సుప్రసిద్ధ పరిశోధకుడు భాషా శాస్త్ర వేత్త,తెలుగు వ్యాకరణ కర్త ,చే.రా.కు గైడ్ ,అంతర్జాతీయ తెలుగు సంస్థకు అంకురార్పణ చేసిన – ప్రొఫెసర్ కేలీ జేరల్ట్ ,బి.

సుప్రసిద్ధ పరిశోధకుడు భాషా శాస్త్ర వేత్త,తెలుగు వ్యాకరణ కర్త ,చే.రా.కు గైడ్ ,అంతర్జాతీయ తెలుగు సంస్థకు అంకురార్పణ చేసిన – ప్రొఫెసర్ కేలీ జేరల్ట్ ,బి.
ఈ శతాబ్దంలో యూరప్ అమెరికా ఖండాల్లో భాగా వ్యాప్తి చెంది న చెందిన భాషా శాస్త్ర మద్దతులలో తెలుగు భాష రహస్యాలు పరిశోధించిన వారిలో జరల్ట్ బి కేలి బుక్కులు తెలుగు భాష గురించి చాలా విషయాలు కొత్తగా ఈయన చెప్పారు వివిధ పరిశోధన సంచికలలో తెలుగు భాష గురించి 1954 నుంచి వ్యాసాలు రాస్తూ వచ్చారు ఈ అభిప్రాయాలని ఒకచోట చర్చ్ 1965 లో ఒక తెలుగు వ్యాకరణం రాశారు ప్రచురణ విషయంలో శ్రద్ధ చూపకపోవడంతో అది మరుగున పడింది.ఈయన 1926లో జన్మించి 1987డిసెంబర్ 8న61ఏళ్ల వయసులో మరణించారు .
తెలుగులో స్వర వర్ణాలు ,ఉచ్చారణలో సంధి చాలా మార్పులు పొందుతాయి .ఈ మార్పులుకుడి నుంచి ఎడమలకు విస్తరించి ఆ పక్కన ఉన్న అచ్చులను కూడా ప్రభావితం చేస్తాయి ఈ ప్రభావాలను వివృతీకరణ ,తాలవ్యీ కరణాలుగా గుర్తించి వాటి ప్రవర్తనలో క్రమపద్ధతులను వివిధ వ్యాసాలలో వివరించారు . తెలుగు అచ్చుల విచారణలో వచ్చే ధ్వని భేదాలపై అతి విస్తారమైనచర్చ చేసింది ఈయనే .
తెలుగు నామ సంబంధాలలో ,వివిధ విశేషణాల ప్రయోగం లో తెలుగు వారు పాటించే నియమాలను గురించి కూడా ఈయన ఒక వ్యాసం రాశారు .తెలుగు సర్వనామాల ప్రయోగానికి ,వాటి నిఘంటు అర్ధం తెలిస్తేచాలదు .వ్య్వహర్తలమధ్య ఉన్న సాంఘిక తేడాలు ,పరస్పర గౌరవ ఆదరణలు ,ఆత్మీయతా సంబంధాలు గురించి బాగా తెలియాలి .తన వ్యాకరణం లో వీటిని విస్తృతంగా చర్చించి రాశారు .
సామాజిక భాషా పరిశోధక పధ్ధతి (సోషియో –లింగ్విసిక్స్ )లో ఉపయోగిస్తారని కేలే నిరూపించారు .భారత భాషా వ్యవహారాలపై ఆసక్తి ఉన్న అమెరికన్ శాస్త్రజ్ఞులలో కూడా హిందీ భారతీయ సర్వ సామాన్యమైన భాషగా ఉండాలనే భావించేవారు మరి కొందరున్నారు .వీరంతా రెండవ వర్గానికి చెందిన వారు .
అమెరికాలోని మాడిసన్ నగరం లో ఈయన యూని వర్సిటి ఆఫ్ విస్కాన్సిన్ లో ఉన్నత విద్యాభ్యాసచేసి పిహెచ్ డి పొంది 1963నుంచి 1987లో మరణించే వరకు న్యూయార్క్ రాష్ట్రం ‘’ఇతాకా ‘’పట్టణం లో కోర్నేల్ యూని వర్సితిలో భాషా శాస్త్ర ప్రొఫెసర్ గా పని చేశారు .తరచుగా హైదరాబాద్ వస్తూ, ఉస్మానియా విశ్వ విద్యాలయ భాషా శాస్త్ర శాఖతో చాలా ఆత్మీయ సంబంధాలు కలిగి ఉండేవారు .1975లో హైదరాబాద్ లో మొదటి ప్రపంచ తెలుగు సమావేశం జరిగినప్పుడు కేలీ వచ్చి చురుకుగా పాల్గొన్నారు ..ఇందులో జెపి ఎల్ గ్విన్ తొ కలిసి అంతర్జాతీయ తెలుగు సంస్థకు ప్రాతిపదిక వేశారు .ఈ సంస్థ ఏర్పడి కొన్నాళ్ళు పని చేసి ,1986లో’’ తెలుగు విజ్ఞాన పీఠం ‘’గా మారి ,చివరికి తెలుగు విశ్వ విద్యాలయం లో కలిసి పోయింది .
కేలీ గొప్ప ఉపాధ్యాయులుగా పేరు పొందారు .భారతీయ భాషలపై పరిశోధన చేసిన చాలామంది విద్యార్ధులకు ఈయన పర్యవేక్షకులుగా ఉన్నారు .శ్రీ చేకూరి రామారావు’’ తెలుగు వాక్య నిర్మాణం ‘’పై చేసిన పరిశోధనకు కేలీ యే గైడ్ .ఈయనకు విద్యార్దులపైనా ఆదరణ ఎక్కువ విద్యార్ధులకు ఈయన అంటే అధిక గౌరవం .చే రా,1975లో రాసిన ‘’తెలుగు వాక్యం ‘’గ్రంథం ఈయనకే అ౦కిత మిచ్చి తన గురుభక్తి చాటుకొన్నారు .జీవితంలోనూ ,పరిశోధనలోనూ ఈయన ‘’నాన్ –కన్ఫార్మిస్ట్ ‘’భగవద్దత్త సత్య వాదమని (గాడ్స్ ట్రూత్ స్కూల్ ),కలగాపులగపు వాదమని (హోకస్ ఫోకస్ స్కూల్ )అనే రెండు వాదాలు ఉండేవి .తాను రెండవ దానికి చెందుతానని ఆయనే చెప్పుకొన్నారు .ఈ విశేషాలన్నీ ‘’చే రా ‘’గారు రాసిన వ్యాసం లోనివే .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -19-10-24-ఉయ్యూరు .

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.