శ్రీమతి శ్రీదేవి మురళీధర్ రాసిన వేదాంత దేశికులు 7వ భాగం.30.11.22
Video link
శ్రీమతి శ్రీదేవి మురళీధర్ రాసిన వేదాంత దేశికులు 7వ భాగం.30.11.22
Video link
శ్రీ భీమేశ శతకం
శ్రీ దేవరకొండ అనంతరావు శ్రీ భీమేశ కందశతకం రచించి ,శ్రీకాకుళం శ్రీ రామ కృష్ణా ప్రింటింగ్ ప్రెస్ లో 1939 లో ముద్రించారు .వెల-పావలా .’’భీమేశా ‘’అనేది మకుటం .దీనికి తొలిపలుకు శ్రీకాకుళం మునిసిపల్ హై స్కూల్ ఖగోళ శాస్తజ్ఞుడు బి.ఎ. బిఎడ్. హెచ్.ఎం. డి .శ్రీ బొమ్మిడాల ఆది వెంకట నరసింగ రావు రాశారు .తన శిష్యుడైన అనంతరావు ఈ శతకాన్ని కంద పద్యాలలో రాశాడని ,ఇది మొదటి ప్రయత్నం కనుక సాధ్యమైనంతవరకు తప్పులు సవరించాననీ ,సారం గ్రహించి ప్రోత్సహించమనీ,సరళంగా శబ్దాలంకారాలతో కవి కూర్చాడనీ మెచ్చుతూ –‘’స్మరహరుపై శతకము బుధ వర-పరమాదరమునకు బాత్రముగాని – ద్ధర నొనరిచి నెగడిన దే-వరకొండ అనంతరావు వర్ధి లు గాతన్ ‘’అని ఆశీర్వదించారు శిష్యుడిని .పీఠికలో కవి ‘’శ్రీ భీమేశు ప్రేరణతో రాశాను భాషాజ్ఞానం గ్రంథ పరిచయం లేని వాడిని .ముందుమాట రాసిన గురువుగారికి ,ముద్రణకు ద్రవ్య సాయం చేసిన శ్రీ కిల్లాన రామన్నాయడు లకు కృతజ్ఞతలు తెలిపారు .
మొదటి పద్యం –‘’శ్రీకర యో సద్భక్త వ-శీకర ,రిపుభీకర ,సుర శేఖరహర మో-క్షాకర రజనీకరధర -శ్రీ కర కంఠాతలంతు భీమేశా’’ .అందాలకందాలనే మందార సుమాలు ఏరి మాలగా అత్యానందంగా కూర్చాను ఇందు ధరా దీన్ని తాల్చు అని కోరారు రెండవపద్యంలో .ఈశా గౌరీశా విశ్వేశా,రిపునాశా ,మహేశా పోషా ,ఆశాపాశ వినాశా ,నాశ రహిత దయ చూపు అన్నారు శకార యమకం తో .ధరణి రధం ,దానికి దినకర ,శశి చక్రాలు మిన్కు గమి తురగాలు ,ధరణీధరమే ధనువు ,హరి శరం .అజుడు నీ సూతుడు అని తనకే పాండిత్యం లేదన్న కవి అద్భుతంగా కవిత అల్లారు .నందీశ భ్రున్గీశ ,బృందారక బృందం అజుడు హరి రుషివరులు ‘’నీ సుందర పదపద్మాలను అందముగా గొల్తురు ‘’అన్నారు
‘’ఒక్కడవట రక్కసులను –బెక్కుడువట,భక్త తాటికి జిక్కుడువట నీ –దిక్కును కోరిన వారి కి దక్కుడదువట ‘’అంటూ కకార ప్రాస లో కాలేకాలుడిని చమత్కారంగా భక్తసులభుడినిగా వర్ణించారు , మృత్యు నిత్యు సత్య లతో మరోఆణిముత్యం అందించారు .అకల౦కా ఉమా౦కా అంటూ కొడుకును భార్యను శివుడికి అర్పించిన భక్తుల గాథలు జ్ఞాపకం చేశారు .విల్లు కా౦చనమేగా,ఆభరణాలు చేయటానికి విశ్వకర్మ నీ సన్నిధిలోలేడు అందుకే ‘’’’పాప’’ నగల దాల్చగల రూపం ‘’మర్మం చెప్పమన్నారు .ఏ పేరుతొ పిలిస్తే పలుకుతావో తెలీదు .నీదయ లేక నేను జడుడు గా ఉన్నా .దయతో మన్నించు .’’నీపలుకులు సుధలొలుకుతాయి ‘’అని పోతన్నగారి శైలి పద్యం రాశారు .నామొరలు వినబడలేదా దీన బంధో’’అన్నారు ఆర్తిగా .కాలుని చేతికి చిక్కకముందే కాలాంతక నీలీలలు పోగుడుతున్నాను .
జడమతి నిడుముల దడబడి-కడుపడిసెడి నీ యడుగులకడ,బడ నీవీ –యెడ జేనిడ,నో మృడయే-డకేగుదు మగుడ దెల్పుమిక భీమేశా ‘’ పోతనగారికేమీ తీసిపోడు అనట్లుగా ఉందికదా పద్యం .కనికరపు గనివి .కరములు మోడ్చి వెడితే విని కరము గాచెదవని విబుధనికరము ‘’నిన్ను పొగుడుతుంది అని కరము తో కమ్మని కందం వండి వడ్డించారు .’’నిన్ను తెలుసుకోని చదువులు వ్యర్ధంకదా అని యదార్ధం చెప్పారు .పంచశర గర్వహర –పంచానన వరద భక్తవరా ‘’అంటూ హరనామాల తో భక్తికవితా ప్రవాహం పారించారు .నీఇల్లు ధవళం ,భూషలు జడ ,నెత్తిన సుధాకరుడు,నీ శరీరం కూడా ధవళం అని ధవళవర్ణుని వర్ణించారు కవి .
పిలిచినా రావు నా నేరమా గ్రహచారమా గజచర్మధరా హరా ‘’అంటూ పల్లవి౦చారు.హరి హరులు ఒక్కటే .భేద బుద్ధి పాటించినవాడు ‘’కరుణా మయ ,కాలుని కడ కరుగుట తధ్యం .బలి ఇంటికి హరి కావలి కాస్తే ,’’నువ్వు బాణుని ఇలు గాచితివి ‘’కనుక మీ ఇద్దరికీ భేదమే లేదు .ఇద్దరూ భక్తులకు కింకరులు వశంకరులే .నరు సఖుడా శ్రీహరి .అలాంటి నరునికి పాశుపతం ఇచ్చావు నువ్వు .మీ ఇద్దరికీ భేదమేమిటి ఉమామహేశా ,రమేశా అన్నారు .నువ్వు ఎలాగూ నిత్య యాచకుడివే .ఆయనేమైనా పొడిచేశాడా ? బలిని మూడడుగులు యాచించాడు .యాచనలోనూ తేడాలేదు అని చమత్కారం .పన్నగాలు నీ భూషలు ,పన్నగ శయనుడు ఆయన .ఇద్దరూ పాపవినాశులే .
‘’మురహరుడాతడు నీవో –పురహరుడవు సర్వ లోక పూజ్యా ,భువిపై –హరియన ,హరుడన భేదంబు లేదయా ‘’అని అద్వైతం ఆవిష్కరించారు కవి .నువ్వు శ్రీ(విషం ) గళుడవు.ఆయన శ్రీ(లక్ష్మి ) గలవాడు .మీకు భేదం ఏమిటి మా అజ్ఞానం కాక అన్నారు .ఆయనకు తిరుపతి నీకు రజతగిరి ఉనికి పట్టు .ఇద్దరూ కొండల దేవుళ్లే.మాకోసం దిగొస్తారు .గట్టులరాయని (హిమవంతుడు )ముద్దులపట్టిని చేపట్టినట్టి పరమేశుడిని,పుట్టుట గిట్టుట లేని జెట్టిని భీమేశుని మోక్షంకోసం ప్రార్ధిస్తా .శివుడు ‘’దినకర ,శశి, శిఖి త్రినేత్రుడు .ఒకరాజు కలంకుడు వేరొకరాజుకు వేయికన్నులు ,ఇంకోరాజు గ్రహబాధితుడు .కనుక రాజు అంటే నువ్వే అని చక్కని ఎనేక్డోట్స్ తో మంచి పద్యం రాశారు .’’నా చిత్తం అనే అశ్వం ఇచ్చవచ్చిన చిత్తంతో పరిగెత్తుతోంది చిత్త హరా ‘’ నువ్వే వచ్చి ఆగుర్రాన్ని దారికి తేవాలి అంటూ ఆదిశంకరుల శివానందలహరి శ్లోకాన్ని జ్ఞాపకం చేశారు .
‘’శ్రీకరములు సుగుణాలికి-భీకరములు దైత్యతతికి వీనుల విన మో-క్షాకరములు భక్తులకు వశీకరములు నీ చరితలు ‘’.శూలివి ,గిరిజాసతికి అనుకూలివి ,అసుర కుంజర తతినిర్మూలివి ,కడు బలశాలివి –పాలితలోకాళివరయ ప్రభు భీమేశా’’.తోలు ధరించి జలంధరు నేలకూల్చి ,కాలుని గెల్చి ,శిరియాళుని దయతో కాపాడావు ..
99వ పద్యం లో ‘’శ్రీ విశ్వ కర్మ కులజుడ –దేవర కొండాన్వయుడను,ధీనుత చరితా – శ్రీ విశ్వభద్ర గోత్రుడ –బ్రోవుమనంతాఖ్యు నన్ను భువి భీమేశా ‘’అని తన విషయాలు చెప్పుకొన్నారు .నూరవ పద్యంలో మంగళం పాడుతూ –‘’మంగళమిదె గొనుమా –మంగళకర యో శుభాంగ ,మాధవహిత ,నా –మంగళమిదె గైకొనుమో –యంగజ హర భ్రు౦గి వినుత హర భీమేశా “’అంటూ శతకం సమాప్తం చేశారు కవి .
కవి విశ్వకర్మ కులజుడు కనుక బంగారాన్ని ఎంత సున్నితంగా ఆభరణాలుగా మలుస్తారో ,అంతే సున్నితంగా ప్రతిపద్యాన్నీ శిల్పీకరించి ఆపరమశివుడే పరమాశ్చర్యం పొందేట్లు ‘’శతకనక ‘’శోభాయ మానంగా తయారు చేశారు .ప్రతిపద్యం ఒక ఉదాహరణమే .భక్తి శతకాలలో తలమానికమైన శతకం అని నేను భావిస్తాను .ప్రతి పద్య చమత్కృతి తో శతకం సహస్రగుణ శోభిత౦ గా ఉంది .శతకకర్తకు కమోడ్పులు ఘటిస్తున్నాను .నిత్య పారాయణకు అద్భుతంగా పనికి వచ్చే శతకం ఇది .రసభరిత శతకం .కవితాధార నాగావళీ, వంశధారా సదృశ వేగంగా సాగింది .ప్రతిపద్య రమణీయం శతకం .బహుశా శ్రీ కాకుళం లోని ముఖ లింగేశ్వర స్వామిపై రాసి ఉండచ్చు .అక్కడ భీమేశ్వర దేవాలయం ఉన్నట్లు లేదు .గొప్ప భక్తిశతకాన్ని, తద్రచయితను పరిచయం చేసిన మహద్భాగ్యం నాకు దక్కింది .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -30-11-22-ఉయ్యూరు .
బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం .40,వ భాగం.30.11.22
Video link
మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -366
· 366-1940లో ఒక గ్రామం దర్శకుడు ,కదా ,పాటలరచయిత ,నిర్మాత ,జాతీయ నందీపురస్కార గ్రహీత-నరసింహ నంది
· నరసింహనంది (జన్మనామం:నరసింహారెడ్డి) భారతీయ సినిమా కథా రచయిత, దర్శకుడు, నిర్మాత, పాటల రచయిత. ఆయన ముఖ్యంగా తెలుగు చిత్రసీమలో సుపరిచితుడు. [1][2] 2008 లో 1940 లో ఒక గ్రామం చిత్రానికి దర్శకత్వం చేసినందుకు గానూ ఆయన జాతీయ ఫిలిం పురస్కారం, నంది పురస్కారం పొందాడు. [3] 2013 లో 60వ జాతీయ చిత్ర పురస్కారాలలో దక్షిణ విభాగం- 2 కు తన సేవలందించాడు.[4]
· హైస్కూలు,కమలతో నా ప్రయాణం ,లజ్జ ,జాతీయ రహదారి దర్శక కధారచయిత ,లజ్జ లో నటుడు
పురస్కారాలు
జాతీయ ఫిలిం పురస్కారాలు
· జాతీయ ఫిలిం పురస్కారం (ఉత్తమ తెలుగు సినిమా దర్శకుడు – 1940 లో ఒక గ్రామం) (2008)
నంది పురస్కారాలు
· సరోజినీ దేవి పురస్కారం (జాతీయ సమైక్యత పై చిత్రానికి దర్శకునిగా – 1940 లో ఒక గ్రామం ) (2008)
· 367-లక్ష్మీ ,లక్ష్యం రేసుగుర్రం నిర్మాణ ఫేం నందీ అవార్డీ –నల్లమలపు బుజ్జి
· నల్లమలపు బుజ్జి, తెలుగు సినిమా నిర్మాత.[1][2] 2001లో శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ అనే సినీ నిర్మాణ సంస్థను స్థాపించి సినీరంగంలోకి అడుగుపెట్టాడు
సినిమాలు
నిర్మాతగా[మార్చు]
సంవత్సరం
సినిమా పేరు
నటులు
ఇతర వివరాలు
2001
రా
ఉపేంద్ర, ప్రియాంక ఉపేంద్ర
2006
లక్ష్మి
వెంకటేష్, నయన తార, ఛార్మీ కౌర్
2007
లక్ష్యం
గోపీచంద్, జగపతి బాబు, అనుష్క శెట్టి
2008
చింతకాయల రవి
వెంకటేష్, అనుష్క శెట్టి
2009
కొంచెం ఇష్టం కొంచెం కష్టం
సిద్ధార్థ్, తమన్నా
2011
నేను నా రాక్షసి
రానా దగ్గుబాటి, ఇలియానా
2011
మొగుడు
గోపీచంద్, తాప్సీ
2011
కాంచన
రాఘవ లారెన్స్, లక్ష్మీ రాయ్
తెలుగు వెర్షన్ మాత్రమే, బెల్లంకొండ సురేష్‌తో కలిసి నిర్మించాడు
2014
రేసుగుర్రం
అల్లు అర్జున్, శ్రుతి హాసన్
2014
అల్లుడు సీను
బెల్లంకొండ శ్రీనివాస్, సమంత
బెల్లంకొండ సురేష్‌తో కలిసి నిర్మించాడు.
2014
రభస
జూనియర్ ఎన్.టి.ఆర్, సమంత, ప్రణీత సుభాష్
బెల్లంకొండ సురేష్‌తో కలిసి నిర్మించాడు.
2014
ముకుంద
వరుణ్ తేజ్, పూజా హెగ్డే
ఠాగూర్ మధుతో కలిసి నిర్మించాడు.
2015
ఉపేంద్ర 2
ఉపేంద్ర, క్రిస్టినా అఖీవా
ఉప్పి 2 తెలుగు వెర్షన్.
2017
విజేత
సాయి ధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్
ఠాగూర్ మధుతో సహ నిర్మాణం.
2017
మిస్టర్
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్
ఠాగూర్ మధుతో సహ నిర్మాణం.
2017
టచ్ చేసి చూడు
రవితేజ, రాశి ఖన్నా
వల్లభనేని వంశీతో సహ నిర్మాణం.
అవార్డులు
నంది అవార్డులు
· ఉత్తమ చలన చిత్రానికి నంది అవార్డు – లక్ష్యం (2007)
· ఉత్తమ కుటుంబ చిత్రానికి అక్కినేని అవార్డుకు నంది అవార్డు – కొంచెం ఇష్టం కొంచెం కష్టం (2009)
· బి. నాగిరెడ్డి మెమోరియల్ అవార్డు – రేసుగుర్రం (డాక్టర్ వెంకటేశ్వర రావుతో పంచుకున్నాడు)
· సంతోషం ఉత్తమ నిర్మాత అవార్డు – రేసుగుర్రం (డాక్టర్ వెంకటేశ్వర రావుతో పంచుకున్నాడు)
368-ఆది, చెన్నకేశవరెడ్డి సినీ నిర్మాత –నల్లమలపు శ్రీనివాస్
నల్లమలపు శ్రీనివాస్ ఒక తెలుగు సినీ నిర్మాత. ఈయన్నే బుజ్జి అని కూడా పిలుస్తారు
జీవితం
శ్రీనివాస్ ది గుంటూరు. తండ్రి స్వంత లారీ నడిపేవాడు. తల్లి గృహిణి. అతనికి ఒక అక్క ఉంది. పదో తరగతి గణితం పరీక్షలో మొదటి సారి ఉత్తీర్ణుడు కాలేక మళ్ళీ రాసి పాసయ్యాడు. కళాశాల చదువుకు వెళ్ళే సమయానికి తండ్రి చనిపోవడంతో కుటుంబ భారం అతని మీద పడింది. వాళ్ళ పక్కింట్లో ఉన్న రంగారావు అనే వ్యక్తి పత్తి విత్తనాల వ్యాపారం చేస్తుంటే అందులో సహాయకుడిగా చేరి అంచెలంచెలుగా ఎదిగాడు. అక్కడే ఐదారేళ్ళు పనిచేశాక తనే స్వంతంగా ఓ సంస్థను ప్రారంభించాడు. ఇప్పటికీ ఆ సంస్థ పనిచేస్తూనే ఉంది.
సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ ఇతనికి మేనమామ. వ్యాపార నిమిత్తం హైదరాబాదుకు వెళ్ళి ఆయన్ను కలిసినప్పుడు సినీ నిర్మాణంతో అనుబంధం కలిగింది. అలా 1997 లో సినీ రంగంలోకి అడుగు పెట్టాడు. అతను పనిచేసిన మొదటి సినిమా శ్రీహరి కథానాయకుడిగా నటించిన సాంబయ్య. హైదరాబాదులో శ్రీనివాస్, దర్శకులు వి. వి. వినాయక్, డాలీ, మిత్రుడు గోపిలతో కలిసి జూబ్లీహిల్స్ లో ఉండేవాళ్ళు.
కెరీర్
జూనియర్ ఎన్టీఆర్ హీరో గా నటించిన ఆది సినిమాతో పూర్తి స్థాయి నిర్మాతగా మారాడు. తరువాత బాలకృష్ణ హీరోగా చెన్నకేశవరెడ్డి సినిమా తీశారు. తరువాత కల్యాణ రాముడు, లక్ష్మీ సినిమాలు తీశాడు. ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో ఇక సినిమాలు చాలనుకుని గుంటూరు వెళ్ళిపోయాడు. అక్కడే కొద్ది రోజులుండి వ్యాపారం చేద్దామనుకున్నాడు. కానీ స్నేహితుల సలహాతో మళ్ళీ సినీరంగం లోకి వచ్చాడు. గోపీచంద్ తో లక్ష్యం సినిమా చేశాడు. ఆ సినిమా బాగా విజయవంతం అయ్యింది. తరువాత డి. సురేష్ బాబు సహకారంతో చింతకాయల రవి, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, నేను నా రాక్షసి సినిమాలు తీశాడు. కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాకు అవార్డులు వచ్చాయి కానీ ఆర్థికంగా పెద్దగా లాభాలు రాలేదు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరో గా రేసుగుర్రం తీశాడు. దీని తర్వాత ముకుంద సినిమా తీశాడు.
సినిమాలు
· ఆది
· చెన్నకేశవ రెడ్డి
· కళ్యాణ రాముడు
· లక్ష్మి
· లక్ష్యం
· చింతకాయల రవి
· కొంచెం ఇష్టం కొంచెం కష్టం
· నేను నా రాక్షసి
· రేసుగుర్రం
· ముకుంద
· సశేషం
· మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -30-11-22-ఉయ్యూరు
శ్రీమతి శ్రీదేవి మురళీధర్ రాసిన వేదాంత దేశికులు .6వభాగ0.29.11.22
Video link
కన్నడ కాల్పనిక సాహిత్య రచయిత బి.ఎం.శ్రీ కంఠయ్య -5(చివరి భాగం )
శ్రీ కంఠయ్య వివిధ సందర్భాలలో వ్రాసిన పద్య సంపుటి బంగారుకలలు –మైసూరు రాజవంశం పట్ల తనకున్న ఆరాధనాభావానికి అక్షరరూపం .ఆది ప్రాస పాటించాడు .స్వేచ్చా ప్రియుడే అయినా సంప్రదాయానికి విరోధిని కాను అని తెలియ జేశాడు .’’ఓ భారతమాతా –మళ్ళీ ఎప్పుడు నేను తలెత్తుకోనేట్లు చేస్తావు ‘’అనేది ప్రారంభగీతం .మన సంస్కృతీ ఘనతే మనకు మోయరాని భారమైంది ,’’సత్యం మీ ఆత్మల్ని ఉత్తేజితం చేసినపుడు –సరిహద్దుల్ని వెనక్కి నెట్ట లేకపోయారు –వెలుగు ప్రసరించిన చోట్ల నుంచి వెనుదిరిగి పారిపోయారు –గుహలలో బతికారు అహంకారం పెంచుకొని –కుల దురహంకారంతో ,సంకుచిత విశ్వాసాలతో .భారత దేశం తన బిడ్డలలో జడత్వాన్ని పోగెట్టే ఏఏ పనులు చేసిందో చెప్పాడు .ఇంగ్లాండ్ కు భారత్ కు మధ్య ఉన్న బాంధవ్యం గొప్పదిగా భావించాడు .బ్రిటిష్ సామ్రాజ్యం మనకు కొన్ని మేళ్ళు చేసి౦దినఅని గుర్తు చేశాడు .మనం మన దేశానికీ ఇంగ్లాండ్ కూ మేలు చేశామన్నాడు .
కృష్ణ రాజు చనిపోయినప్పుడు ‘’బన్ కొండ కృష్ణన్ ‘’అనే స్మృతి గీతి రాశాడు .ఇదేకన్నడంలో పూర్తి స్మృతికావ్యం గా భావిస్తారు .విజయనగర సామ్రాజ్య ఆరవ శత వార్షికోత్సవం సందర్భంగా ‘’కన్నడ తాయ నోట ‘’కవితను దేశభాక్తిపూరిత౦గా ,ఆలంకారిక శైలిలో రాశాడు –‘’కర్నాటక అంతా చుట్టి వచ్చాను –దేశ వైభోగామంతా ఆకళించుకొన్నాను –ఆమె పాద ధూళి తాకుతూ పరవశించాను –దాని అందానికి సోక్కిపోయాను –నా గుండె ఆనందంతో చి౦దు లేసింది –నాట్యమే చేశాను ‘’ కర్నాటక అంటే నల్లని నేల అనే అర్ధం ఆయన చెప్పేవాడు .పై మబ్బు నలుపు కన్నెపిల్లల జుట్టు నలుపు ,నవ్వే కళ్ళు నలుపు అనేవాడు .
కన్నడిగుల శక్తి యుక్తులకు ,కార్యశీలతను పురిగొల్పటానికి ‘’కన్నడ బావుటా ‘’రాశాడు .ఈ సంకలనం లో ఇదేఅద్భుత కవిత అన్నారు .జ్ఞానం సత్యం ఉన్నవారికే ఆభావం అర్ధమౌతుంది అనేవాడు –‘’వెలుతురు వచ్చు గాక ‘’అని సృష్టి ఆది లో అన్నప్పుడు –అంతటా వెలుతురూ ఇంపుగా ప్రసరించింది –అందులోంచి మెరుపులు దూసుకొచ్చాయి –అప్పుడు ఖగోళాలు ప్రకాశించాయి –సూర్య చంద్రులు లోకానికిసత్యధర్మాలులాగా ,క్షమా దయ లాగా రెండు కళ్ళు’’అప్పుడు భూదేవి పచ్చని కోకతో అందంగా గానం చేస్తూ సాక్షాత్కరించింది –ప్రత్యగాత్మ ,విశ్వాత్మల వైభవంతో దీపించే దివ్య తలాలతో క్రీడిస్తూ –దేవతలు ఋషులు చూసిఆనందంతో చి౦దులేశారు .తమకు కనబడకుండా సత్యాన్ని మరుగు పరచిన బంగారు పళ్ళాన్ని తొలగించమని పూషుడి ని వేడుకొన్నారు .అసత్ నుంచి సత్ కు అజ్ఞానం నుంచి జ్ఞానానికి చీకటి నుంచి వెలుతురుకు నడిపించమన్నారు .అమృతత్వాన్ని విశ్వమంతా వ్యాపింప జేయమన్నారు .
