శ్రీ నందుల అచ్యుత రామ శాస్త్రి గారి ‘’శ్రీరామోదాహరణము ‘’
తెలంగాణ కోదాడకు ప్రాంతానికి చెందిన ఈ ఆధునికకవి 2014 లో రామ ఉదాహరణ కావ్యం రాయటం ప్రశంసనీయం..ఉదాహరణ ప్రక్రియను దాదాపుగా అందరూ మరచిపోయిన ఈకాలం లో దానికి రామ తేజస్సు ,ఓజస్సు కలిగించారు కవి ధన్యుడు .ఈయన కోదాడలో ‘’శారదా సాహితీ సమాఖ్య ‘’నెలకొల్పి సారస్వత సేవ చేస్తున్నారు .ఇప్పటికి మూడు పుస్తకాలు రాశారు .తిమ్మరాజపురిలో వేంచేసి ఉన్న సీతారామ స్వామికి అంకితం చేశారు .
ప్రధమా విభక్తిలో ‘’శ్రీ రాజిల్లెడు తమ్మరాఖ్య పురిలో చెన్నారు అత్యన్తమున్ –సారోదార కటాక్ష వీక్షణములన్ సర్వార్ధముల్ భక్తులం –జేరం జేయుచు గిల్బిష చ్చదములన్ చేదించుచు౦ బ్రోచు సీ-తారామా విముడెల్ల వేళల నమంద ప్రీతి మమ్మోముతన్ ‘’అంటూ శార్దూల౦ పై విహరించి స్వామికి అర్పించారు ..తర్వాత కలిక ,ఉత్కలిక లు రాసి రామ చరిత్ర ప్రారంభించి ,ద్వితీయావిభక్తిలో శార్దూలం లో’దయాశాలి ,దమ్మర ధాము ‘’భక్తజన రక్షా దీక్షితుని నుతించి ,మళ్లీ కలిక ఉత్కలిక లలో శివ ధనుర్భ౦గం చెప్పి,తృతీయావిభక్తిలో ఉత్పలమాల అలంకరించి ‘’నీరేజ దళాక్షు చేతను హరి౦చు నఘౌఘము ‘’ఆని సంతృప్తి చెంది ,మళ్లీ యదా ప్రకారం కలిక ఉత్కలిక పేని ,పరశు రామ గర్వ భంగం చెప్పి చతుర్ధీ విభక్తిలో ఉత్పలమాల లో ‘’హరికి,కమనీయ దివ్య కార దండు నకై దయాబ్దికయి తమ్మెర దామునికి కమోడ్పు చేశారు .
మధురగగతి రగడలో యధాప్రకారం కలిక ఉత్కలిక కూర్చి ,పంచమీ విభక్తిలో మహాస్రగ్ధర ‘’అనిమేషాస్వేద దృక్కాయముల బొదలు వారార్తి బ్రార్దిమ్పగా కుంభిని కౌసల్యా సుతుడై సీతారామ చంద్రుని గా సమస్త భక్తుల కోరికలు తీర్చాడు .ఇలా క్రమంగా సప్తమీ విభక్తి దాకా సాగించి ,,తర్వాత సంబోధణ ప్రధమా విభక్తిలో ‘’ద్వికంద క్రౌన్చాపద వృత్తం లో విజ్రుమ్భించి ,సార్వ విభక్తికం లో రాసి అన్కా౦కితం చేశారు .
స్తోత్ర మాలికలో శ్రీరామ స్తవం మహా భక్తిగా చేసి కైంకర్యం చేశారుకవి .పిమ్మట నీలగిరి స్థిత పట్టాభిరామ స్తుతి 34వృత్త పద్యాలలో చెప్పి ,మట్టపల్లి శ్రీ నారసింహ కరావలంబనస్తోత్రం చేసి ధన్యులై మనల్నీ ధన్యులను చేశారు .తర్వాత దశావతార రఘుపతి స్తుతి ,చంద్ర కళా అ౦బురుహ,తరల,ద్రువ కోకిల మొదలైన భిన్న వృత్తాలలో సొగసు గా సన్ను తించారు .చివరగా వేణు గోపాల దండకం రాసి అయిందని పించి ,తమ్మెర గ్రామం లో వెలసిన సీతా రాముని గురించి వివరించారు .ఇది నల్గొండ జిల్లా పురాతన ఆలయం .రెండు వందల ఏళ్ల ప్రాచీనాలయం ..ఇక్కడ శ్రీరామ పుష్కరిణి ఉంది.
కవి గారు తమ్మేరలో పుట్టి విద్యనేర్చి అనూచానంగా వస్తున్నా వైదిక వృత్తిలో జీవితం సార్ధకం చేసుకొంటూ,కృష్ణా నాదే తీరం లోని మట్టపల్లి క్షత్రం తో బాటు జిల్లా రాష్ట్ర స్థాయిలలో సాహితీ గోష్టులలో పాల్గొని ,,అవధానాలలో పృ చ్చకుడై రాణింపు పొందారు .అచలాత్మజా స్తుతి వెంకటేశ్వర స్తుతి శతకం ,దశావతార రఘు స్తుతి ,రాశారు ముకుందమాల ,ఆంధ్రీకరించారు జీడికంటి రామ శతకం శ్రీ కృష్ణ దండకం ,మట్టపల్లి నరసింహ స్తుతి ,సింహగిరి వరాహ నరసింహ తారావళి అనేక శతకాలు రాసి స్వామికి నైవేద్యమిచ్చారు .బహుముఖ ప్రజ్ఞాశాలి .జ్ఞాన ధారతో సాహితీ లోకాన్ని తరి౦ప జేస్తున్న భక్తకవి శ్రీ నందుల అచ్య్త రామ శాస్త్రి .
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -7-10-24-ఉయ్యూరు ,

