మార్కండేయ మహా పురాణం.3వ భాగం.28.10.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -339

· మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -339

· 339- క్రియేటివ్ కమ్మర్షియల్ అధినేత ,,అభిలాష సినీ నిర్మాత ,ఇళయరాజా తో మొదటి తెలుగు ట్యూన్స్ ఇప్పించిన –కె.ఎస్ .రామాకె.ఎస్. రామారావు ఒక తెలుగు సినీ నిర్మాత. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకం పై పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించి పెక్కు పురస్కారాలను కూడా పొందారురావు

నేపధ్యము
ఇతనిది విజయవాడ. అక్కడే పుట్టి పెరిగాడు. విద్యాభ్యాసం కూడా అక్కడే చేశాడు. ఇరవై ఒక్క ఏళ్లు వయస్సులో విజయవాడ నుండి చెన్నై వెళ్ళాడు. సినిమాల మీద ఇతని ఆసక్తి గమనించి కె. రాఘవేంద్రరావు వాళ్ల నాన్న కె.ఎస్. ప్రకాశరావు గారు అతడిని తన వద్ద దర్శకత్వ శాఖలో సహాయకుడిగా పెట్టుకున్నాడు. ఆయన వద్ద ‘బందిపోటు దొంగలు’, ‘విచిత్ర కుటుంబం’, ‘నా కుటుంబం’ అనే మూడు సినిమాలకు పనిచేశాడు. ఆ తర్వాత ఇతని నాన్నకి ఒంట్లో బాగా లేకపోవడంతో విజయవాడ తిరిగి వచ్చాడు. అప్పుడే వచ్చిన ‘జై ఆంధ్ర’ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. ఆంధ్రా పీపుల్ అసోసియేషన్‌కు సెక్రటరీగా ఉండేవాడు. కానీ వాటిలోనూ రాజకీయ నాయకులు రావడంతో వదిలేసి, మళ్లీ చెన్నైకి వెళ్లిపోయాడు.

నిర్మించిన చిత్రాలు
ఇతను మొదట పుట్టనకనగళ్ అనే కన్నడ దర్శకుడి మీద అభిమానం ఉండటంతో ఆయన సినిమాని తెలుగులో అనువాదం చేశాడు. అది ఫ్లాపయింది. కమల్‌హాసన్ అబిమాని కావడంతో ‘ఎర్ర గులాబీలు’ కొన్నాడు. అది పెద్ద హిట్టయింది. అలాగే ఆయనదే ‘టిక్ టిక్ టిక్’ చేశాడు. అదీ బాగా ఆడింది. ఆ తర్వాత సుహాసిని మొదటి సినిమా ‘మౌనగీతం’ చేశాడు. అది కూడా ఆడింది. అలా డబ్బింగ్ సినిమాలతో ఆర్థికంగా నిలదొక్కుకున్నాడు. ఆ తర్వాత నెమ్మదిగా ప్రధాన సినిమాల్లోకి వచ్చాడు. చిన్నప్పట్నించీ సాహిత్యం ఎక్కువగా చదివేవాడు. ఆంధ్రజ్యోతిలో యండమూరి వీరేంద్రనాథ్ ధారావాహిక ‘అభిలాష’ చదువుతూ, బాగుందనిపించి, ఓ బృందాన్ని ఏర్పాటు చేసుకుని, ఆ సినిమా తీశాడు. ఇళయరాజాను నేరుగా తెలుగుకు పరిచయం చేసింది ఆ సినిమాతోనే. అదివరకు ‘సీతాకోకచిలుక’కు ఆయన పనిచేసినా, అందులోని పాటలు తమిళ ట్రాకువే. ఆయన ప్రత్యేకంగా తెలుగు సినిమా కోసం ట్యూన్లు కట్టింది మొదటగా ‘అభిలాష’కే. ఆ తర్వాత ఆయన ఇతని సినిమాలకు తెలుగు ట్యూన్లే చేస్తూ వచ్చారు.

చిత్రాల జాబితా

  1. కౌసల్య కృష్ణమూర్తి (2019)[1]
  2. వరల్డ్ ఫేమస్ లవర్ (2020)[2

· 340-‘’నవ్విపోదురుగాక ‘’ఆత్మకధా రచయిత ,మాధుర్య మైన పాటలకు స్థానమిచ్చిన సీతామాలక్ష్మి ,మురారి సినీ నిర్మాత, –కె. మురారి

· కె. మురారి గా ప్రసిద్ధిచెందిన కాట్రగడ్డ మురారి ఒక తెలుగు సినిమా నిర్మాత. సినిమాలపై ఆసక్తితో వైద్య విద్య మధ్యలో ఆపేసి సినీ నిర్మాణ రంగంలోకి ప్రవేశించాడు. జానకి రాముడు, నారి నారి నడుమ మురారి లాంటి పలు విజయవంతమైన సినిమాలు నిర్మించాడు. నవ్విపోదురుగాక పేరిట తన సినీ రంగ అనుభవాలపై మురారి పుస్తకం రచించారు.

వ్యక్తిగత జీవితం
విజయవాడ, మొగల్రాజపురంలో 1944 వ సంవత్సరంలో జన్మించాడు. తాత, నాయనమ్మలు: కాట్రగడ్డ గంగయ్య, అక్కమ్మలు. వరంగల్లు, ఆ తర్వాత హైదరాబాదులలో యంబీబీయస్ చదువుతూ మధ్యలో ఆపి మద్రాసు చేసి సినిమా రంగంలో ప్రవేశించాడు.

మురారి మొదటగా కొన్ని సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేసి తర్వాత యువచిత్ర ఆర్ట్స్ అనే సంస్థను స్థాపించి సినిమాలు నిర్మించాడు. తన సినిమాల్లో సంగీతానికి ప్రాముఖ్యం ఇచ్చేవాడు. ఆయన నిర్మించిన సినిమాల్లో ఎక్కువగా కె. వి. మహదేవన్ స్వరపరిచినవి.

2012 లో ఆయన ఆత్మకథ నవ్విపోదురు గాక అనే పుస్తక రూపంలో విడుదల చేశారు. ఈ పుస్తకంలో కొందరు సినీ ప్రముఖులపై విమర్శలు చేశాడు.[2]

సినీ రచయిత పి. సత్యానంద్ మురారితో తన అనుభందం గురించి వ్రాసిన వ్యాఖ్యలు :

“హీరోని తీసేస్తున్నా మన సినిమా లోంచి” నిర్మాత అన్నాడు .అందరికీ షాక్ .

“ఎందుకని ..ఏమయింది “

“కథ లో చిన్న చిన్న మార్పులు కొన్ని చెబుతున్నాడు “

“చిన్నవే కదా పోనీ చేసేద్దాం ….”

“కథ ,పాట, సీన్ ..నాకు నచ్చాలి ..తర్వాత డైరెక్టర్ కి , రైటర్ కి నచ్చాలి అంతే …హీరో కి , హీరోయిన్ కి కాదు ..వాళ్ళ చెప్పే మార్పులు -కూర్పులు నేను చెయ్యను .డబ్బు పెట్టేది నేను ..పొతే నష్ట పోయేది నేనే ..”

చెప్పాడు నిర్మాత .

“మనకి ఇప్పుడు వేరే హీరో ఎవరూ దొరకరు …”

“అయితే సినిమా తియ్యను …హీరో డేట్స్ వున్నాయని , లక్షలు వస్తాయని , వాళ్ళకి నచ్చేటట్టు మార్పులు చేసి మాత్రం సినిమా తియ్యను ..”ఖచ్చితం గా అన్నాడు నిర్మాత మురారి ..

ఆ మొండి తనం తోనే తను అనుకున్నట్టే సినిమాలు తీసాడు .

ఆలా కుదరక పోవటంతో ,తను అన్నట్టే మానేసాడు కూడా చాలాకాలం క్రితమే .

ఆ నాటి టాప్ దర్శకులు అందరితోనూ (విశ్వనాధ్ ,దాసరి , రాఘవేంద్రరావు , జంధ్యాల , కోడి రామకృష్ణ , కోదండరామిరెడ్డి ..) సినిమాలు తీసాడు తనకి ‘నచ్చిన ‘విధంగానే .

సాహిత్యం ,సంగీతం -అంటే ప్రాణం గా ఫీల్ అయ్యే మురారి “మావ -బాలు “ని

మారుద్దాం అంటే అలాఅన్న డైరెక్టర్ ని కూడా మార్చేయటానికి సిద్ధపడేవాడు .

అందుకే తన సినిమాల్లో అన్ని పాటలూ బావుంటాయి

తనకి రెండే సినిమాలు ( త్రిశూలం (సినిమా), జానకిరాముడు) రాసినా మూడుపదుల స్నేహం మాది .

మొండి ,కోపిష్టి , తిక్క మనిషి ,అని కొందరు అన్నా నాకు మాత్రం చాలా మంచిస్నేహితుడు …మురారి కాట్రగడ్డ.

“నవ్వి పోదురుగాక …”నాకేమిటి అని తనకి నచ్చినట్టే జీవిస్తూ ,

ఆ టైటిల్ తోనే తన జీవిత అనుభవాలు రాసిన ( ఎక్కువ సేల్స్ అయిన సినిమా మనిషి బయోగ్రఫీ )

మిత్రుడు మురారి ఎప్పటికీ అలాగే ,

సాహిత్య ..సంగీతాలతో హాయిగా గడపాలని తన ఈ పుట్టిన రోజు పూట కోరుకుంటూ …

సినిమాలు

  1. సీతామాలక్ష్మి
  2. గోరింటాకు
  3. జేగంటలు
  4. త్రిశూలం
  5. అభిమన్యుడు
  6. సీతారామ కల్యాణం
  7. శ్రీనివాస కళ్యాణం
  8. జానకిరాముడు
  9. నారీ నారీ నడుమ మురారి

పుస్తకాలు

  1. తెలుగు చలనచిత్ర నిర్మాతల చరిత్ర 1931-2005, తెలుగుసినిమా వజ్రోత్సవాలలో విడుదలయిన పుస్తకానికి సంపాదకుడు.
  2. నవ్విపోదురుగాక ఆత్మకథ. (2012లో తొలి ప్రచురణ)

మరణం
కాట్రగడ్డ మురారి చెన్నైలోని తన స్వగృహం నీలాంగరైలో 2022 అక్టోబరు 15న మరణించాడు.[3]

· సశేషం

· మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -28-10-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 19వ భాగం.28.10.22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 19వ భాగం.28.10.22

Video link

Posted in రచనలు | Leave a comment

హాస్యానందం(చివరిభాగం )

హాస్యానందం(చివరిభాగం )

55- నవ్య  సాహిత్యం లో హాస్యం -3

  శ్రీశ్రీ హాస్యం

మహా కవి శ్రీ శ్రీ కొన్ని హాస్య గేయాలు రాశాడు .మూడు యాభైలు అనే గేయ సంపుటిలో చాలా హాస్యం పండించాడు ప్రాస క్రీడలు లో ‘’–రాస క్రీడా శృంగారానికీ రమ్యమైన ప్రాణం –ప్రాస క్రీడహాస్యానికి పసందైన బాణం ‘’నవ్యత్వాన్నికోరాడు ‘’సౌభద్రుని ప్రణయయాత్ర చదవాలని తొందర –ఎంకిపాటలు వన్స్ మోర్ ,కవికోకిల గబ్బిలం విశ్వ సత్య నాథాయణ అగ్గిమీద గుగ్గిలం ‘’మొదలైన వాక్యాలు హాస్య స్ఫోరకాలన్నారు మునిమాణిక్యం.అల్లాటప్పా రాతలు రాస్తే చెవి మేలేస్తాడు శ్రీశ్రీ –‘’అల్లాటప్పా రాతలు రాయటమే గొప్పా –ఒప్పుకోదగ్గ మెప్పా ?అలాంటి కవుల చెవులు మెలితిప్పానంటే అది నాతప్పా ?’’అన్నాడు .శ్రీశ్రీ కలం నుంచి జలువారిందిఏడైనా గోప్పెఅని కితాబిచ్చారు మాష్టారు .

 భానుమతిగారి హాస్యం సంసార పక్షం .ఆవిడ అత్తగారు అమాయకురాలు.జపాను ఎక్కడ ఉందొ తెలీనిది .ఆగ్రా దగ్గరే ఉంది అంటే నమ్ముతుంది. తన్ను తీసుకు వెళ్లి చూపించమని కొడుకును అడుగుతుంది .మదడి బట్టలు మడి ఆవకాయ జాడీలతో జపాన్ కు ప్రయాణమౌతుంది .కోడలూ మనుమడూ ఆమెను ఆడిస్తారు .ఆమె అమాయకత్వమే ఇక్కడ హాస్యానికి హేతువు అన్నారు గురూజీ .ఆమె అభిప్రాయాలుఅజ్ఞానం పరిహాసం సృష్టిస్తాయి .అయితే ఆమె ప్రేమ మూర్తి .ఆమెకు జపాన్ బట్టలు కట్టి తైతక్కలాడుతున్నట్లుగా ముఖ చిత్రం గీయటం ఆమెను అపహాస్యం చేయటమే అన్నారు బాధతో,ఉగ్రరూపం తో  నరసి౦హారావు గారు .

  ముళ్ళపూడి వెంకట రమణ ఉత్సాహ వంతుడైన యువకుడు .పరమ రమణీయమైన శాబ్దిక హాస్యం సృష్టించాడు .మల్లాది విశ్వనాథ కవిరాజు ,మల్లాది వెంకట కృష్ణ శర్మ మంచి హాస్య ఏకాంకికలు రాశారు. నేటి రాజకీయాలు ,అంతర్ రాష్ట్ర సమస్యలు ,కవి సమాజాలు ,నాటక సభలుమోదలైనవాటిపై వ్యంగ్య రచనలు చేశారు.మన హాస్య గ్రంథాలలో ముందు చెప్పదగినది మొక్కపాటివారి బారిస్టర్ పార్వతీశం,.’’క్షితిలో బారిస్టరు పార్వతీశమును చెప్పి –పిదప పలుకవలే గదా –కితకితల కితరులను –భాసిత సుశ్లోకు డతడు’’అన్నమాట నిజమన్నారు మాణిక్యం మాస్టారు .రావూరు వారి హాస్యం మృదువైంది . విడిగా హాస్య గ్రంథాలు రాయలేదుకానీ వీరి వడగండ్లు ,ఆషామాషీ చదవని వారులేరన్నారు .మాటల్లోనూ హాస్యం చిలికిస్తారు .ఆయన ఛలోక్తి ఒకటి మాస్టారు చెప్పారు –సిగరెట్లు మానెయ్యటం మంచిది ‘’అన్నాను నేను .ఆయన ‘’నిజమే .అందుకే నేను ఎప్పుడూ మానేస్తూ ఉంటాను .ఇప్పటికి కనీసం పాతిక సార్లు మానేసి ఉంటాను ‘’అన్నారట రావూరు వెంకట సత్యనారాయణగారు .

  అసలు హాస్యానికి పుట్టినిల్లు ఇంగ్లాండ్, ఫ్రాన్స్, అమెరికా .ఇతర దేశాలసంగతి తనకు తెలీదన్నారు. ఆ దేశాల్లో హాస్యం సాహిత్యం లో ఉజ్జ్వలమణిలాగా ప్రకాశించింది .ఇంగ్లీష్ తో పరిచయం అయ్యాకే హాస్య సమగ్రస్వరూపం ,విశిష్ట త మనకు తెలిశాయి అన్నారు గురూజీ .మోలియర్ ,మార్క్ ట్వేన్ ,లీకాక్ వంటి హాస్యవేత్తలు తెలుగులో లేరనే చెప్పచ్చు అన్నారు .ఒకరిద్దరున్న అదేమీ విశేషం కాదు అని పెదవి విరిచారు .పాలగుమ్మిపద్మరాజుగారి ‘’బతికిన కాలేజి నవల లో చక్కని,మృదువైన  హాస్యం ఉందన్నారు ముని జీ .

  చివరగా మనం చమత్కారం హాస్యం అనే మాటలను పర్యాయ పదాలుగా వాడుతాం ..ఈ రెంటికీ ఏదో కొత్తదనం విశిష్టఃత ఉండాలి .ఈ రెంటికీ భేదం ఏమిటి అంటే చెప్పటం కష్టం .స్థూలంగా కావ్యగుణం కలది చమత్కారం అనచ్చు. కావ్య గుణం కాక మరొక రకమైన రామణీయకత్వం కలదాన్ని హాస్యం అనచ్చు అన్నారు .చమత్కారంలో కావ్యగునం పెరిగితే ఉత్తమకవిత్వం అవుతుంది .చమత్కారం దిగజారి వికృతిపొందితే హాస్యం అవుతుంది అని మాస్టారు నిర్వచించారు .చిత్ర ,బంధకవిత్వాలు చమత్కార సంబంధమున్నవే .అల౦కారాలుకూడా చమత్కారాన్ని సాధించాటానికే ఉపయోగపడతాయి .వికృతి తో సంబంధంలేని ఏ అందమైనా చమత్కారమే .అయితే ఒక్కోసారి చమత్కారం హాస్యం కలిసే ఉంటాయి .అని చెప్పి –

‘’హమ్మయ్య ‘’అయిపొయింది కానీ హాస్యం గురించి చెప్పాల్సినవి కొన్ని చెప్పనే లేదు ‘’నవ్వు ఎందుకు వస్తుంది “’అనేదానిపై సమగ్రంగా చర్చించలేదు .బర్గ్ సన్,ఈస్ట్ మన్ ల సిద్ధాంతాలు సూచించి వదిలేశానేకాని ,తృప్తికరంగా పరామర్శించలేకపోయాను అని బాధపడ్డారు .శక్తిమూల హాస్యం ఉక్తిమూల హాస్యం లలోచేర్చాల్సినవి ఇంకాచాలా ఉన్నాయి .హాస్య ప్రయోజనం గురించి రాయలేకపోయాను ఈపుస్తకానికి ఆదరణలభిస్తే ,రెండో ఎడిషన్  లోఆవిషయాలురాస్తాను .లేకపోతె తర్వాత వాళ్ళు ఆసంగతిచూసుకొంటారు .ఈ పుస్తకం లో దోషాలను సద్భావంతో తెలియజేస్తే,సంతోషిస్తాను .కానీ మీ అభిప్రాయాలుమాత్రం నాకు తెలియ జేయండి అని ప్రార్ధిస్తున్నాను ‘’అని శ్రీ మునిమాణిక్యం నరసింహారావు గారు 1968లో333పేజీలలో  రాసిన ‘’మన హాస్యము ‘’ను ముగించారు దీన్ని ఆంధ్ర సారస్వత పరిషత్ –హైదరాబాద్ ప్రచురించింది .ఇదే నేను24-10-2021న మొదలుపెట్టి ఈరోజు 27-10-22న పూర్తీ చేసిన 55ఎపిసోడ్ల ‘’హాస్యానందం ‘’కు ఆధారం .మరొక్క మారు- మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో-

మీ గబ్బిట దుర్గా ప్రసాద్ -27-10-22

Posted in రచనలు | Tagged | Leave a comment

మార్కండేయ మహాపురాణం .2వ భాగం.27.10.22

మార్కండేయ మహాపురాణం .2వ భాగం.27.10.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ధర్మవీర పండిత లేఖరాం -3

ధర్మవీర పండిత లేఖరాం -3

 విదేశాలలో ప్రచారం చేయాలన్న కోరిక

 విదేశాలలో కూడా ధర్మ ప్రచారం చేయాలని లేఖరాం భావించాడు .డా.షా రాసిన సత్యార్ధ ప్రకాశికను పార్సీ భాషలో అనువాదం చేయాలనే కోరిక కలిగింది .ఆఫ్ఘనిస్తాన్ పర్షియా ,ఆరబ్ దేశాలకు వెళ్లి ధర్మప్రచారం చేయాలనుకొన్నాడుకానీ ఆయన జీవితకాలం లో జరగలేదు .

 కుంభ మేళా

12-4-1891నాటి కుంభమేళా కు నెలరోజులముందే స్వామి శ్రద్దానంద్ తోకలిసి ప్రచార ప్రకటన చేశాడు .పంజాబ్ ,ఉత్తరప్రదేశ్ ప్రతినిధులు అత్యంత ఉత్సాహంగా కార్యరంగంలోకి దూకారు .లేఖరాం ఎన్నో చోట్లకు తిరిగి విరాళాలు సేకరించాడు .కుంభ మేళాలో ఆర్య సమాజం చేసిన సేవను ఒక పుస్తక రూపం వెలువరించాడు . సింథ్ లో

సి౦థ్ లోని హైదరాబాద్ లో హిందువులు కొందరు క్రైస్తవ ,ఇస్లాం మతాలలోకి మారుతున్నారని పంజాబ్ ఆర్యప్రతినిధి ప్రధాన్ లేఖ రాయగా ,సింధీ భాష తెలిసిన స్వామి పూర్ణానంద ను తనతో తీసుకు వెళ్లి ,వారివాదాలను ఖండించి ‘’ఆడం ,అవ్వ లు మన తలిదండ్రులా ?’’అనే పుస్తకం రాసి సమస్త మానవ సృష్టి ఒకేతలిదండ్రుల సంతానం కాజాలదని అనేక రుజువులతో ,ప్రమాణాలతో వివరించాడు .అక్కడి పదిమంది యువకులను మతం మారకు౦డాకాపాడి ,అక్కడి ఆర్య సామాజికులను అప్రమత్తం చేశాడు .ఒక సింధీ ధనికుడు దివాన్ సూర్యమల్ ముసల్మాన్ గా మారటానికి సిద్ధపడితే ,విషయం తెలిసి ఆయన్నుకలవటానికి  వెడితే ,ఆయన ఆలీపూర్ వైపుకు పారిపోగా ,అతని కొడుకుల్ని ముట్టడించగా పెద్దకొడుకు తప్పించుకొనే ప్రయత్నం చేస్తే ,నాలుగు సార్లు వెళ్లి శాస్త్రార్ధా  నికి పిలిచి ఉత్తరాలవర్షం కురిపించగా మౌల్వీలు వచ్చి పాల్గొనగా వాదంలో వారిని నిరుత్తరుల్ని చేశాడు .ప్రసిద్ధబ్రహ్మ సమాజ వ్యాఖ్యాత టిఎల్. స్వామి హృదయమ లో  ధర్మ శాస్త్రాలపై గౌరవం కలిగించాడు .లర్కానాలో కొందరు హిందువుల్ని బలవంతంగా ముస్లిం లుగా మార్చారు .ఆదుకోమని అక్కడివారు లేఖ పంపితే ఆరోగ్య౦ బాగాలేక వెళ్ళ లేక పోయాడు .ఆతర్వాత ఎన్నోప్రయత్నాలతర్వాత  వాళ్ళంతా వైదిక  ధర్మం లోకి వచ్చారు .

 లేఖరాం ఎక్కువగా పంజాబ్ లోనే పని చేశాడు .అమృతసర్ ఆర్యసమాజ వార్షికోత్సవం లో చారిత్రకదృష్టితో ,పరిశోధనాత్మక ప్రసంగం చేయగా అమరవీరుడు స్వామి శ్రద్ధానంద దాన్ని ప్రశంసిస్తూ,హిందీలో’’షార్ట్ హాండ్’’ అవసరమని ఆయన ప్రసంగం రుజువుచేసిందని అంతటి వాక్ ప్రవాహంతో ఉత్తేజంగా ఆయన ఉపన్యాసం సాగిందని తెలిపాడు .నాహన్ రాజ్ లో సాధు కేశవానంద ఉదాసి పెద్ద దుమారం లేపితే పండిట్ జీకి టెలిగ్రాం ద్వారా తెలియబరిస్తే వెళ్లి ,ఆయనతోమాట్లాడి మనసులో మార్పు తెచ్చి ఆయనతోనే అక్కడ ఆర్యసమాజం  స్థాపించేట్లు చేశాడు

   రాజపుఠానా లో ప్రచారం

దయానందుని జీవన సామగ్రి సేకరణకు పండిట్జీ అజ్మీర్ కు వెళ్లి అక్కడ అందరినీ కలిసి విషయ సేకరణ చేసి దయానందుని జీవిత చరిత్ర రాశాడు .నిత్యానంద ,విశ్వేశ్వరానంద లు బూందీ రాజ్యంలో శాస్త్రార్ధ చర్చల్లో మునిగిపోయారు .వారికి సాయంగా ఈయనకూడా వెళ్ళాడు .అక్కడినుంచి షాహాజ్ పూర్ ,వెళ్లి వ్యాఖ్యానం చేస్తుంటే ఒక ముసల్మాన్ సుబేదార్ లేచి ‘’30దెబ్బలుతిని బూందీ నుంచి ఎందుకు పారిపోయి వచ్చావ్ ?’’అని ప్రశ్నిస్తే పండిట్ ‘’విరోధులు శాస్స్త్రార్ధానికినికి రమ్మంటే రాకపోతే ఏం చెయ్యాలి ?మేము హజరత్ మహమ్మద్ లా పారిపోయి రాలేదు ‘’అనగా హర్షధ్వానాలు మిన్నుముట్టాయి .

  ఉపనిషత్తులకు టీకా తాత్పర్యాలు రాయలనుకొన్నాడు .మనుస్మృతిలో ఒక అధ్యాయానికి భాష్యం రాశాడు. కాశ్మీర్ లో అరుదైన మనుస్మృతి గ్రంథం ఆయనకు లభించింది .మనుస్మృతి తర్వాత వాల్మీకి రామాయణం అనువది౦చా లనుకొన్నాడు .శ్రద్ధానంద శాస్త్రాల అనువాదాలకు ఒక ప్రణాళిక తయారు చేశాడు .దురదృష్టవశాత్తు లేఖరాం అకాల మృత్యువు పాలయ్యాడు .అమీర్ లో పీరజేతో శాస్త్రార్ధం చేశాడు .మొత్తం మీద ఇక్కడ 15వ్యాఖ్యానాలు చేశాడు .

  కథియవాడ లో

దయానంద జన్మస్థలం నిర్ధారించటానికి కథియవాడ వెళ్ళాడు .అక్కడ బాన్కానేర్ ,మౌర్వీ రాజ్యాలలో తిరిగాడు .మహర్షి పుట్టిన అక్కడ ఆర్యసమాజం చాలా దుర్దశలో ఉండటం గమనించి బాధపడ్డాడు .పంజాబ్ లో మాంసం తినటం ఎక్కువ .ఆర్యసమాజ సభ్యులుకూడా అలవాటు మార్చుకోలేక పోయారు .వేదం లో మాంస భక్షణ ఉందని మొండిగా వాదించేవారు .ఆర్యప్రతినిధి సభ ప్రాధాన్ ఈయనను పంజాబ్ కు రమ్మని కోరగా ,రాజపుఠానా వెళ్లి మా౦సభక్షణం విరుద్ధమని,పాపం అనీ  అనేక ప్రమాణాలతో నిరూపించాడు .ఆయనవాదానికి జవాబు చెప్పగలమోగాడు అక్కడ లేకపోయాడు .అప్పటికి ఒకటి ఆర్యసమాజంలో సంస్కృత శిక్షణ ను సమర్ధించేది ,రెండోది కాలేజి పక్షంగా,పాశ్చాత్య శిక్షణ అనుసరించాలి అనేది  ఉన్నాయి .

  గృహస్థ జీవనం

వైశాఖమాసం లో దయానందుని ఆజ్ఞాపాలనలో 25 ఏళ్ళు గడచిపోయి పండిట్ కు 35ఏళ్ళు రాగా వివాహం చేసుకొన్నాడు .జహాలం నుంచి కహూటకు వెళ్ళాడు .అక్కడ భాన్న గ్రామవాసి,అక్షరంకూడా రాని  లక్ష్మీదేవి ని ఆమె 26ఏట వివాహం చేసుకొన్నాడు .తర్వాత ఆమెకు తానె చదువు చెప్పాడు.ఆమెకు ధార్మిక శిక్షణ ఇవ్వటానికి గ్రామమే తగినదని అనుకొన్నాడు.

 జోథ్ పూర్ లో

పంజాబ్ లో ఆర్యసమాజం రెండు పక్షాలు అయ్యాక ,మాంస పక్షం నుంచి శ్రద్ధానంద ,జోథ్ పూర్ వెళ్ళాడు .రాజు మేజర్ జనరల్ ప్రతాప సింహా మహర్షి భక్తుడైనా యుద్ధం చేసే రాజపుత్రులకు  మాంసభక్షణ తప్పదు అని వాదించేవాడు .రాజు భయంతో ధనికులు పత్రికలవారూ తలలూపారు .రాజు తనకు సపోర్ట్ గా నిలుస్తారని  పండిట్ గంగాప్రసాద్ ,పండిట్ ఎం ఎ మీరట్ లను పిలిపించాడు .కానీ డబ్బు, హోదా తమల్ని ధర్మమార్గం నుంచి తప్పించలేవు అని రాజుకు కౌంటర్ ఇచ్చారు .లేఖరాం జోథ్ పూర్ వెళ్లి కొన్ని రోజులు౦డిచర్చల్లోపాల్గొని మాంస వ్యతిరేకతకు మద్దతు కూడ గట్టాడు .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -27-10-22-ఉయ్యూరు   —

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 18వ భాగం.27.10.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -336

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -336

· 336-మన వూరిపాన్డవులు సినీ నిర్మాత ,ఫిలిం ఫేర్ అవార్డీ –కాకితజయకృష్ణ

· జయకృష్ణ (ఆగష్టు 18, 1941 – మార్చి 29, 2016) భారతీయ సినిమా నిర్మాత. ఆయన తెలుగు, తమిళ సినిమాలకు ప్రధానంగా నిర్మాతగా సేవలనందించారు.[1] ఆయన 1978 లో మనఊరి పాండవులుకు నిర్మాతగా కెరీర్ ప్రారంభించి తెలుగులో ఉత్తమ ఫిలిం పేర్ అవార్డును అందుకున్నారు. ఆయన ఇతర సినిమాలు మంత్రిగారి వియ్యంకుడు (1983), వివాహ భోజనం, ముద్దుల మనవరాలు, సీతారాములు, రాగలీల, నీకు నాకు పెళ్ళంట, కృష్ణార్జునులు, 420 మొదలగు సినిమాలను తెలుగులో నిర్మించారు. తమిళంలో ఆయన “ఆలవందం” సినిమాను నిర్మించారు.[2] 15 పైగా తెలుగు చిత్రాలు నిర్మించారు. మరో 20కిపైగా డబ్బింగ్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. బాపు దర్శకత్వంలో వచ్చిన మనవూరి పాండవులు చిత్రానికి ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా అందుకున్నారు.[3][4]

జీవిత విశేషాలు
పశ్చిమగోదావరి జిల్లా అత్తిలికి సమీపంలోని కొమ్మర గ్రామానికి చెందిన జయకృష్ణ, తన బావ లైన ఎడిటర్ గోపాలరావు, మేకప్‌మ్యాన్ సురేశ్‌బాబుల ప్రోత్సాహంతో మద్రాసు చేరుకున్నారు. తొలుత కెమెరా అసిస్టెంట్‌గా, ఎడిటింగ్ అసిస్టెంట్‌గా పనిచేశారు. అటుపైన మేకప్ డిపార్ట్‌మెంట్‌లో అప్రెంటిస్‌గా తన ప్రయాణం మొదలుపెట్టారు. మేకప్ వృత్తిపై ఎంతో ఇష్టాన్ని పెంచుకున్న జయకృష్ణ ఎన్నో మెళకువలు నేర్చుకుని పరిశ్రమకు వచ్చిన ఎనిమిదేళ్లకే చీఫ్ మేకప్‌మ్యాన్ స్థాయికి ఎదిగారు. ‘బంగారు తల్లి’ సినిమా సమయంలో కృష్ణంరాజుతో పరిచయం ఏర్పడి ఆయన పర్సనల్ మేకప్‌మ్యాన్‌గా చేరారు. ఆ తర్వాత జయప్రదకు పర్సనల్ మేకప్‌మ్యాన్‌గా వ్యవహరించారు. అటుపై సినీ నిర్మాణ రంగంపై ఉన్న ఆసక్తితో నిర్మాతగానూ మారారు. ‘కృష్ణవేణి’, ‘భక్త కన్నప్ప’, ‘అమర దీపం’ తదితర చిత్రాలకు భాగస్వామిగా ఉంటూనే నిర్మాణ నిర్వహణ చేశారు. ప్రముఖ పంపిణీదారు ‘లక్ష్మీ ఫిలిమ్స్’ లింగ మూర్తి ప్రోత్సాహంతో 1977లో జేకే మూవీస్ సంస్థను స్థాపించి, బాపు దర్శకత్వంలో కృష్ణంరాజు, చిరంజీవి, మురళీమోహన్ తదితరులతో ‘మనవూరి పాండవులు’ నిర్మించారు. దాసరి దర్శకత్వంలో ‘సీతారాములు’, ‘కృష్ణార్జునులు’, బాపు దర్శకత్వంలో ‘మంత్రిగారి వియ్యంకుడు’, ‘జాకీ’, ‘సీతమ్మ పెళ్లి’, జంధ్యాల దర్శకత్వంలో ‘ముద్దుల మనవరాలు’, ‘రాగలీల’, ‘వివాహభోజనంబు’, ‘నీకూ నాకూ పెళ్లంట’, క్రాంతికుమార్ దర్శకత్వంలో ‘స్రవంతి’ తదితర చిత్రాలను నిర్మించారు.[5]

కెరీర్
కృష్ణం రాజు, జయసుధలకు మేకప్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టిన జయకృష్ణ తర్వాత నిర్మాతగా మారి పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం ఆయన విద్యార్థి. ఆయన వద్ద మేకప్ ఆర్టిస్టుగా చేరి తరువాత నిర్మాతగా స్థిరపడ్డారు.[6] ఆయన ప్రముఖ సినిమా నటుడు చిరంజీవికి మొట్టమొదటిసారిగా పారితోషకాన్ని (రూ.1116/-) అందించిన నిర్మాత. ఆయన ప్రొడక్షన్ బానర్స్ లో ముద్దు ఆర్ట్ మువీస్, జయకృష్ణ మువీస్ కూడా ఉన్నాయి.[7]

గతంలో స్టార్ హీరోలతో సినిమాలు తీసిన జయకృష్ణ నిర్మించిన చివరి సినిమా ‘దాసు’. సుదీర్ఘ విరామం తరువాత సినీనటి తారాచౌదరి జీవిత చరిత్రపై ‘ఒక తార’ అనే సినిమా నిర్మిస్తున్నట్టు ప్రకటించినప్పటికీ అది తెరకెక్కలేదు. జయకృష్ణ ఒక్కగానొక్క కొడుకు ముద్దుకృష్ణ 2008లో ఆత్మహత్య చేసుకోవడం జయకృష్ణ జీవితంలో అత్యంత విషాదాత్మక ఘటన.[8]

· 337-భారత్ బంద్ సినీ నటుడు ,పెళ్లిపందిరి సినీ నిర్మాత –కాస్ట్యూమ్ కృష్ణ

కాస్ట్యూమ్స్ కృష్ణ ఒక సినీ నటుడు,, నిర్మాత.[1] అనేక చిత్రాలలో విలన్ గా, సహాయ పాత్రల్లో నటించాడు.[2] 8 చివ్యక్తిగత జీవితం
ఆయన స్వస్థలం విజయనగరం జిల్లా, లక్కవరపుకోట.[3]

కెరీర్
కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన భారత్ బంద్ సినిమాతో నటుడిగా పరిచయం అయ్యాడు.[2] కోడి రామకృష్ణను ఆయన గురువుగా భావిస్తాడు.[3]

జగపతి బాబు హీరోగా వచ్చిన పెళ్ళిపందిరి చిత్రాన్ని నిర్మించాడు. అందులో ఓ పాత్రలో కూడా నటించాడు. కన్నడంలో విజయవంతమైన ఓ చిత్రాన్ని అరుంధతి పేరుతో రీమేక్ చేశాడు.[4]

సినిమాల]
నటుడిగా
· భారత్ బంద్

· అల్లరి మొగుడు

· దేవుళ్ళు

· మా ఆయన బంగారం

· విలన్ (2003)

· శాంభవి ఐపిఎస్ (2003)

· పుట్టింటికి రా చెల్లి (2004)

నిర్మాతగా
· పెళ్ళిపందిరి

· 338-మనీషా ఫిలిమ్స్ నిర్మాత ,యమలీల సినీ ఫేం –కె.అచ్చిరెడ్డి

· కె. అచ్చిరెడ్డి ప్రముఖ తెలుగు సినీ నిర్మాత. దర్శకుడు, స్నేహితుడైన ఎస్. వి. కృష్ణారెడ్డితో కలిసి అనేక విజయవంతమైన సినిమాలు నిర్మించాడు.[1] ఆయన కొబ్బరిబోండాం, రాజేంద్రుడు – గజేంద్రుడు, మాయలోడు, యమలీల, ఘటోత్కచుడు, వినోదం, దీర్ఘ సుమంగళీభవ వంటి హిట్ చిత్రాల్ని మనీషా ఫిలిమ్స్ బ్యానర్‌పై నిర్మించాడు.[2]

· వ్యక్తిగత జీవితం
· అచ్చిరెడ్డి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా, ఆరవల్లి. ఆరవల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. అప్పటి నుంచి ఎస్. వి. కృష్ణారెడ్డితో స్నేహం ఉంది.[1] తనకు సినిమా మీద ఆసక్తి లేకపోయినా కృష్ణారెడ్డి అవకాశాల కోసం మద్రాసు వెళ్ళినపుడు తనే నిర్మాత అయితే బాగుండుననిపించింది. హైదరాబాదుకు వచ్చి డబ్బు సంపాదించడానికి అనేక వ్యాపారాలు చేశాడు. మొదట్లో జంట నగరాల్లోని ఇరానీ కేఫ్ లకు స్వీట్లు సరఫరా చేశారు. అప్పట్లో పాప్ సంగీతం ప్రాచుర్యంలో ఉండటంతో పాప్ టీ పేరుతో అప్పట్లో ఉన్న డంకన్ టీకి పోటీగా తయారు చేశారు. గోల్డెన్ ఫింగర్స్ పేరుతో ఒక రకమైన వడియాలు లాంటి ఆహార ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారం చేశారు. కొంతమంది కలిసి బృందంగా ఏర్పడి డబ్బు సంపాదన కోసం ఈ వ్యాపారాలు నిర్వహించేవారు. ఖాళీ సమయాల్లో తెలుగు, హిందీ, ఇంగ్లీషు సినిమాలు చూసేవారు. వ్యాపారాల ద్వారా కొంత డబ్బును కూడబెట్టారు కానీ సినిమా నిర్మాణానికి అవి సరిపోవని తెలిసింది. సినీరంగంతో పరిచయం కలగడం కోసం అప్పుడే ప్రాచుర్యం పొందుతున్న దూరదర్శన్ చానల్లో అధికారులకు, నిర్మాతలకు మధ్య వారధిగా వ్యవహరించడం ద్వారా సినీ ప్రముఖులతో పరిచయాలు పెంచుకున్నారు. అప్పుడే మరో నిర్మాత కిషోర్ రాఠీతో పరిచయం ఏర్పడింది. ఆయనకు అప్పుడే మనీషా వీడియోస్ పేరుతో సినిమాలకు సంబంధించిన ఒక సంస్థ ఉండేది. మొదట్లో మూడు రీమేక్ చిత్రాలు నిర్మించాక కొబ్బరి బోండాం సినిమా తీశారు.

· కెరీర్
· 1988లో ఆయన కెరీర్ ప్రారంభమైంది.[3] మొదట్లో మనీషా ఫిలిమ్స్ బ్యానర్‌పై కొబ్బరిబోండాం, రాజేంద్రుడు – గజేంద్రుడు, మాయలోడు, యమలీల, ఘటోత్కచుడు, వినోదం, దీర్ఘ సుమంగళీభవ వంటి హిట్ చిత్రాల్ని నిర్మించాడు. తర్వాత ఆర్.ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై హంగామా, సామాన్యుడు, గుండమ్మగారి మనవడు, కిక్ వంటి చిత్రాలకు సమర్పకుడుగా వ్యవహరించాడు. తర్వాత మ్యాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ అనే నూతన సంస్థను స్థాపించి ఆది హీరోగా ప్రేమ కావాలి సినిమా తీశాడు.

·

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -27-10-22-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

హాస్యానందం55- నవ్య సాహిత్యం లో హాస్యం -2

హాస్యానందం
55- నవ్య సాహిత్యం లో హాస్యం -2
కృష్ణ శాస్త్రిగారిహాస్యం
కృష్ణ శాస్త్రి గారిహాస్యంచాలా చక్కగా ఉంటుంది .అవి పద్యాలు .ఇంకా పుస్తకరూపం దరించ లేదనుకొంటాను (ఇది 1968లో మాస్టారు అన్నమాట ).దేశంలో ప్రతిప్రాంతం తనకుస్వతంత్ర్యం కావాలని కోరే రోజులవి .తర్వాత పాకిస్తాన్ లాగా విడిపోయి స్వతంత్ర రాజ్యం స్థాపించుకోవాలని చిన్న చిన్న సంస్థానాలు కూడా ఆశ అడ్డాయి .ఇలా చేస్తే దేశం ముక్కలు చెక్కలవుతుంది .దీన్ని దృష్టిలో పెట్టుకొని కృష్ణ శాస్త్రిగారు పద్యం రాశారు –వీట నున్న శుద్ధ విశ్వస్తలందరూ-గొప్ప సభను చేసి గోలపెట్టి –వెధవ పేట నొకటి వేరే ఇమ్మన్నారు-విశ్వదాభిరామ వినురవేమ ‘’
సోషలిజ వాదుల డాంబికాన్ని హేళన చేస్తూ రాసిన మరోపద్యం –‘’కత్తిసాము చేతు గండడు రాళ్ళను మోతు –మొగ్గ వేతు నగ్గిపోతుననియే –స్వామి ఎవరమంటే సామ్య వాడదులమన్నాడు –విశ్వదాభిరాం వినురవేమ ‘’.
అర్హత లేని పనులు చేయటానికి సాహసించే అవివేకులను అవహేళన చేస్తూ ‘’ఆడ వేషం వేయటానికి అర్హత లేకపోయినా సరదాకు ఆవేషం కట్టి న వాడిని హేళన చేస్తూ రాసిన పద్యం –
‘’నాటకాలలో నారీ వేషము వేయ –పురుషుడట్టులుండుపోతరాజు-ఉత్తయప్డు సరిగా యువతీ లలమయే –విశ్వ –‘’
భావకవిని గురించి మరో చెణుకు –‘’మెరుగు కంటి జోళ్ళు ,గిరజాలు సరదాలు –భావకవికి లేని వేవిలేవు-కవిత యందు తప్ప గట్టివాడన్నిట –విశ్వ —‘’
ఎప్పుడో రాజ్యమేలిన పాదుషాలు తురకలైన కారణం తో,తానూ అంతవాడినే ఆని రొమ్ము విరుచుకొనే ‘’కుట్టు సాహేబు’’(దర్జీ )సంగతి మరీ హాస్యాస్పదంగా ఉంది –‘’
‘’మొగలు పాదుషాలు తుఘలక్ నవాబులు డొక్కచి౦చి తోలు చెక్కిరంచు –కుట్టు సాహేబయ్య కొట్టు బడాయీలు –విశ్వ –‘’
నియోగులలో కొందరుకరణాలు గోముఖ వ్యాఘ్రాల్లా కొ౦పలార్పారు .వారిని హేళన చేస్తూ –‘’ఆరు వేల కొ౦పలంటించి నయగారు –ఆరు వేల వేరే యప్పు జేసే –అతడుగాక ఎవ్వ డారువేల నియోగి –విశ్వ –‘’
పనికిమాలినవాళ్ళు రాజకీయ నాయకులౌతున్నారని చెబుతూ అల్లిన పద్యం –
‘’నోటి తీతవాడు ,మేటి నాయకుడాయే –మౌని వరుడు పనికి మాలిపోయే –సింహమునకు గ్రామ సింహమే గురువయ్యే –విశ్వ –‘’
గుర్రాలే కుర్చీ ఎక్కి పెత్తనం చలాయిస్తున్నాయి అంటూ –
‘’ఉలవ చారు త్రాగి ఉద్యోగి గుర్రమై –దౌడుతీసే లద్దె తానె వేసె-గుర్రముండి యుండి కుర్చీపైకేక్కేరా ‘’
మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -26-10-22-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

మార్కండేయ మహాపురాణం.1వ భాగం.26.10.22

మార్కండేయ మహాపురాణం.1వ భాగం.26.10.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ధర్మవీర పండిత లేఖరాం -2

ధర్మవీర పండిత లేఖరాం -2

ధర్మ ప్రచారానికి ఒక పత్రిక అవసరం అని గుర్తించి ‘’ధర్మోపదేశ ‘’మాసపత్రిక స్థాపించి ,సంపాదకు డయ్యాడు లేఖరాం .దీనితోపాటు వ్యాఖ్యానాలు కూడా చెబుతూవాటికి సంనద్ధుడవుతూ ఉండేవాడు .ఒకసారి మద్య నిషేధం పై ఈయన ఉపన్యాసం విన్న సైనికాధికారి సైన్యంలో మద్య నిషేధం విధించాడు శాస్త్రార్ధాలు  చేయటంలోనూ నైపుణ్యం సంపాదించాడు .పోలీస్ సూపరింటే౦డెంట్ తన డిప్యూటీ లీడర్ వజీర్ ఆలీ ఈయన తో వ్యాఖ్యానాలు చేస్తూ సమర్ధించే వాడు .ఈయన బదులువచ్చిన కొత్తాయన లేఖరాం ను పెషావర్ నుంచి ‘’సు ఆబీ ఠాణా ‘’కు మార్చాడు .అక్కడిను౦చికూడా తన వ్యాసంగాన్ని కొనసాగించాడు .ఒకసారి ఇక్కడి పోలీస్ ఇన్స్పెక్టర్ ఈయనతో సత్యాసత్యాలపై చర్చకు రాగా ,ఈర్ష్య చెంది ఈయన ఇంక్రిమెంట్ ఆరునెలలు నిలిపేశాడు .

   ఆర్య సామ్రాజ్యకా౦క్ష

  భారతీయ శిక్షా పద్ధతికి లేఖరాం వద్ద ఎప్పుడూ ఒక గ్రంథం ఉండేది .దాని ముఖ చిత్రంగా ‘’ఓ3మ్’’అనే జండా ముద్రి౦పజేయించారు. అంటే సమస్తభూప్రపంచ౦పై  ఈ పతాకం ఎగరాలి ఉద్దేశ్యం .వైదికం ప్రపంచానికి శిరోమణి కావాలనే భావం .కానీ ఇప్పటివరకు నెరవేరలేదు .ఏదైనా ముందు తానూ ఆచరించి ఇతరులకు చెప్పేవాడు .పెషావర్ లో జరిగే ఆర్యసమాజిక సాప్తాహికాలకు వెళ్ళాడు .ధర్మశాల అధ్యక్షుడైన తాసిల్దారునే సమాజానికి ప్రధాన్ గా చేయాలని అందరి ఆలోచనగా ఉంది .తాసిల్దార్ మద్య మా౦సప్రియుడు కనుక ఉండటానికి వీలులేదని ఆయన హాజరైఉండగా చెప్పాడు .సభ్యులు అంగీకరించకపోతే సభ వదిలి వెళ్లి పోయాడు లేఖరాం .

  ఉద్యోగానికి రాం రాం

 పోలీసు ఉద్యోగం ధార్మిక కార్యక్రమాలకు అడ్డంకి గా ఉందనిభావించి 24-12-1884న రిజైన్ చేశాడు .ఇప్పుడు స్వేచ్చ లభించింది .ఇంతలో దయానందుని నుంచి రెండు ఉత్తరాలు వచ్చాయి .ఒకదానిలో గోరక్షణ కోసం సంతకాల సేకరణ ,రెండవది పంజాబ్ లో హిందీ ప్రచారానికి విద్యా సంస్థకు నివేదన పత్రం పంపటం గురించి .ఎంతో ఉత్సాహంగా ఈ రెండూ పూర్తిచేశాడు .

  మీర్జా గులాం అహమ్మద్ కాదియాని తానూ పైగంబర్ అని చెప్పుకొంటూ జమ్మూలోని ,హిందువులను ముస్లిం లుగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నాడు .ఈయన చాలాసార్లు అక్కడికి వెళ్లి ఆప్రయత్నాలకు అడ్డు పడ్డాడు ..కాదియానిరాసిన ‘’బురాహీన్ ఆహామదియా ‘’లో ఆర్యసమాజం పై దూషణలు చేశాడు .కనుక తన చర్యలను తీవ్రతరంచేయటంతో  మతమార్పిడి చాలాభాగం తగ్గింది .ఇంకో అడుగు ముందు వేసి క్రైస్తవ ,ముస్లిం లనుకూడా వైదిక ధర్మ౦ లోకి తెచ్చాడు .ఎవరైనా తనదగ్గర ఏడాదికాలం ఉంటె తన చమత్కారాలు ప్రత్యక్షంగా చూడచ్చు అని కాదియానా ప్రకటించగా,ఖండించి , ఈయన వెళ్లి ,ఆయన రహస్యాలు బట్టబయలు చేసి ,జనాల భ్రమలను వదిలించి ఆర్యసమాజం స్థాపించాడు .కాదియాకు చెందినా హిందువు విష్ణుదాసు ఇస్లాం లోకి మారకపోతే ఏడాదిలోపే చచ్చి పోతాడనిమీర్జా  ప్రచారం చేయగా ,లేఖరాం వెళ్లి సందేహాలు సంతృప్తితో తీర్చి ఆర్య సమాజ సభ్యుని చేశాడు .ఎందఱో సామాన్యులని మీర్జాకుతంత్రానికి  బలికాకుండా కాపాడాడు .సురమా చాస్మ ఆరియా అని మీర్జా రాస్తే దాన్నిఖండిస్తూ లేఖరాం’’సుస్తా ఖబ్దఆహ్మదియా ‘’రాసి నోరుకాదుకాదు కలం మూయించాడు .

  లాహోర్ లో ఉపన్యాసాలిస్తూనే సంస్కృత వ్యాకరణం సాయంతో వైదిక సాహిత్యాన్ని అధ్యయనం చేశాడు .ఫాదరీ ఖడక్ సింహ్ క్రైస్తవాన్ని సమర్ధిస్తూ ఆరు వ్యాసాలురస్తే ,వాటికి ఖండిస్తూ ఆరు చిన్న పుస్తకాలు రాశాడు .’’ఆర్యగజేట్ –ఫిరోజ్ పూర్’’ కు ఆయన సంపాదకు డయ్యాడు .దయానందుని నిర్యాణం తర్వాత లేఖరాం బాధ్యత పెరిగింది .ఆర్య ప్రతినిధి సభ దయానందుని జీవిత చరిత్ర లేఖరాం రాయాలని తీర్మానించింది .దీనికోసం విషయ సేకరణకు దేశమంతా పర్యటించాడు .ముందుగా  స్వామి విరజానందుని  శిష్యులైన పండిత యుగళ్ కిషోర్ ,పండిత దామోదర్ చౌబే వంటి వారినికలిసి విషయాలు గ్రహించాడు .వీరు దయానండునిక్లాస్ మేట్స్ .మధుర ,సంయుక్త పరగణాలు కూడా వెళ్లి విషయాలుసేకరించాడు .అజ్మీర్ లో అబ్దుల్ రహమాన్ తక్జీబ్ ,నుస్కా ఖబ్ద్  పుస్తకాలు చదివి ఇస్లాం వదిలి ‘’సోమదత్త ‘’పేరుతొ వైదికం లోకిచేరి ఆర్యసమాజానికి గొప్ప ప్రచారకుడయ్యాడు  .ఆర్య సమాజ హేతువాద ప్రచారం పౌరాణికులను, జైనులను కూడా కలవర పరచింది .లేఖరాం గారికి ప్రాణాపాయం ఉంటుందేమో అని భయపడి ఆయనకు కాపలాగా నలుగుర్ని నియమించాలని ఆర్యులుకోరగా ఈయన ఒప్పుకోలేదు .తనకు భయం లేదన్నాడు .ఒక మౌల్వీకి హిందీనేర్పించాడు

  శూద్రునికి యజ్ఞోపవీతం

మీర్జాపూర్ ఆర్యసమాజంలో ఉన్న ఒక శూద్రుడు  వైశ్యులకు  వైదికకార్యాలుచేస్తాడు. ఆయనకు యజ్ఞోపవీతం వేయటానికి అక్కడి ఆర్యసమాజం ముందుకురాలేదు .ఇది తెలిసి  లేఖరాం ఆయనకు యజ్ఞోప దేశ సంస్కారం దగ్గరుండి చేయించాడు .మీర్జాపూర్ లో ఒక గూండా మౌలీతో శాస్త్రార్ధం  చేశాడు .ఆతనికి భయపడి ఎవరూ ఎదురు వెళ్ళేవారు కాదు .ఈయన సాయ౦కాలం నిర్భయంగా దుడ్డుకర్ర చేత్తోపట్టుకొని వాహ్యాళి వెళ్ళేవాడు .కాశీలో రెండు ననెలలున్నాడు .ఓజస్వీ భాషణ చేశాడు .పౌరాణికులు అడ్డుపడినా నిర్భయంగా తనవాదాన్ని వెలువరించి ఆమోదం పొందాడు .

   సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -26-10-22-ఉయ్యూరు 

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -334

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -334

· 334-చాయాగ్రాహకుడు ,క్షణ క్షణం సినీ నిర్మాత –ఎస్.గోపాల రెడ్డి

· ఎస్. గోపాలరెడ్డి సినీ ఛాయాగ్రాహకుడు (కెమెరామెన్) రచయిత, దర్శకుడు, నిర్మాత.[1] డా. కె. ఎల్. నారాయణతో కలిసి దుర్గా ఆర్ట్స్ అనే సినీ నిర్మాణ సంస్థ ద్వారా సినిమాలు నిర్మిస్తున్నాడు. తెలుగులోనే కాక కొన్ని బాలీవుడ్ సినిమాల్లో కూడా పనిచేశాడు. రాం గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన శివ సినిమా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. నిర్మాతగా క్షణ క్షణం ఆయనకు బాగా పేరు తెచ్చింది.

వ్యక్తిగత వివరాలు
గోపాల్ రెడ్డి జులై 4, 1951న కృష్ణా జిల్లాలో జన్మించాడు. ఆయన మరో కెమెరామెన్ అయిన రసూల్ ఎల్లోర్ సోదరి మైకేలాను వివాహం చేసుకున్నాడు.[2] వారికి ఒక కుమారుడు సందీప్, కుమార్తె సంధ్య ఉన్నారు. సందీప్ కూడా కెమెరామెన్ గా పనిచేస్తున్నాడు.[1]

కెరీర్
1968 లో చెన్నైలోని వీనస్ స్టూడియోలో ప్రముఖ ఛాయాగ్రాహకుడు వి. ఎస్. ఆర్. స్వామి దగ్గర సహాయకుడిగా ఆయన కెరీర్ ప్రారంభమైంది. సినీ పరిశ్రమలో ప్రవేశించిన కొత్తలో అనేక తెలుపు-నలుపు చిత్రాలకు పనిచేశాడు.1979 లో ఆయనకు సినిమాటోగ్రాఫర్ గా పేరు వచ్చింది. తరువాత 1980 వ దశకంలో అనేక తెలుగు, బాలీవుడ్ సినిమాలకు పనిచేశాడు. 1980 వ దశకంలో అమితాబ్ బచ్చన్ నటించిన ఆఖరీ రాస్తా, ఇంక్విలాబ్, సూర్యవంశీ మొదలైన సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశాడు. తరువాత 1990 వ దశకంలో అజయ్ దేవగణ్, సైఫ్ ఆలీ ఖాన్ నటించిన కచ్చే ధాగే సినిమా కూడా ఆయనకు పేరు తెచ్చిన చిత్రం. ఆయన మొత్తం 150 సినిమాలకు పైగా పనిచేస్తే అందులో నాగార్జున కథానాయకుడిగా నటించినవి 15 సినిమాలున్నాయి.

క్షణక్షణం, దొంగాట, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ఆయన నిర్మాతగా పేరు తెచ్చిన సినిమాలు. రవితేజ హీరోగా నటించిన, తమిళ సినిమాకు రీమేక్ అయిన నా ఆటోగ్రాఫ్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు.

ఛాయాగ్రాహకుడిగా
· చిన్నబ్బాయి (1997)[3]

· పోలీస్ లాకప్ (1993)

· 335-నటుడు ,కిలాడి సినీ నిర్మాత –ఏడిద శ్రీరాం

· ఏడిద శ్రీరాం తెలుగు చలన చిత్ర నటుడు, నిర్మాత. ఇతను పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అనే సంస్థ ద్వారా కొన్ని ఉన్నత ఆశయాలు గల తెలుగు సినిమాలను నిర్మించిన నిర్మాత ఏడిద నాగేశ్వరరావు చిన్న కుమారుడు

జీవిత విశేషాలు
అతను డిగ్రీ వరకు చదివాడు. స్వరకల్పన సినిమా చేస్తున్న సమయంలో శ్రీలక్ష్మితో వివాహం 1989 అక్టోబరు 5న జరిగింది. అతను నటుడిగా కొనసాగుతూనే సీరియల్స్ వైపు పయనించాడు. తరువాత అతను కన్‌స్ట్రక్షన్ రంగంలో అడుగు పెట్టాడు. అతనికి ఒక కుమార్తె శ్రీజ ఉంది. [1]

సినిమాలు
నిర్మాతగా
· కిలాడి [2]

· కేడి [3]

· వీరి వీరి గుమ్మడి పండు [4]

నటునిగా
· శంకరాభరణం[5]

· సాగరసంగమం[6]

· సీతాకోక చిలుక [7]

· సితార (1983)[8]

· స్వాతిముత్యం [9]

· స్వరకల్పన (1989)[10]

· శంభో శంకర (2018)

· వీరి వీరి గుమ్మడి పండు [4]

· మిస్టర్ ఎర్రబాబు [11]

· తెలంగాణ దేవుడు (2021

· సశేషం

· మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -26-10-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం .17 భాగం26.10 .22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం .17 భాగం26.10 .22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

సరసభారతి 168 వ కార్యక్రమం (సినీనటులు శ్రీ సుబ్బరాయశర్మ గారి జీవన సాఫల్య పురస్కార ప్రధాన వేడుక ఆహ్వానం)

సరసభారతి 168 వ కార్యక్రమం (సినీనటులు శ్రీ సుబ్బరాయశర్మ గారి జీవన సాఫల్య పురస్కార ప్రధాన వేడుక ఆహ్వానం)

Video link

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

హాస్యానందం54- నవ్య సాహిత్యం లో హాస్యం

హాస్యానందం
54- నవ్య సాహిత్యం లో హాస్యం
నవ్య సాహిత్యమంటే ఇరవై వ శతాబ్దిలో పుట్టిన సాహిత్యం .నవ్య సాహిత్యానికి పితామహుడు కందుకూరి .చిలకమర్తీ ,పానుగంటి ఈయన సమకాలికులు .ఈ ముగ్గురుహాస్యరచయితలే.చిలకమర్తి వారిహాస్యం ‘’మడి’’వదల్లెదన్నారు మునిమాణిక్యం .నవలలో హాస్యపు చెణుకులున్నాయి .వీరి మందపాలుడు సంస్కృతతనాటకాలలో విదూషకుని సంతతి వాడే అన్నారుమాస్టారు .వీరి గణపతి అనాకారితనం ,అసభ్యపనులు చూసి నవ్వుతాం .కానీ అది సభ్యతా హాస్యంకాదన్నారు గురూజీ .హాస్యంలో ప్రతిభా ప్రదర్శన మృగ్యం అన్నారు .
వేదం వారి హాస్యం తురకభాషా సంపర్కం తో ‘’మైలపడింది ‘’అన్నారు సార్..మనహాస్యం తురకం నేర్చున్నట్లు కనబడుతుంది .దానితో ఆహాస్యం తెలుగుకాకుండా, మనదికాకుండా పోయిందని తేల్చారు .గురజాడ హాస్యం ఇంగ్లీష్ సంపర్కం తో మైలపడి ,అదీ మనదికాదేమో అనిపిస్తు౦దన్నారు .కన్యాశుల్కం కొందడు భట్టీయాలలో ఇంగ్లీష్ సంపర్కం లేని హాస్య కుశాలమైన పరిహాస భాశితమైన ఘట్టాలులేకపోలేదన్నారు .ముదిగొండ వీరభద్రమూర్తి గారు రాసిన ‘సువర్ణ ధార ‘’కావ్యం హాస్య రచనకాదుకానీ ,కొన్ని ఘట్టాలు హాస్యాశ్రయం కలవి . మార్కండేయం అనే పద్యకావ్యంలో బహు సున్నితహాస్యాన్ని కవి సాధించాడు ,గుప్తంగా దాచిన బంగారు నగలా ఉంది .మార్కండేయుడికి చివరిఘడియలు వచ్చాయి .యమధర్మరాజే స్వయంగా వచ్చి పాశం వేశాడు .అప్పుడు కవి ‘’పాశ బంధిత కంఠుండాబాలకుండు పలికె’’నో దండధర నన్ బలిమిన్ గట్టి కొంచు బో దలచితే కోవిదుడవు .రాను ఫో .శివపూజ పూర్ణమగు వరకు ‘అ౦టాడుకవి ఇందులోహాస్యం పైకి కనబడదన్నారుమాస్టారు .అంతభయంకారాకార భారీ శాల్తీ వస్తే భయపడకుండఈ నాలుగేళ్ల చిన్నిపిల్లాడు ‘’రాను ఫో ‘’అన్నాడుకనుక నవ్వొస్తుంది .అందులోని అసంగత్వం అసహజత్వం హాస్య హేతువులయ్యాయన్నారు మునిశ్రీ .నిజంగా యముడికి సెన్సాఫ్ హ్యూమర్ ఉంటె పసివాడు తన్ను సవాల్ చేయటం ఏమిటని నవ్వి ఊరుకోవాలి .అలాచేయకుండా కోపం తెచ్చుకోవటం హస్యస్ఫోరకమే అయింది కుర్రడిపై యముడికోపమూ అనుచితమే .అనుచితం ఎప్పుడూ నవ్వు పుట్టిస్తు౦దన్నారు సార్.యముడు ‘’ఇప్పటికే నీపూజలు పూర్తవాల్సింది.ఇప్పటికే చాలాలస్యమయింది ‘’అన్నాడు .తనతో సమానమైన వాడితో అనాల్సినమాటలవి. కుర్రకుంకతో అనాల్సినవికావు అంటారు మునిమాణిక్యం .ఏకళన ఉన్నాడో యముడు దున్నపోతుదిగి వస్తుంటే గురుడిలో ఏదో మార్పు గమనించిన మృకండ సూతి ‘’నా వంటి భక్తుణ్ణి హి౦సిస్తావా ?చస్తావురా అబ్బాయ్ ‘’అన్నాడు ఈ క్షీర కంఠడు లోకపాలకునికినీతి బోధించటం మరీ హాస్యాస్పదం అని తేల్చారు సార్.అంతటితో ఊరుకోక యముడిని ‘’మహిష వాహనా ‘’అన్నాడు అంటే ఇంత బుద్ధిలేని వాడివా అని అర్ధం. తనకు ఆమాటకు మాస్టారికి ఫక్కున నవ్వోచ్చిందట .అప్పుడాబాలుడు ‘’నీతోమాట్లాడటానికి నాకు తీరికలేదు ‘’అంటాడు .ఎంతధీమా ?ఈ సామాన్యుడుఒక అసామన్యుడిని అంత మాట అనటం పూర్తిగా హాస్యాస్పదమే అన్నారు మునిమాణిక్యం .
యముడు గమ్మున ఊరుకొంటే బాగుండేది .’’నేను ఎంత గొప్పవాడినో తెలుసా అని తనడబ్బా తాను బాగా వాయి౦చు కొని ‘’అట్టి ప్రతాపవంతుని ,మహాత్ముని నన్ను తృణీకరిస్తావా చిట్టెముగట్టు భక్తిగల జిట్టెడ బొట్టెడ ‘’అన్నాడు. తనగొప్ప తానె చెప్పుకోవాల్సిన అవస్థ వచ్చినందుకు మనకు నవ్వూ జాలీ వస్తాయి .ఆతర్వాత ఆబొట్టెడు యముణ్ణి ‘’పదంబు రావడి ఎత్తి దండధరు బోర ఫెడీలున ‘’తన్నాడు .ఆతన్నుకు యముడు ఒరిగి నిలబడి నెత్తురు కక్కుకొన్నాడు .ఇదంతా శివ మాహాత్మ్యం అనుకోండి .ఆతర్వాత గ్రంథకర్త ఒక విసురు విసుర్తాడు ‘’నెత్తురులను గ్రక్కుచు యముడు దోరెను దున్నయు బారెనయ్యడన్ ‘’యముడు చచ్చాడట ,దున్న మాత్రం పారిపోయిందట. ఇవన్నీ తనకు విపరీతంగా నవ్వు పుట్టి౦చాయని మునిమాణిక్యం నరసి౦హారావుగారు చెప్పారు ..
మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25-10-22-ఉయ్యూరు

Posted in రచనలు | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 16వ భాగం.25.10.22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 16వ భాగం.25.10.22

Posted in రచనలు | Leave a comment

సార్ధకమైన కోపూరి శ్రీనివాస్ స్మారక సింగిల్ పేజీకథలు

సార్ధకమైన కోపూరి శ్రీనివాస్ స్మారక సింగిల్ పేజీ కథలు

ప్రముఖ రచయిత్రి ,కవి శ్రీమతి కోపూరి పుష్పాదేవి దంపతల కుమారుడు శ్రీనివాస్ మరణాన్ని తట్టుకొని అతని స్మారకం గా సింగిల్ పేజీ కథలపోటీ నిర్వహించి బహుమతులు అందించి ఆ కథలను రమ్యభారతి ‘’ఆగస్ట్ –అక్టోబర్ ‘ప్రత్యేక సంచికగా తీసుకురావటం, శ్రీనివాస్ ఆత్మకు గొప్ప శాంతిని చేకూర్చి ఉంటుంది .ఈ కథల విశేషాలు సింగిల్ వాక్యాలలో మీముందుంచుతున్నాను .

  మొదటి బహుమతిమరీదు వేణు పొందిన  కథ –ఒకరిప్ తోసరి .ప్రేమ పిచ్చి ఒకడిని పాతాళంలోకి నెడితే ఆమెను అమెరికా పంపింది .కరోనాతో అతడు చనిపోతే ఆమెకు తెలిసి వాట్సాప్ లో ‘’రిప్ ‘’పెట్టి,లిప్ మూసుకొని  సరిపుచ్చింది ప్రేమ ఒకరికి త్యాగం మరొకరికి భోగం అయింది .అది పొందలేని ప్రతివారిదీ దీర్ఘరోగమేఅయింది .

జి .రంగబాబు కథ’’అసలైన పూజ ‘’రెండవ బహుమతి పొందింది .ప్రతిదీ ఫోటోలు వీడియోలు తీసి పోస్ట్ చేసి బుర్రల్ని కంగాళీ చేయటం వెర్రితనం. అది భక్తి విషయంలో ముదిరి అతి అయితే, కొడుకే ‘’మనసు ముఖ్యంకాని మన భక్తి మనకు ముఖ్యం ‘’అని బుద్ధి చెబితే ఆర్ధం చేసుకుని తనకళ్ళు తెరిపించిన కొడుకును అభినందించింది కన్నతల్లి.

పాణ్యం దత్త శర్మ రాసిన ‘’నేను వస్తలేను’’కథ మూడవ బహుమతి పొందింది .హజ్ యాత్రకు మొహనత్ చేసి కమాయించిన  డబ్బుతోనే వెళ్లాలని ఖుర్ ఆన్  చెప్పిందని ,ప్రభుత్వం డబ్బుతో పంపే యాత్రకు ‘’నేను వస్తలేను ‘’  అని చెప్పిన ముస్లిం పెద్దాయన ,ఆయన మనసు అర్ధం చేసుకొన్న కొడుకుఅభినందనీయులనిపిస్తారు .

  తర్వాతవన్నీ ప్రోత్సాహక బహుమతులు పొందిన కథలు .విరిగిపోయిన బొమ్మలో అమ్మ ఉందని బొమ్మకొన్న అమ్మలేని పిల్ల ,నల్లగా ఉ౦డేకుర్రాడు చానళ్ళ  ప్రభావంతో తెల్లబడటానికి పాలలో వాషింగ్ పౌడర్ కలిపితాగటం ,’’నాభర్తా,పిల్లలు చల్లగా ఉండాలి ‘’అనిడైరీలో అన్నిపెజీల్లో అమ్మరాసిన వాక్యాలు పేర్చిన అన్నం మెతుకుల్లా ఉండటం ,అమ్మా నాన్నల్ని  ఇంకో ఫామిలీ గా లెక్కపెట్టే ఇల్లు అద్దెకు వద్దన్నఅతని మాటకు ఓనరమ్మ అమెరికాలో ఉన్న కొడుకుకుటుంబం  ఫోటో చూసి ,కన్నపేగు కదిలినట్లు౦డటం ,నిజమైన సాహసం సెల్ఫీకాదు ప్రాణాలను కాపాడేవారిదే ,ముఖ్యంగా మన సైనికులది అని ,ప్రాణదానానికి ఉపయోగపడే రక్తానికి కులం అడ్డురాదని ,తెగించే దా ‘’రుణదాతలు ‘’గురించి తెలిసి అండగా ఉంటామన్న మెసేజ్ లు ,ఎవరో ఎప్పుడో రాసి ప్రసిద్ధి చెందినకథను శీర్షికమార్చి పత్రికకు పంపెసాహసి ,పని మనిషి రోగం కనుక్కొని జీత౦తో పాటు మందులూ కొనిచ్చి తనకు పెరిగిన జీతం ఇకనుంచి ఆ అమ్మాయికే  ఖర్చు పెడతానన్న యజమానురాలు .ఇవన్నీ ఆయా కథలలోని దినుసులు .మనసునచ్చే విషయాలు .సామాజిక అంశాలు .

 మొదటి మూడు బహుమతులు తో పాటు ప్రోత్సాహక బహుమతులు పొందినవారికీ ,ఎంపిక చేసిన సమర్ధులకు ,బహుమతి ప్రదానం చేసిన పుష్పాదేవి దంపతులకు ,ఇదంతా ప్రత్యేక సంచికలో పొందుపరచిన రమ్యభారతి సంపాదకుడు చలపాక ప్రకాష్ కు అభినందనలు .ఇదంతా ఈ సంచికలో ముఖ్యభాగమైన ప్రధాన ఆకర్షణ.