కన్నడం లో అంగీకారయోగ్యమైన విమర్శ లేదు .విమర్శను మనం పెంపొందించుకోవాలని కోరాడు .ఆయన మరణానంతరం ప్రచురింపబడిన ‘’కన్నడిగరే ఒళ్లేయ సాహిత్య ‘’-కన్నడిగులకోసం మంచి సాహిత్యం అనేది అయన మూర్తి మత్వాన్ని గొప్పగా ఆవిష్కరిస్తుంది .అక్షర రాజ్యాధిపతి అయిన ఈయన అవసరమైతే క్షమాపణలు కూడాచెప్పగలడు..’’ఈనాటి కన్నడ సాహిత్యం లో వినిపించే మధురస్వరాలన్నిటికి మూలం శ్రీ కంఠయ్య గారి వరవడి ,అభ్యాసం ‘’అని నిష్కర్షగా చెప్పవచ్చు .అయన నడిపిన కాల్పనికోద్యమం ఇప్పుడు తిరోగమించింది .నూతననాయకులు ఆయన గొప్పతనాన్నీ, కన్నడ సాహిత్యం పై ఆయన ప్రభావాన్నీ అంగీకరిస్తారు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్-29-11-22-ఉయ్యూరు
బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 38వభాగం.28.11.22
Video link
Video link
మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -363
· 363-మహారధి కుమారుడు ,సంతానం ,గెలుపు సినీ దశక నిర్మాత –త్రిపురనేని వరప్రసాద్
· త్రిపురనేని వరప్రసాద్ (చిట్టి) తెలుగు సినిమా దర్శకుడు.[1] అతని తండ్రి త్రిపురనేని మహారథి తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత. అతని నాన్నగారి పినతండ్రి త్రిపురనేని సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ లోని తొలి థియేటర్ మారుతీ టాకీస్ లో పార్టనర్. అలా ఆ కుటుంబానికి సినిమా నేపథ్యం ఉంది.
జీవిత విశేషాలు
త్రిపురనేని మహారథి 1955 జూలై 28న కృష్ణా జిల్లాకు చెందిన గుడ్లవల్లేరు గ్రామంలో జన్మించాడు. తరువాత తన కుటుంబం నిజామాబాదులో స్థిరపడింది. అతని తండ్రి త్రిపురనేని మహారథి హైరదాబాదులో అప్పట్లో దక్కను రేడియో కేంద్రంలో అనౌన్సరుగా పనిచేయడంతో వారి కుటుంబం కొంత కాలం హైదరాబాదులో ఉండేది. ఆక్కడి నుండి చెన్నై వెళ్ళి మహారథి రచయితగా స్థిరపడినందున వరప్రసాద్ చదువంతా చెన్నైలోనే సాగింది. పాఠశాల జీవితంలో అతను నాటకాలలో నటిస్తుండేవాడు. చెన్నైలోని పచ్చయప్ప కాలేజీలో పి.యు.సి చదువుకుంటూనే సినిమా రంగంపై మక్కువతో తన తండ్రి నిర్మించిన దేశమంటే మనుషులోయ్ చిత్రం షూటింగ్ కు సరదాగా వెళ్లాడు. ఈ విధంగా వివిధ సినిమా అంశాల్ని గమనిస్తూ ఉండేవాడు. సినిమాలో దర్శకునిగా ఉండాలనే కోరిక బలంగా ఉండడంతో అతని తండ్రి అతనిని ఆత్రేయ, అప్పలాచార్యల వద్ద కొంత కాలం పనిచేసే ఏర్పాటు చేసాడు. వారివద్ద కొంతకాలం పనిచేసాడు. ఆత్రేయ సినిమాలు చూసి చాలా విషయాలు నేర్చుకున్నాడు. ఆ తరువాత దర్శకుడు ఎం.మల్లికార్జునరావు వద్ద అప్రెంటిస్ గా చేరాడు. అతనితో పాటు కె.ఎస్.ఆర్.దాస్, కొమ్మినేని శేషగిరిరావు తో పాటు తమిళ దర్శకులు ఏ.సి.త్రిలోక్ చందర్, అమృతం, రాజేంద్రన్ దగ్గర కూడా పనిచేసాడు. పద్మాలయా సంస్థ నిర్మించిన హిందీ చిత్రాలకూ పనిచేసాడు. కురుక్షేత్రం సినిమాలో బాబూభాయ్ మిస్త్రీ అనే ఛాయాగ్రాహకునితో కూడా పనిచేసాడు. “నవభారత్” బాబూరావు నిర్మించిన చిత్రాలలో కో డైరక్టరుగా పని చేసాడు. ఈ అకవాశం రావడానికి ప్రధాన కారకుడు మోహన్ బాబు.[2]
దర్శకునిగా
అతను సంతానం సినిమాతో దర్శకునిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ఈ సినిమాకి ప్రేక్షకుల ఆదరణతో పాటు ప్రభుత్వ పురస్కారాలు కూడా లభించాయి. ఇదే కథను కొంచెం మార్చి పదేళ్ల తరువాత మాతృదేవోభవ సినిమాగా తీసారు. సంతానం సినిమాలో హీరో ఘట్టమనేని కృష్ణ అతిథి పాత్రను పోషించాడు. అతని అభివృద్ధిని కాంక్షించే వ్యక్తి కావడంతో కృష్ణ ఒక స్టార్ గా ఎదిగినా గెస్ట్ పాత్రను పోషించాడు.
సంతానం సినిమా విడుదల కాగానే అతనికి నాలుగు కొత్త ఆఫర్లు వచ్చాయి. అడ్వాన్సులు కూడా తీసుకున్నాడు. ఆ తరుణంలో రాఘవ సినిమా చేద్దామని అతనిని కబురు పంపారు. రాఘవపై ఉన్న గౌరవంతో అతని ఆఫర్ ను అంగీకరించాడు. రాఘవ ఒప్పందం ప్రకారం ఒక సినిమా చేస్తున్నప్పుడు వేరే ఏ సినిమాకు పని చేయకూడదు. అతని తో చేయవలసిన సినిమా ఆలస్యమైంది. రాఘవతో అతనికి వచ్చిన చిన్న చిన్న అభిప్రాయ భేదాల వల్ల స్వంతంగా సినిమా తీయకుండా, మరో సినిమాలో చేయకుండా బ్లాక్ కావలసి వచ్చింది. వారి మధ్య రాజీ కుదరక రాఘవతో పనిచేయలేనని అతను చెప్పేసాడు.
రాఘవ సినిమా అతను వదిలెసిన తరువాత అతను అంగీకరించిన చిత్రం నా పేరే దుర్గ. ఆ సినిమాకు సిల్క్ స్మిత కథానాయిక. తరువాత సిల్క్ స్మిత బ్రహ్మా నీ రాత తారుమారు అనే సినిమాను తీస్తూ అందులో అతనిని దర్శకునిగా ఎన్నుకుంది. ఈ చిత్రానికి రాధాకృష్ణ నిర్మాత. కానీ ఆ సినిమా అనేక అడ్డంగులతో రిలీజ్ కాలేదు. అది కెరీర్ పరంగా అతనికి నష్టం కలిగిందించి. తరువాత స్వంతంగా సినిమా తీద్దామని భావించి రైతు భారతం సినిమాను ప్రారంభించాడు. అందులో సౌందర్యను కథానాయకిగా పరిచయం చేసాడు. కానీ దర్శకుడు పి.ఎన్.రామచంద్రరావు అభ్యర్థన మేరకు ఆమెను మనవరాలి పెళ్ళి చిత్రానికి నటించేందుకు అవకాశం ఇచ్చాడు. అది హిట్ కావడంతో ఆమె మరో తమిళ సినిమాలో కూడా నటించింది. అలా రైతుభారతం విడుదల కాకుండానే ఆమె బిజీ హీరోయిన్ అయింది.
ఆతనికి సామాజిక సందేశంతో సినిమాలు తీయడమంటే యిష్టం. అందువల్ల కమర్షియల్ సినిమాలు కాకుండా ఇష్యూ ఆధారిత సినిమాలు తీయడానికి యిష్టపడుతుంటాడు. అలా కేరళలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా “గెలుపు” సినిమా తీసాడు. ఇది న్యూస్ ని ఆధారంగా తీసిన సినిమా. తరువాత అతను మా నాన్న పెళ్ళి సినిమా సినిమా తీసాడు ఈ సినిమా సౌందర్య నటించిన చివరి సినిమా. ఆమె తొలి సినిమా, చివరి సినిమా కూడా అతనిదే కావడం విశేషం. [3]
రాజకీయ జీవితం
1998లో అతని జీవితంలో మలుపు తిరిగింది. అతను భారతీయ జనతా పార్టీలో చేరాడు. నాలుగేళ్ళపాటు ఆ పార్టీలో చురుకైన పాత్ర పోషించాడు. వాజ్ పేయి గారిని ప్రధాన మంత్రిగా చూడాలనుకున్నాడు. అది నెరవేరిన తరువాత అతను మళ్లీ సినిమా రంగంలోని ప్రవేశించి “గెలుపు” సినిమాను తీసాడు.
· 364-బందరు కుర్రాడు యానిమేషన్ ఎక్స్పెర్ట్ ,ప్రతిరోజూ పండగే ,బస్టాప్ దర్శకుడు –దాసరి మారుతి
· దాసరి మారుతీ ఒక తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత.[2]
నేపథ్యము
ఇతడిది మచిలీపట్నం.[3] పేదరికంలో పెరిగాడు. వీళ్ళ నాన్న బండ్ల మీద అరటిపళ్లు అమ్మేవాడు. అమ్మ టైలరింగ్ చేసేది. ఇతను మొదట్లో వాహనాలకు నంబర్ స్టిక్కర్లు వేసేవాడు. కష్టాల మధ్యే డిగ్రీ పూర్తి చేశాడు. టూడీ యానిమేషన్ నేర్చుకోవాలన్న సంకల్పంతో 1998లో హైదరాబాదు వచ్చేశాడు. నిజాంపేటలోని వీళ్ళ అక్క వాళ్లింటో మొదటి నివాసము.
ఆ రోజుల్లో నిజాంపేటకు బస్సులు తక్కువ. ఆటోలు కూడా వచ్చేవి కావు. జేఎన్‌టీయూ నుంచి నిజాంపేట వరకూ నడిచేవాడు. జూబ్లీహిల్స్ లోని హార్ట్ ఇనిస్టిట్యూట్ అకాడమీలో టూడీ యానిమేషన్ కోర్స్‌లో చేరాడు. ఉదయం పదింటికే నిజాంపేట నుంచి సైకిల్ మీద జేఎన్‌టీయూ బస్టాప్ చేరుకునేవాడు. తెలిసిన వాళ్ల షాప్ దగ్గర సైకిల్ పార్క్ చేసి బస్సులు మారి రెండింటికి ఇన్‌స్టిట్యూట్‌కు వెళ్లేవాడు. ఐదింటికి క్లాస్ అయిపోయాక బయల్దేరితే.. ఇంటికి చేరుకునే సరికి రాత్రి తొమ్మిది దాటేది. ఇలా చదువు కన్నా జర్నీకే ఎక్కువ టైం పట్టేది.
ఇతడికి బొమ్మలేయడం అంటే సరదా. సిటీ రోడ్లపై బాగా చక్కర్లు కొట్టేవాడు. ఆ టైంలోనే బస్టాప్‌ల దగ్గర వేచి ఉండే ప్రయాణికుల బొమ్మలు గీసేవాడు. గోల్కొండ, చార్మినార్, నెహ్రూ జంతుప్రదర్శనశాలలోని జంతువులు, పక్షులు ఇలా ఎన్నో బొమ్మలు వేశాడు. సమయం దొరికితే చాలు హైదరాబాద్ అందాలను స్కెచింగ్‌లో చూపించే ప్రయత్నం చే సేవాడు.
సినీ జీవితము
2008లో ఇతనికి పెళ్లయింది. తర్వాత యానిమేషన్ ట్రైనింగ్ క్లాసెస్ నిర్వహిస్తూ జీవనం కొనసాగించాడు. ఈ టైంలోనే బన్నీ వాసుతో పరిచయం ఇతని జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది. ఆర్య సినిమాకు డిస్ట్రిబ్యూటర్‌గా అవకాశం వచ్చింది. తర్వాత ఏ ఫిల్మ్ బై అరవింద్, ప్రేమిస్తే సినిమాలకు కో ప్రొడ్యూసర్‌గా చేశాడు. కొన్ని ప్రకటనలు కూడా తీశాడు. తర్వాత దర్శకత్వం తన వృత్తిగా స్వీకరించాడు.
దర్శకత్వం వహించిన సినిమాలు
సహా నిర్మాత
365-ఘరానామొగుడు ,అమ్మరాజీనామా సినీ నిర్మాత –దేవీ వరప్రసాద్
దేవీవర ప్రసాద్ తెలుగు సినీ నిర్మాత. దేవీఫిలింస్ బేనరు పై పలు విజయవంతమైన తెలుగు చిత్రాలు నిర్మంచాడు.
జీవిత విశేషాలు
అతను 1943 డిసెంబరు 6న విజయవాడలో జన్మించాడు. నందమూరి తారక రామారావు ప్రోత్సాహంతో సినీ పరిశ్రమలో అడుగు పెట్టాడు.
దేవి వర ప్రసాద్ తండ్రి తిరుపతయ్య సినిమా పంపిణీదారుడు అయిన ఎన్టీఆర్ కు సన్నిహితుడు. అతను ఎన్టీఆర్ యొక్క మూడు సినిమాలకు కూడా భాగస్వామి. ప్రసాద్ నందమూరి తారక రామారావు ప్రోత్సాహంతో సినీ పరిశ్రమలో అడుగు పెట్టాడు. నిర్మాతగా అతను ఎన్‌టిఆర్‌తో కథానాయకుని కథ, కేడీ నంబర్ 1, తిరుగులేని మనీషి, నా దేశం వంటి చిత్రాలను తీసాడు[1]. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత దేవి వర ప్రసాద్ చిరంజీవితో సినిమాలు చేయడం ప్రారంభించాడు. చట్టంతో పోరాటం సగటు కంటే ఎక్కువగా ఉండగా కొండవీటి దొంగ, మంచి దొంగ పెద్ద విజయాలు సాధించాయి. ఘరానా మొగుడు బ్లాక్ బస్టర్‌గా మారింది. చిరంజీవి యొక్క టాప్ 5 సూపర్ డూపర్ హిట్స్‌లో ఈ చిత్రాన్ని పేర్కొనాలి. తరువాత అల్లుడా మజాకా చిత్రం కూడా మంచి కలెక్షన్లు సాధించి విజయాన్ని సాధించింది. అయితే తదనంతరం మృగరాజు టైటిల్‌తో గుణ శేఖర్‌తో దర్శకుడిగా దేవి వర ప్రసాద్ చిత్రం పూర్తిగా అపజయం పాలైంది. దేవి వర ప్రసాద్ యొక్క దాదాపు అన్ని ఆదాయాలు ఈ చిత్రంతో కొట్టుకుపోయాయి.[2] ఆ తర్వాత అతను చిరంజీవితో సినిమా చేయడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. మృగరాజుతో ప్రతిదీ కోల్పోయినందున, చిరంజీవి తనపై దయ చూపవచ్చని ఆతను భావించాడు. కానీ అది జరుగలేదు. తర్వాత ఆర్థికంగా బాగా చితికిపోయాడు. అతని చివరి సినిమా భజంత్రీలు కూడా అనుకున్న విజయం సాధించక ఇంకా ఆర్థిక నష్టాలను అనుభవించి అనారోగ్య పాలయ్యాడు.
సినిమాలు
భలే తమ్ముడు , కథానాయకుని కథ, భలేదొంగ, మంచి దొంగ, కొండ వీటి రాజా, అల్లుడా మజాకా, కేడీ నెంబర్ వన్, ఘరానా మొగుడు ,మృగరాజు, భజంత్రీలు, అమ్మరాజీనామా వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించాడు.
మరణం
దేవి వర ప్రసాద్ కాలేయ సంబంధిత వ్యాధి, మధుమేహంతో బాధపడుతూ కిమ్స్ హాస్పిటల్లో చేరాడు. అతను 2010 డిసెంబరు 10 న మరణించాడు.[3]
· సశేషం
· మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -29-11-22-ఉయ్యూరు
శ్రీమతి శ్రీదేవి మురళీధర్ రాసిన వేదాంత దేశికులు 5వ భాగం.28.11.22
Video link
కన్నడ కాల్పనిక సాహిత్య రచయిత బి.ఎం.శ్రీ కంఠయ్య -4
గదా యుద్ధ నాటకం
అయిదు అంకాల ఈ నాటకాన్ని 1925లోప్రదర్శింఛి 1926లో ముద్రించారు .కన్నడం లో ‘’రన్న కవి ‘’రాసిన సాహస భీమ విజయ కావ్యం ఆధారంగా శ్రీ కంఠయ్య రాశాడు .గొప్ప నాటకీయత తో రన్న పండించాడు .ఈనాటకం కావ్య౦చదివిన అనుభూతికి భిన్న౦గా ఉంటుంది .కౌరవ కుమారులంతా చనిపోగా దుర్యోధనుడు ఒక్కడే మిగిలాడు .ధర్మరాజు భీముడిని శాంత పరచి వాణ్ని చంపకుండా వదిలేయమంటాడేమో అనే సందేహంతో నాటకం ప్రారంభమౌతుంది .వాడు తొడమీద గుదడ్డతీసి తనను అవమాని౦చాడు అన్న విషయం ద్రౌపది మర్చిపోలేదు.వాడి తొడ విరుస్తానని ప్రతిజ్ఞ చేసిన భీముడు ఆరోజు సాయంత్రం లోపు వాడిని చంపక పొతే వాడు అజేయుడుఅవుతాడన్న విషయం గుర్తు చేశాడు .రెండవ అంకం లో ద్రోణ ఆశ్వత్దామలు తన్ను మోసం చేశారని దుర్యోధనుడు వారిని నిందిస్తాడు .సంజయుడు పాండవులను పొగడటం వాడికి ఇంకా కారం రాసినట్లయింది .తాను పాండవులకు చేసిన అవమానాలన్నీ మరోసారి ఏకరువు పెడతాడు .వాళ్ళు గతిలేక భరించారని గోప్పగాచెబుతాడు. అయితే ఏదైనా చేయబోయేముందు భీష్ముడిని సంప్రదిస్తాను అంటాడు . మూడవ అంకం లో అంపశయ్యపై ఉన్న పితామహుడి దగ్గరకు దుర్యోధనుడు వెడుతుంటే ,పీనుగులతో పొట్టని౦పు కొనే మూడు పిశాచాలు కనిపిస్తాయి .అవి వాడి పాపపు పనులు గుర్తు చేస్తూ వాడు బతికేది సూర్యాస్తమయం వరకే అని చెబుతాయి .కర్ణ దుశ్శాసన పీనుగుల్ని చూసి వాడు చలించిపోతాడు .అభిమన్య శరీరం చూసి ఉదారంగా శ్లాఘిస్తాడు .భీష్ముడు సంధి చేసుకోవటం మంచిది అని సలహా ఇస్తాడు వాడికి .వాడుఅలాచేయడని తెలిసి ఉపశమనంగా వైశంపాయన సరోవరంలో దాక్కొమని చెబుతాడు .
నాల్గవ ,అయిదవ అంకా లలో కృష్ణ భీమ ధర్మరాజులు శత్రువుజాడ కనిపెట్టటానికి సరోవరం దగ్గరకు వస్తారు .భీముడి దేప్పిపోడుపులు ,కవ్వింపులు భరించలేకనీటి లోనుంచి బయటికి వస్తాడు .భీముడితో గదా యుద్ధం చేస్తాడు .ఒకసారి భీముడు పడిపోతే యుద్ధం ఆపేసి గదతో విసిరి సేద తీరుస్తాడు .చేసిన ప్రతిజ్ఞను కన్నయ్య భీమయ్యకు గుర్తు చేస్తాడు .గదతోదుర్యోధనుడి తొడపై కొడతాడు .వాడు కింద పడిపోగా కాలితో తంతాడు .దానితో భీమునిపై ప్రతీకారశక్తులు పగబట్టగా ,శివుడిని ధ్యానించటానికి పాండవులు నీలాద్రి చేరతారు
రాజుదగ్గరకు అశ్వత్ధామ వచ్చి రారాజు దైన్య స్థితి చూసి చలించి పాండవుల తలలు కోసి తెస్తానని ప్రతిజ్ఞ చేసి వెళ్ళిపోతాడు .కానీ వాడు తెచ్చింది ద్రౌపది కొడుకుల శిరస్సులు .నువ్వు పాపం చేశావంటాడు రాజు .దైవ శక్తిముందు మానవ శక్తి ఎందుకూ పనికిరాదని గ్రహించి ప్రాణం వదుల్తాడు దుర్యోధనుడు .పొద్దు గుంకిపోతుంది .
నాటకం అంతా యుద్ధరంగం మీదనే జరుగుతుంది .ఆరంభం అంతమూఅక్కడే పాండవులకు ఒక్క అంగుళం నేలకూడా ఇవ్వను అన్న ప్రతిజ్ఞ ఒక్కటే దక్కించుకొన్నాడు రారాజు .రన్న కవికి వీడిపై సానుభూతి మిన్న వాడిచివరిమాటలలో ప్రశాంత గాంభీర్యం ఉంది శత్రువైన భీముడిపై ఔదార్యం చూపాడు .దుర్యోధనుడి సర్వ అవలక్షణాలు నాటకం లో చూపాడు శ్రీ కంఠయ్య .
1929లో ‘’ఆశ్వత్దామన్ ‘’నాటకం రాశాడు .మహారాజా కాలేజిసంఘం వారు ప్రదర్శించారు .గ్రీకునాటకం మొట్టమొదటిసారిగా కన్నడ రంగస్థలం పై ప్రదర్శింప బడి నట్లయింది .గ్రీకులోని ‘’ఆయాస్ ‘’నాటకం స్పూర్తితో ఈనాటకం రాశాడు .గ్రీకు నాటకం లో అడిషియాస్ కవచాన్నిఅయాన్ కు కాకుండా ఓడిన్యాస్ కు బహూకరిస్తాడు , దీన్ని అవమానంగా భావించి సేనానాయకుల౦దర్నీ చంపాలను కొంటాడు .కానీ ఎథినీ దేవత శాపం వలన పిచ్చెక్కుతుంది .పశువులమందల్ని చూసిసేనానాయకులని భ్రమపడి ఊచకోతకోసేస్తాడు .భ్రా౦తి తొలగి జరిగింది తెలిసి పశ్చాత్తాపం పొంది దేవతకు ఆగ్రహం కలిగించినందుకు చిన్న బుచ్చుకొంటాడు .ఆదేవత కోపం ఒక్క రోజే ఉంటుంది . ఈసంగతి తెలిసిన అయాన్ సవతి తమ్ముడు ట్యూసర్ తానూ తిరిగి వచ్చేదాకా అయాస్ ను జాగ్రత్తగా చూసుకోమని అయాస్ పెళ్లి చేసుకోబోయే బానిసపిల్ల టెక్ మేసాకు చెప్పి ,నావికులకు కబురుచేస్తాడు. ఈలోగానే అయాస్ అందరికళ్ళు కప్పి ఆత్మహత్య చేసుకొంటాడు .గ్రీకు సేనానులకు వాడు దేశ ద్రోహి .అతడి కళేబరాన్ని ముక్కలు ముక్కలు చేసి కాకులకు గద్దలకు వెయ్యాలంటారు .కానీ ట్యూసర్ ,ఉదారుడైన ఓడిన్యాస్ లు దాన్ని కాదని అమరవీరుడికి జరిగినట్లుగా అంత్యక్రియలు నిర్వహిస్తారు .
ఈ గ్రీకు కథ ఆధారంగా మహాభారతం సౌప్తిక పర్వంలో కౌరవ యోధుల్లో మిగిలిన అశ్వత్ధామ తనరాజు రక్తం మడుగులోకొనూపిరితో ఉన్నట్లు ,పిశాచాలు లు ఆయన రక్తమాంసాలు నంజుకొని జుర్రుకొని తినటానికి సిద్ధంగా ఉన్నట్లు చూసి విచలితుడు అవుతాడు .తనతండ్రి ద్రోణుడు లాగా దుర్యోధనుడుకూడా అధర్మ యుద్ధంలో పాండవుల చేతిలో చచ్చాడని భావించి ,ఆరోజునే పాండవులందర్నీ చంపేస్తానని ప్రతిజ్ఞ చేయాగా సేనాపతిగా నియమించగా ,కృపాచార్య కృతతవర్మలతో దృష్టద్యుమ్నుని శిబిరానికి వెళ్లి ,పాంచాల ఉపపా౦ డవుల్ని చంపేస్తాడు .పాండవులకు తెలిసి వీడిని పట్టుకోటానికి బయల్దేరతారు .అశ్వత్ధామ ప్రయోగించిన భయంకర అస్త్రం నుండి కృష్ణుడు వారినికాపాడి వాడిని’’మానవులకు ఎవరికీ కనిపించకుండా వారితో మాటా మంతీ లేకుండా మూడు వేల ఏళ్ళు అడవులలో ఎడారులలో తిరుగు ‘’అని శపిస్తాడు .వాడి తలలో ఉన్న మణిని ఊడ బెరికి ద్రౌపదికి బహూకరిస్తారు .వాడు గబ్బుకంపు కొడుతూ దేశాలపాలయ్యాడు .
అశ్వత్ధామకు రాజుపట్ల వీర విధేయత స్పష్టంగా నాటకం లో చూపాడు రచయిత .కపట నాటక సూత్రధారిగా కృష్ణుడిని చిత్రించాడు .అక్కడి గ్రీకుకథను ఇక్కడి మహాభారత కథతో అనుసంధానం చేసి అద్భుతంగా రాశాడు. చివరలో చచ్చిన రారాజు రెప్పలు మూసి ,గౌరవంగా నమస్కరించి ,విల్లు విసిరిపారేసి ఒరలోంచి రెండు వైపులా పదునున్న కత్తి దూసి పళ్ళు పటపట లాడిస్తూ పాండవ శిబిరంలోకి ప్రతీకారం కోసం ప్రవేశిస్తాడు .అసలు ఏమి జరిగిందో చెప్పమని కృష్ణుడు రుద్రుడిని అదుగు తాడు ‘’రుద్రుడు – ‘’సూర్యుడు అస్తమించాడు కౌరవనాథుడుకూడా .అర్ధరాత్రి మీ శిబిరం లో ప్రవేశిస్తుంటే చూశాను నేను .ఎక్కడికి,ఏ యుద్ధానికి ,ఏ వరం కావాలి యోధుడా ‘’అని అడిగా .’’పాండవ వంశాన్ని నాశనం చెయ్యాలి ‘’అన్నాడు .’’కొందర్ని తప్పించి ‘’అన్నాను నేను .వాడు ‘’చూడు రుద్రా .మనిషి బలం ఎలాంటిదో చూడు ‘’అని పొగరుగా నవ్వాడు .నేనూ అలానే నవ్వాను నర్మగర్భంగా .వాడికి మాయ కమ్మేట్లు చేశాను ..అది వాడి మనసును కమ్మేసింది .కళ్ళకు వాడికేమీకనిపించలేదు ,వాడిని నీ శిబిరంనుంచి లాక్కేళ్లి బయట శిబిరం వాళ్ళదగ్గర పడేశాను .అప్పుడు చూడు కృష్ణా వాడి ప్రలాపాలు ప్రగల్భాలు ,సంహారగర్వం .పశువుల్ని నరికాడు ఆడవాళ్ళను చంపేశాడు ,దాదుల చేతుల్లోనూఉన్న పసిపిల్లల్ని కత్తిమొనకు గుచ్చి ముక్కలు ముక్కలు చేశాడు .శిబిరాలు నేలకూల్చాడు .నేను ఇంకా దగ్గరగా ఉంటూ వాడి పిచ్చిని మరింత ప్రకోపి౦పజేశాను .తుఫాను రేగిన సముద్ర కెరటాలుగా మారాడు వాడు .ఒక గుర్రాన్ని మెడనరికి ‘’ఒరరే దృష్టద్యుమ్నా !నువ్వు నీ గురువు గొంతు కోసింది ఇట్లాగేగా ‘’అన్నాడు .ఒక ఏనుగును ‘’ఒరేభీమా !కౌరవనాథుడిని తలదన్నిన పాదం ఏదిరా ‘’అ౦టూ పిచ్చిపట్టినవాడిలా ఊగుతూ అరిచాడు .దానికాలు నరికి కళేబరాన్ని తన్నాడు .అందర్నీ చంపేశాను అనుకోని ఒక గొర్రెపిల్లను చంకలో పెట్టుకొని ‘’ఒరే జిత్తులమారి నక్కా కృష్ణా రారా .నువ్వు విత్తు వేసిన మొక్కపళ్ళు తి౦దువు గాని రారా .ప్రత్యెక గౌరవం పొందే అతిథివికదా తినుతిను ‘’అన్నాడు అని రుద్రుడు శ్రీ కృష్ణుడికి ఆశ్వత్ధామ ఉన్మాద వీర విహారం కళ్ళకు కట్టినట్లు వర్ణించి చెప్పినట్లు శ్రీ క౦ఠయ్య తన నాటకం లోరాసి , ప్రేక్షకజనం ఉర్రూతలూగేట్లు చేశాడు ‘
ఈనాటకం లో పగా ,దయా రెండూఉన్నాయి .’’నవ్వు మధురమైనది .పగవాడిని చూసి నవ్వే నవ్వు ఇంకా మధురమైనది ‘’అంటాడు రుద్రుడు .ఇక్కడి రుద్రపాత్ర గ్రీకు నాటకం లోని ఎధినీ పాత్ర వంటిది.ఆశ్వత్దామన్ కు గుడి కట్టించాలి అనే ప్రతిపాదన సెంటిమెంట్ కు విరుద్ధం .’’ఓదుష్ట యుద్ధమా ఎప్పుడు నువ్వు నశించేది?ఓ శాన్తిమాతాఎప్పుదు నువ్వు వర్ధిల్లేది ‘’అనే బృందగానం తో నాటకం ముగుస్తుంది .ధర్మ సంరక్షణకే నాటకం నడుం కట్టింది .ఛందో నైపుణ్యం శైలి నాటకానికి విజయం చేకూర్చాయి .భారతీయ ,పాశ్చాత్య సంస్కృతీ మేళవింపు నాటకం లో బాగా నే పండింది .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్-28-11-22-ఉయ్యూరు
బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 38వభాగం.28.11.22
Video link
షట్త్రి౦శత్ శతాధిక(136) గ్రంధ కర్త డా టి.రంగస్వామి
వరంగల్ శ్రీ లేఖ సాహితి-సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్షులు ,నాకు పరమ ఆత్మీయులు ,విశ్వనాథ కృష్ణ కావ్యాలపై పరిశోధన చేసి పి.హెచ్ డి.పొందిన సరసభారతి పురస్కార గ్రహీత తమ సంస్థద్వారా 136-షట్త్రి౦శత్ శతాధిక(గ్రంథాలు ప్రచురించి 136వ పుస్తకమైన ”పలుకు జెలి”అనే సాహిత్య విమర్శ వ్యాస సంపుటిని నాకు పంపగా నిన్ననే అందింది .వారి నిరంతర సాహితీక్రుషిని అభినందిస్తూ , ద్విశత ప్రచురణ త్వరలొనె పూర్తీ చేయాలని ఆశిస్తున్నాను -దుర్గాప్రసాద్-27-11-22-ఉయ్యూరు
శ్రీమతి శ్రీదేవి మురళీధర్ రాసిన వేదాంత దేశికులు 4వ భాగం.27.11.22
Video link
కన్నడ కాల్పనిక సాహిత్య రచయిత బి.ఎం.శ్రీ కంఠయ్య -3
బ్రిటిషర్ల పాలనలో మనపై మనకు ఆత్మ న్యూనతా భావం కలిగించింది .వాళ్ళ సాహిత్య పరిచయం వలన శ్రీ కంఠయ్య లో ఆయా దేశాలపట్ల గౌరవభావం ఏర్పడింది .ఈయన కాలేజి లో చేరేనాటికి ఆక్స్ ఫర్డ్ ,కేంబ్రిడ్జి యూని వర్సిటీ లలో తర్ఫీదు అయిన కొత్తరకం పండితులు పరిచయమయ్యారు .వారిలో ఆత్మ న్యూనతా భావం లేదు .దేశానికి అప్రతిష్ట కలిగించే అంశాలను వాళ్ళు ఒప్పుకొనే వారుకాదు .ఈయనకు భవిష్యత్తు పై ఎక్కువ ఆసక్తి .కన్నడం తల ఎత్తుకోవాలని ఆయన గట్టిగా కోరాడు .అందుకే కన్నడ జెండా ఎగరేశాడు .సంస్కృతం ఒక్కటే మనల్ని తీర్చి దిద్దలేదు .పాశ్చాత్య సాహిత్య ప్రక్రియలు తెలుసుకోవాలి .కన్నడం ఇవ్వగలిగింది ఏమిటిఅనే మౌలిక ప్రశ్నకూడా వేసుకొన్నాడు .కన్నడ ప్రాచీన సాహిత్యంలో కన్నడంకన్నా సంస్కృత పదాలెక్కువ .ఆధునిక భాషాజ్ఞానం ఆధునిక సాహిత్య పరిచయం అందుకే కావాలన్నాడు .యువత ఆయన వెంట నడిచింది ..కర్నాటక ఏకీ కరణ ఉద్యమాన్ని ఆయన తలకెత్తుకొన్నాడు .దానికి వీరి మద్దతు పుష్కలంగా ఉంది .మైసూర్ యూని వర్సిటి ఏర్పడిన 15ఏళ్ళకు కానీ కన్నడ భాషా పీఠం ఏర్పడలేదు .కన్నడ పునరుద్ధరణకు ధార్వాడ లోని కర్నాటక విద్యావర్ధక సంఘం ,బెంగుళూరులోని కన్నడ సాహిత్య పరిషత్ కృషి చేశాయి .జాతీయోద్యమం కూడా ప్రాంతీయోద్యమానికి, భాషోద్యమానికి సహాయ పడింది .కర్ణాటకలోని అన్ని ప్రాంతాలవారినీ కలుపుకొని పోతూ ,రాజకీయ సాంఘిక సాంస్కృతిక శక్తులను ఏకం చేసే నాయకుడు కావాల్సి వచ్చింది దానికి తగినవాడు శ్రీ కంఠయ్య మాత్రమె .
‘’ఢిల్లీ దూరం ,పల్లె చాలు నాకు ‘’అన్నాడు శ్రీ కంఠయ్య .షేక్స్ పియర్ అన్నాడని చెప్పబడే ‘’నేను చనిపోయాక నా గుండె మీద ఇంగ్లాండ్ అని రాసి ఉంటుంది చూడండి ‘’అన్న వాక్యం ఈయనకూ వర్తిస్తుంది కర్నాటక విషయంలో ..మైసూర్ మహారాజా గారి ఏక చ్చత్రం కింద సమైక్య కర్నాటకం ఏర్పడాలని ఆయన చనిపోవటానికి ముందు కోరుకున్నాడు .లెక్చరర్ గా ఆయన విశేష గౌరవం పొందాడు .తాదాత్మ్య స్థితిలో పాఠాలు బోధించేవాడని ఆయన శిష్యులు గొప్పగా చెప్పుకొనేవారు ‘’.పాఠ్య భాగం సువిశాల ఆలోచనా సంవేదనలలోకి ఎగిరిపోవటానికి కాలు పెట్టె ఆధార పీఠం’’ అనే వాడు .ఎన్నెన్నో విషయాలు ఆయన బోధనలో దొర్లిపోయేవి .విద్యార్ధి దృక్పధం సువిశాలం చేయటమే ఆయన ధ్యేయం .ఆయనకు బాగా ఇష్టమైన కవితలు –‘’the spirit that dwells in the light of setting suns ‘’,..the young lambs bound as tabors’ sound ‘’అవి మాటలుకావు సంగీత ధ్వనులు .వీటిద్వారా గొప్ప అనుభూతిని కలిగించేవాడు .మాధ్యూ ఆర్నాల్డ్ పాఠం చెబుతూ అందులో డాంటే చెప్పిన మాటలు’’in His will is our peace ‘’ అంటూ పదే పదేమననం చేసుకొనేవాడు .వర్డ్స్ వర్త్ రాసిన ‘’the still sad music of humaanity ‘’బోధిస్తూ గంట దాటినా చెబుతూనే ఉన్నాడు ఒకసారి అంతా అయ్యాక పూర్తి నిశ్శబ్దం ఆవహించింది అని ఒక పూర్వ విద్యార్ధి జ్ఞాపకం చేసుకొన్నాడు .
ఇంగ్లీషు గీత గళు
పూర్వ కన్నడ కవిత్వాన్ని ఆయన ‘’రాయ కేళి౦దే’’-రాజా అవధరింపుము అని వెక్కిరించేవాడు .అవధానం నిలకడ గా ఉందని రాజుకు వినిపించటానికి రాసిన క్షీణయుగ కవిత్వం గా భావించేవాడు.ఇరవై ఖండికలున్న ఈ కవితా సంపుటి లో షెల్లీవి 9,బర్న్స్ వి 7,వర్డ్స్ వర్త్ వి 5,బ్రౌనింగ్ ,టెన్నిసన్ స్కాట్ లవి మూడేసి షేక్స్ పియర్ సౌదీ ,బైరన్ లవి రెండేసి ,మిగిలినవి ఇతరకవులవి ఉన్నాయి .వర్డ్స్ వర్త్ రాసిన ‘’లూసీ ‘’కవిత ,సాలిటరి రీపర్ లాంటివి వదిలేశాడు .తన శక్తికి మించినవి కావు అన్నవాటినే అనువదించినట్లు చెప్పుకొన్నాడాయన ..ఈయనకాలం లోనే హెచ్ నారాయణ రాకూడా ఆంగ్లకవితలను వాదాలు చేశాడు.
అన్నీ ఉత్తమ అనువాదాలు అనిపించుకోలేదు .కొన్ని మాత్రం అత్యున్నతంగా కనిపిస్తాయి ‘’కవిత్వం అనువాదానికి లొంగదు ‘’అన్న దాన్ని తారుమారు చేసేశాడు .సరళ శైలి అందం మనల్ని ముగ్ధుల్ని చేస్తాయి .కొన్ని మూలాలనికి మించి అద్భుత సోయగాన్ని ప్రదర్శించాయి .చారిత్రిక ప్రాముఖ్యత వల్ల ఈకవితలు జీవిస్తాయి .మానవుడిని మానవుడిగా చిత్రిస్తూ రాసిన నవ్యకవిత్వాలు ఇవి .మానవ విషాద సంగీత౦ కూడా వినిపించింది .పదాడంబర క్షీణయుగ మహాకావ్యాల స్థానాన్ని ఈకవితలు ఆక్రమించేశాయి తర్వాత రెండు దశాబ్దాల కు కానీ కెవి పుట్టప్ప అనే’’ కు వెంపు’’రాసిన’’ శ్రీ రామాయణ దర్శనం ‘’మహాకావ్యంగా కొత్త చూపు హుందాతనతో ప్రవేశించలేదు .కర్నాటక సాహిత్య చరిత్రలో ,ప్రయోజనకర విప్లవాలలో ‘’ఇంగ్లీషుగీత గళు ‘’కు ఎప్పటికీ ప్రత్యెక స్థానం ఉంటుంది .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -27-11-22-ఉయ్యూరు
బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం . 37వ భాగం.27..11.22
Video link
మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -359
359-నిర్మాత ,దర్శకుడు ,సినీ పెద్ద మనిషి ,నందీ,స్వరలయ అవార్డీ–తమ్మారెడ్డి భరద్వాజ
· తమ్మారెడ్డి భరద్వాజ తెలుగు సినిమా నిర్మాత, దర్శకులు. ఆయన దర్శకుడు తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి కుమారుడు.
చిత్రాలు
దర్శకునిగా
· పోతే పోనీ (2006)
· సంచలనం (2000)
· ఎంత బావుందో! (2002)
· స్వర్ణముఖి (1998)
· అత్తా నీకొడుకు జాగ్రత్త (1997)
· కూతురు (1996)
· వేటగాడు (1995)
· రౌడీ అన్నయ్య (1993)
· ఊర్మిళ (1993)
· పచ్చని సంసారం (1992)
· శివశక్తి (1991)
· నేటి దౌర్జన్యం (1990)
· అలజడి (1990)
· మన్మధ సామ్రాజ్యం (1988)
· స్వర్ణక్క (1998)
నిర్మాతగా
· స్వర్ణక్క (1998)
· ఇద్దరు కిలాడీలు (1983)
· మరో కురుక్షేత్రం (1981)
· మొగుడు కావాలి (1980)
· కోతల రాయుడు (1979)
· (1/2)
సమర్పణ
· పలాస 1978 (2020)[1][2]
అవార్డులు
· పోతే పోనీ చిత్రానికి ఉత్తమ చిత్రంగా నంది అవార్డు పొందినాడు.
· 2022 ఉగాది సందర్భంగా సాహితీ, సాంస్కృతిక సంస్థ, తెనాలి, గుంటూరు జిల్లా వారిచే స్వరలయ జీవిత కాల సాఫల్య పురస్కారం.[3]
360-కేంద్ర మంత్రి కాంగ్రెస్ కు పెద్దదిక్కు ,పారిశ్రామికవేత్త ,భగవద్గీత సంస్కృత౦ ,స్వామి వివేకానంద హిందీ .జీవనపోరాటం .స్టేట్ రౌడీ సినీ నిర్మాత,ఆధ్యాత్మిక వేత్త –టి.సుబ్బ రామి రెడ్డి
· తిక్కవరపు సుబ్బరామిరెడ్డి (ఆంగ్లం: T. Subbarami Reddy) (జ. సెప్టెంబరు 17, 1943) భారత జాతీయ కాంగ్రెసుకు చెందిన రాజకీయ నాయకుడు, తెలుగు సినీ నిర్మాత, పారిశ్రామికవేత్త. వీరు ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పార్లమెంటు సభ్యుడు. ఈయన గనుల శాఖామాత్యునిగా ఉన్నాడు. ఈయన 1996, 1998 సంవత్సరాలలో 11వ, 12వ లోక్‌సభ లకు విశాఖపట్నం నియోజకవర్గం నుండి ఎన్నికైనాడు. ఇతడు 2002 సంవత్సరం నుండి రాజ్యసభ సభ్యునిగా పనిచేస్తున్నాడు.
· సుబ్బరామిరెడ్డి 1943, సెప్టెంబర్ 17న బాబు రెడ్డి, రుక్మిణమ్మ దంపతులకు నెల్లూరులో జన్మించాడు.[1] హైదరాబాదు లోని నిజాం కళాశాల నుండి బి.కామ్ పట్టాపొందాడు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో మట్టి ఆనకట్ట పనులకు కాంట్రక్టరుగా వ్యాపార జీవితాన్ని ప్రారంభించాడు, 1966 ఫిబ్రవరి 6న ఈయనకు ఇందిరా సుబ్బరామిరెడ్డితో వివాహమైన
సినిమా నిర్మాణం
ఇతడు తెలుగు, హిందీ, తమిళ, సంస్కృత భాషలలో కొన్ని సినిమాలను నిర్మించాడు. సంస్కృతంలో ఇతడు నిర్మించిన భగవద్గీత చలనచిత్రానికి ఉత్తమ చిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారం లభించింది.
ఇతడు నిర్మించిన సినిమాల పాక్షిక జాబితా:
తెలుగు
హిందీ
సంస్కృతం
· సశేషం
· మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -27-11-22-ఉయ్యూరు
శ్రీమతి శ్రీదేవి మురళీధర్ రాసిన వేదాంత దేశికులు .3వ భాగం.26.11.22 గ
కన్నడ కాల్పనిక సాహిత్య రచయిత బి.ఎం.శ్రీ కంఠయ్య -2
శ్రీ కంఠయ్య రచనలన్నీ 1926-35 మధ్య వచ్చినవే ఆయన రాసిన ‘’ఇంగ్లీష్ గీత గళు’’ ను లికిరికల్ బాలడ్స్ తో పోల్చవచ్చు .అన్నిటికంటే గొప్ప రచన ‘’ఆశ్వత్దామన్’’1929లో వచ్చింది .ఇది విషాదాంత నాటకం సోఫోక్లిస్ ‘’అయాన్ ‘’కు సరిపోలుతుంది .గదాయుద్ధ నాటకం అనే పద్య నాటకం కూడా రాశాడు .1935లో ఆసిలాస్ రాసిన ‘’పెర్సే ‘’కు అనువాదంగా ‘’పారశీకరు ‘’రాశాడు .1937లో ‘’ఎ షార్ట్ బుక్ ఆఫ్ కన్నడ ప్రాసెడి’’రాశాడు .అప్పుడప్పుడు రాసిన కన్నడ పద్యాలను ‘’హో౦గన సుగళు’’-బంగారు కలలు గా1943లో ప్రచురించాడు. 1948లో’’కన్నడిగరియెఒళ్ళేయ సాహిత్య ‘’- కన్నడిగులకోసం చక్కని సాహిత్యం ‘’.ఇందులో ఆయన చేసిన ప్రసంగాలు ,చేసిన సమీక్షలు రాసిన పీఠికలు ఉన్నాయి .షేక్స్పియర్ విషాదాంత నాటకాలను ,అరిష్ట్రియస్ ‘’ట్రయాలజి ‘’ని అనువాదం చేయగల సమర్ధుడు .ఎ౦దుకొఆజొలికి పోకపోవటం కన్నడిగుల దురదృష్టం ‘’.’’విశ్వ జనీనత విషయం లో ,జీవితంలో వివిధ అంశాలను స్పృశించటం లో షేక్స్ పియర్ ను మించిన వారు లేరు .కానీ భారతీయులకు గ్రీకులే దగ్గర వారుగా కనిపిస్తారు ‘’అనే వాడాయన .ఆషిలస్ రాసిన ‘’ప్రామిధ్యూస్ బౌండ్ ‘’,ను షెల్లీ రాసిన ‘’ ’ప్రామిధ్యూస్ అన్ బౌండ్’’ను ఆధారంగా ఒక గొప్ప స్వతంత్ర నాటకం రాయటానికి ప్రణాళిక తయారు చేసుకొన్నాడు .దీనివిషయంలో ‘’ ముసలాడి గడ్డాన్ని పడుచు వాడి మీసానికి మెలేసి దానిపై ఉయ్యాల లూగాలి ‘’అనే వాడు సరదాగా .దానికి ‘’మాతారీశ్వరన్ ‘’అనే పేరుకూడా పెట్టాడు .
1935 తర్వాత ఆయన ఏమీ రాయలేదుకాని ,విలువైన ప్రసంగాలు చేశాడు .ఆశుధారగా తేనెల సోనలమాటలతో ఆయన ప్రసంగాలు చవులూరించేవి .1928కన్నడ సాహిత్య మహాసభలకు అద్యక్షు డయ్యాడు .1938లో మైసూర్ మహారాజా ఆయనకు ‘’రాజ సేవాసక్త ‘’బిరుదునిచ్చి సత్కరించాడు .తర్వాత పరిషత్తు కు ఉపాధ్యక్షు డయ్యాడు .ఆకాలం లో రాజవంశం లో ఒకరు అధ్యక్షులుగా ఉండేవారు .ఆయన స్వరం సంగీతమయంగా ఉండేది అందుకే శ్రోతలు గానం వింటున్న అనుభూతిని ఆయన ఉపన్యాసాలలో అనుభవించేవారు .
శ్రీ కంఠ ను తిరగేసి కంఠశ్రీ గా మార్చి ఆయన్ను స్వర సంపద గా భావించి గౌరవించేవారు .ప్రతిమాటకు కనీసం అరడజను సమానార్ధకాలను ప్రయోగించి మాట్లాడటం ఆయనకు కొట్టిన పిండి .ఈ లక్షణం నాకు తెలిసినంతవరకూ శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయణ మూర్తి గారికి ఉండేది .
షేక్స్పియర్ ,వర్డ్స్ వర్త్ ,పంప ,రన్న కవులపై ఉపన్యసించమని నిత్యం అభ్యర్ధనలు ఆయనకు వచ్చేవి .తత్వ శాస్స్త్రం మతం గురించికూడా ఆయనే మాట్లాడాలని కోరేవారు. ‘’ప్రవక్తల భారం ‘’అనేది ఆయనకు అభిమాన విషయం .ఆయన ప్రసంగాలు వినటానికి జనం క్యూలు కట్టేవారు .ఎన్ని గంటలు మాట్లాడినా కదిలేవారుకాదు.ఏ సమయానికి వచ్చినా వినటానికి తయారుగా ఉండేవారు అంతటి క్రేజ్ ఆయన ప్రసంగం అంటే .రైలు బస్సు కారు ఏది అందుబాటులో ఉంటె అది అందుకొని కోరిన చోటికి వెళ్లి ప్రసంగించి సంతృప్తి పరచేవారు .పదవ శతాబ్దిలో పంప మహాకవి వలన వన్నె కెక్కిన ‘’బనవాసి ‘’ని చూడగానే పులకిన్చిపోయేవాడు .హంపి అంటే వీరాభిమానం.హరిహర ,రాఘవాంక కవులంటే మరీ ఇష్టం .హలెబీడు శిల్ప సంపద ను గురించి ఆయనలా వర్ణించి చెప్పగలవారు లేరు .
1938-42మధ్య కన్నడ సాహిత్య పరిషత్ కు ప్రధాన నిర్వాహకుడుగా ఉన్నాడు .’’కన్నడ నుడి’’మాసపత్రిక స్థాపించాడు .’’కన్నడ ద బావుటా ‘’-కన్నడ జెండా అనే కవితా సంకలనానికి సంపాదకత్వం వహించాడు .కన్నడ ప్రెస్ కు తానె నిధులు ఇచ్చి ఏర్పాటు చేశాడు .వందలాదిమందిని సాహిత్య పరిషత్ సభ్యులుగా చేర్చి సాహిత్యోత్సవాలు సమావేశాలు జరిపాడు .ఇంతచేస్తున్నా ఒక నియమిత పరిధిలో ఒక ప్రవక్త లాగా ఉన్నాడు .కర్నాటక మాట వర్ణక్రమ విషయం లో భేదాభిప్రాయాలు వచ్చాయి .1942పరిషత్ ఎన్నికలలో అభిప్రాయ భేదాలు కనిపించాయి .ఆయన మళ్ళీ పోటీ చేయను అన్నాడు .దాన్ని పట్టుకొని ఆతర్వాత ఆయన పేరును ప్రతిపాదించటం మానేశారు .కొత్త ఉపాధ్యాధ్యక్షుడికి బాధ్యత అప్పగించి తప్పుకొన్నాడు .ఇది అందరికీ బాధ కలిగించింది. అప్పుడే విశ్వ విద్యాలయ ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాడు .
కానీ ‘’అక్షరాస్యతా వ్యాప్తి కమిటీకి అధ్యక్షుడుగా నియమితుడయ్యాడు .1944దాకా ఉన్నాడు ..అప్పుడే ధార్వాడలోని కెఇ బోర్డ్ ఆఫ్ ఆర్ట్స్ వారు ఆయన్ను ప్రిన్సిపాల్ గా ఆహ్వానించారు .చాలామంది వద్దని హితవు చెప్పినా అందులో చేరాడు కాని హాయి అనిపించలేదు .ఆరోగ్యం క్షీణిస్తోంది మధు మేహం పట్టుకొన్నది .రక్తపోటు పెరిగింది .వయసుకు మించిన భారం మోసి విధి నిర్వహణ చేశాడు .5-1-1944న 60ఏళ్ళకే ధార్వాడ లో శ్రీ కంఠయ్య శివలోకం చేరాడు .కర్నాటకనవ రాష్ట్ర నిర్మాత గా ఆయన్ను ప్రజలు, ప్రభుత్వం గౌరవించారు.
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-11-22-ఉయ్యూరు .
బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం .36వ భాగం.26.11.22
Video link
మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -356
· 356-పవిత్ర బంధం ,ఆజ్ కా రక్వాలా చిత్ర దర్శకుడు –జొన్నలగడ్డ శ్రీనివాసరావు
జొన్నలగడ్డ శ్రీనివాసరావు తెలుగు చలనచిత్ర దర్శకుడు, నిర్మాత. పవిత్రబంధం, సోగ్గాడి పెళ్ళాం వంటి చిత్రాలకు సహ దర్శకత్వం వహించిన ఈయన 2001లో అక్కినేని నాగార్జున నటించిన ఎదురులేని మనిషి సినిమాతో తెలుగు సిజననం
శ్రీనివాసరావు 1964, నవంబర్ 4న జన్మించాడు.
సినిమారంగ ప్రస్థానం
దర్శకత్వం చేసినవి
357-కార్తీక పౌర్ణమి ,ముఠా మేస్త్రి నిర్మాత –డి.శివ ప్రసాద రెడ్డి
డి. శివప్రసాద్ రెడ్డి (- అక్టోబర్ 27, 2018) తెలుగు చలనచిత్ర నిర్మాత. 1985లో కామాక్షి మూవీస్ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి కార్తీక పౌర్ణమి, శ్రావణ సంధ్య, విక్కీదాదా, ముఠా మేస్త్రి, అల్లరి అల్లుడు, ఆటోడ్రైవర్, సీతారామరాజు, ఎదురులేని మనిషి, నేనున్నాను, బాస్, కింగ్, కేడి, రగడ, దడ, గ్రీకు వీరుడు వంటి చిత్రాలను నిర్మించారు
నిర్మించిన సినిమాలు
మరణం
గత కొన్నిరోజులుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న శివప్రసాద్ రెడ్డి 2018, అక్టోబర్ 27న ఉదయం 6.30 ని.లకి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మరణించాడు.[1][2]
358-రవీంద్రా ఆర్ట్ పిక్చర్స్ అధినేత ,సారధి స్టూడియో నిర్మాత రాలి జనరల్ మేనేజర్ ,అభ్యుదయవాది ,వహీదాను తెలుగు సినిమాకు పరిచయం చేసినవాడు ,పల్లెటూరు ,ధర్మదాత సినీ నిర్మాణ ఫేం ,రఘుపతి వెంకయ్య అవార్డీ–తమ్మారెడ్డి గోపాల కృష్ణ మూర్తి
తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి (అక్టోబరు 4, 1920 – సెప్టెంబరు 16, 2013) హేతువాది, వామపక్షవాది.
జననం
కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం చినపాలపర్రులో తమ్మారెడ్డి వెంకటాద్రి, సౌభాగ్యమ్య దంపతులకు1920 అక్టోబరు నాలుగో తేదీన జన్మించాడు. ‘గోరా’ ప్రభావానికి లోనయ్యాడు. మాలపల్లిలో సహ పంక్తి భోజనాలు చేసిన అభ్యుదయవాది. కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యుడిగా చేరి ‘స్వతంత్ర భారత్’ అనే పత్రిక వ్రాతప్రతిని చుట్టుపక్కల గ్రామాల్లో సర్క్యులేట్ చేశారు. సూరపనేని శేషగిరిరావుతో కలసి ట్యుటోరియల్ ప్రారంభించాడు. సినిమాలవైపు ఆకర్షితుడయ్యాడు. 1945లో కృష్ణవేణిని వితంతు వివాహం చేసుకున్నారు. 1950 నవంబరులో మద్రాసుకు మకాం మార్చిన కృష్ణమూర్తి మొదట్లో ట్యూషన్లు చెప్పుకుంటూ కొంత కాలం గడిపారు. కొడవటిగంటి కుటుంబరావు పేరు పెట్టిన ‘పీపుల్స్ ఆర్ట్ ప్రొడక్షన్’ సంస్థలో తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో తొలిసినిమా పల్లెటూరు తీసాడు. సారథి సంస్థలో చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా, జనరల్ మేనేజర్‌గా ఎన్నో చిత్రాల నిర్మాణానికి కృషి చేశాడు. సారథి నా విశ్వవిద్యాలయం అంటాడు. తెలుగు, తమిళం లలో సుప్రసిద్ధ నటీనటులతో పదమూడు చిత్రాలు తీశాడు. హైదరాబాద్‌లో ‘సారథి స్టూడియో’ ఏర్పాటుకు కృషి చేశాడు. ఆయనే దానికి తొలి జనరల్ మేనేజరు. ‘ఏరువాక సాగారో’ పాటకు నర్తించిన వహీదా రెహమాన్‌ను తీసుకొచ్చింది కృష్ణమూర్తే. 1962 లో తానే సొంతంగా సినిమాలు తీయాలనే ఉద్దేశంతో రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ ప్రారంభించాడు. ఆయనకు రవీంద్ర కవి అంటే ప్రాణం. ఆయన సంస్థలన్నీ రవీంద్రతోనే మొదలయ్యాయి. లక్షాధికారి, జమీందారు, బంగారుగాజులు, ధర్మదాత, సిసింద్రీ చిట్టిబాబు, దత్తపుత్రుడు, డాక్టర్ బాబు, అమ్మా నాన్న, లవ్ మ్యారేజ్… ఇలా ఎన్నో చిత్రాలు. జూబ్లీ హిల్స్‌లో ఫిల్మ్‌నగర్ వ్యవస్థాపకుడు. జంట నగరాల్లో ఇరవైమూడు కాలనీలను ఒక గొడుగు క్రిందకు తెచ్చి, ఫెడరేషన్ ఏర్పాటు చేశాడు. తెలుగు భాషా చైతన్య సమితికి గౌరవాధ్యక్షుడు. తెలుగు భాషాభ్యుదయ సమాఖ్యకు సలహాదారు. ప్రజానాట్యమండలి పోషకులు. నంది అవార్డు ల కమిటీలో సభ్యుడు, ఛైర్మన్ అయ్యాడు. చిత్ర పరిశ్రమాభివృద్ధి సంస్థ సభ్యుడు. వృద్ధాప్యంలో ఎవరికీ భారం కాకూడనే అభిప్రాయంతో కన్నుమూసే వరకు వృద్ధాశ్రమంలో కాలం గడిపారు. చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ సభ్యుడు. ఆ సంస్థ నడిపే వృద్ధాశ్రమంలోనూ సేవ చేస్తున్నాడు. ‘సినిమా ఒక మజిలీ… సమసమాజం నా అంతిమ లక్ష్యం’ అంటారు. ఇతడు2007 లో “రఘుపతి వెంకయ్య అవార్డు”ను పొందినాడు.[1][2]
ప్రముఖ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఈయన కుమారుడు.[3]
కుటుంబ నేపథ్యం
వారి నాన్న పేరు తమ్మారెడ్డి వెంకటాద్రి, అమ్మ పేరు సౌభాగ్యమ్మ. వారికి ముగ్గురు సోదరులు. ఇద్దరు సోదరీమణులు. సోదరుల పేర్లు సత్యనారాయణ, రఘురామయ్య, వెంకటేశ్వరరావు, ఇద్దరు సోదరీమణులలో ఒకరిని పొట్లూరి హనుమంతరావుకు మరొకరిని పొట్లూరి వెంకట సుబ్బయ్యకు యిచ్చి వివాహం చేశారు.
విద్య
వారి ఊరిలో అప్పుడు కేవలం పాతిక ఇళ్ళుండేవి. ఊరికి దూరంగా మాలపల్లి ఉండేది. వారి ప్రాథమిక విద్య నాలుగో తరగతి వరకు వారి ఊళ్ళోనే జరిగింది. వారి బడిలో చరచూరి వెంకట బ్రహ్మం అనే టీచరు ఉండే వారు. ఆయన చాలా ఆసక్తిగా పాఠాలు చెప్పేవాడు. చదువు విషయంలో వారు ఎప్పుడూ ముందుండే వారు.
రహస్య జీవిత౦]
1946లో నిర్భంధ విధానం వచ్చింది. అప్పుడు రెండు సంవత్సరాలు వానపాముల గ్రామంలో వారి కుటుంబాన్ని ఉంచి వారు రహస్య జీవితానికి వెళ్ళారు.
మరణం
సెప్టెంబరు 16, 2013 న తుదిశ్వాస విడిచారు.
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -26-11-22-ఉయ్యూరు
Video link
పదహారు కోట్లతో పదహారు రెట్ల ఫలితం సాధించిన ‘’కాంతార (అడవి )పుత్రుల కథ ‘’కాంతార’’
అడవి బిడ్డల హక్కులు ,నమ్మకాలు ,పూనకాలు ,వారికిచ్చిన భూమి లాక్కుంటే జరిగే ప్రమాదాలు ,వారి జాతరలు అత్యంత సహజంగా నిర్మించి నేటివిటి కి పట్టం కట్టిన చిత్రం కాంతార .ఎవరి నోట విన్నా బ్లాక్ బస్టర్ మూవీ గా చెప్పబడుతోంది . కథ,కథన౦ , నటన, చిత్రీకరణ ,సన్నివేశాలకు తగిన పాటలు ,వీటిని మించిన ఫోటోగ్రఫీ ,ఎన్నెన్నో కష్టాలకోర్చి అరణ్యం లో సెట్ లు వేసి ,విజువల్ ఎఫెక్ట్ కోసం రాత్రి వేళ షూట్ చేసి తెరకెక్కించిన వైనం తెలిసి ,చూసి ప్రేక్షకజనం నీరాజనాలు పట్టిన సినిమా .దక్షిణ కర్నాటకు చెందిననట దర్శకుడు రిషబ్ శెట్టి బహు ముఖ ప్రజ్ఞకు నిలువెత్తు దర్పణంగా నిలిచింది .అన్నటా అతడు అద్వితీయుడని పించాడు .సినిమా విజువల్ రిచ్ నెస్ మనసుకు హృదయానికి హత్తు కొంటుంది .ఒక్క క్షణం కూడా కన్ను మరో వైపుకు తిప్పాలనిపించదు. అంతగా అటేన్షన్ ను సూదంటురాయిలా లాగేస్తుంది .
దక్షిణ కర్ణాటకలో తుళుప్రాంత కథ.ఒక అడవిలోని ఊరుకు రాజు చాలా అండగా ఉంటాడు .అడవిబిడ్డల ఆలనా పాలనాచూసే కన్నతండ్రిలా కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు అతడంటే వారికీ దైవ సమానమైన భక్తీ గౌరవాలున్నాయి .ఊరి పెద్దాయన ఒకాయన కూడా ప్రజల మనిషిగా ఉంటాడు ..పరస్పరం ఒకరినొకరు నమ్ముకొని ఉంటారు .అడవి పుత్రుడు శివ ఆయనకు గొప్ప సహాయ కారి .ఊరికి ఉపకారి .స్నేహితులతోకలిసి అప్పుడప్పుడు వేటకు వెడతాడు .ఒకసారి ఫారెస్ట్ ఆఫీసర్ మురళి వచ్చి శివ ను స్మగ్లర్ అని అనుకొంటాడు .చట్టం ముందు అందరూ సమానమే అన్నభావం మురళిది.ప్రజలకు దూరంగా ఉంటాడు .అక్కడిజనం అటవీ భూములు ఆక్రమి౦చు కున్నారని, కనుక సరిహద్దు కంచే వేయాలని అనుకొంటాడు ఆఫీసర్ .శివ ను ప్రేమించేలీల ఫారెస్ట్ గార్డ్ గా చేరి ,సర్వె చేయటం లో సాయం చేస్తుంది .
అనుకోని సంఘటన జరిగి శివ జైలుకు వెడతాడు .అతని స్నేహితుడు హత్యకు గురౌతాడు .జైల్లో ఉన్న శివ ఈ విషయం ఊరి పెద్దమనిషిద్వారా విని తట్టుకోలేకపోతాడు .ఈపని మురళిదే అంటాడు పెద్దాయన .జైలునుంచి వచ్చిన శివ అటవీ భూమిని కాపాడతాడు .ప్రజలకు భూమిని అప్పగిస్తాడు ఫారెస్ట్ ఆఫీసర్ తప్పు తెలుసు కొంటాడు .శివ, లీల దంపతులకు కొడుకు పుడతాడు .శివ తండ్రి తనకాలం లోఅడవి బిడ్డలకు రక్షణగా ,ఉంటె ఆతని తర్వాత శివ అతడితర్వాత కొడుకు రక్షకులౌతారు .
దక్షిణ కన్నడ దేశం లోని స్థానిక విషయాన్ని సబ్జెక్ట్ గా తీసుకొని ,చక్కని ట్రీట్ మెంట్ తో అందరిని అలరించాడు దర్శకుడు .ఆప్రాంతం లోని భూత కోలా ,కంబళ,కోళ్ళ పందాలను కళ్ళకు కట్టించాడు .ధనస్వామ్యం ,అడవీ రక్షణ ,అడవిపుత్రులహక్కులు ,పర్యావరణ పరిరక్షణలను దైవారాధన ,జానపద సాహిత్యాలతో మేళవించి కంబళ వంటి స్థానిక సంస్కృతిని ప్రేక్షకులకు తెలిసేట్లు చిత్రీకరించాడు .
పల్లెటూరి కథ.భావోద్వేగా ప్రధానం .మనుషులలో ఉన్న ప్రేమ అమాయకత్వం ,నమ్మిన దానికై ప్రాణాలను కూడా పణంగా పెట్టె నైజం గుండెను పట్టేస్తాయి ఊపిరి సలుపనివ్వవు .
మొదట్లో సినిమాలో రాజు మహా సంపన్నుడైనా ,మనశ్శాంతి లేక తిరుగుతూ ,ఈ అడవిలోకి వచ్చి ‘’పంజుర్లి ‘’అనే రాయి ని చూస్తాడు .అనుకోని మనశ్శాంతి లభించి తన ఖడ్గం అక్కడ పడేయగా అక్కడి ప్రజలు ఆరాయిని ఆరాధించటానికి వస్తారు .రాజు వాళ్ళను వారి దేవుడిని తనకిమ్మంటాడు .అందులో పంజర్లీ దేవుడికి సేవ చేసే కుటుంబంలోని వ్యక్తికి ఆదేవుడు ఆవహించి తాను రాజుతో వచ్చి మనశ్శాంతి నిస్తానుకానీ ఇక్కడి ప్రజలకు ఏమిస్తావని అడిగితె ,ఎడైనైస్తానని రాజు అంటే ,అప్పుడు అతడు పెద్దగా అరిచి తన అరుపు వినబడినంత మేర స్థానికులకు ఇచ్చేయ్యమంటే అలానే ఇస్తానన్నాడు రాజు .ఒక షరతు పెట్టాడు పంజర్లీ .రాజు తరఫున భవిష్యత్తులో ఎవరైనా వారసుడు మళ్ళీ ఈ భూమిని కావాలని రాద్ధాంతం చేస్తే ‘’గుళిగ’’దేవుడు ఉపేక్షించడు .అతనిని శిక్షిస్తాడు అంటాడు .అతడే క్షేత్ర పాలకుడు .మొదట్లో ఈ ఇద్దరు దేవుళ్ళకు పెద్ద యుద్ధాలు జరిగుతాయి .తర్వాత కొందరు దేవుళ్ళు వీరిద్దరిమధ్య సంధి చేసి అన్నదమ్ముల్లా మేలిగేట్లు ఒప్పందం కుదురుస్తారు .ఈ ఇద్దరు దేవుళ్ళు అక్కడి ప్రజలను నిరంతరం కాపాడుతూ ఉంటారు .ఇలా దేవుడికీ భూమికి మధ్య చక్కని సంబంధం కలిగించారు .
కొన్నేళ్ళ తర్వాత రాజు వారసుడు ఒకడు వచ్చి తమ రాజు ఇచ్చిన భూమి తిరిగి తనకు ఇచ్చెయమని అడుగుతాడు .శివతండ్రి అప్పుడు భూత కోలా ఆడుతుంటే అతనిలోకి దేవుడు పూని ‘’ఈ స్థలం మాట మర్చిపో .ఇది ప్రజల ఉమ్మడి ఆస్తి .దీనికోసం కోర్టుకు వెడితే ,కోర్టు మెట్లమీదే తేలుస్తాను ‘’అంటాడు .వెంటనే అడవిలోనుంచి తనను పిలుస్తున్న కేక విని అప్పటికప్పుడు అదే వేషంతో అడవిలోకి పరిగెత్తుకోనిపోయి తన చుట్టూ అగ్ని వలయం ఏర్పాటు చేసుకొని అదృశ్యమైపోతాడు .పంజర్లీ దేవుడు చెప్పినట్లే రాజుగారి వారసుడు కోర్టు మెట్లమీద అకస్మాత్తుగా చచ్చిపోతాడు .ఇలా హీరో మాయమయ్యే సీన్ మళ్ళీ క్లైమాక్స్ లో వస్తుంది .
జైలు నుంచి ఇంటికి వస్తున్న శివకు దారిలో ఒక అడవిపంది –వరాహం కనపడుతుంది .దాన్ని చూసిన ప్రతిసారి భయపడి అడవిలోకి పారిపోయేవాడు . ఈ సారి భయపడకుండా దాని వెంట వెళ్లగా,శివ తండ్రి మాయమైన వలయంలోకి అతడిని ప్రవేశించేట్లు చేస్తుంది .అందులోకి చేరిన శివకు తండ్రి రూపు ఒక కాంతిలా కనిపించి ‘’నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉందని ‘’అంటాడు పంజర్లీ దేవుడు అతడికి ఊరి లోని జరిగిన జరగబోయే విషయాలన్నీ తెలియజేస్తాడు .ఊరి వారంతా ఏం జరుగుతుందో అని కంగారు పడుతుంటే శివమాత్రం తాపీగా నిశ్చలమనసుతో ఉంటాడు .అందర్నీ అక్కడే ఉండమని చెప్పి ,ఇంతలో దొర వస్తే తన ఊరి వారందర్నీ జాగ్రత్తగా చూసుకొంటూ కాపాడమని అప్పగించి వెడతాడు .అంటే ఇక తిరిగి రాడు అని మనం గ్రహించాలి .కాని దొర,అక్కడి మనుషులతోపాటు శివను కూడా కాల్చి చంపేస్తాడు .కాని శివ చనిపోడు.అతనిలోకి వెళ్ళగా గులిగ దేవుడు ఆవహిస్తాడు .గులిగ దేవుడు చేసే పనులను అత్యద్భుతంగా చిత్రీకరించాడు దర్శకుడు .ఈ దేవుడికి ఆకలి ఎక్కువ .ఒకసారి మహా విష్ణువే వచ్చినా ఆకలి తీరకపోతే ఆయన చిటికెన వ్రేలును తినటానికిస్తే గుళిగ ఆకలి శాంతించింది .శివలోని గుళిగదేవుడు ‘’ఆకలి ఆకలి ‘’అని అరిస్తే ఊరిజనం ఆయనకిష్టమైన మరమరాలు తెచ్చి సమర్పిస్తారు .అవితింటూ గుళిగ అరిచే అరుపులకు ప్రేక్షకులకు వెన్నులో వణుకు పుడుతుంది. అంత భయంకరంగా ఉంటుంది అఆరుపు .రాతి విగ్రహం దగ్గర మట్టిలో ఉన్న కత్తిని తీసి దొర తల నరికేస్తాడు గుళిగ .ఈకత్తి సినిమా మొదట్లో రాజు అక్కడి రాతి దేవుడిని చూసి మనశ్శాంతి పొందినప్పుడు విసిరేసిన కత్తి.కొన్ని నెలల తర్వాత శివ మాయమైపోతాడు .అతనికి అప్పటికే ఒక కొడుకు పుట్టాడు .మాయమయ్యే ముందు శివ కోలా కడతాడు .అతనిలోకి పంజర్లీ దేవుడు ఆవహిస్తాడు .ఊరి వారి నందర్నీ కలిసికట్టుగా ఉండమని ప్రజల రక్షణ పోలీసు ఆఫీసర్ ను చూసుకోమని చెప్పి ,ఎవరోపిలుస్తున్నట్లుగా అకస్మాత్తుగా అడవిలోకి వెళ్లి వాళ్ళనాన్న మాయమైన వలయం నుంచే శివ మాయమై పోతాడు .మాయమవటానికి ముందు శివకు తండ్రి కనిపిస్తాడు .ఎందుకు ఈమయమవటాలు అనేది థౌజండ్ డాలర్ క్వశ్చిన్ .కారణం శివ కుటుంబం దైవ సేవ చేసే కుటుంబం .ప్రతిమనిషి ఏదో ఒక ప్రయోజనం కోసమే పుడతాడు. ప్రయోజనం నెరవేరగానే మళ్ళీ దేవుని చేరతారు .శివ నాన్నరాజవంశీకుడిని అలానే చేశాడు .ఇప్పుడు శివకూడాదొరవలన ప్రజలకు కలిగిన ఇక్కట్లనుంది దొరను చంపి తనవారిని కాపాడాడు . తన జన్మకారణాన్ని తండ్రిలాగానే సార్ధకం చేసుకొన్నాడు.శివకు పుట్టిన బిడ్డ కూడా దైవకార్యం నిర్వర్తి౦చటానికే .వాడుకూడా తనపని పూర్తికాగానే తాత తండ్రీ ల్లాగా దైవాన్ని చేరుకొంటారు .ఇలా దేవుడే దిగివచ్చి తనమనుషులను కాపాడుకొంటూ ఉంటాడు అని ‘’పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం –ధర్మ సంస్థాపనార్ధాయ సంభ వామి యుగే యుగే ‘’అనే గీతాకారుని మాటను మరో విధంగా ఈ కాంతార కథా రూపంగా రుజువు చేశాడు దర్శకుడు ,దార్శనికుడు రిషభ్.
ఈ సినిమాకు సంగీతం లోకేషన్లు ముఖ్య బలంగా నిలిచాయి .ప్రతి సెంటి మీటర్ కలర్ఫుల్ గా ఉంది .అజనీష్ లోక నాథ సంగీతం నేపధ్య సంగీతం మరోలోకం లోకి తీసుకు వెడతాయి. కొన్ని చోట్ల రోమాలు నిక్కబొడుచుకొంటాయి .అరవింద కాశ్యప్ సినిమాటోగ్రఫీ కెవ్వు కేక .హీరో రిషబ్ శెట్టి కనిపించడుఎక్కడా. శివ పాత్రమాత్రమే కనిపిస్తుంది .దర్శకుడుగా రిషభ్ విశ్వ రూపం చూపించాడు .వృషభం ధర్మానికి ప్రతీక .రిషభ్ అలా దివ్యమైన ధర్మబద్ధమైన సినిమాకు ప్రతీకగా నిలిచాడు .సినిమాలోని పాత్రలన్నీ జీవించాయి .లీలగా సప్తమీ గౌడ పాత్రలో లీనమై నటించింది .ఫారెస్ట్ ఆఫీసర్ మురళి గా కిషోర్ కుమార్ ప్రతిభ చాటాడు .భూస్వామి గా అచ్యుతకుమార్ ఆకట్టుకొన్నాడు .
పాటలు –‘’వరాహ రూపం దైవ వరిష్టం –వరస్మిత వదనం –వజ్రదంత ధార-రక్షా కవచం –శివ సంభూత ,భువి సంజాత నంబిడగి౦బు కొడు వవనీత సావిర మన సంప్రీత -బెడుత నిందేవు ఆరాధి సుత ‘’గీతాన్ని శ్రీలత ,రిషభ్ మహా శ్రావ్యంగా భావ స్ఫోరకంగా పాడారు.
కన్నడ తారలు ‘’కనకతారలు’’ గా మెరిశారు .మురిపించారు , మైమరపించారు నటనలో .అన్ని విభాగాలు అత్యున్నత ప్రమాణంగా ఉన్న చిత్రరాజం కాంతార .ట్రెండ్ సెట్టర్ గా నిలిచి మార్గదర్శనం చేసింది .రిషభ్ ‘’అభినందగళు’’.’’ఒళ్ళ యదాగలి (బెస్ట్ ఆఫ్ లక్ )
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -25-11-22-ఉయ్యూరు
బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం .35 వ భాగం.25.11.22
Video link
మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -356
· 356-గోపీ ఆర్ట్ పిక్చర్స్ అధినేత ,చిలకమ్మా చెప్పింది ,కృష్ణవేణి వంటి ప్రయోగాత్మక చిత్ర నిర్మాత –చలసాని గోపి
· చలసాని గోపి చలనచిత్ర నిర్మాత. ఇతడు 1944, ఏప్రిల్ 15న కృష్ణా జిల్లా, పామర్రు మండలానికి చెందిన పెదమద్దాలి గ్రామంలో జన్మించాడు.
ఇతడు వెంకటేశ్వర వైభవం చిత్రంలో భాగస్వామిగా సినీ నిర్మాణరంగంలోకి ప్రవేశించాడు. ప్రయోగాత్మక చిత్రాల నిర్మాతగా ప్రసిద్ధి చెందాడు.అతను గోపీ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై చిత్రాలనునిర్మించాడు.[1]
ఇతడు నిర్మించిన సినిమాలు:
1. కృష్ణవేణి – 1974
2. చిలకమ్మ చెప్పింది – 1977
3. కుక్క కాటుకు చెప్పు దెబ్బ – 1979
4. గజదొంగ – 1981
5. దొంగ రాముడు – 1988
6. చిన్న అల్లుడు – 1993
7. దొంగా పోలీస్ – 1992
8. అడవి దొంగ – 1985
9. కుర్రాడు బాబోయ్ – 1995
మూత్రపిండాల పనిచేయకపోవడం వల్ల 2003 ఆగస్టు 23 న మరణించాడు. అసోసియేట్ నిర్మాతగా ‘శ్రీ వెంకటేశ్వర మహాత్యం’ తో కెరీర్ ప్రారంభించాడు. తరువాత, అతను ‘గజదొంగ’ (ఎన్టీఆర్) , అడవి దొంగ (చిరంజీవి) వంటి బ్లాక్ బాస్టర్లను నిర్మించాడు. [2]
357-మాజీ మంత్రి ,ఈ భూమి పత్రిక నిర్వాహకుడు ,రూమ్ మేట్స్ మీ శ్రేయోభిలాషి చిత్రనిర్మాత ఎందఱో విద్యార్ధుల విదేశీ చదువులకు సాయం చేసినవాడు ,అంతర్జాతీయ ఎడ్యుకేషనల్ సొసైటీ స్థాపకుడు –సి.సి .రెడ్డి
విసు కన్సలటెన్సీ, విసు ఫిలింస్ అధినేత, చలన చిత్ర నిర్మాత, పారిశ్రామికవేత్త చవ్వా చంద్ర శేఖర రెడ్డి అనే సి.సి. రెడ్డి ( అక్టోబర్ 24, 1930 – అక్టోబర్ 6, 2014). ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దివంగత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఐటీ శాఖ సలహాదారుగా కూడా వ్యవహరించారు.
1930, అక్టోబర్ 24 న జన్మించారు.
· రూమ్ మేట్స్
· వెంగళ్‌రెడ్డి అంతర్జాతీయ ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపించాడు.
· విసు కన్సల్టెన్సీ ద్వారా ఎందరో విద్యార్థులను ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపించాడు.
· ఎడిటర్ గా ఈ భూమి అనే పత్రికను నడిపాడు.
2008 సెప్టెంబరులో కాలి బొటన వేలికి సంబంధించిన “గౌట్” అనే వ్యాధితో బాధపడ్డారు. అది శ్రుతిమించి కేన్సర్‌గా మారే అవకాశముందని డాక్టర్లు తెలిపారు. సరైన ట్రీట్ మెంట్ తీసుకోకపోవడంతో కోమాలోకి వెళ్లి, ఐదురోజుల అనంతరం బయటపడ్డారు.
కొంత కాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్నారు. 2014, అక్టోబర్ 6 సోమవారం డయాలసిస్ కోసం బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రికి వెళ్లారు. పక్రియ కొనసాగుతుండగానే ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురై గుండెపోటు రావడంతో మృతి చెందారు.
358-శాసన సభ్యుడు ,సమరసింహారెడ్డి సినీ నిర్మాత –చంగల వెంకటరావు
చెంగల వెంకటరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సినీ నిర్మాత, రాజకీయ నాయకుడు. ఆయన 1999 నుంచి 2009 వరకు పాయకరావుపేట శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పని చేశాడు.
· సమరసింహారెడ్డి (1999)[1]
· నర్సింహుడు (2005)
చెంగల వెంకటరావు పాయకరావుపేట శాసనసభ నియోజకవర్గం నుండి 1999 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి గంటెల సుమనా పై 7576 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన 2004లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గంటెల సుమనా పై 13689 ఓట్ల మెజారిటీతో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు.[2]వెంకటరావు 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గొల్ల బాబూరావు చేతిలో 656 ఓట్ల స్వల్ప మెజారిటీతో ఓటమి పాలయ్యాడు. ఆయన 2013లో తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరాడు. చెంగల వెంకటరావు 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి వంగలపూడి అనిత చేతిలో ఓడిపోయాడు.
చెంగల వెంకటరావు 2007లో నక్కపల్లి మండలం బంగారమ్మపేట అనే మత్స్యకార గ్రామంలో బీచ్ మినరల్స్ కంపెనీ పెట్టడానికి ప్రయత్నాలు జరిగాయి. గ్రామసభ జరిగినప్పుడు ఎమ్మెల్యే చెంగల సహా ఆయన అనుచరవర్గం పరిశ్రమ పెట్టడానికి వీళ్లదని ఖరాఖండిగా చెప్పారు. కానీ మరో వర్గం వారు పరిశ్రమను పెట్టితీరాలని వాదించింది. దీంతో అక్కడ ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో ఒక మత్స్యకారుడు మరణించాడు. బంగారయ్యపేటలో జరిగిన ఘర్షణలో మత్స్యకారుడు మరణానికి చెంగల వెంకట్రావు, అతని అనుచరులే కారణమంటూ కేసు పెట్టారు. పదేళ్లపాటు కేసు విచారణ జరగగా 2017 మే 24న అనకాపల్లిలోని జిల్లా సెషన్స్ జడ్జి కోర్టు వెంకటరావుతో పాటు 21 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.[3]
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -25-11-22-ఉయ్యూరు
శ్రీమతి శ్రీదేవి మురళీధర్ రాసిన వేదాంత దేశికులు.1వ భాగం.24.11.22
Video link
కన్నడ సాహిత్య కాల్పనిక రచయిత బి.ఎం.శ్రీ కంఠయ్య
కన్నడ సాహిత్య కాల్పనిక రచయిత బి.ఎం.శ్రీ కంఠయ్య
ఇంగ్లీష్ లో ఎ.ఎన్.మూర్తి రావు రాసిన దానికి తెలుగు అనువాదం చేసిన శ్రీ పోరంకి దక్షిణా మూర్తి గారి పుస్తకం బి.ఎం.శ్రీ కంఠయ్య ను కేంద్ర సాహిత్య అకాడెమి 1978లో ప్రచురించింది .వెల-2-50రూపాయలు .
జీవితం
3-1-1884న కర్ణాటక రాష్ట్రం ‘’సి౦పెగి ‘’గ్రామం లో బి.ఎం.శ్రీ కంఠయ్యఅయిదుగురు సంతానం లో పెద్దవాడుగా జన్మించాడు .తల్లి భగీరధమ్మ .తండ్రి బెల్లూరు మైలారయ్య .సాంప్రదాయ మధ్యతరగతి కుటుంబం..తండ్రి గొప్ప వకీలు .శ్రీరంగపట్టణం లో ప్రాక్టీస్ చేసేవాడు.ప్రాధమిక విద్య అక్కడే చదివి ,సెకండరి ఉన్నతవిద్యలకోసం మైసూరు వెళ్ళాడు .ఆర్ట్స్ లో ఎఫ్ ఎ పాసై ,బెంగుళూరు సెంట్రల్ కాలేజిలో చదివి 1903లో బిఎపాసయ్యాడు .పై చదువుకోసం మద్రాస్ వెళ్లి చదివి,1907లో ఎం .ఎ .పట్టా పొందాడు .1906లోనే లా పాసైనా ,ప్రాక్టీస్ చేయాలనిపించ లేదు .మైసూర్ సివిల్ సర్వీస్ పరీక్షలో ఉన్నత శ్రేణి దక్కలేదు .అదికన్నడ సాహిత్యానికి గొప్ప అదృష్టాన్ని కలగజేసింది .
1911లో ధార్వాడ లో ఆయన చేసిన ప్రసంగం లో కన్నడ సాహిత్యం ఎదుర్కొంటున్న సమస్యలను భావ స్ఫోరకంగా వివరించటం ,నూతన సాహిత్య సృష్టికి మార్గాన్ని సుగమం చేసింది .1909 లో మైసూర్ లో మహారాజా కాలేజిలో ఆంగ్ల-కన్నడ లెక్చరర్ గా నియమించటం జరిగింది .1914కు ప్రొఫెసర్ అయ్యాడు .’’ఎ హాండ్ బుక్ ఆఫ్ రెటారిక్ ‘’అనే మొదటి రచన చేశాడు .అప్పుడే ఆంగ్ల భావ గీతాల అనువాదం ప్రారంభించాడు .అందులో మొదటి మూడు 1919లో వెలువడినాయి .ఇంగ్లీష్ లెక్చరర్ గా గొప్ప పేరు పొందాడు .పెళ్లి చేసుకొని ముగ్గురు పిల్లల తండ్రి అయ్యాడు .కండ్లకలకతో బాధపడే ఆయన కొడుకు సరైన వైద్యం లేక గుడ్డివాడయ్యాడు .తర్వాత భార్య పురిటి జ్వరం తో చనిపోయింది .ఈ బాధలను దిగమింగు కోవటానికి ఎంతో ఆత్మ స్థైర్యాన్ని కూడ దీసుకొన్నారు .తర్వాత తల్లీ ,అల్లుడూ కూడా చనిపోయి విధి ఆయనపై క్రూరంగా విరుచుకు పడింది .ఈ దుర్ఘటనలు ఆయన్ను కొంచెం కఠినుడిగా మార్చి ఉంటాయి .ఆయన ఒకసారి తన సోదరితో ‘’దేవుడు మనుషులకు మంచి చేయదలచినా, చెడు చేయదలచినా ముందు నేనే కనిపిస్తానేమో .దేవుడికి ఇష్టమైన వాడిని నేను ‘’అని పరిహాసంగా ఆన్నాడు .
30ఏళ్లకే భార్య చనిపోయినా ,మళ్ళీ పెళ్లి చేసుకోలేదు .సాహిత్య కృషికే అంకితమయ్యాడు .అప్పటి వరకు ఇంగ్లీష్ ఆక్రమించిన అగ్రస్థానాన్ని కన్నడానికి కట్టబెట్టాలని నిశ్చయించి ఆ మార్గం లో తీవ్ర కృషి చేశాడు .సంప్రదాయ బంధాలలో నుంచి కన్నడ భాషను విముక్తి చేసి ,పునరుజ్జీవనం కల్పించి ,కన్నడ భాషా ప్రాంతాలన్నిటిని ,ఒకే ప్రభుత్వం కిందకు తెచ్చి కర్నాటక రాష్ట్ర స్థాపనకు కృషి చేయటం ఆయన ధ్యేయం .ఆంగ్ల భాషా నిష్ణాతుడైన ఆయన గ్రీకు భాషనూ అధ్యయనం చేసి అందులోని సాహిత్యాన్ని మధించాడు .ఇదంతా తన కన్నడం కోసం చేసిన కృషి .’’కన్నడం ఎడారి పాలుకాకుండా కాపాడింది శ్రీ క౦ఠయ్య గారు’’అని ఈపుస్తకరచయిత ఆయనతో అంటే ‘’కన్నడం కూడా ఆయన్ను కాపాడి ,ఆత్మ దైన్యం పాలుకాకుండా చేసింది ‘’అన్నాడు .1919 ఆయన్ను కన్నడం లో సీనియర్ ప్రోఫెసర్షిప్ కావాలా ,ఇంగ్లీష్ లో జూనియర్ ప్రొఫెసర్ షిప్ కావాలో తేల్చుకోమంటే ,ఆంగ్లం లో జూనియర్ ప్రొఫెసర్ షిప్ నే ఎంచుకొన్నాడు .ఇంగ్లాండ్ లోని ఏదో ఒక యూని వర్సిటి నుంచి డిగ్రీతీసుకోకపోతే డిపార్ట్ మెంట్ లో భవిష్యత్తు ఉండదు అని అని పై అధికారులు అంటే దాన్ని సవాలుగా తీసుకొని ‘’ఇంగ్లాండ్ వెళ్లి వచ్చిన వాడితోనే కాదు ,అసలు ఇంగ్లీష్ వాడితోనే తలపడుతా ‘’అన్న ధీరోదాత్తుడు .కొన్ని కన్నడ సభలలో కూడా ఆయన్ను ఇంగ్లీష్ లోనే మాట్లాడమంటే అత్యద్భుతంగా ప్రసంగించి సుభాష్ అనిపించాడు .ఇంగ్లీష్ లెక్చరర్స్ లో ఆయనకు వచ్చిన౦త పేరు ఎవ్వరికీ రాలేదు .ఆయన డిపార్ట్ మెంట్ లో పని చేస్తున్న ఆక్స్ ఫర్డ్ మనిషి, ఆయనకు సీనియర్ ‘’’శ్రీ క౦ఠయ్య ఇంగ్లాండ్ వెడితే అక్కడి ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటి ఆయన్ను చటుక్కున లాగేసుకొంటు౦ది ‘’అని ఆయన ప్రతిభకు నీరాజనం పట్టాడు .1926లో రిజిష్ట్రార్ అయ్యాడు ప్రొఫెసర్ ,రిజిష్ట్రార్ పదవులు తీసుకోవటానికి కారణం కేవలం కన్నడ సాహిత్యాభి వృద్ధికి మాత్రమె .
‘’మైసూర్ యూని వర్సిటి పబ్లికేషన్స్ సిరీస్’’ పేరిట వరుసగా కొన్ని పుస్తకాలు ప్రచురించటానికి ఆయన డబ్బు గ్రాంట్ చేయించాడు .ఆ ప్రచురణలకు తానె సంపాదకత్వం వహించాడు .మరుగునపడ్డ మాణిక్యాలను బయట పడేశాడు. సాహిత్య విమర్శ ,ప్రాచీన కన్నడ గ్రంథాలకూర్పులు , పాశ్చాత్య సాహిత్య అనువాద గ్రంథాలు ,రిసెర్చ్ గ్రంథాలు సాహిత్యేతరమైన తత్వశాస్త్ర సాంఘిక శాస్త్రాలను ప్రధాన గ్రంథాలుగా సీరియల్ గా ప్రచురించి మహోన్నతసాహితీ సేవ చేశాడు .యువ కవులను ప్రోత్సహించటానికి ప్రతి ఏడూ ఉత్తమకవిత రాసిన యువకవికి బంగారు పతకం బహూకరించాడు .తత్వ శాస్స్త్రం లో ఉన్న ఆయన శిష్యుడు జి హనుమంతరావు ‘’యూనివర్సిటి టీచర్స్ అసోసియేషన్ ‘’స్థాపించాడు .ఈ అసోసియేషన్ సభ్యులు ఏడాదికి మూడుసార్లు గ్రామాలకు వెళ్లి వారం రోజులు మకాం చేసి అక్కడ కన్నడం లో చెప్పబడని విషయాలన్నీ ఉపన్యాసాలుగా గ్రామ ప్రజలకు తెలియ జేసేవారు .ఆఉపన్యాసాలను పుస్తకాలుగా ప్రచురించి రూపాయికి 8పుస్తకాలు అతి చవకగా అందించేవారు .ఇది హనుమంత రావు పూనికే అయినా వెనకున్నది మన శ్రీ కంఠయ్యే .
1930లో సీనియర్ ప్రొఫెసర్ ను చేసి బెంగుళూరు సెంట్రల్ కాలేజి కి బదిలీ చేశారు అక్కడే 1942లో పదవీ విరమణ వరకు పని చేశాడు .బెంగుళూరు వెళ్ళగానే ‘’ది ఇంగ్లీష్ సెమినార్ ‘’ను నిర్వహించి సాంస్కృతిక అభిరుచి కల్గించాడు .సైన్స్ డిపార్ట్ మెంట్ తో సహా ఎందఱో విద్యార్ధులు అధ్యాపకులు ఆకర్షితులయ్యారు .బెంగుళూరు వాతావరణం ఆయనకు ఎందుకో అంతగా నచ్చినట్లు లేదు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -24-11-22-ఉయ్యూరు
బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం .34వ భాగం.24.11.22
Video link
సంగమేశ్వర శతకం
కృష్ణా –తుంగభద్రా సంగమం లో చామర్ల పూడి(సంగం జాగర్లమూడి ) గ్రామం లో వేంచేసి ఉన్న శ్రీ సంగమేశ్వర స్వామిపై శ్రీ పరిమి వేంకటాచలకవి శతకం రాయగా ,గుంటూరు వాసి శ్రీ పరిమి కృష్ణయ్య గారిచే బెజవాడ ఆంద్ర గ్రంధాలయ ముద్రాక్షర శాలలో శ్రీ క.కోదండరామయ్య చే 1931లో ప్రచురింపబడింది. వెల.రెండు అణాలు .
విజ్ఞప్తిలో’’ ఈకవి ఆది శాఖీయబ్రాహ్మణుడుఅని,పేరు పరిమి వేంకటాచల౦ అని ,హరితస గోత్రం ,తండ్రి రఘునాయకుడు ,తల్లి సూరమాంబ .ఈకవి నూట ఇరవై ఏళ్ళ క్రిందటివాడు అంటే సుమారు 1811 నాటివాడు .వీరి సంతానం గుంటూరు మండలం లో వ్యాపించి ఉంది .గుంటూరు పుర పారిశుధ్య సంఘ కార్యాలయ ఉద్యోగి పరిమి సూర్యనారాయణ ,విజయవాడ ప్రభుత్వ ఔషధాలయ ఉద్యోగి పరిమి సీతారామయ్య ఈ కవి సంతతి లోని వారే ..సూర్యనారాయణ ఈకవికి అయిదవ తరం వాడు .సంస్కృత ఆంధ్రాలలో కవికి అసామాన్య పాండిత్యం ఉంది .శతకం సంస్కృత పద భూయిష్టం అయినా,మూలపదాలుకాని కటువైన పదాలుకానీ లేకుండా నిరర్గళ ధారాశుద్ధి ,తో ద్రాక్షాపాకం తో,భక్తిరసం వెల్లి విరిసేట్లు ,ఇప్పటిశతకాలకు ఏ మాత్రం తీసిపోకుండా సలక్షణంగా ఉంది ‘’ అని కర్లేపాలెం కోదండ రామయ్యగారు శ్లాఘించారు .ఉత్పలమాలా శతకం ఇది .’’కూడలి సంగమేశ్వరా ‘’అనేది శతకం మకుటం .
మొదటి పద్యం –‘’శ్రీ గిరిజా పయోధర పరిస్ఫుట చర్చిత సారగంధ గం –దధాగరు కుంకుమాంకిత ,సమంచి దురస్కజగత్ప్రపాలనో –ద్యోగ మనస్క ,శారద పయోద సమాన యశస్క ,సంతతా –భోగ వయస్క ,సర్వమునిపూజిత ‘’కూడలి సంగమేశ్వరా ‘’..రెండవ పద్యం లో’’వృషాధి రాజ కంఖాణ,మురారిబాణ’’అని విచిత్ర పద ప్రయోగం చేశారు కవి .తర్వాత ‘’భాసిత మందహాస ,పరిపాలిత దాస ,వ్రతోగ్ర కల్మష త్రాస ,పరాక్రమానల విదగ్ధ నిశాచర ఘాస ,సంతతోల్లాస ,శివా మనోహర విలాస ,సురాద్రి శరాస ,దివ్య కైలాస నివాస ‘’అ౦టూ సకార ప్రయోగంతో కవితాప్రాకారం కట్టి కదను తొక్కించారు .తర్వాత టకార ప్రయోగంతో వృషాద్రిప ఘోట , హిమాద్రి మనోబ్జాట లసత్కిరీట ,సుజనౌఘ భవాబ్ది కృపీట,జాహ్నవీ జూట ,కరాగ్ర శోభిమృగ శూల విధాత్రుక కోట,వాజ్నిరాఘాట విపత్కవాట ‘’అంటూ టకటక లాడించారు పద్యాన్ని.భాషపై ఎంతటి పట్టు ఉందొ ప్రకటించారు .ఆతర్వాత డకార ,దంభ రంభ డింభ స్తంభ లతో మరి రెండు పద్యాలు ఢంకా మోగించి చెప్పారు .ఈశ వినాశ ,దినేశ పాశ ,కేశాలతో పద్యం జడ అల్లారు .ఇలా ప్రతిపద్యంలో సంగమేశుని కీర్తించి కవితా కృష్ణా తుంగ లను సంగమింప జేసి ఉత్పల మాలికలల్లి అర్చించారు .
ఆతర్వాత మాదిరాజు ,పండితార్య బసవయ్య ,కాటకోటయ్య ,కేశిరాజు శిరియాళు,చోళ మహేశు ,సిద్ధరామయ్య బాచి రాజు వరదయ్య లనే శివ భక్తులను కీర్తించారు .’’తల్లికి ఉండే దయ బిడ్డపై దాసికి ఉంటుందా ‘’అంటూ నువ్వే దిక్కు అన్నారు .రారా చలమేరరా ,వినరాఏలుకోరా ,పలకరా మది నమ్మితిరా పదభక్తినియ్యరా ‘’అని వేడుకున్నారు చనువు మీరా .నీమిత్రుడు ధనదుడు ఇల్లు వెండికొండ ,కాంచన గిరి చాపం ,సర్వ విభూతులు కలిగికూడా ‘’ తనయుని పెండ్లి చేయని ఉదార గుణుడవు .అలాంటి నిన్ను వెంబడించే నన్ను అనాలికాని నిన్నని ప్రయోజనం ఏమిటి అని నర్మగర్భంగా పలికారుకవి .
రోకలి తోకోట్టినా ,రాళ్ళు రువ్వినా ,నంజుడు తి౦డిపెట్టినా ,సహిఛి మోక్షం ఇచ్చావు నన్నుమాత్రం వదిలేశావ్ అన్నారు .గళసీమలో మాణిక్యం ఉన్నా ,గాజుపూస కోసం అర్రులు చాస్తారుమానవులు అతి దగ్గరలో నువ్వున్నా నిన్ను పట్టించుకోరు వెర్రిజనం .ఉదరం లో ‘’పయోజ భవాండ శతాలు ఉంటె ,’’నీకడుపు ని౦డేట్లు భోజనం పెట్టటం మాకుసాధ్యమా ? ‘’ఎవ్వనిచే జగమ్ము జనియించు వసించు ,నశించు అవ్యయుడు,ఎవ్వడు ,కార్యకారణములలెవ్వడు ,భూత సమాశ్రయుడు ,చిత్కలా సహితుడు ఎవ్వరు ‘’అలాంటి నీవే మాకు దిక్కు అంటూ పోతనగారి పద్యాన్ని అనుకరిస్తూ శివ పరంగా అల్లారు .
‘’మూడిటి రెండిటిన్ గెలిచి మూటిని మూటిని రూపుమాపి ,మున్మూడిటిమూసి ,అయిదిటిని పొందుగా నేకము చేసి ,మూడిటన్ మూడిటి దాటి ,రెంటి నడుమన్ శివయోగి మూడిటన్ గూడిన చోటు మీరి నిను చేరతాడు ‘’అని వేదాంతపరంగా అద్భుత పద్యం రాశారు కవి. ఆపద కలిగిన వేళ,భయారతునిగా మొరబెట్ట నా సంతాపం మాన్పకున్నావు ఆకలిగొన్నప్పుడు అన్నం పెట్టకపోవటం న్యాయమా ఆది భిక్షూ అన్నారు , తు౦గ భద్రవద్ద అమరావతీనగరాన్నిపోలిన చామర్లపూడి లో సర్వ మంగళతో కొలువైన స్వామీ భక్తజనానికి అభయ ప్రదాతవు .
చివరిపద్యం –‘’మంగళమంబికా సహిత ,మంగళ మార్య శుభ ప్రదాయకా –మంగళమాహవ ప్రకట ,మంగళ మ౦బుజ నేత్ర,సాయకా –మంగళమిందుఖండ ధర ,మంగళ ముగ్ర మహాఘ శోషణా-మంగళ మభ్ర కేశ గుణ మండన కూడలి సంగమేశ్వరా ‘’అని శతకం ముగించారు .
చక్కని సంప్రదాయ బద్ధంగా శతకం సాగింది .భక్తి ఆర్తి ప్రపన్నత శరణాగతం తో భక్త చింతామణి గా శతకం రాశారు కవి.ధారాశుద్ధి అద్భుతం .భక్తి శతకాలలో తల మాణిక్యం గా ఉంది .ఈశతకం గురించి మనకవులు ఎవ్వరూ పేర్కొన్న దాఖలా కనిపించలేదు .ఈ కవినీ, ఈశతకాన్నీ పరిచయం చేసే మహద్భాగ్యం నాకు కలిగింది .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -23-11-22-ఉయ్యూరు
బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం .33వభాగం 23.11.22
Video link
పెదరావూరు కీర్తిపతాకలు
గుంటూరు జిల్లా తెనాలి దగ్గర పెదరావూరు గ్రామం లోని కొందరు ప్రముఖులను ‘’పెదరావూరు కీర్తి పతాకలు’’ గా పరి చయం చేస్తున్నాను .
1-శ్రీ రావూరి రంగారావు
శ్రీ రావూరి రంగారావు పెదరావూరు గ్రామం లో 1895లో రైతు కుటుంబం లో జన్మించారు .తండ్రి నారాయణ.1917లో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి 1921లో జాతీయ ఉద్యమం లో దూకారు .తిలక్ స్వరాజ్యనిధికి బాగా కృషి చేశారు .1921-22లో పెద నందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమం లో పాల్గొని ఒక ఏడాది కఠిన శిక్ష అనుభవించారు .సైమన్ కమీషన్ బహిష్కరణ ఉద్యమం లోనూ తీవ్రంగా పాల్గొన్నారు .శాసనోల్లంఘన ఉద్యమం లో పాల్గొని 1930లో ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్షను రాజమండ్రి ,ఆలీపూర్ జైళ్ళలో అనుభవించారు .రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆడిటింగ్ ఇన్స్పెక్టర్ గా రెండున్నర ఏళ్ళు పని చేశారు .1941వ్యక్తీ సత్యాగ్రహం లో పాల్గొని ఆరునెలలు రాజమండ్రి ,ఆలీపూర్ కారాగారాలలో కఠిన శిక్ష అనుభవించారు .1942లో క్విట్ ఇండియా ఉద్యమం లో చేతిబామ్బులు తన అధీనం లో ఉంచుకొన్నందుకు , ,రహస్య బులెటిన్ లు తెనిగించి నందుకు,డిటిన్యు గా నిర్బందింప బడ్డారు .తెనాలిపట్టణ ,తాలూకా కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులుగా ,గుంటూరుజిల్లా కాంగ్రెస్ సంయుక్త కార్యదర్శిగా సేవ లందించారు
2-శ్రీ కొడాలి గోపాలరావు గారు
పెదరావూరు కు చెందిన కొడాలి గోపాలరావు గారు గొప్ప నాటక రచయిత. అనేక ఎమేచ్యూర్ నాటక సమాజాలు ఆయన నాటకాలను భారీగా ప్రదర్శించాయి .శివాలయం ప్రక్కనే ఉన్న ప్రభుత్వ పాథశాలలో మూడవ తరగతి వరకు చదువుకొన్నారు .ముఖ్యంగా రైతు కూలీ సమస్యలపై ,భూస్వాముల ,అధికారుల పెత్తనాలపై అనేక నాటక ,నాటికలు రాశారు .పేద రైతు ,,తిరుగుబాటు ,కూలీ ,,లంకెల బిందెలు ,దొంగ వీరడు , నిరుద్యోగి ,చైర్మన్ నాటకాలను రసవత్తరంగా ,ప్రయోగాత్మకం గా రచించారు .అవి ఆంధ్రదేశం లో విస్తృతంగా ప్రజానీకాలకు నచ్చాయి .స్వతహాగా రైతు బిడ్డ అవటం వలన వీరి నాటకాలు సజీవంగా దర్శన మిస్తాయి .వందకు పైగా నాటకాలు రాసి ‘’శత నాటక కర్త ‘’అనే పేరు పొందారు .గ్రామీణ ప్రజలు జమీందార్లు ,రాజకీయ నాయకులు ,వడ్డీ వ్యాపరస్తులు ,,కూలీలు పేదలు వీరినాటకాలలో ప్రముఖ పాత్రలు వారి మధ్య సంఘర్షణ లను అత్యద్భుతంగా చిత్రించారు .అనేక నాటక పరిషత్తులలో 170కి పైగా బహుమతులు పొందారు .తెనాలిలో ‘’జనతా ఆర్ట్ థియేటర్ ‘’స౦స్థాపకులు .వీరి చైర్మన్ ,లంకె బిందెలు దొంగ వీరడు నాటకాలు ఆంధ్ర దేశం లో సంచలనమే సృష్టించాయి అడిగిన వారికల్లా నాటకాలు రచించిన ఉదారుడాయన ,ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్మించిన ‘’కల చెదిరింది ‘’సినిమాకు కొడాలి గోపాలరావు గారు దర్శకత్వం వహించారు. ఈ సంగతి చాలామందికి తెలియదు .
ఈ నెల 15వ తేదీ అమర్తలూరు వెళ్లి నప్పుడు మా అమ్మాయి స్నేహితురాలు శ్రీమతి శుభాషిణి ఇంటికి ఎదురుగా ,ఒక చెట్టు కింద ఒక విగ్రహం ఉంటె ఎవరిదీ అని అడిగితె కొడాలి గోపాలరావు గారిది అని చెప్పింది .కానీ నాకు అప్పుడు బల్బు వెలగలేదు .ఇవాళ తెలిసింది ఆమహనుభావుడి విగ్రహం అని .దాదాపుఆవూరి జనం కూడా ఆయన్ను మార్చే పోయి ఉంటారేమో .
3-శ్రీ రంగా వజ్ఝల వెంకట సుబ్బయ్యగారు
ప్రముఖ హరిభక్త శిఖామణి శ్రీ రంగా వజ్ఝల వెంకట సుబ్బయ్యగారు పెదరావూరు లో జన్మించారు .వీరు కృష్ణా జిల్లా దివి తాలూకా కోడూరు గ్రామం లో ‘’శ్రీ రామ దాసు ‘’హరికథా గానం చేస్తూ ప్రజోత్పత్తి నామ సంవత్సరం శ్రావణ శుద్ధ ఏకాదశి సోమవారం నాడు సప్తాహమండపం లో ‘’శ్రీరామ ప్రభో ‘’అని ఆలపించి ఒక్క సారిగా కుప్పకూలి అసువులు బాసి శ్రీ రామసాన్నిధ్యం చేరిన హరికథా శిఖామణి . ఈ ముగ్గురు మూడు రంగాలలో ప్రముఖులు .శ్రీరావూరి రంగారావు గారు భారత స్వాతంత్రోద్యమ నాయకులు .శ్రీ కొడాలి గోపాలరావు గారు శతాధిక నాటక నవలాకర్తలు అయిన సాహిత్యోపజీవి .శ్రీ రంగా వజ్ఝల వెంకట సుబ్బయ్యగారు హరికథకులైన భక్త శిఖా మణులు .ఆధ్యాత్మిక ప్రముఖులు .పెదరావూరు గ్రామ కీర్తి పతాకలు .వీరి గురించి ఇంతకంటే వివరాలు దొరకలేదు .
ఈ వివరాలు నాకు ముందే తెలిసి ఉంటె మొన్న ఆదివారం పెదరావూరు సదస్సులో వారిని గుర్తు చేసి ఉండేవాడిని .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -22-11-22-ఉయ్యూరు
బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం .32వ భాగం.22.11.22
Video link
మార్గశిర మాసంలో వేదాంత దేశికులు
సాహితీ బంధువులకు శుభ కామనలు .24-11-22 గురు వారం నుండి మార్గశిర మాసం ప్రారంభం అవుతున్నందున ఆ రోజు సాయంతం నుండి శ్రీమతి శ్రీదేవి మురళీధర్ గారు రచించిన ”వేదాంత దేశికులు ”ప్రత్యక్ష ప్రసారం ప్రారంభిస్తున్నామని తెలియ జేయటానికి సంతోషంగా ఉంది .ప్రస్తుతం చేస్తున్న మత్ష్యపురాణం తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాము .ఉదయం మాత్రం మహాభారత తత్వ కధనం కొనసాగుతూనే ఉంటుంది .మీ -గబ్బిటదుర్గాప్రసాద్ -22-11-22-ఉయ్యూరు
మత్స్య పురాణం.8వ భాగం.21.11.22.
Video link
ఇదం బ్రాహ్మం –
ఈ నెల 14వ తేదీ న ఆంధ్రభూమి లో పని చేసిన ,సరసభారతి సభలకు ఒకటి రెండు సార్లు వచ్చిన శ్రీమతి స్వాతి ఫోన్ చేసి ,భూమి ఎడిటర్ గా పదేళ్ళు పని చేసి దాని కి వెలుగురేఖలు తీర్చిదిద్దిన సీనియర్ ఎడిటర్ శ్రీ ఎం వి ఆర్ శాస్త్రి గారు రిటైరయ్యాక ,’’ఇదం బ్రాహ్మ౦’’అనే సంస్థను స్థాపించి కృషి చేస్తున్నారనీ ,ఆసంస్థ ఆత్మీయ సమావేశం తెనాలిదగ్గరపెదరావూరు లో 20వ తేదీ ఆదివారం ఉదయం జరుగుతుందని ,నన్నూ,శ్రీ పూర్ణ చ౦ద్ లను అతిధులుగా పిలుస్తున్నా మని తప్పక రమ్మని కోరగా సరే అన్నాను .పెదరావూరు అంటే ఒక సామెత జ్ఞాపకం వచ్చింది .’’ఎవరికైనా డబ్బు అప్పు ఇచ్చి వసూలుకాకపోతే దాన్ని పెదరావూరు ఖాతా ‘’అంటారని బాగా అనుకొనేవారు .ఈనెలలోనే మా అమ్మాయి విజ్జి అమెరికానుంచి ఒక పదిరోజులు ఉండటానికి ఉయ్యూరు వస్తే ,10,11తేదీలు మేమిద్దరం మా అమ్మాయి హైదరాబాద్ వెళ్లి అక్కడ మా అబ్బాయిల్ని మాబావగారిని ,మాఅమ్మాయి పాలిటెక్నిక్ స్నేహితురాళ్ళను చూసి వస్తుంటే మేము వచ్చిన సంగతి ఫోటోలద్వారా తెలుసుకొని మా మేనకోడలు పద్మ భర్త రామకృష్ణ ఫోన్ చేసి 20వ తేదీ తమ ఇంట్లో అభిషేకం వగైరా ఉంటాయనీ ,తప్పక రమ్మని చెబితే ,ఉండటం లేదని చెప్పాం .ఇంటికి రాగానే నాకు ఉయ్యూరు హైస్కూల్ లో సహోద్యోగి లెక్కలమాస్టారు శ్రీ పసుమర్తి ఆన్జనేయశాస్త్రిగారు ఫోన్ చేసి ,20వ తేదీ తమ స్వగ్రామం కృష్ణా జిల్లా కూడేరులోతమ టెంపుల్ కాంప్లెక్స్ లో రుద్రాభిషేకం ,వగైరాలున్నాయని మమ్మల్నందర్నీ రమ్మని ఆహ్వానిస్తే ,పెదరావూరు సంగతి చెప్పి రాలేమన్నాను .మా అమ్మాయి 15 మంగళవారం రాత్రి గన్నవరం నుంచి అమెరికా వెళ్ళింది .శుక్రవారం రాత్రి నాకు ఫేస్ బుక్ లో రావూరు సమావేశం ఆహ్వాన పత్రిక వచ్చింది .అందులో నన్ను ఆత్మీయ అతిధిగా వేశారు .అప్పటిదాకా వెళ్లి అక్కడ భోజనం చేసి రావటమే కదా అనుకొన్నాను .ఈ ‘’మేకు బిగింపు ‘’చూశాక అసలు ఇదం బ్రాహ్మం అనే సంస్థ గురించి నాకేమీ తెలీదని ఎప్పుడూ వినలేదని అనుకోని యుట్యూబ్ లో ఆరాత్రి వెతికా .అందులో సద్గురు శివానందమూర్తి గారి ‘’మాని ఫెస్తేషన్ గురించి ఏమ్విఆర్ శాస్త్రిగారు శ్రీరమణ్ అనే ఆయన డిస్కషన్ చూశా .అందులో ఏమీ సంస్థ గురించి నాకు తెలీలేదు .తర్వాత ఇంకోదానిలో ఒకావిడ కొంచెం లావుగా ఉండీఆవిడ తాను చేసిన కార్యక్రమాలు ఏవో తెలియేసింది. చాలాకాష్టపడుతున్నట్లు అర్ధమయింది .అప్పటికే రాత్రి 11దాటటం తో పడుకొన్నాను .శనివారం ‘’మహాభారత తత్వకథనం ‘’లైవ్ పూర్తి చేశాక, ఉదయం 11కు మళ్ళీ వెతకటం మొదలెడితే కొంత సమాచారం దొరికింది .కొంత నేను రాసిన ‘’దైవ చిత్తం ‘’నుంచి నోట్స్ రాసుకొని మాట్లాడమంటే కనీసం అయిదారు నిమిషాలైనా మాట్లాడటానికి సిద్ధమయ్యా .ఆదివారం ఉదయం 4.30కే లేచి స్నానం సంధ్య పూజ కార్తీక అభిషేకం పూర్తి చేసి 6-30కి సిద్ధంగా ఉన్నా .మా అన్నయ్యగారబ్బాయి రాంబాబు వచ్చాడు .అంతకుముందు మా శ్రీమతి ,మా మూడు ,నాలుగు కోడళ్ళు వస్తామని అన్నవారు ,ఇంతపొద్దున్నే వెళ్లి సాయంత్రందాకా ఉండలేమని రాలేమన్నారు .మేమిద్దరమే కారులో బయల్దేరి 9కి పెదరావూరు ‘’అభయహస్త శ్రీ సుబ్రహ్మణ్యస్వామి దేవాలయం ‘’కు చేరాం శ్రీమతి స్వాతి మాకు స్వాగతం చెప్పింది .ఉయ్యూరునుంచి నేనురాసిన, సరసభారతి ప్రచురించిన ‘’ దైవ చిత్తం ,వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి ‘’పుస్తకాలు 25సెట్లు తీసుకొని వెళ్లాను. ఒక సెట్ స్వాతికి ఇచ్చాను .శాస్త్రిగారువచ్చారు .నన్ను చూడగానే ‘’స్వాతి మిమ్మల్ని గురించి చాలాచేప్పింది సంతోషం ‘’అన్నారు అప్పటికి మేమిద్దరమే వచ్చాము.ఉప్మా టిఫిన్ కాఫీ తాగాం ఇంకెవరూ కనపడలేదు శరవణ దర్శనం ,శంకరాచార్య దర్శనాలు పూర్తి చేశాక శ్రీ పూర్ణ చ౦ద్ దంపతులు ,శ్రీమతి అన్నపూర్ణ కనిపించారు.ఆలయం చక్కని పంటపొలాలమధ్య కంచిపీఠం అధ్వర్యంలో బాగాకట్టారు .స్వామి పళనిలో ఉన్నట్లు ఆకర్షణీయంగా ఉన్నాడు .సమావేశమందిరం ‘’పరమాచార్య వేదిక ‘’గా పేరుపెట్టారు .
ఉదయం 10గంటలకు సమావేశం శ్రీ శాస్త్రిగారి అధ్యక్షత న ప్రారంభమైంది .న్యాయమూర్తి శ్రీ బులుసు శివ శంకరరావు గారు పంచెకట్టు చొక్కా ఉత్తరీయంతో బ్రాహ్మీమూర్తిగా విచ్చేశారు .ఆధ్యాత్మిక వేత్తలు శ్రీ చిలకలపాటి వీరరాఘవాచార్యులు ,శ్రీ చింతపల్లి సుబ్రహ్మణ్య శర్మ ,శ్రీ గోవింద వజ్ఝల కామేశ్వరశర్మ ,శ్రీ మేళ్ళ చెర్వు చంద్రమౌళి శర్మ ,అఖిలభారత బ్రాహ్మణ సమాఖ్య ఉపాధ్యక్షులు శ్రీ ద్రోణం రాజు రవికుమార్ , ట్రాన్స్పోర్ట్ అడిషనల్ కమిషనర్ శ్రీ ఎస్ వి ప్రసాదరావు ,నేనూ శ్రీపూర్ణ చ౦ద్ లతోసభ ప్రారంభమైంది .పూర్ణచంద్ ఆహారం ఆరోగ్యం పై మాట్లాడారు .తర్వాత నన్ను మాట్లాడమంటే ఇదం బ్రాహ్మం గురించి ఏడెనిమిది నిమిషాలు మాట్లాడాను .తర్వాత అందర్నీ మాట్లడించటానికి జస్టిస్ గారు ప్రయత్నించారు. స్పందన తక్కువ .మా రాంబాబు నాలుగు ముక్కలు మాట్లాడాడు .11గం లకు పెదముత్తేవి శ్రీకృష్ణాశ్రమం పీఠాధిపతి శ్రీ ముత్తేవి సీతారాం గురుదేవులు 45నిమిషాలు అనుగ్రహ భాషణం చేశారు .ఆయన ఏమి చెప్పారో ఎవరికీ తెలియలేదు .ఆయన మైక్ ను అందుకోలేకపోయారు అదేకారణం .బెజవాడ నుంచి ఇతర చోట్లనుంచి వేద విద్యార్ధులను తీసుకొని వచ్చి వారిని వస్త్రాలు వగైరా లతో సత్కరించి వేదం పఠనం చేయించారు .తర్వాత వారి గురువుల సమక్షం లో అందరూ వేదికపై ఆహ్వాని౦ప బడి వేదాశీస్సులు పలికారు.గురు సత్కారమూ జరిగింది .ఇంతలో గజల్ శ్రీనివాస్ రాగా ఆయననూ వేదిక ఎక్కించి ఆయన ఇటీవల కూర్చిన గజల్ గానం చేయించారు .మధ్యమధ్యలో ఎవరేవర్నో పిలవటం వారు వచ్చి మాట్లాడటం జరిగింది .పాపం శాస్త్రి గారి చేతిలోనుంచి సభానిర్వహణ జారిపోయింది .అన్యాయ౦ పై నిప్పులుకక్కే శాస్త్రిగారు నిరుత్తరులయ్యారు .ఒకరకంగా వేదిక కబ్జా అయింది .మళ్ళీ శాస్త్రిగార్ని వేదికపై పిలిచి అతిధులకు ఆయనతోశాలువా ఉత్తరీయం జ్ఞాపిక లతో సన్మానం చేయించారు .అంతా అయ్యేసరికి ఒంటిగంట దాటింది .ఈలోగా ఫుడ్ కోర్ట్ తెరిచారు .మొదట్లో సభలో పల్చగా ఉన్నజనం భోజన సమయానికి నిండిపోయారు .రెండవ బాచ్ లో మాకు భోజనాలు పెట్టారు వేదం విద్యార్ధులకు గురువులకు లోపల విడిగా భోజనాలు ఏర్పాటు చేశారు .టమేటా పప్పు నేను కాశీలో వదిలేసిన దొండకాయకూర ,క౦దా బచ్చలికూర, గుంటూరు గోంగూరపచ్చడి,నేతి బీరకాయ పచ్చడి నాకిష్టమైన మైసూర్ పాక్ ,పులిహోర ,పులుసు సంగం గడ్డ పెరుగు ,స్వామి ప్రసాదంగా మైసూర్ పాక్ లతో విందు .పెద్దగా రుచికరంగా ఏవీ లేవనిపించాయి నా మైసూర్ పాక్ నాకు మూడు సార్లు దక్కింది .నేను తెచ్చిన పుస్తకాలు శాస్త్రిగారికీ ,జస్టిస్ గారికి ,మిగిలిన పెద్దలందరికీ ఇచ్చేసి సంతృప్తి చెందాను .భోజనానికి ముందు స్వాతి నా దగ్గరకు వచ్చి ‘’ఎలాసంస్థను నడపాలి ‘’అనేది చర్చిద్దామనుకొన్న ఈ సమావేశం వనభోజనాలతో సరిపోయింది .ఆశయం నెరవేరలేదు మాస్టారు ‘’అని బాధ పడింది .నేను ఫీల్ అయిందే ఆవిడా చెప్పింది .సభానిర్వహణకు భోజనాలకు స్థానికి స్త్రీలు పురుషులు గొప్పగా సహకరించారు అందరూ అభినందనీయులే .నాకు ఈకార్యక్రమం లో పాల్గొనటానికి అవకాశమిచ్చినశ్రీమతి స్వాతి, శ్రీ శాస్త్రి గార్లకు ధన్యవాదాలు .
మధ్యాహ్నం రెండున్నరకు అందరికీ వీడ్కోలు చెప్పి ,మేము బయల్దేరి అమృతలూరు అని అందరూ పిలిచే’’ అమర్తలూరు’’ కు వెళ్లి ,మా అమ్మాయి కి గుంటూరు పాలిటెక్నిక్ లో క్లాస్ మేట్ అయియన్ శ్రీమతి శుభాషిణి ఇంటికి వెళ్లాం .ఆమె, కొడుకుతో 14వ తేదీఉదయ౦ మా అమ్మాయిని చూడటానికి ఉయ్యూరు వచ్చింది .అందుకే ఇంతదూరం వచ్చి ఆమెను చూడకుండా వెళ్ళటానికి మనసొప్పక వెళ్లాం .ఆమె సుగంధిపాల అందరికీ ఇచ్చి ఒక బాటిల్ మా శ్రీమతికి ఇవ్వటమేకాక తమ పొలం లో పండిన పెసలు నాలుగుగైదు సేర్లు మూటకట్టి ఇచ్చింది . అక్కడి పల్లె రోడ్లన్నీ చాలా దారుణంగా ఉన్నాయి .అక్కడ ఎవర్ని కదిలించినా గతమూడేళ్ళుగా గంపెడు మట్టి కూడా వేయలేదని ఆవేదనతో చెప్పారు .నాకు ఒక కుళ్ళు జోకు మనస్సులో మెదిలింది –‘’ఆడవాళ్ళకు ఈజీ డెలివరి రోడ్లు ‘’అనచ్చు నెమో శాంతం పాపం .మంచిరోజులెప్పుడు వస్తాయో అని ఎదురు చూడటమే మిగిలి౦ది అందరికీ .అక్కడి నుంచి తాడేపల్లి వెళ్లి మా శిష్యుడు రెండేళ్ళ క్రితం అకస్మాత్తుగా మరణించిన కాళీప్రసాద్ ఇంటికి వెళ్లి భార్యను ,ఇద్దరబ్బాయిలను పలకరించి ,ఉయ్యూరుకు సాయంత్రం 6-15కు చేరి 6-30కి ‘’మత్యపురాణ౦ ‘’లైవ్ చేశాను .ఈలోపు ఎప్పటిఫోటోలు అప్పుడే వాట్సాప్ లో తోసేశాను .ఇప్పుడు నేను సభలో మాట్లాడాలనుకొన్న విషయాలు మీకోసం అందిస్తున్నాను .
‘’అగ్రతః చతురో వేదః –పృష్టతః సశరం ధనుః-ఇదం బ్రాహ్మం ఇదం క్షాత్రం –శాపాదపి శరాదపి ‘’అనేది అసలు శ్లోకం .ఇది భాసనాటకం లో పరశురాముని వాక్యం .అందుకే బ్రాహ్మణులకు పరశురాముడే ఆదర్శం .బ్రాహ్మీ మూర్తి అవసరమైనప్పుడు ధర్మహాని జరిగినప్పుడు క్షాత్ర శీలం చూపించాలి అని భావం . బ్రాహ్మీ శక్తి ,క్షాత్ర శక్తి అనే రెండు శక్తులున్నాయి .ఈరెండు ఆత్మకు అన్న౦అ వుతున్నాయి .అంటే ఈరెండిటిని ఆత్మ తినేస్తుంది .ఏది చేయాలో చెప్పేది బ్రాహ్మీ శక్తి .దాన్ని విధాయక శక్తి అంటారు .దీనివలన స్థిత ప్రజ్ఞత కలుగుతుంది .అ౦ టేధర్మాన్ని అనుసరించి మోక్షం పొందటం .శరీర బలంతో వ్యావహారిక శక్తితో ,అర్ధకామ బలం తో పురుషార్ధాలను ధర్మ బద్ధంగా ,పాలనా బలం తో చేయటం క్షాత్ర తేజం .దీన్ని దారకం అంటారు .దీని వలన సంక్షోభ సమయం లో పోరాట పటిమ పెరుగుతుంది. అన్యాయాన్ని ఎదిరిస్తాడు .ఈ రెండూ కలిసి పని చేస్తే సాధించ లేనిది ఉండదు .
మత్స్య పురాణం లోయయాతి కథ నీతి దాయకం . నహుషుడి కొడుకు యయాతి తన రాజ్యాన్ని కొడుకు ‘’పూరుడు ‘’కు ఇచ్చేసి ,వానప్రస్థాశ్రమం లో ధర్మాలు పాటిస్తూ స్వర్గం చేరాడు .కొంతకాలం తర్వాత ఇంద్రుడు కిందికి తోసేశాడు .భూమి మీదపడకుండా అంతరిక్షంలో ఉండిపోయాడు .అక్కడ వసుమంతుడు ,అనేరాజు ,అష్టకుడు ,ప్రతర్దనుడు ,శిబి కనిపిస్తారు .కొంతకాలం వారితో గడిపి మళ్ళీ స్వర్గం చేరాడు యయాతి .ఎందుకు ఇలా జరిగింది అని శతానీకుడు అడిగితె శౌనకుడు ‘’ఒకరోజు ఇంద్రుడు ‘’నీ కొడుక్కి రాజ్యం అప్పగించి నీ ముసలితనం తీసుకోమన్నప్పుడు ఏమి చెప్పావు అనిఅడిగితే యయాతి ‘’కోపం పనికిరాదు ,ఇతరుల్ని బాధపెట్ట రాదు.మైత్రి, దానం ,మధురభాషణం లకు మించిన ఉత్తమ గుణం లేదు .పూజ్యులను పూజించాలి ‘’అని చెప్పాను అన్నాడు .ఇంద్రుడు ‘’నువ్వు గొప్ప తపస్సంపన్నుడవు కదా .నీతో సమానులు ఎవరు ‘’అని అడిగితె యయాతి ‘’నాతోసమాన తపస్సు చేసినవాడు ఎవడూ లేడు ‘’ అన్నాడు .ఇంద్రుడికికోపం వచ్చి ‘’తరతమ భేదం ఎంచకుండా మాట్లాడావు కనుక స్వర్గలోక౦ లో ఉండతగవు ‘’అని తోసేస్తే ‘’అయితే నన్ను సత్పురుషులమధ్య పడెయ్యి చాలు ‘’అనగా అలానే చేశాడు .అష్టకాదులను కలిసినప్పుడు వాళ్ళు అడిగిన అనేక ధార్మిక విషయాలు వివరించి చెప్పాడు యయాతి .అందులో –విద్య తపస్సు పుట్టుక చేత ద్విజుడు వృద్ధుడు అవుతాడు అని చెప్పాడు. అష్టక వసుమంతశిబి లు తమ పుణ్య గతులు ఇస్తాం నువ్వు క్షేత్రజ్నుడివి స్వర్గం చేరమన్నారు .వద్దన్నాడు. అందరి పుణ్యం కలిపి ఇస్తామన్నా వద్దన్నాడు ‘’నేను సత్యవ్రతిని ధర్మావలంబిని .భూ మండలం అంతాజయించి ,బ్రాహ్మణులకు దానం చేశాను. నేను స్వయంగా సాధించిన పుణ్యం తోనే మళ్ళీ స్వర్గం చేరతాను .మీ పుణ్య ఫలాలు నాకు వద్దు ఇచ్చేవాడినేకాని తీసుకొనే వాడిని కాదు ‘’అన్నాడు .ఉత్తములైన పై వారి మధ్య ఉండటం చేత పుణ్యం కలిగి వాళ్లకు తాను మాతామహుడను అని తెలియ జేసి యయాతి మళ్ళీ స్వర్గం చేరాడు .ఇందులో మన౦ నేర్వాల్సిన విషయాలెన్నో ఉన్నాయి .అవి తెలుసుకొంటే చాలు మనకూ ఉత్తమ గతులు లభిస్తాయి .
మన పురాణాలను శాస్త్రీయంగా విశ్లేషించి ఇవాల్టి వారికి అందించాలి .అప్పుడే వాటిపై గౌరవం పెరుగుతంది .హైదరాబాద్ కు చెందిన శ్రీ ఎసిసి శాస్త్రి గారు ‘’దిమైండ్ ఆఫ్ గాడ్ ‘’అనే ఇంగ్లీష్ పుస్తకం ప్రఖ్యాత భౌతిక ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ రాసిన ‘’బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం’’ఆధారంగా ఆయన అభిప్రాయాలను మన పురాణాలతో అంతకు ముందే చెప్పబడిన విషయాలను విశ్లేషిస్తూ రాస్తే ,దాన్ని నేను ‘’దైవ చిత్తం ‘’గా అనువదించి సరసభారతి తరఫున ప్రచురించాను .అందులోని విషయాలు అందరూ తెలుసుకొని మన పురాణ,ఉపనిషత్తుల వైశిష్ట్యాలను అర్ధంచేసుకోవాలి .అందులో ముఖ్యవిషయాలు మాత్రమె మీ ముందు ఉంచుతున్నాను .
వ్యక్తీ చిత్తాన్ని ,దైవ చిత్తాన్ని తులనాత్మకంగా పరిశీలిస్తే ,నిర్జీవ శక్తి అంటే మాటర్,సజీవ శక్తి అంటే లైఫ్ ,.ఈ రెండిటి సామర్ధ్యతతో శిలాపదార్ధం రాక్ అంటే నిగూఢ శక్తి ఏర్పడింది .దీన్ని శాస్త్రవేత్తలు అరవిందుడు ఆవిష్కరించారు .రెండు వేల ఏళ్ళ క్రితమే ఆది శంకరులు ‘’శివ శ్శక్త్యాయుక్తో యది భవతి శక్తిః ప్రభవితం ‘’అని చెప్పారు .
విష్ణుమూర్తి మొదటి అవతారం మత్శ్యావతారం . చేపను ‘’ధీ ‘’అంటారు అంటే బుద్ధి .వివేకానికి ప్రతీక .సృష్టికర్తకు శత్రువు సోమకాసురుడు. వేదాలను అపహరించి ధ్వంసం చేయబోతే వాడిని చంపి వేదోద్ధరణ చేశాడు .అంటే బుద్ధి ,వివేకం నశించకుండా కాపాడాడు అన్నమాట .రెండవది కూర్మావతారం .ఇది ప్రతీకాత్మకం గా అంతరిక్ష కథ.ఇందులో సృష్టి పరిణామ సంఘటన ఉంది .పాలసముద్రం అంటే మిల్కీ వె .వాసుకి సర్పం గమనానికి సహకరించే దీర్ఘ వృత్తం అంటే ఎలిప్టికల్ ఆర్బిట్ .మంధర పర్వతం అయస్కాంత ధృవం.మధనానికి సహకరించేది మిల్కీ వె సెంటర్ .మధనం లో వచ్చిన గరళం ఓజోన్.తర్వాత వచ్చింది అమృతం అంటే ఆక్సిజన్ ,నీరు .
టైం,స్పేస్ లు సరళ రేఖా మర్గాలుకావు .చక్రీయాలు అంటే సైక్లిక్ .అదే అది కూర్మం వీపు .ఒకప్పుడు ప్రఖ్యాత సైంటిస్ట్, తత్వ వేత్త బెర్ట్రాండ్ రసెల్ ఒక చోట ఉపన్యాసం ఇస్తూ భూమి సూర్యుడి చుట్టూ ఎలా తిరుగుతుందో ,ఎలా సూర్యుడు అనేక నక్షత్ర సముదాయాలతో ఉన్న మన గెలాక్సీ కేంద్రం చుట్టూ తిరుగుతాడోవివరిస్తుంటే ఒక ముసలావిడ ‘’నువ్వు చెప్పింది అంతా చెత్తగా ఉంది .ప్రపంచం నిజంగా సమతలం గా ఉంది.ఒక బలమైన తాబేలు వీపు మీద ఆధార పడి ఉంది ‘’అన్నది ఆశ్చర్యపోయి రసెల్ ‘’ఆతాబేలు దేని మీద ఆధార పడి ఉండమ్మా ‘’అని అడిగితె ‘’నువ్వు తెలివైన వాడివే .అదెప్పుడూ కిందనే ఉంటుంది ‘’అని చిరునవ్వుతో సమాధానం చెప్పింది .దిమ్మతిరిగి బొమ్మకనిపించింది సైంటిస్ట్ కు .ఇది జరిగిందియూరప్ దేశం లో .మన ఆది కూర్మ విషయం ఆమెకెలాగ తెలిసిందో అని అ౦దరూ ఆశ్చర్యపోయారట .
స్పేస్ ,టైం ల కర్వ్ చాలాపెద్దది అనంతం .అప్పుడు సరళ రేఖలా కనిపిస్తుంది .అంటే లీనియర్ గా .పాలసముద్రం మన విశ్వమే .పాలపుంత నక్షత్రసముదాయానికి చిహ్నం .శేషుడు కాలానికి ప్రతీక .శేషం అంటే మిగిలి ఉండేది .సృష్టి లయం అయితే మిగిలి ఉండేది కాలమే .మనం ఒక గెలాక్సీ లో ఉన్నాం.అది ఒక లక్ష కాంతి సంవత్సరాల దూరం లో ఉండి,నెమ్మదిగా భ్రమిస్తోంది .స్పైరల్ బాహువులలోని నక్షత్రాలు కేంద్రం చుట్టూ అనేక వందల మిలియన్ల కాలం లో ఒకే ఒక చుట్టూ తిరుగుతాయి అని స్టీఫెన్ హాకింగ్ చెప్పాడు .ఈ స్థిర నక్షత్రాన్నే మన వాళ్ళు ధ్రువ నక్షత్రమన్నారు కొత్తగా పెళ్ళైన దంపతులకు శాశ్వతంగా శృంగార బాంధవ్యం ఉండాలని ఆ ధ్రువ నక్షత్రాన్ని అర్థిస్తారు .
ఈ విశ్వానికి పదార్ధం ఎక్కడి నుంచి వచ్చింది ?అని హాకింగ్ సైంటిస్ట్ బుర్ర బద్దలు కొట్టుకొన్నా సమాధానం పొందలేక పోయాడు .దీనికి మన ఉపనిషత్తులు సమాధానం చెప్పాయి భేషుగ్గా .విశ్వానికి ఆధారం ఆత్మ.,వనరు అంటే సోర్స్ ,రూపకర్తా అంటే డిజైనర్ కూడా . దీన్ని ఉపాదాన కారణం అన్నారు .స్టీఫెన్ హాకింగ్ సృష్టికి సంబంధించిన అన్ని సిద్ధాంతాలు పరిశీలించాడు ‘’మైండ్ ఆఫ్ గాడ్ ‘’ను తెలుసుకొనే ఆఖరి ప్రయత్నం చేశాడు .మన అద్వైతం ఎప్పుడో సమాధానం చెప్పింది సృష్టికి కారణం ఆత్మ.ఆత్మ సృష్టించటం లేదు అది అలాగే ఉంది –‘’ఇట్ఈజ్ జస్ట్ ఈజ్ ‘’సృష్టికి ఆద్యంతాలు లేవు. దేవుడు ఈ విశ్వ రూపం లో కనిపించటమే దైవ చిత్తం అంటే దిమైండ్ ఆఫ్ గాడ్ .
ఇలాంటి విషయాలు ఆధునికకాలం లో యువతకు నేర్పాలి .అప్పుడే వాళ్లకు మన సంస్కృతీ సంప్రదాయాలపట్ల గౌరవ మర్యాదలుకలుగుతాయి .పరిరక్షించటానికి నడుం కడతారు .
ఎమ్వీ ఆర్ శాస్త్రి గారు తలపెట్టిన ‘’ఇదం బ్రాహ్మం ‘’పూర్తి జవసత్వాలతో దేహమంతటా శాఖలతో ఉత్సాహవంతులైన కార్యకర్తలతో పరిపుష్టమై, ఆయనకు వెన్ను దన్నుగా నిలిచి అభీష్టసిద్ధి కలిగించాలని ఆశిస్తున్నాను .భగవంతుని ప్రార్ధిస్తున్నాను .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-11-22-ఉయ్యూరు
బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం31వభాగం.21.11.22
Video link
మత్స్య పురాణం.7 వ భాగం.20.11.22\
Video link
మత్స్య పురాణం.6.,వభాగం.19.11.22
Video link
శ్రీ మత్పుష్పగిరి చంద్రమౌళీశ్వర శతకం
శ్రీ మత్పుష్పగిరి చంద్ర మౌళీశ్వర శతకాన్ని కావ్య విశారద శ్రీ శంకరమంచి రామ కృష్ణ శర్మ రచించి,బ్రహ్మశ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రిగారికి చూపించి పరిష్కరి౦ప జేసి ,రెంటపాళ్ళ అగ్రహారం లో మకాం చేసి ఉన్న పుష్పగిరి పీఠాధిపతులకు చూపించి వారి అనుగ్రహం పొంది ,ముద్రణకు ద్రవ్యమిచ్ఛి ప్రోత్సహించగా ,ముద్రించి .శ్రీ పుష్పగిరి పీఠాదిపతులు జగద్గురు శంకరాచార్య స్వామి వారికి అంకితమిచ్చారు –‘’శ్రీ పుష్పగిరి పీఠస్థః శంకరాచార్య వేష ధృత్ – శ్రీకరశ్చంద్ర మౌళీశో-జీయాదాచంద్ర తారార్కం ‘’అని శుభం పలికారు .శార్దూల ,మత్తేభ పద్యాల శతకం ఇది .’’చంద్ర మౌళీశ్వరా ‘’అనేది మకుటం .1939 కృష్ణపక్ష తదియనాడు శతకం పూర్తి చేశారు కవి .కవి ఆపస్తంభ సూత్రుడు .ఆత్రేయస గోత్రీకుడు .నర్సరాట్పురం నివాసి .కావ్య రసజ్ఞుడు .వెల ఇవ్వలేదు .
మొదటి శార్దూలం లో –‘’శ్రీ రాజిల్ల సమస్త చేతనలకున్ స్వీయ ప్రసన్నావనో -దారత్వమెరింగి౦చు టే విమల తత్వార్ధంబు బోధించు నా –చారంబంచు దలంచి పుష్పగిరి వాసబుండివెల్గొందునోం-కారాకార ,నమస్కరించెద శుభాంగా ‘’చంద్ర మౌళీశ్వరా ‘’ అని చెప్పి ,సద్భక్తితోరాశానని ,సాహిత్యం సున్నా ,వృద్ధజన సాంగత్యం పూజ్యం ,ధన సంపత్తి హుళక్కి ,తెల్వినహి ,శ్రద్ధాభక్తి శూన్యం ,ఉక్తి నియుక్తులు ‘’బండిగల్లు ‘’అయినా కీర్తిస్తున్నా ఆదరించు అని లౌక్యంగా చెప్పారు’’కావ్య విశారదులు .’’తనకావ్యకుమారి మోహం కలిగించే సుందరికాదు నూతన చమత్కారాలు చూపే నేర్పరీకాదుఅయినా ఎలాస్వీకరిస్తానని సందేహించక నన్ను కృతార్ధుని చేసి కన్యాదానఫలితం ఇమ్మన్నారు .ఒకావిడ నెత్తికెక్కి కూర్చుంది ఇ౦కొఆవిడ అర్ధ శరీరం ఆక్రమించింది ,మీఅమ్మాయికి ఇక నేను ఏమివ్వగలను అని అనుకోవద్దు .మాఅమ్మాయి వృధాకోరికలు కోరని కన్య అన్నారు ..’’బోళాశంకరుడ వంచు భక్తతతి సంబోధించుతాన్ జేసి ‘’నా మేలు నువ్వే చూస్తావనే ధైర్యంతో ఉన్నాను .
ధనగర్వంతో విర్రవీగే వారు నీపై దృష్టిపెట్టరు సంపదతో ఉబ్బి తబ్బిబ్బౌతారు .అలాంటి వారి తలపై తన్ని బుద్ధి చెప్పేవాడివి నువ్వే .’’ఆరాధ్యుడవు ,పుణ్య శీలుడవు ,నిత్యానంద నిష్కామ ,నిర్వైరాయత్తుడవు ,ఆదిమూర్తివి .’’గిరికన్యా హృదయాబ్జ రంజనం,సాక్షీభూత నిర్మోహ సుందరమైన రూపం నీది .జగత్స౦జీ వనౌషధమ్ ‘’నీ పంచాక్షరి ‘’.వైరం ఎందుకు అన్నా,హెచ్చుఫలముల్ వంచించను అన్నా ,నేరాలు భరించమన్నా ,ఎప్పుడూ నీవాడినే అన్నా,సత్యార్యం చూపమన్నా ,హితం చేకూర్చమన్నా ,ఆధారం నువ్వే అన్నా .’’నేర్పరివై సర్వము నామ భేదాలుఅదర్పం జూచే వాడవు మామ దక్షుడి యాగం ఆగం చేసి బుద్ది చెప్పావ్ . భూమికి ‘’ప్రాజ్ఞుడు మూలం అసలైన మూర్తి నీవే .’’శివ శంభో గిరిజాపతీ శుభద,దాక్షిణ్యైక భావాన్వితా ,భవ ,గంగాధరా ,శూలపాణి హర సౌభాగ్యప్రదా హర ధవళా౦గా ‘’అంటూహర నామాలన్నీ చెప్పారుపద్యంలో .
పార్ధునిపై శశాంశాకు నిపై ,భళ్లాణుపై ,సిరియాలునిపై ఉషాజనకునిపై శ్రీ గౌరిపై గంగపై పరమానందం,ఆదరం చూపించావు ..’’నేను నీమొర ఆలించను ‘’అంటావేమో .నీగుట్టు మట్టులన్నీ నాకు తెలుసు .బి౦కాలుపోకు .కాలుస్తావా సై.లేక నేనే నిన్ను గెలుస్తానో కాచుకో అన్న భక్తశిఖామణి కవి .ఆతర్వాత శివ భక్తిమహాత్మ్య కథలన్నీ వరసబెట్టి చెప్పారు .తన మొరను అరణ్య రోదనం చేయద్దని వేడుకొన్నారు .నీ వాహనం ఎద్దు మీ ఆవిడ వాహనం వ్యాఘ్రం .వీటిమధ్య ఉన్న క్రూరత్వాన్ని బాపటానికే సమయం చాలదంటావా ,లేక నన్ను మర్చేపోయావా .?ఘోరపాతకాలలో కూరుకుపోయి నేను నిన్ను ‘’శివ శంభో గిరిజాపతీ హర శ్రీ పుష్పశైలేశ్వరా ,భవ బంధా ‘’అని పిలుస్తూనే ఉంటా .అన్నారు ఈపద్యం భీమఖండంలో శ్రీనాథుని ‘’శంభున్ శివుణ్ శ్రీ కంఠు నిన్ ‘’అనే పద్యాన్ని స్ఫురింపజేస్తుంది .తన్మయభక్తికి గొప్ప ఉదాహరణ ,నరకం అనేది ఉందని ఇప్పుడే తెలిసి జ౦కు తున్నాను .చేసినపాపాల చిట్టా విప్పుతున్నాను –నీ పాదద్వయమే నాకుఏడుగడ రక్షా .
బాల్య యవ్వన కౌమార వార్ధక్యాలు మాయ చుట్టాలు .అవి పట్టుకొంటే నీ ధ్యానం చేయటం ఎవరి తరమూకాదు .’’నిను బూజి౦ప గా ,నిన్ను జూడగను ,నీ నిత్యప్రభావంబు వర్ణన చేయగను కేశవాదులకైనా అసాధ్యం ‘’నాకు అనువౌనే కుజనుడను ఘోర దురితాహ౦కారుడిని .కాదనకయ్యా గిరీశా .నన్ను భరించటం నీకు తప్పదు.ఎందుకు ?నేను నీవాడిని కనుక .నాకవితా కుమారిని నీ చేతిలో పెడుతున్నా .ఇవ్వటానికి చేతిలో కానీ లేదు .రాద్ధాంతం చేయకుండా ‘’వేయార్లట్టుల’’ ఎంచి ,తృప్తి చెంది ఆదరించు అని కన్యాశుల్కం లో రామప్పపంతులు లౌక్యం చూపారు కవి .నీ చేతిలో ఉంచా .అంటూ అగ్నిహోత్రావధాన్లు ‘’తామ్బూలాలిచ్చా తన్నుకు చావండి ‘’అన్నట్లుగా భారమంతా అల్లుడు చంద్రమౌళి పైనే పెట్టారు మామ కవీశ్వరుడు భక్తిగా .చివరి రెండుపద్యాలో భావం ముందే చెప్పేశాను .ఖచ్చితంగా 100పద్యాల శతకం ఇది .
భక్తీ ఆర్తి శరణాగతి ,లౌక్యం లోకజ్ఞత ,కథా సంవిధానం ,పుష్కలంగా ఉన్న శతకం శైలి ద్రాక్షాపాకం .కవితాప్రవాహం పుష్పగిరి ప్రక్కన ప్రవహించే పెన్నా నదీ ప్రవాహమే .పుష్ప గిరిలోని పుష్ప సౌందర్యం ,మాధుర్యం ,పరిమళం ప్రతిపద్యం లోనూ దర్శన మిస్తుంది .ఈ శతకం ,ఈకవి గురించి మనవారికెవరికీ పట్టినట్లు లేదు .నాకు ఈకవిగారినీ శతకాన్నీ పరిచయం చేసే మహద్భాగ్యం ఆ చంద్ర మౌళీశ్వరుని కృపాకటాక్షం వలన లభించింది .2019లో ఒంటిమిట్ట తోపాటు పుష్పగిరి సందర్శనం మాకు లభించింది .అదిఇలా సార్ధకమయింది . శ్రీ చంద్ర మౌళీశ్వర లింగం ఆదిశంకరాచార్య ప్రతిష్టితం .విద్యారణ్యస్వామి శ్రీ చక్రం ప్రతిష్టించారు .శివ ,కేశవ ఆలయాలు ఇక్కడ ఉండటం మరో విశేషం .దక్షిణ కాశిగా ,రెండవ హంపిగా భావిస్తారు శైవులు మధ్య కైలాసంగా వైష్ణవులు మధ్య అహోబిలం గా పిలుస్తారు .గ్రామానికీ ,క్షేత్రానికి మధ్య పెన్నానది ఉంది .దీనిలో పాపాఘ్ని కుముద్వతి,వల్కల ,మాండవి నదులు కలుస్తాయి .ఆంద్ర దేశం లో ఉన్న ఏకైక శంకరాచార్య పీఠం పుష్పగిరిలో నే ఉంది .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-11-22-ఉయ్యూరు
బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం .30వ భాగం.19.11.22
Video link
మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -354
· 354-రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ అధినేత ,విశ్వరూపం సినీ నిర్మాత ,కమల్ హాసన్ సోదరుడు చారు హాసన్
· చంద్రహాసన్ రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ అధినేత, సినిమా నిర్మాత. ఆయన ప్రముఖ భారతీయ సినిమా నటులైన కమల్ హాసన్, చారుహాసన్ ల సోదరుడు.[1]
జీవిత విశేషాలు
ఆయన వృత్తి రీత్యా న్యాయవాది. ఆయన కమల్ హాసన్ నిర్మించిన ‘అపూర్వ సహోదరులు’, ‘హేరామ్’, ‘విరుమాండి’, ‘ముంబై ఎక్స్‌ప్రెస్’, ‘ఉన్నైపోల్ ఒరువన్’ చిత్రాలకు సహనిర్మాతగా వ్యవహరించారు. చంద్రహాసన్ ప్రస్తుతం కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ ‘రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్’కి అధినేతగా వ్యవహరిస్తున్నారు. తన ఇద్దరు సోదరులు సినిమాల్లో నటించినప్పటికీ ఆయన మాత్రం తెర వెనుక ఉండి పనిచేయడానికి ఇష్టపడ్డారు. ఆయన కుమార్తె అను హాసన్ ఇందిర, రన్, ఆల్వంధన్ తదితర సినిమాల్లో నటించారు. ఇప్పుడు కూడా ‘ఈజ్ దిస్ నౌ’ అనే ఇంగ్లీష్ సినిమాలో చేస్తున్నారు. ‘విశ్వరూపం’ సినిమా విడుదల విషయంలో ఆటంకాలు వచ్చినప్పుడు చంద్రహాసన్ తన వెంటే ఉండి ధైర్యం చెప్పారని ఆయనే తన బలమని కమల్‌హాసన్ ఇదివరకు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. చంద్రహాసన్ ‘విరుమంది’, ‘విశ్వరూపం’, ‘థూంగవనమ్’ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.[2]
అస్తమయ౦]
ఆయన లండన్‌లో ఉన్న తన కుమార్తె అనుహాసన్ వద్ద మార్చి 18 2017 న గుండెపోటుతో మరణించారు.[3] ఆయన భార్య గీతామణి (73) జనవరి 7 2017న మరణించారు.[4]
355-కేరక్టర్ నటుడు నిర్మాత –చలపతిరావు
చలపతిరావు అలియాస్ తమ్మారెడ్డి చలపతిరావు సుప్రసిద్ద తెలుగు సినీ నటుడు. ఇతను పన్నెండు వందల పైగా సినిమాల్లో పలు రకాలైన పాత్రల్లో నటించాడు. ఆయన స్వస్థలం కృష్ణాజిల్లా పామర్రు మండలంలోని బల్లిపర్రు. నాన్న పేరు మణియ్య. అమ్మ వియ్యమ్మది పక్కనే ఉన్న మామిళ్ళపల్లి .
వ్యక్తిగత వివరాలు
ఆయనకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. ఆడపిల్లలు అమెరికాలో ఉంటారు. వాళ్లు ఇండియా వచ్చినప్పుడు పిల్లలందరితో కలిసి బల్లిపర్రు వెళుతుంటారు. అక్కడ ఉన్న వారికి స్వంత ఇల్లు, రెండెకరాలు పొలం ఉంది.
నటుడుగా
వగైరా 1200సినిమాలు
నిర్మాతగా
[17]
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -19-11-22-ఉయ్యూరు
మత్స్య పురాణం.5వ భాగం.18.11.22
Video link
శ్రీ విశ్వేశ్వర శతకం
కవికోకిల విద్వాన్ శ్రీ వేమూరి వెంకటరామయ్య శర్మ రచించిన శ్రీ విశ్వేశ్వరశతకం కు పరిష్కర్త శతావధాని శ్రీ కాటూరి వెంకటేశ్వరావు గారు .దీనికి తొలిపలుకులు కైకలూరు స్థానికోన్నత పాఠశాల ప్రధాన ఆంధ్రా ధ్యాపకులు విద్వాన్ నందుల సుబ్బరాయ శర్మగారు రాశారు. అందులో –కృష్ణా ,ఉభయగోదావరి గుంటూరు నెల్లూరు మండల భక్తి ప్రచారకులు ,అభినవ ప్రహ్లాద ,భాగవతకులా౦కార ,,పరమ భాగావతాగ్రగణ్య ,భక్త కులశేఖర ,భక్తిమూర్తి ,భక్త్యుపన్యాస కేసరి మున్నగు బిరుదాంకితులు ,మధుర వాగ్విశారదులు బ్రహ్మశ్రీ ములుకుట్ల లక్ష్మీ నారాయణ శాస్త్రి గారు శ్రీ సనాతన భాగవత భక్తసమాజ స్థాపకులు .విష్ణు భక్తులే అయినా ఆయనకు శివ కేశవులు సమానులు .శ్రీరాముడు రామేశ్వరంలో శివ లింగ ప్రతిష్ట చేసినట్లు ,శాస్త్రిగారు శివ ప్రతిష్ట చేయాలను కోగానే తక్షణమే సాఫల్యం జరిగి ,సత్తెనపల్లి తాలూకా నుదురుబాడు నివాసిశ్రీపానకాలు రెడ్డి మహాశయులు ,భారమంతా పైన వేసుకొని ఆలయ నిర్మాణం చేశారు .వారణాసి నుంచి శ్రీ విశ్వేశ్వరుడు పలనాటికి విచ్చేసే సందర్భం లో ,మా శిష్యుడు కవికోకిల ఈ శతకం రాసి కృతి సమర్పణం చేయటం చరితార్ధకమైంది .మా శిష్యుని శ్రీ విశ్వేశ్వర శతకం దూర్జటి మహాకవి శ్రీకాళహస్తీశ్వర శతకానికి తుల్యం అని నా భావన .’’అన్నారు .శతకం బందరు మినర్వా ప్రెస్ లో ముద్రితం .సంవత్సరం ,వెల తెలుపలేదు .’’లక్ష్మీ నారాయణ శాస్త్రి హృత్కమల కాశీ వాస విశ్వేశ్వరా ‘’అనేది శతకం మకుటం .శార్దూల పద్య శతకం .
మొదటిపద్యం –‘’శ్రీ నారాయణ నామ చింతన సుధా సేవారతిం దన్మయుం- డై నారాయణి కా విశేష రుచులింపై తోప ,ఝ౦కార ని-స్వానంబు బొనరించు ,శ్వేత మధుపస్వామి న్నినుం గొల్తు ల –క్ష్మీ నారాయణ శాస్త్రి హృత్కమల కాశీ వాస విశ్వేశ్వరా ‘’అని నివేదించి మనసులో శతకం రాయాలనుకోగానే శతశార్దూలాలు మదిలో మెలిగాయని ,ఆయన కటాక్ష శ్రీ ఎక్కడ వాలుతుందో తెలీదని ,లక్ష్మీ నారాయణ శాస్త్రిగారి మనోవా౦ఛితం నెరవేరి ఈ ఆలయంలో ప్రవేశించావనీ ,శివభక్తుల చరిత్రతోపాటు లీలలూ ఇందులో వర్ణిస్తాననీ చెప్పుకొన్నారుకవి .
‘’దీను౦ డైపోలలేమి బోయ శివరాత్రి న్ శ్రీ ఫలంబెక్కి తా-నే ణమ్మున్ గురిసేయ దిత్తియుదకంబింతింత నీపైబడన్-వానినిన్ముక్తుని జేయ నర్బుద గిరిన్ వ్యాథేశ్వర స్వామి ‘’గా వెలిశావు అన్నారు పాతకథ చెప్పి .సానిని సంతృప్తిచేసి మోక్షమిచ్చావు .తారకాసుర సంహారంకోసం దేవతలు ప్రార్ధిస్తే పార్వతిని చేబట్టి కుమారస్వామికి జన్మనిచ్చి సంహరి౦ప జేశావు .’’నీకల్యాణ సమయం లో ముల్లోకాలజనం రాగా భూమి కుంగితే ,’’దయా దీనత్వమునన్ కు౦భజు బనిచి ,యార్తిన్ ద్రోయగా లేదా ‘’అన్నారు .మూడోకన్ను మంటతో మన్మధ సంహారం చేసి ఆతని భార్య వేడుకొనగా పతిని దానంగా సమర్పించిన కరుణా సముద్రుడివి .శిష్యుడైన వి౦ధ్యపర్వతాన్ని తాను దక్షిణ దేశం నుంచి తిరిగివచ్చేదాకా అలాగే వంగి ఉండమన్న అగస్త్యుడుభక్తితో నిన్ను సేవించి తరించాడు .అలాగే వాతాపి ఇల్వల సంహారం నీదయతో అగస్త్యర్షి చేయగలిగాడు .మామగారు దక్షుడు శపిస్తే’’ ఏణా౦కు ని ‘’తలమీద దాల్చి గౌరవం కలిగించావు .
క్షీరసాగర మధనంలో విషం పుడితే సంకోచించకుండా తాగి లోకరక్షణ చేశావ్ .దేవతలు ప్రార్ధిస్తే ‘’మేష శీర్ష౦బుగంఠాన౦ జిత్రముగా ఘటించి అసుదానం ‘’ఇచ్చావు నీ మామ దక్షుడికి .’’శ్వానంబుంగపి పెంచి ,వేశ్య మెడలం బంధింప నక్షంబు ల-ద్దానన్ వారి కమాత్యరాజ తనయత్వం ‘’ఇచ్చి మోక్షం ఇచ్చావు .తర్వాత రుద్రాక్షమహిమ చెప్పిఎలా ఎవరెవరి ప్రాణాలు కాపాడాడో వర్ణించారు కవి ‘’మౌని శ్రేష్టుడు వ్యాసుడచ్యుత డబ్రహ్మం బంచు జేయెత్తిని౦-బొనాడన్’’ఆ చేతులు అలాగే నిల్చిపోగా ,గోవిందుడు కాపాడమని వేడితే కరుణతో కాపాడావు .పాలకోసం ఏడ్చే బీద పిల్లాడి ఆకలి తీర్చమని ఆతల్లి ప్రార్ధిస్తే ‘’దుగ్ధాబ్ది ‘’నే ఇచ్చిన కరుణామయుడివి .మృకండ సూతిని కాపాడి యముని కాలితోతన్ని పంపావ్ .నీభక్తుడైన వైశ్యుడు అడవిలో తిరుగుతూ లింగం దొరక్క కుంచమే లింగంగా భావించి అర్చిస్తే ‘’కు౦చేశ్వరుడి గా వెలిశావు .చోళరాజు భక్తికి పరవశి౦చావు .రాజుకోర్కేపై కావేరీనదికి ఆనకట్ట కట్టావ్ .భైరవుడికి మామిడిఫలాలు ఇచ్చావు .వెయ్యికి ఒక్కపువ్వు తగ్గితే తలనరికి నీకుసమర్పించిన వాడికి ముక్తిప్రసాది౦చావు .
‘’ఈ నా ఈప్సితమిమ్ము నీవు బసవా యిప్డన్న సంతుష్టిగా –డా నీజాలినవాడ టంచసమ నేత్ర౦ బీవు యాచింప న –ద్దానన్నీకను నీకే చూపడె యదార్ధం బేర్పడన్నాడు ‘’అని మరొకథా ప్రసంగం చేశారు ..పాలుత్రాగకపోతే నామీద ఒట్టు అని ఒక బుడుతడు మారాం చేస్తే ‘’ఆ కూనం గాచి కుంచెడు పయస్సు గ్రోలి ‘’వాడికి సంతృప్తి కల్గించిన దయారాశివి .’’నీ చిత్తము దారువో శిలయో లోహమ్మో ‘’మాకు అర్ధంకాదు .కిరాతవేషంలో అర్జునుని పౌరుషాన్ని పరీక్షించి పాశుపతాస్త్రం ప్రసాది౦చావ్ .జంగమ దేవరలకు అభయప్రదాతవు .’’నీచ బౌద్ధ జైనాలను త్రుంచమని నిన్నుకోరుతూ రాళ్ళతో నీలి౦గాన్నికోట్టిన వాడికి వరాలిచ్చి ముక్తినిచ్చావ్ .సౌరాష్ట్రం వెడుతూ కుష్టు వ్యాధితో బాధ భరించలేక ‘’గౌరీనాథా ‘’అని ఆర్తిగా పిలిస్తే ఆర్తిబాపిన దయాసింధువు నువ్వు .అప్పుడెప్పుడో గరళం మెక్కావు .ఇప్పుడు ఈ విషముష్టి పండు తిను చూద్దాం నీ దమ్ము ఏమిటో ‘’అని భక్తుడు సవాలు విసిరి పెట్టిన దాన్ని తినేసిన కాల కంఠుడవు .
చివరి పద్యం –‘’నేనీ దివ్య కథామహత్వముల వర్ణింప నెట్టోర్తున-జ్ఞానిన్ వేమురి వాని చాపలయుతున్ సాక౦గదే భక్త బం-ధూ,నన్ వేంకట రాము ‘’విశ్వ పతయే తుభ్యం నమోస్త౦ టి ‘’ల-కక్ష్మీ నారాయణశాస్త్రి హృత్కమల కాశీవాస విశ్వేశ్వరా ‘’
నిజంగా నే భక్తదూర్జటి మహాకవి కవిత్వం స్ఫురణకు తెస్తుంది ఈ శతకం .కవిగారు విద్వాన్ అవటంతో పండితలక్షణాలు పుష్కలంగా ఉన్నాయి శతకం లో కవికోకిల కావటంతో హాయిగా పాడుకోటానికి వీలుగా ఉన్నాయి ఇంపైన పద్యాలు .విశ్వేశ్వరునికి నిజమైన నీరాజనం ,ఇంపైన ఇష్టనైవేద్యం ఈశతకం .తమాషాగా పద్యం మొదలుపెట్టి ఆసక్తికరంగా ముగించటం ఈ కవి ప్రత్యేకత .ఈకవిగారినీ ఈశతకాన్ని పరిచయం చేసి నేను ధన్యుడనయ్యాను .నిత్య పఠనీయ శతకం ఇది .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్-18-11-22-ఉయ్యూరు .
బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 9వ భాగం.18.11.22
Video link
మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -351
· 351-పద్మాలయా సంస్థ భాగస్వామి ,సింహాసనం ,ఈనాడు సినీ నిర్మాత స్క్రీన్ ప్లే రచయిత, హీరో కృష్ణ సోదరుడు –ఘట్టమనేని హనుమంతరావు
· ఘట్టమనేని హనుమంతరావు ఘట్టమనేని రాఘవయ్య చౌదరి, నాగరత్నమ్మ దంపతులకు జన్మించాడు. అతని సోదరుడు ఘట్టమనేని కృష్ణ సినీనటుడు, రాజకీయ నాయకుడు. మరొక సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు తెలుగు సినిమా నిర్మాత, రాజకీయ నాయకుడు. అతను సోదరులతో కలసి కలిసి పద్మాలయ ప్రొడక్షన్స్ నిర్మాణ వ్యవహారాలు, స్టూడియో నిర్వహణ చూసుకునేవాడు.
· అతని భార్య పార్వతి. వారికి ఇద్దరు కొడుకులు – ప్రసాద్, నర్సయ్య , కుమార్తె జయప్రద. ఉన్నారు.
సినీ ప్రస్థానం
నిర్మాతగా
· 1994 – పోలీసు అల్లుడు
· 1994 – పచ్చ తోరణం
· 1993 – అన్నాచెల్లెలు
· 1988 – కన్వర్‌లాల్ (Kanwarlal-హిందీ)
· 1988 – రాజకీయ చదరంగం
· 1986 – సింహాసనం
· 1983 – మావాలీ (Mawaali-హిందీ)
· 1985 – పతాల్ భైరవి (Pataal Bhairavi-హిందీ)
· 1984 – ఖైదీ
· 1983 – హిమ్మత్‌వాలా (Himmatwala-హిందీ)
· 1982 – ఈనాడు
· 1982 – త్యాగి (Thyagi-హిందీ)
· 1981 – మేరీ ఆవాజ్ సునో (Meri Aawaz Suno-హిందీ)
· 1978 – పట్నవాసం
· 1977 – కురుక్షేత్రం
· 1974 – అల్లూరి సీతారామరాజు
· 1973 – దేవుడు చేసిన మనుషులు
రచయితగా
· 1976 – రామరాజ్యంలో రక్తపాతం (స్క్రీన్‌ప్లే)
· 352-టెన్త్ క్లాస్ సినీ దర్శక ఫేం –చందు
· చందు (సత్తి చంద్రశేఖర్ రెడ్డి) తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత.
జీవిత విషయాలు
చందు 1975, అక్టోబరు 17న ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ సమీపంలోని వెదురుపాక గ్రామంలో జన్మించాడు. రాజమండ్రిలోని సెయింట్స్, ఎస్‌కెవిటి ఉన్నత పాఠశాలలో చదువుకున్నాడు.
సినిమారంగం
2003లో రాంప్రాసాద్ దర్శకత్వం వహించిన కళ్యాణ రాముడు, 2004లో వి. వి. వినాయక్ దర్శకత్వం వహించిన సాంబ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన సినిమారంగ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. 2005లో ఎస్.పి. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానరులో శ్యామ్ ప్రసాద్ నిర్మించిన టెన్త్ క్లాస్ సినిమాకు చందు తొలిసారిగా దర్శకత్వం వహించాడు.[1] ఇది 2006లో విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది. తరువాత 2007లో నోట్ బుక్ సినిమాకి దర్శకత్వం వహించాడు. సంగీత దర్శకుడు కోటి కుమారుడు రాజీవ్ ఈ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. 2013లో ప్రేమ ఒక మైకం సినిమాకి దర్శకత్వం వహించాడు.[2]
సినిమాలు
దర్శకుడిగా
· టెన్త్ క్లాస్ (2006)[3]
· నోట్ బుక్ (2007)
· ప్రేమ ఒక మైకం (2013)
అసిస్టెంట్ డైరెక్టర్‌గా
· కళ్యాణ రాముడు (2003)
· సాంబ (2004)
· 353-ఆ నలుగురు సినీ దర్శక ఫేం ,నిర్మాత ,నందీ అవార్డీ-చంద్ర సిద్ధార్ధ
· చంద్ర సిద్దార్థ ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు, నిర్మాత.
నేపధ్యము
చంద్ర సిద్దార్థ, పూర్ణచంద్రరావు, శకుంతలాదేవి దంపతులకు జన్మించాడు. బడిలో ఉండగానే చిత్రలేఖనంలో, సృజనాత్మక రచనల్లో అనేక అవార్డులు అందుకున్నాడు. దాంతో ఆయన సృజనాత్మక రంగంలోనే రాణించాలనుకున్నాడు.[1] హైదరాబాదు నిజాం కళాశాలలో విద్యనభ్యసించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగు సాహిత్యంలో పట్టభద్రుడయ్యాడు. దర్శకుడు ఉప్పలపాటి నారాయణరావు దగ్గర జైత్రయాత్ర చిత్రానికి గాను సహాయ దర్శకుడిగా పనిచేశాడు. తర్వాత నిరంతరం అనే చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రం మలేషియాలో నిర్వహించిన భారతీయ చలన చిత్రోత్సవాలలో ప్రదర్శింపబడింది.
పురస్కారములు
· నంది ఉత్తమ చిత్ర పురస్కారము – ఆ నలుగురు
· నంది ఉత్తమ కుటుంబ కథా చిత్ర పురస్కారము – అందరి బంధువయ
· నంది ప్రత్యేక జ్యూరీ పురస్కారము -అందరి బంధువయ
సినీప్రస్థానము
దర్శకుడిగా
· ఆటగదరా శివ (2018)
· ఏమో గుర్రం ఎగరావచ్చు (2013)
· మధుమాసం
· అందరి బంధువయ
· ఇదీ సంగతి (2008)
· ఆ నలుగురు
అప్పుడప్పుడు (2003)
నిర్మాతగా
· నిరంతరం
· హౌస్‌ఫుల్
· సశేషం
· మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -18-11-22-ఉయ్యూరు
మత్స్య పురాణం.4వ భాగం.17.11.22
Video link