మనమరుపు వెనుక మనవెండి తెరమహానుభావులు -318318-ఇతర భాషల డైరెక్టర్లు తెలుగులో చేసినఒకే ఒక్క స్ట్రైట్ ఫిల్మ్!

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -318

318-ఇతర భాషల డైరెక్టర్లు తెలుగులో చేసిన ఒకే ఒక్క స్ట్రైట్ ఫిల్మ్!

భాష మారినా దర్శకుడికి తను చూపించాలనుకున్న కథని చూపించడం పెద్ద కష్టమేం కాదు. అందుకే వేరే భాషల్లో సినిమాలు చేస్తున్న వాళ్లయినా సరే.. తెలుగులో కూడా సినిమాలు చేసే ప్రయత్నం చేసిన దాఖలాలు ఉన్నాయి. అలాగే, తెలుగు దర్శకులైన కె. విశ్వనాథ్, రవిరాజా పినిశెట్టి, దాసరి నారాయణ రావ్, ఇంకా రామ్ గోపాల్ వర్మ వంటి నేటి దర్శకులు కూడా ఇతర భాషల్లో సినిమాలు చేసారు. కేవలం ఒకట్రెండు సినిమాలు కూడా కాదు. చాలానే చేసారు. ఐతే, వేరే భాషల నుండి మన తెలుగులో స్ట్రైట్ సినిమాలు చేసిన డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ళు ఎవరో ఏయే సినిమాలు చేశారో తెలుసుకుందాం.

ముందుగా బాలీవుడ్ “మహేష్ భట్” నుండి మొదలుపెడదాం. మహేష్ భట్ బాలీవుడ్ లో ఎన్నో హిట్ సినిమాలని చేసారు. అలాంటి డైరెక్టర్ అప్పట్లో మంచి ఫామ్ లో ఉన్న నాగార్జునతో ‘క్రిమినల్’ అనే సినిమా చేశారు. ఈ మూవీ ఆయన చేయడానికి మరో కారణం.. ఈ సినిమాతో నాగార్జున బాలీవుడ్ ఎంట్రీ ప్రయత్నం కూడా జరిగింది.

ఇక తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన చాలామంది తెలుగులో ఒక సినిమా చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళలో ముందుగా చెప్పుకోవాల్సిన వ్యక్తి “మణిరత్నం”. ఈ మూవీకూడా నాగార్జున హీరోగా వచ్చిందే. అదే ‘గీతాంజలి’. మణిరత్నం చేసిన ఒక్కగానొక్క ఈ క్లాసిక్ తెలుగులో ఆయన స్ట్రైట్ ఫిల్మ్. ఇక నటుడిగా ఎంతో పేరు తెచ్చుకున్న “ప్రతాప్ పోతన్” కూడా తెలుగులో ఒక స్ట్రైట్ ఫిల్మ్ చేశారు. విశేషం ఏంటంటే ఇది కూడా నాగార్జున హీరోగా చేసిన సినిమానే. అదే ‘చైతన్య’. ఇంకా చెప్పాలంటే “ఫాజిల్” అనే మరో తమిళ దర్శకుడు కూడా నాగార్జున హీరోగా ఒకే ఒక్క స్ట్రైట్ తెలుగు సినిమా చేశారు. అదే ‘కిల్లర్’.

మరో తమిళ దర్శకుడు “విష్ణువర్ధన్” పవన్ కళ్యాణ్ హీరోగా ‘పంజా’ అనే స్ట్రైట్ సినిమా చేశారు. అదే పవన్ కళ్యాణ్ హీరోగా మరో తమిళ దర్శకుడైన “ధరణి” చేసిన స్ట్రైట్ ఫిల్మ్ ‘బంగారం’. “అదయమాన్” అనే దర్శకుడు ‘బొబ్బిలి వంశం’. “సుబ్రహ్మణ్యం శివ” అనే మరో తమిళ్ దర్శకుడు ‘దొంగ దొంగది’. “షాజీ కైలాష్” మంచు విష్ణు హీరోగా ‘విష్ణు’ సినిమా చేశారు. ఇక “అగస్త్యన్” రవితేజ హీరోగా ‘ఈ అబ్బాయి చాలా మంచోడు’ అనే స్ట్రైట్ సినిమా చేసి హిట్ కొట్టడం చెప్పుకోవాల్సిన విషయం.

ఇక కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ఉపేంద్ర నటించిన సినిమాలు చాలావరకు తెలుగులో డబ్ అయ్యాయి. వాటితో పాటు తెలుగులో నేరుగా ఒక సినిమాకి దర్శకత్వం కూడా వహించారు. ఆ సినిమా పేరు రాజశేఖర్ హీరోగా నటించిన ‘ఓం’. మరో కన్నడ దర్శకుడు “పవన్ వడేయార్” మంచు మనోజ్ హీరోగా ‘పోటుగాడు అనే మూవీ చేశారు. అలాగే బెంగాలీ దర్శకుడైన గౌతం ఘోష్ ‘మా భూమి’ అనే సినిమా చేశారు. ఈ మూవీ తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఉద్దేశించి ఉంటుంది. బెంగాలీవాడైనా ఇక్కడి ప్రాంతానికి సంబంధించిన సినిమా చేయడం విశేషం.

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -20-10-22-ఉయ్యూరు

Posted in సినిమా | Leave a comment

ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు,రచయిత-సుబ్రహ్మణ్యం శివ

ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు,రచయిత-సుబ్రహ్మణ్యం శివ

— సుబ్రహ్మణ్య శివ (అక్టోబర్ 4, 1884 – జూలై 23, 1925) భారతదేశ స్వాతంత్ర్య సమర యోధుడు, రచయిత.[3]

జననం
సుబ్రమణ్య శివ 1884, అక్టోబర్ 4న మద్రాసు ప్రెసిడెన్సీ, మధురై జిల్లా, దిండిగుల్ సమీపంలోవున్న బాట్లగుందులోని అయ్యర్ కుటుంబంలో రాజం అయ్యర్ కు జన్మించాడు. 1908లో భారత స్వాతంత్ర్యోద్యమంలో చేరాడు.

ఉద్యమంలో
ఈయన్ని 1908లో బ్రిటీష్ వారు అరెస్టు చేశారు. మద్రాసు జైలులో మొదటి రాజకీయ ఖైదీ సుబ్రహ్మణ్య శివనే. జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో కుష్ఠువ్యాధి రావడంతో సుబ్రహ్మణ్య శివను సేలం జైలుకు మార్చారు. వ్యాధికి గురైన ఈయన్ను బ్రిటీష్ అధికారులు రైలులో ప్రయాణించటానికి అనుమతి ఇవ్వకపోవడంతో కాలినడకన ప్రయాణించాడు. 1922వరకు స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన సుబ్రహ్మణ్య శివ అనేకసార్లు జైలుశిక్ష అనుభవించాడు. జ్ఞానభాను పత్రిక, రామానుజ విజయ, మాధవ విజయం పుస్తకాలు రచించాడు.[3]

గౌరవాలు
సుబ్రహ్మణ్య శివ మరణానాంతరం దిండుగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తియాగి సుబ్రమణ్య శివ మాళిగైగా పేరు పెట్టబడింది. ధర్మపురి జిల్లా పెన్నగడం సమీపంలోని పప్పరపట్టి వద్ద ఒక స్మారక చిహ్నం స్థాపించబడింది.[4]

మరణం
1925, జూలై 23న కుష్టువ్యాధితో చనిపోయాడు.[1]

మీ -గబ్బిట దుర్గాప్రసాద్-20-10-22-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

హాస్యానందం 48-  విభావనోక్తి

హాస్యానందం

48-  విభావనోక్తి

కారణం లేక కార్యం జరగదు కాని కవి చాకచక్యం తో అలా జరిగినట్లు చెబితే విభావనాలంకారం అన్నారు .ఇది హాస్యంలోనూ ప్రయోగిస్తే ,’విభావనోక్తి ‘’అంటారని మునిమాణిక్యం కని  పెట్టారు .ఇలాంటివి పిల్లల మాటలలో కనిపిస్తాయన్నారు .ఉదాహరణ ఆయనే చెప్పారు –‘’నేను మేడమీద ఉంటె ,కింద పిల్లలు నానా  అల్లరీ గోలా చేస్తున్నారు.ఏదో  కొ౦ప మునిగిందని కిందకి దిగివచ్చాను ..ఏదో గుడ్డ తగలడుతోంది .ఏమిట్రా అది అన్నాను .అమ్మ చీర అన్నారు ఎందుకు తగలడుతోంది అన్నాను .నిప్పు పుల్లగీచి దానిపై వేస్తె అన్నారు .నిప్పుపుల్ల గీసి మేము వేయలేదునాన్నా అని అందరూ ఒక్కసారే అన్నారు .ఆశ్చర్యమేసింది .ఆశ్చర్యం కోపం ,వచ్చి వళ్ళు మండింది ‘’చా గాడిద కొడుకుల్లారా !ఎవరాపని చేసింది ?అని అగద్దించాను .మా అయిదేళ్ళ పెద్ద కు౦క   ధైర్యంగా ‘’మేమంతా ఇక్కడే ఉన్నాం.మేమెవ్వరం అగ్గిపుల్లగీసి చీరమీద వేయలేదండి నానారండీ ‘’అన్నాడు .ఎట్లా అంటుకొందిరా. అంటే పెద్దపిల్ల ‘’ఏమో నాన్న దానంతట అదే  అంటుకొని భగ్గున మండింది ‘’అన్నది  ‘’కారణం లేకుండా కార్యం జరిగినట్లు చెప్పారన్నమాట అన్నారు స్వానుభవంతో మునిమాణిక్యం .

  ఒక్కోసారి బల్లమీద మంచినీళ్ళ గ్లాస్ దానంతతకడే మొగ్గేసి బోర్లపడుతుంది.నూనె దానంతట అదే ఒలుకుతుంది .పుస్తకం లో పేజీలు  వాటంతకు అవే చినిగిపోతాయి .మరీ విచిత్రం ఏమిటంటే ‘’మా ఆవిడ పులుసు రాచిప్ప పోయిమీద పెట్టి దొడ్లోకి స్నానికి వెళ్లి వచ్చే సరికి డబ్బాలో ఉన్న బొగ్గులు అవే నడిచివచ్చి పులుసులో పడిపోతాయి’’ .కనపడకుండా ఇవి జరిగిపోతూనే ఉంటాయి దానితో హాస్యం పుడుతూనే ఉంటుంది . .ఒక్కోసారి ఎండలేకుండానే దేశం మండిపోతుంది .ప్రేమలేకుండా భార్యను ప్రేమిస్తాడు. కోపం లేకుండానే ముఖం చిటపట లాడుతుంది ‘’అన్నారు .

‘’ఒకసారి రైలలో వెడుతున్నాం  .పొలాల మధ్య రైలు అకస్మాత్తుగా ఆగిపోయింది .డ్రైవర్ దిగి చూస్తె పట్టాలమధ్య ఆవు నలిగి రక్త సిక్తమైంది .ఆవు ఆసామివచ్చి డ్రైవర్ తో తగాదాపడి ‘’నా ఆవును చంపావు ‘’అని కలబడ్డాడు .డ్రైవర్ ‘’నేను చంపలేదు ఇంజన్ ఆవుమీదు గా పోలేదు .ఆవు దానంతతకు అదే చచ్చింది ‘’అంటే ఆసామి ‘’కాళ్ళు ఎలాతెగాయి “”అనగా ‘’ఆకాళ్ళు చచ్చు  కాళ్ళు వాటంతటకవే తెగిపదడిపోయాయి .ఆవు తలను రైలు చక్రాలమధ్య పెట్టి ఆత్మ హత్య చేసుకొంది’’అన్నాడు ఆసామి ‘’ఇంజన్ నడుపుతున్నావుగా .కాస్త చూసి నడపాలికదా ‘’అంటే డ్రైవర్ ‘’ఇంజన్ ను నేను నడపటం లేదు అద౦తట అదే నడుస్తోంది ‘’అన్నాడు అని కత చెప్పి ఇందులో ఉపద్రవాలకు దేనికీ కారణం లేదు వాటంతకవే జరిగాయి. కారణం లేకుండా కార్యం జరగటానికి హాస్యం గా నడిపిస్తే ,అర్ధం పర్ధం లేకుండా ,అసంబద్ధంగా హాస్యజనకంగా ఉంటుంది అన్నారు మునిమాణిక్యం ముసిముసి నవ్వులతో .మరికొన్ని ఉదాహరణలు వాయి౦చా రాయన .వాహకుడు లేని పల్లకి ,కడుపులేనికానుపు ,తడుపులేని నానుపు ,మగువ లేని దాంపత్యం ,మగడు లేని పాతివ్రత్యం ,ప్రియురాలులేని అనురాగం,జవరాలులేనిపెనుభోగం ,నాటకం లేని వేషాలు ,మగతనం లేనిమీసాలు ,బిడ్డలు లేని ఇల్లరికం ,అత్తలేని కోడరికం ,భాగ్యాలు లేని పంపకం ,రోకళ్ళు లేని దంపుడు ,అని ఏకధాటిగా వాయించారు సార్.పైగా ‘’ఉన్నట్లు అంటే –ఊహిచటం విభావనోక్తి .కారణం లేని కార్యం ఉన్నచొ  కవితా చమత్కారోక్తి .స్వకీయముల్ ఈ ఎక్సాంపుల్స్ –సరసము లీ శా౦పుల్స్ ‘’అని కవిత్వం తో ఎడాపెడా వాయించారు .

 మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -19-10-22-ఉయ్యూరు 

Posted in ప్రవచనం | Tagged | Leave a comment

విజయ విలాసం. 10వ భాగం.19.10.22.

విజయ విలాసం. 10వ భాగం.19.10.22.

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ఆధునిక హిందీ భాషా పితామహుడు భారతే౦దు హరిశ్చంద్ర -7(చివరిభాగం )

ఆధునిక హిందీ భాషా పితామహుడు భారతే౦దు హరిశ్చంద్ర -7(చివరిభాగం )

  హిందీ భాషాభి వృద్ధి మరచి గుడ్డిగా ఆంగ్లేయులను అనుసరించే వారిని హరిశ్చంద్ర గట్టిగా విమర్శించాడు హిందీ పత్రికాప్రచారానికి ఆయన మార్గదర్శి .సాహిత్యంలో హాస్యాన్ని పోషించాడు .హరిశ్చంద్రతర్వాత  అదే దారిలో నడిచినవారు కాన్పూరు కు చెందిన ప్రతాప్ నారాయణ మిశ్రా ,బాలకృష్ణ భట్ లు .నాటక రచనకూ భారతే౦దు మార్గదర్శనం చేశాడు. హరిశ్చంద్ర అసంపూర్తి నాటికలను బాబూ రాదా కృష్ణ దాస్ పూర్తి చేయటమేకాక దుఖినీబాలా ,రాణాప్రతాప్ నాటకాలు కూడా రాశాడు

  హరిశ్చంద్ర స్త్రీ విద్య ,విధవావిహాం ,సముద్రప్రయాణ౦  వంటి  సంస్కరణ లపైనా  రాశాడు .పూరీ జగన్నాథ దర్శనానికి వెడుతూ బర్ద్వాన్ కు చేసిన ప్రయాణమే అతని మొదటి రైలు ప్రయాణం ఆ తర్వాత అనేక చోట్లకు రైలులో వెళ్ళాడు .దీనివలన విశాలభావాలుకలిగాయి .ఖందేప్ లో గుజరాత్ వరద బాధితులకు సహాయం తన పత్రికలద్వారానూ , స్వయంగా చేశాడు .అతని విస్తృత యాత్రా ఫలితంగా రాసినవే యాత్రా చరిత్రలు .అవసాన దశలో అస్వస్థతకు కారణమైనది ఉదయపూర్ ప్రయాణం .

  సంపన్న యువరాజులకు ,జమీందార్ పిల్లలకోసం స్థాపించబడిన ఒక విద్యా సంస్థలో పురాతన వృత్తాంతాల సంగ్రహణ కర్తగా ఉన్న రాజెంద్రలాల్ మిత్ర ఈయన ఇంటికి దగ్గరలో ఉండేవాడు .ఇద్దరూ విష్ణు భక్తులే సన్నిహితులయ్యారు .దానితో ప్రాచీన వస్తువులపై ఇతనికి ఆసక్తికలిగి,ప్రాచీన వస్తు చరిత్రను మొట్టమొదటి సారిగా హిందీలో రాశాడు .వారణాశి అంతా విస్తృతంగా తిరిగి రాగి శాసనాలు చదివి విపులంగా రాశాడు .కలకత్తా వెడితే ఆసియా సంఘాన్ని తప్పక చూసేవాడు .ఎన్నో వ్రాతప్రతులు దానికి సమర్పించాడు .వివిధకాలాల భారతచరిత్రను వ్యాసాలుగా రాశాడు .ఇలా రాసేటప్పుడు అందులోని సాహిత్యమంతా కాచి వడపోసేవాడు .బ్రిటిష్, ఫ్రెంచ్ చరిత్రకారుల రచనలలోని విషయాలుకూడా పొందు పరచేవాడు .ఉదయపూర్ రాజభవనం ,రాజస్థాన్ కోట చరిత్ర గురించి అతడు రాసినవి పరమ ప్రామాణికాలు .ఇవి రాయటానికి ముందు ‘’టాడ్’’రాసిన ‘’అనల్స్ ఆఫ్ రాజస్థాన్ ‘’క్షుణ్ణంగా చదివాడు .అనేక భారతీయ సంస్థానాధీశులు హరిశ్చంద్రను ఆహ్వానించి గౌరవించి సత్కరించారు .

  ‘’కాల చక్ర ‘’రచనలో ప్రపంచ చరిత్రను కొన్ని భాగాలుగా చెప్పే ప్రయత్నం చేశాడు .భక్తుడే కాని మూఢ భక్తిలేదు .జైనం లో నిరసి౦చటానికి ఏమీ లేదన్నాడు . 1870లో ఆర్యసమాజం వారు వారణాశి మతబోధకులను విమర్శించే సమయంలో స్వామి దయానంద సరస్వతికి వ్యతిరేకంగా నిలిచాడు .తర్వాత కాలం లో ఆయన్ను తనపత్రికలో చేర్చుకొన్నాడు .చివరికాలం లో మతసమన్వయతకోసం అర్రులు చాచాడు .వచనంలో ఖడీబోలీ ప్రవేశపెట్టిన మార్గదర్శి అయ్యాడు .హిందీలో నవలలు రాలేదని ఆవేదన చెందాడు .రాధా చరణ్ గోస్వామి ,బాబూకాశీ నాథ లను హిందీ నవలలు రాయమని ప్రోత్సహించాడు .తన రెండవ భార్య బెంగాలీ అయిన మల్లిక ను బెంగాలీ నవలలను అనువదించమని కోరగా రాధారాణి ,చంద్రప్రభపూర్ణ ప్రకాష్ ,సౌందర్యమయి నవలలను హిందీలోకి అనువదించి రాధారాణి ని ఆయనకే అంకితమిచ్చినది .బంకిం చంద్ర నవల ‘’రాజ సిన్హా ‘’ను స్వయంగా అనువాదం మొదలు పెట్టిరాయగా అసంపూర్ణంగా మిగిలిపోతే బంధువు రాధా కృష్ణ దాస్ పూర్తి చేశాడు .ఇతడే స్వయంగా స్వర్ణలత ,పండిత రాం శంకర నవల ‘’మధుమాలతి’’కూడా అనువదించాడు .

  డబ్బు దుబారాతో మనశ్శాంతి భోగ విలాసాలతో ఆరోగ్యం కోల్పోయిన హరిశ్చంద్ర ,దూర ప్రయాణాలు మానలేదు .చిరకాల మిత్రుడు మోహన్ లాల్ పాండ్య ఉదయపూర్ లో ఉంటె  వెళ్లి చూసి అటునుంచి నత్వారాకు వెళ్ళాడు .దీనితో ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నది .కలరా సోకి ఊపిరి పీల్చుకోవటం కష్టమైంది .ఎన్నో ఇబ్బందులు తట్టుకొని కాశీచేరాడు .తన ప్రాణప్రదమైన రచనలు పూర్తి చేయలనుకొన్నాడు .భారతీయ రంగ౦  తీరు తెన్నులపై ఒక గ్రంథం రాశాడు. బ్రిటిష్ వారి కోరికపై వారి జాతీయ గీతాన్ని హిందీలోకింవాదం చేశాడు .కొన్ని నాటికలు  మరికొన్ని రచనలూ చేశాడు .బల్లియాలో అతడురాసిన సత్య హరిశ్చంద్ర ,నీల్ దేవ్ ప్రదర్శిస్తున్నారని తెలిసి ,అక్కడికి వెళ్ళగా అందరూ హరిశ్చంద్రద్రను షేక్స్పియర్ అంతటి వాడు అని మెచ్చుకొన్నారు ‘

  తిరిగి కాశీ వచ్చాక అనారోగ్యం తిరగబెట్టింది .డాక్టర్లు వారించినా రచన చేస్తూనే ఉన్నాడు .9-9-1850లో జన్మించిన హరిశ్చంద్ర  5-1-1885 న 35వ ఏట అతి తక్కువవయసులోనే తనువు  చాలించాడు .తులసీదాస్ తర్వాత అంతటి ప్రతిభామూర్తి హరిశ్చంద్ర . అయితేనేమి హిందీ సాహిత్యానికి మార్గదర్శి అయి ఆధునిక హిందీ భాషా పితామహుడు అనిపించుకొన్నాడు .అతని మనసులో 1-హిందీ బోధనాభాషగా యూని వర్సిటి నెలకొల్పటం 2-తన ఉద్యానవనం లో ఠాకూర్ జీ విగ్రహం నెలకొల్పటం 3-దేశం వాయవ్యమూలలో  లలితకళా నిలయంగా ఒక కళాశాల స్థాపించటం 4-అమెరికా ,బ్రిటన్ దేశాలు సందర్శించటం అనే కోరికలున్నట్లు మిత్రులకు చెప్పేవాడు .అవి చేయలేక పోయానని బాధపడ్డాడు .

ఆధారం –మదన గోపాల్ రచనకు శ్రీమతి ఎ.లక్ష్మీరమణ చేసిన తెలుగు అనువాదపుస్తకం –భారతే౦దు హరిశ్చంద్ర .

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-10-22-ఉయ్యూరు   , . ,

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -317

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -317

317-కళాత్మక చిత్ర చాయాగ్రాహకుడు ,శంకరాభరణం మనవూరి పాండవులు ఫేం ,నిరీక్షణ ,సంధ్యారగం దర్శకుడు ,బహుపురస్కార గ్రహీత –బాలు మహేంద్ర

బాలు మహేంద్ర (Balu Mahendra) (మే 20, 1939 – ఫిబ్రవరి 13, 2014) దక్షిణ భారతీయ సుప్రసిద్ధ ఛాయాగ్రహకుడు, దర్శకుడు. కళాత్మక చిత్రాలను తీయడంలో పేరుగాంచిన ఈయన ఇప్పటివరకు ఐదు జాతీయ అవార్డులు అందుకున్నారు. మొదట ఛాయాగ్రాహకుడిగా తమిళ చిత్ర సీమలో ప్రవేశించారు. అనంతరం ఆయన స్క్రీన్ ప్లే, దర్శకత్వ, నిర్మాణరంగంలోకి అడుగుపెట్టి తనదైన శైలిలో చిత్రాలను రూపొందించారు. దక్షిణాదిలోని అన్ని భాషలలో రూపొందిన చిత్రాలకు ఆయన పనిచేశారు.

జననం, విద్యాభ్యాసం
1939లో శ్రీలంక లోని తమిళ ఫ్యామిలీలో జన్మించారు. విద్యాభ్యాసంకూడా అక్కడే పూర్తి చేసారు. 13 ఏళ్ల వయసులో డేవిడ్ లీన్ దర్శకత్వంలో వచ్చిన ‘ది బ్రిడ్జ్ ఆన్ ది రివర్ క్వాయ్’ చిత్రం చూసే అవకాశం దక్కించుకున్న బాలు మహేంద్ర తర్వాత సినిమాలపై ఆసక్తి పెంచుకున్నారు. లండన్ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ హానర్స్ డిగ్రీ పట్టా పొందిన అనంతరం పూణె లోని ఎఫ్‌టిఐఐలో జాయినై సినిమాటోగ్రఫీలో కోర్సు పూర్తి చేయడంతో పాటు గోల్డ్ మెడల్ సాధించారు.

మరణం
2014 ఫిబ్రవరి 13 తెల్లవారుజామున గుండెపోటు రావడంతో చెన్నైలోని విజయ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఉదయం 11.00 గంటలకు మరణించారు.

సినీ నేపథ్య౦
సొమ్మొకడిది సోకుకడది, తరం మారింది, లంబాడోళ్ల రాందాసు, మనవూరి పాండవులు, శంకరాభరణం తదితర చిత్రాలకు ఆయన ఛాయగ్రాహాకుడిగా పనిచేశారు. తమిళం, హిందీ, మలయాళం, కన్నడ, తెలుగు భాషల్లో ఆయన పలు అద్భుతమైన సినిమాలు తెరకెక్కించారు. భానుచందర్, అర్చన జంటగా నటించిన నిరీక్షణ చిత్రానికి, కమల్ హాసన్ – శ్రీదేవి జంటగా నటించిన వసంత కోకిల చిత్రానికి దర్శకత్వం వహించారు. వసంత కోకిల చిత్రం హిందీలో సద్మా పేరుతో వచ్చింది. ఆయన రెండు నంది అవార్డ్స్, ఎన్నో ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ తోపాటు, కేంద్ర ప్రభుత్వ, పలు రాష్ట్ర ప్రభుత్వాల నుండి అనేక అవార్డులు, రివార్డులు అందుకున్నారు.

చిత్ర సమాహారం
దర్శకుడిగా
· Athu Oru Kanaa Kaalam (2005)

· Julie Ganapathy (2003)

· Aur Ek Prem Kahani (1996)

· సతీ లీలావతి (1995)

· Marupadiyam (1993)

· చక్రవ్యూహం (1992)

· Poonthenaruvi Chuvannu (1991)

· Vanna Vanna Pookkal (1991)

· సంధ్యారాగం (1989)

· వీడు (1988)

· Irattaival Kuruvi (1987)

· Rendu Thokala Titta (1987)

· Yaathra (1985)

· Unn Kannil Neer Vazhindal (1985)

· Neengal Kettavai (1984)

· Oomai Kuyil (1983)

· Sadma (1983)

· Moondram Pirai (1982)

· నిరీక్షణ (1982)

· Olangal (1982)

· Manju Moodal Manju (1980)

· Moodupani (1980)

· Azhiyatha Kolangal (1979)

· కోకిల (1977)

· Motor Sundaram Pillai (1966)

ఛాయాగ్రహకుడిగా
· Yaathra (1985)

· పల్లవి అనుపల్లవి (1983)

· Sadma (1983)

· Moondram Pirai (1982)

· Olangal (1982)

· సీతాకోకచిలుక (1981)

· Moodupani (1980)

· శంకరాభరణం (1979)

· మనవూరి పాండవులు (1978)

· లంబాడోళ్ళ రామదాసు (1978)

· సొమ్మొకడిది సోకొకడిది (1978)

· Ulkatal (1978)

· తరం మారింది (1977)

· Nellu (1974)

అవార్డులు, గౌరవాలు
జాతీయ చలనచిత్ర అవార్డులు
· కోకిల – జాతీయ ఉత్తమ ఛాయాగ్రహణం (1978), (బ్లాక్ అండ్ వైట్)

· మూంద్రన్ పిరాయి (వసంత కోకిల) – [జాతాయ [ఉత్తమ ఛాయాగ్రహణం]], (1983), (కలర్)

· వీడు – జాతీయ ఉత్తమ చిత్రం, (1988) (తమిళం)

· సంధ్యారాగం – జాతీయ ఉత్తమ కుటుంబ చిత్రం, 1990

· వన్న వన్న పూక్కల్ – జాతీయ ఉత్తమ చిత్రం, (1992) (తమిళం)

ఫిల్మ్ ఫేర్ అవార్డులు
నామినేట్ అయినవి

· సద్మా – ఫిల్మ్ ఫేర్ ఉత్తమ రచన (1983),

గెలుపొందినవి

· మూంద్రన్ పిరాయి – ఫిల్మ్ ఫేర్ ఉత్తమ దర్శకుడు , (1983) (తమిళం)

· ఒలంగల్ – ఫిల్మ్ ఫేర్ ఉత్తమ దర్శకుడు , (1983) (మలయాళం)

· వీడు – ఫిల్మ్ ఫేర్ ఉత్తమ దర్శకుడు , (1988) (తమిళం)

కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డులు]
· కోకిల – ఉత్తమ నేపథ్యం – 1977

కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు
· నీల్లు – ఉత్తమ ఛాయాగ్రహణం – 1974

· చువన్న సంధ్యకల్, ప్రయాణం- ఉత్తమ ఛాయాగ్రహణం – 1975 (బ్లాక్ అండ్ వైట్)

నంది పురస్కారాలు
· మనవూరి పాండవులు – జాతీయ ఉత్తమ ఛాయాగ్రహణం- 1978.

· నిరీక్షణ – జాతీయ ఉత్తమ ఛాయాగ్రహణం – 1982.

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -19-10-22-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 10వ భాగం.19.10.22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 10వ భాగం.19.10.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

రాణ కెక్కిన కొందరు రాయలసీమ ప్రముఖులు -8

రాణ కెక్కిన కొందరు రాయలసీమ ప్రముఖులు -8

21-అణుశాస్త్ర వేత్త ,వైద్య వైజ్ఞానికుడు ,రేడియో ధార్మిక శాస్త్రజ్ఞుడు ,మేరీ క్యూరీ వద్ద పరిశోధన చేసిన అణుధార్మిక పరిశిధన సంస్థ స్థాపకుడు –శ్రీ పత్తిపాటి రామయ్య నాయుడు

  • పత్తిపాటి రామయ్య నాయుడు (జూన్ 1904-జూన్ 1991) ప్రఖ్యాతిగాంచిన అణుశాస్త్రవేత్త, వైద్య వైజ్ఞానికుడు, రేడియోధార్మిక శాస్త్రజ్ఞుడు. వైద్య భౌతిక శాస్త్రము ఆవిష్కరించినవారిలో ఆద్యుడు. పారిస్ లో నోబెల్ బహుమతి గ్రహీత మేడం క్యూరీ వద్ద పరిశోధనలు చేసిన మేధావి. 1938లో భారతదేశములో మొట్టమొదటి అణుధార్మిక పరిశోధనశాల స్థాపించిన వాడు.

బాల్యము, విద్య
నాయుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము, చిత్తూరు జిల్లా, మదనపల్లిలో జూన్ 1904న జన్మించాడు[1]. చిన్న వయసులోనే ఇల్లు వదలి పుదుచ్చేరి లోని అరవిందాశ్రమములో చేరాడు. పిదప బెంగాల్ లోని శాంతినికేతన్లో గణితశాస్త్రము బోధించాడు. కాశీ విశ్వవిద్యాలయములో 1923 లో పట్టభద్రుడయ్యాడు. పారిస్ విశ్వవిద్యాలయంలో 1929లో ఎం.ఎస్.సి. డిగ్రీని, 1933లో డాక్టరేట్ పట్టాను పుచ్చుకున్నాడు.

పరిశోధనలు
ఇతడు తన డాక్టోరల్ థీసిస్ కొరకు క్యూరీ-కార్నెగీ రీసర్చ్ ఫెలోషిప్‌లో భాగంగా పారిస్ లోని రేడియమ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో మేడం క్యూరీతో కలిసి పనిచేశాడు. తరువాత ఇంగ్లాండుకు వెళ్ళి అక్కడ లండన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ పాట్రిక్ బ్లాకెట్ పర్యవేక్షణలో పరిశోధనలు చేసి 1936లో డాక్టరేట్ పట్టా సంపాదించాడు. 1936లో బొంబాయిలోని టాటా ట్రస్టు ఇతడిని కేన్సర్ వ్యాధి చికిత్స కోసం రాడాన్ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించడానికి భారతదేశానికి ఆహ్వానించింది. 1938లో ఇతడు రేడియం సంగ్రహణ పరికరాలతో పాటు 2 గ్రాముల రేడియంతో బొంబాయిలోని టాటా మెమొరియల్ హాస్పెటల్‌కు తీసుకురాబడ్డాడు. ఇతని పర్యవేక్షణలో దేశంలోని మొట్టమొదటి రాడాన్ ప్లాంట్ నిర్మించబడి 1941 ఫిబ్రవరి 28న టాటా మెమొరియల్ ఆసుపత్రి ప్రారంభమైంది. ఈ ఆసుపత్రి 1952లో భారత ప్రభుత్వపు అణు ఇంధనశాఖకు బదిలీ అయ్యింది.

వ్యక్తిగతము
మదనపల్లె (చిత్తూరు) నకు చెందిన భౌతిక శాస్త్రవేత్త పత్తిపాటి రామయ్య నాయుడు కుమార్తె లీల హిందీ చలనచిత్ర నటి. రామయ్య పారిస్ లోని UNESCO శాస్త్ర సలహాదారుగా పనిచేయుచున్నపుడు ఫ్రెంచి వనిత మార్తాను వివాహమాడాడు. వీరికి లీల 1940 సంవత్సరములో జన్మించింది. మార్తా భారతదేశానికి సంబంధించిన విషయములలో పరిశోధకురాలు (Indologist).

22-న్యాయవాది లోక్ సభ స్పీకర్ ,,కేంద్రీయ సంస్కృత విద్యా పీఠం అధ్యక్షుడు ,బీహార్ గవర్నర్ –శ్రీ మాడభూషి అనంత శయనం అయ్యంగార్

, మాడభూషి అనంతశయనం అయ్యంగారు స్వాతంత్ర్య సమర యోధుడు, పార్లమెంటు సభ్యుడు, లోక్‌సభ స్పీకరు. ఇతడు 1891, ఫిబ్రవరి 4 తేదీన చిత్తూరు జిల్లా, తిరుచానూరులో వెంకట వరదాచారి దంపతులకు జన్మించాడు. పచ్చయప్ప కళాశాల నుండి బి.ఏ.పట్టా పొందిన పిదప మద్రాసు లా కాలేజీ నుండి 1913లో బి.ఎల్. పట్టా పొందారు. ఇతని స్వస్థలం తిరుపతిలో గణిత ఉపాధ్యాయునిగా పనిచేసి, తరువాత న్యాయవాదిగా 1915 -1950 వరకు నిర్వహించాడు. మహాత్మా గాంధీ సందేశం మేరకు స్వాతంత్ర్య సమరంలో (వ్యక్తి సత్యాగ్రహం, క్విట్ ఇండియా) పాల్గొని రెండు సార్లు కఠిన కారాగార శిక్ష అనుభవించాడు.

1934లో మొదటిసారిగా కేంద్ర శాసనసభలో సభ్యునిగా ఎన్నుకోబడ్డాడు. భారత స్వాతంత్ర్యం అనంతరం జరిగిన మొదటి సాధారణ ఎన్నికలలో తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం నుండి, రెండవ లోక్‌సభ ఎన్నికలలో చిత్తూరు నుండి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యాడు.

1948లో మొదటి లోక్‌సభలో డిప్యూటీ స్పీకరుగా తరువాత 1956లో స్పీకరుగా ఎన్నుకోబడ్డాడు. 1962లో బీహార్ గవర్నరుగా నియమితులై 1967 వరకు ఆ పదవిలో ఉన్నాడు.

కేంద్రీయ సంస్కృత విద్యాపీఠానికి అధ్యక్షులుగా 1966లో ఎన్నుకోబడి చివరిదాకా ఆ పదవి నిర్వహించాడు.

బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఇతడు 1978 మార్చి 19న తిరుపతిలో పరమపదించాడు. ఇతని జ్ఞాపకార్ధం 2007 సంవత్సరంలో కంచు విగ్రహాన్ని తిరుపతి పట్టణంలో నెలకొల్పారు.[1]

ఇతని కుమార్తె పద్మా సేథ్ ఢిల్లీ బాలభవన్ అధ్యక్షురాలిగా, మహిళా కమిషన్ సభ్యురాలిగా, సుప్రీం కోర్టు న్యాయవాదిగా, యునిసెఫ్ సలహాదారుగా పనిచేసింది.

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-10-22-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

హాస్యానందం 47- వ్యాజోక్తి

హాస్యానందం

47- వ్యాజోక్తి

అసలు దాన్ని వేరే నెపం తో చెప్పటం వ్యాజోక్తి .నాయికకు నరస భూపలుడిని చూస్తె ,ఆనంద బాష్పాలు వస్తే ,ఆమాట చెప్పటానికి సిగ్గుపడి అగరు ధూపం వలనఆనంద బాష్పాలు కారాయని చెప్పింది .ఒక కధకుడు ‘’ఆమెకు భర్తపై చాలా   దయ ఉంది . .భర్తపై ఆమెకు అమితమైన ప్రేమ దయా ఉన్నాయి ఆమెకు కోపం వస్తే మొగుడి చెవి మేలేసినా ,దానివల్ల వచ్చే వాపు తగ్గటానికి వెంటనే మందు రాస్తుంది ‘’అని తమాషా ఉదాహరణ ఇచ్చారు మునిమాణిక్యం .మేలేయటం లో  ధూర్త లక్షణం కనిపించినా ,మందు రాయటం తో దాన్ని కప్పేసింది .మరోటి ‘’అప్పుడప్పుడు ఆమె మొగుడిపై కాఫీ కప్పు విసుర్తుంది .కనీ ఆయన బట్టలు ఖరాబుకాకుండా కాఫీ వేరే దాన్లో పోసి ఖాళీ కప్పే విసుర్తుంది .అందులో స్పూన్ తేసేసి మరీ విసుర్తుంది అది తగిలి ఆయనముఖం వాచిపోతు౦ దేమోననే భయంతో ‘’.మునిమాణిక్యం గారి మామ్మ ఒక కత చెప్పిందట –ఒక కోడలు లేచిపోతూ ‘’అత్తానీకొడుకు ఆకలికి ఆగలేడు జాగ్రత్తగా చూసుకో అందట .

  చేసే పనివలన బయట పడే గుణం ఒకటి ,దాని తర్వాత అన్నమాటలవలన స్పురించే భావం వేరొకటి .ఆ మాటల్లో అప్రకటిత భావాన్ని దాచే ప్రయత్నం ఉంటుంది లక్షణ కర్త చెప్పింది కాదుకానీ తానె సరదాగా దీన్ని వ్యాజోక్తి కింద జమ కట్టానని మాస్టారువాచ. హాస్యంలో పారిభాషిక పదాలు లేవుకనుక సాహిత్యం లో ఒక అర్ధం లో స్థిరపడిన ఉన్నమాటకే విశేషార్ధం కల్పించి ఇలాంటి పారిభాషిక పదాలు సృష్టించాల్సి వచ్చిందని ఇదివరకే చెప్పాననీ ఇప్పుడు చేస్తుంది అదే అని మునిమాణిక్యం సార న్నారు.

మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -18-10-22-ఉయ్యూరు .

Posted in ప్రవచనం | Tagged | Leave a comment

విజయ విలాసం.9వ భాగం.18.10.22

విజయ విలాసం.9వ భాగం.18.10.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ఆధునిక హిందీ భాషా పితామహుడు భారతే౦దు హరిశ్చంద్ర -6

’ఆధునిక హిందీ భాషా పితామహుడు భారతే౦దు హరిశ్చంద్ర -6

  విక్టోరియా రాణికాలం లో హరిశ్చంద్ర 11వ ఏట నే ప్రిన్స్ ఆల్బర్ట్ ను అభినందిస్తూ ఒకపద్యం రాశాడు .తాను  స్థాపించిన పాఠశాలలో ప్రతియేటా రాణి పుట్టినరోజు జరిపేవాడు . దేపాలతొఅల౦క రింప జెసి ,కాశీ పండితులతో యువరాజుకు ఆశీస్సు పద్యాలు చెప్పించి ,ప్రశంసా పత్రాలు అచ్చువేయించి యువరాజుకు బహుమతిగా పంపేవాడు .బ్రిటిష్ వారి ఆదరాభిమానాలు పొందటం చేత ,ఆయన్ను మునిసి పల్ అదికారిగా ,గౌరవ న్యాయాధికారిగా చేసి గౌరవించేవారు .న్యాయవిచారణ సంఘ గౌరవ స్థానం చాల చిన్న వయసులోనే పొందాడు .కాశీలో ఇలాంటి గౌరవం పొందినవారిలో ఇతడే అతి చిన్నవాడు .అతని పత్రికలకు పోషకులుగా ప్రభుత్వం ఉండటంకూడా గౌరవానికి గుర్తే .డైరెక్ట్ గా లండన్ లోని సె౦ట్ జేమ్స్ రాజగృహంతో సంబంధాలు నెలకొల్పుకున్నాడు .1871లోచక్రవర్తి ఆధ్వర్యం లో  జరిగిన జగద్విఖ్యాత ప్రదర్శనకు యితడు పంపిన పురాతన వస్తువులకు  వేల్స్ యువరాజు స్వయంగా యోగ్యతా పత్రం బహూకరించాడు .ఇంగ్లాండ్ రాజు రాణీలతోనేకాకుండా రష్యా జార్ చక్రవర్తి ,జర్మనీ ఖైజర్ తో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవాడు .తన పుస్తకాలు వారికి పంపటంతో మొదటిసారిగా విదేశాలకు హిందీ సాహిత్యాన్ని పరిచయం చేసిన ఘనకీర్తి  పొందాడు .తూర్పు దేశ భాషలతో బాగా పరిచయమున్న గార్కాన్ డిటాస్, తోనూ పరిచయం పొందాడు .రష్యా ఆలోచనా సభ సభ్యుడు సెయింట్ పీటర్స్ బర్గ్ నుంచి ఇతనికి రాసిన లేఖను బట్టి 1870లో తూర్పు దేశ భాషలలో పరిజ్ఞానమున్న రష్యా దేశీయులకు హరిశ్చంద్ర రచనలతో బాగా పరిచయంన్నట్లు తెలుస్తోంది .బ్రిటిష్ వారిద్వార బెర్లిన్ కు, పిట్స్ బర్గ్ కు పంపిన పుస్తకాలు అందినట్లు ఇండియా గవర్నర్ కు, ఉత్తరప్రదేశ్ గవర్నర కు వ్రాతపూర్వక సమాచారం చేరేది .

  యువరాజు ఇండియావస్తే అతనిపై ప్రశంసా పద్యాలు,రాణి హంతకుల తుపాకి దేబ్బలనుంచి తప్పించుకొన్న దానిపై కవితలు అల్లాడు  .భారతీయులతో ఉన్న బ్రిటిష్ సైన్యం విజయాలు సాధిస్తే ఉత్సాహంగా కవితలు కూర్చాడు  . కాశీ వచ్చిన రాజ కుటుంబీకులతో స్నేహభావంగా మెదిలేవాడు .ఇవన్నీ రాజా శివరాం ప్రసాద్ కు కంటకంగా ఉండేది .వారిని సరదాగా ఆటపట్టి౦చి  యేదడిపించేవాడు .ఇలాంటి బ్రిటిష్ వీరాభిమాని 1870విదేశీ వస్తు నిషేధానికి ఉద్యమించాడు అంటే ఆశ్చర్యమేస్తుంది   .స్వదేశీ  వస్తువులే వాడమని ప్రమాణాలు చేయించాడు .కొద్దికాలం తర్వాత ఇతని ఈరకమైన అభిప్రాయాన్ని బ్రిటిష్ వారు సహించలేకపోయారు .పత్రిక పోషణ మానేశారు .దీనికి నిరసనగా ఈయన మున్సిపిల అధికార,గౌరవ న్యాయాధీశ పదవులకు రాజీనామా చేసి తన దేశభక్తి నిరూపించాడు .దేశమే అత్యున్నతమైనది అన్న భావం నిలబెట్టాడు .ఇతని పత్రికలూ అందులోని వ్యాసాలూ ప్రభుత్వ వ్యతిరేకం గా ఉన్నాయని ప్రత్యర్ధులు కాకిగోల చేశారు .ప్రభుత్వం చెప్పుడుమాటలకు లొంగి ఈయన ప్రత్యర్ధి శివరామ ప్రసాద్ ను దగ్గరకు చేర్చుకున్నది.దీనిఫలితంగా ఇతని కవి వచన సుధ పత్రిక ఆర్ధికంగా నష్టపోగా,చివారికి దివాలా తీసింది .పత్రికను స్నేహితుడికి ఇచ్చేశాడు .బాలబోధిని పత్రికకూ ఇలాంటి స్థితి ఏర్పడగా ,దాన్నీ మూసేశాడు .మిత్రునితో మాట్లాడి కవివచన కు దీన్ని అనుబంధం చేసినా దాని ప్రత్యేకత కోల్పోయింది .చివరికి కవి వచన సుధ ఆయన ప్రత్యర్దిశివ రామప్రసాద్ చేతికి చిక్కింది .

  ఒక్క చంద్రికను మాత్రమేకొంతకాలం నడిపి తర్వాత మిత్రుడు మోహన చంద్ర దాన్ని తనపత్రికలో కలిపేయమని కోరగా చివరికి అది ‘’హరిశ్చంద్ర మోహన చంద్రిక’’గా వెలువడింది .మోహన్ లాల్  విష్ణూ లాల్ పాండ్య కు ఉద్యోగం రాగా  పత్రిక ఉదయపూర్ కు  మారి,తర్వాత నఢ్ధావాలాకు  మారి చివరికి ఎడారిలో కలిసిపోయింది .చనిపోవటానికి కొంతకాలం ముందు హరిశ్చంద్ర తన ప్రియమైన చంద్రికను ‘’నవోదిత చంద్రిక ‘’గా ముద్రించాడు .కానీ ఎంతోకాలం కాకుండానే కన్ను మూశాడు .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -18-10-22-ఉయ్యూరు  

     .

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

2022 దీపావళి పండుగసందర్భంగాఆన్ లైన్ విధానంలోఏక పత్ర కథల పొటీ(Single page story)

2022 దీపావళి పండుగ
సందర్భంగా
ఆన్ లైన్ విధానంలో
ఏక పత్ర కథల పొటీ
(Single page story)

  • ఔత్సాహిక రచయితలకు ఆహ్వనం.
  • వ్రాతప్రతిలో A4 పేజీ లో 32 లైన్లు రావచ్చును.
  • పిడిఎఫ్ ఫార్మాట్ మాత్రమే ఉండాలి.
  • కథ ఇంతకుముందు ఏ ఫార్మట్ లోనూ ప్రచురణ అయి ఉండకూడదు. ప్రచురణార్థం పంపి ఉండకూడదు. అభ్యర్థులు ఈ మేరకు హామి పత్రం మరియు తమ పూర్తి వివరాలు, చరవాణి సంఖ్యలను కథ చివరలో పొందుపరచాలి.
  • రచన సమకాలీన తెలుగు జీవన విధానాన్ని ప్రతిబింబించాలి.
  • ఒక అభ్యర్థి ఒక కథను మాత్రమే పంపాలి. ఎక్కువ పంపిన సందర్భంలో మొదటగా పంపిన రచన మాత్రమే పోటీకి స్వీకరించబడుతుంది.
  • బహుమతి పొందిన కథా రచయితలకు తగు రీతిన ప్రోత్సాహకాలు ఉంటాయి.
  • బహుమతి పొందిన కథలను నిర్వాహకులు ఏ విధంగానైనా ఉపయోగించుకునే హక్కు ఉంటుంది.
  • తుది తీర్పు న్యాయ నిర్ణేతలదే.
  • పాల్గొన్న రచయితలందరికీ ప్రశంసా పత్రం ఇవ్వబడుతుంది .
  • దీనిలో పాల్గొనుటకు కథల్ని
    kmvvaranasi@yahoo.com
    మెయిల్ కు పంపాలి.
  • కథలని పంపుటకు చివరి తేది 25.10. 2022
Posted in రచనలు | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 9వ భాగం.18.10.22.

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 9వ భాగం.18.10.22.

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

రాణ కెక్కిన కొందరు రాయలసీమ ప్రముఖులు -7

రాణ కెక్కిన కొందరు రాయలసీమ ప్రముఖులు -7

19- ప్రత్యేకాంధ్ర ఉద్యమ నాయకుడు ,ఆంధ్రమహాసభ అధ్యక్షుడు –శ్రీ దేశపాండ్య సుబ్బారావు

ప్రతేకాంధ్ర ఉద్యమ నాయకుడు, ఆంధ్రమహాసభ అధ్యక్షుడు. నంద్యాల ప్రముఖుడు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుపై కోస్తా ఆంధ్ర, రాయలసీమ నాయకుల మధ్య ఏర్పడిన అపోహలను, విభేదాలను తొలగించే ఉద్దేశంతో 1937లో నియమించిన సంఘంలో ఈయన సభ్యుడు. ఈ సంఘపు చర్చలే శ్రీబాగ్‌ ఒడంబడికకు దారితీసాయి.

ప్రత్యేక ఆంధ్రరాష్ట్రానికి దత్తమండలపు నాయకులు తొలుత సుముఖంగా లేరు. ఆంధ్ర మహాసభ నాయకులు తరచుగా పర్యటనలు జరిపి సాగించిన ప్రచారం ప్రభావమో తెలియదు కాని క్రమంగా ‘సీమ’వారి వైఖరి మారింది. 1915లో జరిగిన కర్నూలు జిల్లా రెండవ మహాసభ ఆంధ్ర ఉద్యమాన్ని, దాని ఆశయాలను పూర్తిగా బలపరిచింది. అదే సంవత్సరం విశాఖపట్నంలో జరిగిన తృతీయాంధ్ర మహాసభకు అధ్యక్షత వహించిన చిత్తూరుకు చెందిన పానుగంటి రాజా రామారాయణింగార్ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు వెంటనే వద్దన్నాడే కానీ అసలే వద్దన లేదు. ఇదే సభలో పాల్గొన్న దేశపాండ్య సుబ్బారావు ఆంధ్ర రాష్ట్రాన్ని బేషరతుగా, మనస్ఫూర్తిగా సమర్థిస్తూ ఇలా అన్నారు “నేను సీడెడ్ జిల్లాలకు చెందిన వాడిని… ఆంధ్ర రాష్ట్రం సాధించాలన్న ఉత్సాహం మీకెంత ఉన్నదో మాకూ అంతే ఉన్నది. తిక్కనను చదివి, ఆనందించిన ప్రతి ఆంధ్రుడికీ ఆ కోరిక ఉండాలి. ఇంకోసారి చెబుతున్నాను – సీడెడ్ జిల్లాలు ఆంధ్ర రాష్ట్రం కావాలంటున్నాయి” సుబ్బారావు లాంటివారి మద్దతుతో సీడెడ్ జిల్లాల ప్రతికూలతపట్ల సర్కార్ జిల్లాల వారికి సందేహాలు తగ్గాయి. ఆ జిల్లాలకు వెళ్లి సభలు పెడితే అక్కడివారూ మనకు ఇంకా చేరువవుతారు, మనతో కలిసి వస్తారు అని వల్లూరి సూర్యనారాయణరావు, కె.ఆర్.వి. కృష్ణరావు తదితరులు విశాఖపట్నం మహాసభలో సూచించారు. దానితో మరుసటి సంవత్సరం ఆంధ్రమహాసభ నెల్లూరులోనూ, ఆ తర్వాత నంద్యాలలోనూ జరిగింది.

1934లో ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ఉద్యమాన్ని పట్టించుకునే దిక్కులేని నిస్తబ్ధ దురవస్థలో దేశపాండ్య సుబ్బారావు ఆంధ్రత్వం మీది అభిమానంతో ఖర్చులు తానే పెట్టుకుని లండను వెళతానని ముందుకొచ్చాడు. ఆంధ్రుల తరఫున మాట్లాడటానికి నువ్వెవరు అని ఆయనను సీమలో ఎవరైనా అడిగే పరిస్థితి రాకూడదు కదా? అందుకని ఆయన కోరిన మేరకు పెద్దలు బద్ధకంగా కదిలి అతి కష్టంమీద విశాఖపట్నంలో ఆంధ్ర మహాసభ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పరచి, సుబ్బారావును అధ్యక్షుడుగా ఎన్నుకుని, సభ పనుపున లండను రాయబారానికి అధికారికంగా పంపించారు. అదే పదివేలు అనుకున్న సుబ్బారావు ఎవరినీ పైసా అడక్కుండా సమస్త ఖర్చులూ తానే భరించి హుటాహుటిన ఓడ ఎక్కి లండన్ వెళ్లి బ్రిటిషు రాజకీయ ప్రముఖులను దర్శించి ఆంధ్రకు న్యాయం చెయ్యమని పరిపరి విధాల ప్రాధేయపడ్డాడు. అప్పుడు వారు “మీకు జరిగింది న్యాయమో, అన్యాయమో మాకెలా తెలుస్తుంది? తగినంత ఆందోళన జరిగినప్పుడే కదా పరిస్థితి తీవ్రత మీకు అర్థమయ్యేను. ఇక్కడ మా వ్యవహారాలు కూడా తగిన పబ్లిసిటీ, ప్రాపగాండా లేనిదే పార్లమెంటులో పాసుకావు” అన్ని తిప్పి పంపారు.

ఈయన కన్నడ కథా, నాటక రచయిత టి.పి.కైలాసంకు సన్నిహిత స్నేహితుడు. 1933లో కైలాసం పంపిన లిటిల్ లేస్ అండ్ ప్లేస్ ప్రతి సుబ్బారావుకు బాగా నచ్చి, సొంతగా పుస్తకాన్ని అచ్చువేయించి, అన్ని ప్రతులను కైలాసానికి బహూకరించాడు.

1939లో గాడిచర్ల హరిసర్వోత్తమరావు కర్నూలు జిల్లా, కాల్వబుగ్గలో ప్రారంభించిన రాజకీయ, ఆర్థిక శాస్త్రాల వేసవి పాఠశాలలో దేశపాండ్య సుబ్బారావు అధ్యాపకునిగా పనిచేశాడు.

20-కొచ్చిన్ సంస్థాన దివాన్ ,ఇటుకల తయారీ పరిశ్రమ స్థాపకుడు స్వాతంత్ర్య సమరయోధుడు –శ్రీ నెమిలి పట్టాభిరామారావు

దీవాన్ బహుద్దూర్ నెమిలి పట్టాభి రామారావు (1862 – అక్టోబరు 15, 1937) బి.ఏ స్వాతంత్ర్య సమరయోధుడు, కొచ్చిన్ సంస్థానం యొక్క మాజీ దీవాన్‌.

పట్టాభి రామారావు 1862లో కడప జిల్లా, సిద్ధవటంలో ఒక దేశస్థ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఈయన తండ్రి రామానుజరావు అప్పట్లో కడప జిల్లాలో తాసీల్దారుగా పనిచేస్తున్నాడు.[1] పట్టాభి రామారావు విద్యాభ్యాసం కడప ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తిచేసుకొని మద్రాసులోని ప్రెసిడెన్సీ కళాశాలలో చేరాడు. 1882లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి బి.ఏ డిగ్రీతో పట్టభద్రుడై మదనపల్లెలోని సబ్‌కలెక్టరు కార్యాలయంలో గుమాస్తాగా ఉద్యోగజీవితాన్ని ప్రారంభించాడు.

ఉద్యోగ జీవితం
చిత్తూరు జిల్లాకు చెందిన పట్టాభి రామారావు 1882 ఏప్రిల్ 15న మద్రాసు రాష్ట్ర రెవిన్యూ సెటిల్‌మెంట్ శాఖలో ఉద్యోగిగా జీవితం ప్రారంభించి, 1895లో అసిస్టెంట్ కమీషనర్ స్థాయికి చేరుకున్నాడు.[2] 1888లో దక్షిణ ఆర్కాటులో సూపర్‌వైజరుగా పనిచేశాడు. ఆ తరువాత 1892లో మలబారుకు బదిలీ అయి అక్కడ అన్‌కవెనెంటెడ్ అసిస్టెంటుగా పనిచేశాడు. మూడు సంవత్సరాల తర్వాత అసిస్టెంటు కమీషనరుగాను, తదనంతరం డిప్యుటీ కమీనషరుగానూ పదవోన్నతి పొందాడు. డిప్యూటి కమీషనరు హోదాలో గోదావరి, అనంతపురం, కృష్ణా జిల్లాలలో పనిచేశాడు.[1] కొచ్చిన్ సంస్థానంలో రెవిన్యూ సెటిల్‌మెంట్ వ్యవస్థను సంస్కరించేందుకు, ఆ విషయాలలో అనుభవమున్న పట్టాభి రామారావును ప్రభుత్వం కొచ్చిన్ సంస్థానం యొక్క దీవాన్‌గా నియమించింది. 1902 నుండి 1907 వరకు దీవాన్ గా పనిచేసిన పట్టాభి రామారావు రెవిన్యూ సెటిల్‌మెంటును పూర్తిచేసి భూమి దస్తావేజులను సక్రమంగా నిర్వహించేందుకు చర్యలను ప్రవేశపెట్టారు. 1908లో ఉద్యోగ జీవితం నుండి విరమించాడు. అప్పట్లో 350 రూపాయల ఉద్యోగవిరమణ భత్యంతో పదవీ విరమణ చేశాడు.

ప్రజాసేవలో
పదవీ విరమణానంతరం పట్టాభి రామారావు మద్రాసులోని పూనమల్లి హై రోడ్డుపై శ్రీరామ బ్రిక్ వర్క్స్ అనే ఇటుకల పరిశ్రమను స్థాపించి వందలాది కార్మికులకు పనికల్పించాడు. ఈ కర్మాగారంలో 30-40 లక్షల ఇటుకల తయారుచేయబడేవి. తన సొంత వ్యాపార నిర్వహణతో పాటు ఈయన ఆదోనిలోని వెస్ట్రన్ కాటన్ కంపెనీ, ఉన్నిదారం ఎగుమతిచేసే మద్రాసు యార్న్ కంపెనీల నిర్వహణలో పాల్పంచుకోనేవాడు. తెలుగు అకాడమీ, భారతీయ అధికారుల సంఘం, కేంద్ర వ్యవసాయ కమిటీల కార్యదర్శిగా ప్రజాసేవలో చురుకుగా పాల్గొనేవాడు. చివరకు మదనపల్లెలో స్థిరపడి సబ్ డివిజన్ సంఘానికి అధ్యక్షత వహించి, వాటి కార్యక్రమాలకు పూర్తి సమయాన్ని కేటాయించాడు. సొంత ఖర్చులతో గ్రామాలను పర్యటించి, సామాన్య ప్రజల ఉద్ధరణకు సలహాలు సూచనిలిస్తుండేవాడు.[1]

తొలుత ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుకు ఉత్సుకత చూపించకపోయినా, ఆ తర్వాత మనసు మార్చుకొని ప్రతేక రాష్ట్రం ఏర్పాటుకు మద్దతునిచ్చాడు. ఈయన 1918లో కడపలో జరిగిన ఆంధ్రమహాసభకు అధ్యక్షత వహించాడు.[3]

పట్టాభిరామారావు 75సంవత్సరాల వయసులో వృద్ధాప్యకారాణాలవల్ల 1937, అక్టోబరు 15 న మద్రాసులో తన స్వగృహంలో మరణించాడు.[4]

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -18-10-22-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

హాస్యానందం 46-అసంభవోక్తి

హాస్యానందం

46-అసంభవోక్తి

జరగటానికి వీల్లెనిది అసంభవం .ఊహించటానికి కూడా ఆస్కారం లేని విషయాలను నవ్వు పుట్టించటానికి రాసే ఉక్తి విశేషమే అసంభావోక్తి అని నిర్వచించారు మునుమాణిక్యం జీ .ఉదాహరన  –ఒకడు నీళ్ళు పల్చగా ద్రవంలాగా ఉన్నాయి కనుక సరిపోయి౦ది కానీ ,రాళ్ళలాగా ఉన్నట్లయితే కొట్టుకొని తాగటానికి చచ్చేంత పని అయ్యేది’’ .మరొకటి ఒకడిని అంతా ఏవగించుకొంటారని చెప్పటానికి ‘’వాడ్ని చూస్తేనే అసయ్యం .వాడి నీడే వాడి వెంటరాదు ‘’.మరోటి ‘’పడవ ఎంత తేలిక అంటే పొగమంచు మీద కూడా రయ్యిన దూసుకు వెడుతుంది .ఇంకోటి ‘’ఆమెకు ఎంతసిగ్గు అంటే బట్టలు మార్చుకోనేప్పుడేకాక మనసు మార్చుకోన్నప్పుడూ తలుపు వేసుకొంటుంది ‘’ఇవి అసంభావాలే అయినా చమత్కార భాజనాలు కనుక నవ్వు పుడుతుందన్నారు మాస్టారు

 ఒకడు ఎంత బలం కలాడు అంటే ‘’ఒక చేత్తో తన జుట్టు పట్టుకొని తననే భూమ్మీంచి ఆరడుగుల ఎత్తుకు లెవ నెత్తగలడు ‘’మరొకడుడు ‘’నాదొక్కటే కోరికభయ్యా .చనిపోయాక మా ఆవిడ ఎలా ఏడుస్తుందో చూడాలని ఉంది ‘’జరగటానికి వీల్లెనిదాన్ని చెప్పి చమత్కారం సాధించటం అన్నమాట .పిసినారి గురించి ఒకడు ‘’వాడు మహా పీనాసి ఎంత పీనాసి సన్నాసి అంటే ఒకే పంచాంగాన్ని ఏళ్ళ తరబడి వాడుతాడు ‘’.మరోటి ‘’ఆమె యెంత ఎత్తు అంటే ,తనపళ్ళు తనకే అందకా ,కుర్చీ ఎక్కి మరీ తోముకుంటుంది’’ .ఇంకోతి-‘’ఆమెకు జ్ఞాపకశక్తి పోయింది .తాను  బతికి ఉందొ లేదో పక్క వాళ్ళని అడిగి తెలుసుకొంటు౦ది .’’ఒక కొంటె కుర్రాడు ‘’నువ్వు బతికి ఉన్నావని ఎవరు చెప్పారమ్మా  ఆ మాట శుద్ధ అబద్ధం .అన్నాడు వెంటనే ఆమె ‘’నేను చచ్చానన్న సంగతి నాకెందుకు చెప్పలేదు ‘’అని ఏడుస్తూ కూర్చుంది .’’స్నానానికి చన్నీళ్ళు మంచిదే కానీ అందులో కొన్ని వేన్నీళ్ళు కలిపితే ప్రశస్తం ‘’.మరోటి ‘’ఆకవి పద్యాలన్నీ వచనంలోనే అఘోరిస్తాడు ‘’.ఒక హాస్యరచయిత ‘’భార్యా విధేయుడు వేళకు కొంపకు చేరతాడు లేకపోతెభార్య  చెవులు మేలేస్తు౦దనొ సాదిస్తు౦దనొనభయం .కానీ అటువంటి వాడుకాదట తనను ఇంటికి చేర్చే రైలు తప్పినా ఎక్కటంమానడుట .

  ఒకాయన తనతో మాట్లాడటానికి వచ్చిన స్నేహితుడితో ‘’ఇక్కడే వెయిట్ చేయి నేను అలావెల్లి వస్తా .నేను లేనప్పుడు నేను రావచ్చు అప్పుడు నువ్వు నన్ను మిస్ అవుతావు –దీన్నే ఇంగ్లీష్ లో ‘’Imay come in my absence ‘’అని అంటారు .దీన్ని అబ్సర్డ్ అన్నారు అందులోనే మనోహర చమత్కారం ఉందన్నారు సార్. అబ్సర్డిటి చమత్కారానికి గని అన్నారు ముని జీ .

మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -17-10-22-ఉయ్యూరు 

Posted in రచనలు | Tagged | Leave a comment

విజయ విలాసం.8వ భాగం.17.10.22

విజయ విలాసం.8వ భాగం.17.10.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

’ఆధునిక హిందీ భాషా పితామహుడు భారతే౦దు హరిశ్చంద్ర -5

’ఆధునిక హిందీ భాషా పితామహుడు భారతే౦దు హరిశ్చంద్ర -5

  హరిశ్చంద్ర ఏడవఏటనే కవిత్వం రాశాడు .అందులో వైష్ణవ భక్తీ ఎక్కువ.కొన్ని ఇతరవిశషయాలూ ఉన్నాయి .బ్రజ్ భాషపై మక్కువ తో రాదా కృష్ణులపై భక్తికీర్తనలురాశాడు . వెన్నెముక లేనిది  అని బ్రజభాషను కొందరు అన్నా ,అందులో ఆభాష ఆయన కవిత్వంలో మృదు మధురరూపం దాల్చింది .ప్రేమకు భక్తికి సమన్వయము తెచ్చాడు .శృంగారానికి ఆధ్యాత్మికత జోడించాడు .మొత్తం మీద 3వేల భక్తీ కీర్తనలు ,ప్రణయ గీతాలు రచించాడు .హిందోళ ,పూర్వి ,ఖయాల్ కల్యాణి వంటి వందరాగాలలో ఇవి రాశాడు .ఇవన్నీ 20సంపుటాలుగా వచ్చాయి .భక్తీ సర్వస్వం అనే దానిలో భగవంతుని లక్షణాలు వివరించాడు .ప్రేమమాలికలో బాల కృష్ణ లీలలు వర్ణించాడు .కృష్ణుడు వ్రేపల్లె వదిలి వెళ్ళే టప్పుడు గోపికలు పడేఆరాటం ఆవేదన మనోహరంగా చూపాడు .ప్రేమ పవిత్రతకు చిహ్నం అన్నాడు .ప్రేమ ప్రతాప్ లో నిష్ఫలప్రేమలో నిరాశ వివరించాడు .ప్రేమ అశ్రు వర్ణాలో ఋతు శోభ వర్ణించాడు .పరిపక్వంకాని ప్రేమ శూన్యం అన్నాడు .

  బ్రజ్ పై ఎంత వ్యామోహమున్నా ఖడ్ బోలీ లోనూ పద్యాలు రాశాడు .ఆతర్వాత ఈ రెండిటి రూపు రేఖలూ లేకుండా తుడిచేశాడు .హిందీలో గొప్ప రచనలు చేసిన ఈయన ఉర్దూ  లోనూ బాగా కృషి చేశాడు .1872లో’’క్వాసిడ్ ‘’అనే  ఉర్దూ పత్రిక ప్రారంభించటానికి ప్రకటనలు కూడా ఇచ్చాడు .ప్రోత్సాహం లభించకమానేశాడు ఉర్దూ లో పద్యాలు ,వచన రచనలు మిమర్శ అచ్చులో వంద పేజీలదాకా రాశాడు .అనిల్ ,వాజిస్ అనే ఉర్దూ కవులకు మిత్రుడుగా ,పోషకుడుగా ఉంటూ ‘’రస ‘’కలం పేరుతొ ఉర్దూలో రాసేవాడు .అతని గులిస్తాన్ ఇపుర్ బాహర్ ,చమాని స్తాన్ ఇ పుర్ బాహర్ అనే పద్య సంపుటాలు విజ్ఞాన ఖనులు అన్నారు. గజల్స్ కూడా రాశాడు .సమకాలీన ఉర్దూకవుల రచయిత్రుల వివరాలు తెలుసుకోనేవాడు .రూప్ రతన్ కలం పేరుతొ భోపాల్ బీగం రాసిన రచనలను ఆసక్తిగా చదివేవాడు .వాటినితన పత్రికలో ప్రచురిస్తూ ,కలకత్తా నుంచి వెలువడే భారత మిత్ర కు తన ప్రసంశలు జోడించి ముద్రణకు పంపి ప్రోత్సహించేవాడు .పంచ వన్ పైఘామ్బార్ ,కుషీ అనే వచన వ్యాసాలూ ఉర్దూలో రాశాడు .హిందూస్తానే అక్బర్ పత్రిక ఇతని ఉర్దూ రచనలను శ్లాఘించేది .ఆయన ఉర్దూలో నాటికలు రాయకపోవటం పెద్ద వెలితి అని సాహిత్యకారులు అంటారు .

   అనేక సాహిత్యప్రక్రియలపై తనదైన ముద్ర వేసిన హరిశ్చంద్ర హిందీ నాటకాలకు చేసిన సేవ అపూర్వం .స్వంతవీ బెంగాలీసంస్కృత ఇంగ్లీష్  అనువాదాలు కలిపి 18నాటికలు హిందీలో రాశాడు .మొదటినుంచి బెంగాలీ స్నేహితులు ఆయనకు ఎక్కువగా ఉండేవారు .ఆధునిక హిందీనాటికలలో సీతల్ ప్రసాద్ త్రిపాఠి1867లో  రాసిన ‘’జానకీమన్ డళ్’’మొదటిది .కాశీ రాజు ఎదుట ప్రదర్శించాలి అనుకొన్న దీనిలోని లక్ష్మణ పాత్రధారి అనారోగ్యం తో రాలేకపోతే ,17ఏళ్ళ హరిశ్చంద్ర కొద్ది సమయం తనకిస్తే ఆపాత్ర ధరిస్తానని చెప్పాడు .ఇంత తక్కువ సమయంలో వేరొకరు నటించటం అసాధ్యమన్నాడు రాజు .అరగంట యిస్తే చాలన్నాడు ఈయన ,గంట సమయమిచ్చారు .ఆసమయంలో నాటకం బాగా చదివాడు .అందులోని ప్రతివాక్యం గడగడా వప్పచేప్పేసరికి అంతా ఆశ్చర్యపోయారు .లక్ష్మణ వేషం వేసి రక్తికట్టించి సమర్ధత చాటి చూపాడు .

  అప్పుడే నాటక రచనకు శ్రీకారం చుట్టాడు .ప్రవాస్ అనే మొదటి నాటకం రాశాడు ఇప్పుడది అలభ్యం.రెండోది రత్నావళికి అనువాదం .జతెన్ద్రమోహన్ ఠాకూర్ బెంగాలీ నాటకానువాదంగా విద్యాసుందర్ రాశాడు .అప్పుడే 1870లో ప్రెస్టన్ జీ ఫ్రాంజీ అనే మొదటి నాటక సంస్థ వెలిసింది .7ఏళ్ళ తర్వాత ఢిల్లీ కి చెందిన కుర్ పద్ జీ బాలీవాలా ‘’విక్టోరియా ధియేట్రికల్ కంపెని ‘’ప్రారంభించాడు .కోవాల్ ఖాతూవ్ పెట్టిన ‘’ఆల్ఫ్రెడ్ ధియేట్రి కల్ కంపెనీ కూడా ప్రసిద్ధికెక్కింది .నాటకం నవరస భరితంగా ,పంచ కళా స్వరూపంగా ఉండాలని హరిశ్చంద్ర భావించాడు .అందుకే తన భావ వ్యక్తీకరణ ధ్యేయంగా నాటకాలు రాశాడు .పార్శీ నాటకరంగం వేగం గా దూసుకుపోవటానికి కారణాలు గ్రహించాడు .అందులోని మంచినీ సనాతన రంగస్థల వాంచలను ప్రవేశ పెట్టాడు .నాటకపద్యాలు సున్నితంగా బ్రజభాషలోనే రాసినా ఖడ్ బోలీకి ప్రాదాన్యమిచ్చాడు .బ్రాహ్మణ పాత్రలకుసంస్క్రుతం సామాన్యులకు వాడుకభాష వాడి,సహజత్వం తెచ్చాడు .కాలానికి అనుగుణంగా నూతన విధానాలు జోడించాడు .అనారోగ్యంగా ఉండి,అవసాన దశలో రాసినవిశిష్టరచన  ‘’నాటక్’’.ఇందులో ఆనాటి నాటకాల పురోగమనానికి కారణమైన ఇంగ్లీష్,బెంగాలీ  నాటకాలను చక్కగా విశ్లేషించాడు .సాహిత్యంలో నాటకం ముఖ్యభాగం అన్నాడు .

    పురాతన చారిత్రిక సాంఘిక నాటకాలు రాసినా భారతే౦దు సమకాలీన సమాజ చిత్రణలో కొత్త వరవడి ప్రవేశపెట్టి మార్గదర్శి అయ్యాడు .విధవా వివాహం మాంసాహారనిషేధం ,సంస్థానాలలో అరాచకాలు , ,భారత్ ఉత్పత్తిని బ్రిటన్ దేశాభి వృద్ధికి వాడుకోవటం మొదలైన విషయాలు నాటకాలలో చర్చించాడు .సమాజ దురాచారాలను అవినీతిని చీల్చి చెండాడాడు .అతని ఆదర్శాలకు అండగా ప్రతాప నారాయణ మిశ్రా ,బద్రీ నారాయణ చౌదరి ,బాలకృష్ణ భట్ట వంటి సాహితీ ప్రముఖులున్నారు .

  హిందీ నాటకానికి ఆధునికత తెచ్చినవాడు హరిశ్చంద్ర .మర్చెంట్ ఆఫ్ వెనిస్ నాటకాన్ని ‘’ ,దుర్లాభ్ బంధు ‘’గా స్వేచ్చానువాదం చేశాడు .పాత్రలు పోర్షియాకు పుర్ శ్రీ ,,షైలాక్ కు శౌలాక్షు అని బసానియోకి బసంతు అనీ ,హిందూ పెర్లుపెట్టాడు .బెంగాలీనుంచి విద్యాసుందర్ ,భారత్ జనని అనుకరణలుగా రాశాడు .సంస్క్రుతనాటకాలకు అనువాదాలు అనుసరణలూ చేశాడు .సత్యానికి అసత్యానికి జరిగే నిరంతర పోరాటం గా ‘’సత్యహరిశ్చంద్ర ‘’,మానవాతీత సత్యనిరతికి హరిశ్చంద్రుడు ,దాన్ని విచ్చిన్నం చేసే దుష్టశక్తి విశ్వామిత్రుడు గా చూపాడు .చంద్రావలి నాటకం లో సర్వ ప్రపంచాన్నే రక్షించే ప్రేమస్వరూపుడుగా కృష్ణుడిని ఆవిష్కరిస్తాడు .శోకాన్ని అధిగమించి ధర్మ సిద్ధికోసం నిరంతర అన్వేషిగా చంద్రావలి ని తీర్చి దిద్దాడు .’’ప్రేమ జోగిని ‘’లో ఆనాటి కాశీ పరిస్థితులు ప్రతిబింబింప జేశాడు .కళావంతులనుసమర్ధించాడు .మంచి చెడ్డ లేక నిష్పక్షపాతం ఇందులో సమర్ధించాడు .అనారోగ్యం పేదరికం ,అవివేకం తాగుడు లను పాత్రలు చేయటం కొత్త పధ్ధతి .ఇలాగే  అంధేర్ నగరి  కూడా రాశాడు .నీల్ దేవి లోనూ సమాజ దుర్దశ చూపాడు .బ్రిటన్ లో స్త్రీలు పురుషులతో సమానంగా ముందుకు వెడుతుంటే మనదేశం లో స్త్రీలు ఇంటికి అంటుకు పోయారని బాధపడుతూ ,వాళ్ళు  పిల్లాపాపలనుచక్కగాసాకుకొంటూ నమ్రత తో ఉంటూ కూడా ఇంటి బయట నిర్మాణాత్మకమైన కార్యాలలో ముందుకు రావాలని కోరాడు .భారత నారీమణులు ఉన్నత స్థానం లో ఉన్నారు ఆవిషయాలు ఇప్పటి స్త్రీలు గుర్తించి  అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నాడు .’’విపస్య విష మౌషధం’’నాటకం బరోడా రాజు పతనంపై రాసింది .ఇంగ్లీష్ లో కొద్ది పరిజ్ఞానంసంపాది౦చినంతమాత్రాన ,అభ్యుదయవాడదులమనీ పునరుద్ధరణకు కంకణం కట్టుకొన్నామని విర్ర వీగేవారిని విమర్శించాడు .ఈ విమర్శ ఆయన ప్రత్యర్ధులు రాజా శివరామప్రసాద్ ఆయన అనుచరులను ఉద్దేశించి అన్నమాటలే .

 సశేషం

 మీ –గబ్బిట దుర్గాప్రసాద్-17-10-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహాభారత తత్వ కథనం.8వ భాగం.17.10.22

మహాభారత తత్వ కథనం.8వ భాగం.17.10.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

రాణ కెక్కిన కొందరు రాయలసీమ ప్రముఖులు -6

రాణ కెక్కిన కొందరు రాయలసీమ ప్రముఖులు -6

16-సామాజిక సేవాకర్త ,పద్మశ్రీ గ్రహీత –శ్రీ జి.మునిరత్నం నాయుడు

గుత్తా మునిరత్నం నాయుడు చిత్తూరు జిల్లాకు చెందిన సామాజిక కార్యకర్త. పద్మశ్రీ పురస్కార గ్రహీత.

జీవిత విశేషాలు
మునిరత్నం తమిళనాడులోని తిరుత్తణికి సమీపంలోని కనకమ్మసత్రంలో రంగయ్య నాయుడు, మంగమ్మ దంపతులకు 1936, జనవరి 6 వ తేదీన జన్మించారు.

1981లో ప్రముఖ కాంగ్రెస్‌ నాయకులు రాజగోపాల్‌నాయుడు, ప్రముఖ సామాజక శాస్త్రవేత్త, రైతు నాయకుదు ఆచార్య ఎన్‌.జి. రంగాతో కలిసి ‘రాయలసీమ సేవా సమితి’ సంస్థ ఏర్పాటు చేశారు. క్రమేణా ఆ సంస్థ రాయలసీమకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. దీంతో ఆ సంస్థ పేరును రాష్ట్రీయ సేవా సమితిగా మార్చారు. ప్రస్తుతం ఆ సంస్థ శిశువిహార్‌, బాల విహార్‌, ఛైల్డ్‌ స్పాన్సర్‌షిప్‌ ప్రోగ్రాం, అంగన్‌వాడీ కేంద్రాలు, వయో వృద్ధులకు పునరావాస కేంద్రం, వితంతు పునరావాస కేంద్రం, కృషి విజ్ఞాన కేంద్రం, స్వధార్‌ హోం, మత్తు మందు బానిసల పునరావాస కేంద్రం తదితర సేవల ద్వారా ప్రజలకు చేరువైంది.

మునిరత్నం సేవలను గుర్తించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు అవార్డులను ప్రదానం చేసింది. 1989లో ఇందిరాగాంధీ నేషనల్‌ అవార్డు, 1991లో శిరోమణి, 1992లో జెమ్‌ ఆఫ్‌ ఇండియా, 1993లో బాలబంధు, 1996లో నవాబ్‌ మెహిదీ నవాజ్‌జంగ్‌ బెస్ట్‌ వెల్ఫేర్‌, 1998లో పైడి లక్ష్మయ్య మెమోరియల్‌, 2006లో రాజీవ్‌గాంధీ మానవసేవ, 2010లో హరిజన బంధు అవార్డులను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది.

1981 నుండి రాష్ట్రీయ సేవాసమితి స్వచ్ఛంద సేవా సంస్థ సంస్థాపక గౌరవ కార్యదర్శిగా సేవలందిస్తున్నాడు. బడుగు వర్గాలు, స్త్రీలు, పిల్లలు, వికలాంగులు, వృద్ధుల సంక్షేమం కోసం వివిధ సంస్థలు స్థాపించాడు. వివిధ ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల్లో కీలక పదవులు నిర్వహిస్తున్నాడు. వికలాంగుల జాతీయ కమిషన్‌లో అసోసియేషన్‌ మెంబర్‌, సీఏపీఏఆర్‌టీ సెంట్రల్‌ కమిటీలో ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మెంబర్‌గా పనిచేస్తున్నాడు. బాల భారతికి చైర్‌పర్సన్‌గా ఉన్నాడు. ఆయన సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం 2012లో పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసింది. ఈయన బ్రహ్మచారి. మరణం గుత్తా మునిరత్నం నాయుదు తన తుది శ్వాస వరకు సమాజ సేవలో గదిపి 2021,మే నెల 5వ తేదిన మరణించారు.

17-బారిస్టర్ ,శాసన సభ్యుడు ,ఆంధ్రమహా సభ అధ్యక్షుడు –శ్రీ కడప కోటిరెడ్డి

కడప కోటిరెడ్డి, స్వాతంత్ర్య సమరయోధుడు, కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు.

కోటిరెడ్డి, చిత్తూరు జిల్లా, మదనపల్లె తాలూకాలోని నారాయణ చెరువు (కోటిరెడ్డిగారి పల్లె) లో 1886లో జన్మించాడు. 1911లో ఇంగ్లాండులోని మిడిల్‌ టెంపుల్ నుండి బారిష్టర్ ఎట్ లా పట్టా పుచ్చుకున్న కోటిరెడ్డి న్యాయవాదిగా, రైతుగా కడపలో స్థిరపడ్డాడు. ఈయన గాడిచర్ల హరిసర్వోత్తమరావుతో కలిసి రాయలసీమలో హోమ్ రూల్ ఉద్యమంలో పాల్గొన్నాడు. ఈయన కల్లూరు సుబ్బారావు, పప్పూరు రామాచార్యులతో సన్నిహితంగా పనిచేసేవాడు. వీరిద్దరూ, ఆ తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నీలం సంజీవరెడ్డికి రాజకీయ గురువులు.

కోటిరెడ్డి 1921లో మహాత్మాగాంధీతో పాటూ రాయలసీమంతా పర్యటించాడు. 1922లో అనగా తన 32వ యేటనే ఇతడు శాసనసభలో ప్రవేశించాడు. ఇతడు మొదట కాంగ్రెస్‌కు అనుకూలమైన ప్రెసిడెన్సీ అసోసియేషన్‌లో గుత్తి కేశవపిళ్లెతో కలిసి పనిచేశాడు.1926లో స్వరాజ్యపార్టీ ఉపనాయకుడిగా ఎన్నుకోబడినాడు. 1929లో స్వతంత్ర సభ్యుడిగా మద్రాసు శాసనసభకు ఎన్నుకోబడినాడు. 1931లో తిరిగి ఏకగ్రీవంగా మద్రాసు శాసనసభకు ఎన్నికయినాడు. కోటిరెడ్డి ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంలో కూడా కీలక పాత్ర వహించాడు. ఆంధ్ర మహాసభకు రెండు సార్లు అధ్యక్షత వహించిన ఇద్దరు వ్యక్తులలో సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒకరైతే, కోటిరెడ్డి రెండవ వాడు. 1929, 1937లో జరిగిన సమావేశాలకు అధ్యక్షత వహించాడు. అంతేకాకుండా 1931లో మద్రాసులో జరిగిన ప్రత్యేక సమావేశం కూడా ఈయన అధ్యక్షతలోనే జరిగింది. 1940లో ఉప్పు సత్యాగ్రహంలో క్రియాశీలకంగా పాల్గొని జైలుకు వెళ్లాడు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని రాజాజీ ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా కోటిరెడ్డి మధుర, తిరునల్వేలి, శ్రీరంగం దేవాలయాలలో హరిజనులకు ప్రవేశం కల్పించాడు[1].

స్వాతంత్ర్యం తర్వాత 1952లో కడప నియోజకవర్గం నుండి, [2]1955లో లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యాడు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత టంగుటూరి ప్రకాశం పంతులు మంత్రివర్గంలో పనిచేశాడు. 1957లో ఆంధ్ర ప్రదేశ్ శాసన సభకు, 1964లో శాసనమండలికి ఎన్నికయ్యాడు. రాయలసీమ కరువు ఉపసంశన సంఘానికి అధ్యక్షుడిగా శ్రీబాగ్‌ ఒడంబడిక రూపుదాల్చుకోవటంలో కీలక పాత్ర పోషించాడు.[3]

ఈయన సతీమణి రామసుబ్బమ్మ కూడా స్వాతంత్ర్యోద్యమంలో చురుకుగా పాల్గొన్నది.

18-హైదరాబాద్ బుక్ ట్రస్ట్ స్థాపకుడు ,,శాసన సభ్యుడు-పీలేరు గాంధి –శ్రీ చల్లా కృష్ణ నారాయణ రెడ్డి

సి. కె. నారాయణ రెడ్డి (ఆగష్టు 1, 1925 – సెప్టెంబరు 5, 2013) హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, మాజీ శాసన సభ్యులు, పీలేరు గాంధీగా సుప్రసిద్ధులు. సికెగా వ్యవహరించబడే ఆయన పూర్తి పేరు చల్లా కృష్ణ నారాయణరెడ్డి.[1]

జీవిత విశేషాలు
చల్లా కృష్ణనారాయణరెడ్డి చిత్తూరు జిల్లా పీలేరు సమీపంలోని రొంపిచర్ల మండలం చల్లావారిపల్లె(చిత్తూరు జిల్లా) లో ఆగస్టు 1 1925 న జన్మించారు. మదనపల్లెలో బీసెంట్‌ థియొసాఫికల్‌ స్కూల్‌/కాలేజీలో బి.ఎ వరకు చదువుకున్నారు. బిఎ రెండో సంవత్సరంలో ఉండగానే పేద విద్యార్థుల కోసం ఆయన ఒక వసతి గృహాన్ని నిర్వహించారు. కాలేజిలో మంచి హాకీ క్రీడాకారుడిగా రాణిస్తూనే సామాజిక సమస్యల పట్ల స్పందించేవారు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. ఎప్పుడూ ఖద్దరు వస్త్రాలనే ధరించారు. సోషలిస్టు పార్టీలో క్రియాశీల సభ్యుడిగా, జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. 1953లో కమ్యూనిస్టు ఉద్యమంలో చేరారు. కరవు రోజుల్లో గంజి కేంద్రాలను నిర్వహించారు.అనేక వసతిగృహాలను నెలకొల్పారు. దళిత పిల్లల చదువు కోసం విశేషంగా కృషి చేశారు.బాకారావు పేట, వాయలపాడు, యెర్రవారిపాలెం, నేలబైలు, పీలేరు, మదనపల్లెలో బడుగు వర్గాలకోసం వసతి గృహాలను నిర్వహించారు. అక్కడ చదువుకున్న మునివెంకటప్ప, అబ్బన్న ఐఎఎస్‌ అధికారులు అయ్యారు. సికె 1962లో కమ్యూనిస్టు పార్టీ తరపున పోటీ చేసి శాసనసభకు ఎన్నికయ్యారు.[2]

రొంపిచెర్లలో ఒక గ్రంథాలయాన్ని నెలకొల్పారు. 1967 లో చారుమంజుందార్‌ గ్రూపులో చేరారు. 1970 లో ప్రభుత్వం వీరిని అరెస్టు చేసింది. అత్యయిక పరిస్థితి సందర్భంగా 1975 లో జైల్లో నిర్భంధించింది. జనతా ప్రచురణలు, అనుపమ ప్రచురణలు, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ను నెలకొల్పి అనేక మంచి పుస్తకాలను తెలుగులో వెలువరించారు. అనుపమ ప్రచురణలు నెలకొల్పి – ది స్కాల్‌పెల్‌, ది స్వోర్డ్‌ -రిచర్డ్‌ అ లెన్‌, టెడ్‌ గోర్డన్‌, ఫాన్‌షెన్‌-విలియమ్‌ హింటన్‌, మై ఇయర్స్‌ ఇన్‌ ఎన్‌ ఇండియన్‌ ప్రిజన్‌-మేరీ టైలర్‌ రెడ్‌స్టార్‌ ఓవర్‌చైనా-ఎడ్గార్‌ స్నో తదితర పుస్తకాలను తెలుగులోకి ప్రచురించారు. ప్రజల మనసుల్ని గెలిచేందుకు చిన్న పుస్తకాలు విశేషంగా తోడ్పడతాయని భావించేవారు.1980లో హైదరాబాద్‌ బుక్‌ట్రస్టును నెలకొల్పి అప్పటినుంచి 1990 ల చివర తన ఆరోగ్యం క్షీణించేవరకూ నిర్విరామంగా కృషిచేస్తూ అనేక పుస్తకాలను తెలుగులో వెలువరించారు. జంటనగరాల్లో కుక్కల సంతతి ఎక్కువైనా సరే కుక్కలను చంపకూడదని ఉద్యమం నిర్వహించారు. ఫ్లోరోసిస్‌ సమస్యపై పోరాటాలు చేశారు. శాసన సభ్యులకు అనేక సౌకర్యాలు అక్కరలేదన్నారు. ఆయన సతీమణి జయప్రద మదనపల్లె ఉన్నత పాఠశాలలో సామాన్యశాస్త్ర ఉపాధ్యాయురాలిగా, అనంతరం ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. 1972 లో ఉస్మానియా యూనివర్సిటీలో హత్యకు గురైన జార్జి రెడ్డి వీరి అన్న కుమారుడు. సికె గారికి భార్య జయప్రద, ఇద్దరు కూతుళ్లు డా. అరుణ, సి. శైలజ ఉన్నారు. ఈయన 2013 సెప్టెంబరు 5 న హైదరాబాద్‌లో చనిపోయారు.[2] నారాయణ రెడ్డిగారి కోరిక మేరకు, ఆయన కుటుంబసభ్యులు ఆయన మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి కి అందజేశారు.

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-10-22-ఉయ్యూరు

Posted in రచనలు | Leave a comment

విజయ విలాసం7వ భాగం.16.10.22

విజయ విలాసం7వ భాగం.16.10.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

దేశ భక్త కొండా వెంకటప్పయ్య గారి స్వీయ చరిత్ర 1వ భాగం.16.10.22

దేశ భక్త కొండా వెంకటప్పయ్య గారి స్వీయ చరిత్ర 1వ భాగం.16.10.22

Video link

Posted in రచనలు | Leave a comment

ఆంధ్రా ఎడిసన్ కవిశేఖర పాను గంటివారి సాక్షి .3వ భాగం.16.10.22

ఆంధ్రా ఎడిసన్ కవిశేఖర పాను గంటివారి సాక్షి .3వ భాగం.16.10.22

Video link

Posted in రచనలు | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 7వ భాగం.16.10.22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 7వ భాగం.16.10.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

విజయ విలాసం.6 వ భాగం.15.10.22

విజయ విలాసం.6 వ భాగం.15.10.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ఆధునిక హిందీ భాషా పితామహుడు భారతే౦దు హరిశ్చంద్ర -4హరిశ్చంద్ర -4

ఆధునిక హిందీ భాషా పితామహుడు భారతే౦దు హరిశ్చంద్ర -4

రాజారామ మోహన రాయ్ తన ‘’బంగదూత ‘’ను దేవనాగరిలో వచనం  తో సహా నాలుగు భాషలలో ప్రచురించాడు .ఉద౦త్ మార్తాండ్ మొదటి హిందీ పత్రికలో వచనమే రాశాడు .హిందీ వాడుకభాషలో వచ్చిన మొదటి పత్రిక కాశీ నుంచే 1844లో వెలువడింది .తారామోహన మిత్ర సంపాదకుడు .రాజా శివప్రసాద్ ‘’సితార ఎ హింద్’’పత్రిక కు పోషకుడు .ఇది హిందీలిపిలో ఉన్నా పర్షియన్ ఉర్దూ ప్రభావం ఎక్కువగా ఉండేది .1850లో తారామోహన మిత్ర సుధాకర్ పత్రిక స్థాపించాడు

  పత్రికలో ఏ భాష వాడాలి అనే వివాదానికి తెరదించి హరిశ్చంద్ర 1867లో  ‘’కవివచన సుధ’’పత్రిక నిర్వహించాడు .మొదట్లో బిహారి,జాయసీ రాసిన పద్యాలు వేశారు .హరిశ్చంద్రకు పద్య రచనా నైపుణ్యమే కాదు అద్భుతంగా శ్రావ్యంగా గానం చేసే ప్రతిభ ఉంది  .అందుకే ఆయనను ‘’కలియుగ్ కా కన్హ యా ‘’కలియుగ కృష్ణుడు అనేవారు .అతని శరీరచాయ గిరజాల జుట్టూ కూడా దానికి తగినట్లే ఉండేవి .ఇతని పత్రికకొనేవారు 25౦ మంది .వీరిలో 150 మంది చందాదారులు .మిగిలినవాటిని బ్రిటిష్ వారుకోనేవారు .కొద్దికాలంలోనే పక్షపత్రిక ఆతర్వాత వారపత్రికగా మారింది ..1867లో వెలువడిన మూడు స్వతంత్రహిందీ పత్రికలలో కవి వచన సుధఒకటిగా గుర్తి౦పు పొందింది.రామమోహన రాయ్ అంతటివాడు అని ప్రఖ్యాతిపొండాడు హరిశ్చంద్రసంపాదకుడై .ఎందఱో రచయితలకు మార్గదర్శి అయ్యాడు ..ఇతనివల్లనే హిందీ పత్రికా రంగానికి స్థిరత్వం కలిగింది .ఆకాలం లో సాహిత్యవిలువలున్న ఎన్నో పత్రికలూ వచ్చినా నిలదొక్కుకోలేక కాలగర్భం లో కలిసిపోయాయి .

 1873లో భారతేందు మరోపత్రిక ‘’మేగజైన్ ‘’ప్రారంభించాడు .ఈపేరు చాలామందికే కాక అతనికీ నచ్చక ‘’చంద్రిక ‘’గా మార్చాడు .ఇందులో వచనం నాటకాలు సమీక్షలు వ్యాసాలూ ,హాస్యరచనలు ,చదరంగ పోటీ విశేషాలు ఉండేవి .అంటే మానవ జీవితానికి కావాల్సిన అన్నీ ఉండేవి .సహాయ సంపాదకులుగా ఈశ్వర చంద్ర విద్యాసాగర్ స్వామి దయానంద సరస్వతి ,భీషుబ్ చంద్ర సేన్ ,వంటిప్రముఖులు౦డేవారు .ఈపత్రికనూ బ్రిటీష్ వారు వందకాపీలు కొని ప్రోత్సహించారు .రాజా శివరామ ప్రసాద్ తనపత్రికలో వాడే పర్షియన్ పద మిశ్రిత హిందీకి ,వారణాసి బ్రాహ్మణులు వాడే సంస్కృత పదభూయిష్ట హిందీకి మధ్యగా హరిశ్చంద్ర చంద్రిక పత్రికలో సామాన్యమానవులు వాడే వాడుక భాషను వాడి ప్రజలకు పత్రికను సన్నిహితం చేశాడు .సంపన్న ఉన్నత కుటుంబం లో పుట్టినా సామాన్యుల భాషను ప్రోత్సహించటం ప్రశంసనీయం .వేషం లో డాబూ దర్పం ఉన్నా ,వీధి భాగవతులతోకలిసి కవిత్వం అల్లేవాడు .తాను  అనుసరించిన మార్గాన్నే పత్రిక భాషగా తీర్చి దిద్దాడు .ఇతని రెండు పత్రికలు ఎందరికో ప్రత్సాహాన్నిచ్చి ఎన్నోపత్రికలు రావటానికి తోడ్పడ్డాయి .దీనిఫలితంగా ‘’హరిశ్చంద్ర మండలి ‘’ఏర్పడి ,ఇప్పటికీ నడుస్తూనే ఉంది .బద్రీ నారాయణ చౌదరి అనే ప్రేమ ఘన అతడి వీరాభిమాని .ఆనంద్ కాదంబినీ ,మాసపత్రిక నగరినినాద్ వార పత్రిక ఈ ధ్యేయంతోనే ప్రారంభించి నిర్వహించాడు .పండిత ప్రతాప్ నారాయణ మిశ్ర హరిశ్చంద్ర పత్రికలకు రాసేవాడు .కలకత్తా నుంచి  అలహాబాద్ వచ్చిన పండిత బాలకృష్ణ భట్టా హిందీప్రదీప్ పత్రికస్థాపించాడు .ఇదేఅలహాబాద్ లో హిందీ వర్ధని సభకు మార్గదర్శనం చేసింది .దీనికి చైతన్యం తెచ్చినవాడు హరిశ్చంద్ర .అధ్యక్షోపన్యాసం ఇవ్వటానికి అలహాబాద్ వెళ్ళినప్పుడు మాతృభాష ప్రాధాన్యత గురించి వివరంగా చెప్పాడు. ప్రఖ్యాత రచయిత లాలా శ్రీనివాసదాస్ ఇక్కడికి వచ్చి ‘’సదా ధర్మ సదాదర్శ్ ‘’పత్రిక  పెట్టి నిర్వహించాడు .కొంతకాలానికి దాన్ని చంద్రికలో విలీనం చేశాడు .హరిశ్చంద్ర పై విపరీత అభిమాన గౌరవాలున్న రాధాచరణ్ గోస్వామి ‘’భారతే౦దు ‘’పత్రిక స్థాపించి తన అభిమాన్నాన్ని వ్యక్తం చేశాడు .ఇంతమంది గోప్పరచయితలకు ప్రేరణ ,ప్రోత్సాహం కల్పించటం వారి రచనలు తన పత్రికలలో ప్రచురించటం హరిశ్చంద్రకు గొప్ప గర్వ కారణం.

  పత్రికారంగం లో సాధించిన విజయాలను పురస్కరించుకొని మహిలా ఉద్యమ వ్యాప్తికి  ‘’బాలబోధిని ‘’,తానూ జన్మతః వైష్ణవుడుకనుక వైష్ణవ భక్తీ ప్రచారానికి ‘’భగవత్ తోషిణి’’అనే మరో రెండు పత్రికలూ నిర్వహించాడు .ప్రభుత్వం యధాశక్తి సహకరించింది .గోహత్య మహా పాతకం అనే శీర్షికపై రచనలు నాటికలపోటీ నిర్వహించి బహుమతులిచ్చేవాడు .మద్యం, మాంసాహారం తీసుకోము అని సభ్యులతో ప్రమాణం చేయించేవాడు .తన పత్రిక పాఠకులతో విదేశీ వస్త్రాలు వాడము అని ప్రతిజ్ఞ చేయించాడు .ఉత్తరభారతం లో హిందీని ప్రాధమిక భాష చేయాలని తీవ్రంగా కృషి చేశాడు

   సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -15-10-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆంధ్రా ఎడిసన్ కవి శేఖర పానుగంటి వారి సాక్షి….2వభవంభాగం.15.10.22

ఆంధ్రా ఎడిసన్ కవి శేఖర పానుగంటి వారి సాక్షి….2వభవంభాగం.15.10.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 6వ భాగం.15.10.22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 6వ భాగం.15.10.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

రాణ కెక్కిన కొందరు రాయలసీమ ప్రముఖులు -5

రాణ కెక్కిన కొందరు రాయలసీమ ప్రముఖులు -5

14-సాహితీ విమర్శకుడు కధాశిల్పం ఫేం ,కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డీ,,లెక్చరర్ –శ్రీ వల్ల్మపాటి వెంకట సుబ్బయ్య

, వల్లంపాటి వెంకటసుబ్బయ్య (మార్చి 15, 1937 – జనవరి 2, 2007) సాహితీ విమర్శకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.[1]

జననం
వల్లంపాటి 1937, మార్చి 15 న చిత్తూరు జిల్లా రొంపిచర్ల లో జన్మించాడు. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా వృత్తిని ప్రారంభించి, ఇంగ్లీషులో ఎం.ఏ చేసి, తరువాత హైదరాబాదు లోని సెంటర్‌ ఫర్‌ ఇంగ్లీష్‌ అండ్‌ ఫారెన్‌ లాంగ్వేజెస్‌ నుంచి ఎం.లిట్‌ పొందాడు. మదనపల్లె బీసెంట్‌ థియేసాఫికల్‌ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసాడు.

వల్లంపాటి కథకుడిగా తన రచనా వ్యాసంగాన్ని మొదలుపెట్టాడు. పరిష్కారం, మిథ్య మొదలైన కథానికలు 40 దాకా ప్రచురించాడు. ఆయన రాసిన ఇంధ్రధనస్సు, దూర తీరాలు నవలలు ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో బహుమతులు పొందాయి. వల్లంపాటి సాహితీ విమర్శకుడిగా సుప్రసిద్ధుడు. ఆయన రాసిన కథా శిల్పం, నవలాశిల్పం, విమర్శా శిల్పం పుస్తకాలు తెలుగు సాహిత్య విమర్శకు ప్రామాణికాలు. అనువాదకుడిగా కుడా ఆయన ప్రసిద్ధుడే. ఇంగ్లీషు నుంచి, కన్నడం నుంచి తెలుగులోకి ఎన్నో గ్రంధాలు, కథలను అనువదించాడు. తస్లీమా నస్రీన్‌ రచించిన లజ్జ, బ్రిటిష్‌ రచయిత ఇ.హెచ్‌.కార్‌ రచించిన చరిత్ర అంటే ఏమిటి…? ఆయన చేసిన అనువాద రచనలలో కొన్ని.

ఆయన రాసిన కథాశిల్పం రచనకు 1999 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఇదే పుస్తకానికి తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ సాహిత్య విమర్శ గ్రంథంగా ఎంపిక చేసి, సత్కరించింది.

మరణం
2007, జనవరి 2 న వల్లంపాటి మదనపల్లెలో మరణించాడు.

రచనల జాబితా
నవలలు

· ఇంద్ర ధనుస్సు – 1962

· దూర తీరాలు – 1964

· మమతలు – మంచుతెరలు – 1972

· జానకి పెళ్ళి – 1974

కథలు

· బండి కదిలింది

· రానున్న శిశిరం

· బంధాలు

సాహితీ విమర్శ, పరిశోధన

· కథా శిల్పం – 1996

· నవలా శిల్పం – 1995

· నిమర్శా శిల్పం – 2002

· అనుశీలన – 1985

· నాటికవులు – 1963

· వల్లంపాటి సాహిత్య వ్యాసాలు – 1997

· రాయలసీమలో ఆధునిక సాహిత్యం – సామాజిక సాంస్కృతిక విశ్లేషణ – 2006

అనువాదాలు

· ప్రపంచ చరిత్ర

· చరిత్ర అంటే ఏవిటి?

· చరిత్రలో ఏమి జరిగింది?

· ప్రాచీన భారతదేశం ప్రగతి

· సంప్రదాయ వాదం – 1998

· భారతదేశం చరిత్ర – (ఆర్.ఎస్.శర్మ 2002)

· బతుకంతా (కన్నడ నవల)

· లజ్జ

· నవల-ప్రజలు

ఇంకా

· ఎన్నో సంకలనాలు, సంపుటాలకు ముందు మాటలు వ్రాసాడు

· తెలుగు, కన్న, ఇంగ్లీషు భాషలలోకి, వాటినుండి అనువాదాలు చేశాడు

· ఇండో – ఆంగ్ల సాహిత్యానికి సంబంధించిన షుమారు 15 పరిశోధనా పత్రాలను లిటరరీ క్రిటేరియన్ వంటి పత్రికలలో ప్రచురించాడు.

సత్కారాలు
· తాపీ ధర్మారావు అవార్డు – 1993

· కొండేపూడి సాహిత్య సత్కారం[2]. – 1995

· తెలుగు యూనివర్శిటీ అవార్డు – 1997

· గజ్జల మల్లారెడ్డి అవార్డు – 2000

· కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు – 2000

15-సుప్రసిద్ధ కదా రచయితా ,కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కార గ్రహీత ,డా అంబేద్కర్ యూని వర్సిటి డైరెక్టర్ –శ్రీ కేతు విశ్వనాధ రెడ్డి

కేతు విశ్వనాథ రెడ్డి ప్రసిద్ధ సాహితీవేత్త, విద్యావేత్త. ఈయన ప్రధానంగా కథారచయితగా ప్రసిద్ధుడు. కేతు విశ్వనాథ రెడ్డి కథలు అనే కథా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందాడు

వ్యక్తిగత జీవితం
జూలై 10, 1939 న వైఎస్ఆర్ జిల్లా కమలాపురం తాలూకా రంగశాయిపురం గ్రామంలో జన్మించాడు.

విద్యాభ్యాసం, వృత్తి
కడపజిల్లా గ్రామనామాలు అనే అంశంపై పరిశోధనకు గాను డాక్టరేట్ పొందాడు. పాత్రికేయుడుగా ఉద్యోగజీవితాన్ని ప్రారంభించి కడప, తిరుపతి, హైదరాబాదు లాంటి చోట్ల అధ్యాపకుడుగా పనిచేసి డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డైరెక్టరుగా పదవీవిరమణ చేశాడు. పాఠ్యపుస్తకాల రూపకల్పనలో SCERT సంపాదకుడుగా వ్యవహరించాడు. పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయస్థాయి దాకా అనేక పాఠ్యపుస్తకాలకు సంపాదకత్వం వహించాడు. పాఠ్యప్రణాళికలను రూపొందించాడు. ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి పత్రికాసిబ్బందికి శిక్షణ ఇచ్చాడు.

సాహిత్య రంగం
ఈయన తొలి కథ అనాదివాళ్ళు 1963లో సవ్యసాచిలో ప్రచురితమైంది. కొడవటిగంటి కుటుంబరావు సాహిత్య సంకలనాలకు సంపాదకత్వం వహించాడు. విశాలాంధ్ర తెలుగు కథ సంపాదక మండలికి అధ్యక్షుడుగా ఉన్నాడు. కొన్నేళ్ళు అరసం (అభ్యుదయ రచయితల సంఘం) అధ్యక్షుడుగా ఉన్నాడు. ఈయన రాసిన సాహితీవ్యాసాలు “దృష్టి” అనే పేరుతో పుస్తక రూపంలో వచ్చాయి. ఆధునిక తెలుగు కథారచయితల్లో Torch bearers అనదగ్గ ప్రసిద్ధుల గురించి ఈయన రాసిన మరో పుస్తకం దీపధారులు. ప్రస్తుతం “ఈభూమి” పత్రికకు సంపాదకుడుగా పనిచేస్తున్నాడు. జప్తు, ఇచ్ఛాగ్ని, కేతు విశ్వనాథరెడ్డి కథలు (1998-2003) కథా సంపుటులు కూడా వెలువరించాడు. ఈయన కథలు అనేకం హిందీ, కన్నడం, మలయాళం, బెంగాలీ, మరాఠీ, ఆంగ్లం, రష్యన్ భాష ల్లోకి అనువాదితమయ్యాయి. వేర్లు, బోధి ఈయన రాసిన నవలలు. వేర్లు రిజర్వేషన్లకు సంబంధించి క్రీమీ లేయర్ మీద వెలువడిన మొట్టమొదటి నవల. విశ్వనాధరెడ్డి, పోలు సత్యనారాయణ ఇద్దరూ కలసి చదువుకథలు[1] అనే కథల సంపుటిని సంకలనం చేశారు.

పురస్కారాలు
· కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు (న్యూ ఢిల్లీ),

· భారతీయ భాషా పరిషత్తు (కలకత్తా),

· తెలుగు విశ్వవిద్యాలయం (హైదరాబాదు),

· రావిశాస్త్రి అవార్డు,

· రితంబరీ అవార్డు

· ఆంధ్రప్రదేశ్ అభ్యుదయరచయితల సంఘం, గుంటూరు జిలాశాఖ వారిచే అమరజీవి పులుపుల వెంకటశివయ్య సాహితీ సత్కారం[2].

అధ్యాపకుడుగా
· విశ్వవిద్యాలయ అధ్యాపకులకు రాష్ట్రప్రభుత్వం ఇచ్చే ఉత్తమ అధ్యాపక పురస్కారం.

వివిధ పత్రికలలో ప్రచురితమైన వీరి కథలు కొన్ని…
· 1991 కేతు విస్వనాథరెడ్డి కథలు……. ఆంధ్రజోతి వార పత్రిక.

· 1975 ద్రోహం. విశాలాంధ్ర దిన పత్రిక.

· 1977 ఆత్మ రక్షణ. వీచిక మాస పత్రిక.

· 1977 మన ప్రేమకథలు. ఆంధ్ర జోతి మాస పత్రిక.

· 1978 విశ్వరూపం స్వాతి మాస పత్రిక.

· 1979 ఆరోజులొస్తే… నివేదిత మాస పత్రిక.

· 1980 పీర్ల సావిడి. స్వాతి మాస పత్రిక.

· 1991 ఎస్.2 బోగీలు. ఉదయం వార పత్రిక.

· 1997 ఒక జీవుడి ఆవేదన. ఆదివారం ఆంధ్రభూమి.

· 2001 కాంక్ష రచన మాస పత్రిక.

· 2003 అమ్మవారి నవ్వు. ఇండియా టుడే.[3]

ఇతరుల మాటలు
· ఆ కథలో(జప్తు)భాష మా ప్రాంతానికి చెందింది కాదు. అందులో చిత్రితమైన గ్రామం మాసీమకు చెందిందికాదు. కాని ఆగ్రామీణ జీవితంలో అక్కడి రైతుల సమస్యలతో, స్వభావాలతో మా ప్రాంత జీవితానికీ, రైతు సమస్యలకూ దగ్గరతనం కనిపించింది. ఈ రచయిత ఎవరో కట్టుకథలు కాకుండా పుట్టుకథలు రాసే వారనిపించింది-కాళీపట్నం రామారావు(కారా)

· 1960 నుంచి ఒకపాతిక, ముప్పైయేళ్ళ కాలవ్యవధిలో ఒక నిర్దిష్ట మానవ సమాజంలో వచ్చిన మార్పులన్నింటినీ ఆయన కథలు రికార్డు చేశాయి-మధురాంతకం రాజారాం

· విశ్వనాథరెడ్దిగారి కథల్లో-కథౌండదు-కథనం ఉంటుంది. ఆవేశంవుండదు-ఆలోచనవుంటుంది. అలంకారాలుండవు-అనుభూతివుంటుంది; కృత్రిమత్వంవుందదు-క్లుప్తతవుంటుంది. కథకుడిగా తెలుగు సాహిత్యంలో విశిష్ట స్థానం విశ్వనాథరెడ్దిగారిది-సింగమనేని నారాయణ

· నీల్లు లేని రాయలసీమలో జీవన ప్రవాహంలో తనుమోసిన, అనుభవించిన ఉద్రిక్త సుఖదుఃఖాలను ప్రపంచంలో పంచుకోవడానికి విశ్వనాథరెడ్డి కథలు రాసారు-అల్లం రాజయ్య

· ప్రజలనాడిని ప్రజలభాష ద్వారా పట్తుకున్న కథకుడు విశ్వనాథరెడ్డి. కథకుడిగా అతని చూపు అత్యంత రాక్షసమైనది. అంటే అంత కఠినమైనది. తెలుగుభాషపై అతనికున్న పట్టు కూడా చాలా గట్టిది.తెలుగు కథల్లో కవిత్వంకాని మంచి వచనం రాసిన కొద్దిమంది కథకుల్లో ఇతనొకడు.-చేకూరి రామారావు

· …సానుభూతితో, మానవతావాదంతో, వర్గచైతన్యంతో, స్త్రీపాత్రలను సృష్టించటం దగ్గర మొదలై లింగవివక్షనూ, స్త్రీల అణచివేతనూ అర్థం చేసుకొని ఆ దృష్టితో స్త్రీ పాత్రలను రూపొందించేంత వరకూ ఒక గుణాత్మక పరిణామ ప్రయాణం చేశారు-ఓల్గా

· ఒకే ఒక్క సృజనాత్మక రచానా ప్రక్రియలో అనేక సామాజికాంశాలను దర్శించడం కష్టమేకాని అసాధ్యం కాదని నిరూపిస్తాయి కేతు విశ్వనాథరెడ్ది కథలు.-అఫ్సర్

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -15-10-22-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Leave a comment

హాస్యానందం45-సమాసోక్తి

హాస్యానందం
45-సమాసోక్తి
రెండు మూడు అక్షరాల మాట తో చెప్పాల్సిన దాన్ని పెద్ద సమాసం లో చెప్పటం సమాసోక్తి అన్నారు మునిమానిక్యంగారు .చెంబు అని సింపుల్ గా అనకుండా ‘’జలాది ద్రవ్య ధారక సమర్ధ లోహాదిపదార్ధనిర్మిత ఘటికా విశేషం ‘’అ౦టేఅవతలి వాడి బుర్ర పగిలిపోతుంది .అంటే అల్పమైన భావాన్ని పెద్దసమాసంలో కూర్చటం అన్నారు మాస్టారు .అలాగే అందమైన వాడు అనటానికి ‘’పవనాశనేంద్ర ధర మకుటాలంకార మణి జనక వరపుత్రీ రమణ కుమారరూపదీపితుడు ‘’అంటే క్లిష్టం అయి కావ్యదోశ మౌతుందని ఆలంకారికులు అన్నారు .ఈ డొంక తిరుగుడు వలన వినే వాడికి నవ్వు పుట్టిస్తుంది ,వాడి అందం దేవుడెరుగు .
ప్రగల్భోక్తి –నమ్మటానికి వీల్లేని దాన్ని నమ్మమని చెప్పటమే ప్రగల్భోక్తి అని నిర్వచించారు మాణిక్యంసార్ .ప్రగల్భాలు అతిశయోక్తులే .విస్తరించి చెబితే అర్దాశ్రయ హాస్య ప్రక్రియ అవుతుందన్నారు .ఉదాహరణ –ఒకాయన ఈకాలపు మనుష్యుల బలహీనతలగురించి చెబుతూ ‘’ఈకాలం సన్నాసులు దేనికీ పనికిరారు పిట్ట తిండి పిట్ట కూతగాళ్ళు .మాకాలం లో ఒక్కొక్కడూ సేరు బియ్యం అన్నం ఊదేసే వాళ్ళం .చుట్టలు ఇప్పటివాళ్ళూ కాలుస్తారుకానీ ,అప్పుడు మావాళ్ళూ కాల్చేవారు ఎంతతేడా ఎంతతేడా ?మా వాడు భోంచేసి చుట్ట ముట్టి౦చాడూ అంటే ఆచుట్ట రాత్రంతా అలా కాలుతూనే ఉండేది. రూళ్ళకర్రల్లాగా ఉండేవి ఆకాలం చుట్టలు .ఇప్పుడు వీళ్ళు కాల్చేది చుట్టలుకాదు చుట్టపీకలు .పది నిమిషాలకంటే ఎక్కువ సేపు చుట్ట కాల్చేవాడు దివిటీవేసి వెతికినాదొరకడు ఇప్పుడు .ఆ కాలం వేరు ఆమనుషులు వేరు .
మరో ఉదాహరణ –ఒకాయన ‘’ఇప్పుడు గ్రహణాలు పడితే అర్ధగంట మహా అయితే గంట .మాకాలం లో అసలు గ్రహణాలు పట్టేవేకావు .కర్మ చాలక గ్రహణం పట్టిందా అంటే రెండురోజులు ఏక ధాటిగాఉండేవి .ఇప్పుడేవీ అలంటి గ్రహణాలు పిదపకాలం పిదప గ్రహణాలూ’’అన్నాడట
ఇంకో ముదురాయన ‘’మా తాత పాలు తీయటానికి ముక్కాలు పీట వేసుకొని పొడదుగు దగ్గర కూచున్నాడూ అంటే సాయంత్రం ఆరింటికి కూచున్నవాడు తెల్లార్లూ తీస్తూనే ఉండేవాడు .చివరికి విసుగొచ్చి లేచి ,దూడను వదిల్తే చీకటిపడే దాకా పాలు కుడుస్తూనే ఉండేది .ఇప్పుడు అలాంటి ఆవులూ లేవు అలాటి మనుష్యులూ లేరు ‘’అన్నాడు.
ఆత్మ తృప్తితో అంటున్నమాట కూడాహాస్యమనోహారం చెయ్యచ్చునన్నారు మునిమాణిక్యం .ఒకావిడ భర్తతో పోట్లాడి బావిలో పడిచస్తాను అని బెదిరించింది .భర్తకు ఒళ్ళు మండి ‘’నీ చావు నువ్వు చావు .మనదొడ్లో బావిలేదు .ఎదురింట్లో ఉంది కావాలంటే అందులో దూకి చావు ‘’అన్నాడు .ఆమెకు అభిమానం తన్నుకొచ్చి ‘’ఎవరి బావిలోనో పడి చచ్చే కర్మనాకేం పట్టలేదు .మన ఇంట్లోనే బావి తవ్వించుకొని మరీ చస్తాను’’ .ఇదీ ప్రగల్భోక్తి లాంటిదే అని ప్రగల్భం స్వాభిమానంతో గర్వం తో పుట్టేది అని వివరణ ఇచ్చారు గురూజీ .ప్రగల్భం ఉత్ప్రేక్ష ,అతిశయోక్తి అక్కా చెల్లెళ్ళు లాంటివే .హనుమతుడు రావణుడి ఎదుట తనతోక అతిగా పెంచి ఆదేసి౦హసనమనుకుని కూర్చున్నాడు .ఈ విషయం హనుమంతుడి నోటిద్వారా వస్తే ప్రగల్భోక్తి అయ్యేది,దాన్ని పరమ సత్యంగా భావిస్తాం కనుక హాస్యపు పలుకుగానే ఉంటుందన్నారు మునిమానిక్యంజీ .కానీ ఇది సరైనదికాదు అని ఆయన మిత్రులు వాదించారట .మరింత లోతుగా ఆలోచించాలని ఆపేశారు .
మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్-14-10-22-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

విజయ విలాసం.5వ భాగం.14.10.22

విజయ విలాసం.5వ భాగం.14.10.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ఆధునిక హిందీ భాషా పితామహుడు భారతే౦దు హరిశ్చంద్ర -3

’ఆధునిక హిందీ భాషా పితామహుడు భారతే౦దు హరిశ్చంద్ర -3

  సత్య హరిశ్చంద్రుని పేరు తనపేరుకావటం భారతేందు అని అందరూ గౌరవంగా పిలవటం ఆయనకు గర్వంగా ఉండేది.ఉదారస్వభావుడుగానేకాక సత్యధర్మ పాలకుడుగా కూడా ఉండేవాడు .ఆలిగగడ్ విశ్వ విద్యాలయం స్థాపించిన సయ్యద్ అహ్మద్ ఖాన్ న్యాయవాదిగా వారణాసి బదిలీ మీద వస్తే ,ఇతని పై  వేసిన దావాలో ఈయన కోర్ట్ కు హాజరవ్వాల్సివచ్చింది .ఆదావాలో ఈయన ఒక వ్యాపారికి 3వేలరూపాయలు తీర్చాల్సి వస్తే ,వ్యాపారి ఒక నావను అమ్మి కొంతడబ్బు ఇచ్చినట్లు తెలుస్తోంది .డబ్బు ఎగగొట్టటానికి మంచి అవకాశం .న్యాయమూర్తి ఈయన నిజాయితీ గుర్తించి గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తే ‘’డబ్బుకోసం మతధర్మం , సత్యాన్ని త్యాగం చేయలేను .ఆవ్యాపారి నన్ను ప్రోనోట్ రాసిమ్మని అడగలేదు ,అతని షరతులకు నేను ఒప్పుకొని తీసుకున్నాను .అప్పు తీర్చే టప్పుడుఎ౦దుకుకు మాట తప్పాలి ?సత్యానికి ప్రతీకగా నిలబడిన హరిశ్చంద్రుని పేరే నా పేరు ‘’అన్నాడు .న్యాయమూర్తి ఆయన సత్య సంధత గుర్తించి సాక్షుల విచారణ చేయకుండా తీర్పు చెప్పాడు .అతని నీతి నిజాయితీలకు ఇలాంటివి కోకొల్లలు .చిన్న అప్పులకు కూడా ఎక్కువ డబ్బు చెల్లించేవాడు .

  ఒకసారి కుటుంబంతో పూరీ యాత్రకు బయల్దేరి వెడుతుంటే గోపాల్చంద్ర స్నేహితుడు రెండు బంగారు నాణాలు అప్పుగా ఇచ్చాడు తనకు డబ్బు అవసరం లేదని ఎంత చెప్పినా వినకుండా .వెళ్లిరావటానికి కొన్ని రోజులుపట్టింది .నాణాలను డబ్బుగా మార్చాడు .ఆయన దగ్గర డబ్బున్న సంగతి తెల్సి కొంతకాలం అక్కడే ఉందామన్నారు కుటుంబ సభ్యులు .డబ్బు పూర్తిగా ఖర్చైపోయింది .రెండు నాణాల అప్పు తీర్చటానికి ఆతర్వాత ఆయన 15వేలు ఖరీదు చేసే ఇల్లు తాకట్టు పెట్టాల్సి వచ్చిందని ఆయనే ఒకసారి చెప్పాడు .ధనార్జన ,పొదుపు ఆయనకు తెలీనివి .పూర్వం వ్యాపారంలో కుటుంబం కుబేర స్థానంలో ఉంటె ఇప్పుడు ‘’బేర్’’మనే స్థితికి వచ్చింది .వ్యయం తప్ప ఆదాయం హుళక్కి.కుటుంబ సభ్యులు కాశీ రాజు దగ్గరకు వెళ్లి ఈయనతో ఎలాగైనా దుబారాఖర్చు తగ్గించెట్లు చేయమనికోరితే ఆయన ఈతన్ని పిలిపించి సూచన చేయబోతే ‘’అయ్యా డబ్బు మాపూర్వీకుల్ని హరించి వేసింది .నేను డబ్బును హరి౦చాలనుకొన్నాను. నాకు డబ్బుపై వ్యామోహం లేదు ‘’అన్నాడు .ఇక ఎవరూ ఆయన్ను ఆపలేకపోయారు .

  లాభం లేదని కుటుంబంలోని వారంతా భాగాలు పంచుకొందామని నిర్ణయించి ,ఈయన అనాసక్తత వలన ఎక్కడ కావాలంటే అక్కడ సంతకాలు పెట్టగా ఉన్నదంతా వాళ్ళే పంచేసుకొన్నారు .ఆయన చిన్నతనం లోచేసిన అప్పులు కూడాఆయన భాగంలోనే చూపించార్రు .తర్వాత అమ్మమ్మ  ఆస్తిపంపకాలలో కూడా ఇలానే  ఆయన్ను అన్యాయం చేశారు .అయినా ఉమ్మడిగానే ఉన్నారు .హరిశ్చంద్ర ఉన్నభాగం తో మిగిలినవారు సంబంధం పెట్టుకోలేదు .ఆదాయం లేకపోవటం వలన అప్పులు చేయాల్సి వచ్చి తీర్చటానికి ఆస్తి అమ్మాల్సి రాగా సోదరుడు గోకుల్ చంద్ర ,ఈయన అప్పులు తీర్చేసిఅస్తి స్వాధీనం చేసుకొన్నాడు .ఆస్తి పోయినందుకు బాధపదలేదుకానీ అప్పు పుట్టనందుకు ఎక్కువ బాధ పడ్డాడు .ఇంతజరుగుతున్నా ఆయన సాహిత్య సంపదమాత్రం పెరుగుతూనే ఉంది . హరిశ్చంద్ర హిందీ సాహిత్యానికి చేసిన సేవ తెలియాలంటే ,అతనికి ముందు హిందీ సాహిత్యం ఎలా ఉందో తెలియాలి .అప్పటి ఉత్తర హిందూస్థాన్ లో అంటే ఇప్పటి బీహార్ హర్యానా ఢిల్లీ ఉత్తరప్రదేశ్ ,రాజస్థాన్ ,మధ్య ప్రదేశ్ లలో మాండలిక భాషలనుంచే ఇప్పటి హిందీఎర్పడింది .ఇక్కడి మాండలీకాలు మేవతి ,మార్వారీ ,జైపూరి,రాజస్థాన్ లకు చెందిన ఖడీబోలీ అంటే బంగారుభాష ,బ్రజ్ ,కనౌజీ ,బుందేలీ ,అవధి ,బాగ్ హెలి ,చత్తీస్ ఘడీ ,మైధిలి ,భోజ్ పూరి ,మాగధి ,.వీటిని దేవనాగరిలిపిలోనే రాసేవారు .మార్వాడీ వ్రజ్ ,అవధి మైధిలి భోజ్ పూరి లను కేవలం కవులే వాడేవారు .సాహిత్యం పద్యరూపం గా ఉండేది .వచనం అరుదు.మొగలాయీ దండయాత్రతో కొంత మార్పు జరిగింది .అరబిక్ పర్షియన్ టర్కి పదాలు ఆయా ప్రాంత మా౦డలీకాలలో  చేరిపోయాయి .దీనివలన ఉర్దూ భాష వచ్చింది .ఉర్దూ అంటే టర్కీ భాషలో’’ మిలిటరీ బస’’ అని అర్ధం.ఈ ఉర్దూ హిందీభాషలలో కలిసిపోయింది .ఢిల్లీ లో మాండలికంగా ఉన్న రెఖటా లేక హిండ్వీభాష మహమ్మదీయ రాజుల్నించి ఫకీరులా ‘’జాలియాస్ ‘’వరకు అలవాటైంది .షామిరాన్ బుర్హనుద్దీన్ ,మహమూద్ గౌస్ మొదలైనవారు ‘’హిండ్వీ’’లోనే రచన చేశారు .మంచి హిందీభాషగా చెలామణి అయింది ఈభాషలోనే అమీర్ ఖుశ్రు ,జాయాసి, కబీర్ లు కవిత్వం రాశారు .అక్బర్ ఈభాషను బాగా ప్రోత్సహించాడు అక్బర్ హిండ్వీభాషలో రాసిన పద్యాలనూ ‘’అక్బార్ రే ‘’అనే కలం పేరుతొ రాశాడు .అతని సమకాలికులు తోడర్ మల్ బీ  ర్బల్, అబ్దుల్ రహీం, ఖాన్ ఖానా ,అబుల్ ఫైజి, ,గంగాకవి తులసీదాస్ సూర్ దాస్ లుకూడా హిండ్వీలోనే రాశారు .జహంగీర్ షాజహాన్ ,ముర్షిదాబాద్ ,జీడ్,దక్కన్ సుబెదార్లు అందరూ దీన్ని ప్రోత్సహించారు .మొగలుల చివరి చక్రవర్తి బహదూర్ షా హిందీలోమంచికవి చాలారచనలు చేశాడు .

  మొగలాయికాలం లో పద్యమే ఏలింది .రాం ప్రసాద్ నిరంజన్ రాసిన భాషా యోగవశిష్ట -1741,పండిత్ దౌలత్ రాం అనువదించిన పద్మపురాణం -1761వంటివి అతితక్కువ వచన రచనలు. క్రైస్తవ కాలం లో మత ప్రచారం కోసం ఆయా మా౦డలీకాలనే వాడేవారు .హిందీ రచయితలకు అవకాశాలు బాగా వచ్చాయి. ప్రజలు ఎక్కువమంది అర్ధం చేసుకొనేవారు .కానీ బ్రజ్ భాషలోనే రచన జరిగింది .మొగలాయీలతర్వాత వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి ఉర్దూ పిచ్చపిచ్చగా నచ్చి ఉర్దూ-ఇంగ్లీష్ డిక్షనరీ,  ఉర్దూ వ్యాకరణం  గిల్ క్రైస్ట్ తో రాయించారు , రచయితలూ బాగా పండితులవటంతో ఉర్దూ పర్షియన్ భాషల్లో రచనలు చేశారు .ఆగ్రానుంచి వచ్చిన లల్లూ జూలాల్ కి ఉత్తరప్రదేశ్ లో మాట్లాడే ఖడ్ బోలీ బ్రజ్ లలో మంచి పరిచయముంది .భాగవతాన్ని హిందీలోని అనువదించి ప్రేమ సాగర్ పేరుతొ ప్రచురించాడు .హితోపదేశ ,పంచ తంత్రాలకు బ్రజ్ భాషలో అనువాదం చేశాడు .బైతాల్ మొదలైన వాటిని ఉర్దూ-హిందీ మిశ్రమభాషలో రాశాడు .నాసికేలో పాయాన్ ను  సాదత్ మిశ్రా 1803లో రాశాడు .ఖేత్ కికహాని అనే సంప్రదాయ గ్రంథాన్నిన  ఇన్సాల్లాఖాన్ రాశాడు .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -14-10-22-ఉయ్యూరు

     .

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

పానుగంటి లక్ష్మీ నరసింహారావు సాక్షి.1వ భాగం.14.10.22

పానుగంటి లక్ష్మీ నరసింహారావు సాక్షి.1వ భాగం.14.10.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Tagged | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం.5వ భాగం.14.10.22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం.5వ భాగం.14.10.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -20

మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -20

· 56-రచయిత ,కధకుడు పాడే ,వాడినమల్లెలు ఫేం,రాచకొండ పురస్కార గ్రహీత –శ్రీ సొదు౦ జయరాం

· సొదుం జయరాం తెలుగు రచయిత, కథకుడు. [1]

జీవిత విశేషాలు
అతను కడప జిల్లాలోని ఉరుటూరు గ్రామంలో జన్మించాదు. అతను ప్రొద్దుటూరు మునిసిపల్ హైస్కూలులో చదివుకున్నాడు. అతను బి.ఏ. పట్టభద్రులు.అతను కొడవటిగంటి కుటుంబరావు ప్రశంసలు పొందాడు. పాడె, వాడిన మల్లెలు, పుణ్యకాలం మించిపోయింది మొదలైనవి అతని పేరొందిన కథలు. అతని కథల్లో అనవసరమైన సన్నివేశం గానీ, అనవసరమైన వాక్యం గానీ, అనవసరమైన మాటగానీ ఉండవని రచయితలు, విమర్శకులు, సాహితీపత్రికల సంపాదకులు గొప్పగా చెబుతారు. అతను రాసిన కథలు చాలా మటుకు రెండు పేజీల్లోపలే ముగుస్తాయి. 2004లో వీరి కథలకు రాచకొండ రచనాపురస్కారం వచ్చింది.[2]

1986లో అతను రాసిన ‘కర్రోడిచావు’ రాసిన కథలను కలిపి 1991లో ‘సొదుం జయరాం కథలు’ సంకలనం వచ్చింది. పాలగిరి విశ్వప్రసాద్ రెడ్డి సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి సొదుం జయరాం సాహిత్యనేత్రం ప్రచారం ద్వారా ‘రాతిపూలు’ సంకలనం తెచ్చారు.జయరాం రాసిన 12 కథలు రష్యా భాషలోకి, కొన్ని హిందీ,కన్నడ భాషలోకి అనువదింప బడినాయి.[3]

రచనల]
· వాడినమల్లెలు (కథాసంకలనం)

57-జుమ్మా కదల ఫేం,కేంద్ర సాహిత్య అకాడెమియువ అవార్డీ,టివి వ్యాఖ్యాత –శ్రీ వేంపల్లి షరీఫ్

వేంపల్లె షరీఫ్ తెలుగునాట ప్రముఖ కథా రచయిత. జర్నలిస్టు. టీవీ వ్యాఖ్యాత. వీరు కడప జిల్లా వేంపల్లె గ్రామానికి చెందినవారు. ఇతని జుమ్మా కథల సంపుటి కేంద్ర సాహిత్య అకాడెమి యువ పురస్కారం 2012 కు ఎంపికైంది [1].ఈ పుస్తకంలోని కథలను కడప ఆల్ ఇండియా రేడియో వారు వరుసగా నాలుగు నెలలపాటు ధారావాహికగా ప్రతిశుక్రవారం ప్రసారం చేశారు.

జుమ్మా
జుమ్మాఁ ఒక కథల సంపుటి [2]. జుమ్మా అంటే ఉర్దూలో శుక్రవారం అని అర్థం. హైదరాబాద్ లోని మక్కా మసీదులో శుక్రవారం ప్రార్థనల సమయంలో జరిగిన బాంబు పేలుళ్ల నేపథ్యంలోరాసిన కథ జుమ్మా. ఈ కథ పేరునే పుస్తకం శీర్షికగా పెట్టడం జరిగింది. ఈ కథ హిందీ, ఇంగ్లీషు, మైథిలి, కొంకణి, కన్నడ భాషల్లోకి అనువాదమైంది. ఇందులో ఇంకా రచయిత షరీఫ్ ముస్లిం కుటుంబాలలో చోటుచేసుకునే కొన్ని జీవిత విషయాలను తన దృష్టి కోణంలో రాసారు. ఇందులో ఉన్న పాత్రలు నిజ జీవితంలో మన చుట్టూ కనిపిస్తాయి.ఆనందాలు, ఆశలు, కట్టుబాట్లు, సాంఘిక జీవితంలో చోటు చేసుకొనే సంఘటనలను ఈ కథ లలో షరీఫ్ లోతుగా వివరించారు. రాసిన తొలిపుస్తకంతోనే తెలుగు సాహిత్యంలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకున్నారు. ఈ పుస్తకం తృతీయ ముద్రణ మార్కెట్లోకి విడుదలైంది.

జుమ్మాలో ఉన్న కథలు

  1. జుమ్మా
  2. అయ్యవారి చదువు
  3. పర్దా
  4. తెలుగోళ్లదేవుడు
  5. ఆకుపచ్చముగ్గు
  6. చాపరాయి
  7. జీపొచ్చింది
  8. రజాక్‌మియాసేద్యం
  9. పలక -పండగ
  10. దస్తగిరి చెట్టు
  11. రూపాయి కోడిపిల్ల.

మరోవైపుఇటీవలే ఆయన “తలుగు’పేరుతో ఒకే కథను నేరుగాపుస్తకంగా ప్రచురించారు. “తలుగు’ అంటే రాయలసీమ మాండలికంలో గొడ్లనుకట్టేసే తాడు అని అర్థం.

బాల్యం
వేంపల్లె షరీఫ్ అసలు పేరు షేక్ మహమ్మద్ షరీఫ్. తండ్రి రాజాసాహెబ్, తల్లి నూర్జహాన్. కడప జిల్లాలోని వేంపల్లెలో పేద ముస్లిం కుటుంబంలోపుట్టారు. ముగ్గురు అన్నదమ్ములు, ఒక చెల్లెలు ఉన్నారు. బాల్యమంతా వేంపల్లెలోనే గడిచింది. పదవ తరగతి వరకు వీరి చదువు సజావుగా సాగింది. తర్వాత ఆయన చిన్న చిన్న పనులు చేసుకుంటూ చదువుకోవాల్సి వచ్చింది. ఎస్టీడీ బూత్ లో బోయ్ గా, కొరియర్ బోయ్ గా, ఆటో డ్రైవర్ గా ఇలా ఎన్నో పనులు చేశారు. ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల నుంచి రచనా వ్యాసంగం మొదలుపెట్టారు. మొదట చిన్న పిల్లల కథల రాశారు. 2003 నుంచి సీరియస్ రైటింగ్ మొదలుపెట్టారు. రాయలసీమ గ్రామీణ ముస్లింల జీవితాన్ని కథలుగా మలుస్తున్నారు. 2003లో సొంత ఊరు వదిలేసి హైదరాబాద్ చేరారు. హైదరాబాద్ వచ్చాక ఊరిపేరునే ఇంటి పేరుగా మార్చుకుని రచనలు చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు.

చదువు
హైదరాబద్లో ని పొట్టిశ్రీరాములు తెలుగుయూనివర్సిటీ నుంచి జర్నలిజంలో పిహెచ్ డి చేశారు. “టీవీ ప్రకటనల్లో సంస్కృతి” అనే అంశంపై పరిశోధన చేశారు. అదే యూనివర్సిటీలో ఎంఫిల్ చేశారు. “తెలుగు న్యూస్ చానల్స్ లో బ్రేకింగ్ న్యూస్ కవరేజ్ ‘ అనే అంశంపై సిద్ధాంత గ్రంథం సమర్పించి ఎంఫిల్ పట్టా పొందారు. అంబెద్కర్ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ రిలేషన్స్ లో బ్యాచలర్ డిగ్రీ పొందారు. ఎం ఏ తెలుగు చేశారు. ఆల్ ఇండియా రేడియో నుంచి “వాణి సర్టిఫికెట్ కోర్సు’ పూర్తి చేశారు.

రచనలు

  1. జుమ్మా (2011)- కథల సంపుటి (జుమ్మా కథా సంకలనం ఇంగ్లీషులో అనువాదమైంది. జాతీయ ముద్రణా సంస్థ ప్రిజమ్స్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. అమెరికాలో ఉంటున్న సీనియర్ జర్నలిస్టు దాసు కృష్ణమూర్తి గారు ఈ పుస్తకాన్ని ఇంగ్లీషులోకి అనువాదం చేశారు. అలాగే ఇటీవలే ఈ పుస్తకం కన్నడ భాషలోకి అనువాదమైంది. నవకర్నాటక పబ్లికేషన్స్ వారు ప్రచురించారు)
  2. తియ్యని చదువు (2017)- పిల్లల కథలు
  3. టోపి జబ్బార్ (2017)- కథల సంపుటి
  4. కథామినార్ (సహ సంపాదకత్వం) (2018) – నవ్యాంధ్ర ముస్లిం కథా సంకలనం
  5. చోంగారోటీ (సంపాదకత్వం) (2020) – రాయలసీమ ముస్లిం కథా సంకలనం
  6. తలుగు (2015) – ఏక కథాపుస్తకం – మనిషైనా, పశువైనా పరపీడన నుంచి విముక్తి కోరుకుంటే ఎలాంటి ‘తలుగు’లనైనా ఇట్టే తెంచుకోవచ్చని చాటి చెప్పిన కథ
  7. టీవీ ప్రకటనలు (2021) – పరిశోధనా రచన

తెలుగు టీవీ ప్రకటనల్లో భాషా సంస్కృతులు ఎలా ప్రతిఫలిస్తున్నాయో సోదాహరణగా వివరించిన పరిశోధనా పుస్తకం ఇది. తెలుగులో టీవీ ప్రకటనలకు స్క్రిప్టు ఎలా రాయాలి? అనువాదం ఎంత జాగ్రత్తగా చేయాలి? భావం ఎంత స్పష్టంగా ఉండాలి? సంస్కృతీపరమైన అంశాల మీద ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. వంటి విషయాల మీద ఈ పరిశోధన సాగింది. రచయిత తన పిహెచ్ డి పరిశోధనలో భాగంగా ఈ పుస్తకం రాశారు. మీడియాలో ఉండే ప్రతి ఒక్కరూ చదవదగ్గ పుస్తకంగా దీనిని విమర్శకులు ప్రశంసించారు.

ఇతర రంగాలు
వేంపల్లె షరీఫ్ రచయితగానే కాకుండా అప్పుడప్పుడు న్యూస్ రీడర్ గా కూడా టీవీల్లో కనిపిస్తారు. హైదరాబాద్ లోని రెయిన్ బో ఎఫ్ ఎమ్ 101.9 లో ఆర్.జెగా వినిపిస్తారు. గతంలో వివిధ పత్రికల్లోనూ పనిచేశారు. హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో దూరవిద్యాకేంద్రం విద్యార్థులకోసం కొన్ని జర్నలిజం పాఠాలు రాశారు. చెప్పారు. సారంగ సాహిత్య వెబ్ మ్యాగజైన్లో 2012 నుంచి 2013 వరకు కథల విభాగానికి ఎడిటర్ గా పనిచేశారు. కొంతకాలం పాఠశాల విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున వెలువడుతున్న బాలికల ద్వైమాస పత్రిక “కస్తూరి”కి ఎడిటర్ గా పనిచేశారు. తెలుగులో ఉత్తమ కథలను స్వయంగా చదివి రికార్డు చేసి యూట్యూబ్ లో “కథనం” పేరుతో ప్రచురిస్తున్నారు. వీటికి అశేష ప్రజానీకం దగ్గర్నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.

అవార్డులు
· కేంద్రసాహిత్య అకాడెమి యువ పురస్కారం (జాతీయ పురస్కారం) 2012

· గిడుగు రామ్మూర్తి పంతులు భాషా పురస్కారం (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం) 2017

· విమలాశాంతి సాహిత్యపురస్కారం (అనంతపురం)

· డా.కవితా స్మారక సాహిత్య పురస్కారం (కడప)

· కొలకలూరి భగీరథి కథా పురస్కారం (తిరుపతి)

· కథాపీఠం సాహిత్య పురస్కారం (రచన ప్రతిక)

· అక్షర గోదావరి కథా సాహిత్య పురస్కారం (విశాఖ) 2017

· వేదగిరిరాంబాబు కథానిక పురస్కారం (హైదరాబాద్) 2017

· విళంబి నామ ఉగాది పురస్కారం (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం) 2018

· కన్నడ సాహిత్యపరిషత్ పురస్కారం (కర్ణాటక ప్రభుత్వం) 2018

· చాసో సాహితీ స్ఫూర్తి పురస్కారం (విజయనగరం) 2018

· కువెంపు భాషా భారతి ప్రాదికార పురస్కారం (బెంగళూరు) 2019

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -14-10-22-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

హాస్యానందం 44-పర్యాయోక్తి

హాస్యానందం

44-పర్యాయోక్తి

ప్రశ్ననుంచే సమాధానం లాగే పద్ధతిని పర్యాయోక్తి అన్నారు మునిమాణిక్యం మాస్టారు.మనం ఏ ప్రశ్న అడిగినా ఇమ్మీడియట్ గా జవాబు వస్తుంది .ఆప్రశ్న జ్యోతిశ్శాస్త్రం కానీ మరేదైనా కానీ .తెలీదు అని అనడం ఉండదు .గారడీ లాగా ప్రశ్నలో౦ చే సమాధానం లాగుతాడు .ప్రశ్నలోనే ఉన్న మాటలనే మార్చిజవాబుగా ఇస్తాడు .ఉదాహరణ-‘’ఒంటె మెడ అంతఎత్తుకు ఎత్తి ఎందుకు నడుస్తుంది ?’’అని అడిగితె తెలివైనోడు’’దాని మెడ పొడుగయ్యా .అందుకని అలా ఎత్తక తప్పదు’’అంటాడు ఠప్పున. ఇంకోటి ‘’పిల్లి రాత్రిళ్ళు ఎలా చూడగలుగుతుంది ?’’’’చీకట్లో కళ్ళు కనబడతాయి కాబట్టి ‘’అని ప్రశ్న పూర్తిగా ఆడిగేలోపే జవాబు వస్తుంది .మరోటి –‘’సగోత్రీకులపిల్లను ఎందుకు పెళ్లి చేసుకోకూడదు ??’’’అది తప్పుకదయ్యా శాస్త్రాలు ఘోషిస్తున్నాయికాబట్టి ‘’.మరోటి ‘’అకాల వర్షాలకు కారణం ఏమిటి ?’’సకాలం లో వర్షాలు పడకపోవటమే ‘అంటాడు .  ఒకసారి బీహార్ లో వరదలు ముంచేస్తుంటే ప్రధాని నెహ్రు చూడటానికి వెళ్లి తిరిగొచ్చాక విలేకరులు ‘’ఎలాగుంది వరద ?’’అని అడిగితె ‘’అంతా జలమయంగా ఉంది ‘’అన్నాడు ఇందులో తర్కం ఆత్మాశ్రయ ఉ౦దికనుక ఇదీ పర్యాయోక్తే అన్నారు నరసింహారావు జీ .

పునరుక్తి –ఒకసారి అన్నదాన్ని మళ్ళీ మళ్ళీ అనటమే పునరుక్తి అన్నారు .మొదట ఒకభాషలో అని తర్వాత అదే అర్ధాన్ని మరికొన్ని భాషల్లో అనటమూ పునరుక్తే అన్నారు మునిమాణిక్యం .మన సినిమాలో రాళ్ళపల్లి దీన్ని బాగా పండించాడు .గురజాడ కన్యాశుల్కం లో ఇది పుష్కలం అంటారు మాస్టారు ..భర్త భార్యతో ‘’ఖరీదైనది వద్దు  మామూలు వాషింగ్ మెషిన్ కొందాము అంటే వినలేదు నామాట .అప్పు తీర్చటం యెంత కష్టమో నీకు తెలీదు ‘’అనగా భార్య తెలివిగా ‘’అదే మంత కష్టం లెండి .కాకపొతే ఆ అప్పు తీర్చటానికి నెలకు యాభై వంతున  ఏడాది పట్టే బదులు పన్నెండు నెలలు కట్టాలి అంతేగా ?’’భర్త మాట కాదన్నట్లున్నా,నిజానికి ఇద్దర్దీ ఒకేమాట ఒకేబాట అన్నారు మునిమాణిక్యం .ఒకావిడ పక్కావిడతో ‘’ఆవిడ ఎంత చెవిటిది అంటే ఎవరన్నా పిలిస్తే వస్తున్నాను అని కూడా అనలేదు .మరో తమాషా .ఆమె  మాటలు ఆమెకు వినిపించక ‘’నేనేమన్నాను ?’’అని అడుగుంది .ఆమె ఎంత మూగది అంటే ,ఆకలైతే అన్నం పెట్టమని కూడా అడగలేదు ‘’

  మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -13-10-22-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

విజయ విలాసం.4వ భాగం.13.10.22

విజయ విలాసం.4వ భాగం.13.10.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ఆధునిక హిందీ భాషా పితామహుడు భారతే౦దు హరిశ్చంద్ర -2

ఆధునిక హిందీ భాషా పితామహుడు భారతే౦దు హరిశ్చంద్ర -2

తండ్రి మరణం తో  కుటుంబ బాధ్యతలుమోస్తూ ఆడంబరంగా డబ్బు ఖర్చు పెట్టాడు  హరిశ్చంద్రరంగురంగులబట్టలు పీతాంబరాలు ,సెంట్లు అత్తరు లతో విలాస పురుషుడుగా ఉండేవాడు .అత్తరు ,తమలపాకుల్లో వాడేఅత్తరు ఖర్చు చూసి గుండెలు బాదుకోనేవారు .ఎప్పుడూ మహారాజుగా ఘుమ ఘుమ లాడుతూ ముస్తాబులో ఉండేవాడు .వివిధ ప్రాంతాలనుంచి అమ్మకానికి వచ్చిన చిత్రాలు చిత్ర సంపుటాలు పురాతన గ్రంథాలు ఎంత ఖరీదైనా కొని తండ్రి ఏర్పాటు చేసుకొన్న స్వంత గ్రంథాలయానికి వన్నె తెచ్చేవాడు .అనాదిగా వస్తున్న కళాకారులపోషణ తలకు మించిన భారమూ  అయ్యేది .ప్రముఖ దేశీయులు ,విదేశీయులు ఇంటికి అతిధులుగా వస్తే వారిని భారీ ఖర్చుతో సన్మాని౦చేవాడు .ఆధునికత ఏరూపం లో ఉన్నా అతడు ఆదరించేవాడు .గడియారాలపై మోజు ఎక్కువ .వందలాది  వాటిని కొని వందిమాగధులకు ధారాదత్తం చేసేవాడు,కొత్తగా వచ్చిన ఫోటో పరిశ్రమ లో నిలదోక్కుకోనేవారికి పెట్టుబడి పెట్టి జీవనోపాధి కల్పించాడు. హోమియోపతి వైద్యాన్నీ ప్రోత్సహించాడు .ఉచిత హోమియో చికిత్సాలయం నెలకొల్పి నెలకు నూట పాతిక రూపాయలు ఖర్చు చేసే  వాడు .

  లితో ప్రింటింగ్ తో తండ్రి పుస్తకాలు ముద్రించేవాడు .’’సుందరీ తిలక్ ‘’పేరుతొ ప్రఖ్యాత కవుల కవితా సంకలనాలు ప్రచురించాడు .కొత్తగా అప్పుడప్పుడే ప్రవేశం అయిన ముద్రణా యంత్రాలు కొని ముద్రించే వారికి ఆర్ధిక సాయం చేసేవాడు .కుస్తీపోటీలకు ,ఇంద్రజాల ప్రదర్శనాలకు గొప్ప ప్తోత్సాహం కల్పించేవాడు .దానాలు చేసేటప్పుడు స్వంత ఉంగరాలు రవ్వలు కూడా ఇచ్చి దాన కర్ణుడు అయ్యాడు .చలిలో వణుకుతున్న బిచ్చగానికి తన వంటిపై ఉన్న ఖరీదైన శాలువా ఇచ్చేసిన మానవతా మూర్తి .ఆపదలలో ఉన్న బ్రాహ్మణుడికి తన వజ్రాల ఉన్గారమే ఇచ్చేసిన త్యాగి .తన వెండి పెట్టె చూసి ముచ్చటపడ్డ ఒక బాలుని తండ్రికి విలువైన ఆపెట్టెను బహూకరించిన త్యాగధనుడు .రూపం ,ధనంపుష్కలంగా ఉన్న ఈ నవయవ్వనుని చుట్టూ అవకాశవాదులు చేరి స్తోత్రాలు చేసి ,డబ్బు గుంజుకొనేవారు .హిందీ భాషలో మొట్టమొదటగా వచ్చిన స్వీయ చరిత్ర హరిశ్చంద్ర రాసి౦దె ,ఇలాంటి వారినందరి మనస్తత్వాన్ని నాటి సామాజిక స్థితి ని అందులో  వర్ణించాడు.’’నన్ను నిజంగా ప్రేమించేవారెవరో ,వందిమాగధులు ఎవరో తెలీని అమాయకుడిని కాను,అజ్ఞానినీకాను  .నీదగ్గరున్నవి పావురాలా దివి నుంచి దిగివచ్చిన దివ్య గరుడ పక్షులా ?నా గుర్రాల్ని మెచ్చేవాడొకడు నా క౦చర గాడిదల్ని పోగిడేవాడొకడు  .ఈ పొగడ్తల కుంభ వృష్టికి నేను తట్టుకోన్నానుకాని ,ఇంకొడైతే పారిపోయేవాడు .ఇదంతారోజూ మాకచ్చేరి గదిలో జరిగే తంతు .ఇవన్నీ నీటి బుడగలలా చల్లగా జారిపోయేవి ‘’అని యదార్ధ చిత్రణ చేశాడు

  .’’మెట్లగది దగ్గర మరోరకమైన తంతు జరిగేది .నలుగురైదుగురు హిందూ ముసల్మానులు కాపలావారు ,ఇద్దరుముగ్గురు ఉద్యోగాలకోసం వచ్చేవారు,ఇంకొందరు చిల్లరమల్లర పనులకోసం వచ్చినవారు .కొందరు నిలబడి కొందరుకూర్చుని  అందరి ప్రార్ధనా డబ్బు కోసమే .ఇందులోఅందరూ స్వార్ధ పరులుకారు .భక్తిప్రపత్తులున్నవారూ ఉండేవారు .ఒకడు తార్పుగానితోబేరాలుపెట్టేవాడు ‘’రూపయకి బేడా నాకు ఇవ్వకపోతే నీ అంతు చూస్తా .నువ్వు వెనకేసుకొచ్చే బీబీ జాన్ ఈ ఇంటి గడపకూడా దాటి లోపలి రాలేదు ‘’అనేవాడు .బట్టలవ్యాపారితో ఒక లంచగొండి ‘’ఆ నల్లశాలువా నాకు ఇస్తేనే లోపలి వెళ్లి బట్టలు అమ్ముకోగలవు. నా మాట శాసనం ఇక్కడ.అమ్మినదానికి నీకుడబ్బు చేతిలో పడాలంటే నా చేయి తడపాల్సి౦దే,శాలువా కప్పాల్సిందే  ‘’అని బెదిరిస్తాడు .ఇంకో మధ్యవర్తి ‘’నేను అయ్యగారి తలలో నాలుక ‘’అని హడల గోడతాడు .మరోఘనుడు ‘’నాముందు తల ఎత్త టానికి నీకెన్ని గుండెలు?ఆడాళ్ళకు డబ్బు పంచేది నేనే ‘’హడలగొడతాడు ‘’ఇంతనిర్మొహమాటంగా తన జీవిత చరిత్ర చెప్పుకొన్నాడు .

 హర్స్చంద్ర భార్య మన్నో దేవి వలన ఇద్దరుకొడుకులు ,ఒకకూతురు పుట్టారు .ముగ్గురూ చిన్నప్పుడే చనిపోయారు .వివాహ జీవితం లో అన్యోన్యత లేదు .ఇంటి వైద్యుడు అతన భార్య అనారోగ్యానికి కారణం భర్త నిరాదరణ.అని చెప్పి , ఆయనకు సూటిగా  చెప్పటం కంటే ఆ సున్నిత మనస్కుడికి ఉత్తరం ద్వారా తెలియజేస్తే మంచిదని జాబురాశాడు .ఈయన దీనికి జవాబు బెంగాలో దేవనాగరలిపిలో తనకు ఇంట్లో సుఖం లేదని భార్యను ఇబ్బంది పెట్టటం లేదని ,అన్ని సౌకర్యాలు ఆమెకు కల్పిస్తున్నాననీ ,,అయితే తన హృదయాన్ని అదుపులో పెట్టుకొనే సామర్ధ్యం తనకు లేదనీ,తానూ ‘’అసహాయుడను ‘’అనీ  ‘’రాశాడు .

  1870లో కాశీలో సంపన్నులు తమకున్న ఇంటిని బట్టి ఉంచుకున్న కళావంతుల్ని బట్టి స్టేటస్ అంచనా వేసుకొనేవారు ‘’.గురూజీ’’ ఇందులో ఏమీ తీసిపోలేదు .ఉమ్మడికుటుంబం కనుక సరదాలు బయటనే తీర్చుకోనేవాడు .కళావంతుల ఇళ్ళకు వెళ్ళేవాడు వాళ్ళు ఈయన వసతి గృహానికి వచ్చేవారు .ఈయన సాహిత్యం లోనూ జీవితం లోనూ ,పాలుపంచుకొన్న ఇద్దరు స్త్రీలలో ఒకామె ఆలీజాన్ .ఆమె చేసిన అప్పు తీర్చటానికి వీళ్ళ ఇంటికి వచ్చేది .ఈయనతో పరిచయం పొందిన మహమ్మదీయ స్త్రీ .ఆమె పేరు మాధవిగా మార్చి హిందూమతంలోకి మార్చి అండన  చేర్చుకున్నట్లు కథనం.ఆమె ఇంట్లోనేదర్బారుపెట్టి పగలురాత్రి అక్కడే గడిపేవాడు .ఇల్లంతా దంతపు శోభ చేకూర్చాడు .ఇతని మరణం తర్వాత గోకుల్ చంద్ర ఆయిల్లు స్వాధీనం చేసుకొని నెలకు పదిరూపాయలు మాత్రమె ముట్ట చెప్పేవాడు .ఇతని చావుతర్వాత ఆమెకు ఆ ఆధారమూలేకుండా పోయింది .మల్లిక అనే బెంగాలీఅమ్మాయికూడాహరిశ్చంద్ర జీవితంలో ప్రవేశించి ,ఆమెకున్న సాహిత్య పరిజ్ఞానంతో మరీ దగ్గరైంది .గేయాలురాసేది .మూడు బెంగాలీనవలలు హిందీ లొకిఅనువది౦చి౦ది  .ఒక అనువాఫం ఇతనికే అంకితమిచ్చి అతడిని ‘’నేను ఆరాధించే ప్రభువు ‘’అన్నది .ప్రభువు ప్రోత్సాహంతోనే తనపుస్తలు ప్రచురితాలయ్యాయని కృతజ్ఞత తెల్పింది  ఇతని రచనలకు సహాయపడుతూ ప్రచురణాలయం పెట్టి ,ఇతనిపుస్తకాలు విక్రయించేది .

  భారతే౦దు అనే ముందుపేరు  హరిశ్చంద్ర  నడవడికను బట్టి వచ్చి, జీవితాంతం ఉండిపోయింది .ఒకపెద్ద మనిషిని ఒకసారి యితడు హేళన చేస్తేసున్నితంగా మందలిస్తూ నువ్వేమైనా తోపువా ?నీ నడవడినిర్మలమా ?నీ ప్రవర్తన నిజానికి చంద్రుని లాంటిది. చంద్రునిలో మచ్చలున్నట్లే నీ ప్రవర్తనలోనూ ఉన్నాయి అందుకే నిన్ను ‘’భారతేందు’’అనవచ్చు అనగా,తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నాడు మనవాడు .ఆపేరుతోనే స్నేహితులు పిలిచేవారు. 1870-80కాలం లో హరిశ్చంద్ర హిందీలో వివిధ సాహిత్య ప్రక్రియలలో ప్రఖ్యాతుడయ్యాడు .తోటి రచయితలు ఇతన్ని బ్రిటిష్ ప్రభుత్వం గౌరవించాలని కోరారు .ప్రభుత్వం  స్పందించక పోవటంతో పాటు, అతని ప్రత్యర్ధి రాజా శివ ప్రసాద్ కు ‘’సితార ఎహిందూ ‘’ఇవ్వటం బాధాకరంగా అనిపించి కలకత్తాలోని సారసుధానిధి పత్రికాసంపాదకుడు  హరిశ్చంద్ర  ‘’భారతేందు  ‘’  అంటే ‘’భారత చంద్రుడు’’ అని ప్రకటించగా సాహిత్యలోకమంతా  ఏకీభవి౦చగా ఆనాటినుండి సాహిత్యలోక౦  ఆయన్ను ‘’భారతేం హరిశ్చంద్ర ‘’అని అత్య౦త గౌరవంగా సంబోధించింది .ఇదే స్థిరపడిపోయింది .జార్జి గ్రీసన్ ,గర్కాన్ డిటాసీ వంటి పాశ్చాత్య ప్రముఖులు ఇలాగే సంబోధిస్తే చిరునవ్వు నవ్వేవాడు .తన లెటర్ పాడ్ పై  చంద్రోదయం ముద్రించుకొన్నాడు .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్-13-10-22-ఉయ్యూరు

     .

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహాభారత తత్వ కథనం.4వ భాగం.13.10.22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహాభారత తత్వ కథనం.4వ భాగం.13.10.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -19

మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -19

· 55-జీవితానుభవాలను రచనలలో పొందుపరచిన దార్శనిక రచయిత,బాలసాహిత్య నిర్మాత ,శారదా పీఠ స్థాపకుడు,రైతాంగ సాహిత్య వైతాళికుడు –శ్రీ కె.సభా

కె.సభా (జూలై 1, 1923 – నవంబరు 4, 1980) రాయలసీమలో కథా రచనను తొలినాళ్ళలో ప్రారంభించి ఆ రుచిని తెలుగు పాఠకలోకానికి దశాబ్దాలపాటు పంచిన బహుముఖ ప్రజ్ఞాశాలి.జాతీయోద్యమ చైతన్యంతో జీవితానుభవాలను, ఆదర్శాలను తన రచనా మూలాలుగా అందించిన దార్శనికుడు. కథా రచయితగా, నవలాకారుడిగా, కవిగా, గేయకర్తగా, బాలసాహిత్య నిర్మాతగా, సంపాదకునిగా, జానపద గేయ సంకలనకర్తగా, ప్రచురణకర్తగా కె.సభా విస్తారమైన సాహిత్య కృషిని చేశారు

జీవిత విశేషాలు
సభా చిత్తూరు జిల్లా కొట్రకోన గ్రామంలో 1923 జూలై 1 న సభా జన్మించారు. ఈయన తల్లి దండ్రులు పార్వతమ్మ, చెంగల్వరాయుడు. తండ్రి వీధిబడి ఉపాధ్యాయుడు. సభా ఎనిమదవ తరగతి పూర్తి చేసి తర్వాత ఉపాధ్యాయ శిక్షణ పూర్తిచేశారు. సభా ఏనాడూ కష్టాలకు చలించలేదు. పదహారేళ్ళ వయస్సులో ఉపాధ్యాయు వృత్తి లోనికి చేరారు. వృత్తి బాధ్యతలు నిర్వహిస్తూనే బి.ఏను పూర్తిచేశారు.

సమాజ సేవకునిగా
సభా శ్రీ రమణ పబ్లికేషన్స్‌ స్థాపించి ఔత్సాహిత రచయితల్ని, శారదాపీఠాన్ని స్థాపించి కళాకారుల్ని సభా ప్రోత్సహించారు. తనచుట్టూ ఉన్న రైతు కూలీలు, రైతులు, వివిధ గ్రామీణ వృత్తులవారు, దళితులు పడుతున్న బాధలను చూసి తట్టుకోలేక అప్పటి సామాజిక ఉద్యమాలలో పాల్గొంటూనే మరోవైపు ఉద్యమశీలత్వంతో కూడిన అనేక రచనలు చేశారు.1947లో శివగిరిలో రైతాంగ విద్యాలయం నిర్వహించిన సభాకు రైతులలో ముడిపడిన వివిధ వృత్తి జీవిత సమస్యలు బాగా తెలుసు. తమకున్న కొద్దిపాటి పొలంలోనే స్వయంగా పంటలు పండించిన సభా అనుభవంలో రైతు కష్టాల్ని రంగరించుకున్నారు. మద్యనిషేధం ఎత్తివేతతో ఛిన్నాభిన్నమైన దళితుల జీవితం, దళిత స్త్రీలయాతనను ఆయన తట్టుకోలేకపోయారు. అంతరించిపోతున్న భూగర్భజలాలు, ప్రకృతి విధ్వంసంతో కూలిపోయిన వ్యవసాయం, అతీగతీ లేని వృత్తులు, జీవనకల్లోలాలు వంటి ఎన్నెన్నో పరిణామాలు స్వాతంత్య్రానికి కొంచెం అటూయిటూగా సభా రచనల్లో వ్యక్తమయ్యాయి.

సభా చిత్తూరు -జిల్లా రచయితల సంఘం, రచయితల సహకార ప్రచురణ సంఘం, కళాపరిషత్తు వంటి సంస్థలను స్థాపించి ఆ జిల్లాలో సాంస్కృతిక, సాహిత్య వాతావరణాన్ని సృష్టించారు. ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీలో సభ్యులుగా నియమితులయ్యారు. 1975లో మొదటి ప్రపంచ తెలుగు సభల్లో ప్రభుత్వం ఆయనను సత్కరించింది. 1940లో రచనా జీవితాన్ని ప్రారంభించిన సభా 300 కథానికలు, 7 నవలలు, పిల్లలు -పెద్దల కోసం అనేక కథలు, రచనలు చేశారు. కథా సంకలనాల్లో బంగారు, పాతాళగంగ, నీటిదీపాలు, నవలల్లో భిక్షుకి, మొగిలి, దేవాంతకులు ముఖ్యమైనవి. పిల్లలకోసం వచ్చిన కథా సంకలనాల్లో అరగొండ కథలు, సీసాచరిత్ర, ఐకమత్యం, చిలకమ్మ, బొంగరం, ప్రాచీన భారతి, విప్లవగాథలు చెప్పుకోదగ్గవి. పిల్లల నవలల్లో మత్స్యకన్యలు, సూర్యం, కవిగాయకుడు, చంద్రం, పసిహృదయాలు, బుజ్జి జిజ్జి, పావురాలు, బాలల నాటకాల్లో పరీక్షా ఫలితాలు, చిట్టిమరదలు, స్వతంత్రోదయం, పురవదినాయక, ఏటిగట్టున, చావుబేరం, బుర్రకథల్లో రైతురాజ్యం, పాంచజన్యం పేరొందాయి. దయానిధి, వేదభూమి, విశ్వరూప సందర్శనం అనేవి వీరి ప్రచురిత కావ్యాలు. 500 పైగా వివిధ పత్రికల్లో కవితలు ప్రచురితమయ్యాయి. రాయలసీమ జానపద గీతాల్ని సేకరించి ప్రచురించిన సభా లెక్కకుమించిన రేడియో ప్రసంగాలు చేశారు.ఆంధ్రప్రభ, జమీన్‌ రైతు, నాగేలు మొదలైన పత్రికల సంపాదకవర్గంలో పనిచేశారు. దేవదత్తం అనే పేరుతో ఒక వారపత్రికను సంపాదకత్వం వహించి నడిపారు. ఆంగ్లంలో పాంచజన్యం అనే పత్రికను నడిపారు.

రాయలసీమ రైతాంగ సహిత్య వైతాళికుడు
రాయలసీమ రైతాంగ సాహిత్య వైతాళికునిగా కె.సభా కృషి అనన్యసామాన్యం. పల్లెపట్టుల బాధల పాటల పల్లవుల మీద సజన దృష్టిని నిలిపిన సభా అభివృద్ధి పేర వంచనాపరులైన పాలనా యంత్రాంగంలోని క్షుద్రులమీద, రాజకీయ యంత్రాంగంలోని కొత్తతరం స్వార్థ రాజకీయ వాదులమీద, నిరసన గళం గట్టిగా విన్పించారు. గాంధేయ జాతీయ వాద స్ఫూర్తినిండిన భావాలు సభారచనల్లో కోకొల్లలుగా కన్పిస్తాయి. ఇతివృత్త స్వీకరణలం, కథనంలో పాత్రల చిత్రీకరణలో, కంఠస్వరంలో, వాతావరణ చిత్రణంలో, మానవ సంబంధాల నిరూపణలో అద్వితీయమైన శైలిని, నిబద్ధతను సభా రచనల్లో పాటించారు. రైతుల కథల్లో ఆదర్శవాస్తవికతా వాదం, కఠిన విమర్శనా వాస్తవికత, ప్రజాస్వామ్యంలోని కొన్ని లొసుగులు కన్పిస్తాయి. కథన శిల్పంలో చెక్కు చెదరని దేశీయతను సభా పాటించారు. ‘పిచ్చిదంపతులు’ అనే ఆయన కథ చదివినప్పుడు సమాజ ప్రేమకు మనస్సున్న మనుషులు కావాలనే ఒక సామాజిక వేదన గుండెను తాకుతుంది. ‘అంబా’ కథ సీమకరవు నేపథ్యంతో రాసింది. చదివిన ప్రతి పాఠకుణ్ణి అది ఒక విషాదాంతసంఘటనగా వెంటాడుతుంది. ‘అంతరంగం’ కథ గ్రామీణ జీవితం, రైతుల కడగండ్లు, కడుపునిండని కవుల కృతక కావ్యరచనను వెక్కిరిస్తుంది. ‘చుక్కలవరాలు’ కథ అచ్చమైన దేశీయతను చెబుతుంది.

రచనలు
కథా సంపుటాలు బంగారు (5 కథలు, పాతాళ గంగ (పది కథలు), నీటి దీపాలు (15 కథలు) యిలా మూడొందల కథలు, పిల్లలకథలు వందల సంఖ్యలో ఉండగా తొమ్మిది సంపుటాలు వెలువడ్డాయి. భిక్షుకి, మొగలి, దేవాంతకుడు వంటి నవలలు, పిల్లల కోసం మరో ఏడు నవలను వ్రాసారు. వేయికి పైగా బాలగేయాలు వ్రాసారు. విశ్వరూప సందర్శనం అనే గేయ కావ్యం రాసారు.దయానిధి వేదభూమి వంటి పద్యకావ్యాలను వ్రాసారు.రైతురాజ్యం, పాంచజన్యం అనే బుర్రకథలు వ్రాసారు.

ఈయన 1980 నవంబరు 4 న మరణించారు.

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -13-10-22-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

విజయ విలాసం.3వ భాగం.12.10.22

విజయ విలాసం.3వ భాగం.12.10.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహాభారత తత్వ కథనం.3వ భాగం.12.10.22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహాభారత తత్వ కథనం.3వ భాగం.12.10.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

సరస భారతి 168వ కార్యక్రమ౦గా నాటక, టివి, సినీనటులు –శ్రీ ఉప్పులూరి సుబ్బరాయశర్మ గారికి ‘’జీవన సాఫల్య పురస్కార ప్రదానోత్సవం ‘’

అక్షరం లోక రక్షకం

సరస భారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు

సరస భారతి 168వ కార్యక్రమ౦గా  నాటక, టివి,  సినీనటులు  –శ్రీ ఉప్పులూరి సుబ్బరాయశర్మ గారికి ‘’జీవన సాఫల్య పురస్కార ప్రదానోత్సవం ‘’

 సరసభారతి ,స్థానిక శ్రీనివాస అక్షరాలయం సంయుక్తం గా 29-10-22 శనివారం ఉదయం 11గం.కు శ్రీనివాస కాలేజి లో సరసభారతి 168వ కార్యక్రమం గా ప్రయోగాత్మక నాటక నటులు ,ప్రదర్శకులు ,రేడియో ,టి.వి.చలనచిత్ర నటులు శ్రీ ఉప్పులూరి సుబ్బరాయ శర్మగారికి ‘’జీవనసాఫల్య పురస్కారం ‘’ప్రదానోత్సవం  నిర్వహిస్తున్నాము .సాహితీ, సాంస్కృతిక అభిమానులు పాల్గొని జయప్రదం చేయప్రార్ధన .

పాల్గొనుఅతిధులు

ముఖ్య అతిధి – శ్రీ మండలి బుద్ధప్రసాద్ –ఆంధ్రప్రదేశ శాసనసభ మాజీ ఉపసభాపతి

విశిష్ట అతిధి -శ్రీ ఓలేటి పార్వతీశం – కవి పండితులు వక్త ,విశ్లేషకులు ,దూరదర్శన్ ఎక్సిక్యూటివ్

ఆత్మీయ అతిధులు –శ్రీ గుత్తికొండ సుబ్బారావు –కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు

శ్రీ జివి .పూర్ణచంద్-కృష్ణాజిల్లారచయితల సంఘం ప్రధాన కార్యదర్శి

శ్రీ చలపాక ప్రకాష్ –ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి

మొదలైన ప్రముఖులు

  పూర్తి వివరాలతో ఆహ్వానపత్రం మరో వారంలో అంద జేస్తాం .

                           గబ్బిట దుర్గా ప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు

                         పరుచూరి శ్రీనివాసరావు –శ్రీనివాస అక్షరాలయం ప్రిన్సిపాల్

                               12-10-22-ఉయ్యూరు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

రాణ కెక్కిన కొందరు రాయలసీమ ప్రముఖులు -412-అంధ గణితావధాని,గణిత బ్రహ్మ –శ్రీ లక్కోజు సంజీవరాయ శర్మ

రాణ కెక్కిన కొందరు రాయలసీమ ప్రముఖులు -4
12-అంధ గణితావధాని,గణిత బ్రహ్మ –శ్రీ లక్కోజు సంజీవరాయ శర్మ

ణిత బ్రహ్మగా పేరొందిన లక్కోజు సంజీవరాయశర్మ (నవంబర్ 22, 1907 – డిసెంబరు 2, 1997) ప్రపంచంలో ఆరు వేల గణితావధానాలు చేసిన ఏకైక వ్యక్తి.[1]

జననం
1907లో నవంబర్ 22న వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలంలోని కల్లూరులో సంజీవరాయశర్మ జన్మించాడు. ఈయన తల్లితండ్రులు నాగమాంబ, పెద్ద పుల్లయ్యలు. జన్మతః అంధుడు కావడంతో పురుడు పోసిన మహిళ గొంతు నులిమి దిబ్బలో పాతెయ్యమంది. కొందరు బంధువులు నోట్లో వడ్ల గింజ వేశారు. అయినా ఆయన్ని మరణం ఏమీ చేయలేకపోయింది. అప్పట్లో బ్రెయిలీ లిపి కానీ, అంధుల్ని చేరదీసే వ్యవస్థ కానీ లేదు. శర్మ అక్క పాఠశాలలో చదివినవి ఇంటిదగ్గర గొంతెత్తి బిగ్గరగా మననం చేస్తే, అవి విని, గుర్తుపెట్టుకుని, గణితంలో అపార విజ్ఞానం సాధించాడు. చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో, తల్లి పెంచి పెద్దచేసింది. కల్లూరులో రైతులకు ధాన్యం ధర, భూమి కొలతలు చెప్పేవాడు. వారు ఆయనకి కొంత సొమ్ము చెల్లించేవారు. గణితంలో పేరు ప్రఖ్యాతులు పొందుతోన్న కాలంలోనే అతను వయొలిన్ పట్ల ఆకర్షితుడై నేర్చుకొన్నాడు.

గణితావధానం
సంజీవరాయశర్మ తొలిసారి 1928 లో గణితావధానం నిర్వహించాడు. అప్పటినుంచి 1995 వరకు ఆయన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, బీహారు, ఢిల్లీ రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించి, ఆరువేల ప్రదర్శనలు ఇచ్చాడు. మహానగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాదు లలోను పలు ప్రదర్శనలను ఇచ్చాడు.[2] అఖిల భారత కాంగ్రెస్మహాసభలు 1928 నవంబర్ 15న నంద్యాలలో జరిగినపుడు, ప్రధాన ఆకర్షణ సంజీవరాయశర్మ గణితావధానమే.

ప్రత్యేకతలు
సాధారణంగా, గణితావధానం లో, పుట్టిన తేదీ ఇస్తే, అది ఏ వారము అయిందో చెప్పడం ఒక అంశం. కాని, ఈ విషయంలో సంజీవరాయశర్మకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ పుట్టిన తేదీ ఏ వారము అయినదో చెప్పడమే కాకుండా, ఆనాటి పూర్తి పంచాంగము చెప్పేవాడు. అంటే, పుట్టిన తేదీ, సమయము, ప్రదేశము చెప్పగానే, దానికి సంబంధించిన తిథి, వారము, నక్షత్రము, కరణము, యోగము, వర్జ్యము, రాశి కూడాచెప్పి, కొంతవరకు జాతకం కూడాచెప్పేవాడు. ఈ ప్రత్యేకతను (మానవ గణనయంత్రంగా పేరొందిన శకుంతలాదేవితో సహా) మరెవరూ చూపలేకపోయారు. ఆవిధంగా, ఇది అనితరసాధ్యమైన ప్రత్యేకత.

ఒక చిన్న వైఫల్యం
సంజీవరాయశర్మ ఏవిధంగా చూసినా గణనంలో గొప్పవాడు. జాత్యంధుడైనా, ఏవిధంగా గణనం చేసేవాడో తెలుసుకొందామనుకున్న వారికి నిరాశే ఎదురయింది. పుట్టు గ్రుడ్డి అయినందున, అంకెల భావనయే కాని, రూపము తెలియదు. మరి ఎలా గణనం చేసేవాడోనని అడుగుతే, తనకు చీకటి, అందులోనే వెలుగు తప్ప మరేమీ తెలియదనీ, అందులోనే సమాధానం తట్టుతుందనీ చెప్పాడు. కనుక, అతనిది దైవదత్తమైన వరమే కాని మరొకటి కాదు. శ్రీనివాస రామానుజన్ కు గోడ చేర్పు లాగ హార్డీ దొరికినట్లు, ఇతనికి కూడా ఎవరైనా దొరికి ఉంటే, ప్రపంచ ప్రఖ్యాతి వచ్చేది.
ఒకసారి, విశాఖపట్నంలో గణితావధానం చేస్తున్నప్పుడు అడిగిన ఒకప్రశ్న:
61 x2+1 = y 2
అనే సమీకరణానికి x, yలు ధన పూర్ణాంకాలు అయేటట్లు సాధన చెప్పండని కోరగా, తనకు సాధన తట్టడం లేదని, కాని ఆ సాధనలో చాలా పెద్ద అంకెలు వస్తాయని చెప్పాడు. సాధన చెప్పలేకపోవడం ఒక చిన్న వైఫల్యంగా తీసుకున్నా, సాధనలో చాలా పెద్ద అంకెలు వస్తాయన్నది నిజం.
సాధన : x = 226153980, y = 1766319049
ఇలాంటి సమీకరణాలను, పెల్ సమీకరణాలు అంటారు. ఇవి డయొఫాంటైన్ సమీకరణాలలో ఒక ప్రత్యేకమైన తరగతి. ఇలాంటి సమీకరణాలకు సాధనలు కనుక్కొనేందుకు చాలా కాలము క్రితమే ప్రముఖ భారతీయ గణితవేత్తలు, బ్రహ్మగుప్తుడు ( సా.శ.628) సమాస పద్ధతిని, భాస్కరాచార్యుడు ( సా.శ.1150) చక్రవాళ పద్ధతిని సూచించారు.
ఆధునిక కాలంలో, ఈ సమీకరణాల సాధనకు, సతత భిన్న వాదమును వాడుతారు.

సత్కారాలు
· శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం 1996 లో గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది.

· 1959 లో డిల్లీలో అప్పటి రాష్ట్రపతి శ్రీ బాబూరాజేంద్రప్రసాద్, ప్రధానమంత్రి శ్రీ జవహర్లాల్ నెహ్రూ లాంటి పెద్దలముందు తన ప్రతిభను ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు.[3]

కుటుంబం
అతనికి పందొమ్మిదవయేట వివాహమైంది. భార్య పేరు ఆది లక్ష్మమ్మ. పెళ్ళినాటికి ఈమె వయస్సు తొమ్మిదేళ్లు. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు సంతానం. భార్య ఆదిలక్ష్మమ్మ 1994 జనవరి 5 న శ్రీకాళహస్తిలో చనిపోయింది. ఆ తరువాత ఆయన మకాం హైదరాబాదులో ఉన్న కుమారుని వద్దకు మారింది. ఇతడు 1997 డిసెంబరు 2 న హైదరాబాదులో పరమపదించాడు.

13-ఇంపీరియల్ కౌన్సిల్ సభ్యుడు ,పీపుల్స్ మాగజైన్ సంపాదకుడు ,మద్రాస్ మహాజనసభ వ్యవస్థాపక సభ్యుడు ,నాగపూర్ కాంగ్రెస్ అధ్యక్షుడు,రావుబహదూర్ –శ్రీ వనప్పాకం అనంతాచార్యులు

పనప్పాకం అనంతాచార్యులు (పనప్పాకం ఆనందాచార్యులు) (1843 – 1907) అఖిల భారత జాతీయ కాంగ్రెసు అధ్యక్షులు.[1] ఈయన ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో విశేష స్థానం కలిగినవారు. 1884 సంవత్సరములో స్థాపించబడ్డ మద్రాసు మహాజనసభ అను కార్యాలోచన సభ వ్యవస్థాపకుడు, పీపుల్స్ మాగజీన్ అను మాసపత్రికకు సంపాదకుడుగానూ ఉన్నాడు. “ఆయన పేరు పి. ఆనందాచార్యులని ప్రసిద్దిచెందిననూ ఆయన ఎప్పుడూ పి. అనంతాచార్లు అని సంతకం చేస్తూ తనను తెలుగు వాడిగా ప్రకటించుకుంటూ ఉండిరి” అని 1948 మే 5వ తేది ఆంధ్రపత్రికలో మద్రాసు మహాజన సభ అనే వ్యాసములో దిగవల్లి వేంకటశివరావు వ్రాశాడు.[2]

జీవిత విశేషాలు
అనంతాచార్యుల వారి పూర్వులు చంగల్ పట్టు జిల్లా పొన్నేరు తాలూకా లోని గ్రామం పనప్పాకం వాస్తవ్యులు. వీరి తండ్రిగారు శ్రీనివాసా చార్యులు గారు ఇప్పటి చిత్తూరు జిల్లా (అదివరకటి నార్త్ ఆర్కాట్ జిల్లాలో కడమంచి అను తెలుగు గ్రామంలో ఇల్లు కట్టుకుని స్థిర పడ్డారు. అనంతాచార్యులు కడమంచి గ్రామంలోనే 1843లో జన్మించారు. వారి 12 ఏటనే తండ్రి శ్రీనివాసాచారి మరణించాడు.

ఈయనచిత్తూరు జిల్లా కోర్టులో ఉద్యోగం చేశారు. తండ్రి మరణానంతరం ఆతని మిత్రుడైన సి. వి. రంగనాథ శాస్త్రులు సహాయంలో 1863 లో మెట్రిక్యులేషన్, తర్వాత మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో 1865లో ఎఫ్.ఎ పరీక్షలలో ఉత్తీర్ణులయ్యారు. తర్వాత పచ్చియప్పా పాఠశాలలో ఉపాధ్యాయునిగా 1969 వరకు పనిచేశారు. ప్రైవేటుగా చదివి 1869లో బి.ఎల్ పరీక్షలో ఉత్తీర్ణులై మద్రాసు హైకోర్టు న్యాయవాదులలో అగ్రగణ్యులైన కావలి వెంకటపతిరావు వద్ద అప్రెంటిస్ గా పనిచేశారు. 1870లో వకీలుగా అనుమతిని పొంది హైకోర్టు న్యాయవాదులలో అగ్రగణ్యులయ్యారు. వీరు 1889లో మద్రాసు అడ్వొకేట్ల సంఘాన్ని స్థాపించారు.[3] లండనులో ఇంపీర్యల్ కౌన్సిల్లో ఇద్దరే ఇద్దరు భారతీయ (నేటివ్) సభ్యులోలో వీరు 1895 నుండి 8 ఏండ్లు సభ్యలుగా వుండి భారతీయుల దీనస్థితిగతులను వైస్రాయి సమక్షంలో కూడా ధైర్యముగా వెల్లడించేవారు. 1885 డిసెంబరు 28 న జాతీయ కాంగ్రెస్ మహాసభ స్దాపించుటకు బొంబాయి నగరములో జరిగిన ప్రప్రథము సభలో పాల్గోన్న 72 మందిలో అనంతాచార్యులు గారు తెలుగువారవటం గర్వించతగిన విషయం. అటు తరువాత 1891 డిసెంబరులో నాగపూరులో జరిగిన 7 వ కాంగెస్ మహాసభకు అధ్యక్షుడైనారు. 1878 లో స్దాపించబడ్డ హిందూ మహాజన సభలో సభ్యులు గానున్న సర్ టి. మాధవరావు, దివాన్ బహదూర్ ఆర్ రఘునందన రావు, న్యాపతి సుబ్బారావు గార్లతోపాటు గావీరు గూడా సభ్యులు, వీరందరూ తిరునల్ వేలి లటరరీ సదస్సులోకూడా ప్రముఖ సభ్యులు. హిందూ పత్రికలో 1878 నుండి వారి వ్యాసములు ప్రచురితమైనవి.1882 లో “How to reform the Courts” అను గ్రంథమును 1883లో“The Legal Profession, how to reform it” అను గ్రంథముప్రచురించారు. Madras Native Public Opinion అను ఇంగ్లీషు పత్రికలో వ్యాసములు వ్యాసేవారు వారు న్యాయవాదిగా చేసిన కేసులలో వారి వాదనలు Indian Law Report లో తరచు రిపోర్టు అవబడుతూవుండేవి.

అనంతాచార్యులు గారిని గురించి ఆదిభట్ల నారాయణదాసు కవి, వేటూరి ప్రభాకరశాస్త్రి గారు వ్రాసి యున్నారు. ఆంతటి విశేష మైనవ్యక్తి జీవితచరిత్ర లేకపోవటం, వేరెవరూ కూడా వ్రయకపోవటం అంతేకాక వారిని గురించి 1966 తరువాత వచ్చిన మూలాధారములు వారి పేరు “ఆనందాచార్యులు” అని ఉండటం చాల నొచ్చుకోతగ్గవిషయం. దీనికి కారణం వారిని గూర్చిన మూలాధారము ఒకటి మద్రాసులోని వారి మిత్రులొకరు అరవభాషలో వ్రాసియుండటం తదుపరి మూలాధారాలైన కాంగ్రెస్ చరిత్ర పుస్తకంలో వారి పేరు “ఆనందాచార్యులు” అయిపోవటం మరీ దురదృష్టకరమని వాపోయారు చరిత్రకారులు.[4]

న్యాయవాది వృత్తి, రావుబహదూర్ బిరుదు
1870లో మద్రాసు హేకోర్టులో న్యాయవాదిగా చేరారు.కావలి వెంకటపతిరావుగారి జూనియర్ గా కేసులు చేయటం ప్రారంభించిన కొద్దిరోజులలోనే వీరికి ప్రతిపక్షంగా బారిస్టర్ H.D Mayne అనుఆఖండన్యాయది (హిందూధర్మశాస్త్రాన్ని గూర్చి రచించిన ఉద్ఘ్రంధ కర్త ) తో భేటి పడిన ఒక కేసులో వీరు కేసు నడిపించి వాదాన చేయటం ఆ వాదనను హైకోర్టు ప్రధానన్యాయమూర్తి స్వయముగా ప్రసన్నించటము వీరి న్యాయవారి వృత్తిలో ఒక మైలు రాయి లాగ అయి అప్పటినుండి వీరి సీనియర్ కావలి వెంకటపతిగారు వీరిని జూనియర్ గా కాక తన భాగస్వామిగా స్వీకరించటం జరిగింది. త్వరలోనే వీరు చన్నపట్ణంలో అప్పటిలోనున్న అగ్రశ్రేణి న్యాయవాదులైన భాష్యం అయ్యంగార్, సర్ సుబ్రమణ్య అయర్ కోవకి చేరుకునటం జరిగింది. వీరి గొప్ప సమర్ధత ప్రావీణతకు హైకోర్టు ప్రధాన్యాయమూర్తి సిఫారసుపై రావుబహదూర్ బిరుదును విక్టోరియా రాణీ జాబిలీ సందర్భమున వీరికి ఇవ్వబడింది. వీరు గొప్ప ధైర్యసహాసములు గలవారు. ఆరోజులలోని ఇండియన్ పీనల్ కోడ్ శిక్షాస్మృతి, క్రిమినల్ ప్రొసీజర్ కోడులోని నిషేధనలోని లోటుపాటులను నీరు తీవ్రముగా విమర్శించి ఖండించారు. అప్పటి ప్రభుత్వము ఆయా శాసనములను సవరించుటకు నియమించబడ్డ ఉపసంఘములో ఇద్దరే ఇద్దరు నేటివ్ సభ్యులగల ఉపసభలో వీరొకరు, దర్భాంగ మహారాజ గారిని సభ్యులుగా నియమించారు. మిగతావారందరు ఆంగ్లేయదొరలగుట వారి అధిక సంఖ్యతో వీరి ప్రతిపాదనలు తిరస్కరించటం వీరు తీవ్రంగా డిసెంట్ ప్రకటించారు. వీరి ధైర్యసాహసాలు గణనీయము. నిర్మొహమాటంగా అన్యాయమును ఖండించగల ధైర్యసాహసి. 1881-1886 మధ్యకాలంలో మద్రాసు గవర్నరుగా నుండి అతి కఠినముగా భారతీయలపై పక్షపాతముగా నిర్దయుడైన గ్రాంటు దొర గారి వీడ్కోలుకు ప్రభు భక్తులు సంసిద్ధులగుతుండగా అనంతాచార్యులుగారొక బహిరంగసభలో నిర్మొహమాటంగా ఆప్రతిపాదనను తిర్కరించి ప్రసంగించటంతో ఆ వీడ్కోలు సన్నాహం ఆపటం జరిగింది.

రచయితగా
మొదట్లో ఆనందాచార్యులు జర్నలిజం, రాజకీయాల పట్ల ఆసక్తి చూపారు. ఆయన ‘నేటివ్ పబ్లిక్ ఒపీనియన్, మద్రాసి’ అనే మ్యాగజైన్లకు వ్యాసాలు రాసేవారు. ఆ తర్వాత హిందూ పత్రిక స్థాపనకు సహాయం చేసి, వ్యాసాలు రాశారు. రాజకీయాల్లో పాల్గొని కాంగ్రెస్ పార్టీకి అనేక రకాలుగా సేవలందించారు.[5]

రాజకీయ నేతగా
వీరు 1885లో బొంబాయిలో సమావేశమైన నాటి నుండి భారత జాతీయ కాంగ్రెసు సభా సమావేశాలలో పాల్గొని గణనీయమైన సేవచేశారు. 1891 నాగపూర్లో జరిగిన 7వ జాతీయ సభకు వీరు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఈ పదవిని అలంకరించిన మొట్టమొదటి దక్షిణ భారతీయులు వీరు. వీరు కాంగ్రెసు కార్యనిర్వహక సంఘంలో సభ్యులుగాను, అలహాబాదు కాంగ్రెసు కార్యదర్శులలో ఒకరుగా ఎన్నికయ్యారు. 1896లో భారతీయ సామ్రాజ్య శాసనసభకు చెన్నై నుండి ప్రతినిధిగా ఎన్నుకోబడ్డారు. ఆ సభలో నిర్భయంగా ప్రజల హక్కులను పరిరక్షించుటలో ఎనిమిది సంవత్సరాలు పనిచేసి 1903లో రాజీనామా చేశారు. వీరు నవంబరు 28 1907 న పరమపదించారు.

సత్కారాలు
ఈయన ప్రతిభకు మెచ్చి 1887లో ఆనాటి ప్రభుత్వం రాజబహుదూర్ బిరుదుతో సత్కరించారు. ఆంధ్ర భాషా సారస్వత పోషకుడిగా కీర్తి గడించడమే కాకుండా ‘పద్యావినోద’అనే బిరుదుతో ఆనాటి సాంస్కృతిక సమాజాలు సత్కరించి గౌరవించాయి.

అనంతాచార్లుగారా? ఆనందాచార్లుగారా?
ఈయన పేరు వివిధ పుస్తకాలు, అంతర్జాల వనరులలో రెండు విధాలుగా ఉంటుంది. ఈయన పేరు అనంతాచార్యులైనా అనేక గ్రంథములలో ఆనందాచార్యులుగా ప్రచురితమైనది. అది తేలేవరకూ నేలటూరి వెంకట రమణయ్య విజ్ఞాన సర్వస్వం లో వ్రాసినట్లు అనంత(ఆనందా)చార్యులు గారే.[6] ఇది తమిళ- ఆంగ్ల తర్జుమాల గడబిడ. మద్రాసు హైకోర్టు సెంటినెరీ సంకలన పుస్తకములో కూడా ” ఆనందాచార్యులు ” అని వుండటం.[7]. అంతకన్నాముందే ఇంకో మూలాధారము ఒకటి మద్రాసులోని వారి మిత్రులొకరు, కె సుందర రాఘవన్ అను వారు తమిళం లో వ్రాసిన గ్రంథము”Rao Bhadur P.Anandacharyulu” మూలాధారముచేసి 1965 Freedom Struggle in Andhra Pradesh Volume I Document No.86 pp235–245 అను ప్రభుత్వ ప్రచురితమైన గ్రంథములో ఇంగ్లీషు తర్జుమాల లోను వచ్చిన గడబిడ. ప్రభుత్వప్రచురణ గీటురాయి యై తదుపరి ప్రచురణలకు కారణభూతమైనది . 19 వశతాబ్దమునాటి ఆంధ్రమహాపురుషుని గూర్చిన విషయ సేకరణ ఇప్పుడు 21వ శతాబ్దములో విషయ స్పష్టతకి మార్గం తిరిగి మరోమారు

మూలాధార సేకరణ

  1. ఆయన స్వయంగా రచించిన వ్యాసములు, వారు 1890 -1895 మధ్య నడిపించి న పత్రిక “వైజయంతి “ అను పత్రిక, న్యాయవాదిగా వారి వాదనలు రిపోర్టు చేసిన I L R reports [Indian Law Reports back issues ]
  2. హరికథా పితామహుడుగా బిరుదు పొందిన అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు (1864- 1945) గారి ఆత్మకథలో అనంతాచార్యులుగారిని గురించి వ్రాశారు[8]
  3. 1891 నాగాపూరులో జరిగి న అఖిలజాతీయ కాంగ్రెస్ మహాసభ రిపోర్టు (2) ఉద్ధండులైన వేటూరి ప్రభాకర శాస్త్రి గారు 05/03/1944ఆంధ్రపత్రికలో వీరిని గురించి వ్రాసిన వ్యాసం.[9]
  4. ఆంధ్ర విజ్ఞాన సర్వసంలో డా నేలటూరి వెంకటరమణయ్య గారి వ్యాసం.
  5. మద్రాసు మహాజనసభ లోఅనంతాచార్యులుగారి కృషి.[10]
  6. 1924 నుండి అనేక చారిత్రక విశేషాలు రచించిచి అనేక మన్ననలందుకుని నిర్మహొమాటంగా నిజం చప్పగలిగినవారని పేరుపొంది,19వ శతాబ్దమునాటి అనేక ప్రముఖులతో (వేటూరి ప్రభాకరశాస్త్రి, వడ్డాదిసుబ్బారాయడు, న్యాపతి సుబ్బారావు మొదలగు ఇంకా ఎందరి తోనో) స్వయంగా పరిచయముకలిగి అనేక చారిత్రకవిషయనులు త్రవ్విపోసినట్టి చరిత్రకారుడు 1966 లోనే ఈ లోపమును బయటపెట్టిన చారిత్రాత్మక ప్రచురణ.[11].
  7. దిగవల్లి వేంకట శివరావు గారు 1988 లో సమాలోచనలో వ్రాసిన వ్యాసములో అనంతాచార్యులు గారిని గూర్చిచాల అమూల్యవిశేషాలు వ్రాస్తూ స్వాతంత్ర్యపోరాటములో 1930 -1933 మధ్య వారితో పాటు ఒకసహగ్రంధకర్తగా నుండిన డా భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు కూడా స్వతంత్రోద్యమచరిత్రలో అనంతాచారిగారి పేరును’ఆనందాచారి’గా చరిత్రలోకెక్కించారని చెప్పక తప్పదని వాపోయారు.

ఛాయాచిత్రములో “పి. ఆనందాచార్యులు”

1944 లో వేటూరి ప్రభాకరశాస్త్రి గారి వ్యాసంలో మొత్తం అంతా అనంతాచార్యులు గారనే అనేక సార్లు సంబోధించి యుండగా ఆవ్యాసములో ప్రచురించిన ఛాయాచిత్రము క్రింద ఆనందార్యులు అని వుండటం ఆశ్చర్యమైన విషయం. కానీ ఆంధ్ర విజ్ఞానసర్వస్యం లోనేలటూరి వెంకటరమణయ్యగారి వ్యాసంలో మాత్రం ఛాయాచిత్రము క్రింద “చిత్రము 128 పనస్పాకము అనంతాచార్యులు” అని వుండటం గమనీయం.[12]

సాహిత్యకృషి
సర్ టి మాధవరావు, మరియూ దివాన్ బహదూర్ ఆర్ రఘునాధ రావు గారు నిర్వహించిన The Madras Native Public Opinion అను ఇంగ్లీషు పత్రికలో అనంతాచార్లుగారు వ్యాసాలు వ్యాశారు. ఆ పత్రిక కొన్నాళకు ఆగిపోయినతరువాత దాని స్ధానంలో మద్రాసీ అను తెలుగు పత్రికలో వ్యాసాలు వ్రాశారు. 1878 లో స్దాపించ బడ్డ హిందూ పత్రికలో అనేక వ్యాసాలు వ్రాశారు. అనేక బహిరంగ సభలలో ఉపన్యాసాలుచ్చారు. 1890-1899 మధ్యన వారు వైజయంతి అను తెలుగు పత్రిక నడిపించారు. ఆ పత్రికలోకొక్కొండ వెంకటరత్నం గారు రచించిన మహాశ్వేత అను నవలను ప్రకటించారు. శబ్దరత్నాకరం రచించిన బహుజనపల్లి సీతారామాచార్యులు గారు గూడా ఆ వైజయంతి పత్రికలో వ్యాసాలు వ్రాసేవారు. అనంతాచార్లుగారు మంజువాణీవిజయము అనే నాటకమును రచించి తన పత్రిక వైజయంతిలో ప్రచురించారు. ఆ వైజయంతి పత్రికలో అనేక గొప్ప గొప్ప పూర్వప్రబంధములను ప్రచురించారు అందులో ఎర్రాప్రగడ విరచితమైన నృసింహపురాణము, మాడభూషి వెంకటనరసిహాచారి గారు రచించిన పల్లవీపల్లవోల్లాసమను శకుంతలా పరిణయము (కృష్ణకవిరచించిన) మొదలగునవి ప్రచురించారు. అనంతాచారి గారి చరమదశలో వేటూరి ప్రభాకర శాస్త్రి గారు స్నేహితులైనారు. అనంతాచారిగారిని స్వయంగా ఎరిగి వారిని గూర్చి 5-3-1944 లో ఆంధ్రపత్రికలో వ్యాసము వ్రాశారు.

మరణం
పనప్పాకం అనంతా చార్యులు గారు 28/11/1907 న దివంగతులైనారు

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -12-10-22-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

హాస్యానందం 43- నిరుత్సాహోక్తి

హాస్యానందం

43- నిరుత్సాహోక్తి

కొందరికిఏదీగొప్ప అనిపించదు .వారిని ఏదీ చలింప చేయలేదు .పెద్దనగారి మహోత్కృష్ట పద్యం ‘’అటజనికాంచె భూమి సురుడు ‘’చదివి వినిపిస్తే –స్వారస్యం తెలియనివాడు ‘’ఆ ఏముందయ్యా అందులో .ప్రవరుడు హిమాలయం వెళ్ళాడు .అక్కడ ఏం చూశాడో అంతా సంస్కృతంలో ఓజో భూయిష్టంగా చెప్పాడు .భాష నీ చేతుల్లో ఉంటె అంతకంటే దానబ్బలాంటి పద్యం నువ్వూ రాస్తావు .అక్కడ కొండల్ని చూట్టమూ గొప్పేనా ?మా అమ్మాయి కొండపల్లి కొండలు చూసింది .పర్వత సానువుల్లో ఏనుగుల్ని చూశాట్ట .ఓరి వీడిల్లు బంగారంకానూ !మహారణ్యంలో ఏనుగుల్ని కాక పీనుగుల్ని చూస్తాడా ?’’అన్నాడు .ఇదే నిరుత్సాహోక్తి అన్నారుమునిమానిక్యం మాస్టారు

  టెన్సింగ్ నార్కే ఎవరెస్ట్ శిఖరం ఎక్కాడని అందరూ గర్వంగా చెప్పుకొంటూ ఉంటె ఒక నీరసంగాడు ‘’పర్వతం ఎక్కాడా ?ఆ జాతి వాళ్ళ పనే అది రోజూ ..అలవాటుంటే మనం గోడలూ చెట్లూ ఎక్కటం లేదా ?మనిషి అన్నాక ఏదో ఒకటి ఎక్కుతూ ఉంటాడు  ,పడుతూ ఉంటాడు. ఇంతోటిదానికి తాషా మర్బా  మోత ఎందుకంట ‘’అన్నాడు .అంతటితో ఆగకుండా ‘’మళ్ళీ దిగాడా లేదా ?అయినా ఎక్కినవాడు దిగకేం చేస్తాడు .అక్కడ బువ్వ ఎవరు పెడతాడు?.అయినా దిగేవాడు అసలు ఎక్కటం ఎందు కంటా.దీనికి మనం అర్రులు చాచి చంకలు కొట్టుకోనక్కర్లేదు ‘’అన్నాడు .

 అలాంటి వాడితోనే మునిమానిక్యంగారు ఒకసారి ‘’చూశారా బాబుగారూ!మనవాడు వర్తకం మొదలెట్టి ఏడాది తిరక్కుండానే లకారాధిపతి అయ్యాడు .’’అన్నారు మహోత్సాహంగా అభినందిస్తూ వాళ్ళబ్బాయిని  .ఆ మేళానికిఇదేమీ కిక్ ఇవ్వలేదు .చప్పరించి ఇదోన్యూసా  అనుకోని ‘’వాడి జాతకం అలా౦టిదయ్యా శుక్రమహర్దశ నడుస్తోంది. లగ్నాన్ని బుధుడు చూస్తున్నాడు శుభగ్రహాలన్నీ బాగా నిక్కినిక్కి చూస్తుంటే అంతే.,శని ఉచ్చ దశలో వుండి ముడ్డిమీద తంతుంటే వాడు సంపాదిస్తాడా వాడి తలలో జేజమ్మ సంపాదిస్తుందా ?గ్రహబలమయ్యా అంతాగ్రహబలం ‘’అన్నాడు .

ఇలా ఏ విషయాన్నైనా లైట్ తీసుకొని ,చెప్పేవాడికి నీరసం పుట్టిస్తారు . ఇవే నిరసోక్తులు అంటే అని ఫినిషింగ్ టచ్ ఇచ్చారు గురూజీ .

  మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -11-10-22-ఉయ్యూరు 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

వసు చరిత్ర.2వ భాగం.11.10.22.

వసు చరిత్ర.2వ భాగం.11.10.22.

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | 1 Comment