18-పారిభాషిక పదప్రయోగ హాస్యం

18-పారిభాషిక పదప్రయోగ హాస్యం

కొన్ని పారిభాషిక పదాలు ఆ శాస్త్రంలోనే రాణిస్తాయి వాటిని తెచ్చి మామూలు మాటలలో పొదిగితే ఒక రకమైన చమత్కారం కలిగి నవ్వు  పుట్టటమే పారిభాషిక పద ప్రయోగ హాస్యం .ఉదాహరణ –‘’వితంతులకు శిరో ము౦డనం స్మార్తులలో నిత్యం ,అద్వైతులలొ వైకల్పికం .,విశిష్టాద్వైతులలో  ముండనము లేదు’’అన్నారట స్వామి శివశంకరస్వామి అని మునిమాణిక్యం ఉవాచ .ఇంకోఆయన ‘’ధూళి పాళ వారు విశ్వనాథ కు తత్సమం అన్నాడట .మాస్టారి ఇంట్లో వరసకు బావమరది అయిన ఒక కుర్రాడున్నాడు .ఎవరో ‘’ఎవరా అబ్బాయి ?’’అని అడిగితె జలసూత్రం రుక్మిణీ నాథ శాస్త్రి ‘’ఔప విభక్తికం ‘’అన్నారట .విశాఖ జిల్లావారు అన్నాన్ని ‘వణ్ణ౦ ‘’అంటారు ఎందుకు అలా అంటారని అడిగితె ఒక శర్మగారు అది ‘’యణా దేశ సంధి ‘’అన్నాడట .

  ఒకాయనకు భార్యమాట ‘’మహావాక్యం ‘’అహం బ్రహ్మాస్మి లాగా అన్నాడట ఒకాయన ..ఒక ఇంటాయన పెళ్ళాన్ని ‘’ఇవాళ ఏమిటీ’’ సత్పదార్ధం ‘’అని అడిగాడట .అంటే వండిన వాటిలో బాగా రుచిగా ఉన్నదిఏది అని ఆయన భాష్యం.రావూరు వారిని మాస్టారు ‘’కూటస్థుడు’’అంటే ఏమిటి ?అని అడిగితె ‘’భార్య ఏమన్నా ,ఎంత ని౦దించినా,పట్టించుకోకుండా ,వికారం పొందకుండా ఉండే  సద్గ్రుహస్తు’’అన్నారట .ఇదంతా వేదాన్తపారిభాషిక హాస్యం .

  ఒక భార్యాభర్తలు పోట్లాడుకొని కొంతకాలం మాట్లాడుకోకపోతే ఇప్పుడు ఎలా ఉన్నారు వాళ్ళు?అని రావూరు ను అడిగితె ‘’ఇద్దరికీ రాజీ కుదిర్చే ఏర్పాటు  జరుగుతోంది .’’నిర్వహణ సంధి’’ జరగచ్చు .కాకపొతే’’ ముఖ సంధి’’లో ఆ పోట్లాట అంతం కావచ్చు .చివరకు’’ గర్భ సంధి’’ లో వ్యవహారం పర్యవసానం చెందుతుంది ‘’అన్నారని మునిమాణిక్యం గారువాచ .కానీ ఏమీ బోధపడక వివరించమని కోరితే ‘’మధ్యవర్తులు ఇరువైపులా చెప్పిచూశారు పోట్లాట ఆగిపోతే నిర్వహణ సంధి అలా కుదరకపోతే భర్తే కాస్త తగ్గి భార్య దగ్గరకు వెళ్లి ముఖం మీద ముఖం పెట్టి చెవిలో మంచి మాటలు రహస్యంగా చెప్పి ,వీలయితే ముద్దుపెట్టి రాజీ చేసుకొంటే అది ముఖ సంధి .కొంతకాలానికి వాళ్ళిద్దరూ కలిసి కాపురం చేస్తే ఆమెకు గర్భం వస్తే వివాదం సమసిపోతే గర్భ సంధి అ౦టారనిచెబితే పగలబడి నవ్వారట మాస్టారు.ఇదంతా ఆలంకారిక పారిభాషిక ప్ర’యోగం .

మాస్టారు తన స్నేహితుడిని ‘’అధ్యవసాయం ‘’అంటే ఏమిటిఅని అడిగితె ‘’ఒకరకమైన వ్యవసాయాన్ని అధ్యవసాయం అంటారు’’అన్నాడట .వ్యభిచారీ భావం అంటే ఏమిటి అని అడిగితె ‘’అది అంత మంచి భావం .కాదు అదొక క్షుద్రభావం ‘’అన్నాడట అంటే అతడికి ఆలంకారిక పరిభాష అర్ధమే తెలీదన్నమాట అన్నారు మునిమాణిక్యం సార్.

  ధ్వని లో హాస్యం –ఒక వాక్యానికి అందరికీ తెలిసిన అర్ధం ఒకటి ఉంటె ,సహృదయులకు మాత్రమె స్ఫురించే అర్ధమే ధ్వని .మాస్టారి ఫ్రెండ్ కొత్త అర్ధం చెప్పాడట –‘’వాడు ధ్వనించాడు ‘’అంటే బాగా చప్పుడు చేశాడు అని అర్ధం ట.కనుక ధ్వని అంటే చప్పుడు చేయటం అని వాక్రుచ్చాడట .అలాంటప్పుడు నవ్వక చస్తామా ?ఒకరింటికి వెడితే అక్కడిపిల్లలు కొట్టుకొంటూ  చెంబూ  తప్పాలా గిరాటేస్తూ కన్పిస్తే ‘’ఏమిటి ఈ మోత ?’’అని మాస్టారు అడిగితె ‘’వస్తుధ్వని ‘’అంటే వస్తువులు చేసే ధ్వని అని ఆయన భావనట.మనకూ నవ్వు రావాలి తప్పకుండా .ఒక ఇంట్లో పిల్లల్ని తల్లి పిచ్చ పీకుడు పీకితే వాళ్ళు లబోదిబో మని ఏడుస్తుంటే  ‘’ఇదేం ధ్వని బాబూ ‘’అని అడిగితె ‘’రసధ్వని ‘’అని ముసిముసి నవ్వులు నవ్వాడట .అంటే కరుణ రౌద్రరసాలు ఆధ్వనిలో అభి వ్యక్తమయ్యాయని టీకా చెప్పాడట .ఇలా పారిభాషిక పదాలకు వింత అర్ధ స్ఫూర్తి కల్పించి వాడితే హాస్యం ఉత్పన్నం అవుతుందని మునిమాణిక్యం గారన్నారు .ఇలాంటి పారిభాషిక పదప్రయోగాన్ని అలంకార శాస్త్రం లో ‘’అప్రతీక పద ప్రయోగం ‘’అంటారని మునిమాణిక్యంగారువాచ .

  శ్రీ మునిమాణిక్యం మాస్టారు గారికి కృతజ్ఞతలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-11-21-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

హంసలదీవి శతకం

హంసలదీవి శతకం

మధురకవి కాసుల పురుషోత్తమకవి హంసల దీవి శతకం రాయగా ,1925లో మచిలీ పట్నం బుట్టాయ పేటలోని నేషనల్ ప్రెస్ లో వేమూరి చిరంజీవావదానుల చేత ప్రకటితమైనది .వెల తెలుపలేదు .ఎలాంటి ఉపోద్ఘాతం , కవి పరిచయాదులు కూడా లేవు .సూటిగా శతకాన్ని ‘’’లలితా కృష్ణాబ్ది సంగమ స్థల విహార –పరమ కరుణా స్వభావ గోపాల దేవ’’మకుటం తో ప్రారంభించి ‘’శత సీస పద్యాల కాసులు రాల్చాడు ‘’కాసుల పురుషోత్తమకవి .మొదటిపద్యం –

‘’శ్రీ రుక్మిణీ మనస్సార సే౦దిర-సత్యభామా ముఖాబ్జాత మిత్ర –జాంబవతీ పటుస్థన శైల జీమూత –ఘన సుదా౦తాన యోవన మదేభ

లక్ష్మణా పరి రంభ లలిత పంజరకీర –భాద్రావలీతరంగ వనమరాళ-మిత్ర వి౦దా ధర మృదు పల్లవ పిత –రవి జాదృగుర్పల రాజబింబ

షోడశ సహస్రకామినీ స్తోమకామ –భావజ విలాస భావజ విలాస

హంసల దీవి వాస –లలిత కృష్ణాబ్ధి సంగమస్తల విహార –పరమకరుణా స్వభావ గోపాల దేవ’’ అని శ్రీకృష్ణుని అష్టభార్యల వర్ణన చేశాడు .

కాసులకవి వ్యాజస్తుతి గా కావ్యాలు రాశాడు .క్రీశ.1791లో కృష్ణాజిల్లా దేవరకోట అనే చల్లపల్లి సంస్థాన రాజు అంకినీడు రాజా ఆస్థానకవి .మోపిదేవి దగ్గర పెద ప్రోలు గ్రామవాసి . నేను మొట్టమొదట మోపిదేవి హైస్కూల్ లో సైన్స్ మాస్టర్ గా చేరినప్పుడు ఈ పేద ప్రోలులోనే కాపురం పెట్టి రోజూ మోపిదేవి వెళ్లి ఉద్యోగం చేసి వచ్చేవాడిని .పుల్లమ రాజు అనే పేరు కూడా ఈకవికి ఉంది ఈయన రచనలు అర్ధాంతర న్యాస అలంకారాలతో ఉంటూ రచనలకు వన్నె తెచ్చాయి.

వీరు జన్మించిన పెదప్రోలు గ్రామంలో, వీరి విగ్రహాన్ని, 2012, ఏప్రిల్-29నాడు ఆవిష్కరించారు. ఘంటసాల మండలంలోని శ్రీకాకుళం గ్రామములో వేంచేసియున్న శ్రీ ఆంధ్రమహావిష్ణువు ఆలయం ప్రాంగణంలో, శ్రీ కాసులపురుషోత్తమ కవి విగ్రహాన్ని, 2016, ఫిబ్రవరి-11వ తేదీనాడు ఆవిష్కరించారు. ఈ విగ్రహాన్ని శ్రీ కాసుల పురుషోత్తమ కవి వంశీకులైన శ్రీ జాడల్రిజా సాగర్ రాజు, శ్రీ కాసుల కృష్ణంరాజు, శ్రీ కాసుల శ్రీధరరాజు ఏర్పాటు చేసారు.

రచనలు
విజయనగర సామ్రాజ్య ప్రాభవంలో వెలిగిన ఆంధ్ర మహావిష్ణువు దేవాలయం, తరువాత సరైన పాలన లేక నిర్లక్ష్యానికి గురి అయ్యిందిట. అప్పుడు కాసుల పురుషోత్తమ కవి ఈ స్వామి పై నిందాస్తుతిగా ఆంధ్ర నాయక శతకాన్ని రచించాడుట. ఇది విని అప్పట్లోని జమీందారు ఈ ఆలయాన్ని మళ్ళీ పునరుద్ధరించాడని చెప్పుకుంటారు.

ఆంధ్రనాయక శతకం:- ఈ శతకం సీస పద్యాలతో రచించ బడింది. అద్భుతమైన ధార, ఆకట్టుకునే శైలి ఈ కవి సొత్తు. మీరు ఈ శతకాన్ని ఇక్కడ చదివి ఆనందిచవచ్చు. శ్రీకాకుళం గ్రామములోని శ్రీ రాజ్యలక్ష్మీ సమేత శ్రీ శ్రీకాకుళేశ్వరస్వామివారిని కీర్తించుచూ రచించిన ఆంధ్రనాయకశతకం లోని 108 పద్యాలను, ఆ ఆలయప్రాంగణంలో రాతి శాసనాలరూపంలో భద్రపరచారు. ఈ పద్యాలను వారి వారసులు శ్రీ కాసుల కృష్ణంరాజు, రాజశ్రీధర్ లు, ప్రముఖ చలనచిత్ర నేపథ్య గాయకులు గాయకులు శ్రీ శ్రీకృష్ణచే ఆలపింపజేసి, సీ.డీ.రూపంలో నిక్షిప్తం చేసారు. ఈ సీ.డీ.లను 2016, ఫిబ్రవరి-4వ తేదీనాడు ఆలయంలో ఆవిష్కరించారు.

హంసల దీవి శతకాన్ని ఇది హంసలదీవిలోని అధిషాసనదైవమైన గోపాలదేవునిపై ఆంధ్రనాయక శతకకర్త శ్రీ కాసుల పురుషోత్తమకవిచే కూర్చబడినది. శ్రీ కాసుల పురుషోత్తమ కవి తలిదండ్రులు రమణమాంబ, అప్పలరాజులు, కాశ్యపగోత్రజుడు. విద్యాగురువు శ్రీమాన్‌ అద్దంకి తిరుమలాచార్యులవారు.

ఈ హంసలదీవి గోపాల శతకం, కవిగారు రచించిన నాలుగు శతకాల్లో మూడవది. మొదటి రెండూ, మానసబోధ శతకం,రామా! భక్తకల్పక ద్రామా అన్న మకుటం గల శతకాలు అలభ్యాలు. కవి ఈ శతకంలో భక్తిమీర భాగవతం లోని గాధలను తనివితీరా గానం చేశారు. ఆ చేసిన తీరులో భగవంతునితో ఆయనకు గల సన్నిహితత్వం ఎలాంటిదో అవగతమవుతుంది. పద్యం నడిపించిన తీరు అత్యద్భుతం. కాగా ఆయనకు గల శబ్ధాధికారం నన్నయకు సాటి వచ్చేది. అంత్యానుప్రాస, ముక్తపదగ్రస్తాలు ఈయనకు ఒదిగినట్లు మరొకరికి ఒదుగలేదంటే అతిశయోక్తి కాదు. ఇక భాషాపటుత్వ విషయం చెప్పనే అక్కరలేదు. శతకమంటూ చదవటం ప్రారంభిస్తే, పూర్తి చేసే దాక వదలిపెట్టలేము. భక్తులు, విద్యార్థులూ, పఠించి లాభపుదురుగాక అని ఆశిస్తూ…

  • ఆచార్య యార్లగడ్డ బాలగంగాధరరావు

ఒకవేళ చీకటింటికి దీప మిడినట్లు
తేటగా సర్వంబు దెలిసియుండు
నొకవేళ నీహార మెనసిన పద్మంబు
గతి బోల్పదగి మందమతిగనుండు
నొకవేళ ద్విరదమూరక త్రొక్కిన కొలంకు
పగిది నెంతయుఁ గల్కబారియుండు
నొకవేళ క్రొత్తవీటికి మీను బ్రాకిన
కరణి మహాశలఁ దిరుగుచుండు
గాని నిశ్చలపడదు నామానసంబు
భావజవిలాస! హంసల దీవివాస!
లలిత కృష్ణాబ్ది సంగమస్థల విహార!
పరమ కరుణాస్వభావ! గోపాలదేవ!

భావం – స్వామీ నామనస్సు ఏనాడు నిశ్చలంగా ఉండదయ్యా
ఒకసారి చీకటింట్లో దీపం పెట్టినట్టుగా, అంతా సుస్పష్ట
మౌతుంది. ఒక సమయంలో మంచుతో కూడిన పద్మంలా
మందమతిగా ఉంటుంది. ఒక్కోసారి ఏనుగు త్రొక్కిన
సరస్సులా కలుషితమైపోతుంది. ఒక్కొక్కొప్పుడు క్రొత్తనీటికి
ఎదురు ప్రాకే చేపలా గొప్ప ఆశలతో తిరుగుతూ ఉంటుంది.
మన్మథాకారా కృష్ణా సముద్ర సంగమ స్థలమైన హంసలదీవిలో
విహరించువాడా దయాస్వభావా గోపాలదేవా – అని భావం
ఈ శతకంలో మకుటం మూడుపాదాలు గమనించగలరు.

అచ్యుతవరలబ్ధకవితా విదగ్ధుడు — ఆంధ్రనాయకశతక కర్త శ్రీ కాసుల పురుషోత్తమకవివరుడు.

ఈ శారదాతనయుడు ఆంధ్రశతక సారస్వతచరిత్రలోనే శాశ్వత నిరుపమ స్థానాన్ని సంపాదించుకున్న అకళంక, అపూర్వ పుణ్యమయ గ్రంథరచయిత. వీరి రచనలగురించి విశ్వనాథ సత్యనారాయణగారు “సాహిత్య సురభి” అనే తమ గ్రంథంలో ఇలా అన్నారు:

“– – -కాసుల పురుషోత్తమకవి- – -శతకములు మాత్రమే వ్రాసెను. అతని కవిత్వము కావ్యదోషము లెరుంగనిది“.

మరొక సందర్భంలో ఒక సభలో మాట్లాడుతూ విశ్వనాథవారే ప్రస్తావవశంగా ఇలాగ అన్నారట:

“తెలుగులో భాగవతాన్ని పోతనగారు రచించి ఉండకపోతే, పురుషోత్తమకవి తప్పక వ్రాసివుండేవాడు“.

అంటే పురుషోత్తమకవి పోతనగారి స్థాయికిచెందిన సహజకవి,పండితుడు, మహాభక్తుడు అన్నమాట.కృష్ణా జిల్లాలోని దివిసీమకిచెందిన పెదప్రోలు పురుషోత్తమకవిగారి స్వస్థలము. అప్పలరాజు-రమణమ్మ దంపతుల కుమారుడు పురుషోత్తమకవి. చిన్నతనంలో వారి పేరు ‘పుల్లంరాజు’ట! కాని పురుషోత్తమ నామధేయమే ఆయనకి స్థిరపడింది. వారు “వంది”(తెలుగులో భట్రాజులు) కులానికి చెందినవారు. “వందంతే ఇతి వందినః” అంటే స్తోత్రముచేసేవారని అర్థం! “వది” ధాతువు-root-నుంచి ‘వంది’ అనేమాట వచ్చింది. ఈ ధాతువుకి “అభివాదనమూ,స్తుతి చేయుట” అని అర్థం. ఈ వందిపరంపర గురించి కాళిదాసమహాకవి తన రఘు వంశ మహాకావ్యం(IV—6.) లో ఇలాగ తెలియచేసేరు:

“పరికల్పిత సాన్నిధ్యా
కాలే కాలే చ వందిషు |
స్తుత్యం స్తుతిభిః అర్థ్యాభిః
ఉపతస్థే సరస్వతీ” ||

“ఆయా సందర్భానుసారంగా సరస్వతీ దేవి వందిలకి సన్నిహితంగావుంటూ, వారు స్తోత్రంచెయ్యవలసిన విషయానికి అనుగుణమైన అర్థ-శబ్దాలని వారియందు కలిగింప చేస్తూంటుంది”.

దీనివలన మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే వంది-మాగధులు ప్రత్యేక వాగ్ధేవతానుగ్రహం-అంటే పలుకులవెలది ప్రసన్నతని సహజంగానే కలిగివుంటారన్నమాట.
కాసుల పురుషోత్తమకవిగారు ఈ దివ్యానుగ్రహాన్ని తన ఇష్టదైవమైన పురుషోత్తముడికి సంపూర్ణంగా సమర్పించుకున్నారు. ఈ దివ్యానుగ్రహంతో వారు నాలుగు శతకాలు రచించేరు:

కవిత్వం లో కాసులను ఏరుకొందాం –‘’కుబ్జగంధమొసంగి కొమరు ప్రాయంబున –శాతకుమ్భ శలాక రీతిగా ‘’ఉందట .మాలికుడు మాలికలు అర్పిస్తే మౌనులు గగన నిర్మలత పొందారట .రీజకుడు శుభ్రవస్త్రాలిస్తే ఇహ పర సౌఖ్య లబ్దిపొందాడు .విదురుడు ఇష్టాన్న భోజనం పెట్టి పరమ భాగవతోత్తముడు అయ్యాడు .గురుపుత్రుని బ్రతికించి కుచేలునికి కలుములిచ్ఛి ,అర్జున సారధ్యం చేసి గెలిపించి ఉత్తర గర్భాన్ని కాపాడటమే సాక్షి ఆయన కృప అనంతం .

‘’గతి నీవే సుమ్ము ,నీవతి వేగరమ్ము నా మతి బాదుకొమ్ము –కామితములిమ్ము – కృపాశాలి వన్న –నేనపచారి నన్న –నింత పరాకు నీకున్న నేపమురన్న ‘’అంటాడు ఆర్తిగా .’’ఏ తండ్రి నిర్మించే భూతక పంచ క గునోపెతావయవ సర్వ చేతంబు /

?ఏ సద్గురుడు దెల్పెహితవుగా సుజ్ఞాన మెలమి గర్భస్థ జీవులనెల్ల’’ఏస్వామి రక్షించాడు అని స్తుతించాడు .నిద్రలో కూడా స్వామి దర్శనమే కోరాడు .వరదివాకర నిశాకరులు నీ నేత్రాలు పరమేష్టి నీ నాభి పద్మ సంభవుడు ,కమలజాండాలు నీ చేతి బంతులు ,నిఖిల తరంగిణులు నీ సపాదకములు ‘’అని వర్ణిస్తాడు .

‘’అత్యున్నతా కారి వయ్యు బలీంద్రుని యాచించు చొ గుజ్జువైతి వీవు –సద్గుణ శాలివైనా సత్రాజిత్తుని శమంతకమణి ఇమ్మని దేబిరించావు .అఖిల పూజార్హుడవైనా బాపనయ్యలని అన్నం అడిగావు ,అసహాయ శూరుడవైనా పారిజాతం పీక్కొని పరుగోపరుగు లంకిన్చావు –ఘనులకు యాచన లాఘవమే అనిపించావు అని వ్యాజస్తుతి చేశాడు .అక్రూర విదుర భీష్మ అమ్బరీషుల పై చూపిన దయారసం తనపైనాచిలకమన్నాడు .శబరీ నహల్య పాంచాలి ఉత్తర లను బ్రోచినట్లు ధృవ,విభీషణ గుహులపై చూపినకూర్మి చూపమన్నాడు –‘’నమ్మినాడను పోషించ న్యాయమయ్య’’అని భారం ఆయనమీదే వేశాడు .’’భువనముల్ గన్న తండ్రివి నిజంబుగా నీడ –నీ బిడ్డ నని నే గణియిమ్పవలేనే ‘’అని లోక రక్షా జాగరూకుడవైన నువ్వు నాపై పరాకు ఎందుకు చూపిస్తున్నావు ,సకలాన్తరాత్మ స్వామివి. నా మనో వ్యధ నేనే చెప్పాలా ?’’అని ప్రశ్నించి ‘’ఎద్ది భవదిచ్చ నా రీతి నేలుమయ్య ‘’అని ఆయనకే వదిలేశాడు

సముద్ర తరంగాలు లెక్కపెట్టవచ్చుకానీ నీ చరిత్రలు వర్ణించలేము –గంగానది నీటి ని గణించ వచ్చుకానీ ,నీ గుణాలు వర్ణించలేము –వర్ష దారలు లెక్కపెట్టవచ్చుకానీ నీ లీలలు వర్ణించలేము ,ఆకాశంలో చుక్కలు లెక్కవేయవచ్చుకానీ ,నీ వినోదాలు వర్ణించలేము –‘’తరము గాదైన తోచినంతయే నుతించాను ‘’అని వినయంగా చెప్పుకొన్నాడు .’’జగతి జీవుడు పునర్జన్మ దుఃఖము బాయు –భద్రమౌ శాశ్వత పదము దొరకు –దాసులకు నీదు నామ కీర్తనల వలన ‘’అని అభయమిచ్చాడు అందరికి పురుషోత్తమ మహాకవి .

నీ కథా కావ్యం నిర్మించి బమ్మెర పోతన ,నీకు అర్పణ గా అన్నదానం చేసి కోట సింగన ,అర్ధు లపాలిటి కల్పవృక్షం భాస్కరుడు ,నీకు కోవెలకట్టి కృత్తి వెంటి వెంకటాచలం లు మృతి చెందినా కీర్తి స్థిరులయ్యారు అని అలాతరించినవారిని మనకు జ్ఞాపకం చేశాడు .తాను కాశ్యప గోత్రుడనని ,కాసుల వంశం లో అప్పలరాజు ,రమణా౦బ లకు పుత్రుడననీ ,అద్దంకి తిరుమలాచార్య తనగురువనీ ,’’భవ తీర్ధ మరందపాన ద్విరేఫా య మాన మానసు డను,-మాన్యహితుడ –పురుషోత్తమాఖ్యు౦డ-పూల్దండ వలె నీకు శతకంబు గూర్చితి శాశ్వతముగ-చిత్త గింపుము నీ పాద సేవకుడను –భావజ విలాస హంసల దీవి వాస –లలిత కృష్ణాబ్ధిసంగమ స్థల విహార –పరమ కరుణాస్వభావ గోపాల దేవ’’అని నూరవ పద్యంతో హంసల దీవి శతకం ముగించాడు కాసుల పురుషోత్తమ కవి .

శతకమంతా ఉదాహరి౦పదగిన పద్యాలే. ఆయన భావుకతకు పరమ భక్తి తాత్పర్యాలకు వర్ణనా వైదుష్యానికి ,ఔచిత్య ప్రకర్షకు ,ఆర్తికి అద్భుత శయ్యా సౌభాగ్యానికీ ,కృష్ణాప్రవాహ సదృశ పద్య ఝరి కి అబ్బురపడతాం .ఆశ్చర్యా౦బు ధిలో మునిగి తేలుతాం .హంసల దీవి కృష్ణా సంగమ పవిత్ర స్నానం చేసినంత అనుభూతి పొందుతాం . కవీ, మనమూ ధన్యులం . ఇప్పుడు శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ చరిత్ర తెలుసుకొందాం –

శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ఒక పవిత్ర పుణ్య స్థలం. పూర్వం దేవతలు ఈ గుడిని నిర్మించారు అని ఇక్కడి ప్రజల నమ్మకము.ఈ ఆలయానికి గాలిగోపురం ఉండదు. ఇక్కడ మాఘ పౌర్ణమి నాడు ప్రత్యేకమైన పూజలుమహోత్సవాలు, అన్నదానం జరుగుతాయి. ఈ ఆలయంలోని శ్రీ వేణుగోపాలస్వామి పిలిస్తే పలుకుతాడని భక్తులు విశ్వసిస్తారు. ఈ ప్రాంతంలో బయటపడిన శ్రీ కృష్ణుడి విగ్రహం అనుకోని కారణంగా దెబ్బతినడంతో, దానిని ప్రతిష్ఠించే విషయమై ప్రజలు ఆలోచనలో పడ్డారు. అప్పుడు వారిలో ఒకరికి స్వామి కలలో కనిపించి చెప్పిన ప్రకారం కాకరపర్రు వెళ్ళి ఓ గృహస్థుని ఇంట్లో కాకరపాదు కింద భూమిలో వున్న స్వామివారి విగ్రహాన్ని వెలికితీశారు. ఈ కారణంగానే ఆ ఊరికి కూడా కాకర పర్తి అనే పేరు వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. ఇక్కడ బయటపడిన శ్రీ వేణుగోపాల స్వామిని హంసలదీవికి తెచ్చి ప్రతిష్ఠించారు. అయితే ప్రపంచంలో ఎక్కడా కనిపించని విధంగా ఈ విగ్రహం నీలమేఘ ఛాయలో ఉండటాన్ని విశేషంగా చెప్పుకుంటారు.

ఈ దేవాలయం, విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివారి దేవాలయానికి దత్తత దేవాలయంగా ఉంది.

ప్రత్యేక పూజలు.
ఈ ఆలయంలో వేణుగోపాలస్వామి శ్రీ రుక్మిణీ సత్యభామ సమేతుడై పూజలు అందుకుంటూ ఉన్నాడు. ఇక్కడి దేవాలయ కుడ్యాలపై రామాయణ ఘట్టాలు అందంగా చెక్కబడి ఉన్నాయి. తూర్పు చాళుక్యుల శిల్పకళా వైభవానికి అద్దం పడుతుంటాయి. ప్రతి యేడు మాఘ శుద్ధ నవమి నుంచి బహుళ పాడ్యమి వరకూ స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా వేలసంఖ్యలో వచ్చిన ప్రజలు స్వామివారిని దర్శించుకుంటారు. ఆ తరువాత అక్కడికి దగ్గరలో ఉన్న సాగరంలో కృష్ణానది (తుంగ – భద్ర నదులను తనలో కలుపుకున్న కృష్ణవేణి ఇక్కడే సముద్రంలో కలుస్తుంది) క్షేత్రంలో స్నానం చేసి తరిస్తుంటారు.

ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, మాఘ పౌర్ణమికి వైభవంగా నిర్వహించెదరు. మాఘ శుద్ధ త్రయోదశినాడు ఉదయం స్వామివారిని శాస్త్రోక్తంగా పెళ్ళికుమారునిచేసి ప్రత్యేకపూజలు నిర్వహించెదరు. చతుర్దశినాడు ఉదయం శ్రీ రాజ్యలక్ష్మీ అమ్మవారికి కుంకుమపూజను రాత్రికి స్వామివారి కళ్యాణం నిర్వహించెదరు. పౌర్ణమినాడు రథోత్సవం మరుసటిరోజున చక్రస్నానం (వసంతోత్సవం) మొదలగు కార్యక్రమాలు నిర్వహించెదరు.

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -27-11-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

పరిచ్ఛేదక ప్రయోగ హాస్యం

పరిచ్ఛేదక ప్రయోగ హాస్యం

ఇతరపదాల సా౦గ త్యంనుంచి విడదీస్తే ,వికృతి చెంది హాస్యం పుట్టటమే పరిచ్చేదక ప్రయోగ హాస్యం .చిగురు ఆకు కలిస్తే చిగురుటాకు .చిగురు తీసేస్తే టాకును ప్రత్యేకంగా తీసుకొంటే అది పరిచ్చేద శబ్దం అవుతుంది .’’కృపారసంబు పై జల్లెడు మోము వాడు ‘’లో జల్లెడు ను జల్లించి బయటికి తెస్తే మిగిలిన దానికి పూర్వం ఉన్న అర్ధం పోయి వేరే అర్ధం వస్తుంది .జల్లెడు మోము వాడు అంటే జల్లెడ వంటి ముఖం ఉన్న వాడు అనే అర్ధం వచ్చి హాస్యం పుడుతుంది అన్నారు మునిమాణిక్యం మాస్టారు .

  తెలుగు పాఠం చెప్పమని హెడ్ మాస్టారు మునిమాణిక్యం గారిని ఆదేశించారు ఒకసారి ..తెలుగు పంతుళ్ళ  క్లాసుల్లో కిష్కింధా కాండె అవుతోందని ఇంగ్లీష్ వచ్చినవాడు తెలుగు చెబితే గ్లామర్ కలుగుతుందని హెచ్ ఎం భావన . సిడ్దౌన్,డో౦టాక్   అని దబాయిస్తే నోరు మూసు కుంటారని ఆశ .తనకు తెలుగు లో పాండిత్యం లేకపోయినా ఎదో పెద్దాయన అడిగాడు కదా అని సరే అన్నారు మాస్టారు .కానీ తెలుగు పండితులకు ఎక్కడో కారం రాసినట్లు ఉండి ‘’సడేలే ఈయనేం చెబుతాడు ‘’అని గొణిగారు.ఆమాటకు అర్ధం చెప్పండి ,ఈ పదాన్ని విడదీయండి అని పిల్లల్ని ఎక్కేసి పంపేవారు .కొద్దికాలం అవగానే గురూ గారికి వ్యాకరణం రాదు అని ప్రచారం ఊపు అందుకొన్నది .ప్రతి తలక మాసిన వాడూ వచ్చి ప్రశ్న అడగటం ఈయన ఎదో చెప్పటం వాడు నవ్వు కొంటూ వెళ్ళటం అనే ప్రహసనం చాలా రోజులు జరిగింది .ఒక రోజు ఒక కొంటె గాడు ‘’మాస్టారూ !ల౦గూడి ‘’ అంటేఅర్ధమ్ ఏమిటండీ ?’’అని అడిగితె ఆమాట ఇది వరకు ఎన్నడూ విన్నట్లు లేక ఎక్కడిది అని అడిగితె ‘’వెంకయ్య వ్యాకరణం ‘’లోది అన్నాడు.ఇంతలో బెల్ కొట్టగా బతుకు జీవుడా అని బయట పడ్డారు .మర్నాడు కూడావాడు తగులుకొన్నాడు .ఆమాట ఎక్కడుందో తెచ్చిచూపించమన్నారు మునిమాణిక్యం .తెచ్చి చూపించగా అందులో –అ ఆ ఇఈ లంగూడి ‘’ అని ఉన్నదాన్ని చదివి నవ్వుకొని  మాటను విడదీస్తే ఎలా కొంప ముంచు తుందో తెలిసింది .లతో కూడి లంగూడి అయి తికమక పెట్టింది అన్నారు మాస్టారు .

  మరో సారి ఇంకో కుర్రాడు రావణుడి ఇంటి పేరేమిటి అని అడిగితె ఆకాలం లో ఇంటి పేర్లు లేవని చెబితే ‘’కాదు మాస్టారు ‘’గాదె’’ అండీ  ‘’అన్నాడు .ఎక్కడుందో చూపించమంటే తీసుకురాగా చూస్తె ‘’గర్వించి చెడిపోయేగాదె రావణుడు ‘’అని ఉంది .సంధి తెలియక పోవటం వలన వచ్చిన చిక్కు ఇది అన్నారు మాస్టారు .’’అల్లుడా రమ్మని ఆదరంబున బిల్వ బంపుమామ  ను బట్టి జ౦ప గలమే ‘’పద్యం లో ‘’బంపు మామ ‘’చాలాకాలం తెలుగు నేలపై షికారు చేసింది అన్నారు మాస్టారు .ఇతర శబ్దాలనుంచి విడదీస్తే వచ్చే విపరీతార్ధం వచ్చి హాస్యం పుడుతుంది .ఇదికూడా శబ్దాశ్రయ హాస్యం లో భాగమే అంటారు మునిమాణిక్యం .

  శ్రీ మునిమాణిక్యం మాస్టారు గారికి కృతజ్ఞతలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-11-21-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

మరాఠీ నవకవిత్వ మార్గ దర్శి –కేశవ సుత్-5(చివరి భాగం )

మరాఠీ నవకవిత్వ మార్గ దర్శి –కేశవ సుత్-5(చివరి భాగం )

      అనువాద కేశవ

కేశవ సుత్ రాసిన 132కవితలలో అనువాదకవితలు 25.వీటిలో నాలుగు మాత్రమె సంస్కృతం నుంచి మిగిలినవి ఆంగ్ల కవితలనుంచి అనువదించాడు .సంస్కృత కవితల్ని మక్కీకి మక్కీ అనువాదం చేశాడు .కాళిదాసు రఘు వంశం ఏడవ సర్గ లో 5నుంచి 12వ శ్లోకం వరకు అనువాదం చేసి తనకవిత్వానికి శ్రీకారం చుట్టాడు .భారవి కిరాతార్జునీయం మొదటి సర్గలో 26శ్లోకాలు అనువదించాడు .ఇది కొంత మెరుగుగా ఉంది .మరి రెండు సంస్కృత కవితలు అందులో ఒకటి హాస్య స్ఫోరకమైనదానినీ మరాఠీకరించాడు .

  ఆంగ్ల కవితను వాదం లో విలియం డ్రమండ్ రాసిన –డత్ దెన్ ది వరల్డ్ గో దస్,ది లెసన్స్ ఆఫ్ నేచర్ కవితలు ,ఇబి బ్రౌనింగ్ రాసిన –వర్క్ ,షేక్స్పియర్ రాసిన –లవ్, సిన్స్ బ్రాస్ నార్ స్టోన్,పోస్ట్ మార్టెం కవితలు ,ధామస్ హుడ్-ది డెత్ బెడ్ ,అలాన్ పో-డ్రీం విదిన్ ఎ డ్రీం,ఎమర్సన్ –ది అపాలజీ ,స్కాట్ –కుపిడ్ అండ్ కాన్ పోస్పే ,జాన్ లిలే ,లేహంట్ రాసిన –రాన్డీన్ లను ఆంగ్లం నుంచి అనువాదం చేశాడు ,జర్మన్ కవి గోథె రాసిన –ఎ లిటిల్ రోజ్ఆన్ ది హీత్ ,విక్టర్ హ్యూగో కవితలు –ది బట్టర్ ఫ్లైస్ ఆజ్ వైట్ ఆజ్ స్నో ,నెపోలియన్ లిపెటిట్ లను వాటి ఆంగ్లమూలాలను అనుసరించి అనువదించాడు .ఇంగ్లీష్ కవితలను అనుసరించి లాంగ్ ఫెలో కవిత –దిఓల్డ్ క్లాక్ ఆన్ ది స్టేయిర్స్,అలాన్ పో –రావెన్ ,జాన్ డ్రై డెన్ కవిత –అలేగ్జా౦డర్స్ ఫీస్ట్ ఆర్ దిపవర్ ఆఫ్ మ్యూజిక్ లను ప్రతిభావంతంగా అనువదించాడు .అవన్నీ సర్వోత్తమాలు అన్నారు పట్వర్ధన్, జోగ్ వంటి విమర్శకులు . 

                             కేశవ సానెట్

   మరాఠీ కవిత్వం లో ‘’సానెట్ ‘’ను ప్రవేశ పెట్టిన ఘనతకేశవ సుత్ దే.మయూరాసన్ ,ఆణీతాజ్ మహల్ సానెట్ ను 13-11-1892లో రాశాడు .సానెట్ లో 14పంక్తులు ఉంటాయి కనుక మొదట్లో ‘’చతుర్దశ పది ‘’అన్నాడు .తర్వాత సానెట్ అనే పిలిచాడు. దుర్ముఖ్ లేలా కూడా సానెట్ వంటిదే .ఇందులో 16పాదాలు పెట్టాడు .మిల్టన్ ,షేక్స్ పియర్ పద్ధతినే కేశవ పాటించాడు .ఈ అనువాదాలతో ఆయన విశాల దృక్పధం ,ఉదారహృదయం తెలుస్తుంది ,ఈ సానెట్ లు తర్వాత మరాఠీ కవిత్వం లో అ౦తర్భాగం అయింది.తర్వాతకవులు సానెట్ ధోరణిలో వీరగాధలు ,లఘు కావ్యాలు రాశారు .ఈ శైలికి కేశవ్ మార్గదర్శి .

     కొత్తదారులు

అక్షర గణాల కంటే మాత్రా గణాలపై మక్కువ చూపి ,నాలుగుపాదాల కవిత్వం కాక వాటి  సంఖ్య నతిక్రమించి కవితలల్లాడు .హిందీ ‘’దోహా’’ ను మధ్యయుగ కవి మోరోపంత్ అనుసరించాడు .మళ్ళీ కేశవ్ దాకా ఎవరూ దాని జోలికి పోలేదు .మత వేదాన్తాలకు ఉపయోగించే ఛందస్సు ను వాస్తవికత ,సంఘ సంస్కరణ కు వాడాడు .లిరిక్ లో ఉండే మాత్రా సామ్యాన్ని కూడా వదిలేసి పాదాలను పల్లవిగా మాటిమాటికీ ఉపయోగించాడు .భావాన్ని బట్టి పాదాలను సాగదీశాడు కూడా .. అంత్యప్రాసలలో కొత్త ప్రయోగాలు చేశాడు . ‘’తుతూరీ అంటే బాకా ,ఘూ బడ్-అంటే గుడ్లగూబ కవితలలో మొదటి మూడు పాదాలకు ఒక అంత్య ప్రాస ,చివరి మూడు పదాలకు వేరొక అంత్యప్రాస వాడాడు .స్వర సంబంధ అంత్య ప్రాసలకూ ఇంగ్లీష్ కవుల్లాగా ప్రాదాన్యమిచ్చాడు .గుడ్డిగా ఎవర్నీ అనుకరించలేదు .’’శబ్ద ప్రయోగ కవి’’ అన్నాడు కేశవ్ ను పట్వర్ధన్ .శబ్దాశ్రయ కవిత అనువాదానికి లొంగదు .

 విమర్శనాత్మక ధోరణి

హాస్యానికి విముఖుడు అయినా ఇతరుల హాస్యాన్ని  ఆస్వాదించే సహృదయత ఉంది   .’’లోకం మూర్ఖుల మయం –వారిని చూడకుండా ఉండాలంటే తలుపులు మూస్తే సరిపోదు –తాను  ముఖం చూసుకొనే అద్దాన్ని పగల గొట్టాలి ‘’అన్నాడు అని బోల్యోకవితను అనువదిం చాడు .కేశవ కు ము౦దు దాకా సామాన్యుడు కవితా వస్తువు కాలేదు .అది అతనితోనే మొదలైంది .అతని కవితలో నిగూఢ జిజ్ఞాస ,అనంతత్వం పై అభిమానం కనిపిస్తాయి .దేవీ దేవతల గురించి ప్రత్యేకంగా రాయకపోయినా, ఆధ్యాత్మిక జిజ్ఞాస అతని కవిత్వం లో అంతర్వాహినిగా ఉంటుంది .’’నూతన మానవతా వాదాన్ని’’ ఆవిష్కరించాడు .కనుకనే అతనికవిత శ్రేష్టం విశ్వ జనీనం అయింది .

   చుట్టూ క్రౌర్యం నిర్దాక్షిణ్యత ఉన్నా నిరాశ పడనికవి కేశవ.అతని సౌందర్య భావం స్థిరం, శాశ్వతం .ప్రేమతో మృత్యువును ,కరుణ తో క్రౌర్యాన్ని జయించ గలడు .కాళ్ళకింద పచ్చిక కప్పిన భూమిని ,నెత్తిమీద నీలాకాశాన్ని ప్రేమించటం తప్ప దేన్నీ కోరడు..’’ఛందశ్శిల్ప నూత్న ప్రయోగ కర్త’’ అతడే .మరాఠీ కవిత్వ శైలికి ,విషయం పట్ల చెలరేగిన విప్లవ భావాలకు అతడే’’ ఊట బుగ్గ ‘’అన్నది ప్రముఖ విశ్లేశషకురాలు కుసుమావతీ దేశ పాండే .

   నవ సైనికుడు కేశవ

 ‘’నవ్యయుగ నవ సైనికుడిని నేను –నన్నెవరూ ఆపలేరు –ఏజాతికీ  చెందిన వాడినీ కాను –విశ్వమంతా వ్యాపించిన పతితులలో నేనూ ఒకడిని –సర్వత్రానాసహోదరులే గృహ చిహ్నాలే –అందరూ నా వాళ్ళే –నేను వాళ్ళ వాడినే –విశ్వాన్ని దర్శించి ఆరాధించి నన్ను నేను  ఆరాధించు కొంటాను –కాలం శాంతి సామ్రాజ్య స్థాపన కోరుతుంది-దానికి అవతరించిన ప్రవక్తను నేను –నవ సైనికుణ్ణి నేను ‘’అని గొప్ప కవిత రాశాడు బహుశా మన అనుభూతికవి తిలక్ కు ఈకవిత ప్రేరణగా నిలిచిందేమో నని పిస్తుంది .

  ‘’మేమంతా ఈశ్వరుని ప్రేమపాత్రులం –ఈ భూమిని మాకు ఆడుకోవటానికిచ్చాడు ‘’మరోకవిత –‘’నాకొక బాకా తెచ్చివ్వు –ప్రాణవాయువుతో ఊది ఆకాశాన్ని బద్దలు చేస్తా ‘’ మరోటి –‘’పాతని చావనీ –భవిష్యత్తు పిలుపు విను – సంఘ శక్తి పునాదుల్ని –పూర్వాచారం చీలికలు చేసిపగుళ్ళు   రేపింది-నిస్వార్ధ ప్రేమతో దాన్ని నింపి నిర్మించాలి –వెనకాడ కండి –ధీరులు కష్టాల్లో ఉత్సాహం పొందుతారు –ధర్మం సుస్థిరం అన్న దాన్ని మూర్ఖులు విస్మరించారు .సమానత్వ పతాక ఎత్తండి ‘’అని గర్జించిన దేశభక్త వీరకవి కేశవ సుత్.

  ఆధారం –మొదటిఎపి సోడ్  లోనే చెప్పినట్లు –  ప్రభాకర్ మచ్వే మరాఠీ లో రాయగా ,శ్రీ ఎస్ .సదాశివ తెలుగులోకి అనువాదం చేస్తే ,కేంద్ర సాహిత్య అకాడెమి 1970 లో ముద్రించిన ‘’కేశవ సుత్..

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -26-11-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

క్లిష్ట పద ప్రయోగ హాస్యం

క్లిష్ట పద ప్రయోగ హాస్యం

 యమక ,అనుప్రాస లతో వాక్యానికి శబ్ద వైచిత్రి సాధింఛి హాస్యం పుట్టించవచ్చు .చేకానుప్రాస ,లాటాను ప్రాసలను  సంధించి ,హాస్యం రాబట్ట వచ్చు .’’మిష్టర్ కిష్టాయ్ కష్టపడి చదివి ,ఎష్టాగో అష్టా మేష్ట్రిక్లేషన్ ఫష్టున పాసై ,అష్టకష్టాలు పడి ,ఆగష్టులో జష్టుపక్షం రోజులుండే మాష్టరీ పని అతి కష్టం మీద సాధించి ,,పనిలో చేరి శిరో వేష్టనంధరించి  డష్టరు  చేత్తో పుచ్చుకొని ,దిష్టి బొమ్మలాగా తయారయ్యాడు’’ అని ఉదాహరించారు మాష్టారు మునిమాణిక్యం గారు .ఇందులో శబ్దాల గడ బిడ తప్ప వేరే ఏమీ ఉండదు .చాటుపద్యాల్లో ఇలాంటి హడా విడి చాలా ఉంది .ఒక ఉదాహరణ –  ‘’నీళ్ళకు నిర్రి తోళ్ళకును ,నేతికరెళ్ళకు దొడ్డ యుత్తరేరేన్-వ్రేళ్ళకు,దర్భ ముళ్ళ కును , వేదపు నోళ్లకు .,సన్న కుట్టు వి -స్తళ్ళకు రావి పేళ్ల కనిశంబును ,మళ్లకు పప్పు కూర పచ్చళ్ళకు ,రాగి బిళ్ళలకు సంతత మందుదురాంధ్ర వైదికుల్ ‘’.ఇందులో ఏముంది దేవటానికి అనుకొంటే ఏమీ ఉండదు. రచనలో చమత్కారం చూడటానికి ఆసక్తి ఉండాలి .అసలు అర్ధం చేసుకొనే కోరిక ముఖ్యంగా ఉండాలి .చంద్రుడిని చూసిసముద్రం ఉప్పొంగినట్లు ,వికృత దర్శనం తో రసవాహిని పొంగిపోరలెత్తెస్వభావం ఉండాలి అన్నారు అనుభవంతో మాష్టారు .ఇందులో యమకాదులు హాస్యానికి ఉపయోగపడ్డాయి శబ్దాశ్రయ హాస్యం లో ఇది ఒక అంతర్విశేషం అన్నారు మునిమాణిక్యం .అలాగే శ్రీనాధుని ‘’చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు –నాగులేటి నీళ్ళు నాపరాళ్ళు –సజ్జ జొన్న కూళ్ళు సర్పంబులును , తేళ్ళు –పల్లెనాటి సీమ పల్లెటూళ్ళు’’చాటువుకూడా .ఇందులో అక్షరా వృత్తి తీసేస్తే పేలవమై పోతుంది .శబ్దాల హడావిడే తప్ప సరుకు లేదు .చిన్న పిల్లల పాట ఒకటి ఇలాగే నడుస్తుంది –‘’అక్కల కర్ర ,ముక్కల పీటకూర్చో వదినా కూచో –వేప చెక్క వెల్లుల్లి గడ్డ పోక తమ్మి వేసుకో –కాకి బొచ్చు గచ్చర కాయ మెక్కి విందు తీర్చుకో –అల్లి తుట్ట మర్రి రొట్ట పైట వేసి కట్టుకో –ఉల్లి పూలు నువ్వు చేరుకొప్పునిండా పెట్టుకో –అత్తమాట కొత్తకుండ సవతి పోరు దిద్దుకో –ఆలగోలు బాలగోలు రవ్వ వదిన మాన్పుకో ‘’ .అర్ధం లేకుండా కూడా శబ్దాన్ని ఆవృతం చేయవచ్చు .ఉదాహరణ –నిరక్షర కుక్షీ గండ భేరుండ పక్షీ .శీతాంశు కులావతంస సీతమ్మ మొగుడా.ఆకర్నాంత విశాల నయనా –  వల్లభ రసాయనా ‘’వగైరా .

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -25-11-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మరాఠీ నవకవిత్వ మార్గ దర్శి –కేశవ సుత్-4

మరాఠీ నవకవిత్వ మార్గ దర్శి –కేశవ సుత్-4

      ప్రకృతి కవి కేశవ

కేశవ సుత్ కు ప్రకృతికి విషాద అనుబంధమేదో ఉంది .రమణీయ కొంకణ్ తీరాన్ని మాతృదేవి ఆరాధనతో తనివితీరా వర్ణించాడు కవితలలో .కాళిదాసు ఋతు సంహారాన్ని గుర్తు చేస్తూ ‘’పర్జన్యావ్రత్ ‘’దీర్ఘ కవిత రాశాడు .దివాళీ కవితలో శరత్ వర్ణన చేశాడు .పువ్వుల్ని సీతాకోక చిలకల్ని ప్రతీకలుగా వాడాడు .ప్రాచీన రుషిలాగా’’అరణ్యాలలో నిత్య యౌవనం లసిస్తుంది .మహోదాత్తత శాశ్వతంగా దొరుకుతుంది .దివ్యమైన సత్ ఎప్పుడూ పునరావృత్త మౌతుంది . దిగంతాల దూర తీరాలలో మనిషి స్వభావానుశీల రూపసౌన్దర్యం దర్శిస్తాడు ‘’అంటాడు .ప్రకృతిలో ఈ కవి ఉపశాంతి పొందాడు .’ఎన్నో సార్లు మనసు విరిగి –ఆశలుచచ్చిపోగా –వాటిని వెతుక్కుంటూ ఏకతార మీటుకొంటూ నిర్జ రారణ్యాలలోకి  వెళ్ళాలి’’.అతనికి ప్రకృతికి ఉపదేశకునిగా ,సహచరుడుగా అనిపిస్తుంది కానీ క్రూరంగా మాత్రం కాదు .’’’సుడిగాలిలో గిరగిరా తిరుగుతూ సచ్చిదానందంలో లయం కావాలని ఉంది ‘’అన్నాడు .వాగులు గుట్టలదగ్గర జీవితా దర్శం కనిపించి రమింప జేస్తుందని అంటాడు .నదీ తీరం లో అద్భుత తత్త్వం మహోదాత్తత దర్శిస్తాడు మబ్బు తునక నుంచి గతం లో లీనమై పరవశిస్తాడు ..

    సమకాలీన మరాఠీ కవులలో రెవరెండ్ తిలక్ ,కేశవ సుత పిల్లలకు ,పువ్వులకు చెందిన కవులు .బాలకవి ధోమ్రే ప్రకృతి ఒడిలో పాప . కేశవ తర్వాత కాల కవితలలో మనిషికి ప్రకృతికి మధ్య ఘర్షణ కనిపిస్తుంది .పువ్వు ధూళి అయినట్లు రవిబింబం –కరాళతరంగాలలో లయించి ‘’నట్లు కనిపించింది .దైవం పై విశ్వాసం ఉన్నవాడు కాదు కేశవ .కాని మిత్రుడు కిరాత్ తో ‘’ఎదో వింత మధురనాదం నాలో నాకు వినబడుతోంది ‘’అన్నాడు .ప్రకృతి పరమాత్మ అయితే ,అంతా ప్రేమ మయమే అయితే ప్రపంచం లో ఇంతదుఖం ఎందుకు ?అని ప్రశ్నించాడు .’’ఈ దృశ్యమానమైనది అంతా  స్వప్నం లో స్వప్న దర్శనం ‘’అన్నాడు .

   కేశవ ప్రేమ

‘’మరాఠీ ప్రణయ కవిత్వానికి కేశవ వైతాళికుడు ,.అతనికవితలలో ఆంగ్లకవితా చాయలున్నా ,కాళిదాస భవభూతుల కవితలలతో తనకవిత్వాన్ని అను సంధించాడు .మధ్యయుగ కవిత్వాలలో సామాజిక జీవిత స్ప్రుహలేదు .పవిత్రప్రేమ సహజ ప్రేమ ,ప్రేమ వివాహాల ప్రసక్తి కనిపించదు .వ్యక్తి స్వాతంత్ర్యం స్థాపింప బడ్డాక సామాజిక బంధాలు సడలి అలాంటి కవితా భావాలకు కేశవ సుత వాణి ఉషస్సూక్తం  ‘’..అని అనిల్ దేశ పాండే (అనిల్ )వ్యాఖ్యానించాడు .సాంప్రదాయ పద్ధతికి భిన్నంగా భార్యా భర్తల ప్రణయాన్ని ‘’ప్రియే చే ధ్యాన్ ‘’కవితలో రాశాడు కేశవ .ప్రేయసి ప్రియులు ప్రణయ బంధం లో  బంధింపబడినాం’’అంటాడు మరోకవితలో .ప్లెటానిక్ ప్రేమ ను అభిమానించాడు .’’ప్రేమను నిన్నూ తప్ప వేరే ఏదీ ఆలోచించను ‘’అన్నాడు ఇంకో కవితలో.బాడ్లియర్ కవితలాగా ఇతని ప్రణయ కవిత కాల్పనిక లోకం లో విహరిస్తుంది .కేశవది’’నవ్య మర్మ కవిత ‘’అని కితాబిచ్చాడు దేశపాండే . ‘’జీవితపు లోతులు పరిశీలించి ,జీవితానుభవాలను ప్రయోగాత్మకం గా పరిశోధించిన తాత్విక కవి ‘’అన్నాడు ఎస్.జె.భగత్ .ప్రేమలోని వివిధ అవస్తలు వర్ణించాడు.కేశవకు పూర్వం ఉన్న మరాఠీ కవిత ‘’లావణి’’ అనే శృంగార ప్రధానమైనది.కేశవ కవిత్వం లో ప్రణయం దివ్య ప్రణయం గా పరి వర్తనం చెందింది .దానిలోని ఇంద్రచాప వర్ణాలు సన్నని విషాద రేఖనుండి వెలువడ్డాయి .’’ప్రేమదివ్యం అలౌకికం .ప్రేమ బీజం హృదయం లో మొలకెత్తి పుష్పిస్తుంది .అది బజారులో దొరికేదికాదు .ఇంకోదాని బదులుగా దొరికేదికాదు ప్రేమ .ప్రేమ వలన ప్రేమ లభిస్తుంది ‘’అంటాడు .ఇది కబీర్ దోహా వంటిదే .అచ్చంగా మన కృష్ణ శాస్త్రిగారూ ఇలానే అన్నారు . ‘’ముండ్ల పొదలు  నరికి .క్రూరమృగాలను చంపి ఆమెకోసం కోట నిర్మిస్తా .ఆమె సుఖం కోసం నా ప్రాణాలు ఇస్తా .వనలతలలలాగా ఒకరినొకరం అల్లుకుపోతాం .నరకాన్ని స్వర్గం గా మారుస్తాం ‘’అన్నాడు కవిత్వం లో .అతడిది ఆదర్శ ప్రేమ .జెన్ని లేహంట్ కవితా వస్తువు లన్నీ  కేశవ కవితలో దొరుకుతాయి .

  కేశవ ప్రణయకవిత కరుణామయం .చెదిరిన కలలసమాహారం .విరహ వేదన ఉన్నా ,ఎడ్గార్ అలన్ పో ఛాయలున్నా కవిత వేదనా భరితం .’’నన్ను దుఖం తో పొంగి పోరలనీ – అది నా విషాద హృదయం పై బరువు .నాగాయాలను కెలకక నన్ను వదిలి వెళ్ళు ‘’అంటాడు దేవులపల్లి లాగా ‘’ఏను అనంత శోక భీకర లోకైక తిమిరపతిని ‘’అన్నట్లుగా .13-11-1893న రాసిన కవిత లో షాజహాన్ నిర్మించిన మయూర సింహాసనం ,తాజమహల్ ల గురించి చెబుతూ ‘’మయూరాసనం ఖర్చు ఆరుకోట్లు .రాజులు దానిముందు నిలబడి చేతులు జోడించి ,తమతలలు ఆయన గుప్పిటలో ఉన్నట్లు గిలగిల లాడేవారు .గంభీర యమునా తీరం లో ప్రియురాలికోసం మూడు కోట్లు ఖర్చు చేసి ‘’ప్రేమమందిరం’’ కట్టించాడు .దొంగలు సింహాసనం ఎత్తుకుపోతే ,ఆ తాజసుందరి జ్ఞాపకాలలో నిలిచి ఉంది .మనిషీ నీ పనుల పర్యవసానం ఇదే .స్వార్ధ ప్రకృతికి ఎంత ధూపం వేసినా పొగ ప్రపంచం నుంచి మాయమౌతుంది .ప్రేమకోసం చిన్న అగరు బత్తి వెలిగిస్తే దాని సువాసన విశ్వమంతా వ్యాపిస్తుంది ‘’.సుకుమార శైలితో ,సున్నిత కవిత్వం తో మరాఠీ ఆధునిక ఉత్తమ ప్రణయ కవిత్వాన్ని రాసిన యుగ కర్త కేశవ సుత్.

