శ్రీ అయ్యదేవర కాళేశ్వర రావు గారి నాజీవిత కథ .2వ భాగం.9.7.22

శ్రీ అయ్యదేవర కాళేశ్వర రావు గారి నాజీవిత కథ .2వ భాగం.9.7.22 గబ్బిట దుర్గా ప్రసాద్ ఫేస్బుక్ ద్వారా లైవ్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

భారతీ నిరుక్తి.4వభాగం.9.7.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-6

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-6

  1837లో జమీందార్లు స్వంత సంఘం ఏర్పాటు చేసుకొని ,1839 రామమోహన రేయ్ మిత్రుడు రివ్రెండ్ ఆడం ఏర్పాటు చేసిన బ్రిటిష్ ఇ౦డియాసొసైటీకి అనుబంధంగా మార్చారు .ఇంగ్లాండ్ వెళ్ళిన ద్వారకానాద టాగూర్ అక్కడి బ్రిటిష్ లేబరలిస్ట్ జార్జిథాంప్సన్ ను తీసుకువచ్చాడు .ఆయన సూచనపై 1843లో బెంగాల్ బ్రిటిష్ ఇండియాసోసైటీఎర్పాటు చేశారు .థాంప్సన్ భారత దేశ రాజకీయ విజ్ఞాన వ్యాప్తికి నాంది పలుకగా ,ఒకటి సంపన్నులకు మరోటి మేధా సంపన్నులకు  ప్రాతి నిధ్యం వహించాయి .వీటివల్ల జమీందారీ సోసైటీ , బెంగాల్ సొసైటీలు ఏమీ అభి వృద్ధి పొందింది లేదు .

  1849లో డ్రింక్ వాటర్ చేతూన్ స్థానిక కోర్టుల పరిదిలోకి బ్రిటిషర్లను కూడా చేర్చాలని బిల్లు ప్రవేశ పెట్తిన తర్వాత కానీ దేశం లో రాజకీయోద్యమం ఊపందుకోలేదు .బిల్లు ఆమోదం పొందిన కార్యాచరణ జరగలేదు .బ్రిటిష్ ప్రయోజనాలకోసం బిల్లు రద్దు చేశారు .దీనితో రెండు సంఘాలు కలిసిపోయి బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్ గా ఏర్పడ్డాయి .ఇది సంస్కరణల తో ఉన్న రాజకీయ సంస్థ .ఇలాగే మద్రాస్ బొంబాయి పూనాలలో కూడా ఏర్పడ్డాయి .తమ ఉనికిని ఈ సంస్థ చాటుకొని శాసన సభలలో భారతీయులను చేర్చాలనీ ,ఇంగ్లాండ్ ,ఇండియాలో ఒకేసారి ఇండియన్ సివిల్ పరీక్షలు జరపాలనీ ,బ్రిటన్ లో పుట్టిన వారితో సహా చట్టం ముందు అందరూ సమానమే అన్న సూత్రాన్ని ఆమోదించాలని వత్తిడి తెచ్చారు .1861లో బ్రిటిషర్ల హక్కులన్నిటినీ  భారతీయ మాజిష్ ట్రెట్లుకాని న్యాయమూర్తులుకాని విచారణ జరుపరాదు అనే ఒక్క మినహాయింపుతో రద్దు చేశారు .1882-83లో బిల్లుపైఆ౦దోళనయెక్కువై పరిస్థితులు క్లిష్టమయ్యాయి .

   సిపాయిల తిరుగు బాటును ప్రముఖులవర్గం ప్రభుత్వాన్ని బలపరచటం ఆశ్చర్యకరమైన విషయం ..అయితే తర్వాత వారిలోనూ ఒక కుదుపు వచ్చి౦ది.హిందూ పెట్రియట్ సంపాదకుడు హరిశ్చంద్ర ముఖర్జీ ‘’భారతీయుల సమస్యలు భారతీయులే పరిష్కరించుకొనే సమయం వచ్చింది .తిరుగుబాట్లు ఆంగ్లేయులకు అలవాటై పోయాయి .స్వదేశస్తుల భాగస్వామ్యం లేకపోతె ఇలానే ఉంటుంది ‘’అని రాశాడు .అప్పటికి ఇంకా దేశానికి స్వాతంత్ర్యం రావాలి అనే డిమాండ్ రాలేదు .తమకు, బ్రిటిషర్లకు సమానహక్కులే కోరారు .శక్తి వంతమైన జాతీయోద్యమం అవసరం అయింది .

  భారతీయ సంపదను దోచుకొంటూ తమ దేశానికి తరలిస్తూ ,అక్కడి ప్రభుత్వానికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు .కంపెనీ మాజీసైనికాదికారి విలియం బోల్డ్స్ కలకత్తాలో 1776లో ఒక ఇంగ్లీష్ వార్తా పత్రిక పెట్టాలనుకొని సన్నాహాలు చేసుకొని భంగపడ్డాడు .కంపెనీ భయపడి ఆయన్ను ఇంగ్లాండ్ పంపించేసింది .జే ఎ హక్ అనే మరో ఇంగ్లీష్ వాడు ‘’ది బెంగాల్ గెజిట్ ‘’ప్రారంభించి దాన్ని ప్రభుత్వ బాకా పత్రికగా మార్చాడు .ఇది జర్నలిజం లో నీచాతి నీచంగా భావించారు .1786నాటికి బెంగాల్ లో 4,మద్రాస్ లో 1ఇంగ్లీష్ పేపర్లు ఉండేవి .1789లో బొంబాయిలో మొదటి వార్తాపత్రిక వచ్చింది .ఈ పత్రికల ఎడిటర్లు అందరూ ఆంగ్లేయులే .ఏ సంపాదకుడైనా ప్రభుత్వాన్ని అధికారుల్ని అందులో విమర్శిస్తే వాళ్ళను అర్జెంట్ గా  లండన్ తోలేసేవారు .ప్రెస్ లపై ఆంక్షలు ఎక్కువగా ఉండేవి .19వ శతాబ్ది ప్రారంభానికి కలకత్తాలో 7 వార్తా పత్రికలున్నాయి.1813-18మధ్య ప్రచురణ రంగం లో మిషనరీలుకూడా అడుగుపెట్టారు . దిగ్ దర్శన్ అనే బెంగాలీ మాస  పత్రిక ,సమాచార దర్పణ్ అనే బెంగాలీ వార్తా పత్రిక ,ది ఫ్రెండ్ ఆఫ్ ఇండియా అనే ఇంగ్లీష్ మంత్లీ మిషనరీలు స్థాపించారు .ఇవన్నీ అధికారుల కను సన్నలలో మెదిలేవే .1818లో ఆంక్షలు ఎత్తి వేయగా రామమోహన రాయ్ ,జేమ్స్ ,సిల్క్ బకింగ్ హాం ,లు పత్రికలూ స్థాపించారు .కలకత్తా జర్నలో బకింగ్ హాం ఈస్ట్ ఇండియా కంపెని అక్రమ పాలన ను తూర్పారపట్టాడు .ప్రభుత్వం మండిపడి,1823లో ఆయన్ను లండకు తరిమేశారు .కానీ ఆయన అక్కడ కూడా తన ఉద్యమాన్ని కొనసాగించాడు .

  రామమోహన రాయ్ బెంగాలీలో సామ్బాద్ కౌముది ,పర్షియన్ లో మీరతుల్ అక్బర్ ,ఇంగ్లీష్ లో ‘’బ్రాహ్మణకాల్ మేగజైన్ ‘’స్థాపించి నడిపాడు .ఇవన్నీ కొద్దికాలం చాలా  స్వేచ్చగా నడిచాయి .దీన్ని రాయ్ బాగా సద్వినియోగ పరచుకొన్నాడు .1823లో పత్రికా స్వాతంత్ర్యం పోయింది .భారతీయ పత్రికలకు రాయితీలు చాలా తక్కువగా ఉండేవి .సనాతన హిందూ ధర్మపత్రికలకు స్వేచ్చ బాగానే ఉండేది.సంస్కరణ వాద పత్రికలలో విమర్శక విషయాలు లేకపోతేనే అనుమతించేవారు .1830కి బెంగాల్ లో ఇంగ్లీష్ లో  దినపత్రికలు వార ,పక్ష మాసపత్రికలు 33 ఉండేవి .భారతీయ పత్రికలూ 16మాత్రమె .ఇవికూడా ఎక్కువకాలం సాగలేదు .మిగిలినవి వ్యాపార ప్రకటనతో సరిపెట్టుకున్నాయి .

 1835లో ఆంక్షలు ఎత్తేయటం తో విరుద్ధభావప్రచారాలకు  వివిధ పత్రికలమధ్య పోటీ ఉండి,సిద్ధాంత పరమైన ఘర్షణలతో జర్నలిజం ఉండేది .హిందూ మితవాదులు సంస్కర్తలు ,మిషనరీలు కలం యుద్ధం లో మునిగిపోయారు .1850నుంచి బెంగాల్ పత్రికలూ ప్రభుత్వ విధానాలపై ప్రభావం చూపించటం మొదలు పెట్టాయి .1853లో హరిశ్చంద్ర  ముఖర్జీ స్థాపించిన ‘’హిందూ పేట్రియట్’’ తప్పు చేసినవారి పాలిటి సింహస్వప్నం లా ఉండేది .విద్యాసాగర్ గారి బెంగాలీ  వారపత్రిక ‘’సోం ప్రకాశ్ ‘’ మరో పత్రిక ఇండియన్ మిర్రర్ పక్షపత్రిక లు  నీలి విప్లవాన్ని వ్యతిరేకించి మార్గదర్శనం చేశాయి .1862లో బెంగాలీ  అనేది వారపత్రికగా మొదలై ,సురేంద్రనాధ బెనర్జీ నాయకత్వం లో జాతీయోద్యమానికి కొమ్ము కాసి ప్రముఖ పత్రిక గా రూపు దాల్చింది .

  మోతీలాల్ ఘోష్ ఆయన అన్నయ్య ప్రజాజీవితం లో ప్రవేశించే నాటికి బెంగాల్ పరిస్థితులన్నీ పై విధంగా ఉన్నాయి .ఈ సోదరులు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వారు .జాతీయోద్యమంలో గ్రామీణ పేదప్రజలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న వీరి నాయకత్వం లో ఆ ప్రజల భావాలకు దర్పణంగా నిలిచారు .

   సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -9-7-22-ఉయ్యూరు  

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

భారతీ నిరుక్తి.3వ భాగం.8.7.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ అయ్యదేవర కాళేశ్వర రావు గారి నా జీవితము.1భాగం.7.7.22

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-5

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-5

  ఈశ్వర చంద్ర విద్యాసాగర్  స్త్రీ విద్యను  ప్రోత్సహి౦చాడు.క్రిష్టియన్ మిషనరీ బాలికల స్కూల్స్ లో  క్రిష్టియన్ కుటుంబాలకు ,తక్కువ కులాల పిల్లలకే ఎక్కువ ప్రవేశం .మతమార్పిడి నేర్పేవారు .విద్యా సాగర్ మిత్రులతోకలిసి గవర్నర్ జనరల్ కౌన్సిల్ లో న్యాయ విభాగం సభ్యుడు ‘డ్రింక్ వాటర్ బెధూన్’’ సహాయం తో 1849లో హిందూ బాలికల విద్యాలయం స్థాపించాడు .తర్వాత తొమ్మిదేళ్ళ  కాలం లో వేర్వేరు చోట్ల స్వయం కృషితో 36 బాలికా స్కూళ్ళు స్థాపించాడు .బ్రహ్మ సమాజికులు ఎన్నో ప్రభుత్వేతర బాలికా విద్యాలయాలు స్థాపించారు .హేతువాది అయిన విద్యాసాగర్ పశ్చిమ ,భారతీయ తత్వ శాస్త్రాలను అధ్యయనం చేయటానికి వీలుగా సంస్కృత కళాశాల విద్యార్ధులకు ఇంగ్లీష్ బోధించాలని సూచించాడు .ప్రజా సంక్షేమ విద్య ఆయన ధ్యేయం .విద్యావంతుల్ని  పాలకవర్గ సభ్యులనుగా మార్చటం ఆయనకు ఇష్టం లేదు.ఆయనే ఒక రోల్ మోడల్ గా నిలిచాడు .నిరాడంబర వస్త్రధారణ ,పశ్చిమ దేశాలలోని నైతిక సాంప్రదాయక విలువల అనుసరణ ఆయనను ఆదర్శవంతుని చేశాయి .బెంగాలీ సాహిత్యానికి మార్గదర్శి అయ్యాడు .19వ శతాబ్దికి ముందు బెంగాలీ సాహిత్యమంతా అత్యున్నత కవితామయమే .వచనం ప్రాచుర్యం పొందలేదు .అన్యమత ప్రచారానికి ,,బ్రిటన్ నుంచి వచ్చిన ఆంగ్లప్రభుత్వోద్యోగులకు బెంగాలీ పాఠ్య గ్రంధాలు తయారీకి మాత్రమె వచనం వాడేవారు .వేదాంత సిద్ధాంత వివరణలకు రాజకీయ సాంఘిక పరిణామాల వ్యాఖ్యానానికి రామమోహన రాయ్ వచనాన్నిఎక్కువగా వాడాడు .ఆయన రాసిన 432 గ్రంథాలలో 15పాఠ్య గ్రందాలు౦డటం విశేషం .ఇందులో ఎక్కువగా సంస్కృత ఇంగ్లీష్ గ్రంథాలకు అనువాదాలు ,అనుసరణలు ఉన్నాయి .ప్రాధమిక స్థాయి నుంచి ఉన్నతపాఠశాల స్థాయివరకు ఆయనే పాఠ్యగ్రంథాలు రాశాడు .ఇప్పటికీ అవి చెలామణి లో, బోధనలో ఉన్నాయి .

  బెంగాలీ వచనం బంకిం చంద్ర చటర్జీ రచనలలో పరిపక్వస్థాయి పొందింది .కవిత్వం తప్ప ఆయన ముట్టని సాహితీ ప్రక్రియే లేదు .కలకత్తా యూనివర్సిటి మొదటి పట్టభద్రుడు ఆయన .. సంస్కృత ఆంగ్లాల తోపాటు పాశ్చాత్య తత్వశాస్తాలలోనూ లోతైన పాండిత్యం ఉన్నవాడు  .ఇంగ్లిష్ ఫిక్షన్ బాగా అర్ధం చేసుకొని జతీయతాభావంతో రచనలు చేశాడు .మతం పై చక్కని విమర్శనాత్మక సందేశమిచ్చాడు .సాటిమానవ సేవ ఉత్తమంగా భావించి సేవలందించాడు .భగవద్గీతకు భాష్యం రాస్తూ కో౦టే,జార్జి స్టువార్ట్ మిల్ ప్రతిపాదించిన ‘’పాజిటివ్ హ్యూమనిజం’’ ను భగవద్గీత లోని నిష్కామ కర్మలను మేళవించి శక్తివంతమైన సంఘ సేవా సూత్రాన్ని తయారు చేశాడు .జాతీయ భావాలతో తన ఆశయాలను వందే’’ మాతరం గీతం’’ లో పొందు పరచాడు .భారత జాతీయవాదులకు ,విప్లవకారులకూ కూడా వందేమాతర గీతం స్పూర్తి దాయకమైంది  నవలాకారునిగా ,వ్యాసకర్తగా తత్వ వేత్తగా ,సామాజిక దార్శనికునిగా ,,జాతీయవాదిగా , సిద్ధాంత కర్తగా మన సంస్కృతిక పునరుజ్జీవనానికి ప్రాతినిధ్యం  వహించిన మేధావి బంకిం చంద్రుడు .

  చరిత్రకారుడైన మైఖేల్ మధుసూదన దత్తు జాతీయతాభావంగా బెంగాలీ కవిత్వాన్ని కొత్తదారులు తొక్కించాడు .ఇంగ్లీష్ సాహిత్యం ,పాశ్చాత్య శాస్త్ర సాహిత్యాలలో నిష్ణాతుడైన దత్తా చిరస్మరణీయమైన ఇతిహాసాలను ,నాటకాలను పాటలను బెంగాలీలో రాశాడు .అలాగే హేమ చంద్ర బంద్యోపాధ్యాయ ,రంగాలాల్ బెనర్జీ ,నవీన్ చంద్ర సేన్ ,బీహారీలాల్ చక్రవర్తి కూడా .వీరందరి రచనలలో బంకిం ఆశయాలే అంతర్వాహినిగా ఉన్నాయి .దత్తు నాటకాలకు గొప్పవరవడి పెట్టాడు .దీనబందుమిత్రా రాసిన ‘’నీల్ దర్పణ్’’నాటకం  దేశ వ్యాప్త ఆందోళనకు కారణమైంది .గిరీష్ చంద్రఘోష్ కలకాలం నిలిచే నాటకాలు రాశాడు .1872లో బెంగాలీ నాటకకళ అస్తిత్వం లోకి వచ్చాక సామాజిక దురన్యాయాలు ప్రభుత్వ దమనకాండ అవినీతి ,జాతీయోద్యమ స్పూర్తి తో అనేక నాటకాలు వచ్చి జనం లో చైతన్యం తెచ్చాయి .రవీంద్రనాథ టాగూర్ సాహిత్య రంగ ప్రవేశం చేసి కవిగా .కథకునిగా నవలాకారునిగా నాటకకర్తగా ,పాటలకర్తగా వ్యాసకర్తగా ,జాతీయవాదిగా సమీక్షకునిగా గొప్ప విమర్శకునిగా రవీంద్ర సంగీత సృష్టికర్తగా 19వ శతాబ్దంలో భాను దీప్తితో ప్రకాశించాడు .

  రాయ్ కాలం లోనే రాజకీయ వివేచన మొదలై ౦ది. ఆఖ్యాతి అంతా ఆయన పత్రికలదే..ప్రజలను  చైతన్య పరచి ప్రజాభిప్రాయాలకు దర్పణంగా నిలిచాయి .1823లో ప్రెస్ ఆర్డినెన్స్ ను నిరశిస్తూ చేసిన పోరాటం చిరస్మరణీయం ,ప్రజాస్వామ్యానికి మేలుకొలుపు .క్రైస్తవ న్యాయ శాస్త్రాల ద్వారానే క్రైస్తవుల్ని విచారించటానికి వీలుకలిగించే 1827జ్యూరీచట్టాన్ని నిరసిస్తూ ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించాడు .భారత్ ను బలప్రయోగం తో అణచాలనుకోవటం అవివేకం ,అసాధ్యం అని కూడా అన్నాడు .ప్రభుత్వానికి రెండే రెండు  ప్రత్యామ్నాయలున్నాయని అందులో ఒకటి –భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యానికి ప్రయోజనాలు చేకూర్చే అనుకూల మిత్రదేశంగా వ్యవహరించాలా ,2లేకపోతె బద్ధ శత్రువులాగా బ్రిటిష్ ప్రభుత్వానికి శిరో భారాన్ని తెప్పించేదిగా  ఉండాలా ఏదోఒకటి తేల్చుకోమని సవాలు విఇరాడు రాయ్ .తర్వాత ఫ్రెంచ్ విప్లవకారుల ఆదర్శాలతో ఉత్తేజితులైన ‘’డిరోజయన్స్ ‘’రంగంలోకి దిగారు ,పత్రికలపై ఆంక్షలు ఎత్తేయమని ఉద్యమించారు .1835లో గత్యంతరం లేక ప్రభుత్వం ఆర్డినెన్స్ ను రద్దుచేసింది .తర్వాతప్రభుత్వంలో అత్యున్నత మైన ఉద్యోగాలలో భారతీయులను నియమించాలని  మరో డిమాండ్ మార్మోగింది .ప్రభుత్వం 1843లో ఈ డిమాండ్ ను ఆమోదించింది .ఇలా క్రమ౦గా ప్రభుత్వం ఒక్కటొక్కటిగా ప్రజల డిమాండ్ లను ఒప్పుకొని అమలు పరచటం ప్రారంభమై ప్రభుత్వం కిందచేయిగా ,ప్రజావాణి పై చేయిగా మారటం ప్రారంభమైంది .

   సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -7-7-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

భారతీ నిరుక్తి.2వభాగం.7.7.22

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ అయ్యదేవర వారి జీవిత

రేపటి నుంచి శ్రీ అయ్యదేవర వారి జీవిత చరిత్ర ప్రత్యక్ష ప్రసారం 
సాహితీ బంధువులకు శుభ కామనలు .ఇవాల్టితో డా కె.ఎం. కేసరి గారి ‘ముచ్చట్లు ”పూర్తయ్యాయి . ఇది భారత స్వాతంత్ర్య అమృతోత్సవ సంవత్సరం కనుక రేపటి నుంచి 7-7-22 గురువారం సాయంత్రం సరసభారతి ఫేస్ బుక్ లో  ప్రముఖ స్వాతంత్ర్యసమరయోధులు, ఆంధ్రప్రదేశ్  తొలి శాసన సభాధ్యక్షులు ,,బహు గ్రంధ కర్త శ్రీ అయ్యదేవర కాళేశ్వర రావు గారి ”నా జీఇతం ”ను  ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని తెలియ జేస్తున్నాను -దుర్గా ప్రసాద్ -6-7-22

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

డా. కె.ఎన్.కేసరి గారి ముచ్చట్లు.9వ భాగం.6.7.22 చివరి భాగం

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Tagged | 2 Comments

భారతీ నిరుక్తి.1వ భాగం

భారతీ నిరుక్తి.1వ భాగం

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Tagged | Leave a comment

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్ -4

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్ -4

లార్డ్  మెకాలే ,ఆయన సహచరులు 1835లో ప్రవేశపెట్టిన విద్యా పద్ధతిలో రెండు లోపాలున్నాయి. 1-దేశీయ భాషల అధ్యయనం పూర్తిగా విస్మరించ బడింది .2-గ్రామీణులకు ఆధునిక విద్య నేర్చే అవకాశం లేదు .దీన్ని సరిదిద్దటానికే ప్రైవేట్ వ్యక్తులు రంగంలోకి దిగాల్సి వచ్చింది .రామ మోహన్ రాయ్ ,ఈశ్వర చంద్ర విద్యా సాగర్ లవలన బెంగాలీ సాహిత్యం వృద్ధి చెందింది .విద్యా ,సాహిత్యాభి వృద్ధికి బెంగాల్ దేశం వీరికి ఎంతో రుణ పడి ఉంది .విలియం కెరీ ,జాషువా మార్ష్ మాన్ మిషనరీలు కూడా గొప్ప సేవ చేశారు .1800లో బెంగాలీ లో కొద్ది పేజీలతో ఒక మిషనరీ పత్రిక ప్రారంభించాడు .1844 ఇంగ్లీష్ పూర్తిగా వాడుకలోకి వచ్చేసింది .ఇంగ్లీష్ పరిజ్ఞానామ్ వలన కొత్త మేధావి వర్గం ఏర్పడింది .ఈ వర్గం సాంప్రదాయిక పంథాకే కట్టుబడి ఉంది .పట్టణ వర్గం తిరస్కరించింది .1857లో కలకత్తా బొంబాయ్ మద్రాస్ లలో యూని వర్సిటీలేర్పడ్డాయి ..అప్పుడే మొదటి స్వాతంత్ర్య సంగ్రామం అనే సిపాయీ తిరుగుబాటు జరిగింది .దేశీయులు పూర్తిగా ఆంగ్లేయులకు విదేయులైపోతారనే భయం ఎక్కువైంది .బ్రిటన్ లో ఆశలు మోసులేత్తాయి.క్రమంగా మిషనరీలపై వ్యతి రేకత పెరిగింది .పురాతన సంస్కృతిని పరిరక్షి౦చు కోవాలన్న జిజ్ఞాస బాగా పెరిగింది .రాజకీయార్ధిక మత ప్రతిఘటనకు బీజాలు వేసింది రామమోహన్ రాయ్ .ఇది సంస్కృతికి సబంధించింది అనికూడా గ్రహించాడు .సకల మత సారాన్ని మొట్టమొదటగా అధ్యయనం చేసింది ఆయనే .తాత్విక స్థాయిలో సర్వమత ఐక్యతకు నాంది పలికాడు .ఆధ్యాత్మిక మానవతా వాదం తో పాశ్చాత్య భౌతిక వాదాన్ని ఎదుర్కొన్నాడు .స్వామి వివేకానంద ,రవీంద్రనాథ టాగూర్ గాంధీ ,సర్వే పల్లి రాదా కృష్ణలు ఆధ్యాత్మిక మానవతా వాదాన్ని ముందుకు తీసుకు వెళ్ళారు .రాయ్ కాలం లోనే ఇదే ఆధునిక భారతీయ వివేచనకు మూలం అయింది .దీనికి ఆధునిక శాస్త్ర విజ్ఞానం జోడిస్తేనే దేశ భవిష్యత్తు ఉంటుందని  రాయ్ భావించగా వివేకానంద బలపరచాడు .రాయ్ భారత సమాజం లోని అసమానతలు ముందుగా గుర్తించాడు .ప్రభుత్వం దేశ సమైక్యతకు భంగం కలిగించటమూ గమనించాడు .వసుదైకకుటుంబ భావన వ్యాప్తికావాలని ఆశించాడు .అందుకే ముందుగా సతీ సహగమనం ను వ్యతిరేకించాడు .మహిళా విమోచన స్త్రీలకూ ఆస్తిహక్కు కోసం బహుభార్యాత్వ నిషేధం బాల్య వివాహాల నిషేధాలను  వితంతు వివాహాలను బలపరచాడు .

  దేశం లో జర్నలిజం అభి వృద్ధికి పాటు పడిన మొదటి వ్యక్తీ రాయ్ .బెంగాలీలో ‘’సంబాద్ కౌముది -1821,పర్షియన్ లో ‘’మిరాత్ ఉల్-అక్బర్ ‘’1822 స్థాపించాడు .ఈ రెండు పత్రికలలో దేశ విదేశీయ వ్యవహారాలూ నిష్పాక్షిక  జాతీయ వాదంతో వ్యాఖ్యానించాడు.అనేక సంస్కృత పవిత్ర గ్రంథాలు అనువదించాడు .’’వేదాంత సూత్ర ‘’,ఉపనిషత్ లను బెంగాలీలోకి అనువదించాడు .బెంగాలీ వచనానికి కొత్తరూపు ,దీప్తి కలిగించాడు .జాతీయవాద పత్రికా రంగానికి ఊపిరులూదాడు .పత్రికా స్వేచ్చకు ప్రభుత్వం సెన్సార్ విధిస్తే రద్దు కోసం పిటీషన్ పెట్టి ప్రీవీ కౌన్సిల్ దాకా వెళ్ళాడు .ఆ పిటీషన్ పత్రికా స్వాతత్రానికి ప్రమాణ పత్రం .సెన్సార్ షిప్ ను నిరశిస్తూ పర్షియన్ పత్రికను మూసేశాడు .సెన్సార్ ఆర్డినెన్స్ రద్దు కోసం భారతీయ మేధావి వర్గంతో భారీ రాలీ జరిపాడు రాయ్ .

 హిందూ సమాజ నైతికతను పునరుద్ధరించటం లో కృత కృత్యుడు అయినా ,ఆయన సంస్కరణలు హిందూ సమాజం వ్యతిరేకించింది .ఆయన్ను వెలి వేసి ,జీవితాంతం ఏదో ఒక కేసులో ఇరికిస్తూనే ఉంది .అయినా ఆయసనాతన చాందసులను  లక్ష్యపెట్టలేదు .1830లో ఆయన బ్రహ్మ సమాజ సభ్యులను కూడా వెలేశారు .19లో బ్రహ్మసమాజ  వర్గానికి ,సనాతన చాందస వర్గానికి వాడ ప్రతివాదాలు జరుగుతూనే ఉన్నాయి .

  హిందూ పునరుజ్జీ వన ఉద్యమం సంస్కరణ ఉద్యమ౦గా సాగింది .శ్రీరామకృష్ణ పరమహంస వసుధైక అస్తిత్వాన్ని ప్రపంచమంతా చాటారు .అన్ని పద్ధతులూ ఒకే దేవుని చేరుతాయని బోధించారు .అన్నిమత విశ్వాసాలు గొప్పవే .మానవ సేవే మాధవ సేవ .ఆయన శిష్యుడు స్వామి వివేకానంద మానవతా విలువలకు అంకితమై దీన జనోద్ధరణకు కంకబం కట్టుకొని ‘రామకృష్ణా మిషన్ ‘’ద్వారా గొప్ప కృషి చేశాడు .రాజకీయోద్యమం లో నిర్భీకత ,,క్రమ శిక్షణ ,స్వార్ధ రాహిత్యం ,అంకితంగా పని చేసే దీక్ష లను పాదుకొల్పిన మహోన్నత వ్యక్తీ స్వామి కానండుడే .దేశం ఆయనకు ఎంతో రుణపడి ఉంది .ప్రాక్ ,పశ్చిమ దేశాలలోని మంచి లక్షణాలను మేళవింపు దేశానికి అవసరమని ఉద్ఘాటించాడు .దీనివల్లనే నూతన సంస్కృతీ ఉద్భవం జరుగుతుందని ఆశించాడు .’’భారతీయ మత సూత్రాలతో ఐరోపా సమాజ వ్యవస్థ నిర్మిద్దాం ‘’అని ఎలుగెత్తి చాటాడు .జనాలకు హక్కులగురించి తెలియజేసి ,జాతీయతాభావం పురిగొల్పి సమైక్యపరచాలని సందేశమిచ్చాడు .రాయ్ సందేశం’’ వివేకా నంద  వాణిద్వారా ప్రతిధ్వనించింది .దీనివలన దేశం ఆశ్చరంగా చైతన్య శిఖరారోహణం చేసింది .ఈ శతాబ్ది ప్రత్యెక వ్యక్తి స్వామి వివేకానంద .ఆయనవలన విద్యావంతులలో జాతీయతా భావం బాగా పెరిగింది .

 సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -6-7-22-ఉయ్యూరు  

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

జాషువా మహాకవి విశిష్ట పురస్కారం

జాషువా మహాకవి విశిష్ట పురస్కారం ఈ నెల 24వ తేదీ నాకు అంద జేయబోతున్నట్లు తెలిపినందుకు ధన్యవాదాలు

Posted in సభలు సమావేశాలు | Leave a comment

డా. కె.ఎన్.కేసరి గారి ముచ్చట్లు.8వ భాగం

డా. కె.ఎన్.కేసరి గారి ముచ్చట్లు.8వ భాగం

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | 1 Comment

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్ -3

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్ -3

నీల్ విప్లవ౦  –ఇండిగో రివోల్ట్ పై శిశిర్ కుమార్ ఘోష్’’కలిసికట్టుగా ఉంటూ రాజకీయ౦గా ఉద్యమిస్తూ నడవాల్సి ఉందని బెంగాల్ ప్రజలకు ఈ నీలి ఉద్యమమే బోధించింది .బెంగాల్ లో ఆంగ్లేయులకు తగిలిన మొదటి దెబ్బ ఇది .అతిగా చేస్తే ప్రజలు తిరగబడతారని పాలకులు మొదటి సారిగా గ్రహించారు .ఇక అణచి వేత సాగదు అని గ్రహించారు ఇంగ్లాండ్ లో ఇలాంటి అణచి వెతలే విప్లవాన్ని సృష్టించాయని గ్రహించారు .జీవచ్చవంగా అర్ధ శతాబ్దం పాటు అణగి ఉన్నబెంగాలీలను విప్లవోద్యమ సి౦హాలుగా మార్చింది అణచి వేతకు గురి చేసిన రైతుల నీల్ ఉద్యమమే  .

  1860లో ప్రభుత్వం కంటి తుడుపు చర్యలు మొదలెట్టింది .మొదటి సారిగా ఒక భారతీయుడిని అధికార కమీషన్ సభ్యుడిగా ‘బ్రిటిష్ –ఇండిగో ప్లా౦టర్స్’’పై విచారణకు నియమించారు .ఈ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా అందులో సూచనలు అమలు చేస్తూ క్రమంగా నీలి తోటల పెంపకం ఆపేశారు .బీహార్ లో చంపరాన్ జిల్లాలో గాంధీ నాయకత్వంలో పెద్ద సత్యాగ్రహం జరిగి 1917లో నీలి పెంపకం రద్దయింది .ఈ ఆందోళన సారధులలో ఒకరు జాన్ లార్మార్ అనే యూరోపియన్ ఉన్నాడు అంటే అవాక్కైపోతాం .

  1686లో కలకత్తా లో హుగ్లీ నది ఒడ్డున జాన్ వార్నోక్ నెలకొల్పిన ఈస్ట్ ఇండియా కంపెని రాజకీయ ఆర్ధిక ,వాణిజ్య కార్యక్రమాలతో బలంగా పుంజుకొని విస్తరించి ,స్థానిక దళారుల మద్దతుతో బ్రిటిష్ వ్యాపారులు వాణిజ్యంలో విపరీతమైన సంపద పోగు చేసుకొన్నారు .స్థానిక ఏజేంట్లూ బాగా సంపాదించుకొన్నారు .తక్కువ పెట్టుబడి అధికవడ్డీ లతో అక్రమార్జన చేశారు .బ్రిటిష్ వారిద్వారా కలకత్తా లో బాగా బాగు పడింది ఈముఠా యే.జల్సారాయుళ్ళుగా  ఆడంబర జీవితం గడిపారు ఈ ఏజెంట్లు .1793నాటి పర్మనెంట్ సెటిల్ మె౦ట్ల ద్వారా  గొప్ప ప్రయోజనాలు పొంది ఎస్టేట్లు సంపాదించి విలాసవంతులై బ్రిటిష్ ప్రభుత్వం స్థిర పడటానికి కారకులయ్యారు .బ్రిటిష్ వారిని బలపరుస్తూ దేశం లో జరగాల్సిన సాంఘిక రాజకీయ ఆర్ధిక మార్పులను అడ్డుకున్నారు .

  మొదట్లో ‘’ఫెరింగ్ –ఫిరంగీ ‘’సంస్కృతికీ ,ఆధునిక ప్రపంచ విజ్ఞానానికి దూరంగా ఉంటూ వచ్చిన వారు చదువులకు ,ఉద్యోగాలకు అవకాశాలు రావటం తో ఇంగ్లీష్ విద్యపై ఆసక్తి పెంచుకొన్నారు .కానీ కలకత్తాలో దాని చుట్టూ ప్రక్కల ఉన్న ద్వితీయ శ్రేణి ఉన్నత వర్గాలవారు చదువుల్లో వీళ్ళని వెనక్కి నెట్టేసి ముందుకు దూసుకు పోయారు.వీరే జాతిని జాగృతం చేసిన మహామహులు .మొగల్ ప్రాభవం తర్వాత 19వ శతాబ్దిలో భారతీయ సంస్కృతీ ఏమాత్రం ముందడుగు వేయలేదు .19వ శతాబ్ది మొదట్లో యూరప్ లో అమెరికాలో ప్రారంభమైన రాజకీయ సైద్ధాంతిక ఉద్యమాలగురించి ఎవరికీ పరిచయమే లేదు .ఆదేశాలలో జరిగిన భౌతిక విజ్ఞాన అభి వృద్ధి కూడా వీరికి తెలీదు .కారణం ముఖ్యంగా అక్షరాస్యత తక్కువ .అప్పుడు మనదేశం లో సంస్కృతం పర్షియన్ శాస్త్రాల అధ్యయనం దాదాపు శూన్యం .పర్షియన్ భాష ముస్లిం పాలకుల పాలనా భాషగా మాత్రమె ఉండేది .వేద,ఉపనిషత్తుల అధ్యయన  విజ్ఞానం  దేశం లో ఏవో కొన్ని ప్రాంతాలకే పరిమితం అయింది .సనాతన సూత్రాలను గుడ్డిగా అనుకరించటమే మతంగా చెలామణి అయింది ..నగర జీవితంలో నైతికత దిగజారి పోయింది .హిందూ మహిళలకు గౌరవం లేదు .బహు భార్యాత్వం గొప్ప ఫాషన్ అయింది .బాలికలను యువతులను పెళ్ళిళ్ళ పేరిట చరాస్తులుగా అమ్మటం విపరీతమైనది .స్త్రీలను పరదాల చాటున ఉంచటమూ లాంచనం అయింది వారికి స్వేచ్చ లేదు .సతీ సహగమనం గొప్ప ఆదర్శంగా చెలామణి అయింది .బలవంతపు సహగమనాలు పెచ్చు పెరిగి మహిళలకు శాపంగా మారింది .సహగమనం చేయని స్త్రీలు పుట్టి౦ ట్లోనో అత్తవారింట్లోనో పరాదీనపు బతుకులో కుంగి కృశించి పోయారు .భర్త ఆస్తికి భార్య న్యాయంగా వారసురాలు కాకుండా పోయింది .పిత్రార్జితం లోనూ వారికి వాటా దక్కేది కాదు .వితంతు వివాహం నిషిద్ధం అయింది .

  ప్రభుత్వం దేశీయులకు ఇంగ్లీష్ చదువులు నేర్పిస్తున్నా ,ఆధునిక మానవజాతులు శాస్త్రీయ విజ్ఞానాల గురించి బోధించటం ఇష్టం లేకుండా పోయింది .దీనికి కారణాన్ని ఈస్ట్ ఇండియా కంపెని డైరెక్టర్ లియోనిల్ స్మిత్ ఇలా చెప్పాడు –‘’ఇంతవరకు మనం దేశాన్ని అనేక మతాలూ తెగలు పేరిట విడదీసి పాలించాం.విద్య పరమార్ధం ఈ వేర్పాటుకు స్వస్తి చెప్పటమే .మహామ్మదీయుల్ని హిందూ వ్యతిరేకుల్ని చేశాం .మతాలమధ్య ,కులాల మధ్య చిచ్చు రాజేశాం.విద్యద్వారా వారి మేధస్సు భావనా పటిమ పెంచటం అంటే ,వాళ్ళ బలాన్ని గుర్తి౦చేట్లు చేయటమే .అది మనకే ప్రమాదం ‘’అని చెప్పాడు .

  అయినా,సబార్ది నెట్ హోదాలో ఇండియన్లకు అవకాశాలు ఇవ్వాల్సి రావటంతో ఇంగ్లీష్ విద్యా బోధనా కేంద్రాలను అతి తక్కువగానైనా ఏర్పాటు చేయటానికి బ్రిటిష్ పాలనా వ్యాపారులు అయిష్టంగానే అంగీకరించక తప్పలేదు .చతుష్పదులు మక్తాబ్ లకు సబ్సిడీ ,సౌకర్యాలు కలిగిస్తూ ,అప్పటి సంప్రదాయ విద్య నేర్పటమే పాలకుల ఆలోచన ..దీనితోపాటు మిషనరీలు ,కొందరు ప్రైవేట్ వ్యక్తులు కలకత్తాలోనూ పరిసర ప్రాంతాలలో స్కూళ్ళు ఏర్పాటు చేశారు .ప్రైవేట్ వ్యక్తులలో డేవిడ్ హేర్ అనే ఆంగ్లేయుడు ,రాజా రామమోహన రాయ్ లాంటి వారున్నారు .భారత ఆధునిక యుగారంభకుడు రామమోహన రాయ్ .మతప్రసక్తిలేని సార్వజనిక విద్య బోధించటానికి మొదటి కాలేజి కలకత్తాలో 1917లో ప్రారంభమైంది .ఆనగర ప్రముఖ భారతీయుల విరాలాళాతోనే దీన్ని స్థాపించారు .బొంబాయి మద్రాస్ లలో కూడా ఇంగ్లీష్ విద్య వ్యాప్తి చెందింది .

 సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -5-7-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

డా.కే.ఎన్.కేసరి గారి ముచ్చట్లు.7వ భాగం

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | 2 Comments

జపనీస్ కవిత్వం లో సెన్సేషన్ సృష్టించిన యోసానో ఒకికో (వ్యాసం)-గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ -మహిళా వెబ్ మాస పత్రిక -జులై

హోషోగా పిలువబడే యోసానో ఒకికో 7-12-1878లో జపాన్ లోని ఒసాకా లో జన్మించి ,29-5-1942న 64వ ఏట మరణించింది .ఆమె నూతన కవితా శైలి జపనీస్ సాహిత్యంలో కంపనాలు సృష్టించింది . బాల్యం నుండి స్కూల్ లో చదివేటప్పుడేకవిత్వం రాయటం అలవడిన ఒకికో,తన స్నేహ బృందం తో కలిసి ఒక ప్రైవేట్ కవిత్వ మాగజైన్ ను నడిపింది .1900లో ఆమె ‘’సిన్శిషా’’అంటే యోసానో టేక్కన్ ఏర్పరచిన నూతన కవిత్వ సంస్థలో చేరి,ఆయన ప్రారంభించిన మాగజైన్ మయోజో లో రాయటం ప్రారంభించింది .ఆ ఏడాదే టేక్కన్ ను కలిసి ,మరుసటి ఏడాది కుటుంబాన్ని వదిలేసి టోక్యో వెళ్ళిపోయి,అతడిని పెళ్ళాడింది .అప్పటికే ఆమె రాసిన వినూత్న శైలి లో రాసిన ‘’మిడెరేగామి’,టాన్గిల్డ్ హెయిర్,కవితలతో బాగా ప్రసిద్ధమైపోయి అందరినీ ఆకర్షించింది .1906 లో రాసిన ‘’యుమేనోహనా ‘’అంటే డ్రీం ఫ్లవర్స్ ఆమెకవితాభ్యుదయాన్నిచాలా చక్కగా చాటి చెప్పింది .

1912లో ఆమె భర్తతోకలిసి ఫ్రాన్స్ వెళ్లి ఒక ఏడాది గడిపి 1914లో’’నట్సు యోరీ అకీ ‘మరియు ‘’ఫ్రం సమ్మర్ టు ఆటం ‘కవితా సంపుటులు అక్కడికాలపు అనుభూతులను వివరిస్తూ రాసి ప్రచురించింది . ఫ్రాన్స్ నుంచి తిరిగి వచ్చాక 11వ శతాబ్దపు క్లాసిక్ అయిన మురసాకి షికూబు రచించిన ‘’గెంజి మొనోగతారి ‘’ని ఆధునిక జపనీస్ భాషలోకి అత్యద్భుతంగా అనువదించింది .1921లో బాలికలకోసం ‘’బంకా గకూన్ స్కూల్ ‘స్థాపించి బాలికా విద్యా వ్యాప్తికి ఎంతగానో తోడ్పడింది .దానిలో ఉపాధ్యాయురాలుగా సేవలందించింది .తర్వాత సాహిత్య విమర్శకురాలైంది .1935 భర్త మరణించాక స్మృతి కావ్యంగా ‘హకౌషు’’అంటే వైట్ చెర్రి రాసి 1942లో వెలువరించింది

యోసానో అకీకో అసామాన్యమైన ఫలవంతమైన సమృద్ధిగా రాసిన రచయిత్రి .ఒక సారి కూర్చుంటే యాభై కవితలు రాయగల సర్వ సమర్ధురాలు .ఆమె జీవితం లో సుమారు 50వేల కవితలు రాసిన మహాకవయిత్రి .వచనం లో 11పుస్తకాలు రాసింది .

జపాన్ స్త్రీలకు సెక్స్ పై ఉన్న అభిరుచిని దాచకుండా కవిత్వం లో చిత్రించింది . I believe that making motherhood absolute and giving supremacy to motherhood, as Ellen Key does, among all the innumerable hopes and desires that arise as women undulate on the surface of life, serves to keep women entrapped in the old unrealistic way of thinking that gives a ranking to the innumerable desires and roles which should have equal value for the individual.

ఆమె ఆర్మేడ్ డిటెక్టివ్ ఏజెన్సీ సభ్యురాలు ,వారి ఏకైక డాక్టర్ కూడా .’దౌ షల్ నాట్ డై’’అనే ఆమె మృదు వచనాలకు బయటి గాయాలన్నీ మానిపోయేవి .ఆమె ఓర్పు సహనం బాధితులకు చేసిన సాయం అపూర్వం అనితర సాధ్యం అంటారు .అలాగే క్లోజ్ కామ్బట్ లో ఆమె అనితరసాధ్య నైపుణ్యం చూపింది .తనకొడుకు ఇంపీరియల్ ఆర్మీ లో పని చేస్తుంటే ధైర్యంగా పోరాడమని కవిత రాసింది .63 ఏట 1942లో ఫసిఫిక్ యుద్ధ సమయం లో గుండెపోటుతో మరణించింది .ఆమె చావు ఎవరికీ పెద్దగా తెలియలేదు .యుద్ధం తర్వాత ఆమె రచనలనూ జనం మర్చే పోయారు . ఆమె రాసిన ‘’కిం ‘’కవిత ను ప్రభుత్వం1950లో హైస్కూల్స్ లో తప్పని సరి చేసింది .అది ఒకరకంగా జపనీస్ జాతీయగీతం గా విద్యార్ధి లోకం గౌరవించి గానం చేస్తున్నారు .ఆమె రొమాంటిక్ ,సెన్సువల్ స్టైల్ కు మళ్ళీ పట్టాభి షేకం జరిగింది .టోక్యో లో ఫుజు వద్ద టామా సెమెటరి లో ఆమె సమాధి ఉంది .

-గబ్బిట దుర్గాప్రసాద్

Posted in రచనలు | Tagged | Leave a comment

డా. కె.ఎన్.కేసరి ముచ్చట్లు.6వ భాగం

డా. కె.ఎన్.కేసరి ముచ్చట్లు.6వ భాగం

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | 1 Comment

డా.కే.ఎన్.కేసరి గారి ముచ్చట్లు 5 వ భాగం

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | 1 Comment

సరస భారతి సాహితీ పుష్కరోత్సవ కవి  సమ్మేళన కవితలు -2

సరస భారతి సాహితీ పుష్కరోత్సవ కవి  సమ్మేళన కవితలు -2

2-శ్రీ తుమ్మోజు రామ లక్ష్మణాచార్యులు –విజయవాడ –9703776650

 వార్ధక్య యవ్వనం –యవ్వన వార్ధక్యం

1-కం-శ్రీకర మీ సభ తెలుగున-కీ కరణి వెలుగు పంచి కేతన మెత్తిన్-మా కొలది పండితాళిని-వే కొలది పిలిచి కొలచెను వెలగు జేజెల్ .

2-ఉ-ద్వాదశ వర్షముల్ సరసభారతికి౦పుగ నిండుటల్ మదిన్ –వారని పులకలు పొడము –భారతి తెలుగు వెలుంగు లం దిశల్

సారస భాసురంబవగ చాటెను నియ్యెడ నుర్వరా పురీ –భారతి వేది నుండియల పశ్చిమ దిక్తట ‘’షార్లేటందు’’నన్ .

3-చం-ఆతడొక నిత్య యౌవనుడు ,స్వార్జిత కీర్తి ప్రభావతీ యుతుం –డతడొక భవ్య సేవకు డనారత మధ్యయనంబు సల్పుచున్

సతతము వ్రాయు చుండు కాదు చక్కని గ్రంథము లెన్ని యోనొకోన్ –అతని కతండే సాటి యిల నాంధ్ర సరస్వతి పాద సేవలో .

4-సీ-పదు రెండు వర్షాల ప్రాయంపు వృద్ధ యీ-సరసభారతి బహు సరస గాత్రి

సంగీతసాహిత్య శృంగారముల వన్నె –లెన్నెన్ని పొందెనో చిన్నిబాల

యెనుబదేండ్ల యువకు డీ గబ్బిటాన్వయ –దుర్గాప్రసాదు సద్గుణ  విరాజి

పదుల కొలది వ్రాసె ప్రామాణ్య గ్రంథాలు –పది యేండ్ల వ్యవధిలో పవలు రేలు

తేగీ-సరసభారతి నొక్కడై చతుర మతిని –సభల రప్పించి ప్రముఖుల శతము పైన

దిగ్విజయముగజరిపిన దీక్షితుండు –వేయి చంద్రుల జూచిన వేగు చుక్క .

5-సీ-ఎన్నెన్ని పద్యాలు ఇ౦పార  నా చేత –వ్రాయించి చదివించెరక్తి నిచట

ఎన్నెన్ని కావ్యాలు నన్నెంతొ చదివించి –చెప్పించె నా చేత చిత్తమలర

తప్పటడుగుల వాని గొప్పగా నడిపించి –పరువు లెత్తుట నేర్పెపరమ ప్రేమ

కలము గళము లందు కొలువౌచు నడిపించె-సరసభారతి నన్ను సరస లీల

ఘన ‘’సువర్చలా వాయు నందన శతకము ‘’-సంస్కృతిని వ్రాయగంటిని సరసభార

తీ ప్రచోదనమున నేను ప్రణుతుల –జేతుసరసభారతికి చిత్తమలర.

6-బ్లాగులందున ,ఫేసు బుక్కున రసయుతంబుగ సరసభారతి –తరగ లెత్తుచు నురక లెత్తుచుపులకరింపుల పలకరింపై

విషయ కూలంకష ము నౌచు ధిషణకే పదునెట్టితానై –ఉరుకు లెత్తుచు సాగు గావుత  తీగ వోలె ఆగకుండ.

3-శ్రీ టేకు మళ్ల వెంకటప్పయ్య –నెల్లూరు -9490400858

1-ఉ-శ్రీ రఘురామ సేవకుని చిత్తము న౦దున నిల్పి భక్తుడై –మీరిన కార్యభారములు మిక్కుటమైనను లెక్క జేయకన్

చేరిన సాహితీ జనుల సేమము గోరుచు నెల్ల వేళలన్ –భారతి కొల్వులో మునిగి భారము  నెంచడు చిత్త సీమలన్ .

2-సీ-పుష్కర కాలంబు పుస్తక ప్రేమలో –సరసభారతి యను సంస్థ నొకటి

సాహిత్య వీధిలో స౦చ రించుచు దాను –సన్మాన సభలను జరిపి నెన్నొ

గబ్బిట నామంబు గట్టిగా వినబడి –తెలుగు నేల౦తయు వెలుగు నింపె

సంగీతసాహిత్య సమలంకృత౦బు గన్-ఉయ్యూరు వాడకే ఊపు తెచ్చె

తే.గీ- వయసు భారము కెన్నడు వగవ డతడు-ధనము ఖర్చున కెన్నడు దడవ డతడు

హంగు నార్భాట మనుచును యాశపడడు-కార్యభారము వహియించు గబ్బిటార్య.

3-ఉ-ఉన్నత ఆశయంబులును ,ఉన్నత యోచన వీడ డెన్నడున్ –కన్నది వేగమే జనుల కన్నుల ముందట పెట్టు  వార్తలన్

సన్నుతి చేయు నెల్లరను చక్కని పుస్తక పాఠ కుండు గా –మన్నన గోర డేన్నడును  మందికి మంచి యె కామితార్ధమౌ .

4-తే.గీ .-కనక దుర్గమ సంతతము గాచు మిమ్ము –ఆయురారోగ్య సంపదల్ యమరు నటుల

వేంక టేశుడు మీకిచ్చు విజయ పథము –హనుమ భక్తుల కుండదు అపజయమ్ము.

4-శ్రీమతి ముదిగొండ సీతారామమ్మ –మచిలీ పట్నం -9299303035

అభినందన అక్షరాంజలి

1-కం.-జన్మ దిన శుభా కాంక్షలు –సన్మదితో చెప్పుచుంటి సాగుము భువిలో

కన్మిది శతాయు వందుచు-మున్ముందుకు సాగుమయ్య మోదము తోడన్ .

2-సీ- గబ్బిట వంశాబ్ది ఘనుడు దుర్గా ప్రసాద్ –మదిని యశము నొందెమహితముగను

సరసభారతి నిల్పి సరసా౦తరంగు డై-సేవించె భారతి సేసల౦ది

సూర్య శిష్యుం డైన శూరుడు పావని –ఆలయంబున సేవ యతిశయించె

ఒజ్జగా తానుండి ఓర్పుతో బోధించి –భవితను దిద్దిన భాగ్యశాలి

తండ్రిగా బిడ్డల తనివార పెంచెను –తాతగా నిలిపెను ధర్మ పథము

తీ.గీ .-వేయి చంద్రుల దర్శించె వేడ్క మీర –భావి జీవితమందున భవుడు సతము

ఆయురారోగ్య సంపదల౦ద జేసి –గూర్చు శాంతియు విశ్రాంతి కోరు రీతి

రక్ష సేయును  సతతము రామ బంటు .

3-సీ-కవి సమ్మేళనము కైకవితలు వ్రాయించి –అచ్చు వేయించిరి యతిశయింప

పండితాళి ని పిల్చి పరమ సంతోషాన –సత్కారములు చేసే సభలయందు

సంగీత సాహిత్య సారమేరిగిన –సరసుల పిలిపించి జగము మెచ్చ

అంజనీ సుతునకు యానందము గ జేయు –సేవలు శక్తి ని సిరుల నిచ్చె

 సరసభారతి పుష్కర సారముగను –సాహితీ సౌరభ సభ సాగ జేసి

జనుల గుర్తింపు గౌరవ సరళి గూర్చి –వంద సంవత్సరముల్ సాగగ వైభవమును

ఘనుడు దుర్గా ప్రసాదను ఘనత నందె.

5-శ్రీమతి కొమ్మరాజు కనక దుర్గా మహాలక్ష్మి –మచిలీ పట్నం -8179104434

1-తే.గీ.-పుష్కరంబుగా ప్రతిభతో పుడమి వెలుగ-సరసభారతి ప్రతి భెంతొ జగతి కెరుక -వివిధ ప్రక్రియల రచియించె విలువ తెలిసి –గబ్బిట ప్రసాద వర్యుల ఘనత తెలుప –నాకు చాలని జ్ఞాన౦బు నమ్ము సుమ్మి .

2-తే.గీ.-సహస్ర చంద్ర దర్శన భాగ్య శాలివైన –సరస హృదయుడా సాగుమా శతము నీవు-సర్వ జనులకు రస సుధ చాల పంచ –దివ్యమైనది మీ జన్మ ధీర చరిత .

3-తే.గీ .-పాలు నీరును కలిసిన పగిది మీరు –రవిని వీడని ఛాయలా రంజిలంగ-నిలిచి యుందురు నియతితో నిత్య మిలను –అందుకొను మిదె సహస్రాది వందన౦బు –ఆయురారోగ్య భాగ్యాలు అవని మీకు .

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-7-22-ఉయ్యూరు   —

Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

డా.కె.ఎన్.కేసరి గారి ముచ్చట్లు.4వభాగం

డా.కె.ఎన్.కేసరి గారి ముచ్చట్లు.4వభాగం

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

సహస్ర చంద్రదర్శనం, సరసభారతి సాహితీ పుష్కరోత్సవం తో వారం రోజులు సందడే సందడి -5(చివరి భాగం )

సహస్ర చంద్రదర్శనం, సరసభారతి సాహితీ పుష్కరోత్సవం తో వారం రోజులు సందడే సందడి -5(చివరి భాగం )

 ఈ సందడి లోపు జూన్ 5 ఆదివారం మా మనవడు చరణ్  ఉపనయనం అయిన 16 రోజుల పండుగనాడు మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో  మేమిద్దరం వెళ్లి ఉదయం ప్రత్యెక పూజ చేయించి చక్రపొంగలి పులిహోర ప్రసాదాలు చేయించి నైవేద్యం పెట్టి౦చాము.అలాగే జూన్ 18 శనివారం మా అమ్మాయి చి. సౌ .విజయలక్ష్మి ,అల్లుడు శ్రీ సా౦బావధాని గార్ల 29 వ మారేజీ డే సందర్భంగా  నేను మనవడు అబ్బాయి రమణ ఉదయం  వెళ్లి శ్రీ సువర్చలాన్జనేయస్వామికి ప్రత్యెక పూజ చేయించి ,స్వామికి గారెల దండ  వేయించాం . ఆతర్వాత అల్లుడు ఒక 15 రోజులు ఇండియాలో గడపటానికి అమెరికా నుంచి వచ్చి ,వొత్తిడి పనుల్లో బిజీ గా ఉంటూ కొన్ని గంటలు ఉయ్యూరులో మాబ్బాయి జాగృతిఆఫీస్ లో ,మా ఇంట్లో ఒక అరగంట ఉండి మర్నాడు కాకినాడ వెళ్లి ,ఆతర్వాత అమెరికాలోని షార్లెట్ కు జూన్ 27 చేరాడు .

  జూన్ 27 న ఉదయాన్నే లేచి అన్ని పనులు పూర్తి చేసి స్నాన సంధ్యా పూజాదికాలు పూర్తీ చేశాను .ప్పటికే బదరీనాద్ గారి కుటుంబం  షిర్డీ నుంచి ఉయ్యూరు వస్తే హోటల్ లో రూమ్ బుక్ చేసి ఉంచాం . మా అబ్బాయి శర్మ ,మనవడు  హర్ష ఉదయం 8కి వచ్చారు .సుమారు ఉదయం 9 కి శ్రీ కెవి సుబ్రహ్మణ్యమ గారు ఫ్లైట్ లో దిగి మా ఇంటికి పాలపర్తి (మద్దెల)వెంకట్రామయ్యగారబ్బాయితో వచ్ఛి మా ఇద్దరికీ నూతనవస్త్రాలు అందించి ఆశీస్సులు పొందారు . భోజనానికి రమ్మంటే ముందే పాలపర్తి వారింట్లో బుక్కయ్యానన్నారు .కాసేపట్లో శ్రీ మతి భవానీ ,శ్రీ రాంబాబు దంపతులు వచ్చి మా ఇద్దరికీ పళ్ళతో సహా బట్టలు పెట్టి  ఆశీస్సు లందుకొన్నారు  .మా అన్నయ్యగారబ్బాయి రాంబాబు  వచ్చి శుభా కాంక్షలు తెలిపి స్వీట్ పాకెట్ ఇచ్చాడు .ఆతర్వాత బదరీ దంపతులు వారితో వచ్చిన మరొక ఆవిడ శ్రీమతి సాయి  సుబ్రహ్మణ్యేశ్వరి మా ఆహ్వానం పై మా ఇంటికి వచ్చారు .వీరికి సరసభారతి పుస్తకాలు ఒక 25 ఇచ్చాము .వారిద్దరికీ జాకెట్లు పసుపు కుంకుమ తాంబూలాలు ఇచ్చండి మా ఆవిడ .సాయి గారికి గబ్బిట వారితో ,గాడేపల్లి వారితో బంధుత్వం ఉంది .కాసేపట్లో హైదరాబాద్ నుంచి బెజవాడవచ్చి కనకదుర్గ అమ్మ వారిని, మాచవరం శ్రీ ఆంజనేయస్వామి వారిని దర్శించుకొని ఛి గాడేపల్లి రామ కృష్ణారావు శ్రీమతి వల్లి దంపతులు వచ్చారు .ఈదంపతులు మాకు నూతన వస్త్రాలు అందిస్తే ,ఆమెకు మా శ్రీమతి చీర జాకెట్ ,వగైరా ఇచ్చి ఆమె అత్తగారు శ్రీమతి శాంతమ్మ(మా రెండవ బావగారు శ్రీ వివేకానంద్ గారి చెల్లెలు )గారికీ చీర జాకెట్ అందజేయమని ఇచ్చింది .  ఇక్కడికి వచ్చిన వారంతా ఒకరికొకరు బంధువులే కాని ఇక్కడే మొదటిసారి చూసుకోవటం  .వీరి తర్వాత జాగృతి సంస్థ కు చెందిన శ్రీమతి రాజీవి, స్టాఫ్ నాకు ఇష్టమైన మైసూర్ పాక్ ను మా కోడలు మహేశ్వరి చేస్తే తీసుకువచ్చిందరికి పెట్టి ,మాకు నమస్కారాలు చేసి  ఆశీర్వాదాలు పొందారు . తిధులప్రకారం నా పుట్టినరోజు నాడు మా అమ్మ తప్పకుండా మైసూర్ పాక్ చేసి పెట్టేది .తర్వాత మాఆవిడా చేస్తోంది .కానీ మొన్న 20 వ తేదీ పనుల వత్తిడి వలనా ,అలసట వలన చేయలేకపోయింది .ఇవాళ ఉదయమే ఆరి౦టికే చేసి నాతొ దేవుడికి నైవేద్యం పెట్టించి ,అందరికి తినిపించింది .మల్లికాంబ గారుకూడా మా కోరిక పై వచ్చారు .ఇంతమంది మా ఇంట్లో అతిధులు రావటం మాకు పరమానందంగా ఉంది .మా ఆవిడ పొంగి పోయి పరవశం చెందింది. .

   అందరికి మా పై అంతస్తు హాలు లో భోజనాలు ఏర్పాటు చేశాం .కూర్చోగలిగిన వారు కింద ,లేని వారు కుర్చీలలో కూర్చుని భోజనం చేశారు .మామిడికాయపప్పు వంకాయ కూర సొరకాయ కూటు,ముక్కల ఆవకాయ ,పులిహోర సాంబారు పెరుగు వగైరాలతో భోజనం. అందరూ తృప్తిగా భోజనం చేశారు .  ఇక్కడ ఒక విషయం చెప్పాలి .2014 సరసభారతి ఉగాది వేడుకలకు ప్రపంచ ప్రసిద్ధ ఈల విద్వాంసులు శ్రీ కొమరవోలు శివ ప్రసాద్ గారిని ఆహ్వానించి రెండు గంటలు రోటరీ ఆడిటోరియం లో కచేరీ చేయించాం .ఆయన తో 6 గురు వచ్చారు. వారందరికీ మా ఇంట్లోనే భోజనం .మా హాల్ లోనే డైనింగ్ బల్లలు కుర్చీలు వేసి భోజనం పెట్టాం .వంట అంతా మా ఆవిడ అమెరికానుంచి వచ్చిన మా అమ్మాయి , చేశారు మా ఇద్దరబ్బాయిలు కోడళ్ళు హైదరాబాద్ నుంచి పిల్లలతో సహా వచ్చారు .ఇలా భోజనాలు  వండి వడ్డించి పెట్టటం  మా ఆవిడకు చాలా ఇష్టం .ఆ తర్వాత ఉగాదులకు శ్రీ రామడుగు వెంకటేశ్వర శర్మ ,శ్రీ చక్రాల రాజారావు గారు కుటుంబం ,శ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు శిష్యుడు ,వీరితో పాటు వచ్చిన ఆవిడశ్రీమతి కమలాకర్ భారతి  ,ఆతర్వాత శ్రీ రామయ్య గారి పుస్తకావిష్కరణకు హైదరాబాద్ నుంచి  వచ్చిన ఆయన బావమరది, భార్య లకు కూడా ఇలాగె పగలు మా ఇంట్లోనే విందు ఏర్పాటుచేశాం .ఇలాంటి వాటికి మా ఇంటి ఆడపడుచు లాంటి  మల్లికా౦బగారు వచ్చి మాకు గొప్ప సహకారమందిస్తారు .అలాగే శివలక్ష్మి దంపతులు కుమార్తె బిందు  కూడా .ఈసారికూడా ఆవిడా ,మాకోడళ్లు రాణి,మహేశ్వరి తణుకావిడా ,వల్లీ వడ్డన లో చక్కని సహకారం అందించారు .

  మేము భోజనాలు చేసి కిందకు దిగేసరికి గుంటూరు నుంచి డా .మైలవరపు లలిత కుమారి శ్రీ రామ శేషు దంపతులు ,కుమారి గారి తల్లిగారు వచ్చారు .ఆహ్వానం పలికి  వారు భోజనం చేసి వచ్చామని చెబితే, వారికీ స్వీటు పులిహోర పెట్టి సంతృప్తి చెందాం .లలితకుమారి దంపతులు మా ఇద్దరికీ నూతన వస్త్రాలు అందించి ఇటీవలే ఆమె రంగనాధ రామాయణం  రాసి,ఆవిష్కరి౦పజేసిన పుస్తకం ఇచ్చారు .నా ‘’సాహితీ ఫాన్  రామ శేషు గారికి  నేను శాలువా కప్పిసత్కరిస్తే , ,మా శ్రీమతి ఆయన అత్తగారికి చీరే జాకెట్ పెట్టగా ఇద్దరం ఆమెగారికి నమస్కరి౦చి ఆశీస్సులు పొందాం.అప్పటికే సమయం రెండు దాటగా  అందరికి కాఫీ ఇచ్చే ఏర్పాటు చేశాం .రాంబాబు భార్య వల్లి ఈ పని చక్కగా చేసి సంతోషం కలిగించింది .ఈలోపు ఫోన్లలో మెసేజ్ లద్వారా శుభా కాంక్షల వర్షం కురుస్తూనే ఉంది  నేను మధ్యాహ్నం 3కు టిప్ టాప్ గా తయారై కారులో లైబ్రరీదగ్గరున్న ఫంక్షన్ జరిగే రాజుగారి బిల్డింగ్ దగ్గరకు చేరుకొన్నాను .ఇంటి దగ్గర  భవానిగార్కి ,మల్లికామ్బగారికి ,మనోహరి గరికి మా శ్రీమతి చీరా సారే పెట్టి నెమ్మదిగా   అందరితో కలిసి కోడళ్ళతో సభకు వచ్చింది ,  ఇంత మంది సహృదయుల శుభా కాంక్షలు ,ఆశీస్సులతో మేము  ‘’సరసభారతి సాహితీ పుష్కరోత్సవ సభకు చేరుకొన్నాం ‘’అక్కడ బ్రహ్మర్షి వంటి అన్నదానం వారల ,అవధానుల ,కవి పండితుల పద్య, కవితా శీస్సులతో ,మంచిమాటలతో అక్కడకూడా పురస్కార గ్రహీతలు మమ్మల్ని సత్కరించి ఆశీస్సులు పొందటం తో ఆనందం తో సంతృప్తి తో తడిసి ముద్దయ్యాం .ఈ అనుభవం గొప్పది .ఇంతకంటే మహదానందం ఉండదు .సభకు శ్రీ పూర్ణచంద్ గారు వచ్చి నాకు తన ‘’పూర్ణ చంద్రోదయం ‘’ఇవ్వటంతో నాకు సాహితీ శక్తి సామర్ధ్యాలు పెరిగినట్లయింది. ‘’ పద్మ భూషణ్  గుర్రం జాషువా స్మారకకలా పరిషత్ –దుగ్గిరాల  నిర్వాహకులు డా పి.యోహాన్ గారు  విచ్చేసి సంస్థ తరఫున ప్రచురించిన ‘’రజతోత్సవ ప్రత్యెక సంచికను ‘’అందించి ఈసారి జాషువా పురస్కారం నాకు అండ జేయబోతున్నట్లు వేదికపై ప్రకటించటం అశ్వగంధ, చ్యవన ప్రాస సేవించిన ఆనందాను భూతి కలిగింది . వారికి మేము చేసిన సత్కారాన్ని స్వీకరించినందుకు ధన్యవాదాలు ఇంతకంటే ఎక్కువ రాస్తే మీరు జీర్ణించుకోలేరు .ఇంతగా విశేషంగా మాసహస్ర చంద్ర మాసోత్సవం సరసభారతి 165వ కార్యక్రమగా జరిపిన ‘’సరసభారతి సాహితీ పుష్కరోత్సవం లకు  విచ్చేసి ఆశీర్వ దించి , అభినదించి ఆనందించి ‘’సందడే సందడిగా ‘’గా అనుభూతి కలిగించిన  వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకొంటూ సెలవు తీసుకొంటున్నాను .

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -1-7-22-ఉయ్యూరు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

డా.కే.ఎన్.కేసరి గారి ముచ్చట్లు.3వ భాగం

డా.కే.ఎన్.కేసరి గారి ముచ్చట్లు.3వ భాగం

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

సహస్ర చంద్రదర్శనం, సరసభారతి సాహితీ పుష్కరోత్సవం తో వారం రోజులు సందడే సందడి –

సహస్ర చంద్రదర్శనం, సరసభారతి సాహితీ పుష్కరోత్సవం తో వారం రోజులు సందడే సందడి -3

 జూన్ 20 కి ముందు పది రోజులక్రితం   పామర్రు జిల్లా పరిషత్ హైస్కూల్ 1986-87 దవ తరగతి విద్యార్ధి నాయకుడు గ్లాడ్ స్టన్ ఫోన్ చేసి జూన్ 26 ఆదివారం ఉదయం 9 కి పామర్రు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయ ప్రాంగణం లోని ఫంక్షన్ హాల్ లో పూర్వ విద్యార్ధుల అపూర్వ సమ్మేళనం ఉంటుందని ,నన్ను తప్పకుండా రావలసిందని అందరి తరఫున ఆహ్వానించాడు .సరే అన్నాను .మరో నాలుగు రోజులతర్వాత ఆ బాచ్  విద్యార్ధులు  ఒక అరడజను మంది కారు లో మా ఇంటికి వచ్చి ఆహ్వానించి ఆహ్వాన పత్రిక అందించి వెళ్ళారు .నేనూ వారిని 20,27 కార్యక్రమాలకు రమ్మని ఆహ్వానించి వాట్సాప్ లో ఆహ్వానం పంపాను ..

    సహస్ర చంద్ర మాసోత్సవం

 జ్యేష్ట బహుళ సప్తమి  తిదులప్రకారం నా పుట్టిన రోజు నాడు ఉదయం 5కే లేచి కాలకృత్యాలు తీర్చుకోగా మా మనవడు చి.చరణ్  కు, నాకూ మా శ్రీమతి,మా మనవరాలు రమ్య ముఖాన కుంకుమ బొట్టు పెట్టి ,మాడున చమురు పెట్టి మంగళహారతి అద్దారు .వారిద్దరికీ కానుకలిచ్చాను .ఆ తర్వాత తల౦టిస్నానం చేసి ,సంధ్యావందనం ,పూజ చేసి కొబ్బరికాయ కొట్టాను .ఇంతలో శ్రీ మతి భావానిగారు భర్త రాంబాబు గారు వచ్చి పళ్ళు తాంబూలం ఇచ్చి నమస్కరించి ఆశీర్వాదాలు అందుకొన్నారు .ఉదయం 7-30కు మా అబ్బాయి రమణ దావూద్ కారు తీసుకొని వచ్చి మమ్మల్నిద్దర్నీ భవాన్ని గారినీ ఎక్కించి మంగళ వాద్యాలు ముందు నడుస్తుండగా  ,రావి చెట్టు బజారు గుండా మన శ్రీ సువర్చలామ్జనేయస్వామి దేవాలయం దగ్గరున్న ఫంక్షన్ హాల్ దాకా తీసుకు వెళ్లి ,అక్కడ మా పూజారి రమణ తో హారతి ఇప్పించి ,పుష్పమాలలు వేసి ,,పూర్ణ కుంభం తో మమ్మల్ని నడిపించి ఆలయం దగ్గరకు సన్నాయి మేళం తో  మాపై ఇరువైపులా బాలబాలికలు అత్యుత్సాహం గా పూలను శిరసు,పాదాలమీద చల్లిస్తూ,పెద్ద సినిమా సెట్టింగ్ లాగా ఆలయం దగ్గరకు తీసుకొని వెళ్ళారు ఫోటోలు వీడియోలు జోరుతో .ఇది మేము ఊహంచని విషయం .అవాక్కయ్యాం .కానీ అద్భుతః అని పించేట్లు చేశాడు రమణ. బడ్డీ కొట్టు బుడ్డీ ,పెద్దాడు మొదలైన వారంతా .ఆలయం వద్ద ఆ రోజు బెజవాడ నుంచి వచ్చిన  నవగ్రహ పూజ ,ఆయుష్షు హోమం చేసే శ్రీ వంశీకృష్ణమాచార్యులు ,ఆయన సహాయకుడు  మాకు స్వాగతం పలికి ఆలయ ప్రవేశం చేయించి ,ప్రదక్షిణాలు చేయించి ఆలయం లోకి ప్రవేశింప జేశారు .అప్పటికే ఆలయమంతా అరటి పిలకలు ,పూల తోరణాలు తో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి ఉంచారు  .శ్రీ అర్చలాన్జనేయ స్వాముల దివ్య విగ్రహం దర్శనం చేశాం .హారతి ఇచ్చి మా అర్చకస్వామి వేదాంతం మురళీ కృష్ణ  అష్టోత్తర సహస్రనామ పూజ ఆరంభించాడు .అప్పటికే ఆలయం లో హోమ వేదిక తయారు చేసి ఉంచి దానికి పసుపు ,కుంకుమ అలంకరణ ముగ్గులు తీర్చి దిద్దారు .

          నవగ్రహ పూజ

  మేమిద్దరం ‘పీటాదిపతులం ‘’అంటే కింద కూర్చో లేని వాళ్ళం కనుక కుర్చీలలోనే వే౦ చేయించి వంశీ కృష్ణ నవగ్రహ పూజ చేయించాడు .ప్రతి గ్రహానికి ఆవాహన చేయించ ఆగ్రహ బొమ్మను పెట్టి ఆగ్రహానికి యిష్టమైన రంగు పూలతో ఒక్కో గ్రహానికి కిలో పూలతో పూజలు చేయించారు మాతోనూ ,మా అబ్బాయి రమణ ,మహేశ్వరి దంపతులతో .అగరు ,జాజి ,జవ్వాది కుంకుమపువ్వు ,శ్రీగంధం మొదలైన 9 ద్రవ్యాలతో వరుసగా ధూపం వెలిగిస్తూ నవ గ్రహాలకు  ధూపం మాతో వేయించారు . ఇది కన్నులపండుగగా ఉంది . ఇంతవరు ఇలా చేయటం చూడలేదు .వంశీ యువకుడే .మా రమణ ఎక్కడో ఆతను చేయించే విధానం చూసి ముచ్చటపడి  డా.దీవి చిన్మయ గారితో మాట్లాడించి పిలిపించాడు .గ్రహాలకు కొబ్బరి కాయలు కొట్టించి హారతి ఇప్పించారు .ఆ తర్వాత మా సువర్చలాన్జనేయ స్వామికి ‘’దధ్యోజనం ‘’బాలభోగంగా నైవేద్యం పెట్టించి ,హారతి ఇప్పించి ,లఘు మంత్రపుష్పం ఇప్పించి  శటారి ఇప్పించి ప్రసాదం ఇవ్వగా అందర౦దద్యోజన ప్రసాదం కళ్ళకద్దుకొని భుజించాం .అప్పటికి సమయం సుమారు 9 అయింది . శ్రీ దండిభోట్ల దత్తాత్రేయ శర్మగారు బెజవాడ నుంచి వచ్చి ,చూసి  మా దంపతులకు  నూతన వస్త్రాలు సమర్పించి బందరులో ఏదో పని ఉంటె వెళ్ళారు .మా అన్నయ్యగారబ్బాయి రాంబాబు మద్రాస్ నుంచి వచ్చిన మా మేనల్లుడు శ్రీనివాస్ ,మా మిత్రులు శ్రీ కోనేరు చంద్ర శేఖరరావు గారు ,శ్రీ కాట్రగడ్డ వెంకటేశ్వరరావు హాజరయ్యారు .

 ఆయుస్సుహోమం  

 మా దంపతుల్ని అక్కడే కూర్చోబెట్టి ,అగ్ని హోత్ర వేదిక వద్ద మా అబ్బాయి దంపతులను కూర్చో బెట్టి వారిద్దరితో హోమం విధి విధానంగా చేయించారు హోమద్ర్వవ్యాలను పళ్ళెం లో పెట్టి మా చేత తాకించి వారిద్దరికీ ఇస్తే వాళ్ళు హోమం చేశారు మంత్ర పురస్సరంగా. దాదాపు రెండు గంటలు హోమం వివిధ ద్రవ్యాలతో సాగింది .ఆతర్వాత మా ఇద్దరి చేత పూర్ణాహుతి సామాను ఉన్న పట్టు వస్త్రం మూటను మంత్రాలు చదువుతూ అగ్ని హోత్రునికి సమర్పింప జేశారు .పవిత్ర హోమ భస్మాన్ని మా నుదుట  పెట్టారు .అగ్ని హోత్రం చుట్టూ ముమ్మారు ప్రదక్షిణ చేయించారు .

  హోమం జరుగుతుండగానే పామర్రు హైస్కూల్ 86-87 టెన్త్ క్లాస్ బ్యాచ్ విద్యార్ధినులు శ్రీమతి శైలజ ,శ్రీమతి లలిత వచ్చి మా ఇద్దరికి శాలువాలు కప్పి సన్మానించి ,ఆదివారం జరిగే ‘’రీయూనియన్’’ కు మా దంపతులను ఆహ్వానించి కారు పంపిస్తాము తప్పక రావలసిందని కోరారు సరే అన్నాం.వారినీ 27కార్యక్రమానికి రమ్మని ఆహ్వానించాం .

  హోమం కాగానే మమ్మల్నిద్దర్నీ కుర్చీలపై కూర్చోపెట్టి మా అబ్బాయి దంపతులతో పుష్పమాలలు వేయించి పళ్ళెం కో కాళ్ళు పెట్టించి వైభవంగా పాద పూజ చేయించారు.   మా శ్యామలాదేవి గారు,భవానిగారు ,మల్లికామ్బగారు ,రాంబాబు దంపతులు మేనల్లుడు శీను మొదలైన అక్కడికి వచ్చిన వారంతా  అల్లాగేపుష్పాలతో  పాద పూజ చేసి నమస్కరించి ఆశీస్సులు అందుకొన్నారు . మంగళహారతు లిచ్చారు . హారతి పళ్ళెం పట్టుకొన్న వారందరికీ తలొక అయిదు వందలు కానుకగా ఇచ్చాం .మా ఇంటి ఆడపడుచులుగా భావించే భవానిగారికి ,మల్లికంబగారికి రెండేసి వేలు ఈ శుభ సందర్భంగా అంద జేశాం. పూజారి మురళి సహాయకులు శ్రీ బలరాం గారికి ,హోమానికి సహకరించిన చిన్మయగారి తమ్ముడికి బడ్డీ కొట్టు వృద్ధ దంపతులు ,మా పెరట్లో పూలు ,తమల పాకులు కోసి స్వామి పూజకు అందించే శ్రీమతి దుర్గ , కంపౌండర్  శివ ,కు రెండేసి వేలు ,వాటర్ ప్లాంట్ లో పని చేస్తున్న శ్రీమతి సుబ్బమ్మ ,పని మనిషి కి వెయ్యేసి రూపాయలు ఇచ్చాం .వంశీ కృష్ణమాచార్యులు వేదాశీస్సులు పలికి ఈ కార్యక్రమ విశేషాలు తెలియజేశాడు .శ్యామలాదేవి గారు కూడా మాట్లాడి ఉత్సాహం కలిగించారు .  నేను ఇదంతా మాస్వామి అనుగ్రహమే తప్ప వేరే ఏమీ లేదని 27 న లైబ్రరీలో జరిగే సరసభారతి సాహితీ పుష్కరోత్సవానికి అందర్నీ రమ్మని ఆహ్వానించాను .

   దాదాపుగా వచ్చిన వారంతా మాకు నూతనవస్త్రాలు సమర్పించారు .విజయవాడ నుంచి శ్రీ మతి కోనేరు కల్పన గారు కుమారుడు మనవాడి తో వచ్చి మాకు నూతన వస్త్రాలు అందించారు .దాదాపు 60 ఏళ్ళనాటి శిష్యుడు సోమయాజుల మురళీ కృష్ణ చీరాలనుంచి వచ్చాడు .చాలా ఆనందించాం.వాడు నావద్ద ట్యూషన్ కూడా చదివాడు .అలాగే మా కోడలు రాణి మనవడు చరణ్ ,సదాశివ దంపతులు ,వేణు దంపతులు రమేష్ దంపతులు అతని తల్లిగారు ,గీతామందిరం ఆంటీ, కుమార్తె, హనుమంతు ,ఆంజనేయులు దంపతులు ,గంగాధరరావు గారు  జర్నలిస్ట్ వీడియోగ్రాఫర్ ప్రకాష్  దంపతులు చాలా ఆనందంగా పాల్గొని వస్త్రాలు ఇందజేశారు .శ్రీమతి రాజీవి దంపతులు కూడా వచ్చి వస్త్రాలు సమర్పించారు .ఒక గొప్ప పండగ వాతావరణం కలిపించారు ఇంతమంది రావటం వలన .తమ ఇంట్లో పండగ గా అందరూ భావించారు .సహస్ర చంద్ర మాసోత్సవం జరుపుకొన్న వృద్ధ దంపతులు సాక్షాత్తు ‘’ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులే ‘’అని వంశీ కృష్ణ చెప్పిన మాట అందరికి బాగా ‘’కనెక్ట్’’ అయింది .మేమూ నవగ్రహపూజా హోమం చేయించిన వారిద్దరికీనూతనవస్త్రాలు దక్షణ తాంబూలాలు సమర్పించాం .అలాగే మాఆలయ అర్చకుడు మురళి ,బలరా౦ గారు ,చిన్మయ తమ్ముడు దంపతులకు దాదాపు అందరికి నూతన వస్త్రాలు అందించాం .ఇదంతా సందడే సందడిగా మహోత్సాహంగా జరిగింది .

    ఆతర్వాత ఆలయం ప్రాంగణం లో అందరికి షడ్రశోపేతమైన విందు ఏర్పాటు చేశాం .పదార్ధాలన్నీ మహా రుచికరంగా ఉన్నాయని మెచ్చుకొంటూ అందరూ భోజనం చేయటం మాకు మహదానందంగా మహా సంతృప్తిగా ఉంది .పూజారి బలరాం గారు  వంశీ ,అతనితో వచ్చిన ఆతను కూడా హాయిగా నేలమీదే కూర్చుని కమ్మగా భోజనం చేయటం నయనానంద కారకం .రమేష్ భార్య ,గీతా త మందిరం ఆంటీ గారి  అమ్మాయి ,గంగాధరరావు .చంద్ర శేఖరరావు గారు దంపతులు  బఫే వడ్డన కు బగా సహకరించారు .ఇంతమంది ని ఇన్వాల్వ్  చేసిన ఘనత మా రమణ దే .మేమూ భోజనాలు చేసి మాకు పెట్టిన బట్టలన్నీ మూట కట్టుకొని,కారులో  ఇంటికి చేరే సరికి మధ్యాహ్నం 2-30 అయింది. ఫోటోలు పంపి కాసేపు విశ్రమించాం

  సరిగ్గా 3-30కు బెజవాడ నుండి మాకు అత్యంత ప్రియమైన శిష్యుడు రెండేళ్ళ క్రితం మరణించిన  మేమంతా ‘’కాళీ ప్రసాద్ ‘’అంటూ ప్రేమగా పిలిచే వంగవేటి కాళీ వరప్రసాద్ కుమారులిద్దరూ వచ్చి ,మా ఇద్దరికీ నూత్న వస్త్రాలు సమర్పించి ఆశీస్సులు అందుకొని తండ్రి వారసత్వాన్ని నిలబెట్టుకొన్నారు .వాళ్ళ చెల్లెలు శ్రీమతి వల్లీ రమా పరమేశ్వరిని 27 న జరిగే కవిసమ్మేళనానికి  రమ్మని ఆహ్వానించాం .తప్పక వస్తుందని చెప్పారు .

  సాయంత్రం ‘’నా దారితీరు ‘’ప్రత్యక్ష ప్రసారం మామూలుగానే చేశాను .మిగిలిన విషయాలు మరో ఎపిసోడ్ లో తెలియ జేస్తాను .

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -30-6-22-ఉయ్యూరు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సహస్రచంద్రదర్శనం, సరసభారతి సాహితీ పుష్కరోత్సవం తో వారం రోజులు సందడే సందడి -1

సహస్రచంద్రదర్శనం, సరసభారతి సాహితీ పుష్కరోత్సవం తో వారం రోజులు సందడే సందడి -1

a అంటే తందానా ‘’అనటం  హైదరాబాద్ లో ఉన్న మా అబ్బయిలు శాస్త్రి శర్మ ‘’ తలలు ఊపటం’’ తో నాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వక తప్పింది కాదు .ఆలోచన అమ్మాయిది ,కర్తవ్య నిర్వహణ అబ్బాయిది .సాధారణంగా నేను ఒప్పుకోను .కానీ వయసు మీద పడుతోంది ,ఇదివరకైతే ‘’రయ్యి  మంటూ’’ స్కూటర్ పై ఎక్కడికైనా వెళ్లి వచ్చేవాడిని .ఇప్పుడు నన్ను అలా వెళ్ళ నీయటం లేదు మా అబ్బాయి, మనవడు చరణ్ ,మనవరాలు రమ్య . వాళ్ళే నన్ను ఎక్కడికైనా తీసుకు వెళ్లి తీసుకు వస్తున్నారు. కనుక ఈ రకంగా నా స్వేచ్చ కూడా కొంత తగ్గినట్లే .దీనికి తోడు రెండేళ్ళ కరోనా ఫలితంగా సరసభారతి ఉగాది వేడుకలు నిర్వహించ లేక పోవటం మనసులో ఏదో వెలితిగా ఉంది .కనుక నా పుట్టిన రోజు జూన్ 27 న నా పుట్టిన రోజుతోపాటు  ‘’సరసభారతి సాహితీ పుష్కరోత్సవం ‘’జరిపి సాహితీ బంధువులను అందరినీ ఆహ్వానించి ,సాహిత్యం లో విశిష్ట విశేష సేవలందించిన మహనీయులను ఆత్మీయం గా సత్కరించి ,కవులతో కవి సమ్మేళనం చేయించి , నేను రాసిన ‘’అణు శాస్త్ర వేత్త డా .ఆకునూరి వెంకట రామయ్య ‘’ పుస్తకాన్ని ఇంగ్లీష్ లోకి అనువదింపజేసి నాకు,సరసభారతి కి  అరుదైన గౌరవం కల్గించిన స్పాన్సర్  శ్రీ మైనేని గోపాల కృష్ణ శ్రీమతి సత్యవతి దంపతులు(అమెరికా ) కృతజ్ఞతగా ఆ ఆంగ్ల పుస్తకాన్ని ఆవిష్కరించటం చేస్తే బాగుంటుంది అనిపించింది .సాహితీ బంధువుల సమక్షం లో ఇక నేను కార్యక్రమాలు తగ్గించుకొని లైవ్ లో మాత్రమేసరసభారతి ని నిర్వహిస్తానని అందరికి తెలియ చేయటం నా ధర్మగా భావించాను. అదే చేశాను .

.కొందరు ప్రముఖులను గత రెండేళ్లుగా ఆహ్వానించినా  పెద్ద ఎత్తున సభలు జరిపి సన్మానించలేక పోయాము అనే అసంతృప్తీ ఉంది .కార్యక్రమాలు ఆపకుండా మా శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో నిర్వహిస్తూ కవి సమ్మేళనం తప్ప పుస్తకావిష్కరణలు స్థానికులకు ఆత్మీయ సన్మానాలు చేశాం .కనుక కొంచెం భారీగా ఈ సారి కార్యక్రమం జరపాన్నది నా తలపు .అతిధులను అందర్నీ నేనే ఫోన్ లో మాట్లాడి ఆహ్వానించాను .నేను అనుకొన్న పేర్లు కాక ఇంకెవరైనా ఉంటె చెప్పమని శ్రీ దండి భొట్ల దత్తాత్రేయ శర్మగారినిఅడిగితె, ఆయన అవధాన రవళి శ్రీ ఆముదాల మురళి గారి పేరును ,బాల అవధాని చి. ఉప్పలధడియం భరత్ శర్మ ను సూచిస్తూ ,సంగీత కచేరీ కూడా ఉంటె బాగుంటుందని ‘’సన్నాయి నొక్కులు నొక్కారు ‘’మంచి ఆలోచన అంటూ ఎవర్ని పిలుద్దాం అంటే బందరుకు చెందిన  శ్రీ మతి ఓలేటి రాధికా సుబ్రహ్మణ్యం పేరు సూచించగా ‘’వాయస్ ‘’అన్నాను .వారినే ఆ ముగ్గుర్ని ఆహ్వానిస్తే  ,ఆయన మురళి గారి నంబర్ నాకు ఇవ్వకపోవటం నేను అడగక పోవటం జరిగి ఆయన తప్ప మిగిలిని ఇద్దర్నీ ఫోన్ చేసి ఆహ్వాని౦చాను .ఇవన్నీ ఎప్పటికప్పుడు బులెటిన్ ల లో పెడుతుండగా వరంగల్ లో శ్రీ లేఖ సాహితీ సంస్థను నిర్వహిస్తున్న నాకు ఆత్మీయులు మా పురస్కారం అందుకొన్నవారు  డా .టి.రంగస్వామి మెయిల్ రాసి మద్రాస్ లో ఉన్న శ్రీ గుడిమెట్ల చెన్నయ్యగారి సాహితీ సేవా కార్యక్రమాలు రాసి వీలుంటే చూడండి అనగా వెంటనే నంబర్ రాయమంటే ,రాయగా వారితో మాట్లాడాను.’’ సరే ‘’అంటూ హోసూరు లో తెలుగు సంస్థ నిర్వాహకులు   డా వసంత్ ఉగాది కవి సమ్మేళన కవితల ‘’పోత్తానికి’’ నేను సమీక్ష చేస్తూ వారి కవితను మెచ్చుకొన్న విషయం గుర్తు చేశారు .శ్రీ బెల్లం కొండ నాగేశ్వరరావు గారినీ గత రెండేళ్లుగా ఆహ్వానిస్తూనే ఉన్నాం .ఈ సారి అయినా తప్పక వస్తారనుకొంటే  అకస్మాత్తుగా వారికి ఆరోగ్య సమస్య వచ్చి  రాలేక పోయానని నిన్ననే తెలియజేశారు .అలాగే మద్రాస్ లో ఉంటున్నడా మాడభూషి శ్రీధర్ గారి శిష్యురాలు  శ్రీమతి లేళ్లపల్లి శ్రీదేవి నిరుడు మాడభూషి వారు ‘’జూమ్ ‘’లో నిర్వహించిన  సాహితీ కార్యక్రమం లో నన్ను పరిచయం చేసి అప్పటినుంచి నన్ను ‘’బాబాయి గారు ‘’అంటున్న ఆమెను ఆమె భర్తనూ ఆహ్వానించా .ఆమెకు కూడా అకస్మాత్తుగా జ్వరం వచ్చి రాలేక పోయారు .డా ఎన్.భాస్కరరావు గారు ఢిల్లీ లో ఉండిపోవాల్సి వచ్చి రాలేదు .వీరు తప్పఅందరు హాజరవటం ఆనందంగా ఉంది .

    విశిష్ట ,విశేష పురస్కార గ్రహీతలలో ఉన్న నర్మదా రెడ్డి .భవానీ  ,ప్రకాష్ గార్ల కూ రెండేళ్ల  నుంచి ‘’డ్యూ’’.వీరూ రావటం సంతోషం .శ్రీ సుబ్రహ్మణ్యంగారు చిరపరిచితులు ,బదరీగారు నిడదవోలులో రెండేళ్ళక్రితం పరిచయం .టేకు మళ్ల  వారు దాదాపు పదేళ్లుగా పరిచయం .మా కార్యక్రమాలకు తప్పక వచ్చేవారు .మా త్యాగరాజ ఆరాధనోత్సవాలకు వారి శ్రీమతి చిదంబరి గారు వచ్చి కోమలగాత్రంతో అలరిస్తారు .గంధం వారి కథా గంధాన్ని ఆస్వాదించి వారి, రెండు సంపుటాలలోని కథలను ,వారి అన్నగారు శ్రీ వేంకాస్వామి గారి రెండు సంపుటాలలోని కథలను సరసభారతి  ప్రత్యక్ష ప్రసారం ద్వారా మరోసారి సాహితీ లోకానికి పరిచయం చేసే అదృష్టం కలిగింది .వీరితోదాదాపుగా పాతిక  ఏళ్ళ పరిచయం .వారి రాక మాకెంతో ముదావహం .శ్రీ చలపాక ,శ్రీ కళాసాగర్ సరసభారతి పుస్తక ప్రచురణకు వెన్ను దన్ను గా నిలిచినవారు .మా దూరపు బంధువు ,పురాతత్వ శాస్త్ర వేత్త శ్రీ వేలూరి కృష్ణ శాస్త్రి గారి తర్వాత మళ్ళీ ఆశాఖలో మంచి పేరు తెచ్చుకొన్న గాడేపల్లి రామకృష్ణారావు మా రెండవ బావగారు శ్రీ వేలూరి వివేకానంద్ గారి మేనల్లుడు .శ్రీమతి మైలవరపు లలితకుమారి గొప్ప విద్వాంసురాలు .ఆమె రావటం కూడా శోభచేకూర్చింది.ఆమె భర్త రామ శేషు గారు నాకు’’ ఫాన్’’. శ్రీమతి కేనేరుకల్పన ,శ్రీ పంతుల వెంకటేశ్వరరావు గార్లు మాకు పాతకాపులే .ఉయ్యూరు లో సాహితీ ప్రియులు కవి విమర్శకులు శ్రీ సారదిగారు .అలాగే ఉయ్యూరు శాఖా గ్రంధాలయ నిర్వాహకులు శ్రీ కృష్ణారావు గారు శ్రీమతి స్రవంతి గార్లు .వీరిద్దరి సాహితీ సేవ మరువలేనిది .ఇంకా ఎవరినైనా మర్చిపోతే మన్నించండి .

  అంతేకాక ఎందరెందరో వదాన్యులు నేను అడగకుండానే సరసభారతి కార్యక్రమాలకు ఆన౦దిస్తూ స్వచ్చందంగా విరాళాలిచ్చిన దాతలకు సభా ముఖంగా కృతజ్ఞతలు తెలుపుకోవటమూ ఇందులో పరమార్ధంగా భావించాము .అందుకే ఆహ్వానం లో వారి పేర్లు రాసి ‘’సౌజన్యం తో ‘’అని కృతజ్ఞత చెప్పుకొన్నాం .   ఇంత  వరకు బాగానే ఉంది .కవి సమ్మేళనం జరగాలి కదా .విషయ౦ ‘’సరసభారతి సాహితీ పుష్కరోత్సవం ‘’అని నేనేచెప్పి  ఇదంతా మా సంస్థ,దాని నిర్వాహకునిగా నేనే ఎక్కువగా కనిపిస్తానుకనుక ‘’కవులను వచ్చి నాకు డప్పు కొట్టండి ‘’అని అడిగితె బాగుండదు అని దత్తాత్రేయ శర్మగారికి చెప్పి కవులను ఆహ్వానించే బాధ్యతా, శీర్షికను వారికి తెలియ జేసే బాధ్యతే కాక మొత్తం కార్యక్రమాన్ని అలాంటి పండితుని చేత నిర్వహిస్తే బాగుంటుందని వారిని ఒప్పించి కవుల ఫోన్ నంబర్లు ఇచ్చి ఆయనతోనే వారికి ఫోన్ చేయించా .36పేర్లు సేకరించి ఆయన తెలియ జేసినా, సుమారు ఇరవై మంది మాత్రమె వచ్చారు .పురస్కార గ్రహీతలకూ అవకాశమివ్వటం తో రక్తి కట్టింది .దీనికి శర్మగారికి అభినందనలు . పురస్కార గ్రహీతలకు’’ ఉడతా భక్తి గా ‘’ సత్కారం శాస్త్రోక్తంగా నిర్వహించి మా శక్తిని బట్టి నగదు కానుక అందించాం .వారి విద్వత్ కు శక్తి సామర్ధ్యాలకు మేమిచ్చింది తులతూగేది కాదు . ,కవులనూఅలానే సత్కరించి నగదుకానుక లందించి సంతృప్తి చెందాం .

   హైదరాబాద్ లో ఉన్న మా అబ్బాయిలు శాస్త్రి శర్మలు  కోడళ్లు  కుటుంబాలతో రావాల్సి ఉంది .సరిగ్గా నెల క్రితమే మా మనవడు చి.చరణ్ ఉపనయనానికి అందరూ వచ్చారు కనుక పిల్లల పరీక్షలు చదువులు ఉద్యోగాలవలన రాలేక పోయారు .కానీ మా మనవడు ఛి హర్ష కు ఇలాంటి కార్యక్రమాలు అంటే మహా ఇష్టం .ఈ తాతగారిపై వాడికిఅమితమైన గౌరవం .నా లైవ్ ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తాడు . బిటేక్  సెమిస్టర్ పరీక్షలు వారం రోజులుగా రాస్తూ అలిసిపోయి ఆటవిడుపుగా ఇక్కడికి రావాలని తండ్రిపై ఒత్తిడి తెస్తే , బలవంతం మీద మా అబ్బాయి శర్మ వాడితో వచ్చి నేను అప్పగించిన కార్యక్రమం చక్కగా నెరవేర్చి సంతోషం కలిగించాడు .ఉయ్యూరు మనవడు చరణ్ ,మనవరాలు రమ్య చదువులు పరీక్షలు ,కాన్ఫరెన్స్ లవలన ఎక్కువ సేపు ఉండలేక పోయారు .మా కోడలు శ్రీమతి రాణి ఇంట్లో ఇచ్చిన సహకారం ఎన్నతగినది.అలాగె నాలుగవ కోడలు శ్రీమతి మహేశ్వరి ఆఫీస్ పని,ఈ సభా కార్యక్రమ౦ లలో గొప్ప సహకారం అందించింది .

 కార్యక్రమం అరగంట ఆలస్యంగా మొదలవటం ,నేనుఎంత పకడ్బందీగా ప్లాన్ ఇచ్చినా  ,వేదికపై తొట్రు పాట్లు జరిగాయి .పురస్కార గ్రహీతల స్పందనకు అవకాశం కలగనందుకు వారిని క్షమించమని వేడుకొంటున్నాను .వారందరూ మాట్లాడితే బాగా ఉండేది .కానీ చెప్పుల్లో కాళ్ళు పెట్టుకొని ,రైల్ కి వెళ్లాలనో, బస్  టైం అయి౦దనో కంగారులో మాట్లాడలేక పోయి ఉంటారు .

  ఈ బృహత్తర కార్యక్రమానికి బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు విచ్చేయటం మన ,మా అదృష్టం .మూర్తీభవించిన బ్రాహ్మీ మూర్తులు వారు. ఒక వేదవ్యాస మహర్షియో , వాల్మీకి మహర్షియో ,పరాశర మహర్షియో విచ్చేసిన అనుభూతి కలిగింది. వారు సరసభారతిని, నన్ను ఆశీర్వదించటం వేదాశీస్సుగా భావిస్తున్నాను .వారికి మరొక్క సారి కృతజ్ఞతలు తెలుపు కొంటున్నాను .

 ఎసి లైబ్రరీ లో జరగాల్సిన కార్యక్రమంప్రత్యక్ష ప్రసారానికి ,సంగీత కచేరీకి ఇబ్బంది అవుతుందని ,సరిగ్గా రెండురోజుల ముందు మాత్రమె గ్రహించి ,  శివాలయం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ వదాన్యులు  శ్రీ కుటుంబ రాజు గారి బిల్డింగ్ లో వారి తోడ్పాటు తో నిర్వహించాం .  ఎసి అలవాటైన కొందరికి  ఇబ్బంది కలిగించి ఉండచ్చు ఈ అసౌకర్యానికి మన్నించండి .రాజుగారికి కృతజ్ఞతలు .వారి సౌజన్యం మరువలేనిది.ఈ మధ్య మన భారీ కార్యక్రమాలు కెసీపి దగ్గరున్న రోటరీ ఆడిటోరియం లో జరిగేవని మీకు తెలుసు అక్కడ మనకు అన్ని రకాల సహాయ సౌకర్యాలు అందించే శ్రీ కొండలు గారు మరణించటం ,ఇప్పుడున్నవారితో మాకు పరిచయాలులేకపోవటం వలన అక్కడ జరపలేదు .

  ఇవన్నీ ఒక ఎత్తు .దాదాపు వందమంది పైగా సాహిత్య సంగీతాభిమానులు పాల్గొని సభను దిగ్విజయం చేశారు. వారందరికీ ధన్యవాదాలు .లైవ్  ప్రసారం ,ఫోటోగ్రఫీ నిర్వహించిన శ్రీ ప్రకాష్ అతని బృందం అభినందనీయులు .వేదిక ఏర్పాటు తో సహా సభకు కావాల్సిన హంగు లన్నీ సమకూర్చిన మా అబ్బాయి రమణ అభి నందనీయుడు .వాడికి సహకరించిన వారికీ ధన్యవాదాలు .సరసభారతి గౌర వాధ్యక్షులు  శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి గారికి నిర్వహణ సహకారం అందించిన కార్యదర్శి శ్రీమతి మాదిరాజు శివలక్ష్మికి ,భర్త శ్రీ శ్రీనివాస శర్మ గారికి సాంకేతిక నిపునులుశ్రీ విబిజి రావు గారికి ,మా అన్నగారబ్బాయి  చి రామనాద్ బాబు కు  శ్రీమతి మల్లిక గారికి ప్రత్యెక ధన్యవాదాలు  .జాగృతి సంస్థ వారు ఉత్సాహంగా పాల్గొని ఘనవిజయం చేకూర్చి ఫినిషింగ్ టచ్ ఇచ్చి నందుకు అభినందనలు .

 అందర్నీ  ఆహ్వానించి ,వారికి సరైన ఆతిధ్యం ఇవ్వటం మా ధర్మం .కనుక మంచి ఉపాహారం ,టీ అందించి చివరికి కమ్మని విందు కూడా ఇచ్చి సంతృప్తి పరచాం .శ్రీ ప్రసాద్ గారి కేటరింగ్ అద్భుతంగా ఉందనీ అన్నీ రుచికరంగా ఉన్నాయని అందరూ భావించి సంతృప్తిగా భోజనం చేశారని అందరూ చెప్పగా మా దంపతులం చాలా ఆనందించాం .

  అసలు సందడి రేపు రాస్తాను .ఇది నేపధ్యం మాత్రమె .

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -29-6-22-ఉయ్యూరు  

చి. శిష్టు సత్యరాజేష్ గురించి చెప్పటం మర్చిపోయాను. సుమారు అయిదేళ్లుగా పరిచయమున్న ఉత్సాహవంతుడైన సాహితీ కార్యకర్త .గోదావరి రచయితల సంఘం అధ్యక్షుడు .శ్రీ మతి డొక్కా సీతమ్మగారు, శ్రీ ఎస్పి బాలు గార్లపై కవితలు రాయించి సంస్థ తరఫున ప్రచురించాడు. అలాగే బాలలకోసం కథలు, కవిత్వం రాయించి సంకలనాలు తెచ్చాడు .జూమ్ మీటింగ్ లు నిర్వహిస్తాడు .అతడికి విశేష పురస్కారం ఇచ్చాం .అలాగే 58 ఏళ్ళ క్రితం ఉయ్యూరు హైస్కూల్ లో ట్యూషన్ లో నా శిష్యురాలు ,ఉయ్యూరు స్వగ్రామం భర్తగారిదికూడాఉయ్యూరు  అయిన శ్రీమతి పువ్వుల కరుణానిధి సరసభారతికి అత్యంత ఆప్తురాలు .రామగుండం లో ఉన్నా ఉయ్యూరు వస్తే  ఆ దంపతులు మా ఇంటికి వచ్చి కనపడే వినయశీలి ,స్వచ్చందంగా మా సంస్థకు విరాళాలు అందించే  భక్తురాలు .కనుక కరుణా నిధి ,శ్రీ నరసింహారావు దంపతులకు’’ ప్రత్యెక ఆత్మీయ సౌజన్య పురస్కారం’’ అందించాం.నిన్న డా .మాడభూషి సంపత్కుమార్ అని రాయటానికి బదులు శ్రీధర్ అని పొరబాటుగా రాశాను .ఇవన్నీ’’ కవర్ చేసుకోవటాని’’కి సారీ సరిదిద్దుకోవటానికిచేసిన ప్రయత్నమే ఇది .

  వారం రోజుల సందడి గురించి రాయటానికి ముందు కొన్ని సంగతులు రాయాలి .నిరుడు మార్చి 22 న మా మూడవ అబ్బాయి డా నాగగోపాలమూర్తి అకస్మాత్తుగా గుండె పోటుతో మరణించాడు .ఆసంగతి మీకు తెలుసు .ఈ మార్చి 9,10,11 తేదీలలో అతని సంవత్సరీకాలు పూర్తయ్యాయి .దానికోసం ఇళ్ళకు సున్నాలు వేయించటం హడావిడి  .ప్రతి ఏడాది మాఘమాసం లో ఒక ఆదివారం మా శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో ఉదయం పూట పాలుపొంగించి ఉచితంగా సామూహిక శ్రీ సత్యనారాయణ వ్రతాలు జరిపి భోజనాలు ఏర్పాటు చేసేవాళ్ళం .కానీ ఈ సారి మాఘం లో కుదరక ఫాల్గుణ శుద్ధ ఏకాదశి ఆదివారం 13-3-22ఘనంగా నిర్వహించి విందు ఏర్పాటు చేశాం .

   తర్వాత ఏప్రిల్ 2 న శ్రీ శుభకృత్ సంవత్సర ఉగాది వేడుకలు మా దేవాలయం లో ,మధ్యాహ్నం ఇంటి దగ్గర ప్రత్యక్ష ప్రసారంగా పంచాంగ శ్రవణం, సాయంత్రం గండి గుంట దత్త గుడిలో  పంచాంగ శ్రవణ౦  చేశాను .శ్రీరామనవమికి శ్రీసీతారామ కల్యాణం మనగుడిలో వైభవంగా నిర్వహించాం .

  మే 22 ఆదివారం మా మనవడు చి. సుస్మిత్ శ్రీ చరణ్ గౌతమ్ ఉపనయనం మా ఇంటి వద్దే చేశాం. మా అబ్బాయి రమణ కోడలు మహేశ్వరి పీటలమీద కూర్చుని ఉపనయనం చేశారు .దీనికి హైదరాబాద్ నుంచి మా అబ్బాయిలు కోడళ్ళు మనవలు మనవరాళ్ళు హైదరాబాద్ లో ఉన్న మేనల్లుడు మేనకోడలు దంపతులు  మా బావమరది ఆనంద్, భార్య ,కొడుకు, కోడలు ,మద్రాస్ లో ఉండే మేనల్లుడు కుటుంబం తో సహా వచ్చి పాల్గొన్నారు .మా శిష్యులు మల్లాది సత్యం ,వెంకటేశ్వర్లు మా ఇంటికి ఆప్తుడు చిలుకూరి దంపత్యుక్తంగా ,అలాగే మా మూర్తి అత్తగారు బావమరదులు కుటుంబాలతో సహా వచ్చి నిండుతనం తెచ్చారు . బెజవాడ నుంచి మా తోడల్లుడు కుటుంబం ,అలాగే బంధువులు మిత్రులు అభిమానులు విచ్చేసి వటువును ఆశీర్వదించారు. మా దంపతులకు  మా రమణ దంపతులకు చరణ్ కూ నూతన వస్త్రాలు అంద జేశారు .మేమూ అందరికీ బట్టలు పెట్టాం . మంచి విందు ,మామిడి పళ్ళతో సహా ఇచ్చాం .మా మేనల్లుళ్లు  మేనకోడలు మా అబ్బాయిలకు రసం మామిడి పళ్ళు తలొక 50 ప్రత్యేకంగా పాక్ చేయించి ఇచ్చాం కనుక ఇదో సందడి .

  అలాగే మే 23,24,25 సోమ,మంగళ, బుధ వారాల్లో శ్రీహనుమజ్జయంతి ని అత్యంత వైభవంగా మూడు రోజులు నిర్వహించాం మొదటి రోజు ఉదయం స్వామి వారికి అష్టకలశ స్నపన, అభిషేకం, నూతన వస్త్రధారణ. గంధసిన్దూరం ,చామంతి, గులాబిపూలతో పూజ సాయంతం సంగీత విభావరి ,రెండవరోజు మంగళవారం ఉదయం’’ వెయ్యి రస౦ మామిడి పళ్ళతో  స్వామి వారలకు విశేష పూజ ,సాయంతం ధార్మిక ఉపన్యాసం ,వైశాఖ బహుళ దశమి బుధవారం శ్రీ హనుమజ్జయంతి నాడు ఉదయం 6గం.నుంచి 9 వరకు తమలపాకు పూజ ,10గం.లకు స్వామి వారల శాంతి కల్యాణం సాయంత్రం మహిళా భక్తులచేశ్రీ హనుమాన్ చాలీసా పారాయణ ,వడమాల .నిన్న చేసిన మామిడి పళ్ళ ప్రసాదాన్ని కల్యాణం సమయంలోనూ ,రాత్రి చాలీసా సమయం లోనూ భక్తులకు అందజేశాం .రాత్రి 108కొబ్బరి కాయలు కొట్టించి కార్యక్రమం పూర్తీ చేయించాం .ఈ హనుమజ్జయంటికి ధ్వజ స్తంభం తో సహా గుడి గోడలకు అన్నిటికి రంగులు వేయించి ముస్తాబు చేశాం .,

  జూన్ మధ్య లో మాకుతుమ్బం అంతా కారులో  ద్వారకాతిరుమల వెళ్లి స్వామి వారి దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు మా గబ్బిత వారి రామారావు గూడెం అగ్రహారం లో మా స్థలం లో ఉన్న మా ఇలవేల్పు శ్రీ భాక్తాన్జనేయస్వామిని దర్శించి స్వయంగా పూజచేసి ,అక్కడి పూజారిణి శ్రీమతి రమాదేవి కి నూతనవస్త్రాలు నగదుకానుక అందించి  ఇంటికి తిరిగి వచ్చాం .ఇంతటి తీరిక లేని కార్యక్రమాలు పూర్తీ అయ్యాక అసలు సందడి ప్రారంభ మైంది .ఆవివరాలు మరో ఎపిసోడ్ లో తెలియజేస్తాను .

 సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -30-6-22-ఉయ్యూరు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

డాక్టర్ కె.ఎన్ .కేసరి గారి ముచ్చట్లు.2వ భాగం

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | 1 Comment

సరస్వతీ సమర్చనం

సరస్వతీ సమర్చనం

సరసమైన అక్షరాలపొందికతో
రససమంచితమైన పదాల అల్లికలతో
సహృదయ హృదయాలను వెలిగింపచేస్తూ
భాషా భారతికి సేవలందిస్తూ
రమణీయమైన రచనలతో
తీరైన కావ్యముల ద్వారా
ఎందరోమహానుభావులను
పాఠకలోకానికి పరిచయంచేస్తూ
సరసభారతి సాహితీ సంస్థద్వారా
“తెలుగులో మాట్లాడటం మనజన్మహక్కంటూ”
మాతృభాషను మాతను మరువరాదంటూ
సరస్వతీ సమర్చనం చేస్తున్న
పెద్దలు మాన్యులు శ్రీదుర్గాప్రసాద్ దంపతులు
సహస్రచంద్రదర్శన వేడుకలేకాక
శతవసంతాల పండుగనుజరుపుకోవాలని
వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలను
ప్రసాదించాలని మనసారా
మనసారా ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను.

డా.మైలవరపు లలితకుమారి
గుంటూరు.
9959510422.

Posted in పద్య రత్నములు | Tagged | Leave a comment

సహస్ర చంద్రదర్శన సౌభాగ్య మహోత్సవ పద్య రత్నములు

సహస్ర చంద్రదర్శన సౌభాగ్య మహోత్సవ పద్య రత్నములు

దైవతాశీస్సు!
శ్రీ ‘సువర్చలాదేవి’తో స్థిరముగాను, పూర్వకాలాన ‘నుయ్యూరు’ పురమునందు,
‘గబ్బిటాన్వయ’ పుణ్యంపు గరిమ మహిమ, తెలుప; స్థాపించుకొన్నట్టి దేవ ‘హనుమ’
గుణధనమున వెలిగెడు నీ గొప్పవాని, శిష్టు, దుర్గాప్రసాదు నా శీర్వదించు!

వేకువఝామునన్ గడగి  వేదవిశేష సుమంత్ర శేముషిన్,
చేకొని ‘యాంజనేయుని’కి సేవలుచేసిన పుణ్య భాగ్యమే,
నీ కమనీయ గ్రాత్ర వరణీయమహీయ వదాన్యసూత్రమై
సాకెనటంచు నెంచి, మనసా వచసా నతులన్ వచించెదన్!

గబ్బిట వంశ వర్ధనుడు! గౌరవ ‘దుర్గ ప్రసాదు మాస్టరున్’,
నిబ్బరమైన ప్రఙ్ఞకును, నిర్మలవర్తన మేలుబంతిగాన్,
కబ్బములెన్నొ  వ్రాసిన  ప్రకాండుడునై, గురుతుల్యుడై,
యబ్బిన విద్యలందఱకు నందగ జూచుట, ‘నెంత ధన్యుడో’!

సొగసు నిండార పండిన సోకుగాడు!
నిత్య పరిశుభ్ర సరిదభ్ర నీటుగాడు!
అందరిని కుదిపి కదుపు నాటగాడు!
పొగరు పండించి పెంచె, నీ పోటుగాడు!

వీరి వర్తనకు మత్తకోకిలా కీర్తన!
‘నెమ్మదిన్’ తన కోశమందున నిల్వజేయని వీరుడున్,
మమ్మునందరి దుమ్ము దుల్పుచు మారుపల్కగజేయకన్,
సమ్మతంబున వారి వెన్కనె సాగునట్టుల జేయుటన్
యిమ్మహాత్ముని ‘యాంజనేయుడె’ యెల్లవేళలగాచుతన్!

                                                         భవదీయుడు.
                                                              సరస కవిరాజు
                                                 విద్వాన్  నవులూరి రమేశ్ బాబు,
                                                              ఉయ్యూరు.  

Posted in పద్య రత్నములు | Leave a comment

కె.ఎన్.కేసరి గారి ముచ్చట్లు.1వ భాగం

Posted in రచనలు | Tagged | Leave a comment

Sarasabharati 27.06.22 program live

Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

ఇవాళ నా పుట్టిన రోజు

ఇవాళ నా పుట్టిన రోజు

 ఇవాళ 27-6-22 సోమవారం  నా పుట్టిన రోజు .82 వెళ్లి 83 వచ్చిన సందర్భంగా  సాహితీ బంధువులకు ,సాహిత్యాభిమానులకు ,హితులకు ,మిత్రులకు ,బంధువులకు ,కుటుంబ సభ్యులకు  శుభ కామనలు. గబ్బిట దుర్గా ప్రసాద్ – 

Posted in సమయం - సందర్భం | 1 Comment

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్ -2

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్ -2

1757ప్లాసీ యుద్ధం తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాలో తమపాలన మొదలు పెట్టేనాటికి తూర్పు భారతమంతా అరాచకంగా ఉంది .శాంతి భద్రతలు లేవు .ఇది 19వ శతాబ్ది  ప్రారంభందాకా కొనసాగింది .డబ్బుకు న్యాయం అమ్ముడు పోయింది .బ్రిటిష్ వారికి జీతాలేక్కువ ఇండియన్ లకుచాలా తక్కువ .దేశీయులు కూడా విదేశీయులతో పాటు అవినీతి లంచ గొండి తనానికి కేరాఫ్ అడ్రస్ అయ్యారు .ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా లో ఆర్ .సి దత్  ఇలా రాశాడు -‘’బెంగాల్ లో అప్పుడు దోపిడీ దొంగలు బందిపోట్లు అందలమేక్కారు .వారిని మేజిస్ట్రేట్లు  కూడా ఏమీ చేయలేకపోయారు .కారణం పోలీసుల జీతాలు అతి తక్కువకనుక లంచాలకు అలవాటు పడ్డారు .వీరి సహకారం  సరిగ్గా మేజిస్ట్రేట్ లకు దక్కలేదు .పెద్ద పట్టణాలు వ్యాపారకేంద్రాల్లో బందిపోట్ల దాడులు తీవ్రంగా ఉండేవి .గ్రామాలు భయంతో కంపించేవి .బందిపోటు నాయకులు మారినప్పుడల్లా వారిని ప్రసన్నం చేసుకోవటానికి మూల్యం చెల్లించాల్సి వచ్చేది .1800 నుంచి పదేళ్ళు దేశం విపత్కర పరిస్థితులలో కొట్టు మిట్టాడింది .బజార్లలో మార్కెట్ లలో ‘’బెంగాల్ రాజ్ రాయ్ ‘’ల గురించి కధలు గాధలుగా చెప్పుకొనేవారు .తగిన అధికారాలు లేక మేజిస్ట్రేట్లు, పోలీసులు అచేతనులయ్యారు .ప్రజలు దుస్థితి కి తలవొగ్గారు .పాలకుల చర్యలు ప్రజల్ని మరింత సంక్షోభాపెత్తాయి .తప్పుడు సమాచారాలతో భారీగా అరెస్ట్ లు జరిగాయి .బందిపోట్లతో పాటు పోలీసుల పీడా కూడా జనాలను కుంగదీసింది .బ్రిటిష్ పాలన అంతం అయేదాకా ఈ పరిస్థితి ఉంది .దేశభాషలు ఆచారాలు సంప్రదాయాలు ,సామాజిక వ్యవస్థ తెలీని  బ్రిటిష్ అధికారులు ,ప్రాపకం సంపాదించిన వారి సాయంతో మరింత అన్యాయాలు చేయించారు .మోకాళ్ళ  మెదడు లోని ట్యూబ్ లైట్లు వెలిగి ,పాలన ,న్యాయ వ్యవస్థ,బాధ్యతాయుత పదవులలో విషయజ్ఞులైన సమర్ధులైన భారతీయులను నియమించాలి అని బ్రిటిష్ అధికారులు గుర్తించారు .కానీ తక్కువ జీతాలతో నియమించారు .ఈ పరిణామ తో భారత్ లో ఆంగ్లేయ విద్య కు నాంది పలికారు .భారతీయ ప్రభుత్వ సిబ్బందికి విషయ పరిజ్ఞానం అందించటమే వారి ముఖ్యోద్దేశం .కంపెని వాణిజ్య విధానాలతో దేశీయ పరిశ్రమలైన స్పిన్నింగ్ డైయింగ్ ,నూలు ,పట్టు పరిశ్రమలు  బాగా దెబ్బ తిన్నాయి .ఇదే అదనుగా బ్రిటిష్ వస్తువులు దేశీయులపై రుద్దటం మొదలు పెట్టారు .కొద్దికాలం లోనే దేశీయ వస్త్రాల ఉత్పత్తి దారులకు ,వారి పట్టు ,నూలు బట్టలకు స్థానం లేకుండా పోయింది ..దేశీ వస్త్రాలపై 67శాతం పన్ను విధించటం వలన ,యంత్ర వస్త్రాల తయారీ ధాటికి తట్టుకోలేక  అదృశ్యమయ్యాయి .నూలు విదేశాలకు ఎగుమతి అయ్యేది .వీటన్నిటితో భారత దేశం ఉత్పాదక స్థాయి నుంచి పతనం చెంది ,కేవలం వ్యావసాయక దేశంగా మారిపోయింది .నూలు వస్త్రాల ఎగుమతులు విపరీతంగా పెరిగిపోయాయి .

  గుత్తాదిపత్యంతో అక్రమ లాభాలు ఆర్జిస్తూ,,చార్జీలపేరుతో దేశాన్ని కొల్లగొట్టింది కంపెని ప్రభుత్వం .బ్రిటన్ కు చెల్లించాల్సిన వడ్డీ పై  వడ్డీ ,రైల్వే మిలిటరీ చార్జీలపై వడ్డీ ముక్కు పిండి వసూలు చేశారు .దేశీయ రాజులపైన ,ఆఫ్ఘనిస్తాన్ చైనా బర్మా నేపాల్ పై యుద్ధాల పైనా అయిన ఖర్చులు మననుండే  గుంజుకొన్నారు .1858లో ఈస్ట్ ఇండియా కంపెని పాలనను బ్రిటిష్ సింహాసనానికి ధారాదత్తం చేశాక ,మన దేశపు రుణ భారం పేరిట 15కోట్లు బ్రిటిష్ రాజ్యం ముక్కు పిండి వసూలు చేసింది .1857 సిపాయి తిరుగుబాటు ఖర్చు,1867 అబిసీనియా పై యుద్ధం ఖర్చూ  కూడా రాబట్టుకొన్నారు .1900 నాటికి మన రుణ భారం 2కోట్ల 40లక్షలు .

  దేశంలో పండిన ఆహార ధాన్యాలు విదేశాలకు ఎగుమతి చేయటం తో పేదరికం తీవ్ర స్థాయికి చేరింది .తరచుగా కరువులు  ,మహామారి1770-19౦౦ మధ్య 22సార్లు వ్యాప్తి వలనఆకలి బాధతో కోట్లాది జనం మలమలమాడి నశించారు  .కరువు తాండవమాడే కాలం లోనూ పన్నులు పెంచి పీడించారు .1866-67 ఘోర కరువుకాలం లోకూడా ,అంతకు ముందు ఎప్పుడూ లేనంత ఎక్కువగా ఆహారధాన్యాలు ఇండియానుంచి ఎగుమతి చేసి జనం చావుకు కారకులయ్యారు .

  ఉన్న ఒకే ఒక ఆదాయ వనరు వ్యవసాయం పైన కూడా అధికపన్నులు వసూలు చేసి రైతుల నడ్డి విరగగొట్టారు .దేశం భూకమత౦ గా  మారి ,దేశం లో పండింది ఏదైనా తమదే అనే నిర్ణయానికి వచ్చారు .రైతులు ,కూలీలు పొట్టగడవక బంది పోట్లుగా మారారు .1793లో సుంకాలు లేవీల వసూలు అధికారం లాండ్ లార్డ్ లనబడే బడా ధనికభూస్వాములకు  అప్పగించారు  .వసూలు చేసినదానిలోసి౦హభాగం అంటే 90శాతం ప్రభుత్వానికి అప్పగించాలని షరతు పెట్టారు .దీనితో భూస్వాములు సాధికార రెవిన్యు ఏజెంట్లయ్యారు .వాళ్ళు రైతులపై అదనపు పన్ను వసూలు చేసి విలాసాలకు ఉపయోగించుకొన్నారు .ఇలా సింహాసనానికి సొమ్ము దోచిపెట్టారు భూస్వాములు .అక్రమ పన్నులలో  తలపన్ను అంటే ‘’పోన్ టాక్స్’’ఒకటి .మనుషులుపశువులు పై ఈ టాక్స్ వసూలు చేసి భూస్వాములు తమ బొక్కసాలు నింపుకున్నారు బొర్రలు పెంచుకొన్నారు .తిండి గిజలు ,జనుము కొని బ్రిటిష్ దొరలతో  నీలి అంటే ఇండిగోతోటల పెంపకం దారులతో కుమ్మక్కై ,కౌలు రైతుల్ని పీడిస్తూ అంతులేని  అధికారం  చెలాయించారు .బక్కరైతులు బిక్క చచ్చి న్యాయ పోరాటం కూడా చేయలేక  శక్తి హీనులైపోయారు .తెల్లదొరల రక్షణలో ఉంటూ ,అనాగరకంగా రైతులను అణగదొక్కుతూ బలవంతంగా నీలి పండించేవారు .దీన్ని తక్కువ ధరకే కొని ఎక్కువధరకు అమ్మి  విపరీతంగా లాభాలు పొంది,రైతులకడుపులు కొట్టి నిర్భాగ్యుల్ని చేసి తాము  ఆధునిక కుబేరులయ్యారు బొర్రా సాబ్ లయ్యారు .

  భారత దేశంలో నీలి విప్లవం ‘’ఇండిగో రివోల్ట్ ‘’తో జాతీయ ఉద్యమానికి నాంది పలికింది .జర్మన్ శాస్త్ర వేత్తలు1880లో  సింధటిక్ రంగులు కనిపెట్టే దాకా నీలి రంగు రాజ్యమేలింది  .బెంగాల్ లో సుమారు 400 ఇండిగో కర్మాగారాలు ఉండేవి .నీలి పండించని రైతులపై భూస్వాములు ఏదో ఒక సాకుతో కక్ష తీర్చుకొనేవారు .ఆక్రమ నిర్బంధం తో చాలామంది రైతులు మరణించారు .1810లో వచ్చిన సర్క్యులర్ దాకా అంటే బెంగాల్ ప్రజలు ఎదురు తిరిగేదాకా  సుమారు అర్ధ శతాబ్దం నీలి రైతులపై అణచి వేతకొనసాగింది .1860లో ‘’ఇండిగో డిస్టర్బెంస్ ‘’అనే తిరుగుబాటు వచ్చాక బ్రిటిష్ నీలి పెంపక దార్లను తన్ని తరిమేశారు .నీలి పెంపకాన్ని ఎదిరించి బ్రిటిష్  వారి ఇళ్ళ పైనా  నీలి  ఫాక్టరీలపైనా ప్రజలు దాడులు చేశారు .బడుగు రైతుల ఈ తిరుగు బాటును పత్రికలూ బాగా సమర్ధించాయి .జెస్సోర్ జిల్లలో శిశిర్ కుమార్ ఘోష్ ,ఆయన తమ్ముడు మోతీ లాల్ ఘోష్ లు  నీలి రైతుల ఆందోళనకు మద్దతు పలికారు .దీన బంధు మిశ్రా రాసిన .’’నీల్ దర్పణ్’’-మిర్రర్ ఆఫ్ ఇండిగో నాటకం వాడవాడలా ప్రదర్శింఛి రైతు ఉద్యమానికి తిరుగులేని బలం చేకూర్చారు .ప్రజల్లో బ్రిటిషర్లపై అసహ్యం కలిగింది. మైఖేల్ మధుసూదన దత్ ఈ నాటకాన్ని ఇంగ్లీష్ లోకి  అనువదించి ‘రివరెండ్ జే లాంగ్ ‘అనే మారు పేరుతొ ప్రచురించాడు .ప్రభుత్వం ప్రాసిక్యూట్ చేసి వెయ్యిరూపాయల జరిమానా ,  నెల రోజులు జైలు శిక్ష వధించింది .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -25-6-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సరస భారతి సాహితీ పుష్కరోత్సవం ఆహ్వాన పత్రిక

Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన,అమృత బజార్ పత్రిక స్థాపకుడు , స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్ -1

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన,అమృత బజార్ పత్రిక స్థాపకుడు , స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్ -1

సచ్చీంద్ర లాల్ ఘోష్ బెంగాలీ లో రాసిన దానికి శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ ‘’మోతీలాల్ ఘోష్ ‘’గా తెలుగు అనువాదం చేయగా, కేంద్ర సాహిత్య అకాడెమి1992లో పుస్తకంగా ప్రచురించింది .వెల-37 రూపాయలు .పుస్తకం ద్వితీయ ముద్రణ భాగ్యం పొందింది .

  19వ శతాబ్దం మొదట్లో జాతీయోద్యమమ ,,భారతీయ జర్నలిజం జమిలిగా ఒకదాని నొకటి కాపాడుకొంటూ నడిచాయి .దేశం స్వాతంత్ర్యం పొందేదాకా ఈ రెండు జోడు గుర్రాలస్వారి చేశాయి .1757నుంచి 1910దాకా కలకత్తా నగరం బ్రిటిష్ పాలనలో పాలనా యంత్రా౦గానికి  రాజధానిగా ,తూర్పు భాగాన ప్రధాన వ్యాపార కేంద్రం గా ఉంది .అందువలన జాతీయోద్యమం అక్కడే పుట్టింది .కలకత్తా ,బెంగాలీలు జాతీయోద్యమం లో  అసామాన్య పాత్ర నిర్వహించారు .కలకత్తా పత్రికల సంపాదకులు భారత రాజకీయ లక్ష్యాలను ,అభిప్రాయాలను విస్తృతంగా ప్రచారం చేశారు.దాదాపు 50 ఏళ్ళ పాటు ఆ లక్ష్యాలు ,కార్యక్రమాలను రూపొందించి ,నిర్దేశించింది ఈ సంపాదకులే .దేశానికి రాజకీయ జాగృతి కలిగిన మొదటి దశలో ముగ్గురు మహానుభావులు మూడు మార్గాలలో చైతన్య రధాలను నడిపించి సారధులయ్యారు .అన్నగారైన శిశిర్ కుమార్ ఘోష్ శిష్యరికం ,తర్ఫీదు లో మోతీలాల్ ఘోష్ స్వాతంత్రోద్యమ కారుడుగా రూపొందాడు ,శాంతియుత ప్రతిఘటనకు ప్రజలను సమాయత్తం చేశాడు .బ్రిటిష్ పాలన తొలగించటానికి ,,స్వాతంత్ర్యం సాధించటానికి ,బ్రిటిష్ వలస రాజ్యమైన ఇండియా స్వీయ పాలనకోసం పోరాటం చేయటానికి సురేంద్ర నాథ బెనర్జీ పిలుపు నిచ్చాడు .అరవింద ఘోష్ సంపూర్ణ స్వరాజ్యం  ప్రతిపాదించాడు .ఆ విప్లవోద్యమానికి సిద్ధాంత కర్త కూడా అయ్యాడు .దేశ రాజకీయ పోరాట మౌలిక ప్రముఖులలో అరవిందులు ఒకరు .చిన్న కుగ్రామం నుంచి వచ్చిన మోతీలాల్ ఘోష్  పై ప్రముఖ వర్గానికి చెందిన వాడు కాదు .ఆ నాటి గ్రామీణ ప్రజల సాధకబాధకాలు గ్రహించి స్వాతంత్రోద్యమం వైపు మళ్ళినవాడు .గ్రామీణ ప్రజలను కాపాడాలంటే ,విదేశీ పాలకులను తరిమి కొట్టాల్సిందే అని భావించి గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం స్వాతంత్రోద్యమం లో అడుగుపెట్టాడు .

  కాలం ఆ తర్వాత మహా వేగంగా గడవటం తో ,వర్తమాన భారతం ఆ  స్వాతంత్రోద్యమ ప్రారంభకులను మర్చే పోయింది .కానీ గాంధీ ,నెహ్రూలు ఈ మహానుభావులను తరచూ స్మరించేవారు .వంకలేని తిన్ననైన జీవితం మోతీలాల్ ఘోష్ ది.పత్రికా రచనలో కర్తవ్య దీక్షలో ఆయన జీవితం పండి పోయింది .జాతీయోద్యమ ,స్వాతంత్ర్య పోరాటాలలో గ్రామీణ ప్రజలకు ప్రాతినిధ్యం వహించి ,అత్యంత ప్రముఖ వ్యక్తిగా భాసిల్లాడు .ఆయన వ్యక్తిగత జీవితం కంటే ప్రజాజీవిత విశేషాలు కార్యక్రమాలు ,కార్య కలాపాలకే అత్యధిక ప్రాధాన్యత నిచ్చి ఈ చిన్న పుస్తకం రాశానని బెంగాలీ రచయిత సచ్చీంద్ర లాల్ ఘోష్ వివరించాడు  .

  ప్రవేశిక

18వ శతాబ్దిలో బ్రిటిష్ వ్యాపారులు బెంగాల్ ను చేజిక్కించుకొని పాలన చేశారు .ఈ పునాదులపై విస్తరిల్లిన కలకత్తా మహా నగరం రాజకీయ ఉద్యమాలకు ,వ్యాపారాలకు గొప్ప కేంద్రమై ప్రాముఖ్యం పొందింది .స్వదేశే విదేశీ పాలకులమధ్య సాంస్కృతిక ఘర్షణలకు కూడా ఈ నగరం కేంద్రమైంది .మొగల్ సామ్రాజ్యం లో రాజకీయ ఐక్యత సాధించిన భారత్ ,బ్రిటిష్ వ్యాపారులు వచ్చాక ,చిన్న చిన్న రాజ్యాలు పరస్పరం ఘర్షణలకు దిగాయి .బ్రిటిష్ వారిచే అణచి వేయబడిన ప్రజలు ,రాజకీయ అధికార మార్పిడిని పెద్దగా పట్టించుకోలేదు .1757లో జరిగిన ప్లాసీ యుద్ధం లో ,బెంగాల్ పై ఆధిపత్యం చేతులు మారిన తరుణం లో ప్రజలు నిస్సహాయంగా ఉండి పోయారే తప్ప ,ప్రతిఘటన ప్రయత్నం చేయకపోవటం తో భారత దేశ భవిష్యత్తు స్థంభించి పోయింది .’’’లక్షల సంఖ్యలో ఉన్న బెంగాల్ జనాభా యూరోపియన్లను తరిమి వేయాలి అని యేమాత్రమైనా అనుకుని ఉంటె,రాళ్ళు రప్పలతో ఆ లక్ష్యాన్ని సాధించగలిగి ఉండేవారు .కాని వాళ్ళను స్తబ్దత ఆవరించింది ‘’అన్నాడు బ్రిటిష్ పార్లమెంట్ సెలెక్ట్ కమిటీ సమావేశం లో రాబర్ట్ క్లైవ్.

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-6-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సరస భారతి సాహితీ పుష్కరోత్సవం ఫైనల్ ఆహ్వాన పత్రిక

సరస భారతి సాహితీ పుష్కరోత్సవం ఫైనల్ ఆహ్వాన పత్రిక .చివర ఇచ్చిన లింక్ ను గమనించండి

Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

  శ్రీ మహమ్మద్ హుస్సేన్ రాసిన హరిహర నాథ శతకం -2(చివరి భాగం )

  శ్రీ మహమ్మద్ హుస్సేన్ రాసిన హరిహర నాథ శతకం -2(చివరి భాగం )

‘’శ్రీకరమై నీ నామము –ధీకరము నగణ్యపుణ్య దీప్తి కరమ్మై-లోకోత్తర శీలకర-మ్మై కావుట మమ్ము నెపుడు హరిహరనాథా ‘’అని కంద శతకం మొదలుపెట్టి మహమ్మద్ కవి .’’క౦దమ్ములు భక్తి రసా-నందంబులు ,నవ రసార్ద్ర నానాగుణమా –కందంబులువరశిల్పపు -టందంబులు స్వీకరింపు హరిహరనాథా ‘’అని ప్రార్ధించి క౦ద౦ అందంగా చెప్పారు .’’నీ కరుణ కృతార్ధ సుధా –సేకరణ ,మఖర్వ వృజిన జీమూత విశు-ష్కీకరుణ మపూర్వ ప్ర-జ్ఞా కరణ మకారణముగ’అంటూ కవితా రామణీయకంగా అన్నారు .’’కవి ‘’ముసిలి’’మ్మట వ్రాసెడి-కవనమ్ముజాను తెనుగునట కవితా ప్రభువో –భవహర హరిహర పతివట-హవణిల్లదే సుంత వింత ‘’అని మనకొచ్చే అనుమానం ఆయనకే వచ్చి సమాధానం చెప్పారు .’’ఇరు తెగల అఖిల మతుల నరిగెడి వారలకు హరిహర నాథుడు పతి అని శివ విష్ణు అద్వైతాన్ని తెలియజేశారు .క్రోధం అధముని విత్తం,బాధాకరం ,కుటిల వ్యాపారానికి సాధన కనుక ఆ వ్యాధినుంచి విముక్తి చేయమని వేడారు .

  శత్రువులకంటే అంతశ్శత్రువులే పరమ డేంజర్.వీటినుంచి బయట పడేట్లు చేయి .ఇదికాదు అదికాదు అంటూ అన్నీకాదని దేన్నీ చెప్పలేకపోయాయి పరమాత్మను .నీ కరుణా పీయూషాన్నిజుర్రకపోతే వెయ్యి పుటాలు పెట్టినా అజ్ఞానం తొలగదు .’అక్కజపు నింగి రిక్కల –లెక్కను దక్కువలు సేయులే –నా దొసగుల్-ఉక్కు సెడే-బెక్కు యతనము –లక్కున గ్రక్కున గదింపు ‘’ .పూచిక పుల్లను కూడా కదల్చ లేని వాడిని –‘’నీ చెయిది విశ్వ సృజనము ‘’కనుక నీ కరుణ యాచిస్తున్నాను .ఇంగువ కట్టిన గుడ్డ వాసన అంతావ్యాపించినట్లు పూర్వజన్మ పాపాలన్నీ నావెంట వచ్చాయి దాన్ని వదిలించు .’ఏ నాటి కు సంస్కారమో ‘’అని మొదటి పంక్తి తో మూడు పద్యాలురాసి కుసంస్కారం ,ఇంద్రియ లోలత్వం ,జ్ఞానులను సాధువులను చులకన చేయటం లో కొట్టు మిట్టాడే వారిని ఉద్ధరించు అని కోరారు .అలాగే ‘’నీ యాజ్ఞామాత్రమ్మున’’తో అయిదు పద్యాలురాసి వాయువు వరుణుడు క్రమం తప్పకుండా విధి నిర్వహణ చేస్తున్నారు ,చంద్ర సూర్యులు వేడి వెలుగు ఇస్తున్నారు ,సప్త సముద్రాలు తమ ధర్మాలను నేరవేరుస్తున్నాయి ,పంచ భూతాలూ ప్రకృతి ధర్మాలను తుచ పాటిస్తున్నాయి ,నీ ఆజ్ఞ లేకుండా చీమకూడా కదలదు అని ఉపనిషత్ రహస్యాలను అందంగా కందంలో బంధించారు .’’బలవంత మెంత చేసినా  భోగాలపై ఆసక్తి పోగొట్టమని ,,విషయ వాంఛలను తుదముట్టించమని ,పర ద్రవ్యాపేక్ష కూకటి వ్రేళ్ళతో కూల్చమని వేడుకొన్నారు .’’నీ కూర్మిలేకుండా మేమేమీ సాధించలేం ‘’.నీ నెనరు లేకపోతె స్నానధ్యానజపతపాలు ఫలించవు .చేతులు కాలాక ఆకులు పట్టుకొన్నట్లు పాపకూపాల్లో పడి క్షోభిస్తున్న నాకు నువ్వే దిక్కు .’’తెలివి తక్కువ ఆకలి ఎక్కువ ‘’అనే సామెత నిజం అవటానికి నన్ను పుట్టి౦చావు  –లెక్కకు మించిన ఇక్కట్లతో చతికిలపడ్డాను’’  అంటారుకవి .నీ సంకల్ప బలం కొంచెం ఉంటె చాలు సింధువు  బిందువు అవుతుంది హిమాలయం వట్టి రాయి అవుతుంది .నీ యక్కటికము బోలని –మాయత్నము పురుషాహంకారమా –కాదు ప్రభూ ‘నీ వద్ద అద్దం వెలుగులు చిమ్మగలుగుతుందా ‘’అని వేదాంత రహస్యం బోధించారు .

  ‘’ నా మేధా వైదగ్ధ్యం –నీ ము౦గల దాప నేర్తునె?’’తల్లి పుట్టిల్లు మేనమామకు తెలీదా స్వామీ ?ఎండినమాను చిగిర్చివసంతం లో శోభించినట్లు ‘బెండు పడిఉన్ననన్ను నువ్వే అనునయించాలి .ఏదో అభిశాపం నాపై దారుణ దాహమూని- బలవత్కామోన్మాదిగ బాధిస్తోంది తరుణోపాయం నువ్వే చెప్పాలి .గోరంత గౌరవం వస్తే కొండంతగా చాటి చెప్పుకొని భీర స్వా౦త౦తో అల్పునిగా బతికే నాకు నువ్వే ఏడుగడ హరిహరా ..కొండంత దేవుడికి కొండంత పత్రి ఇచ్చుకోలేముకదాకనుక ‘’గుండియనుడుగర సేసెద –నండగ నీ నెనరు నింపు ‘అని ప్రార్ధించారు కవి .’’దేవర చిత్తం నా భాగ్యం ‘అంటూ 113 వ పద్యంతో శతకం పూర్తి చేశారు .

  శతకానికి అనుబంధంగా ప్రాతస్మరణ ,నిద్రా సమయస్మరణ ,కూడా కందాలు రాసి చివరి కందాలలో ‘’పది తొమ్మిది వందల నలు –బది ఏడవ వత్సరా౦త  వాసరముల స-మ్మదమున దీని రచియించితి –నదిరా క్రీస్తు శకమ౦దు హరిహరనాథా ‘’అనీ తర్వాతపద్యంలో ద్వారకా తిరుమల పుణ్య క్షేత్రానికి సమీపం లోని ‘’దొరసాని పురం ‘’లో జన్మించాననిచెప్పారు .130వ పద్యం లో ‘’దీని రచించిన నీ –సేవానిరతున్ ,గుణ గణాఢ్యు  ,వరమహమ్మద్ హు –స్సేనాఖ్యు గవిత్వ పద –ధ్యానపరున్,నన్ను గావు హరిహర నాథా ‘’అని శతకం పూర్తి చేశారు కవి మహమ్మద్ హుస్సేన్ జీ .

  దీనికి బోనస్ గా ‘’పంజాబ్ దురంతాలు ‘’శీర్షికతో 45 పద్యాలు రాసి ఆ దృశ్యాలను కళ్ళకు కట్టించారు .కవి గారు లోతైన పాండిత్యం ,సకల శాస్త్రాలలో గొప్ప అవగాహన ఉన్నవారు. మీదు మిక్కిలి ఆంద్ర ఆస్థానకవులు శ్రీపాద వారి ప్రియశిష్యులు .వారి వాత్సల్యామృతాన్ని పుష్కలంగా గ్రోలినవారు .ద్రాక్షాపాక౦గా ,సరళ మృదు మధుర పదజాలంతో రాసిన శతకం .హరిహరనాథునికి మరో అరుదైన కానుక ఇది .భక్తకబీర్ రామనామ  పారాయణ చేసి ధన్యుడైనట్లు మహమ్మద్ హుస్సేన్ కవిగారు హరిహరనాథుని స్మరించి ధన్యులయ్యారు .వారికి ఆంధ్రలోకం కృతజ్ఞత తో కైమోడ్పు ఘటి౦చాలి .ఈ శతాకాన్ని, కవి హుసేన్ గార్ని పరిచయం చేసే మహద్భాగ్యం నాకు కలిగినందుకు పొంగిపోతున్నాను .

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -23-6-22-ఉయ్యూరు    

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ మతి కోనేరు కల్పన ‘’ఒకటి తక్కువ పదారు వన్నెలతో ‘’ చిన్నెలతో వినిపించిన తెలుగింటి’’ గుండె చప్పుళ్ళు ‘

శ్రీ మతి కోనేరు కల్పన ‘’ఒకటి తక్కువ పదారు వన్నెలతో ‘’ చిన్నెలతో వినిపించిన తెలుగింటి’’ గుండె చప్పుళ్ళు ‘’

శ్రీమతి కోనేరు కల్పన గారితో సుమారుపాతికేళ్ళకు పైగాసాహితీ అనుబంధం ఉంది .సరసభారతి ఆస్థానకవులలొ ఆమె కూడా ఒక మాణిక్యం .నిన్న నా సహస్ర చంద్ర మాసోత్సవానికి కుమారుడు, మనవడు లతో కలిసి వచ్చి మా శ్రీ సువర్చలాన్జనేయస్వామిని దర్శించి మాకు పట్టు బట్టలు పెట్టి  మా ఆతిధ్యం స్వీకరించి ,తాను  నవంబర్ లో ప్రచురించిన ‘’గుండె చప్పుడు ‘’కథా సంపుటి అందించారు ,ముక్కు సూటి మనీషి.కథల్లో కవిత్వం లో అదే కనిపించి ఆమెకు విశిష్టను కలిగించాయి .ఆమె సాహితీ ప్రస్థానం సుదీర్ఘం .రావి( వారి )వృక్షం క్రింద  ఎదిగిన కవి .బందరు సాహితీ మిత్రుల ప్రధాన కార్యదర్శి ,కోశాధికారి ,ఉపాధ్యక్షురాలు ,అందుకే ఈపుస్తకాన్ని తన మెంటార్ డా రావిరంగారావు గారికి ఆయన సాహిత్య స్వర్ణోత్సవ కానుకగా అంకితమిచ్చారు .ఇవాళ ఉదయమే ఆపుస్తకం చదివి ,నా స్పందన తెలియజేస్తున్నాను .

 ‘’ అన్ని పనులు సవ్యంగా జరగాలంటే కృష్ణ సారధ్యం కావాలి కానీ శల్య సారధ్యం కాదు.సాయం చేయలేక పొతే కాం గా ఉండండి .నా చేతనయినట్లు నేనే చేసుకొంటాను ‘’అని భర్త కు యాక్సిడెంట్ జరిగి ,కోలుకుంటూ ,కూతురు పెళ్లి నిశ్చయమై ,పనులతో సతమత మౌతుంటే మరిది చేతనైన సాయం చేయకుండా చీటికీ మాటికీ అడ్డువస్తూ చీకాకు కలిగిస్తూ దెప్పుతూ ఉంటె ఒక ఇంటి వదిన గారు మరిదికి పెట్టిన గడ్డి ‘’సారధ్యం ‘’కథ..దొడ్డ మనసు తో  బీదా బిక్కీలకు అన్నిరకాలసాయం అందిస్తూ ఆమె పేరేవరికీ తెలియకపోయినా ‘’దొడ్డమ్మా’’అంటూ అందరి చేత పిలిపించుకునే దొడ్డమ్మ పశువులు పొలాలకు వెడుతూ పేడ వేస్తె వాటి ‘’కడి ‘’లలో గింజలను ఏరుకోవటానికి నిర్భాగ్యులు ఎదురు చూసే కరువు వచ్చి అతలాకుతలం చేస్తోంది జనాన్ని .ఆమె రోజూ ఇంటికి ఇళ్ళకు గింజలు పంపుతుంది .జీత గాళ్ళ ఇళ్ళకు ఒక పూట అన్నం పంపుతుంది. ఒక పొరుగూరి వాడు ఆమె ఆనూ పానులను ,ఆమెకు నమ్మకమైన వాడిద్వారా కూపీ లాగుతుంటే వాడికి అనుమానమొచ్చి ఆమె చెవిలో వేస్తె ,బందిపోట్లు దోచుకోవటానికి వస్తున్నారని గ్రహించి తన ఇంట్లో ఉన్న రెండు లంకె బిందెల్లో ఒక దాన్ని ఎవరికి తెలీకుండా ఒక చోట పాటించి రెండవదాన్ని తన దత్తుడి౦ట్లో పెట్టించి ,తలుపులేసుకొని అడ్డ గడియకూడా పెట్టుకొని ఇంట్లో కాపలా లేకుండానే ధైర్యంగా పడుకొన్నది దొడ్డమ్మ. ఆరాత్రే .నిశిరాత్రి నలుగురు బందిపోట్లు తలుపులు  బాదుతూ తియ్యకపోతే విరగ్గొడతా మంటే తలుపులు తీయగా వాళ్ళు దౌర్జన్యంగా ప్రవేశించి లంకె బిందేలేక్కడున్నాయో చెప్పమంటే మా ఆయనతోనే మా వైభవమూ పోయింది ఆయన చేసిన  అప్పులు తీర్చటానికే అవి చాలలేదు ‘’లౌక్యంగా  చెప్పగా నిజం చెప్పకపోతే ‘’నీ కొడుకును చంపేస్తాం ‘’అంటే ‘’వాడు టైఫాయిడ్ తో బాధ పడుతున్నాడు చంపితే పాపం రా ‘’అని చెప్పి తన చేతులకున్న గాజులు మెడలోని ఒంటిపేట గొలుసు తీసి అక్కడ పెట్టి అవే తనదగ్గరున్నవి అనిచెప్పి తీసుకు వెళ్లమంది .వాళ్ళు ఇల్లంతా వెతికి ఏమీ దొరక్క పెరట్లోనూ తవ్వి అక్కడా శూన్యం అని తెలుసుకొని వెళ్లిపోతుంటే ‘’ఆశగా వచ్చారు ఉసూరు మంటూ వెళ్ళకండి కాస్త అన్నం మామిడిఊరగాయ  ఉంది నాలుగు ముద్దలు తిని పొండి’’అన్న దొడ్డ ఇల్లాలు దొడ్డమ్మ ‘’బందిపోట్లు కథ ‘’లో దొడ్డమ్మలోని దాతృత్వం మేధావితనం కనికరం అన్ని కోణాలలోనుంచి ఆవిష్కరించిన కత ఇది .

 డబ్బు ఎక్కువైతే ఒంటరితనమే వేధిస్తుంది ఎవర్నీ నమ్మలేం .శరీరసుఖాలెన్ని ఉన్నా మనసుకు సాంత్వన ఇచ్చేవాటిపైనే ఆధారపడాలి .తను భార్యా పిల్లలతో సంతృప్తిగా జీవిస్తున్నానని శివం  ప్రాణ స్నేహితుడు సత్యం తో  అంటే ‘’నాకు ఇవేమీ తెలీవు నా పిల్లలు వాళ్ళ బతుకు వాళ్ళు బతుకు తున్నారు నేనుమాత్రం అనాధ ,వృద్ధాశ్రమాలు తరుగుతూ సీనియర్ సిటిజెన్స్ పెన్షనర్స్ తో  గడుపుతూ ఖానం తీరిక లేకుండా ఉన్నాను .వాళ్ళ సమస్యలు తీర్చి వాళ్ళు సుఖపడుతుంటే చూసి ఆనందిస్తున్నాను .ఇదే నాడ్యూటీ గా భావిస్తాను .ఆనందంగా ఉన్నానా లేనా అనే ఆలోచనే నాకు రాదు ‘’అ౦టాడుసత్యం ‘’సత్యం శివంసుందరం ‘’లో .ఆప్యాయంగా ఆత్మీయంగా ఆతిధ్యమిచ్చి అన్నం పెడితే అది చింతకాయ పచ్చడితోనైనా పచ్చి పులుసుతోనైనా ‘’అమృతోపమానం గా ఉంటుందని చెప్పిన కథ ‘’కొత్తాకు బుట్ట ‘’.ఇంతకూ కొత్తాకు బుట్ట అంటే ఏమిటి ?పనసాకుల్ని మడిచి చిన్న చిన్న బుట్టలుగా కుట్టటం.వీటిలో ఇడ్లీ పిండి వేసి   ఆవిరిమీద ఉడికిస్తే రుచి అదుర్స్ .అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ‘’అవుట్ స్టాండింగ్ ఉద్యోగాలు ‘’అని చక్కగా విశ్లేషించి చెప్పిదే ‘’’నేనూ మనిషినే ‘’.చిత్తజల్లు లో ఒక గౌరవ నీయ వంశానికి తాను  వారసుడిని ఇవ్వ బోతున్నానని  ఆ ఇల్లాలు వసంత ఆనంద పడింది .ఇంటికోచిన భర్తకు తనకు ఆరవనెల ,ఆనందంతో గంతులేయకుండా తనకు పిల్లలు ఇష్టం లేదని అబార్షన్ చేయించుకోమని సీరియస్ గాభర్త వెంకట్  చెబితే షాకై ఏమి చేయాలో తోచకుండా ఉంటె సాయంత్రం డాక్టర్ దగ్గరకు తీసుకు వెడితే ఆస్థితిలో అబార్షన్ డేంజర్ అని,తనకు ఆమె మాత్రమె కావాలని మళ్ళీ భర్త అని .ఆమెను పట్టించుకోకుండా  ఉంటె ,ఆమెలోస్త్రీత్వం మాతృత్వం భర్తపై అనురాగం త్రివేణీ సంగమ౦గా ఉద్ద్రుతమై పొంగుతుంటే తట్టుకోలేక పోతోంది .పుట్టిన బిడ్డను మాయకుండలో కుక్కుతుంటే ప్రక్కనున్న రాజేశ్వరి రాగా కంగారుపడి బిడ్డ చచ్చిపోయిందని చెప్పగా ఆమె అన్నీ శుభ్రం చేసి ఆమెను పడుకోబెట్టింది .సాయంత్రం  వెంకట్ రాగా  విషయం చెప్పింది రాజేశ్వరి .డాక్టర్ కు  చూపించి మందులిప్పిస్తున్నాడు .ఇల్లుకట్టి రిజిస్ట్రెషన్లో భార్యపేరు చిత్తజల్లు వసంతమ అని ని రాయి౦చగా  చూసి ఆశ్చర్యపోయి ,తనను ఇంకా వెలయాలుగానే చూస్తున్నాడని అనుకుని ,తనకడుపున పుట్టిన బిడ్డను తన వారసునిగా అంగీకరిస్తేనే కదా తనకు గౌరవం అని భావించింది .అతడు పిల్లాడిని ముద్దాటటం చూసి విస్తు పోయింది .కుర్రాడు ఒక రోజు అతడిని ‘’పాండురాజు చనిపోతే ధర్మాత్ముడు విదురుడు రాజవ్వాలి కదా ధృత  రాష్ట్రుడు ఎలాయ్యాడు ?అని అడుగుంటే విన్నది వసంత .అతడు ‘’విదురుడు దాసీ పుత్రుడు .అందుకే రాజు కాలేదు ‘’అన్నాడు .వసంతకు భ్రమల మబ్బులు వీడాయి ‘’వాళ్ళు బీజం వేసిన వారికి కానీ ,క్షేత్రానికి కానీ వారసులు కాదు .ఆక్షేత్రాల స్వంతదారునికి వారసులయ్యారు ‘’అంటూ భర్త  కళ్ళలోకి  తీక్షణంగా అర్ధవంతంగా  చూసింది .అతనికి అర్ధం కాకపోయినా ఆ చూపు అతని గుండెలో బాకులా గుచ్చుకొన్నది .మళ్ళీ ‘’వాళ్ళు బీజం వేసిన వ్యాసమహర్షి సంతానంగా పెరగలేదు .క్షేత్రాలయిన క్షత్రియ స్త్రీల వారసులుగానూ పెరగలేదు .ఆ క్షేత్రాల స్వంత దారులైన వారి వంశం పేరున పెరిగారు. దాసీ అయిన విదురుడి తల్లిని వాళ్ళెవరూ పెళ్లి చేసుకోలేదు .కనుక అతడు వీళ్ళ వారసుడు కాలేదు కనుక ఇప్పుడు చెప్పండి .నేనిప్పుడు ఎవరి సొంతం ?నాకు పుట్టిన పిల్లలు ఎవరికీ వారసులు ??’అనగానే వెంకట్ తలది౦చు కొన్నాడు .ఇది ధర్మ సందేహాలు లో మల్లాది వారు చెప్పే ధర్మ సూక్ష్మం లాఉంది.పరిణతి చెందిన కథ రచయిత్రి కనుక కల్పనగారు ఈ కథను ఆద్యంతం గొప్పగా రాశారు  .శీర్షికా గొప్పగా పెట్టారు

  ఇలాంటివి 15 కథలున్న పుస్తకమే ‘’కల్పనగారి ‘’గుండె చప్పుడు ‘’అందరి గుండెలను తాకే కథా కదంబం .తప్పక చదివి ఆనందించాల్సిన పుస్తకం .కల్పన గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను .

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -21-6-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

28 -అలంకారాభాస హాస్యం

28 -అలంకారాభాస హాస్యం

సుమారు ఆరు నెలలక్రితం’’హేత్వాభాస హాస్యం ‘గురించి రాశాను .ఇవాళ ‘’అల౦కారా భాస హాస్యం ‘’గురించి తెలియజేస్తున్నాను .శరీరానికీ ,కావ్యానికీ అలంకారాలు అందం కోసమే .ఆమె ముఖం చంద్రుని వలే ఉంది అంటే ఉపమాలంకారం కానీ ఆమెముఖం సిబ్బి లాగా ఉంది అంటే మాత్రం అది ఉపమకు ఆభాసం .అలంకారం ఉచితమైనదిగా ఉదాత్త గాంభీర్యంగా ఉండాలి ఈ లక్షణాలు కోల్పోతే ,వికృత భావ గర్భితంగా ఉంటె ,అది అభాస రూపం పొందింది అంటారు అని మునిమాణిక్యం గారు సెలవిచ్చారు .అయితే అభాస రూపం లో అలంకారం ఉంటె హాస్యం పుడుతు౦ది.అదే చమత్కారం .

 అభాస రూపం –లాక్షణికులు కొన్ని పదాలను కావ్యపరంగా నిర్వచించారు .వాటికి హాస్య పరంగా కొత్త అర్ధాలను సృష్టించుకొని హాస్యరసానికి హాస్య భేద ,ప్రభేదాలను సూచి౦చటానికి తగిన పారిభాషిక పదజాలాను సృష్టించుకోవాల్సిన అవసరం వచ్చిందన్నారు మునిమాణిక్యం .ప్రసిద్ధమైన ఉపమ ఉత్ప్రేక్ష ,మొదలైన అలంకారాలు ఆభాస రూపం లో హాస్యం కోసం ఉపయోగించుకోవచ్చు అని మాస్టారు  ఉవాచ .అప్పుడు వాటి ఉదాత్తత ,గాంభీర్యం కోల్పోతాయి .దానినే తాను  ‘’అభాస రూపం పొందటం ‘’అన్నాను అన్నారు సార్.ఈ అలంకారాలు హాస్యానికి ఎలా ఉపయోగ పడతాయో చూద్దాం .

 ఉపమా భాస హాస్యం –ఆమె జడగరిటెకాడ లాగా ఉంది .కీర్తిని శరశ్చంద్ర చంద్రిక లాగా ఉంది అనటం మామూలు .కానీ ఆ కీర్తిని కొబ్బరిముక్కతో ,కర్పూరం తో పోలిస్తే అలంకారం ఆభాసం అయి హాస్యం పుడుతుందన్నారు మునిమాణిక్యం గారు .చీకటిని నల్లసిరాతో ,మేఘాలను సిగ రేట్ పొగతో పోల్చినా ఇలాగే నవ్వు పుడుతుంది అంటారు సార్.

  చిలకమర్తి వారి నరకాసుర వధ లో మందపాలుడు రంభను ‘’ఈమె చక్కని చుక్క .దాని శరీర కాంతి తాటి పేషం వలె ఉంటుంది .వెంట్రుకలు మసిబొగ్గు నలుపు .కొప్పు మాలకాకి ,కళ్ళు ఆలు చిప్పలు లాగా ,మొగం ఇత్తడి సిబ్బిలాగా గుండ్రంగా ఉంటుంది ‘’అన్నాడని మునిమాణిక్యంగారు చెప్పారు .ఇది కొంత జుగుప్స కలిగించేదే అయినా ,మనవాళ్ళు మనకు అందించిన హాస్యం ఇదే అన్నారు మాస్టారు .

  విరోధాలంకారం –పైకి మాత్రం విరోధం కనిపిస్తూ ,అంతరార్ధం లో విరోధం లేకపోతె విరోధాలంకారం అంటారు .’’హాస్య పరంగా విరుద్ధ భావాల పదాల సంయోగం విరుద్ధం ‘’అని మాస్టారు సింపుల్ గా డిఫైన్ చేశారు .ఉదాహరణ –అతడు ప్రకాశవంతమైన చీకటిలో నడుస్తున్నాడు .వాడు మందగమనం తో పరిగెత్తాడు .వీటిలో భిన్నార్ధా  లైన పదాలను ఒకదానికొకటి విరుద్ధమైన వాటిని కలపటం జరిగింది .ఇది ఒక రకమైన ‘’వాక్చమత్కృతి ‘’అన్నారు మునిమాణిక్యం .’’ప్రొఫెసర్ గారు ఏం చేస్తున్నారు ?’’అన్న ప్రశ్నకు  శిష్యుడు ‘’మర్చిపోయిన వాట్ని గుర్తుకు తెచ్చు కుంటున్నారు ‘’’అన్నాడు .మర్చి పొతే ,మళ్ళీ జ్ఞాపకానికి ఎలా వస్తాయి .కనుక ఇది విరుద్ధ భావ సంకలనం అని తేల్చారు మునిమాణిక్యం సార్.

  ఇంకో రకమైన విరుద్ధం  -ప్రసిద్ధ విషయాలకు విరుద్ధంగా మాట్లాడటం .-‘’ఇటలీలోని హిమాలయ గుహలలో ఋషులు తపస్సు చేస్తున్నారు ‘’అంటే విరుద్ధంగా కనిపిస్తుంది .మృచ్ఛకటికం లో రాజుగారి బామ్మర్ది శకారుడు ‘ఏను దుశ్శాసనుని వలె నీ కొప్పు దొరకొందును.జమదగ్ని కొడుకు భీమసేనుడేతెంచిఆపునో ,లేక చాన కుంతికి ఆత్మజుండు శంకరుడు ఆపగల డో”?అంటాడు .ఇది ప్రసిద్ధమైన కవిసమయాలున్న విరుద్ధం అన్నారు మునిమాణిక్యంగారు.అలాగే ‘’కోకిల మావి చివుళ్ళు తిని కడుపు నెప్పితో అరుస్తోంది ‘’అంటే అది విరుద్ధ సమయం కనుక నవ్వొస్తుంది అన్నారు .

 మరో రకం హాస్యం –భర్త భార్యను సినిమాకు రమ్మనిఎన్ని సార్లు పిల్చినా రాకపోతే ‘’వాస్తావా రావా ??’’అని గట్టిగా అరిస్తే ‘’వస్తానండీ ‘’అని ఆమె అంటే .’’ఈముక్క ముందే చెప్పి చావచ్చు కదా ‘’అని అయ్యవారంటే ‘’చెప్పాను చాలాసేపటి కిందటే ‘’అంటే ‘’ఏమని అఘోరించావ్ ‘’అని ఆయన అంటే ‘’ఒక నిమిషం లో వస్తానని అరగంట కిందటే చెప్పాను మీకు ‘’అంటే నవ్వకుండా ఉండలేం .ఇందులో కాలానికి సంబంధించిన వైరుధ్యం ఉంది అన్నారు మునిమాణిక్యంగారు .మరో తమాషా ‘’కృష్ణ శాస్త్రి గారికి 49 వెళ్ళటానికి రెండుమూడు ఏళ్ళు పట్టిందట పాపం.ఎంత బాధ పడ్డాడో ?’’ ‘’అని ఒక కవి మిత్రుడన్నాడని సెలవిచ్చారు మాస్టారు  .ఇవన్నీ విరుద్ధా లంకార ఆభాస  రూపాలు అన్నారాయన .

మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో

 సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-6-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ మహమ్మద్ హుస్సేన్ రాసిన   హరిహర నాథ శతకం -1

శ్రీ మహమ్మద్ హుస్సేన్ రాసిన   హరిహర నాథ శతకం -1

పశ్చిమ గోదావరిజిల్లా భీమడోలు మండలం దొరసాని పాడు గ్రామానికి చెందిన టీచరు ,కవి మహమ్మద్ హుస్సేన్ గారు హరిహర నాథ శతకం రచించి ,1959లో ప్రచురించారు .ఈశతకానికి ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవి శ్రీ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రిగారు అభిప్రాయం రాస్తూ ‘’ఎలిమెంటరి స్కూల్ మాస్టర్ అయిన మహమ్మద్ హుస్సేన్ నాకు 20ఏళ్ళ నుంచి పరిచయం ..శిష్యప్రాయుడు .గర్వం లేని సజ్జనుడు .మతసహనమున్నవాడు .ఈ శతకం లో కవిత్వం సరళం ధారాళం,మనోహరం .చక్కని కల్పనలతో భక్తి రస ప్రవాహంగా రాశాడు .ఇప్పటికే 15పుస్తకాలు రచించిన సామర్ధ్యం ఉన్నవాడు .చదివి ఆదరించి ప్రోత్సహించమని కోరుతున్నాను ‘’అన్నారు .

  భీమడోలు BDO శ్రీ బాలకృష్ణ ‘’ఈ కవి నాకు చాలాకాలంగా పరిచయమున్నవాడు .ఈ శతకం మధుర మంజులంగా రాశారు .కందాన్ని అందంగా  నడిపించిన  నేర్పున్నవారు .శతకం చదివి ఆనందంతో పులకిస్తారు అందరూ .అభ్యుదయకవిగా పేరు పొందాలి ‘అని అభిప్రాయం రాశారు .

  శతకాన్ని కవిగారు వితరణశీలి విద్యాభిమాని శ్రీమతి గారపాటి హైమవతీ దేవి ఆర్ధిక సాయంతో ప్రచురించినట్లు కందపద్యాలలో కృతజ్ఞత చెప్పుకొన్నారు .’’హరిహర నాథ స్మరణ –స్ఫురణం బాధ్యాత్మిక ప్రబుద్ధ విశుద్ధం –బరయుము ,మద్రచితంబిది-హరిహరనాథ శతకము మహత్కృతి చరితా ‘’అని వినయంగా చెప్పి ‘’ఆశుకవిని గాను ,హాస్య చతురత లేదు –గర్భ బంధ చిత్ర కవిత రాదు –దేవ దేవు డిచ్చు భావభక్తి ప్రేర-ణ౦బు మామక కవనంబు డంబు’’అని విస్పష్టంగా చెప్పుకున్నాడుకవి .కవి గారి అభ్యర్ధన పై హైమవతీ దేవిగారు ‘’మీరు కవితారూపం లో మానవ కల్యాణానికి ,విజ్ఞాన దాయకంగా వికసించు మీ వాణి ద్వారా మానవ  అజ్ఞాన అంధకారాన్ని పారద్రోలుతూ మహోపకారం చేస్తున్నారు .విద్యపై నాకున్న అభిమానం తో 116రూపాయలు మీకు అందిస్తునాను. గ్రహించి శతక ముద్రణకు ఉపయోగించండి ‘’అని రాశారు .అనన్య వదాన్య శేఖరులు ,కేవల కీర్తి వాంఛా పరులు ఉదార మనస్సంపన్నులు గుండుగొలను వాసి శ్రీ మావులేటి సోమరాజు గారిని కీర్తిస్తూ కవి రెండు పద్యాలు రాసి ‘’కృతులు శాశ్వత బుధనుత కీర్తి నిధులు –బళిర మిము నుతింప నేపాటి వాడను ‘అని వినయం ప్రకటించారు కవి .

   ఆకాంక్ష లో హుసేన్ జీ ‘’సార్దీకృత జన్ముడుగా నర్ధింటు ననుగ్రహింప హరిహరనాధా ‘’,’’వెలి చూపును ,లోజూపును –వెలివోని సుధీ బలమ్ము విలసి౦చు  సము –జ్జ్వల ఫాలజ్యోతిని నా –నకలవడ  ,నిలబడ నొనర్పు హరిహరనాథా ‘’  .హరిహరనాథా మకుటంతో ఉన్న ఇది కందాల శతకం ‘ఇందులోని అందాలు తర్వాత తెలుసుకొందాం .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -19-6-22-ఉయ్యూరు  

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

విశ్వ పుత్రిక తోరూ దత్-11(చివరి భాగం )

విశ్వ పుత్రిక తోరూ దత్-11(చివరి భాగం )

ఇరవై ఏళ్ళు  

ఇంగ్లాండ్ యువరాజు రావటం వెళ్ళటం జరిగాక కలకత్తా నిస్తబ్ద౦గా  ఉంది .తోరూ ఆయన్ను చాలాదగ్గరగా చూసి అందగాడు నీలికన్నుల వాడు తెలుపు బట్టతలా  అని మేరీకి జాబు రాసింది .ఆయన్ను చూడటానికి కాశ్మీర్ రాజు 40లక్షల తలపాగాతో వచ్చి ,101కాశ్మీర్ శాలువలు ,నవరత్నాలు పొదిగిన బంగారు  హుక్కా ,బంగారపు భోజన సామాను బహుమతులుగా ఇచ్చాడు.బాబూ జగదానంద ముఖర్జీ యువరాజును తన ఇంటికి ఆహ్వానించి,ఆడవాళ్ళను పరిచయం చేసి  మర్యాద చేశాడు .ఇది జనం లో సంచలనం కలిగించింది .స్త్రీలను పరిచయం చేస్తానంటేనే వచ్చాడు యువరాజు .దీన్ని సభ్యసమాజం తప్పు పట్టి దీనిపై వ్యతిరేకంగా నాటకాలు రాసి ప్రదర్శించారు .దీన్ని బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది .తోరూ పుస్తకముద్రణ దాదాపు పూర్తయింది .

  మిల్లె క్లారిస్ బాదర్ అనే ఫ్రెంచ్ మహిళ భారతీయ వీర వనితలపై రాసిన పుస్తకం తోరూను బాగా ఆకర్షించింది .దీన్ని అనువదించటానికి ఆమెనుంచి పర్మిషన్ తెప్పించుకున్నది .బాదర్ కు ఉత్తరం రాస్తూభారత దేశం లో  భర్త అసమర్దుడూ స్వార్ధ పరుడు అయినా సరే భార్య భర్తకు సర్వ సమర్పణ చేసి ఆరాధిస్తుంది ఇది ఆశ్చర్యం కదా ‘’అన్నది .మార్చి 4న తోరూకు 20ఏళ్ళు వచ్చాయి .పుట్టిన రోజు నాడే బాదర్ పంపిన పుస్తకం అందింది .మార్చి 24 నాడే ‘’షీఫ్ ‘’కూడా విడుదలైంది .అన్ని దినపత్రికలు రోజూ చదివేది .మానవత్వం ను అగౌరవపరుస్తూ పేపర్లలో వచ్చే వార్తలను ఆమె బాగా ఖండించి మేరీకి రాసేది .ఉత్తరాలలో హిందూ శబ్దానికి బదులు ‘’దేశీయ ‘’అని వాడేది .హిందూస్త్రీల భద్రతా విషయం లో ఆమెకు ఆదుర్దా ఉండేది .ఆనందమోహన్ బోస్ చాలా సార్లు తోరూ ను చూడటానికి వచ్చాడు .యుక్త వయసు కన్యల కోసం తాను  నడిపే స్కూల్ వ్యవహారాలు  చూడమని తోరూ ను కోరేవాడు .ఇండియాలో ఉంటె తోరూ స్త్రీ విద్యా వ్యాప్తికి చాలా తోడ్పడుతుందని ఆయన బాగా విశ్వసించాడు .

  తొరూ రోజులు దగ్గర పడుతున్నాయి .ఆమెను పాడనివ్వటం లేదు .ఆంక్షలు భరించలేక ‘’నన్నుఒక గాజు పెట్టెలో పెట్టండి ‘’అని విసుక్కునేది .హ్యూగో నవలలు ఫ్రెంచ్ కవితలు అనువదిస్తూనే ఉంది .’’షీఫ్ ‘’పుస్తకం జోరుగా అమ్ముడయి మంచి ఉత్సాహం తెచ్చింది .ఆమె కవితలు కొన్ని ‘’కలకత్తా రివ్యు ‘’పత్రికలో ప్రచురించటానికి తీసుకొని తండ్రికీ కూతురుకు గొప్ప జోష్ ఇచ్చింది .బెంగాల్ పత్రిక ఆమెను రచనలు పంపమని ఎప్పుడూ కోరేది .సోలరి, సెంట్ చాన్ ,గామెటి ది గ్రామెంట్,ఆగస్ట్ వాక్వేరి ధియో షెల్ గెటే,వాల్టర్ ,మార్నేర్ ,,విక్టర్ హ్యూగో రచనలు అనువదించి పంపేది .

  1876డిసెంబర్ నాటికీ తోరూ తీవ్రంగా జబ్బు పడింది .ఇంటి డాక్టర్ ఊరు వెళ్ళటం తో వైద్య కళాశాల డాక్టర్ స్మిత్ వచ్చి చూసి మందులిచ్చేవాడు .కళ్ళలో నుంచి రక్తం కారేది. ఏమందులవలన ఇది తగ్గలేదు .డిజిటాలిసిస్ కూడా ప్రభావం చూపలేదు .ఒకసారి డాక్టర్ స్మిత్ విజిట్ కు వచ్చినప్పుడు ఆమె పక్కనే ఉన్న ‘’షీఫ్ ‘’పుస్తకం చూసి ఆమె రాసిందే అని అడిగి తెలుసుకొని ఆమెపై మరీ శ్రద్ధతో వైద్యం చేశాడు .

 విశ్వం నుంచి విశ్వ పుత్రిక నిష్క్రమణం

క్లారిసే బాదర్ కు తోరూకు గాఢ స్నేహమేర్పడింది. క్లారిసే రాసిన పుస్తకాన్ని అనువదించటానికి పర్మిషన్ ఇమ్మని కోరగా ఆమె ‘’నేను రాసి గంగాతీర ప్రాచీనార్యులకు అంకితమిచ్చిన పుస్తకాన్ని అనువాదం చేయాలనుకొంటున్నది నేను మెచ్చే హైందవ నాయికల వారాసు రాలు కాబోలు ‘’అని సంతోషంగా అనుమతించింది క్లారేస్ .1877ఏప్రిల్ లో తోరూ జబ్బు బాగా ఎక్కువైపోయింది .ఈవిషయాన్ని మేరీకి ఉత్తరంలో తెలియజేసి ఆమెఫోటో పంపమని,ఇక యూరప్ రాలేము అని  తెలియజేసింది .మేరీ బాధ పడుతూ జవాబు  రాసి,ఫోటో పంపింది  .జులై 3న యేవో మూడు లైన్లు తప్ప రాయలేకపోయింది .ఆగస్ట్ 30న తోరూ మరణించినట్లు తండ్రి మేరీకిఉత్తర౦  లో తెలిపాడు .చివరిదాకా హ్యూగో రచనలను అత్యాసక్తిగా చదివింది .ప్రాణప్రదంగా చూసుకొన్ని కొడుకు ,ఇద్దరు కూతుళ్ళు తమ కళ్ళ ముందే చనిపోవటం ఆ తలిదండ్రులు జీర్ణించుకోలేక పోయారు .

  షీఫ్ బాగా ఆకర్షించింది సాహిత్య ప్రియులను –అందులో –‘’నువ్వు నిజంగానే పునర్జీవిస్తావు –నీ ఆశ నికరమైనది ‘’అన్నపంక్తులు చదివి చలించని వారులేరు –‘’సుందరమైన వదనం మీద –మందహాసం కరగిపోయినట్లే –అంతరించింది –నీ మీద నాకున్న ప్రేమ –నిన్ను విస్మృతికి తెచ్చే –శాపాలనుండి కాపాడుతుంది ‘’అన్నకవితను ఇ.జె.ధాంసన్ బాగా మెచ్చాడు .21ఏళ్ళకే విశ్వ పుత్రిక తోరూ దత్ ఈ విశ్వం నుంచి నిష్క్రమించింది .  

  ఆధారం –పద్మిని సేన్ గుప్తా రచనకు ఆచార్య నాయని కృష్ణకుమారి అనువాద పుస్తకం ‘’తోరూ దత్’’.

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-6-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

సరసభారతి’’ పుష్కర కాల ప్రగతి ‘’ మరియు గబ్బిట దుర్గాప్రసాద్  సాహిత్య ప్రగతి (అందరి అవగాహన కోసం )

సరసభారతి’’ పుష్కర కాల ప్రగతి ‘’ మరియు గబ్బిటదుర్గాప్రసాద్   సాహిత్య ప్రగతి (అందరి అవగాహన కోసం )

 సరసభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు

స్థాపన -24-11-2009

కార్యక్రమాలు

1-ప్రతి ఏటా ఉగాది కవి సమ్మేళనం ,ఆకవితలను 1-నవకవితా వసంతం 2-మా అక్కయ్య 3-మా అన్నయ్య 4-ఆదిత్య హృదయం 5-వసుధైక కుటుంబం పుస్తకాలుగా ప్రచురణ

2-ప్రముఖ కవిపండితులకు స్వర్గీయ విద్వాన్ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి శ్రీమతి భవనమ్మ గార్ల స్మారక పురస్కారాలు శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ డా ,కోట నిత్యానందశాస్స్త్రి సశ్రీ మండలి బుద్ధప్రసాద్ ,,శ్రీనోరి సుబ్రహ్మణ్యశాస్త్రి ,బౌద్ధ భిక్షు శ్రీ అన్నపరెడ్డి  వెంకటేశ్వర రెడ్డి ,ఈల విద్వాంసులు శ్రీ కొమరవోలు శివ ప్రసాద్ ,ఆధునిక పికాసో శ్రీ ఎస్ వి రామారావు ,అంతర్జాతీయ ఆర్ధిక శాస్త్రవేత్త ,అమెరికాలో ఉంటున్న ఉయ్యూరు వాసి శ్రీ ఆరిక పూడి ప్రేం చ౦ద్ గారికి ,బెజవాడ రేడియో స్టేషన్ డైరెక్టర్లు శ్రీ మంగళగిరి ఆదిత్య ప్రసాద్ ,శ్రీమతి మున్జులూరి కృష్ణకుమారి మొదలైనవారికి అందజేత .

3-39పుస్తకాల ప్రచురణ .అందులో శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ రాసినవి 26.అన్నీ రిసెర్చ్ స్థాయి పుస్తకాలే

4-ముగ్గురు కవులచే శ్రీ సువర్చలన్జనేయ స్వామి పై మూడు శతకాలు రచి౦ప జేసిఒక్కొక్కరికి 10వేలరూపాయలు నగదు నూతన వస్త్రాలతో  ఘనంగా సత్కరించటం

5-ప్రతి ఏడాది శ్రీత్యాగరాజ ఆరాధనోత్సవాలు నిర్వహించటం

6-సంగీత కచేరీలు శ్రీమతి సింగరాజు కల్యాణిశ్రీమతి కాళీ పట్నపు ఉమా ,శ్రీ గోపాలం ,శ్రీ శివప్రసాద్,శ్రీమతి చిడంబరి  ల చే నిర్వహణ

7-అమెరికా లోని నార్త్ కరోలిన రాష్ట్రం షార్లెట్ లో సరసభారతి శాఖ ఏర్పరచి కార్యక్రమాలు నిర్వహించి ‘’షార్లెట్ సాహితీ మైత్రీ బంధం ‘పుస్తకాన్ని ’అక్కడా ,ఇక్కడా ఉగాదికి ఆవిష్కరించటం ,’’అణుశాస్త్ర వేత్త డా .ఆకునూరివెంకట  రామయ్య’’ పుస్తకాన్ని అమెరికాలో రెండు చోట్ల ,ఇక్కడ కూడా శ్రీ వై విబి రాజేంద్ర ప్రసాద్ తో ఆవిష్కరి౦ప జేయటం

8-ప్రతి ఏడాది సెప్టెంబర్ 5 గురు పూజోత్సవం నాడు కోటగురు వరేణ్యులు స్వర్గీయ శ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి ,శ్రీమతి సీతమ్మ దంపతుల స్మారక పురస్కారాలు శ్రీమైనేని ,శ్రీ కోట గురుపుత్రుల సహకారంతో పేద ప్రతిభగల విద్యార్ధులకు ఒక్కొక్కరికి 10 వేలరూపాయలు అందించటం

9-నిరతాన్నదాత శ్రీమతి డొక్కా సీతమ్మగారి స్మారక పురస్కారాలను వారి ఇనిమనవడు శ్రీ  డొక్కా రాం భద్ర గారి సహకారం తో ప్రతిభ ఉన్న పేద విద్యార్ధులకు అందించటం

10-సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించటం

11-తెలుగుభాషా దినోత్సవం జరిపి తెలుగులో కృషి చేసినవారిని సన్మానించటం

12-అంతర్జాతీయ తెలుగు బడి పురస్కారాలను కరోనా బాధిత సమయం లోనూ విద్యా బోధన చేసిన 5గురు ఉపాధ్యాయులకు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్ శాఖ నిర్వహిస్తున్న శ్రీ డొక్కా రాంభద్ర గారి సౌజన్యంతో,సరసభారతి సహకారంతో  ఒకొక్కరికిసుమారు  25వేల రూపాయలు  అందించటం  .

13-గురజాడ ,విశ్వకవి రవీంద్రుల 150వ జయంతి కాలేజీ విద్యార్ధుల సమక్షం లో జరపటం

14-సరసభారతి ముఖ్యమైన ప్రచురణలు కాలేజీ విద్యార్ధుల సమక్షం లో ఆవిష్కరింప జేయటం

15-కాలేజీ విద్యార్ధుల,హైస్కూల్ విద్యార్ధుల  సమక్షం లో శ్రీ కృష్ణశాస్త్రి ,శ్రీ భరద్వాజ మొదలైన ప్రముఖులపై ప్రసిద్దులైనవారిచే ప్రేరణాత్మక ప్రసంగాలు చేయించటం

16-శతాధిక  గ్రంథకర్త ,శతవృద్ధు కవిసామ్రాట్ శ్రీ చింతలపాటి నరసింహ దీక్షిత శర్మగారికి ఘన సన్మానం

 17- శ్రీమైనేని గోపాలకృష్ణ గారి సహకారంతో ‘బాపు –రమణ ‘’ల స్మారక పురస్కారాలను ప్రఖ్యాత కధకులు శ్రీ వేదగిరి రాం బాబు గారికి కు ,ప్రముఖ చిత్రకారులు శ్రీ శీలా వీర్రాజు గారికి  అందజేయటం

18-శ్రీ మైనేని గోపాలకృష్ణ గారి సౌజన్యంతో శ్రీ కాళీ పట్నం రామారావు గారు నిర్వహిస్తున్న ‘’కధానిలయం ‘’కు 15వేల రూపాయలు అందించటం

19- శ్రీ మైనేని గోపాలకృష్ణ గారి సౌజన్యంతో సద్గురు శ్రీ శివానంద మూర్తి గారి ‘’సనాతన చారిటబుల్ ట్రస్ట్ ‘’కు రూ 11,116 అందజేయటం

20- శ్రీ మైనేని గోపాలకృష్ణ గారి సౌజన్యంతో మచిలీ పట్నం లోని కృష్ణా యూని వర్సిటి తెలుగు శాఖ అభి వృద్ధికి 20 వేలరూపాయల విరాళం అందజేయటం మొదలైనవి

21-కరోనా రెండేళ్లలో వచ్చిన శ్రీ శార్వరి ,,శ్రీ ప్లవ ఉగాది వేడుకలను కవిసమ్మేళనం మినహా 3+2 =5పుస్తకాల ఆవిష్కరణ ,ఉగాది పురస్కారాలను కూడా శ్రీసువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో ఆ రెండేళ్ళు నిర్వహి౦చి ,సాహితీ బంధువులకు అభిమానులకు కవులకు అతిధులకు అందరికి ఆవిష్కరణల తర్వాత వెంటనే బుక్ పోస్ట్ లో పుస్తకాలు పంపి రికార్డ్ సృష్టించాం..

  గబ్బిట దుర్గా ప్రసాద్ బయోడేటా

 పేరు– గబ్బిట దుర్గాప్రసాద్

 జననం -27-6-1940-ఉయ్యూరు -కృష్ణా జిల్లా

తలిదండ్రులు -గబ్బిట భవానమ్మ ,మృత్యుంజయ శాస్త్రి –

విద్య -ఎం ఏ ,తెలుగు ,బి.ఎస్ సి. బి.ఎడ్ .

భార్య -ప్రభావతి

ఉద్యోగం -ఫిజికల్ సైన్స్ టీచర్, పధానోపాధ్యాయుడు  -కృష్ణా జిల్లా పరిషత్ (1963-1998)

సంతానం –గబ్బిట మృత్యుంజయ శాస్త్రి ,సమత

             సంకల్ప్,భువన్ సాయి తేజ

             లక్ష్మీ నరసింహ శర్మ ,ఇందిర

             శ్రీ హర్ష సాయి ,హర్షి తాంజని

             నాగ గోపాల కృష్ణ మూర్తి ,రాణి

              సుస్మిత్  శ్రీ చరణ్ గౌతం ,,రమ్య

            వెంకట రమణ ,మహేశ్వరి

           కోమలి విజయలక్ష్మి ,సా౦బావధాని

                శ్రీకేత్ ,ఆశుతోష్ ,పీయూష్

1-సాహిత్య వ్యాసంగం –  అధ్యకుడు-సరభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ-ఉయ్యూరు –12ఏళ్ళలో 165 కార్యక్రమాల నిర్వహణ .ప్రతి సంవత్సరం ఉగాది వేడుకలు నిర్వహి౦ఛి  ప్రముఖులను సన్మాని౦చటం ,జిల్లాలోని ప్రముఖులతో కవిసమ్మేళనం నిర్వహించటం ,పుస్తకావిష్కరణలు .

  ఉయ్యూరు శ్రీ సువర్చలా౦జ నేయ దేవాలయ వంశ పారంపర్య ధర్మకర్త –స్వామి సేవలో, అనునిత్య సాహితీ  వ్యాసంగం లో ధన్యత ..సరసభారతి ,శ్రీ సువర్చలాజనేయ అనే 2 బ్లాగుల నిర్వహణ .నిత్యం అంతర్జాల రచన.

2-ముద్రి౦పబడిన స్వీయ రచనలు -1-ఆంద్ర వేద శాస్త్ర విద్యాలంకారులు 2-జనవేమన 3-దర్శనీయ దేవాలయాలు 4-శ్రీ హనుమత్ కథా నిధి 5-శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం 6- సిద్ధ యోగిపు౦గవులు  7-మహిళా మాణిక్యాలు 8-పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు (125మంది ఇంగ్లాండ్, అమెరికా దేశాల కవుల చరిత్ర )

9- దర్శనీయ దైవ క్షేత్రాలు 10-గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-3 భాగాలు (మొదటిభాగం లో 146 మంది రెండవభాగం లో 482మంది మూడవభాగం లో 462మంది మొత్తం 1090మంది  సంస్కృత కవుల జీవిత, సాహిత్య సమగ్ర విషయాలు )11-దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు-2భాగాలు  (మొదటిభాగం లో దేశ ,విదేశాలలోని 201 ,రెండవ భాగం లో 221-మొత్తం 422ఆంజనేయ దేవాలయాల విశేషాలు ) 4 భాగం –అంతర్జాలం లో 700 మంది కవులపై ,12-కేమోటాలాజి పిత డా.కొలచల సీతారామయ్య—తెలుగులో వచ్చిన మొట్టమొదటి పుస్తకం  (ఉయ్యూరుకు చెందిన ఆయిల్ సైన్స్ శాస్త్రవేత్త .రష్యా లో స్థిరపడి ఆ దేశ శాస్త్ర సాంకేతికతకు తోడ్పడిన శాస్త్రజ్ఞుడు )13-దైవ చిత్తం (ప్రఖ్యాత శాస్త్రవేత్త –స్టీఫెన్ హాకింగ్ రాసిన –‘’ది ఆరిజిన్ ఆఫ్ టైం ‘’లోని విషయాలను మన వేద,ఉపనిషత్ ,పురాణాల లోని విషయాలతో పోల్చిన తులనాత్మకరచన 14-బ్రహ్మశ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారి శతజయంతి  కరదీపిక  15-ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు (ప్రపంచ చరిత్రను మలుపు త్రిప్పిన వివిధ రంగాలకు చెందిన 91 మంది ప్రపంచ ప్రముఖుల జీవితం ,కృషి పై 704పేజీల సమగ్ర గ్రంథం)16-షార్లెట్ సాహితీ మైత్రీ బంధం (2012,2017లలో మేము అమెరికా నార్త్ కరోలిన  లోని షార్లెట్ నగర సందర్శనం -అక్కడి వ్యక్తుల ,సాహిత్య సాంస్కృతిక సంస్థల ,,సరసభారతి స్థాపన ,కార్యక్రమాల విశేషాల యాత్రా సాహిత్యం ) 17-అణుశాస్త్ర వేత్త డా.ఆకునూరి వెంకట రామయ్య- (117 వ మూలకం టెన్నిస్సిన్ –‘’Ts’’ ను ఆవిష్కరించిన ఆంద్ర అణుశాస్త్ర వేత్త)  తెలుగులో వీరిపై వెలువడినతొలి పుస్తకం –అమెరికాలో రెండు చోట్ల ,ఉయ్యూరులో మూడవసారి ఆవిష్కరింపబడిన అరుదైన పుస్తకం 19-ప్రయోగాత్మక కాంతి శాస్త్ర పరిశోధన పిత –డా .పుచ్చా వెంకటేశ్వర్లు (లేజర్ కిరణాలపై అత్యద్భుత ప్రయోగాలు చేసి ,ఎందరికో మార్గదర్శి యై ,ఆలిఘర్ ముస్లిం యూని వర్సిటి ,కాన్పూర్ ఐ. ఐ .టి.,అలబామా అగ్రికల్చరల్ అండ్  మెకానికల్ యూని వర్సి టీల స్థాపన ,అభివృద్ధిలో భాగస్వామి ఐన  ఆంద్ర శాస్త్ర సాంకేతిక వేత్త )-వీరిపై  తెలుగులో వచ్చిన మొట్ట మొదటి పుస్తకం .

3- 22-3-20 సరసభారతి 150 వ కార్యక్రమంగా  నిర్వహిస్తున్నశ్రీ శార్వరి ఉగాది వేడుకలలో ఆవిష్కరి౦పబడిన   పుస్తకాలు -1-ఊసుల్లో ఉయ్యూరు ( ఉయ్యూరుతో ,అక్కడి వ్యక్తులు,సంస్థలు మొదలైనవాటితో నాకున్న 75ఏళ్ళ అనుబంధం ,జ్ఞాపకాలు అనుభవాల నాస్టాల్జియా )

2-సోమనాథ్ నుంచి కాశీ విశ్వనాథ్ దాకా (2002 నుంచి 2015 వరకు -6 రాష్ట్రాలలో మా క్షేత్ర సందర్శన విశేషాల యాత్రా సాహిత్యం)

3-ఆధునిక ఆంద్ర శాస్త్ర మాణిక్యాలు  (వివిధరంగాలకు చెందిన 62మంది ఆంద్ర శాస్త్రవేత్తల జీవిత విశేషాలు, చేసిన అమోఘ కృషి )

శ్రీప్లవ ఉగాదికి ఆవిష్కరించిన పుస్తకాలు -1-వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష (25)02-ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు(26)

4-  నా సంపాదకత్వం లో సరసభారతి ప్రచురించిన పుస్తకాలు

          1-జ్యోతిస్సంశ్లేషణం 2-ఉయ్యూరు ఊసులు 3-నవకవితా వసంతం 4-మా అక్కయ్య 5-‘’ఆదిత్య ‘’హృదయం 6-త్యాగి పే’’రెడీలు’’7-శ్రీరామవాణి 8-మా అన్నయ్య 9-శ్రీ సువర్చలా వాయు నందన శతకం 10-శ్రీ సువర్చలా మారుతి శతకం 11-శ్రీ సువర్చలేశ్వర శతకం 12-వసుధైక కుటుంబం 13-  Nucleaar Scentist Dr.Akunuri  Venkata Ramayya 14-సాహితీ స్రవంతి (సాహితీ మండలి తరఫున )

5- రేడియోలోసాహిత్య ధార్మిక ప్రసంగాలు

6-గత రెండేళ్లుగా సరసభారతి ఫేస్ బుక్ ద్వారా ,విద్యారణ్య స్వామి రచించిన శంకర విజయం ,వ్యాస విరచిత బ్రహ్మసూత్రాలు ,ద్వాదశ ఉపనిషత్తులు ,కాలిదాస మహాకవి ,కృష్ణ శాస్త్రి ,శ్రీపాద ,మధురాంతకం ,కేతు విశ్వనాధ రెడ్డి ,మల్లాది రామ కృష్ణ శాస్త్రి ,గంధం యాజ్ఞ వల్క్య శర్మ గంధం వేంకాస్వామి శర్మ ,గుంటూరు శేషేంద్రశర్మ ‘’షోడశి ‘’,స్వర్ణ హంస ,,సోమనాద్ నుంచి కాశీ విశ్వనాద్ దాకా ,ఆధునిక ప్రపంచ నిర్మాతలు షార్లెట్ సాహితీ మైత్రీ బంధం ,బ్రహ్మ వైవర్త పురాణం ,శివపురాణం ,శివతాండవం ,అనంతకాలం లో నేనూ ,నా దారి తీరు (స్వీయ జీవిత చరిత్ర ),మొదలైన వాటిపై , ప్రత్యక్ష ప్రసార ప్రసంగాలు .

7-5 సార్లు అమెరికా సందర్శన .ఐదవసారి నార్త్ కరోలినా షార్లెట్ కు రెండవ సారి వెళ్ళినపుడు  సరసభారతి స్థాపించి 6 కార్యక్రమాల నిర్వహణ

8-అంతర్జాలం లో నేను రాసి,,గ్రంథ రూపం దాల్చని  వివిధ రచనలు

     1-గణిత  వేదాంత  తత్వ కోవిదుడు శాస్త్ర వేత్త –ఇమాన్యుల్ కాంట్ 2-సింఫనీ మాంత్రికుడు –బీథోవెన్ 3-కోన సీమ ఆహితాగ్నులు 4-వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాథ సూరి మనీష  5-అలనాటి విజ్ఞాన శాస్త్ర వేత్తలు 6-యాజ్ఞ్యవల్క్య మహర్షి జీవితం 7-కాశీఖండం 8-భీమఖండం 9-గౌతమీ మహాత్మ్యం 10-నా దారి తీరు (స్వీయ చరిత్ర )11-కోరాడ రామకృష్ణయ్య గారి కోవిదత్వం 12-ప్రపంచ దేశాల సాహిత్యం 13-గానకవి రాజు –సంగీత సద్గురు త్యాగరాజ స్వామి 14-ప్రసిద్ధాంధ్ర మంత్రి పుంగవులు 15-కిరాతార్జునీయం 16-గీర్వాణకవుల కవితా  గీర్వాణం-4 వ భాగం -650మంది సంస్కృత రచయితల సాహితీ విశేషాలు 17-పంచారామ క్షేత్ర విశేషాలు 18-చిత్రకళా విశ్వనాథుని కీర్తి కిరీటం లో మరో ఆభరణం –శంకరాభరణం 19-కృష్ణా జిల్లా సంస్థానాలు –సాహిత్య సేవ 20-అమరగాయకుడు ఘంటసాల 21-విరాట ఉద్యోగాదిపర్వాలలో తిక్కన పద్య సౌరభం 22-శ్రీ కృష్ణ తత్త్వం 23-సదా శివ  బ్రహ్మేంద్ర  కీర్తనలలో అద్వైతామృతం 24-ఫాహియాన్ సఫల యాత్ర 25-స్వామి శివానందుల ఉపనిషత్ సారం 26-కన్యాశుల్కం లో కరటక శాస్త్రి 27-దర్శనీయ శివాలయాలు 28-దర్శనీయ దేవీ ఆలయాలు 29-దర్శనీయ వినాయక దేవాలయాలు 30-కేతు విశ్వనాధ రెడ్డి కథలు 31-మధురాంతకం రాజారాం కథలు 32-గొల్లపూడి కథామారుతీరావు  33-వేలూరి శివరామ శాస్త్రిగారి కథలు34-కాళిదాసు శకుంతల 35-పుట్టపర్తివారి శివతాండవం 36-విప్లవసింహం –ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 37-ప్రాచీనకాశీ నగరం 38-ముద్రా రాక్షసం లో మానవీయ ముద్ర 39-వందేళ్ళ తెలుగు కథ సామాజికాంశం 40-బ్రాహ్మణాల కథా కమామీషు 41-వీక్లీ అమెరికా 42- అమెరికా డైరి 43-వరద సాహితీ స్రవంతి 44-కొందరు హిమాలయ యోగులు 45-అలంకారిక ఆనంద నందనం 46-శ్రీ శంకరుల శివానందలహరి ఆంతర్యం 47-గాంధీజీ -21వ శతాబ్ది 48-ఇది విన్నారా కన్నారా (సంగీత జ్ఞుల విశేషాలు )49-బాపు-రమణీయం 50- ఖడ్గతిక్కన కావ్య సమీక్ష 51-దాక్షిణాత్య గానకళా తపస్సంపన్నులు (త్యాగరాజ స్వామి ,శిష్య ప్రశిష్య పరంపర ,సమకాలికులు నుంచి నేటివరకు ఆంధ్రగాయకులు ).52-మహా భక్త శిఖామణులు .53-అనుభూతికవి తిలక్ 54-అధర్వవేదం –వ్రాత్యఖండం ‘’డా సంపూర్ణానంద్ ఇంగ్లిష్ పుస్తకానికి నా అనువాదం 54-చరిత్ర కెక్కని చరితార్ధులు 55-శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్యలహరి 56-అమెరికాలో జర్మన్ హవా 57- నాద యోగం 58-జ్ఞానదుడు నారదుడు 59-అస్వత్ధామ 60-మత్స్వప్నః –బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారి రచన  విశేషాలు 61-మహిళా జాతి రత్నాలు

62-మన మరుపున పడిన మన వెండి తెర మహానుభావులు –శేర్ర్శికలో 300మందిని పరిచయం చేయటం 63-వీకీ పీడియ లో చోటు చేసుకొనని  సుమారు 50 శతకాలను ,కవులను రచయితలను ,వివిధ రంగాలకు చెందినప్రముఖులను సుమారు 50 మంది ని పరిచయం మొదలైనవి  చేశాను

  9-విహంగ మహిళా వెబ్ మాసపత్రికు 2012నుంచి ఇప్పటివరకు ప్రతినెలా వివిధరంగాలలోప్రపంచ  ప్రసిద్ధులైన మహిళ పై ధారావాహికంగా సుమారు 120మంది మహిళా మాణిక్యాలపై రాశాను .వారి అవార్డ్ కూడా అందుకొన్నాను .

 పొందిన సాహితీ పురస్కారాలు

1 -ఆంద్ర సారస్వత   సమితి –మచిలీ పట్నం  వారి పురస్కారం

2-చిన్నయసూరి పురస్కారం

3-విహంగ వెబ్   మహిళా మాసపత్రిక పురస్కారం –జనవరి 2017

4-శారదా స్రవంతి-విజయవాడ  ఉగాది పురస్కారం -2019ఏప్రిల్

5-సర్వేపల్లి చారిటబుల్ ట్రస్ట్ –నెల్లూరు –ఉగాది పురస్కారం –ఏప్రిల్-2019

6-శ్రీ పుట్టి వెంకటేశ్వరరావు సారక సాహితీ పురస్కారం-గుడివాడ  –జూన్ -2019

7-నోరి చారిటబుల్ ట్రస్ట్  వారి –కళా సుబ్బారావు స్మారక సాహితీ పురస్కారం –త్యాగరాజ గానసభ –హైదరాబాద్

8-ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం అందజేసిన ‘’జ్ఞానజ్యోతి ‘’పురస్కారం –నవంబర్ 2019.

9-కళా ప్రపూర్ణ బ్రహ్మశ్రీ చర్ల గణపతి శాస్త్రి శ్రీమతి సుశీల గార్ల స్మారక  సాహితీ పురస్కారం జనవరి 2021

                    గబ్బిట దుర్గా ప్రసాద్ –19-6-22-ఉయ్యూరు

                     సరసభారతి అధ్యక్షుడు

Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

విశ్వ పుత్రిక తోరూ దత్-10

విశ్వ పుత్రిక తోరూ దత్-10

ఒక్కత్తీ

ఆరూ చనిపోయాక నెమ్మదిగా అందరూ చాలాకాలానికి మామూలు స్థితికి వచ్చారు .తోరూ మేరేకిఉత్తరాలు రాస్తూ ఇంగ్లాండ్ పై ప్రేమను చూపిస్తూనే ఉంది ఆమె తండ్రికి వర్డ్స్ వర్త్ కవి నివసించిన వెస్ట్ మోర్లాండ్ ,అక్కడి విండర్ మెర్ సరస్సు ,దగ్గర కేస్విన్ చాలా ఇష్టం .చదువులోనే ఎక్కువ కాలం గడుపుతున్నా తొరూ వంటరితనం భరించలేక పోతోంది .గణిత శాస్త్ర పరిజ్ఞానానికి పదును పెట్టటం మొదలు పెట్టింది .అప్పుడు బెంగాల్ కరువు విపరీతంగా కబళించేస్తోంది .దానిపై తోరూ’’మనుషులందరూ అస్థిపంజరాల్లా ఉన్నారు .ఎముకలు బయటకు పొడుచుకొని వస్తున్నాయి .అన్నం కోసం ఒకరితో ఒకరు కొట్టుకొంటున్నారు .పిల్లల చేతుల్లోని తినుబండారాలను తల్లులు లాగేసుకొంటూ హృదయ విదారకంగా కనిపిస్తున్నారు ‘’అని రాసింది .

 కొన్ని నెలల తర్వాత దత్తు కుటుంబం బాగ్ మరీ తోటలోకి మారారు .కానీ ఆరూ స్మృతులు వెంటాడి ఉండటానికి భయమేసింది .సంస్కృతం నేర్వాలని తోరూ తీవ్రంగా భావించింది .తండ్రి ఏర్పాటు చేశాడు –‘’వెలుతురులో రాణించే-అతి చిక్కని శబ్దరాహిత్యం –అక్కడ ఒక దేవత –దేవతకు మారుగా –మంచం పక్కనే కూర్చుని –ఓర్పుగా నన్నే చూస్తున్న మానాన్న –నా చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని కన్నీళ్లు ఆపుకొంటున్నాడు ‘’అని అద్భుత కవిత రాసింది .ఇందులో తాత్వికత కనిపిస్తుంది .విలియం బ్లేక్ తాత్వికత దర్శనమిస్తుంది .ఆమె రాసిన కవితల్ని చదువుతూనే ఆమె మరో ప్రపంచం లోకి జారిపోయున్నట్లు కనిపిస్తుంది .మృత్యువును కూడా మంచితనం పోతపోసిన వాడి గానే ఊహించింది –ఓ మృత్యూ !ఇంకా ఎప్పుడు ??’’అని ఆహ్వానించింది .సెయింట్ జాన్ చెప్పినట్లు ‘’మృత్యువు చీకట్లో మెరుస్తుంది .తనకు తానె వస్తుంది దానికి స్వాగతం చెప్పిన వారంతా దేవుని బిడ్డలే ‘’ .

  తోరూకు లి కాంటేడిలైల్ అంటే ప్రత్యెక అభిమానం .అతనిపై ఒక ప్రత్యేకవ్యాసం 1874 చివర్లో బెంగాల్ పత్రికలో రాసింది .అతని కవితల్ని ‘’లా మార్టే డీ వాల్మీకి ‘’పేరుతొ అనువదించింది .1874 చివర మళ్ళీ ఆమెకు జబ్బు చేసింది .

   1875

1875 జనవరి ఒకటిన తోరూ తన స్నేహితురాలికి న్యు యియర్ గ్రీటింగ్స్ చెప్పింది .ఫిబ్రవరిలో జబ్బు ఎక్కువైంది కనుక విదేశ యానానికి ఏర్పాట్లు జరగలేదు .ఎలిజబెత్ బ్రౌనింగ్ కవితలు ఇష్టంగా చదువుతోంది .బ్లీక్ హౌస్ కూడా చదివి అనువాదాలు చేసి బెంగాలీ పత్రికకు పంపేది .అప్పుడే ఇంగ్లాండ్ నుంచి కొత్త పుస్తకాలు వచ్చాయి .వేల్స్ యువరాజు 7వ ఎడ్వర్డ్ ఇండియా రాబోతున్నాడు .జులైలో తోరూ నాయనమ్మ చనిపోయింది .తొరూ చాతీమీద ప్లాస్టర్ పట్టీ వేయటంతో ఎక్కడికీ కదలటానికి వీల్లేకపోయింది .సెప్టెంబర్ లో యువరాజు రాక కోలాహలంతో కలకత్తా నిండిపోయింది .ఈ సమయం లో తన దిన చర్య గురించి ‘’తెల్లవారుజామున 4-30కే లేస్తాను .నాకూ నాన్నకు రెండుకప్పుల చాకొలేట్ తయారు చేస్తా .బట్టలు మార్చుకొని అమ్మా నాన్న లను చూస్తా. నాన్న చుట్ట కాలుస్తూ కనిపిస్తాడు .పైకి వెళ్లి ఒకసారి ప్రకృతిని చూసి పని వాళ్లకు చేపలకు ఆహారం పెట్టమని అందిస్తా .మా గుర్రాలు జెంటిల్, చానేట్లు ను తనివితీరా చూస్తా వాటికి దాణా పెట్టిన్చాక మా ఫలహారాలు చేస్తాం . అమ్మ వంటిట్లో వంటపనికి వెడుతుంది .నేను పుస్తకం పట్టుకొంటా నాన్న రాతపనిలో ఉంటాడు .12కు భోజనం చేసి 3గంటలదాకా చదువు లేక రాత .తర్వాత ఒక సీతాఫలమో బత్తాయో తింటా .కాసేపు తోటలో షికారు .రాత్రి 7కు భోజనాలు పూర్తీ .8-30కు టీతాగి రాత్రి 10కి హాయిగా పడుకోవటమే ‘’అని రాసుకొన్నది .

   ఆత్మకూ పరమాత్మకూ ఉన్న సంబంధాన్ని ఒక కవితలో ఇలా రాసింది తోరూ-‘’రహస్యంగా గుంపులో నుంచి –ఆత్మను ఒకదాన్ని –పరమాత్మ పరిగ్రహిస్తాడు –విచారం, లోపాలనుండి –మెల్లగా ముందుకు నడిపిస్తూ –నిబ్బరంగా గమ్యానికి చేరుస్తాడు –చిరుసూది లాంటి ఆత్మను చూసి చిరునవ్వు నవ్వుకొంటాడు –తను చేసిన పనికి మురిసిపోతాడు ‘’.1869 డ్యూక్ ఆఫ్ ఎడింబరో కలకత్తా వస్తే 9వేలమంది ప్రేక్షకులు బాణా సంచా కాల్చటం తెల్సి ‘’డబ్బు ను బూడిద చెయ్యటం అంటే ఇదేగా ‘’అన్నది .తండ్రి గుర్రపు పందాలకు తీసుకు వెడతాను అంటే అంతగా ఉత్సాహం చూపలేదు .ఆమె స్వంత రచన ‘’ఫ్రెంచ్ క్షేత్రం లో మెరిసే కంకులు ‘’పూర్తీ చేసింది .దీన్ని చాలామంది విమర్శకులు మెచ్చారు –‘’పుష్ప వర్ణ శబలితాలుగా పుష్ప పత్రాలు విచ్చుకొన్నాయి ‘’లాంటి లైన్లు చాలాఉన్నాయి అందులో .

 పుస్తకం పూర్తయింది కనుక తండ్రీ కూతురు  సంస్కృత  అధ్యయనం మొదలెట్టారు .డిసెంబర్ 4న పాఠాలు మొదలయ్యాయి .రామాయణ మహాభారతాలను సంస్కృతంలో చదవాలని ఆమె కోరిక .తోరూచూడటానికి రోజూ చాలామంది వచ్చేవారు .ఇంగ్లాండ్ నుంచి మిస్ ఆడాస్మిత్ కలకత్తా వస్తే తండ్రి ఆమెను బాగ్ మరీకు తీసుకు వస్తే మేనత్త ఆమెకు ‘’కాస్కేట్ ఆఫ్ జేమ్స్ ‘’చూపిస్తే ఆ ఇల్లూ ఆ తోట ఆమెకు భూలోక స్వర్గం లా అనిపించి ,ఈ ఆనందాన్ని అనుభవించకుండా ఈ కుటుంబం ఎందుకు ఇంగ్లాండ్ వెళ్ళాలను కొంటున్నారు అని ఆశ్చర్యపోయింది .

  డిసెంబర్ లో వచ్చే యువరాజు స్వాగతానికి కలకత్తా అంతా పెళ్లి ముస్తాబు చేసుకొన్నది .రాజులు అందరూ వచ్చి విడిది చేశారు .ఒక రాజు రత్నాలు ముత్యాలుపొదిగిన   చొక్కా పది లక్షలు ఖర్చు చేసి తయారు చేయిన్చుకొన్నాడు .ఒక రాజు తన ఆస్థానానికి యువరాజు వస్తే ఖర్చు చేయటానికి 30లక్షలతో సిద్ధంగా ఉన్నాడు .

  తప్పులు పడకుండా పది నెలలలో సంస్కృతం చదవటం అలవాటయింది తోరూకు .రోజురోజుకు ఆమె ఆరోగ్యం క్షీణిస్తోంది .సెప్టెంబర్ వరకు శ్రమ పడవద్దని డాక్టర్లు సూచించారు .తనకు నేర్పుతున్న గురువు గొప్పతనం గురింఛి మేరీకి రాసింది .1976జులైలో ‘వ్యాకరణం చాలా కష్టంగా ఉంది .రుజుపధం లో మూడు భాగాలు పూర్తీ చేశాను .కాళిదాసు శాకుంతలం మొదలు పెట్టాలి ‘’అని రాసింది .కానీ చదువు మూలపడింది .

 సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -18-6-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

విశ్వ పుత్రిక తోరూ దత్-10స్వదేశాగమనం -2

విశ్వ పుత్రిక తోరూ దత్-10
స్వదేశాగమనం -2
రాం బగత్ లో ఉన్న పుస్తకాలన్నీ బాగ్ మరీ కి తరలించటం వలన తోరూకు చేతినిండా పుస్తకాలు దొరికాయి చదవటానికి .జీవితాలు ప్రశాంతంగా సాగుతున్నందున తాను  అనేక పుస్తకాలు చదవగలిగానని తోరూ చెప్పింది .భోజనం టిఫిన్ టెన్నిస్ విహారాలకు సమయం బాగా తగ్గించి పుస్తకాలే చదివి పుస్తకాల పురుగుయింది .లండన్ నుంచి ‘’మండేస్ రివ్యు ‘’తెప్పించుకోనేది  .హాటర్ దంపతులు లండన్ నుంచి ఇంగ్లీష్ ఫ్రెంచ్ పుస్తకాలు పంపేవారు .సమకాలిక రచనలన్నీ చదివే అదృష్టం కలిగింది .ప్రముఖ కవులు రచయితలైన కార్లైల్, బ్రాంటి సిస్టర్స్ ,బైరన్ ,ధాకరే ,కాల్రిడ్జ్, టెన్నిసన్ ,బ్రౌనింగ్ ,ఇలియట్ ,లిట్టన్ పేర్లు ఆమె తరచుగా పెర్కొనేది .ఫ్రెంచ్ పుస్తకాలనీ లోతుగా అధ్యయనం చేసేది .మోలియర్ హాస్యనాటకాలు ,మిగేట్ విప్లవ  చరిత్ర ,రోసేల్ వ్యాసాలూ హ్యూగో రచనలు ,టైన్ యాత్రా విశేషాలు ,సెస్ టైన్ రచనలు అన్నీ చదివేది .ఫ్రెంచ్ కాల్పనిక సాహిత్యాన్ని కూడా ఔపోసనపట్టింది ..తోరూ అతి నాజూకుగా సగం విచ్చిన గులాబి మొగ్గ .హిందూ గృహ కుటుంబం లో సువాసనలు వెదజల్లే మనోహర ముకుళం’’అన్నాడు ఆమె జీవిత చరిత్రకారుడు హరిహరదాస్ .చిన్నా ,పెద్దా అంతా తొరూ ను ‘’దీదీ’’అంటూ ఆప్యాయంగా పిలిచేవారు .కళ్ళలో కారుణ్యం తొణికిస లాడేది.డాక్టర్ హంటర్ ఆమెకు ఎన్నో ఉత్తరాలు రాసేవాడు .
   తోరూ జీవితావసరాలు చాలా చిన్నవి .ఒక దోమ తెర,పొద్దున్నే తన గుర్రాల్ని చూడటం ,తురాయి చెట్టు చూస్తూ మురిసిపోవటం ,తల్లి పాట,చివరకు తానూ మృత్యు ముఖాన ఉన్నప్పుడు తన చేతిలో ఇమిడిపోయిన తండ్రి స్పర్శ తో తన అల్పాయుష్క జీవితాన్ని అనుభవించింది .’’తోరూ ఉత్తరాలలో నిష్కాపట్య౦ ,,అర్ధవత్వం ,మనసును ఆకర్షించే మంచితనం ,సరళత ,అన్నీ పరిపూర్ణంగా ఉండి,ఆమె ను నా దగ్గరగా తెచ్చి నన్ను ఆకర్షించాయి ‘’అని రాసుకుంది బాదేర్. 
  అకాల మరణం
దత్తు కుటుంబం ఇండియాకు తిరిగి వచ్చాక ఆరూ తోరూ ల ఫ్రెంచ్ కవితల అనువాదాలను సేకరించి బెంగాల్ పత్రిక లో ప్రచురణకు ఇవ్వటం తో సమయం గడిచిపోయింది .తోరూ అనువాదాలు సీరియల్ వచ్చాయి. ఆరు తక్కువే రాసింది .1874 ప్రారంభం నుంచి వీరి కవితలు బెంగాల్ పత్రికలో సీరియల్గా వచ్చాయి. బుద్ధి శ్రమా ఎక్కువై తోరూ కలలలో తేలిపోయి ఉద్రేకంలో ఊగిపోయింది .బలహీన ఆరోగ్యంతో  అయిదు నెలల భరించరాని ఏకాంతవాసం లో ఆమె సాధించిన ఫలితం ,ఆ బలహీన శరీరం ఎందుకింత త్వరగా నిర్జీవమై పోయిందో అర్ధమౌతుంది .
1874మొదట్లో ఆరు తోరూ లిద్దరికీ జబ్బు చేసింది .తోరూలో క్షయ చిహ్నాలు కనిపించాయి .మార్చిలో కొద్దిగా కోలుకున్నది .వేసవిలో కొంత ఉల్లాసంగా ఉంది కానీ ఆరు ఆరోగ్యం మాత్రం బాగుపడలేదు .ఉన్నట్టుండి ఆరూ  చనిపోయి ఇంట్లో తీవ్ర విషాదాన్ని నింపేసింది. భగవంతుడిని నమ్మటం తప్ప ఎవరూ ఏమీ చేయలేకపోయారు ..తనకూ అదే గతి అని తొరూ తెలుసుకొన్నది. ఆరూ లేని ఒంటరితనాన్ని భరించ లేకుండా ఉన్నానని ‘’మేరీ కి బాధా తప్త హృదయంతో రాసింది .అనారోగ్యంతో బాధపడుతున్నా ,సాహిత్యవ్యాసంగంలో అక్కా చెల్లెలు బాగానే గడిపేవారు .ఆరూ రాసిన 7కవితలు ‘’షీఫ్’’బెంగాలీ పత్రికలో ప్రచురితాలయ్యాయి .ఆరూ అనువదించిన  విక్టర్ హ్యూగో రచన 1974 ఏప్రిల్ లో ‘మార్నింగ్ సెనేరేడ్’’లో ప్రచురితమైంది. దీనిపై ఎక్సామినర్ పత్రికలో విమర్శరాస్తూ ఎడ్మండ్ గాస్ అది తోరూ రచన అని పొరబాటు పడ్డాడు ‘నీ అందమంతా –నీ కళ్ళకోసమే కదూ –ఊరికే నిద్రపోకు –జాగ్రత్తగా విను –పదేపదే రోదిస్తున్నాను నేను –ఇంతకీ ఎక్కడున్నావు నీవు?’’.ఇది చిన్నదేకాని అత్యుత్తం శ్రేణికవిత. ఆరూ చనిపోయే ముందు తొరూ కూడా బెంగాల్ పత్రికకు 7కవితలు పంపింది .అక్క చెల్లెళ్ళు ఇద్దరూ ఈ పత్రికకు 14కవితలు రాశారు .అందులో ఆర్నాల్డ్ కవిత ‘’ది లీఫ్ ‘’కు తోరూ చేసిన అనువాదం చాలామందిని ఆకర్షించింది –‘’రోజాలకైనా –నాజూకు రేకలు రాలక తప్పదు –మరి నాకెందుకు అంటి పెట్టుకు ఉండాలనే తపన’’ ?,
  సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-6-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

విశ్వ పుత్రిక తోరూ దత్-9

విశ్వ పుత్రిక తోరూ దత్-9

ఇంగ్లాండ్ లో తోరూ కుటుంబం -2

కేంబ్రిడ్జి లో దత్తు కుటుంబానికి మరో స్నేహితుడు క్లిఫర్డ్ పరిచయమయాడు .దత్తు తనకుటు౦బాన్ని కేం బ్రిడ్జి నుంచి సముద్ర తీరం లో ఉన్న సెంట్ లియోనార్డ్ కు మార్చాడు .చివరిదాకా అక్కడే ఉన్నారు .తోరూకు, తండ్రికి  మాస్టర్ గిరాల్ద్ ఫ్రెంచ్ చెప్పేవాడు .ఆరూ ఆరోగ్యం బాగుండక బలహీనం గా ఉండటం వలన ఫ్రెంచ్ నేర్వలేదు .ఫామిలి ఆల్బం నుంచి మూడు కవితలు ఆయన ఫ్రెంచ్ లోకి అనువదించాడు .ఆరూ తొరూ ల ఫోటో ఇక్కడ తీసిందే .19ఏళ్ళ వయసున్న ఆరూ అనారోగ్యం వలన ఇంకా పెద్ద గా కనిపించేది .తోరూ మిసమిస లాడుతూ అందంగా చలాకీ గా ఉండేది .ఆమె వయసుఅప్పుడు 17.ఆ అందం ఆకర్షణ చలాకీ తనం ఉన్న తోరూను మరో అయిదేళ్ళలో క్షయ వ్యాధి బలి తీసుకొన్నది అంటే ఎవరూ నమ్మలేరు .మరో రెండేళ్లలో ఆరూ జీవితమూ సమాప్తమౌబోతోంది.ఇద్దరూ కుచ్చులు కుచ్చులుగా ఉన్న విక్టోరియన్ గౌన్లు వేసుకొని యువ రాణీలు లాగా ఉండేవారు .వాళ్ళ ఫోటోలు చూశాక చీర కట్టుకొంటే మరెంత అందంగా ఉండేవారో అనిపిస్తుంది .

  తోరూ ప్రచురించిన ‘భారత దేశపు ప్రాచీన గేయ గాధలు ‘లో ఆమె కవిత ‘నియర్ హేస్టింగ్స్ ‘’కూడా ఉంది .ఇందులో ఆరూ ఆరోగ్యం పై ఆందోళన ఉంది –సముద్రతీరాన జలకన్యల్లా తిరిగాం . దూరంగా ఏకత్వాన్ని భజించే –ఆకాశమూ భూమి –అలసటగా విసుగును మోస్తూ -మెల్లగా అక్కడ తిరిగే మేము రోగ గ్రస్తులం –ఫిర్యాదులు తెలీని అక్క అక్కడే కూర్చుండి పోయేది –మహర్షికి ఉండాల్సిన లక్షణాలన్నీ -అక్కడమాకు కనిపించిన ఆమెలో  ఉన్నాయి –తల్లీ ఆ పరమేశ్వరుడు చల్లగా చూడాలి మీ ఇద్దర్నీ ‘’అని దీవిన్చినట్లనిపి౦చి౦ది’’.

  గోవిన్ చందర్ 1873లో తనకుటు౦బ౦ సహా ‘’లైనర్ పెషావర్ ‘’లో ఇండియాకు ప్రయాణమయ్యాడు .

  స్వదేశాగమనం

1873 సెప్టెంబర్ నుంచి 53ఉత్తరాలు మేరీకి తోరూ రాసిందని ఆమె జీవిత చరిత్రకారుడు హరదాస్ రాశాడు .వీటిలో సాహిత్యం గుబాళిం చేది విక్టోరియాయుగ రచయితల హాస్యం ప్రతి బి౦బించేది.గొప్ప సాహిత్య విమర్శలూ ఉండేవి .ఉత్తరాలు రాయటం లో అసామాన్య ప్రతిభ కనిపించేది .పెషావర్ లైనర్ లో ప్రయాణం చేస్తూ జిబ్రాల్టర్ దగ్గర మేరీ కి ఉత్తరం రాసింది  .

కలకత్తాలో ఆమెజీవితం చాలా హుషారుగా గడిపింది .ఇంగ్లాండ్ నుంచి వచ్చిన ఏడాదికే ఆమెకు  క్షయ సోకింది  .1873 డిసెంబర్ నుంచి కలకత్తానుంచి ఉత్తరాలు రాసింది .దారిలో సింహళం లో ఒక రోజు ఆన౦ద౦ గా  గడిపారు .ఇండియారాగానే బంధువులు అపూర్వ స్వాగతమిచ్చారు .విశాలమైన తోట చేపలకు చిన్న చిన్న చెరువులు ఫలవృక్షాలు అనేకరకాల పుష్పాలు  చెట్లు వాటిపై కోతులు ,అనేకరంగులపిట్టలు ,సీతాకోక చిలుకలు కనువిందు చేసేవి. నాలుగేళ్ల దాకా వీటి సొందర్యమంతా వర్ణిస్తూ మేరీకి జాబులు రాసేది తొరూ .

  జీవితం ప్రశాంతంగా గడిచిపోతోంది .తల్లి కమ్మగా పాటలు పాడేది .ఈ ఆనందం అంతా ‘’సీత ‘కవితలో గొప్పగా నిక్షిప్తం చేసింది  .

 సశేషం

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -16-6-22-ఉయ్యూరు 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -302

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -302

302-‘’ఎగిరి పొతే ఎంత బాగుంటుందో ‘’పాట ఫేం పాటల మాటల రచయిత –సాహితీ

సాహితి పేరుతో తెలుగు సినిమారంగంలో గేయ రచయితగా, సంభాషణల రచయితగా చలామణీ అవుతున్న రచయిత అసలు పేరు చెరుకుపల్లి శ్రీరామచంద్రమూర్తి. ఇతడు కృష్ణా జిల్లామైలవరం మండలం, వెల్వడం గ్రామంలో జన్మించాడు. ఇతడు వెల్వడం గ్రామంలో ఎస్.ఎస్.సి, వరంగల్లులో ఇంటర్మీడియట్,నూజివీడులో డిగ్రీ చదివాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి స్నాతకోత్తర పట్టా పొందాడు. ఇతడు గుడివాడలో ఒక ట్యుటోరియల్ కాలేజీలో లెక్చరర్‌గా కొంతకాలం ఉద్యోగం చేశాడు[3].

సినిమా రంగం

సినిమాలలో అవకాశం కోసం 1974లో మద్రాసుకు వెళ్లాడు. మొదట ఆత్రేయ వద్ద సహాయకునిగా చేరాడు. గురువు దగ్గర మెలకువలు నేర్చుకుంటూనే ప్రయత్నాలు మొదలు పెట్టాడు. 1979లో విజయనిర్మల దర్శకత్వంలో కృష్ణ హీరోగా తెరకెక్కిన కిలాడి కృష్ణుడు సినిమాలో తొలి పాటను రచించాడు. తరువాత ఇతనికి అనేక అవకాశాలు వెనువెంటనే వచ్చాయి. ఇతడు మూడున్నర దశాబ్దాలలో 500కు పైగా పాటలు, 100 ప్రైవేటు ఆల్బమ్స్, 30 డబ్బింగ్ సినిమాలకు పాటలను అందించాడు. కేవలం పాటలే కాక “మల్లన్న”, “జర్నీ” వంటి సినిమాలకు సంభాషణలు కూడా అందించాడు[3].

ఇతని కలం తనదైన శైలిలో పాటకు పట్టాభిషేకం చేస్తుంది. ఈయన పాటలో పదాలు స్వరాల మధ్య విసిరేసినట్టుండవు. స్వరంపై పైచేయి సాధించడానికి పోటీ పడుతున్నట్టుంటాయి. ఇతడు రాసిన “జాబిలికీ వెన్నెలకీ”, “ఎగిరిపోతే ఎంత బాగుంటుంది” పాటలు అశేష ఆదరణ పొందాయి.[4] ఇతడు సుమారు 1000 తెలుగు సినిమా పాటలు రాసాడు. ఆంధ్రప్రదేశ్ యొక్క వివిధ యాస, మాండలికాలతో జానపద గీతాలను రాసినందున సినిమా పరిశ్రమలో ప్రసిద్ది చెందాడు. ఇతను దూర ప్రాంతాలు ప్రయాణం చేసి, ప్రజలతో సంభాషించి, వారి వ్యావహారిక పదాలు, పదజాలాన్ని సేకరించి జానపద కవిత్వంలో తనకు ఒక ప్రత్యేకమైన చిహ్నాన్ని సృష్టించాడు. అతడు మొండిమొగుడు పెంకి పెళ్ళాం చిత్రంలో విజయశాంతి పాత్రకు రాసిన “లాలూ దర్వాజ లష్కర్ బోనాల్ పండుగ” పాట పెద్ద హిట్ అయింది. ఇతను అందమైన, గొప్ప యాసలను రాసాడని భావిస్తారు.[5]

సినిమాల జాబితా

గేయ రచయితగా

1.   కిలాడి కృష్ణుడు (1980)

2.   రామ్ రాబర్ట్ రహీమ్ (1980)

3.   వాడనిమల్లి (1981)

4.   అతిరధుడు (1991)

5.   ఆగ్రహం (1991)

6.   ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్ (1991)

7.   అప్పుల అప్పారావు (1992)

8.   వద్దు బావా తప్పు (1993)

9.   ఘరానా అల్లుడు (1994)

10. అమ్మలేని పుట్టిల్లు (1995)

11. ఆంటీ (1995)

12. ఆలీబాబా అద్భుతదీపం (1995)

13. ఆడాళ్లా మజాకా? (1995)

14. అక్కుమ్ బక్కుమ్ (1996)

15. ఇల్లాలు (1997)

16. దొంగాట (1997)

17. అల్లరి పెళ్లాం (1998)

18. డాడీ డాడీ (1998)

19. ఆవిడే శ్యామల (1999)

20. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం (2001)

21. తప్పుచేసి పప్పుకూడు (2002)

22. అదృష్టం (2002)

23. వెంకీ (2004)

24. ఖుషి ఖుషీగా (2004)

25. సఖియా (2004)

26. మాస్ (2004)

27. బాస్ (2006)

28. ఆటాడిస్తా (2008)

29. భలే దొంగలు (2008)

30. బ్లేడ్ బాబ్జీ (2008)

31. సమర్ధుడు (2009)

32. వేదం (2009)

33. మిరపకాయ్ (2011)

34. ప్రేమ కావాలి (2011)

35. ఢమరుకం (2012)

36. రామయ్యా వస్తావయ్యా (2013)

37. చల్‌ మోహన రంగా (2018)

సంభాషణల రచయితగా[మార్చు]

1.   మల్లన్న

2.   జర్నీ

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -16-6-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

విశ్వ పుత్రిక తోరూ దత్-8

విశ్వ పుత్రిక తోరూ దత్-8

ఇంగ్లాండ్ లో తోరూ కుటుంబం

దత్తు కుటుంబం ఇంగ్లాండ్ లో లండన్ లోని చారింగ్ క్లాస్ హోటల్ లో ముందు బస చేసి ,తర్వాత బంధువు రమేష్ చందర్ మాట్లాడిఉన్చిన  గ్రాస్ వెనర్ హోటల్ గదుల్లో ఉన్నారు .తర్వాత బ్రాండం లో అన్ని వసతులు ఉన్న ఇంట్లో చేరారు .సిడ్నీ ప్లేస్ ,ఆన్ స్లో స్వేర్ లో 9వ నంబర్ ఇల్లు అది .ఇక్కడే అక్కచెల్లెళ్ళు ఫ్రెంచ్ కవితల్ని ఇంగ్లీష్ లోకి అనువదించారు .గోవిన్ కుటుంబం అందరితో బాగానే పరిచయాలు పెంచుకొన్నారు .దత్ ఫామిలి ఆల్బం లో ఉన్న తనకొడుకు మరణానికి చెందినతనకవితలు నీళ్ళు నిండిన కళ్ళతో   రమేష్ కు చదివి వినిపించేవాడు .దాన్ని పుస్తకంగా ప్రచురించి అతనికి ఒకకాపీ ఇచ్చాడు .మరో బంధువు అరుణ్ చందర్ దత్తు అంటే తోరూకు బాగా అభిమానం ..అతడు కేంబ్రిడ్జి కార్పస్ క్రిష్టి కాలేజి లో డిగ్రీ పొంది అక్కడే స్థిరపడ్డాడు .గొప్ప  డాక్టర్ గా పేరు తెచ్చుకొని ఆంగ్ల వనితను పెళ్ళాడి సుఖంగా ఉన్నాడు .

  ఇంగ్లాండ్ లో ఆరూ తొరూ లు హాయిగా కాలక్షేపం చేశారు. సర్ జార్జి మెక్ ఫర్న్,సర్ బార్టర్ ఫ్రేరీ లతో పరిచయం కలిగింది .మెక్ ఫెర్న్ భార్య వీళ్ళిద్దరికీ సంగీతం నేర్పింది .సర్ బార్టర్ 1862నుంచి 67దాకా బెంగాల్ గవర్నర్ గా ఉన్నాడు .ఫ్రేరీ దంపతులతో తొరూ వింబుల్డన్ లో చాలా రోజులు కులాసాగా గడిపింది .షేక్స్పియర్ నాటకాలను ఫ్రెంచ్ లోకి అనువాదం చేసిన,విక్టర్ హ్యూగోకు స్నేహితుడు అయిన  సెవేలియర్ డి.చాటర్టన్ కూడా పరిచయమయ్యాడు .

  పెద్దదైన ఆరు తోరూ కన్నా మానసికంగా చిన్నది .తోరూకున్న చొరవ లేదామెకు .ఒకరకంగా ఆరూ కు మార్గదర్శి తొరూ .ఇద్దరిమధ్య గొప్పఅనుబంధమే ఉండేది .నవలలు కాకుండా చారిత్రిక గ్రంధాలు చదవమని లార్డ్ లారెన్స్  హితవు చెప్పేవాడు .ఆమెచరిత్ర అంతా బూటకం నవల లో అంతా నిజమే ఉంటుంది అని జవాబిచ్చింది .ఆరూ పై తోరూ పెద్దరికానికి తల్లీ తండ్రీ అభ్యంతరం చెప్పలేదు .తోరూ జ్ఞాపక శక్తి అమోఘం .తాను  చేసిన అనువాదాలన్నీ ఆమెకు కంఠతా వచ్చు .ఆమె గొప్పశ్రద్ధతో అధ్యయనం చేసేది .సందేహం వస్తే నిఘంటువులు విజ్ఞాన సర్వస్వాలు రిఫర్ చేసేది .ఆ వివరనలన్నీ రాసుకొని జాగ్రత్తగా ఉంచుకోనేది .తండ్రికి కూతురు కు ఈ విషయం లో అభిప్రాయ భేదం వస్తే కూతురు తోరూ మాటే నిజమయ్యేది.ఆమెదే గెలుపు అని తండ్రికూడా చెప్పేవాడు .తాను ఎప్పుడైనా తండ్రి చేతిలో ఓడిపోతే ‘’నా తెలివి తెల్లవారి నట్లుంది నువ్వు పెద్దవాడివి పూర్ణ పురుషుడవు  ‘’అని బాధపడకుండా తప్పుకునేది .

  దత్తు కుటుంబం అంతా1837నుంచి 43వరకు కలకత్తా సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి  సర్ ఎడ్వర్డ్ రెయాన్ తో సన్నిహితంగా ఉండేది .డికెన్స్, ధాకరే వంటి వారికి ఆయన ముఖ్య స్నేహితుడు .ఒకసారి ఆయన ‘’మీకు ధాకరే కూతుళ్ళు తెలుసా ?మీ ప్రక్కనే ఉంటారు ‘’అని అడిగితె తెలియదని తోరూ చెప్పింది .’’ఆయన నవలల లో ఏది ఇష్టం ?అని అడిగితె ‘’అందరికి నచ్చిన పెండరిన్ .కానీ దీనికంటే గొప్ప కళాఖండం ‘’ఎస్మాండ్ ‘’‘’అన్నది తోరూ .పిల్లలిద్దరి చదువులు ఎలా సాగుతున్నాయో చూడటానికి తండ్రి శ్రీమతి లాలేన్స్ ను పర్య వేక్షకురాలుగా కుదిర్చాడు .

  అసలే అంత౦త మాత్రం ఆరోగ్యాలున్న అక్క చెల్లెళ్ళకు దినచర్య చాలా భారంగా ఉండేది .ఊపిరి పీల్చుకోవటానికి కూడా వీలు౦డేదికాదు .ఇండియా వచ్చినా తొరూ ఆరోగ్యం మెరుగు పడలేదు పైపెచ్చు దినచర్య  ఎక్కువగానే ఉండేది .దీన్ని గురించి ‘’ఉత్తరం రాసే తీరిక కూడా లేదు .ఉదయం ఏడున్నరకు పియానోక్లాసులు .తర్వాత టిఫిన్ చేసి బైబిల్ ఒక గంట చదవాలి  .మళ్ళీ పియానో తోమ్మిదిన్నరదాకా .తర్వాత టైమ్స్ పత్రిక  చదవటం .పదింటికి లాలేన్స్ వచ్చి మధ్యాహ్నం మూడున్నర దాక తోముతారు .నాలుగింటికి నాన్నతో కలిసి పఠనం.శుక్రవారం మిసెస్ మెన్ ఫారన్ వచ్చి సంగీతం నేర్పుతారు .సోమవారాలు మిస్టర్ పార్ ఇంటికి వెళ్లి సంగీతం నేర్చుకొంటాం .ఆతర్వాత మళ్ళీ పియానో ‘అని ఆమె ఒక స్నేహితురాలికి ఉత్తరం రాసింది .

  ఇంగ్లాండ్ లో ఉన్నా ఫ్రెంచ్ అధ్యయనం కొనసాగించారు .ఇంట్లో ఇటాలియన్ సేవకుడు ఉండటంతో అతనితో మాట్లాడటం వలన ఫ్రెంచ్ బాగా వచ్చింది .వంటమనిషి ఇసాబెల్ కు భారతీయ వంటకాలు వండటం వీళ్ళు నేర్పారు .అప్పుడప్పుడు ‘’ఐ మీ రోబ్సర్డ్’’,’’మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీం ‘’వంటి నాటకాలు వెళ్లి చూసేవారు .1871లో దత్తు కుటుంబం కేంబ్రిడ్జి లో పార్కర్స్ పీన్ కు ఎదురుగా రీజెంట్ వీధిలో ఉన్నారు .స్త్రీలకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సభలకు వెళ్లి ప్రసంగాలు శ్రద్ధగా వినేవారు .ఇక్కడ ఫ్రెంచ్ నేర్పటానికి బోగెల్ అనే టీచర్ కుదిరాడు .కేం బ్రిడ్జి లో తోరూకు ముఖ్య ఆకర్షణ మేరీ మార్టిన్ .తర్వాత ప్రాణప్రద స్నేహిహితురాలైంది.ఎంతో లేఖాయణం ఇద్దరిమధ్యా జరిగి, సాహిత్య చరిత్రలో స్థానం సంపాదించుకొన్నది  .హరిహర దాసు రాసిన తోరూ జీవిత చరిత్రకు సహాయకారిణి మిస్ మార్టెన్ .ఆయన ఈమెను 1913లో కలకత్తాలో కల్సి విషయ సేకరణ చేశాడు .లేఖాయణం ప్రచురించటానికి ఆమె నుండి అనుమతి పొందాడు .ఆ కృతజ్ఞత ప్రకటించటానికే ఆపుస్తకాన్ని ఆమెకే అంకితమిచ్చాడు-‘’తాను  చూపిన మెత్తనైన సానుభూతికి –కృతజ్ఞతతో ఎంతొప్రేమతో –తనభారతీయ స్నేహితురాలూ ,-ప్రాణం మిత్రమూ అయిన –తోరూదత్ స్మృతికావ్యం –మేరీ ఐ .ఆర్ .మార్టిన్ కు అంకితం చేయబడుతోంది ‘’అని హృదయపూర్వకంగా తెలియజేశాడు తోరూ దత్ జీవిత చరిత్ర చేసిన హరిహరదాస్ .తోరూ చనిపోయిన చాలాకానికి అంటే 1910-13మధ్య మేరీ మిషనరీ గా కలకత్తాకు వచ్చింది .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -15-6-22-ఉయ్యూరు  

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment