మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -14

• మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -14
• 41-ధర్మజ్యోతి ,విశ్వేశ్వర నక్షత్రమాల కర్త –శ్రీ పాణ్యంలక్ష్మీ నరసయ్య
• పాణ్యం లక్ష్మీనరసింహయ్య 1920వ సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీన కర్నూలు జిల్లా, ఉయ్యాలవాడ గ్రామంలో సుబ్బలక్ష్మమ్మ, లక్ష్మీనరసయ్య దంపతులకు జన్మించాడు. ఇతడు తన తండ్రివద్దను, పినతండ్రి వాసుదేవశాస్త్రి వద్దను, వెల్దుర్తి లోని అన్నదానం సుబ్బాశాస్త్రి వద్దను, గౌరిపెద్ది శేషశాస్త్రుల వద్దను సంస్కృతాంధ్రములు నేర్చాడు. ఇతనికి చిన్నతనంలోనే కవిత్వం అబ్బింది. ఇతడికి ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కలిగారు. ఇతని పెద్దకుమారుడు పాణ్యం నరసరామయ్య కూడా చక్కని కవితలు అల్లిన కవి. లోకోపకారార్థము ధార్మిక రచనలు చేసిన పాణ్యం లక్ష్మీనరసింహయ్య 1978-79 ప్రాంతంలో తనువుచాలించాడు[1].
• రచనలు
• ధర్మజ్యోతి[2]
• ఈశ్వరశతకము
• శ్రీ కోదండరామశతకము
• శ్రీ విశ్వేశ్వర నక్షత్రమాల
• శ్రీ రామతత్త్వ రహస్యము
• 42- స్కూళ్ళ ఇన్స్పెక్టర్ ,రోజా కధకు గిడుగు వారి ప్రశంసలుపొంది ,జానపద వాజ్మయం ,నాటకాలు,ఫ్యూచర్ లైఫ్ ఆఫ్ ది సోల్ రాసిన –శ్రీ టేకుమళ్ళ కామేశ్వరరావు 
టేకుమళ్ల కామేశ్వరరావు కవి, విమర్శకుడు.జానపద వాజ్మయం లోనూ, బాల వాజ్మయం లోనూ ఎక్కువగా కృషి చేశాడు. పాత పాటలు జోల పాటలు సేకరించి ప్రచురించాడు. వ్యవహారిక భాషకు కూడా కొన్ని నియమాలు అవసరమనే అభిప్రాయమున్న వ్యవహారిక భాషవాది.
జీవిత విశేషాలు
తండ్రి టేకుమళ్ల అచ్యుతరావు వాజ్మయ విమర్శకుడు, బహుగ్రంథకర్త. ఇతడికి చిన్నప్పటి నుండే కవిత్వం వ్రాయడం అభ్యాసమైనది. బళ్లారిలో చదివాడు. 1927లో వివాహం జరిగింది. 1933లో ఉపాధ్యాయుడుగా ఉద్యోగం ప్రారంభించి స్కూళ్ల ఇన్‌స్పెక్టర్‌గా రాయలసీమ,ఉత్తర సర్కారు జిల్లాలలో పనిచేశాడు.1935లో భార్యావియోగం కలుగగా అదే సంవత్సరం రెండవ వివాహమైనది.
ఈయన రాసిన రోజా కథ చదివిన గిడుగు రామ్మూర్తి పంతులు గారు దేశ భాషలో ఎంతో కృషి చేసాను ఎందుకు? ఇటువంటి కథ ఒక్కటి రాసివుంటే ఎంత బాగుండేది అని మెచ్చుకున్నారు.
రచనలు
• రోజా (కథా సంపుటము)
• జానకి ప్రేమ (కథా సంపుటము)
• వెలుగు
• పాలపిట్ట
• మిణుగురు పురుగు (గేయాలు)
• కోపదారి మొగుడు (నాటకం)
• సాహిత్య చిత్రములు(కథల సంపుటి) [1]
• పాత పాటలు
• సాంప్రదాయ విజ్ఞానం
• నా వాజ్మయ మిత్రులు
• Further life of the Soul
• కలువలు (ఖండకావ్యము)
• వాడుక భాషారచన – కొన్ని నియమములు
• పూర్వాంధ్రకవులు
• తెలంగాణా రాజుల చరిత్ర
• ప్రకాశవిమర్శీయము (నాటకం)
• జానపదగేయ వాజ్మయ చరిత్ర
• 43-శతాధిక గ్రంధకర్త ,మహా పరిశోధక విమర్శకుడు,కళారత్న – ఆచార్య ఎస్.గంగప్ప
• సాహితీపరిశోధకుడు, బహుగ్రంథకర్త అయిన ఎస్.గంగప్ప అనంతపురం జిల్లాకు చెందినవాడు.
జీవిత విశేషాలు
ఎస్.గంగప్ప 1936, నవంబర్ నెల 8వ తేదీన నల్లగొండ్రాయని పల్లి లో వెంకటప్ప, కృష్ణమ్మ దంపతులకు జన్మించాడు. ఇతడి ప్రాథమిక విద్య సోమందేపల్లిలోను, మాధ్యమిక విద్య పెనుకొండలోను జరిగింది. అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో బి.ఏ. ఆనర్స్ చదివాడు. వాల్తేరు ఆంధ్ర విశ్వకళాపరిషత్తు నుండి 1960లో ఎం.ఏ. పూర్తిచేశాడు. కాలేజీ లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తూ ప్రైవేటుగా “కోలాచలం శ్రీనివాసరావు – నాటక సాహిత్య సమాలోచనము” అనే అంశంపై పరిశోధన చేసి పి.హెచ్.డి. సాధించాడు. 1960లో అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో ఆంధ్రోపన్యాసకుడిగా చేరి కాకినాడ, విశాఖపట్నం,హైదరాబాదు, కర్నూలు సిల్వర్ జూబ్లీ కళాశాల లలో ఆంధ్రోపన్యాసకునిగా, తెలుగు శాఖాధిపతిగా 1978 వరకు పనిచేశాడు. 1978నుండి నాగార్జునాయూనివర్శిటీ ఆంధ్రోపన్యాసకుడిగా, రీడర్‌గా, ప్రొఫెసర్‌గా పనిచేశాడు. 1989-91లో తెలుగు ప్రాచ్యభాషాసంఘం అధ్యక్షుడిగా, 1994-96లో ఎం.ఏ పాఠ్యనిర్ణాయక సంఘం అధ్యక్షుడిగా ఉండి 1996లో పదవీవిరమణ చేశాడు.
సాహిత్యసేవ
అనేక పత్రికలలో వివిధ సాహిత్యాంశాలపై వ్యాసాలను ప్రచురించాడు. అనేక సాహిత్య సదస్సులలో, గోష్టులలో పత్రాలు సమర్పించాడు. అనేక విశ్వవిద్యాలయాలలో ప్రసంగాలు చేశాడు. సుమారు 100కుపైగా గ్రంథాలను వ్రాసి ప్రచురించాడు. అనేక సాహిత్యాంశాలపై రేడియో ప్రసంగాలు చేశాడు. ఆయనను అనేక సంస్థలు సత్కరించాయి. అనేక పురస్కారాలను గెలుచుకున్నాడు. కేంద్రసాహిత్య అకాడెమీ సీనియర్ ఫెలోషిప్‌ను పొందాడు. పదసాహిత్యంపై పరిశోధన జరిపాడు.
రచనలు
1. క్షేత్రయ్య పదసాహిత్యం
2. సారంగపాణి పదసాహిత్యం
3. అన్నమాచార్యులు – ఇతర ప్రముఖ వాగ్గేయకారులు – తులనాత్మక అధ్యయనం
4. తెలుగులో పదకవిత
5. కోలాచలం శ్రీనివాసరావు[1] (ఆం.ప్ర.సంగీత అకాడెమీ ప్రచురణ)
6. సాహిత్యసమాలోచన[2]
7. తెలుగుదేశపు జానపదగీతాలు
8. జానపద గేయరామాయణము
9. జాతికి ప్రతిబింబం జానపద సాహిత్యం
10. సాహిత్యసుధ[3]
11. సాహిత్యానుశీలన[4]
12. ఉన్నవ లక్ష్మీనారాయణ సాహిత్యజీవితం
13. సాహిత్యోపన్యాసములు
14. భాషావ్యాసాలు
15. తెలుగు నాటకం – ఆరంభం నుంచి అబ్సర్డు నాటకాలదాకా
16. విశ్వనాథవారి వేయిపడగలు – విశ్లేషణాత్మక విమర్శ
17. విశ్వనాథవారి నాటకాలు – విశ్లేషణ
18. సుహాసినీహాసం (నవల)
19. వేమన భావన
20. సిద్ధేంద్రయోగి
21. పురంధరదాసు
22. నాగార్జునుడు
23. ఎఱ్ఱన రసపోషణ
24. తిక్కన భారతం శాంతిపర్వం ద్వితీయాశ్వాసం వ్యాఖ్యానం
25. Literature of Asian Studies
26. అన్నమాచార్య సంకీర్తన సుధ
27. రాజరాజప్రశస్తి (నవల)
28. ఆత్మార్పణం (నవల)
29. పదకవితాపితామహుడు (నాటకం)
30. దివ్యదీపావళి (నాటకం)
31. దేశం బాగుపడాలంటే (నాటకం)
32. బాలగేయాలు
33. తీరిన భయం (కథలసంపుటి)
34. నవోదయం (కవిత్వం)
35. రెండు గులాబీలు (కవిత్వం)
36. అంతరంగతరంగాలు (కవిత్వం)
37. పగటివేషాలు
38. శ్రీకృష్ణస్తోత్రత్రయము
39. ప్రసంగసాహితి
పురస్కారాలు సత్కారాలు
• 1972 – ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు
• 1981 – ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు
• 1983-85 – కేంద్రప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ సీనియర్ ఫెలోషిప్
• 1984 – విశ్వనాథ సాహిత్యపీఠం అవార్డు
• 1991 – యు.జి.సి. జాతీయ ఉత్తమ అధ్యాపక అవార్డు
• 1992 – ఆం.ప్ర.ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక అవార్డు
• 1992 – తెలుగు విశ్వవిద్యాలయం తిక్కవరపు రామిరెడ్డి స్మారక ధర్మనిధి పురస్కారం
• 1993 – తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ పరిశోధన పురస్కారం
• 2013 – హంస (కళారత్న) పురస్కారం (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హైదరాబాదు, 11 ఏప్రిల్ 2013)[5]
44-‘’తెలుగు కాకి ‘’బిరుదాంకితుడు ,ఉత్తమ ఉపాధ్యాయుడు ,బహుప్రక్రియా రచయిత,ప్రజా కవి –శ్రీ కోగిర జయసీతారాం
గిర జయసీతారాం (నవంబర్ 14, 1924 – అక్టోబర్ 9, 2000) [1] అనంతపురం జిల్లాలోని ఒక మారుమూల పల్లెలో నిరుపేద కుటుంబంలో జన్మించాడు. 8వ తరగతి వరకు చదివాడు. కోనపురం, నడింపల్లె, బొంతలపల్లె, కోగిర, రామగిరి మొదలైన ప్రాంతాలలో ఒకటవ తరగతి ఉపాధ్యాయుడిగా, ఏకోపాధ్యాయుడిగా 1949 – 85 మధ్యకాలంలో పనిచేశాడు.[2] ఆ పల్లెలలో పేద ప్రజల నడుమ నిత్యము కలిసిమెలిసి తిరుగుతూ ఆ ప్రజాజీవితాన్ని,భాషను, ఆచార వ్యవహారాలను, వారి జీవితానుభవాలను పూర్తిగా తన రక్తంలో జీర్ణించుకుని వారికోసం వారి భాష, పలుకుబడులతో కవిత్వం అల్లి ప్రజాకవిగా నిలిచాడు.
జీవిత విశేషాలు
“తెలుగు సాహిత్యంలో కవికోకిల, కవి వృషభ, కవి సింహ, కవికిశోర మొదలైన బిరుదులు కలవారే ఎక్కువ మంది ఉన్నారు. కవికాకి బిరుదు ఎవరికీ ఉన్నట్లు లేదు. మీకు ఇస్తున్నాం. స్వీకరించగలరా?” అని ఒక నిండు సభలో ఆ సభాధ్యక్షుడు ఇతడిని ప్రశ్నించగా ఈయన నిస్సంకోచంగా ముందుకు వచ్చి “కాకి ప్రజల పక్షి. నిత్యము వాళ్ళను మేల్కొపుతూ వుంటుంది. నేనూ అటువంటి వాడినే. నాకు ఆ బిరుదు తగినదే” అని సభలో పలికి గౌరవాగౌరవాలను సమాన స్థాయిలో స్వీకరించిన సుకవి ఇతడు. అనంతపురం మాండలికాన్ని ఇతడు తన రచనలలో అత్యంత సమర్థవంతంగా ఉపయోగించుకున్నాడు. 1983లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇతడిని ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం ఇచ్చి సత్కరించింది. 1984-85 సంవత్సరానికి రెండవ తరగతి తెలుగువాచకాన్ని అందించాడు. ఇతడు చెయ్యి తిరిగిన రచయితే కాకుండా తబలా, హార్మోనియంలు వాయించడంలో దిట్ట. మంచి చిత్రకారుడు కూడా. ఇతడు 2000, అక్టోబరు 9 తేదీన చనిపోయాడు.
రచనలు[మార్చు]
1. నిట్టూర్పులు (పద్యకావ్యం)
2. విజయప్రభ (బుఱ్ఱకథ)
3. సుగుణా శతకము (400 పద్యాలు)
4. మదాంధబరాతము (వ్యంగ్య రచన)
5. అరణ్యరోదనము (సీసపద్యాలు)
6. కావ్ కావ్ శతకము
7. కాకిగోల (గేయాలు)
8. పండువెన్నెల (పిల్లల పాటలు)
9. జయభారతి (బుడబుక్కల కథ)
10. కృష్ణార్జున యుద్ధము (నాటకము)
11. రామాంజనేయ యుద్ధము (నాటకము)
12. సీతారామ కళ్యాణము (నాటకము)
13. మేం పిల్లలం (150 బాలగేయాల సంకలనం)
14. అక్షరసైన్యం
15. జైసీతారాం సీసాలు
రచనల నుండి మచ్చుతునకలు
ఆడ బెయ్యెదెవ్‌రు? ఆదిగా – “యాలవా”
“అగ్గిపెట్టె వుంద అనుముగా; నితావ?”
“వూను వుందితాలు నేనంటిత్త”
—- —- —-
“కప్కొనేకి యేడ్డి కప్పడమూ లేదు
దుప్టి గొందమంటె దుడ్లు లేవు
తొలుపుల్యాక వాకిలికి తడకడ్డం బెట్కోని
యేటి బతుకో యేమొ యల్ల కాల్ము”
“-యంగటమ్మా! లేత్వ, యింగా లేదా”
“ఏం, లేశ్ననత్తా! యెసురెంత బెట్టల్ల”
“రొండు జెమ్లు బెట్టు; పిండి వుందొ”
“యాడిదిప్‌డు రాగులిసురల్ల; యెసర్లోకి”
“సందకాడ వురికె సత్తారంద్రు….”
(సలిమంటలు అనే కవిత నుండి)
అక్కా! పెట్టు
చుక్కా బొట్టు!
అవ్వా! నాకు
బువ్వా పెట్టు!
అమ్మా! నాకు
బొమ్మా ఇవ్వు!
నాన్నా! నాకు
పెన్నూ ఇవ్వు!
(మేం పిల్లలం పిల్లల గేయసంపుటి నుండి)
45-విద్వాంసులకు విద్వాంసుడు ,ఆంధ్రప్రభ సంపాదకుడు ,కదా సరిత్సాగర అనువాదకుడు ,పెన్నేటిపాట ఫేం –శ్రీ విద్వాన్ విశ్వం
విద్వాన్ విశ్వం, (1915 అక్టోబర్ 21 – అక్టోబర్ 19 1987 గా చిరపరచితుడైన మీసరగండ విశ్వరూపాచారి విద్వాంసులకు విద్వాంసుడుగా పలువురి ప్రశంసలు పొందాడు. తెలుగు వెలుగులను అందంగా విస్తరిస్తూ అసభ్యతలకు దూరంగా తెలుగు వారపత్రిక “ఆంధ్రప్రభ” నడిపించిన సంపాదకుడు విశ్వం .
జీవిత చరిత్ర
బాల్యం, విద్యాభ్యాసం
1915, అక్టోబరు 21న అనంతపురం జిల్లాలో తరిమెల గ్రామంలో ఒక విశ్వబ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. తండ్రి మీసరగండ మునిరామాచార్యులు. విశ్వం చిన్నతనంలో స్వగ్రామంలోని రామాయణం శంకరశాస్త్రి వద్ద సంస్కృతం నేర్చుకున్నాడు. సంప్రదాయ పద్ధతిలో కర్నూలు,ప్రొద్దుటూరు లలో సంస్కృత కావ్య నాటకాలంకారాలను, తర్కశాస్త్రాన్ని ఆభ్యసించాడు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి సంస్కృతంలోనూ, ఆంధ్రంలోనూ విద్వాన్ పట్టాపుచ్చుకున్నాడు. అనంతపురంలో చిలుకూరు నారాయణరావు వద్ద శిష్యరికం చేశాడు. కాశీ విశ్వవిద్యాలయంలో పరిశోధన చేస్తూ అనారోగ్యం వలన పూర్తి చేయలేకపోయాడు.
రాజకీయరంగం
బెనారస్‌ నుండి అనంతపురం తిరిగిరాగానే తరిమెల నాగిరెడ్డితో కలిసి రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించాడు.ప్రజలను చైతన్యపరచటానికి గ్రంథ ప్రచురణ అవసరమని భావించి నవ్యసాహిత్యమాల అనే ప్రచురణ సంస్థ ఏర్పాటు చేసి నవ్యసాహితి అనే పత్రికకు సంపాదకత్వం వహించాడు. ఫాసిజం మొదలైన అంశాలపై పుస్తకాలను ప్రచురించాడు. దానితో బ్రిటీషు ప్రభుత్వం రాజద్రోహం క్రింద తరిమెల నాగిరెడ్డిని, విద్వాన్ విశాన్ని అరెస్టు చేసి మొదట బళ్ళారిలోని అల్లీపూర్ జైల్లోనూ ఆ తర్వాత తిరుచిరాపల్లి జైలు లోనూ నిర్భందించింది. తిరుచిరాపల్లి జైలులో విశ్వం బెజవాడ గోపాలరెడ్డి వద్ద బెంగాలీ నేర్చుకున్నాడు. ఈ జైలులో రాజాజీ, టంగుటూరి ప్రకాశం వంటి నాయకుల సాహచర్యం లభించింది.ఇతను అనంతపురం జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా, రాయలసీమ కాంగ్రెస్ కమిటీ కార్యాలయ కార్యదర్శిగా, అనంతపురం జిల్లా జాతీయసభకు, జిల్లా లోకజనసంఘానికి, మండల క్షామనివారణ సభకు, జిల్లా ఆంధ్రమహాసభకు ప్రధాన కార్యదర్శిగా, జిల్లా రైతు మహాసభకు ఉపాధ్యక్షుడుగా పనిచేశాడు.
పత్రికారంగం
ఉద్యమం, ఉపన్యాసం మాత్రమే కాకుండా మరింత లోతుగా రాజకీయాలు శాస్త్రపద్ధతిలో వివరించడానికి పత్రికారంగం వైపు దృష్టి సారించాడు. అడవి బాపిరాజు ఆహ్వానించడంతో మీజాన్ పత్రికలో 1945లో అసిస్టెంట్ ఎడిటర్‌గా చేరి కొంతకాలం పనిచేశాడు. తరువాత విజయవాడలో ప్రజాశక్తి దినపత్రికలో అసిస్టెంట్ ఎడిటర్‌గా సుమారు మూడు సంవత్సరాలు పనిచేశాడు. “మీజాన్” పత్రికలో రచనావ్యాసంగం, “ప్రజాశక్తి”లో సంపాదకత్వం పాండితీభాషలోనే సులభశైలిని సాధించగలిగినా, పరిపాలనాయంత్రాంగపు నిర్బంధాలకు గురయ్యాడు. తర్వాత మద్రాసుకు తరలివెళ్ళి అక్కడ బాలభారత్ విద్యాలయంలో సంపాదకుడిగా కొన్నాళ్ళు పనిచేశాడు. 1952 ఆగష్టు 15న ఆంధ్రప్రభ సచిత్రవారపత్రిక ప్రారంభమైనపుడు దానిలో ఎడిటర్ ఇన్‌చార్జ్‌గా చేరి 1959 వరకు పనిచేశాడు. 1959లో ఆంధ్రపత్రిక దినపత్రికలో అసిస్టెంట్ ఎడిటర్‌గా కొంతకాలం పనిచేసి 1960లో విజయవాడకు వచ్చి ఆంధ్రజ్యోతి దినపత్రికలో అసోసియేట్ ఎడిటర్‌గా పనిచేశాడు. మళ్ళీ 1963లో ఆంధ్రప్రభ దినపత్రికకు అసోసియేట్ ఎడిటర్‌ చేరాడు. 1967లో ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికకు సంపాదకుడిగా మారాడు. ఆంధ్రప్రభ సచిత్రవారపత్రికలో పదవీవిరమణ చేసిన తరువాత 1981నుండి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణల విభాగానికి ప్రధాన సంపాదకునిగా వ్యవహరించాడు. ఈ సమయంలో విశ్వం కథాసరిత్సాగరాన్ని 12 సంపుటాలుగా తెనుగించాడు. “చందమామ”లో ద్విపద కావ్యం రూపంలో వ్రాసిన పంచతంత్ర కథలను బాపు బొమ్మలతో తి.తి.దే.ప్రచురణగా వెలువరించాడు. బ్రహ్మసూత్రాలు శంకరభాష్యం నాలుగు సంపుటాలను, అధర్వణ వేదాన్ని అనువాదం చేసి ప్రచురించాడు. 1987 అక్టోబర్ 19వతేదీ తనువు చాలించాడు.
రచనలు
• విరికన్నె (కావ్యం)
• ఆత్మసాక్షి (కవిత్వం)
• ప్రేమించేను (నవల)
• పెన్నేటిపాట (కావ్యం)
• ఒకనాడు (కావ్యం)
• నాహృదయం (కావ్యం)
• పాపం
• రాతలూ గీతలూ
• సమీక్ష
• లెనిన్
• స్టాలిన్
• స్వతంత్రం
• మహాశిల్పి
• మహాసంకల్పం
• అదీ రష్యా
• స్వతంత్రం ఏం చేయటం
• ఫాసిజం దాని ధ్వంసం
• రష్యా యుద్ధకవులు
• రానున్న సంక్షోభం
• సత్యభామ
• ప్రథమ ప్రేమ
• ధర్మదుర్గం
• పొద్దుతిరిగింది
• స్వస్తిశ్రీ
• కచదేవయాని
• ద్వేషం
• దురాక్రమణ
• ఇరాన్
• ఇండియా
• ఇండోనేషియా
• వియత్నాం
• నీడలు – జాడలు
• విక్రమోర్వశీయము (రేడియో నాటకము)
• నాగానందము (రేడియో నాటకము)
• యుద్ధం మాకొద్దు (రేడియో నాటకము)
• ఏమి చెయ్యడం?
• మాణిక్యవీణ
అనువాదాలు
• కథాసరిత్సాగరం కథాలహరిని 12 సంపుటాల్లో ఆంధ్రీకరణం చేశారు.
• కాదంబరి (బాణుడు)
• కిరాతార్జునీయం (భారవి)
• దశకుమారచరిత్ర (దండి)
• మేఘసందేశం (కాళిదాసు)
• రఘువంశము (కాళిదాసు)
• కుమార సంభవము (కాళిదాసు)
• శిశుపాలవధ (మాఘుడు)
• రాజతరంగిణి (కల్హణుడు)
• మానవుడు (రోమారోలా నవల)
• నేటి భారతదేశం (రజనీ పామీదత్)
• ఫాసిజం
• భూమి (ఓప్లే హార్డీ నవల)
• వీడ్కోలు
• కర్ణకుంతి
• సతి
• ముక్తకములు
• చేకోవ్ కథలు
• గోర్కీ కథలు
• శిశు హృదయము
• శిశు రహస్యము
• యుద్ధానంతర ఆర్థిక పరిణామాలు
• బిల్హణీయము
• తెలుగు అధర్వ వేదసంహిత[1]
• పూలచెట్లు[2]
• రష్యా యుద్ధకథలు
• పేదరాలు (కథాసంకలనం)
• విలాసిని (కథల సంపుటి)
• ప్రజావిరోధి (నాటకము)
నిర్వహించిన శీర్షికలు
• విశ్వభావన – శ్రీసాధన పత్రిక 1938-1939
• తెలుపు-నలుపు – ఆంధ్రప్రభ వారపత్రిక 1952-1959
• అవీ-ఇవీ – ఆంధ్రపత్రిక దినపత్రిక 1958-1959
• ఇవ్వాళ – ఆంధ్రజ్యోతి దినపత్రిక 1960-1962
• టీకా-టిప్పణి – ఆంధ్రజ్యోతి దినపత్రిక
• మాణిక్యవీణ – ఆంధ్రప్రభ దినపత్రిక 1962-1966, ఆంధ్రప్రభ వారపత్రిక 1967-1987
మచ్చుతునక
14-9-1948న ఒడ్డు గ్రామానికి చెందిన రంగారెడ్డి అనే భూస్వామిని చంపారన్న అభియోగం పై 17మందికి నిజాం ప్రభుత్వం 19-07-1950న ఉరిశిక్ష విధించింది. ఈ ఉదంతం పత్రికలలో చదివి ఒక ఐరిష్ కవి స్పందించి వ్రాసిన కవితకు తెలుగు అనువాదం ఇది. జనవాణి దినపత్రిక 1951 ఏప్రిల్ 24 సంచికలో ప్రచురింపబడింది.[3]

ఉరికంబం కదులుతోంది

స్వచ్చ రవికిరణ కాంతితో
స్వయం వ్యక్తిత్వంతో
జ్వలించవలసిన జీవితం
కాలుష్యాచ్ఛన్నమై మసకబారిపోయింది.
………….
పదిహేడుగురు తల్లులు
కదలకుండా కిటికీల వద్ద నిల్చొని
కంటనీరు పెడ్తున్నారు
కాళరాత్రి తెలంగాణాలో
కటిక చీకటిని పూసింది
…………..
నవయుగ నాందీగీతం
నగారా మోగిస్తోంది
నేడో రేపో వినితీరాలి
నేడే వినడం మంచిది
…………..
నరలోకపు గుండెల్లో
చిరచిరలాడుతోంది బాధ
ఉరికంబం కదులుతోంది
ఉచ్చు గాలికెగురుతోంది
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్-28-9-22-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

హాస్యానందం 32

హాస్యానందం

32-ఆత్మాపకర్ష

ఆత్మస్తుతిలో ఎలాంటి హాస్యం పుడుతుందో ఆత్మానిందలోనూ అలాంటిదే జాలువారుతుందన్నారు మునిమాణిక్యం మాష్టారు .ఒకసారి ఒక శిష్యుడిని మాస్టారు ‘’నువ్వు వట్టివెధవాయివోయ్ ‘’అంటే వాడు ‘’నిజమేసార్ మా అమ్మా నాన్న అందరూ అలానే అంటారు ‘’అన్నాడట .’’మీకేమీ తెలీదు ఊరుకోండి ‘’అంటుంది ప్రతిభార్య తన మొగుణ్ణి.’’అంతేగా అంతేనేమో అనుకున్నారట మాస్టారు .’’త్రీమేన్ ఇన్ ఎ బోట్’’ అనీ జెరోం కే జెరోం రాసిన దానిలో ఒకపాత్ర తనకు లోకం లో ఉన్న జబ్బులన్నీ ఉన్నట్లు ఏకరువు పెడతాడు .వరుసక్రమంలో aనుంచి zదాకా ఆలిస్ట్ చెబుతాడు .ఒక డాక్టర్ గారి క్లినిక్ కు ఒక పెద్దమనిషి వచ్చి అక్కడి మందు సీసాలున్న బల్ల దగ్గరకు వెళ్లి ఒక గ్లాసులో అన్ని సీసాలలో అరకు కొద్దిగా పోస్తుంటే డాక్టర్ చూసి ఏంచేస్తున్నావు, ఎవరు చేయమన్నారు అని గద్దిస్తే ‘’తాగటానికి కలిపాను ‘’అనగా ‘’నీకేమైనా పిచ్చా ?’’అంటే ‘’బలే డయాగ్నైజ్ చేశారు డాక్టర్ .నాకు కొంచెం పిచ్చి ఉంది. అన్నాడు అందరూ నవ్వారు .ఆయనకు పిచ్చిలేదు కొద్దిగా మనో చాంచల్యం మాత్రమె ఉంది అనికవర్ చేశారు ముని సార్.

ఉక్తి మూల హాస్యం

దీన్ని ఉత్పత్తి చేసేశక్తిని విట్ అంటారు .విట్ వలన పుట్టిన రమణీయ వాక్ వైభవాన్ని ‘’జోక్ ‘’అంటారు .ఇదిఒక ‘’మేలము’’ అంటే హఠాత్తుగా వచ్చేదన్నమాట .దీనికి బుద్ధి ,సమయస్పూర్తికావాలి .ఇది సరస సంభాషణలో బాగా దొర్లుతుంది .ఇలాంటి దాన్ని మునిమాణిక్యం సార్ ‘’కేరడం’’అని డిఫైన్ చేశారు .ఇందులో ఉన్న ఉక్తి విశేషాన్ని అర్ధం చేసుకొని ,చమత్కారం గ్రహించి ఆనందించాలి .కొంత భాషాజ్ఞానం,పరిశీలనా శక్తి ,హాస్యం పై అనురక్తి కావాలి .జోక్ అంటే రసాత్మక వాక్యం అని సి౦పుల్ గా చెప్పారు సార్.ఉక్తిమూల హాస్యం ఆత్మశ్రయంగా ,పరాశ్రయంగా కూడా ఉంటుంది .అంటే హాస్య శీలుడు జోక్ ను తనపై తానూ సంధించుకోవచ్చు ,ఇతరులపై విసరనూ వచ్చు .ఇందులో చాలారకాలున్నాయి ఆ విశేషాలు రేపు .

మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -27-9-22-ఉయ్యూరు

Posted in సమీక్ష | Tagged | Leave a comment

పద్మభూషణ్ బృందావన్ లాల్ వర్మ.2వ భాగం.27.9.22

పద్మభూషణ్ బృందావన్ లాల్ వర్మ.2వ భాగం.27.9.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

పద్మ భూషణ్ తారా శంకర్ బంద్యోపాధ్యాయ-3

పద్మ భూషణ్ తారా శంకర్ బంద్యోపాధ్యాయ-3

కలికాల్, కల్లోల్ ,లతోపాటు ఉపాసనా ,దూప్ ఛాయా మొదలైన పత్రికలూ తారాశంకర్ ను కధలు రాసిపంపమని కోరితే రాసిపంపితే ప్రచురించాయి .జమీందార్ల దోపిడీ ,కాబూలీవాళ్ళ దౌష్ట్యం ,మలేరియా మసూచి పట్ల ప్రభుత్వ ఉదాసీనత లతో నలిగిపోయిన ఒక గ్రామ చరిత్రను ‘’ శ్మశా నేర్ పధే’’-శ్మశానానికి  దారి కధగా రాశాడు .ఇదీ చైతాలీ ఘూర్ణి నవలకు బీజమైంది .కలకత్తా వెళ్లి వస్తున్నా అక్కడి జనజీవితపు లోతుపాతులు తెలియవు .ఆయన స్వభావంగా అవేశపూరితుడు .సున్నితఃరహృదయుడుశాంత చిత్తుడు .కలికాలం ఎడిటర్ మురళీ ధర బసు ఆయన్ను బాగా ఆకర్షించాడు .తర్వాత ప్రసిద్ధ రచయితలతో పరిచయం సాధించాడు .ఉపాసన సంపాదకుడు సావిత్రీ ప్రసన్న చటర్జీ చైతాలీ ఘూర్ణి ప్రచురణకు తోడ్పడ్డాడు .

  1929నుండిఅలజడి  ఆందోళన అశాంతి ఇండియాలో ఎక్కువయ్యాయి.మీరట్ కుట్ర తోఏర్పడిన అశాంతికి  గాంధీ సహాయనిరాకరణంద్వారాశాంతికి దారి చూపాడు దండియాత్ర చేశాడు ఆసేతు హిమాచలం గాంధీ బాట లో నడిచింది .మేనెలలో గాంధీని అరెస్ట్ చేసి కాంగ్రెస్ ను నిషేధ సంస్థగా ప్రకటించింది బ్రిటిష్ ప్రభుత్వం 10నెలల కాలం లో 90వేల సత్యాగ్రహుల్ని అరెస్ట్ చేసింది .పోలీస్ కాల్పుల్లో ఇద్దరు రాజకీయ నిర్బంధితులు మరణిస్తే ,కలకత్తాలో బ్రహ్మాండమైన నిరసన సభజరిగి  టాగూర్ అందులో ప్రసంగించాడు .1930లో తారాశంకర్ కూడా జైలుకు వెళ్ళాడు జైలు లోనే పాషాణ పూరి , ఘూర్ణి నవలలు రాశాడు  , డిసెంబర్లో విడుదలయ్యాడు .

 విడుదలకాగానే సుభాష్ చంద్ర బోస్ ను కలుసుకొన్నాడు బంద్యోపాధ్యాయ .బోస్ కు సేన్ గుప్తాకు మధ్య విభేదాలువస్తే పరి శీలించ టానికినిఆనె కలకత్తావస్తే ,బీర్భం నుండి మనవాడిని సాక్షిగా ఆహ్వానించారు .ఈయన నిర్మొహమైన మాటలకు బోసు సంతోషించాడు .సుభాష్ వ్యక్తిత్వం ఈయన్ను ఆకర్షించింది .చైతాలి ఘూర్ణి నవల బోసుబాబుకే అంకితమిచ్చాడు .ఇంటికి వచ్చి స్త్రీలనగలు అమ్మి అచ్చు యంత్రం కొని ఇంట్లో ఒక గదిలో పెట్టాడు .తారా రచనలను ఉపాసన అభ్యుదయపత్రికలు ప్రచురించేవి .

  బెంగాళ జానపద నృత్యాలను పునరుద్ధరి౦చాలనిఒక జిల్లా ఆఫీసర్ గ్రామాలనుండి ప్రాచీన కళాఖండాలను బలవంతంగా దౌర్జన్యంగాసేకరిస్తుంటే ,అది జాతీయోద్యమాన్ని పక్కదారి పట్టించే ఎత్తుఅని కొందరు భావించారు .కోపం తో ఒక రాజకీయకార్యకర్త బాగా ప్రచారంలో ఉన్న ఒక జానపద గీతానికి పేరడీ రాసి ,ఈయన ముద్రణాలయం ఎవరు లేని సమయంలో ముద్రించాడు .అధికారికి తనగురించే అది అని తెలిసి అరెస్ట్ చేయించాడు .తారాశంకర్ కూడా  గురయ్యాడు తప్పు లేకపోయినా .కుటిలకారణాలతో అరెస్ట్ ప్రయత్నం చేశారు .భోల్ పూర్ స్టేషన్ లో బోసును ఈయన రెండో సారికలియగా హామీపత్రం ఏదీ రాసివ్వద్దు,లొంగిపోవద్దు  అని హితవు చెప్పాడు  .ఈలోగా అచ్చు యంత్రం విప్పదీసి విడివిడిగా ఎడ్లబండీమీద లాభ పూర్ తీసుకు వెళ్ళాడు .

  అశా౦తమనస్సుతో మళ్ళీ జిల్లా పర్యటన చేశాడు. ఒక చిన్న పిల్ల చావు కు సంబంధించిన కధ రాస్తుండగా ఆరేళ్ళ ఆయన కూతురు’’ బులు’’ చనిపోయింది .అత్య౦త విషాదంతోకలకత్తా చేరాడు .ఉపాసన పత్రిక మూసేస్తూ చటర్జీ ఆపత్రికలో ప్రచురించిన రచనలకు ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చాడు .మనసుబాగోక స్వగ్రామం వెళ్ళినా లాభం లేక శాంతినికేతన్ వెళ్లి టాగూర్ గ్రామాభి వృద్ధి గురించి చర్చించాడు .భార్యబందువులు ఈయన్ను బొగ్గు వ్యాపార ముగ్గు లో దింపే ప్రయత్నం చేస్తే ఈయన ఒప్పుకోలేదు .ఆయన్ను అక్కడ అర్ధం చేసుకొన్న వారు అతితక్కువే .ఆవూళ్ళో ఒకయన ఇంగ్లాండ్ వెళ్లి వచ్చినవాడికి తనకూతుర్నిచ్చిపెళ్లిచేస్తే ,ఊళ్ళో వారు ఒప్పుకోకపోతే ఈయన ఒక్కడూ ఆయన్ని సమర్ధించాడు .

  గురుడు మళ్ళీ కలకత్తా చేరగా ,పసిపిల్లాడి మరణం పై కధ’’శ్మశాన్ ఘాట్ ‘’ సజనీ కాంత్ దాస్ కు  నచ్చి వగాశ్రీ మొదటి సంచికలోనే వేశాడు .ప్రముఖ చిత్రకారుడు జైమిని రాయ్ సలహాపై కలకత్తాలోనే ఉండిపోవాలనుకొని ఉన్నాడు .అక్కడ ఉండాలంటే కనీసం నెలకు పాతిక రూపాయలు కావాలి  .మిణకలేక తిరిగి స్వగ్రామం చేరాడు .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -27-9-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged , | Leave a comment

బ్రహ్మ వైవర్త పురాణం.ప్రకృతి ఖండం.13వ భాగం.27.9.22

బ్రహ్మ వైవర్త పురాణం.ప్రకృతి ఖండం.13వ భాగం.27.9.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -13

• మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -13
• 37-సైరంధ్రి కావ్యం,జ్ఞాన ప్రసూనా౦బికా శతకం రాసిన , స్వర్ణకంకణ గ్రహీత ,సరస కవయిత్రి –శ్రీమతి గంటి కృష్ణ వేణమ్మ
• ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన గంటి కృష్ణవేణమ్మ[1] గొప్ప కవయిత్రి. ఈమెది వాధూలస గోత్రము. ఈమె తండ్రి కఱ్ఱా రామశర్మ పోలీసు ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశాడు. తల్లి సుబ్బలక్ష్మమ్మ కవయిత్రి. చంద్రకళా విలాసము అనే ప్రబంధాన్ని రచించింది. ఈ గ్రంథం విద్వాన్ పరీక్షకు పాఠ్యగ్రంథంగా ఉండేది. గంటి కృష్ణవేణమ్మ భర్త గంటి వెంకటసుబ్బయ్య కూడా గొప్ప పండితుడు. కవులుట్ల చెన్నకేశవ శతకము ను వ్రాశాడు. ఈమె పెద్దగా చదువుకోక పోయినా తాతగారైన నాగపూడి కుప్పుసామయ్య వద్ద తెలుగు సాహిత్యం చదువుకుంది. ఒంటిమిట్టలో వావిలికొలను సుబ్బారావు నిర్వహించిన పరీక్షలను చిన్న తనంలోనే ముగించింది. హిందీ విద్యాపీఠం వార్థా నిర్వహించే భాషాకోవిద వరకు చదివింది. ఇంగ్లీషు, కన్నడ భాషలలో కూడా కొంత ప్రవేశముంది. ఈమె గృహలక్ష్మి , భారతి, త్రిలిఙ్గ పత్రికలలో పద్యఖండికలను ప్రచురించింది. గృహలక్ష్మి పత్రికాధిపతులు ఈమెకు స్వర్ణకంకణమును బహూకరించి సరసకవయిత్రి అనే బిరుదుతో సత్కరించారు. తన 86వ యేట ప్రొద్దుటూరులో మరణించింది.
రచనలు
1. సైరంధ్రి (పద్యకావ్యము)
2. గిరిజాకళ్యాణము
3. పవనద్యూతము
4. రాజరాజేశ్వరీ శతకము
5. కామాక్షీ శతకము
6. శ్రీ జ్ఞానప్రసూనాంబికా శతకము
7. తలపోత[2]
రచనల నుండి ఉదాహరణ
నాడటు పాండవాత్మజులు నన్నును, తమ్మును రాజ్యమెల్ల దా
నోడి మహార్తి నున్నతరి మద్యతులై ధృతరాష్ట్ర నందనున్
పాడి దొఱంగి వల్వలొలువన్‌గని సూతసుతుండు కొల్వులో
నాడిన మాట లకటా! తలపోయ మనంబు వ్రయ్యదే!
కురుపతి, భీష్ముడున్, గృపుడు, కుంభజ ముఖ్యులు గల్గుకొల్వులో
నరసి వచింపరైరకట! యాడుది వేడిన ధర్మసంశయం
బెరుఁగరె? ధర్మ శాస్త్రముల నేటికి గాల్పనె! పెద్దవారలం
దురుగద, యేటి పెద్దలిక నేటికి వారల గౌరవింపగన్?
(సైరంధ్రి పద్యకావ్యం నుండి)
38-ఆయుర్వేద ,జ్యోతిష పండితుడు,మహా౦ద్రో దయకావ్యకర్త  కవి –శ్రీ గొల్లాపిన్ని రామకృష్ణ శాస్త్రి
గొల్లాపిన్ని రామకృష్ణశాస్త్రి (1922 – 2001) ప్రముఖ ఆయుర్వేద, జ్యోతిష పండితుడు.[1]
. ఇతను గొల్లాపిన్ని సీతారామశాస్త్రి, సుబ్బమ్మ దంపతుల సంతానం. ఇతనిది పండిత వంశము కనుక కవిత్వము ఉగ్గుపాలతోనే అబ్బింది. ఆయుర్వేదంలో కూడా అనుభవం సంపాదించుకున్నాడు. అబ్కారీ డిపార్ట్‌మెంటులో కడపలో పనిచేశాడు.
రచనలనుండి ఉదాహరణలు
సీ. కాకతి క్ష్మాపతి కాంచుచున్నాడు హ
ర్షాశ్రు ముక్తామాల సంతరించి
హరిహర బుక్కరాయలు కాంచుచున్నారు
తెలినవ్వు చలువ వెన్నెలల బరసి
ఘనుడు విద్యారణ్యముని పలుకుచున్నాడు
సిరిలొల్క వైదికాశీస్సు గురుసి
శ్రీకృష్ణరాయలు వాకొనుచున్నాడు
శక్రుతో నాంధ్ర ప్రశస్తియేమొ

గీ. గురుని కెఱిగించు చుండె తిమ్మరుసుమంత్రి
ఆంధ్రమంత్రుల సాహసౌదార్యములను
గతచరిత్రకు నీకు దార్కాణవారె!
వచ్చియున్నారు నీయుత్సవంబుఁజూడ.
(మహాంధ్రోదయము నుండి)
39-అన౦త ఆణిముఖ్యం ,ప్రకాశంగారి శిష్యుడు ,దశకావ్య కర్త –శ్రీ తక్కళ్ళపల్లి పాపా సాహెబ్
అనంతపురం జిల్లా కీర్తి ప్రతిష్ఠలు పెంచిన జాతిరత్నాలలో తక్కళ్లపల్లి పాపాసాహేబు ఒక అనంత ఆణిముత్యం.
జీవిత విశేషాలు
1928లో తక్కళ్లపల్లి పాపాసాహేబు[1],[2] తన మాతామహుల ఇంటిలో కేశవరాయునిపేటలో జన్మించాడు. ఇతని విద్యాభ్యాసము ప్యాపిలి, పత్తికొండ, గుత్తి గ్రామాలలో జరిగింది. కాశీ విద్యాలయంలో చదువబోయి కారణాంతరాల వల్ల ఆ ప్రయత్నాన్ని మానుకొని స్వయంకృషితో విద్వాన్ పరీక్ష ఉత్తీర్ణుడయ్యాడు. గాంధీగారి స్ఫూర్తితో రాజకీయాలలో ప్రవేశించి కాంగ్రెస్ పార్టీకి అంకితమై దేశానికి సేవ చేశాడు. చిన్నతనం నుండి కవితాభ్యాసం చేసి పదికి పైగా కావ్యాలను వ్రాశాడు. ఇతని అంబ కావ్యము ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి భాషాప్రవీణ పరీక్షకు పాఠ్యగ్రంథంగా ఉండేది. ఇతని రచనలపై విశ్వవిద్యాలయాలలో ఎం.ఫిల్., పి.హెచ్.డి. స్థాయిలలో పరిశోధనలు జరిగాయి. 1964లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇతనిని రాష్ట్రకవిగా గుర్తించి సత్కరించింది. రాయప్రోలు సుబ్బారావు ఇతడికి మహాకవి అనే బిరుదును ఇచ్చాడు. పాపాసాహేబు 1981లో మరణించాడు.
రాజకీయరంగం
ఇతడు టంగుటూరి ప్రకాశం పంతులును రాజకీయ గురువుగా భావించి రాజకీయాలలోకి ప్రవేశించాడు. ఇతడు కాసు బ్రహ్మానందరెడ్డి అనుయాయిగా అనంతపురం జిల్లా రాజకీయాలలో కీలకపాత్ర వహించాడు. 1958 నుండి జిల్లా కాంగ్రెసు కార్యవర్గ సభ్యుడిగా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభుడిగా ఉన్నాడు. 1962, 1967, 1972 శాసనసభ ఎన్నికలలో గుత్తి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశాడు. రాజకీయాలలో తలమునకలుగా ఉండికూడా ఇతడు సాహిత్య వ్యాసంగాన్ని కొనసాగించాడు. ఇతడు తన రాజకీయ అనుభవాలను “నా రాజకీయ జీవితానుభవములు” అనే గ్రంథరూపంలో వివరించాడు[3].
రచనలు
1. అంబ
2. అవధి
3. కన్నీటి చుక్కలు
4. నా రాజకీయ జీవితానుభవాలు
5. పాపుసాబు మాట పైడిమూట
6. ప్రేమవిలాపము
7. రస ఖండము
8. రాజ్యశ్రీ
9. రాణీ సంయుక్త
10. శకుంతల
11. సత్యాన్వేషణ
12. విశ్వనాథ నాయకుడు
రచనల నుండి మచ్చుతునకలు
తన్నె వివాహమాడుట కెదన్ త్వరబొందెడు రుక్మిణిన్ మహా
పన్నత కుందు దాని మురభంజను డెత్తుక పోయినట్లు వే
గన్నరుదెమ్ము స్వామి నను గైకొని పోవగ వేచియుందు వే
గన్నుల నీదు రాకకయి కైరవ మిందుని కోస మట్టులన్
పరమ పవిత్రమైన మన భారతభూమి ప్రతిష్ఠ స్వార్థ త
త్పరమతి దుమ్ములో కలుపు తండ్రియెకాదు మరెవ్వరైననున్
స్థిర కరవాల ధారలను నిర్దయ గొంతులు కోతు, గొఱ్ఱెలం
గరణి దదసృగార్ద్ర శితఖడ్గము నిచ్చెద నీకు కాన్కగా
(రాణీసంయుక్త కావ్యం నుండి)
ప్రాణము పోవుచున్న దలవంచని పౌరుషసాహసాలు, వా
గ్దానమొసంగి తప్పని యుదార గభీరగుణమ్ము, లొంగుటే
గానని యాత్మగౌరవము, కంపము చెందని గట్టి చేవయున్
మానపరాయణత్వ మసమాన మఖండము నై విరాజిలున్
(సత్యాన్వేషణ నుండి)
యావజ్జీవము, మాతృదేశ భయదోద్యద్దాస్య నిర్మూలనా
భావోల్లాస వికాస చిత్తమున, దౌర్భాగ్యాభి పూత ప్రజా
సేవా దీక్షకు, ధారవోసిన దయాశ్రీసాంద్ర నిస్తంద్ర తే
జో విస్తార! జగత్పితా! కొనుమివే జోహారులర్పించెదన్
(మహాత్మాగాంధీ గురించి)
తురక కేమి తెలుసు పరమ వేదార్థమ
టంచు నెత్తి పొడుతు రవని సురులు
కన కబీరు తురక గాకేమి గరకయా
పాపుసాబు మాట పైడి మూట
(పాపుసాబు మాట పైడి మూట నుండ

40 –డిటెక్టివ్ నవలలతోసహా శతాధిక గ్రంధకర్త ,మహాకవి బిరుదాంకితుడు –శ్రీ గుంటి సుబ్రహ్మణ్యశర్మ
• గుంటి సుబ్రహ్మణ్యశర్మ[1] అనంతపురం జిల్లాకు చెందిన శతాధిక గ్రంథకర్త.
జీవిత విశేషాలు
సంస్కృత, ఆంగ్ల. ఆంధ్ర భాషలలో విద్యావంతుడు. సంస్కృతము గురుముఖంగా కాకుండా కేవలం స్వయంకృషితో నేర్చుకున్నాడు. అనంతపురంజిల్లా లోని అనేక గ్రామాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ప్రైవేటుగా ఇంటర్మీడియెట్, బి.కాం పరీక్షలు పాసయ్యాడు. ఇతని కలం నుండి 18 నవలలు, 18 బాలసాహిత్య కథాసంపుటాలు,18 వచనప్రబంధాలు, 20 జాతీయనాయకుల జీవితచరిత్రలు, 8 పద్యకావ్యాలు, ఇంకా ఎన్నో ఇతర గ్రంథాలు వెలువడినవి. ఇతని అపరాధపరిశోధక నవల ‘భూతగృహము’ ఆంధ్ర ప్రచారిణీ గ్రంథమాల కాకినాడచే 116/-రూ.ల బహుమతి గెలుచుకుంది.
రచనలు
• భూతగృహము (అపరాధపరిశోధక నవల)
• రహస్యశోధనము (అపరాధపరిశోధక నవల) [2]
• విశ్వజ్యోతి (గౌతమ బుద్ధుని చరిత్ర కావ్యము)
• మాధవాశ్రమము (నవల)
• విశ్వప్రేమ (బసవేశ్వరుని చరతము కావ్యము)
• శ్రీరామకృష్ణ భాగవతము (5000 పద్యాలున్న ఉద్గ్రంథము)
• జయాపజయములు
• కాసులదండ
• కాలభ్రమణం
• కన్నీటికాపురం
• ఆత్మతత్త్వవిచారము
రచనల నుండి ఉదాహరణలు
ఎన్నఁటికైన నన్ను నిను నేర్పడఁజేయును మిత్తి; సంపదల్
మిన్నలు కావు; నేను మిడిమేలపు జీవితమొంది భూమిపై
గ్రన్నన జచ్చుకంటె, బలకాయ సముత్థిత శక్తివెల్, నా
పన్నుల సేవఁజేతు; నిదిపాడియ; మద్భవసార మిద్ధరణన్
ఏమి సేతు నకట! ఎనలేని నీరూప
కాంతి, రెంట దీన కష్టజనుల
యోజ, చేరి మనసు నుఱ్ఱూత లూగించు
సుదతి నిన్ను విడుతు సుకృతమెంచి
తనయుడనై నీయొడిలో
దనరారుచు నుందు నింక తలఁకక,నాపై
మనసుంచక, యేలోటును
గనుపించక సుతునితోడ గడుపుము దినముల్
(విశ్వజ్యోతి నుండి)
మృత్యుముఖమున దరిజేరి మేధినీశు
లొక్కటౌదురు,భువిలోన సుక్కి పిదప
నెవర లేమౌదురో దేవు డెఱుగు? నకట!
మురిసిపోదురు మూన్నాళ్ళ ముచ్చటలకు
(విశ్వప్రేమ నుండి)
బిరుదులు
• అనంతపురము రాయలకళాగోష్ఠి ఇతడికి మహాకవి అనే బిరుదును ప్రదానం చేసింది.
•   సశేషం
• మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -27-9-22-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

హాస్యానందం 31-సిన్క్లేయిర్ హాస్యం 

హాస్యానందం

31-సిన్క్లేయిర్ హాస్యం 

లూయీ సింక్లైర్  కూడా ఆత్మాపకర్ష మూలంగా ,శబ్దార్ధ ఉభయ స్ఫురణతో రమణీయ హాస్యం  వండి వడ్డించాడని  మాస్టారువాచ .ఆయన కధకు నోబెల్ ప్రైజ్ వచ్చింది ,అప్పుడు  దాన్ని  ఎలా చెప్పాడో ఆయనమాటలలోనే –‘’నోబెల్ బహుమానం మిలియన్ డాలర్లు వచ్చిందని పొంగిపోయాను .మా ఆవిడ చెవిలో ఈశుభ వార్త చెబుదామని ఎంతో తాపత్రయ పడ్డాను .ఆ ఉత్తరం తీసుకొని ఇంటికి పరిగెత్తాను .ఆవిడ నేను అంతత్వరగా ఇంటికి రావటం చూసి బోల్డు ఆశ్చర్యపోయి ‘’మీకేం జరిగింది అంత హడావిడిగా వచ్చారు ?’’అని అడిగితె ,నేను సంతోషంతో ఉప్పొంగిపోయి ‘నాకు నోబెల్ ప్రైజ్ వచ్చిందోచ్ ‘’అన్నాను .ఆవిడ మరింత ఆశ్చర్యంతో ‘’అది గొప్ప వాళ్లకు కదండీ వచ్చేది . మీకెలా వచ్చింది ?అన్నది .

బార్క్ –లేస్క్ –హాస్యం

దీనికి తెలుగులో ఏపేరు పెట్టాలో మునిమాణిక్యంగారికి తెలియలేదు .ఇది హాస్యానుకరణం ,అతిశయోక్తి ,వెక్కిరింత ,వ్యంగ్యం,నాన్సెన్స్ వంటిదే అన్నారు .ఉదాహరణ –‘’అడవిలో చలి అదరగొడుతోంది చెట్లు ముడుచుకుపోయాయి మర్రి చెట్లు  వెంపలి చెట్లన్తయ్యాయి. కదలలేవు మెదల్లేవు .అప్పటికే సూర్యోదయం కావాలి .ప్రపంచంలోని నిప్పు అంతా గడ్డ కట్టుకు పోయింది .భూమి సూర్యుడి చుట్టూ తిరగటం మానేసింది .సూర్యరధం మంచులో కూరుకుపోయింది. ఆయన స్థాణువు అయ్యాడు .ఎలాగైనా తెల్లార్చాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు .సృష్టి స్తంభించిపోయింది .అప్పుడు నాకో అయిడియా తట్టి సూర్యుడి రధ చక్రాలను రెండు తాపులు తన్నాను. అంతే మంచు విడిపోయి సూర్యరధం కదిలింది .బిగుసుకుపోయిన భూమిని రెండు సార్లు మనిషిని బుజాలు పట్టుకొని ఊపినట్లు ఊపి దార్లో పడేసేసరికి నా తలప్రాణం తోకకి వచ్చింది .ఇదే బర్-లేస్క్ కు ఉదాహరణ అన్నారు మీసాలు మెలేస్తూ మాస్టారుగారు .

 మరో ఉదాహరణ –‘’ఆ రోజు స్కాట్ లాండ్డ్ తూర్పు తీరం నానాగందర గోళంగా ఉంది .సముద్రం లో తుఫాను రేగింది. అన్ని తీరాలూ అలానే ఉన్నాయి. మనకధ జరిగింది ఇంగ్లాండ్ దక్షిణ తీరంలో .అక్కడ ఒకే రాజు పాలన. రాజుపేరు ‘’క్నో-ట్రాక్-స్పైన్-ట్వ్యి-న్మ్య’’.సాధారణంగా నోట్రం ట్వి అంటారు .రాజధాని పేరు క్న్యో-ట్మ్యా-స్వెం-ట్వ్యికో ‘’కాని అంతా దాన్నిక్నోస్సేట్’’అంటారు .కధకు పేర్లకూ అసలు సంబంధమే లేదు తన పేరు చెప్పక పొతే రాజు కోప్పడతాడని ఆపలక లేని పేరు చెప్పి మన బుర్ర తిన్నాడు రచయిత అంటారు నరసింహారావు జీ .

మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-9-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బృందావన్ లాల్ వర్మ.1వ భాగం.26.9.22/

బృందావన్ లాల్ వర్మ.1వ భాగం.26.9.22/

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

పద్మ భూషణ్ తారా శంకర్ బంద్యోపాధ్యాయ-2

పద్మ భూషణ్ తారా శంకర్ బంద్యోపాధ్యాయ-2

     యవ్వన దశ

తారాశంకర్ కు యవ్వన దశ వచ్చాక నళిని బాగ్చి అనే అనే విప్లవకారుడితో పరిచయం కలిగింది .అతడుఇతనిలొ విప్లవభావాలు నాటాడు .1916లో జాదవలాల్ ఉన్నతాంగ్ల పాఠశాలలో చేరి మెట్రిక్ పాసయ్యాడు .తర్వాత కలకత్తాలో సెయింట్ జేవియర్ కలేజిలోచేరి ,రాజకీయ అనుమానితుల జాబితాలో అతని  పేరు ఉండటం తో  చదువు మానేయాల్సి వచ్చింది .అసుతోష్ కాలేజిఅనే సౌత్ సబర్బన్ కాలేజిలో చేరి ,అనారోగ్యం వల్ల మానేశాడు.1921లో విప్లవభావాలు కొంత స్తబ్దతతర్వాత  నూతన ఉత్తేజం పొందాయి అతనిలో .గాంధీ సహాకనిరాకరణ పట్ల ఆకర్షితుడయ్యాడు .హి౦సావిధానం ఆయన మెచ్చలేదు. తానెప్పుడూ విప్లవవాదినికాను అని కల్లోల్ నవలలో చెప్పుకొన్నాడు .మనసులోని భావాలకు గాంధీ సిద్ధాంతాలు సమాధానం చెప్పినట్లు అనిపించింది .ప్రజల కష్టాలపై ఆసక్తి,ఆదుకోవాలనే కోరిక ,అభిమానం సానుభూతి ఆయనను మహా రచయితగా మార్చాయి .అనంత ప్రజావాహినే ఆయన మార్గదర్శి .

  పరిపూర్ణ మానవతపై తారాశంకర్ కు మహా విశ్వాసం ఉంది .మహనీయ వ్యక్తులే ఆయన నవలలలోని పాత్రలు .కవి కావాలనే కోరిక ఉండేది.1920లో ఆయన బంధువు ఒకాయన ‘’త్రిపత్ర ‘’అంటేమూడాకులు అనే ఈయన కవితా సంపుటి ప్రచురించాడు  .భారతవర్ష అనే ప్రముఖ పత్రికలఈయన కవిత అంతకు ముందే ప్రచురింపబడింది .త్రిపత్ర ఆయన బందుమిత్రులకే పరిమితం అవటం వలన తర్వాత కాల గర్భం లో కలిసిపోయింది .తర్వాతకాలం లో రాసిన కవిత్వం తక్కువేకాని, ఆయనలో భావుకుడైన కవి ఎప్పుడూ ఉండేవాడు .గురుముఖతనేర్వని ఆశుకవిత్వం ఈయనలో బాగా కనిపిస్తుంది .ఆకాలం లో ‘’కబియల్’’అంటే కవి-గాయకుడు అనేవారు గ్రామాలలో పద్యాలురాసి గానం చేస్తూ అలరించేవారు .ఈయన నవల ‘’కబి ‘’ఆ కవి –గాయక ప్రతిభకు నిదర్శనం .జానపద జీవితాన్ని అద్భుతంగా వర్ణిస్తాడు తారాశంకర్ .

  స్వగ్రామం లాభ పూర్ లో ధనిక భూస్వామి నిర్మలశివ బంద్యోపాధ్యాయ నాటకరచయితగా ప్రయోక్తగా పేరున్నవాడు .ఈయన నాటకాలను కలకత్తాలో కూడా ప్రదర్శించేవారు .తారాశంకర్ కూ నాటకాలు రాయాలనిపించింది .18రూపాయలతో గ్రాంట్ డఫ్ రాసిన మూడు సంపుటాల మహారాష్ట్ర చరిత్ర కొని ,పానిపట్టు యుద్ధంగురించి నాటకం రాశాడు శంకర్ .నిర్మల శివ ప్రోత్సాహంతో దాన్ని ఒక నాటకకంపెనియజమాని కిచ్చాడు .ఊరూ పేరులేని వాడు రాసిన దాన్ని చదవటం దండగ అని చులకనగా చూస్తె కోపం వచ్చి  నాటకాన్ని అగ్నికిఆహుతి చేశాడు తారాశంకర్ .ఇంక రాయకూడదు అనుకొన్నాడు వ్యధతో .కాంగ్రెస్ లో ఉంటూ సమాజ సేవ చేసేవాడు. చిన్నతరహా భూస్వామికనుక కుటుంబ పోషణకు ఇబ్బంది లేదు .

 కొంతకాలం తర్వాత ఒక మిత్రునితోకలసి ‘’పూర్ణిమ ‘’మాస పత్రిక ప్రారంభించి ,తన రచనాసర్వస్వం అందులో ప్రచురించటం మొదలుపెట్టాడు .పెద్దగాసంతృప్తికలగలేదు అప్పుడే ‘’కవి-కలం’’అనే ఒక పత్రిక చూసి అందులో ప్రేమే౦ద్రమిత్ర ,శైలజానంద ముఖర్జీ లు రాసిన కథలు చదివి ,సంమోహితుడయ్యాడు .కలకత్తాకు వస్తూ పోతూ ఉన్నా సాహితీరంగంలో కొత్తపోకడలు గమనించనే లేదు .ఆరచయితలే తనకు మార్గదర్శులు అను కొన్నాడు .ఒకసారి తారాశంకర్ తన జమీన్ లో ఒక గ్రామానికి వెడితే అక్కడ ఒక సౌందర్యవతి అయిన ఒక వైష్ణవ యువతి కనిపిస్తే ,ఆమెపై ‘’రస-కలి ‘’అంటే చందనం కథ రాసి ప్రముఖ బెంగాలీ పత్రికకు పంపి౦చి 8నెలలతర్వాత ఆ పత్రికాఫీసుకు వెళ్లి అడిగితతే వావ్వరూ ఆకథ చదవలేదని చేబితెఅవాక్కై ,మధ్యకలకత్తానుంచి దక్షిణ కలకత్తా దాకా కాళ్ళీడ్చుకొంటూ నడిచి ‘’ఇక రచనలు చేయను .సేవాకార్యక్రమాలలో ఉంటాను ‘’అని నిశ్చయించాడు .

 లాభపూర్ గ్రామయూనియాన్ బోర్డ్ కు అధ్యక్షుడయ్యాడు తారాశంకర్ .జిల్లా అంతా సైకిల్ పై తిరుగుతూ గ్రామజీవితాన్ని అధ్యయనం చేశాడు .నీటిఎద్దడి బాగా ఉన్న జిల్లా అది .కలరాతో రెండేళ్ళు ఇబ్బందిపడింది. ఆరునెలలు ప్రజల మధ్యగడిపి వ్యాధిని దూరం చేశాడు .ప్రజలకుఊరట  కలిగించి సేవాకార్యాలలోసంతృప్తి  చెందాడు  ప్రజల కళ్లల్లోవెలుగు చూసితృప్తి  చెందాడు .ఈ సంఘటనలన్నీ ఆయన రాసిన హన్సూలీ బంకర్ ‘’అంటే కొడవలి వంపు కథలో చోటుచేసుకొన్నాయి .

అభ్యుదయ సాహితీ వేదికగాఉన్న కల్లోల్ పత్రిక ముఖ చిత్రం ఒకసారి చూశాడు .తిరస్కరింపబడిన తన రస-కలి’’కథను దీనికిపంపితే ,నాలుగురోజుల్లోనేప్రచురణామోదం పొంది వెంటనే ప్రచురింపబడి,సాహితీ వేత్తల ప్రశంసలు పొంది , మరొకద రాసిపంపాని ఆహ్వానం అందుకుని పంపితే అదీ వెంటనే ప్రచురితమై ,కలికాలం అనే మరొక అభ్యుదయ సాహితీపత్రిక ‘’ఈ కథలు అరుదైన ఉత్తమకథలు ‘’అని ప్రసంశించింది .ఇవి 1929లో ప్రచురితాలు .

  సశేషం

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -26-9-22-ఉయ్యూరు .

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మ వైవర్త పురాణం.ప్రకృతి ఖండం.12వ భాగం.26.9.22

బ్రహ్మ వైవర్త పురాణం.ప్రకృతి ఖండం.12వ భాగం.26.9.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -12రాయల సీమమనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -12

త్యాగి మద్దూరి అన్నపూర్ణయ్య,ఆచలరమణుడు ,గ్రేట్ సెయింట్స్ ఆఫ్ సౌత్ ఇండియా కర్త –శ్రీ రావినూతల శ్రీరాములు

· రావినూతల శ్రీరాములు బహుగ్రంథకర్త, ప్రముఖ వ్యాసరచయిత. శ్యామప్రియ ఇతని కలం పేరు. ఇతడు వృత్తిరీత్యా సబ్-రిజిస్ట్రారుగా సేవలందించి పదవీవిరమణ పొందినాడు. ఇతడు 1936, అక్టోబరు 12న ప్రకాశం జిల్లా, పమిడిపాడులో జన్మించాడు. బి.ఎ. పట్టభధ్రుడు.

రచనలు

  1. మహాత్యాగి మద్దూరి అన్నపూర్ణయ్య జీవితచరిత్ర[1]
  2. పేదలపెన్నిది (గుత్తి కేశవపిళ్ళై జీవితగాథ)
  3. ప్రజలమనిషి ప్రకాశం
  4. ఆంధ్రకేసరి ప్రకాశం
  5. ధ్రువతార (పొట్టిశ్రీరాములు జీవితగాథ)[2]
  6. అరుణగిరి యోగులు
  7. దాక్షిణాత్య భక్తులు
  8. దక్షిణాది భక్తపారిజాతాలు
  9. సుందరకాండము (నవరత్నమాల)
  10. అచల రమణుడు
  11. బ్రహ్మర్షి దైవరాత
  12. మహాతపస్వి కావ్యకంఠ గణపతిముని
  13. బి.వి.నరసింహస్వామి
  14. ప్రతిభాశాలి (పప్పూరు రామాచార్యులు జీవితకథ)
  15. కల్లూరి మనీషి
  16. ధన్యజీవి
  17. చీమకుర్తి శేషగిరిరావు
  18. బాపూజీ రామమంత్రము
  19. పప్పూరి రామాచార్యుల ఆముక్తమాల్యద
  20. జవహర్‌లాల్‌ నెహ్రూ జీవితకథ, సూక్తులు
  21. మహామనిషి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ సంక్షిప్త జీవితపరిచయం
  22. జాతీయ పతాకం – గీతం
  23. గ్రేట్ సెయింట్స్ ఆఫ్ సౌత్ ఇండియా

· 36-శ్రీరామాయణనిధి ,కధానిదధి ,బైబిల్ సూక్తులు రాసిన విద్యారత్న ,లలితకవికోకిల –శ్రీ తలమర్ల కళానిధి

· లమర్ల కళానిధి పేరుతో సాహిత్యలోకానికి పరిచయమైన ఈ కవి అసలు పేరు కొల్లప్ప[1].

జీవిత విశేషాలు
ఆయన అనంతపురం జిల్లా, కొత్తచెరువు మండలానికి చెందిన తలమర్ల గ్రామంలో 1915 లో ఓబమ్మ, ఓబన్న దంపతులకు జన్మించాడు.వారిది హరిజన కులం. మొదటి నుండి బీదతనంతో జీవితాన్ని గడిపిన ఆయన నిరాడంబరుడు, సుగుణ సంపన్నుడిగా పేరెన్నికగన్నాడు. ఇతడు స్వయంకృషితో విద్వాన్ పరీక్ష ఉత్తీర్ణుడై సెకండరీ గ్రేడు ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. 1970లో అనంతపురంలో తెలుగు పండితునిగా పదవీ విరమణ చేశాడు.

ఇతని సుగుణాన్ని నిరూపించే సంఘటన ఒకటి[2], [3]

ఆ రోజుల్లో పల్లెల్లో అక్షరాస్యతని వ్యాపింపచేయటం కోసం, ప్రైవేటు మేనేజ్‌మెంట్లు నిర్వహించే ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలల్నీ, ప్రాథమికోన్నత పాఠశాలల్నీ, ప్రభుత్వం గ్రాంటులిచ్చి ప్రోత్సహించేది. ఆ గ్రాంటుసొమ్ము ఎంతో తెలుసా? 1 నుండి 5వ తరగతి వరకూ ఉండే ప్రాథమిక పాఠశాలకి నెలకి 5 రూపాయలు. 6, 7, 8 తరగతులు కూడా ఉన్న ప్రాథమికోన్నత పాఠశాల అయితే, నెలకి 15 రూపాయలు. అంతే, ప్రభుత్వం అందించే సాయం. మరి, స్కూలుకి కావలసిన కుర్చీలూ, బెంచీలూ, బల్లలూ, రిజిష్టర్లూ, మ్యాపులూ, తెల్ల కాగితాలూ, చాక్`పీసులూ, ఇవి కాక, బిల్డింగ్ అద్దె, టీచర్ల జీతాలు – వీటన్నింటికీ డబ్బు కావాలి కదా – అది అంతా మేనేజ్‌మెంట్ వారే, ఊళ్లో ప్రజల విరాళాల ద్వారానో, విద్యార్థులు చెల్లించే స్కూలు ఫీజుల ద్వారానో సమకూర్చుకోవాలి. విద్యార్థుల దగ్గర్నుంచి ఫీజు, ఎట్టి పరిస్థితిలోనూ నెలకి అర్థ రూపాయి మించకుండా, అదైనా స్కూళ్ళ ఇన్‌స్పెక్టరు వారి అనుజ్ఞ లేకుండా వసూలు చెయ్యకూడదు – ఇదీ ఆనాటి ఎయిడెడ్ పాఠశాల పరిస్థితి. ఆ పాఠశాల మేనేజ్‌మెంట్ల దుస్థితీను. అటువంటి ప్రాథమిక పాఠశాల మేనేజ్‌మెంట్ అధిపతిగా తలమర్ల కళానిధి ఉండేవాడు. అప్పటికాయన వయస్సు ఇరవై నిండలేదు. అంతే కాదు, ఆయన ఎనిమిదవ క్లాసు వరకే చదువుకొని టీచర్ ట్రైనింగ్ అయ్యాడు. అలా ఎనిమిదవ క్లాసు మాత్రమే పాసయి టీచర్ ట్రైనింగ్ అయిన వాళ్ళని హయ్యర్‌గ్రేడ్ టీచర్లనే వారు. అలా కాకుండా మెట్రిక్యులేషన్ పేసయి, టీచర్ ట్రైనింగ్ అయిన వాళ్లని సెకండరీ గ్రేడ్ టీచర్లనే వారు. తలమర్ల వారు అప్పట్లో హయ్యర్‌ గ్రేడ్ టీచర్ మాత్రమే! బెళ్లూరి శ్రీనివాసమూర్తి మాత్రం సెకండరీ గ్రేడ్. అంటే బెళ్లూరి ఓ మెట్టు ఎక్కువ. అనగా 6, 7, 8 తరగతులకి పాఠం చెప్పే అర్హత వుంది ఆయనకి. అలా తనకంటే ఎక్కువ అర్హత ఉన్న తన మిత్రుడు బెళ్లూరి శ్రీనివాసమూర్తిని, ప్రాథమికోన్నత పాఠశాలగా ఎదిగి, తన మేనేజ్‌మెంట్ లోనే ఉన్నత పాఠశాలకి హెడ్‌మాస్టర్‌గా చెయ్యడమే కాకుండా, శ్రీనివాసమూర్తి తమ్ముడికీ, తండ్రిగారికీ, ఇద్దరికీ కూడా తన పాఠశాలలో టీచర్ ఉద్యోగాలిచ్చాడు తలమర్ల కళానిధి. మైత్రిపట్ల ఆయనకి ఉన్న అభిమానం అది. కాని శ్రీనివాసమూర్తి తండ్రి అయిన హనుమంతరావుగారికి, ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి ప్రాథమికోన్నత పాఠశాల స్థాయికి ఎదిగిన ఆ పాఠశాల మేనేజ్‌మెంట్‌ని, తలమర్ల కళానిధి నుంచి తప్పించి తను చేజిక్కించుకోవాలనే చెడు తలంపు వచ్చింది. దాంతో ఎన్నో ప్రయత్నాలు చేశాడు. పై అధికార్లకి ఫిర్యాదులు చేశాడు. ఊళ్ళో కొందరిని తలమర్లపైకి ఉసిగొల్పాడు. లెక్కలు సరిగా లేవని తప్పుడు ప్రచారం చేశాడు. ఆయన ఎన్ని రకాల దుష్ప్రచారం చేసినా తలమర్ల కళానిధి కలత చెందలేదు. తన మిత్రుడైన శ్రీనివాసమూర్తి కూడా ఆ కుట్రలో కలిసి అందులో భాగస్వామి అయ్యాడే అని బాధపడ్డాడు. దాంతో ఎన్నో ఏళ్ళుగా వర్ధిల్లుతూన్న బెళ్ళూరి, తలమర్లల స్నేహానికి గ్రహణం పట్టింది. ఇద్దరి మధ్యామాటలూ, పలకరింపులూ అదృశ్యం అయ్యాయి. ఇద్దర్లో, ఏ ఒక్కరు సంస్కారి కాకపోయినా, ఆ విరామం వైషమ్యానికీ, వైషమ్యం విరోధానికి దారితీసేది. కాని ఇద్దరూ సంస్కారులు – ముభావంగా ఒకరికొకరు దూరంగా ఉండిపోయారు. పరస్పరం దూషించుకోలేదు. తగవులాడుకోలేదు. తర్వాత కొన్ని నెలలకి బెళ్లూరి విద్వాన్ పరీక్షకి కూర్చోవలసి వచ్చింది. అందుకాయనకో సర్టిఫికెట్ కావలసి వచ్చింది. బోనఫైడ్ టీచర్‌గా పనిచేసినట్లు. ఆ సర్టిఫికెట్ ఎవరుఇవ్వాలి? తను పనిచేసింది తలమర్ల స్కూల్లో, అందువల్ల ఆయన ఇవ్వాలి సర్టిఫికేట్. కాని ఇంత జరిగాక ఇస్తారా? సరాసరి తలమర్ల దగ్గరికి వెళ్ళి తలవంచుకొని కన్నీరు కారుస్తూ నిలబడ్డాడు బెళ్లూరి. తలమర్ల కళవళపడి ‘ఏవిటిది స్వామీ?’ అనడిగాడు. ‘నీకు ద్రోహం చేశాను. మా నాన్నగారితో కలిసి నీపై కుట్రపన్నాను. దుష్ప్రచారం చేశాను. ఇప్పుడు క్షమించి బోనఫైడ్ టీచర్ సర్టిఫికేట్ నాకు ఎలా ఇస్తావు? ఇవ్వవు నాకు తెలుసు’ అన్నాడు. ‘ఎందుకివ్వను? ఇస్తాను. మన స్నేహానికి మధ్యలో ఏదో మబ్బుపట్టింది. ఇప్పుడు తొలిగిపోయింది ‘ అంటూ కౌగిలించుకొని, సర్టిఫికెట్ మీద సంతకం చేసి మిత్రుని భవిష్యత్తుకి బంగారుబాట వేశాడు తలమర్ల.

రచనలు

  1. శ్రీరామాయణనిధి (వాల్మీకి రామాయణానికి వచనానువాదం)
  2. దక్షిణేశ్వర భాగవతము (రామకృష్ణ పరమహంస జీవితగాథ మంజరీ ద్విపదలో)
  3. ఆత్మకథ
  4. కబీరు సూక్తినిధి (తేటగీతుల్లో కబీరు సూక్తులు)
  5. వర్ణాంతర వివాహాలు (నాటకము)
  6. హరిజనోద్ధరణ (నాటకము)
  7. కళాసౌధము[4] (ఖండకావ్య సంపుటి)
  8. నవనాథ చరిత్ర
  9. మధుకణములు (శ్రీ కృష్ణకర్ణామృతమునకు తెలుగు అనువాదము వచనం)
  10. కథానిధి (కథాసంపుటి)
  11. ప్రేమపూజ (కథాసంపుటి)
  12. మణిమనోహరులు (కథాసంపుటి)
  13. బైబిల్ సూక్తులు

బిరుదులు

  1. లలితకవికోకిల
  2. విద్యారత్న

రచనల నుండి ఉదాహరణ
గిజిగాడు
నూతిలోనికి వ్రాలిన యీతరెమ్మ
ఆకును తూగుటుయ్యెలవోలె సఖియతోడ
నీకులాయము నల్లెదు నిపుణమైతో
ఓయి! గిజిగాడ! ధన్యుడవోయి జగతి

ప్రణయరాజ్యపు రమతోడ బవ్వళింప
అద్భుతాశ్చర్యములు గొల్ప నందముగను
ఎవ్వరెఱుగని యల్లికనెటులొయల్లి
గారడీవైతె! గిజిగాడ కళను బెంచ

ఓ కళారాధకుడ యెంత యోపికోయి
పూనివా వేదొ దీక్షను పూతమతిని
నీకళా రహస్యమ్మును నెరుగనైతి
ఔర గిజిగాడ యెవరు నీగురువు చెపుమ
(శ్రీసాధన పత్రిక 28 జూన్ 1947 సంచికనుండి

· సశేషం

· మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-9-22-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

దసరా శుభా కాంక్షలు  శుభా కాంక్షలు దసరాదసరా శుభా కాంక్షలు  శుభా కాంక్షలు 

దసరా శుభా కాంక్షలు 
సాహితీ బంధువులకు -26-9-22సోమవారం నుంచి 5-10-22 బుధ వారం వరకు జరిగే నవరాత్రి దసరా శుభాకాంక్షలు -గబ్బిట దుర్గా ప్రసాద్ 

Posted in సమయం - సందర్భం | Leave a comment

హాస్యానందం30-ఫాల్స్టాఫ్ హాస్యం

హాస్యానందం
30-ఫాల్స్టాఫ్ హాస్యం
షేక్స్పియర్ నాటకాలలో ఫాల్స్టాఫ్అనే హాస్యగాడు ఉంటాడు .ఒకసారి అతడు కొంతడబ్బుతో స్నేహితులతో కలిసి ప్రయాణిస్తున్న బాటసారుల్ని దోచుకోవాలని ప్రయత్నిస్తాడు .కానీ తన్నులు తింటాడు వాళ్ళ చేతుల్లో .స్థూలకాయుడు నడి వయస్సువాడు .వాళ్ళు ముగ్గురు .యితడు అనుచరులుకలిసి అయిదుగురు .ఈ అయిదుగురు ఆముగ్గురి చేతిలో చావు దెబ్బలు తింటారు కాని వాడు దాన్ని గా మలిచి చమత్కారంగా ఇలా చెప్పాడు –‘’నేను నా అనుచరులం దారి కాచాం.వాళ్ళు గుర్రాలపై డబ్బు సంచులతో వస్తున్నారు .వాళ్ళను దోచటానికి ఒకపధకం  వేశాం .మా వాళ్ళు వట్టి పిరికి పందలు .వాళ్ళపై ఉరకటానికి సాహసించలేకపోయారు ‘’అన్నాడు నిజానికి పిరికి వెధవ వీడే .వాళ్ళను ముందుకు నెట్టి చచెట్టువెనక దాగాడు. వాళ్ళు చావగొట్టారు .పారిపోయారు .వాళ్ళతోపాటు వీడూ పారిపోతూ ఒక చోటికి వచ్చాక తానె వాళ్ళను చితక్కోట్టినట్లు తన స్నేహితులు పారిపోయి వచ్చినట్లు ప్రగల్భాలు పలికాడు దీన్నే మనవాళ్ళు ఇప్పుడు’’ బిల్డప్ ఇచ్చాడు’’ అంటున్నారు.పూర్వం రేలంగి హాస్యం గుర్తుకు వస్తుంది .
లీకాక్ హాస్యం
లీకాక్ అనే హాస్య రచనా చతురుడు ‘’మై ఫైనాన్షి యల్ కెరీర్’’అనే కధలో తనను తెలివి తక్కువవాడిగా లోకజ్ఞాన శూన్యుడిగా ప్రదర్శించుకొంటాడు .దీన్ని ఆధార౦గా  మునిమాణిక్యం మాస్టారు ఒక కధఅల్లారు .’’ఒకసారి డబ్బు కావాల్సి వచ్చింది ఎవరూ అప్పు ఇవ్వలేదు .బ్యాంకి తక్కువ వడ్డీకి  ఇస్తుందని ఎవరో చెప్పగా వెళ్లాను .అక్కడికి వెళ్ళాక భయమేసింది ఎవర్ని అడగాలో తెలీయలేదు ఒక కుర్రగుమాస్తాను అడిగితె ఏజెంట్ దగ్గరకు తీసుకు వెళ్ళాడు .అనేక మెట్లు ఎక్కిదిగి వాడి వెంటనడుస్తున్నా అందరూ నన్ను చూసి జాలిపడుతున్నారు .కబేళాకు వెళ్ళే మేకపిల్లలాగా అయింది నా పరిస్థితి .తిప్పి తిప్పి అసలుగదికి తీసుకు వెళ్ళాడు .అధికారి కూర్చో మంటే కూర్చున్నాను .నేనెలా సాయపడగలను అని ఇంగ్లీష్ లో అడిగాడాయన .వదిలేస్తే కిందికి పారిపోయి బతుకు జీవుడా అందామని పించింది .ధైర్యం చేసి రెండు వందలు అప్పుకావాలని చెప్పాను .ఏదైనా హామీ పెట్టాలి అన్నాడు .పూర్వం పర్సనల్ సెక్యూరిటీ మీద ఇచ్చేవాళ్ళం .కానీ అప్పు తీసుకొనే వాడు ఏ తలకు మాసిన వెధవనో తెచ్చి చూపేవాడు .ఈ ఇవ్వలేని వాడికి ఇంకొక ఇవ్వలేని వాడు హామీ ఏమిటి అని మానేశాము .తలకొట్టేసినట్లైంది .ఒక ఇల్లు హామీ పెడతాను నా మాట నమ్ముతారా వచ్చి చూస్తారా అన్నాను .మా ఆఫీసు వాళ్ళు వచ్చి చూస్తారు అన్నాడు .ఎప్పుడు పంపిస్తారు అంటే రేపే అన్నాడు
మర్నాడు బాంకు నుంచి ఒకాయన వచ్చాడు .ఇల్లు చూపించాను .ఇది చిన్న ఇల్లే అయినా మీరు తీసుకొనే అప్పుకు సరిపోతు౦ది లెండి ‘’అన్నాడు లోపలి వెళ్లి చూదాం అన్నాడు .ఆ ఇంట్లో ముస్లిమ్స్ ఉన్నారు లోపలి రానివ్వరు అన్నాను డాక్యుమెంట్లు ఉన్నాయా అన్నాడు అలాంటివి లేవన్నాను. మీరు కొన్న ఇల్లేనా అంటే కాదు అన్నాను. మీ ఇల్లు ఎలా అయింది అని అడిగితె అది నాది అని చెప్పలేదే హామీ అంటే అది చూపించా అన్నాను .మీదికాకపోతే సెక్యూరిటి ఎలా ఇస్తారు అన్నాడు .సెక్యూరిటీగా చూపమంటే  చూపాను ..అదికుదరదు అన్నాడు .పోనీ డా .రామరాజుగారిల్లు చూపిస్తా. అదీ నాది కాదు అన్నాను .మీదికానిది ఎలా తాకట్టు పెడతారు అన్నాడు .మీరు డాక్యుమెంట్లు అడగకపోతే ఆయన తగాదా పడకుండా చూసుకొంటా అన్నాను .మీస్వంతం ఏదైనా ఉంటె చెప్పండి అన్నాడు ‘’నా బొంద నాకు స్వంతం ఏమీ లేదు ఒక్క పెళ్ళాం తప్ప .బ్యాంకి వారికి అప్రతిష్టరాకూడదు. త్వరలో ఒక చిన్న ఇల్లు కట్టి సక్రమంగా హామీ పెట్టి నాలుగు రెట్లు అప్పు తీసుకాకపోతే నన్ను మారుపేరుతో పిలవండి ‘’అని అవమానం తో కుంగిపోతూ దిండులో దూరాను ‘’అన్నారు మునిమాణిక్యం అయ్యవారు .ఏదో సినిమాలో కళ్ళు చిదంబరం బ్యాంకి అధికారిమల్లి కార్జునరావు దగ్గరకు వెళ్లి అప్పు అడిగిన సీను గుర్తుకు వచ్చిందా భయ్యా .
మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్-25-9-22-ఉయ్యూరు

‘

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ అడివి బాపిరాజు గారు.14వ భాగం.25.9.22

బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ అడివి బాపిరాజు గారు.14వ భాగం.25.9.22

Video link

Posted in రచనలు | Leave a comment

తారా శంకర్ బంద్యోపాధ్యాయతారా శంకర్ బంద్యోపాధ్యాయ

తారా శంకర్ బంద్యోపాధ్యాయ

ఆంగ్లం లో మహా శ్వేతాదేవి రాసిన దానికి తెలుగులో ఎస్ ఎస్ ప్రభాకర్ అనువాదం చేసిన ‘’ తారా శంకర్ బంద్యోపాధ్యాయ’’పుస్తకాన్ని కేంద్ర సాహిత్యఅకాడమి 1978లో ప్రచురించింది వెల-2-50రూపాయలు .

  జననం విద్యా భ్యాసం

తారాశంకర్ బంద్యో పాధ్యాయ పశ్చిమ బెంగాల్ బీర్భం జిల్లా లాభపూర్ గ్రామం లో 25-7-1898న జన్మించాడు .తండ్రి హరిదాస బంద్యోపాధ్యాయ తల్లి ప్రభావతీదేవి .మొదటి సంతానం .ఇద్దరు తమ్ముళ్ళు ,ఒకచెల్లెలు .అతడు పుట్టిన గ్రామం పురాణాలలో అట్టహాస అని పిలువ బడేది .సతీ దేవి శరీర భాగం పడిన పవిత్ర ప్రదేశం .ఇక్కడ శక్తి ఆరాధకులు ,వైష్ణవులు ఎక్కువ .జానపద సంగీతానికి ప్రసిద్ధి .చిన్న తనం లో శంకర్ బోలు వైష్ణవ శక్తి దాసరుల భక్తీ గీతాలు విని నిద్ర లేచేవాడు .గ్రామం మతసామరస్యానికి ప్రసిద్ధి .పాట్వాలు అనే సంచార జాతి వారు చేతితో రాసిన చిత్ర పటాలను పట్టుకొని తిరిగే వారు .అందులో కృష్ణలీలలు గౌరాంగ అనే చైతన్యప్రభు చిత్రాలు ఉండేవి .ఇక్కడి పాములవాళ్ళు మహమ్మదీయులు .వీరిలో పురుషులు బాగా అందంగా ఉంటారు .స్త్రీలుఎవరినీలెక్క చేసేవారుకాదు. గొప్ప నర్తకీ మణులు .సర్కస్ వాళ్ళు కూడా వచ్చి ప్రదర్శనలిచ్చేవారు .యువతకు బాగా ఆకర్షణ .సంచారజాతి స్త్రీలు ఆకుపసర్లు ,ప్రేమ లేపనాలు అమ్మేవారు .వారిలో మగాళ్ళు కుందేళ్ళను,అడవిపందుల్ని, అడవి బల్లులను  వేటాడేవారు .

  ఆగ్రామ చిన్నా పెద్ద జమీందార్లు  ఉన్నత వంశీయులు .కొందరు బొగ్గుగనుల వ్యాపారంలో బాగా సంపాదించారు .పేదలు నిత్య దరిద్రులే .’’ రూపాయలతో ఎవరైనా మహా రాజుగా బతకవచ్చు .నెలకు సరిపడా ఆకుకూరలు 75పైసలే .వారానికి రెండు సార్లు జరిగే సంతలో అయితే మరీ కారు చౌక 37పైసలే .ఇంటి నౌకరు నెలజీతం రూపాయిన్నర .ఆడ వంటమనిషికి నెలకు రెండు రూపాయలు .మగ వంటగాడికి మూడు రూపాయలు .సంప్రదాయ ధనిక కుటుంబాలకు బొగ్గుగనులతో ‘’డబ్బు చేసిన ‘’వ్యాపారస్తులకు మధ్య స్పర్ధలు ఉండేవి .వ్యాపారుల్లో చాలామంది వైష్ణవులు .జమీందార్లు శాక్తేయులు.ఆలయ మరమ్మత్తులు చెరువుల బాగుకోసం బాధ్యత ఎవరిదీ అనే విషయం పై తగాదాపడేవారు .హైస్కూల్స్ కు    చేసే ఆర్ధిక సహాయం లో కూడా భేదాలు కనబడేవి .పండుగలు మత  ఉత్సవాలు చేసేటప్పుడు ఇవి బాగా బయటపదేవి .లాభపూర్ లో పటిష్టమైన నాటక సంప్రదాయం అనాదిగా ఉంది .అన్ని హంగులతో ర౦గస్థలం ఉండేది .’’యాత్రా ‘’నాటక సంస్థలు ఇక్కడికి వచ్చి ప్రదర్శనలిచ్చేవారు .ఇవీ ఆ నాటిసా౦ఘిక  పరిస్తి తులు అని బంద్యో పాధ్యాయ  చెప్పాడు . ఎర్రని భీర్భం అంటే వీర భూమిలో ,కోపాయ్ నది పరవళ్ళు తొక్కేది .మతదురాచారాలు వరదలు  వర్షభీభత్సం తారాశంకర్ బాల్యం లోనే చవిచూశాడు .ఇవన్నీ ఆయన నవలలో ప్రత్యక్షంగా చూపాడు .తొలిరచన చైత్ర జంఝ నుంచి చనిపోయాక వచ్చిన ‘’శాతాబ్దిర్ మృత్యు అంటే ఒక శకం వెళ్లి పోయింది నవలదాకా ఆయన రచనలలో తనకు పరిచయమైన నేలను మనుష్యుల్ని పరిసరాలను ,ప్రకృతిని నిశితంగాపరిశీలించిరాశాడు .

  తండ్రికి హైస్కూల్ విద్యకూడా లేదు అయినాస్వయంగా ఎన్నో గ్రంథాలు చదివి జీర్ణం చేసుకొన్నాడు .అన్నిరకాల పత్రికలూ వార్తా పత్రికలూ తెప్పించుకోనేవాడు మంచి లైబ్రరీ ఉండేదిఇంట్లో .తారా కు ఎనిమిదేళ్ళప్పుడే తండ్రినడి వయసులోనే చనిపోయాడు .తల్లి పాట్నాలోని విద్యాధిక కుటుంబానికి చెందినది .అప్పటి సనాతనాలు స్త్రీ విద్యను ప్రోత్సహించేవారుకాదుకానీ  ఆమె తలిదండ్రులు ఆమెను బాగా చదివించారు .శంకర్ పై తల్లిప్రభావం జాస్తి. ఆమె అనేక మైన ఒడిదుడుకులు తట్టుకొని సంసారాన్ని నిలబెట్టింది .తల్లి అంటే అపారగౌరవం శంకర్ కు .అతని అత్త భర్తను కొడుకునుపోగోట్టుకొని  వీరింటి లోనే ఉండేది .ఆమెకు మేనల్లునిపై అపార వాత్సల్యం,ప్రేమ  .ఈ ఇద్దరు మహిళలు తారా శంకర్  జీవితానికి గొప్ప వెలుగులయ్యారు  .అతనిలో ఉన్నత నైతిక విలువలను ప్రోది చేశారు .

  తల్లి కథలను రసరమ్యంగా చెప్పేది .అతని రచనలలో ఈ కథకురాళ్ళు దర్శనమిస్తారు .ముఖ్యంగా గణ దేవత ,పంచగ్రామ నవలలో న్యాయరత్న పాత్ర తల్లియే .అతని మేనమామలు జాతీయోద్యమం లో పాల్గొన్నారు .1905లో కర్జన్ బెంగాల్ విభజన చేసినప్పుడు అతని మామయ్య చెల్లి చేతికి రక్షా బంధన్ కట్టాడు .తల్లికూడా ఈ కొడుకు చేతికి కట్టింది .అప్పటికి ఇతని వయసు చాలా తక్కువే.తండ్రి మరణం తల్లి ఆత్మ స్థైర్యం ,అత్త అపారప్రేమ ధాత్రీదేవత నవలలో అత్యద్భుతంగా చిత్రించాడు తారాశంకర్ .నాటి జమీందార్లు ధనవ్యయం బాగా చేస్తూ ,తాగుడుకు బానిసలైనావ్యక్తిగత,సాంఘిక ప్రవర్తన ఉన్నతంగా ఉండటంతో   తారాశంకర్ కు వారిపై అభిమానం,సానుభూతి ఉండేవి. కాని రచనలలో వారి దురాచారాలను వ్యసనాలను ఖండించేవాడు .జమీందార్లు మతాచారాలను అత్యంత నియమ నిష్టలతో జరిపేవారు .ఇవి ఇతని కుటుంబానికీ  ఎక్కువే .తరుణ వయస్సు వచ్చేసరికి శంకర్ కు ఆవిశ్వాసాలు ఆలోచనలపై స్థిర బుద్ధిఎర్పడింది .

   సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -25-9-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మ వైవర్త పురాణం.ప్రకృతి ఖండం.11వ భాగం.25.9.22

బ్రహ్మ వైవర్త పురాణం.ప్రకృతి ఖండం.11వ భాగం.25.9.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -11

మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -11

· 34-బ్రౌన్ లైబ్రరిస్థాపకుడు,మా సీమ కవులు ,కడప సంస్కృతి ,ఎందఱో మహానుభావులు ,శక్తిపీఠాలు రచయిత,ధార్మిక రత్న , బ్రౌన్ శాస్త్రి –శ్రీ జానమద్ది హనుమచ్చాస్త్రి

· జానమద్ది హనుమచ్ఛాస్త్రి (జూన్ 5, 1926 – ఫిబ్రవరి 28, 2014) [1][2] తెలుగులో ఒక విశిష్టమైన బహు గ్రంథ రచయిత.

జీవిత విశేషాలు
ఇతడు జూన్ 5, 1926 లో అనంతపురం జిల్లా రాయదుర్గం లో జన్మించాడు.[3] రాయదుర్గం జిల్లా బోర్డు హైస్కూలులో ఎస్.ఎస్.ఎల్.సి చదివాడు. ప్రైవేటుగా బి.ఎ. ఉత్తీర్ణుడైనాడు. బి.ఇడి. కూడా పూర్తి చేశాడు. స్వయంకృషితో తెలుగు, ఇంగ్లీషు భాషలలో ఎం.ఏ. పట్టా పొందాడు.

1946లో బళ్ళారి లోని ప్రభుత్వ పాఠశాలలో సెకండరీ గ్రేడు ఉపాధ్యాయునిగా ఉద్యోగ జీవితం ప్రారంభించాడు. కడప లో సి.పి.బ్రౌన్ స్మారక గ్రంథాలయ ట్రస్టును నెలకొల్పి, దాని కార్యదర్శిగా అహర్నిశలూ పాటుపడి 10 లక్షల రూపాయల విరాళాలు సేకరించాడు. వీరి కృషితో అది వాస్తవ రూపం ధరించింది. ఈ కేంద్రానికి 15 వేల గ్రంథాలను శాస్త్రి సేకరించి, బ్రౌన్ ద్విశతి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించాడు. ‘బ్రౌన్ శాస్త్రి’గా పేరు గడించాడు. కడపజిల్లా రచయితల సంఘం 1973లో స్థాపించి 20ఏళ్లు కార్యదర్శిగా పనిచేశాడు. రాష్ట్రంలోని సుప్రసిద్ధ రచయితలను కడపజిల్లాకు పరిచయం చేసిన ఘనత ఇతనిదే. బెజవాడ గోపాలరెడ్డి, ఆరుద్ర, దాశరథి, కుందుర్తి, పురిపండా అప్పలస్వామి, శ్రీశ్రీ, సి.నా.రె.,దేవులపల్లి రామానుజరావు,దివాకర్ల వెంకటావధాని మొదలైన రచయితలను, విద్వాంసులను రప్పించి అద్భుతమైన కార్యక్రమాలను ఏర్పాటు చేశాడు.

రచనలు
జానమద్ది కథా రచనే కాకుండా వివిధ పత్రికలలో, సంచికలలో 2,500 పైగా వ్యాసాలు రాసాడు. 16 గ్రంథాలు వెలువరించాడు.

గ్రంథాల జాబితా

  1. మా సీమకవులు
  2. నాట్యకళాప్రపూర్ణ బళ్ళారి రాఘవ (జీవిత చరిత్ర) [4]
  3. కస్తూరి కన్నడ సాహిత్య సౌరభం 2
  4. కడప సంస్కృతి- దర్శనీయ స్థలాలు
  5. రసవద్ఘట్టాలు
  6. మన దేవతలు
  7. భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవిత చరిత్ర
  8. సి.పి.బ్రౌన్ చరిత్ర
  9. మొండి గోడలనుంచి మహా సౌధం దాకా
  10. విదురుడు
  11. త్యాగమూర్తులు
  12. మనిషీ నీకు అసాధ్యమేదీ
  13. ఎందరో మహానుభావులు
  14. భారత మహిళ
  15. శంకరంబాడి సుందరాచారి

పురస్కారాలు, సత్కారాలు
శాస్త్రి కి అనేక అవార్డులు లభించాయి.

  1. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేటు
  2. లోకనాయక్ ఫౌండేషన్ సాహితీపురస్కారం (2011)
  3. గుంటూరులో అయ్యంకి వెంకటరమణయ్య అవార్డు
  4. అనంతపురం లలిత కళా పరిషత్ అవార్డు
  5. ధర్మవరం కళాజ్యోతి వారి సిరిసి ఆంజనేయులు అవార్డు
  6. కడప సవేరా ఆర్ట్స్ వారి సాహితీ ప్రపూర్ణ అవార్డు
  7. మదనపల్లి భరతముని కళారత్న అవార్డు
  8. తెలుగు విశ్వవిద్యాలయ ప్రతిభా పురస్కారం
  9. బెంగళూరులో అఖిల భారత గ్రంథాలయ మహాసభ పురస్కారం
  10. ఉడిపి పెజావరు పీఠాధిపతిచే ‘ధార్మికరత్న’ బిరుదు

మొదలైన అనేక పురస్కారాలు ఇతనికి లభించాయి.

మరణం
కడపలోని రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2014, ఫిబ్రవరి 28 న వీరు పరమపదించారు.

·

· శ్రీ హనుమ చ్చాస్త్రి గారితో నాకు మంచి పరిచయమే ఉండేది వారితో చాలాసార్లు ఫోన్ లో మాట్లాడాను సరసభారతి పుస్తకాలు పంపేవాడిని అందాయి అని చెప్పి చదివాక బ్రౌన్ లైబ్రరీకి అండ జేశానని చెప్పేవారు తన పుస్తకాలుకూడా నాకు పంపేవారు .కడప సాహితీ జ్యోతి శాస్త్రిగారు బహుముఖీనమైన ప్రతిభా సంపన్నులు .

· సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -25-9-22-ఉయ్యూ

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -313

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -313

313-మూడు సినిమాల్లో మాత్రమె నటించిన సినీ తొలితరం హీరో ,న్యాయవాది రంగస్థల నటుడు ,షేక్స్ పియర్ నాటకాల అనువాదకర్త-వెల్లాల ఉమామహేశ్వరరావు

వెల్లాల ఉమామహేశ్వరరావు, తెలుగు సినిమా తొలితరం హీరోల్లో ఒకరు. కడప జిల్లాకు చెందిన ఉమామహేశ్వరరావు ప్రముఖ న్యాయవాది, రంగస్థల నటుడు.[1] రచయిత, నాటకకర్త, ఈయన ఇల్లాలు సినిమాలో హీరోగా సినీ రంగప్రవేశం చేశాడు. ఎత్తుగా, అందంగా ఉన్న ఉమామహేశ్వరరావు సినిమాలపై మోజుతో చాలా డబ్బును భాగస్వామిగా పెట్టుబడిగా పెట్టి ఇల్లాలు సినిమా నిర్మించి, అందులో హీరోగా నటించాడు. ఆ తరువాత ఈయన 1943లో విడుదలైన మరో రెండు సినిమాల్లో మాత్రమే నటించాడు. అవి నాగయ్య సొంత చిత్రమైన భాగ్యలక్ష్మి (పి.పుల్లయ్య దర్శకుడు), గూడవల్లి రాంబ్రహ్మం నిర్మించిన పంతులమ్మ.[2] “లేపాక్షి” అనే పేరుతో ఒక డాక్యుమెంటరీ ఫిలింను నిర్మించాడు.

ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ చిత్తూరు నాగయ్య కాలం వచ్చేప్పటికి తెర మరుగయ్యాడు. అయితే అప్పట్లో స్టార్‌ ఇమేజ్‌ ఉన్న నటుడిగా పేరు గడించాడు

విద్యాభ్యాసము
వెల్లాల ఉమామహేశ్వరరావు 4వ ఫారం వరకు చిత్తూరులో చదివి తరువాతి ఉన్నత విద్య కడపలో ముగించాడు. ఇంటర్మీడియెట్ మద్రాసులో చదివాడు. బి.ఎ. అనంతపురం దత్తమండల కళాశాలలో చదివాడు. మద్రాసులో లా చదివి అక్కడే న్యాయవాదిగా కొంతకాలం పనిచేశాడు.

సాహిత్యసేవ
అనంతపురంలో చదివేటప్పుడు 1932 ప్రాంతంలో మిత్రులు మఠం వాసుదేవమూర్తి, పాళ్ళూరు సుబ్బణాచార్యులుతో కలిసి ‘కవికుమారసమితి’గా ఏర్పడి క్రొక్కారు మెఱుగులు, తొలకరి చినుకులు అనే ఖండకావ్య సంకలనాలను వెలువరించాడు.[3] ఉమామహేశ్వరరావు 1960వ దశకంలో షేక్స్‌పియర్ నాటకాలన్నీ తెలుగులోకి అనువదించాడు. అతనికి పుట్టపర్తి నారాయణాచార్యులు బాల్యస్నేహితుడు.[4] అంతే కాక మహాత్మా గాంధీ వ్యక్తిత్వాన్ని చిత్రిస్తూ మహాత్ముని అంతరంగము అనే రచన చేశాడు.[5]

నటించిన సినిమాలు

  1. ఇల్లాలు (1940)
  2. భాగ్యలక్ష్మి (1943)
  3. పంతులమ్మ (1943)

సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -25-9-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

శతక భారతం

శతక భారతం

కృష్ణా జిల్లా నూజి వీడుకు చెందినశ్రీ పిసిపాటి సోమయ్య కవిమహా భారత కథను ‘’భారత శతకం ‘’గా రచించి 1935లో ,అక్కడే ఉన్న శ్రీ గౌరీ ముద్రాక్షర శాలలో ప్రచురించారు .వెల 5 అణాలు .దీనికి ముందుమాటను నూజివీడు ఆర్.ఆర్ .అంటే రాజారంగయ్యప్పారావు హైస్కూల్ రిటైర్డ్ హెడ్ మాస్టర్, జిల్లా ఎడ్యుకేషనల్ కౌన్సిల్ మాజీ ప్రెసిడెంట్ శ్రీ మద్దిరాల రామారావు ఆంగ్లం లో రాశారు అందులోని విశేషాలు –‘’భక్త వత్సల కృష్ణ ‘’మకుటంతో కవిగారు మహా భారత ఇతి వృత్తాన్ని శతకంగా చెప్పటం నమ్మలేక పోతున్నాను .ఈనాటి యువతకు ప్రోత్సాహకరంగా ఉంది .భారత దేశ క్లాసిక్ కావ్యాలలో భారతం ఒకటి .భారతం లోలేని విషయాలు ఎక్కడా ఉండవు .ఎక్కడున్న విషయమైనా భారతం లో ఉంటుంది .యువత ఈశతకం చదివి భగవద్ భక్తిని, మన సంస్కృతిపై ఆరాధనా భావాన్ని పెంపొందించుకోవాలి. ‘’

బందరు హిందూ కాలేజి ఎక్స్ ప్రిన్సిపాల్ శ్రీ వారణాసి శ్రీనివాసరావు కంద పద్యాలలో పండితాభిప్రాయం చెబుతూ ‘’ఒక చులుకమ్మున గు౦భజు –డకలంక ప్రతిభ గ్రోలె న౦బు ధులి౦కన్ –సుకరమ్ముగాని భారత –మొక శతకంబయ్యె నీదు యుక్తి స్ఫురణచే ‘’,అంటూ కవిది ‘’అతులిత మనీష ‘’అని శ్లాఘించారు .కవిసామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు ‘’శయ్య మనోహరం ప్రధానాంశాలు వదిలిపెట్టకుండా భారతాన్ని శతక కమండలం లో ఇమిడ్చారు ‘’అన్నారు .కలువపాములనుంచి శతావధాని శ్రీ హరి రామలింగ శాస్త్రి ‘’రసమున్నించి ,యలంకృతులన్ జొనిపి ,మహాకథా విశేషమున్ గుంచించి ముఖ్యా౦శపు గోసలైనన్ విడబోక ,యాగమహితోక్తుల్ వెల్లిగా ‘’రాసినందుకు పద్యాలలో మెచ్చుకొన్నారు .నూజివీడు డిప్యూటీ తాసిల్దార్ ఆఫీస్ హెడ్ క్లార్క్ –శతావధాని శ్రీ పాగొలు సత్యనారాయణ ‘’భారత సారము శతకము –గా రచియించితివి ముద్దుగా బాలురకున్ –దీరైన శబ్ద సంపుటి –నౌరా యని యబ్బుర౦బు నంద మనీషుల్ ‘’అని ఆశీర్వదించారు .కలువపాములవాసి శ్రీ హరి రాదా కృష్ణ మూర్తి ‘’లలి లక్షాధికమైన భారతము నెల్లన్ నూరు పద్యంబుల౦- బలుకంగా వలెనందుగందముల గావ్య ప్రక్రియన్ ‘’భక్త వత్సల కృష్ణా యను సత్కిరీటమున –ఓహో నీకృతి దివ్యం ‘’అని వెన్ను తట్టారు .నూజివీడు కో ఆపరేటివ్ సూపర్వైజర్ శ్రీ జోశ్యుల సూర్యనారాయణ శాస్త్రి ‘’నన్నయ తిక్కన యెర్రన-పన్నిన యా ఫక్కి నెందు బస చెడకుండన్ –సన్నుత గతి శతకంబున –వన్నె లొలుక బలికి తీవు భారత గాథన్’’అన్నారు .కనుక ఈశతకం కంద శతకం .మకుటం –‘’భక్త వత్సల కృష్ణా ‘’.ప్రతిపద్యానికి సూక్ష్మగా తాత్పర్యమూ రాశారు కవి .

మొదటి కందపద్యం –‘’శ్రీ రుక్మిణీ మణీహృ-త్సార సమద భ్రు౦గాపార్ధ సారధి చక్రి

ద్వారవతీశా నీపద –వారిజ ములగోలుతుభక్తవత్సల కృష్ణా ‘’.తర్వాత దశావతారాలు ఎత్తిన నీకు స్తుతి అంటే లోకోపకారమైన జండాను ఎత్తటమే.తర్వాత వ్యాస వాల్మీకాదికవులను తెలుగు కవులను ప్రస్తుతించి ‘’మద్గ్రంథోచిత రచనాధిక వాగ్వై చిత్రి ‘’ప్రసాదించమని కంసారిని మనసారా కోరారు .భూదేవి ధరించిన ఆభారణమా అన్నట్లు హస్తినాపురమున్నది .పుట్టు గుడ్డి ధృత రాష్ట్ర మహారాజు న్యాయంగా పాలిస్తున్నాడు .పాండురాజు అన్నకు సాయపడుతున్నాడు .చాపకళా విదుడుబ్రహ్మచర్యాశ్రమ దీక్షా పరుడు పెదతండ్రి భీష్ముడు అన్నివిధాలా ప్రాపు .’’నయ విద్యా పాండితిలో మేటి విదురుడు రాచకార్య నిర్వాహకుడు .తర్వాత పాండవ కౌరవ జననం ,పెంపకం ,పాండురాజు ‘’కిందమముని ‘’శాపంతో చనిపోవటం ,మాద్రి సహగమనం చేయటం ,కుంతితో పాండవులు హస్తిన చేరటం విద్య విలువిద్యాదులలో పెరుపొందటం ,దుర్యోధనాదులు భీమాదులను అవమాన పరచి దుష్టంగా ప్రవర్తించటం,ద్రోణ గురువు వద్ద ధనుర్విద్యాభ్యాసం చెప్పారు . ‘’నరశర విద్యాకుశలత ,,మరుదాత్మజు బాహు విక్రమం ,యుధిష్ఠిరుని పదవి చూసి సహించలేకపోయాడు దుర్యోధనుడు .సౌబల కర్ణాహ్వాయులు అతడికి దుష్ట సలహాలిస్తూ దుష్ట చతుష్టయంయ్యారు .తండ్రికి మాయమాటలు చెప్పి పా౦ డుకుమారుల్ని వారణావతం పంపి ,లక్కింట కాపురం పెట్టించి, అర్ధరాత్రిదహనం చేయించాడు .’’విదుర దూత సమకూర్చిన భూబిల మార్గం లో అడవి లోకి ప్రవేశించారు తల్లితోసహా .హిడింబ భీమ వివాహం ,ఘటోత్కచ జననం ,విప్రవేషంలో ఏక చక్రపురం చేరి ,భీముడు బకాసుర సంహారం చేసి ప్రజల బాధలు తీర్చటం ,ద్రౌపదీ స్వయం వరంలో పాల్గొనటం .’’వచ్చిన రాసుతు లెల్లరు –జెచ్చెర జని భంగపడుట చే యంత్రం –బచ్చపు ద్విజ వేషుడువి-వ్వచ్చుడు దాని నేసె భక్తవత్సల కృష్ణా ‘’.తల్లికుంతి,వ్యాస మహర్షి అనుమతితో పాండవులు అయిదుగురు ద్రౌపదికి భర్తలయ్యారు .ఈ విషయం తెలిసిన పెద్దరాజు వారందర్నీ గజపురికి ఆహ్వానింఛి అర్ధ రాజ్యమివ్వగా ఇంద్ర ప్రస్తాన్ని రాజధానిగా ధర్మరాజు తమ్ముల సాయంతోపాలించాడు .తర్వాత ‘’మేనరిక మని త్వదీయసహోదరి సుభద్ర దేవేరిగనీ –వాయర్జునునకు ‘’కూర్చాడుకృష్ణుడు .సుభద్రార్జునులకు మహా పౌరుషవంతుడు అభిమన్యకుమారుడు జన్మించాడు .ద్రౌపదికి ధర్మజ భీమార్జున నకుల సహదేవుల వలన ప్రతి వింధ్య ,శ్రుతసోమ ,శ్రుతకీర్తి శతానీక ,శత్రుసేన అనే ఉపపాండవులు జన్మించారు

అర్జునుడు ఖాండవ దహనం చేసి అగ్నిని మెప్పించి ,ఇంద్రాదులను జయించి వీతి హోత్రుని తృప్తి పొందించాడు .మయుడు అఆగ్నిజ్వాలలో చిక్కుకొని కిరీటిని శరణు వెడితే , అతడు రక్షించగా ,కృతజ్ఞతగా అతడు ‘’శ్రీమన్మణి సభ –నాకస్వామియు నరుదొంద’’ధర్మపుత్రునికి నిర్మించి ఇచ్చాడు .మయసభా ప్రవేశం చేసి యుధిష్ఠిరుడు ధర్మ బద్ధంగా రాజ్యపాలన చేస్తూ ,నారద మహర్షి రాజసూయ యాగం చేయమని హితవు చెప్పగా బావ కృష్ణుని ఆహ్వానించి ‘’నీ నియోగంతో రాజలోకాన్ని జయించాలి ‘’అని కోరగా ,జరాసంధుని హతమార్చటానికి కృష్ణ భీమార్జునులు వెళ్లగా ,భీముడితో మల్ల యుద్ధం లో వాడు చనిపోయాడు .తమ్ముల సాయంతో పూర్వోత్తర పశ్చిమ దక్షిణ దిగ్విజం పొంది ధర్మరాజు రాజసూయాధ్వరం చేశాడు .అగ్రతాంబూలం శ్రీ కృష్ణుడికి ధర్మరాజు ఇస్తే ,శిశుపాలుడు అతడిని,కృష్ణుని దూషిస్తే ,’’నిన్నుదిట్టు శిశు పాలున్ –గూలిచి చక్రముచే –క్రతుపాలన ‘’చేశాడు .

పాండవ వైభవాన్ని కనులారా చూస్తున్న దుర్యోధనుడికి అ సూయ పరాకాష్టకు పెరిగి ,మాయాద్యూతం ఆడించి వనవాస అజ్ఞాత వాసాలకు పంపాడు పాండవుల్ని ‘కౌంతేయులు సతితో కాననమున బలు పాట్లు పడ్డారు .’’బకుని తమ్ముడు కిమ్మీరుడు అడ్డు వస్తే భీముడు చంపేశాడు .’’ఈశునికై తపము –పారాశర్యు ననుజ్ఞ సల్పి –ప్రత్యక్షముగా జేసికొని-నరుడు వొందెను – పాశుపతాస్త్రము ‘’.శతమఖ నందనుడు అర్జునుడు అమరావతికి వెళ్లి ఊర్వశికామించగా ,నిరాకరిస్తే ‘’పేడిగ బ్రతుకు మని ‘’శపించింది .ఇంద్రుని ఆజ్ఞతో పార్ధుడు పాతాళం లో ఉన్న నివాత కవచులు అనే 3కోట్ల రాక్షసులను ,హిరణ్య పురవాసులైన పౌలోమ కాలకేయాది 60వేల రాక్షసులని చంపి దేవతా ప్రీతి చేశాడు .

గంధర్వులు దుర్యోధనుడిని బంధిస్తే ,విడిపించి ‘’గంధర్వుల నోరిచిన –సద్బంధులు పాండవులు .కామ్యవనంలో పాండవులు ద్రౌపదిని ఒక్కదాన్నే ఆశ్రమ లో ఉంచి వేటకు వెడితే ‘’ద్రుపద సుత వలచి సైంధవుడు అపహరణము సేయగా –మారుతాత్మజుడు ‘’వాడి గర్వం అడచి ద్రోవదిని తెచ్చాడు .’’సురయక్ష మౌని భూసుర సమూహం వరాలు ఇస్తే ,12ఏళ్ళు సుఖంగా పాండవులు వనవాసం పూర్తి చేశారు .అజ్ఞాతవాసం ఏడాది గడపపటానికి మత్స్యనగరి వెళ్లి ,విరటునికొలువులో మారువేషాలతో ఉన్నారు .’’నరుడు బ్రహన్నల నాగను బరగెను బేడియయి ‘’.ద్రౌపదిని గా౦ క్షీంచియుంట-దుర్జ్నేయ విధిన్ –దేవి సహోదరు గీచకు –బావని వధించాడు ‘’అని కీచకవదను ఒకే ఒక పద్యంలో చెప్పేశారు .తర్వాత దక్షిణ గోగ్రహణం.’’అత్తరి విరటుని పుత్రకు –నుత్తరు గని పసుల వార లోగివెడితే ‘’అర్జునుడు వెళ్లి ఆలను రక్షించి దుర్యోధనాదులకు యుద్ధంలో బుద్ధిచెప్పి ‘’క్రీడి రధియై తా రహి కౌరవ సేనా –వారంబుల గవిసె ‘’అనిలో ఉరు విజయం’’ పొందాడు .పాండవులు తమ నిజస్వరూపాలు విరతునికి తెలియజేయటం అర్జునుని కోరికపై అతడు ఉత్తరను అభిమన్యునికిచ్చి వివాహం చేయటం ,ఉపప్లావ్యం చేరి పాండవులు ‘’తమపాలిమ్మని కురు పతిని ‘’కోరటం ,చివరగా శ్రీ కృష్ణ రాయబారం ‘’తమ పైతృకమగు ఉర్వీ సామ్రాజ్యం పాండవులకిచ్చి ,భువి వాసిగా మనుము ‘’అని హితవు చెప్పటం ,లేదంటే యుద్ధంలో జయించి వాళ్ళే రాజ్యం పొందుతారని హెచ్చరించటం ,యుద్ధంలోనే తేలుద్దాం అని పెద్దరాజుకొడుకు అనటం ,ఆదుష్టులు ‘’నిండు సభ బట్ట నేనొక రుండన ?”’అంటూ విశ్వరూపం చూపటం ,చెప్పారు .

‘’పోరున సారధి వగుమని –కోరుతట నిన్ను సవ్యసాచి గొనకొని నీవా -భారము బై నిడుకొన్నావు ‘’అపార కృపా లీలతో .కురుపాండవ సంగ్రామం .వరుసగా కౌరవులంతా పాండవులచేతిలో హతమవ్వటం ,18అక్షౌహిణుల సైన్యంతో 18రోజులు జరిగిన యుద్ధంలో పాండవులు విజయం సాధించగా ‘’శ్రీ మెరయ నంతధర్మజు –బ్రేమంబున హస్తిపురికి పృధ్వీ పతిగా –నేమించి ,ఏలితీవు ప్రభామయ సాధువుల భక్త వత్సల కృష్ణా ‘’111వ కందంలో పిసిపాటి సుబ్బయ నరసాంబ కుమారుడు సోమయకవి రాసిన భారత శతకం చదివిన విన్నవారు కృష్ణుని దయతో దీర్ఘాయుస్సు నిర్మలమనసు ,సమస్తసంపదలు సత్సంతానం ఇహపర సౌఖ్యం తప్పక పొండుతారని ఫలశృతి చెప్పారు .

ఇందులో నేను విశ్లేషించి చెప్పాల్సిందేమీ లేదు మున్డుమాతలలోనే మహా మహులు చెప్పే ఉన్నారు .ఈకవి రామాయణం కూడా శతకరామాయణ0గా రాసిన తర్వాత దీన్ని రాసి ఆటర్వార భాగావతాన్నికూడా శతక భాగవతంగా రాశారని నిన్న చెప్పుకొన్నాం .కొండను అడ్డం చూపినట్లు మహా ఉద్గ్రందాలను శతకాలుగా మలచిన ఈ కవిని శతవిధాల కీర్తించాలి .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-9-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ అడివి బాపిరాజు గారు.13వ భాగం.24.9.22

బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ అడివి బాపిరాజు గారు.13వ భాగం.24.9.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

బ్రహ్మ వైవర్త పురాణం. ప్రకృతి ఖండం.10వ భాగం.24.9.22.

బ్రహ్మ వైవర్త పురాణం. ప్రకృతి ఖండం.10వ భాగం.24.9.22.

Video link

Posted in రచనలు | Leave a comment

మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -10

మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -10

· 31-బళ్ళారి రాఘవ మేనమామ ,నాటక రచయితా ,రామ కబీరు ,కంసధ్వంస నాటక ఫేం –శ్రీ ధర్మ వరం గోపాలాచార్యులు

· , ధర్మవరం గోపాలాచార్యులు నాటక రచయిత. ధర్మవరం రామకృష్ణమాచార్యులు తమ్మడు. వీళ్ళిద్దరి మేనల్లుడే బళ్లారి రాఘవాచార్యులు.

నాటకరంగ ప్రస్థానం
కన్నడ నాటకాలకు పోటీగా రామకృష్ణమాచార్యులు ఒక తెలుగు నాటకం రాసి మొదట ప్రదర్శించాడు. కానీ అది సరిగా ప్రదర్శన కాలేదు. దాంతో తెలుగు భాష నాటక రచనకు పనికిరాదన్న భావనకు దారితీసింది. అప్పుడు రామకృష్ణమాచార్యులు స్వయంగా నాటక రచన, ప్రదర్శనలను ప్రారంభించి ప్రప్రథమంగా చిత్రనళీయము నాటకం రాసి 1887 జనవరి 29 తేదీన విజయవంతంగా ప్రదర్శించాడు. తర్వాత చాలా నాటకాలను రచించి, స్వయంగా ప్రదర్శించాడు. గోపాలాచార్యులు తన అన్నతో కలిసి నాటకాలలో భరతుడు మొదలైన పాత్రలను పోషించాడు.

తర్వాత హైద్రాబాదులో వకీలు వృత్తిని నిర్వర్తించాడు. హైదరాబాదులో “కృష్ణ విలాసినీ సభ” అనే నాటక సంస్థను స్థాపించి, హరిశ్చంద్ర నాటకంను స్వయముగా రచించి ప్రదర్శింపజేశాడు. అక్కడినుండి 1910లో బళ్ళారికి తిరిగి వచ్చి 1912లో అన్న ధర్మవరం రామకృష్ణమాచార్యులతో కలిసి, ‘అభినవ సరస వినోదిని’ స్థాపించాడు. 1912, నవంబరు 30న రామకృష్ణమాచార్యులు మరణంతో అది ఆగిపోయిన తర్వాత ‘కృష్ణమాచార్య సభ’ అనే పేరుతో ఒక సమాజంను నడిపి, దేశమంతా తిరిగి ప్రదర్శనలు చేశాడు. ఈ సమాజానికి గోపాలాచార్యులు ఉపాధ్యక్షులుగా ఉన్నాడు. బళ్ళారి తిరిగివచ్చిన తరువాత ఇతను మరికొన్ని నాటకాలను రచించాడు.

రచనలు
ఈయన మొత్తము 12 నాటకములును రచించాడు.

  1. రామదాసు
  2. సుభద్రార్జునీయము
  3. రామకబీరు
  4. ప్రేమచంద్రయోగి లేదా అస్పృశ్య విజయము (1933)
  5. చంద్రమతీపరిణయము
  6. రుక్మిణీకృష్ణీయము లేదా మాయాశక్తి
  7. శ్రీరామ లీలలు
  8. గిరిజా శంకరీయము
  9. పాండవాజ్ఞాతవాసం
  10. ఉత్తర రామచరిత (కన్నడ) (1889)
  11. కంసధ్వంసము
  12. కెయిసర్

ఇతర వివరాలు
మేనల్లుడు బళ్ళారి రాఘవాచార్యులు ప్రతి నాటకపు ప్రతిని పరిశీలించి మార్పులు, చేర్పులు సూచించేవాడు. దాని ప్రకారమే వీళ్ళిద్దరు సరిదిద్దుకునేవారు. అలా ‘రామదాసు’, ‘సుభద్రార్జునియము’ ‘రాం కబీర్’ వంటి నాటకాలు రూపొందించారు. వీరు మొత్తం 13 నాటకాలు రాశారు. అందులో ప్రకటిత మైనవి –పై ముడున్నూ, ప్రేమచంద్రవిజయం’ లేదా ‘అస్ప్రస్యవిజయము’ ‘రుక్మిణీకృష్నియము’ లేదా ‘మాయాశక్తి’. ఇంకను అముద్రిత నాటకాలు; ‘ శ్రీరామ లిలలు’ గిరిజా శంకరియము, పాండజ్ఞాత్వాసం, ఉత్తర రామచరితము, హరిశ్చంద్ర, కేయిసర్ లేదా కలియుగ దుర్యోధన, ఉషాపరినయము, కంసద్వంసము’ వీరు పాత్రోచిత భాషను ఆధరించి , పౌరులు మొదలగు వారి భాషకు ‘మిస్రభాష’ అని పేరుపెట్టారు . వీరి నాటకాలు అన్నింటిలోకి ముఖ్యమైనది ‘రామదాసు’ నాటకం. బళ్ళారి రాఘవాచార్యులకు కీర్తి తెచ్చిన లేదా అతని వల్లన ప్రఖ్యాతి చెందినరెండు నాటకాలలో అది రెండవది. (మొదటిది కోలాచలం శ్రీనివసురావు ‘రామరాజు ) ‘భక్తి’ ప్రదనరసంగా ఉత్తమ నాటక రచన చేసినవారిలో వీరు రెండవ వారు. మొదటివాడు రాధాకృష్ణ ’ నాటక రచయిత అయిన పానుగంటి లక్ష్మి నరసింహారావు ).

· 32-చిత్రకవిత్వ దిట్ట,హాలికుడు ,నాటక ,శతక హరికధా కర్త –శ్రీ రాప్తాటి ఓబిరెడ్డి

రాప్తాటి ఓబిరెడ్డి [1]అనంతపురం జిల్లాకు చెందిన అజ్ఞాతకవి. చిత్రకవిత్వం చెప్పడంలో దిట్ట. ఒక మారుమూల కుగ్రామంలో బడి పెట్టుకొని, పేదపిల్లలకు పాఠం చెప్తూ, తీరిక సమయంలో తోచిన విషయాలపై కవిత్వం చెప్తూ మరోప్రక్క వ్యవసాయంచేస్తూ జీవనం సాగించిన నిరాడంబర జీవి ఇతడు. శతకాలు, హరికథలు, నాటకాలు, పద్యకావ్యాలు చాలా వ్రాశాడు. వాటిలో ఎక్కువభాగం అముద్రితాలే. ఖడ్గబంధ కందము, శైలబంధకందము, రతిబంధము, ఉత్పల పాద గర్భకందము మొదలైన చిత్రబంధకవిత్వం, అంత్యప్రాస, ద్విప్రాస, త్రిప్రాస,లటానుప్రాస మొదలైన శబ్దాలంకారాలు ఇతని రచనలలో అడుగడుగునా కనిపిస్తుంది.

రచనలు

  1. భక్త శ్రీ సిరియాళ (హరికథ)
  2. భీమసౌగంధిక (నాటకము)
  3. నిర్యోష్ట కృష్ణశతకము
  4. రాప్తాటి నిర్వచన రామాయణము
  5. శబ్దాలంకార శతకము

రచనల నుండి ఉదాహరణలు
నక్షత్రనేత! ఖద్యో

తాక్షా! రణరంగదక్ష! ఆశ్రితరక్షా!

రాక్షస గజహర్యక్షా!

అక్షీణ దయా కవితకటాక్షా! కృష్ణా!

(కృష్ణ శతకము నుండి)

ఏరా! సాగర! యింతనీకు పొగరా! మీరీతి నాయనతిన్

మేరంజాలితివా! దురాత్మ! కుటిలా! మిథ్యానులాపా! నినున్

ఘోరప్రక్రియ ఖండఖండములుగా, గోయించి భూతాళికా

హారం బౌ నటులే నొనర్తు ననగా – నాతండు భీతాత్ముఁడై

(రాప్తాటి నిర్వచన రామాయణములో కౌసల్యా పరిణయ ఘట్టము నుండి)

ఏమేమీ! చిరుతొండనంబి సతతం – బీరీతి సద్భక్తులన్

ఆమోదంబు జెలంగ, దృప్తిపడ – నాహారంబు లర్పించునే?

ఈ మాడ్కిన్ జెలువొందు త్యాగపరు నెందేనిన్ గనుగొంటిమే?

స్వామీ! నా మదిఁగోర్కె గల్గెను భవద్భక్తున్ బరీక్షింపగన్

(భక్త శ్రీసిరియాళ నుండి)

33-రాయలసీమ రచయితల చరిత్ర, కుమార శతక,పుష్పబామ విలాస కర్త,హెడ్ మాస్టర్ ,శ్రీ కృష్ణ దేవరాయ గ్రంధాలయ స్థాపకుడు,కవిభూషణ ,కవితిలక –శ్రీ కల్లూరు హనుమంతరావు
· రాయలసీమ రచయితల చరిత్ర వ్రాసిన కల్లూరు అహోబలరావు స్వయంగా కవి. బహుగ్రంథకర్త.

జీవితవిశేషాలు
కల్లూరు అహోబలరావు[1] 1901 జూన్ నెలలో అనంతపురం జిల్లా లేపాక్షి మండలం కల్లూరు గ్రామంలో జన్మించాడు. ఇతని పూర్వీకులు మైసూరు రాష్ట్రంలోని ‘మొళబాగు’కు చెందినవారు. బడగనాడు నియోగి శాఖకు చెందిన బ్రాహ్మణుడు. కాశ్యపశ గోత్రుడు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు కల్లూరు సుబ్బారావు ఇతనికి మేనమామ. ఇతనికి తన పన్నెండవయేటనే వివాహమైనది. భార్య సీతమ్మకు అప్పటికి ఎనిమిదేండ్లు మాత్రమే. ఇతనికి ఆరుగురు కొడుకులు ముగ్గురు కూతుళ్ళు పుట్టారు.

విద్యాభ్యాసం, ఉద్యోగం
ఇతడు తన ప్రాథమిక విద్య హిందూపురం, ధర్మవరం గ్రామాలలో చదివాడు. బెంగళూరులో యస్.యస్.ఎల్.సి చదివాడు. బళ్లారిలో సెకండరీగ్రేడ్ టీచర్ ట్రైనింగ్ పరీక్ష పాసయ్యాడు. తెలుగులో విద్వాన్ పరీక్ష ఉత్తీర్ణుడయ్యాడు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తాలూకాలోని అనేక గ్రామాల పాఠశాలలో హెడ్‌మాస్టర్‌గా పనిచేశాడు. బళ్లారిలోని సెయింట్ జాన్స్ హైస్కూలులో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా, తెలుగు పండితునిగా పనిచేశాడు.

సాహిత్యరంగం
బళ్లారిలో పనిచేస్తున్నపుడు 1931లో ఘూళీకృష్ణమూర్తి, హెచ్.దేవదానముల సహకారంతో శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల స్థాపించాడు. ఈ సంస్థ ద్వారా 40కు పైగా గ్రంథాలను పాఠకలోకానికి అందించాడు. 1981లో ఈ సంస్థ స్వర్ణోత్సవాలను ఘనంగా జరుపుకున్నది. ఇతడు తన రచనలను మొదట శతకాలతో ప్రారంభించాడు. ఎన్నో గ్రంథాలను వ్రాశాడు. 1919 నుండి 1990 వరకు ప్రతి సంవత్సరం ఉగాది పండుగకు క్రమం తప్పకుండా శుభాకాంక్షలను పద్యరూపంలో ముద్రించి బంధుమిత్రులకు పంపేవాడు. అవి కేవలం శుభాకాంక్ష పద్యాలు మాత్రమే కావు. గత సంవత్సరంలో ప్రజానీకం పడిన కష్టనష్టాలకు, దేశకాల పరిస్థితులకు దర్పణం పట్టిన పద్య ఖండికలు.[2] రాయలసీమలో పుట్టిపెరిగిన 141మంది కవుల జీవితచరిత్రలను,వారి రచనలను పరిచయంచేస్తూ నాలుగు సంపుటాలలో “రాయలసీమ రచయితల చరిత్ర”ను వెలువరించాడు.

రచనలు

  1. కుమార శతకము (1923)
  2. భరతమాతృ శతకము (1923)
  3. భావతరంగములు – ఖండికలు (1931)
  4. పూదోట – ఖండికలు (1951)
  5. భక్తమందారము – ద్విశతి (1958)
  6. ఉగాది స్వర్ణభారతి (1972)
  7. రాయలసీమ రచయితల చరిత్ర – 4 సంపుటాలు (1975-1986)
  8. శ్రీరామకర్ణామృతము (1980)
  9. శ్రీకృష్ణకర్ణామృతము
  10. ఉగాది వజ్రభారతి
  11. గృహలక్ష్మి – కందపద్య త్రిశతి
  12. పుష్పబాణ విలాసము
  13. యామినీపూర్ణతిలక
  14. శ్రీలక్ష్మీనృసింహ స్తోత్రము

రచనల నుండి ఉధాహరణలు
1.సీ. రాటమా! కాదు – పోరాటంబు లుడిగించు

విష్ణుచక్రంబిద్ది పృథివి యందు

రాటమా! కాదు – ఆరాటంబు బోకార్పు

కల్పవృక్షంబిద్ది ఖండితముగ

రాటమా! కాదుపో – కాటకంబుల ద్రోలి

కడుపు నిండించెడి కన్నతల్లి

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

నటుడు ,శ్రీ కృష్ణ దేవరాయ నాట్యమండలి స్థాపకుడు ,ఆహుళ పాత్ర ఫేం -రొద్దం హనుమంతరావు

నటుడు ,శ్రీ కృష్ణ దేవరాయ నాట్యమండలి స్థాపకుడు ,ఆహుళ పాత్ర ఫేం -రొద్దం హనుమంతరావు

రొద్దం హనుమంతరావు (ఫిబ్రవరి 23, 1906 – 1986) ప్రముఖ రంగస్థల నటుడు, న్యాయవాది, శ్రీకృష్ణదేవరాయ నాట్యమండలి స్థాపకుడు.[1

జననం
హనుమంతరావు 1906, ఫిబ్రవరి 23న అనంతపురం జిల్లా, పెనుగొండ లో జన్మించాడు. ఈయన తండ్రి పేరు వెంకోబరావు. ఈయన పినతండ్రి రొద్దం రంగారావు, సోదరుడు రొద్దం రాజారావులు ప్రముఖ నటులు. ఈయన కుమారుడు రొద్దం ప్రభాకరరావు ఐ.పి.ఎస్. అధికారి. వారు ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో పనిచేసి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా రిటైర్ అయ్యారు.

రంగస్థల ప్రస్థానం
హనుమంతరావు తన 13వ ఏట అనంతపురం కళశాలలో విజయనగర పతనం నాటకంలోని విరుమలాంబగా నటించి రంగస్థలంపై అడుగుపెట్టాడు. పెనుగొండలో శ్రీకృష్ణదేవరాయ నాట్యమండలి, అనంతపురంలో అలిత కళాపోషణ సమితిని స్థాపించాడు. బళ్ళారి రాఘవ, స్థానం నరసింహరావు, ఈలపాట రఘురామయ్య తదితర ప్రముఖ నటులతో కలిసి నటించాడు.

నటించిన నాటకాలు – పాత్రలు
· విజయనగర పతనం – విరుమలాంబ

· సావిత్రి – సావిత్రి

· పాదుకా పట్టాభిషేకం – కైకేయి

· ప్రమీలార్జునీయం – ప్రమీల

· శ్రీకృష్ణదేవరాయ విజయం – అన్నపూర్ణ

· ఉత్తర గోగ్రహణం – ఊర్వశి, ఉత్తర కుమారుడు

· నటచరిత్ర – బాహుకుడు

· రాణీ సంయుక్త – అహుళ రాయుడు

మరణం
హనుమంతరావు 1986లో హైదరాబాద్లో మరణించాడు.

మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -24-9-22-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Leave a comment

బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ అడివి బాపిరాజు గారు.12వ భాగం.23.9.22

బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ అడివి బాపిరాజు గారు.12వ భాగం.23.9.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శతక భాగవతంశ్రీ పిసిపాటి సోమయ్య కవి

శతక భాగవతం
శ్రీ పిసిపాటి సోమయ్య కవి రచించిన శతకభాగవతం 1942లో నూజివీడులోని గౌరీ ముద్రాక్షర శాలలో ముద్రింపబడింది .వెల పేర్కొనలేదు .కంద పద్యాల్లో భాగవత కథా శతకం రాశాడు కవి ..’’కృష్ణ ,పరమాత్మ హరీ ‘’అనేది మకుటం .
మొదటి పద్యం –‘’శ్రీ కళ్యాణ గుణాకర-లోకేశ్వరసాధు భక్త లోక యన౦
తా
నీ కథల స్మరియి౦తును –బ్రాకట సద్భక్తి గృష్ణ పరమాత్మహరీ ‘’
తర్వాత భాగవతాన్ని సంస్కృతంలో రాసిన వ్యాసుని తెలుగులో రాసిన పోతనను స్మరించి ,అప్పటికే శతక రామాయణం శతక భారతం రాశానని ,ఇప్పుడు భాగవత శతకాన్ని కూడారాసి అర్పిస్తున్నాననీ విన్నవించాడు .శిరములు కన్నులు కరములు శత వేలు కలిగి సర్వాతీతుడవై జలధిలో ఉంటావు .ధర్మానికి విఘాతంకలిగినపుడు ప్రతియుగం లో అవతరించి ధర్మోద్ధరణ చేస్తావు .మొదట పెనుమీనంగా విలయాబ్ది విరించి కునుక, వేదాలను అపహరించిన హయగ్రీవుని మలపినావు .’’నిద్దుర మానిన వేలుపు -పెద్దకు నిగమముల చిక్కు విచ్చుచు మగుడన్ –‘’ముద్దుగా తెచ్చిచ్ఛి విపద్దశ బాపావు .సత్యవ్రత రాజుకు బ్రహ్మమార్గం తెలిపావు .ప్రళయాబ్దిలో మనువు ,విత్తనాలు ఓషధులు మునులు మునిగిపోతుంటే,పెద్ద నావతో వచ్చి తేల్చి కాపాడావు .
తర్వాత క్షీరసాగర మధనం ,కూర్మావతారం ,అమృతాన్ని మోహిని రూపంలో దేవతలకుపంచి దనుజుల పరిఢవం చేశావ్.సనకసనందులు విష్ణుద్వారపాలకులకుశాపం ఇవ్వటం వారు భూలోకంలో పుట్టటం ,భూమిని చాపచుట్టగా చేసి సముద్రంలో దాక్కున్న హిరణ్యాక్షుడిని మహావరాహ రూపం లో మర్దింఛి కోరపై భూమిని నిలిపితే భయపడిన భూదేవిని భయం పోగొట్టటం ,హిరణ్యకశిపుని చంపి ప్రహ్లాదుని కాపాడి ప్రహ్లాద వరదుడవటం చక్కగా వర్ణించాడు కవి .వామనుడవై బలిని మూడడుగుల భూమి కోరి ,మూడో పాదం ‘’నతుడై శిరమం జూపిన –మతియుతుబలి దైత్యు బొగడి –మానుగానతని సుతలమునకు బనిపి ‘’దేవతలను బ్రోచాడు హరి .రాముడుగా ‘’ఒరులేరును విరువంగానెరుగని శివధనువు దునిమి –మిధిలా వరు సద్మ౦బున – సీతను’’ పరిణయమాడావు .తర్వాత రామాయణ కథ అంతాకందాలలో అందంగా నడిపారు . తర్వాత కృష్ణావతారం .’’అష్టమ గర్భంబున బహు –లాష్టమిగల రోహిణీ సమన్విత రాత్రి న్-సృష్టిం గంటివిధర్మ –భ్రష్టుల దండింప కృష్ణ పరమాత్మహరీ ‘’అని చక్కని చిక్కని పద్యం రాసి శ్రీకృష్ణజననం చెప్పారు .అక్కడినుంచి కృష్ణ కథ మొదలెట్టి ,నంద యశోదల గారాబు పట్టిగా పెరగటం ,పూతన శకటాసురాది రాక్షస నిధనం వర్ణించి బాల కృష్ణుని లీలావినోదాలను తనివార వర్ణించి ,కాళీయ మర్దనం గోపికా వస్త్రాపహరణం ,గోవర్ధనోద్ధరణం మేనమామ కంసవధ ,’’లేపనముల నంది కుబ్జకు –బాపంబుల బాపి దేహ వక్రత బోవ సద్రూపం ‘’ఇచ్చాడు
కాశీకి వెళ్లి సాందీపముని ఆశ్రమం లో అన్న బలరాముడితో చదివి ‘ఎల్ల విద్యల బనుపడ’’నేర్చాడు .చనిపోయిన గురు సుతుని ‘’జము నడిగి తెచ్చి-గురు దక్షిణగా స్థిరభక్తి ‘’తో అందించి లోకానికి మార్గదర్శకుడయ్యాడు .సముద్రంలో ద్వారక నిర్మించి మదురానగర వాసుల్ని యుద్ధభయ౦ లేకుండా కాపాడాడు .రుక్మిణీ కల్యాణాన్ని –‘’సిరి మున్ను గొన్న వడువున –నెరి నోరిచి చైద్య పక్ష నృపతుల నాజిన్-బరిణయమైతి విదర్భే-శ్వర సుత రుక్మిణిని కృష్ణ పరమాత్మహరీ ‘’.ఆతర్వాత శ్యమంతక మణి వృత్తాంతం ,అష్టభార్య వివాహం ,పారిజాతాపహరణం ,ధర్మరాజుతో రాజసూయం జరిపించటం భీష్మ వచనం ప్రకారం అగ్ర పూజ అందుకోవటం ,చైద్యుని చంపటం సూటిగా వర్ణించాడు .
‘’సుదతి దను బంప నడుగుల – బదిలముగాదేచ్చి యీయబత్తి గుచేలుం –డొదవిన కరుణను బలు- సంపద లిడి ‘’స్నేహధర్మాన్ని లోకానికి చాటాడు .ద్రౌపదీ వస్త్రాపహరణం ,అక్షయ వస్త్ర ప్రదానం ,ధర్మాత్ములైన పాండవుల పక్షం లో ఉండి కురుపాండవ సంగ్రామం జరిపించి ధర్మాన్ని కాపాడాడు .ద్రోణ సుతుని అస్త్రం నుంచి ఉత్తర గర్భాన్నికాపాడి పరీక్షిత్తు ఉదయానికి కారకుడవటం వివరించారు ‘’భేదా చారులు దుర్నయ –వాదులు లోకాపకార పరులు జెలగన్ –మేదిని బుద్ధుడవై ‘’పుట్టి నీతిని బోధించాడు .చివరగా కల్కి అవతారం దాల్చాడు హరి .
ఇన్నీ చెప్పి ‘’నీ లీలలలెల్ల బేర్కొన –జాలరు బ్రహ్మాదులరయ సంకర్షణ –‘’నా వల్ల ఏమౌతుంది అని కాడి పారేశాడుకవి .111వ కందం లో ‘’భారద్వాజస గోత్ర వి-హారుని బిసపాటి సుబ్బయార్య తనూజున్ –ధారుణి సోమయ సుకవి గృ-పారతిరక్షించు కృష్ణ పరమాత్మహరీ ‘’అని ముగిస్తూ చివరిపద్యంలో ఫలశ్రుతి రాశారు .
ఈ శతకం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ‘’సుత్తి లేకుండా సూటిగా భాగవతామృత పానం చేయించిన శతకం ‘’ అనాలి .సోమయ్య గారికి సాహిత్యం లో గొప్ప పేరే ఉంది .తన అనుభవం భక్తీ కి కలిపి తన పాండిత్యాన్ని ఇక్షురసంగా మార్చి కవి రాశారు .పండితలోకం గుర్తించే ఉంటుంది .అయినా పరిచయం చేసే సౌభాగ్యం నాకు దక్కింది .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -23-9-22-ఉయ్యూరు ,

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మ వైవర్త పురాణం.ప్రకృతి ఖండం.9వభాగం.23.9.22

బ్రహ్మ వైవర్త పురాణం.ప్రకృతి ఖండం.9వభాగం.23.9.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

·మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు  26-తెలుగు ,హిందీ కవి అనువాదకుడు లెక్చరర్ ,క్రీడా శిర్దేశ్వర ,సాయి శతకకర్త –శ్రీ దావూద్ సాహెబ్ షేక్

మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -9

· 26-తెలుగు ,హిందీ కవి అనువాదకుడు లెక్చరర్ ,క్రీడా శిర్దేశ్వర ,సాయి శతకకర్త –శ్రీ దావూద్ సాహెబ్ షేక్

· దావూద్‌ సాహెబ్‌ షేక్‌ తెలుగు రచయిత. ఆయన కర్నూలు ఉస్మానియా కళాశాలలో తెలుగు- హిందీ పండితులుగా విద్యాబోధన చేస్తూనే తెలుగు భాషాభివృద్ధి ధ్యేయంగా పలు కార్యక్రమాలను నిర్వహించారు. తెలుగులోకి పలు ఇతర బాషా గ్రంథాలను అనువదించి ప్రచురించారు. చివరి దశ వరకు తెలుగులో రచనలు గావించారు.

జీవిత విశేషాలు
దావూద్‌ సాహెబ్‌ షేక్‌ కర్నూలు జిల్లా చిట్వేలు గ్రామములో ఖాదర్‌బి, సుల్తాన్‌ సాహెబ్‌ దంపతులకు జూలై 1 1916 న జన్మించారు. చిన్న నాటనే తల్లిదండ్రుల్ని కోల్పోయి, జీవనయానంలో బ్రతుకు తెరువుకై నెల్లూరు చేరుకొన్నారు. అక్కడ రూపాయిన్నర పెట్టుబడితో ట్రంకురోడ్డులో పెట్టుకొన్న కిళ్లీ కొట్టు తెలుగు సాహిత్యం పట్ల అతనిలో తొలి బీజాంకురం వేసింది. అలనాటి సుప్రసిద్ధ నెల్లూరు కవులు మరుపూరు కోదండరామిరెడ్డి, పిలకా గణపతిశాస్త్రి, బెజవాడ గోపాలరెడ్డి, రేవురు సుబ్బారావు, జక్కా సుధాకరం వంటి వుద్దండులు ప్రతి సాయంత్రం ‘సాహిత్య తాంబూల సేవన మంజూషా” (కిళ్లీ కొట్టుకి కవులు పెట్టుకున్న ముద్దు పేరు) వద్దకి చేరటం, తమతమ పద్య రచనా పఠనం గావించటం దావూదు కవిలో సాంప్రదాయక పద్యరచన పట్ల ఆసక్తిని పెంచిన విషయాలు. తనకు తొలి ఆడబిడ్డ పుట్టిన పిదప ఆయన ఆనాటి సంస్కృతాంధ్ర పండితులైన దుర్భా సుబ్రహ్మణ్యశర్మ గారిని ఆశ్రయించి తన 22వ యేట విద్యాభ్యాసానికి వొడిగట్టారు. అప్పటి పండిత వర్గం శర్మగారి వద్దకు చేరి ‘సాయిబుకు సంస్కృతం నేర్పుతున్నావటగా! ఇక రాళ్లదెబ్బలకు సిద్ధంగా వుండు’ అంటూ అవహేళన చేశారట. అయితే సంస్కృతాంధ్ర భాషల్లో మదరాసు విశ్వవిద్యాలయం ద్వారా విద్వాన్ పట్టా పుచ్చుకొని వుత్తరోత్తరా నంద్యాల పురపాలక పాఠశాలలో తెలుగు పండితుడుగా చేరిన పిదప తన తొలి మాసం వేతనాన్ని గురువుగారి పాదపద్మాలకి గురుదక్షిణగా మనియార్డరు ద్వారా సమర్పించుకున్నారు దావూదు కవి. ఆ మనియార్డరు చేతపుచ్చుకుని తనను దెప్పి పొడిచిన పండిత మిత్రుల్ని సమావేశపరచి ‘ఇదుగోనండీ! నా సాయిబు శిష్యుడు విసిరిన తొలి రాయి’ అంటూ దాన్ని అందరికీ చూపి పొంగిపోయారట దుర్భా సుబ్రహ్మణ్యశర్మ గారు. ఆ గురు శిష్యుల ఆత్మబలం అటువంటిది [1]. పిదప కర్నూలు ఉస్మానియా కళాశాలలో దాదాపు 30 సంవత్సరాలు తెలుగు- హిందీ పండితులుగా విద్యాబోధన గావించారు. అరబిక్‌, ఉర్దూ, తెలుగు భాషల్లో మంచి విద్వత్తును సంపాదించిన ఆయన తెలుగు భాషాభివృద్ధి ధ్యేయంగా పలు కార్యక్రమాలను నిర్వహించారు. తెలుగులోకి పలు ఇతర బాషా గ్రంథాలను అనువదించి ప్రచురించారు. ఈయన రచనలపై తెలుగులో రెండు, ఉర్దూలో ఒక పి.హెచ్.డి. పరిశోధనలు జరిగాయి. చివరి దశ వరకు తెలుగులో రచనలు గావించారు. ఈయన 1994లో మరణించాడు.

రచనావ్యాసంగము

  1. చిత్త పరివర్తనము
  2. దాసీపన్నా (1956)
  3. రసూల్‌ ప్రభువు శతకము
  4. సంస్కార ప్రయాణము (1957)
  5. సూఫి సూక్తులు
  6. సంత్‌వాణి
  7. అల్లా మాలిక్‌ శతకము
  8. సఖుడ (శతకం)
  9. క్రీడాషిర్డీశ్వరము
  10. సాయి శతకము
  11. సాయిబాబా దండకము
  12. సాయిబాబా చరిత్రము (కావ్యము)
  13. అభినవ తిక్కన కవితా సమీక్ష (వచనం)
  14. నాగూర్‌ ఖాదర్‌ వలీ చరిత్రము
  15. ఆజాదు చరిత్రము
  16. ఆదర్శము (నవల)
  17. అబ్దుల్‌ ఖాదర్‌ జీలాని
  18. గౌసుల్‌ ఆజం దస్తగిరి దివ్య చరిత్ర (వచనం)
  19. చంద్ర వదన మోహియార్‌ (ఖండ కావ్యము)
  20. కదిరి సమాధి గాథ

27-నేత్ర వైద్యుడు ,సాహిత్య పోషకుడు ,నవలా నాటక కదా రచయితా –శ్రీ గుంటుపల్లి రాదా కృష్ణమూర్తి

· గుంటుపల్లి రాధాకృష్ణమూర్తి కళాభిమాని, సాహిత్య పోషకుడు, రచయిత, ప్రముఖ నేత్రవైద్యుడు. ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో వైద్యవిజ్ఙానం శీర్షిక ద్వారా ఇతడు పాఠకులకు చిరపరిచితుడు[1].

బాల్యం
ఇతడు గుంటూరు జిల్లా, లోని నరసరావు పేట గ్రామంలో నందవరీక నియోగి కుటుంబంలో 1930, మార్చి 25న తేదీన జన్మించాడు. ఇతని తండ్రి గుంటుపల్లి శ్రీనివాసరావు కవి. అతడు రుక్మిణీ కళ్యాణము, జానకీ పరిణయము మొదలైన కావ్యాలను వ్రాశాడు. రాధాకృష్ణమూర్తి తన అన్న గుంటుపల్లి శ్రీరామమూర్తి వద్ద మద్రాసులో పెరిగి పెద్దయ్యాడు.

విద్య, ఉద్యోగం
ఇతడు మద్రాసులోని పచ్చయప్ప కళాశాలలో చదివి 1949లో బి.ఎస్.సి పట్టాను పొందాడు. తరువాత మద్రాసులోని వైద్యకళాశాలలో 1954లో ఎం.బి.బి.ఎస్. డిగ్రీని, 1956లో ఆఫ్తాల్మాలజీలో డిప్లొమాను సంపాదించాడు. 1961లో ఎం.ఎస్. పట్టాను సాధించాడు. 1956లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యశాఖలో అసిస్టెంట్ సివిల్ సర్జన్‌గా ఉద్యోగం ప్రారంభించాడు. కర్నూలు, వరంగల్లు వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఆఫ్తాల్మాలజీగా పనిచేశాడు. 1965లో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి నేత్రవైద్యుడిగా బదిలీ అయ్యాడు. తరువాత ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి అనంతపురంలో స్వంత నేత్రవైద్యశాలను స్థాపించి పేరు ప్రఖ్యాతులు పొందాడు. అనేక గ్రామాలు, పట్టణాలలో నేత్ర శిబిరాలు నిర్వహించి రమారమి లక్ష మందికి కంటి శుక్లాల ఉచిత శస్త్ర చికిత్సలు చేశారు.రోటరీ అంతర్జాతీయ సంస్థలో జిల్లా గవర్నరుగా సామాజిక సేవ చేశారు.జస్టిస్ ఆవుల సాంబశివరావు గారిచే నేత్రదాత బిరుదు అందుకున్నారు.

రచనలు
ఇతడు మద్రాసులో ఎస్.ఎస్.ఎల్.సి చదువుతున్నప్పుడే తెలుగు ఉపాధ్యాయుడు గరిమెళ్ల సత్యగోదావరిశర్మ వల్ల ఆంధ్రసాహిత్యం పట్ల మమకారం ఏర్పడింది. ఇతని తొలి రచన సుదినం 1946లో ఆంధ్రమహిళ మాసపత్రికలో అచ్చయ్యింది. అది మొదలు ఇతడు చిత్రగుప్త, నవజీవన, ఆనందవాణి, జయశ్రీ, కిన్నెర, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఆంధ్ర విద్యార్థి మొదలైన పత్రికలలో కథానిక[2]లు, వ్యాసాలు, నాటికలు, పద్యాలు, గేయాలు, శీర్షికలు వరుసగా ప్రకటించాడు. ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ఇతడు నిర్వహించిన వైద్యవిజ్ఞానము, తెలుగు కలాలు శీర్షికలు పాఠకుల మెప్పును పొందాయి. “గుంటుపల్లి సూక్తి గురుడ వినర” అనే మకుటంతో 200 పద్యాలను వ్రాశాడు.

ఇతని రచనలలో కొన్ని:

నవలలు
· గెలుపు

· ప్రకాశము – ప్రేమ

· చక్కని చుక్కలు

· సిస్టర్ సుమతి

· అన్వేషణ

నాటకాలు/నాటికలు
· ఓట్లవేట

· టోకరా

· ప్రేయసి

· వన్‌టూత్రీ

· మరో జవహర్

ఇతర గ్రంథాలు
· చందమామ యాత్ర

· హాస్యకుసుమాలు

· హక్కులు – విధులు[3]

· కళ్లను కాపాడుకోండి[4]

· విజ్ఞాన విశారదులు (5 భాగాలు)

· ఆరోగ్యమే మహాభాగ్యము

· సంఘజీవనము

· జ్ఞానపంచమి

· విజ్ఞానం

· వైద్యవిజ్ఞానము[5] (ఆంధ్రప్రభ ఫీచర్)

కథలు
· కుబేరపుష్పకము

· మనసు మలుపుల్లో

· లాటరీచీటీ

· షష్టాష్టకం

· దోమతెర తగాదా

· అనందం

· అలవాటు

· ఆమె త్యాగం

· ఉద్యోగం సద్యోగం

· 28-పుట్టపర్తి వారి శిష్యుడు ,నటుడు ,రెవెన్యు ఇన్స్పెక్టర్ ,కవి సుధాకర ,గాన కలాధర –శ్రీ ఎస్.రాజన్నకవి

· యస్.రాజన్నకవి పండితులు[1],[2] చిన్నజమాలప్ప, సాలమ్మ దంపతులకు

…

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ అడివి బాపిరాజు గారు.11వ భాగం.22.9.22

బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ అడివి బాపిరాజు గారు.11వ భాగం.22.9.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ కాశీ విశ్వ నాద శతకం –తంగెడంచ

శ్రీ కాశీ విశ్వ నాద శతకం –తంగెడంచ

శతావధానులు రామ కృష్ణ సీతారామ సోదరకవులు రచించిన శ్రీ కాశీ విశ్వ నాథ శతకం- తంగె డంచ – కర్నూలు జైహింద్ ముద్రాక్షర శాలలో 1950లో ముద్రితమైంది వెల నాలుగణాలు .ఈశతకం  కర్నూలు జిల్లా న౦ది కొట్కూరు తాలూకా తంగెడంచ గ్రామం లో వెలసిన శ్రీ కాశీ విశ్వేశ్వరునికి అంకితం .ఈ గ్రామం కర్నూలు నుంచి శ్రీశైలం వెళ్ళేదారిలో ఉంది .ఇక్కడ కర్నూలు వాసి వెండి ,బంగారం వ్యాపారి శ్రీ చాగాపుర౦ చిన్న యల్లచిప్ప గౌడుగారు ఇద్దరు భార్యల సహకారంతో శివాలయం కట్టించి ,25-2-1948సర్వజిత్ మాఘ బహుళ విదియ బుధవారం ప్రతిష్టా సంకల్పం చేసి ,26-2-1948జలదివాసాలు నిర్వహించి 27-2-1948 సర్వజిత్ మాఘ బహుళ తదియనాడు  శ్రీ సుబ్రహ్మణ్యాది పరివారంతో శ్రీ అన్నపూర్ణా విశాలాక్షీ సమేత  కాశీ విశ్వనాథ లింగ ప్రతిష్ట చేశారు .

 తర్వాత సోదరకవులు ఆలయనిర్మాత  వంశ చరిత్ర పద్యాలలో రాశారు ..’’తంగెడంచపుర కాశీ విశ్వనాథ ప్రభూ’’ అనే మకుటం తో 110మత్తేభ ,శార్దూల పద్యాలతో శతకం అల్లారు .మొదటిశార్దూల పద్యం –‘’శ్రీ వాణీశ గిరీశపద్మహిత లక్ష్మీ శా౦బికా ,భద్ర కా-ళీ వీరేశ కుమారభక్తజన పాళిన్,దేశిక శ్రేణినా

నా విద్వత్కవుల న్నుతించి ,పరమానంద౦బుతో  నీకు వా-క్సేవం జేతుము తంగెడంచ పుర కాశీ విశ్వనాథ ప్రభూ ‘’అని శివ పంచాయతనం వాణీ లక్ష్మీ మొదలైన వారిని గురువులను స్మరించారు .దురహంకారంతో బుద్ధినాలుగు విధాలపోతుంది వానరంలాగా .నీ భక్తి సూత్రంతో దాన్ని బంధించు అని శివానందలహరిలో భగవత్పాదులు అన్నట్లే అన్నారు .సారంగాసురహారి ,సారంగ ప్రతిభా విహారి అని శివుని కీర్తించారు .శివ పంచాక్షరి శ్రీశైల శవ దర్శనం కాశీవాసం బిల్వపూజ నీ కిష్టం .

  తర్వాత ఈ ప్రదేశం గొప్పతనాన్ని వర్ణించారు .ఇది అపరాకాశి.ఇక్కడి గోస్తనీ నది గంగానదితో సమానం .ఇక్కడ శివ తీర్ధం అనే కొత్తబావి ఉంది .ఇంద్రద్యుమ్న మహారాజుఇక్కడ తటాకం ,శివాలయం కట్టించి ,లింగ ప్రతిష్ట చేసి ,ఒకబావి తవ్వించాడు .బావినీరు కొబ్బరి నీటి రుచి .స్వామి దర్శనం మోక్షదాయకం .శివరాత్రికి శ్రీశైలం వెళ్ళే భక్తులు ఇక్కడికివచ్చి పానకంగా రుచిగా ఉన్న యీజలం తాగి ఎండనుంచి ఉపశమనం పొందుతారు .ఇక్కడి పుష్పవనం సకల పుష్పజాతులు తమ పుష్పాలను హరకై౦కర్యంగా ఉపయోగపడతాయి .ఇక్కడి స్వామికి జరిగే మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చూసి భక్తులు పులకి౦చి పోతారు. కైలాసం లో ఉన్న అనుభూతికి లోనౌతారు .

  శ్రీ కృష్ణుడు సాయం పూజ చేస్తే మోకాలు చూపిస్తే దాన్ని పూజించి మొకాలే నువ్వు అని భీముడికి అర్జునుడు తెల్పాడు .పతివి గౌడ సతిని రతికి ఒప్పించి ,ఆమె భర్తరాగా భయంతో సురాభాండం లో దాగి ,ఆదంపతులు భక్తితో ప్రార్ధిస్తే మోక్షం ఇచ్చావు ,అని చాలా  శివలీలలను  వర్ణించారు .హరి నీభక్తుడు నిత్యం వెయ్యి పద్మాలతో పూజిస్తాడు ఒకరోజుఒక పువ్వు తగ్గితే  కన్ను పీకి పుష్పంగాసంర్పించిన పరమ శివభక్తుడు శ్రీహరి .కిరాతార్జునీయం ,దక్ష గర్వభ౦గ౦ వగైరా వర్ణించారు .వ్యాసుడిని కాశినుంచి గెంటేయటం,రావణుడు నిత్యం కోటి శివాలయాలలో పూజ చేయటం ,శిరస్సు కోసి అర్పించిమెప్పించటం ,బాణాసురుడు భక్తితో మెప్పించిశివపార్వతులను తన ద్వారానికి కాపలా వారినిగాచేయటం చెప్పారు .

  ఆతర్వాత పద్యాలలోసంసార జ౦ఝాటనం మనసు శివునిపైనిల్పలేకపోవటం చెప్పారు . ‘’ఆశా వృక్షము భూమిలో బొడమి,యాశాన్తముల్నిండియా-కాశం బంటెడు వేళ-పద్మభవు కల్పద్రుమం బడ్డమై’’  నాశనం చేస్తుంది .ఇక ఫలవంతం ఎలా అవుతుంది అని ప్రశ్నించారు .గళం లో మహావిషం సగభాగంలో నిలిపి నేత్రాగ్నిజ్వాలల కొలిమిలో కరగించి ,మోహమద లోలత్వం కలిపి ‘’మాయలరంగు ల్బయి పూతపూసి ,విషకన్యల్సల్పి ,తచ్చిత్తమున్ శిలగా చేశావుకదా సామీ అన్నారు .నేటిపరిస్తులను చెబుతూ ‘’సినిమావచ్చెను పూర్వ నాట్య కళలన్ చేదింప –ఆచార దీక్షను గంగానదిలో కలపటానికి కాఫీ ప్రత్యక్షమైంది అని బాధపడ్డారు .సాలె పురుగు దారం అల్లి ,గూడు నిర్మించి తానె దాన్ని నాశనం  చేసినట్లు నువ్వు ‘’నానాలోకముల న్ సృజించు మనుచు న్నాశంబు ‘’చేస్తావుకదా అదే నీలీల .

 బౌద్ధులు చెలరేగిపోతుంటే సంకల్పం తో శంకరుడవై  జన్మించి ,అనేక భాష్యాలురాసి ‘’సంసరణా౦బోధి  తరియింప ఉపనిషత్సార ప్రచారం చేశావు .దాస్యం పొట్టకూటికే మానలేక పోతున్నాం .మాకు మోక్షం ఎన్నడో ?కాలుడు దున్నపోతునుఇవ్వగా  ,నీదగ్గరున్న ఎద్దుఉండగా  ,పుష్కలంగా గంగాజలం ,కుబేరుడు విత్తనాలు ఇస్తాడు నాగలి బలరాముడిస్తాడు ,నీకుకృషి చేతనౌను .హాయిగా పంటలు పుష్కలంబుగా పండించి మా ఆకలి దప్పులు తీర్చి రేషను బాధనుంచి గట్టేక్కిన్చవయ్యా .అని చమత్కరించారు కవీశ్వరులు .నువ్వు నిత్య భిక్షార్ధివి మాలోకనికి వస్తేపిడికెడు భిక్షంకూడా నీకు వెయ్యరయ్యోయ్ .నీకు రేషన్ కార్డు కూడా ఇవ్వరు జాగ్రత్తసామీ .

  మా భారత సోదరీమణులకు 30ఏళ్ళు దాటినా పెళ్ళిళ్ళు కావటం లేదు .వాళ్ళ వివాహం సంతానం సంగతి చూడవయ్యమహానుభావా .’’దానంబిచ్చిన రాజు లేగిరి ,శిలా తామ్రాది తచ్చాసనా లేనాడో చనె ,విప్రవంశ భవులా ఇంగ్లీషు వారైరి ‘’ఇంకా అగ్రహారాలలెక్కడ అమ్ముకుపోయారు .బ్రాహ్మణుల తపోమహిమ చచ్చింది. బ్యాటరీ గొట్టాలోచ్చాయి .కరంట్ లేదు జపతపాలు లేవు అని వాపోయారు .

‘’ఈవీశు౦డవు నే కవీశ్వరుడ ,స్వర్ణ రౌప్యాగామముల్ -దావుల్నీకు శతావధాన మునుపాధ్యాయ త్వము నాకు ‘’అయ్యో దరిద్రం తీరటం లేదు .చివరి 113వ మత్తేభ పద్యం –‘’శత లేఖిన్యవధాన ముల్సలుపు ,సంచారంబు నన్సేలువల్ –పతకంబుల్గొని ,నాటకంబులును ,కావ్యశ్రేణినిట్లేన్నియో

శతకంబుల్విరచించి డస్సితిని ,నా సామర్ధ్యముం బూర్వపు న్-స్థితికి దేగదే తంగెడంచ పుర కాశీ విశ్వనాధ ప్రభూ’’

‘’ఇది- శ్రీ మద్ గౌరా వఝల-సీతమా౦బాసుబ్బరామా ర్య తనూభవ రామ కృష్ణ సీతారామ సోదరకవి ప్రణీతంబగు శ్రీ కాశీ విశ్వనాథ శతకం సంపూర్ణం .

 ఈసోదరకవులు శతావధానులుకనుక పద్యాలు నల్లేరుపై బండినడక .చక్కని ఊహ నిర్వహణ తగినట్లు భక్తీ అందుకు తగ్గ పాండిత్యం తో శతకం రసవత్తరంగా రచించారు .అయితే మన వాళ్ళ దృష్టిలో పడిన దాఖలా నాకు కనిపించలేదు .వీరిని వీరి శతకాన్నీ పరిచయం చేసే మహద్భాగ్యం నాకు కలిగింది .

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -22-9-22-ఉయ్యూరు—

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మ వైవర్త పురాణం.ప్రకృతి ఖండం.8వ భాగం.22.9.22

బ్రహ్మ వైవర్త పురాణం.ప్రకృతి ఖండం.8వ భాగం.22.9.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

హిందూ మహాసముద్ర౦ లోఒకటవ శతాబ్దం లో ఒంటరిగా పడవ పై ప్రయాణించిన అజ్ఞాత నావికుని చరిత్ర పెరిప్లేస్ ను తెలుగులో అవిష్కరించిన- బందరు వాస్కోడిగామా శ్రీ సిలార్ –(చివరి భాగం )

హిందూ మహాసముద్ర౦ లోఒకటవ శతాబ్దం లో ఒంటరిగా పడవ పై ప్రయాణించిన అజ్ఞాత నావికుని చరిత్ర పెరిప్లేస్ ను తెలుగులో అవిష్కరించిన- బందరు వాస్కోడిగామా శ్రీ సిలార్ –(చివరి భాగం )
బరాకా అఖాతం దాటాక,ఇండియాకు –నమ్బనుస్ రాజ్య ప్రారంభం లో బరై గాజా ,ఆరికా దేశం తీరం ఉంది .మైదానప్రాంతం లో స్కైటికా ను ఆనుకొని ఉన్న ఈ భాభాగం అబిరియా గా పిలువబడుతోంది .ఈ తీరాన్ని సైరాష్ట్రెన్అంటారు అంటే సౌరాష్ట్ర అవచ్చు .అంటే గుజరాత్ .ఇది సారవంతం గోధుమలు బియ్యం నువ్వులు వెన్న నూలు ,ముతక ఇండియన్ వస్త్రాలు లభిస్తాయి ఇక్కడి పశువులు పచ్చిక బాగా మేసి బాగా పాలిస్తాయి .ప్రజలు పొడుగ్గా నల్లగా ఉంటారు .రాజధాని మిన్నగర నుంచి నూలు వస్త్రాలు వస్తాయి .ఇక్కడ అలేగ్జాండర్ దండ యాత్ర గుర్తులు ,పూర్వపు ప్రార్ధనా మందిరాలు ,కోట గోడలు నీటి బావులు చూడచ్చు .నామ్బనుస్ అంటే శకరాజ్య పాలకుడు ‘’సహపణ’’కావచ్చు.
అష్ట కంప్రకు 3వేల స్టాడియాల దూరం లో ని పాపిక దాటాక ,మరొక సింధు శాఖ –గల్ఫ్ వస్తుంది .ఇక్కడ బయోన్స్ దీవి ,దాని ముఖద్వారం వద్ద మయాస్ నది కనిపిస్తాయి .ఇక్క డ అడ్డంగా ప్రయాణం చేయాల్సిందే. బయోన్స్ కు ఎదురుగా నమ్మడస్ నది ఉంది .ఇదే నర్మదానది .దీన్నే పెరిప్లస్ రచయిత నమ్మ డస్ అన్నాడు .గల్ఫ్ ఇరుకుగా ఉండటం వలన సముద్రయానం కష్టం .పాపిక గా పిలువబదేఅష్ట కంప్ర కు ముందు భాగం ఎడమవైపు సముద్రం లోకి చొచ్చుకొని పోయి అలలతాకిడి ఎక్కువై లంగరు వేసిన పడవల తాళ్ళు తెగిపోతాయి .అందుకని స్థానిక రాజు నియమించిన మత్స్యకారులు తమ పడవల్లో సైరాష్ట్రెన్ అంటే సూరత్ వరకు దారి చూపిస్తారు .
ఇండియా మొత్తం మీద సముద్రపు అటు పోట్లు గురయ్యే అనేక నదులున్నాయి .బైరేగాజవడ్డ పోట్లు మరీ ఎక్కువ .అనుభవం లేని నావికులకు కష్టమే .నిలువుగా ప్రయాణిస్తే నౌకలు అడ్డం తిరిగి నీటిలో ఇరుక్కుపోయి బ్రద్దలై పోతాయి .బైరై గాజా కు లోపల ఉన్న బుసేఫలుస్ అలెగ్జాండ్రియా లో అరట్టి,అరచ్చోసి ,గండ్రాయి పోక్లాయిస్ తెగలు జీవిస్తారు .యుద్ధ ప్రియులైన బాక్ట్రేయిన్లురాజు కు లోబడి ఉంటారు .అలేగ్జాండర్ డమరిక దక్షిణ ఇండియా తప్ప అన్ని ప్రాంతాలను గంగానది వరకు ఆక్రమించాడు .గ్రీకులైన ద్రాచ్మే ప్రజలు ఇప్పటికీఅక్కడే ఉంటున్నారు .అలేగ్జాండర్ తర్వాత గ్రీసును పాలించిన అపోలో డోటస్,,మీనం డర్ ల శిలా విగ్రహాలున్నాయి .అరచ్చోసి అంటే కాందహార్ .ఈ బెలూఫస్ నగరమే జీలం నగరం అన్నాడు విన్సెంట్ స్మిత్ .అలేగ్జాండర్ కు అత్యంత ప్రియమైన గుర్రం పేరే బుసాఫెలాస్ .అది ఇక్కడే చనిపోతే దానిపేరనగరం నిర్మించాడు .మినాండర్ ను అలేగ్జాండర్ గా పొరబడ్డాడు పెరిప్లస్ రచయిత .అపోలో డ్రోటస్ తమ్ముడు మిలాండర్ సౌరాష్ట్ర పశ్చిమ తీరాన్ని ఆక్రమించి మధుర చిత్తోడ్ ,పాటలీ పుత్రాలను లోబరచుకొని మళ్ళీ స్వదేశం బాక్ట్రియా వెళ్ళిపోయాడు .బౌద్ధంలోకి మారి మిలిందుడు అయ్యాడు .మిలింద ప్రశ్నలు మిలింద పన్హా బౌద్ధ సాహిత్యాలే . ఇక్కడినుంచి తూర్పుకు వెడితే ఒకప్పటి రాజధాని ఒజేన్ వస్తుంది. ఇక్కడి నుంచి సరుకు రవాణా అవుతుంది .ఇందులో గో మేధికం ,గురువింద రత్నాలు ,రవ సేల్లాలు మల్లు గుడ్డలు జటామాంసి లు దిగుమతి అవుతాయి .ఆధునిక ఉజ్జెయిన్ అప్పటి పేరు ఒజేన్ .దీని ఆనుకొని ఉన్నదే సిప్రా నది .ఫోర్ గ్రేట్పవర్స్ ఆఫ్ ఇండియాలో అవంతీ రాజ్యం ఒకటి .బుద్ధుడి ముఖ్య శిష్యుడు కాచానా ఇక్కడే ఉజ్జయినిలో పుట్టాడు .జటామాంసి హిమాలయ ప్రాంతమొక్క. సువాసన నూనెల తయారీలో వాడతారు .
ఒజేన్ పట్టణానికి ,ఇటలి ,లోడేషియా,అరేబియా దేశాలకు రాగి తగరం ,సీసం పగడం ,పుష్యరాగం ,అన్నిరకాల వస్త్రాలు నడుం బెల్ట్ లు అద్దాలు కంటి సుర్మా,వెండి బంగారు నాణాలు ,ఆయింట్ మెంట్లు ఒజేన్ మార్కెట్ కు దిగుమతి అవుతాయి .
బైర్గాజా దాటాక వచ్చేదాన్ని ‘’దచ్చిన బదేశ్ ‘’అంటారు .అంటే దక్షిణ దేశం .ఇక్కడ పెద్ద పర్వతాలు ,ఎడార్లు క్రూరమృగాలు ,కోతులతో గంగానది వరకు కనిపిస్తాయి .ఇక్కడి నుంచి 20 రోజులు ప్రయాణిస్తే పైధాన్,మరో పది రోజులు ప్రయాణం లో తగర అనే రెండు సంత పట్టణాలు వస్తాయి .కురువింద రత్నాలు ఇక్కడ ప్రత్యేకం .పైధాన్ అంటే ప్రతిష్టానపురం .పులమావి రాజధాని అని టోలమీ చెప్పాడు .వస్త్ర పరిశ్రమకు కేంద్రం .
ఇవి దాటి వెడితే సుప్పార ,కల్లియాన నగర భారీ సంతలు వస్తాయి .లంగరుకు వీలుపడదు .సుప్పార అంటే బొంబాయి దగ్గరున్న సోపారా ఒకప్పటి కొంకణ రాజధాని .కల్లియాన అంటే కళ్యాణ్ నగరమే .కళ్యాణ్ దాటాక సేమైల్లా ,మండగోరా వగైరా పట్నాలు.ఇక్కడి కేనేటి దీవులలోసముద్ర దొంగలుంటారు .మండగోరాంటే,సావిత్రీ నది ముఖద్వారం లో ఉన్న బంకోట్ నగరం .ఇది మత్స్యకార గ్రామం .పూర్వం వ్యాపార కేంద్రం. కలప రవాణా జరిగేది .సేరె బోత్రా రాజ్యం లో ఉన్న టైన్ డిన్ గ్రామం .సరుకు ఉన్న ఒడలతో కిటకిట లాడుతుంది .దీనికి దగ్గరలోని సెల్ సిండా పాండ్య రాష్ట్ర భాగమే .
రక్షణ ఉన్న రహదారులతో ,స్థానికంగా నిర్మించిన ద్రావిడ దేశపు ఒడలలో సౌత్ ఇండియాలోనే కాక ,పర్షియన్ గల్ఫ్ ,అరేబియా ,ఆఫ్రికా దేశాల సముద్రతీరాలలో వ్యాపారం గొప్పగా సాగేది .సరుకులమార్పిడితో పాటు భావాల మార్పిడీ జరిగేది .ఇదంతా క్రీపూ 5వ శతాబ్దికే జరిగిందని బౌద్ధ వాజ్మయం ద్వారా తెలుస్తోంది .12వ శతాబ్ది తుడేలా నివాసి బెంజమిన్ చేర అనబడే కేరళ తీర సముద్ర వ్యాపారం గురించి ,స్థానికరాజు వ్యాపార సరుకులకు కల్పించిన రక్షణ గురించి ‘’సూర్యారాధకుల దేశానికి మొదట్లో ఉన్న ఖులం అంటే క్విలన్ 7రోజుల ప్రయాణ దూరం .వీరు కుష్ కుమారులు నల్లగా ఉంటారు నక్షత్రజ్ఞానం ఉన్నవారు నిజాయితీ పరులు .రాజు కార్యదర్శులు వచ్చి ,వ్యాపారుల పేర్లు నమోదు చేసుకొని రాజు వద్దకు తీసుకు వెళ్లితే వారి సరుకులకు రాజు రక్షణ కల్పించటం ఇక్కడ ఆచారం.పాండ్యరాజ్యం ప్రస్తుత తిరునల్వేలి దాకా ఉండేది .రాజధాని కొరకే నుంచి మధురకు మార్చబడింది .
నదీ తీరం లో బకారే అనే మరో ప్రాంతం ఉంది ఇక్కడ పాములెక్కువ .నల్లగా ఎర్ర కళ్ళతో ఉంటాయి .అలేప్పీ రేవు నిర్మాణం కావటంతో పోరకాడ్ రేవు ప్రభావం తగ్గింది .పోర్చుగీసులు తర్వాత డచ్ వారు ఇక్కడ ఆవాసాలేర్పరచుకొన్నారు అని ట్రావర్నియర్ యత్రికుడు పోర్కా పేర్కొన్నాడు .మిరియాలు ,మల బాత్రుం కొనుగోలుకు రాజులు మార్కెట్ పట్టణాలకు పెద్ద ఓడల్ని పంపి ,నాణాలు ,టోపాజ్ ,అద్దకం బట్టలు అంటిమొని అనే కళ్ళమందు సుర్మా ,పగడం ,సిందూరం అంటే రియాల్గర్ ఒర్పిమేంట్ గోధుమలు దిగుమతి చేసుకొంటారు. కొత్తనారా జిల్లాలో మాత్రమె లభించే మిరియాలు ఇక్కడి నుంచి ఎగుమతి అవుతాయి .ముత్యాలు సిల్క్ బట్టలు జటామాంసి ,రంగు రాళ్ళు వజ్రాలు నీలాలు తాబేటి చిప్పలు భారీగా ఎగుమతి చేస్తారు రోము దేశపు మేలిమి బంగారు నాణాలు వస్తు మార్పిడి కింద ఇచ్చేవారు .మన చేతి రుమాళ్ళు రోమన్ చక్రవర్తికి పూర్వమే విపరీతంగా అమ్ముడయ్యేవి .బంగారు నాణాలు మన దక్షిణదేశ రేవు పట్నాలైన పెనుగంచిప్రోలు ఘంటసాల ,విజయవాడలోని విద్యాధరాపురం దగ్గర త్రవ్వకాలలో బయట పడ్డాయి .2002లో నందిగామ తాలూకా పెనుగంచిప్రోలులో పెద్దింటమ్మ గుడి సత్రంపునాదులు తవ్వుతుంటే మట్టి కుండల్లో 59బంగారు రోమునాణాలు దొరికాయి .నికోలాకో౦టీ చెప్పినట్లు ‘’ఇండియన్ వజ్రాలు పర్వతాలమీద లోయలలోకి మాంసం ముద్దలు విసరటం వలన దొరుకుతాయి .ఇక్కడ విష సర్పాల భయం వలన జనం అక్కడికి వెళ్లరుకాబట్టి ‘’.
సముద్రపు గాలుల మీద హిప్పాలాస్ పరిశోధన సుమారు 45ఏళ్ళు రోముకు ఓడ వ్యాపారం లో కొత్తశకం ప్రారంభమైంది .పెరిప్లస్ కాలం లో మలక్కా మలబార్ సొమాలి, సౌత్ అరేబియా ఆడులిన్,బెరినైస్ రేవులలో సరుకులు చేతులు మారేవి .బకారే దాటాక ముదురు ఎరుపు రంగు పర్వతాలున్న బాలిటా, ,తర్వాత వరాలియా జిల్లా కనిపిస్తాయి.ఇక్కడ మంచి హార్బర్ ఉంది దీనితర్వాత కొమరి అంటే కేపాఫ్ కొమరిన్ కన్యాకుమారి నౌకాశ్రయం ఉంది .జీవితాన్ని ప్రశాంతంగా గడపటానికి సముద్ర స్నానాలు చేస్తూ ,బ్రహ్మ చర్యం పాటి౦చాలనుకొనె పురుషులు స్త్రీలు ఇక్కడికి వస్తారు .కొమరి పడమర కొల్చి అంటే కొచ్చిన్ దాకా వ్యాపించింది .పెరల్ ఫిషరీ కి కేంద్రం . పాండ్యరాజ్యభాగం ..దీనితర్వాత లోతట్టున ఆర్గారు పట్టణం ఉంది .ఏరిన ముత్యాలు ఇక్కడికి మాత్రమె చేరుస్తారు .రవ సేల్లాలు మజ్లిన్స్ ఇక్కడ నుండి ఎగుమతి అవుతాయి .దక్షిణ ద్రావిడులు చురుకైన వ్యాపారులు .శ్రీలంకలో వలస రాజ్య స్థాపకులు ,లంకీయులతో తగాదాలున్నా పెరల్ ఫిషరీస్ ను లంక వాయవ్య తీరంవరకు రాజ్యం విస్తరింప జేశారు .ఇక్కడున్న మహేంద్ర పర్వతం నుంచి దూకి హనుమాన్ లంకలో సీతమ్మను చూశాడు .పెరిప్లస్ కాలానికి పాండ్య చేర చోళ రాజ్యాలలో చోళ రాజ్యం బహు సంపన్నమైనది కూడా .చేర మండలం నుంచే కోరమండలం పదం వచ్చింది సారసీనులు మాబార్ అన్నారు అదే మలబార్ అయింది .అంటే రేవు పట్టణం .
డమరిక మరియు ఉత్తరం నుండి ఓడలు వచ్చే ఈ దేశ మార్కెట్ పట్టణాలు ,హార్బర్లు వరుసగా కామర ,పొడుక ,సోపట్మా .’సంగారగా అనే చెక్క దుంగలు పేర్చి నిర్మించిన అతి పొడవైన పెద్ద ఓడలు ,కరిసే మరియు గంగానది వరకు ప్రయాణించే కోలండియాపెద్ద ఓడలు ఉంటాయి ,వరాలియాకు వెళ్ళాల్సిన సరుకును ఇక్కడే దింపుతారు .బెంగాల్ నుంచి ఇక్కడికి ఓడలు వచ్చేవి .రఘుమహారాజు అయోధ్యనుంచి బయల్దేరి తూర్పు ముఖంగా సముద్రందాకా వెళ్లి తమ స్వంత నౌకలబలం మీద నమ్మకం ఉన్న బెంగాలీలను జయించాడని కాళిదాసు రఘు వంశం లో రాశాడట ..పెరిప్లేస్ చెప్పిన కమరను ఇప్పుడు కరికాల్ అంటారు .సుపట్న అంటే మంచి పట్నం .ఇదే మద్రాస్ .కొల౦డియా ఓడలు మలబారులో తయారవుతాయి .ఈ తీరరేవుల్లో ఓడలు సరుకులతో నిండి అవి గాలికి రెక్కలు కట్టుకొన్నట్లు నీటిపై తేలుతూ వెడుతూ వస్తుంటే బహు అందంగా ఉంటాయి అని వర్ణించారు .
సోపట్మా దాటాక ప్రవాహం తూర్పుకు మళ్ళి ,పడమరగా వలేసి ముండు దీవి వస్తుంది .దీన్ని తాప్రబాన్ అనే వారు .సముద్ర దక్షిణభాగం క్రమగా పడమరకు మారి ఎదురుగా ఉండే అజానియా తీరం చేర్తుంది. ఇక్కడ ముత్యాలు రంగురాళ్ళు మస్లిన్ ఉత్పత్తి అవుతాయి .శ్రీలంకను మొదటవలస దేశంగా చేసుకొన్న విజయ్ అనేరాజు తానుకాలు పెట్టిన ప్రదేశానికి తాప్రబ అంటే తామ్రపర్ణి అని పేరు పెట్టాడు .అంటే రాగిలాగా ఎర్రగా ఉండేది. గంగానదిముఖద్వారం వద్ద ఉన్న ఓడరేవు తామ్రావిప్తి అశోకుని గిర్నార్ శాసనం లో పాళీ భాషలో టాంబ పన్ని అని ఉంది లంకకు వైదికనామం రావణ లంక .లంకలో ఆదిమకాలం లో మనుష్యులు లేరని అదృశ్య శక్తుల ,నాగుల అధీనంలో దేశం ఉండేదని అప్పుడే వివిధ దేశాలతో వ్యాపారాలు జరిగాయని ,అదృష్యశాక్తులు కనబడకుండా ఉండేవి వ్యాపారం అరిగినప్పుడు వస్తువుల ఖరీదును తెలిసేట్లు చేస్తూ ఉంటె వ్యాపారులు దానికి తగిన డబ్బు అక్కడ పెట్టి తీసుకు వెళ్ళేవారని చైనా యాత్రికుడు ఫాహియాన్ రాశాడు .మెక్సికో లో కూడా ఇలానేజరిగేది
ఈ తీరం చుట్టి చాలాదూరం వెడితే మసాలియా మైదానం వస్తుంది ఎక్కడ మస్లిన్ వస్త్రాలు భారీగా ఉత్పత్తి చేస్తారు .ఇక్కడినుంచి ఒక సముద్రపాయ దాటితే దోసరినిక్ ఉత్పత్తిగా చెప్పే ఏనుగుదంతాలు దొరికే దోసరెన్ వస్తుంది .ఇక్కడినుంచి ప్రవాహం ఉత్తరానికి సాగుతుంది ఇక్కడ అనేక ఆటవిక తెగలున్నాయి .బాగా అనాగరికులు .మగవాళ్ళ ముక్కు చదునుగా ఉంటుంది .బార్గిసి తెగ ప్రజల ముఖాలు గుర్రాన్ని పోలిన పొడవైన ముఖాలు కలిగి ఉంటారు .వీరు నరమాంస భక్షకులు .టోలమీచెప్పిన మైసోలియా అంటే కృష్ణా నది సంస్కృతంలో మౌసల మసాలియాగా మారింది. అదే మచిలీ పట్నం మసాలియా అనే బందరు లో నౌకలు లంగరుకు అనువైనది .ఇక్కడినుంచి పెగూ సయాం , ,అరకాన్ బెంగాల్ ,కొచ్చిన్ చైనా ,మక్కా మడగాస్కర్ ,సుమత్రా మనిలా దీవులకు రెగ్యులర్ గా ఓడలు సరుకులతో నడిచేవి అని టవర్నయిర్ రాశాడు .మసాలియాలో చేనేత వస్త్రాల ఉత్పత్తి ఎక్కువ అని పెరిప్లస్ లో ఉంది. కుంచెలతో రంగులు అద్దేవారని టవర్నియర్ రాశాడు .డోసరెన్ అంటే ఆధునిక ఒరిస్సా .ఇండియాకు పవిత్రభూమిగాచేప్పబడింది .డోసరిన్ అంటే మహానది .ఇది ఏనుగు దంతాలకు ప్రసిద్ధి .సిక్కిం మొరుంగ్ ప్రాంతంలోనిభోటో తెగను కిరాతకులు అంటారు .చాలాకాలంస్వంతరాజ్యం ఏలారు .భూటాన్ పేరుతొ భోటా ఉంది .బార్గిసి ని విష్ణుపురాణం లో కిరాతకులన్నారు యుద్ధ ప్రియులు .
ఇక్కడి కిరాతకుల పాలిబడ కుండా ముందుకు వెడితే ,సముద్రప్రవాహం తూర్పుకు మారి,కుడివైపుకు ప్రయాణిస్తే ఎడమవైపు గంగానదిదర్శనమిస్తుంది .దీని చివర క్రిసే భూమి దగ్గరలో తూర్పులో నైలునదిలాగా ప్రవహించే గంగానది ,దాని ఒడ్డున మార్కెట్ పట్టణం ఉంది. ఇక్కడి నుంచే జటామాంసి మల బాత్రుం ముత్యాలు ఎగుమతి అవుతాయి. బంగారు గనులు కూడా ఉన్నాయి .కల్టీస్ అనే బంగారునాణాలు చలామణిలో ఉంటాయి ఈ నదికి ఎదురుగా ఉన్నదీవిలో జనం ఉంటారు .సూర్యుడు ఉదయించే చివరి దీవి ఇదే .మలక్కా పీఠభూమినే కిసే అంటారు .
ఇది దాటి ఉత్తరంగా వెడితే దినే నగరం ఉంది ఇక్కడికి బాక్ట్రియానుంచి బైరై గాజా వరకు ప్రజలు కాలినడకన సిల్కుదారం సిల్కు బట్టలు మోసుకోస్తారు. అవి డమరిక కు ఎగుమతి అవుతాయి .చైనావ్యాపారం సింధునది ముఖద్వారం వరకే .చైనా యాత్రికుడు ఫాహియాన్ తామ్రలిప్తిలో రెండేళ్ళు గడిపి అక్కడినుంచి పెద్ద సబురు అంటే వ్యాపార ఓడ ఎక్కి నైరుతిదిశగా ప్రయాణించి సింహళం చేరాడు .
ప్రతి సంవత్సరం దిస్ భూభాగానికి దాని సరిహద్దులనుండిపొడవైన చదునైన ముఖాలున్న శాంతియుత జీవితం గడిపే పూర్తీ అనాగరక బిసటేప్రజలు వస్తారు .ఆకుపచ్చని ద్రాక్ష తీగ ఆకుల్లాంటి ఆకులు మడతబెట్టి న బుట్టల్ని మోస్తూ భార్యా పిల్లలతో వస్తారు ఆ ఆకుల్ని భూమిపై పరచి అక్కడే చాలాకాలం విందు వినోదాలతోగడిపి మళ్ళీ స్వంత ఊళ్లకు వెడతారు .వాళ్ళు వెళ్ళాక స్థాకులు ఆ చాపలను సేకరించుకొంటారు .వాళ్ళు నారతో అల్లిన జడ లనుండి ఆకులు ఏర్తారు దాన్ని పెట్రి అంటే పత్రీ అంటారు .ఆకుల్ని పొరలుగా పేర్చి బంతులుగా చుట్టి చాపల నారతో పిండుతారు .పెద్ద ఆకుల్తో చేసినవి మలబాత్రుం అంటారు .బిసటే ప్రజలు టిబెట్ బర్మా లకు చెందినవారు .ఆధునిక కుకి ,చిన్ నాగ్ తెగలకు అనుబంధ తెగలు .చెట్లు ,పాముల్ని పూజిస్తారు .
ఈ ప్రదేశందాటి అక్కడి అత్యధిక శీతల వాతావరణం లో శీతాకాల ఋతువులలో సముద్ర ప్రయాణం కుదరదు .దైవీ శక్తి ప్రభావం వల్లనే ముందుకు వెళ్ళగలరు .సిక్కిం దాటాక ప్రయాణం ప్రాణా౦తకమె .
కనుక మనం కూడా ముందుకు పోకుండా ఆ దైవీ శక్తులను నమ్మి’’ పీచే మూడ్’’ అవుదాం .నాతొ ఇంతదాకా ప్రయాణం చేసిన వారందరికీ ధన్యవాదాలు .
ఒరిజినల్ లోని పేరాలలో 66పేరాలను మాత్రమె సిలార్ గారు గ్రంధ విస్తరణ భయంతో అనువదించారు .ప్రతిపేరా అనువాదం తర్వాత వివరణలు ఇస్తూ ఆపెరాలోని మనుష్యుల ప్రదేశాల పేర్లు ఈ కాలం లో ఏయే పేర్లతో పిలుస్తున్నారో వస్తువుల పేర్లు ఎలామారాయోవాటికి ఎందుకు ఉపయోగిస్తారో ,సవివరంగా ఎనక్డోట్స్ తో సహా అందించారు .గోదారిలో రాదారి పడవలో పిల్లగాలులపై కమ్మ తెమ్మెరాలలో సాగే హాయైన ప్రయాణం లా సాగింది రచన .హాట్సాఫ్ టు జనాబ్ సిలార్ సార్ .వీరు ఇదివరకే తరతరాల బందరుచరిత్ర ,కృష్ణాజిల్లా చరిత్ర ,మచిలీ పట్నం సర్వస్వంది,విసీమ సర్వస్వం, కృష్ణా జిల్లా జమీందారులు గ్రంథాలు రాసి విఖ్యాతులైనవారు. ఆ అనుభవంతో దీన్ని సునాయాసంగా రాశారు .మనకెవ్వరికీ తెలీని ఒకటవ శతాబ్ది చరిత్ర ను అందించిన సిలార్ గారు మిక్కిలి అభినందనేయులు .మన సాహితీ బన్ధువులకుఏ విషయాలన్నీ తెలియజేయాలని ఇంత వివరంగా ఇంతటి సుదీర్ఘంగా రాశాను .మనసారా ‘’బందర్ వాస్కోడగామా’’ ,’’బందర్ చరిత్ర చతురానన’’ జనాబ్ మహమ్మద్ సిలార్ గారిని అభినందిస్తూ శుభాశీస్సుల౦దిస్తున్నాను
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -21-9-22-ఉయ్యూరు .

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ అడివి బాపిరాజు గారు10వాభగం ,21.9.22

బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ అడివి బాపిరాజు గారు10వాభగం ,21.9.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

బ్రహ్మ వైవర్త పురాణం.ప్రకృతి ఖండం.7వ భాగం.21.9.22

బ్రహ్మ వైవర్త పురాణం.ప్రకృతి ఖండం.7వ భాగం.21.9.22

Video link

Posted in రచనలు | Leave a comment

మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -8

మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -8

· 23-మార్కండేయ విజయ నాటకం ,స్వీయ చరిత్ర కర్త ,శ్రీశైల దేవాలయ పాలక వర్గ సభ్యుడు,కవి చకోర చంద్రోదయ కళాప్రపూర్ణ –శ్రీ పైడి లక్ష్మయ్య

· పైడి లక్ష్మయ్య (Paidi Lakshmayya) (1904 – 1987) ప్రజా సేవకులు, విద్యా సంపన్నులు, పరిపాలనా దక్షులు.

జీవిత విశేషాలు
లక్ష్మయ్య ఏప్రిల్ 26, 1904 తేదీన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో పేరూరి అచ్చంపల్లి గ్రామంలో ముసలప్ప, వెంకటమ్మ దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్య ముగించి అనంతపురంలోని దత్తమండల కళాశాలలో 1932లో తెలుగు ప్రధానాంశంగా బి.ఏ. డిగ్రీ పొందారు. మద్రాసులో న్యాయశాస్త్ర పట్టాను సంపాదించి 1937లో న్యాయవాదవృత్తిని స్వీకరించాడు.

వీరు స్థానిక పరిపాలనా రంగంలో ప్రజా ప్రతినిధిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.1942 నుండి 1947వరకు అనంతపురం జిల్లా బోర్డు అధ్యక్షులుగా వుండి జిల్లా అభివృద్ధికి కృషి చేశారు. 1952 సంవత్సరంలో అనంతపురం లోకసభ నియోజకవర్గం నుండి మొదటి లోక్‌సభకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు.[1] పార్లమెంటులో వివిధ విషయాలపై చర్చలలో పాల్గొని నిర్మాణాత్మకమైన సూచనలు చేసి ఉత్తమ రాజకీయవేత్తగా పేరుపొందారు.1956లో రష్యా దేశంలో పర్యటించి భారతదేశంలో వ్యవసాభివృద్ధికి కొన్ని సూచనలు ఇచ్చారు. వీరు ఆంధ్ర విశ్వవిద్యాలయం సెనేట్ సభ్యులుగా, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం సిండికేట్ సభ్యులుగా వుండి ఉన్నత విద్యావ్యాప్తికి తమవంతు కృషి చేశారు[2].

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 1957లో వీరిని హిందూ దేవాదాయ ధర్మాదాయ శాఖకు కమీషనరుగా నియమించారు. ఆ కాలంలో వివిధ దేవాలయాల పునరుద్ధరణకు కృషిచేశారు. ముఖ్యంగా శ్రీశైల క్షేత్రంలో ఆలయ, మండపాదుల పునర్నిర్మాణానికి ఎంతో కృషిచేశారు. శ్రీశైల దేవస్థాన పాలకమండలి అధ్యక్షులుగా కూడా కొంతకాలం పనిచేశారు. అనంతపురం జిల్లా రచయితల సంఘానికి అధ్యక్షులుగా పనిచేశారు.

రచనలు
నాటకాలు

  1. మార్కండేయ విజయం
  2. మహాత్మ కబీర్
  3. సంసార నౌక
  4. సాయి లీలలు
  5. హేమారెడ్డి మల్లమ్మ లేక శ్రీశైలమల్లికార్జున మహాత్మ్యము
  6. శ్రీశైలీయము
  7. శ్రీరామాశ్వమేధము
  8. లుబ్ధాగ్రేసర
  9. తారాశశాంక

శతకము

  1. సద్గురు శ్రీ సోమనాథ శతకము

స్వీయ చరిత్ర

  1. జ్ఞాపకాలు – వ్యాపకాలు

బిరుదములు
· ఆంధ్ర విశ్వకళా పరిషత్తు వీరికి కళా ప్రపూర్ణ గౌరవం ఇచ్చి సత్కరించింది.

· కవిచకోరచంద్రోదయ అనే బిరుదును శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి ప్రదానం చేశారు

· 24-వీరాంజనేయ విలాస ,మంత్రి త్రయ కర్త ,తాను రాసిన పుస్తకం పై తానె పరీక్ష రాసిన మరో పుట్టపర్తి ,ఆర్ష విద్యా విశారద –శ్రీ జోస్యం జనార్దన శాస్త్రి

· జోస్యం జనార్దనశాస్త్రి రాయలసీమకు చెందిన కవిపుంగవులలో ప్రముఖుడు.

జీవిత విశేషాలు
జోస్యం జనార్దనశాస్త్రి కర్నూలు జిల్లా, పాణ్యంలో 1911, అక్టోబరు 2వ తేదీకి సరియైన విరోధికృతు నామ సంవత్సర ఆశ్వయుజ శుద్ధ దశమి నాడు అన్నపూర్ణమ్మ, వేంకటరామయ్య దంపతులకు జన్మించాడు. ఇతడు ములకనాడు శాఖకు చెందిన బ్రాహ్మణకుటుంబంలో పుట్టాడు. కౌండిన్యస గోత్రజుడు. ఇతని తల్లిదండ్రులు ప్రాచీనార్షసాంప్రదాయానికి చెందిన సాత్వికులు. ఇతడు ప్రాథమిక విద్యను 12 సంత్సరములలో ముగించి మేనమామల వద్ద పూర్వపద్ధతులలో సంస్కృతాంధ్రములలో కావ్యనాటక అలంకారములను నేర్చుకున్నాడు. 1933లో ఇతడు మద్రాసు విశ్వవిద్యాలయం నుండి విద్వాన్ పరీక్ష ఉత్తీర్ణుడయ్యాడు. అప్పటి నుండి అనంతపురం జిల్లా, తాడిపత్రిలోని మునిసిపల్ హైస్కూలులో ప్రధాన ఆంధ్రోపాధ్యాయుడిగా అనేక సంవత్సరాలు పనిచేసి పదవీ విరమణ చేశాడు. తరువాత కూడా తాడిపత్రిలోనే స్థిరపడ్డాడు. ఇతడు ప్రైవేటుగా 1942లో ఎస్.ఎస్.ఎల్.సి పరీక్షలు వ్రాసినప్పుడు ఇతనికి ‘మంత్రి త్రయము’ అనే పాఠ్యగ్రంథం ఉపవాచకంగా ఉన్నది. విచిత్రం ఏమిటంటే ఈ మంత్రి త్రయం వ్రాసింది ఇతడే. మరో విశేషం ఏమిటంటే ఈ పరీక్షను ఇతనితోబాటు ఇతని కుమార్తె సుబ్బలక్ష్మమ్మకూడా అదే సంవత్సరం వ్రాసింది. ఇతడు 20కి పైగా రచనలు చేశాడు. నాలుగు అష్టావధానాలు కూడా చేసి పండితుల మెప్పు పొందాడు. ఇతడికి జ్యోతిషము, వైద్యములలో కూడా ప్రవేశం ఉంది. ఇతని కుమారుడు జోస్యం విద్యాసాగర్ కూడా రచయితగా పేరుగడించాడు. జోస్యం జనార్దనశాస్త్రి తన 87 యేట పింగళ నామ సంవత్సర మార్గశిర బహుళ ద్వాదశినాడు అనగా 1997, డిసెంబరు 25వ తేదీన తాడిపత్రిలో మరణించాడు.

సత్కారాలు
· త్యాగరాజకళాసమితి, హైదరాబాదు వారిచే 11-04-1983వ తేదీన ప్రముఖ కవి దాశరథి చేతుల మీదుగా కనకాభిషేకం.

· రచన సాహిత్యవేదిక, కడప వారిచే గడియారం వేంకటశేషశాస్త్రి స్మారక అవార్డుతో సత్కారం.

· 1993లో అనంతపురంలో కల్లూరు సుబ్బారావు అవార్డు.

· 1992లో తాడిపత్రి పురపాలక సంఘం వారిచే పౌరసన్మానం మొదలైనవి.

బిరుదులు
· అభినవ వేమన

· ఆర్షవిద్యా విశారద

రచనలు

  1. కన్నతల్లి
  2. ప్రకృతి కన్నతల్లి
  3. కన్నీటి చుక్కలు
  4. కృతిపతి
  5. ఉన్నమాటలు
  6. పసిడిపంట
  7. దుర్గా సప్తశతి (ఆంధ్రీకరణము)
  8. సీతమ్మ (ఖండకావ్యము)
  9. వీరాంజనేయ విలాసము
  10. రామలింగ సుప్రభాతము
  11. విజయజ్యోతి
  12. వీరశ్రీ
  13. రామలింగ సుప్రభాతము
  14. కథామంజరి
  15. చంపకాలు నూటపదార్లు
  16. శాంతలహరి
  17. భావసపర్య
  18. ఆనందలహరి
  19. పురుషోత్తమ శతకము (అనువాదము)
  20. శృంగారలహరి
  21. కైంకర్యం
  22. శ్రీ మల్లేశా (శతకము)
  23. మంత్రిత్రయము (చాణక్యుడు, యుగంధరుడు, తిమ్మరుసు)
  24. భాషాముకురము
  25. విద్యార్థి కల్పతరువు మొదలైనవి

రచనల నుండి ఉదాహరణలు
ఇతడి కృతిపతి కావ్యంలో గువ్వల చెన్నుడికి, అతడి భార్యకు మధ్య జరిగిన సంభాషణను పాత్రోచితంగా గ్రామ్యభాషలో ఈ విధంగా వ్రాశాడు.

భార్య:- మామా! యేంతిక్కోనివి?
ఆ మారాజే అడక్క ఆకడె మిస్తే
నీ మన్సెంబడి తుంటా
నే మోజుగ అడుగు తుంటె యీరా దేమే?

చెన్నుడు:- పిల్లా! దాని గ్గాదే
యిల్లాలికి సొమ్ములేంటికే! యెరి మొగమా!
యిల్లూ, వాకిలి, మొగుడూ,
సల్లగ తిననీకి వుంటే సాల్లేదేమే?

నాపాలి పున్నె మాయని,
ఆ పెద్దయ్యకు దయొచ్చి ఆయన కాయ్నే
ఆ పద్యాల్మూలాన్నే
నా పేర్నిలబెట్టు సంతు నాక్కలిగించెన్

పోయే! అయియేకము దా
నా! యేపాటి సుగాలుగాని యేం సాస్వత మౌ
తాయా? యివన్ని యెంటొ
స్తాయా

…

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ అడివి బాపిరాజు గారు.9వభాగం.20.9.22

బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ అడివి బాపిరాజు గారు.9వభాగం.20.9.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

హిందూ మహాసముద్ర౦ లోఒకటవ  శతాబ్దం లో ఒంటరిగా పడవ పై ప్రయాణించిన అజ్ఞాత నావికుని చరిత్ర పెరిప్లేస్ ను తెలుగులో అవిష్కరించిన- బందరు వాస్కోడిగామా శ్రీ సిలార్ -3

హిందూ మహాసముద్ర౦ లోఒకటవ  శతాబ్దం లో ఒంటరిగా పడవ పై ప్రయాణించిన అజ్ఞాత నావికుని చరిత్ర పెరిప్లేస్ ను తెలుగులో అవిష్కరించిన- బందరు వాస్కోడిగామా శ్రీ సిలార్ -3

డయాస్ కోరిడా దీవి సాంబ్రాణి దేశపు రాజు ‘’చరిబయాల్ ‘’ఏలుబడిలో ఉంది .బియ్యం గోధుమలు ఇండియా వస్త్రాలు ,మహిళా బానిసలను తెచ్చి తాబేలు పై చిప్పలతో వస్తుమారకం బార్టర్ సిస్టం  లో వ్యాపారం చేస్తారు .స్యాగారాస్ భూభాగం దాటాక ఒమన అనే సముద్ర పాయ,,ప్రక్కన విలువైన రాతి పర్వతాలు దాటి సచాలిటిక్ సాంబ్రాణి కొనటానికి ఒక నౌకాశ్రయం మొచ్చాచేరతారు .ఇక్కడ కూడా వస్తు మారక వ్యాపారమే . సాంబ్రాణి  గుట్టలు గుట్టలుగా చూసి ఆశ్చర్యపోతాం .ఎలాంటి సైనిక రక్షణా ఉండదు.దేవుడే కాపాడుతున్నట్లు ఉంటుంది .ఇక్కడినుంచి చాలాదూరం వెడితే 7దీవులు వరుసగా కనిపిస్తాయి .ఇందులో మగదీవులు ఆడ దీవులు అని ఉన్నాయి మగ దీవుల్లో మగవారుమాత్రమే ,ఉంటారు  ప్రతి మార్చి నెలలో  వీళ్ళు అడ దీవికి వెళ్లి అక్కడ భార్యాపిల్లలతో మూడు నెలలు గడిపిమళ్ళీ వెళ్ళిపోతారు .ఆడపిల్లలు తల్లులవద్దె పెరుగుతారు మగపిల్లలు 14వ ఏడు దాకా తల్లుల వద్ద పెరిగి ,తండ్రులను చేరతారు .భార్యలు కనటం పెంచటం తప్ప ఇంక ఏనీ చేయరు .వాళ్లకు కావాల్సినవన్నీ మగాళ్ళే అందజేస్తారు .పళ్ళు మాత్రం ఏరుతారు . చాలాదూరం వెడితే సరపిస్ దీవి వస్తుంది .ఇక్కడ అరబ్బీ మాట్లాడే దుర్మార్గ ప్రజలుంటారు. నడుముకు తాటి ఆకులు కట్టుకొంటారు .తాబేటి చిప్పలు విరివిగా లభిస్తాయి .

  పర్షియాసముద్ర తీరం ఉత్తర దిశగా ప్రయాణిస్తే కళాయి దీవుల సముదాయం వస్తుంది .ఇక్కడి వారు అనాగరికులైన దుష్టులు .అబ్దుల్ రజాక్ రాసినదాన్ని బట్టి ఇక్కడ ఎండమహాతీవ్రం .ఎముకల్లోని మూలుగ మాడి,మైనంలా కరిగిపోతుంది బాకుకు బిగించిన రత్నాలు మాడి బొగ్గు అవుతాయి .అధిక  వేడిలన పుట్టిన పిల్లలు గుడ్డివారుగా పుడతారు .పర్షియన్ గల్ఫ్ ముఖద్వారం లో ముత్యాల శోధన జరుగుతుంది .ఇక్కడినుంచి పర్వతాలమధ్యనుంచి ప్రయాణం చేసి పర్షియన్ గల్ఫ్ చేరతారు .ఇక్కడ అపోలోగాస్ అనే మార్కెట్ చారక్స్ స్సాసిని ,యూఫ్రేటిస్ నదుల మధ్య  ఉంది .

 ఒమ్మన మార్కేట్ పట్టణం .రాజకీయంగా భౌగోళికంగా పర్షియాలో ఉంది .ఇండియానుంచి రాగి ఇక్కడికి ఎగుమతి అవుతుంది .టేకు ,,బ్లాక్ వుడ్,రెడ్ వుడ్ వంటి నాణ్యమైన కలప దొరుకుతుంది .వైన్ ఖర్జూరం బానిసలు బంగారం ఇక్కడ ముఖ్యవ్యాపారం .ఇక్కడి నుంచి 7రోజులు ప్రయాణిస్తే ,ఒరారియా మార్కెట్ టౌన్ వస్తుంది .మైదాన ప్రాంతం లో రాయల్ పాలస్ ఉంటుంది .పేరు రహం బాసియా .గోధుమలు బియ్యం సారాయి ఉత్పత్తి ఎక్కువ .ఇదిదాటితే భూమి తూర్పువైపుకు వంపుతిరిగి స్కైటికా జిల్లా తీర భూమి వస్తుంది .ఇది చిత్తడి నేల. ఇక్కడేనదులలో పెద్దదైన  సింధు నది అపరిమిత జలరాశితో ఇండియన్ సముద్రం అనే ఎరిత్రేనియన్ సి లోకి ప్రవహిస్తుంది .ఈ నదీ జలాలవలన సముద్రం నీరు స్వచ్చంగా ఉంటుంది .పాములు ఎక్కువ ..ఈ నది ఏడు ముఖ ద్వారాలతో సప్త సింధు గా పిలువబడుతుంది .మధ్యపాయ ఒక్కటే నౌకాయానానికి అనువైనది .తీర౦లో బార్బారికం సంతపట్టణం ఉంది .సింధు ను గ్రీకులు ఇండస్ అంటారు సింధూ లేక మస్లిన్ పూర్వం ఇండియా –యూఫ్రటిస్ ల మధ్య జరిగిన వస్త్ర వ్యాపారానికి గుర్తు అని సియూ అనే చారిత్రకుడు చెప్పాడు .బార్బరికం రేవులో ఓడల్ని లంగరు వేసి సరుకును యేటిపాయద్వారానగరం రాజుకు  చేర్చుతారు .బొమ్మలు అద్దిన నారబట్టలు పగడాలు,పుష్యరాగం  శిలారసం ,గాజుపాత్రలు ,వెండి ,బంగారు పల్లాలు ద్రాక్ష సారాయి దిగుమతి అవుతాయి .సింధు నదికి అవతల ఉత్తరాన భూఖ౦డం లోకి ప్రవహిస్తూ నౌకాయానానికి పనికి రాని ఒక సముద్ర పాయ ఇరినాన్ వస్తుంది.తీరంలో ఇసుకతిన్నేలు టాయి .తీరం చేరకముందే నౌకలు ఇసుకమేటలకు తగిలి బద్దలౌతాయి .సముద్రం అడుగున రాతి బండలు ప్రమాదకారులు .లంగరుకు వీలు ఉండదు .ఆకుపచ్చ సముద్ర పాములు ఇక్కడి ప్రత్యేకత .

 ఇక్కడ మరో మజిలీ చేద్దాం

 సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -20-9-22-ఉయ్యూరు   —

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఎప్పటి రమేష్ చంద్ర ?ఏమా వినయం ?

ఎప్పటి రమేష్ చంద్ర ?ఏమా వినయం ?

ఇవాళ ఉదయం లైవ్ పూర్తి అయి పేపర్ చదువుతుంటే ఒకతను ఫోన్ చేసి దుర్గా ప్రసాద్ మాస్టారేనా అని అడిగితె అవును అంటే ,నేను మీదగ్గర ఉయ్యూరు హై స్కూల్ లో  చదివాను సార్  అని తనపేరు రమేష్ చంద్ర బాబు అనగా నాకు ఇంకా బల్బ్ వెలగలేదు .అప్పుడు అతడే మీ ఆంజనేయ స్వామి దేవాలయానికి మా నాన్న గారు 10 వేల రూపాయలు విరాళం ఇచ్చారు అన్నా, కొద్దిగా డిం గానే వెలిగితే ,ఉయ్యూరులో ఎక్కడ ఉండేవారు అని అడిగితె తాండవ లక్ష్మి  ధియేటర్ దగ్గర అన్నా ,ఇంకా కరెక్ట్ గా కనెక్ట్ కాకపొతే అతడే మాకు అక్కడ మెకానికల్ వర్క్ షాప్ ఉండేది మా నాన్న గారు పిచ్చేశ్వర రావు అంటే ఒక్కసారిగా బల్బ్ థౌజండ్ కాండిల్ పవర్ తో వెలిగి, ఒక్క సారి 35ఏళ్ళు వెనక్కి మెమరీని తిప్పాను .  

 అవి మేము 1987లో శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయ నిర్మాణం పూర్తీ చేసి ,స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించి ,పై మెరుగులు దిద్దుతున్న సమయం .కాంపౌండ్ వాల్ లోపల ప్రదక్షిణానికి  నాపరాళ్ళు పరవాలనిచూస్తున్నాం .చేతిలో తడి అప్పటికే అయి పోయింది .నాకు అప్పుడు సహాయకులు స్వర్గీయ మండాశ్రీ  వీరభద్ర రావు ,శ్రీ లంకా సంజీవ రావు గార్లు .అందులో సంజీవరావు గారు ‘’సార్.తాండవ లక్ష్మి ఏసీ ధియేటర్ నిర్మాణం పూర్తయి మిగిలిన నాపరాళ్ళు అన్నీ ప్రక్కన పెట్టారు .అడిగితె ఇస్తారేమో అన్నారు .నాకు పరిచయం లేదు. సరే అని ముగ్గురం వెళ్లాం. పిచ్చేశ్వరరావు గారు మర్యాదగా ఆహ్వానిచంచి ఇంట్లోంచి కాఫీ తెప్పించి ఇప్పించారు .వచ్చిన విషయం చెప్పగానే సందేహించకుండా మీకు ఎంతకావాలంటే అంత రాయి తీసుకు వెళ్ళండి అభ్య౦తరం లేదన్నారు .వెంటనే కావాల్సిన రాయి తెప్పించి పరిపించేశాం .ఆయన్ను ఆలయం చూడటానికి రమ్మని కోరాం.ఒక హనుమజ్జయంతికి కుటుంబం తో సహా వచ్చిన జ్ఞాపకం .అప్పుడు రమేష్ కూడా వచ్చి పరిచయం చేసుకున్నాడు .అతనును బాగా బ్రైట్ విద్యార్ధిగా గుర్తు .

  తర్వాత ఒకసారి పిచ్చారావు గారు ఫోన్ చేసి మమ్మల్ని రమ్మంటే మా త్రయం వెళ్లాం .మీ గుడి బాగా ఉంది .స్వామి సేవకు 10వేల రూపాయలు అందజేస్తాను .మీ ఇష్టం ఎలా ఉంటె అలా ఖర్చు చేయండి .అని ఇచ్చేశారు .ఆ డబ్బుతో ఆలయం వెనక భాగాలన పిల్లర్లతో స్లాబ్ వేసి ఆయనను ఆహ్వానించగా చాలా సంతోష పడ్డారు ఆడబ్బు సార్ధకం చేసినందుకు .ఆతర్వాత ప్రతి మంగళవారం సంజీవరావు గారు అప్పాలు ప్రసాదం తీసుకొని వెళ్లి ఇచ్చేవారు .తర్వాత వంగవీటి రాధ హత్య .అప్పుడు వారి  ధియేటర్ ను విధ్వంసం చేశారు దుండగులు . ఆతర్వాత దాన్ని బాగు చేయించారు .ఉయ్యూరులో మొదటి ఏసీ దియేటర్ అది .కొంతకాలం ఇక్కడే ఉండి తర్వాత ఆయన వ్యాపార వాణిజ్యాలు చేస్తున్న విశాఖకు వెళ్ళిపోయారు ధియేయేటర్ లీజుకు ఇచ్చి .

 రమేష్ తల్లిగారు మేముఎప్పుడు  పిచ్చారావు గార్ని కలవటానికి వెళ్ళినా మమ్మల్ని గౌరవంగా చూసి కాఫీ ఇచ్చేవారు .ఆమె పసుపుకొమ్ముల నోము నోచుకొన్నట్లు ,తానూ వెళ్లి వాయనం తీసుకున్నట్లు మా శ్రీమతి గుర్తు చేసింది .ఉయ్యూరునుంచి వెళ్ళాక వాళ్ళు ఎవరూ మళ్ళీ ఉయ్యూరు వచ్చినట్లు లేదు పిల్లలు వచ్చి వెళ్లేవారేమో తెలీదు .

 ఇవాళ రమేష్ చంద్ర మాటలలో  ఆనాటి వినయం గౌరవం స్పష్టంగా కనిపించాయి .ఎదిగినకొద్దీ ఒదిగి ఉండటం అనే గొప్ప లక్షణానికి ఉదాహరణ అని పించాడు .ఉయ్యూరు హైస్కూల్ లో తను ఆరాధించే ముగ్గురు మేస్టార్లలో నేనూ ,లెక్కల మేష్టారు ఆంజనేయ శాస్త్రిగారు  , సోషల్ టీచర్ శ్రీ మతి నాగమల్లికాంబ గార్లు అని మహదానందంగా చెప్పాడు .వాళ్ళిద్దరి ఫోన్ నంబర్లు అడిగితె  మల్లికామ్బగారు శ్రీమతి కస్తూరి గారి స్నేహితురాలని తెలిసి ఆమెకు ఫోన్ చేసి నంబర్ తీసుకొని శాస్త్రీ గారి నంబర్ తో కలిపి  అతనికి పంపాను .త్వరలో ఉయ్యూరు వచ్చి మిమ్మల్ని కలిసి మీ ఆశీర్వాదం తీసుకొంటాను .మీ లాంటి గురువులవలననే మేము ఇంతటి స్థితికి వచ్చాము ,గురువులను మరవలేదు అన్నాడు .తప్పక రమ్మన్నాను. సరస భారతి సంగతి చెప్పి అతనికి పుస్తకాలు పంపిస్తాను అ అడ్రస్ మెసేజ్ చేయమంటే ,తాను  డబ్బు పంపిస్తాను అంటే వద్దు అని చెప్పి అతని విశాఖ అడ్రస్ కు రెండు రిజిస్టర్డ్ పార్సిల్స్ లో పుస్తకాలు పంపి ,పంపానని  వాట్సాప్ మెసేజ్ రాస్తూ పుస్తకాలకు డబ్బు పంపవద్దని మళ్ళీ చెప్పి ,ఆంజనేయస్వామి ప్రసాదంగా తీసుకోమని అందగానే తెలియజేయమని చెప్పాను. అతడు ఆన్జనేయస్స్వామి బొమ్మ పెట్టి శుభం అన్నాడు .ఇలాంటి వినయం వివేకం ఉన్న వారు తప్పక అభి వృద్ధి చెందుతారని మనకు అనుభవమైన విషయమే . అతనికి అతని కుటుంబానికి శ్రీ సువర్చలాంజనేయస్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ అలభించాలని కోర్తున్నాను .

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -20-9-22-ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Leave a comment

బ్రహ్మ వైవర్త పురాణం. ప్రకృతి ఖండం.6వ భాగం. 20.9.22

బ్రహ్మ వైవర్త పురాణం. ప్రకృతి ఖండం.6వ భాగం. 20.9.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -7

మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -7

· 19-తెలుగుకన్నడ కవి,మయూరధ్వజ నాటక కర్త కవిరాజు ,కవి సవ్యసాచి –శ్రీ కలుగోడు అశ్వత్ధ రావు

· బడగనాడు శాఖకు చెందిన మధ్వ బ్రాహ్మణ కుటుంబంలో వెంకోబరావు, లక్ష్మమ్మ దంపతులకు కలుగోడు అశ్వత్థరావు (జూలై 25, 1901 – జూలై 19, 1972) [1] 1901 వ సంవత్సరం జూలై 25 వ తేదీన జన్మించాడు. కేవలం నాలుగవ తరగతి వరకే చదివిన ఇతడు సహజంగా అబ్బిన విద్యతోపాటు స్వయంకృషితో తెలుగు కన్నడ భాషలలో ప్రావీణ్యం సంపాదించాడు.అనంతపురం జిల్లా, గుమ్మఘట్ట మండలం లోని కలుగోడు లోను, కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లా తళుకు గ్రామంలోను కరణముగా పనిచేశాడు. ఈ రెండు గ్రామాలలోను ఇతనికి చాలినన్ని భూములున్నాయి. ఇతని జీవితం హాయిగా గడచింది.ఇంటికి వచ్చిన అతిథులను గొప్పగా సత్కరించేవాడు.తన గ్రంథాలను ప్రచురించుకోవటానికి స్వంతంగా రాయదుర్గంలో కవిరాజ ముద్రాక్షరశాలను నెలకొల్పాడు. తన చివరి దశలో దీనిని రాయల పరిషత్తుకు ఉచితంగా ఇచ్చివేశాడు.

రచనలు

  1. సర్వజ్ఞునివచనములు – కన్నడభాష నుండి తెలుగులోనికి అనువాదం
  2. ವೇಮನ ರತ್ನಗಳು – వేమన పద్యాలను కన్నడ భాషలోనికి అనువాదం
  3. అనుభవామృత సారము – మహాలింగ రంగ కన్నడలో వ్రాసిన అనుభవామృత అనే అద్వైత వేదాంత గ్రంథానికి తెలుగు అనువాదం
  4. సోమేశ్వర శతకము – పాల్కురికి సోమనాథుని కన్నడ శతకానికి తెలుగు అనువాదం
  5. హరిభక్తసారము – కనకదాసు కన్నడరచనకు తెలుగు సేత
  6. ಭಾಗವತ ಗೀತಿಗಳು – పోతనభారతంలోని గజేంద్రమోక్షము, రుక్మిణీకళ్యాణము, ప్రహ్లాదచరిత్ర, వామనచరిత్ర ఘట్టాల కన్నడానువాదము
  7. ಶೃಂಗಾರ ವರೂಧಿನಿ – మనుచరిత్ర కన్నడానువాదము
  8. ಕಂದಪದ್ಯ ರಾಮಾಯಣ – స్వతంత్ర కన్నడ రచన
  9. ಶ್ರೀಕೃಷ್ಣಲೀಲೆ (ಬೈಲು ನಾಟಕ) – స్వతంత్ర కన్నడ వీధి నాటకము
  10. ಸುಭದ್ರಾಪರಿಣಯ ನಾಟಕ – స్వతంత్ర కన్నడ రచన
  11. గధాయుద్ధము – రన్న కవిచే రచింపబడిన ಸಾಹಸ ಭೀಮ ವಿಜಯ అనే కన్నడ కావ్యానువాదము
  12. దండకరామాయణము
  13. అశ్వత్థ భారతము (ఆది చతుష్కము మాత్రము)
  14. అశ్వత్థేశ త్రిశతి (కందములు)
  15. మూడు శతకములు
  16. మయూరధ్వజము (నాటకము)
  17. యువతీ వివాహభాగ్యోదయము (నాటకము)
  18. అక్కమహాదేవి వచనములు
  19. బ్రాహ్మణుడు
  20. గురుదక్షిణ

రచనల నుండి ఉదాహరణలు
· దండకరామాయణం నుండి మచ్చుకు కొంతభాగము:- కైకేయి: “హా నాథా! మత్ప్రేమనాథా! ధరానేత్రునేతా!ప్రతాపాధినాథున్ నిన్ను భర్తగా బొందియున్ నే నథా కృతిన్ గుందెదన్ మోహనాంగా! మదీ యేప్సితార్థంబు దీర్పంగ నేనుంటినం చంటివే? అంత భాగ్యంబు నాకున్నదే? సత్యమున్ బల్కుదే? బాళి నీ వంతగా నాయెడన్ జుల్కుదే? పల్కవే!” యన్న భూనాథు “డో మానిని! నా యెడన్ నీకు సందేహ మిట్లుండ నే హేతువో? నాతిరో! మున్ను కన్నావటే నా యుదాసీన భావంబు నీపట్ల?నీకై చితిన్ దూకగా వచ్చినన్ దూకెదన్ గోర్కె నేదీర్తు, నీడేర్తు నో కామినీ! కోరుమం”చన్న, నా జాణ వేలేచి, ముద్దారగా గౌగిటన్ గ్రుచ్చి, యా వృధ్దు మాయా విమోహంబులన్ గుప్పి, తీపౌ చమత్కారపున్ భాషణల్ సెప్పి, యిట్లాడు…..

బిరుదములు,పురస్కారములు
· కవిరాజ

· 1967 మే 6వ తేదీ హిందూపురంలో రాయలకళాపరిషత్ సత్కరించి కవిసవ్యసాచి బిరుదును ప్రదానం చేసింది.[2]

· ఉభయభాషాభాస్కర

· 20-దైవోపాసన తో ప్రజలైక్కట్లు తీర్చి శ్రీరామ స్తవ క్షేత్రమాల ,విచార దర్పణ కర్త –శ్రీ మేడవరము సుబ్రహ్మణ్య శాస్త్రి

మేడవరము సుబ్రహ్మణ్యశాస్త్రి సంస్కృతాంధ్రాలలో గొప్ప పండితుడిగా పేరుగాంచిన వ్యక్తి.[1][2]

జీవితసంగ్రహం
శాస్త్రిగారు 1885లో నెల్లూరుజిల్లా దర్శితాలూకా (ప్రస్తుతం ప్రకాశంజిల్లా దొనకొండమండలంలో ఉన్న) పోలేపల్లి గ్రామంలో అన్నపూర్ణమ్మ,కోటయ్య దంపతులకు జన్మించాడు. ఋగ్వేది. ఆశ్వలాయన సూత్రము, కామకాయన విశ్వామిత్రస గోత్రజుడు. వైదిక బ్రాహ్మణ శాఖకు చెందినవాడు. ఇతడు మొదట తిరుపతి, గుంటూరు జిల్లా కొల్లూరు మొదలైన చోట్ల కావ్యాలు నేర్చుకుని, ఆ తరువాత గోదావరి జిల్లా కాకరపఱ్ఱు గ్రామంలో ఉన్న వేదుల సత్యనారాయణశాస్త్రి వద్ద కావ్య, నాటక, అలంకార, సాహిత్య గ్రంథాలు చదువుకున్నాడు. మంత్రశాస్త్రము, జ్యోతిష్యశాస్త్రాలలో పాండిత్యం సంపాదించాడు. తన జీవితకాలంలో ఎక్కువభాగము కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోను, అనంతపురం, కడప జిల్లాలలోనూ నివసించినందువల్ల ఇతడిని రాయలసీమవాసిగా గుర్తిస్తున్నారు. ఇతడు మూడువందలకు పైగా శిష్యులకు ఆధ్యాత్మిక విద్యను నేర్పాడు. నిరతాన్నదానము చేసేవాడు. ఇతడు గద్యాలకు వెళ్లి అక్కడి మహారాజాతో చండీయాగము చేయించాడు. దైవోపాసనతో సంతానము లేనివారికి సంతానము కలిగేటట్లు చేశాడు. తన మంత్ర శక్తులతో గ్రామాలలో మశూచి మొదలైన బాధలనుండి విముక్తి గావించాడు. శీతలాయంత్ర ప్రతిష్ఠాపన, అష్టదిగ్బంధనాలు చేసి గ్రామాలను కాపాడుతూ, అకాల మరణాలు సంభవించకుండా, శిశువృద్ధి కలిగేటట్లు, పాడిపంటలతో తులతూగేట్లు చేశాడు.

ఇతడి శిష్యులలో గాడేపల్లి వీరరాఘవశాస్త్రి, మద్దులపల్లి వేంకట సుబ్రహ్మణ్యశర్మ ప్రముఖులు. జీవితకాలమంతా సాహిత్యసేవలో గడిపిన ఇతడు 1960, మే 22న మరణించాడు.

రచనలు

  1. యథార్థ విచారము
  2. విచారదర్పణము
  3. అద్వైతాధ్యాత్మిక తత్త్వము
  4. శ్రీరామస్తవన క్షేత్రమాల
  5. సీతాస్తోత్రము
  6. విభీషణ శరణాగరి
  7. విశ్వామిత్రచరిత్ర
  8. జీవితచరిత్ర (అసంపూర్ణము. 1947 వరకు మాత్రమే వ్రాశాడు. దీనిని అతని శిష్యుడు మద్దులపల్లి వేంకట సుబ్రహ్మణ్యశర్మ పూర్తి చేశాడు

· 21-కృతికర్త కృతిభర్త ,సంఘ సంస్కర్త ,సర్వోదయనాయకుడు ,ప్రకృతిమాత సంపాదకుడు నాటక డిటెక్టివ్ నవలా రచయిత ,సాహిత్య సరస్వతి –శ్రీ శీరిపి ఆంజనేయులు

· శీరిపి ఆంజనేయులు (జూన్ 1, 1890 – నవంబర్ 27, 1974) [1][2] కృతికర్తగా, కృతిభర్తగా, పత్రికా సంపాదకుడిగా, ఉత్తమ ఉపాధ్యాయుడిగా, సంఘసంస్కర్తగా, పరిశోధకుడిగా అనంతపురం జిల్లాకు ఎంతో పేరుప్రఖ్యాతులు ఆర్జించిపెట్టాడు.

జీవిత విశేషాలు
ధర్మవరం వీధిబడులలోను, మిషన్ స్కూలులోను ఇతని ప్రాథమిక విద్య సాగింది. కలకత్తాలోని అఖిల భారత విద్యాపీఠం నుండి ఉత్తమశ్రేణిలో పట్టపరీక్ష ఉత్తీర్ణుడయ్యాడు. తాను చదివిన మిషన్ స్కూలులోనే ఉపాధ్యాయుడిగా పదేండ్లు పనిచేశాడు. జిల్లాపరిషత్ హైస్కూలులో ఐదేళ్లు, అనంతపురం లోని గర్ల్స్ ట్రైనింగ్ స్కూలులో 22 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ధర్మవరంలో విజ్ఞానవల్లికా గ్రంథమాలను స్థాపించి తన రచనలనే కాకుండా నారు నాగ నార్య,

…

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ అడివి బాపిరాజు గారు.8వ భాగం.19.9.22

బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ అడివి బాపిరాజు గారు.8వ భాగం.19.9.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

హిందూ మహాసముద్ర౦ లోఒకటవ శతాబ్దం లో ఒంటరిగా పడవ పై ప్రయాణించిన అజ్ఞాత నావికుని చరిత్ర పెరిప్లేస్ ను తెలుగులో అవిష్కరించిన- బందరు వాస్కోడిగామా శ్రీ సిలార్ -2

హిందూ మహాసముద్ర౦ లోఒకటవ శతాబ్దం లో ఒంటరిగా పడవ పై ప్రయాణించిన అజ్ఞాత నావికుని చరిత్ర పెరిప్లేస్ ను తెలుగులో అవిష్కరించిన- బందరు వాస్కోడిగామా శ్రీ సిలార్ -2
అడులిన్ వద్ద ఈ దేశాలకు ఈజిప్ట్ నుంచి బేర్ బేర్ ప్రజలకోసం కుట్టని బట్టలు ఆర్సినోయ్ నుంచి ధనికులకు విలువైన బట్టలు తక్కువ ఖరీదు గడియారాలు రెండు అంచులకు జాలర్ కుట్టిన నారబట్టఉత్తరీయాలు ,మంచి అద్దాలు ముక్కలుగా కత్తిరించిన ఇత్తడి ,రాగిషీట్లు ,ముంజేతి కంకణాలు కాళ్ళ అందెలు యుద్ధ పరికరాలు వేట బల్లాలు కోసం ఇనుము దిగుమతి అవుతాయి .రాగిపాత్రలు ,నాణాలు ఇటలీ నుంచి ద్రాక్ష సారాయి బంగారు వెండి పళ్ళాలు,సైనికుల పై వస్త్రాలు ,పల్చని చర్మ కోట్లు కూడా ఈ రేవులో దిగుమతి అవుతాయి .ఇండియా ఇనుము ,ఉక్కు ,నూలు బట్టలు పెద్ద పన్నా సగమ టోగాన్ వస్త్రాలు ,చర్మ కోట్లు ,లక్క దిగుమతి అవుతాయి .డయోస్పోలిస్ అంటే ఈజిప్ట్ రాజధాని దేవుని నగరంగా పిలువబడుతుంది .మొనాఖి అంటే మల్లు బట్టలు .
అరేబియా గల్ఫ్ ఇక్కడ తూర్పుకు తిరిగి ,అవాలిటేస్ దగ్గర సన్నగా మారుతుంది .ఇలా పోతుంటే బేర్ బేర్ దేశ సంత పట్టణాలు ఒకదాని తర్వాత ఒకటి తగుల్తాయి .ఈప్రజలకోసం రెడీమేడ్ డ్రెస్సులు గోదుమలు,ద్రాక్షసారాయి దిగుమతి అవుతాయి .ఈ ప్రజలు తాము కట్టుకొనే చెక్క తెప్పలమీద ఆవలి తీరం లోని ,ఒకేలిస్ ,ముజ పట్టణాలకు స్పైసేస్ ,దంతాలు తాబేటి చిప్పలు సువాసనకల బంక ఎగుమతి చేస్తారు .అవాలిటేస్ దాటితే మలావ్ అనే మరో మార్కెట్ పట్టణం వస్తుంది .ఇక్కడ సముద్రం లో ఓడలు లంగరు వేసే రోడ్ స్టేడ్ ఉంది .బంగారం వెండి ఇక్కడికి దిగుమతి అవుతాయి. సువాసన బంక మైరా సాంబ్రాణి ,జాజి జాపత్రి అరేబియాకు ఎగుమతి అవుతాయి .మాలో దాటితే మరో సంతపట్టణం ముండుస్ వస్తుంది .లంగరు వేసే వీలు ఎక్కువ .పైన చెప్పిన సరుకులన్నీ ఇక్కడ దిగుమతి అవుతాయి .ఇక్కడి వ్యాపారస్తులు తగాదా కోర్లు.మనం వ్యాపారం చేయం కనుక మనకు ఫికర్ నై భాయీ ఔర్ బెహనోం .
దీనినుంచి తూర్పుగా వెడితే మూడు రోజులతర్వాత మోసైల్లుం చేరతారు .ఇక్కడా పై సరుకులతోపాటు వెండి పళ్ళాలు కొద్దిగా ఇనుము గాజు దిగుమతి అవుతాయి .ఇక్కడి నుంచి దాల్చిన చెక్క అంటే లవంగపు పట్ట భారీగా ఎగుమతి అవుతుంది .ఇక్కడినుంచి రెండు రోజులు ప్రయాణం చేస్తే చిన్న నైలు నది అనే యేరు ,నీటి ఊటలు పొన్న చెట్లు మీదుగా కేఫ్ ఎలిఫెంట్ చేర్తారు .తీరం ఇక్కడ ఒక శాఖగా చీలి ఎలిఫెంటా నది అకాన్నే అనే పొన్న చెట్ల తోపు వస్తాయి .సాంబ్రాణి, దంతం మైరా ఎగుమతి అవుతాయి .ఇక్కడినుంచి సముద్రం దక్షిణంగా మలుపు తిరిగిన చోట బేర్ బేర్ తీరం చివరహైలాండ్ వస్తుంది .ఇక్కడ అరుదుగా తుఫాన్లు వస్తాయి .అందుకే స్థానికులు టబెయి అనే సముద్రం లో మెరక ప్రాంతానికి రక్షణ కోసం వెడతారు .టబేయి దాటాక పానోగ్రామం ,అక్కడి నుంచి సముద్ర యానం చేస్తే ఒపోన్ అనే మార్కెట్ సంత పట్టణం వస్తుంది .ఇక్కడ దాల్చిన చెక్క భారీగా ఉత్పత్తి అవుతుంది .ఈజిప్ట్ బానిసలతో పాటు నాణ్యమైన తాబేటి చిప్పలు లభిస్తాయి .
ఈజిప్ట్ నుంచి దూరం లో ఉన్న ఈజిప్ట్ లో ఎపిఫీ గా పిలువబడే జులై లో సముద్ర ప్రయాణం చేస్తారు .సాంప్రదాయ బద్ధంగా నిర్మించిన ఓడలు సముద్రం మీద అడ్డం గా అరికా ,బారే గాజా లనుండి అక్కడ ఉత్పత్తి అయ్యే గోధుమ బియ్యం,వెన్న, నువ్వుల నూనె నూలు బట్టలు, నడుం బెల్ట్ లు సచ్చారి అని పిలువబడే వెదురు తోపుల్లో లభించే తేనే ను సంతకు తెస్తారు .ఇక్కడి రాజు స్వతంత్రుడు .పట్టణ ప్రముఖుడు ఒకరు పాలనా వ్యవహారాలూ చూస్తాడు .ఇక్కడి నుంచి సముద్ర తీరం దక్షిణానికి వంపు తిరిగిన చోటు అజానియా భూభాగం తగుల్తుంది .ఇక్కడి నుంచి ఆరు రోజులు ప్రయాణిస్తే ఏడు నదులు ,పైరాలియా దీవులు ,దాటి ,ఔసాటిక్ తీరంలో ఒక పగలు ఒక రాత్రి ప్రయాణిస్తే అడవులతో ఉండే మెనుడియాన్ దీవి వస్తుంది .ఈ దీవిలో అనేక నదులు ,పక్షులు మెట్ట తాబేళ్లు ,మొసళ్ళు ఉంటాయి .చేపల మావులతో తాబెళ్ళను పడతారు .రెండు రోజుల ప్రయాణం తర్వాత రేప్టాసంతపట్టణ౦వస్తుంది .కొబ్బరి నారతో బిగి౦ప బడిన ఈ పట్టణం రాఫ్తా గా పిలువబడుతోంది .దంతాలు ఎక్కువగా దొరుకుతాయి ఇది దొంగల దీవి. మఫారిక్ తెగ ముఖ్యుడు దీని పాలకుడు రాజుకు లోబడి ముజా ప్రజలు ఓడలను అరబ్బు కెప్టెన్ లతో బెరాలాడి వ్యాపారానికి పంపిస్తారు వీళ్ళు స్థానికులతో వివాహాలు చేసుకొంటారు .ముజ మార్కెట్ లో ఇనుప బల్లాలు ,గొడ్డళ్ళు బాకులు ,కత్తులు,కొబ్బరినూనె, గాజు సామాను ఎగుమతి అయి సారాయి గోధుమలు దిగుమతి అవుతాయి.
బెర్ నెస్ కు కుడివైపు భూఖండానికిచివర అజానియా మార్కెట్ తగుల్తుంది .ఇది దాటితే అప్పటి వరకు ఎవరూ అధిగమించని సముద్రం పడమరకు వంపు తిరిగి కనిపిస్తుంది .నావికులకు పెద్దగా పరిచయం లేని ఇధియోపియా ,లిబియా ,ఆఫ్రికా ల మీదుగా ప్రయాణిస్తే ఆ దారి పశ్చిమ సముద్ర౦ లో కలుస్తుంది .మస్సేల్ నుంచి మూడు రోజులు ప్రయాణం చేస్తే చుట్టూప్రాకారాలతో ఉన్న వైట్ విలేజ్ హార్బర్ వస్తుంది .నబ టేయాన్స్ లకు రాజైన మలిఖాస్ పాలన లో ఇది ఉంది .అరేబియా చిన్న నౌకలకు స్థావరం. రాజప్రతినిధి సుంకం వసూలు చేస్తాడు . .దీనికి చాలా దూరం లో దిగువున ఇండియన్ సముద్రపు సరిహద్దుగా అరేబియా దేశం ఉంది .ఇక్కడి గిరిజనులు వాళ్ళ స్వంత భాష మాట్లాడతారు .కొండగుహల్లో చేపలు తినేవారు ,లోతట్టు ప్రాంతాలలో రెండు భాషలు మాట్లాడే దుర్మార్గ ప్రజలుంటారు .సముద్రంలో ప్రయాణించే వారిని దోచుకొని బతుకుతారు .ఓడలు బ్రద్దలై నిర్వాసితులైన జనాన్ని వీళ్ళు పట్టుకొని బానిసలుగా మార్చి అరబ్బు రాజులు ,ముఖ్యులకు అమ్మితే వారు వీరిని ఖైదీలను చేసి ‘’కారనైట్స్’’గా పిలుస్తారు .అరేబియా తీరం వెంట సముద్రయానం భయానకం .కొండరాళ్ళు తగిలి షిప్ రెక్ అవచ్చు .వీటిని దాటి బరంట్ ఐలాండ్ చేరి ,హమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని అక్కడ ఒంటెలు గుర్రాలు,గొర్రెలను మేపే శాంతియుతులైన సంచార జాతి ప్రజలతో కలిసి ఉంటారు .
ఇక్కడి నుంచి గల్ఫ్ పాదం కుఎడమ వైపు సముద్ర తీరాన ముజ పట్టణం వస్తుంది .ఇది చట్టప్రకారం ఏర్పడిందే .అరబ్బీ ఓడవ్యాపారులతో సముద్ర ప్రయాణీకులతో సందడిగా ఉంటుంది .నిరంతరం లావా దేవీలతో బిజీ బిజీగా ఉంటుంది. ఇక్కడ నుంచి చాలా దూరం లో ఉన్న బారి గాజా తో వ్యాపారం చేస్తారు .ఇక్కడినుంచి బయల్దేరితే సవా నగరం వస్తుంది .దీని ప్రభువు ఖోలే బస్ .ఇక్కడికి తొమ్మిది రోజుల ప్రయాణ దూరం లో సఫర్ అనే రాజధాని వస్తుంది .ఇక్కడి రెండు తెగలను పాలించే చారిబయాల్ రాజు ఉంటాడు .అంటే దైవ ఆశీర్వాదమున్నవాడు అని అర్ధం యితడు ఖరీదైన బహుమతులు చక్రవర్తికి అందిస్తూ ,రాయబారులను పంపిస్తూ అతనితో సఖ్యత తో ఉంటాడు .ముజ హార్బర్ లో ఎరుపు నీలం కలిసిన సన్న, ,ముతక వస్త్రాలు ,అరేబియా స్టైల్ బట్టలు ,జుబ్బాలు ,నూలు ,బంగారం తో నేసిన ఎ౦బ్రాయిడరి వస్త్రాలు కుంకుమపువ్వు ,రంగు మస్లిన్స్ ,దుప్పట్లు ,సువాసన ఆయింట్ మెంట్లు ,గోధుమలు దిగుమతి అవుతాయి .రాజులకోసం గుర్రాలు కంచరగాడిదలు, వెండి బంగారు పాలిష్ ఉన్న పాత్రలు ,ముజలో ఉత్పత్తి అయి ఎగుమతి అవుతాయి గ్రీకు మాసం ధోట్ లో అంటే సెప్టెంబర్ లో నౌకాయానం సుఖకరం .
ముజకు చాలా దూరం లో అవలిటిక్ గల్ఫ్ దగ్గర బెర్ బెర్ ల దేశం అరేబియా తీరాన ఉంది .ఇక్కడ పెద్దగా పొడవులేని కాలువ ఇరుకు దారిగుండా ప్రవహించి ,పెద్ద అలలల్తో పర్వత గాలులతో ఉప్పొంగుతూ ప్రవహిస్తుంది .తీరానికి దగ్గర ఒసేలిస్ అనే అరబ్బు గ్రామం ఉంది .లంగరు వేసే వీలుంది .పర్షియన్ గల్ఫ్ కు వెళ్ళే నౌకలు లంగరు వేసే మొదటి స్థావరం ఇది .ఇది దాటి చాలాదూరం వెడితే యుడేమా అరేబియా గ్రామం వస్తుంది ఇది చారిబయాల్ రాజ్యం లోనిది ఇక్కడి నీరు మంచి రుచిగా తాగటానికి వీలుగా ఉంటుంది .ఇది బే కు ముఖద్వారం .ఇండియా ఈజిప్ట్ దేశాల కార్గో నౌకలకు దారి ఇచ్చేదికనుక దీన్ని యుడేమా అరేబియా అన్నారు .అలెగ్జాండ్రియా రేవు దారి ఇస్తున్నట్లు ఇది గేట్ వే గా ఉంటుంది అన్నమాట ..దీని రాజధాని సబ్బాధ .అరేబియా బట్టలు ,శిలారసం అంటే స్టోరాక్స్,బంగారు వెండి పళ్ళాలు, గుర్రాలు బొమ్మలు దిగుమతి అవుతాయి ఇక్కడ ఉత్పత్తి అయ్యే సాంబ్రాణి, కలబంద ఎగుమతి అవుతాయి .
ఇక్కడి నుంచి ముందుకు వెడితే సచలిటస్ అనే లోతైన సముద్రశాఖ అడ్డంగా ప్రవహిస్తుంది. దట్టమైన అడవులు మేఘాలు ,పొగ తో ఎత్తైన పర్వత ప్రాంతాల చెట్ల మధ్య నాణ్యమైన సాంబ్రాణి లభిస్తుంది .సాంబ్రాణి చెట్లు పొట్టిగా ఉంటాయి .ఈజిప్ట్ చెట్లు కొద్దికొద్దిగా బ౦కక కార్చి నట్లు ,ఇక్కడి చెట్ల బెరడు పై చుక్కలు చుక్కలుగా ద్రవరూపం లో సాంబ్రాణి కారి ఘనీభవిస్తుంది .శిక్షకుగురైన ఖైదీలచే సాంబ్రాణి సేకరిస్తారు ..వాతావరణం అనారోగ్యకారణం .
స్యాగరాస్ అనే ఈ భూభాగం బే కు కుడివైపు సముద్రం లోకి చొచ్చుకొని పోతుంది .ఇక్కడ ఒక దుర్గం నౌకాశ్రయం ఉన్నాయి కేప్ కు వ్యతిరేక దిశలో ఒక దీవి ఉందిడయాన్ కోయిడా దీవి విశాలంగా ఎడారిగా సముద్ర జలాలతో చిత్తడి నేలగా ఉంటుంది .ఇక్కడ పాకే జీవులు ఎక్కువ .వీటి కొవ్వు కరగబెట్టి వంటనూనె గా వాడుకొంటారు. పండ్లు ఉండవు. ద్రాక్ష పెరగదు .ప్రజలు చాలాతక్కువ. స్థానికులు ఉండరు .వ్యాపారనిమిత్తం వచ్చిన వారే ఉంటారు .ఇక్కడ వ్యాపారం లో స్థిరపడిన వారు అరేబియా –ఇండియా గ్రీసు మిశ్రమజాతి వారు .తెల్ల తాబేళ్లు, మామూలు తాబేళ్లు ఉంటాయి .తాబేళ్ల వేట ఎక్కువ. తాబేళ్ల డిప్పలు కోసి చిన్న సైజు పళ్ళాలు రొట్టెల పాత్రలు చేసి ఎక్కువ ఖరీదుకు అమ్ముతారు .ఇక్కడ రస సింధూరం అంటే రెడ్ సల్ఫైడ్ ఆఫ్ మెర్క్యురి అంటే సినబార్ ఇండియాలో లాగానే దొరుకుతుంది .

మహా ప్రయాణం లో అలసిపోయాం కనుక కాసేపు విశ్రమిద్దాం మిత్రులారా .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-9-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

హిందూ మహాసముద్ర౦ లోఒకటవ  శతాబ్దం లో ఒంటరిగా పడవ పై ప్రయాణించిన అజ్ఞాత నావికుని చరిత్ర పెరిప్లేస్ ను తెలుగులో అవిష్కరించిన- బందరు వాస్కోడిగామా శ్రీ సిలార్ -1

హిందూ మహాసముద్ర౦ లోఒకటవ  శతాబ్దం లో ఒంటరిగా పడవ పై ప్రయాణించిన అజ్ఞాత నావికుని చరిత్ర పెరిప్లేస్ ను తెలుగులో అవిష్కరించిన- బందరు వాస్కోడిగామా శ్రీ సిలార్ -1

రోమన్ జాతీయుడు ఈజిప్ట్ వాసి ,గ్రీకు సాహసిక నావికుడు ,ఒక సాధారణ వ్యాపారి క్రీ శ 1వ శతాబ్దం లో హిందూ మహాసముద్రంలో టాప్ లేని ఓపెన్ బోట్ లో వాణిజ్యసరుకుతోసాహసంగా ప్రయాణించగా అతని  యాత్రా వ్యాపార విషయాలను గ్రంధస్తం చేసిన కైఫీయత్తుపేరే  ‘’పెరిప్లస్. ‘’.నావికుడి పేరూ రచయిత పేరు లేని గ్రంథం  .ఆనాటిఆచార వ్యవహారాలను ప్రజల జీవన పరిస్థితులను ప్రపంచానికి తెలియపరచి న తోలి చరిత్రకారుడు పెరిప్లస్ గ్రంధ కర్త .గ్రీకులో రాసిన దీన్ని 1912లో  విల్ఫ్రెడ్ హెచ్  స్కాఫ్ ఇంగ్లీష్ లోకి అనువదిస్తే ఆత్మీయుడు బందరు సాహితీ  మిత్రుల మార్గదర్శి జనాబ్ సిలార్ మహమ్మద్ గారు ఈ ఏడాది మార్చిలో తెలుగులొకిఅనువది౦చి  అందించిన తాజా పుస్తకం ఇది .దీన్ని కోరుకొల్లు జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి పామర్తి( నారగాని )  లీలావతి గారికి అంకితమిచ్చారు .

   అజ్ఞాత రచయిత ,చరిత్రకారుడు పెరిప్లస్ గ్రంధ కర్త ‘’పెరిప్లస్ ఆఫ్ దిఎరైత్రియన్ సీ’’పుస్తకం రాశాడు .అ నాడు ఇండియానుంచి విలువైన జాతి రంగురాళ్ళు ,కలప సుగంధ ద్రవ్యాలు ముఖ్యంగా దాల్చిన చెక్క వగైరా మళ్ళీపంపిణీ చేయబడి ,నైలుకు .మధ్యధరా ప్రాంతాలకు రవాణా అయ్యేవి .ఇండియాలో జరిగిన భౌగోళిక మార్పు వల్లసింధునది డెల్టా భూభాగం పశ్చిమ దిక్కుకు మారటం ,కచ్ ప్రాంతపు హార్బర్లు మెరక అవటం ,ఆసియా ప్రజలపై దాడులు వలన హిందూ సముద్రంపై వ్యాపారం మందగించింది .ఆరబ్బులస్వాదీనం లో ఉన్న ‘’గార్డా వ్యూయి ‘’స్వతంతం పొంది ,వ్యాపారాలకు మార్కెట్ ఏర్పడింది .అప్పుడే అబిసీనియా దేశపు సేవలలో ఉన్న పేరు తెలియని రోమన్ ఒకడు ఇండియాకు ఓపెన్ పడవ పై సముద్రయానం సాగించాడు .అనుకూల వాతావరణం లో కొన్ని నెలలు విదేశాల్లో వ్యాపారం ముగించి ,అక్కడి సరుకులతో అనుభవాలతో స్వేదేశం చేరాడు .కొలంబస్ తో పాటు పేర్కొన తగిన హిప్పలస్ అనే సాహస యాత్రికుడు క్రీశ 47లో ఎరైత్రియన్ అంటే ఇండియన్ ఓషన్ లో అడ్డంగా ప్రయాణించి ,ఇండియాలో వివిధ ఋతువులలో సముద్ర వాతావరణం లో మార్పులు ఉండటం గమనించాడు .ఇండియాకు ఇతడే మార్గం కనిపెట్టినవాడు .ఇవి తర్వాతి నావికులకు మార్గ దర్శకాలయ్యాయి .చరిత్రకారుడు ప్లీనీ అతడిని విశేషంగా శ్లాఘించాడు .ఉజ్జయిని రాజు ,శాలివాహన శత కర్త కతియవార్ క్రీశ 78లో శక సంవత్సరం ప్రారంభించాడు .కనుక ఈ పుస్తకరచన దానికి ముందే జరిగిఉండాలి .ఇండియాకు రోముకు జరిగిన వ్యాపారాన్నే పెరిప్లస్ చెప్పింది . క్రీశ 64లో రోము పాలకుడు నీరో. జులై 19నుంచి 25వరకు 7రోజులపాటు రొం తగలబడి,10జిల్లాలు అగ్నికి పూర్తిగా ఆహుతయ్యాయి .ప్లినీకొంతవరకు దీన్ని చరిత్రలో పొందుపరచాడు .ఈ సంఘటనకు ముందే పెరిప్లస్ రచన జరిగి ఉండాలి కనుక చరిత్రలో నమోదుకాలేదు .కాబట్టి  పెరిప్లస్ రచనాకాలం క్రీ శ 62వేసవి తర్వాత ,క్రీ శ 58వేసవికి ముందు అని మల్లగుల్లాలు పడి చరిత్రకారులు నిర్ధారించారు .రోమన్ల కాలం లో అనేక రచనలు కు పెరిప్లస్ అనే పేరు వాడారు .హిందూ దేశపు హిందూ మహాసముద్రం ,అందులో కలిసే ఎర్ర సముద్రం ,పర్షియన్ గల్ఫ్ లకు గ్రీకులు రోమన్లు ‘’ఎరైత్రియన్ సి ‘’పేరు వాడారు . సిలార్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ,ఇక మీరూ, నేనూ కలిసి ఆ అజ్ఞాత నావికుడితో ప్రయాణం చేస్తూ విషయాలు తెలుసుకొందామా ?

  ఆకాలం లో చేపల ఆవుదూడల మా౦స భక్షకుల తెగలను ఇచ్ టయోఫాగి, అగ్రియో ఫాగి ,మొచ్చోఫాగి అని పిలిచేవారు .ఇప్పుడు ‘’బిషారిన్స్ ‘’అంటున్నారు .సూబియా రాజ్యపు చివరి రాజధాని మేరోయి క్రీ పూ 520లో రాజకీయ కేంద్రంగా మారి పెరిప్లస్ రచనాకాలం తర్వాత ఎడారి తెగలు సూడాన్ నీగ్రోల దండయాత్రలో రాజ్యం ముక్కలు చెక్కలై ,మేరోయి నైలు నదీ భాగ మై ,ఆరవ యేటిపాయ దిగువన సారవంతమైన ఆధునిక బెగారావియా ఏర్పడింది .బైరైన్స్ నౌకాశ్రయం నుంచి నాల్గు వేల  స్టాడియాల దూరం లో ఒక చిన్న  సంతమార్కెట్ పట్టణం టోలమయాన్ వస్తుంది .ఇక్కడ తెలుపు రంగు డిప్పలున్న తాబేళ్లున్నాయి .ఏనుగు దంతాలు ఉన్నాయి .నౌకాశ్రయం లేదు. చిన్న పడవలలోనే ప్రయాణమంతా.

  సెప్టెంబర్ మొదటివారం లో ఎర్ర సముద్రం దాటితే అడ్డంగా ప్రయాణించటానికి వీలైన గాలులు వీస్తూ ప్రయాణం హాయి కలిగిస్తుంది .టోలెమయాన్ -టోకేరా డెల్టా లో దక్షిణ భాగం .దీన్ని ప్రాకారాల రక్షణ దుర్గ౦గా కట్టారు .దీనికి దగ్గర నూబియన్ అడవిలో ఏనుగులు ఎక్కువ .పూర్వకాలం నుంచి దీనికి దారి ఉంది  .వేటగాళ్ళ కేంద్రమైన టోలేమయాన్ కు దిగువన దూరం లో అడులిన్ ఓడరేవు ఉంది .ఇది గల్ఫ్ కు తలభాగంగా ఉంటుంది .లంకప్రాంతాల్లో ఏనుగుల్ని  ఖడ్గ మృగాలను  బతికి ఉండగానేచంపుతారు .అలలాయి సముద్ర తీరం లో చేపలను తినేవారు తాబేటి చిప్పల్ని అమ్ముతారు .ఇక్కడికి ఎనిమిది వందల స్టాడియాల దూరంలో లోతైన బే-అఖాతం  ఉంది .ఇక్కడ అరుదైన ఒన్ సియాన్ రాయి ఉత్పత్తి చేస్తారు .  

 సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-9-22-ఉయ్యూరు 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -6

మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -6

16-అచ్చ తెనుగు కవి,మనువు పుట్టువు ,మెచ్చుల పచ్చ ముచ్చెలి కర్త , కవితా కళానిధి- శ్రీ నారు నాగనార్య

నారు నాగనార్య (జులై 3, 1903 – జనవరి 18, 1973) సాహితీవేత్త.

జీవిత విశేషాలు
నారు నాగనార్య 1903 జూలై 3లో సుబ్బమ్మ నరసింహం దంపతులకు జన్మించాడు. తెలిక కులస్థుడు. స్వగ్రామం వైఎస్ఆర్ జిల్లా రైల్వే కోడూరు సమీపంలో ఉన్న రాఘవరాజుపురం. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో అష్టావధాని అల్లాడి జగన్నాథశాస్త్రి వద్ద చంధస్సు, అలంకార శాస్త్రాలు నేర్చుకున్నాడు. జనమంచి శేషాద్రిశర్మ వద్ద శ్రీవిద్య ఉపాసనము చేశాడు. ఇతడు స్వాతంత్ర్యప్రియుడు. 1921లో సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నాడు. పర్లపాడు సత్యాగ్రహాశ్రమములో నివసించి ఖద్దరు సేవ చేశాడు. 1923,1947లలో సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్లాడు. 1949నుండి సాహిత్యంవైపు దృష్టి మరలించాడు. ఇతనికి వైద్యవిద్యలో ప్రవేశం ఉంది. రమణ మహర్షి పట్ల ఆకర్షితుడైనాడు. 1973 జనవరి 18న మరణించాడు.

సాహిత్యసేవ
ఇతనికి సంస్కృతాంధ్ర భాషలంటే అభిమానము. సుమారు 70 గ్రంథాలు రచించాడు. ఏకథాటిగా వందలకొద్దీ పద్యాలను అల్లగలిగే శక్తి ఉంది. అచ్చతెలుగు పై ఎక్కువ మమకారము ఉన్నవాడు. పెద్దన మనుచరిత్రను మనువుపుట్టువు అనే పేరుతోను, ముక్కు తిమ్మన పారిజాతాపహరణమును మెచ్చులపచ్చమ్రుచ్చిలి అనే పేరుతోను అచ్చతెలుగులో అనువదించాడు. ఇతని రచనలు గడియారం వేంకట శేషశాస్త్రి, జనమంచి వేంకట సుబ్రహ్మణ్యశర్మ మొదలైన పండితుల మెప్పును పొందాయి.

రచనలు
· వీరపూజ

· శ్రీ పృథ్వీరాజవిజయము

· తిలోత్తమాసాహసికము

· మనువు పుట్టువు

· మెచ్చులపచ్చ మ్రుచ్చిలి

· శకుంతల

· ఊర్వశి

· వెన్నెల పెళ్ళి

· రామకత

· ఉషారాజ్ఞి

· ధ్యానమాలిని

· ప్రణయిని

· శ్రీ రమణాభ్యుదయము

· ఆర్యవాణి

· తెలుగుతల్లి శతకము

· సౌందర్యలహరి

· శ్రీ మలయాళ సద్గురు దండకం

· శ్రీ రమణానుగ్రహ స్తుతి

· కేనోపనిషత్తు

· యతిగీతం

· శ్రీ హృదయాభ్యుదయము

· శ్రీరామహృదయం

· లక్ష్మణహృదయం

· దేవయాని

· కష్టజీవి

· పరాధీన భారతం

· సత్యాన్వేషి

· ఉద్బోధ

· వెన్నెలపెండ్లి

· వసంతోదయం …మొదలైనవి

రచనలనుండి ఉదాహరణలు
పనిపాటు విడియూరు నాడుఁ దిరుగన్ బాల్వడ్డ బైరాగి పో

రనుతిండిన్ బ్రదుకంగలాడచటికాహా! వచ్చెనా! వచ్చి యే

మనిచెప్పెన్ మనయందగాఁడు బదులేమందించెఁగన్గీటి రు

క్మిణి యేమాడెను డాఁప కంతయును గూర్మింబల్కరాదే!చెలీ!

దాసానిరంగు చీరన్

బాసి, వెలఁది మడుఁగుఁగట్టి – పంచల సొమ్ముల్

వేసి, కయిదమ్మిఁదునుకలు

సేసి,చెలిన్ గొదుకు బ్రదుకుఁ – జిడిముడి పడుచున్

నీరున్నకాఱు మబ్బున

జేరిన రిక్కవలె ‘సత్య’- చెలువంబఱిపం

చారించి యలుకగీమున

దూరెను సకులలుగఁ జేయుదురుగద! యిట్టుల్

-మెచ్చులపచ్చ మ్రుచ్చిలి (అచ్చతెలుగు పారిజాతాపహరణము)నుండి

వాగర్ధంబులవోలె నిర్వురొకటై వైరి ప్రకాండంబును

ద్వేగాకంపిత దేహవల్లరులరీతిన్ స్వప్రతాపక్రియా

వేగోదీర్ణబల ప్రభంజనతఁ గల్పింపన్ సముద్దిష్ట దీ

క్షాగర్వంబున లేళ్లపై నుఱుకువ్యాఘ్రంబుల్ వలెన్ దూఁకినన్

బలవన్నాగవరంబేన్

జవిచీమల చేతఁజిక్కిచచ్చినయటులీ

బలియుఁడు మాచే సిలుఁగుల

గలఁగఁడె యిపుడొంటి పాటు గదిసినకతనన్

అనియుప్పొంగుతలంపులన్ బెనఁగు మిథ్యాపౌరుషోద్రేక సం

జనిత క్రోధ విఘూర్ణనోత్థచటులోచ్ఛాయ క్రియన్ బ్రాఙ్మనో

జనితాఖండజయేప్సితార్థ ఫలమిచ్చాస్ఫూర్తి నర్థించి, మిం

చిన వేగంబున వీరుపైఁగవిసి నిస్త్రింశోగ్ర ధారాహతిన్

-వీరపూజనుండి

గుత్తపు పట్టుఱైకబిగి కుట్టు పటుక్కునఁ బిక్కటిల్లి స్వా

యత్తముఁ దప్పిపోఁబ్రిదిలి యబ్బుర పుబ్బగు గబ్బిగుబ్బలు

వెత్తున నొత్తరించి వలపింపఁగవుంగిటనించి పల్లు కెం

పొత్తిలి మోవితేనెఁజవులూరఁగొనెన్ ‘విధు’డా ‘తిలోత్తమన్’

-తిలోత్తమాసాహసికమునుండి

ఈ కాలం లో మన కవితా సరస్వతి ,అవధాన విద్వాన్ బ్రహ్మశ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ అచ్చతెనుగు లో కావ్యాలు రాయటమేకాక అవధానాలు కూడా చేసి దేశ విదేశాలలో కీర్తి పొందుతున్నారు .
17-శివభారత కావ్యకర్త ,శతావధాని ,స్వర్ణకంకణ,కనకాభిషేకం;సువర్ణ గండ పెండేర గ్రహీత, గౌరవ డాక్టరేట్ ,శాసన మండలి సభ్యులు ,ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమి ఉపాధ్యక్షులు ,కవి సింహ ,అవధాన పంచానన –శ్రీ గడియారం వేంకట శేష శాస్త్రి
పరాయిపాలనను నిరసించి స్వాతంత్య్రకాంక్షను అణువణువునా రగుల్చుతూ రచించిన మహాకావ్యమే ‘శ్రీశివభారతం’. భరతమాత పరాయి పాలనలో కళావిహీనమైన తరుణంలో అరుణోదయంగా వెల్లివిరిసింది కావ్యమది. మాతృభాష విముక్తికి మార్గదర్శిగా పంచకావ్యాల సరసన 1943లో 8 ఆశ్వాసముల ప్రబంధంగా శివభారతం వెలుగొందింది. ఈ అద్భుత కావ్య సృష్టికర్త గడియారం వేంకట శేషశాస్త్రి.ఆధునికాంధ్ర కవుల్లో ప్రముకులు,శతావధాని డా||గడియారం వేంకటశేషశాస్త్రి.ఈయన దుర్భాక శతావధానితో కలిసి కొన్నికావ్వనాటకాలు రాశాడు.
జీవిత విశేషాలు
పెద్దముడియం మండలం నెమళ్లదిన్నె గ్రామంలో రామయ్య, నరసమ్మ దంపతులకు 1894 ఏప్రిల్ 7వతేదీన జన్మించారు. విద్యాభ్యాసం కోసం ప్రొద్దుటూరు చేరుకుని స్థిరపడ్డారు. గడియారం వేంకట శేషశాస్త్రి ధర్మపత్రి వెంకటసుబ్బమ్మ. రామశేషయ్య, వెంకటసుబ్రమణ్య వీరి పుత్రులు. 1932లో అనిబిసెంట్‌ మున్సిపల్‌ పురపాలిక పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. బ్రహ్మానందిని అనే సాహిత్య సాంస్కృతిక మాసపత్రికకు సంపాదకులుగా సేవలు అందించారు. గడియారం వేంకట శేషశాస్త్రి బహుముఖ ప్రజ్ఞాశాలి. రూపావతారం శేషశాస్త్రి వద్ద తర్క, వ్యాకరణ, సాహిత్య శాస్త్రాలు, వాసుదేవావధాని వద్ద యజుర్వేదం, ఉపనిషత్తులు, దుర్భాక రాజశేఖర శతావధాని వద్ద అవధాన విద్యల్లో ఆరితేరారు. గోవర్ధన సప్తశతి, ఉత్తర రామాయణ గ్రంథాలు, సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించారు. పుష్పబాణ విలాసం, వస్తుజంత్రి, మల్లికామారుతం, శ్రీనాథ కవితాసామ్రాజ్యం, రఘునాధీయం, వాల్మీకి హృదయావిష్కరణ వంటి గ్రంథాలను రచించారు. నన్నయ్య భారతం, పోతన భాగవతం లాగా గడియారం వేంకటశేష శాస్త్రికి చిర కీర్తిని తెచ్చిన పెట్టిన గ్రంథం శివభారతం.

సత్కారాలు
· ప్రొద్దుటూరు రాయల సాహిత్య పరిషత్తు ఆధ్వర్యంలో ఎన్నో సాహిత్య ప్రసంగాలు చేశారు గోదావరి తీరంలోని రాజమహేంద్రవరంలో శ్రీపాద తల్లావర్ఘుల వారిఎదుట గజారోహణ సత్కారం అందుకున్నారు.

· 1945లో అనంతపురంలోని హిందూపురం లలిత కళాపరిషత్తు సభ్యులు స్వర్ణ గండపెండేరం, సువర్ణ కంకణ బహుకరించారు.

· 1948లో మద్రాసు ప్రభుత్వం దశాబ్ద కాలపు ఉత్తమ సాహితీ గ్రంథంగా శివభారతాన్ని గౌరవించి ప్రథమ బహుమతితో సత్కరించారు.

· 1967లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సాహిత్య అకాడమి అవార్డు అందజేసింది.

· 1968లో ప్రొద్దుటూరులో కనకాభిషేకం,

· 1974లో మరాఠా మందిర్‌ వారు శివాజి త్రిశత జయంతి ఉత్సవాల్లో భాగంగా బంగారు పతకాన్ని బహుకరించారు.

· 1976లో వెంకటేశ్వర విశ్వ విద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను అందించారు.

· 1959 నుంచి 1968 వరకు శాసనమండలి సభ్యునిగానూ,

· 1969 నుంచి 1973 వరకు ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు

బిరుదులు
· కవితావతంస

·

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ అడివి బాపిరాజు గారు.8వ భాగం.18.9.22

బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ అడివి బాపిరాజు గారు.8వ భాగం.18.9.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మరో పు౦జీడు పుస్తకాలు

.మరో పు౦జీడు పుస్తకాలు ,5వ ప్రపంచసభలు డిసెంబర్ 23,24
ఇవాళ ఉదయం బెజవాడ ఐలాపురం కన్వెన్షన్ హాల్ లో కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యం లో 75ఏళ్ళ స్వాతంత్ర ఉత్సవాల సందర్భంగా వెలువరించిన ‘’అమృత భారతి ‘’వ్యాస సంకలనం ను జస్టిస్ శ్రీ బట్టు దేవానంద్ గారు ఆవిష్కరించారు .వేదికపై శ్రీ మండలి బుద్ధప్రసాద్ ,శ్రీ గుత్తికొండ సుబ్బారావు శ్రీ పూర్ణ చ౦ద్ ఉన్నారు .శ్రీవిహారి పుస్తకాన్ని పరిచయం చేశారు .జస్టిస్ గారు చాల నిష్కర్షగా నిర్మొహమాటంగా నేటి దేశ రాష్ట్ర పరిస్థితి వివరించారు .మనకొక రాజధాని లేదని అన్ని రాష్ట్రాలవారు ఆక్షేపిస్తుంటే యువత తల దించు కోవాల్సి వస్తోందని ఇది అత్యంత సిగ్గు చేటైన విషయమని ,దేశం లో అన్ని రంగాలలో విలువలు పతనమై పోయాయని వాటిని పునరుద్ధరించి జాతిని తల ఎత్తుకొనేట్లు చేసేబాధ్యత రాచాయితది అనీ, రచయిత అధికారానికి లొంగి పొతే వ్యవస్థను ఎవ్వరూ బాగు చేయలేరని ,ఆత్మ విశ్వాసం స్థైర్యం తో రచయిత సంఘానికి మార్గ దర్శి కావాలని కోరుతూ పోతనగారి పద్యాన్ని సందర్భానికి తగినట్లు ఉదాహరించారు. చప్పట్లు మోగించారు జనం .బుద్ధప్రసాద్ గారు మాట్లాడుతూ నిజాయితీకి, నిర్భీతికి ,విలువైన జడ్జిమెంట్ల కు ఈ జస్టిస్ గొప్ప పెరుపొందారని అందుకే వారితో పుస్తకావిష్కరణ జరిపించామని చెప్పారు .తర్వాత ఈ పుస్తకం లో వ్యాసాలురాసిన రచయితలలో హాజరైన వారికి శాలువాకప్పి ఆపుస్తకాన్నిచ్చిశ్రీ జస్టిస్ గారి చేత సత్కరింప జేశారు .సభలో ఉన్నవారందరికీ పుస్తకం అందించారు . ఆతర్వాత కృష్ణా జిల్లా రచయితల సంఘం కార్యవర్గ సమావేశం జరిగింది .ముఖ్య విషయాలు అధ్యక్ష కార్య దర్శిలు తెలియజేశారు .
5వ ప్రపంచ రచయితల మహాసభలు రెండు రోజులు ఈ డిసెంబర్ 23,24తేదీలలో శుక్ర ,శని వారాలలో విజయవాడ సిద్ధార్ధ కాలేజిలో జరుగుతాయనీ ,ఈ సారి కార్యవర్గం బాధ్యత పెంచు తున్నామని ,జీవిత సభ్యులతో సహా అందరూ ప్రవేశ రుసుం 500 రూపాయలు చెల్లించాలనీ ,స్వచ్చందంగా ముందుకు వచ్చి విరాళాలు కూడా ఇవ్వాలని కోరారు .సుబ్బారావు గారు 50,పూర్ణ 25,పుట్టి నాగలక్ష్మి 25వేలు ,నేను 10వేలు ,శ్రీలత 10వేలు ,విష్ణుప్రసాద్ 10వేలు సిలార్ 10వేలు మరికొందరు ఉదారంగా విరాళాలు అందిస్తామని హర్షధ్వానాల మధ్య తెలియజేశా౦ .ఈ సారి సభలకు ఒక ప్రత్యెక వాట్సాప్ ఫోన్ నంబర్ , ప్రత్యెక బాంక్ అకౌంట్ కూడా తీసుకొన్నామని ఆనంబర్ లతోనే అన్నీ త్రాన్సాక్షనులు జరపాలనీ ,ఉత్సాహంగా పని చేసి ఎక్కువమంది ప్రతినిధులను నమోదు చేసి సభల విజయానికి తోడ్పడమని కోరారు .
ఆతర్వాత ఐలాపురం హోటల్ లో భోజనాలు ఏర్పాటు చేశారు .చాటంత ప్లేటులో చుట్టూ అన్నీ పదార్ధాల డిప్పలు మధ్యలో అన్నం కలుపుకోవటానికి వీలు .ఐలాపురం భోజనం అన్నా టిఫిన్ అన్నా ఎప్పుడూ రొటీనే .నేను తిన్నదేమీ లేదు . జనవరి తర్వాత ఎనిమిదినెలలకు జరిగిన కార్యవర్గం .శ్రీమతి తుర్లపాటి రాజేశ్వరి దంపతులు శ్రీ సవరంమాస్టారు ,శ్రీలత ,రాధిక ,అన్నపూర్ణ ,అక్షరం ప్రభాకర్ ,రాజేష్ ,వృద్ధులు శ్రీ బందా రామారావు ,నూనె అంకమ్మారావు,భూసురపల్లి,దత్తాత్రేయ శర్మ మొదలైన వారిని చాల నెలల తర్వాత చూశాను .
నేను ఫంక్షన్ హాల్ మెట్లు ఎక్కుతు౦డ గానే పైన ఉన్న బుద్ధ ప్రసాద్ గారు ‘’దుర్గా ప్రసాద్ గారూ మీరు రాసిన ఆర్టికల్ ఇవాళ ప్రభలో చూశాను ‘’అని అభినదించారు .శ్రీ నాగసూరి రాయమని కోరిన ఆర్టికల్ అది .అమృత భారతి తోపాటు చారిత్రిక రచయిత శ్రీ సిలార్ మహమ్మద్ అందించిన – ‘’పెరిప్లస్ఆఫ్ దిఎరిత్రియన్ సి ‘’కి ఆయన చేసిన అనువాదం ,ఆయనే రాసిన కృష్ణాజిల్లా జమీందారులు ,డాక్టర్ నూనె అ౦కమ్మారావు గారి ‘’యోచన ఆలోచన’’, సరికొండ నరసింహరాజు గారిచ్చిన ‘నెత్తురు పాదాలు ‘’లయన్ శ్రీ బందా వెంకట రామారావు గారి ఇటీవలి రచన ‘’పాండవ పట్టమహిషి ద్రౌపది ‘’.ఇవన్నీ ఎప్పుడు చదవాలో ?
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -18-9-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Leave a comment