భారతీ నిరుక్తి .20వ భాగం.25.7.22

భారతీ నిరుక్తి .20వ భాగం.25.7.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారి నా జీవిత కథ.17వ భాగం.24.7.22

శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారి నా జీవిత కథ.17వ భాగం.24.7.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

భారతీ నిరుక్తి .19వభవం.24..7.22

భారతీ నిరుక్తి .19వభవం.24..7.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారి నా జీవిత కథ.16వ భాగం.23.7.22

శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారి నా జీవిత కథ.16వ భాగం.23.7.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-15

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-15

  బ్రిటిషర్లు స్వార్ధం కోసమే ఇండియన్స్ ను గుప్పితో పెట్టుకొంటున్నారనీ ,కనుక ప్రజాఉద్యమం ,ప్రత్యక్షచర్య ,తిరుగుబాటు చివరికి హింస,బలప్రయోగం  ద్వారానైనా దేశానికి విముక్తి కలిగించాలని  యువత భావించింది .కాంగ్రెస్ లోని మితవాదులు పిరికి సన్నాసులని,దేశాన్ని ఐరోపా సంస్కృతిలోకి నెట్టి ,కాళ్ళబేరానికి వస్తున్నారని  ఆక్షేపించారు .మంగళ పాండే రాసిన ‘దిబ్రేకప్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా ‘’ఈ ఉగ్రవాదులకు వేదం అయింది .కాంగ్రెస్ ఇలాంటిది జరుగుతుందని ఊహించలేదు .దక్షిణాఫ్రికా విజయం తర్వాత గాంధీ ఈ సభలో పాల్గొన్నాడు .తిలక్ ,మోతీలాల్ లను మొదటి సారి కలిసి మాట్లాడాడు .తిలక్ తో ప్రత్యేకంగా వేరే గదిలో మాట్లాడాడు .తన ఆత్మకధలో గాంధీ ‘’ఆ నాడు నన్ను కలిసిన చాలామందిలో ఇవాల్టికీ గుర్తున్నవాడు మోతీలాల్ ఘోష్ ఒక్కరే .పాలక బ్రిటిషర్లపై నిప్పులు కక్కుతూ మాట్లాడారు ‘’అని రాశాడు .గాంధీ తీర్మానం చర్చలేకుండానే ఆమోదించారు .దీనిపై కూడా గాంధీ ‘తీర్మానం లో ఏముందో ఎవరికీ దృష్టి లేదు .ఎప్పుడు బయటికి పోదామా అనే ధ్యాసతప్ప ‘’అని బాధతో రాశాడు .మూడురోజుల కాంగ్రెస్ మేలా అలా ముగిసింది .1915లో కలకత్తాలో గాంధీ దక్షిణాఫ్రికాలో సేవ చేసినందుకు జరిగిన అభినందన సభకు మోతీలాల్ అధ్యక్షుడు .గాంధీని అభినందించాడు మోతీలాల్ అక్కడ చేసిన సేవకూ ఇక్కడ చేస్తున్నదానికీ .గాంధీ మితవాది లాల్ అతివాది అవటం తో ఇద్దరిమధ్య సరైన సమావేశం జరగలేదు .

 రాష్ట్రాల పునర్విభజనకు తుది మెరుగులు దిద్దిన వాడు జే హెచ్ గ్రూప్ ఫీల్డ్ .స్లేవ్ రాసిన ‘’యూనిట్స్ ఆఫ్ 1904’’లో ‘’కొత్త తూర్పు రాష్ట్రాల్లో ముస్లిం లకు ,పశ్చిమ రాష్ట్రాలలో బీహారీ ఒరియావారికి మెజార్టీ స్థానాలు ఇవ్వటం జాతీయ దృక్పధాన్ని చీల్చే ప్రయత్నమే ,బెంగాల్ లో భద్రలోక్ రాజకీయ ప్రభావం కట్టడి చేయటమే .ఈ బిల్లు చట్టం కాకుండా సురేంద్ర నాద విశ్వ ప్రయత్నం చేసినా ,ఫలించలేదు .ఉగ్రవాదులు ‘’భారతీయ వాదం అనే కొత్త ప్రతిపాదనలతో ముందుకు దూకుతున్నారు .భారత దేశాన్ని మాతృభూమిగా భావిస్తూ కదం తొక్కారు .భారతీయ సాంస్కృతిక విలువలను అనుసరిస్తూ ,పాశ్చాత్య విలువలను త్యజించాలని వీరి నినాదం .బ్రిటిష్ వస్తువులు వదిలేసి భారతీయ వస్తువులు వాడుతూ ,శాంతియుత ప్రతిఘటన ఇవ్వాలని కొత్త జాతీయ దృక్పధాన్ని మోతీలాల్ బిపిన్ చంద్రపాల్ ,అశ్విని కుమార్ దత్త ,అరవింద ఘోష్ ప్రతిపాదించారు .పంజాబ్ లో లాలా లజపతిరాయ్ ,మహా రాష్ట్రలో బాలగంగాధర తిలక్ ,మద్రాస్ లో చిదంబరం పిళ్ళై ,సుబ్రహ్మణ్య   భారతి నీలాకంఠ బ్రహ్మ చారి బలపరచారు .దీనికి తాత్విక ప్రాతిపదికను రవీంద్ర నాథ టాగూర్ కల్పించాడు .1907లో అరవిందుడు ‘’జాతి జీవనం లోని అన్నిశాఖలను ముందుకు నడిపించటానికి ఒక కేంద్ర సాధికార సంస్థతోపాటు విదేశీ ఆధిపత్యాన్నిఒక్క సారిగా కాకపోయినా , క్రమేణా తొలగించటానికి  మనం ఆత్మ రక్షణ యుద్ధం ప్రారంభించాలి .ఒక జాతిగా ఇదే మన తక్షణ కర్తవ్య౦ తప్ప మేధావులుగా విజ్ఞానఖనులుగా సంపన్నులుగా ఎలా ఎదగాలన్నవి కాదు .జాతికి అనివార్యమైన మృత్యు మేఘాలను తొలగించాలి .మన మనో ధైర్య స్తై  ర్యాలను ఎలా పెంచుకోవాలన్నది ఆలోచన చేయాలి .శాంతియుతంగా చట్టం ,పాలనా యంత్రా౦గాన్నీ   ఉల్లంఘిస్తాం .చట్టపరమైన శిక్షలను శిరసావహిస్తాం ‘’అన్నాడు .దీని తర్వాత 15ఏళ్ళకు గాందెయ ఉద్యమం ప్రారంభమవటానికి ఇదే పునాది నాంది మార్గదర్శకం కూడా .’’ఆత్మ రక్షణ కోసం ప్రతి ఘటన ‘’అనటంలో విప్లవోద్యమం అనే మాట అంతర్గతంగా ఉంది .దుష్ట శిక్షణకు అది మన పవిత్రమార్గం గా గుర్తింపు పొందింది .

  రాష్ట్రాల పునర్విభజన జరిగినా ఆరేళ్ళ తర్వాత అది అపరిష్క్రుతంగానే ఉండిపోయింది .మళ్ళీ సంయుక్త బెంగాల్ ఏర్పడింది .ఉగ్రవాద విదానాను హిందూ సంపన్నులు బలపరుస్తుంటే ముస్లిం లు వ్యతిరేకిస్తున్నారు .దీన్ని ఆయుధంగా తీసుకొని బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్ గ్రామీణ పేద ముస్లిం లను హిందువులకు వ్యతిరేకంగా ఉద్యమానికి సిద్ధం చేసింది .అయితే అశ్వినీ కుమార దత్తా ప్రాతినిధ్యం వహించిన బరిసాల్ జిల్లాలో  బహిష్కరణ ఉద్యమం ప్రశాంతంగా కలహాలు లేకుండా సాగింది .బ్రిటిష్ రాజధాని కలకత్తా నుంచి ఢిల్లీ కి మారింది .ఆలీ గడ్ ఆంగ్లో –ముస్లిం కాలేజి రూపం లో  సయ్యద్ మొహమ్మద్ మొలకెత్తించిన  వేర్పాటు  వాదం ను బెక్, మొరిసన్ ,ఆర్చిబోల్ద్ లు తీవ్రతరం చేశారు .కాంగ్రెస్ ముస్లిం లను గుర్తించటం లేదనేభావం యువకులలో రేకెత్తించారు .కాంగ్రెస్ సంపన్న ముస్లిం లకే  కొమ్ము కాస్తోందని ప్రచారం చేశారు .కర్జన్ కాలం లోసాగిన ఈ హిందూ ముస్లిం భేదాలను మింటో పెంచాడు .1906 సంపన్న ముస్లిం వర్గం ‘’ముస్లిం లీగ్ ‘’గా మారింది దీనిపై మోతీలాల్ ‘’ఇదంతా అధికారుల కను సన్నలలో జరిగిందే .ముస్లిం లీగ్ కు జాతీయ స్థాయి లేదు .అందులో అంతా ముస్లిం లు కూడా కాదు .ప్రభుత్వ తప్పిదాలను కప్పి పుచ్చుకోవటానికి వీరిని పావులుగా వాడింది ప్రభుత్వం ‘అని వ్యాఖ్యానించాడు .

తూర్పు బెంగాల్ కొత్త లెఫ్టినెంట్ గవర్నర్ ఫీల్డ్ పుల్లెర్ కూడా హిందువులపై మహమ్మదీయ దోర్జన్య కాండను,అల్లర్లను  ప్రోత్సహించాడు.అతడి అతి ప్రవర్తనకు చివరికి రాజీనామా చేయాల్సి వచ్చింది .అప్పటికే జాతీయవాదులలోని ఉగ్రవాద వర్గం అజ్ఞాత విప్లవ సంఘాలు స్థాపించి బలపడింది .బెదిరిన ప్రభుత్వం ఒక చిట్కా ప్రయోగించి కొన్ని సంస్కరణలు చేసింది .ముస్లిం లను వేరే వోటర్లుగా ,భూస్వాములకు విడిగా ప్రాతినిధ్యం కల్పించటం జరిగింది .ఇతర స్థానాలకు పరోక్ష ఎన్నికలు జరుపుతారు .ఇది అన్యాయం అని ఆతర్వాత గుర్తించి  రూపొందించిన మింటో మార్లేలే తల బాదుకొన్నారు  .కానీ ‘’భారతీయులనుంచి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని రక్షించుకోవాలికనుక ఇందుకోసం చేసేదేదీ అక్రమం కాదు ‘’అని నోరు మూసుకొన్నారు .ఇదే సామ్రాజ్య వినాశానికి దారి చూపింది .

  1906లో కాంగ్రెస్ లోని అతివాద మితవాదులమధ్య భేదాలు తీవ్రస్థాయికి చేరాయి .అధ్యక్షుడు దాదాభాయ్ కొంత నివారించాడు .ఇంగ్లాండ్ లాగా భారతీయులకు స్వయం పాలనకల డామియన్ లు కావాలని చెప్పాడు .సదస్సు తర్వాత వైస్రాయి ని కలవకుండా కాంగ్రెస్ లో ఘర్షణ నివారించాడు .అనివార్యమైన ఈ ఘర్షణ సూరత్ కాంగ్రెస్ లో బయటపడింది .రాస్ బిహారీ ఘోష్ ను మితవాదులు అధ్యక్షస్థానానికి పోటీ చేయిస్తే ,అతివాదులు తిలక్ కాని లజపతిరాయ్ కానీ ఉండాలని అన్నారు .తిలక్ పేరును చైర్మన్ తిరస్కరించగా ,అప్పుడే తిలక్ వేదికపైకి వెడుతుంటే ఆయనపై ఒక చెప్పు విసిరేయబడటం తో గలాభా జరిగి  అర్ధాంతర౦ గా  సభ ముగించారు .ఆ చెప్పు సురెంద్రనాద్ కు తగిలింది .అతివాద మితవాదులమధ్య సయోధ్య కుదర్చటానికి మర్నాడు సభజరిగి, మోతీలాల్ ప్రయత్నించాడు .సభలో ఎవరు ఎవర్ని బహిష్కరించారో తెలీడదుకాని 1908లో కలకత్తాలో మోతీలాల్ ఇంట్లో అతివాదులు సమావేశం జరిపి కాంగ్రెస్ లో తాము ఎందుకు చేరటం లేదో ఒక మాని ఫెష్టో ప్రకటించారు .1916లోకానీ వీరు కాంగ్రెస్ లో మళ్ళీ చేరలేదు .

   సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -23-7-22-ఉయ్యూరు  

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

భారతీ నిరుక్తి .18వ భాగం.23.7.22

భారతీ నిరుక్తి .18వ భాగం.23.7.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -306 • 306-నేపధ్యగాయకుడు సంగీతదర్శకుడు ,ప్రపంచ వ్యాప్తంగా 6వేలకచేరీలు నిర్వహించిన ‘’స్వరమాధురి ‘స్థాపకుడు –జి ఆనంద్

 మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -306

· 306- నేపధ్యగాయకుడు సంగీతదర్శకుడు ,ప్రపంచ వ్యాప్తంగా 6వేలకచేరీలు నిర్వహించిన ‘’స్వరమాధురి ‘స్థాపకుడు –జి ఆనంద్

· జి. ఆనంద్ తెలుగు నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు. అతను నవతరం స్వర మాధురి సంస్థతో వర్ధమాన, ఔత్సాహిక గాయనీ, గాయకులకు ప్రదర్శనావకాశాలు కల్పించాడు. ప్రపంచ వ్యాప్తంగా 6,500 పైగా కచేరీలు నిర్వహించాడు[1].

జీవిత విశేషాలు
అతను శ్రీకాకుళం జిల్లాకు చెందినవాడు. అతని పూర్తిపేరు గేదెల ఆనందరావు. అతని పుట్టినజిల్లా పట్ల ప్రేమతో జిల్లాలో జరిగిన అనేక సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతూ ఉంటాడు. అతను అమెరికాలో 14 ప్రదర్శనలు ఇచ్చాడు. సుమారు 2,500 పాటలు పాడాడు. 150 ఆల్బమ్‌సు చేసాడు . సినిమా అవకాశాలు లేకపోయిన సందర్భంలో కూడా డబ్బింగు ఆర్టిస్టు గాను, అనేక టి.వి. సీరియల్స్ లో సంగీత దర్శకుడుగా రాణించాడు.

పండంటి కాపురం సినీమాతో గాయకుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆనంద్ సంగీత దర్శకుడు కుడా . స్వరమాధురిఫౌండేషన్ వ్యవస్థాపకుడైన ఆయన ఎంతో మందిని సినీ, దూరదర్శన్ రంగాలకు పరిచయం చేశాడు. అతను తన తొలి పాట “ఎన్నియల్లో.. ఎన్నీయల్లో.. ఎందాకా..” ను చిరంజీవి నటించిన సినిమాకే పాడాడు[2].

షిరిడి సాయిబాబా, తిరుపతి బాలాజీ, విష్ణుపురాణం, గాంధర్వ మాలతీయం వంటి సీరియల్ కి సంగీతం అందించారు. ఎన్నో భక్తి పాటల అల్బుమ్స్ చేసాడు.

సినిమాలు
· 1972 : పండంటి కాపురం (గాయకుడు: మొదటి పాట – కోరస్)

· ‍1976 : అమెరికా అమ్మాయి (గాయకుడు: ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక)

· 1977 : ఆమె కథ

· 1977 : కల్పన (గాయకుడు: దిక్కులు చూడకు రామయ్య పక్కనె ఉన్నది సీతమ్మ)

· 1977 : దాన వీర శూర కర్ణ (గాయకుడు)

· 1977 : చక్రధారి (గాయకుడు: విఠలా విఠలా పాండురంగ విఠలా)

· 1977 : బంగారక్క (గాయకుడు: దూరానా దూరానా తారాదీపం)

· 1978 : మన ఊరి పాండవులు (గాయకుడు: నల్లా నల్లని)

· 1978 : ప్రాణం ఖరీదు

· 1979 : తాయారమ్మ బంగారయ్య (1979)

· 1987 : గాంధీనగర్ రెండవ వీధి (సంగీత దర్శకుడు)

· 1987 : స్వతంత్రానికి ఊపిరి పోయండి (సంగీత దర్శకుడు)

· 1990 : రంగవల్లి (సంగీత దర్శకుడు)

ఖ్యాతి తెచ్చిన పాటలు
· ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక, (అమెరికా అమ్మాయి).

· దిక్కులు చూడకు రామయ్య పక్కనె ఉన్నది సీతమ్మ, (కల్పన).

· విఠలా విఠలా పాండురంగ విఠలా, (చక్రధారి)

· దూరానా దూరానా తారాదీపం, (బంగారక్క)

మరణం
జి. ఆనంద్ కొద్ది రోజులుగా కరోనాతో బాధపడుతుతూ సకాలంలో ఆక్సిజన్ అందక 2021 మే 6న మృతి చెందాడు.[3]

సుమారు పాతికేళ్ళ క్రితం బెజవాడ లో ఘంటసాల స్వర సప్తాహం తుమ్మలపల్లి కళా క్షేత్రం లో జరిగినప్పుడు బాలు పాల్గొన్న రోజున ఆనంద్ ,ఘంటసాల గారబ్బాయి విజయకుమార్ ,ఘంటసాలశిష్యుడు ఆయన విగ్రహస్థాపకుడు గంగాధరరావు ,లతో పాటు ఆనంద్ కూడా వచ్చి పాడాడు .అప్పుడే అతనిని చూడటం .
· సశేషం

· మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -22-7-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -307· 307-తొలితరం రంగస్థల ,సినీ నటి ,గాయని వాలు మొగ్గ భంగిమలోనోటితో రూపాయిబిళ్ళ ,పంటితో సూది తీయగల అపూర్వ నర్తకి ,మాలపిల్ల హీరోయిన్ ,దశావతారాలలో నాలుగు వేషాలు వేసి,’’అత్తా ఒకింటి కోడలు ‘’లో అత్తనే భయపెట్టిన గడసరి ‘’అత్తత్త’’ –లక్ష్మీకాంతం

· మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -307

· 307-తొలితరం రంగస్థల ,సినీ నటి ,గాయని వాలు మొగ్గ భంగిమలో నోటితో రూపాయిబిళ్ళ ,పంటితో సూది తీయగల అపూర్వ నర్తకి ,మాలపిల్ల హీరోయిన్ ,దశావ తారాలలో నాలుగు వేషాలు వేసి,’’అత్తా ఒకింటి కోడలు ‘’లో అత్తనే భయపెట్టిన గడసరి ‘’అత్తత్త’’ –లక్ష్మీ కాంతం

· పువ్వుల లక్ష్మీకాంతమ్మ (మ. ఆగష్టు 3, 2008) తొలితరం సినిమా నటి, గాయని, నర్తకీమణి, రంగస్థల నటి. మాలపిల్లలో కథానాయకిగా ప్రసిద్ధి చెందారు. జీవితాంతం అవివాహిత గానే ఉన్న లక్ష్మీకాంతమ్మ దాదాపు 200 చిత్రాల్లో నటించారు.

బాల్యం
లక్ష్మీకాంతమ్మ, పశ్చిమగోదావరి జిల్లా, పెంటపాడులో నారాయణమ్మ, సింహాచలం దంపతులకు జన్మించారు. ఆ ఊరిలోగల వేణుగోపాలస్వామి ఆలయ ఉత్సవాల్లో వీరి కుటుంబ సభ్యులు నృత్య ప్రదర్శనలివ్వడం ఆనవాయితీగా వస్తుండేది. ప్రతి కార్యక్రమానికి ఈమె తండ్రి పువ్వుల సింహాచలం మృదంగం వాయించేవారు. నాయనమ్మ మాణిక్యం, మేనత్త సరస్వతి స్ఫూర్తితో నాట్యం నేర్చుకుని ప్రదర్శనలిస్తుండేది. కందికట్టు మాణిక్యం, జనాబ్‌యూసఫ్‌, చదలవాడ సామ్రాజ్యం వంటి గురువుల దగ్గర సంప్రదాయ నృత్య విధానాలే గాకుండా ఆధ్యాత్మిక రామాయణ కీర్తనల అభినయం వంటి ప్రక్రియలు నేర్చుకున్నారు. వాలుమొగ్గ భంగిమలో నోటితో రూపాయిబిళ్ళ, పంటితో సూదితీయగల ఆమె నాట్యకౌశల్యం గురించి పలు ప్రాంతాల్లో చెప్పుకునేవారు. విజయనగరం, బందరు, గుంటూరు, గుంతకల్లు, రాజమండ్రి వంటి నగరాల్లో ఈమె ప్రదర్శనకు గుర్తింపు, ప్రేక్షకుల ఆదరణ పుష్కలంగా ఉండేది.[1]

రంగస్థలంపై
1933 నుంచి రంగస్థల నటిగా మారిన లక్ష్మీకాంతమ్మ పాటలు, పద్యాలు స్వయంగా పాడుకుంటూ సక్కుబాయి, రంగూన్‌రౌడీ, వరవిక్రయం, తెలుగుతల్లి, హరిశ్చంద్ర, చింతామణి, గయోపాఖ్యానం, త్యాగరాజు, సావిత్రి, తులాభారం, రామదాసు, సారంగధర, కమ్మరిమొల్ల, శాంతినివాసం, మల్లమ్మ వంటి నాటకాలలో విభిన్న పాత్రలు పోషించి ఎంతో పేరుగడించారు. దొమ్మేటి సూర్యనారాయణ, బందా కనకలింగేశ్వరరావు, బళ్ళారి రాఘవ, పసల సూర్యచంద్రరావు, స్థానం నరసింహారావు, పి.సూరిబాబు, కన్నాంబ, రాజేశ్వరి వంటి మేటి నటులతో కలిసి నాటి రంగస్థల ప్రియులను అలరించారు. లక్ష్మీకాంతమ్మ తానే స్వయంగా శ్రీలక్ష్మీ కళాసమితి అనే నాటక సంస్థను స్థాపించి శ్రీకృష్ణతులాభారం, సక్కుబాయి, ఇదా ప్రపంచం, చంద్రగుప్త, విప్రనారాయణ, హరిశ్చంద్ర లాంటి నాటకాలు అనేక ప్రాంతాల్లో ప్రదర్శించారు.

సినీ రంగంలో
లక్ష్మీకాంతమ్మకు వేమూరి గగ్గయ్య ద్వారా 1936లో చిత్రపు నరసింహారావు దర్శకత్వంలో ‘సతీతులసి’ సినిమాలో నటించే అవకాశం లభించింది. తర్వాత సారథీ ఫిలింస్‌ వారి మాలపిల్ల, కొచ్చర్లకోట రంగారావు దర్శకత్వంలో ‘హరవిలాసం’ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. 1937లో పూర్ణా కామరాజు నిర్మించిన ‘దశావతారం’ సినిమాలో ఈమె భూదేవి, రేణుకాదేవి, కైకేయి, గోపికగా నాలుగు పాత్రలలో నటించి రికార్డు సృష్టించింది. రెండవ ప్రపంచ యుద్ధం కాలంలో మద్రాసు విడిచిపెట్టి ఏలూరు తిరిగి వచ్చి, మళ్ళీ రంగస్థల నటిగా అనేక నాటకాలలో నటించింది.

1958లో హాస్యనటుడు రమణారెడ్డి లక్ష్మీకాంతమ్మను మద్రాసు రప్పించి నిర్మాత, దర్శకుడు కె.బి.తిలక్‌కు పరిచయం చేసి, అత్తా ఒకింటి కోడలే సినిమాలో హేమలత అత్తపాత్రకు రికమెండ్‌ చేశాడు. వయసుమళ్ళిన ప్రధాన పాత్రను ఈమె చేయగలదా? అని తిలక్‌ మొదట సందేహించాడు. ఫస్ట్‌షాట్‌ తర్వాత ఆమె నటనకు అబ్బురపడి తన ప్రతి సినిమాలో అవకాశమిస్తానని మాట ఇచ్చి ఉయ్యాల జంపాల, ఈడుజోడు చిత్రాలలో కూడా నటింపజేశాడు. సినీ నటిగా లక్ష్మీకాంతమ్మ, మాఇంటి మహాలక్ష్మి, దొంగల్లో దొర, అదృష్టజాతకుడు, సమాజంలో స్త్రీ, భక్తపోతన, ఉమ్మడి కుటుంబం, మనుషులు- మట్టిబొమ్మలు, బాలరాజు కథ లాంటి 200 సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించింది.

మూగమనసులు సినిమా ప్రారంభ సన్నివేశాలలో అక్కినేని, జమున పాత్రల మధ్య కామెడీ సృష్టించిన అవ్వపాత్రను ప్రేక్షకులు ఎన్నటికీ మర్చిపోరు. జ్వాలాద్వీపరహస్యం చిత్రంలో మంత్రగత్తెపాత్ర, అత్తాఒకింటి కోడలే చిత్రంలో హేమలత అత్తగా బుద్ధిచెప్పేపాత్ర ఈమెకు నటిగా ఎంతో పేరు తెచ్చిపెట్టింది.

మరణం
వయసుమీదపడి 93వ సంవత్సరం ప్రవేశించినా తన అనుభవాలతో ఔత్సాహిక నటీనటులను ప్రోత్సహిస్తూ కృష్ణా జిల్లా, కైకలూరులో వృద్ధాప్య పింఛను, నటరాజ రామకృష్ణ లాంటి దాతల ఆర్థిక సహాయంతో కాలం గడుపుతూ ఆగష్టు 3, 2008లో మృతి చెందింది.

· సశేషం

· మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -23-7-22-ఉయ్యూరు

image.png

Posted in సినిమా | Tagged | Leave a comment

శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారి నా జీవిత కథ.15వ భాగం.22.7.22

శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారి నా జీవిత కథ.15వ భాగం.22.7.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-14

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-14

ప్రభుత్వ అణచివేతపై స్పందిస్తూ శిశిర్ కుమార్ ‘’ఇది దివ్యౌషధం .మంచిమార్పుకు ఆయుధం  .ఇంగ్లాండ్ లో గొప్ప విప్లవాలు తెచ్చింది అణచివేతలే ‘అని రాశాడు .1898లో వచ్చిన మున్సిపల్ బిల్లుపై వచ్చిన ఆందోళనలు మోతీలాల్ ను బాగా ఆకర్షించాయి లార్డ్ కర్జన్ బ్రిటిష్ ప్రయోజనాలను బుజానకెత్తుకోవటం సహించలేకపోయాడు .ప్రజా వెల్లువతొఅనెక బహిరంగ సభలు జరిగాయి.ఒక సభకు అధ్యక్షత వహించాడు .కలకత్తా పన్ను చెల్లించే వారిని ఉద్దేశిస్తూ పత్రికలో ‘’ప్రజలు నిర్ద్వంద్వంగా బిల్లును వ్యతిరేకించాలి ఖండించాలి .ఆ బిల్లు వద్దని సభ్యపదజాలంతో పాలకులకు తెలియజేయాలి .ప్రభుత్వం వినకపోతేప్రహసనం గా మారిన ఎన్నికల వ్యవస్థ రద్దు చేసి ,కలకత్తా మునిసిపల్ విభాగాన్ని ప్రభుత్వ విభాగంగా మార్చమని కోరాలి ‘’అని రాశాడు .ప్రభుత్వ మొండితనంతో బిల్లు చట్టమైంది .ఆతర్వాత స్వయం ప్రతిపత్తికల కార్పోరేషన్ కావటానికి 24ఏళ్ళు పట్టింది .డాకా మున్సిపాలిటి నుంచి విధాన పరిషత్తుకు ప్రతినిధిని ఎన్నుకొనే పధ్ధతి రద్దు చేయటం తో మరో వివాదం చెలరేగింది .ఈ విషయంలోనూ మోతీలాల్ సురెంద్రనాద్ ల మధ్య భేదాలేర్పడ్డాయి .మోతీలాల్ వ్యతిరెకిస్తెఆయన బలపరచాడు .పరస్పరారోపణలు వ్యక్తిగాతదూషణలుపెరిగాయి .ఈ అవాంచనీయ జర్నలిజం కొంతకాలం సాగింది .పరువు నష్టం దావా వేస్తానని మోతీలాల్ కు నోటీస్ పంపాడు .దీనపై పత్రికలో ‘’గాజు ఇంట్లో ఉంటూ అవతలవారిపై రాళ్ళు విసిరితే ఏమి జరుగుతుందో ఆపెద్దమనిషికి తెలీదా ? ఎవరు తవ్వుకొన్న గోతిలో వారే పడతారు అన్న సామెత గుర్తు౦చు కోవాలి ఆయన ‘’అని రాశాడు  .ఇద్దరి అనుయాయులు పరిష్కారానికి తీవ్ర ప్రయత్నం చేసి,సాధించి ఒక ప్రకటన తో సమాప్తి చేయించారు .కర్జన్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడటానికి వారి సఖ్యత ఒక రాజ మార్గమైంది .

  జన జాగృతికి కారణమైన కర్జన్

  1899లో వచ్చిన కర్జన్ 1905 లో  వెళ్లి పోయేముందు బ్రిటిష్ సామ్రాజ్యం బీటలు వారింది .బ్రిటిష్ జాతి అత్యున్నతజాతి అని ఆయన నరనరానా భావించి అహంతో ప్రవర్తించిన ఫలితమే ఈబీటలు .’’ఇండియాను వదులుకుంటే బ్రిటన్ మూడవ ప్రపంచ దేశంగా ఆధః పాతాళం లో పడిపోతుంది ‘’అనేవాడు .అందుకే ఉక్కు పిడికిలి లో బిగించాలని అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు .భారతీయులను ,విద్యాధికులను అర్ధం చేసుకోలేక పోయాడు .పాలనలో భారతీయ భాగం తగ్గించటానికి తీవ్రయత్నాలు చేశాడు .అతడి నిష్క్రమణ ను వివరిస్తూ మోతీలాల్ ‘’కర్జన్ యువకుడు డాబు దర్పం ఉన్నవాడు .శిక్షణ లేకుండా అధికారానికి వచ్చాడు .మన దేశం పై ముసరిన పెద్ద మేఘం అతడు .రాకెట్ లా పైకి లేచి మిణుగురులా కూలిపోయాడు ‘’అని సార్ధకమైన వ్యాసం రాశాడు .

  కలకత్తా మున్సిపాలిటీ పనిపట్టి విశ్వవిద్యాలయం లో కూడా రాజకీయ జోక్యం పెంచాడు కర్జన్ .విద్యావ్యవస్థలోకూడా జాతీయ వాదం లేకుండా చేయటానికి  విశ్వ ప్రయత్నం చేశాడు .అమృతబజార్ పత్రిక మొదలైనవి ఆయన చర్యలపై ఘాటైన విమర్శలు చేశాయి .మోతీలాల్ ఆయన్ను కలుసుకోవటానికి వెడితే మొహం చూపించని అహంకారి .ఇద్దరూ వేర్వేరు గదులలో కూర్చుని చీటీలద్వారా స౦భాషణ జరిపారు  .కర్జన్  ప్రైవేట్ సెక్రెటరి  ఆసులో గొట్టం లా అటూ ఇటూ తిరుగుతూ ఈ’’ చీటీ రాయబారం చేశాడు .ఈ సంఘటనపై మోతీలాల్ ‘’ప్రభువుగారు నాలాంటి సామాన్యులతో చర్చించటం న్యూనత గా భావించిన ఉన్నతులు ‘’అని రాశాడు .1902కలకత్తా యూని వర్సిటి కాన్వో కేషన్ లో కర్జన్ చాన్సలర్ హోదాలో ‘జాతీయ పత్రికలు  చెప్పేది నమ్మవద్దు ‘’అని హితవు చెప్పాడు .దీనికి దీటుగా మోతీలాల్ పత్రికలో ‘’ఒక వైస్రాయి చేయతగినవీ చేయతగనివీ ఏమిటి ‘’?అనే శీర్షికలో ‘’ ఎడ్వర్డ్ చక్రవర్తి ప్రతినిధిగా వైస్రాయి కర్జన్ కు నాలుగు కళ్ళు రెండు ముందు,రెండు వెనక  ఉండాలి .వైస్రాయి ఎంతై వాడైనా కళ్ళజోడు వాడకూడదు .పచ్చకామెర్ల జబ్బు ఉంటె నయం చేసుకోవాలి. అసలు ఆజబ్బున్నవాడు సింహాసనానికి పనికి రాడు.ప్రత్యర్ధి విమర్శను హత్యగా భావి౦చ రాదు .విమర్శలను సంతోషంగా స్వీకరించే లక్షణం అవసరం ‘’అని రాశాడు .ఈ విమర్శ అతడికి చేరినా తెలు కుట్టిన దొంగ లా మిన్నకున్నాడు.బ్రిటిష్ రాజ్యం పతనావస్థలో ఉందని తెలిసి కాపాడుకొనే ప్రయత్నం లో మునిగిపోయాడు .1905లో కలకత్తా విశ్వ విద్యాలయ స్నాతకోత్సవం లో కర్జన్ ‘’ప్రపంచం లో సమున్నత సత్య  సంధత ప్రాచ్య దేశాలకంటే పాశ్చాత్య దేశాల్లోనే ఎక్కువగా ఉంది  .పొగడ్త సత్య దూరం కారాదు ‘’అని భారతీయతను ఎద్దేవా చేస్తున్నట్లుమాట్లాడాడు .దీనితో తీవ్ర ఆందోళనలు చేశారు జనం . ‘’ప్రాక్ ప్రపంచపు సమస్యలు ‘’అనే కర్జన్ రాసిన గ్రంథం లో కొరియా బాయబారిగా ఉండటానికి తాను  ఆడిన ఒక అబద్ధాన్ని కర్జన్  తన నోటి తోనే చెప్పిన ఉదంతాన్ని పేర్కొని మోతీలాల్ ఎద్దేవా చేశాడు  రెండవ ముద్రణలో కర్జన్ ఆభాగాన్ని తీసేయించి జాగ్రత్త పడ్డాడు కర్జన్ . కర్జన్ ఆడిన అతిపెద్ద అబద్ధాన్ని బట్ట బయలు చేసినందుకు మొతీలాల్ ను ,  అమృత బజార్ పత్రికను దేశ విదేశాల పత్రికలన్నీ శ్లాఘించాయి భారత పత్రికలూ ఉబ్బి తబ్బిబ్బే అయ్యాయి .దివీక్లీ టైమ్స్ ‘’పత్రిక దీనిపై స్పందిస్తూ ‘’బహుశా సత్య సందత అనేది   కర్జన్ కు యాన్కీలకు సహజంగా ఉండే సత్య సంధత  ఆయన పెళ్లి చేసుకొన్న అమెరికన్ అమ్మాయి భార్య అయినతర్వాత  వచ్చి ఉంటుంది ‘’అని వ్యంగ్యంగా రాసి చురుక్కుమనిపించింది .బ్రిటిష్ జీవన సరళిని అనుకరిస్తున్న సంపన్నులైన భారతీయులను తేలికగా చిన్న చూపు చూస్తూ ‘’కాంగ్రెస్ పునాదులు కదుల్తున్నాయి.ఇండియాలో ఉండగానే దాని సర్వనాశనం చూడాలని నా ముఖ్య ఆశయం ‘’అన్నాడు 1900లోనే . కానీ కాంగ్రెస్ దినదినాభి వృద్ధి చెంది బ్రిటిష్ పునాదులే కదిలించి మూటా ముల్లె సర్దుకొని పోయేట్లు చేసింది ..సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్-22-7-22-ఉయ్యూరు   .

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

భారతీ నిరుక్తి .17వ భాగం.22.7.22

భారతీ నిరుక్తి .17వ భాగం.22.7.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారి నా జీవిత కథ.14వ భాగం.21.7.22=9

శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారి నా జీవిత కథ.14వ భాగం.21.7.22=9

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-13

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-13

మోతీలాల్ ఘోష్ భారత జాతీయ కాంగ్రెస్ లో చేరాడు .1889లో కాంగ్రెస్ సభలకుఅధ్యక్షత వహించిన సర్ విలియం వెడర్బన్  శాసన పరిషత్తు లో భారతీయులకు ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించటానికి సంస్కరణలు సూచిస్తే ,మోతీలాల్ దానికి ఒక  పధకం ఆలోచించాడు .భారతీయుల లక్ష్యాలను బలపరచే ‘’బ్రిటిష్ పార్లమెంట్ లో భారతీయ సభ్యుడు ‘’అని పిలువ బడే చార్లెస్ బ్రాడ్ లాప్ కూడా హాజరయ్యాడు .అమృతబజార్ పత్రిక ప్రతిపాదనలే బాగా ఉన్నాయనిమెచ్చాడు .కానీ టోరీ పార్టీ వీటిని బలపరచకపోవచ్చు అనీ చెప్పాడు .ఆమోదింపబడిన తర్వాత ప్రోవెంషియల్ కౌన్సిల్స్ లో భారతీయ ప్రాధాన్యం పెరిగింది .

  బ్రిటన్ లో కాంగ్రెస్ లక్ష్యాల సాధనకు కాంగ్రెస్ ఒక కమిటీ ఏర్పాటు చేసింది .ఇందులో రిటైర్ అయిన ప్రభుత్వోద్యోగులు వెడర్ బర్న్,కాటన్ ,కీర్ హార్డీ,రాట్ క్లిఫ్ ,బ్రిటీష్ లేబర్ ప్రధాని కాబోయే మాక్దోనాల్ద్ ,చార్లెస్ బ్రాడ్ లాఫ్ హెచ్ బి రూధర్ ఫర్డ్ లాంటి ఉగ్రవాదులు , నేవింగ్ సన్,విలియం డిగ్ బీ ,స్కేవెన్ బ్లాంట్ మొదలైనవారితో బ్రిటిష్ కమిటీ ఏర్పడింది .1892లో కాంగ్రెస్ నాయకుడు దాదాభాయ్ నౌరోజీ బ్రిటిష్ పార్లమెంట్ కు ఎన్నికవటం ఘనవిజయం .ఇంతకు  మించి ఆ కమిటీ ఏమీ సాధించలేక పోయింది .బ్రిటిష్ పార్లేంట్ లో ఇండియా విషయాలు చర్చిస్తే ,ఆ దేశాన్ని బ్రిటిష్ కోల్పోయినట్లే అనే అభిప్రాయం అక్కడ దిగువ సభలో బలంగా ఉండేది. పైకమిటీకి కాంగ్రెస్ యాభై వేలరూపాయలు వార్షిక గ్రాంట్ మంజూరు చేసింది .అక్కడ ‘ఇండియా ‘అనే పత్రికపెట్టినా ,పొడిచేసిందేమీ  లేదు .ఈవిషయం మొతీలాల్ ముందే చెప్పాడు .ఈ సభలప్పుడే మోతీలాల్ –బ్రాడ్ లాఫ్ సమావేశం జరిగి ఆయన మనసు ఇండియాకు అనుకూలంగా మార్చగలిగాడు మోతీలాల్ .జీవితాంతం భారత్ ను బలపరుస్తూనే ఉన్నాడాయన’

           మలిమార్పు

1891లో పెళ్లి అయిన ఆడపిల్లలకు  దాంపత్య జీవితానికి వయోపరిమితిని 10నుంచి 12 ఏళ్ళకు మార్చటం కోసం చేసిన ప్రతిపాదన తీవ్ర సంచలనం కలిగించింది .అమృతం కూడా సనాతనులతో పాటు నిరసించింది .ప్రజలు కోరితేనే మార్చాలని వీరి అభ్యంతరం .పత్రికను సమర్ధిస్తూ భారీ నిరసనలు సభలు జరిగాయి .అయినా బిల్లు చట్ట౦  అయింది. ప్రజాభిప్రాయాన్ని మన్నించ నందుకు ,ప్రజల నిత్య సమస్యలను చర్చించటానికి ఒక పత్రిక కావాలని అందరూ భావించారు .ఘోష్ సోదరులపై వత్తిడి తెచ్చినా ఆర్ధికంగా దెబ్బ తిన్న కారణంగా సాహసించలేకపోయారు. కానీ ప్రజాభి ప్రాయం బలంగా ఉంది దినపత్రికగా మారకపోతే మాబతుకు బస్ స్టాండ్ అవుతుందని వాపోయారు సోదరులు ఒప్పుకోక తప్పలేదు .ప్రింటింగ్ మెటీరియల్ తగినంతగా లేకపోయినా ధైర్యంగా ముందడుగు వేశారు 19-2-1891అమృత బజార్ ఆంగ్లం లో దినపత్రికగా ప్రత్యక్షమైంది .ప్రజా సంఘటితను రాజకీయ సాంఘిక సంస్కరణలవైపు మళ్ళించితేనే జాతికి ప్రయోజనం అని మోతీలాల్ ఆలోచించాడు. లాల్ ఆలోచన తర్వాతే 1920లో తిలక్, గాంధీ కూడా .రాజకీయ ఉద్యమం లో సంస్కరణల అవసరాన్ని ప్రచారం చేశారు .

   మున్సిపాలిటీ లలో మాత్రమె ప్రాతినిధ్యం కలిగింది. బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కు ప్రతినిధిని పంపే అధికారం 1892చట్టం ప్రకారం కలకత్తా మున్సిపాలిటీకి మాత్రమె ఉంది .మోతీలాల్ మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేయాలనుకోగా పత్రిక  ,ప్రజలు పూర్తిగా మద్దతు ఇచ్చారు .ఉత్తరాకలకత్తా 1వ వార్డు నుంచి ఆయన ఎన్నికల అరంగేట్రం చేశాడు .ప్రత్యర్ధులు చాలాబలమైన సంపన్నులు అక్కడ కాయస్థ కులం వారు ఎక్కువే .’’చేతనైనంత ప్రజా సేవ చేస్తాను ‘అని మాత్రమె ప్రచారం చేసి ఓడిపోయాడు .డబ్బు ,విందు మందు పంచలేదు ,దీనితో ఎన్నికలలో నిలబడకూడదు అనే భావం పెరిగిపోయింది .ఒక కేసులో అప్రతిష్ట పాలైన ఒక స్త్రీకి మోతీలాల్ అండగా నిలిస్తే సురెంద్రనాద్ బెనర్జీ హితవాది సంపాదకుడు కాళీ ప్రసన్న కావ్య విశారదను బలపరిస్తే రాజీకోసం ఈయన ప్రయత్నించినా కోర్టులో కేసుజరిగి కాళీ దోషిగా నిర్ధారించబడ్డాడు .దీనితో మోతీలాల్ పై కక్షకట్టాడు .జైలు నుంచి విడుదలై అమృత బజార్ పత్రికపై అవాకులు చెవాకులు పేలుతూ వ్యాసాలూ రాస్తే ఘోష్ సోదరులు 1889లో ఆయనపై పరువు నష్టం దావా వెయ్యాలని అనుకొంటే ఆయనే ముందు వీరిపై వేయగా  విచారణ జరిగి మోతీలాల్ కు వెయ్యి రూపాయలు జరిమానా వేయగా చెల్లించి బయటికి వచ్చాడు .మరోకేసులో దోషి ఒకయూరోపియన్ .విచారించిందీ ఆయన దేశం వాళ్ళే .దోషికి శిక్ష పడలేదు పైగా విస్తృత ధర్మాసనం కూడా అక్కర్లేదని తెల్ల జడ్జి నల్ల తీర్పు .ఈ కేసుతో భారత జాతీయతా వాదానికి ఆనుకూల్యత బాగా ఏర్పడింది .

    రాజకీయ దక్షత

కాంగ్రెస్ లో ఉన్నా  సురేంద్ర నాధ బెనర్జీ ఉగ్రవాదుల్ని ,మోతీలాల్ సమకాలీన అంశాలకు మద్దతిచ్చేవారు .మహారాష్ట్రలో కూడా శిశిర్ కుమార్ ను గురువుగా భావించే తిలక్ ఉగ్రవాదుల్ని బలపరచాడు .గోఖలే తిలక్ తో భేదించాడు .అరవిందో ,పాల్ ,రాయ్ సర్దార్ అజిత్ సింగ్ లు అతివాదులై బలం చేకూర్చారు .1888లో కలకత్తాలో రాష్ట్రస్థాయి రాజకీయసభలు కలకత్తాలో  సురేంద్ర నాధ నాయకత్వాన జరిగాయి .తర్వాత జిల్లాలు పట్టణాలలో కూడా జరపాలను కొన్నారు .1895లో బెంగాల్ లో అనేక పట్టణాలలో పెద్ద పెద్ద పందిర్ల కింద జరిగిన ఆఖరి సభ చివరి 6నిమిషాలలో బెంగాల్ అంతా తీవ్ర భూకంపం వచ్చి తీవ్ర నష్టం కలిగించింది .అమృతబజార్ పత్రిక ‘’భూకంపం జరిగిన అర్ధగంట తర్వాత మళ్ళీ అందరూ సమావేశమై  సభ నిర్వహించారు ‘’అని రాసింది .

 1896 పశ్చిమ భారతం లో కరువు ప్లేగు వ్యాపించి ఇబ్బంది పెడితే ,తిలక్ నిర్విరామంగా కృషి చేసి వైద్య ఆరోగ్య ఆహార సౌకర్యాలు కలిపించాడు .శివాజీ ఉత్సవాన్నీ జరిపాడు .బ్రిటిష్ ప్రభుత్వం ఈ కల్లోల సమయంలో మొరటుగా వ్యవరిస్తే కోపోద్రేకం తో ఇద్దరు యువకులు కెప్టెన్ రాండ్ ,లెఫ్టినెంట్ అయేష్టి అనే సైన్యాదికారుల్ని కాల్చి చంపారు .వేగంగా విచారణ జరిగి ఉరి శిక్ష వేశారు .ప్రజలు ఆందోళనలకు దిగగా తిలక్ ‘’కేసరి ‘’లో ఈ దారుణాలపై వ్యాస పరంపరాలతో చైతన్యం కలిగించాడు .బొంబాయి ప్రభుత్వం తిలక్ ను ప్రాసిక్యూట్ చేసింది .తిలక్ తరఫున ప్రముఖ  బెంగాల్ బారిస్టర్ ఆర్ధర్ పఫ్ వాదించాడు .9మంది సభ్యుల జ్యూరీ విచారించి తిలక్ 18నెలలు జైలు విధించారు .రీ అప్పీల్ కు అవకాశమివ్వలేదు క్షమాపణ చెప్పి బయట పడమని కొందరు సూచిస్తే అమృత బజార్ పత్రిక దాన్ని ఖండించి తిలక్ క్షమాపణ కోరరాదు అన్నది –దీనికికారణాలు –‘’తిలక్ రాతలలో రెచ్చగొట్టే మాటలు లేవు ,రాజకీయం లో ఉన్నవారు కష్టనష్టాలకు తలక్రిందు కారాదు .ఆయన మహారాష్ట్రలో ఉండి నిత్యం అవమానం పొందటం కంటే అండమాన్ లో ఉండటమే మంచిది ‘’అని రాసింది .రాజీ పరిష్కార సూచానకూ తిలక్ బాధపడుతూ మోతీలాల్ కు రాసిన లేఖలో –‘’తప్పు చేశాను అని ఒప్పుకో మంటోంది ప్రత్యర్ధి వర్గం .ప్రజలమధ్య నాస్థానం నా ప్రవర్తనమీద ఆధార పడి ఉంటుంది .నేను తలొగ్గితే మహారాష్ట్ర మొత్తం అండమాన్ అయి నన్ను శిక్షిస్తుందని నాకు తెలుసు .జ్యూరీ ముందున్న కేసు చాలా బలహీనమైందనీ నాకు బాగా తెలుసు .కీలక సమయం లో మనో ధైర్యాన్ని కోల్పోతే ,మనం ప్రజల్ని మోసం చేసినట్లే .గౌరవనీయ నిజాయితీ పరుడుగా ఉన్ననేను చేయని నేరాన్ని ఒప్పుకోవటం దేనికి ?.నాకు శిక్షపడితే ,నా దేశ ప్రజల సానుభూతి నా కష్టకాలం లో నాకు అండగా ఉంటుంది ‘’అని రాశాడు ఆయన విదేశీ మిత్రులు ప్రొఫెసర్ మార్క్స్ ముల్లర్ ,సర్ విలియం హంటర్ ల జోక్యంతో ఏడాది శిక్ష అవగానే విడుదలయ్యాడు తిలక్ .ఆయనపై మళ్ళీ అవినీతి ఫోర్జరీ వగైరా కేసులు పెట్టారు కానీ ఏవీ నిలవలేదు .తిలక్ కేసుమూలంగా తిరుగుబాటు ప్రోత్సహించే కార్యాలపై 1897లో నిబంధనలు మరీ కట్టుదిట్టం చేసింది ప్రభుత్వం .స్వీయ రక్షణకు ఇవన్నీ అవసరం అని లెఫ్టినెంట్ గవర్నర్ మెకంజీ అన్నాడు .ఇవి చాలక తమ రక్షణకోసం మరిన్ని తీవ్ర చట్టలు తెచ్చింది ప్రభుత్వం .’’దేశ ప్రయోజనాలకోసం శత్రు సంహారం అవసరమే ‘’ అనే గీతావాక్యాలను తిలక్ ,బంకిం చంద్రాల నోటి నుండి విని ప్రజలు ప్రభావితులయ్యారు. అరవిందుడు బెంగాలీ విప్లవ దళం పెట్టి యువతను ఆకర్షించాడు .నాతూ సోదరుల నిర్బంధం జాతీయవాదాన్ని మరింత పదునెక్కించింది .ప్రభుత్వ అణచి వేతలు పెరిగినకొద్దీ ఉగ్రవాద జాతీయోద్యమం మరింత బలపడింది ,

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-7-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

భారతీ నిరుక్తి .16వ భాగం.21.7.22

భారతీ నిరుక్తి .16వ భాగం.21.7.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

జ్ఞాపకాల మొగలిపొత్తు పరీమళాలలో శ్రీ సోమయాజి గారు

జ్ఞాపకాల మొగలి పొత్తు పరీమళాలలో  శ్రీ సోమయాజి గారు

  ఈనాటి సాహిత్యలోకం లో సోమయాజి గారు అంటే శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజి గారే .ఆయనలో గొప్ప కవీశ్వరుడు ,దార్శనికుడు ,ఆత్మీయ స్నేహమూర్తి ,మీదు మిక్కిలి భక్తకవి కనిపిస్తారు .తాతగారు వాగ్గేయ కారులు శ్రీ పువ్వాడ రామదాసు గారు .తండ్రిగారు ఆంధ్రదేశం పట్టని కవిపాదుషా శ్రీ పువ్వాడ శేషగిరి రావు గారు .వీరు అక్కడి కుదురు లోని ఇంగువకట్టిన గుడ్డ .సల్లక్షణాలన్నీ,వారసత్వంగా ,కొంత స్వయం సంపాదకంగా లభించినవీ ,లాభించినవీ .’’జీవితభీమా సంస్థ ‘’లో ఉద్యోగించి డివిజనల్ స్థాయి ఆఫీసర్ గా పదవీ విరమణ చేశారు .గత ఏభై  ఏళ్ళుగా  కృష్ణా జిల్లా రచయితల సభకు పెద్ద కాపుగా అండదండగా ఉంటూ సంస్థ ఎదుగుదలకు అన్నిరకాలుగా దోహదం చేశారు .మొన్న అంటే 18 వ తేదీ సోమవారం రాత్రి  అయ్యదేవర కాళేశ్వర రావు గారిపై  నేను చేసిన ప్రత్యక్ష ప్రసారాన్ని ఆద్య౦త౦ 6-30 నుంచి 7-30వరకు నాన్ స్టాప్ గా చూశారు .నిన్న 19 మంగళవారం ఉదయం 6-30 గంటలకు శివైక్యం చెందారంటే ఆశ్చర్య పోయి ,నమ్మాల్సి వచ్చింది .ఆయన నమ్మిన శ్రీ రామ సన్నిధి చేరారు .నాపై అనంత ప్రేమ ,ఆదరం, గౌరవం ,ఆపేక్ష ఉన్నవారాయన .నాకూ వారు పెద్దన్నయ్య లాటి వారే  .నిన్న అనుకోకుండా నేను కొంచెం నీరసంగా ఉండటం తో   వారి అంతిమ దర్శనానికి వెళ్ళలేక పోయిన అభాగ్యుడను .వారి ఆత్మకు శాంతి కలగాలనీ ,వారి కుటుంబానికి సానుభూతి తెలియ జేస్తున్నాను .

కృష్ణా జిల్లా రచయితల సంఘానికి వెన్నెముకగా ఉన్న ప్రముఖ కవులు రచయితలు   శ్రీ మాదిరాజు రామలింగేశ్వరావు గారు ,శ్రీమతి కె.బి. లక్ష్మిగారు గతించి పూడ్చరాని పెద్ద లోటునే కలిగించారు  .ఇప్పుడు పువ్వాడ వారి ఆకస్మిక మరణం కోలుకోలేని  మరో దెబ్బ .నవ్వుతూ ఆనవ్వుమాటున వ్యంగ్యపు మొగలి ముల్లు గుచ్చుతూ స్నేహ పరీమళాన్ని వ్యాపించే ఉత్తమ సంస్కారి సహృదయులు ,సౌజన్య మూర్తి సోమయాజులుగారు .నుదుట ఎర్రని నిలువు శ్రీ చూర్ణం ,తెల్లని పైజమా, లాల్చీలతో నవ్విస్తూ ,కనుకోసల్నించి కవ్విస్తూ పలకరించారు అంటే ఆయన పువ్వాడ సోమయాజి గారే .

  సోమయాజి గారితో నా మొదటి పరిచయం సుమారు 52ఏళ్ళ క్రితం జరిగినట్లు జ్ఞాపకం .కృష్ణా జిల్లా గ్రంథాలయ  శాఖ కార్యదర్శి శ్రీ చంద్ర శేఖరరావు గారు బందరు  ఫోర్ట్ రోడ్ లోని సెంట్రల్ లైబ్రరీ లో  శ్రీ ఆవంత్స సోమసుందర్ గారి ని ఆహ్వానించి ముఖ్య ప్రసంగం ఏర్పాటు చేశారు .అప్పుడు ఉయ్యూరు హైస్కూల్ లో మాతో పాటు పని చేస్తున్నఆధునిక కవిత్వం పై అధారిటి ,మహా సారస్వత విమర్శకుడు  స్వర్గీయ టి.ఎల్.కాంతారావు గారు మమ్మల్ని కూడా  ఆసభకు  వెడదాం రమ్మని కోరగా ,ఆయనతోపాటు నేనూ ,లెక్కల మేష్టారు శ్రీ పసుమర్తి .ఆంజనేయ శాస్త్రిగారు ,హిందీ మాస్టారు శ్రీ కొడాలి రామా రావు గారు కలిసి బస్ లో వెళ్లాం .అక్కడ సోమ సుందర్ గారి ఉపన్యాసం రాత్రి 8కి అని గుర్తు .అనర్గళంగా తన వజ్రాయుధం కావ్యం గురించి మిగిలిన సాహిత్య విషయాలగురించి అద్భుత ప్రసంగం చేశారు .అదే ఆయన్ను మొదటి సారి చూడటం .  ,అప్పుడప్పుడు బెజవాడ రేడియో స్టేషన్ వారి ఉగాది కవి సమ్మేళనాల లో  చూశాను. చివరిసారిగా కృష్ణా జిల్లా రచయితల సంఘం జరిపిన ప్రపంచ తెలుగు రచయితల సభలో ఆయన వెబ్ సైట్ ను శ్రీ రామతీర్ధ వేదికపై ప్రారంభించినప్పుడు  చూశాను .బహుశా ఇదే చివరి సారి అయిఉంటుంది .అప్పటికే పండి పోయారు .

  సరే బందరులో ఆవంత్స వారి ప్రసంగం అవగానే ఆయన్ను కారేక్కించి పంపేశారు .ఆ రాత్రి భోజనం ,పడక  సెక్రెటరి చంద్ర శేఖరరావు గారి౦ట్లోనే అని గుర్తు .ఈ ఏర్పాట్లన్నీ కాంతారావు గారే చేశారు .బహుశా మర్నాడు ఆదివారం ఉదయం అందరం అక్కడే కాలకృత్యాలు వగైరా  ,కాఫీ టిఫిన్లు పూర్తీ చేశాక .మమ్మల్ని కాంతారావు గారు ముందుగా శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజి గారింటికి తీసుకు వెళ్ళారు .అక్కడ వారి తండ్రిగారు కవిపాదుషా శేషగిరిరావు గారు వాలు కుర్చీలో  ఆసీనులయి ఉండగా దర్శించి నమస్సులు అందించాం .తర్వాత సోమయాజిగారితో పరిచయం చేయించారు కాంతారావు గారు .మళ్ళీ అక్కడ కూడా వారి ఆతిధ్యం తీసుకోనినట్లు జ్ఞాపకం .అక్కడి నుంచి ప్రముఖ కథకులు విమర్శకులు ,ఎల్ ఐసి లో ఉద్యోగి  శ్రీవిహారి గారింటికి తీసుకొని వెళ్లి పరిచయం చేశారు .ఆతర్వాత అదే సంస్థలో పని చేస్తున్న ,సాహితీ వేత్త శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారినీ పరిచయం చేశారు .అప్పుడాయన ఇన్ షర్ట్ లో సన్నగా రివటగా ఉన్నట్లు జ్ఞాపకం . సుబ్బారావు గారి మీద ఎందుకో కాంతారావు గారి మాటలలో సదభిప్రాయం వ్యక్తమయ్యేది కాదు .పిమ్మట అదేసంస్థలో ఉద్యోగి మహా కథారచయిత సి. రా .అంటే శ్రీ సింగరాజు రామ చంద్ర మూర్తి గారినీ కూడా వారి వారి ఇళ్ళ వద్ద పరిచయం చేశారు .ఆతర్వాత ఆంద్ర సారస్వత సమితి అధ్యక్షుడు శ్రీ సత్యనారాయణ గారినీ ,పరిచయం చేశారు .వీరందరితో మాకు అదే మొదటి సారి పరిచయం . అంతా అయ్యాక అందరం మళ్ళీ బస్సెక్కి ఉయ్యూరు ఏ మధ్యాహ్నానికో చేరి ఉంటాం .బందరులో ఇందరు సాహితీ మూర్తుల పరిచయ భాగ్యం కలగటం శ్రీ కాంతారావు గారి సౌజన్యమే కారణం .మర్చి పోలేని సుగంధ సాహితీ పరిమళం ఇదంతా .

  2008 లో కృష్ణా జిల్లా రచయితల సంఘం తో పరిచయం శ్రీ సోమంచి రామ౦ గారి వలన  జరిగింది .ఆయనే నన్ను సుబ్బారావు ,పూర్ణ చ౦ద్ గార్లకు పరిచయం చేసి నా చేత సెకండరీ విద్య మీద ఒక వ్యాసం రాయించారు జాతీయ సభలకోసం .అప్పటినుంచి ఆ సంఘం లో నాకు చ.క్కని అవకాశాలిస్తూ  ,ప్రోత్సహిస్తూ ,మంచి మంచి వ్యాసాలూ రాయిస్తున్నారు.నన్ను తమలో ఒకరినిగా చేసుకొన్నారు . సంస్థ నిర్వహించే జాతీయ అంతర్జాతీయ మహాసభల కు నేను తప్పక హాజరౌతూ నావంతు సాహితీ సాయం చేస్తున్నాను .వారిద్దరూ కూడా ఉయ్యూరులో నేను సాహితీ మండలి కన్వీనర్ గా ఉంటూ చేసిన కార్యక్రమాలకు వస్తూ ,విలువైన ప్రసంగాలు చేస్తూ ,ప్రోత్సహించారు .అప్పుడే బెజవాడ సభలలో శ్రీ సోమయాజిగారితో పరిచయం బలపడింది .ఆయన్ను ఉయ్యూరు తీసుకువచ్చి సాహిత్య ప్రసంగం చేయించి ,మా తలిదండ్రులు గబ్బిట భావనమ్మ మృత్యుంజయ శాస్త్రి గారల స్మారక పురస్కారం అందించాను .ఆ ఉపన్యాసం పై నా స్పందన తర్వాత కార్డ్ మీద రాసి పంపాను చదివి పరమసంతోషించారు .ఆతర్వాత రేడియోలో బుద్ధుని పై ప్రసంగం చేసినప్పుడు సోమయాజిగారిదో వారి నాన్నగారిదో ఒక పద్యం కోట్ చేసి స్పూర్తి కలిగించా .

  2009లో సరసభారతి స్థాపించిన దగ్గరనుండీ సుబ్బారావు,పూర్ణచంద్ .బుద్ధప్రసాద్ ,మాదిరాజు, సామల రమేష్ ,సోమయాజిగార్లు  మా కార్యక్రమాలకు వస్తూ ప్రసంగిస్తూ,పుస్తకావిష్కరణ లో , కవి  సమ్మేళనాలలో పాల్గొంటూ మాసంస్థ అభి వృద్ధికి తోడ్పడ్డారు . గ్రంథాలయ వారోత్సవాలలో కూడా సోమయాజిగారిని ఆహ్వానించి లైబ్రేరియన్ శ్రీమతి సుజాత గారి ఆధ్వర్యం లో సత్కరించాం.హాస్య కవి సమ్మేళనం లో సోమయాజిగారు ఆత్మీయ అతిధిగా విచ్చేసి ‘’ఉయ్యూరు అంటే నాకు చాలా ఇష్టం .ఇక్కడి కవి సమ్మేళనాలు అంటే మరీ ఇష్టం .అందుకే తప్పక హాజరౌతాను .మంచి సాహితీ అభిరుచి ఉన్న సంస్థగా సరసభారతి అభి వృద్ధి చెందుతోంది ‘’అని చెప్పి హాస్య స్పోరకంగా రాసిన ఒక  పద్యం చదివి వినిపించారు  

  కృష్ణా జిల్లా రచయితల సంఘం నిర్వహించిన అన్ని బృహత్తర కార్యక్రమాలలో శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజిగారు ఒక అధికార కోశాధికారిగా  చేతిలో బాగ్ అందులో డబ్బు ఉన్న కవర్లు పెట్టుకొని ఆహ్వానితులకు అతిధులకు అందజేయాల్సిన పైకాన్ని అందిస్తూ,పుస్తకం లో సంతకాలు పెట్టిస్తూ కనిపించటం ఒక ప్రత్యేకతగా నేను చాలా సార్లు గమనించాను .అంతటి నిబద్ధత వారిది అందుకే ఆ  బాధ్యత వారిపై పెట్టేది సంఘం .సర్వ సమర్ధతతో వారు నిర్వహించేవారు .అసలే మాట బహు స్వల్పం ,వినిపించీ విని పించనట్లు మాట్లేడేవారు ఆబాధ్యతలో నవ్వుతూ చాలా ఓపికగా కనిపించేవారు .ఆయన లేని సభ మొన్న నవంబర్ లో బందరులో జరిగిన సభ తప్ప దాదాపు అన్నిటిలో చూసిన గుర్తు ఆయన ఉంటె ఒక ఠీవి,ఒక దర్జా ,ఒకరాజసం ఒక నిండుతనం,ఒక ఆత్మీయ స్పర్శ  కనిపించేవి .

  సోమయాజిగారు తమ పుస్తకావిష్కరణ సభలనూ కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యం లో చాలా ఘనంగా జరిపేవారు .గొప్ప ఉపాహారం, దానితర్వాత మహా విందు తప్పని సరి .స్వాదిష్టమైన భోజనాలే అవి .దాదాపు నాలుగేళ్ల క్రితం తండ్రిగారి కార్యక్రమం ఒకటి హోటల్ ఐలాపురం లో జరిపి వారి కుటుంబంలోని చిన్నా పెద్దలను అందర్నీ వేదికపై సన్మానించి జ్ఞాపికలు అందించారు .వారందరిలో ఆత్మీయత ,ఆనందం చూసి పొంగిపోయారు .వారి కుటుంబ పెద్దల ఆశీర్వచనం పొందుతూనే వారిలోని వినయ విధేయతలు ప్రస్ఫుటంగా చూశాను .ఆ దృశ్యం ఇంకా నా కళ్ళముందు మెదులుతూ చిరస్మరణీయంగా ఉంది . మిత్రులు ,నా అభిమాని ,సరసభారతికి ఆత్మీయులు ,తనదైన ధోరణలో పద్యరచన చేస్తూ అంతే విలక్షణ ధోరణిలో భావ రాగ యుక్తం గా పద్యాలు  హృద్యాలయేట్లు చదవగలిగిన నేర్పున్న శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజి గారు తమ పితృదేవులు కవిపాదుషాశ్రీ పువ్వాడ శేషగిరిరావు మహోదయుల ‘’కవిత్వం ,వ్యక్తిత్వం ‘’పై ఒక సమగ్ర  బృహద్గ్రంథాన్ని ప్రచురించి పిత్రూణ౦ తీర్చుకొన్నారు .దాన్ని నాపై అభిమానంతో నాకు పంపగా 25-7-19 చేరింది .పాదుషా గారి గురించి అందులో ఎందరెందరో ఎన్నెన్నో విధాల చెప్పారు .ఇటీవలే తండ్రిగారి సాహిత్య సర్వస్వం ప్రచురించి పిత్రూణం తీర్చుకొన్నారు .దీనికి నా అభిప్రాయాన్ని రికార్డ్ చేసి వాట్సాప్ లో  పంపమని ఫోన్ పై కోరితే రికార్డ్ చేసి పంపాను .అంతటి అనురాగం వారికి నాపై ఉండేది .సోమయాజిగారి భార్యగారు బహుదొడ్డ ఇల్లాలు .పిల్లలు రత్నమాణిక్యాలు .     దేశం లోని అవధానాలలో ,భువన విజయాలలో ఆయన లేకుండా ఏదీ జరగలేదనే జ్ఞాపకం .పద్యాలు ఆయన హృదయం లోతుల్లోంచి పెల్లుబుకుతాయి .ఆధునిక పదాలకంటే సంప్రదాయ సిద్ధపదాలకే ఆయన ప్రాధాన్యమిస్తారు .ఇటీవలే రామాయణకావ్యమూ రచించి ధన్యులయ్యారు . రేడియోలో ,చినుకు మాసపత్రికలో ఎన్నెన్నో అద్భుత పద్యాలను విశ్లేషించి ,లోతులు తరచి అందచందాలు వివరించారు .సరసభారతి కవి సమ్మేళనానికి ముందు ఆయన్ను పిలిచి తర్వాతే మిగతా వారిని పిలవటం నాకు అలవాటు.  సరసభారతి సాహితీ పుష్కరోత్సవానికి అలానే వారిపేరు ముందు చేర్చి గౌరవి౦చా౦ .

  సరసభారతి తరఫున జరిపిన కవి  సమ్మేళన కవితలను పుస్తకాలు గా ప్రచురించినప్పుడు ఒకసారి మిత్రుడు శ్రీ తుమ్మోజు రామలక్ష్మణా చార్యుల గారి కవిత చదివి బాగుందని మెచ్చి, ఆయన నంబర్ అడిగి తీసుకొని ఆయనతో మాట్లాడి అభినందించిన కవితా పిపాసి పువ్వాడ వారు .అంతేకాదు మేము శ్రీ సువర్చలాన్జనేయస్వామి వారిపై ముగ్గురు కవులతో మూడు శతకాలు రాయించి నప్పుడు ఆచార్యులవారు సోమయాజిగారికి చూపించి మెరుగులు దిద్ది౦చు కొన్నానని చెప్పారు ,మా సువర్చలాన్జనేయస్వామికి 1,116 రూపాయలు ఆచార్యులగారి   ద్వారా అందించిన మహా భక్తులు .వారిబావగారు శ్రీ కోడూరిశ్రీ పాండు రంగారావు గారు కూడా మహా భక్తకవులైన రిటైర్డ్ ఆఫీసర్ .’’అరణ్య పర్వం నన్నయ్యే వ్రాశాడు’’  అనే సాధికారమైన గ్రంథం రాశారు ‘’శ్రీనాథుని పద్యాలవంటి పద్యాలు రాయగల బావగారు తిక్కన సోమయాజి గారికి దీటైనవారు .పోతన శ్రీనాథులవంటి వారు .వారూ మా సభలకు వచ్చేవారు .ఒకసారి బందరులో మా హెడ్ మాస్టర్ మిత్రుడు శ్రీ కోసూరు  ఆదినారాయణ గారబ్బాయి ఉపనయనానికి  వెడితే అక్కడ రావుగారి దంపతులు తమ ఇంటికి తీసుకువెళ్ళారు .ఈ విషయం సోమయాజిగారికి చెబితే పరమానంద పడ్డారు .

  సోమయాజిగారు తమమనవరాలి నాట్య అరంగేట్రం కు ప్రోత్సహిచమనిచెబితే  అలానే చేసి అందరికీ తెలియజేశాం సరసభారతి ద్వారా . సుమారు అయిదేళ్ళక్రితం తమ బంధువుల అమ్మాయికి సంబంధం చూస్తూ ,ఆవరుడి గురించి వాకబ్ చేయమంటే చేసి సంతృప్తి కలిగించాను . సుమారు మూడేళ్లక్రితం ఆయన భార్యగారు కైలాస గౌరీ  నోము నోచుకోవాలని  అనుకొంటున్నారనీ  ,వారిద్దరూ మా ఇంటికి వచ్చి పూర్తి వివరాలను మాశ్రీమతి వద్ద తెలుసుకొంటామనీ ఫోన్ లో చెప్పారు ,.హృదయ పూర్వక స్వాగతం అని చెప్పాము .చేసుకొన్నదీ లేనిదీ తెలీదు .మరో తమాషా ఏమిటంటే వారింటికి మేము  వెళ్ళటం  మా ఇంటికి వారు రావటం కూడా జరగలేదు .

  2013నవంబర్ 19న శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారి అర్ధాంగి శ్వాస  పీల్చటం ఇబ్బంది కి గురై బెజవాడ హెల్ప్ హాస్పిటల్ లో చేర్పిస్తే పూర్ణ చంద్ గారు ఫోన్ చేసి చెబితే  నేను చూడటానికి వెళ్లాను .అక్కడ అప్పటికే ఆయనా ,సుబ్బారావు గారితోపాటు సోమయాజిగారూ ఉన్నారు .మధ్యాహ్నం ఒంటి గంటవరకు అక్కడే ఉండి ఇంటికి బయల్దేరి వస్తూంటే సోమయాజిగారు తమ ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానిస్తే ,గంటలో ఇంటికిచేర్తాను వద్దని చెప్పాను . బెజవాడ రేడియో స్టేషన్ డైరెక్టర్ శ్రీ మంగళగిరి ఆదిత్య ప్రసాద్ గారి ఆధ్వర్యం లో ‘’ఆధునిక గిరీశం –వెంకటేశం ‘’ ‘’ రూపకం లో ఆదిత్య ప్రసాద్ ఆనంద గజపతి వేషం వేస్తే సర్వశ్రీ ధారా రామనాధ శాస్త్రి ,పింగళి  కృష్ణా రావు ,పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ ,జంధ్యాల మహాతీశంకర్,పువ్వాడ తిక్కన సోమయాజి మొదలైన వారు గురజాడ అప్పారావు ఆదిభట్ల నారాయణ దాసు మొదలైన వారి వేషాలు ధరించి రక్తి కట్టించారు ..

  సోమయాజి గారి  తాత గారు పువ్వాడ రామ దాసు గారి  కీర్తనల పుస్తకం నాకు పంపిస్తే చదివి ,దానిపై నెట్ లోవ్యాసం రాసి ఆయనకు మెయిల్ ద్వారా తెలియజేశాను .ఆయన నెట్ లో ‘’మన సాహితీ  బంధువు .‘’ అన్నీ చదువుతారు స్పందిస్తారుకూడా .సుమారు పాతికేళ్ళ క్రితం మొవ్వలో క్షేత్రయ్య పదసాహితీ సదస్సుఅక్కడి తెలుగు లెక్చరర్ శ్రీమతి వై.శ్రీలత  కృష్ణాజిల్లా రచయితల సంఘం సహకారంతో రెండు రోజులు జరిపితే సోమయాజి గారు వచ్చి అక్కడే పుట్టిన పువ్వాడ రామదాసుగారు తమ తాత గారే అని గొప్ప వాగ్గేయకారులనీ చెప్పారు రేడియోలో ఆయన గీతాలు వినేవాడినే కానీ ,ఆయన వీరికి బంధువని అప్పుడే తెలిసింది .

  సుమారు పది హేను రోజులక్రితం సోమయాజిగారు ఒక మెయిల్ రాస్తూ ,తన పొరబాటు వలన సాహితీ బంధువు లో తన పేరు లేకుండా పోయిందనీ ,మళ్ళీ చేర్చమనీ ,అలానే వాట్సాప్ గ్రూప్ లో కూడా చేర్చమని కోరితే చేర్చాము .అంతేకాదు ఆయన ఇంటిదగ్గర వారు,ఆయన గొప్ప మిత్రుడు  రిటైర్డ్ ఆఫీసర్ ,కవి ,సరసభారతికి అత్యంత ఆత్మీయులు శ్రీ కందికొండ రవి కిరణ్ గారిని సాహితీ పుష్కరోత్సవ కవి సమ్మేళనం లో చేర్చమని మెయిల్ రాస్తే ,ఆయన్ను దత్తాత్రేయ శర్మగారి తో మాట్లాడించి ఎప్పుడో చేర్చామని తెలియజేస్తే చాలా సంతోషించారు .అంతేకాదు తాము రాసిన పద్యాలను అద్భుతంగా కలర్ పేపర్ పై ప్రింట్ చేయించి ,ఫ్రేం కట్టించి సభలో ఆయనతోనే చదివించి నాకు శాలువా కప్పించిన  సహృదయ సాహితీ మూర్తి సోమయాజిగారు .మా అన్నయ్య పై జరిపిన కవి సమ్మేళనం లో సోమయాజిగారి పద్యాలు .

26-అన్నన్నా –శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజి –విజయ వాడ –

1- అన్నా !అన్న !ఇదేమి దుర్విది !అనూహ్యంమన్న !నన్నింక నీ

మన్నన్ కాదన నన్న !చేసితిని అన్యాయమ్ము,నీ, కమ్మకున్

మున్నే నే పసిగట్టి చేటు ,నుడువన్ ,మోటైన మాటాడి ,వీరి

మ్మన్నన్,తల్లిటు వచ్చితిన్ శఠుడనై   ఆలోచనా శూన్యతన్ .

2 తరలితీవు బంగారు లేడి తరుము కొనుచు—కొంతవడికి వింటిమి మేము వింత గొలుపు

నార్త నాదమ్ము ‘’హా లక్ష్మణా ‘’రవమ్ము –స్పస్టమది నీదె గొంతు ,ఉచ్చ్రైస్స్వరమ్ము.

3-వెను వేంటనేపోపోమ్మన –వినని ననున్ తల్లి రూక్ష వీక్షల నురిమెన్

మనసును రాయి పొనర్చుచు –నని వార్యపు గతిని కదలితన్నా వినుమా .

4-ఏదీ తల్లి ఇటుండ బాసితినిగా ,ఈ పంచ వటీ స్థలిన్

 ఎదీ లేదిట లోగిలిన్ వేలుపలన్ ,ఏదేని కీడయ్యెనో

ఆ దేవిం గొను పోయి రక్కసులు ద్రోహమ్మేమి  కాంక్షిం చిరో

నా దైవంమగు తల్లి ,అగ్రజుని ప్రాణమ్మింక నేమౌనోకో .

5-అనుచున్ లక్ష్మణుడశ్రు ధారల హ్రుదబ్జాంత ర్దళోద్విగ్నతన్

 ప్రణమిల్లెన్ త్రప నొంది ,అగ్రజునకున్ ,పల్కండు ,తోన్కండేట్

కినుకన్ బూనేనో ?లోని కోప బడ బాగ్నిన్ మ్రింగి చల్లార్చేనో ?

అనుకొంచం గ్రజు వెంటనంటి తరాలేనారాన్య సంశోధనన్ .

6-రాక్షస సంహారము –ముని రక్షణ యు తన అవతారలక్ష్యము లగుచో

 సుక్షత్రియుడౌ రఘు పతి-దీక్షకు భూ పుత్రి రక్ష తీక్ష్ణ సమస్యౌ ‘’.

    ఇంతటి సాహితీ మూర్తి ,ఆత్మీయులు శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజులు గారు మనమధ్య లేకపోవటం తీరని వేలితి.అందుకే ఈ జ్ఞాపకాల పరిమళాలు .

 మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-7-22-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారి నా జీవిత కథ .13వ భాగం.20.7.22

శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారి నా జీవిత కథ .13వ భాగం.20.7.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

గుఱ్ఱం జాషువా వర్ధంతి సమావేశ ఆహ్వానం

Posted in సభలు సమావేశాలు | Leave a comment

భారతీ నిరుక్తి .15వ భాగం.20.7.22

భారతీ నిరుక్తి .15వ భాగం.20.7.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారి నా జీవిత కథ.12వ భాగం.19.7.22

శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారి నా జీవిత కథ.12వ భాగం.19.7.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

భారతీ నిరుక్తి 14వ భాగం.19.7.22

భారతీ నిరుక్తి 14వ భాగం.19.7.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారి నా జీవిత కథ. 11వ భాగం.18.7.22

శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారి నా జీవిత కథ. 11వ భాగం.18.7.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-12

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-12

కాంగ్రెస్ రెండవ సదస్సు తర్వాత కలకత్తాలో దాదాభాయ్ నౌరోజీ అధ్యక్షత న జరిగిన సభలో ఇండియన్ అసోసిఏషన్ అందులో విలీనమై జాతీయ కాంగ్రెస్ ఏర్పడింది .భారతీయుల్ని నామినేట్ చేయకుండా ఎన్నికలలో నిలిచి గెలిచేట్లు చేయాలనే డిమాండ్ వచ్చింది .విదేశీ యంత్రాంగం కింద మగ్గడం అనే కాంగ్రెస్ మాటలకు లార్డ్ డఫ్రిన్ కు కోపమొచ్చి విరుచుకుపడ్డాడు .మోతీలాల్ కాంగ్రెస్ ను సమర్ధించాడు .డఫ్రిన్ కాంగ్రెస్ ను ‘’సూక్ష్మమైన అల్ప సంఖ్యాక వర్గానికి ‘’ప్రాతినిధ్యం వహిస్తోందని అనటం మోతీలాల్ కు నచ్చక కాంగ్రెస్ తో చేతులు కలిపాడు .1888అలహాబాద్ కాంగ్రెస్ సదస్సుకు ఖద్దరు బట్టలతో హాజరయ్యాడు .ఐయే ఎస్ పాసైన భారతీయులు లండన్ లో ఒక ఏడాది శిక్షణ పొందాలి అన్నదాన్ని వ్యతిరేకించాడు .అందరూ ఆయన్ను అభినందించారు .కాంగ్రెస్ లో చర్చలు సరిగ్గాజరగాకపోవటం ,భారత్ ఇంగ్లాండ్ లమధ్య సయోధ్యతకే తంటాలు పడటం ఆయనకు నచ్చలేదు .పాలనలో బ్రిటిష్ వారితో సమానాధికారాలకోసమే అర్రులు చాచటమూ నచ్చలేదు .మైనారిటీల మానవ హక్కులు చాలా విలువైనవనీ వాటిని బల ప్రదర్శనతోనే సాధించుకోవాలని ఆయన నమ్మి ,పత్రికలో దాన్ని వ్రాసేవాడు .

  ప్రభుత్వం ముస్లిం వేర్పాటు వాదాన్ని వెనకేసుకొచ్చింది .సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ద్వారా పోటీ రాజకీయ పక్షాన్ని రూపొందించారు .హిందువులు ,ముస్లిములు వేర్వేరు జాతులనీ ,కనుక ప్రభుత్వం ఏర్పడితే బెంగాలీ బాబుల ఆదిపత్యం పెరిగి ముస్లిం లకు అన్యాయం జరుగుతుందని ప్రచారం చేశాడు .’’ఉన్నత కుటుం బీకులు తమ ధన మాన ప్రాణాలను  దిగువ శ్రేణి ప్రజలకు నమ్మి ఇవ్వరు ‘’అని వ్యంగ్య బాణాలు వేశాడు .దీనికోసం 1888లో ‘’యునైటెడ్ ఇండియన్ పేట్రియాటిక్ అసోసియేషన్ ‘’ను కాంగ్రెస్ కు పోటీగా స్థాపించాలనుకొని హిందూ ముస్లిం ఉన్నతవర్గాలవారితో ఏర్పాటు చేశాడు .1878లోనే అమీర్ అలీ అనే  సంపన్న ముస్లిం బారిస్టర్ ‘’సెంట్రల్ నేషనల్ మహామ్మదీన్ అసోసియేషన్ ‘’ను ప్రభుత్వం లో ముస్లిం భాస్వామ్యాన్ని పెంచటానికి ఏర్పరచాడు .నామినేషన్ లద్వారానే లాభం పొందాలని అతడి ఆలోచన.దీనివల్ల బెంగాల్ లో కాంగ్రెస్ అంత పటిష్టం కాదు అనే భావన కలిగింది .స్థానిక ,ప్రాంతీయ సమస్యలను  చర్చించటానికి కాంగ్రెస్ అంతగా అభి రుచి చూపకపోవటమూ మరోకారణం  .కరువు కాటకాలు వరదలు ఒకదానితర్వాత ఒకటి వచ్చి మీద  పడటం తో గ్రామీణ రైతాంగానికి దిక్కు తోచటం లేదు .తేయాకు తోటల్లోకి బలవంతంగా కూలీలను తెప్పించి శ్రమ దోపిడీ చేస్తోంది ప్రభుత్వం .బెంగాల్ ప్రజలు పేదరికం లో అల్లాడి పోతుంటే కాంగ్రెస్ అసలేమీ పట్టించుకోవటం లేదు .ఈ మొండి వైఖరి వలన 1887’’బెంగాల్ ప్రోవిన్షియల్ కాంగ్రెస్’’ఏర్పడక తప్పిందికాదు .అణగారిన ప్రజలు రైతులు కూలీల తరఫున విద్యాధికులు ఉద్యమిస్తేనే తప్ప వారికి న్యాయం జరగదని మోతీలాల్ మొదలైన వారు భావించారు .ప్రజాప్రాతినిధ్య ప్రభుత్వంకోసం కాంగ్రెస్ కంటే బెంగాలీలే పట్టు బట్టారు .అన్ని గ్రామాలూ జిల్లాలు కలకత్తా తో సమానంగా నిలిచాయి .ఈకార్యకలాపాలను అమృతబజార్ పత్రికలో కవరేజ్ బాగా వచ్చేది .శిశిర్ కుమార్ ఇంగ్లీష్ భాష మధ్యతరగతి వారికి హాయిగా అర్ధమయ్యేది .భారతీయ ప్రత్యామ్నాయ పదాలు కూడా మధ్యమధ్యలో వాడేవారు .ఈ ఇంగ్లీష్ ను ఇంగ్లీష్ వారు ‘’బాబూ ఇంగ్లీష్ ‘’అని ముఖం  చిట్లించేవారు .

   ప్రజా జీవన రంగం లో

  1887 లో పబ్లిక్ సర్వీస్ లపై సుప్రీంకోర్ట్ ‘’రాయల్ కమిషన్ ‘’ఏర్పాటు చేయగా ,మోతీలాల్ సాక్షిగా హాజరై ముందుగా పోస్టల్ డిపార్ట్ మెంట్ గురించి మాట్లాడుతూ అందులో ఉద్యోగులంతా ఆంగ్లేయులే అనీ ,అవినీతి నిలయంగా మారిందని ,సమర్ధ భారతీయులతో ఈశాఖను నింపాలని చెప్పాడు .ఆతర్వాతనే భారతీయులను తీసుకోవటం మొదలుపెట్టారు .పోస్టల్ డైరెక్టర్ జనరల్ ‘’హాగ్ ‘’రాజీనామా చేసేశాడు .18-20మధ్య వయసున్నవారిని ఆ డిపార్ట్ మెంట్ లో పెద్దపెద్ద పదవుల్లో నియమిస్తే అనుభవం లేక పాలన సరిగ్గా జరగదు .వాళ్ళంతా తల్లి గర్భం లో 12ఏళ్ళు ఉన్న  ఆష్టావక్రులై ఉంటేనే అది సాధ్యం అని వ్యంగ్యం గా అన్నాడు .మోతీలాల్ చేసిన ఈ వ్యాఖ్యలకు పాఠకుల నుంచి అనూహ్యమైన మద్దతు లభించింది .ఒక యూరపియన్ ఆకాశ రామన్న ఉత్తరం పత్రికకు రాస్తూ-‘’మోతీలాల్ !పబ్లిక్ కమీషన్ ఎదుట నీ వాగుడు చదివిన వారికి మీ దుర్మార్గజాతి ఎలాంటి నీచులో తెలిసింది .అక్కడి యూరోపియన్ పెద్దమనుషులు బూటు మడమలతో నీ వీపు మోగించ లేదు అంటే ఆశ్చర్యంగా ఉంది .మీ బెంగాలీలకు అదే శాస్తి జరగాలి .మీ అంత నికృష్టజాతి భూమ్మీద లేదు .మెకాలే ఏమన్నాడో తెలుసా ?మీ (ముద్రించటానికి వీల్లేని బూతు )అందర్నీ ఇంగ్లీష్ ప్రభుత్వం కనుక సహిస్తోంది .బెంగాలీలు దగుల్బాజీలు లుచ్చాలు ,మోసగాళ్ళు వాళ్ళందర్నీమించి   నువ్వు  నీ వాళ్ళు నీజాతి  పరువు తీసేశారు ‘’అని అక్కసు వెళ్ళ గక్కాడు .అమృత బజార్ పత్రికలో ఆ లేఖను ముద్రించి చివరగా ‘’ఈ లేఖ ఒక యూరోపియన్ కానీ పోస్టల్ ఆఫీసర్ కాని రాసి ఉంటాడు .అదే నిజమైతే ఆబూతులన్నీ అతనికి ఉద్యోగామిచ్చిన పెద్దమనిషికే తగలాలి .దీన్ని ఆయనకు ఉచిత కానుకగా ఇస్తున్నాం ‘’.అని రాశారు .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -18-7-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -305

· మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -305

· ‘’అనువాద కోవిదాగ్రణి’’ శరత్ నవలలకు ఆంధ్రత్వం అద్దిన ,కార్తవరాయనికద ,కార్తీకదీపం సినీ ఫేం,సాహిత్య అకాడెమి పురస్కారగ్రహీత –మద్దిపట్లసూరి

· మద్దిపట్ల సూరి ( జులై 7, 1916 – నవంబర్ 19, 1995) రచయిత, అనువాదకుడు, సాహితీవేత్త. 1993 లో సాహిత్య అకాడమీ అనువాద బహుమతి తో వీరిని సత్కరించారు.

జీవిత సంగ్రహం
అనువాద కోవిదాగ్రణిగా ప్రసిద్ధులయిన “మద్దిపట్ల సూరి” తెనాలి సమీపంలో సంస్కృతాంధ్రవిద్యలకి ఆటపట్టయిన అమృతలూరులో జులై 7, 1920నాడు జన్మించారు. అనేక సుప్రసిద్ధ నవలలు బెంగాలీ, హిందీ భాషలనుండి తెలుగులోకి స్వతంత్ర నవలలు అనిపించేంత సహజంగా అనువాదాలు చేసి అనువాద కోవిదాగ్రణి అని పేరు పొందారు. దేశీ కవితామండలి ఆధ్వర్యంలో ప్రచురించిన శరత్ చంద్ర ఛటర్జీ నవలలు, దేవదేసు, పరిణీత అనువాదాలకు బొందలపాటి శివరామకృష్ణగారికి దోహదం చేసారు. చివరిదశలో ఉద్యోగం లేక, ధనాభావంవల్ల కొంతమంది ప్రసిద్ధులకు కొన్ని ప్రసిద్ధ రచనలు రాసి పెట్టారు. మాధవపెద్ది గోఖలే సూరిగారిని చిత్రరంగంలో ప్రవేశపెట్టేరు 1958లో. ప్రముఖ నటుడు యం. ప్రభాకరరెడ్డి, సూరి మిత్రులయినతరువాత అనేక చిత్రాలలో పని చేసేరు. ప్రభాకరరెడ్డి సూరిగారికి అనేకసందర్భాలలో ఆర్థిక సహాయం చేసారు. ఇటీవల “”సమరేశ్ బసు”” మహాభారత కథాకల్పన శాంబుడు, “”విభూతిభూషణ్ బందోపాధ్యాయ”” చరిత్రాత్మక రచన పథేర్ పాంచాలి నవలలకు ఆయన చేసిన అనువాదాలు పునర్ముద్రిస్తున్నారు. “”విశ్వవాణి””కోసం నిమ్నవర్గాల సముద్ధరణకు కులరాహిత్యాన్ని ప్రబోధించే జీవనలీల గ్రంథాన్ని 1959 లో రాసారు. నవంబరు 19, 1995 తేదీన సూరి మరణించారు.

విద్య
అన్నగారూ వ్యాకరణశిరోమణీ అయిన రామవరపు కృష్యమూర్తిశాస్త్రిగారివద్ద శ్రౌతస్మార్తాలను చెప్పుకున్నారు. ఉన్నత పాఠశాల చదువు నచ్చక, కలకత్తా వెళ్ళి బెంగాలీల చలిత్ భాషను, గౌడుల సంస్కృతాంధ్ర గ్రంథాలను, అలంకారశాస్త్రము అధ్యయనం చేసారు. అక్కడే జుగాంతర్ ప్రభావంమూలాన ఆధునిక భావజాలానికి లోనై, పుట్టుబిరుదు “శాస్త్రి”ని తొలగించి డిగ్రీలు లేని పాండిత్యంతో మద్దిపట్ల సూరిగా వెనక్కి వచ్చారు.

అనువాదాలు[మార్చు]
సూరిగారి అనువాదాలలో అధికభాగం సాహిత్య ఎకాడమీ పురస్కారాలు అందుకున్నవారి రచనలే. వారి శైలి సంస్కృతం వన్నెమీరిన వ్యావహారికం. రవీంద్రనాథ్ టాగోర్ 21 ప్రసిద్ధకథలకు సూరి అనువాదాలు రవీంద్ర కథావళ అన్నపేరుతో 1968 లో ప్రచురించారు. ఈ సంకలనానికి సోమనాత మిత్ర అవిస్మరణీయమైన పీఠిక, ఈ అనువాదాలు సుప్రసిద్ధమయినవి. బి.యస్.ఆర్ ఈ పుస్తకానికి సమీక్ష రాస్తూ, “పోస్ట్ మాస్టర్, కాబూలీవాలా అనువాదాలను చదివి చెమ్మగిల్లని వారుండరు,” అని వ్యాఖ్యానించారు. సూరిగారి హాస్యప్రియత్వంగురించి ఏల్చూరి మురళీధరరావు ఇలా వ్యాఖ్యానించారు, “సూరిగారు సరస హాస్యప్రియులు. గంగూలీ & గంగూలీ అన్న కథలో వ్యాపారనష్టాలను పూడ్చుకోవటానికి కాళీమంత్రం అష్టోత్తరం రాయమని ఎవరో సలహా ఇస్తారు. మోసాలు అలవాటయిన గంగూలీ పన్నెండు నామావృత్తులతో ఒక రబ్బరుస్టాంపు చేయించి, దాన్ని తొమ్మిదిసార్లు కొట్టి దేవతకే టోపీవేద్దామనుకొంటాడు. మరొక కథలో రైలుప్రయాణంలో సంప్రదాయ కుటుంబపెద్ద తమతో ఒక నవయువకుడి పలకరింపు చొరవను సహింపలేకపోతాడు. రైల్లో వంటచేస్తుండగా కూతురి చీరకు నిప్పంటుకొంటే ఆ యువకుడు చూసి రక్షిస్తాడు. కుటుంబం వారంతా అతన్ని ఆదరిస్తారు. యువతీయువకులకు ప్రేమభావం అంకురిస్తుంది. రాత్రివేళ మాటలు కలుస్తాయి. అంతలో అతని స్టేషను వస్తుంది. హడావుడిగా దిగిపోతూ ఆమె వివరాలడుగుతాడు. ఆమె సమాధానం వినబడకుండానే రైలు కదిలిపోతుంటుంది. ఇంకో కథలో ఒక సంపన్న బ్రాహ్మణయువకుడు పెద్దలు కుదిర్చిన ఆధునికభావాల యువతి మల్లికను చేసుకొంటాడు. ఆమె అతని వేషభాషలను మార్చి, మాంసాహారం కూడా అలవాటుచేస్తుంది. ఎంత ప్రేమ చూపినా ఆమెను సంతృప్తిపరుపలేక అతను విహ్వలుడు కావటాన్ని ఎంతో రమ్యంగా చిత్రీకరిస్తారు.”

ఇతని కొన్ని అనువాద రచనలు:

· అనురూపాదేవి రాసిన “మంత్రశక్తి” నాటకానికి అనువాదం 1959

· నిరుపమాదేవి రాసిన శ్యామలికి అనువాదం. 1959

· తారాశంకర్ బెనర్జీ రాసిన జల్ సాగర్ నవలకి అనువాదం, 1960. దేశీ కవితామండలి ప్రచురణ.

· తారాశంకర్ బెనర్జీ నవల ఉత్తరాయణ్ కి అనువాదం. ఇది రెండవ ప్రపంచయుద్ధం యొక్క దారుణఫలితాలను చిత్రీకరించిన విషాదాంత నవల. (1962)

· నీహార్ రంజన్ గుప్త నవల మాయామృగం, (1962)

· ఆప్తమిత్రులు అనువాదం, (1966)

· బిమల్ కర్ రాసిన అసమయ్ నవలను సమయం కాని సమయం అన్నశీర్షికతో అనువదించేరు, 1968

· శరత్ చంద్ర ఛటర్జీ రాసిన స్వయంసిద్ధ తెలుగులో అత్యుత్తమ అనువాద నవలగా ప్రసిద్ధి చెందింది.

· వనఫూల్ నవలకి అనువాదం రాత్రి. (1958)

· తారాశంకర్ బందోపాధ్యాయ రాసిన “గణదేవత” నవల.1970

సినిమారంగంలో కృషి
· కార్తవరాయని కథ. రోమియో జూలియట్, రాజస్థానచరిత్రల ఆధారంగా రూపొందించినది, (1958).

· రమాసుందరికి సంభాషణలు.

· వరకట్నం (1962)

· మా వదిన (1967)

· మాతృ దేవత (1969)

· భలే తమ్ముడు (1969)

· పచ్చని సంసారం (1970)

· విచిత్ర దాంపత్యం (1971)

· పండంటి కాపురం, (1972). ఈ చిత్రం రజతోత్సవం చేసుకుంది.

· గృహప్రవేశం (1982)

· కార్తీకదీపం

· పచ్చని సంసారం

· ధర్మాత్ముడు

· గాంధీ పుట్టిన దేశం

· రాధా మై డార్లింగ్

పురస్కారాలు
· “కలకతార్ కాఛేఈ” అనువాదానికి తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం

· సాహిత్య అకాడమీ అనువాద బహుమతి (1993)

· సశేషం

· మీ- గబ్బిట దుర్గాప్రసాద్-18-7-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

భారతీ నిరుక్తి.13వ భాగం.18.7.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారి నా జీవితకథ.10వ భాగం.17.7.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-11

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-11

 పత్రిక మార్పులకు కారణాలు -2

బ్రిటిష్ లిబరల్స్ చెప్పీ మాటలు నిజమే నని సురెంద్రనాద్ నమ్మాడు .విదేశీ ప్రభుత్వం పై అంతటి నమ్మకం ఉంచరాదని గ్రహించలేకపోయాడు.బ్రిటన్ లో టోరీ పార్టీ ఓడిపోవటం తో లార్డ్ లిట్టన్ పదవి ముగిసింది .లార్డ్ రిప్పన్ వచ్చాడు .రాగానే వెర్నాక్యులర్ చట్టం1861లో  రద్దు చేశాడు .ప్రజలలో సురేంద్ర పలుకుబడి బాగా ఉంది .1878లో ఘోష్ సోదరులు’’ ఆనంద బజార్ ‘’అనే మతప్రాతిపాదిక బెంగాలీ వార పత్రిక ప్రారంభించారు .1922లో సురేష్ చంద్ర మజుందార్ ,,ఫ్రఫుల్లకుమార్ సర్కార్ లు దీన్ని దినపత్రికగా మార్ఛి విశేష ప్రాచుర్యం కలిగించారు .

  నమ్మిన వారికి గుణపాఠం

 విషయజ్ఞుడు రాజకీయజ్ఞుడు అయిన రిప్పన్ స్థానిక స్వపరిపాలన ప్రవేశపెట్టాడు .ఇది రాజకీయ ప్రజావివేచనకు తోడ్పడింది .జిల్లాబోర్డులేర్పడి బోర్డ్ అధ్యక్షుడికి అధికారాలు వచ్చాయి .అన్నిరకాల అధికారాలు ఆయనకిందే ఉండేవి .స్థానిక బోర్డులు ఏర్పరచి జిల్లా బోర్డు లకింద పని చేసేట్లు చేశారు .పట్టణ మునిసిపాలిటీలకు మెజార్టీ సభ్యులు ఎన్నుకోనేవారు .స్థిరపడ్డాక అనధికారులు అధ్యక్షులయ్యారు .రిప్పన్ భారతీయ విద్యా కమీషన్ ఏర్పాటు చేసి ,దాని తీర్మానాలను అమలు చేశాడు .’’పాలకుడు నిజాయితీ పరుడు అయినా ,విదేశీపాలన నిజాయితీగా సాగే వీలు లేదు ‘’అని చెప్పిన అమృతబజార్ పత్రికమాట నిజమై రిప్పన్ విఫలమయ్యాడు .యూరోపియన్ల గర్జన ఎక్కువై ,1883లో ఆయన డార్జిలింగ్ నుంచి వస్తుంటే వైస్రాయ్ భవనం గేటు వద్ద ఆయన్ను బండబూతులు తిట్టారు .దీనిపై పరమానంద దత్’’ఆంగ్లో ఇండియన్లు పెద్ద కుట్ర పన్ని ,ప్రభుత్వ చట్టాన్ని రద్దు చేయకపోతే , సెంట్రీల  దాడి చేసి ,వైశ్రాయిని చాంద్ పాల్ ఘాట్ వద్ద స్టీమర్ లోకి బలవంతంగా ఎక్కించి ,గుడ్ హాప్ అగ్రం మీదుగా ఇంగ్లాండ్ కు తరలించాలని ప్లాన్ ‘’అని రాశాడు .బ్రిటన్ గవర్నమెంట్ జోక్యం చేసుకొని జిల్లా మేజిస్ట్రేట్ ,సెషన్స్ జడ్జి ల అధికారాలను ప్రకటించటం తో వివాదం సమసిపోయింది .తర్వాత చేసిన చట్టం లో యూరోపియన్ అధికారుల అధికారాలు పెంచారు .అన్ని రాయితీలు వారికి లభించాయి .

  చట్టం ముందు అందరూ సమానులే  అనే రోజు వస్తుందని భావించిన ఇండియన్ లకు ఈ ‘’ఇల్బర్ట్ బిల్ ‘’ఆశనిపాతం అయింది .అయితే మోతీలాల్ అమృతబజార్ పత్రిక ఒక గట్టి గుణ పాఠం నేర్చుకొన్నారు .ఒక కేసులో సాలగ్రామ వివాదం లో దాన్ని కోర్టులో ప్రవేశపెట్టాలన్న జస్టిస్ నోరిస్ న్యాయమూర్తి పదవికి అనర్హుడు అని ది బెంగాలీ పత్రికలో సురేంద్ర వ్యాసం రాస్తే ,రెండు నెలలు శిక్ష పడితే హిందువులు ఆయనకు పూర్తీ మద్దతు ప్రదర్శించి ఆగ్రహంతో ఊగిపోయి తీవ్ర నిరసనలు చేయాటం తో ఆయన కీర్తి మరింత పెరిగింది .1883లో విడుదలకాగానే  డిసెంబర్ లో కలకత్తాలో ఇండియన్ అసోసియేషన్  అఖిలభారత జాతీయ సభ జరూపగా ,భారత మిత్రుడు w.s.బ్లాంట్ ‘’ఇది జాతీయ పార్లమెంట్ ఆవిర్భావానికి మొదటి మెట్టు ‘’అన్నాడు  .1870లోనే శిశిర్ కుమార్ ‘’జాతీయ పార్లమెంట్ ‘’ను సూచించాడు .1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపన తర్వాత కాన్ఫరెన్స్ అందులో విలీనమైంది .అమృత౦ దీన్ని బలపరచింది .1884లో సెంట్రల్ ఇండియా గవర్నర్ జనరల్ ఏజెంట్ సర్ లేపెలో గ్రిఫిన్ అక్రమాలను పత్రిక బయట పెట్టింది .ఆరోపణలు రుజువై రాజీనామా చేసి ,వెళ్ళియాడు .

  1889లో మరోస్కూప్ బయటికి లాగింది పత్రిక .కాశ్మీర్  మహారాజు ను గద్దె దించటానికి వెనకున్న కారణాన్ని తెలిపే విదేశాంగ శాఖ రహస్యపత్రాన్ని బయటపెట్టి ప్రభుత్వాన్ని ఇరుకున పడేసింది .గిల్గిత్ ప్రాంత ఆక్రమణ ఇందులో ముఖ్యమని చెప్పింది .దేశంలో తీవ్రలజడి జరిగి ప్రజాగ్రహం ఉప్పెన అవగా గత్యంతరం లేక మళ్ళీ రాజును కాశ్మీర్ గద్దె నెక్కించారు .ఇంతకల్లోలం లోనూ పత్రికకు ఇబ్బందికలగలేదు .అప్పటికి అధికార రహస్య చట్టం లెదు కనుక పత్రిక జోలికి రాలేకపోయింది ప్రభుత్వం .బెంగాల్లో బెంగాలీ, అమృత బజార్ పత్రికలూ అగ్రస్థానం లో ఉన్నాయి .ప్రాంతీయ పత్రికలూ జాతీయోద్యమానికి కొమ్ము కాశాయి .బెంగాలీ పత్రికలలో బంగబాసి -1881,సంజిబాని -1883,హితబాది 1891 విశేష ప్రచారం పొందాయి ..మొదటిది హిందూధర్మాన్ని రెండోది బ్రహ్మసమాజాన్ని ,మూడోది హిందూ సంస్కరణ వాదాన్ని బలపరిచేవి .మహారాష్ట్రలో హిందూ ప్రకాష్ ,మహారాట్ట,కేసరి ,కాల్ పత్రికలూ బొంబాయ్ లో బొంబాయి సమాచార్ ,జయ్-ఇ-జయ్ షెడ్,,రాస్త్ గుప్తార్ ,మద్రాస్ లో దిహిందూ ,స్వదేశీమిత్రన్ ,ఉత్తరాభారత్ లో దిట్రిబ్యూన్ పత్రికలూ జనజాగృతిచేసేవి .1890లో కేసరి మహారాట్ట పత్రిలకు ఎడిటర్ గా ఉన్న బాలగంగాధర తిలక్ తన గురువు అమృతబజార్ పత్రకా సంపాదకుడు శిశిర్ కుమార్ అని గర్వంగా చెప్పుకొన్నాడు –‘’ఆయనను తండ్రిగా నేనుభావిస్తా .ఆయన నన్నుకుమారుడిగా భావిస్తారు ‘’అని రాశాడు తిలక్  1917లో.

  విద్యావంతులైన దేశీయులను విశ్వాసం లోకి తీసుకోవాలని రిప్పన్ ,మరికొందరు భావించి ముగ్గురు అధికారులు ఏవో హ్యూమ్ ,సర్ డబ్ల్యు వెడర్  బర్న్ ,డబ్ల్యు ఎస్ బ్లంట్ లు ముందుకొచ్చి అఖిలభారత వ్యవస్థ ఏర్పాటుకు సూచించి,1883లో హ్యూమ్ దేశంలోని దేశంలోని అత్యున్నత విద్యావంతులుగా ఎంపికైన మేధావులకు ఒక బహిరంగ లేఖ రాస్తూ –‘’మీకూ మీదేశానికి మరింత అధిక స్వాతంత్ర్యాన్ని ,నిష్పాక్షిక పాలనా వ్యవస్థను ,పాలనలో విస్తృత భాగ స్వామ్యాన్నీ సాధించటానికి పోరాటం చేయండి .కార్యాచరణ ఎలా ఉండాలో ఆలోచించండి .ఆత్మత్యాగం స్వార్ధ రాహిత్యం తిరుగులేని మార్గాలు ‘’అన్నాడు .ఆతర్వాత రిప్పన్ స్థానం లో వచ్చిన లార్డ్ డఫ్రిన్  ఈ మేధావుల సమావేశాన్ని 1885 డిసెంబర్ లో బొంబాయి లో జరిపాడు .అప్పుడే భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భవించింది .కలకత్తాకు చెందిన ప్రముఖ బారిస్టర్,  సంస్థ అధ్యక్షుడు డబ్ల్యు సి బెనర్జీ తోపాటు ‘’దిఇండియన్ మిర్రర్ ,నబ బిభాకర్ పత్రిక సంపాదకులు మాత్రమె బెంగాల్ నుంచి ఆ సభకు హాజరయ్యారు .ఆహ్వానం వచ్చినా ,తీరికలేక సురెంద్రనాద్ బెనర్జీ వెళ్ళలేదు .ఇంకెవరినీ ఆహ్వానించినట్లు లేదు .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -17-7-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

భారతీ నిరుక్తి.12 వ భాగం.17.7.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

భారతీ నిరుక్తి.11వ భాగం.16.7.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -304

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -304

304 త్రిపురనేని గోపీ చ౦ద్ కుమారుడు ,-మాభూమి హీరో ,ఫిదాలో ఇద్దరుకూతుళ్ళ పెళ్ళికాని తండ్రి –సాయి చ౦ద్

త్రిపురనేని సాయిచంద్ తెలుగు చలనచిత్ర నటుడు, డాక్యుమెంటరీ సినిమాల రూపకర్త.[1] రచయిత త్రిపురనేని గోపిచంద్ కుమారుడు. సంఘసంస్కర్త, హేతువాది అయిన కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరికి మనుమడు. తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో ప్రసిద్ధ దర్శకుడు గౌతమ్ ఘోష్ దర్శకత్వంలో వచ్చిన మాభూమి చిత్రంతో తెలుగు చలనచిత్రరంగంలో నటుడిగా ప్రవేశించాడు. ఆ చిత్రంలో కథానాయకుడు రామయ్య పాత్రలో మరుపురాని నటనను కనబరిచాడు. ఆ తర్వాత శివ, అంకురం మొదలగు తెలుగు సినిమాల్లో నటించాడు. శివ చిత్రంలో నటి అమలకు అన్నయ్యగా నటించాడు. నటనకు దూరమై మైత్రి కమ్యూనికేషన్స్ స్థాపించి కొన్నాళ్ళపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సందేశాత్మక డాక్యుమెంటరీలు తీస్తూ ఢిల్లీలో గడిపారు[2]. పాతికేళ్ళ విరామం తరువాత మళ్ళీ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా చిత్రంతో నటుడిగా పునఃప్రవేశం చేశాడు. నిజజీవితంలో బ్రహ్మచారి[3]గా మిగిలిపోయిన సాయిచంద్, ఫిదా చిత్రంలో ఇద్దరు కూతుళ్ళ తండ్రిగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.[4]

బాల్యం, విద్యాభ్యాసం
సాయిచంద్ 1956 మార్చి 12న త్రిపురనేని గోపీచంద్, శకుంతలా దేవి దంపతులకు కర్నూలులో జన్మించాడు. ఈ దంపతులకు మొత్తం అయిదు మంది సంతానం. వీళ్ళందరిలో సాయిచంద్ చివరివాడు. తండ్రి గోపీచంద్, ఆయన తండ్రి త్రిపురనేని రామస్వామి పేరొందిన రచయితలు. సాయిచంద్ కి ఆరేళ్ళ వయసులో తండ్రి మరణించాడు. పదేళ్ళ వయసులో తల్లి కూడా మరణించింది. అప్పటి నుంచి మాతామహుడైన (తల్లికి తండ్రి) నారయ్య సమక్షంలో పెరిగాడు. చిన్నతనంలో తండ్రి రచనలు చదవడం ప్రారంభించాడు.

గోరా ప్రారంభించిన వాసవ్య పాఠశాలలో చదువుకున్నాడు. ఆ పాఠశాల నిర్వాహకురాలు, గోరా కోడలైన హేమలతా లవణం ఊయనకు తన పేరు, తండ్రి పేరు కలిసొచ్చేలా సాయిచంద్ అని పేరు మార్చింది.[5]

ఫిల్మోగ్రఫీ
సాయిచంద్ నటించిన తెలుగు చిత్రాల పాక్షిక జాబితా:

· మాభూమి (1980)

· ధర్మవడ్డీ (1982)

· పెళ్లీడు పిల్లలు (1982)

· మంచుపల్లకీ (1982)

· ఆడవాళ్లే అలిగితే (1983)

· ఈ దేశంలో ఒకరోజు (1983)

· రంగులకల (1983)

· విముక్తి కోసం (1983)

· ఈ చదువులు మాకొద్దు (1984)

· శివ (1989)

· అంకురం (1992)

· ఫిదా (2017)

· సైరా నరసింహారెడ్డి (2018)

· చెక్ (2021

· ఉప్పెన 2021

· విరాటపర్వం (2022)

· పండిత పరమేశ్వర ఐ నవల ,విశ్వనాధవారి నవలలు దాక్యు మెంటరీ లుగా తీసి చిరస్మరణీయం చేశాడు సాయి చంద్.

· సశేషం

· మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -16-7-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారి నా జీవిత కథ.8వ భాగం.15.7.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-10

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-10

 పత్రిక మార్పులకు కారణాలు

ఇండియన్ సివిల్ సర్వీస్ వారి విమర్శలు బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాయి .ప్రభుత్వ వ్యవహారాల రూపకల్పనలో తమకు ఎక్కువ భాగస్వామ్యం కావాలని వారు కోరుతున్నారు .దీన్ని ఒప్పుకొంటే తమపని ఖాళీ అనుకొన్నది ప్రభుత్వం .అప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ నలుగురు బ్రిటిష్,నలుగురు అనధికార ,ఇద్దరు భారతీయ అధికార ,ఇద్దరు అనధికార సభ్యులతో ‘’బెంగాల్ విధాన పరిషత్’’ ఏర్పాటు చేశాడు .సామ్రాజ్య విస్తరణ విధానాలు పత్రికలలో విమర్శలుగా రాకూడదని ,వైశ్రాయికి అసలు తెలియకూడదని ప్రభుత్వం వారి భావన .రష్యా భారత్ పై కన్నేసిందని అనుకోని లార్డ్ లిట్టన్ ఆఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించే ప్రయత్నం లో 1870లో తలమునకలై ఉన్నాడు .కాశ్మీర్ మహారాజుకు ఆయుధాలు సరఫరా చేసి ,చిత్రాల్ లోకి సైన్యాన్ని దించమని ప్రేరేపించాడు .కాశ్మీర్ అజేయ రాజ్యం .అధిక పన్నుల భారం తో ఇండియా కునారిల్లుతోంది .దుర్భిక్షాలు ఇబ్బంది పెడుతున్నాయి .ఈరెండిపైన వైశ్రాయిదృష్టి లేదు .అప్పటి బెంగాల్ లెఫ్టినెంట్ గవర్నర్ సర్ ఆప్లె ఏడెన్ లంచాలు ఎరచూపి ఇంగ్లీష్ పత్రికల నోళ్ళు నొక్కటానికి ప్రయత్నించాడు .హిందూ పేట్రియట్ పత్రిక ఎడిటర్ కృపతో, దాస్ పాల్ ను లొంగదీసుకొన్నాడు .యితడు శిశిర్ కుమార్ కు కబురు చేశాడు .తనమాటవింటే ప్రభుత్వం లో ప్రాతినిధ్యం  కల్పిస్తానని ఆశపెట్టాడు .దీనిపై మోతీలాల్ రాస్తూ  ‘’నువ్వు ,నేను ,కృపతో దాసు కలిసి బెంగాల్ని పాలిద్దాం .నేను చెప్పినట్లు పత్రిక నడపటానికి దాస్ ఒప్పుకొన్నాడు .నువ్వూ ఒప్పుకో .పెట్రియట్ కు ఇస్తున్నట్లే నీకూ ముట్ట చెబుతాం .ప్రభుత్వాన్ని విమర్శిస్తూ నువ్వు ఏదిరాసినా ము౦దు నాకు పంపు .ప్రభుత్వం ఎక్కువకాపీలు కోనేట్లు చేస్తా .నిర్వహణలో దాస్ తో పాటు నిన్నూ సంప్రదిస్తా ‘’అని ప్రతిపాదించాడని చెప్పాడు మోతీలాల్ .

  నిజంగా అప్పుడు శిశిర్ కుమార్ చాలా పేద వ్యక్తీ .కలకత్తా సమాజం లో ఆయన స్థితి గొప్పదేమీ కాదు కూడా .తంతే గారెల బుట్టలో పడే చాన్స్ వచ్చింది .కానీ ఆయన ఆలోచనలు వేరుగా ఉన్నాయి .కృతజ్ఞతలు తెలుపుతూ ‘’అయ్యా !ఈ భూమి మీద కనీసం ఒక్కడైనా నిజాయితీ కల జర్నలిస్ట్ ఉండటం చాలా అవసరం ‘’అన్నాడు ఇంకేముంది అవతలివాడు ఆగ్రహోదగ్రుడయ్యాడు.వ్యంగ్యంగా ‘’నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా .బెంగాల్ అ త్యున్నత అధికారిని నేను ఎప్పుడైనా సరే నిన్ను జైల్లోపెట్టి ఆరునెలలు ఉంచగలను .నీపత్రికను  మూటాముల్లె తో సహా జేస్సూర్ పంపెయగలను ‘’అన్నాడు ఎడెన్.అవి వట్టిమాటలుకావు అప్పటికే ‘’వెర్నాక్యులర్ యాక్ట్ కింద ప్రభుత్వం పై ఎలాంటి విమర్శరాయమని జిల్లా మేజిష్ట్రేట్ కు లేదా పోలీస్ కమీషనర్ కు లిఖిత పూర్వకంగా తెలియజేయాలి పూచీకత్తుగా కొంతసొమ్ము కట్టాలికూడా .ఉల్లంఘిస్తే ఈడబ్బు తిరిగిరాదు .కోర్టుకు వెళ్ళే అవకాశాలూ ఉండవు .ఇదంతా ముఖ్యంగా అమృత బజార్ పత్రిక పైన పెట్టిన గురిమాత్రమే .ఈ చట్టం అమలుకు పూర్వమే పూర్తిగా ఇంగ్లేష్ లో పత్రిక నడిపారు ఘోష్ బ్రదర్స్ .చట్టం పరిధినుంచి తప్పించుకోవటం వలన ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అని ఎదుర్కొన్నారు .’’పూర్తిగా ఇంగ్లీష్ లో ప్రచురించే పత్రిక లార్డ్ గారి యాక్ట్ కంటే అతీతమైంది ‘’అన్నాడు మోతీలాల్.వాడికి ఎక్కడోకాలి మిత్రులవద్ద గొణిగాడు .పత్రిక ఇంగ్లీష్ లో రావటం ఒక వారం ఆలస్యం అయిఉంటే ఈ నిబంధనలన్నీ అమలు చేసేది ప్రభుత్వం .వాళ్ళ తిత్తి తీసేవాడిని ‘’అని లబో దిబోమన్నాడట .

  21-3-1878లో అమృత బజార్ పత్రిక పూర్తిగా ఇంగ్లీష్ లో ప్రచురితమైంది అందులో సంపాదకీయం లో శిశిర్ కుమార్ ‘’మాతృభాషలో పత్రికకు స్వస్తి చెప్పటం అనివార్యమైంది .మిత్రుల అభిమానుల సూచనలు పాటించాం .ఈమార్పు దేశానికి ప్రయోజనమా కాదా అనేది కాలమే నిర్ణయిస్తుంది .ఐతే స్వేచ్చా స్వాతంత్ర్యాలతో ఒక ఆంగ్ల పత్రిక అవసరం .ఎన్నో అగ్నిపరీక్షలు తట్టుకోన్నాం .ప్రజాహృదయ స్పందన ప్రజాజాగృతి స్వేచ్చా స్వాతంత్ర్య హక్కు లకోసం పాటు పడే పత్రిక మనది. ఇకపైన కూడా మీ సంపూర్ణ సహకారం లభించాలని భగవంతుని ప్రార్దిస్తున్నాం ‘’అని తెలిపాడు అన్యా పదేశంగా .

   కపట చట్టం వలన ప్రజలు తీవ్ర నిరశన తెలిపారు .1875,లో శిశిర్ కుమార్ మోతీలాల్ కల్సి ప్రజా సమైక్యతకు ‘’ఇండియన్ లీగ్ ‘’స్థాపించారు .1876 సురేంద్రనాధ బెనర్జీ ఇండియన్ అసోసియేషన్ స్థాపించాక దీన్ని రద్దుచేశారు .ఆయన 1869లో ఇంగ్లాండ్ లో సివిల్ సర్వీస్ పాసై నా, వయసు తప్పుగా ప్రకటించాడని నియామకం ఉపసంహరించారు .దీనిపై కోర్టులో పోరాడి విజయం సాధించాడు .1871లో ఆయన్ను సిల్హెట్ లో అసిస్టెంట్ డిష్టిక్ట్ మీజిస్ట్రేట్ గా పోస్టింగ్ ఇచ్చారు .యూరోపియన్ లతో పాటు సమాన స్థాయి పొందాడు .కన్నుకుట్టిన ప్రభుత్వం నిరాధార ఆరోపనలు చేసి సర్వీస్ నుంచి తొలగించారు .ఇదొక పెద్ద వివాదమై ఆయన మళ్ళీ లండన్ లో అప్పీల్ చేసినా ఓడిపోయి ,బారిస్టర్ హక్కుకూడా కోల్పోయాడు .ఇదొక గోప్పమలుపైంది ఆయన జీవితం లో .

‘’  ఎ నేషన్ ఇన్ మేకింగ్ ‘’అనే తనపుస్తకం లో ఆయన ‘’మనం చాలాహీనంగా హేయంగా బతుకుతున్నాం .మనతప్పుల్ని తెలుసుకొని మన వ్యక్తిగత హక్కుల్నీ ,జాతి హక్కుల్నీ పరిరక్షించుకొంటూ గమ్యం వైపుకు సాగుదాం .మీ అందరికి నేను సహాయకుడిగా ఉంటాను ‘’అన్నాడు .ఆయన వజ్ర సంకల్పం వాక్ చాతుర్యం అందర్నీ ఆకర్షించాయి .ఆనందమోహన్  బోస్ నాయకత్వాన స్టూడెంట్స్ అసోసియేషన్ లో చేరాడు .ఆయన్ను ఈశ్వరచంద్ర విద్యాసాగర్ మెట్రోపాలిటన్ కాలేజిలో ఇంగ్లీష్ ప్రొఫెసర్  గా నియమించాడు .ఈయన ‘’దిబెంగాలీ ‘అనే పత్రిక స్థాపించి తనభావ ప్రకటనకు ఉపయోగించుకొన్నాడు .

 సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -15-7-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

నిర్మాణాత్మక కార్యకర్త ,స్వాతంత్రోద్యమ ,గ్రందాలయోద్యమనాయకుడు శ్రీ ముదిగంటి జగ్గన్న శాస్త్రి

నిర్మాణాత్మక కార్యకర్త ,స్వాతంత్రోద్యమ ,గ్రందాలయోద్యమనాయకుడు  శ్రీ ముదిగొండ జగ్గన్న శాస్త్రి  

ముదిగంటి జగ్గన్న శాస్త్రి, స్వాతంత్ర్య సమరయోధులు, పత్రికా సంపాదకులు, రచయిత

గోదావరి జిల్లాలో స్వాతంత్య్రోద్యమ కాలంలో ముదిగంటి జగ్గన్నశాస్త్రి ఎన్నో నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు నిర్వహించి త్యాగజీవనుడిగా పేరు తెచ్చుకున్నారు. స్వాతంత్య్ర యోధుడిగా గుర్తింపు పొందారు. పల్లెటూరి గ్రంథమండలి కొంతకాలం నిర్వహించారు. సార్వజనిక ఎన్నికలప్పుడు ఆయననందరూ విస్మరించారు. ఆయన ఏదైనా ప్రయత్నం చేస్తే ఫలితముంటుందేమోనని ఢిల్లీ వచ్చారు. దుర్గాబాయిని కలుసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందేమోనని ఆమెను కలుసుకోవటానికి ప్రయత్నించారు. కానీ ఆయన నిరాడంబరుడు. అందుకు కావలసిన దారీతెన్నూ కూడా తెలియనివాడు. అందువల్ల అప్పట్లో ఢిల్లీలో భౌతిక విజ్ఞాన కేంద్రం సంస్థలో (నేషనల్‌ ఫిజికల్‌ లేబరేటరీస్‌) ఉన్నతాధికారి పదవి నిర్వహిస్తున్న స్వామి జ్ఞానానందను కలుసుకున్నారు. స్వామి జ్ఞానానంద బాల్యంలో శాస్త్రి గారి సహాధ్యాయి. అప్పటికే స్వామి విదేశాలలో భౌతిక పరమాణు విజ్ఞానంలో గొప్ప శాస్త్రవేత్తగా గుర్తింపు పొందారు. జవహర్‌లాల్‌ నెహ్రు ఆహ్వానంపై ఆధ్యాత్మిక జీవితాన్ని వదిలి భారతీయ వైజ్ఞానిక రంగాన్ని ఆధునికావసరాలకు పటిష్టంగా రూపొందించడానికి తన విజ్ఞానాన్ని వినియోగించడానికి ముందుకు వచ్చిన గొప్ప దేశభక్తుడాయన. జవహర్‌లాల్‌కు ఆయనంటే గొప్ప గౌరవం.

జగ్గన్న శాస్త్రి గారు స్వామీజీని కలుసుకోగా, ఆయన ఇటువంటి విషయాలలో ఏమీ పరిజ్ఞానం లేనివారు కనుక శాస్త్రిగారిని దుర్గాబాయి నివాసానికి తీసుకువెళ్ళారు. ఆమె స్వామీజీకి భక్తి ప్రపత్తులతో వందనం చేసి తనకు కబురుచేస్తే తానే వచ్చేదాన్ని కదా అని శాస్త్రిగారిని కూడా ఆదర గౌరవాలతో ఉపచరించింది. తర్వాత శాస్త్రిగారిని అందుకు సంబంధీకులైన పార్టీ ప్రముఖుల వద్దకు తీసుకువెళ్ళింది. ఆయనకు ఎన్నికలలో పోటీ చేయడానికి కావలసిన గుర్తింపు కోసం ఎంతో సహకరించింది. కానీ ఆయనకు టికెట్‌ మాత్రం లభించలేదు. ఈ విషయం ముదిగంటి జగ్గన్న శాస్త్రి గారు స్వామి జ్ఞానానంద జీవిత చరిత్రకు పరిచయ వాక్యాలు రాస్తూ స్మరించుకున్నారు.

 ముదిగంటి జగ్గన్న శాస్త్రి గార్లవంటి రచయితలు గాంధేయులు; గాంధేయ సాహిత్యాన్ని తెలుగువారికి అందించడంలో కృషిచేసినవారు.   

డాక్ట ర్‌ రాధా కృష్ణన్ గాంధీజీ సప్తతి జన్మదినోత్సవానికి తయారుచేసిన “గాందీ _ గాంధీత్‌ త్రము” అన్న (గంథానికి “యహోత్తాజీ”ి అన్న “పేరుతో ముదిగంటి జగ్గన్న శాస్త్రిగారి అనువాదం ముఖ్యమైనవి.

గాంధి  నీతిమందిరి (1926) అన్న (గంథంలో అవాదో అకారాదిగా గాంధిగారి (పవచనాలు యివ్వబడ్డాయి. ముదిగంటి జగ్గన్న శాస్త్రీ, శనివారపు సుబ్బారావు గార్ల సంపాదకత్వాన వెలు వడిన యీ (గంథంలో Young India, Navajivan పత్రిక లలో గాంధి గారు (వాసిన (పవచనాలు -సీకరించి (వకటించబడ్లాయి. 

  జగ్గన్న గారు తణుకులో పల్లెటూరు (గంథమౌాల ప్రారంభించారు . కాని ఆదరణ తక్కు_వై పోయినది, “1925 లగాయతు 1981     వరకు పల్లెటూరు (గంథమండలి పేరిట షుమారు 15 పుస్తకములను (వాసి ఆంధ భాపామతల్లీని సేవించితిని.”” వేలూరి శివరామ శాొ(న్త్హ్‌ గారు విశ్వదాత ( పేరణవల్ల గాంధీగారి “ఆత్మకథ” ను భాపాంతరీక రించినాడు, జగ్గన్న ‘శా స్రిగా రు స్యయము గా నే నెహూ గారి “ఆత్మకథ నుఅనువదించి నాడు. ఇది మొదటి దానికం టే సాఫీగాఉంది, ఈ. రచన గూర్చి డాక్టరు పట్టాభిగారిట్లాఅన్నారు. “ఆంగ్ల గంథ మ లను తెనిగించునప్పుడు, తెనుగు తర్జుమా లాగా ఉండక  మూలమే తెనుగా అనివీంచవలెసు.” జగ్గన్న గారు అనేక మార్లు శ్రికృన్ణజన్మస్థానా నికి పోయిన వాడు!

  జగ్గన్న శాస్త్రి గారు మానవ యంత్రము ,ఉద్యోగమూ ,గాంధీ సూక్తులు ,గాంధీ -గారడీ ,గాంధీ హృదయం ,సంతోషములేక ?నెహ్రు ఆత్మకధ ,కురళ్ లేక తిరువల్లువార్ సూక్తులు ,వినాయకసావర్కార్ ,రామ తీర్ధ మొదలైన ఉత్తమ గ్రంధాలు రాశారు .ఇంతకంటే వారిపై సమగ్ర విషయాలు తెలియలేదు 

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

భారతీ నిరుక్తి.10వ భాగం.15.7.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ అయ్యదేవర కాళేశ్వర రావు గారి నా జీవిత కథ.7వ భాగం.14.7.22

శ్రీ అయ్యదేవర కాళేశ్వర రావు గారి నా జీవిత కథ.7వ భాగం.14.7.22 n

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-9

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-9

         వలస

అమృతబజార్ పత్రికకు మూడేళ్ళలోనే విస్తృత పాఠకలోకమేర్పడింది .అభిప్రాయాలు వ్యాసాలూ సూటిగా ఉండటం ,కౌలుదార్ల ,భూస్వాముల సమస్యలు చర్చించటం తో అభిమానపాత్రమైంది .పత్రికకు ఆర్ధిక సాయం అందించటానికి జనం క్యూ కట్టారు .1871లో బెంగాల్ అంతటా మలేరియా  కోరల్లో చిక్కింది .బెంగాల్ లో ఇదే మొదలు అంటువ్యాధి ప్రబలటం ..జేస్సూర్ జిల్లా అతలాకుతలమైంది .అమృతబజార్ గ్రామం లో ప్రతి యింటినీ  బాధించింది .నిర్దిష్టమైన చికిత్స లేదు. కర్పూరం అప్పుడు అందరాని వస్తువు .దేశవాళీ మందులతో ఉపశమనం పొందినా మళ్ళీ తిరగబెట్టేది .అనేకమంది చనిపోవటం సోకినవారి కాయకస్టా నికి పనికి రాని నీరసంతో ఉండటం జరిగింది .దీనికి తోడూ వరదలూ ముంచెత్తాయి .పంటనాశనం పశునష్టం లెక్కలేకుండా పోయింది .నీరు నిలిచి మలేరియా దోమలకు అవాసాలుగా మారాయి .పత్రిక కూడా కష్టాలపాలైంది .కార్మికులూ బాధపడి ముద్రణ కుంటుపడింది .వర్షాకాలం వరదలు మరీ భీభత్సం సృష్టించాయి .

  కనుక పత్రికను కలకత్తాకు తరలించాలని ఘోష్ సోదరులు భావించి ,చేతిలో దమ్మిడీకూడా లేక ప్రెస్ అమ్మేయాల్సి వచ్చింది .మోతీలాల్ దగ్గరవున్న రెండువండలు ,ఊర్లో షావుకారు దగ్గర అప్పు చేసిన మరోవంద మొత్తం మూడు వందల రూపాయలతో 30మంది కల ఆకుటుంబం  కలకత్తా చేరి,బజార్ క్వార్టర్ లో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని దిగారు .మళ్ళీ పత్రిక ముద్రించాలని సంకల్పం కలిగి ,ఒక ప్రెస్ 600రూపాయలకు అమ్మకానికి వస్తే ,శిశిర్ కుమార్ చాకచక్యం తో కమీషన్ ఏజెంట్ గా మారి 800 రూపాయలు సంపాదించగా  ప్రెస్ కొన్నారు .ఈచేతి యంత్రాల ప్రెస్ తో కలకత్తాలో మొదటి అమృతబజార్ పత్రికను 21-9-1871న ముద్రించారు .ఇందులో శిశిర్ కుమార్ ‘’ఎన్నో వ్యయప్రయాసలు పడి,పత్రిక స్థాపించి నిలబడి అందరి మన్ననలు పొంది పల్లెనుంచి ఇప్పుడు తప్పని సరి పరిస్థితుల్లో ఈ పట్టణం నుంచి ముద్రిస్తున్నా మా అభిప్రాయాలలో మార్పెమీలేదు.కలకత్తా పౌరులు దయాపూరిత హృదయాలతో పత్రికను ఆహ్వానించాలని కోరుతున్నాం ‘’అని రాశాడు  .1874వరకు తామున్నబౌ బజార్ లోని  ఇంటి నుంచే పత్రిక ముద్రించారు .1874లో ఉత్తరకలకత్తా లోని బజార్ క్వార్టర్స్ లో విశాలమైన పురాతనమైన ఇంటిని అద్దెకు తీసుకొని .జర్నలిజం చరిత్ర చరిత్ర సృష్టించిన ఈపత్రిక ఉన్న గృహం కాశీం బజార్ మహారాజుది  .నెలకు 40రూపాయలు అద్దె.50ఏళ్ళు ఇక్కడి నుంచే అమృతతబజార్ పత్రిక వెలువడటం మరో చరిత్ర ప్రసిద్ధమైన విషయం .ఇదే ఘోష్ సోదరుల  నివాసంకూడా..తర్వాత అదే వీధిలో స్వంతభవనం కట్టుకొన్నా ,దీన్ని అద్దె భవనంగానే ఉంచుకొన్నారు .

  దేశీయోద్యమం లో ఎందరెందరో మహానుభావులు దేశ ,విదేశాలనుంచి ఈ ఇంటికి వచ్చేవారు  .ప్రఖ్యాత బెంగాలీకవి నవీన్ చంద్ర ఈ భవనం గురించి రాస్తూ శతాబ్ద కాలం మరమ్మతులు ఎరగని భవనం అన్నాడు .మెమరీస్ ఆఫ్ మోతీలాల్ పుస్తకం లో పరమానంద దత్తు ‘’కింద ,పై అంతస్తులనిండా ప్రింటింగ్ కు సంబంధించిన సామగ్రి  గుట్టలు గుట్టలుగా ఉండేది .దుర్వాసన ,దుమ్ముతో ఉండేది .అపరిశుభ్రత కు నిలయం మెట్లు చాలాయిరుకు .మెట్లను కానీ గదులనుకానీ ఒక్కసారి కూడా ఊడ్చిన దాఖలాలు లేవు .మొదటి అంతస్తు వరండాలో మట్టికొట్టుకుపోయిన టేబుల్,విరిగిన కుర్చీపై మొకాళ్ళమధ్య  గడ్డాన్ని ఆనించి ఒక చిన్న మనిషి ‘’బ్రిటిష్ పాలకుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తించే అపార సామర్ధ్యం కల వ్యక్తీ కూర్చున్నాడు .మోతీలాల్ అనే ఈ సామాన్యవ్యక్తి ఒక మామూలు కాగితం ,సాదా పెన్ను తో రాజకీయ ఆయుధాలు విసురుతున్నాడు .ఆయన మకిలి పట్టిన ఎర్ర బోర్దరున్న సాదా పంచ ,బొత్తాలులేని తెల్లచొక్కాతో ఉన్నాడు.ఆయన పక్కన మరో బెంచి, నల్లులమయమైన ఒక చెయ్యివిరిగిన ఇంకో పాతకుర్చీ ఉన్నాయి .సీలింగ్ ల పై మరకలు సాలె గూళ్ళు ,గోడలపై ఉమ్మి మరకలు ,ఇంకా ఎన్నెన్నో మచ్చలు ఉన్నాయి .గది అంతా దర్రీ పరిచి దానిపై దుప్పట్లు పరిచారు .దుప్పట్లు వగైరాలు ‘’మేము చాకలాడి మొహం చూసి ఎరగం ‘’అని మొత్తుకొంటున్నాయి.అలాంటి గదిలో తమ పాదముద్రలతో పవిత్రం చేయని దేశ ప్రముఖుడు ఎవరూ లేరు .లోపలిగదులు మరీ దారుణం అని విన్నాను ‘అని రాశాడు .

  ఘోష్ కుటుంబం కలకత్తా చేరేనాటికి దాని జనాభా 10లక్షలు .బెంగాలీలమెజారిటి తక్కువ -1.3శాతం .రాజకీయ వాణిజ్యాదికారాలన్నీ బ్రిటిష్ వారి చేతుల్లోనే ఉన్నాయి .టెలిగ్రాఫ్ రైల్వేలకూ వారే అధిపతులు .వ్యాపార వాణిజ్యాలలో కొద్దిమంది అమెరికన్లు యూదులు గుజరాతీలు ,ముస్లిం లు ఉండేవారు .కార్మికులంతా బీహార్ యుపి ఒరిస్సా ల నుంచి వచ్చిన వారే .బెంగాలీలలో ఎక్కువమంది గుమాస్తాలు టీచర్లు లాయర్లు  డాక్టర్లు .ఇంగ్లీష్ విద్యకు ఆనగరం గొప్ప కేంద్రంగా ఉంది .1872నాటికి జిల్లా ముఖ్య పట్టణాలైన జెస్సోర్ ,ఢాకా,కృష్ణనగర్ ,మిడ్నపూర్ ,మెమెన్ సింగ్ ,ర౦గపూర్ ,పాట్నా లలో జాతీయోద్యమం  జీర్ణించు కొన్న  విద్యావంతుల వర్గం ఏర్పడింది .స్టేట్స్ మన్,ఇండియన్ డైలీ న్యూస్ ,దిఇంగ్లీష్ మాన్ పత్రికలు బ్రిటిష్ వారికి కొమ్ముకాసేవి .దిహిందూ ,పెట్రియట్,ఇండియన్ మిర్రర్ ,దిబెంగాలీ అనే ఇంగ్లీష్ పేపర్లు బాగా ప్రాచుర్యం పొందాయి .బెంగాలీ పత్రికారంగానికి సోంప్రకాశ్ , వారపత్రిక సులభ ఫా సమాచార్ ,అమృతబజార్ పత్రిక ప్రాతి నిధ్యం వహించాయి .పత్రిక నడపటం ఈ మహానగరం లో చాలాకష్టంగా ఉండేది .దీనికి తోడూ ఆదాయం పై పన్ను పెంచి ప్రభుత్వం మరీ ఇబ్బంది పెట్టింది .దీన్ని అన్ని పత్రికలూ నిరశి౦చాయి  .అమృతబజార్ పత్రిక మాత్రమె సమర్ధించగా ,చాలామంది ధనికులు ఆ పత్రిక కొనడం మానేశారు .దిగువ తరగతి ఆడాయవర్గాలు పత్రికే ను  బాగా ఆదరించి వెన్ను దన్నుగా నిలబడ్డారు .రాజాదిగంబర సింగ్ లాంటి సంపన్నులు పత్రిక సర్క్యులేషన్ పెంచటానికి బాగా కృషి చేశారు .కలకత్తా హైకోర్ట్ ప్రముఖ న్యాయమూర్తి ద్వారకానాద్ మిత్రా కూడా అండగా నిలిచాడు .కానీ ఆయన ఒకసారి ‘’మీ పత్రికలో ఉగ్రవాదం అంతర్లీనంగా ఉంది ముందుముందు ప్రమాదంగా మారచ్చు ‘’అని అంటే ‘ప్రజలలో వారి అస్తిత్వాన్ని తెలుసుకోనేట్లు చేసి ,వివేచనా దేశ భక్తీ కలిగించటం మా పత్రిక లక్ష్యం ‘’అని శిశిర్ కుమార్ దీటుగా బదులిచ్చాడు .ఈ విధానాన్నే తర్వాతకాలం లో అన్ని పత్రికలూ అనుసరిచటం వలన అమృతబజార్ పత్రిక మార్గ దర్శనం చేసింది .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-7-22-ఉయ్యూరు  

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

భారతీ నిరుక్తి.9వ భాగం.14.7.22

భారతీ నిరుక్తి.9వ భాగం.14.7.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారి నా జీవిత కథ.6వ భాగం.13.7.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-8

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-8

   అమృతబజార్ పత్రిక ఆవిర్భావం -2

ప్రజలపై పాలకులు ,అధికారులు చేస్తున్న అన్యాయాలను బహిర్గతం చేస్తూ ,కొద్దికాలం లోనే అమృతబజార్ పత్రిక బాగా ప్రాచుర్యం పొందింది .దొరలకు ఎక్కడో కాలి ఘోష్ కుటుంబానికి గుణపాఠం చెప్పాలని అనుకోగా పత్రిక మిత్రవర్గం బాగా విస్తరించింది .న్యాయవాదుల అధ్యాపకుల ప్రజల మద్దతు బాగా వచ్చింది .నాలుగు నెలలకే పత్రికపై పరువు నష్టం దావా వచ్చింది .పత్రికలో ఒక మిత్రుడు యూరోపియన్ అధికారిపై విమర్శ రాయటమే కారణం .ఎడిటర్ పై కేసుపెట్ట టానికి ప్రాసిక్యూషన్ తటపటాయించి ,మోతీలాల్ ను సాక్షిగా పెట్టారు .మాజిష్ట్రేట్ స్వయంగా క్రాస్ ఎక్సామినేషన్ చేసినా సంపాదకుడు ఎవరో తేలలేదు .ఎవరు సంపాదకుడు అని అడిగితె మోతీలాల్ పెట్టి నాలుగు నెలలే అయింది ఇంకా సంపాదకుడిని పెట్టలేదని చెప్పాడు .శిశిర్ కుమార్ సంపాదకుడు అని అంటున్నారు అనగా, బాగా రాస్తాడుకనుక అలా ప్రజలు  భావించారు అని సమాధానం .ఆయన ఇంగ్లీష్ బాగా రాయగలడా అంటే ,బాగా జీతాలు తీసుకొనే ప్రభుత్వ ఆఫీసర్లకంటే బాగా రాయగలడు అని సమాధానం ..పత్రిక తరఫున డిఫెన్స్ వకాల్తా కలకత్తాకు చెందిన ప్రముఖ ప్లీడర్  మదన్ మోహన్ ఘోష్ .ఎనిమిది నెలలు కేసుకోనసాగి ఘోష్ సోదరులు నిర్దోషులని కోర్టు తేల్చింది .అయితే ముద్రాపకుడికి ఆరునెలలు రచయితకు ఏడాది శిక్షపడింది .సాక్ష్యాధారాలు గల్లంతు చేశారని మళ్ళీ ప్రాసిక్యూషన్ సాగితే కేసు విఫలమైంది .ఘోష్ సోదరులు ఈ దావాతో తీవ్రంగా ఆర్ధిక చిక్కుల్లో పడ్డారు .మిత్రుల ప్రోద్బలం తో పత్రిక యధావిధిగా కొనసాగింది .

   1869లో ఇంగ్లీష్ లో కూడా పత్రిక వెలువడి ద్విభాషా పత్రిక అయింది .అప్పటి బెంగాల్ ప్రెసిడెన్సిలో బెంగాల్ బీహార్ ఒరిస్సాలు కూడా ఉండేవి .పత్రిక బాగా విజయం పొందింది .1871కి ఆర్ధికంగా బలపడింది .సిబ్బందికి మంచి జీతాలిస్తూ అనవసర ఖర్చులు తగ్గించుకోవటమే ఈ విజయ రహస్యం .సగటు ప్రజల హృదయాలలో అమృతబజార్ పత్రిక సుస్థిర స్థానం సంపాది౦చి౦ది .నిరాడంబరత్వం ఘోష్ కుటుంబానికి ఆదర్శం .

  తూర్పు భారతం లో కీర్తనలకు మంచి పేరుంది .శిశిర్ కుమార్ ద్విపద కర్తకూడా .చైతన్యుని జీవిత చరిత్రను ‘’అనియామివై ‘’కావ్యంగా రాశాడు .బెంగాలీ సాహిత్యం లో ఇదొక గొప్ప ఇతిహాసం .గ్రామం లో ఉన్నప్పుడూ ,కలకత్తా లో ఉండగానూ ఘోష్ కుటుంబం లో సాయంత్రం వైష్ణవ భజనలు తప్పక జరిగేవి .

  ఘోష్ సోదరులు ఆధ్యాత్మిక చింతనపై కూడా దృష్టిని కేంద్రీకరించారు .మోతీలాల్ చిన్నతమ్ముడు హీరాలాల్ ఎప్పుడూ ఏదోపోగొట్టుకోన్నవాడిగా విచారంతో ఉంటూ 1886లోఆత్మా హత్య చేసుకొన్నాడు .తండ్రిమరణం తో పాటు ఈతమ్ముడి మరణం వలన కుటుంబంలో విచారం పెరిగింది .శిశిర్ అమెరికావెల్లి భూతవైద్యం నేర్చుకోవాలి అనుకొంటే ,మిత్రులు దానికి సంబంధించి జ్ఞానాన్ని అందించారు .తర్వాత ఆధ్యాత్మిక సదస్సులు నిర్వహించాడు .1908 లో హిందూ స్పిరిట్యువల్ అనే మేగజైన్ లో ఆయన రాస్తూ ‘’ఇక్కడే లో ఆధ్యాత్మిక వాదాన్ని మనమే మొదలుపెట్టాం .సదస్సులు గోష్టులు గ్రామాల్లోనే జరిపాం .ఇవి తెలుసుకొని కలకత్తాలోని మిత్రులు బాగా ప్రచారం చేసి దేశం లో తీవ్ర సంచలనం కలిగించారు .పల్లెలకు పట్టణాలకు సమాచారం బాగా చేరింది .అమృతబజార్ గ్రామం లో చనిపోయిన వారితో ప్రజలు మాట్లాడుతున్నారు అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు ‘’అని తెలిపాడు .

   భూతవైద్యం ,అతీత శక్తుల విజ్ఞానం నేర్చుకొనే సమయం మోతీలాల్ కు లభించలేదుకానీ మిగిలిన సోదరులు అందులో నిష్ణాతులయ్యారు .హేమంతకుమార్ కొడుకు మృణాల్ కాంతి 1954లో చనిపోయే నాటికి ఆరంగంలో గణనీయంగా అభి వృద్ధి చెందాడు .మరణానంతర జీవితం పై అతడు రాసిన ‘’పరలోక్ కధా’’పుస్తకం విపరీతంగా అమ్ముడయింది .జాతర ,ఆరుబయట రంగస్థలాలు బాగా ఉన్న ఆకాలం లో ఘోష్ సోదరులు తమ గ్రామం లో రంగస్థల నాటకాలను బాగా ప్రోత్సహించి పోషించారు .ఉన్నతప్రమాణాలతో వారి నాటకాలు ఉండేవి .ప్రసిద్ధి చెందిన నటులు అనేకప్రాంతాలనుంచి వచ్చి నటించేవారు .’’నీల్ దర్పణ్’’నాటకరచయిత దీనబంధు మిత్రాకూడా ఈనాటకాలలో పాల్గొనే వాడు .ఆగ్రామ ప్రజల్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకు వెళ్ళే కృషి ఘోష సోదరులు చేశారు .

  1869లో మోతీలాల్ వివాహం నాదియాజిల్లాలోని కుమారఖలికి చెందిన వధువు తో జరిగింది .సోదరులు బ్రహ్మ సమాజ సభ్యులు కాకపోయినా ఛాందసులు కక్షకట్టి క్రైస్తవం పుచ్చుకున్నారనే కట్టు కధ ప్రచారం చేసి పెళ్ళికూతురు వాళ్ళకూ తెలిపారు .అందులో నిజానిఆలు వారు గమనించి ‘’లైట్ తీసుకొని ‘’ హాయిగా పెళ్లి చేసి సుఖాంతం చేశారు .గ్రామీణ కక్షలు ఎలా ఉంటాయో ఎంత విపరీతానికి వొడగట్టుతారో మోతీలాల్ వివాహం రుజువు చేసింది .ఈ దంపతులకు 1876’’సజల నయన ‘’అనే కూతురు పుట్టింది .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -13-7-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

భారతీ నిరుక్తి.8వ భాగం.13.7.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ అయ్యదేవర కాళేశ్వర రావు గారి నా జీవిత కథ 5వ భాగం.12.7.22

శ్రీ అయ్యదేవర కాళేశ్వర రావు గారి నా జీవిత కథ 5వ భాగం.12.7.22

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

రమణీయం దశావతార ‘శ్రీదేవీ’’భాగవతం కమనీయం

 సుమారు పది హేను రోజులక్రితం కీ.శే .ముళ్ళపూడి వెంకటరమణ గారి అర్ధాంగి శ్రీమతి శ్రీదేవి గారు  హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి ,తాను  రాసిన భాగవతం పుస్తకం ఆవిష్కరణ జరుపుతున్నామని ,అవగానే ప౦పిస్తానని చెప్పారు. శుభం భూయాత్ అన్నాను .న్యాయంగా ఆమె నాకు అలా చెప్పాల్సిన పని లేదు అది వారి  సౌజన్యమే . నాకంటే మా శ్రీమతి ఆపుస్తకం రాక కోసం ఎదురు చూసింది ఆమె రామాయణం చదివిన అనుభూతితో .అన్నట్లుగానే నిన్న సాయంత్రమే ‘రమణీయ శ్రీ భాగవతం ‘’-దశావతారాలు ‘పుస్తకం అందింది .అందిందని వాయిస్ మెసేజ్ లో తెలియజేశాను .ఇవాళ ఉదయం చదివి, స్పందిస్తున్నాను  .

  బాపు –రమణ లు రామాయణ భాగవతాలను పుడిసిళ్ళ కొద్దీ గ్రోలిన వారు .వారిద్దరుఏదిరాసినా ,గీసినా ,చెప్పినా  వాటిలోని పరమార్ధమే అంతరార్ధంగా ఉంటుంది .ఆ తానులోని వారే శ్రీదేవి గారు .ముందుగా ‘’రమణీయ రామాయణం ‘’రాసి తమ రామాయణ భక్తి తాత్పర్యాలు నిరూపించారు .ఇప్పుడు ఈ భాగవత మందారమకరందం తానూ గ్రోలి ,మనకూ పంచి పెట్టారు .ఆనాడుసూతుడు శౌనకాది మునులకు పురాణాలు ప్రవచిస్తే ,ఈనాడు ‘’స్త్రీ సూతుడు ‘’సూతి’’ అనచ్చా ?శ్రీదేవిగారు మనవళ్ళకు మనవరాళ్ళకేకాక  సమస్త బాలబాలికలకు హృదయంగమంగా ఈ  దశావతారాలను ఆధారంగా చేసుకొని భాగవత కథా పరమార్ధాలను వాళ్ళ స్థాయిలో ‘ఒక నానమ్మ,ఒక అమ్మమ్మ ఒక అవ్వ ‘’ బువ్వ పెడుతూ ముద్దుగా చెప్పినట్లు హృద్యంగా చెప్పారు . వ్యాసుడు, తెలుగు వ్యాసుడు పోతన్నగారు బుద్ధుడి గురించి చెప్పలేదు కనుక తానూ ఆయన జోలికి పోలేదన్నారు .  .దశావతారాలను శీర్షికగా పెట్టి జయదేవుని అష్టపదిలోని అవతార శోక్లాలను సందర్భోచితంగా ,చిత్రాలతో సహా పొందు పరచారు .పోతన్న గారి రసగుళికల వంటి పద్యాలను చేర్చి రచన రక్తి కట్టించారు .పిల్లలు అడిగే  ప్రశ్నలకు  జవాబు చెబుతున్నట్లుగా ,కథనం చేయటం ఆకర్షణీయం .అవతార పరమార్ధాలనూ  చక్కగా విడమర్చి చెప్పారు .మత్స్యా వతార ఆవశ్యకత గురించి చెబుతూ ‘’వేదాలు సృష్టి నిర్మాణానికి మూలాధారాలు .సమస్త విజ్ఞానం,శాస్త్రాలు వాటిలో ఉన్నాయి .మన బతుకుకు కావాల్సిన విజ్ఞానం అంతా వాటిలో ఉన్నాయి. అవి లేకపోతె గందరగోళమే.సోమకాసురుడు వేద విజ్ఞానాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని ఆధిపత్యం చలా ఇంచటానికి వేదాలను దొంగిలించాడు .అందరికీ అందు బాటులో ఉండాల్సినవి ఒక్కడి చేతిలో ఉంటె అనర్ధం కనుక విష్ణువు మత్స్యా వతారం పొంది వాడిని, సంహరించి వేదోద్ధరణ చేశాడు ‘’ అని మనసుకు హత్తుకునేట్లు చెప్పారు .లోకాస్సమస్తా స్సుఖినో భవంతు అన్న మన ఆదర్శాన్ని వివరించారు .వ్యాసుడు వరాహావతారం ము౦దుచెప్పి ,నారసింహ కూర్మ వామనావతారాల తర్వాత మత్స్యావతారం చెప్పాడు అని కూడా వివరించారు .పోతనగారు కూడా అలానే చెప్పారు  మిగిలినవారెవరూఅలా చెప్పలేదు .

  అశ్వత్ధామ చేసిన పరమకిరాతకానికి కొడుకుల్ని పోగొట్టుకొన్న ద్రౌపది వాడి కర్కశ హృదయం కరిగిపోయేట్లు దుఃఖిస్తూ ‘’ద్రోణునితో శిఖిం బడక ద్రోణ కుటుంబిణి యున్నదింట ‘’వీడిని కట్టి తెచ్చినందుకు ఆతల్లి ఎంత పరితపిస్తోందో అని సహ వేదన చూపించి పాండవుల్ని బ్రాహ్మణ హింస పాపం అని చెప్పి వారించిన పోతనగారి పద్యం ఉదాహరించటం సందర్భ శుద్ధి, వెయ్యి మాటలపెట్టు ఆ పద్యం .

  నారసి౦హావతారం లో ప్రహ్లాద చరిత్రలో పోతనగారి రంగారు బంగారు పద్యాలు వివరిస్తూ తేనెల సోనలు అందింఛి పోతనకవితామృతాన్ని పంచారు .గజేంద్ర మోక్షం ,వామనావతారం ల  లో బాపు గారి కమనీయ చిత్రరాజాలూ పొందుపరచి కళ్ళకు కట్టించారు .’’రవి బి౦బ౦బుప మింప పాత్రమగు ఛత్రమై ,శ్రవణాలంకృతియై’’పద్యానికి’’ బామ్మ ‘’అదే నండీ బాపుగారి బొమ్మ అత్యద్భుతంగా పండింది . ధర్మ విగ్రహుడు ,మర్యాదా పురుషోత్తముడు అయిన శ్రీరాముని రామావతారం ఆమెకు కొట్టిన పిండే.రాముని  శివధనుర్భంగం ,బాపు రమణీయ చిత్రంతో పరమ రామణీయకమైంది .సుందరకాండలో సీతామాత ను హనుమ దర్శించటం చరితార్ధకం గా ఉంది చిత్రంతో సహా .బాపుగారి మాగ్నం ఓపస్ చిత్రం శ్రీరామ పట్టాభిషేకం అన్ని  భావాల సమ్మిళనం .దాన్ని వివరించిన విధానమూ ఒక నిధానం గా ఉంది .

  శరశ్చంద్ర ప్రభువు శ్రీ కృష్ణావతారం శారీరక మానసిక ఆహ్లాద ఆనంద ప్రదానం .ఆ పేరులోనే అనంతమైన ఆకర్షణ ఉంది .పులకింతే కలుగుతుంది .కన్నయ్యకతలు పిన్నయ్యలకు మహారుచి .అంతే రుచికరంగా వర్ణించారు .’’అమ్మా మన్ను తినంగ నే శిశువునో ‘అన్న పద్య భావం, బాపు దానికి తగినట్లు గీసిన చిత్రం కనులకు మిరుమిట్లు గొల్పేవే .బాల కిట్టమ్మ  నోటిలోయశోద చూసిన సకల భువనాలు,పొందిన లోకోత్తర అనుభూతి చిత్ర హృదయం చిత్త హృద్యంగా ఉన్నాయి . గోపాలురతోకలిసి ‘’కిత్తమూర్తి మామయ్య ‘’చల్దులు ఆరగించటం ,తెలుగు ఊరగాయలు తినటం పోతనగారు తెలుగు భోజనం రుచి చూపించారు దానినే శ్రీ దేవి గారిక్కడ పొందుపరచారు .ఇక్కడ నాకొక విషయం జ్ఞాపకం వస్తోంది .కరుణశ్రీ గారు ‘’భాగవత వైజయంతిక ‘’లో ఈ ఘట్టాన్ని పేర్కొని, వ్యాసుడు ‘’కృష్ణయ్యా !నువ్వు మరీ తెలుగు వాడివి అయిపోయావయ్యా ‘’అని వెండి గడ్డాన్ని నిమురుకొంటూ ,ముసిముసి నవ్వులు నవ్వాడట.కాళీయయమర్దనమూ బాగుంది చిత్రంతో పాటు .రాసలీలా విలాసాన్నీ రసకందాయంగా ,పోతన శృంగారరస భరిత పద్యాలనాధారంగా రాయటం బాగుంది .’’కిటియై కౌగిట చేర్చెను –వటుడై వర్ధిల్లి కొలిచే వడి కృష్ణుం డై-ఇట పద చిహ్నము లిడెకిం-దటిబామున నేమి నోచితిమమ్మ ధరిత్రీ ‘’అని తమకు దక్కని ఆదివ్యానుభూతి భూమాతకు దక్కిందని అది ఆమె పూర్వ జన్మ సుకృతమనీ భావి౦చారు గోపికలు .మురళీ గానం లో లోకమంతా పరవశించింది .అలాగే శ్రీ కృష్ణ కర్ణామృతం లోని లీలాశుకుని  భక్తి పారవశ్య శ్లోక౦’’అ౦గనామంగనా మంతరే మాధవో –మాధవం మాధవం చాంతరే ణా౦గనే-ఇత్ధ మాకల్పితే మండలే మధ్యగః –సంజగౌ వేణునా దేవకీ నందనః ‘’ చేర్చి మనోహరం చేశారు .ఆనీబిసేంట్ చెప్పినట్లు రాసక్రీడ ‘’రిబాల్ట్రీ’’కాదు అది జీవేశ్వరాను బంధం . ‘’.రుక్మిణీ కల్యాణం ,శ్యమంతకోపాఖ్యానం ,నరకాసురవధ ,సత్య అవక్ర ధనుష్ పాండిత్యం ,ఆమె ‘’రోష రాగోదయా విరాట భ్రుకుటి,మందహాసములతో చూపించిన వీరం ,శృంగారం ను మురిపెంగా వర్ణించి సత్యాకృష్ణుల గాఢ అనుబంధాన్ని బాపు బొమ్మ ఆధారంగా రక్తి కట్టించారు .కల్కి అవతారంతో సమాప్తి చేస్తూ,ఫలశ్రుతికూడా చెప్పి అర్ధవంతమైన శ్లోకం పొందు పరచారు –‘శిష్ఠ జనావన దుష్టహర ఖగ తురగోత్తమ వాహన తే –కల్కి రూప పరిపాల నమో భక్తం తే పరిపాలయ మాం –నామ స్మరణా దన్యోపాయం నహి పశ్యామో భవతరణే –రామహరే కృష్ణ హరే తమనామ వదామి సదా నృహరే ‘’.

కృష్ణ పరమాత్మ జగద్గురువు .’’ది లార్డ్ ఆఫ్ ఆటం మూన్స్ ‘’-శర శ్చంద్రప్రభువు’’.ప్రేమ ప్రేమకోసం ,విధి కర్తవ్య నిర్వహణకోసం అనే సత్యాన్ని ప్రపంచ చరిత్రలో మొదటి సారిగా గ్రహించి ప్రకటించిన ప్రధమ ఆచార్యుడు .ఆదర్శ గార్హత్యం ,ఆదర్శ సన్యాసం ఆయనలో చూస్తాం .ది మాస్టర్ స్టేట్స్ మన్  ,ది అన్ క్రౌన్డ్ మోనార్క్ ,దికింగ్ మేకర్ హు హాడ్ నో ఆమ్బిషన్ ఫర్ హింసెల్ఫ్ .ఆయన రసో వై సః‘’అన్నారు స్వామి త్యాగీశానంద .ఇలాంటి లోకోత్తర పురుషుని క్రీ డావిన్యాసమే భాగవతం. భక్తి ప్రకాశం .సుందర  పుష్పం .భక్తి సిద్ధాంత మహాద్భుతసారం .ఇంతటి ఉత్కృష్ట గ్రంథాన్ని అత్య౦త  సులభశైలిలో అరటి పండు వలిచి పెట్టినట్లు ,ముఖ్యమైన  కథలైన అజామిళ ,అంబరీష ,కుచేలాదులను కూడా రసవత్తరంగా వివరించి పరమభాగవతోత్తమురాలై ధన్యురాలయ్యారు శ్రీదేవి గారు .పోతన గారు చేయిపట్టుకొని నడిపించినట్లుంది .మా నూజివీడు రసాలు ,పనసతొనలు ,తెనేతోమాగిన తియ్యమామిడి ,పచ్చకర్పూరం వేసిన పరమాన్నం తిన్నట్లు ,పంచదార పానకం తాగినట్లు అనుభూతి కలుగుతుంది . దశావతారాల విష్ణు మూర్తి ముఖ చిత్రం ,పాలనురగవంటి స్వచ్ఛ మైన కాగితాలపై స్కాలిత్యం లేని ముద్రణ పుస్తకానికి మరింతశోభ చేకూర్చాయి .అందుకే ‘రమణీయం దశావతార శ్రీ దేవీ భాగవతం కమనీయం ‘’అన్నాను . కలం దించకుండా మరిన్ని అర్ధవంతమైన ,మన సంస్కృతీ ప్రతి బి౦బాలైన రచనలు శ్రీదేవి గారు చేయాలని ఆశిస్తున్నాను .శుభం భూయాత్ .

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -12-7-22-ఉయ్యూరు 

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

భారతీ నిరుక్తి.7వ భాగం.12.7.22

భారతీ నిరుక్తి.7వ భాగం.12.7.22

Video link

Posted in రచనలు | Leave a comment

శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారి నా జీవిత కథ 4వ భాగం.11.7.22

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-7

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-7

  మోతీలాల్ ఘోష్ బాల్యం విద్య

28-10-1847 న మోతీలాల్ ఘోష్  బెంగాల్ లోని పాలువా –మగురా అనే ఉన్నతకాయస్త మధ్యతరగతి కుటుంబం లో జన్మించాడు. తల్లిపేరు అమృతమయీ పేరిట ఆ గ్రామం ‘’అమృత బజార్ ‘’గా మారింది .తండ్రి హరినారాయణ ఘోష్ జేస్సూర్ పట్టణం లో ప్లీడర్ .యుగాలక్రితం ఉన్న రాజప్రతినిధి పేర  ఆ పట్టణం కు ఆ పేరువచ్చింది .ఆనాటి ఒక భూస్వామి ఆరాజ్యాన్ని అక్బర్ కలిపేసుకో బోతుంటే సేనలతో పోరాడినందుకు ఆపేరు .మరో పౌరుషం గల రాజు సీతారాం ఆస్థానం కూడా అక్కడే ఉంది.యితడు స్వతంత్ర ప్రతిపత్తికోసం ప్రయత్నించి విఫలుడయ్యాడు .మోతీలాల్ పుట్టినప్పుడు ఈ జిల్లాకు చాలా ప్రాముఖ్యం ఉంది .ఇది ఇండిగో భారీఉత్పత్తి కేంద్రం కూడా .తాడిచెట్లనుంచి చక్కర ,బెల్లం ఉత్పత్తి చేసేవారు .దీని సరిహద్దు సుందర్బన్ అవతల బంగాళాఖాతం ఉంది .ఇవన్నీ వారి బాగా పండే బంగారు భూములు .ప్రభుత్వ ఉప్పు  కర్మాగారాలు కూడా ఎక్కువే .ఈజిల్లా ఎగువ ప్రాంతాలలో శతాబ్దాలక్రితంనుంచి గ్రామలేర్పరచుకొని గ్రామస్తులున్నారు .వీరు దిగువ ప్రాంతాలలో వరి పండించే వారు  .అందువల్ల దేశీయ పరిశ్రమలు క్షీణించినా  ఆప్రభావం ఇక్కడ లేదు .వీరి అవసరాలు చిన్నవి నిరాడంబరులు కూడా .1915లో తన వృద్ధాప్యం లో మోతీలాల్ గత స్మృతులను నేమరేసుకొంటూ ‘’నేటి ఘోరాలకు అతీతంగా ఆనాడు జీవితం ఆదర్శంగా గడిచింది .ఆయన స్వగ్రామం  బ్రిటీష్ వారు ‘’కబోదాక్ ‘’గా పిలచిన కలాక్షి నది  చాలా ప్రసిద్ధమైంది .ఇక్కడ ఆయనబాల్యం ఉల్లాసంగా గడిచింది .

  తండ్రి ఎనిమిదిమంది  సంతానంలో నాలుగోవాడు మోతీలాల్ ..పెద్దన్న బసంతకుమార్ మంచి జ్ఞాని .తనవిజ్ఞానాన్ని తమ్ములకు అందించేవాడు .వారికి జర్నలిజం లో ఆసక్తి కలగటానికి ఆయనే కారణం .1862లో ఆయన ‘’అమృత ప్రభాహిని ‘’అనే సంస్కృత పత్రికపెట్టి ,పక్షపత్రికగా నడుపుతూ ,సైన్స్ సాహిత్యం ,పరిశ్రమలు వ్యవసాయం మొదలైన వాటిపై విలువైన సమాచారం అందించాడు .ప్రారంభించిన కొద్దికాలానికే ఆయన చనిపోవటంతో పత్రిక ఆగిపోయింది ..రెండవ అన్న హేమంతకుమార్ కలకత్తా వైద్య కళాశాలలో డాక్టరీ చదువుతూ తండ్రి 1864లో చనిపోవటంతో ఆర్దికంగా కుటుంబం దెబ్బతినటం వలన  డిగ్రీ  తీసుకోకుండా చదువు విరమించాడు .మూడవ అన్న శశి కుమార్ ప్రఖ్యాత జర్నలిస్ట్ గా విశేష కీర్తి పొందాడు .మోతీలాల్ ను తీర్చి దిద్దాడు వీరి తమ్ముడు హీరాలాల్ చిన్నప్పుడే చనిపోయాడు రాం లాల్ కూడా కొద్దికాలమే బతికాడు అందరికంటే చిన్నవాడు గోలప్ లాల్ పత్రికా సంపాదకత్వ బాధ్యతలను మోతీలాల్ తర్వాత చేబట్టి పత్రికా సంపాదకత్వ సంప్రదాయం నిలబెట్టాడు .మోతీలాల్ పెద్దన్నగారి దగ్గరే మొదటి పాఠాలు నేర్చాడు స్థానిక పాఠాశాలలో అన్ని తరగతులు చదివి ,హైస్కూల్ విద్యకు నడియాజిల్లా కేంద్రమైన  కృష్ణ ఘర్ వెళ్ళాడు .ఆజిల్లా నీలిపంటకే కాక ,మిషనరీలకూ ,సనాతన సంస్కృత ఇతిహాస గ్రంధ అధ్యయనానికీ కేంద్రం .అర్ధ –భూస్వామ్య సంపన్నులైన నాడియా మహారాజ సంపన్న కుటుంబాలకు నిలయం కూడా .మహారాజా కృష్ణ చంద్ర పేరిట ఆపేరోచ్చింది .ప్లాసీ యుద్ధంలో ఈయన బ్రిటిష్ వారిని సమర్ధించాడు .విద్య విజ్ఞానాలను బాగా పోషించాడు .ఇంగ్లీష్ ఇక్కడ బాగా వ్యాప్తి చెందింది .1860లో  బ్రహ్మ సమాజానికి చెందిన నాయకులు బ్రహ్మర్షి దేవేంద్రనాధ టాగూర్ ,కేశవ చంద్ర సేన్ లు  సందర్శించారు .వారి ఉపన్యాసాలు హిందూ యువతను ఆకర్షించి బ్రహ్మసమాజ సంస్థ ఏర్పడింది .మోతీలాల్ కూడా చేరాడు .సంఘ సంస్కరణలను బలపరచాడు .హిందూమత ప్రాతిపదికను మాత్రం అన్నల్లాగానే వదులుకోలేదు .

  ప్రవేశ పరీక్ష పాసై స్థానిక కాలేజిలో ఆర్ట్స్ కోర్సు లో చేరాడు మోతీలాల్ .కాలేజీ శలవలకు ఇంటికి నడిచే వెళ్ళేవాడు తిరిగి అలానే వచ్చేవాడు .రానుపోను 160కిలోమీటర్లు .రైలు బస్ సౌకర్యాలు అప్పుడు లేవు .తండ్ర మరణంతో వచ్చిన ఆర్దికసమస్యల వలన ఫైనల్ పరీక్ష రాయలేకపోయాడు .అదే జిల్లాలో పిల్ జంగా అనే ఊరిలో కొత్తగా పెట్టిన నఇంగ్లీష్ హైస్కూల్ హెడ్ మాస్టర్ గా చేరిపని చేశాడు .ఆరోగ్యం దెబ్బతిని స్వగ్రామం చేరాడు .అన్నగార్లు ప్రారంభించిన ఉన్నత పాఠశాల బాలికల పాఠశాల ,వయోజన మహిళా పాఠశాల వ్యవహారాలు  చూశాడు .అగ్రామ అగ్రవర్ణ నాయకులు వీరి సంస్కరణలను దుయ్యబట్టారు .సోదరులు హరిసభ ,బ్రహ్మ సభలు పెట్టి వారి వాదాలను తిప్పికొట్టారు .తర్వాత వీరు వైష్ణవం స్వీకరించారు .

  సోదరుడు భాస్కరకుమార్ అకాల మరణం నాటికి హేమంతకుమార్ శశికుమార్ లు ఆదాయం పన్ను డిప్యూటీ కలెక్టర్లుగా ప్రభుత్వోద్యోగాలలో ఉన్నారు .అయినా ప్రజా చైతన్యం కోసం జర్నలిజం చేబట్టారు .1867లో రాజీనామా చేసి ,బెంగాలీలో ‘’అమృత బజార్ ‘’పత్రిక నడపటానికి నిర్ణయింఛి స్వగ్రామం చేరారు  ఆశతాబ్దం లో అదొక సంచలనమే అయింది .

   అమృతబజార్ పత్రిక ఆవిర్భావం

 20-2-1868న  అమృత బజార్ పత్రిక విడుదల చేశారు .ఇది ముగురన్నదమ్ముల ముద్దు చెల్లెలు .ఒక గ్రామం నుంచి వెలువడిన పత్రిక .ఎలా మొదలు పెట్టారో మోతీలాల్ ఇలా చెప్పాడు –‘’కలకత్తా దగ్గర ఒక వ్యాపారి ప్రింటింగ్ కోసం యంత్ర పరికరం కొని వ్యాపారం లో విఫలుడై ,చనిపోగా ,ఆయనభార్య వాటిని అమ్మేయాలనుకోగా  అప్పుడు అన్నలుకొని జేస్సూర్ లోని చిన్న గ్రామ అమృతబజార్ కు తెచ్చారు .వాటిలో విలువైన ప్రింటింగ్ ప్రెస్ అయిన ‘’బెలీన్ ప్రెస్ ‘’ఉంది .ఖరీదు 32రూపాయలు .ఊళ్ళో ఉన్న వడ్రంగి సాయంతో దాన్ని బిగించారు .అరిగిపోయిన టైపులతో కేసులను స్టాండ్ మీద అమర్చారు .ఇలాగా ఒక కుగ్రామంలో అమృతబజార్ పత్రిక ముద్రణాలయం ఏర్పడింది ‘’అని చెప్పాడు .

  తర్వాత కలకత్తా వెళ్లి ముద్రణ విధానం నేర్చుకొన్నారు .పత్రిక మొదలెట్టాక స్టిక్కులు చేతిలోపట్టుకొని,తమ రచనలు తామే టైప్ చేసుకొంటూ ప్రతులు తామే ముద్రించేవారు .గ్రామంలో కొందరికి కంపోజింగ్ ,ముద్రణా నేర్పినా సోదరులు అన్నిపనులు తామే చేసుకొనేవారు .స్టిక్ లు చేతిలోపట్టుకోవటం ,ముద్రణకు యంత్రం తిప్పటం ,రోలర్స్ టైపులు ఎక్కించటం ,కాగితం ,మాట్రి స్ లు తయారు చేయటం అంతా యజమానులే చూసుకోనేవారు .కాగితం తయారు చేయటంలో విఫలం అయినా నాణ్యమైన ఇంకు తయారు చేసుకొన్నారు .వారపత్రికగా దాని సైజు 2 ½ క్రౌన్ సైజ్ .అమృతం అంటే అమృతమూ తేనే ,బజార్ అంటే మార్కెట్ .ఈ మూదూకలిస్తే తేనే ను పంచి ఇచ్చే పత్రిక అని అర్ధం .అమృతం అంటే విషం కూడా కనుక అమృతాన్నీ విషాన్నీ కూడా ఇచ్చే పత్రిక .రుజు  దృష్టి ఉన్నవారికి అమృతం ,వక్ర దృష్టి ఉన్నవారికి విషం పంచి పెడుతుందని యజమానులమనోభావం .రాసేదీ గుద్దేదీ వాళ్ళే కనుక కొంతకాలానికే సర్క్యులేషన్ 500దాకా పెరిగింది పత్రిక .ప్రచారం ప్రజలలో బాగా వ్యాపించి ,ప్రభుత్వం దాన్ని నిశితంగా పరిశీలించటం మొదలెట్టింది .త్వరలోనే పత్రికపై కత్తి కట్టింది .

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -11-7-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

భారతీ నిరుక్తి. 6వ భాగం.11.7.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment