
వరంగల్ జిల్లా కొడకండ్ల మండల కేంద్రానికి చెందిన ప్రముఖ ఆధ్యా త్మికవేత్త పాలకుర్తి నృసింహరామ సిద్ధాంతి 91 ఏళ్ల వయసులోను అలుపెరగకుండా ఆధ్యాత్మిక సేవలను కొనసాగిస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన ‘దర్శనం’ అనే ఆధ్యాత్మిక మాస పత్రిక తమ సంచిక నవమ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజు హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో జీవన సాఫల్య పుర స్కారం, ధార్మిక వరేణ్య బిరుదు ప్రదానం చేస్తోంది. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు, హైకోర్టు న్యాయమూర్తి ఎల్. నర్సింహారెడ్డి, భూ పరిపాలన శాఖ కమిషనర్ ఐ.వై.ఆర్. కృష్ణారావు, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సలహాదారు కె.వి.రమణచారి, రిటైర్డ్ డీజీపీ అరవిందర్ రావు, పేర్వా రం రాములు, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి ఎల్.వి. సుబ్రమణ్యం తదితరులు హాజరు కానున్నారు.
1925 జూలై 20న జన్మించిన నృసింగరామ సిద్ధాంతికి మొదటి నుంచీ ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉండేది. ఆయన కు తెలుగు, హిందీ, సంస్కతం భాషల్లో ప్రావీణ్యం ఉంది. ఆయన ఇప్పటి వరకు 2400 ఆలయాల ఏర్పాటులో చురుకైన పాత్ర పోషించడమే కాక, బొండ్రాయి ప్రతిష్ఠాపనతో సహా అనేక విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆయనకు వైదిక విద్య, జ్యోతిష్యాలతో కూడా ప్రావీణ్యం ఉంది. ప్రస్తుతం ఆయన కొంత కాలంగా ధర్మ ప్రచారం, ఆధ్యాత్మిక సేవలలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఆయన భార్య సుభద్రాదేవి మూడేళ్ల క్రితం అనారోగ్యం మృతి చెందారు. ఆయనకు ఆరుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారిలో చిన్న కుమారుడైన గౌతమి శర్మ బయోమెడికల్ కంపెనీ ఉద్యోగం వదులుకొని తన వెంట ఆధ్యాత్మిక సేవలో పాల్గొంటున్నారు. నిత్యపారా యణ పద్ధతి, శ్రీ విద్య సాఫల్య, శ్రీ విద్య లఘుచక్రపూజ, శ్రీ విద్య నిత్యాహ్నికం, రుద్ర స్వాహాకారం గ్రంథాలను రచించిన నృసింహ రామ సిద్ధాంతి రాష్ట్రంలోనే కాక, ఉజ్జయని, కాశీ, వేలు ప్రాంతాల్లో నవచండీ హోమం నిర్వహించారు. దీపావళి, దసరా ఇతర పండుగ తేదీల్లో వ్యత్యాసం వస్తుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తు న్న సిద్ధాంతి, వాస్తవానికి ఈ రకమైన వ్యత్యాసం రాకూ డదని చెప్పారు. కొంత మంది ప్రాచీన గణితం, మరికొంత మంది ధృ గ్గణితం ఆచారిస్తుండడం వల్ల ఈ రకమైన తేడాలు వస్తున్నాయని ఆయన వ్యాఖ్యా నించారు. దేవుడి పేరిట పలు సంస్థలు, కొందరు వ్యక్తులు వ్యాపారం చేస్తుండడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ, దేశంలో దేవా లయాల నిర్మాణం పెర గడం ఆధ్యాత్మిక చింతనను పెంచుతోందని, ప్రజల్లో భక్తి భావం ఇనుమడించడం హర్షణీయమేనని అన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉగాది పర్వదినం రోజున విశిష్టమైన వ్యక్తిగా ఆయనను సన్మానించడం జరిగింది. తెలంగాణ భవన్ నిర్మాణ సమయంలో చండీ హోమం నిర్వహిం చిన సందర్భంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, గతంలో దివంగత మాజీ మంత్రి ఎన్. యతిరాజారావు అనేక సార్లు సిద్ధాంతిని సత్కరించారు. మండల కేంద్రంలో రూ. 30 లక్షలతో ఆయన దాతల సహాయంతో, యోగ లింగేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో విశిష్టమైన వినాయక విగ్రహాలతో పాటు రాజరాజేశ్వరి విగ్రహాలను నెలకొల్పి నిత్యం పూజలు కొనసాగిస్తూ ప్రజల్లో భక్తి భావం వ్యాపించడం కోసం కృషి చేస్తున్నారు.