తర్వాత పుస్తకాల సమీక్ష,నానీలు ,సాహిత్య సమాచారం ,పాఠకుల చర్చ ,ఎందరో మహానుభావులు ,మంచికథలవలన మంచి సమాజం వస్తుందనే బిక్కునూరి వ్యాసం ,సాహితీ సభల సమాచార చిత్రాలు ,హైకూలు నానీలు ,అడిగోపులకవిత ,వంశీ స్వర్ణోత్సవ కథా సంకలనం పై చలపాక సమీక్ష తోపాటు ముఖ చిత్రంగా ఈయేటి కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డ్ గ్రహీతలు లతో సంచిక ఆకర్షణీయంగా,విజ్ఞాన దాయకంగా  ఉంది .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25-10-22-ఉయ్యూరు  

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -331

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -331

331-మీర్జాపురం రాజా ,కృష్ణ వేణి దంపతులకుమార్తే ,,చక్రధారి అనుబంధం నిర్మాత లక్ష్మీ కంబైన్స్ అధినేత్రి –ఎన్.అనూరాధా దేవి

ఎన్. అనూరాధాదేవి తెలుగు చలనచిత్ర నిర్మాత. బహుకొద్దిమంది మహిళా నిర్మాతలలో ఈవిడ ఒకరు. ఈమె మూడు తరాల హీరోలతో చిత్రాలను నిర్మించింది. ఈమె నిర్మించిన సినిమాలలో 80 శాతం విజయవంతమై స
జీవిత విశేషాలు
ఈమె 1947, అక్టోబరు 24న విజయవాడలో జన్మించింది. ఈమె తండ్రి శోభనాచల పిక్చర్స్ అధినేత మిర్జాపురం రాజాగా ప్రసిద్ధులైన రాజా వెంకట్రామ అప్పారావు. ఈమె తల్లి సుప్రసిద్ధ నటి, నిర్మాత సి.కృష్ణవేణి. ఈమె మద్రాసులోని గుడ్ షెపర్డ్ స్కూలులో ఎనిమిదవ తరగతి వరకు చదివింది. ఆ తరువాత ఈమెకు చదువు అబ్బకపోవడంతో అంతటితో ఆపివేసింది. ఈమెకు 1967లో వరంగల్లు వాస్తవ్యుడు నంగనూరు శ్రీనివాసరావుతో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు అమ్మాయిలు పుట్టారు. ఈమె భర్త 2005లో మరణించాడు[1].

సినిమా నిర్మాణం
ఈమె తండ్రి మీర్జాపురం రాజా తన తరువాత కూడా చలనచిత్ర నిర్మాణ రంగ కార్యకలాపాలు కొనసాగాలనే ఉద్దేశంతో ఈమెను నిర్మాతగా కొనసాగమని కోరాడు. అతనే లక్ష్మీ ఫిలిమ్స్ కంబైన్స్ అనే బ్యానరు పేరు పెట్టాడు. ఈమె మొదట కన్నడ భాషలో రాజ్‌కుమార్ హీరోగా భక్త కుంబార అనే సినిమాను కలర్‌లో నిర్మించింది. ఈ సినిమా 1974లో విడుదలయ్యింది. తరువాత ఈ సినిమానే తెలుగులో చక్రధారి పేరుతో అక్కినేని నాగేశ్వరరావు కథానాయకుడిగా రీమేక్ చేసింది. ఆ తరువాత హిందీలో హిట్ అయిన సినిమా “సమాధి”ని నిండు మనిషి పేరుతో నిర్మించింది. ఈ సినిమాలో శోభన్ బాబు ద్విపాత్రాభినయం చేశాడు. ఆ తరువాత ఈమె అక్కినేని నాగేశ్వరరావు, మురళీమోహన్, చిరంజీవి, వడ్డే నవీన్, అబ్బాస్, రవితేజ, జె.డి.చక్రవర్తి మొదలైన హీరోలతో, దాసరి నారాయణరావు, ఎ.కోదండరామిరెడ్డి, సి.వి.శ్రీధర్, టి.ఎల్.వి.ప్రసాద్ వంటి దర్శకులతో ఎన్నో విజయవంతమైన సినిమాలను నిర్మించింది.

సినిమాల జాబితా
ఈమె నిర్మాతగా లక్ష్మీ ఫిలిం కంబైన్స్ బ్యానర్‌పై తెలుగులో నిర్మించిన సినిమాల పాక్షిక జాబితా:

  1. చక్రధారి (1977)
  2. నిండు మనిషి (1978)
  3. రావణుడే రాముడైతే (1979)
  4. శ్రీవారి ముచ్చట్లు (1981)
  5. రాముడు కాదు కృష్ణుడు (1983)
  6. అనుబంధం (1984)
  7. ఆలయదీపం (1985)
  8. ఇల్లాలే దేవత (1985)
  9. ప్రియా ఓ ప్రియా (1997)
  10. ప్రేమించేమనసు (1999)
  11. మా పెళ్ళికి రండి (2000)

క్సెస్‌ఫుల్ నిర్మాతగా పేరు సంపాదించుకుంది.

332-తెలుగు ,కన్నడ చిత్ర నిర్మాత ,తోడూ నీడా సినీ ఫేం –ఎన్.నిత్యానంద భట్

ఎన్.నిత్యానంద్ భట్ చలనచిత్ర నిర్మాత.

జీవిత విశేషాలు
ఇతడు 1935 అక్టోబర్ 2న నైనిటాల్‌లో జన్మించాడు. చదువు పూర్తయ్యాక, ఢిల్లీలో చమ్రియా టాకీ డిస్ట్రిబ్యూటర్ల బ్రాంచిలో కొంతకాలం పనిచేశాడు. ఆ సంస్థ అధినేత మోతీలాల్‌కు కార్యదర్శిగా 1954 నుంచి 1959 వరకూ వ్యవహరించాడు. 1960లో విజయవాడ చమ్రియా టాకీ బ్రాంచి మేనేజర్‌గా ఉద్యోగం నిర్వర్తించి, అక్కడి నుంచి వైదొలగిన తరువాత నిర్మాతగా మారాడు. తన స్నేహితుడు ఎ.రామిరెడ్డితో కలిసి విజయభట్ మూవీస్ పతాకంపై 1965లో ఎన్.‌టి.ఆర్., భానుమతి, జమునల కాంబినేషన్‌లో ‘తోడూ- నీడ’ సినిమాను ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో రూపొందించాడు[1].

ఫిల్మోగ్రఫీ
ఎన్.ఎన్.భట్ నిర్మించిన కొన్ని సినిమాలు:

తెలుగు
· తోడూ నీడా (1965)

· సుఖదుఃఖాలు (1967)

· భలే రంగడు (1969)

· సుగుణసుందరి కథ (1970)

· మూగ ప్రేమ (1971)

కన్నడ
· అత్తెగొందు కాల సొసెగొందు కాల (1968)

· శ్రీ రేణుకాదేవి మహాత్మె (1977)

· వీరాధివీర (1985)

· ఈ జీవ నినగాగి (1986)

· జీవనజ్యోతి (1987)

· ఒందాగిబాళు (1989)

· రెడీమేడ్ గండ (1991

· 333-సామాజిక చైతన్య సినీ నిర్మాత ,,శ్రీరాములయ్య ,జైబోలో తెలంగాణా నిర్మాత ,నటుడు ,నంది అవార్డీ,ఆస్కార్ స్క్రీనింగ్ కమిటి సభ్యుడు ,తెలంగాణా సినీ చేంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ –నిమ్మల శంకర్

·

నిమ్మల శంకర్ తెలుగు చలనచిత్ర దర్శకుడు, నిర్మాత, రచయిత. జయం మనదే రా వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. కమర్షియల్ మెయిన్‌ స్ట్రీమ్ ఫార్మాట్‌లోనే తనదైన కమిట్‌మెంట్‌తో సామాజిక చైతన్యం కలిగించే చిత్రాలను రూపొందించాడు. 2011లో శంకర్ తీసిన జై బోలో తెలంగాణ సినిమా ఐదు నంది అవార్డులను గెలుచుకుంది. 2011 సెప్టెంబరులో గోవాలో జరిగిన 6వ దక్షిణాసియా చలన చిత్రోత్సవంలో [1][2] ప్రదర్శించబడింది.

జననం
గురువయ్య, సక్కుబాయమ్మ దంపతులకు నల్గొండ జిల్లా, మాడుగులపల్లి మండలంలోని చిరుమర్తి గ్రామంలో 1968 అక్టోబర్ 3 నా జన్మించాడు .[3]

సినీరంగం
దర్శకుడిగా
1997లో ఎన్‌కౌంటర్ సినిమాతో కెరీర్ మొదలుపెట్టి శ్రీరాములయ్య, జయం మనదేరా,[4][5] భద్రాచలం వంటి సినిమాలతో మంచి దర్శకుడిగా పేరు సాధించారు. ఇక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో సమకాలీన పరిణామల, తెలంగాణ ఉద్యమం, విద్యార్థుల ఆత్మహత్యలు, కేంద్ర ప్రభుత్వ వైఖరిను కథగా అల్లుకుని ఆయన తీసిన ‘జై బోలో తెలంగాణా’ సినిమా ‘మినియేచర్ ఆఫ్ ఎ మూమెంట్’గా ప్రశంసలు అందుకుంది.

తెలుగు

  1. 2 కంట్రీస్ (2017)[6][7]
  2. జై బోలో తెలంగాణా – (04.02.2011)
  3. రామ్ -(30 మార్చి 2006)
  4. ఆయుధం -(2003)
  5. భద్రాచలం – (2001)
  6. జయం మనదేరా -(07.10.2000)
  7. యమజాతకుడు – (1999)
  8. శ్రీరాములయ్య – (28.09.1999)
  9. ఎన్‌కౌంటర్ – (14.08.97)

కన్నడ

  1. నమ్మణ్ణ (2005)

నటుడిగా
రామ్‌కీ హీరోగా, కత్తి మహేష్ దర్శకత్వంలో రూపొందిన రిపోర్టర్ మూవీ ద్వారా ఆయన నటుడిగా పరిచయమయ్యాడు.

అవార్డులు
నంది అవార్డులు
· 2011 లో సరోజినిదేవి ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రం – జై బోలో తెలంగాణా, ఉత్తమ దర్శకుడు – ఎన్.శంకర్‌ కు అవార్డు, ఉత్తమ నేపథ్య గాయకుడు – గద్దర్.

పదవులు
· ఆస్కార్‌ స్క్రీనింగ్‌ కమిటీ సభ్యునిగా

· నంది పురస్కార కమిటీకి రెండుసార్లు సభ్యునిగా, ఒకసారి అధ్యక్షునిగా (2010)

· గోవా ఫిలిం ఫెస్టివల్‌ (2009), జాతీయ సినిమా అకాడమీ (2003) పురస్కారాల జ్యూరీకి సభ్యునిగా

· తెలంగాణ సినిమా చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంటుగా (2013)

· తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షులు (2

· సశేషం

· మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -25-10-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

హాస్యానందం 53- పూర్వ సాహిత్యం లో హాస్యం -3

హాస్యానందం

53- పూర్వ సాహిత్యం లో హాస్యం -3

 ప్రబంధాలలో

ఏ రసమైనా ఆభాస రూపం హాస్య కారణ మౌతుంది .మను చరిత్రలో వరూధిని అలాకావాల్సి ఉంది .కానీ కాలేదు పారిజాతాపహరణం లో సత్య, కృష్ణుని నారదుడికి దానం చేస్తుంది .అతని బరువు ఎంతో అంతధనం ఇచ్చి తిరిగిపొం.దాలి ఇదీ హాస్యం పుట్టించే చోటే కాని కవి అలా చేయలేదు భగవంతుడిని అపహాస్యం చేయలేడుకవి .ఉదాత్త విషయాలను తేలిక తనం తో పరామిర్శించటం తగనిపని అని ప్రబంధకవులు దాని జోలికి పోలేదు అన్నారు మునిమాణిక్యం మాస్టారు .పూర్వకవుల నవ్వుటాలకు అనే మాటల్నికూడా పెదవి బిగబట్టి గంభీరంగా అ౦ టారేకాని తేలికగా అనరు .అది మడి కట్టిన హాస్యం అన్నారు బాధగా మాస్టారు .శశి రేఖా పరిణయం లో ఘటోత్కచుని మాయవలన లక్ష్మణకుమారుడికి శశిరేఖ కుందేలుగా, పిల్లిగా ,కోతిగా  భల్లూకం గా పాముగా కనిపిస్తుంది .నిజానికి ఇవన్నీ హాస్య జనకాలే .

 చంద్ర లేఖా విలాపం లో హాస్యముందని అ౦టారుకాని అందులో జుగుప్సాకరమైన వర్ణనలు చాలాఉన్నాయన్నారు గురూజీ ‘’పళ్ళు తోమడు .గుద ప్రక్షాళన చేయడు ‘’వంటివి .ఆపుస్తకం చదివి నవ్వుతాముకానీ ,అది వికారం తెప్పించేదేకాని నిర్మలమైన నవ్వు కాదన్నారు సార్.తర్వాత వచ్చిన రావణ దమ్మీయం అధిక్షేపకావ్యం హాస్యజనకం అన్నారని మాస్టారు చెప్పారు .

శతకాలు

చంద్ర శేఖర శతకం పామరుల భాషలో రాయబడింది .పామరుల నోళ్ళలో వికృతిపొందిన శబ్దాలను కవి ఉపయోగించాడు .వాటి సుస్వరూపం వెంటనే మనకు గుర్తుకురాదు .ఇది శబ్దాశ్రయహాస్యం .పుస్తకం అంతాఒకే తీరులో ఉండటంతో విసుగుపుట్టి పది పద్యాలతర్వాత చదవలేము అన్నారు మునిమాణిక్యం .ఈ భాషా వైపరీత్యం కొత్తదనాన్ని పోగొడుతుంది .చదవాలనే ఆసక్తీ నశిస్తు౦దన్నారు అనుభవంతో మునిజీ .

 సింహాద్రి నారసి౦హ శతకం  ,ఆంద్ర నాయక శతకం హాస్యాన్ని అందిస్తాయి జానపద గీతాలలోనూ హాస్యం ఉందన్నారు డా రామరాజుగారు .వదినా మరదళ్ళ  మధ్య ,అత్తా కోడళ్ళమధ్య జరిగే సంభాషణలలో కావలసినంత హాస్యం ఉందని ,దాన్ని ఎవరూ పోగు చేయలేదని ,చాలావరకు గాలికి కొట్టుకు పోగా ,కొంతవరకు జానపద సాహిత్యం లో ఇరుక్కుంది అని రామరాజుగారన్నారని మస్టారువాచ .పాతకాలపు పాటల్లోనూ హాస్యం ఉంది .మొత్తం మీద పూర్వ సాహిత్యం లో హాస్యం తక్కువే అని అంగీకరించాలి .గొప్పకవులేవరూ హాస్యం జోలికి పోలేదన్నారు మునిమాణిక్యంగారు .

  మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -24-10-22-ఉయ్యూరు —

Posted in రచనలు | Tagged | Leave a comment

విజయ విలాసం.15వ భాగం.24.10.22 గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు

విజయ విలాసం.15వ భాగం.24.10.22 గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

దీపావళి భిక్ష

స్వాతంత్రం రాకముందు స్కూల్స్ నడవడానికి దసరా మామూలు లాగా దీపావళి భిక్ష జరిగింది  అని తెలుస్తోంది

ప్రజలు దీపావళి అతిగా ఖర్చు పెట్టకుండా భారతీయులు స్థాపించి నడుపుతున్న  బడులు, ఆశ్రమాలు  దీపావళి భిక్ష రూపం లో స్వీకరించి రసీదులు ఇచ్చేది. దసరా నుంచి దీపావళి వరకూ మూడు వారాలు జరిపినట్లు తెలుస్తోంది 

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కాంగ్రెస్ పిలుపు మేరకు ప్రతి గ్రామ, ఊరు, పట్టణాల్లో ప్రతి ఇంటికి వెళ్లి భిక్షలు  జరిగినట్లు తెలుస్తోంది. ఒక ఏడాది స్కూల్ నిర్వహణకు, విద్యార్థులకు కావలసిన ఫీజులు మొత్తం సేకరించేవారు. 

స్వాతత్రం వచ్చిన తరువాత దీపావళి భిక్షలు ఆగిపోయాయి అందువల్ల తరువాతి తరాలకు దీపావళి భిక్షలు అసలు తెలియదు 

Posted in సమయం - సందర్భం | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం థనం.15వ భాగం.24.10.22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం థనం.15వ భాగం.24.10.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -328

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -328
328-కర్తవ్యమ్ సినీ నిర్మాత –ఎ.ఎం.రత్నం
ఏ.ఎం.రత్నం (ఆంగ్లం: A. M. Rathnam) దక్షిణ భారతదేశానికి చెందిన సినీనిర్మాత. ఇతడు మొదట సినిమారంగంలో మేకప్ ఆర్టిస్ట్‌గా ప్రవేశించి తరువాత నిర్మాతగా మారారు. కొన్ని చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. ఇతను శ్రీ సూర్య మూవీస్ అనే సినీ నిర్మాణ సంస్థను స్థపించి తెలుగు, తమిళ చిత్రాలను నిర్మిస్తున్నారు. నిర్మాతగా ఇతని మొదటి సినిమా విజయశాంతి ప్రధాన పాత్రలో వచ్చిన కర్తవ్యం. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.
ఇతని కుమారులు జ్యోతి కృష్ణ, రవికృష్ణలు కూడా సినీరంగంలోనే ఉన్నారు.
తెలుగు సినిమాలు
• ధర్మ యుద్ధం (1989)
• కర్తవ్యం (1990)
• పెద్దరికం (1992) – దర్శకత్వం
• సంకల్పం (1995) – దర్శకత్వం
• భారతీయుడు (1996)
• ఒకే ఒక్కడు (1999)
• ప్రేమికులరోజు (1999)
• స్నేహం కోసం (1999)
• ఖుషి (2001)
• నాగ (2003)
• 7G బృందావన్ కాలనీ (2004)
• బంగారం (2006)
• నీ మనసు నాకు తెలుసు
329–శ్రీరంజని కుమారుడు స్క్రీన్ ప్లే రచయితా సహాయ దర్శకుడు ,,ప్రమీలార్జు నీయం దర్శకుడు –ఎం.మల్లికార్జున రావు
ఎం.మల్లికార్జునరావు తెలుగు చలనచిత్ర దర్శకుడు. ఇతడు ప్రముఖనటి శ్రీరంజని (సీనియర్) కుమారుడు.29-
జీవిత విశేషాలు
ఎం.మల్లికార్జునరావు 1923లో గుంటూరు జిల్లా, మురికిపూడి గ్రామంలో శ్రీరంజని, కె.నాగమణి దంపతులకు జన్మించాడు. ఇతడు ప్రాథమిక విద్యను నరసారావుపేటలో ఉన్నత విద్యను గుంటూరులో అభ్యసించాడు. ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూపులో పూర్తి చేశాడు. ఇతడు గుంటూరు హిందూ కాలేజీలో చదివినప్పుడు గుమ్మడి వెంకటేశ్వరరావు ఇతని సహాధ్యాయి. అదే సమయంలో ఎ.సి.కాలేజీలో నందమూరి తారకరామారావు, కొంగర జగ్గయ్య, కె.వి.ఎస్‌.శర్మ మొదలైన వారు చదివేవారు. ప్రతి యేటా జరిగే అంతర్ కళాశాల నాటకపోటీలలో ఈ యువకళాకారులు అందరూ కలిసి నాటకాలు వేసేవారు. “నాయకురాలు” నాటకంలో ఎన్.టి.ఆర్. నలగామరాజు పాత్ర ధరించగా, ఇతడు బాలచంద్రుని వేషం వేశాడు. ఈ నాటకాన్ని మాధవపెద్ది గోఖలే దర్శకత్వం వహించాడు. ఇంకా ఇతడు విద్యార్థి దశలోనే వసంతసేన, పిచ్చిరాజు, విప్లవం వంటి నాటకాలలో అనేక పాత్రలను ధరించాడు. హిస్ట్రానిక్స్ సొసైటీ సెక్రెటరీగా అనేక సేవలను అందజేశాడు[1].
సినీరంగ ప్రస్థానం
తన తల్లి శ్రీరంజని (సీనియర్) ను సినిమా రంగానికి పరిచయం చేసిన పి.పుల్లయ్యనే ఇతడిని గొల్లభామ సినిమాలో కథానాయకి కొడుకు పాత్రలో నటుడిగా తొలి అవకాశం ఇచ్చాడు. కె.వి.రెడ్డి ఇతడిని నాగిరెడ్డి, చక్రపాణిలకు పరిచయం చేయడంతో విజయా సంస్థలో పర్మనెంట్ ఆర్టిస్ట్‌గా తీసుకోబడ్డాడు. పెళ్ళిచేసిచూడు సినిమాలో ఎల్.వి.ప్రసాద్ క్రింద సహాయదర్శకునిగా ఇతనికి తొలి అవకాశం వచ్చింది. తరువాత ఆ సంస్థలో చంద్రహారం సినిమా వరకూ అన్ని చిత్రాలకు సహాయ దర్శకునిగా పనిచేశాడు. అలాగే అమరసందేశం సినిమాలో ఆదుర్తి సుబ్బారావు వద్ద, పెంకి పెళ్ళాం సినిమాలో కమలాకర కామేశ్వరరావు వద్ద, సతీ అనసూయ చిత్రంలో కడారు నాగభూషణం వద్ద, రక్త సంబంధం సినిమాలో వి.మధుసూధనరావు వద్ద పనిచేశాడు. చిత్రపరిశ్రమలోని అన్ని శాఖలలోను పనిచేసి మెలకువలను తెలుసుకున్నాడు. తన తల్లి పేరుమీద స్థాపించిన ఎస్.ఆర్.మూవీస్ పతాకం మీద నిర్మించిన ప్రమీలార్జునీయం సినిమా ద్వారా ఇతడు దర్శకునిగా పరిచయమయ్యాడు.
చిత్రాల జాబితా
• దర్శకుడిగా:
1. తండ్రీ కొడుకుల ఛాలెంజ్ (1987)
2. రగిలే హృదయాలు (1980)
3. దొంగల దోపిడీ (1978)
4. మనుషులు చేసిన దొంగలు (1977)
5. బంధంగల్ బంధంగల్ (1976) (మలయాళం)
6. రక్త సంబంధాలు (1975)
7. పట్టాభిషేకం (1974)
8. కండవరుండో (1972) (మలయాళం)
9. కోడలు పిల్ల (1972)
10. బందిపోటు భీమన్న (1969)
11. చెల్లెలి కోసం (1968)
12. గూఢచారి 116 (1967)
13. అందరికి మొనగాడు (1971)
14. ముహూర్త బలం (1969)
15. ప్రమీలార్జునీయం (1965)
• నిర్మాతగా:
1. సితార (1980)
• రచయితగా:
1. చెల్లెలి కోసం (రచయిత)
2. ప్రమీలార్జునీయం (స్క్రీన్ ప్లే)
330-పార్లమెంట్ మెంబర్ ,నటుడు ,గీతాంజలి కరణం మల్లేశ్వరి సినీ నిర్మాత-ఎం.వి వి సత్యనారాయణ
ముళ్ళపూడి వీరవెంకట సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త, సినీ నిర్మాత.[2] అతను 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో విశాఖపట్నం లోక్‌సభ నుండి ఎంపీగా గెలిచాడు.[3][4
జననం, విద్యాభాస్యం
సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు లో 1966 జూన్ 25న రఘునాయకులు ముళ్ళపూడి, పర్వతా యర్ధనమ్మ దంపతులకు జన్మించాడు. అతను ఆంధ్ర యూనివర్సిటీ నుండి బీఏ పూర్తి చేశాడు. 1997లో ఎంవీవీ బిల్డర్స్ సంస్థను స్థాపించాడు. అతను విశాఖ బిల్డర్స్‌ అసోసియేషన్‌కు రెండుసార్లు చైర్మన్‌గా వ్యవహరించాడు.[5][6]
సినీ జీవితం
ఎంవీవీ సత్యనారాయణ ఎం.వి.వి.సినిమా బ్యానర్ పై తెలుగు, కన్నడలో పలు సినిమాలను నిర్మించాడు. [7]
నిర్మించిన సినిమాలు
1. గీతాంజలి (2014) [8]
2. అభినేత్రి (2015)
3. శంకరాభరణం (2015)
4. లక్కున్నోడు (2017)
5. నీవెవరో (2018)
6. కవచ (కన్నడ – 2019)
7. కరణం మల్లేశ్వరి బయోపిక్ (2021)
నటుడిగా
1. శంకరాభరణం (2015)
2. లక్కున్నోడు (2017)
రాజకీయ జీవితం
ఎంవీవీ సత్యనారాయణ 2012లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి విశాఖ లోక్‌సభ కో ఆర్డినేటర్‌గా నియమితుడయ్యాడు. అతను 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుండి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎం.భరత్ పై 4414 ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలిచాడు.[9] అతనిని 2019 సెప్టెంబరు 15న ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా నియమించాడు.[10]
సశేషం
దీపావళి శుభ కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-10-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

హాస్యానందం 32- పూర్వ సాహిత్యం లో హాస్యం -2

హాస్యానందం

52- పూర్వ సాహిత్యం లో హాస్యం -2

భారతంలో భీముడు సౌగ౦ధికాహరణం కోసంపోతుంటే దారిలో హనుమ దారికి అడ్డంగా ఉంటె లెమ్మనమని అంటే, ముసలికోతిని లేవలేను నువ్వే ఎత్తి అడ్డం తొలగించుకోమంటే, భీముడు విశ్వ ప్రయత్నం చేసి తోకనుకూడా కదల్చ లేకపోయాడు .హనుమ మహా బలశాలి అని చెప్పటమే కవి ఉద్దేశ్యం. ఇది పరమ సత్యం .అతిశయోక్తికాదు .ఆదృష్టిలో ఇందులో హాస్యం లేదు .తోక ఎత్తకపోతే నవ్వేది పిల్లలు మాత్రమె .ఇందులో వికృతి, అసందర్భం లేనే లేవన్నారు మునిమాణిక్యం .

  తెలుగులో ఉత్తమకవులెవరూ హాస్యాన్ని పోషిస్తూ రచనలు చేయలేదు .అక్కడక్కడ కొన్ని చెణుకులున్నా,అది ఉత్తమ హాస్యం కాదు .నన్నయ భీముని వర్ణించే ఘట్టం లో రాసిన పద్యంలో హాస్య చాయలు కనిపిస్తాయన్నారు మాస్టారు .పదేళ్ళ భీముడిని ఎత్తుకొని కుంతీ దేవగృహానికి వెడుతుంటే ,పులిఎదురైతె భయపడి పసివాడిన జారవిడిస్తే ఒకరాతిపై పడితే ఆరాయి ముక్కలు చెక్కలయింది .బకాసుర వధ సందర్భంలో భీముడిని పంపే ఈవిషయం లో కుంతీదేవి ఈ సంగతి బయట పెట్టి ‘’వీడు పుట్టిన పదియవనాడు పెలుచ బడియె .నా చేతినుండి యప్పర్వతమున బడిన వాడి జేసి బాలకు నొడలుదాకి యాక్షణ౦ బ రాఎల్ల నుగ్గయ్యే జూవె ‘’అని అక్కడి బ్రాహ్మణ కుటుంబానికి చెప్పింది .ఈ సన్నివేశం నవ్వు పుట్టి౦చెదె కాని హాస్యంకోసం కవి రాయలేదు .భీరువు దీరుడిగా వృద్ధుడు యువకుడిలా మాట్లాడితే నవ్వు వస్తుంది .అంటే అసహజత్వం ఉంటేనే నవ్వు వస్తుంది అన్నారు గురూజీ .భీముడు బండెడు అన్నం తినటమూ నవ్వు పుట్టి౦చేదికాదు. ఒక వేళ నవ్వినా అది ఆశ్చర్యానికి  సంబంధించింది అన్నారు  మునిమాణిక్యం .

 పిల్లలమఱ్ఱి పినవీర భద్రుడు జైమిని భారతం లో ఉద్దాలకుని కధలో భార్యకు భర్త ఏమాట చెప్పినా వ్యతిరేకం గా  చేస్తుంది .మదడిధొవతి తెమ్మంటే సగం చింపి ఇస్తుంది .జపమాలిక ఇమ్మంటే తెంపి ఇస్తుంది .అతిధులు వస్తే గౌరవించమంటే అగౌరవం చేస్తుంది .ఇవన్నీ హాస్య జనకాలే. గౌరన హరిశ్చంద్రోపాఖ్యానంలో  కలహ కంఠి చండిక కూడా ఇదేరకం .ఆమె మాటల్లో హాస్యం వెతుక్కొంటే దొరకచ్చు అని మునిమాణిక్యం గారువాచ .

  మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో

 సశేషం

రేపు నరకచతుర్దశి ,దీపావళి శుభా కాంక్షలతో

Posted in రచనలు | Leave a comment

విజయ విలాసం 14వ భాగం.,23.10.22

విజయ విలాసం 14వ భాగం.,23.10.22

విజయ విలాసం 14వ భాగం.,23.10.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ధర్మవీర పండిత లేఖరాం

ధర్మవీర పండిత లేఖరాం

సికందరాబాద్ శ్రీ గాయత్రీ ఆశ్రమ ట్రస్ట్ అనేక సిద్ధాంత ,నీతి గ్రంధాలు ,మహాపురుషుల జీవిత చరిత్రలు ప్రచురిస్తూ 25వ కుసుమంగా ధర్మవీర పండిత లేఖరాం గారి జీవిత ప్రచురించింది .బలిదానం లో ‘’వీర తృతీయ ‘’గా ఉన్న లేఖరాం తన 39సంవత్సరాలజీవితం లో 20ఏళ్ళు వైదిక ధర్మ ప్రచారానికే అంకితం చేశారు .35వ ఏట వివాహమాడి ,అయిదేళ్ళయినా వివాహ జీవితం గడపని నిరంతర కార్యశీలి. ధర్మపత్ని లక్ష్మీదేవి కూడా త్యాగమయ జీవితం గడిపిన ఆదర్శ మహిళ.భయం ఎరుగని మేరునగధీరుడు లేఖరాం నేటి తరానికి ప్రేరణగా నిలిచారు .ఈమహామహుని జీవిత చరిత్రను హిందీలో త్రిలోక చంద్ర విశారద రాస్తే ,శ్రీ సంధ్యావందనం శ్రీనివాసరావు తెలుగు అనువాదం చేశారు .1997లో ప్రచురింపబడిన ఈపుస్తకం ఖరీదు 3 రూపాయలు .

     రావల్పిండి జిల్లా పోఠోహార్ లో ,ఇప్పుడుగురుకులాలున్న చోట లేఖరాం వంశస్తులు ఉండేవారు .తాత మహతా నారాయణ్ సింహ్ తండ్రి సయ్యద్ పురగ్రామం లో స్థిరపడ్డాడు .ఈగ్రామం జీలం జిల్లా లో చక్వాల్ తాలూకాకు సుమారు 10కిలోమీటర్లదూరంలో ఎత్తైన కొండలమీద ఉంది .ఇక్కడే లేఖరాం జన్మించాడు .మూడువైపులా వర్షాకాల నదులు ప్రవహిస్తాయి. అయన శారీరక మానసిక స్థితిపై ఇవి గొప్ప ప్రభావం చూపాయి .దృఢమైన శరీరం ,తీవ్రమైన ఆలోచనలు ఆయనవి .

   జననం

లేఖరాం తాత కు మహతా తారాసి౦హ్ ,మహతా గండా సింహ్ అనే ఇద్దరుకొడుకులు .తారా సింహ ముగ్గురు కుమారులలో లేఖరాం 1859లో జన్మించాడు .ఇండియాలో ఆంగ్లసామ్రాజ్య స్థాపన తర్వాత ప్రజలనుంచి ఆయుధాలు లాగేసుకొన్నారు .ఆంగ్లేయులకు స్వయంగా ఆయుధాలు అప్పగించటం అవమానంగా భావించి వాటిని  పూంచ్ రాజ్యానికి తీసుకు వెళ్లి అమ్మేశారు .శ్యాం సిన్హ బ్రహ్మచారి. సిక్కు సామ్రాజ్యపతనం తర్వాత సాధువుగా మారాడు .దీనిప్రభావం లేఖరాం పై పడింది .

  విద్యాభ్యాసం జీవితం

ఆరేళ్ళ వయసులో లేఖరాం తండ్రి గ్రామపాఠలలో పార్సేఉర్దూ లు నేర్చాడు .చలాకీ కుర్రాడు . ,ఒకసారి విద్యాశాఖాధికారి వస్తే తన బుద్ధిబలం ప్రదర్శి౦చి ,అనెకబహుమానాలు పొందాడు .పెషావర్ లో ఉన్న పినతండ్రి  దగ్గరకు 11వ ఏట వెళ్ళాడు .ఆయన ఇతని విద్యకోసం ఒక ముస్లిం ఉపాధ్యాయుడిని నియమించాడు .ఆయన ముస్లిం భావాలు వ్యాప్తి చేస్తూడటం నచ్చక మానేశాడు .పినతండ్రి బదిలీ అయిన ప్రతి సారీ చదువుకు విఘాతకలిగి,చదువుసాగనందున స్వగ్రామానికి పంపెశాడుపినతండ్రి.14వ ఏట మళ్ళీ గ్రామపాఠశాలలో  చేరి చదివాడు .హెడ్ మాస్టర్ ఇతనిపై మంచి అభిమానం చూపేవాడు .

  ఇతడు చొక్కా గుండీలుసరిగ్గా పెట్టుకోనేవాడుకాదు .టోపీ ఊడినా సరి చేసుకొనేవాడుకాదు .ప్రతివిషయం చదివి స్వయంగా గ్రహించేవాడు  .కవిత్వంపై మక్కువకలిగింది .

పోలీసు ఉద్యోగం

21-12-1875న పెషావర్ లో పోలీసు ఉద్యోగంలో17వ ఏట  చేరి ,అయిదేళ్ళు పని చేశాడు .మనసు నిరంతర౦ ఈశ్వర లగ్నమై ఉండటం వలన ఉద్యోగం మానేశాడు .నిత్యభజనలు చేసే సిక్కు సిపాయి ప్రభావం ఇతనిపై పదడి ,నిర౦తర ఈశ్వరోపాసనలో గడిపాడు .నిత్యం గీత చదివేవాడు .శ్రీ కృష్ణునిపై అమిత భక్తి ఏర్పడింది .కృష్ణ నామ జపం అర్ధసహిత౦ గా  చేసేవాడు .ఉద్యోగం మానేసి బృందావనం చేరాడు .

  వైదిక ధర్మం వైపు దృష్టి మరలటం

  క్రమంగా అన్నిమతాలపై ప్రేమ భావం కలిగింది .పంజాబ్ సంఘ సంస్కర్త కన్హయాలాల్  అలక్ ధారి పుస్తకాలు చదివి మహర్షి దయానంద రచనలతో  పరిచయమేర్పడింది .అద్వైతం కనుమరుగైంది .మహర్షి గ్రంథాల అధ్యయనం చేసి వైదికధర్మ సేవకుడైనాడు

  పెషావర్ లో ఆర్య సమాజం

పండిత లేఖరాం ఆర్య సమాజ సిద్ధాంతాలపై జీవించాలని నిర్ణయించుకొన్నాడు .1880లో పెషావర్ లో ఆర్య సమాజాన్ని స్థాపింఛి ,మాయీ రంజీ ధర్మశాలలో ఉన్నాడు .దైనిక సమావేశాలు జరుపుతూ ధర్మాన్ని ప్రచారం చేశాడు .

  మహర్షి దర్శనం

దయానందసారస్వతం  చదివినప్పటినుంచీ ఆయన్ను ఎప్పుడు దర్శిస్తానా అని తహతహ లాడేవాడు .ఒక నెల సెలవు తీసుకొని అజ్మీర్ లో సేఠ్ ఫతెమల్ దేవిడీలో మహర్షిదయానందుని దర్శించాడు .వ్యాపక పదార్దాలైన ఆకాశం ,బ్రహ్మతత్వం ఒకే స్థానంలో ఎలాఉ౦టాయి  అని ఋషిని అడిగితె, ఆయన ఒకరాయిని చూపించి అందులో అగ్ని, మట్టి, పరమాత్మ ఉన్నాయాలేదా అని అడిగి ఒకసూక్ష్మ వస్తువు ఒక స్థూల వస్తువులో వ్యాపించి ఉంటుంది అని చెప్పగా పరమానందం పొందాడు లేఖరాం .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -23-10-22-ఉయ్యూరు  

Posted in మహానుభావులు | Leave a comment

నరక చతుర్దశి, దీపావళి ,కార్తీక మాస శుభా కాంక్షలు

నరక చతుర్దశి, దీపావళి ,కార్తీక మాస శుభా కాంక్షలు

 సాహితీ బంధువులకు -రేపు 24-10-22 సోమవారం నరక చతుర్దశి ,దీపావళి ,26-10-22బుధవారం నుండి ప్రారంభమయ్యే పవిత్ర కార్తీకమాస శుభా కాంక్షలు -దుర్గాప్రసాద్ -23-10-22 

 సాహితీ బంధువులకు -రేపు 24-10-22 సోమవారం నరక చతుర్దశి ,దీపావళి ,26-10-22బుధవారం నుండి ప్రారంభమయ్యే పవిత్ర కార్తీకమాస శుభా కాంక్షలు -దుర్గాప్రసాద్ -23-10-22 

Posted in సమయం - సందర్భం | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం .14వ భాగం.23.10.22బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం .14వ భాగం.23.10.22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం .14వ భాగం.23.10.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -326

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -326
• 326-బిజినెస్ మాన్ ,పైసా సినీ నిర్మాత ,ఓపెన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటి గౌరవ డాక్టరేట్ –ఆర్ ఆర్.వెంకట్
• ఆర్.ఆర్.వెంకట్ తెలుగు సినిమా నిర్మాత. ఆయన పూర్తి పేరు జె.వి. వెంకట్‌ ఫణీంద్రా రెడ్డి. వెంకట్ ఆర్.ఆర్.మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఆంధ్రావాలా, కిక్, ప్రేమ కావాలి, డాన్ శీను, మిరపకాయ్, బిజినెస్‌మెన్ , డమరుకం, పైసా వంటి సినిమాలను నిర్మించి, అనేక సినిమాలను డిస్టిబ్యూషన్ చేసి, తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్‌ల్లో సినిమాలు నిర్మించాడు. వెంకట్ 2011లో సామాజిక కార్యకర్తగా చేసిన కృషికి కొలంబో విశ్వవిద్యాలయంలో కాంప్లిమెంటరీ మెడిసిన్స్ కోసం ఓపెన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్నాడు.
సినీ జీవితం
ఆర్ఆర్ వెంకట్ హిందీలో 2004లో ఏక్ హసీనా తి, 2012లో ‘డివోర్స్‌ ఇన్విటేషన్‌’ ఇంగ్లీష్ సినిమాను నిర్మించాడు. 1997లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో శ్రీకాంత్, రమ్యకృష్ణ నటించిన తెలుగులో ఆహ్వనం పేరుతో రిలీజ్ అయిన సినిమాను ఇంగ్లీష్‌లో డైవర్స్‌ ఇన్విటేషన్‌ పేరుతో రీమేక్ చేశాడు.
నిర్మించిన సినిమాలు
• పైసా (2013)
• ఆటోనగర్ సూర్య (2013)
• డమరుకం (2012)
• లవ్‌లీ (2012)
• పూలరంగడు (2012)
• డివోర్స్ ఇన్విటేషన్ (ఇంగ్లీష్ – 2012)
• బిజినెస్‌మెన్ (2012)
• మిరపకాయ్ (2011)
• డాన్ శీను (2010)
• ప్రేమ కావాలి (2010)
• కిక్ (2009)
• బహుమతి (2007)
• గుండమ్మగారి మనవడు (2007)
• విక్టరీ (సినిమా) (2008)
• మాయాజాలం (2006)
• జేమ్స్ (హిందీ – 2005)
• ఏక్ హసీనా తి (హిందీ – 2004)
• ఆంధ్రావాలా (2004)
• సామాన్యుడు (2006)
మరణం
వెంకట్ కొన్ని రోజులుగా కీడ్ని సంబంధిత వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్‏, గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‏లో 27 సెప్టెంబర్ 2021న మరణించాడు.[1][2][3]
• 327-చివరకి మిగిలేదిచిత్రనిర్మాత తెలంగాణా రాష్ట్ర రాజకీయ కురు వృద్ధుడు ,మాజీ మంత్రి –ఉప్పునూతల పురుషోత్తమరెడ్డి
• మాజీ మంత్రి, రాజకీయ కురువృద్దుడుగా పేరొందిన ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి (1933 – ఆగష్టు 3, 2013) హైదరాబాదు రాష్ట్రానికి చెందిన తొలితరం కాంగ్రెస్ నాయకులలో ఒకరు
జననం
ఈయన యాదాద్రి – భువనగిరి జిల్లా, మోత్కూరు మండలం అడ్డగూడూర్ గ్రామంలో 1933లో జన్మించారు.
ఉప్పునూతల రాజకీయ ప్రస్ధానం
ఈయన చిన్ననాటి నుంచి రాజకీయాల్లో చురుగ్గాపాల్గొని మంచినేతగా గుర్తింపు పొందారు. స్వంత గ్రామమైన అడ్డగూడూరులో సర్పంచ్‌ పదవి తో రాజకీయం ప్రారంభమైంది. రెండుసార్లు శాసనసభ సభ్యుడిగా, రెండుసార్లు శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. డెయిరీ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ గా, ఏపీఐఐసీకి ఛైర్మన్ గా, తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలికి ఛైర్మన్ గా పనిచేశారు. వీరు 1947 లో కాంగ్రెస్ లో చేరారు. హైదరాబాద్ రాష్ట్ర విమోచనా ఉద్యమమంలో నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు. 1957 లో ఆంధ్ర ప్రదేశ్ లో స్నేహపూరిత వాతావరణం కొరకు సుహృద్భావ సందేశం పేరిట యాత్ర నిర్వహించారు. 1969 లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 1969 నుండి 1972 వరకు చిన్న నీటి వనరుల శాఖ మంత్రిగా పనిచేసి, 1974 నుండి 1977 వరకు అబ్కారీ, గనుల శాఖ మంత్రిలో పనిచేశారు.
ఆ తర్వాత మోత్కూర్‌ సమితి ప్రెసిడెంట్‌గా పనిచేశాడు. రాజకీయాల్లో అనేక ఒడిదొడుకులు ఎదుర్కోని మరీ ముందడుగు వేసి తన సత్తాను చాటుకున్నాడు. ఢిల్లీ కాంగ్రెస్‌ పెద్దల లాబీయింగ్‌తో రాష్ట్రంలో రాజకీయాలను శాశించాడు. సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం కలిగిన ఆయన తనదైన శైలిలో ముందుకు సాగి అందరి మన్ననలు పొందాడు. తెలంగాణవాదిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. రాష్ట్ర కాంగ్రెస్‌లో ఎలాంటి నేతనైనా వ్యతిరేకించే వ్యక్తిగా ఆయనకు పేరుంది. రెండుసార్లు శాసన సభ్యులుగా, ఒక సారి ఎమ్మెల్సీగా పనిచేశాడు. ఎమ్మెల్సీగా ఉన్న కాలంలో 1973లో ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రి వర్గంలో ఓడరేవుల మంత్రిగా, జలగం వెంగళరావు మంత్రి వర్గంలో ఎక్సైజ్‌శాఖ మంత్రిగా పనిచేశారు.
రాజకీయాల్లో చక్రం తిప్పిన కురువృద్దులు.. జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో తనదైనముద్ర వేసుకున్న నేత.. జిల్లాలో తిరుగులేని కాంగ్రెస్‌ నాయకులు.. ఢిల్లి పెద్దల లాబీయింగ్‌తో కాంగ్రెస్‌లో ఒకవెలుగు వెలిగిన సీనియర్‌ నేత.. పేరున్న తెలంగాణ వాది.. ఇలా సుదీర్ఘరాజకీయ అనుభవం గడించి రాజకీయ భీష్మాచార్యుడిగా పేరొందారు. మాజీ ముఖ్యమంత్రులు కోట్ల విజయభాస్కరరెడ్డి, నేదురుమల్లి జనార్ధనరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, జలగం వెంగళరావుతో సన్నిహిత సంబంధాలు కలిగిన నేతగా జిల్లాలో చక్రం తిప్పారు. రెండు పర్యాయాలు శాసన సభ్యులుగా, ఒక సారి ఎమ్మెల్సీగా, మంత్రిగా పనిచేసి జిల్లా రాజకీయాలను శాసించారు.
జిల్లా కాంగ్రెస్‌లో మంచి క్యాడర్‌ను సంపాదించుకొని ఆయన తన వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడు డిసిసి అధ్యక్షుడుగా ఉన్న చకిలం శ్రీనివాసరావు, పురుషోత్తంరెడ్డికి వైరం ఉండేది. పురుషోత్తంరెడ్డికి టికెట్‌ రాకుండా మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు ఆశీస్సులతో శ్రీనివాసరావు అడ్డుకోవడంతో జీర్ణించుకోలేని ఆయన వ్యతిరేక శిబిరాన్ని నడిపాడు. పోటీ డిసిసిని ఏర్పాటు చేసి గిరిజననేత ధీరావత్‌ రాగ్యా నాయక్‌ను అధ్యక్షుడుగా ఎంపికచేశారు. అప్పటి నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం చురుగ్గా సాగింది. 1999, 2004 మినహా కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఏనాడు పొందలేదు. ఇండిపెండెంట్‌గా, రెబల్‌ అభ్యర్థిగా పోటీచేసి సిపిఐ చేతిలో ఓటమిపాలయ్యారు. అయినా వెనుతిరగని నేతగా ముందుకు సాగి రెండుసార్లు టికెట్‌ పొంది విజయం సాధించారు. దివంగత సిఎం వై.యస్. రాజశేఖరరెడ్డి క్యాబినేట్‌లో మంత్రి పదవి దక్కించుకునేందుకు పలుమార్లు ప్రయత్నించారు. అయితే కురువృద్దులైన గాదె వెంకట్‌రెడ్డి, ఎం.సత్యనారాయణరావు లను మంత్రి వర్గంలోకి తీసుకొని ఈయనకు మొండిచేయి చూపించారు. ప్రత్యేక తెలంగాణ వాదిగా గుర్తింపు ఉండడంతో గమనించిన వైఎస్‌ తెలంగాణ ప్రాంతీయ మండలి చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించారు. ఆ పదవిలో కొన్ని రోజులు పనిచేశారు. కోట్ల విజయభాస్కరరెడ్డి, నేదురుమల్లి జనార్ధనరెడ్డితో ఉన్న సన్నిహిత సంబంధాలతో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి వ్యతిరేకిగా ఉన్నారు. నియోజకవర్గాల పునర్విభజనలో రామన్నపేట నియోజకవర్గం నకిరేకల్‌ నియోజకవర్గం లోకి మారింది. ఆ నియోజకవర్గాన్ని ఎస్‌సిలకు కేటాయించారు. దీంతో పురుషోత్తంరెడ్డి భువనగిరి, ఆలేరు లలో ఏదో నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. కాని చివరకు తప్పుకొని తన అనుచరగణంగా ముద్రపడిన చింతల వెంకటేశ్వరరెడ్డికి భువనగిరి, బూడిద భిక్షమయ్య గౌడ్‌కు ఆలేరు శాసన సభ్యులుగా టికెట్‌ ఇప్పించారు. వారి గెలుపుకోసం తీవ్రంగా ప్రయత్నించినా భిక్షమయ్యగౌడ్‌ గెలవడం, చింతల ఓటమిపాలయ్యారు.
వైకాపా పార్టీ
రాజకీయ చివరిలో, ఆరోగ్యం క్షీణిస్తున్న సమయంలో కాంగ్రెస్‌లో చక్రం తిప్పిన ఉప్పునూతల 2012 వ సంవత్సరంలో వైకాసా పార్టీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి చేరారు. కాంగ్రెస్‌ శాసన సభ్యులు బూడిద భిక్షమయ్యగౌడ్‌, చింతలతో కొంత విభేదాలు తలెత్తడంతో ఆయన వారిని వ్యతిరేకించి పార్టీ మారారు. వైఎస్‌కు వ్యతిరేకిగా ఉన్న ఆయన విభేదాలతో వైఎస్‌ఆర్‌ సిపి తీర్థం పుచ్చుకోక తప్పలేదు. పార్టీలో చేరినా చురుగ్గా రాజకీయాల్లో పాల్గొనలేక పోయారు.
నిర్మాతతో సినీ పరిచయం
సినీ రంగంలో కూడా ఆయనకు పరిచయాలు ఉన్నాయి. చివరకు మిగిలేది చిత్రాన్ని సావిత్రితో తీసి నిర్మాతగా సినీరంగంలో పరిచయం పొందారు. అప్పట్లో ఆ చిత్రానికి విశేష ఆదరణ పొంది నంది అవార్డు కూడా లభించింది. అయితే ఒకే ఒక సినిమా తీసి రాజకీయంపై ఉన్న మమకారంతో సినీ రంగానికి దూరమయ్యారు.
మరణం
గత కొంతకాలంగా అస్వస్ధతతో బాధపడుతూ హైదరాబాదు‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2013, ఆగష్టు 3 న, 80 సంవత్సరాల వయస్సులో తుది శ్వాస వదిలారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
  సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -23-10-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

హాస్యానందం 51- పూర్వ సాహిత్యం లో హాస్యం51- పూర్వ సాహిత్యం లో హాస్యం

హాస్యానందం

51- పూర్వ సాహిత్యం లో హాస్యం

మనపూర్వులు హాస్యాన్ని చిన్న చూపు చూశారు .ఉత్తమహాస్యం అంటే ఏమిటో తెలుసుకొన్నారుకానీ ఆదరించలేదు .వారి హాస్యం చదివితే ఊహ ఇంతవరకే పోయిందా ,మనోహర హాస్యం దొరకలేదా అనిపిస్తుంది అని బాధపడ్డారు మునిమాణిక్యం గారు .నరసభూపాలీయంలో హాస్యానికి ఒక ఉదాహరణ ఇచ్చారు –నరసభూపాలుడు వస్తున్నాడని శత్రుసైనికులు పరిగెత్తి గుర్రాలను ఎక్కారట .ఆతొ౦దర, భయం లో గుర్రాలతోకవైపు ముఖం పెట్టి కూర్చుని దౌడు తీశారట .నవ్వు వస్తు౦దికాని ఇది ఉత్తమహాస్యం కాదన్నారు మాస్టారు .

ప్రతాపరుద్రీయం లో ఉదాహరణ –కొప్పులుపెట్టి కళ్ళకు కాటుకపెట్టి కృత్రిమ స్తనాలతో స్త్రీ వేషం ధరించి ప్రచ్చన్నంగా కాకతీయ ఆంధ్రనగర వీధుల్లో వెళ్ళే శత్రురాజుల్ని చూసి దుండగులు, విటులు వారి బట్టలూడదీసి కుచాలులాగి నీవిని తాకి హిహిహీ అని నవ్వారని హాస్యానికి ఉదాహరణ గా ఇచ్చారు .ఇదాహాస్యం అన్నారు గురూజీ .

రసగంగాధర౦ లో ‘’గోవు పృష్టభాగం దర్శనీయం .రాసభ పృష్టభాగం ఎందుకు దర్శనీయంకాడదు ?అని ఉదాహరణ.పేలవంగా జుగుప్సగా లేదా అంటారు మాస్టారు .రమణీయార్ధకంగా ఉండాలన్న కర్త ఇలా వెకిలి ఉదాహరణ ఇవ్వటం ఏమిటని బాధపడ్డారు .కనుక హాస్యానికికూడా కావ్య లక్షణాలు ఉండాలన్నారు సార్.జుగుప్సలేని సభ్యమైన రసజనకమైనచిత్తవృత్తిని కలిగించేది ఉత్తమహాస్యం అని నిర్వచించారు నరసింహారావు మాస్టారు

పూర్వకవులలో హాస్యం మృగ్యం కాదు కానీ చాలాతక్కువ .బహుశా హాస్యానికి ఆరోజుల్లో ఆదరణ లేకపోబట్టి ఆవైపుకు వెళ్లి ఉండరు .హాస్య శీలుడిని నటవిట విదూషకుల పాత్రలతో కలిపి కూర్చోబెట్టారు .అంటే పంక్తి బాహ్యుడిని చేశారన్నమాట అంతనీచంగా చూస్తె ఎవరు సాహసించి హాస్యం వండి వడ్డిస్తారు అన్నారు మాస్టారు .ఇంకోటి అనౌచిత్యం .కావాలని ఏకవీ అనౌచిత్యాన్నిప్రవేశ పెట్టడు .దాన్ని సవ్యంగా సరసంగా సుందరంగా చెప్పే ప్రయత్నం చేస్తాడు.డో౦క తిరుగుడుగా చెప్పి నవ్వించే ప్రయత్నం చేయడు అని వారి తరఫున వకాల్తా పుచ్చుకొన్నారు మాస్టారు .

పోనీ నాటకాలలో హాస్యం ఉందేమో అని వెతికితే ఆదిదొరకదు .పూర్వ పండితులుకవులూ హాస్యాన్ని గొల్లభాగోతులకు కేతిగాళ్ళకీ ,భండిక జనానికి గంధోలి గాళ్ళకు ఇచ్చేసి తాము గంభీర రచనలు చేశారు .నాటకపాత్రలూ హాస్యం మాట్లాడరు .నాయకుడుకానీ నాయిక కానీ చమత్కారంగా మాట్లాడరు అని నొచ్చుకొన్నారు.

మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్-22-10-22-ఉయ్యూరు

Posted in సమీక్ష | Tagged | Leave a comment

ఆచార్య సార్వభౌముల ‘’ఆశీతి తమ జన్మ దినోత్సవ ‘’కానుక –వ్యాస కదంబం

ఆచార్య సార్వభౌముల ‘’ఆశీతి తమ జన్మ దినోత్సవ ‘’కానుక –వ్యాస కదంబం
  ఆచార్య సార్వభౌమ బ్రహ్మశ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి 80 వ పుట్టిన రోజు సందర్భంగా సాహిత్యలోకానికి అపూర్వ కానుకగా షోడశ కళా ప్రపూర్ణ౦గా  తామువ్రాసిన 16 అమూల్య వ్యాస రత్నాలహారాన్నికూర్చి ,తమ భాషా శాస్త్ర బోధకులు ఆచార్య తూమాటి దొణప్ప గారికి అంకితమిచ్చి గురుభక్తిని ప్రదర్శింఛి ,నాకు ‘’ఆత్మీయత తో ‘’అ౦పి౦చగా ,నాలుగు రోజులక్రితం అంది, వెంటనే వాట్సాప్ మెసేజ్ ద్వారా ధన్యవాదాలు తెలియజేశాను .
  ఇందులో మొదటి అయిదు వ్యాసాలూ సాహిత్య శిరోమణులగురింఛి పరిచయంగా రాసినవి .తర్వాత నాలుగు సంస్కృత సాహిత్యానికి ,మిగిలినవి తెలుగు సాహిత్యానికి సంబంధించినవి . 
ఆచార్య పింగళి లక్ష్మీ కా౦త౦ గారిగురించిన పరిచయంలో గురువు చెళ్ళపిళ్ళ వారిచే కవిగా గుర్తింపబడిన సందర్భంలో చెప్పిన ‘’అ౦కిలిమాంచి భాగవతమౌ పలుకున్ వెలయించి ,పల్కులో వంకలు దీర్చి దిద్ది రసవంతం గా ‘’తీర్చితనను  దిద్దారని కొనియాడారు .ఆంధ్ర విశ్వ కళాపరిషదా౦ధ్ర శాఖా ధ్యక్ష పదవి ని అలంకరించటంలో వారిప్రతిభ సర్వతోముఖ వికాసం పొందింది .వారు నిర్ణయించిన పాఠ్యప్రణాళికలోని ఆంధ్రసాహిత్య చారిత్ర ,ప్రాచ్య పాశ్చాత్య సాహిత్య విమర్శన విధానం సంస్కృత సాహిత్య వ్యాకరణ పరిజ్ఞానం తెలుగులో ఛందో వ్యాకరణ అలంకార గ్రంథాధ్యయనం అయన వైదుష్యానికి నిదర్శనం .ఆయన ఘనుడు ,అల్పుడు అనే భేదం లేని శిష్యవాత్సల్యులు .గురువులకు ,దేవుడికి కాక ఇతరులకు మొక్కని వ్యక్తిత్వం కలవారు .వారికుమారులు తండ్రిగారి సాహిత్య వరివస్యపై ప్రసిద్ధ పండితులచే పరిశోధనాత్మక వ్యాసాలు  రాయించి ‘’రసజ్ఞ’’గా ముద్రించి పిత్రూణ౦  తీర్చు కొనటం ప్రశంసార్హమన్నారు .
ఆచార్య శిరోమణి శ్రీ గంటి జోగి సోమయాజి తెలుగు సాహిత్యాన్నిఅధ్యయనం చేసేటప్పుడు ,ఆ భాష పుట్టు పూర్వోత్తరాలు, పొందిన క్రమ పరిణామ వికాసం ప్రాధాన్యం వహిస్తుందని గుర్తించిన విలక్షణ  ప్రతిభాశాలి అని శ్లాఘించారు .విషయ సమగ్రత ,బోధనాపటిమ ఆయన విశిష్ట లక్షణాలు ఆంద్ర భాషా వికాసం బోధించటం ఆయనకు మహా అభిరుచి . కరతలామలకం.ప్రతి సూక్ష్మ విషయాన్నీ పరిశోధనాత్మకంగా దర్శిస్తారు .భాషాధ్యయనం ప్రత్యేకంగా చేయమని ప్రోద్బలం కలిగించగా శిష్యులు ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి ,ఆచార్య దొణప్ప,ఆచార్య పి.ఎస్.సుబ్రహ్మణ్యం, ఆచార్య చేకూరి రామారావు భాషా శాస్త్రంలో విశేష పరిశ్రమ చేసి లోక ప్రసిద్దులయ్యారని జ్ఞాపకం చేశారు .యూనివర్సిటీలోఅధ్యాపకులుగా ఉన్నప్పుడే వివిధ సంస్థలలో విశిష్ట సభ్యత్వం పొందటానికి కారణం ఆయన భాషా శాస్త్ర పరిజ్ఞానమే అన్నారు .ఆయనరాసిన  ‘’ఆంధ్ర భాషా వికాసం’’వెలుగులిచ్చే గొప్పకరదీపిక .తెలుగు ఉపన్యాసకునికి ఆంగ్ల,గణిత ,భౌతికాది శాస్త్ర బోధకులతో సమాన వేతనం పొందటానిముఖ్యులు సోమయాజిగారే అన్నారు .
అభినవ వాగనుశాసన శ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు ‘’వేలలో ఒకపండితుడు పుడతాడు ‘’అన్న ఆర్యోక్తికినిదర్శనం .తాను  రచించిన ‘’సంస్కృత వాజ్మయ చరిత్ర ‘’ను తమ గురుదేవులు నడిచే మహా విద్యాలయమైన’’కడి యెద్ద జన్మించి కాశికాపురికేగి శబ్దాది శాస్త్రాలు ‘’సంతరించిన బ్రహ్మశ్రీ చర్ల బ్రహ్మయ్య శాస్త్రిగారికి అంకితమిచ్చారు.ఆంధ్ర విశ్వ విద్యాలయం లో తెలుగు లో పండితపదవిలో రాణించారు .ఐ.పి.ఎస్.  పరీక్షాధికారిగా పని చేయటం వారి ధిషణకు తార్కాణ.సంస్కృతాంధ్రాలలో బహు గ్రంథాలు రాశారు .ఆంధ్ర భవిష్య రచనలో శ్రీనాథుని అనుకరిస్తూ తమ రచనా వ్యాసంగాన్ని పద్య నిబద్ధం చేసి –‘’తెనిగించి విదురనీతి బూర్తిగామున్ను –స్త్రీ ధర్మబోదినీ కృతి యొనర్చి ‘’—‘సురభారతిని ‘’బ్రహంసూత్రార్ధ దీపిక ‘’అంటూ తమరచనలనూ వాటితత్వాన్నీ సూత్రప్రాయంగా సూచించారని వేదులవారన్నారు .శాస్త్రిగారు పవిత్ర శీలురు స్వతంత్రులు .శిష్యవాత్సల్యం అపారం. అనేక పురస్కారాలు, రాజాస్థాన గౌరవాలు పొందారు .
చతురవచస్వి ,చారుమనస్వి ,చిరయశస్వి ఆచార్య యస్వీ జోగారావు  అనే శిష్ట్లా వేంకట జోగారావు  గారు ఆంధ్రవిశ్వ విద్యాలయ యశశ్చంద్రికలను నాల్గు దిక్కులా విస్తరింపజేశారు తండ్రిపై ‘’పంచ కల్యాణి ‘’కృతిలో పద్య ప్రశంస చేశారు .యక్షగాన వాజ్మయంపై విపుల పరిశోధన చేశారు .గురువులు కళాప్రపూర్ణ గంటి జోగి సోమయాజి గారి ని స్తుతిస్తూ –‘’బహుభాషాబహుశాస్త్ర బంధుర మహా వైదుష్య మత్యద్భుతావహ మేధావధి ‘’అన్నారు .లెక్చరర్ గా చేరి ప్రొఫెసర్ ,హెడ్ ఆఫ్ దిడిపార్ట్ మెంట్ గా 30 ఏళ్ళు  ఆంధ్రవిశ్వవిద్యాలయ౦  లో పని చేశారు .ఉత్తమ అధ్యాపక పురస్కారం పొందారు .సాహిత్యవిమర్శ బోధన మహ ఇష్టం. పద్య గేయ నృత్యనాటికలెన్నో రాశారు .’’నాది రసరాజ్యమార్గము ,ప్రాతయనిపించు సరికొత్త పదము నాది ‘అని చాటుకొన్నారు నిజంగా ఆయన ప్రతివాక్యమూ రసరమ్యమే అని నాకూ అని పించింది .ఆంధ్ర కావ్య మహాస్రష్టలలో  –నాకు నచ్చిన శిల్పులు నల్వురేను –తిక్కయజ్వ ,సూరన్న ,సుధీశ్వరుండు –విశ్వనాథ మహాకవి యస్విసుకవి ‘’అని తననుకూడా కలుపుకొని ‘’హలో భగవాన్ ‘’లో భంగ్యంతరంగా  చెప్పారు .లండన్ కెనడా మలేషియా సింగపూర్ సందర్శించారు తెలుగు అకాడెమి గవర్నర్ గా ఎన్నుకోబడ్డారు .మద్రాస్ తెలుగు అకాడెమి ,కేంద్ర సాహిత్యేకాడేమి లచే సత్కారం పొందారు .గుంటూరుజిల్లా రచయితల సహకార సంఘానికి అధ్యక్షులు రోటరీ డిస్ట్రిక్ట్ 315కి ఆస్థాన కవి .
బ్రాహ్మీ భూషణ రాంభట్ల లక్ష్మీ నారాయణ శాస్త్రిగారు మహావక్త ,పౌరాణిక పండితాగ్రగణ్యులు  .మురారి అనర్ఘ రాఘవాన్ని అనువదించారు .ఆయన రచనా వ్యాసంగం బహుముఖీయం బహు శ్లాఘనీయం అన్నారు .అపూర్వ కల్పనా సనాథనంగా ‘’ప్రతీక ‘’నాటకం వారి రచనాకౌశలాన్ని వెల్లడిస్తుంది .అహోబల పండితీయం కు రాంభట్ల వారి అనువాదం విద్వజ్జన సమాదరణీయం కాని ముద్రణ భాగ్యం పొందలేదని బాధపడ్డారు .వేదాంత మంత్ర శాస్త్ర గ్రంథాలను అనువదించి వ్యాఖ్యానించి స్వతంత్రంగా రచించిన శాస్త్రిగారు చిరస్మరణీయులు అన్నారు శ్రీ వేదుల .
  ఈ వ్యాసాలలో మనకు తెలియనివి వారికి అనుభవమైనవి ఎన్నో విషయాలు ఉటంకించారు వారిపై గౌరవం ఇనుమడింపజేశారు శాస్త్రిగారు
  తర్వాత సంస్కృత సాహిత్యానికి చెందిన సంస్క్రుతభాగవతం అవతారిక ,శ్రీదేవీ భాగవతం సంక్షిప్తపరిచయం ,ఊరుభంగ నాటకం భాసుని ఉపజ్ఞ ,స్వప్న వాసవదత్తం ,అభిజ్ఞాన శాకుంతలం రచనా సంవాదాలు ,.ఆతర్వాత తెలుగు సాహిత్యానికి చెందిన సాహిత్యాభిరుచి ,కవిత్వ తత్వ మీమాంస ,రుషి వంటికవి నన్నయ్య రెండవ వాల్మీకి ,తిక్కన్న శిల్పపు దెనుగు తోట ,హరివంశం ఎర్రన కవితా వైభవం ,దూబగుంట నారాయణకవి పంచతంత్రం ,మనుచరిత్రం మన చరిత్ర వ్యాసాలున్నాయి అన్నీ అన్నే .అన్నీ ఆచార్య సార్వభౌమ వేదులవారి సర్వతోముఖ పాండిత్యానికి విమర్శనానికి విశ్లేషణకు,బహుకాల బోధనా ధిషణకు  ,అనుభవానికి ప్రతీకలే  .చదివి ఆనంది౦చాల్సినవే. విజ్ఞానం పెంచుకోవాల్సినవే .వారి కలం తాకితే ఏ వ్యాసమైనా సువర్ణం కావాల్సిందే .వారికలం పరుసవేది .వారిగళ౦ సాహితీ పుంస్కోకిలం .చక్కని ముద్రణ ,దంపత్యుక్తమై అర్ధవంతమైన ముఖ చిత్రం పుస్తకానికి మరింత వన్నె తెచ్చాయి .
  ఆచార్య సార్వభౌమ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు   శతాధిక ఆయుర్దాయం తో ,దంపత్యుక్తంగా ఆరోగ్యంగా వర్ధిల్లుతూ ఇతోధిక సాహితీ సేవ చేస్తూ వారి ‘’శారదా పీఠం’’నిరంతర విజ్ఞాన తేజో పుంజాలను వెదజల్లాలని ఆశిస్తున్నాను .
   దీపావళి శుభా కాంక్షలతో
  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -23-10-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

విజయ విలాసం.13వ భాగం.22.10.22

విజయ విలాసం.13వ భాగం.22.10.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ శూన్య లింగ శతకం

శ్రీ శూన్య లింగ శతకం
కాకినాడ ఎల్ ఎఫ్ .సబ్ డివిజన్ ఆఫీస్ హెడ్ క్లార్క్ శ్రీ వోలేటి సుబ్బారావు గారు శ్రీ సీతారామా౦జనేయ సంవాద సార సంగ్రహ రూప ‘’శ్రీ శూన్య లింగ శతకం ‘’ ను రచించి ,అమలాపురం శ్రీ మారుతి ముద్రానిలయం లో ముద్రించారు .వెల-ఒక అణామాత్రమె .సంవత్సరం తెలుపలేదు .ప్రార్ధన సీస పద్యం లో –‘’ననునేల భయమేల నయశీల రావేల –చీటికిమాటికి మూల గ్రాలనేల ‘’అంటూ నెపం తో మొదలెట్టి ,గీతపద్యం లో –‘’పలుకవేల శ్రీలోల నన్ దలపవేల –సహజ యోగానంద జలధి లోల ‘’అని, రెండవ సీసం లో –‘’శ్రీరామ యని నిన్ను బ్రేమగా బిల్చెదనన్న –నామ రూపములు నాస్తి కన్న-వైకుంఠ నిను గాంచి వర్ధిల్లెద నటన్న –లోకాళితో బొత్తునీకు సున్న’’అని వ్యాజంతో అంటూ కానుకలిచ్చి ఘనత చెందుదామంటే కామాది వాసనలు కల్ల – భక్తితో ప్రణమిల్లుదామంటే ఒక్క చోటా నీకు కాలునిలువదాయే,పాహిమాం అందామంటే తలపులు కలలోని మాటలే –‘’సీతమ్మతో జెప్పి చెంత చేరెదనన్న –తలపదు నా మాట కలియనిన్ను ‘’అని గీతం లో –‘’నీవు నన్నెట్లు గాచేదో నిర్వికార –నయన పథచార రాగాది భయవిదూర –త్రిపుర సంహార యో వీర ధీర ధీర –భౌమ శబ్దార్ధ సువిచార స్వా విహార ‘’అని తన వేదాంత పరిజ్ఞానమంతా వలకబోసి, చెప్ప బోయేదానికి నాందీ ప్రస్తావనగా చేశారు .అసలు శతకమంతా గీత పద్యాలలో కూర్చి ‘’సుభగ పుష్ప భ్రు౦గ శూన్యలింగ ‘’అని మకుట కిరీటం పెట్టారు .
శతకాన్ని తారక యోగంతో ప్రారంభించి ‘’భక్తికలుగు పూజ పరమపదమునిచ్చు ‘’అంటూ ,కర్మ చేస్తే ముక్తి రాదు జ్ఞానమార్గంతో సద్గురునివలన చిత్తశుద్ధికలుగుతుంది .మూర్తి ఆరాధనతో శివుడిని కొలిస్తే ‘’మూర్తి విడిచి మూల మూర్తి తానౌను ‘’అన్న ఎరుక చెప్పారు .అణోరణీయాన్ మహతో మహీయాన్ ‘’అనే భావన చక్కని పద్యంలో కూర్చి ‘’శ్రుతులు కూడా నిన్ను నుతియి౦ప జాలవు ‘’అన్నారు .చిత్త శుద్ధి లేనిది ఏదీ సాధ్యం కాదు అని మరీ మరీ చెప్పారు .చిత్ర చిత్ర కళలు చిత్ర విభ్రమాలు –‘’పండు వెన్నెల తుది నిండి యున్న రూపులేనికళను రూపించి చూడు ‘’అన్నారు .ధీయోగి నాద సూత్రం తెలుసుకొని నాదలయం లో మోదించి నిలుస్తాడు’’.అవ్యక్త స్థితినే బిందు అంటారు .బుద్ధిని దాటితే అంతా పూర్ణమే.యోని లింగైక్యం శివుని చేరుస్తుంది .స్త్రీపురుషులు ఒక్కరవటమే ‘’పరగ నద్వైతము ‘’’’మరుని క్రతువుకన్నా మారులేదు ‘’.’’సతిని గూడ ముక్తి –సతిని వీడితెబంధం ‘’ హఠంలో అష్ట సిద్ధులు కల్గుతాయి .యోగం అభ్యసించి భోగం వదిలితే మనసు చిక్క బట్టితే అంతా ఆనుకూల్యమే .
తర్వాత సాంఖ్యయోగం వివరించారు –‘’సృష్టిజాడ సృష్టికర్తకేతెలుసు –శ్రుతులు భిన్నరూపంగా చెప్పాయి .’’లేనిదాని నెట్లు లెక్కింప భయం ‘’దేనికి ?జగత్తు స్థూలం .తత్త్వం సూక్ష్మం.ఉన్నదానిను౦చేఉత్పత్తికాని, శూన్యంలో సృష్టి జరుగుతుందా ?తలిదండ్రిలేక సంతానం ఉంటుందా ?’’.కార్యజగము కాదు కారణాత్మ కాదు .చిత్రం ఏమిటో చెప్పలేము –‘’తెచ్చుకొన్న ముండ తిప్పలు పెట్టదా?’’అని నీతి చెప్పారు .’’దేహ సాక్షి అంటే దేహం తానూ అవటమే ‘’దృక్కు బ్రహ్మమౌను –దృశ్యంబు జగమౌను …సత్తు చిత్తూ సకలం తానె ‘’ ‘’
తర్వత ‘’అమనస్క యోగం ‘’వివరించారు –‘’మానసంబు చేత గానవచ్చు జగము –మనసు గలియకున్న గనుట లేదు –మనసే చూడటానికి దృశ్యజాలం అవుతుంది .మనసును తెలుసుకొన్న వారెవరూ లేరు .అన్నిటికీ మనస్సాక్షి ముఖ్యం .దినదినం లో సుషుప్తి తేజరిల్లుతుంది .జన్మజన్మాల మధ్యా చావు ఉంటుంది ..సహజ రాజయోగ సారమే మనిషి ..జగం వేరే కాదు జగమంతా బ్రహ్మమే .జగత్తు బ్రహ్మంలో పుట్టి బ్రహ్మ లో కలిసిపోతుంది .దేహంలోనే ముక్తి దేహాంతంలో కూడా ముక్తి –కనుక నేలవిడిచి సాము వద్దు ..తనను తానటంచు దగగాంచ ముక్తుడౌ.’’సార మెద్ది జ్ఞాన రూపం బెద్ది –యాదికాది కెద్ది యఖిల మెద్ది –యెద్దిబుద్ధి నడపునద్దియే బ్రహ్మంబు ‘’అని అసలు సూక్షం ఆవిష్కరించారు ‘’’తలప నీశు డౌను తత్పద వాచ్యంబు –తత్పరు౦డజుడు తత్పద లక్ష్యంబు ‘’బ్రహ్మాన్ని తెలిసినవాడు బ్రహ్మమే అవుతాడు –నువ్వు నేను లేని నిలకడ బ్రహ్మం ‘’అని ఉపనిషత్ ఉపదేశం అందించారు
99వ పద్యంలో –‘’సకల నిగమ రూప సారసంగ్రహ మూర్తి –యంగలింగ రూప లింగమూర్తి –సకల హృదయ గమ్య చైతన్య సత్కీర్తి –సుభగ పుష్పభ్రు౦గ శూన్యలింగ ‘’100వ చివరి పద్యం –‘’ఆశ్రిత జన రక్షణానంద సుముఖా౦గ -నిజ సులభ సుఖ జలనిధితరంగ –ద్వయ రహితసుభాంగ భావ వర్జిత సంగ –సుభగపుష్ప భ్రుంగశూన్య లింగ ‘’అని పూర్తిచేశారు ‘.
చివరలో గద్యం రాసి ‘’ఇది శ్రీ పరమేశ్వరీ పరమేశ్వరైక్య స్వరూప భూత ,విద్వాదనుభవ సిద్ధ సహజామనస్క –రాజయోగ సారామృత నిరంతర పానానంద విరాజిత ,నిముస కవి వంశ పారావార రాకాసుధాకర శ్రీ మల్లప రాజామాత్య శేఖర శ్రీ మత్సద్గురు చరణారవింద ,కరుణా కటాక్ష లబ్ధజ్ఞాన ,ఓలేటివంశ పవిత్ర శ్రీసూర్య నారాయణ మంత్రిపుత్ర శేషమాంబా శుక్తి ముక్తాఫల సుబ్బారాయ విరచిత శ్రీ సీతారామ సంవాద సార సంగ్రహ రూప శ్రీ శూన్యలింగ శతక రాజంబు సర్వంబు శ్రీ పరదేవతార్పణమస్తు –శ్రీ శ్రీశ్రీ .
అని తన ప్రవర తెలియ జేశారు కవి .హెడ్ క్లార్క్ ఇంతటి ఘనమైన తత్వాన్ని అరటి పండు వలిచి చేతిలో పెట్టినట్లు ,ఆరుచిని తేనే మాధుర్య శైలిలో రంగరించి మనకు అందించారు .మనముందు అసలు ‘’సీతారామాంజనేయ సంవాద౦’’దాన్ని ప్రతిపద్య మాధుర్య ఫలభరిత౦గారచించిన శ్రీ పరశురామ పంతుల లింగమూర్తి గురుమూర్తి దర్శన మిస్తారు .ఆగ్రంథాన్నీ ఆకర్తను మన ముందుంచారు ఈశతకం ద్వారా మనకవి శ్రీ ఓలేటి సుబ్బారావు గారు .ఓలేటి వారు అంటే సాహిత్య ,కవనాలను ‘’ఏలేటి వారు ‘’ అని వీరూ రుజువు చేసుకొన్నారు .
ఈ శతకం మన వాళ్ళ దృష్టిలో పడిన దాఖలా నాకు కనిపించలేదు .ఈ శతకకర్తనూ, శతకాన్నీ పరిచయం చేసి నేను అదృష్ట వంతుడినయ్యాను .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -22-10-22-ఉయ్యూరు ‘’..

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం13వ భాగం.22.10.22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం13వ భాగం.22.10.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -323

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -323

323-శుభలగ్నం నంబర్ వన్ సినీ నిర్మాత,అనేక అవార్డులగ్రహీత  –అడుసుమిల్లి వెంకటేశ్వరరావు

అడుసుమిల్లి వేంకటేశ్వర రావు తెలుగు సినిమా నిర్మాత. నిర్మించిన తక్కువ చిత్రాలతోటే ఎక్కువ ప్రజాదరణ పొందిన నిర్మాత ఆయన.[1]

జివిత విశేషాలు

వెంకటేశ్వరరావు నంబర్‌వన్‌, శుభలగ్నంతోపాటు పలు సినిమాలు నిర్మించారు.[2]

మరణం

ఆయన అనారోగ్యంతో బుధవారం ఆగష్టు 19 2015 న మృతిచెందారు.పేగు సంబంధిత సమస్యతో బాధపడుతూ కొద్ది రోజులుగా విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. [3

324-దూకుడు సినీ నిర్మాత రచయితా ,దర్శకుడు  –అనిల్ సుంకర

అనిల్ సుంకరతెలుగు సినిమా నిర్మాతరచయితదర్శకుడు. ఇతడు నిర్మించిన దూకుడు సినిమా అనేక అవార్డులు గెలుచుకుంది.[1][2]

సినిమారంగం

అనిల్ సుంకర, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నమో వెంకటేశ1 – నేనొక్కడినే, లెజెండ్ఆగడుకృష్ణ గాడి వీర ప్రేమ గాథహైపర్లై మొదలైన సినిమాలను, ఎకె ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై బిందాస్ఆహా నా పెళ్ళంటయాక్షన్ 3D, జేమ్స్ బాండ్రన్ఈడోరకం ఆడోరకంఈడు గోల్డ్ ఎహెకిట్టు ఉన్నాడు జాగ్రత్తఅంధగాడుకిరాక్‌ పార్టీరాజుగాడుసీతచాణక్య మొదలైన సినిమాలను నిర్మించాడు. 2013లో యాక్షన్ 3D చిత్రానికి దర్శకత్వం వహించాడు. మహాసముద్రం సినిమా, ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ బయోపిక్ నిర్మాణ దశలో ఉన్నాయి.[3][4][5]

సినిమాలు

నిర్మాతగా

క్రమసంఖ్యసంవత్సరంసినిమా పేరు
292021మహాసముద్రం
282020సరిలేరు నీకెవ్వరు
272019చాణక్య
252019సీత
242018రాజుగాడు
232018కిరాక్‌ పార్టీ
222017లై[6]
212017అంధగాడు
202017కిట్టు ఉన్నాడు జాగ్రత
192016ఈడు గోల్డ్ ఎహె
182016హైపర్
172016సెల్ఫీ రాజా
162016ఈడోరకం ఆడోరకం
152016రన్
142016కృష్ణ గాడి వీర ప్రేమ గాథ
132015రాజు గారి గది
122015జేమ్స్ బాండ్
112014ఆగడు
102014పవర్
92014లెజెండ్
82014చందమామ కథలు[7]
720141 – నేనొక్కడినే
62013యాక్షన్ 3D
52012వెన్నెల 1 1/2
42011దూకుడు
32011ఆహా నా పెళ్ళంట
22010నమో వెంకటేశ
12010బిందాస్

దర్శకుడిగా

·         యాక్షన్ 3D (2013)

అవార్డులు

·         ఉత్తమ చిత్ర విభాగంలో సినీ’మా’ అవార్డు (2012): దూకుడు

·         ఉత్తమ చిత్రంగా ఫిలింఫేర్ అవార్డు (2012): దూకుడు

·         ఉత్తమ చిత్రంగా సైమా అవార్డు (2012): దూకుడు

·         ఉత్తమ చిత్ర విభాగంలో టైమ్స్ ఆఫ్ ఇండియా ఫిల్మ్ అవార్డు (2012): దూకుడు

·         ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా నంది అవార్డు (2013): దూకుడు

·         తెలుగులో ఉత్తమ చలన చిత్రంగా జాతీయ చిత్ర పురస్కారం (2015): చందమామ కథలు

325-టెన్త్ క్లాస్ ,నోట్ బుక్ సినీ దర్శకుడు స్క్రీన్ ప్లే రచయిత–చందు

చందు (సత్తి చంద్రశేఖర్ రెడ్డితెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత.

జీవిత విషయాలు]

చందు 1975, అక్టోబరు 17న ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాకాకినాడ సమీపంలోని వెదురుపాక గ్రామంలో జన్మించాడు. రాజమండ్రిలోని సెయింట్స్, ఎస్‌కెవిటి ఉన్నత పాఠశాలలో చదువుకున్నాడు.

సినిమారంగం

2003లో రాంప్రాసాద్ దర్శకత్వం వహించిన కళ్యాణ రాముడు, 2004లో వి. వి. వినాయక్ దర్శకత్వం వహించిన సాంబ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన సినిమారంగ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. 2005లో ఎస్.పి. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానరులో శ్యామ్ ప్రసాద్ నిర్మించిన టెన్త్ క్లాస్ సినిమాకు చందు తొలిసారిగా దర్శకత్వం వహించాడు.[1] ఇది 2006లో విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది. తరువాత 2007లో నోట్ బుక్ సినిమాకి దర్శకత్వం వహించాడు. సంగీత దర్శకుడు కోటి కుమారుడు రాజీవ్ ఈ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. 2013లో ప్రేమ ఒక మైకం సినిమాకి దర్శకత్వం వహించాడు.[2]

సినిమాలు

దర్శకుడిగా

·         టెన్త్ క్లాస్ (2006)[3]

·         నోట్ బుక్ (2007)

·         ప్రేమ ఒక మైకం (2013)

అసిస్టెంట్ డైరెక్టర్‌గా

·         కళ్యాణ రాముడు (2003)

·         సాంబ (2004)

·           సశేషం

·         మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -22-10-22-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

హాస్యానందం 50- అభి యుక్తోక్తి

హాస్యానందం

50-  అభి యుక్తోక్తి

అభియుక్తుడు అంటే పండితుడు ,అనుభవమున్నవాడు అనేమాటను అభియుక్తోక్తి అంటారని ఇంగ్లీష్లో ఎపిగ్రం అంటారని మునిమాణిక్యం గారన్నారు .జ్ఞాని తననుభావాన్ని మాటున పెట్టి అన్నమాటగా చెప్పుకోవచ్చు. ఆ ఒక్కమాటలో ఎంతో అర్ధం ఇమిడి ఉంటుంది మనల్ని ఆమాట ఆశ్చర్య చాకితుల్నీ  చేస్తుంది .ఆమాట వింటే పెదవులపై చిరునవ్వు మొలుస్తుంది అన్నారుమాస్టారు .అది చురుక్కున తగిలి గాటు పెట్టచ్చుకూడా .కానీ చమత్కారం తళుక్కున మెరుస్తూ బాధ అనిపించదు .ఉదాహరణ –1-ఆడవాళ్ళను అడిగి చూడు సలహా –ఆచరణలో మాత్రం ఏదైనా చేయి అది మినహా ‘’2-ప్రేమతో వచ్చింది ఒక్కటే ఇక్కట్టు  -సుఖదుఖాలమధ్య అది సీజను టికెట్టు3-దయ్యలవంటిదంటాను నిజమైన మక్కువ –లోకం లో ఇది కనబడేది తక్కువ వినబడేది ఎక్కువ 4-అసలు అడ్రసు లేనివాడు అడవారకం –రెండు అడ్రసులు ఉన్నవాడు భడవారకం 5-పాతదన్నది ఎల్లను మారుతుంది-కొత్తడానికి చోటిచ్చి తీరుతుంది 6-వట్టి గొద్దుకు అరుపులెక్కువ –మట్టి బుర్రకు మాటలెక్కువ ‘’.

మణిప్రవాళోక్తి-

రెండుమూడు భాషలపదాలు కలిపి చేసిన రచనను మణిప్రవాళం అంటారు .సంస్కృతం తెలుగు కలిపి అలాంటి రచనలు పూర్వం వచ్చాయి .ఇప్పుడు తెలుగులోనూ బాగానే వస్తున్నాయి అన్నారు గురూజీ .ఉదాహరణలు -1-తండులాలు గృహమందు నసంతి –తి౦డికైతే పది మంది వసంతి .పెద్దగా హాస్యం పండని కొన్నిటిని ఆయనే ఉదాహరించారు .2-రేరే గజ్జలిగా కిమస్తి నగరే –ఏమబ్బ ఎపుడోస్తిరి ?

విశేషోక్తి

అనేకకారణాలున్నా కార్యం జరగకపోవటం అని అర్ధం అన్నాడులక్షణకర్త .కానీ దీన్ని హాస్యంలో వాడితే ఎలాఉంటుందో శా౦పిల్స్ ఇచ్చారు -1-పల్లం ఉన్నా పారదు నీరు –నాలుకున్నా మాట్లాడదు నోరు .కవులు శ్లేషతో విశేషోక్తి సాధిస్తారు దాని స్వరూపాన్ని తాను  కొద్దిగా మార్చి విశేషోక్తి సాధించానని చెప్పి మాస్టారు స్వంత ఉదాహరణలు ఇచ్చారు .1-ఎరువు వేసినా ఎదగదు మా గులాబిమొక్క –మందలు తిన్నా కుదరదు మావాడి తలతిక్క 2-వాకిలి ఉన్నా తలుపులు లేవు-కురుపులుఉన్నా సలుపులు లేవు 3-ఎర్రగా బుర్రగా ఉన్నది ఏమితక్కువ ?-ఏలనన్నాడు మగడు తెలివి తక్కువ .

మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో

సశేషంమీ –గబ్బిటదుర్గాప్రసాద్ -21-10-22-ఉయ్యూరు

Posted in ప్రవచనం | Tagged | Leave a comment

విజయ విలాసం.12వ భాగం.21.10.22

విజయ విలాసం.12వ భాగం.21.10.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

సుబుద్ధి శతకం  

సుబుద్ధి శతకం  

గుంటూరు తాలూకా గారపాడు వాసి ఖాసీం ఆలీషా కవి సుబుద్ధి శతకాన్ని రచించి గుంటూరు కన్యకా ముద్రాక్షరశాలలో 1924న ప్రచురించారు .ఈకవి మణిమంజరి నాటకం ,కొండవీటి చరిత్ర మొదలైన రచనలు చేశారు.వేద విద్యాపరుడు ,ప్రదిత సత్కీర్తి ,సూనృత వ్రత గరిష్టుడు,అమలగుణ శాలి అయిన తన తండ్రి మౌలాలీ గారికి అంకితమిచ్చారు . ఈ కంద పద్య శతక మకుటం ‘’సుబుద్ధీ ‘’.  

 మొదటిపద్యంలో లక్ష్మీదేవిని –శ్రీ మహిలా మణిత్రిజ –ద్దామోదర ప్రధిత మణియునై-దైవ గణ పురం –ద్రీమణిదుగ్దాబ్దికుమా –రీమణిరామనిన్ను గనికరించును  సుబుద్ధీ’’అని ధైర్యం చెప్పారు .భువి దివి సర్వగ్రహాలను ,సూర్య మాతరిశ్వాదులను సృజించిన ఆ భూధవుని పరాత్పరుని ,పరుని తలచారు .అక్షరుని సర్వ లోకాధ్యక్షుని దక్షుని స్తుతించమని చెప్పారు .తర్వాత గణనాధుని ,సద్రస పేశల మాధురీ నిరంకుశ భాషా రసికత్వం లో కుశలత ఇవ్వటానికి భారతిని కొల్చారు అంటే కొలవమని చెప్పారని భావం.

 ‘’క౦ద౦బులు సుకవీశుల-కందంబు లమంద సుందరాబ్జాస్యలకున్ –గుందంబులు బుధ –కర్ణానందంబులు ‘’కనుక కందంలో కదను తొక్కానని అందంగా చిందులేస్తూ  చెప్పారు .తెలుగు కవిత్వం అల్లన కుమ్మరిమొల్లకు జోహార్లు చెప్పారు .పూర్వకవులకు కైమోడ్పులు పలికారు .

  తర్వాత నీతులు బోధించటం ప్రారంభించి అత్తనుకులదేవతగా ,మామను ఉర్వీన్ద్రునిగా ,భక్తితో సేవించే సతిని సత్తరుణి అంటారని ,భర్తను సేవి౦చె భార్య సౌభాగ్యవతి అనీ ,జనకజ కుముదవతి అనసూయ అరు౦ధతులమార్గం లో స్త్రీలు నడిస్తే ఉత్తమగతులు కలుగుతాయని చెప్పారు .తగిన మగడు ఇంట్లో ఉంటె ,వాడిని దిగ ద్రొక్కి విటాళికోసం తెగతిరిగే వగలాడిని ,చెడు బోటిని తెగనరికినా తప్పులేదన్నారు .మొగుడితో గుద్దులాడేది ఆడదికాడు గాడిద అన్నారు .కడుపెకైలాసంగా జీవించటం నీచం .రచ్చలకుఎక్కకు రచ్చలకుకాలుదువ్వకు ,మెచ్చులకోసం అదరకు .యాత్రలకోసం గాత్రాన్ని ఇబ్బంది పెట్టక కించిత్ స్తోత్రం చేస్తేముక్తివస్తుంది .నడవడి చెడితే నీచునిగా లోకంచూస్తుంది .భిక్షం (బికిరం )ఎత్తేవారిని ,వికలాంగుల్ని పరిహాసం చేయకు అది భగవత్ ప్రయత్నం వాళ్ళ తప్పుకాదని గ్రహించు .

  లక్షణం లేనికవిత్వం శిక్షణ లేని స్త్రీ శీలం భిక్షాటన జీవితం అక్షయమైన నింద.లయ లేని సంగీతం ప్రియం తెలియని తిండి ,వ్యయం తెలీని డంబం నియమం లేని నెలత రాణించవు .నీతి స్థిరురులైన పెద్దలమాటలు వేదవాక్యాలే .’’చెడి బ్రతుకుట కంటే లేదు చెరుపు ‘’.శిలకు ,శైలానికి ,దోమకు ఏనుగుకు ,ఎంత తేడానో కులకాంతకు వెలకా౦తకు అంత తేడాఉంది .దేనినైనా తనవారికంటే ముందు తింటే –‘’ఎనుబోతని ,మనుబోతని ,తినుబోతని లోకం ఈసడిస్తుంది .పరువంలో బుద్ధి త్వరత్వరగా పరిగెత్తుతుంది .దానితో పరిగెత్తగలమా ?’’కరువలి (గాలి )కైనా ,మురహరి గరుడునికైనా ‘’ఇది తప్పదు.చీటికీ మాటికీ అత్తింట్లో అలిగి ‘’బుట్టింటి కేగకెప్పుడు –మెట్టిన నట్టింట ఉండటం మేలు .’’చచ్చినమీదట పుచ్చిన వక్కైన నీతో రాదు .కోపం ఘోర విపద్ధూపం దుర్భర దురంత దుష్కృత కూపం .శాంతం ‘’విలసత్కార్యాశాంతం –చిరసౌఖ్యసద్యశః ప్రాంతం వేదాన్తోదంతం శాంతమే భోషాణం సారీ భూషణం .కవిగాయకులకు సతికి భోగినికి కళలే .’’తొడవులు ‘’.తన శుభ్రత గృహశుభ్రత ఘనం .

  ‘’బాలికలకు బాలురకును-దేలికగా దెలియ దేట తెనుగుపడంబుల్ –గ్రాలెడు పద్యంబులనే  -జాలగ వ్రాసితిని దీని జదువుసుబుద్దీ ‘’అని 102వ పద్యం రాసి చివరి 103వ కందంలో –‘’మతిమంతుల హృద్గతమై –క్షితి సాధ్వీతిలకములకు శ్రీకరమైశా –శ్వతమై మత్క్రుతమగు నీ –శతకము వర్ధి లును గాక సతతము సుబుద్ధీ ‘’అని ఆశావహంగా ముగించారు ఆలీషా కవి .ధారాశుద్ధికల కవిత్వం అందరికి కావాల్సిన నీతులు పుష్కలంగా ఉన్నాయి .చిన్నాపెద్దాముసలీ ముతకా అందరూచదివి తీరాల్సిన శతకం .బుద్ధికి పదును పెట్టి సుబుద్ధిని చేసే శతకం .ఎక్కడాతడబాటులేదు .ధార కుంటూ పడటం లేదు .పరుగోపరుగు అన్నట్లు క౦దాలను హృదయంగమంగా రాసిన కవి ఖాసీం ఆలీషా మరో వేమన అనిస్తారు మరో సుమతీశతకం కుమారీశతకం మనము౦దున్నట్లు భావన కలుగుతుంది .

  ఈకవినీ ,ఈశతకాన్నీ పరిచయం చేసి నేను ధన్యుడను అయ్యాను .

  మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -21-10-22-ఉయ్యూరు 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కార్తీకం లో మార్కండేయ పురాణం

కార్తీకం లో మార్కండేయ పురాణం
సాహితీ బంధువులకు కార్తీకమాస శుభా కాంక్షలు .26-10-22 బుధ వారం నుంచి కార్తీకమాసం  ప్రారంభం ఆవుతున్న  సందర్భంగా ఆరోజునుంచే సాయం కాలం ప్రస్తుతం నడుస్తున్న విజయవిలాసం ను వాయిదా వేస్తూ ”మార్కండేయ మహా పురాణం ”ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని తెలియ జేస్తున్నాను -దుర్గాప్రసాద్ -21-10-22

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 12వ భాగం.21.10.22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 12వ భాగం.21.10.22

http://sarasabharativuyyuru.wordpress.com http://suvarchalaanjaneyaswami.wordpress.com youtube channel : https://www.youtube.com/channel/UCCB-Z-3t-3SxVy1G_BcwS6w FB page : https://www.facebook.com/sarasabharathi.vuyyuru Telugu Wikipedia : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D Gabbita Durga Prasad Rtd. head Master Sivalayam Street Vuyyuru 521165 Krishan District Andhra Pradesh

Thumbnail

Select or upload a picture that shows what’s in your video. A good thumbnail stands out and draws viewers’ attention. Learn more

Playlists

Add your video to one or more playlists. Playlists can help viewers discover your content faster. Learn more

మహాభారత తత్వ కథనం

Audience

Paid promotion, tags, subtitles, and more

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -319

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -319

319–పార్లమెంట్ సభ్యుడు చిలకమ్మ చెప్పింది ,సినీ నిర్మాత ,ఫిలిం అభివ్రుద్ధిమండలి చైర్మన్ –చేగొండి హరిరామ జోగయ్య

చేగొండి వెంకట హరిరామజోగయ్య (జ: 5 ఏప్రిల్, 1937) భారత మాజీ పార్లమెంటు సభ్యుడు, తెలుగు సినిమా నిర్మాత.

వీరు నారాయణ స్వామి, కమలమ్మ దంపతులకు పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో 1937 సంవత్సరంలో జన్మించారు. వీరి ప్రాథమిక, కళాశాల విద్యాభ్యాసం విజయవాడలో జరిగింది.

1960-1966 మధ్యకాలంలో పంచాయితీ సమితి ప్రెసిడెంటుగా ఆ తరువాత 1971 వరకు జిల్లా పరిషత్ ఛైర్మన్ గా పనిచేశారు.

వీరు 1972 – 1988 సంవత్సరాలలో జరిగిన ఎన్నికలలో ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు మూడు సార్లు ఎన్నికయ్యారు. 1983, 1988 లో నర్సాపురం శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు. వీరు 1984-85 లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో రాష్ట్ర హోం మినిస్టర్ గా, 1990-91లో అటవీశాఖ మంత్రిగా తరువాత 1993-95లో గనులు, పరిశ్రమల మంత్రిగా పనిచేశారు.

ఇతడు 2004 సంవత్సరంలో 14వ లోక్‌సభకు ఆంధ్ర ప్రదేశ్ లోని నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యారు.

హరిరామ జోగయ్య చిలకమ్మచెప్పింది, నాలాగేఎందరో మొదలైన ఏడు తెలుగు సినిమాలు నిర్మించారు. సినిమా రంగంలో ఇతడు చేగొండి హరిబాబు గా ప్రసిద్ధిచెందారు. బాబు పిక్చర్స్ పతాకం క్రింద దేవుళ్లు సినిమా నిర్మించింది వీరే. వీరు 1977-78లో ఫిల్మ్ అభివృద్ధి మండలి ఛైర్మన్ గా పనిచేశారు. చిలకమ్మచెప్పింది, నాలాగేఎందరో

320-కురుక్షేత్రం సినీ కళాదర్శకుడు –కుదరవల్లి నాగేశ్వరరావు

కుదరవల్లి నాగేశ్వరరావు ప్రముఖ సినీ కళా దర్శకుడు.

వీరు సృష్టించిన అపూర్వ కళాఖండం 1977లో కృష్ణ నిర్మించిన కురుక్షేత్రం.[1]

డ్రైవర్ రాముడు

చిత్ర సమాహారం
· 1949 : గుణసుందరి కథ

· 1963 : తిరుపతమ్మ కథ

· 1967 : భామా విజయం

· 1968 : రణభేరి

· 1970 : లక్ష్మీ కటాక్షం[2]

· 1974 : తిరపతి [3]

· 1975 : మాయామశ్చీంద్ర [4]

· 1977 : కురుక్షేత్రం

· 1979 : డ్రైవర్ రాముడు

· 1979 : శ్రీమద్విరాట పర్వము

· 1980 : ఆటగాడు [5]

321-అల్లుడు శీను నిర్మాత –బెల్లంకొండ సురేష్

బెల్లంకొండ సురేష్ ఒక భారతీయ చలనచిత్ర నిర్మాత. తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి పేరు పొందారు.

జీవిత చరిత్ర
బెల్లంకొండ సురేష్ సతీమణి పద్మావతి. వీరికి బెల్లంకొండ సాయి శ్రీనివాస్, బెల్లంకొండ గణేష్ బాబు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. శ్రీనివాస్ 2014లో అల్లుడు శీనుతో అరంగేట్రం చేశాడు. ఈ చిత్రం విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను అందుకుంది. ఆయన రెండో కుమారుడు బెల్లంకొండ గణేష్ బాబు నిర్మాత. కాగా 2022లో స్వాతిముత్యం సినిమాతో ఆయన హీరోగా పరిచయం కాబోతోన్నాడు.

వివాదం
టాలీవుడ్ నటుడు నందమూరి బాలకృష్ణ హైదరాబాదు జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో 2004 జూన్ 3న జరిగిన కాల్పుల ఘటనలో ఉన్నారు. నిర్మాత బెల్లంకొండ సురేష్, అతని అసోసియేట్ సత్యనారాయణ చౌదరిపై నటుడు కాల్పులు జరిపాడు. అనంతరం క్షతగాత్రులిద్దరినీ ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.[1] ఈ కేసు విచారణ, దానిని హ్యూమన్ రైట్స్ ఫోరమ్ ప్రశ్నించడం లాంటివి అప్పట్లో చాలా వివాదానికి దారితీశాయి.[2]

322-మరోచరిత్ర మిషన్ ఇంపాజిబుల్ నిర్మాత ,న్యాయవాది ,రాజకీయ నాయకుడు –నిరంజన్ రెడ్డి

సిర్గాపుర్ నిరంజన్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన న్యాయవాది, సినీ నిర్మాత మరియు రాజకీయ నాయకుడు. ఆయనను 2022 మే 17న వైఎస్సార్‌సీపీ తరపున రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించింది.[1

జననం, విద్యాభాస్యం
నిరంజన్‌రెడ్డి 1970 జులై 23న తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లా, దిలావర్‌పూర్‌ మండలం, సిర్గాపూర్ గ్రామంలో విద్యాసాగర్ రెడ్డి, విజయ లక్ష్మి దంపతులు జన్మించాడు. ఆయన హైదరాబాద్‌లో ఉన్నత విద్యంతా పూర్తి చేసి పుణెలోని సింబయాసిస్‌ లా కాలేజీలో న్యాయవిద్య పూర్తి చేశాడు.[2]

వృత్తి జీవితం
నిరంజన్‌రెడ్డి సింబయాసిస్‌ లా కాలేజీలో ఐదేళ్ల లా కోర్సు పూర్తి చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సీనియర్‌ న్యాయవాదులు ఒ.మనోహర్‌రెడ్డి, కె.ప్రతాప్‌ రెడ్డి వద్ద జూనియర్‌గా పని చేసి రాజ్యాంగపరమైన అంశాలతోపాటు వేర్వేరు చట్టాలపై 1992 నుంచి హైకోర్టులో, 1994 నుండి సుప్రీం కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ మొదలు పెట్టాడు. 2016లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆయనకు సీనియర్‌ న్యాయవాది హోదాను కల్పించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల తరఫున పలు కేసుల్లో స్పెషల్‌ సీనియర్‌ కౌన్సిల్‌గా సేపని చేసి, రాష్ట్ర విభజన అనంతరం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా నియమితుడయ్యాడు.[3]

రాజకీయ జీవితం
నిరంజన్‌రెడ్డిని వైఎస్సార్‌సీపీ తరపున రాజ్యసభ అభ్యర్థిగా 2022 మే 17న ప్రకటించింది.[4]

నిర్మించిన సినిమాలు
ఆయన 2002లో హైదరాబాదులో మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ తెలుగు సినీ నిర్మాణ సంస్థను స్థాపించాను. ఆయన మొదట దిల్ రాజు సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కు అనుబంధ సంస్థగా ఈ మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రారంభించి ఈ సంస్థ 2010లో మరో చరిత్ర, 2011లో గగనం సినిమాలను నిర్మించి ఆ తరువాత, పూర్తిస్థాయి సినీ నిర్మాణ సంస్థగా ఏర్పడి, 2016లో క్షణం, 2017లో ఘాజీ వంటి అవార్డు పొందిన సినిమాలను నిర్మించింది.

క్రమసంఖ్య

సంవత్సరం

సినిమా పేరు

భాష

గమనిక

1

2010

మరోచరిత్ర

తెలుగు

అనుబంధ సంస్థగా

2

2011

గగనం

తెలుగు

అనుబంధ సంస్థగా

3

2016

క్షణం

తెలుగు

4

2017

ఘాజీ

తెలుగు, హిందీ

5

2017

రాజు గారి గది 2

తెలుగు

అనుబంధ సంస్థగా

6

2021

ఆచార్య

తెలుగు

7

2021

వైల్డ్ డాగ్

తెలుగు

8

2021

అర్జున ఫల్గుణ

తెలుగు

[5]

9

2022

మిషన్ ఇంపాజిబుల్

తెలుగు

సశేషం

-మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -21-10-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

హాస్యానందం

49-  వినోక్తి

gabbita prasadThu, Oct 20, 8:45 PM (13 hours ago)
to sahitibandhu@googlegroups.com, Andukuri, Narasimha, Vuppaladhadiyam, Gopala, Krishna, గోదావరి, Lavanya, Padma, Padmasri, Durvasula, Sastri, mrvs, GITANJALI, Ramky, Sai, Pavan

హాస్యానందం

49-  వినోక్తి

అని ఒక అలంకారం .ఒకదాన్ని వదిలేస్తే మరొకటి అందంగా ఉన్నట్లు చెబితే అది వినోక్తిఅని నిర్వచించారు మునిమాణిక్యం నరసింహా రావు గారు. కావ్యాలంకార కర్త ఉదాహరణ గా క్రూరతలేని చూపు సుందరం .రవిలేని నభం అసుందరం .మనింట్లో భార్యాభర్తల సంభాషణలలో ఇలాంటివి దొర్లుతాయన్నారుమాస్టారు .ఒకసారి మాస్టారిగది అంతా చిందర వందరగా,నానా కంగాళీగా ఉంటె కా౦త౦ గార్నిపిలిచి ‘’ఇల్లంతా ఇంత అసెయ్య౦గా ఉందేమిటి  ?’’అని అడిగితె ‘’అలా ఉంటేనే అందం .అప్పుడే పిల్లలున్న కుటుంబం అని తెలుస్తుంది అవి లేకపోతె శోభే ఉండదు ‘’అన్నారని గురువాచ .

  ఆవిడే ఇంకోసారి ‘’కిచకిచాలాడే పిచ్చికలు ,గలగలలాడే పిల్లలు లేనిఇల్లు ఇల్లెకాదు  ‘’అన్నారట .ఇంకోసారి ఆమె ‘’గోడలకు బూజు కోడలికి పోజూ పనికి రావు ‘’అలానే మరోసారి ‘’వాసన లేనిమద్యం ,దోషం లేనిపద్యం సుందరం ‘’అన్నారు .అలానే ‘’ప్రాకారం లేనిగోపురాలు ,సహకారం లేనికాపురాలూ అందం లేని నవ్వు మకరందం లేనిపువ్వు ,కండలు లేని ఒళ్ళు ,ముండలు లేని ఊళ్లు అసు౦దరాలుఅని ఆయన స్నేహితుడు అదే ధోరణలో వాక్రుచ్చడట ..

 ఇంకో ఇంచి ముందుకేసి ఒక కవి –బొజ్జలేని గణపతి ,లజ్జలేని కులపతి ,టాపులేనికారు ,పోపులేనికూర ,జుట్టులేని తల ,బొట్టులేనిముఖం ,ఎరుకలేనిచదువు ,ఎరుపులేని పెదవి ,ముక్కులేనిమోము ,ముద్దులేని ప్రేమ ,అని గిలికాడు .అదే బాణిలో మాస్టారు –ఒక గుణము బాసి వస్తు-వొప్పిదమును బాయు నననెడి –వింతయైన వినోక్తికి –సొంతమైన ఎక్సాంపూల్స్ –చొక్కమైన శాంపిల్స్ ‘’అని ‘’ముదురులేని ముంజలు ,ముసురులేని సంజలు ,ముండ్లు లేని బాటలు ముళ్ళు లేనిమాటలు ,మచ్చలేనజాబిలి ,రొచ్చులేనివాకిలి ,పుచ్చులేనిగింజలు ,పచ్చిలేని లంజలు ,మట్టిలేనిబుర్రలు ,పొట్టలేనిపిర్రలు ,-‘ఒకటి లేనికతన మొప్పిదమగునవి చెప్పేడు వింతయైన వినోక్తి –సొంతమైన ఎక్సాంపూల్స్ –చొక్కమైన శామ్పుల్స్ ‘’అని నాన్ స్టాప్ గా వాయించేశారు

మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -20-10-22-ఉయ్యూరు 

Posted in రచనలు | Leave a comment

విజయ విలాసం.11వ భాగం.20.10.22

విజయ విలాసం.11వ భాగం.20.10.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీమత్పూనూరు వేణుగోపాల కృష్ణ శతకం

శ్రీమత్పూనూరు వేణుగోపాల కృష్ణ శతకం

పూనూరు బోర్డ్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీమత్ దూపాటి నారాయణాచార్య ప్రణీత శ్రీమత్పూనూరు వేణుగోపాల కృష్ణ శతకం బాపట్ల విజయ ముద్రాక్షరశాలలో 1926లో ప్రచురితమైంది . వెల – ఇవ్వ బడ లెదు .దీనికి చేబ్రోలు వాస్తవ్యులు శ్రీ ఇలపావులూరి శ్రీరాములు తొలిపలుకులు పలుకుతూ ‘’సీస పద్యాలలో ఈశతకం రాసిన కవి ఆచార్య నాకు నూతన పరిచితులే .నన్ను పీఠిక రాయమనటం సమంజసంగా లేదు .ఏలయన నేను అల్పజ్ఞుడిని ,కుక్షి౦భరుడిని .వారు పండితులు ,శబ్దవిదులు ..అట్టి వారి కవిత్వాన్ని నేను విమర్శించటం హాస్యాస్పదం .కానీ పద్యాలు మిగుల రసవత్తరంగా ,భావగర్భితాలుగా ,స్వాభావోక్తులుగా ,శైలి మృదు మధురంగా ,పండిత పామర రంజకంగా ఉందని చెబుతూ ఆ శ్రీ కృష్ణ పరమాత్మ ఈ కవివరునికి ఇంకా అనేక ఉద్గ్రంథ రచనకు తోడ్పడాలని,ఆశీర్వ ది౦చాలనీ  అనికోరుతున్నాను ‘’అన్నారు .

  తర్వాత కవిగారుచేసిన ‘’ విజ్ఞప్తి ‘’లో ’’శతకరచన మిక్కిలి కష్టమని పెద్దలంటారు నేను అల్పమతిని సంస్కృతాంధ్రాలలో భాషాపరిచయం స్వల్పం .కవిత్వ రసానుభావమూ శూన్యమే .తొలి శతకరచన కనుక ఇందులో గుణాలు తక్కువ దోషాలు ఎక్కువగా ఉంటాయి ‘’ఏకస్వాదు నమ౦భూ జీయాత్ ‘’అన్న పెద్దలమాటలను బట్టి శ్రీ కృష్ణ పరమాత్మ నా హృదయం లో చేరి నాతొ రాయించి నా ఆన౦దాన్ని లోకానికీ పంచమన్నట్లు గా అడియాస .రెండేళ్లక్రితమే రచన పూర్తి అయినా ,ఇరవై నెలలక్రితం అప్పటి బోర్డ్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీ ఆ. సుబ్బారావు గారిద్వారా శ్రీ ఇలపావులూరి శ్రీరాములుగారికి చేరింది(వీరు శ్రీ ఇలపావులూరి పాండురంగారావు గారి తండ్రి గారేమో ) .ముద్రించేశక్తి నాకు లేకపోవటంతో ‘’యోగక్షేమం వహామ్యహం ‘’అని చెప్పిన వాడి మీదనేపెట్టి ఊరుకున్నాను .

  ఇంతలో వేదాంత గ్రంథ విచార ప్రచారకులైన శ్రీ శ్రీరాములుగారి అమోఘ ఆశీర్ బలముతో ,సహృదయులు శ్రీ సుబ్బారాగారి భక్తిభావ గరిమతో ,ప్రియశిష్యులు శ్రీ పూనూరు భక్త సమాజం వారి ఆదరాతిశయాలతో ,వేణుగోపాలుని నైసర్గిక వత్సలత్వ విలసనంతో ,శతకము ముద్రణ పొందింది .స్థల పురాణం కూడా రాయమని మిత్రులు కోరినా అందులో నిజానిజాలేమిటో తెలుసుకోవటం కష్టం కనుక దాని జోలికి పోలేదు .’’ప్రార్ధయే స్సర్వ విదు షో,క్షంతు మంతు శతానిచ –యద్యాత్ర కుత్రచిద్దోషో,నిర్మలం కురుతాదరాత్ ‘’అని బుధజన విధేయుడైన కవి కోరారు .’’వరద పూనూరు వేణుగోపాల కృష్ణ ‘’అనేది ఈ సీసపద్య శతకానికి మకుటం .

మొదటి పద్యం –‘’శ్రీ యాదవాన్వాయ క్షీర నీరధిపూర్ణ –చంద్ర చంచాత్క్రుపా సాంద్ర హృదయ -శౌర్య ధైర్య స్థైర్య చాతుర్యసద్గుణ –ధామ ,నిర్జిత దుష్ట దైత్య సీమ

శిశుపాల చాణూర జీవ సమీర భు –జ౦గాయమాన,విహంగ యాన –కంసాది రాక్షస గర్వపర్వత పాక-శాసన ధర్మ సంస్థాపనాద్య

తే.గీ.-నీరజేక్షణ భక్త చకోర చంద్ర –గాత్రజితమేఘ బుధజనస్తోత్ర పాత్ర – భుక్తిముక్తిఫలప్రద –వరద పూనూరు వేణుగోపాల కృష్ణ ‘’

అని ప్రారంభించారుకవి.నాల్గవ పద్యం లో పూర్వ సంస్కృత, తెలుగుకవులను స్తుతించి ,తర్వాత తనగురువు మంగళగిరి దూపాటి వంశానికి చెందిన విశిష్టాద్వైత సిద్ధాంత ప్రవరులు ,మంత్రోపదేశి ,వే౦కటగురు వర్యుని స్తోత్రం చేసి ,తర్వాత పోతన్నలాగా ‘’అవిరలానంద సౌఖ్యములగూర్చు నీదు నామంబు స్మరియించు నాలుకనాలుక ‘’అంటూ కరచరణాదులు మనసు ఆయనకు అర్పిస్తేనే అవిధన్యం అన్నాడు .శంతన సుతుడిలాగా మంతనం చేసే మనసులో బంధించలేను ,విదురునిలాగా నీతి వాక్యాలు చెప్పలేను ,పార్ధుడిలాగా చెట్టపట్టాలేసుకొని బందుత్వంతో తిరగలేను ,గోపాలురులాగా నిన్ను పొందే భాగ్యం పొందలేదు ,చంద్రునికి నూలుపోగుగా నా శక్తికొద్దీ నీ పరిచర్య చేస్తా .ప్రాపుగా ఉంటూ రక్షించు అన్నారు .భువనాలను బ్రోవజాలిన నీబలానికి ,బ్రహ్మా౦డాల్ని   రమణీయంగా చేసే నీ కౌశలానికి ,బ్రహ్మమొదలు స్తంభ పర్యంతం జీవులలో సంచరించే నీఘనత ,కోటి సూర్య ప్రకాశం మించే నీ తేజస్సు లకు ఎల్లలు లేవు అన్నారు

  అంతర బాహ్య ఇంన్ద్రియాలను అణచి నిశ్చలభక్తితో నీపూజ చేయని జీవితం వ్యర్ధం .పుణ్యనదులకు  పాపాలను పోగొట్టే శక్తి ,చంద్ర సూర్యాగ్నులకు దివ్యదీప్తి ,సౌందర్య సౌరభ్య సౌకుమార్యాలను ప్రసవజాతికి ,చెరుకులో తియ్యదనం ,కవులవాక్కులకు అమృతం కూర్చిన ‘’నీ వినోదంబులు అమితాద్భుతములు ‘’అన్నారు .తర్వాత ముచుకు౦దు డు మొదలైన భక్తులకు మోక్షమిచ్చిన గాధలు ప్రస్తుతించారు .’’దురితాటవులకు విస్ఫురదగ్నిహోత్రం,ఆపదద్రులకు వజ్రాయుధం ,వివిధ మనో రోగ బిస తంతువులకు గంధ బంధుర మత్తగజం ,అజ్ఞానరూప గాఢాంధకారానికి గొప్ప ప్రభాకర మండలోదయం ,తీరని దారిద్ర్య వారివాహకులకు భూరిజవోపేత మారుతం ,సకలపురుషార్ధ ఫలజయ సాధనం ,భావ మహార్ణవ తరణం కృష్ణనామం పావనం అని మహా గొప్పగా పద్యం రాశారు

 నారదుడు నీ భక్తిబీజాన్ని భువిలో నాటితే ,ధ్రువుడు నిశ్చలభక్తితో పాదు చేస్తే ,ప్రహ్లాదుడు నీరుపోస్తే ,రుక్మా౦గదుడు అంకురిం పిస్తే ,భీష్ముడుచివురి౦ప జేస్తే ,ద్రౌపది పర్ణాళిప్రబలజేస్తే ‘’విరుల నలరార జేససెనుకరి ,శుకుండు –పక్వ ఫలములగాయించచె భక్తులీ-ఫలముల గడుమెక్కి ‘’నీ పదాంబుజాలను చేరుకొంటున్నారని మరో అద్భుతపద్యం సెలవిచ్చారు ఆచార్యవర్యకవి .నీపాదాలు నిర్మలగంగాభవానీ సముద్భవ స్థానాలు .నీ అమ్ఘ్రులు నిగమాంత పుష్ప సంచార పారీణ పుష్పంధయాలు ,నీపద్మాలు నిత్యపద్మాలయా ప్రియంభావుకాలు ,నీ అడుగులు నిర్వాణసౌధాగ్ర సీమలకు అలంకారాలు ,నీచరణపద్మాలు ‘’నీరజాసనాది సుర సంచయమునకవ్యాజసౌఖ్య –సంపదల నెల్ల సమకూర్చు ‘’అని మరో చిరస్మరణీయ పద్యం శాయించారు ఆచార్యశ్రీ .తనకేమీ రాదంటూనే వేదాన్తరహస్యాలన్నీ కరతలామలకం చేశారు భక్తిలో మునిగి,ముంచి తేల్చారు

  ‘’మాధరా ఉధృత భూధరా పి౦ఛదా-మాధరా విష్టప నాద రార’’అనిమరోరసగుళిక వదిలారు .’’కుమ్మరపుర్వులాగున సంసరణమందు- దిరుగుచు నిన్ను నేమరసివాడు –భక్తి నిష్టాగరిష్టుడై వరలువాడు –సర్వమర్పించి నీసేవ సలుపువాడు-నీకు ప్రియతమ భక్తీ  నిర్మలాత్మ ‘’అని భక్తితత్పరుని దివ్యలక్షణాలు ఆవిష్కరించారు .’’అవురయేమందు నీయంద మందు –విందు వి౦దది వలపుల మందు ‘’అని మహామహాకవులకేమీ తీసిపోనట్లు పద్యాలు అమృతరసప్రవాహంగా చిమ్మేశారు .’’చిత్తమా భక్తితో శ్రీ వేణుగోపాలు –భక్తితో భజియించి ముక్తి బడయుమంటి ‘’వక్త్రమా వ్రజసున్దరీ నాధుని కీర్తనలుపాడి సుఖంపొందు ,ఘ్రాణమా కృష్ణ అంఘ్రి రాజీవ పరిమళతులసి గంధాలలో మెలుగు ,పాణి యుగ్మమా కృష్ణ పాదారవి౦ద౦బు బు లర్చించి సంతోషించు అక్షియుగ్మమా శ్రీకృష్ణుని చూడు శ్రోత్రయుగామా హరికధల్ విను ,మూర్ధమా ప్రీతితో కన్నయ్యకు మొక్కుఅని శరీరభాగాలన్నిటినిస్వామి సేవలో తరించమని హితవుచెప్పారు ఇలాంటిపద్యం అరుదు అనిపించింది .

  106వ పద్యంలో ప్రజలు సౌహార్దభావంతో మెలిగేట్లు చేయమని ,ధర్మమే జయం అన్నదాన్ని సార్ధకం చేయమని ,భూమి ముక్కారుపంటలతో విలసిల్లెట్లుగా సామాజికధర్మ౦గా కోరి ‘’ఆరనిభక్తితో ఆ గోపాలబాలుని అందరూ అర్చించే భక్తిభావన కల్పించమని ,ప్రతికుటుంబం  ,పాడి పంటలతో తామరతంపరగా వెలయు నట్లు చేయమని ,అందరికి తోడూ నీడగా ఉంటూ కాచి రక్షించమని వేణుగోపాలకృష్ణుని ప్రార్ది౦చారుకవి విశ్వ శ్రేయస్సును ఆకాంక్షిస్తూ .ఇలా రాసినవారరెవరైనా ఇంతకుము౦దున్నారా అని నాకు అనుమానం .తర్వాత సీసం లో మంగళం పాడారు  .చివరి 108పద్యంలో –తండ్రి వెంకటాచార్యులు తల్లి పేరిందేవి ,శ్రీనివాసాచార్య సోదరుడు ,వంశం దూపాటివంశం.తనను నారాయణా అనిపిలుస్తారు ,తన ఊరు చిన్ని యనమదల ..’’కేవలజ్ఞుడ యుష్మతగ్రుపా వశమున –త్వద్గుణార్ణవమున గొన్ని పద్య రత్న-ములను దేవితి గొని ,నన్ను బ్రోవుమయ్య –వరద పూనూరు వేణుగోపాల కృష్ణ ‘’ అంటూ’’ ఆడియేన్ దాసోహం’’గా కవి తన భక్తిని మనస్పూర్తిగా చాటుకున్నారు .రసప్రవాహ పద్యాలివి .జ్ఞానవైరాగ్య తత్వ ప్రధానాలు ,ప్రదానాలుకూడా .దూపాటి వారి వంశం అంటే నే గోప్పకవిపండితులకు నిలయం .మనకవి అందులో ఎవరికీతక్కువకాదు  అన్నిరకాల భావాలతో పద్యాలుపరిగెత్తాయి .అద్భుతం అనిపించింది .ఈ శతకాన్నీ ,ఈ కవిగారిని పరిచయం చేసి నేను ధన్యుడిని అయ్యాను .

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -20-10-22-ఉయ్యూరు    

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం .11వ భాగం.20.10.22.

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం .11వ భాగం.20.10.22.

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment