రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -58

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -58

 మహాత్ముని 1944 లో జైలు నుంచి విడుదల చేశారు .పాకిస్తాన్ విషయం వదిలేయమని శాస్త్రి చాలా ఉత్తరాలు గాంధీకి రాశాడు .శాంతి సమావేశానికి హాజరవమని విజ్ఞప్తి చేశాడు .2-4-1944న గాంధీకి రాసిన ఉత్తరం లో శాస్త్రి –‘’మీ జీవితంలో ఒక అద్భుత అవకాశం ప్రపంచ శాంతి సమావేశం జరుగబోతోంది .మీరు తప్పక వెళ్ళండి .వాళ్ళు మిమ్మల్ని భారత ప్రతినిదిగా ఆహ్వాని౦చక పోయినా మీరు వెళ్ళాలి .శాంతి సమావేశం లో మీ పేరే మారుమోగాలి .భారత ప్రభుత్వ ప్రతినిధిగా శక్తియుక్తులున్న పోరాట యోధులుగా మీరు హాజరవ్వాలి .ప్రతినిధి బృందానికి మిమ్మల్ని నాయకుడిని చేయకపోయినా వెళ్ళమని వేడుతున్నాను .మీరు వెడితే మీరే లీడర్ అక్కడ .ఇంకెవరూ మీ సమానులు కారు .’’అన్నాడు .

  గాంధీ వెళ్లటం ఎంత అవసరమో జిడి బిర్లాకు తెలియజేసి ఆయన వెళ్ళటానికి ఏర్పాటు చేయమని కోరాడు పిచ్చి పంతులు శాస్త్రి .గాంధీని ఉత్తరాలతో వాయిస్తూనే ఉన్నాడు –‘’The peace conference is of the greatest significance for India and your special mission in life ‘’అన్నాడు .కానీ అతడి ఉత్తరాలు గాంధీ హృదయాన్ని తీవ్రంగా ఆకర్షించినా శాస్త్రి వినతులేవీ గాంధీ పట్టించుకునే మూడ్ లో లేడు ..జీవితం చివరి రోజులలో శాస్త్రి పాకిస్తాన్ ను విడదీయటం అనే బాధ తట్టకుకోలేక పోయాడు .భారత దేశపు అత్యున్నత మహానాయకులైన దాదాభాయ్ నౌరోజీ ,రానడే ,ఫిరోజ్ షా మెహతా ,దిన్షా వాచా ,అనిబిసెంట్ ,వి.కృష్ణస్వామి అయ్యర్ ,వంటి అతిరధ మహారదులతో తనకున్న సాన్నిహిత్యాన్ని తలుచుకొంటూ గడిపాడు .తమిళ స్వదేశ మిత్ర పత్రికకు తన జ్ఞాపకాలు ధారావాహికంగా రాశాడు .వాటినన్నిటిని ఈ రచయిత సేకరించి మద్రాస్ లోని రోచ్ హౌస్ అండ్ సన్స్ కు పుస్తక  ప్రచురణ నిమిత్తం పంపాడు .తనజ్ఞాపకాలు కూడా తమిళం లో రాసి పంపగా వెంటనే ప్రచురణ జరిగి అందరికి అందుబాటులోకి వచ్చి విశేష వ్యాప్తి పొందింది .శాస్త్రి చూసి మహాదానందపడి ఈ పుస్తక రచయితకు ‘’What a great event’’!అని బదులిచ్చాడు

అలాంటి మధురమైన రోజులలో శ్రీని వాస శాస్త్రి రామాయణం పై అద్భుత ఉపన్యాసాలు ఇచ్చాడు .జీవిత చరమాంకంలో ఇలాంటివి ఇవ్వటానికి రాయటానికి మాట్లాడటానికి ఆయన కు దొరికిన సమయాన్ని ఎంతో అద్భుతంగా సద్వినియోగం చేసుకొన్నాడు .రేడియోలోనూ చాలా ప్రసంగాలిచ్చాడు .తన తమిళ మాతృభాషను నూత్న వరవడిలో ఆదర్శ ప్రాయం చేశాడు రచనలలో ప్రసంగాలలో .

   శాస్త్రి తన వయసు వారైన స్నేహితులు అభిమానులతో ఎంత సంతృప్తిగా గడిపాడో అంతే సంతృప్తిగా యువజనం తోనూ గడిపి వారిని ఉత్సాహ పరచాడు .21-2-1942  న పూనా నుంచి ఒక ఉత్తరం రాస్తూ శాస్త్రి –‘’ఈ స్వర్గ ధామం నుంచి నేను పొందిన సంతృప్తిని మీకు తెలియ జేయటానికి అనుమతించండి .ఇది వరకేప్పుడూ ఇంతటి మహోన్నత భావం నాకు కలగలేదు .ఇక్కడి జనం గౌరవం మర్యాద ప్రేమ ఆత్మీయత లతో నాకు మహదానందాన్ని చేకూర్చారు ఇది వరకేప్పుడూ ఇలాంటి అనుభవం నేను పొందలేదు .నన్ను ఇప్పటిదాకా గమనించనికారణమా ,నా వయసు, నా అసాధారణ అనుభవం చూసియా ?19 వ తేదీ గోఖలే హాల్ లోఅంతకు ముందు ఎన్నడూ లేనివిధంగా  వచ్చిన ఆవిపరీత జనం సంఖ్యలోనేకాక అన్నిటా విశిష్టమైంది .’’They regard  me as a relic of a school of politics remarkable for their  earnestness knowledge and sagacity ‘’అని మనసుని౦డుగా అభినందించాడు.ఆ అనుభవాన్ని అందరికి పంచాడు శాస్త్రి .

     1946 జనవరి-ఫిబ్రవరి మధ్యలో దాదాపు మృత్యు సమీపం లో ఉన్న శాస్త్రిని మహాత్ముడు జనరల్ హాస్పిటల్ లో చేరిన మర్నాడే వచ్చి  చూసి పవిత్ర ఆశీస్సులు అందజేశాడు  .గాంధీ మద్రాస్ పర్యటనలో శాస్త్రిని చూసేలోపే చనిపోతాడని అనుకొన్నారు కానీ ఒక అద్భుతంగా ఆయనరావటం చూడటం ఆశీర్వదించటం జరిగిపోయాయి .శాస్త్రి మహాత్ముని సందర్శనంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు .ఇలా మూడు సార్లు గాంధి వచ్చి శాస్త్రిని చూసి వెళ్లటం అసాధారణ విషయం .ఈ చివరి రెండు సార్లు ఈ రచయిత అక్కడే శాస్త్రి ప్రక్కన ఉన్నాడు .దానిపై రచయిత ఇలారాశాడు-‘’The communion of these important pair of friends had almost a divine beauty and tenderness .The second meeting was in  some ways the most memorable .Whole Gandhi  sat suffused with the glow of admiring love ,Sastri bathed him in a torrent of worshipful affection.’’తరచుగా తానూ ఈ మధ్య రామాయణ ప్రవచనాలలో గాంధీని రాముడుగా అభి వందించటం ఇప్పుడు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాడు శాస్త్రి ఒక శబరిలా ,మతంగ మహర్షిలా .కొద్దిగా అపస్మారక స్థితిలో ఉన్నా శాస్త్రి మనసులు గాంధీ శ్రీరాముడి గానే దర్శనమిచ్చాడు .మనసంతారామమయమే అయిపొయింది గాంధీ రామ భక్త శాస్త్రి హనుమాన్ కి .తనను రాముడితో పోల్చటం గాంధీకి నచ్చక ‘’వాట్ నాన్సెన్స్ శాస్త్రి ‘’అన్నాడు .తన బలహీనతను ఒక క్షణం వదిలేసి శాస్త్రి తన సహజ గంభీర స్వరంతో ‘’నాకు గాంధీ తెలీదా ?మీరు నన్ను ఒక స్నేహితుడిని లా చూడటానికి వచ్చినా ,మీరు ఇవాళ ప్రపంచంలో సజీవ మహోన్నత మానవ మూర్తి ‘’అన్నాడు మళ్ళా గాంధి తన నిరాడంబరత చాటుకొని ‘’వాట్ నాన్సెన్స్ శాస్త్రి ‘’అన్నాడు మళ్ళీ .తర్వాత అత్యంత ప్రేమ వాత్సల్య పూర్వకంగా ‘’నేను మద్రాస్ వచ్చి చాలా పర్యటనలు చేశానుకానీ ఇప్పుడు నిన్ను చూడట౦ అత్యంత పవిత్రం అనిపించింది .మీ డాక్టర్లు అనుమతిస్తే ఇంకా ఎక్కువ సేపు నీతో గడుపుతాను ‘’అన్నాడు మహాత్ముడు .మదురై వెళ్ళి మద్రాస్ వచ్చి వార్ధా వెళ్ళబోతున్న గాంధీకి ఉన్న మూడే మూడు గంటల వ్యవధిలో శాస్త్రిని చూడటానికి మూడవ సారి  శాస్త్రి హాస్పిటల్ నుంచి డిస్చార్జ్ అయి స్వగృహం ‘’స్వాగతం ‘’లో ఉండగా గాంధి వచ్చి చూశాడు .ఇదే చివరి చూపు అయింది .భావోద్వేగంతో శాస్త్రి ఒక  అంతర్గత  నోట్ రాస్తూ ‘’Brother you have done me exceptional honour ,especially by paying this visit when you are in a great hurry .You are nearer and dearer to me than my own brothers ,son ,daughter and members of my family ‘’అని వినయాంజలి ఘటించాడు శాస్త్రి మహాత్మునికి .కష్టంగానే ఊపిరి పీల్చుకొంటూ అతి నెమ్మది స్వరంతో శాస్త్రి ‘’మీరు ఇక్కడికి అంతర్భావ మహోన్నత తొ వచ్చారు .బయటి ఏరకమైన స్నేహమూ దీనికి కారణాలు చెప్పలేదు .Gokhale was  but the occasion of it .’’అంటూ మహాత్మునికి మరింత దగ్గరకు జరిగి ‘’నేను మాటలు వృధా చేయను .నేను చెప్పదలచి౦దేమిటో మీకు తెలుసు ‘’అన్నాడు హీన స్వరంతో .

   శాస్త్రి జీవితం సమాప్తి ఆయె రోజులు దగ్గరపడ్డాయి రోజురోజుకీ బలహీనమౌతున్నాడు .మనసుమాత్రం దృఢంగానే ఉండి బుద్ధి బాగా పని చేస్తోంది .ఆయన మనసు బుద్ధీ అన్నీ ఇండియాఐక్యత ,ప్రపంచ శాంతి యే ఆక్రమించాయి .చివరి ఘడియలు అనుకోకుండా దగ్గర పడ్డాయి .17-4-19946 రాత్రి మేము కొందరం ఆయన ప్రక్కనే ఉన్నాం రాత్రి 10 వరకు .అప్పుడు ఆయన తన కుటుంబ సభ్యులతో మాతో ఉల్లాసంగానే మాట్లాడాడు .రాత్రి 10-15కి స్పృహ కోల్పోయాడు శాస్త్రి .10-35 కు శాస్త్రి అంతిమ శ్వాస విడిచాడు .ప్రపంచం నలుమూలలనుంచి ఆయనకు నివాళులు కుప్పలు తెప్పలుగా వచ్చాయి .అందులో శాస్త్రి డియరేస్ట్ ఫ్రెండ్ అండ్ బ్రదర్ మహాత్మాగాంధీ రాసిన నివాళి ఉత్కృష్టమైనది –‘’మననుంచే కాక ప్రపంచం నుంచి కూడా శాస్త్రిని మృత్యువు దూరం చేసింది .భారత మాత  ఉత్తమ కుమారులలో ఆయన అగ్రగణ్యుడు .దేశాన్ని ఆయన౦త గొప్పగా ప్రేమించి ఆరాధించిన వారులేరు .చివరి సారి మద్రాస్ లో  నేను ఆయన్ను చూడటానికి వెళ్ళినప్పుడు ఇండియా, దేశ సంస్కృతీ తప్ప వేరే మాట్లాడనే లెదు .వాటికోసమే ఆయన జీవించాడు ప్రేమించాడు చనిపోయాడు .మరణ శయ్యపైన ఉన్నా ఆయన తన గురించి ఎమీఆలోచించలేదు .అంటే ఆయన ఎంతటి ఉదాత్త ఉత్తమ స్వార్ధరహిత దేశ భక్తుడో మనకు అర్ధమౌతుంది .ఆయన ఇంగ్లీష్ భాషా పాండిత్యం ఎంతగోప్పదో ఆయన సంస్కృత పాండిత్యమూ అంతే గొప్పది .రాజకీయంగా మేము భిన్నాభిప్రాయులమే అయినా –‘’Our hearts were one ,and I could never that his patriotism was less than that of the tallest patriot .Sastri ,the man ,lives though his body is reduced to ashes ‘’అని నివాళి అర్పించాడు ఆమహాత్ముడు ఆశాస్త్రి మహోన్నత ఆత్మకు .

   సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -10-8-23-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.