‘’ఈ నాడు ‘’మాత్రమేకాదు ఏనాడైనా అక్షర యోధుడు , భాషా సంస్కృతులకు ‘’తెలుగు వెలుగు ‘’,పొదుపు మదుపులకు ‘’మార్గదర్శి’’,తెలుగు పచ్చళ్ళ రుచికి ‘’ప్రియ ‘’తముడు , చానెళ్ల హంవీరుడు, నిర్భీతికి ,ఆత్మ గౌరవానికి నిలువెత్తు నిదర్శనం , చలన చిత్ర’’ ప్రగతి సిటీ రామోజీ’’ అసామాన్య పద్మ విభూషణుడు .

‘’ఈ నాడు ‘’మాత్రమేకాదు ఏనాడైనా అక్షర యోధుడు , భాషా సంస్కృతులకు ‘’తెలుగు వెలుగు ‘’,పొదుపు మదుపులకు ‘’మార్గదర్శి’’,తెలుగు పచ్చళ్ళ రుచికి ‘’ప్రియ ‘’తముడు , చానెళ్ల హంవీరుడు, నిర్భీతికి ,ఆత్మ గౌరవానికి నిలువెత్తు నిదర్శనం , చలన చిత్ర’’ ప్రగతి సిటీ రామోజీ’’ అసామాన్య పద్మ  విభూషణుడు .

 1974లో ఎందుకో విశాఖ వెళ్లాను .సీతమ్మధార వద్ద ఉన్న ఉయ్యూరుపాలిటెక్నిక్  కాలేజిలో చదువుతూ మా ఇంట్లో వారాలు చేసుకొంటూ చదివి పాసై న ఇసుకపల్లి బ్రహ్మం ,నేను 1963లో విశాఖ పట్నం లో గవర్నమెంట్ మెడికల్ కాలేజీ లో ఫిజిక్స్ డిమాన్ స్ట్రెటర్  గా పని చేసిన  శని ఆదివారాలలో   వాల్టేర్ అప్ లో కాపురం ఉంటున్న గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు (తరువాత హాస్య రచయితగా అవతారం ఎత్తి , ఉయ్యూరు హై స్కూల్  లో నాట్యూషన్ లో శిష్యురాలు ,నా స్నేహితుడు స్కూల్ మేట్ సూరి నరసింహం చెల్లెలు అన్నపూర్ణ భర్త  )వాళ్ళు అక్కడ వంట    చేసుకొంటూ యూనివర్సిటిలో చదువుతూ ,ఉండగా బ్రహ్మం కూడా వాళ్ళతో ఉండేవాడు .ఆ తర్వాత ఎప్పుడో ఉయ్యూరు వచ్చి తానూ సీతమ్మ ధార  దగ్గర ఉంటున్నాను ఒకసారి రమ్మంటే వెళ్లాను .అప్పుడే’’ వాళ్ళ ఇంటికి ఎదురుగ ఒక రేకుల షేడ్ లో ‘’ఈనాడు’’పత్రిక ఈవెనింగ్ ఎడిషన్ గా ప్రింట్ అవటం  ప్రత్యక్షం గా చూశాను .అప్పుడు సర్క్యులేషన్ పెద్దగా ఉన్నట్లు లేదు .ఆతర్వాత బెజవాడ లో ఆఫీస్ పెట్టటం దినపత్రికగా మార్చటం ,తెల్ల వారు జామున నాలుగు గంటలకే ఈనాడు ప్రతి ఇంటినీ తనదిగా చేసుకోవటం ,జిల్లా ఎడిషన్ లతో వినూత్నంగా ఉండటం ,వసుంధర లాంటి శీర్షికలు ,సినీ రివ్యూలు వగైరాలతో రంగుల హంగులతో పత్రిక ముచ్చటగా ముద్దులు మూటగడుతూ  గుమ్మానికి శోభ చేయటం శ్రీ చెరుకూరి రామోజీ రావు నిరంతర కృషికి ఫలితం .తెలుగు లోగిళ్ళు ఈనాడు వశం అయిపోయాయి .అది అప్రహతి హతంగా ఆనాడు నుంచి ఈనాడు దాకా సాగుతూనే ఉంది .సర్క్యులేషన్ లో వగైరాలలో  రికార్డ్ సృష్టిస్తూనే ఉంది .అది వారం స్పెషల్  నిజంగా ఒక స్పెషల్ .ఆప్పటికి దిన పత్రికలో దినఫలాలు లేవు .సూక్తులు లేవు .దాదాపు ప్రచ్చన్న కమ్యూనిస్ట్ పత్రికగా ఉండేది . తర్వాత వాటినీ చేర్చారు .రాంభట్ల కృష్ణమూర్తి ,రావూరి భరద్వాజ వగైరాలు సాహితీ సృష్టి ఉపక్రమించారు . తర్వాత  రామా రావు సినీ రంగం నుంచి రాజకీయ అర౦ గేట్రం చేసి తెలుగు దేశం పార్టీ పెట్టినప్పుడు ,ఈనాడు పత్రిక వెన్నంటి నిలబడి  విజయానికి సర్వ శక్తులు ధారపోసి గెలిపించింది .పత్రిక సర్క్యులేషన్ ఇంతింతై ఎంతో ఎదిగిపోయి ఛాలా మంది ఈర్ష్యకు కారణమైంది .అయినా లెక్క చేయలేదు అప్రతి హతంగా పత్రిక సాగుతూనే ఉంది . ఇంత వరకు ఒక ఘట్టం .తర్వాత రాం లాల్  వర్నర్ గాఉన్నప్పుడు రామారావు అమెరికా లో ఉండగా నాదెండ్ల భాస్కరరావు ను ముఖ్యమంత్రిని చేసి ,ప్రజాభిప్రాయం వెల్లువై అన్నిపార్టీలు వ్యతిరేకిస్తే ,ఇందిర చేసిన తప్పుకు పశ్చాత్తాపం పడి శంకర్ దయాళ్ శర్మను  గవర్నర్ ను చేసి మళ్లీ రామారావు ను  గద్దె నెక్కించే దాకా ఈనాడు న్యాయ పోరాటంలో తన పాత్ర బాగా పోషించింది .ఒకరకం గా హల్ చల్ చేసింది .

  రామారావు బహుకృత వేషాలు నిలకడ లేనితనం మీద ఘాటుగానే విమర్శించింది ఈనాడు .ఆతర్వాత వీర భోగ వసంతరాయలకోసం  ఒక వీరగంధం మహిళ పంచ చేరటం ,భ్రష్టు పట్టించటం ,అన్నీ తనే అయి చక్రం తిప్పటం ,అయ్యగారి పతనం పాతాళానికి చేరటం తో విసుగు చెందిన అల్లుడు బాబు అందరికీ ఆడర్శమవటం ఆయన నాయకత్వానికి మద్దతు పలికి వైస్రాయ్ హోటల్ లో మంతనాలు సాగి ఎన్నుకోబడి ముసలాయన కూలిపోవటం ,వీటి నన్నిటినీ ఎప్పటికప్పుడు నిష్పక్షపాతంగా పాఠకులకు తెలియజేస్తూ జాగృతం చేసింది ఈనాడు .చివరికి బాబే దిక్కు అయి పార్టీ నిలిచింది గెలిచింది. అప్పటినుంచి ప్రతి ఎన్నికలోనూ .ఇక్కడకూడా పత్రిక అమోఘమైన సేవ లందించింది .ప్రజాభిమానం చూరగొన్నది .ఎదురు లేని పత్రికగా నిలిచింది .ఇదంతా రామోజీ దూర దృష్టి .రాష్ట్రంముఖ్యం అన్నదే ఆయన ధోరణి .అందుకే శ్రీ శ్రీ అన్నట్లు ‘’పెట్టుబడికి కట్టుకధకు పుట్టిన విష పుత్రిక ‘’కాకుండా యదార్దానికి ఆత్మగౌరవానికి సంకేతంగా నిలిచింది ఈనాడు .అలాగే ఆయన మరణించేదాకా కొనసాగింది ఆ ఆశయం .

  1960లో ఆంధ్ర జ్యోతి పత్రిక ను శ్రీ కె ఎల్ ఎన్ ప్రసాద్ స్థాపించి నార్ల ను ఎడిటర్ గా నడిపించాడు .ఇక్కడ ఒక కధ విన్నాను .రామోజీరావు గుడివాడ దగ్గర పెదపాలపర్రు వాడు .ప్రసాద్ గుడివాడ –బందరు దారిలో ఉన్న కౌతవరం వాడు .ఇద్దరూ కృష్ణా జిల్లా వాళ్ళే .రామోజీ  ప్రసాద్ దగ్గరకొచ్చి తానూ పత్రిక పెట్టాలను కొంటున్నాను అంటే ‘’నీ వల్లనేమౌతుదయ్యా  వద్దు ఆ ప్రయత్నం మానుకో ‘’అన్నాడట .అనుకొంటే అంతు చూసే రామోజీ పత్రిక పెట్టటం ఘన విజయం సాధించటం రోల్మోడల్ గ తీర్చి దిద్దటం ఇప్పటిదాకా మనం చెప్పుకొన్న దే .ఈ విషయం చాలా మంది మర్చేపోయారు .ఆంధ్రజ్యోతి కూడా అఖండ విజయం సాధిస్తూ ,మంచి పేరు తెచ్చుకొని ఆర్కే నేతృత్వంలో అరివీర భయంకర పత్రికగా నిలబడింది .చానల్ కూడా పెట్టి దూసుకు పోతోంది .ఈనాడు జ్యోతి పత్రికలూ ఇవాళ ప్రతి తెలుగు వాడి రెండు కళ్ళు .ఇటీవల ఎన్నికలలో నరకాసుర వధకు సర్వ శక్తులు ఒడ్డి ప్రజాభిప్రాయాన్ని నిర్భయంగా ప్రకటించి తమ వంతు కర్తవ్య౦ సమర్ధంగా  నిర్వహించాయి .ప్రజా పీడ ను ఎదిరించి నిలవటం అంత ఆషా మాషీ కాదు .ఇవి ఒకరకంగా ప్రజలకు వేదాలుగా ,ఉపనిషత్తులుగా భగవద్గీతగా ,బైబిల్ గా ,కురాన్ గా  జెంద్ అవెస్తా గా దర్శనమిచ్చి మార్గదర్శనం చేశాయి . రెండు కమ్మ పత్రికలే అనే ముద్ర వేయి౦చు కోన్నాయిపచ్చ కళ్ళ పశువుల చేత  .బాబు మోడీని ఎదిర్చి నిలబడ్డప్పుడు  తొందర పడ్డాడేమోమో అని హెచ్చరించాయి .మళ్లీ ఇప్పుడు రావణ సంహారానికి మూడు పార్టీలు కలిసినపుడు సంపూర్ణ మద్దతు నిచ్చి అనునిత్య జాగృతం చేశాయి .60ఏళ్ళుగా అప్రతిహతంగా సాగుతూ నమ్మకానికి నిలువెత్తు ఆదర్శంగా ఉన్న మార్గదర్శి చిట్ ఫండ్ పై పైశాచిక ఆనందంతో కుహనా మేధావి ఉండవల్లి ,ఒళ్ళంతా కావరం ఉన్న బుడ్డోడు అనేక సార్లు అనవసరమైన కేసులు పెట్టి ఎలాగైనా రామోజీని అరెస్ట్ చేసి జైల్లో పెట్టమని తాబెదార్లకు హుకుం ఇస్తే అన్నిటినీ కోర్టులద్వారా సమర్ధంగా ఎదుర్కొని అజేయంగా నిలబడ్డాడు రామోజీ .రాష్ట్రం లోని రావణా కాష్టం  చల్లారింతర్వాత  ప్రజావిజయం వీక్షించి ప్రశాంతంగా కన్ను మూశాడు అఆక్షర యోధుడు 88ఏళ్ళ వయసులో  ఆయన ప్రజల కిచ్చిన ఆదర్శం ఫలవంతమైందన్న ఆత్మ విశ్వాసంతో.

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -9-6-24-ఉయ్యూరు . 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమయం - సందర్భం. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.