శ్రీ పంతుల ‘’వెంకటేశా !నిన్ను ‘’శతకం
శ్రీ పంతుల వెంకటేశ్వరరావు (తపస్వి )మంచి కవి ,పండితుడు సరసభారతికి ఆప్తుడు .ఆయన ఇటీవల రాసినదే ఈ శతకం .శీర్షి క’’యే’వెంకటేశా !నిన్ను-వేడు కొందును దేవ ‘’ మకుటం..మనమలకోరిక తీర్చి ముద్రణకు సాయపడిన శ్రీ తిరుచ్చిక్కి రామానుజా చార్యులకు కవి అంకితమిచ్చాడు .
ఇష్ట దేవతాస్తుతి చేసి తర్వాత దశావతార వర్ణన చేసి ,పిమ్మట భాగవతం ఆధారంగా వివిధ అవతారాలు వర్ణించాడు .రామావతారం లో ‘’పుత్రధర్మాన్నే పూర్తి చేశాడు ‘’అన్నాడు .రణరంగం లో క్రీడికి గీత బోధించి ధర్మం నిలిపిపాడు కృష్ణావతారం లో .’’ఈనాటికీ ఇడుములు బాపుతూ –భక్తులను రక్షిస్తున్నాడు వేంకటేశ్వర అవతారం లో .టక్కరి పనులైన -చిక్కని గనులైన –ఠక్కముల్ నాశక –ఠావు నీవే కదా ‘’అన్నాడు బాలాజీని అక్షరార్చన లో .
ఆచమనం లో కేశవ నామాలను ,స్వామి లీలలను ,విపులంగా వర్ణించి చివరికి తన ఆవేదన విన్న వి౦చు న్చుకొన్నాడు అక్షర తపస్వి పంతుల ..చదివిన ప్రతివారికి ఇక్కట్లు తొలగుతాయని హామీ ఇస్తూ ఫలస్తుతి చేసి 108వ పద్యం లో మంగళం పాడాడు .భావపుష్టి దారా శుద్ధి ,భక్తీ ,శరణాగతి పుష్కలంగా ఉన్న శతకం . చక్కని గెటప్, కూర్పు, ముద్రణ ముచ్చట గొలుపుతాయి .పంతులను అభినందిస్తున్నాను .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ 3-10-24-

