గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-18
  విషాద ఛాయలు
1911 ఘోష్ కుటుంబం లో అత్య౦త విషాదం రేపింది .రెండు దశాబ్దాలు మంచాన పడి తీసుకొన్న శిశిర్ కుమార్ ఘోష్ ఎక్కువ భాగం కలకత్తాకు దూరంగా గడిపి జనవరి 10 కన్ను మూశాడు .పత్రిక భారం మోతీలాల్ పై పూర్తిగా పడింది .పావు శతాబ్దం శిరశిరకుమార్ అమృత బజార్ పత్రికకు సంపాదకుడు .దాని రూపానికి అస్తిత్వానికి,ఆత్మకూ  రూపకర్త .సంపాదకీయ అభిప్రాయాలు ఆయనవే .అందరూ ఆయనను గౌరవంగా ‘’మహాత్మా ‘’అనే సంబోధించేవారు .ఔదార్యం ,నిరాడంబరత అంకిత భావం ఆయన సొమ్ములు .ఆయన రాసిన శ్రీచైతన్య జీవితగాధ 1870లో బెంగాలీ  కుటుంబాలలో కీర్తనలుగా వ్యాపించాయి .అన్నగారిని గురించి మోతీలాల్ రాస్తూ –‘’ఆయన మాకు అత్య౦త విలువైన సోదర ప్రేమ పంచారు. అది అన్ని ప్రేమలకు పునాది .సోదరుని కోల్పోవటం అంటే హృదయం ముక్కలు ముక్కలవటమే .దాదాపు 60ఏళ్ళు ఆయన సోదర ప్రేమను చవి చూశాం .మేము సాధించింది ఏమైనా ఉంటె అన్నగారి పాదాలకే సమర్పిస్తున్నాం .ఉన్నత జీవిత లక్ష్యాలను ,రాజకీయ పాఠాలను ఆయన మాకు నేర్పారు .సిద్ధాంతాలు చెప్పటమే కాదు జీవితం లొఅనుసరి౦చ టమూ నేర్పిన మా గురుమూర్తి ఆయన .మానవ సేవద్వారా మాధవ సేవ చేయాలన్న మహోన్నత ఆశయం నేర్పించారు .ఆయన లేని లోటు మాకు ఎన్నటికీ తీరేదికాదు.శిశిర్ అన్నయ్య మాకు చిరంజీవి ‘’అన్నాడు .
  ఉమ్మడి కుటుంబ వ్యాపార సంస్థ ప్రారంభించిన అమృత బజార్ పత్రిక ,40ఏళ్ళ తర్వాత లిమిటెడ్ సంస్థగా రిజిస్టర్ అయింది . .అందులో వాటాలు ఘోష్ కుటు౦బానివే .ఆర్ధిక వ్యవహారాలూ హేమంతకుమార్ ,ఆయనతర్వత గోలాప్ లాల్,హేమంత కొడుకు మృణాల్ కాంతి చూశారు .పత్రికపై వచ్చే ఆదాయం అతి స్వల్పం .కుటుంబ పోషణకేకాక పత్రిక గడవటానికీ ,స్వగ్రామం లోని భూములపై రాబడీ అవసరమయ్యేది .కలకత్తాలో మోతీలాల్ కు అగ్రశ్రేణి స్థానం లేదు .దానికి ఆయన అర్రులు చాచనూ లేదు .సామాన్యుల బాధలు పట్టించు కోవటమే ఆయన ,బలం ,గుర్తింపు .
  జాత్యహంకారంతో భారతీయులపై ,ముఖ్యంగా విద్యావంతులపై బ్రిటిష్ యాజమాన్యం లోని పత్రికలూ రెచ్చ గొట్టే ధోరణి అవలంబించటం చూసి గోపాలకృష్ణ గోఖలే ‘’ప్రతి ఆంగ్లో ఇండియన్ రచయితా తనకలాన్ని సర్కారు వారి ఇంకులో ముంచి రాస్తున్నారు .ఇది అసంబద్ధం హానికరం ‘’అని రాశాడు .1912 మే 18న లార్డ్ కార్మి చెల్  మోతీలాల్ కు ఒక లేఖ రాస్తూ ‘’ఏయే సమస్యలని నేను వ్యక్తిగతంగా జోక్యం చేసుకొని పరిష్కరించాలో నాకు తెలియ జేస్తే నేను కృతజ్ఞుడుగా ఉంటాను .మీపత్రికలో వీటికోసం ఎదురు చూస్తూ ఉంటాను బెంగాలీలు సుఖ శాంతులతో ఆనందంగా వర్ధిల్లటానికి శాయశక్తులా పని చేస్తాను .ప్రజలు మా పట్ల అసంతృప్తిగా ఉన్నారని నాకు తెలుసు .నేను వారికి సేవ చేయలేక పోతున్నాననీ తెలుసు .తక్షణ సమస్యలలో నేను ఏం చేయాలో మీరే చెప్పాలి .నా బదులు మరో గవర్నర్ వచ్చినా ,భాష రాకపోతే అతడూ ఏమీ చేయలేడు.గవర్నర్ పదవిలో ఉన్నవాడు ఎన్నో చేయాలనుకొంతాడుకానీ ఏమీ చేయలేడు.తనకు తోచిన దృష్టితోకాక వేరే దృష్టితో చూడటమే అతడు చేయగల పని అనిపిస్తోంది ‘’‘అని రాశాడు .అన్ని తరగతులమధ్య సామరస్యం సాధించాటానికి ఆయన ప్రయత్నం చేశాడు .కానీ హో౦ శాఖ సభ్యుడు లాస్ రీనాల్డ్ క్రాడాక్ మాత్రం పత్రికలే ఉగ్రవాదాన్ని పోషిస్తున్నాయనీ బెంగాల్ వెనుకబాటుతనమూ కారణం అనీ అసలు బెంగాలీలు ప్రభుత్వం పట్ల విశ్వాసం చూపరు ‘’అని భావించాడు .కార్మిచేల్ ,క్రాడాక్ లమధ్య విభేదాలు పెరిగాయి .ప్రజలు కార్మిచేల్ ను నమ్మారు .ఆయన మోతీలాల్ తో స్నేహ హస్తం చాచాడు .కార్మిచేల్ తన అభిప్రాయాలమేరకు పని చేస్తూనే ఉన్నాడు .క్రాడాక్ పత్రికా స్వేచ్చపై కత్తి దూశాడు .అమృతబజార్ పత్రిక అంటే అతడికి సింహస్వప్నం .సిల్హెట్ జిల్లా అరుణాచల ఆశ్రమ వాసులపై పోలీసులు జరిపిన భీభత్సకాండ ను పత్రిక ప్రచురించగా ,అస్సాం ప్రభుత్వం సుప్రీం గవర్నమెంట్ కు ఫిర్యాదు చేయగా ప్రభుత్వానికి ఉక్కుపాదం మోపటానికి అవకాశం దొరికింది .
  ఆ ఆశ్రమం దయానంద అనే వైష్ణవ గురు పీఠం.ఇక్కడ గౌరవ ఉన్నత కుటుంబాల స్త్రీ పురుషులు సంకీర్తనలు చేస్తారు .తమకు నిద్రాభంగం కలిగిస్తున్నారని గిట్టనివారు పోలీసులకు ఫిర్యాదు చేయగా ,గురువుకు ఆశ్రమవాసులకూ పదేసి రూపాయలు జుల్మానా విధించారు .అయినా రాత్రిళ్ళు భజనలు వారు మానలేదు .ఆశ్రమవాసులు ఒక బాలుడిని అపహరించారని మళ్ళీ ఫిర్యాదు చేస్తే,పోలీసులువస్తే వారిని లోపలి రానివ్వ లేదు .ఆశ్రమం ఉగ్రవాద సంస్థగా ఉందని ,మిలిటరీతో దాడి జరిపించగా ,స్త్రీలపై చేయి చేసుకొన్నందుకు ఆశ్రమవాసులు తిరగబడ్డారు .సన్యాసుల త్రిశూలాలను పోలీసులపై విసిరారు .కాల్పులు జరిపి పోలీసు బృందం ఒక ప్రముఖుడిని చంపి ,ఏడుగుర్ని గాయ పరచింది .దీనిపై ప్రభుత్వం ఒక ఎంక్వైరీ కమిటీని వేస్తె అనైతిక అశ్లీల కార్యక్రమాలు ఆశ్రమం లో జరుగుతున్నాయని,బ్రిటిష్ పాలన నుంచి తాము విముక్తులం అయినట్లు ఆశ్రమవాసులు ముందే ప్రకటించారని  రిపోర్ట్ ఇస్తే ,మోతీలాల్ ఘోష్ ప్రభుత్వపు తప్పుడు రిపోర్ట్ ను తూర్పారబట్టితే ,కేంద్ర ప్రభుత్వం పత్రికపై 5వేల రూపాయల ధరావతు విధి౦చి చార్నేల్ కు పంపితే ఆయన తిరస్కరించినా ఫలితం లేకపోయింది ..ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్ గార్డియన్ పత్రిక బ్రిటిష్ ప్రభుత్వం తప్పుడు చర్యలను బయటపెడుతూ –‘’ఇండియాలోకానీ ,మరెక్కడా కాని అమృత బజార్ వంటి పత్రిక లేనేలేదు .ప్రజాభిప్రాయానికి అద్దంపట్టే పత్రిక అది .మోతీలాల్ సంపాదకత్వాన వెలువడుతోంది .ఆయనే పత్రిక పత్రికే ఆయన .లార్డ్ విల్టాన్ వైస్రాయి గా వచ్చినప్పటి నుంచి అది బెంగాలీ ప్రజాభిప్రాయ సాధనంగా ఉంది .అందులో పతాక శీర్షికలు ముఖ్యవార్తలు అన్నీ మోతీలాల్ మాత్రమె రాస్తారు .నిర్దాక్షిణ్యంగా తనకలాన్ని ఝడిపిస్తాడు .ఆయన ధనవంతుడు కాదుకానీ  ఆ డబ్బు  చెల్లించ గలడు’’అని రాస్తే దిపాల్ మాల్ గెజిట్ ‘మోతీలాల్ జాతి వినాశకారికాడు .ముఖంపై చిరునవ్వు చిందించే మర్యాదా పురుషుడు .యూరోపియన్ ల వేష భాషలను అనుకరించని జ్ఞాన వయో వృద్దు .ఆయన కలం గంధకాన్ని చిమ్ముతుంది అంతమాత్రాన విప్లవవాది కాదు .ప్రభుత్వాధికారులతో మర్యాదగా ప్రవర్తిస్తాడు .బెంగాలీ కుటుంబ సంప్రదాయాలు పాటిస్తూఉమ్మడికుటుంబం లో ఉంటూ ఒకే ఒక తుండుగుడ్డ మొలకు చుట్టుకొని ,పాదాలపై పని వాళ్ళు పడిమొక్కుతూ ఉంటె ,ఆయన పాతకుర్చీలో కూర్చుని గంధకం లాంటి రచనలను ముఖం పై చెదరని చిరునవ్వుతో రాసుకు పోతూ ఉంటాడు .’’అని రాసింది .సెక్యూరిటీ డిపాజిట్ సొమ్ము తిరిగి ఇచ్చేయమని కార్మినల్ రెండు సార్లు చెప్పినా క్రాడేక్ తిరస్కరించాడు .అది జుల్మానాగా మారకుండా రెండు సార్లు అడ్డుపడ్డాడు కార్మినల్ . 
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -8-8-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

భారతీ నిరుక్తి .25వ భాగం8.8.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారి నా జీవిత కథ.22వ భాగం.7.8.22

శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారి నా జీవిత కథ.22వ భాగం.7.8.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-17

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-17

  పంజాబ్ లో రైతాంగం భూమిపట్టాల లోటుపాటు చట్టాలవలన లజపతిరాయ్ అజిత్ సింగ్ నాయకత్వాన తీవ్ర ఆందోళనకు దిగారు .వారపత్రిక పంజాబీ ప్రచురణకర్త  ముద్రాపకుడిని జైలు లో పెట్టి బర్మాకు తరలించింది ప్రభుత్వం .ప్రజాతిరుగుబాటును కఠినంగా అణచి వేయాలని ప్రభుత్వం భావించింది .విదేశీ వస్తు విక్రయశాలలవద్ద పోలీసు కాపలా పెట్టింది .తూర్పు బెంగాల్ లెఫ్టినెంట్ గవర్నర్ సర్బాంఫీల్డీ ఫుల్లర్ కఠినాతి కఠినంగా వ్యవహరించాడు .బరిసాల్ జిల్లాలో అశ్వినీకుమార్ ,అశ్వినీకుమార్ దత్తు ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ప్రభుత్వానికి వణుకు పుట్టించారు .స్థానిక వివాద పరిష్కారానికి అశ్వినీకుమార్ దత్ పంచాయితీ కోర్టులను సమర్ధ వంతంగా నిర్వహించాడు .1906 ఏప్రిల్ 14,15తేదీలలో బెంగాల్ రాష్ట్రీయ రాజకీయ మహా సభ జరిగినప్పుడు అక్కడ రక్తం చిందింది.బందేమాతరం నినాదం చేయటానికి అనుమతించలేదు ప్రభుత్వం .అంతకుముందే బందేమాతరం పై నిషేద్ధం ప్రకటించినందువల్ల దాన్ని కొనసాగించలా  వద్దా అనేది సమస్య అయింది .అప్పుడు మోతీలాల్ అమృత బజార్ పత్రికలో ‘’నా శిరస్సు అంత విలువైనదేమీ కాదు వందేమాతరం అనకుండా ఉండలేను .అలానినాదంచేసే సమయంలో పోలీసులు అరెస్ట్ చేయటానికి వస్తే ప్రతిఘతించండి ‘’అని రాశాడు .చివరికి నిషేధపు ఉత్తర్వును శాంతియుతంగానే ధిక్కరించాలని నిర్ణయించారు .

  మహాసభ ప్రతినిధులు శిబిరాలనుంచి బయటికి వచ్చి సభకు హాజరవటానికి వందేమాతరం అంటూ వెడుతుంటే పోలీస్ సూపరిం టే౦డెంట్ అతనిబలగాలు లాఠీలతో ప్రజలపై విరుచుకు పడ్డారు .సురెంద్రనాద్ మోతీలాల్ అశ్వినీకుమార్ లు ముందుకు వచ్చి కావాలంటే తమల్ని అరెస్ట్ చేయమన్నారు .కానీ సురెంద్రనాథ నుమాత్రమే అరెస్ట్ చేసి ,మేజిష్ట్రేట్ ఇంటికి తీసుకుపొగా ఆయన నాలుగు వందల రూపాయలు జరిమానా విధించాడు .ఆ ఫైన్ చెల్లించి మళ్ళీ వందేమాతరం నినాదాలతో రెట్టింపు ఉత్సాహం తో ప్రజలు ఆయనను సభాస్థలికి ఊరేగింపుగా తీసుకు వెళ్ళారు .కలకత్తా ప్రముఖ న్యాయవాది అబ్దుల్ రసూల్ అధ్యక్షోపన్యాసమిచ్చాడు .మోతీలాల్ ఆ సభలో ఒక కీలక తీర్మానం ప్రవేశ పెట్టాడు అందులో సారాంశం –‘’తూర్పు బెంగాల్ ,అస్సాం లలో దేశభక్తులైన కార్యకర్తలపై ప్రభుత్వం రాక్షసంగా ప్రవర్తిస్తోంది .న్యాయబద్ధమైన చట్టబద్ధమైన పరిపాలన ఏనాడో అంతరించింది .ఈబాధ్యతా రహిత ప్రభుత్వంతో ఎలాంటి చార్చాలు జరపము .ప్రజలస్వయం కృషివలన పరిష్కరించదగిన అంశాలే చర్చిస్తాము ‘’

  15ఏళ్ళ తర్వాత గాంధీ అహింసావిధానం లో సహాయనిరాకరణ శాసనోల్లంఘన చేయాలని పిలుపునిచ్చాడు .అప్పట్లో ఆంగ్లో ఇండియన్ ల అభిప్రాయాలను చాటే స్టేట్స్ మాన్ పత్రిక ‘’1906లోనే బెంగాల్ లోని బరిసాలాలో మొదటిసారి శాసనోల్లంఘన మోతీలాల్ ఘోష్ నాయకత్వాన జరిగింది .గాంధీ సహాయ నిరాకరణ మంత్రం కూడా మోతీలాల్ సూచిన్చిందే .చరఖాపై నూలు వడకటం కూడా మోతీలాల్ చెప్పిందే .ఆయన కృషి సత్ఫలితాన్నిచ్చి భాద్రాలోక్ కుటుంబాలలో వేలాది చరఖాలు వెలిశాయి .కానీ విభజన ఆందోళన కారులు దీని ప్రాముఖ్యాన్ని గుర్తించలేక పోయారు .’’అని రాసి మోతీలాల్ దూర దృష్టి మార్గ నిర్దేశనం ను శ్లాఘించింది .

  కర్జన్ తర్వాత వచ్చిన మింటో  ప్రజలపై మరింత కఠినంగా ప్రవర్తిస్తూ కలకత్తాలో వందే మాతరం అని అరచిన 15ఏళ్ళబాలుడికి 16కొరడా దెబ్బలు శిక్ష వేశాడు .ఈ కేసు విచారించి,తీర్పు చెప్పిన మేజిష్ట్రేట్ కింగ్ ఫోర్ట్ పై పగ తీర్చుకొంటామని విప్లవకారులు ప్రతిజ్ఞ చేయాగా ఆయన్ను ముజఫర్ పూర్  కు ట్రాన్సఫర్ చేశారు .అతన్ని చంపటానికి ఖుదీరాం బోస్ ,ఫ్రఫుల్ల చక్కీ లకు బా౦బులిచ్చి పంపారు .వీరు వేసిన బా౦బులలో మేజిష్ట్రేట్ కాక ఇద్దరు యూరోపియన్లు చనిపోయారు .బెంగాల్ లెఫ్టినెంట్ జనరల్ ఆండ్రూ ఫైజర్ పైకూడా రెండు సార్లు బాంబు దాడి జరిపారు .కానీ వెంట్రుకవాసిలో తప్పించుకోగలిగారు .ఒక బాంబుదాడిలో ఢాకాడిష్ట్రిక్ట్ మేజిష్ట్రేట్ ‘అలెన్ ‘’చనిపోయాడు .చివరికి చిక్కీ ఒక బెంగాల్ పోలీసాఫీసర్ కు చిక్కగా ఆత్మహత్య చేసుకొన్నాడు  . తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్ ను విప్లవకారులు చంపేశారు .కలకత్తా శివార్లలోని ‘’మానికాల్ గార్డెన్ ‘’లో ఉన్న చిన్న ఆయుధ శాలలపై పోలీసులు దాడి చేయగా అరవి౦దఘోష్ తమ్ముడు వీరేంద్ర ఘోష్ తో సహా అనేకమంది విప్లవకారులు అరెస్ట్ అయ్యారు .వారిలో చాలామందికి యావజ్జీవ కారాగార వాస శిక్ష విధించారు .అరవి౦దోను కూడా ఖైదు చేసి విచారించి ఏ ఆధారం దొరకక నెల తర్వాత విడుదల చేశారు .

  విప్లవకారులు ఇంగ్లాండ్ ,ఫ్రాన్స్ ,అమెరికాల లో కూడా విప్లవ కేంద్రాలు స్థాపించారు .అక్కడి నుంచే బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నాలు సాగించారు .వీరిలో శ్యాం జీ కృష్ణవర్మ ,మేడంఎస్ ఆర్ రాణా,వీరేంద్రనాధ చటోపాధ్యాయ ,తారాకాంత దాస్ ,బేడీ సావర్కార్ ,,లాల్ హరిదయాల్  లు ముఖ్యులు .వీరంతా పత్రికలద్వారా ప్రచారం చేశారు .అక్కడి భారతీయ విద్యార్ధులను సమీకరించి ప్రబోధం కలిగించారు .లండన్ లో జరుగుతున్న ఒక సమావేశం లో విదేశాంగమంత్రి కార్యదర్శి సర్ కర్జన్ వైల్  ను మదన్ లాల్ ధింగ్రా కాల్చి చంపాడు .అతన్ని ప్రభుత్వం ఉరి తీసింది .కలకత్తా ఆలీపూర్ జైలు లో ఒక రాజకీయ కేసులో అరెస్ట్ అయి విచారణలో ఉన్న సత్యన్ బోస్ మాణిక్ లాల్ కేసు లో అప్రూవర్ గా మారిన నిందితుడు నరేంద్ర గోస్వామిని కాల్చి చంపాడు .ఈ కేసు విచారిస్తున్న పోలీస్ అధికారినీ ప్రాసిక్యూషన్ న్యాయవాదినీ బూటారంగా కోర్ట్ లో కాల్చి చంపారు .టెర్రరిస్ట్ విజ్రు౦భణకు పత్రికా స్వేచ్చముఖ్యకారణం అన్నాడు మింటో .1910లో పత్రికా చట్టం తెచ్ఛి అంక్షలు విధించాడు .నిషేద్ధిత వార్త ప్రచురిస్తే పత్రిక ఐదువేలు ఫైన్ కట్టాలని రూల్ పెట్టాడు .

  మోతీలాల్ కు ,పత్రికకు ఎప్పుడూ ఏదో ఒక హెచ్చరిక  అందుతూనే ఉంది .ప్రజలను భయభ్రాంతులను చేసి లొంగ తీద్దాం అనుకొన్న మింటో ఆశలు అడియాశలే అయ్యాయి .’’ముందు అణచి వేత తర్వాతే చర్చలు ‘’అనే మింటో విధానాన్ని మేధావి వర్గం తిరస్కరించింది .తర్వాతవచ్చిన మోర్లె,లార్డ్ క్రేవీ లవలన కూడా ఏమీకాలేదు .మింటో మార్లే సంస్కరణలను ముస్లిం లు మాత్రమె సమర్ధించారు .1911లోబెంగాల్ విభజన రద్దు అవగానే ముస్లిం లకు అసంతృప్తి పెరిగింది .1902లో బోయర్లు స్వాతంత్ర్యం సాదించుకొన్నారు .1905లో చిన్న దేశం జపాన్ రష్యా జార్ ప్రభువుల అహంకారానికి దెబ్బకొట్టింది .1912 డిసెంబర్ లో వైస్రాయ్ లార్డ్ హార్డింగ్ ను నడి రోడ్డుమీద హత్య చేయటానికి జరిగిన ప్రయత్నం లో అప్పటిదాకా నివురుకప్పిన నిప్పులాగా ఉన్న జ్వాల ఒక్కసారి ఎగసి పడింది .మోతీలాల్ అహింసను ,ప్రజోద్యమాన్నే బలపరచాడు .గాంధీ యుగం ఆరంభించటానికి ముందే మేధావులలో ముఖ్యులైన రవీంద్రుడు ,మోతీలాల్ ఘోష్ జాతికోసం ప్రాణాలు త్యజించి పోరాడిన వీరుల చిత్త శుద్ధినీ ,ఔన్నత్యాన్నీ కొనియాడారు .

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-8-22-ఉయ్యూరు   

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

భారతీ నిరుక్తి 24వ భాగం.

భారతీ నిరుక్తి 24వ భాగం.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-16

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-16

 స్వదేశీ ఉద్యమం

బెంగాల్ విభజన వలన కనీ వినీ ఎరుగని రీతిలో ఉద్యమం రూపు దాల్చింది .స్వదేశీ వస్తువులను ముఖ్యంగా వస్త్రాలనే వాడాలనే సంకల్పం బలీయమైంది .ఇదే ‘’వందేమాతరం ‘’ఉద్యమంగారూపు దాల్చి,ప్రజల నరనరానా జీర్ణించుకు పోయింది .1906లో కలకత్తా కాంగ్రెస్ లో తిలక్ ‘’శిస్తులు ,పన్ను వసూళ్లు చేయం ..మనడబ్బుతో ప్రభుత్వం ఎక్కడెక్కడో చేసే యుద్ధాలలో సహకరించం .న్యాయస్థానాలలోకూడా సహకరించం .మనల్ని విచారించటానానికి మనమే స్వతంత్ర న్యాయస్థానాలు నిర్వహిస్తాం .కాలం కలిసివస్తే మనం పన్నులే కట్టాల్సి న పని ఉండకపోవచ్చు .సమైక్యతతో దీన్ని సాధించగలిగితే మనం సర్వ స్వతంత్రులం ‘అని ఉద్బోధించాడు .ఇంతకుముందు ఏడాదిన్నర క్రితం మోతీలాల్ ఘోష్ ప్రవచించిన మాటలు గుర్తుకు తెచ్చుకొందాం –‘’ఆరుకోట్ల బెంగాలీలను కర్జన్ బంగాళాఖాతం లో మున్చేశాడుకర్కశపాలనలో .మన డబ్బూ దస్కం తో మేపబడుతున్న 72వేల మంది బ్రిటిష్ సైనికుల్ని అండగా చేసుకొని ఈ దారుణం చేశాడు .కోల్పోయిన శక్తియుక్తుల్ని కూడా తీసుకొని స్వజాతి రక్తాన్ని ధారపోయని జాతి ప్రపంచం లో లేదు .అమెరికన్లు ఇంగ్లాండ్ ప్రజలు ఇలా త్యాగాలు చేసిన జాతి అని మర్చిపోరాదు ‘’నీలి విత్తనాలను మళ్ళీ ఈ చేతులు ముట్టవు ‘’అని శపథం చేసి మన రైతాంగం మాట నిలబెట్టుకొన్నారు అలానే బెంగాల్ విభజన వద్దు అనే వారంతా ‘’ఈ చేతులతో విదేశీ వస్తువులు మళ్ళీ ముట్టుకోము ‘అని శపథం చేసి ,నెరవేర్చుకోవాలి .16-10-1905న విభాజిత రాష్ట్రాల ప్రారంభోత్సవం జరిగినప్పుడు మోతీలాల్ అమృత బజార్ పత్రికలో ఇలా రాశాడు –‘’భారతీయులు పశువులమందలేకానీ మానవ మాత్రులు కాదు అని పరాయిపాలకులు భావిస్తున్నారు .బెంగాలీలకు తగిలిన ఈ కొరడా దెబ్బ మంచిదే అయింది .లేకపోతె దీర్ఘనిద్ర నుంచి అంతత్వరగా మేలుకొనే వారుకాదేమో .కర్జన్ హేయమయిన చర్యలవలన తలెత్తిన స్వదేశీ ఉద్యమం సక్రమమార్గం లో నడిస్తే మృతప్రాయమైన దేశానికి మళ్ళీ జవసత్వాలు కలుగుతాయి .మనం ఈ ఉద్యమానికి ఎంతో రుణపడి ఉన్నాం ‘’అని ఎలుగెత్తి చాటాడు .

  1906తర్వాత అయిదవ జార్జి వేల్స్ ప్రభువు కలకత్తావస్తే అమృతబజార్ పత్రిక,దిబెంగాలీ,ఉగ్రవాది ఎస్ కే రాడ్క్లిఫ్ సంపాదకత్వంలో వెలువడే ది స్టేట్స్ మన్ అనే పత్రికలను రాజుకంటపడకుండా బ్రిటిష్ అధికారులు నానా తంటా పడ్డారు .కానీ రాజు ఆంతరంగిక కార్యదర్శి ,మోతీలాల్ స్నేహితుడు సర్ వాల్టర్ లారెన్స్ అమృతబజార్ పత్రికలూ కొన్నిటిని సేకరించి చూపించాడు యువరాజుకు .లారెన్స్ పిలవనంపితే మోతీలాల్ సంప్రదాయమైన ఖద్దరు పంచ చొక్కాధరించి గవర్నర్ హౌస్ కు వెళ్ళాడు .’’యువరాజు ను చూడాలని ఉందా ?’’అని వెళ్ళగానే లారెన్స్ అడిగితె ,చూడకపోతే మర్యాదగా ఉండదేమో అనుకోని సరే అంటే .లోపలి తీసుకు వెళ్ళాడు .వాళ్ళిద్దరూ ఏయే విషయాలు మాట్లాడుకోన్నారో అవన్నీ మోతీలాల్ చాలాకాలం తర్వాత పత్రికలో ఇలా రాశాడు –‘’యువరాజు షేక్ హాండ్ ఇవ్వటానికి చేయి చాచగా ,భవిష్యత్తులో రాజుకాబోతున్న ఆయన ను భారతేయులు గౌరవించే పధ్ధతి అదికాదని చెప్పి ముకుళితహస్తాలతో నమస్కరించాను . గద్గదస్వరంతో ఇలా విన్న వించాను –‘’  మీ పరిచయాన్నికలిగిన్చినందుకు ధన్యవాదాలు ,ఇది గౌరవంగా భావించి కలకాలం మనసులో  భద్రపరచుకొంటాను .నిరుపేద ఇండియాదయనీయ పరిస్థితి వివరించటానికి అనుమతించండి .మా భవిష్యత్ పాలకులు మీరేకనుక మీ చేతులతో మా దేశస్థితిని చక్క దిద్దండి .భారతీయులని మరవకండి .ఇంగ్లాండ్ లోని నాలుగుకోట్ల ఆంగ్లేయుల్లాగానే ,భారతీయుల్నికూడా మీ స్వజనం గా భావించండి .మాకు మా పాలకుల దయాదాక్షిణ్యాలు శ్రద్ధాసక్తులు చాలా అవసరం ‘’అన్నాడు మోతీలాల్ ఆ మాటలకు యువరాజు కరిగిపోయినట్లు కనిపించాడు .చాలా ఆప్యాయంగా మోతీలాల్ ను లేచి నిలబడమని కోరి ,ఆత్మీయత ధ్వనించే కంపిత స్వరంతో ‘’మిమ్మల్ని కలుసుకోవటం నాకెంతో సంతృప్తినిచ్చింది .నిజంగానే నేను భారతీయులను మరువనే మరువను అని మీద్వారా మాట ఇస్తున్నాను .నా స్మృతిపధం లో భారతీయులు ఎప్పుడూ నిలిచే ఉంటారు .మీరు మాకు చూపిన స్వాగత సత్కారాలను మా తండ్రిగారికి నివేద్దిస్తాను .ఎంతో ఆత్మీయతా భావంతో మీ దేశం నుంచి తిరిగి వెడుతున్నాను ‘’అన్నాడు యువరాజు .ఇంగ్లాండ్ వెళ్ళిన వెంటనే తండ్రికి ఈ విషయాలన్నీ చెప్పాడు.భారతీయుల విధేయత మరింత పొందగలిగితే ,ఆదేశ పాలనాభారం మరింతసులువుగా ఉంటుందని అక్కడి ప్రభుత్వానికి నివేదించాడు .1911లో ఆయన బ్రిటిష్ సింహాసనాన్ని అధిష్టించాక బెంగాల్ ను పునరేకీకరించాలని సూచన చేసినట్లు తెలిసింది .11-12-1911న ఢిల్లీ లోని రాజదర్బార్ లో ఈ పునరేకీకరణ సంకల్ప ప్రకటన జారీ అయింది .మోతీలాల్ ఘోష్ ,యువరాజు దీన్ని అత్య౦త రహస్యంగా ఉ౦చాలనుకొని రహస్యాన్ని కాపాడారు .1910లో మోతీలాల్ ఘోష్ ను అరెస్ట్ చేసే పధకాన్ని అత్యంత నాటకీయంగా చేబట్టకపోవటానికి ఇదే కారణం .

  బెంగాల్ లో స్వదేశీ ఉద్యమ సారదులలో మోతీలాల్ ఘోష్ ఒకరన్న సంగతి మర్చిపోలేము .అనేక బృందాలు సమితులు ఊరూరా ఉద్యమవ్యాప్తికోసం తీవ్ర కృషి జరిపారు .స్వతంత్ర ఉద్యమానకి వీరంతా వాలంటీర్లుగా సాయపడ్డారు .అరవిందులు మోతీలాల్ కు అత్య౦త  సన్నిహితులు  .స్వామి వివేకానంద శిష్యురాలు సోదరి నివేదిత వారితో అందరికంటే మోతీలాల్ కు ఎక్కువ పరిచయం ఉందికూడా .

  స్వాతంత్ర సాధనకు తిరుగుబాటు పద్ధతులను ప్రోత్సహించే పత్రికలూ కూడా వచ్చాయి .బ్రహ్మబంధం ఉపాధ్యాయ సంపాదకత్వం లో సంధ్య దినపత్రిక ,భూపెంద్రనధ దత్తు సంపాదకత్వం లో జుగ౦తర్ వారపత్రిక ,మనోరంజన్ గుహ ఠాకూర్త గారి నవశక్తి దినపత్రిక ,అరవింద ఘోష్ ‘’బందేమాతరం ‘’పత్రిక గొప్ప ప్రచారం చేశాయి .ఉన్నదున్నట్లు రాసి పత్రికలూ స్వచ్చతను పాటించి గౌరవం పొందాయి .వీటిపై నిరంతరం నిఘా సాగేది .బ్రహ్మబందు తాను కోరుకోన్నట్లే విచారణ ఖైదీగా ఉండగానే చనిపోయాడు .

    సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -6-8-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

19వ శతాబ్ది ఇంగ్లాండ్ సాంఘిక సంస్కర్త ,రచయిత్రి –కరోలిన్ నార్టన్( వ్యాసం)-గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ మహిళా వెబ్ మాసపత్రిక -ఆగస్ట్

ప్రఖ్యాత నవలాకారుడు ధామస్ షెరిడాన్,కరోలిన్ హెన్నెట్టా కాల్లేండర్ లకు లండన్ లో మార్చి 1808 న కరోలిన్ జన్మించింది .తండ్రి గొప్పనటుడు ,సైనికుడు ,కాలని అడ్మి స్ట్రెటర్.ఈయన ,ఐరిష్ రాజకీయవేత్త ,నాటకకర్త రిచార్డ్ బ్రిన్స్క్లి షెరిడాన్ .తల్లి ఎలిజబెత్ ఆన్ లిన్లి నవలారచయిత్రి .1817లో కరోనిన్ తండ్రి దక్షిణాఫ్రికలో కేప్ ఆఫ్ గుడ్ హాప్ లో కాలనీ సెక్రటరిగా ఉంటూ చనిపోయాడు .కుటుంబానికి పెన్నీ కూడా లేకుండా పోయింది .డ్యూక్ ఆఫ్ యార్క అండ్ అల్బని ప్రిన్స్ ఫ్రెడరిక్ కారుణ్యమ తో ఆయన సేవకు వీరికుటు౦బ పోషణకు హామ్టన్ కోర్ట్ పాలస్ లో ఉండేట్లు ఏర్పాటు చేశాడు ‘.షెరిడన్ సిస్టర్స్ లో పెద్దమ్మాయి హెలెన్ గీతరచయిత ,ప్రిన్స్ బ్లాక్ ఉడ్ ను పెళ్ళాడింది .దీనివలన నార్టన్ మొదటి మార్క్వేస్ ఆఫ్ డఫరిన్ అండ్ ఆవా ఫ్రెడరిక్ హామిల్టన్ టెంపుల్ బ్లాక్ వుడ్ కు పిన్ని అయింది .ఈమె తర్వాత కెనడా గవర్నర్ జనరల్ ,ఇండియాకు ఎనిమిదవ వైస్ రాయ్ అయింది .ఈమె చెల్లెలు జార్జియానా డ్యూక్ ఆఫ్ సోమర్సెట్ ను పెళ్లి చేసుకోన్నది ఈ సోదరీ మణి త్రయాన్నివారి అందచందాలకు ‘’త్రీ గ్రేసేస్ ‘’’’సౌందర్య త్రయం ‘అని పిలిచేవారు .

1827లో కరోలిన్ గిల్ఫాడ్ కు చెందిన బారిస్టర్ జార్జి చాపెల్ నార్టన్ ను పెళ్లి చేసుకొన్నది .ఇతడు అసూయాపరుడు, తాగుబోతు .ఆమెను శారీరకంగా మానసికంగా చాలా ఇబ్బంది పెట్టేవాడు .దీనికి తోడు అతడు బారిస్టర్ గా రాణించలేక డబ్బుకు ఇబ్బంది పడేవాడు .డబ్బు విషయంలో ఇద్దరికీ తరచుగా పోట్లాటలు జరిగి దాంపత్యం కలిసి రాలేదు .పెళ్ళైన కొత్తలో ఆమె తన అంద చందాలతో ,రాజకీయంతో విట్ అండ్ హ్యూమర్ తో సంఘంలో ప్రముఖ ‘’హోస్టెస్ ‘’అంటే ఆతిధేయురాలిగా ఉండేది .ఆమె అనాచార జీవితం ,దాపరికం లేని సంభాషణలు 19వ శతాబ్ది ఇంగ్లీష్ ఉన్నతకుటుంబాలకు నచ్చలేదు .ఆమెకు అభిమానులు ,వ్యతిరేకులు సరిసమానంగా ఉండేవారు .ఆమె స్నేహితులలో ప్రముఖ రాజకీయవేత్తలు రచయితలూ ఉండేవారు వారిలో శామ్యూల్ రోజేర్స్ ,ఎడ్వర్డ్ బుల్వేర్ లిట్టేన్, ఎడ్వర్డ్ ట్రేలాని,అబ్రహామ్ హావర్డ్ ,మేరీ షెల్లీ ,ఫాన్ని కెం బుల్ బె౦జమిన్ ,భవిషత్తులో బెల్జియం కింగ్ 1వ లియోపార్డ్ అయిన డిజ్రేలి,ఆరవ డ్యూక్ ఆఫ్ డెవాన్ షైర్ విలియం కేవండిష్ ముఖ్యులు .తర్వాత ఆమె టోల్ పుడిల్ మేరీస్ ప్రొటెస్ట్ మార్చ్ లో 1834లో పాల్గొన్నదికూడా .

అసూయాపరుడైనా, ఆమె భర్తను తన ప్రతిభా చాకచక్యాలతో 1831లో మెట్రోపాలిటన్ పోలీస్ మేజిష్ట్రేట్ అవటానికి సాయం చేసింది .ఆకాలంలో తనలోని భావోద్రేకాలను అదుపు చేసుకోవటానికి జీవితం గడవటానికి కవిత్వం రాసింది ,వచన రచనలు చేసింది .1829లో ‘’దిసారోస్ ఆఫ్ రోసాలే ‘’రాసి ప్రచురించి ప్రఖ్యాతి పొందింది .1830లో ‘’ది అన్ డయింగ్ వన్’’అనే రోమాన్స్ విషయంరాసింది .1832నుంచి 37 వరకు ‘’ది కోర్ట్ మేగజైన్ అండ్ బెల్లీ అసెంబ్లీ ‘’,కు సంపాదకురాలు గా ఉంది .రాబర్ట్ సూదీ తర్వాత ఆస్థానకవిగా సర్ రాబర్ట్ పీల్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్ వేసింది, కాని ఫలించలేదు .

1836 లో భర్తనుండి వేరుపడి ,తన రచనలతో వచ్చినడబ్బుతో గడిపింది .ఆడబ్బుపైనా తనకే హక్కు ఉందని భర్త కోర్టులో వేసి గెలిచాడు .భర్తనుంచి భరణం రాకపోగా ,ఆమె సంపాదన అతని హక్కుభుక్తమైంది . చట్టాన్ని నార్టన్ బాగా ఉపయోగించి అప్పులవాళ్ళను వసూళ్ల కోసం భర్తపై కేసులు వేసేట్లు చేసింది .భర్తనుంచి విడిపోయిన కొద్దికాలానికే భర్త వాళ్ళ ముగ్గురు కొడుకుల్ని స్కాట్ లాండ్ లో తర్వాత యార్క్ షైర్ లో ఆమెకు తెలీకుండా చెప్పకుండా దాచేసి ఆమె పైనే కేసుపెట్టాడు .అంతేకాక ఆమెకు తన ముఖ్య స్నేహితుడు విగ్ ప్రైం మినిస్టర్ అయిన లార్డ్ మెల్ బోర్న్ తో అక్రమ సంబంధం ఉందని ,మొదట్లో అతడి నుంచి 10వేలపౌండ్లు ఇమ్మని బెదిరించాడు . .అతడు తిరస్కరించగా ప్రధానిఅయిన మెల్ బోర్న్ ను కోర్టు కీడ్చాడు .తొమ్మిది రోజుల విచారణ తర్వాత జడ్జి మెల్ బోర్న్ ను సమర్ధించి జార్జి పిటీషన్ తిరస్కరించి౦ది కాని,ప్రభుత్వం పరువు ధేమ్స్ నదిలో కలిసింది .ఆమెకు విడాకులివ్వనూలేదు ,పిల్లల్ని చూపించనూలేదు భర్త .1836చట్టం ప్రకారం సంతానంతండ్రికే చెందుతుంది .

1842లో ఆమె చిన్నకొడుకు గుర్రం స్వారీ చేస్తూ కిందపడి గాయాలై సరైన వైద్యం అందక చనిపోవటంతో గోరు చుట్టుపై రోకలి పోటు ఆయనది కరోలిన్ జీవితం .కుర్రాడిచావుకు కారణం తండ్రి అని ఆమె అతడిని నిలదీసింది .అప్పటినుంచి మిగిలిన ఇద్దరు పిల్లల్ని చూసి వెళ్ళటానికి అతడు అనుమతించాడు .కాని నిఘా పెట్టేవాడు .కుటుంబ జీవితం లో శాంతి సుఖాలు లేకపోవటంతో ఆమె ,తనలాగా స్త్రీ సమాజం మగాడిక్రూరత్వాలకు బలికారాదని స్త్రీ హక్కులకోసం దృష్టి సారించింది .ముఖ్యంగా వివాహమైన , విడాకులు పొందిన మహిళల హక్కులకోసం పోరాడింది .1836లో ఆమె రాసిన ‘’ఎ వాయిస్ ఫ్రం ది ఫాక్టరీస్’’ ,1845లో రాసిన ’దిచైల్డ్ ఆఫ్ ది ఐలాండ్స్ ‘’కవితా సంపుటులలో ఆమెకున్న రాజకీయ ప్రజ్ఞా,సాంఘిక సేవా తత్పరత మహిళలకు హక్కులకోసం తపన కనిపిస్తుంది .1855లో పార్లమెంట్ లో ‘’విడాకుల సంస్కరణ ‘’పై చర్చ జరుగుతున్నప్పుడు నార్టన్ సభ్యులకు తన జీవిత గాధను ,అనుభవించిన అవమానాలు కష్టాలను వారికి వ్రాతపూర్వకంగాతెలిపి ,మహిళలకు న్యాయం చేయమని కోరింది .ఆమె వారికి అందించిన సమాచారంలో ‘’ఇంగ్లీష్ భార్య భర్త ఇల్లు వదిలి పెట్టలేదు.ఆమెబందువుల దగ్గరకాని స్నేహితుల ఇంట్లో కానిఉంటే భర్తవచ్చిబలవంతంగా తీసుకుపోతాడు .భర్త విడాకులు కోరితే మొదటగా భార్య అభీష్టం తెలుసుకోవటం లేదు .ఆమెకు ప్లీడర్ ను పెట్టుకొని వాదించేహక్కు కాని ఆమెను పార్టీ గా చేర్చటం లేదు .భార్య తప్పు చేస్తే భర్త ఆమెకు విడాకులిచ్చి మళ్ళీ పెళ్లి చేసుకొంటాడు ,కానీ భార్యకు అలాంటి హక్కులేదు. వాడు ఎంతటి క్రూరుడు దుర్మార్గుడు తాగుబోతు వ్యభిచారి అయినా .కని పెంచి తమ ఆశలన్నీ వాళ్ళపైనే పెట్టుకొని బతికే తల్లికి పిల్లలను చూసుకొనే హక్కు ఉండటం లేదు దీనికి నాజీవితమే ఒక పెద్ద ఉదాహరణ .ఆతల్లి మనోవేదన ఎవరికీ పట్టటం లేదు ‘’అని వివరంగా రాసి పార్లమెంట్ సభ్యుల దృష్టికి తెచ్చి మహిళలకు మహోపకారం చేసింది .‘’.

స్త్రీ హక్కులకోసం నార్టన్ ఉద్యమించింది .విక్టోరియామహారాణి కి ఈ పరిస్థితులు తెలియజేస్తూ ఉత్తరం రాసింది .ఆమె కృషి ఫలితంగా ‘’ దికస్టడిఆఫ్ ఇంఫన్ట్స్ యాక్ట్ ,మాట్రిమోనియల్ కాజెస్ యాక్ట్ ,మారీడ్ వుమెన్స్ ప్రాపర్టి యాక్ట్ లను పార్లమెంట్ ఆమోదించి పాస్ చేసి అమలు పరచింది . ఓటు హక్కు ఉద్యమకారిణి బార్బరా బ్రాడికాన్ తో కలిసి ఆమె పనిచేసింది.వీటివలన పెళ్లి అయిన స్త్రీలకూ పిల్లలపై హక్కు ,విడాకుల సరళీకరణ ,ఆస్తిహక్కు సమకూడాయి .

1849చిత్రకారుడు డేనియల్ మక్లైస్ ఆమె చిత్రాన్ని అత్యద్భుతంగా చిత్రించి ‘’జస్టిస్ ‘’అని పేరుపెట్టాడు హౌస్ ఆఫ్ లార్డ్స్ లో .ఆమెను అనేక హింసలకు ,అన్యాయాలకు గురైన బాధితురాలు అన్నాడు .లార్డ్ మెల్బోర్న్ మాత్రం ఆమె సాధించిన సంస్కరణలను వ్యతిరేకిస్తే క్వీన్ విక్టోరియా అతడిని దూషించింది .నార్టన్ 19వ శతాబ్దిలో స్త్రీవోటుహక్కు విషయమై పెద్దగ ఆసక్తి చూపలేదు .1838లో’’ దిటైమ్స్’’పత్రిక ఆమెను రాడికల్ అంది .దీనికి ఆమె ‘’ “The natural position of woman is inferiority to man. Amen! That is a thing of God’s appointing, not of man’s devising. I believe it sincerely, as part of my religion. I never pretended to the wild and ridiculous doctrine of equality. అని సమాధానం చెప్పింది .

1875లో నార్టన్ చనిపోయాక ఆమె కస్టాలు గట్టెక్కాయి .పాత స్నేహితుడు ,రాజకీయవేత్త చారిత్రకరచయిత సర్ స్టెర్లింగ్ మాక్స్ వెల్ ను పెళ్లిచేసుకొన్నది .ఆమె పెద్దకొడుకు టిబి తో చనిపోయాడు .రెండవవాడు తరచూ అనారోగ్యంతో ఆమె దగ్గరే ఉండేవాడు .అతనికొడుకు జాన్ ఎస్టేట్ కు వారసుడయ్యాడు .17-6-1877న కరోలిన్ నార్టన్ 69వ ఏట లండన్ లో చనిపోయింది .ఏప్రిల్ 2021లో ‘’ఇంగ్లీష్ హెరిటేజ్ ‘’ నార్టన్ ను’’ బ్లూ ప్లేక్ ‘’ గౌరవంతో ఆరుగురితోపాటు గౌరవించింది .30ఏళ్ళు సెంట్రల్ లండన్ లో ఆమె ఉన్న ఇంటిని స్మృతి చిహ్నం చేశారు .

కరోలిన్ నార్టన్-దిసారోస్ ఆఫ్ రోసేల్లా ,ఐ డునాట్ లవ్ దీ,దికోల్డ్ చేంజ్ ,దిఅన్డైయింగ్ వన్ అండ్ అదర్ పోయెమ్స్ ,దిఫైత్త్ లెస్ నైట్(knight ) ,దిడ్రీం అండ్ అదర్ పోయెమ్స్ ,దిచైల్డ్ ఆఫ్ దిఐలాండ్స్ ,మొదలైన 11కవితా సంపుటులు ,దిడాన్డిల్స్ రూట్ ,దివైఫ్ అండ్ వుమెన్స్ రివార్డ్ ,లాస్ట్ అండ్ సేవ్డ్ మొదలైన 5నవలలు ,’’దిజిప్సీ ఫాదర్ ,వాతేక్ అనే నాటకాలు,ఎవాయిస్ ఫ్రం దిఫాక్టరీస్ ,సేపరేషన్ ఆఫ్ మదర్ అండ్ చైల్డ్ ,ఎ ప్లేన్ లెటర్ టు దిలార్డ్ చాన్సెలర్ ,లెటర్స్ టుదిమాబ్ ,ఇంగ్లిష్ లాస్ ఫర్ దినైన్ టీంత్ సెంచరి ,లెటర్ టు దిక్వీన్ ,ఎ రివ్యు ఆఫ్ దిడైవోర్స్ బిల్ ఆఫ్ 1856 అనే రాజకీయ కరపత్రాలు అంటే పా౦ఫ్లేట్స్’’రాసింది .

-గబ్బిట దుర్గాప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారి నా జీవిత కథ 21వ భాగం.2.8.22 గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు

Video link

Video link

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -310

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -310

·         310-‘’‘నా షోలాపూర్ చెప్పులు పెళ్ళిలో పోయాయి ‘’పాటతో జంధ్యాల సినిమాలో కనిపించి విశ్వనాద్ గారి శంకరాభరణం లో ‘హలో మై డియర్ శంకర శాస్త్రి ‘తోనూ సప్తపది లో’’గోవుల్లు తెల్లన గోపన్న నల్లన’’ పాటలతో తన ప్రత్యేకత చూపి,జీవనసాఫల్య పురస్కారం పొంది,ఇప్పటికీ స్వంత ఆర్కేష్ట్రా తో  ప్రదర్శనలిస్తున్న  80ఏళ్ళ రాజమండ్రి లాయర్,రాజమండ్రి ‘’కిషోర్ కుమార్ ‘’ –జిత్ మోహన మిత్ర 

·          ‘నా షోలాపూర్‌ చెప్పులు పెళ్లిలో పోయాయి..అవి కొత్తవి.. మెత్తవి.. కాలికి హత్తుకు పోయేవి’ అంటూ నాలుగు దశాబ్దాల క్రితం నాటి ఈ పాట నేటికీ సజీవంగానే ఉంటుంది. ఉర్రూతలూగిస్తుంది.. 1981లో విడుదలైన ముద్దమందారం సినిమాలోని ఈ పాట నాడు కుర్రకారు నోట జోరుగా వినిపించేది. రాజమహేంద్రవరానికి చెందిన జిత్‌మోహన్‌ మిత్ర పాడిన ఈ పాట ఆయనకు ఓ బ్రాండ్‌ ఇమేజి తెచ్చిపెట్టింది. ఇప్పటికీ ఈ నటగాయకునిలో ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. 52 ఏళ్ల క్రితం ఈయన సారథ్యంలో ప్రారంభమైన ఆర్కెస్ట్రా నేటికీ పాటల పల్లకీలో అభిమానులను ఊరేగిస్తూనే ఉంది. వచ్చే నెల 30వ తేదీకి 80 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న ఈ పాటల మాంత్రికుడిని రాజమహేంద్రవరం కిషోర్‌కుమార్‌గా పిలిచేవారు..

  వారసత్వ నేపథ్యం..
జిత్‌మోహన్‌ తండ్రి శ్రీపాద కృష్ణమూర్తి ప్లీడర్‌ గుమాస్తాగా పని చేస్తూ నాటకాల్లో నటించేవారు. ఆయనకు ఐదుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. పెద్ద కుమారుడు పట్టాభి ఆ రోజుల్లోనే సినిమా రంగమంటే చెవికోసుకునే వారు. ఆదుర్తి నిర్మించిన ‘మూగమనసులు’ నుంచి తెరపై గోదావరి కనిపించడం వెనుక పట్టాభి ముద్ర ఎంతో ఉండేది. ఆయన ప్రభావమే జిత్‌మోహన్‌లోనూ కనిపించేది. జిల్లాలో ఏ సినిమా నిర్మించినా తెర వెనుక కీలక పాత్ర పోషించేవారు. ముఖ్యంగా లొకేషన్ల ఎంపికలో దర్శకునికి సహకరించేవారు. దర్శకుడు కె.విశ్వనాథ్‌ మొదలుకొని అందరూ రాజమహేంహేంద్రవరం రాగానే ఈయన్ను సంప్రదించేవారంటే అతిశయోక్తి కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే  నగరంలో సినిమాలకు కేరాఫ్‌గా గుర్తింపు పొందారు.
ఆయన నోట.. కిషోర్‌కుమార్‌ పాట
జిత్‌మోహన్‌ మిత్రకు పాటలంటే విపరీతమైన ఇష్టం. హిందీలో పాడే కిషోర్‌కుమార్‌ అంటే ప్రాణం. అందుకే చిన్నప్పటి నుంచీ ఆయన పాటలే ఎక్కువగా పాడేవారు. ఈ ఉత్సాహమే ఆయనను 1970లో ఓ ఆర్కెస్ట్రా పెట్టేలా చేసింది. నాటి నుంచి ఇప్పటి వరకూ ఆయన నేతృత్వంలోని ఆర్కెస్ట్రా రాష్ట్రంలోని అన్నిచోట్లా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఆర్కెస్ట్రాలో ఈయన పాటల జోష్‌ చూసిన దర్శకుడు జంధ్యాల తన ముద్దమందారం సినిమాలో అవకాశమిచ్చారు. అందులో ఈయన పాడిన ‘షోలాపూర్‌ చెప్పులు పెళ్లిలో పోయాయి’ పాట సూపర్‌ హిట్‌ అయింది. ఎక్కడ పెళ్లిళ్లయినా ఆర్కెస్ట్రాలో  ఈ పాట తప్పనిసరిగా వినిపించేది.
తాను ప్రాణం కన్నా మిన్నగా భావించే కిషోర్‌కుమార్‌ను కలవా లని 1979లో ముంబయి వెళ్లారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఆర్‌డీ బర్మన్‌ ఆధ్వర్యంలో సినిమా పాటల రికార్డింగ్‌ చేస్తున్న సమయంలో దీర్ఘ నిరీక్షణ తర్వాత కిషోర్‌ను కలిశారు. తాను రాజమహేంద్రవరం నుంచి వచ్చానని చెప్పారు. ఆ ఊరెక్కడుందని కిషోర్‌ అడిగారు. వహీదా రహమాన్,  జరీనా వహాబ్, జయప్రదల ఊరు అదేనని చెప్పడంతో ఆశ్చర్యపోయారు. కిషోర్‌కుమార్‌ పాడిన పంటూస్‌ సినిమా లోని ఓ పాట పాడి వినిపించడంతో అచ్చం తనలాగే పాడుతున్నావంటూ ఆయన అభినందించడం నేటికీ తనకు సంతోషం కలిగిస్తుందంటారు జిత్‌.

అభిరుచి.. ఉత్సాహం
వయసు పెరిగినా ఆయనలో పాట ఉత్సాహం ఏమాత్రం సన్నగిల్లలేదు. ఆ గొంతులోనూ తేడా కనిపించదంటారు అభిమానులు. ఇప్పటికీ ఆర్కెస్ట్రా ద్వారా వేదికలపై గళం వినిపించడంలోనే ఆనందపడుతుంటారు. సంపాదన యావ ఏమాత్రం లేదు. కేవలం అభిరుచి మాత్రమే. అదే ముందుకు నడిపిస్తోంది. ‘2005లో జరిగిన మా ఆర్కెస్ట్రా స్వర్ణోత్స వాల వేడుకకు విశ్వనాథ్‌లాంటి రావడం ఎప్పటికీ మరువను. ఇప్పటి వరకూ 6 వేల ఆర్కెస్ట్రాలు ప్రదర్శించాం’ అని జిత్‌మోహన్‌మిత్ర చెప్పారు.

తెర మీద..
న్యాయవాదిగా ఉంటూ, ఓపక్క ఆర్కెస్ట్రా నడుపుతూ, మరోపక్క సినిమాల నిర్మాణానికి తెరవెనుక పాత్ర పోషించే జిత్‌మోహన్‌ తెరముందుకు కూడా వచ్చారు. చిన్న పాత్రలే అయినా తనకు గుర్తింపు తెచ్చాయంటారాయన. విశ్వనాథ్‌ దర్శకత్వంలోని సప్తపదిలో ‘గోవుల్లు తెల్లన.. గోప య్య నల్లన.. గోధూళి ఎర్రన’ పాటలో ఓ పాప ను (ఆయన కుమార్తె సుబ్బలక్ష్మి) భుజాన ఎత్తు కుని సాగే సన్నివేశంలో కనిపించింది ఈయనే.

మిత్ర తన కుమార్తెతో కలిసి ఆ పాటకు అభినయించారు. బాపు, కె.విశ్వనాథ్, బాలచందర్, జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ వంటి దిగ్గజ దర్శకుల సినిమాల్లో నటించారు. శంకరాభరణం, సప్తపది, ఆనందబైరవి, చంటి, స్వాతికిరణం, సిరివెన్నెల, బొబ్బిలి బ్రహ్మన్న, మేఘసందేశం, సీతారత్నం గారి అబ్బాయి, సర్‌గమ్, సర్‌ సంగమ్‌ వంటి సుమారు 210  సినిమాల్లో నటించారు. రాజమహేంద్రవరం నేపథ్యంలోని 400 సినిమాలకు షూటింగ్‌ స్పాట్ల సహాయకుడిగా ఉన్నారు. ప్రముఖ సినీ నటుడు అలీ తెరంగేట్రం వెనుక కీలక భూమిక మిత్రాదే. జిత్‌ కుమార్తె సుబ్బలక్ష్మి తరువాత కూడా పలు చిత్రాల్లో బాలనటిగా కనిపించింది. 

·    జిత్‌’కు జీవిత సాఫల్య పురస్కారం


రాజమహేంద్రవరం కల్చరల్‌ :


తన స్వరంతో ఆరు దశాబ్దాలుగా అలరిస్తున్న శ్రీపాద జిత్‌ మోహన్‌ మిత్రా జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. గాయకుడిగానే కాక నటుడు, క్రీడాకారుడు, న్యాయవాదిగా సేవలందించిన ఆయనకు నవరస నటసమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి రాజమహేంద్రవరంలోని ఆనం కళాకేంద్రంలో రొటేరియన్‌ పట్టపగలు వెంకటరావు, రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మేయర్‌ పంతం రజనీ శేషసాయి, ఇతర ప్రముఖులు పురస్కారాన్ని అందించారు. ఆరు దశాబ్దాలకు పైగా తన పాటలతో కళాభిమానులను అలరిస్తున్న జిత్‌.. భవిష్యత్‌లో మరిన్ని పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు. ముందుగా జిత్‌ మోహన్‌మిత్రా ఆర్కెస్ట్రా తరఫున గాయకులు సినీ గీతాలను ఆలపించారు. చిన్నారి షైలిక పాత్రో కూచిపూడి నృత్యం అలరించింది. కార్యక్రమంలో మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్, ఏపీఐఐసీ మాజీ చైర్మన్‌ ఎస్‌.శివరామసుబ్రహ్మణ్యం, శ్రీపాద కుమారశర్మ, రుంకాని వెంకటేశ్వరరావు, మధు ఫామ్రా, అశోక్‌ కుమార్‌ జైన్, ఎస్‌బీ చౌదరి, మహ్మద్‌ఖాదర్‌ ఖాన్, గుమ్మడి సమర్పణరావు, బొడ్డు బుల్లెబ్బాయి పాల్గొన్నారు. జిత్‌కు పద్మశ్రీ ఇవ్వాలని పట్టపగలు కోరారు. ఆనం కళాకేంద్రం అద్దెలు తగ్గించాలని పలువురు కోరగా ఈ మేరకు కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపామని గోరంట్ల చెప్పారు. 

  సశేషం

 మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -1-9-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -309

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -309

· 309-పోస్ట్ గ్రాడ్యుయేట్ ,టీచర్ ,గణపతి టివి సీరియల్ ఫేం ,అనంతాపురం సినిమాతో సినీఅరంగేట్ర౦ చేసిన –ఢిల్లీ రాజేశ్వరి

· ల్లీ రాజేశ్వరి తెలుగు సినిమా నటి. ఈమె దేశ రాజధాని ఢిల్లీలో పుట్టి పెరగడం వల్ల ఢిల్లీ రాజేశ్వరిగా సినిమా రంగంలో పిలువబడుతూ ఉంది. స్నాతకోత్తర విద్యను అభ్యసించిన రాజేశ్వరి నృత్యాన్ని అభ్యసించింది. ఈమె తండ్రి మల్లేశ్వరశర్మ, తల్లి హైమవతి. నటిగా మారక ముందు ఈమె అస్సాంలో ఉపాధ్యాయినిగా పనిచేసింది. ఈమె శేషసాయిప్రసాద్‌ను వివాహం చేసుకుని రాజమండ్రి సమీపంలోని కొత్తపేట గ్రామంలో స్థిరపడింది. ఈమెకు ఒక కుమారుడు ఉన్నాడు .

నటిగా
ఈమె మొదట దూరదర్శన్‌లో గణపతి సీరియల్‌లో నటించింది. కృష్ణవంశీ దర్శకత్వంలో వెలువడిన అంతఃపురం సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైంది.

ఈమె నటించిన చిత్రాల జాబితా:

  1. అంతఃపురం
  2. సముద్రం
  3. ఇంద్ర
  4. చిత్రం
  5. నువ్వే కావాలి
  6. ఢీ
  7. ఖుషీ ఖుషీగా
  8. చక్రం
  9. మా ఆయన సుందరయ్య
  10. మంత్ర 2
  11. కలెక్టర్ గారి భార్య
  12. కలవరమాయే మదిలో
  13. ఓనమాలు
  14. ఈ వర్షం సాక్షిగా
  15. ఒక్కడినే
  16. అవును
  17. దండు
  18. కాంట్రాక్ట్
  19. నమో వెంకటేశ
  20. గొడవ
  21. నందీశ్వరుడు
  22. సారొచ్చారు
  23. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
  24. డాన్ శీను
  25. తూనీగ తూనీగ
  26. మాయగాడు
  27. వాడే కావాలి
  28. పరుగు
  29. ధన 51
  30. వెంకీ
  31. ప్రేమాయనమః
  32. వసంతం
  33. నిన్నే ఇష్టపడ్డాను
  34. ఉత్సాహం
  35. నీతో
  36. మౌనమేలనోయి
  37. ఫ్రెండ్స్
  38. ప్రియనేస్తమా
  39. ప్రేమకు స్వాగతం
  40. ఇష్టం
  41. ఆనందం
  42. చెప్పాలని ఉంది
  43. డార్లింగ్ డార్లింగ్ (2001)
  44. రామ్మా! చిలకమ్మా
  45. యువరాజు
  46. పెళ్ళి సంబంధం
  47. అల్లుడుగారు వచ్చారు సరదా ముసలి వేషాలతో అలరిస్తోంది
    సశేషం
    మీ –గబ్బిట దుర్గాప్రసాద్-31-7-22-ఉయ్యూరు
Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -308 • 308-‘’ఏమైందీ వేళ’’లో సినీ అరంగేట్రం చేసి నండీ అవార్డ్ పొంది , తమిళమలయాలలో హీరోయిన్ అయి తల్లిపాత్రలతో రాణిస్తున్న –ప్రగతి

 మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -308

· 308-‘’ఏమైందీ వేళ’’లో సినీ అరంగేట్రం చేసి నండీ అవార్డ్ పొంది , తమిళమలయాలలో హీరోయిన్ అయి తల్లిపాత్రలతో రాణిస్తున్న –ప్రగతి ·

· తెలుగు సినీ నటి.[1] ఎక్కువగా సహాయ పాత్రలలో నటించింది. ఏమైంది ఈవేళ సినిమాలో ఆమె పోషించిన హీరో తల్లి పాత్రకు ఉత్తమ సహాయనటిగా నంది పురస్కారం లభించింది.[2]

జీవితం
ఆమె హైదరాబాదులో పుట్టి పెరిగింది. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయింది. తల్లికి సాయంగా ఉండటం కోసం కార్టూన్ పాత్రలకు గాత్రదానం చేసేది. చెన్నైలో స్థిరపడింది.[3]

కెరీర్
ప్రగతి కాలేజీలో మొదటి సంవత్సరంలో ఉండగా చెన్నైలోని మైసూర్ సిల్క్ ప్యాలెస్ వారి ప్రకటనల్లో కనిపించింది. ఆ ప్రకటన చూసిన తమిళ దర్శకుడు కె.భాగ్యరాజ్ తన సినిమా వీట్ల విశేషంగాలో కథానాయికగా అవకాశం ఇచ్చాడు.[3] రెండు సంవత్సరాల పాటు ఏడు తమిళ సినిమాలు, ఒక మలాయళం సినిమాలో నటించింది. తరువాత వివాహం కావడంతో నటనకు కొద్దిరోజులు విరామం తీసుకుంది. మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ మూడు భాషల్లో టీవీ సీరియళ్ళలో నటించడం మొదలు పెట్టింది.

సినిమాలు
· బాబీ[4]

· నేనుసైతం (2004)

· చిరుత 2007

· నువ్వే నువ్వే

· నువ్వు లేక నేను లేను

· కందిరీగ

· దూకుడు

· డమరుకం

· నిప్పు (2012)

· నా ఇష్టం (2012)

· బాడీగార్డ్

· బద్రీనాథ్

· రేసుగుర్రం

· బృందావనం

· బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం (2010)

· బెంగాల్ టైగర్

· ఏమైంది ఈవేళ

· బ్యాక్‌బెంచ్ స్టూడెంట్ (2013)

· దళం (2013)

· ప్రియతమా నీవచట కుశలమా (2013)[5]

రోమియో (2014)[6]
లక్ష్మీ రావే మా ఇంటికి (2014)[7]
సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ (2015)
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ (2015)
సౌఖ్యం (2015)[8]
కేరింత9
కళ్యాణ వైభోగమే (2016)
శంకర (2016)[10]
ఇంట్లో దెయ్యం నాకేం భయం (2016)[11]
రాధ (2017)
ప్రేమతో మీ కార్తీక్ (2017)
ఓయ్ నిన్నే (2017)
అర్జున్ సురవరం (2019)
90ఎంల్ (2019)
మార్షల్ (2019)
మా వింత గాధ వినుమా (2020)
డిజె టిల్లు (2022)
సూపర్‌ మచ్చి (2022)
ఎఫ్ 3
· చక్కని నవ్వు ముఖం క్షణాలలో మార్చే ముఖకవళికల తో ,అపేక్ష పాత్రలకు జీవం పోస్తున్న ప్రగతి బాగా రాణిస్తోంది .

· సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -29-7-21-ఉయ్యూరు

–image.png

Posted in సినిమా | Tagged | Leave a comment

చెన్నై తెలుగు తల్లి (జనని )కి పాతికేళ్ళు -2(చివరి భాగం )

చెన్నై తెలుగు తల్లి (జనని )కి పాతికేళ్ళు -2(చివరి భాగం )
లక్ష్మీ నారాయణ రెడ్డి ధూర్జటి రచనలలో సమకాలీనతను పసిబిడ్డలస్నానం ,బాలింతతాంబూల సేవనం మొదలైన వాటిలో దర్శించి –‘’తలబంకించిన నూనె- పుక్కిట సదా తామ్బూలమున్ ,నేత్ర క –జ్జలమున్ గంధరకట్టుకొన్న వసపూవుల్ గబ్బి పాలుబ్బు –‘’అంటూ ధూర్జటి దృష్టి ‘’ఎప్పుడూ అక్కడే ఉండే’’ విషయం కూడా గుర్తు చేశారు .బిడ్డ పుట్టాక వాడికి దంతాలువచ్చేదాకా సంయోగం నిషేధం .అలాగే దిష్టి అనే దృష్టి దోషం అప్పటినుంచి వెంటబడుతూనే ఉంది .పంటలకు దిష్టి తగలకుండా ధూర్జటి దిష్టి కుండలు పెట్టించాడు . ఎలిజబెత్ ‘’రఘునాధ రాయలు ‘’పై సమగ్రంగా రాస్తూఆయన కున్న లక్ష్మీ విలాస ,రామ సౌద సభాభవనాలగురించి చెప్పి ,అతడు చాలా రచనలు చేసినట్లు తెలుస్తోందని ,కృష్ణాధ్వరి, వెంకట ముఖి ,దీక్షితుడు,క్షేత్రయ్య చౌడప్ప వంటి కవి రాజ పోషకుడని ,అతని సంగీత సుధ ఆయన సంగీత నిధి అని తెలుపుతోంది ,జయన్తసేన ,రామానంద రాగ సృష్టికర్త మాత్రమేకాక ‘రఘనాథమేళ ను కూడా సృష్టించిన సృజనశీలి .దక్షిణాంధ్ర స్వర్ణ యుగ సృష్టికర్త .అతనికొలువు లో’’ శారదా ధ్వజం ‘’నిరంతరం ఎగురు తు౦దనిచెప్పటం మర్చిపోయినట్లున్నారు .శ్రీ చంద్రావళి త్యాగయ్య కీర్తనల భక్తి తత్పరత లో ‘’నీ పద చి౦తనమే జీవనము ‘,నిష్కామ శ్రవణ స్మరణ విశిష్టత ,నవ విధ భక్తులు ఆయన కీర్తనల ద్వారా వివరించారు .’’దుడుకుగల నిన్నే ‘’లో తనలోని దుర్గుణాలగురించి చింతించి ,’జగదానంద కారక ‘’లో శ్రీరాముని అష్టోత్తర శతనామావళి ని అర్చన రూప కృతిగా రచించి ముక్తికి భక్తి అత్యన్తముఖ్యమని చాటి చెప్పాడు .సనత్కుమార్ విశ్వనాథ లఘు కావ్యాలను వివరిస్తూ ఆయనలోని కవి నిత్యజాగారితుడు,భ్రష్టయోగి అని కీర్తించారు.
కిట్టన్న సినారె గేయకావ్యాలపై సమాలోచనం చేసి ,ఆయన విశ్వ గీతి విశిష్టత చెప్పి కర్పూర వసంతరాయలులో నాటకోచిత సంభాషణలతో రక్తికట్టిన్చారని ,లకుమలోని సహృదయత సౌన్దర్యానికిసరి సాటి అన్నారు .రాజేశ్వరి కర్నాటక తెలుగు సాహిత్య కృషినితవ్వి తలకెత్తారు .కర్నాటక తెలుగు సాహిత్య విభజన చేసి ,చిన్నయసూరికి వీరేశలింగం గారికి మంచి స్నేహం ఉండేదని ,నంజన గూడు ,పాతవల్లి కవులు ప్రసిద్ధులని ,బళ్ళారి తెలుగు పంట ను వర్ణించి ,గుత్తి చంద్ర శేఖరరెడ్డి ముకుందరామారావు గారి ‘వలసపోయిన మందహాసం ‘ను కన్నడీకరించారని చెప్పారు ఆయనను ‘’గుత్తి జోలద రాసి చంద్ర శేఖర రెడ్డి ‘’అనే ఆయనకిష్టమైన పేరు చెప్పటం మరచినట్లున్నారు .నాకు మంచి మిత్రులుకూడా వారు .చిలకల సుబ్బారెడ్డి వేమన కాల నిర్ణయం చేశారని ,వేటూరి ఆనందమూర్తి ,తుమ్మపూడి కోటేశ్వరరావు లబ్దా ప్రతిష్టులు .ప్రాచార్య రాళ్ళపల్లి సుందరం తమ తల్లి పేర నెలకొల్పిన ‘సౌశీల్య’’పురస్కారం బెజవాడలో రజనీ కాంతారావు గారికి అందించారని మనం మర్చిపోయిన విషయం గుర్తు చేశారు .బెంగళూరు యూని వర్సిటి తెలుగు శాఖాధ్యక్షులు త౦గరా సుబ్బారావు గారు ‘’తెలుగు వీరగాథా కవిత్వం ‘బృహద్గంథ రచయిత .శ్రీరస స్థాపించి తెలుగు సాహిత్య రసాన్ని బహు సంపన్నంగా ప్రవహిమ్పజేశారు .కర్నాటక తెలుగింటి ఆడపడుచులు అత్తిమబ్బే బెలగరే జానకమ్మ తిరుమల రాజమ్మ ,దివాకర్ల రాజేశ్వరీ ,భార్గవీరావు సేవ నిరుపమానం .తెలుగు దినపత్రికల కార్యాలయాలు కర్నాటక లో ఉండి మంచి సేవ చేస్తున్నాయి .బెంగుళూరు ఆకాశవాణి ,స్నేహభారతి లలో తెలుగు సాహిత్యం అగ్రస్థాయిలో ఉందని తెలియజేశారు .2012లో మేము బెగులూరు మా అబ్బాయి శర్మ ఇన్తికివెల్లిఅనప్పుదు మైనేని గారు ఆయన ఫోన్ నంబర్ ఇస్తే మాట్లాడాను ఎంతో సహృదయత చూపారు .ఆతర్వాత వారిపుస్తాలు నాకు పంపితే మన పుస్తాకాలు వారికి పంపాను
ఉత్కళ దేశం లో ఉంటూ తెలుగు సాహిత్యాన్ని మూడు పూలు ఆరు కాయలుగా వికసి౦ప జేసిన తుర్లపాటి రాజేశ్వరి గారు ‘పలుకు తల్లికి పుట్టినిల్లు బరంపురం లో జయంతి కామేశ్వర రావు తెలుగు సాహితీ సౌరభాలు వ్యాపింపజేశారని ,దేశిరాజు వెంకటక్రిష్ణారావు తొలి తెలుగు అపరాధ పరిశోధక నవలా రచయిత అనీ .మామడమ్మ సుభద్ర ఆధ్యాత్మిక రామాయణం ద్విపద కావ్యంగా రాసిందనీ ,సాహిత్య సామ్రాట్ విక్రమ దేవ వర్మ ,మంత్రి ప్రగడ సూర్య ప్రకాశ కవి ఎనలేని సాహితీసేవ చేశారనీ ,గిడుగు సీతాపతి ,భట్టిప్రోలు కృష్ణమూర్తి సేవ ప్రస్తుతించారు ,తుర్లపాటి రాజ రాజేశ్వరి వివిధ ప్రక్రియలలో డజనున్నర పుస్తకాలు రాశారు. ‘’ఒరిస్సాలో తెలుగు వారి మూలాలు’’ గ్రంథం ఆమె బహుముఖీన ప్రతిభకు నిదర్శనం మాగ్నం ఓపస్ .ఉపద్రష్ట అనూరాధ ,విజయ చంద్ర ,సింగి శెట్టి అనంద రావు పట్నాయక్ అన్ని ప్రక్రియలలో రాస్తూ తెలుగును పోషిస్తున్నారు అని ‘’ఉత్కలాంధ్ర సాహిత్యం ‘’లో వివరించారు .
అమరేంద్ర ఢిల్లీ సాహిత్యాన్నిస్తాలీ పులాకంగా స్పృశించారు .ముఖ్యంగా అక్కడ జరిగిన తెలుగు సభలు సమావేశాలపైన బాగా రాశారు .ఉప్పలధడియం వెంకటేశ్వర ‘’చెన్నై లో పాతి కేళ్ళ తెలుగు ప్రస్థానం ‘’లో 19శతాబ్ది నుంచి ఇక్కడ తెలుగు పండితకవులకు నిలయం .ఆలూరి అప్పకవితంజావూర్ తులజెంద్రుని ఆస్థానం లో ఉంటూ ‘’పార్ధ సారధి విజయం ‘యక్షగానం రాసి మద్రాస్ లోని పార్ధ సారధి స్వామికి అంకితమిచ్చాడు .పానకాల రాయకవి పార్ధ సారధి శతకం ,మతుకుమిల్లి నరసింహ శాస్త్రి చెన్నపురీ విలాసం రాశారు.ఆతర్వాత చిన్నయసూరి ఆరుద్రశ్రీశ్రీ పఠాభి కృష్ణ శాస్త్రి ,పిలకా మొదలైన తెలుగు సత్కవులంతా అక్కడి నుంచే కవితా పరిమళాలు వ్యాపింపజేశారు .కొక్కొండ ,రావూరి దొరస్వామి ,అష్టభాషా ప్రవీణ పిబి శ్రీనివాస్ ,అవధాని పప్పు వారు సాహిత్యాన్ని డోలికలలో ఊపారు.పాతికేళ్లలో కావ్యాలు తక్కువే వచ్చాయి .చెన్నైలో సభలు బాగానే జరుగుతాయికాని ‘’సభలకేమి కొరత సభ్యులకేగాని ‘’అని బాధ పడ్డారు .పళని వేలు సూరి సారస్వత సేవ లో తరించారు అత్య౦త విస్తృతంగా రాసి .సిమ్మన్న గారు ‘’గిడుగు భాషా సేవ ‘కు నీరాజనాలెత్తారు .’చిలుకూరి నారాయణ రావు సాహితీ వరివస్య ‘’ జీస్ మోహన్ చక్కగా వివరించారు .రాళ్ళపల్లి వారి గురించి ‘’రాళ్ళపల్లి లోన రాళ్ళేన్ని పుట్టెనో-రాళ్ళ లోపల వజ్జరాలు పుట్టే –వజ్జరాలలోన వలపెట్లు పుట్టెరా –కీర్త నీయచరిత కృష్ణ శర్మ ‘’అని ఆచార్యులవారిబహుముఖీన ప్రతిభకు దర్పణం పట్టారు .అనంతపురం బుక్కరాయ సముద్రం చెరువుకు సంబంధించిన ..ముసలమ్మ’’పదం చిలుకూరి వారి అపూర్వ సృష్టి .గురజాడ పూర్ణమ్మను పోలి ఉన్న విషాద గీతం .’’ఓరిమి ,పరిశ్రమ పేరిమి-ప్తతిభా వ్యుత్పత్తుల నేరిమి కలిసి చిలుకూరి నారాయణ రావు ‘’అన్న మధునాపంతుల వారి మాటలు అక్షర సత్యాలు .
అనంత పద్మనాభరావు గారు కుందూరి ఈశ్వరదత్తు లోని చారిత్రిక పరిశోధకుడిని ఆవిష్కరించారు .ఆయన రాసిన ‘’శాసన శబ్ద కోసం ‘’అనర్ఘ మణిరత్నం .జీర్ణ విజయనగర చరిత్ర బహు ప్రామాణిక గ్రంథం . తిరుమలవారి పుత్రికలు నీరజ ,ఆముక్తమాల్యద తమ తండ్రి రామ చంద్రగారి వాజ్మయ తపస్సును ఆయన శైలిలోనే కమ్మగా ఆవిష్కరించారు .జాతీయ పతాక రూప శిల్పి పింగళి వెంకయ్య గారిపై చలపాక వ్యాసం వివరణాత్మకంగా ఉంది ‘’నేను చనిపోతే జాతీయ పతాకాన్ని కప్పి స్మశానానికి తీసుకు వెళ్ళండి ‘అని ఆయన చెప్పిన మాట కలకాలం గుర్తు ఉంటుది .తెలుగు పత్రికార౦గ సమీక్షలో సునీత ‘’ఫోర్ట్ సెంట్ జార్జి గెజెట్ ప్రకటనల పత్రికే .తెలుగు పత్రికకాదు.1883లో వృత్తాంత్రి ,తో తెలుగు పత్రిక ఆవిర్భావం జరిగింది .పువ్వాడ వెంకటరావు వర్తమాన తరంగిణి వచ్చింది .చిల్లర భవానీదేవిగారు ‘’తెలుగు రచనలకు హిందీ అనువాదాలు ‘’అనే వ్యాసం లో పోతనగారి భాగవతం లోని నాలుగు అంశాలను ‘’భాగావత పరిమళ ‘’గా పి.ఆదెశ్వర రావు అనువదించారని ,త్యాగరాజకీర్తనలను ఇలపావులూరి వారు అన్నమయ్య పదాలను సి .హెచ్ రాములు ,సుమతీ శతకపద్యాలను సుంకర చెంగయ్య దోహాలుగా ,,మధునాపంతులవారి ఆంద్ర పురాణాన్ని చేబోలు శేషగిరిరావు ,కుందుర్తి కవితలను నిర్మలానంద వగైరా ,ఆరుద్ర సినీ వాలీని బాదరవాడ నరెంద్రవర్మ శ్రీ శ్రీ మహాప్రస్థానం ను గుర్రం సుబ్బారావు ,బాపిరాజు నారాయణరావు ని ఆరికపూడి రమేష్, భరద్వాజ కౌముదిని బాలశౌరి రెడ్డి మొదలైన వారుఏయే పేర్లతో అనువదిన్చారో విస్తృత పట్టిక లో తెలిపారు .జానపద సాహిత్యం ఎందుకు చావాలి అని దామోదర్ రా స్తూ వివిధ కోణాలలో పరిశోధించాలన్నారు .నీలిమ ‘’కూచిపూడి నాట్యకళ ‘’పై అరంగేట్రం చేసి సమసమాజ పోకడలను గమనించి ,ప్రోత్సాహిక అంశాలతో ముందుకు సాగితేనే కూచిపూడి కళ మూడు పూలు ఆరుకాయలుగా వర్ధిల్లు తుంది అని హితవు చెప్పారు .నాటక రంగం ‘’అజరామారం ‘’అన్నారు మునిరత్నం తనకున్న విశేష ప్రజ్ఞా పాటవాలతో .ఎవరినా అందుంకు నడుం బిగించి పోషిస్తే నాటక కళ చిగురిస్తుందని ఆశాభావం వ్యక్త పరచారు .ఆంద్ర సాహిత్య పరిషత్ లో మణిబాబు విద్వాన్ పీసపాటి విశ్వేశ్వర శాస్త్రి రజతోత్సవ సందర్భంగా చేసిన ‘’శ్రీ జయంతి కులాబ్ధి శీతభానుడు ‘’పద్యం గుర్తు చేసి సూర్యరాయాంధ్ర నిఘంటు నిర్మాణం ,శ్రీపాద ,కాశీ భట్ట బ్రహ్మయ్య బండారు తమ్మయ్య ,దంటు భాస్కరరావు గార్ల అశేష విశేష సాహితీ సేవలను మన కళ్ళముందుంచారు .దాని పునర్వైభవానికి ,సృజనకు ప్రచారం అవసరం అన్న సత్యం ఎరుకపరచారు .
ఇలా విస్తృత కేన్వాస్ పై తెలుగు సాహిత్యాన్ని దిగ్మాత్రంగా పరిచయం చేసి మన ముందుంచారు చెన్నై జనని లో .అందరినీ పేరుపేరునా అభినదిస్తూ ,ఇంతటి ఉత్కృష్ట గ్రంధాన్ని ప్రచురించే సాహసం చేసి కృతకృత్యులైన గుడిమెట్ల చెన్నయ్యగారిని మరీ మరీ ప్రశంసిస్తూ ,ఆశవత్దామ సంగీతంగా పరమ రామణీయకంగా ఆస్వాదనీయంగా ఉందని తెలియజేస్తున్నాను .ఇలాంటి రచన పై నన్ను అభిప్రాయం రాయమని కోరిన చెన్నయ్యగారి సహృదయత.నాకు దక్కిన విశిష్ట గౌరవం అంటూ నమోవాకాలర్పిస్తున్నాను .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-7-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | 1 Comment

భారతీ నిరుక్తి .22వ భాగం.27.7.22

భారతీ నిరుక్తి .22వ భాగం.27.7.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

వాగ్గేయ కారుడు టైగర్ వరదాచారి

టైగర్ వరదాచారి (1876–1950) తమిళనాడుకు చెందిన కర్ణాటక సంగీత గాత్రవిద్వాంసుడు.

ఆరంభ జీవితం
వరదాచారి మద్రాసు ప్రెసిడెన్సీ, చెంగల్పట్టు జిల్లా కొలత్తూర్ గ్రామంలో 1876, ఆగష్టు 1వ తేదీన జన్మించాడు. ఇతని తండ్రి కందాడై రామానుజాచారి తెలుగు,తమిళ, సంస్కృత పండితుడు. తల్లి కళ్యాణి అమ్మాళ్.

మసిలమణి, పెద్ద సింగరాచార్యుల ప్రోద్బలంతో ఇతడు సంగీతాన్ని అభ్యసించాడు. ఇతడు తన 14వ యేట పట్నం సుబ్రమణ్య అయ్యరు వద్ద చేరి మూడు సంవత్సరాలు సంగీతాభ్యాసం చేశాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇతడు కాలికట్ లో సర్వే డిపార్టుమెంట్‌లో నెలకు 12 రూపాయల జీతంతో ఉద్యోగానికి చేరాడు. ఉద్యోగం చేస్తూనే ఇతడు తన సంగీతం పట్ల ఉన్న మక్కువను పెంచుకోసాగాడు. మైసూరులో ఉన్నప్పుడు మైసూర్ మహారాజు కృష్ణరాజ ఒడయార్ దృష్టిలో పడ్డాడు. మహారాజు ఇతనికి “టైగర్” బిరుదును, “తోడా”ను ప్రదానం చేశాడు.

ఇతడు చాలా కాలం సేలం జిల్లా (ప్రస్తుతం కృష్ణగిరి జిల్లా) కావేరీపట్నంలో నివసించాడు. ఇతడు కావేరీపట్నం పెరియార్ వీధిలో నివసించిన ఇల్లు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది.

ఇతని కుటుంబ సభ్యులకు సంగీతంలో ప్రావీణ్యం ఉంది. ఇతని తండ్రి రామానుజాచారి సంగీతం గురించి ప్రసంగాలు చేశాడు. ఇతని సోదరుడు కె.వి.శ్రీనివాస అయ్యంగార్ సంగీతశాస్త్ర ప్రవీణుడు. మరొక సోదరుడు కె.వి.కృష్ణమాచారి వీణ విద్వాంసుడు. వరదాచారి తన సోదరి నుండి పాటలు పాడటం గురించి ఎక్కువగా నేర్చుకున్నాడు.[1][2] ఇతడు మద్రాసు సంగీత అకాడమీ నిర్వహిస్తున్న సంగీత అధ్యాపకుల కాలేజీకి ప్రిన్సిపాల్‌గా ఉన్నాడు. ఆ పదవిలో 5 సంవత్సరాలు గడిపిన తరువాత ఇతడు మద్రాసు విశ్వవిద్యాలయం సంగీత శాఖకు అధిపతిగా, అన్నామలై విశ్వవిద్యాలయం సంగీత కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేశాడు. చివరకు “కళాక్షేత్ర” సంగీత విభాగానికి ప్రిన్సిపాల్‌గా పనిచేశాడు.

సంగీతం
వేగవంతమైన సంగతులు పాడటం ఇతని ప్రత్యేకత. ఇతడు మంచి వాగ్గేయకారుడు కూడా. ఇతడు గీతాలు, వర్ణాలు, కృతులు ఎన్నో రచించి సంగీత ప్రపంచానికి అందించాడు. 1.1948లో చక్రవర్తి రాజగోపాలాచారి గవర్నర్ జనరల్ హోదాలో “కళాక్షేత్ర”ను సందర్శించినప్పుడు ఇతడు “ఈ దినమే సుదినము” అనే కృతిని స్వరపరిచి పాడాడు. 2.రుక్మిణీదేవి అరండల్ జన్మదినం సందర్భంగా “వందనము నొనరించి” అనే వర్ణాన్ని వాచస్పతి రాగంలో కూర్చాడు.
శిష్యులు
ఇతని శిష్యులలో పేర్కొన దగిన కొంత మంది:

జి.ఎన్.బాలసుబ్రమణియం
ఎం.డి.రామనాథన్
పురాణం పురుషోత్తమశాస్త్రి
సంధ్యావందనం శ్రీనివాసరావు
అశ్వత్థామ
బి.వి.రామన్ , బి.వి.లక్ష్మణన్
పురస్కారాలు
1932లో మద్రాసు సంగీత అకాడమీ ఇతనికి సంగీత కళానిధి పురస్కారం ప్రదానం చేసింది.

మీ గబ్బిట దుర్గా ప్రసాద్ -27-7-22-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారి నా జీవిత కథ.19వ భాగం.26.7.22

శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారి నా జీవిత కథ.19వ భాగం.26.7.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

చెన్నై తెలుగు తల్లి (జనని )కి పాతికేళ్ళు

చెన్నై తెలుగు తల్లి (జనని )కి పాతికేళ్ళు

 నిండిన సందార్భంగా ఆ సాహితీ సంస్థ ‘జనని ‘’రజతోత్సవ సంచికను 43వ్యాసాలతో 452పేజీలతో బృహత్తరంగా సర్వాంగ సుందరంగా అర్ధవంతమైన తెలుగు రచయితల ముఖ చిత్రం 28-5-2022 న శ్రీ గుడిమెట్ల చెన్నయ్య గారి రూపకల్పన , డా ఉప్పలధడియం వెంకటేశ్వర గారి సంపాదకత్వం లో వెలువరించి  ,కార్యదర్శి శ్రీ చెన్నయ్య గారు నాకు పోస్ట్ లో 8-6-22న పంపగా , అందగా వెంటనే తెలియజేశాను   .సరసభారతి సాహితీ పుష్కరోత్సవం హడావిడిలో పుస్తకం చదవలేదు నాలుగు రోజుల క్రితం ఆయనే వాట్సాప్ లో గుర్తు చేసి హోసూరు బస్తీ యువక బృందం డా వసంత ఆధ్వర్యం లో శ్రీ ప్లవ ఉగాదికి తెచ్చిన కవితా సంకలనం లో వారి కవిత్వం పై నేను రాసినవిషయం గుర్తు చేసి ,జనని పైన కూడా నా అభి ప్రాయం రాయమని ఆశతో ఎదురు చూస్తు౦టాననితెలియజేయగా ,అప్పటికి ఇంకా చదవలేదని,నాలుగు రోజులలో చదివి వ్రాస్తాననీ తెలియ జేసి ,గడువుపూర్తికాకుండానే ఇవాళే చదివి రాస్తున్నాను .చెన్నయ్యగారిని ఉయ్యూరు సభలకు ఆహ్వానించమని  వరంగల్ నుంచి శ్రీ టి.రంగస్వామి గారు మెయిల్ లో తెలియ జేస్తే ,వారినే ఫోన్ నంబర్ రాయమని చెప్పి ఆయన పంపగా మాట్లాడి ఆహ్వానించాను .అప్పుడే హోసూరు విషయం జ్ఞాపకం చేశారు .చెన్నయ్యగారిని మా సరసభారతికి ఆహ్వానించి విశిష్ట సాహితీ  పురస్కారం  అందజేయటం మా సంస్థ పొందిన గొప్ప అదృష్టం .చాలాసాదాసీదాగా ఉండే వారు ఇంతటి బృహత్తర సాహితీకార్యక్రమాలను మద్రాస్ నడి బొడ్డున నిర్వహిస్తున్నారంటే వారి దీక్ష దక్షత తపన అర్ధమవుతోంది .చెన్న అంటే మంచి లేక సుందరమైన అని అర్ధం వారి మనసు బహు సుందరమైనది అని అందుకే సార్ధక నామధేయం అని అనిపిస్తుంది .వారింటి పేరు గుడిమెట్ల .ఈపేరు వినగానే సినీ సంగీత దర్శకుడు గుడి మెట్ల అశ్వత్ధామ గుర్తుకు వస్తాడు నాకు ఆయన దేవాంతకుడు సినిమాలో ఆరుద్ర గీతం ‘’ఎంత మధుర సీమా ,ప్రియతమా ‘’కు చేసిన స్వర రచన ముగ్ధులను చేస్తుంది ఆ సినిమా ఆపాట ఎన్నో సార్లు చూశాను విన్నాను .నేను ఆయన సంగీతాభిమానిని .అలాగే  నా దృష్టిలో ఆయన’’ మాగ్నం ఓపస్ ‘ ’సినిమా  ‘’చివరకు  మిగిలేది ‘’ అన్నా మహా ఇష్టం ఆసినిమా కూడా నా దృష్టిలో ఆల్ టైం క్లాసిక్ పిక్చర్ .ఇదంతా గుడిమెట్ల పేరు తెచ్చిన అనుభూతి .చెన్నయ్యగారి గురించి పెద్దగా నాకు ఇప్పటిదాకా తెలియక పోవటం నా అజ్ఞానం .ఉప్పలధడియంగారితో మంచి పరిచయమే ఉంది .నాలుగేళ్ళక్రితం ఆయన్ను ఆహ్వానించి సత్కరించాం. ఆయన పుస్తకాలన్నిటికీ సమీక్ష రాశాను కూడా .ఇక ప్రస్తుతానికి వస్తాను .

    ఈ సంచికలో వ్రాసిన రచయితలంత బాగా సాహితీ సుప్రసిద్దులే .దాదాపు అందరూ  డాక్ట రేట్  లే .ఇలాంటి రచనలు వారందరికీ నల్లేరు పై నడకే . దాడాపుంని రచనలు అన్నీ పూర్వసాహిత్యం గురించి ఆకవులగురించే ఉన్నాయి .అందుకని ఇది ‘’పూర్వాంధ్ర సాహిత్య లఘు సర్వస్వం ‘’అని పించింది .రచయితలందరూ తమరచనలతో సంచికను సుసంపన్నం చేశారు .రిఫెరెన్స్ పుస్తకంగా సంచిక తయారైంది .తరతరాలు దగ్గర ఉంచుకొని మళ్ళీ మళ్ళీ చదవాల్సిన రచనలే   ఆస్వాది౦చ తగిన దగిన అంశాలే .వారందరి కృషికి ,వారందరినీ ప్రోత్సహించి రాయించిన చెన్నయ్యగారి దీక్ష కు అభినందన మందారాలు .ఇంతటి విజ్ఞాన పయః పారావారం లో ఎన్నని రత్నాలు వెతకగలం ?త్రవ్వినకొద్దీ లభిస్తాయి.దిగినకొద్దీ ఆనంద మధురాను భూతియే పొందగలం . ఇంత భారీ పుస్తకం పై అభిప్రాయం రాయాలంటే ఇంతకు  మించిన పుస్తకం అవుతుంది .కనుక నా చూపులో  పడిన, నాకు దొరికిన రత్నమాణిక్యాలవంటి విషయాలు మాటలు అభిప్రాయాలు సేకరించి మీకు అందించే పని చేస్తున్నాను .

  తెలుగు భాషా సాహిత్య సంస్కృతీ త్రివేణీ సంగమం లా సంచిక తెచ్చినట్లు ఉప్పలధడియం చెప్పిన మాట సంపూర్ణ సత్యం 1993గురు పూర్ణమినాడు పురుడుపోసుకున్న  జనని –సాంఘిక సాంస్కృతిక సమితి ‘కి మంగళారతులు అద్దారు భువన చంద్ర .నేటి యువతరానికి విషయ వివేకం అధికం గురువు మంచి చెడ్డలు తెలుసుకోనేహక్కు వారికిఉంది కనుక వారి బుద్ధిగరిమకు దాన్ని వదిలి పెట్టాలి ఉపాధ్యాయులు అని అందరికీ హిత బోధ చేశారు పుల్లూరి ఉమా .అద్దంకి శ్రీనివాస్ తెలుగు లక్షణ గ్రంథాలపై విపరీత శ్రమ చేసి గొప్ప వ్యాసం రాసి ,సమగ్ర తెలుగు నిఘంటువు నిర్మించాలని కోరారు .కప్పి చెప్పేదికవిత్వం అయితే విప్పి చెప్పేది విమర్శ .దీన్ని సంపన్నం చేసినవారు డా జివి సుబ్రహ్మణ్యం గారు ,ఇప్పుడొస్తున్న కొత్త భావ వ్యక్తీఅరణ సాధనాలైన ఫేస్ బుక్ వాట్సాప్ లో వచ్చేసాహిత్యాన్నీ అధ్యయనం చేయాలన్నారు మండవ సుబ్బారావు .రంగస్వామి ఉదాహరణ వాజ్మయాన్ని చాలా సోదాహరణంగా వివరించారు .తంజావూర్ నాయకరాజులలో సాహిత్య ప్రముఖుడు విజయరాఘవ నాయకుడు .ఆకాలం గీత నృత్య అభినయాత్మకమైన యక్షగానాలకు స్వర్ణయుగం .తెలుగు సాహిత్య పరిణామ దశ ,జాతీయ వాజ్మయ చరిత్ర ,తెలుగు ఛందో రూపం ,దేశి దృశ్య కళారీతులు పరిశీలించాలంటే యక్షగాన అధ్యయనం తప్పని సరి అని చెప్పారు .హరి కథా వాజ్మయ మధనం చక్కగా చేసి నిసుగులను అందించారు యోగ ప్రభావతీ దేవి .ప్రముఖ హరికథకులలో ములుకుట్ల సదా శివ శాస్త్రి ,కోట సచ్చిదానంద శాస్త్రి ,పిల్లలమఱ్ఱి రామదాసు ,కడలి వీరయ్య  గార్ల వంటి  వారి పేర్లను వదిలేశారు. సైన్స్ ఫిక్షన్ రచయిత దేవరాజు మహారాజు తెలుగులో సరళ విజ్ఞాన శాస్త్ర గ్రంథాలు అరుదు అన్న వాస్తవం తెలియజేసి ,పరిశోధన పత్రిక నడిపిన ఏం ఎం శాస్త్రి గార్ని ,వసంతరావు వెంకటరావు గార్నీ గుర్తు చేసి ,జనసామాన్యానికి విజ్ఞానం అందించాలన్న రావూరి భరద్వాజ ‘’ప్లాస్టిక్ ప్రపంచం ‘’వంటి పుస్తకాల ను  వివరించి ,గణిత శాస్త్రావిషయాలు రాసిన విశ్వనాథ అరుణాచలం ,కందుల నాగభూషణం ,ఆధునికంగా రాస్తున్న వారిని ప్రస్తుతించారు .చారిత్రిక నవలలపై శరత్ చంద్ర  బాపిరాజు చారిత్రకావలలో ఎన్నెన్నో చారిత్రాత్మక విషయాలు వివరించారానీ నోరి నరసింహశాస్త్రి గారు ,దేశాభిమానంతో రాశారని ,తెన్నేటి సూరి చంఘీజ్ ఖాన్ ‘’ఆంధ్రదేశాన్ని ఉర్రూతలూగించిందని ,పాటిబండ్ల మాధవ శర్మగారి రాజశిల్పి కుమారగిరి రెడ్డి నాటి చరిత్రను కళ్ళ ముందు ఉంచుతుందనీ  ,ముదిగొండ శివప్రసాద్ శతాధిక చారిత్రిక నవలలు రాశారని ,ధూళిపాల శ్రీరామమూర్తిగారి గృహరాజు మేడ భువనవిజయం ఆనాటి రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టాయని చెప్పారు. తంగిరాల సుబ్బారావు గారు ‘’పలనాటి వీరకథా చక్రం -,గురిజాల రాయబారం లేక అలరాజు రాయబారం ‘’వ్యాసం లో నవల పల్నాటి పౌరుషానికి ప్రతీక అలరాజు ఒరలో ‘’సూర్య భేతాళం ‘’అనే కత్తిని బయటికి తీస్తే దాన్ని ప్రయోగించి శత్రువును చంపకుండా లోపల పెట్టడు అనే గొప్ప సత్యాన్ని ఎరుకపరచారు .

  సుమారు ఆరునెలలక్రితం పరిచయమై నన్ను ‘’బాబాయిగారూ ‘’అని పిలిచే మా మద్రాస్’’ అమ్మాయి ‘’లేళ్ళపల్లి శ్రీదేవి  పాల్కురికిసోమన  రచనాలక్షణాలు తెలియజేసింది .తనరచనలద్వారాఆయన వీర శైవాన్ని దశ దిశలా వ్యాపి౦ప జే శాడని ,శివకవులకాలం వాడైన నాచన సోమన ప్రభావం పోతన తిక్కన శ్రీనాథ ధూర్జటి,రామలింగకవులపై ఉందన్నది .చోడుడి కుమార సంభవం విశేషాలు వివరిస్తూ బసవ శంకరరావు అతడు రాజసం ఉట్టిపడే కవి ,కవిరాజు ..కవిత్వం లో స్వాతిశయం నిలువెల్లా ప్రవహిస్తుంది .శ్రీకారం తో పద్యం ప్రారంభిస్తే అశుభం అని భావి౦చే కాలం లో శ్రీ తో మొదలుపెట్టి శ్రీతో అంతం ఆయె పద్యం రాశాడు .శ్లేషరచనకు మార్గదర్శి .నూతన కవితా సంప్రదాయాలకు ఆలవాలం కుమార సంభవం .ప్రబంథకవులకు మార్గదర్శి,ఒక్క తెలుగు పదం కూడా లేకుండా సంస్కృత సమాస రచనతో పద్యం అల్లాడు .ఎర్రన కావ్య శిల్పాన్ని సరిత వివరిస్తూ అరణ్యపర్వం లో రామకథ ఉందనీ, కానీ ఆయన రాసిన రామాయణం అలభ్యం అనీ ,అలతిఅలతిపదాలతొ శబ్దసార నిదర్శకంగా ఉండటం ఎర్రన శైలి అన్నారు .అంగాంగ వర్ణనకు ఆయన నృసింహ పురాణ ప్రబంధమే మార్గదర్శి .గుణవాది.పురాణ రచనకు ఓజస్సు తేజస్సు కూర్చాడు .ఎర్రన యుగంలో ఆయనతో దీటైనకవి నాచన సోమన అని శంకర్ రాస్తూ సోమనకు సోమనయే సాటి అని ,హరిహరనాథుని కావ్య వస్తువు చేసిన ఎకైకకవి అన్నారు .భక్తిజనవాటిక ,పేటిక అయిన భాగవతం రాసిన పోతన కవిత్వం లో వీరరసాన్ని బల దాన దయా ,యుద్ధ ధర్మ భక్తి లను అన్ని కోణాలలో హరినాథ్ వివరించారు .భగవంతుని వీరత్వం శిశుపాల దంతవక్త్ర ,బాణాసుర వధ మొదలైన వాటిలో చక్కగా పోషించాడు భక్తీ రసాన్ని పొంగి పొరలించిన పోతనామాత్యుడు .జాతికి అన్నమయ్య చేసిన సేవలు లో రెంటాల ‘’పదకవిత్వం ద్వారా తెలుగు వాడిలో సంగీత  కళా౦శ ను  అన్నమయ్య కాపాడాడు ,ఆయన కవిత్వం ఆరుద్ర అన్నట్లు ‘’అష్టమ సముద్రం ‘’అన్నారు .అన్నమయ్య అభ్యుదయ భావాలను వివరిస్తూ మన్నవ ‘’సుమారు అయిదున్నర శతాబ్దాల ముందే అన్నమయ్య అభ్యుదయ భావ వ్యాప్తి చేశాడు .డబ్బున్నవాడికీ నిరుపేదకు అహోరాత్రులు ఒకటే అన్న సత్యం చెప్పాడు .

  మల్లెపూలవంటి పదాలతో మొల్ల సున్నిత శృంగారాన్ని రాసింది .కమనీయ రమణీయ మనోహర మహనీయ సుందర పద్యాలురాసింది .వేదకాల గార్గి మైత్రేయి లాగా తెలుగు సాహిత్యం లో మొల్ల మహిళలకు మార్గదర్శనం చేసింది ‘’అన్నారు మద్దూరి .మనుచరిత్ర వర్ణనా వైభవాన్ని నాగరాజ లక్ష్మి తన అనుభవ సారంతో వివరించారు .వస్తువు ను వ్యక్తీకరించటానికి పెద్దన సీసాలే వాడాడు అన్నారు .లోకోత్తర ప్రయోగ చాతుర్యం ,పాత్రౌచిత్యం పింగళి సూరన నేర్పు .అప్పటికీ ఎప్పటికీ ‘’కళా పూర్ణోదయం ‘’వంటిది అద్భుత ప్రబంధం అదొక్కటే .ఆయనకు సమకాలీన ధోరణి కూడా ఉన్నవాడు .సూరనకవిత్వం ‘’సమస్త ఔచితీ మండన మందనాయనం ‘’ అనటానికి కళాపూర్ణోదయం గొప్ప ఉదాహరణం అన్నారు సుబ్రహ్మణ్య శాస్త్రి ..గుమ్మా సాంబశివ రావు తెనాలి వాడి సంస్కృత పద గు౦ఫనం ‘’పై విస్తృత వివరణాత్మక రచన చేసి తన పాండితీ, బోధనా వైభవాన్ని చాటి చెప్పారు .పాండు రంగ మాహాత్మ్యం లో ఎన్నో పద్యాలు సంస్కృత పద బాహుళ్యాలె  .సంస్కృత సూక్తులను తెలుగుపద్యాల్లో నిబంధించాడు .యమ దూతలలో శ్రేష్టమైనది చిరకాలం బతికేదీ ,దూరపు చుట్టాలరాకను మధురస్వనం తో సూచి౦చేది,ఒంటికంటి చూపు కలది ,చలికాలం లో బలం కలదీ బలి భుక్కులలో శ్రేష్టమై నది కాకి అని రామలింగడు ‘’యమ రాడ్దూత శిఖా వతంసము ‘అనే పద్యంలో బాగా వివరించాడని చెప్పారు .శివుడు కన్ను ఆయుధంగా కలవాడు అని చెప్పటానికి ‘’అక్షి కౌక్షేయుడు ‘’అనే పద బంధం సృష్టించాడు గచ్చకాయల ఆట ను ‘’కుబేరాక్ష కేళి ‘’అన్నాడని చెప్పారు .   

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -26-7-22-ఉయ్యూరు  

Posted in సమీక్ష | Leave a comment

భారతీ నిరుక్తి .21వ. భాగం.26.7.22

భారతీ నిరుక్తి .21వ. భాగం.26.7.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారి నా జీవిత కథ. 18వ భాగం.25.7.22

శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారి నా జీవిత కథ. 18వ భాగం.25.7.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మహాకవి జాషువా విశిష్ట పురస్కార స్వీకారం

మహాకవి జాషువా విశిష్ట పురస్కార స్వీకారం

27-6-22 ఉయ్యూరులో జరిగిన సరసభారతి సాహితీ పుష్కరోత్సవ సభకు  పద్మభూష ణ్ జాషువా స్మారక కళాపరిషత్ –దుగ్గిరాల  అధ్యక్షులు డా పి.యోహాన్ గారు వచ్చి పాల్గొని ,సన్మానితులై,అప్పటికప్పుడు జులై 24న జరిగే జాషువా గారి 51వ వర్ధంతి ,జాషువాస్మారక కళాపరిషత్ నాడు నాకు ‘’జాషువా పురస్కారం,’’ అందజేయ బోతున్నట్లు తెలియజేసి అందర్నీ ఆశ్చర్యంలో ముంచేశారు . మధ్యలో ఒకసారి ఫోన్ చేసి మా శ్రీమతిని కూడా తీసుకు రమ్మని చెప్పారు .నిన్న తెనాలిలో జరిగిన ఆసభకు వెళ్లి స్వీకరించాను .ఆ వివరాలు .

  నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు నేనూ మా శ్రీమతీ శ్రీమతి ప్రభావతి ,మామూడవకోడలు రాణి మనవడు చరణ్ ,నల్గవకోడలు మహేశ్వరి ,జాగృతి సంస్థ అధికారిణి రాజీవి కుమారుడు షణ్ముఖ్ ,కారులో దావూద్ డ్రైవింగ్ లో బయల్దేరి ,ముందుగా దుగ్గిరాల గాంధీనగర్ లో ఉంటున్న అంధులైన  ,అడవి బాపి రాజు గారిపై పరిశోధనచేసి పి.హెచ్. డి.అందుకొన్న నాగార్జున యూని వర్సిటి విశ్రాంత తెలుగు ఆచార్యులు ,నాపై విశేష ఆదరాభిమానాలున్న వారు ఆచార్య శ్రీ మన్నవ సత్యనారాయణ  గారిని వారింటిలో దర్శించి, వారికి నేను రాసి, సరస భారతి ప్రచురించిన మల్లినాథ సూరి ,ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు పుస్తకాలు ,నూతన వస్త్రాలు ,శాలువా ,సాహితీ పుష్కరోత్సవ జ్ఞాపిక అంద జేసి అందరం ఆశీస్సులు పొందాము. వారి తల్లిగారు ఆరునెలల క్రితం మరణించారని తెలిసింది .ఒంటరిగా ఉంటున్నారు .ప్రస్తుతం ఏం చేస్తున్నారు రాస్తున్నారు అని అడిగితె ఎక్కువగా లైవ్ ప్రోగ్రాములు చేస్తున్నానని చెప్పి వారితో ‘’బాపిరాజుగారి పై మీ పరిశోధన పుస్తకం ఉంటె నాకు ఇస్తే  ప్రత్యక్ష ప్రసారం గా చేస్తాను ‘’అని చెప్పాను . తనవద్ద కూడా లేదనీ ,ఎవరిదగ్గరైనా ఉంటె పంపిస్తాను అన్నారు. లైవ్ చేశాక మళ్ళీ తిరిగి పంపిస్తాను అన్నాను సరే అన్నారు .

 దుగ్గిరాలనుంచి సరాసరి తెనాలి లో రామలింగేశ్వర నగర్ లో ఉంటున్న  ,70ఏళ్ళ క్రితం ఉయ్యూరు హైస్కూల్ లో నా క్లాస్ మేట్,కనకవల్లి వాస్తవ్యుడు తెనాలి మున్సిపల్ హై స్కూల్ లో సెకండరీ గ్రేడ్ టీచర్ చేసి,రిటైరై , రెండస్తుల స్వంత బిల్డింగ్ నిర్మించుకొని ఉంటున్న ,నాటక ,రేడియో  నటుడు శిష్ట్లా సాక్షి కామేశ్వర సోమయాజులు ఇంటికి వెళ్లాం .పై అంతస్తులో ఉంటున్నారు. అతని భార్య నాలుగు నెలలక్రితం అకస్మాత్తుగా మరణించింది .మార్గదర్శిలో పని చేస్తున్న మూడవ కొడుకు కుటుంబం తో ఉన్నాడు .మొన్ననే వాళ్లకు మేము వస్తున్నట్లు ఫోన్ చేసి చెబితే చాలా సంతోషించారు .సోమయాజులు నాకంటే మూడు నెలలు పెద్ద వాడు .ఆత్మీయం గా అందరూ పలకరించిమాట్లాడారు అతడు, కొడుకు, కోడలు మనవరాళ్ళు . అతను ఉయ్యూరు వైపు ఎప్పుడొచ్చిన మా ఇంటికి వచ్చి కనిపించకుండా వెళ్ళే వాడు కాదు .భార్యతో కూడా మూడేళ్లక్రితం వచ్చాడు .ఏడాది క్రితం ఉయ్యూరులో ఒక పెళ్ళిలో కలిశాం కూడా .’’ఏరా అంటే ఏరా ‘’అనుకొనే స్నేహం మాది .అతనికి మేము నూతనవస్త్రాలు సమర్పించి శాలువాకప్పి సాహితీ పుష్కరోత్సవ జ్ఞాపిక అందించాము .వాడు వెంటనే నాకు వస్త్రాలు సమర్పించి ఆశ్చర్యం కలిగించాడు .మా కోడళ్ళకు మా ఆవిడకు బొట్టు పెట్టి ,బ్లౌజు పీసెస్ ఇచ్చారు .మంచి వాతావరణం ,మొక్కలు ,ఆహ్లాదకరమైన లోగిలి .మా ఆవిడ మేడ ఎక్క లేక కిందనే కూర్చుంది .పై నుంచి అందరం కిందికి దిగి ఫోటోలు దిగి అందరికీ వీడ్కోలు పలికి బయల్దేరాం .అందరి మనసులనిండా సంతోషం నిండింది .ఇక్కడొక విషయం జ్ఞాపకం వచ్చింది .మేము ఉయ్యూరు హైస్కూల్ లో చదువుతున్నప్పుడే నాకూ సోమయాజులు  మిగతా మిత్రులకు స్నేహితుడైన సూరి నరసింహం అన్న ,ఉయ్యూరు పాలిటెక్నిక్ లో చదువుతున్న ,మాంచి స్పోర్ట్స్ మన్ ,జావెలిన్ త్రో హీరో అనంతరాం పెళ్లి తెనాలిలో జరిగితే పెళ్లి కొడుకు బృందంతో పాటు నన్నూ ,ఆదినారాయణ ,లను నరసింహ తీసుకు వెళ్ళాడు .ఆ రాత్రి సెకండ్ షో  ‘’ఇలవేలుపు ‘’చూశాం .’’చల్లని రాజా ఓ చందమామ’’పాట రఘునాథ పాణి గ్రాహిపాడాడు .సుసర్ల దక్షిణా మూర్తి సంగీతం .ఆర్ నాగేశ్వర రావు ఒక ఆశ్రమ నిర్వాహకుడు. ‘అందరూ ‘’నాన్నగారూ ‘’అని పిలిచే సాఫ్ట్ కార్నర్  పాత్ర వేయటం గొప్ప ఆశ్చర్యం .

  సోమయాజులు ఇంటి నుంచి వైకుంఠ పురం లోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి ,అక్కడి నుంచి కవిరాజు పార్కు లోని  సీనియర్ సిటిజెన్స్ హాల్ కు సాయంత్రం 6-30కు చేరాం .పద్యాలు పాడుతున్నారు .రాత్రి 7కు సన్మాన సభ ప్రారంభమైంది .మాజీ మంత్రి ,ప్రస్తుత ఎం ఎల్ సి .శ్రీ డొక్కా మాణిక్యవర  ప్రసాద్  గారిని శ్రీ యోహాన్ వేదికపైకి ఆహ్వానించారు .జాషువా చిత్రపటానికి  పూల మాల వేశారాయన . యోహాన్ గారు రాసిన ‘’కవికోకిల ,విశ్వకవి సమ్రాట్ గుర్రం జాషువా –సాంఘిక పద్యనాటకం ‘’పుస్తకాన్ని ఆయన ఆవిష్కరింఛి  జాషువా గురించి ,యోహాన్ గారి గురించి మాట్లాడారు .తర్వాత  యోహాన్ గారికి కుచ్చు టోపీ పెట్టి శాలువా కప్పి ఎం ఎల్ సి గారు సన్మానించారు .తర్వాత నన్నూ ,మా శ్రీమతిని వేదికపై కి ఆహ్వానించి సన్మానపత్రం అందించి శాలువాలుకప్పి దండలు వేశారు .నాకు ‘’సాహితీ కళా రత్న ‘’బిరుదు ప్రదానం చేశారు .మా శిష్యుడు కీ శే .వంగవీటి కాళీ వరప్రసాద్ కుమారుడు’’దైవజ్ఞ రత్న’’  సుబ్రహ్మణ్య శాస్త్రి నిన్న సాయంత్రమే ఆరు గంటలకు హైదరాబాద్ నుంచి తాడేపల్లి వచ్చి వెంటనే ,  అతని చెల్లెలు శ్రీమతి వల్లీ రమా పరమేశ్వరిని కూడా   తాడేపల్లి నుంచి బైక్ పై తీసుకు వచ్చి మా ఇద్దరికీ శాలువాలు కప్పారు .జాగృతి సంస్థ తరఫున మా కోడలు మహేశ్వరి ,మనవడు చరణ్ ,మాతోవచ్చిన శ్రావణ్ రోజా పుష్పమాలలు మాకు వేయించి రోజా పూలతో పాద పూజ చేసి నెత్తిన చల్లి గొప్ప అనుభూతిని అందరికి కలిగించారు .ఒక రకంగా గొప్ప కిక్ తెప్పించారు నీరసంగా ఉన్న సభకు .నేను నాలుగు మాటలు జాషువా గురించి చెప్పాను .మాణిక్యవర ప్రసాద్ గారు చాలా బాగుందన్నారు .చాలామంది మెచ్చుకొన్నారు .శ్రీ నాగేల్లి ప్రభాకర్ (అక్షరం )-మహబూబాబాద్ గారికి సాహితీ విద్యా రత్న ,శ్రీ సాపాటి ప్రభాకర్ –బ్రాహ్మణ కోడూరు కు సాహితీ రత్న,శ్రీ గొట్టిముక్కల నాసరయ్య-త్రిపురాంతకం గారికి సాహితీ భూషణ్ ,శ్రీ దార్వేముల అనిల్ కుమార్ –గుంటూరు గారికి సాహితీ భూషణ్ ,శ్రీ రంగి శెట్టి రమేష్ –చిలువూరు గారికి సాహితీ భూషణ్ ,శ్రీ ఈపూరి ప్రేమ కుమార్ –పెదరావూరు గారికి నాటకరత్న ,శ్రీ పంతుల వెంకటేశ్వరరావు-విజయవాడ  గారికి సాహితీ రత్న బిరుదులూ జాషువా పురస్కారాలు అందించారు . అక్షరం ఆయన నన్ను గురువు గారూ అంటూ సంబోధిస్తూ ,సరసభారతి విషయాలు వాట్సాప్ గ్రూప్ విషయాలూ తెలుసుకోవటమే కాకుండా సన్మానితులలో నా పేరు తర్వాత తన పేరు ఉండటం గొప్ప అదృష్టం అని ఫీలయ్యారు. ఇది అవగానే మేము బయల్దేరాం .దారిలో మా అమ్మాయి ,విజ్జి, అల్లుడు అవధాని అమెరికా లోని  షార్లెట్ నుంచి అట్లాంటా లో ఒక వారం  ప్రాజెక్ట్ వర్క్ చేయటానికి   మా మనవడు ఆశుతోష్  ను అట్లాంటా తీసుకు  వెళ్లి దింపటానికి వెడుతూ ఫోన్ చేసింది మా అమ్మాయి .మమ్మల్ని అందర్నీ చూసి మాట్లాడింది వాట్సాప్ కాల్ లో .

అక్కడినుంచి ఎక్కడైనా మంచి హోటల్ ఉందేమో వెతికితే దావూద్ మమ్మల్ని ‘’సజ్జాస్ ఫుడ్ కోర్ట్ ‘’కు తీసుకు వెళ్ళాడు. పెద్ద హోటల్ ఆదివారం కనుక మిగతా హోటళ్లకు సెలవ్ .నీట్ గా ఉంది .తలొక రెండు ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చిఆబగా తింటూ పింగ్ పాంగ్ ఆడుతున్నట్లు  ఫుడ్ కోర్ట్ లో దున్నేశాం .అన్నీచాలాబాగున్నాయి కాఫీ తో సహా .మామనవడు చరణ్ స్పాన్సర్ చేశాడు.మాతోపాటు రమ్మని కోరగా ,వొప్పుకొని ,కాళీప్రసాద్ కొడుకు, కూతురు వచ్చి ఇష్టమైనవి తింటూ మంచి కంపెనీ ఇచ్చారు .హాయైన అనుభవం . హోటల్ లో ఏది బాగా లేకపోయినా  నేను రుచి చూసిపెదవి విరవటం అలవాటు .కానీ నిన్న మాత్రం చట్నీలతో సహా అన్నీ బాగా ఉన్నందుకు మహా సంతృప్తిగా తినటం నాకే ఆశ్చర్యం కలిగించింది  .ఇది చూస్తుంటే మరో అనుభూతి గుర్తుకొచ్చింది .2019లో నోరి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు శ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రిగారు గురు పౌర్ణమినాడు హైదరాబాద్ త్యాగరాజ గాన సభ లో ‘’కళా సుబ్బారావు గారి ‘’పురస్కారం అందజేయటం ఉయ్యూరునుంచి మేము వెళ్ళటం హైదరాబాద్ లో ఉన్న మా అబ్బాయిలు శాస్త్రి, శర్మ,మా బావమరది ఆనంద్ కుటుంబాలతో వచ్చి శాలువాలు కప్పటం పూలహారాలు వేయటం ,పుష్పాభిషేకం చేయటం ,గాన సభ అంతా మా ముఠా ‘’హల్ చల్ ‘’చేయటం, ఆతర్వాత అందరం ఒక హోటల్ లో టిఫిన్లు చేయటం ,ఆఖర్చు మా శర్మ’’ ఎయిత్ వండర్’’ గా స్పాన్సర్ చేయటం మర్చిపోలేని మరో అనుభవం .

   టిఫిన్లు అయ్యాక కాళీ ప్రసాద్ పిల్లల్ని ఇంటికి బయల్దేరి వెళ్ళమని చెప్పి ,మేము కారెక్కి ,ఉయ్యూరుకు రాత్రి 10-15కు చేరాం .కార్ పెట్రోల్ ఖర్చు కూడా నా చేతికి అంటనివ్వలేదు .ఇలా ఆదివారం యాత్ర పూర్తయింది .వెంటనే వాట్సాప్ లో ఫోటోలు పెట్టేసి పడుకొన్నాను .ఇప్పుడు  తెనాలి సభలో నేను మాట్లాడిందీ మాట్లాడాలను కొన్నదీ వివరంగా తెలియ జేస్తాను .

                 విశ్వ నరుడుజాషువా

 సాహిత్యం లో పీడితులపక్షాన కలం పట్టిన యోధుడైన సాహితీ మూర్తి జాషువా .దళిత హృదయార్తి కి బీజమే ఆయన కవిత్వం .గాంధేయ విధానం ఆయన కవిత్వానికి మూలం .అనుభూతి,ఆవేశం వలన కవిత్వావిర్భావం జరుగుతుందని చెప్పాడు .సర్వ కవిత్వ సమన్వయ లక్షణం ఆయనది .కరుణ  రసావిష్కర్త .’విశ్వ నరుడను ‘’అని చెప్పుకున్న ధీరకవి .గాయపడిన మనసు ఆక్రోశమే జాషువా కవిత్వానికి ‘’షడ్జమం ‘.అన్నిటికీ అతీతమైన సమసమాజస్థాపన  ఆయన లక్ష్యం .మనిషిని మనిషిగా గుర్తించమని ప్రాధేయపడిన మానవతా మూర్తి జాషువా.తెలుగు పద్యం ఇంత హృద్యంగా ఉంటుందని రుచి చూపించిన కవి ..భాషపై పట్టు,భావం పై అధికారం ,నడకపై తూగూ ఊపూ ,కమ్మని శైలి ఆయనకే స్వంతం .ద్రాక్షాపాకమే ఆయన కవిత్వం .వృత్త పద్యానికి మహోన్నత శిల్పి జాషువా .మానవ ప్రవృత్తికీ ,జడ ప్రవృత్తికీ ఉన్న అంతరాన్ని ,కొత్తదృక్పధం తో తగ్గించిన సంస్కారి .

  జాషువా కు తల్లి అంటే పంచ ప్రాణాలు .ఆమె చనిపోయినప్పుడు ‘’నీ ఋణము తీరదు రక్తము ధార పోసినన్ ‘’అని వెక్కి వెక్కి ఏడ్చాడు .పెంపుడు కుక్క మరణిస్తే ‘’విశ్వాసము నీ కులానికి నిసర్గ భూషణమ్ము-ఇట్టి సావాసము చచ్చి పోయినది ‘అని దుఖించిన కరుణా మూర్తి .’’పేదరికం పెద్ద విద్యాశాల .దానిలో లజ్జ లేదు .ఉదరమే ఒజ్జ .ఓర్మిని నేర్పిస్తుంది ‘’అని తన అనుభవాన్ని జోడించి చెప్పాడు తాత్వికంగా .ముంతాజ్ మహల్ కోసం షాజహాన్ కట్టిన తాజ మహల్ యొక్క శిలలను గురించి ‘’కలము నందుకొన్న కవి వరేణ్యుని మ్రోల తలలు వంచు శబ్దాల విధాన –నాటి శిల్పి చెంత నవనీతమును బోలి –మెత్తదనము దాల్చె మేటి శిలలు ‘’అనగల సత్తా జాషువాది .

  కోతిని గురించి రాస్తూ –‘’నిన్నీక్షించి హసి౦చనట్టి నరుడున్ నీపై దయాభావముత్పన్నంబందని వాడు –గానమునకున్ వైముఖ్యమును చూపు వా-డున్నాడా సకల ప్రపంచమున ,నాయుర్భూతి నిండార తిమ్మన్నా !హాస్య కళాసముద్రమున మమ్మెలార్పు నశ్రా౦త మున్ ‘’అని బొమ్మ కట్టించిన శిల్పి .తేనే పట్టు అంతా పిండుకొని తాగే వాళ్ళమే కాని అందులోని మధుపం మనో భావాలను అర్ధం చేసుకోలేని దౌర్భాగ్యం మనది .ఎంత రసవంతంగా రాశాడో ఈ పద్యాలు చూడండి –‘’కుత్తుకలు గొని రణమున –కాయత్తంబై న వీర యోధులట్లు మధుపముల్ –మొత్తమయి లేచి పొడిచెన్  -గత్తులతో నన్ను నొక్క క్షణ కాలమునన్ ‘’అని మీద దాడి చేశాయి తేనెటీగలు కవిమీద .అందులోనుంచి ఒక అళి కుమారుని మనో వేదన, ఆర్తనాదం విని చలించిపోయాడుకవి .అందులోని ఒక శిశు మధుకరం –‘’ఓరి దురాత్మ !బిడ్డలు లేరా ?యొక్కింత కరుణ లేదా?మమ్మున్ నోరెరుంగనట్టి నిసుగుల –గారించుట నీకు వేడుకా ?దౌష్టంబా ‘’?అని నిలదీసింది .బిక్క చచ్చిపోయాడు గురుడు .’నరుడు అ౦టుకొంటేకొడుకులు చనిపోతారని మా మిళింద మాతలు  మళ్ళీ దయతో పెంచుతారు .ఇది మాకులం కట్టు బాటు .’’అని బుద్ధి చెప్పింది .చివరగా ‘’మా తీయని నగరంబును –ఘాతుకమతి వౌచు మంట గలిపితివి –మా తలల్లు లండ్రు –నరులకు నీతి హుళక్కి యనుచు ,నేడు నిజ మయ్యెన్ ‘’.కరుణ శ్రీ గారి ‘’పుష్పవిలాపం ‘’గుర్తుకొస్తుంది .

  వంచిత అనే పద్యం లో –ఆబల యను బిరుద మంటించి కాంతల –స్వీయ శక్తులదిమి చిదిమి నారు –సబల యన్న బిరుదు నావరించి హక్కులు –గడవ జేసి కొమ్ముకష్ట చరిత ‘’అని ఓదారుస్తూ ధైర్యం నూరి పోశాడు కవి .బడిపంతులు పద్యం లో –‘’ఎంతెంత వారు నాదగు –‘’చింత బరికె ‘’ సోకకుండ,సిరి గలిగి యశో –వంతులు కాగలరా యని –సంతృప్తి వహించు తాతని సహజ గుణంబున్ ‘’అని ఫోటో తీసి చూపించాడు జాషువా .అమ్మవారు పద్యం లో –‘’మొగమున కక్కుకొట్టి మసిబాసి ,వికార మొనర్చ నీచపుం –దెగులునకు ‘’అమ్మవారనుచు ‘’తీయని పేరిడిమేకపోతులన్ దగరుల జంపి ,రక్తమున దండవ కేళియొనర్చు వెర్రికిన్ దగిన చికిత్స చేయగలదా నవ భారత మెన్నడేనియున్’’అని సమాజానికి సవాల్ విసిరాడుకవి .

  ద్వారం వెంకటస్వామి నాయుడు గారిని కీర్తిస్తూ –‘’నీవు ఫిడేలు దాల్చి కమనీయ నినాదఝరీ మరంద –మాలా వివిధ స్వరూప రస లక్ష్ముల సృష్టి యొనర్చు లాఘవం –బీ వర కెవ్వ డందు గడియించి ఎరు౦గరు నీదు వ్రేళ్ళలో –నే వరమున్నదోయెరుగ రెవ్వరు ‘’ద్వారము వంశ భూషణా ‘’.-చెవులు పిండి ,శిక్షించి జడమైన –కట్టె కెట్లు విద్య గరపినావో _అంగుళీయకంబులంటియంతక ముందే-నీ ఫిడేలు మధుర నిధులు గురియు ‘’అంటూ ద్వారంవారి సర్వోత్తమ వైదుష్యాన్ని కళ్ళకు కట్టించాడు .వీరేశ లింగం గారిని ప్రస్తుతిస్తూ –‘’ఒకవంకన్ బదివేల కంఠములతో హు౦కారముల్ సల్పిసాం-ఘిక శార్దూలము చప్పరించుటకు లంఘి౦పన్ –రవంతేని జంకక ,దీక్షా రథమున్ మరల్పక –కళా క్షాత్రంబు జూపించు ను –వేద౦డుని యుక్కు గుండెలు మహా౦ధ్రా మీకు నా దర్శముల్ ‘’  .భట్టుమూర్తి రామరాజ భూషణుడికి పద్య భూషణాలు తొడుగుతూ జాషువా –‘’శ్లేష కవిత్వ చండ భాస్వంతుడవహో –సరస భట్ట కవీ ,కవితా కళానిధీ-నాటికి నేటికి ఒక నాటికి నీ కెదురేరి సత్కవీ –చక్కదనాల కబ్బపుం గాపులు గాచి పోయితివిగా కవితా దివిజ ద్రుమబునకున్ ‘’అని అత్యద్భుతంగా వర్ణించాడు .గోవుకు నమస్కరిస్తూ జాషువా –‘’వెలగలయట్టి నీ రుధిర  బిందువు లెన్ని వ్యయించి పాలుగా జిలికెద వోగదా’’మొదవు చేడియ’’!నీ బలమెల్ల ఇమ్మనుష్యుల కిడి  వృద్ధురాలవయి సుక్కిన నీకు గటారి పోటులాఫలితము ?-భారతీయుని గృపా పరతంత్ర త గొడ్డు వవోయెనో ‘’అంటూ సహవేదన చెందాడు మనసు మెత్తని కవి జాషువా .సర్దార్ పటేల్ ను –‘’కొండవంటి తనువు-కొండంత భుజ శక్తి –కలిగి యుండ భరత ఖండ లక్ష్మి –వల్లభాయి మంత్రి పరమ పది౦పగా –గుండె లేని దయ్యె- గుండెగలిగి ‘’అంటూ స్మృత్యంజలి ఘటించాడు దేశభక్త కవి జాషువా .

  చివరగా తన గురుదేవుడు శ్రీ చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రిగారు తన కాళ్ళకు బంగారపు కడియం తొడుగుతుంటే ఆనందం ,భక్తీ ,వినయం త్రివేణీ సంగమంగా –

‘’చెళ్ళపిళ్ళ సత్కవీశుడు ప్రసిద్ధుండు –వీర శతావధాని ,యాంధ్రుల శుభ రక్తనాళములరూపము  నెత్తిన బ్రాహ్మణుండు-‘’నా పలుకుల రాణి పాదము’’ ను బంగరు గగ్గెర తో నలంకృతుల్ సలిపె-నికేమి కావలె ప్రశస్తి కవిత్వ కళా వధూటికిన్ ‘’అని కృతజ్ఞతాంజలి ఘటించాడు శిష్యుడు జాషువా .తనకు తొడిగారు అనకుండా తన కవితా సరస్వతి పాదాలకు తొడిగారు అనటం జాషువా మహోన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం .అలాంటి అరుదైన వ్యక్తిత్వం ,సర్వసమానత్వం, విశాల భావ సంపద తో విరాజిల్లిన మహాకవి జాషువా గారి పురస్కారాన్ని అంతే వినయ విధేయతలతో అందుకొంటున్నాను ‘’అని ముగించాను .

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -25-7-22-ఉయ్యూరు  

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

భారతీ నిరుక్తి .20వ భాగం.25.7.22

భారతీ నిరుక్తి .20వ భాగం.25.7.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారి నా జీవిత కథ.17వ భాగం.24.7.22

శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారి నా జీవిత కథ.17వ భాగం.24.7.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

భారతీ నిరుక్తి .19వభవం.24..7.22

భారతీ నిరుక్తి .19వభవం.24..7.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారి నా జీవిత కథ.16వ భాగం.23.7.22

శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారి నా జీవిత కథ.16వ భాగం.23.7.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-15

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-15

  బ్రిటిషర్లు స్వార్ధం కోసమే ఇండియన్స్ ను గుప్పితో పెట్టుకొంటున్నారనీ ,కనుక ప్రజాఉద్యమం ,ప్రత్యక్షచర్య ,తిరుగుబాటు చివరికి హింస,బలప్రయోగం  ద్వారానైనా దేశానికి విముక్తి కలిగించాలని  యువత భావించింది .కాంగ్రెస్ లోని మితవాదులు పిరికి సన్నాసులని,దేశాన్ని ఐరోపా సంస్కృతిలోకి నెట్టి ,కాళ్ళబేరానికి వస్తున్నారని  ఆక్షేపించారు .మంగళ పాండే రాసిన ‘దిబ్రేకప్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా ‘’ఈ ఉగ్రవాదులకు వేదం అయింది .కాంగ్రెస్ ఇలాంటిది జరుగుతుందని ఊహించలేదు .దక్షిణాఫ్రికా విజయం తర్వాత గాంధీ ఈ సభలో పాల్గొన్నాడు .తిలక్ ,మోతీలాల్ లను మొదటి సారి కలిసి మాట్లాడాడు .తిలక్ తో ప్రత్యేకంగా వేరే గదిలో మాట్లాడాడు .తన ఆత్మకధలో గాంధీ ‘’ఆ నాడు నన్ను కలిసిన చాలామందిలో ఇవాల్టికీ గుర్తున్నవాడు మోతీలాల్ ఘోష్ ఒక్కరే .పాలక బ్రిటిషర్లపై నిప్పులు కక్కుతూ మాట్లాడారు ‘’అని రాశాడు .గాంధీ తీర్మానం చర్చలేకుండానే ఆమోదించారు .దీనిపై కూడా గాంధీ ‘తీర్మానం లో ఏముందో ఎవరికీ దృష్టి లేదు .ఎప్పుడు బయటికి పోదామా అనే ధ్యాసతప్ప ‘’అని బాధతో రాశాడు .మూడురోజుల కాంగ్రెస్ మేలా అలా ముగిసింది .1915లో కలకత్తాలో గాంధీ దక్షిణాఫ్రికాలో సేవ చేసినందుకు జరిగిన అభినందన సభకు మోతీలాల్ అధ్యక్షుడు .గాంధీని అభినందించాడు మోతీలాల్ అక్కడ చేసిన సేవకూ ఇక్కడ చేస్తున్నదానికీ .గాంధీ మితవాది లాల్ అతివాది అవటం తో ఇద్దరిమధ్య సరైన సమావేశం జరగలేదు .

 రాష్ట్రాల పునర్విభజనకు తుది మెరుగులు దిద్దిన వాడు జే హెచ్ గ్రూప్ ఫీల్డ్ .స్లేవ్ రాసిన ‘’యూనిట్స్ ఆఫ్ 1904’’లో ‘’కొత్త తూర్పు రాష్ట్రాల్లో ముస్లిం లకు ,పశ్చిమ రాష్ట్రాలలో బీహారీ ఒరియావారికి మెజార్టీ స్థానాలు ఇవ్వటం జాతీయ దృక్పధాన్ని చీల్చే ప్రయత్నమే ,బెంగాల్ లో భద్రలోక్ రాజకీయ ప్రభావం కట్టడి చేయటమే .ఈ బిల్లు చట్టం కాకుండా సురేంద్ర నాద విశ్వ ప్రయత్నం చేసినా ,ఫలించలేదు .ఉగ్రవాదులు ‘’భారతీయ వాదం అనే కొత్త ప్రతిపాదనలతో ముందుకు దూకుతున్నారు .భారత దేశాన్ని మాతృభూమిగా భావిస్తూ కదం తొక్కారు .భారతీయ సాంస్కృతిక విలువలను అనుసరిస్తూ ,పాశ్చాత్య విలువలను త్యజించాలని వీరి నినాదం .బ్రిటిష్ వస్తువులు వదిలేసి భారతీయ వస్తువులు వాడుతూ ,శాంతియుత ప్రతిఘటన ఇవ్వాలని కొత్త జాతీయ దృక్పధాన్ని మోతీలాల్ బిపిన్ చంద్రపాల్ ,అశ్విని కుమార్ దత్త ,అరవింద ఘోష్ ప్రతిపాదించారు .పంజాబ్ లో లాలా లజపతిరాయ్ ,మహా రాష్ట్రలో బాలగంగాధర తిలక్ ,మద్రాస్ లో చిదంబరం పిళ్ళై ,సుబ్రహ్మణ్య   భారతి నీలాకంఠ బ్రహ్మ చారి బలపరచారు .దీనికి తాత్విక ప్రాతిపదికను రవీంద్ర నాథ టాగూర్ కల్పించాడు .1907లో అరవిందుడు ‘’జాతి జీవనం లోని అన్నిశాఖలను ముందుకు నడిపించటానికి ఒక కేంద్ర సాధికార సంస్థతోపాటు విదేశీ ఆధిపత్యాన్నిఒక్క సారిగా కాకపోయినా , క్రమేణా తొలగించటానికి  మనం ఆత్మ రక్షణ యుద్ధం ప్రారంభించాలి .ఒక జాతిగా ఇదే మన తక్షణ కర్తవ్య౦ తప్ప మేధావులుగా విజ్ఞానఖనులుగా సంపన్నులుగా ఎలా ఎదగాలన్నవి కాదు .జాతికి అనివార్యమైన మృత్యు మేఘాలను తొలగించాలి .మన మనో ధైర్య స్తై  ర్యాలను ఎలా పెంచుకోవాలన్నది ఆలోచన చేయాలి .శాంతియుతంగా చట్టం ,పాలనా యంత్రా౦గాన్నీ   ఉల్లంఘిస్తాం .చట్టపరమైన శిక్షలను శిరసావహిస్తాం ‘’అన్నాడు .దీని తర్వాత 15ఏళ్ళకు గాందెయ ఉద్యమం ప్రారంభమవటానికి ఇదే పునాది నాంది మార్గదర్శకం కూడా .’’ఆత్మ రక్షణ కోసం ప్రతి ఘటన ‘’అనటంలో విప్లవోద్యమం అనే మాట అంతర్గతంగా ఉంది .దుష్ట శిక్షణకు అది మన పవిత్రమార్గం గా గుర్తింపు పొందింది .

  రాష్ట్రాల పునర్విభజన జరిగినా ఆరేళ్ళ తర్వాత అది అపరిష్క్రుతంగానే ఉండిపోయింది .మళ్ళీ సంయుక్త బెంగాల్ ఏర్పడింది .ఉగ్రవాద విదానాను హిందూ సంపన్నులు బలపరుస్తుంటే ముస్లిం లు వ్యతిరేకిస్తున్నారు .దీన్ని ఆయుధంగా తీసుకొని బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్ గ్రామీణ పేద ముస్లిం లను హిందువులకు వ్యతిరేకంగా ఉద్యమానికి సిద్ధం చేసింది .అయితే అశ్వినీ కుమార దత్తా ప్రాతినిధ్యం వహించిన బరిసాల్ జిల్లాలో  బహిష్కరణ ఉద్యమం ప్రశాంతంగా కలహాలు లేకుండా సాగింది .బ్రిటిష్ రాజధాని కలకత్తా నుంచి ఢిల్లీ కి మారింది .ఆలీ గడ్ ఆంగ్లో –ముస్లిం కాలేజి రూపం లో  సయ్యద్ మొహమ్మద్ మొలకెత్తించిన  వేర్పాటు  వాదం ను బెక్, మొరిసన్ ,ఆర్చిబోల్ద్ లు తీవ్రతరం చేశారు .కాంగ్రెస్ ముస్లిం లను గుర్తించటం లేదనేభావం యువకులలో రేకెత్తించారు .కాంగ్రెస్ సంపన్న ముస్లిం లకే  కొమ్ము కాస్తోందని ప్రచారం చేశారు .కర్జన్ కాలం లోసాగిన ఈ హిందూ ముస్లిం భేదాలను మింటో పెంచాడు .1906 సంపన్న ముస్లిం వర్గం ‘’ముస్లిం లీగ్ ‘’గా మారింది దీనిపై మోతీలాల్ ‘’ఇదంతా అధికారుల కను సన్నలలో జరిగిందే .ముస్లిం లీగ్ కు జాతీయ స్థాయి లేదు .అందులో అంతా ముస్లిం లు కూడా కాదు .ప్రభుత్వ తప్పిదాలను కప్పి పుచ్చుకోవటానికి వీరిని పావులుగా వాడింది ప్రభుత్వం ‘అని వ్యాఖ్యానించాడు .

తూర్పు బెంగాల్ కొత్త లెఫ్టినెంట్ గవర్నర్ ఫీల్డ్ పుల్లెర్ కూడా హిందువులపై మహమ్మదీయ దోర్జన్య కాండను,అల్లర్లను  ప్రోత్సహించాడు.అతడి అతి ప్రవర్తనకు చివరికి రాజీనామా చేయాల్సి వచ్చింది .అప్పటికే జాతీయవాదులలోని ఉగ్రవాద వర్గం అజ్ఞాత విప్లవ సంఘాలు స్థాపించి బలపడింది .బెదిరిన ప్రభుత్వం ఒక చిట్కా ప్రయోగించి కొన్ని సంస్కరణలు చేసింది .ముస్లిం లను వేరే వోటర్లుగా ,భూస్వాములకు విడిగా ప్రాతినిధ్యం కల్పించటం జరిగింది .ఇతర స్థానాలకు పరోక్ష ఎన్నికలు జరుపుతారు .ఇది అన్యాయం అని ఆతర్వాత గుర్తించి  రూపొందించిన మింటో మార్లేలే తల బాదుకొన్నారు  .కానీ ‘’భారతీయులనుంచి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని రక్షించుకోవాలికనుక ఇందుకోసం చేసేదేదీ అక్రమం కాదు ‘’అని నోరు మూసుకొన్నారు .ఇదే సామ్రాజ్య వినాశానికి దారి చూపింది .

  1906లో కాంగ్రెస్ లోని అతివాద మితవాదులమధ్య భేదాలు తీవ్రస్థాయికి చేరాయి .అధ్యక్షుడు దాదాభాయ్ కొంత నివారించాడు .ఇంగ్లాండ్ లాగా భారతీయులకు స్వయం పాలనకల డామియన్ లు కావాలని చెప్పాడు .సదస్సు తర్వాత వైస్రాయి ని కలవకుండా కాంగ్రెస్ లో ఘర్షణ నివారించాడు .అనివార్యమైన ఈ ఘర్షణ సూరత్ కాంగ్రెస్ లో బయటపడింది .రాస్ బిహారీ ఘోష్ ను మితవాదులు అధ్యక్షస్థానానికి పోటీ చేయిస్తే ,అతివాదులు తిలక్ కాని లజపతిరాయ్ కానీ ఉండాలని అన్నారు .తిలక్ పేరును చైర్మన్ తిరస్కరించగా ,అప్పుడే తిలక్ వేదికపైకి వెడుతుంటే ఆయనపై ఒక చెప్పు విసిరేయబడటం తో గలాభా జరిగి  అర్ధాంతర౦ గా  సభ ముగించారు .ఆ చెప్పు సురెంద్రనాద్ కు తగిలింది .అతివాద మితవాదులమధ్య సయోధ్య కుదర్చటానికి మర్నాడు సభజరిగి, మోతీలాల్ ప్రయత్నించాడు .సభలో ఎవరు ఎవర్ని బహిష్కరించారో తెలీడదుకాని 1908లో కలకత్తాలో మోతీలాల్ ఇంట్లో అతివాదులు సమావేశం జరిపి కాంగ్రెస్ లో తాము ఎందుకు చేరటం లేదో ఒక మాని ఫెష్టో ప్రకటించారు .1916లోకానీ వీరు కాంగ్రెస్ లో మళ్ళీ చేరలేదు .

   సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -23-7-22-ఉయ్యూరు  

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

భారతీ నిరుక్తి .18వ భాగం.23.7.22

భారతీ నిరుక్తి .18వ భాగం.23.7.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -306 • 306-నేపధ్యగాయకుడు సంగీతదర్శకుడు ,ప్రపంచ వ్యాప్తంగా 6వేలకచేరీలు నిర్వహించిన ‘’స్వరమాధురి ‘స్థాపకుడు –జి ఆనంద్

 మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -306

· 306- నేపధ్యగాయకుడు సంగీతదర్శకుడు ,ప్రపంచ వ్యాప్తంగా 6వేలకచేరీలు నిర్వహించిన ‘’స్వరమాధురి ‘స్థాపకుడు –జి ఆనంద్

· జి. ఆనంద్ తెలుగు నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు. అతను నవతరం స్వర మాధురి సంస్థతో వర్ధమాన, ఔత్సాహిక గాయనీ, గాయకులకు ప్రదర్శనావకాశాలు కల్పించాడు. ప్రపంచ వ్యాప్తంగా 6,500 పైగా కచేరీలు నిర్వహించాడు[1].

జీవిత విశేషాలు
అతను శ్రీకాకుళం జిల్లాకు చెందినవాడు. అతని పూర్తిపేరు గేదెల ఆనందరావు. అతని పుట్టినజిల్లా పట్ల ప్రేమతో జిల్లాలో జరిగిన అనేక సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతూ ఉంటాడు. అతను అమెరికాలో 14 ప్రదర్శనలు ఇచ్చాడు. సుమారు 2,500 పాటలు పాడాడు. 150 ఆల్బమ్‌సు చేసాడు . సినిమా అవకాశాలు లేకపోయిన సందర్భంలో కూడా డబ్బింగు ఆర్టిస్టు గాను, అనేక టి.వి. సీరియల్స్ లో సంగీత దర్శకుడుగా రాణించాడు.

పండంటి కాపురం సినీమాతో గాయకుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆనంద్ సంగీత దర్శకుడు కుడా . స్వరమాధురిఫౌండేషన్ వ్యవస్థాపకుడైన ఆయన ఎంతో మందిని సినీ, దూరదర్శన్ రంగాలకు పరిచయం చేశాడు. అతను తన తొలి పాట “ఎన్నియల్లో.. ఎన్నీయల్లో.. ఎందాకా..” ను చిరంజీవి నటించిన సినిమాకే పాడాడు[2].

షిరిడి సాయిబాబా, తిరుపతి బాలాజీ, విష్ణుపురాణం, గాంధర్వ మాలతీయం వంటి సీరియల్ కి సంగీతం అందించారు. ఎన్నో భక్తి పాటల అల్బుమ్స్ చేసాడు.

సినిమాలు
· 1972 : పండంటి కాపురం (గాయకుడు: మొదటి పాట – కోరస్)

· ‍1976 : అమెరికా అమ్మాయి (గాయకుడు: ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక)

· 1977 : ఆమె కథ

· 1977 : కల్పన (గాయకుడు: దిక్కులు చూడకు రామయ్య పక్కనె ఉన్నది సీతమ్మ)

· 1977 : దాన వీర శూర కర్ణ (గాయకుడు)

· 1977 : చక్రధారి (గాయకుడు: విఠలా విఠలా పాండురంగ విఠలా)

· 1977 : బంగారక్క (గాయకుడు: దూరానా దూరానా తారాదీపం)

· 1978 : మన ఊరి పాండవులు (గాయకుడు: నల్లా నల్లని)

· 1978 : ప్రాణం ఖరీదు

· 1979 : తాయారమ్మ బంగారయ్య (1979)

· 1987 : గాంధీనగర్ రెండవ వీధి (సంగీత దర్శకుడు)

· 1987 : స్వతంత్రానికి ఊపిరి పోయండి (సంగీత దర్శకుడు)

· 1990 : రంగవల్లి (సంగీత దర్శకుడు)

ఖ్యాతి తెచ్చిన పాటలు
· ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక, (అమెరికా అమ్మాయి).

· దిక్కులు చూడకు రామయ్య పక్కనె ఉన్నది సీతమ్మ, (కల్పన).

· విఠలా విఠలా పాండురంగ విఠలా, (చక్రధారి)

· దూరానా దూరానా తారాదీపం, (బంగారక్క)

మరణం
జి. ఆనంద్ కొద్ది రోజులుగా కరోనాతో బాధపడుతుతూ సకాలంలో ఆక్సిజన్ అందక 2021 మే 6న మృతి చెందాడు.[3]

సుమారు పాతికేళ్ళ క్రితం బెజవాడ లో ఘంటసాల స్వర సప్తాహం తుమ్మలపల్లి కళా క్షేత్రం లో జరిగినప్పుడు బాలు పాల్గొన్న రోజున ఆనంద్ ,ఘంటసాల గారబ్బాయి విజయకుమార్ ,ఘంటసాలశిష్యుడు ఆయన విగ్రహస్థాపకుడు గంగాధరరావు ,లతో పాటు ఆనంద్ కూడా వచ్చి పాడాడు .అప్పుడే అతనిని చూడటం .
· సశేషం

· మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -22-7-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -307· 307-తొలితరం రంగస్థల ,సినీ నటి ,గాయని వాలు మొగ్గ భంగిమలోనోటితో రూపాయిబిళ్ళ ,పంటితో సూది తీయగల అపూర్వ నర్తకి ,మాలపిల్ల హీరోయిన్ ,దశావతారాలలో నాలుగు వేషాలు వేసి,’’అత్తా ఒకింటి కోడలు ‘’లో అత్తనే భయపెట్టిన గడసరి ‘’అత్తత్త’’ –లక్ష్మీకాంతం

· మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -307

· 307-తొలితరం రంగస్థల ,సినీ నటి ,గాయని వాలు మొగ్గ భంగిమలో నోటితో రూపాయిబిళ్ళ ,పంటితో సూది తీయగల అపూర్వ నర్తకి ,మాలపిల్ల హీరోయిన్ ,దశావ తారాలలో నాలుగు వేషాలు వేసి,’’అత్తా ఒకింటి కోడలు ‘’లో అత్తనే భయపెట్టిన గడసరి ‘’అత్తత్త’’ –లక్ష్మీ కాంతం

· పువ్వుల లక్ష్మీకాంతమ్మ (మ. ఆగష్టు 3, 2008) తొలితరం సినిమా నటి, గాయని, నర్తకీమణి, రంగస్థల నటి. మాలపిల్లలో కథానాయకిగా ప్రసిద్ధి చెందారు. జీవితాంతం అవివాహిత గానే ఉన్న లక్ష్మీకాంతమ్మ దాదాపు 200 చిత్రాల్లో నటించారు.

బాల్యం
లక్ష్మీకాంతమ్మ, పశ్చిమగోదావరి జిల్లా, పెంటపాడులో నారాయణమ్మ, సింహాచలం దంపతులకు జన్మించారు. ఆ ఊరిలోగల వేణుగోపాలస్వామి ఆలయ ఉత్సవాల్లో వీరి కుటుంబ సభ్యులు నృత్య ప్రదర్శనలివ్వడం ఆనవాయితీగా వస్తుండేది. ప్రతి కార్యక్రమానికి ఈమె తండ్రి పువ్వుల సింహాచలం మృదంగం వాయించేవారు. నాయనమ్మ మాణిక్యం, మేనత్త సరస్వతి స్ఫూర్తితో నాట్యం నేర్చుకుని ప్రదర్శనలిస్తుండేది. కందికట్టు మాణిక్యం, జనాబ్‌యూసఫ్‌, చదలవాడ సామ్రాజ్యం వంటి గురువుల దగ్గర సంప్రదాయ నృత్య విధానాలే గాకుండా ఆధ్యాత్మిక రామాయణ కీర్తనల అభినయం వంటి ప్రక్రియలు నేర్చుకున్నారు. వాలుమొగ్గ భంగిమలో నోటితో రూపాయిబిళ్ళ, పంటితో సూదితీయగల ఆమె నాట్యకౌశల్యం గురించి పలు ప్రాంతాల్లో చెప్పుకునేవారు. విజయనగరం, బందరు, గుంటూరు, గుంతకల్లు, రాజమండ్రి వంటి నగరాల్లో ఈమె ప్రదర్శనకు గుర్తింపు, ప్రేక్షకుల ఆదరణ పుష్కలంగా ఉండేది.[1]

రంగస్థలంపై
1933 నుంచి రంగస్థల నటిగా మారిన లక్ష్మీకాంతమ్మ పాటలు, పద్యాలు స్వయంగా పాడుకుంటూ సక్కుబాయి, రంగూన్‌రౌడీ, వరవిక్రయం, తెలుగుతల్లి, హరిశ్చంద్ర, చింతామణి, గయోపాఖ్యానం, త్యాగరాజు, సావిత్రి, తులాభారం, రామదాసు, సారంగధర, కమ్మరిమొల్ల, శాంతినివాసం, మల్లమ్మ వంటి నాటకాలలో విభిన్న పాత్రలు పోషించి ఎంతో పేరుగడించారు. దొమ్మేటి సూర్యనారాయణ, బందా కనకలింగేశ్వరరావు, బళ్ళారి రాఘవ, పసల సూర్యచంద్రరావు, స్థానం నరసింహారావు, పి.సూరిబాబు, కన్నాంబ, రాజేశ్వరి వంటి మేటి నటులతో కలిసి నాటి రంగస్థల ప్రియులను అలరించారు. లక్ష్మీకాంతమ్మ తానే స్వయంగా శ్రీలక్ష్మీ కళాసమితి అనే నాటక సంస్థను స్థాపించి శ్రీకృష్ణతులాభారం, సక్కుబాయి, ఇదా ప్రపంచం, చంద్రగుప్త, విప్రనారాయణ, హరిశ్చంద్ర లాంటి నాటకాలు అనేక ప్రాంతాల్లో ప్రదర్శించారు.

సినీ రంగంలో
లక్ష్మీకాంతమ్మకు వేమూరి గగ్గయ్య ద్వారా 1936లో చిత్రపు నరసింహారావు దర్శకత్వంలో ‘సతీతులసి’ సినిమాలో నటించే అవకాశం లభించింది. తర్వాత సారథీ ఫిలింస్‌ వారి మాలపిల్ల, కొచ్చర్లకోట రంగారావు దర్శకత్వంలో ‘హరవిలాసం’ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. 1937లో పూర్ణా కామరాజు నిర్మించిన ‘దశావతారం’ సినిమాలో ఈమె భూదేవి, రేణుకాదేవి, కైకేయి, గోపికగా నాలుగు పాత్రలలో నటించి రికార్డు సృష్టించింది. రెండవ ప్రపంచ యుద్ధం కాలంలో మద్రాసు విడిచిపెట్టి ఏలూరు తిరిగి వచ్చి, మళ్ళీ రంగస్థల నటిగా అనేక నాటకాలలో నటించింది.

1958లో హాస్యనటుడు రమణారెడ్డి లక్ష్మీకాంతమ్మను మద్రాసు రప్పించి నిర్మాత, దర్శకుడు కె.బి.తిలక్‌కు పరిచయం చేసి, అత్తా ఒకింటి కోడలే సినిమాలో హేమలత అత్తపాత్రకు రికమెండ్‌ చేశాడు. వయసుమళ్ళిన ప్రధాన పాత్రను ఈమె చేయగలదా? అని తిలక్‌ మొదట సందేహించాడు. ఫస్ట్‌షాట్‌ తర్వాత ఆమె నటనకు అబ్బురపడి తన ప్రతి సినిమాలో అవకాశమిస్తానని మాట ఇచ్చి ఉయ్యాల జంపాల, ఈడుజోడు చిత్రాలలో కూడా నటింపజేశాడు. సినీ నటిగా లక్ష్మీకాంతమ్మ, మాఇంటి మహాలక్ష్మి, దొంగల్లో దొర, అదృష్టజాతకుడు, సమాజంలో స్త్రీ, భక్తపోతన, ఉమ్మడి కుటుంబం, మనుషులు- మట్టిబొమ్మలు, బాలరాజు కథ లాంటి 200 సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించింది.

మూగమనసులు సినిమా ప్రారంభ సన్నివేశాలలో అక్కినేని, జమున పాత్రల మధ్య కామెడీ సృష్టించిన అవ్వపాత్రను ప్రేక్షకులు ఎన్నటికీ మర్చిపోరు. జ్వాలాద్వీపరహస్యం చిత్రంలో మంత్రగత్తెపాత్ర, అత్తాఒకింటి కోడలే చిత్రంలో హేమలత అత్తగా బుద్ధిచెప్పేపాత్ర ఈమెకు నటిగా ఎంతో పేరు తెచ్చిపెట్టింది.

మరణం
వయసుమీదపడి 93వ సంవత్సరం ప్రవేశించినా తన అనుభవాలతో ఔత్సాహిక నటీనటులను ప్రోత్సహిస్తూ కృష్ణా జిల్లా, కైకలూరులో వృద్ధాప్య పింఛను, నటరాజ రామకృష్ణ లాంటి దాతల ఆర్థిక సహాయంతో కాలం గడుపుతూ ఆగష్టు 3, 2008లో మృతి చెందింది.

· సశేషం

· మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -23-7-22-ఉయ్యూరు

image.png

Posted in సినిమా | Tagged | Leave a comment

శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారి నా జీవిత కథ.15వ భాగం.22.7.22

శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారి నా జీవిత కథ.15వ భాగం.22.7.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-14

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-14

ప్రభుత్వ అణచివేతపై స్పందిస్తూ శిశిర్ కుమార్ ‘’ఇది దివ్యౌషధం .మంచిమార్పుకు ఆయుధం  .ఇంగ్లాండ్ లో గొప్ప విప్లవాలు తెచ్చింది అణచివేతలే ‘అని రాశాడు .1898లో వచ్చిన మున్సిపల్ బిల్లుపై వచ్చిన ఆందోళనలు మోతీలాల్ ను బాగా ఆకర్షించాయి లార్డ్ కర్జన్ బ్రిటిష్ ప్రయోజనాలను బుజానకెత్తుకోవటం సహించలేకపోయాడు .ప్రజా వెల్లువతొఅనెక బహిరంగ సభలు జరిగాయి.ఒక సభకు అధ్యక్షత వహించాడు .కలకత్తా పన్ను చెల్లించే వారిని ఉద్దేశిస్తూ పత్రికలో ‘’ప్రజలు నిర్ద్వంద్వంగా బిల్లును వ్యతిరేకించాలి ఖండించాలి .ఆ బిల్లు వద్దని సభ్యపదజాలంతో పాలకులకు తెలియజేయాలి .ప్రభుత్వం వినకపోతేప్రహసనం గా మారిన ఎన్నికల వ్యవస్థ రద్దు చేసి ,కలకత్తా మునిసిపల్ విభాగాన్ని ప్రభుత్వ విభాగంగా మార్చమని కోరాలి ‘’అని రాశాడు .ప్రభుత్వ మొండితనంతో బిల్లు చట్టమైంది .ఆతర్వాత స్వయం ప్రతిపత్తికల కార్పోరేషన్ కావటానికి 24ఏళ్ళు పట్టింది .డాకా మున్సిపాలిటి నుంచి విధాన పరిషత్తుకు ప్రతినిధిని ఎన్నుకొనే పధ్ధతి రద్దు చేయటం తో మరో వివాదం చెలరేగింది .ఈ విషయంలోనూ మోతీలాల్ సురెంద్రనాద్ ల మధ్య భేదాలేర్పడ్డాయి .మోతీలాల్ వ్యతిరెకిస్తెఆయన బలపరచాడు .పరస్పరారోపణలు వ్యక్తిగాతదూషణలుపెరిగాయి .ఈ అవాంచనీయ జర్నలిజం కొంతకాలం సాగింది .పరువు నష్టం దావా వేస్తానని మోతీలాల్ కు నోటీస్ పంపాడు .దీనపై పత్రికలో ‘’గాజు ఇంట్లో ఉంటూ అవతలవారిపై రాళ్ళు విసిరితే ఏమి జరుగుతుందో ఆపెద్దమనిషికి తెలీదా ? ఎవరు తవ్వుకొన్న గోతిలో వారే పడతారు అన్న సామెత గుర్తు౦చు కోవాలి ఆయన ‘’అని రాశాడు  .ఇద్దరి అనుయాయులు పరిష్కారానికి తీవ్ర ప్రయత్నం చేసి,సాధించి ఒక ప్రకటన తో సమాప్తి చేయించారు .కర్జన్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడటానికి వారి సఖ్యత ఒక రాజ మార్గమైంది .

  జన జాగృతికి కారణమైన కర్జన్

  1899లో వచ్చిన కర్జన్ 1905 లో  వెళ్లి పోయేముందు బ్రిటిష్ సామ్రాజ్యం బీటలు వారింది .బ్రిటిష్ జాతి అత్యున్నతజాతి అని ఆయన నరనరానా భావించి అహంతో ప్రవర్తించిన ఫలితమే ఈబీటలు .’’ఇండియాను వదులుకుంటే బ్రిటన్ మూడవ ప్రపంచ దేశంగా ఆధః పాతాళం లో పడిపోతుంది ‘’అనేవాడు .అందుకే ఉక్కు పిడికిలి లో బిగించాలని అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు .భారతీయులను ,విద్యాధికులను అర్ధం చేసుకోలేక పోయాడు .పాలనలో భారతీయ భాగం తగ్గించటానికి తీవ్రయత్నాలు చేశాడు .అతడి నిష్క్రమణ ను వివరిస్తూ మోతీలాల్ ‘’కర్జన్ యువకుడు డాబు దర్పం ఉన్నవాడు .శిక్షణ లేకుండా అధికారానికి వచ్చాడు .మన దేశం పై ముసరిన పెద్ద మేఘం అతడు .రాకెట్ లా పైకి లేచి మిణుగురులా కూలిపోయాడు ‘’అని సార్ధకమైన వ్యాసం రాశాడు .

  కలకత్తా మున్సిపాలిటీ పనిపట్టి విశ్వవిద్యాలయం లో కూడా రాజకీయ జోక్యం పెంచాడు కర్జన్ .విద్యావ్యవస్థలోకూడా జాతీయ వాదం లేకుండా చేయటానికి  విశ్వ ప్రయత్నం చేశాడు .అమృతబజార్ పత్రిక మొదలైనవి ఆయన చర్యలపై ఘాటైన విమర్శలు చేశాయి .మోతీలాల్ ఆయన్ను కలుసుకోవటానికి వెడితే మొహం చూపించని అహంకారి .ఇద్దరూ వేర్వేరు గదులలో కూర్చుని చీటీలద్వారా స౦భాషణ జరిపారు  .కర్జన్  ప్రైవేట్ సెక్రెటరి  ఆసులో గొట్టం లా అటూ ఇటూ తిరుగుతూ ఈ’’ చీటీ రాయబారం చేశాడు .ఈ సంఘటనపై మోతీలాల్ ‘’ప్రభువుగారు నాలాంటి సామాన్యులతో చర్చించటం న్యూనత గా భావించిన ఉన్నతులు ‘’అని రాశాడు .1902కలకత్తా యూని వర్సిటి కాన్వో కేషన్ లో కర్జన్ చాన్సలర్ హోదాలో ‘జాతీయ పత్రికలు  చెప్పేది నమ్మవద్దు ‘’అని హితవు చెప్పాడు .దీనికి దీటుగా మోతీలాల్ పత్రికలో ‘’ఒక వైస్రాయి చేయతగినవీ చేయతగనివీ ఏమిటి ‘’?అనే శీర్షికలో ‘’ ఎడ్వర్డ్ చక్రవర్తి ప్రతినిధిగా వైస్రాయి కర్జన్ కు నాలుగు కళ్ళు రెండు ముందు,రెండు వెనక  ఉండాలి .వైస్రాయి ఎంతై వాడైనా కళ్ళజోడు వాడకూడదు .పచ్చకామెర్ల జబ్బు ఉంటె నయం చేసుకోవాలి. అసలు ఆజబ్బున్నవాడు సింహాసనానికి పనికి రాడు.ప్రత్యర్ధి విమర్శను హత్యగా భావి౦చ రాదు .విమర్శలను సంతోషంగా స్వీకరించే లక్షణం అవసరం ‘’అని రాశాడు .ఈ విమర్శ అతడికి చేరినా తెలు కుట్టిన దొంగ లా మిన్నకున్నాడు.బ్రిటిష్ రాజ్యం పతనావస్థలో ఉందని తెలిసి కాపాడుకొనే ప్రయత్నం లో మునిగిపోయాడు .1905లో కలకత్తా విశ్వ విద్యాలయ స్నాతకోత్సవం లో కర్జన్ ‘’ప్రపంచం లో సమున్నత సత్య  సంధత ప్రాచ్య దేశాలకంటే పాశ్చాత్య దేశాల్లోనే ఎక్కువగా ఉంది  .పొగడ్త సత్య దూరం కారాదు ‘’అని భారతీయతను ఎద్దేవా చేస్తున్నట్లుమాట్లాడాడు .దీనితో తీవ్ర ఆందోళనలు చేశారు జనం . ‘’ప్రాక్ ప్రపంచపు సమస్యలు ‘’అనే కర్జన్ రాసిన గ్రంథం లో కొరియా బాయబారిగా ఉండటానికి తాను  ఆడిన ఒక అబద్ధాన్ని కర్జన్  తన నోటి తోనే చెప్పిన ఉదంతాన్ని పేర్కొని మోతీలాల్ ఎద్దేవా చేశాడు  రెండవ ముద్రణలో కర్జన్ ఆభాగాన్ని తీసేయించి జాగ్రత్త పడ్డాడు కర్జన్ . కర్జన్ ఆడిన అతిపెద్ద అబద్ధాన్ని బట్ట బయలు చేసినందుకు మొతీలాల్ ను ,  అమృత బజార్ పత్రికను దేశ విదేశాల పత్రికలన్నీ శ్లాఘించాయి భారత పత్రికలూ ఉబ్బి తబ్బిబ్బే అయ్యాయి .దివీక్లీ టైమ్స్ ‘’పత్రిక దీనిపై స్పందిస్తూ ‘’బహుశా సత్య సందత అనేది   కర్జన్ కు యాన్కీలకు సహజంగా ఉండే సత్య సంధత  ఆయన పెళ్లి చేసుకొన్న అమెరికన్ అమ్మాయి భార్య అయినతర్వాత  వచ్చి ఉంటుంది ‘’అని వ్యంగ్యంగా రాసి చురుక్కుమనిపించింది .బ్రిటిష్ జీవన సరళిని అనుకరిస్తున్న సంపన్నులైన భారతీయులను తేలికగా చిన్న చూపు చూస్తూ ‘’కాంగ్రెస్ పునాదులు కదుల్తున్నాయి.ఇండియాలో ఉండగానే దాని సర్వనాశనం చూడాలని నా ముఖ్య ఆశయం ‘’అన్నాడు 1900లోనే . కానీ కాంగ్రెస్ దినదినాభి వృద్ధి చెంది బ్రిటిష్ పునాదులే కదిలించి మూటా ముల్లె సర్దుకొని పోయేట్లు చేసింది ..సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్-22-7-22-ఉయ్యూరు   .

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

భారతీ నిరుక్తి .17వ భాగం.22.7.22

భారతీ నిరుక్తి .17వ భాగం.22.7.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారి నా జీవిత కథ.14వ భాగం.21.7.22=9

శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారి నా జీవిత కథ.14వ భాగం.21.7.22=9

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-13

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-13

మోతీలాల్ ఘోష్ భారత జాతీయ కాంగ్రెస్ లో చేరాడు .1889లో కాంగ్రెస్ సభలకుఅధ్యక్షత వహించిన సర్ విలియం వెడర్బన్  శాసన పరిషత్తు లో భారతీయులకు ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించటానికి సంస్కరణలు సూచిస్తే ,మోతీలాల్ దానికి ఒక  పధకం ఆలోచించాడు .భారతీయుల లక్ష్యాలను బలపరచే ‘’బ్రిటిష్ పార్లమెంట్ లో భారతీయ సభ్యుడు ‘’అని పిలువ బడే చార్లెస్ బ్రాడ్ లాప్ కూడా హాజరయ్యాడు .అమృతబజార్ పత్రిక ప్రతిపాదనలే బాగా ఉన్నాయనిమెచ్చాడు .కానీ టోరీ పార్టీ వీటిని బలపరచకపోవచ్చు అనీ చెప్పాడు .ఆమోదింపబడిన తర్వాత ప్రోవెంషియల్ కౌన్సిల్స్ లో భారతీయ ప్రాధాన్యం పెరిగింది .

  బ్రిటన్ లో కాంగ్రెస్ లక్ష్యాల సాధనకు కాంగ్రెస్ ఒక కమిటీ ఏర్పాటు చేసింది .ఇందులో రిటైర్ అయిన ప్రభుత్వోద్యోగులు వెడర్ బర్న్,కాటన్ ,కీర్ హార్డీ,రాట్ క్లిఫ్ ,బ్రిటీష్ లేబర్ ప్రధాని కాబోయే మాక్దోనాల్ద్ ,చార్లెస్ బ్రాడ్ లాఫ్ హెచ్ బి రూధర్ ఫర్డ్ లాంటి ఉగ్రవాదులు , నేవింగ్ సన్,విలియం డిగ్ బీ ,స్కేవెన్ బ్లాంట్ మొదలైనవారితో బ్రిటిష్ కమిటీ ఏర్పడింది .1892లో కాంగ్రెస్ నాయకుడు దాదాభాయ్ నౌరోజీ బ్రిటిష్ పార్లమెంట్ కు ఎన్నికవటం ఘనవిజయం .ఇంతకు  మించి ఆ కమిటీ ఏమీ సాధించలేక పోయింది .బ్రిటిష్ పార్లేంట్ లో ఇండియా విషయాలు చర్చిస్తే ,ఆ దేశాన్ని బ్రిటిష్ కోల్పోయినట్లే అనే అభిప్రాయం అక్కడ దిగువ సభలో బలంగా ఉండేది. పైకమిటీకి కాంగ్రెస్ యాభై వేలరూపాయలు వార్షిక గ్రాంట్ మంజూరు చేసింది .అక్కడ ‘ఇండియా ‘అనే పత్రికపెట్టినా ,పొడిచేసిందేమీ  లేదు .ఈవిషయం మొతీలాల్ ముందే చెప్పాడు .ఈ సభలప్పుడే మోతీలాల్ –బ్రాడ్ లాఫ్ సమావేశం జరిగి ఆయన మనసు ఇండియాకు అనుకూలంగా మార్చగలిగాడు మోతీలాల్ .జీవితాంతం భారత్ ను బలపరుస్తూనే ఉన్నాడాయన’

           మలిమార్పు

1891లో పెళ్లి అయిన ఆడపిల్లలకు  దాంపత్య జీవితానికి వయోపరిమితిని 10నుంచి 12 ఏళ్ళకు మార్చటం కోసం చేసిన ప్రతిపాదన తీవ్ర సంచలనం కలిగించింది .అమృతం కూడా సనాతనులతో పాటు నిరసించింది .ప్రజలు కోరితేనే మార్చాలని వీరి అభ్యంతరం .పత్రికను సమర్ధిస్తూ భారీ నిరసనలు సభలు జరిగాయి .అయినా బిల్లు చట్ట౦  అయింది. ప్రజాభిప్రాయాన్ని మన్నించ నందుకు ,ప్రజల నిత్య సమస్యలను చర్చించటానికి ఒక పత్రిక కావాలని అందరూ భావించారు .ఘోష్ సోదరులపై వత్తిడి తెచ్చినా ఆర్ధికంగా దెబ్బ తిన్న కారణంగా సాహసించలేకపోయారు. కానీ ప్రజాభి ప్రాయం బలంగా ఉంది దినపత్రికగా మారకపోతే మాబతుకు బస్ స్టాండ్ అవుతుందని వాపోయారు సోదరులు ఒప్పుకోక తప్పలేదు .ప్రింటింగ్ మెటీరియల్ తగినంతగా లేకపోయినా ధైర్యంగా ముందడుగు వేశారు 19-2-1891అమృత బజార్ ఆంగ్లం లో దినపత్రికగా ప్రత్యక్షమైంది .ప్రజా సంఘటితను రాజకీయ సాంఘిక సంస్కరణలవైపు మళ్ళించితేనే జాతికి ప్రయోజనం అని మోతీలాల్ ఆలోచించాడు. లాల్ ఆలోచన తర్వాతే 1920లో తిలక్, గాంధీ కూడా .రాజకీయ ఉద్యమం లో సంస్కరణల అవసరాన్ని ప్రచారం చేశారు .

   మున్సిపాలిటీ లలో మాత్రమె ప్రాతినిధ్యం కలిగింది. బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కు ప్రతినిధిని పంపే అధికారం 1892చట్టం ప్రకారం కలకత్తా మున్సిపాలిటీకి మాత్రమె ఉంది .మోతీలాల్ మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేయాలనుకోగా పత్రిక  ,ప్రజలు పూర్తిగా మద్దతు ఇచ్చారు .ఉత్తరాకలకత్తా 1వ వార్డు నుంచి ఆయన ఎన్నికల అరంగేట్రం చేశాడు .ప్రత్యర్ధులు చాలాబలమైన సంపన్నులు అక్కడ కాయస్థ కులం వారు ఎక్కువే .’’చేతనైనంత ప్రజా సేవ చేస్తాను ‘అని మాత్రమె ప్రచారం చేసి ఓడిపోయాడు .డబ్బు ,విందు మందు పంచలేదు ,దీనితో ఎన్నికలలో నిలబడకూడదు అనే భావం పెరిగిపోయింది .ఒక కేసులో అప్రతిష్ట పాలైన ఒక స్త్రీకి మోతీలాల్ అండగా నిలిస్తే సురెంద్రనాద్ బెనర్జీ హితవాది సంపాదకుడు కాళీ ప్రసన్న కావ్య విశారదను బలపరిస్తే రాజీకోసం ఈయన ప్రయత్నించినా కోర్టులో కేసుజరిగి కాళీ దోషిగా నిర్ధారించబడ్డాడు .దీనితో మోతీలాల్ పై కక్షకట్టాడు .జైలు నుంచి విడుదలై అమృత బజార్ పత్రికపై అవాకులు చెవాకులు పేలుతూ వ్యాసాలూ రాస్తే ఘోష్ సోదరులు 1889లో ఆయనపై పరువు నష్టం దావా వెయ్యాలని అనుకొంటే ఆయనే ముందు వీరిపై వేయగా  విచారణ జరిగి మోతీలాల్ కు వెయ్యి రూపాయలు జరిమానా వేయగా చెల్లించి బయటికి వచ్చాడు .మరోకేసులో దోషి ఒకయూరోపియన్ .విచారించిందీ ఆయన దేశం వాళ్ళే .దోషికి శిక్ష పడలేదు పైగా విస్తృత ధర్మాసనం కూడా అక్కర్లేదని తెల్ల జడ్జి నల్ల తీర్పు .ఈ కేసుతో భారత జాతీయతా వాదానికి ఆనుకూల్యత బాగా ఏర్పడింది .

    రాజకీయ దక్షత

కాంగ్రెస్ లో ఉన్నా  సురేంద్ర నాధ బెనర్జీ ఉగ్రవాదుల్ని ,మోతీలాల్ సమకాలీన అంశాలకు మద్దతిచ్చేవారు .మహారాష్ట్రలో కూడా శిశిర్ కుమార్ ను గురువుగా భావించే తిలక్ ఉగ్రవాదుల్ని బలపరచాడు .గోఖలే తిలక్ తో భేదించాడు .అరవిందో ,పాల్ ,రాయ్ సర్దార్ అజిత్ సింగ్ లు అతివాదులై బలం చేకూర్చారు .1888లో కలకత్తాలో రాష్ట్రస్థాయి రాజకీయసభలు కలకత్తాలో  సురేంద్ర నాధ నాయకత్వాన జరిగాయి .తర్వాత జిల్లాలు పట్టణాలలో కూడా జరపాలను కొన్నారు .1895లో బెంగాల్ లో అనేక పట్టణాలలో పెద్ద పెద్ద పందిర్ల కింద జరిగిన ఆఖరి సభ చివరి 6నిమిషాలలో బెంగాల్ అంతా తీవ్ర భూకంపం వచ్చి తీవ్ర నష్టం కలిగించింది .అమృతబజార్ పత్రిక ‘’భూకంపం జరిగిన అర్ధగంట తర్వాత మళ్ళీ అందరూ సమావేశమై  సభ నిర్వహించారు ‘’అని రాసింది .

 1896 పశ్చిమ భారతం లో కరువు ప్లేగు వ్యాపించి ఇబ్బంది పెడితే ,తిలక్ నిర్విరామంగా కృషి చేసి వైద్య ఆరోగ్య ఆహార సౌకర్యాలు కలిపించాడు .శివాజీ ఉత్సవాన్నీ జరిపాడు .బ్రిటిష్ ప్రభుత్వం ఈ కల్లోల సమయంలో మొరటుగా వ్యవరిస్తే కోపోద్రేకం తో ఇద్దరు యువకులు కెప్టెన్ రాండ్ ,లెఫ్టినెంట్ అయేష్టి అనే సైన్యాదికారుల్ని కాల్చి చంపారు .వేగంగా విచారణ జరిగి ఉరి శిక్ష వేశారు .ప్రజలు ఆందోళనలకు దిగగా తిలక్ ‘’కేసరి ‘’లో ఈ దారుణాలపై వ్యాస పరంపరాలతో చైతన్యం కలిగించాడు .బొంబాయి ప్రభుత్వం తిలక్ ను ప్రాసిక్యూట్ చేసింది .తిలక్ తరఫున ప్రముఖ  బెంగాల్ బారిస్టర్ ఆర్ధర్ పఫ్ వాదించాడు .9మంది సభ్యుల జ్యూరీ విచారించి తిలక్ 18నెలలు జైలు విధించారు .రీ అప్పీల్ కు అవకాశమివ్వలేదు క్షమాపణ చెప్పి బయట పడమని కొందరు సూచిస్తే అమృత బజార్ పత్రిక దాన్ని ఖండించి తిలక్ క్షమాపణ కోరరాదు అన్నది –దీనికికారణాలు –‘’తిలక్ రాతలలో రెచ్చగొట్టే మాటలు లేవు ,రాజకీయం లో ఉన్నవారు కష్టనష్టాలకు తలక్రిందు కారాదు .ఆయన మహారాష్ట్రలో ఉండి నిత్యం అవమానం పొందటం కంటే అండమాన్ లో ఉండటమే మంచిది ‘’అని రాసింది .రాజీ పరిష్కార సూచానకూ తిలక్ బాధపడుతూ మోతీలాల్ కు రాసిన లేఖలో –‘’తప్పు చేశాను అని ఒప్పుకో మంటోంది ప్రత్యర్ధి వర్గం .ప్రజలమధ్య నాస్థానం నా ప్రవర్తనమీద ఆధార పడి ఉంటుంది .నేను తలొగ్గితే మహారాష్ట్ర మొత్తం అండమాన్ అయి నన్ను శిక్షిస్తుందని నాకు తెలుసు .జ్యూరీ ముందున్న కేసు చాలా బలహీనమైందనీ నాకు బాగా తెలుసు .కీలక సమయం లో మనో ధైర్యాన్ని కోల్పోతే ,మనం ప్రజల్ని మోసం చేసినట్లే .గౌరవనీయ నిజాయితీ పరుడుగా ఉన్ననేను చేయని నేరాన్ని ఒప్పుకోవటం దేనికి ?.నాకు శిక్షపడితే ,నా దేశ ప్రజల సానుభూతి నా కష్టకాలం లో నాకు అండగా ఉంటుంది ‘’అని రాశాడు ఆయన విదేశీ మిత్రులు ప్రొఫెసర్ మార్క్స్ ముల్లర్ ,సర్ విలియం హంటర్ ల జోక్యంతో ఏడాది శిక్ష అవగానే విడుదలయ్యాడు తిలక్ .ఆయనపై మళ్ళీ అవినీతి ఫోర్జరీ వగైరా కేసులు పెట్టారు కానీ ఏవీ నిలవలేదు .తిలక్ కేసుమూలంగా తిరుగుబాటు ప్రోత్సహించే కార్యాలపై 1897లో నిబంధనలు మరీ కట్టుదిట్టం చేసింది ప్రభుత్వం .స్వీయ రక్షణకు ఇవన్నీ అవసరం అని లెఫ్టినెంట్ గవర్నర్ మెకంజీ అన్నాడు .ఇవి చాలక తమ రక్షణకోసం మరిన్ని తీవ్ర చట్టలు తెచ్చింది ప్రభుత్వం .’’దేశ ప్రయోజనాలకోసం శత్రు సంహారం అవసరమే ‘’ అనే గీతావాక్యాలను తిలక్ ,బంకిం చంద్రాల నోటి నుండి విని ప్రజలు ప్రభావితులయ్యారు. అరవిందుడు బెంగాలీ విప్లవ దళం పెట్టి యువతను ఆకర్షించాడు .నాతూ సోదరుల నిర్బంధం జాతీయవాదాన్ని మరింత పదునెక్కించింది .ప్రభుత్వ అణచి వేతలు పెరిగినకొద్దీ ఉగ్రవాద జాతీయోద్యమం మరింత బలపడింది ,

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-7-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

భారతీ నిరుక్తి .16వ భాగం.21.7.22

భారతీ నిరుక్తి .16వ భాగం.21.7.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

జ్ఞాపకాల మొగలిపొత్తు పరీమళాలలో శ్రీ సోమయాజి గారు

జ్ఞాపకాల మొగలి పొత్తు పరీమళాలలో  శ్రీ సోమయాజి గారు

  ఈనాటి సాహిత్యలోకం లో సోమయాజి గారు అంటే శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజి గారే .ఆయనలో గొప్ప కవీశ్వరుడు ,దార్శనికుడు ,ఆత్మీయ స్నేహమూర్తి ,మీదు మిక్కిలి భక్తకవి కనిపిస్తారు .తాతగారు వాగ్గేయ కారులు శ్రీ పువ్వాడ రామదాసు గారు .తండ్రిగారు ఆంధ్రదేశం పట్టని కవిపాదుషా శ్రీ పువ్వాడ శేషగిరి రావు గారు .వీరు అక్కడి కుదురు లోని ఇంగువకట్టిన గుడ్డ .సల్లక్షణాలన్నీ,వారసత్వంగా ,కొంత స్వయం సంపాదకంగా లభించినవీ ,లాభించినవీ .’’జీవితభీమా సంస్థ ‘’లో ఉద్యోగించి డివిజనల్ స్థాయి ఆఫీసర్ గా పదవీ విరమణ చేశారు .గత ఏభై  ఏళ్ళుగా  కృష్ణా జిల్లా రచయితల సభకు పెద్ద కాపుగా అండదండగా ఉంటూ సంస్థ ఎదుగుదలకు అన్నిరకాలుగా దోహదం చేశారు .మొన్న అంటే 18 వ తేదీ సోమవారం రాత్రి  అయ్యదేవర కాళేశ్వర రావు గారిపై  నేను చేసిన ప్రత్యక్ష ప్రసారాన్ని ఆద్య౦త౦ 6-30 నుంచి 7-30వరకు నాన్ స్టాప్ గా చూశారు .నిన్న 19 మంగళవారం ఉదయం 6-30 గంటలకు శివైక్యం చెందారంటే ఆశ్చర్య పోయి ,నమ్మాల్సి వచ్చింది .ఆయన నమ్మిన శ్రీ రామ సన్నిధి చేరారు .నాపై అనంత ప్రేమ ,ఆదరం, గౌరవం ,ఆపేక్ష ఉన్నవారాయన .నాకూ వారు పెద్దన్నయ్య లాటి వారే  .నిన్న అనుకోకుండా నేను కొంచెం నీరసంగా ఉండటం తో   వారి అంతిమ దర్శనానికి వెళ్ళలేక పోయిన అభాగ్యుడను .వారి ఆత్మకు శాంతి కలగాలనీ ,వారి కుటుంబానికి సానుభూతి తెలియ జేస్తున్నాను .

కృష్ణా జిల్లా రచయితల సంఘానికి వెన్నెముకగా ఉన్న ప్రముఖ కవులు రచయితలు   శ్రీ మాదిరాజు రామలింగేశ్వరావు గారు ,శ్రీమతి కె.బి. లక్ష్మిగారు గతించి పూడ్చరాని పెద్ద లోటునే కలిగించారు  .ఇప్పుడు పువ్వాడ వారి ఆకస్మిక మరణం కోలుకోలేని  మరో దెబ్బ .నవ్వుతూ ఆనవ్వుమాటున వ్యంగ్యపు మొగలి ముల్లు గుచ్చుతూ స్నేహ పరీమళాన్ని వ్యాపించే ఉత్తమ సంస్కారి సహృదయులు ,సౌజన్య మూర్తి సోమయాజులుగారు .నుదుట ఎర్రని నిలువు శ్రీ చూర్ణం ,తెల్లని పైజమా, లాల్చీలతో నవ్విస్తూ ,కనుకోసల్నించి కవ్విస్తూ పలకరించారు అంటే ఆయన పువ్వాడ సోమయాజి గారే .

  సోమయాజి గారితో నా మొదటి పరిచయం సుమారు 52ఏళ్ళ క్రితం జరిగినట్లు జ్ఞాపకం .కృష్ణా జిల్లా గ్రంథాలయ  శాఖ కార్యదర్శి శ్రీ చంద్ర శేఖరరావు గారు బందరు  ఫోర్ట్ రోడ్ లోని సెంట్రల్ లైబ్రరీ లో  శ్రీ ఆవంత్స సోమసుందర్ గారి ని ఆహ్వానించి ముఖ్య ప్రసంగం ఏర్పాటు చేశారు .అప్పుడు ఉయ్యూరు హైస్కూల్ లో మాతో పాటు పని చేస్తున్నఆధునిక కవిత్వం పై అధారిటి ,మహా సారస్వత విమర్శకుడు  స్వర్గీయ టి.ఎల్.కాంతారావు గారు మమ్మల్ని కూడా  ఆసభకు  వెడదాం రమ్మని కోరగా ,ఆయనతోపాటు నేనూ ,లెక్కల మేష్టారు శ్రీ పసుమర్తి .ఆంజనేయ శాస్త్రిగారు ,హిందీ మాస్టారు శ్రీ కొడాలి రామా రావు గారు కలిసి బస్ లో వెళ్లాం .అక్కడ సోమ సుందర్ గారి ఉపన్యాసం రాత్రి 8కి అని గుర్తు .అనర్గళంగా తన వజ్రాయుధం కావ్యం గురించి మిగిలిన సాహిత్య విషయాలగురించి అద్భుత ప్రసంగం చేశారు .అదే ఆయన్ను మొదటి సారి చూడటం .  ,అప్పుడప్పుడు బెజవాడ రేడియో స్టేషన్ వారి ఉగాది కవి సమ్మేళనాల లో  చూశాను. చివరిసారిగా కృష్ణా జిల్లా రచయితల సంఘం జరిపిన ప్రపంచ తెలుగు రచయితల సభలో ఆయన వెబ్ సైట్ ను శ్రీ రామతీర్ధ వేదికపై ప్రారంభించినప్పుడు  చూశాను .బహుశా ఇదే చివరి సారి అయిఉంటుంది .అప్పటికే పండి పోయారు .

  సరే బందరులో ఆవంత్స వారి ప్రసంగం అవగానే ఆయన్ను కారేక్కించి పంపేశారు .ఆ రాత్రి భోజనం ,పడక  సెక్రెటరి చంద్ర శేఖరరావు గారి౦ట్లోనే అని గుర్తు .ఈ ఏర్పాట్లన్నీ కాంతారావు గారే చేశారు .బహుశా మర్నాడు ఆదివారం ఉదయం అందరం అక్కడే కాలకృత్యాలు వగైరా  ,కాఫీ టిఫిన్లు పూర్తీ చేశాక .మమ్మల్ని కాంతారావు గారు ముందుగా శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజి గారింటికి తీసుకు వెళ్ళారు .అక్కడ వారి తండ్రిగారు కవిపాదుషా శేషగిరిరావు గారు వాలు కుర్చీలో  ఆసీనులయి ఉండగా దర్శించి నమస్సులు అందించాం .తర్వాత సోమయాజిగారితో పరిచయం చేయించారు కాంతారావు గారు .మళ్ళీ అక్కడ కూడా వారి ఆతిధ్యం తీసుకోనినట్లు జ్ఞాపకం .అక్కడి నుంచి ప్రముఖ కథకులు విమర్శకులు ,ఎల్ ఐసి లో ఉద్యోగి  శ్రీవిహారి గారింటికి తీసుకొని వెళ్లి పరిచయం చేశారు .ఆతర్వాత అదే సంస్థలో పని చేస్తున్న ,సాహితీ వేత్త శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారినీ పరిచయం చేశారు .అప్పుడాయన ఇన్ షర్ట్ లో సన్నగా రివటగా ఉన్నట్లు జ్ఞాపకం . సుబ్బారావు గారి మీద ఎందుకో కాంతారావు గారి మాటలలో సదభిప్రాయం వ్యక్తమయ్యేది కాదు .పిమ్మట అదేసంస్థలో ఉద్యోగి మహా కథారచయిత సి. రా .అంటే శ్రీ సింగరాజు రామ చంద్ర మూర్తి గారినీ కూడా వారి వారి ఇళ్ళ వద్ద పరిచయం చేశారు .ఆతర్వాత ఆంద్ర సారస్వత సమితి అధ్యక్షుడు శ్రీ సత్యనారాయణ గారినీ ,పరిచయం చేశారు .వీరందరితో మాకు అదే మొదటి సారి పరిచయం . అంతా అయ్యాక అందరం మళ్ళీ బస్సెక్కి ఉయ్యూరు ఏ మధ్యాహ్నానికో చేరి ఉంటాం .బందరులో ఇందరు సాహితీ మూర్తుల పరిచయ భాగ్యం కలగటం శ్రీ కాంతారావు గారి సౌజన్యమే కారణం .మర్చి పోలేని సుగంధ సాహితీ పరిమళం ఇదంతా .

  2008 లో కృష్ణా జిల్లా రచయితల సంఘం తో పరిచయం శ్రీ సోమంచి రామ౦ గారి వలన  జరిగింది .ఆయనే నన్ను సుబ్బారావు ,పూర్ణ చ౦ద్ గార్లకు పరిచయం చేసి నా చేత సెకండరీ విద్య మీద ఒక వ్యాసం రాయించారు జాతీయ సభలకోసం .అప్పటినుంచి ఆ సంఘం లో నాకు చ.క్కని అవకాశాలిస్తూ  ,ప్రోత్సహిస్తూ ,మంచి మంచి వ్యాసాలూ రాయిస్తున్నారు.నన్ను తమలో ఒకరినిగా చేసుకొన్నారు . సంస్థ నిర్వహించే జాతీయ అంతర్జాతీయ మహాసభల కు నేను తప్పక హాజరౌతూ నావంతు సాహితీ సాయం చేస్తున్నాను .వారిద్దరూ కూడా ఉయ్యూరులో నేను సాహితీ మండలి కన్వీనర్ గా ఉంటూ చేసిన కార్యక్రమాలకు వస్తూ ,విలువైన ప్రసంగాలు చేస్తూ ,ప్రోత్సహించారు .అప్పుడే బెజవాడ సభలలో శ్రీ సోమయాజిగారితో పరిచయం బలపడింది .ఆయన్ను ఉయ్యూరు తీసుకువచ్చి సాహిత్య ప్రసంగం చేయించి ,మా తలిదండ్రులు గబ్బిట భావనమ్మ మృత్యుంజయ శాస్త్రి గారల స్మారక పురస్కారం అందించాను .ఆ ఉపన్యాసం పై నా స్పందన తర్వాత కార్డ్ మీద రాసి పంపాను చదివి పరమసంతోషించారు .ఆతర్వాత రేడియోలో బుద్ధుని పై ప్రసంగం చేసినప్పుడు సోమయాజిగారిదో వారి నాన్నగారిదో ఒక పద్యం కోట్ చేసి స్పూర్తి కలిగించా .

  2009లో సరసభారతి స్థాపించిన దగ్గరనుండీ సుబ్బారావు,పూర్ణచంద్ .బుద్ధప్రసాద్ ,మాదిరాజు, సామల రమేష్ ,సోమయాజిగార్లు  మా కార్యక్రమాలకు వస్తూ ప్రసంగిస్తూ,పుస్తకావిష్కరణ లో , కవి  సమ్మేళనాలలో పాల్గొంటూ మాసంస్థ అభి వృద్ధికి తోడ్పడ్డారు . గ్రంథాలయ వారోత్సవాలలో కూడా సోమయాజిగారిని ఆహ్వానించి లైబ్రేరియన్ శ్రీమతి సుజాత గారి ఆధ్వర్యం లో సత్కరించాం.హాస్య కవి సమ్మేళనం లో సోమయాజిగారు ఆత్మీయ అతిధిగా విచ్చేసి ‘’ఉయ్యూరు అంటే నాకు చాలా ఇష్టం .ఇక్కడి కవి సమ్మేళనాలు అంటే మరీ ఇష్టం .అందుకే తప్పక హాజరౌతాను .మంచి సాహితీ అభిరుచి ఉన్న సంస్థగా సరసభారతి అభి వృద్ధి చెందుతోంది ‘’అని చెప్పి హాస్య స్పోరకంగా రాసిన ఒక  పద్యం చదివి వినిపించారు  

  కృష్ణా జిల్లా రచయితల సంఘం నిర్వహించిన అన్ని బృహత్తర కార్యక్రమాలలో శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజిగారు ఒక అధికార కోశాధికారిగా  చేతిలో బాగ్ అందులో డబ్బు ఉన్న కవర్లు పెట్టుకొని ఆహ్వానితులకు అతిధులకు అందజేయాల్సిన పైకాన్ని అందిస్తూ,పుస్తకం లో సంతకాలు పెట్టిస్తూ కనిపించటం ఒక ప్రత్యేకతగా నేను చాలా సార్లు గమనించాను .అంతటి నిబద్ధత వారిది అందుకే ఆ  బాధ్యత వారిపై పెట్టేది సంఘం .సర్వ సమర్ధతతో వారు నిర్వహించేవారు .అసలే మాట బహు స్వల్పం ,వినిపించీ విని పించనట్లు మాట్లేడేవారు ఆబాధ్యతలో నవ్వుతూ చాలా ఓపికగా కనిపించేవారు .ఆయన లేని సభ మొన్న నవంబర్ లో బందరులో జరిగిన సభ తప్ప దాదాపు అన్నిటిలో చూసిన గుర్తు ఆయన ఉంటె ఒక ఠీవి,ఒక దర్జా ,ఒకరాజసం ఒక నిండుతనం,ఒక ఆత్మీయ స్పర్శ  కనిపించేవి .

  సోమయాజిగారు తమ పుస్తకావిష్కరణ సభలనూ కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యం లో చాలా ఘనంగా జరిపేవారు .గొప్ప ఉపాహారం, దానితర్వాత మహా విందు తప్పని సరి .స్వాదిష్టమైన భోజనాలే అవి .దాదాపు నాలుగేళ్ల క్రితం తండ్రిగారి కార్యక్రమం ఒకటి హోటల్ ఐలాపురం లో జరిపి వారి కుటుంబంలోని చిన్నా పెద్దలను అందర్నీ వేదికపై సన్మానించి జ్ఞాపికలు అందించారు .వారందరిలో ఆత్మీయత ,ఆనందం చూసి పొంగిపోయారు .వారి కుటుంబ పెద్దల ఆశీర్వచనం పొందుతూనే వారిలోని వినయ విధేయతలు ప్రస్ఫుటంగా చూశాను .ఆ దృశ్యం ఇంకా నా కళ్ళముందు మెదులుతూ చిరస్మరణీయంగా ఉంది . మిత్రులు ,నా అభిమాని ,సరసభారతికి ఆత్మీయులు ,తనదైన ధోరణలో పద్యరచన చేస్తూ అంతే విలక్షణ ధోరణిలో భావ రాగ యుక్తం గా పద్యాలు  హృద్యాలయేట్లు చదవగలిగిన నేర్పున్న శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజి గారు తమ పితృదేవులు కవిపాదుషాశ్రీ పువ్వాడ శేషగిరిరావు మహోదయుల ‘’కవిత్వం ,వ్యక్తిత్వం ‘’పై ఒక సమగ్ర  బృహద్గ్రంథాన్ని ప్రచురించి పిత్రూణ౦ తీర్చుకొన్నారు .దాన్ని నాపై అభిమానంతో నాకు పంపగా 25-7-19 చేరింది .పాదుషా గారి గురించి అందులో ఎందరెందరో ఎన్నెన్నో విధాల చెప్పారు .ఇటీవలే తండ్రిగారి సాహిత్య సర్వస్వం ప్రచురించి పిత్రూణం తీర్చుకొన్నారు .దీనికి నా అభిప్రాయాన్ని రికార్డ్ చేసి వాట్సాప్ లో  పంపమని ఫోన్ పై కోరితే రికార్డ్ చేసి పంపాను .అంతటి అనురాగం వారికి నాపై ఉండేది .సోమయాజిగారి భార్యగారు బహుదొడ్డ ఇల్లాలు .పిల్లలు రత్నమాణిక్యాలు .     దేశం లోని అవధానాలలో ,భువన విజయాలలో ఆయన లేకుండా ఏదీ జరగలేదనే జ్ఞాపకం .పద్యాలు ఆయన హృదయం లోతుల్లోంచి పెల్లుబుకుతాయి .ఆధునిక పదాలకంటే సంప్రదాయ సిద్ధపదాలకే ఆయన ప్రాధాన్యమిస్తారు .ఇటీవలే రామాయణకావ్యమూ రచించి ధన్యులయ్యారు . రేడియోలో ,చినుకు మాసపత్రికలో ఎన్నెన్నో అద్భుత పద్యాలను విశ్లేషించి ,లోతులు తరచి అందచందాలు వివరించారు .సరసభారతి కవి సమ్మేళనానికి ముందు ఆయన్ను పిలిచి తర్వాతే మిగతా వారిని పిలవటం నాకు అలవాటు.  సరసభారతి సాహితీ పుష్కరోత్సవానికి అలానే వారిపేరు ముందు చేర్చి గౌరవి౦చా౦ .

  సరసభారతి తరఫున జరిపిన కవి  సమ్మేళన కవితలను పుస్తకాలు గా ప్రచురించినప్పుడు ఒకసారి మిత్రుడు శ్రీ తుమ్మోజు రామలక్ష్మణా చార్యుల గారి కవిత చదివి బాగుందని మెచ్చి, ఆయన నంబర్ అడిగి తీసుకొని ఆయనతో మాట్లాడి అభినందించిన కవితా పిపాసి పువ్వాడ వారు .అంతేకాదు మేము శ్రీ సువర్చలాన్జనేయస్వామి వారిపై ముగ్గురు కవులతో మూడు శతకాలు రాయించి నప్పుడు ఆచార్యులవారు సోమయాజిగారికి చూపించి మెరుగులు దిద్ది౦చు కొన్నానని చెప్పారు ,మా సువర్చలాన్జనేయస్వామికి 1,116 రూపాయలు ఆచార్యులగారి   ద్వారా అందించిన మహా భక్తులు .వారిబావగారు శ్రీ కోడూరిశ్రీ పాండు రంగారావు గారు కూడా మహా భక్తకవులైన రిటైర్డ్ ఆఫీసర్ .’’అరణ్య పర్వం నన్నయ్యే వ్రాశాడు’’  అనే సాధికారమైన గ్రంథం రాశారు ‘’శ్రీనాథుని పద్యాలవంటి పద్యాలు రాయగల బావగారు తిక్కన సోమయాజి గారికి దీటైనవారు .పోతన శ్రీనాథులవంటి వారు .వారూ మా సభలకు వచ్చేవారు .ఒకసారి బందరులో మా హెడ్ మాస్టర్ మిత్రుడు శ్రీ కోసూరు  ఆదినారాయణ గారబ్బాయి ఉపనయనానికి  వెడితే అక్కడ రావుగారి దంపతులు తమ ఇంటికి తీసుకువెళ్ళారు .ఈ విషయం సోమయాజిగారికి చెబితే పరమానంద పడ్డారు .

  సోమయాజిగారు తమమనవరాలి నాట్య అరంగేట్రం కు ప్రోత్సహిచమనిచెబితే  అలానే చేసి అందరికీ తెలియజేశాం సరసభారతి ద్వారా . సుమారు అయిదేళ్ళక్రితం తమ బంధువుల అమ్మాయికి సంబంధం చూస్తూ ,ఆవరుడి గురించి వాకబ్ చేయమంటే చేసి సంతృప్తి కలిగించాను . సుమారు మూడేళ్లక్రితం ఆయన భార్యగారు కైలాస గౌరీ  నోము నోచుకోవాలని  అనుకొంటున్నారనీ  ,వారిద్దరూ మా ఇంటికి వచ్చి పూర్తి వివరాలను మాశ్రీమతి వద్ద తెలుసుకొంటామనీ ఫోన్ లో చెప్పారు ,.హృదయ పూర్వక స్వాగతం అని చెప్పాము .చేసుకొన్నదీ లేనిదీ తెలీదు .మరో తమాషా ఏమిటంటే వారింటికి మేము  వెళ్ళటం  మా ఇంటికి వారు రావటం కూడా జరగలేదు .

  2013నవంబర్ 19న శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారి అర్ధాంగి శ్వాస  పీల్చటం ఇబ్బంది కి గురై బెజవాడ హెల్ప్ హాస్పిటల్ లో చేర్పిస్తే పూర్ణ చంద్ గారు ఫోన్ చేసి చెబితే  నేను చూడటానికి వెళ్లాను .అక్కడ అప్పటికే ఆయనా ,సుబ్బారావు గారితోపాటు సోమయాజిగారూ ఉన్నారు .మధ్యాహ్నం ఒంటి గంటవరకు అక్కడే ఉండి ఇంటికి బయల్దేరి వస్తూంటే సోమయాజిగారు తమ ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానిస్తే ,గంటలో ఇంటికిచేర్తాను వద్దని చెప్పాను . బెజవాడ రేడియో స్టేషన్ డైరెక్టర్ శ్రీ మంగళగిరి ఆదిత్య ప్రసాద్ గారి ఆధ్వర్యం లో ‘’ఆధునిక గిరీశం –వెంకటేశం ‘’ ‘’ రూపకం లో ఆదిత్య ప్రసాద్ ఆనంద గజపతి వేషం వేస్తే సర్వశ్రీ ధారా రామనాధ శాస్త్రి ,పింగళి  కృష్ణా రావు ,పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ ,జంధ్యాల మహాతీశంకర్,పువ్వాడ తిక్కన సోమయాజి మొదలైన వారు గురజాడ అప్పారావు ఆదిభట్ల నారాయణ దాసు మొదలైన వారి వేషాలు ధరించి రక్తి కట్టించారు ..

  సోమయాజి గారి  తాత గారు పువ్వాడ రామ దాసు గారి  కీర్తనల పుస్తకం నాకు పంపిస్తే చదివి ,దానిపై నెట్ లోవ్యాసం రాసి ఆయనకు మెయిల్ ద్వారా తెలియజేశాను .ఆయన నెట్ లో ‘’మన సాహితీ  బంధువు .‘’ అన్నీ చదువుతారు స్పందిస్తారుకూడా .సుమారు పాతికేళ్ళ క్రితం మొవ్వలో క్షేత్రయ్య పదసాహితీ సదస్సుఅక్కడి తెలుగు లెక్చరర్ శ్రీమతి వై.శ్రీలత  కృష్ణాజిల్లా రచయితల సంఘం సహకారంతో రెండు రోజులు జరిపితే సోమయాజి గారు వచ్చి అక్కడే పుట్టిన పువ్వాడ రామదాసుగారు తమ తాత గారే అని గొప్ప వాగ్గేయకారులనీ చెప్పారు రేడియోలో ఆయన గీతాలు వినేవాడినే కానీ ,ఆయన వీరికి బంధువని అప్పుడే తెలిసింది .

  సుమారు పది హేను రోజులక్రితం సోమయాజిగారు ఒక మెయిల్ రాస్తూ ,తన పొరబాటు వలన సాహితీ బంధువు లో తన పేరు లేకుండా పోయిందనీ ,మళ్ళీ చేర్చమనీ ,అలానే వాట్సాప్ గ్రూప్ లో కూడా చేర్చమని కోరితే చేర్చాము .అంతేకాదు ఆయన ఇంటిదగ్గర వారు,ఆయన గొప్ప మిత్రుడు  రిటైర్డ్ ఆఫీసర్ ,కవి ,సరసభారతికి అత్యంత ఆత్మీయులు శ్రీ కందికొండ రవి కిరణ్ గారిని సాహితీ పుష్కరోత్సవ కవి సమ్మేళనం లో చేర్చమని మెయిల్ రాస్తే ,ఆయన్ను దత్తాత్రేయ శర్మగారి తో మాట్లాడించి ఎప్పుడో చేర్చామని తెలియజేస్తే చాలా సంతోషించారు .అంతేకాదు తాము రాసిన పద్యాలను అద్భుతంగా కలర్ పేపర్ పై ప్రింట్ చేయించి ,ఫ్రేం కట్టించి సభలో ఆయనతోనే చదివించి నాకు శాలువా కప్పించిన  సహృదయ సాహితీ మూర్తి సోమయాజిగారు .మా అన్నయ్య పై జరిపిన కవి సమ్మేళనం లో సోమయాజిగారి పద్యాలు .

26-అన్నన్నా –శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజి –విజయ వాడ –

1- అన్నా !అన్న !ఇదేమి దుర్విది !అనూహ్యంమన్న !నన్నింక నీ

మన్నన్ కాదన నన్న !చేసితిని అన్యాయమ్ము,నీ, కమ్మకున్

మున్నే నే పసిగట్టి చేటు ,నుడువన్ ,మోటైన మాటాడి ,వీరి

మ్మన్నన్,తల్లిటు వచ్చితిన్ శఠుడనై   ఆలోచనా శూన్యతన్ .

2 తరలితీవు బంగారు లేడి తరుము కొనుచు—కొంతవడికి వింటిమి మేము వింత గొలుపు

నార్త నాదమ్ము ‘’హా లక్ష్మణా ‘’రవమ్ము –స్పస్టమది నీదె గొంతు ,ఉచ్చ్రైస్స్వరమ్ము.

3-వెను వేంటనేపోపోమ్మన –వినని ననున్ తల్లి రూక్ష వీక్షల నురిమెన్

మనసును రాయి పొనర్చుచు –నని వార్యపు గతిని కదలితన్నా వినుమా .

4-ఏదీ తల్లి ఇటుండ బాసితినిగా ,ఈ పంచ వటీ స్థలిన్

 ఎదీ లేదిట లోగిలిన్ వేలుపలన్ ,ఏదేని కీడయ్యెనో

ఆ దేవిం గొను పోయి రక్కసులు ద్రోహమ్మేమి  కాంక్షిం చిరో

నా దైవంమగు తల్లి ,అగ్రజుని ప్రాణమ్మింక నేమౌనోకో .

5-అనుచున్ లక్ష్మణుడశ్రు ధారల హ్రుదబ్జాంత ర్దళోద్విగ్నతన్

 ప్రణమిల్లెన్ త్రప నొంది ,అగ్రజునకున్ ,పల్కండు ,తోన్కండేట్

కినుకన్ బూనేనో ?లోని కోప బడ బాగ్నిన్ మ్రింగి చల్లార్చేనో ?

అనుకొంచం గ్రజు వెంటనంటి తరాలేనారాన్య సంశోధనన్ .

6-రాక్షస సంహారము –ముని రక్షణ యు తన అవతారలక్ష్యము లగుచో

 సుక్షత్రియుడౌ రఘు పతి-దీక్షకు భూ పుత్రి రక్ష తీక్ష్ణ సమస్యౌ ‘’.

    ఇంతటి సాహితీ మూర్తి ,ఆత్మీయులు శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజులు గారు మనమధ్య లేకపోవటం తీరని వేలితి.అందుకే ఈ జ్ఞాపకాల పరిమళాలు .

 మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-7-22-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారి నా జీవిత కథ .13వ భాగం.20.7.22

శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారి నా జీవిత కథ .13వ భాగం.20.7.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

గుఱ్ఱం జాషువా వర్ధంతి సమావేశ ఆహ్వానం

Posted in సభలు సమావేశాలు | Leave a comment

భారతీ నిరుక్తి .15వ భాగం.20.7.22

భారతీ నిరుక్తి .15వ భాగం.20.7.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారి నా జీవిత కథ.12వ భాగం.19.7.22

శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారి నా జీవిత కథ.12వ భాగం.19.7.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

భారతీ నిరుక్తి 14వ భాగం.19.7.22

భారతీ నిరుక్తి 14వ భాగం.19.7.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారి నా జీవిత కథ. 11వ భాగం.18.7.22

శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారి నా జీవిత కథ. 11వ భాగం.18.7.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-12

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-12

కాంగ్రెస్ రెండవ సదస్సు తర్వాత కలకత్తాలో దాదాభాయ్ నౌరోజీ అధ్యక్షత న జరిగిన సభలో ఇండియన్ అసోసిఏషన్ అందులో విలీనమై జాతీయ కాంగ్రెస్ ఏర్పడింది .భారతీయుల్ని నామినేట్ చేయకుండా ఎన్నికలలో నిలిచి గెలిచేట్లు చేయాలనే డిమాండ్ వచ్చింది .విదేశీ యంత్రాంగం కింద మగ్గడం అనే కాంగ్రెస్ మాటలకు లార్డ్ డఫ్రిన్ కు కోపమొచ్చి విరుచుకుపడ్డాడు .మోతీలాల్ కాంగ్రెస్ ను సమర్ధించాడు .డఫ్రిన్ కాంగ్రెస్ ను ‘’సూక్ష్మమైన అల్ప సంఖ్యాక వర్గానికి ‘’ప్రాతినిధ్యం వహిస్తోందని అనటం మోతీలాల్ కు నచ్చక కాంగ్రెస్ తో చేతులు కలిపాడు .1888అలహాబాద్ కాంగ్రెస్ సదస్సుకు ఖద్దరు బట్టలతో హాజరయ్యాడు .ఐయే ఎస్ పాసైన భారతీయులు లండన్ లో ఒక ఏడాది శిక్షణ పొందాలి అన్నదాన్ని వ్యతిరేకించాడు .అందరూ ఆయన్ను అభినందించారు .కాంగ్రెస్ లో చర్చలు సరిగ్గాజరగాకపోవటం ,భారత్ ఇంగ్లాండ్ లమధ్య సయోధ్యతకే తంటాలు పడటం ఆయనకు నచ్చలేదు .పాలనలో బ్రిటిష్ వారితో సమానాధికారాలకోసమే అర్రులు చాచటమూ నచ్చలేదు .మైనారిటీల మానవ హక్కులు చాలా విలువైనవనీ వాటిని బల ప్రదర్శనతోనే సాధించుకోవాలని ఆయన నమ్మి ,పత్రికలో దాన్ని వ్రాసేవాడు .

  ప్రభుత్వం ముస్లిం వేర్పాటు వాదాన్ని వెనకేసుకొచ్చింది .సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ద్వారా పోటీ రాజకీయ పక్షాన్ని రూపొందించారు .హిందువులు ,ముస్లిములు వేర్వేరు జాతులనీ ,కనుక ప్రభుత్వం ఏర్పడితే బెంగాలీ బాబుల ఆదిపత్యం పెరిగి ముస్లిం లకు అన్యాయం జరుగుతుందని ప్రచారం చేశాడు .’’ఉన్నత కుటుం బీకులు తమ ధన మాన ప్రాణాలను  దిగువ శ్రేణి ప్రజలకు నమ్మి ఇవ్వరు ‘’అని వ్యంగ్య బాణాలు వేశాడు .దీనికోసం 1888లో ‘’యునైటెడ్ ఇండియన్ పేట్రియాటిక్ అసోసియేషన్ ‘’ను కాంగ్రెస్ కు పోటీగా స్థాపించాలనుకొని హిందూ ముస్లిం ఉన్నతవర్గాలవారితో ఏర్పాటు చేశాడు .1878లోనే అమీర్ అలీ అనే  సంపన్న ముస్లిం బారిస్టర్ ‘’సెంట్రల్ నేషనల్ మహామ్మదీన్ అసోసియేషన్ ‘’ను ప్రభుత్వం లో ముస్లిం భాస్వామ్యాన్ని పెంచటానికి ఏర్పరచాడు .నామినేషన్ లద్వారానే లాభం పొందాలని అతడి ఆలోచన.దీనివల్ల బెంగాల్ లో కాంగ్రెస్ అంత పటిష్టం కాదు అనే భావన కలిగింది .స్థానిక ,ప్రాంతీయ సమస్యలను  చర్చించటానికి కాంగ్రెస్ అంతగా అభి రుచి చూపకపోవటమూ మరోకారణం  .కరువు కాటకాలు వరదలు ఒకదానితర్వాత ఒకటి వచ్చి మీద  పడటం తో గ్రామీణ రైతాంగానికి దిక్కు తోచటం లేదు .తేయాకు తోటల్లోకి బలవంతంగా కూలీలను తెప్పించి శ్రమ దోపిడీ చేస్తోంది ప్రభుత్వం .బెంగాల్ ప్రజలు పేదరికం లో అల్లాడి పోతుంటే కాంగ్రెస్ అసలేమీ పట్టించుకోవటం లేదు .ఈ మొండి వైఖరి వలన 1887’’బెంగాల్ ప్రోవిన్షియల్ కాంగ్రెస్’’ఏర్పడక తప్పిందికాదు .అణగారిన ప్రజలు రైతులు కూలీల తరఫున విద్యాధికులు ఉద్యమిస్తేనే తప్ప వారికి న్యాయం జరగదని మోతీలాల్ మొదలైన వారు భావించారు .ప్రజాప్రాతినిధ్య ప్రభుత్వంకోసం కాంగ్రెస్ కంటే బెంగాలీలే పట్టు బట్టారు .అన్ని గ్రామాలూ జిల్లాలు కలకత్తా తో సమానంగా నిలిచాయి .ఈకార్యకలాపాలను అమృతబజార్ పత్రికలో కవరేజ్ బాగా వచ్చేది .శిశిర్ కుమార్ ఇంగ్లీష్ భాష మధ్యతరగతి వారికి హాయిగా అర్ధమయ్యేది .భారతీయ ప్రత్యామ్నాయ పదాలు కూడా మధ్యమధ్యలో వాడేవారు .ఈ ఇంగ్లీష్ ను ఇంగ్లీష్ వారు ‘’బాబూ ఇంగ్లీష్ ‘’అని ముఖం  చిట్లించేవారు .

   ప్రజా జీవన రంగం లో

  1887 లో పబ్లిక్ సర్వీస్ లపై సుప్రీంకోర్ట్ ‘’రాయల్ కమిషన్ ‘’ఏర్పాటు చేయగా ,మోతీలాల్ సాక్షిగా హాజరై ముందుగా పోస్టల్ డిపార్ట్ మెంట్ గురించి మాట్లాడుతూ అందులో ఉద్యోగులంతా ఆంగ్లేయులే అనీ ,అవినీతి నిలయంగా మారిందని ,సమర్ధ భారతీయులతో ఈశాఖను నింపాలని చెప్పాడు .ఆతర్వాతనే భారతీయులను తీసుకోవటం మొదలుపెట్టారు .పోస్టల్ డైరెక్టర్ జనరల్ ‘’హాగ్ ‘’రాజీనామా చేసేశాడు .18-20మధ్య వయసున్నవారిని ఆ డిపార్ట్ మెంట్ లో పెద్దపెద్ద పదవుల్లో నియమిస్తే అనుభవం లేక పాలన సరిగ్గా జరగదు .వాళ్ళంతా తల్లి గర్భం లో 12ఏళ్ళు ఉన్న  ఆష్టావక్రులై ఉంటేనే అది సాధ్యం అని వ్యంగ్యం గా అన్నాడు .మోతీలాల్ చేసిన ఈ వ్యాఖ్యలకు పాఠకుల నుంచి అనూహ్యమైన మద్దతు లభించింది .ఒక యూరపియన్ ఆకాశ రామన్న ఉత్తరం పత్రికకు రాస్తూ-‘’మోతీలాల్ !పబ్లిక్ కమీషన్ ఎదుట నీ వాగుడు చదివిన వారికి మీ దుర్మార్గజాతి ఎలాంటి నీచులో తెలిసింది .అక్కడి యూరోపియన్ పెద్దమనుషులు బూటు మడమలతో నీ వీపు మోగించ లేదు అంటే ఆశ్చర్యంగా ఉంది .మీ బెంగాలీలకు అదే శాస్తి జరగాలి .మీ అంత నికృష్టజాతి భూమ్మీద లేదు .మెకాలే ఏమన్నాడో తెలుసా ?మీ (ముద్రించటానికి వీల్లేని బూతు )అందర్నీ ఇంగ్లీష్ ప్రభుత్వం కనుక సహిస్తోంది .బెంగాలీలు దగుల్బాజీలు లుచ్చాలు ,మోసగాళ్ళు వాళ్ళందర్నీమించి   నువ్వు  నీ వాళ్ళు నీజాతి  పరువు తీసేశారు ‘’అని అక్కసు వెళ్ళ గక్కాడు .అమృత బజార్ పత్రికలో ఆ లేఖను ముద్రించి చివరగా ‘’ఈ లేఖ ఒక యూరోపియన్ కానీ పోస్టల్ ఆఫీసర్ కాని రాసి ఉంటాడు .అదే నిజమైతే ఆబూతులన్నీ అతనికి ఉద్యోగామిచ్చిన పెద్దమనిషికే తగలాలి .దీన్ని ఆయనకు ఉచిత కానుకగా ఇస్తున్నాం ‘’.అని రాశారు .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -18-7-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -305

· మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -305

· ‘’అనువాద కోవిదాగ్రణి’’ శరత్ నవలలకు ఆంధ్రత్వం అద్దిన ,కార్తవరాయనికద ,కార్తీకదీపం సినీ ఫేం,సాహిత్య అకాడెమి పురస్కారగ్రహీత –మద్దిపట్లసూరి

· మద్దిపట్ల సూరి ( జులై 7, 1916 – నవంబర్ 19, 1995) రచయిత, అనువాదకుడు, సాహితీవేత్త. 1993 లో సాహిత్య అకాడమీ అనువాద బహుమతి తో వీరిని సత్కరించారు.

జీవిత సంగ్రహం
అనువాద కోవిదాగ్రణిగా ప్రసిద్ధులయిన “మద్దిపట్ల సూరి” తెనాలి సమీపంలో సంస్కృతాంధ్రవిద్యలకి ఆటపట్టయిన అమృతలూరులో జులై 7, 1920నాడు జన్మించారు. అనేక సుప్రసిద్ధ నవలలు బెంగాలీ, హిందీ భాషలనుండి తెలుగులోకి స్వతంత్ర నవలలు అనిపించేంత సహజంగా అనువాదాలు చేసి అనువాద కోవిదాగ్రణి అని పేరు పొందారు. దేశీ కవితామండలి ఆధ్వర్యంలో ప్రచురించిన శరత్ చంద్ర ఛటర్జీ నవలలు, దేవదేసు, పరిణీత అనువాదాలకు బొందలపాటి శివరామకృష్ణగారికి దోహదం చేసారు. చివరిదశలో ఉద్యోగం లేక, ధనాభావంవల్ల కొంతమంది ప్రసిద్ధులకు కొన్ని ప్రసిద్ధ రచనలు రాసి పెట్టారు. మాధవపెద్ది గోఖలే సూరిగారిని చిత్రరంగంలో ప్రవేశపెట్టేరు 1958లో. ప్రముఖ నటుడు యం. ప్రభాకరరెడ్డి, సూరి మిత్రులయినతరువాత అనేక చిత్రాలలో పని చేసేరు. ప్రభాకరరెడ్డి సూరిగారికి అనేకసందర్భాలలో ఆర్థిక సహాయం చేసారు. ఇటీవల “”సమరేశ్ బసు”” మహాభారత కథాకల్పన శాంబుడు, “”విభూతిభూషణ్ బందోపాధ్యాయ”” చరిత్రాత్మక రచన పథేర్ పాంచాలి నవలలకు ఆయన చేసిన అనువాదాలు పునర్ముద్రిస్తున్నారు. “”విశ్వవాణి””కోసం నిమ్నవర్గాల సముద్ధరణకు కులరాహిత్యాన్ని ప్రబోధించే జీవనలీల గ్రంథాన్ని 1959 లో రాసారు. నవంబరు 19, 1995 తేదీన సూరి మరణించారు.

విద్య
అన్నగారూ వ్యాకరణశిరోమణీ అయిన రామవరపు కృష్యమూర్తిశాస్త్రిగారివద్ద శ్రౌతస్మార్తాలను చెప్పుకున్నారు. ఉన్నత పాఠశాల చదువు నచ్చక, కలకత్తా వెళ్ళి బెంగాలీల చలిత్ భాషను, గౌడుల సంస్కృతాంధ్ర గ్రంథాలను, అలంకారశాస్త్రము అధ్యయనం చేసారు. అక్కడే జుగాంతర్ ప్రభావంమూలాన ఆధునిక భావజాలానికి లోనై, పుట్టుబిరుదు “శాస్త్రి”ని తొలగించి డిగ్రీలు లేని పాండిత్యంతో మద్దిపట్ల సూరిగా వెనక్కి వచ్చారు.

అనువాదాలు[మార్చు]
సూరిగారి అనువాదాలలో అధికభాగం సాహిత్య ఎకాడమీ పురస్కారాలు అందుకున్నవారి రచనలే. వారి శైలి సంస్కృతం వన్నెమీరిన వ్యావహారికం. రవీంద్రనాథ్ టాగోర్ 21 ప్రసిద్ధకథలకు సూరి అనువాదాలు రవీంద్ర కథావళ అన్నపేరుతో 1968 లో ప్రచురించారు. ఈ సంకలనానికి సోమనాత మిత్ర అవిస్మరణీయమైన పీఠిక, ఈ అనువాదాలు సుప్రసిద్ధమయినవి. బి.యస్.ఆర్ ఈ పుస్తకానికి సమీక్ష రాస్తూ, “పోస్ట్ మాస్టర్, కాబూలీవాలా అనువాదాలను చదివి చెమ్మగిల్లని వారుండరు,” అని వ్యాఖ్యానించారు. సూరిగారి హాస్యప్రియత్వంగురించి ఏల్చూరి మురళీధరరావు ఇలా వ్యాఖ్యానించారు, “సూరిగారు సరస హాస్యప్రియులు. గంగూలీ & గంగూలీ అన్న కథలో వ్యాపారనష్టాలను పూడ్చుకోవటానికి కాళీమంత్రం అష్టోత్తరం రాయమని ఎవరో సలహా ఇస్తారు. మోసాలు అలవాటయిన గంగూలీ పన్నెండు నామావృత్తులతో ఒక రబ్బరుస్టాంపు చేయించి, దాన్ని తొమ్మిదిసార్లు కొట్టి దేవతకే టోపీవేద్దామనుకొంటాడు. మరొక కథలో రైలుప్రయాణంలో సంప్రదాయ కుటుంబపెద్ద తమతో ఒక నవయువకుడి పలకరింపు చొరవను సహింపలేకపోతాడు. రైల్లో వంటచేస్తుండగా కూతురి చీరకు నిప్పంటుకొంటే ఆ యువకుడు చూసి రక్షిస్తాడు. కుటుంబం వారంతా అతన్ని ఆదరిస్తారు. యువతీయువకులకు ప్రేమభావం అంకురిస్తుంది. రాత్రివేళ మాటలు కలుస్తాయి. అంతలో అతని స్టేషను వస్తుంది. హడావుడిగా దిగిపోతూ ఆమె వివరాలడుగుతాడు. ఆమె సమాధానం వినబడకుండానే రైలు కదిలిపోతుంటుంది. ఇంకో కథలో ఒక సంపన్న బ్రాహ్మణయువకుడు పెద్దలు కుదిర్చిన ఆధునికభావాల యువతి మల్లికను చేసుకొంటాడు. ఆమె అతని వేషభాషలను మార్చి, మాంసాహారం కూడా అలవాటుచేస్తుంది. ఎంత ప్రేమ చూపినా ఆమెను సంతృప్తిపరుపలేక అతను విహ్వలుడు కావటాన్ని ఎంతో రమ్యంగా చిత్రీకరిస్తారు.”

ఇతని కొన్ని అనువాద రచనలు:

· అనురూపాదేవి రాసిన “మంత్రశక్తి” నాటకానికి అనువాదం 1959

· నిరుపమాదేవి రాసిన శ్యామలికి అనువాదం. 1959

· తారాశంకర్ బెనర్జీ రాసిన జల్ సాగర్ నవలకి అనువాదం, 1960. దేశీ కవితామండలి ప్రచురణ.

· తారాశంకర్ బెనర్జీ నవల ఉత్తరాయణ్ కి అనువాదం. ఇది రెండవ ప్రపంచయుద్ధం యొక్క దారుణఫలితాలను చిత్రీకరించిన విషాదాంత నవల. (1962)

· నీహార్ రంజన్ గుప్త నవల మాయామృగం, (1962)

· ఆప్తమిత్రులు అనువాదం, (1966)

· బిమల్ కర్ రాసిన అసమయ్ నవలను సమయం కాని సమయం అన్నశీర్షికతో అనువదించేరు, 1968

· శరత్ చంద్ర ఛటర్జీ రాసిన స్వయంసిద్ధ తెలుగులో అత్యుత్తమ అనువాద నవలగా ప్రసిద్ధి చెందింది.

· వనఫూల్ నవలకి అనువాదం రాత్రి. (1958)

· తారాశంకర్ బందోపాధ్యాయ రాసిన “గణదేవత” నవల.1970

సినిమారంగంలో కృషి
· కార్తవరాయని కథ. రోమియో జూలియట్, రాజస్థానచరిత్రల ఆధారంగా రూపొందించినది, (1958).

· రమాసుందరికి సంభాషణలు.

· వరకట్నం (1962)

· మా వదిన (1967)

· మాతృ దేవత (1969)

· భలే తమ్ముడు (1969)

· పచ్చని సంసారం (1970)

· విచిత్ర దాంపత్యం (1971)

· పండంటి కాపురం, (1972). ఈ చిత్రం రజతోత్సవం చేసుకుంది.

· గృహప్రవేశం (1982)

· కార్తీకదీపం

· పచ్చని సంసారం

· ధర్మాత్ముడు

· గాంధీ పుట్టిన దేశం

· రాధా మై డార్లింగ్

పురస్కారాలు
· “కలకతార్ కాఛేఈ” అనువాదానికి తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం

· సాహిత్య అకాడమీ అనువాద బహుమతి (1993)

· సశేషం

· మీ- గబ్బిట దుర్గాప్రసాద్-18-7-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

భారతీ నిరుక్తి.13వ భాగం.18.7.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారి నా జీవితకథ.10వ భాగం.17.7.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-11

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-11

 పత్రిక మార్పులకు కారణాలు -2

బ్రిటిష్ లిబరల్స్ చెప్పీ మాటలు నిజమే నని సురెంద్రనాద్ నమ్మాడు .విదేశీ ప్రభుత్వం పై అంతటి నమ్మకం ఉంచరాదని గ్రహించలేకపోయాడు.బ్రిటన్ లో టోరీ పార్టీ ఓడిపోవటం తో లార్డ్ లిట్టన్ పదవి ముగిసింది .లార్డ్ రిప్పన్ వచ్చాడు .రాగానే వెర్నాక్యులర్ చట్టం1861లో  రద్దు చేశాడు .ప్రజలలో సురేంద్ర పలుకుబడి బాగా ఉంది .1878లో ఘోష్ సోదరులు’’ ఆనంద బజార్ ‘’అనే మతప్రాతిపాదిక బెంగాలీ వార పత్రిక ప్రారంభించారు .1922లో సురేష్ చంద్ర మజుందార్ ,,ఫ్రఫుల్లకుమార్ సర్కార్ లు దీన్ని దినపత్రికగా మార్ఛి విశేష ప్రాచుర్యం కలిగించారు .

  నమ్మిన వారికి గుణపాఠం

 విషయజ్ఞుడు రాజకీయజ్ఞుడు అయిన రిప్పన్ స్థానిక స్వపరిపాలన ప్రవేశపెట్టాడు .ఇది రాజకీయ ప్రజావివేచనకు తోడ్పడింది .జిల్లాబోర్డులేర్పడి బోర్డ్ అధ్యక్షుడికి అధికారాలు వచ్చాయి .అన్నిరకాల అధికారాలు ఆయనకిందే ఉండేవి .స్థానిక బోర్డులు ఏర్పరచి జిల్లా బోర్డు లకింద పని చేసేట్లు చేశారు .పట్టణ మునిసిపాలిటీలకు మెజార్టీ సభ్యులు ఎన్నుకోనేవారు .స్థిరపడ్డాక అనధికారులు అధ్యక్షులయ్యారు .రిప్పన్ భారతీయ విద్యా కమీషన్ ఏర్పాటు చేసి ,దాని తీర్మానాలను అమలు చేశాడు .’’పాలకుడు నిజాయితీ పరుడు అయినా ,విదేశీపాలన నిజాయితీగా సాగే వీలు లేదు ‘’అని చెప్పిన అమృతబజార్ పత్రికమాట నిజమై రిప్పన్ విఫలమయ్యాడు .యూరోపియన్ల గర్జన ఎక్కువై ,1883లో ఆయన డార్జిలింగ్ నుంచి వస్తుంటే వైస్రాయ్ భవనం గేటు వద్ద ఆయన్ను బండబూతులు తిట్టారు .దీనిపై పరమానంద దత్’’ఆంగ్లో ఇండియన్లు పెద్ద కుట్ర పన్ని ,ప్రభుత్వ చట్టాన్ని రద్దు చేయకపోతే , సెంట్రీల  దాడి చేసి ,వైశ్రాయిని చాంద్ పాల్ ఘాట్ వద్ద స్టీమర్ లోకి బలవంతంగా ఎక్కించి ,గుడ్ హాప్ అగ్రం మీదుగా ఇంగ్లాండ్ కు తరలించాలని ప్లాన్ ‘’అని రాశాడు .బ్రిటన్ గవర్నమెంట్ జోక్యం చేసుకొని జిల్లా మేజిస్ట్రేట్ ,సెషన్స్ జడ్జి ల అధికారాలను ప్రకటించటం తో వివాదం సమసిపోయింది .తర్వాత చేసిన చట్టం లో యూరోపియన్ అధికారుల అధికారాలు పెంచారు .అన్ని రాయితీలు వారికి లభించాయి .

  చట్టం ముందు అందరూ సమానులే  అనే రోజు వస్తుందని భావించిన ఇండియన్ లకు ఈ ‘’ఇల్బర్ట్ బిల్ ‘’ఆశనిపాతం అయింది .అయితే మోతీలాల్ అమృతబజార్ పత్రిక ఒక గట్టి గుణ పాఠం నేర్చుకొన్నారు .ఒక కేసులో సాలగ్రామ వివాదం లో దాన్ని కోర్టులో ప్రవేశపెట్టాలన్న జస్టిస్ నోరిస్ న్యాయమూర్తి పదవికి అనర్హుడు అని ది బెంగాలీ పత్రికలో సురేంద్ర వ్యాసం రాస్తే ,రెండు నెలలు శిక్ష పడితే హిందువులు ఆయనకు పూర్తీ మద్దతు ప్రదర్శించి ఆగ్రహంతో ఊగిపోయి తీవ్ర నిరసనలు చేయాటం తో ఆయన కీర్తి మరింత పెరిగింది .1883లో విడుదలకాగానే  డిసెంబర్ లో కలకత్తాలో ఇండియన్ అసోసియేషన్  అఖిలభారత జాతీయ సభ జరూపగా ,భారత మిత్రుడు w.s.బ్లాంట్ ‘’ఇది జాతీయ పార్లమెంట్ ఆవిర్భావానికి మొదటి మెట్టు ‘’అన్నాడు  .1870లోనే శిశిర్ కుమార్ ‘’జాతీయ పార్లమెంట్ ‘’ను సూచించాడు .1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపన తర్వాత కాన్ఫరెన్స్ అందులో విలీనమైంది .అమృత౦ దీన్ని బలపరచింది .1884లో సెంట్రల్ ఇండియా గవర్నర్ జనరల్ ఏజెంట్ సర్ లేపెలో గ్రిఫిన్ అక్రమాలను పత్రిక బయట పెట్టింది .ఆరోపణలు రుజువై రాజీనామా చేసి ,వెళ్ళియాడు .

  1889లో మరోస్కూప్ బయటికి లాగింది పత్రిక .కాశ్మీర్  మహారాజు ను గద్దె దించటానికి వెనకున్న కారణాన్ని తెలిపే విదేశాంగ శాఖ రహస్యపత్రాన్ని బయటపెట్టి ప్రభుత్వాన్ని ఇరుకున పడేసింది .గిల్గిత్ ప్రాంత ఆక్రమణ ఇందులో ముఖ్యమని చెప్పింది .దేశంలో తీవ్రలజడి జరిగి ప్రజాగ్రహం ఉప్పెన అవగా గత్యంతరం లేక మళ్ళీ రాజును కాశ్మీర్ గద్దె నెక్కించారు .ఇంతకల్లోలం లోనూ పత్రికకు ఇబ్బందికలగలేదు .అప్పటికి అధికార రహస్య చట్టం లెదు కనుక పత్రిక జోలికి రాలేకపోయింది ప్రభుత్వం .బెంగాల్లో బెంగాలీ, అమృత బజార్ పత్రికలూ అగ్రస్థానం లో ఉన్నాయి .ప్రాంతీయ పత్రికలూ జాతీయోద్యమానికి కొమ్ము కాశాయి .బెంగాలీ పత్రికలలో బంగబాసి -1881,సంజిబాని -1883,హితబాది 1891 విశేష ప్రచారం పొందాయి ..మొదటిది హిందూధర్మాన్ని రెండోది బ్రహ్మసమాజాన్ని ,మూడోది హిందూ సంస్కరణ వాదాన్ని బలపరిచేవి .మహారాష్ట్రలో హిందూ ప్రకాష్ ,మహారాట్ట,కేసరి ,కాల్ పత్రికలూ బొంబాయ్ లో బొంబాయి సమాచార్ ,జయ్-ఇ-జయ్ షెడ్,,రాస్త్ గుప్తార్ ,మద్రాస్ లో దిహిందూ ,స్వదేశీమిత్రన్ ,ఉత్తరాభారత్ లో దిట్రిబ్యూన్ పత్రికలూ జనజాగృతిచేసేవి .1890లో కేసరి మహారాట్ట పత్రిలకు ఎడిటర్ గా ఉన్న బాలగంగాధర తిలక్ తన గురువు అమృతబజార్ పత్రకా సంపాదకుడు శిశిర్ కుమార్ అని గర్వంగా చెప్పుకొన్నాడు –‘’ఆయనను తండ్రిగా నేనుభావిస్తా .ఆయన నన్నుకుమారుడిగా భావిస్తారు ‘’అని రాశాడు తిలక్  1917లో.

  విద్యావంతులైన దేశీయులను విశ్వాసం లోకి తీసుకోవాలని రిప్పన్ ,మరికొందరు భావించి ముగ్గురు అధికారులు ఏవో హ్యూమ్ ,సర్ డబ్ల్యు వెడర్  బర్న్ ,డబ్ల్యు ఎస్ బ్లంట్ లు ముందుకొచ్చి అఖిలభారత వ్యవస్థ ఏర్పాటుకు సూచించి,1883లో హ్యూమ్ దేశంలోని దేశంలోని అత్యున్నత విద్యావంతులుగా ఎంపికైన మేధావులకు ఒక బహిరంగ లేఖ రాస్తూ –‘’మీకూ మీదేశానికి మరింత అధిక స్వాతంత్ర్యాన్ని ,నిష్పాక్షిక పాలనా వ్యవస్థను ,పాలనలో విస్తృత భాగ స్వామ్యాన్నీ సాధించటానికి పోరాటం చేయండి .కార్యాచరణ ఎలా ఉండాలో ఆలోచించండి .ఆత్మత్యాగం స్వార్ధ రాహిత్యం తిరుగులేని మార్గాలు ‘’అన్నాడు .ఆతర్వాత రిప్పన్ స్థానం లో వచ్చిన లార్డ్ డఫ్రిన్  ఈ మేధావుల సమావేశాన్ని 1885 డిసెంబర్ లో బొంబాయి లో జరిపాడు .అప్పుడే భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భవించింది .కలకత్తాకు చెందిన ప్రముఖ బారిస్టర్,  సంస్థ అధ్యక్షుడు డబ్ల్యు సి బెనర్జీ తోపాటు ‘’దిఇండియన్ మిర్రర్ ,నబ బిభాకర్ పత్రిక సంపాదకులు మాత్రమె బెంగాల్ నుంచి ఆ సభకు హాజరయ్యారు .ఆహ్వానం వచ్చినా ,తీరికలేక సురెంద్రనాద్ బెనర్జీ వెళ్ళలేదు .ఇంకెవరినీ ఆహ్వానించినట్లు లేదు .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -17-7-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment