మేమున్నామని’’కథ

మేమున్నామని’’కథ

గుంటూరుకు చెందిన ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ అనేక పురస్కారాలగ్రహీత శ్రీమతి కరశరణం నాగవల్లి రాసిన ‘’మేమున్నామని ‘’కథ ఆర్ద్రతకు అద్దంపట్టింది అందుకే శ్రీమతి పద్మాదాశరధి స్మారక ఉగాది  కథలపోటీలో రెండవ బహుమతి పొందింది .

 కథ చెబుతున్న ఆయనపాండురంగారావు  తల్లి చనిపోతే కుటుంబం అంతా కాశీ ప్రయాణానికి బయల్దేరారు .ఈయన  చెడిబతికినవాడు తండ్రి ముందే చనిపోతే ఉన్న కాస్తా అన్నదమ్ములు పంచుకోగా తన చేతిలోపెట్టిన 500 నోటు ,తల్లినీ చెరో చేత్తోపట్టుకొని బయటపడి తల్లి సూచనతో భార్య సహకారం తో  మిఠాయిబండి పెట్టి ఎదిగిడు .దుకాణం  పెట్టి మంచిపేరు తెచ్చుకొని లక్షాధికారయ్యాడు .డబ్బు కొరత లేదుకనుక తమ్ముళ్ళు అంతసంపాదనా పరులుకాదుకనుక  ఇన్నేళ్ళు దూరం దూరంగా ఉన్న వాళ్ళు ఇప్పుడు తప్పుతెలుసుకొని దగ్గర చేరారు కనుక ఆ అన౦ద౦ తో మొత్తం కుటుంబంతో కాశీలో తల్లి అస్తికలు కలపటానికి బయల్దేరాడు

 అంతాసామానులు సద్దె హడావిడిగా ఉంటె కాసేపు వాలు కుర్చీలో కునుకు తీస్తుంటే తల్లి అతని పై చేతులేస్తే ఆస్పర్శ గుర్తించి తెలీకుండా కన్నీరు ధారాపాతంగా కారిస్తే భార్యతోసహా కుటుంబమంతా కంగారు పడుతూరాగా ,కారణం తెలుసుకొని వారి హృదయాలూ ఆర్ద్రమయ్యాయి .ఆయనకు యేమీకారాదని వారి మూగమనసులు చెబుతున్నాయి .అయిదేళ్ళమనవరాలు తాతకు భరోసా ఇస్తూ తాను జేజిమ్మను  తాతయ్య చూసుకొన్నట్లుగా చూసుకొంటానని ముద్దుమాటలతో అంటే  అందరూ ద్రవీభూతులయ్యారు .రైలులో చితాభస్మం ఉన్న కుండఉన్నగుడ్డమూట  కిందపెట్టకుండా ముందు మనవరాలు పట్టుకొంటే తర్వాత చిన్నా పెద్దా అందరూ జాగ్రత్తగా మోశారు కాశీదాకా ఋణం తీర్చుకొన్నారు .బతికి ఉండగా కలపలేని ఇంతపెద్ద కుటుంబాన్ని తల్లి చనిపోయి కలిపిందని పెద్దాయన పాండు రంగారావు  దుఖాశ్రువులతోపాటు ఆనంద బాష్పాలు కార్చాడు .

  ఆద్యంతం కథను చక్కగా తీర్చిదిద్దింది రచయిత్రి .ధనలక్ష్మి దానికదే వచ్చి చేతులలో వాలదు. చిత్తవృత్తులన్నీ డబ్బు చుట్టూ పరిభ్రమిస్తాయి. పైకి కనిపించకుండా బంధాలన్నీ డబ్బు చుట్టూనే తిరుగుతాయి . ఆత్మ నివేదన మరో అంకురమై వెలిగే జ్యోతికి మనం చేసిన పుణ్యమే మూలం . పెద్దవారిని అలా ప్రేమగా చూసుకోవాలని ఆలోచన దాని మనసులో బీజం పడింది  దేవుడు మనకి పెట్టే చేయి ఇచ్చాడు,వారికి చాచే చేయి ఇచ్చాడు . మనిషికి ధైర్యం డబ్బుకాదు,కొండంత అండ మేమున్నాము అనటం .మొదలైన వాక్యాలు రచయిత్రి లోచూపును విశాలహృదయాన్ని చూపిస్తాయి .నాగలక్ష్మిఇంటిపేరు కరశరణం. ఇవన్నీ చూస్తె ‘’కలమే ఆమెకు శరణం’’ అన్నదా అనిపిస్తుంది . మరిన్ని మంచి కథలురాసి,  మరిన్ని పురస్కారాలు పొందాలని ఆశీర్వదిస్తున్నాను ‘

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -6-7-26-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.