ప్రముఖ బెంగాలీ కవి -జీవనానంద దాస్ -2

ప్రముఖ బెంగాలీ కవి -జీవనానంద దాస్ -2

పట్టణన వర్గాలలో మధ్యతరగతి ప్రజలకష్ట నష్టాలను  వర్ణిస్తూ సమర సేన్ తనకవితలలో అసహనం చూపాడు .ఈ మార్పులను గురించి కవితా అస్త్ర సన్యాసం చేయటానికి కూడా సిద్ధపడ్డాడు .విష్ణు డే కవితలలో శ్రామికవర్గం పై జాలికనిపిస్తుంది .నాటికవులు తమ వర్గ స్వభావాన్ని వదులుకోలేక పోయారు .సుభాష్ ముఖోపాధ్యాయ ,,సుకంతో భట్టాచార్య కవితల్లో ఏ కొన్నో తప్ప నిజంగా ప్రజానీకానికి చేరలేదు.ఆ రోజుల్లో కవి తనకు తానె తుది లక్ష్యం వలన ,తనకు తాను తన్మయుడై ,దాన్నికవిత్వంగా ‘’కక్కటం ‘’తప్ప ఏమీ సాధించలేక పోయాడు .ప్రజాహృదయ స్పందన కలిగించలేక పోయాడు .

 విభూతి భూషణ బంద్యోపాధ్యాయ కవిత్వం లో  నవలలో లాగా జీవనానంద దాస్ ప్రకృతి దృశ్యాలతో చేలూ, నదులు సామాన్యప్రజలు వారి మనోభావాల చిత్రణ ఉంది .దాస్ కూడా బంద్యోపాధ్యాయ లాగా వామ పక్ష భావ ప్రభావితుడు కాదు .ప్రముఖ బెంగాలీ చిత్ర దర్శకుడు సత్యజిత్ రే విభూతి నవలలను సినిమాలుగా మలిచాడు .చిత్రకారుడు జెమిని రాయ్ కూడా ఈ కోవలోని వాడే .ఇతడి కళాఖండాలకు అద్భుత వ్యాఖ్యాత విష్ణు డే.

 టాగూర్ తర్వాత జీవనానంద దాస్ ఒక్కడే బెంగాలీ కవిత్వం లో అద్భుతాలు సాధించాడు .నజ్రులిస్లాం గొంతెత్తి దేశభక్తి గీతా గానం చేశాడు .ప్రజల్లో బ్రతుకు బాధ ఎక్కువై వాటిపై మోజు తగ్గింది .సుధీంద్ర నాథ దత్తా సంస్కృత సాహిత్య లోతులు తరచి ,సమకాలీన జీవితాన్ని సంస్కృతంలో ఆవిష్కరించాడు .విలువలను సమన్వయ పరచాడు .విష్ణు డే తన కవితా మృదు స్పర్శతో ,ఆవేశం ,అనుభూతి రంగరించి ,ప్రజలలో వైజ్ఞానిక చైతన్యం తెచ్చాడు .బుద్ధ దేవ బోస్ తన అనుభూతుల్ని ప్రజానుభూతులు చేసి ప్రజా హృదయం ఆకర్షించాడు .ప్రేమేంద్ర మిత్రా విశాల దృక్పధంతో ప్రజాహృదయాలను మీటాడు .అమీయా చక్రవర్తి రచనలలో ఆధునిక భాష, నుడికారం శైలీ చి౦దులేశాయి .సురేంద్రనాథ్ లాగా ఆజిత్ దత్తా భారతీయ భావాలకు, సమకలీనతకు పట్టం కట్టాడు .అల్పాక్షరాలతో అనల్పార్ధ రచన చేశాడు .ఇలా వీరంతా ఎవరికీ వారే తమ ప్రత్యేకతను నిల్పుకొన్నారు .కానీ వీరిలో ఎవరూ జీవనానంద దాస్ లాగా నూతనత్వం కవితాశక్తి సంమోహ గుణం ప్రదర్శించ లేకపోయారు .అందుకే రవీంద్రుని తర్వాత ఆస్థానం జీవనానంద కు దక్కింది .

           వ్యక్తిత్వం

జీవితమంతా కవిత్వంలోనే మునిగి తేలినవాడు జీవనానంద దాస్ .ఏవోకొన్ని నవలు కథలు రాశాడుకానీ, కవిత్వంలోనే జీవించాడని చెప్పవచ్చు .అదే ఆయన వ్యక్తిత్వమై భాసిల్లింది .ఆయన కవిత్వం లో ఉన్న సౌందర్యం ఆయన వేష ధారణలో కనిపించదు .శైలి లో ఉన్న శోభ ఆయన ఇంట్లో ఉండదు .అంటే ఊహకూ నిజానికీ మధ్య సమన్వయము లేదు .తను నిర్మించిన కల్పనా జగత్తుకు ,సాంఘిక జీవనం లోని నిత్య జీవితానికి సంబంధం ఉండదు .తూర్పు బెంగాల్ బారిసాల్ లో పుట్టి ,కలకత్తా లో పెరిగిన దాస్ కు పల్లె సౌ౦దర్యం ,పట్టణ  సౌభాగ్యం రెండూ కూడా పట్టనే లేదు .తనలోకం లో తాను ఊహా సౌధాలు నిర్మించుకొని గడిపాడు .జీవిత సమస్యలకు దూరంగా ఉన్నా , జీవితాన్ని నిశితంగా పరిశీలించే నేర్పున్నవాడు .కానీ జీవిత సమరంలో రచనలద్వారానే పాల్గొన్నకవి. ఆయన కవే కానీ మరేదీ కానివాడు .అందుకే ‘’ఒక వ్యక్తీ నిజంగా కవి అయితే ,నిత్య జీవితంలో సతమతమయ్యే లోకానికి తానిచ్చే మొదటి బహుమతి కవిత్వమే ‘’అన్నాడు .

  జీవనానంద దాస్ చివరికి ట్రా౦ కారు కింద పడి మరణించటం ఆయన జీవితంలో భగవంతుడు చేసిన చమత్కారం .అయ్యో అనిపించినా ,మంచాన పడి తీసుకోకుండా హఠాన్మరణం పొందటం లో కూడా ఆయన కవితా సాహసం తొంగి చూసింది అంటారు .మరణానికి ముందే ఆయన జీవితంలో పతనావస్థ ప్రారంభమైంది .నిత్య జీవితంలో సన్నిహిత సంబంధం కల వ్యక్తిగా ఆయన్ను భావించేవారు .అందువల్ల సనాతనులు ఆధునికులు హేళన తో ఆయన్ను చూసేవారు .’’శనివారర్ చీటీ ‘’-శనివారం లేఖ అనే పత్రికలో సజనీ కాంత దాస్  ఈయన్ను దుయ్య బడుతూ ఉండేవాడు .

  నిష్టాగరిష్ట బ్రహ్మ సమాజ  కుటుంబం లో పుట్టిన జీవనానంద ,తండ్రి మంచి పండితుడైన ఉపాధ్యాయుడు తల్లి కవయిత్రి ..కలకత్తాలో బ్రహ్మ సమాజీయుల కాలేజిలో దాస్ ఇంగ్లీష్ లెక్చరర్ గా పని చేశాడు .ఒక కవితలో స్త్రీ వక్షోజాలను  వర్ణించి నందుకు  ఆయన్ను ఉద్యోగం నుంచి తీసేశారని అంటారు .జీవితమంతా ఇంగ్లీష్ లెక్చరర్ గానే గడిపాడు .ఆదాయం చాలక ,కవిత్వంతో బాగా పేరు తెచ్చుకొనే సమయంలో ఇన్సూ రెన్స్ పాలసీని అయినకాడికి అమ్మేశాడు .

 ప్రజలతో మాట్లాడటానికి ఇబ్బంది పడేవాడు .టాగూర్ ప్రదర్శించిన ప్రశాంత సమైక్య సంపూర్ణ సమన్వయ భావాలకు దూరంగా జీవితం గడిపాడు దాస్ .ఆయన జీవించిన కాలానికి సంబంధించి సమస్త గుణాలు ఉన్నకాలం లో జీవితం గడిపాడు .జీవితంలో రచనలలో ఆయన టాగూర్ అనంతర కాలానికి అంకితమైన వాడు జీవనానంద దాస్ .

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -6-9-22-ఉయ్యూరు  

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మ వైవర్త పురాణం. గణపతి ఖండం.6.వభాగం.6.9.22

బ్రహ్మ వైవర్త పురాణం. గణపతి ఖండం.6.వభాగం.6.9.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హరి సర్వోత్తమ రావు జీవితం.15వ భాగం..5.9.22

శ్రీ హరి సర్వోత్తమ రావు జీవితం.15వ భాగం..5.9.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

బ్రహ్మ వైవర్త పురాణం.గణపతి ఖండం.5వ భాగం.5.9.22

బ్రహ్మ వైవర్త పురాణం.గణపతి ఖండం.5వ భాగం.5.9.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హరి సర్వోత్తమ రావు గారి జీవితం.14వ భాగం.4.9.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ప్రముఖ బెంగాలీ కవి -జీవనానంద దాస్

ప్రముఖ బెంగాలీ కవి -జీవనానంద దాస్

చిదానంద దాస్ గుప్త ఆంగ్లం లో రాసిన పుస్తకానికి కుందుర్తి చేసిన అనువాదం జీవనానంద దాస్ .కేంద్ర సాహిత్య అకాడెమి 1979లో ప్రచురించింది. వెల –రూ-2-50.హుమాయున్ కబీర్ కు స్మృత్య౦జలి గా  అంకితం చేశారు .

 కవి కాలాదులు

రవీంద్రుని ప్రతిభ ఉత్కృష్టంగా వెలుగు తున్నప్పుడే జీవనానంద దాస్ కవితా ప్రతిభ కూడా వెలుగు లీనింది .అర్ధ శతాబ్దం టాగూర్ బెంగాలీ సాహిత్యాన్ని ప్రభావితం చేశాడు .ఆనాటి కవులంతా ఆయన దారి తొక్కి ఆమర్గం లో నడిచారు. అదే శైలి అనుసరించారు .ఆయన చూపిన సమన్వయ దృక్పధం అందరికీ ఆరాధనం అయింది .ఆయన్ను దాటి అలోచి౦చటం సాధ్యమా ?అనే స్థితిఏర్పడింది .అన్నిటా ఆయన శిఖరాయ మానుడు .టాగూర్ సాహిత్య సంస్కృతీ బెంగాల్ లో ఇప్పటికీ జీవించే ఉంది .1937లో టాగూర్ ‘’ప్రాంతిక్ ‘అనే కవితా సంపుటిరాసి విడుదల చేశాడు .పెద్ద జబ్బు చేసి మరణావస్థ నుంచి కోలుకొని ,ఆనాటి బెంగాలీ సమకాలీనతను ఆకవిత్వం లో ఆవిష్కరించాడు .యుద్ధ కారణ శక్తులను తీవ్రంగా ఖండించాడు .సమాజం వింతపోకడలు ,దిగజారుడు లను కళ్ళకు కట్టించాడు .తన ఆవేదనను ఒకకవితలో ఇలా అన్నాడు –

‘’బుసకొట్టే సర్పరాజులు విషం కక్కు తున్నాయ్ –నా చుట్టూ ఉన్న గాలిలో –శాంతి ప్రవచానాలన్నీ శక్తి హీనమైపోయాయి-పెద్ద వాణ్ని అయిపోయాను –పోయే లోగా ఒక విజ్ఞప్తి-ఈ రాక్షసిని తుద ముట్టిద్దాం .-అందరూ దీనికోసం సర్వ సన్నద్ధులు కావాలి ‘’

  1930వ తరానికి చెందిన కవులంతా రవీంద్రుని ప్రభావం నుంచి బయట పడాలనే కాంక్ష ,కృషీ మొదలయ్యాయి .బుద్ధ దేవ బోస్ దీనికి ప్రధాన పాత్ర పోషించాడు .టాగూర్ మరణానికి 15ఏళ్ళ ముందునుంచి ‘’కల్లోల్ సాహితీ బృందం ‘’దీనికి తోడ్పడింది .ఆ కాలం లో నిరాశా నిస్పృహలతో ఉన్నవారు ,మార్క్సిస్ట్ ప్రభావితులైన వారు ,,ఈ రెండిటికీ మధ్యగా ఉన్నవారు అందరూ కలిసే ఉండేవారు .వీరంతా టాగూర్ తర్వాత రానున్న ఆలోచనా ధోరణుల గురించే బాగా ఆలోచించారు .కల్లోల్ బృందమేకాదు ‘’విష్ణు డే’’కూడా –‘’టాగూర్ చెట్టు పేరు చెప్పికాయలమ్మే గతి –ఇక మనకు వద్దు –జటాజూటపు మెలికల్లో గంగను ఇరికి౦చుకొని –శాశ్వతంగా నిలపటానికి ఇక వీల్లేదు –ఆత్మ భావ గంగా ప్రవాహాన్ని –విచ్చల విడిగా వదుల్తున్నాం –పాటల పడవల మీదెక్కి –జలధి వైపుకు కదుల్తున్నాం –కొత్తదారి ,కొత్తనడక –కొత్త రంగులు ,కొత్త చిత్రాలు –కొత్త గొంతుల కోలాహలం తో –నవ్యకవితా ప్రవాహాలు పారిస్తాం –ప్రజల మనస్సులు పాలిస్తాం ‘’అంటూ వైశాఖ 25 కవిత్వంతో ముందుకు దూకాడు విష్ణు డే.

  ఇలాంటి సమయంలో కూడా జీవనానంద దాస్ టాగూర్ పై ధ్వజమెత్తి కవిత్వం రాయలేదు .ఆయన కవితా వస్తు ప్రదర్శనం టాగూర్ లో వచ్చిన పరిణామ దశల్లో ప్రయాణం చేసి బలపడింది .టాగూర్ అనంతర కవులలో జీవనానంద దాస్ లో అందరికంటే ఎక్కువగా ఈ పరిణామం చోటు చేసుకొన్నది .ఇది ఆయన గమనించి ఇలా అన్నాడు –‘’తమకంటే ముందున్న మహాకవులను పడ త్రోసే ప్రయత్నం లో, కవులు తమ స్థానాన్ని నిలబెట్టుకో లేరు .ఒకరిద్దర్ని మినహాయిస్తే ఆధునిక బెంగాలీ కవితారంగం అంతా టాగూర్ ప్రభావమే కనిపిస్తుంది .ఆధునిక కవితలను ఆయన కవిత్వంతో పోలిస్తే ,ఆయనలో ఎంత వైవిధ్యం ఉందొ అర్ధమౌతుంది .ఆయన అడుగు జాడల్లోనే ఆధునిక  బెంగాలీ కవిత్వం ఇప్పుడే కొత్తగా ప్రారంభించింది .టాగూర్ ప్రతిపాదించిన విలువలకు ఎన్నటికీ భంగం కలగదు ‘’అన్నాడు .టాగూర్ కవితా సంప్రదాయానికి ఎదురు తిరక్కుండా ,దాన్ని కొత్తతరంలోని భావాలతో ,భాషా నుడికారాలతో మేళవించి ముందుకు తీసుకు వెళ్ళటమే ధ్యేయంగా జీవనానంద దాస్ కృషి చేశాడు .’’సంప్రదాయం –వ్యక్తి ప్రతిభ ‘’లో ఆంగ్లకవి టీఎస్ ఇలియట్ రాసిన వ్యాసం లో ఈ రెండిటికి ఉన్న సంబంధాన్ని వివరించినట్లుగా జీవనానంద దాస్ కవిత్వం రాశాడు .

 బెంగాలీ సాహిత్యం లో పశ్చిమ దేశాల హవా బాగా ఉన్న రోజులవి .రెండు ప్రపంచ యుద్దాలఫలిత౦ గా  ‘’వేస్ట్ లాండ్ ‘’గా మారిన భూగోళం మీద వీచిన గాలి ,బెంగాలీ నేలనూ  తాకింది .విక్టోరియాకాలపు నైతిక విలువలు పతనమై ,అణుయుగం లో మానవ జీవితం లో సందిగ్ధ పరిస్థితులేర్పడి ,ప్రపంచమంతా ఎర్రజండాలు ఎగురుతున్న రోజులవి .వీటన్నిటి ప్రభావం బెంగాలీ సాహిత్యంపై బలంగానే పడింది .

  టాగూర్ యుగం చివర్లో ,టాగూర్ తర్వాత బెంగాలీ సాహిత్య నిర్మాతలలో చాలామంది ఆంగ్ల భాషా నిష్ణాతులవటం విశేషం .అలాంటి వారిలో బుద్ధ దేవ బోస్, అమియా చక్రవర్తి, విష్ణు డే,సమర్ సేన్ ,జీవనానంద దాస్ ముఖ్యాతి ముఖ్యులు .ఇంగ్లీష్ జర్నలిస్ట్ లుగా ఉంటూ ఇంగ్లీష్ సాహిత్యాన్ని మధించినవారూ ఉన్నారు .పాశ్చాత్య దేశాల కళా సాహిత్యాలలో ,పురాతన ,అధునాతన గాధలతో ఉన్న పద చిత్రాలు వారికవితల్లో కో కొల్లలు .ఇలియట్, వెబ్స్ ,యేట్స్,కాల్డ్వెల్ ,రజనీ పామీదత్ ఆస్వాల్డ్ స్ప్లేన్గ్లార్ ల వివిధ సాహిత్య ప్రక్రియలను బెంగాలీ సాహిత్యం లో దిగుమతి చేసి దారీ గమ్యం లేకుండా చేశారు .

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-9-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మ వైవర్త పురాణం.గణపతి ఖండం.4వ భాగం.4.9.22

బ్రహ్మ వైవర్త పురాణం.గణపతి ఖండం.4వ భాగం.4.9.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

సరస భారతి 167 వ కార్యక్రమంగా శ్రీకోటగురువరేణ్యుల స్మారక నగదు పురస్కార ప్రదానం 

సరసభారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు

‘’అక్షరం లోక రక్షకం ‘’

సరస భారతి 167 వ కార్యక్రమంగా శ్రీకోటగురువరేణ్యుల స్మారక నగదు పురస్కార ప్రదానం 

సాహితీ బంధువులకు శుభకామనలు ,ఉపాధ్యాయ దినోత్సవ శుభా కాంక్షలు

సరస భారతి 167వ కార్యక్రమంగా 2022 మార్చి లో లో పదవతరగతి  పాసై , అత్యధిక మార్కులు పొందిన పేద ప్రతిభగల బ్రాహ్మణ విద్యార్ధికి , విద్యార్ధినికి  మా గురువరేణ్యులు కీ .శే .బ్రహ్మశ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి ,శ్రీమతి సీతమ్మ దంపతుల స్మారక నగదు పురస్కార౦   శ్రీ సర్వేపల్లి రాదా కృష్ణ పండితుని జన్మదినోత్సవం –ఉపాధ్యాయ దినోత్సవం  నాడు 5–9-22 సోమవారం ఉదయం 10.గం కు అమరవాణి  హైస్కూల్ లో మా  గురుపుత్రులు శ్రీ కోట సోదరులచేతులమీదుగా అందజేయ బడుతుంది .అలాగే శ్రీ కోట మాస్టారి  శిష్యులు శ్రీ మైనేని గోపాల కృష్ణ శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా )ఏర్పాటు చేసిన బ్రహ్మశ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి ,శ్రీమతి సీతమ్మ దంపతుల స్మారక నగదు పురస్కారం పేద ప్రతిభగల ఒక SC విద్యార్ధికి ,ఒక BC విద్యార్ధినికి అంద జేయబడుతుంది .సాహిత్య ,విద్యాభిమానులుఅందరూ  పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన .

  కార్య క్రమం -5-9-22 సోమ వారం ఉదయం 10.గం.లకు

   సభాధ్యక్షులు –శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు

   సభ ప్రారంభకులు –శ్రీమతి జోశ్యుల శ్యామలా దేవి –సరసభారతి గౌరవాధ్యక్షులు

 ఆత్మీయ అతిధులు -పురస్కార ప్రదాతలు శ్రీ కోట గురుపుత్రులు ,శ్రీ కోట సోదరులు – శ్రీ కోట చంద్రశేఖర శాస్త్రి గారు ,శ్రీ కోట గాయత్రీ ప్రసాద్ గారు ,శ్రీ కోట రామకృష్ణగారు ,శ్రీకోట సీతారామాంజనేయులు గారు .

             కార్యక్రమ వివరం

 శ్రీ కోట గురువరేణ్యుల ,శ్రీసర్వేపల్లి రాధా కృష్ణన్ చిత్ర పటాలకు  పుష్పమాలాలంకరణం

        1-  శ్రీ కోట సోదరులు ఏర్పాటు చేసిన –  శ్రీ  కోట గురువరేణ్యులు కీ .శే .శ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి గారి స్మారక ప్రోత్సాహక నగదు పురస్కార ప్రదానం  –

ఉయ్యూరు ఫ్లోరా స్కూల్ లో  చదివి 2022 పబ్లిక్ పరీక్షలో పదవతరగతి  546/600మార్కులతో ఉత్తీర్ణత సాధించి ,శ్రీచైతన్యలో ఇంటర్ చదువుతున్న   –చిర౦జీవి  కుందేరు నాగ సాయి కృష్ణ తేజ కు రూ-10,116(పది వేల నూట పదహారు రూపాయలు )

2-శ్రీ కోట సోదరులు ఏర్పాటు చేసిన -కీ శే .శ్రీమతి కోట సీతమ్మ గారి స్మారక ప్రోత్సాహక నగదు పురస్కార ప్రదానం  

  ఉయ్యూరు శ్రీనివాస అక్షరాలయం లోచదివి   2022 పదవ తరగతి  పబ్లిక్ పరీక్షలో 536/600మార్కులతో ఉత్తీర్ణత సాధించి ,శ్రీనివాస కాలేజిలో ఇంటర్ చదువుతున్న

 కుమారి వేదాంతం శ్రీ కమల తేజస్విని కు రూ-10,116(పది వేల నూట పదహారు రూపాయలు )

3-శ్రీ కోట గురు వరేణ్యుల శిష్యులు ,శ్రీ మైనేని గోపాల కృష్ణ ,శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా )ఏర్పాటు చేసిన

కీ.శే. శ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి గారి స్మారక నగదు పురస్కారం –S.C..విద్యార్ధికి  

 ఉయ్యూరు అమరవాణి హైస్కూల్ లో చదివి ,2022పదవ తరగతి పబ్లిక్ పరీక్షలో 549/600మార్కులతో ఉత్తీర్ణత సాధించి ,నారాయణ కాలేజిలో ఇంటర్ చదువుతున్న

చిరంజీవి జిత్తుక దీక్షిత్ బాబు కు –

5000రూపాయలు +శ్రీ గబ్బిట రామనాధ బాబు అందించిన 2,000రూపాయలు +శ్రీమతి కొల్లి భారతి అందించిన 1000 రూపాయలు –మొత్తం –రూ.8,000.

4- కీ శే .శ్రీమతి కోట సీతమ్మ గారి స్మారక ప్రోత్సాహక నగదు పురస్కార ప్రదానం  -BC విద్యార్ధినికి

ఉయ్యూరు అమరవాణి హైస్కూల్ లో చదివి ,2022పదవ తరగతి పబ్లిక్ పరీక్షలో 576/600మార్కులతో ఉత్తీర్ణత సాధించి ,శ్రీ చైతన్య  కాలేజిలో ఇంటర్ చదువుతున్న

కుమారి ధూళి పూడి త్రిష కు

5000రూపాయలు +శ్రీ గబ్బిట రామనాధ బాబు అందించిన 2,000రూపాయలు +శ్రీమతి కొల్లి భారతీ దేవి  అందించిన 1000 రూపాయలు –మొత్తం –రూ.8,000.

సరస భారతి ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ దినోత్సవ ప్రత్యేక  సన్మానం

 –అమరవాణిలో పని చేస్తున్న  ఇద్దరు ఉపాధ్యాయులకు

  ఉపాధ్యాయ దినోత్సవ  శుభా కాంక్షలతో

జోశ్యుల శ్యామలాదేవి   మాదిరాజు శివ లక్ష్మి    గబ్బిట వెంకట రమణ

గౌరవాధ్యక్షులు              కార్య దర్శి              కోశాధికారి

                             గబ్బిట దుర్గా ప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు మరియు పివి.నాగరాజు –ప్రిన్సిపాల్ అమరవాణి హైస్కూల్

                                                          4-9-22-ఉయ్యూరు

Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

శ్రీ హరి సర్వోత్తమ రావు గారి జీవితం.13వ భాగం.2.9.22

శ్రీ హరి సర్వోత్తమ రావు గారి జీవితం.13వ భాగం.2.9.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

‘’మహా భారత తత్వ కథనం’’ రచయిత మహోపాధ్యాయ ,మహాభారత మర్మజ్ఞ -శ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు

‘’మహా భారత తత్వ కథనం’’ రచయిత మహోపాధ్యాయ ,మహాభారత మర్మజ్ఞ -శ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు

శ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ప్రముఖ సంస్కృతాంధ్ర పండితుడు. మహాభారత తత్త్వ కథనము రచించారు ..

జీవిత విశేషాలు
1894వ సంవత్సరం విజయ, మార్గశిర శుద్ధ షష్ఠి నాడు, తూర్పు గోదావరి జిల్లా, కాజులూరు గ్రామంలో తన మాతామహుని ఇంట జన్మించారు[1]. వారణాసి భావనారాయణ, కామేశ్వరమ్మ తల్లిదండ్రులు. స్వస్థలం పిఠాపురం. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు జన్మించడం వల్ల ఇ సుబ్రహ్మణ్యశాస్త్రి అని పేరు పెట్టారు. తన మాతామహుడైన రేగిళ్ల కామశాస్త్రి వద్ద సంస్కృత కావ్యాలను అభ్యసించారు. పిదప పిఠాపురంలో పేరి పేరయ్యశాస్త్రి వద్ద సిద్ధాంతకౌముది చదువుకున్నారు. అనంతరం వేదుల సూర్యనారాయణశాస్త్రి వద్ద వ్యాకరణం మహాభాష్యాంతం మంజూషతో సహా చదువుకున్నారు. అక్కడ కుప్పా ఆంజనేయశాస్త్రి, దర్భా సర్వేశ్వరశాస్త్రి, వడ్లమాని వేంకటశాస్త్రి సహాధ్యాయులుగా ఉన్నారు. ఆ తరువాత సుబ్రహ్మణ్యశాస్త్రి శ్రీపాద లక్ష్మీనృసింహశాస్త్రి వద్ద న్యాయశాస్త్రము, దెందుకూరి నరసింహశాస్త్రి వద్ద వేదాంతశాస్త్రము క్షుణ్ణంగా నేర్చుకున్నారు. స్వయంకృషితో ఇతర శాస్త్రాలను కూడా అభ్యసించి సర్వతంత్ర స్వతంత్రతను సంపాదించారు. తాను నేర్చుకున్న విద్యను ఇతర ప్రాంతాలనుండి వచ్చిన విద్యార్థులకు భోజనాది సదుపాయాలు కల్పించి గురుకుల పద్ధతిలో బోధించారు. వీరి వద్ద శిష్యరికం చేయడం గొప్ప విషయంగా భావించి దూరదేశాలనుండి ఎంతో మంది విద్యార్థులు పిఠాపురం చేరుకొనేవారు. ఈయన శిష్యులలో చాలామంది ప్రాచ్యకళాశాల ప్రిన్సిపాల్స్‌గా,పాఠశాలల ప్రధానోపాధ్యాయులుగా, పురాతత్త్వ శాస్త్ర పరిశోధకులుగా ఉన్నతపదవులు అలంకరించారు.

రచనలు
బాల్యం నుండే అనేక వ్యాసాలను వ్రాసి ప్రచురించేవారు. సుమారు 14 గ్రంథాలను సంస్కృతాంధ్రాలలో రచించి ప్రకటించారు. వాటిలో కొన్ని:

  1. చేతవనీ ఖండనం
  2. మహాభారత తత్త్వ దీపః
  3. మహాభారత తత్త్వ కథనం
  4. రామాయణ తత్త్వ కథనం
  5. ఆస్తికత్వం మొదలైనవి.

ఇంకా అనేక వ్యాసాలను విశ్వహిందూ పరిషత్తు సావనీరులోను, ఇతర పత్రికలలోను ప్రకటించారు. తెలుగులోను, సంస్కృత భాషలోను ఆకాశవాణి ద్వారా అనేక ప్రసంగాలు చేశారు. ఇతర రాష్ట్రాలలో సంస్కృతంలో, ఆంధ్రరాష్ట్రంలో తెలుగులో అనేక మహాసభలలో ఉపన్యాసాలు చేసి మంచి వక్తగా రాణించారు అష్టాదశ పురాణాలను తన పురాణపఠనం ద్వారా పిఠాపురవాసులకు వినిపించి వారిని ఆకట్టుకున్న విద్వన్ శిరోమణి .

బిరుదులు, సన్మానాలు
వీరిని అనేక బిరుదులు, సన్మాన సత్కారాలు వరించాయి.

ఇతని బిరుదులలో కొన్ని:

· వ్యాకరణాలంకార

· బ్రాహ్మీభూషణ

· వ్యాకరణస్థాపక

· మహామహోపాధ్యాయ

· మహాభారత మర్మజ్ఞ

· బాలవ్యాస

· తర్క వ్యాకరణ వేదాంత కేసరి

· జరిగిన సన్మానాలలో కొన్ని:

· విజయవాడలో జరిగిన పండితపరిషత్తులో శృంగేరీ పీఠాధిపతులచే సన్మానం

· ఆంధ్ర ప్రభుత్వాస్థాన కవి కాశీ కృష్ణాచార్యుల చే సత్కారం

· త్రిలింగ విద్యాపీఠం వారిచే సన్మానం

· ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వారిచే పురస్కారం

· పిఠాపురంలో సింహతలాటంతో పౌరసన్మానం

కుటుంబం
తన మేనమామ రేగిళ్ల చింతామణి పుత్రిక సుబ్బమ్మను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు భావనారాయణశాస్త్రి, కామశాస్త్రి, చింతామణిశాస్త్రి, రాజేశ్వరశాస్త్రి అనే నలుగురు కుమారులు, కామేశ్వరి, సుబ్బలక్ష్మి అనే ఇద్దరు కుమార్తెలు జన్మించారు.

మరణం
ప్రవచనాలు, ధర్మోపన్యాసాలు, దుర్విమర్శనా ఖండనము తన నిత్యకృత్యంగా పెట్టుకుని జీవిస్తూ తుదకు 1978, మార్చి 3వ తేదీన 84 వ ఏటమరణించారు.

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-9-22-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

హాస్యానందం  29 –సందేహాలంకారాభాసం  

హాస్యానందం 

29 –సందేహాలంకారాభాసం  

 సందేహం అనే అలంకారం ఉంది .అందులోనరస భూపాలుడిని చూసి  ‘’ఇంద్రుడో ,ఉపెంద్రుడో బలీ౦ ద్రుడో ‘’అనే పద్యం ఉదాహరణగా ఇచ్చాడు అలంకార శాస్త్రవేత్త .సందేహం అనే హాస్య ప్రక్రియ కూడా అలానే ఉంటుంది అన్నారు మునిమాణిక్యం నరసింహారావు మాస్టారు .ఎప్పుడో తనదగ్గర చదువుకొన్న శిష్య పరమాణువును చూసి ఒక మాస్టారు ‘’వీడు నా దగ్గర చదువుకొన్నవాడేనా ?వాడి తమ్ముడా ?’’అని అనుమానపడతాడు .అనుకుని ఊరు కొంటె బాగానే ఉంటుంది .కాని వాడితో ‘’నా దగ్గర చాలా మంది చదువుకొన్నారు .ఒక్కొకుటుంబంలోనే  నలుగయిదుగురు  అన్న దమ్మలుంటారు .వాళ్ళు పెద్ద వాళ్లైన తర్వాత  నన్ను కలిసి ‘నమస్కారం మాస్టారూ అంటారు ..ఆనలుగుర్లో వీడు ఎన్నో వాడో నాకు గుర్తుండదు .అప్పుడు నేను ‘’అయితే అబ్బాయీ !నువ్వు నువ్వేనా ?లేకపోతె మీ అన్నయ్యవా ?“”అంటాను. ఇదే ఒక సందేహమేగా ఈ దేహానికి వచ్చి౦ దేగా  .ఒక సారి అలాంటి కవలలో ఒకడు మరణించాడు .అప్పుడు వాడిని ‘’బాబూ!మీ ఇద్దర్లో చనిపోయింది నువ్వా ?మీ అన్నయ్యా ?అని అడిగాడు .సందేహాన్ని హాస్యోత్పత్తికి ఉపయోగిస్తే ఇలాంటి పలుకు బడులు తయారౌతాయన్నారు మనిమాణిక్యం .కనుక దీన్ని సందేహాలంకార ఆభాసం అన్నారాయన .మరో ఉదాహరణ –విస్తట్లో వడ్డించిన కూర చూసి ‘’ఇది వంకాయకూరా ?దోసకాయ కూరా ??’’అంటే సందేహాలంకారం .ఈ అలంకారం అల్ప వస్తు పరంగా ఉందికనుక సందేహాలంకార ఆభాసం అంటారు మాస్టారు .

 ఉత్ప్రేక్షా భాసం

ఉత్ప్రేక్ష  దాదాపు అతి శయోక్తి వంటిది..మునిమాణిక్యంగారింటి ముందు ఒక ధనికుడి ఇల్లుంది .ఈయనభార్య కాంతం గారికీ, ఆయన భార్యకూ మంచి స్నేహం ..ఆవిడ రత్నాలు ,వజ్రాలు పొదిగిన ఖరీదైన ఆభరణాలు ధరించేది .కా౦త౦ గారికి  ‘’అంత దృశ్యం ‘’లేదు .చిలకల పూడి గిల్ట్ నగలు పెట్టుకొనే వారీమె .ఆవిడ  ఒక సారి ఈవిడను ‘ఏమండీ అవి రవ్వ దుద్దులేనా ?ముత్యాలహారం లోవి మంచి ముత్యాలేనా ?’’అని అడిగింది ఆవిడకు తెలుసు అవి కాదని .కానీ హేళన చేయాలనే ఆవిడ ఉద్దేశ్యం .ఈ సంగతి గ్రహించిన కాంతం గారు ‘’ఆ అవి మంచి ముత్యాలే .నాలుగు వేలు పోసికొన్నవి మాయముత్యాలది అవుతుందా వదినా “”అన్నారు .ఇది చూడండి వదినా .ఇది డైమ౦డ్ నెక్లెస్ అంటే మరీ లక్షల ఖరీదు  కాదు .ఏదో పది వేలకే వస్తే మా వారు ఉబలాట పడితే ,మా అన్నయ్య కొన్నాడు ‘’అవతలామెకూ తెలుసు ఇందులోని మర్మం .మరో సారి ఆ షావుకారి భార్య కాంతం గారిని ‘’వదినగారూ!రత్నాలు,కెంపులు  నీరు పడితే మేము కెమికల్ తో శుద్ధి చేస్తాం .మీరేం చేస్తారు?’’అని అడిగితె కా౦త౦ గారికి ఒళ్ళు మండి,తాను అబద్ధాలాడినసంగతి ఆవిడ బయట పెట్టాలని ప్రయత్నం చేస్తోందని  గ్రహించి ‘’ఇవి ఖరీదైన రాళ్ళే అయినా,నీరు పట్టినా ,మాసినా ,వాటిని బాగు చేస్తూ కూర్చోం .అలాంటి వాటిని గోడవతల విసిరేసి పారేస్తాం .కొత్తవి కోనేస్తాం వదినగారూ ‘’అని మూతి మూడు వంకర్లు తిప్పి ఝాడించి చెప్పారు కాంతం గారు అని భర్త మునిమాణిక్యం ఉవాచ .

  కోతలు –కోతలు కూడా ఉత్ప్రేక్షా ? అనే అనుమానం రావచ్చు .కాని తానూ వాటిని ఉత్ప్రేక్షగా మార్చి అందిస్తున్నాను అన్నారు నరసింహారావు జీ .నరస భూపాలీయం లో –నరస భూపాలుడు శత్రువులను సంహరిస్తే,  వాళ్ళ భార్యలు ఏడిస్తే ఆ కన్నీటితో సముద్రాలు నిండి పొంగాయట.ఇది ఉత్ప్రేక్షాలంకారం .వాడుక భాషలో ఇది సొరకాయ కోత అంటాం .మొదటిది కావ్య గంభీరంగా ఉంటె తాను  చెప్పింది హాస్యం తో రామణీయకంగా ఉంది  అన్నారు .రెండిటిలోనూ జరిగింది వాక్ వ్యాపారమే అన్నారు .మనం కూడా ప్రదీప్ లాగా ‘’అంతేగామరి, అంతేగా ‘’అని తలూపాల్సి౦ దేగా .అంతేమరి .

మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో

  సశేషం

 మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-9-22-ఉయ్యూరు  

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

బ్రహ్మ వైవర్త పురాణం .గణపతి ఖండం.3వ భాగం.2.9.22

బ్రహ్మ వైవర్త పురాణం .గణపతి ఖండం.3వ భాగం.2.9.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీహరి సర్వోత్తమ రావు గారి జీవితం,.12వ భాగం.1.9.22

శ్రీహరి సర్వోత్తమ రావు గారి జీవితం,.12వ భాగం.1.9.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ రాఘవ వేంకటేశ్వర బృహత్ శతకం

శ్రీ రాఘవ వేంకటేశ్వర బృహత్ శతకం

శ్రీ మత్తిరుమల రాఘవాచార్య కవి ‘’పెద్దాపురీ వాస ,వేంకటేశ్వర ‘’మకుటం తో 165 సీస పద్యాలతో శ్రీ రాఘవ వేంకటేశ్వర బృహత్ శతకం రచించారు .శ్రీ ఘంటసాల పూర్ణయ్యగారు పిఠాపురం లోని శ్రీ విద్వజ్జన మనోరంజని ముద్రాక్షర శాలలో 1941 న ప్రచురించారు .వేల ఆరు అణాలు .

 కవి గారు సీస పద్యాలలో తన తండ్రి శ్రీ తిరుమల దేశికా చార్య అనీ ,తల్లిగారు రంగాంబ అనీ ,చూడామణి తన భార్య అనీ ,కొడుకు పేరు శ్రీనివాసుడు అని చెప్పారు .తమ్ముడు సీతారామమూర్తి ,అక్కగారు నరసమాంబ .తనపేరు రాఘవాచార్య .షట్ శాస్త్ర ప్రవీణుడు చేవలి సుబ్రహ్మణ్యం గారునూనూగు మీసాల నాడే వైద్యంతో పాటు సంస్కృతం నూరి పోశారు .తమ కుటుంబానికి ఉమా మహేశ్వరం అనే అగ్రహారం ఉంది .పద్నాలుగు ఏళ్ళకే తనను కవితా కన్య పాణి గ్రహణం చేసింది .18వ ఏట భీష్మ సంభవం ,19వ ఏట పార్వతీ వల్లభ శతకం రాసి ,,ఇప్పుడు ఈ ఇరవై రెండవ ఏట  ఈ రాఘవ వేంకాటేశ్వర శతకం సంతరిస్తున్నానని చెప్పుకొన్నారు ,కూచిమంచి తిమ్మన సంస్కృతంలో కుక్కుటేశ్వర శతకం ,ధూర్జటి కాళహస్తీశ్వర శతకం ,భాస్కరుడు భాస్కర శతకం రాసి వన్నె కెక్కినట్లు తానూ ‘’అనవద్యహృద్య పద్య రత్నమాలికల గూర్చంగ నూతన గతులలో ‘ఈ శతకం రాస్తున్నాని స్వామికి నివేది౦చు కొన్నారు .

  గ్రుడ్డులోపల పిల్ల ఎవరి కారుణ్య౦ చక్కగా ఎదుగుతుందో ,ఆకాశం లోఎంతో ఎత్తున ఎగిరే పక్షి మళ్ళీ ఎలా భూమిని ఎవరి కరుణతో చేరుతుందో,కర్మ బంధాలు ఎవని పాద ధ్యానం వలన విచ్చిన్నమవుతాయో అలాంటి ‘’దేవాది దేవా దివ్య ప్రభావ ,ఆది మధ్యా౦తశూన్య లోకైక మాన్య ‘’అయిన వేంకటేశుని నమ్మాను అన్నారు .,లోకంలోని అన్ని విషయాలపై తన ఆవేదన వ్యక్తం చేశారు .ధర్మ దేవత నాలుగు పదాలు విరిగాయని బాధ పడ్డారుకవి .అక్క చేల్లెల్లమధ్య అన్నదమ్ముల మధ్య సఖ్యత కరువైంది .వైష్ణవంలో పుట్టి ,వగలు పోయిన నారి వేశ్యగా మాలజాతిలోపుట్టి ,అగ్రజన్మలో పేద బ్రాహ్మణుడి సొమ్ము హరించిన విప్రునిభార్య కడజాతి కాంతగా,అన్త్యకులం లోపుట్టి సార్వ భౌమి గా ప్రసిద్ధి చెందుతారేమో అని పురాణకధలు వివరించారు  .ఆత్మను తెలుసుకున్నవారికి అందరూ పూజనీయులే .

  విటులను తార్చే వేశ్యకు ,ఒక్క నిమిషం హరిని ధ్యానిస్తే ముక్తికలుగుతుంది .మేకల్నికోస్తూ హరినామ స్మరణ చేస్తే కైవల్యం వస్తుంది కటిక వాడికి.సంసార బంధం లో చిక్కుకున్నా చిత్తం శివునిపై లగ్నం చేస్తే జన్మ సాఫల్యం కలుగుతుంది .గోవింద స్మరణ చేసిన వారందరూ ఇహ పరసౌఖ్యాలు పొందుతారు –‘’కలదు భగవంతు డను నమ్మకంబే చాలు –ప్రజలకెల్లను భ్రుత్యుడై పరగు శౌరి’’అని గ్యారంటీ ఇచ్చారు  .చక్రవర్తికి పుత్ర ప్రేమ ఎంతో ,మాలవాని పుత్ర మమత అంతే.పట్టపురాణిపై  పతికి ఎంత ప్రేమో ,,నిరుపేదకు ఆలి పై ప్రేమ అంతే.సుఖభోగాలు అందరికీ సమానం .పండితుడు ఎలాంటి ఖ్యాతికోరుతాడో ,నోరులేనివాడూ అంతె.అంటూ అన్నమయ్యలాగా చక్కని వేదాంతం చెప్పారుకవి .

  ఎండిన చెట్టు చిగిర్చటం ,పెద్దగా పెరిగిన వృక్షం నేలకూలటం ,పనికి రానివాడే అన్నీ సాధించటం ,మహాబలశాలి కూడా ఒక్కోసారి  ఓడిపోవటం ,పండిన చేను ఒరిగిపోవటం ,మహా విద్వా౦సుడుకూడా ఒక్కోసారి కటిక నెల మీద పడుకోవాల్సి రావటం ,రారాజుకూడా చెయ్యి చాచి బిచ్చం అడుక్కోవాల్సి రావచ్చు .మహా దరిద్రుడు రాజుకావచ్చు .ఏది ఎలా జరుగుతు౦దోఎవరికే తెలీదు –‘’కాక మానదు కానున్న కర్మ ఫలము –సర్వము నీ కృతమే కదా శ్రీనివాసా ‘’అన్నారు .గయ్యాళి భార్యకు భయపడే వారు కులమతాచారాలను వదిలేసిన వారు ,అష్టకష్టాలు పడి పెంచిన తలిదండ్రుల చావు కోరేవారు ,పరము అనేదిలేదని విర్రవీగేవారు ,కుటిలమతులు ఈరోజుల్లో  గడ్డాలుపెంచి సన్యాసులై,అమాయకుల్ని మోసగిస్తున్నారు .కాకిగూటిలో కొంతకాలం ఉంటె కాకి కోకిల అవుతుందా .పాము పడగ విప్పకుండా పడుకొన్నమాత్రాన వానపాము శేషభోగి అవుతుందా ?మట్టి కొట్టుకు పోయిన బొగ్గు మాణిక్యం అవుతుందా ?అని ప్రశ్నించారు .’’మానినీ మణికి మారు మనువులేదు –సతుల విడనాడు పతులకు గతులు లేవు ‘’అని ధర్మ సూక్షం చెప్పారు .

   గార్ధభం అశ్వం ,కాకికోయిల ,ఉల్లి మల్లి ,సింహం నక్క ,ఆవుబర్రే ,నెమలి ఎరికోడి ,బంగారం ,కాకిబంగారం ఒక్కటికావు. దేని స్థాయి దానిదే .నువ్వు ఆకాశం అనటానికి సాక్షి దూర దృష్టికల అనంతుడివిఅవటం ,జలరూపదారి అనటానికి సాక్ష్యం గంగ నీ పాదోద్భవ .పృధ్వీస్వరూపం అనటానికి సాక్షి నీ భార్య భూదేవి కావటం .వాయు స్వరూపానికి సాక్ష్యం భూత పాలన .అగ్ని స్వరూపం అనటానికి సాక్ష్యం నీ విగ్రహం ‘’హాటక చ్ఛవి’’వెలుగు ఉండటం –‘’పంచ భూతములీవ ప్రపంచమీవ .’’అని స్వామిని పంచభూతాత్మకునిగా చక్కగా వర్ణించారు కవి .

 మొదటిపద్యం –‘శ్రీ మీర తిరుపతి క్షేత్రమందు వసి౦చి –మూడులోకమూల నేలు మొదటి వేల్ప –

అజ రుద్రులను గూడ గజగజ లాడించు –దేదీప్యమాన మూర్తి ప్రభావ

పాహిమా యని వేడు ప్రజల బ్రోవగ ధాత్రి –నవతరించిన స్వయం వ్యక్తరూప

నీకు సోదరమూర్తి నీవయైద్వారకా- తిరుపతిబాలించు పరమ పురుష

తండ్రులకు దండ్రివైకుంఠ ధామ నిన్ను –బొగడ బూనితి నా పూర్వ పూజ వలన

నిహపరములిచ్చి మముగావు మి౦దిరేశ-విదిత పెద్దాపురీ వాస వేంక టేశ   –   తో ప్రారంభించి 165వ చివరిపద్యం –

‘’కా౦చ నోజ్వల చేల కారుణ్య మయ శీల –యఖిల కళ్యాణ గుణాల వాల

రక్షితామర గణాధ్యక్ష కౌస్తుభ వక్ష –కమలాయతాక్ష రాక్షస విపక్ష

పరమ భక్తిజ్ఞాన ,పటు నిశ్చలధ్యాన –ఘనజన ప్రత్యక్ష కల్ప వృక్ష

సకలలోకస్వామి జ౦గమమస్థావరాం –తర్యామి గరుడ పత౦గ గామి

చిన్మయానంద లక్ష్మీ విహార –పరమ గుణ సద్మ-భవదీయ పాద పద్మ

సేవకు౦డను ననుగావు దేవ దేవ –విదిత పెద్దాపురీ వాస వేంక టేశ’’అని శతకం ముగించారు శ్రీమత్తిరుమల రాఘవాచార్య కవి .

  ఈశతకం లో భక్తి వెల్లువగా ప్రవహించింది .లోకోక్తి తేజస్సుతో ప్రకాశించింది .నడక కావేరీ ప్రవాహం .శైలి అద్భుతం .అత్యంత రమణీయం .ఈ శతకమూ లోకం దృష్టిలో పడ లేదని పించింది .వైష్ణవం లో ప్రచారం లో ఉందేమో ?మంచిశతకాన్ని కర్త అయిన విద్వత్ కవిని పరిచయం చేసే భాగ్యం నాకు కలిగింది .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -1-9-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

బ్రహ్మ వైవర్త పురాణం.గణపతి ఖండం.2వ భాగం.1.9.22

బ్రహ్మ వైవర్త పురాణం.గణపతి ఖండం.2వ భాగం.1.9.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హరి సర్వోత్తమ రావు గారి జీవితం.11వ భాగం.31.8.22.

శ్రీ హరి సర్వోత్తమ రావు గారి జీవితం.11వ భాగం.31.8.22.

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

బ్రహ్మ వైవర్త మహా పురాణం.గణపతి ఖండం 1వ భాగం.31.8.22

బ్రహ్మ వైవర్త మహా పురాణం.గణపతి ఖండం 1వ భాగం.31.8.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మరి కొందరు నిస్వార్ధ స్వాతంత్ర్య సమరయోధులు -4(చివరిభాగం )

మరి కొందరు నిస్వార్ధ స్వాతంత్ర్య సమరయోధులు -4(చివరిభాగం )

7-శ్రీ మర్ల అప్పయ్య శాస్త్రి

ఒక రోజు రాత్రి  7-30కి నాలుగు లారీలతో యాభై మంది పోలీసులు శ్రీ మర్ల అప్పయ్య శాస్త్రి గారింటిపై దాడి చేశారు .అప్పుడాయన భోజనం భోజనం చేస్తున్నారు .అయ్యే దాకా ఆగకుండా ఆయనపై విచక్షణా రహితం గా లాఠీలతో పోలీసులు విపరీతంగా కొట్టారు .ఆయన స్పృహతప్పి కూలి పోయారు .తలమీద, ఒంటి నిండా గాయాలై రక్తం ప్రవహించింది .ఆయన కుటుంబ సభ్యులను దొడ్లోకి గెంటేసి ,ఇంట్లో ఉన్న 1500రూపాయలు  దోచుకు  పోయారు .బీరువాలలో ఉన్న ఔషధాల సీసాలు బద్దలుకొట్టి వీధిలో పారేశారు .

అప్పయ్య శాస్త్రి గారిని అరెస్ట్ చేసి ,రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ లో పెట్టి ,చాలా రకాలుగా హింసించారు .కనీసం మంచి నీళ్ళు తాగటానికి కూడా వీల్లేకుండా ,ఆయన నోటిలో గుడ్డలు కుక్కారు .కాళ్ళకు చేతులకు సంకెళ్ళు వేసి కొట్లో పడేశారు .ఇలా మూడు రోజులు ఆయన్ను బాధించారు .ఈయన సోదరులను బంధువులపై కూడా లాఠీ చార్జి చేశారు .

8-శ్రీ సామవేదం అచ్యుత రామయ్య

రాజమండ్రి వాస్తవ్యులైన బ్రాహ్మణులు శ్రీ సామవేదం అచ్యుత రామయ్య

గారు .1932లో కర్కోటకుడు ముస్తఫా ఈయనపై చేసిన లాఠీ చార్జి వలన ఆయన చెయ్యి విరిగి పోయింది .

9-శ్రీ వల్లూరి సూర్యనారాయణ రావు

కొవ్వూరులో ప్లీడరయిన శ్రీ వల్లూరి సూర్యనారాయణ రావుగారు సద్గుణ సంపన్నులు .1932లో వీరు రాజమండ్రిలో నెత్తిపై గాంధీ టోపీ పెట్టుకొని వెడుతుంటే ,నర రూప రాక్షస పోలీస్ ఆఫీసర్ ముస్తఫా ఎదురై , టోపీలాగి  పీకిపారేశాడు .దీనిపై సూర్యనారాయణ రావు గారు కోర్టుకు వెళ్లి ,మూడు కోర్టులు తిప్పించి ముస్తాఫాను మూడు చెరువుల నీళ్ళు తాగింఛి ,మొగాడు అనిపించారు .

  వినాయక చవితి శుభా కాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -31-8-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మశ్రీ విద్వాన్ శ్రీ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి సాహిత్య, సామాజిక సేవ వార్తాపత్రికల సంకలనం 132 వ జయంతి కానుక

బ్రహ్మశ్రీ విద్వాన్ శ్రీ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి సాహిత్య, సామాజిక సేవ వార్తాపత్రికల సంకలనం 132 వ జయంతి కాను

క

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ గాడిచర్ల హరి సర్వోత్తమ రావు గారి జీవితం.10వ భాగం.30.8.22

శ్రీ గాడిచర్ల హరి సర్వోత్తమ రావు గారి జీవితం.10వ భాగం.30.8.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మరి కొందరు నిస్వార్ధ స్వాతంత్ర్య సమరయోధులు -3

మరి కొందరు నిస్వార్ధ స్వాతంత్ర్య సమరయోధులు -3

5-శ్రీ రాపాక తిరుపతి రాజు

1904లో రాజోలు తాలూకా పోతవరం లో బ్రాహ్మణ కుటుంబం లో జన్మించిన శ్రీ రాపాక తిరుపతి రాజుగారు 1921నుంచి కాంగ్రెస్ సేవలో ఉన్నారు .ఉద్యమాలలో పాల్గొని జైలుకు వెళ్లి 1921 రాజమండ్రి జైలునుంచి విడుదలయ్యారు .1929లో అఖిలభారత చరఖా సంఘం లో ఉద్యోగం లో చేరారు .1930 ఉప్పు సత్యాగ్రహం లో అయిదారు సార్లు పాల్గొని ,లాఠీచార్జి కి గురయ్యారు .మంచి ఆరోగ్యవంతులు కనుక తట్టుకోగలిగారు .ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ,గాంధీ గారి పిలుపు అందుకొని అనేక సత్యాగ్రహాలలో అకు౦ఠీత  దీక్ష తో పాల్గొన్నారు .

  డాక్టర్ కొరళ్ళ రాజారావు  గారితో కలిసి స్వదేశీ ఉద్యమం ప్రచారం చేస్తూ రామచంద్రాపురం వెళ్ళారు .ఆ రాత్రి ఆయనతోపాటే ఒక సత్రంలో బసచేసి నిద్రించారు .అర్ధ రాత్రి వేళ పోలీస్ ఆఫీసర్ ముస్తఫా పోలీసు బృందంతో వచ్చి ,ముందుగా రాజారావు గారిపై దమనకాండ సాగించి, తర్వాత రాజుగారిపై లాఠీలతో విరుచుకు పడ్డాడు .విపరీతమైన ఆదె బ్బలకు తిరుపతి రాజు గారు నేలపై పడి పోయారు .కనికరం లేని ముస్తఫా తుపాకి బాయి నెట్ తో అయన మోకాలిపై తీవ్రంగా పొడిచాడు .రాజుగారి శరీరంనుంచి రక్తం కాలువ కట్టింది .ఇద్దరు పోలీసులు ఆయన్నులేపి  నిలబెట్టారు .కోపం ,ఉద్రేకం తగ్గని ముస్తఫా ఆయన కుడిజబ్బ పై లాఠీతో బలం గా కొట్టాడు .వాడికున్న అక్కసు అంతాచూపించాడు ఆదెబ్బలో రాజుగారి జబ్బ ఎముక విరిగి పోయింది .ఇంకా కసి తీరక, అరెస్ట్ చేసి రాజుగారిని జైలుకు పంపాడు .ఆరునెలలు బళ్ళారి జైలులో శిక్ష అనుభవించారు .తిరిగి వచ్చి మళ్ళీ దేశసేవ లోనే మునిగిపోయారు శ్రీ రాపాక తిరుపతి రాజు.

6-శ్రీ పోడూరి పేర్రాజు

తారణ నామ సంవత్సరం లో షష్టి పూర్తి చేసుకొన్న శ్రీ పోడూరి పేర్రాజు బ్రాహ్మణులు .కృష్ణా జిల్లా బందరు తాలూకా చిన గొల్లపాలెం లో జన్మించారు .1906వరకు రాజమండ్రి ట్రెయినింగ్ కాలేజి లో చదివి ,వందేమాతరం ఉద్యమం లో చదువు మానేసి ,స్వగ్రామం పోడూరు చేరారు .

  1907లో బొంబాయి వెళ్లి శ్రీ కాశీనాధుని నాగేశ్వర రావు పంతులుగారి అమృతాంజన్ కంపని లో ఉద్యోగం లో చేరారు .1908 లో రంగం అంటే రంగూన్ వెళ్లి,ఒక ఏడాదిగడిపి తిరిగి  స్వగ్రామం చేరారు ,కొన్ని రోజులతర్వాత మళ్ళీ రంగూన్ వెళ్లి ,అక్కడ డబ్బు సంపాదించి అక్కడి రాజకీయాలలో పాల్గొనేవారు .

  మళ్ళీ స్వగ్రామంచేరి ,పెళ్లి చేసుకొని రాజమండ్రిలో కాపురం పెట్టివ్యాపారం చేశారు  .యుద్ధ సమయం లో విపరీతంగా డబ్బు సంపాదించారు .హోం రూల్ లీగ్ లో చేరి ,1919లో వ్యాపారం మానేసి ,గాంధీజీ సత్యాగ్రహ ఉద్యమం లో పూర్తిగా పని చేశారు .నాలుగైదు సార్లు జైలుకు వెళ్ళారు .1930లో రాజమండ్రి నుంచి రాయ వెల్లూరుకు మార్చబడిన ఖైదీలలో శ్రీ వెలిదేండ్ల హనుమంతరావు గారి తో పాటువీరూ ఉన్నారు .

 పొట్టిగా ఉండే పేర్రాజుగారికి పొడవైన దట్టమైన గుబురు మీసాలు ఉండేవి .రాజమండ్రిలో   లాఠీఛార్జి చేసే సార్జంట్ రాజుగారి మీసాలు పట్టుకొని ,’’యు ఆర్ ఎ లిల్లీ పుట్.ఐయాం ఎ లిల్లీపుట్ ‘’అంటూ మీసాలు అటూ ఇటూ లాగి నరకాన్ని చూపించాడు .లాఠీతో వెన్నుమీద ,పిర్రలమీద చావు దెబ్బలు కొట్టాడు .రెండు కాళ్ళూ పట్టుకొని లారీలోకి గిరాటేశాడు .చావుతప్పి కన్ను లొట్ట పోయినట్లు ఆ లారీలో రాయ వెల్లూరు చేరారు .విడుదలైనతర్వాత రాజమండ్రి వచ్చి, మళ్ళీ దేశ సేవకు అంకితమయ్యారు శ్రీ పోడూరి పేర్రాజు.

సశేషం

  రేపు వినాయక చవితి శుభా కాంక్షలతో

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -30-8-22-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

భారతీ నిరుక్తి .45వ చివరి భాగం.30.8.22

భారతీ నిరుక్తి .45వ చివరి భాగం.30.8.22

Video link

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ఇవాళ కాటూరి హై స్కూల్ లో తెలుగు భాషా దినోత్సవం లో నేను

ఈ రోజు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా కడియాల రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కాటూరు నందు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పిల్లలకు పద్య,పాఠన పోటీలను నిర్వహించి తెలుగు భాష ఔన్నత్యాన్ని ,ప్రాముఖ్యాన్ని తెలిపే పలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.ముఖ్య అతిథిగా వచ్చిన ప్రముఖ సాహితీ వేత్త,సాహితీ పోషకులు,విశ్రాంత ప్రధానోపాధ్యాయులు గబ్బిట దుర్గా ప్రసాద్ గారు తెలుగు భాష ప్రాముఖ్యాన్ని తెలియజేసి తన సరస భారతి ద్వారా చేసే సాహితీ సేవలను తెలియజేశారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు బహుమతులను మరియు వారి సాహిత్యాన్ని పాఠశాల గ్రంథాలయానికి అందించడం జరిగింది. కార్యక్రమాలలో ప్రధానోపాధ్యాయిని టి.రమాదేవి తెలుగు ఉపాధ్యాయులు రోజం రాజా,మోకా మాధవరావు లు మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.వివిధ అంశాలలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులను అందజేయడం జరిగింది

Posted in సమయం - సందర్భం | Leave a comment

భారతీ నిరుక్తి .44వ భాగం.29.8.22

భారతీ నిరుక్తి .44వ భాగం.29.8.22

Video link

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హరి సర్వోత్తమ రావు గారి జీవితం.9వ భాగం.28.8.22

శ్రీ హరి సర్వోత్తమ రావు గారి జీవితం.9వ భాగం.28.8.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మరి కొందరు నిస్వార్ధ స్వాతంత్ర్య సమరయోధులు -2

మరి కొందరు నిస్వార్ధ స్వాతంత్ర్య సమరయోధులు -2

3- పోలీసు లాఠీ చార్జి లో  గాంధీ దర్శనం పొందిన మరో వినోబా  డా .కొరళ్ళ రాజారావు

కాకినాడలో వైశ్య కుటుంబానికి చెందిన డా .కొరళ్ళ రాజారావు,మెట్రిక్ పాసై ,గురువులవద్ద సంప్రదాయ బద్ధంగా ఆయుర్వేద విద్య నేర్చారు .బాల్యం నుంచి దేశ సేవ పై అభిలాష ఎక్కువ .1921-22లో కాంగ్రెస్ లో చేరి సేవ చేశారు .1930 ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొన్న 200 మందిలో మొదటివారు శ్రీ బులుసు సాంబమూర్తి గారు కాగ ,రెండవ వారు డా .కొరళ్ళ రాజారావు గారు .గాంధీజీకి వినోబా ఎలాగో బులుసువారికి కొరళ్ళ అలాటి శిష్యుడు ..

  సత్యాగ్రహం తర్వాత కొందరు వాలంటీర్లతో కలిసి రామ చంద్రాపురానికి ప్రచారం కోసం వెళ్లి అక్కడి ఒక ఇంట్లో  లో రాత్రి పడుకొని ఉండగా ,విషయం పసిగట్టిన ముస్తఫా అర్ధరాత్రి ,పోలీసులతో ప్రవేశించి తుపాకి మడమతో రాజారావు గార్ని పొడిచి నిద్ర లేపి  నిర్దాక్షిణ్యంగా లాఠీ చార్జి చేశాడు .రాజారావు గారు ఏమాత్రం భయపడక చలించక అలాగే నిలబడ్డారు .ఆయన్ను కొట్టటానికి నలుగురు రిజర్వ్ పోలీసులను నియమించి  వాళ్ళతో రక్తం ధారగా కారెట్లు  చితక బాదించాడు .అయినా నిబ్బరంగా తక్కుకున్నాడు ఆ వైశ్య ధీర ధైర్య దేశ భక్తుడు .ముస్తాఫాను కొట్టాలంటే రాజారావు గారి కి చాలా తేలికే .అంతటి బలిష్టులాయన .కానీ గాంధీజీ చెప్పిన దౌర్జన్య రాహిత్య తత్వానికి అంకిత భావం తో లోబడి ,ముస్తఫా పై చేయి చేసుకోలేదు .మిగిలిన సత్యాగ్రహులను అందర్నీ ఒక వాయింపు వాయించి మళ్ళీ ముస్తఫా ఈయన దగ్గరకు వచ్చాడు .మళ్ళీ రెండో సారి లాఠీ చార్జి చేశాడు పరమ కిరాతకం గా .అప్పుడు ‘’తనకు గాంధీ మహాత్ముని దివ్య దర్శనం’’ కలిగిందని దేశభక్త డా .కొరళ్ళ రాజారావు గారు చెప్పారట .అప్పటికీ డాక్టరు గారు చలించక పోవటం తో ముస్తఫా మిలిటరీ బూటుతో రాజారావు గారి ఆయువు పట్టుపై అత్యంత బలంగా తన్నాడు .డాక్టర్ గారికి స్పృహ తప్పికింద పడిపోయారు .గిలగిల తన్నుకొన్నారు .అయినా వదలక ఆ నరరూప రాక్షసుడు మళ్ళీ తన్నగా నెత్తురు కక్కుకొన్నారు .రాక్షసానందం తో నవ్వుకొంటూ బలగంతో వెళ్ళిపోయాడు ముస్తఫా .  గ్రామస్తులెవ్వరూఅక్కడికి  వచ్చి ఆయన ముఖమైనా చూడలేదు.  రాజారావు గారిని లెవ తీయనూ లేదు.మంచినీళ్లివ్వ  లేదు భోజనం పెట్టలేదు .అందరూ ముస్తాఫాకు భయపడి ఏరకమైనా సానుభూతి కాని సహాయంకాని ప్రజల ప్రాణాలు కాపాడే అ డాక్టర్ గారికి చూప లేకపోయారు .ఆ రోజు రాత్రి ఎలాగో కాకినాడ చేరారు .అప్పటినుంచి ఆరోగ్యం దెబ్బతిని క్షయవ్యాధి వచ్చింది .కానీ తాను  సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు అవటంతో తగిన మందులు తానె చక్కగా వాడుకొని ఆరోగ్యం పొందగలిగారు .1941లో మళ్ళీ వ్యక్తి సత్యాగ్రహం లో పాల్గొన్నారు రెట్టింపు ఉత్సాహం తో .పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేయలేదు .కొద్ది శిక్ష వేసి వదిలేశారు .

4-అభినవ ప్రహ్లాద శ్రీ కాశీ భట్ట జగన్నాథం  

తూగోజి అమలాపురం తాలూకా కడలి గ్రామ కాపురస్తులు శ్రీ కాశీ భట్ట జగన్నాథం  గారు .వైదీక శోత్రియ బ్రాహ్మణులు.సదాచార  సంపన్నులు  .మొదట్నించి గాంధీజీ ఉద్యమం లో పని చేశారు .ప్రతిగ్రామాన్ని కాలినడకతో తిరిగి గాంధీ సూత్రాలు ప్రచారం చేసిన మహాను భావులు .నిరంతరం రాట్నం పై నూలు వడికే కర్మిష్టి .గాంధీ మహాత్ముడికంటే ఎక్కువ నూలు వడికిన వారుగా జగన్నాథంగారు  అని చెప్పుకొంటారు . .కాంగ్రెస్ సేవ తప్ప వేరే జీవితం లేనివారు .పరాదీనతలో బ్రతకరాదనే సిద్ధాంతాన్ని అమలు చేశారు .గ్రామాలలో వారానికి ఒకసారి జరిగే సంతలకు వెళ్లి అక్కడ ప్రజల్ని సమీకరించి మహాత్ముని సందేశాలు వినిపించేవారు. .

   1932లో అలాగే ఒక ఊరు వెళ్లి ,అక్కడ త్రివర్ణ పతాకం ఎగరేసి ,అక్కడికి అందర్నీ పిలిచి ,గాంధీగారి ఖద్దరు ఉద్యమం గురించి బోధ చేశారు .ఇంతలో ముస్తఫా వచ్చి ఆ జండాను ముక్కలు ముక్కలుగా చి౦పేసి జగన్నాథం గారిని లాఠీ చార్జి చేయించాడు .ఆయన్ను వస్త్ర విహీనుడిని చేసి ,విదేశీ వస్త్రాన్ని ఆయనపైకి విసిరేసి దాన్ని కట్టుకోమని ఆజ్ఞా పించాడు .ససేమిరా కట్టుకోనన్నారు .కోపం నషాళానికి అంటిన ముస్తఫా ఆయన నుంచి ఊడదీసిన ఖద్దరు వస్త్రాలను ఆయన ఎదుటే తగలబెట్టించాడు .మళ్ళీ లాఠీ చార్జి చేయించాడు .తగిలే ప్రతి దెబ్బకు ‘గాంధీ గాంధీ గాంధీ ‘’అంటూ ఆక్రోశించటం తప్ప జగన్నాధం గారు ఏమీ చేయలేక పోయారు పాపం .కిందపడిన ఆయన్నుమట్టిలో పొర్లించాడు . బూటుకాలుతో కసితీరేదాకా తన్నాడు ఆ కంస రూప రాక్షస పోలీసు ఆఫీసర్ముస్తాఫా .ఆయన  గాంధీనామం తప్ప వేరేదీ స్మరించలేదు .ఆయనకున్న జంధ్యం చూసి బ్రాహ్మణుడు అని గుర్తించి కల్లు కుండ తెప్పించి ,నోట్లో కల్లుపోయించే ప్రయత్నం చేయించాడు .ఆయన నోరు తెరవలేదు .ఆ నరాధముడు బాయినెట్ తో నోరు పెకలించి ,కల్లు పోశాడు నోట్లో .వెంటనే జగన్నాధంగారు ప్రక్కకు తిరిగి ఉమ్మేశారు .వాడు ఆయన గుండేపైకి ఎక్కి కూర్చుని ,బాయి నెట్ తో నోరు తెరిచి మళ్ళీ కల్లు నోట్లో పోశాడు .ఆయన మింగక పోవటంతో ఆకు౦డలోని కల్లు అంతా ఆయనపై కుమ్మరించి అక్కసుతో అక్కడినుంచి వెళ్ళిపోయాడు .

  జగన్నాథం గారు నెమ్మదిగా లేచి కూర్చుని నోటిలోఒక్క కల్లు చుక్క కూడా లేకుండా ఉమ్మేసి ,అక్కడి వారు ఇచ్చిన ఖద్దరు తువ్వాలు కట్టుకొని, ఇంటికి వెళ్ళారు ఆ ‘’అభినవ ప్రహ్లాదుడు ‘’జగన్నాధం గారు .కాంగ్రెస్ వారికి ఎన్నికలు వచ్చినప్పుడే ఆయన గుర్తుకు వస్తారు .నిశ్చల దేశభక్తులు అచంచల సత్యాగ్రహి .గాంధీజీ ని మాత్రమె నమ్ముకొన్నఆధునిక  భక్త ప్రహ్లాదుడు ఆయన..డబ్బు కు  ,పదవులకు ,పలుకు బడికి ప్రాకులాడని విశుద్ధ దేశ భక్తులు శ్రీ కాశీ భట్ట జగన్నాధం గారు .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -28-8-22-ఉయ్యూరు 

Posted in మహానుభావులు | Leave a comment

భారతీ నిరుక్తి .43వ భాగం.28.8.22

భారతీ నిరుక్తి .43వ భాగం.28.8.22

Video link

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ గాడి చర్ల హరి సర్వోత్తమ రావు గారి జీవితం.8వ భాగం.27.8.22

శ్రీ గాడి చర్ల హరి సర్వోత్తమ రావు గారి జీవితం.8వ భాగం.27.8.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

భారతీ నిరుక్తి .42వ భాగం.27.8.22గ

భారతీ నిరుక్తి .42వ భాగం.27.8.22గ

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మరి కొందరు నిస్వార్ధ స్వాతంత్ర్య సమరయోధులు

మరి కొందరు నిస్వార్ధ స్వాతంత్ర్య సమరయోధులు

1=శ్రీ వెన్నెటి సత్యనారాయణ

గోదావరిజిల్లా కాతేరు గ్రామవాసి బ్రాహ్మణులు శ్రీ వెన్నెటి సత్యనారాయణ .బియే పాసై రాజమండ్రి వీరేశలింగం హై స్కూల్ ఉపాధ్యాయులుగా పని చేసి ,మానేసి ప్లీడరీ చదివి పాసై ,రామ చంద్రాపురం లో న్యాయవాదిగా పని చేశారు .గాంధీజీ  పిలుపు విని వృత్తివదిలేసి ,ఉద్యమాలలో పాల్గొని 1921-22లో అరెస్ట్ కాబడి జైలు శిక్ష అనుభవించి విడుదలై ,కాంగ్రెస్ లో చేరి ఉప్పు సత్యాగ్రహం లో1930 పాల్గొని రెండవసారి జైలుకు వెళ్ళారు .1932లో ముస్తఫా క్రూరానికి బలై,చెరసాలపాలై , ,విడుదలై గాంధీ గ్రామ పునర్నిర్మాణం లో చురుకుగా పాల్గొని ,గృహ పరిశ్రమలకు ,ఖద్దరు ఉత్పత్తికి పాటు పడ్డారు .డా జోశ్యుల సుబ్రహ్మణ్యం గారి తర్వాత ఈయన్నే ఎక్కువగా టార్గెట్ చేసి ముస్తఫా లాఠీలతో బాధించాడని   రాజమండ్రి పురవాసులు చెప్పుకొంటారు .

2-శ్రీ నాళ౦ భీమరాజు

రాజమండ్రిలో ప్రసిద్ధ వైశ్య కులం లో జన్మించిన శ్రీ నాళం భీమరాజు గారు మహాసాహసి ,పిరికితనం అంటే ఏమిటో తెలియని ధీరుడు .1930ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొని జైలుకు వెళ్లి వచ్చారు .1930 డిసెంబర్ లో జరిగిన పెద్దాపురం తోట విందుఏర్పరచిన వారిలో ఒకరు .

  ఆ రోజు తోట విందు పూర్తయ్యాక మధ్యాహ్నం 2-30కి పోలీ సులు లాఠీ లతో వస్తున్నారన్నవార్త తెలిసి ,అందరూ చెదిరి పారిపోదామని భావించగా భీమరాజు ఒక్కరే పారిపోవటం పిరికి తనం పారిపోకూడదని పట్టు బట్టగా ,అరగంటలోపే పోలీసులు వచ్చి చితక బాదేశారు అందర్నీ .కోదేటి రంగా చార్యుల చెయ్యి విరగ గొట్టారు .అది మళ్ళీ అతుక్కోలేదు .1937లో చనిపోయాడు .1932లో డా సుబ్రహ్మణ్యం గారితోపాటు భీమరాజుగారినీ పోలీసులు బాదిపారేశారు .భీమరాజును అరెస్ట్ చేశారు విడుదలై ,హార్ట్ అటాక్ తో చనిపోయారు .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -27-8-22-ఉయ్యూరు   —

Posted in మహానుభావులు | Leave a comment

భారతీ నిరుక్తి .41వ భాగం.27.8.22

భారతీ నిరుక్తి .41వ భాగం.27.8.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

కు ”బ్రహ్మ వైవర్త మహా పురాణం -గణపతి ఖండం

భారతీ నిరుక్తి తర్వాత ?

 శ్రీ హరి సోదరులు రచించిన భారతీ నిరుక్తి ,ఈ రోజు ఉదయం 10గంటలకు ,,సాయంత్రం 4గంటలకు కూడా ప్రసారం చేసి 30వ తేదీ మంగళవారం ఉదయం తో పూర్తీ చేస్తున్నాము .

31-8-22 బుధ వారం శ్రీ వినాయక చవితినాడు సాయంత్రం 4 గంటలకు ”బ్రహ్మ వైవర్త మహా పురాణం -గణపతి ఖండం ”ప్రారంభి౦చి ,మర్నాడు 1-9-22గురువారం నుంచి ఉదయం 10 గంటలకు ప్రత్యక్ష ప్రసారం చేస్తాము .వినాయక చవితి శుభా కాంక్షలతో -గబ్బిట దుర్గా ప్రసాద్ -27-8-22

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ గాడిచర్ల హరి సర్వోత్తమ రావు గారి జీవితం.7వ భాగం.26.8.22

శ్రీ గాడిచర్ల హరి సర్వోత్తమ రావు గారి జీవితం.7వ భాగం.26.8.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

స్వాతంత్ర్య విప్లవ కారులకు సహాయ,సహకారాలు అందించిన  వంగల వెంకట నారాయణ దంపతులు .

స్వాతంత్ర్య విప్లవ కారులకు సహాయ,సహకారాలు అందించిన  వంగల వెంకట నారాయణ దంపతులు .

 వైదీక తెలగాణ్య శాఖకు చెందిన వంగల వెంకట నారాయణ అత్తిలి వాస్తవ్యులు  రసాయన శాస్త్రం లో బి ఏ పాసై ,పాండిత్యం సంపాదించారు .వీరికున్న అభినివేశం ,ఉత్సాహం ఎవరికీ లేదు ., వెంకట నారాయణ ,తమ్ముడు శివరాం కూడా ఇలాంటి వారే ..లక్నో యూని వర్సిటిలో గొప్ప పదవులలో ఉన్నారు .కృష్ణా పత్రిక సంపాదకులు శ్రీ ముట్నూరి కృష్ణా రావు గారి కుమార్తె ను శివరాం గారు వివాహం చేసుకొని ,యూరప్ అమెరికాలకు వెళ్లి విజ్ఞాన ఖనులుగా గుర్తింపు పొందారు .

  వెంకట నారాయణ గారు బియేపాసై ఉపాధ్యాయ వృత్తి లో చేరి ,రెండేళ్ళు పని చేసి జపాన్ వెళ్ళారు .అక్కడ  రసాయన శాస్త్రం లో నిష్ణాతులయ్యారు .ఆదేశాలు స్వేచ్చా స్వాతంత్రాలతో వర్దిల్లటం కనులారా చూసి ,తన మాతృభూమి భారత దేశం పరదేశ దాస్య శ్రుంఖలాలలో  బంధింప బడటం తట్టుకోలేక పోయారు .

  1905-06లో ఇండియాకు తిరిగి వచ్చిన వెంకట నారాయణ గారు  వివాహం చేసుకొని రాజమండ్రి లో స్థిర నివాసం ఏర్పరచుకొన్నారు .అప్పటినుంచి ఆంద్ర తొలిలి విప్లవవీరుడు ఎర్రమిల్లి జగ్గన్న శాస్త్రి గారితో గొప్ప పరిచయం ఏర్పడింది .శాస్త్రిగారు రాజకీయం లో ప్రవేశించగానే వంగల వారు ఆయనకు కుడిభుజంగా నిలిచారు .అత్యంత రహస్య విషయాలు సేకరిస్తూ శాస్త్రి గారికి అందిస్తూ ,కావలసిన అన్ని విధాల సాయం అందించారు .

  ఆరోజుల్లో వెంకట నారాయణ గారి ఇల్లు రాజమండ్రి లో తీవ్ర రాజకీయ ఆందోళనలకు నిలయంగా ఉండేది .ఎవరు ఏ విషయం మాట్లాడాలన్నా వెంకట నారాయణ గారింటికే వచ్చి మాట్లాడే వారు .ఎవరెవరు పోలీసు వారంట్ తప్పించుకోవాలన్నా వంగల వారింటికే చేరేవారు .వెంకట నారాయణ దంపతులు అందరికి చక్కని వసతి భోజనాలు సమకూర్చేవారు .వెంకట నారాయణ గారు వారికి గొప్ప సలహాదారు గా మాత్రమె ఉన్నారు .కానీ సాహసించి ముందు అడుగు వేయలేదు .

   కానీ ఆయన భార్య అలాకాదు .ఆకాలం లో విప్లవకారులతో దీటుగా పని చేసేవారు .పోలీసుల ఎర్ర టోపీ చూసి భయపడే ఆకాలం లో ఆమె ధైర్య సాహసాలతో ,ఉత్సాహం గా ముందుకు వచ్చి భారత స్వాతంత్ర్య విప్లవానికి సాటిలేని సహాయం చేసేవారు .ఎవరికీ ఏ వార్త చేరాలన్నా, ఆమె ద్వారానే చేరేది అలాంటి’’ కీ రోల్ ‘’పోషించారామే .రకరకాలుగా దుస్తులు మార్చుకొని ,వేషాలు వేసుకొని పోలేసుల కళ్ళు కప్పి ,విప్లవ కారులకు గొప్ప సాయం చేసేవారు .ఆకాలం లో రాజమండ్రి లో అంతటి సాహసం చేసి౦ది వెంకట నారాయణ గారి భార్య ఒక్కరే .

  ఒక రోజు దొరసాని వేషం తో గోదావరి స్టేషన్ లో దిగిన ఆమె ను పోలీసులు వెన్నంటారు .రెండు మూడు సందులు దాటి మాయమయ్యారామె .పోలీసులకు ఆమె దొరకలేదు ఎంత ప్రయత్నం చేసినా ..అప్పుడామే సరాసరి’’జాతీయ నాయకులు ‘’పుస్తక రచయిత ,జగ్గన్న శాస్త్రికి కుడిభుజం  కోటమర్తిచినరఘు పతి గారింటికి వెళ్లారు .ఆయన తల్లి సోదరి ఆమెను ఆశ్చర్యంగా చూసి ‘’అమ్మా ఇదేమిటి ?’’అని అడిగితె మాట్లాడ వద్దని సౌజ్ఞ చేసి ,లోపలి వెళ్లి దొరసాని వేషం తీసేసి .ముఖానికి పసుపురాసుకొని స్నానం చేసి ,పట్టు చీర పట్టు జాకెట్ ధరించి,నుదుటిపై కాణీ అంత కుంకుమ బొట్టు తలలో పూలు ధరించి  ,పళ్ళెం లో పూలు ,పళ్ళు పెట్టుకొని ,చేతిలో చెంబు నీళ్ళు పట్టుకొని ,అతి శాస్త్రోక్తంగా రఘుపతి గారిచ్చిన రహస్యమైన జాబులు మొలలో దాచుకొని ,సరాసరి గుడికి వెళ్లి ,అక్కడినుంచి బండి కట్టించుకుకొని ఇంటికి చేరారు .భర్త వెంకట నారాయణ గారు ‘’ఎప్పుడు వచ్చావు ?ఈ వేషం ఏమిటి ?’’అని అడిగితె ,ఆమె దొరసానివేషం తో తన పుట్టిల్లు అయిన రఘుపతి గారింటికి వెళ్లి ,అక్కడినుంచి తాను  తెచ్చిన రహస్య ఉత్తరాలను భర్తకు అందజేశారు .ఇంతటి ధైర్య సాహసాలతో స్వాతంత్ర్య సమరానికి రహస్యంగా తోడుపడిన ఏకైక ఆంద్ర మహిళ వెంకట నారాయణ గారి భార్య ,రఘుపతి గారి సోదరి 1914లో బొంబాయిలో మరణించారు .ఆమె పేరు కూడా మనకు తెలీదు .

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-8-22-ఉయ్యూరు

  భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ సంవత్సరంలో శ్రీ వంగల వెంకట నారాయణ  దంపతులను పరిచయం చేయటం మహదానందంగా ఉంది .

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-8-22-ఉయ్యూరు–

Posted in మహానుభావులు | Leave a comment

  మా నాన్న గారి నవ్యజ్యోతి మాసపత్రిక

  మా నాన్న గారి నవ్యజ్యోతి మాసపత్రిక

 మా నాన్న గారు విద్వాన్ శ్రీ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి గారు అనంతపురం జిల్లా హిందూపూర్ లో ఎడ్వర్డ్ కారోనేషన్ మునిసిపల్ హైస్కూల్ (ఇ.సి.ఎంహైస్కూల్ )లో సేనియర్ తెలుగు పండిట్ గా 1931 నుంచి 1953వరకు పని చేసినపుడు  ‘’నవ్య జ్యోతి ‘’మాస పత్రిక కు సంపాదకులుగా ఉంటూ వెలువరించారని  నాకు ఇంతవరకు తెలియదు .దీని విషయం శ్రీ ఆశావాది ప్రకాశరావు గారు  రాయల సీమ లో వెలువడిన పత్రికల గురించి సేకరించివిషయాలను  తెలుగు అకాదేమికి అందించినట్లు ,ఇవాళ మా అబ్బాయి శర్మ సేకరించి పంపగా తెలిసి మహా సంతోషం పొందాను .వాడికి అభినందనలు  -దుర్గాప్రసాద్ -26-8-22-ఉయ్యూరు 

Page Number 445 : https://ia801604.us.archive.org/8/items/in.ernet.dli.2015.489107/2015.489107.Telugulo-Parishodhana.pdf

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

హరిజనోద్ధరణ చేసిన రాజమండ్రి మున్సిపల్ చైర్మన్ ,జాతీయ సత్యాగ్రహి,ఉత్తమ ప్రజాసేవకులు  డా. శ్రీ పాలకొడేటి గురు మూర్తి -2(చివరిభాగం

హరిజనోద్ధరణ చేసిన రాజమండ్రి మున్సిపల్ చైర్మన్ ,జాతీయ సత్యాగ్రహి,ఉత్తమ ప్రజాసేవకులు  డా. శ్రీ పాలకొడేటి గురు మూర్తి -2(చివరిభాగం

 ఇందులో మొదటి భాగం చదివిన శ్రీమతి క్రష్ణమయిగారు వెంటనే స్పందించి అమెరికా నుంచి మెయిల్ లో తాను  పాలకొడేటి గురుమూర్తిగారికి మనవరాలు అంటేకుమారుని కుమార్తెఅని తెలియ జేశారు .ఈమె నాకు ఎలా పరిచయం అంటారా ?ఆమె భర్త ప్రఖ్యాత అణుశాస్త్రవేత్త ,117వ మూలకం టేన్నిస్సిన్(Tn)ను ఆవిష్కరించిన మహా శాస్త్రవేత్త శ్రీ ఆకునూరి వెంకట రామయ్య గారిపై నాతొ మా మైనేని గోపాల కృష్ణగారు ‘’అణుశాస్త్ర వేత్త డా .ఆకునూరి వెంకట రామయ్య ‘’పుస్తకం రాయించి సరసభారతి తరఫున ప్రచురించారు .ఆసమయం లో రామయ్యగారితో, ఈమె గారితో ఎన్నో సార్లు ఫోన్ లో మాట్లాడి విషయ సేకరణ చేశాను .ఇప్పటికే తరచుగా ఫోన్ చేసి ఆదంపతులు మాట్లాడే సౌజన్యమూర్తులు ఆ దంపతులు  .మన సరసభారతి ని ఆమె రోజూ చదువుతారు .శ్రీ సువర్చలాంజనేయ స్వామి దేవాలయం కార్యక్రమాలు చూస్తారు ,స్పందిస్తారు .ఇంకో విషయం నేను రామయ్య గారిపై రాసిన పుస్తకం అమెరికాలో టెన్నిసీ రాష్ట్రం లో రామయ్య గారింట్లోనూ ,స్పాన్సర్ శ్రీ మైనేని గారుండే అలబామా రాష్ట్రం లోని హ౦ట్స్ విల్ దగ్గరున్న మాడిసన్ కౌంటి లోను ,మూడవసారి ఉయ్యూరులో  సరసభారతి  ఉగాది వేడుకలలో రామయ్య దంపతుల బంధుగణం సమక్షం లో శాసన మాండలి సభ్యులు శ్రీ వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరించి హాట్రిక్ సాధించారు .అంతేనా ?ఈ సంవత్సరం సరసభారతి సాహితీ పుష్కరోత్సవం మా సహస్ర చంద్ర మాసోత్సవం నాడు 27-6-22 సోమవారం  శ్రీ మైనేని దంపతులు ఆపుస్తకానికి ఇంగ్లీష్ అనువాదం చేయించి Nuclear Scinntist  ’’Dr.Akunuri Venkataramayya ప్రచురించగా  నాలుగో సారి రాజేంద్ర ఆవిష్కరించి అరుదైన రికార్డ్ సృష్టించారు .

 శ్రీమతి కృష్ణ మయి గారు మెయిల్ లో తెలియ జేసిన విషయాలు –తనమూడవ ఏట తాతగారు గురు మూర్తిగారు మరణి౦చారని ,కనుక తనకు వారితో ప్రత్యక్ష పరిచయం  లేదని ,ఆయనకు స్వంత ఇల్లు కూడా లేదని ,కస్టపడి సంపాదించి రాజమండ్రిలో స్వగృహం నిర్మించుకోన్నారని ,కో ఆపరేటివ్ బాంక్ ను రాజమండ్రిలో స్థాపించిన ఘనత వారిదే అని చెప్పారు .ఆ బ్యాంక్ వజ్రోత్సవ అంటే 75 వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించి ఫాదర్ డా.రాం బాబు గారిచే సన్మాన౦చినపుడు తానుకూడా హాజరయ్యానని తెలియజేశారు .పేపర్ వార్తలనుబట్టి గురుమూర్తిగారి 1884లో జన్మించారనీ ,ఆంధ్ర దేశం లో సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి దిట్ట గా గుర్తి౦పు పొందారని ,మునిసిపల్ చైర్మన్ గా ఆదర్శ వంతగా పరిపాలించారని ,స్వాతంత్ర్య ఉద్యమం లో పాల్గొని జైలుకు వెళ్ళారని ,హరిజన సీవ లో తరించారనీ ,రాజమండ్రిలో మొట్టమొదటిసారిగా ఆయుర్వేద మునిసిపల్ ఆస్పత్రి నిర్మించినఘనత తాతగారిదే అని చెప్పారు .తాతగారి ఫోటో కూడా పంపి వ్యాసానికి నిండుదనం చేకూర్చారు 

Posted in మహానుభావులు | Leave a comment

భారతీ నిరుక్తి 40 వ భాగం.26.8.22

భారతీ నిరుక్తి 40 వ భాగం.26.8.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హరి సర్వోత్తమ రావు గారి జీవితం.6వ భాగం.26.8.22

శ్రీ హరి సర్వోత్తమ రావు గారి జీవితం.6వ భాగం.26.8.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ఆదర్శ వైద్యుడు ,ఉప్పు సత్యాగ్రహి డా వెలిదండ్ల హనుమంతరావు

ఆదర్శ వైద్యుడు ,ఉప్పు సత్యాగ్రహి డా వెలిదండ్ల హనుమంతరావు

బెజవాడకు చెందినా వెలిదండ్ల హనుమంతరావు సంపన్న బ్రాహ్మణులు .B.A.,L.M. అండ్ Sపాసైన డాక్టర్ .నెలకు కనీసం వెయ్యి రూపాయల ఆర్జన .1930లో గాన్దీజే ఉప్పు సత్యాగ్రహ పిలుపు విని రాజకీయ వాలంటీర్ గా పశ్చిమ కృష్ణా లో ఉప్పు సత్యాగ్రహం రెండవ బాచ్ కు నాయకత్వం వహింఛి జైలుకు వెళ్ళాడు .బెజవాడలో అరెస్ట్ అయి ఏప్రిల్ లో రాజమండ్రిజైలులో శిక్ష అనుభవించాడు .ఖైదీలకిచ్చే బియ్యం లో పురుగులు ఉండటం తో భోజనం పై అసహ్యం కలిగి పస్తులే ఉన్నాడు .ఖైదీలలో ఐక్యత సాధించి వారితో ఉదయమిచ్చే గంజి త్రాగటం మాన్పించాడు .జైలు సూపరిన్ టే౦డెంట్ రికర్వ్ పోలీసులను పిలిపించి ,ఖైదీలు ఎందుకు గంజి తాగటం లేదో ఆరా తీయించాడు .హనుమంతరావు గంజిపై తేలిన పురుగులన్నిటిని చూపించాడు .జైలర్ బియ్యం బాగు చేయిస్తామని చెప్పి ,కొందరు ఖైదీల నంబర్లు నోట్ చేసుకొని ఆ రాత్రికి రాత్రే 50మంది సిక్లాస్ ,9మంది బి.క్లాస్ ఖైదీలను రాయవెల్లూరు జైలుకు పంపించాడు .ఇందులో 49మంది తూర్పు గోదావరి జిల్లావారే .మరుసటి వారం మరో బాచ్ బిక్లాస్ ఖైదీలను పంపాడు వీరికి నాయకుడు వెలిదండ్ల హనుమంతరావు .

వీరని అర్ధరాత్రి 12గంటలరైల్ లో తీసుకొని వెళ్ళారు .ముస్తాఫాలీ తో సహా పోలీసు లారీలు సిద్ధం చేశారు .ఒక్కొక్కరినే పిలిచి కిందకు దిగగానే పోలీసులు ,సార్జేంట్లు ఖైదీలపై హత్యాకాండ సాగించారు .ఒకపోలీస్ హనుమంతరావు వీపుపై బలంగా గుద్దగా,ఆయన కింద పడి పోయాడు .ఒక సార్జంట్ ఆయన్ను లాతీ తో విపరీతంగా బాదేశాడు .ఒకపోలీసు ఆయన సామాన్లు పగలకొడితే ఇంకోడు ఆయన పుస్తకాలు చిన్చిపారేసి పైశాచికానందాన్ని పొందారు .రావు గారు స్పృహ కోల్పోయారు .,ఆయన కాళ్ళు చేతులు పట్టుకొని బస్సు వైపుకు ఈడ్చారు .అందరికి ఇదే శాస్తి .ఒక్కొక్కర్నీ బస్సులోకి గిరాటు వేసి వెన్నుపై లాఠీ తో పొడిచి ,లోపలి తోసి ఆతర్వాత రైలు లోనూ ఇలానే ప్రవర్తించారు .రాయ వెల్లూరు లో దిగగానే కొంత చికిత్స చేయించారు .

ఆ దెబ్బల వలన హనుమంతరావు గారి ఊపిరి తిత్తులు బాగా దెబ్బ తిన్నాయి .క్షయ వ్యాధి కలిగింది .ఆయన మళ్ళీ లేచి తిరగలేదు .రాయవెల్లూరు వెళ్ళిన రెండు మూడు రోజులకే ఆయన బంధువులు ,ఆయన చనిపోయారనే గాలి వార్తా విని కంగారుగా బెజవాడ నుంచి చూడటానికి వచ్చి,ఆయన్ను హాస్పిటల్ లో చూసి వెళ్లి పోయారు .జైలు నుంచి విడుదలై బేజా వాడ చేరినా ఆయన ఆరోగ్యం కుదుట బడలేదు .ఇంతటి అనారోగ్యంగా ఉన్న తన తో పాటు విడుదల అయిన ఖైదీల ఇళ్ళకు వెళ్లి ,ఉచితంగా పరీక్షించి మందులిచ్చి వచ్చేవారు .అంతటి నిరాడంబరుడు త్యాగి డా వెలిదండ్ల హనుమంతరావు గారు 1934లో చనిపోయారు .

డాక్టర్ వెలిదండ్ల హనుమంతరావు గారు డా వెలిదండ్ల హనుమంతరావుగారిని గూర్చిఇంటరనెట్లో ఎక్కడా కనపడలేదు. వారిని గూర్చి విజయవాడలో ఇప్పటికీ చాల గొప్ప వైద్యులని చెప్పుకుంటారు. వారి పేరున కట్టిన లైబ్రరీ విజయవాడలో ఇంకా ఉంది. 1930 లో వీరుస్వతంత్ర పోరాటములో జైలుకి వెళ్లి పోలీసుల లాఠీల దెబ్బలు తిన్నారనీ దాంతో వారి ఆరోగ్యంచెడి అకాల మరణం పొందారని శివరావు గారి నోట్సును బట్టీ, 1980 లో విజయవాడలో జరిగిన సభ కరపత్రంరం ఒకటి కనబడటం వలన తెలియ వచ్చింది.

అక్టోబరు ఇరవై తారీఖు 1980 విజయవాడలో వెలిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయ ప్రాంగణంలో కాట్రగడ్డ నారాయణరావు అధ్యక్షతన వెలిదండ్లహనుమంతరావుగారి 49 వ వర్ధంతి సభ జరిగింది. ఆరోజు సభ ప్రారంభకులు తుర్లపాటి కుటుంబ రావుగారు. వక్తలు కాట్రగడ్డ మధుసూదన రావు, దిగవల్లి వేంకట శివరావు, కోగంటి గోపాల కృష్ణయ్య, వెనిగళ్ళ వెంకటేశ్వరావు, పెనమకూరు కేశవరావు గార్లు. వెలిదండ్ల హనుమంతరావుగారిని గూర్చిశివరావుగారి నోట్సులో ఇలా వ్రాశారు “యశః కాయులైన శ్రీ డాక్టరు వెలిదండ్ల హనుమంతరావుగారును నేనూ చిన్నప్పటి స్నేహితులము. ఆయన చాల తెలివైన వాడు. తన 13 వ ఏట నే మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడై బి.ఎ పట్టాను పొందిన తరువాత చెన్నపట్ణంలోని వైద్య కళాశాలలో చేరినారు. నేను ప్రసిడెన్సీ కాలేజీలో చదువుతున్నాను. మేముభయులము 1918 నుండి 1920 వరకు చెన్నపట్ణం లోని విక్టోరియా హాస్టల్ అనే విద్యార్థి వసతి గృహములో నుండేవారము. ఆయన స్పురద్రూపి సుకుమారి మితభాషి. స్నేహితులెవ్వరైననూ పలకరిస్తే చిరునవ్వు నవ్వే వాడు. ఎక్కువమందితో స్నేహం చేసేవారు కాదు. నీతినియమాలు కలవారు. ఆకాలంలో మద్రాసుమెడికల్ కాలేజీ ప్రిన్సిపాలు, ప్రొఫెస్సర్లు మిలిటరీ హోదాలు గల I.M.S శాఖకు చెందిన బ్రిటిష్ ఉద్యోగులు. వారు నిరంకుశులు. కొంతమంది అవినీతపరులు. దేశీయ విద్యార్థి ఎంత తెలివైనవాడైనా వారినాశ్రయించకపోతే పరీక్షలలో తప్పించేవారు. చివరి పరీక్ష అనంతరం ఎం బీ బి యస్ డిగ్రీ నివ్వక L.M &S అను తక్కువ హోదా గల పట్టానిచ్చేవారు. హనుమంతరావుగారు మొదటినుండీ ఆత్మగౌరవం గలవారు ఒకరినాశ్రయించే స్వభావము లేదు అందువల్ల ఆయనకు L.M &S పట్టామాత్రమే లభించింది.

ఆయన ప్రభుత్వోద్యోగము నపేక్షించక బెజవాడలో స్వతంత్రజీవనం చేయదలచి 1922 సంవత్సరంలో ప్రాక్టీసు ప్రారంభించారు. త్వరలోనే గొప్ప వైద్యుడని నీతి పరుడని పేరు పొందినారు. సాధారణంగా ఒక డాక్టరు ఇంకకొకరిని ప్రోత్సహించరు. హనుమంతరావుగారిది విశాల హృదయం. మా మిత్రుడు డాక్టరు చాగంటి సూర్యనారాయణ మూర్తిగారు 1924 సంవత్సరంలో ఎంబి బియస్ పరీక్ష ఉత్తీర్ణులై ఎక్కడ ప్రాక్టీసు పెడదామా అని ఆలోచిస్తూ వుంటే హనుమంతరావుగారాయనకు బెజవాడలో ప్రాక్టీసు పెట్టమని ప్రోత్సహించారు. నేను 1922 సంవత్సరంనుండీ బెజవాడలో న్యాయవాదిగా నున్నాను మేము చాల స్నేహంగా నుండేవారము. 1930 సంవత్సరం వరకూ హనుమంతరావుగారికి రాజకీయాలతో సంబంధంలేదు. గాంధీమహాత్ముడు ఉప్పుసత్యాగ్రహ ఉద్యమంప్రారంభించగనే ఒకరోజు సాయింత్రం నాథగ్గరకు వచ్చి తాము సత్యాగ్రహ ప్రమాణపత్రిక పైన సంతకం చేశానని చెప్పి రాజకీయ చరిత్ర గ్రంథాలను తీసుకుని వెళ్ళారు. ఆయన తన వైద్య వృత్తిని విసర్జించి సత్యాగ్రహదళమునకు నాయకత్వం వహించి 18 నెలలు కఠిన శిక్ష పొందారు. ఆయనకు శక్షవిధించిన సబు కలెక్టరు హెజమాడీగారికే ఆయన డాక్టరుగానుండిరి. హనుమంతరావుగారికి బి క్లాసు ఖైదీనిచ్చినా ఆయన సి క్లాసు ఖైదీగానే కఠిన నియమాలు పాటించి జైలులోని అక్రమాలు ప్రతిఘటించి లాఠీ దెబ్బలకు గురియైనారు. ఆ దెబ్బల ఫలితంగా ఆరోగ్యం పాడైనది. ఆయనకు జ్వరం వస్తూ వుండేది అయినా లెక్క చేయక జైలులోని కఠిన నియమాలను తు ఛ తప్పక పాటించేవారు. గాంధీ ఇర్విన్ రాజీలో 1931 మార్చిలో విడుదలైవచ్చిన తరువాత ఎండలో విదేశ వస్తు దుకాణాల వద్ద పికెటింగ్ చేశేవారు. ఆయన ఆరోగ్యం చెడి క్షయవ్యాధికి గురియై 1931 అక్టోబరు 20 తేదీ అకాల మరణం పొంది యశః కాయులైనారు.

1933 నేను నా మిత్రుడు చెరుకుపల్లి వెంకటప్పయ్య కలిసి రచించిన అధినివేశ స్వరాజ్యము అను రాజ్యాంగ శాస్త్ర గ్రంథమును హనుమంతరావుగారికి బహిరంగ సభలో అంకితం చెశాము. ఆసభకు దేశ భక్త కొండా వెంకటప్పయ్య గారు అధ్యక్షత వహించారు. ఆ అంకితంలో హనుమంతరావుగారిని స్మరించాము” అని శివరావు గారు నోట్సులో వున్నది. ఇంతే కాక శివరావు గారి”Family History and Diary of chronological events” అను పెద్ద డైరీలో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం రోజులలో బెజవాడలో జరిగిన ఆందోళన గురించి వ్రాశారు మహాత్మా గాంధీజీ ఇచ్చిన ఉప్పు సత్యాగ్రహ పిలుపుతో బెజవాడ నుండి 11/04/1930 నాడు మొదటి విడతగా గంపలగూడెం కుమారరాజా గారి ఆధర్యాన బందరు దగ్గర చిన్నపురం బయలు దేరి వెళ్లారు. డా ఘంటసాల సీతారామ శర్మ గారు కూడా మొదటి విడతలో వెళ్లారు. 14/04/1930 తారీఖునాడు డాక్టరు వెలిదండ్ల హనుమంతరావు గారు డాక్టరు ఘంటసాల సీతారామశర్మ గారు కలసి రెండో విడతలో బెజవాడలో కాలి నడకన రైలు స్టేషన్ కు వెళ్లి రైలులో బందరుకు వెళ్లారు. ఆ రాత్రి బందరులో డా భోగరాజు పట్టాభి సీతారామయ్య గారింటి వద్ద బస చేసి మర్నాడు ఉదయం కాఫీ లైన తరువాత బయలు దేరి ముగ్గురు డాక్టర్లు కలసి చిన్నపురం సముద్రతీరంకి వెళ్లి అక్కడ ఉప్పు తయారు చేశారు. అట్లా చేసిన ఉప్పును తీసుకుచ్చి బందరు టౌనులో అమ్మకం చేసి బ్రిటిష్ వారి ఉప్పు చట్టమునుల్లఘించినందున పోలీసు వారిచే అరెస్టు చేయ బడి మెజస్ట్రేటు కోర్టులో హాజరు పరచటం వారికి జైలు శిక్షపటం జరిగింది. 19/04/1930 నాడు నందిగామ బ్యాచ్ అయ్యదేవర కాళేశ్వర రావుగారి ఆధ్వర్యంలో చిన్న పురంలో ఉప్పు తయారు చేయటానికి మచిలీ పట్టణం వెళ్లారు. తత్ఫలితముగా 28/04/1930 నాడు కాళేశ్వరావారుగారికి కారాగార శక్ష విధిచారు. మెదటి బ్యాచ్ లో ఉప్పుచేసిన వారికి అప్పటికే జైలులో నిర్భందిచ బడిన వారైన కుమారాజా గారిని జైలునించి తీసుకుచ్చి కోర్టులో హాజరు పరచారు. ముద్దాయిగా వచ్చిన కుమార రాజాగారికి గౌరవచిహ్నంగా ఆసమయంలో కోర్టు హాలులోనున్న వకీళ్ళందరూ ( ప్లీడర్లందరూ) లేచి నిలబడటంతో ఆకోర్టులోనున్న మాజిస్ట్రేటు నిశ్చేస్టుడై వెలవెల పోయాడు. ఆసమయంలో శివరావుగారు కూడా కోర్టులోనే ఉన్నారు. కుమార రాజాగారికి శివరావు గారే అమికసే క్యూరీగా పనిచేశారు. శివరావు గారి మీద 1930 లో వచ్చిన మొదటి రాజద్రోహం కేసు నంబరు 46, 1930 కేసులో 1930 సెప్టెంబరు 12 వ తారీఖునాడు సర్కిల్ ఇన్ స్పెక్టరు స్వామి గారిచ్చివ వాగ్మూలాన్ని బట్టి స్వతంత్ర ఉద్యమాల్లో పోలీసు వారిచే అరెస్టు కాబడిన చాల మంది ప్రముఖ కాంగ్రెస్ నాయకులను కోర్టులో హాజరు పరచిన ప్పుడు శివరావు గారే కోర్టు వారి అనుమతితో అమికస్ క్యూరి [ అంటే ప్రత్యర్థి తరఫు వకీలు, defendant lawyer ]గా వుండేవారని తెలుస్తున్నది. వెలిదండ్ల హనుమంతరావుగారికి కూడా శివరావుగారే అమికస్ క్యూరీగా నుండియుండవచ్చు. 08/05/1930 నాడు బెజవాడలో డా వెలిదండ్ల హనుమంతరావు గారి ఆధ్వర్యాన్న ఉప్పుసత్యాగ్రహ ఉరేగింపు జరిగింది. అందులో చాలమంది పురప్రముఖలు కూడా వున్నారు 1923 డిసెంబరు 28 తారీఖనాడు కాకినాడ కాంగ్రెస్ మహా సభ జరిగినప్పుడు డాక్టరు వెలిదండ్ల హనుమంతరావుగారు డాక్టరు ఘంటసాల సీతారామ శర్మగారు వైద్య సిబిరం నెలకొలిపి కాంగ్రెస్సు కార్యకర్తలకు సభకు వచ్చిన ఇతర ప్రజానీకానికానికి కావలసిన వైద్య సహాయమునిచ్చారు. ఆ కాకినాడ కాంగ్రెస్సు మహా ఘనంగా జరిగింది. చెరుకుపల్లి వెంకటప్పయ్య గారు దిగవల్లి శివరావు గారు స్వరాజ్య పత్రికాప్రతినిధులుగా ఆరోజు సభలో పాల్గొన్నట్లు శివరావుగారి డైరీలో వ్రశారు. 15/06/1930 తారీఖునాడు డా శర్మ, వేలూరి యజ్ఞన్నారాయణ, డా వెలిదండ్ల హనుమంతరావు, బ్రహ్మాండం నరసిహాం, గోనుగుట్ల సుబ్రహమణ్యగుప్త, నూకల వీర రాఘవయ్య, వీర మల్లయ్య మొదలగు వారలు మొత్తం 40 మందిని రాజమండ్రీ సెంట్రల్ జైలులోని బ్రిటిష పోలీసు సార్జంటు దౌర్జన్యంగాలాఠీతో కొట్టారు, వారి మంచనీళ్ల మగ్గు, కళ్లజోడును కారణం లేకుండా విరక్కొటి వారందరును (మొత్తం 40 మందిని) ఆరోజువెల్లూరు తరలించటానికి సి ఆర్ పి సిబ్బందికప్పచెప్పారు 16/06/1930 నాడు పొద్దున్నే వారిని రాజమండ్రీ జైలునుండి వెల్లూరికి పాసింజరు రైలులో ప్రయాణాంచేయించి వెల్లూరు జైలుకు తరలించారు. దారిలో బెజవాడ రైలు స్టేషన్ లో పౌరులూ కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు శివరావుగారు కూడా రైలు స్టేషన్ కు వారలను చూడ్డానికి వెళ్లారు. పోలీసు వారి బందోబస్తీ నిఘాలో రైలు బండిలో ఖైదీలు గానున్న చాల మంది శివరావుగారితో పోలీసు వారు చూడకుండా చిన్న చిన్న సందేశాలిచ్చారు. అందులో డా శర్మగారు పెన్సిలోతో వ్రాసిన చిన్న లేఖలో శివరావుగారికి పోలీసువారు రాజమండ్రీ జైలు గేటుదగ్గర ఆ క్రితం రోజు రాత్రి ఎలా కొట్టిందీ వ్రాసి దానిని ప్రచురించవద్దని కోరారు. బాగా దెబ్బలు తిన్న వారిలో బ్రహ్మాండం నరసింహాం వెలిదండ్ల హనుమంతరావు గారు . ఆ జైలు సంఘటన కృష్ణా పత్రికలో డిసెంబరు 12 వ తారీఖ 1930 నాడు బొబ్బిలి పాట వరుసలో గురజాడ రాఘవ శర్మ రచించిన పాట ప్రచురించారు ( దాని ప్రతి చివరిలో జత పరిచాము) 31/01/1962 తేదీన ప్రచురితమైన వెలిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయ రజతోత్సవ సంచికలో డాక్టరు శ్రీ వెలిదండ్ల హనుమంతరావు గారిపై దిగవల్లి వేంకట శివరావు గారు వ్రాసిన వ్యాసంలో ఇంకా కొన్ని వివరాలు: వెలిదండ్ల హనుమంతరావు గారు గుడివాడ కాపురస్తులు. వారు బహుశా 1895 లో జన్నించియుండచ్చని శివరావు గారి అంచనా. వెలిదండ్ల దాసయ్య గారి పెద్దకుమారుడు.

హనుమంత రావు గారి విద్యాభ్యాసం
వెలిదండ్ల హనుమంతరావు గారు గుడివాడ కాపురస్తులు. వారు బహుశా 1895 లో జన్నించియుండచ్చని శివరావు గారి అంచనా. మూడవ ఫారం వరకూ గుడివాడలో తరువాత బందరు హైస్కూలులో స్కూలు ఫైనల్ దాక చదివారు. వారు 13 వ ఏటనే స్కూలు ఫైనల్ క్లాసుకు వచ్చెను. కానీ ఆ సంవత్సరం వారి ఆరోగ్య దృష్ట్యా వారి లెఖ్ళ ల మాస్టారు వారిని పరీక్షకు కూచ్చోవద్దన్న కారణంగా మరుసటిసంవత్సరం స్కూలుఫైనల్ కు వెళ్లి ప్యాసై బందరు నోబుల్ కళాశాలలో ఇంటరులో చేరి తరువాత మద్రాసులో క్రిస్టియన్ కాలేజీకు వెళ్ళి భౌతిక శాస్త్రములో బి.ఎ డిగ్రీలో చేరి 1916 లో పట్టభద్రులైరి. వారిని ఇంజనీరింగు కళాశాలలో చేరమని చాలమంది ప్రోత్సహించిరి కానీ ఆయన వైద్యకళాశాలలో చేరారు. ఆదే కాలం విక్టోర్యా హాస్టలులో వీరికి సమకాలీకులగా 1918-1920 లో దిగవల్లి వేంకట శివరావు గారు కూడా యున్నారు ( చూడు దిగవల్లి వేంకట శివరావు Wikipidea Telugu ). అటువంటి అమూల్య విశేషాలు “Reminiscences of Victoria Hostel” అని శివరావుగారి డైరీలో వ్రాసుకున్నారు.

వైద్య వృత్తిలో హనుమంతరావు గారి ప్రఖ్యాతి
ఆయన ప్రభుత్వోద్యోగము నపేక్షించక బెజవాడలో స్వతంత్రజీవనం చేయదలచి 1922 సంవత్సరంలో ప్రాక్టీసు ప్రారంభించారు. త్వరలోనే గొప్ప వైద్యుడని నీతి పరుడని పేరు పొందినారు. హనుమంతరావుగారి సౌమ్యస్వభావము, వైద్య ప్రావీణ్యత, సర్వజన సమానత్వము వలన త్వరలోనే వారు ప్రముఖ వైద్యులుగా రాణించారు. బెజవాడలోనున్న వారే గాక చుట్టు పట్ల గ్రామాలు పట్టణములనుండి గూడా అనేక మంది వైద్యానికి వచ్చేవారు. ధనవంతులైనా హోదా కలవారైనా వారిదగ్గరకు వైద్యానికి వరుసలో నున్న రోగులతో పాటు రావలసినదే. బీదవారిని చాల దయగా చూచేవారు. పధ్య పానవిషయములు పాఠించని రోగులతో చాల కఠినముగా మందలించేవారు ఒకక్క సారి చాల కోపంగా రోగులపైనా రోగుల బంధువులపైనా పరుషముగా మాట్లాడినా అపాయస్థితిలో నున్న రోగులను చంటి పిల్లలవలే చూసుకునే వారు. వారి హృదయము కోమలమని రోగులు గ్రహించగలిగారు.

వైద్యమహాసభలలో హనుమంతరావుగారి పాత్ర
1927 లో హనుమంత రావు గారు, వారి సమకాలీక వైద్య మిత్రులు డా పాలకోడేటి గురుమూర్తిగారు కలిసి రాజమండ్రిలో రాష్ట్రీయ వైద్య మహా సభ జరిపారు. తరువాత 1928 లో బెజవాడ మెడికల్ యసోసియేషన్ అను వైద్యసంఘమును స్థాపించి దానికి కార్యదర్శిగా చేశారు. ఆ సంస్ధ నానాటికి అభివృధ్ధి చెంది బెజవాడలో నున్న డాక్టర్లందరి క్షేమలాభములకొరకు పనిచేసి ప్రఖ్యాతి గాంచింది.

స్వతంత్ర పోరాటము
1930 సంవత్సరం వరకూ హనుమంతరావుగారికి రాజకీయాలతో సంబంధంలేదు. ఆయన తన వైద్య వృత్తిని విసర్జించి సత్యాగ్రహదళమునకు నాయకత్వం వహించి 18 నెలలు కఠిన శిక్ష పొందారు. క్లాసు ఖైదీగానే కఠిన నియమాలు పాటించి జైలులోని అక్రమాలు ప్రతిఘటించి లాఠీ దెబ్బలకు గురియైనారు. ఆ దెబ్బల ఫలితంగా ఆరోగ్యం పాడైనది. ఆయనకు జ్వరం వస్తూ వుండేది అయినా లెక్క చేయక జైలులోని కఠిన నియమాలను తు ఛ తప్పక పాటించేవారు. గాంధీ ఇర్విన్ రాజీలో 1931 మార్చిలో విడుదలైవచ్చిన తరువాత ఎండలో విదేశ వస్తు దుకాణాల వద్ద పికెటింగ్ చేశేవారు.

మరణం
ఆయన ఆరోగ్యం చెడి క్షయవ్యాధికి గురియై 1931 అక్టోబరు 20 తేదీ అకాల మరణం పొందినారు.1930 లో వీరుస్వతంత్ర పోరాటములో జైలుకి వెళ్లి పోలీసుల లాఠీల దెబ్బలు తిన్నారనీ దాంతో వారి ఆరోగ్యంచెడి అకాల మరణం పొందారని శివరావు గారి నోట్సును బట్టీ, 1980 లో విజయవాడలో జరిగిన సభ కరపత్రంరం ఒకటి కనబడటం వలన తెలియ వచ్చింది.

నేను 1956నుంచి 1960వరకు బెజవాడ ఎస్ఆర్ఆర్ కాలేజిలో ఇంటర్ బీస్ సి చదివాను .సాయంకాలలో హనుమంతరాయ గ్రంధాలయానికి వెళ్ళే వాడిని అక్కడే అనేక విలువైన గ్రందాలున్దేవి చాలారకాల దినపత్రికలు వీక్లీ మాస పత్రికలూ అక్కడే చదివాను .చాలా నిశ్శబ్దంగా ఉండేది .నిర్వహణ బాగా ఉండేది .దానికి అనుబంధంగా నాటక శాల ఉండేది అక్కడ ఎప్పుడూ నాటక ప్రదర్శనలో సంగీత కచేరీలో ,సాహితీ ప్రసంగాలో జరిగేవి .

కానీ అప్పుడు నాకు హనుమంతరావు గారి గురించి ఏమీ తెలీదు .ఆయన బస్ట్ సైజ్ విగ్రహం మాత్రం రోజూ చూసేవాడిని .అంతటి మహానుభావుని గురించి రాసే అదృష్టం ఇవాళ కలిగింది .

ఆధారం –స్వాతంత్ర్య సత్యాగ్రహి శ్రీ కోటమర్తి చిన రఘుపతి రాసిన –జాతీయ నాయకులు –రెండవ సంపుటం ,మరియు వీకీ పీడియా

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -25-8-22-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Leave a comment

హరిజనోద్ధరణ చేసిన రాజమండ్రి మున్సిపల్ చైర్మన్ ,జాతీయ సత్యాగ్రహి,ఉత్తమ ప్రజాసేవకులు డా. శ్రీ పాలకొడేటి గురు మూర్తి

హరిజనోద్ధరణ చేసిన రాజమండ్రి మున్సిపల్ చైర్మన్ ,జాతీయ సత్యాగ్రహి,ఉత్తమ ప్రజాసేవకులు డా. శ్రీ పాలకొడేటి గురు మూర్తి
పశ్చిమ గోదావరిజిల్లా గరగ పర్రు గ్రామం లో 1884లో శ్రీ పాలకోడేటి గురుమూర్తి సద్వంశ బ్రాహ్మణ కుటుంబం లో జన్మించారు .మెట్రిక్ పాసై L.M.P.చదివి రాజమండ్రిలో వైద్య వృత్తి చేశారు .1910లో రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి ,అయిదేళ్ళు పని చేసి ,తర్వాతఏజెన్సీప్రాంతంలో మూడేళ్ళు డాక్టరీ చేశారు .1918లో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీ నామా చేసి ,రాజమండ్రి లో స్వంతంగా విద్యాలయం నెలకొల్పి ప్రజా సేవ చేయటం ప్రారంభించారు .
హరిజన ఉద్ధరణ పై అభిమానం కలిగి సేవ చేశారు. రాజమండ్రి పురపాలక సంఘానికి 1925నుంచి 1927 వరకు రెండేళ్ళు అధ్యక్షులుగా ఉన్నారు .ఆంధ్రా మెడికల్ అసోసియేషన్ కు మూడు సార్లు అధ్యక్షులుగా పని చేశారు .మద్రాస్ మెడికల్ కౌన్సిల్ ఎక్సిక్యూటివ్ మెంబర్ కూడా .ఉత్తర విశాఖ జిల్లాలో క్షామం వచ్చినప్పుడు ప్రజలను ఆదుకోవటానికి గొప్ప సేవ చేశారు .
ఆంధ్రరాష్ట్ర కాంగ్రెస్ కాంగ్రెస్ కమిటీ సభ్యులుగా ఉంటూ కాంగ్రెస్ సేవ చేశారు .ఇంతటి మహాను భావుడిని రాజమండ్రి’’ పందిరి వారి వీధి’’లో ముస్తఫా స్వయంగా క్రూరంగా లాఠీ చార్జి చేశాడు .గురుమూర్తిగారి తలను పట్టుకొని గోడ కేసి కొట్టాడు ఆ రాక్షసుడు .ముస్తఫా నరరూప రాక్షసుడైన పోలీస్ ఆఫీసర్ .వాడి నరనరానా అక్కసు ద్వేషం ,ప్రతీకారం జీర్ణించుకు పోయాయి .ఆ ఆవేశంతో ఉచితాఉచితాలు లేకుండా కాంగ్రెస్ వాదులను కొట్టేవాడు. ఇలాగే వీడి చేతులలో దెబ్బలు తిన్నవారిలో బ్రహ్మా జోస్యుల సుబ్రహ్మణ్యం వెలిదండ్ల హనుమంతరావు గార్లు కూడా ఉన్నారని ముందే చెప్పుకొన్నాం .డాక్టర్ గురుమూర్తిగారు ముస్తఫా చేతిలో ఎన్ని దెబ్బలు ,ఎన్ని పోట్లు తిన్నారో లెక్కే లేదు .
గురుమూర్తిగారు ప్రఖ్యాత అణుశాస్త్ర వేత్త డా .ఆకునూరి వెంకట రామయ్య గారి అర్ధాంగి శ్రీమతి కృష్ణ మయి గారికి మాతా మహులు అని ఆమె చెప్పినట్లు జ్ఞాపకం .ఇంతకంటే గురుమూర్తి గారిపై సమాచారం దొరకలేదు .వారి కుటుంబ సభ్యులెవరైనా వారి గురించి మిగిలిన విషయాలు తెలియ జేయచ్చు.వారి ఫోటో కూడా దొరకలేదు .

(శీ, పాలకోడేటి గురుమూర్తి
1884 జననం. సర్దార్‌ వల్లభాయిపకేల్‌ లాంటి దిట్ట. నిర్మోహమాటి.
నీతి, నిజాయితీలకి మరోపేరు. వెద్యవృత్తిలో పేదసాదలకి ఎంతో సేవచేశారు.
జాతీయోద్యమాలలో జెలుశిక్షలను అనుభవించి, సత్యా(గహాలలో లారీ
దెబ్బలుతిన్నారు. మునిసిపల్‌ చైర్మన్‌ గా ఆదర్శవంతంగా కృషిచేశారు. హరిజన,
సహకారోద్యమాలకి వూపిరిగా సేవలు చేశారు. ఆజన్మాంతం ఆదర్శవంతంగా
జీవించారు. 1984లో కీర్తి శేషులెనారు.  రాజమండ్రికి వలస వెళ్ళిన పాలకోడేటివారి కుటుంబం శ్రీయుతులు గురుమూర్తిగారు, సూర్యప్రకాశరావు గారు, రామ్మూర్తిగారు, వంటి ప్రముఖులతో విశ్వఖ్యాతం పొందుతోంది. అయితే వీరు రాజమండ్రికి దగ్గర్లోనే వున్న రాజానగరం సమీపంలోని గండేపల్లి నుంచి రాజమండ్రికి వలస వచ్చారనే ఊహ కూడా వుంది. రాజమండ్రిలోని ఇన్నీస్‌పేటలో నాల్గవవీధి ‘పాలకోడేటివారి వీధి’. మాజీ ఛైర్మన్‌ స్వాతంత్య్ర సమరవీరుడు, సుప్రసిద్ధ సహకారవేత్త, డాక్టర్‌ పాలకోడేటి గురుమూర్తిగారు ఈ వీధిలో నివసించేవారు. ఎందరో ఉద్యమవీరులకు ఇక్కడ అతిథ్యం లభించేది. దాదాపు నగరంలోని సహకార సంస్థలన్నింటిని వీరే స్థాపించారు. పురపాలక సంఘం పక్షాన ప్రప్రధమంగా ఆయుర్వేద ఆసుపత్రిని ప్రస్తుత కోటిపల్లి బస్టాండ్‌లో నెలకొల్పారు. అది ఈనాటికీ పనిచేస్తోంది. విచిత్రమేమంటే ఇప్పుడు పాలకోడేటి వారి వీధిలో పాలకోడేటి వారికి స్వగృహం లేదు.

డా॥ పాలకోడేటి గురుమూర్తి  చేతి మహిమ 

  1933 వ సం॥లో హరిజవాశమంలో వుంటుండగనే నుబహ్మణ్యం గార్కి క్షయవ్యాధి అంకురించి_ది, తాత్తాలికమైన చికిత్సవలన కొంత ఉపశ మించింది. కాని వ్యాధి నిర్మూలనం కాలేదు. 1934 సం। వెసవిలో ఆయ నకు చాల (ప్రమాదకరమైన జబ్బు చెపింది. కఫం గొంతుపచ్తైపింది. దాదాపు ఆయన వృత్యువుతో పోరాటాన్నే సాగించాడు. వైద్య సహాయం కోసం రాజమండ్రి నుండి ఎందరో డాక్టర్లు వచ్చారు డా॥ పాలకోడేటి గురుమూర్తి గారు అందరి సలహాలతో వైద్యం చెళారు. ఆయన తుది (ప్రయత్నంగా ఒక యింజక్షన్‌ యిచ్చి చెతులె త్తి భగవంతుని (ప్రాంచాడు ఆ స్థితిలో మేమంతా యెంతటి నిస్సహాయ నిస్పృహలతో వున్నామో చెప్పనక్కర్లదు,

  సు[బహ్మాణ్య ంగారు మృత్యువుతో అలా పోరాడుతూ ‘ ‘My soul shall live as a maonumsnt cf ~esistence to British Imperialism’ (నా ఆత్మ క్‌ మా9జ్య (పతిఘటనకు శాశ్వత చిహ్నంగావుండుగాక! ‘ | అని గబ్లీగా “కేక లేయటం మొదలె నెట్టారు. మమంతా దేవుడ్ని ప్రొర్సిస్తూ నిశ్చేష్షులె వుండిపోయాము. ఈశ్వరానుగహం వలన అప్పటి కాయన కౌ గండం తప్పింది. కొంచెం బలం చేకూరడంకోనే ఆయన బళ్ళారి సాం దూర్‌లో కొన్ని నెలలపాబు విశ్రాంతి తీసుకున్నారు. ఆ విశంతి ఆయన జబ్బును తాత్యా లిక గా పోగొట్టింది. ఏీత్రాకాలంనాటికి ఆయన తిరిగ సీతా నగరం చరుకున్నారు. అప్పటికి ఆ గ్రామంలోని సభ్యులందరూ బైళ్ళనుండి విడుదలై వచ్చిళశారు. కానీ చేతినిండా మనస్సుకు నచ్చిన పని లేక విరుత్సా హంగా కాలం గడపవళలపి వచ్చింది.   


మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -25-8-22-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Leave a comment

భారతీ నిరుక్తి .39 వ భాగం.25.8.22

భారతీ నిరుక్తి .39 వ భాగం.25.8.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

సంప్రదాయం ,ఆధునికత కలిపి చేసిన షష్టి పూర్తి-2(చివరి భాగం )

సంప్రదాయం ,ఆధునికత కలిపి చేసిన షష్టి పూర్తి-2(చివరి భాగం )
19వ తేదీ శుక్రవారం నాడు ఉదయం మేమిద్దరం పద్మ వాళ్ళ మామగారికి నూతన వస్త్రాలు సమర్పించి ,పండిత శాలువా కప్పి నమస్కరించి ఆశీర్వాదం పొందాం.రామకృష్ణ కు పద్మకు నూతన వస్త్రాలు అందించి శాలువా కప్పి జ్ఞాపిక అందించి ఆశీర్వదించాం .మా అమ్మాయి విజయలక్ష్మి దంపతులు వారిద్దరికీ ఇవ్వమని చెప్పిన 5వేలరూపాయలు అందజేసి ,పద్మకు మా సహస్ర చాంద్రమాసోత్సవం సందర్భంగా మంగళహారతి కి గాను వెయ్యిన్నూట పదహారు రూపాయలు అందజేశాం .అలాగే రవి తేజ అమ్మగారికి నాన్న గారికి ,రవళి అత్తగారికి మామగారికి సరసభారతి పుస్తకాలు జ్ఞాపిక ఇచ్చాం .వీరు సరసభారతి బ్లాగ్ అభిమానులం అని చెప్పారు .అలాగే మా మేనల్లుడు శాస్త్రి ,భార్య విజయలక్ష్మి కొడుకు కృష్ణ కు కూడా శాలువా కప్పి జ్ఞాపిక అందించాం .శుక్రవారం రాత్రి బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు ఫోన్ చేసి ,మర్నాడు శనివారం సాయంత్రం ఉయ్యూరులో కృష్ణాష్టమి ప్రసంగానికి ఒక చోటుకు వస్తున్నానని ,శ్రీ సువర్చలాన్జనేయ స్వామిని దర్శించాలని ఉందని తెలియజేస్తే ,మేము హైదరాబాద్ లో ఉన్నామని ,పూజారికి ,సరసభారతి కార్యదర్శి శివ లక్ష్మికి ఫోన్ చేసి ,వారిని గౌరవంగా గుడికి తీసుకు వెడతారని చెప్పాను .అలాగే వాళ్ళిద్దరూ దేవాలయానికి తీసుకు వెళ్లి పూజారి మురళితో ఆలయ మర్యాద ననుసరించి సత్కారం జరిపించి సరసభారతి తరఫున శివ లక్ష్మి దంపతులు వారికి శాలువా కప్పి పిల్లలకు పెట్టిన కృష్ణ గోపికల వేష ధారణ లో పాల్గొన్న బాలబాలికలకుబహుమతులు అంది౦ప జేశారు .శాస్త్రిగారు ప్రేరణాత్మక ప్రసంగం చేశారు అని శివ లక్ష్మి మెయిల్ పెట్టి ఫోటోలు పంపింది .
మూడవ రోజు 20-8-22 శనివారం ఉదయమే లేచి స్నానసంధ్య పూజాదికాలు పూర్తీ చేసి ,ఒక గంట ‘’భారతీ నిరుక్తి ‘’లైవ్ చేశాను గెస్ట్ రూమ్ నుంచే .ఆతర్వాత కిందికి దిగి ,టిఫిన్ ,కాఫీలు హాట్ హాట్ గా స్వీకరించగా ఉయ్యూరునుంచి వచ్చిన మా అన్నయ్యగారి అబ్బాయి రాం బాబు మద్రాస్ నుంచి వచ్చిన మేనల్లుడు శ్రీనివాస్ లను పలకరించి ,ఆరోజు కార్యక్రమం పెళ్లి చూపులు వేడుక ,ఉంగరాలు తొడగటం లో పాల్గొన్నాం .పద్మ తరఫున మేమందరం ,అశోక్ దంపతులు శాస్త్రి కుటుంబం ,రవి తేజ ,రవళి ,మొదలైన వారు ,రామ కృష్ణ తరఫున అల్లుడు కోడలు ,రామకృష్ణ బంధు గణం పాల్గొన్నారు యాంకరింగ్ బావ బావమరది సరదాగా చేసి రక్తి కట్టించారు .పెళ్లి కూతురు తరఫున మేమిద్దరం పెళ్లి పెద్దలుగా ,పెళ్లి కొడుకు తరఫున రామకృష్ణ పెదనాన్న గారి అబ్బాయిలు ఆడపడుచులు వ్యవహరించాం .కాసేపు సూటీ పోటీ మాటలు కవ్వింపులు ,ఇద్దరి అభీష్టాలు తెలుసుకోవటం వారిద్దరికీ వివాహం చేయటానికి నిశ్చయించటం జరిగి ,ఉంగరాలు అంద జేసుకొన్నారు ఉభయులు .ఇంతవరకే మేము ఉన్నాం .
మేము ఇక్కడికి వచ్చి ప్రతిపూట పెడుతున్న ఫోటోలు చూస్తున్నడా. శ్రీమతి కోనేరు లక్ష్మీ ప్రమీల గారు ‘’గురువుగారూ !మీదర్శన భాగ్యం నాకు కలుగ జేయండి ‘అని వాట్సాప్ మెసేజ్ లు పంపుతున్నారు .వీలుంటే వస్తాను అని రిప్లై ఇచ్చాను .ఆమె 30ఏళ్ళు సంసార జీవితం లో మునిగి తర్వాత భర్త ను ఒప్పించి నెమ్మదిగా ఆపేసిన చదువు ఆయన ప్రోత్సాహంతో కొనసాగించి తెలుగులో ఎం ఏ.పాసై ,ఆంధ్రదేశం లోని ‘’పేరంటాళ్ళు దేవతలు ‘’పై రిసెర్చ్ చేసి పిహెచ్ డి చేశారు .అకస్మాత్తుగా భర్త చనిపోయారు అయినా కృత నిశ్చయంతో దాన్ని ప్రచురించి భర్తకు అంకితం చేశారు .ఆపుస్తకం నాకు ఆమె బెజవాడ సభలో ఇస్తే వెంటనే చదివి ‘’స్వయం సిద్ధ లక్ష్మీ ప్రమీల ‘’అని సమీక్షగా రాసి పంపాను .ఆమెను 2019సరసభారతి ఉగాది వేడుకలకు ఆహ్వానించి మేము ఇస్తున్న ‘’స్వయం సిద్ధ ఉగాది పురస్కారం ‘’అందించాం .ఆమె ఆనందానికి అంతులేదు .ఆమెగుంటూరు జిల్లా వేమూరు గ్రామం లో జన్మించారు .అక్కడే శ్రీ రోశయ్య వేమూరి గగ్గయ్య గార్లు జన్మించిన సంగతి మనకు తెలుసు .ఇప్పుడు రెండవ పుస్తకం గా ‘’వేమూరు గ్రామ చరిత్ర ‘’రాశారు .దీన్ని రాస్తుండగా ఆమెకు హార్ట్ సమస్య వచ్చి రెండు స్టె౦ట్లు’’వేశారు .ఇప్పుడిప్పుడే కోలుకొంటున్నారు .ఆమెను చూడటం ధర్మం అనుకొన్నాం .అలాగే బోయిన్ పల్లిలో ఉన్న మా బావగారిని ,బాచుపల్లిలో ఉన్న మా శ్రీమతి అక్కయ్య గారినీ చూడాలని అనుకొన్నాం .
ఉయ్యూరు నుంచి మాతో వచ్చిన కారు ,మా మేనల్లుడు శాస్త్రి కారు లో ఉదం 11 గంకు మేమిద్దరం,మా అబ్బాయి మా ఇద్దరుకోడళ్ళు రాంబాబు ,శ్రీను బయల్దేరి యూసఫ్ గూడా లో ఉన్న ప్రమీల గారింటికి వెళ్లి ,పలకరించాం .ఆమె ఆనందానికి అవధులు లేవు .జ్ఞాపిక అందించి త్వరలో కోలుకోవాలని చెప్పాం .యోగాలో పరుగుపందెం లో ఆటాపాటలలో ఎన్నో బహుమతులు పొందిన ఆమెకు గుండె జబ్బు అంటే ‘’ఇనుముకు చెదలు ‘’పట్టటమే .అక్కడ ఇచ్చిన మజ్జిగతాగి బయల్దేరి సరాసరి ఓల్డ్ బోయిన్ పల్లి లో ఉన్న మా బావగారు -92ఏళ్ళ శ్రీ వివేకానంద్ గారిని చూసి నమస్కరించి ఆశీస్సులుపొంది నూతన వస్త్రాలు అందించి శాలువా కప్పి , జ్ఞాపిక నిచ్చాం .మమ్మల్ని చూడగానే ఆయన ఆనందం ఉత్సాహం రెట్టింపు అయింది .ఆయన నాతొ ‘’నేను ఆంజనేయస్వామికార్యక్రమాలకు నువ్వు అడగక పోయినా వీలువెంట డబ్బు పంపుతున్నాను .ఇంకా కావాల్సి వస్తే మొహమాటం పడకుండా అడుగు ‘’అన్నారు .నేను ‘’మాకు డబ్బు ఏమీ అక్కర్లేదు .మీ ఆరోగ్యం బాగా ఉంటే,మీ ఆశీస్సులు ఉంటె చాలు బావగారూ ‘’అన్నాను .ఆయన వద్ద సెలవు తీసుకొని ,బాచుపల్లి లో ఉన్న 90ఏళ్ళ మా తోడల్లుడు గారి భార్య ,మా ఆవిడ పెద్దక్కగారు శ్రీమతి లక్ష్మీ గారిని-చూసి జ్ఞాపిక అందించి ,వాళ్ళబ్బాయి సూర్యం ఇచ్చిన డ్రింక్ తాగి బయల్దేరి మళ్ళీ క్లబ్ హౌస్ కు సాయంత్రం 4కు చేరాం .అప్పుడు ఏదో తిన్నాం అనిపించినట్లు భోజనం చేసి రూమ్ కు వెళ్లి విశ్రాంతి తీసుకొన్నాం .
సాయంత్రం మెహిందీ హడావిడి ,తర్వాత ఎదుర్కోలు ,ఆతర్వాత సంగీత విభావరి జరిపారు .కుర్రకారు ముసలి వారు అత్యుత్సాహంగా సంగీతం ,నృత్యాలలో పాల్గొన్నారు .ఊగారు తూగారు స్టెప్స్ వేశారు .కిక్ తెప్పించారు .రామకృష్ణ బంధువు ఒక కుర్రాడు అద్భుతంగా చేసి అందరి మెప్పు పొందాడు .హాల్ లోకే మాకు ‘మైసూర్ బొండా’’ సర్వ్ చేయించారు .బాగున్నాయి .మా బావగారరుశ్రీ వేలూరి వివేకానంద్ గారి పెద్ద బావగారు అంటే పెద్దక్కయ్య గారి భర్త శ్రీ మైలవరపు కృష్ణ శాస్త్రి గారి అమ్మాయిలు శ్రీమతి నళిని,సోదరీమణులు భర్తలతో సహా వచ్చి వారే పరిచయం చేసుకొని ,వాళ్ళు నా ఫాన్స్ అని చెప్పి సంతోషం కలిగించారు .ఫోటోలు తీసుకొన్నాం .ఒకే ఒక పుస్తకం ఉంటె నళిని గారికిచ్చి ,అడ్రస్ రాస్తే పుస్తకాలు పంపిస్తానని చెప్పి ఇవాళ రిజిస్టర్ పార్సిల్ లో ఉయ్యూరు నుంచి పంపాను .అక్కడే బయట ఒక వీల్ పై నిలబడి అది గుండ్రంగా తిరుగుతుంటే వీడియో తీయిన్చుకోన్నాం ఉచితంగా .రూమ్ కు వెళ్లి పడుకున్నాం . నాల్గవరోజు 21-8-22 ఆదివారం –ఉదయమే లేచి స్నాన సంధ్య పూజలు పూర్తీ చేసి ,కిందకు దిగే టప్పటికి మద్రాస్ నుంచి రాత్రి ఫ్లైట్ లో వచ్చిన మా పెద్ద మేనకోడలు అంటే మా పెద్దక్కయ్య లోపాముద్ర కుమార్తె ,కొడుకు బాలాజీ ,కోడలు అన్నపూర్ణ కనిపిస్తే పరమాశ్చర్యం వేసింది .అందరు శాస్త్రి కుటుంబం రామ కృష్ణ కుటుబం సరదాగా మాట్లాడుకొంటూ,మాఅమెరికా మనవడు పీయూష్ సరదాగా అడిగినట్లు ‘’టిపినీలు’’తాగి ,‘’కాఫీలు’’ తిన్నాం .సందడే సందడి ,ఊరంతా పండగే ,ప్రతి రోజు పండగే గా ఉంది .మాచి జోష్ ఫీలయ్యారంతా .ఆతర్వాత మా తమ్ముడుమోహన్ ,మరదలు సునీత వచ్చారు.శుక్రవారం కృష్ణాష్టమి సెలవు రోజున ఉదయం మల్లాపూర్ నుంచి మా పెద్దబ్బాయి శాస్త్రి ,కోడలు సమత వచ్చి రాత్రి దాకా ఉండి వెళ్ళారు . మా అన్నయ్యగారి మనవడు రవి భార్య గాయత్రి కొడుకు రేయా౦శ్ లు కూడా వచ్చారు .కళావాళ్లకు జ్ఞాపిక ఇచ్చాం .
ఉదయం 10గంటలకు చి రామకృష్ణ ,చి. సౌ .పద్మ ల షష్టి పూర్తి వేడుక వివాహం పురోహితుడు చక్కగా చేయించారు .మట్టెలు మంగళసూత్రధారణ ,బంతాట ,బిందెలో నీళ్ళలో వేసిన ఉంగరాలు తీయటం వగైరా పెళ్లి తంతు లన్నీ జరిపించారు .తెనాలి నుంచివచ్చిన మస్తానయ్య, కుమార్తె నాదస్వరం వాయిస్తే డోళ్ళువాద్యాలపై ఇద్దరు చక్కని సహకారం అందించి’ సునాద నాద వినోదం ‘’కలిగించారు .అందరూ మహా మెచ్చారు .చెవుల తుప్పు వదిలించారు .ఆ బృందాన్ని అభినందించి సరసభారతి తరఫున మస్తానయ్యగారికి నూతన వస్త్రాలు అందించి ,తండ్రీ కూతుళ్ళకు శాలువాకప్పి రెండు వేల రూపాయలు అందించాం మేమిద్దరంమా మేనల్లుడు శాస్త్రి కుటుంబం .
ఈ నాలుగు రోజులు రాత్రి 11గబ్తలదాకా ఫంక్షన్ లో ఉంటూ మళ్ళీ పొద్దున్నే ఆరు గంటలకు హాజరవుతూ అలసట లేకుండా ,అందర్నీ చక్కగా పలకరిస్తూ చిరునవ్వులు చిందిస్తూ అంతాతామే గా పని చేసి షష్టి పూర్తిని ఇష్టపూర్తి గా నిర్వహించిన రవి తేజ ,భార్య రమ్య ,రవళి ,భర్త వంశీ లకు అభినదన పూర్వకంగా ‘’వీర తాడుగా ‘’శాలువా కప్పి బుజాలు తట్టి మనస్పూర్తిగా అభినదనలు తెలిపాం మేమిద్దరం .ఆ నలుగురు శిరసులు వంచి కృతజ్ఞతలు తెలియ జేస్తుంటే తెలియని ఆనందం కలిగింది అందరికి .ఇదొక చిన్న అప్రీసి ఏషన్’’మాత్రమె .మేము చూసింది నాలుగు రోజులనుంచే అంతకు ఎన్ని రోజులముందు నుంచి వారు శ్రమిస్తున్నారో ఆలోచిస్తే అర్ధమౌతుంది .అంకితభావంతో చేసిన సమష్టి కృషి ఫలించింది .ఉదయం బాచుపల్లి నుంచి మా రెండో అబ్బాయి శర్మ కోడలు ఇందిర, మనవడు హర్ష ,మనవరాలు హర్షిత కూడా వచ్చి పాల్గొన్నారు .అందరికి హనుమజ్జయ౦తినాడు స్వామివార్లకు వెయ్యి రసాలమామిడి పళ్ళతో చేసిన పూజ ప్రసాదం గా అందరికి గుడిలో పంచగా మిగిలిన పళ్ళతో చేసిన మామిడి తాండ్ర ప్రసాదం అంద జేశాం . ఆతర్వాత భోజనాలు .అప్పుడు మేనల్లుడు శాస్త్రి కొడుకు కృష్ణ తో ‘’మీ నాన్న షష్టి పూర్తి ‘’కూడా మీరు చేయాలి .ఇన్ని రోజులు కాకపోయినా ఒక్కరోజు ఇంతటి ఆర్భాటం లేకుండా చేయండి ‘’అన్నాంమేమిద్దరం .వాడు ‘’మాకూ చేయాలనే ఉంది మార్గశిరమాసం లో .నాన్న ఒప్పుకోవటం లేదు ‘’అన్నాడు ఒప్పించి చేయండి అని సలహా ఇచ్చాం .ఉచిత సలహానేగా .తప్పని సరిగా అన్నాడు .
సాయంత్రం మినర్వా గ్రాండ్ ఫంక్షన్ హాల్ లో రిసెప్షన్ .మళ్ళీ హడావిడి .ఒకతను ట్రంపెట్ చాలా శ్రావ్యంగా నేపధ్య సంగీతంగా మొదటి నుంచి చివరిదాకా వినిపిస్తూనే ఉన్నాడు .వేదిక పై పద్మ దంపతులకు అభినందన తెలియజేయటానికి మిత్రులు బంధువులు ,కుటుంబ సభ్యులు వచ్చారు .తెలుగు విద్యార్ధి సంపాదకులు స్వర్గీయ కొల్లూరి కోటేశ్వరరావు గారబ్బాయి రమణ ,కొడుకు కోడలూ ఉన్నారు . పత్రిక వస్తోందా అని అడిగితె ‘’మీకు పంపకుండా పత్రిక నడుపుతానా .కరోనా నుంచి పత్రిక నడపటం లేద’’న్నాడు రమణ నిజాయితీగా .
మేనల్లుడు శాస్త్రి పెద్దబావమరాది స్వర్గీయ సత్యనారాయణ భార్య కొడుకు కూతురు వచ్చారు.శుక్రవారం ఉదయం చిన్న బావమరది కామేష్అమెరికా నుంచి కూడా వచ్చి వెళ్ళాడు .మా తమ్ముడికొడుకు రాజు ,కోడలు రాజ్యలక్ష్మి వచ్చారు .మా మేనల్లుడు అశోక్ దంపతులు ,కూతురు భార్గవి అల్లుడు మురారి ,వచ్చారు మనవలు వచ్చారు .మురారి విశ్వనాధ సత్యనారాయణ గారి తమ్ముడు వెంకటేశ్వర్లు గారి మనవడు అంటే కొడుకు శ్రీనివాస్ కుమారుడు .శ్రీనివాస్ ఉయ్యూరు హైస్కూల్ లోనూ ఇంటి దగ్గర ట్యూషన్ లోనూ శిష్యుడు .బిహెచ్ ఎల్ నుంచి మా కోడలు రాణి అన్నయ్య, కొడుకు వచ్చారు .మళ్ళీ ఇక్కడా సందడే సందడి .పెంద్రాళేభోజనం చేసి కళా వాళ్ళు మద్రాస్ వెళ్ళిపోయారు .మేమూ భోజనాలు చేసి ,బయటకు వస్తుంటే మా శ్రీమతి చిన్ననాటి స్నేహితురాలు వసంత కుటుంబం కనిపించారు .మమ్మల్ని స్టేజి పైకి పిలిచి అందారితో కలిసి ఫోటోలు తీయించాడు రామకృష్ణ .వెళ్లి పోతుంటే ‘’బాబాయి గారూ !రేపు పొద్దున్న ఏడున్నరకు మాఇంట్లో టిఫిన్ చేసి వెళ్ళాలి మీరు ‘’అన్నాడు సరే అన్నాం .రూమ్ కు వచ్చి పడుకున్నాం .
22-8-22-సోమవారం స్నానసంధ్యాదులు పూజ అయ్యాక పద్మా వాళ్ళింటికి వెళ్లాం .రమణ కూడా వచ్చాడు .అందరికి పొంగల్ ఇడ్లీ గారే సాంబారు అల్లం చట్నీ కారప్పొడి వగగైరాలతో టిఫిన్ పెట్టారుకాఫీ ఇచ్చారు పద్మ దంపతులు .లడ్డూలు ఇచ్చారు . .అన్నీ పూర్తీ చేసి ఉదయం 10గంటలకు కారులో బయల్దేరాం .మల్లాపూర్ మా శాస్త్రి ఇంటికి వెళ్లి మనవడు భువన్ కు ఉయ్యూరు నుంచి తెచ్చిన కొబ్బరికాయలు రామకృష్ణ ఇచ్చిన స్వీట్లు అందించి అక్కడి నుంచి ఉప్పల్ దగ్గర ఆర్ టీసి కాలనీ లో ఉన్న మా బావ వివేకానంద్ గారి చెల్లెలు 86ఏళ్ళ శ్రీమతి శాంతమ్మగారిని చూశాం .ఆమెవరలక్ష్మీ వ్రతం నాడు కుర్చీలోంచి కిందపడితే తుంటిఎముక విరిగితే ఆపరేషన్ చేసి రాడ్ వేశారు .మా కుటుంబం అంటే ఆమెకూ ఆమె భర్త గాడేపల్లి శ్రీమన్నారాయణ గారికి మహా అపేక్ష .రవళి పెళ్ళికి మేమంతా రోజూ ఒకే చోట కూర్చుని భోజనాలు చేశాం. ఆయన నాలుగేళ్ళక్రితం చనిపోయారు .రామకృష్ణ రెండు అంతస్తుల డాబా కట్టుకొన్నాడు .మామిడి చెట్టు ఉసిరి చెట్టు తమలపాకు చెట్టు పెంచాడు. ముందు శ్రీ సంజీవరాయ ఆంజనేయస్వామి దేవాలయం ఉంది .ప్రశాంత వాతావరణం .మా అందరికి రామకృష్ణ వల్లి దంపతులు నూతనవస్త్రాలు అందించి గౌరవించారు రెండావ కొడుకు మహేష్ కూడా చాలా ఆప్యాయత చూపించాడు .రామకృష్ణ ను జూన్ 27న ఉయ్యూరులో జరిగిన సరసభారతి సాహితీ పుష్కరోత్సవం నాడు ఉయ్యూరుకు ఆహ్వానించిపురస్కారం అందించి నూతనవస్త్రాలు సమర్పించి శాలువాకప్పి జ్ఞాపికా నగదుతో సత్కరించాం .భార్యకు మా ఇంటి వద్దనే చీర సారే పెట్టాం .చాలాకలుపు గోలుగా ఉన్నారు వాళ్ళిద్దరూ ఉయ్యూరులో .
అక్కడినుంచి మళ్ళీ రోడ్డునపడి ,మధ్యాహ్నం 3కు సూర్యాపేట దగ్గర కాకినాడ వారి సుబ్బయ్యగారి హోటల్ లో భోజనంఒక్కొక్కరికి 279రూపాయలతో చేసి రాత్రి 7-30కు ఉయ్యూరు చేరాం .ఈ అయిదు రోజుల పర్యటనలో మా మనవడు చరణ్ మనవరాలు రమ్య మా రెండు ఇళ్ళను ,వాటర్ ప్లాంట్ ను చూసుకొంటూ వాడు జాబ్ ట్రెయినింగ్ అవుతూ కాన్ఫరెన్స్ కు అటెండ్ అవుతూ ,పిల్ల బెజవాడ కాలేజికి వెళ్లి వస్తూ ఎంతో ధైర్యంగా ఉన్నారు .హైదరాబాద్ నుంచి ప్రతిపూటా ఫోన్ చేస్తూ మాట్లాడుతూనే ఉన్నాం .వీళ్ళిద్దరూ అభినందనేయులే .
పదనిసలు –
1-సాధారణంగా షష్టి పూర్తికి చేసే కలశ స్థాపన ,పూజ ఉద్వాసన తర్వాత దంపతులు ,దంపతి పూజ చేసి సత్కరించి ఆశీస్సులు పొంది భర్తకు కలశం కొబ్బరికాయ ,భార్యకు జాకెట్ ముక్క ఇవ్వటం సంప్రదాయం .కానీ పద్మా వాళ్లకు ఆవిషయం తెలుసో లేదో తెలీదు .చేయించే బ్రహ్మగారు చెప్పారో లేదో తెలీదు .అవగానే పురోహితుడు అన్నీ మూటలు కట్టి తీసుకు వెళ్ళటం చూశాం .కాంట్రాక్ట్ వ్యవహారం లో భాగమేమో .
2-క్లబ్ హౌస్ లో వేడినీరు సరఫరా లేదు .ముసలి ముఠాకు ఇబ్బంది .మాకు రూమ్ లో కరెంట్ తో వేడినీళ్ళు కాచుకొనే ఫ్లాస్క్ ఉంది .కనుక ఇబ్బంది లేదు దానితో కాచుకొని మా శ్రీమతి స్నానించింది .నేను చన్నీళ్ళే చేశాను .
3-ఎసి కూడా సరిగా పని చేయలేదు .మాకు ఇబ్బంది లేదుకాని పద్మ అక్కయ్య బావగారు మా పక్క రూమ్ లో ఉన్నారు బాగా ఇబ్బంది పడ్డారు .ఆవిడ చాలా కలుపుగోలు మనిషి. వాళ్ళల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఆవిడే .
3-రూమ్ క్లీనింగ్ లేదు .పక్కబట్టలు మార్చటం లేదు .ఇవి క్లబ్ మేయిన్ టేనెన్స్ వారి బాధ్యతలు .
4-వై.ఫై. రోజులివి .కింద తప్ప పై రూమ్స్ కు కనెక్షన్ రాలేదు .
సరిగమలు
కార్యాలలో ఇవన్నీ మామూలే .వీటిని మించి మనం ఆలోచించాలి .మేము అయిదు రోజుల షష్టి పూర్తీ అతి ఆనందంగా అనుభవించాం .ఒకరకంగా పరవశించాం .ఆప్యాయత ఆదరణ గౌరవం మన్నన మర్యాదా చూపిన పద్మ రామ కృష్ణ కుటుంబానికి మనస్పూర్తిగా అభినందనలు .రామ కృష్ణ అన్నగారబ్బాయి ఒకాయన మా దగ్గరకు వచ్చి ‘మీరు రావటం వలన కార్యక్రమానికి నిండు దనం వచ్చింది. ధన్యవాదాలు ‘’అని చాలా సార్లు అన్నారు .పద్మ దంపతులు పదే పదే అలానే అన్నారు .వారందరికీ వినాయక చవితి ,నవరాత్రి, దీపావళి శుభా కాంక్షలు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-8-22-ఉయ్యూరు

.

Posted in సమయం - సందర్భం | Leave a comment

భారతీ నిరుక్తి .38వ భాగం.24.8.22

భారతీ నిరుక్తి .38వ భాగం.24.8.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

సరస భారతి 167 వ కార్యక్రమంగా శ్రీకోటగురువరేణ్యుల స్మారక నగదు పురస్కార ప్రదానం

సరసభారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు

‘’అక్షరం లోక రక్షకం ‘’

సాహితీ బంధువులకు శుభకామనలు ,ఉపాధ్యాయ దినోత్సవ శుభా కాంక్షలు

సరస భారతి 167వ కార్యక్రమంగా 2022 మార్చి లో లో పదవతరగతి  పాసై , అత్యధిక మార్కులు పొందిన పేద ప్రతిభగల బ్రాహ్మణ విద్యార్ధికి , విద్యార్ధినికి  మా గురువరేణ్యులు కీ .శే .బ్రహ్మశ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి ,శ్రీమతి సీతమ్మ దంపతుల స్మారక నగదు పురస్కార౦   శ్రీ సర్వేపల్లి రాదా కృష్ణ పండితుని జన్మదినోత్సవం –ఉపాధ్యాయ దినోత్సవం  నాడు 5–9-22 సోమవారం ఉదయం 10.గం కు అమరవాణి  హైస్కూల్ లో మా  గురుపుత్రులు శ్రీ కోట సోదరులచేతులమీదుగా అందజేయ బడుతుంది .అలాగే శ్రీ కోట మాస్టారి  శిష్యులు శ్రీ మైనేని గోపాల కృష్ణ శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా )ఏర్పాటు చేసిన బ్రహ్మశ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి ,శ్రీమతి సీతమ్మ దంపతుల స్మారక నగదు పురస్కారం పేద ప్రతిభగల ఒక SC విద్యార్ధికి ,ఒక BC విద్యార్ధినికి అంద జేయబడుతుంది .సాహిత్య ,విద్యాభిమానులుఅందరూ  పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన .

  కార్య క్రమం -5-9-22 సోమ వారం ఉదయం 10.గం.లకు

   సభాధ్యక్షులు –శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు

   సభ ప్రారంభకులు –శ్రీమతి జోశ్యుల శ్యామలా దేవి –సరసభారతి గౌరవాధ్యక్షులు

 ఆత్మీయ అతిధులు -పురస్కార ప్రదాతలు శ్రీ కోట గురుపుత్రులు ,శ్రీ కోట సోదరులు – శ్రీ కోట చంద్రశేఖర శాస్త్రి గారు ,శ్రీ కోట గాయత్రీ ప్రసాద్ గారు ,శ్రీ కోట రామకృష్ణగారు ,శ్రీకోట సీతారామాంజనేయులు గారు .

             కార్యక్రమ వివరం

 శ్రీ కోట గురువరేణ్యుల ,శ్రీసర్వేపల్లి రాధా కృష్ణన్ చిత్ర పటాలకు  పుష్పమాలాలంకరణం

        1-  శ్రీ కోట సోదరులు ఏర్పాటు చేసిన –  శ్రీ  కోట గురువరేణ్యులు కీ .శే .శ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి గారి స్మారక ప్రోత్సాహక నగదు పురస్కార ప్రదానం  –

ఉయ్యూరు ఫ్లోరా స్కూల్ లో  చదివి 2022 పబ్లిక్ పరీక్షలో పదవతరగతి  546/600మార్కులతో ఉత్తీర్ణత సాధించి ,శ్రీచైతన్యలో ఇంటర్ చదువుతున్న   –చిర౦జీవి  కుందేరు నాగ సాయి కృష్ణ తేజ కు రూ-10,116(పది వేల నూట పదహారు రూపాయలు )

2-శ్రీ కోట సోదరులు ఏర్పాటు చేసిన -కీ శే .శ్రీమతి కోట సీతమ్మ గారి స్మారక ప్రోత్సాహక నగదు పురస్కార ప్రదానం  

  ఉయ్యూరు శ్రీనివాస అక్షరాలయం లోచదివి   2022 పదవ తరగతి  పబ్లిక్ పరీక్షలో 536/600మార్కులతో ఉత్తీర్ణత సాధించి ,శ్రీనివాస కాలేజిలో ఇంటర్ చదువుతున్న

 కుమారి వేదాంతం శ్రీ కమల తేజస్విని కు రూ-10,116(పది వేల నూట పదహారు రూపాయలు )

3-శ్రీ కోట గురు వరేణ్యుల శిష్యులు ,శ్రీ మైనేని గోపాల కృష్ణ ,శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా )ఏర్పాటు చేసిన

కీ.శే. శ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి గారి స్మారక నగదు పురస్కారం –S.C..విద్యార్ధికి  

 ఉయ్యూరు అమరవాణి హైస్కూల్ లో చదివి ,2022పదవ తరగతి పబ్లిక్ పరీక్షలో 549/600మార్కులతో ఉత్తీర్ణత సాధించి ,నారాయణ కాలేజిలో ఇంటర్ చదువుతున్న

చిరంజీవి జిత్తుక దీక్షిత్ బాబు కు –

5000రూపాయలు +శ్రీ గబ్బిట రామనాధ బాబు అందించిన 2,000రూపాయలు +శ్రీమతి కొల్లి భారతి అందించిన 1000 రూపాయలు –మొత్తం –రూ.8,000.

4- కీ శే .శ్రీమతి కోట సీతమ్మ గారి స్మారక ప్రోత్సాహక నగదు పురస్కార ప్రదానం  -BC విద్యార్ధినికి

ఉయ్యూరు అమరవాణి హైస్కూల్ లో చదివి ,2022పదవ తరగతి పబ్లిక్ పరీక్షలో 576/600మార్కులతో ఉత్తీర్ణత సాధించి ,శ్రీ చైతన్య  కాలేజిలో ఇంటర్ చదువుతున్న

కుమారి ధూళి పూడి త్రిష కు

5000రూపాయలు +శ్రీ గబ్బిట రామనాధ బాబు అందించిన 2,000రూపాయలు +శ్రీమతి కొల్లి భారతి అందించిన 1000 రూపాయలు –మొత్తం –రూ.8,000.

సరస భారతి ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ దినోత్సవ ప్రత్యేక  సన్మానం

 –అమరవాణిలో పని చేస్తున్న  ఇద్దరు ఉపాధ్యాయులకు

  ఉపాధ్యాయ దినోత్సవ  శుభా కాంక్షలతో

జోశ్యుల శ్యామలాదేవి   మాదిరాజు శివ లక్ష్మి    గబ్బిట వెంకట రమణ

గౌరవాధ్యక్షులు              కార్య దర్శి              కోశాధికారి

                             గబ్బిట దుర్గా ప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు మరియు పివి.నాగరాజు –ప్రిన్సిపాల్ అమరవాణి హైస్కూల్

                                                          24-8-22-ఉయ్యూరు

 తెలుగులో మాట్లాడటం మన జన్మ హక్కు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

శ్రీ గాడిచర్ల హరి సర్వోత్తమ రావు గారి.జీవితం.5వ భాగం

శ్రీ గాడిచర్ల హరి సర్వోత్తమ రావు గారి.జీవితం.5వ భాగం

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment