అగస్త్య లింగ శతకం -2(చివరి భాగం )

అగస్త్య లింగ శతకం -2(చివరి భాగం )

మల్లికార్జున శాస్త్రి రెండవ భార్య కొడుకు పుట్టగానే చనిపోగా ,కళ్ళికోట కు చెందిన మీనాక్షమ్మను తృతీయం చేసుకొని అయిదుగురు కుమారులను పొందాడు .మల్లికార్జున గారి శిష్యులు వరంగల్ చాందా ,నాగపూర్ ,కామిఠీ,ఆశనపర్తి సీతం పేట ,కోరుపల్లి మొదలైన చోట్ల ఉన్నారు .మల్లికార్జునగారు –అచ్చతెనుగు హరిశ్చంద్రోపాఖ్యానం ,కూకడ మారయ్య కదా ,శ్రియాలుని కథ ,రౌద్ర సత్తెక్క కథ ,మిధున రామయ్య కథ ,సిద్దేశ్వర శతకం ,భజనకీర్తనలు ,రామేశ్వర యాత్రా తటస్థ క్షేత్ర దేవతా పంచరత్నాలు ,అష్టకాలు రాశారు .హరిశ్చంద్రోపాఖ్యానం నుంచి మచ్చుకు ఒక పద్యం –

‘’తలనాకసపు జాలు ,,మొలను బెబ్బులి తోలు –మేన వెన్నెల డాలు మేరుగులీన

చేత కంకాటి తుండు సికను జాబిలీ తుండు –నెడను తాచుల పిండు కుదురు దనర

నుదుట మండేడికన్ను ,పెదవి నగవు చెన్ను –కురువులండలి యన్నుకులుకు గదుర

పూప జక్కవ రేని ,రూపు ననెన్నగరాని –జడల క్రొమ్ముడి జిగి సౌరు చెలగ

తెల్లముగా చంక నొక జింక పిల్ల నిడుక –పూన్కపల్లెరమొక చేత బూని మిగుల

మత్తల్లిన తెల్ల గిత్త నెక్కి –కనికరంబు న నా మ్రోల గానుపించె’’.

   మల్లికార్జునుడు నిత్యం 21,600 జపం చేసేవాడు .ఆతపో ఫలితంగా శ్రీముఖ సంవత్సర మాఘ బహుళ చతుర్దశి మహా శివరాత్రి నాడు లింగోద్భవ సమయం లో ,శిష్యుల సందేహాలు తీరుస్తూ శివ సాయుజ్యం పొందాడు .లింగైక్యం చెందాక,వరంగల్ లోని  చిదరవారు లింగ ప్రతిష్టాదులకు ,గ్రంధ ప్రచురణకు పూనుకొని నెరవేర్చారు .

అగస్త్యలింగ శతకాన్ని మల్లికార్జున ఆరాధ్యులు

 ‘’శ్రీ గిరిజా సతీ చిత్తాబ్జ రోలంబ –భక్త హృత్పద్మినీ భానుబింబ

తారకాచాలవాస తారతారక భాస –భూరి శైలస రాస-బుధవిలాస

ఇందు ఖండన వతంస ఈడిత ముని హంస –యాహి భూషి తా౦స సంహత నరు శంస

హర గణ పరివార హత పురాసురవార –శరనిధి తూణీర శర్వ ధీర

పరమపావన నామ సద్భక్త ధామ –అభయ విశ్రాణన సుశీల అజిన చేల

అంగజ విభంగ పరమ దయాంతరంగ –ఈమని అగస్త్యలింగ బాలేందు సంగ ‘’

అంటూ ప్రారంభించి ‘’ ఈమని అగస్త్యలింగ బాలేందు సంగ ‘ అనే మకుటాన్ని మకుటాయమానంగా పెట్టాడు .

పద్యాలన్నీ పరుగుదీస్తాయి –పులితోలు మొలకట్టు ,తెలిగట్టు నీ పట్టు ‘’అంటూ పట్టు పడతాడు .తర్వాత శివతాండవం వర్ణించాడు .త్రిపురాసుర సంహార విజ్రు౦ భణ కన్నులకు కట్టించాడు .’’నేరమా నినువేడ భారమా నను బ్రోవ బీరమానాతోడ ‘’అని నిలదీశాడు .శివుని పంచముఖాలు పంచభూతాలకు ప్రతీకలన్నాడు .పంచముఖాలతో తానూ పంచ విషయాలు గ్రహించగా ఆయన చిదానంద రూపంగా వెలుగుతున్నాడట .శివభక్తుల చరిత్రలన్నీ విప్పి చెప్పాడు .ఒక భక్తుడు భార్య చర్మం వొలిచి చెప్పులు కుట్టి ఇచ్చాడు .ఒక భక్తుడిని బానిసనుఇమ్మని అడిగితె  దభార్యనే ఇచ్చాడు

   ‘’నీ మన్కి నా యున్కి ‘ఒక్కటే అన్నాడు .’’సురపతి సురముఖ సురవర చయమకుటమనికిరణ పద కమల యుగళ’’అంటూ గుక్కతిప్పుకోకుండా సీసాలు రాసే నేర్పుకవిది భక్తి పరవశంతో చెప్పినపద్యాలు .సముద్ర మధనం లో విషం పుడితే అందరూ భయంతో పారిపోతే ‘’నువ్వు తొడరి భుజించ గా అమృతము పుట్టిన్దన్నాడు .’’వేదాంత వేద్యాయవిమలాన్తరంగాయ –మౌని హృన్నిలయాయ  తే నమోస్తు ‘’అని భక్త్యాంజలి ఘటిస్తాడు .బెజ్జమహాదేవికి కొడుకుగా పెరిగావు .గొడగూచి భక్తితో ఇచ్చిన పాలు తాగావు బాణాసురుని వాకిటి కాపలా కాశావు కన్నప్ప పుక్కిలించిన నీళ్ళు పోస్తే అభిషేకంగా భావించావు ఇలాంటి భక్త సులభుడు లేదు అన్నాడు .నీభూషణం పాము నీకొడుకు వాహనం ఎలుకను తినటానికి ,మీకొడుకు కుమారస్వామి వాహనం నెమలి నీ పాముల్ని తినటానికి ,నీభార్య పార్వతి వాహనం సింహం గజాన్ని కొట్టటానికి ,నీభార్యలు సవతిపోరు,ఫాలాగ్ని చంద్రుడిని బాధ పెడుతూ ఉంటె ఎలా తట్టుకొంటున్నావు సామీ ‘’’కుటు౦బ కలహాలతో విసిగి విషం తాగుతున్నావేమో ‘’అని చమత్కరించాడుకవి .

   ఆరు మొగాల శూరుని కొడుకుగా ,ఆరక్షరాలు మంత్రంగా ,ఆరుపద్మాలలో ఆరు లింగాలుగా ఆరు చక్రాల అవతల జ్యోతిస్వరూపుడివిగా వెలుగుతున్నావని ఆరు సంఖ్య సార్ధకత వర్ణించాడు .నీకన్నా గొప్ప దేవుడే ఉంటె నిన్ను మహాదేవుడు అని ఎందుకంటారు అని సమర్ధిస్తాడు .అన్ని చక్రాలసస్థానాలను వర్ణించాడు ’ .తన సీసపద్యాల చివర గీత పద్యాలు రాయటాన్ని సమర్ధిస్తూ –‘’చెరకునకు వంకబోయిన చెడదు తీపి –యనుచు బల్కెడి లోకోక్తి ననుసరించి

సీసపద్యాళి  సుమమాల జేసి నీదు –కంఠమున దాల్ప నొసగితి కరుణ దాల్పు ము ‘’అని చివరి పద్యం చెప్పాడు కవి .

తర్వాత ఇష్టలింగాన్ని పంచరత్న సీసాలతో స్తుతించాడు. ఆతర్వాత శివ భజన కీర్తనలు వివిధరాగాలలో కూర్చాడు .

 గొప్ప శతకం ఇది మహా భక్తుడు రాశాడుకనుక ఉదాత్తంగా ఉత్తమోత్తమగా భక్తి భావ గర్భితంగా సరళంగా నడిపించాడు కవి ధన్యుడయ్యాడు .శివ భక్తులకు వరప్రసాదం అగస్త్య లింగ శతకం .

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -13-9-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీమతి కాళ్ళకూరి శేషమ్మ గారిది ‘’చదువు తీర్చిన జీవితం ‘’

శ్రీమతి కాళ్ళకూరి శేషమ్మ గారిది ‘’చదువు తీర్చిన జీవితం ‘’

ఒక సామాన్య మహిళ ఆత్మ కథ గా శ్రీమతి కాళ్ళకూరి శేషమ్మగారు తన జీవిత చరిత్ర రాసుకొంటే ,కృష్ణా జిల్లా తెన్నేరు వాసి సాహిత్య  ,విద్యోపజీవి మాన్యమిత్రులు శ్రీ దేవినేని మధుసూదనరావు గారు తమ తల్లిగారి పేర ఏర్పరచిన ‘’దేవినేని సీతారావమ్మ ఫౌండేషన్ ‘’తరఫున జులై 2020లో మొదటి ,ఏప్రిల్ 21 రండవ ముద్రణ చేసి అందించారు .దీన్ని నాకు మొదటి దానితర్వాత పంపారో రెండవ ముద్రణ తర్వాత పంపారో తెలీదుకానీ ,హాయిగా నా పుస్తకాలమధ్య నిద్రపోయింది పార్సిల్ కూడా విప్పబడకుండా .ఇవాళ ఏదో పుస్తకం కోసం వెతుకుతుంటే దర్శనమిచ్చింది .రచయిత్రి తో నాకు పరిచయం లేదు ఎవరు పంపారో చూస్తె మధుసూదనరావు గారు అని అర్ధమై ,కాస్త తీరిక దొరకగానే చదివేశాను .ఒక మధ్యతరగతి మహిళ తాను  కావాలంటే ఎలా ఎదిగి జీవితాన్ని సార్ధకం చేసుకో గలదో అందరికీ మార్గ దర్శనం చేసే పుస్తకమని పించింది .

   ఈ పుస్తక రచనకు నేపధ్యం ,ప్రేరణ తో ప్రారంభించి ,తన మరణం ఎలాసార్ధకం కావాలో తెలియ జేస్తూ ముగించారు శేషమ్మగారు. మధ్యలొఎన్నెన్నొ మజిలీలు ఎత్తుపల్లాలు ఆత్మీయుల ఎడబాటు ,అన్నిటినీ తట్టుకొంటూ జీవిత ధ్యేయాన్ని నేరవేర్చుకొన్న సార్ధక జీవి శేషమ్మగారు .నిత్య విద్యార్ధిని ఆమె .ఉపాధ్యాయ వృత్తి చేబట్టిన అదృష్ట శీలి. 78వ పడిలో కూడామనవల విద్యాభి వృద్ధికోసం తన విద్యను సార్ధకం చేస్తూ పాటుపడుతున్న నిత్య విద్యా శ్రామికురాలు .కూతురు సలహాతో తన జీవితానుభవాన్ని జోడించి రాసిన పుస్తకం .కనుక కరదీపికగా నిలిచింది .

  ఇటీవలి కాలం లొఆడపిల్లల్లొ పెరుగుతున్న అసహనం ఆమెను కలవరానికి గురి చేసింది .ఆడంబరం ,అట్టహాసంగా పెళ్ళిళ్ళు చేసుకోవటం ,కట్టు’’కొన్న’’వాడి తో వివిధకారణాలతో కాపురం చేయలేక తిరిగి పుట్టింటికి’’ బాక్ టు పెవిలియన్’’ గాఅతి త్వరలోనే  రావటం చూసి బాధపడ్డారామే .సహనం లేకుంటే కుటుంబాలు నిలబడవు అని నిర్మొహమాటం గా చెప్పారు .ఈమెకు తల్లి గర్భం లో ఉన్నప్పటి నుంచి సాహిత్య౦ వంటబట్టి ,తండ్రి ఇచ్చే సలహాలతో జీవితం తీర్చి దిద్దుకోవటం అలవాటైంది .కాలేజీలో చదువుతుండగానే శ్రీ హరినాధ బాబు గారితో 14వ ఏట వివాహం ,చదువు కు గంట కొట్టబడి ,భర్తకు ప్రమోషన్ కోసం ఒకపరీక్షకు తయారు చేయించి ,ఆయన పాసవ్వగానే ఆమెకోరినట్లు హిందూ పత్రిక చందా కట్టి దానితో ఆమె, ఇంటిల్లిపాదీ విద్యా విజ్ఞానాలు సంపాదించారు .

  స్వయం బోధనా ,నిరంతర శ్రమతో బిఏపాసై శేషమ్మగారు విశ్వనాథపుస్తకాలతో ఆత్మబలం ,మనో ధైర్యం పెంచుకొని ,విమర్శనాత్మక దృష్టి అలవడి ,కీట్స్ షెల్లీ కవిత్వాలతో నిత్యసత్యాలు గ్రహించి ,సంసారం పెరిగి వారి ఆలనాపాలనలో మురుస్తూ ,ఇంటిని చూసి ఇల్లాలిని చూడు అన్న సామెతకు అర్ధం తెలిసి అమలు జేస్తూ ,అనుకోకుండా వచ్చిన టీచర్ ఉద్యోగం లో చేరి ,మొదటిసారే పదవ తరగతి కి  సాంఘిక పాఠం ధైర్యంగాబోధించి హెడ్ మన్నన పొంది ,ఆతర్వాత భర్త ట్రాన్స్ ఫర్ లతో ఎక్కడుంటే అక్కడ అందివచ్చిన స్కూళ్ళలో టీచర్ గా పని చేస్తూ 16సంవత్సరాలు విద్యాబోధన చేశారు .

  జీవిత భాగస్వామిని కోల్పోయినా ధైర్యాన్ని పుంజుకొని ,మంచి వార్తాపత్రికలు ,పుస్తకాలు చదువుతూ ,జీవితం అంటే ఏమిటో చర్చించి తెలుసుకొని ,మనకూ పాఠం చెప్పారు  .చివరగా మరణం కోసం నిరీక్షిస్తున్నట్లు తెలిపారు .చావు మెలకువ రాని నిద్ర అన్నారు .ముగింపుగా మరణం దేవుడు జీవికి ఇచ్చే స్వేచ్ఛ అంటారు శ్రీమతి కాళ్ళకూరి శేషమ్మ.ఎన్నో నీతులు ,జీవిత సత్యాలు ,మార్గదర్శక సూత్రాలు ,తన అనుభవ సారం తో నింపిన శేషమ్మగారి జీవిత చరిత్ర ఇది .

 శేషమ్మగారి సార్ధక జీవితమైన ఈ  పుస్తకాన్ని అందంగా ముద్రించి లోకానికి అందించిన శ్రీ మధు సూదనరావు గారిని అభినందిస్తున్నాను .

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -13-9-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అగస్త్య లింగ శతకం

అగస్త్య లింగ శతకం

శ్రీ తాడికొండ పూర్ణ మల్లికార్జున అయ్య వార్ల౦గారు ‘’అగస్త్యలింగ శతకాన్ని  పూర్తిగా సీసపద్యాలతో  రచించి ,1935లో బెజవాడ ఆంద్ర గ్రంధాలయ ముద్రాక్షరశాలలో ,వరంగల్ కు చెందిన చిదర రాజమౌళి గారి రాజశేఖరం,అక్షయ లింగం  గార్ల ద్రవ్య సహాయం తో ముద్రి౦చారు .దీనితోపాటు శివభజన కీర్తనలు కూడా ఉన్నాయి .వెల తెలుపలేదు .దీనికి ముందుమాటలుకృష్ణాజిల్లా నందిగామకు చెందిన ‘’నిగమాగమ విశారద ముదిగొండ వీర భద్రేశ్వరార్యులు రాశారు .

  శ్రీ ముదిగొండ వీరేశ లింగం గారు కవిగారి జీవిత చరిత్ర చక్కగా తెలియజేశారు .మల్లికార్జునకవిది గుంటూరు జిల్లా తాడికొండ గ్రామం .ఇదే ఇంటిపెరుకూడా .వ్యవహార నామం పూర్ణయ్య శాస్త్రి .భారద్వాజస గోత్రం ఆపస్తంభ సూత్రం .యజుశ్శాఖ  బ్రాహ్మణులు .మతం శైవం ఆరాధ్యులు .1776 ఆనంద నామ సంవత్సరంలో గుంటూరుజిల్లా ఈమనిలో జనన౦.బుచ్చమా౦బా , రాజ లింగారాధ్యులు తలిదండ్రులు . తల్లి పండితారాధ్యుల రాజలింగారాధ్యుల కుమార్తె .రాజలింగం గారు మంత్రం శాస్త్ర ప్రవీణులు .సోమవార ,కార్తీక నక్త వ్రతాలు ఆచరించారు .

  కవి తాత గారు మల్లనారాధ్యుడు సంస్కృతాంధ్ర కోవిదుడు .నంది వెలుగు గ్రామం లో తొమ్మిది ఎకరాల ఈనాము భూమి సంపాదించాడు.ఆ నాటి ప్రభువు శ్రీ మల్యాలరాయ వెంకట గుండారాయ ని దర్శించి ఆశువుగాతొమ్మిది సీసాపద్యాలు ,ఏకాక్షర కంద శతకం  చెప్పి,రాజును మెప్పించి ఏం కావాలని అడిగితె ‘’ఈమనికి తూర్పుగా నా మాన్యం ఉంది .పంటపండటం లేదు .దీన్ని తీసుకొని దక్షిణంగా ఉన్న భూమి నాకు ఇవ్వండి అని మరి రెండుకందాల్లో తెలియజేశాడు .రాజుగారు కవిప్రతిభకు సంతోషించి ఈమనికి దక్షిణంగా ఏకంగా 25 ఎకరాల మాన్యాన్ని ఇచ్చి సత్కరించాడు .

  మల్లికార్జునకవి కుటుంబం వాడైన శ్రీశైల పతిశ్రీ శైల తూర్పు ద్వారం వద్ద తపస్సు చేసి శివానుగ్రహం పొంది ,వివాదాలలో బిల్వ దళం లో పంచాక్షరి రాసి దానితో తులాభారం తూగి ‘’శ్రీశైల ప్రాగ్వార ప్రణవ పంచాక్షరీ తులాభార ప్రసిద్ధులు ‘’అని పించుకొన్నాడు .చన్నబసవ పురాణకర్త అత్తలూరి పాపకవి ,ఈ కవి వంశీకుడైన నందీశ్వరుడిని గురువుగా భావించి స్తుతించాడు .ఇలాంటి ప్రసిద్ధ వంశం లో పుట్టిన మల్లికార్జునకవి బాల్యం నుంచీ ఉభయ భాషా ప్రవీణుడై ,సంగీత ,మంత్రం శాస్త్రాలలో కూడా ప్రతిభా సంపన్ను డయ్యాడు .ఈతని గురువు ,లింగ ధారణ నిచ్చినవాడు పండితారాధ్యుల రాజలింగ ఆరాధ్యులు .ఆతని రచన ‘’కూకద మారయ్యకధ లో పద్యాలు తెలియజేస్తున్నాయి .

  కవి పెద్ద సోదరి రాజమ్మ పండితారాధ్యుల జోగయ్యారాధ్యుల భార్య .చిన్నావిడ భ్రమరాంబ పండితారాధ్యుల కొటయ్యారాధ్యుల భార్య . మనకవి అష్ట విధ ఆర్జనపరుడు . షట్కాల శివ పూజాదురంధరుడు .ఎందరికో విద్యనేర్పిన గురువు .మొదటిభార్య ఇవటూరి లింగయ్యగారి కూతురు చనిపోతే ,జగ్గయ్యపేటకు చెందినశివాపురం కోటయ్యా రాధ్యులపుత్రిక  రాజేశ్వరి ని చేసుకొని ,భ్రమరాంబ ,పూర్ణానందం లను పొందారు .పెద్ద మేనల్లుడికి ఒకకూతురిని ఇస్తే కొద్దికాలం లో ఆమె చనిపోయింది .పూర్ణాన౦దానికి   శివపురం వీర భద్రా రాధ్యుల కుమార్తె అగస్త్యేశ్వరినిచ్చి పెళ్లి చేశారు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-9-21-ఉయ్యూరు 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ధన్యవాదాలు

ధన్యవాదాలు

నమస్తే శ్రీ సు౦కర కోటేశ్వరరావు గారు -అంతా క్షేమమని తలుస్తాను .యధా ప్రకారం ఎప్పుడూ పంపించినట్లే మేము అడుగకుండానే ,సరసభారతి పై అభిమానం తో మీరు ఈరోజు 11-9-21 శనివారం పంపిన 10వేలరూపాయలు ,అంది నా అకౌంట్ లో జమ అయినట్లు మెసేజ్ వచ్చింది .ధన్యవాదాలు  .మీ ఆదరాభిమానాలు సాహిత్యం పై ఉన్న మక్కువ కు ముగ్దుడిని అవుతున్నాను .మరొక్కమారు ధన్యవాదాలతో  కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాను -గబ్బిట దుర్గాప్రసాద్ -11-9-21-ఉయ్యూరు  

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

త్ర్యంబకేశ్వర శతకం

  త్ర్యంబకేశ్వర శతకం

శ్రీ కేసనపల్లి లక్ష్మణ కవి త్ర్యంబ కేశ్వర శతకాన్ని రచించి ,1936లో నరసరావు పేట కోటీశ్వర ముద్రాక్షర శాలలో ముద్రించారు ,వెల-బేడ అంటే రెండు అణాలు .’’కవిగారు గుంటూరుజిల్లా నరసరావు పేట కేసనపల్లి వాస్తవ్యుడు .ఆర్వేలనియోగి బ్రాహ్మణుడు .శ్రీవత్స గోత్రీకుడు .శ్రీ ఆంజనేయ వర ప్రసాది .సుబోధక యమక ,అనుప్రాసలతో దీన్ని రాశాడు ‘’అని నరసరావు పేటకు చెందిన పౌరాణిక శిరోమణి శ్రీ నందిగల సుబ్బా రెడ్డి  ఈశతకానికి  ముందుమాటలలో తెలియజేశారు .ఇది పెసరవాయి పురస్థిత త్ర్యంబ కేశ్వర స్వామిపై చెప్పిన శతకం. ‘’పెసరవాయి పురస్థిత త్ర్యంబ కేశ్వరా’’అనేది శతక మకుటం .

  ‘’శ్రీకర భక్తమానస వశీకర ,సద్గుణ రత్నపుంజ ,నీ-రాకర దుర్మదాసుర నిరాకర భీకర పాపవాయు ద

ర్వీకర వారిజోదర ,విరించి ,ముఖామర వందిత ప్రభావా –కరుణాకరా ’పెసరవాయి పురస్థిత త్ర్యంబ కేశ్వరా’’.అని ఎత్తుకోటం లోనేస్వామి మహిమను కీర్తి౦చాడుకవి .పాక మృదుత్వం తో లలితభావ సమగ్రత తో కూర్చే నేర్పున్న వాడి నని చెప్పుకొన్నాడు .శాస్త్రాలు చదివి రంగుహ౦ గు లతో రాస్తే అందులో ‘’వే భంగుల నీదు వర్ణనలు ‘’లేకపోతె దానిలో ‘’దాన భిష్వంగము  భంగమౌతుంది ‘’అన్నాడు .’’నుతిపాత్రమైన నీ సుచరిత్ర మొయ్యనన్ వాకొనకుంటే’’కీర్తి హెచ్చదు అన్నాడు .’’రుద్ర, దయాసముద్ర బహురూప వికార విదూర సార నిర్నిద్ర నిరంతరస్మరణ రీత్యనుమోదితరామభద్ర ,యచ్చిద్ర యశోదిముద్ర ‘’అంటూ రుద్రముద్రలు వేశాడు .

  ‘’సార విచార ఘోర  తర సంగర శూర యుదార నిర్మలాకారుడని స్తుతించాడు .’’శైల సుతా కళత్ర రవిచంద్ర హుతాశన నేత్ర పాప జంబాల సరోజమిత్ర ‘’అని త్రకార ధ్వని మోగించాడు .’’ఈ రసమూని నిన్ను ,జగదీశ్వరు సర్వ ఫలప్రదాయకున్ –నీరసుడు ‘’  అనే వాళ్ళు కు బుద్ధి చెప్పటానికి దక్షయజ్ఞ ధ్వంసం జ్ఞాపకం చేశాడు ..’’పంకజ నాభు డీవగును,బంకజ నాభుడ వౌదు నీవిటన్’’అని శివ కేశవాద్వైతం చెప్పాడు.’’నీసగమేన  పార్వతిని దాల్చి ‘’లోకానికి అద్వైతమిథునం ఎలా ఉండాలో మార్గ దర్శివయ్యావు .

  తనకు ఎడతెగని శివ భక్తి ప్రసాదించమని –‘’నీరము గ్రోలు నప్పుడును ,నిల్చిన యప్డు ,,భుజించు నప్డు స౦ –చారము సేయునప్పుడు ,ప్రస౦గ మునన౦  దిగినప్డు ,శయ్యకుం జేరినప్డు ‘’నీమీదే చిత్తం ఉండేట్లు అనుగ్రహించమని వేడుకొన్నాడు .’’మారహరా హరా త్రిపుర మర్దన శూరధరా ,గిరీశ గౌ-రీ రమణా యటంచు  ‘’ అంటూనే బూతుల బు౦గను అయ్యానని ,అన్నీ పోయి నువ్వే శరణు అంటున్నానని , ఆర్తిగా వేడాడు ..నీకెన నీవ యౌట ఎరిగిననన్ను  వదిలిపెట్టకు అని ప్రాధేయపడ్డాడు .’’నీ నిస్తుల విశ్వ విభుత్వ లక్షణాన్ని నంది అపార్ధం చేసుకొని కొంతకాలం దూరమయ్యాడు.కానీ బహుకాల తపస్సుతో వ్యాసుడు ‘’నీ మూల మెరింగి దాసుడయ్యాడు’’అని పూర్వగాథాలహరి వివరించాడు .

  ‘’ఏ నరుడెద్ది యిమ్మనిన నిచ్చుట ‘’అనేది వాడిలో నీకు నచ్చినదేదో ఉండటం వలననే కదా .అందుకే భోళా శంకరుదడివయ్యావు అంటాడు .’’శంకర శంకరా నను ,వశంకరు నేలుట ‘’కు ఇంత ఆలస్యమా ?’’వంకర వంకరాశ్రితుని  వ్రాలుట ,బాణ దైత్య  రాట్కింకర కి౦కరా’’ఒకటికి పది అడుగుతాడు వీడు అని నాపై అలుసా అన్నాడు .

  107వ పద్యం లో తనగురించి చెప్పుకొన్నాడు కవి –‘’కేసనపల్లి వాసుడను .గేసనపల్లి కులు౦డ లక్ష్మణా-ఖ్యా సహితుండ ,దావక పదార్చన తత్పర మానసుండ నే

జేసిన దోసముల్ వొలియ జేసి కరమ్ము వరమ్ము లీయరా –వాసవ వందితా పెసరవాయి పురస్థిత త్ర్యంబ కేశ్వరా’’

‘’మంగళ మద్రిజా రమణ మంగళ మండజ రాడ్విభూషణా-మంగళ మ౦బుజాక్ష సఖ,మంగళ మంగజ గర్వ భంజకా

మంగళ మాది తేయనుత ,మంగళ మెప్పుడు గాత నీకు స-ర్వం గత సంగతా పెసరవాయి పురస్థిత త్ర్యంబ కేశ్వరా’’అని శతకం పూర్తిచేశాడుకవి .

  దీనికింద గద్యం లో ‘’ఇది శ్రీ మదాన్జనేయానుగ్రహోప లబ్ధ ,సరస కవితా సామ్రాజ్యాధి వైభవ రమానాథాభిధేయ ద్వితీయ తనూభవ ,’’వికటవాద పరాయణ ‘’ ఇతి భీకర వినయ ,నమిత సుకర ,వశీకర లాక్షిణిక ,జనవిధేయ ,లక్ష్మణ నామ ధేయ ప్రణీత౦బైన ‘’పెసరవాయి పురస్థిత త్ర్యంబ కేశ్వర శతకము సంపూర్ణము ‘’ అని రాసుకొన్నాడు .మన వికటకవి రామలింగని వంటివాడే ఈ లక్ష్మణ కవి అనిపిస్తోంది .అతనిది సరస కవితాసామ్రాజ్య వైభవం .తండ్రిపేరు రమానాథుడు .కవి రెండవ కుమారుడు .తన వినయం భీకర వినయం ట.లక్షణ శాస్త్రాలన్నీ కరతలామలాకాలే కవికి .మీదు మిక్కిలి హనుమ ఉపాసకుడు .ఆయన బలవంతుడైతే,ఈ  కవి కవితా బలసంపన్నుడు .అంతే తేడా .అందుకే ఏ పద్యాన్ని ఎత్తుకొన్నా ,ఎక్కడా కుంటుపడక యమక అనుప్రాసలతో సర్వాంగ సుందరం చేశారు .108 ఉత్పలాలతో శతక మాలిక అల్లి ,తన  హృదయేశ్వరుడైన త్ర్యంబ కేశ్వరుని అలంకరించి ధన్యుడయ్యాడు .చక్కని ధారా శుద్ధి ఉంది. సులభమైన పదాలతో నిజభక్తితో రాసి , కవి ధన్యుడైనాడు .

  ఈ శతకం గురించీ ఈకవి కేసనపల్లి లక్ష్మణ కవి గురించి కూడా మనవాళ్ళు ఎవరూ ,ఎక్కడా ప్రస్తావించినట్లు లేదనిపిస్తోంది .కవినీ శతకాన్ని పరిచయం చేసే భాగ్యం నాకు దక్కింది .కవి చెప్పుకొన్న మాటలుకాక ,ఆయన గురించి వివరాలేవీ లేవు .త్ర్యంబ కేశ్వర స్వామి చరిత్ర కూడా కవి రాయ లేదు .భక్తిలో ఊగి పోయి రాసినకవిత్వమిది.

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-9-21-ఉయ్యూరు  

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఇవాల్టి నుంచే ”మంత్రమయ వాణి విశ్వ నాద” ప్రారంభం

ఇవాల్టి నుంచే ”మంత్రమయ వాణి విశ్వ నాద” ప్రారంభం  ప్రస్థాన త్రయం లో ముఖ్యమైనది శ్రీ బాదరాయణ వేద వ్యాస మహర్షి రచించిన బ్రహ్మ సూత్రాలు కు  శ్రీ శంకర భగవత్పాదులు రచించిన అద్వైత భాష్యానికి శ్రీ నోరి శ్రీనాధ సోమయాజులు గారి తెలుగు వ్యాఖ్యానం ”బ్రహ్మ సూత్ర దర్శనం ”ను సరసభారతి ఫేస్ బుక్ ద్వారా 24-7-21  వేదవ్యాస జయంతి నుంచి నిన్న 10-9-21 వినాయక చవితి వరకు 45 భాగాలుగా ప్రత్యక్ష ప్రసారం చేసిన అరుదైన అదృష్టం నాకు, సరసభారతికి దక్కింది .ఎన్నో జన్మల పుణ్య ఫలం గా భావిస్తున్నాను .ఆదరించిన సాహితీ బంధువులకు ధన్యవాదాలు .  ఈ రోజు 11-9-21భాద్రపద శుద్ధ పంచమి  శనివారం ఉదయం 10గం.ల నుంచి సరసభారతి ఫేస్ బుక్ లో విశ్వం పట్టని కవిసామ్రాట్ ,జ్ఞానపీ పురస్కార గ్రహీత   ,అన్ని ప్రక్రియలను సుసంపన్నం చేసిన శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారిపై ”మంత్రమయ వాణి విశ్వనాధ ”ధారావాహిక ప్రారంభిస్తున్నామని తెలియ జేయటానికి సంతోషం గా ఉంది .మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -11-9-21

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Tagged | Leave a comment

వేద, ఇతిహాస, తాత్విక రచనల విశ్లేషణ

వేద, ఇతిహాస, తాత్విక రచనల విశ్లేషణ

సాహితీ బంధువులకు శ్రీ వినాయక చవితి శుభాకాంక్షలు .సరసభారతి బ్లాగ్ ఏర్పరచి దశాబ్ద కాలం దాటింది నేను వివిధ రామాయణ, భారత, భాగవత,వేద ఉపనిషత్తులు మొదలైన వాటిపై విశ్లేషణ రూపంగా రాసినవన్నీ ఒక చోటికి చేర్చి డిజిటల్ రూపమిచ్చి రెండవ భాగం గా సుమారు 450 పేజీల ‘’వేద, ఇతిహాస, తాత్విక రచనల విశ్లేషణ’’గా నామకరణం చేసి విద్యా ప్రదాత శ్రీ వినాయకుని పుట్టినరోజు శ్రీ వినాయక చవితి నాడు నాచేత ఆవిష్కరి౦ప జేస్తున్నందుకు మహదానందంగా ఉంది . ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఫేస్ బుక్ లైవ్ ద్వారా ఆవిష్కరణ…

Posted in పుస్తకాలు | Tagged , | 1 Comment

కన్నడం లో మొదటి సాహిత్య కావ్యం –వడ్డారాధన-2(చివరి భాగం ) 

కన్నడం లో మొదటి సాహిత్య కావ్యం –వడ్డారాధన-2(చివరి భాగం ) 

ఆంధ్ర చాళుక్యులు జైన మఠాలను,కానీ జైన గ్రంథాలను కానీ తగలబెట్టినట్లు ఆధారాలు లేవు .9వ శతాబ్ది కి చెందిన’’కవి రాజ మార్గం ‘’అనే ఛందో గ్రంథం వడ్డారాధన కంటే ప్రాచీనమైనది .వాన్చియార్ అనే శాస్త్రవేత్త తెలుగులో ఛందో శాస్త్రం రాశాడని అందులో ఉంది .కానీ ఇది అలభ్యం .క్రీశ 855లో అసగ కవి కుమార సంభవం రాశాడని చాలామంది చెప్పినా ,అదీ దొరకలేదు .దొరికి ఉన్నట్లయితే నన్నె చోడుని కుమార స౦భవంతో పోల్చటానికి వీలయ్యేది .

  వడ్డా రాదన లోని జైనమునులు దేవ ,మానవ ,తిర్యక్ ,అచేతనాలు అనే నాలుగు ఉపసర్గలను జయించి ,ధ్యానం తో ముక్తిపొంది’’ఉపసర్గ కేవలులు ‘’అని పించుకున్నారు .వీటిలోఅనేక జన్మల వరకు ఎన్నో కథలు వడ్డారాధన లో ఉన్నాయి .ఎప్పుడో జన్మాంతరం లో బంధువైన ఆడనక్క మూడురోజులు పీక్కు తింటున్నా ,జైనుడు ఓర్పుతో సహించి సమ్యక్ జ్ఞానం ,సమ్యక్ దర్శనం సమ్యక్ చరిత్ర లను పొందినవాడు సుకుమారస్వామి .సుకౌసలస్వామిని జన్మాంతర ద్వేషం తో ఒకపెద్దపులి తింటున్నా ఓర్చుకొన్న కథ మరొకటి.వాతపిత్త శేష్మాది 700 వ్యాదుల్ని తట్టుకొని సమాధి పొందిన వాడు సనత్కుమారజైనుడు .

  ఎర్రగా కాలిన బండపై కూర్చుని  వేసవి వడగాలుల్ని ఓర్చుకొని సద్గతి పొందాడు వృషభ సేన భటారుడు . దేహం లో బాణాలు నాటుకొని దుర్భర వేదన అనుభవిస్తూ ధర్మ ధ్యానం తో రత్నత్రయం పొందినవాడు ‘’దండ కరిసి ‘’..గానుగలో వేసి పిండుతున్నా ,ఓర్చుకొని మహేంద్ర దత్తాచార్యుడు మొదలైన 500 మందిజైన  ఋషులు సద్గతిపొందినట్లు శ్రీ ఆర్ వి ఎస్ సుందరం కన్నడ సాహిత్య చరిత్రలో రాశారు.

  తెలుగులో 14శతాబ్దిలో వచ్చిన సింహగిరి వచనాలు వడ్డారాధన తో పోల్చలేము .19వ శతాబ్ది మధిర సుబ్బన్న దీక్షితులుగారి కాశీ మజిలీ కథలతో పోల్చవచ్చు అది కూడా కథాకథన వైచిత్రి తోనే పోలిక, విషయం లో కాదు ..తల్లావఝల శివ శంకర స్వామి బుద్ధుని జాతకకథలను తెలుగులోకి అనువదించారు .జైనమత కథలు తెలుగులో రాలేదు .10వ శతాబ్ది కన్నడ ప్రజల సామాన్యజీవనం, ఆట పాటలు ,ఆచార వ్యవహారాలూ వడ్డారాధన చదివి తెలుసుకోవచ్చు అనిదీనికి ముందుమాటలు రాసిన శ్రీ రామమోహన రాయ్ అభిప్రాయ పడ్డారు .వడ్డారాధన లోని 19కథలను తెలుగులోకి అనువదించినవారిలో –డా.టి నారాయణ ,డా కే ఆశాజ్యోతి ,శ్రీ బాలాజీ ,డా జిఎస్ మోహన్ ,డా జి రాజేశ్వరి ,శ్రీ రంగనాథ రామ చంద్రరావు ఉన్నారు ..అనువాదాలు సరళంగా ఉన్నాయి హాయిగా చదివి ఆనందించవచ్చు .ఇలాంటి అరుదైన సాహిత్యాన్ని అందించిన కేంద్ర సాహిత్య అకాడెమి కి అభినందనలు .

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-9-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనల్ని ఏకు (లు )తున్న సార్ధక నాములు 

మనల్ని ఏకు (లు )తున్న సార్ధక నాములు 
1-విద్యా వ్యవస్థ భ్రష్టు కు ”ఆదిమూలం ”2-ఒళ్ళంతా ,నోటినిండా బూతులతో -”నాని” ,”నాని” ,”నాని ”౩-ఆయన ఆర్ధిక విషయం వింటే ”బుగ్గన ”వేలేసుకోవాల్సిందే ‘ఆశ్చర్యంగా 4-రోడ్ల బాగు సేత ఏ”ధర్మానా ”లేదు5-అమరావతి ప్రజల చేతిలో ”బొచ్చె”పెట్టె మున్సిపాలిటి 6-గుడులు గోపురాలు ధార్మిక సంస్థల ”పల్లీ”ల హాంఫట్ కు నోరు ”వెల్ల ”బెట్టాల్సిందే ” 7-ఇరిగేషన్ కు అనలం ”అనిలం ”8-ప్రజలకు పనికిరాని పంచాయితీ ”పెద్ది ”9-”గుమ్మున” ఉండే ఉపాధి ,కార్మికం 10-అప్పుల ,తప్పుల నడకల ,నడతల ,కోర్టు చెంప దెబ్బల ,మడమ తిప్పే” జగన్మొహనం” 
దొరవారి ఆజ్ఞలతో  హాయిగా జరుపుకొ లేకపోతున్న” వినాయక చవితి ”శుభా కాంక్షలతో –మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -8-9-21-ఉయ్యూరు 

Posted in రాజకీయం | Tagged | Leave a comment

కన్నడం లో మొదటి సాహిత్య కావ్యం –వడ్డారాధన

కన్నడం లో మొదటి సాహిత్య కావ్యం –వడ్డారాధన

వడ్డారాధన మతపూర్వ యుగ కృతి .చతుర్విధ ఉపసర్గలను విని ,ముక్తి పొందిన 19 జైన మహాపురుషులకధలు ఇవి .దీనికి ‘’ఉపసర్గ కేవలుల కధలు ‘’అనే పేరు కూడా ఉంది .దీన్ని క్రీ శ 920లో శివ కొత్యాచార్యుడు రచించాడని మొదట అంతా అనుకొన్నారు .కానీ డా హం .ప .నాగరాజయ్య చేసిన పరిశోధన ఫలితంగా కన్నడం లో దీనిపేరు ‘’ఆరాధనా కర్నాట టీక ‘’అనీ ,కర్త క్రీ.శ 800 నాటి భ్రాజిష్ణు అని తేలింది.ఇదికూడా ప్రాకృతి రచన ‘’మూలారాధన ‘’కు కన్నడ అనువాదం .భ్రాజిష్ణుడు రాష్ట్ర కూట రాజుల రాజధాని మాన్యకటకం అనే మలఖేడ వాసి ..వడ్డారాధన ప్రాకృత పదం అయిన ‘’బృహదారాధన ‘’కు రూపాంతర పదం .కర్త ఆరాధన కర్నాటక టీకా అని రాసినా జనం లో వడ్డారాధన అనే పేరుతోనే బాగా ప్రచారమైంది .ఈఆరాధన ,మూలా రాధనా ,భగవతీ ఆరాధన అనేది క్రీస్తు శకం ఒకటవ శతాబ్దిలోనే ప్రారంభమైంది .దీనిమూల భాష ‘’జైన సూర సేన ప్రాకృతం ‘’.ఇందులో 40అధికరణాలు ,40 శీర్షికలు ఉండి,జైనముని ఆచారాన్ని తెలియ జేస్తోంది .కథలన్నీ రెండు వరుసలలో అమరి ఉంటాయి .35వది కవచాధికరణం . కష్టాలను గెలిచే సామర్ధ్యమే  కవచం .ఈ కవచార భాగాన్నే భ్రాజిష్ణు కన్నడం లోకి అనువదించాడు .మూలాధారానికి వ్యాఖ్యానాలు,కథా కోశాలు ఉన్నాయి .శ్రీ చంద్ర –కథాకోశ –అప భ్రంశ ,ప్రభా చంద్ర-కథాకోశ- సంస్కృత ,నేమికోశ –కథా కోశ –సంస్కృతం రాశారు .హరి సేనుడి కథాకోశం లో 157 కథలున్నాయి .దీని కథనం భావం వడ్డారాధన తో సరిపోలుతుంది .జాతక కథలు ,శివ శరణ కథలు,జైన కథలు ఒకే కోవలోనివే .కథలలో ఉద్దేశ్యం ధార్మికం కనుక ,నిరూపణలో వైవిధ్యం కనిపించదు .వడ్డా రాదన లో  ఆకాలపు జనజీవన వివరణ కన్పిస్తుంది .

వడ్డారాధన కన్నడ సాహిత్యం లో మొట్టమొదటి సాహిత్య గ్రంథమే కాకుండా ,మొదటి గద్యకావ్యం కూడా .ఇందులో సుకుమారస్వామి అనే జైనముని నుంచి వృషభ సేనుని వరకు జైనమునుల 19 కథలున్నాయి .ప్రతి కథకు ముందు ఒక ప్రాకృతగాథ ఉంటుంది .ఇవి ఆరాధన లోనివే .ఆత్మ శుద్ధి కోసం చేసే ప్రయత్నమే ఆరాధన .ఆరాధన గ్రంథాలలో శివాచార్యుని గ్రంథ౦ ఉత్తమమైనది .దీనిలో రెండు వేలకు పైగా ప్రాకృత గాథలున్నాయి.

వడ్డారాధన రచన కాలానికి కన్నడ ,తెలుగులకు ఒకే లిపి ఉంది .వ్యాకరణం ఛందస్సుకూడా ఒకేరకం సాంఘిక మత విషయాలలోనూ ఐక్యత ఉండేది.,ప్రాచీన కన్నడం లో గద్యకృతులున్నాయని ‘’కవిరాజ మార్గ కారుడు ‘’చెప్పినప్పటికీ ,అవి అలభ్యాలు .చాము౦డరాయ పురాణం ,ముద్రా మంజూష ,నో౦పియకథలు ,రాజావళి కథా సార మొదలైనవి కన్నడ గద్య రచనలే కాని వడ్డారాధన ఒక్కటే కన్నడ సాహిత్యం లో విశిష్టకృతి అనిపించుకొన్నది .తెలుగులో కంటే కన్నడం లోనే ముందు కావ్య రచన జరిగింది .రాష్ట్రకూట సామంతరాజు వేములవాడ చాళుక్య వంశానికి చెందిన ఆంధ్ర మహారాజు అరి కేసరి కన్నడ ఆదికవి పంపమహాకవి ని పోషించాడు .మౌర్య చంద్ర గుప్తునికాలం లో భద్ర బాహుముని దక్షిణ భారతం లో జైనమతాన్ని వ్యాప్తి చేశాడు .చాళుక్యులు ,రాష్ట్రకూటులు జైనాన్ని ఆచరించారు .కమ్మనాటిలో రాష్ట్రకూట చక్రవర్తి సామంతరాజు పుంగనూరు పాలకుడైన మల్లపయ్యరాజు కన్నడకవి ‘’రన్నకవి ‘’నిపోషించాడు .చాళుక్యరాజులు జినభవనాలు కట్టించారు .జైనులకు అనేక దానాలిచ్చినట్లు శాసనాలున్నాయి .

రాజరాజ నరేంద్రుని తండ్రి విమలాదిత్యుడు జైనమతావలంబి ,త్రికాల యోగి శిష్యుడుకూడా ..విశాఖజిల్లా రామ తీర్ధం లో విమలాదిత్యుని కన్నడ శాసనం ఉంది .రాజరాజ నరేంద్రుని కొడుకు కులోత్తుంగ చోళుడు జైనమతాన్ని ఆదరించినట్లు గుంటూరులో దొరికిన శాసనాలు చెబుతున్నాయి .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-9-21-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కేరళ పాణిని రాజరాజ వర్మ -5(చివరి భాగం )

కేరళ పాణిని రాజరాజ వర్మ -5(చివరి భాగం )

కాలేజిలో పని చేసే రోజుల్లో వర్మ ఉదయం 9లోపే స్నాన భోజనాలు పూర్తీ చేసేవాడు .కాలేజిలోనే టిఫిన్ చేసి ,కాలేజి అవగానే యూనియన్ క్లబ్ కు వెళ్లి ,పేకాట ,టెన్నిస్ ఆడి ,చీకటి పడ్డాక ఇంటికి చేరేవాడు .

  కుటుంబ జీవనం

రాజరాజ వర్మ తమ్పురాన్ ది ఆదర్శ సంసారం .భార్యా పిల్లల్ని అనురాగంతో చూసేవాడు .వారి కి సుఖ సంతోషాలు అందించాడు .వర్మకు ఏడుగురు కూతుళ్ళు ,ఆరుగురు కొడుకులు .చివరికి నలుగురు కూతుళ్ళు ఇద్దరు కొడుకులే మిగిలారు 13మంది సంతానం లో .కేంద్ర మంత్రి జి రవీంద్ర వర్మ ఒక కూతురు కొడుకు .1915లో మేనమామ కేరళ వర్మ చనిపోయాడు .ఇది జీర్ణించుకోలేకపోయాడు రాజరజవర్మ .తీరిక లేకపోయినా సంసార ధర్మ గురించేఆలోచన .1918లో కొడుకు రాఘవ వర్మ పెళ్లి చేశాడు .

  జీవితం భారంగా గడుస్తోంది .శరీరానికి నీరు పట్టింది .దానికి తోడూ అతిసారం పెరిగి వ్యాకులం కల్గించింది .మూడురోజుల్లో బాగా బలహీనమయ్యాడు .టైఫాయిడ్ వచ్చి 103డిగ్రీల జ్వరం తో బాధపడ్డాడు .అయినా డాక్టర్ తో చతురోక్తులాడేవాడు .కూతుర్ని గీత గోవిందం గానం చేయమని, వినేవాడు .తాను రాయాలనుకొన్న   నాటకం కథా ప్రణాళిక చెప్పి ఆమెతో రాయించాడు .ఆమె తండ్రిని విశ్రాంతి తీసుకోమని మొత్తుకున్నా వినేవాడు కాదు .పక్షం రోజులు టైఫాయిడ్ ఆయన్ను పీల్చి పిప్పి చేసింది .18-6-1918 న 55 వ ఏట కేరళ పాణిని రాజరాజ వర్మ పరమపదించాడు .

   రాజరాజ వర్మ రాసిన కేరళ పాణినీయం కు మించిన వ్యాకరణం లేదు .అది అతి ప్రామాణిక వ్యాకరణం .కేరళ పాణినీయం విద్యార్ధులకు కొరకరాని కొయ్య గాఉందనిపించి ,1902లో మూడు నెలలు కష్టపడి సులభ బోధకంగా ఉండటానికి ‘’శబ్ద శోధిని ‘’వ్యాకరణ౦  రాశాడు ఇది బాగా క్లిక్ అయింది .ప్రాధమిక విద్యార్దులకోసం ‘’ప్రధమ వ్యాకరణం ‘’1906లో ,మధ్యమ వ్యాకరణం 1907లో మాధ్యమిక పాఠశాల విద్యార్దుల కోసం రాశాడు .మలయాళం లో సరళ సంస్కృత వ్యాకరణం  అవసరాన్ని గుర్తించి వర్మ ‘’మణి దీపిక ‘’అనే వ్యాకరణాన్ని 1908లో రాశాడు .ఆయన ఉద్దేశ్యం లో మణి అంటే సంస్కృతం అని అర్ధం .మణిదీపిక రాశాక ,పాణిని అడుగుజాడలలో సులభ సంస్కృత వ్యాకరణం 1910లో రాసి కృతకృత్యుడయ్యాడు .ఈ వ్యాకరణ౦  రచన చూసి ముచ్చటపడిన ప్రొఫెసర్ జాకోబి వర్మకు ‘’మీ వ్యాకరణం అన్నిటి కకంటే ఉత్క్రుష్టం గా ఉంది .మా విద్యార్ధులకు పాణినీయం బోధించేటప్పుడు ‘’సిద్ధాంత కౌముది ‘’ని కాకుండా మీ గ్రంధాన్ని ఉపయోగించాలనుకొంటున్నాను .’’అని రాశాడు ఇంతకంటే గొప్ప  ప్రశంస ఇంకేమి ఉంటుంది? వర్మ జీవితం, ఆవ్యాకరణం ధన్యం  .బొంబాయి విల్సన్ కాలేజి ప్రొఫెసర్ ‘’మీ ప్రణాళికఅత్యుత్తమం .పాణిని హృదయాన్ని విద్యార్ధులకు ఆవిష్కరిస్తుంది ‘’అని మెచ్చాడు .పూనా డక్కన్ కాలేజి ఆచార్యుడు ఆర్ సి రానడే ‘’పాణిని సూత్రాలను కొత్త మూసలో అందించారు .మీ ఉపోద్ఘాత౦ చదివితే సంస్కృత౦ మృత భాష అన్న దోషం తొలగిపోతుంది’’అన్నాడు  .పాణిని అష్టాధ్యాయి లో 2,978 సూత్రాలు ఉంటె వర్మ రాసిన దానిలో 1959 సూత్రాలున్నాయి. వైదిక ఖండం ,స్వర ఖండం లు మాత్రమేకాక ,భాషను గూర్చి ప్రాక్ ,పశ్చిమ ప్రామాణిక ఆచార్యులతో జరిపిన చార్చలతో ఉన్న ‘’లఘు పాణిని ‘’ని రెండవభాగాన్ని 1912లో ప్రచురించాడు .

  బెయిలీ ,గుండర్ట్ ల నిఘంటువులకు మించిన నిఘంటువు తయారు చేయాలనీ వర్మభావించాడు .కాని ఇతరవ్యాపకాలు పాఠ్య పుస్తకాల రచనలతో తలమునకలవటం వలన ఆపని చేయలేకపోయాడు .లక్షణ గ్రంధాలను సమన్వయ పరచి వర్మ భాషాభూషణం , వృత్త మంజరి ,సాహిత్య సహ్య౦ రాశాడు .అనువాదకుడుగా కూడా వర్మ రాణించాడు .కాళిదాసు  మేఘదూతం, కుమార సంభవం ,శాకుంతలం,మాలవికాగ్నిమిత్రం  లను నిర్దుష్టంగా అనువదించాడు .భాసుని చారుదత్త ,స్వప్న వాసవ దత్తం నాటకాల  అనువాదం చేశాడు .షేక్స్పియర్ నాటకం ఒదేల్లో ను ఉద్దాలచరిత గా గద్యం లో అనువదించాడు .

  రాజరాజ వర్మ సృజనాత్మక విమర్శ రచనలు కూడా చేశాడు .భంగవిలాపం ,పితృ విలాపం అనే స్మృతికావ్యాలు సంస్కృతం లో రాశాడు .తోలి రోజుల్లో రాసిన శ్లోకాల సంకలనం కు విద్వాన్ తురవూర్ నారాయణ శాస్త్రి టీకా రాశారు .సరస్వతీ స్తవం వీణాష్టకం ,రాగముద్రా సప్తకం ,విమానాష్టకం ,హిందూ పద వ్యుత్పత్తి ,పితృ ప్రలాపం ,దేవీ దండకం ,ఏకాంకిక గా గైర్వాణీ విజయం రాశాడు నాలుగు రాత్రులలో రాధా మాధవ సమాగమనాన్ని ‘’విట విభావరి ‘’గా రాశాడు .

   ఆధునికకవులు రాసిన సంస్కృత కావ్యాలలో శిఖరాయమానమైనది రాజ రాజ వర్మ రాసిన ‘’ఆంగ్ల సామ్రాజ్యం ‘’.ఇందులో బ్రిటిష్ పాలన ,విక్టోరియా మహారాణి పాలన 60వ వార్షికోత్సవం వరకు వర్ణించాడు .ఈ వజ్రోత్సవం దేశమంతా మహా వైభవంగా జరిగింది .ఇదంతా సంస్కృతంబు పచరించిన పట్టున అన్నట్లు వర్మ సంస్కృత సాహిత్య శేముషీ వైభవం .

  మళయాళ భాషలో కూడా వర్మ తన పాండిత్య కవిత్వ ప్రతిభ చూపాడు .పడమటి కనుమలను వస్తువుగా తీసుకొని ‘’మలయ విలాసం ‘’గేయం రాశాడు .చనిపోవటానికి ముందు వర్మ తిరువనంతపురం రాజు శ్రీ మూలం తిరుణాల్ షష్టిపూర్తీ సందర్భంగా ‘’ప్రసాద మాల ‘’సుదీర్ఘ మళయాళ కావ్యం రాశాడు .సాహిత్య విమర్శ రచనకూడా చేశాడు .ఉన్నాయి వారియర్ రాసిన ‘’నల చరిత్ర ‘’గురించి అద్భుత విమర్శరాసి లోకానికి కవి సత్తా చాటి చూపించాడు .దీనికి రాసిన పీఠిక మళయాళ సాహిత్య విమర్శలో చిరస్థాయిగా నిల్చింది .ఈ పీఠిక కు ‘’కాంతార తారకం ‘’అనిపేరు పెట్టాడు .కుమరన్ ఆసన్ రాసిన ‘’నళిని ‘’కావ్యానికి గొప్ప వికాస వంతమైన పీఠిక రాశాడు .ఆసన్ రాసిన ‘’రాలిన పూవు ‘’కావ్యానికి మొదట్లో ప్రశంసలు రాలేదు .నళినికి వర్మ రాసిన పీఠిక వలన గొప్ప ప్రచారం కలిగింది .

  జ్యోతిష శాస్త్రం లో బాగా కృషి చేసిన వర్మ ‘’పంచాంగ శుద్ధిపద్దతి’’,కేరళ జ్యోతిష శాస్త్రం ‘’అనే విశిష్ట రచనలు చేశాడు .సాహిత్య పూర్వ వికాస ప్రదాత గా రాజరాజ వర్మ గణుతింప బడ్డాడు .సాహిత్య చరిత్రలో నవ వికాసం కల్పించాడు రాజరాజ వర్మ ..

  మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -6-9-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

శ్రీనాథ కవి సార్వ భౌముడు

శ్రీనాథ కవి సార్వ భౌముడు

 శ్రీనాధుడికి ఈ పేరు పెట్టిన మారయ్య గొప్ప సంస్కారి .తండ్రిని కొడుకు ‘’విద్యా రాజీవ భువుడు ‘’అని చెప్పాడు అంటే విద్యలకు బ్రహ్మ అంతటివాడు.శ్రీనాధుడు ‘’బందరు ‘’వాడు అంటే ,కర్నాటకం వాడని కొందరు  నెల్లూరి కవిజాణఅనుకొన్నారు అక్కడి వారు .అసలు పేరు ‘’సీనయ్య’’అని అదే శ్రీనాథుడిగా మారిందని ఒక మరకట బుద్ధి గాడు చెప్పాడట .తాత మారనను  ‘’వినమత్కకతిసార్వ భౌమడని ,కవితా విద్యాధరుడు ‘’అని చెప్పాడు .శ్రీనాథుడి నాలుకపై బాణుడు ,మయూరుడు ,బిల్హణుడు మొదలైన ప్రౌఢ కవులు నర్తిస్తూఉంటారు  .అయితే భారవి శ్రీనాథుడికి అందడు అంటారు ఆచార్యశ్రీ .హరవిలాసం లోని కిరాతార్జునీయం భారవి తో సంబంధమే లేదు .అతడు ‘’సర్వాంగీణ  కీర్తి ఖర్జువు ‘’ప్రతిభ కంటే పాండిత్యం ఎక్కువ .శ్రీనాథుడు ‘’కచ్చిపోతు‘’.తనంతటి వాడు ఇంకోడు ఉంటె సహించ లేడు.అందుకే ‘’కంటకుడైన శాత్రవు డోకండు తనంతటి వాడు కల్గినన్ –కంటికి నిద్ర వచ్చునే సుఖంబగునే రతి కేళి ‘’?అన్నాడు .

    వామన భట్ట భాణుడు ఆ కాలం లో కొండ వీటిలో ఉన్నాడు .తరువాత విద్యానగరం నుండి వచ్చి రెడ్డిరాజులను చేరాడు .ఇతనికి డిండిమ భట్టు పై అభిమానం .మన కవి సార్వ భౌముడు రెడ్డి రాజుల విద్యాధికారి .అనేక దేశాల పండితులతో భాషించాడు .పండితులు ‘’క్రోడ పత్రాలు ‘’కూడా బయట పెట్టె వారుకాదు .శాస్త్ర చర్చలు ఎడతెగక సాగేవి .పరస్పర అవహేళనలే ఎక్కువ .సిద్ధాంత గ్రంథాలకంటే పూర్వ పక్ష గ్రంథాలపైనే అధికారం ఉండేది .ఉత్తరాది మఠానికిచెందిన’’ సత్య ధ్యాన తీర్ధులు’’ద్వైతులు. దాన శూరులు .ఆది శంకరుల గ్రంథాలన్నీ కొట్టిన పిండి వారికి .శాస్త్ర వాద పద్ధతిని రాయలు నాలుగు పద్యాలలో భేషుగ్గా వర్ణించాడు .

 వేదాంత దేశికులు  డిండిముడిని ఓడించారు .కాని శ్రీనాథుడు  డిండిమ భట్టును ఓడించి అతని కంచు ఢక్క పగల కొట్టించే దాకా నిద్ర పోలేదు .రాజసం శ్రీనాథుడి సొత్తు .అప్పుడే ‘’కర్నాటక దేశ కటక పద్మ వన హేళి’’అని పించుకొన్నాడు .రెడ్డి రాజులు రాసిన  మాళవిక ,గాధా ,అమరుకం మొదలైన కావ్యాలలో శ్రీనాధుడి హస్తం ఉండి ఉండచ్చు అని నారాయణాచార్యుల వారి ఊహ .కవిత్వాన్ని జీవితాన్ని ఒకటిగా చేసుకొన్న కవి ఇంకోడు లేడు.’’దూడ పేడ ,పసిపిల్లల ఉచ్చ ,జంగమ రాలి వక్షోజాలు అన్నీ కవిత్వీకరించాడు .శ్రీశ్రీ గారి ‘’అగ్గిపుల్లా సబ్బు బిళ్ళ కాదేది కవిత కనర్హం ‘’కు శ్రీనాథుడే స్పూర్తి అనిపిస్తోంది  నాకు .మగడు చచ్చిన మగువ బతక రాదని శ్రీనాథుడి అభిప్రాయం .వాళ్ళ ప్రస్తావన వచ్చినపుడు నీచం గా ‘’మగడు చచ్చిన ముండ ,ముండ దీవెన ,తలకు మాసిన ముండ ‘’అని తిట్టాడు ‘’విశ్వస్త వడ్డించటం హేయం గా భావించాడు .

 శ్రీనాథుడికి దేనినైనా ‘’ఆస్ఫాలించటం ‘’ఇష్టం ఆ శబ్దాన్ని పలుమార్లు ఉపయోగిస్తాడు .శబ్దాలను ఆలోచించి ప్రయోగించడు మనల్నీ ఆలో చింప నీయడు  అంత వేగం గా పద్యం ప్రవిహిస్తుంది .పెద్దన గారి శబ్ద ‘’వశిత్వం ‘’ఎవరికీ రాలేదు .ఇతను వాచ్య కవి .’’కుల్లా యుంచితి కోక గట్టితి మహా కూర్పాసమున్ దొడ్గితిన్ –తల్లీ కన్నడ రాజ్య లక్ష్మీ దయ లేదా నేను శ్రీనాడ న్ ‘’అని రాయల దర్శనానికి వెళ్లి చెప్పాడు పూర్తిగా కన్నడ వేషం వేసుకోన్నాననే చెప్పాడు తల్లీ అంటూనే నేను శ్రీనాదుడన్ అన్నాడు .శ్రీనాధుడు అంటే లక్ష్మీ దేవి భర్త .ఇది ఆలోచించకుండా ఆ వేగం లో అనేశాడు అంటారు సరస్వతీ పుత్రులు .కాళిదాసు ను అందుకోవాలనే తపన. కాని అది సాధ్యంకాలేదు. కాళిదాసు సున్నిత వీణాగానం .శ్రీనాధుడు ‘’ఆర్గాన్ ‘’ధ్వని .ఆయన జీవనాడి ఈయనకు చిక్కదు .అంటారు ఆచార్యులు .శ్రీనాధుని పద్యం పైన పటారం లోన లొటారం .

     విజయనగర కవులు శ్రీనాధుడిని అడ్డం పెట్టుకొని బాగా గడించారట .అర్ధ గామ్భీర్యంలేని పద్యాలెన్నో చెప్పాడు రచనలో, జీవితం లో లౌల్యం ఎక్కువ .ఆడదికనిపిస్తే చాలు బహిరంగం గానో రహస్యం గానో చాటువు లు చేటల్లో చెరిగాడు .నారదుడి మహతి అనేవీణ ను తానె మోసుకొని వెళ్ళినట్లు మన పురాణాలు శాస్త్రాలు అన్నీ చెప్పాయి. కాని శ్రీనాధుడు మహాతిని ధరించటానికి ఒక  ‘’ఆడమనిషిని ‘’ పెట్టాడు  దటీజ్ శ్రీనాథ –మగాళ్ళు రోత, ఆడాళ్ళు మోత ఆయనకు .’’శివుడైనా అగస్త్యుడైనా భార్య ల ‘మెరుగు పాలిండ్ల పై పవళించాల్సిందే ‘’ ‘’అదిలేక పొతే ‘’ఆయన కు తోచదు శృంగార ప్రియుడు కదా .దాన్ని వాళ్ళకీ అంటించాడు .

       శ్రీనాధుని శృంగార నైషధం సర్వాంగ సుందరం గా స్వతంత్ర కావ్య గౌరవాన్ని పొందింది .దీన్ని చూసి పిల్లల మర్రి పిన వీర భద్రుడు ‘’మా –డు ము వు లు ‘’మాకిచ్చి మీ సంస్కృతాన్ని తీసుకోండి ‘’అని ఆక్షేపించడట. అంటే అన్నీ సంస్కృత పదాలే నువ్వు పొడి చేసిందేమిటి ?’’అని దెప్పాడన్నమాట .’’శ్రీనాధుడు తప్ప మరే కవి అయినా నైషధం మీద చెయ్యి వేస్తె అది కోతి పిల్ల అయ్యి ఉండేది ‘’అని నిష్కర్షగా నిర్మొహమాటం గా హృదయ స్పూర్తిగా శ్రీనాదుడిని మెచ్చిన పుట్టపర్తి వారి ఔదార్యానికి జేజేలు .చిత్ర విచిత్రాలైన కల్పనలకు దూరాన్వయ ,క్లిస్టాన్వయాలకు  హర్ష నైషధం పెన్నిధి .హర్షుడికి ఉన్న రస కండూతి ఏ సంస్కృత కవికీ లేదన్నారు .’’అడుగడుగునా ‘’అమృతాంజనం ‘’‘’పట్టించుకోవాల్సిందే . భావాలకు హర్షుడు భోషాణం ‘’అన్నారు .’’శ్రీనాధుడికి నాలుక దురద ‘’ ఎక్కువ .హర్షుడు హర్షుడే శ్రీనాథుడు శ్రీనాథుడే –గురువు గురువే శిష్యుడు శిష్యుడే .ఒకరి చేతిలో ఇంకొకరు ఓడిపోలేదని తేల్చి చెప్పారు పుట్టపర్తి వారు .గబ్బిట దుర్గాప్రసాద్ -6-9-21-ఉయ్యూరు 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆధునిక భారత దేశ ప్రధమ ముస్లిం టీచర్ –ఫాతిమా షేక్(వ్యాసం) – గబ్బిట దుర్గా ప్రసాద్

ఆధునిక భారత దేశ ప్రధమ ముస్లిం టీచర్ –ఫాతిమా షేక్(వ్యాసం) – గబ్బిట దుర్గా ప్రసాద్

01/09/2021గబ్బిట దుర్గాప్రసాద్

ఫాతిమా షేక్ జనన ,మరణాల తేదీలు తెలియదు కానీ ,బారత దేశం లో మొదటి ముస్లిం టీచర్ గా ఫాతిమా షేక్ గుర్తింపు పొందింది . ఆ కాలం లో సా౦ఘిక సంస్కర్తలైన జ్యోతిబాయ్ ఫూలే ,సావిత్రీ బాయ్ ఫూలే లకు ఫాతిమా సహోద్యోగి .ఈమె మియాన్ హుస్మాన్ షేక్ కు సోదరి . ఈయన ఇంట్లోనే జ్యోతిబా ,సావిత్రీ బాయ్ లు అద్దెకు ఉండేవారు .

ఫూలే స్థాపించిన పాఠశాలలో ఫాతిమా షేక్ దళిత విద్యార్ధులకు విద్య బోధించి ఆధునిక భారత దేశం లో మొట్టమొదటి ముస్లిం టీచర్ గా రికార్డ్ నెలకొల్పింది .జ్యోతి ,సావిత్రి లతో కలిసి ఫాతిమా అణగారిన సమాజం లోని వారి విద్యా వ్యాప్తికి తీవ్రంగా కృషి చేసింది .

అమెరికన్ మిషనరీ సింధియా ఫరార్ అహ్మద్ నగర్ లో నెలకొల్పిన టీచర్ ట్రెయినింగ్ సంస్థలో జ్యోతిబాయ్ ,ఫాతిమాలు తమ పేర్లను నమోదు చేసుకోవటం తో వారిద్దరి మధ్య పరిచయమేర్పడింది .ఫూలెలు స్థాపించిన అయిదు స్కూళ్ళలో ఫాతిమా అన్నిమతాల ,కులాల వారికి విద్య గరపింది .అంతేకాదు బొంబాయిలో 1851లో ఫూలెలు నెలకొల్పిన రెండు విద్యాలయాల నిర్మాణం లోఫాతిమా షేక్ గొప్పగా సహకరించింది .ఫూలేలతో కలిసిఉన్న కాలం లోని విశేషాలుతప్ప ఫాతిమా షేక్ గురించి అదనంగా సమాచారంఇప్పటికీ అంటే స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు అయినా లభించక పోవటం దురదృష్టం .ఉన్నత తరగతి వారికి ఫూలేలు ఇలాంటి పాఠశాలలు నెలకొల్పటం ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు .కావాలనే వారు అడ్డుపడేవారు బెదిరించేవారు అవసరమైతే క్రూరంగా హింసించే వారుకూడా . ఆడపిల్లల్ని బడికి పంపటానికి ఇష్టపడని తలిదండ్రులకు తరచుగా గంటలతరబడి ఫాతిమా కౌన్సెలింగ్ నిర్వహిస్తూ,వారిని ఒప్పించి , వారి ఆడపిల్లలను ఆ స్కూళ్ళలో చేర్పించేట్లు చేసేది .దళిత బాలికలను విద్యాలయాలలో చేర్పించటం లో ఫాతిమా షేక్ నిర్వహించిన పాత్ర చిరస్మరణీయం .

జ్యోతిబాయ్ ఫూలే జన్మించిన జనవరి 31 అయితే ఫాతిమా షేక్ జన్మించింది జనవరి 9 అని చరిత్రకారులు చెబుతున్నారు .ఇద్దరూ బ్రాహ్మణ భావ వ్యతిరేకులే ,అయినా దేశప్రధాని మొదలు ఆర్ ఎస్ ఎస్ నాయకులవరకు జ్యోతీబాయ్ ని అందలం ఎక్కించి పొగుడుతూ జయంతులు ఘనంగా జరుపుతున్నారే కానీ ,ఫాతిమా ను గురించి ఎవ్వరూ పట్టించు కోవటం లేదు .ఎందుకో ఈ వివక్ష అర్ధం కావటం లేదు .జ్యోతిరావు ను సావిత్రీ బాయ్ నీ వారు చేసే కార్యక్రమాలు నచ్చక తండ్రి తమ పూర్వీకుల ఇంట్లో నుంచి బలవంతంగా బయటికి నెట్టేస్తే ,అప్పుడు వారిని సోదరిలుగా ఆహ్వానించి అక్కున చేర్చుకొని ,తమ ఇంట్లో ఆశ్రయం కలిపించింది ఫాతిమా షేక్ ,ఆమె సోదరుడు ఉస్మాన్ షేక్ లే .

అణగారిన అట్టడుగు పేద ప్రజల వికాసం కోసం సావిత్రీ బాయ్ తన మొదటి స్కూల్ ను ఫాతిమా సహాయంతోనే ప్రారంభించింది .ఈ ఇద్దరూ కలిసి ఆనాటి సంప్రదాయ చాందస హిందూ ,ముస్లిక్ సమాజాలను ధైర్యంగా ఎదిరించి నిలబడ్డారు .తమ కర్తవ్య౦ నెరవేర్చుకొన్నారు .దళితులలో విద్యా వికాసం కలిపించారు,వారి జీవితాలలో వెలుగు నింపారు .

19వ శతాబ్ది ముస్లిం మహిళ ఫాతిమా షేక్ ఆనాటి పితృస్వామ్య ,సంప్రదాయ ముస్లిం పెద్దల ,సమాజాలను మొక్కవోని ధైర్యంతో ఎదుర్కొని ,తన ధ్యేయాన్ని చాటి తన అంకిత భావంతో దీన జనోద్దరణ చేసి ఆదర్శంగా నిలిచింది .అంతటి సాహసం ఆ కమ్యూనిటి లో అంతవరకూ ఎవ్వరూ చెయ్యలేదు .భేష్ ఫాతిమా భేష్ .జీవితాలలో వెలుగులు నింపిన జ్యోతిబాయ్ లాంటి వారిని గుర్తుంచుకొని .చీకటిలో మగ్గిపోయే వారి జీవితాలలో వెలుగులు చిమ్మిన ఫాతిమా ను గుర్తించకపోవటం. గుర్తుంచుకోకపోవటం చారిత్రిక తప్పిదం కాదా అని ప్రశ్నిస్తోంది నేటి యువతరం ‘.ఫాతిమా షేక్ జీవితం పై మంచి అవగాహన ఉన్న విద్యావేత్త నస్రీన్ సయ్యద్ చెప్పిన విషయం – “Fatima Sheikh knew how to read and write already, her brother Usman who was a friend of Jyotiba, had encouraged Fatima to take up the teacher training course. She went along with Savitribai to the Normal School and they both graduated together. She was the first Muslim woman teacher of India”. Fatima and Savitribai opened a school in Sheikh’s home in 1849.

భారత దేశం లో మహిళా విద్యా వ్యాప్తికీ ,సంఘ సంస్కరణలకు ముందుగా నిలబడిన ఫూలేల సరసన నిలబడి, అంతే అంకిత భావంతో కృషి చేసిన ఫాతిమా షేక్ పై చిన్నచూపు చూడటం క్షంతవ్యం కాదు .భారత జాతీయ పునరుజ్జీవనం గురించి మన చరిత్రకారులు ,రాజారామ మోహన రాయ్ ,ఈశ్వర చంద్ర విద్యాసాగర్ ,స్వామి దయానంద ,స్వామి వివేకానంద ,మహాదేవ గోవింద రానడే లను చరిత్ర పుస్తకాలలో ఆకాశానికి ఎత్తేశారు .అప్పటికి సావిత్రీ బాయ్ గురించి స్మరణే లేదు .ఆతర్వాత దళితులూ ,బహుజన కార్యకర్తలూ ఆమెను గురించి రాశాక మాత్రమె ఆమె గురించిన ఫోటోలు క్లిప్పింగ్ లు బయటికి తెచ్చారు .బహుజన నాయకుడు కాన్షీరాం బహుజన సమాజ పార్టీ స్థాపించిన తర్వాతనే సావిత్రీబాయ్ జీవిత విశేషాలు కోట్లాది జనాలకు తెలిసింది .అయితే ఆమె తో పాటే అంతే విశిష్ట కృషి చేసిన ఫాతిమా షేక్ ను మర్చేపోయారు మళ్ళీ మన చరిత్రకారులు . ఇంతటి వివక్ష చరిత్రకారులకు ఉండటం క్షంతవ్యం కాదు .పోనీ ముస్లిం చరిత్రకారులకు కూడా ఆమె త్యాగం ధైర్య సాహసాలు ముందుచూపు కనిపించకపోవటం ఆమె జీవితం పై గొప్పఅధ్యయనం చేసి ఆమె జీవితాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించకపోవటమూ గొప్ప తప్పిదమే కదా .

-గబ్బిట దుర్గా ప్రసాద్

Posted in రచనలు | Tagged | Leave a comment

కేరళపాణిని రాజరాజ వర్మ 4

కేరళ పాణిని -4
ఉద్యోగం లో ఉన్నత దశ  
రాజరాజ వర్మ అధ్యాపక వృత్తిలో శిఖరాగ్రం అందుకొన్న కాలం ఇది .పాశ్చాత్యులు మాత్రమే అధిష్టించాల్సిన ఉన్నత పదవులు వర్మకు దక్కటం ఆయన ప్రతిభా విశేషం .19 10 లో సంస్కృత ,ద్రావిడ భాషలకు ఆచార్యుడయ్యాడు .ఈ విషయం మేనమామ  కేరళ వర్మకు ముందు తెలిసి మేనల్లుని అభినందిస్తూ టెలిగ్రాం పంపాడు .1910 నుంచి 15 వరకు ఆచార్యుడుగా ఉన్న ఈ అయిదేళ్లు సవ్యంగా జరగలేదు .కళాశాల పాలక వర్గ సమావేశాలలో ఈయనకు ,ప్రొఫెసర్లు అయిన యూరోపియన్ లకు ఏక వాక్యత కుది రేది కాదు  .సంస్కృతానికి మాళ యాళానికి వేర్వేరుగా ట్యూటర్లు నియమించాలని వర్మ అభిమతం .అది కుదరదని వారు అడ్డుపడే వారు .అయినా అంతిమ విజయం వర్మకే దక్కింది . ఆ ప్రకారంగా నండియార్  వీట్టిల్  పరమేశ్వర పిళ్ళే ,  అత్తూరు    కృష్ణాపీషరాడి లు తిరువనంతపురం మహారాజా కాలేజీలో ఆచార్యులుగా నియమితులయ్యారు . వీరు మలయాళ భాషాభివృద్ధికి అంకితభావం తో కృషి చేశారు . యూరోపియన్లకు ,భారతీయులకు జీతాల్లో కూడా తేడా లుండేవి . తెల్ల ప్రొఫెసర్ కు 75౦  ,నల్లవారికి 45౦  రూపాయాలిచ్చేవారు .మూడేళ్లు పోరాడితేకానీ సామాన్య జీతాలు రాలేదు . యూరోపియన్ లే  ప్రిన్సిపాల్స్ అయ్యేవారు .19 13లో వర్మ ను కేవలం 8  రోజులు ప్రిన్సిపాల్ గా ఉంచటం గగన మైంది.19 16 లో 7 నెలలు ,19 18 లో 3 నెలలే  తాత్కాలిక ప్రిన్సిపాల్ గా ఉన్నాడు వర్మ .
     సంస్కారణాభి లాష  
19 14 లో కళాశాల వర్ధంతి ఉత్సవాలకు వర్మ  అధ్యక్షత వహించి ,తన అధ్యక్షోపన్యాసన్ని జాగ్రత్తగా రాసి   సెనేట్ , సిండికేట్ ,అకడమిక్  ,విశ్వవిద్యాలయ  సభ్యులకు , ఇతర అధికారులకు , సభ్యులకు పంపాడు . మద్రాస్ యూని  వర్శిటీ లో దేశ భాషలను నిర్బంధ పాఠ్య  భాగం గా తొలగించడాన్ని ఖండించాడు . అందులో కొన్ని ముఖ్య విషయాలు -దక్షిణ భాషలలో  జరిగే ఉన్నత పరీక్షలకు అనువైన పుస్తకాలు కనీసం వచనం లో నైనా లేవు .ఒకటి రెండు ఉన్నా ఆంగ్ల సాహిత్యం లో ఉన్నస్థాయిలో లేవు దీనిపై నిర్లక్ష్యం చూపించటం దారుణం .ఆధునిక బోధనా పద్ధతులను ,విమర్శ సూత్రాన్నీ అన్వయించి పండితులు బోధించటం లేదు .. అందుకే అవి విద్యార్ధులకుఏవగింపుగా ఉన్నాయి . పరీక్షాధికారులు అర్ధరహితమైన ప్రశ్నలడిగి విద్యార్ధులను గందరగోళ పరుస్తున్నారు . ఇవి నిష్పక్షపాతంగా ,కళ్ళు  తెరిపించేవిగా రాజరాజ వర్మ చెప్పిన సత్యవాక్కులు   .జాతీయ సంస్కృతీ ప్రచారానికి ఆయన కొన్ని సూచనలు చేశాడు -దేశ భాషలను సవరించాలికానీ తొలగించకూడదు . వాటి అధ్యయనానికి న్యాయం జరగాలి . చాలా కాలేజీలలో దేశభాషల బోధకులకు ఉత్తమ శిక్షణ ఇవ్వటం జరగటం లేదు . నామ మాత్ర జీతాలిస్తూ ,వారిని పస్తులు0చుతున్నారు .పాతకాలపు పండితులకే ఈఉద్యోగాలివ్వటం న్యాయం కాదు . అందుకని విద్యార్ధుల దృష్టిలో భాషలకు న్యాయం జరగటం లేదు . మలయాళం లో వచ్చిన బోధన పుస్తకాలు బాగానే ఉన్నాయి .సాహిత్య విమర్శ ,విజ్నాన   శాస్త్రాలలో నాణ్యమైన పుస్తకాలు రావాలి . వీటి రచనకు సుశిక్షితులైన పట్టభద్రులు కావాలి . పాత పండితులలో ఉన్న మూఢత్వం  పోగొట్టి ,ఆధునిక దృక్పధం అలవరచాలి . నూతన ప్రణాళికలు కావాలి .ఆంగ్ల భాష నుంచి ఇతరభాషాలకు ఇతరభాషాలలోని వాటిని ఇంగ్లీష్ లోకి అనువాదించటానికి విశ్వ విద్యాలయ విద్యాప్రణాళికలో నిర్బంధంగా చోటు కల్పించాలి . ప్రాంతీయ భాషలే ప్రజల భాషలు . ఇంగ్లీష్ తో వీటికి సరైన  సామాన్య స్థాయి కల్పించాలి . విదేశీ సంస్కృతి ,విజ్నాలాలలో   కొంతవరకైనా  దేశీయ భాషలవారికి అవగాహన కల్పించాలి ”అని వర్మ రాసిన అధ్యక్షోపన్యాసాన్ని వేలాది మంది విద్యావేత్తలు ప్రశంసించారు . బిఎ ఆనర్స్ భారతీయ భాషలలొ ప్రవేశ పెట్టాలనీ ,తిరువనంతపురం లో మరొక విశ్వ విద్యాలయం ఏర్పాటు చేయాలనీ ,మద్రాస్ యూని  వర్శిటీ తన తప్పులు తాను సవరించుకోవాలని కోరాడు . ఆనాటి వర్మకొరికలు గొంతెమ్మకోరికలు అని అప్పటి వారికి అనిపించి ఉండచ్చు . ఆతర్వాత జరిగిన సంఘటనలు వర్మ దూర దృష్టికి ఎలా నిదర్శన లుగా ఉన్నాయో తెలుస్తుంది .19 35 లో తిరువనంతపురం మహారాజాకాలేజీ లో మాలయాలభాషలో బిఎ ఆనర్స్ ఏర్పడింది .19 37 లో తిరువనంతపురం యూని  వర్శిటీ ఏర్పడింది .ఇవన్నీ వర్మ సూచనలు కోరికలు ఫలాప్రాప్తి న0దాయి  . ఇదే తర్వాత కేరళ విశ్వ విద్యాలయం అయింది .
     విద్యా విషయక వ్యాసంగాలు
    ప్రొఫెసర్ గా ప్రిన్సిపాల్ గా ఉంటూనే వర్మ భాషా ప్రణాళికా ,సామాన్య విద్యా విధాన బాధ్యతలు కూడా తలకెత్తు కోవాల్సి వచ్చి సమర్ధంగా నిర్వహించాడు . పాఠ్య పుస్తక ప్రణాళికా సభ్యుడుగా ఉన్నాడు .ఆరాష్ట్ర పాఠ్య పుస్తక సంఘ సభ్యుడు గా గణనీయమైన సేవలందించాడు . బహిరంగ ఉపన్యాస సంఘానికి కార్యదర్శీ కూడా .భాషా పరిష్కరణ సంఘ సభ్యుడు . ఇన్నిటిలో బిజీబిజీ గా ఉన్నా రచన ప్రక్రియ మాత్రం మానలేదు . ఉద్యోగం లో ఉన్న చివరి ఎనిమిదేళ్ళ కాలం లో రాజరాజ వర్మ -సాహిత్య సహ్యం ,అభిజ్నాన శాకుంతలం కు మలయాళ అనువాదం ,లఘు పాణినీయ ద్వితీయభాగం ,మాలవికాగ్ని మిత్రం ,చారుదత్తం ,స్వప్న వాసవ దత్తం నాటకాలు అనువదించాడు . పాఠశాల వాచకాలు కూడా రాశాడు . రాజరాజ వర్మ రాసిన ”కేరళ పాణినీయం ”సంపూర్ణంగా పరిష్కరింపబడి 19 17 లో ప్రచురితమైంది . ఎనిమిదేళ్లలో ఇన్ని గ్రంధాలా అని అనుమానించే వారికి ఆయన డైరీలే  సాక్షి  .ఉదయం 6 కు లేచి ,8 కి ఒకకప్పు కోకా తాగి 10 కి స్నానం పూజ,11 కు  భోజనం ,నేలపై నిద్ర ,పిల్లలతో కాలక్షేపం ,గంటన్నర నిద్ర ,తర్వాత ఏదో ఫలహారం ,తర్వాత చదవటం రాయటం ,3 -30 కి కాఫీ ,తర్వాత కరెస్పానడేన్స్ ,5 కు గృహా ఆవరణలో నడక ,లేదా క్లబ్ లో టెన్నిస్ ఆట ,ఇంటికి వచ్చి స్నానం చేసి పత్రికలు గ్రంధాలు  చదవటం ,రాత్రి 8 కి భోజనం ,తర్వాత కుటుంబ  సభ్యులతో పిచ్చాపాటీ ,10 కి నిద్ర .
   సశేషం
మీ-గబ్బిట  దుర్గా ప్రసాద్ -2 -9 -21 -కాంప్ -మల్లం పేట -హైదరాబాద్

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కేరళ పాణిని-రాజరాజ వర్మ 3

కేరళ పాణిని-రాజరాజ వర్మ -3
ఉపాధ్యాయుడు -పరిశోధకుడు
రాజ వంశ సంబంధాలు రాజరాజ వర్మను సంపన్నుడిని చేయలేదుకానీ అవసరాలు తీరాయి .మేనమామ సహాయం ఎలానూ ఉండనే ఉంది .స్వంతకాళ్ళ మీద నిలబడాలన్న తపనతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం లో చేరాలనుకొన్నాడు కానీ రాజ వంశాస్తులు ప్రభుత్వ ఉద్యోగం చేయటం ఆచారం కాదు.దీన్ని లక్ష్య పెట్టలేదు .తిరువనంతపురం లో సంస్కృత పాఠశాల పెట్టాలని ప్రభుత్వం భావించింది .దీనికి సమర్ధుడు వర్మ అని తెలిసినా ,చిన్నవాడు అని భావించారు .కానీ 1890లో రాజరాజ వరమనే ప్రధానోపాధ్యాయునిగా ప్రభుత్వం నియమించింది .సిలబస్ కానీ ,పాఠ్యపుస్తక ప్రచురణ కాని లేదు .వీటి నన్నిటిని తన ప్రతిభతో రూపొందించి ,మార్గ నిర్దేశనం చేసి పాఠశాల నిర్వహి౦చి గాడిలో పెట్టాడు .విద్యాలయం స్థాయీ ప్రమాణం పెంచాడు .బ్రాహ్మణేతరులకు కూడా ఇక్కడ చదువుకొనే అవకాశం కల్పింఛి మార్గ దర్శి అయ్యాడు .తిరువనంతపురం లోనే స్థిర నివాసమేర్పరచుకొన్నాడు .సంస్కృతం ఎం ఎ కు అప్లికేషన్ పెట్టుకొన్నాడు .గుర్రపుస్వారీ ,చదరంగం ,పేకాట యధా విధిగా సాగటం వలన చదువు కుంటుపడింది .లఘు సిద్ధాంత వ్యాసం రాయాలి దానికోసం.అందుకు ‘’నారాయణ భట్టు -కృతులు ‘’అంశాన్ని ఎంపిక చేసుకొన్నాడు .ఇందులో సాయం చేసే ప్రజ్ఞకల పండితులేవరూ లేరు కనుక స్వయంగా అన్నీ వర్మ చూసుకొన్నాడు .ఇండియన్ యాన్టిక్వేరి వంటి పత్రికలన్నీ తిరగేసి నోట్స్ రాసుకొన్నాడు .1891లో పరేక్షరాసి విశ్వ విద్యాలయం లో ప్రధమ స్థానం సంపాదించినా ,సెకండ్ క్లాస్ లో పాసయ్యాడు .ఆ రోజుల్లో ఫస్ట్ క్లాస్ రావటం అతి దుర్లభంగా ఉండేది .ముఖ్య పరీక్షాధికారి శేష గిరి శాస్త్రి కి వర్మ రాసిన సమాధానాలు విశేషంగా నచ్చి ,ఆ జవాబుపత్రాలను భద్రపరచావలసినదిగాఅధికార్లను ఆదేశించాడు .గ్రీకు భాష నుంచి సంస్కృతం గ్రహించిన 12పదాలు రాయమని ప్రశ్న ఉంటె వర్మ 30పదాలురాసి అవాక్కయ్యేట్లు చేశాడు .అనువాదానికి ఇచ్చిన మిల్టన్ కవి ఆంగ్ల పద్యాన్ని సంస్కృతం లో చక్కని కవిత్వంగా అనువదించాడు వర్మ .సంస్కృతం లో ప్రావీ ణ్యతకు ఇచ్చే ‘’రాస్ బంగారుపతకం ‘’,మునిస్వామి శెట్టి పతకాలను రాజరాజ వర్మ పొందాడు .
సంస్కృత కళాశాల ఉద్యోగం
1894లో వర్మ సంస్కృత కళాశాల ప్రధాన ఆచార్యుడయ్యాడు .కళాశాల విస్త్రుతాభి వృద్ధికి శక్తినంతా ధారపోసి పనిచేశాడు .పాఠ్య ప్రణాళికలో సాహిత్యం ,ఆయుర్వేదం జ్యోతిషం లను చేర్చమని ప్రభుత్వానికి సూచన చేశాడు .జాతీయ కళలకు ,విజ్ఞాన శాస్త్రానికి వాజ్మయానికి ప్రాధాన్యత నివ్వటం ఆయన లక్ష్యం .ఖగోళశాస్త్రం బీజగణితం ,చరిత్ర, త్రికోణమితి పాఠ్య ప్రణాళికలో చేర్చిన క్రాంత దర్శి వర్మ .ఆల్జీబ్రా, ట్రిగనామెట్రి స్వయంగా బోధించేవాడు. వీటి ఆంగ్ల పాఠ్య గ్రంథాలను సంస్కృతం లోకి అనువాదం కూడా చేసిన నేర్పరి .ఆ కాలం లో ఆంగ్లేయులైన ఆచార్యుల ,వారి అనుయాయుల అభిప్రాయాలకే విలువ నిచ్చేవారు .కానీ రాజరాజ వర్మ అభిప్రాయాలు ఆతర్వాత ఇరవై అయిదేళ్లకు అమలుపర్చబడినాయని చరిత్ర చెబుతోంది .అంతటి విలువైన సూచనలు అభిప్రాయాలు ఆయన చెప్పాడన్నమాట .ఆంగ్లం ,సంస్కృతం లలో తనకున్న అపూర్వ ప్రజ్ఞను తన రచనల్లో నిక్షిప్తం చేసి తన సహాధ్యాయులైనఇద్దరు శాస్త్రులకు వాటిలో నిష్ణాతుల్ని చేశాడు .వీరిలో గణపతి శాస్త్రి కావ్య పరిష్కర్తగా ,పత్రికా సంపాదకుడుగా ప్రసిద్ధికెక్కాడు .విద్యారంగం లో తన స్థాన్నాని ఎలా పదిల పరచుకున్నదీ ,పై అధికారుల వేధింపులు ఎలా ఉండేవి అనే విషయాలను తన డైరీలో రాసుకొన్నాడు వర్మ .ఆరోజుల్లో మళయాళం వంటి ప్రాంతీయ భాషలను చులకనగా చూసేవారు వాటిలో ఏముంది నేర్చుకోవటానికి అని ప్రశ్నించేవారు .మళయాళ భాషకూ గొప్ప భవిష్యత్తు ఉందని వర్మ ఊహించాడు .అది మార్గ దర్శనం చేస్తుందనే సత్యాన్ని తనజీవితంలోనే తర్వాత కాలం లోచూశాడు
దేశభాషల అధ్యయన పర్యవేక్షకుడు
1896-1898మధ్యకాలం లో ఆయుర్వేద సంస్థాకారి బాధ్యతల్నీ ,కళాశాల ప్రధాన ఆచార్య అంటే ప్రిన్సిపాల్ బాధ్యతల్నీ ఒక్కరే నిర్వహించాలి అన్నదాన్ని ప్రభుత్వం తిరస్కరించి ,పురావస్తు శాఖాధికారి పదవి ఖాళీ అయితే ,ప్రిన్సిపాల్ ఒక్కరే దాన్నినిర్వహించగల సమర్ధుడు అనేదాన్నికూడా తోసిపుచ్చింది .అప్పటికే రాజరాజవర్మ కీర్తి దక్షిణ దేశమంతా విస్తృతంగా వ్యాపించింది .మహారాజా కాలేజిలో దేశభాషల అధ్యయన పర్యవేక్షకుడు గా వర్మ1899లో నియుక్తుడయ్యాడు . ఉన్నత విద్యలలో భారతీయ భాషలకు తగిన ప్రాతినిధ్యం లేదని గ్రహించాడు . పాఠ్యగ్రంథాలుకూడా నిర్డుష్టంగాలేవని తెలుసుకొన్నాడు .మేలురకాలైన పుస్తకాలు ఎంపిక చేసి ,కొత్తపుస్తకాలు రాయించి ,పాఠ్య ప్రణాళికలో సవరణలు చేయించాడు వర్మ .ఎఫ్ ఎ .బి.ఏ క్లాసులకు అనేక పాఠాలు తానె బోధించేవాడు .అవసరానికి తగిన ఛందో వ్యాకరణ,అలంకార గ్రంథాలు తానె రాశాడు .విద్యార్ధులకు శిక్షణ ఇవ్వటం లో లెక్చరర్లకు మార్గదర్శిగా ఉండేవాడు .ఆయన ప్రియతమ శిష్యులు పంచణ్ణన్,పీకే నారాయణ పిళ్లే లు తర్వాత సహాధ్యాపకులయ్యారు .
భారతీయ భాషోద్ధారకుడు
విశ్వ విద్యాలయాలలో ఇంగ్లీష్ మొదటిస్థానం దేశీయభాషలకు రెండవ స్థానం ఉండేది .దీనిపై విద్యార్ధులు ఆందోళన చేశారు .వర్మకాలం లో మలయాళానికి ప్రాముఖ్యత లభించింది .విద్యా వేత్తగా ,ప్రణాళికా రచయితగా, క్రాంత దర్శిగా అధ్యాపకుడిగా రాజరాజ వర్మ అందరికంటే ముందున్నాడు .మళయాళ భాషా బోధనలో ఉత్తమ ఉపాధ్యాయడని పించుకొన్నాడు .చివరి 25ఏళ్లకాలం లో అధికం గా మళయాళ రచనలే చేశాడు వర్మ .ఇంగ్లాండ్ హిస్టరీ, ధాకరే స్కాట్ల నవలలు ,స్కోపెన్ హార్ రచించిన ‘’విజ్డం ఆఫ్ లైఫ్ పుస్తకాలు ఆయన చదివినట్లు ఆయన డైరీలు చెబుతున్నాయి .’’కేరళపాణినీయం’’అనే వ్యాకరణ గ్రంథాన్ని రాయటానికి మహాకవి కుంజీ కుట్టు తంపురాన్ కు చూపించి అభిప్రాయం తీసుకొన్నాడు .అందుకే రాజరాజవర్మను ‘’ కేరళ పాణిని ‘’అన్నారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -31-8-21-కాంప్ -మల్లం పేట (బాచుపల్లి )-హైదరాబాద్

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

కేరళపాణిని రాజరాజ వర్మ -2

కేరళపాణిని రాజరాజ వర్మ -2

ఉన్నత విద్య

మెట్రిక్ తేలిగ్గా పాసై రాజరాజ వర్మ విశ్వ విద్యాలయం లో చేరేసమయం లోతల్లి మరణం తో ఒక ఏడాదిపాటు క్షురకర్మ చేయిన్చుకోకుండా కర్మకాండలు పూర్తీ చేయాల్సి ఉన్నందున విద్య సాగలేదు .  చదవాలని ఉన్నా పెద్దలు అంగీకరించలేదు రాజు కి తెలిసి తనకుమారుడు నారాయణ తంపి మద్రాస్ యూని వర్సిటిలో ఎఫ్ ఏ.పరీక్ష రాయటానికి ఇంటి వద్ద ఉండటం తో ,అతనికి రాజప్రాసాద౦లోనే ట్యూషన్ ఏర్పాటు చేసి వర్మను కూడా అక్కడే చదువుకోమని ఆహ్వానించాడు .రాజావారు యూని వర్సిటి పర్మిషన్ కూడా వచ్చేట్లు చేశారు రూపాయి ఖర్చు లేకుండా ఉత్తమ విద్య లభించింది రాజావారి పరిష్కారం తో .విశాఖం తిరునాళ్ మరణించాడు .వర్మ 1886లో ఎఫ్ ఎ పాసై మహారాజావారి కాలేజిలోనే చేరాడు .

  అక్కడే బియ్ చదివి క్రీడలలో కూడా ఆసక్తి కనబరచి ,చదువేకాక ,ఉత్తమ కావ్య పఠనం కవిత్వం రాయటం ,అక్షరశ్లోక పోటీలలో పాల్గొనేవాడు .అన్నిట్లో వేలుపెట్టటం తో చదువు తగ్గి మొదటి ఏడాది పరీక్ష తప్పి తర్వాత పాసయ్యాడు .సంస్కృత ప్రశ్నలకు సమాధానాలు శ్లోకాలో రాసి ఆశ్చర్య పరచేవాడు.పరిక్ష మొదటి సారి తప్పినందున బాగా వ్యాకులం చెంది తన మనో వేదనను సంస్కృత శ్లోకాలలో ‘’భంగ విలాప కావ్యం ‘’గారాసిన సమర్ధుడు వర్మ .కెమిష్ట్రి పరీక్షకు మద్రాస్ వెళ్ళిన సందర్భంగా ఆ అనుభవాన్ని డైరీలో గ్రంథస్తం చేశాడు .శోరనూరు నుంచి రైలెక్కి ,కొంతదూరం ఎడ్లబండిలో ,మరికొంతదూరం పడవలో ప్రయాణం చేయాల్సి వచ్చింది .

  అన్ని అర్హతలు ఉన్న రాజ రాజవర్మ తన కూతురికితగిన వాడని విశాఖం తిరునాళ్ మనసులో భావించాడు .రాజు మరణం తో అది కార్య రూపం దాల్చలేదు . .వర్మ పెద్ద మేనమామ కోయి తంపురాన్  మేనల్లుడికి సంబంధాలు చూసి ,తన మూడవ కూతురు ‘’స్వాతి తిరునాళ్ మహాప్రభ తంపు రాట్టి ‘’   నిచ్చి పెళ్లి చేశాడు .ఆమెకు వర్మపై గొప్ప అనురాగం ఉండేది .26వ ఏట బిఎ పాసై ,మళయాళ క్షత్రియ కులం లో మద్రాస్ యూని వర్సిటి నుంచి మొదటి పట్టభద్రుడు గా రికార్డ్ సృష్టించాడు .దీనికి అనేక బహుమతులతోపాటు రాజా శ్రీమూలం తిరునాళ్ వారి రత్నఖచిత స్వర్ణ కంకణ బహుమానం కూడా పొందాడు .

                                    రచనలు

     బాల్యం లోనే కవిత్వం అబ్బటం తో మద్రాస్ విశ్వవిద్యాలయ ఎం ఎ పరీక్ష కూడా రాసి ,వెంటనే ‘’విమానాష్టకం ‘’రాశాడు ఒక యూరోపియన్ మద్రాస్   లో వాయువు నింపిన విమానం లో అంతరిక్షం లోకి ఎగరటానికి చేసిన ప్రయత్నమే  ఇందులోని వృత్తాంతం .ప్రేక్షకుల ఉత్కంఠ ,ఉత్తెజాలను  అద్భుతంగా వర్ణించాడు .తన రెండవ కూతురు మరణం తో   వియోగం పొందిన  తండ్రి దుఖాన్ని ‘’పితృవిలాప’’అనే స్మృతి కావ్యం గా   ‘’గా రాశాడు .స్నేహితుల ప్రోద్బలం తో పత్రికలకు పంపటానికి రాసిన సరస్వతీ స్తవం ,దేవీ మంగళం ,రాగ ముద్రా సప్తకం ,శ్రీ పద్మనాభ పంచకం ,దేవీ దండకం ఉన్నాయి .ఇంగ్లీష్ కన్నా సంస్కృతం గొప్ప అని తెలిపే ‘’గైర్వాణి’’విజయం రాశాడు .షేక్స్పియర్ ఒథెల్లో నాటకానికి అనువాదంగా ‘’ఉద్దల చరిత్ర ‘’వచన కావ్యం రాశాడు .

   సశేషం

మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -30-8-21-కాంప్ -బాచుపల్లి -హైదరాబాద్

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కవిపండిత ,విమర్శకుడుకేరళపాణిని- రాజరాజ వర్మ

కవిపండిత ,విమర్శకుడుకేరళపాణిని- రాజరాజ వర్మ

రాజరాజ వర్మ కోయిల్ తంపురాన్ అని అసలుపేరు .రాజ వర్మ తంపురాన్,కోయి తంపురాన్ వగైరా లన్నీ రాజవంశస్తుల్ని కేరళ రాజ బంధువుల్ని సూచించేవి .1863లో రాజవర్మ తిరువనంతపురానికి  ఉత్తరంగా  చెంగనా శేరిలోని లక్ష్మీపురం లోని రాజప్రాసాదం లో జన్మించాడు .హైదరాలీ దండయాత్రలనుంచి తప్పుకొవటానికి అనేక రాజకుటుంబాలు మలబారు ప్రాంతం నుంచి తిరువనంతపురం చేరాయి .కాంది శీకులుగా తలదాచుకొన్నారు .వీరిని తిరువనంతపురం రాజు ఉదారంగా ఆదరించాడు .ప్రశాంత పరిస్తితులేర్పడినా చాల మంది వెనక్కి వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోయారు .రాజవంశం తో వివాహాలు ఏర్పాటు చేసుకొన్నారు .అలాంటి బాంధవ్యం ఏర్పాటు చేసుకోన్నవారిలో రాజరాజ వర్మ కుటుంబం కూడా ఉంది.

  రాజరాజ వర్మ తల్లి కున్జిక్కవు తమ్ తమ్పురాట్టి సాహిత్య సామ్రాట్ కేరళవర్మ పెత్తల్లి కూతురు సద్గుణ రాశి .తండ్రి వాసుదేవ నంబూద్రి పట్టియం ఇల్లం గ్రామస్తుడైన వేద విద్వాంసుడు హాస్య చతురుడు .ఆకాలం లో బ్రాహ్మణ నంబూద్రి కుటుంబాలకు ,క్షత్రియ నాయర్ కుటుంబాలకు వివాహ సంబంధాలుండేవి .బాల్యం లో రాజవర్మను కొచ్చత్తాన్ అంటే  చిట్టిబాబు అని పిలిచేవారు .ఇతడు రెండేళ్ళ వయసులో ఉండగా రాజ అంతఃపురం లో కలతలేర్పడ్డాయి .ఆకారణంగా కొందరు రాజ సంబంధీకులు చెంగనా శేరికి 20మైళ్ళ దూరం లోని కార్తికపల్లి కి వలస పోయారు .అక్కడ కేరళవర్మ రాజరాజలకు  ఇబ్బందులేర్పడ్డాయి. తర్వాత మహారాజు సహాయం తో హరిపాదులో కొత్త ఇంట్లో చేరారు .దీన్ని అనంతపురం రాజ ప్రాసాదం అన్నారు .ఇక్కడే రాజరాజవర్మ బాల్యం గడిచింది .విద్యాధికులైన మేనమామలప్రోత్సాహం తో , తల్లి ఆశీస్సులతో బాల్యం ఇక్కడ హాయిగా గడిచింది .చిన్నతనం లో రెండు గండాలుగడిచి గట్టేక్కాడు.రాజభవన ప్రాంగణం లోని కొలనులో పడవలో విహరిస్తుంటే తలక్రిందులై  నీటిలో మునిగిపోయారు వర్మా, బంధువులబ్బాయి ,పనిపిల్లా .కొనూపిరితో బతికి బయట పడ్డారు. మరోసారి పాములు బాగా తిరిగే తోటలో కుడి కాలుపై ఏదో పడి నట్లు అనిపించి క్రమమగా కాలు వాచిపోతుంటే భయం తో ఇంటికి చేరాడు .అది పాముకాటే అని నిర్ధారించారు. ప్రాణాలు దక్కాయి .ఇలా రెండు గండాలు గడిచిన గండర గండడు రాజవర్మ.

     విద్యాభ్యాసం

 రాజవర్మ చదువు సంప్రదాయ బద్ధంగా సాగింది .చునక్కర అచ్యుత వారియర్ ,,శంకర వారియర్ ప్రాధమిక గురువులు చదువుకంటే ఆటలపై ధ్యాస ఎక్కువ .కనుక నాయకుడయ్యాడు బాలలకు .స్వయంగా తెలివి తేటలు అధికం కనుక ఎక్కువ సేపు చదవకుండానే అన్నీ వచ్చేసేవి .రాజవర్మకంటే మేనమామ కేరళ వర్మ 18 ఏళ్ళు పెద్ద వాడు .అప్పటికే ప్రతిభావంతుడైన రచయితగా కేరళ వర్మ ప్రసిద్ధికెక్కాడు .తిరువనంతపురం రాజుతో ఉన్న తగాదా వలన గృహ నిర్బంధం లో ఉండాల్సి వచ్చింది .తర్వాత అలేప్పీ నుంచి హరిపాదుకు తరలించారు .దీనివలన మళయాళ వాజ్మయం గొప్ప లాభం పొందింది .మేనమామ సమక్షం లో రాజవర్మకు సంస్కృతం నేర్చుకోవటానికి గొప్ప అవకాశం లభించింది .ప్రసిద్ధ సంస్కృత సందేశ కావ్యమైన ‘’మయూర సందేశం ‘’కేరళవర్మ దుర్భర భార్యా వియోగ దుఖాన్నిఅనుభవిస్తూ  హరిపాదులోరాశాడు  ఆరేళ్ళకాలం లో రాజరాజవర్మ సంస్కృత కావ్యాలలో నిష్ణాతుడై,కవిత్వం లోనూ సిద్ధహస్తుడయ్యాడు ఒకసారి గురువు శిష్యులు ముగ్గుర్నీ గణపతిపైఅష్టకం రాసి మధ్యాహ్న౦ రెండు గంటలకు  చూపించాలని ఆదేశించారు .ఇద్దరుశిష్యులు వెంటనే మొదలుపెట్టి ఆతర్వాత తోచక బుర్రలు గోక్కుం టు౦టే,రాజవర్మ చివరి నిమిషం వరకు ఏమీ రాయకుండా మధ్యాహ్నం రెండు అవబోతుంటే గభాల్న గుర్తుకొచ్చి అష్టకం రాసేశాడు .మొదటి శిష్యుడి కవిత్వం లో కొన్ని దోషాలున్నాయనీ రెండో వాడి కవిత్వం సంతృప్తిగా ఉందని చెప్పి రాజవర్మను తన అష్టకాన్ని బిగ్గరగా చదవమంటే మొదట్లో భయపడినా చదివాడు

.గురువు రాసిన అష్టకాన్ని కూడా తెప్పించి  వర్మమనే చదవమన్నాడు .ఇద్దరూ నవ్వుకొన్నారు ఒకర్ని చూసి ఒకరు .గురువు కవితాస్థాయిలో శిష్యుడు  వర్మ కవిత్వమూ ఉన్నది. మేనమామ కేరళ వర్మ మేనల్లుడి కవితాప్రాభవాన్ని మెచ్చుకొన్నాడు  మేల్లుడూ ఖుషీ అయ్యాడు .గురు,శిష్యుల అష్టకాలకు నకళ్ళు రాయించి కవి పేర్లు తెలపకుండా తన అన్నగారికి పంపాడు. గురు కవిత్వం తో పాటు సమాన స్థాయిలో వర్మకవిత్వం ఉందని తేల్చాడు అన్న. రాజవర్మకు గొప్ప బహుమతులు లభించాయి .అప్పుడతనివయసు 15మాత్రమే. ఏలాత్తూరు రామస్వామి శాస్త్రిగారు కేరళ వర్మకు గురువు ఒకసారి రాజ ప్రాసాదానికివచ్చి కేరళవర్మ శిష్యుల ప్రజ్ఞా పాటవాలను పరీక్షించాడు .అప్పయ్య దీక్షితులు రాసిన కువలయానందం అనే అలంకార గ్రంధం లో  ‘’అద్యదపి ‘’శ్లోకం తో మొదలుపెట్టి కొన్ని శ్లోకాలు చదివి ,వాటిని వివరించమని కోరారు .పసివాడైన రాజవర్మ వివరించిన విధానానికీ చేసిన వ్యాఖ్యానానికీ ,తెలిపిన అంతరార్దానికి పరవశించిపోయి ,ఆశ్చర్యంతో మనస్పూర్తిగా అభినందించాడు .బాల్యం లోనే సంస్కృత కవికి ఉండాల్సిన ప్రతిభా సామర్ధ్యాలు రాజరాజ వర్మకు అలవడినాయి.సంస్కృత ఛందో వ్యాకరణాలలో అపార పాండిత్యం సాధించి ,అసామాన్య ప్రజ్ఞా దురీణతతో కవిత్వం రాసి కుటుంబీకులను ఇతరులను మెప్పించాడు .

  1880లో తిరువనంతపురం సంస్థానానికి విశాఖం తిరునాళ్ రాజు అవటం తో కేళవర్మ కు అదృష్టం వెతుక్కుంటూ వచ్చింది

రాజప్రాసాద వాసులకు మంచి ప్రోత్సాహం లభించింది .కేరళ వర్మ తిరువనంత పురం మళ్ళీ చేరాడు .విద్వత్ కవి రాజరాజ వర్మ కు రాజుతో సన్నిహిత సంబంధం ఏర్పడింది .రాజవర్మను ఆహ్వానించి విద్యను కొనసాగించమని రాజు కొరాడు.రాజరాజ వర్మ ఇద్దరు విద్యార్ధులతో కలిసి ఇక్కడికి వచ్చి ,’’చంగానా శేరి మూడత్తు మఠం’’లో చేరి ,ఉన్నతపాఠశాలలో విద్య కొనసాగించాడు .ఇదంతా మేనమామ  కేరళవర్మ  ప్రోత్సాహమే .1881లో ఇక్కడ చేరిన వర్మకు కొన్ని బోధనాంశాలు అర్ధం కావటం లేదు .లెక్కల్లో పది శాతం కంటే తక్కువ మార్కులోచ్చినా సగటు మార్కులు ఎప్పుడూ 70శాతం కి తగ్గనేలేదు .ప్రధానోపాధ్యాయుని ప్రత్యెక సిఫారసుతో పైతరతికి ప్రమోటయ్యాడు  .ఇప్పుడు మళయాళం కూడా నేర్వాల్సి వచ్చింది.వర్మకు ఆభాషా  వ్యాకరణం పై ఆసక్తి పెరిగింది  .ఉపాధ్యాయుడు దీనికి తగినట్లు బోధించేవాడు .ఆరోజుల్లో మలయాళానికి విద్యలో తక్కువ స్థానం ఉండేది .వర్మకూడా అలానే భావించాడు .సిలబస్ కూడా విసుగ్గానే ఉండేది అందుకే చులకన భావం ఉండేది అందరికీ .

  మహారాజు విద్యార్ధుల్ని ప్రోత్సహించటానికి సంస్కృతం లో ఎనిమిది పేజీల వ్యాసం రాయమని పోటీ పెట్టాడు .ఉత్తమ వ్యాసానికి గొప్ప బహుమతి .ఆ వ్యాసాలను మొదట రాజు పరిశీలించి ,తర్వాత కేరళ వర్మకు పంపాడు .రాజరాజ వర్మ రాసిన వ్యాసమే ఉత్తమమైనదిగా ఆ ఇద్దరూ ఏకగ్రీవ అభిప్రాయంతో ప్రకటించి  గొప్ప బహుమతి అందించారు .

 సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -29-8-21-కాంప్ -బాచుపల్లి -హైదరాబాద్

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ దాసు లింగమూర్తి -6(చివరిభాగం )

     శ్రీ దాసు లింగమూర్తి -6(చివరిభాగం )

  ముక్తీశ్వరం ,చంద్రవరం

గోదావరి మండలం లో కమలాపురం రాజోలు తాలూకాలు రెండు ఉద్యానవనాలు .విద్యలకు ఆటపట్టు ,ప్రకృతి సంపదకు నిలయం .ద్రాక్షారామ తర్వాత క్షణ ముక్తీశ్వరం లో దాసుగారు ఒక సప్తాహం వైభవంగా జరిపారు .కవిపండితులంతా దాసుగారికి బ్రహ్మ రధం పట్టారు .ఒకసారి రాజమండ్రి పడవ మీద వెళ్లాలను కొంటె అది వెళ్ళిపోతే .కనపడిన దారిగుండా నడుస్తూ  చంద్రవరం చేరారు .ప్రజలు ఆదరంగా ఆహ్వానించి ‘’ఇది మీ పూర్వుల గ్రామం .అన్ని చోట్లా మహాకార్యాలు చేశారు ,ఇక్కడ కూడా ఏదైనా ఒక సత్కార్యం చేయండి ‘’అని కోరగా ,ఒక కాపు నూట యాభై ఏళ్లుగా రామాలయం ఇక్కడ కట్టించాలని అనుకొన్నా జరగలేదు మీరు ప్రయత్నించండి అని కోరగా ‘’నువ్వు ఎంత చందా ఇస్తావు ?’’అని అడిగితె ఒక అణా చేతిలో పెట్టాడు .దానితో ఒక టెంకాయ తెప్పించి దగ్గరలో ఉన్న రామమందిరానికి వెళ్లి ,రాముడిపటానికి నమస్కరించి కొబ్బరికాయకొట్టి నైవేద్యం పెట్టి ,లోపలి గరుడ స్తంభం ఫోటో తెచ్చి ,ఒక ఇంట్లో ఉంచి ,పూరిపాకలో ఉన్న మందిరాన్ని ఊడ దీయించారు .కాసేపటికే అది నేల మట్ట మైంది .ఆరాత్రి పునాదులు తీశారు .

   మర్నాడు ఉదయం ఆరువందల రూపాయలు ,చందాల వివరాలు దాసు గారి చేతిలో పెట్టగా దాన్ని తీసుకోకుండా ,ఒకసంఘాన్ని ఏర్పాటు చేసి వారికిచ్చారు .రామమందిరం ఆఘమేఘాలమీద పనులు జరుగుతున్నాయి  .అప్పుడే పాలపర్తి సూర్యనారాయణగారు దాసుగారిని చాగలమర్రి కి తీసుకు వెళ్ళటానికి వచ్చారు .అందరితో పాటు భజన చేసి  శ్రీమంతులు పునాదులు త్రవ్వుతుంటే ,అగ్రవర్ణ స్త్రీలు భజన చేస్తుంటే ,చూసి ఆశ్చర్యపోయారు .అక్కడి నుంచి రాత్రి 12 గంటలకు ప్రయాణానికి రైల్వే స్టేషన్ కు వెడితే ,అక్కడ దాదాపు మూడువందలమంది జనం చేరగా ,అయిదారుగంటలలో దాసుగారు ఆరు ఉపన్యాసాలు ఇచ్చారు .ఒక్క కాసు కూడా కూలీ తీసుకోకుండా అగ్రజాతి స్త్రీలు సంపన్నుల గృహిణులు భజన చేస్తూ సున్నపు గానుగ త్రిప్పి సున్నం తయారు చేసి రామలయ  నిర్మాణం పూర్తీ చేశారు .ప్రతిష్టకోసం దాసు గారి రాకకై నిరీక్షిస్తున్నారు .

                          చాగలమర్రి

చాగలమర్రికి దాసుగారు శుక్ల సంవత్సర మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చారు అంతకు ముందు ఆగ్రామం లో రెండు నెలల నుంచి ఒక సాదువున్నాడు .ఆయనకు బావిలో సాలగ్రామం దొరికితే శ్రద్ధగా పూజిస్తున్నాడు .ఆ సాలగ్రామం తనకు  ఇవ్వమని సూర్య నారాయణ గారు కోరితే దాసు గారు వారించి’’ఇది ఉత్కృష్ట లింగం సామాన్య గృహస్తు  భరించలేడు.దేవాలయం లో ప్రతిష్టించాలి అని చెప్పారు .దగ్గరలో ఉన్న చెన్న కేశవ దేవాలయం లో ఉన్న ఖాళీ మందిరానని అప్పటికప్పుడే బాగు చేయించి ఆరాత్రి 12 గంటలకు అమావాస్య మంగళవారం నాడు ప్రతిష్టించి మూడవరోజు ఈ భవానీ శంకర లింగానికి బిల్వార్చన చేశారు .

 చెన్న కేశవాలయం1350లో చోళ రాజ ప్రతిష్టిత పురాతనాలయం అని శాసనం ఉంది .భూవసతిలేక పూజా పుంస్కారాలు కనీసం దీపారాధన కూడా జరగటం లేదు .దాసుగారి లింగ ప్రతిష్టతర్వాత జనం లో కదలిక వచ్చి 5వేల రూపాయలు చందా వసూలు చేసి  శాశ్వతం గా  గాపూజ జరిగే ఏర్పాటు చేశారు  .దాసుగారి లింగ ప్రతిష్ట ప్రభావమే ఇదంతా అందరి భావన .

                      సురభేశ్వరీ కోన సప్తాహం  

సెలవు పూర్తయ్యాక దాసుగారిని కంభం తాలూకా రాచర్ల ఫిర్కా రెవిన్యు ఇన్స్పెక్టర్ గా బదిలీ చేశారు .రాగానే జమదగ్ని మహాముని ఆశ్రమం ,కోటి లింగాలకు ఉనికిపట్టు ,గండకీ నదీ తీర ప్రదేశం అయిన సురభేశ్వరీ కోన లో వైభవంగాసప్తాహం చేశారు .అహోబిల క్షేత్రం యొక్క దీన స్థితి దాసుగారికి వివరించి ,పెద్దలు ఏదైనా ఉపాయం ఆలోచించమని కోరగా ,మాఘ శుద్ధ సప్తమి మంచి ముహూర్తంగా భాగవత ప్రశ్న ద్వారా  భావించి 26-3-1931అహోబిల క్షేత్రం లో సప్తాహం చేయటానికి నిశ్చయించారు  .జియ్యరుగారి సలహా సంప్రదింపులతో అది నిర్విఘ్నంగా పూర్తయింది  .

 సమాప్తం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -24-5-21-ఉయ్యూరు

  శ్రీ దాసు లింగమూర్తి దాసు గారి భగవన్నామ సంకీర్తనలు చాగలమర్రి భక్తసమాజం వారు నేటికీ పాడుతూనే ఉన్నారు –

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

   శ్రీ దాసు లింగమూర్తి -5

   శ్రీ దాసు లింగమూర్తి -5

 భార్య మరణం

దాసుగారు భార్య ప్రసవం కోసం అత్తారింటికి తీసుకు వెళ్ళారు .కొద్దిరోజుల్లోనే ఉబ్బు వ్యాధి వచ్చింది .రాజమండ్రిలోని ఘోషా ఆస్పత్రికి తీసుకు వెళ్ళే ప్రయత్నం చేశారు దాసుగారు సెలవు పెట్టి వచ్చేసరికి మామగారు ఆమెను సవారీ బండిలో రాజమండ్రి తీసుకు వెడుతుండగా భార్య కాస్త కాఫీ ఇమ్మని చెప్పగా తయారు చేయించి ఇస్తే దాసుగారు ఆమె పెదవులకు అందించగా ఆమె సంతృప్తితో కన్ను మూసింది .బండీలో నుంచి ఆమె శవాన్ని ది౦పి౦చి ,ఆమె తలను తన తొడపై ఉంచుకొని దీర్ఘాలోచనలో మునగగా అందరూ గొల్లుమన్నారు .దాసుగారు తన ఇష్ట దైవం తో బాధ చెప్పుకోగా ఆయన వేదాంత వచనాలతో ఊరడించి ,అందరికిధైర్యం చెప్పి ఉత్తర క్రియలు యధావిధిగా నిర్వర్తించారు .

           ద్రాక్షారామ కోటి పత్రిపూజ

భార్య మరణానికి సెలవుపై వచ్చిన దాసుగారికి అకస్మాత్తుగా ద్రాక్షారామం లో కోటిపత్రి పూజ చేయాలని ఆలోచనవచ్చి ,ఆషాఢ అమావాస్యకు అక్కడికి చేరి ,మర్నాటి నుంచి కోటిపత్రి పూజ ప్రారంభమౌతుందని తెలియ జేశారు .చేతిలో చిల్లిగవ్వ లేదు .అప్పటికే నాలుగు బస్తాల మారేడు దళాలు వచ్చాయి. మర్నాడు సప్తగోదావరి లో స్నానం చేసి ,భీమేశ్వరాలయం చేరి తాము తెచ్చిన జలాలతో విఘ్నేశ్వరునికి అభిషేకం చేసి ,బ్రాహ్మణులతో పూజా సంకల్పం చేయించి అందర్నీ ఆశ్చర్యపరచారు .పూజారులతో సహా ‘’ఈ వవెర్రోడికి ఎంత తోస్తే అంత ‘’అని సణుగుడు మొదలుపెట్టగా దాసుగారు ‘’ఇది అమ్మ మాణిక్యాంబ సంకల్పం నాదికాదు .బిక్క వోలు పూజలో ఉన్నప్పుడే నన్ను ఆహ్వానించింది అనటానికి ఈ జోగావదానులే సాక్షి .ఈయనే ఆమెతరఫున నాదగ్గరకు దూతగా వచ్చారు .దీనికికర్త లోకాధినాధుడు ఫాలాక్షుడు భీమేశ్వరుడే .నేను తప్పెట వాయించే వాడినే .అమ్మవారే దీనికి పూనుకొన్నది .ఈశ్వర సంకల్పం నిరాటంకంగా జరుగుతుంది అనుమానం వద్దు ‘’అన్నారు .

  ఇంతలో బిక్కవోలు నుంచి ఒక బ్రాహ్మణ దంపతులు రాగా ,వారిగోత్రనామాలతో పూజ మొదలు  పెట్టించారు .ఆక్షణం నుంచి జనం అడగకుండానే ముందుకు వచ్చి తోచిన ద్రవ్యం అందించారు .దీనికి విఘ్నం కలిగించటానికి ధర్మకర్తను లోబరచుకొని కొందరు తప్పతాగి వచ్చి దాసుగారిని కొట్ట బోగా,ఆయన ఉపన్యాసం వినగానే మంత్రముగ్ధమైన పాముల్లాగా  అయిపోయి పూర్తి సహకారం ఇచ్చారు .అంతగొప్పకార్యక్రమం ఎప్పుడూ జరగలేదని అందరూ వేనోళ్ళ దాసుగారిని స్తుతించారు .పూర్ణాహుతిలో పది వేల రూపాయల విలువగల హోమ ద్రవ్యాలు సమర్పింప జేసి , నభూతో అనిపించారు .పిఠాపురం లో అత్య౦త వైభవం గా కోటి పత్రి పూజ నిర్వహించిన గరిమెళ్ళ విశ్వనాధ శాస్త్రిగారు చివరి రోజున ఇక్కడికి వచ్చి పూర్ణాహుతి సమయంలో ‘’మహత్కార్యం చేసి విజయం సాధించావు నాయనా ‘’ అని ఆశీర్వ దింఛి దాసుగారిని ఆప్యాయంగా కౌగిలించుకొని ఆనందా శ్రువులు రాల్చారు .ఈపూజా దినాలలో  దాసుగారు చిన్న పంచ మొలకు చుట్టుకొని ఉపన్యసించేవారు .జనం రాత్రీ పగలు లేకుండా తండోప తండాలుగా వచ్చి చూసి విని ధన్యత చెందారు .ఒక రోజు వారి ప్రవచనం –‘’ముసలమ్మను(మాణిక్యాంబ ) చూడటానికి వచ్చారా నాయనలారా!శంకర భగవత్పాదులు ప్రతిష్టించిన శక్తిపీఠంఇది .2వేల ఏళ్ళు యోగ నిద్రలో ఉన్న భీమేశ్వరుని మేల్కొల్పి ఈ దేశవాసులు ధర్మహీనులై ప్రవర్తిస్తున్నారు .వీరిని ఆదుకో నాధా’’అనగా   భీమేశ్వరస్వామి నన్ను చూసి ‘’ఒరేయ్ !టముకు వేయట౦లొ నేర్పరివి .మా ఆలయానికి వచ్చి సింహద్వారం ముందు ‘’భీమేశ్వరునికి కోటి బిల్వార్చన ,మాణిక్యాంబ కు  కోటి కుంకుమ పూజ ‘’అని ఎలుగెత్తి చాటిస్తూ డప్పు మోగించు ‘’అని ఆనతివ్వగా ఇక్కడికి వచ్చిమీకు తెలియజేశాను .నేను సన్యాసినీకాను దిగంబరుడినీకాను  .నిర్బల,కురూపిని .గోచిపాత రాయుడిని .నాదగ్గర పైసా లేదు కానీ ఈకార్యానికి రోజుకు వేలకొద్దీ రూపాయలఖర్చు .ఇది దక్షుని యాగం భగ్నమైన చోటు .మీకంటేనివిధాలా అతి తక్కువవాడిని నేను .నేనే ఈ కార్యం సంకల్పిస్తే, మీరు ఇలాంటివి ఎన్నైనా చేయగల సమర్ధులు అని గుర్తించండి ‘’అని చెప్పారు నూరు రోజుల మహా క్రతువు అత్యంత వైభవంగా ముగిసింది .దాసుగారికి చివరి రోజున ఘనసన్మానం చేసి సన్మానపత్రం రాయించి చదివించి గౌరవించారు .

  ఈకార్యక్రమం ముగిశాక జీర్ణమైన భీమేశ్వర ఆలయ గోడలు బాగు చేయించారు పురజనులందరూ కలిసి .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -23-8-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ దాసు లింగమూర్తి -4

  శ్రీ దాసు లింగమూర్తి -4

గోదావరి జిల్లాలో సత్కార్యాలు

అనేక సేవాకార్యక్రమాలలో మునిగి తేలుతున్న దాసుగారి ఆరోగ్యం దెబ్బతినటం వలన విశ్రాంతికోసం సెలవుపెట్టి అత్తగారింటికీ  వెళ్ళారు .దారిలో వారికొడుకు కృష్ణారావు చనిపోయాడు .మరదలి అత్తగారి ఊరు రాజానగరం వెళ్ళారు. అక్కడ తోడల్లుడు సుబ్బారావు గారు హెడ్ మాస్టర్ .ఒకరోజు ఒకకుమ్మరి జాతక రహస్యాలు దాసుగారు చెప్పగా ,ఆయన ప్రతిభ లోకానికి బాగా చాటింపు అయింది .జనాలు వచ్చి తమ జాతకాలు చెప్పించుకోనేవారు ఒకరోజు తోడల్లుడు అడిగితె ఏడాది లోపల మరణం ఉందని చెప్పారు .ఇంట్లో వాళ్ళు ఏడుస్తుంటే భార్యకూడా నాలుగేళ్ళలో చనిపోతుందని చెప్పారు.ఈ వూళ్ళో రామ సప్తాహం వైభవంగా జరిపించారు .

  అక్కడినుంచి జగ్గం పేటవచ్చి సప్తాహం మొదలుపెట్టారు  .రెండురోజులతర్వాత పూజలో ఉన్న రామపట్టాభిషేకం చిత్రాన్ని చూసి జనం భయపడిమూర్చ పోగా ,ఒక జమీందారు వచ్చి ‘’మీ రాముడిని చూసి జనం వణుకుతున్నారు ఏదైనా ప్రయోగం చేయండి ‘’అంటే తనకు మంత్రాలు ప్రయోగాలు రావని ,రాముడే సప్తాహాన్ని పూర్తీ చేయిస్తాడని చెప్పారు .మర్నాడు ఒకగుమాస్తాను పంపగా ఆతడుకూడా పట౦ చూసి మూర్చపోయాడు .రాత్రి 9గంటలకు రామ పటం ఫెళఫెళ మంటూ విరిగిపోయింది .మడపం అంటుకొన్నది .ఓం శాంతి అంటూ జపించగా మంటలు చల్లారాయి .మంటపం లో దాసు  గారి పట్టు పంచ ,ఒక బ్రాహ్మణుడి రామాయణపారాయణ గ్రంథం, పట్టు బట్ట కొన్ని కాగితాలు తగలబడ్డాయి .ఆతగులబడిన ఒకకాగితం లో ‘’ఆ రోజు ప్రాలుమాలి చదువమాని తదనంతర కథ ముగించాను ‘’అని ఆబాపడు రాసుకొన్న విషయం తెలిసింది .అంటే పారాయణం లో ఒకరోజు చేయాల్సింది చేయకుండా మర్నాటి పారాయణం చేయటం వలన జరిగిన అనర్ధం అన్నమాట .

 పెద్దాపురం లో అంతకు ముందు ఎప్పుడూ మంచి కార్యాలు జరగకపోవటం చేత దానికి ‘’పంచ మహా పాతక పట్టణం ‘’అనే పేరొచ్చిందట .ఇక్కడ దాసుగారు బ్రహ్మాండమైన సప్తాహం చేసి ఆపేరు పోగొట్టే ప్రయత్నం చేశారు .ప్రతి ఇంటి గోడపై సీతారామ అని రాసుకొన్నారు .తినేది అంతా సీతారామ  ప్రసాదంగా భావించారు .తర్వాత రామపట్టాభి షేకమూ జరిపించారు .’’ఇలు  వెడలని కులకాంతలు –చెలరేగి ‘’నమో నమో హృషీ కేశ ‘’యటం-చెలుగెత్తిపల్కుచును వీ –ధుల నడచిరి భక్తితమ మతుల నుప్పొంగన్ ‘’అని మహాభక్త విజయం లో రికార్డ్ అయిన సప్తాహం ఇది . అప్పుడే శివుడికి లక్ష బిల్వార్చన అమ్మవారికి లక్ష కుంకుమ పూజ కూడా జరిపించారు ,రాముడికి లక్ష తులసిపూజ కన్యకాపరమేశ్వరికి కొత్త యంత్రస్థాపన ,లక్ష కుంకుమార్చన అపూర్వమైన అన్నదానం  బీదలకు వస్త్ర సమర్పణ నభూతో గా జరిపించారు దాసుగారు .మొదట్లో నిరుత్సాహపరచిన ధనికులు క్రమగా దాసుగారి సద్భావనకు ముగ్ధులై దాసోహమన్నారు .

  పెద్దాపుర సప్తాహ అవబృధ స్నానం అయ్యాక దాసుగారు కాకినాడ వచ్చి మహావైభవంగా సప్తాహం చేశారు .పెట్టిన సెలవు అయిపోగానే దాసుగారు గిద్దలూరు సబ్ మేజిస్ట్రేట్ కోర్ట్ లో హెడ్ గుమాస్తాగా చేరారు .అనుకోకుండా అక్కడ సప్తాహం మొదలుపెట్టి రంగరంగా వైభవంగా పూర్తీ చేశారు

తూగోజి రామ చంద్రాపురం దగ్గర బిక్కవోలు లో కామధేనువు చే ప్రతిష్టింప బడిన గోలింగేశ్వర దేవాలయం శిధిలం లో ఉంది .అక్కడి సుబ్బారాయుడుస్వామికి మార్గశిర శుద్ధ షష్ఠినుంచి బ్రహ్మోత్సవాలు వైభవంగా చేస్తున్నాడు హరికధలు నాటకాలు,పాటకచేరీలు  ఏర్పాటు చేసేవాడు .1928బ్రహ్మోత్సవాలలో కూచిమంచి మూర్తిరాజు గారు రామదాసుచరిత్ర హరికధ చెప్పి భక్తులను ఓలలాడి౦చారు .ప్రజలంతా ఆపందిళ్ళలోనే మరో సప్తాహం చేయాలని భావించి ,5వేల రూపాయలు పోగు చేసి ఇచ్చారు .ఊరిజనం లో బ్రాహ్మణ అబ్రాహ్మణ తగాదాలు వచ్చి ముందుకు సాగకపోతే గిద్దలూరులో ఉన్న దాసుగారిని వచ్చి బాధ్యత తీసుకోమని ఆకెళ్ళ వ్యాఘ్రప్ప గారు మరికొందరు విన్నవిస్తూ టెలిగ్రాం ఇవ్వగా ,వెంటనే బయల్దేరి రాగా కొందరు ఆయనకు ఇక్కడి కలహ కారణాలు చెప్పగా దాసుగారు ‘’రామాజ్ఞ పొంది వచ్చాను .రేపటి నుంచి సప్తాహం ప్రారంభమవుతుంది ‘’అని చెప్పి ,మర్నాడు ఉదయం వేలాది జనం తో గోదావరి కాలువలో స్నానం చేసి  వీదులవెంట భజన చేస్తూ గోలింగేశ్వరాలయం చేరి పూజారినడిగి రామ పట్టాభి షేకపటాన్ని తీసుకొని సప్తాహం ప్రారంభించారు .రెడ్లుఅడ్డంకులు కల్పించారు మొదటి రెండు రోజుల్లో. కరణ౦గారు దాసు గారిని ‘’ఇక మీరు గిద్దలూరు వేవెళ్లిపోతేనే మంచి దేమో ?’’ అనగా ,మూడో రోజునుంచి ముఠా నాయకుడు ఒకరికి  రాత్రి వళ పెద్ద పెద్ద కోతులు కనిపించి పళ్ళు కాయలు తింటూ భయభ్రాంతుల్ని చేయగా మర్నాడు ఉదయమే తోటలోంచి కాయగూరలు కోసి సప్తాహానికి పంపాడు .అసలు మొదట్లో జనమే లేని ఆలయం జనం తో కిటకిటలాడింది .కోలాటాలు భజనలు పరవశంగా జరిగాయి .ఊరివారి ఉత్సాహానికిఅవధులు లేకుండా పోయి సప్తాహం దిగ్విజయమై బీదల అన్నదానం ఘనం గా జరిగి ముగిసి అందరికి సంతృప్తి కలిగించింది .రెడ్డి నాయకులు దాసుగారికి దాసులై రాత్రీ పగలు కంటికి రెప్పలాగా చూసుకొన్నారు .ప్రజలంతా దాసుగారి వెంట రైల్వే స్టేషన్ కు నడిచి వెళ్లి అపూర్వంగా వీడ్కోలు పలికారు .దాసు  గారిని భుజాలపై ఎక్కించుకొని స్టేషన్ లో అరగంట సేపు ఆడారు .అందుకని బండీ అరగంట లేటుగా అక్కడి నుంచి బయల్దేరింది

  1928లో దాసుగారు బిక్కవోలులో వందరోజుల గోలిన్గేశ్వరస్వామికి కోటి బిల్వార్చన మహా వైభవంగా జరిపించారు .చేతిలో కానీ లేకుండా కార్యక్రమం ప్రారంభించేవారు .పార్వతీ పరమేశ్వరులే తన యజమానులనీ తాను  దండోరా వేసే బంటు ను మాత్రమె అనీ నూరురోజుల పూజ ఆయనే జరిపించుకొంటారని చెప్పేవారు ,అనుకోన్నట్లుగానే ప్రతిరోజూ కోటిబిల్వార్చన అమ్మవారికి కోటి కుంకుమార్చన 100రోజులు నిర్విఘ్నంగా అత్య౦త వైభవంగా అందరి సాయంతో దాసు గారు నిర్వహించి సరికొత్త రికార్డ్ నెలకొల్పారు .

   సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -12-8-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మట్టి పువ్వులు

మట్టి పువ్వులు

గా ,హోసూరు బస్తీ యువక బృందం డా అగరం వసంత్ కూర్పరి గావివిధ ప్రాంతాలకు చెందిన 61మందికవులురాసిన  15వ ‘’కవితల పొత్తం’’ ఈ సంవత్సరం ప్రచురించి కృష్ణ గిరి జిల్లా తెలుగు రచయితల సంఘం గౌరవ అధ్యక్షుడు కీ .శే .కలువకుంట నారాయణ పిళ్ళే కు అంకితమిచ్చి౦ది .ఈ పుస్తకాన్ని వసంత్ నాకు పంపి దాదాపు నెల రోజులయింది .ఇప్పుడే చదివి స్పందిస్తున్నాను .

  పలమ నేరు బాలాజీ ‘’కల్లోలకాలం లో కవిత్వం కాసింత ఊరట నిచ్చింది ‘’అంటూ ముందుమాట రాయటమేకాక ‘’మనుషుల్ని నాటవలసిన కాలం ఇది,మనుషులు పండాలి ,మొలకెత్తాలి ,దయ ప్రేమ కరుణ ప్రశ్నించటం వాళ్ళ ఆనవాళ్ళు కావాలి ‘’అని కవిత కూడా కూర్చాడు. డా ఎన్. గోపి’’నేనొక యా౦టిక్’’అవుతున్నా అని బాధపడ్డాడు ‘’కాలపేటిక ‘’లో .పిళ్లే మరణానికి విచారిస్తూ ‘’నాకు మీ స్మరణ నేస్తం –సంస్మరణ నేస్తం’’అని గుండె బరువుతో అన్నాడు .’’భావం అర్ధమైతే చాలు –భాష బతుకు తుంది ‘’అని ఆశించాడు విజయకుమార్ .శ్రీ కాట్రగడ్డ ‘’ప్రకృతినేమారుస్తూ –ప్రకృతోత్సవాలు జరుపుకుంటున్నాం –సత్యాన్ని సమాధి చేస్తూ –స్వతంత్రులమనుకొంటున్నాం’’అని మన న౦గనాచి తు౦గ బుర్రల్ని కడిగేశాడు  .చలపాక ప్రకాష్ ‘’ప్రాణాలన్నీ మాస్క్ వెనక దాగున్నప్పుడు –ఎన్ని సాని టేషన్ల నిప్పుల్లో చేతులు కడుక్కోవాలి ?’’అని సూటి ప్రశ్న వేసి ‘’అంటరాని తరం వెలివాడ ఇప్పుడు కొత్తకాపురం పెట్టింది ‘’అని బాధపడ్డాడు .’’కనిపించే సౌందర్యం వెనక –అజ్ఞాత వేదనలు ‘’గుర్తించినకవి రజిత .’’మట్టి తవ్వి పిసుకుతాడు –సారిపట్టి తిప్పుతాడు- కొలిమిలోకాలి  సమ్మెటేత్తి బాది-తిత్తిపోయి, జబ్బుపట్టి’’మనోడే మన తోడబుట్టినోడే-భారతమ్మకు కన్న బిడ్డడే ‘’అని వ్యధ చెందాడు దేశరాజు .’’పాపం ఉప్పెనలా ఎగిసింది –అవతరించు దేవా –ధర్మాన్ని కాపాడు ‘’అని వేడుకొన్నాడు రాజారావు .

  ‘’దృశ్యాదృ శ్యాలమధ్య –దగ్ధమౌతున్నాను ‘’  అనే ఆవేదన డా ఉప్పలధడియం ది.’’కొత్త ఏడాది లోనైనా –ఆశలు చిగురించి –ఆశయాలు పుష్పించి ‘’ఫలించాలని ఆశ పడ్డాడు పంతుల వెంకటేశ్వరరావు.తాడినాడ కవికి ‘’కొత్త ఆశలే వసంతం –ఆరురుతువుల సమ్మేళనమే జీవితం –కలిమి చెలిమి పై బలిమి ‘’ఒక దాని వెంట ఒకటి రావాలని కోరిక ..’’తల్లడిల్లే వాతావరణ౦  కాదు –రెప్పలా కాపాడే రాచరికపు ఎత్తుగడ ‘’కావాలని సరిహద్దు పోరాటాలపై ప్రభుత్వ తీరు గురించి అంటాడు జోగారావు .’’ఆంధ్రుడి కంటి వెలుగు –అచ్చతెలుగు ‘’అని మురిసిపోయాడు కుమారస్వామి రెడ్డి .’’జీవన భ్రమణం లో చింతలకు హారతులిచ్చి –ఆనందాన్ని ఆహ్వానించ’మని సుసర్ల శిరీష కోరింది .రోజంతా ఆకలితో ఉన్న ముసలాడికి ఒకావిడ అన్నం వేసింది .ఆబగా తిన్నాడు ‘’ఇంతలో పలమారింది- ఎక్కిళ్ళతో ఊపిరాడలేదు –‘’తాగేందుకు ఎక్కడా నీరులేక అలమటించి ఉసురు పోయింది ‘’అని బాధా తప్త హృదయంతో గుడిమెట్ల చెన్నయ్య ‘’ఆకలి ‘’ ని వర్ణించాడు .’’ఒక పలకరింపు –వేయింతల చేయూత ‘’జీవితసత్యాన్ని డా టి.రంగస్వామి ప్రకటించాడు డా. రాధశ్రీ ‘’ముందుతరం నాకు దారిద్ర్య భాగ్యం అందిస్తే –నేను నా తరువాతి తరానికి భాగ్యమనే –దారిద్ర్యాన్ని అంటగడుతున్నాను’’అని నేటి వ్యవస్థ స్థితికి  అద్దంపట్టాడు .కూచిపూడి నాట్య కళాకారిణి శోభానాయుడు ‘’ఓ శిల్ప కళాకృతి –ఆమె అభినయం ఓ అపూర్వస్మృతి ‘’అని  నివాళు లర్పించాడు  ఆకుల రఘురామయ్య ..’’మూకుమ్మడి మృత్యు మాతృకలను ముట్టి చూస్తుంటే -.సంరక్షణే ప్రాధాన్యమన్న దిశా నిర్దేశం ‘’వడలి రాధా కృష్ణకు ‘’మసక చీకటిలో కారుమబ్బుగా మిగులుతూనే కనిపించింది .

 ‘’భిక్షగాడి గా మారలేక-పర్యావరణ రక్షకుడుగా మారిన అతడి పేరు –రేషన్ కార్డు లో మాత్రం లేదు .కానీ ‘’ఎక్కడెక్కడి ప్లాస్టిక్ అంతా అతని వెన్నెల సంచీలో  చేరిపోతుంది –వైరస్ యుగం లో –ఆత్మ గౌరవం ఆత్మ విశ్వాసం తో ‘’లోకం నేర్వని ఎన్నో కొత్తపాఠాలు చూశాడు బి .శంకరరా.బహుశా ఇలాంటి కవిత్వం ఎవరూ రాయలేదు అనిపించి౦దినాకు మాత్రం .’’శక్తి స్వరూపిణి మగువ –ఆమెజీవితం కలకాలం విరబూసిన కలువ ‘’కావాలని ఆశపడింది మారుతీ దేవి .శొ౦ఠి వెంకట రమణ కు ‘’పూరిపాకలే పేణాలకు సొర్గ సీమలు-పల్లెలయందం-పవిత్రానందం ‘’.జ్ఞాన వయో వృద్ధకవి  నంద్యాల నారాయణ రెడ్డకి ఆఫీసర్లకు గ్రాసం తోపాటు లంచాలూనూ ‘’కావాలని తెలిసి ‘’వేయిటయోటాలు ,వెయి డకోటా లు తయారు చేస్తార్రా ?-ఏదీ –మీ జాగ్రత్త అంతాకలిపి ఒక్క టమేటా ,ఒక్క సపోటా ,ఒక్క వడ్ల గింజ నో –తయారించి చూడండ్రా ‘’అని సవాలు విసిరారు రైతుకవికనుక మట్టికవికనుక .

చిలుకూరి దీవెనకు ‘’నల్లమబ్బులు –కరువు రైతుల మెడకుఉరితాడుగా ‘’కనిపించి ,’’తెల్లని మనసుతో –చల్లగా నవ్వు తున్నట్లు-రైతుల ఆశల శిశువుకు –ఊపిరి పోస్తున్నట్లు  ‘’వాన పడుతోందట .చాలాసహజ వర్ణన .దక్షిణాఫ్రికాలో గాంధీని ఫస్ట్ క్లాస్ రైల్వేబోగీ నుంచి ప్లాట్ ఫాం పైకి నెట్టిన జాత్యహ౦కారం పడగ విప్పిన చోట ,గాంధీ విగ్రహం పెట్టి ఆ స్టేషన్ కు ‘’గాంధీ స్టేషన్ ‘’గా మార్చిన ఉదంతాన్ని కవిత్వీకరించి వై హెచ్ కే మోహనరావు ‘’గాంధీని మహాత్మునిగా మార్చిన –ఒకటవ తరగతి బోగీ –మెడబట్టిన జాత్యహంకార హస్తమా –అందుకోండి కోట్లాది గళాలకృతజ్ఞతలు –అవధులు దాటిన జన నీరాజనాలు ‘’అని పరవశించి పాడాడు .

‘’ఏమైనా మనిషి ఒక వింత మనిషబ్బా –దేవుడైనా దయ్యమైనా వాడిలోన ఉందబ్బా ‘’   అంటూ మానవుని స్ప్లిట్ పర్సనాలిటి ని బయటపెట్టాడు మధురాంతకం శ్రీధర్ .’’హృదయాన్ని పూలపాన్పు చేసి  – ప్రియుడికోసం ఎదురు చూస్తోంది సిరివరపు అన్నపూర్ణ ‘’మధు పాత్ర ‘’తో .’’ఆప్త వాక్యం అవిభాజ్య కవల ‘’గా గోచరించింది సుంకోజి దేవేంద్రాచారికి .కవిత్వం కోసం ఎక్కడెక్కడో వెతకనక్కర్లేదు ‘’రైతులకు అండగా –శ్రామికుడికి బాసటగా –కార్మికుడికి మద్దతుగా –పీడితునికి దన్నుగా ‘’ఉండు చాలు ‘’అప్పుడు సూర్య చంద్రులిద్దరూ –నీ గదిలోనే కనిపిస్తారు ‘’అంటాడు గొడవర్తి శ్రీను .పార్టీ  మారిన వాడు ‘’ఇపుడు నేను బినామీని –ప్రస్తుత పార్టీ లోఎనిమీని’’ –అని లబోదిబో అంటాడని శ్రీకా ఉవాచ .

  ఇలా వైవిధ్యం తో పలువురు కవులు ఈసంకలనం లో రాశారు .కొందరు ఆమనికిస్వాగత౦ పలికితే ,కొందరు తల్లిభాష పై ప్రేమ ప్రకటిస్తే ,మరికొందరు గాధీమళ్ళీ పుట్టాలనికోరితే ,ఇంకొందరు రైతు ను బుజానికి ఎత్తు కొ౦టే ,మిగిలినవారు తెలుగుకు పట్టిన తెగులుకు విచారించారు .అన్నీ మంచి కవిత్వాలే  అందరూ అభిన౦దనీయులే  .చక్కని శీర్షికలే .నాకు ‘’స్ట్రైకింగ్’’ గా కనిపించిన వాక్యాలే ఉదాహరి౦ చాను అంతే .  బస్తీ మే సవాల్ లాగా బస్తీ నుంచి మరిన్ని అర్ధవంతమైన రచనలు  వెలువడాలనీ,హోసూరు తెలుగు కలకాలం వర్ధిల్లాలనీ ,  డా వసంత్ సాహితీ సేవలు మరువరానివని తెలియ జేస్తున్నాను .ఎప్పుడూ కవితల పొత్తం లో చివరికవితగా తనకవిత వేసుకొనే  వసంత్ కవిత ఈ సారి లేకపోవటం కాస్త ఆశ్చర్యం కలిగించింది . మీ –గబ్బిట దుర్గాప్రసాద్ – 21-8-21 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ధూర్జటీ!

ధూర్జటీ!

శృంగేరి కి చెందిన శ్రీ యరికలపూడి సుబ్రహ్మణ్య శర్మగారు ‘’ధూర్జటీ ‘’శతకం రాసి ,శృంగేరి 34వ పీఠఠాదిపతులు శ్రీ శ్రీ చంద్ర శేఖర భారతీ తీర్ధ మహా స్వామివారికి అంకితమిచ్చారు .శర్మగారితో నాకుఎలాంటి పరిచయమూలేదు .కానీ వారుఆత్మీయంగా ధూర్జటిని మా ఇంటికి పంపగా ,అందిందనిఫోన్ చేస్తే ‘’మీ అభిప్రాయం రాయండి ‘’అని కోరారు .అందుకే  ఈస్పందన.పీఠం తరఫున ఆశీస్సులతోపాటు ,ప్రాచార్య శ్రీ శలాక రఘునాధ శర్మ ,ఆచార్య బేతవోలు రామ బ్రహ్మం ,ప్రొఫెసర్ ముది గొండ శివ ప్రసాద్ ,సామవేదం షణ్ముఖ శర్మగార్ల ఆశీరభినందనలు ఉన్నాయి .’’నామాట ‘’లో శర్మగారి  కృతజ్ఞతలున్నాయి .ధూర్జటీ అనేది మకుటం .

చక్కని ముఖ చిత్రాలతో ఉన్న ఈశతకం వెల 50రూపాయలు .

‘’వాగర్ధ ద్వితయైక విభవ రూపా ,నిన్ను సామాన్యదృ-గ్రాతీత ,నిరంతరౌప నిషదర్దా కార రోచి చ్ఛటా

ప్రాగాద్యష్ట దిశాదిప ప్రభ్రుతిదేవానీక సంధ్యార్చనా –భోగ స్వీకరణావ్యయా  కృతివి శంభూ కొల్చేదన్ ధూర్జటీ ‘’

ఈ ఒక్క పద్యం చాలు శర్మగారి కవితా వైదుష్యం తెలుసుకోవటానికి .

 హర కోదండం త్రు౦చిన  హరి ,హరుడిని మేరు ధనుర్విముక్త శరంగా అర్చించాడు ఈఇద్దరిలీల వర్ణించటం బహు కష్టం అన్నారొకపద్యం లో

‘’అనిలున్డైయినుడై మహానలుడునై యబ్జారియై,ఆత్మయై –వనమై ఆకసమై ,వసున్ధరయునై బ్రహ్మా౦డముల్ నిండి యే

ఘనుడానంద నటన్మనోహరుడు ప్రాకామ్యాష్టమూర్తి ప్రభ –న్మను,నా మూర్తిని ,నిన్ను నామనమునన్ ధ్యాని౦చెదన్ ధూర్జటీ ‘’అద్భుత రచన అనిపిస్తుంది .నడుము మీద చేతులు ఉంచుకొని నాల్గు దిక్కులా జటాజూటం ఊగుతుండే,ఉడు పథదృక్కు వైన శివుడు ‘’అంటే కవికి మహదానందం .అందుకే పరవశంతో రాశారు .

‘’నిను నజస్ర నాట్య పరిణీతు,నానారత సర్వ దేవతా –సన్నుతు ,శాశ్వతాగతను జారద సురూపు ,మహోరగాధినా

థోన్నయ  సద్గుణున్ ,బహు విధోక్త మహాత్వు ననంత యజ్ఞ సూ –త్రోన్నత దివ్య మూర్తి సహజోక్తి నుతింతు గ్రహింతు ధూర్జటీ ‘’

ఉదద్గిశా ధినాథ మిత్ర ,ఆది గృహస్థ శేఖర ,మృదంగవాది శ్రీహరీ ,సరీ సృపోత్తరీయ ,కౌముదీశ ఖండభూషణా,యమీ ,  మాలికా కృతాహిపాళీ,మాధి నాథమానితా ,నాగాధిరాజ కార్ముకా ,ప్రమర్దతాసుర త్రయీ ‘’వంటి విశేష పద బంధాలతో ధూర్జటిని సాభిప్రాయంగా వర్ణించి స్తుతించారు కవి శర్మగారు .

‘’టంకంపు౦డకటో౦కులి౦క విడి,యాట౦కంబు లూటాడ నీ –బి౦క౦ బింక సడల్చి లెంక నను రావే గావ ‘’పద్యం బహు సొగసుగారాశారు .నాద రహస్యం తెలీకపోయినా ‘’సుస్వరరాగా మంజరీ మెదుర గానుపున్ శ్రుతుల మేకొని ‘’తానూ విహరించాలని కోరుతున్నారు.

‘’శివ హరు దక్క ఖండ శశి శేఖరు దక్క ,కృతాంత శాసక –ప్రణవ మహా౦ఘ్రిదక్క ,నటరాజును దక్క మహాహి శింజినీ –రవ దళితారి దక్క –గరలగ్రహణప్రతి షేదితాఖిలార్తివి నీవు దక్క ‘’అని హరుడే తప్ప తనను కాపాడేవాడు లేడు అని చక్కని దక్క పద్యాన్ని ఢక్కా బజాయించి చెప్పారుకవి .

మరో హరార్పిత కమనీయ పద్య బిల్వదళం –‘’శరమై వాహనమై ,శరీరామున తా సవ్యార్ధమౌ భార్యయై –కిరియై ,మోహినియై ,మృదంగ వహన క్రీడా సమార్చుడౌ’’ అరవిందాక్షుడు స్వీయనేత్రమిచ్చి పూజించాడు ‘’.ఆత్మకుమధ్య ప్రాణం అనీ ,ఆధ్వనికీ ప్రాణానికి మధ్య ఆత్మ అనీ ,నాదానికీ ,ఆధ్వనికీ ఆపైన ఉన్న నిన్ను నాదత్మగా అంటారనీ వేదాన్తపరిభాషలో ఉత్పలమాల అల్లి శివుని మెడలో వేశారు .

‘’ఇంగల మొండుకంట,నిను ,నిన్దుని తక్కిన  కంటి జంటగా గంగ నెత్తిపైనా ,పునుకలు మెడలో చేతిలో జింక ఉన్న  త్రినేత్రుడు’’సింగపు తత్త డి౦గలుగు చిన్నది సంగడి కత్తె,కాపురం కడ వీట’’ఉన్నా ‘’మ్రొక్కిన గావగముందు నుండు నీకుం గల గుండె మెత్తనకుకోటులు దండము లయ్యదూర్జటీ ‘’అని అన్ని విచిత్ర సంగతులతో ఉన్నా ధూర్జటి’’ యద మెత్తన ‘’అనటం కవి అనుభవమే .

‘’సనందన ప్రధాన శిష్య సంఘ సంశాయాపహా – మనోభవ ప్రభావ భంగ మాన్యు పావకా౦బకా

జనార్దనాబ్జ సంభవాది సర్వ దేవసన్నుతా –  మనస్వినీ సమాదృతాంగ మౌని పాహిధూర్జటీ ‘’అని పంచ చామరం తో పద్య వింజామర వీచారు  .

చెలికత్తెలు పార్వతితో మేలమడే సందర్భంగా ,ప్రశ్నోత్తరమాలికా ఉత్పలమాల అయిదు పాదాలు –‘’’’

‘’నీ మగడింత తెల్లనటే-నిక్కము చక్కని వాడే ,గాని తా –నీమమటేజడల్నుదుట నేల ధరించే చిచ్చు  – ముచ్చటే ,-పాముల దండలున్ డమరు పాణినిదాల్చుచు నిల్చు తీరు నీ కే మనిపించేనే ?’’అని నవ్వుతుంటే చెలులు ‘’మందహాస సస్యామల గౌరీ గాంచు భవదాస్య రుచిన్నుతి యింతు ధూర్జటీ ‘’ఆది మిథునమైన అమ్మా, అయ్యల దిద్దరిదీ చిరునవ్వే సమాధానం  అనటం మహా చమత్కారం.

మదినిండా శివుడు కొలువై ఉంటేనే వచ్చే పద్యాలలో మరో మణిపూస లాంటి పద్యం –

‘’మానన్మానను మాననే మానస రామావామ సీమా రమా –జుని ప్రార్ధిత నిత్య దక్షిణ ముఖా ,సంమౌని సంస్తుత్య వే-దానీ కానన కాననావ పథ నాదాకార పంచాస్య ‘’నన్నునిరంతరం కనిపెడుతూ ఉండు అని వేడుకొన్నారుకవి .శివుడు –

‘’అతడు విరాగి ,రాగి ,సమయాను నయామిత భోగి ,యోగి ,సం-గత నియతామితా నుగత గాత్రయు గైక విభాగి ‘’అలాంటి యోగికి ‘’సాగి నేనతని నుతింతు సంతత శయాను హృదంత రర్చితా తపపతితావనున్ పతిని తత్పరతన్ గురు మూర్తి ధూర్జటీ అని బహు సొగసుగా పద్యం చెప్పారు .

  ధనుష్యాగ్రణి యైన దాశరధి సిద్దాశ్రమదగ్గర అసాంఘిక రక్షస్సంఘాన్ని ఆనాడు నిర్మూలనం చేస్తే –అలాగే ‘’ఆహార్యోగ్ర ధన్వీ మనో –ధ్యాన స్థాన విహరివై  షడరులన్  ద్వంసంబు గావి౦పుమీ –నీ ,నా సందిది వీడ రాని ముడి తండ్రీ పాహి ధూర్జటీ ‘’అంటూ ఆయనకూ తనకూ ఉన్న ఆ బంధనపు ముడి బయట పెట్టారు కవి .

శార్దూలం లో చాలా ఆర్తిగా –

‘’శాపా౦త౦ బెపు డౌను నాకు గిరిశా,సాయం మహా నాట్య వే-ళాపార్శ్వ్య ప్రియ వర్తినై తమకు వ్యాళాలంకృతుల్  దీర్చు మ

ద్వ్యాపారాన పునః ప్రవేశపు డార్యాపాంగ మందస్మిత –శ్రీ పారమ్యరహో విహార ,కవితా శ్రీ మూర్తి నా ధూర్జటీ ‘’

పద్యాలన్నీ ఆత్మ వేదనా భరితాలు, ధూర్జటి మహత్వ సంపన్నాలు ,భక్తి భావ మందారాలు ,ఆర్తి భావ మంజూషాలు .శతకమంతా ధూర్జటి వర్ణనమే ఉండటం మరింత ఇంపు కూర్చింది .లోకం లోని రాజకీయాలు ,కరోనా ,కోవిడ్ విహారాలు అవినీతి వగైరా ల జోలికి పోకుండా శతకం అంతా ధూర్జటి మాయం చేయటం మహదానందంగా ఉంది .అన్ని రకాల వృత్తాలూ చుట్టారు కవిత్వం లో .

ఇంతకూ ఈ కవిగారు సౌత్ వెస్ట్రన్ రైల్వే –హుబ్లి లో చీఫ్ యార్డ్ మాస్టర్ గా పని చేసి రిటైరయ్యారు .వీరికి ఇంతటి కవిత్వ సంపద అలవడం చూసి అవాక్కౌతాం .వీరిది గుంటూరుజిల్లా సత్తెనపల్లి తాలూకా ,కృష్ణా తీరగ్రామం –కామేపల్లి .బెజవాడ ఎస్ ఆర్ ఆర్ . కాలేజిలో పియుసి ,లయోలాలో బిఎస్ సి చదివారు  .గురువులు –శ్రీ శిష్ట్లా లక్ష్మీ కాంత శాస్త్రి గారు ,శ్రీ చెరుకుపల్లి జమదగ్ని శర్మగారు అని చెప్పుకొన్నారు .వీరి ఆరాధన జ్ఞానమూర్తి –శ్రీ శ్రీ శ్రీ భారతీ మహా తీర్ధ మహాస్వామి వార్లు.శర్మగారు త్వరలో ‘’మంజుఘోష’’ అనే ఖండ కావ్యం వెలువరిస్తున్నట్లు తెలిపారు  .

 బెజవాడ లో శ్రీ ఎరికలపూడి గోపీ నాథ రావు గారు అనే మంచి పద్యకవి ఉన్నారు సరసభారతికి ఆప్తులు వారు .వీరికీ ఈ  శతకకర్త యరికలపూడి  శర్మగారికీ ఏమైనా బంధుత్వం ఉందేమో తెలీదు .

  శ్రీ వరలక్ష్మీ వ్రత శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -20-8-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

 శ్రీ దాసు లింగమూర్తి -3

 శ్రీ దాసు లింగమూర్తి -3

దాసుగారు ముదిగల్లు ,కళ్యాణ దుర్గం ,గంగవరం ,సిర్పి ,అనంతపురం మొదలలైన చోట్ల నామభజన సప్తాహాలు చేశారు .పినాకిని పత్రిక కవరేజ్ ప్రకారం అనంతపురం లో శ్రీరామ నామ సప్తాహం చేశారు .ముదిగల్లులో శివాలయ ఉద్ధరణ చేసి రామనామ సప్తాహం ,ఈశ్వరుడికి లక్ష బిల్వార్చన చేశారు .ఒకయువకుడు ‘’అయ్యా రాత్రి ఏమి కలవచ్చింది ఇన్ని చేస్తున్నారు ‘’అని వ్యంగ్యంగా అంటే దాసుగారు ‘’దేవుడికి తన ఆలయ పునరుద్ధరణ ప్రీతికరం .సర్వాత్మ తేజమే లింగం అనేది సత్య౦  అయితే శివుదిపైకి వేసిన ఈపువ్వు గాలిలో నిలిచి ఉండుగాక ‘’అని ఒక పువ్వు విసిరేశారు .అది వాడకుండా ఆకార్యక్రమాలు అయ్యేవరకు అలాగే నిల్చి ఉంది .ఈవిషయం పెద్దాపురం లో దాసుగారిపై రచించబడిన ‘’భక్త విజయ ధ్వజం ‘’లో –

‘’ముదముగలు లోన మూఢ జనముల్ మిము  గైతవ దాసు డంచుస –మ్మదమున దూలనాడ జనమాన్ద్యము వాపగ ,జూడు మంచు స-

మ్మదమున లింగ మూర్ధమున బుష్పము వేయగనద్ది గాలిలో –బదిలముగాగనిల్చె  నొకవారము మీదగు శక్తి జాటదే’’

 కళ్యాణ దుర్గం లో సప్తాహం 21రోజులు చేశారు .ఒక రోజు ఆపోశన పోస్తూ ‘’ఈ పవిత్రోదకం ఎవ్వరి చేతి నుంచి ఎన్ని బిందువులు కింద రాలితే ,అన్ని పది సంవత్సరాలు బీదయై వస్త్రాలు లేకుండా ఉంటాడు అని నాకు తోస్తోంది కనుక జాగ్రత్తగా గ్రహించండి ‘’అన్నారు .ఒక శ్రీమంతుడు ధనగర్వంతో ఆపోశన ఉదకాన్ని కిందపోశాడు .దాసుగారికి కోపం వచ్చి ‘’సృష్టికర్త అందరి హృదయాలలో ఉంటె ,దేవాలయాలలో తన కళలు నిలపటం సత్యమైతే ఈ బ్రాహ్మణుడు ఇరవై నాలుగు గంటలలో పాప ఫలం అనుభవిస్తాడు ‘’అన్నారు .భోజనాలైపోయి అందరూ తాంబూలాలు వేసుకొంటు౦టే ,ఆ బ్రాహ్మడు హఠాత్తుగా దాసుగారి దగ్గరకు వచ్చి చేతులు జోడించి ‘’నాకు పుత్రభిక్ష పెట్టండి ‘’అని దీనంగా ప్రార్ధించాడు .ఆయన దుఖానికి కారణం అడిగి తెలుసుకొని ,కలరాతో బాధ పడుతున్నాడని తెలిసి ‘’భయం లేదు కలరాతగ్గిపోతుంది ‘’అని అభయమిచ్చి స్వామి ప్రసాదమిచ్చి పంపారు. కుర్రాడు తేరుకొన్నాడు ..ఆరాత్రి ఆకొడుకును తెచ్చి దాసుగారి పాదాలవద్ద ఉంచాడు .కానిఅతనికే కలరావచ్చి చచ్చిపోయాడు .నూతి మడుగు గ్రామం  లో  ఒక గొప్ప ఆంజనేయ విగ్రహం నాగ జెముడు పొదల్లో పడి ఉందని తెలిసిన దాసుగారు ,ఆ విగ్రహం తేజస్సుకు అబ్బురపడి ఊరి జనాన్ని పిలిపించి ఆలయం కట్టమని అడిగితె వాళ్ళు విముఖత చూపారు .అప్పుడు దాసుగారు ఒక గొనె సంచి తీసుకొని మొదటి రోజు ఒకబస్తా జొన్నలు సంపాదించి పని ప్రారంభించారు .ఉత్సాహంగా ఇచ్చినవారి దగ్గర డబ్బు తీసుకొని తన డబ్బు కొంత ఖర్చు చేసి కొంత పని చేయగా జనాలకు అప్పుడు బల్బు వెలిగి వారే ముందుకు వచ్చి హనుమ దేవాలయ నిర్మాణానికి దాసుగారికి పూర్తీ సహకారం అందించారు .అప్పటికి ఆరు సంవత్సరాలుగా అక్కడ వర్షాభావం .కాని స్వామి ప్రతిష్టతర్వాత వర్షాలే ,వర్షాలు కురిసి ప్రజలంతా సుఖ జీవనం సాగించారు .ఆలయానికి యాభై వేల నికర ద్రవ్యం సమకూరి రంగరంగా వైభవం గా కార్యక్రమాలు జరుగుతున్నాయి .శ్రీరాం ఎర్రప్పనాయుడు తన భార్యచని పోయిన దగ్గర్నుంచి యావదాస్తీ దేవాలయానికి రాసిచ్చి నిత్యం స్వామి  సేవలో ధన్యతచెందుతూ పుష్పోద్యానం వగైరా ఏర్పాటు చేశాడు .ఇలాంటి ఘనకార్యాలు ఎన్నిటినో లింగమూర్తి దాసుగారు అనంతపురం ప్రాంతం లో చేసి ఘనకీర్తి పొందారు .

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సరస భారతి వీక్షకులు -9,90,385

సరస భారతి వీక్షకులు -9,90,385

సరసభారతి సాహితీ బంధు లకు శుభ కామనలు -ఈరోజు ఉదయం 7-15కు సరసభారతి బ్లాగ్ వీక్షకుల సంఖ్య8,56,000,సువర్చలాన్జనేయ బ్లాగ్ వీక్షకుల సంఖ్య1,34,385 అంటే మొత్తం రెండు బ్లాగుల వీక్షకుల సంఖ్య9,90,385అక్షరాలా తొమ్మిది లక్షల తొంభై వేల ,385 అన్నమాట .ఈ విజయం అంతా సాహిత్య బంధు, సాహిత్యాభిమానులదే. అందరికి వినమ్రంగా ధన్యవాదాలు .-దుర్గా ప్రసాద్ -19-8-21-ఉదయం 7-15-ఉయ్యూరు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

శ్రీ దాసు లింగమూర్తి -2 వివాహ ఉద్యోగాలు –దాసు గా అవతరించటం

శ్రీ దాసు లింగమూర్తి -2

           వివాహ ఉద్యోగాలు –దాసు గా అవతరించటం

గోదావరీ నదీ పాయ వశిష్ట గోదావరి ఒడ్డున విజ్జ్హేశ్వరం అనే  గ్రామం  లో నదికి ఆనకట్ట ,లాకులు ,నరసాపురం కాలువ ఉ౦డి,పరమ మనోహరం గా కనిపిస్తుంది .ఈ గ్రామ కరణం అల్లుడు  ఒంటిమిల్లి వాసి ఎర్రమిల్లి వెంకట చలమయ్య కరణీకం చేస్తాడు ఈయన పెద్దకూతురు సంగమేశ్వరమ్మ ను లింగమూర్తి గారికిచ్చి 1914లో పెళ్లి చేశారు .మూర్తి  గారు చదువు ముగించి ఉద్యోగప్రయత్నాలు చేసినా ఫలి౦చ  లేదు.ఒక నాడు కాకినాడ స్టేషన్ లో షికారు చేస్తుంటే బాల్యమిత్రుడు కనిపించగా అయన తండ్రి డిప్యూటీ కలెక్టర్ నిట్టల రామమూర్తి నాయుడు కాకినాడ నుంచి కర్నూలుకు మారి .తనకొడుకుద్వారా మూర్తి గారి గురించి అడిగి తెల్సుకొని కర్నూలుకు వస్తే ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పారు.ఆయన సిఫారసుతో మూర్తి గారు ద్రోణాచలం తాలూకాఆఫీసు లో 1915లో చేరారు .అప్పటినుంచి నాలుగేళ్ళు మార్కాపురం వగైరా చోట్లలో పని చేసి ,1919లో రెవెన్యు ఇన్స్పెక్టర్ అయ్యారు .రెండేళ్ళ తర్వాత అనంతపురం సెటిల్ మెంట్ రెవిన్యు ఇన్స్పెక్టర్ అయి రెండు చేతులా పుష్కలంగా డబ్బు సంపాదించారు .వీరికి రాముడు త్రిపురసుందరి ,కృష్ణుడు సంతానం .బీద బిక్కి కి సాయపడటం ,లోక సేవలో తరించటం వలన లింగమూర్తి గారిని’’ దాసు గారుగా పిలిచి జానం గౌరవించారు  .

                దిగంబర స్వామి

అనంతపురం బెల్గుప్ప గ్రామం లో ఒక దిగంబర పిచ్చోడు తిరుగుతూ ఒక కమ్మరివాడు పొయ్యిలో కొర్రు కాలుస్తూ ఆ దిగంబరుడి ఒంటికి  వేళాకోళంగా కర్రుకాల్చగా ఆయన్ను ఏమీచేయ లేకపోవటం తో ఆయన్ను ‘’దిగంబర స్వామి ‘’అని ఆరాధించటం మొదలు పెట్టారు అక్కడి ప్రజలు .ఒకరోజు ఈ స్వామిఆ వూరి  దేవాలయం లో ఉండగా దాసుగారు ఉద్యోగ బాధ్యత పై ఆ దేవాలయం లోనే విడిది చేశారు .ఆలయం దగ్గర పెద్ద గుంపు స్వామి చుట్టూ మూగి కోలాహల౦ చేస్తుండగా దాసుగారు రాగా,స్వామి చిరునవ్వుతో దాసుగారిని ఆప్యాయంగా కౌగలించుకొని ,ఆతర్వాత ఒక అరుగుపై పడుకొని స్వామి వెళ్ళిపోయారు .దాసుగారికీ ఏమి జరిగిందో చాలా సేపటిదాకా తెలీక స్మృతి రాగానే కళ్ళు తెరిచి చూస్తె స్వామీ ,ఆ జనమూ కనిపించలేదు .స్వామి కౌగిలింతలో తనకు ఒక స్వప్నం వచ్చిందని ,అందులో తన పూర్వ జన్మ వృత్తాంతం తెలియ జేయబడి౦దని దాసుగారు తన ఆ౦తరంగికులకు తెలియజేశారు .

   ఆ కల వివరాలు –ఒక భయంకరారణ్య౦ లో  పెద్ద పర్వతం దానిపై ఒకకుటీరం దాని ప్రక్క కోనేరు ,గొర్రెలు మేపెకుర్రాడు ఒక ముసలాయన ఉన్నారు .ముసలి బాలుడి దగ్గరకొచ్చి అన్న౦ కావాలని అడిగితె ,పైన కుటీరం లో తన తలిదండ్రులు పెడతారని చెప్పాడు .వాళ్ళను అడిగాననీ ఏమీ లేదని చెప్పారని తెలిపాడు .మూడు రోజులనుంచి అన్నం లేదని చెప్పి కూలబడ్డాడు .తాను  మధ్యాహ్నం తినటానికి ఉంచుకొన్న రొట్టెముక్క, వెన్న తెచ్చి ముసలికి పెట్టాడు .అందులో సగమే తని మిగతా సగం ఆబాలుడిని తినమని చెప్పి ‘’అబ్బాయీ !ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టావు. నీ పుణ్యం ఊరికే పోదు .వచ్చే జన్మలో వేలకొద్దీ జనాలకు ఉపకారం చేస్తావు ‘’అని దీవించి వెళ్ళాడని ఆకల సారాంశం  .

   దాసుగారికి నాలుగవ సంతానం కమల పుట్టి14రోజులైంది భర్త ప్రేలాపన అవతారం చూసి భయపడి౦దిభార్య సంగమేశ్వరమ్మ .తండ్రికి టెలిగ్రాం ఇప్పిస్తే ఆయనవచ్చి ,ఉద్యోగానికి రెండు నెలలు సెలవుపెట్టించి ,తమతో పాటు తీసుకువెళ్ళాడు .ఆరోగ్యం బాగై మళ్ళీ ఉద్యోగం లో చేరారు .కానీ దిగంబరస్వామి ప్రభావంతో దీన జన సముద్ధరణపైనే మనసు లగ్నమై పోయింది.స్వామి అనుగ్రహం లో దాసుగారిలో దివ్య తేజస్సు ఆవిర్భవి౦చ గా ప్రజలు ఆయనవైపుకు ఆకర్షి౦ప బడ్డారు  .

              అన్న సత్రాల స్థాపన

 అనంత పురమండలం లో 1923-24లో తీవ్ర క్షామం ఏర్పడింది .ప్రజలకు అన్నం నీరు లేక విలవిల లాడారు .ఇందులోనుంచి ప్రజలను బయట పడేయాలని సంకల్పించుకొని దాసుగారు ,తాను వెళ్ళిన  ప్రతి ఊరులోనూ అన్నదానమహిమ చెబుతూ రోజూ ఒక్కమనిశషికైనా అన్నం పెట్టమని ఉద్బోధించేవారు .కులీన యాచకుడిని ఒకరిని నియమించి గ్రామంలో ఆహారం అడిగి తెప్పించి ,అందులో అతని సంసారానికి తగిన ఆహారం ఉంచుకొని ,మిగిలింది ఆగంతులైన బాట సారులకు పెట్టె ఏర్పాటు చేశారు దాసుగారు .ఎలాంటి ఆర్భాటం హడావిడి ప్రచారం లేకుండా ఈ అన్నసత్రాలు నిర్వహి౦పబడుతూ అన్నార్తులకు తృప్తి కలిగిస్తూ ,ఇప్పటికీ నిర్వహింప బడుతూనే ఉన్నాయి .పినాకిని పత్రిక ఈ అన్న సత్రస్థాపన గురించి 1924 ఏప్రిల్ 12 న ‘’లింగరాజు అనేవారు సుమారు రెండు నెలలక్రితం సెటిల్ మెంట్ ఇన్స్పెక్టర్ గా ఈ ప్రాంతానికి వచ్చి ,తాము వెళ్ళిన ప్రతిచోటా మంచి విషయాలు బోధిస్తూ చెడును వదిలిపెట్టమని  హితవు పలుకుతూ ,సన్మార్గ ప్రవర్తకులు కావాలని చెబుతూ ,ప్రతిపల్లెలో నిరతాన్న దానం జరగాలని ,అన్నసత్రాలు స్థాపించారు .నేను కాంగ్రెస్ ప్రచారానికి ముదిగల్లు గ్రామం వచ్చాను నేనుచేయాల్సిన పనేమీ కనిపించలేదు .ఎందుకంటే అక్కడి ప్రజల ఐకమత్యం ,మిత్రత్వం వాత్సల్యం పాపభీతి ధర్మమార్గం నన్ను ముగ్దుడిని చేశాయి .ఇలాంటి గ్రామం ఇంతకూ ముందు నేనేప్పుదూచూడనే లేదు .దీనికి కారణం ఎవరై ఉండచ్చునా అని విచారించగా దాసు లింగమూర్తి గారు అనే మహనీయుడు అని తెలిసింది .వారి తత్వోపదేశం లో పరధనాపేక్ష ,,పరస్త్రీ సంగమం ,పరస్పర శత్రుభావాలను త్యజించమని ఉద్బోధిస్తున్నారు. వారిమాట త్రికరణ శుద్ధిగా ప్రజలు ఆచరిస్తున్నారు .ఈ కరువుకాలం లో ఈ  ప్రాంతంలో నిన్నటివరకు 10అన్న సత్రాలు స్థాపించి ఆకలి గొన్నవారికి అన్నం అందిస్తూ మహామానవ సేవ చేస్తున్నారు దాసుగారు తన విధ్యుక్తధర్మ నిర్వహణ   సంతృప్తిగా  చేస్తూనే .ఇవాళ 11అన్నసత్రాన్ని కళ్యాణ దుర్గలో స్థాపిస్తున్నట్లు తెలిసింది .ఇలా ప్రతిగ్రామం లోనూ జరగాలని దాసుగారి ఆలోచన త్వరలోనే కార్యరూపం దాలుస్తు౦దనటానికి  ఎలాంటి అనుమానమూ లేనేలేదు –సోంపల్లి వెంకటరమణయ్య చౌదరి -24-3-24-ముదిగల్లు .ఇలా దాసుగారు తన సంకల్ప బలం తో ,ప్రజల సహకారంతో 100 అన్న సత్రాలు స్థాపించి అన్న దానం చేసి పెద్దల పిన్నల బీద ప్రజల చేత కృతజ్ఞత పొందారు .

             తారకనామ ఉపదేశం

పదేళ్ళ వయసుగల ఒక బాలయోగి తన చుట్టూ వందలాది జన౦  మూగిఉండగా ఊరూరు తిరిగాడు .ఊరివారు వాళ్లకు భోజనవసతులు కల్పించేవారు .ఒకరోజు దాసుగారు ఉండే చెట్టూరు గ్రామానికి వచ్చి ఒక చెట్టుకు ఉయ్యాల కట్టించు కొని ఊగు తుండగా దాసుగారు సైకిల్ పై  వస్తూ౦డగా ఎంత పెద్దవాదినైనాఒరేయ్ అని పిలిచే బాలయోగి ‘’ఒరేయ్ .ఇక్కడికి రా ‘’అని పిలువగా ,ఆశ్చర్యపడి అతడు తనతోషికారు రమ్మంటే ఆయన గుర్రం మీదా ఈయన సైకిల్ పైనా రెండు మైళ్ళు వెళ్లి ఒక దిగుడు బావి దగ్గర దిగారు .దాసుగారిని ఏదైనా మంత్రం వచ్చా అని అడిగి ,రాదనీ చెప్పగా బాలయోగి తారకమంత్రం దాసుగారికి ఉపదేశించి అనుగ్రహించారు .అప్పటి నుంచి దాసుగారు అన్నసత్రాలతో తృప్తిపడకుండా శ్రీరామ సప్తాహాలు ,దేవాలయ నిర్మాణాలు జీర్ణాలయ ఉద్ధరణలు  మొదలైన మహత్కార్యాలు కూడా చేబట్టారు .నిత్యం మానసిక పూజతో చిత్తాన్ని పరిపక్వం చేసుకొన్నారు .

  సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -18-8-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సంజీవరాయ కవి శ్రీ రుక్మిణీ పరిణయ సంజీవిని 

సంజీవరాయ కవి శ్రీ రుక్మిణీ పరిణయ సంజీవిని -1

 కవికధా కమామీషు

      రావూరి సంజీవ రాయ కవి ప్రణీత ‘’శ్రీ రుక్మిణీ పరిణయము ‘’కావ్యం విశిష్ట మైంది .కారణాలు చాలా ఉన్నా ,అందులో ముఖ్య మైన కొన్నిటిని చూద్దాం .ఏ కావ్యాని కైనా కర్త ఒక్కడే ఉండటం సహజం .కాని ఈకవ్యకన్యక కు నిజం తండ్రి సంజీవ రాయ కవి అయినా ,తామూ ఆ కోవకు చెందిన వారమే నని కొప్పర్తి నరసాఖ్యుడు ముందు ప్రకటించగా ,మహా మహోపాధ్యాయ శ్రీ కాశీ కృష్ణాచార్యుల వారు తామే పరిష్కరించి ప్రకటించి నట్లు చెప్పారు .అంటే అసలు తండ్రే కాక ,మరో ఇద్దరి ముద్దుల పుత్రిక అయింది ఈ కావ్య కన్యక .అయితే ,సాహితీ లోకం వీరిద్దరిని గుర్తించ లేదు .అసలు తండ్రి సంజీవ రాయ కవి యే అని పరిశీలకులు ,పరి శోధకులు నిర్ణ యించారు .,ధ్రువీకరించారు .కనుక కర్తృత్వం పై వాదం సమసి పోయింది .ఈ కావ్య కన్యక కు ఇప్పుడు  280 ఏళ్ళ వయసు వచ్చింది .

           సంజీవ రాయ కవి వరంగల్లు జిల్లా కొలను పాక అనే గ్రామం లో జన్మించి నట్లు ఆది జైన పుణ్య క్షేత్రమని అక్కడ వీర నారాయణ స్వామి దేవాలయం ఉందని ఆరుద్ర తెలిపారు .అక్కడ గోపరాజు రాయప్ప గొప్ప శ్రీమంతుడు .ఆయన స్వామిపై శతకం రాయమని ఈ కవిని పిలిపించి ,సత్కరించి ,వేడుకొన్నాడు .’’కొలను పాక వీర నారాయణ ముకుంద విశ్వ కుంద‘’అనే మకుటం తొ సీస పద్య శతకం రాశాడు .వీటిని ‘’గునుగు సీసాలు ‘’అన్నారు దశావతార వర్ణన ,శ్రీ కృష్ణ లీలలను కూడా కవి వర్నిం ఛాడట .సంజీవయ్య తండ్రి గురవయ్య కూడా కవి గా ప్రసిద్ధుడే .కొండ వీటిలో ఉండే వాడు .ఆయన్ను ‘’కొండ వీటి పేద రావు గురవయ్య ‘’అనే వారట .మొదట తెలంగాణా వారే .తర్వాత  తెనాలి దగ్గర రావూరు చేరటం వల్ల ఇంటి పేరు రావూరి గా మారింది .’’అనుమ కొండలు ‘’అనే ఉప శాఖ ఉన్న  ప్రధమ శాఖ లో భాగమట..ఈ శాఖ బ్రాహ్మణులు ఓరుగల్లు దగ్గర ఉండటం వల్ల వీరి పూర్వీకులు ఇక్కడి వారే నంటారు ఆరుద్ర .కవి సంజీవయ్య చదువు తెలంగాణాలోనే సాగింది  .రాత్రి పూట శ్మశానం లో శవాల వెలుగు లో చదువు కొనే వాడట.అంతటి దుర్భర దారిద్ర్య స్తితిలో కుటుంబం ఉండేదన్న మాట .తర్వాత పెద్ద వాడై,సంపాదనా పరుడై వీర నారాయణ స్వామి ఆలయాన్ని అభి వృద్ధి చేశాడట .’’కృష్ణ హరీ వాసుదేవ నందన ‘’శతకం రాశాడు .ఆ శతకం లో తనను ‘’సుధా రస తుల్య కవిత్వ కల్పనా స్రావిని –కొండ వీటి పేద రావు గుర్వ తనూజు సంజీవిని ‘’అని చెప్పుకోన్నాడట .జాతక సిద్దాంతగ్రంధాలు చదివి వంట పట్టించుకోన్నాడు .వీర నారాయణ శతకాన్ని 1731లో రాశాడట .రుక్మిణీ పరిణయ కావ్యాన్ని1787  లో రాశాడు .పద్యాలు క్లిష్టం గా ఉండటం ,జనాలకు అర్ధం కాక పోవటం వల్ల సంస్కృతం లో వివరణలూ రాసుకొన్నాడు కవి .ఈ వివరాలన్నీ ఆరుద్ర సమగ్ర ఆంద్ర సాహిత్యం ‘’లో పొందు పరచాడు .

            బులుసు వెంకట రమణయ్య గారు ‘’ ఆంధ్ర కవి సప్త  శతి ‘’లో సంజీవ రాయ కవి కవితా త్రివిక్రమవిలాసం ,భాగవతం లోని ఏకాదశ ,ద్వాదశ ఖండాలు కూడా పద్య కావ్యాలుగా  చెప్పి నట్లు వ్రాశారు .ఈ విషయాలను ఆరుద్ర చెప్ప లేదు .దీపాల పిచ్చయ్య శాస్త్రి గారు కూడా సంజీవ రాయ కవి గురించి చెప్పారు .కవి ప్రత్యేకత వల్ల సాహితీ లోకం లో నిలబడి ,ఎన్ని తంత్రాలు జరిగినా ‘’చిరంజీవి ‘’గా సంజీవ రాయ కవి నామ సార్ధకాన్ని సాధించారు .ఆంజనేయ స్వామి పేరును సార్ధకం చేసుకొన్నారు .

 శ్రీ రుక్మిణీ  పరిణయ సంజీవిని-2

దౌహిత్రుని తాపత్రయం

            సంజీవ రాయ కవి కవి కథకులు రిటైర్డ్ రేడియో ఇంజినీర్ స్వర్గీయ శ్రీ గంధం వేంకాస్వామి శర్మగారి మాతా మహస్థానం  లోని వారు .ఆరు తరాల ముందటి వారు .సాధారణం గా దౌహిత్రుడు తాత గారి ఆస్తి కి వారసుడౌతాడు అనేది లోక రీతి .శర్మ గారు ఆరోతరానికి చెందిన వారు కనుక సాహితీ వారసత్వపు హక్కు లభించింది .అది తన తాత ,ముత్తాతల నే కాక ముందు తరాల వారికీ ఋణం తీర్చు కొనే హక్కు ,బాధ్యతగా భావించి తాను పది హేనవ ఏట చూసిన సంజీవ రాయ కృత రుక్మిణీ పరిణయ కావ్యం లోనీ చిత్రాలను సేకరించే ప్రయత్నం లో ఉన్నారు .ఇప్పుడీ కావ్యాన్ని పరి శుద్ధ పరచి తానే ‘’ప్రకాశకులు ‘’అయి ,దాన్ని సాహితీ ప్రకాశ మానం చేస్తూ తర తరాలరుణాన్ని సభక్తికం గా తీర్చుకొన్నారు .ఎందరికో ఆదర్శమాను లయారు .ఇలా ప్రచురించటం లో అమితానందాన్ని పొంది ,ఆ ఆనందపు  అను భూతిని సాహితీ ప్రియులకు అందజేసి ధన్యులవుతున్నారు .,ప్రశంస నీయులయారు .తప్పులు జల్లెడ పట్టి ,అభిప్రాయం రాయమని నన్ను ఆదేశించారు .వారి పై ఆదరాభిమానాలతో ఔదల దాల్చాను .కావ్యం చదువుతూంటే ,చేమ కూర వేంకటకవి ,రామ రాజభూషణ కవి,పోతన కవి ల కవిత్వాలు కలిపి ‘’మిక్సీ పడితే’’ ఎలాంటి కవిత్వం వస్తుందో అలాంటి కవిత్వం ఈ కవి రాశారని అని పించింది .మంచి పండితునితో అర్ధ తాత్పర్యాలను విశేషాలను వ్రాయిస్తే మరీ శోభ తో కావ్యం ప్రకాశిస్తుందని శర్మ గారికి సూచించాను .వారు వెంటనే ‘’మంచి సూచన చేశారు ప్రసాద్ గారూ ,నేను ఆ ప్రయత్నం చేసి మీరు చెప్పింది త్వరలోనే ఆచరణ లోకి తెస్తాను .అర్ధ తాత్పర్యాలు విశేషాల తో మళ్ళీ ఈ పుస్తకాన్ని ముద్రిస్తాను.మీ వ్యాఖ్యానాన్ని అక్షరం వదల కుండా అందులో ముద్రిస్తాను ‘’అని చెప్పారు .ఆ ప్రయత్నం తీవ్రం గా నే చేశారు .రాసే వారు దొరికారని ,పని జరుగుతోందని త్వరలోనే పూర్తీ అవుతుందని కని పించినప్పుడల్లా చెప్పే వారు .అయితే అకస్మాత్తు గా శ్రీ శర్మ గారు ఈ  ఏడాది 2012మే నెలలో ఆ పని పూర్తి కాకుండానే మరణించటం సాహితీ ప్రియులకు తీవ్ర నిరాశనే మిగిల్చింది .శర్మ గారు సమర్ధులైన కధా రచయిత .గొప్ప సంస్కారి .’’అమృత హస్తాలు ‘’,’’నాయనమ్మ కథలు ‘’మొదలైన అద్భుత సంకలాను తెచ్చారు .ఇప్పుడు కావ్య విశిష్టత ను తెలుసు కొందాం

                      కావ్య విశిష్టత

       శ్రీ రుక్మిణీ పరిణయ కావ్యం అనేక ప్రయోగాలకు నిలయం .కావ్యానికి కావలసిన సకల హంగులూ ఉన్నాయి .తన ఇష్ట దైవం సంజీవ పర్వతోద్ధారి అయిన శ్రీ ఆంజనేయ స్వామి కలలో కన్పించి ,కొండపల్లి మండలం లో కృష్ణా నదికి ఉత్తరాన గల కోడూరు లో తాను వెలసి ఉన్నానని ,అక్కడ మదన గోపాలుని ఆలయాన్ని నిర్మించి ,స్వామిని ప్రతిష్టించి ,రుక్మిణీ పరిణయ కావ్యం రాసి ధన్యుడైనాడు .జన్మ సార్ధకత చేసుకొన్నాడు .అలానే చిత్తాను వృత్తిగా ప్రవర్తించి ,కావ్యం రాసి సార్ధకత పొందాడు .ఈ కావ్యానికి ‘’మదన గోపాల చరిత్ర ‘’అనే పేరూ వచ్చింది .అయిదు ఆశ్వాసాల కావ్యం ఇది .

       శ్రీ మద్భాగవత దశమ స్కంధం లోనీ రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని పఠించిన కన్యకలకు వివాహం త్వరలోనే జరుగుతుందని మన దేశం లో నమ్మకం బాగా ఉంది .అలాచేసి సఫలీ కృతు లైన వారెందరో ఉన్నారు .ఆ కథకే కాయ కల్ప చికిత్స చేశారు సంజీవ రాయ కవి .తనకు ముందు తరాల వారైన పోతన ,భట్టు మూర్తి ,చేమకూర వెంకట కవుల బాణిని ,వాణిని స్వంతం చేసుకొన్నాడు .వారు పోయిన ఫక్కీ లన్ని అనుసరించాడు .,అనుక రించాడు కూడా .ముఖ్యం గా కథా వివరణ లో పోతన గారు ఏయే సందర్భాలలో ఎలా పద్యాలు చెప్పి పారాయణ చేయటానికి రాశారో అలానే ఈ కవీ పద్యాలు రాశాడు .అయితే అంత తాదాత్మ్యకత చూపలేక ,కల్పించలేక పోయారు .వర్ణనల విషయం లో యమకాలు ,చమక్కులు ,బంధ కవిత్వాలతో మిగిలిన ఇద్దర్నీ అనుసరించారు .కావ్య స్తితికి కావలసిన మసాలా అంతా దట్టించాడు .

       కథ అంతా తెలుగు లోగిళ్ళు లోనే జరిగి నట్లు చేయటం తమాషా గా ఉంది .రుక్మిణి తెలుగింటి ఆడపడుచు లాగ కన్పిస్తుంది .ఆమె తల్లి గర్భవతి అయినప్పుడు జరిగే సీమంతం ,రుక్మిణి బాలసార ,ఆట ,పాట అన్నీ తెలుగు వారు జరుపుకొనే రీతి లోనే చూపారు .కవిత్వం చాలా చక్కగా ,వయ్యారం గా నడుస్తుంది .’’పద్మేశు కధలు –మధు మాధురీ నాద స్తిత   కున్మేలై ,కాగిన మీగడ పాలై విన ,గ్రొత్త సేయు ‘’రీతిగా ఉంటాయట. .రుక్మిణి తల్లికి కలలో లక్ష్మీ దేవి కన్పించటం ఆమె అందాన్ని ,లావణ్య దీధితిని చూసి ముచ్చట పడి తనకు కూతురు గా జన్మించమని కోరటం కవి చేసిన భలే కల్పన .ఆ సందర్భం లో ‘’పుష్ప వత్సవ మహా రాజ భాగమునకు రాజు వెంచేసే నొక రేయి రాజసమున ‘’అని శ్లేషను ప్రయోగించి సందర్భ శుద్ధి గా చెప్పాడు .ఆమె గర్భవతి గా ఉన్నప్పుడు ,శారీరకం గా వచ్చిన మార్పులను సాంప్రదాయ పద్ధతులలో వర్ణించి చెప్పాడు .రుక్మిణి జన్మించింది ..పీటలపై దంపతులు కూర్చుని ,స్వస్తి పుణ్యః వాచనం చేసి’’ బాలికా మణి దేహ శోభా విభూతి రుక్మ కాంతి (బంగారు కాంతి )విలాసైక రూఢిదగుట వల్ల ‘’రుక్మిణి అని పేరు పెట్టారట .అద్భుతం అని పిస్తుంది .ఆమెను చూడ టానికి వచ్చిన పురజనులు రుక్మిణి తన పిన తల్లి పోలిక అని ఒకరంటే ,తల్లి పోలిక అని ఇంకోరు ,అమ్మమ్మ పోలిక అని వేరొకరు అనటం లో మన తెలుగింటి అమ్మలక్కల తీరు ప్రతి బి౦బిస్తుంది .చివరకు ‘’అగణ్య పుణ్య జన నిశ్శేష భువన పోషణ ,సువత్సతల విభూషిన్మతల్లి యైన బాలికా మణి ‘’అని సాక్షాత్తు లక్ష్మీ దేవి యే ఆమె అని నిర్ధారించింది ఒక పేరంటాలు  .రుక్మిణి దిన దిన ప్రవర్ధ మానమవుతూ ఉంది .ఆమెను ఉయ్యాల్లో వేశారు .ముత్తైదువులు ‘’ఉయ్యాలో జంపాలో ‘’అని తెలుగింట్లో లాగా ఉయ్యాలా లూపారు .బాల రుక్మిణి తల్లి పాలు తాగే విధానమూ వర్ణించాడు కవి .మనోహరం గా .’’ఒక చన్నా నుచు ,నొక చన్ను బుడుకుచు ,మార్చి మార్చి ‘’పాలు కుడుస్తోందిట .ఇది అందరు పిల్లలు చేసే విధానమే .బొమ్మ కట్టి మన ముందుంచాడు .బాలికకు బేసి నెలలో అన్న ప్రాసనా చేయటం మన రివాజు .రుక్మిణికి అయిదవ నెలలో ‘’అయిదవదౌ నెల యందు నైదువల్ ‘’చేశారని వర్ణించాడు .తోటి పిల్లలతో ఆమె ఆటలాడింది .’’జగదుద్ధారర మోహనా కార వర్తి యై ‘’విల సిల్లు తోంది .’’చలువ జాజిగి మించు చలువ వలువలు ధరించింది ‘’రవిక లోపల రవిక తొడిగిందట .అని చమత్కారం గా చెప్పాడు కవి .అంటే ఇప్పుడు స్త్రీలు వేసే ‘’బాడీ ‘’వేసిందన్న మాట ఆనాడే రుక్మిణి .ఇంతకూ రుక్మిణి తండ్రి పాలించిన విష్ణు కుండిన నగరం మన కొండ వీడు దగ్గరే నని చరిత్ర కారులు చెబుతారు .ఆది దృష్టిలో పెట్టుకొని కవి ఇంతటి తెలుగు వాతావరణాన్ని తెలుగింటి శోభను తెచ్చాడని  పిస్తుంది .

 శ్రీ రుక్మిణీ పరిణయ సంజీవిని -3

       రుక్మిణీ దేవి సర్వ దేహ వర్ణన ను చమత్కారం గవర్ణించాడు ‘’సువర్ణా’’లతో .యుక్త వయస్సు వచ్చింది .ఆమెకు తగిన వరుడు శ్రీ కృష్ణుడే నని ఊహించి చక్కని పద్యం చెప్పాడు .

‘’హరి  య౦శ౦ బున బుట్టె గ్రుష్ణు డిలపై ,నద్దేవుని గూర్ప ,వా

  గ్వరుడూహించి విచిత్ర కల్పనముగా ,బద్మాంగి నీలాల కో

త్కరంగ ,నీ సుదతిన్ సృజించి ,జఘన స్థానంబు గాజేసెనో

ధరణిన్ ,దత్తరుణీత్రయంశాక్రుతి ,దత్తాద్దేతువై కన్పడన్ ‘’

కృష్ణుని లోనీ అంశాలన్నీ ఆవిడ శరీరం లో ఉన్నట్లు చెప్పటం భావుకతకు పట్టం కట్టటమే .ఆమె మోవికి మామిడి చిగురు ,మంకెన పువ్వు ,యెర్ర తామరా వగైరాలేవీ సరి పోవటం లేదనటం చిత్రం గా ఉంది..పరిణతి లో సారూప్య స్తితి తో వర వర్ణిని గా పేరు పొందింది .కృష్ణుడు కూడా ఆమె రూప లావణ్యాలను తెలిసి కొని ,’’తనకుం జాయగా జే కొందు ననుచు శౌరి దలచెన్ ‘’అని పిస్తాడు .’’మేడ్ ఫర్ఈచ్ అదర్’’అన్నట్లున్నా రన్న మాట .

         కూతురి పెళ్ళి చేయాలని తండ్రి భీష్మకుడు భావించి ,మంత్రులతో ,పెద్దలతో తగిన వరుడెవరు అని అడుగుతాడు .తనకు కాబోయే అల్లుడు తలిదండ్రులు బల వంతులైన బంధు గణం గురు పురోహిత హితులు ,సిరి సంపదా ,కళా ,సాహస ఔదార్యం ,పరాక్రమం గుణ విరాజం ఉన్న రాజ కుమారుడై ఉండాలని అన్నాడు .కమల వంటి కుమార్తెకు హరిని బోలిన అల్లుడు దొరికితే మహదానందం అన్నాడు .

‘’కన్యాం రూప గుణాన్వితాం మమ సుతాం ,క్ష్మాపాల బాలైక మూ

  ర్ధన్యాం కాంచన రత్న భూషణ యుతం దాస్యామి తే విష్ణవే

  ధన్యోహం హి గృహాణ ‘’యంచు హరి పాదద్వంబు న్వార్చి ,ఈ

  కన్యాం దానము సేయగలగు ఘన భాగ్యం బెన్న దిన్కబ్బున్ ‘’

   ఇలా సంస్కృతం లో తెలుగులో పద్యాన్ని ,కన్యాదానాన్ని వివరించాడు విచిత్ర కవి .

         మంత్రు లంతా ఏకాంత మందిరం లో సంప్రదించుకొని ఏక వాక్యం గా శ్రీ కృష్ణుడే తగిన వరుడని అతని పుర విశేషాలు ,ఆయన గుణ శీలాదు లన్నిటిని సవివరం గా చెప్పారు .శ్రీ కృష్ణుని కలిమి ముందు ఇంద్ర ,కుబేర సముద్ర ,ఈశ్వర విభూతు లేవీ చాల వన్నాడు .అతని శరీరం లోనీ ప్రతి భాగాన్ని అద్భుత మైన పద్యాలతో వర్ణించాడు .ఆయనే రుక్మిణీ పతి కాగలిగిన వాడని చెప్పారు .

            అన్న రుక్మి అక్కడే ఉన్నాడు .వీళ్ళ తీరు నచ్చలేదు .అతని మనసులో శిశు పాలుడున్నాడు .ఇచ్చకపు మాటలతో రాజును ప్రక్క దోవ పట్టిస్తున్నారని ‘’అనర్ఘ్య రత్నాన్ని ఆర ఊతంబు తోదవున అతకటం లాఉంటుంది రుక్మిణిని కృష్ణునికిస్తే’’ అన్నాడు .కృష్ణుని చేష్టల్ని తన వాక్య చాతుర్యం తో గేలి చేశాడు .’’నిలువెల్లా మాయ ,కులం ,గుణం లేవు .ఎన్నో చోట్లు మార్చాడు .గుణం లేని వారి స్నేహం రూప రేఖాదులు లేని వాడు ‘’అంటూ నిందా స్తుతి చేశాడు .కవి సామర్ధ్యం ఇక్కడ ప్రస్పుటం గా కన్పిస్తుంది .మరి శిశుపాలుడు ‘’మహిత కనక కుదర చాప మంత్ర జపుడు ,భరిత పరమ కృపుడు ‘’అని మెచ్చాడు .రుక్మిణి భరించలేక పోయింది .రాచ కన్య ఏమీ చేసే స్తితి లో లేదు .అక్కణ్ణించి వెళ్లి పోయింది .ఎక్కడికి వెళ్ళిందో ,ఏమి చేసిందో చూద్ద్దాం

‘’కాంత ఏకాంత కాంత నిశాంత శయ్య –వాన్తగతి నొప్పె తాం త లతాం తమై

  దంతరిత పూర్వ జోదితో దంత చింత –సంత సంతాప దంతురి తాం త రామమున ‘’

  అంతటి బాధను ఇంతటి అందమైన పద్యం లో బంధించాడు కవి .ఆమె వెంట మనమూ వెళ్తున్న భ్రాంతి కల్గించాడు .ఆమె బాధ ‘’గోరు చుట్టు పై రోకటి పోటు ‘’లా ఉన్నదని మంచి జాతీయం ప్రయోగించాడు .

  శ్రీ రుక్మిణీ పరిణయ సంజీవిని -4

   బాపని రాయబారం

         తన మనసులోని ప్రేమను శ్రీ కృష్ణునికి విన్న వించటానికి పేరు లేని బాపనయ్య ను పిలిపించి కృష్ణుని చేరి తన విషయం తెలియ జేయమని కోరింది .’’రూఢ మేదో విషలు ,వాచాలు నిన్ను బిల్వ న్వలసే నితకు నా వార్త దెల్ప బుధే౦ద్రా ‘’అన్నది .తన మనసంతా హరి పై చిక్కు కున్నదని సింహముపాలి సొమ్ము  గోమాయువు హరి౦చి నట్లు గా శిశుపాలుడున్నాడని పోతన శైలిలోనే చెప్పింది కాదు చెప్పించాడు సంజీవ రాయ కవి –

 ‘’కారము చేయునగ్రాజు వికారము దూరముగా భవచ్చమ –త్కారము జూపి ,నాదగు ప్రకారము శౌరికి విన్న వించి ,స

 త్కారము సేయనిన యుపకారము కై ప్రతీకారమే నమ-సకారము నేయు చుండుదు చొ కారాముగా హరి దెచ్చు నంతకున్ ‘’అంటూ ‘’కారం ‘’తో చమత్కారం చేస్తాడు కవి ..

        బాపడు ద్వారకా నగరం చేరి అక్కడి పట్టణవిశేషాలన్నీ తిలకిస్తాడు .పుర వర్ణన లో అద్భుత మైన పద్యాలున్నాయి .తన రాక ను ద్వార పాలకుని ద్వారా ద్వారకా కా౦తునికి చెప్పిస్తాడు .ఆయన విని ,’’భీష్మ కరాట నయా ,గతి దెల్పగా వచ్చిన వాడ’’నితెలిసి హృష్ట చిత్తుడౌతాడు కన్నయ్య .అంతటి పరేంగితావగాహి .బ్రాహ్మణునికి ఎదురేగి పూజించి ఉచితాసనం పై కూర్చో బెట్టాడు .ఇక్కడ శ్రీ కృష్ణుని దివ్య సుందర విగ్రహాన్ని చూసి నోరారా ప్రస్తుతిస్తాడు రాయబారి బాపడు .ఎన్ని పద్యాలు చెప్పి వర్ణించినా కవి కౌతుకం తీరలేదు .ఓ దండకం దండ వేసి ,దంచేస్తాడు .అదీ సంతృప్తి నివ్వదు .బహు విధ కందాలలో అర వింద దళాయతేక్షణుడిని వర్ణిస్తాడు .పాద భ్రమర ,క్షురికా బంధ , ఆర్ద భ్రమర ,గుడి ఏకాక్షర ,తల కట్టు ,శ్రుంగ కందాలలో అందాన్ని కలం యేతాముతో తోడేస్తాడు .ఇది చాలక గుణితం లో గుణిస్తాడు .సాప్తిక ,ఆంద్ర సప్తిక విభక్తికం గా భక్త్యంజలి ఘటిస్తాడు ..చక్ర బంధ ,నాగ బంధ అనుప్రాస సీస ,ఆంద్ర గీర్వాణ భాశిక్య పద్యాలతో ఆనంద పులకామ్కితం గా చక్ర వర్ణన చేస్తాడు .రుక్మిణీ సందేశాన్ని అప్పుడు విని పిస్తాడు .అలాగే రుక్మిణి అందాలణు రుక్మిణీ కాన్తునికి విన్న విస్తాడు .ఇదంతా ఒక రసమయ లోకం లా ఉంటుంది .ఇక్కడ ఒక పద్యం హృద్యం గా రాస్తాడు

‘’అభ్ర విభ్రమము మధ్యమమునందే కాదు -పొందిన వేనలి యందు గలదు

  హరి మనోహరిత్వ మాస్యమ్బునందే కా—దనిశము పాలకుల యందు గలదు ‘’ అంటూ ‘’ముందు శ్రీత్వంబు భావంబు నందే కాదు –కర్ణముల యందు గలదు ‘’అంటూ ‘’ ఆ వరారోహ యాఖ్య చేత నె కాదు దేహ విభూతి నలరు ‘’అని ముక్తాయింపు నిస్తాడు .

          ఆమె పలకులు ‘’కు౦దమ్ములు   పలుకుదురున ,కుందంము లటంచు బల్కు గొన నౌ జేలికిన్ ‘’అని చెప్పుతూ ‘’కం దమ్ములు లు ఘన శోభా –కం దమ్ములు మారుని నంత గందమ్ములగున్ ‘’అన్న మాటలు ఆయన కంద పద్యాలకు అన్వ యించ వచ్చని పిస్తుంది .అందమైన కందం ,మా కందం ,మధుర నిష్యందం ,ఆనంద రస నిక్షేపం .

శ్రీ రుక్మిణీ పరిణయ సంజీవిని -5(చివరి భాగం )

రుక్మిణీ కృష్ణ పరిణయం

       శ్రీ కృష్ణుడు రుక్మిణి సందేశాన్ని విని పోతన గారు ‘’వచ్చెద విదర్భభూమికి ‘’అని చెప్పి నట్లు సంజీవ రాయ కవీ చెప్పాడు .’’వచ్చేద విదర్భ నృప వరాన భీష్మక కుండి నంబు ‘’అని చెప్పాడు .బ్రాహ్మణుడు బయల్దేరాడు .కృష్ణుడు ‘’సకలా రాతి చమూ సమూహ కలశా కూపార ,మందానమై ,పటు రుక్మిణ్య బాలా వివాహ కలనా ప్రారంభ సంధానమై ‘’బయల్దేరాడు కుండిన నగరానికి .

           చతుర్ధా శ్వాసం లో రుక్మిణి తాను పంపిన రాయ బారి కోసం ఎదురు చూడటం వెళ్ళాడో లేదో నని సందేహించటం తన సందేశం చెప్పాడో లేదో నని పోతన గారి రుక్మిణి లా సందేహించటం ఇక్కడా ఉంది.తర్వాత విరహం ,ఉప చర్యలు ‘’చక్కని దాన నంచు నేల జవ్వని నంచు సఖీ జనావళి ‘’అన్న పద్యం ముక్కు తిమ్మన గారి సత్య భామ పద్యం లా ఉంటుంది .ఆమె విరహాన్ని భరించలేక ‘’భైరవ కామ సుమాస్త్ర వేదనా శాలినిజంగ జాల గని హస్తాద్రికి చేరాడు .చంద్రోదయ వర్ణన కూడా సందర్భోచితం గా చేశాడు .’’ఆగ మిష్య త్శ్రిత య యామినీ నిటలాగ్ర దీపిత చందన తిలక మనగ ‘’లా ఉన్నాడు చంద్రుడు .రుక్మిణి పూర్ణ చంద్రుని పూజించి ‘’సిత భాసురాయ పూత వివిధ సుపరవిక పుణ్య దాయ దివ్య తారక మూర్తయే తే నమోస్తు ‘’అని సంస్కృత పదభూయిష్ట౦  గా స్తుతిస్తుంది .తర్వాత‘’పాపి ‘’అనే అదే రేంజి లో తెలుగు లో తిట్టి పోయింది .

          తర్వాత భానూదయం –‘’రుక్మిణీ కన్యకా వివాహ పూర్వ పరి ప్రేష్య వర చిరతర దీప్య మాన రత్నాకార దీపమనగా ‘’అన్నట్లు సూర్యుడు ఉదయించాడు .శ్రీ కృష్ణ భాగవానుడూ ఉదయించాడు .బ్రాహ్మణ ,సుదర్శన యోగమూ కలిగింది .వివరాలు తెలుసుకొని సంబర పడింది .గుండె దిటవు చేసుకొన్నది ..ప్రత్యుపకారం గా ‘’అంజలి ‘’ఘటించటం తప్ప ఏమీ చేయలేని అశక్తు రాలనని చెప్పి దీవన పొందింది .

శ్రీ కృష్ణుడు ఒంటరి గానే బయల్దేరాడు .తర్వాత ససైన్యం గా అన్న బలరాముడు వచ్చాడు .పోతన గారి లాగానే ‘’జతయా చక్రి విదర్భ రాజ సుతకున్ ,సత్యంబు వైదర్భియున్ జత ఈ చక్రికి నింత లెస్స యగునే ‘’అని పుర జనులనుకొన్నారు .భవానీ దేవిని దర్శించి ‘’మతి లో నమ్మితినే సనాతనుల నమ్మా ,మిమ్ము బ్రోచిన దంపతులుగా ‘’అని పోతన గారి రుక్మిణి ‘’నమ్మితి నా మనంబున సనాతనులైన ఉమా మహేశులన్ ‘’అన్న పద్యాన్ని ప్రేరణ గా చెప్పాడు సంజీవ కవి .రుక్మిణిని అశ్వం పై చేర్చిన కృష్ణుడు ద్వారకకు చేరటం శిశుపాలుడు ఎదిర్చినా ఫలితం లేక పోవటం రుక్మి ఎదిరించి  శృంగభంగ మవటం మనకు తెలిసిందే

          ద్వారక లో గార్గ పురోహితుడు శుభ లగ్నం లో వివాహం జరిపించాడు .’’వృష రాశి జాత ,యాదవ వృషభుడు రుక్మి ణీ౦ద్రు తులయన్మిష చేత భార్గవి యయ్యెను దృశానే కాది పతయ మెసంగగె నుభయతన్ ‘’అని చెప్పి కవి తన జ్యోతిష పాండిత్యాన్ని చక్క గా జోడించాడు .తులా వృష భాలకు రాశి నాయకుడు ఒక్కడే అవటం భార్గవుడైన హరికి ,భార్గవి అయిన రుక్మిణి అని చమత్కరించాడు .’’హరి పతి యగు చుండగా మరి ,హరిణీ నామము ఘటిల్లి నది ‘’అన్నాడు .హరి ది గోరాశి .రుక్మిణిది తుల .షష్టా ష్టకం  .న్యాయం గా పనికి రాదు పొత్తు కుదరదు .కాని ‘’ఉభయైక స్వామికత్వం ‘’వల్ల దోషం లేదని తేల్చాడు .మానుష రూపం దాల్చిన కృష్ణుడు మాయి మూర్తి .మాయ లేనిది రుక్మిణి జగన్మాత .వారిద్దరి పరిణయం చేయటం తనకు పూర్వ పుణ్య ఫలమని గర్గుడు భావించాడు .వివాహం మన పద్ధతి లోనే జరిపించాడు .’’జానక్యాః కమలాంజలి ‘’అన్న ప్రసిద్ధ శ్లోకం లోనీ భావాన్ని ‘’రుక్మిణి పోసే ముత్యాలు కెంపు లై హరి శిరం పై పడి శుద్ధాలై శరీరం నుండి జారుతూ నీలాలై తలంబ్రాలు శోభించాయట .వధూ వరులు పేర్లు చెప్పుకోవటం ,పరమాన్నం తినటం పానుపు మీద తాంబూలాలు కొరకటం ,నాక బలి వగైరాలు పూర్తి చేశారు .తర్వాత గర్భా దానమూ చేయించాడు కవి .రుక్మిణీ కళ్యాణం ఈ విధం గా ఫలప్రదం అయింది .ఈ కథ వ్రాసినా ,విన్నా ,చెప్పినా శ్రీ కైవల్యం తప్పదని సంజీవ రాయ కవి భరోసా ఇచ్చాడు .ఇలా పోతన గారి పోకడా ,భట్టు మూర్తి అల్లికా ,వేంకటకవి చాతుర్యం త్రివేణీ సంగమం గా వర్ధిల్లిన కావ్యం ఇది .కవి సంజీవ రాయలకు ,మనకు ఈ దివ్య సంజీవినిని అందించిన వారి వారసుడు స్వర్గీయ గంధం వేంకా స్వామి శర్మ గారికి అంజలి ఘటిస్తున్నాను .రుక్మిణీ పరిణయ కావ్యం  భవ్యం దివ్యం –శుభం భూయాత్.

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

భారతదేశ 75 వ స్వాతంత్ర దినోత్సవ కానుకగా ‘సరసభారతి’ అందిస్తున్న కానుక అంకాత్మక (డిజిటల్)పుస్తకం సమస్త భక్త శిఖామణులు

భారతదేశ 75 వ స్వాతంత్ర దినోత్సవ కానుకగా ‘సరసభారతి’ అందిస్తున్న కానుక అంకాత్మక (డిజిటల్)పుస్తకం సమస్త భక్త శిఖామణులు

సమస్త భక్త శిఖామణులు
Posted in పుస్తకాలు | Leave a comment

శ్రీ దాసు లింగమూర్తి

  శ్రీ దాసు లింగమూర్తి

శ్రీ దాసు లింగమూర్తి జీవితము  అనే పుస్తకాన్ని శ్రీ పాలపర్తి సూర్యనారాయణ రాశారు ఈయన అంతకుమునుపే ప్రియదర్శిని ,మేవాడపతనం లక్ష్మీ నరసింహ ,ముకుందమాల స్తోత్రాలు ,అహోబిల చరిత్రాదులు రాశారు .దీన్ని చాగలమర్రి వాసి డాక్టర్ గంగరాజు వెంకట రామయ్య గారు బెజవాడ ఆంద్ర గ్రంధాలయం లో 1931లో  ప్రచురించారు .ఖరీదు 12అణాలు .ముందుమాట  ఆళ్లగడ్డకు  చెందిన డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ శ్రీ ఎస్.లక్ష్మీ నరసయ్య ఎం .ఎ .లిట్ ఇంగ్లీష్ లో విపులంగా రాశారు .

  గ్రంథ కర్త తనమాటలలో శ్రీ పోణ౦గి లింగమూర్తి దాసు గారిపై ఉన్న భక్తితో తాను  ఈ రచన చేశాననీ ఆయన జీవించి ఉన్నకాలం లోనే గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందిన మహనీయులనీ ,పూజ్యులు ఆరాధ్యులు ,ఆదర్శ ప్రాయులు అనీ చెప్పారు .ఈ పుస్తకం అమ్మకాలవల్ల వచ్చే ఆదాయాన్ని చాగలమర్రి శ్రీ చెన్న కేశవ స్వామి శాశ్వత నిధికి జమ చేస్తున్నట్లు తెలిపారు .ఈ పుస్తకాన్ని అహోబిల క్షేత్ర స్థాపన ,పోషణ ,భవిష్యత్ ఉద్ధరణ కు కారకులైన భక్త బృందానికి అ౦కితమిచ్చినట్లు విన్నవించారు.తర్వాత ప్రవేశికలో శ్రీ లింగమూర్తి దాసు గారు వంటి జీవిత చరిత్రలు ఎలాస్పూర్తి నిస్తాయో వివరించారు .

    బాల్యం విద్యాభ్యాసం

  తిరుపతి క్షేత్రానికి నకలుగా ఉన్నవిశాఖ పట్టణం లోని  ఉప్మాక వెంకటేశ్వర ఆలయం  గొడే జమీందార్ల జమీ లోనిది .జమీందారు గణపతి రాయణి ఆస్థానం లో పోణ౦గి  వెంకటరామయ్యగారనే భక్తుడు సముద్దారుగా కొద్ది జీతానికే పని చేస్తున్నాడు .ఈయన చంద్రవరానికి చెందినా ఆర్వెల నియోగి .భార్య కృష్ణ వేణమ్మ. వీరి అయిదుగురు సంతానం లో చివరి వాడు శ్రీ లింగమూర్తి దాసు గారు 4-11-1895 జయనామ సంవత్సర ఆశ్వయుజ బహుళ దశమి నాడు జన్మించారు .వీరి జాతక చక్రం కూడా ఇవ్వబడింది .35వ ఏడు ను౦చి 52వరకు అంగారక మహర్దశ ,అందులో భార్య మృతి ,పుత్ర వృద్ధి ఉంటాయి .ఆంగీరస సంవత్సరం లో ద్వితీయ కళత్రయోగం ,52 వయసు వచ్చేసరికి అనుకొన్న పనుల్నీ జరుగుతాయని ,ఉద్యోగ రాజ్య ధన భూ గృహ  లాభాలు ,ఇంట్లో శుభకార్యాలు సూచింప బడింది .52నుంచి 69వరకు బుధమహర్దశ లో గృహ భూ జల శిదిలాలయపునరుద్ధరణ ,65లో గండం ,69-70లో మరణం .

   నిరాడంబరుడైన తండ్రి వెంకటరామయ్య గారికి భార్యావియోగం ,దాసుగారు పుట్టిన నాలుగు నెలలకే జరిగి అష్టకస్టాలుపడ్డారు .అయిదుగురు పసిపిల్లలనీ ప్రేమతో పెంచుతున్నారు .పసి దాసుకు తల్లిపాలు లోటు తీర్చలేక పోయారు తండ్రి .పెంకె పిల్లాడుగా పెరిగాడు  .ఉన్న చోటే ప్రాధమిక విద్య నేర్చి ,పదేళ్ళ వయసులో కాకినాడలోని దగ్గర బంధువు కానుకొల్లు వెంకట అప్పారావు గారివద్ద ఇంగ్లీష్ నేర్చుకోటాని పంపారు .అక్కడ పిఠాపురం రాజా కాలేజిలో మాధ్యమిక విద్యనేర్చారు రెండవ ఫారం లో ఉండగా ఒక ఒరిస్సా జ్యోతిష్యుడు అప్పారావు గారింటికి వచ్చి మధ్యాహ్న భోజనానికి ఇంటికి వచ్చిన బాల దాసుగారిని చూసి మహాయోగ పురుషుడు అవుతాడని చెప్పాడు .ఎలా చెప్పగలిగారని అప్పారావు గారు అడిగితె కాలి బొటన వ్రేళ్ళ లో చేతి బొటన వ్రేళ్ళలో తప్పక చక్రాలు ఉండి ఉంటాయని ,అలాంటివాడు రాజుకానీ మఠాధిపతికానీ తప్పక అవుతాడని  చెప్పాడు .దాసుగార్ని పిలిచి నాలుగు వ్రేళ్ళల్లో ఉన్న చక్రాలు ఆజ్యోతిష్యుడు అప్పారావు గారికి చూపించాడు .ఆతర్వాత మూడేళ్ళకు దాసుగారు ఒకరాత్రి ఒక హరిదాసు చెప్పిన మానసిక పూజా విధానం విని ఆకర్షితులయ్యారు .ప్రహ్లాద చరిత్ర బాగా ఆకర్షించి ,నిత్య మానసిక పూజ చేశారు .

          కలకత్తా ప్రయాణం –బలినుంచి తప్పించుకోవటం

 దాసుగారు స్కూల్ ఫైనల్  చదువుతున్నప్పుడు  ఉప్మాక వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు చూసి ,అక్కడున్న వికలాంగ రోగపీడిత కుష్టు వారిని చూసి మహా జాలిపడి ,వారి దుఃఖ నివృత్తికోసం హిమాలయాలకు వెళ్లి తపస్సు చేయాలనుకొన్నారు   .కాకినాడ చదువుకోసమని తండ్రి దగ్గర డబ్బు తీసుకొని సరాసరి సింహాచలం వెళ్లి ,అక్కడి నుంచి కాశీ వెళ్లాలని కలకత్తా కు రాత్రి8 గంటలకు చేరారు .ఆకలి దంచేస్తోంది దగ్గరున్న మూడు అణాల మూడు కానులతో మార్వాడీ దుకాణం లో మిఠాయికొని తిని మంచినీళ్ళు తాగి స్టేషన్ లోనే పడుకొన్నారు .

  మర్నాడు ఉదయం లేచి ఆమార్వాడీని కాళికా దేవి గుడికి ఎలా వెళ్లాలని వచ్చీరాని భాషలో అడిగితె పాపం పసివాడు అని జాలిపడి తనదగ్గరే మూడు రోజులు ఉంచుకొన్నాడు  .ప్లాట్ ఫారం పై పచారు చేస్తున్న దాసుగారిని చూసి ఒక మార్వాడీశ్రీమతుడు తన ఇంట ఆతిధ్యమిచ్చాడు .ఆమహల్ లో ఇతనికి సేవ చేయటానికి ఒకబాలికను ఏర్పాటు చేశాడు .ఆమె ఎప్పుడూ విచారంగా ఉండటం చూసి కారణం అడిగారు .ఆమె ‘’నీకు ఆతిధ్యమిచ్చినవాడు మా తండ్రే .శక్తి పూజ అబ్బింది ఆయనకు .నిన్ను  కాళికామాతకు బలి ఇవ్వాలని అనుకొంటూ మేపుతున్నాడు .మానాన్న బారి నుంచి నిన్ను తప్పించటం ఎట్లా అన్నదే నా బాధ ‘’అని చెప్పింది .కాళీమాత యే తన్ను రక్షిస్తు౦ది అను కొని ఆమె చెప్పినట్లు చేశాడు .ఒకరోజు దాసుగారు తెలివిగా మార్వాడీ తో తన సోదరుడుకూడా కలకత్తా వచ్చాడని స్టేషన్ లో ఉన్నాడనీ అతన్ని కూడా తీసుకొస్తాననీ అంటే  ఇద్దరు ‘’బకరాల్ని బలివ్వచ్చు’’ అనుకోని సరే  అనగా ఇద్దరూకలిసి కారులో బయల్దేరి స్టేషన్ కు బయల్దేరగా  .దారిలో కొందరు తెల్లవాళ్ళు మరో కారులో రావటం చూసి దాసుగారు బిగ్గరగా కేకలు వేశారు .వాళ్ళు విని  వీళ్ళ కారు ఆపి౦చి  ,దాసుగారిని కారణం అడితితే జరిగింది అంతా చెప్పగా ,అందులో ఉన్న తెల్లదొర డిటెక్టివ్ అవటం తో మార్వాడీని మందలించి ,దాసుగారి చెర  వదిలిలించి కాకినాడకు రైల్ టికెట్ కొనిచ్చి రైలు ఎక్కించారు .చావుతప్పి కన్ను లొట్టబోయినట్లయింది .కాకినాడ చేరి బుద్ధిగా చదివి పాసయ్యారు .  

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-8-21-ఉయ్యూరు 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సాలిగ్రామ పుర వైభవం

సాలిగ్రామ పుర వైభవం

యతి సార్వభౌమ శ్రీ రామానుజ పాదుకా తీర్ధ ప్రభావ ప్రపూరిత ‘’సాలిగ్రామ పుర వైభవం ‘’అనే స్తోత్రాన్ని శ్రీ మదస్టాక్షరీ మఠాధ్యక్షుడు స్వామి దయాసాగర భీష్మార్య శ్రీమన్నల్లార్య కులతిలక శ్రీ మద్వరద రామానుజపాదుకా సేవా ధురీణ ,దేశాభిమానీ మొదలైన బిరుదులున్నశ్రీ బి.పి .శ్రీనివాస శర్మ గారు రచించగా ,శ్రీమాన్ తూప్పిల్ గోపాలాచార్యకవి ,శ్రీమాన్ మైసూరు గోపాలకృష్ణ  శాస్త్రి గారి సహాయం తో పరిష్కరింప జేసి ,చెన్నపురి లోని ఆనంద ముద్ర శాల లో శ్రీ రామానుజ పాద పద్మాశ్రిత వేంకటేశ గుప్త చేత 1914లో ముద్రింపబడింది .వెల-అర్ధ అణా.

  ఇంతకీ సాలగ్రామ పురం అంటే ఏమిటి దాని కధా ,కమామీషు తెలుసుకొందాం .కావేరీ నది ఉత్తర తీరాన ఉప జిల్లా గా ఉన్న పట్టణమే సాలిగ్రామ  అనే శ్రీ వైష్ణవులకు అత్యంత పవిత్రమైన క్షేత్రం .ఇది భగ ద్రామానుజా చార్యుల వారి నివాస నగరం .కర్నాటక రాష్ట్రం లో మైసూరు  జిల్లాలో ఉన్నది .ఇక్కడ శ్రీ యోగ నరసింహ స్వామి దేవాలయం తోపాటు ,జైన బసాడీలు,ఆశ్రమ ఉన్నాయి .ప్రముఖ బంగారు వర్తకుడు నాగేష్ కెంపాచార్ ఇక్కడి వాడే .

  రామానుజా చార్యులు ఇక్కడికి వెంచేసినపుడు అక్కడి గిరిజనులందరూ ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు .కానీ స్థానికులకు ఇది కన్నేర్రగా ఉండి,ఆయనను చంపటానికి కుట్ర పన్నారు .ఈకుట్రను కనిపెట్టిన ఆచర్యశ్రీ  తన ముఖ్య శిష్యుడు ముదలి యందన్ స్వామిని , ఇప్పుడు సాలిగ్రాం గా పిలువబడుతున్న చోట ఉన్న మంచి నీటి చెరువులో తన  పాదాలను ఉంచమని ఆదేశించారు .ఎప్పుడైతే శ్రీవారి పాద తీర్ధం  లో పాల్గొన్న వారందరికీ  ,ఆయనను చంపాలనుకొన్న వారి మనసులు మారి తప్పు తెలుసుకొని అమాంతం వారి పాదాలపై పడి క్షమా భిక్ష వేడారు .ఇందులో రామానుజమహిమేకాక  మహా మహిమాన్వితుడు గా ముదలి యందన్ స్వామికూడా కనిపిస్తాడు

  కులోత్తుంగ చోళుని తీవ్రమైన ఆదేశాలవలన రామానుజా చార్య అక్కడి నుండి వహ్ని పుష్కరిణికి వెళ్లి ,అక్కడి నుంచి సాలిగ్రామానికి చేరారు .కర్నాటక మెల్కోటే దగ్గర ఉన్న ఈ ప్రదేశానికి రామానుజులు సాలిగ్రామం అని పేరుపెట్టారు .అప్పటి నుంచి ఈపుష్కరిణి గేట్లు మూసేసి ,బయటివారు ఆనీటిని కలుషితం చేయకుండా పూజారులు అత్యంత జాగ్రత్త వహిస్తున్నారు .ఈపుష్కరిణి కి ఎదురుగా ఒక చిన్న గుడిలో రామానుజాచార్యులవారి తిరువది,చువదుగల్ లకు నిత్యార్చన జరుగుతుంది .ఆలయగర్భ గృహం లో శేషరూప శ్రీ రామానుజాచార్యుల విగ్రహం ఉంటుంది.

  ఈ సాలిగ్రామ పుర వర్ణన స్తోత్రం సంస్కృతం లో రచించబడింది.

‘’యో దేవోధారయేద్లక్ష్మీం  -స్వర్ణాభరణ రూపవాత్ – శంఖ చక్రాది భిర్యుతః –‘’

‘’నాగాభరణ సంప్రీతః ప్రభుర్హర్హరిర్హరేశ్వరః –ధ్యాన నందన పూజాద్యైఃయస్తం దేవముపాస్మ్యహం ‘’అని ప్రారంభించారు .’’దేవ దేవోత్తమ హరే కురు మంగళం సదా ‘’అని కోరాడుకవి .తర్వాత వేదాంత దేశిక మనవాళ్ళముని లనుస్తుతి౦చి ’’’వక్ష్యామి తత్వ బోదార్ధం సాలిగ్రామస్య వైభవం ‘’అని మొదలుపెట్టాడు .

 వింధ్యకు దక్షిణాన ,యాదాద్రికిపశ్చిమాన ,హేమావతీ,కావేరీ సంగమస్థలం  గౌతమ క్షేత్రం గా ప్రసిద్ధి చెందింది .అక్కడ ‘’నృసింహ క్షేత్ర మత్యత్ర ,రామ క్షేత్రం తధైవచ ‘’ఈమధ్యలో సాలిగ్రామం విరాజిల్లుతోంది .విశిష్టాద్వైతసిద్ధాంత స్థాపనాచార్య పాదుకే తత్రాపి పాదుకా తీర్ధం రమణీయం మనోహరంగా ఉంటుంది .అదిపవిత్రం ,జ్ఞాన సాధకం ..అక్కడ నిత్యారాధన జరుగుతుంది .’’సాలిగ్రామ శుభం క్షేత్రం –సర్వ క్షేత్రేషు ఉత్తమం ‘’అని దాని గొప్పతనం చెప్పారు .శ్రీపాదతీర్ధ మహాత్మ్యాన్ని వర్ణించటం ఎవరితరమూకాదన్నారు .

  కుష్టురోగి అక్కడి తీర్ధం పుచ్చుకొని రోగం పోగొట్టుకొన్నాడు  .’’రామానుజయతి మానుషోపి నమానుషః’’అని శ్రీవారి గొప్పతనం చాటారు .’’వివిధానిచ పాపానీ ,రోగ ప్రతినిధీ న్యహో-మనోవ్యధాచ దారిద్ర్యం –పర సేవాయచ దారుణా ‘’దులన్నీ నశిస్తాయిఅని భరోసా ఇచ్చారు .అది సర్వ దుఃఖ శమనం ,సర్వ రోగ నికృ౦తనం .మేష ,ఆరుద్ర సంభవకాలం లోసాలిగ్రామపురం తీర్ధం తాగినవారికి మోక్షం గ్యారంటీ .ఈ తీర్ధ మహత్యాన్ని చదివినా విన్నా పరమపదం లభిస్తుంది .

చివరకు మంగళం చెబుతూ –

‘’మంగళం భాష్యకారాయ –శుద్ధ తత్వాయ మంగళం –మంగళం లక్ష్మణార్యాయ-యోగ రూఢాయ మంగళం –మంగళం  విష్ణు భక్తాయ –సుసంకల్పాయ మంగళం –మంగళం రాజ రాజాయ –యతిరాజాయ మంగళం –మంగళం లోక నాథాయ –లోకాచార్యాయ మంగళం ‘’

  ఆచివర్లో అద్వైత ,ద్వైత మత సిద్ధాంతాలను పేర్కొని విశిష్టాద్వైతమత౦ గొప్పతనాన్ని సంస్కృతంలో ఉల్లేఖించారు .

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-8-21-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

‘’ ఘూర్జరాంధ్ర ‘’అవుతుందేమో గోవి౦దా రామ !

‘’ ఘూర్జరాంధ్ర ‘’అవుతుందేమో గోవి౦దా రామ !

అమరావతికి సమాధి కట్టారు గోవి౦దారామ

రోడ్లన్నీ తవ్వి మెరకేసుకొంటున్నారు గోవిందా రామా

ఇన్సైడ్ ట్రేడింగ్ బూచి బూమరా౦గైనా,గోవిందా రామా

అక్కడి రైతులకేది ఊరట గోవిందా రామా

గేట్లు బిగించి అమరావతిని ముంచి గోవిందా రామ

‘’కొ౦పకొల్లేరు ‘’చేశారు గోవి౦దా రామా

పులిచింతల గేటు విరిగితే గోవిందా రామా

తప్పు బాబుదని తప్పుకొన్నారు గోవిందా రామా 

ఆంధ్రా పాలను అముల్’’ పాలు ‘’చేశారు గోవి౦దారామా

వందేళ్ళ ఆంధ్రా బ్యాంక్ అడ్రస్ లేకుండా చేశారు గోవి౦దారామా

ఘన చరిత్రున్న ‘’అమర రాజా ‘’ను పొగబెట్టి పంపారు గోవి౦దారామా

కమ్మటి తెలుగక్షరాలు శిలువపాల్జేశారు గోవి౦దారామా

కృష్ణపట్నం పోర్ట్ ‘’ఆదానీ’’ పరం చేశారు గోవిందారామా

ఆంధ్రా అంటే ఆదానీ, అంబానీ సొత్తైపోతోంది గోవి౦దా రామ

ఇళ్ళు ఇళ్ళన్నారు గోచీపాత స్థలం చూపారు గోవి౦దారామా

ఇల్లు కట్టిస్తామనీ గొప్పలెన్నో చెప్పి ,గోవి౦దా రామ

మావల్లకాదని చేతులెత్తేశారు  గోవి౦దారామా

అప్పుల భారం తో రాష్ట్రం ఏర్పడినా గోవిందా రామ

ఎవరికీ ఇబ్బంది కలక్కుండా చేశాడు ఆనాడు బాబు గోవిందా రామా

అన్నీ ఉన్నా ఒకటిన్నర శతం మద్దతుదార్లున్నాగోవిందా రామా  ,

మరో ఒకటిన్నర శతం మాయ గాళ్ళ తో దివాలా తీయించారు గోవిందరామా 

కోడికత్తి ఏమైందో బాబాయి సంగతేమై౦దో ‘’ఆపై వాళ్ళకే’’తెల్సు గోవి౦దా రామా 

ఆర్ధికమంత్రి తిష్ట వేసినా  కాసు రాలట్లేదు గోవి౦దారామ

అప్పు చేసి పప్పుకూడు తింటున్నారురా గోవి౦దారామా

తిరుపతిని కూడా తిరు క్షవరం చేసేట్లున్నారు గోవిందా రామా

రైతుల౦తాను  ఢిల్లీలో దీక్ష పూనిఉంటే గోవిందా రామో  

పలుకరించే ధైర్యం లేని పెత్తం దార్లు గోవి౦దారామా

రాఫెల్  పెగాసిస్ లపై చర్చి౦చే ధైర్యమే లేదు గోవి౦దారామా

డాబు దర్పం ,పెట్రో ధనం తో వెలిగిపోతున్నారు గోవి౦దారామా 

ప్రభుత్వమంటే రుజు ప్రవర్తన కాదు గోవిందా రామా

 ఎన్నికలే అని మాటిమాటికి రుజువు చేస్తున్నారు గోవి౦దారామా

పదేళ్ళ కితం వోటింగ్ మెషీన్ లపై మండిపడ్డ పార్టీ గోవిందా రామా ,

వాటినే అడ్డం పెట్టుకొనిఇప్పుడు  మెజార్టీ తెచ్చుకొని ,తెప్పించి గోవిందా రామా

గురివింద సామెతగా గునగునలాడుతున్నారు గోవి౦దా రామా

‘’ఈ టూ బ్రూటస్ ‘’అన్న సీజర్ మాట నిజం చేసి గోవి౦దారామా 

అందరూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే వారే అయ్యారు  గోవి౦దారామా   

కరోనా చావులు, వాక్సిన్ ప్రజల లెక్కలన్నీగోవిందా రామా

 హుష్ కాకి అంటోంది ,మీడియా గోవిందా రామ

మసిబూసి మారేడు కాయ చేస్తున్నారు  గోవిందా రామా

మానసిక ధైర్యం ,ఆర్ధిక ఊరట ,ఇవ్వలేని లేని ప్రభుత్వాలు గోవి౦దా రామా

శిరోభారమే కదా ప్రజాళికి గోవి౦దారామా

మంచి వినక కనక ఆలోచించని ప్రభుత ఎందుకు గోవి౦దారామా .

హస్తం ప్రభుత్వం లో చేసిన తప్పులకు సభలనుగోవి౦దారామా  నడవనీయకుండా చేసి గోవిందా రామ ఆనాడు

,ఇప్పుడు వాళ్ళు ఆపనే చేస్తుంటే తప్పంటారా గోవిందారామా

 ఆనాటి గవర్నర్లు అది నేత చేతి మనుషులనీ గోవిందా రామా కీలుబొమ్మలనీ,పునరావాసులని ఎద్దేవా చేసినోళ్ళు గోవి౦దా రామా

 ఇప్పుడు కాళ్ళు కీళ్ళు కదపలేని గోవిందా రామా

‘’ నో వాయిస్ ‘’వారిని అలంకార ప్రాయంగా అందలం ఎక్కించటంగోవిందారామా

 సభ్యసమాజానికి ఇచ్చే సందేశం ఏమిటి గోవిందా రామ   

తెచ్చిన చట్టాలన్నీఎపెక్స్ కోర్ట్ లు చెత్త బుట్ట పాల్జేస్తుంటే గోవి౦దా రామా

పరపతెక్కడ తిరపతి గుండు కద గొవి౦దారామా

 తెలుక్కే దిక్కు లేదు సంస్కృతం డోలు తగిలించుకొనిగోవిందా రామా  

దబా ఇస్తున్నారు దిక్కేది మనకు ,గోవి౦దారామా

మనం  మాటాడే  తెలుగుకు  గోవి౦దా రామా

గోరీకట్టి ఊపిరాడక చేస్తున్నారు గోవి౦దారామా  

ఆంధ్రుల హక్కుగా సాధించిన విశాఖ ఉక్కు గోవి౦దా  గోవిందా రామ

తుక్కుకింద అమ్మేస్తారట తిక్క నాయాళ్ళు  గోవి౦దారామ ,

కొనటానికి బడాబాబులు గోవి౦దా రామ

 గోతికాడ నక్కల్లా కూచున్నారు  గోవిందా రామ  

సమర్ధులైన జడ్జీలు లేకుంటే ను గోవిందారామ

ప్రజాస్వామ్యం హుళక్కే ఔతుంది గోవిందా రామా

 ‘’పైనా, కిందా’’ కూడా గోవి౦దా రామ

 పేరుకు స్పర్ధ కానీ గోవిందారామ

 సూట్ కేసులతో కలయిక అంటున్నారు గోవిందా రామా  

రెండేళ్ళు దాటినా రిటైరీలకు వేతన రివిజన్ ,గో గో గో గోవిందా రామా

కరువు భత్యం లేక అలమటిస్తున్నారు గోవి౦దోగోవిందా రామ  

ఎన్నాళ్ళు ఈ వ్యధలు ఎన్నాళ్ళు ఈ అవమానాలు గోవిందా రామా ఎన్నాళ్ళు ఈ వేధింపులు అంతం  ఎప్పుడో తెలీదు గోవి౦దారామా

కేంద్రం పై ఆరోపణలు ,తల్లీ చెల్లీ చీలిపోటాలు గోవిందారామ

అంతా హంబగ్ ,టాపిక్ డైవర్షన్ కోసమే గోవిందా రామా

అమ్మేస్తే ఆంధ్రాని కొనే౦దుకున్నారు పడమటి కుబేరులు గోవి౦దారామా

ప్రజాస్వామ్యం అంటేను గోవిందా రామ

ధర్మ రాజులా’’ మెత్తటి పులి ‘’గోవిందా రామ

సహనం హద్దు దాటితే గోవిందా రామ

ఆనాటి కురుక్షేత్రమే గోవి౦దా రామ

కర్కశ నియంతలే చంకనాకి పోయారు గోవిందా రామా

ఇక మిడి మిడి జ్ఞానసూన్యులు గోవిందా రామ

ప్రజాబలం ముందు గోవి౦దా గోవిందో గోవి౦దారామ రామా

ఉఫ్ఫున ఎగిరి పోతారు గోవిందా రామా

 ధూళి కణాల్లా గోవి౦దా గోవిందోరామ

స్వర్ణోత్సవ స్వతంత్ర భారతావని సంక్లిష్టంగా ఉంది గోవిందా రామా

 అలుసిచ్చి నెత్తినెక్కించు కొంటేను  గోవిందా రామా

 పేను కొరుకుడు అయింది అయ్యయ్యో గోవిందా రామా  

ఇక మన భాష ‘’తెలుగా౦ధ్రం కాదు’’ గోవి౦దా రామా  

అయ్యేది తధ్యం ’ఘూర్జ రాంధ్రా ‘’గోవిందా రామ

మేలుకోకపోతే ఇకనైన గోవి౦దారామా ,

తిరుపతి క్షవరమే గోవి౦దారామా .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-8-21-ఉయ్యూరు

Posted in రాజకీయం | Tagged | Leave a comment

సిద్ధ యోగుల సిద్ధ గుటిక

సిద్ధ యోగుల సిద్ధ గుటిక .

 సరసభారతి ఆస్థానకవులు మాrపూర్తి  చేసి ,ఇప్పుడే ఆపుస్తకం చదివాను .నిజంగా సిద్ధ ఘుటిక అనిపించింది .ఆచార్యులవారి పాండిత్యానికి,వైదుష్యానికి  బహుకావ్యాను శీలానికి ,తానూ సిద్ధహస్తులైన పద్యకవిత్వానికి ,తన బహు శాస్త్ర పరిచయానికి ,అధ్యన శీలత్వానికి ,బహుకాల తెనుగు బోధనాపటిమకు  అద్దంపట్టిన రచన . 2019డిసెంబర్ లో మేముఒంటి మిట్ట యాత్ర చేసినప్పుడు తిరుగు ప్రయాణం లో  బ్రహ్మం గారి మఠం  దర్శించాము.పాశ్చాత్యులకు ‘’నోస్టర్ డాం’’ఎలాంటివాడో మనకు వీరబ్రహ్మం గారు అలాంటివారు .అంతకంటే ఎక్కువైన వారుకూడా .సంఘం లో ఉన్న దురాచారాల్ని ఎత్తి చూసి సంస్కరించే ప్రయత్నాలు చేస్తే ఈ సమాజం ఆయన భావాలను జీర్ణించుకోలేక కూడా గుడ్డ కనీసం నీరు కూడా దక్కకుండా   బహిష్కరిస్తే ,ఒక్కరాత్రిలో మహా సంకల్పం తో చిన్నకొమ్ముతో  తెల్లారేటప్పటికి బావిని త్రవ్విన సంకల్ప సిద్ధుడు .ఆ బావి నీరు ఎండిపోవటం జరగనే జరగదు .ఆ నీటి రుచి అమృతం ఆయన సిద్ధ వాక్కుల్లాగానే  . ఈ పుస్తకం లో బ్రహ్మంగారు సిద్దయ్యకు చెప్పిన 55పద్యాలున్నాయి .55 వ సంఖ్యకు ప్రాముఖ్యమున్నది. దాన్ని దేవతా సంఖ్య అంటారు .అంతేకాక దైవ సందేశం ఇచ్చే సంఖ్యగా భావిస్తారు .జీవితం లో ఉత్తమ స్థాయి మార్పు సాధించటానికి ఈ సంఖ్య చిహ్నం .కొత్త అనుభూతులకు అనుభవాలకు నాంది పలుకుతుంది .గతి౦చిన దాన్ని మర్చిపోయి ఉజ్వల జీవిత పరమార్ధాన్ని సాధించటానికి తొలి మెట్టుగా ఉపయోగ పడుతుంది .అందుకే వీటిని విని సిద్దయ్య గురువు అంతటి విశిష్ట వ్యక్తిగా పరిణామం చెందాడు .కనుకనే 55పద్యాలు తీసుకొన్నారేమో? .చదివిన వార౦దరికి  అలాంటి ఆధ్యాత్మికానుభూతి కలగాలని ఆచార్యులవారి అభిమతం అయి ఉంటుంది . పుల్లయ్య తాతగారు అనే శ్రీశ్రీ తుమ్మోజు పురుషోత్తమానందస్వామి గారి అనుజుడు అపరధన్వంతరి  బ్రహ్మయ చార్యులవారి పౌత్రుడే ఈ పద్యాలకు వ్యాఖ్యానం రాసిన మన రామ లక్ష్మణాచార్యులు .

  ఇందులో ముందుగా కవిత్వం ,కవి, కావ్యం లపై గొప్పపద్యాలున్నాయి .తర్వాత గురువు విషయం పై విశేషాలు ఆతర్వాతసన్యాసం యోగాలు వాటి రహస్యాల విచారణలో పద్యాలున్నాయి అన్నీ రస గుళికలే .వ్యాఖ్యానం చేయటానికి కవి పండితుడు విమర్శకవిశ్లేషకుడు అయిన ఆచార్యుల వారికి చేతి నిండా పని  దొరికి అత్యంత సమర్ధంగా సంతృప్తిగా వ్యాఖ్యానాలు చేశారు .మాన్యులనుంచి సామాన్యులదాకా ఆకర్షించే వ్యాఖ్యానం ఇది .ఎన్నెన్నో విషయాలు త్రవ్వి తీసి ,పూస గుచ్చినట్లుగా వివరించారు .అపారమైన ఆయన జ్ఞాన విజ్ఞాన ప్రకాశం మనకు జ్యోతకమౌతుంది .బ్రహ్మ౦గారి భావాల పసిడికి ఆచార్యులవారి భాష్యం తావిని చేకూర్చింది .సరళ సుందరమైన తెనుగు పండింది .అరచేతిలో వేదాంత సంపద నిలిపారని పిస్తుంది ..అన్నీ అన్నే .కొన్ని రసపట్లు మాత్రమె మీముందు ఉంచుతున్నాను .

  ‘’శ్రీకరముగా శివకవులకు –ప్రాకటముగ  భక్తులకును భావజ్ఞులకున్-లోకములోన వెల్గు నిరా –కారంమ్మునకు ,శరణమనరా సిద్దా ‘’అనే బ్రహ్మంగారి మొదటిపద్యానికి –శివకవులు అంటే సోమనాథాదులు మాత్రమేకాదు నిరంతర భగవద్భక్తి కలిగిన వారు.భగత్ తత్వాన్ని తెలుసుకొన్నవారే భావజ్ఞులు .లోకం లో ప్రకాశించే నిరాకార భగవంతుని శరణు వేడాలి అంటే జనతా జనార్దనుడిని గుర్తించాలి అని చక్కని భావం చెప్పారు .గొప్పపా౦డిత్యం నైపుణ్యం ఉన్నవాడే కవి .కావ్యపుత్రిక కన్యలాగా ఆకర్షించాలి .కవిత్వం లో మాయ సృష్టి ఉండరాదు ప్రపంచ జనులమెప్పు పొందే కవిత్వమే రాయాలి .మెస్మరిజం తాత్కాలికమే .’’పట్టు లేనికవిత భజియి౦ప రాదయా –పట్టు దివ్య గురుని పదముకవిత ‘’పద్యం లో బిగువు, సారవంతమైన కవిత్వమే శ్రేష్టం .విత్తాపహరునికాని చిటత్తాపహరుడైన గురుని పాదాలే పట్టుకోవాలి అని హెచ్చరిక చేశారు .తత్వ జ్ఞానం కలిగించే యోగ విద్యనూ బోధించేవారు జ్ఞానకవులు .కవికి మయబ్రహ్మకు అభేదం చెప్పారు బ్రహ్మగారు .మయబ్రహ్మ అంటే విశ్వాన్ని శిల్పించే పరబ్రహ్మమే .కవి పక్షిలాగా తిరుగుతూ ప్రపంచ దర్శన౦ చేస్తూ  కవిత్వం ఉన్న చలమలను కనిపెట్టి రాయాలి .అంటే కవితాభావన అంతగా కలగనివస్తువుల్ని చూసినప్పుడు కూడా కవితా వేశం పొందేవాడే కవి అని మంచి వ్యాఖ్యానం చేశారు  .కవి నిబద్ధతకు కళ్ళు ,వాక్కు నిబద్ధతకు పరులు ,ధర్మ నిబద్ధతకు దైవం సాక్షులు . తన నిబద్ధత కు లోకమే సాక్షి అన్నారు .గురు శుశ్రూష చేసి విద్యనభ్యసించే శిష్యులలో తానె ఉత్తముడను రవ్వ అంటే వజ్రం లాంటి కవుల పాద రజస్సు తానని అత్యంత వినయంగా ప్రకటించుకొన్నారు వీర బ్రహ్మేంద్రస్వామి .రవకవులు అంటే సామాన్యకవులు రసకవులకు తీసికట్టు .కవిత్వం రెండురకాలు ఒకటి ద్రవించి కాలం లో కలిసిపోతుంది .రెండు శాశ్వతంగా ఉండేది ధన్యత్వమైన కవిత్వం అని సిద్దయ్యకు గురుబ్రహ్మం ఉపదేశించారు .

  గురువుల గురించి చెబుతూ –‘’కృతి వాక్యము విని చూడరో –సతతంబెజాతి యైన సద్గురు సేవన్ –గతి గాంచు బ్రాహ్మణోత్తము–శ్రుతివటవృక్షమ్ము  బ్రహ్మ రూపము సిద్ధా ‘’

గురువు ఏజాతి కులానికి చెందినా ఉత్తముడైతే సేవించి జ్ఞానం పొందాలి.వటవృక్షం అంటే రావి చెట్టూ మర్రి చెట్టు అనే రెండు అర్ధాలున్నాయని ,శ్రుతి అంటే మర్రి చెట్టే అనీ ఊడలతో విస్తృతంగా విస్తరించే లక్షణం దానికే ఉందని గొప్ప వ్యాఖ్యానం చేశారు .వృక్షమే బ్రహ్మం. దాన్ని తెలుసుకోన్నవాడే ముక్తుడు అన్నారు .శిష్యుడు గురువు యొక్క గురుభావాన్ని అంటే శ్రేష్టత్వాన్నితెలుసుకోవాలి .గురుని దృష్టి ఎరుగు గురుని గురుడు ‘’అంటే ఏకాగ్రత చిత్త శుద్ధి ,మనో నిశ్చలత్వం గురువు యొక్క గురువు తెలుసుకొంటాడని భావం .ఉత్తమగురువు నాతోసమానం ,ఆయన నన్ను చూస్తాడు నేను ఆయన్ను చూడగలను అన్నారు బ్రహ్మగారు గుర్వాజ్ఞను పాటించే శిష్యుని ఏ శత్రువు తాకలేడు.కామక్రోధాది ఆరుగురు శత్రువుల శిఖలను కత్తిరించి సద్గురువు వారి భయాలను పోగొడతాడు .

  ఆతర్వాత రాజయోగం గురించి చెప్పారు –‘’అంతరంగమందు అమనస్కుడై యున్న –చింత గురుని మీద చిక్కి యున్న –పగఱు శిష్యు ముందు భంగమై పొయ్యేరు –భావమెరుగరేని  భ్రమలు సిద్ధ .’’సాంఖ్యతారక అమనస్క యోగాలతో కూడి ఉన్నదేరాజయోగం .ఇది ముక్తికి రాజమార్గం అన్నారు సీతారామా౦జ నేయసంవాదం  కర్తశ్రీ పరశురామపంతుల లింగమూర్తి గురుమూర్తిగారు  .అంతఃకరణ శుద్ధికలిగిచేది తారకం అయితే ,ఆత్మస్వరూపాన్ని తెలిపేదిసాంఖ్యం,అనుభవ జ్ఞానం తో కలిసింది అమనస్కం .మనసు భగవంతుడిపై లగ్నం చేసినవాడు అమనస్కుడు .గురు కృపతో అమనస్కం దాకావచ్చి రాజయోగాన్ని అనుభవం లోకి తెచ్చుకోనివాడు భ్రమలోనే ఉంటాడు .పరబ్రహ్మను తెలుసుకోలేడు అని వివరణాత్మకమైన విశ్లేషణ చేశారు ఆచార్య శ్రీ .

  సముద్రాలు ఈదచ్చు సప్త కులపర్వతాలను ఎగరేసి పట్టుకోవచ్చు కానీ ,తనలోని ఈశ్వరుని దర్శించటం మాత్రం అసాధ్యం .’’పలికెడు పలుకులు పలుకై –పలుకులలో నుండు నాతడు బ్రహ్మము తానై –వెలుగుచు వెలుగుల వెలుగై –వెలుగులలో నుండు నాతడు వెలుగౌ .

   మధుర సుందర సురుచిర తెలుగు పదాలతో గహన వేదాంత రహస్యాన్ని సులభంగా చేతి వెన్నముద్దగా అందించిన వీరబ్రహ్మ యోగేద్ర కవీన్ద్రులకు కైమోడ్పు .మన మాటలలోనే ఉన్న శబ్ద బ్రహ్మమే వేద మంత్రాలలోనూ ఉంది అదే .సూర్య చంద్రులకు దిక్కు. ఆజ్యోతే ముక్తి మార్గం చూపే వెలుగు అన్న ఆచార్యులవారి వ్యాఖ్యానం భేష్ .సర్వం తానె అని గ్రహించి సంసారం చేయటమే రాజయోగం .

  మిగిలిన లోక వ్యవహారాలనూ కవిత్వం లో రంగరించి బ్రహ్మం గారు చెప్పారు –

‘’తల్లియు కూతురు  చెల్లెలు –ఇల్లాలి యున్న భావమెరుగక తిరిగే –వల్లడిగానికి మోక్షము –కొల్లలుగా  నెటులు దొరకు  సిద్దా ‘’

మనం తరచుగా కార్యేషు దాసీ శ్లోకం ఉదాహరిస్తాం .భార్యకు ఆరు బాధ్యతలు అని గుర్తు చేస్తాం .దాన్నే పద్యం లో ఇమిడ్చి చెప్పారు .వివాహ విధానం లో ఢర్మశాస్త్రాలలో ఎనిమిదేళ్ళ పిల్ల కన్య అయి వివాహానికి సిద్ధం  ఆరేళ్ళ ప్పుడే ఆమెకు చంద్రుడు ఆతర్వాత గంధర్వులు పిమ్మట అగ్ని ఆమెను అనుభవిస్తారు .ఇంతమంది ఎంగిలి చేసిన అమ్మాయిని పెళ్ళాడి తనకే స్వంతమనుకోవటం అజ్ఞానం కాదా అని బ్రహ్మం గారి ప్రశ్న .ఇలా ఆలోచిస్తే లోకం లో ఏ కన్యనూ ఎవరూ పెళ్లి చేసుకోరు.ఇదొక పారడాక్స్ లోకం లో .అలాగే ఆకలి చంపుకొని   ,అడవుల్లో ఉంటూ ఉన్నవారికి మోక్షం ఎలావస్తుంది .ఆకులు తినే మేకలు మోక్షాన్ని పొండదుతాయా అని ఎద్దేవా చేశారు పరమగురుబ్రహ్మం గారు .

  తర్వాత సన్యాసుల పని పట్టారు ‘’కన్యలతో భ్రాంతి నొంది కామాన్ధకులై ‘’న సన్యాసులు  ముక్తి సాధన ఎందుకు అని ప్రశ్నించారు .తనలో తన్నేరుగు వారు ధన్యులుసిద్దా ‘’అని తేలిక చిట్కా చెప్పారు .దీనికి –‘’ఖేచరి యొక్కటేసత్యము –లోచనముల దృష్టినిలిపి లో జూచిన తా –తోచును వింతలు  భువిలో –నాచారము గలదు ముద్ర లైదుర సిద్ధా ‘’ యోగముద్రలలోని అయిదు  ముద్రలలో ఖేచరి ముద్రొకటి .అంటే ఆకాశం లో చరి౦చెది. దహరాకాశం లో పరం జ్యోతి దర్శనం చెయ్యాలి .లోచూపుతో సాధకుడు హృదయాకాశం లో దృష్టి నిలిపితే కనిపించే చిత్కళ దర్శనం తో ముక్తి పొందేవిధానం బోధించారిక్కడ –‘’గుండ్లను ద్రిప్పిన పువ్వుల –చెండ్లును చుక్కలును శశియు చిత్కళ లనగా –కండ్లకు నడుమును నావల –గుండ్లను దాటినను ముక్తి కుదరదు సిద్ధా ‘’అంటే కను గ్రుడ్లను తిప్పటం అంటే తారక అనగా నల్ల గ్రుడ్లను భ్రూ మద్యం వైపు తిప్పి చూస్తూ, మనసును ఆజ్ఞా చక్ర లోకి మళ్ళించి చూడాలి .అప్పుడు మెరుపు తీగలకాంతులు ,మిణుగురులకాంతులు నానా రత్నకాంతుల్లాగా అవి సూర్యకాంతి వంటి తేజస్సుతో కనిపిస్తాయి .పది రకాల నాదాలు వినిపిస్తాయి .ఇదే నాద యోగం .నాద బిందు కళాదర్శనం లో ఆకలీ దప్పిక ఉండవు .తానె బ్రహ్మం అనే స్థితిపొంది బ్రహ్మానందాన్ని అనుభవిస్తాడు .అదే ముక్తి .వీటి వివరణలో ఆచార్యులవారుతీసుకొన్న శ్రమ అత్యంత శ్లాఘనీయం .కరతలామలకం చేశారు .

 ‘’నూతియు తుదనొక నాతియు –నాతికి తుదనొక్క కోతి నయమగు భాతిన్ –నాతికికోతికి నావల –జ్యోతికి పై నుండుశివుడు చూడర సిద్ధా ‘’  అనే మార్మిక అంటే మిస్టిక్ పద్యం లో బ్రహ్మంగారు తత్వాన్ని ప్రాస కవితాత్మకంగా చెప్పారు .నుయ్యి నరకం. నాతిస్వర్గం .కోతిమనసు ,జ్యోతి పరబ్రహ్మకు సంకేతాలు .నరకకూపంలో పడకుండా ఉంటేనే స్వర్గం అనే స్త్రీ దొరుకుతుంది .పుణ్యఫలం ఖర్చవగానే మళ్ళీ పుట్టుక మరణం కనుక అది శాశ్వతం కాదు దానికి పైనున్నదే జ్యోతి .అక్కడికి చేరుకోవటం మానవుని గమ్యం .మరో పద్యం లో –‘’తానెవ్వరు నేనెవ్వరు –తానె నేనాయే పంచ తత్వము లందున్ –తాననుచు జీవ కళలను –తానె తానాయె బ్రహ్మ తత్వము సిద్ధా ‘’పరబ్రహ్మ జీవిలో ఆత్మ అయ్యాడు .ప్రళయం లో విశ్వకర్మ సర్వజగత్ సంహార హోమకర్తయై తనలో లయం చేసుకొంటాడు .సృష్టికాలం లో మళ్ళీ ప్రాణుల్ని సృష్టించి వారి హృదయాలలో ప్రవేశిస్తాడు (అవరాన్ అవి వేశ )ఇదే తానె నేనై నేనే తానై ,తానె తానైన అద్వైతభావన  .బ్రహ్మగారు కమ్మని తెలుగుపద పద్యం లో అంతటి భావాన్నీ వెన్నముద్ద చేసి అందిస్తే ఆ మనోహర భావాన్నిశ్రుతి స్మృతి పురాణాల వివేచనతో ఆచార్యులవారు మనకు అందించి ధన్యులయ్యారు

 మరోమిస్టిక్ పోయెం లో –‘’మూడవ దినమందగ్నికి –చేడియ సతియాయే ననుచు చేబట్ట గదా –గూడె మును పెండ్లికొడుకని –చూడ నరులకియ్యది బ్రహ్మ సూత్రము సిద్దా ‘’

  మూడవ రోజు కన్యను అగ్నికిస్తే అతడూ పెళ్లి కొడుకే అని కన్య అతడిని కలుస్తుంది .ఇదే నరులకు బ్రహ్మ సూత్రం అంటారు బ్రహ్మంగారు .సోముడు మనస్సుకు ,గంధర్వుడు రాజోగుణానికి,అగ్ని తమో గునణానికీ సంకేతాలు .త్రిగుణాలను అణచి   నిశ్చలలమనస్సుతో ధ్యానం చేస్తే ముక్తికాంత స్వంతమౌతుంది లేకపోతె దక్కీ దక్కనట్లు దోబోచులాడుతుందని అర్ధం గా  వ్యాఖ్యానకర్త వివరించారు .ఈ సూత్రం తెలియకపోతే ఎంత చదివినా ‘’తమలో వాసించి యున్న త్రిజగ – ,ద్భానుని గానరైరి మాయపాలై సిద్ధా ‘’శాస్త్రాలు చదివితే మాయ తొలగిపోదు .మాయ ఆవరి౦చి ఉంటే లోపలి పరతత్వాన్ని చూడలేరు .కనుక సద్గురు ఆశ్రయం తో సద్గ్రంధ పఠనం తో జ్ఞానం పొందాలి అని సూచన .చివరి 55 వ పద్యం –

‘’అంతా బ్రహ్మమయం బని –సంతసమున తిరుగు వారు సర్వజ్ఞులు శ్రీ –కాంతుని కృపచే వారికి –చింతలు లేవయ్యెయోగ సిద్ధులు సిద్ధా ‘’

ప్రపంచమంతా బ్రహ్మ తో నిండి ఉందని తెలుసుకొన్నవారికి అప్రమేయ ఆనందం లభిస్తుంది .ఇది తెలిసినవాడు బ్రహ్మే తానూ అవుతాడు. ఇదే సర్వజ్ఞత్వం. అతడే యోగ సిద్ధుడు లక్ష్మీకా౦తుడు అంటే మోక్షలక్ష్మికి అధిపతి .ఈవిధంగా అందరూ సిద్ధులు కావటానికి శ్రీమద్విరాట్ పోతులూరి వీర  బ్రహ్మేంద్ర స్వామి శిష్యుడు సిద్ధయ్యకు  చెప్పినట్లుగా అందరికీ జ్ఞాన బోధ చేశారు .బ్రహ్మం గారి తత్వాలు లోకం లో బాగా ప్రచారం లో ఉన్నాయికానీ .ఈ పద్యాలు పెద్దగా జనాలకు తెలియవు .చరిత్రకారులు, విమర్శక శిఖా మణులు కూడా వీటిపై ఉపేక్ష వహించారని పిస్తుంది .మిత్రులు శ్రీ తుమ్మోజు రామలక్ష్మణాచార్యులు ఇలాంటి అమృతోపమానమైన పద్యాలను జన హృదయాలలో  చిరస్థాయిగా నిలవాలనే ఏకైక లక్ష్యం తో వాటికి కమ కమ్మని వ్యాఖ్యానం చేశారు .సులభాన్ని మరింత సులభతరం చేశారు .ఎన్నెన్నో గ్రంథాలనుంచి ఉదాహరణలు ఇస్తూ తమ వ్యాఖ్యానానికి నిర్దుష్ట త కలిపించి ,ఆదర్శ ప్రాయులయ్యారు .సిద్ధ యోగులకు సిద్ద గుటి(ళి)క గా ఈ పుస్తకంలోని పద్యాలు, వ్యాఖ్యానం ఉన్నాయి .ఇలాంటి మరిన్ని రచనలు ఆచార్యుల వారి లేఖిని నుండి వెలుగు చూడాలని కోరుతున్నాను

 ఈ అపూర్వగ్రంథంను హైదరాబాద్ లోని కాశ్యప ప్రచురణల వారు అందమైన బ్రహ్మ౦గారి ముఖ చిత్రం తో ,దోషరహితంగా పెద్ద అక్షరాలతోముద్రించి మహోపకారం చేశారు .దీని వెల ప్రకటించలేదు కనుక అమోల్యం అని భావిస్తున్నాను .ఆసక్తి ఉన్నవారు వ్యాఖ్యాన రచయిత గారి 97037 76650 కు ఫోన్ చేయవచ్చు .

 మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -13-8-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

పారు వేట( పార్వేట )కథా సంగ్రహం

పారు వేట( పార్వేట )కథా సంగ్రహం

పారు వేట( పార్వేట )కథా సంగ్రహం  అనే చిరుపోత్తాన్ని కర్నూలు జిల్లా వోర్వకల్లు  శ్రీ కేశవస్వామి ఉత్సవాన్ని గురించి ,కావ్యంగా నిజాం ఇలాకా ఇల్లూరు  గ్రామానికి చెందిన శ్రీ అప్పకవి గారు వ్రాయగా కర్నూలు కు చెందిన శ్రీ గుంతా సుబ్బన్న శ్రేష్టి గారు 1918లో కర్నూలు శ్రీ చంద్ర మౌళీశ్వరి ప్రెస్ లో ప్రచురించారు .వెల ఎంతో రాయలేదు .

  అసలు ఇంతకీ పారు వేట అంటే ఏమిటి ?దేవోత్సవం .దేవుడి తిరునాళ్ళ లో చివరి రోజున  దేవుడు గుర్రం వాహనం పై  ఊరిలోని జనం బయటకు వెళ్లి వేటాడి నట్లు ఆడే ఆట .వ్యభిచారించటానికి తిరగటం అనే అర్ధమూ ఉంది .పందెపు వేట అనే అర్ధమూ కనిపిస్తోంది .దేవుడి ఉత్సవాలలో ఒక గూటానికి పొట్టేలు నుకట్టి దూరం నుంచి తుపాకితో గురి తప్పకుండా కాల్చిన వాడికి ఆపోటేలు ను ఇవ్వటంరివాజు  .దసరాలలో విజయ దశమినాడు రాజు లేక జమీందారు మొదలైనవారు జమ్మి చెట్టు కొమ్మను కొట్టటానికి  వెళ్ళటాన్ని పార్వేట ఉత్సవం అంటారు .ఈ కావ్యం లో కవిగారు వోర్వకల్లు శ్రీ కేశవస్వామి ఉత్సవాల పారువేట విషయాన్ని వర్ణించి చెప్పాడు .

 కవి ముందుగా ఒక సంస్కృత శ్లోకం లో కేశవస్వామిని –

‘’శ్రీ కాంతా కుఛ కుంభ కుంకుమ లసద్భక్త ప్రదేశం సదా –ధ్యాయేత్ఫుల్ల సరోజ పత్ర నయనం బ్రహ్మాండ భాండోదరం-సాకారి ప్రముఖాఖిలామర భ్రాజత్కిరీటప్రభా –భాస్వత్వత్పద మోర్వ కంటి నగరీ శ్రీ కేశవ స్వామినం ‘’ అంటూ స్తుతించాడు .తర్వాత  ద్విపదలో ‘’శ్రీమించు కందనూల్ శీమ లోపలను –శ్రీ రమణికి ఇల్లయి చనునట్టి –ఘనమైన వోర్వకంటి పట్టణమును –అనుదినంబు బ్రోచు న౦బు జోదరుడు-కందర్ప సుందరాకారుడచ్యుతుడు-శ్రీ కేశవ స్వామి శృంగారముగను  -ప్రాకట వన విహారము సల్పబూని ‘’అని మొదలుపెట్టాడు ఉత్సవాన్ని .తర్వాత కేశవస్వామి అలంకార వైభవాన్ని కన్నులపండువుగా వర్ణించి –‘’రంగుగా గరుడ తురంగ౦బు నెక్కి –కరమొప్ప శ౦ఖు చక్రములు  నందకము –గడి మీరుచునుండు కౌమోదకియును-సరభసంబుగశాజ్న చాపసాయకము ‘’లతో గరుడ యక్ష కిన్నెర ఉరగ,సుర వసువు లాదిగా వెంటరాగా ,సూత్రధారులు ‘’అంగ కలింగ  మహారాష్ట్ర ,లాట .బంగాల వంగ నేపళ,సౌవీర సౌర ,విదర్భ పా౦చాలాంధ్ర’’భూపతులతో .కరితురగ రధాదులతో ,నటవిట గాయక ,ప్రధానులతో ,గాలవ కశ్యప గాధేయ వాలఖిల్యాది మునులు దీవించగా పున్నాగ సౌరాష్ట్ర సురటి ,మోహన కన్నడ గౌడ,శ్రీకల్యాణి రాగ ఝరులు నిండగా ,సరిగమ పదనిస్వరయుక్తంగా ,మద్దెల తాళ గతులు వేశ్య సుందరులు పాడుతూ ఉంటె ,పతాక త్రిపతాక   అర్ధ చంద్ర కర కర్తరీ ముఖ కటక మొదలైన ముద్రలతో హస్తాలు అభినయిస్తూ  ఇంపుగా నాట్యాలు చేస్తూ ,మేదినీ నాధుడు పట్టణం దాటి –ఘనసార కేతకీ ఖర్జూర ని౦బపనస ద్రాక్ష పాటలాశోక,అశ్వర్ధ చంపక వకుళ మొదలైన ఫల పుష్పజాతులు ఉన్న అరణ్యానికి ‘’కలహంస ,సారసకలరవాకీర్ణ మైన కాసారాలు చూస్తూ ,పంకజ మారండ మత్తాళి సంరంభం గమనిస్తూ ,కొంచెం సేపు విశ్రమిస్తూ ప్రయాణం సాగించాడు .

  ధనుస్సుతో బాణ సంధానం చేసి వనమృగాలను వేటాడుతూఉంటె విలాసంగా లక్ష్మీ దేవి దగ్గరకు చెలికత్తెలు వచ్చి  ఆమెతో ఏమి చెప్పారో ‘’చణుకు’’లో ఇలాచేప్పించాడు కవి –‘’వెలది మేమేమాని వివరింతుమమ్మా –నీ చెలువూని హోయలెట్లు తెలియవలేనమ్మా ‘’సందేహాలు తీర్చటానికి మేమెంతటివారం అన్నారు  .ఆమె కనుగవ  కెందోయి దోపగా ఆమెకూడా చెణుకు లోనే భైరవి రాగం లో –‘’మోసమాయే గద వమ్మా –ఎందుకోసమో కాని రాడమ్మా-మాట మీరనివాడూ మొగమాటం లేనివాడూ –బూటకాడు –మృగయా వినోదమంచు –కనుమాటి పోయే ‘’అని బాధపడుతుంది .

  తిరుమంగ ఆల్వారును పిలిపించి ‘’పొండు మీరిపుడుపుండరీకాక్షు వంచన జేసి ద్రవ్యము గొని రండు ‘’అని చెప్పగా ఆమె ఆజ్ఞతో బయల్దేరి అడవిలోని చుంచు వాళ్ళన౦దర్నీ పిలిపించగా ‘’చికిలి నాయుడు చిన్నకుమారుడు,సింగడు వోబులపతి చినమొదలైన నాయకులు గోచులు బిగించి ముందుకువచ్చి ఆల్వారుగారికి నమస్కరించి ఆయన చెప్పింది విని ‘’చక్రి చిహ్నములు –కనుపడ కుండగా గైకొని వచ్చి పేరైన సొమ్ములు వేర్వేరుగాను –శ్రీ రమాదేవికి అర్పించి రావేళ’’

  అప్పుడు శౌరి వనవిహారం చాలించి కాసేపు విశ్రమించగా ,క్విష్వక్సేనుడు సేనుడు సైన్యమంతా పరికించి ఆభరణాలు కనబడక పోవటం తో స్వామి చెంత చేరి ‘’స్వామిపరాకు హెచ్చరిక ఈ వేళ-‘అంటూ బరాబరులు చేసి ఎవరో కన్నుగప్పి ద్రవ్యమంతా అపహరించుకు పోయారని చావు కబురు చల్లగా విన్న వించాడు .కేశవస్వామి కూడా విహ్వలుడై వెతికి పట్టుకొమ్మని ఆనతివ్వగా ,జాడలన్నీ వెదుకుతూ సొమ్ములు దొరికి ‘’కంటిమి పొడగంటిమి  -తుంట విల్తుని గన్న డంట యైన తమ్మికంటి సొమ్ములు జాడ ‘’అని చణుకులో అంటూ జాడల ను బట్టి కదిలి ‘’శ్రీ రమామణి ఇంటికి ‘’వచ్చి సొమ్ములు ఇక్కడే ఉన్నాయి లోపలి వెళ్లి తీసుకొంటాము అంటే లక్ష్మీదేవి ఖబడ్దార్ జాగ్రత్త అంటే  గుడ్ల నీరు కుక్కుకొంటూ చేసేదిలేక శౌరికి చెప్పటానికి వెళ్ళిపోయారు

  కేశవ స్వామి ఆ ఆడది ఎలాంటిదో తెలుసుకోవాలని చూర్నిక లో ఒక లేఖ రాయించాడు –‘’శ్రీమదఖిల గురు ద్విదళన పాటవ శతకోటి ధర తరుణీప్రముఖ సుర సుందరీ నికార —-‘’జలరుహ సేడనే యుష్మత్పరి చారకః-సకలాభరణ ప్రముఖ వస్తూని గృహీత్వా – త్వచ్చిద్ధాంతముప విష్టాః-‘’అంటూ ఆద్రవ్యాన్ని వెంటనే తెచ్చివ్వమని హుకుం పంపాడు .దీనికి సమాధానంగా లక్ష్మీదేవి కూడా చూర్నికలోనే ‘’శ్రీమత్కామల సంభవ భావా ఖండలాది నిలింప నికర మస్తకన్య స్తహాటక కోటీర సంధానిత మందార ప్రసూనమాలికా మకరంద బిందుధారా –‘’అంటూ గీర్వాణ౦ లోనే ‘’చన్న కేశవా రాయా త్వదీయ పత్రికాభిప్రాయం హృద్గత మామ జైతు-ఏతత్కార్యం మయాజజ్ఞాతవ్యంకుత భవతి-తత్రైవ విచార ణియ్య ‘’అని గడుసు సమాధానం రాసింది .

  వెంటనే ద్వారపాలులను తలుపులు మూసేయ్యమన్నది .కిటుకు గ్రహించిన కేశవుడు అమ్మవారి భవనం దగ్గరకొచ్చి తోడిరాగం చణుకు తో ‘’వారిజ నేత్రి కవాటము మూసినకారణమేమో చప్పవే భామా ‘’అనగా లక్ష్మీదేవి ‘’ కారణమడిగెదవు నీ పేరేమిటో చెప్పవోయి కృష్ణా ‘’అన్నది .తాను  మాధవుడనని తనతో పరచికాలేమిటని అన్నాడు .వసంతుడవైతే తరు రంజన చెయ్యమని కోరింది .వసంతుడినికాను చక్రిని నీవాడినే ‘’అన్నాడు .కుమ్మరివాడవైతే కుండలు చెయ్యి అంది .హరినే ముద్దులగుమ్మా అనగా ‘’హరివైతే బాగాయనట్ట యితే –నరుడుగా గంతులు వేయు కృష్ణా ‘’అంది .ధరణీ ధరుడనే కొమ్మా అన్నాడు అయితే వాల్మీకం లో దూరవోయి ‘’అన్నది .పామునుకాను పాముల రాజు మదం అణచే వాడినే అన్నాడు .విహ౦గ పతివైతే ఆకాశం లో గింగిరాలు కొట్టు ఫో అంది .’’కీరవాణి ఖగపతి నేగానే వోర్వ క౦టీశుడనే’’అనగా ‘’పరనారీచిహ్నాలు కనిపిస్తున్నాయేమిటి సామీ అంది .దిగొచ్చిన కేశవుడు ‘’నానేరమేమో చెపుమా ‘’అని బామాలాడు .నీతో వాదాలేమిటి కొంటె కిట్టయ్యా ఫోఫో అంది .

  అప్పుడు కేశవస్వామి ‘’ఎప్పుడూ లేని వింత ఇప్పుడు కలిగినదే చింత .పోలయలుకలు మాని పొందుమీ నన్నూ ‘’అన్నాడు ..నీ మెరమెచ్చుమాటలు చాలు అక్కడికే పో నాతొ పనేమిటి అనగా ‘’నిన్ను విడిచి అన్యమెరుగని వాడను ‘’అంటే శ్రీరాగం లో ఆమె ‘’పోరా చక్కని సామిగా –పోరా ఊరూ వాకంటి విహారా శ్రీ చన్నరాయా ‘’అంటూ కాసేపు మేలమాడుకొన్నారు .కేశవుడు అష్టపద్యార్ధం లో ‘’అందము మీరగా వనవిహారము సల్పు చుండ కస్తూరి అ౦టుకొందికాని స్త్రీలకాటుక కాదన్నాడు .లక్ష్మి రేగుప్తి రాగం లో ‘’సుందరరూప ఏచందన గ౦ధిని లీలతోకౌగ లింలచు కొన్నావో ‘’అని ప్రశ్నిస్తే ,ఆయన సీసార్ధం లో ‘’వట్టి నిందలు పలకటం న్యాయం కాదు ‘’అనగా ఆమె  తగ్గేదేలే అన్నట్లు ‘’మళ్ళీ ఏకటం మొదలు పెడితే లెంపలేసుకొని సమాధానాలు చెప్పాడు .ద్విపదార్ధాలతో ఇద్దరూ తగువు పెంచుకుంటూ పోయారు .ఆయనకూడా ఆమెకు లక్ష్మి ‘’యాలాలు ‘’లో’’ మల్లెపోదల్లో తిరుగుతుంటే వాటి వాసన పట్టుకున్నది తనకు అంది .

  లక్ష్మికి సమాధానం చెప్పలేక ‘’ఎన్ని విధముల వేడినాగానీ మానినీ మణి ప్రమాణ మంటేని –పామునైనాను చేత బట్టెద నింక ‘’అన్నాడుపాపం .ఆమె ఊరుకొంటు౦దా ‘’పాముమీద పవళించు వాడికి పాముకాటు లెక్కలోనిదే ‘’అంది వెటకారంగా .అగ్ని చేతులో పట్టుకోమంటావా అంటే ‘’  భగభగమందు దిక్కులా –పోగలలెగయు దావానలంబు పొందిక చాతాన్ –దిగమ్రింగు వాని కనలము ‘’పట్టుకోవటం  వింతేమీ కాదు  ఫో అంది .

  లక్ష్మి కందపద్యం లో నామీద ప్రేమ ఉంటె ‘’బాకేత్వము బల్కి రమ్ము పంకజ నాభా ‘’అనగా ఆయన ‘’బాకేత్వ మీయనేరనే –నా కోడలుగాదే వాణినామాట లలన్ .నాకొరకే దీర్చు భామ నయగుణ ధామా ‘’అని అనునయంగా పలుకగా మళ్ళీ కందంలో అందంగా కవి –‘’భేరీనాదము భాభా భూరీ విభవయవన సతుల బొడగన బూబూ – చీరు లరుగగగానభీభీ –అరయంగా గొల్లవారలందురు బేబే ‘’అని  మంగళం పాడాడు .

దీనికి ఫినిషింగ్ టచ్ గా బాలకవి శతావధాని ,దోమా వెంకటస్వామి గుప్త గారు నాటి రాగం ఆది తాళం లో –

‘’జయమంగళం హయరాజముఖ –భయవార శూరా- న్వయనాథ దేవా –జయ భక్తానుకూల –పరమార్ధ లోల –యుక్తి ప్రపాల సూక్తి సుశీల –కరిరాజు నాడు మొర లిడవిని –యరమరబాపి-నావయ్య శ్రీశ –ధరనోరుగంటిపుర కేశవేశ –వరబాలకవి వెంకయాఖ్య నుత జయమంగళం ‘’

 20పేజీల  పార్వేట కథా సంగ్రహం ఇది.తమాషాగా గిల్లికజ్జాలు లా చిలిపి సంభాషణల్లా ,ఎందుకోననుకొంటి గోంగూరకి పాటలా సరదాగా తనకున్న సంస్కృత ఆంద్ర పాండిత్యాన్ని సంగీతాన్నీ గుది గుచ్చిఅప్ప కవి లోకానికి అందించాడు ఈకావ్యమూ, ఈకవీ కూడా లోకానికి పట్టినట్లులేదు .పరిచయం చేసే భాగ్యం నాకు కలిగినందుకు ఆనందంగా ఉంది .

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-8-21-ఉయ్యూరు  .

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మాల్యాద్రి నృసింహ శతకం

మాల్యాద్రి నృసింహ శతకం

మాల్యాద్రి నృసింహ శతకాన్ని నరసింహ భక్తాగ్రేసరుడు శ్రీ ముత్తరాజు నృసింహరావు గారు సర్వజిత్ నామ సంవత్సర పుష్య శుద్ధ తదియ స్థిరవాసరం అంటే 1887 డిసెంబర్ లో  రచించి,నృసింహా చార్య పండితుని చే పరిష్కరింప జేయించి ,నెల్లూరు శ్రీ రంగనాయక లీలా ముద్రాక్షర శాల యందు 1889నవంబర్ 5న  ముద్రించారు .మాల్యాద్రి   నెల్లూరు జిల్లా కందుకూరు తాలూకా చుండి జమీందారీ లో ఒక పర్వతం .గొప్ప నృసింహ క్షేత్రం .  

 కవి గారు శతకాన్ని కందపద్యాలతో దేవతా స్తుతితో ప్రారంభించారు మొదటగా నృసి౦హ స్తుతిగా –‘’శ్రీ రామామణి సేవిత –స్మేరా౦చిత భక్త కుముద సితకర విహితా –శ్రీ రాజిత శైల శ్రీ నృసింహా ‘’చెప్పి ,తర్వాత –‘’మురహర పురహర ధాతల –నిరవొందగ బ్రస్స్తుతి౦చి ఎరగెదమదినీ –వరరూపములై చెలగుట –స్థిర తరముగా మాల్యశశైల శ్రీ  నృసింహా ‘’ఆతర్వాత శారద వినాయకులను స్తుతించి –

‘’శతకముగా గాను కందము –లతి వైఖరి తోడ జెప్పి యార్యులు మెచ్చన్ –గృతి నిచ్చెద వందనములు-క్షితి గైకొను– ‘’ శతక మకుటం ‘’మాల్యశైల శ్రీ నృసింహా ‘’

  ఆతర్వాత ప్రహ్లాద జనన దశకం రాస్తూ –‘’అన్నిటదానై వెలిగెడు –సన్నుత చరితుండవుకా –వెసద్భక్తులకైమిన్నగు రూపము దాల్చుట –చిన్నలెకదా—‘’

 పిమ్మట నృసింహ ఉద్భవ దశకం చెప్పాడు –‘’ధవళ ధరాధర దీర్ఘ దు –రవలోక న దివ్య దేహ యాశాష్టగజా- శ్రవణవిభేదన గర్జన –శివసన్నుత మాల్య శైల —  అని నృసిమ్హావిర్భావం వర్ణించి ,ఆతర్వాత శత్రు సంహార దశకం లో –‘’శాత్రవుని బట్టి బల్-సూత్రమునవధి౦చి తౌర చూపరులు దగన్ –ధాత్రిని సంతోషింపగ జిత్రముగ –‘’’’అరి కసిపుని దునిమి భక్తుని –నరి సుతు ప్రహ్లాదు జూచి యఖిల సుఖంబు –ల్గరుణ యగుపడ గ నీయవే –సిరినాయక –‘’

  ఆతర్వాత దశకం లో గ్రహోచ్చటన వర్ణించాడు కవి –‘’వేదం విచారులు కర్మా-మోదప్రచారులు-నీడయకే పాత్రులు అని వేదాన్తరహస్యం విప్పారు .నృసింహ అష్టాక్షరి మంత్రం జపిస్తే తీరని కోరిక ఉండదన్నారు .తర్వాత మహిమాను వర్ణన దశకం ,లీలావతార వర్ణక దశకం చెప్పాడు –‘’నీలీలలు నీ చర్యలు –నీ లీలా జనకర్మ నిపుణత’’ఎన్నాతానికి  ఆశక్తుడనన్నాడు  .ఇందులో దశావతార లీలలు వర్నిన్చాడుకవి ..ఆపిమ్మట అర్ఘ్యపాద్యాది పూజా వర్ణన పది పద్యాల్లో చెప్పి ,ధూప దీప నైవేద్య దశకం చెప్పి ,దూషణ భూషణ తిరస్కార దశకం చెప్పి ,చివర్లో గడుసుగా ‘’స్తుతి చేయ నేరని –నా స్థితి నంతయు జెప్పి నాడ జిత్తము నీవె-గతినైనను బ్రోవగ వలె’’అన్నాడు .

  గ్రంథాంత శాంతి రత్నమాలిక లోకూడా పద్య దశకం చెప్పి –‘’మ౦గళము శ్రీ నృసింహా  -మంగళము సుభక్త పోషక మంజుల వేషా –మంగళము కావ్య రమకున్ –శృంగార కరుణ రస –మాల్య వర శైల నరశ్రీ –నరసిమహార్పణ మంచు మతినిచ్చి –కర మష్టోత్తర శతకము –సిరివర గొనుమా ‘’అని ఆస్వైకే అంకితమిచ్చి ధన్యుడయ్యాడు కవి శ్రీ ముత్తరాజు నృసి౦హారావు .

   ఈశాతకమూ ఈకవీ కూడా లోకానికి పట్టినట్లు లేదు .ఈ శతకాన్నీ ఆనృసింహ భ్క్తకవినీ పరిచయం చేసే భాగ్యం నాకు కలిగిందని సంతోషిస్తున్నాను

  మాల్యాద్రి అంటే కొండలహారం అని అర్ధం .మాలకొండ అని కూడా పిలుస్తారు .ప్రకాశం జిల్లా వలేటి వారి పాలెం లో ఈ మాల్యాద్రి ఉంది .స్వామి లక్ష్మీ నృసింహస్వామి .దీనికి పడమర అహోబిల నరసింహ దేవాలయం ,ఉత్తరాన శ్రీ శైలం ,దక్షిణాన వృక్షాచల క్షేత్రం ,తూర్పున సింగరాయకొండ నరసింహ దేవాలయం ఉన్నాయి .మాల్యాద్రికి దక్షిణాన పినాకిని  అంటేపెన్నా నది ,ఉత్తరాన కృష్ణానది ప్రవహిస్తున్నాయి .మాల్యద్రిలోని భక్తులు తమ సంతానానికి మగవారైతే నరసింహ నామ౦ ,ఆడవారైతే మహాలక్ష్మీ పేరు  ఎక్కువగా పెట్టుకొంటారు .

 మాల్యాద్రి నృసింహ స్వామికి ఒక చేత సుదర్శన చక్రం మరో చేతిలో శంకు ఉంటాయి .అమ్మవారు శ్రీ మహా లక్ష్మి ఆయన  అంకం మీద కూర్చుని దర్శనమిస్తుంది .స్వామి ఒక చేయి ఆమె బుజం పైనా ,మరొక చేయి వరద హస్తం గా ఉంటాయి .స్వామివారు యక్ష కిన్నర సిద్ధ ,దేవమునిగణాలకు  ఆదివారం నుంచి శుక్రవారం వరకు ఆరు రోజులు దర్శన భాగ్యం కలిగిస్తారు .మానవులకు మాత్రం శనివారమే దర్శన భాగ్యం కలిగిస్తారు .మాల్యాద్రి దేవత మహా లక్ష్మీ దేవి మాల్యాద్రి పర్వత శిఖరం పైన కొలువై ఉంటుంది .మహాలక్ష్మీ సమేత మాల్యాద్రి నృసింహస్వామి భక్త వరదుడు. పిలిస్తే పలుకుతాడనే విశ్వాసం భక్తులలో ఉన్నది .

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-7-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

తత్వ వేత్త యడ్ల రామ దాసు గారు

తత్వ వేత్త యడ్ల రామ దాసు గారు

19వ శతాబ్దం చివరలో కాకినాడలో ఉన్న తత్వ వేత్తలలో యడ్ల రామదాసు ఒకరు .క్రీ.శ 1860లో జన్మించి 70ఏళ్ళు జీవించి 1910లో సిద్ధిపొందిన తత్వ వేత్త .బ్రహ్మం గారి తత్వాల తర్వాత ఈయన తత్వాలకే వ్యాప్తి ఎక్కువ .119కీర్తనలతో ‘’సాంఖ్య తారకామనస్క యోగంబనెడు సుజ్ఞాన చంద్రిక ‘ అనే గ్రంథాన్ని పీఠిక తో సహా తాను బ్రతికుండగానే ముద్రింపించుకొన్నాడు .

  విజయనగరం సంస్థానం దగ్గరలో కలవ చర్ల గ్రామం లో యడ్ల అచ్చయ్య ,మహాలక్ష్మమ్మ దంపతులకు యడ్ల రామ దాసు జన్మించాడు .అక్షరాభ్యాసం అయిన తర్వాత 12వ ఏట కాకినాడ చేరాడు .అక్కడ మంతెన  వేంకటాచార్య అనే వేదాంత గురువు వద్ద  ఉపదేశం పొంది సాంఖ్య తారక అమనస్క,రాజయోగాదులలో  ప్రావీణ్యం సంపాదించాడు  

పీఠిక లో రాసుకొన్నట్లు తాను విద్య విహీనుడైనా,సద్గురు కటాక్షం చేత  కవిత్వ ,వచన రచనలో ఒకధోరణికలిగి కొన్ని కీర్తనలు మరికోన్నితత్వాలు గద్య పద్యాలో సకల జనాహ్లాదకరంగా సులభ శైలిలో రాశాడు. సుజ్ఞాన చంద్రిక తోపాటు ఆయన శిష్యులు తాము రచించినవికూడా చేర్చి ;;యడ్ల రామ దాసు చరిత్ర ‘’పేర పుస్తకం ప్రచురించారు .ఇది బాగా ప్రచారం లో ఉంది ఇందులో రాసిన శిష్యులు –బూచి అప్పలదాసు ,చిట్టూరి నారాయణ దాసు ,విత్తనాల కొండయ్య దాసు ,వెంకటదాసు ,బోని అప్పలదాసు బోని గవరయ్య దాసు మామిడి అప్పలదాసు కంచుమర్తి యల్లయదాసు ,నాగన్న లు .

  సుజ్ఞాన చంద్రికను యడ్ల రామ దాసు తన జీవిత చరిత్రగానే రాశాడు .హరికథా కథన శైలిలో, తోహరాలతో ఉత్తమ పురుష లో ఆత్మకథాకథన పద్ధతిలో రాశాడు –

‘’అండపిండ బ్రహ్మాండ పురంబున నా గురు రూపము జూపెన్ –కుండలాగ్రమున మంతెన వెంకట గురువై తానటియి౦చెన్ –శ్రీకరమగు శ్రీకాకినాడ పురి దాపున జేరిన వాడన్ –ప్రాకటముగ యడ్ల రామదాసు తలవాకిటపై ప్రకటించెన్’’

  చంద్రికలో ఉన్నవి తత్వాలు మాత్రమేకాక ,చాలాపాటలు కీర్తనల రూపం లో ఉన్నాయి .భజనపాటలు మేలుకొలుపులు ,జోలపాటలు మంగళహారతులు ,ఆంజనేయ దండకం ,గోపీ కృష్ణ సంవాదం ,గురుశిష్య సంవాద గేయాలు ఉన్నాయి .రంగనాథ వెంకటేశ్వర ,రామ ,కృష్ణ ,వినాయక ,త్రిపురసుందరి ఈశ్వర ,నారాయణ రూప పరబ్రహ్మాలపైకీర్తనలున్నాయి .కొన్ని పల్లవులు బాగా ప్రచారం లో ఉన్నాయి -1-ఈశ్వరా  పరమేశ్వరాజగదీశ్వరా కరుణించరా ,2- జీవమా మేలుకొనవే –మేలుకొనవే వెర్రిజీవమ చాలు ,3-అనుమాన మేలకే మనకు ఈతనువు నిత్యముగాదు హంస , ,4-దీనిభావము తెలియవలేనన్నా నీలోను బ్రహ్మముపూని కనుగొనవలెను వినుమన్నా.

 కృష్ణ లీలా సంకీర్తన –శ్రీరాగం –ఆదితాళం

‘’ఎన్నిమాయలు నేర్చినాడమ్మా నీ కొడుకన్నిటికి నెరజాణు డో యమ్మా ‘’తేటతేటమాటలతో జీవాత్మ ,పరమాత్మ సంబంధం ఎరుకపరచాడు .పరమాత్మ క్రీడా విలాసాలే బాలకృష్ణలీలలు – 

‘’వ్యవసాయము  జేసేవారము –ఈ అడవిలోపల కాపువారము –నవద్వార పురము వీధి  వారము-నవనీత చోరుని భక్తపరులము  -అండ పిండ బ్రహ్మాండము మేము  మెండుగ పండించినారము – పుండరీకాక్షుని నామము ఈ పుడమి అంతట జల్లినారము ‘’

అంటూ తత్త్వం లో భక్తిసాధన వ్యవసాయం తో పోల్చి నిగూఢమైన వేదాంత రహస్యాన్ని బోధించాడు .

  నాదనామ క్రియ –ఆటతాలం

‘’ఈ ఊరికిదే దారికదా గురురాయలు తెలిపినదదే కదా –దారికి ఎదురై మూడు శునకములు దాటుచు మిక్కిలి మొరిగే కదా –ఎక్కువైన ఏకాక్షరి కుక్కల కెదురుకొనీ మదమణచె గదా ‘’

గురు శిష్య సంవాదం –హిందూస్థానీ ఆటతాలం

శిష్యుడు –ఇలను సద్గురు సేవ చేసితే ఏమి ఫలితము గురువరా

గురువు-ఈ ధరను సద్గురు కృపను  పరముకు దారిదొరకును శిష్యుడా

శి-పంచభూతములు  ఏ స్థలమున సంచరించును గురువరా

గు-పంచభూతము లైదుగూడి ప్రపంచమాయను శిష్యుడా .

బాగా ప్రసిద్ధి చెందిన యడ్లవారి తత్త్వం –

సావేరి రాగం –ఆట తాళం

‘’ఏమి జన్మ౦బేమి జీవనమూ –ఈ మాయకాయము

ఏమి  జన్మము మేమి శాశ్వత మేమి సౌఖ్య –మిదేమి నా ప్రారబ్ధకర్మము స్వామి నన్నిటు చేసి మరచెను .’’

  మూడు  భాగాలుగా ఉన్న యడ్ల రామదాసుగారి ‘’సుజ్ఞాన చంద్రిక ‘’లో నుంచి కొన్ని కీర్తనలు –

గీ-చతుర్వేదముల ఫలశృతి –మతి నిను దలంచి ,హితము మీరగ మోక్ష సతిని గూడి వ్రతము సలుపువాడు –అతడే పో ఆచలుండు –ధరను యడ్ల రామ దాస పోష .

‘’ముఖ్యమైనటు వంటి మోక్షమేదో దెలిపి మోక్షమొసగుమి వెంకటార్యా-‘’చక్కగా గురు సేవ సలుపు చుండు నీకు –సంప్రాప్తమవు రామ దాసా ‘

‘’సోహమెద్దియు వెంకటార్యా –అహం బ్రహ్మాస్మి యనునుచు –యజుర్వేదంబు దనరుచున్నది రామ దాసా ‘’

‘’ఆచలపరిపూర్ణ బ్రహ్మము   –క్రమము నొందుట దెల్పుము వెంకటార్యా –పంచ దశాక్షరిని పరికించు –ద్వాదశాక్షర భావమది రామ దాసా ‘’

‘’వందనము నీకు గురువరా –చార్యమూర్తి –వందనము నీకు అక్షరాకార సూత్రి-వందనము సా౦ఖ్యతారక మనస్క జైత్రి –వందనము నీకు సదానంద మూర్తీ ‘’

‘’అనాదియగు విఘ్నపతిని –చోద్యమలర హృదయైక  వేద్యు నచట పూజింతు విమలమతిని –రాజ్యమున రాజ యోగ –రాజ్యంబు నందు ‘’

‘’మ్రొక్కెద పద్మజు రాణికి –మ్రొక్కెద వాగీశ్వరికిని –మ్రొక్కెద మక్కువ తోడుత-గ్రక్కున మత్కావ్య సిద్ధి కలుగుటకై ‘’

కీర్తన -మోహన రాగం –ఆటతాలం

‘’ ఎందుబోయెద వి౦దురావయ్యా –శ్రీ లక్ష్మీ రమణా-పొందుగా నన్నేలు కోవయ్యా ‘’

యదుకుల కాంభోజి-ఆటతాలం

‘’ గరుడా వాహన పరంధామా –నన్ను కరుణించ రావే శ్రీరామా –నరుల బ్రోచే దొరవు నీవని స్మరణ జేసెద –పరమ పురుష .’’

   మూడు భాగాల ఈ చంద్రిక కాకినాడ సుజన రంజని ముద్రాక్షర శాలలో 1898లో ముద్రింపబడింది .వెల –పావలా మాత్రమె .తత్వ వేత్త

 మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -10-8-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రాజ యోగి –   శ్రీ  రాళ్ళపల్లి  అనంత కృష్ణ శర్మ

రాజ యోగి –   శ్రీ  రాళ్ళపల్లి  అనంత కృష్ణ శర్మ

రాళ్ళ పల్లి అనంత కృష్ణ శర్మ హిందీ లో ప్రేమ చంద్ లాగా తెలుగులో నిజం గా తెలుగు వారు .ఆయన శైలి కిసలయ కుసుమం .ఒక్క కఠిన పదం ఉన్నా సహించరు .జావళీలకు ,జట్కా సాహేబు వరుసలకు యతి ని తెలుగు గద్యం లో ప్రవేశ పెట్టిన ఘనులు .వ్రజ భాషాకవులు అంత్య ప్రాసను బాగా వాడారు .అది వారి జీవ లక్షణం .అలాగే శర్మ గారు ఆ ‘’తుక్ బందీ ‘’లేకుండా రచన చేయలేదు .వారికి లాక్షణికత కంటే సౌందర్య పిపాస  ,రస లోలుపత ఎక్కువ . గాధా సప్త శతి లో ‘’సంకు ‘’అనే గ్రాంధిక పదం ఉంటె ‘’.సెంకు’’గా తెనిగించారు .అదీ యతి స్థానం లోనే వాడారు .ఆయన ప్రతి వాక్యమూ ఒక పల్లవి లాంటిదే .ఆయన వచనం లో సంగీతం ప్రాణం ..ప్రతి వ్యాసాన్ని కనీసం అయిదారు సార్లు సాఫు చేస్తే గాని తృప్తి చెందరు .శ్రవణ సుఖం లేని పదాన్ని వాడనే వాడరు .ప్రతివాక్యం అప్సరసగా తయారవ్వాల్సిందే .స్వతంత్రత ఆయన రచనలకు అలంకారం .లోకం ఎదురు తిరిగినా తన భావాన్ని మార్చుకోరు .నాచన సోమనకున్న ‘’నవీన గుణ సనాధథుడు ‘’అనే బిరుదు ఆయన భాషకే కాని భావానికి కాదని నిర్ద్వందం గా చెప్పారు .నాటకాలలో స్త్రీ పాత్రల్ని పురుషులు కూడా వేయ వచ్చు ‘’అన్నారు .బళ్ళారి రాఘవ కుదరదు అన్నా ‘’నా అభిప్రాయం అదే ‘’అని సభలోనే చెప్పారట  శర్మాజీ .

         హఠయోగం లో నిష్ణాతుడైన బిడారం కృష్ణప్ప శిష్యులై, రాజ యోగిగా మారి కర్నాటక ,ఆంద్ర దేశాల్లో వీర విహారం చేశారు .కన్నడ దేశం లో శర్మ గారికి సంస్కృత పండితుడి గా ,విమర్శకుడిగా పేరుంది కాని కవిగా ప్రసిద్ధుడు అని పించుకోలేదు .కాని గొప్ప గాయకుడి గా అక్కడ పేరుపొందారు .ఆయన సంగీతం అమృత ఖండం అన్నారు పుట్టపర్తి వారు .సాత్వికావేశం ఎక్కువ .స్వరాల్ని పెంచి పాండిత్యం చూపరు .ప్రక్క వాద్యాలపైకి విజ్రు౦భి౦పరు .శ్రోతలను ఈ లోకం లో ఉండేట్లు చేయరు .రస నాళిలను లలితంగా తాకి హాయి చేకూరుస్తారు .శర్మ గారి తో మాట్లాడటం ఒక సాహితీ విందు .మెదడులో ఉన్న పుస్తకాలన్నిటిని పరచి మన ముందు ఉంచుతారు .సరస సంభాషణా చతురులు .విసుగు ,అరుచి ఉండదు వింటుంటే .ఎదుటివారిని బహిరంగంగా ఖండించరు .సాను భూతి ఎక్కువ .ప్రతి పదాన్ని మంచి అభినయం తో,సంగీత జ్ఞానం తో చల్లని కమ్మని  కంఠ స్వరం తో మనల్ని పరవశుల్ని చేస్తారు .కనుబొమలు నిలవవు .చేతుల్లో అతివేగంగా హస్తముద్రలు మారిపోతూ ఉంటాయి .చూసిన వారికీ ఈయన ‘’భరతాచార్యుడా “’అని పిస్తుందని అంటారు నారాయణా చార్యులు .

 శర్మ గారు గద్యం తో ఒక శకాన్నే ఏర్పరచారు .కందుకూరి వారితో ప్రారంభమైన వచన రచన శర్మ గారితో భరత వాక్యం పలి కింది అన్నారు  పుట్టపర్తి వారు. కొత్త పరికరాలతో కొత్త వస్తువులతో కొత్త శైలిని వచనం లో తెచ్చిన మహాను భావులు .పూల రధం వచ్చినట్లుంటుంది వారి వచన రచానా చమత్కారం .తిక్కన అంటే మహా ప్రాణం .శివ కవులను ఎక్కువగా ఆదరించారు.‘’తెలుగుకు ప్రత్యేక ఉనికి లేదా?సంస్కృతం వెంటఎందుకు పరిగెత్తాలి?’’అని ప్రశ్నించుకొని ,ప్రశ్నించి చక్కని తెలుగుకు జీవం పోశారు .ఆయన రచనలలో తిక్కన ,సోమన ,వేమన తొంగి చూస్తారు .శర్మ గారి రచనలన్నీ వ్రాసి చదివినవే .సభలో వ్రాసిన వ్యాసం లేకుండా ఎప్పుడూ ఉపన్యాసం చేయలేదాయన .తప్పు దొర్లుతుందో ,దారి తప్పుతామనో ఒక జంకు వారికి ఉండేదన్నారు ఆచార్య శ్రీ .ఆయన మనసు వీణా తంత్రి  వంటిది .ముట్టుకోగానే రింగున మొగుతుందట .ఆగ్లంలో ‘’రాసిటీ ‘’వంటి మధుర భావుకుడు .ఆంధ్రలోకం లో అమృతాన్ని పంచారు .

            శర్మ గారు మంచికవి .ఒకటే కావ్యం ‘’గాథా సప్త శతి ‘’అనే అనువాద కావ్యం రాశారు .కాని ‘’మహా కవి ‘’బిరుదు పొందారు .నూతన పదాల సృష్టిలో ఆయన అందె వేసిన చేయి .’’మగ సేత ,పరువమైన వయసు ,వలపు వేడి ప్రేమంపు చవులు ,సిగ్గు దెగిన వాడ ,మగడూర లేని దాన ‘’వంటివి ఎన్నో .ఒక్కో సారి ఒక పద్యం రాయటానికి నెల రోజులు పట్టేది .కళా రహస్యం తెలిసిన వారు కనుక చిత్రిక పట్టేవారు .విశ్వనాథ ‘’ఆంద్ర దేశం లో శర్మ గారి రచనలు చిరంజీవులు ‘’అన్నది నూటికి నూరు శాతం యదార్ధం అని ఆమోద ముద్ర వేశారు ఆచార్యుల వారు .శర్మ గారికి సంగీత ,సాహిత్యాలు వలచి వచ్చిన మహా భాగ్య శాలి .ఆయన కవిత్వం ఒక సంగీతం .ఆయన జీవితమే గానం అయింది .గద్య పద్యాలలో సంస్కారాన్ని కుప్పలు పోశారు. విమర్శకు ఆదర్శమై నిలిచారు .పండిత పామరులకు శర్మ గారి పేరు ‘’మంత్రం దండం ‘’అయింది .నేటి సాహితీ భూముల్లో శర్మ గారు జనకుని వంటి రాజ యోగి అని కితాబిచ్చారు నారాయాణాచార్య వర్యులు .

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -10-8-21-ఉయ్యూరు 

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

అవధూత నిట్టల ప్రకాశం గారు

అవధూత నిట్టల ప్రకాశం గారు

 అవధూత నిట్టల ప్రకాశం గారు యానాం కు ఆయన 50 వ ఏట వచ్చినప్పుడు తన చిన్నతనం లో చూశానని శతావధాని శ్రీ చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రిగారు రాశారు .అప్పటికి ప్రకాశం గారికి కవిగా గుర్తింపులేదు .ఆయనను ఎవరూ ఎరగరు కూడా .అలా ఒకరోజున ఆయన తనకు కొద్దిరోజుల్లో కవన శక్తి కలగబోతోందని ,దానిని పరిశీలించమని యానాం లోని ప్రముఖులతో చెప్పుకొన్నారు .శాస్త్రిగారి పుట్టినూరు కూడా యానాం .యానాం దేవాలయం దగ్గరు ఆసక్తికల వారందరూ రావచ్చునని ప్రకాశం గారు ప్రకటించారు .ఊరి పెద్దలు ఎవ్వరూ ఆయనమాటలు లక్ష్య పెట్టలేదనీ ,లైట్ తీసుకోన్నారనీ ఎవరూ రాలేదనీ ,ఎవరో పది మంది ‘’లాకాయ్ లూకాయ్ గాళ్ళు ‘’మాత్రమె వచ్చారని శాస్త్రిగారు చెప్పారు .నిట్టలవారు ఆశువుగా ,ధారాళంగా చెప్పిన పద్యాలను వినటం మాత్రమె కాక అప్పటికప్పుడు తాను  పుస్తకం లో రాసుకొన్నాననీ చెళ్ళ పిళ్ళ వారు చెప్పారు.అందులోని కవిత్వంకూడా చాలా గొప్పగా ఉందనీ వారికీర్తనలు చాలామందికి కంఠోపాఠం గ వచ్చుననీ శాస్త్రిగారు ఉవాచ .తమకు గుర్తున్న కీర్తనలు ఆయన తెలియజేశారు .

   ఆదితాళం లో కీర్తన –‘’హరా నిన్నే నమ్మినానుగదరా  –

అనుపల్లవి –కరుణాకర పురహర నీపాద మును నమ్మినానురా

 మ్రొక్కు చుంటినిరా ‘’అని సాగుతుందని ప్రాసయతి తో కీర్తన మనోజ్ఞంగా ఉందనీ శాస్త్రిగారన్నారు .అయన కీర్తనలు భద్రాచల రామ దాసు గారి కీర్తనలాగా మనోహరంగా ఉంటాయన్నారు .నిట్టల వారి స్వగ్రామం పెద్దాపురం కావచ్చుననీ తనకు తెలిసినప్పటి నుండీ ఆయనకు స్వగ్రామం లేదనీ భార్యను కూడా వదిలేసి రోజుకో గ్రామం లో తిరిగేవారనీ చెప్పారు .సంతానం అసలే లేదు  .కుల నియమం పాటించకుండా అన్ని వర్ణాల వారిళ్ళలో భోజనాలు చేస్తూసారాకు అలవాటు పడ్డారని చెప్పారు .భోజనమున్నా లేకున్నా మందు ఉంటె చాలు .

  యానాం వచ్చినప్పుడు నిట్టలవారి  మకాం సారా కొట్టే అని చెళ్ళపిళ్ళ వారు జ్ఞాపకం చేసుకొన్నారు .పల్లెకారులు భోజనం తెచ్చి పెట్టేవారు .చేపలు మాంసం పెట్టేవారుకాదు .భయం తో మాలలు ఆయనకు భోజనం పెట్టలేదన్నారు .కొద్దికాలం బ్రాహ్మణులు పిలిస్తే వెళ్లి తినేవారు,కానీ చివరికి ఆయన ఆతిధ్యం అంతా పల్లె కారులదే.అన్నం కంటే మద్యమే ప్రియం ఆయనకు .అవదూతలకు మద్యం నిషేధం కాదని తన చిన్న తనం నుంచీ తెలిసిన విషయమే అన్నారు శాస్త్రీజీ .

  నిషా దారుడే అయినా నిట్టల అవదూతగారికి సంబంధించిన కొన్ని విచిత్ర గాధలు ప్రచారం లో ఉన్నాయన్నారు శాస్త్రి గారు .ఇందులో కొన్నైనా యదార్ధాలే అని తాము నమ్మినట్లు చెప్పారు .ఆయన్ను తరచుగా సేవించేవారు పల్లెకారులు అనే అగ్నికులక్షత్రియులు .అధికభక్తితో సారా సమర్పణ చేయటం వలన ఆయనకు అదొక కుతిగా మారింది .దానితో కిక్కేక్కి తన్మయత్వం ఏర్పడేది.సారా కొట్టు దగ్గరకు వెళ్లి ‘’కాస్త పొయ్యి ‘’అనిఅదిగితే ‘’లేదు పో ‘’అని చిరాకు చూపిస్తే ‘’సరే లేకుండా నే పోతుందిలే ‘’అని వెళ్లి పోయేవారట .ఈమాట అని కొంచెం దూరం వెళ్ళగానే కొట్టువాడు జాడీల్లో సారా చూసుకొంటే చాలాభాగం ఖాళీ గా కనిపించేదట .అప్పుడు ఆయనమాట మహిమ అర్ధమై ,వెళ్లి కాళ్ళమీద పడి వేడుకొంటే ,కనికరంచూపితే జాడీలు మళ్ళీ ఫుల్ గా నిండా ఉండేవట .ఆ కాలం లో ఆయన తృప్తిగా తాగే సారా ఖరీదు కేవలం అణన్నర  అంటే ఒకటిన్నర అణా మాత్రమె .యాచకుడు అనుకోని ఆయనకు ఎవరైనా డబ్బు ఇస్తే ప్రకాశంగారు  తీసుకొనే వారుకాదు .మరీ బలవంత పెడితే అణన్నర మాత్రమె పుచ్చుకొని మిగిలింది అక్కడే వదిలేసి వెళ్ళిపోవటం చాలామంది చెప్పగా తాము విన్నామని శాస్త్రిగారన్నారు  .మాంచి నిషాలో ఉన్నప్పుడు నిట్టల వారి నడక ‘’గోమూత్రం ‘’ఆకారంగా అంటే ఈమూల నుంచి ఆమూలకు ఆమూలనుంచి ఈ మూలకు అన్నట్లుగా ఉండేది .

   ఈ విధమైన అపమార్గం లో తిరుగుతున్న భర్తకు పిచ్చి ఎక్కిందని భార్య పోలీసు స్టేషన్ లోరిపోర్ట్ చేస్తే ఆయన్ను తీసుకువెళ్ళి మూడు  రోజులు ఉంచారు .నాలుగో రోజుఉదయం  స్నానం చేయాలని చెప్పి స్టేషన్ నుంచి  సంకెళ్ళతో ,ఇద్దరు పోలీసుల  పహారాతో  గోదావరికి వెళ్లి ‘’జై పరమేశ్వరా ‘’అని ఒక్క మునుగు మునిగి ,అర్ధ ఫర్లాంగు దూరం లో తేలి ,నీటిపై బాసిన పట్టు వేసుకొని కూర్చుని –‘’గౌతమి నే కనుగొంటిని –కనుల పండువుగానూ –రాతి నాతిగ చేసిన సీత రాముని కరుణ రసమున ‘’అని ఆదితాళం లో కీర్తన మొదలుపెట్టి –‘’అంగజారి శిరమున ఆడుచు  నుండేటి గంగ-పొంగి తరంగముల చేత  భూమి నిండును –అ౦గ లింగభంగ ధరుల  సంగమున జెలంగు-కోటి లింగముల —-‘’అని పాడారట .ఇంకాకొన్ని చరణాలున్నాయి కాని అరవై ఏళ్ల క్రితం విన్నవికనుక పూర్తిగా జ్ఞాపకం లేవని వెంకటశాస్త్రి గారన్నారు .భజనపరులకు చాలామందికి ఈకీర్తన వచ్చు అన్నారు .

  ఒకసారి ఎవరో ‘’అయ్యా తమరు శృంగార కవిత్వం బాగా చెబుతారట .మాకు సెలవియ్యండి’’అని అడిగితె ఆశువుగా  సావేరిరాగం ఆది తాళం లో –‘’జాలిమాలీ వనమాలీ రాడాయే ,నయమో ‘’అని జావళి పాడి ఆశ్చర్య పరచారట  -‘’అంచయాన స్త్రీ హంతకుడగు –శ్రీ పంచ బాణు డిప్డు నన్ను డీ కొని –కి౦చ మాని కొంచ పంచ దలచు –అంచ నెక్కి వెడలె  నడుగో చూడుడు ‘’అని శృంగారం రసాభి నివేశంతో రక్తికట్టి౦చారని వెంకటశాస్త్రీయం  .

  నిట్టల ప్రకాశం అవధూత గారికాలం లోనే నిత్యమౌని రాం భొట్లు  అని మరొక అవధూత ఉండేవారట  .ఈయన నడుస్తూ దారిలో ఉన్న చెత్తా చెదారం ఎడమవైపుది ఎడమవైపు కుడివైపుది కుడివైపు  ఏరి పారేసేవారట .ఎలుగుబంటిలాగా మహా బలిష్టులు.ఈయన పుట్టగోచీ మాత్రమె పెట్టుకొనేవారు .భిక్షాటన చేసేవారు కాదు .నీరు గాలిమాత్రమే వారి ఆహారం అన్నారు శాస్త్రీజీ .తమ 12ఏట రా౦ భొట్లు  అవదూతగారిని చూసినట్లు వెంకట శాస్త్రి గారు చెప్పారు .ఈయనకు ఖేచర గమనం ఉందనీ దానిని పైడా  వెంకన్నగారు కనిపెట్టారనీ జనం చెప్పుకొనే మాటలు తానూ విన్నాను అన్నారు .ద్రాక్షారామ భీమేశ్వరుని దేవాలయం దగ్గర ఉన్న అన్నసత్రం పైడా వారిదే .తరచుగా దాక్షారం వెళ్ళేవారు .ఒకరోజు వెంకన్నగారు ప్రయాణం చేస్తూ వీధి అరుగుమీద పడుకొన్న  రాం భోట్లుగారిని ‘’స్వామీ !దయ చేస్తారా ‘’?అని అడిగితె ‘’మీరు పదండి నేను మీ వెనక నెమ్మదిగా  వస్తాను చివరికి అవ్వా, గుర్రం ఒక్కటే అవుతాయి ‘’అన్నారట .తానేమో బోయీల సవారీలో వెడుతున్నాడు ఈయన ఎకసక్కెం ఆడటం లేదు కదా అనిపించింది .రెండు ఆమడల దూరం లో ఉన్న దాక్షారం చేరేసరికి ,రా౦భొట్లు గారు గోపురం అరుగుమీద కనిపించారట .ఆశ్చర్యపోయి ఆయనకు ఖేచరగమనం అంటే గాలిలో ప్రయాణం చేసే లక్షణం ఉందని అనుకోని ఉండచ్చు అంటారు శాస్త్రిగారు .సిద్ధ పురుషులకు ఎలాంటి గమనం ఉన్నా ఆశ్చర్యపడాల్సింది లేదన్నారుకూడా .అలాగే నిట్టల ప్రకాశం గారు గోదాట్లో సంకెళ్ళ  తోనే నీటిపై ‘’బోసేనపట్టు’(ఇది శాస్త్రిగారి ప్రయోగం ) వేసి కూర్చోటం యోగాభ్యాస ఫలితం కావచ్చు అనీ చెప్పారు .

          సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -6-8-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అవధూత నిట్టల ప్రకాశం గారు -2(చివరిభాగం )

అవధూత నిట్టల ప్రకాశం గారు -2(చివరిభాగం )

‘’నిట్టల ప్రకాశంగారు భజన కత్తుగా పాడుకోదగిన వారే కానీ అంతకు మించిన పాటకులు కారు ‘’అన్నారు వెంకట శాస్త్రి గారు .ఆయన భామ వేషం కట్టేవారనీ ,దానిలోనుంచి వచ్చిన పదకవితలే ఇవి అని చెప్పగా విన్నారట .ఆ వేషానికీ ఆకవిత్వానికి సంబంధం ఉండదు .పూర్వ జన్మ లో ఏదో పుణ్యం చేసి ,దానివలన ఏదో కళ అబ్బి ,ఆ కల్మషాన్ని అల్లరి చిల్లర నడకలద్వారా ,ఈవిధంగా ,వరప్రసాదిగా జన్మించారని ఊహించుకోవచ్చు అన్నారు చెళ్ళపిళ్ళ.నూట నాట గాయకులలో ఆయన పేరులేకపోవటం న్యాయమే అంటారు .కొద్దిగా ఛందస్సు తెలిస్తే తేలిగ్గా కట్టెయ్యవచ్చు .జన్మతః కవులే అయినా ప్రకాశం గారు వాజ్మాదుర్యం ఉన్నవారుకనుక భజన లలొఆయన కీర్తనలు ప్రసిద్ధి చెందాయి .శబ్ద ,అన్వయ కాఠిన్యం వీరిలో లేదు ,రేగుప్తిరాగం లో ఆట తాళం లో వారి మరోకీర్తన –

‘’సీతా మనోహర రారా –సేవకుడ నను బ్రోవ వేరా ‘’

అనుపల్లవి –రాతి నాతిని జేసే నీ పద రాజమటంచును

ఖ్యాతిగా విని , ప్రీతితో నిను నమ్మితిని

నాపాతకము లెడబాపుమిక –దేవా దేవా దివ్యప్రభావ దిక్కు నీవే గావ

అని చెప్పి మిగిలిన చరణాలు గుర్తులో లేవన్నారు శాస్త్రీజీ .పదకవిత్వం లో ఒక చరణం తెలిస్తే ,మిగిలిన చరణాలన్నీ తాడు దబ్బనం తో గుచ్చినట్లు అదే రీతిలో నడుస్తాయన్నారు .తానూ చామర్లకోటలో చదువుకొనే సమయానికి ప్రకాశం గారు జీవించే ఉన్నారట .కాకినాడ జగన్నాధపురం దేవాలయం గోపురం వద్ద మకాం గా  ఉండేవారట .వార్ధక్యం పెరిగినా తానూ ఫలానా రోజున ,ఫలానా ఘడియలో  చనిపోతానని చెప్పారట .అదే ప్రకారం సిద్ధిపొందారట .చామర్ల కోటనుంచి అప్పటి తమనివాసమైన యానాం వెడుతూ,ప్రకాశం గారి సద్గతికి సంబంధించిన సంగతులన్నీ చూసినట్లేజ్ఞాపకం ఉందన్నారు వెంకట శాస్త్రిజీ .జగన్నాధపురం పడమటిదిక్కులో నిట్టల వారి సమాధి ఉందట .అక్కడా భజనాదికాలు  జరుగుతూ ఉండచ్చు అన్నారు.

 నిట్టల వారి చివరి రోజులలో వచ్చిన భక్తుడే యడ్ల రామదాసు .సత్ శూద్ర కులస్తుడు ఆజానుబాహువు .గొప్ప తేజశ్శాలి డబ్బపండు వంటి శరీర ఛాయ .కవిత్వం ప్రకాశం గారి కవిత్వం లాగానే ఉంటుంది .

 ప్రకాశం గారి తత్వాలు కొన్ని -1-గూటి చిలకేదిరా అన్నా 2-గాలిపటమురా జీవా గాలి నిలిచినంతనే కూలిపోవురా జీవా

  ఈయన తత్వాలు కొన్ని సంకీర్తనాత్మకంగా ,కొన్ని భక్తకవి మనో ధర్మాన్ని ప్రకటించేవిగా  ఉంటాయి  

3-శంకరాభరణం ఆది తాళం లో –

‘’నారాయణ నీ నామము నిరతమునమ్మి స్మరియి౦చుట నా వంతు – ఘోరదురితములు పారద్రోలి  నను గారవి౦చుటది నీ వంతు ‘’

4-ఎరుకల కాంభోజి లో –

రాములవారిమాట నవ –రత్నములుంచిన మూట –జయ రాములవారిమాట మాకు –దోసెడు వరహాల మూట

ఇవి రామదాసు కీర్తనల ధోరణిలో సాగాయి

4-ఆనంద భైరవి లో తన మనో భావాన్ని ప్రకటిస్తూ –

‘’దైవ సహాయ్యమెన్నటికో నా –చిత్తము హరిపై చేర్చే దెన్నటికో

ఉత్తములతో పొత్తేన్నటికో వర –విత్తముపై భ్రమ విడిచే దెన్నటికో

ఆశను రోసే దెన్నటికో భవ –పాశములను కోసి వేసే దెన్నటికో

దాసుల గూడే దెన్నటికో,నిష్ఠల ప్ర –కాశూడానని గంతు వేసే దెన్నటికో  ‘’

 ప్రకాశం గారు కాకినాడచుట్టుప్రక్కల గ్రామాల్లో ఉన్నట్లు తెలుస్తోందనీ ,ఆయన చివరి తత్త్వం పిఠాపురం వాస్తవ్యురాలుఅప్పటికే 90ఏళ్లనట్టువరాలు పెండ్యాల సత్యభామ ద్వారా ,ఆమె అమ్మమ్మగారు స్వయంగా ప్రకాశంగారి దగ్గర నేర్చుకొన్న ది తమకు అందింది అని వెంకట శాస్త్రి గారువాచ .

ఆధారం –29-12-1948 ఆంధ్రపత్రిక వారపత్రికలో  చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రిగారు  రాసిన వ్యాసం.నిట్టల వారినీ యడ్ల రామదాసుగారినీ శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారు తమ ‘’ఆంద్ర వాగ్గేయకారుల చరిత్ర ‘’లో చేర్చారు .

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గుర్రపు స్వారిలో బంగారుపతకం పొందిన ప్రస్తుత బ్రిటన్ రాణీ అధికారప్రతినిది –రాయల్ ప్రిన్సెస్ అన్నే-(వ్యాసం)– గబ్బిట దుర్గా ప్రసాద్

గుర్రపు స్వారిలో బంగారుపతకం పొందిన ప్రస్తుత బ్రిటన్ రాణీ అధికారప్రతినిది –రాయల్ ప్రిన్సెస్ అన్నే-(వ్యాసం)– గబ్బిట దుర్గా ప్రసాద్

01/08/2021గబ్బిట దుర్గాప్రసాద్

పుట్టుక:

బ్రిటన్ చక్రవర్తి ఆరవ జార్జి పాలనాకాలం లో క్లియరెన్స్ హౌస్ లో 1950 ఆగస్ట్ 15 న డచెస్ ఆఫ్ ఎడింబర్గ్ ప్రిన్సెస్ ఎలిజబెత్ కు , డ్యూక్ ఆఫ్ ఎడింబర్గ్ ఫిలిప్ కు అన్నే జన్మించింది .ఆమె పుట్టిన సమయం లో హైడ్ పార్క్ లో 21 గన్ సాల్యూట్ చేశారు .బకింగ్ హాం పాలెస్ లోని మ్యూజిక్ రూమ్ లో అన్నే అక్టోబర్ 21న క్రైస్తవమత స్వీకారం జరిపారు .బ్రిటిష్ రాజవంశం లో సి౦హాసనాధిపత్యానికి అర్హత కలవారిలో ఆమె తల్లి ప్రిన్సెస్ ఎలిజబెత్ ,అన్న చార్లెస్ తర్వాత అన్నే మూడవ స్థానం లో ఉన్నారు .తల్లికి రాజ్యాదిపత్యం వచ్చాక ఈమెది రెండవ స్థానం అయింది .ఇప్పుడు ఆమె స్థానం 16.

విద్య:

అన్నే పరిరక్షణ,విద్యలకు బాధ్యతను గవర్నెస్ కేధరీన్ పీబుల్స్ కు అప్పగించారు .ఈమె చార్లెస్ కూ గవర్నెస్ గా అంతకు ముందు ఉండేది .ఆరవ జార్జి మరణం తర్వాత తల్లి రెండవ ఎలిజబెత్ 1953జూన్ లో ఇంగ్లాండ్ రాణి అయింది .తల్లి పట్టాభిషేకాన్ని మూడేళ్ళ అన్నే చూడలేదు .గర్ల్స్ గైడ్ కంపెని అనే మొదటి బకింగ్హాం పాలెస్ కంపెని 1963లో ఏర్పడింది .దీనితో తన వయసుపిల్లలతో గడిపే అవకాశం అన్నేకు కలిగింది.1963లో బెనే౦డేన్ స్కూల్ లో చేరి ,1968లో 6GCEO లెవెల్స్ సాధించి మానేసింది .1969లో రాయల్ ఎంగేజ్ మెంట్స్ లో 18ఏళ్లవయసులో పాల్గొనటం ప్రారంభించింది .

విఫల ప్రేమ:

1970లో అన్నే ఆండ్రూ పార్కర్ బోవేల్స్ తో సంబంధాలు పెట్టుకాగా ,ఆతర్వాత అతడు కేమిల్లా స్ట్రా౦డ్ ను పెళ్లాడగా ,ఆతర్వాత ఆమె అతడినివదిలేసి అన్నే అన్నప్రిన్స్ చార్లెస్ ను ద్వితీయం చేసుకొంది.

గుర్రపు స్వారి:

1971లో ప్రిన్స్ అన్నే రషాల్ హార్స్ ట్రయల్స్ లో నాలుగు పూర్తి చేసింది .21ఏళ్ల వయసులో ‘’యూరోపియన్ ఈవెంటింగ్ చాంపియన్ షిప్’’గోల్డ్ మెడల్ తో సాధించి,1971’’ బిబిసి స్పోర్ట్స్ పర్సనాలిటి ‘’గా గుర్తింపు పొందింది . గ్రాండ్ మిలిటరీ స్టీప్లె చేజ్ గుర్రపు పందాలు లో గెలిచింది .వరుసగా అయిదేళ్ళు బ్రిటిష్ ఈవె౦టింగ్ టీం లో పాల్గొని గెలిచింది 1972లో కాలికి దెబ్బతగిలిన తన ప్రియతమగుర్రం’’ డబ్లేట్ ‘’తో ‘’బాడ్మింటన్ హార్స్ ట్రయల్స్’’ లో పాల్గొని టీం తరఫున ,తన స్వంతంగానూ సిల్వర్ మెడల్స్ ను 1975 యూరోపియన్ ఈవెంటింగ్ చాంపియన్ షిప్ పోటీలలో గెలుపొంది సాధించింది .1976 లో మాంట్రియాల్ లో జరిగిన ఒలింపిక్స్ గేమ్స్ లో మెంబర్ ఆఫ్ ది బ్రిటిష్ టీం లో ప్రిన్స్ అన్నేక్వీన్ హార్స్ ‘’గుడ్ విల్ ‘’పై స్వారీ పోటీ లోపాల్గొన్నది .పోటీ మధ్యలో బలమైన దెబ్బతగిలి స్పృహ కోల్పోయింది కానీ ధైర్యంతో మళ్ళీ గుర్రమెక్కి ఈవెంట్ పూర్తి చేసింది .కాని స్పృహలోకి వచ్చాక తాను జంప్స్ ఎలా చేశానో గుర్తుకు రావటం లేదని ఆతర్వాత చెప్పింది .1979 బాడ్ మింటన్ హార్స్ ట్రయల్స్ లో ఆరవ స్థానం పొందింది .1985లో ఎప్సాం డేర్బిలో జరిగిన ‘’చారిటి హార్స్ రేస్’’లో పాల్గొని ఫోర్త్ వచ్చింది .1986నుంచి 94వరకు ‘’ఫెడరేషన్ ఈక్వెస్ట్రి ఇంటర్ నేషనేల్ ‘’కు ప్రిన్స్ అన్నే ప్రెసిడెంట్ గా ఉన్నది .1987 ఫిబ్రవరి 5న’’ ఎ క్వస్చిన్ ఆఫ్ స్పోర్ట్ పై ‘’బిబిసి టెలివిజన్ పానెల్ గేం క్విజ్ షో లో రాజ కుటుంబం లోని మొట్టమొదటి వ్యక్తిగా ప్రిన్స్ అన్నే పాల్గొని చరిత్ర సృష్టించింది .

వివాహం:

ఫస్ట్ క్వీన్స్ డ్రాగన్ గార్డ్స్ లెఫ్టినెంట్ మార్క్ ఫిలిప్స్ 1966లో ఒక పార్టీ లో కలిసి మనసు పారేసుకొంది .1973 నవంబర్ 14న ఇద్దరికీ పెళ్లి ‘’ వెస్ట్ మినిస్టర్ ఆబే ‘’లో టెలివిజన్ సెరిమనిగా 100మిలియన్ల ఆడియెన్స్ చూస్తుండగా వైభవంగా జరిగింది.గేట్ కొమ్బే పార్క్ లో దంపతులు కాపురం పెట్టారు .ఏదోఒక రాజ చిహ్నం లేకపోతె బ్రిటిష్ రాయల్ కుటుంబం లోకి ఆహ్వానం ఉండదుకనుక ఆయనకు ‘’ఎరల్ ‘’టైటిల్ ఇస్తామని రాజకుటుంబం చెప్పినా,ఫిలిప్ మర్యాదగా తిరస్కరించాడు అందుకే వీరిద్దరికీ పుట్టిన పిల్లలు పీటర్ , జారా ఫిలిప్ లకు ఏటైటిల్స్ ఉండవు . అన్నే దంపతులకు అయిదుగురు మనవలు మనవరాండ్రు

రాయల్ ప్రిన్సెస్:

.1989ఆగస్ట్ 31న అన్నే దంపతులు విడిపోతున్నట్లు ప్రకటించారు .పబ్లిక్ లో కలిసి పెద్దగా కనిపించకపోయినా ఒకరిపై మరొకరికి ప్రేమానురాగాలున్నాయి .విడాకులు తీసుకోము అని ముందు ప్రకటించినా రాయల్ పాలెస్ 1992ఏప్రిల్ 13వ అన్నే విడాకులకు నోటీస్ ఇచ్చిందని ప్రకటించి ,పది రోజుల్లో మంజూరు చేసింది .

ఆతర్వాత రాయల్ నేవీలో యాచ్ బ్రిటానికా లో కమాండర్ అయిన టిమోతీ లారెన్స్ ను అన్నే ప్రేమించి 1992 డిసెంబర్ 12న పెళ్లి చేసుకొన్నది. అతన్ని ‘’ఈక్వేర్రీ టుది క్వీన్ ‘’గా అపాయింట్ చేశారు .విక్టోరియా రాణీ మనవరాలు ప్రిన్సెస్ విక్టోరియామెలిటా తర్వాత రాజకుటుంబం లో మళ్ళీ ఒక డైవోర్సీ కి పెళ్లి జరిగింది ఇప్పుడే .

అధికార బాధ్యతలు:

తల్లి ఎలిజబెత్ తరఫున కామన్ వెల్త్ సార్వభౌమాధికారం లో అన్నే అనేక కార్యక్రమాలలో క్షణం తీరికలేకుండా పాల్గొంటుంది .2017 డిసెంబర్ లో ప్రిన్సెస్ రాయల్ అయిన అన్నే తనతల్లి తోపాటు మొత్తం రాజకుటుంబబాధ్యతలను చేబట్టింది .రాణి తరఫున నార్వే, జమైకా జర్మని ,ఆస్ట్రియా న్యూజిలాండ్ ,ఆస్ట్రే లియా దేశాలు సందర్శించింది .1969లో మొదటిసారిగా ఎడ్యుకేషనల్ అండ్ ట్రెయినింగ్ సెంటర్ ను తల్లితరఫున ప్రారంభించి పబ్లిక్ లో కనిపించింది .రెండు వందలకు పైగా చారిటీస్ ,ఆర్గనైజేషన్స్ తో సంబంధాలున్నాయి .సేవ్ ది చిల్డ్రన్ ‘’సంస్థ కు యాభై ఏళ్లుగా అధ్యక్షురాలు .ఆమెసేవలకు నోబెల్ పీస్ ప్రైజ్ కోసం1990 లో జాంబియా ప్రెసిడెంట్ కెన్నెత్ కౌండా ప్రతిపాదించాడు., . ‘’దిప్రిన్సెస్ రాయల్ ట్రస్ట్ ఫర్ కేర్స్,చార్టెడ్ఇన్ ష్టిట్యూట్ ఆఫ్ లాగిస్టిక్స్ అండ్ ట్రాన్స్ పోర్ట్ ,రాయల్ పేట్రన్ ఆఫ్WISE,సెయింట్ జాన్ అంబులెన్స్ ,లండన్ ఆర్గనైజింగ్ కమిటీ ఫర్ ఒలింపిక్స్ ‘’,బ్రిటిష్ యూనివర్సిటి అండ్ కాలేజెస్ ‘’వంటి విశిష్ట సంస్థలను అన్నే సమర్ధంగా నిర్వహిస్తోంది .

యూనివర్సిటి చాన్సలర్ ,ఫెలో:

1981లో క్వీన్ మదర్ రిటైరవ్వగా లండన్ యూనివర్సిటి గ్రాడ్యుయేట్లు అన్నే ను చాన్సెలర్ గా ఎన్నుకోగా అప్పటినుంచి ఆపదవిలో కొనసాగుతోంది .1996నుంచి స్కాట్లాండ్ చర్చ్ కి హైకమిషనర్ గా ఉంది .అకాడెమి ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు ఆమె మొదటి రాయల్ ఫెలో .ఎడింబర్గ్ యూనివర్సిటి ఛాన్సలర్ గా ఎన్నుకోబడింది .సిటి అండ్ గిల్డ్స్ అఫ్ లండన్ ఇన్స్టి ట్యూట్ కు ప్రెసిడెంట్ .రష్యాలో 2014లో జరిగిన ఒలింపిక్స్ లో గ్రేట్ బ్రిటన్ కు ప్రతినిధి గా వెళ్ళింది .

అన్నే పొందిన ఫెలోషిప్స్ ఎన్నో –ఫెలో ఆఫ్ ది రాయల్ కాలేజ్ ,రాయల్ ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ ,రాయల్ ఫెలో ఆఫ్ ఎడింబర్గ్ ,రాయల్ ఫెలో ఆఫ్ రాయల్ అకాడెమి ఆఫ్ ఇంజినీరింగ్ ,మెడికల్ సర్వీసెస్ ,సర్జెన్స్,వగైరా.

ఫాషన్ ఐకాన్:

.బ్రిటన్ అత్యంత ప్రసిద్ధి చెందిన రాయల్ అనీ ,ఆమె జాతి సంపదఅనీ పేరు పొందింది .బ్రిటిష్ శైలికి ఆమె ఐకాన్ అంటే చిహ్నమనీ ,తామెన్నడూ చూడని తమకు తెలియని ఫాషన్ కు స్థిరమైన రూపమని ప్రజాభిప్రాయం .యునైటెడ్ కింగ్డం ఫాషన్ అండ్ టేక్స్టైల్ అసోసియేషన్ కు అన్నే పాట్రన్.రాజ కుటుంబం లో మిలిటరీ డ్రెస్ లో కనిపించే అరుదైనమహిళకూడా.బ్రూచ్ లేకుండా రాయల్ ఫంక్షన్ కు హాజరుకాదు .ఆమెకున్న 90 స్టైల్స్ లో జాకీ కాప్స్ ,మల్టిపుల్ కలర్స్ ,బోల్డ్ పాటర్న్స్ ఉన్నాయి . రెండవ ఎలిజబెత్ రాణి అవార్డ్ ను బ్రిటిష్ డిజైన్ కు 2020 ఫాషన్ వీక్ లో అన్నే ప్రదానం చేసింది .ఒక్కమాటలో చెప్పాలంటే సింహాసనం పై కూర్చోలేదుకానీ ,తల్లి ఎలిజబెత్ రాణి చేసే పనులన్నీ ప్రిన్సెస్ అన్నే నిర్వహిస్తోంది .

బిరుదులూ గౌరవాలు:

అన్నే పొందిన బిరుదులనేకం .అందులో ‘’హర్ రాయల్ హైనెస్ ప్రిన్సెస్ అన్నే ఆఫ్ ఎడింబర్గ్ ,’’హర్ రాయల్ హైనెస్ ప్రిన్సెస్ అన్నే ,హర్ రాయల్ హైనెస్ ప్రిన్సెస్ అన్నే మిసెస్ మార్క్ ఫిలిప్స్ ,హర్ రాయల్ హై నెస్ ది ప్రిన్సెస్ రాయల్ ఉన్నాయి .

అలాగే పొందిన జాతీయ గౌరవాలూ అనేకమే –రాయల్ ఫామిలి ఆర్డర్ ఆఫ్ క్వీన్ ఎలిజబెత్ 2,డేమ్ గ్రాండ్ క్రాస్ అవార్డ్ , డేమ్ గ్రాండ్ రాయల్ విక్టోరియన్ అవార్డ్ ,రాయల్ నైట్ ఆఫ్ ది మోస్ట్ నోబుల్ ఆర్డర్ ,ఎక్స్ట్రా నైట్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షేంట్ అండ్ నోబుల్ ఆర్డర్ ,క్వీన్ ఎలిజబెత్ కారోనేషన్ మెడల్ ,క్వీన్ ఎలిజబెత్ సిల్వర్ జూబిలీ మెడల్ ,గోల్డెన్ జూబిలీ మెడల్ ,డైమండ్ జూబిలీ మెడల్ ,సర్విస్ మెడల్ ఆఫ్ దిఆర్డర్ ఆఫ్ సెయింట్ జాన్ ,

.కామన్ వెల్త్ గౌరవాలలో –కెనడియన్ ఫోర్సెస్ డెకరేషన్ ,ఎక్స్ట్రా కంపానియన్ ఆఫ్ ది క్వీన్స్ సర్విస్ ఆర్డర్ ,కమెమోరేటివ్ మెడల్ ఫర్ ది సెంటెన్నియల్ ఆఫ్ సస్కాచ్ వాన్ ,చీఫ్ గ్రాండ్ కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ లోఘు .

అంతర్జాతీయ గౌరవాలు –గ్రాండ్ డెకరేషన్ ఆఫ్ ఆనర్ ఇన్ గోల్డ్ విత్ సాష్ ఫర్ సర్వీసెస్ టు దిపబ్లిక్ ఆఫ్ ఆష్ట్రియా,కమాండర్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ రోజ్ ఆఫ్ ఫిన్లాండ్ , మెంబర్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ యుగోస్లేవ్ ఫ్లాగ్ ,మెడగాస్కర్ ఫ్లాగ్ మొదలైనవి .

సివిల్ –మాస్టర్ వర్షిప్ ఫుల్ కంపని మాస్టర్ ఆఫ్ వర్షిప్ ఫుల్ కంపెని ఆఫ్ వుమెన్ ,ప్రైం వార్డెన్ వర్షిప్ ఫుల్ కంపెని ఆఫ్ ఫ్లాష్ మా౦గర్స్.

లండన్ ఎడింబర్గ్ ,హైలాండ్స్ అండ్ ఐలాండ్స్ హార్పాట్ ఆడమ్స్ యూనివర్సిటీలకు అన్నే చాన్సలర్ .

రేజినా ,మెమోరియల్ ,గ్రాండ్ ఫీల్డ్ ,అబర్దీన్ యూనివర్సిటీలకు డాక్టర్ ఆఫ్ లాస్ .కామన్ వెల్త్ దేశాలన్నీ తమ అత్యుత్తమ పురస్కారాలు అందించి ప్రిన్సెస్ అన్నేను గౌరవించాయి .ఇవికాక మిలిటరీ గౌరవాలకు కొదవే లేదు .2015 ఫిబ్రవరిలో ఈ ప్రిన్సెస్ రాయల్ అన్నే ‘’రాయల్ అండ్ ఏన్షేంట్ గోల్ఫ్ క్లబ్ ఆఫ్ సెయింట్ ఆండ్రూస్ ‘’కు మొదటి గౌరవ మహిళామెంబర్ అయి రికార్డ్ సృష్టించింది .సమర్ధత ,ధైర్యసాహసాలు అంకితభావం సేవా దృక్పధం తో రాయల్ ప్రిన్సెస్ అన్నే ప్రజలందరి హృదయాలలో సుస్థిర స్థానం పొందింది .’’లాంగ్ లివ్ ప్రిన్సెస్ అన్నే’’.

-గబ్బిట దుర్గాప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

image.png

Tagged | Leave a comment

శ్రీ అబ్బూరి వరద రాజేశ్వరరావు

శ్రీ అబ్బూరి వరద రాజేశ్వరరావు

చిలిపి’’ వరద ‘’

శ్రీ అబ్బూరి వరద రాజేశ్వరరావు చిన్నతనం విశాఖ పట్నం లో గడిచింది .అప్పుడు ఆయన తండ్రి శ్రీ అబ్బూరి రామకృష్ణా రావు గారు ఆంధ్రా యూని వర్సిటిలో లైబ్రేరియన్ గా ఉండేవారు. ఆయనవల్లనే శ్రీ శ్రీ ,ఆరుద్రలు పాశ్చాత్య సాహిత్యపు పోకడలను గ్రహించారు .పుస్తకాలిచ్చి వారితో చదివి౦చేవారాయన .వరద బాల్యం విశాఖ లో రావి శాస్త్రి తో ‘’యేరా అంటే యేరా ‘’అను కొనే చిలిపి  స్నేహంగా గడిచింది .ఆచిలిపి చేష్టలను   రావి శాస్త్రి ‘’వరద స్మృతి’’లో ‘’అబ్బూరి నా ఆది గురువు ‘’వ్యాసం లో వివరంగా రాశాడు అందులోని కొన్ని ముఖ్య విషయాలు .

‘’అబ్బూరి వరద  ఆది గురువు ,నాచివరి గురువు కూడా ‘’అన్నాడు రావిశాస్త్రి .కొద్ది రోజులకు చనిపోతాడనగా వరద రావికి ఫోన్ చేసి ‘’ఒరే శాస్త్రీ !బతికున్న వాళ్ళకంటే చచ్చిపోయిన వాళ్ళే అదృష్ట వంతులురా .కనుక నువ్వు ఏం దుఖించకు –విచారించకు ‘’అని చెప్పాడు .

1932 లో విశాఖ ఏ వి యెన్ కాలేజీ లో శాస్త్రి సెకండ్ ఫాం ఒక సారి ఫెయిల్ అయి మళ్ళీ చదువుతుండగా అప్పుడొక ఎర్రటి కుర్రాడు స్పోటకపుమచ్చలతో వచ్చి చేరాడు .ఎక్కడినుంచి వచ్చావని శాస్త్రి అడిగితె ‘’బెజవాడ నుంచీ ‘’అని బెజవాడ విశాఖ కంటే గోప్పదనట్లు పోజిచ్చి చెప్పాడు .’’ఆడే వరద’’. .’’దేవుడు లేడు.నీకు తెలుసా ?’’అడిగాడు కుర్ర వరద కుర్ర శాస్త్రిని .ఆమాటకుతల్లీ తండ్రీ లేనివాడిలాగా  బెదిరిపోయాడు శాస్త్రి.అప్పుడు ప్రహ్లాదుని గురించి రహస్యంగా ఒక కథ రాస్తున్నాడు శాస్త్రి .వరద మాటలకు భయపడి ఆ కథ చి౦చేశాడు  ‘’దేవుడు ఉంటె మా చెల్లి ఎందుకు చచ్చిపోవాలి ?’’అన్నాడు బుడ్డి వరద .దీనిపై తానొక  ఒక గేయం రాశానని మర్నాడు తెచ్చి చూపించాడు బాలవరద .వరద రెండవ భాషగా  తెలుగు  తీసుకోవటం వలన ఎ డివిజన్ లో ,రావి సంస్కృతం తీసుకోవటం వలన బి డివిజన్ లో ఉన్నారు .ధర్డ్ ఫారానికి ఇద్దరూ బి డివిజన్ లో ఉన్నారు .

ఒకసారి తెలుగు మాస్టారు వరదను కొట్టాడు .అతని అన్న వాణీకుమార్ కు పిచ్చకోపం వచ్చి మేస్టార్ని ‘’మా తమ్ముడిని ఎందుకు కొట్టావు బయటికి రా చంపేస్తాను ‘’అన్నాడు .ఫోర్త్ ఫారం లో వక్తృత్వ పోటీల్లో వరద ఎక్కువగా పాల్గొనేవాడు .కన్యకాపరమేశ్వరి దేవాలయం పూజారి స్థానాపతి సత్యనారాయణ మూర్తి వద్ద వరద సంస్కృతం నేర్చాడు .సత్యనారాయణగారి భార్య రుక్మిణమ్మ దేవీ భాగవతం ను సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించి విదుషీమణి .

ఆరుద్ర పినతండ్రి భాగవతుల నారాయణ రావు సైకిల్ కు మున్సిపాలిటీ పన్ను ఏడాదికి రెండుమ్ముప్పావలా కట్టక పొతే సైకిల్ లాక్కెళ్ళారు. ఆయన వరదకు మంచి దోస్త్ .అందుకని వరద స్నేహితులందరి దగ్గరా అణా బేడా ఎంత ఇస్తే అంత వసూలు చేసి పన్నుకట్టి సైకిల్ విడిపించి ఇప్పించాడు .ఆ రోజుల్లో రూపాయకు 8 సేర్ల బియ్యం వచ్చేవిట .సైకిల్ పన్నుకు 22 శేర్ల బియ్యం వచ్చేవని రావి రాశాడు .దీనితో నారాయణ రావు అందరికీ  బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాడట .అంత డబ్బు ఆ రోజుల్లో పోగు చేయటం చాలెంజ్ .దాన్ని చేసి చూపించినవాడు వరద .మేస్టర్లకు వరద ప్రియ శిష్యుడు.

శాస్త్రికీ వరదకూ లెక్కలు రావు . ఫిఫ్త్ ఫాం ఫైనల్ పరీక్షల్లో లక్ష్మణరావు అనే లేక్కలమేస్టారు నాలుగైదు లెక్కలు చెప్పేశాడు .శాస్త్రి కనిపెట్టి దణ్ణం పెట్టి’’ షేక్స్ పియర్ మొహం ‘’పెడితే అతనికీ చెప్పి ఇద్దరూపాస్ అయేట్లు చేశాడు .ఎస్ ఎస్ ఎల్ సి కి వచ్చేసరికి వరద వరదలా విజ్రు౦భించాడు .అప్పుడు జస్టిస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కి ఎన్నికలు జరిగితే వరద బాచ్ కాంగ్రెస్ కు సపోర్ట్ చేసింది .జస్టిస్ పార్టీమీద రోజుకొక బులెటిన్ రాసి వదిలేవాడు వరద .ఎవరికీ తెలిసేదికాదు .జయపురం రాజా విక్రమ దేవ వర్మ ఏ పార్టీనీ సపోర్ట్ చేయలేదు .వరదకు కోపం వరదలా వచ్చి ఆయన పై ‘’తొండం అప్పారావు ‘’అనే పేరు పెట్టి పెద్ద గేయం రాశాడు .అది అప్పట్లో పెద్ద పాప్యులర్ అయింది .బొబ్బిలి రాజా రామబ్రహ్మం అనే ఆయన్ను కాదని జస్టిస్ పార్టీ టికెట్టు అంకితం భానోజీ రావు ను సపోర్ట్ చేయమని ఆర్డర్ వేశాడు .దీనికీ మండింది వరదకి .

ఆ రోజుల్లో ‘’గోంగూర పాట’’అందరి నోట్లోనూ నానేది –అది –‘’నాను ఎల్లకెల్లకేల్లినాను గొంగూరకీ –తోటలన్నీ తిప్పినాడు గొంగూరకీ –దొడ్లన్ని తిప్పినాడు గొంగూరకీ –మాయ దారి నా కొడుకే గొంగూరకీ –చివరికి మంచమెక్కమన్నాడే గొంగూరకీ ‘’అనేది బాహా హిట్ సాంగ్ .అబ్బూరి వరద ఈ బాణీలో రామ బ్రహ్మం మీద పాటతో విరుచుకు పడ్డాడు –

‘’మేడలని కట్టావు రామ బ్రహ్మం –మిద్దేల్ని కట్టావు రామ బ్రహ్మం –స్టాండ్ స్టాండ్ అన్నావు రామబ్రహ్మం –స్టాండేను అన్నావు రామబ్రహ్మం –కానీ రాజా గారొచ్చారు రామబ్రహ్మం –సిట్టు సిట్టాన్నారు రామ బ్రహ్మం –సిట్టేను అన్నావు రామబ్రహ్మం –‘’ఈ పాట పిల్ల గాంగ్ అందరికీ నేర్పి రామబ్రహ్మం ఇంటి ఎదురుగా కూచుని పాడించేవాడు వరద .అప్పుడు తెన్నేటి విశ్వనాథం కాంగ్రెస్ కాండిడేట్ అంటే జస్టిస్ పార్టీకి వ్యతిరేకం కనుక భానోజీకీ వ్యతిరేకమే.పాట చివర్లో ‘’విశ్వనాథంకి  జై –రామ బ్రహ్మంకి తుస్ ‘’అని పించేవాడు .పాటపాడి గాంగ్ వెళ్ళిపోయేది రోజూ .వైశ్యులు కాంగ్రెస్ సపోర్ట్

వాళ్ళు ఒక పాట తయారు చేస్తే వరద బృందం వరద లీడర్షిప్  లో డాన్స్ చేస్తూ దాన్ని పాడేవాళ్ళు .-ఆపాట

‘’తెన్నేటి విశ్వ నాథమూ మన కాంగ్రేసు వారండీ –వారికి మన వోటు నిచ్చి ఖ్యాతి నిలపండి ‘’  .ఈ పాటను కోమట్లు వాళ్ళ ఆడవాళ్ళు చూడాలని వాళ్ళ ఇళ్ళముందు పాడించేవారు .ఇది గ్రహించి వరద శాస్త్రి తో ‘’ఒరేయ్  వాళ్ళ కులం వాళ్ళు చూడాలని మన చేత గంతులేయి స్తున్నారు ‘’అని చెప్పి ఆతర్వాత ముఖ్య కేంద్రాలలోనే పాడి డాన్స్ చేశారు

తోటి  స్నేహితులందరూ ఒకరినొకరు ఒరేయ్ అనే పిల్చుకోనేవారు .అలా పిలవని వాళ్ళను వెలేసేవారు .ఇంటర్ ముందువరకు ఇలానే సాగింది . పాత ముఠా అంతా మారి కొత్తజనం చేరారు ఏవండీ అని పిలవటం అప్పుడు గౌరవం .అది వరదకు నచ్చలేదు .అలా పిలిస్తే ‘’జెల్ల ‘’కొట్టే వారు .కనుక ఈ బాధ భరించలేక అందరూ ఒరేయ్ లోకి దిగారు .దీనితో వరద ‘’ఒరేయ్ ఒరేయ్ క్లబ్ ‘’ను ఏర్పాటు చేశాడు .ఇంటర్ లో ఒరేయ్ క్లబ్ ను ‘’యువజన సంఘం ‘’గా మార్చాడు .కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేసిన వారిని ఇంకా విడుదల చేయకపోతే విడుదల చేయాలని పెద్ద యాజిటే షన్ తెచ్చాడు  వరద .ఇంటర్ లో స్టూడెంట్ యూనియన్ కార్య వర్గ సభ్యుడయ్యాడు. శాస్త్రినీ ఎలెక్ట్ చేయించాడు ..భమిడిపాటి కామేశ్వర రావు మాస్టారు రాసిన నాటకాల్లో తానూ వేషం వేసి రావి శాస్త్రి చేతా స్టేజి ఎక్కించాడు .1938 లో జపాన్ –చైనాపై అప్రకటిత యుద్ధం మొదలు పెట్టింది .అప్పట్లో మార్కెట్ అంతా జపాను సరుకులతో నిండిపోయేది .ఏ వస్తువైనా బేడా అర్ధణా .కాంగ్రెస్ వాళ్ళే వీటిని అమ్మేవారు .వరద షాపుల ముందు పికెటింగ్ నిర్వహించి ‘’డౌన్ విత్ ది సర్వీసెస్ ఆఫ్ జపాన్ గూడ్స్ ‘’అని నినాదాలు చేయించి ఆపించే ప్రయత్నం చేశాడు .రెండవ ప్రపంచ యుద్ధం లో ఎం యెన్ రాయ్ అనుచరులయ్యారు అబ్బూరి తండ్రీ కొడుకులూ .కమ్యూనిస్ట్ లు తటస్థం .కాని వరద హిట్లర్ కు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య దేశాలకు సపోర్ట్ చేయాలన్న రాయ్ వాదం తో ఏకీభవించి సపోర్ట్ చేసి స్టూడెంట్ బలగాన్నీ సపోర్ట్ కు సన్నద్ధం చేశాడు .చిలిపి పనులలోనూ వరద కు ఒక ధ్యేయం ఆదర్శం దేశ భక్తీ ఉండేవి .అతన్నే అందరూ అనుసరించేవారు’’. దటీజ్ వరద’’మీ- గబ్బిట దుర్గాప్రసాద్-4-4-17-ఉయ్యూరు –

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

21వ శతాబ్దం లో మతం -3(చివరి భాగం )

21వ శతాబ్దం లో మతం -3(చివరి భాగం )

 21వ శతాబ్ది ఆశా జ్యోతి ధర్మ౦ ఒక్కటే

21వ శతాబ్దిలో రాబోయే దశకాలలో ధర్మం ఒక్కటే సరైన మార్గనిర్దేశం చేసే దివ్య జ్యోతి .పడమటి దేశాలలో మతం పూర్తిగా మతతత్వవాదానికీ ,సెక్యులరిజ వర్గాలమధ్య ఇరుక్కు పోయింది .కానీ మనకు మాత్ర౦ ధర్మమే  ఉత్కృష్ట  ధ్యేయం.వాళ్లకు ఆ వాసనే తెలియదు .ధర్మం మనుగడ  వృత్తి సంస్థలపై ఆధారపడనిది .ఏదేశం లోని మతమైనా మానవ ఉన్నతిని పెంచి కోల్పోయిన వైభవాన్ని సాధించి మానవాభ్యుదయానికి దోహదం చేయాలి .కనుక ధర్మం ఒక్కటే ఈ రెండు పనులను సమర్ధం గా నిర్వర్తించగలదు.ఈ విలువలు శాశ్వతమైనవీ ,మార్పు చెందనివీ అని గ్రహించాలి

  ఈ ఆధ్యాత్మిక ,నైతిక విలువలు అన్నిమతాలకు ఆధారభూమి .ఆధునికయుగం లో మతాలన్నీ ఈ ధ్యేయంగా పనిచేస్తూ మానవాళి అభ్యుదయానికి దోహదం చేయాలి అప్పుడే వాటి ఉనికి సార్ధకం .కనుక ఈ నవనాగరక టెక్నలాజికల్ యుగం లో ధర్మం కేంద్ర బిందువుగా వ్యవహరించి దారి చూపాలి .

  వేదాలలో ఋతం అనేది మొట్టమొదటి కీలక భావన .దానిలోనుంచే ధర్మం నిష్పన్నమైంది .రుతం అనేది సాధారణ ఆర్డర్ లేక ఆజ్ఞ.ఇదే విశ్వాన్నీ అందులో ఉన్నవాటికీ ప్రేరణ స్పూర్తి కలిగిస్తూ సహకరిస్తూ ఉంటుంది,ఉండాలి .సంస్కృతం లో ధర్ అంటే ధరించేది అనే ధాతువునుంది ధర్మం అనే పదం ఏర్పడింది .అంతరార్ధం -ఏది శాశ్వతంగా గట్టిగా దృఢంగా స్థాపించబడినదో అదే ధర్మం .

  ధర్మం భౌతిక స౦పదతొపాటుఆధ్యాత్మిక వైభవాన్ని కలిగిస్తుంది .ధర్మం అనే పదానికి సరైన పదం  ఏభాష లోనూ లేదు .ఇంగ్లీష్ లో వర్త్యు,మొరాలిటి,డ్యూటీ అనిఅర్ధాలు చెప్పారుకానీ అవేవీ ధర్మాన్ని సరిగ్గా నిర్వచించేవి మాత్రంకాదు .జీవితం లో  అర్ధం ,కోరికల సాధనకు ధర్మం ప్రాతిపదిక కావాలి లేకపోతె అనర్ధం జరుగుతుంది .శీల నిర్మాణం ధర్మాదారంగా జరగాలి .అందుకే వ్యాసమహర్షి వీటన్నిటినీ బోధిస్తూ మహాభారత రచన చేశాడు .చివరికిచేతులెత్తి ప్రార్ధిస్తూ ‘’ఊర్ధ్వ బాహు ర్విరోభ్యేష నత కశ్చిచ్చ్రునోతుమే-ధర్మాదర్ధశ్చకామశ్చ స కిమర్ధ న సేవ్యతే ‘’ , భావం ‘’చేతులెత్తి ప్రార్ధిస్తున్నాను .నా మాట ఎవరూ వినటం లేదు .ధర్మంలో నుంచే అర్ధ ,కామాలు వస్తాయి ,కోరికలు తీరతాయి .ఎందుకు ధర్మాన్ని ఉపెక్షిస్తున్నారో,అనుసరించటం లేదో నాకు  అర్ధం కావటం లేదు’’అని వాపోయాడు వ్యాసమహర్షి కృష్ణ ద్వైపాయనుడు

  వివేకానందస్వామికూడా ధర్మం ఆధారంగా మతాలు ఉండాలి అన్నాడు .మతం అనే దానికి ఆయన ఆరు రకాల నిర్వచనాలు చెప్పాడు -1-ఇంద్రియాల అదుపుకు పోరాటం చేయాలి 2-మనిషిలోని  దివ్యత్వాన్ని మేల్కొల్పాలి .3-శాశ్వత ఆన౦ద౦ పొందే కృషిలో సహకరించాలి 4-జ్ఞాన సముపార్జనకు తోడ్పడాలి 5-మానవుని భూత భవిష్యత్ వర్తమానాలకు కారణభూతమై సంపూర్ణ మానవుని చేయాలి 6-ఇది యదార్ధమా అనే ప్రశ్న కు సమాదానమివ్వాలి .అంటే మాని ఫెస్టేషన్ ,ఎండేవర్,రియలై జేషన్ ,రిలేషన్ షిప్ ,రియాలిటి లకు బాధ్యత వహించాలి మతం .మతం ఒక విశ్వాసానికి పరిమితమైనదిమాత్రమే. ధర్మం దీనికి విరుద్ధమైన శాశ్వతమైనది .నిజానికి మతం  అంటేధర్మమే .అది మానవుని భౌతిక ఆధ్యాత్మిక ఆధిభౌతిక తత్వాన్ని ఉపదేశించేది .మత సూత్రాలన్నీ ఈ మూల ప్రాతిపదికలుగా ఉండాలి .ఇదే ప్రతిమతం మూల సిద్ధాంతంగా ఉండాలి  ,లేకపోతె మానవభ్యుదయానికి ,సమాజాభి వృద్ధికీ అవి అవరోధాలుగా నిలుస్తాయి .

             తక్షణ కర్తవ్య౦   

సెక్యులర్ వాతావరణం లో మతం మానవ ఆధ్యాత్మిక ఔన్నత్యానికి దోహదం చేసే పాత్ర నిర్వహించాలి .తరతరాలుగా పోషిస్తున్న ఆధ్యాత్మిక సంపద వృధాకాకుండా బాధ్యత వహించి చేరాల్సినవారికి చేర్చాలి .రాబోయే తరాలకు కరదీపికలుగా మతాలు ప్రవర్తించాలి.కనుక ఆధ్యాత్మికత్వాన్ని శక్తిమంతంచేసి నైతికతను పొందుపరచి బలమైన మూలాలతో మతం వర్ధిల్లాలి అదే తక్షణ కర్తవ్యం .ఈపవిత్రకార్యం మతాలు మాత్రమె చేయగలవు .దీనితో భౌతికతనే కూపం లో స్వార్ధం సంకుచితత్వం అత్యాశ లలో కూరుకుపోయిన మానవాళికి వెలుగు కలుగుతుంది .

  కనుక  21వ శతాబ్ది లో మతం అంటే వర్గాలు గా విడిపోయినవారిని  సమైక్యపరచి ఆధ్యాత్మిక నైతికతా విలువలను బోధించి ధర్మమార్గాన ప్రవర్తింప చేయటమే ..సమాజంలో నైతిక విలువలు పెంచాలి .మత౦ విభజించేదిగా కాకుండా ,.. సమైక్య పరచేదిగా ఉండాలి .సర్వమానవ సౌభ్రాత్రుత్వమే మతం ధ్యేయంగా ఉండాలి .ఆధునిక యుగం లో నిరంకుశ ,మతోన్మాద ,మతమార్పిడి లక్షణాలతో మతాలు ఉండరాదు .అవి ప్రమాదకరం వినాశహేతువు అభి వృద్ధి నిరోధకం కూడా .రాజ్యాదికారంతో పెత్తనం చేయకుండా ,,వ్యాధిగ్రస్తులను వోదార్చేదిగా ,ఆపనులకు అమృత హస్తం అంది౦ చేదిగా,ఆధ్యాత్మిక లక్ష్యాన్ని చేరుకోవటానికి మార్గ దర్శిగా మతం ఉండాలి .బలమైన రాజకీయనాయకుల చేతిలో,స్వార్ధపరుల చేతిలో  వికర్షణ(రిపల్సివ్ ) శక్తిగా మతం ఉండరాదు .

            ఆదర్శమతం

వివేకానంద స్వామి చెప్పినట్లు భవిష్య మతం ,రాబోయే తరాలకు ఆదర్శంగా ,అందర్నీ కలుపుకుపోతూ వివక్షత చూపకుండా ,ప్రపంచంలో ఉన్నమంచినీ గొప్పతనాన్ని గుర్తించి అనుసరిస్తూ ,ద్వేష ,కార్పణ్య భావాలను వదిలేసి నడవాలి .అనుకంప, కనికరం ,తోటిభావన(ఫెలో ఫీలింగ్ )తో ఒకరి నొకరు  గౌరవిస్తూ ,స్నేహ సౌహార్దాలతో కలిసి నడవాలి .

   ఈ సందర్భంగా స్వామి వివేకానంద ‘’విశ్వ మతం ‘’అనే భావన తెస్తూ ‘’నా ఉద్దేశ్య౦ లో అందరూ అంగీకరించే ,అందరి వేదాంతాలను ఒప్పుకొనే,అందరిభావోద్వేగాలకుసరిపడిన ,అందరి ఆధ్యాత్మికతకు అద్దంపట్టే  ,కర్తవ్యానికి అనుకూలమైన విశ్వ మతం కావాలి .’’అన్నాడు ఆయన ఉద్దేశ్యం లోప్రతిమతానికి కోల్పోరాని ఒక ఆదర్శం ఉంటుంది .కనుక ప్రతిమతం తెలివిగా ,వివేకంతో ముందడుగు వేయాలి .21వ శతాబ్దిలో మతానికి దీనికంటే అమృతోపమానమైన మాటలతో   చెప్పే గొప్ప బ్లూ ప్రింట్ అనేది ఉండదు .

   ఆధారం – ప్రబుద్ధ భారతి –జులై –స్వామి వీరేశ్వరానంద ఎడిటోరియల్

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

21వశతాబ్దం లో మతం -2

21వశతాబ్దం లో మతం -2

సిగ్మండ్ ఫ్రాయిడ్ ఆధునిక సైకాలజీ ప్రకారం   ‘’మతవిశ్వాసం విశ్వవ్యాపిత మనో వ్యాకులమైన ముట్టడి (యూని వర్సల్ అబ్సేషనల్ న్యూరోసిస్ ‘’).దేహెంద్రియప్రపంచం పై మతం పెత్తనం వహిస్తోందని సూచన చేశాడు .ఇది చిన్నపిల్లలమనో భ్రాంతి వంటిది అన్నాడు .మానవజాతి పరిణామానికి మతం కి౦చపరచేదిగా ఉ౦దన్నాడు.

  21వ శతాబ్దిలో మతం పాత్ర ఏమిటి ?

  పాశ్చాత్య పండితులు21వ శతాబ్దిలో మతం వహించాల్సిన సిద్దా౦తా లగురించి చాలా చెప్పారు .వీటిలో రెండు సిద్ధాంతాల గురించి తెలుసుకొందాం .ఇజ్రాయిల్ ప్రసిద్ధ రచయిత యువాల్ నోవా హరిరి వీటికి సమాధానాలు చెప్పాడు .1-మత౦ మానవ జాతిభవితకు ఆచరణీయమైన విజన్ సృస్టించ గలదా  ? ఈయన రాసిన ‘’ట్వెంటి వన్ లెసన్స్ ఫర్ ట్వెంటి ఫస్ట్ సెంచరి ‘’పుస్తకం లో ‘’సెక్యులర్ మనుషులు మతాన్ని కించపరుస్తున్నా ,కోట్లాది జనం మాత్రం మత విశ్వాసాలు వదలలేదు .మత ఉద్యమాలు ఇండియాతో సహా అనేక దేశాల రాజకీయాలను ప్రభావితం చేశాయి .ఇందులో టర్కీ అమెరికా రష్యాలున్నాయి .దురదృష్ట వశాత్తు మత విద్వేషాలు అనేక దేశాలలో శత్రుత్వానికి ఆజ్యం పోశాయి .

  ప్రపంచం ఎదుర్కొనే ఈ సమస్య కు మతం ఏ విధంగా సమర్ధంగా పరిష్కరించగలదు?ఇదే బిలియన్ డాలర్ క్వస్చిన్ .మతాన్ని ఉపెక్షించటం పరిష్కారమా .ఈ సందర్భంగా హిరారి ‘’21వ శతాబ్దం లో సాంకేతిక  ,వ్యావసాయక ,ఆర్ధిక మొదలైన సమస్యలు పరిష్కరించటానికి   మతం పాత్ర అసంబద్ధం(ఇర్రిలవెంట్ ).అయినా’’ మాస్ ఐడెంటిటీ’’లను అంటే సామూహిక గుర్తింపు ల సృజనకు మతం పాత్ర వహించాలి .మత ఉత్సవాలు కర్మకాండలు ఉత్సవాలు నమ్మకాల వలన ప్రజలంతా ఐకమత్యంగా ,విధేయంగా ,తమ తమ సంస్థల లో గుర్తింపుగా ,ఇతరులకు విరుద్ధంగా కన్పిస్తారు .అందుకని హరారి ‘’రెలిజియస్ ఐడెంటి టీలు ,కర్మకాండలు తప్పనిసరిగా కొత్త టెక్నాలజీ తోజరుపుతూ అత్యధిక రాజకీయ అధికారాన్ని సాధించి ,దేశీయ ఐక్యతను సంఘటితం చేయాలి ‘’అని అభిప్రాయ పడ్డాడు .

  అంతర్జాతీయ విలువలు ,విశ్వ ప్రామాణికత లను బహిర్గతం చేయటానికి సంప్రదాయ మతాలు అవసరమే అని హరారి ఒప్పుకొన్నా ,అవన్నీ ఇప్పుడు కుటుంబ తయారీ అయినఆధునిక  జాతీయత అంటాడు .ఆధ్యాత్మిక ,నైతిక అవగాహన ఏర్పరచటానికి  మతాలు పని చేయాలని అత్యధికులు ,ధామస్ బెర్రీ లాంటి స్కాలర్స్ కూడా అభిప్రాయ పడుతున్నారు ,.

   బెర్రీ ‘’సంప్రదాయ మతం ఆధునిక ప్రపంచానికి దూరమావుతున్నందుకు ,ఆధునిక ప్రపంచం ఒక ఆధ్యాత్మిక ప్రతిష్టంభనకు లోను కావటం అవసరమైన వారికి ,సాదికారతగలవారికీ  దూరమవటం అత్యంత బాదాకరం  ‘’అన్నాడు.అది మేధస్సును చూపటంకానీ ,మనతో కలిసి ఆధినిక వైభవం ,అవమానాలలో నడవటానికి కానీ సిద్ధం గా లేదు ..బాధా సర్పదష్టుల పాలిటి ఓదార్పుగా    స్థై  ర్యాలనిచ్చి అక్కున చేర్చుకొనే మానవత్వమున్న ట్లుగా మతం ప్రవర్తించటం లేదు .కనుక ఇలాంటి విపత్కర పరిస్థితిలో ‘’ ఆధ్యాత్మిక ,ఆధ్యాత్మిక సంప్రదాయాల ను గౌరవిస్తూ ,ప్రతిస్పందించే ఆధునిక ప్రపంచం కావాలి,రావాలి  ‘’అన్నాడు .మానవాళికి అవి ఆశాజ్యోతిగా భాసి౦చాలి .

   విశ్వ వ్యాప్తంగా మత సంస్థలన్నీఆధ్యాత్మిక ,నైతిక పిలుపులను ఇవ్వలేక పోతున్నాయి .అవన్నీ నమ్మకాన్నీ గౌరవాన్నీ కోల్పోతున్నాయి .ఆధునిక ప్రపంచ సవాళ్ళను ఎదుర్కోతానికి పెళుసుగా ,పనికి రాని వాటిగా తయారయ్యాయి .దీని పర్యవసానం గా పూరి౦పరాని మత సంప్రదాయం ,నైతిక ధర్మ కర్తృత్వం చచ్చిపోవటం జరుగుతుంది .దీనితో సెక్యులర్ విషయాలలో ప్రాధాన్యత పెరిగి ,తమకున్న   ఆధ్యాత్మిక నైతిక స్వభావ లక్షణాలు తప్పకుండా కోల్పోతాయి .

   సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -31-7-21-ఉయ్యూరు   

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

21వ శతాబ్దం లో మతం

21వ శతాబ్దం లో మతం

మానవాళ జీవితం లో మతం ప్రముఖమైనది .వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది .దేశాలకు వర్గాలకు అస్తిత్వాన్ని ప్రసాదిస్తుంది .దీనివలన ఐక్యత ,స్వంత భావన ఏర్పడుతుంది .సైన్స్ ఫిలాసఫీ ,సాహిత్యాలను ప్రభావితం చేస్తాయి  .  పాశ్చాత్య దేశాలలో 19,20శతాబ్దాలలో సైన్స్ టెక్నాలజీ ,హేతువాద వ్యాప్తిపై మతంపై   యుద్ధాలే జరిగాయి .రాజకీయ ఆర్ధిక ఉద్యమాలు సోషలిజం కమ్యూనిజాలు మతాన్ని చాలా తక్కువ చేసి మూక మనస్తత్వం అని అవహేళన చేశాయి .దీనితో అభి వృద్ధిలో దాని ప్రాధాన్యత తగ్గి పనికిమాలినదని పించుకొంది. . ఆధునిక విజ్ఞానం సహజ సిద్ధ ప్రపంచం ను పట్టించుకొంటే ,మతం నేచురల్ సూపర్ నేచురల్  ను రెండిటినీ పట్టించుకోన్నది .మతం దేవునిపై విశ్వాసం కల్పిస్తుంది,పారదర్శకం గా ఉంటుంది .ఇంద్రియ గోచరమైన  దాన్నే నమ్ముతాము అంటుంది సైన్స్ .అనుభావికకు(ఎమ్పెరికల్ ) తావు లేదు అంటుంది.’’ఫెయిత్ వర్సెస్ ఫాక్ట్’’ అనే తనపుస్తకం లో జెర్రీ ఎ కొనే ‘’సైన్స్ రెలిజియన్ రెండూ అననుకూలమైనవి (in compatible)దేన్ని ఎంచుకోవాలో నీదే నిర్ణయం ‘’అన్నాడు .దీనికి రెండు కారణాలు పేర్కొన్నాడు .1-సైన్స్ ద్వారా మతాన్నిబలపరచటం లేక వాటిమధ్య ఘర్షణ నివారించటం వ్యర్ద ప్రయత్నం.2ప్రపంచాన్ని అర్ధం చేసుకోవటం లో సైన్స్ ,మతం అంతర్గతం గవ్యతిరేక భావం కలిగినవి .

   సైన్స్ మానసపుత్రిక అయిన టెక్నాలజీ విశ్వ వ్యాప్తం గా మానవ జీవితాలపై అత్యధిక ప్రభావం చూపిస్తోంది .టెక్నాలజీ సాధించిన విజయాలు మత సిద్ధాంతాలకు పూర్తి వ్యతిరేకం .విశ్వం  విషయమై అరిస్టాటిల్ ఆలోచనలను క్రిష్టి యన్ చర్చి  సమర్ధించినా ,సాంకేతికాభి వృద్ధితో  గెలీలియో కనిపెట్టిన టేలిస్కోప్ ఆవిర్భావంతో  చెల్లకుండా పోయింది .అయినా కానీ, టెక్నాలజీ జీవిత విలువలను తెలియ జేయ లేకపోతున్నా ,మతం చక్కని సూచనలు చేస్తోంది.

 దాదాపు  పాశ్చాత్య ఫిలాసఫీ అంతా మానవ జీవిత సమస్యలను పరిష్కరించటం లో మత విశ్వాసాల సమర్ధతను.చర్చి ఆధిపత్యాన్నీ   తీవ్రంగా వ్యతిరేకించాయి .కార్ల్ మార్క్స్ ‘’మానవ సారాంశాన్ని (ఎస్సెన్స్ )సాక్షాత్కరింప జేయటం లో యదార్ధ జ్ఞానం కంటే మతం ఒక గొప్ప అద్భుతమైన విజయం సాధించింది ‘’అన్నాడు. అంటే మానవుడు నైరూప్య(ఆబ్ ష్ట్రాక్ట్ ) జీవికాడు బయట చతికిలపడి కూర్చోటానికి .కాని మతం మానవుడికి స్వీయ చేతనా ,ఆత్మ గౌరవం పొందటం లేక పోగొట్టుకొన్నది సాధించటం , నిలబెట్టుకోవటానికి  బలిపీఠం అవుతోంది .ఇది అత్యంత బాధాకరం .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-7-21-ఉయ్యూరు   

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

లంపెన్ ప్రోలిటరేట్ల లైంలైట్- రావి శాస్త్రి

లంపెన్ ప్రోలిటరేట్ల లైంలైట్- రావి శాస్త్రి

‘ఈ జులై నెల 30వ తేదీశుక్రవారం సాయంత్రం శ్రీ రాచకొండ విశ్వనాథ శాస్త్రి (రావి శాస్త్రి )గారి 99వ జయంతిని విశాఖపట్నం లో విశాఖ రసజ్ఞ వేదిక ,రావిశాస్త్రి లిటరరీ ట్రస్ట్ సంయుక్తంగా ద్వారకానగర్ పౌరగారంథాలయం లో నిర్వహిస్తూ ,ప్రముఖ రచయిత శ్రీ చింతకింద శ్రీనివాసరావు గారికి(2020) ,శ్రీమతి డి.కామేశ్వరీ దేవిగారికి (2021)సాహిత్య పురస్కారాలను డా రాచకొండ నరసింహ శర్మగారు ఎం .డి. అందజేస్తూ ,శ్రీనివాసరావు గారి కథాసంకలనం ‘’ఉడుకు బెల్లం ‘’ఆవిష్కరిస్తున్నట్లు నాకు శర్మగారు ఆహ్వానపత్రం మెయిల్ చేశారు .ఈ సందర్భంగా ఆకార్యక్రమం జయప్రదం కావాలని కోరుతూ , రావి శాస్త్రి గారిపై ఈ కింది వ్యాసం రాస్తున్నాను –‘’

‘’రచయిత ప్రతివాడు తాను వ్రాస్తున్నది ఏమంచికి హాని కలిగిస్తుందో, ఏ చేడ్డకు ఉపకారం చేస్తుందో అని ఆలోచించవలసిన అవసరం వుందని నేను తలుస్తాను, మంచికిహాని , చెడ్డకు సహాయమూ చెయ్యకూడదని నేను భావిస్తాను” అన్నాడు రావిశాస్త్రి. 1922 జూలై 30న పుట్టి, పీడిత, తాడిత ప్రజల పక్షాన న్యాయంకోసం పోరాడి, విరసం వ్యవస్థాపకుల్లో ప్రముఖుడిగా నిలిచి, అన్యాయాల నెదిరించి నెలల తరబడి జైలుపాలై, ప్రభుత్వ బిరుదుల్ని, అవార్డుల్ని తిరస్కరించి, పతితు కోసం, భ్రష్టుల కోసం, బాధాసర్పదష్టుల కోసం దగాపడ్డ తమ్ముల కోసం, చల్లారిన సంసారల కోసం, చీకట్లు ముసిరిన బ్రతుకుల కోసం.. తుది శ్వాసవరకు అవిశ్రాంతంగా ఉద్యమించి,అణచి వేతకుగురైనవారిలో ఆలోచన ,ఆత్మ విశ్వాసం కలిగించిన దీన జన పక్షపాతి .సమాజహృదయ౦ ,ప్రతిబింబం అయిన సాహిత్యాన్ని మనముందు నిలిపినవాడు రావి శాస్త్రి .రావి చెట్టు కింద జ్ఞానం కలిగిన వారెందరో ఉన్నారు .అలాగే రావి శాస్త్రికథలవలన విజ్ఞానులైనవారుఅనే కులే ఉన్నారు .

గురజాడ పుట్టిన దుర్ముఖి లోనేశ్రావణ శుద్ధ సప్తమి నాడు సీతారామల్క్ష్మి నారాయణ మూర్తి దంపతులకు శ్రీకాకుళం లో మేనమామల ఇంట రావి శాస్త్రి పుట్టాడు.అనకాపల్లి దగ్గర తుమ్మ పాలెం లో అచ్చటా ముచ్చట .మూడు మైళ్ళదూరం లోని అనకాపల్లి నడిచి వెళ్లి శారదా లైబ్రరీలో పుస్తకాలు తిరగేసేవాడు ఆయనకుటుంబం అంతా విద్యావంతులే అటూ ,ఇటూ మూడు తరాలవారు న్యాయవాదులే అవటం మరో గొప్ప విషయం .తండ్రి లాయర్ ,తల్లి భారత రామాయణాలతో బాగా పరిచయమున్న మహిళ .

సర్ సివిరామన్ చదివిన ప్రాంతం లో చదివినందుకు గర్వపడ్డాడు .ఆస్కూల్ హెడ్ మాస్టర్ కొడుకు శ్రీ శ్రీ సహవాసం ,తర్వాత ఆరాధన గా మారింది ,ఆంధ్రాయూనివర్సిటి కంటే అందులోని లైబ్రరీకి దగ్గరయ్యాడు .అది లోకజ్ఞాన పరిశీలను తోడ్పడింది .న్యూస్ రీడర్ పన్యాల రంగనాథరావు , జర్నలిస్ట్ ఆదిగురువు అబ్బూరి వరద రాజేశ్వరరావు లు హైస్కూల్ క్లాస్ మేట్స్ ,ప్రాణమిత్రులు .’’మొదట్లో తెల్లపాంటు షర్ట్ ,నుదుట పెద్ద కుంకుమ బొట్టు చేతిలో కొబ్బరిచిప్ప,చెవిలో పువ్వు తో కనక లక్ష్మీ అమ్మవారి భక్తుడి ‘’గా కనిపించేవాడు ప్రతి గురువారం .తర్వాత ఈ విధానం మారినా దేవుడు జ్యోతిష్యం పై నమ్మకాలున్నాయి .విశాఖ నాటకమండలి నాటకాలు తిరస్కృతి, నిజం, విషాదం లకు దర్శకత్వం వహించి కొన్నిట్లోనూ కన్యాశుల్కం లోనూ నటించాడు .స్నేహితుడు ఆకెళ్ళ కృష్ణమూర్తి తో కలిసి ‘గురజాడ కళాకేంద్రం ‘’స్థాపించి సాహిత్య సాంఘిక రాజకీయ అంతర్జాతీయ విషయాలపై చర్చించేవారు .చాణక్యుని స(క)లహాలనుఅప్పటి సమాజానికి అన్వయిస్తూ శాస్త్రి మాట్లాడేవాడు .కాంగోవిముక్తి ఉద్యమనాయకుడు , ఇండిపెండెంట్ కాంగో రిపబ్లిక్ మొదటి ప్రెసిడెంట్ పాట్రిస్ లుముబా హత్యపై పెద్ద సభ నిర్వహించి ,దేశ విదేశాలలో జరిగే అన్యాయాలకు తన వ్యతిరేకతను వ్యక్తపరుస్తూ సామాజిక బాధ్యతా తీసుకొనేవాడు .భోళా శంకరుడైన శాస్త్రి ఈలపాట రఘురామయ్య, బడే గులాం పాటలంటే చెవికోసుకోనేవాడు . స్నేహితులకు అన్నివిధాలా పెద్ద దిక్కుగా ఉండేవాడు .

శాస్త్రి దేనినైనా వెయ్యి కళ్ళతో చూసే వాడు కనుకయదార్ధం యిట్టె పసిగట్టేవాడు .మద్రాస్ లో చదివి 1946లో లా పాసై ,ప్రసిద్ధ లాయర్ తాతా శ్రీరామమూర్తి దగ్గర 9ఏళ్ళు అప్ర౦టిస్ గా ఆయనను నొప్పించకుండా పని చేసి ,తర్వాత క్రిమినల్ లాయర్ గా స్థిరపడ్డాడు .1945లో లక్ష్మీ సోదేమ్మతో వివాహం జరిగినా ,1965లో తటవర్తి రామం ను ద్వితీయం చేసుకొంటే , 1993లో ఆమె చనిపోయింది .ఈవివాహానికి పుట్టిన లక్ష్మీ నారాయణ ప్రసాద్ ,ఉమా కుమారశాస్త్రి గార్లు కూడా లాయర్లయ్యారు .

మొదట్లో శాస్త్రి ఫీజుగా క్లయింట్లు ఆయనకిష్టమైన స్టార్ సిగరెట్ పెట్టె ,గుర్రం గుర్తు అగ్గిపెట్టె ‘’తో సరిపెట్టేవారు .సారా ,సారో కేసుల లో ఇరికించబడిన వారెందరికో శాస్త్రి దిక్కై వారి తరఫున వాదించి న్యాయం చేకూర్ఛి ‘’పేదోళ్ళ ప్లీడర్ ‘’అయ్యాడు .తాను ఎక్కడైనా పొరబాటు చేస్తే స్టే తెచ్చుకోవటానికి క్లయింటుకు డబ్బిచ్చి హై కోర్ట్ లో స్టే తెచ్చుకోమనే నిజాయితీ ఆయనది .’’లా ఈజ్ యాన్ యాస్ ‘’అన్న ప్రముఖ నవలాకారుడు చార్లెస్ డికెన్స్ లాగా శాస్త్రి ‘’ఇండియన్ కాన్ష్టిట్యూషన్ ఈజ్ లాయర్స్ పేరడైజ్ ‘’ అని ఎద్దేవా చేసేవాడు .

చిన్నప్పుడే పఠనాసక్తి కలిగి ఆతర్వాత డికెన్స్ ,ఉడ్ హౌస్ ‘’లను ‘’స్కాచ్ వడపోశాడు ‘’.1938లో మొదటిసారిగా శశాంక విజయం, దేముడే చేశాడు కధలురాశాడు రావి శాస్త్రి .కామేశ్వరరావు కేసు అనే డిటెక్టివ్ నవల రాశాడు .రాసిన’’కోనయ్య ‘’నవల ‘’ఇంతవరకూ కనిపించలేదని బాధ పడ్డాడు .అబ్బూరి వరద వగైరాలతో కలిసి యువ కళపత్రిక పెట్టి మూడు సంచికలు ప్రచురించాడు .జాస్మిన్ ,అన్ జానా వంటి 10మారు పేర్లతో రాసేవాడు .’’అల్పజీవి’’ నవలతో దశ తిరిగింది.చలం కొడవటిగంటి మాగోఖలే శ్రీపాద ఉన్నవ రచనలన్నీ చదివిజీర్ణం చేసుకొన్నా , తనదైన ‘’అననుకరణమైన శైలితో’’ కొత్తమార్గం పట్టి రాశాడు . . 1966లో రాజు మహిషి ,గోవులోస్తున్నాయి జాగ్రత్త నవల జ్యోతిలో అయిదు నెలలు ధారావాహికంగా వచ్చింది.1980లో ‘’సొమ్ములు పోనాయండి ‘’ అనే బ్లాక్ బస్టర్ నవల రాశాడు .చివరి నవల ‘’ఇల్లు ‘’.ఆయన 63కధలు 7సంపుటాలలో,నిజం తిరస్కృతి విషాదం నాటకాలు డాల్ఫిన్ డైరీలో ఎన్నో వ్యాసాలూ అసంపూర్తిగా ‘’ఏడవ చంద్రుడు’’ రాశాడు .

శ్రీకాకుళ గిరిజనోద్యమం నాయకుడు వెంకటాపు సత్యం తో పరిచయం తో ఎలర్ట్ అయి ‘’రచయితలారా మీరెటు ‘’కరపత్రం రాసి తెలుగు సాహిత్య చరిత్రను మలుపుతిప్పి ,విరసం ఆవిర్భావానికి నాంది పలికాడు రావి శాస్త్రి .1970ఖమ్మం సభలో శాస్త్రి కొ.కు. లు ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు .ఇందిర ఎమర్జెన్సీ లో నిరసన చేసి జైలుకెళ్ళి 6-2-77వరకు జైలు జీవితం గడిపి ,జైలు అధికారులకు సంజాయిషీ రాసిచ్చి విడుదలై ,విరసం బహిష్కరణకు గురయినా సభ్యత్వం లేకుండా ఆదారిలోనే నడిచి ఆతర్వాత కమ్యూనిస్ట్ సానుభూతిపరుడిగా మిగిలాడు .1972లో వరవరరావు వగైరాల నిర్బంధానికి వ్యతిరేక ప్రదర్శన చేసి సంఘీభావం తెలిపాడు .అనారోగ్యం వలన రచన మందగించి౦దికానీ ప్రజలపక్షాన నిలిచి ,ప్రగతి బాట నుకోరిన ప్రజాబంధు వయ్యాడు .గిరిజన యువకులను పేద రైతులను అట్టడుగు వర్గాల వారినీ ఆలోచింపజేసి ఎదురు తిరిగి న్యాయం సాధించేట్లు చేసిన వెలుగు రేఖ శాస్త్రి.

1967లో ఆంద్ర ప్రదేశ్ అకాడెమి రావి శాస్త్రి కథలు కు పురస్కారం ఇస్తే తీసుకొన్నాడు కానీ ఆతర్వాత 1983లో తిరస్కరిస్తున్నట్లు ప్రకటించాడు .ఆంధ్రాయూనివర్సిటి ‘’కళాప్రపూర్ణ ‘’ప్రకటించి సత్కరించాలనుకొంటే తిరస్కరించాడు .రత్తాలు రాంబాబు నవలకు మన అకాడెమి ఇచ్చిన పురస్కారం వద్దన్నాడు .యజ్ఞం కథకు కారా మాస్టారు ఏకారణాలు చెప్పి తిరస్కరించారోఅవే కారణాలు రావి చెప్పాడు .మూడు కథలబంగారం కు శిరీషా సాహిత్య సంస్థఇచ్చిన అవార్డ్, గోపీచంద్ అవార్డ్ పుచ్చుకొన్నాడు ..స్త్రీ సినిమాకు కథా మాటలు ,రాసి౦దీ ఆయన నిజం నాటకం సినిమాగా వచ్చిందీ చాలామందికి తెలీదు .రావి శాస్త్రి ఇంట్లోవాళ్ళకు విశ్వం ,బార్ లో వాళ్లకు ఆర్ వి ఎస్ ,క్లయింట్ లకు ‘’చాత్రిబాబు’’ గా త్రిమూర్త్యవతారం దాల్చాడు .

రిక్షా ,ఆటోలను ఎప్పుడూ బేరమాడి ఎక్కని బడుగు జీవుల పెన్నిధి .నిజాయితీ చిత్తశుద్ధి .ఆత్మ విశ్వాసం ఆత్మ విమర్శ ఆయన ఆభరణాలు .1990డిసెంబర్ 9న పక్షవాతానికి గురై ,కొద్దోగొప్పో కోలుకొని 1993జూన్ 2న మూత్రపిండాల వ్యాధి బయటపడి ,చాలాసార్లు డయాలిసిస్ జరిగి ,తట్టుకొని 10-11-1993ఉదయం ‘ఇహం ఇల్లు ఖాళీ చేసి ‘’వెళ్ళిపోయాడు’’పెన్నూ,కన్నూ మూసి ”’ రావిశాస్త్రి .

రావి శాస్త్రి అల్ప జీవి నవల తెలుగులో మొట్టమొదటిసారిగా చైతన్య స్రవంతి ప్రక్రియ లో రాసిన మనో వైజ్ఞానిక నవల.గోవులొస్తున్నాయి నవల ఇంటర్నల్ మోనోలోగ్ .మూడుభాగాల రత్తాలు రాంబాబు నవల స్త్రీ జీవితం గాలిపటం గా చూపబడింది .గోవులు పోనాయండి ఒక వర్గనికి జరిగిన అన్యాయం .ఇది అయన స్నేహితుడు ,మెంటార్ వరద కు అంకితం .వియత్నాం విమలలు పుట్టాల్సిన అవసరం ,బంగారానికి బలైన చెల్లి ,ధర్మం కోసం ,లోక రక్షణకోసం బయల్దేరటం ‘’మూడుకథల బంగారం ‘’ లో ఆంతర్యం .మంచికి ఉపకారం, చెడుకు అపకారం ‘’ఇల్లు ‘’నవల .ఆయన చిత్రించిన పాత్రలన్నీ సామాజిక బాధ్యతతో చిత్రించిన సజీవ శిల్పాలే .ముత్యాలు పాత్ర ముత్యం లా మెరుస్తూనే ఉంటుంది ఉత్తరాంధ్ర మాండలికాలు జాతీయాలు సామెతలు లోకోక్తులు పుష్కలంగా కురిపించాడు .కథనం లో ఓరల్ ట్రడిషన్ పాటించాడు ఏదిరాసినా దాని ఎత్తుగడ ముగింపు లో ఆయన ప్రత్యేకతకనిపిస్తుంది. ఎందులో ఒక్కలైన్ చదివినా ఇది రావి శాస్త్రిది అని యిట్టె చెప్పయ్యచ్చు.టాల్ స్టాయ్ , డికెన్స్ ,పెర్ల్ ఎస్ బక్ ప్రసిద్ధ నవలలోని ఆరంభవాక్యాలుగా శాస్త్రి ముఖ్యనవలలోని మొదటి వాక్యాలు కోటబుల్ కోట్స్ గా ఉండటం ప్రత్యేకత .అల్పజీవి రాసిన రావి శాస్త్రి మహోన్నత సాహిత్య జీవి .ఆయన రచనా సర్వస్వం ‘’ధర్మేతిహాసం ‘’అన్నారు . ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక అజంతా కవి

ఇక కథ లేదు వ్యధ,
దారి లేదు, ఎడారి, ఎడారి ఎడారి
అడుగడుగునా ఇక అశ్రుఘాతాలే
శిరస్సు వ్రయ్యలైన అపశబ్ద శరీరాలే
వీధి మొగలో ధూళి, ధూళి
జీవన గ్రంథం నిండా పొగ’ అని అన్నాడు.

రావి శాస్త్రి కథలను కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయం ఇంగ్లీష్ లోకి ఆయన తమ్ముడు నరసింహ శర్మ గారు మొదలైన వారితో అనువాదం చేయించి ప్రచురించి గొప్ప గౌరవం కలిగించింది .మా మిత్రుడు స్వర్గీయ టిఎల్.కాంతారావు నోటిలో ఎప్పుడూ శ్రీ శ్రీ ,రావి శాస్త్రి నానుతూ ఉండేవారు .వారిద్దరూ ఆయనకు ఆరాధ్య దైవాలు .శ్రీ శ్రీ కవిత్వం ,శాస్త్రి కధలపై పత్రికలలో వ్యాసాలు తరచుగా రాసేవాడు. మాతో ముచ్చటి౦చేవాడు. శాస్త్రిపై పరిశోధన చేసి పుస్తకం తేవాలని కలలు కన్నాడు .కానీ అది నెరవేర లేదు .ఈవిషయం శాస్త్రి నవలలపై బెజవాడ సిద్ధార్ధ కాలేజి తెలుగు లెక్చరర్ శ్రీ తాటి శ్రీకృష్ణ నాటి నాగార్జున యూని వర్సిటి ఆంద్ర శాఖాధ్యక్షులు ఆచార్య ఎస్. గంగప్పగారి పర్య వేక్షణలో పరిశోధన చేసి ప్రచురించిన ‘’రావిశాస్త్రి నవలాను శీలనం ‘’పుస్తకంలో ఆచార్యులవారు’’వామపక్ష భావాలను గూర్చి మంచి అవగాహన కలిగిన టిఎల్ కాంతారావు జీవించి ఉంటె ‘’రావి శాస్త్రి కథా ప్రపంచం ‘’ అనే అంశం పై ,నా పర్య వేక్షణలో ఇంతకు ముందెప్పుడో మంచి సిద్ధాంత వ్యాసం వచ్చి ఉండేది ‘’అని సెలవిచ్చిన విషయం ఇది .

ఈవ్యాసానికి ఆద్ధారం శ్రీ తాటి కృష్ణ పరిశోధన ‘’ ’రావిశాస్త్రి నవలాను శీలనం’’

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -29-7-21-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Leave a comment

శ్రీ రేచర్లపురి శ్రీ రామ శతకం

శ్రీ రేచర్లపురి శ్రీ రామ శతకం

 వాగ్గేయ కారులుయడ్ల రామ దాసుగారి శిష్యుడు కంటా అప్పలదాసు గారు  శ్రీ రేచర్లపురి శ్రీ రామ శతకం రాసి గురువుగారితో పరిష్కరింప జేసుకొని ,కాకినాడ శ్రీ సావిత్రీ ముద్రాక్షర శాలలో 1913లో ప్రచురించారు వెల. బేడ అంటే రెండు అణాలు.

 పీఠిక లో కవిగారు ‘’విజయనగర వాసి శ్రీ కంటాఆశిరయ, యల్లమాంబ దంపతులకు రెండవ కుమారుడు .14వ ఏట కాకినాడ రేచర్లపేట లో నివసిస్తుండగా కేవలపరబ్రహ్మ ,శివనారాయణ ద్వయ జ్యోతి స్వరూపులు ,శ్రీ యడ్ల రామదాసు సద్గురువుల కటాక్షం తో సాంఖ్య,తారక ,అమనస్క,పరిపూర్ణ రాజయోగాదులు నేర్చారు .20వ ఏట ‘’సుజ్ఞాన బోధిని ‘’రచింఛి ముద్రించారు .గురువులు సంతోషించి ‘’నీఉన్న స్వగ్రామం లో శ్రీరామమందిరం ఏర్పాటు చేసి ,శ్రీరామ శతకంగా నూట ఎనిమిదిసీసపద్యాలురాసిఆ రామునికే అంకితమిచ్చి ధన్యుడవు కమ్ము ‘’అని ఆశీర్వదించగా ,వెంటనే శక్తికొలదీ రామమందిరం రేచర్లలో నిర్మించి శ్రీరామ శతకం రాసి ,గురువుగారికిచూపి పరిష్కరింప జేసి ముద్రించారు .ముందుగా గురువుగారిపై రేగుప్తిరాగం ఆటతాలం లో ఒక తత్త్వం’’నమస్తే శ్రీయడ్ల రామార్యా –శ్రీమత్పరబ్రహ్మా మిము స్మరామి గురురాయా –విమలమగు తత్పదములను హృత్కమలమధ్యమునందు జేర్చి,ఏమరక భజియించి మ్రొక్కెద —‘’  రాసి  సంర్పించారు. –

  ‘’శ్రీ రఘువర పుత్రశృంగార గుణ గాత్ర త్రైలోక్యపావనధన్యచరిత –పార్వతి పతి మిత్ర  పండిత గణ స్తోత్ర శ్రీ లక్ష్మి నాయకా శ్రిత పవిత్ర —ధరను శ్రీ కంటా అప్పలదాస పోష –శరణు శ్రీరామ రేచర్లపురనివాసా ‘’అని సీసాలు మొదలెట్టి ,’’యతిగణ ప్రాసలు ,తర్కం తెలీదు నీ నామ సంకీర్తనే తప్ప సాధన యుక్తి తెలీదు కనుక నువ్వే అన్నిటికి ఆధారంగా నా శతకాన్ని పూర్తి చేయించాలని ఆపద మొక్కులు మొక్కాడు కవి .రాజాధి రాజైనా తీర్ధయాత్రలు చేసినా సకల విద్యాసారం తెలిసినా ,సద్గురుని చేరకపోతే ఫలించదు అన్నాడు .రామ దాస సద్గురువుల అనుగ్రహం తో ‘’మమతలుడిగి నిశ్చలమతి ‘’అయ్యాడు .’’నారాయణా నీదు నామ స్మరణ మహిమ భవభయ౦బులెల్ల బారదోలు ‘’ అని నమ్మాడు .తర్వాత మాయ ను వర్ణించాడు .నిజసంపదలు భూమిమీద నిలవవు .కాయము నీటి బుగ్గ అని తెలుసుకోకపోతే యమ పాశం లో పడాల్సిందే అన్నాడు .హరినామ స్మరణ చేస్తే అరిషడ్వర్గాలు నాశానమౌతాయి అని భారోసా గా పల్కాడు .శబరి, కరిరాజులను కాపాడావు అనీ .రా అంటే పాపాలుపోతాయనీ ,మా అంటే కవాటాలు మూసుకుపోతాయని రామశబ్ద మహాత్మ్యం చెప్పాడు.’’గోవింద సర్వేశ గోపాల మాధవా నా ఎదుట నిలువవే నల్లనయ్యా ‘’అని ఆర్తిగా కోరాడు .పిపీలికాది బ్రహ్మ పర్యంతం నీ మహిమలే అని సత్యం చెప్పాడు .తల్లీ తండ్రీ గురువు నువ్వే రామయ్యా అన్నాడు .’’శ్రీలక్ష్మి నా తల్లి శిరులిచ్చి బ్రోచును ,శ్రీరాముడే తండ్రి చేబట్టి రక్షించును ‘’అన్నాడు .అద్దం గుడ్డివాడికి అగపడనట్లు , చెవిటి వానిముండు శంఖం ఊదినట్లు ,కోతికి జలతారు కుళాయి ఇచ్చినట్లు చేన చెనటికి వేదం చెప్పినట్లు  పణ్యస్త్రీలకు పతిభక్తి బోధించినట్లు ,విటులకు శీలం ఉ౦దన్నట్లు,మందమతికి నీ మహా మంత్రం ఉపదేశించి నట్లు వ్యర్ధమే అన్నాడు .

 ‘’మదిలోన నీ యొక్క మహిమలు వర్ణింఛి స్మరియింప నారడుడను గాను ,తండ్రితోపోట్లాడే ప్రహ్లాదుడను కాను .కనుక నీ పాదపద్మాలే నాకు శరణు అని విన్నవించుకొన్నాడు .అమరేంద్ర సుతునికి ఆత్మ తత్త్వం తెల్పి ,పవన సుతుని అతిప్రేమగా చూపినట్లు ,రావణానుజుడిని రాజు చేసినట్లు ,పాంచాలి మానభంగం కాచినట్లు ,గోపికలకు కూర్మి కలిగించినట్లు తనకు ప్రత్యక్షమవమని ప్రాధేయపడ్డాడు .నిరతం నిన్ను వర్ణించటం నా వంతు నిజంగా రక్షించటం నీ వంతు అని రామయ్యపైనే భారం మోపాడు గడుసుకవి .షణ్మతాలకు ఒక్కడే స్వామి , శృంగారాలకు సువర్ణం ఒక్కటే ,తనువులకు జీవం ఒక్కటే ,రంగుపశువులకు పాలు తెల్లవే ,ఎక్కడచూసినా పరబ్రహ్మం ఒక్కడే .

  ఆతర్వాత దశావతార వర్ణన చేసి ,ఆవతార విశేషాలు సీసాలలో కరిగించి మెరుగుపెట్టాడు  .చివరగా ఫలశ్రుతి చెబుతూ ‘’ఈశతకమెల్ల సాంతము గాను చదివి,వినిన యట్టిసజ్జనులకు ‘’పాపాలు తొలగి పరమపదమబ్బి ,ఆయురారోగ్యాలు వర్ధిల్లు తాయని భరోసా ఇచ్చాడు కాటం కవి .శతకాన్ని 20-12-1912లో పూర్తిచేశాడు కవి .

   ఈ శతకానికి శతాబ్ద చరిత్ర ఉంది .ఎవ్వరి కనుల్లోనూ పడలేక పోవటం వింత . చక్కని దారాశుద్ది తీవ్రమైన భక్తీ ఆర్తి శ్రద్ధ విశ్వాసం ఉన్నశతకం ఇది .హాయిగా చదూకొని పారాయణ చేయ తగ్గది.దీన్ని పరిచయం చేసే అదృష్టం నాకు దక్కింది .

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -27-7-21-ఉయ్యూరు    

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ధన్యవాదాలు   బ్రహ్మశ్రీ డా రాచకొండ నరసింహ శర్మ గారు

ధన్యవాదాలు

 బ్రహ్మశ్రీ డా రాచకొండ నరసింహ శర్మ గారు -ఎం.డి గారికి  -నమస్కారాలు
సరసభారతి పై మీకున్న అవ్యాజ అనురాగం ,ఆత్మీయత మరువలేనిది .మా కార్యక్రమాలు మీరు మెయిల్ లో చూస్తూ ,సరసభారతి బ్లాగ్ ను నిత్యం ఈ 95ఏళ్ల వయసులో కూడా చదువుతూ మెయిల్ లో స్పందిస్తూ ,నాకు .సరసభారతికి గొప్ప స్పూర్తి కలిగిస్తున్నారు .మీకు వీలైనప్పుడల్లా సరస  భారతికి

మేము అడగకుండానే చెక్ ల రూపం లో డబ్బు పంపుతూ మాకు మరింత ఉత్సాహ ,ప్రోత్సాహాలు కలిగిస్తున్నారు . ఇటీవల మీరు నా పేర పంపిన 10వేలరూపాయల చెక్ ఇవాళే అందింది .కృతజ్ఞలతో ధన్యవాదాలు తెలియ జేస్తున్నాను .మీ శ్రీమతి గారు డా  .అన్నపూర్ణా దేవి గారికి మా నమోవాకములు .మీ దంపతులు మంచి ఆరోగ్యం తో కలకాలం జీవించాలని కోరుతూ మీఆశీస్సులు మాపై ఎల్లకాలం ఇలానే ఉండాలని కోరుతూ  -మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -27-7-21-ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment