వీక్షకులు
- 1,132,012 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- శ్రీ స్వర్ణ రాజ హనుమంతరావు గారి_ శ్రీమద్రామాయణం లో ఆంధ్రాయణం.1 వ భాగం.2.4.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.160 వ భాగం.2.4.26.
- శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.11 వ భాగం.1.4.26.
- శ్రీమతి మేరీ కృపాబాయి గారి కథాంజలి.8 వ భాగం.1.3.26.
- శ్రీరామ కర్ణామృతం.15 వ భాగం.1.4.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.159 వ భాగం.1.4.26.
- శ్రీరామ కర్ణామృతం.12 వ భాగం.28.3.26.
- శ్రీరామ కర్ణామృతం.11 వ భాగం.27.3.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.156 వ భాగం.28.3.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.155 వ భాగం.27.3.26.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,878)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Category Archives: వార్తా పత్రికలో
ధర్మజాగృతికి మార్గం హరికథాగానం
కళా రూపాల్లో తెలుగునాట వర్థిల్లిన హరికథ ధర్మజాగృతిని కలిగించే విశిష్టమైన కళాప్రక్రియ. నవరసాలను పండిస్తూ భక్తి ప్రధానంగా ఒకే వ్యక్తి ఎన్నో పాత్రలను పోషిస్తూ పండిత పామర జనరంజకంగా చెప్పేదే హరికథ. ధర్మార్థ కామమోక్షములనే నాల్గు పురుషార్థాలను మానవులకు వేదం నిర్దేశించింది. మానవుడు ఆవరించే ధర్మార్థ కామములు భగవంతుడు సృష్టించిన సృష్టిని కొనసాగించేందుకు ఉపయోగిస్తాయి. … Continue reading
రాగం.. తానం.. పల్లవి… రమ
సంగీత విద్యానిధీ, కళానిధీ; రెండు రకాలుగా డా పంతుల రమ సామర్థ్యం వికసించి ఈ వర్తమాన తరాన్ని గుబాళింపజేస్తున్నది. ఇటు కేవల కళాకారులకూ, అటు విద్వాంసులకూ ఆమె ఆదర్శంగా నిలుస్తున్నదనడంలో ఏ మాత్రమూ అతిశయోక్తి లేదు. ‘‘సాధన ద్వారా ఆదర్శ కర్ణాటక సంగీతజ్ఞుని రూపొందించడం’’ అన్న అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టాని ఆంధ్ర … Continue reading
లింగాభిషేకం
కార్తీక మాసంలో లింగాభిషేకం చేయించుకుంటే చాలా మంచిదని పెద్దలు చెబుతూ ఉంటారు. అసలు లింగాభిషేకం ఎందుకు చేయాలి అనే విషయాలను చాగంటి కోటేశ్వరరావు శర్మ వివరిస్తారు. “బహుళో మృదాగాంశి శాఖో….” పరమేశ్వరుడి తలపై ఒక వైపు గంగ, మరొక వైపు చంద్రరేఖ కనిపిస్తూ ఉంటాయి. ఇవి రెండు చల్లగానే ఉంటాయి. వీటికి తోడు ఎడమచేతి … Continue reading
జంధ్యాల స్టైల్ నెట్ దండకం (వెబ్ బాత్ )-ఆంధ్ర జ్యోతి -18-11-13-మరియు ”నిర్వచనాలు ”
జంధ్యాల స్టైల్ నెట్ దండకం (వెబ్ బాత్ )-ఆంధ్ర జ్యోతి -18-11-13- ఫేస్ బుక్ లో ఎవరో చచ్చారని పోస్ట్ లైక్ చేసే ”పింజారీ”! ఫేస్ బుక్ లో త్విత్తర్ కోసం వెదికే దరిద్రపు సన్నాసీ ! ప్రొఫైల్ పిక్చర్లు హాక్ చేసే నికృష్ట దుస్టాత్ముడా ! పొద్దున్నే లేచి పాచి మొహం … Continue reading
వన భోజనం ఎందుకు? కార్తీక స్నానం ఎలా చేయాలి?
కార్తీక మాస వన భోజనాల ప్రాశస్త్యం గురించి, వీటికి పౌరాణికంగానే కాక, సామాజికంగా కూడా ఉన్న ప్రాధాన్యం గురించి ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వర రావు శర్మ ఈ వ్యాసంలో వివరించారు. కార్తీక మాసంలో వనభోజనం తప్పని సరి. ‘వనం’ అనే పదానికి అరణ్యాన్ని ప్రేమించడమని అర్థమని అమరకోశం చెబు తుంది. కార్తీక మాసంలో … Continue reading
ఆవంత్స @90 ఇంటర్వ్యూ: పెన్నా శివరామకృష్ణ
చిన్నతనంలో కవిత్వ రచన ప్రారంభించినప్పుడు ఏ ఆశలూ ఉండవు. ఇప్పుడు కూడా ఆ తాజాదనం మనం కాపాడుకుంటే ఏ బాధా ఉండదు.సాధారణ మేధావి కన్న, కవి పదిరెట్లు ఎక్కువ చదవాలి. ఇంగ్లిష్ కవిత్వం తప్పనిసరిగా చదవాలి.రాయాలనుకొని రాయలేకపోయిన రచనలు ప్రతి కవికీ ఎన్నో కొన్ని ఉంటాయనుకుంటాను.ఏ వాదానికైనా రెండు అంశాలు ముఖ్యం. ఒకటి చిత్తశుద్ధి, … Continue reading
పాటల కోసమే నాట్లేయడం నేర్చుకున్నా
విమలక్క అంటే పాటను పరవళ్లు తొక్కించే అరుణోదయ కళాకారిణి మాత్రమే కాదు. ప్రజా ఉద్యమాలకే జీవితాన్ని అంకితం చేసిన పోరాట వనిత. ప్రగతిశీల విద్యార్థి సంఘంలో పనిచేస్తున్నప్పుడే జోగిని వ్యవస్థపై పోరాడిన «ధైర్యశీలి. చిన్న వయసులోనే ఉద్యమాల్లో తిరిగిన సాహసి. ఏ క్షణమైనా, ఎలాంటి పరిస్థితిలోనైనా ఉద్యమానికి జై కొట్టడానికి ముందుండే పిడికిలి ఆమె. … Continue reading
నృసింహ సిద్ధాంతికి అపూర్వ సన్మానం
వరంగల్ జిల్లా కొడకండ్ల మండల కేంద్రానికి చెందిన ప్రముఖ ఆధ్యా త్మికవేత్త పాలకుర్తి నృసింహరామ సిద్ధాంతి 91 ఏళ్ల వయసులోను అలుపెరగకుండా ఆధ్యాత్మిక సేవలను కొనసాగిస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన ‘దర్శనం’ అనే ఆధ్యాత్మిక మాస పత్రిక తమ సంచిక నవమ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజు హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో జీవన సాఫల్య … Continue reading
దీపం ఓ ఆధ్యాత్మిక మార్గం – కార్తీక దీపాలెందుకు?
దీపం యథార్థంగా పరమేశ్వర స్వరూపం. ఏ సహస్ర నామాన్ని చదివినా దానిలో అనేక నామాలుంటాయి. దానిలో పరంజ్యోతి అనే నామం కూడా ఉంటుంది. పరంజ్యోతి నపుంసక నామం. అలాంటి ఈశ్వరుడు స్త్రీయా, ఈశ్వరుడు పురుషుడా, నపుంసకుడా అని ఆలోచించండి. అసలు ఈశ్వరుడు స్త్రీ కాడు, పురుషుడు కాడు, నపుంసకుడూ కాడు. ఈశ్వరుడు … Continue reading
ప్రవాస తెలుగు వారికి అండదండలు
ఇతర రాష్ట్రాలలో స్థిరపడిన తెలుగువారికి భాషా వికాస పరిధిలో తగిన ప్రోత్సాహం అందించడానికి, భాషను వ్యాప్తి చేయడానికి అధికార భాషా సంఘం పెద్దయెత్తున కృషి ప్రారంభించింది. దిగంతాలకు విస్తరించిన తెలుగుదనంలో అచ్చమైన తేటతెలుగు మాటలు తరిగిపోతున్నాయి. పలచబారిపోతున్న మన రాతకోతల తెలుగుపై రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ ఆవేదన వ్యక్తం … Continue reading
జీనియస్ జివి కృష్ణరావు – ప్రొఫెసర్ వెలమల సిమ్మన్న
నాటకకర్తగా, నవలా రచయితగా, కథా రచయితగా, విమర్శకుడుగా, పరిశోధకుడుగా, వ్యాసకర్తగా, అలంకారశాస్త్రాల్లోని లోతుపాతులు తెలిసిన మేధావిగా, ప్రాక్‌పశ్చిమ దేశాల తత్వశాస్త్రాల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన ప్రతిభావంతుడుగా, హేతువాదిగా, మానవతావాదిగా, తెలుగుదేశంలో పేరు ప్రఖ్యాతులు గడించారు డాక్టర్ గవిని వెంకట కృష్ణరావు. కృష్ణరావు వ్యవసాయ కుటుంబంలో తెనాలి తాలుకా కూచిపూడి గ్రామంలో నవంబర్ 15, 1914లో … Continue reading
పోరాటాల వేదిక ‘సృజన’ – సాహితీ మిత్రులు
సృజన- ఆ మూడక్షరాల పేరు ఇరవయో శతాబ్ది రెండో అర్ధభాగపు తెలుగు సాహిత్యంలో, సమాజంలో, సాంస్కృతిక రంగంలో, మేధో ప్రపంచంలో ఉజ్వల అరుణారుణ తార. ఒక చిన్న యువ సాహితీమిత్రుల బృందం పూనికతో స్పష్టాస్పష్ట అన్వేషణగా 1966లో ప్రారంభమైన సృజన పావుశతాబ్ది ప్రయాణం తర్వాత 1992లో అర్ధాంతరంగా ఆగిపోయేనాటికి తెలుగుసీమలో సమాజ సాహిత్య సంబంధాలకు, … Continue reading
సమంత నన్ను మార్చేసింది-కంచర్ల రమేష్ -ఆంధ్ర జ్యోతి
పసిపిల్లలంటే అందరికీ ప్రాణమే. కానీ, ఆ ప్రాణాల్ని కాపాడుకోవాలంటే, అత్యంత ఆధునికమైన వనరులెన్నో కావాలి. ఆ వనరులెన్నింటినో చేర్చుకుని వెలిసిందే ‘రెయిన్‌బో’ హాస్పిటల్. దాని మూలస్తంభం పేరే డాక్టర్ రమేశ్ కంచర్ల. ఒక దశలో అప్పుల్లో కూరుకుపోయి ఇక హాస్పిటల్ నడపడం అసాధ్యమేమో అనిపించిన స్థితి నుంచి మరో మూడు కొత్త బ్రాంచీలను ప్రారంభించే … Continue reading
కాదంబరి ప్రేమలో రవీంద్రుడు
విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ యుక్తవయస్సులో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి కాదంబరి. సొంత వదిన అయినా, తన కన్నా వయస్సులో రెండేళ్లు పెద్దదయినా ఆమెతో ఠాగూర్‌కు ఎలాంటి అనుబం«ధం ఉందనే విషయంపై అనేక కథనాలు వెలువడ్డాయి. తాజాగా ప్రముఖ మానసిక విశ్లేషకుడు సుధీర్ కాకర్ రాసిన ‘యంగ్ ఠాగూర్’లో ఈ అనుబంధానికి సంబంధించిన విశ్లేషణ … Continue reading
NON STOP జోకర్
గంటల తరబడి ఆపకుండా నవ్వించడం జోక్ కాదు. కాని విశాఖపట్టణంలోని కోరుకొండ రంగారావుకు మాత్రం జోక్‌తో పెట్టిన విద్య. అయన కదిలొస్తే జోక్, నడిచొస్తే జోక్, షర్టు మడతెడితే జోక్. వైవిధ్యమైన కామెడీ స్క్రిప్ట్స్, కామెడీ ప్లేలెట్స్‌లతో అదరగొట్టేస్తున్న ఈయన.. జోకులరాజ్యంలో పాతుకుపోయిన పాత రికార్డులన్నీ తుడిపేస్తున్నారు. ఈ మధ్యనే ఆపకుండా 654 జోకులు … Continue reading
సమగ్ర కళా వేదికగా శతరూపం
రాష్ట్రంలో తెలుగు భాష, సాంస్కృతిక వికాసానికి ఒక కొత్త విధానాన్ని రూపొందించాలని, యువతకు కళా రంగంలో అవకాశాలు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. స్పష్టమైన సాంస్కృతిక విధానం లేని మన రాష్ట్రంలో తప్పటడుగుల శతరూప కార్యక్రమం కొత్తపుంతల్లో సాగుతోంది. ప్రతిభావంతులైన కళాకారుల సృజన, ప్రదర్శనా పాటవాలకు ప్రోత్సాహక వేదికగా ఆ కార్యక్రమాన్ని రూపుదిద్దారు. వరుసగా వంద … Continue reading
అక్షరంలో.. ఆచరణలో..ఆజానుబాహువు -బొగ్గుల శ్రీనివాస్
అక్షరంలో.. ఆచరణలో..ఆజానుబాహువు 1948వ సంవత్సరం.. ‘రేరాణి’ పత్రికలో ‘అలవాటయిన ప్రాణం’ అనే కథలో పరిధికి మించిన శృంగారం రాశాడని ఒక 21 ఏళ్ల యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 500 రూపాయల జరిమాన కట్టకపోతే ఆరు నెలల జైలుశిక్ష అనుభవించవలసి ఉంటుందని జడ్జి తీర్పునిచ్చాడు. ‘రేరాణి’ పత్రికాధిపతి ఆలపాటి రవీంద్రనాథ్ జరిమానా కట్టి ఆ … Continue reading
ఇప్పటికీ అవే గాయాలు
ఇప్పటికీ అవే గాయాలు : కొలకలూరి ఇనాక్ పశువుల కాసే ఓ కుర్రాడు యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ కావడాన్ని ఊహించ గలమా? అలాంటి అసాధ్యాన్ని నిజం చేసిన వారు కొలకలూరి ఇనాక్. అంటరానితనం కారణంగా ఎదురయ్యే అన్ని అవమానాలూ భరిస్తూనే అనుకున్న లక్ష్యం దిశగా అడుగు ముందుకేశారాయన. పిహెచ్.డి లో సీటు రావడానికి ఎన్ని అవాంతరాలు … Continue reading
బౌద్ధ సంస్కృతి పరిరక్షణే లక్ష్యం
బౌద్ధ సంస్కృతి పరిరక్షణే లక్ష్యం ఒకప్పుడు సివిల్స్ సర్వీసు పరీక్షల కోసం భారతదేశ చరిత్రతోపాటు బౌద్ధమతంపై సమగ్ర అధ్యయనం చేసిన చెన్నూరు ఆంజనేయరెడ్డి బౌద్ధ సంస్కృతి పట్ల ఆకర్షితులయ్యారు. ఆరంభంలో నాస్తికుడైన ఈయన తాను నమ్మిన బౌద్ధ సంస్కృతి, సంప్రదాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పలు స్వచ్ఛంద కార్యక్రమాలు చేపడుతున్నారు. వివిధ భాషల్లో ఉన్న గ్రంథాలను తెలుగులోకి … Continue reading
సారే మా ‘శ్రీహరి’ 24-10-2013 andhrajyothi
సారే మా ‘శ్రీహరి’ రియల్‌స్టార్ శ్రీహరి- భాస్కర్‌ల బంధం గురించి మాట్లాడటం అంటే ఓ మహానది పిల్లకాలువపై పెంచుకున్న ప్రేమను, సముద్రమే నది కోసం ఎదురుచూస్తున్న సందర్భాన్ని వర్ణించినట్టుగా ఉంటుంది. ఈ భాస్కర్ సినిమా పరిశ్రమలో తప్ప ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ శ్రీహరి జీవన ప్రయాణంలో ఇతనిదీ సగం జీవితం. ఆ ‘హీరో’ నవ్వితే … Continue reading
ఇసుక తుఫాన్ ‘జజీరా’
ఇసుక తుఫాన్ ‘జజీరా’ ఉత్తరప్రదేశ్‌లో ఇసుకమాఫియా మీద పోరాడి సస్పెన్షన్‌కు గురైన దుర్గ్గాశక్తి నాగ్‌పాల్ గురించి దేశమంతటికీ తెలుసు. ఎందుకంటే ఆమె ఐఏఎస్ అధికారిణి కనుక. ఆమె చూపిన తెగువకు, సాహసానికీ ఏ మాత్రం తక్కువ కాకుండా.. అదే ఇసుక మాఫియాను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తోంది కేరళకు చెందిన సామాన్య ముస్లిం … Continue reading
నేను మలాలా -ఆత్మకధ -ఆంధ్ర జ్యోతి ఆదివారం -20-10-13
నేను మలాలా -ఆత్మకధ -ఆంధ్ర జ్యోతి ఆదివారం -20-10-13
నెత్తురోడిన గాంధీ
నెత్తురోడిన గాంధీ మహాత్మాగాంధీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన సంఘటనలేమిటి? ఆయనను ప్రభావితం చేసిన వ్యక్తులెవ్వరు?- ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ రాసిన ‘గాంధీ బిఫోర్ ఇండియా’ పుస్తకంలో మనకు లభ్యమవుతాయి. గాంధీ జీవితంలోని కొత్త కోణాలను ఆవిష్కరించిన ఈ పుస్తకంలోని కొన్ని ఆసక్తికరమైన భాగాలు.. “డర్బన్ సహజసిద్ధమైన నౌకాశ్రయం. అయితే అన్ని నౌకలను … Continue reading
ఉయ్యూరు యోగ మిత్ర మండలి ఆధ్వర్యం లో లో శ్రీ ఎక్కిరాల వేద వ్యాస స్మరణ
ఉయ్యూరు యోగ మిత్ర మండలి ఆధ్వర్యం లో లో శ్రీ ఎక్కిరాల వేద వ్యాస స్మరణ
కష్టపడే తత్వం అక్కడే నేర్చుకున్నాను : పరుచూరి హనుమంతరావు
కష్టపడే తత్వం అక్కడే నేర్చుకున్నాను : పరుచూరి హనుమంతరావు P ప్రింటింగ్‌లో అత్యున్నత ప్రమాణాలకు పెట్టింది పేరయిన ‘ప్రగతి ఆర్ట్ ప్రింటర్స్’నే తన ఇంటి పేరుగా మార్చుకున్న తొంభయ్యేళ్ల పెద్దమనిషి పరుచూరి హనుమంతరావు. ఆయనను ‘మీ ఊరేది’ అని కొద్దిగా కదిలిస్తే చాలు.. తొమ్మిదేళ్ల చిన్నపిల్లాడైపోయి, ‘పొలం పనులు చేసుకోవడం, బర్రెల్ని మేపుకోవడం, చెరువు ఒడ్డున … Continue reading
సాటి మనిషి సేవలతోనే జీవితానికి సార్థకత
సాటి మనిషి సేవలతోనే జీవితానికి సార్థకత మారుమూల గ్రామంలో రైతు కుటుంబంలో పుట్టిన ఊట్ల అప్పారావు డబుల్ ఎంఏ చదివి, తన ప్రతిభతో 1964లో ఐపిఎస్ అధికారిగా ఎంపికయ్యారు. అవినీతి అధికారులపై ఉక్కుపాదం మోపటంతోపాటు నేరస్థులను అణచివేసి శాంతిభద్రతల పరిరక్షణకు పాటుపడ్డారు. రాష్ట్రంలో అవినీతి నిరోధకశాఖ అదనపు డైరెక్టరుగా, పౌర సరఫరాల శాఖ విజిలెన్స్ విభాగం … Continue reading
98 నాటౌట్
98 నాటౌట్ మనశ్శాంతిగా ఉండండి. అది ఉండాలంటే బ్యాంక్ అకౌంట్లో బోల్డంత డబ్బు ఉండాల్సిందే. డబ్బు లేకపోవడం వల్ల మానసికంగా కుంగిపోతాం. అంటే కోట్లకొద్దీ ఉండాలని కాదు, మీ భవిష్యత్ అవసరాలకు సరిపోయినంత ఉండాలి, ప్రముఖ రచయిత, కాలమిస్టు కుష్వంత్ సింగ్‌కు 98 ఏళ్లంటే నమ్మడం కష్టమే. ముప్పయ్యేళ్ల యువత కంటే ఉత్సాహంగా కనిపించే తన … Continue reading
సాటి లేని మేటి భువన విజయం
సాటి లేని మేటి భువన విజయం September 23, 2013 రాయల వారు అష్ట దిగ్గజాలతో నిర్వహించిన ‘భువన విజయం’ రూపకం క్రమక్రమంగా యువకులు, విద్యార్థులను ఆకట్టుకుంటోందని ఇటీవల జరిగిన శతరూప కార్యక్రమాల సందర్భంగా రుజువయింది. ఇటీవల రాష్ట్ర రాజధాని నగరంలోని రవీంద్ర భారతిలో నిర్వహించిన ‘భువన విజయం’ రూపకం అమోఘంగా విజయం సాధించింది. ఒకప్పుడు … Continue reading
చెరి 60 మార్కులు వేసుకుంటాం-ఓపెన్ హార్ట్ విత్ ఆర్.కె.లో రోజా రమణి దంపతులు -ఆంధ్రజ్యోతి -23-9-13
చెరి 60 మార్కులు వేసుకుంటాం September 23, 2013 బాలనటిగా మొదటి సినిమాకే జాతీయ అవార్డును అందుకున్న నటి రోజారమణి. ‘ఒడియా ఎన్టీఆర్’ అని పెద్ద పేరు తెచ్చుకున్న హీరో చక్రపాణి. సినిమాల్లోనే కాకుండా, భార్యాభర్తలుగా జీవితంలోనూ కలిసి నడుస్తున్న రోజారమణి – చక్రపాణి జంట ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి ఎం.డి. వేమూరి రాధాకృష్ణ నిర్వహించే … Continue reading
ఆ ఘాటు తెనాలిదే!
ఆ ఘాటు తెనాలిదే! September 22, 2013 శారద డైలాగులు చెప్పిందంటే సినిమా హాలు దద్దరిల్లిపోయేది. మీసాలు మెలేసే విలన్లకు సైతం ముచ్చెమటలు పట్టించేదామె. అక్రమాలు, అన్యాయాలు జరిగినప్పుడు.. ఇదేమి న్యాయం? అని నిలదీసిందంటే చాలు.. ఎదుటివాడు నీళ్లు నమలాల్సిందే! అంత కఠోరమైన పాత్రలే కాదు వెన్నముద్దలా కరిగిపోయే ఆత్మీయ పాత్రల్నీ పోషించింది శారద. ఆ … Continue reading
నాగావళి ‘ఛాయ’ – బి. సూర్యసాగర్
నాగావళి ‘ఛాయ’ – బి. సూర్యసాగర్ September 21, 2013 దాదాపు నాలుగు దశాబ్దాలుగా విప్లవ సాహితీ సాంస్కృతికోద్యమంలో రాజీలేని నిబద్దతా నిమగ్నతలతో అద్భుతమైన కవిత్వం సృజించాడు ఛాయరాజ్. ‘కేన్సర్’ బాధితుడై 65 ఏళ్ల వయసులో ఈ నెల 20న ఉదయం శ్రీకాకుళం పట్టణంలో ఆయన తుదిశ్వాస వదిలారు. గొప్ప కవిగానే కాకుండా ఉత్తమ ఉపాధ్యాయునిగా, … Continue reading
వెయ్యి కథల నానమ్మ పప్పు జయా వేణుగోపాల్-ఆంద్ర జ్యోతి -19-9-13
వెయ్యి కథల నానమ్మ September 19, 2013 మన దేశాన్ని భరతుడు పరిపాలించాడు కనుక భరతవర్షమంటారని తెలుసు. మరి అంతకు ముందు మన దేశాన్ని ఏమని పిలిచేవారు? రాముడి పిల్లలు ఎవరెవరు? బ్రహ్మదేవుడికి ఆలయం లేదెందుకు? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం ఎవరు చెప్పగలరు? పూర్వమైతే ఇంట్లో ఉండే నానమ్మలో, అమ్మమ్మలో చెప్పేవారు. “ఇప్పుడు నేను చెబుతాను. … Continue reading