  సమాజ వ్యవస్థ పై తిరుగుబాటు

‘’నవ సిపాయి ‘’,తుతారీ ,స్పూర్తి ‘’అనే మూడు కవితలు మించి రాయకపోయినా కేశవ ఆమరుడు అయి ఉండేవాడు ‘’అన్నది శ్రీమతి చారు శీల గుప్తే .ఈ మూడూ అంతకు పూర్వం లేని విప్లవభావ కవితలే .దురాచారాలను తూర్పారబట్టి మానవతా వాదానికి కేతనమైన కవితలే .ఇతడి దేశభక్తి కవితలన్నీ 1890కి ముందే రాసినవి .వీటిలో రాజకీయ ప్రసక్తి లేదు .గతాన్ని తవ్వి బుజాలు ఎగరేయకుండా వర్తమానంలోని అసమానతలు దృష్టికి తెచ్చాడు కేశవ .అతడు విప్లవవాదికాడు.’’ఉత్క్రాంత వాది’’.కాలం కంటే ముందు ఆలోచించిన వాడు .ప్రగతి పధగామి .నిర్దేశకుడు కాదు .సర్వమానవ సమానత్వం సౌభ్రాతృత్వం ,స్వాతంత్ర్యం కోరినవాడు కాని రాజకీయ వాది కాదు..

  పిల్లల చిత్తాన్ని ఆకర్షించకుండా బెత్తాలతో భయపెట్టే క్రూర చండామార్క గురువులపై –‘’కటిక వాడి వృత్తిని ఎందుకు తీసుకోన్నావ్ ?పసివాడిని అంత  రాక్షసంగా హింసించే హక్కు నీకెవరిచ్చారు “”అని గద్దించాడు ఒక కవిత లో .భారత దేశ పరిస్థితులను అవగాహన చేసుకొని ‘’ఏకా భారతీయాచే ఉద్గార్ –ఒక భారతీయుని మాట ‘’అనే కవితలో ‘’సూర్యుడు ఉదయించి చాలా పైకి ప్రాకినా-మా భాగ్య సూర్యుడు పైకి ప్రాకే దెప్పుడు ?క్షీణత కారు చీకటై కమ్మేసింది –పరతంత్రులమైనమాకు చూడటానికి కళ్లు వినటానికి చెవులు లేనే  లేవు ‘’అన్నాడు ..ఈదాస్యం ఎప్పుడు తొలగుతుంది పంజరం నుంచి ఎప్పుడు బయటపడతాం-మా జాతికి పూర్వ వైభవం ఎప్పుడు ?”’అని బాధ పడ్డాడు .పాశ్చాత్య భావాలను నిరసిస్తూ’’ఏక్ ఖేడే’’కవితలో ‘’ఇవి చిన్న గుడిసేలే కానీ –సుందర సౌధాలు కావు –అక్కడ రోగాలు కాపురం ఉంటాయి –ఇక్కడ ఉండవు –రోగం సుకుమారమైనది –అది పరుపులపై పడుకొంటుంది –పూరి గుడిసెలో ముతక గొంగళిపై ఎలా పడుకొంటుంది ?-ఈ గుడిసెలలో మంచి కృషీ వళురు నివశిస్తారు ‘. కీర్తి అంటే ప్రజల తలలపై తురాయిగా చేరిన పక్షి ఈక –పక్షి తూటా దెబ్బతగిలి పడిపోతెనేగా , ఈక లభించేది ?’’అన్నాడు .గాంధీ గారి ‘’పల్లెలకు తరలండి ‘’నినాదానికి కేశవ కవిత మార్గ దర్శి .టాగూర్ కూడా ‘’మాతిర్ డాక్’’లో ఇదేభావం చెప్పాడు .’’నేను ఈ ప్రపంచ కోలాహాలాన్ని వదిలేసి ప్రశాంత పల్లెటూరికి వెడతాను ‘’అన్న హాలీ  కవిత కూడా ఇలాంటిదే. దీనినే ‘’కాల్పనిక పలాయన వాదం ‘’అంటారు .’’ప్రతి పలాయనం ఒక పరి పూర్ణతే ‘’అన్నాడు ఆల్డస్ హక్స్లీ ‘’ఎండ్స్ అండ్ మీన్స్ ‘’లో .

  స్త్రీ విద్యా ప్రోత్సాహం, బాల్య వివాహాల పై నిరసన ,విధవల కేశఖండనపై ఆక్షేపణా ,అస్పృశ్యతా నిరసన  లను కేశవ తనకవితలలో సూటిగా ప్రస్తావించాడు.ఇతడు సృష్టించిన కార్మికుడు ‘’ఎర్ర కామ్రేడ్ ‘’కాదు .అప్పటికి ఇండియన్స్ కు కారల్ మార్క్స్ ఎవరో తెలీదు .అన్ని రంగాలలో దేశం అభివృద్ధి చెందాలనే కేశవ తపన ,ఆ కాంక్ష .  

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25-11-21-ఉయ్యూరు  

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్లిష్ట పద ప్రయోగ హాస్యం

శ్లిష్ట పద ప్రయోగ హాస్యం

పదాలను శ్లేషించి విశేషార్ధం   సృష్టించటం మనకావ్యాలలో పుష్కలం .శ్లిష్టపద ప్రయోగం వలన హాస్యం పుట్టించటం చాలా అరుదే .దీనినే ఇంగ్లీష్ లో ‘’పన్’’అంటారు .ఉదాహరణ –ఒకాయన చాలా అప్పులు చేసి చచ్చాడు .అప్పులవాళ్ళు వచ్చి తమకు రావల్సిన ఆస్తి  వశం చేసుకొని అతని భార్య పిల్లలమీద కొంత దయ చూపి కొంత ఆస్తి వదిలేశారు .ఇంతలో ఆ చనిపోయిన ఆయన స్నేహితుడు వచ్చి ‘’మా వాడు చనిపోయాడు కనక బతికి పోయాడు .బతికి ఉంటె అన్యాయంగా చచ్చేవాడు ‘’అన్నాడు .ఇక్కడ చావటం బతకటం ఒకచోట ఒక అర్ధం లో మరో చోట వేరే అర్ధం లో వాడబడి హాస్యాన్ని చిందించిందని మునిమాణిక్యంమాస్టారు ఉవాచ .

హాస్య బ్రహ్మ’’ భకారా’’ అంటే భమిడి పాటి కామేశ్వరరావు గారు ఒకసారి ‘’మనకవులు బతికి ఉన్నన్నాళ్ళు చచ్చినట్లుండి,చచ్చాక బతకడం మొదలు పెడతారేమో ‘’అన్నారని మాస్టారన్నారు.పూర్వ కవుల  సంభాషణలో ఎంత హాస్యం దొర్లిందో  మనకు దాఖలాలు లేవన్నారు .ఆ సంపద గాలికి కొట్టుకు పోయిందనీ ,కాలం మింగేసింది ,చాటువులలో కొద్దిగా మిగిలింది అనీ  బాధపడ్డారు మునిమాణిక్యం.శ్రీనాధుడు పల్నాడులో తిరుగుతూ నీటి ఇబ్బంది చూసి శివుడిని ప్రార్ధిస్తూ ‘’సిరిగలవానికి చెల్లును –తరుణుల పది యారు వేల దగ పెండ్లాడన్ –తిరిపెమున కిద్దరాండ్రా పరమేశా గంగ విడువు పార్వతి చాలున్ ‘’అని చెప్పిన చాటువు లోకం లో బాగా క్లిక్ అయింది .ఇక్కడ గంగ శబ్దం శ్లేషించబడి చమత్కారమై హాస్యంపుట్టింది .

 సిడ్నీ స్మిత్ అనే ఆంగ్లేయుడు వీధిలో నడుస్తుంటే ఎదురెదురు ఇళ్ళల్లోని ఆడవాళ్ళు పోట్లాడుకోవటం ,ఇద్దరి మధ్య రోడ్డు ఉండటం చూసి  ‘’It is impossible for those women to agree since they are arguing  from different premises ‘’అన్నాడు ఇక్కడ ప్రిమిసేస్ అనే మాట శ్లేష పొంది౦ది .ఒక అర్ధం ఆవరణ అయితే మరో అర్ధం తర్క శాస్త్రం లో వాదనకు ప్రాతిపదిక అని అర్ధం అని మాస్టారు విశ్లేషించి చెప్పారు . ఇలాంటిదే తెలుగులో ఒక సంగతి ఉంది .ఒక పెద్దాయన అన్ని విషయాలు పకడ్బందీ గా చూసుకొని చనిపోయాడు .స్మశానానికి తీసుకు వెళ్ళటానికి శవ వాహకులు దొరకలేదు .అక్కడే ఉన్నాయన మిత్రుడు ‘’మా వాడు బతికి ఉన్నప్పుడూ నిర్వాహకుడే ,చనిపోయినా నిర్వాహకుడే అయ్యాడు ‘’అన్నాడు ఇందులో శబ్ద చమత్కారం ఉత్తమహాస్యం కాకపోయినా ,హాస్యపు పలుకు బడే అని పిస్తుంది .

  శ్లిష్టా సీతారామ శాస్త్రి గారు గుంటూరు మిషన్ కాలేజిలో పని చేసేవారు .ఒక రోజు ప్రిన్సిపాల్ ఆయన్ను పిలిపించి ‘’మీకు ఎన్నేళ్ళు ‘’అని అడిగితె ‘’తిమ్మిదేళ్ళు’’అన్నారు అంటే 63 అని ఆయన అభిప్రాయం .శివ శంకర శాస్త్రి గారు ఒకసారి బందర్లో ఉన్న మునిమాణిక్యం గారింటికి  వచ్చి దొడ్లో అరటి చెట్ల దగ్గర ఆడుకొంటున్న వారబ్బాయిని ‘’ఏం చేస్తున్నావురా ?’’అని అడిగితె ,వాడు ఆడుకొంటున్నాను అని చెబితే శాస్త్రిగారు ‘’రంభతో క్రీడిస్తున్నావురా ‘’అన్నారట రంభ అంటే అరటి చెట్టు అనే అర్ధంకూడా ఉంది .రంభ ,క్రీడించటం రెండు పదాలు శ్లేష పదాలు .

 ఒకసారి రావూరు వెంకట సత్యనారాయణ రావు గారు ఎవరినో ‘’చంద్రమతి ,సుమతి ఉన్నారా ?’’అని అడిగితె ‘’ఆడవాలళ్ళా అండీ ‘’అని అడిగితె రావూరు ‘’ఆడవాళ్లకు కాక మగాళ్ళకు’’ మతి’’ఎక్కడు౦దయ్యా ?’’అన్నారు ఇదో రకం శ్లేష అన్నారు మాస్టారు .ఈ శాబ్దిక హాస్యం అత్యున్నత హాస్య౦ కిందకు  రాదు అని కొందరు అంటారు .ఒక ఇంగ్లీష్ గ్రంధ కర్త ‘’It cannot be denied that an adroit play upon words rarely fails to make the reader smile .But punning pure and simple cannot reach a high standard of humour and should be indulged in with great discretion and very sparingly ‘’ అన్నాడని మునిమాణిక్యం మాస్టారు చెప్పారు.

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-11-21-ఉయ్యూరు  

Posted in రచనలు | Tagged | Leave a comment

మరాఠీ నవకవిత్వ మార్గ దర్శి –కేశవ సుత్-3

మరాఠీ నవకవిత్వ మార్గ దర్శి –కేశవ సుత్-3

పేదరికం వలన మెట్రిక్ తర్వాత చదవలేక పోయిన కేశవ సుత్ 1890లో ఉద్యోగం కోసం బొంబాయ్ వెళ్లి ఎవరినీ అర్ధించకుండా ఒక మిషన్ స్కూల్ లో టీచర్ గా చేరాడు.జ్ఞానోదయ పత్రికలోనూ పని చేశాడు .తర్వాత దాదర్ న్యు ఇంగ్లీష్ స్కూల్ టీచర్ గా నియుక్తుడై ,ట్యూషన్లు కూడా చెప్పాడు .ఇంత చేసినా  నెల రాబడి 25రూపాయలే .ఇష్టం లేకపోయినా బొంబాయి లోనే స్థిరపడాలని 1893లో నిశ్చయం చేసుకొని ఉండిపోయాడు .’’ఆత్మావలోకన్ ‘’అనేస్వీయ చరిత్ర కవిత లో  కుటుంబ కలహాలు తెలియజేశాడు 1819 లో కళ్యాణ్ లో ఇంగ్లీష్ స్కూల్ టీచర్ గా చేశాడు .కొద్దికాలం కమిష రేట్ లో గుమాస్తా గా ఉన్నాడు .తనకు ఇష్టం లేకపోయినా కరాచీకి బదిలీ చేస్తే రిజైన్ చేశాడు .మోర్స్ కోడ్ ను అధ్యయనం చేశాడు. 1893లో సావంతవాడి లో టీచర్ చేశాడు .

  బొంబాయి లో ఉండగానే కాశీనాథ రఘునాధ మిశ్ర ,జనార్దన ఢోండో.భా౦గలే బాలకృష్ణ కాలేల్కర్ అనే యువ రచయితలూ సంపాదకులతో పరిచయం పొందాడు .1895లో స్థాపింపిబడిన మనో రంజన్ మాసపత్రికలో కవితలు రాశాడు .భా౦గలే ఆపత్రికలో బంకిం చంద్ర చటర్జీ బెంగాలీ నవలలను , గుజరాతీ నవలను అనువాదం చేశాడు .బంకిం రాసిన’’ ఆనంద మఠం’’నవల 1894లో ‘’ఆన౦దాశ్రమం ‘’పేరుతొ మరాఠీ లోకి అనువాదం చెందింది .మన జాతీయ గీతం ‘’వందేమాతరం ‘’ఈ నవలలోనిదే .కేశవకు డా కాశీ నాథ హరిమోదక్ ,కిరాత్ ,గజానన్ భాస్కర వైద్య కవులతోనూ పరిచయం కలిగింది .వైద్య సోదరుడు కేశవ సుత ఊహా చిత్రాన్ని పెన్సిల్ తో గీశాడు .ఆర్య సమాజ,క్రైస్తవ సమాజ సమావేశాలకు వెళ్లి ఆసక్తిగా వినేవాడు కేశవ .1896లో బొంబాయి లో ప్లేగు వ్యాధి విపరీతం గా వ్యాపించటం తో ఖాందేశ్ లోని భాద్గాం కు వెళ్ళాడు .భార్యా పిల్లల్ని మామగారింట చాలీస్ గావ్ లో ఉంచాడు .మామగారి సలహాతో ఖాండ్ గావ్ లో నెలకు 15 రూపాయల జీతం తో టీచర్ గా చేరాడు .1897నుంచి 1904వరకు అక్కడే ఉంటూ ,1998లో ట్రెయినింగ్ స్కూల్ లో చేరి పాసై ,1901లో ఫైజ్ పూర్ హిందూ హైస్కూల్ హెడ్మాస్టర్ అయ్యాడు కేశవ .ఇంగ్లీష్ బోధించేవాడు .దురదృష్టం వలన అక్కడా ప్లేగు వ్యాపించగా ,మేనేజిమెంట్ తో పడక బదిలీ కోరగా1904 న దార్వార్ హైస్కూల్ కు మరాఠీ టీచర్ గా  ట్రాన్స్ ఫర్ అయ్యాడు

 ఖాందేశ్ లో కవితా ప్రచురణ లక్ష్యంగా ‘’కావ్య రత్నావళి ‘’అనే పత్రిక ఉంటె దానికి తనకవితలు పంపేవాడు కేశవ .దాని సంపాదకుడుకవితాభిరుచిఉన్న  నరసింహ ఫడ్న వీస్  ‘’మా పత్రిక గర్వించదగ్గ పంచ రత్నకవులలో కేశవ సుత ఒకడు ‘’హరప్ ళేతీ, శ్రేయ ‘’అనే అతనికవితనుచివరి సారిగా మా పత్రికలో ప్రచురించాం .స్వతంత్ర భావాలతో భావౌన్నత్యం ఉత్క్రుష్టత తో అందర్నీ ఆకర్షించాడు .అతని చిత్తవృత్తి ఆచరణ సాధ్యం కానిది .మానసిక స్థితి ఆస్థిరం .సిగ్గు ఎక్కువ ఎప్పుడూ కలిసి మేము అతనితో మాట్లాడలేక పోయాం ‘’అని 1905చివరి ‘’కావ్యావళి’’ లో రాశాడు .

 కేశవ బాంబేలో ఉండగా పరిచయమైన మహారాష్ట్ర బైరన్ కవి గా ప్రసిద్ధుడైన  వినాయక జనార్దన్ కాన్దీకర్ కవి కేశవ లాగానే సామాజిక హింస ,రాజకీయ దాస్యం లను వ్యతిరేకించాడు .జీవిత చరమాంకం లో కేశవ కొంత సుఖం అనుభవిస్తూ ,ప్రకృతి శోభను ఆస్వాదిస్తూ ,కవిత్వ తత్వ సమాలోచనచేస్తూ ,ఉద్గ్రంథ పఠనం చేస్తూ గడిపాడు .1904 ఏప్రిల్ నుంచి 18నెలలు దార్వార్ లో గడిపాడు .తనమరణం గురించి ముందే గ్రహించాడేమో 25-5-1905’’చిపులన్ ‘’అనే చివరికవిత గురించి ఒక స్నేహితుడికి జాబు రాస్తూ ‘’మనోరంజన్ లో వచ్చిన నా కవిత చదివే ఉంటావు .నా హృదయస్థితి ఎలా ఉందొ ఊహించే ఉంటావ్ .నా గుండె తాపం తో బీటలు వారింది .శాంతికి ఏది మార్గం ?’’అని మనసులోని బాధను చెప్పుకొన్నాడు.

  నిజంగానే మార్గం లేకుండా పోయింది అక్టోబర్ చివర్లో హుబ్లీలో ఉంటున్న తన దూరపు పినతండ్రి ‘’హరి సదాశివ దామ్లె ‘’ను చూడటానికి భార్య కూతురులతో వెళ్ళాడు .నాలుగు రోజుల్లో తిరిగి వెడదామనుకొన్నాడు .నవంబర్ 7 న ప్లేగువ్యాదిసోకి చనిపోయాడు .ఎనిమిది రోజులతర్వాత భార్యకూడా మరణించింది .అంత్యక్రియలు పినతండ్రే చేశాడు .ముగ్గురు కూతుళ్ళను అయనే కొంకణ్ కు పంపాడు .అందులో ఒకామె కొద్దిరోజుల్లోనేచనిపోయింది .చివరి ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి కానీ వారి వివరాలు తెలియలేదు .

  39ఏళ్ళ విషాద జీవితాన్ని గడిపినవాడు కవి కేశవ సుత్.ఆయనకవితలలోనే ఆయన జీవితం తెలుసుకోవాలి .వార్షిక కవి సమ్మేళనాలు గురించి కేశవ ఒక మిత్రునికి ఉత్తరం రాస్తూ –‘’భావ సాదృశ్యం గలకవులు కలిసి కవితలు రాసి వినిపిస్తే బాగు౦టు౦దికానీ ,మందగాచేరితే రసాభాస అవుతుంది’’అని రాశాడు .మరో మిత్రుడికి ‘’ఒక శతాబ్దకాలం గా మరాఠీలో కావ్యం రాలేదు .మీ స్నేహితుడికి  చిన్న చిన్నకవితలను వదిలి కావ్య రచనచేయమని చెప్పు.నేను వామనుడిని .త్రివిక్రముడు అయ్యే లక్షణాలు నాలో లేవు .అందుకే నామీద నాకే అసహ్యం .చిల్లర కవిత్వ కవులను అభినందించలేను  ‘’అని రాశాడు .ఈ ఉత్తరాలన్నీ కేశవ ఇంగ్లీష్ లో రాసినవే .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -24-11-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మరాఠీ నవకవిత్వ మార్గ దర్శి –కేశవ సుత్-2

మరాఠీ నవకవిత్వ మార్గ దర్శి –కేశవ సుత్-2

కేశవ సుత్ మొదటినుంచి బలహీనుడు ,ఎప్పుడూ సణుగుతూ ఉండేవాడు .ఒంటరిగా వాహ్యాళికి వెళ్ళేవాడు .ముఖం ఆలోచనా గభీరం ,చూపు ఎప్పుడూ కిందకే ఉండేది .తీక్ష్ణమైన కను చూపులు .ఎత్తు5అడుగులు  గుండ్రని ముఖం పై ముడుతలు .’’ముఖం ఖిన్నంగా ఉంటేనేం దివ్య ప్రభతో అతడు చేసే గానం ప్రపంచ ప్రజలకు ఆనందం కల్గించేది .వాడిన ముఖం నుంచి సుందర భవిష్యత్తు శాశ్వతానందం కలిగించే అమృత కవిత్వం వెలువడేది ‘’అని తనకవిత ‘’దుర్ముఖ్ ఖేలా ‘’(ఖిన్న వదనుడు )లో ఆయనే చెప్పుకొన్నాడు .అందుకే 1886లో ఆయన తమ్ముడైన ఫిలాసఫీ ప్రొఫెసర్ ఇంట్లో కుటుంబం అంతా సమావేశమైనా కేశవ  ఫోటో తీయి౦చుకోలేదు .

  ప్రాధమిక విద్యలో ఉపాధ్యాయుల హింసను భరించ లేకపోయాడు .1882లో బరోడా లో ఉన్న అన్న శ్రీధర్ ఇంటికి వెళ్ళాడు .ఎనిమిది నెలలకే  అతడు చనిపోగా ,వార్ధాలో ప్లీడర్ గా ఉన్న మేనమామ శ్రీరామ చంద్ర గణేష్ కరందీకర్ ఇంట్లో చదువు కొనసాగించాడు . ‘’కృష్ణాజీ’’ అంటే కేశవ సుత్ తమ్ముడు  మోరోపంత్ తో కలిసి నాగపూర్ వెళ్ళారు.వీరిని చదివించే ఆర్ధిక స్థితి తలిదండ్రులకు లేదు .అక్కడి వేడికి అతని దుర్బల శరీరం తట్టుకోలేక పోయింది కానీ అక్కడే సుప్రసిద్ధ మహారాష్ట్ర కవి రెవరెండ్ నారాయణన్ వామన్ తిలక్ ,ప్రొఫెసర్ పట్వర్ధన్ తో స్నేహం కలిగింది .తిలక్ పరిచయం వలన కృష్ణాజీ కి కవిత్వం పై అభిరుచికలిగింది .తిలక్ ‘’మేము మంచి మిత్రులం .కేశవ లో కవితావిర్భావం గమనించాను .1883లో నాగపూర్ ,,88,89 లలోపూనాలో ,95,96 లలో బొంబాయ్ లో కలుసుకొన్నాం .’’అని రాశాడు .పూనాలో న్యు ఇంగ్లీష్ స్కూల్ లో మెట్రిక్  చదువుతున్నప్పుడు తిలక్ ను కలిశాడు .అప్పుడే క్రైస్తవ పత్రిక ‘’జ్ఞానోదయా ‘’సంపాదక వర్గం లో తిలక్ చేరాడు .తిలక్ దీనికి కవితలు పంపేవాడు .10-2-1895లో తిలక్ క్రైస్తవం లో చేరాడు .బైబిల్ పై ఆసక్తి ఉన్న కేశవ కూడా అందులో చేరుతాడేమో అని బంధువులు భయపడేవారు .చేరతానని తమ్ముడు సీతారాం కు చెప్పాడు కూడా .తిలక్ కవిత్వం ప్రసాద గుణం కలిగిఉంటే కేశవుని కవిత్వం ఓజో గుణభరితం .తిలక్ చనిపోయాక రెండు కవితలురాసి 1906జనవరి లో కావ్య రత్నావళి ,ఫిబ్రవరిలో మనోరంజన్ పత్రికలో ప్రచురించాడు కేశవ .

  నాగపూర్ లో ఉండగా సంఘ సంస్కర్త శ్రీ వాసుదేవ బలవంత్ పట్వర్ధన్ తో కేశవ కు పరిచయం కలిగి ,1888లో ఆయనపై ఒక దీర్ఘకవిత రాశాడు .ఇద్దరికీ అభ్యుదయ భావాలున్నాయి .డెక్కన్ వర్నాక్యులర్ సొసైటీ కి పట్వర్ధన్ శాశ్వత సభ్యుడు .అగార్కర్ తర్వాత ఆయనే ‘’సుధాకర్ ‘’పత్రికా సంపాదకుడయ్యాడు .పట్వర్ధన్ పై కేశవ కవిత –‘’విశ్వాన్తరాళలోని చుక్కలతో కవి ఆత్మలను దర్శిస్తాడు .ప్రజలుఅద్దం లో చూస్తె ,కవి బండలద్వారాకూడా చూస్తాడు’’ఈ కవితపై అమెరికన్ కవి తాత్వికుడు ఎమెర్సన్ ప్రభావం ఉంది అంటారు .

  1883లో స్వగ్రామం ఖేడ్ లో కొంతకాలం ఉండి,పై చదువులకు పూనా వెళ్లి 11-6-1884న న్యు ఇంగ్లిష్ స్కూల్ లో చేరి ,1889లో మెట్రిక్ ను 23వఏట పాసయ్యాడు కేశవ ..ఆస్కూల్ లోప్రముఖ మరాఠీ నవలారచయిత ,పత్రికా సంపాదకుడు  హరినారాయణ ఆప్టే తో పరిచయం కలిగింది కవి ,అనువాదకుడు .గోవింద వాసుదేవ కణిట్కర్  తో నూ స్నేహం కలిసింది  .ఇతనిభార్య గొప్ప విదుషీ మణి.ఆంగ్లకవి స్కాట్ శైలిలో యితడు రాసిన ‘’అక్బర్ ‘’,కృష్ణకుమారి ‘’వంటి చారిత్రకకవితలను జస్టిస్ ఎం. జి .రానడే బాగా మెచ్చాడు .మెసర్స్ హైమ్స్,ఎలిజబెత్ బార్రెల్ బ్రౌనింగ్ ,తోరు దత్  కవితలంటే కనిట్కర్ కు ప్రాణం .థామస్ మూర్ ,థామస్ హుడ్,బైరన్ ,బర్న్స్,కీట్స్ లిరిక్కులను అతడు అనువాదం చేశాడు .కేశవ ,ఆప్టే లు మనోరంజన్ ,ఆణీ,నిబంధ చంద్రికా పత్రికలకు తమకవితలు రాసేవారు .1880-90లో కేశవ 13కవితలు ఆమాసపత్రికలో ప్రచురించాడు .

  కేశవ కవితా సరస్వతి ఆంగ్లకవితాధ్యయనం తో ప్రభావితమైంది .సాల్ గ్రేవ్, మైకే ,మాక్మిలన్ కవితలను బాగా చదివాడు .ఉత్తరాలలొఎమర్సన్ గురించి చాలాసార్లు ప్రస్తావించాడు .తోరు దత్ కవిత ‘’ఎ షీఫ్ గ్లీన్డ్ ఇన్ ఫ్రెంచ్ ఫీల్డ్స్ ‘’కూడా చదివాడు .షేక్పియర్ ,డ్రామండ్,గేథే,అల్లాన్ పో ,లాంగ్ ఫెలో కవితల్ని అనువాదం చేయటమేకాక స్వయంగా కొన్ని ఇంగ్లీష్ పోయెమ్స్ రాసే ప్రయత్నం చేశాడు .’’పాంచ్ –కవి ‘’అనే గ్రంధం లో ప్రొఫెసర్ ఎం వి రాజాధ్యక్ష  సంస్కృత వాగ్మయాన్ని కేశవ ఔపోసన పట్టాడని రాశాడు .న్యు ఇంగ్లిష్ స్కూల్ లో అగార్కర ,లోకమాన్య బాల గంగాధర తిలక్ అధ్యాపకులుగా ఉన్నా ,కేశవ కు వారి బోధనపై అభిరుచి ఆసక్తి కలగలేదు .అగార్కర్ సంఘ సంస్కరణకు ప్రభావితుడయ్యాడు .క్లాస్ లో కూర్చునితిలక్ మొదలైన వారిపై కార్టూన్లు వేస్తూ ఉండేవాడు .మహా వక్తలు అంటే మహా ఇష్టం .పూనా ఆందోళన కాలం లో చిఫ్లూమ్కర్ ‘’తన నిబంధమాల లో ‘’ఇంగ్లీష్ నేర్వటం ఆడ సింహం పాలు తాగటం లాంటిదే ‘’ అని 1880నుంచి వ్యాఖ్యానిస్తూ ఉండేవాడు .సుధాకర్ పత్రికలో అగార్కర్ సంఘ  సంస్కరణ లపై  రాసేవాడు. కిర్లోస్కర్,భావే లు మహారాష్ట్ర రంగస్థలాన్ని ప్రభావితం చేస్తుంటే కేసరి పత్రికలో తిలక్ గర్జిన్చేవాడు .ఆప్టే మరాఠీ నవలకు శ్రీకారం చుట్టి దున్నేస్తున్నాడు .మనవాడు సిగ్గులమొగ్గల బుట్ట కనుక దేనిలోనూ కలిపించుకో కుండా షెల్లీ లాగే  కవిత్వానికే పరిమితమై ‘’drive my dead thoughts over the universe –like withered leaves to quicken a newbirth ‘’అనే షెల్లీ కవిత ‘’ఓడ్ టు వెస్ట్ విండ్ ‘’కవితా భావంలా  ఆకాంక్షించాడు .

  కేశవ తమ్ముడు మోరో కేశవ దామ్లే బాంబే యూని వర్సిటి నుంచి ఫిలాసఫీ హిస్టరీ డిగ్రీ పొంది ,ఉజ్జైన్ మాధవ కాలేజిలో ఫిలాసఫీ ప్రొఫెసర్ గా 1894నుంచి 1907వరకు పనిచేశాడు .1908లో ఆకాలేజి మూతపడితే ,నాగపూర్ సిటి హైస్కూల్ లో టీచర్ గా చేరి 1913లో రైలు ప్రమాదం లో చనిపోయాడు .ఇతడు 900 పేజీల మరాఠీ వ్యాకరణాన్నిరాసిన వ్యాకరణ ఉద్దండ పండితుడు .బర్క్ ఉపన్యాసాలను అనువదించాడు .తర్కానికి అద్భుత ప్రారంభ గ్రంధం రాశాడు .మరో తమ్ముడు సీతారాం కేశవ్ దామ్లె పత్రికా రచయితా ,నవలాకారుడు ,దేశభక్తుడు .జ్ఞానప్రకాష్ ,రాష్ట్ర మత్ పత్రికలకు సంపాదక వర్గం లో ఉన్నాడు .మూల్షీ సత్యాగ్రహం లో పాల్గొని రెండేళ్ళు జైలులో ఉన్నాడు .ఇంతటి ప్రతిభా సంపన్నులైన తమ్ముళ్ళు అల్పాయుష్యుతో చనిపోవటం తో కేశవ జీవితం లో ,కవిత్వం లోనూ ,విషాదం చోటు చేసుకొని కవిత్వం లో ప్రతి ఫలించింది .

   సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -23-11-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

 మరాఠీ నవకవిత్వ మార్గ దర్శి –కేశవ సుత్

 మరాఠీ నవకవిత్వ మార్గ దర్శి –కేశవ సుత్

మరాఠీ భాషలో నవకవిత్వానికి నాంది పలికి కేశవ సుత్,అటు బెంగాలీలకు  మైకేల్ మధుసూదన దత్ ,ఉర్దూ భాషాభిమానులకు హాకీ ,గుజరాతీయులకు నర్మద్ ల సరసన చేరాడు .ఈ శతాబ్ద సాహిత్య చరిత్రలో వీరు మైలు రాళ్ళు .వీరందరూ వాగ్గేయకారులే . జాతీయ చైతన్యానికి పాశ్చాత్య సంస్కృతీ ఎలా దోహదం చేసిందో తమ రచనలద్వారా స్పష్టం చేసిన వాళ్ళు .మరాఠీనవలారచనలో హరి నారాయణ ఆప్టే సాధించిన ఘనత కేశవ సుత్ మరాఠీ కవితా నిర్మాణ శక్తికి కలిగించాడు .దేశీయ ,విదేశీయ ప్రతి ధ్వనుల ప్రపంచం లో కేశవ సుత్ ధ్వని విస్పష్టమైనది .ఈ కవి జీవితచరిత్రను ప్రభాకర్ మచ్వే మరాఠీ లో రాయగా ,శ్రీ ఎస్ .సదాశివ తెలుగులోకి అనువాదం చేస్తే ,కేంద్ర సాహిత్య అకాడెమి 1970 లో ముద్రించిండ్ .వెలరూ-2-50.

  జీవితం

మొదట్లో సంప్రదాయ పద్ధతిలో రాసి తర్వాత తన స్వీయ భావ వ్యక్తీకరణకు స్వంత శైలిని ఏర్పాటు చేసుకొన్నాడు .1885 రఘు వంశ కావ్యానికి అనువాదం చేశాడు .తర్వాత నిత్య వ్యవహార భాషలోని సొగసును ప్రదర్శించి ,,కావ్య భాషా విరుద్ధ పదాలను చాలా వాడాడు .ఆత్మాశ్రయ కవిత్వానికి ,,భావనలో ఆత్మ విశ్వాసాన్నీ కలిగించి ,కవితా ప్రయోజనాన్ని నిరూపించటం లో సాటిలేని నిజాయితీ ప్రదర్శింఛి ,ఆధునిక మరాఠీ ‘’లిరిక్ ‘’కు ప్రాణదాత  అయ్యాడు .అతని ఆవ్య రత్నావళి లో ఎ కవిత్వమా చదివినా మరుభూమిలో సుందర పుష్ప దర్శనం లా ఉంటుంది .అతనిలోని చైతన్య ,తాదాత్మ్యాలు రసానుభూతి కలిగిస్తాయి .ఆంగ్ల ప్రకృతి కవి వర్డ్స్ వర్త్ కవితలలాగా సరళ ,ధ్యానముద్ర కలవి గా ఉంటాయి .

  అగార్కర్ ప్రభావం వలన కేశవ సుత్ సర్వమానవ సౌభ్రాత్రుత్వాన్నీ ,సంఘ సంస్కరణను అభిలషించాడు .సాంఘిక దురాచారాలు ,మూఢ సంప్రదాయ నిరసనగా ‘’నవ సిపాయి ‘’రాశాడు .అతని కవితలు ఆలోచనాత్మకాలు .సాంప్రదాయ’’ చెమ్మా చెక్కా ఆట’’ –జిమ్మా లో మాటిమాటికీ వాడేపదం-‘’జా –పోరీ –జా ‘’ను క్లుప్తం చేసి ‘’జపుర్జా ‘’కవిత రాశాడు .’’హరప్ లే శ్రేయా’’ కవితలోఎదో వింతలోకం లో ,సృష్టికి అంతటికీ నిలయమైన దాన్ని పొందాలని ఉవ్విళ్ళూ రాడు .దీనిపై వర్డ్స్ వర్త్ కవిత –‘’ఓడ్ టు ఇంటిమేషంస్ ఆఫ్ ఇమ్మోర్టాలిటి”  ప్రభావం ఉందన్నారు విశ్లేషకులు .19వ శతాబ్ది ప్రారంభం లో రవీంద్రుడు ఏర్పరచిన నవ చైతన్యానికి ఏర్పరచిన మూడు విషయాలు-ప్రకృతిపై పరతత్వ దృష్టి ,మాతృదేశ విముక్తి కాంక్ష ,సాంఘిక న్యాయానికి మానవతా వాదం మూడూ కేశవ సుత్ కవిత్వం లో త్రివేణీ సంగమం గా ఉన్నాయి .

  కేశవ్ తమ్ముడు సీతారాం కేశవ్ దామ్లె రాసిన అన్న గారిజీవిత చరిత్రలో  జనన తేదీని 15-3-1866 ఫాల్గుణ బహుళ చతుర్దశి గా చెప్పాడు కానీ దీనిపై ఏకీ భావం రాలేదు .కొందరు ప్రామాణికులు 7-10-1866గా నిర్ణయించారు సంవత్సరం ఒకటే నెలా, తేదీలు మారాయి .ఈ కవి 39వ ఏట హుబ్లి లో 7-11-1905 న ప్లేగు వ్యాధితో మరణించాడని ,ఆతర్వాత ఎనిమిది రోజులకు భార్యకూడా చనిపోయిందనీ  నిర్ధారించారు .తనపుట్టిన ఊరు  గురించి కవి ‘’నైరుత్యే కడీల్ వారా ‘’కవితలో మాల్గుండా గ్రామాన్ని సంస్కృతీకరించి మాల్యకూటం గా చెప్పాడు .ఏక్ ఖేడే కవిత లో వర్ణించిన ప్రకృతి ని చూస్తె ‘’వశ్నే’’గ్రామం అని అన్నారు .ఈ గ్రామ వర్ణన వర్డ్స్ వర్త్ రాసిన ‘’ప్రేల్యూడ్’’ను పోలి ఉంటుంది .

  కేశవ తల్లి మల్దౌలీ జమీన్దారులులైన కరదీపుల ఇంట పుట్టింది .1902లో ఉజ్జైన్ లో చనిపోయింది .భావుకత ,ఆస్తిక్యం ,విశాల హృదయం ,ఉదారమానవత ఆమెకు పెట్టని సొమ్ములని   ఒకకవితలో కొడుకు రాశాడు .

  తండ్రి కేశవ విఠల్ ఉపాధ్యాయుడు .వ్యవసాయమూ ఉంది .అతని జీతం నెలకు మూడు రూపాయలతో మొదలై 39తో ముగిసింది .అనారోగ్యం వలన ముందే రిటైరై 11రూపాయల ఉపకార వేతనం పొందాడు .తర్వాత స్వంతూరిలో విశ్వనాథ మా౦డలిక్ కు  సంబంధించి  భూవ్యవహారాలూ చూసేవాడు .క్రమ శిక్షణ నిజాయితీ ఆత్మశక్తి ఆయన సొమ్ములు .1893లో చనిపోయాడు .

  తలిదండ్రుల సంతానంలో  కేశవ సుత  నాలుగవ వాడు .అయిదుగురు సోదరులు ,ఆరుగురు ఆడపడచులు .పెద్దన్నయ్య 11 ఏట నీట మునిగి చనిపోయాడు .రెండవ అన్న శ్రీధర్ రత్నగిరి హైస్కూల్ లో ఫస్ట్  గా పాసై జగన్నాథ శంకర్ సేట్ స్కాలర్ షిప్ పొందిన మేధావి .1882లో ఎల్ఫి౦ టన్ కాలేజి లో బిఎ పాసై ,బరోడా కాలేజి లో సంస్కృత లేక్చరర్ గా చేరాడు .కాని ఏడాది లోపే టైఫాయిడ్ తో మరణించాడు .

   సుత్ చదువు సంధ్యలు

ఖేడ్ లో చిన్నతమ్ముడి తో కలిసి చదివి ప్రాధమిక విద్య పూర్తీ చేసి ,ఉన్నత విద్యకోసం బరోడా వెళ్ళారు సోదరులు సుత్ కు 15,తమ్ముడికి 13 వయసుకే పెళ్ళిళ్ళు జరిగాయి .కేశవ సుత్ భార్య చితళే వంశానికి చెందిన రుక్మిణీ దేవి పెళ్లి  నాటికి ఆమె వయసు 8..రూపవతికాకపోయినా  దయామయి ,కష్టజీవి .ఇద్దరికీ సిగ్గు ఎక్కువే .మామగారు కేశవ గంగాధర చిదలే .ఖాందేశ్ జిల్లాలో చాలీస్ గావ్  మరాఠీ హైస్కూల్ హెడ్ మాస్టర్ .సుత దంపతులకు  మనోరమ వత్సల ,సుమతి కుమార్తెలు .మహతారీ కవితలో రెండో కూతురిగురించి రాశాడుసుత్.

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -22-11-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

తాడిమళ్ళ రాజగోపాల శతకం

తాడిమళ్ళ రాజగోపాల శతకం
1913లో కాకినాడ శ్రీ వెంకటేశ్వర విద్యాసాగర ముద్రాక్షర శాలలో శ్రీ మంగు వెంకట రంగనాథ రావు గారివలన తాడిమళ్ళ రాజగోపాల శతకం ముద్రింపబడింది .వెల బేడ అంటే రెండు అణాలు . ‘’ శ్రీ తాడిమళ్ళ వాస –రాజగోపాల నీ పూజ తేజమయ్య’’అనేది మకుటం .
‘’శ్రీ కృష్ణు నెవ్వరు సేవింపు చుందురో వైకుంఠ పురమున వారు ఘనులు –కమలనాభుని చిత్తకమల౦బులొ నున్న వసుధలో మెలగెడు వాడు రాజు –ధనము మెండుగ గూర్చిధన్యులెందరు నైన స్వామి భక్తులతో సాటి రారు వారు –హరినామ కీర్తన లతి భక్తి జేసిన వారి దుష్కర్మముల్వదలి పోను –కలియుగంబున౦ దొనర్చు నఘ౦బులెల్ల –బాసి పోగాక వెంబడి బడియు రావు –కల్లగాదయ్య శ్రీ తాడిమళ్ళ వాస –రాజగోపాల నీ పూజ తేజమయ్య ‘’ అంటూ పద్యం తో శతకం ప్రారంభించాడు కవి .
గోపికలు గోపాలునిపై ప్రేమతో మసలుతున్నారు .’’ఎన్ని సోగసులుగలిగిన నేమి ఫలము –కలికి కృష్ణుడు వచ్చుట గాదె సొమ్ము ‘’అంటోంది రాధ .తనమన్మథ బాధను చెలులకు చెప్పి నల్లనయ్యను తనదగ్గరకు వచ్చేట్లు చేయమని ఒక చెలికత్తె కు చెప్పింది –‘’సొరిది కృష్ణుని దేవమ్మ సుందరాంగి ‘’.కృష్ణయ్యను తనకు కూర్చితే ‘’గుండ్లపేరు ,నాబన్న సరాలు ,పౌజులకమ్మలు ,ముత్యాలసరాలు మొదలైనవి కానుకగా ఇస్తానన్నది రాధ .’’పగతుడై మదను౦డు బాణములు సంధించి చురుచురుక్కున నేయ’’ జూస్తున్నాడట.వాటిని తప్పించుకోవటం తన తరం కావటం లేదట .’’వెడ విలుకాడు ‘’తన వెంట నంటి వేధిస్తున్నాడట .’’గడియ గడియకు వేష గాడ౦చు తెలియక ‘’వెర్రిగొల్లని కి ఏల వెలది నైతి ‘’అని బాధపడింది .మనసంతా రుక్మిణీ పతిని చూసి విసిగిపోయింది వేగంగా రమ్మని చెప్పమన్నది
‘’పడతిరో నాదు కౌగిలి పంజరముయన్ –జేర్చి’’ పుణ్యం కట్టుకో మన్నది .’’శేషాహిపై పడుకొంటాను అనే గర్వంతో ఉన్నాడు కాని గొల్లభామల ఇళ్ళల్లో దొంగచాటుగా తిరుగుతాడు అలాంటి వారు ఆయనతోపడుకోవటం చెల్లుతుందా చెప్పు అంటోంది. ‘’గొల్ల వానికి రాజకూతురు నియ్య మాతల్లి దండ్రులకు ధర్మం అవుతుందా ?’’పసులకాపరికీలాగు బడతి జేసి గూర్చే గద దైవంబు కుటిల బుద్ధి ‘’అని దైవాన్నీ నిందించింది ఆ దైవమె తన భర్త అని మరచిపోయి . నిందా గర్భం గా కృష్ణుని నిజాన్ని ఎండగడుతోంది –‘’తన తల్లి గుణములు దక్కించి చూచినా పుత్రుల గని చంపు పుణ్యశాలి –తన అక్క అయిదుగురికి భార్య అయిన గరిత-అన్నేమో దున్నుకు బతికెడి దుక్కి ముచ్చు’’అని ఇంటి గుట్టుకాస్తా బయట పెట్టింది .
రాధ చెలికత్తె తో ‘’పున్నమినాటి చంద్రునిగా సొగసుగా ఉన్నాననీ ,జిగివన్నె బంగారు చీర కట్టాననీ .బంగారు ఆభరణాలు రత్నాలతో మెరిసిపోతున్నాననీ ,అన్ని వేళలలో ఆయన్నే దైవంగా కొలిచేదానిననీ ,రాకపోతే ఒక్క నిమిషం కూడా బతక లేననీ ‘’దీనంగా మొరపెట్టుకొన్నది విరహిణి రాధ ..తన అధరామృతాన్ని తాగితాగి ఆన౦దించిన వాడికి తాను ఇప్పుడు విషం అయ్యానా అని దేప్పింది .
కృష్ణుని ఆనవాలు కూడా చెప్పింది అడగకుండానే చెలికి –‘’వేణువు దన చేత బూనువాడు –రహినొప్పుశంఖ చక్ర౦బులు గలవాడు ,శ్రీ వత్స లా౦ఛన మున్నవాడు,కస్తూరి తిలకం, చెవులకు రత్నకు౦డలాలున్నవాడు ,కమనీయ జీమూత కాంతి వాడు స్త్రీలతో నవ్వుతూ తిరిగేవాడు..వెన్నెలలో తన దగ్గర కూర్చున్నా ఒక్క ముద్దు కూడా ఇవ్వలేదట .గంధం పూస్తాను అంటే వద్దనేవాడు ,నోరారా తన్ను ఎప్పుడూ పిలిచినా పాపాన పోలేదట కొంటె కన్నయ్య .కర్పూర తాంబూలం ప్రేమగా చుట్టినోట్లో పెడితే మొత్తం తినేవాడే కాని కొరికి సగం తనకు ఎప్పుడూ పెట్టలేదట .సిగ్గులేకుండా చెట్టెక్కి ఆడవారు జలక్రీడలాడుతుంటే కొంటె చూపులు చూసి వలువలు ఎత్తుకుపోయినవాడట .దిసి మొలలతో బయటికి వస్తే చీరలిస్తానని మొండికేసినవాడట.ఇలాంటి కొంటె కోణ౦గిని ‘’మా తలిదండ్రుల మాట లాలింపక కుటిల బుద్ధిని గూడి, కోలుపోతి-వేగిర పడి నేను వేడుకొంటినిగాని, సవతి పోరు ఉంటుందని జడియ నైతి ‘’అని రోట్లో తలపెట్టి రోకటి పోటుల బాధ భరించినట్లు రాధ తన బాధ వెళ్ళబోసింది .ఇదంతా ఆమెకు కన్నయ్యపై ఉన్న ఆరాధనాభావమే. ఆపనులన్నీ ఆమెకు చాలా ప్రీతికరమైనవే లోకం మెచ్చేవే ఆయన్ను భగవంతునిగా ఆరాధించిన చేష్టలే అవి.
చివరికి ఆపద మొక్కులు మొక్కి౦ది రాధ –‘’దశరధ నందన ధాత్రీశ ,యచ్యుత దైతేయ హర మీకు దండమయ్య –గౌతమా౦గన శాప కలుషంబు బాపిన ధర్మాత్మ హరి మీకు దండమయ్య –వర నర వందన వారిధి బంధన దశ కంఠ సంహార దండమయ్య ‘’అని రాముడిని ,తర్వాత కృష్ణుడిని స్తుతించి ,’’చల్లగా వర్ధిల్లు సరస సద్గుణమణీ సౌభాగ్యమే నీకు సత్యభామ,నీవు కోరిన కోర్కెలు నిత్యముగను సఫలమాయెను ‘’అని మెచ్చి , క్షేమ సమాచారాలు అడిగి.మళ్ళీ మనసు కన్నయ్యపైకి మళ్లి ‘’ఏమిరా కృష్ణ ఎంత గర్వమురా పిలిచినపలుకవు పిరికి తనమా ??’’అని వాయించి కన్నయ్య చేసిన దొంగాటలన్నీ మళ్ళీ ఏకరువు పెట్టి ఉతికి జాడించి ఆరేసి అవతార పురుషుని లీలా విశేషాలు వివరించింది .
‘’ఆదికాలమునాడే అవతార మెట్టిన మత్ష్యావతారమహిమ ,చెప్పి అది హేయమైన అవతారమని దెప్పి ,కుటిలబుద్ధితో కూర్మావతార తాబేలు అవటం తప్పుకాదా ,పంది అవతారం ఎలా ఎత్తావయ్యా అని ఈసడించి ,నరుడు –సింహగా ,మరుగుజ్జు వాడిగా పుట్టటం ‘’వేషధారికి నౌ బ్రహ్మ వెర్రియగుచు ,అర్జునునికోసం కృష్ణావతారం ,అర్జున రధానికి కపి ధ్వజంగా హనుమంతుని పెట్టి పదకొండు అక్షౌహిణుల సైన్యాన్ని చంపించి అర్జునునికాపాడి,ద్రౌపదిని నిండుసభలో కాపాడి న పరమాత్మను నిండారా స్తుతించి ,పదేళ్ళ వయసులో గోవర్ధన గిరి ఎత్తి ,ఇంద్రుడు రాళ్ళవాన కురిపిస్తే గో,గోపాలరులన్దర్నీ ఆ గొడుగు కింద చేర్చి రక్షించి న బాలగోపాల లీలలు వర్ణించింది .రామావతారం లో సీతాపహరణం రావణాది రాక్షస సంహారం ,మళ్ళీ కృష్ణావతారాదిగాధలు చెప్పి చివరికి తనను ఆదుకోమని బతిమాలింది .
‘’జలధర దేహాయ శంఖు చక్ర గదాధరాయ మానిత భర్గాయతే నమోస్తు –పాలిత సుజనాయ భావజ జనకాయ ,దీనార్తిహరణాయ తే నమోస్తు –సామజ వరదాయ శాసిత దనుజాయ ,దేవకీ తనయాయ తే నమోస్తు –‘’అని ప్రణామము లొనరించియతని మదిని –గనికరము దోచునట్టుల గారవించి-తరుణ మిది యని తెలిసి –శ్రీ తాడిమళ్ళరాజగోపాలు దోడ్తేరె రమణు లార’’అని ముగిస్తూ కూడా రాధ హృదయబాధను తీర్చమని ఆర్తిగా కోరింది .
కమనీయ పద్య రచన ,సుమదురభావ జాలం ,మనోజ్ఞ శైలి,ఆకర్షించే కథా సంవిధానం ,విషయవివరణలో పట్టు తో శతకం బాగా రాణించింది ..తాడిమళ్ళ ఎక్కడ ఉన్నదో తెలియదు .ఆలయ చరిత్ర వివరంకూడా లేదు . ఒకసగటు మధ్యతరగతి స్త్రీ హృదయం ఆవిష్కరించి నట్లున్నది .తన పొరబాట్లు ,తెలిసీ తెనియని తనం ,సాటి వారిలో పలచన అయిపోతాననే భయం ,ధూర్త గోపాలుడే అయినా తనమనసు నిండా నిండిఉన్న తేజోమూర్తిగా ,ఆరాధనాభావం ఉన్న రాధను కవి మనోహరంగా మన ముందు నిలిపాడు భేష్ అనిపించాడు .రాజగోపాలస్వామి మహిమా లేదు ..’’రాధనురా ప్రభూ నిరపరాధనురా –అనురాగ భావనా రాదన మగ్న మానసనురా-కరుణి౦చరా’,కరుణి౦చరా ’అని కరుణశ్రీ పద్యాలు గుర్తుకు వస్తాయి . ఈ రాజగోపాల శతకం, కవి గురించి మనవారెవ్వరూ గుర్తించినట్లు లేదు . పరిచయం చేసే అదృష్టం నాకు దక్కింది .
మీ –గబ్బిటదుర్గాప్రసాద్ -19-11-21-ఉయ్యూరు ..
,

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-10(చివరి భాగం )

తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-10(చివరి భాగం )

ధనవణికన్ పత్రిక ‘’మహావిద్వాంసులు స్వామినాధయ్యర్ అజ్ఞాత  తమిళ మహాపురుషులగురించి విలువైన విషయాలు త్రవ్వి తీసి లోకానికి తెలియబరచారు .సాంప్రదాయ విద్వాంసులు కూడా ఆయనలా సరళంగా రాయగలరని నిరూపించారు .ఆయన శైలి అద్భుతం చిన్న చిన్న మాటలతో ,సరళ సుందరంగా రాస్తారు ‘’అని మెచ్చింది .మీనాక్షి సుందర పిళ్ళై జీవిత చరిత్ర ’మహా  విద్వాన్ మీనాక్షి సుందరం పిళ్ళై అవర్ గళ్ చరిత్తిరం’’  రెండుభాగాలుగా వెలువడి నందుకు  అయ్యర్ పరమానంద భరితుడయ్యాడు.మార్గదర్శకమైన వచనకావ్యం గా అది చరిత్రలో నిలిచిపోయింది .

   అశీతి అయ్యర్

అయ్యర్  80 వ జన్మ దినాన్ని వైభవంగా జరపాలని అభిమానులు సర్ పిటి రాజన్ అధ్యక్షతన సన్మాన సంఘం ఏర్పరచారు .విశ్వవిద్యాలయ సెనేట్ హాల్ లో సర్ మహమ్మద్ ఉస్మాన్ అధ్యక్షతన బహిరంగ సభ జరిగింది .ఆయన తమిళ భాషకు చేసిన కృషి ని    సన్మానపత్రం లో విశదీకరించి,గౌరవ పురస్సరంగా  3001 రూపాయల నగదు అందించారు .మద్రాస్ తమిళ సాహిత్య సంఘాలన్నీ ‘’తమిళ తాత ‘’కు ప్రశంసాపత్రాలు బహుమతులు అందజేశాయి .ఇవన్నీ తమిళతల్లి అనుగ్రహం అని ముక్తసరిగా వినయంగా అయ్యర్  బదులు గా స్పందిస్తూ –‘’నామనస్సు ఆనంద జలధిలో తేలిపోతోంది .భగవద్దర్శనం గురించి ‘’సేక్కిళారు’’చేసిన వర్ణన గుర్తుకొస్తోంది .దాన్ని వర్ణించి చెప్పటానికి మాటలు రావటం లేదు .ఆ దర్శనం నన్ను కాపాడుగాక .మీ ఆదరాభిమానాలు భవిష్యత్తులో నా తమిళ పరిశోధనకు  మీరుమంచి ప్రోత్సాహం కల్పించినందుకు ధన్యవాదాలు’’అన్నాడు .అయ్యర్ చిత్రపటాన్ని సర్ మహమ్మద్ ఉస్మాన్ ఆవిష్కరించగా ,విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడు లిటిల్ హేయిల్స్ స్వీకరించాడు హరికేశవ కల్లూర్ ముత్తయ్య భాగవతార్ పాడిన తమిళ కృతులతో సభ సమాప్తమైంది ..కలైమగల్ పత్రిక ప్రత్యెక సంచిక వెలువరించింది .ఈ జన్మదినోత్సవాన్ని తమిళనాడు అన్ని ముఖ్య పట్టణాలలో, జాఫ్నా ,రంగూన్ లలో కూడా పండుగలా జరుపుకొన్నారు.

  కలైమగళ్ పత్రికలో ఒకసారి అయ్యర్ ‘’బిచ్చగానిపాట ‘’అనే వ్యాసం రాస్తే ,చదివిన రాజాజీ 22-5-1937న అయ్యర్ కు ఒక ఉత్తరం రాస్తూ –‘’మీ బిచ్చగానిపాట మహాద్భుతం మంచి .కథ, గొప్ప కథనం రసప్రవాహం తో నిండి ఉంది .ఈ  కథకు నేనైతే ‘’ ఊరిని తగలబెడుతుందా ?’’అని పేరు పెట్టి ఉండేవాడిని ‘’అన్నాడు .

  1937లో మద్రాస్ లో జరిగిన భారతీయ సాహిత్యసమావేశానికి మహాత్మా గాంధీ అధ్యక్షత వహించాడు .స్వాగతోపన్యాస౦ అయ్యర్ చేశాడు .తమిళప్రాభవం సంస్కృతీ గురించి విపులంగా అయ్యర్ పేర్కొనగా గాంధీకి అందులో చాలాభాగం కొత్త అనిపించింది .ఆన౦ద మనస్కుడై మహాత్ముడు ‘’రూపుకట్టిన తమిళ౦ గా భాసిస్తున్న అయ్యర్ గారి విద్యార్ధిగా ఉండాలని నా మనసుకోరుతోంది .ఆ అవకాశం ఎప్పుడొస్తుందో ?””అన్నాడు ,నానాటికీ వయసు మీదపడుతున్నా అయ్యర్ సంగకాలపు ‘’ కురు తొంగై’’కావ్యాన్ని పరిశోధించటానికి మొదలు పెట్టాడు .అంతకు ముందే ఒకరు దాన్ని ప్రచురించినా అదంతా తప్పుల తడక .అయ్యర్ విపుల వ్యాఖ్యతో పరిష్కరణ ప్రతి తయారు చేసి పద్యం ప్రతిపదార్ధం తాత్పర్యం ప్రత్యెక వివరణ సంవాద రచనలు,ఉదాహరణలు ,పాఠాంతరాలు,విపుల పద పట్టికతో సహా 1937లో ప్రచురించాడు .

  తిరుప్ప నందాళ్ మఠాధిపతి స్వామినాథ తంబిరాన్ కోరికపై ‘’కుమార గురువరర్ ‘’  ప్రబంధాలు పరిశోధించి అయ్యర్1939 వెలువరింఛి ఆయనను దర్శించటానికి వెళ్ళాడు .అక్కడకు వచ్చిన కవిపండిత శాస్త్రకారులతో అయ్యర్ కు గొప్ప కాలక్షేపమేజరిగింది .చాలారోజులు అక్కడే ఉన్నాడు .ఒకరోజు ఉదయం పడకకుర్చీలో అయ్యర్ విశ్రాంతి తీసుకొంటుంటే  మఠాధిపతి దొడ్డి తలుపు వైపు నుంచి లోపలికి రాగా ‘’ఎవరా వచ్చేది ‘’అంటే ‘’స్వామిగళ్’’అనే మాట వినిపించగా ,అయ్యర్ వినయంగా లేస్తూ ‘’మీరు రావాలాస్వామీ కబురు పెడితే నేనే వచ్చేవాడిని కదా ,అదీ దొడ్డివైపు నుంచి రావటమా ??’’అన్నాడు .ఆయన ‘’మీరు చేసిన ఉపకారానికి ఇది ఏపాటిది ?’’శివరాళు౦దు దేశికర్’’’’కుమర గురుపరర్ ‘’,రచనలు ప్రచురించి మాకుటుంబానికీ ,మఠానికీ ఎంతో గౌరవం కల్పించారు .దీనికి ప్రత్యుపకారం నేనేం చెయ్యగలను ??’’అని వెయ్యిరూపాయలఖరీదైన వెండిపళ్ళెం అయ్యర్ చేతిలో ఉంచి ఆశ్చర్యపరచారు .ఈ విషయానికి పొంగిపోయి నలుగురికీ అయ్యర్ చెప్పుకోనేవాడు ‘

 స్వీయ చరిత్ర రాయమని చాలామంది అయ్యర్ ను కోరారు .ఒకా అభిమాని దాని ప్రచురణకు 501రూపాయలు అడగకుండా నే పంపాడు .అయ్యర్ చరిత్ర ధారావాహికంగా తన పత్రిక ఆనంద వికటన్ వారపత్రిక లో ప్రచురిస్తానని సంపాదకుడు కల్కి కృష్ణమూర్తి చెప్పాడు .’’ఎన్ చరిత్తరం ‘’అంటే నా చరిత్ర గా దాన్ని రాయటానికి అయ్యర్ ఒప్పుకొని 1940జనవరి నుంచి ధారావాహికంగా రాశాడు .ప్రతివారం ఉత్కంఠ తో ఎదురు చూసేవారు అయ్యర్ రచనకోసం .తన సాంస్కృతిక వారసత్వాన్ని అయ్యర్ అద్భుతంగా చిత్రించాడు .1942ఏప్రిల్ లో అయ్యర్ మరణించేదాకా ఈ ప్రవాహం సాగి,అసమగ్రంగా నిలిచిపోయింది .

 1942ఏప్రిల్ 12 సోమవారం అయ్యర్ మేడ మీద గదిలో బల్లపై పడుకుని ఉదయమే లేచి ,కి౦దికి దిగుతూ పడ్డాడు .మోకాలుకు దెబ్బతగిలి రక్తం కారింది వైద్య పరీక్షలో ఎముక విరిగినట్లు తెలిసింది .రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులవి .మద్రాస్ వాసులు తమ కుటుంబాలను  పల్లెటూళ్ళకు తరలిస్తున్నారు యుద్ధభయం తో .అయ్యర్ ను ‘’తిరుక్క ళుక్కుండ్ర౦’’ లో ఉన్న తిరువాడు దురై మఠానికి చెందిన భవనం లోకి తరలించారు .ఏప్రిల్ 11న తనత్యాగారాజ విలాసం నుంచి కారులో బయల్దేరే ముందు అయ్యర్’’ దేవా ! తిరుక్క ళుక్కుండ్ర౦ లో నువ్వు ఎన్నో అద్భుతాలు చేషావు ‘’అనే ’’తిరువాచకం గీతాన్ని చదివాడు .మళ్ళీ ఇంటికి తిరిగి వస్తానా ?అనుకొంటూ బయల్దేరాడు .సాయంకాలానికి కారు గమ్యస్థానం చేరింది .తాళపత్ర ప్రతుల్ని ఇంటి దగ్గరే వదిలేసి వచ్చినందుకు శిశువుకు దూరమైన తల్లి పడే బాధలా బాధపడ్డాడు .తండ్రి ఆవేదన అయ్యర్ కొడుకు అర్ధం చేసుకొని ,కొద్దిరోజుల్లోనే వాటిని అన్నిటినీ కొత్త నివాసానికి తరలించి అయ్యర్ కు ఊరట కలిగించాడు .

  కొద్ది రోజులకు అయ్యర్ ఆరోగ్యం కుదుటబడి లేచి కూర్చో గలిగాడు .అయ్యర్ పై ఈపుస్తకం రాసిన శిష్యుడు తన తండ్రి ఆరోగ్యం బాగా లేదని తెలిసిమైసూర్ వెళ్ళే ముందు ఇక్కడికి వచ్చి ఒకరోజంతా గురువుతోగడిపి తమిళ సాహిత్యం పై మాట్లాడుకొన్నారు’’ కంబరామాయణం’’ ,’’తేవారం’’ లను సక్రమంగా ప్రచురించాలని అయ్యర్ అభిప్రాయ పడి’’ఇందులో నువ్వు సహాయం చేస్తావా ?ఏదీ నీ చెయ్యి నాకుఒకసారి ఇవ్వు ‘’అని అడిగి తీసుకొన్నాడు .అదే ఆఖరి స్పర్శ అని శిష్యుడు గ్రహించలేదు .శిష్యుడు మైసూర్ వెళ్ళాడు గురువు అనుజ్ఞ తీసుకొని .

 అయ్యర్ కి జ్వరం వస్తే కొడుకుకు టెలిగ్రాం ఇవ్వగా ,అతడువచ్చే లోపే అయ్యర్ 28-4-1942న 87 వ ఏటశివ సాన్నిధ్యం చెందాడు .శ్రీమతి రుక్మిణీదేవి అరండేల్’’ తమిళతాత  అయ్యర్’’ పేరుమీదుగా తిరువాన్మయూరు లో ఒక గ్రంథాలయం స్థాపించి ,అయ్యర్ సేకరించినవీ ,ప్రచురించినవీ అన్నిటినీ భద్రపరచినది .త్యాగరాజ చెట్టియార్ సజీవులై ఉండగా ఆయనపై తానేమీ రాయలేక పోయిందుకు అయ్యర్ బాధ పడేవాడు .మద్రాస్ లో కాంగ్రెస్ భవనం లో సభ జరిగినపుడు రాజాజీ అయ్యర్ ను సుబ్రహ్మణ్య భారతిపై ప్రసంగించమని కోరగా  అద్భుతంగా మాట్లాడగా   రాజాజీ పరవశంతో ‘’వశిష్టుడు విశ్వామిత్రుడిని బ్రహ్మర్షి అనటం వల్ల ఆయన కీర్తి పెరిగినట్లు అయ్యర్ ప్రశంసావాక్యాలవల్ల భారతి కీర్తి ఇనుమడించింది ‘’అన్నాడు .

  ‘’తమిళులకు ఒక ప్రత్యెక విలక్షణమైన చరిత్రను సంపాదించి ఇచ్చిన స్వామినాథ అయ్యర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది .సంగకాలపుకావ్యాలను  వెతికి తీసి తమిళ భాషా సేవ చేశాడు .ఆయన వచన రచనలు ‘’వచనం లో వెలసిన వర్ణ చిత్రాలు ,సాంస్కృతిక కోశాలు ‘’ .

ఆధారం –మొదట్లోనే చెప్పినట్లు కి .వా .జగన్నాథన్ తమిళ రచనకు ప్రేమానంద కుమార్ చేసిన ఆంగ్ల అనువాదానికి తెలుగు లో శ్రీ చల్లా రాధాకృష్ణ శర్మ చేసిన ‘’ఉ.వే.స్వామినాథ అయ్యర్ ‘’పుస్తకం .

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -18-11-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

తిట్టి పని సాధించుకొన్న శ్రీనాథుడు

తిట్టి పని సాధించుకొన్న శ్రీనాథుడు

శ్రీనాథ కవి సార్వ భౌముడు తెలుగు రాయని దగ్గరకు వెళ్లి ‘’ధాటీ ఘోటక రత్న ఘట్టన మిల ద్రాఘిష్ట కళ్యాణ ఘంటా టంకార విలు౦ఠ లుంఠిత మహోన్మత్తాహిత క్షోణి  భ్రుత్కోటీ రాంకిత కుంభినీధర సముత్కూట ఝాటకర్ణాటాంధ్రధిపా-సామరాయని తెలుంగా –నీకు బ్రహ్మాయువౌ ‘’అని దీవించి –‘’అక్షయ్య౦బుగసాంపరాయని తెలుంగా ధీశ –కస్తూరికా భిక్షాదానము సేయురా –సుకవి రాట్బ్రు౦దారక శ్రేణికిన్-దాక్షారామ చళుక్యభీమవర గంధర్వాప్సరో భామినీ వక్షోజ ద్వయ కుంభి కు౦భములపై వాసించు తద్వాసనల్ ‘’అని కస్తూరికోసం చెయ్యి చాపి ఉంటాడు అన్నారు మునిమాణిక్యం .మొదట్లో దీర్ఘ కఠినపద సమాస౦వాడటం తన కవితా పాండిత్య ప్రకర్ష తో హడల గొట్టించ డానికే నట .తన్ను తాను పొగుడుకోవటం ఎదుటి వాడిని తక్కువ చేయటమే .అంటే సాంపరాయని రెండు తిట్టి ‘’ఇప్పుడు ఏమంటావ్ ?కస్తూరి ఇస్తావా ఇవ్వవా ‘’ అని అడిగి నట్లు తోస్తుంది అన్నారు చక్కగా ఎస్టిమేట్ చేస్తూ మాస్టారు .

  నువ్వు బాగా ఎడ్చావు అంటే అందులో కొంటెదనం ఉందన్నారు మాస్టారు .ఆమె ఒళ్ళు మండటానికి అన్నమాట .ఇదీ ఒకరకమైన తిట్టు కిందే జమ వేశారు మునిమాణిక్యం .కలస్వనం తో ఏడ్చినా ,పల్లవ గ్రాస కాషాయ కంఠకాకలీధ్వనితో ఏడ్చినా ,కాంభోజీ మేళవిపంచికారవ సుధా పూరంబుతో ఏడ్చినా  అది ఏడ్పే కాని ఇంకోటికాదు .ఇలా ఏడ్చినా దానితో మహా బాగా ఎడ్చావు అంటే ఒక రకమైన విక్కిరి౦పే అని తేల్చారు .అయితే ఈతిట్లు  సుకుమార,సుందర, శ్రవణ పేయంగా ఉన్నాయి ట.తెనాలికవి తనకవిత్వం లో తప్పు పట్టలేరనీ ,తప్పు పట్టితే –‘’మొగమటు కిందుగా దివిచి ముక్కలు వోవ నినుంప కత్తితో సిక మొదలంట గోయుదును ,చెప్పున గొట్టుదు,మోము దన్నుదున్ ‘’వాచ్యంగా మరీ బండగా మోటుగా తిట్టాడు .కానీ పైన పద్యాలు కృష్ణ శాస్త్రి కవిత్వం లా లలిత సుకుమార ౦గ హాయిగా ఉన్నాయన్నారు మాస్టారు.కనుక తిట్టటం తిట్టి౦చు కోవటం మనోహర వ్యాపారం అన్నారు మునిమాణిక్యశ్రీ .రమ్యంగా తిట్టటం వాక్ చమత్కృతి,  హాస జనకమూ అవుతుందట .

  తిట్టుకవిత్వమంతగా సరసమైనదీ ,ఉత్తమహాస్యం అనిపించుకోనిదీ అయినా ,అది హాస్య రచనే. వాటిలో చమత్కార ,హాస్యాలు కలిసి ఉన్నాయట .’’పెట్ట నేరని రండ,పెక్కు నీతుల పెద్ద – గొడ్రాలి ముండకుగొంతు పెద్ద –గుడ్డి గుర్రపు తట్టు గుగ్గిళ్ళు తిన పెద్ద –వెలయ నాబోతు క౦డలకు పెద్ద –అల్ప విద్యావంతుడా క్షేపణకుపెద్ద –రిక్తుని మనసు కోరికలపెద్ద –   మధ్య వైష్ణవునకు నామములు పెద్ద ‘’లో దుష్టాచారాలను ఖండించి హాస్యం కలిపించాడు కవి .మనకున్న ద్వేషాన్నీ కోపాన్నీ ఇంకెవరైనా బహిర్గతం చేస్తే మనకు సంతోషం కలుగుతుంది .మనం చేయలేని పని వాడుచేశాడుకనుక ఎవర్ని ఎవరు తిట్టినా మనకు ఆనందం కలుగుతుందని తీర్పు చెప్పారు మునిమాణిక్యం.

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -17-11-21-ఉయ్యూరు  

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-9

తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-9

1912లో ఎం ఆరె ఎన్ రామనాధ చెట్టియార్ ,సోదరులు కలిసి శ్రీ కాళహస్తి ఆలయం కుంభాభిషేకం మహా వైభవం గా జరిపి, ఆలయ చరిత్ర పుస్తకం ప్రచురించారు  .అప్పుడు అయ్యర్’’ తిరుకాళత్తిపురాణం ‘’ప్రచురించే సన్నాహం లో ఉన్నాడు  .భక్త కన్నప్ప గురించి అనేక విషయాలు సేకరింఛి కాళహస్తి మహా కుంభాభిషేక సమయం లో ఆవిష్కరించాడు .

 1915ఫిబ్రవరికి  అయ్యర్ కు 60ఏళ్ళు నిండాయి .షష్టిపూర్తి వైభవంగా చేయాలని మిత్రులు భావిస్తే  వద్దని వారించి కాళహస్తిలో కొన్ని రోజులు ప్రశాంతంగా గడిపి స్వామి సేవలో ధన్యుడయ్యాడు .తర్వాత రెండేళ్లకు భార్య కమలమ్మ గతించింది ,రాజధాని కాలేజిలో ఆయన గడిపిన చివరి సంవత్సరాలలో పరిశోధన విస్తృతి చెందింది .సంగ కాలపు ‘’పరి పాడలు ‘’ ప్రచురించాడు .పరిమేలళగర్ వ్యాఖ్యానం ప్రకారం అది  70పద్యాల సంకలనం .ఎంత ప్రయత్నించినా సమగ్ర ప్రతి దొరకలేదు .దొరికిన 22పద్యాలు ఆధారంగా ప్రాచీన తమిళులు పూజించిన దేవతా విగ్రహాల ,సంగకాలపు సాంఘిక విషయాలతో దాన్నే ప్రచురించాడు .

   వారణాశి లోని ‘’భారత ధర్మ మహా మండల్’’వారు అయ్యర్ ను ఆహ్వానించి ‘’ద్రావిడ విద్యా భూషణ ‘’బిరుదు ప్రదానం చేసి , సత్కరించి గౌరవించారు .

   ఉద్యోగ విరమణ

స్వామి నాథయ్యర్ 1919లో మద్రాస్ రాజధాని కాలేజి లో ఉద్యోగ విరమణ చేశాడు .మరికొంతకాలం చేయమని కోరినా ,వినయంగా తిరస్కరించాడు .తన స్థానం లో తమిళ భాషాసేవ ఇంకా బాగా  చేసే ఆయన్ను నియమించమని కోరాడు .ఇ.వి .అనంతరామయ్యర్ ను అయ్యర్ సూచించగా ,ఆయననే నియమించారు .1919లో విశ్వకవి రవీంద్రనాధ టాగూర్ మద్రాస్ వచ్చాడు .టి.ఎస్ .రామస్వామి అయ్యర్ గృహం లో అతిధిగా ఉన్న టాగూర్ ను అయ్యర్ వెళ్లి దర్శించిమాట్లాడాడు .అయ్యర్ తన సాహితీ సేవ ఆయనకు వివరించగా ‘’ఇంత సాహిత్య సేవ ఎలా చేయ గలిగారు ??’’అని రవీంద్ర కవి చంద్రుడు ఆశ్చర్యపోయాడు .తమిళ ప్రాచీన ప్రతులకోసం ,ఎలా విస్తృత పర్యటన చేసిందీ అయ్యర్ వివరించగా టాగూరు ఆశ్చర్యం మరింత ఎక్కువైంది .ఆ సాయంత్రమే రవికవి అయ్యర్ ఇల్లు ‘’త్యాగరాజ విలాసం ‘’సందర్శించి ,చక్కగా  అలంకరింప బడిన తాళపత్ర గ్రంథాలను కాగిత ప్రతులను చూసి ముచ్చటపడి అయ్యర్ ను ప్రశంసించాడు. తాటి ఆకులపై ఎలా రాస్తారు అని టాగూర్ అడిగితె వ్రాసి చూపించి మరీ ఆశ్చర్యపరచాడు .అయ్యర్ ఉంటున్న ‘’తిరు వేట్టీశ్వరన్ పేట’’ మొత్తానికే ఇది అనుకోని  ఊహించలేని అద్భుత సంఘటన.ఆ నాటి నుంచి అయ్యర్ రోడ్డుమీద కనిపిస్తే గౌరవంగా రెండు చేతులతో వినయంగా నమస్కరి౦ చే వారు ఆపేట వాసులు. అంతగా ఆయన గౌరవం పెరిగి౦ది నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్ర నాథ టాగూర్ అయ్యర్ ఇంటికి స్వయంగా రావటం వలన .

  వయసు మీదపడుతోంది .కుటుంబ సమస్యల పరిష్కారం తోపాటు తిరువాడు దురై మఠం వారి వాదాల పరిష్కారం కూడా ఆయన చేశాడు 1920లో అంబాల వాణదేశికర్ పరమపదించగా ,మేనేజర్ వైద్య నాద తమ్బిరాన్ పీఠాధిపతి అయ్యారు .ఆయన ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ కొందరు కోర్టు కు వెళ్ళగా ఆయన అయ్యర్ సాయం కోరగా రెండువారాలు ఉండి,తాళపత్ర రచనలన్నీ సక్రమంగా అమర్చి గ్రంథాలయం లాగా మార్చాడు .తాను బోధించిన చోట ఒక పాఠశాల ప్రారంభించగా ఆ౦దరూ బాగా సంతోషించి ,మీనాక్షి సుందరం పిళ్ళై రోజులు జ్ఞాపకం చేసుకొన్నారు .

  1922జనవరిలో వేల్స్ రాజు మద్రాస్ రాగా ,ప్రభుత్వం తమిళ, సంస్కృత విద్వాంసులను సత్కరించే కార్యక్రమ౦ చేబట్టి అయ్యర్ ను ఆహ్వానించగా ,మద్రాస్ వచ్చి ‘’ఖిల్లత్ ‘’అందుకొన్నాడు అయ్యర్ .తిరువాడు దురై చనిపోగా వైద్యలింగ దేశికర్ ఆస్థానం భర్తీ చేశాడు .మద్రాస్ రాగానే  ‘’కొంగు వేల్    మాక్కదై’’అనే మరోపేరున్న ‘’పేరుం గదై’’-బృహత్కథ పరిశోధనలో నిమగ్నమయ్యాడు .అయిదేళ్ళు శ్రమించాడు చివరిభాగం లభించలేదు.బృహత్ సంహిత లోని విషయాలు సంస్కృత విద్వా౦సులద్వారా తెలుసుకొని ,విపులమైన గ్రంథం తయారు చేసి 1924లో ‘’పెరుంగదై ‘’పరిష్కరణ గ్రంథాన్ని ప్రచురింఛి ,తమిళ పండిత ప్రశంసలు పొంది ,లబ్ధ ప్రతిష్టుడయ్యాడు అయ్యర్ .

  ప్రాచీన తమిళ సాహిత్యం వెలుగు చూసినకొద్దీ ,కాలేజీలలో తమిళ శాఖ కు గౌరవం పెరిగి తమిళ సంస్కృత అధ్యయనానికి దారి తీయగా దీనికోసం అన్నామలై చెట్టియార్ గొప్ప ప్రోత్సాహం కల్పించాడు .తమిళ కళాశాల ప్రిన్సిపాల్ పదవికి అయ్యర్ ను చెట్టియార్ ఒప్పించి  ప్రిన్సిపాల్ ను చేశాడు .నిత్యం నటరాజస్వామి దర్శనం లభిస్తుందని అయ్యర్ సంతోషంగా ఒప్పుకొన్నాడు .ఆలయ వంశపారం పర్య ధర్మకర్త దీక్షితార్ చాలా సంతోషించాడు .1924లో చిదంబర రాగా ఆయన ఉండటానికి మంచి వసతులు కల్పించారు .ఆయన నివాసం లోనే ‘’మీనాక్షి తమిళ కళాశాల ‘’ప్రారంభమైంది .ఆర్ట్స్ కాలేజి ప్రిన్సిపాల్ నీలకంఠ శాస్త్రి సహాయ సహకారాలు అందించాడు .

  1925 జూన్ 8న మదురై లో తమిళ సంగం 24వ వార్షికోత్సవం జరుపుకోగా సిపిరామస్వామి అయ్యర్ అధ్యక్షత వహించాడు .నిర్వాహకుల కోరికమేరకు అయ్యర్ ముందే అక్కడికి వెళ్ళాడు .అయ్యర్ రాక తమిళ భాషాభిమానులకు దివ్యౌషధం అయింది .కీర్తి ఉచ్చస్తిలో ఉంది .పౌరసత్కారం చేశారు .నిధి సమర్పించారు అయ్యర్ కు .కంచికామకోటి పీఠాధిపతిశ్రీ శ్రీ చంద్ర శేఖర సరస్వతి స్వాములు  అయ్యర్ కు జంట శాలువాలు ,కంకణం పంపి ‘’దాక్షిణాత్య కళానిధి ‘’బిరుదు ప్రదానం చేశారు  .మదురై పౌర నిధి అయ్యర్ కు ‘’శంకర నమశ్శి  వాయర్ నన్నూల్ ‘’గ్రంథ పరిష్కరణ ,ప్రచరణకు తోడ్పడింది .ఉపోద్ఘాతం లో విరాళాలు ఇచ్చినవారి పేర్లన్నీ ప్రచురించి కృతజ్ఞత ప్రకటించారు అయ్యర్ .

  కొత్తకాలేజి ప్రిన్సిపాల్ గా పని చేస్తున్నా ,అయ్యర్ పరిశోధన కు ఏమాత్రం  ఆటంకం కలుగలేదు .చిదంబరం లో ఉన్నకాలం లో అయ్యర్ ‘’దక్క యాగప్పరణి’’సవ్యాఖ్యానం గా ప్రచురించే కృషి చేశాడు.1930లో దీన్ని ప్రచురించాడు. .అజీర్ణ వ్యాధి ,కడుపు నొప్పి తో బాధపడుతున్న అయ్యర్ తనను రిలీవ్ చేయని అన్నామలై ను కోరగా ,అంగీకరించి అయ్యర్ సలహాతో ‘’పోన్నోదు వార్ ‘’ని ప్రిన్సిపాల్ ను చేశాడు .చిదంబరం పౌరులు ఆత్మీయమైన వీడ్కోలు చెప్పగా అయ్యర్ మద్రాస్ చేరాడు .

   1930లో అయ్యర్ మెట్లమీద నుంచి దిగుతూ కాలుజారి ,పాదానికి దెబ్బతగిలితే పక్కనే ఉన్న వైద్యుడు చికిత్స చేసినా లాభం లేకపోగా ,ప్రముఖ శస్త్ర వైద్యుడు డాక్టర్ రంగాచారి నిపిలిపించి ,ఇంట్లోనే శాస్త్ర చికిత్స జరిపించగా ,మంచం లోనే ఉన్న అయ్యర్ ను ఎక్కువగా చదవటం రాయటం చేయవద్దని డాక్టర్ సలహా ఇచ్చాడు .హైకోర్ట్ లో ఉద్యోగిస్తున్న కొడుకు ఉద్యోగానికి వెళ్ళగానే శిష్యుడు ఈ పుస్తకం రచయిత కీ .వా .జగన్నాథన్  ను తమిళకావ్యం చదవమని అడిగి చదివించుకొనే వాడు ‘అయ్యర్ తానూ శిష్యుడుగా ఉన్నప్పుడు రోజుకు 300తమిలపద్యాలు బోధించేవారని గుర్తు చేసుకొన్నాడు . అప్పటికే అయ్యర్ గురువు పిళ్ళై గారి జీవిత చరిత్ర గురించి చాలా విషయాలు సేకరించి ఉంఛి కొన్నిభాగాలు రాసి మిగిలినవి రాస్తానో లేదో అని బాధ పడేవాడు .ఒక రోజు ఆకట్ట తీసుకురా అడిగితె శిష్యుడు డాక్టర్ చెప్పిన హెచ్చరిక గుర్తు చేయగా అయ్యర్ ‘’డాక్టర్ కు ఏం తెలుసయ్యా .నేను నాపని పూర్తి చేస్తే భగవంతుడే నన్ను రక్షిస్తాడు ‘’అనగా చేసేది లేక ఆ కట్ట తెచ్చి ఇవ్వగా ,కనులనుంచి నీరుకారుతుండగా ,అయ్యర్ డిక్టేట్ చేస్తుంటే శిష్యుడు రాసేవాడు .ఇలా అశ్రుపూరిత నయనాలతో గురువుగారు మీనాక్షి సుందరం పిళ్ళై జీవిత చరిత్రను రాసి అయ్యర్ ధన్యుడయ్యాడు .

  1932ఆగస్ట్ లో  మద్రాస్ విశ్వ విద్యాలయ స్నాతకోత్సవం నాడు అయ్యర్ కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు .దాన్ని తీసుకోవటానికి పిఎస్ శివస్వామి అయ్యర్ తగిన డ్రెస్ ను అయ్యర్ కి కుట్టించి తీసుకు వెళ్ళగా అయ్యర్ స్వీకరించి ముక్తసరిగా మాట్లాడాడు .సెందమిళు పత్రికలో అయ్యర్ ధారా వాహికంగా ప్రచురిస్తున్న వాటిని చూసి ,’’శివ నేశన్ ‘’పత్రికసంపాదకుడు తన పేపర్ కూ వ్యాసాలూ రాయమని కోరగా ,అలానే అని ,’’నలమలైక్కోళై’’,తిరుమయిలై,యమక అంతాది మొదలైనవి ధారా వాహికంగా ప్రచురణకు పంపాడు .మద్రాస్ లా జర్నల్ అధిపతి నారాయణ స్వామి అయ్యర్ పెట్టిన ‘’కలై మగళ్’’ అంటే కళాసరస్వతి పత్రికకూ అయ్యర్ వ్యాసాలు రాశాడు .అయ్యర్ ప్రముఖ రచనలన్నీ అందులో ప్రచురితాలే .

సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -17-11-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | 2 Comments

తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-8

తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-8

నిరుపమాన పాండిత్యం ,నిరాడంబర జీవితం  

అయ్యర్ ఒక చిన్న ఇంట్లోనెలకు 20రూపాయల  అద్దెకు ఉండేవాడు .ఒకసారి ఇంటి యజమాని స్నేహితుడు యజమానిని ‘’ఇంత తక్కువ అద్దె కు ఎందుకు ఇచ్చారు ?”’అని అడిగితె ఇంటి యజమాని ‘’ఈ ఇరవై కూడా తీసుకోవటం నా తప్పే .మా ఇంట్లో ఆయన అద్దెకు ఉన్నందుకు నెలనెలా ఇరవై రూపాయలు నేనే ఆయనకు  ఇవ్వాలి .అంతగొప్ప పండితుడు మా ఇంట్లో ఉండటం వలన మా ఇల్లు ఒక గుడిలా పవిత్రమైనది .ఆయన్ను దర్శించటానికి ఎందరెందేరో ప్రముఖులు వస్తున్నారు .ఆయన అంతకు ఆయన ఖాళీ చేస్తే తప్ప అద్దె ఇంకొక రూపాయికూడా పెంచను,ఖాళీచేయమని అడగనుకూడా ‘’అని నిర్మొహమాటంగా చెప్పాడట.ఒక సారి  యజమాని అయ్యర్ ని ‘’ఈఇల్లు  కొనాలనుకొంటే మీకే ఇస్తాను ‘’అంటే తనకు కుంభకోణం లో ఇల్లు ఉందనీ ,ఇప్పుడు మద్రాస్ లో దీన్ని కొనే తాహతు లేదని వినయంగా చెప్పాడట .కానీఇంటాయన మిత్రుడు ఆ ఇంటిని 4,500కు బేరం పెట్టించాడు .అయ్యర్ కు లోపలభయంగా ఉంది .తనపుస్తకాలకు సరిపడా ఇల్లు ఎక్కడదొరుకుతుంది ఇవన్నీ తీసుకు వెళ్ళటం ఎలా అని చింతిస్తూ వాకిట్లో కూర్చున్నాడు .ఇంటాయన సేహితుడు అటు వెడుతుంటే యజమాని ఇల్లు అమ్ముతున్నారని బజానా కూడా తీసుకొన్నారని ,తనకు చెబితే ఇంకో వంద పెంచి  కొనే వాడినికదా ‘’అన్నాడు అయ్యర్ .ఆయన ‘’ఏడాదిక్రితం మీకు చెబితే కొనలేను అన్నారట కదా .మీరు ఎక్కడో పెద్ద ఇల్లు కట్టిస్తున్నారనీ చెప్పాడు మా వాడు ‘’అనగా ,అయ్యర్ ‘’అప్పుడు కొనాలనిపించలేదు ఇప్పుడు కొనాలని ఉంది మీరు ఇంటిని నాకు ఇప్పించేట్లు సాయం చేయండి ‘’అన్నాడట దీనంగా .ఆసాయంత్రం ఆ మిత్రుడే వచ్చి ‘’మీ యజమాని తీసుకొన్న బయానా తిరిగి ఇచ్చేశాడట ఇల్లు మీకే అమ్ముతాడట ‘’అని కమ్మని వార్త చెప్పాడు .నెల ఆతర్వాత ఆఇల్లుకొని చెట్టి గారి స్మృత్యర్ధం ‘’త్యాగరాజ విలాసం ‘’అని పేరుపెట్టాడు అయ్యర్ .

  1906లో అయ్యర్ ‘’వే౦బత్తురార్  తిరవిళై యాడార్’’పురాణాన్ని పరిశోధన అంశాలతో ,పద పట్టికతో సహా పా౦డిత్తురై తేవర్ ఆర్ధికసాయం తో ప్రచురించాడు  .తమిళ సంఘం వారి పరిశోధన ప్రచురణ ‘’సెందమిళు’’కు వ్యాసాలూ రాయమని తేవర్ కోరగా ,అయ్యర్ తాను పరిశోధిస్తున్న ‘’తిరువారూర్ ఉలా ‘’ను ఆపత్రిక లో  ధారావాహికంగా ప్రచురించి దాని కీర్తి ప్రతిష్టలు పెంచాడు .తర్వాత మీనాక్షి సుందరం పిళ్ళై రాసిన ‘’తనియూర్ పురాణం ‘’,మణ్ణి పడిక్కరై’’పురాణాలను 1907 డిసెంబర్ లో ప్రచురించాడు అయ్యర్ .

  1908లో జైలులో ఉన్న  దక్షిణ భారత తొలి నౌకా నిర్మాత ,ప్రముఖ దేశ భక్తుడు వ.ఉ.చిదంబరం పిళ్ళై అయ్యర్ కు ఉత్తరం రాస్తే తనిఖీలన్నీ పూర్తయి అయ్యర్కు చేరింది . తిరుక్కురళ్ గురించి ఆయన చేస్తున్న అధ్యయనం ,దాన్ని ఇంగ్లీష్ లోకి అనువాదం చేస్తున్న సంగతి రాశాడాయన .ఆయనకు వచ్చిన సందేహాలను తెలియ అరచగా ,అయ్యర్ వెంటనే తీర్చాడుకూడా .

  అయ్యర్ కి స్వంత ప్రెస్ ఉంటె బాగుంటుంది అని తిరువాడు దురై పీఠాధిపతిఅంబలవాణ దేశికర్ భావించి అయ్యర్ తో చెప్పగా ‘’నా సమస్యను అర్ధం చేసుకొని ప్రెస్ ఏర్పాటు చేస్తామని అన్నందుకు కృతజ్ఞతలు .నా పరిశోధన -ప్రెస్ విషయాలు చూడటం తో కుంటు పడుతుంది .మీఆజ్ఞ మన్నించనందుకు క్షమించండి ‘’అన్నాడు వినయంగా .

   అ నాటి గవర్నర్ కార్మైకేల్ పురాతత్వ శాఖ చూడటానికి వస్తున్నట్లు కబురు చేయగా ,అపూర్వ విగ్రహాలు ,కళా ఖండాల గురించి ఆయనకు ఎలా వివరించాలో సందేహ పడుతున్న ఆ శాఖాధిపతి,అయ్యర్ ను సహాయమడిగితే ,గవర్నర్ దంపతులతో  పాటు వెంట ఉండి వాటి ప్రాముఖ్యాలను చరిత్రను సంపూర్ణంగా వివరించగా ,అధికారి ఆంగ్లం లోకి అనువాదం చేసి వారికి తెలియజేశాడు. గవర్నర్ దంపతులు చాలా సంతోషించారు .గవర్నర్ ఫోటో తీసుకోవాలని అక్కడ వారు అనుకొంటుంటే గవర్నర్ అంతబాగా వివరించిన ‘’పండిట్ ‘’ఎక్కడా అని ఎదురు చూస్తున్నాడు .గవర్నర్ అయ్యర్ ను తన ప్రక్కన కూర్చోపెట్టుకొని ఫోటో దిగాడు .అయ్యర్ భావ ప్రకటన జాతి భాషా పరమైన సరిహద్దులు దాటి ఆన౦దాన్ని,గౌరవాన్ని ,ప్రాముఖ్యతను  చేకూర్చింది .

 సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -16-11-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

తిట్టడం లో చమత్కారం

తిట్టడం లో చమత్కారం

ముక్కు పొడుం అడుక్కుంటే ఇవ్వలేదని ఒక కవి ‘’శాస్తుర్లట ఈ నీచుడు –పాసోత్తుల మగడు వీని పరువేమో కా –కాస్తంత  నశ్యమడిగిన నాస్తీ యని పలికె వీని నాలుక పీకా ‘’అంటూ పద్యం లో తిట్టిపారేసి చమత్కారం సృష్టించాడు . తిట్టు కవిత్వం లో కొంత హాస్యం ఏర్పడినా ,అది ఉత్తమ హాస్యం కాదు అన్నారు మునిమాణిక్య శ్రీ .కానీ తిట్టడం లో తాము దిట్టలం అని పింగళి సూరనాదులు గర్వంగా ఛాతీ విరిచి చెప్పుకొన్నారు –‘’తిట్టుదునా మహోగ్ర కరతీవ్ర వచో వర గద్య పద్య సంఘట్ట ఫణీ౦ద్రకోటి ఘన కంఠ విషాగ్నుల రీతి మెట్టునన్ నెట్టన దాకగా వలయు నిందను జేయక ,పద్య మిస్తినా ,పట్టపు రాజు రీతి  బహు భంగుల లెస్స సుఖి౦పగా  వలెన్’’అన్నాడు ఆ రుద్రకవి అన్నారు మాస్టారు .

  ‘’తిట్టు రచన బూతు రచన లాగా మనిషి లో ఉండే ఒకానొక గుర్తి౦ప రాని  హృదయపు లోతులలో దాగి ఉన్న ,చిత్ప్రమేయం లేని ఒకానొక ప్రేరణకు ప్రతీకారచర్య ‘’ అని భాష్యం చెప్పారు ఫ్రాయిడ్ లిబిడో చదివిన మునిమాణిక్యం .

  సాడిస్ట్ టెన్డేన్సీ- అంటే  ఒకర్ని తిట్టటం లో మనకు తృప్తి కలిగించే గుణం .అవతలి వాడిని బాధించి  ఏడిపించటం లోనూ ఆనందం ఉందన్నారు మాస్టారు .ఇది ఒక సహజ ప్రేరణ ,దీనినే సాడిస్ట్ టెన్డేన్సిఅన్నారు గురూజీ .ఇది సహజాతం అనీ ,,ఆ సహజ ప్రేరణకు ఇతర్లను కొట్టటం ,తిట్టి బాధించటం అనేవి ప్రతీకారాలు అంటారు మాస్టారు .విజ్ఞులు దీన్ని అదుపులో పెట్టుకొంటారు .కానీ ఎక్కువ సంతోషం ,ఆవేశం కలిగినప్పుడు మనిషి ప్రమత్తుడై ఈ ప్రేరణకు లోనౌతాడు అంటారు మాస్టారు .అప్పుడు ప్రతీకార చర్య తీవ్ర రూపం పొందుతుంది ఎలా అంటే ఒకడు ‘’లంజాకొడకా ‘’అని తిడితే వెంటనే ‘’లంజా కొడకా ‘’అనటం .

  రోమన్ చక్రవర్తి అగష్టస్ కాలం లో ఒకే పోలిక ఉన్న ఇద్దరు  వేర్వేరు కుటుంబాలకు చెందిన యువకులున్నారు  .తలిదండ్రులు వేరు .అయితే ఇలా ఒకేలా ఎలా ఉన్నారని లోకులు ఆడి పోసుకొన్నారు .వాళ్ళు విని మనసు బాధపడి ,ఇద్దరూ ఒకరోజు ఒక శృంగాటకం లో కలుసుకొన్నారు . అందులో ఒకడు  రోమ్ పట్టణం వాడు రెండో వాడిని ‘’మీ అమ్మ ఎప్పుడైనా ఈ పట్నం లో ఉండేదా ?’’అని కొంచెం తూగోజిఎటకారంగా కారంగా అడిగితె ,రెండో వాడు ఊరుకుంటాడా ?మా అమ్మ రాలేదు కానీ మానాన్న ఇక్కడ కొంతకాలం ఉన్నాడు ‘’అనగా మొదటి వాడు సిగ్గుతో తలవంచుకొన్నడట .మొదటి వాడు తన తండ్రికీ రెండోవాడి తల్లికి వాడు పుట్టి ఉంటాడని  ఎద్దేవా చేస్తే రెండో వాడు ,తన తండ్రికీ అక్కడే ఉన్న వాడి తల్లికీ పుట్టి ఉంటాడని రిపార్టీ ఇచ్చాడు .’’లంజల కొడకా –ఎక్కడ కుంజర యూధంబు దోమకుత్తుక జొచ్చెన్ ‘’అన్న పద్యం కంటే పై యువకుల సంభాషణలో నర్మోక్తి బాగా పేలింది అని ఎస్టిమేట్ చేశారు మాస్టారు మునిమాణిక్యం .

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -15-11-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

 తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-7

 తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-7

 , రాజధాని కళాశాలలో అయ్యర్ నిజాయితీ ,పాండిత్యం సునిసితహాస్యం తో విద్యార్ధులను ఆకట్టుకొన్నాడు .కొ౦దరు అసూయా పరులు అయ్యర్ క్లాసులలో గోలచేయమని కొందరు విద్యార్దులను పురిగొల్పగా ,వారొక ‘’నచ్చినార్కిలియార్ ,శంకరాచార్య లతోపాటు అయ్యర్ కూడా అదే దారిలో తప్పులు చేశాడు ‘’అని కరపత్రం రాసి వదిలగా ఒక విద్యార్ధి బాధాపడుతూ అయ్యర్ కు ఇవ్వగా చిరునవ్వుతో ‘’ఆ మహానుభావుల స్థాయిలో ఈ అల్పుణ్ణీనిలబెట్టారు ‘’అనగా అందరూ పెద్దగా నవ్వారు .

   అయ్యర్ కు జీవితం ,పరిశోధనా ఏక సూత్రమే .అత్యంత సహనం ఆయన ముఖ్య లక్షణం .భారతీయ సాహిత్య వైభవం ,మత సంప్రదాయాల గొప్పతనాన్ని వీలైనప్పుడల్లా చెబుతూ ఉండేవాడు .ఒకపోలీస్ అధికారి జయసింగ్ ఇంటిపక్కన అయ్యర్ కాపురం .ఒక తమళభాషాభిమాని సింగ్  దగ్గరకొచ్చి ‘’కావడిచ్చిందు ‘’.’’తిరుప్పగళ్’’లలోని గీతాలు చదివగా ,అందులోని శృంగారానికి సింగ్ ఉగ్రుడై ,అలా౦టివి పిల్లల్ని చెడగొడతాయికనుక నిషేధించాలన్నాడు .ఈవిషయం తెలిసి అయ్యర్ ఆయన ఇంటికి వెళ్లి ,’’మన సంస్కృతిని సరిగా అర్ధం చేసుకున్నవారికే ఇలాంటి భావం కలుగుతుంది కానీ సాహిత్యాన్ని మరో పార్శ్వం నుంచి చూడాలి .సంగయుగకవులు దాన్ని ఆదరించారు .వాటిలో సాహిత్య వైభావాన్నే మనం చూడాలి ‘’అని చెప్పగా సింగ్ ప్రసన్ను డయ్యాడు .కొందరు అవాంఛనీయ కవిత్వం రాసి విద్యార్ధులను చెడగొడుతున్నారు ‘’అనగా అయ్యర్ ‘’మీరు తమిళ విరోధులని చాలా మంది  నాతొ చెప్పగా అలా అనకూడదు అన్నాను .మీరు చెప్పినట్లు సంగ సాహిత్యం లో స్త్రీ వర్ణ ఎక్కువగానే ఉంది. అదే చదివి అభిప్రాయానికి రాకూడదు .నవరసాలలో శృంగారం ఒకటి. సంస్కృత కావ్యాలలోనూ ఇది పుష్కలం .సంగకాల కృతులన్నీ నేను పూర్తిగా చదివాను. అందుకే  తమిళులు నన్ను అభిమానిస్తున్నారు .స్త్రీ వర్ణనలో సాహిత్య సౌరభం ,సందర్భ శుద్ధి నే చూడాలి .మీరు సాహిత్యాన్ని నాశనం చేయాలనుకొంటే సంస్కృత ,తమిళ సాహిత్యాలేవీ మిగలవు ‘’అనగా సింగ్ అన్నిటా శృంగారం ఉందా అని అడిగితె అయ్యర్ ‘’అశ్లీలం వేరు ,రసానందం వేరు. జీవితం లో ప్రేమ ముఖ్యమైనది. పురాణాలు కావ్యాలు దీనినే చెప్పాయి .భగవంతుని ప్రియుడుగా తానూ ప్రేయసిగా వర్ణించి ఆళ్వార్లు ,నాయనార్లు గీతాలు రచించిపాడారు .తేవారం ,తిరువాచికం లో,దివ్య ప్రబందాలలోనూ శృంగారం ఉంది  .అక్కడ ఉన్నది దేహం ,ఆత్మల శృంగారం ‘’అని అయ్యర్ చెప్పగా ‘అదంతా తనకు గందరగోళ౦గా ఉందని సింగ్ అంటే ,అయ్యర్ ‘’భారతీయ రసతత్వం తెలుసుకొనే తీరిక మీకు ఉన్నట్లు లేదు .గ్రామస్త్రీలు ,కూరగాయలు పెరుగు పాలు అమ్మే స్త్రీలు రవికలు కట్టుకోరు .చీరలు మాత్రమె కడతారు .చూసే వారి కళ్ళల్లో  దోషమే కానీ వారిలో దోషం లేదు ‘’అనగా ‘’నిజమే ‘’అని సింగ్ అనగా ‘’దేవాలయ గోపురం మీద చెక్కిన శిల్పాలు స్త్రీల సర్వా౦గా లను ప్రదర్శించినా ,ఎవ్వరికీ నీచంగా అనిపించదు. తల్లి రొమ్ము మీద ఆడుకొనే పసి వాడికి వేరే భావం రాదు ‘’ప్రణయం ద్వారా భగవద్దర్శనం ‘’అనేది భారతీయ సంస్కృతీ ,తత్వశాస్త్రం .ఏవో కొన్ని వర్ణనలు మాత్రమె చూసి ఆ కావ్యాలు నిషేధించాలనుకొంటే సంస్కృత ,తమిళ సాహిత్యాలు సముద్రం లో పాతిపెట్టాల్సిందే ‘’అనగా తన అజ్ఞానాన్ని క్షమించమని, తత్వం ఎదో ఇప్పుడు బోధపదిందని కృతజ్ఞుడను అని పోలీసు అధికారి సింగ్ మనస్పూర్తిగా అన్నాడు .

  మీనాక్షి సుందరం రాసిన ‘’త్యాగరాజ లీల ‘’అనే అనువాద కృతిని అయ్యర్ ప్రచురించి ,ఖ్యాతి పొందాడు ఇది ఆయన ప్రచురించినవాటిలో తలమానికం .తిరువారూర్ లో వేంచేసి ఉన్న శ్రీత్యాగరాజ స్వామివారి 360కథలలో పిళ్ళై 14మాత్రమె అనువాదం చేశాడు.దీనినే అయ్యర్ ప్రచురించాడు .

        మహామహోపాధ్యాయ అయ్యర్

  1906లో స్వామినాధ అయ్యర్ కు ప్రభుత్వం ‘’మహాహోపాధ్యాయ ‘’బిరుదునిచ్చిసన్మానించింది . అప్పటివరకు సంస్కృత విద్వాంసులకు మాత్రమె ఇస్తున్న ఆ బిరుదును ఇప్పుడు మొదటిసారిగా తమిళ విద్వాంసుడు అయ్యర్ కు దక్కిన అరుదైన గౌరవం .భాషాభిమానులందరూ మహా సంతోషించారు.తమిళ భాషకు దక్కిన అత్య౦త విలువైన గౌరవం ఇది ..వేల్స్ రాజదంపతులు భారత్ పర్యటనకు వచ్చారు .మద్రాస్ లో గవర్నర్ నివాసం లో హేమా హేమీలతో గొప్ప విందు జరిగింది .ఇండియన్స్ చాలా మంది నివసించే మద్రాస్ నగర ప్రాంతాన్ని ఆంగ్లేయులు ‘’బ్లాక్ టౌన్ ‘’అని పిలిచేవారు .వినటానికే కర్ణ కఠోరంగా ఉన్న ఆపేరుమార్చి రాజురాకసందర్భంగా ‘’జార్జి టౌన్ ‘’అని పేరుపెట్టారు .అయ్యర్ కు స్వర్ణకంకణం ప్రదానం చేశారు .అయ్యర్ ను   సత్కరించటానికి   రాజధాని కాలేజిలో  బ్రహ్మాండమైన సభ జరిగింది .తమిళమహాకవి,స్వదేశమిత్రన్ పత్రిక సంపాదకుడు  సుబ్రహ్మణ్య భారతి హాజరయ్యాడు .ఉప్పొంగిపోయిన భారతి అయ్యర్ పై మూడు పద్యాలు అప్పటికప్పుడే రాసిచదివి  అభిమందించాడు –

1-‘’సవితలో కాంతి, తేనెలో తీయదనం ఉన్నదనీ –దేవతలు చిరంజీవులనీ ,-ఎవరైనా ప్రశంసిస్తారా ?కుంభ ముని అనదగ్గ స్వామి నాథ పండితుడు –కీర్తి గడించి నందుకా ఇంత సంబరం ?’’

2-తమిళ ప్రశస్తి తెలియని అన్యులు –ప్రకృతం మన పాలకులైనా –కుంభకోణం స్వామి నాథుని గౌరవించారు –మహామహోపాధ్యాయ బిరుదమిచ్చి –పా౦   పాండ్యుకాలం లోజీవించి ఉంటె  -ఈ పండితునికి ఇంకెంత గౌరవం లభించేదో ?

3-మదిని విచారించకు –నిధిలేదనీ ,సౌఖ్యాలు లేవనీ –కుంభకోణం స్వామినాథ సూరీ –తమిళభాష మనినంతకాలం –తెలుస్తుంది నీకు కవుల ప్రశంస –లభిస్తుంది వారి కృతజ్ఞత –చిరంజీవి వయ్యా నీవు అయ్యరూ ‘’

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -15-11-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-6

తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-6

కుంభ కోణం కాలేజి అధ్యక్షుడు వి.నాగోజిరావు సంగీతం లో దిట్ట .కొన్ని సంస్కృతతగ్రంథాలు ముద్రించాలనుకొని ,అయ్యర్ సాయం కోరగా చక్కగా పరిష్కరించి ముద్రణకు తోడ్పడ్డాడు .అయ్యర్ కు ఏదైనా సాయం చేయదలచి ‘’మీరు పాఠ్య పుస్తకాలు రాస్తే మీ రాబడీ పెరుగుతుంది , ,మంచి పుస్తకాలూ వచ్చి ఉభయ తారకంగా ఉంటుంది ‘’అనగా ‘’ధన్యవాదాలు డబ్బు రావటం మొదలైతే నా తమిళ పరిశోధన ఆగిపోతుంది నిరాకరిస్తున్నందుకు మన్నించండి ‘’అని వినయంగా చెప్పాడు .1890లో లార్డ్ హేవక్ కుంభకోణం కాలేజీని సందర్శించగా ,నాగోజి కోరికపై అయ్యర్ తమిళం లోస్వాగత పద్యాలు రాసి చదవగా ,హాజరైన గవర్నర్ హేమాహేమీలందరూ  సముచితంగా ఉన్నదని మెచ్చారు .గవర్నర్ తో అయ్యర్ ఫోటోకూడా తీశారు .

  తమిళ వ్రాత ప్రతులున్నాయని అయ్యర్ కి ఉత్తరం రాస్తే డబ్బులు పంపి పంపమనే వాడు .అవి వచ్చేవికావు .ఒకపండితుడికి డబ్బుప౦పి తే  శరభ పురాణం పంపాడు  .అది ఉపయోగపడలేదు .1901లో మదురైలో తమిళసంఘం ఏర్పడి ప్రతి ఏడాదీవార్షికోత్సవాలు జరిపారు .తేవర్ ఆహ్వానం పై అయ్యర్ వెళ్లి పాల్గొనేవాడు .రెండవ రోజు కవి సమ్మేళనానికి అధ్యక్షత వహించేవాడు .ఇలా కొన్నేళ్ళు గడిచాయి .1900లో మద్రాస్ లో  ద్రావిడ భాషా సంఘం స్థాపించగా విద్యా శాఖకు చెందిన శేషాద్రి ఆచార్,ఫాదర్ జే లార్స్ లు కార్యదర్శు లైతే అయ్యర్ గౌరవ సభ్యుడు . అయ్యర్ లెక్చరర్ గా మంచి పేరు కీర్తి పొందాడు .ఆయన మద్రాస్ వస్తే బాగుంటుంది అని విద్యావేత్తలు భావించారు .శేషాద్రి ఆచార్ ఈ విషయం అయ్యర్ కు తెలియజేస్తే ‘’నా ఉద్యోగం ఇక్కడైతే మద్రాస్ కు ఎలా రాను?’’అని అంటే ‘’మీరుఒప్పుకుంటే ,మద్రాస్  రాజధాని కాలేజికి ట్రాన్స్ఫర్ చేయిస్తాను’’అన్నాడు అక్కడ ఒక వృద్ధ తమిళ పండితుడు ఉన్నాడు ఆయనకు ఇబ్బంది కలుగుతుందని మర్యాదగా తిరస్కరించాడు అయ్యర్ .

 1902 వేసవి సెలవలలో పారిస్ కు చెందిన జూలియస్ విన్సన్ అనే శిష్యుడు వచ్చాడు .వీరిద్దరి మధ్య ఉత్తరప్రత్యుత్తరాలు జరుగుతున్నాయి .అప్పుడు తంజావూర్ కలెక్టర్ లయోనేల్ బైబర్ట్ కు  అతిధిగా ఉన్నాడు లిన్సేన్ .తానుపా౦ డిచ్చేరి,కారైక్కాల్ వగైరాచూసివస్తానని కాలక్షేపానికి ఏదైనా పుస్తకం ఇవ్వమని అయ్యర్ నికోరితే ‘’పాత కా౦చీపురాణం ‘’కాగిత ప్రతి ఇచ్చాడు  .అది చదివి  రిజిస్టర్డ్  పోస్ట్ లో జాగ్రత్తగా పంపాడు .అయ్యర్ తమిళ సాహిత్య గౌరవం కోసం ఎడతెగని  కృషి చేస్తున్నాడని చెప్పాడు .1903లో మూడవ ఎడ్వర్డ్ పట్టాభి షేకం సందర్భం గా తంజావూర్ లో కలెక్టర్ ఆధ్వర్యం లో జరిగిన సభకు అయ్యర్ ను ఆహ్వానించగా హాజరుకాగా, కలెక్టర్  మిళభాషకు అయ్యర్ చేస్తున్న కృషిని గుర్తించి గౌరవ పూర్వకంగా ఒక ప్రశంసా పత్రాన్ని బహూకరించాడు .ఇదీ మొదటి అఫీషియల్ రికగ్నిషన్ .

  సంగ కాలపు కృతి అయిన ‘’ఐ౦గురు నూరు ‘’ను అయ్యర్ పరిశోదిస్తున్నప్పుడు యాళ్పాళం అంటే జాఫ్నానుంచి ఒకాయన సంగ్రహం గా ప్రచురిస్తే,మరికొన్ని ప్రచురించే అవకాశాలు ఉంటాయని జాబు రాయగా ,బాగుంది అనుకోని 1902లో సంగ్రహ ప్రతి ప్రచురించాడు .అది చూసిన జాఫ్నా ఆయన ‘’ఇంత సంగ్రహం గా అని నేను అనుకోలేదు ఇందులో నాదే తప్పు ‘’అని ఉత్తరం రాస్తే అయ్యర్ 1903జూన్ లో సమగ్ర ప్రచురణ వెలువరించాడు .దీన్ని త్యాగరాజ చెట్టికి కృతజ్ఞతగా అంకితమిచ్చాడు అయ్యర్ .

   మద్రాస్ అయ్యర్

1903 వేసవిలో మద్రాస్ రాజదానికాలేజి తమిళ అధ్యాపకుడు శ్రీనివాసాచారి రిటైర్ అయ్యాడు . ,అయ్యర్ ‘’పదిట్రుపత్తు’’పరిశోధనలో మునిగి ఉండగా  .కాలేజి ప్రిన్సిపాల్ హేన్స్ మన్ వచ్చి ,అయ్యర్ ను మద్రాస్ రాజదానికాలేజికి బదిలీ చేస్తూ ఆర్డర్ వచ్చిందని చెప్పి, తనతర్వాట ఇక్కడ ఎవర్ని నియమించాలో సూచి౦చ మనీ కోరాడు .23ఏళ్లుగా ఉంటున్న పట్టణం మిత్రబృందం ,మఠాధిపతులను ను వదిలి వెళ్ళటం బాధగానేఉందని చెబితే ‘’మద్రాస్ మీ పరిశోధనకు బాగా ఉపయోగపడుతుంది ‘’అని నచ్చచెప్పగా సరేఅన్నాడు

  మద్రాస్ లో తిరు వట్టీశ్వరన్ పేటలో తనపిన తండ్రి ఇంట్లో బస చేసి కాలేజిలో చేరాడు అయ్యర్ .,కుంభ కోణం కాలేజిలో తమిళ క్లాసుకు ఎత్తైన వేదిక ,టేబుల్, కుర్చీ ఉండేవి .ఇక్కడ అవేవీ లేనేలేవు .ప్రిన్సిపాల్  బిల్డర్ బెల్ కు తెలియ జేయగా వెంటనే  బీరువాతో సహా అవన్నీ ఏర్పాటు చేశాడు .1904జనవరిలో కోవిల్ వీధి అద్దె ఇంటికి  మారాడు.జూన్ లో పదిత్రు పట్టు ప్రచురించాడు .1905 మొదట్లో తల్లి సరస్వతి అమ్మాళ్ చనిపోగా ,,శ్రీనివాస అయ్యంగార్ పరామర్శించటానికి వచ్చి అయ్యర్ ప్రచురించిన ‘మనిమేకలై ‘’ఎం. ఏ .కి పాఠ్య పుస్తకంగా నిర్ణయింపబడిన మంచి వార్త చెవినవేశాడు .దీనిపై వచ్చిన డబ్బు తల్లి అంత్యక్రియల ఉపయోగ పడింది .

  సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-11-21-ఉయ్యూరు . ,  ,

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రతి,చు౦బన హాస్యం

రతి,చు౦బన హాస్యం
జుగుప్స కలిగించేవి హాస్య ప్రోద్బలాలు ఎలా అవుతాయని ఒక డౌట్ఉంది .అవి సభ్యసమాజం ముందు చదివితే జుగుప్స కల్గిస్తాయికానీ ,ఒంటరిగా చదివితే ఏహ్యం కంటే తమాషా గా ఉంటాయి .మన రహస్యా౦గాన్ని ఇతరులముందు చూపించటానికి సిగ్గుపడతాం .కానీ బాత్ రూమ్ లో ఫ్రెంచ్ బాత్ అదే నండీ బట్టలిప్పి స్నానం చేస్తుంటే జుగుప్సకలిగించదు గర్వం అనిపించచ్చు .కనుక ఆతరహా రచన హాస్యం కి౦దేజమ అన్నారు మునిమాణిక్యం మాస్టారు .ఉత్తమ హాస్యం కాకపోయినా ఇదో తరహా హాస్యమన్నారు మాస్టారు .రతి ,చుంబన రచనలు చదూతుంటే మనమే చేస్తున్న ఫీలింగ్ వచ్చి ఆనందం వస్తుందన్నారు సార్.’
కామక్రీడానుభూతి హాస్యం
కల్లుతాగినా ,ఆనందం ఉపనిషత్తులు చదువుతున్నా ఆనందం కలుగుతుంది .ఈ రెంటికి భేదంహస్తి మశకాంతరం .సంభోగ చుంబనాలువంటి శృంగార క్రియలు సహజమైనవి .వాటి తృప్తికోసం మనసు రెపరెప లాడుతుంది .అవి సబ్ కాన్షస్ లో ఉండి అల్లరి పెడతాయి .బలవంతంగా వాటిని అణచుకొంటాం..బూతు రచనలు రాయటం, చదవటం వలన ఆసహాజ ప్రేమకు మానసికంగా ప్రతీకారం జరుగుతుందని సైకలా జికల్ గా ఫ్రాయిడ్ విధానం లో మాస్టారు చెప్పారు .నాయకానాయికలు చేసే ఆపనులు మానసికంగా మనకూ ఆనందాన్ని తృప్తినీ,అనుభూతినీ ఇస్తాయి అన్నారు మునిమాణిక్యం .కనుక ఆ రచనలు దిండుకింద పెట్టుకొని చలం పుస్తకాలు లాగా గుట్టు చప్పుడుకాకుండా చదువుతాం .ఇందులో హాస్యం అశ్లీలమే అయినా ,మానసిక ఆనందం తృప్తి ఇస్తాయని మాస్టారి తీర్పు .
తిట్లతో హాస్యం
ఒకరినొకరు తిట్టుకొంటుంటే వినే మనకు మహా సరదాగా ఉంటుంది .ఆ తిట్లలో న్యాయం ఉంటె ఆనందం ,హాస్యం మరీ ఎక్కువ .వ్యక్తిగతం గా కాకుండా వాడు చేసిన అధర్మాన్నో, అవినీతినో పట్టుకొని తిడుతుంటే మహా మజాగా ఉంటుందన్నారు మాష్టారు .హేమా హేమీ కవులు ఒకరినొకరు తిట్టుకొంటే అసభ్యం జుగుప్స అని పించక నవ్వే వస్తుంది .ఐతే ఇవి శాశ్వత ఆనందాన్నివ్వలేవన్నారు సార్.అవి చివరికి వ్యక్తి దూషణలోకి దిగి అసహ్యం కలిగిస్తాయి .ఆరచనలను తిరస్కరిస్తాం కూడా .అకవులు మన్నన కోల్పోయి సభ్యసమాజం లో పల్చనైపోతారు .వాటికి శాశ్వత విలువ ,సాహిత్య విలువ ఉండవు .సాహిత్యోద్యానవనం లో అవి కలుపు మొక్కలు లాంటివి అన్నారు మునిమాణిక్యం గారు . సంస్థలు తప్పు చేసినా, అవినీతిలో కూరుకుపోయినా ధర్మానికి విరుద్ధంగా ఉన్నా ,సంప్రదాయాన్ని పాటించకపోయినా తిట్టే తిట్లు వినటానికి చమ్మగానే ఉంటాయట మాస్టారు ఉవాచ .కందుకూరి, చిలకమర్తి ఈతరహ హాస్యం పుష్కలం గా పండించారు .ఆహాస్యం జనరంజకం నిర్మలం శుద్ధం కాకపోవచ్చు .ఒక ప్రయోజనాన్ని కోరే హాస్యం ఉత్తమమైనది కాదు కానీ హాస్యమే అని పించు కొంటుంది అని మాణిక్య సదృశంగా చెప్పారు హాస్య ముని మాణిక్యం .
ఇది శబ్దాశ్రయ హాస్యం లో తక్కువరకానికి చెందినది .అర్ధ వైభవం రసపుష్టి వ్యంగ్యమర్యాద.శ్లేష సొంపుపు కానీ ఏవీ ఇందులో ఉండవు .నిందా సూచక అసభ్య ప్రయోగమే దీనికి ప్రాణం .మంచి కవిత్వాన్ని ఆదరించలేని వాడిని చౌడప్ప –‘’విద్దెల మేలెరుగని నరు –డేద్దేగా,గడ్డి తినెడి దెద్దా-పసులందెద్దుకు కొంత వివేకము –గద్దప్పాకుందవరపు కవి చౌడప్పా ‘’పద్యం లో తిట్టినా కాస్త హాస్యం చిలికింది .అలాగే ‘’ఇయ్యగ ఇప్పంచగల –యయ్యలకే గాని మీసమందరికేలా-రొయ్యకు లేదా మీసము కయ్యమునకు కవి చౌడప్పా ‘’కూడా .
మునిమాణిక్యం మాస్టారు గారికి కృతజ్ఞతలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -13-11-21-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-5

తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-5
జీవక చింతామణి పరిష్కరణ ,ప్రచురణ పూర్తయ్యాక అయ్యర్ ‘’పత్తుపాట్టు ‘’అనే కడ(చివరి ) సంగం కాలం లో వెలసిన సంకలనాన్ని పరిశీలించాడు .వ్రాత ప్రతులకోసం మారుమూల గ్రామాలు తిరిగాడు .అయ్యర్ అంటే ఈర్ష్య కలిగిన కొందరు జీవకచింతామణి పై వ్యాఖ్యలు చేశారు .శైవంలో పుట్టిపెరిగినవాడు జైనం మీద పరిశోధన ఏమిటని వారి అభ్యంతరం .ఈలేఖను మిత్రుడు సాధు శేషయ్యర్ కి చూపిస్తే అలాంటి విమర్శలకు సమాధానం ఇవ్వవద్దని ఇస్తే వాళ్ళకే ప్రచారం పెరుగుతుందనీ ,అయ్యర్ కార్యక్రమానికి భంగం కూడా కలుగుతుందని సాధు సలహా ఇచ్చాడు .పత్తుపాట్టు పరిశీలనలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు .మద్రాస్ లో దాన్ని ప్రచురించాలనుకొని సమగ్రంగా గ్రంధం లభించకపోయినా నచ్చినార్కనియర్ వ్యాఖ్య ఆధారం గా మూలం లోని పద్యాలను నిర్ణయించి ఆరునెలలు విపరీత శ్రమ చేసి 1889జూన్ లో పూర్తి చేశాడు .
దీనితర్వాత ప్రసిద్ధ ‘’సిలప్పాది కార ‘’కావ్య పరిశీలన కు పూనుకొని ,అడియాక్కు నల్లార్ రాసిన వ్యాఖ్యానం సంపాదించి మూలప్రతులకోసం గాలించాడు కానీ అపూర్వ పద పట్టిక ఒకటి దొరికింది .దాని సాయం తో కొన్నిపద్యాల విశేషార్ధాలు గ్రహించాడు .1891వేసవి లో తాళపత్ర ప్రతులకోసం తిరునల్వేలి జిల్లాలో పర్యటించాడు .క్రిములు కొట్టేసిన రెండు ప్రతులు దొరికాయి .సార నిర్ణయంచేసి ముద్రణ మొదలుపెట్టాడు .కుంభకోణం ఉద్యోగం చేస్తూనే ఈపనులు చేశాడు .విశ్రాంతి దొరికితే చాలు కావ్య పరిష్కరణమే .మహా బృహత్కార్యాన్ని అత్యంత సమర్ధ వంతంగా నిర్వహింఛి ముద్రణ పూర్తి చేశాడు అయ్యర్ .మన వేటూరి ప్రభాకర శాస్త్రి గారు గుర్తుకు వస్తారు .
సిలప్పాదికం తర్వాత మనిమేకలై,పురనానూర్ లపై దృష్టిపెట్టి ,రెండవదాని లోని 260పద్యాలకు పూర్వ వ్యాఖ్య సంపాదించాడుకానీ తర్వాత పద్యాలు అయోమయంగానిపించాయి .అప్పటికే సంగం సంస్కృతీ ,పదజాలం కరతలామలకం అవటం తో 1893జనవరిలో మద్రాస్ లో ముద్రణ మొదలుపెట్టగా,సెప్టెంబర్ లో అయ్యర్ తల్లి కాలగతి చెందగా ,మరోముఖ్య స్నేహితుడు పూండి అరణ౦గనాథ మొదలియార్ కూడా చనిపోగా ,గండాలన్నీగడిచి 1894సెప్టెంబర్ లో ముద్రణ పూర్తిచేశాడు అయ్యర్ . చారిత్రాత్మక అంశాలతోపాటు విశేష అంశాలు కూడా రాశాడు .ఇది వెలువడిన తర్వాత పండితులు సంగయుగానికి చెందిన అనేక విమర్శ ,పరిశోధనాత్మక గ్రంథాలు రాసి ప్రచురించారు .
తర్వాత బౌద్ధమత ధర్మాల పెన్నిధి మనిమేకలై కావ్య పరిష్కరణ ప్రారంభించాడు. బౌద్ధమత గ్రంథాలను విస్తృతంగా అధ్యయనం చేసిన మద్రాస్ లో ఉన్న ఆచార్య మళూర్ రంగాచారి అయ్యర్ గారిని కలిసి సందేహాలు తీర్చుకొని సంతృప్తి చెందాడు .ఈలోగా ‘పురుప్పోరుళ్ వెణ్బా మలై ‘’ని ప్రచురించాడు అయ్యర్.1896జూన్ లో మనిమేకలై ను ముద్ర ణకిచ్చాడు .బౌద్ధమతాన్ని గురించి తనకు తెలిసిన అంశాలు ,అపూర్వ పద పట్టిక, అకారాది అక్షర క్రమం లో సూచిక తయారుచేసి1898లో ప్రచురించాడు .తర్వాత 59 తమిళ కావ్యాలనుంచి ,29 సంస్కృత గ్రంథాలనుంచి కొన్ని భాగాలుఎన్నుకొని,పరిష్కరణ లో చేర్చి కఠిన శబ్దాలకు అర్ధాలను వివరంగా రాశాడు .కావ్య కధ ను వచనం లో కూడా రాసి ప్రచురించాడు .చదువరికి ఇదిబాగా తోడ్పడుతు౦దికావ్యాన్ని పూర్తిగా అర్ధం చేసుకోవటానికి .
తర్వాత ఐం గురునూరు ,పదిట్రుస్సత్తు,ఆగనానూరు ,పెరుం గదై అంటే బృహత్కధ మొదలైనవి పరిశోధించాడు .వీటిలో మొదటిది తమిళకావ్యాలలో ప్రధాన భౌగోళిక భాగ పంచకం గురించి 500 గీతాలు .ఒక్కొక్క భాగం గురించి వందపద్యాలున్నాయి .చేరరాజుల గొప్పతనాన్ని చెప్పేది పదిట్రుసత్తు .ప్రణయం గురించిచేప్పేది ఆగనానూరు .పెరుం గదై లో ఉదయనుడి కథ ఉంది .వీటిని ఒక్కొక్కటిగా ప్రచురించాలని ప్రాచీన తమిళ చరిత్ర ,సంస్కృతీ వగైరాలు క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు .
గ్రామదానాన్ని వద్దన్న అయ్యర్
రామనాథపురం రాజకుటుంబానికి చెందిన,మదురై లో తమిళ సంగ స్థాపకుడు ,చాలాకావ్యాలు ప్రచురించిన పొ.పాండిత్తురై తేవర్ అనే సహృదయుడు మని మేకలై ,పురుప్పోరుళ్,వెణ్బా మాలై ల ప్రచురణకు సాయంచేశాడు. 1898లోతేవర్ తల్లి చనిపోయింది .పలకరించటానికి అయ్యర్ రామనాథపురం వెళ్ళాడు .ఈయన భవనం పేరు ‘’సోమసుందర విలాసం ‘’.ఇక్కడ నెలరోజులు ఉండి ఉదయం సాయంత్రాలలో తేవర్ తో అయ్యర్ సాహిత్య చర్చ చేశాడు .ఆయన చాలా ఆనందించి తన దుఖం తగ్గింది అని చెప్పాడు .తేవర్ ఒకరోజు రాజు సేతుపతిని కలవటానికి వెడితే ఆయన ఒక ముఖ్య విషయం చెప్పగా ఆయన సరాసరి అయ్యర్ నుకలిసి ‘’మీకో శుభ వార్తతెచ్చాను ‘’అనగా ‘’ఏదైనా కొత్తపుస్తకం పరిష్కరించాలా ?’’అని అమాయకంగా అడిగాడు అయ్యర్ .’’ఒకటికాదు ఎన్నైనా పరిష్కరించుకోవచ్చు ఇకమీరు. రాజుగారు మీకు ఒక గ్రామాన్ని దానం చేయాలనుకొంటున్నారు .ఇన్నాళ్ళూ మీకుచెప్పుకోతగిన సాయం చేయలేకపోయానని రాజుగారు బాధ పడుతున్నారు .గ్రామదానం గురించి రాజాగారు నన్ను మీకు తెలియ జేయమన్నారు ‘’అన్నాడు ఆనందంగా తేవర్.వెంటనే ఎగిరి గంతేసి సరే అనకుండా ‘’ధన్యవాదాలు చెప్పండి .నేనొకసారి వారితో మాట్లాడుతాను ‘’అన్నాడు అయ్యర్ . సేతుపతి ని సందర్శింఛి అయ్యర్ ‘’తేవర్ గారిద్వారా మీ మనసులోని మాట తెలిసింది. నాపై ఉన్న గౌరవానికి ధన్యవాదాలు .కానీ నాకు ప్రభుత్వం జీతం ఇస్తోంది .గుట్టుగా సంసారం చేసుకొంటున్నాను .మీ కోరికను తిరస్కరించినట్లు భావించకండి .సంస్థానం స్థితిగతులు నాకు తెలుసు .మీ ఔదార్యాన్ని భరించలేను ‘’అని వినయంగా చెప్పాడు .నిజంగానే సంస్థాన ఆర్ధిక స్థితిబాగాలేదు .’’సరే మీ ఇష్టం ‘’అని రాజు అయ్యర్ కు వీడ్కోలుపలికాడు .గ్రామం కోల్పోయానే అనే భావం ఏనాడూ అయ్యర్ మనసులోకి రానే లేదు .అదీ మేరునగ ధీరత్వం అంటే .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -12-11-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆడంబర పద ప్రయోగ హాస్యం

ఆడంబర పద ప్రయోగ హాస్యం

మామూలు మాటలుకాకుండా పెద్ద పెద్ద మాటలు ఉపయోగించి మాట్లాడితే ఆ వాగాడంబరం వలన వికృతి తో హాస్యం పుడుతుంది అన్నారు మునిమాణిక్యం మాస్టారు .పానుగంటి వారి సాక్షి వ్యాసాలలో ఇది పుష్కలం .ఉదాహరణ –‘’దోమలన్నీ సభ చేసినవి ఆ సభకు కిష్కింధ నుంచి కొన్ని దోమలు వచ్చి చేరినవి .వాటి వర్ణన –శ్రీమాన్ మహా మండలేశ్వరుడు ,మహా రాజాధిరాజు ,క్రీర పటీర నీహార చంద్రికాసాంద్ర ధిక్కార జగద్విశ్రాంత యశస్సాన్ద్రములైన కిష్కింధ మశక మహా రాజులు౦ గారి విడిది యది ‘’.

అప్రసిద్ధ పద ప్రయోగ హాస్యం –ప్రసిద్ధం కాని వికృతమైన పదాల వాడకం వలన రచన వైపరీత్యం పొంది ,సుమనోజ్ఞ హాస్యం వస్తుంది అన్నారు మాస్టారు .సంగీతం బాగాపాడే వాడిని ‘’వాడిగొంతు బాగుంది ‘’అంటే బాగుంటుందికాని ‘’వాడి పీక బాగుంది ‘’అంటే నవ్వుకోలేక చస్తాం .భోజనం చేశాడు అని మామూలుగా అనే దాన్ని ‘’వాడు సాపాటు చెల్లించాడు ‘’అనీ ‘’మూతి తుడుచుకొన్నాడు ‘’అనికాని ‘’పిండా కూడు మెక్కాడు’’అని అంటే నవ్వుకొంటాం .

 మనిషి తినే ఆహారాన్ని గురించి భమిడిపాటి వారు ‘’ప్రాణి ప్రాణాన్ని పోషిస్తుంది .పెద్ద ప్రాణి చిన్న ప్రాణిని మింగేస్తుంది .మానవుడు ప్రాణులను ,ప్రాణేతరులనూ తినేస్తాడు .మనిషి ఇంకోమనిషిని తినటం కూడా కొన్ని చోట్ల ఉంది .మనకు ఆఆచారం లేదనుకోండి .ఇంకో మనిషిపై కోపం వస్తే వాడిని తినేట్లు చూస్తాడు కాని తినడు .మనిషి జంతువులను ఫలహారం చేస్తాడు .తన్నే తినేస్తుందేమో అనే భయంతో కొన్నిటి జోలికి పోడు.ఆ భయం లేకపోతె ఏ జంతువునైనా చప్పరిస్తాడు .గాలిలో తిరిగే పక్షుల్నీ, నీటిలోని చేపల్నీ తింటాడు .చెట్ల మొదళ్ళ నుండి చివురుదాకా మేస్తాడు ‘’

అప్రయుక్త ప్రయోగ హాస్యం –అంటే ఉపయోగి౦పరాని మాటలు వాడటం .మంచి శబ్దమే ఒక చోట బాగుంటుంది మరో చోట బాగుండదు .’’సన్ ఆఫ్ ది సాయిల్ ‘’అనే మాటను మట్టి కొడుకులు అనీ ,’’కూల్ హెడేడ్ ఫెలో ‘’ ను చల్లని తలగలవాడు అంటే బోల్డు హాస్యం పుడుతుంది .మన మాజీ రాష్ట్ర పతి సంజీవరెడ్దిగారు నెహ్రు ప్రసంగాన్ని సభలో తర్జుమా చేస్తూ ‘’కోల్డ్ వార్ ‘’ను ‘’శీతల యుద్ధం ‘’అని ట్రాన్స్లేట్ చేసి చెప్పారని పేపర్ వార్త నేనూ చదివాను  .

 ఒక హాస్య చిత్రం లో మంగలి షాపు దగ్గర బోర్డుపై ‘’ఇక్కడ తలా, వెంట్రుకలు నరకబడును ‘’అని ఉంటె చదివి నవ్వు తన్నుకొస్తుంది ‘’తలవెంట్రుకలు ‘’కు వచ్చిన తిప్పలు ఇది .అరవ హోటలు బయట ‘’ఇక్కడ కూడు వేయబడును ‘’అని ఉన్నా ,ముఖ క్షవరానికి బదులు ‘’ముఖము కోయబడును ‘’అని ఉన్నా నవ్వే నవ్వు .

 అశ్లీల పద ప్రయోగ హాస్యం –అశ్లీలాలు అంటే బూతులు .ఇవి కావ్యాలలో  నిషిద్ధాలు .కానీ బూతుకావ్యాలూ మనకవులు బాగానే రాశారు ‘’బూతు రచనలు ఉత్తమ హాస్యర రచనలు గా పరిగణి౦చిన రోజులున్నాయి ‘’అని మాష్టారు ఢంకా బజాయించి చెప్పారు .’’ఒకింత బూతాడక దొరకు నవ్వు పుట్టదు ధరలో ‘’,’నీతులూ ,బూతులు ,లోక ఖ్యాతులురా కుందవరపు కవి చౌడప్పా ‘’బూతు కవితా పితామహుడు చౌడప్ప .ఆయన తర్వాత చాలా మంది రాశారు ఇవి రమణీయాలూ కావు,రమణీయార్ధకాలూ కాకపోయినా నవ్వు పుట్టిస్తాయి అనటం లో సందేహం లేదు .కాని అవి ఉత్తమ రచనలు కానే కావు .అశ్లీలార్ధ స్పురణతోబలహీనమైన నరాలలో ఎదో చలనం కలిగి చక్కిలిగింత పెట్టినట్లు నవ్వుతాము ‘’అని మునిమాణిక్యం వారు స్పష్టంగా చెప్పారు .ఈకాలం లో అసెంబ్లీలో  బయటా మహామాత్య శిఖామణులు ,సభ్యులు బూతులు మాట్లాడుతుంటే నవ్వు రావటం లేదు జుగుప్స కలుగుతో౦ది కదా .

 మునిమాణిక్యం మాస్టారు గారికి కృతజ్ఞతలతో

 మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -11-11-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-4

వాడుదురై ,కుంభ కోణాలలో అధ్యాపకత్వం

అయ్యర్ కోసం సుబ్రహ్మణ్య దేశికర్ ఒక ఇల్లు కట్టించాడు .1877నవంబర్ లో అయ్యర్ భార్య ,తన తలి దండ్రులతో అక్కడ కాపురం పెట్టాడు .కుటుంబానికి కావలసినవన్నీ మఠం సమకూర్చేది .దేశికర్ అభిమానానికి ఇంటిల్లిపాదీ సంతోషించారు .ఇంతలో మడురైలోమీనాక్షి అమ్మవారి కుంభాభిషేకం దగ్గరకురాగా దానితోపాటు ఇతర క్షేత్రాలు దర్శించాలని దేశికర్ భావించి అయ్యర్ నూ రమ్మన్నాడు .కుంభాభిషేకం మహోత్సాహంగా జరిగింది అక్కడ న్యాయమూర్తి మణి అయ్యర్ తో పరిచయమేర్పడింది .మధురనుంచి తిరునల్వేలి వెళ్లి అక్కడా మఠంలో ఉన్నారు .చాలామంది కవిపండితులు దేశికర్ దర్శనానికి వచ్చేవారు .అక్కడినుంచి సెవందిపురం వెళ్లగా అక్కడ మఠం సహాయాధిపతి వేణువనలింగ తమ్బిరాన్  ఒక నూతనభవనం నిర్మించి దేశికర్ పేరు పెట్టాడు .ప్రారంభోత్సవానికి వచ్చిన కవులంతా దాన్ని ప్రశంసిస్తూ పద్యాలు చెబితే ,అయ్యర్ వాటిని సేకరించి ముద్రించాడు .దీనితో పరిష్కరణ కార్యానికి శ్రీకారం చుట్టాడు అయ్యర్ .దాని మొదటిపేజీలో ‘’వేణువనలింగ స్వాముల కార్యదీక్ష సుబ్రహ్మణ్య దేశికర్ మాహా వేత్రుత్వం కవుల కవిత్వాలను పరిశీలించి ఈ పుస్తకాన్ని తిరువాడుదురైవెంకట సుబ్బ అయ్యర్ పుత్రుడు స్వామినాథ అయ్యర్ పరిష్కరించగా , తిరునల్వేలి ముత్తమిళాకర ముద్ర శాలలో బహుధాన్య సంవత్సరం లో ముద్రింపబడింది ‘’అని రాశాడు .

  సేవందిపురం నుంచి అందరూ కుట్రాలం ,శంకరన్ కోయిల్ ,తిరు చెందూర్ వగైరా క్షేత్ర దర్శనం చేసి తిరువాడు దురై మఠానికి చేరారు .1880 ఫిబ్రవరి 12 త్యాగరాజ చెట్టి ఇక్కడికి వచ్చి దేశికర్ తో తాను  రిటైర్ అవుతున్నానని సమర్ధుడైన వారిని నియమించాలని అయ్యర్ ను సిఫార్సు చేస్తే ఉభయతారకం గా ఉంటుందని చెప్పాడు ..అయ్యర్ ను వదులుకోవటానికి మొదట్లో దేశికర్ సుముఖంగా లేకపోయినా ,,చివరికి ఒప్పుకొని మంచి ముహూర్తం చూడగా అయ్యర్ సెలవు తీసుకోవటానికి రాగా దేశికర్ ‘’చెట్టి స్థానాన్ని సమర్ధవంతంగా భర్తీ చేయాలి .కుంభకోణం లో తాండవ రాయ మొదలియార్ ,మహాలింగ అయ్యర్ ,విశాఖ పెరు మాళ్ళయ్యర్ మొదలైన మహా సమర్ధులు పని చేసిన స్థానం అది .బాగాపని చేసి అందరికీ కీర్తి తేవాలి ‘’అని ఆశీర్వదించి పంపాడు .

  కుంభ కోణం లో ఉద్యోగం లో చేరగానే సహచరులు అయ్యర్ ను చాలాప్రశ్నలు అడిగారు .అన్నిటికీ సంతృప్తిగా సమాధానాలు చెప్పి ,చెట్టిపై ఆసువు గా –‘’చదివితిమి మనము యశః కాయుడైన మీనాక్షి సుందరము పదముల చెంత –కుంభ కోణమున నెలకొన్న ఈ కళాశాల –నన్ను చేయవమ్మ వారసునిగా త్యాగరాజ సూరి ,ఓమహానీయా ‘’ పద్యం చెప్పేసరికి అందరి ఆనందానికి అవధులు లేవు .కాలేజి ప్రెసిడెంట్ గోపాలరావు తృప్తి చెందాడు .మొదట్లో అయ్యర్ తరగతుల్ని రావు పర్యవేక్షించేవాడు .తర్వాత అయ్యర్ బోధనా పటిమ చూసి ఆనందించాడు .అయ్యర్ తరచుగా దేశికర్ ను కలిసి ఇక్కడి విశేషాలు వివరిమ్చేవాడు .మంచి అనుభవం పొంది రాణిస్తున్నందుకు దేశికర్ అభినందించాడు .అయ్యర్ కు కొడుకు పుడితే ,కళ్యాణ సుందరం పేరుపెట్టాడు . తిరునల్లూర్ లోని కళ్యాణ సుందరేశస్వామి అనుగ్రహం  తోపుట్టాడుకనుక ఆపేరు పెట్టాడు అయ్యర్ .

  ప్రముఖ గ్రంథ పరిష్కర్త

ఆకాలం లో సేలం రామస్వామి మొదలియార్ జిల్లా మునసబ్ .ఆయన తమిళ సంస్కృత సంగీతాలలో దిట్ట .ఆయనతో స్నేహం చేయమని దేశికర్ చెప్పగా 21-10-1880న ఆయన్నుకలిసి ,తనగురువులు, తాను  చదివిన కావ్యాలు చెప్పగా వాటి వల్ల లాభమేమిటి అని ప్రశ్నించగా ఆశ్చర్య పడికంబరామాయణమూమొదలైనవి  చదివానన్నాడు .ప్రాచీన తమిళ కావ్యాలు జీవక చింతామణి ,మనిమేకలై ,చదివారా అని అడిగితె నీళ్ళు నమిలి ,వాటి తాళపత్ర గ్రంధాలు తనకిస్తే ,చదివి వాటి గొప్పతనం తెలుసుకొంటాను అని కొద్దిగా ధైర్యం చేసి చెప్పాడు అయ్యర్ ..కొన్నాళ్ళైన తర్వాత ఆయన్నుకలిస్తే ‘’జీవక చింతామణి ‘’కాగిత పుస్తకం ఇవ్వగాచదివి దీనికి ‘’నచినార్ కినియార్ ‘’రాసిన వ్యాఖ్యానం కూడా ఉందని గ్రహించి కావ్యాన్ని చాలాసార్లు చదివి అర్ధం కాని చోట్ల ఆయన్ని అడిగితె అయ్యర్ నిజాయితీ గుర్తించి అక్కడి జైన మునులను దర్శించి సందేహ నివృత్తి చేసు కొని హృద్గతం చేసుకొన్నాడు .దానికి పరిష్కరణ  కావాలనుకొన్నాడు.అనేక ప్రతులు సరి చూసి ,సరైన పాఠ నిర్ణయం చేశాడు .దీన్ని మద్రాస్ లో ముద్రించాలని వెళ్లి రెండు వారాలు ఉండి ప్రసిద్ధ రచయితలను కలిశాడు .తేరళు౦దూర్ కు చెందిన చక్రవర్తుల రాజగోపాచారి ముద్రణ భారానికి ప్రూఫులు దిద్ద టానికి ఒప్పుకున్నాడు .ఒక ప్రాచీనకావ్యం మొదటి సారిగా ప్రచురించే భాగ్యం కలిగినదుకు ఆచారి ఉప్పొంగిపోయి 500ప్రతులు ముద్రించాడు . దీనితో తమిళ సాహిత్య పునరుజ్జీవనం ప్రారంభమైంది .ప్రాచీన వాఖ్యాతలు ఉదాహరించిన పద్యాలు పరిష్కర్త అయ్యర్ తెలిపాడు .తులనాత్మక పరిశీలనకు కొన్ని భాగాలు చేర్చాడు . ఈ పరిష్కరణ  ప్రాచీన తమిళ కావ్యాల పెన్నిధిగా మారి,సహృదయుల మన్నన పొందింది .1888జనవరి 7 న సుబ్రహ్మణ్య దేశికర్ శివ సాయుజ్యం చెందారు .అయ్యర్ దుఖసముద్రం లో మునిగిపోయాడు –దానిపై స్పందిస్తూ –‘’దేశికర్ మరణ వార్త విని నిలుచున్న చోటనే నిలబడిపోయాను .ఏపనీ చేయబుద్ధికలేదు .రక్తం ప్రసరించటం ఆగిపోయిందని పించింది .నా ప్రయత్నాలన్నీ హర్షించి ఆశీర్వదించారు దేశికర్ .నా అభివృద్ధి కి ఉప్పొంగిపోయారు .నన్ను కాపాడిన పరోపకారి దేశికర్ మహాశయుడు ‘’అన్నాడు .ఆరాత్రే బయల్దేరి వెళ్ళాడు శ్రీ అమ్బలవాన దేశికర్ కొత్త పీఠాధిపతి ..గురుపూజా కార్యక్రమం లో శ్రద్ధగా పాల్గొన్నాడు అయ్యర్ .తర్వాత త్యాగరాజ చెట్టియార్ మరణింఛగా , 1888 బాధామయ సంవత్సరంగా మిగిలి పోయింది అయ్యర్ జీవితం లో  .

  సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-11-21-ఉయ్యూరు   

 వాడుదురై ,కుంభ కోణాలలో అధ్యాపకత్వం

అయ్యర్ కోసం సుబ్రహ్మణ్య దేశికర్ ఒక ఇల్లు కట్టించాడు .1877నవంబర్ లో అయ్యర్ భార్య ,తన తలి దండ్రులతో అక్కడ కాపురం పెట్టాడు .కుటుంబానికి కావలసినవన్నీ మఠం సమకూర్చేది .దేశికర్ అభిమానానికి ఇంటిల్లిపాదీ సంతోషించారు .ఇంతలో మడురైలోమీనాక్షి అమ్మవారి కుంభాభిషేకం దగ్గరకురాగా దానితోపాటు ఇతర క్షేత్రాలు దర్శించాలని దేశికర్ భావించి అయ్యర్ నూ రమ్మన్నాడు .కుంభాభిషేకం మహోత్సాహంగా జరిగింది అక్కడ న్యాయమూర్తి మణి అయ్యర్ తో పరిచయమేర్పడింది .మధురనుంచి తిరునల్వేలి వెళ్లి అక్కడా మఠంలో ఉన్నారు .చాలామంది కవిపండితులు దేశికర్ దర్శనానికి వచ్చేవారు .అక్కడినుంచి సెవందిపురం వెళ్లగా అక్కడ మఠం సహాయాధిపతి వేణువనలింగ తమ్బిరాన్  ఒక నూతనభవనం నిర్మించి దేశికర్ పేరు పెట్టాడు .ప్రారంభోత్సవానికి వచ్చిన కవులంతా దాన్ని ప్రశంసిస్తూ పద్యాలు చెబితే ,అయ్యర్ వాటిని సేకరించి ముద్రించాడు .దీనితో పరిష్కరణ కార్యానికి శ్రీకారం చుట్టాడు అయ్యర్ .దాని మొదటిపేజీలో ‘’వేణువనలింగ స్వాముల కార్యదీక్ష సుబ్రహ్మణ్య దేశికర్ మాహా వేత్రుత్వం కవుల కవిత్వాలను పరిశీలించి ఈ పుస్తకాన్ని తిరువాడుదురైవెంకట సుబ్బ అయ్యర్ పుత్రుడు స్వామినాథ అయ్యర్ పరిష్కరించగా , తిరునల్వేలి ముత్తమిళాకర ముద్ర శాలలో బహుధాన్య సంవత్సరం లో ముద్రింపబడింది ‘’అని రాశాడు .

  సేవందిపురం నుంచి అందరూ కుట్రాలం ,శంకరన్ కోయిల్ ,తిరు చెందూర్ వగైరా క్షేత్ర దర్శనం చేసి తిరువాడు దురై మఠానికి చేరారు .1880 ఫిబ్రవరి 12 త్యాగరాజ చెట్టి ఇక్కడికి వచ్చి దేశికర్ తో తాను  రిటైర్ అవుతున్నానని సమర్ధుడైన వారిని నియమించాలని అయ్యర్ ను సిఫార్సు చేస్తే ఉభయతారకం గా ఉంటుందని చెప్పాడు ..అయ్యర్ ను వదులుకోవటానికి మొదట్లో దేశికర్ సుముఖంగా లేకపోయినా ,,చివరికి ఒప్పుకొని మంచి ముహూర్తం చూడగా అయ్యర్ సెలవు తీసుకోవటానికి రాగా దేశికర్ ‘’చెట్టి స్థానాన్ని సమర్ధవంతంగా భర్తీ చేయాలి .కుంభకోణం లో తాండవ రాయ మొదలియార్ ,మహాలింగ అయ్యర్ ,విశాఖ పెరు మాళ్ళయ్యర్ మొదలైన మహా సమర్ధులు పని చేసిన స్థానం అది .బాగాపని చేసి అందరికీ కీర్తి తేవాలి ‘’అని ఆశీర్వదించి పంపాడు .

  కుంభ కోణం లో ఉద్యోగం లో చేరగానే సహచరులు అయ్యర్ ను చాలాప్రశ్నలు అడిగారు .అన్నిటికీ సంతృప్తిగా సమాధానాలు చెప్పి ,చెట్టిపై ఆసువు గా –‘’చదివితిమి మనము యశః కాయుడైన మీనాక్షి సుందరము పదముల చెంత –కుంభ కోణమున నెలకొన్న ఈ కళాశాల –నన్ను చేయవమ్మ వారసునిగా త్యాగరాజ సూరి ,ఓమహానీయా ‘’ పద్యం చెప్పేసరికి అందరి ఆనందానికి అవధులు లేవు .కాలేజి ప్రెసిడెంట్ గోపాలరావు తృప్తి చెందాడు .మొదట్లో అయ్యర్ తరగతుల్ని రావు పర్యవేక్షించేవాడు .తర్వాత అయ్యర్ బోధనా పటిమ చూసి ఆనందించాడు .అయ్యర్ తరచుగా దేశికర్ ను కలిసి ఇక్కడి విశేషాలు వివరిమ్చేవాడు .మంచి అనుభవం పొంది రాణిస్తున్నందుకు దేశికర్ అభినందించాడు .అయ్యర్ కు కొడుకు పుడితే ,కళ్యాణ సుందరం పేరుపెట్టాడు . తిరునల్లూర్ లోని కళ్యాణ సుందరేశస్వామి అనుగ్రహం  తోపుట్టాడుకనుక ఆపేరు పెట్టాడు అయ్యర్ .

  ప్రముఖ గ్రంథ పరిష్కర్త

ఆకాలం లో సేలం రామస్వామి మొదలియార్ జిల్లా మునసబ్ .ఆయన తమిళ సంస్కృత సంగీతాలలో దిట్ట .ఆయనతో స్నేహం చేయమని దేశికర్ చెప్పగా 21-10-1880న ఆయన్నుకలిసి ,తనగురువులు, తాను  చదివిన కావ్యాలు చెప్పగా వాటి వల్ల లాభమేమిటి అని ప్రశ్నించగా ఆశ్చర్య పడికంబరామాయణమూమొదలైనవి  చదివానన్నాడు .ప్రాచీన తమిళ కావ్యాలు జీవక చింతామణి ,మనిమేకలై ,చదివారా అని అడిగితె నీళ్ళు నమిలి ,వాటి తాళపత్ర గ్రంధాలు తనకిస్తే ,చదివి వాటి గొప్పతనం తెలుసుకొంటాను అని కొద్దిగా ధైర్యం చేసి చెప్పాడు అయ్యర్ ..కొన్నాళ్ళైన తర్వాత ఆయన్నుకలిస్తే ‘’జీవక చింతామణి ‘’కాగిత పుస్తకం ఇవ్వగాచదివి దీనికి ‘’నచినార్ కినియార్ ‘’రాసిన వ్యాఖ్యానం కూడా ఉందని గ్రహించి కావ్యాన్ని చాలాసార్లు చదివి అర్ధం కాని చోట్ల ఆయన్ని అడిగితె అయ్యర్ నిజాయితీ గుర్తించి అక్కడి జైన మునులను దర్శించి సందేహ నివృత్తి చేసు కొని హృద్గతం చేసుకొన్నాడు .దానికి పరిష్కరణ  కావాలనుకొన్నాడు.అనేక ప్రతులు సరి చూసి ,సరైన పాఠ నిర్ణయం చేశాడు .దీన్ని మద్రాస్ లో ముద్రించాలని వెళ్లి రెండు వారాలు ఉండి ప్రసిద్ధ రచయితలను కలిశాడు .తేరళు౦దూర్ కు చెందిన చక్రవర్తుల రాజగోపాచారి ముద్రణ భారానికి ప్రూఫులు దిద్ద టానికి ఒప్పుకున్నాడు .ఒక ప్రాచీనకావ్యం మొదటి సారిగా ప్రచురించే భాగ్యం కలిగినదుకు ఆచారి ఉప్పొంగిపోయి 500ప్రతులు ముద్రించాడు . దీనితో తమిళ సాహిత్య పునరుజ్జీవనం ప్రారంభమైంది .ప్రాచీన వాఖ్యాతలు ఉదాహరించిన పద్యాలు పరిష్కర్త అయ్యర్ తెలిపాడు .తులనాత్మక పరిశీలనకు కొన్ని భాగాలు చేర్చాడు . ఈ పరిష్కరణ  ప్రాచీన తమిళ కావ్యాల పెన్నిధిగా మారి,సహృదయుల మన్నన పొందింది .1888జనవరి 7 న సుబ్రహ్మణ్య దేశికర్ శివ సాయుజ్యం చెందారు .అయ్యర్ దుఖసముద్రం లో మునిగిపోయాడు –దానిపై స్పందిస్తూ –‘’దేశికర్ మరణ వార్త విని నిలుచున్న చోటనే నిలబడిపోయాను .ఏపనీ చేయబుద్ధికలేదు .రక్తం ప్రసరించటం ఆగిపోయిందని పించింది .నా ప్రయత్నాలన్నీ హర్షించి ఆశీర్వదించారు దేశికర్ .నా అభివృద్ధి కి ఉప్పొంగిపోయారు .నన్ను కాపాడిన పరోపకారి దేశికర్ మహాశయుడు ‘’అన్నాడు .ఆరాత్రే బయల్దేరి వెళ్ళాడు శ్రీ అమ్బలవాన దేశికర్ కొత్త పీఠాధిపతి ..గురుపూజా కార్యక్రమం లో శ్రద్ధగా పాల్గొన్నాడు అయ్యర్ .తర్వాత త్యాగరాజ చెట్టియార్ మరణింఛగా , 1888 బాధామయ సంవత్సరంగా మిగిలి పోయింది అయ్యర్ జీవితం లో  .

  సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-11-21-ఉయ్యూరు   

 వాడుదురై ,కుంభ కోణాలలో అధ్యాపకత్వం

అయ్యర్ కోసం సుబ్రహ్మణ్య దేశికర్ ఒక ఇల్లు కట్టించాడు .1877నవంబర్ లో అయ్యర్ భార్య ,తన తలి దండ్రులతో అక్కడ కాపురం పెట్టాడు .కుటుంబానికి కావలసినవన్నీ మఠం సమకూర్చేది .దేశికర్ అభిమానానికి ఇంటిల్లిపాదీ సంతోషించారు .ఇంతలో మడురైలోమీనాక్షి అమ్మవారి కుంభాభిషేకం దగ్గరకురాగా దానితోపాటు ఇతర క్షేత్రాలు దర్శించాలని దేశికర్ భావించి అయ్యర్ నూ రమ్మన్నాడు .కుంభాభిషేకం మహోత్సాహంగా జరిగింది అక్కడ న్యాయమూర్తి మణి అయ్యర్ తో పరిచయమేర్పడింది .మధురనుంచి తిరునల్వేలి వెళ్లి అక్కడా మఠంలో ఉన్నారు .చాలామంది కవిపండితులు దేశికర్ దర్శనానికి వచ్చేవారు .అక్కడినుంచి సెవందిపురం వెళ్లగా అక్కడ మఠం సహాయాధిపతి వేణువనలింగ తమ్బిరాన్  ఒక నూతనభవనం నిర్మించి దేశికర్ పేరు పెట్టాడు .ప్రారంభోత్సవానికి వచ్చిన కవులంతా దాన్ని ప్రశంసిస్తూ పద్యాలు చెబితే ,అయ్యర్ వాటిని సేకరించి ముద్రించాడు .దీనితో పరిష్కరణ కార్యానికి శ్రీకారం చుట్టాడు అయ్యర్ .దాని మొదటిపేజీలో ‘’వేణువనలింగ స్వాముల కార్యదీక్ష సుబ్రహ్మణ్య దేశికర్ మాహా వేత్రుత్వం కవుల కవిత్వాలను పరిశీలించి ఈ పుస్తకాన్ని తిరువాడుదురైవెంకట సుబ్బ అయ్యర్ పుత్రుడు స్వామినాథ అయ్యర్ పరిష్కరించగా , తిరునల్వేలి ముత్తమిళాకర ముద్ర శాలలో బహుధాన్య సంవత్సరం లో ముద్రింపబడింది ‘’అని రాశాడు .

  సేవందిపురం నుంచి అందరూ కుట్రాలం ,శంకరన్ కోయిల్ ,తిరు చెందూర్ వగైరా క్షేత్ర దర్శనం చేసి తిరువాడు దురై మఠానికి చేరారు .1880 ఫిబ్రవరి 12 త్యాగరాజ చెట్టి ఇక్కడికి వచ్చి దేశికర్ తో తాను  రిటైర్ అవుతున్నానని సమర్ధుడైన వారిని నియమించాలని అయ్యర్ ను సిఫార్సు చేస్తే ఉభయతారకం గా ఉంటుందని చెప్పాడు ..అయ్యర్ ను వదులుకోవటానికి మొదట్లో దేశికర్ సుముఖంగా లేకపోయినా ,,చివరికి ఒప్పుకొని మంచి ముహూర్తం చూడగా అయ్యర్ సెలవు తీసుకోవటానికి రాగా దేశికర్ ‘’చెట్టి స్థానాన్ని సమర్ధవంతంగా భర్తీ చేయాలి .కుంభకోణం లో తాండవ రాయ మొదలియార్ ,మహాలింగ అయ్యర్ ,విశాఖ పెరు మాళ్ళయ్యర్ మొదలైన మహా సమర్ధులు పని చేసిన స్థానం అది .బాగాపని చేసి అందరికీ కీర్తి తేవాలి ‘’అని ఆశీర్వదించి పంపాడు .

  కుంభ కోణం లో ఉద్యోగం లో చేరగానే సహచరులు అయ్యర్ ను చాలాప్రశ్నలు అడిగారు .అన్నిటికీ సంతృప్తిగా సమాధానాలు చెప్పి ,చెట్టిపై ఆసువు గా –‘’చదివితిమి మనము యశః కాయుడైన మీనాక్షి సుందరము పదముల చెంత –కుంభ కోణమున నెలకొన్న ఈ కళాశాల –నన్ను చేయవమ్మ వారసునిగా త్యాగరాజ సూరి ,ఓమహానీయా ‘’ పద్యం చెప్పేసరికి అందరి ఆనందానికి అవధులు లేవు .కాలేజి ప్రెసిడెంట్ గోపాలరావు తృప్తి చెందాడు .మొదట్లో అయ్యర్ తరగతుల్ని రావు పర్యవేక్షించేవాడు .తర్వాత అయ్యర్ బోధనా పటిమ చూసి ఆనందించాడు .అయ్యర్ తరచుగా దేశికర్ ను కలిసి ఇక్కడి విశేషాలు వివరిమ్చేవాడు .మంచి అనుభవం పొంది రాణిస్తున్నందుకు దేశికర్ అభినందించాడు .అయ్యర్ కు కొడుకు పుడితే ,కళ్యాణ సుందరం పేరుపెట్టాడు . తిరునల్లూర్ లోని కళ్యాణ సుందరేశస్వామి అనుగ్రహం  తోపుట్టాడుకనుక ఆపేరు పెట్టాడు అయ్యర్ .

  ప్రముఖ గ్రంథ పరిష్కర్త

ఆకాలం లో సేలం రామస్వామి మొదలియార్ జిల్లా మునసబ్ .ఆయన తమిళ సంస్కృత సంగీతాలలో దిట్ట .ఆయనతో స్నేహం చేయమని దేశికర్ చెప్పగా 21-10-1880న ఆయన్నుకలిసి ,తనగురువులు, తాను  చదివిన కావ్యాలు చెప్పగా వాటి వల్ల లాభమేమిటి అని ప్రశ్నించగా ఆశ్చర్య పడికంబరామాయణమూమొదలైనవి  చదివానన్నాడు .ప్రాచీన తమిళ కావ్యాలు జీవక చింతామణి ,మనిమేకలై ,చదివారా అని అడిగితె నీళ్ళు నమిలి ,వాటి తాళపత్ర గ్రంధాలు తనకిస్తే ,చదివి వాటి గొప్పతనం తెలుసుకొంటాను అని కొద్దిగా ధైర్యం చేసి చెప్పాడు అయ్యర్ ..కొన్నాళ్ళైన తర్వాత ఆయన్నుకలిస్తే ‘’జీవక చింతామణి ‘’కాగిత పుస్తకం ఇవ్వగాచదివి దీనికి ‘’నచినార్ కినియార్ ‘’రాసిన వ్యాఖ్యానం కూడా ఉందని గ్రహించి కావ్యాన్ని చాలాసార్లు చదివి అర్ధం కాని చోట్ల ఆయన్ని అడిగితె అయ్యర్ నిజాయితీ గుర్తించి అక్కడి జైన మునులను దర్శించి సందేహ నివృత్తి చేసు కొని హృద్గతం చేసుకొన్నాడు .దానికి పరిష్కరణ  కావాలనుకొన్నాడు.అనేక ప్రతులు సరి చూసి ,సరైన పాఠ నిర్ణయం చేశాడు .దీన్ని మద్రాస్ లో ముద్రించాలని వెళ్లి రెండు వారాలు ఉండి ప్రసిద్ధ రచయితలను కలిశాడు .తేరళు౦దూర్ కు చెందిన చక్రవర్తుల రాజగోపాచారి ముద్రణ భారానికి ప్రూఫులు దిద్ద టానికి ఒప్పుకున్నాడు .ఒక ప్రాచీనకావ్యం మొదటి సారిగా ప్రచురించే భాగ్యం కలిగినదుకు ఆచారి ఉప్పొంగిపోయి 500ప్రతులు ముద్రించాడు . దీనితో తమిళ సాహిత్య పునరుజ్జీవనం ప్రారంభమైంది .ప్రాచీన వాఖ్యాతలు ఉదాహరించిన పద్యాలు పరిష్కర్త అయ్యర్ తెలిపాడు .తులనాత్మక పరిశీలనకు కొన్ని భాగాలు చేర్చాడు . ఈ పరిష్కరణ  ప్రాచీన తమిళ కావ్యాల పెన్నిధిగా మారి,సహృదయుల మన్నన పొందింది .1888జనవరి 7 న సుబ్రహ్మణ్య దేశికర్ శివ సాయుజ్యం చెందారు .అయ్యర్ దుఖసముద్రం లో మునిగిపోయాడు –దానిపై స్పందిస్తూ –‘’దేశికర్ మరణ వార్త విని నిలుచున్న చోటనే నిలబడిపోయాను .ఏపనీ చేయబుద్ధికలేదు .రక్తం ప్రసరించటం ఆగిపోయిందని పించింది .నా ప్రయత్నాలన్నీ హర్షించి ఆశీర్వదించారు దేశికర్ .నా అభివృద్ధి కి ఉప్పొంగిపోయారు .నన్ను కాపాడిన పరోపకారి దేశికర్ మహాశయుడు ‘’అన్నాడు .ఆరాత్రే బయల్దేరి వెళ్ళాడు శ్రీ అమ్బలవాన దేశికర్ కొత్త పీఠాధిపతి ..గురుపూజా కార్యక్రమం లో శ్రద్ధగా పాల్గొన్నాడు అయ్యర్ .తర్వాత త్యాగరాజ చెట్టియార్ మరణింఛగా , 1888 బాధామయ సంవత్సరంగా మిగిలి పోయింది అయ్యర్ జీవితం లో  .

  సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-11-21-ఉయ్యూరు   

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-3

తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-3

పట్టీశ్వరం లో ఉండగానే తమ తలిదండ్రులు ఉండే కొత్తూరు వెళ్ళాడు స్వామినథయ్యర్ .జ్వరం వచ్చి చాలా వారాలు ఉండిపోయాడక్కడ .ఆరోగ్యం కుదిరాక గురుపూజ సందర్భంగా పిళ్ళై గారు వస్తారని తిరువాడుదురై వెళ్ళాడు .ఈమఠ స్థాపకులు శ్రీ నమశ్శివాయ మూర్తి ఆరాధన పుష్యమాసం లో జరిగే గొప్ప ఉత్సవం .ఆ ఉత్సవ రోజుల్లో పాటకచేరీలు ,కావ్య పఠనాలు ,సంస్కృత పండితుల విద్వద్గోష్టులు ,ఉత్సవ వేడుకలు జరుగుతాయి .అక్కడికి వచ్చిన వారందరికీ ఉచిత భోజనం సమకూరుస్తారు .అయ్యర్ పిళ్ళైగారిని కలుసుకొన్నాడు .గురు బహు ముఖ ప్రజ్ఞను ఇక్కడ చూశాడు .ఆశుకవిత్వం లో పిళ్ళై దిట్ట .వచ్చిన వారు విశాల భవనం లో ఉన్న దేశికర్ ని దర్శించి పద్యాలు చెప్పి బహుమతులు పుచ్చుకొని వెళ్ళేవారు .ఈ పద్యాలన్నీ పిళ్ళై గారివే .మర్నాడు పిళ్ళై దేశికర్ ను కలువగా ‘’రాత్రి మీకు నిద్ర లేనట్లుందే ‘’అని చిరునవ్వుతోఅడగగా ఈయనా మందహాసం చేశాడు కొన్ని రోజులు మాయూరం లో గడిపి ఇంటికి వెళ్ళిపోయాడు పిళ్ళై .బండిలోప్రయాణం చేస్తూ ‘’అంబర్ పురాణం ‘’చెప్పాడు .ఆగతుకుల రోడ్డులో బండీ అటూ ఇటూ ఊగుతూ వెడుతుంటే అయ్యర్ ఆయన చెప్పినవన్నీ రాసేవాడు.ఉదాత్త కవితా ధార పిళ్ళై నోటి నుండి జాలువారేది. పరవశుడయ్యేవాడు అయ్యర్ .

  తిరువడు దూరు లో తరగతుల్ని రెండు భాగాలు చేయాలనుకొన్నారు .అయ్యర్ ను కొత్త వాళ్ళలో కూర్చో పెట్టాలా ,పాతవారితోనా అనే సమస్య వచ్చింది .చివరికి అయ్యరే రెండు తరగతులకు తాను  హాజరౌతానని చెప్పి సమస్యను తీర్చాడు .కనుక ఊపిరాడనంత పని .కానీ రెండు రకాల లాభం పొందాడు .గురువు పద్యాలను రాగయుక్తంగా పాడి విపించే బాధ్యతఆయనమీదే  వేసుకొన్నాడు .

            గురు చరణ సన్నిధి

స్వామినాథయ్యర్ రాసిన ‘’మీనాక్షి సుందరం పిళ్ళై జీవిత చరిత్ర ‘’ఒక మాన్యుమెంట్ .ఆనాటి ముచ్చటను అయ్యర్ మధురంగా వర్ణించాడు . .ఒకనాటి రాత్రి అయ్యర్ మఠం లో భోజనం చేసి అందరికంటే ముందే లేచి వెళ్ళాడు అక్కడి నియమాలకు విరుద్ధంగా .వీధి అరుగుమీద పడుకొన్న పిళ్ళై శిష్యుడిని చూసి భోజనం చేశావా అని అడుగ్గా  గురువుగారికి శిష్యుడిపై ఉన్న అభిమానం చూసి మిగిలినవారు ఆశ్చర్యపోయారు .  ఈ ఊరిలోనే అయ్యర్ మహాగాయకుడు మహా మదురై వైద్యనాథయ్యర్ ను కలుసుకొన్నాడు .దేశికర్ కోరికపై ఆయన చాలా కీర్తనలు రసవత్తరంగా పాడాడు.అయ్యర్ దివ్యానుభూతి పొందాడు.తన అన్నగారు రాసిన శైవ కావ్యం పెరియ పురాణం ఆధారంగా ఒక యక్షగానం రచించాడు వైద్యనాథయ్యర్ .వీటినీ ,పిళ్ళై గీతాలను ఆనాడు పాడాడు .గురువు గారి గీతాలలో ఉన్న అందచందాలకు శిష్యుడు అయ్యర్ ముగ్ధుడయ్యాడు .

 పిళ్ళై మాయూరం లో ఉన్నప్పుడు తిరుప్పేరుండు రైకి చెందిన సుబ్రహ్మణ్య తమ్బిరాన్ ,ఆక్షేత్ర స్థల పురాణం రాయి౦చా లనుకొని తగినవాడు పిళ్ళై అని గ్రహించిదేశికర్ ను తన తరఫున అడగమనగా ఆయన అయ్యర్ ను మాయూరం పంపగా ,పిళ్ళై ఆనందభరితుడై వినాయకునిపై ఆశువుగా –‘’వెన్నెల వలెభాసి౦ చెడు పెన్నెరులవి-నాయకుని స్మరించుచు జీవనమ్ము గడుపు ‘’అనే పద్యం చెప్పాడు .గురుశిష్యులు తిరువాడు దురు వెళ్లగా ,అయ్యర్ కు 1872లో మశూచికం పోసింది .అప్పుడాయన పెరియ పురాణం అధ్యయనం చేస్తున్నాడు .గురువుశిష్యుని కంటికి రెప్పలా కాపాడు కొన్నాడు .తర్వాత తలుపులు మూసిన పల్లకిలో అయ్యర్ ను సూర్యమూలై కి పంపగా తండ్రీ తాత జాగ్రత్తగా చూసుకొన్నారు . 

  1873లో కుంభ కోణం లో మహాపుష్కరాలు (మహా మాక౦ )రాగా ,సుబ్రహ్మణ్య దేశికర్ శిష్యులతో  అక్కడికి చేరాడు  .శైవులకు ఈ పుష్కరాలు మహా పవిత్రమైనవి .పాల్గొనక లేకపోయినందుకు అయ్యర్ బాధపడ్డాడు .ఆరోగ్యంకుదిరాక మళ్ళీ తిరువాడు దురై వెళ్ళాడు .కుంభ కోణం లో త్యాగ రాజ చెట్టి  ఇదివరకు అయ్యర్ కలవటం ,అక్కడ బోధిస్తావా అని అడగటం సరే ననటం మనకు తెలిసిందే .అక్కడ అప్పు శాస్త్రిగారు ఒక కొత్త పాశాల పెడుతున్నారనీ దానిలో తమిళ బోధకుడు కావాలనీ చెట్టి అయ్యర్ చెవిన వేశాడు .ఇక్కడ పని చేస్తూ తండ్రికి కొంత ఆర్ధికం గా సాయపదాలనుకొన్నాడు అయ్యర్ .కానీ పిళ్ళైకి  నచ్చలేదు.అయ్యర్ ఇంకా చదువుకోవాలని ఆయన భావం .అయ్యర్ ని తనదగ్గరే ఉంచమని అవసరం వచ్చినప్పుడు ఉద్యోగం చేయవచ్చు నని తండ్రితో చెప్పగా అయ్యర్ బ్రహ్మానంద భరితుడయ్యాడు .

    1873లో పిళ్ళై తిరుప్పేరున్డురై కి వెళ్ళగా ,అయ్యర్ సవేరినాద పిళ్ళై ఆయనతో వెళ్ళారు .ఆక్షేత్ర మహాత్మ్యం విని ఈ ఇద్దరూ ఆశ్చర్యపోయారు .తమిళ సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన శైవ గ్రంధం ‘’తిరువాచకం ‘రాసిన మానిక్క వాచాకర్ కు జరిగే ప్రత్యెక అర్చన విధి చూసి మరీ ఆశ్చర్యపోయారు .పిల్లైగారి స్థలపురాణం ఆవిష్కరణ కు ఇక్కడ కు వచ్చారు .ఇంకా పురాణం పూర్తికాలేదు వీలు దొరికినప్పుడల్లా పిళ్ళై పద్యాలు రాసి మర్నాడు అందరికీ చదివి వినిపింఛి వివరించేవాడు ఇది ఇంకా ఆశ్చర్యం కలిగించింది అయ్యర్ కి.1874లో వ్రుదాప్యం లో ఉన్న తండ్రికి సేవ చేశాడు అయ్యర్ .తండ్రికి సంపాదనలేదు కుటుంబం అప్పులపాలైంది .చదువు మానేసి పౌరాణికవృత్తి చేబడితే పరిసరగ్రామాలవారు ఆదరిస్తారని హితవు చెప్పాడు .ఒప్పుకొని చెంగానం, కారై గ్రామాలలో ‘’తిరు విల్లై యాడల్’’పురాణం చెప్పాడు .పిళ్ళై గురుత్వాన్ని వదులు కాకూడదని మనసు చెబుతోంది .అంబర్ లో పుస్తకా విష్కరణకు వెళ్ళిన పిళ్ళై ని చేరి మళ్ళీ శిష్యుడయ్యాడు .కారై వెళ్లి ఆపేసిన పురాణాన్ని పూర్తీ చేశాడు .మంచి ఆదరణ కలిగి ఇంకా ప్రవచనాలు చేయమని గ్రామస్తులు కోరారు .తనమనసులోని మాటను వినయంగా చెప్పి గురువును చేరాడు .

 తమిళం లో మొదటి నవల’’ప్రతాప మొదలియార్ ‘’ రాసిన మున్సిఫ్ ఉద్యోగం చేసిన వేద నాయకం పిళ్ళై ఒకసారి దేశికర్ దర్శనానికి రాగా , ఇద్దరు పరస్పరం గౌరవించుకోవటం చూసి అయ్యర్ చకితుడయ్యాడు .అయ్యర్ ప్రియతమా గురువు మీనాక్షి సుందరం పిళ్ళై 1-1-1876న శివైక్యం చెందాడు .ఆఖరు క్షణం వరకు శిష్యుడికి తిరువాచకం లోని సందేహాలు తీరుస్తూనే ఉన్నాడు .అయ్యర్ దుఖం కట్టలు తెన్చుకోగా దేశికర్ ఓదార్చాడు –‘’మనం ఒక మణి ని కోల్పోయాం .ఆలోటు భర్తీ చేయలేం .కానీ ఎం చెయ్యగలం ?పిల్లైగారికి నువ్వంటే ప్రాణం .నువ్వు మతం లో చేరి ,నావద్ద నేర్చుకోవచ్చు ‘’అని అనునయించాడు.అయ్యర్ ఇప్పుడు దేశికర్ శిష్యడై కొత్తగా చేరిన వారికి బోధిస్తున్నాడు .’’కావిడిచ్చి౦దు’’రచించిన చొక్కి కుళ౦అన్నామలై రెడ్డియార్ కొన్ని తమిళ గ్రంధాలు అధ్యయనం చేయటానికి అక్కడికి రాగా ,అయ్యర్ సాయం చేశాడు .

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -10-11-21-ఉయ్యూరు 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

డా తూములూరు శ్రీదక్షిణా మూర్తి శాస్త్రి గారు

డా తూములూరు శ్రీదక్షిణా మూర్తి శాస్త్రి గారు

చిత్త శార్దూలమ్ము చిత్తు చిత్తు గ ,గాగ నెత్తిపై కెక్కిన నీరజాక్షి –శేముషీ సింహమ్ము ‘’శ్రీ ‘’పెంచి ,దానిచే మహిషాదులను నామపు మహిత భావ –శ్వాస హంసము నెక్కి ,చతుర సంచారంబు నేర్పించి కాచు నిర్నిద్ర మాత ‘’అయిన లలితా పరా భట్టారిక శ్రీ రాజ రాజేశ్వరి పై శతకం రాసి ,తమ గురుదేవులు  బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు ,వారి తండ్రిగారు వెంకటప్పయ్య శాస్త్రిగారు రచించిన ‘’శ్రీరామ కదామృతం’’అనే బృహత్ గ్రంధం పై’’ సమగ్ర సమీక్ష పరిశోధన నిబంధనం ‘’రచించి ,ఆంద్ర విశ్వ విద్యాలయం చేత పి హెచ్ డి పొందిన వారు శ్రీ తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారు .పొన్నూరు లోని శ్రీ భావనారాయణ సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ గా ఉద్యోగించి, పదవీ విరమణ  చేసిన సాహితీ మూర్తి .వీరి జననం కృష్ణా జిల్లా ఉప్పులూరు కావటం విశేషం .శ్రీ తూములూరు వెంకట రామ శాస్త్రి ,శ్రీమతి లక్ష్మీ నరసమ్మ దంపతులకు 15-2-1953 లో జన్మించిన శాస్త్రిగారు శ్రీమతి నాగ పద్మావతి గారిని వివాహమాడారు .

  రామాయణం –సమాజ దర్పణం ను రెండుభాగాలుగా రచించి ,శ్రీ రామ ,వాల్మీకి , వానుమ ద్వాణి లను వినిపించిన ఆధ్యాత్మిక తేజో విరాజితులు .పావనీ శతకం ,శ్రీ త్రికూటేశ్వర త్రిశతి ,శ్రీ కపోతేశ్వర శతకం ,శ్రీ పొన్నూరు వీరాంజనేయ శతకం ,భావ దేవశతకం వంటి భక్తీ శతకాలను ‘’పిలిస్తేపలికే పద్య ధార’’తో వీనుల విందుగా, గుండెల నిండుగా రాసిన సాహితీ చైతన్య మూర్తి .తమ బావ గారు –అంటే అక్కగారి భర్త గారు శ్రీ చెరువు సత్యనారాయణ శాస్త్రి గారి అపార సంస్క్రుతాంధ్ర వైదుష్యానికి ,సంస్కృత శతావదానానికీ  అనుక్షణం అబ్బురపడి ఆ మధుర స్మృతులను పంచుకొనే సహృదయ మూర్తి శ్రీ శాస్త్రిగారు

.’’స్తవ నీయుండు ,నరోత్తముండు ,సుగుణోద్దాముండు,ధన్యుండు రాఘవ నారారాణశాస్త్రి తాడెపలి విఖ్యాతుండు ,కారుణ్య మూర్తి ,వివేక స్థిర వర్తనుడు మద్దీక్షా గురుండు ,ఆత్మ తత్వ విదుండా’’రుషి వర్యు ‘’గొల్తు ‘’ అని ఘనం గా కీర్తించే గురుభక్తి శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారిది .ఇంతవరకు పద్యాలలో యోగ విద్య ను రాయని లోటును  తీరుస్తూ ‘’ యోగ వైభవం  ‘’రాసి రికార్డ్ సృష్టించారు .  సాహిత్య సాంస్కృతిక ప్రసంగాలతో ప్రజలకు  వందనం అభివందనం            గబ్బిట దుర్గాప్రసాద్

గీర్వాణ కవుల కవితా గీర్వాణం మొదటి భాగం గ్రంధాన్ని ఉస్మానియా విశ్వ విద్యాలయ సంస్కృత ప్రాచార్యులు డా.శ్రీ ఇప్పగుంట సాయి బాబా గారికి పంపగా, క్షుణ్ణంగా చదివి అభినందిస్తూనే ,నేను చేసిన తప్పులను సవివరంగా వ్రాత పూర్వకంగా తెలియ జేశారు .ఆ పత్రాలను అందరికి అంతర్జాలం ద్వారా తెలియ బర్చాను .అందులో వారు నాకొక గొప్పసూచన చేశారు .శ్రీ ఎం .కృష్ణమాచారియార్ గారు ఆంగ్లం లో రాసిన ‘’హిస్టరీ ఆఫ్  క్లాసికల్ సాంస్క్రిట్ లిటరేచర్ ‘’తెప్పించుకొని చదవమన్నారు .ఈ విషయాన్ని గుర్తించిన నా ఆత్మీయులు శ్రీ మైనేని గోపాలకృష్ణ గారు సుమారు వెయ్యిపెజీలున్న ఆ గ్రంధాన్ని  నాకు తెలియ కుండానే ఆర్డర్ ఇచ్చి తెప్పించి నాకు పంపారు .అద్భుతం అనిపించింది చదువు తుంటే .దాని ఆధారం గా గీర్వాణ కవుల కవితా గీర్వాణం రెండవ భాగం నెట్ లో రాయటం ప్రారంభించాను .ఇందులో ఉన్న దాదాపు అందరుకవులను ,అన్ని ప్రక్రియలను గురించి రాయగలిగాను .దీనికి శ్రీ సాయిబాబాగారికి శ్రీ మైనేని వారికీ ఎంతైనా రుణపడి ఉంటాను .

     మొదటిభాగానికి ముందుమాట రాసిన డా. రామడుగు వెంకటేశ్వర శర్మ గారు కూడా ఇంకా రాయవాసిన కవులు చాలా మంది ఉన్నారని వారిని గూర్చి కూడా రెండవ భాగం లో రాయమని మంచి సలహా ఇస్తూ ఆ కవుల వివరాలు గుంటూరు జిల్లా పొన్నూరు సంస్కృత కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ డా.తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారు ఇవ్వగలరని వారి ఫోన్ నంబర్ నాకు ఇవ్వగా కిందటిఏడాది  సెప్టెంబర్ లో వారితో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకొన్నాను .వారి వలననే బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు ,వారి తండ్రిగారు శ్రీ వెంకటప్పయ్య శాస్త్రిగారు ,శ్రీ తూములూరు వారి బావగారు ,శ్రీ రాఘవ నారాయణ శాస్త్రి గారి దౌహిత్రులు అయిన శ్రీచెరువు సత్యనారాయణ శాస్త్రిగారు,శ్రీ కొలచిన యజ్ఞనారాయణ దీక్షితులు  గార్ల గురించి శ్రీ దక్షిణామూర్తి శాస్త్రి గారు పై వారు రచించిన పుస్తకాలు పంపగా రాయగలిగాను .శాస్త్రి గారి ద్వారానే శ్రీ ముళ్ళపూడి జయ సీతా రామ శాస్త్రి గారిని పరిచయం చేసుకొని సీతారామ శాస్త్రి గారు పంపిన తమవీ ,తమ తండ్రి గారు శ్రీ నారాయణ శాస్త్రి గారి గ్రంధాలనాధారంగా వీరిద్దరి సంస్కృత సేవను వివరించాను .అలాగే శ్రీ ములుకుట్ల   నరసింహావధాని గారు రచించిన ‘’రామాయణ సారోద్ధారం ‘’7 భాగాలు శ్రీ తూములూరు వారు నాకు అందజేయగా అవధాని గారి గూర్చి సవివరంగా రాయగలిగాను .

   .చీరాల విశ్రాంత లెక్చరర్ ,సంస్కృత భాషా సేవకులు ,ఆత్మ జ్యోతి మాసపత్రిక సంపాదకులు శ్రీ రావి మోహన రావు గారినీ శ్రీ తూములూరు వారు పరిచయం చేయగా ,వారు పంపిన వాటి ఆధారం గా శ్రీ చింత గుంట సుబ్బారావు గారి గురించి రాశాను .శ్రీ మోహన రావు గారి ద్వారాశ్రీ గరిమెళ్ళ సోమయాజులుగారు పరిచయమవ్వగా వారు పంపిన రచనల నాదారంగా శ్రీ గరిమెళ్ళ వారి గూర్చి రాశాను .గుంటూరు జిల్లా జిల్లెళ్ళమూడి  అమ్మ సంస్కృత కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారి తో ఉన్న పూర్వ పరిచయాన్ని పురస్కరించుకొని వారిద్వారా జిల్లెళ్లమూడి సంస్కృత కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ డా.శ్రీ పన్నాల రాదా కృష్ణ శర్మ గారి ఫోన్ నంబర్ తెలుసుకొని ,  హైదరాబాద్ లో వారి స్వగృహం లో కలిసి ఇంటర్వ్యు చేసి ,వారు అందజేసిన తమ రచనల నాధారంగా శర్మ గారి గీర్వాణ కృషి ని పరిచయం చేయగలిగాను.

   ఆచార్య సార్వ భౌమ శ్రీ వేదుల సుబ్రాహ్మణ్య  శాస్త్రి  గారు వారంతకు వారే నాగురించి తెలుసుకొని వారి గ్రంధాలను పంపగా వారి గూర్చి రాసే భాగ్యం దక్కింది  .ఈ రెండవ భాగం తీగ కదలటానికి ముఖ్య కారకులు ,నాపై అమితమైన ప్రేమ ఆదరణ కురిపిస్తూ,అభినందిస్తూ  ‘’ప్రసాద్ గారూ !సంస్కృతం చదువుకొన్న మేమెవ్వరం చేయ లేని మహత్కార్యాన్ని మీరు చేస్తున్నారు. మిమ్మల్ని చూసి నాకు గర్వం గా ఉంది’’అని ఎప్పటికప్పుడు ఫోన్ లో దీని ప్రగతిని తెలుసుకొంటూ నన్ను ఎంతగానో ప్రోత్సహించిన శ్రీ తూములూరు వారి సౌజన్యానికి ఎంతో రుణపడి ఉంటాను .

                 శ్రీ గరిమెళ్ళ సోమయాజులు శర్మ గారి పరిచయం లో మరో గొప్ప ముందడుగు పడింది .వారు ఆచార్య శ్రీ  బిరుద రాజు  రామ రాజు గారు ఆంగ్లం లో రాసిన ‘’కంట్రి బ్యూషన్ ఆఫ్ ఆంద్ర టు సాంస్క్రిట్ లిటరేచర్ ‘’‘’గ్రంధం చదివారా అంటే, లేదని చెప్పాను .ఎక్కడైనా దొరుకుతుందేమో నెట్ లో వెతకమని శ్రీ మైనేని వారిని కోరటం  వారు వెంటనే దాన్ని ఆర్డర్ ఇచ్చిస్వర్గీయ  సద్గురు శ్రీ శివానంద  మూర్తి గారి గారి కుమారులు శ్రీ బసవ రాజు గారి తో ఫోన్ లో మాట్లాడగా తమ వద్ద ఉన్నదని చెప్పి కొరియర్ లో 700 పేజీలున్న   దానిని భద్రం గా ఉచితంగా పంపి…

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-2 

తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-2 

  . మీనాక్షి సుందరం పిళ్ళై శిష్యరికం .

మాయూరం లో తిరువాడుడురై మఠానికి చెందినఒక భవనం లో మీనాక్షి సుందరం పిళ్ళై ఉండేవాడు .తమిళ మహా విద్వాంసుడుగా పేరుపొందాడు .స్థలపురాణాలు ఎన్నో రాశాడాయన .తమిళ భాషా సాహిత్య బోధనలో మహాదిట్ట .స్వామినాథన్ ను వెంటబెట్టుకొని తండ్రి సుబ్బయ్యర్ ఆయనదగ్గరకు వెళ్ళాడు .వీరిని ఆహ్వానించటానికి పిళ్ళై బయటకు రాగా అయ్యర్ మనసులోఆయనపై ఆరాధనా భావం ఏర్పడింది ‘’మా వైపు వస్తుంటే ఆయన ఆకృతి నన్ను ఆకర్షించింది .బలిష్టమైన దేహం చిరుబొజ్జ ,విశాలఫాలభాగం ,చిన్న పిలక శ్వేత వస్త్ర ధారణా ,సంపన్న గృహస్తుడుగా అనిపించాడు .కానీ ముఖం లో ధనిక దర్పం లేదు ప్రశాంతత కళ్ళల్లో కనిపించింది .దయార్ద్ర వీక్షణాలు .జీవిత సమరం లో అలసిన యోధునిగా అవుపించాడు .కంఠ సీమను అలంకరించిన రుద్రాక్షమాల .దీర్ఘ తపస్సు తర్వాత సాక్షాత్కరించిన పరమ శివుని లాగా అనిపించాడు .నాలో ఉత్సాహం కళ్ళలో ఆనంద బాష్పాలు ఉక్కిరి బిక్కిరి చేశాయి .’’అన్నాడు అయ్యర్.

  తండ్రి తనను తాను  పరిచయం చేసుకొని గోపాలకృష్ణ భారతితో ఉన్న మిత్రత్వం చెప్పి ,కొడుకు స్వామినాథన్ కు  తమిళ భాష పై ఉన్న ఆరాధన తెలియజేశాడు .సంతోషించిన పిళ్ళై అయ్యర్ ను పరీక్షించి ,అనేక ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టగా తండ్రి ‘’ఈ పిల్లాడిని మీకు అప్పగిస్తున్నాను .శిష్యుడిగా స్వీకరించండి .పాఠాలు ఎప్పుడు ప్రారంభిస్తారు ?’’అన్నాడు .పిళ్ళై ‘’చాలామంది నా దగ్గర చదువుకోటానికి వస్తారు .ఏదో అరకొర చదువు చదివి నా శిష్యులమని ప్రచారం చేసుకొంటారు .దానివలన నాకూ వాళ్ళకూ తృప్తి ఉండదు.’’అనగా తండ్రి ‘’మావాడు మీరు ఉండమన్నంతవరకు మీ దగ్గరే ఉంటాడు .వాడిని తమిళం లో సుషిక్షితుని చేసే దాకా మీ వద్దనే ఉంచుకోండి వాడికీ మాకూ అభ్యంతరం లేదు .వాడికేమీ బాధ్యతలు ఇప్పుడులేవు ‘’అని బ్లాంక్ చెక్ ఇచ్చేశాడు .పిళ్ళై సంతృప్తి చెంది అయ్యర్ ను ఎక్కడ ఉంచుతారో చెప్పమని అడగగా ,ఆ బాధ్యతా పిళ్ళై గారే తీసుకోవాలనే ,ప్రతినేలాకొంతడబ్బు పంపిస్తాననీ అన్నాడు  తండ్రి.అందరికీ సంతోషంగా ఉంది .

  కొంతకాలం దాకా పిళ్ళై తన శిష్యుడు సావేరి నాథ పిళ్ళై కి అప్పగించాడు .యితడు పండితుడేకాని క్రైస్తవుడు.బాగానే చెప్పేవాడుకానీ గురుముఖతా పాఠాలు నేర్చుకోవాలన్న అయ్యర్ తపన తీరలేదు .ప్రకృతి ఉపాసకుడైన పిళ్ళై పెరటిలో సమూలంగా పెకలించిన చెట్లు నాటాడు .అవి ఎలా బతుకుతాయా అని ఆదుర్దాలో ఉండేవాడు .అయ్యర్ ఉదయాన్నే లేచి కొత్త చివుల్లను గుర్తించి గురువు గారికి చూపేవాడు .ఆయన సంతృప్తి చెండది శిష్యుని మెచ్చేవాడు,మనసు విప్పి మాట్లాడేవాడు .

  ఒక రోజు గురువుతో తాను  నైషధం చదువుతున్నాననీ ,దాన్ని గురువుగారు బోధిస్తేనే బాగుంటుందని వినయంగా చెప్పాడు .చిరునవ్వు నవ్విన పిళ్ళై ఆరోజు నుంచే శిష్యుడికి బోధించటం ప్రారంభించి కోరిక తీర్చాడు .తన రచన ‘’తిరుక్కు డందయి తిరి పందాదిని ‘’కూడా చెప్పటం మొదలుపెట్టి ,అయ్యర్ కున్న భాషా శాస్త్రాభిమానానికి ముగ్ధుడయ్యాడు .అప్పటినుంచి రోజూ చాలాగంటలు పాఠాలు చెప్పాడు ప్రత్యెక శ్రద్ధతో.దీన్ని అయ్యర్ ‘’నాకున్న తమిళ తృష్ణ ,ఏనుగు కు మహా ఆకలేస్తే గుప్పెడు మరమరాలతో సరి పుచ్చుకొన్నట్లు ఉండేది ఒకప్పుడు ఇప్పుడు పిళ్ళై గారివద్ద విందు భోజనమే రోజూ ..ఒక్కోసారి ఆకలిని మించిన భోజనం లభించేది’.ఇక తమిళ విద్యాభ్యాసానికి ఢోకా’లేదు ‘’అని పరవశించి చెప్పుకొన్నాడు  .అయ్యర్ గురుసన్నిధిలో ఎన్నెన్నో కృతులు అధ్యయనం చేశాడు .వాటిలో అంతాది,పిళ్ళై త్తమిల్  వంటివి ఉన్నాయి .ఆదర్శ గురువుకు ఆదర్శ శిష్యుడు .పిళ్ళై సాహిత్య వర్ష దారల్ని తనివి తీరా అనుభవించాడు స్వామినాధయ్యర్ .

   తిరువాడు దురై లో విద్యాభ్యాసం   

ఒకరోజు గురువుశిష్యుడిని ‘’నీకు వెంకటరాన్ ‘’అని ఎందుకు పేరు పెట్టారు ?’’అని అకస్మాత్తుగా అడిగాడు .’’మా ఇలవేల్పు వేంకటేశ్వరుడు కనుక ఆపేరు పెట్టారు ‘’అన్నాడు .’’నీకు ఇంకోపేరు ఉందా ?’’అని అడిగితె ‘’శామా అంటారు అది స్వామినాథన్ కు సంక్షిప్తనామం ‘’అన్నాడు .ఇక అతడిని స్వామినాథన్ పేరుతోనే పిలుస్తానని పిళ్ళై అని అలాగే పిలుస్తూ ఆపేరుకు వ్యాప్తితెచ్చాడు .ఉదయం గోపాలకృష్ణ భారతివద్ద సంగీతం నేరుస్తూ ఒకసారి గురువు అడిగితె నేర్చిన సంగీతం మర్చి పోకుండా ఉండటానికే అక్కడికి వెడుతున్నట్లు, కాని తనకు అందులో ఉత్సాహం లేనట్లు ధ్వనించేట్లు చెప్పాడు .సంగీతం లోకి ప్రవేశిస్తే సాహిత్యం అంటదు అన్నాడు గురూజీ .వెంటనే భారతి దగ్గరకు వెళ్లి తన అశక్తత చెప్పేశాడు ,

  కొన్ని నెలల తరవాత పిళ్ళై తోకలిసి అయ్యర్ తిరువాడుదురై వెళ్ళాడు .అక్కడి మఠానికి మేలకరం సుబ్రహ్మణ్య దేశికర్ అధిపతి .ఆయన మహా విద్వాంసుడు ప్రజల్లో చాలా గౌరవాదరాలు ఉండేవి .దేశికర్ కు పిళ్ళై పట్ల విపరీతమైన అభిమానం..మఠంలో కొంతకాలం ఉండమని ,ఆధ్యాత్మిక సాధకులైన ‘’త౦బి రాళ్ల’’కు పాఠాలు బోధించమని అభ్యర్ధించాడు.శిష్యుడిని దేశికర్ కు పరిచయం చేశాడు గురువు .దేశికర్ కోరిక మేరకు ఒకపద్యాన్ని రాగయుక్తంగా పాడి ,అర్ధ వివరణా చేసి వీనులవిందు చేశాడు అయ్యర్ . మఠంలోని శివార్చనా విధానం ఆశ్చర్యం కలిగించి౦ది .తమ్బిరానులు పొడవైన కేశాలతో ,కాషాయ వస్త్రాలతో ,ఆరుకట్టి ఆభరణాలతో ముచ్చట గొలిపెవారు .శైవానికి ఈమఠం కేంద్రంగా ఉండేది .  దేశికర్ పిళ్ళై ను విద్యార్ధులకు బోధించమని మళ్ళీ కోరగా ,అంగీకరించి ,పట్టీశ్వరం వాసి ఆరుముగత్తపిళ్ళై ను కొంతకాలం తన ఊరుకు పంపమని కోరగా సరేనన్నాడు  దేశికర్  తిరువాడు దురై-పట్టీశ్వరం మధ్య కుంభ కోణం లో ఉన్న ప్రభుత్వ కళాశాల తమిళపండితుడు .త్యాగరాజ చెట్టిని అయ్యర్ కలిశాడు .శెట్టి ఇతన్ని ప్రశ్నించి చెప్పిన సమాధానాలకు తృప్తిపడి ,’’మీరు ఇతరులకు పాఠాలు చెబుతారా ?’’అని అడిగితె ‘’శక్తి వంచన లేకుండా చెబుతాను ‘’అనగా పిళ్ళై గారి శిష్యుడుకనుక బాగా బోధిస్తాడు అనే నమ్మకం కలిగి వెంటనే ప్రారంభించామన్నాడు చెట్టి.పట్టీశ్వరం లో ఉన్నప్పుడు చుట్టు ప్రక్క దేవాలయాలు సందర్శించి వాటి చరిత్రను గురుముఖతా తెలుసుకొన్నాడు .నాగి ,మాయూర పురాణాలు అధ్యయనం చేశాడు .

తిరుముగత్త పిళ్ళై ఇంటిపద్ధతులు తమాషాగా ఉండేవి .రాత్రి తొమ్మిదింటికి అందరూ నిద్రపోవాలి .అర్ధరాత్రి పిళ్ళై నిద్రలేచి బంధువుల్నీ అతిదుల్నీ లేపి భోజనం చెయ్యమనే వాడు .మీనాక్షి సుందరం పిళ్ళై వెంట వచ్చిన వారికి ఈ పధ్ధతి నచ్చలేదు .కానీ కిమ్మనే వారుకాదు .ఆపిళ్ళై చండ శాసనుడు .ఆయనపై ఎవరికీ ఆదరభావం లేదు .అయ్యర్ కూడా ఆయనకోపానికి బలి అయినవాడే .మాయూరం నుంచి తరచుగా వచ్చే సావేరి నాథ పిళ్ళై ఒక రోజు ఈయనపై చాటువుగా ఒకపద్యం చదివాడు దానిభావం ‘’పట్టీశ్వరం లో రాత్రివేళ ఆకలి బాధపడమని ఆదేశించిన బ్రహ్మ మమ్మల్ని చెట్లు గా పుట్టించలేదు ‘’దీనితో అతనిలో మార్పు తెప్పించి సకాలం లో భోజనాలు జరిగేట్లు చేశాడు .ఇలా ఆరునెలలు పట్టీశ్వరం లో గడిపాడు అయ్యర్ .ఇక్కడ ఉన్నప్పుడే తమ స్వగ్రామ౦ ఉత్తరమదాన పురం వెళ్లి,విజయదశమి నాడు గురువువద్ద కొత్తకావ్యం ప్రారంభించాలని తిరిగిపట్టీశ్వరం  వచ్చేశాడు .నైషధం లో ఒక శ్లోకం చదివి నైషధ అధ్యయనం గురు సన్నిధిలో ప్రారంభించాడు  .

మనకు కూడా పట్టిస ఉంది .అక్కడినుంచే గోదావరి జలాలను ఎత్తి పోత పధకం ద్వారా కృష్ణాజిల్లకు నీరు సరఫరా చేయించాడు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు .దక్ష యాగా ధ్వంసం చేసి పట్టిస ఆయుధంగా అందర్నీ చంపిన వీరభద్రుడు పట్టిస దగ్గర గోదావరిలో ఆనెత్తురును కడిగాడు .పట్టిస ఆయుధం నెత్తురు కడిగిన ప్రదేశం కనుక పట్టిస అనే పేరు వచ్చింది .ఇక్కడి  వీరభద్ర భద్రకాళిఆలయ౦ గోదావరి నదిలో చిన్న కొండపై ఉంటుంది .పట్టిసక్షేత్రం మహా క్షేత్రంగా పేరు పొందింది .తమిళ నాడులో పట్టీశ్వరం పేరు ఎందుకు వచ్చిందో ?ఆలోచిస్తే –కామధేనువు దూడ అంటే పట్టి పేరు నంది .అందుకే పట్టీశ్వరం అనే పేరు వచ్చిందని ‘’గూగుల్ సూతమహర్షి ఉవాచ ‘’

  సశేషం

 మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -9-11-21-ఉయ్యూరు  

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-1  

తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-1  

 అనే పుస్తకాన్ని ఇంగ్లీష్ లో శ్రీ ప్రేమానందకుమార్ రాయగా తమిళం లోకి కివా జగన్నాథన్ అనువదించగా ,తెలుగు సేత  శ్రీ చల్లా రాధా కృష్ణ శర్మ చేయగా ,కేంద్ర సాహిత్య అకాడెమి 1989లో ప్రచురించింది .వెల-5రూపాయలు .ఇంతకీ ఎవరు ఈ తాత?అనే విషయాన్ని మున్నుడిలో జగన్నాథన్ తెలిపాడు .గత శతాబ్ది ఉత్తరార్ధం లో పుట్టి ,ఈ శతాబ్దం లో మరణించి తమిళ సాహిత్య సేవలో పునీతులైన ఇద్దరు విద్వాంసులలో మొదటివాడు సుబ్రహ్మణ్య భారతికాగా రెండవవాడు ఉ.వే.స్వామినాథయ్యర్ .అద్భుతకవితలతో భారతి తమిళ సాహిత్య తల్లిని సేవిస్తే , అయ్యర్ రెండు వేల ఏళ్ల నాటి తమిళ’’ సంగ కావ్యాలను’’ ,ఇతరకావ్యాలను బయటికి తీసి ,పరిశోధించి ప్రచురించాడు .వీటి వలనననే తమిళ ప్రాచీన చరిత్ర,సంస్కృతీ ప్రపంచం తెలుసుకో గలిగింది .అప్పటినుంచి వీటిపై పరిశోధన ముమ్మరంగా సాగి,అంతర్జాతీయ తమిళ మహా సభలు జరిగాయి. కంబ రామాయణం ,విల్లిపుత్తురార్ రాసిన భారతం తో ఆగిపోయిన తమిళ సాహిత్యం విస్తృతి చెందింది .ఆశ్చర్యానికి లోను చేసింది .సంగకాల సాహిత్యం ప్రాచీనమే అయినా ఈనాటికీ విలువైనదిగానే గుర్తింపు పొందింది .అయ్యర్ స్వయంగా కొన్ని వచన రచనలు కూడా చేశాడు  తాను ప్రచురించిన ‘’మణిమేకలై ‘’కి అనుబంధంగా దాని కథాసంగ్రహం ,త్రిరత్నాలైన బుద్ధుడు ,సంఘం, ధర్మం గురించికూడా రాశాడు .పెరుం గదై అంటే బృహత్కథ,పరిష్కరణలో భాగం గా ‘’ఉదయనుడు’’ రాశాడు .గురువైన మీనాక్షి సుందర పిళ్ళై,మొదలైనవారి జీవిత చరిత్రలూ రాశాడు తాళపత్ర గ్రంథాల కోసం పడిన శ్రమలో కలిగిన అనుభవాలనూ గ్రంథస్తం చేశాడు పరిష్కరణ కావ్యాలకు ఆయన రచించిన ఉపోద్ఘాతాలు మణి,మాణిక్యాలే.ఇవన్నీ తమిళ సాహిత్య విజ్ఞాన సర్వస్వం గా భాసి౦చాయి …88ఏళ్ళు సార్ధక జీవితం గడిపి అయ్యర్’’ దైవికం’’ చెందాడు .అయ్యర్ గురించి సుబ్రహ్మణ్య భారతి –‘’తమిళ భాష జీవించినంతకాలం –తెలుస్తుంది నీకు తమిళకవుల ప్రశంస –లభిస్తుంది వారి కృతజ్ఞత –చిరంజీవివయ్యా నీవు ‘’అని కీర్తించాడు ‘’అందుకే అయ్యర్ ‘’తమిళ తాత ‘’అయ్యాడు .

    బాల్య విద్యాభ్యాసాలు

  తంజావూర్ పాలకరాజు ఒకాయన 48మంది బ్రాహ్మణ కుటుంబాలకు ఉత్తమదాన పురాన్ని కానుకగా ఇచ్చాడు ..అక్కడసాంప్రదాయ విద్వత్తు ,మేధస్సు వెల్లి విరిశాయి.,19వశాతబ్ది మొదట్లో అక్కడ వేంకటాచల అయ్యర్ అనే పేద శైవ బ్రాహ్మణ ,అష్ట సహస్ర శాఖకు చెందిన ఉపాధ్యాయుడు ఉండేవాడు .ఈయనకు వెంకట సుబ్బ అయ్యర్ ,శ్రీనివాసయ్యర్ కుమారులు .వెంకట సుబ్బయ్యర్ కు 19-2-1855 న స్వామి నాథన్ జన్మించాడు .తాతగారి వద్ద అక్షరాభ్యాసం జరిగి ,చాలా గీతాలు నేర్చాడు .తండ్రి మేనమామ ఘనం కృష్ణయ్యర్ గొప్ప సంగీత విద్వాంసుడు .శాస్త్రీయ సంగీత మార్గ త్రయాన్ని ‘’ఘనం ,నయం ,దేశికం ‘’అంటారు .అతి జటిలమైన ఘనం లో ఆయన ఘటికుడు .మేనమామ దగ్గర సంగీతం నేర్చి మహా ప్రావీణ్యం సంపాదించాడు సుబ్బయ్యర్ .కొడుకూ అలా కావాలని ఆశించాడు .సంగీతం కంటే తమిళభాష మీద మక్కువ ఎక్కువ స్వామినాథన్ కు .

 వెంకట సుబ్బయ్యర్ తనమకాం ను ‘’అరియలూరు ‘’కు మార్చి,రామాయణం గురించి సంగీత ఉపన్యాసాలు చేసి జీవిక సాగించాడు. కొడుకును సంగీత సంస్కృతాలలో నిధి అయిన స్వామి నాథయ్యర్ వద్ద చేర్చగా కొన్ని లఘు కావ్యాలు నేర్చుకొన్నాడు.సంగీత , సంస్కృతాలూ ,చిత్రలేఖనం ఒంటబట్టాయి .అందమైన కాగితం బొమ్మలు తయారు చేసేవాడు .భావుకుడు కనుక సంస్కృత సాహిత్యాధ్యయనమూ చేశాడు .కావేరీ తీర మారుమూల గ్రామాల ప్రకృతి సౌందర్యాన్ని చూసి పరవశి౦చేవాడు ..మాతామహుడు కృష్ణ శాస్త్రి పరమ శివభక్తుడు అవటం తో శివనామం నిరంతరం జపించేవాడు.

   ఆ కాలం లో తమిళం పై చిన్న చూపు , సంస్కృతంపై మర్యాద ఎక్కువ .విజయానికి రాచబాట ఇంగ్లీష్ .దీనిపై ఆయనకు మోజులేదు .శాస్త్రీయ సంగీత శిక్షణ పొందేవాడు .తెలుగులోనూ కొంత పరిచయం సంపాదించే వారు ఆనాటి వారు.ఈయనకు అదీ లేదు   .తమిళమే ఆయన్ను బాగా ఆకర్షించింది .

 గోపాలకృష్ణ భారతి రాసిన నందనార్ యక్షగానం బాగా ఆకర్షించి విపరీతంగా చదివి అంతా కంఠతా పట్టాడు .ఆవూరిలోనే ఉన్న శఠగోపం అయ్యంగారి తో పరిచయం కలిగి ,తమిళం అభ్యసించాడు .జటిల  తమిళాన్ని కూడా కరతలామలకం గా బోధించేవాడు అయ్యంగార్  ‘.దీనితో అయ్యర్ కి అయ్యంగారి వలన తమిళం లో మహానేర్పు అలవడింది .7వ ఏట ఉపనయనం జరిగి వెంకటరామ శర్మ అనే పేరు పెట్టారు .అందరూ ‘’శామా ‘’అనే పిలిచేవారు .తిరు వేరగం లోని స్వామి’పేరు స్వామినాథన్. మేనమామనుంచి కొన్ని మంత్రాలు నేర్చాడు .నియమంగాసంధ్యావందనం చేసేవాడు .

   తండ్రి తన నివాసాన్ని దగ్గరలో ఉన్న ‘’కున్నం ‘’గ్రామానికి మార్చాడు .ఆగ్రామస్తులు సంగీతోపన్యాసాలకు తగిన పారితోషికం ఇస్తామని చెప్పటం తో మార్చిన మకాం .అక్కడి చిదంబరం పిళ్ళై తిరు విడైయార్ పురాణం మొదలైనవి అయ్యర్ కు బోధించాడు .తమిళ కావ్య రహస్యాలను ,నన్నూల్ ,నవనీత పాట్టియల్ లక్షణ గ్రంథాలను కస్తూరి రంగయ్యర్ బోధించాడు  .తాయుమానవార్ ,పట్టిణత్తార్ లను అనుకరిస్తూ సంప్రదాయ ఛందస్సులో తమిళ పద్యాలు రాశాడు .తమిళం లో మాంచి పాండిత్యం పొందే సమయం లో 16-6-1868 న అయ్యర్ పెళ్లి మధురాంబాళ్ తో జరిగింది .జీవిత విధానం లో మార్పులేదు కానీ ఆర్ధిక సమస్యలున్నాయి.

  కొడుకుకున్నతమిళ సాహిత్యాభి రుచి గమనించి తండ్రి అతడిని చెంగన్నం లోని వృద్దాచలం రెడ్డి గారి శిష్యుడిగా చేర్చాడు .ఆయనదగ్గర తమిళ ఛందో శాస్త్ర గ్రంధం ‘’యాప్పరుం గల క్కారికైని ‘’ని నేర్చాడు .గురువు తరచుగా తమిళ విద్వా౦సులగురించి ,ప్రసిద్ధ అధ్యాపకుల గురించి ప్రసంగించే వాడు .’’తిరువాడు దురై మరం ‘’ ఆస్థాన విద్వాంసుడు మహా విద్వాన్ మీనాక్షి సుందర పిళ్ళై పేరు తలిస్తే చాలు రెడ్డిగారు తన్మయులయ్యేవారు .ఆయన శిష్యుడు కావాలని అయ్యర్ అభిలాష ,.తనకున్న తమిళ తృష్ణ తీర్చగలసమర్ధుడు ఆయనే అని నమ్మాడు .

  ఆయన దగ్గరచదవాలంటే ,అక్కడే కాపురం పెట్టాలి .ఆయన అనుగ్రహం తో కొడుకు తమిళ మహా విద్వాంసుడు అవుతాడని తండ్రికి గట్టినమ్మకం .తన మిత్రుడు గోపాల కృష్ణ భారతి అక్కడే ఉన్నాడు కనుక ఒకసారి మయూరం వెళ్లి అతడిని కలవాలనుకొన్నాడు సుబ్బయ్యర్ .

   సశేషం

నాగుల చవితి శుభా కాంక్షలతో

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -7-11-21-ఉయ్యూరు   . . 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

స్వర సంధానం తో హాస్యం

స్వర సంధానం తో హాస్యం

స్వరం లో మార్పునే స్వర సంధానం అంటారు .ఇదికూడా ఉచ్చారణ వికృతే.దీనితో హాస్యం పుడుతుందని మునిమాణిక్యం ఉవాచ .ఒకసారి మాస్టారు స్వామి శివ శంకర స్వామిని ‘’అనుష్టుప్  ‘’నడక ఎలా ఉంటుంది అని అడిగితె –ఒక కాని ఒకే కాని ,రెండు కానులు అర్ధణా ,మూడుకానులు ముక్కానీ ,నాలుగు కానులు ఒక అణా’’అనే వాక్యాలను అనుష్టుప్ లాగా చదివి నడక ఎలా ఉంటుందో బోధించారట .పూర్వం కృష్ణమాచారి అనే ఆయన మహా వక్తగా ఉంటూ దేశమంతా తిరిగి ఉపన్యాసాలిచ్చాడు .ఆయన ఇంగ్లీష్ వాక్యాలను వేద రుక్కులు లాగా ఉదాత్త అనుదాత్తాలతో చదువుతూ ఉంటె తమాషాగా ఉంటూ నవ్వు పుట్టి౦చెవి అని  మునిమాణిక్య వచనం .ఉదాహరణకు –‘’Oh 1what a heart I must have to contemplate without emotion that elevation and that fall ‘’

  అట్లాగే ‘’మై మదర్ కేము హియర్ .షి ఈజ్ నాట్హాపీ .షి ఈజ్ ఇల్లు .మరోటి ‘’వాటూ?ట్రెయిన్  ఇంకా నాట్ కమ్మా ?లేటా?హౌ మచ్చూ ‘’?’’యు ఆర్ గోయింగా రైటో ‘’.

  తెలుగు పద్యాన్ని సంస్కృతం లోగా ఉచ్చరిస్తే రమణీయంగా ఉంటూ నవ్వు తెప్పిస్తుంది అన్నారు మాస్టారు .చదివే వాడికి సంస్కృతం చదివే నేర్పు ఉంటేనే రాణిస్తుంది .లేకపోతె బెడిసి కొడుతుంది .ఉదాహరణ –‘’దొంగల్లారా భ్రమలు పడితే పేదవాళ్ళం గదట్రా – కుండా మండా పగలగొడితే కనుక్కోలెం గదర్రా’’.’’మరోతి’’-‘’అనవేమ మహీ పాలా చూపులున్ గడు లెస్సలున్ –యుద్దమందు మహా శూర్లూ ,శహ బాసునే  భలే ముండాధియో యోనః ప్రచోదయాత్ ‘’అని ఒక కవి రాశాడని మేష్టారు ఉవాచ .

   ఊత పద ప్రయోగ హాస్యం

ఊతం అంటే నేయ బడింది అని అర్ధం అన్నారు మునిమాణిక్యం ..బట్టలు నేసేప్పుడు దారం మాటిమాటికీ వచ్చినట్లు ,కొందరు మాట్లాడుతుంటే ఒక రకమైన పదం పదేపదే వస్తుంది హాస్యం పుట్టిస్తుంది .ఊత పద ప్రయోగం వలన హాస్యం పుట్టటానికి సంకులం, భిభీషికం ,అతి వచనం అనే మూడు పద్ధతులున్నాయన్నారు మాష్టారు .

సంకులం –ముందు ,వెనుకల విరుద్ధమైన వాక్యాన్ని సంకుల వాక్యం అంటారు .ఇది శబ్దాశ్రయ హాస్యమే అన్నారు మాస్టారు .ఉదాహరణ-‘’నేనూ –నిన్నసాయంత్రం ఐ మీన్ అంటే ఇవాళ పొద్దున్న మీ ఇంటికి వస్తే ,నువ్వు లేవు ‘’.అలాగే ‘’పాపం వాడు చనిపోయాడు –అంటే ఇంకాచావలేదనుకో .అందుకు సిద్ధంగా ఉన్నాడు ‘’.మరోటి –‘’ఆయన ఏక పత్నీ వ్రతుడే .కాకపోతే ఎవరైనా ఆడాళ్ళు కంటబడితే తినేట్లు చూస్తాడు .అంతమాత్రాన అతని శీలాన్ని శంకి౦చ నక్కరలేదు ‘’.

 భిభీషికం-ఇందులో మాటలు సంభాషణ లోనే రాణిస్తాయి,గ్రంథస్తమైతే సొంపుఉండదు అంటారు మాస్టారు..ఇదొక భాషణావిశేషం అనుకోవచ్చు అన్నారు మాస్టారు .ఉదాహరణ –కొంపలంటుకు పోయాయి .వాడు నిన్నసాయంత్రం ఊరెళ్ళాడు’’ .ఇంతకీ అర్ధం ఏమిటి అంటే ‘’నవ్వులాటకు భయ పెట్టటం ‘’అన్నారు మునిమాణిక్యం .

 అతి వచనం –తె లంగాణా వారు దీన్ని ఎక్కువగా వాడుతారు  ప్రతి వాక్యం చివరా ‘’వింటిరా?’’అంటారు .ఉదాహరణ –‘’ఆంద్ర సారస్వత పరిషత్ వారు వింటిరా –ఈ సంవత్సరం వింటిరా-కార్తీక మాసం లోనే విశారద పరీక్షలు జరుపుతున్నారు –వింటిరా ‘’మొదటి సారి మనం వింటే నవ్వు రాక చస్తుందా .వింటిరా అన్నప్పుడల్లా ‘’వినలేదు ‘’అంటారు కొంటె కుర్రోళ్ళు .పగోజి వారు ‘’బోధ పళ్ళే’’అంటారు .’నమ్ము నమ్మకపో వాడు పొద్దునే వెళ్ళాడు ‘’’’నేను చెప్పలా ‘’?చంపావు పో ‘’,మరిగంటే’’వగైరాలు ఎన్నైనా చెప్పచ్చు .ఊత పదాలను ఒక రమణీయ ఊపుతో అంటేనే హాస్యం పేలుతుంది .ఈ ఊత పద ప్రయోగం వల్లమధురత్వ ,రసవత్వ,రమణీయత్వాలు కలుగుతాయని,ఇది తెలిసిన వాడికి హాస్య సామ్రాజ్య పట్టాభిషేకం జరుగుతుందని  మాష్టారు మరీ మరీ డష్టర్  బోర్డు మీద గట్టిగా కొట్టి  చెప్పారు .

 మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -7-11-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

దూర్జటికలాపం

శ్రీ వేదాంతం పార్వతీశం రచించిన ‘’ధూర్జటి కలాపం ‘’తెలుగు విశ్వవిద్యాలయం 1996లో ప్రచురించింది .వెల-24రూపాయలు .దీనికి ముందుమాట రాసిన తెలుగు విశ్వ విద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య నాయని కృష్ణ కుమారి గారు ‘’కూచిపూడి నృత్య సంబంధమైన శాస్త్ర ప్రాయోగిక విషయాలలో సమర్ధులైన శ్రీ వేదాంతం పార్వతీశం ‘’ధూర్జటి కలాపం ‘’రాశారు .నాట్య ద్వాదశ అంగాలను కరణ సమాహారం తో జాతి అన్వయం తోపూరించారు ‘’అన్నారు .

 పార్వతేశం గీతపద్యం లో ‘’శ్రీసతీ లాస్య గౌరవ శ్రీల జూసి –తనకు తానై యుప్పొంగి తాండవించు –శివుడుమా పతినటరాజు సిద్ధ మూర్తి –ఇచ్చుగావుత సిరులను యిపుడు నెపుడు ‘’,’’శ్రీ మదాంధ్ర లలితకళా చిద్విలాస –భాస భూసుర నికర  నివాస లలిత ప్రమోద హాస-రామలింగేశ రామేశ శ్రీ మహేశ ‘’,కుచేల బుధ సంసేవ్యం –బాలా త్రిపుర సున్దరీ౦ –నమామి నృత్య వారాశీం-కూచిపూడి నివాసినీం ‘’,’’శ్రీ సిద్ధేంద్ర యోగి సంసేవ్యం –భామాకలాప నాయక౦ –నమామి రాజగోపాలం –కూచిపూడి నివాసినీం ‘’అంటూ కూచి పూడి క్షేత్రాన్నీ , భామకలాప నాయకులను ప్రస్తుతించి తర్వాత వినాయక, భారతి ,కవితా ,నృత్య గురువులను స్మరించి ,అమ్మానాన్నలకు నమస్కరించి  గురువైన పెద్దన్న నాగ లక్ష్మీ నరసింహుని స్మరి౦చి ,పినతాత పౌత్రుడు, దర్శకుడు వేదాంతం రాఘవయ్యను గుర్తు చేసుకొని తర్వాత –‘’నాదు వంశజులెల్ల నాట్యము నను,జ్యోతిషంబునవాదమిచ్చి –శూలినైనను,నటు తమ్మి చూలినైన –మేలమాడుచు మెప్పించు మేటి మగలు ‘’అని చాటి ,తాను  కలం పట్టి కావ్యాను శీలనంగా గద్యపద్యాలు సుకవులు మెచ్చగా రాస్తాననీ ,హలం పట్టుకొంటే మాగాణ౦ లో  లో రత్నాల వరిపంట పండించాగలనని ,చలమూని చదువులన్నీ శిక్షిస్తాననీ ,’’తలపూని కవ్వింతుతకిట తై-దికటతైఅని నాట్యలక్ష్మిని కవ్విస్తాననీ ,నాట్య శ్రీని చేతిలో తాళాలతో నాట్య మాడిస్తాననీ ,’’కళను పార్వతీశుడ  వేదాంత వంశజుడను ‘’ అని తనను పరిచయం చేసుకొన్నాడు .రామలింగేశ ,రాజగోపాలురు తండ్రులు బాలమ్మ అమ్మ లాలించి నృత్యకలాపం నేర్పింది పెద్దన ,పోతన తనకు ఆదర్శం ‘’క్షేత్రయ్య మా బావ –సిద్దేంద్రుడు గురుడు ‘’,లీలాశుకుడుమామ .మేళ కర్తలను సృష్టించి నేర్పుతున్నాడు .గొల్లభామాకలాపం కూచిపూడి సంపుటీ నృత్యనాటికలు చక్కదిద్దాడు .నృత్య వాచస్పతి అని బిరుదు పొందాడు .చింతామణి యక్షగానం స్వంత రచన .నాట్యహేల, రసలీల,లవకుశ ,హరిశ్చంద్ర ,సిద్ధేంద్ర మొదలైన కృతులు,పగటి వేషాలు,శారదారాశాడు .నృత్య తరంగిణి ,లవకుశానృత్యాలు లాక్షణికంగా కూర్చాడు.గొల్లకలాపాలలో గోగోపికల్ ఫేరణీ రసాల విరిసి మురిసింది .బాలమురళి ఆశీర్వదించారు .ఆరుద్ర మురిసి హృదార్ద్రు డయ్యాడు .మేళకర్తల రచన  తితిదే ముద్రించింది .’’వేములవాడ భీమకవి మా పెద్ద తాత –దండి శ్రీనాధ చౌడప్ప తరతరమని –చెళ్ళపిళ్ళ ,దివాకర్ల ‘’చెప్పమన్నారట .కష్టార్జితమే మనుగడ .’’ధూర్జటి కలాపమ్ము –నృత్యకావ్యము పేరణీ నేర్పు దవిలి –మేళకర్తల లక్ష్యాల సమ్మేళ పరచి ‘’వ్రాస్తున్నాను  కనుక వాణి దీవెనలు ఇమ్మని కోరాడు .ఎన్నాళ్ళ కోరికో ఇప్పుడు తీరిందట .

  తర్వాత కూచిపూడి మేళకర్తలు వినియోగాలు వివరించి ,నాట్య ద్వాదశ అంగాలు చెప్పి ,పీఠిక 1వ మేళకర్త బ్రహ్మా తాళం ,ఆతర్వాత వరుసగా రెండవ కర్త కౌతుకం ,కూటమానం,కైయడు,తురుఫు ,,కళాసిక,,,ప్రచుర వసర ,,శబ్దం మరాళకరకట్టు చాళీయంచారమానం ఆర్దీ మోహన ,,నత్రం గురించి విపులంగా రాశాడు .ఆతర్వాత చతుర్దశ మేళకర్త జ్యోతిర్లింగ కరణావతారాలు ,పతాక వందనం హంసధ్వని గురించి రాశాడు .

బహుశా కూచి పూడి నాట్యం పై ఇలాంటికలాపం రావటం అరుదైన విషయం ఎంతో సాహిత్య ,సంగీత నాట్య పరిజ్ఞానం ఉంటేనే ఈరచన చేయగలరు. అలాంటి లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్న పుంభావ సరస్వతి నట ధూర్జటి కనుకనే శ్రీ వేదాంతం పార్వతీశం ఇంత అద్భుత శాస్త్రగ్రంద రచన చేసి మెప్పుపొండాడు .

 .వేదాంతం పార్వతీశం  1920సెప్టెంబరు 24వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూచిపూడి గ్రామంలో పుణ్యవతమ్మ, వెంకటసుబ్బయ్య దంపతులకు జన్మించాడు. ఇతడు చింతా వెంకటరామయ్య, వేదాంతం రామకృష్ణయ్య, వేదాంతం రాఘవయ్యల వద్ద కూచిపూడి యక్షగానాలను నేర్చుకున్నాడు. యేలేశ్వరపు సీతారామాంజనేయులు వద్ద సంగీతాన్ని అభ్యసించాడు. ఇతడు ఢిల్లీ, జయపూర్‌లలో జరిగిన కాంగ్రెస్ మహాసభలలో తన నృత్యప్రదర్శన ఇచ్చాడు.

ఇతడు ఎరుక, అర్ధనారీశ్వరుడు, దక్షయజ్ఞం, ప్రవరాఖ్య, పేరణి శంకరప్ప, దాదీనమ్మ, శివమోహినులు మొదలైన కూచిపూడి నృత్యరూపకాలను రచించి వాటికి నృత్యాన్ని సమకూర్చి తన శిష్యులచే నటింపజేశాడు. ఇంకా ఇతడు తిల్లానాలు, జావళీలు ఎన్నో రచించాడు. నాట్యకళ మాసపత్రికలో నృత్యానికి సంబంధించి అనేక రచనలు చేశాడు. సిద్ధేంద్రయోగి భామాకలాపం, ప్రహ్లాద నాటకం, కూచిపూడి నాట్యదర్పణం,[2] కూచిపూడి మేళకర్తలు, గొల్లకలాపం, నృత్య తరంగిణి, ధూర్జటి కలాపం వంటి గ్రంథాలను ప్రచురించాడు. ఇంకా చింతామణి, ఉషాపరిణయం,హరిశ్చంద్ర, పగటివేషాలు, నాట్యమేళా, రాసలీల, జముకుల గేయాలు వంటి అముద్రిత రచనలు కూడా ఉన్నాయి.

ఇతడు 1952లో బందా కనకలింగేశ్వరరావుతో కలిసి కూచిపూడిలో సిద్ధేంద్ర కళాక్షేత్రాన్ని స్థాపించాడు. ఈ సంస్థ ఆరంభం నుండి దానిలో పనిచేసి దానికి ప్రిన్సిపాల్‌గా పదవీవిరమణ చేశాడు.[3] 1954లో కూచిపూడి పతాకాన్ని ఆవిష్కరించాడు.

ఇతని శిష్యులలో పసుమర్తి రామలింగశాస్త్రి, వేదాంతం రత్తయ్య శర్మవేదాంతం రాధేశ్యాం, పసుమర్తి కేశవప్రసాద్, చింతా సీతారామాంజనేయులుయేలేశ్వరపు నాగేశ్వర శర్మ, చింతా రామము, భాగవతుల మోహన్ రావు మొదలైనవారు ఉన్నారు.

కేంద్ర సంగీత నాటక అకాడమీ 1994లో ఇతనికి కూచిపూడి నాట్యంలో అవార్డును ప్రకటించింది.

 సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-11-21-ఉయ్యూరు     –     .

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఏకప్రాస సీతారామ శతకం- అల్లమరాజు రామకృష్ణ కవి

ఏకప్రాస సీతారామ శతకం

అల్లమరాజు రామకృష్ణ కవి ఏక ప్రాస సీతారామ శతకం రచించి జగ్గమపేట శ్రీ సీతారామస్వామి ఆలయ ధర్మకర్త శ్రీ మోగంటి కొండ్రాజు గారి ద్రవ్య సహాయంతో,కాకినాడ శ్రీ సరస్వతీ ముద్రాక్షర శాలలో 1913లో ప్రచురించాడు  వెల.కేవలం పావలా.

  పీఠికలో శార్దూల పద్యం లో –‘’శ్రీ మా హైమవతీ సరస్వతుల గూర్మిం బెన్నురంబందునన్-సామేనన్,రసనాగ్రభాగమున నిచ్చల్ దాల్చి ముల్లోకముల్

ప్రేమన్బ్రోచుపురాణ పూరుషులు పేర్మి గాన్త్రు రశ్రా౦త మున్ –శ్రీ మోగంటి కులామృతాబ్ధిశశియౌ  శ్రీ కొండ రాజాఖ్యునిన్ ‘’అని కృతిభర్తను ర్రక్షించమని లక్ష్మీ ,పార్వతీ  సరస్వతులను వాళ్ళ భర్తలైన త్రిమూర్తులను ఒక్క పద్యం లోనే బహు చమత్కారంగా వర్ణించాడు కవి .తర్వాత జగ్గమ పేట పురాన్ని వర్ణించాడు .

  గోదావరీ తీరం లో పిఠాపురం సంస్థానం లో రత్నగిరి దగ్గర సకల సౌభాగ్యాలతో జగ్గమపేట వర్ధిల్లింది .దానికి చెందిన 45 పల్లెలకు కరణీకం ఆర్వెల నియోగులైన మోగంటి వారు .రాజ్యాంగ మంత్రం తంత్రాలలో ,పాలనలో  ప్రసిద్ధులు.సత్యవాక్య పరిపాలనలో ,సాదు సజ్జన సేవలో,వితరణలో  మేటివారు  .కాశ్యప గోత్రులు .ఈ వంశం లో –‘’తిరుపతి రాజు బుట్టె గవి దీన జనావళి గాచిబ్రోవ శ్రీ –తిరుపతి రాజే ఈతడన ధీవర సన్నుతుడౌచు  దాన ని

ర్ఝరఝర కల్ప భూరుహ విశారద శారద నారదేందుధి-క్కరణ యశో శాలు డరికాలుడుసద్గుణ శీలు డౌననన్ ‘’

  ఈయనకొడుకు మల్లప రాజు గ్రామణిత్వం లో దిట్ట.ఈతిరుపతి  సీతమ్మ దంపతులకు దుర్మతి నామ సంవత్సరం శుద్ధ చతుర్దశి సోమవారం నాడు  గ్రహాలన్నీ ఉచ్చ స్థితిలో ఉండగా కొండల్రాజు జన్మించాడు .కాశీప్రయాగ మొదలైన తీర్ధ యాత్రలు చేసి ,తృప్తి చెందక ‘’రమాహృదీశు’’దేవాలయం కట్టించి ‘’శ్రీ సీతారామ  స్వామి దేవాలయం ‘’అని పేరుపెట్టి వైభవోపేతంగా విగ్రహాలను ప్రతిష్టించాడు.నిత్యపూజా శ్రీరామనవమినాడు కల్యాణం నిర్వహించాడు .తర్వాత భద్రాచలం శ్రీరంగం కంచి మొదలైన్ పుణ్య క్షేత్ర దర్శనం చేసి ,తిరిగి వచ్చి భగవధ్యానంతో తరిస్తున్నాడు .

  ఒక రోజు –‘’హరితస గోత్ర సంభవుడ నల్లమ రాజ కులాబ్ధి సోముడ-న్మరియునురామకృష్ణ కవి మాన్యుని పౌత్రుడ ,రామ చంద్ర ధీ

వరుని తనూజుడన్ ,సుకవి వంద్యుడ గృష్ణ విలాస కావ్యమున్ –సిరిమగానిన్ గృతీన్ద్రునిగ జేసినా రామకృష్ణు డన్ ‘’అని తన్ను గురించి చెప్పుకొన్న ఈ కవి ఆ సీతారామ దేవాలయ దర్శనం చేసి అందలి శిల్ప కళా వైభవానికి ఆశ్చర్య పడి,పరవశుడయ్యాడు .ఈ స్వామిపై ఏకప్రాస శతకం రాసి ఆలయ నిర్మాత కొండ్రాజుగారికి అంకితమిచ్చి  జీవితం ధన్యం చేసుకోవాలనుకొన్నాడు .ప్రమాది వత్సర ఆషాఢ శుక్ల దశమిఆదివార౦  శతకం వ్రాయటం మొదలుపెట్టి ,మూడే మూడు రోజుల్లో పూర్తి చేశాడు .తప్పులు ఉంటె మన్నించమని బుధులను కోరాడు కవి .

  శతకాన్ని శార్దూలం లో శ్రీ సీతారామ స్తుతి చేసి ప్రారంభించాడు –‘’’

‘’శ్రీమన్మంగళదేవతా హృదయ రాజీవార్కు మౌనీంద్ర సు –త్రామా బ్జాత శంకర ప్రముఖ గీర్వాణార్చి తాంఘ్రి ద్వయున్

శ్యామా౦గు౦జల జేక్షుణు౦ ,గుణ నిధింస్వర్ణా౦బరు౦ జిన్మయున్-రామున్సర్వ జనాభిరాము మదిలో బ్రార్ధింతు నశ్రా౦తమున్ ‘’.

  తర్వాత కందపద్యాలలో  ఏక ప్రాసతో ‘’ శ్రీ జగ్గమ పేటధామ సీతారామా’’మకుటం తో శతకం మొదలు పెట్టాడుకవి .మొదటిపద్యం –

‘’శ్రీ జనక తనూజా హృ-ద్రాజీవ విరాజ మాన ,రాజీవాప్తా

రాజద్రూప పరాత్పర –శ్రీ జగ్గమ పేటధామ సీతారామా’’

కొండ్రాజు గారు కట్టించిన దేవాలయం లో ‘’ఓజన్ శ్రీ హరి ,గిరిజా గణరాజార్క ‘’స్థాపనం చేశాడు .-రాజ శరాబ్జసుపర్వో- ర్వీజ మహా జలదిరాజవిష్ణు పదీ-సత్తేజోవిశద యశా –‘’శ్రీ జగ్గమపేట’’.మరోపద్యం లో ఇంద్రుని ‘’జీవనదాశ్వ ‘’అన్నాడు తమాషాగా .ఉపాధులకు ఆజీవాలు అన్నాడు .’’జాజుగల నీ పదంబులు –జాజుల చేమంతి పూల సంపెంగనలన౦ –భోజములతో పూజిస్తానన్నాడు .కావి రంగును జాజు అన్నాడు .అజాను వ్యాప్త సుబాహా అంటాడు .జాంబూనద చేలా అంటాడు పీతాంబర ధారి అనటానికి .జేజేలు రావణాదుల –చే జిక్కుల కోర్వలేక సేవించిన నెం-తే జంపితి వా దైత్యుల ‘’లో జేజేలు అంటే దేవతలు .ఓజతో రామా అంటే ఏ జడుడికైనా వైకుంఠ ప్రాప్తి ఇస్తాడట .బీజం లో ద్రుమం లా, పృద్వీజం లో బీజంలాగా ‘’విశ్వము నీలో –నా జగతిలో న నీవును ‘’అని జగత్పిత ను వర్ణించాడు .జిగి గుబ్బలకనులు అంటాడు . ‘’జేజేపెద్దన నంగా –జేజే పెద్దను శివు౦డు –జెల్లిన శివుని-ట్లోజనెలకొల్పు చుంటివి ‘’అని పురాగాధ వర్ణించాడు.

  ‘’స్త్రీజన నిందిత శూర్పణ-ఖా జారను రూపు మాపి ఖరముఖ రక్షో –రాజిని గూల్చిన మేటి ‘’రాముడు అన్నాడు ..’’ఆజియును నీ విలోకన-పూజా స్మరణాను లాపములు జరపని దు –ర్భాజనులు నరకగాములు ‘అని చెప్పాడు .ఇక్కడ ఆజి అంటే క్షణకాలమైనా అని అర్ధం .పర్వతాన్ని జీమూతేశ ధారి అనీ ,వాజీ శ్వారా ధిరోహా ‘’అని గరుత్మంతుని వాహనంగా కలవాడా అనీ అన్నాడు  .ఇక్కడ వాజీ అంటే పక్షి .ఏప్రయత్నమూ అనటానికి ఏ జతనమూ అన్నాడు.యత్నం ప్రకృతి జతనం వికృతి అని చిన్నప్పుడు చదువుకొన్నాం . ..’’నీ జవుకుపలుకు లెన్నో –యోజన్ జవి గ్రోలు కర్ణ యుగళము కటువౌ – కాజనులమాటలానునె’’లో జవుకు పలుకులు అంటే మనోహర శబ్దాలు .         

 .’’తేజీ లందములు గో –రాజియు వెండియును బైడిరాసుల నిడి ‘’కొండ్రాజును దయతో చూడు అని రాముడిని కోరాడు కవి.’’రాజీవ కులజు డల్లమ –రాజశ్రీ రామ కృష్ణ రాట్కవిశతకం –బోజరచించి యొసగె గొను ‘’

తర్వాత అష్టకాలు రాశాడు .తర్వాత మత్తకోకిల గానం చేసి స్వామివారలకు కవిరాజ విరాజితం తో పూజించాడు.దత్తాక్షరీ ,మందాక్రాంత వృత్తం చెప్పి సుగంధి వృత్తం లో సువాసనలు గుప్పించాడు .ఆఖర్న భుజంగ ప్రయాతం తో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు –ప్రభావంబునన్ వేచి భక్తి ప్రపత్తిన్ – శుభంబొప్ప నాన౦ద శుద్ధిన్ సతంబున్-గాభీరాపగన్ జేయగా గల్గు పుణ్యం –బభీష్టంబు లన్సిద్ధి నందించు ధాత్రిన్ ‘’

 కవికి మంచి స్వారస్యం ఉంది .కవిత్వ శుద్ధి బాగా ఉంది .ధారాపాత కవిత్వం తో ‘’జకార ‘’  ప్రాసాన్ని ఓజస్సు తేజస్సు తో సఫలీ కృతం చేశాడు .జగ్గం పేట సీతారాముల కీర్తికి అక్షర పూజ చేసి ధన్యుడయాడు అల్లం రాజు రామ కృష్ణ కవి .

  ఈ శతకమూ ,ఈ కవీ పెద్ద గా ప్రాచుర్యం పొందలేదేమో అనిపించింది . పరిచయం చేసే భాగ్యం నాకు కలిగింది .

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -7-11-21-ఉయ్యూరు 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు  విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -11(చివరి భాగం )

భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు  విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -11(చివరి భాగం )

   ఇండియాస్వయం నిర్ణయ హక్కు

  న్యూయార్క్ లో విఠల్ భాయ్ కి మాజీ భారత కార్యదర్శి వెడ్జి వుడ్ బెన్ కు ఫారిన్ పాలిసి అసోసియేషన్ తరఫున ఒక చర్చ జరిగితే ,రేడియో లో ప్రసారమైతే లక్షలాది జనం విన్నారు .సభకు జేమ్స్ బి మాక్డో  నాల్డ్ అధ్యక్షత వహించి పటేల్ ను పరిచయం చేశాడు .భారత జాతి పునరుద్ధరణకు ఉన్న  ఆటంకాలపై పటేల్ –‘’ఇండియా ప్రతినిధులు ,బ్రిటిష్ ప్రతినిధులు కలిసి ఒక ప్రణాళిక రాసుకొన్నారనీ ,అది ఇండియాలో అమలు కాబోతోందనే అబద్ద ప్రచారం ప్రపంచమంతా చాటారు .ఇండియా ప్రతినిధులు ఎవరు ?బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించిన వారే కదా .ఒక రాజకీయ పార్టీ కాని మత సంఘాన్ని కాని పిలిచారా ? నిజమైన దేశ నాయకుల్ని జైల్లో పెట్టి ,రౌండ్ టేబుల్ నాటకం గుడు గుడు గుంజం గా ఆడారు .శాంతి సమావేశాలలో ,నానాజాతి సభలో ,అంతర్జాతీయ సభలలో కామన్ వెల్త్,ప్రపంచ పరిణామాలలో  ఇండియాకు స్థానం ఉందని చెప్పారు .ఇవన్నీ అసంబద్దాలు .వాటిలో ఇండియా తరఫున హాజరైన వారందరూ బ్రిటిష్ ప్రభుత్వం ఎంపిక చేసి పంపిన వారే .వారి మాటలలో భారత ప్రజల మనో భావాలు ప్రకటితం కానే లేదు .

  ‘’నిజమైన స్వతంత్రం లాంటిదే ‘’అధినివేశ ప్రతిపత్తి’’.కామన్ వెల్త్ లోనే ఒకస్వతంత్ర రాజ్యమై ఉండటం ఒకటి ఉంది అని బ్రిటన్ అంటోంది .ఇది భ్రమ .సంపూర్ణ స్వాతంత్ర్యానికి ,దాస్యానికి మధ్య ఇంకో స్థితి ఉండదని ప్రపంచానికి తెలుసు .’’అన్నాడు పటేల్ ..వెడ్జి వుడ్ –‘’1929నుంచి మా లేబర్ పార్టీ ప్రభుత్వం భారత కాంగ్రెస్ తో సమాధాన పడటా నికికే ప్రయత్నించింది .మాపై అనుమానం తో వాళ్ళు శాసనోల్లంఘనం చేశారు .వేలకొద్దీ జైలు పాలైంది నిజమే .అరాజకం కాకుండా జాగ్రత్త పడ్డాం .గాంధీ –వైస్రాయ్ సమావేశమూ జరిగి ఒడంబడిక జరిగి,ఖైదీలు విడుదలయ్యారన్న సంగతి పటేల్ చెప్పలేదు .బ్రిటిష్ పాలనపై ఉన్న అనేక విమర్శలు నేనూ ఒప్పుకొంటాను .ఎన్నో పొరబాట్లు అపరాధాలు చేసి ఉండవచ్చు .నేను లేబర్ పార్టీ మంత్రిగా ఉండి భారతస్వాతంత్ర కాంక్షను అంగీకరించాము .నేనూ వైస్రాయి ఇండియా ప్రజల సాయం కోరాం.భారత ప్రతినిధులు బ్రిటిష్ ప్రతినిధులతో పాటు సమాన హోదాలో సంప్రదించటానికి ఒప్పుకున్నాం .బ్రిటిష్ పెద్దల హృదయాలలో మార్పు కలిగిందని నాకు నమ్మకం గా ఉంది .పరస్పర స్నేహ సౌహార్ద్రాలద్వారా  ఇండియా కు ఇండిపెండెన్స్ వస్తుందని నమ్ముతున్నాను .అక్కడ మత వైషమ్యం ఉండకూడదని మా భావం  గుండ్ర బల్ల సమావేశం లో మేముఇచ్చింది సంపూర్ణ స్వాతంత్ర్యం కాదు అని ఒప్పుకొంటున్నాను  ‘’అన్నాడు .దీనిపై పటేల్ స్పందించి –‘’మాకు పూర్ణస్వరాజ్యమే కావాలి ఇండియా విషయం లో లేబర్ పార్టీ ప్రభుత్వమైనా ఇంకో పార్టీ ప్రభుత్వమైనా ఒక్కటే పుర్రచెయ్యి తీసి ఎడమచెయ్యి పెట్టమన్నట్టిదే .రామ్సే మాక్డో  నాల్డ్   ప్రతిపక్షం లో ఉన్నప్పుడు ఇండియాకు స్వాతంత్ర్యాన్ని వాగ్దానం చేశాడు కానీ  ఆయన ప్రధాని ,వెడ్జివుడ్ కార్య దర్శిఅయిన మరుక్షణమే  ,మహాత్మునితో సహా 80వేలమందిని జైలులో పెట్టించారు  .స్వత౦త్ర భారత్ తన రాజ్యా౦గాన్ని  తానె రచించుకొంటు౦ది .తన నాగరకతను తానె పెంచుకొంటు౦ది .అంతవరకు ప్రపంచశాంతి కల్ల’’అని దీటుగా సమాధానం చెప్పి భారతీయుల చిరకాల ఆకాంక్ష ‘’సంపూర్ణ స్వతంత్రం ‘’ని నిర్భయంగా ప్రకటించి చెప్పి చిరస్మరణీయమైన సేవ చేశాడు భారత దేశానికి …

  విఠల్ భాయ్ పటేల్ అవసాన దశ

అమెరికాలో ఉండగా ఆయన ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది .ముసలితనం కూడా తోడై శరీరం వ్యాధి గ్రస్తమైంది .నిరంతర పరిశ్రమ ఆరోగ్యాన్ని మరింతకుంగ దీసింది .అమెరికా నుంచి ఇంగ్లాండ్ వెళ్లగా బ్రిటన్ –ఐర్లాండ్ సంబంధాలు బాగా తెగిపోయి ఎన్నికలలో డీవేలేరా పార్టీ విజయం సాధించి,ఐర్లాండ్  అధికారం హస్తగతం చేసుకొన్నది .క్రమంగా నియంతగా మారాడు .ఒకప్పుడు ఆ దేశం లో ఉండటానికి వీలులేక పారిపోయిన డీవేలేరా ,ఇప్పడు బ్రిటిష్ ప్రభుత్వానికి పక్కలో బల్లె౦ కాక బాంబ్ అయ్యాడు .బ్రిటన్ కు కట్టే కప్పాన్ని ఆపేశాడు .ఆసమయం లో లండన్ లో ఉన్న పటేల్ భాయ్ కి డివేలేరా ఐర్లాండ్ రమ్మని ఆహ్వానించాడు .అలాగే వెళ్లి అతడితోమాట్లాడాడు .బ్రిటన్ –ఐర్లాండ్ మధ్య సయోధ్యకు పటేల్ కృషి చేస్తాడని అందరూ భావించారు .అలాగే కొంత శ్రమించగా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది .

  మాతృదేశం భారత్ కు రావాలనే కోరిక ఆయనలో బాగా పెరిగింది .కాని తీరని కోరిక గా మిగిలిపోయింది .చికిత్సకోసం వియన్నా వెళ్ళాల్సి వచ్చింది .ఇండియాలో రాజకీయం శరవేగంగా మారుతోంది .హరిజనాభ్యుదయానికి గాంధీ మూడు వారాలు దీక్ష మొదలు పెట్టాడు .శాసనోల్లంఘనం పడకేసింది .వియన్నాలో ఉన్న నేతాజీ సుభాస్ చంద్ర బోస్ కూ విఠల్ భాయ్ కి అది నచ్చ లేదు .ఇద్దరూ కలిసి గాంధీ నిర్ణయాన్ని ఖండిస్తూ ఒక ప్రకటన –‘’గాంధీ నిర్ణయం ఓటమిని అంగీకరించటమే .నాయకత్వ బలం తగ్గిందన్నమాట .కనుక కాంగ్రెస్ కొత్త విధానం లో పున ర్నిర్మానం  చెందాలి .దీనికి కొత్తనాయకుడు కావాలి .తన జీవన సూత్రాలకు అనుగుణంగా లేని దాన్ని గాంధీ ఒప్పుకోడు .పునర్నిర్మాణమో ,కొత్త పార్టీయో ఏర్పడాలి .సహాయ నిరాకరణ తీవ్రంగా  కొనసాగాలి .స్వాతంత్ర్య సమరం అన్ని రంగాలోనూ విజయం సాధించాలి ‘’అని ప్రకటన జారీచేశారు .ముసలితనంలో కూడా ఆయన రక్తపు ధమనులలో యువక రక్తమే ప్రవహిస్తోందని చాటి చెప్పాడు విఠల్ భాయ్.భారత స్వాతంత్ర్య యువ వీరుల సరసన ఉండాల్సిన వాడు ఆయన .

  బ్రిటన్ తో పరస్పర సంప్రది౦పు లతోనే భారత్ అభ్యుదయం సాధించాలని పటేల్ పూర్తీ విశ్వాసం .దానికోసం తనకు చేతనైనంతవరకు చేసి చివరికి సహాయ నిరాకరణానికి మొగ్గు చూపాడు  .కాంగ్రెస్ లో పిరికితనం ఉన్నా పటేల్ లో టార్చి లైట్ వేసి వెదికినా పిరికితనం లేనే లేదు .అందుకే అన్ని రంగాలో స్వాతంత్ర్య సమరం సాగాలని కోరాడు .కాంగ్రెస్ లోనుంచే మరోకోత్తపార్టీ జవసత్వాలతో రావాలని ఆకాంక్షించాడు .ఆయన ఉద్దేశ్యం లో కాంగ్రెస్ –సోషలిస్ట్ పార్టీ కావచ్చు .ఇదే పటేల్ చివరి ప్రకటన .

  చివరి దశ

క్రమ౦గా వ్యాధి పెరిగి విఠల్ భాయ్ మంచ మెక్కాడు .ఇండియాలో దేశ ప్రియ జే ఎం .సేన్ గుప్తా చనిపోయాడు .వియన్నాకు ఈ వార్త చేరి వియన్నాలో ఒక సభ జరిపారు .లేవలేని పరిస్థిలో ఉన్నాకూడా పటేల్ వెళ్ల గా మిత్రులు నెమ్మదిగా నడిపించి వేదిక ఎక్కించారు .సభకు అధ్యక్షత వహించాడు  .ఆసభలో ఆయన ఎందేరెందరో దేశ భక్తులను చిత్తరంజన్ దాస్ ,మోతీలాల్ మొదలైన వారిని స్మరించాడు నివాళి అర్పించాడు.వారి సేవలను ప్రస్తుతించాడు .తన అవంతూ వచ్చిందని ఆయనకు తెలుసు .కానీ గంభీర్యం సడలలేదు .అమెరికా వదిలాక ఆయనకు గుండేజబ్బుకూడా వచ్చింది ,చికిత్సతో కొంత నయమైంది .అక్కడినుంచి వియన్నా వెళ్ళినప్పుడు ప్రయాణ బడలికతో మళ్ళీ వ్యాధీ పెరిగింది .అక్కడ ఒక ఆసుపత్రిలో చూపించాడు .నాలుగు రోజులు జ్వరం వచ్చి తగ్గిపోయింది .కానీ గుండె బాధ పెరిగింది .డాక్టర్లు,నర్సులు చాలా జాగ్రత్తగా చూసుకొన్నారాయనాను .ఎనిమిది రోజులు జీవన్మరణ పోరాటం చేశాడు .ఆయనమిత్రుడైన వియన్నా డాక్టర్ కూడా అక్కడే ఉన్నాడు .ఎందఱో స్నేహితులు వచ్చి అన్నీ చూసేవారు .కానీ ఫలితం లేకపోయింది .ఆయన కోలుకోవాలని చాలా దేశాలనుంచి మిత్రులు అనుయాయులు లేఖలు రాశారు .లార్డ్  ఇర్విన్ కూడా –‘’ కిందటి సారి మిమ్మల్ని కలిసినపుడు సుస్తీగానే ఉన్నారు .ఈమధ్య మిస్ హారిసన్ మీఆరోగ్య విషయాలు తెలుపుతూ ఉత్తరం రాసింది .నేనూ నా భార్య మీ ఆరోగ్యం గురించి విచారంగా ఉన్నాం ..మీరు చాలా బాధలో ఉన్నారు .మిమ్మల్ని ఎప్పుడూ గుర్తుంచుకొంటాను .’’అని రాశాడు .సర్ బిఎల్ మిట్టర్,భార్య వచ్చి చూశారు .వెల్లింగ్టన్ దంపతుఅలను అడిగినట్లు చెప్పమని వారికి పటేల్ చెప్పాడు .మరణ శయ్యమీద ఉన్నా ఆయనమాతృ దేశాన్ని స్మరిస్తూనే ఉన్నాడు .తన జీవితం భారత మాత సేవలో గడిచినందుకు ఆయనకు తృప్తిగా ఉంది .చివరగా మిత్రులతో ‘’నా దేశ ప్రజలకు ,ఇతర మిత్రులకు నా హృదయ పూర్వక ఆశీస్సులు .కొద్ది కాలం లోనే నా మాతృదేశం భారత్ సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని పొందుతుందని  భగవంతుని చివరి విన్నపం తెలియ జేస్తున్నాను’’అని ఆ కృతార్ధ జీవి పలికికిన చివరిమాటలు . 22-10-1933న 60 ఏళ్లకే భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు  విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్  మరణించాడు.

  విఠల్ భాయ్ అవసాన దశలో కళ్ళల్లో ఒత్తులు వేసుకొని అనుక్షణం వెంట ఉన్న వాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ .ఆయన కళ్ళల్లో  ఎన్ని సుడిగుండాలకన్నీళ్ళు తిరిగాయో చెప్పలేం .పటేల్ చనిపోతూ తన యావదాస్తినీ యువనేత నేతాజీ పేర రాసి ,దాన్ని విదేశాలలో భారత ప్రచారానికి వాడమని కోరి ప్రాణాలను నిశ్చింతగా వదిలాడు పటేల్ .సుభాస్ బాబు దాన్ని అక్షరాలా పాటించాడు .ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించి విదేశానుంచే భారత్ స్వాతంత్ర్యానికి పాటు బడ్డ త్యాగధనుడునేతాజి

  అంత్యక్రియలు

విఠల్ భాయ్ పార్ధివ దేహ౦ ఉన్న శవపేటిక ను  తీసుకొని ఓడ బయల్దేరింది. ఏడెన్ రేవులో ఆగినప్పుడు ప్రజలు తండోపతండాలు గా వచ్చి దర్శనం చేసుకొన్నారు .ఓడలో కొంచే ఎత్తు మీద శవ పేటిక ఉంచి అందరికి దర్శనానికి వీలు కల్పించారు .ఖద్దరు నూలు పూలు సమర్పించి జనం శ్రద్ధాంజలి ఘటించారు  .దహన క్రియలు బొంబాయిలోని చౌపతి లో తిలక్ దహన క్రియలు జరిపిన చోట నిర్వహించాలని నిర్ణయించారు .కానీ ప్రభుత్వం అనుమతించలేదు .అసెంబ్లీ సభ్యులు కూడా వైస్రాయ్ కి అర్జీలు పెట్టినా ఒప్పుకోలేదు .

  అప్పుడు విఠల్ భాయ్ పటేల్ తమ్ముడు సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా జైలులోనే ఉన్నాడు .అంత్యక్రియలకోసం  మూడు రోజులు ఆయన్ను విడుదల చేయటానికి ప్రభుత్వం ఒప్పుకొన్నది .విఠల్ భాయ్ శవ పేటిక బొంబాయి రేవు చేరింది .పోలీసులు కొద్దిమందినే  ఓడలోకి అనుమతించారు .వీరిలో సరోజినీ నాయుడు ,బి.జి.హారిమన్ ,కె.ఎఫ్. నారిమన్ ,జమ్నా దాస్ మెహతా ,కేశవ భాయ్ పటేల్ మొదలైన వారున్నారు  .ఆ రాత్రి శవ పేటికను జి.టి. హాస్పిటల్ లో ఉంచి మర్నాడు ఏషియన్ బిల్డింగ్ కు తీసుకు వెళ్ళారు ..అక్కడి నుంచి ఊరేగింపు బయల్దేరింది .శవపేటికను ఒక మోటారుకారులో ఉంచి డ్రైవర్ సీటులోఆయన  పెద్ద ఫోటో పెట్టి ఊరేగింపు గా సాగించారు..జనం ఆరు వరసలుగా నిలబడ్డారు .దుకాణాలన్నీ మూసేశారు స్వచ్చందంగా .నిశ్శబ్దంగా శాంతి యుతంగా ఊరేగింపు సాగింది .అన్ని మతాలవారూ ఊరేగింపులో పాల్గొన్నారు .కాంగ్రెస్ వాలంటీర్లు కాంగ్రేస్ జెండాలతో వచ్చారు .కొంత దూరం సాగాక స్త్రీ వాలంటీర్లు వచ్చి పటేల్ ముఖం కనిపించేట్లు చేయాలని కోరారు .పేటికలో ఊరేగించటం హైందవ సంప్రదాయం కాదు అంటే సరోజినీ నాయుడు వారికి నచ్చ చెప్పి సమాధాన పరచింది .

  కార్పోరేషన్ ముందు ఆగగానే కార్పో రేటర్లు వచ్చి తమ నాయకునికి శ్రద్ధాంజలి ఘటించి పూలమాలలు వేశారు .కలబా దేవి వీధిలో కి రాగానే లక్షలాది జనం వచ్చారు .అయిదు అంతస్తుల మేడల నుంచి పుష్ప వర్షం కురిపించారు  .దాదాపు నాలుగు లక్షలమంది స్త్రీ ,పురుషులు స్మశాన వాటికకు వచ్చారు .మహాను భావుడు ,కృతార్ధుడు ,భారత దేశ అబ్రహాం లింకన్ అంటూ జనం ఆయనగురించి గొప్పగా చెప్పుకొన్నారు .

  జెనీవా డాక్టర్లు పటేల్ శవాన్ని  పేటికలో కొన్నేళ్ళు అయినా చెడిపోకుండా ఉండేట్లు జాగ్రత్తగా పాక్ చేశారు .శవం పై కాశ్మీర్ శాలువా కప్పబడి ఉంది ..భగవద్గీత పుస్తకం శవం పై ఉంచారు .గంగాజలం తో శుద్ధి చేసి ,గంధం పూసి తులసిమాలలు వేసి భగవద్గీతను శవం పై పెట్టారు .సరోజినీ నాయుడు మాట్లాడుతూ ‘’విఠల్ భాయ్ శవం కాసేపట్లో దహనం చెందుతుంది .కానీ ఆయన ఆత్మ భారతస్వాతంత్ర్య సమరయోధులకు సదా మార్గదర్శిగా ఉంటుంది ‘’అని నివాళి ఘటించింది .’’నాయకులకు నాయకుడు విఠల్ భాయ్ ‘’అన్నాడు జన్నుదాస్ ద్వారకాదాస్ .విఠల్ భాయ్ కి అండ దండ గా ఉండి, ఆయన పార్ధివ దేహాన్ని ఇండియాకు పంపించిన సుభాష్ బాబుకు అందరు కృతజ్ఞతలు తెలిపారు .  సర్దార్ వల్లభాయ్ కుమారుడు చితికి నిప్పు అంటించాడు .జయజయ ధ్వానాలు మిన్ను ముట్టాయి. అగ్ని జ్వాలలు బంగారు తామర పూల రేకులలాగా భాయ్ దేహాన్నిఆవరించాయి .ఒక మహోజ్వల తార మింటికి ఎగసింది .వందేమాతరం .ఓం తత్సత్ .

ఇంతటి మహా దేశభక్తుని గురించి రాసే అదృష్టం నాకు కలిగిందుకు మహదానందంగా ఉంది .

   ఈ రచనకు ఆధారం –శ్రీ కంభం పాటి కుమార రాఘవ శాస్త్రి గారు రచించిన ‘’ ప్రెసిడెంట్ వి.జే .పటేల్ జీవితం’’పుస్తకం .

 మీ గబ్బిట దుర్గాప్రసాద్ -6-11-21-ఉయ్యూరు  

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

అపసంహిత హాస్యం

అపసంహిత హాస్యం

అపసంహిత హాస్యం

పదాలను దగ్గర దగ్గరగా పలికితే సంహితం .విపరీతార్ధం కోసం వాక్యాలను విశ్లేషం చేయటం అపసంహిత .ఒకాయన బుద్ధి హీనుల గురించి కాలేజిలో ఉపన్యాసం ఇవ్వటానికి రాగా ,ప్రిన్సిపాలాయన్ను విద్యార్ధులకు పరిచయం చేస్తూ ‘’ఇవాళ మీరు బుద్ధి హీనులగురించి మంచి ఉపన్యాసం వింటారు .మంచి అని ఎందుకు అన్నానంటే ఇచ్చే ఆయన బుద్ధిహీనత ……గురించి దాని స్వరూప స్వభావాల గురించి ఎక్కువ పరిశోధన చేశారు ‘’అన్నాడు .ఇందులో బుద్ధిహీనత అన్నమాట దగ్గర కావాలని ఏర్పరచిన విశ్రాంతి వలన అర్ధాంతరం  స్ఫురి౦చి చమత్కారమిస్తుంది .ఉపన్యాసకుడు వాయించటం మొదలెట్టి ‘’బుద్ధి హీనతగురించి మీ ప్రిన్సిపాల్ కు తెలిసినంత నాకు తెలియదు ‘’అనటం లో ఉన్న కాకువు వలన వేరొక అర్ధాన్ని సాధించాడు .ఇదీ శబ్దాశ్రయ హాస్యమే.

మరో మచ్చు తునక –ఒక జడ్జి ఒక నేరస్తుని గురించి ‘’ఇంత స్కౌండ్రల్ ను నేనెక్కడా చూడలేదు ‘’.దీనికి నేరస్తుడు ‘’నేను దుర్మార్గుడనే జడ్జి గారు నాకంటే పెద్ద దుర్మార్గుడిని చూడ లేదనటం అన్యాయం ‘’అన్నాడు .నా కంటే దగ్గర ఏర్పడిన విశ్రాంతి వలన విపరీతార్ధం వస్తుందని మునిమాణిక్యం ఉవాచ .

కాకువు –శబ్దాశ్రయ హాస్యం సాధించటానికి హ్రస్వంగా పలకాల్సిన చోట దీర్ఘంగా దీర్గం గా పలకాల్సిన చోట హ్రస్వంగా పలకటం వలన హాస్యం కలుగుతుంది .ఇదే కాకువు అంటారు .కోర్టులో సాక్షి ‘’దేవుని ఎదుట అంతా అంతా నిజం చెబుతానూ ,అబద్ధం చెప్పనూ ‘’అనటం .గుంటూరు దగ్గర ‘’లంజ చెరుకూరు ‘’,’’కుక్కకాకాని ‘’అనే ఊళ్ళున్నాయి .ఒక షోకిలా దారిలో కనిపించిన ఒక సోకు కత్తెతో’’లంజా !చెరుకూరు కు దారేదీ ?అని అడిగితె ఆమె తక్కువేమీ తినలేదు కనుక ‘’కుక్కా ,కాకాని దగ్గర ‘’అని రిపార్టీ ఇచ్చింది

మృషార్ధకం – ఈ కకువుతో ఇంకా రమణీయ హాస్యం పుడుతుంది .వాక్యం లో ఏదో ఒక పదాన్ని నొక్కి పలికితే విపరీతార్ధం వచ్చి నవ్వు పుడుతుంది అంటారు మాస్టారు మునిమాణిక్యం .మీరు ఈ ఊళ్ళో ఇల్లు కొన్నారా అని అడిగితె ‘’ఇల్లు కొనలేదు ‘’అంటే ఇంకేదో కొన్నాను అని అర్ధం వస్తుంది .’’తమకు పిల్లలు పుట్టారా ‘’?అని అడిగితె ‘’పిల్లలు పుట్టలేదు ‘’అంటే ఇంకెవరో పుట్టారనే అర్ధం రావచ్చు .కానీ ఇది అసంభావితం అవుతుంది .బాగా అసంభావిత అర్ధం ఇచ్చే మాట మృషార్ధకం ‘’.అని రుద్ధ చరిత్రలో కృతికర్త వంశ వివరాలిస్తూ ‘’అతని సాధ్వి కొండమాంబ గర్భమందు జనియించే వినయ విద్యా చరణుడు ,హరిహరధ్యాస సేవాపరయణు౦డు.మహిత గుణశాలి అబ్బయా మాత్యుడు ‘’అని రాశాడు కవి నిజంగా ఇందులో హాస్యం లేదు కానీ ముని మాణిక్యంగారికి ‘’గర్భం లో పుట్టకుండా దేనిలో పుడతాడు అని డౌటొచ్చి నవ్వొచ్చిందట.

మునిమాణిక్యం మాస్టారు గారికి కృతజ్ఞతలతో

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -5-11-21-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -10

భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -10
మేయో సతి ‘రాసిన ’మదర్ ఇండియా ‘’లో భారతీయులను అనేక విధాల కించపరచింది .స్వపరిపాలనకు ఇండియన్లు పనికి రారు అని రాసింది .విదేశీయులే కాక మనవాళ్ళలో మహారాజ ధీరజ్ విజయ చంద్ మెహతాబ్ అమెరికా వెళ్లి ఇండియన్ల స్వాతంత్ర ఆశలు మంచివి కావని ప్రసంగాలు చేశాడు .జాతీయ శక్తులు తృణప్రాయం గా భావించాడు .విఠల్ భాయ్ పట్టుదల వదలని విక్రమాదిత్యునిలా భారత జాతీయత స్వరూపస్వభావాల గురించి అమెరికన్ లమనసులో ఘాటంగా నాటగలిగాడు .న్యుయార్క్ లో ‘’స్టేట్ హౌస్ ‘’శిఖరాలు ఆకాశం అందుకొన్నట్లు ఉండి’’సిటి ఆఫ్ స్కై స్క్రేపర్స్ ‘’అని పిలువబడింది .అక్కడ పటేల్ ను పై అంతస్తుకు తీసుకు వెళ్లి ,న్యూయార్కంతా చూపించగా ‘’ఇవన్నీ అద్భుతాలే కానీ నా దేశానికి వెళ్లి పూరి గుడిసెలో ఉంటూ నా దేశ స్వాతంత్రానికి కృషి చేసి మాతృ దేశ సేవ చేయాలని ఉంది ‘’అన్నాడు .అమెరికాలోనే కాదు ఎక్కడకు వెళ్ళినా పటేల్ ‘’బ్రిటిష్ వాడు స్వేచ్చాప్రియుడు .స్వాతంత్రం వాడి జన్మ హక్కు .కాని ఆసియావాసులకు స్వతంత్రం అక్కర్లేదని వాడి మూర్ఖ భావం ‘’అని కుండ బద్దలు కొట్టాడు .
విఠల్ భాయ్ కి అమెరికాలో ఒకసారి రేడియో ప్రసంగం చేసే అవకాశం వచ్చింది .అందులో –‘’అమెరికన్ ల స్నేహం సహాయం మాకు కావాలి .అమెరికా స్వతంత్ర దేశంకనుక బానిస దేశాలకు అండగా నిలిచి స్వాతంత్రం పొందటానికి సహాయపడాలి .అమెరికా ప్రభావం గొప్పది.పీడిత జాతుల అభ్యుదయానికి తోడ్పడాలి .అమెరికా జాతిపిత జార్జి వాషింగ్టన్ ఇక్కడే పుట్టాడు .వ్యక్తి స్వాతంత్ర్యంపక్షపాతి, బానిసత్వ నిర్మూలన చేసిన అబ్రహాం లింకన్ ఈ పుణ్య దేశవాసి .మీకూ బ్రిటిష్ వారికీ రక్త సంబంధం ఉంది. బ్రిటన్ లో సామ్రాజ్యత్వం జీర్ణించుకు పోయింది .దాన్ని మీరు హర్షించరు అని తెలుసు .వాళ్ళతో పోరాటం చేసే మీరు స్వాతంత్ర్యం పొందారు .అప్పటినుంచే మీ జాతీయ జీవనం మొదలైంది .ఆ దేశం పై మీకున్న అభిమానం కంటే ,మీ స్వాతంత్ర్య ప్రియత్వం గొప్పది .వారి విధానం ప్రపంచానికి శాపం .అది అంటు జాడ్యం. దాని బారినపడి, నా దేశం మహా క్షోభ పడుతోంది .ప్రపంచార్ధిక సంక్షోభానికి దాని విధానమే కారణం .మీ రెండు దేశాల ఐక్యతకు అట్టావా సమావేశం జరిగింది .అది యుద్ధ కౌన్సిల్ సమావేశంగా మారింది .అట్టావాలోనే యుద్ధం ప్రత్యక్షమైంది .
‘’మా నేత పరిశ్రమ, నౌకాపరిశ్రమాలు మూలపడ్డాయి .ఇప్పుడు మాది పూర్తిగా వ్యావసాయక దేశం అయింది .మంచి వ్యవసాయ పనిముట్లు మాకు లేవు .ఏడాదికి 20డాలర్ల ఫలసాయం కూడా రాని లక్షలాది ఎకరాల భూమి మాకుంది .బ్రిటిష్ డొమినియన్ లోకూడా మాకు అవమానమే జరిగింది .ప్రపచ దృష్టిలో మేమిప్పుడు ‘’అస్ప్రుశ్యులం ‘’. పౌరహక్కులు లేవుమాకు .ఆస్తి సంపాదించలేము .వలస దేశాలలోకి మమ్మల్ని తోలుకు వెళ్లి అక్కడ ఇళ్ళుకట్టటానికి ,వ్యవసాయానికి వాడుకొని పనులు అవగానే పంపించేస్తారు .బ్రిటిష్ డొమినియన్ లో భారతీయులకంటే ఇతర దేశీయులకే హక్కులు ఎక్కువగా ఉన్నాయి .మా గోడు వినే నాధుడే లేదు .జెనీవా ,అట్టావా,లండన్ రౌండ్ టేబుల్ సమావేశాలలో భారతీయ ప్రతినిధి ఉండడు.బ్రిటిష్ తాబెదారులే వెళ్లి బ్రిటిష్ వారికి అనుకూలంగా చిలకపలుకులు పలికి వస్తారు అంతే.మా దేశానికి వచ్చి మా కిటికీ లోంచి చూస్తె ,ప్రధాన ద్రవ్యాల ధరలు ఎందుకు తగ్గాయో తెలుస్తుంది .ఇండియా చూస్తె ,ఆసియా చూసినట్లే .సామ్రాజ్యవిధానం దరిద్రం తోపాటు వినాశనాన్ని మృత్యువును కూడా తెచ్చింది ‘’.
‘’ఒకప్పుడు మా దేశం మహా సౌభాగ్యవంతం .బ్రిటిష్ వాళ్ళు కాలుపెట్టినదగ్గర్నుంచి మాకు వచ్చిన ధననష్టం 30వేల మిలియన్ల డాలర్లు .మేము ఈర్ష్యతో పోరాటం చేయటం లెదు.ఆత్మగౌరవ౦, ,ఆత్మ వికాసం కోసం చేస్తున్నాం .మాస్వాతంత్ర్యం ప్రపంచ శాంతి భద్రతా లకు రక్షణ .’’అంటూ అవకాశం దొరికినప్పుడల్లా అమెరికన్ లకు భారత దేశాస్వాతంత్రావస్యకత ను గురించి డంకా బజాయించి చెబుతూనే ఉన్నాడు అమెరికాలో పటేల్ భాయ్ .ఇండియాకు స్వతంత్రం లేక పొతే ప్రపంచ శాంతి కూడా ఉండదని ఉద్ఘోషించాడు విఠల్ భాయ్ .
చికాగోలో ఐరిష్ అమెరికన్ ల సమావేశం లో మాట్లాడుతూ విఠల్ భాయ్ –‘’ప్రపంచ శాంతికి కృషి చేసే అవకాశం అమెరికాకే ఉంది .దీన్ని చక్కగా ఉపయోగించుకోవాలి .మొదటి ప్రపంచయుద్ధం తర్వాత బ్రిటన్ లక్ష చదరపు మైళ్ళ భూభాగాన్ని కొత్తగా సంపాదించింది .తన తప్పు తెలుసుకోకుండా, అమెరికాను ‘’షైలాక్ ‘’అంటోంది .ఇతర రాజ్యాలాక్రమణ ఆదేశాలమంచికే అని శ్రీరంగ నీతులు చెబుతోంది .ఐర్లాండ్ ,ఈజిప్ట్ ఆఫ్రికాలను కబళించింది .’’డీవేలార్’’మాత్రం బ్రిటన్ కు పంటికింద పచ్చి వక్కై కూర్చున్నాడు.భూమి శిస్తు తనకు ఐర్లాండ్ బాకీ ఉందని బ్రిటన్ గోలచేస్తోంది .’’బాగానే ఉంది ఒక నిష్పాక్ష విచారణ సంఘం ఏర్పరచి తేల్చండి ‘’అని డివేలార్ కోరాడు.దీన్ని తేల్చటానికి అమెరికా పూనుకోవాలి .నేను ఐర్లాండ్ లో పది రోజులు ఉండి డివేలరా,లేమాస్ ,కెల్లీ వంటి ప్రముఖులతో మాట్లాడాను .ఐర్లాండ్ లో మీరు చాలా అభి వృద్ధి సాధించారు .గవర్నర్ జనరల్ లేడు కనుక కప్పం కట్టక్కరలేదు .ఇంకో 18నెలలో మీకు బ్రిటన్ తో సంబంధం పూర్తిగా తెగిపోతుంది .ఐర్లాండ్ పూర్తిస్వతంత్ర దేశం అవుతుంది .తప్పదు .మేముమాత్రం ఇంకా బానిసబతుకులే బతుకుతున్నాం .రాబోయే ఎన్నికలలో ప్రజలంతా డీవేలేరా కు పూర్తి మద్దతు కూడ గట్టి ,ఐర్లాండ్ కు స్వాతంత్ర్యం సాధించు కొండి.
‘’అన్ని దేశాల వారూఆయుధ విసర్జన చేస్తేనే ప్రపంచశాంతి కలుగుతుంది .సామ్రాజ్య వాదం ఉంటె శాంతి చేకూరదు .పీడితులు శాశ్వతం గా పాలిత జాతికి లొంగి ఉండరు .వారు తిరగబడ కుండా ఉండటానికి వాళ్లకు ఆయుధాలే శరణ్యం కదా .ఎప్పటికైనా ట్రపోలి ,సిరియా ఫిలిప్పీన్స్ ,ఈజిప్ట్ ,మంచూరియాలు పాలకులతో పోరాటం చేస్తారు స్వతంత్రం సాధిస్తారు .ప్రపంచ శాంతి కావాలంటే బ్రిటన్ వంటి సామ్రాజ్య దేశాలు అమెరికా జపాన్ ఫ్రాన్స్ లు తప్పక ఆయుధ విసర్జన చేయాల్సిందే .ప్రపంచ వర్తకం పై గుత్తాధిపత్యం కోసం బ్రిటన్ పట్టుబట్టినంతకాలం ఇది జరగటం కష్టం .శత్రురాజ్య నౌకా సైన్యం తగ్గించాలని బ్రిటన్ కోరిక .85,000మైళ్ళ తీర రేఖను రక్షించు కోవటానికి దానికి సైన్యం కావాలని పట్టు బడుతోంది .అది ఆయుధ విసర్జనకు సిద్ధంగా లేదు .వాషింగ్టన్ సంధి పత్రం పై సంతకం పెడుతూ బ్రిటన్ ‘’బ్రిటిష్ సామ్రాజ్యానికి ముప్పు రాకూడదు .మా సామ్రాజ్యం లోఒక్క అంగుళం నేల పోయినా ఈ సంధి కి తిలోదకాలే ‘’ అని చెప్పిన మాట గుర్తుందా ?150ఏళ్లనుంచి బ్రిటన్ మమల్ని పాలిస్తోంది .దారుణ శాసనాలు తెచ్చారు .వారి అనుమతిలేకపోతే తుపాకి కూడా పట్టుకో రాదు .అంటే మా అందరితో బ్రిటన్ ‘’ఆయుధ విసర్జన చేయించింది అన్నమాట’’ .ఇండియాలో ఎప్పుడూ 60వేలమందిబ్రిటిష్ సైనికులు ఉండాల్సిందే.మాడబ్బు అంతా బ్రిటిష్ అధికారుల జీతాలపాలే .వైస్రాయ్ కి నెలకు 5వేల డాలర్లు .ఇది జీతం మాత్రమె దీనితోపాటు నాతం వగైరాలు ఎంతోచెప్పలేం .పెద్ద ఉద్యోగాలన్నీ వాళ్ళకే ధారాదత్తం .భారత దేశ సగటు మనిషి ఆదాయం రోజుకు 5 సెంట్లు మాత్రమె .దీని ఫలితం ఏమిటో మీరే ఊహించండి .300మిలియన్ల భారతీయులకు సంవత్సరం లో 8నెలలు పని ఉండదు.ఎప్పుడూ 10మిలియన్ల జనానికి నిరుద్యోగమే .రైతులపై పన్ను బాగా వేస్తున్నారు .87శాతం ప్రజలు వైద్య సౌకర్యాలు లేక చనిపోతున్నారు .సంవత్సరం కూడా నిండని శిశుమరణాలు 80శాతం .ఇండియాలో 40మిలియన్ల ప్రజలకు ఒంటిపూట భోజనమే .మీ రంతా నా పైనా, నా భారత ప్రజలపైనా చూపిన శ్రద్ధా విషయానికి కృతజ్ఞుడను ‘’అని ముగించి ,భారత దేశ యదార్ధ స్థితిని ప్రపంచ యవనికపై ఆవిష్కరించాడుమహా దేశభక్త విఠల్భాయ్ పటేల్ .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -5-11-21-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

సంకర హాస్యం

సంకర హాస్యం

కొన్ని పదాలలో ఉన్న ఒక అక్షరాన్ని  మరొకటి కౌగిలించుకొని ఒక వింత రూపాన్ని పొంది ,పరిహాసంగా మారటమే సంకరం .నేపధ్యప్పాట ,ఏమ్హ్లేదు ,షుమ్మయ్య (ఉష్,అమ్మయ్య ),పుస్తకం కొండ మెందుకు ?వాణ్ణ నాల్సిన పన్లేదు.ఇలాంటివి ముళ్ళపూడి మార్క్ ఆస్యానికి బంగారు తునకలు .

భ్రష్టం –తచ్చనం ,అన్ స్ప్రూయత,వ్రెందుకు ,బ్ర౦ధి ఖానా

లోహనం –ను ఇంగ్లీష్ లో లిస్పింగ్ అంటారు .దైల్లో త్రంకు పెట్టె మరిచా .ఎవరైనా తెత్తిత్తేబౌమానం ఇత్తా.

ముద్దమాటల హాస్యం  

‘’అమ్మా మన దొద్దిలో పూలు పూత్తున్నయ్యే,.దీనికో పద్యం అనిరుద్ధ చరిత్ర లో  కథా ప్రారంభ పద్యం కూడా ఉంది .

‘’అని దుద్దుని చాలిత్తము –ఇనుతకు మాకు ఉదయములు ఏదుక పొడమేన్ –ఇనిపింపు తయిత్తరముగ-ఇనుత బుదవాత,తూతఇనయోపేతా ‘’దీనికి అసలు పద్యం –అని రుద్ధుని చారిత్రము –వినుటకు మాకు హృదయములు వేడుక పొడమెన్-వినిపింపు సవిస్తరముగ-వినుత బుధ వ్రాత ,సూత, వినయో పేతా ‘’.

ప్రలాపం –అంటే అప్రయోజనమైన మాట –ఇన్ కోహేరెంట్ స్పీచ్ .దీనికి ఉదాహరణ కుదరలేదనిచేతు లెత్తెశారు మునిమాణిక్యం .

నిరస్తం –గబగబా మాట్లాడే పదాన్ని నిరస్తం అంటారు .సత్యనారాయణ అనటానికి ‘’సత్తేనాన్’’,విశ్వనాధ అనటానికి విశ్వనా అనటం .రామాన్జనరావు ,సుబ్భమన్యం గారూ .హాస్యం లో అనురక్తి ఉన్నవారికే ఇందులో హాస్యం కనిపిస్తుంది .

దీపావళి శుభా కాంక్షలతో

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -4-11-21-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు  విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -9

భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు  విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -9

సామ్రాజ్యం నుంచి విడిపోయే హక్కు

విఠల్ భాయ్ పటేల్ ఒక సమీక్ష చేస్తూ ‘’కేంద్ర ప్రభుత్వ ఆదాయం లో 45శాతం మిలటరీ వ్యయానికే పోతుంది .ఇండియాసెక్రెటరి  ఆయన నియమించే ఉద్యోగుల జీతాలు పెన్షన్ లు కాక ఇండియా  అప్పుపై వడ్డీ ఉన్నాయి .ఇవన్నీ పొతే ప్రజామంత్రి చేతిలో ఉన్న ఫైనాన్స్ నాం కే వాస్తి .ఇలాంటి స్థితిలో ఫైనాన్స్ శాఖను ఎవరూ కోరుకోరు .ఇండియా అప్పుపై ‘’గుండ్ర బల్ల సమావేశం’’ లో చర్చకు రాలేదు .కామన్ వెల్త్ నుంచి విడిపోయే హక్కు పై మాటేలేదు .ఇవన్నీ చూస్తె కేంద్రం లో జాతీయ ప్రభుత్వం ఏర్పడటానికి ఇష్టంగా లేదు అని పించింది .శ్వేతపత్రం అంతా మధ్యకాలం లో మాత్రమే అమలు అని చెప్పారు .ఈకాలం ఎన్నేళ్లో ప్రస్తావన లేదు .కొత్తరాజ్యా౦గ౦  ద్వారా స్వతంత్రం వస్తుంది అన్న నమ్మకం లేదు .వైస్రాయి అసాధారణ అధికారం ఇండియాలో విచ్చల విడిగా ఉపయోగిస్తూనే ఉన్నాడు .మూడవ సమావేశానికి ఎజెండాలేదు .వీలైనప్పుడల్లా కాంగ్రెస్ ను, గాంధీని అవమాన పరుస్తూ ,తమదే పై చేయిగా వ్యవహరిస్తోంది ప్రభుత్వం .ఇర్విన్ తో ఒడంబడికలో గాంధీ తప్పటడుగు వేశాడని నా అభిప్రాయం.దాన్ని ప్రభుత్వం వారు ఒక కాగితం ముక్క గా భావించారు .కాంగ్రెస్ నాయకులు దాన్ని పూర్తిగా గౌరవించారు .బ్రిటిష్ అధికారులూ నిర్లక్ష్యం చేశారు  .బ్రిటిష్ కూట రాజనీతికి ఇది గొప్ప ఉదాహరణ .అంతర్జాతీయం గా తమకు అనుకూలభావన ప్రచారం చేసుకొన్నది ప్రభుత్వం .ఐకమత్యంలేని భారతీయులలొఎవరి దారి వారిది అయింది .’’ఇండియాకు  బ్రిటిష్ పాలనే మేలు ‘’అనే భావం ప్రపంచ దేశాలలో ప్రచారం చేయగలిగింది ప్రభుత్వం .గాంధీ తొందరపడి ఇర్విన్ తో ఒడంబడిక కుదుర్చుకొని శాసనోల్ల౦ఘన  ఉపసంహరించాడని నా విశ్వాసం .’’ఇండియాకు క్షేమకరమైన  నిబంధనలు ‘’అనే పదం  బ్రిటిష్ వారికి అనుకూలంగా మారింది.ఇలా వివాదం ఏర్పడినప్పుడు ఒక నిష్పాక్ష సంఘాన్ని నియమించి విచారణ చేయాలి .అది జరగలేదు .విదేశ వస్తు బహిష్కరణా ఆగింది .వాళ్లకు కావాల్సినవన్నీ జరిగి హమ్మయ్య అనుకొన్నారు .ఇదీ ఒకందుకు మంచిదే .సంపూర్ణ స్వరాజ్యం కోస౦  తీవ్రంగా కాంగ్రెస్ పనిచేసే అవకాశం కలిగింది .ఫెడరేషన్ లో సంస్థానాధీశులు చేరతారని నాకు నమ్మకం లేదు .ఈలోపు’’ ప్రొవిన్షియల్ అటానమి’’రాష్ట్రీయ స్వపరిపాలన రావచ్చు .ఇంగ్లాండ్ వెళ్ళిన బ్రిటిష్ ఇండియా ప్రతినిధులు ఫెడరల్ రాజ్యాంగం పై మోజుపడ్డారు .దీనితో గాంధీ ఉప్పు పన్ను రద్దు చేయగలడా ?మిలిటరీ ఖర్చు తగ్గించగలడా ?ఉద్యోగి పెన్షన్ తగ్గించే తీర్మానం పై ఓటు వేయగలడా .మద్య నిషేధం ,భూమి శిస్తు తగ్గించటం కుదుర్తుందా ?  ఇవన్నీ ప్రజా విప్లవానికి దారి తీసేట్లున్నాయి . రౌండ్ టేబుల్ సభ్యులు అలాచేయలేదు .అప్పర్ హౌస్ లో ఉన్న 200మంది సభ్యులలో నియమితులైన సం స్థానాధీశులు  80 మంది, .ప్రజాశాసన సభలో ఉన్న 300లో వందమందికి –జమీందారులు వర్తక వాణిజ్య ప్రముఖులు కు ప్రత్యెక ప్రాతి నిధ్యం .అంటే దేశపాలన అంతా సంస్థానాధీశుల జమీందార్ల ధనస్వామ్యుల చేతిలోనే బందీ అయి పొయి౦దన్న మాట.ఫెడరేషన్ లో చేరటానికి సంస్థానాధీశులు ఒప్పు కోరు. గాంధీ లండన్ వెళ్లి డౌనింగ్ స్ట్రీట్ లో చేయాల్సింది అంతా చేశాడు .ఫలించలేదు .గాంధీ ఎన్ని డబ్బాలు కొట్టినా గాంధీ –ఇర్విన్ ఒడంబడిక పెద్ద తప్పే .పరువు పోగొట్టుకొన్న కాంగ్రెస్ ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించాలి ‘’అని చాలా విపులంగా జరిగి పోయిన సంఘటనలన్నీ పూసగుచ్చి  చెప్పి తన భావాన్ని నిర్భయంగా బయట పెట్టాడు .

  విఠల్ భాయ్ అమెరికా ప్రయాణం

గాంధీతో పాటు లండన్ నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన పటేల్ వైస్రాయ్ ఆర్డినెన్స్ కు గురై,అసలే అనారోగ్యంగా ఉన్న ఆయన మళ్ళీ జబ్బుపడగా ప్రభుత్వం విడుదల చేసింది .మళ్ళీ వియన్నాకు వెళ్లి చికిత్స చేయించుకొని ,విశ్రాంతికోసం ఇంగ్లాండ్ వెళ్ళాడు .కానీ భారత దేశ సమస్య ఆయన్ను వెంటాడుతూనే ఉంది .ఇంగ్లాండ్ నుంచి అమెరికా వెళ్లి భారత జాతీయ ఆశయాలు విస్తృతంగా ప్రచారం చేశాడు .

   అమెరికాలో ఇండియా రాయబారి విఠల్ భాయ్

స్వాతంత్ర్యం కోసం జాతీయుల సమీకరణం ఎంత ముఖ్యమో అంతర్జాతీయ సానుభూతి కూడా అంతే ముఖ్యం .వారి మోరల్ సపోర్ట్ చాలా ముఖ్యం .వివేకానంద స్వామి, ప్రతాప్ మజుందార్ ,లజపతిరాయ్ ,సర్ జేసి బోస్ ,సరోజినీ నాయుడు ,రవీంద్రుడు అంతకు ముందు అమెరికా వెళ్ళినవారే. ఇప్పుడు విఠల్ భాయ్ కూడా ..భారత్ లో ఐక్యత లేదనీ బ్రిటిష్ ప్రభుత్వం తొలగితే , కొట్టుకు చస్తారనే ప్రచారం పెద్ద ఎత్తున బ్రిటిష్ ప్రభుత్వం  చేసింది .మన పటేల్ ధీరోదాత్తుడు కనుక  ఆ దుష్ప్రచారాన్ని  తిప్పికొట్టి యదార్ధం చాటి చెప్పిమేజారిటీ   అమెరికన్ లకు కనువిప్పు కలిగించాడు .రెండవ ప్రపంచ యద్ధం తర్వాత విజయ లక్ష్మీ పండిట్ అమెరికాలో భారత్ కు చేసిన సేవ చిరస్మరణీయం

   1932లో అమెరికా వెళ్ళిన విఠల్ భాయ్ ఇండియాలో జైలు జీవితం, నాలుగు సార్లు ఆపరేషన్ లతో ఆరోగ్యం బాగా దెబ్బ తిన్నది .అయినా లెక్క చేయకుండా భారత విధానాలను అమెరికన్లకు తెలియ జెప్పటానికి తీవ్ర కృషి చేశాడు .న్యూయార్క్ ,ఫిలడెల్ఫియా, బోస్టన్ డెట్రాయిట్, వాషింగ్టన్ మొదలైన పెద్ద పట్టణాల మేయర్లు ఆయనకు హృదయ పూర్వక స్వాగతం చెప్పి గౌరవించారు .బొంబాయి మేయర్ గా, ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ గా ఆయన చేసిన సేవ ప్రముఖ అమెరికన్ పత్రికలలో విశేషంగా ప్రచురితమైంది .కాలీజీలు, చర్చిలు, క్లబ్బులలో ఆయన ఉపన్యాసాలు పెద్ద ఎత్తున జరిగాయి .వస్తుతః మహా వక్త ,మహా వాక్ చమత్కృతి ,సమగ్ర విషయ సంగ్రహణం తో శ్రోతలను మై మరపించాడు ,జనం తండోప తండాలుగా హాజరయ్యే వారు .ఇండియాకు ఫ్రీడం ఎంత అవసరమో నొక్కి చెప్పాడు .ఆయనతో మాట్లాడి అక్కడి వారంతా ప్రభావితులయ్యారు .

    వాస్సార్ కాలేజి ఉపన్యాసం

 ఒకసారి పటేల్ స్త్రీలకు  ఉన్నత విద్య నేర్పే అతి పురాతన వాస్సార్ కాలేజిలో ప్రసంగించాడు ,.చిన్నా ,పెద్దా నోరు వెళ్ళ బెట్టి విన్నారని వార్తాకథనం .ఉత్సాహ ఆనంద ఆవేశాలను ఆపుకోలేకపోయారు శ్రోతలు .ఉపన్యాసం తర్వాత చేసిన కరతాళధ్వనులు ఎంతో సేపటికి కానీ ఆగలేదట .ప్రాచీన వైభవం ఉన్న భారత్ కు స్వతంత్రం రావాల్సిందే దానికి అర్హత గురించి ఎవరూ చెప్పక్కర్లేదు .స్వపరిపాలన బాధ్యత భారతీయులకు అప్పగించాల్సిందే అనే నిజాన్ని అమెరికన్లకు కల్గించాడు .అమెరికాలో ఉన్న ఆరు నెలలో ఎంతో కృషి చేశాడు పటేల్ .ఇండియాలోని మిత్రుడికిలేఖ రాస్తూ  పటేల్ ‘’నేను ఈ దేశంలో 85ఉపన్యాసాలిచ్చాను .అనేక ముఖ్యులు పరిచయమయ్యారు .బాల్టి మోర్ లో ఫారిన్ పాలిసి అసోసియేషన్  ఆధ్వర్యం లో పెద్ద సభలో మాట్లాడాను .అన్నితరగతుల వారూ హాజరయ్యారు.నాకూ ఫ్రెడరిక్ వైట్ కు చర్చ జరిగింది .ఈ చర్చ కోసమే సభ జరిగింది .మార్చి 11న నాకూ ,వెడ్జి వుడ్ బెన్ కూ న్యుయార్క్ లో చర్చా సభ అరుగుతుంది .పై సంస్థ యే దీన్నీ నిర్వహిస్తోంది .ఆతర్వాత డబ్లిన్ ,లండన్ జెనీవా  వియన్నాలు చూసి చివరికి ‘’ఇండియా జైలు ‘’లో వచ్చి పడతా .ఇక్కడ నేను ఒక్కడినే పని అంతా చేసుకొంటున్నాను .తృప్తి గానే ఉన్నాను .

  సశేషం

దీపావళి శుభా కాంక్షలతో

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -4-11-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అర్ధం లేని మాటలో హాస్యం

అర్ధం లేని మాటలో హాస్యం
ఒక సారి రావూరు మునిమాణిక్యం గారితో ‘’మీకథ చదివా బాగుంది .అందులో ఆఘ్రుణీ,అఘ్రుతి కూడా ఉన్నాయి. చదూతూన్నంతసేపు నాకు మా వంతుడైన క….క్క శ్వేశ్వరుడు మభాత్తేలు క్రీడించు కొన్నట్లున్నాయి ‘’అన్నాడు మరోసారి భమిడిపాటి మునిమాణిక్యం కలిసి విశ్వనాథ ఉపన్యాసం విన్నారు .ఎలాఉందని ముని ,భమిడి ని అడిగితె ‘’హ్రుశితమ్గా ,అవిశమిత౦ గా ,అమిత వశ్యం గా ,హాస్యంగా ఉంది ‘’అన్నారట భమిడి మాస్టారు .
హాస్యం లో అనిర్వచనీయత
అను భూతి కవిత్వం అని ఉంది. దీనిలో తిలక్ శిఖరాయమానుడు .కవి ఏమి చెబుతున్నాడో తెలియపోయినా పద్యం బాగున్నట్లు అనుభూతి కలిగిస్తుంది..హాస్యం లోనూ ఇలాంటిది సాధ్యమే అంటారు మునిమాణిక్యం .నత్తి గా మాట్లాడితే ఉచ్చారణలో వికృతి ఏర్పడి నవ్వు పుట్టిస్తుంది .మునిమాణిక్యం ఒక సారి నెపోలియన్ పాఠం మాహాద్భుత౦ గా చాలా సేపు బోధి౦చి చివర్లో నె…నెపోలియన్ అన్నారు నత్తిగా .ఒక కుర్రాడిని ఆపాఠం చదవమన్నారు .వాడు మొదలుపెడుతూనే ‘’న……న్నేపోలియాన్ యు …య్యురప్ ను జ …జ్జయించెను ‘’అని చదివాడు. తనను వెక్కిరించటానికి వాడు అలా చదివాడనుకొని మాస్టారు ‘’ఒరేయ్ నాకు ఒక్క సారే నత్తి వచ్చింది దాన్నిపట్టుకొని నన్నేవెక్కిరిస్తావా ‘’అని క్లాసు పీకారు .వాడు అవాక్కైపోయి ‘’న్నే…న్నేను మీ…మ్మల్నిఎ….ఎక్కిరించ టా…..టానికి కాదండీ ‘’అనగా అయ్యోపాపం అనుకొన్నారట .అప్పుడు మునిమాణిక్యం ‘’ఒరేయ్ నాయనా ఇందులో సిగ్గుపడాల్సింది లేదు .నత్తి గొప్ప వాళ్ళ లక్షణం .ఇంగ్లాండ్ ప్రధాని చర్చిల్ కు బాల్యం లో నత్తి ఉండేది .నువ్వు కూడా అంతటి వాడివికాకపోయినా గొప్ప వాడివే అవుతావు .కాక తప్పదు కూడా ‘’అని కవర్ చేసుకొని ధైర్యమూ చెప్పారు .
ప్రణాదాత్మకం – ప్రణాదం అనేది ఒకటి ఉంది .ఇది అనురాగం నుంచి పుడుతుంది –సౌండ్ ఇండికేటింగ్ ఎఫెక్షన్ అంటారు .పిల్లల్ని ముద్దు చేసేప్పుడు ‘’ఎన్దుకుఏత్తున్నావు’’?అమ్మకొత్తిందా,ఎందుక్కోత్తిందినాన్నా .అక్క కూడా కొత్తిందా?ఏడవకు బబ్బో ‘’ వంటిమాటలు ప్రియంగా మధురంగా ఉంటాయి నవ్వూ పుట్టిస్తాయి .లాలోసుకున్నవా ?బువ్వ తిన్నావా ?పిల్లాడు ‘’మోతలు కాలు కొను నాన్నా ‘’,నాన్నాలూ నాన్నలూ అమ్మ చూలు .కొత్తుతుంది ‘’వగైరా.
.విశ్వనాథ తన కల్ప వృక్షం లో ఇలాంటి మాటలతో పద్యమే రాశారు –‘’తానో లాములు .తండ్రి పేరెవరయా ?దాచాత మాలాలు (దశరధ మహారాజు )
గ్రస్తం –ఒక అక్షరం కాని పదం కాని వాక్యం లో లోపిస్తే గ్రస్తం అంటారు .కవితల్లడం లో వాడు మొగాడు .మావోడు నాల్రోల్లో వస్తాడు .రచెతను సమ్మా నిన్చాలే .వంటివి దీనికి౦దికి వస్తాయి .
మునిమాణిక్యం మాస్టారికి కృతజ్ఞతలతో
నరక చతుర్దశి శుభాకాంక్షలతో
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -3-11-21-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు  విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -8

భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు  విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -8
ఎస్టేటు –పెన్షన్
దండి ఉప్పు సత్యాగ్రహం దేశం లో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు .ప్రభుత్వం లాటీలకు ,జైళ్లకుకు పని పెట్టింది .రవీంద్రుడు ‘’నైట్ ‘’బిరుదును వదిలేస్తూ వైస్రాయ్ చేమ్స్ ఫర్డ్ కు ‘’మీ బిరుదులు  ఇప్పుడు మాకు అవమానంగా ఉన్నాయి .అనాగరకులైన మీ  చేతులలో నా దేశ ప్రజలను  అమానుష, హింసలకు గురి చేస్తున్నారు .ఈ బిరుదు త్యజించి ,అనామకులైన ప్రజలలో నేనూ ఒకడిగా ఉండటమే నాకు గౌరవం ‘’అని జాబు రాశాడు
.రాజీనామా చేసిన కొద్ది రోజులకే కలకత్తా వెళ్లగా జనం తండోప తండాలుగా స్టేషన్ కు వచ్చి స్వాగతం పలికారు విఠల్ భాయ్ కి .ప్రభుత్వానికి ఇది తప్పు అనిపించి ,పోలీసులు లాఠీ చార్జి చేశారు .పండిట్ గోవింద మాలవీయ మొదలైన నాయకులు తీవ్ర గాయాలయ్యాయి .కలకత్తా వీధులలో జరిగిన ఈ కిరాత చర్య స్వయం గా చూశాడు పటేల్ భాయ్ .ఇక క్షణం  కూడా వృధా చేయకుండా స్వాతంత్ర్య సమరం లోకి దూకాడు ‘        
   పెషావర్ సంఘటనలు
  1920 సహాయ నిరాకర ఉద్యమానికే మనకు స్వాతంత్ర్యం వచ్చి ఉండేది .కానీ కొన్ని హింసాత్మక సంఘటనలు చూసి ,గాంధీ మధ్యలోనే విరమింప జేశాడు .గాంధీకి శాంతి ,అహింసలే ఆయుధాలు .స్వామి వివేకానంద మహాత్ముడిని ‘’చాలా దేశాలు తిరిగాను .మనిషిలోని చెడ్డతనాన్ని మాత్రమె ద్వేషించి ,మనిషిని మనిషిగా ప్రేమించే వ్యక్తిత్వం ఆయనది ‘’అన్నాడు ..రాష్ట్ర కాంగ్రెస్ సభ్యులందర్నీ ప్రభుత్వం బంధించటం తో ప్రజలు ఉద్రేకం పొంది ,గందర గోళం లో ఒక బ్రిటిష్ ఆశ్వికుడు చనిపోయాడు .మిలిటరిని దింపి ప్రజలపై కాల్పులు జరిపించింది ప్రభుత్వం .పరిస్థితి విషమించి పాలన స్తంభించి పోయింది .రాయల్ ఘర్వాల్ సైనికులు దేశీయులపై కాల్పులు జరపటానికి నిరాకరింఛి , ,ప్రజల చేతులలో ఆయుధాలు ఉంటేనే తాము కాలుస్తామని పిల్లల్ని బిచ్చగాళ్ళను కాల్చమని ,ఇండియా సైన్యం ఇండియా రక్షణ కోసమే ,నిరాయుధుల్ని ,చంపటానికి కాదు అని  తేల్చి చెప్పారు .అసలు ఈ ఘటనకు కారణం –బ్రిటిష్ సైనికుడు ముందు తుపాకి పేల్చాడు .రిక్షాలో వెడుతున్న ఒక యువతికి ఇద్దరు కొడుకులకు ఆ తూటా తగిలి చనిపోయారు .దీనితో ప్రజలు కోపం పెచ్చుపెరిగి హద్దు మీరటం జరిగింది .ఈ సంఘటనపై విచారణకు ప్రభుత్వం ఒక సంఘాన్నిఅలహాబాద్ హైకోర్ట్ జడ్జి షా మహమ్మద్ సులేమాన్ ,కలకత్తా హైకోర్ట్ జడ్జి ఫ్రా౦ క్రిడ్జి సభ్యులుగా  నియమించి .వారి నివేదికలో సులేమాన్ ‘’ప్రభుత్వ మిలిటరీ కారు కింద పడి ప్రజలు చావటం వలననే  బ్రిటిష్  ఆశ్వికుని ప్రజలు నిరోధించారు’’అన్నాడు పెషావర్ సంఘటన భయంకరంగా విషాదంగా ముగిసింది .
  పటేల్ కమిటీ
పెషావర్ సంఘటనపై నిజ నిర్ధారణ చేయటానికి కాంగ్రెస్ విఠల్ భాయ్ పటేల్ అధ్యక్షుడుగా ఒక విచారణ సంఘం నియమించింది .ఈ సంఘ సభ్యులు వాయవ్య రాష్ట్రం లో అడుగు పెట్టకూడదని ప్రభుత్వం నిషేధించింది .ఈ కమిటీ నివేదికనూ జప్తు చేసింది .పటేల్ ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి నివేదిక తయారు చేసి కాంగ్రెస్ కార్యవర్గానికి అందించాడు .దీనిపై చర్చించటానికి కార్యవర్గం 7-8-1930 న  ఢిల్లీలో సమావేశమవగా ,ప్రభుత్వం ఆసమావేశాన్ని నిషేధించింది .విఠల్ భాయ్ ,కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు దాన్ని లెక్క చేయకుండా ఉల్లంఘి౦చ గా వీరిని బంధించి జైలులో పెట్టి,6నెలలు కఠిన శిక్ష విధించింది  ప్రభుత్వం . అప్పుడు  పటేల్ నవ్వుతూ ‘’ఇంగ్లాండ్ లో తమ పదవులకు రాజీనామా ఇచ్చిన స్పీకర్లకు ఎస్టేట్ పెన్షన్ ఇచ్చి గౌరవిస్తుంది .ఎస్టేట్ పెన్షన్ ఇవ్వటానికి బదులు ఇండియా మొదటి అనధికార అధ్యక్షుడిని బంధించి కారాగార శిక్ష విధించారు .ఇదే పెన్షన్ అన్నమాట ‘’అన్నాడు .
   పటేల్ అనారోగ్యం
విఠల్ భాయ్ ని మొదట్లో ముల్తాన్ జైలులో ఉంచారు .అక్కడ జబ్బు పడగా కోయంబత్తూరు జైలుకు మార్చారు .డాక్టర్ పరీక్షలో కడుపులో పుండు పెరిగినట్లు గుర్తించారు .ఆపరేషన్ చేయటానికి బల్లపై పడుకోబెట్టారు .అకస్మాత్తుగా ఆయన కింద పడి పోయాడు .దెబ్బలు తగల్లేదు .జైలు రిపోర్ట్ ఇండియా ప్రభుత్వ పరిశీలను పంపారు .1931జనవరి 5న మద్రాస్ శాసన సభలో ఒక సభ్యుడు పటేల్ అనారోగ్యకారణం గా వెంటనే విడుదల చేయాలని తీర్మానం ప్రవేశ పెట్టాడు .ఆతర్వాత రెండు  రోజులకే  పటేల్  ను విడుదల చేసింది ప్రభుత్వం .అప్పటికే ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది .అందువల్ల చారిత్రాత్మక గాంధీ  –ఇర్విన్ ఒడంబడిక రాయబారం లో పాల్గొన లేకపోయాడు .ఫిబ్రవరిలో వియన్నాకు వెళ్ళాడు .అక్కడ మేజర్ ఆపరేషన్ జరిగింది .ఆరోగ్యం కొంత నయమని పించింది .
   రెండవ రౌండ్ టేబుల్ సమావేశం
  భారత దేశ సమస్యా పరిష్కారానికి ఇంగ్లాండ్ లో రెండవ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది .మొదటి దాన్ని కాంగ్రెస్  బహిష్కరించింది.దీనికి సిద్ధపడ్డారు .మోకాళ్ళు దిగని కొల్లాయి కట్టి ,ఒకచేతకర్ర మరో చేత భగవద్గీత తో 40కోట్ల భారతీయుల  ఏకైక ఆత్మ అయిన  మహాత్మా గాంధి హాజరయ్యాడు .విఠల్ భాయ్ కూడా వియన్నానుంచి సరాసరి లండన్ వెళ్ళాడు .ఆరోగ్యం సహకరించకపోవటం, గాంధీ అభిప్రాయాలు తన ఆశయాలకు భిన్నంగా ఉండటం వలన ఏమీ చేయలేక పోయాడు .సమావేశ ఫలితాలు ఆయనకు నచ్చలేదు .బ్రిటిష్ ప్రభుత్వం విడుదల చేసిన వైట్ పేపర్ పై తీవ్రంగా విమర్శిస్తూ –‘’మొదటి సమావేశం లోఏం చెప్పారో ఇప్పుడూ అదే పాటపాడారు .గాంధీ –ఇర్విన్ ఒడంబడిక వలన కాంగ్రెస్ సహకారం ప్రభుత్వానికి లభించినా ఆమాట పేర్కొనలేదు .దానిపై ఆశలు పెట్టుకొన్న వారి ఆశలు నిరాశాలయ్యాయి ‘’అన్నాడు                               
.స్వేత పత్ర నిబంధనలు 
కేంద్ర ప్రభుత్వం ,కేంద్ర శాసన సభ అఖిలభారత ఫెడరల్ విధానాన్ని అనుసరిస్తేనే ఇది సాధ్యం .ఇందులో పెట్టిన నియమాలు-దేశ రక్షణ విదేశీ వ్యవహారాలూ వైస్రాయి చేతిలోనే ఉంటాయి .ఫైనాన్స్ విషయం లో ఇండియా కార్యదర్శి నిబంధనను బట్టిమాత్రమే ప్రజామంత్రిస్వీకరించాలి .సంస్థానాధీశులకు ,బ్రిటిష్ ప్రభుత్వానికి  సంబంధాలు  చక్రవర్తి పర్య వేక్షణలోనే ఉండాలి .బ్రిటిష్ వ్యాపారిపై ఆర్ధిక వ్యాపార అన్యాయ ప్రవర్తన ఉండరాదు .మైనారిటీ హక్కులకోసం వైస్రాయ్ కి అవసరమైన అధికారాలుంటాయి .కరాచీ కాంగ్రెస్ ఈ వైట్ పేపర్ ను తిరస్కరించింది .తమకోరికలను ఇలా –సంపూర్ణ స్వాతంత్ర్యం ముఖ్యంగా దేశ రక్షణ విదేశా౦గ విధానం ఫైనాన్స్ ప్రజల ఆధీనంలోనే ఉండాలి .కామన్వెల్త్ నుంచి విడిపోయే హక్కు భారత దేశానికే ఉండాలి .ఇండియా అప్పు ఎంత సమంజసమో ,అందులో బ్రిటిష్ ప్రభుత్వం ఎంత భరిస్తుందో నిష్పాక్షిక విచారణ జరగాలి ‘’అని రాతపూర్వకం గా తెలియజేస్తే ,దాన్ని బుట్ట దాఖలు  చేసి దేశ గౌరవాన్ని మంట గలిపి,కాంగ్రెస్ ను తీవ్రంగా అవమాన పరచింది  బ్రిటిష్ ప్రభుత్వం .బ్రిటిష్ ప్రధాని ఇండియాకుస్వాతంత్ర్యం ఇవ్వటం జరగదని కుండ బద్దలు కొట్టి మరీచెప్పాడు  .
  సశేషం
  నరక చతుర్దశి శుభా కాంక్షలతో
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -3-11-21-ఉయ్యూరు 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గుజరాత్ మొదటి మహిళా గ్రాడ్యుయేట్,స్త్రీ విద్య ఉద్యమకారిణి –శారదా మెహతా (వ్యాసం )-గబ్బిట దుర్గా ప్రసాద్-నవంబర్ విహంగ మహిళా వెబ్ మాసపత్రిక 

గుజరాత్ మొదటి మహిళా గ్రాడ్యుయేట్,స్త్రీ విద్య ఉద్యమకారిణి –శారదా మెహతా (వ్యాసం )-గబ్బిట దుర్గా ప్రసాద్-నవంబర్ విహంగ మహిళా వెబ్ మాసపత్రిక 

26-6-1882 న గుజరాత్ లోని అహ్మదాబాద్ లో గోపీలాల్ మణీ లాల్ ధ్రువ అనే జుడీషియల్ ఆఫీసర్ ,బాలాబెన్ అనే నగర బ్రాహ్మణ దంపతులకు శారదా మెహతా జన్మించింది .కవి ,స౦ఘ సంస్కర్త బోలానాథ్ దివేషియా ఈమెకు మాతామహుడు . రాయబహదూర్ మేఘనాధ గర్ల్స్ హైస్కూల్ లో చదివి ,మహాలక్ష్మీ టీచర్స్ ట్రెయినింగ్ కాలేజి లో ఇంగ్లీష్ వాడుక భాష క్లాసులకు హాజరై ,1897లో మెట్రిక్ పాసయింది .లాజిక్ ,మోరల్ ఫిలాసఫీ సబ్జెక్ట్ లను తీసుకొని గుజరాత్ కాలేజి లో బి. ఏ. చదివి 1901లో గ్రాడ్యుయేట్ అయింది .శారదా మెహతా ,ఆమె పెద్దక్క ,విద్యా గౌరీ నిఖాంత్ లు ఇద్దరే మొట్టమొదటి సారిగా గుజరాత్ లో డిగ్రీ పొందిన మహిళలుగా రికార్డ్ సాధించారు .1898లో శారద వివాహం మెడిసిన్ లో నాలుగేళ్ల సీనియర్ అయిన సుమంత్ మెహతాతో జరిగింది. ఆతర్వాత భర్త మెహతా బరోడా మహారాజులు గాయక్వాడ్ ల కుటుంబ డాక్టర్ గా ,సాంఘిక కార్యకర్తగా పని చేశాడు .

శారదామెహతా సంఘ సంస్కరణలు, మహిళా విద్యావ్యాప్తి, మహిళా సాధికారత, వర్ణ వ్యవస్థ నియమాలకు, అస్పృశ్యత లకు వ్యతిరేకంగా ఉద్యమించింది. భారత జాతీయోద్యమం లో పాల్గొన్నది .1906లో గాంధీ మహాత్ముని ప్రభావం మొదటి సారిగా శారదా మెహతాపై పడింది .స్వదేశీ ఉద్యమం ,ఖాదీ వస్త్రధారణ ఆమెను బాగా ఆకర్షించాయి .1917లో గర్మితీయ అంటే ఒప్పంద సేవలకు (ఇండెట్యూర్డ్ సెర్వి ట్యూడ్ ) వ్యతిరేకంగాఒక పెద్ద నిరసన ప్రదర్శన నిర్వహించింది. 1919 ‘’నవ జీవన్ ‘’పత్రిక నిర్వహణలో ఎడిటర్ ఇందూలాల్ యాజ్ఞిక్ కు సహాయ సహకారాలదించింది.

1928లో అహ్మదాబాద్ లో జరిగిన గుజరాత్ కిసాన్ పరిషత్ సభలలో శారద పాల్గొని,రాష్ట్ర గవర్నర్ ను కలిసి బార్డోలి రైతు సత్యాగ్రహానికి సరైన, న్యాయమైన పరిష్కారం త్వరగా సాధించమని,ఆసంఘ ప్రతినిధిగా వ్రాతపూర్వకంగా కోరింది .అహమ్మదాబాద్ లోని వస్త్ర పరిశ్రమ లోని కూలి జనాలకు సౌకర్యం కోసం’’ రాయల్ కమీషన్ ఆన్ లేబర్’’ ఎదుట ప్రదర్శన నిర్వహించి దృష్టికి తెచ్చింది .1930 సహాయ నిరాకరణ ఉద్యమం లో కల్లు దుకాణ ముందు పికెటింగ్ నిర్వహించింది. అహ్మదాబాద్ లోని షెర్తా లోని భర్త ఆశ్రమ౦ లో ఖాదీ స్టోర్స్ ఏర్పాటు చేసి సమర్ధం గా నిర్వహించింది .1934లో ‘’అప్నా ఘర్ ని దుకాన్ ‘’అనే కో ఆపరేటివ్ స్టోర్స్ స్థాపించి అందరికి ఉపయోగం లోకి తెచ్చింది .

అహ్మదాబాద్ ,బరోడా ,బాంబే లలోని అనేక విద్యా ,స్త్రీ సంక్షేమ సంస్థలలో సభ్యురాలై, శారదా మెహతా తన సహాయ సహకారాలు, సేవలు అందజేసింది .బరోడా ప్రజా మండల అనే బరోడా ప్రజా సంఘం లో ఆమె సభ్యురాలు .1931నుంచి 1935వరకు అయిదేళ్ళు అహమ్మదాబాద్ మునిసిపాలిటిమెంబర్ గా సేవ చేసింది .స్త్రీసంక్షేమ సేవ కోసం 1934లో ‘జ్యోతి సంఘ్ ‘’స్థాపించింది.

మహిళా విద్యా వ్యాప్తి కోసం అహరహం కృషి చేసిన మహిళా మాణిక్య౦ శారదా మెహతా .దీనికోసం అహమ్మదాబాద్ లో ‘’వనితా విశ్రామ మహిళా విద్యాలయం ‘’నెలకొల్పింది .కార్వే మహిళా యూని వర్సిటి కి అనుబంధంగా ఒక మహిళా కాలేజి కూడా స్థాపించింది.

భారతీయ వేదాంతం ,హిందూ సంస్కృతీ శారద కు గొప్ప స్పూర్తి నిచ్చాయి .సంస్కృత సాహిత్యం ఆపోసన పట్టింది .అరవింద, సుఖలాల్ సంఘ్వి, సర్వేపల్లి రాధా కృష్ణ వేదాంత గ్రంథాలన్నీ చదివి పూర్తిగా అర్ధం చేసుకొన్నది. వీటిపై అనేక వ్యాసాలూ, జీవిత చరిత్రలు రాయటమేకాక, చాలా అనువాదాలు కూడా చేసింది .దిన, వార, మాసపత్రికలలో సాంఘిక విషయాలపై వ్యాసాలూ రాసింది.బాలలవిద్యా, నైతిక వికాసం కోసం ‘’పురానోని బాల్ బోధక్ వార్తా ‘’ అనే కథల సంపుటి రాసి1906లోనే ప్రచురించింది. ’’ఫ్లారెన్స్ నైటింగేల్ జీవిత చరిత్ర ‘’‘’ స్పూర్తి దాయకంగా ’కూడా అదే సంవత్సరం లో రాసి ముద్రించింది .1920లో ‘’గృహ వ్యవస్థ శాస్త్రం ‘’రచించింది. బాల,బాలికల విద్య కోసం ‘’బాలకోను గృహ శిక్ష ‘’రాసి ,1922లో వెలువరించింది . 1938లో శారదా మెహతా తన ఆత్మ కథ’, ఉద్యమాలు, మనోభావాలు, పోరాటాలు,సేవా వివరాలు వివరిస్తూ ’జీవన సంభారణ ‘’రాసి ప్రచురించి మహిళలకు స్పూర్తి, ప్రేరణ కలిగించింది. దీనిలో 1882నుంచి 1937 వరకు సుమారు 55ఏళ్ల ఆమె అనుభవాలు జ్ఞాపకాలు ఉన్నాయి . అక్కయ్య తో కలిసి శారదా మెహతా రమేష్ చంద్ర దత్ రాసిన బెంగాలీ నవల ‘’సంసార్’’ను ‘’సుధా హాసిని ‘’గా 1907లో అనువాదం చేసింది. 1911లో మహారాణీ ఆఫ్ బరోడా, రాసి అందులో భారతీయ జీవిత విధానం లో మహిళాపాత్ర గా రాణీ చిమన్ బాయ్ జీవితాన్ని వర్ణించి చూపింది. దీన్ని 1915లో గుజరాతీ భాషలో ‘’హిందూసస్థాన్ మా స్త్రీ వోను సామాజిక్ స్థాన్’’ గా రాసింది. సాతే అన్న భౌ రాసిన నవలను ‘’వర్ణనే కాంతే’’గా అనువదించింది .

బహుముఖీన ప్రజ్ఞా పాటవాలు ప్రదర్శించి భారత స్వాతంత్ర్య ఉద్యమం లో ప్రముఖ పాత్ర వహించి, మహిళా సాధికారత, విద్యా, గౌరవం కోసం, లేబర్ సోకర్యాల కోసం అహర్నిశలూ కృషి చేసిన, సాహిత్యోపజీవి ధన్యజీవి శారదా మెహతా 13-11-1970 న 88 ఏళ్ళ సార్ధక జీవితం గడిపి మరణించింది.

Posted in రచనలు | Tagged | Leave a comment

భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -7

భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -7
విఠల్భాయ్ పటేల్ రాజీనామా
25-4-1930న విఠల్ భాయ్ పటేల్ అసెంబ్లీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి స్వాతంత్ర్య ఉద్యమం లోకి దూకాడు .తన రాజీనామాకు కారణాలు తెలుపుతూ వైస్రాయ్ ఇర్విన్ కు –‘’డియర్ లార్డ్ ఇర్విన్ –నా అసెంబ్లీ సభ్యత్వానికి అధ్యక్షపదవికి రాజీ నామా పంపిస్తున్నాను .ఈ సందర్భం గా ప్రజలచే ఎన్నుకో బడిన అధ్యక్షుడు ఎన్ని కష్టాలు ఆటంకాలూ ఎదుర్కోవాలో తెలియజేస్తున్నాను .1925నుంచి ఈ పదవిలో ఉంటూ నిష్పక్షపాతంగా ఉన్నాను .ప్రభుత్వ ఆగ్రహానికి భయపడలేదు .నేను కొన్ని పొరబాట్లు చేసి ఉండచ్చు .కానీ నా స్వంత రాజకీయ భావాలతో పని చేయలేదు .అసెంబ్లీ లో అందరి అభిప్రాయం తీసుకోన్నాకే నిర్ణయాలు చేశాను .అత్యంత క్లిష్ట పరిస్థితులలో కూడా నిష్పాక్షికత వదలలేదు .ప్రభుత్వ కోపానికీ గురైయ్యాను .ప్రభుత్వం కూడా చాలా సహించి ఊరుకొన్నది కానీ నా నిష్పాక్షిక తీర్పులను సహించలేక పోయారు .చక్రవర్తికి ఎంత అధికారం ఉందొ అసెంబ్లీ అధ్యక్షుడికీ అంతే అధికారం ఉంటుంది.సంవత్సరం నుంచీ నాకూ ప్రభుత్వానికి ద్వంద్వ యుద్ధమే సాగింది .ఈ పదవి నాకు ముండ్ల పొద అయింది .పత్రికలు కూడా క్రూరంగా ప్రవర్తించాయి .నేను ప్రతీకారం చేయలేక ఊరకుండిపోయాను .అప్పుడప్పుడు మిమ్మల్ని కలిసి నా అభిప్రాయాలు చెప్పేవాడిని .అంతకంటే ఏమీ చేయలేని నిస్సహాయత .ప్రజల దృష్టిలో అధ్యక్షుడి ని కించపరచటం కూడా చేశారు .నాపై దుష్ప్రచారానికి ఒక ముఠా ఏర్పరచారు .కానీ వారు ఏమి సాధించారో నాకు తెలీదు .కొందరు పత్రికా విలేకరులు ఆ ముఠా ను కలిసి వెళ్ళేవారు .వారి వ్యవహారం శ్రుతి మించింది.ఈ దేశం లోనే కాదు ప్రపంచం లో ఎక్కడ ఉన్న తెల్ల వాడికైనా ‘’వీడు ఎప్పుడు వెళ్లి పోతాడా ?’’అని ఎదురు చూస్తూ నాపై నిఘా వేశారు .నన్ను నొప్పించి రాజీనామా చేయించాలని వాళ్ళ ఉద్దేశ్యం అయి ఉండవచ్చు .నేను రాజీనామా చేస్తే ఇలాంటి పదవికి భారతీయులు అర్హులు కారు అని ప్రచారం చేసుకొంటారేమో .మీ ప్రభుత్వానికి నాపై ఆదరం లేదు .విశ్వాస రాహిత్యం తీర్మానం నెగ్గితేనే నేను రాజీనామా చేయాలి .ఆపని వాళ్ళ వల్ల కాలేదు .అభిప్రాయ భేదాలు తీవ్రమైనప్పుడు నాదే పై చేయి అయింది .నరాల బలహీనత ఉన్నవాడైతే ఎప్పుడో తోక ముడిచి పారిపోయేవాడు ,లేకపోతె జోహుకుం అనేవాడు .నా రూలింగ్ లు అసెంబ్లీ గౌరవాన్ని పెంచాయని ప్రపంచ ప్రజలు భావించారు .నేను ఈ పదవిలో ఉన్నంతకాలం నిరంతర ఘర్షణ సాగింది .ఈ నిరంకుశ ప్రభుత్వ౦ నుంచి రక్షణ కోసమే ప్రయత్నించాను .నా ప్రయత్నాలు మూడు వంతులు సత్ఫలితాల నిచ్చాయి .ఎంతో మానసిక క్షోభ అనుభవించాను .ప్రజల విశ్వాసం ఉన్నదన్నమాట ఒక్కటే నాకు ఓదార్పు .పైన తెలిపిన అక్రమ విషయాలనే గర్హిస్తున్నాను .ఇది అంతరించాలని నా కోరిక .ఈ పదవిలో ఉంటూ దేశ సేవ చేయలేను అని బాగా అర్ధమైంది .కనుక ఇందులో ఉండి ప్రయోజనం లేదు .దేశ పరిస్థితులు తీవ్ర రూపం దాల్చాయి .ఇంకా పదవినే పట్టుకొని ప్రాకులాడితే నా దేశానికి తీవ్ర దోహం చేసిన వాడిని అవుతాను .కిందటి సారే నేను ‘’నేనుకూడా రాజీనామా చేసే సమయం వస్తుందని’’ సూచనగా చెప్పాను .కాంగ్రెస్ కోరికలు సమంజసాలు అని మీ ప్రభుత్వం భావించటం లేదు .గాంధీ ప్రతిపాదించిన అధినివేశ ప్రతిపత్తిని చర్చించటానికి రౌండ్ టేబుల్ సమావేశం జరగాలని భావించాడు .ఇది సమంజసం అని నా నమ్మకం.కనుక ఈ ప్రత్యెక పరిస్థితులలో నా అధ్యక్ష పదవికి రాజీనామా ఇచ్చి సరాసరి భారత స్వాతంత్ర సమరం లో నా శక్తి యుక్తులు విని యోగించాలని భావించి రాజీనామా చేస్తున్నాను .ఇప్పటిదాకా మీరిచ్చిన సహకారానికి ధన్యవాదాలు .నా నియోజకవర్గం 1928వరదలకు చాలా కష్టనష్టాలపాలైంది .మీరుస్వయంగా దర్శించి ప్రజలను ఆదుకొన్నారు ధన్యవాదాలు .అనధికార హోదాలో నేను తర్వాత వచ్చి మిమ్మల్ని కలుస్తాను ‘’అని లేఖ రాశాడు పటేల్ భాయ్ .
ఈసుదీర్ఘ లేఖకు వైస్రాయ్ ప్రతి స్పందించి పటేల్ రాజీనామా ఆమోదించి –‘’బార్డోలీ సత్యాగ్రహం లో ప్రభుత్వం తన సలహాప్రకారం నడిచింది అనటం సరికాదు .శాంతియుత సంప్రదింపులు వదిలి శాసనోల్లంఘనలు మొదలైన వాటికి పూనుకోవటం మున్ముందు విచారించాల్సి వస్తుంది ‘’అని క్లుప్తంగా లేఖ రాశాడు .పటేల్ రెండవ సుదీర్ఘ లేఖలో ‘’ 1920 సహాయ నిరాకరణ శాంతియుతంగా సాగినా విజయవంత౦ కాలేదు .అప్పుడే మీరుకొత్తగా వచ్చారు .గాంధీ అనుచరులను తప్ప అందరితో మీరు మాట్లాడారు .మీ –నా సంభాషణలో కాంగ్రెస్ శక్తిని గాంధీ విధానాన్ని చాలా సార్లు శంకించారు .మీరు తప్పుడు సలహాలు వింటారని తెలిసింది .గాంధీ నాయకత్వం లో ఒక బ్రహ్మాండమైన ప్రజా ఉద్యమం బయల్దేరుతుందనీ మీ దమననీతి మీకే చేటు తెస్తుందని చెప్పానుమీకు .ఇలాంటి సలహామీకు ఎవ్వరూ ఇచ్చి ఉండరు .మీరు నా మాట వినే స్థితిలో లేరప్పుడు .1927లో నేను ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు చక్రవర్తితో బర్కిన్ హెడ్ మొదలైన వారితో అవే మాటలు చెప్పాను .బాధ్యతాయుత ప్రభుత్వాలనుఏర్పాటు చేయకపోతే తీవ్ర పరిస్థితులు ఏర్పడతాయనీ గట్టిగానే చెప్పాను .మాకు కొన్ని షరతులమీద కొన్ని ఉద్యోగాలు ఇవ్వమనీ,అప్పుడు రక్షణ సమస్యలు ఏర్పడవు అనీ చెప్పాను .పరిష్కరించకపోతే 1920పరిస్థితులే ఏర్పడతాయనీ చెప్పాను .ఇంగ్లాండ్ నుంచి రాగానే మిమ్మల్ని కలిసి పై విషయాలన్నీ చెప్పాను .సైమన్ కమీషన్ కు బాధపడ్డాను .నా సలహాలు బూడిదలో పోసిన పన్నీరు అయింది .దేశమంతా సైమన్ గో బాక్ అని నినదించింది నేనూ రిజైన్ చేసిపాల్గొందామనుకొన్నా ,వద్దన్న మీ సలహా పాటించాను .మీ ఇంగ్లాండ్ ప్రయాణం మాకు మేలు చేస్తుందని ఆశపడ్డాను .మీరు బయల్దేరేటప్పుడు ‘’గాంధీ నెహ్రు లను సంప్రదించి ఎలాంటి ప్రకటన చేస్తే బాగుంటుందో అది కాంగ్రెస్ కు కూడా నచ్చుతుంది ‘’అని చెప్పి పంపాను .కానీ గాంధీ ప్రభావం మీకంటికి ఆనలేదు .బ్రిటిష్ ప్రభుత్వం కాంగ్రెస్కు తప్ప ఇంకే పార్టీకి అధికారం అప్పగించదు అనికూడా చెప్పాను .మీరు ఇండియాకు తిరిగివచ్చి ప్రభుత్వం తరఫున ప్రకటన చేశారు .దానికాపీ నాకూపంపారు .మీ ప్రకటన కాంగ్రెస్ ను ద్వైవీ భావం లో పడేస్తుందని మీకు సూచించాను .రౌండ్ టేబుల్ సమావేశం జరగటానికి ముందు రాజకీయ ఖైదీలను అందర్నీ విడిచిపెట్టాలి .ప్రముఖ రాజకీయవేత్తలనుఆహ్వానిన్చాలి .సమావేశం తర్వాత మేరు మాకేదో తవ్వి తలకెత్తుతారని అని నేను అనుకోవటం లేదు .బ్రిటిష్ ప్రకటన కాంగ్రెస్ అంగీకరించాలి తోకపార్టీలతో కాదు . .పరిస్థితుల్ని చక్కబరచే దమ్మున్నవాడు గాంధీ ఒక్కడే .ఆయన్ను సంతృప్తి పరచండి .1921నుండి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని మీరు అణచి వేస్తూనే ఉన్నారు .కానీ అది అపూర్వ చైతన్యం ప్రజలలో తెచ్చింది .మీకు కనువిప్పు కలగాల్సింది పోయి కళ్ళు నెత్తికెక్కినట్లు ప్రవర్తించారు .గాంధీని ఆహ్వానించి ఒడంబడిక చేసుకోండి .మాకు సంపూర్ణ స్వరాజ్యమే కావాలి .అధినివేశ ప్రతిపత్తిని మీరు అంగీకరించి తీరాలి .సహృదయంతో పరిష్కరించాలని మీకున్నా ,మీకష్టాలు నాకు తెలుసు .సర్వ త్యాగం చేయటానికి భారత జాతి సిద్ధంగా ఉంది .మీపలుకుబడి ఉపయోగించి ప్రభుత్వాన్ని ఒప్పించండి లేకపోతె రాజీనామా చేసి వెళ్ళిపొండి .కోట్లాది భారతీయుల మనోభావాలు గ్రహించండి .మీకు ఇంగ్లాండ్ లో అన్నిపార్టీ లతో సన్నిహిత సంబంధాలున్నాయి .ఇండియా సేక్రేటరికి మీపై అమిత విశ్వాసం ఉంది .మీరు ధైర్యంగా ముందడుగు వేస్తె ఇండియాకే కాదు అందరికీ మహోపకారం చేసినవారుగా చరిత్రలో నిల్చిపోతారు ‘’అని రాశాడు పటేల్ భాయ్ .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -2-11-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రెండు భాషల కలయిక వల్లా హాస్యం పుడుతుంది

రెండు భాషల కలయిక వల్లా హాస్యం పుడుతుంది

ఔను నిజం .అందులో సౌందర్యం ఉండకపోవచ్చు .చమత్కారంగా ఉంటుంది .తుపాకీ రాయుళ్ళు అనే పగటి వేష గాళ్ళు ఇలా హాస్యం పుట్టిస్తారు .వేదపనసలు చదివినట్లు ఏవో తమాషా శ్లోకాలు చదివి నవ్విస్తారు –‘’బాకీసారా సుమనాసా సర్వాదాయం .యధాక్రమం తిన్నట్టే తినకున్నట్టే .మాడడం.మాట మాట ప్రసంగేన డబ్బు దిబ్బుస్త దైవచ .పాద రక్ష ప్రయోగేనశరీరం పీడా వర్జయేత్ ‘’.దీన్ని వేదం చదివినట్లు ఉదాత్త అనుదాత్తలతో స్వర భేదంతో చదివితే వింతగా చమత్కారంగా అనిపించి నవ్వొస్తుంది .

  ఇంగ్లీష్ –తెలుగు కలిపి కొట్టుడు గిరీశం బాగాచేసి చూపించాడు కన్యా శుల్కం లో .’’ఇన్నాళ్ళాయ్ నీకు విడో మేరేజి విషయమై లెక్చర్లు ఇస్తుంటే ,ఈ కథ ఎప్పుడూ చెప్పావుకావు .మీ ఇంట్లోనే ఓ అన్ ఫార్త్యునేట్ యాంగ్ విడో ఉందటోయ్.ఏమి దురవస్థ .మైహార్ట్ మేల్ట్స్.నేనే తండ్రి నైతే ఈ పిల్లకు విడో మీరేజ్ చేసి శాశ్వతమైన కీర్తి సంపాదిద్దును .ఏమిచక్కదనం .ఈ సోంపు ఎక్కడా చూడలేదు .పల్లె టూళ్లో  ఉబుసు పోదనుకున్నానుకానీ ,పెద్ద కాంపెయిన్ కు ఇక్కడ కూడా అవకాశం ఉండటం నా అదృష్టం ‘’అంటాడు వెంకటేశం తో.

  కవులు కూడా రెండు భాషల కలయికతో పద్యాలు రాశారు .అవీ తమాషాగానే ఉంటాయ్ .’’పోస్టాఫీసున పోస్టు చేయు డొక కార్డున్ రేపే నామాటలన్ –టెష్టున్ జేయగవచ్చు .స్టార్టిమీడియట్లీ  యంచు వైరిచ్చుటే –బెస్టన్ని౦టను –వైరు జూచుకోనుచున్ వేవేగ మేల్ ట్రెయినో  -నే స్టార్టౌ,నతడారణాలెకదవేష్టయిన చోన్ ‘’’అలాగే వరశుల్క నాటకకర్త తెలుగు అరవాలను కలగా పులగం చేసి హాస్య పులగం వాడాడు .ప్రతాప రుద్రీయాం లో వేదం వారూతెలుగు ఉర్దూ కలిపికొట్టి  ఈ తమాషా మాటలతో సాధించి చూపారు .

 ఒక తెలుగాయన కన్నడిగుల విందుకు వెళ్ళాడు .భోజనాలలో రెండు మాటలు అందరు అనటం విన్నాడు. అర్ధం మాత్రం తెలియలేదు .ఎవరైనా వడ్డించటానికి వస్తే ‘’కొంచెం సాకు కొంచెం సాకు ‘’అనేవాడు అక్కర్లేదనుకొని వడ్డించకుండా వెళ్ళేవారు .విస్తట్లో తినటానికి ఎవరూ వడ్డించలేదు .మండి పోయింది .ఒకాయన వస్తేఆకలి మంటతో  ‘’అరగంట నుంచీ ఒక్కడూ సాకలేదు .నీ సాకు చట్టు బండలుకాను .నువ్వైనా రెండు బేకులు బేకి పో ‘’అన్నాడు అందరూ పగలబడి నవ్వక చస్తారా .

  ఉర్దూ సంస్కృతం వచ్చిన ఒక బ్రాహ్మణుడు వరుసగా పది హేను రోజులు సంధ్యావందనం చేయటానికి కుదరపోతే ,అన్నీ కలిసి ఒక రోజే చేద్దామనుకొని ,దీనికి సంస్కృతం లో ఎలాచెప్పాలో తెలీక ‘’పంద్రా యాం కా సంధ్యావందన్ ఏక్ ధం మేకరిష్యే ‘’అని సంకల్పం చెప్పాడు .

  అస్పష్ట ఉచ్చారణతో హాస్యం

దీనికి రెండు విధానాలున్నాయి ఒకటి మ్లిస్టం’’..దీనిలో రెండురకాలు ఒకటి అవిస్పష్టం రెండోది అనర్ధకం .ఈ రెండూ శబ్దాన్ని అస్పష్టంగా ఉచ్చరిస్తే వచ్చే వికృతి వలన హాస్యం పుడుతుంది .

మ్లిష్టం అంటే అర్ధం తెలియరాని మాటలు ఇన్ డిష్టింక్ట్ స్పీచ్ .అవిస్పష్టం అంటే ఇంగ్లీష్ లో మంబ్లింగ్ అంటారు .గొణుక్కోవటం వంటిది-ఉదాహరణ-

హలో రావ్ –ఆ రావునే మాట్లాడుతున్నా .మీరు మత్శ్యశాస్త్రం లో నిష్ణాతులట కదా .ఇవాళ ఒక అపురూపమైన చేప పట్టాం.ఏమిటవి? 0ద్ జాతివి ,అమ్బుల్ క్కా చ్చీ జాతివి అయ్యా .ఆయన మళ్ళీ అనటం వీడు అలాగే చెప్పటం జరిగింది .ఈ ఫోన్ సంభాషణలో మాటలు సరిగా వినపడకపోవటం చివర్లోనో మొదట్లోనో కట్ అవటం వలన వినే వాడు హాస్యం ఫీలౌతాడు .

 అనర్ధకం –ఇందులోనూఅర్ధం లేనిమాటలే  బాగా మాట్లడుతున్నానుకొని మాట్లాడే మాటలన్నమాట .మనకు అర్ధంకాక తికమక పడతాం .దీన్నే ఇంగ్లీష్ లో ‘’డబుల్ టాక్ ‘’అంటారు .దీనికిఒక ఉదాహరణ –రావూరు సత్యనారాయణ రావు గారు ఒకసారి మునిమాణిక్యం గారింటికి వచ్చి ‘’రాత్రి జమ్మలమడక మాధవ రాయ శర్మగారి ఉపన్యాసం విన్నాను .మీరూ విన్నారుగా .కాని మొక్కపాటి ఆ ఉపన్యాసం ‘’వే౦డాయమానం ‘’గా ఉందన్నాడు నాకు అందులో లాటాను ప్రాసం కనిపించింది .మీరు ఏమంటారు ‘’?అని అడిగితె మాస్టారు ‘’వేండాయ౦ గా నూలేదు, లాటాయమానంగానూ లేదు .అది ‘’భార వేరం’’ గా ఉంది.కాళిదాసస్య భార వేరః ‘’అన్నాడుకనుక ఆ ఉపన్యాసం’’ భారవేర సంయుక్త సమాహారం’’ నోడౌట్  ‘’అనగా అక్కడున్నవారంతా పగలబడి నవ్వారని మునిమాణిక్యం ఉవాచ .

మునిమాణిక్యం మాస్టారికి కృతజ్ఞతలతో

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -1-11-21-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు  విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -6

భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు  విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -6

సెప్టెంబర్  అసెంబ్లీ సమావేశాలలో విఠల్ భాయ్ సూచించిన సూచనలన్నీ సమ౦జసాలని సభ తీర్మానించగా మోతీలాల్ ‘’1928డిసెంబర్ 1లోపల అసె౦బ్లే ఆఫీస్ డిపార్ట్ మెంట్  ఏర్పడాలని దానికి ఇండియా కార్యదర్శి అనుమతికోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ‘’ఒక తీర్మానం లో కోరాడు . ఈ తీర్మానం నెగ్గి డిపార్ట్ మెంట్ స్థాపన జరిగింది .విఠల్ భాయ్ తన అధికారం హద్దులుదాటి రక్షణ బిల్లుపై రూలింగ్ ఇచ్చాడనీ ,అసెంబ్లీ ఆఫీస్ డిపార్ట్ మెంట్ ఏర్పాటు చేశాడని బొంబాయి టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక రాసింది .ఆరాతలు అధ్యక్షపీఠాన్ని కి౦చ పరచేవిగా ఉన్నాయని నిరసనగా గయాప్రసాద్ సింగ్ అద్జర్న   అడ్జర్న్ మెంట్  మోషన్ తీసుకురావాలనుకొంటే పటేల్ రూలింగ్ ఇచ్చి చర్చకు రానివ్వలేదు .ఒకసారి బ్రిటిష్ కామన్స్ సభలో డైలీ మెయిల్ పత్రిక పై నిరసన తీర్మానం ప్రవేశ పెట్టాలనుకొంటే ,స్పీకర్ మొదట అనుమతించినా తర్వాత నిరసన తీర్మానం ప్రభుత్వ విధానం మీదనే ఉండాలని  తెలుసుకొని తీర్మానాన్ని ఉపసంహరించుకోమని కోరాడు .టైమ్స్ ఆఫ్ ఇండియా తోపాటు లండన్ డైలి టెలిగ్రాఫ్ వంటి మరికొన్ని పత్రికలూ పటేల్ భాయ్ పై నిప్పులు చెరిగాయి  .ఈ ఉడత ఊపులకు చలించని మేరునగ ధీరుడు మన భాయ్ .’’నేను అధ్యక్షుడినికానా ?అస్తమానం నా చర్యలపై నిఘాఎమిటి “”?అని హాస్యం తో అన్నాడు .హోంమంత్రికూడా ఆపత్రిక ప్రకటలను నిరసించాడు .కానీ పత్రికలపై ,పత్రికా విలేకరులపై చర్య తీసుకోవటం పటేల్ కు నచ్చని విషయం .పత్రికా స్వాతంత్ర్యం ఉండాలని భావించేవాడు .ఇప్పుడు కేంద్రంలో రాష్ట్రాలలో దీనికి విరుద్ధంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలుసు .వార౦తట వారే క్షమాపణ కోరుతారేమో అని ఆశించాడు .’’మీ సభ్యులు చెప్పిన మాటలే రాశాను ‘’అని అధ్యక్షుడికి ఆపత్రిక రాయగా ,సభ్యులు నిరసన తెలిపారు .దేశం లోని మిగిలిన పత్రికలన్నీ విఠల్ భాయ్ నే సమర్ధించి అతని గౌరవాన్ని పెంచాయి .

  పూర్వపు అధ్యక్షుడు రైట్ వివిధ శాసన సభలకు  వెళ్ళే వాడు .పటేల్ కూడా ఆసంప్రదాయాన్ని కొనసాగించాడు .దీన్ని ఒకపత్రిక విమర్శిస్తే అసెంబ్లీలోనే ‘’ఈ ఆచారం నాతోనే మొదలుకాలేదు మాంటేగ్ చేమ్స్ ఫర్డ్ కాలం నుంచే ఉన్నదే .అసెంబ్లీ అధ్యక్షుడు రాష్ట్రీయ శాసన సభాధ్యక్షులకు మార్గ దర్శిగా ఉండాలని ఆశయం ఇందులో ఉంది .రైట్ కూడా ఇలాచాలాసార్లు చేశాడు. కార్యదర్శి మాంటేగ్ తో వెళ్లి చర్చించేవాడు అసెంబ్లీ అధ్యక్షుడు రాష్ట్ర శాసన సభాధ్యక్షులతో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలని మాంటేగ్ సూచించాడు .1921లో రైట్ సిమ్లాలో శాసన సభాధ్యక్షుల సమావేశం జరిపాడు .అప్పటినుంచి అందరిమధ్య సత్సంబంధాలు పెరిగాయి .నేనూ అదే సంప్రదాయాన్ని పాటిస్తున్నాను ‘’అని ప్రకటించాడు .ఎన్ని క్లిష్ట పరిస్థితులు ఎదురైనా శాసన సభాధ్యక్షుని గౌరవాన్ని కాపాడే ప్రయత్నమే విఠల్ భాయ్ చేసి సెబాస్ అనిపించాడు .

 బర్డ్ వుడ్ ఎపిసోడ్

ఇండియా సర్వ సైన్యాధ్యక్షుడైన సర్ విలియం బర్డ్ వుడ్ మిలిటరిలో భారతీయులు చేరటానికి కావలసిన విద్యా విధానం గూర్చి స్కెన్ కమిటీ వేసి ఆనివేదికను వైస్రాయ్ కి పంపగా ,అది అడ్జర్న్ మెంట్ తీర్మానం గా అసెంబ్లీకి రాగా ,బర్డ్ వుడ్ టూర్ లో ఉన్నందున అసెంబ్లీకి రాలేదు.ఆర్మీ సెక్రెటరి ఆయనబదులు వచ్చాడు .వైస్రాయ్ కూడా రానందుకు విమర్శించి వదిలేయగా ,బర్డ్ వుడ్ తిరిగివచ్చి తనతప్పు తెలుసుకొన్నాడు .

  జమేదార్ పటేల్

ఢిల్లీ అసెంబ్లీ బిల్డింగ్స్ చూడటానికి ఒకసారి ఒక అమెరికన్ దంపతులురాగా ,వారి విజిటింగ్ కార్డ్ లను పటేల్ కు ఎవరో తెచ్చిఇచ్చారు .వాటిని చూసి వెంటనే వెళ్లి స్వాగతం చెప్పాడు .వారితో ఉండి అన్నీ చూపించాడు .వాళ్ళు ఆయనను అక్కడి ‘’జమేదార్ ‘’అనుకొన్నారు .చివరికి వారిద్దర్నీ అధ్యక్ష పీఠం మీద కూర్చోపెట్టగా ,శ్రమపడి అన్నీ చూపించాడని ఉదారబుద్ధితో ఏదో ‘’బక్షీష్ ‘’ఇవ్వబోగా తిరస్కరించాడు .ఇంకా చూడాల్సినవి ఉంటె ,నౌకర్ కు చెప్పి చూపించి ,తర్వాత తన చేంబర్ లోకి ఆదంపతులను తీసుకు రమ్మన్నాడు .ఆగదిలోకి రాగానే వాళ్ళ ఆశ్చర్యం పట్టపగ్గాలు లేకుండా పోయింది .అవాక్కై పోయారు .తమ ప్రవర్తనకు సిగ్గుపడ్డారు .తాము జమేదారు అని పొరబడిన వ్యక్తీ ‘’భారత ప్రభుత్వ నిర్వహణ అనే గురుతర బాధ్యతను నిర్వహిస్తున్న అసెంబ్లీ అధ్యక్షుడా ?’’అని విస్తుపోయారు .సిగ్గుతో క్షమాపణ కోరారు .

    శాసన సభా బహిష్కరణ

లాహోర్ కాంగ్రెస్ శాసనసభా బహిష్కరణ తీర్మానం ఆమోదించింది .21-1-1930న అధ్యక్షుడు పటేల్ అసెంబ్లీలో తీర్మానాన్ని పురస్కరించుకొని ‘’కాంగ్రెస్ చేసిన తీర్మానాన్ని బట్టి నా అభిప్రాయాలు మీకు తెలియ జేస్తున్నాను ‘’ఇంగ్లాండ్ కామన్స్ సభలో  స్పీకర్ ప్రవర్తన గురించి కొన్ని నియమాలున్నాయి .అతడు పార్టీ  లకుఅతీతుడుగా ఉండాలి .చక్రవర్తికిలాగానే స్పీకర్ కు రాజకీయాలు ఉండరాదు .ఒకపార్టీ  సభ్యుడి గా  గెలిచిఆపార్టీ ప్రతిపాదించగా స్పీకర్ గా ఎన్నుకోబడినా ,అన్నిపార్టీలవారూ అతనిని సభాధ్యక్ష స్థానం వద్దకు అత్యంత గౌరవంగా తీసుకు వెడతారు ,అప్పుడే అతనికితనపార్టీ  తో బంధం తెగిపోయినట్లే. అందరి వాడు అయ్యాడన్న మాట  .1923లో కాంగ్రెస్ లో అంతర్భాగమైన స్వరాజ్య పార్టీ టికెట్ పై నేను గెలిచాను  .1924లో అధ్యక్ష స్థానం లభించింది .ప్రమాణ స్వీకారం రోజే నేను అన్నిపార్టీల మనిషిని అని చెప్పుకొన్నాను .1926మార్చిలో స్వరాజ్యపార్టీవారు  నిరసన సూచకంగా బయటికి వెళ్ళారు .నేనుకూడా  వెళ్ళిపోతానేమో అని అనుకొన్నారు కొందరు .కామన్స్ స్పీకర్ లాగా ఇక్కడా అధ్యక్షుడు  తటస్థంగా ఉండాల్సిందే  .ఆనియమాన్నే అప్పుడు పాటించాను .1926చివరలో జరిగిన ఎన్నికలలోనేను స్వత౦త్ర అభ్యర్ధిగా పోటీ చేసి ఏకగ్రీవం గా  గెలిచి ,కాంగ్రెస్ ప్రదిపాది౦చ గా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాను .నా నిర్ణయాలు తీర్పులు అన్నీ నిష్పక్షపాతాలు సభ గౌరవాన్ని పెంచినవే .

   ‘’ఇప్పడు ఈ లాహోరు తీర్మానం పై నేను ఏమి చేస్తానో అని  అందరూ ఎదురు చూస్తున్నారు . ఏ పార్టీ కి  చెందని వాడినికనుక లాహోర్ తీర్మానం బట్టి నేను రాజీ నామా  చేయను .ఈ నాలుగేళ్ళు నేను చేసిన కృషి నిష్ప్రయోజనమౌతుంది .కాంగ్రెస్ వారి బదులు మరెవరో రావచ్చు. వారి విశ్వాసాన్ని కూడా పొందగలను అనే నమ్మకం నాకు ఉంది .నేను వ్యవహరించటానికి వీలులేని పరిస్థితేవస్తే మీరు నన్ను ఈ పీఠం పై చూడరు .కానీ భారత దేశ పరిస్థితులు వేరు . దేశ క్షేమం కోసం ఎప్పుడైనా అధ్యక్షుడు పదవికి రాజీనామా చేసే పరిస్థితి కలగవచ్చు

‘’సైమన్ కమీషన్ బహిష్కరణలో రాజీనామాచేద్దామా వద్దా అనే సందేహం వున్నా ఈపదవిలోనుంచే దేశ సేవ ఎక్కువగా చేయగలనని భావించి ఉండిపోయాను. ఇప్పుడుకూడా ఈ పదవి వదలరదనే అనుకొంటున్నాను .దేశ స్వాతంత్ర్యం కోసం నా  అభిప్రాయాలను ప్రభుత్వానికి  చెబుతూనే ఉన్నాను .కాంగ్రెస్ బలం అపారం ఎప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం  ఏర్పడుతుంది అనె విశ్వాసం నాది .కనుక ప్రస్తుత పరిస్థితులలో అసెంబ్లీ అధ్యక్ష పదవికి రాజీనామా ఇవ్వటం లేదని మరో సారి తెలియజేస్తున్నాను ‘’అని తనమనోభావాలను విస్పష్టంగా ప్రకటించాడు విఠల్ భాయ్ పటేల్ .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-11-21-ఉయ్యూరు  

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

నిరర్ధక పదప్రయోగ హాస్యం

నిరర్ధక పదప్రయోగ హాస్యం

ఒకసారి మునిమాణిక్యంగారిని మిత్రులు ఒకపద్యం రాసి చదవమన్నారు ఆయనకు అందులో ప్రవేశమే లేదు .బలవంతంగా ఒత్తిడి చేశారుకనుక రాదు అంటే పరువు పోతుందని ఆశువుగా ‘’ఆశ్రిత పక్ష విచక్షణ కృతక్షణ రక్షితా  దుర్నిరీక్ష భాక్ష్యాంతర దక్షణా క్షోణీభరా –కమలాక్షా తక్షణ యక్షీకృత పక్షీంద్ర లక్ష్యా –వైరిస్తుత కీర్తీ  సాంద్ర వసుక్ష్మాపాల చంద్రా ‘’అని చదివేసరికి మిత్రులు విరగబడి పగలబడి నవ్వేశారు .

  బందరులో మాధవపెద్ది బుచ్చి సుందరరామ శాస్త్రి గొప్పకవి హాస్యగాడుకూడా తండ్రిగారూ కవే ,హాస్య గాడే.,గీతాలు దరువులూ రాసేవాడు. ఒకరోజు శాస్త్రి గారింటికి డోలు వాయించే ఇద్దరు వచ్చి,తమలో ఎవరు గోప్పవారో తేల్చి చెప్పమన్నారు .ఈయనకు అందులో ప్రవేశమే లేదు .చెప్పలేను అంటే పరువు తక్కువ పండిత పుత్రః అంటారేమోనని భయం .సరే ఒకరితర్వాత ఒకర్ని వాయిచమంటే వాయించారు అభిప్రాయం అడగగా  అందులో ఒకాయన బాగా నేర్పరి అనగా రెండో వాడు ఎందుకు అని అడిగితె ‘’అతడు గాత్ర సంవాహనా నైరాశ్య సంకోచ ‘’పద్ధతిలో వాయించాడు .అదేదొ మంచి పధ్ధతి కామోసు అనుకొన్నాడు వాడు. రెండవవాడి విషయం అడిగితె అతడు’’భయ హర్షా మయాదిభిః’’పద్ధతిలో వాయించాడు .నిజమా  అబద్ధమా అన్నాడు.వాళ్ళకేం  తెల్సు ?కాని అలాఅనలేక  నిజం నిజం అన్నారు .అయినా అనుమానం తీరక ‘’ధిభిః ‘’అన్నారు దానర్ధం ఏమిటి స్వామీ అని అడిగితె పెద్దగా నవ్వి –‘’ దిభిః అక్షరాద్వయ ప్రళయస్య దుఖాభ్యాం చేస్టా జ్ఞాన నిరాకకృతీ’’అని నిర్వచనం చెప్పారు .వాళ్లకు అర్ధం కాకపోయినా ‘’పంతులుగోరు మాబాగా సేప్పేరు నిర్ణయం ‘’అని పొంగిపోతూ వెళ్ళిపోయారు .ఇందులో శాస్త్రి గారు పలికినవన్నీ అర్ధం పర్ధం లేని మాటలే.

  ఒక సారి రైలులో ప్రయాణిస్తున్న ముని మాణిక్యం గారికి ఒకాయన కనబడి సెండాఫ్ ఇస్తున్న తనకొడుకును ‘’స్కేనాజర్ ‘’పదం అర్ధం తెలియనందుకు నానా తిట్లూ తిట్టాడు  .మాస్టారినీ అడిగితె ఆయనకూ తెలీకపోగా తెలీదు అంటే మర్యాదగా ఉండదని గాంభీర్యంగా ‘’స్కేనాజర్ అర్ధం తెలీని వాడిని దద్దమ్మ వెధవ వెధవన్నర వెధవ  అంటారు’’ అన్నారు  .దిగే స్టేషన్ వచ్చి మాస్టారు దిగిపోతుంటే ఆపెద్దాయన ‘’మాస్టారూ నేను మీశిష్యుడిని .స్కేనాజర్ ను ఎప్పుడైనా చూశారా అని అడిగితె లేదంటే అప్పుడు వాడు తానూ ఆయన దగ్గర ఎప్పుడు చదువు కోన్నదీ చెప్పి సర దాగా  స్కేనాజర్ తో ఆటలాడాను అన్నాడు .ఇంతకీ దాని అర్ధం ఏమిటని మాస్టారు అడిగితె ‘’నాకూ తెలీదు సార ఊరకే వాడాను ‘’అన్నాడట మునిమానిక్యమువాచ .

అలాగే ఒక ప్లీడర్ ఒక దోషిని శిక్షించమని జడ్జి గారితో జోక్యూజ్  అండీ జోక్యూజ్ అందరూ కోరేది జోక్యూజే ‘’అన్నాడు .జడ్జీకి ఏమి తీర్పు చెప్పాలో తెలీక జుట్టు పీక్కుంటూ ‘’జోక్యూజ్ ‘’జోక్యూజ్ ‘’అంటూ లేచిపోయాడు .కోర్టు హాలులో జనం కూడా ‘’కేసు జోక్యూజు అయిపోయిది అనుకొంటూ వెళ్ళారు .ఈకథరాసినాయన ‘’To my mind and eye Jokyuse is one of the funniest words yet invented .It belongs to no known tongue ‘’అని చెప్పాడని మునిమాణిక్యంగారు చెప్పారు. శక్తిలేని పదం వాళ్ళ కూడా హాస్యం సృష్టించవచ్చు అని దీని వలన తేలింది .

  సంస్కృతం తెలుగు కలగా పులగం చేసి మాట్లాడితే హాస్యం   వస్తుంది ‘’దినం దినం అస్మత్ భార్యే కలహయతి .నేను రోజూ శిరో వేదనేషు బాధ్యతే ‘’,అలాగే ‘’అన్నం కళకళాయతే ,చిటపటాయతే’’మిమ్మల్ని పునరపి సాయంకాలే స్కూల్ వేషు ఆవరణే చూస్తా.’’తస్మిన్ సమయే బాలాఃఫుట్బాల్ క్రీడయతి ‘’

  అలాగే ‘’ఎండా మండిత ప్రదేశం ‘’,తిట్టు ను తిట్టితః అంటే నవ్వుతాం .జిగిమిష అంటే పోవాలనే కోరిక దీన్ని బట్టి ‘’తినమిష ‘’,అనాలనుకోనేదాన్ని ‘’అనమిష ‘’అంటే నవ్వుతారు .అలాగే ఒకశ్లోకం –‘’క్షుధా తురాణా౦ న  ఉడికి ర్నఉడకః –అర్ధా తురాణా౦ న చెల్లి ర్నచెల్లః నిద్రాతురాణా౦  న మెట్టర్నపల్లః –కామాతురాణా౦ న ముసలిర్నపిల్లః ‘’

మునిమాణిక్యం మాస్టారికి కృతజ్ఞతలతో

 మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -31-10-21-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | 1 Comment

భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -5

భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -5
ప్రజా క్షేమ చట్టం అసెంబ్లీలో ప్రవేశపెట్టటం పై స్పీకర్ విఠల్భాయ్ ఇచ్చిన రూలింగ్ లో జోక్యం చేసుకోవటానికి వైస్రాయ్ వచ్చి ‘’దీనిపై తీర్పుచేప్పే హక్కు స్పీకర్ కు మాత్రమేకాదు నాకూ ఉన్నది .స్పీకర్ చర్యవలన విప్లవాలు ఎక్కువౌతాయి .ప్రభుత్వం కొన్ని ప్రత్యేకాదికారాలు పొ౦దాలనుఒన్నదానికిది విరుద్ధం .యాక్ట్ లోని 72 సెక్షన్ ప్రకారం ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం వైస్రాయి కి ఉంది ఆపనిచేస్తాను ‘’అన్నాడు .దీనితో అసెంబ్లీ సమావేశం ముగిసింది .1929సెప్టెంబర్ లో మళ్ళీ సమావేశమయ్యే నాటికి పటేల్ –ఇర్విన్ లమధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి .వాటిని అధ్యక్షుడు తెలియ జేస్తాడేమోనని సభ్యులు ఎదురు చూస్తున్నారు .వైస్రాయి జోక్యాన్ని ఆయన నిరసించాడు .రూలింగ్ ను విమర్శించే అధికారం సభ్యులకు తప్ప ఎవరికీ లేదన్నాడు .ఇద్దరి మధ్య జరిగిన కరేస్పా౦ డేన్స్ సభలో చదివి వినిపించాడు .చివరికి అసెంబ్లీ అధ్యక్షుడికే సర్వాధికారాలు ఉన్నాయని వైస్రాయ్ ఇర్విన్ చెప్పి తెల్లజెండా ఎత్తేశాడు .అసెంబ్లీకి ఉన్న ఆత్మగౌరవాన్ని విఠల్ భాయ్ కాపాడాడు .ఆతర్వాత వైస్రాయ్ ‘’పాటలు రూలింగ్ ను విమర్శించటం ,అసెంబ్లీ గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించటం తన ఉద్దేశ్యం కాదని చివరి సారిగా జాబు రాయటం తో ప్రతిష్టంభన తొలగింది .ఇది అధ్యక్షుడు విఠల్ భాయ్ సాధించిన గొప్ప విజయం .
అసెంబ్లీ భవనాలు
మీరట్ సంఘబన వలన అసెంబ్లీ భవనాల రక్షణ విషయం పై ఆందోళన పడ్డారు .దీనికోసం పటేల్ ప్రభుత్వానికి సలహా ఇవ్వటానికి ఒక కమిటీ నియమించాలనుకొనగా అసెంబ్లీలో భిన్నాభి ప్రాయాలు రాగా,1930జనవరి30న పోలీసులు వచ్చి గాలరీలలో కూర్చున్నారు .సభలోకి ప్రవేశించగానే వాళ్ళను చూసిన పటేల్ తక్షణమే సభనుంచి బయటకు వెళ్లి పొమ్మన్నాడు .ముందు కాసేపు తటపటాయించినా ఖాళీ చేసి వెళ్ళిపోగా ,గాలరీలకు తాళాలు వేయించాడు .సర్ జేమ్స్ కేదార్ ఏదో మాట్లాడాలని ప్రయత్నం చేస్తేరూలింగ్ కు దిక్కారమౌతుందని అవకాశం ఇవ్వలేదు పటేల్ .తర్వాత అధ్యక్షుడు పటేల్ –‘’అసెంబ్లీలోకి ప్రేక్షకులనుకాని ఇతరులను కానీ ప్రవేశ పెట్టటం లో ప్రభుత్వానికి అసెంబ్లీ అధ్యక్షుడికి భేదాభిప్రాయాలు వచ్చాయి .అసెంబ్లీని అధ్యక్షుని రక్షించేబాధ్యత తమకు ఉందని ఇండియా ప్రభుత్వం తరఫున ఢిల్లీ పోలీస్ కమీషనర్ అభి ప్రాయ పడ్డాడు .అవసరమైన పోలీసు సిబ్బందిని అక్కడక్కాడా పెట్టి కాపాడాలని ఆయన ఉద్దేశ్యం . అసెంబ్లీ ఆవరణలో సర్వాధికారాలు అధ్యక్షుడివే.అసెంబ్లీ రక్షణ లో ఆయన నిర్ణయమే ఫైనల్ .నిన్న రాత్రి 9తర్వాత పోలీస్ కమిషనర్ నుంచి నాకు ఒక ఉత్తరం వచ్చింది.అందులో ఆయన జారీ చేసిన ఉత్తర్వు జత చేశాడు .దాన్ని రహస్యంగా ఉంచమనికోరాడు కనుక దాన్ని బహిర్గతం చేయను .అప్పుడే హోం మెంబర్ నుంచీ ఒక జాబు వచ్చింది .అసెంబ్లీ ప్రేక్షకులను తనిఖీ చేయటం ,గాలరీలలో పోలీసులను ఉంచటానికి వైస్రాయ్ అనుమతి ఉన్నట్లు పేర్కొన్నాడు .ఢిల్లీ కమీషనర్ వాటిని అమలు చేసి అసెంబ్లీ రక్షణ చేస్తాడని హోం మెంబర్ రాశాడు .కానీ అసెంబ్లీ రక్షణకోసం మనం ఒకకమిటీని వేశాము .అది రిపోర్ట్ ఇచ్చేదాకా అధ్యక్షుడే సర్వాధికారి అనవసరంగా ఢిల్లీ కమీషనర్ జోక్యం కలిగించుకొన్నాడు .ఇంగ్లాండ్ కామన్స్ సభలో ఒకే ఒక్క పోలీసు’’ బే దుస్తుల్లో’’ ఉండవచ్చునని అధ్యక్షుడి ఆజ్ఞ.ఇక్కడ నలుగురు పోలీసులకు పోలీసు దుస్తులతో ప్రవేశం కల్పించటం విడ్డూరం .అసెంబ్లీ అధ్యక్షుని అధికారం కించపరచటమే కమీషనర్ ఉద్దేశ్యంగా ఉంది .విలేకరుల గాలరీ తప్ప అన్ని గాలరీలు మూసేయ్యాల్సిందే ‘’అని చెప్పాడు .ఈ ప్రతిష్టంభన నెల రోజులు సాగింది చివరికి వైస్రాయ్ జోక్యం చేసుకొని పటేల్ దృక్పధాన్ని సమర్ధించి ఒక సముచిత విధానం చెప్పాడు .అధ్యక్షుని సంప్రది౦చి మాత్రమే పోలీస్ కమీషనర్ అసెంబ్లీ రక్షణ విషయం లో నిర్ణయాలు తీసుకోవాలని హితవు చెప్పాడు .
రిజర్వ్ బాంక్ బిల్
మొదట్లో ఒక రిజర్వ్ బాంక్ బిల్ ను ఒక ఆర్ధిక సభ్యుడు సభలో ప్రవేశ పెట్టాడు .దీన్ని 30మంది సభ్యులున్న జాయంట్ సెలెక్ట్ కమిటీ పరిశీలనకు పంపారు .రిజర్వ్ బాంక్ స్టేట్ బాంక్ గా ఉండాలా ,స్టాక్ హోల్డర్ల బాంక్ గా ఉండాలా ,డైరెక్టర్లు ఎవరు ఉండాలి అనే విషయాలపై సభలో అధికార అనధికార సభ్యులమధ్య వాదోపవాదాలు జరిగి అనధికార సభ్యులదే పై చేయి అయింది . ఆర్ధిక సభ్యుడు వీరిమాటే వినాల్సి వచ్చింది .ఎవరెవరు డైరెక్టర్లుగా ఉండాలనీ చర్చ జరిగిసభ ముగిసింది .మూడో రోజు సమావేశం జరిగి ,చర్చకు మరింత సమయంకావాలని ఆర్ధిక సభ్యుడుకోరగా అంగీకరించారు .మళ్ళీ అసెంబ్లీ సమావేశమైనప్పుడు ప్రభుత్వానికి ఈ బిల్లును చర్చించట ఇష్టం లేదని ప్రకటించాడు .అనధికార సభ్యులకు బాధకలిగి స్వరాజ్యపార్టీ వారు వాకౌట్ చేశారు .ఆర్ధిక సభ్యుని నిరసిస్తూ తీర్మానం పెట్టగా నెగ్గింది .మళ్ళీ కొన్నాళ్ళకు అతడే మరో రిజర్వ్ బాంక్ బిల్లు ప్రవేశ పెట్టె ప్రయత్నం చేస్తే ,మొదటిబిల్లును ఉపసంహరించుకొనేదాకా రెండవదానిపై చర్చ జరగరాదని పటేల్ రూలింగ్ ఇచ్చాడు .ఉపసంహరణ ప్రభుత్వం ఇజ్జత్ నుదెబ్బతీస్తుందని భావించి ‘’మూసివాయన ముత్తైదువ’’లాగ గమ్మున మూసుకుని కూర్చుంది .
ప్రత్యెక అసెంబ్లీ డిపార్ట్ మెంట్
ప్రత్యెక అసెంబ్లీ డిపార్ట్ మెంట్ నెలకొల్పాలనే విషయంపై 5-9-1929న శాసన సభాధ్యక్షుడు విఠల్ భాయ్ ‘’సభకు ఎన్నుకోబడిన నేను అధ్యక్షుడుగా ఉన్నాను .
ఈ శాసన సభకు బాద్యుడిని .సభ్యులకోరికలను అధ్యక్షుడు తోసిపుచ్చకూడదు .అతడి రూలింగ్ నాయబద్ధంగా ఉండాలి .అన్ని పార్టీలయందు నిష్పక్షపాతంగా ఉండాలి .అసెంబ్లీ రూల్స్ కు న్యాయబద్ధంగా వ్యాఖ్యానించాలి ,నిర్వహించాలి .ఇవి సభ్యులు నిర్ణయించినవి కావు .వీటిని సంస్కరించే అధికారం సభ్యులకు లేదు .అవసరమైతే ఇండియా కార్యదర్శి అనుమతితో వైస్రాయ్ సంస్కరిస్తాడు .అలా సంస్కరించే సందర్భాలలో సభ్యుల్నికాని అధ్యక్షుడినికాని సంప్రదించే ఆచారం లేదు .అధ్యక్షుడు కేవలం అసెంబ్లీ కార్యదర్శి సలహాపైనే ఆధారపడాలి .సభ్యులు కూడా తమ విధి నిర్వహణకు కార్యదర్శిమీదే ఆధారాపడతారు .తప్పు జరిగితే అధ్యక్షుడి పైకి నెట్టేస్తారు .కనుక అసెంబ్లీ నిర్దుష్టంగా,తృప్తిగా జరగాలంటే కార్యదర్శి అతని సహాయకులు అసెంబ్లీకి అధ్యక్షుడికి బాధ్యత వహించే వారుగా ఉండాలి .ఇంకో అధికారానికి బానిసలుగా ఉండరాదు .వీరివలన అధ్యక్షుడికి తగిన సలహాలు లభించాలి. అసెంబ్లీ సేవమాత్రమే ప్రధాన బాధ్యతగా ఉండాలి .
కానీ వీరంతా వైస్రాయి సేవకులైపోయారు ,ఆయనకు బాధ్యత వహిస్తారు తప్ప అసెంబ్లీకి కాదు .సభలో భేదాభిప్రాయం వస్తే కార్యదర్శి ప్రభుత్వం కొమ్ము కాస్తున్నాడు ,ప్రభుత్వ సభ్యులతోకలిసి వోటు వేసి వారిలో ఒకడైపోతున్నాడు .ఒకరకంగా ప్రభుత్వం నిర్ణయించిన సభ్యుడే అవుతున్నాడు ప్రవర్తనలో .సభ్యులకు అధ్యక్షుడికి కార్యదర్శిపై అధికారం లేకుండా పోయింది .కనుక అతడి సూచనలు నిష్పక్షపాతంగా ఉండవు .కనుక అసెంబ్లీ ఉద్యోగ శాఖలో తీవ్ర సంస్కరణలు రావాలి .ఇటీవలే నా కోరికపై వైస్రాయి కార్యదర్శిని అసెంబ్లీ సభ్యుడిగా నియమించటానికి స్వస్తి చెప్పాడు .అసెంబ్లీ ఉద్యోగులు అధ్యక్షుడిని సంప్రదించి పని చేయటానికి సంకోచిస్తున్నారు .ప్రభుత్వం అంటే భయమే దీనికి కారణం .అసెంబ్లీ రూల్స్ ను సంస్కరించే అధికారం అధ్యక్షుడికి ఉంటె ,ఆయన సభ్యులకు సహాయకారిగా మార్గ దర్శిగా ఉంటాడు .ప్రస్తుత పరిస్థితులలో అది అసాధ్యం .కనీసం అసెంబ్లీ కార్యదర్శి ప్రభుత్వ ఉద్యోగిగా కాకుండా ,ఒక స్వతంత్ర వ్యక్తిగా ఉంటె కొంత నయం .ఈవిషయాలన్నీ నేను 1925ఆగస్ట్ లో అధ్యక్ష పీఠం పై కూర్చున్నప్పుడే తెలుసుకొన్నాను .జనవరిలో సభాధ్యక్షుల సమావేశం జరిగింది .శాసన సభకు అధికార వర్గం తో సంబంధం లేని ఒక ప్రత్యెక ఆఫీసు ఉండాలని తీర్మానించాం .దాన్ని ఇండియా ప్రభుత్వానికి వెంటనే పంపాను .సెప్టెంబర్ లో ఇలాంటి దాన్ని గురించి ఒక విధానాన్ని ప్రభుత్వానికి సూచన గా పంపాను కూడా .
ఆవిధానం – అసెంబ్లీ ఆఫీసు గవర్నమెంట్ తో సంబంధంలేని ప్రత్యేకశాఖ గా ఉండాలి.ఉద్యోగులు అసెంబ్లీ కే బాధ్యత వహించాలి .ఈ డిపార్ట్మెంట్ ఖర్చు ప్రభుత్వమే భరించాలి .కానీ ఇలాంటి ప్రత్యేకశాఖను ప్రభుత్వం ఒప్పుకోలేదు .కార్యదర్శిపై అతని అనుచరులపై అధ్యక్షుడికి అధికారం ఉండకూడదు అంటోంది . దండనాదికారం , సస్పెన్షన్ ,బర్త్ రఫ్ అధికారాలు అసెంబ్లీకి లేకపోతె ప్రత్యెక డిపార్ట్మెంట్ అనవసరమే కదా .నేను కొన్ని మార్పులు సూచించాను –ప్రత్యెక డిపార్ట్ మెంట్ పెట్టె అధికారం ప్రభుత్వానికి లేకపోతె ,దీన్ని వైస్రాయ్ పోర్ట్ ఫోలియోలలో ఒకటిగా చేయాలి .అసెంబ్లీ అధ్యక్షుడి సలహాతో ఉద్యోగుల్ని వైస్రాయి నియమించవచ్చు ,ఉద్యోగుల్ని దండిన్చాల్సి వస్తే అసెంబ్లీ ముందుగా వైస్రాయికి తెలియజేస్తుంది .సభ్యులను కార్యదర్శి సలహామేరకు అధ్యక్షుడు నియమిస్తాడు .వీరిని దండిన్చాల్సి వస్తేఅధ్యక్షుడు కార్యదర్శిని సంప్రదిస్తాడు .ఈ డిపార్ట్మెంట్ బడ్జెట్ ను అధ్యక్ష కార్యదర్శులు కలిసిరూపొందిస్తారు .ఇదికూడా అసెంబ్లీ బడ్జెట్ లో ఒక భాగంగానే ఉంటుంది .మార్పులు చేసే అధికారం అసెంబ్లీ సభ్యులకు ఉంటుంది .ఈ నా సూచనలను వచ్చే అసెంబ్లీ సమావేశం లో చర్చిద్దాము ‘’అని దీర్ఘోపన్యాసం చేశాడు,అన్నికోనాలలోనుంచీ ఆలోచించి నిర్దుష్టంగా చెప్పాడు విఠల్భాయ్ పటేల్ .
సశేషం
మీ-గబ్బిటదుర్గాప్రసాద్ -31-10-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

  హాస్యం ఎలాపుట్టి౦చచ్చు


  హాస్యం ఎలాపుట్టి౦చచ్చు

 స్పూనరిజం  

ఒకడు ఒక అధికారిని కలవాలని వెళ్లి గేటు మూసిఉంటే తీస్తుంటే ఆయనబయటికి వస్తే కంగారుగా ‘’ఐ తీస్ ది గేట్ సర్ .ఇటీజ్ మూస్’’అన్నాడు .ఇలాంటిమాటల్ని ఇంగ్లీష్ లో ‘’స్పూనరిజం ‘’అంటారు అంటే అస్తవ్యస్త పద ప్రయోగం –దీనికి ఇంగ్లీష్ లో నిర్వచనం –‘’A twist of transposing of words or syllables is called ‘’spoonerism ‘’.it derives from from Spooner ,an absent minded British professor ,who during talk at a women’s college meant to speak of weary benches that confronted him .Instead he said ‘’I address this audience of weary wenches ‘’.

అలాగే ఆశ్వానికి బదులు ‘’గుశ్వం ‘’అనటం ,వచ్చిన గుర్రం చచ్చింది అనటానికి బదులు చచ్చిన గుర్రం వచ్చింది అనటం కూడా .కారెంపూడి సూరయ్యను సూరం పూడి కారేయ్య అనటం ,అక్కినేని రామారావు నందమూరి నాగేశ్వరరావు ,రేలంగి రమణారెడ్డి ,కస్తూరి బ్రహ్మానందం అనటం కూడా స్పూనరిజమే .ఒకసారి బందర్లో స్థానం నరసింహారావు గారి నాటక ప్రదర్శన అయిన మర్నాడు పేపరులో ‘’స్థానం వారు వరలక్ష్మిని స్వయంగా నాటకానికిఆహ్వాని౦చారు ‘’అనటానికి బదులు ‘’వరలక్ష్మి ని ‘’నాకటానికి’’’’ ఆహ్వానించారు అని పడిందని మునిమాణిక్యమే ఉవాచ .నందిగామలో అయ్యదేవర కాళేశ్వరరావు గారు వెయ్యి మంది ఉన్న సభలో ‘’ప్రసవించారు ‘’అని పత్రికలో పడితే నవ్వక చస్తారా జనం .కృష్ణాపత్రిక ముట్నూరు కృష్ణారావు గారి చేతుల్లో ఉన్నకాలం లో శతావధాని చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గారు బందరు వచ్చి ఉపన్యాసం ఇస్తే దాన్ని కవర్ చేస్తూ కృష్ణాపత్రికలో ముట్నూరు వారే వ్యాసం రాస్తే ,శీర్షిక ‘’శవావధాని చెళ్ళపిళ్ళ వారి ఉపన్యాసం ‘’అని అచ్చు అయిందట .శాస్త్రిగారితో పాటు రాసిన అప౦తులు గారూ నవ్వు ఆపుకోలేకపోయారని ముని మాణిక్యం గారే రాశారు .ఈ రకమైన స్పూన రిజానికి ‘’ముద్రారాక్షసం ‘’అని పేరు పెట్టారు భావరాజు నరసింహారావు గారు .

  మేలప్రాపిజం

ఒకమాట అనాలనుకొని దానిస్వరూపస్వభావాలు,వర్ణక్రమాలు తెలీక,సరైన మాటనే మాట్లాడుతున్నానుకొని లేక భ్రమపడి ఆపదానికి భ్రష్టరూపమో దగ్గరైనదో వాడితే మేలప్రాపిజం అంటారని ముని మాణిక్యం వారి నిర్వచనం .శుద్ధ వైదికులు ఒక్కోసారి ‘’ప్రాయశ్చిత్వం ‘’ ప్రాయశ్చిత్తం అనటానికి బదులుగాఅంటారు . .అలాగే ఒక సారి పట్టాభి సీతారామయ్య గారి చిత్ర పటాన్ని ఆవిష్కరిస్తూ ఆవిష్కర్త ‘’పటాన్ని బహిష్కరిస్తున్నాను ‘’అన్నాడని మునిమాణిక్యమే సెలవిచ్చారు .అల్లాగే ‘’జలుబు విశేషించింది అనటానికి జలుబు  వికసించింది అనటం ,రసభస్మం అనటానికి బదులు భసరస్మం’’అనటం . మునిమాణిక్యం గారి సన్మాన సభలో ఒకాయన మాట్లాడుతూ ‘’కీర్తి శేషులు మునిమాణిక్యం మాస్టారిగురించి మాట్లాడుతున్నందుకు గర్వంగా ఉంది అన్నాడని వేదికమీదే ఉన్న మునిమాణిక్యం గారు నవ్వుతూచేప్పినమాటే .

  కొన్ని పద్యాలలో వాక్యాలుదేనికది అర్ధ వంతంగానే ఉన్నా అన్నీ కలిపితే ఏ అర్ధమూ రాదు .ఉదాహరణకు –కాకికేమి తెలుసు సైకోఅనాలిసిస్ –ఆటవెలది ద్విపదకత్తగారు –అయిదు నాలుగు మూడు ఆముక్తమాల్యద –విశ్వదాభిరామ వినురవేమ ‘’దేనినో హేళన చేస్తున్నట్లు స్పురించి నవ్వు తొణికిసలాడుతుంది .అలాగే –‘’ఇస్పేటు జాకీలం –ఎగరేసిన బాకీలం –మృత్యువు సినిమాలో మూడు భాషల టాకీలం ,-భగవంతుని టోపీలం –కవిత్రయపు కాపీలం ‘’ఇందులో అర్ధమేమిటో కవికే తెలియాలి .మరో రసగులిక –గుడుగుడు గుంజాలం –రెక్కల మంచాలం –మృత్యువుఇనప్పెట్టెలో జర్మన్ సిల్వర్ కంచాలం –భగవంతుని పొరబాట్లం –పొగలు గ్రక్కే సిగరెట్లం –కట్టెఉల్లిపాయలం –కొండలమధ్యలోయలం –భగవంతుని కోతులం –పలకరాని బూతులం ‘’ 

మునిమాణిక్యం మాస్టారికి కృతజ్ఞతలతో

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -29-10-21-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు  విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -4

భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు  విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -4

     స్వరాజ్యపార్టి

1922నాటికి శాసన సభా ప్రవేశం పై కాంగ్రెస్ లో అభిప్రాయ భేదాలు తీవ్ర స్థాయికి చేరగా అధ్యక్షుడు చిత్తరంజన్ దాసు ప్రవేశాన్ని సమర్ధించాడు .కానీ కాంగ్రెస్ తోసేసింది .మనస్తాపంతోదేశాబందు రాజీనామా చేయగా కాంగ్రెస్ అంగీకరించలేదు .కాంగ్రెస్ లో ఉంటూనే దాసు ‘’కాంగ్రస్ ఖిలాఫత్ స్వరాజ్య పార్టి ‘’పెట్టగా , ,ప్రవేశాన్ని కోరేవారంతా అందులో చేరారు .ఈపార్టీతో కాంగ్రెస్ ‘’కటీఫ్’’చేసుకోలేదు .స్వరాజ్యపార్టీ వారు దేశమంతా తిరిగి ప్రచారం చేయగా ,ఢిల్లీ కాంగ్రెస్ లో ప్రవేశాన్ని అంగీకరించింది .స్వరాజ్యపార్టీకి  ఎక్కడ లేని ప్రాముఖ్యమూ లభించింది .ప్రజల సానుభూతి సహకారాలు పుష్కలంగాలభించటం చేత స్వరాజ్య పార్టీ వారు ఎక్కువ  సంఖ్యలొఎన్నికై సభలలో ప్రవేశించారు .ఈ పార్టీకి వెన్నెముక అయ్యాడు విఠల్భాయ్ .మోతీలాల్, చిత్తరంజన్ లతో కలిసి తీర్చి దిద్ది ఆరేళ్ళు ఎదురు లేకుండా ఉన్నది స్వరాజ్య పార్టి .శాసన సభలో అడుగుపెట్టిన పటేల్ ,మితవాదుల కు పెత్తనమివ్వలేదు .ఇక్కడ ఆయన సాధించిన విజయాలలో ఫైనాన్స్ బిల్లులు బడ్జెట్ బిల్లులు అనేక సార్లు తిరస్కరించారు .గతిలేక ప్రభుత్వం వీరి మాటలకు విలువ నివ్వటం ప్రారంభించింది .

 నాగపూర్ కాంగ్రెస్ వీరుడు

13-4-1923న జబల్పూర్ లో జలియన్ వాలాబాగ్ సా౦వత్సరికం  జరిపారు .కాంగ్రెస్ యువకులు మున్సిపలాఫీసులపైకి ఎక్కి జాతీయపతాకాన్ని ప్రతిష్టించారు .పోలీసులు వచ్చి లాగేసిచి౦పేసి కాళ్ళతో తొక్కేశారు .మున్సిపల్ డిప్యూటీ కమీషనర్ అయిన యూరోపియన్ చాలా నీచంగా ప్రవర్తిస్తే ,కౌన్సిలర్లు వెంటనే రాజీనామా చేశారు .జిల్లా కాంగ్రెస్ సంఘం సత్యాగ్రహం మొదలుపెట్టింది .జట్లు జట్లుగా యువకులు జాతీయ జెండాలు ఎగరేయటం పోలీసులు వచ్చి పీకేయటం వాలంటీర్లను ఖైదు చేయటం జరిగింది .ఈ తతంగం నాగపూరు కు కూడా పాకింది .రాష్ట్ర కాంగ్రెస్ అక్కడ ఒక సత్యాగ్రహ శిబిరం పెట్టి ,నిధిని పోగు చేసి ఆదుకొన్నారు .వేలాది యువకులు వాలంటీర్లుగా చేరారు .నిరసనలు ,లాటీ చార్జీలు ,జైళ్ళకు పంపటం ఎక్కువైంది .జాతీయ పతాక గౌరవం కాపాడు కోవటానికి ప్రజలు ప్రాణాలు తెగించి ముందుకు వచ్చారు .

  జమన్ లాల్ బజాజ్ నాయకత్వం లో వాలంటీర్ల దళం జాతీయ జండాలు పట్టుకొని సత్యాగ్రహం చేశారు .పోలీసులు ఊరేగింపును ఆపేశారు .144వ సెక్షన్ విధించారు .మేజిష్ట్రేట్ యూనియన్ జాక్ కు అగౌరవం కలిగినట్లు నేరంమోపి తన చర్యలను సమర్ధించుకొన్నాడు .బజాజ్ ను అరెస్ట్ చేయటం తో ఉద్యమం తీవ్రమైనది .పదేసి మంది జాతీయపతాకాలు పట్టుకొని ఊరేగారు .మేజిస్ట్రేట్ వచ్చి శ్రీముఖాలిచ్చి జైలుకు పంపేవాడు .ప్రజల కరతాళ ధ్వనులు మిన్ను ముట్టేవి.వరుసగా నాలుగు నెలలు ఇదే తంతు జరిగింది .వెయ్యి మంది వాలంటీర్లు అరెస్ట్ అయ్యారు .

   ఈసమయంలోనే నాగపూర్ లో కాంగ్రెస్ సమావేశం జరిగి జులై 18జాతీయ పతాక దినోత్సవాన్ని జరిపారు .దేశమంతా ఇల్లాగే జరగాలని కాంగ్రెస్ ఆదేశించింది .అన్నిపట్టణాలలో మహా వైభవంగా పతాక ఉత్సవాలు పెద్ద ఎత్తున జరిపారు .ప్రభుత్వాధికారులు కిమ్మనకుండా మౌనపాత్ర పోషించారు .జోక్యం కలిగించుకొని ఉంటె కురుక్షేత్రమే అవుతుందని భయపడ్డారు .ఇలా నాగపూర్ పతాకోత్సవం అఖిలభారత ఉద్యమంగా రూపు దాల్చింది .ప్రభుత్వోద్యోగులు గుంజాటనలో పడ్డారు .విఠల్ భాయ్ ,వల్లభాయ్ సోదరద్వయం చాలాసార్లు గవర్నర్ నుకలిసి ,ఒక పరిష్కారం సాధించి ప్రజా విజయానికి తోడ్పడ్డారు .

  కేంద్ర శాసన సభాధ్యక్షుడు

 అసెంబ్లీ అధ్యక్షుడుగా తన ప్రతిభా సామర్ధ్యాలు చూపిన విఠల్ భాయ్ సభాగౌరవాన్నీ ఠీవీ ని పెంచాడు .ఆ రాజసం ఆయనకే చెల్లింది .శాసనసభకు అధికారాలు పెంచాడు .నిష్పక్షపాతంగా విధి నిర్వహణ చేశాడు .ఓర్పు సహనం ధైర్యసాహసాలు నిష్పక్షపాతం ఆయన సహజ లక్షణాలు .ప్రజా హితైషి .మానవీయ విలువలకు గౌరవమిచ్చేవాడు .నిశిత దృష్టి ఉన్న ద్రష్ట .మహావక్త .మాటలతో వ్యూహం తో తనమాట నెగ్గించుకోగలిగిన సత్తా ఉన్నవాడు .ఆ తెలివి తేటలు చాకచక్యం ప్రజ్ఞా నిరుపమానాలు .

  ఫ్రెడరిక్ రైట్ సభాధ్యక్షుడుగా ఉండి రిటైర్ కాగానే ,విఠల్భాయ్ పేరు  ఆపదవికి సూచించగా ,టి రంగాచారిని  పోటీకి పెట్టింది అధికార పక్షం .అనధికారులు తక్కువ సంఖ్యలో ఉన్నా ,58వోట్లు సాధించి 2వోట్ల మేజారిటి తో  ఆచారిపై పటేల్ గెలిచాడు .24-8-1925 న ‘’ఖద్దరు దుస్తులతో గాంధీ టోపీతో కింద భాగం లో కూర్చున్న విఠల్ భాయ్ పటేల్ ను  ఫ్రెడరిక్ రైట్  ఆహ్వానించి ,పటేల్ విజయాన్ని సభ్యులకు  తెలియజేసి, సభాధ్యక్ష స్థానం అల౦కరించమని కోరాడు .అంగీకరించి పటేల్ కృజ్ఞాత చెప్పాడు .ప్రజా ప్రతినిధులనుంచి అధ్యక్షుడిని ఎన్ను కోవటం ఇదే ప్రధమం అయి రికార్డ్ కెక్కింది .ఇది చారిత్రాత్మక సంఘటన అని ప్రభుత్వ ప్రభుత్వేతర సభ్యులంతా పెద్దపెట్టున హర్షధ్వానాలు చేశారు .ఫ్రెడరిక్ ఖాళీ చేసిన పీఠాన్ని పటేల్ దేశీయ దుస్తులతో అధిష్టించి జాతి గౌరవాన్ని పెంచాడు . విదేశీ  నూలుతో చేసిన విగ్గుపెట్టుకోటానికి అంగీకరించక ,సరోజినీ నాయుడు స్వయంగా వడికి ఇచ్చిన నూలుతో విగ్గు, గౌను తయారు చేయించుకొని స్పీకర్ పదివిలో హుందాగా కూర్చున్న అసలు సిసలు దేశభక్తుడు విఠల్ భాయ్ పటేల్ . సభ్యులు ఆనంద తాండవమే చేశారుఅప్పుడు .అధ్యక్షోపన్యాసం ఇస్తూ –‘’ఈ పదవితోమాతృదేశ సేవ మరింత ఎక్కువగా చేయటానికే తప్ప పదవీ వ్యామోహం తో నేను రాలేదు .స్వరాజ్యవాదులు నిర్మాణ ఆచరణునలు అని తెలుసుకోండి .పరిపాలన విధానం లో వైస్రాయ్ మన సాయం కోర్తున్నాడు .అలాంటి సహకారం అందిద్దాం .ప్రభుత్వాధికారులకు నా సహయం తప్పక ఉంటుంది ‘’అన్నాడు .సహాయ నిరాకరణను తన భుజస్కంధాలపై నిర్వహించిన విఠల్భాయ్ పటేల్ ఇప్పుడు రాజ్య తంత్రజ్ఞు ,ప్రభుత్వ చక్రాన్ని త్రిప్పే వారిలో ఒకరు అవటం జాతి గర్వించదగిన విషయం.అప్పుడు మోతీలాల్ ప్రతిపక్షమైన ప్రభుత్వ పక్ష నాయకుడు .’’నేను ఇప్పుడు ఏ పార్టీకీ చందిన వాడినికాను .అందరి వాడిని. నా పేరు స్వరాజ్య పార్టీ లో కొట్టేయండి ‘’అని సభా పూర్వకంగా మోతీలాల్ కు చెప్పి ఉత్తమ సంప్రదాయానికి నాంది పలికిన మహానాయకుడు విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ .

  8-3-1926న అసెంబ్లీ లో  ఒక విచిత్ర సంఘటన జరిగింది .అంతకు ముందు రెండు రోజులక్రితమే అఖిలభారత కాంగ్రెస్ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ సభ్యు లందర్నీ సభ నుండి బయటికి రమ్మని తీర్మానించింది .మోతీలాల్ ‘’ప్రభుత్వం తో సహకరించి పరిపాలనలో సహకరించటానికి నిశ్చ యించి నస్వరాజ్యపార్టి రెండున్నర ఏళ్ళు గా అసెంబ్లీలో తగిన సంస్కరణలు ప్రవేశపెట్టటానికి ప్రయత్నించింది .మేము చేయగలిగిందేమీ లేకపోగా అవమానాలు పొందాము ‘’అని ప్రకటించి తన సభ్యుఅలతో బయటికి వెళ్ళిపోయాడు .చేసేది ఏమీలేక స్పీకర్ పటేల్ ‘’సభలో మెజారిటి ఉన్న స్వరాజ్యపార్టీ సభ్యులు సభనుంచి బయటికి వెళ్ళటం విచారకరం .ఆపార్టీ  లేకపోతె అసెంబ్లీలో ప్రజావాణి వినిపించటం కష్టం .మళ్ళీ వాళ్ళు వచ్చేదాకా ప్రభుత్వ విమర్శనాత్మక చట్టాలు అసెంబ్లీలో చర్చకు రాకుండుగాక .పరిపాలన ఆగకుండా నడిపించటమే ఇప్పుడు అసెంబ్లీ చేసేపని ‘’అని చెప్పి సభను మర్నాడు ఉదయానికి వాయిదా వేశాడు పటేల్ .స్వరాజ్య వాదులు లేరుకదా అని ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు బిల్లులు ప్రవేశ పెట్టరాదని పటేల్ ఆశయం .ఇవాళ కేంద్రం లోనూ రాష్ట్ర శాసన సభల్లోనూ విఠల్ భాయ్ ఆదర్శాన్ని పాటించే వారే లేకపోవటం విచారకరం, జాతి దురదృష్టం .

  1926నవంబర్ ఎన్నికలలో విఠల్ భాయ్ పోటీలేకుండా శాసనసభాకే కాక స్పీకర్ కు కూడా ఎన్నికయ్యాడు అదీప్రజాభిమానం .అధికార సభ్యులు యూరోపియన్లు పటేల్ ను విపరీతంగా శ్లాఘించారు .ఇంకోడు అయితే ములగ చెట్టు ఎక్కేవాడు కాని మనోనిబ్బరం ఉన్న పటెలువీటికి అతీతుడు –‘’ఇంతవరకు బ్రిటిష్ ప్రభుత్వం దేశీయులకు పాలనా బాధ్యత ఇవ్వలేదు .ఇస్తే వాళ్ళ శక్తి సామర్ధ్యాలేమితో తెలిసేవి .భారతీయులు బాధ్యతగల పౌరులు .అసంతృప్తి పాలన నిరశిస్తున్నారు .వెంటనే స్వపరిపాలన వారికి అప్పగించాలి ‘’అని చాటాడు పటేల్ .ప్రభుత్వానికి సహకరించటం అంటే డూడూ బసవన్నలాగా తలూపటం కాదు .ప్రభుత్వ విధానాలను ప్రజాభిప్రాయంగా మార్చటం అన్నది పటేల్ ఆదర్శం .

   1927లో విఠల్ భాయ్ ఇంగ్లాండ్ వెళ్ళాడు .కామన్స్ సభా సమావేశానికి హాజరై ,అక్కడి పార్లమెంట్ స్పీకర్ తో చాలా సార్లు సమావేశమై పార్లమెంటరి విధానాన్ని క్షుణ్ణంగా  అవగాహన చేసుకొన్నాడు .ఐర్లాండ్ పార్ల మెంటు నూ  చూశాడు జార్జిరాజునూ  కలిశాడు.

     ప్రజాక్షేమ చట్టం

అసెంబ్లీలో విఠల్ భాయ్ ఆధ్వర్యంలోచిత్ర విచిత్ర చర్చలు జరిగాయి .కమ్యూనిస్ట్ ల కార్యకలాపాలను నియంత్రించటానికి ప్రభుత్వం’’పబ్లిక్ సేఫ్టి బిల్ –ప్రజాక్షేమ  చట్టం తెచ్చింది .ఇది ప్రాధమిక హక్కులకు భంగం అని జాతీయవాదులు వ్యతిరేకించారు .ఇతర దేశపు ఆచారం ఇక్కడ ప్రవేశించ కూడదు  అని ప్రభుత్వం మళ్ళీ1929మార్చిలో చర్చకు పెట్టింది .సెలెక్ట్ కమిటీ పర్యవేక్షణకు దాన్ని పంపారు .ఏప్రిల్ లో మూడవసారి ప్రవేశపెట్టగా స్పీకర్ పటేల్ –‘’చర్చించ బోయే ముందు నామాటలు వినండి. అసెంబ్లీ లీడర్ మాట్లాడింది విన్నాను .మీరట్ కేసులో 31మందిపై చక్రవర్తి మోపిన నేరమూ తెలుసు .ఈ బిల్లుకు ఆ కేసుకు ఉన్నది ఒకటే ప్రాతిపదిక .లా కోర్టు లో తీర్పు పొందే విషయాలు అసెంబ్లీలో చర్చి౦చరాదు అని అందరికి తెలుసు .ఈబిల్లును మనం ఆమోదించినా తిరస్కరించినా మీరట్ కోర్టు తీర్పే ఫైనల్ .కనుక ఆతీర్పును ప్రభావితం చేస్తుంది .కనుక చర్చించటానికి అనుమతి ఎలా ఇవ్వగలను ?మీరట్ కేసు పూర్తయ్యేదాకా ప్రభుత్వం ఈ బిల్లును చర్చించ రాదనీ ప్రభుత్వానికి సలహా ఇస్తున్నాను .లేకపోతె మీరట్ కేసు పూర్తిగా ఉప సంహరించు కొని , అప్పుడు చర్చకు పెట్టవచ్చు ‘’అని ఖరా ఖండీ గా చెప్పి ప్రభుత్వం నోట్లో పచ్చి వెలక్కాయ పెట్టినట్లు చేశాడు .తర్వాత రెండు రోజులు హోం లా మెంబర్లు దీర్ఘోపన్యాసాలు చేశారు .బిల్లును చర్చకు రాకుండా చేసే అధికారం స్పీకర్ కు లేదన్నారు .మీరట్ కేసు ఉపసంహరణ జరగదు అని తేల్చి చెప్పారు .బిల్లుపై మోతీలాల్ ,జయకర్, శ్రీనివాస అయ్యంగార్ వగైరా మాట్లాడారు .చివరికి స్పీకర్ విఠల్ భాయ్ పటేల్ ‘’ఈ బిల్లు చర్చకు రానేరదు రాకూడదు ‘’అని స్పష్టంగా రూలింగ్ గా నిషేధపు ఆజ్ఞఇచ్చాడు .మీరట్ కేసు విచారణలో ఉండగా అసెంబ్లీలో ఈ బిల్లు పై చర్చి౦చ కూడదు .ఇది ప్రభుత్వ కపట నాటకం అని చెప్పాడుపటేల్.’’స్పీకర్ నియంత అయ్యాడు ‘’అన్నారు యూరోపియన్ సభ్యులు .తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు బెదరవు అని నిరూపించాడు మనభాయ్ .నిషేధపు ఆజ్ఞ ఇచ్చే అధికారం స్పీకర్ కు ఉంది రుజువు చేశాడు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-10-21-ఉయ్యూరు  

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు  విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -3

భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు  విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -3

  కాంగ్రెస్ కార్యదర్శిగా రెండు సార్లు ఇంగ్లాండ్ వెళ్లి కాంగ్రెస్ ఆశయాలను ప్రచారం చేసిన విఠల్ భాయ్ పటేల్ కృషికి,వీలైనప్పుడల్లా బ్రిటిష్ ప్రభుత్వ దమనకాండను విమర్శించిన నిర్భయతకు భారతీయులందరూ అభినందించారు .స్వపరిపాలన ఆయన ధ్యేయం .మాంట్ ఫర్డ్ సంస్కరణలను సురేంద్రనాథ బెనర్జీ సహాయం తో సుప్రీం కౌన్సిల్ అభినంది౦చినపుడు ధైర్యంగా తిరస్కరించింది విఠల్ భాయ్ ఒక్కడే .చాలావరకు అతివాదులతో ,చాలాసార్లు తిలక్ తో ఏకీభవించి పని చేశాడు .తిలక్ బాగా ఆదరించి ప్రోత్సహించాడు .లోకమాన్యునితో మంచి సాన్నిహిత్యమేర్పడింది .

  1919లో రౌలట్ చట్టం రాగా గాంధీ ‘’ఈ చట్టం బ్రిటిష్ పాలకులలో వేళ్ళు పాతుకు పోయిన తీవ్ర వ్యాధి లక్షణం ‘’అని విమర్శించాడు .దేశమంతా వ్యతిరేకించినా చట్టం వచ్చేసింది .దీనితోపాటే రిఫార్మ్స్ యాక్ట్ కూడా వచ్చింది .ఇది స్వపరిపాలనం కోరే వారి కన్నీటి తుడుపుమాత్రమే .పంజాబు దురంతాలూ ఇప్పుడే జరిగాయి .రాయల్ విచారణ సంఘాన్ని నియమించి విచారించాలని ప్రజలు ఆందోళన చేశారు .స్పందన లేదు .నేరం చేసిన ప్రభుత్వమే హంటర్ అధ్యక్షుడుగా కమిటీ వేసి విచారి౦చ మన్నదికానీ ,జైలులో ఉన్న వారిని విడుదల చేయకుండా సాక్ష్యం  చెప్పటానికి వీలు కల్పించలేదు .కాంగ్రెస్ గాంధీ మొదలైన లాయర్లతో విచారణ సంఘం నియమించింది .ఇవన్నీ సహాయ నిరాకరణ ఉద్యమానికి దారి తీశాయి .రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా చేసిన గాంధీ సత్యాగ్రహం సహాయ నిరాకరణకు దారి చూపింది .

   అప్పటికే తిలక్ ,పటేల్ ఒక కార్యక్రమం ఆలోచించారు  ,ఉప్పెనలాగా వచ్చే చైతన్యాన్ని పటేల్ గుర్తించాడు .1920 లో  మోతీలాల్ కార్యదర్శి అయ్యాడు .గాంధీ –ఇర్విన్ ఒడంబడిక గాంధీ చేసిన తప్పు అని ప్రకటించాడు కానీ చిత్తరంజన్ ,మోతీలాల్ లకంటే గాంధీ మాత్రమె స్వాతంత్ర్యం మా జన్మ హక్కు అని చాటగల సత్తా ఉన్నవాడు అని నమ్మాడుపటేల్  .వెంటనే సహాయ నిరాకరణ ఉద్యమం లో దూకాడు పటేల్ .రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా గాంధీ ప్రతిపాదించిన తీర్మానాన్ని 1920 సెప్టెంబర్ కలకత్తా కాంగ్రెస్ మీటింగ్ లో లజపతి రాయ్ అధ్యక్షతన ఆమోదించింది .దీనిప్రకారం బిరుదులూ పదవులుత్యజించటం ,గవర్నమెంట్ ఆఫీసులు దర్బార్లు ,కోర్టులు బహిష్కరించటం ,ప్రభుత్వ కాలేజీ స్కూళ్ళలో చదివే విద్యార్ధులు బహిష్కరించి జాతీయ విద్యాలయాలు ఏర్పాటు చేసుకోవటం ,విదేశీ వస్తు బహిష్కరణం అమలు చేయటం   . బిపిన్ చందు పెట్టిన ఎమెండ్ మెంట్ తీర్మానం వీగిపోయింది .అసలు తీర్మాన్నాన్ని నెగ్గించాటానికే గాంధీ ప్రాణం తలనుంచి తోకకు వచ్చింది .కానీ పంజాబ్ దురంతాలు ఆయనకు గొప్ప బలం చేకూర్చి తీర్మానం నెగ్గింది .దేశం లో ఎన్నికలు జరగాల్సిన సమయం అది .కాంగ్రెస్ అభ్యర్ధులు నామినేషన్లు వేశారు .దేశబంధు దాసు ,మోతీలాల్,విఠల్ భాయ్ మొదలైనవారు శాసన సభా బహిష్కారాన్ని వ్యతిరేకించారు .కానీ ప్రజాభి ప్రాయానికి తలలు వంచారు .డిసెంబర్ లో జరిగిన అఖిలభారత కాంగ్రెస్ సమావేశం లో తీర్మానం ఆమోదించారు .అప్పుడే పటేల్ కార్యదర్శి పదవికి రాజీనామా చేశాడు .పటేలు ఇంగ్లాండ్ లో చేసిన కృషికి కాంగ్రెస్ కృతజ్ఞతలు చెప్పింది .ఆయన పేరు చెప్పిన ప్రతిసారీ చప్పట్లతో సభ మారు మోగింది .

   మహాత్ముని నాయకత్వం లో సహాయ నిరాకరణ దావాగ్నిలా దేశమంతా వ్యాపించింది .జాతీయ నాయకులలో ఉన్నకుళ్ళు ఈ  అగ్నిలో ఆహుతై,స్వచ్చమై  పవిత్రమై౦ది .ఉద్యమం పరిశుద్ధమైంది .మితవాదులు ధనికులు సంస్కరణలను బలపరిస్తే జాన్ బ్రైట్  ‘’ధనికులు రాజకీయంగా పిరికి వాళ్ళు’’అని చెప్పినట్లు ఈపిరికితనం కాంగ్రెస్ లో చేరి ,మార్లే మితవాదులను బుజ్జగించి దగ్గరకు తీసి కాంగ్రెస్ లో కొంత పిరికితనం కలిగించాడు .కానీ సహాయ నిరాకరణలో ఈ పిరికి పాలు విరిగిపోగా అతివాదులు మిగిలిన హక్కులకోసం పోరాటానికి సిద్ధమయ్యారు .అహమ్మదా బాద్ కాంగ్రెస్ లో దేశబంధు అధ్యక్షుడయ్యాడు .ఆయన ప్రభుత్వం నిషేధించిన ఒక దళ సభ్యుడు .ప్రభుత్వం జైలులో పెట్టింది .ప్రజల బాధ్యత ప్రభుత్వానికి పట్టలేదు .అందుకే అహ్మదాబాద్ కాంగ్రెస్  శాసనోల్లంఘనను  తీర్మానించింది .గాంధీ రాజకీయం లో హింసకు చోటు లేదు. ఎక్కడైనా హింస ప్రజ్వల్లితే ఆయన నిరాహార దీక్ష చేసేవాడు .

  జన్మతః వీరుడైన విఠల్ భాయ్ కి యుద్ధమంటే మక్కువ .అహమ్మదాబాద్  కాంగ్రెస్ ఆయన భుజస్కంధాలపైనే నడిచింది .శాసనోల్లంఘన తీర్మానాన్ని బలపరచాడు ..’’భారతీయులు కత్తితోనో ,ప్రసాదంగానో స్వరాజ్యం తప్పక సాధిస్తారు ‘’అని ప్రకటించాడు .  ‘’ఈ ఉల్లంఘన లో  మీరుజైలుకు వెళ్ళవచ్చు ,ప్రాణ త్యాగం చేయాల్సి రావచ్చు .కానీ పోరాటం శాంతియుతంగా ఆహి౦సతో మాత్రమె చేయాలి .ఇతరులను శారీరకంగా ,మానసికం గా హింసించ కూడదు ‘’అని ఉద్బోధించాడు వేదికపై నుంచి .

   సంస్కరణలు ప్రవేశ పెడుతూ అయిదవ జార్జి చక్రవర్తి భారతీయులకు ఒక సందేశం పంపాడు –‘’దేశభక్తులు ,రాజభక్తులు అయిన భారతీయులు స్వరాజ్య స్వప్నం కంటున్నారు .దానికి బీజాలు ఈ సంస్కరణలవలన కలుగుతాయి .స్వతంత్ర మార్గం లో ఇండియా పురోగమించటాతానికి అవకాశాలు కల్పిస్తున్నాం ‘’.ఎంతకాలం లో స్వరాజ్యం ఇస్తారో రాజు చెప్పకపోవటం తో నిరాశాకలిగినా కాలపరిమితి ప్రజాబలం పై ఆధారపడి ఉంటుందని చెప్పాడు విఠల్ భాయ్ .జనం ఆయన ఉపన్యాసానికి ఫిదా అయ్యారు .

   శాసనోల్ల౦ఘన  విచారణ సంఘం

6-6-1922న కాంగ్రెస్ కార్యవర్గం ఉల్లంఘన గురించి దీర్ఘంగా చర్చించి .దీనికి దేశం సిద్ధంగా ఉందొ లేదో నిర్ణయించటానికి నియమించిన విచారణ సంఘం లో విఠల్ భాయ్ ముఖ్య సభ్యుడు .ఈకమిటీ దేశమంతా తిరిగి ప్రజలు సిద్ధంగా లేరని రిపోర్ట్ ఇచ్చింది .దీనితో శాసన సభలో ప్రవేశించాలా వద్దా అనే సమస్య వచ్చింది .అన్సారీ రాజాజీ, కస్తూరి రంగయ్యర్ మొదలైనవారు శాసన సభా బహిష్కారాన్నే సమర్ధించారు .కానీ విఠల్ భాయ్ , మోతీలాల్ ,హకీమ్ సాహెబ్ మొదలైనవారు శాసన సభలో ప్రవేశించాల్సిందే అని పట్టుబట్టారు .ప౦జాబ్ ,ఖిలాఫత్ సంఘటనలలో ప్రజలకు జరిగిన అన్యాయానికి శాసన సభలు ఏమీ చేయలేకపోయాయి .ప్రజలు తీవ్రకష్టనష్టాలకు గురైనారు కనుక శాసనసభా ప్రవేశం కాంగ్రెస్ వారికి తప్పదు ‘’అని విఠల్ భాయ్ వాదించాడు .ఈ సందర్భం గా –ఎన్నికలలో కాంగ్రెస్ వారు పాల్గొని ఎక్కువ సీట్లు సాధించాలి ,ఖిలాఫత్ పంజాబ్ గాయాలను మాన్చే కృషి జరగాలి ,ప్రజలకు జరిగిన అన్యాయాలను సరిదిద్దాలి ,స్వరాజ్య సంపాదనమే లక్ష్యం కావాలి .కోరం కు మించిన సభ్యులు ఎన్నిక అయితే పదవులు పొంది బయటికి రావాలి ,ప్రభుత్వ బిల్లులను వ్యతిరేకించాలి .తక్కువ సంఖ్యలో గెల్చినా అలాగే చేయాలి .

   సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -28-10-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment