శ్రీ శంకర విజయం తర్వాత ?

శ్రీ శంకర విజయం తర్వాత ?

  సాహితీ బంధువులకు శుభకామనలు -శ్రీశంకర విజయం తర్వాత 1-జ్ఞానదుడు నారదుడు2-శతావధాని వేలూరి శివరామ శాస్త్రి గారి కథలు 3-శ్రీ గంధం యాజ్న్య వల్క్య శర్మ గారి కథలు  సరసభారతి ఫేస్ బుక్ లో ఒకటిపూర్తయ్యాక  మరొకటి ప్రత్యక్ష ప్రసారమౌతుందని తెలియ జేయటానికి సంతోషంగా ఉంది ..దుర్గాప్రసాద్ -5-3-21-ఉయ్యూరు
Posted in సమీక్ష | Tagged | Leave a comment

భీముడు ద్రౌపది తోకాపురమున్న ప్రదేశం

మధ్యప్రదేశ్ ఛత్తాపూర్ జిల్లా బాస్నా గ్రామం లో ద్రౌపదితో భీముడు కాపురం చేశాడని చెబుతారు .ఇక్కడే గొప్ప జలాశయంఉంది  .పంచపాండవులు ఇక్కడ కొద్దికాలమున్నారు .ఇక్కడ ఉన్న జలాశయాన్ని భీమ కుండ్ అంటారు .పాండవులు అరణ్యవాసం చేస్తూ ఇక్కడికి వచ్చారని ఐతిహ్యం .ఇక్కడ ఎడారుల్లాంటి కొండలు అద్భుతంగా వారికి కనిపించి ఇక్కడ ఉన్నారట .ద్రౌపది అసూర్యంపశ్య అంటే సూర్య రశ్మి తాకితే కళ్ళు తిరిగి పడిపోతుంది .ఇంత సుందర ప్రాంతం లో నీరు లేకపోవటం చూసి భీముడు గదతో కొట్టి భూ గర్భ జలాన్ని పైకి తెప్పించి మహోపకారం చేశాడు ఈ జలాశయం లోతును ఇప్పటివరకు ఎవరూ కనిపెట్టలేకపోయారు .డిస్కవరీ చానల్ వాళ్ళు డైవర్స్ ను పంపి లోతు కనుక్కునే ప్రయత్నం చేస్తే వాళ్ళు సుమారు వంద అడుగులకంటే ఎక్కువ లోతుకు   వెళ్ళ లేకపోయారట .దీనికీఅరేబియా సముద్రానికి సంబంధం ఉందని భావించారు .ఆ సముద్ర ఆలల తాకిడి తోపాటు ,సముద్రాలలో ఉండే అరుదైన జీవరాశులు అంత లోతు నీటిలో కనిపించి పెద్ద ఆశ్చర్యానికి  లోనయ్యారట .

  ఇక్కడే ఒక అద్భుత శివలింగముంది .ఎక్కడ సునామీ వచ్చినా, ఈ జలకుండం లోని నీరు దాదాపు 40అడుగుల ఎత్తునున్న శివలింగాన్ని సెకండ్ల కాలం లోనే తాకుతుందట .గుఅరాత్ ,మనీలా లలో సునామీలోచ్చినప్పుడు ఇలానే జరిగింది .ఈ కుండం లో ఎంతమంది స్నానం చేసినా స్విమ్మింగ్ పూల్ ను క్లీన్ చేస్తే యెంత క్లిస్టల్ క్లియర్ గా ఉంటుందో ఇక్కడా ఎప్పుడూ నీళ్ళు అంత స్వచ్చంగా ఉంటాయి .నారదుడు ఇక్కడ విష్ణుమూర్తి కోసం తపస్సు చేసినందువల్ల దీన్ని నారద కుండం అనీ అంటారు . విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఈ నీటిలో స్నానిచటం వలన ఆ నీలిమేఘశ్యాముని రంగు ఈనీటికి అంటి నీలంగా కనిపిస్తుంది . ఈ కుండును డీప్ టాంక్ అంటారు. ఇందులోని నీరు ఈ కుండానికీ  అరేబియా సముద్రానికి ,పవిత్ర గంగానదికీ సంబంధం ఉందంటారు .కానీ గంగ వెయ్యి కిలోమీటర్లదూరం లో, అరేబియా సముద్రం అయిదు వందలకిలో మీటర్ల దూరం ఉంది .

  మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ కుండం లోతు తెలుసుకొనే ప్రయత్నం లో మూడు పెద్ద పెద్ద మోటార్లు పెట్టి వారం రోజులు నీటిని బయటికి తోడేసినా, ఒక్క అంగుళం కూడా నీటి లోతు తగ్గలేదు. చేతులెత్తేసింది ప్రభుత్వం .ప్రతి సంక్రాంతికి ఇక్కడి ప్రజలు గొప్ప జాతర ఇక్కడ జరుపుతారు .నది ,సముద్రం, కాలువలలో ప్రమాదవశాన మునిగిన వారి శరీరాలు ఉబ్బి పైకి తేల్తాయి .కానీ ఇక్కడ ఎంతోమంది ప్రమాదానికి లోనై చనిపోయినా ఎవరి శవాలు బయట పడలేదట .

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -4-3-21-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

మార్చి 3 బుధవారం రాత్రి మా అబ్బాయి మూర్తి ,కోడలు రాణి ,మనవడు చరణ్ ,మనవరాలు రమ్య లతో మేమిద్దరం శ్రీ వీరమ్మతల్లి తిరుణాల లో

మార్చి 3 బుధవారం రాత్రి మా అబ్బాయి మూర్తి ,కోడలు రాణి ,మనవడు చరణ్ ,మనవరాలు రమ్య లతో మేమిద్దరం శ్రీ వీరమ్మతల్లి తిరుణాల లో

 

https://photos.google.com/u/1/share/AF1QipPoy74uXmtSXGtV7W1Lzl8f17RNkShWWbcG6N6YWhmouvyp9ji4MdD2_XbbSj4CFA

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మార్చి లోనూ విజ్రుమ్భించి పూస్తున్న డిసెంబర్లు

మార్చి లోనూ విజ్రుమ్భించి పూస్తున్న డిసెంబర్లు

 

 

https://photos.google.com/u/1/share/AF1QipMp3ybZu0GMJefqdbh2wjO7b1uoPpnw8vJEuStv_-9E4gHzM45ZwElfBPPyAcC7WA

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మూడు నామాల ‘’చేపలున్నశ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం  

మూడు నామాల ‘’చేపలున్నశ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం

 

తెలంగాణా భువనగిరిజిల్లా వలిగొండ మండలం వెంకటాపురం లో శ్రీ మత్స్య గిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం కొండపై ఉన్నది .ఈ ఆలయవిష్ణు  పుష్కరిణి లోని చేపలన్నీ అరమీటరు పొడవుగా ఉండటం తలపై మూడు ఊర్ధ్వ నామాలు కలిగి  ఉండటం ప్రత్యేకం .అందుకే మత్ష్యగిరి అనే పేరొచ్చింది.మాత్స్యాద్రి  అనీ అంటారు .హైదరాబాద్ కు 70కిలోమీటర్ల దూరం లో ఉన్న ఆలయం .స్వామి  శ్రీమన్నారాయణ మూర్తి ఆది అవతారంగా భావిస్తారు .కొండమీదికి మెట్ల దారి ఉంది .స్లోపు గా ఉన్న దారి లో వెళ్ళటం తేలిక .పొట్టిగుట్ట అనే ఊరునుంచి స్వామి వారి దర్శనం చేప ఆకారం లో కనిపిస్తుంది .గిరిపైనుంది చూస్తె అద్భుత ప్రకృతి పులకింప జేస్తుంది .పూర్వం మునులు అర్చనకోసం కొలను కు నీరు తేవటానికి వెడితే అందులో నామాలతో ఉన్న చేపలు కనిపించాయి .అందుకే వీటిని మత్స్యావతారంగా భావించారు .యాదాద్రి తర్వాత అంతటి విశిష్టమైన ఆలయమిది .

   ఈఆలయ పుష్కరిణి నీటిని పోలాలలో చిమ్మితే పంటలకు చీడపీడలు రావు అని గొప్ప నమ్మకం .వ్యాపారస్తులు వ్యాపార సంస్థలలో చల్లుకొంటే వ్యాపారం విపరీతంగా పెరుగుతుందని విశ్వాసం .అనారోగ్యం తో ఉన్నవారు పుష్కరిణి స్నానం చేసి స్వామిని దర్శి౦చి నిద్ర చేస్తే  పూర్ణారోగ్యం కలుగుతుంది .బ్రహ్మోత్సవాలు ,నరసింహజయంతి ,ఉగాది  ఘనంగా నిర్వహిస్తారు .ధనుర్మాస ఉత్సవాలు ,గోదా రంగనాధ స్వామి కళ్యాణమూ వైభవంగా చేస్తారు ఆలయాన్ని ఆనుకొని మూడు గుండాలకలయికతో ఉన్న  కొలను అన్నికాలాల్లో ఒకే స్థాయిలో నీరు కలిగి ఉండటం ఆశ్చర్యం  .కొండ చుట్టూ కొలను నీరు ప్రవహిస్తూ వింత శోభ కలిగిస్తుంది .పుష్కరిణి లోని నామాల చేపలు సంవత్సరం లో అన్ని రోజుల్లోనూ కనిపిస్తాయి .నామాలు స్పష్టంగా కనిపిస్తాయి .శ్రావణం నుంచి కార్తీకం వరకు పుష్కలంగా కనిపిస్తాయి .సంతానం లేనివారు పుష్కరిణిలో స్నానించి ,దగ్గరలో ఉన్న ఒక చెట్టుకు కొబ్బరి కాయలు ముడుపుగా కడతారు .పుష్కరిణి నీటిని 11 రోజులు తీర్ధంగా సేవిస్తే వ్యాధులు మటుమాయం అంటారు  .స్వామివారి అర్చన ,అభిషేకాలకు ఈ జలాన్నే ఉపయోగిస్తారు .ఇక్కడి లక్ష్మీ నరసింహస్వామి సాలగ్రామ రూపంగా లక్ష్మీ సమేతంగా శంకు చక్రాలతో దర్శనమిస్తాడు .చక్రం లో స్వామివారి ముఖం మధ్యలో నామం ,చేప ఉదరభాగం గా చివరి శంఖంచేప తోకగా దర్శనమనుగ్రహిస్తాడుస్వామి .క్షేత్రపాలకుడు శ్రీ ఆ౦జనేయ స్వామి.గోదా దేవి సీతారామస్వామి దేవాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి .

మీ- గబ్బిట దుర్గాప్రసాద్  -3-3-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

స్వయంగా బానిసలను విడిపించిన నల్లజాతి అమెరికన్ మహిళ- హారియట్ టబ్ మాన్–గబ్బిట దుర్గాప్రసాద్

స్వయంగా బానిసలను విడిపించిన నల్లజాతి అమెరికన్ మహిళ- హారియట్ టబ్ మాన్–గబ్బిట దుర్గాప్రసాద్

 01/03/2021 గబ్బిట దుర్గాప్రసాద్

← Back

Thank you for your response. ✨

బానిస తలిదండ్రులకు అరమింటా రాస్ గా 18 22 మార్చి లో అమెరికాలోని మేరీ లాండ్ రాష్ట్రం డార్చేస్టర్ కౌంటీ లో పుట్టిన హారియట్ తప్పించుకొని ,13సార్లు ప్రయత్నించి,తన కుటుంబం వారు, స్నేహితులతో సహా 70మంది పుట్టు బానిసలకు సురక్షిత గృహాలనబడే ‘’అండర్ గ్రౌండ్ రైల్ రోడ్ ‘’సీక్రెట్ కోడ్ ద్వారా బానిస విముక్తికై ఉద్యమిస్తూ విముక్తి కల్గించిన ధీరవనిత .అమెరికన్ అంతర్యుద్ధం లో యూనియన్ ఆర్మీలో సాహుధ స్కౌట్ గా ,గూఢచారిగా పని చేసి మెప్పించిన సాహస స్త్రీ .మహిళా వోటు హక్కు ఉద్యమానికీ నాయకత్వం వహించిన సంస్కర్త.

బానిసకుటుంబం లో పుట్టటం వలన బాల్యంలో అనేక మంది తలిదండ్రుల చేత కొరడాలతో చావు దెబ్బలు తిని ఒకసారి ఒక ఓవర్ సీర్ విసిరిన బరువైన ఇనుప వస్తువు తగిలి తలకు తీవ్రగాయమై నరకయాతన అనుభవించింది. ఈ దెబ్బకు ఆమె తలనొప్పి, అతి నిద్ర జబ్బు పట్టుకొని జీవితాంతం బాధించాయి .ఆఫలితం గా వి౦తకలలు ,విజన్ వచ్చేవి .ఇవి దైవ సంకల్పాలుగా భావించేది .వీటికి తోడు మెథడిస్ట్ చర్చి భావాలు కూడా తోడై పూర్తిగా మత ఆరాధకురాలైంది .

1849లో పారిపోయి ఫిలడేల్ఫియాకు చేరి ,మళ్ళీ మేరీ లాండ్ వచ్చి తన కుటుంబానికి బానిస విముక్తి కలిగించాలని భావి౦చి నెమ్మది నెమ్మదిగా ఒక్కో సారి ఒక్కొక్క బృందాలవారీగా వారిని ఆ రాష్ట్రం దాటించింది .1849 సెప్టెంబర్ 17న టబ్ మన్ ఆమె సోదరులు బెన్, హారీ లతో పాటు తప్పించుకొని పారిపోయింది .ఆమె పూర్వ యజమాని కొడుకు,దగ్గరలోని కరోలిన్ కౌంటీ లో పోప్లార్ నెక్ లో వందలాది ప్లాంటేషన్ ఎకరాలున్న ఆంధోనీ థాంప్సన్ కు అద్దె కు వెళ్ళింది .ఈ విధంగా బానిసలను అద్దెకు తీసుకోవటం ఆనాడు ఎక్కువగా జరుగుతూ ఉండేది .పూర్వ యజమాని ఆమె పారి పోయిందని అనుకోలేదు .కేంబ్రిడ్జి డెమొక్రాట్ పేపర్ లో తిరిగి వచ్చిన బానిసకు వంద డాలర్ల బహుమతి అనే ప్రకటన పడింది .ఆమె సోదరులు ఆమెను కూడా బలవంతంగా ఒప్పించి పాత యజమాని ని చేరారు .రెండో సారి ఆమె ఒక్కత్తే తప్పించుకొని వెళ్ళింది .ఒక సీక్రెట్ నెట్ వర్క్ ‘’అండర్ గ్రౌండ్ రైల్వే ‘’ఏర్పాటు చేసుకొని ఉచితంగా ఫీజు లేకుండా బానిసలకు, బానిసత్వ వ్యతిరేకులైన తెల్లవారికీ విషయాలు తెలిపేది .వీరిలో రిలీజియస్ సొసైటీ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు .వీళ్ళనే ‘’క్వేకర్స్’’ అంటారు .పోప్లార్ నెక్ కు దగ్గరలో ఉన్న ప్రేస్టాన్ లో క్వేకర్స్ ఎక్కువమంది ఉండేవారు .ఆమె తప్పించుకోన్నప్పుడు మొదటి హాల్ట్ ఇక్కడే .ఇక్కడి నుంచి చోప్ టాంక్ రివర్ మీదుగా డెలావర్ చేరి ,తర్వాత పెన్సిల్వేనియా కు వెళ్ళేవారు .ఇదంతా సుమారు 90 మైళ్ళు అంటే 145కిలోమీటర్లదూరం. అంతా కాలినడకే .దాదాపు 27రోజులు పట్టేది .

డజన్లకొద్దీ బానిసలకు ప్రేరణ కలిగించి బానిసత్వం నుంచి తప్పించుకోవటానికి మార్గ దర్శకురాలైంది .రాత్రి పూట అత్యంత రహస్యంగా ధృవ నక్షత్రం అంటే’’ నార్త్ స్టార్’’వెలుగులో ‘’మోసెస్ ‘’అనే మారు పేరుతొ ,ఎవరికంటబడకుండా తిరుగుతూ వారిని తప్పించేది .ఎప్పుడూ ఏ ఒక్కరూ మళ్ళీ దొరకకుండా తప్పించిన నేర్పు ఆమెది . ఫ్రెండ్స్ ఇంట్లో ఉదయం ఊడుపు అవీ చేస్తూ పనిమనిషిలా ఉండేది. రాత్రిపూట ఆఇంటి వారు బండీ లో వేరే ఫామిలీ ఫ్రెండ్ ఇంటికి చేర్చేవారు .అక్కడి అడవులు పొదలు అన్నీ ఆమెకు పరిచయమే.కనుక పగటిపూట ఎవరికీకనపడకుండా అక్కడే దాక్కునేది .1850లో పారిపోయిన బానిసత్వ విషయమై చట్టం అమలులోకి వచ్చాక ,ఆ బానిసలను సుదూరం లో ఉన్న బ్రిటిష్ నార్త్ అమెరికా అనబడే కెనడాకుచేరుకోవటానికి సహకరించి ,కొత్తగా బానిసత్వ విమోచ నత్వం పొందినవారికి అండగా నిలబడి వారి బ్రతుకు తెరువుకు దారి చూపింది .పారిపోయాక మళ్ళీ 1951లో మొదటిసారి డాచేస్టర్ కొంటీకి వచ్చి ,తనభర్త జాన్ ను చూసి ,అనేక ఉద్యోగాలు చేసి సంపాదించిన డబ్బు తో అతనికి ఒక ఇల్లుకొనిపెట్టి ,మళ్ళీ సౌత్ కు వెళ్ళిపోయింది .భర్త ఇంకో పెళ్లి చేసుకొన్నా, ,తనదగ్గరకు రమ్మన్నా వినకపోయినా’’ సీన్ క్రియేట్’’ చేయకుండా కోపం దిగమింగుకొని ,అక్కడి నుంచి తప్పించుకోవాలనుకోన్నబానిసలకు ఫిలడెల్ఫియా వెళ్ళటానికి సాయం చేసింది .ఆతర్వాత పదహారేళ్ళకు భర్తజాన్ ఒక తెల్ల వాడి తో జరిగిన వివాదం లో హత్య చేయబడ్డాడు .

.1858లో జాన్ బ్రౌన్ కు అండగా నిలబడి హార్పర్స్ ఫెర్రీ పై దాడికి 1959లో మనుషులను ఆసరాగా పంపింది .ఫెడ్రిక్ డగ్లస్ అనే బానిస విమోచననాయకుడి ఇంట్లో పారిపోయిన బానిసలనుంచగా ఆయన , డబ్బు సమకూర్చి వారిని సురక్షితంగా కెనడా చేర్పించాడు . .తనమూడవ ఆత్మకధలో డగ్లాస్ ‘’ On one occasion I had eleven fugitives at the same time under my roof, and it was necessary for them to remain with me until I could collect sufficient money to get them on to Canada. It was the largest number I ever had at any one time, and I had some difficulty in providing so many with food and shelter. … “[65] The number of travelers and the time of the visit make it likely that this was Tubman’s group.

అమెరికన్ అంతర్యుద్ధం ప్రారంభమైనప్పుడు టబ్ మన్ యూనియన్ ఆర్మీలో వంటమనిషిగా చేరి, నర్సుగా పనిచేసి ,తర్వాత సాయుధ స్కౌట్ గా, స్పై గా సేవలు అందించింది .కాంబ్ హీ ఫెర్రీ పై సాయుధ దాడి జరిపిన మొదటి స్త్రీ నాయకురాలిగా గుర్తి౦పు పొందింది .ఈదాడి ఫలితంగా 700 మంది బానిసలకు శాశ్వత విముక్తి కలిగించింది .సివిల్ వార్ పూర్తయ్యాక 1859లో సైన్యం లో రిటైరై,న్యూయార్క్ దగ్గర ఆబర్న్ లో తాను కొనుక్కొన్న ఇల్లు, స్థలం లో ఉంటూ ముసలి తలితండ్రులను చూసుకొంటూ ఉంది .స్త్రీ వోటు హక్కు కోసం నిరంతరం పోరాటం చేసింది .తనకూ టబ్ మాన్ కు బానిసల సేవలో తేడా వివరిస్తూ డగ్లాస్ ఇలారాశాడు ‘’ The difference between us is very marked. Most that I have done and suffered in the service of our cause has been in public, and I have received much encouragement at every step of the way. You, on the other hand, have labored in a private way. I have wrought in the day – you in the night. … The midnight sky and the silent stars have been the witnesses of your devotion to freedom and of your heroism. Excepting John Brown – of sacred memory – I know of no one who has willingly encountered more perils and hardships to serve our enslaved people than you have.[66]

‘’మింటీ’’ అనే ముద్దు పేరుతొ పిలువబడిన ఈమె దాదాపు అయిదు అడుగుల ఎత్తు ఉండేది .ఆమె తప్పించుకు పోయాక ఆమెను పట్టి అప్పగిస్తే 40వేలడాలర్ల రివార్డ్ ప్రకటించారు .1860లో బానిసల ను విడిపించటానికి ఆమె చివరి ప్రయత్నం చేసింది .తనసోదరి రాఖేల్ ను,పిల్లలను విడిపించలేకపోయింది .మళ్ళీ తిరిగొచ్చాక రాఖేల్ చనిపోయిందని తెలిసింది .ఇద్దరు పిల్లల్ని విడిపించటానికి ఒక్కక్కరికి 30డాలర్లు ఖర్చు చేయాలన్నారు .అంతడబ్బు ఆమె వద్ద లేదు .కనుక వారిద్దరూ బానిసలుగానే ఉండిపోవాల్సి వచ్చింది .ఎన్నాలిస్ ఫామిలిని నార్త్ కు తీసుకు వెళ్ళటానికి సాయం చేసింది .చలి విపరీతంగా ఉంది .తిండిసరిగా లేదు .స్లేవ్ కాచర్స్ కంటబడకుండా ఎంతో నేర్పుగా ప్రయాణ౦ చేయించి 28-12-1860 న ఆబర్న్ లో ఉన్న డేవిడ్ ,మార్తాదంపతుల ఇంటికి చేర్చింది సురక్షితంగా .

చివరి రోజుల్లో ఆబర్న్ లో ఉంటూ అనేకపనులు చేస్తూ డబ్బు సంపాదించి ముసలి తలిదండ్రుల సంరక్షణ చేసింది .అక్కడే బ్రిక్ లేయర్ గా పనిచేస్తున్న అయిదు అడుగుల 11అంగుళాల పొడవున్న నెల్సన్ చార్లెస్ డేవిస్ తో ప్రేమలోపడి అతడు తనకంటే 22ఏళ్ళు చిన్నవాడైనా18-3-1869న పెళ్లి చేసుకొన్నది .ఈ దంపతులు ఒక అమ్మాయిని దత్తత చేసుకొన్నారు .భర్త నెల్సన్ టి.బి.వ్యాధితో 1888లో చనిపోయాడు .

టబ్ మాన్ అభిమానులు స్నేతులు ఆమెకోసం నిధి సేకరించి అందించారు.సారాహాప్కిన్స్ బ్రాడ్ ఫోర్డ్ అనే అభిమాని ఆమె జీవిత చరిత్రను ‘’సీన్స్ ఇన్ ది లైఫ్ ఆఫ్ హారియట్ టబ్ మాన్ ‘’పేరుతొ రాసి 1869ప్రచురించగా దీనిపై ఆమెకు 1200డాలర్ల ఆదాయం వచ్చింది .దీనినే మార్పులు చేసి ‘’హారియట్ ది మోజెస్ ఆఫ్ హర్ పీపుల్’’గా రాసి ప్రచురించాడు ఈ రెండు పుస్తకాలలోనూ ఆమెను ‘’జోన్ ఆఫ్ ఆర్క్ ‘’గా ప్రస్తుతించాడు.1896లో ‘’నేషనల్ ఫెడరేషన్ ఫర్ ఆఫ్రో –అమెరికన్ వుమెన్ ‘’ఏర్పడినప్పుడు ఆమె కీలక ప్రసంగం చేసింది .దేశమంతా ఆన౦దోత్సవాలు జరిపారు ..ఉమెన్స్ ఎరా ‘’అని ‘’ఎమినేంట్ వుమన్ ‘’అనీ పేపర్లన్నీ పెద్దపెద్ద శీర్షికలతో రాశాయి .1897లో బోస్టన్ పట్టణం ఆమెసేవకు జాతీయగౌరవం కలిపించి సత్కరించింది .

20వ శతాబ్ది ప్రారంభం లో అంటే 1903లో ఆబర్న్ లోని ‘’ ఆఫ్రికన్ మేధడిస్ట్ ఎపిస్కోపల్ జియాన్ చర్చ్’’కి తనకున్న రియల్ ఎస్టేట్ లోకొంత రాసిచ్చి ముసలి నల్లజాతి వారి సంక్షేమానికి ఒక భవనం కట్టించమని కోరింది .కాని అయిదేళ్ళ వరకూ ఆపని జరగనేలేదు.అందులో ఉండేవారు వందడాలర్లు ప్రవేశ రుసుముకట్టాలని నిబంధన పెడితే నిరాశ పడిఇలా అన్నది –‘’ ]hey make a rule that nobody should come in without they have a hundred dollars. Now I wanted to make a rule that nobody should come in unless they didn’t have no money at all.”[168]

కాని ‘’హారియట్ టబ్ మాన్ హోం ఫర్ దిఏజ్డ్’’ ను 23-6-1908 న ప్రారంభించినపుడు ఆమె గెస్ట్ ఆఫ్ ఆనర్ గా హాజరయింది .చిన్ననాటి తలగాయం మళ్ళీ బాధ పెట్టి తరచూ తలనొప్పి వచ్చేది ,దీనికి ఆమె బోస్టన్ లోని ‘’మెసా చూసేట్స్ జనరల్ హాస్పిటల్ ‘’లో మత్తుమందు లేకుండానే బ్రెయిన్ సర్జరీ చేయి౦చుకొన్నది .1911లో బాగా బలహీనమైతే ఆమెను ఆమెపెరనే ఉన్న వృద్ధాశ్రమం లో చేర్చారు .’’ఇల్ అండ్ పెన్నిలెస్’’గా ఉన్న ఆమె కోసం మిత్రులు అభిమానులు నిధి సేకరించారని న్యూయార్క్ పత్రిక రాసింది .స్నేహితులు కుటుంబసభ్యుల మధ్య న్యుమోనియాతో టబ్ మాన్ 10-3-1913 న 92వ యేట మరణించింది .ఆమెపేర మ్యూజియం లు చారిత్రక కట్టడాలు వెలిశాయి .ఆమె బొమ్మతో 20డాలర్ల నోటు 2016లో ముద్రించి గౌరవించారు .హారియట్ టబ్ మాన్ ప్రైజ్ ఏర్పాటయింది .ఆమె జీవితం సేవలపై నాటకాలు నవలలు రేడియో టివి షోలు సినిమాలు వచ్చాయి .నాటకశాలలు ,సినిమాహాళ్ళు నిర్మించారు .చాలా అవార్డులు ఆమె పేరిట నెలకొల్పారు .2007లో ‘’హారియట్ టబ్ మాన్ –మిత్ ,మెమరి అండ్ హిస్టరీ ‘’అనే గొప్ప పుస్తకం విడుదలై ఆమెను చిరస్మరణీయురాలను చేసింది .

Posted in రచనలు | Tagged | Leave a comment

సరసభారతి శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది వేడుకలు 4-4-21 ఆదివారం

అక్షరం లోక రక్షకం

సరసభారతి శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది వేడుకలు

సరసభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ,  మరియు ఉయ్యూరు  రోటరీక్లబ్  సంయుక్త ఆధ్వర్యం లో ,కె.సి.పి.షుగర్ ఫాక్టరీ వద్ద గల రోటరీ ఆడిటోరియం లో సరసభారతి 157వ కార్యక్రమంగా శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది వేడుకలను   4-4-21 ఆదివారం సాయంత్రం 3.00  గం నుండి నిర్వహిస్తున్నాము . భక్తి సంగీత విభావరి ,.మూడు పుస్తకాల ఆవిష్కరణ ,కవి సమ్మేళనం ప్రముఖులకు జీవన సాఫల్య ,,ఉగాది ,ప్రత్యేక,స్వయం సిద్ధ ,శ్రమశక్తి  ,పురస్కారప్రదానాలు  జరుగును  . అతిథులు,. ,కవిమిత్రులు,పురస్కార గ్రహీతలు ,.సాహిత్య ,సంగీతాభిమానుల౦దరికి శ్రీ ప్లవ ఉగాది శుభాకాంక్షలతో ఆహ్వానం పలుకుతున్నాము .  ,పాల్గొని  జయప్రదం చేయ ప్రార్ధన .

     కార్యక్రమ వివరాలు

ఆత్మీయ అతిథులు –శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ –శాసనమండలి సభ్యులు

                        శ్రీ జి.వెంకటేశ్వరావు –సియివో –కె.సి.పి .అండ్ కె .ఐ.సి. –ఉయ్యూరు

                        శ్రీ  చి౦దా వీర వెంకట కుటుంబ రాజు  -రోటరీ క్లబ్ అధ్యక్షులు –ఉయ్యూరు

                   కార్యక్రమ వివరాలు

4-4-21 ఆదివారం మధ్యాహ్నం -3గం.లకు –అల్పాహారం

సభాధ్యక్షులు –శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు

సభ ప్రారంభకులు –శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి –సరసభారతి గౌరవాధ్యక్షులు

సభ నిర్వహణ –శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి –సరసభారతి కార్య దర్శి

మధ్యాహ్నం -3-30నుండి 4-30వరకు -1-‘’రామాయణ గానం ‘’ .శ్రీ కంభంపాటి సోదరులు –హైదరాబాద్

నిర్వహణ సహకారం –శ్రీ పంతుల వెంకటేశ్వరావు ,శ్రీ దండి భట్ల దత్తాత్రేయ శర్మ

కవి సమ్మేళనం –సాయంత్రం 4.30గం నుండి 5-30 గం వరకు

అంశం –‘’నేటి ప్రజాస్వామ్యం ‘’

నిర్వహణ –శ్రీ శిష్టు సత్యరాజేష్ –కవి భావుకుడు విమర్శకుడు ,గోదావరి జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు-అమలాపురం ,శ్రీమతి గుడిపూడి రాధికారాణి-ప్రముఖ కవి రచయిత్రి –మచిలీపట్నం

మనవి -5 పద్యాలుకానీ ,15పంక్తుల వచనకవిత్వానికి పరిమితం .చదివిన కవిత కాపీ సరసభారతికి అందజేయ మనవి .

3-సాయంత్రం 5-30నుంచి 5-45గం వరకు – శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ రచించి(25,26), ,సరసభారతి ప్రచురించిన(37,38,39) 3 గ్రంథాల ఆవిష్కరణ –అతిధుల చే

1-Nuclear scientist  Dr.Akunuri   Venkata Ramayya –(శ్రీ దుర్గాప్రసాద్ రాసిన  అణుశాస్త్ర వేత్త డా.ఆకునూరి వెంకట రామయ్య పుస్తకం కు ఆంగ్లానువాదం )-స్పాన్సర్ –శ్రీ మైనేని గోపాలకృష్ణ ,శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా)

2-వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాథ సూరి మనీష – స్పాన్సర్ –శ్రీ మైనేని గోపాలకృష్ణ ,శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా) –ముందుమాటలు రాసినవారు -1.డా నిష్టల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ,విశ్రాంత సంస్కృత ఉపన్యాసకులు ,పరశు రామాయణం వంటి సంస్కృత గ్రంథ రచయిత,జ్యోతిష్య పండితులు –పొన్నూరు 2-డా.పుట్టపర్తి నాగపద్మిని గారు –సంస్కృత, ఆంద్ర, ఆంగ్ల, హిందీ భాషా విదుషీమణి ,రచయిత్రి, విమర్శకురాలు –హైదరాబాద్ .

3-ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు .ముందుమాటలు రాసినవారు –డా .వెంపటి కుటుంబ శాస్త్రి గారు రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ పూర్వ వైస్ చాన్సలర్ ,అంతర్జాతీయ సంస్కృత సంస్థ అధ్యక్షులు 14,,15,16,17వ విశ్వ సంస్కృత సమ్మేళనం నిర్వహించిన వారు ,విస్తృత వేద అధ్యయన నిర్వహణ బోర్డ్ సభ్యులు ,బహు గ్రంథ కర్త ,కృష్ణాజిల్లా టేకుపల్లి వాస్తవ్యులు  ప్రస్తుతం పూణే నివాసి .

4- సాయంత్రం -5-45 గం నుండి రాత్రి 7-30గం వరకు

సరసభారతి జీవన సాఫల్య ,ఉగాది పురస్కార ,ప్రత్యేక పురస్కార, స్వయం సిద్ధ ,శ్రమశక్తి పురస్కారప్రదానం ,పురస్కార గ్రహీతల అభిభాషణం

   జీవన సాఫల్య పురస్కార గ్రహీతలు

1-శ్రీ ఉప్పులూరి .సుబ్బరాయ శర్మ   –ప్రముఖ ,నాటక ,రేడియో, టి.వి..సినిమా నటులు –హైదరాబాద్

2-శ్రీ బెల్లం కొండ నాగేశ్వరావు   –వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ,ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్,తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ విజేత ,తెలుగు భాషోద్యమ సమాఖ్య నాయకులు –చెన్నై  ,

3-శ్రీ చలపాక ప్రకాష్   –ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి ,రమ్యభారతి సంపాదకులు ,కవి ,కధకులు విమర్శకులు,ప్రచురణ కర్త –విజయవాడ  .

5-కీ.శే.విద్వాన్ శ్రీ గబ్బిట  మృత్యుంజయశాస్త్రి ,శ్రీమతి భవానమ్మదంపతుల స్మారక ఉగాది సాహితీ పురస్కార ప్రదానం

   గ్రహీతలు

 1-శ్రీ కట్టా నరసింహులు –కడప బ్రౌన్ స్మారక లైబ్రరి ట్రస్ట్ పూర్వ కార్యదర్శి ,శ్రీతిరుమలతిరుపతి దేవస్థానం పోతన భాగవత  ప్రాజెక్ట్ సభ్యులు –తిరుపతి

2-డా .శ్రీమతి చిల్లర భవానీ దేవి –బహు ప్రక్రియల రచయిత్రి –హైదరాబాద్

3-డా శ్రీమతి నోముల నర్మదా రెడ్డి –ప్రముఖ ప్రపంచ పర్యాటకురాలు ,పర్యాటక రచయిత్రి ,గాయని ,బాడ్ మింటన్,రన్నింగ్ చాంపియన్ –హైదరాబాద్

4-శ్రీ రహ్మనుద్దీన్ షేక్ –ప్రసిద్ధ తెలుగు అంతర్జాల నిపుణులు –విజయవాడ

5-శ్రీ కానూరి బదరీనాథ్- విశిష్ట  చారిత్రిక పరిశోధకులు ,ప్రాంతీయ చరిత్ర రచయిత-తణుకు.

6-శ్రీ కంభంపాటి  సుబ్రహ్మణ్యం – ఉయ్యూరులో’’1960-70 లో  ఆర్ట్ ఫిలిం’’ ప్రదర్శనకు ‘’ఫిలిం క్లబ్’’ స్థాపించిన విజనరి,,రిటైర్డ్ స్టేట్ బాంక్ మేనేజర్ –విశాఖ పట్నం

6-సరసభారతి ప్రత్యేక పురస్కార ప్రదాన౦

    గ్రహీతలు

  1-శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి –సరసభారతి గౌరవాధ్యక్షులు ,సుమధుర గాయని-ఉయ్యూరు

 2-డా.దీవి చిన్మయ –సరసభారతి ఉపాధ్యక్షులు,,ప్రముఖ ఆయుర్వేద వైద్యులు –ఉయ్యూరు

3-శ్రీమతి కోనేరు కల్పన-ప్రముఖ రచయత్రి ,విశిష్ట సాహితీ సేవాకర్త –విజయవాడ

4—శ్రీ ‘’హాస్యదండి’’ భట్ల దత్తాత్రేయ శర్మ –తెలుగు భాషా సాంస్కృతిక సమాఖ్య కోశాధికారి ,హాస్యలహరి కార్యదర్శి ,ప్రముఖ కవి ,విమర్శకులు,,సంస్కృతాంధ్ర సాహిత్య ప్రజ్ఞానిధి స్వర్గీయ  శ్రీ కె.వై.ఎల్ .యెన్. కళాపీఠ౦ స్థాపకులు  –మచిలీపట్నం

5-శ్రీ పంతుల వెంకటేశ్వరావు –శారదా సమితి స్థాపకులు ,ప్రసిద్ధకవి ,రచయిత  –విజయవాడ

6-దావులూరి రాదాకృష్ణ మూర్తి –సీనియర్ జర్నలిస్ట్ ,విశిష్ట యోగాచార్య –ఉయ్యూరు

6-శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ శ్రీమతి ప్రభావతి గార్ల -స్వయం సిద్ధ ఉగాది పురస్కారప్రదానం

   గ్రహీతలు

1-శ్రీ గాదిరాజు రంగరాజు –ప్రముఖ కవి ,విశ్లేషకులు –ఉండి

2-శ్రీ ధూళిపాళ రామభద్ర ప్రసాద్ ––తెలుగు భాషా వికాస సమితి సమన్వయకర్త ,-గుడివాడ

3-శ్రీమతి పి.శ్రీవల్లి –లైబ్రేరియన్ –సారస్వత  నికేతనం –వేటపాలెం

4-శ్రీ జమ్మలమడక శ్రీనివాస్ –అసిస్టెంట్ సెక్రెటరి ,లాండ్ డిపార్ట్ మెంట్ –విజయవాడ

5-శ్రీ జంపాన శ్రీనివాస గౌడ్ –మాజీ సర్పంచ్ ,విశిష్ట సామాజిక సేవాకర్త –గురజాడ

6-శ్రీ వీరమాచనేని బాలగంగాధరరావు –సరసభారతి సాంకేతిక నిపుణులు –ఉయ్యూరు

7-శ్రీ వెంట్రప్రగడ వీరా౦జనేయులు –ప్రముఖ సాంఘిక ,సాంస్కృతిక, ధార్మిక సేవా బంధు  –ఉయ్యూరు

8-శ్రీ గుర్రాల  నాగేంద్రరావు –అమృత ఎలెక్ట్రికల్స్ –ఉయ్యూరు –

9-శ్రీ తాడంకి సత్యపవన్ –కంప్యూటర్ మెకానిక్ –ఉయ్యూరు

7-శ్రమశక్తి పురస్కార ప్రదానం –గ్రహీతల పేర్లు తరువాత తెలియజేస్తాము .

8-రాత్రి 7.30గం.లకు విందు

కవి సమ్మేళనం లో పాల్గొను కవిమిత్రులు

అక్షరం ప్రభాకర్ –మానుకోట –వరంగల్ జిల్లా, శ్రీ యల్లాప్రగడ విజయరామరాజు –గుంటూరు -శ్రీ శిష్టు సత్య రాజేష్ –అమలాపురం ,శ్రీ చలపాక ప్రకాష్ ,శ్రీ తుమ్మోజు రామలక్ష్మణా చార్యులుశ్రీ బందా వెంకట రామారావు,శ్రీ కంది కొండ రవి కిరణ్ ,శ్రీ పంతుల వెంకటేశ్వరావు ,శ్రీ దండి భట్ల దత్తాత్రేయ శర్మ ,శ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్య ,శ్రీ రొయ్యూరు సురేష్ ,శ్రీ విష్ణుభొట్ల రామకృష్ణ, శ్రీ కొక్కుర వెంకటేశ్వరరావు,శ్రీ బొడ్డపాటి చంద్ర సేఖరరావు ,శ్రీమతి ముదిగొండ సీతారామమ్మ ,శ్రీమతి మందరపు హైమవతి ,శ్రీమతి వి.శ్రీ ఉమామహేశ్వరి ,శ్రీమతి లక్కరాజు వాణీ సరోజిని , శ్రీమతి వడ్డాది లక్ష్మీసుభద్ర ,శ్రీమతి సింహాద్రి వాణి,శ్రీమతి కోనేరుకల్పన,శ్రీమతి ఎస్.అన్నపూర్ణ ,శ్రీమతి కొమాండూరి కృష్ణా,శ్రీమతి మద్దాలి నిర్మల ,శ్రీమతి సామినేని శైలజ ,శ్రీమతి డి.స్వాతి ,శ్రీమతి విజయశ్రీ దుర్గ ,శ్రీమతి పి.వాణీ రామకృష్ణ ,శ్రీమతి మాచిరాజు మీనాకుమారి ,శ్రీమతి సోమరాజుపల్లి విజయకుమారి ,శ్రీమతి తుమ్మల స్నిగ్ధమాధవి (విజయవాడ )డా జి.విజయకుమార్ (నందిగామ ) శ్రీ వసుధ బసవేశ్వరరావు ,శ్రీ వి.రాఘవాచారి ,శ్రీ జి.మాల్యాద్రి ,శ్రీమతి పుట్టి నాగలక్ష్మి (గుడివాడ )శ్రీమతి పి.శేషుకుమారి (నెప్పల్లె )శ్రీ మైనేపల్లి సుబ్రహ్మణ్యం (ఆకునూరు )శ్రీ కాట్రగడ్డ వెంకటరావు (గూడూరు )శ్రీమతి వారణాసి సూర్యకుమారి ,శ్రీమతి గురజాడ రాజ రాజేశ్వరి ,శ్రీమతి జి.మేరీ కృపాబాయి,శ్రీమతి చిల్లరిగె ప్రమీల ,శ్రీమతి కందాళ జానకి, శ్రీ మహమ్మద్ సిలార్(మచిలీ పట్నం )శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ ,శ్రీమాది రాజు శ్రీనివాస శర్మ ,శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి (ఉయ్యూరు )

  సభ నిర్వహణ సహకారం –డా.గుంటక  వేణు గోపాలరెడ్డి ,డా.దీవి చిన్మయ ,శ్రీ గబ్బిట రామనాథబాబు ,శ్రీ కోనేరు చంద్ర శేఖరరావు ,శ్రీమతి సీతంరాజు మల్లిక,శ్రీ మాదిరాజు శ్రీనివాస శర్మ శ్రీ చౌడాడ చిన అప్పలనాయుడు .

   ఆహ్వాని౦చు వారు

శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి –సరసభారతి గౌరవాధ్యక్షులు

శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు

శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి –సరసభారతి కార్యదర్శి

శ్రీ గబ్బిట వెంకట రమణ –సరసభారతి కోశాధికారి

శ్రీ వి.బి.జి .రావు-సరసభారతి సాంకేతిక నిపుణులు

మరియు రోటరీ క్లబ్ ఉయ్యూరు

 ఉగాది శుభాకాంక్షలు

తెలుగులో మాట్లాడటం మన జన్మ హక్కు

ఉయ్యూరు-1-3-21.

మార్చి రెండవ వారం లో పూర్తి వివరాలతో ముద్రించిన ఆహ్వాన పత్రం అంద జేస్తాం

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరసభారతి శ్రీ ప్లవ ఉగాది వేడుకలు 2021

అక్షరం లోక రక్షకం

సరసభారతి శ్రీ ప్లవ ఉగాది వేడుకలు

-సరసభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ,  స్థానిక రోటరీక్లబ్ సంస్థ తో కలిసి ,కె.సి.పి.షుగర్ ఫాక్టరీ వద్ద గల రోటరీక్లబ్ ఆడి టోరియం లో శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది వేడుకలు ( ఉగాదికి పదిరోజులముందు) 4-4-21 ఆదివారం సాయంత్రం 3.30  గం లకునిర్వహింపబడును . .సాహిత్య ,సంగీతాభిమానులు ,కవిమిత్రులు  విచ్చేసి,పాల్గొని  జయప్రదం చేయ ప్రార్ధన .

     కార్యక్రమ వివరాలు

1-‘’రామాయణ గానం ‘’ .శ్రీ కంభంపాటి సోదరులు –హైదరాబాద్  –

2- ‘’నేటి ప్రజాస్వామ్యం ‘’ అంశం పై –ప్రముఖ కవి మిత్రులచే –కవి సమ్మేళనం

3- శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ రచించి(25,26), ,సరసభారతి ప్రచురించిన(37,38,39) 3 గ్రంథాల ఆవిష్కరణ –

1-Nuclear scientist  Dr.Akunuri   Venkata Ramayya –(శ్రీ దుర్గాప్రసాద్ రాసిన  అణుశాస్త్ర వేత్త డా.ఆకునూరి వెంకట రామయ్య పుస్తకం కు ఆంగ్లానువాదం )-స్పాన్సర్ –శ్రీ మైనేని గోపాలకృష్ణ ,శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా)

2-వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాథ సూరి మనీష – స్పాన్సర్ –శ్రీ మైనేని గోపాలకృష్ణ ,శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా) –ముందుమాటలు రాసినవారు -1.డా నిష్టల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ,విశ్రాంత సంస్కృత ఉపన్యాసకులు ,పరశు రామాయణం వంటి సంస్కృత గ్రంథ రచయిత,జ్యోతిష్య పండితులు –పొన్నూరు 2-డా.పుట్టపర్తి నాగపద్మిని గారు –సంస్కృత, ఆంద్ర, ఆంగ్ల, హిందీ భాషా విదుషీమణి ,రచయిత్రి, విమర్శకురాలు –హైదరాబాద్ .

3-ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు .ముందుమాటలు రాసినవారు –డా .వెంపటి కుటుంబ శాస్త్రి గారు రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ పూర్వ వైస్ చాన్సలర్ ,అంతర్జాతీయ సంస్కృత సంస్థ అధ్యక్షులు 14,,15,16,17వ విశ్వ సంస్కృత సమ్మేళనం నిర్వహించిన వారు ,విస్తృత వేద అధ్యయన నిర్వహణ బోర్డ్ సభ్యులు ,బహు గ్రంథ కర్త ,కృష్ణాజిల్లా టేకుపల్లి వాస్తవ్యులు  ప్రస్తుతం పూణే నివాసి .

4- సరసభారతి జీవన సాఫల్య పురస్కారప్రదానం

   గ్రహీతలు

1-శ్రీ ఉప్పులూరి .సుబ్బరాయ శర్మ గారు  –ప్రముఖ ,నాటక ,రేడియో, టి.వి..సినిమా నటులు –హైదరాబాద్

2-శ్రీ బెల్లం కొండ నాగేశ్వరావు  గారు –వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ,ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్,తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ విజేత ,తెలుగు భాషోద్యమ సమాఖ్యనాయకులు –చెన్నై  ,

3-శ్రీ చలపాక ప్రకాష్ –ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి ,రమ్యభారతి సంపాదకులు ,కవి ,కధకులు విమర్శకులు,ప్రచురణ కర్త –విజయవాడ

5-కీ.శే.విద్వాన్ శ్రీ గబ్బిట  మృత్యుంజయశాస్త్రి ,శ్రీమతి భవానమ్మదంపతుల స్మారక ఉగాది సాహితీ పురస్కార ప్రదానం

   గ్రహీతలు

 1-శ్రీ కట్టా నరసింహులు –కడప బ్రౌన్ స్మారక లైబ్రరి ట్రస్ట్ పూర్వ కార్యదర్శి ,శ్రీతిరుమలతిరుపతి దేవస్థానం పోతన భాగవత  ప్రాజెక్ట్ సభ్యులు –తిరుపతి

2-డా .శ్రీమతి చిల్లర భవానీ దేవి –బహు ప్రక్రియల రచయిత్రి –హైదరాబాద్

3-డా శ్రీమతి నోముల నర్మదా రెడ్డి –ప్రముఖ ప్రపంచ పర్యాటకురాలు ,గాయని ,బాడ్ మింటన్,రన్నింగ్ చాంపియన్ –హైదరాబాద్

4-శ్రీ రహ్మనుద్దీన్ షేక్ –ప్రసిద్ధ తెలుగు అంతర్జాల నిపుణులు –విజయవాడ

6-శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ శ్రీమతి ప్రభావతి గార్ల -స్వయం సిద్ధ ఉగాది పురస్కారప్రదానం

   గ్రహీతలు

1-శ్రీ గాదిరాజు రంగరాజు –ప్రముఖ కవి ,విశ్లేషకులు –ఉండి

2-శ్రీ ధూళిపాళ రామభద్ర ప్రసాద్ ––తెలుగు భాషా వికాస సమితి సమన్వయకర్త ,-గుడివాడ

3-శ్రీమతి పి.శ్రీవల్లి –లైబ్రేరియన్ –సారస్వత  నికేతనం –వేటపాలెం

4-శ్రీ జమ్మలమడక శ్రీనివాస్ –అసిస్టెంట్ సెక్రెటరి ,లాండ్ డిపార్ట్ మెంట్ –విజయవాడ

5-శ్రీ జంపాన శ్రీనివాస గౌడ్ –మాజీ సర్పంచ్ ,విశిష్ట సామాజిక సేవాకర్త –గురజాడ

6-గుర్రాల  నాగేంద్రరావు –అమృత ఎలెక్ట్రికల్స్ –ఉయ్యూరు –

7-శ్రమశక్తి పురస్కార ప్రదానం –గ్రహీతల పేర్లు తరువాత తెలియజేస్తాము .

                                       ఆహ్వానించు వారు

    గబ్బిట దుర్గాప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు, మరియు రోటరీ క్లబ్ ఉయ్యూరు -25-2-21

మార్పులు , చేర్పులతో ,పూర్తి వివరాలతో ఫైనల్ ఆహ్వాన పత్రిక మార్చి రెండవవారం లో అందజేయ బడుతుంది .

 తెలుగులో మాట్లాడటం మన జన్మ హక్కు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

వార్తాపత్రిక లో

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | 1 Comment

మహా భక్త శిఖామణులు34-భక్త శిఖామణి సింగిరి దాసు

మహా భక్త శిఖామణులు34-భక్త శిఖామణిసింగిరి దాసు

ఒంగోలు మండలం  వెంకటాపురం లో 1840 శార్వరి జ్యేష్ట శుద్ధ ఏకాదశి నాడు కామరాజు కృష్ణయ్య ,రామ లక్ష్మమ్మ దంపతులకు సింగిరి దాసు జన్మించాడు .బాల్యం నుంచి జంతువులపై ప్రేమ ఎక్కువ .తల్లి అన్నానికి పిలిస్తే ,ఆడుకొనే కుక్కపిల్లల్ని కూడా వెంట తెచ్చుకొని వాటితో కలిసి తినేవాడు .వేరే కంచం లో వాటికి పెట్టించి తాను  ఇంకో కంచం లో తినేవాడు .లక్కవరపు వెంకట నరసింహం గారి వద్ద బడి చదువు పూర్తి చేసి ,తర్వాత పురాణాలను శ్రావ్యం గా గానం చేసేవాడు .వాటి అంతరార్ధం బోధించే నేర్పు సంపాదించాడు .

  తండ్రికి రోజూ రామాయణం చదివి వినిపించేవాడు .చదువుతూ మైమరచేవాడు రామమందిరం లో భజన చేస్తూ నిద్రపోయేవాడు కాదు .తర్వాత భగవంతుడి పై ఆలోచన తనకు ఆయనకూ ఉన్న సంబంధం గురించి తర్కి౦చు కోనేవాడు .12వ ఏట ఉపనయనం జరిగి ,అప్పటి నుంచి సింగిరి గిరి నరసింహ స్వామిని ప్రతి ఏడాది సందర్శించే వాడు .ఒకరోజు అర్ధరాత్రి వరకు నరసింహ భజన చేసి ,ఇంటికి ఒంటరిగా వస్తుంటే ,దారి తప్పితే ముందు మినుకు మినుకు దీపం కాంతి తర్వాత పెట్రోమాక్స్ లైట్ కాంతి కనిపించి భయ౦,ఆశ్చర్యం కలిగి మనశ్శాంతి కలిగింది .స్పృహ తప్పి నేలపై పడి పోయాడు .స్పృహ వచ్చి చూస్తె ,ఆ జ్యోతి కనిపించలేదు .మట్టిలో పడివున్న అతనిని వెతకటానికి వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా ఇంటికి చేర్చారు .

ఇంకోసారి ఇంటి నుంచి సాయంత్రం అయిదు గంటలకు బయల్దేరి సింగిరి గిరి నరసింహస్వామి కోవెలకు వెళ్లి నిర్మానుష్యంగా ఉండటం చేత ,సంతోషించి లోపలి వెళ్లి ,స్వామి పాదాలపై పడి,ప్రత్యక్ష దర్శనం కోసం ప్రార్ధించాడు .కనిపించకపోయేసరికి ధారాపాతం గా కన్నీరు కారుస్తూ దుఃఖించాడు .కాసేపటికి ఇదివరకులాగానే దివ్య జ్యోతి మళ్ళీ కనిపించగా సంతోషం తో ఆనంద బాష్పాలు రాలుస్తూ ఉండగా సంప్రజ్ఞానం లో నృసింహ స్వామి దర్శన మిచ్చాడు .సమాధి నుంచి బయటికి వచ్చి ఆనంద బాష్పాలు రాలుస్తూ నృత్యం చేసి ఆలయం నుంచి బయటకు రాగానే ఒక యోగిని కనిపించి ‘’నాయనా !నీ కోసమే ఎదురు చూస్తున్నాను ‘’అని చెప్పి ఆత్మీయంగా కౌగిలించుకొని ‘’తారకం ఉపదేశిస్తా .దానితో నీ అభీష్ట సిద్ధి కలుగుతుంది ‘’అని చెప్పి ఆలయం లోకి తీసుకు వెళ్లి ,సర్వ వేదాంత రహస్యాలు బోధించి తారకమంత్రం ఉపదేశించి ,కనిపించకుండా వెళ్ళిపోయింది .ఆమె సీతాంబ అనే శూద్ర యోగిని బ్రహ్మ చారిణి .అంతకంటే వివరాలు తెలీదు .అప్పటినుంచి దాసుగారి జీవితం అంతా రామమయం అయింది . తండ్రి చనిపోగా బాధ్యతా మీద పడి ఆస్తి అంతా అప్పులపాలై ,ఊళ్ళో అప్పిచ్చే వారు లేక ,ఉద్యోగం చేయటం ఇష్టం లేక ,,మేనమామ వెంకట నరసింహం గారి బలవంతం తో ఉద్యోగానికి దరఖాస్తు చేయగా అ ఉద్యోగం ఆర్డర్ చేతి కందేలోపు ,ఒకరోజు రాత్రి యాత్రకు వెడుతున్నట్లు చెప్పి ,ఇంటినుంచి బయల్దేరి 15రోజులలు నడిచి నెల్లూరు చేరాడు .ఈ ప్రయాణం లో ఒక వింత జరిగింది .పెన్నా నది ని దాటటానికి నదిలోకి దిగి భజన చేస్తూ వెడుతుంటే ,ప్రవాహం పెరిగి ,చేతిలోని తంబూర ,పై గుడ్డ కూడా నీటి వేగానికి కొట్టుకుపోయి నా స్పృహ లేకుండా భజన చేస్తూ ,నది మధ్యకు చేరి మైమరచి నిలచిపోయాడు .ఒడ్డుల్ని ఒరుసుకొని నది తీవ్రంగా ప్రవహిస్తోంది. రామనామం విన్న పల్లెకారులు దివిటీలు ,పడవలతో వచ్చి ,మొలబంటి నీటిలో ఇసుకదిబ్బపై స్పృహ లేకు౦డా  పడి ఉన్న దాసు గారిని చూసి ,స్మృతిత వచ్చేవరకు ఉండి,పడవ ఎక్కించుకొని ,ఒడ్డుకు చేర్చారు. ఆయనెవరో వాళ్లకు తెలీదు .

  నెల్లూరు చేరి శ్రీరంగనాయక దర్శనం చేసి,ఆరాత్రి గుడిలోనే పడుకొని రామనామ సంకీర్తన చేస్తూ తెల్లవార్లూ గడిపారు .ఉద్యోగం పోస్టింగ్ ఇచ్చి ఆయన చేరకపోవటం తో రద్దు చేయగా దాసు గారు చాలా సంతోషించారు . మేనమామ మళ్ళీ ప్రయత్నించి ఉద్యోగం వచ్చేట్లు చేశాడు .రామకూరు ఫిర్కా రెవిన్యు ఇన్స్పెక్టర్ ఉద్యోగం లో బలవంతం మీద చేరి ,విధి నిర్వహిస్తూ ,జపతపాలలో  మునిగి ఆఫీసుకు వేళకు  వెళ్లకపోతే ,పై అధికారి మందలించి భయపెట్టేవాడు .ప్రయోజనం లేక ఉద్యోగం ఊడ పీకేశాడు .బంధన విముక్తి అయిందని సంతోషించి ,భార్య తల్లి తో శ్రీరామ సేవాపరాయణలో గడిపారు .కుటుంబ పోషణ కష్టమైంది .తల్లి అన్నకు బాధ చెప్పుకోనగా ,వెల్లూరు తాలూకా కచేరీలో గుమాస్తాఉద్యొగ౦ వేయించి బలవంతం మీద మేనల్లుడిని చేర్చాడు .ఇదీ మూన్నాళ్ళ ముచ్చటే అయింది .

 గర్భవతి అయిన భార్యను అత్తారింటికి పంపగా రోజూ ఉపవాసాలతో బతకలేక తల్లి చిన్న పిల్లాడితో తన పుట్టింటికి చేరింది .బాదర బందీ లేకపోవటం తో రామనామం తో గడుపుతూ ,తిరుపతి యాత్రకు బయల్దేరి మధ్యలో ధేనువకొండ లో రామకృష్ణయ్యగారు కలువగా,ఆయనతో కలిసి యాత్ర చేసిన తర్వాత అప్పుడప్పుడు ఆయన ఇంటికి వస్తానని చెప్పి , యాత్ర అవగానే బావమరిది ఇంటికి చేరాడు .బావను బతిమాలి బామాలి ,చిత్తూరు మండలం పూతలపట్టులో ఒక బడి పెట్టించాడు .అక్కడ పాఠాలు చెబుతూ పురాణ కాలక్షేపాలు చేస్తూ అందరినీ సంతోషింప  జేస్తున్నాడు దాసు .భార్య రుక్మిణమ్మ పసి పిల్లతో ఇక్కడికి వచ్చి ఒక ఏడాది గడిపింది భర్తతో .

  దాసుగారికి రక్తవిరోచన వ్యాధి వచ్చి ,బడికట్టేసి ,1864లో వెంకటాపురం చేరి ,వ్యాధి తగ్గాక భార్యాపిల్లల్ని అత్తారింటికి పంపి ,శేషాచలం చేరి గోగర్భ ప్రాంతగుహలో , 6 నెలలు తపస్సు చేయగా,కౌపీనం మాత్రమే ధరించిన ఒకముని వచ్చి ‘’నీ తపస్సు ఫలించింది ఇప్పటి నుంచి నువ్వు ఎప్పుడు కోరుకొంటే అప్పుడు శ్రీరామ సాక్షాత్కారం లభిస్తుంది .తపస్సు వదిలేసి వెంకటాపురం చేరి ఆదర్శ గృహస్థ జీవితం కొనసాగించు ‘’అని బోధించగా ఆప్రకారమే ఇంటికి వెళ్లి ,నిష్కామకర్మగా జీవించి ‘’శ్రీ భద్రాద్రి రామ దాసు చరిత్ర ‘’రచించి ,శ్రీరామా౦కితం చేశారు దాసుగారు .1869లో మామగారు అప్పయ్య అల్లుడిని తన ఇంటికి తీసుకు వెళ్ళాడు .ఒక ఏడాది మామిళ్ళపల్లి లో ఉండి ,తర్వాత రేపల్లె చేరి ,తమ్ముడి నుంచి వేరై ,పిత్రార్జితం తో నాలుగు ఎకరాలమాగాణికొని ,ఇల్లు కట్టుకొని భార్యాపిల్లలతో సుఖంగా ఉన్నారు .ఇద్దరు చెల్లెళ్ళు ఒకే రోజు చనిపోయినా ,ఐదారుమంది కూతుళ్ళు చనిపోయినా నిర్లిప్తత కోల్పోలేదు .

 రేపల్లె పాఠశాల ఇంకా నడుస్తూనే ఉంది .ప్రొద్దున లేచినదగ్గర్నుంచి విద్యార్ధులకు పాఠాలు ,భజనలు పురాణ ప్రవచనాలు జపతపాలు అనుష్టానం లతో క్షణం తీరిక లేకుండా గడిపేవారు  .కొంతకాలానికి భార్య రుక్మిణమ్మ మరణించింది .రేపల్లె వదిలి పెద్దకొడుకు పని చేసే నూజివీడు చేరి ,తత్వార్ధ ప్రధాని యై ఆతర్వాత పొన్నూరు  చేరి చవలి పున్నయ్య  శాస్త్రిని శిష్యునిగా చేసుకొని,పాతూరి కోటయ్యగారి స్నేహం చేసి,ఆతర్వాత శిష్యుల్తో రామేశ్వరం వెళ్లి స్వామి సేవలో ధన్యం పొంది , ధ్వజస్తంభం దగ్గర  భావ సమాధి పొంది మైమరచి పొతే ,భక్తులు హారతులు పట్టి ఆదరించారు .తర్వాత జంబుకేశ్వరం వెళ్లి ,శ్రీరంగం లో రంగని దర్శించి ,దక్షిణ దేశ యాత్ర పూర్తి చేసుకొని ,ఇంటికి చేరి ,బాపట్లలో ఉన్న రెండవ కొడుకు చెన్న కేశవ ఇంటికి చేరి,అద్దంకి వెంకటరాయుడు స్నేహం పొంది ,74వ ఏట ఆతుర సన్యాసం తీసుకొని నలసంవత్సర జ్యేష్ట శుద్ధ పంచమి నాడు మహా సమాధి చెందారు భక్త శిఖామణి సింగిరి దాసు  గారు.

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -22-2-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ – ప్రభావతీగార్ల 57వ వార్షిక వివాహా మహోత్సవ వేడుక 21-2-2021 ” 

“శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ – ప్రభావతీగార్ల 57వ వార్షిక వివాహా మహోత్సవ వేడుక 21-2-2021 ”

https://photos.app.goo.gl/TZ2JXXFXVw5Nr6oZA

Posted in సమయం - సందర్భం | Leave a comment

మా దంపతుల 57వ వివాహ వార్షికోత్సవం ఆలయం లో రధ సప్తమి , సామూహిక సత్యనారాయణ వ్రతం చిత్రాలు

https://photos.google.com/share/AF1QipM39VhkRwCmlweefoU22gQ0qRgXyTuBsI6rp630FVVBSOZV1maLP-SekKJTrsZ0-Q?pli=1&key=WFNYNzVGRlZTbklld2pOeG9RQ3o5ZXZnbG1DanV3

 

మా దంపతుల 57వ వివాహ వార్షికోత్సవం ఆలయం లో రధ సప్తమి , సామూహిక సత్యనారాయణ వ్రతం చిత్రాలు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఇవాళ మా దంపతుల 57వ వివాహ వార్షికోత్సవం

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 33-తారక బ్రహ్మ వంగల నారాయణప్ప

మహా భక్త శిఖామణులు

33-తారక బ్రహ్మ  వంగల నారాయణప్ప

గుంటూరు జిల్లా నరసరావు పేట తాలూకా జగ్గాపురం లో 19వ శతాబ్దిలో వంగల కొండ౦భొట్లు ,కావేరమ్మ దంపతులకు  కేశవభొట్లు ,సుబ్బమ్మ ,నరసమ్మ, సీతమ్మ సంతానం .ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయి రామకూరు ,వేలూరు, ధర్మవరాలలో హాయిగా కాపురాలు చేసుకొంటూ వృద్ధిపొందారు ,కేశవ నే నారాయణ మూర్తి  , నారాయణ భొట్లు అనేవారు .వ్యవసాయమే ఆధారమైనా ఎవర్నీ చెయ్యి సాచి అడగని అభిమాన ధనుడు .నిత్యం ఎవరో ఒకరు ప్రక్కన కూర్చుని భోజనం చేస్తేకాని ఆయనకు తృప్తి ఉండేదికాదు ..వారింట్లో ఎప్పుడో ఒకప్పుడు భోజనం చేయని గుంటూరు వాసి ఎవరూ లేరు .

ఒకసారి కోనసీమ నుంచి వేద వేత్తలైన ముగ్గురు బ్రాహ్మణులు దేశాటనం చేస్తూ వస్తే, వారిని బంధువులను ఆదరించినట్లు ఆదరించి భోజనాలు పెట్టి సంతృప్తి చెందించిన పుణ్యమూర్తి.వీరితో పాటు 10 మంది బ్రాహ్మణులు కూడా పంక్తిలో కూర్చుని భోజనం చేస్తున్నారు .నవలాయ పిండి వంటలతో భోజనం తయారు చేసి వడ్డించి తినిపిస్తున్నారు ఆ దంపతులు .చివరికి మరదలు లక్ష్మీ నరసమ్మగారు పెరుగు వడ్డించింది .అందరూ తృప్తిగా తిన్నారు కానీ ఒక బ్రాహ్మణుడు పెరుగన్నం లో చెయ్యి పెట్టి ఏడుస్తున్నాడు .’’భోజనలోపమా ఆదరణలోపమా ఎందుకు భోజనం చేయట్లేదని అడిగాడు గృహస్తు.అప్పుడాయన ‘’ఏ లోపమూ లేదు. నాకు ముగ్గురు కొడుకులు ,నలుగురు కూతుళ్ళు .వాళ్లకు ఎప్పుడూ ఇలాంటి భోజనం నేను పెట్టనే లేదు .నా కడుపున పుట్టి వాళ్ళు నిర్భాగ్యులుగా పెరుగుతున్నారు .మీలాంటి సంపన్నుల ఇంట్లో పుడితే మృష్టాన్న భోజనం తినే వారు కదా అని ఏడుస్తున్నాను ‘’అని బావురుమన్నాడు .నారాయణప్ప ‘’మీ కోరిక భగవంతుడు తప్పక తీరుస్తాడు దుఖిచకండి ‘’అని ఓదార్చి తినిపించాడు .

భోజనాలయ్యాక అందరూ తాంబూలాలు వేసుకొన్ కబుర్లు చెప్పు కొంటు౦డగా ,పూటకు మానెడు పాలిచ్చే గేదె తో తనదగ్గరకు వచ్చిన పాలేరు చేతిలో కొంత డబ్బు దారి ఖర్చులకోసం పెట్టి ,ఆ గేదెను ,ఆ బ్రాహ్మణుడి ఇంటికి తోలుకు వెళ్లి అప్పగించి రమ్మని చెప్పాడు . దాని పోషణ  కోసం ఒక యకారం భూమికూడా దానం చేశాడు ఉదార హృదయం తో  .నిష్కామ సేవా పరుడైన నారాయనప్ప ఆరాధన పేరుతొ ప్రతి ఏడాది తన శిష్యబృందాన్ని అందరినీ పిలిచి సోదరులలాగా ఆదరించి భోజన సత్కారాలు చేసి,బహుమానాలిచ్చి  పంపేవాడు  .కోనసీమ పండితులు చెప్పుడుమాటలు విని అసూయతో పరీక్షించటానికి వస్తే బ్రహ్మ విద్యలో తన స్వానుభవం చూపించి నిరుత్తరుల్ని చేశాడు .

వరుసగా ఇరవై ఏళ్ళు భద్రాద్రి శ్రీ సీతారామ కల్యాణానికి కాలినడకన వెళ్లి చూసి తరించిన భాగ్య శీలుడు నారాయణప్ప .భక్త బృందం తో ఇంటి నుంచి  భజన చేస్తూ బయల్దేరి ,భద్రాద్రి కల్యాణ శోభ తిలకించి ,పర్ణశాల చూసి ,మళ్ళీ ఇంటికి చేరి మహా సంతర్పణ శ్రీ రామార్పణం అంటూ చేసేవాడు .మూడు సార్లు కాశీ యాత్ర ,రెండు సార్లు రామేశ్వర యాత్ర చేసి ,తెచ్చిన గంగాజలం తో తలిదండ్రులను అభిషె కించేవాడు .చివరి సారి తలిదండ్రులతో కాశీ వెళ్లి దేహాన్ని విశ్వేశ్వరునికి అర్పించి రుణత్రయ విముక్తు డయ్యాడు .

పన్నెండవ ఏట నుంచి గురువు వద్ద చక్కగా వేద శాస్త్రాలు అభ్యసించి ,వాటి సూక్తుల్ని అనుభవం లోకి తెచ్చుకొని ,పాలేళ్ళతో మంచి వ్యవసాయం చేస్తూ చేయిస్తూ ,ధనధాన్య సమృద్ధి పొంది దాన ధర్మాలు నిరంతరం కొనసాగించాడు .తన ఊళ్ళోతన స్థలం లో ఒక చిన్న కుటీరం నిర్మించుకొని పూల వనం పెంచి బావి త్రవ్వించి ,ఆ బావి జలం తో ప్రతి ఉదయం స్నానించి సంధ్యావందనం చేసి కుటీరం లో జప దీక్షలో మునిగిపోయేవాడు .నారాయణ భొట్లు .ఆసమయం లో గాయత్రీ మాట సర్పాకృతి ధరించి  ఆకుటీర ప్రాంతం లో తిరుగుతూ ,ఆయన సమాధి నుంచి లేచే సమయానికి అదృశ్యమయ్యేది అని అందరూ చెప్పుకొనే వారు. ఈ మాట తెలిసి ,ఎవ్వరూ ఆయన దీక్షకు అంతరాయం కలిగించేవారు కాదు .

ఒక సారి శిష్యులైన వేద విద్యార్ధులతో రాత్రి భోజనం చేసి ఆ కుటీరం లో పడుకొని ఉన్నాడు .ఒక నాగు పాము అర్ధరాత్రి సమయం లో వచ్చి నారాయణప్ప ప్రక్కలో పడుకొని ,ఆయన చెవిపై పడగ ఉంచిందట .ఇంతలో ఒక శిష్యుడికి మెలకువ వచ్చి ఆ దృశ్యం చూసి నోటమాట రాలేదట .తర్వాత అందర్నీ లేపి ఒళ్ళూ వాళ్ళను పిలిచి చూస్తే పాము కనిపించలేదు .ఈ హడావిడికి గురువు గారు లేచి విషయం తెలుసుకొని ‘’మా రామప్ప ఈ రకంగా దర్శనమిచ్చాడు కాబోలు ‘’అన్నాడట .అప్పటి నుంచి శ్రీరాముడు ఆయన వెంట ఉండేవాడు .అందుకే ఆయన స్పర్శ తగిలితే వ్యాధులు నయమయ్యేవి .ఒకసారి కుమారస్వామి అనే కుష్టు రోగం తో బాధ పడే బ్రాహ్మణుడు నారాయణప్ప పొలం దున్నుతుంటే వెళ్లి తన గోడు చెప్పుకోగానే దగ్గరలో ఉన్న పొదరింట్లోని ఒక ఔషధ మొక్కను తీసి తినిపించగా ,గుణం కనిపించి నెలరోజుల్లో వ్యాధి మాయమైపోయింది .ఇలాంటివి చాలా ఉన్నాయి .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -20-2-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీకురుమూర్తి(శ్రీకూర్మ ) నాథ శతకం

‘’కాకుల్మున్గును ,నేను మున్గుదును ,కొంగల్చేయు ధ్యానంబు మి-ధ్యాకల్పంబుగ ‘’అని దొంగ స్నానాలు జపాలు మేలు చేయవు .’’నీవున్నేనును ఒక్కటే యనగ యత్నింతు ర్విమూఢాత్ములా-హా వాలాయముబుట్టి జచ్చు జనులయ్యా ‘’సోహ’’మన్మాటయేలా –వాసి౦గను ,నీ పదాబ్జమ్ముల మ్రోల న్మ్రోక్కుచుం గా౦తుభద్రావాప్తి ‘’అని స్వామి చరణమే శరణం అన్నారు .బాలకృష్ణ లీలలూ వర్ణించారు .స్వామి గుహలో ఎందుకు దాగాడో తెలిసిందట .మత్తేభం లో సరిగమలతో చిరస్మరణీయ పద్య రాజం చెప్పారు కవి –‘’

‘’సరిగా నీపని సాగనీ ,గరిప,దా ,సాగారి సద్ధామ ,మా –గరిమన్ సామ నిదానిగా ,సమపధం గా సాని నీ సారి ,మా

దరిగానీ ,మరి దారి ,సన్నిగమపా , దాసాగమాపా ,సదా – దర మొప్ప౦గురు మూర్తి నాద సురవంద్యా పాహిపాహి ప్రభో ‘’

కురవ గ్రామం లో కుమ్మరికి సాక్షాత్కరించి కురుమూర్తి అనే పేరు సార్ధకం చేసుకొన్నాడట స్వామి .ఛందో వ్యాకరణాలపై పట్టు లేకపోయినా స్వామి అనుగ్రహం పూర్తిగా ఉండబట్టి ఈ శతకం రాయగలిగానని అత్యంత వినయంగా 108వ చివరి పద్యం లో చెప్పి నారాయనరాయ కవి శతకం ముగించారు .సర్వ శాస్త్ర పాండిత్యం, ఛందో వైవిధ్యం ,లోకరీతి, భక్తి స్వభావం, శరణాగత తత్త్వం అన్నీ పుష్కలం గా ఉన్న శతకం ఇది .చదివి ఆనందం అనుభవించ వచ్చు .

శతకం జనం లో ప్రచారమైనదో లేదోకాని ‘’సరిగమ ‘’పద్యం మాత్రం బాగా వ్యాప్తి చెందింది .

శ్రీ కూర్మ దేవాలయ విశేషాలు

శ్రీకూర్మం పూర్వపు కళింగ రాజ్యమునందలి వరాహక్షేత్రములోని పాతాళసిద్ధేశ్వర క్షేత్రమే. ఇచటకల స్వయంవ్యక్త లింగమూర్తి బౌద్ధ మత ప్రభావం ఈప్రాతంలోలేని సమయంలో కళింగ దేశాధీశుడుఇన విజయసిద్ధి ప్రతిష్టించాడు.ఈ లింగమూర్తి వలయాకారపు పానవట్టముపై ఎత్తుగా ఉండి, దర్సన మాత్రమున లింగాకృతి కన్నులకు కట్టి యుండును.

శ్రీకూర్మం, అరసవల్లి, సిమ్హాచలం మొదలగునవి ప్రధమంలో శైవమతమునకు పుట్టినిల్లు. అయినప్పటికీ ఈనాడు వైష్ణవక్షేత్రాలుగా ఉన్నవి.శ్రీకూర్మాలయం, సింహాచలాలలో గల శిలాశాసనాలను బట్టి ఆకాలమున నరహరి తీర్ధులచే వైష్ణవమతము కళింగమున వ్యాపించెనని తెలుస్తున్నది. ఈతని కాలమునాటి శిలాశాసనములు శ్రీకూర్మంలోనూ, సింహాచలం లోనూ చాలా ఉన్నవి.

దీనిని క్రీ.శ. 12వ శతాబ్దంలో వైష్ణవ మతాచార్యుడు శ్రీ రామానుజాచార్యులు తీర్ధయాత్ర సందర్భంగా కళింగదేశం వచ్చాడని, శైవలలో మత సంబంధమైన చర్చలు జరిపి శైవులను అవలీలగా వాగ్వివాదంలో జయించి వైష్ణవాలయంగా మార్చి శ్రీకూర్మనాధుడని నవీన నామకరణం చేసినట్లు సంస్కృతంలోగల ప్రన్నామృతం వలన తెలుస్తున్నది. నాటినుండి పాతాళసిద్ధేశ్వర ప్రశంస మాసిపోయి శ్రీకూర్మనాధ ప్రశస్తి ప్రబలింది. విష్ణుమూర్తిని కూర్మావతార రూపాన ఇచట పూజించటం వలన ఈదేవాలయాన్ని శ్రీకూర్మనాధాలయమనీ ఆగ్రామాన్ని శ్రీకూర్మమని పిలుస్తున్నారు.ఈ దేవాలయం చుట్టూగల స్తంభాల మంటపాలలో నల్లరాతితో చెక్కిన రమణీయమైన శిల్పాలు కలవు. దేవకోష్టమునందు త్రివిక్రమ, పరశురామ, బలరామ, సరస్వతి, కుబేర, మహిషాసురమర్దిని, ఇంకనూ అనేక శంఖచక్రధారియైన విష్ణుమూర్తి విగ్రహాలు కలవు. ఈ దేవాలయమునందు రెండు ధ్వజ స్తంభాలు కలవు. విమానం చోళ రాజుల వాస్తు శిల్పకళారీతులలో నిర్మించారు. చక్కగా కుదురుటచే కాబోలు కుదురుకు కూర్మము చిలుకునకు సింహాచలము అను లోకోక్తి వచ్చినది. శ్రీకూర్మ పురాణం శైవసంప్రదాయసారమై ఉన్నది. దీనిని రాజలింగకవి మండచిట్టి కామశాస్త్రి ఆంధ్రీకరించారు. ఈ క్షేత్ర మహాత్యాన్ని దత్తాత్రేయులవారు వ్యాసమునీంద్రులకు వివరించారనీ, అందు స్థల పురాణం వలన స్వయంగా శ్రీహరిదత్తాత్రేయులకు శ్రీకూర్మనాధ మహాత్యాన్ని గూర్చి స్వప్నంలో చెప్పినత్లు చెబుతారు.

ఇచ్చటి శిలాశాసనముల వలన నాల్గవ శతాబ్దం నుండి పదునాల్గవ శతాబ్దం వరకు పాలించిన తూర్పు గాంగరాజుల చరిత్ర పూర్తిగా తెలుస్తున్నది. క్రీ.శ. 1273లో పాలించిన తూర్పుచాళుక్య రాజైన రాజ రాజ నరేంద్రుడు తన ఆస్థానకవి అయిన నన్నయ్య భటారికుని సంస్కృతంలో కల భారతాన్ని తెనుగదించవలసినదిగా కోరినట్లు తెలిపే ఒక శాసనం కలదు. ఆనాటి సాంఘిక, రాజకీయ, పరిస్థితులను వివరించే అనేక శాసనములు కూడా ఇక్కడ కలవు.

తిరునాళ్ళు, ఉత్సవాలతో ఆస్తికులు ఆచరించే జీవిన విధానమే స్మార్తము. దీనిలో ఏ మతం వారైనా పాలు పంచుకొనే అవకాశం ఉంది. కాకతీయుల కాలంలో విరివిగా ‘స్మార్తము’ ఆచరించే కాలంలో, బౌద్ద క్షేత్రంగా వెలుగొంది, అనంతర కాలంలో వైష్ణవ మత ప్రదేశంగా మారినట్లు చరిత్ర చెబుతోంది. శ్రీకూర్మం తో పాటు సర్పవరం, బాపట్ల కూడా ఇదే రీతిన బౌద్ధ మత కేంద్రాల నుంచి వైష్ణవ మత స్థలాలుగా మారాయి..

రథ సప్తమి శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-2-21-ఉయ్యూరు.

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శుక్రవారం రధ సప్తమి శుభాకాంక్షలు

ఇవాళ 19-2-21శుక్రవారం మా ఇంట్లో రధ సప్తమి,మా శ్రీమతి పూజ ,పాలుపొంగించటం ,నా అరుణపారాయణ

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శ్రీ కపాలీశ్వర విభూతి -2(చివరిభాగం )

శ్రీ కపాలీశ్వర విభూతి -2(చివరిభాగం )

, ‘’లావణ్యోదయ పూర సంభ్రుత సరస్సముద్భూత పద్మాయితౌ –బోధానంద రసో  ప బృంహితతరుపాజ్ఞత్ర వాలాయితౌ –పాదౌ తే వసతాం మదీయహృదయాభోగే భవానీపతీ –స్వామిన్ చంద్ర కలావతంస భగవన్!శంభో కపాలీశ్వరా ‘’అనేది రెండవ శ్లోకం .’’భగవాన్ శంభో కపాలీశ్వరా ‘’అనేది మకుట రాజం .మరో శ్లోకాని కి తెలుగు పద్యం-‘’దారుణ౦బగు గరళ౦బు త్రాగి త్రాగి –గిరి తటంబుల నిచ్చలు తిరిగి తిరిగి –వెడద సిరులుండ గోచినే ముడిచి ముడిచి –ఇంత భరమేల మముగావ ఇందు మౌళి’’.సూర్య చంద్రులు కనులుగా అగ్ని మూడవనేత్రంగా ఉంచుకొని తప్తులను కాచే మహాను భావుడు శివుడు .తలమీద చదలేరు ,చిన్ని జాబిల్లి తో సుప్రసంనంగా కనిపిస్తాడు శివుడు .

  వ్యాజస్తుతి చేస్తూ –వామాన్గే వనితా పరాచ సతతం మూర్ధాన మారోపితా –పుత్రా వంక తలోప వేశలలితౌ హస్తే చ హేమాచలః –త్వామాక్రామతి చైషణాత్రయ మహో కావా కధా మాదృశాన్  ‘’.నొసట నిప్పు ,తలను నురిగొను సురనది –ఆరుత విసము ,సిగను నబ్జరేఖ –వింత వింత వృత్తి విభవాన విశ్వంబు –మోహపెట్టు దీశ ముట్టుపడగ’’.వామాకేకర దృగ్విలాస మామానంగ వాహ్యాలికా౦ –గాఢాలింగన సంపదం సకృదపి ద్వాభ్యాం భుజాభ్యాం పునః –గౌరీనాన్వభవత్తధాపి పరమ ప్రేమైక సారే స్థితా ‘’.’’నిన్ను మరివేడను సంపదలను నువ్వు నిర్భర భిక్షువు కనుక .దిగంబరివి కనుక విభవం కోరను .అభవుడవుకనుక మోక్షం ఇవ్వు చాలు అంటాడు కవి గడుసుగా .’’ముగ్దేందుశిరసోపలాలయసి యద్బాలం కురంగం ముదా ‘’అనే శ్లోకానికి –‘’బాల మృగాల –స్నిగ్ధత లాలింతు వౌర శిరమున గేలన్ –ముగ్ధుడ బాలుడ గానా  -స్నిగ్ధత నను జూడ రాదే శీతాంశు ధరుడా ‘’

 మరో శ్లోకానికి’’ మత్తకోకిల ‘’ గానం చేశాడు –‘’ఆప్తకామిని బిచ్చగాడవు హాళిమై పరమేశ ని-ర్లిప్తత౦ జరియింతు వెల్లెడల ,లీల నాయుపచారముల్ –లుప్తమై కడ తేరు  నీమదిలోన హాళిని గూర్చనే- క్లప్త సర్గ విధాన నామది కిక్కనం బరికి౦పు మా ‘’

మరో రమణీయ శ్లోకం –‘’త్వత్పాబ్జతలాంతరోజ్జ్వల ధనుహ్ శంఖాది రేఖాంతర –స్ఫారద్దూలిల వాంఛి  తాత్మ నిటలైరింద్రాది దిక్పాలకైహ్-ల్లక్ష్మీ సర్వసముజ్జ్జ్వలా చిరతరస్థాయిన్యుపశ్లిష్యతే ‘’.దీనికి కంద౦లో  తెలుగు –‘’   తావకపాదసరోరుహ –భావుక రేఖాన్తరాళ భాస్వద్ధూలిన్-దేవాళి తలదాల్చియే -దేవా స్థిర లక్ష్మి తోడదీపించు నొగిన్ ‘’.భక్తుని కట్టెలు మోశావ్ మూఢ భక్తుని రాజ సభలో గెలిపించావ్ .నక్కను గుర్రం గా మార్చిన నీ విభూతి పొగడటం ఎవరి తరమూ కాదు .

‘’అంతకనాశే కరుణా కోశే –శంకర దేవే జాగ్రతి భావే –పాపభయంవా తాప భయంవా మృత్యు భయం వా నాస్తిహి నాస్తి ‘’అని శంభు వైభవాన్ని కొనియాడాడు కవి .మరో శ్లోక పద్యానికి భావం-అన్నము ప్రాణం హంతవ్యుడు, హంత,హననం మొదలైన అన్ని రూపాలు శివుడే .వేదం వేదాంత సంవేద్యుడే ఆయన .’’తనో రర్ధం సదా సర్వ మంగళాస్పదమేవ తే-మంగళా శంసనంయత్తేశైత్యోప చరణం విధో’’.చివరి 133వ శ్లోకం –‘’ఏకం ను విప్రైబహుధాపి గీతం –తమః పరస్మి న్పదిభాసమానం –శివాత్మకం వ్యాప్యధ  వైష్ణవం వా మహో మద౦తస్తి మిరం  హినస్తు’’-దీనికి గీతపద్యానువాదం –‘’ఏక వస్తువు విప్రులనేక మండ్రు-రజసు కావల వెలుగొందు నజితమహము – శైవ వైష్ణవ భేదంబు సరకు గొనము –మాదునంతర తమమును బాపుగాత ‘’అంటూ శ్రీకల్పవల్లీ కపాలీశ్వర విభూతి ‘’ని కవి వాసా సూర్య నారాయణ శాస్త్రి గారు ముగించారు .లోతుకు వెళ్లి తరిస్తే అన్నీ అనర్ఘ రత్న రాసుల్లాంటి శ్లోకాలు వాటికి భావస్పోరక తెలుగు ముత్యాలపద్యాలు కపాలి విభూతికి అద్దం పట్టాయి .ధన్యుడు కవి .చదివితే ఆ విభూతి వైభవం మనకూదక్కుతుంది .ఈ కావ్యాన్నీ కవినీ పరిచయం చేసి నేను ధన్య విభూతి పొందాను .

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్  -18-2-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ కపాలీశ్వర విభూతి 1

 

శ్రీ కపాలీశ్వర విభూతి -1

  శ్రీ వాసా సూర్య నారాయణ శాస్త్రి గారు ‘’కపాలీశ్వర విభూతి ‘’అనే సంస్కృత కావ్యం రాశారు .కవిగారు సాలూరు వేద సమాజం లో విద్యనేరుస్తున్నప్పుడు సుమారు  వందేళ్ళక్రితం కావ్యకంఠ గణపతి ముని గారితోకలిసి వేగవతీ నదిలో స్నానించి ,చంద్ర గ్రహణం కోసం ఎదురు చూస్తున్నారు .అప్పుడు  వారికి లుప్తమై పోతున్న సంస్కృత భాషలో ప్రాచీన మహాకవుల శైలికి దగ్గరగా ఉండేట్లు గీర్వాణ గ్రంథాలు రచించాలన్న  సంకల్పంకలిగింది .మహాతపస్వి అయిన గణపతిశాస్త్రిగారు అపర కాళిదాసు అవతారం కనుక ‘’ఉమా సహస్రం ‘’మొదలైన సంస్కృత కావ్యాలు రాయగలిగారు .కానీ కవి గారు దారిద్ర్యం తో బాధపడుతూ క్రుంగి కృశిస్తూ ఉన్నా సంకల్పం మాత్రం వదలలేదు .కళింగ దేశం లోని వైశ్యజాతి లో లోపించిపోయిన ఉపనయనం మొదలైన సంస్కారాలను పునరుద్ధరించాలన్న కోరిక బలీయమైంది .దానికోసం పదేళ్ళు తీవ్ర కృషి చేశారు .మహామహోపాధ్యాయ శ్రీ తాతా సుబ్బారాయ శాస్త్రి గారు ,కళాప్రపూర్ణ శ్రీ గిడుగు వెంకటరామ మూర్తి గార్ల సంపూర్ణ సహకారం తో ‘’సావిత్రీ పతితప్రాయశ్చిత్తపూర్వకం ‘’గా ,శాస్త్రీయ పద్ధతిలో సంస్కారాలను వైశ్యకులం లో ప్రవేశ పెట్టి బ్రిటిష్ వారిచే ‘’సంఘ సంస్కర్త ‘’గా గుర్తిప బడ్డారు.శారదా శాసనం అమలు లోకి వచ్చినప్పుడు ,కలకత్తా మొదలైన చోట్ల  పండితులతో శాస్త్ర చర్చ చేసి స్వాములవారి సన్నిధిలో ‘’కపాలీశ్వర విభూతి’’వినిపించి ,కాశీ హిందూ విశ్వ విద్యాలయలోని సంస్కృత విద్యాలయ మీమాంసా శాస్త్ర ప్రధానాచార్యులు ,ఉభయ మీమాంసా పట్ట భద్రులు,మహా పండిత ప్రకాండులు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు విని బాగా ప్రశంసించారు .కవిగారి ‘’నెహ్రూ చరిత్ర’’లోకోత్తరమనీ ,అందులో  కవితా కాదంబిని ప్రకాశించింది అన్నారు .హరదత్తా చార్యులు అప్పయ్య దీక్షితులు మొదలైనవారిచే శివ భక్తి  చిగిరించి పుష్పించి ఫలించి,గంగానది లా దేశమంతా ప్రవహిస్తోందని  తెలియ జేశారు .’’యది సంతి గుణాః పుమ్సా౦ –వికసంత్యైవ తే స్వయం –నహి కస్తూరికామోద శ్శపధేన నివార్యతే ‘’అనీ ‘’ఆకారశ్చ హస్వః-కీర్తి శ్చ మహతీ –భోభో !ఆగమైక శరణాఆస్తిక శిఖా ణయః’’అని కేర్తించారు .ఆతర్వాత ప్రతి శ్లోకాన్నీ హిందీ లోకి అనువదించారు కూడా .కవిగారికి చిన్నతనం లో శ్రీ చేబోలు నాగేశ్వరరావు శాస్త్రులు గారు శివ భక్తీ బీజాలు నాటారు .సంస్కృత కవితకు ప్రోత్సహించారు .  వీరి కుమారులు శ్రీ చేబోలు వెంకట సోమయాజులుగారు కవిగారి కంటికి వైద్యం చేసి ,కొన్ని నెలలు వారి౦ట్లోనే  ఉంచుకొన్న ఉదార హృదయులు .కనుక ఈ కృతిని అత్యంత గౌరవంగా నాగేశ్వరరావు గారికి అంకితమిచ్చారు .

ఈ కృతికి ముందుమాట రాస్తూ డా భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు ‘’ఇవాళకూడా సంస్కృత కవులు మన దేశం లో ఉన్నారని విని గర్వపడుతున్నాను .నేను నరసన్న పేట వచ్చినపుడు మీరు ఈకావ్యం చదివి వినిపిస్తే ఆనందం పొందాను .శ౦కరుల శివానంద లహిరి లాంటివి చాలాఉన్నాయి కదా మళ్ళీ అలాంటిదే కావాలా అని దివాన్ బహదూర్ రామస్వామి శాస్త్రులు అన్నా ,ఎవరి అనుభూతి వారిది .వీటికి తెలుగు పద్యాలు కూడా ఉంటె బాగా శోభించేది .కానీ మీకు సంస్కృత ప్రచారం అభిలష ణీయం కనుక దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక సంస్కృత వ్యాప్తి బాగా జరుగుతుందని భావిస్తాను ‘’అన్నారు .

  ఈ కావ్యం ద్వితీయ ముద్రణ కూడా పొందింది అంటే గొప్ప ఆదరాభిమానాలు పొందినట్లే .ద్వితీయం లో సంస్కృత శ్లోకానికి తెలుగు అనువాద పద్యాలు కూడా జోడించి డా పట్టాభి గారి కోరిక తీర్చారు .కవిగారి అంకిత శ్లోకం –‘’భవ్యామసి౦చ దభవస్యపదాబ్జ భక్తిం –నాగేశ్వరో హృదిపురా మమ భాగ్య యోగాత్ –ప్రాచోయరత్సుర గవీ కవితాను రక్తిం –తద్వంశ మిత్థపుమవర్ణ్యకృతీ భవేయం     కృతి పతివంశాన్ని గూర్చి సంస్కృత శ్లోకాలో లో తెలుగు పద్యాలతో చెప్పాడు కవి . .కులపతి ఖ్యాతిపొంది యజ్ఞయాగాదులు చేసిన చేబ్రోలు సంతతి వారు .దానిలో రామావధాని యజ్వ జన్మించారు .సర్వ వేదాది విద్యలు ఆయన నాలుక కొసమీద నర్తిస్తాయి .ఆయనకు విశ్వేశ ,కామేశ అనే ఇద్దరు కుమారులు .సప్తసంతానాలను వెలయించిన పుణ్య మూర్తులు .సంతానం లేని మాతామహుని కోరిక మేరకు జామి గ్రామం వదిలి వడ్డాది గ్రామం చేరారు .అక్కడ వివాహం చేసుకొని భైరవ ,వెంకట అనే కుమారులను కన్నారు .నారాయణ అప్పలాచార్యులు అనే ఆయన తమ్మయ్య గా ప్రసిద్ధుడై భైరవ సూరికి పుట్టారు .ఈయనకు సరస నారాయణ ,సాంబమూర్తి కొడుకులు .సాంబమూర్తి డాక్టర్ బిరుదు పొందారు .‘’ తమ్మయ్యగారికి కృష్ణమూర్తి ,రామమూర్తి నరసింహ మూర్తి కుమారులు .నరసింహమూర్తి దత్తతకు వెళ్ళాడు .బలిజేపల్లి పార్వతీశం అనే న్యాయవాది కుమార్తె సుభద్రను వెంకటాధ్వరిపెళ్లి చేసుకొన్నాడు .వడ్డాది వదిలి వేంకటాధ్వరి ఖండేవర గ్రామం చేరాడు నాగేశుడు భమిడిపాటి వీరన్న కుమార్తె సోమిదేవమ్మ ను వివాహమాడగా మొదటి సంతానంగా సుబ్బమాంబ పుట్టింది .సుబ్బమాంబ ను దూర్వాసుల పార్వతీశానికిచ్చి పెళ్లిచేయగా వెంకట సోమాశి పుట్టాడు .పట్ట భద్రుడు.ఈయనకు వెంకట సోమయాజి అనేదాత న్యాయవాది పుట్టాడు.ఈయన శ్రీపాద వెంకటరమణ గారి అమ్మాయి లక్ష్మీ నర్సును పెళ్ళాడి పుత్ర పౌత్రాభి వృద్ధి చెందాడనీ,ఇంకా వంశం అభి వృద్ధి చెందాలనీ కోరారుకవి.

   కావ్యం చివరలో తన గురించి కవి చెప్పుకొన్నాడు –వాధూలస గోత్రం .వెంకమా౦బా ,వెంకటరామ ప్రధమ పుత్రుడు శ్రీ సామవేద అన్నప శాస్త్రి కులపతి ప్రియ శిష్యుడు వాసా సూర్యనారాయణ శాస్త్రి విరచిత శ్రీ కల్పవల్లీ కపాలీశ్వర  విభూతి సమాప్తం అని  అని 134వ చివరి శ్లోకం లో చెప్పాడు .పట్టాభి గారు   ముందుమాటలను 19-2-1949 న ఢిల్లీనుంచి రాసి పంపారు .కనుక ఈ కావ్యం 1949లో మొదటి ముద్రణ పొందిందని భావించవచ్చు . ఎక్కడ ముద్రించారో , వెలఎంతో వివరాలు లేవు .  మిగిలిన వివరాలు రేపు తెలుసుకొందాం .

   సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-2-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మోదుకూరి చెన్న కేశవ శతకం

మోదుకూరి చెన్న కేశవ శతకం

గుంటూరు మండలం ఆలపాడు  గ్రామ వాసి ధనకుధరవంశీకుడు  శ్రీమాన్ రామానుజా చార్యులుకవి  ‘’మోదుకూరి చెన్నకేశవ శతకం ‘’రచించగా,పెంటపాడు శ్రీ వైష్ణవ ముద్రాక్షరశాలలో 1925లో ముద్రింపబడింది .వెల అర్ధరూపాయ .కవిగారు  శ్రీగోపాలశతకం ,శ్రీ రామ చంద్ర శతకాలు కూడా అంతకు ముందే రాసిపేరు పొందారు .ఈ చెన్న కేశవ శతకం లో ‘’శ్రీ మోదుకూరి చెన్న ‘’అనేది మకుటం .చివరలో మాత్రమే తన గురించి కవి చెప్పుకొన్నాడు .ఔషధ వైద్యం సద్భూషణ వైశద్యం ,జల ,సూర్య చికిత్సావిధానం ,జ్యోతిషార్ణవ మధనం ,,తాళ మృదంగ చతురిమ ,సత్పఠనం,కవితా చతుష్క కళ,గణిత శాస్త్ర విజ్ఞానం ,శ్రీ పాంచరాత్ర విశిష్ట గుణ సంపన్నత ,ఇద్దరు పుత్రులు ,ఒక కుమార్తె ,ధన ధాన్య గృహ క్షేత్ర దాస దాసీ జనం ఉన్న వాడు కవి శ్రీరామానుజా చార్య .’’గుంటూరు డిస్ట్రిక్టు నంటుతెనాలితాలూకాలో’’ సుక్షేత్రమైన మాగాణులతో ఆలపాడు గ్రామంలో శ్రీ  వేణు గోపాలస్వామి  ఉన్నాడు .ఆస్వామి కోవెలలో కవి అర్చకస్వామి .నాలుగు వర్ణాలతో సౌభాగ్య వృద్ధిగా ఉన్న ఊరు మోదుకూరు .ఈ స్వామి అర్చనలో కూడా కవి భాగ స్వామ్యముంది .ఈ స్వామిపైనే ఇప్పుడు ఈశతకం ‘’హూణ శకం,వేదయుగ నవ స౦ఖ్య,సమరక్త నేత్ర వత్సరం ,మార్గ శిర శుక్ల సప్తమి నాటికి శతకం పూర్తి చేశాడు .అ౦తకు పూర్వమే గోపాల ,రామ చంద్ర శతక రచన చేశాడు . తండ్రి ప్రబంధ అచ్యుతాచార్య. నరసమ తల్లి .భార్యపేరుకూడా నరసమ .సంతానం ముగ్గురు –ఇద్దరు కొడుకులు ,ఒక్క కూతురు .ఇంతకంటే ఎక్కువగా యేమీచేప్పలేదు .

కవి అనేక ఛందో రీతులతో శతక శతపత్రాన్ని సుపరిమళ భరితం చేశాడు .ఆకవితా ప్రవాహం లో అలా కొట్టుకుపోతాం భక్తీ యుక్తీ నేర్పూ చాకచక్యం పద గుంభన,భావ విన్యాసం చూస్తే ప్రబంధకవుల సరసన నిలుస్తాడని పిస్తుంది .ఉదహరించాలంటే అన్ని పద్యాలూ ఉదాహరించాలి .దేన్నీ వదలి పెట్ట లేము .అంతటి ప్రతిభా విశేషాలున్నకవి శ్రేష్టుడు ఆచార్య వర్యుడైన కవి .ముఖ్యమైన కొన్ని వైవిధ్య భరిత పద్యాల చరణ మంజీర నాదం విందాం .

మొదటి సీస పద్యం లో –శ్రీ రమా వరసర్వ-శ్రితజనావన శర్వ –నుతపుణ్య జనగర్వహతసపర్వ –హరివంశ సత్పూర్వ హరత రణి కుల యుర్వ –రాది సఘన పూర్వ రాజపర్వ —‘’ఈశ గోవింద పూర్వ ఈశ సర్వ –క్షోణి సంపన్న శ్రీ మోదుకూరి చెన్న ‘’.తర్వాతపద్యం లో మనవాళముని మొదలైన వారి స్మరణ చేశాడు .ముక్త పద గ్రస్తం లో –సత్పుణ్య చారిత్ర సజ్జన నుతపాత్ర –సకల మోహన గాత్ర సర్వ మిత్ర –మిత్ర లోక పవిత్ర మిహిరకుల క్షేత్ర –మేదినీశ సు-పుత్ర మీననేత్ర ‘’అంటూ సాగిస్తాడు .దశావతార వర్ణన –‘’మీనావతార దుర్దానవ సోమ ర-క్ష స్సుసంహార  వర్చస్సుధీర ‘’అని పరిగెత్తిస్తాడు .తర్వాత శుద్ధాంధ్ర౦ లో  దశరధ రామావతారం వర్ణించాడు –‘’పదియరదముల దొర,పజదొరముగ్గుర-తల్లుల మురువలర జెల్లు జివర –  లలిత దమ్ముల లరనా –గలివరజుపేరమర –వల తెదగరమిరవు జెలువుడు దిర’’అని మన బుర్రలకు పని కల్పిస్తాడు .ఆతర్వాత నిర్యోష్ట్య సీసం లో –‘’శంఖు గదావాసి శాన్గ్య నాయక రుషి-లోకసన్నుతరాశి లోలదాసి –‘’అని లాగించి ,సర్వ లఘు సీసం లో –‘’దనుజహర మురహర –ఘన సమత ను వరద –సురనుత మనుజపతి ధరధర హరి’’,సగర్భ చంకమాలా వృత్త ద్వయ సీసం లో –‘’పరమత మేఘవా-త రస పాప విదార –ణ ప్రభ సోమయానన శశి వర’’,సీస గర్భ చంపక మాల –‘’పరమత మేఘవాత రసపాపవిదారణసోమయానదా –శరపతి శీలఈశ హరి సంస్తుత ప్రాకృత నాశనారతా’’

అలాగే  సగర్భ మత్తేభం ,సీస గర్భ మత్తేభం ,సగర్భోత్పలమాలా,కంద వృత్త ద్వయం ,సీస గర్భ క౦ద౦,స్వరూప కైంకర్య శుద్ధాంధ్ర సర్వత్రయ సీసం ,నిత్య తత్సమ ద్రుత యతి సీసం ,సర్వత్ర శకట రేఫప్రాస శుద్ధా౦ద్ద్ర  సీసంలలో చమక్కులు మెరిపించాడు .,శుద్దాంధ్రస్వరయతి సీసం –‘’ఓడు వారలకొప్పు నొదుగు సంతోషంబు –నోర్పు రుసులకు బువి నోగిరంబు ‘’.సర్వత్ర ప్రాసగర్భ క౦ద౦  రాసి మురిపించాడు .గర్భ క౦ద౦-‘’నిజ మెదజేతుల మురి –బజలకు నందరికి మగడ వనగల మీమే –లు జదల బువిలో –నసమెస-గుజ వరమేబాసవాలు క్రొన్న ప్రోల మేల్’’.శుద్ధాంధ్ర నిర్యోష్ట్యసగర్భ ద్విపద ద్వ్యర్ధి సీసం లో –‘’దణి కొలదణి యునై –తగి నేలలోను నని –సేయగా నౌనన జెల్ల’’, అని ప్రతిభ చూపాడు .

సంస్కృత తత్సమ సగర్భ ద్విపద  -‘’శ్రీ రుక్మిణీ ధవ శ్రిత పారిజాత శ్రీ –రజత వాస శ్రీ రమ్య వేష .’’శుద్ధాంద్రఅన్త్యప్రాసం –‘’చిలువల దణి సెజ్జ-చిని జగంబులు బొజ్జ –ససి చెదలు గడు హజ్జసావు రజ్జ ‘’శుద్ధాంధ్ర అంత్యప్రాస సీసం –‘’అక్కునగద లక్కి ,పక్కి గుఱ్ఱము నెక్కి –టక్కర సురల జెక్కి చొక్కమక్కి –లెక్కెదబోరక్కి చక్కని మెయి దక్కి –మక్కువ వలపెక్కి ,యక్కరెక్కి ‘’అని ‘’కిక్కిస్తాడు’’ ..సర్వ లఘు నిర్యోష్ట్యగర్భ కాదం,దానిచిత్రం కూడా గీసి చూపాడు .సచిత్రోష్ట్యావృత శుద్ధాంధ్ర సీసం కరిగించి పద్యం లో పోతపోశాడు .విషమ సీసమూ కూర్చాడు –‘’దేనుపురినివాస సుదీరసార సాక్షశ్రీ –వేణుకరధరాఖిల విష్ణు శబ్ద బోధ రా –మానుజ యభిదాన మమాత్మ రక్షణా౦ద్రపూ –ర్ణానిజ గురు నాథసురాధిపాష్ఠ మాతృకా ‘’.

గర్భోత్తర మాలిక లో-‘’రంగడు రాయడౌరమణ రాణిని గూడి బువి ప్రియంబుగ-ద్రుంగుడుగంగ నౌ దొలసిరూడి నడుంగులగుట్ర లేకను –గ్రు౦కెదబూజలోకువను  గోరిక జేసియు నిట్రనిక్క మ-గ్రుంగుడుబత్తులన్మొదల బ్రోచుయు నెంతయు వట్రిలందగన్’’.

చివరి పద్యం –‘’చింతిత సంతాన సంతత గోధన ని-రంతరాశ్రయ జన కంతు జనన –జంతుసంతాన నిజాంతరంగనిధాన –యంతక విజయఘన యంత మనన –యంతర సుభావన యంతఃపురావన –యంతి కాంతర సదన  యంత రసన –యత ర్ముఖాధీన ,కుంతి సుత స్వాధీన –కుంతలాళి సమాన జంత్ర నటన –తంత్ర కామల వర కనకాంత తలిన –మంత్ర మంత్రార్ధ సద్భవన తాంత్రిక జన –తాంతి హర లోకపాలన ,నితాంత కరుణ –క్షోణి సంపన్నశ్రీ మోదుకూరి చెన్న ‘’

అర్ధాల కోసం వెంపర లాడకుండా హాయిగా మందార మకరందం లాంటి పద్యాలు పాడుకొంటూ కేశవ స్మరణతో జన్మ ధన్యం చేసుకోవచ్చు .అమృత రసప్రవాహ మాధురీ విలసిత పద్య రచన మనల్ని ఎక్కడికో తీసుకు వెడుతుంది ఎక్కడికి ఏమిటి ?చెన్నకేశవ సాన్నిధ్యానికే తీసుకు వెడుతుంది .చెన్న అంటే అందమైన అని అర్ధం .పద్యాలూ అంత చెన్నం గా ఉన్నాయి .ఈ శతకమూ ఎక్కడా ఎవరూ ప్రస్తావించినట్లు లేదు .ఈ దువ్వూరి చెన్నకేశవ శతకాన్నీ ,కవి శ్రీ రామానుజాచార్యను పరిచయం చేసే మహద్భాగ్యం నాకు కలిగి నందుకు ఆనందంగా సంతృప్తి గా ఉంది .ఇలాంటి వాటిని వెతికి నాకు పంపి పరిచయం చేయిస్తున్న మా అబ్బాయి శర్మకు అభినందనలు .ఇప్పటి దాకా  వీకీ పీడియాలో చోటు చేసుకోని ఇలాంటి వాటిని చేర్చి అందరికి అందుబాటు లోకి తెస్తున్నాడు.

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -16-2-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

వేదాచల (వేదాద్రి)క్షేత్ర మహాత్మ్యం

ఆది కాలం లో బ్రహ్మ దేవుని వద్ద ఉన్న వేదాలను సోమకాసురుడు దొంగిలించి సముద్రం లో దాక్కున్నాడు .బ్రహ్మ తనతండ్రి  విష్ణు మూర్తి దగ్గరకు వెళ్లి  వేదోద్ధరణ చేయమని ప్రార్ధించాడు .సరే అని మత్సావతారుడై సముద్రం లో దిగి ,సోమకుని చంపి ,పంచవేదాలను తీసుకొని బయటికి రాగా అపుడు వేదాలు పురుషరూపం దాల్చి విష్ణు మూర్తిని స్తుతించి ‘’నిన్ను మా శిరస్సులపై దాల్చే భాగ్యం ప్రసాదించు ‘’అని కోరగా సరే అని ‘’ఈ అవతారం లో కాదు .నృసింహావతారం పొంది హిరణ్య కశిపుని సంహరించి ,ప్రహ్లాదుని రక్షించి ,అప్పుడు పంచ మూర్తి స్వరూపం దాలుస్తాను .అప్పటిదాకా మీరు కృష్ణ  వేణీ నదీ గర్భం లో  సాలగ్రామాలుగా ఉండండి. ఆ నది కూడా నన్ను అభిషేకించాలని తహతహ చెందుతోంది .ఈ రకంగా ఆమె కోరిక కూడా తీరుతుంది ‘’అని చెప్పగా వేదాలు కృష్ణానదిలో సాలగ్రామాలుగా ఉండి పోయాయి .

విష్ణువు నరసింహావతారం దాల్చి ప్రహ్లాద వరడుడై హిరణ్య కశిపుని సంహరించి ,పూర్వం వేదాలకు ఇచ్చిన మాట ప్రకారం కృష్ణాతీరం లో కొండపై జ్వాలా నృసింహ మూర్తి ‘’గా వెలిశాడు  బ్రహ్మవచ్చి సాలగ్రామ నరసింహ మూర్తిగా తన సత్యలోకం లో ఉండమని కోరగా ,సరే అని వెళ్ళాడు . బ్రహ్మ పూజ చేద్దామను కొంటె సత్యలోకం తగలబడి పోయింది .భయపడిన బ్రహ్మ మళ్ళీ  కృష్ణా నదీ గర్భం లో  సాలగ్రామ పర్వతం పై ప్రతిష్టించి సత్యలోకం వెళ్ళాడు .మళ్ళీ నదిని స్వామి తరి౦ప జేశాడు .

కొంతకాలానికి ఋష్యశృంగుడు మొదలైన మహర్షులు ,మనువు మొదలైన  మహా రాజులు ప్రార్ధిస్తే ,యోగానంద నరసింహుడై పర్వత మద్యం పై ఉన్నాడు .గరుడుడు మొదలైన వారు ప్రార్ధించగా వీర నరసింహ మూర్తి రూపం పొందాడు .వనదేవతలు ప్రార్ధిస్తే లక్ష్మీ నారసింహ రూపం పొందాడు .ఈ విధంగా పంచ నారసి౦హులు ఒకే చోట ఉన్న పవిత్ర క్షేత్రం ఇంకెక్కడా లేదు ఒక్క వేదాద్రికే దక్కింది ఆ అదృష్టం ..బ్రహ్మాండ పురాణం లో వేదాచల క్షేత్ర మహాత్మ్యం వర్ణన సవివరంగా ఉన్నది .ఇందులో కృష్ణవేణీ నది అష్టకం కూడా ఉన్నది .

మూడు ఆశ్వసాలున్న గ్రంథం ఇది .పై వివరాలన్నీ మూడు ఆశ్వాసాలలో ఉంటాయి .దీన్ని తెలుగు లో వివిధ ఛందో పద్యాలలో అనువాదం  శ్రీ వేద గిరీంద్ర కవి  చేశాడు .తరువాత నరసింహస్వామి సహస్ర నామావళి,శ్రీ ఆంజనేయ సహస్రనామావళి ,పర్యంకాసనోత్సవ కీర్తనలు(పవళింపు సేవ )  అన్ని రాగాలలో తాళాలలో ఉన్నాయి .

మొదటి ఆశ్వాసం లో –‘’శ్రీ వేదాద్రి వికుంఠ పట్టణముగా శ్రీ కృష్ణ వేణిన్ భువిన్ భావిర్వ వీరజానదీ ఝారముగా బ్రాకార సౌదాంచిత –గ్రావంబే తెలిదీవి గాగలిగి యోగానందుడౌ-రుష్యశృంగావిర్భూత నృసిమ్హుం డీవుత తదీయావాప్తి మా కెప్పుడున్ ‘’.చివర షష్ట్యంతాలున్నాయి  .దండకం కూడా ఉంటుంది .

. రెండవ ఆశ్వాసం –‘’శ్రీ వసుధా నీళాహృ-జ్జీవ౦జీవోపజీవ శిశిర మయూఖ –ప్రావీణ్య వదనజలరుహ –శ్రీ వేదం గిరీంద్ర ర౦హ శ్రీ నరసింహా ‘’అనే కాండం తో అందంగా మొదలు పెట్టాడు కవి .

మూడవ ఆశ్వాసం లో –శ్రీమత్క్రుష్ణా తటినీ –భూసుర సానంద కంద భూభ్రుత్ప్రభవ-ద్డాను ధగద్ధిగితసురా –స్తేమ తటి  త్పటల జిహ్వ శ్రీ నరసింహా ‘’అనే కదం తో మొదలుపెట్టి చివర పంచచామరం తో వీచి ,గీత పద్యాలతో సమాప్తి చేశాడు .

మొదట్లోనే ఉన్న శ్రీ కృష్ణ వేణ్యస్టకం –1-‘’శ్రీ మత్కైవల్య నిశ్రే ణీ౦-చిదానంద స్వరూపిణీ౦-కల్యాణీం సైకతశ్రోణీ౦-కృష్ణ వేణీ నమామ్యహం

8-‘’పరమానంద సరణీ౦ కరుణా౦బు తరంగిణీ౦-దురితాంబోధి తరణి౦ –కృష్ణ వేణీ నమామ్యహం ‘’

పవళింపు సేవ కీర్తనలు -1-‘’శ్రీ రాజ్యలక్ష్మీ మనోరమా కరుణాబ్ది పరమ యోగానంద  బహుపరాకు –హలకులిశాది రేఖాంకిత కమనీయ –పాద సరోజాత బహుపరాకు ‘’

చివర – ‘’చేతిలో చేయి వేసి చేతి కందిచ్చి –ఖ్యాతి కౌగిట జేర్చి కన్నీరు నించి –అత్య౦త సంతోష మంది దంపతులు –నిత్య సంపద లొంది నెగడి రెల్లప్పుడు ‘’

శ్లోకం –శ్రీ జ్వాలా నారసింహో విధిముఖ సుర సంప్రార్ధితఃకృష్ణ వేణ్యాం –సాలగ్రామ స్వరూపో గరుడ ముఖ నుతో భూన్మహా వీర సింహః –యోగానందో వసిష్ట్యాద్యఖిల మునిమతం ప్రాప్య లక్ష్మీ నృసి౦హొ-వేదాద్రౌ భాతి భక్త ప్రకర నిరత సంరక్షణే  బద్ధ దీక్షః’’

‘’కృష్ణా నదీ శీతలవాత పోత  -నిర్ధూత హేమా సురకోప వహ్నిహ్ –లక్ష్మీ కటాక్షామృతపూర తృప్తో-వేదాద్రి శృంగం భజతే నృసిమ్హః ‘’

ఈ గ్రంథం ఎప్పుడు ఎక్కడ ప్రచురి౦పబడిందో తెలియదు కవిగారి వివరాలూ లేవు .కాని మంచి ధారాశుద్ధి భక్తీ తాత్పర్యాలతో సరళ భాషలో కవి గొప్ప అనువాదం చేశాడు అభినంద నీయుడు .ఇది కూడా ఎవరి దృష్టిలోనూ పడి నట్లు లేదు .పరిచయం చేసే భాగ్యం నాకు దక్కినందుకు సంతోషం గా ఉంది .

Click to access 2015.386882.Srivedachala-Mahatyam.pdf

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -14-2-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఖాద్రీ(కదిరి)క్షేత్ర మహాత్మ్యం -2(చివరిభాగం )

మొదటి అధ్యాయం లో నారదుడు పరమేశ్వరుని ఖాద్రీ మహాత్య్మం వివరించమని కోరగా ఆయన ‘’ సువర్ణమఖీ తీరం లో ఉన్న వెంకటాచలానికి పది యోజనాలదూరం లో వేదారణ్యం అందులో స్తోత్రాద్రిపై శ్రీ విష్ణుపాద చిహ్నాలున్నాయి ,దానిప్రక్కన అర్జుననది ప్రవహిస్తుంది అనేక రకాల వృక్ష జంతు పక్షిజాలాలకు నిలయం .నదికి తూర్పున నృసింహ దేవాలయమున్నది .స్వామి సర్వకామ ప్రదుడు .అష్ట భుజాలతో పద్మాసనం లో సహస్ర కోటి సూర్యకా౦తితో విరాజిల్లెవాడు .ఖేట ఖడ్గ శంఖ చక్రధరుడు .అక్కడి ఖాదిరీనగరం వైభావోపేతమై,చతుర్ వర్ణాలతో మేడలు ఉద్యానవనాలు పుష్పవాటికలతో భూలోక స్వర్గం గా ఉంటుంది .

  రెండవ అధ్యాయం లో హిరణ్య కశిప ,ప్రహ్లాద కరథా విధానం ,కొడుకును బాధలుపెట్టటం విష్ణువు భక్త ప్రహ్లాదుడిని కాపాడటం స్తంభం లో ఉంటె చూపుమనటం గదతో దానిపై కొట్టగా  నరసింహావతారం లో శ్రీహరి వచ్చి సంహరించటం ,ఉగ్రరూపం శాంతి౦చ టానికి దేవ, మహర్షులు స్తోత్రం చేయటం ,మహాలక్ష్మి ప్రహ్లాదుని ముందుపెట్టుకొని వచ్చి స్తుతించటం ,ఆయన ప్రసన్నుడై భయంకరరూప౦ ఉపసంహరించి తనపాదాల ముద్ర పడేట్లు చేసి ,నదికి పడమట ఒకదివ్యాలయం లో ప్రవేశించి ,దేవమహర్షులు పూజించటం ,తనపాద దర్శనం చేసినవారికి మోక్షం ప్రసాదిస్తానని చెప్పటం అందుకే ఆ పర్వతానికి స్తోత్రాద్రి పేరు వచ్చిందని చెప్పటం,ఈ క్షేత్ర మహాత్మ్యం శివుడే చెప్పగలడని బ్రహ్మాదులకు చెప్పటం తో  రెండవ అధ్యాయం ముగుస్తుంది .

 మూడవ అధ్యాయం లో నారదునికి  శివుడు వసంత కాలం లో నరసింహస్వామికి బ్రహ్మఉత్సవాలు జరిపాడనీ అప్పటినుంచి రివాజుగా జరుగుతున్నాయనీ వైఖానసాది మునులుకూడా ఆఉత్సవం లో పాల్గొన్నారనీ ,ఉత్సవ విశేషాలన్నీ వివరించాడు .నాలుగవ అధ్యాయం లో  అక్కడి ఆరు పుణ్యతీర్దాల వివరాలు చెప్పాడు , బ్రహ్మ తనకమండల జలం తో నారసిహుని పాదాలు కడగట౦ చెప్పాడు .అయిదవ అధ్యాయం లో జాబాలికొడుకు శ్వేతుడు యాగం చేయాలని తపస్సు చేసి ఈపుష్కరిని లోని గోవర్ధన గిరిపై శ్రీకృష్ణ అష్టాదశాక్షర మహామంతాన్ని దీక్షగా జపించగా శోణితుడు అనే రాక్షసుడు ఆయనను చంపాలనుకొని వేచిఉంటే  శ్వేతర్షి అదే సమయం లో రాగా ఆయన్ను మి౦గ బోతే మహర్షి చేసిన హుంకారం తో రాక్షసుడు రెప్పపాటుకాలంలో చచ్చి కిందపడగా వాడి శరీరం నుంచి సుందర గంధర్వుడు బయటికి వచ్చి ,దివ్యవిమానంలో పైకి వెళ్లి మళ్ళీ క్రిందికిదిగి మునికి కృతజ్ఞతలు చెప్పి ,తన వృత్తాంతం చెప్పాడు. తాను చిత్రాంగదుడు  అనే గాంధర్వ రాజు కొడుకు. గానం లో ప్రతిభకలవాడు .ఒకసారి గాలవముని తపస్సు చేస్తుంటే ఇంద్రుడు విఘ్నాలు కలిగి౦చటానికి తనను నియమించి అప్సరసలతో పంపగా ,తానూ గానం తో మహర్షి మనసును ఆకర్షించ గా ఆయన ప్రక్కనే ఉన్న జింక పిల్లను మెడపట్టి కొరికి చంపగా ముని రాక్షసివి కమ్మని  శపిస్తే ,బ్రతిమాలితే మీవలన శాప విమోచనం కలుగుతుందని చెప్పి వెళ్ళిపోగా ముని అష్టదశాక్షరీ మంత్రం జపిస్తూ ఉన్నాడు .అక్కడ గోవర్ధన పర్వతం పై ఆవులమందలు మేసేవి .ఒక ఆవుమాత్రం ఇక్కడీ ఉండేది. ఒక సారి నరసింహస్వామి ప్రత్యక్షమై వరం కోరుకోమనగా తాను దేనికోసం చేస్తున్నాడో మరచిపోయి మోక్షం ప్రసాదించమని కోరితే ,ఆయనే జ్ఞాపకం చేసి ,హవిస్సులు సాధించే ఉపాయం చెప్పిఆ ఆవును హోమదేనువుగా భావించమని యజ్నంచేసి సాయుజ్యం పొందమని   మునిపేర శ్వేత పుష్కరిణి గా అది పిలువబడుతుందని చెప్పి చెప్పి అదృశ్యుడయ్యాడు  . శ్వేత పుష్కరిణి లో  స్నానం ఖాద్రి నరసింహ దర్శనం అపురూపమైనవి ..

   ఆరవ ఆధ్యాయం  లో  భ్రుగు తీర్ధ వివరాలున్నాయి .మహర్షులు అక్కడ తపస్సు చేస్తూ బ్రహ్మ విచారం చేస్తుంటే త్రిమూర్తులలో ఎవరు గొప్ప అనే ప్రశ్న కలగగా భ్రుగు మహర్షి తాను  నిర్నయిస్తానని ముందు సత్యలోకం వెళ్లగా బ్రహ్మ ఈయనను పట్టించుకోకపోతే’’బ్రాహ్మణులు నిన్ను సాకార రూపంగా అర్చించరు’’అని   శపించి కైలాసం వెళ్ళగా  నంది  అడ్డగిస్తే  శివుడికి వార్త చెప్పేవారు లేక కోపం తో ‘’నీ శరీరం స్త్రీపురుష జననాంగం చిహ్నం అవుతుంది .నీకు నైవేద్యం చేసినవి అపవిత్రాలై నీ నిర్మాల్యం అపవిత్రమౌతుంది ,నందిని పశువుగాపుడతావని కూడా  ‘ శపించి ,విష్ణులోకం వెళ్లి లక్ష్మీదేవితో సరస సల్లాపాలు చేస్తున్నతనను పట్టించుకోని  విష్ణువును వక్షస్తలంపై కాలితో తన్నగా ,కోపించక ఆసనం పై కూర్చోపెట్టి ‘’నా శరీరం కాయలు కాచింది దాన్ని తన్నగా మీకోమలపాదం కంది పోయి ఉంటుంది నా అపరాధం మన్నించు ‘’అనగా పరవశుడై ‘’నువ్వు లోకరాధ్యుడవు నీనివేదన పరమపవిత్రం ‘’అని చెప్పి మళ్ళీ మహర్షులను చేరి విష్ణువే త్రిమూర్తులలో ఉత్తముడు అని ప్రకటించి విష్ణువుకి తపస్సు చేయగా ఆయన ప్రత్యక్షమై వరం కోరుకోమంటే ‘’స్వామీ నీ అర్చా బింబాన్ని పూజించటానికి ఇవ్వండి ‘’అనికోరగా శ్రీదేవీ భూదేవి లతో కూడిన దివ్య మంగళ విగ్రహాన్ని ప్రసాదిచాగా ‘’వసంతకాలం లో నాకు నీ విగ్రహం ఇచ్చావుకనుక వసంత నాధుడు అనీ వసంత మాధవుడు అనీ పేరు పెట్టి అర్చన చేస్తాను ‘’అని చెప్పాడు భ్రుగువు తపస్సు చేసిన ఈతీర్ధమే భ్రుగు తీర్ధం .ఏడవ అధ్యాయం లో శ్రీ తీర్ధ వివరాలున్నాయి .దీనిలో నారసింహుడు ఎప్పుడూ ఉంటాడు ఇక్కడ చేసిన స్నాన దానాదులు మోక్షాన్నిస్తాయి .ఎనిమిదవ అధ్యాయం లో గంగాతీర్ధ వర్ణన ఉంది .వ్యాసుడు శిష్యులతో ఇక్కడికి వచ్చి వేదాంత చర్చ చేస్తుంటే రాక్షసులు  మోసం చేయదలిస్తే తానూ మాయావేషం లో అక్కడే ఉండిపోతే ,గంగానదికూడా వేదారణ్యం అనే ఖాద్రి క్షేత్రం లో ప్రవహించి పవిత్రం చేసి౦ది కనుక గంగాతీర్ధం .వినత ఇక్కడే తపస్సు చేస్తే విష్ణువు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే ‘’నీతో సమానమైన బలం కలవాడిని పుత్రునిగా ప్రసాదించు ‘’అని కోరగా గరుత్మంతుడు పుట్టి ఆయన వాహనమయ్యాడు .అమృతాన్ని రాక్షసులకు దక్కకుండా కాపాడాడు .

  తొమ్మిదవ అధ్యాయం అర్జున తీర్ధ వర్ణన .అర్జునుడు తీర్ధయాత్ర చేస్తూ ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించి అర్జున వృక్షం క్రింద ఇంద్రియ నిగ్రహం తో తపస్సు చేయగా నరసింహస్వామి ప్రత్యక్షమవగా ,స్తుతిస్తుంటే ,అక్కడి అర్జున వృక్షం ముని కుమారుడుగా ఆవిర్భవించి ‘’నేను మౌద్గాల్యముని పుత్రుడను పేరు పుణ్య శ్రవణుడు .మానాన్న గారి ఆజ్ఞతో నృసింహ మహామంత్రం జపిస్తూ చాలా కాలం తపస్సు చేశాను .ఒకసారి విద్యాధరరాజు రాణీవాసంతో ఇక్కడికి వచ్చి జలక్రీడలు,రతిక్రీడలు  జరుపుతుంటే అందులో ఒక సుందరిపై ఆశకలిగి ,ఆమెకూ నాపైప్రేమకలుగగా నేను విద్యాధర చక్రవర్తికి నా కోరిక చెప్పగా ,అతడు అంగీకరించి ఆమెను నాకు ఇచ్చేశాడు .ఆమెతో కామక్రీడలు జరుపుతూ సిగ్గూ ఎగ్గూలేక  నగ్నంగా ల సంచరిస్తుంటే దుర్వాసముని వచ్చి కోపం తో మద్ది వృక్షంగా మారు అని శపిస్తే  బ్రతిమాలితే అర్జునునివలన శాప విమోచనం జరుగుతుందని చెప్పాడు ‘’అని వివరించాడు .

 దశమోధ్యాయం లో శివుడు నారదమహర్షికి భవనాషిని తీర్ధ మహాత్మ్యం చెప్పాడు –ఒకప్పుడు భారద్వాజ గోత్రుడు భూరిశ్రవుడు వెయ్యేళ్ళు తీర్ధయాత్రలు చేసినా  ,మనసు కుదుటబడక ,గంగాతీరం లో ఉన్న వ్యాసభగవానుని దర్శించి  వెయ్యేళ్ళనుంచి మోక్షం కోసం ప్రయత్నిస్తున్నా ఫలితం కలగలేదని పాదాలపై వ్రాలి చెప్పగా ఆమహర్షి ‘’స్తోద్రాద్రి లో ఖాద్రి క్షేత్రం ఉంది ,దానికి ఈశాన్యం లో భవనాశిని తీర్ధం సకల పాపహరం మోక్ష దాయకం .అక్కడికి వెళ్లి తపోధ్యానాలు చేయి నీ కోరిక సిద్ధిస్తుంది ‘’అని బోధించగా ,ఖాద్రి క్షేత్రం చేరి భవనాశినీ స్నాన పునీతుడై నరసింహస్వామిని సేవిస్తూ  చాలాకాలం నృహరికోసం తపస్సుచేశాడు .అతడిని పరీక్షించాలని నరహరి కామినీ  వేషం లో వచ్చి ప్రలోభాపెట్టాడు .చిత్తాన్ని చలి౦ప నీయకుండా అతడు తపస్సు కొనసాగించగా నరసింహుడు ప్రత్యక్షమై ,భూరిశ్రవుడికి మోక్షం అనుగ్రహించాడు .

  పదకొండవ అధ్యాయం లో ఆక్షేత్రానికి ఖాద్రి అనే పేరు ఎందుకు వచ్చిందని అడిగిన నారదునికి శివుడు –ద్వాపరయుగం చివర శ్రీకృష్ణుడు కాలనేమి మొదలైన రాక్షస సంహారం చేసి ధర్మ సంస్థాపనం చేసి ,యాదవకులనాశానమూ చేసి ,అవతారం చాలించగా ,పాండవులు శ్రీకృష్ణుని సాయం తో కౌరవులను జయించి రాజ్యం పొంది ద్రౌపది తో కలిసి రాజ్యపాలన చేశారు .కలియుగం ప్రారంభమైతే ధర్మనాశనం జరుగుతుందని రాజర్షులు దేవర్షులు హిమాలయాలలో కనపడని చోట ఉండిపోయారు .కలియుగం ప్రారంభమై రాజులు నశించి మ్లేచ్చపాలన ఏర్పడి పౌరులను పీడించారు .అప్పుడు అక్కడి ప్రజలు దట్టంగా ఉండే  అరణ్యం  లో చేరి ,మంచి నగర నిర్మాణం సర్వ సంపత్తులతో ఏర్పాటు చేసుకొన్నారు  .అది ఖాద్రి క్షేత్రంగా పిలువబడింది .ఈక్షేత్రం లో మంత్రోచ్చటనతో సకల భూత ప్రేతాలు పారిపోతాయి కుష్టు మొదలైన వ్యాధులు నశిస్తాయి ,దారిద్ర్యం ఉండదు .దేవతలూ ఇక్కడికే వచ్చి నివాసమున్నారు .

 పన్నెండవ అధ్యాయం లో బ్రహ్మమానస పుత్రుడు వైఖానసముని కొడుకు విష్ణు శర్మ కు జ్ఞానం ఉపదేశించమని బ్రహ్మ దగ్గరకు పంపాడు .అతడు తన సర్వ శాస్త్ర పాండిత్యాన్ని వివరింఛి మోక్షం ఇమ్మని కోరగా ‘’నువ్వు చిన్నవాడివి మోక్షానికి ఇంకా సమయం ఉంది వేదారణ్యం లో మద్ది వృక్షాలున్న వనం లో తపస్సు చేయి ‘’అని పంపగా వచ్చి ఏకాగ్రచిత్తం తో చాలాకాలం తపస్సు చేస్తుంటే దుర్వాస ముని రాగా సమాధిస్థితి లో ఉండటం వలన గమనించకపోతే కోపం తో వృక్షంగా మారమని శపించి కాసేపటికి అతడు తపస్సు చేస్తున్నాడని తెలుసుకొని దగ్గరకు రాగా సమాధి నుంచి లేచిన విష్ణు శర్మ స్వాగతించి పూజించగా ,కరగినమనస్సుతో ముని ‘’ఒక పుణ్య క్షేత్రం లో వృక్షమై జన్మించకతప్పదు .నీ పూర్వజన్మ సుకృతం తో శ్రీహరి నీకు నరహరి రూపం లో ప్రత్యక్షమై నీ శాపం తీర్చి నీ కోరికకూడా సాఫల్యం చేస్తాడు ‘’అని చెప్పి వెళ్ళిపోయాడు .

  కొంతకాలానికి గరుడ వానహుడై శ్రీహరి ఆ వృక్షం దగ్గరకు రాగా ,అది సమూలంగా కదలి ,అందులో నుంచి మునికుమారుడు బయటికివచ్చి పాదాలపై వ్రాలి స్తుతింఛి తనభక్తి స్థిరం గా ఉండేట్లు అనుగ్రహించమని వేడుకొనగా నారసింహ స్వరూపంగా అర్చా స్వరూపంగా దర్శనమిచ్చి సుప్రతిష్టుడై ఖాద్రి నరసింహుడు అయ్యాడు  ,భుజంగ ప్రయాత స్తోత్రం తో నారసి౦హుని ప్రసన్నుని చేసుకోగా ఆ స్తోత్రం విష్ణుశర్మ స్తోత్రం గా లోకం లో ప్రసిద్ధమైంది .

  చివరిదైన పదమూడవ అధ్యాయం లో నారదుడు ఖాద్రి క్షేత్ర మహాత్మ్యాన్ని శివుడిని అడిగి వివరంగా తెలుసుకొన్నాడు .భ్రుగు మహర్షి ఒకసారి వసంతకాలం లో బ్రహ్మోత్సవాలు చూడటానికి ఇక్కడికి వచ్ఛి మహర్షులకోరికపైభాగవత్కదలు చెప్పాడు.ఒకప్పుడు బ్రహ్మను,శంకరుడిని  శపించటం ,ఇద్దరూ కూడబలుక్కొని పాములతో ఆయన్ను కరవమని చెప్పటం ,అవి కాటు వేయలేక పారిపోవటం జరిగింది .బ్రహ్మ గర్వం ఖర్వమై పాదాలపై వ్రాలి ఏనాడో భ్రుగు మహర్షి పరీక్షించి  స్థాపించిన  ‘’విష్ణు సర్వేశ్వర తత్వ సిద్ధాంతం ‘’అంగీకరించి ,విష్ణువే త్రిమూర్తులలో శ్రేష్టుడనిప్రకటించాడు .బ్రహ్మ మునిని ‘’విష్ణువు వాగామగోచరుడు అయితే ఆయన దివ్య మంగళ విగ్రహం ఎలా ఏర్పడుతుంది? ‘’   అని సందేహం వెలిబుచ్చగా మహర్షి ధ్యానయోగం తో ఆ మహానుభావుని దివ్య మంగళ విగ్రహాన్ని సాక్షాత్కరింప జేయగా దేవతలు మహర్షులు ఆనందంతో స్తోత్రగానాలు చేశారు .స్వామి సర్వవ్యాపకత్వాన్ని అర్ధం చేసుకొన్నారు .బ్రహ్మ చేసిన స్తోత్రం లోకప్రసిద్ధమైనది .శివుడితో భ్రుగువు ‘’స్వామీ ఒకప్పుడు నిన్ను లింగ రూపంలో ఉండమని శపించాను .నీ మూల రూపం అలాగే ఉంటుంది .కాని ఉత్సవ సమయాలలో పార్వతీ దేవితో దర్శనమిచ్చి భక్తులకోర్కే తీరుస్తావు .తర్వాత ఖాద్రి నృసి౦హునికిభ్రుగు మహర్షి మంగళా శాసన౦ తో వైభవం గా స్తోత్రం చేసి,తన ఆశ్రమానికి వెళ్ళాడు .శంకరుడు ,దేవతలు ఇక్కడే ఉండామనుకొన్నారు లక్ష్మీ దేవి భైరవుడుమాత్రం సన్ని దానాలకు  వెళ్ళిపోయారు .లక్ష్మీ దేవి ఎడమ చేతిలో ఒక పండు ,కుడి చేతిలో పద్మం,భైరవుడు నాలుగు చేతులలో ఖడ్గ డమరుక త్రిశూల కపాలాలు ,శిరసుపై రత్నకిరీటం చెవులకు కుండలాలు మెడలో కపాలమాల ,యజ్ఞోపవీతం పాదాలలో అందెలు హస్తాలలో కంకణాలు ధరించి నృసింహ  స్వామి సన్నిధిలో ఉన్నారు’’ అని సవిస్తరంగా శివుడు నారదమహర్షికి ఖాద్రి క్షేత్ర మహాత్మ్యం వివరించాడు

  విష్ణుశర్మ చేసి ఖాద్రి నరింహ స్తుతి-‘’రక్షోవర హిరణ్యాక్ష వక్షస్థల విదారిణం – శిక్షితాక్షం మహాబాహుం ఖాదిరీ నృహరిం భజే ‘’-వందే వందారు మందారం కుండహాస ప్రకాశినం –ఖాదరీ నృహరిం వందే మందహాస శుభానన౦ –ఖాదిరీ నృసింహ స్తోత్రం త్రిసంధ్యం య ఇదం పతేత్-నాపమృత్యు భయం  తస్య కాల మృత్యు భయం న చ –కరోమి త్వదీయాంసపర్యాయాం సుపూర్ణం –సదాహం విధానేన వైఖనసేన-న బాహ్యాగమేస్తుపూజా కదాపి –ప్రసీద ప్రభో ఖాదిరీశ ప్రసీద ‘.

   బ్రహ్మ  చేసిన స్తోత్రం –‘’కళా కాస్టాముహూర్తాస్వం పక్షమాసర్తుమూర్తిమాన్ –కాలస్త్వం కనకాద్రీస్త్వంకారణం కార్యమేవచ –త్వామాది రనంతశ్చత్వం చిద్రూప మాత్మభూనమస్తే ధృత ధైర్యాయ – విశ్వ భోక్త్రేనమోనమః ‘’

భ్రుగుమహర్షి చేసిన స్తోత్రం –‘’సాలగ్రామ శిలావారి సహితం త్వన్ని వేదితం –గ్రాహ్యమస్తు ద్విజాతీనా మిత రేషాం చ పావనం –త్వత్పూజన పరాణా౦చ త్వమిష్టఫలదో భవ-భావనామ తధాస్తే స్తు స్మరతాం భవ మోచనం ‘’

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-2-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఖాద్రీ(కదిరి)క్షేత్ర మహాత్మ్యం -1

ఖాద్రీ(కదిరి)క్షేత్ర మహాత్మ్యం -1

బ్రహ్మాండ పురాణా౦తర్గత’’శ్రీ మత్ఖాద్రీ క్షేత్ర మహాత్మ్యం ‘’శ్రీ కారే సిద్దప్ప శెట్టి గారి ద్రవ్య సహాయంతో ఖాద్రి నృసింహస్వామి దేవస్థానం 1953లో ప్రచురించింది .మంగళాశాసనం లో ‘’దంష్ట్రా కరాల వదన మారాలభ్రుజ్వలచ్చిఖం –ఖాద్రి స్థలగతం జీయాన్నార సింహం పరం మహః ‘’ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతో ముఖం –నృసింహం ,భీషణ౦భద్రం మృత్యు మృత్యుం నమామ్యహం ‘’.’’క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ స్వాహా ‘’(గోపాల అష్ట దశాక్షరీ మంత్రం ).బ్రహ్మాండ పురాణం లో రుద్ర ,నారద సంవాదం లో ఖాద్రి స్థల పురాణం చెప్పబడింది .ఖాద్రి అంటే విష్ణుపదం .విష్ణు పాదాంకితమైన పర్వతం ఇక్కడ ఉండటం చేత ‘’ఖ’’శబ్దానికి విష్ణు పాదాంకిత తత్వ పర్యంతం అనే అర్ధం చెప్పి ,’’అద్రి’’శబ్దాన్ని చేరిస్తే విష్ణుపాదాంకిత మైన పర్వతం ఉన్న చోటు కనుక ‘’ఖాద్రి’’ అయింది .దీనికే ‘’ఖాదిరీ ‘’అనే పేరు కూడా ఉంది .ఖదిరి అరణ్యాలు ఉండటం చేత వృక్ష విశేషవాచకం గా ఖాదిరీ అయింది .ఖాద్రీ అనీ పిలుస్తారు .ఇది ఖాదిరీ శబ్ద దేశ్యరూపం .ఈమహాత్మ్యం లో 13వ అధ్యాయం లో 767శ్లోకం లో ఈ వివరాలున్నాయి .కృతయుగం లో హిరణ్య కశిప దైత్యుని శ్రీ మహా విష్ణువు శ్రీ నృసింహావతారం ఎత్తి సంహరించిన మూల విగ్రహమే ఇక్కడి మూల విరాట్ .ఎనిమిది చేతులు ,కూర్చున్న భంగిమలో స్వామి దర్శనమిస్తాడు .శ్రీదేవీ భూదేవీ లేరు .ఎడమప్రక్కన భక్త ప్రహ్లాద విగ్రహం విరాజమానం గా కనిపిస్తుంది .

భ్రుగు మహర్షి తపస్సు చేస్తే ,ప్రసన్నుడైన నారసింహుడు వరం అడగమంటే అడిగితె ,తనప్రతినిదిగా శ్రీ ,భూదేవులతో మూడు పంచలోహ విగ్రహాలను ఒక పెట్టెలో పెట్టి ,వాటిని నిత్యమూ ఆరాధించమని ఆదేశించాడు ఈ మూర్తులకు 1-వసంత వల్లభుడలు 2వసంత మాధవులు అనేపేర్లు .ఈనాటికీ ఆ పేర్లతోనే పిలుస్తారు .ఇవే ఉత్సవమూర్తులు .వైఖానస విధానం లో పంచ బేరముల పూజ జరుగుతుంది .ధ్రువ ,కౌతుక బలి బేరములు దేవి లేకుండానూ ,ఔత్సవ, స్నాపన బేరములు దేవీ సహిత విష్ణు రూపం లోనూ ఉంటాయి .వేదవ్యాసుడు రాక్షసులకు తెలియకుండా ఉండటం కోసం ఖాద్రి క్షేత్రానికి వచ్చి ,శిష్యులకు ధర్మోపదేశం చేసిన స్థలం కనుక ‘’వేదారణ్యం ‘’అనే పేరు వచ్చింది .హిరణ్యకశిప వధ తర్వాత దేవతలు నృసింహ స్తోత్రాలు చేయటం వలన ఈ పర్వతానికి ‘’స్తోత్రాద్రి ‘’అనే పేరు వచ్చింది .ఇక్కడి నదీ తీరం లో అర్జునుడు తపస్సు చేయటం చేత నదికి ‘’అర్జున నది ‘’అనీ క్షేత్రానికి అర్జున తీర్ధం అనీ పేర్లు .అర్జుననదికి ఆరు పుణ్య తీర్దాలున్నాయి .అవే -శ్వేత పుష్కరిణి ,భ్రుగు తీర్ధము ,లక్ష్మీ తీర్ధము ,గంగాతీర్ధము ,గరుడ తీర్ధం ,భవనాశినీ తీర్ధం .

గంగా తీర్ధం విమాన ప్రదక్షిణ మార్గం లో ఆగ్నేయం లో పాకశాలకు ఎదురుగా ఉంది .ఒకప్పుడు ఇది విశాల నడబావి.ఇప్పుడు చిన్న నుయ్యి .ఈశాన్యం లో భవనాశినీ తీర్ధం ఉంది .ఇది మెట్లు ఉన్న విశాల పుష్కరిణి .ఆలయం వెనుక ఉన్న భ్రుగు తీర్ధం కూడా ఇలానే ఉంటుంది .దీని మధ్య ఉండే నీరాడి మండపం ఇప్పుడు శిదిలరూపం లో కనిపిస్తుంది .దీనికి ఈశాన్యం లో తీర్ధవారి మండపం ఉంది .ఆలయానికి ఆగ్నేయం లో రెండు ఫర్లాంగుల దూరం లో శ్రీ తీర్ధం ఉంది .ఇదికూడా మెట్లతో ఉన్నచిన్న చతురస్రాకార పుష్కరిణి .దీని దక్షిణపు ఒడ్డున ‘’చి౦త పూల ఉట్టి’’ అనే నాలుగు స్తంభాల మండపం ఉంటుంది .దీనికి దక్షిణం గా ఉద్యానవనం లో పాకశాల మండపాలున్నాయి .చైత్ర పౌర్ణమి నాడు స్వామి వారికి ఆస్థాన ఉత్సవం వనభోజనం జరుగుతాయి .దీనికి ఆగ్నేయంగా మైలు దూరం లో శిలాసోపానాలతో పెద్ద చతురస్రాకార౦గ ఉన్న పుష్కరిణి ‘’గరుడ తీర్ధం ‘’.దీనికి తూర్పున విశాల మండపం లో శ్రీ ఆంజనేయస్వామి శిలావిగ్రహం ఉంటుంది .మాఘమాసం లో ఇక్కడ మాఘపురాణ ప్రవచనం జరుగుతుంది .దీనికి మైలు దూరం లో ‘’దేవ చెరువు ‘’ఉంది ‘’.’’ఇక్కడి ‘’నుంచే స్వామి వారలకు అభిషేక జలం తీసుకు వెడతారు .దీన్నే అర్జుననది లేక మద్దు లేరు అంటారు .ఈనది పైన చెప్పిన తీర్థాలను చుట్టి ,భ్రుగు తీర్ధం పడమర భాగం నుంచి ఉత్తరంగా ప్రవహించి ,ఎనిమిది మైళ్ళ దూరం లో ఉన్న చిత్రావతీ నదిలో కలిసి అక్కడినుంచి 70మైళ్ళు ప్రయాణించి కమలాపురం వద్ద ‘’పెన్నా నది’’లో సంగమిస్తుంది .

ఆలయానికి తూర్పున రెండు మైళ్ళ దూరం లో శ్వేత తీర్ధం రాతి మెట్లతో దీర్ఘ చతురస్రాకారంగా ఉంటుంది .ఇది బ్రహ్మ తన కమండల పవిత్ర జలాలతో నరసింహస్వామి పాదాలను కడిగటం వలన ఏర్పడింది .దీనికి దక్షిణంగా గోవర్ధనాద్రి దానికి దక్షిణంగా స్తోత్రాద్రి ఉన్నాయి .ఇక్కడ విష్ణుమూర్తి రెండు పాదాల చిహ్నాలు కనిపిస్తాయి .ఈపర్వతానికి కింద ‘’కొండల నరసింహ దేవుడు ‘’ ఉండే చిన్న ఆలయం ,అందులో శ్రీ లక్ష్మీ నరసింహుని మూల విగ్రహం ఉంటాయి .ప్రతి ఏటా సంక్రాంతి తర్వాత వచ్చే కనుమ నాడు శ్రీ ఖాద్రి నరసింహ మూర్తి ఆలయం నుంచి ఇక్కడికి వచ్చి ఆస్థానం జరిగి ,శ్రీ గోవర్ధనాద్రి ప్రక్కగా శ్వత తీర్ధ మార్గాన వేంచేసి ,దగ్గరున్న క్షీర మండపం లో పాల నివేదన గ్రహించి ,తర్వాత గ్రామం బయట ఉన్న పార్వేట మండపం లో వినోద ప్రదర్శన తిలకించి ,వీధి ప్రదక్షిణంగా మళ్ళీ సన్నిధికి చేరుతారు .విజయదశమి నాడు ఈ మండపం లో శమీ పూజ చేస్తారు .

కాలక్రమం లో ఆలయం జీర్ణమై పోతోంది .పూర్వం జరిగినట్లుగా వైభవంగా నిత్య పూజా నైవేద్యాలు జరగటం లేదు .అలా జీర్ణోద్ధారణ ,పూజలు జరగాలని భక్తుల కోరిక –‘’దానపాలనాయో ర్మధ్యే దానాత్శ్రేయోనుపాలనం –దానాత్స్వర్గ మవాప్నోతి పాలనాదత్యుతం పదం ‘’ఈ గ్రంధం సంస్కృత ప్రతి ధర్మవరం లో శ్రీ ఆనే గొంది ఆస్థాన పండితులు శ్రీ ఉభయ వేదాంత అర్చకం వెంకట రాఘవ భట్టా చార్యులవారు తమకు ఇచ్చినట్లు ఆకులమన్నాడు లో ఉంటున్న శ్రీ పార్ధ సారధి భట్టాచార్యులవారు తెలిపారు .పైన చెప్పిన విషయాలన్నీ వారు వ్రాసినవే ..ఇది సంస్కృతం లో 13 అధ్యాయాల గ్రంథం.మిగిలిన విషయాలు తర్వాతతెలుసుకొందాం

శ్రీ లక్ష్మీ నరసింహ దేవాలయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అనంతపురం జిల్లాలోని కదిరిలో నెలకొని ఉన్న ఆలయం. ఈ దేవాలయం ఎత్తైన ప్రహారీతో, విశాలమైన ఆవరణలో విలసిల్లుతున్నది. ఇది 13 వ శతాబ్దంలో దశలవారీగా అభివృద్ధి చెందిందని శాసనాల వలన తెలుస్తున్నది. ఆలయానికి నాలుగు వైపుల గోపురాలు కలిగి ఉంది. ప్రధాన ఆలయంలో గర్భగుడి, అంతరాలయం, ప్రదిక్షిణా పథం, ముఖ మంటపం, అర్థ మంటపం, రంగమంటపం ఉన్నాయి. రంగ మండపంలో ఉన్న నాలుగు స్తంభాలపై ఉన్న శిల్ప కళా రీతులు అత్యంత సుందరంగా ఉంటాయి. ఇక్కడున్న కోనేరును భృగుతీర్థం అంటారు. ఇక్కడి స్వామివారు అమ్మతల్లి, తాయారు, ప్రహ్లాదులతో కలిసి దర్శనమిస్తారు. ఈ అలయంలో రంగ మండపం పై వేసిన రంగుల బొమ్మలు శతాబ్దాల నాటివి. అందుచేత కొంత వెలిసినట్లున్నా, ఇప్పటికీ బాగున్నాయి. ఈ ఆలయం ముందున్న పెద్ద రాతి ధ్వజస్తంభం నిలబెట్టిన విధానం కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ధ్వజ స్తంభం పునాదిలో నుండి కా ప్రతి ఏడు సంక్రాంతి సమయాన స్వామి వారి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. ముఖ్యంగా సంక్రాంతి సమయంలో వచ్చే పశువుల పండుగ రోజున శ్రీదేవి, భూదేవి లతో కలిసి వసంత వల్లభుడు కదిరి కొండకు పారువేటకు వస్తాడని భక్తుల విశ్వాసం. పారువేట అనంతరం స్వామి వారిని ఊరేగింపుగా ఆలయంలోనికి తీసుకొస్తారు. దీన్నే రథోత్సవం అంటారు. ఈ రథోత్సవానికి చాల ప్రాముఖ్యత ఉంది. ఈ రథం 120 టన్నుల బరువుండి ఆరు చక్రాలతో సుమారు నలబై ఐదు అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. ఎక్కడా లేని విధంగా ఇక్కడ రథోత్సవం సమయంలో భక్తులు రథంపై దవణం., పండ్లు, ముఖ్యంగా మిరియాలు చల్లుతారు. క్రింద పడిన వీటిని ప్రసాదంగా భావించి ఏరుకొని తింటే సర్వ రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మిక. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదో రోజు పాల్గుణ బహుళ పౌర్ణమిని కదిరి పున్నమిగా జరుపుతారు. ఈ రోజు భక్తులు ఉపవాస ముంటారు. ఏటా ఈ ఆలయంలో నృసింహ జయంతిని, వైశాఖ శుద్ధ చతుర్దశి, మల్లెపూల తిరుణాళ్లను వైశాఖ శుద్ధ పౌర్ణమి, చింతపూల తిరుణాళ్లను, అషాడపౌర్ణమి, ఉట్ల తిరుణాళ్లను, శ్రావణ బహుళ నవమి, దసరా వేడుకల్ని, వైకుంఠ ఏకాదశి రోజుల్లో జరుపుతారు.కుండా ఒక బండ పైనే అలా నిలబెట్టి ఉంది.[1]

.

ఉత్సవాల సమయంలో ముస్లింలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ స్వామిని కొలవడం ఈ ఆలయ ప్రత్యేకత. ఇక్కడికి భక్తులు సమీపంలోని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి కూడా వస్తుంటారు. ఇక్కడి ఇంకో విశేష మేమంటే, కదిరి పట్టణానికి సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో తిమ్మమ్మ మర్రి మాను ఉంది. ఇది ఏడున్నర ఎకరాల స్థలంలో విస్తరించి, 1100 ఊడలతో ఉంది. దీని వయస్సు సుమారు ఆరు వందల సంవత్సరాలు ఉంటుందని నమ్మకం. ఇది గిన్నిసు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో కూడా స్థానం సంపాదించు కున్నది. కదిరికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో కటారు పల్లెలో యోగి వేమన సమాధి కూడా ఉంది. ఇది కూడా పర్యాటకులను ఆకర్షిస్తున్నది.

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -10-2-21-ఉయ్యూరు 19:24 10-02-2021

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బందరు ఖొజ్జిల్లిపేట శ్రీ నాగేశ్వరస్వామి మహాత్మ్యం -3(చివరి భాగం )

బందరు ఖొజ్జిల్లిపేట శ్రీ నాగేశ్వరస్వామి మహాత్మ్యం -3(చివరి భాగం )

ద్వితీయాశ్వాసం లో గ్రీష్మర్తు వర్ణన చేశాక నాగేశ్వర సంభవం వివరించాడు కవి టేకుమళ్ళ.ఆ వేసవిలో నీరు లేక జనం అల్లాల్లాడుతుంటే  ఉద్యానవనం లో ఒక బావి త్రవ్వించే ప్రయత్నం చేశాడు జమీందారు  .భూమి త్రవ్వుతుంటే ఆశ్చర్యంగా ఒక శివలింగం కనబడితే ,దానివెంట అనేకనాగుబాములు బయటికి వచ్చి లింగానికి చుట్టుకొని తమ మణులను వేసినట్లుగా పూజించి నాగేన్ద్రస్వామిగా కనిపించింది లింగం .ఇది చూసి బోడపాటి గురురాజు భక్తిగా స్తుతింఛి నీరులేకపోవటం వలన అక్కడ నుయ్యి తవ్వామని క్షమించి పూజలు అందుకోమని ప్రార్ధింఛి నాగేశ్వరస్వామిని తమకు అప్పగించి  నాగులను కూడా దయచేసి ఆస్థలాన్ని వదిలి వెళ్ళిపొమ్మని కోరాడు .సరే అన్నట్లు పాములు లింగం చుట్టూ బిరబిర ప్రదక్షిణలు చేసి నెరియల్లోకి దూరి మళ్ళీ కనిపించాలేదు .గురురాజు స్నానం చేసివచ్చి నాగేశ్వరస్వామికి షోడశోపచార పూజ చేయగా ఆసాయంత్రం ,ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై కుండపోత వర్షం కురిసి నీటి ఎద్దడి తగ్గింది .

నాగేశ్వరస్వామికి ఒక పర్ణశాలకట్టించి నిత్యపూజ జరిగే ఏర్పాట్లు చేశారు .గుర్రాజు సోదరి సుభద్ర భర్త 13రోజులుగా ఎక్కడికి వెళ్ళాడో కనపడక ఎదురు చూస్తూ,విసుగుతోకాశీకి వెళ్లి ఉండిపోవాలనుకొంటే ,శివుడు ఎక్కడైనా శివుడే ,ఇక్కడికే వచ్చి కొలువైన నాగేశ్వర స్వామిని నిత్యం పూజించమని ఊరడించి హితం చెప్పగా ,ఆపర్ణ శాలలోనే అన్నతోపాటు గడుపుతూ శ్రద్ధగా స్వామి సేవలు చేస్తోంది .స్వామికి ఆలయం నిర్మించాలనే కోరిక గుర్రాజు మనసు నిండా ఉంది .దివాను గుర్రాజు సరిగ్గా పనులకు రాకపోవటం గమనించి ఆశ్చర్యపడిన జమీందార్ రామచంద్రరావు  రాణీగారితో సహా ఆ ఉద్యానవన౦  వచ్చాడు .అప్పుడే పూజముగించిన గుర్రాజు ప్రభువుకు తీర్ధ ప్రసాదాలిచ్చాడు .కలలో కనిపించి స్వామి అమ్మవారు చెప్పినట్లు ఇక్కడ ఉద్భవించారని గ్రహించి ఆలయనిర్మాణం తదితర దేవత విగ్రహాల నిర్మాణం తానే చేయిస్తానని మాట ఇవ్వగా కోఠీ పండితుడు బ్రహ్మానందపడ్డాడు .దైవజ్నులచే శుభ ముహూర్త నిర్ణయం చేయించారు .శాలివాహన శకం 1684,శ్రీ చిత్రభాను సంవత్సర మాఘ శివరాత్రి నాడు పనులు.వినాయక షణ్ముఖవీరభద్ర నంది వాహన ప్రతిష్టలు పగలు ,సర్వమంగళతో విశ్వనాథుల ప్రతిష్ట ఆ రాత్రి చేయాలని నిర్ణయించారు  .కవిగారు తర్వాత సాయంకాల వర్ణన చేసి ,కోఠీ రామచంద్రరావు ఆలయ నిర్మాణం గురించి ఆలోచిస్తూ ముందుగా బందరు గ్రామదేవత ‘’మాచకాంబ ‘’ను దర్శించి  ఆచల్లని తల్లి అనుగ్రహం తో పనులు ప్రారంభించాలని భావించి ,గోడుగుపేటలో తన భవనానికి తూర్పుగా ఉద్యానవనానికి ఉత్తరంగా ఉన్న శ్రీమహాలక్ష్మి అనే మాచకాంబ మందిరానికి రానీతో సహా వెళ్లి చీరసారే వగైరా సమర్పించి ,ఆమె కు నాగేశ్వరస్వామి వృత్తాంతం వివరించి ,అనుగ్రహాన్ని పొందారు .

అనుకొన్న ముహూర్తంలో  ఊరి ప్రజలందర్నీ ఆహ్వానించి వినాయక పూజ చేసి శంకుస్థాపన జరిపించగా నిజాం నవాబు  నరసింహారావు అనే మంత్రితో ఒక జాబు దానితోపాటు అరబ్బీ గుర్రం కాసులపేరు మనికాన్చన హారం కానుకగా పంపాడు  .ఆమంత్రికి రాణికి రాజుకు శివుని విభూతి బిల్వదలాలు కానుకగా పంపాడు రామచంద్రరావు .పనులు వేగంగా జరుగుతున్నాయి తర్వాత వర్షర్తు వర్ణన చేశాడు కవి .పనులు ఎలా జరుగుతున్నాయో చూద్దామని రావు ,దివాను వెళ్ళగా అక్కడ ఒక బాలిక బాలుడు ఆనీతిలో పడవల ఆట ఆడుతున్నారు .ఆబాలుడు శివుడిని శ్రద్దహ్తో పూజిస్తే వర్షాలు ఆగిపోతాయని అన్నాడు .అలాంటి చిన్న చిన్న కోర్కెలు దేవుడిని కోరకూడదు రావు అనగా ,బాలిక ‘’ఆలయనిర్మాణం అయ్యేవరకు ఇకనుంచి ఇక్కడ పగలు వర్షం పడదు ‘’అనగా అవాక్కై ,ఎవరిపిల్లలు వారు అని ఆరాతీయగా ఎవరూ చెప్పలేకపోయారు. పార్వతీ పరమేశ్వరులే వాళ్ళు అనుకొన్నారు అందరూ .ఈవార్త భార్యకు చెప్పాలని ఆత్రంతో రావు ఇంటికి వెళ్ళగా భార్య ‘’మనింటికి పార్వతీ పరమేశ్వరులు వచ్చి భోజనం చేసి వెళ్లారండీ.మళ్ళీ శివరాత్రికి వస్తామని చెప్పారండీ ‘’ ‘’అనే శుభవార్త చెప్పగా ఆనంద పరవశు డై,తానూ చూసిన బాల,బాలికా విషయాలు ఆమెకు చెప్పాడు .ఆమె పార్వతీ పరమేశ్వరులను మూడురోజులు ఉండివెళ్ళమని కోరాననీ ,ఎప్పుడూ ఎక్కడికో అక్కడికి వెళ్ళే తమకు అలాఉండటం కుదరదనీ శివరాత్రి నుంచి ఇక్కడే ఉంటూ మీ అందరి యోగక్షేమాలు చూస్తాం కదా అని అన్నారని భార్య చెప్పింది .తర్వాత శరదృతువు చంద్రోదయ వర్ణనం చేశాడు కవి .

ఆశ్వయుజమాస శుక్లపక్షం లో రావు గారికి తాము కట్టే దేవాలయం లో అమ్మవారి అయ్యవారి కి ఏపేర్లు పెట్టాలని ఆలోచిస్తూ ,విజయదశమికి పెద్దలను పిలిపించి అడిగితె తలోకరకంగా చెబితే లింగం ఉద్భవించిన విధానం నాగుల విషయం బాలిక ఉద్యానవనం లో కనపడటం అన్నీ వివరించి స్వామి శ్రీ నాగేశ్వరస్వామి అని అమ్మవారికి శ్రీ  బాలా త్రిపుర సుందరి అని పేర్లు చాలా సముచితంగా ఉంటాయని చెప్పగా అందరూ ఆమోదించారు .అందులో ఒక వృద్ధ బ్రాహ్మణుడు  ద్వాదశ జ్యోతిర్లింగాల విషయాలు సవిస్తరంగా చెప్పి ,దారువనం లో ఉన్న నాగేశ్వర జ్యోతిర్లింగ వివరాలు చెప్పాడు ..శివ పార్వతుల కల్యాణం జరిగాక ఒక రోజు పార్వతి తల్లి మేనక ‘’శివుడు రూపహీనుడు భిక్షుకుడు స్మశానవాసి ,ధనహీనుడు ‘’అని ఎద్దేవా చేయగా ఆది దంపతులు భరించలేక దారు వనానికి వెళ్లి ,అక్కడినుంచి కాశికి అక్కడినుంచి కైలాసం వెళ్లి స్థిరంగా ఉండి పోయారు .ఒకరోజు ఒక వైశ్యుడు దారువనం గుండా వెడుతుంటే ఒకరాక్షసుడు అతడినీ పరివారాన్ని అక్కడే బంధించి జైలులో పెట్టాడు .అతడు ఉమాపతిని ధ్యానించి పూజించగా శివపార్వతులు ప్రత్యక్షమై పాశుపతం ఇవ్వగా దానితో రాక్షసుడిని చంపి అక్కడున్న స్వయంభు లింగాన్ని పూజించి నాగేశ్వర లింగం గా పేరుపెట్టాడు .ఈయన్ను దర్శిస్తే ద్వాదశ జ్యోతిర్లింగా దర్శన ఫలితం కలుగుతుంది .తర్వాత సృష్టి విధానం ,పార్వతీ దేవి తపస్సు శివపార్వతులకల్యాణ,శివరాత్రి మహిమ చెప్పి శివరాత్రి నాడు ఇక్కడ నాగేశ్వర బాలాత్రిపురసుందరి ప్రతిష్ట చేయటం అత్యంత పవివిత్రం అనీ  ప్రతిష్ట తర్వాత కల్యాణం కూడా జరిపించాలనీ  చెప్పాడు .అందరూ అలానే చేద్దామని నిర్ణయించారు . దీనితో ద్వితీయ ఆశ్వాసం పూర్తి .

తృతీయ ఆశ్వాసం లో ముందుగా ‘’శక్తిత్రయ ‘’వర్ణన చేసి మహిషాసుర మర్దన చెప్పాడుకవి  .తర్వాత న౦దీశ్వరుడు కామధేనువుకుజన్మించి తపస్సు చేయటం, శాశ్వతంగా పరమేశ్వర సన్నిధానం లో ఉండిపోవటం ,రావణ విషయం, సతీ దేవి సంగతి ,దక్షయజ్ఞం ,దక్షాధ్వర ధ్వంసం ,పార్వతిగా మేనకా హిమవంతులకు జన్మించటం ,పార్వతి శివుని వరునిగా పొందటానికి చేసిన తపస్సు ,శివుని మూడవ నేత్రం తో మన్మధ దహనం ,భార్య రతీ దేవి పార్వతిని పతిభిక్ష పెట్టమని ప్రార్ధించటం ,ఆమెకు తప్ప ఎవరికీ మన్మధుడు కనిపించకుండా ఉండేట్లు వరం ప్రసాదించటం ,పెళ్లి రాయబారం ,వసంత రుతు వర్ణన ,పార్వతీ పరిణయం ,వినాయక కద పరశురాముని గొడ్డలి దెబ్బతో ఒక దంతం విరిగి ఏకదంతుడు అవటం ,కుమారస్వామి జననం పెద్దాయన కు గణాధిపత్యం చిన్నాయనకు దేవ సేనాధి పత్యం లభించటం ,లోకాలన్నీ శుఖ శాంతులతో వర్దిల్లటం మొదలైన అన్ని విషయాలు ఆ వృద్ధ బ్రాహ్మణుడు  రామ చంద్రరావు జమీందారుకు అక్కడున్న పురజనులకు వివరంగా చెప్పాడు .రావుగారు ఆయన్ను ఉచిత విధంగా సత్కరించి శ్రీనాగేశ్వర శ్రీ బాలా త్రిపుర సుందరీ ప్రతిష్ట రోజు శివరాత్రి నాడు మళ్ళీ అందరం కలుద్దామని చెప్పి పంపాడు .దీనితర్వాత లయగ్రాహి,  ద్రుత విలంబితం  భుజంగ ప్రయాత లో లో ఆశ్వాశాంత పద్యాలు, గద్యమూ చెప్పి కావ్యం పూర్తిచేశాడు కవి టేకుమళ్ళ రామ చంద్రరావు .

కవి కవిత్వం ధారా ప్రవాహం .లలితపదాలతో భావ సుందరంగా  ఛందో వైవిధ్యంగా ,సాగింది .ఈ కావ్యం గురించి బందరు ప్రజలకు గుర్తు ఉందొ లేదో తెలియదు ఎవరూ ఎప్పుడూ ఉదాహరించినజాడ కూడా నాకు కనిపించలేదు .మహాకావ్యంగా దీన్ని తీర్చిదిడ్డాడుకవి .ఆయన ప్రతిభకు జేజేలు .ఇంతటి ఉత్కృష్ట బందరు లాయరు కవిని ఆయన కావ్యాన్నీ పరిచయం చేసే అదృష్టం నాకు దక్కినందుకు మహదానందం గా ఉంది .రుచికోసం చివరిపద్యాలు –

లయగ్రాహి –‘’ఇందుధర ,దాత్రీ తలకంధర భుజంగ సహమందిర-పృదాకు చయ సుందర మహేశా –కందర విముక్త సుమబృందసహవాస సుకబంధనిక టేశ –యరవింద దళ నేత్రా-నందిత కోతీజలనిదీందుహృదయోత్పల సు గంధ –మధుసక్త శివమందిర నివాసా –బందరు పురీ నిలయ- వందిత సమస్త జన నంది ఘన శత్రు చర  యందుమివే మ్రొక్కుల్ ‘’

ద్రుత విలంబితం –సతిని చేకొని సంతసమంది య –య్యతివ లేని మనో వ్యధమాన్పి పా-ర్వతి వివాహము స్వాస్త్యము గూర్ప మా-కతుల సౌఖ్య చయ మ్మిడు ఈశ్వరా’’ .

భుజంగ ప్రయాతం –‘’  భవానీ తపంబుల్ వివాహాది గాధల్ –భవత్స్వీయ వాక్యప్రవాహోర్ము లందున్ –ధ్రువ స్ధేయమై స్వాంత సంతోషంబు గూర్చెన్-నవోద్యత్ గృహావాస  నాగేశ ఈశా ‘’

గద్యం –ఇది శ్రీ శ్రీవత్స స గోత్రా౦తర్గత టేకుమళ్లాన్వాయ సంజనిత రాజగోపాల రావు తనూభవ రామ చంద్రరావు నామ ధేయ ప్రణీతంబైన’’శ్రీ బాలా త్రిపుర సుందరీ సహిత శ్రీ నాగేశ్వర మహాత్మ్యమ్ము నందు తృతీయాశ్వాసము –మంగళం మహాత్ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ .

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -9-2-21-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఉచిత సమూహిక సత్యనారాయణ వ్రతం .21.02.2021

ఉచిత సమూహిక సత్యనారాయణ వ్రతం .

ఉయ్యూరుశ్రీసువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో మాఘ శుద్ధ నవమి ఆదివారం ఉదయం 9గం.లకు సామూహికంగా ఆవుపిడకలపై ఆవుపాలు పొంగించి పొంగలి తయారు చేయటం ,శ్రీ సూర్యనారాయణ మూర్తికి పూజా, నైవేద్యం జరుగుతాయి .

  వెంటనే సామూహిక శ్రీ సత్యనారాయణస్వామి  వ్రతం ఉచితంగా నిర్వహింపబడుతుంది .దీనికి ఎవరూ ఎలాంటి రుసుము  చెల్లించనక్కరలేదు .పూజాద్రవ్యాలు ఎవరికి వారే తీసుకోనిరావాలి .శ్రీ సత్యనారాయణ స్వామి ప్రసాదం ఆలయం తరఫున తయారు చేయించి అంద జేస్తాము .ఈ కార్యక్రమం లో పాల్గొన దలచిన భక్తులు అర్చకస్వామికి ముందే తెలియజేసి  ,పేర్లు నమోదు చేయించుకోవాలి .

  గబ్బిట దుర్గాప్రసాద్ –ఆలయ ధర్మకర్త -9-2-21-ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

బందరు ఖొజ్జిల్లిపేట నాగేశ్వరస్వామి మహాత్మ్యం -1

బందరు ఖొజ్జిల్లిపేట నాగేశ్వరస్వామి మహాత్మ్యం -1

  అనే ఈ పద్యకావ్య కవి శ్రీవత్స గోత్రికుడు ,టేకుమళ్ళ వంశీకుడు రామచంద్రరావు .తండ్రి రాజగోపాలరావు  కవిగారు ధాత నామ సంవత్సరం ఆషాఢ కృష్ణపక్ష తదియనాడు జన్మించాడు .తల్లి రంగనాయకమ్మ .తండ్రి గొప్పపండితుడు .నన్నయకు ముందు తెలుగులేదని ,జయంతి రామయ్య గారు చెప్పగా  యుద్ధమల్లుని శాసనం లో ఉన్నది వచనం కాదనీ ,మధ్యాక్కర పద్యాలనీ ఈయన చెప్పాడు .కాశీ భట్ల బ్రహ్మయ్యగారిని కూడా ఒప్పించిన ఘనుడు .దీన్నీ బట్టి తెలుగు కవిత్వ ప్రాచీనత,మధ్యాక్కరల ఉనికి  రుజువు చేశాడు.దీనితోపాటు పదాలపుట్టుక ,ఇతరభాషల ఛందోరీతులు బాగా అధ్యయనం చేసి లోకానికి చాటాడు .తెలుగు మళయాళ కన్నడ తుళుతమిళ ట్యుటోనిక్ భాషలలోని తొలిశబ్దాలు ఛందస్సు ఒకే విధమైనవని ,ఇవన్నీ ఆర్యభాషల మొదటి శాఖలని ఉదాహరణపూర్వకంగా వివరించాడు  .తెలుగు భాషకు సూర్యుడిలా వెలిగి ,మద్రాస్ యూని వర్సిటి లో ఉన్నతాధికారి యై ,అనేక గ్రంథాలు రాసి ,అమోఘ విజ్ఞానం తో ,వినయ శాంత స్వభావాలతో తనకు సాటి తానే అన్నట్లుగా వెలిగిన తండ్రి బహుధాన్య మార్గశిర  బహుళ పాడ్యమి నాడు 63వ ఏట మరణించాడు .తర్వాత తల్లికూడా చనిపోయింది .తలిదండ్రుల సంతానం లో మనకవి రామచంద్రరావు అగ్రజుడు.ఈయనకు ఇద్దరుకొడుకులు .బందరులో విద్యార్ధి, గ్రంథాలయ,ఆంధ్రోద్యమలాలలో  నాయకత్వం వహించాడు  .’’సంఘసేవకు జీవన సౌరభం అర్పించి ‘’ ప్రజలమేలుకోసం పాటుపడ్డాడు .నవలలు ,నాటకాలు , వ్యాసాలు ,కథలు,కొన్ని గ్రంథాలు రాశాడు .బందరులో న్యాయవాదిగా పని చేస్తూ సంఘం లో పేరు ప్రఖ్యాతులు పొందాడు .’’సరళకవితా విలాస వైశద్యమొసగు ఈ’’ఖొజ్జిల్లిపేట నాగేశ్వరమహాత్మ్యం ‘’  కావ్యం ‘’ నాగేశ్వరస్వామికి అ౦కితమిస్తున్నానని చెప్పాడు.

  ఈకవి వంశ చరిత్ర తెలిపాడు .టేకుమళ్ళ వారు మొగల్ ఫౌజు దార్ల  ,ఉద్యోగ ముఖ్యజనుల గోల్కొండ ఆర్కాటు ప్రభువుల మంత్రులుగా మాన్య వంశం వారు .దక్కన్ సైన్యాధ్యక్షుడు ‘’వీరబల’’ బిరుదాంకితుడు ,కపిల నరసింహుడు  హైదరాబాద్ దగ్గర’’ టేకుమళ్ళ’’ గ్రామవాసి ..ఈయనకొడుకు రామూజీకి ధర్మాజీ ,ఈయనకు కృష్ణప్ప ,నరసింహారావు పుట్టారు .నరసింహారావు ఆసఫ్ జాహి ఆదిపితామహుడికి ఇష్టమైన మంత్రిగా ఉంటూ ,బందిపోటు దొంగలను అణచి  వర్తక వాణిజ్యాలు చేసేవారిపై రాజుకు ఆదరం కలిగేట్లు చేసి తన ధర్మాన్ని న్యాయంగా నిర్వహించాడు .ఎక్కడ అన్యాయం దోపిడీ ఉన్నా వెళ్లి వారిని కట్టడి చేసి ప్రజల ధనమాన ప్రాణాలకు రక్షణ కల్పింఛి ‘’తెలుగు సింహం ‘’అని కీర్తి పొందాడు .

  కపిల నరసింహారావు మొదటికొడుకు రంగశాయి కవితా సంపన్నుడు .మనవడు అచ్చన్న పంతులు ‘’వీరవర ‘’ ‘’ఫౌజుదార్ ‘’ అనే వంశ బిరుదనామాలు,’’రాయజీ ‘’అనే లౌకికనామం  పొంది ,ఆర్కాటు నవాబుకు ప్రధానమంత్రి అయ్యాడు .  హిందూ ముస్లిం ఐక్యత నెలకొల్పి ,అరాచకం  ప్రబలకుండా చేసి దేశాన్ని సస్యశ్యామలం చేసి కరువుకాటకాలు లేకుండా చేసి అందరి మెప్పూ పొందాడు .అనేక చోట్ల చెరువులు త్రవ్వించి సాగు తాగు నీటికి లోపం లేకుండా చేశాడు .

  ఒక రోజు ఒక కులస్త్రీ బహిష్టు అయి ,వాకిట్లో చాపచుట్ట పెట్టి ,కోనేట్లో స్నానం చేసి వచ్చేలోపు ,ఒక గూ౦డావచ్చి చాపచుట్టలో మాంసం దాచగా, ఆమెరాగా వాడు  అన్నమని ఆఎంగిలి కూడుతిని పించి ఆమెతో కలిసి ‘’నాతోకాపురం చెయ్యి ‘’అని బలవంత పెట్టాడు .తనకేపాపం తెలీదు మొర్రో అన్నా వినిపించుకోక చాపచుట్ట తీసి వాడు చూపిస్తే అందులో మాంసం కనిపించి అవాక్కైనదిఆమె .ఇంతలో జనం ప్రోగై కొందరు ఆమెను దుష్టురాలని మరికొందరు శిష్టురాలని అనేకరకాలుగా మాట్లాడారు .ఆమె ఆమె భర్త ఆ గూండా కు ఎన్నో రకాలుగా నచ్చ  చెప్పే ప్రయత్నం  చేశారు .ఆమె మామగారు రాయజీ కిఫిర్యాదు చేయగా ,వెంటనే రాజభటులను పంపి ఆ గూ౦డాల కొంపలు పీకించి భయపెట్టి ఊరిను౦చి పారద్రోలించాడు .సాయబులు  నవాబు దగ్గరకు వెళ్లి ముసల్మానుల్ని రాయజీ బతకనివ్వటం లేదని ఫిర్యాదు చేస్తే ,ఆయన ‘’మంచివాడుకనుక మంత్రిగారు మిమ్మల్ని వదిలిపెట్టాడు.నేనైతే కత్తికి ఖండఖండాలుగా నరికేసేవాడిని .మన పవిత్ర గ్రంథం కురాను ఐకమత్యాన్ని బోధిస్తే ,మీరు దానికి వ్యతిరేకంగా ప్రవర్తించటం నేను సహించను ..రాయజీ తప్పు చేయడు.ప్రజాక్షేమం న్యాయధర్మాలు దైవభక్తీ నాయోగక్షేమాలే ఆయనకు ముఖ్యం .మీరు ఇంక ఆ వూరిలో  ఉండద్దు .ఎక్కదడికైనా వెళ్లిబతకండి .అతిక్రమిస్తే కఠిన దండన తప్పదు ‘’అని నిర్మొహమాటం గా చెప్పాడు నవాబు . మరోసారి స్నానఘట్టం మెట్లకు ఆనుకొని ఉన్న రాతి ఏనుగు తలమీద లో ఎవరో స్త్రీ ,ముక్కు పుడక మర్చి పోయి వెడితే ,అది ఎవరిదో తేలేదాకా కాపలా పెట్టించాడు రాయజీ .ఒక ఏడాది తర్వాత ఒక తల్లీ కూతురు వచ్చి అక్కడి ముక్కుపుడక తనదే అని ఆ కూతురు చెప్పగా ,ఆమెకు దాన్ని రాయజీ అందింప జేశాడు .అనేక చోట్ల త్రవ్వించిన చెరువులు రాయజీ చెరువులుగా పిలువబడుతున్నాయి ఇప్పటికీ

  పైన చెప్పిన నృసి౦హా మాత్యుడికి శాయన్న ,ఆయనకు శ్రీనివాసరావు పుట్టారు .శ్రీనివాసరావు, కొడుకు రామారావు నిడదవోలు సెట్టిపేటలో ఉండేవారు .రామారావు తర్వాత విజయనగరం వెళ్లి అక్కడే ఉండిపోయాడు .ఈయనకు ఈ కవిగారి తాత నారాయణరావు పుట్టాడు .ఈయనగురించి ముందే చెప్పుకొన్నాం .ఇక కావ్యం ,అందులోని విశేషాలు రేపు తెలుసుకొందాం .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-2-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బందరు ఖొజ్జిల్లిపేట శ్రీ నాగేశ్వరస్వామి మహాత్మ్యం -2 మహాత్మ్యం -2

బందరు ఖొజ్జిల్లిపేట శ్రీ నాగేశ్వరస్వామి మహాత్మ్యం -2

  ఈ కావ్యం లో కవి టేకుమళ్ళ రామచంద్రరావు మొదటి ఆశ్వాసం లో శ్రీ లక్ష్మీనారాయణ ,శివ పార్వతి ,సరస్వతీ బ్రహ్మ ,వినాయక మొదలైన ఇష్ట దేవతలను,,తెలుగు కవులకను  వివిధ మధ్యాక్కర లలో స్తుతించాడు .తర్వాత శ్రీ నాగేశ్వరాలయం విషయం వివరించాడు .స్వామి స్వయంభు అని తెలిపాడు .వేకువ జామునుంచే స్వామికి నిత్యార్చనలు,గీత గాత్ర గోష్టులు జరుగుతాయి .సాయం వేళ స్త్రీలంతా సామూహిక గానం భజనలు చేస్తారు .మహాపండితులు వివిధ పురాణాలపై ఉపన్యాసాలు చేస్తారు .ప్రతిరోజూ వందలాది జనం స్వామిని దర్శించి తరిస్తారు .రాత్రిపూట ఇచ్చే చివరి హారతి చూస్తే దేవాలయం భూలోక కైలాసంగా కనిపిస్తుంది .అభీష్ట సిద్ధికి ఆరోగ్య సిద్ధికి నిత్యాభి షేకాలు జరిపిస్తారు.ఇలాంటి ప్రసిద్ధ ఆలయానికి దగ్గరలో మనకవి 18 ఏళ్ళు కాపురమున్నాడు .

   ఒకరోజు కవి కూతురు ధర్మావతి స్వామిపై కావ్యం రాయమని కోరింది .శరత్ నవరాత్రులలో సరస్వతీ పూజ నాడు  కొన్ని అమ్మవారు శ్రీ బాలా త్రిపురసుందరి అయ్యవారు శ్రీ నాగేశ్వరస్వామి ,మొదలగు దేవతలపై పద్యాలు రాసి స్వామి సన్నిధానం లో చదివి వినిపించాడు .కూతురు కూడా ఇందులో కొన్ని పద్యాలు రాసింది   .’’ఈ కృతిని అంకిత మిచ్చుచున్నాడ దేవా స్వీకరి౦పుము ‘’అని సభక్తికంగా అంకితమిచ్చాడు  .షష్ట్య౦తాలు కూడారాసి  కథా ప్రారంభం చేశాడు .ముందుగా బందరు పురవర్ణన చేశాడు –‘’రేడోకండు చేపకంటితో రేవుగవని గట్టగ’’మచిలీ బందరై ‘’క్రాలె పురము –‘బందడ’’ను నొకజాలరి పట్టెన౦ట-యా మహా ఝషమొక యుపాయముపన్ని ‘’అని బందరు కు చేపకన్ను ద్వారం పెట్టటం వలన మచిలీ బందరు అయింది .ఆ పెద్ద  చేపను పట్టినవాడు’’ బందడు ‘’అనే జాలరి రెండూకలిసి వచ్చేట్లు ‘’మచిలీ బందరు’’ అయింది .గోప్పరేవుపట్టణంగా  మచిలీబందరు ప్రసిద్ధమయింది .

  పూర్వం బందరు సముద్రంలో పెద్ద చేపలాగా ఒదిగి ఉండేది .పార్వతీ  దేవికిచ్చిన మాటప్రకారం సముద్రం లో లింగరూపం లో శివుడు ఉద్భవించాడు .సముద్రం కాలాంతరం లో మెరక వేయగా  ఏర్పడిన భూమియే శివునికి ఇల్లు అయి ,అనంత వాసుకి మొదలైన నాగులు తెల్లగొడుగుపట్టారు –‘’నాగమందిరుండు నాగ సేవితుండు –నాగ భూష ణు౦ డు,నాగవరదు –డై గిరీశుడేసగే ‘’నాగేశ్వరుండయి ‘’-భూమి లోన నూరు పుష్కరములు ‘’.

  18వ శతాబ్దం లో బందరునగరం జనం భవనాలు తోటలు పంటపొలాలతో బాగా విస్తరిల్లింది .నవాబుల దేవిడీలు ,కోఠీ మహలులబారు,కా0ద్రేగులవారి మేడలు , మాజేటి వైశ్యప్రముఖులమేడలు ,పచ్చమేడ వగైరాలేర్పడ్డాయి .నవాబులిచ్చిన మాన్యాలలో బ్రిటిష్ వారు వర్తకం చేశారు .కొన్ని గిడ్డంగులు ,కోట కట్టి చాకిరేవుకు ఈశాన్యం లో ఇంగేలీష్ పాలెం నిర్మించారు .దీనికి తూర్పున ఫ్రెంచ్ వర్తకుల ఇళ్ళు,గిడ్డంగులు తో ఫ్రెంచ్ పేట ఏర్పడింది .దీనికి ఉత్తరంగా వల౦దాలు  గిడ్డంగులు ఇళ్ళు చెరువులు ఏర్పరచి హాలండ్ లాగా సుందరం చేసి వల౦దపాలెం అన్నారు .ఇనుగుదురు దక్షిణ ప్రాంతం లో నవాబులు షియాలు సున్నీలు ఉన్నారు .గొడుగుపేట ,ఈడేపల్లి మొదలైన చోట్ల  హిందువుల ఆవాసాలు వచ్చాయి. హిందువుల ఇళ్ళు అన్నీ లక్ష్మీ ప్రదంగా సర్వ శోభాయమానంగా ఉన్నాయి .వస్త్రాలనేత ,కలంకారీ అద్దకం ‘’మసిలిన్ వస్త్రాలు ‘’ నేతగాళ్ళతో పాటు నేతగత్తేలు కూడా నాణ్యంగా నేసేవారు .ఊరిమద్యలో వర్తక సంస్థలు చాలా వచ్చాయి .

  బందరు ముఖ్యవీధిలో ఏనుగులు గుర్రాలు శకటాలు వగైరా సంచారం ఎక్కువై రక్కిస చెట్లు విస్తారంగా పెరిగాయి .బొమ్మ జెముడు రేగు తుమ్మ పల్లేరు నాగజెముడు కొండగోగు,కానుగ కసంది ,ఉమ్మెత్త,జిల్లేడు  పొదలు పెరిగాయి .గచ్చ కుక్కమేడి,గర్దభాండం దురదగొండి తాండ్ర,దిరిసెన,మంగ ,కలిమార , కాకివెదురు,తిప్ప చాగ ,ఈత తాటిగుబురు మొదలైనవి విపరీతంగా పెరిగి కాక ఘూక ,ఝిల్లిక తేళ్ళు,నక్కబొక్కలు అక్కడక్కడ పెద్ద పాముల పుట్టలుపెరిగి’’ రక్కిస దిబ్బ’’అనే పెరుపొంది౦ది ఆ మెరకప్రదేశం .

  ఆకాలం లో  జమీ౦దారు కోఠీ రామ చంద్రరావు  అనే ద్వైతి,పూర్ణ బోధ ప్రశిష్యుడు ,ధర్మపరాయణుడు ఉండేవాడు .రేవుల అజమాయిషీ వర్తకవాణిజ్యాల పై పట్టు ఉన్నవాడు ,నైజాముకు హితుడు ,సన్నిహితుడు .నీతి,దక్షత రుజువర్తనం ,కార్య తత్పరత ,విశ్వాసం సత్యనిరతి కలిగిన వాడు .క్షణం తీరిక లేకుండా ఉండే ఆయన ఒక సాయంత్రం వాహ్యాళి వెళ్లి రక్కిస దిబ్బను చూసి అక్కడ ఒక ఉద్యానవనం నిర్మిస్తే బాగుంటుందని భావించాడు .ఊరిమద్యలో ఇలాంటివి ఉండటం ఊరికి మంచిదికాదని దైవజ్నులను పిలిపించి ,అందరితో చర్చించి ,ఆదిబ్బ ఉన్న చోట ఒక ఉద్యానవనం ఏర్పాటు చేసే ప్రయత్నం చేశాడు .అందరు గొప్ప ఆలోచన అని మెచ్చారు .ముహూర్తం నిర్ణయించి ,ఆమధ్యాహ్ణమే దివాన్ గురురాజు కు కబురుపంపి పిలిపించి  ఉద్యానవన బాధ్యత అప్పగించాడు .కొద్దిరోజుల్లోనే రక్కిస దిబ్బ సుందర ఉద్యానవనంగా మార్పు చెంది అనేక పుష్పజాతులు ,కుంద క్రోటను వగైరాలతో కను విందు చేసేట్లు తయారైంది .చెరువులో తామరకలువలు మానసికనందాన్నిచ్చాయి .

  ఒకరోజు పండు వెన్నెలలో జమీందారు ఆఉద్యానవన విహారం చేశాడు .ఆరాత్రి ఆయనభార్య జానకీబాయమ్మకు  స్వప్నం లో పార్వతీ మాత బాలాత్రిపుర సుందరీ దేవిగా దివ్య దర్శనమిచ్చి శివుని త్రిపురాసురవధ  వృత్తాంతం అంతా చెప్పి ‘’అమ్మా ! నీ కడుపులో నేను పుత్రికగా సరస్వతీ లక్ష్మీ నాకు  చెల్లెళ్ళు గా  జన్మిస్తారు .మమ్మల్ని చక్కగా సాకి పెద్దవాళ్ళను చేయి .నాభర్త శివుడు ఇక్కడ పుడతాడు .ఆయనా నేనూ ఈప్రదేశం లో ఉంటూ ప్రజారక్షణ చేస్తూ కోరికలు తీరుస్తాం .మళ్ళీ నీకు కనిపిస్తాను అని చెప్పి సర్వాలంకార శోభితగా పరమేశ్వరునితో  కనులపండువుగా దర్శనమిచ్చి అంతర్ధానమైంది .

  మర్నాడు ఉదయమే భర్తకు స్వప్న వృత్తాంతం అంతా చెప్పగా ,తమ జీవితాలు ధన్యమయ్యాయని ఆ దంపతులు ఎంతో సంతోషించి భక్తితో ప్రార్ధనలు- చేశారు .జానకమ్మకు కన్పించిన ఆది దంపతులు అర్ధనారీశ్వర స్వరూపం ఎలాఉన్నదో కవిగారి పద్యం లో చూద్దాం –‘’శ్యామారుణ జటాశైలేందు కలికతో –గాల వేణీ ఫణాగ్రమణి తోడ –గాత్ర ప్రభావలీ కలశ వీచికలతో –దేహేంద్రు నీల చంద్రికల తోడ –గటి వేష్టిత ద్విప కాలచర్మమ్ముతో –బరిధీయవల్కలా౦బ రములతో-బాదార్యమోదయ  పాండుర ప్రభలతో –నబ్జోదయే౦దీవరాంఘ్రి తోడ –హరిణములజంట యాశ్రమమందు వోలె –నంది హరియు నెసగ ,ఫణుల్ నగలు గాగ –న౦బకంబులు సుధా కలశంబు లగుచు –గరుణ స్రవియింప,బతి యందు గలిసి నిలిచి ‘’అని వర్ణించాడు కవి టేకుమళ్ళ రామ చంద్రరావు .ప్రధమ ఆశ్వాసం చివర శాలిని ,ఉత్సాహ వృత్త పద్యాలు ,గద్యం చెప్పి ముగించాడు .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-2-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

వెలుగూ వెన్నెలాగోదారి ”భాషా వేత్త పోరంకి దక్షిణామూర్తి మృతి

డా. పోరంకి దక్షిణామూర్తి

పోరంకి దక్షిణామూర్తి తూర్పు గోదావరి జిల్లా ఆరులో 29-12-1935న జన్మించారు  తెలుగు అకాడమి ఉపసంచాలకుడిగా పనిచేసి 1993 లో పదవీ విరమణ చేశారు.

ఆయన అనేక నవలలు, కథలు, కథానికలు, పరిశోధనా వ్యాసాలూ రాశారు. ‘వెలుగూ’,రంగల్లి’ అన్న నవలలను తీరాంధ్ర, తెలంగాణా, రాయలసీమ మాండలికాలలో రచించారు.

తెలుగు కథానిక స్వరూప స్వభావాలపై సిద్ధాంత వ్యాసం రచించి డాక్టరేట్‌ ‌పట్టా పొందారు. తెలుగు కథానికపై పరిశోధన చేసి డాక్టరేట్‌ పొందిన ఆయన తెలుగు భాషకు ఎనలేని సేవ చేశారు. తూర్పు గోదావరి జిల్లా ఆలమూరులో 1935 డిసెంబరు 24న దక్షిణామూర్తి జన్మించారు. డిగ్రీ వరకూ కాకినాడలో చదివారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీజీ పూర్తి చేశారు. అనంతరం, అదే యూనివర్సిటీలో తెలుగు శాఖ రీడర్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. 1969లో తెలుగు అకాడమీకి బదిలీ అయ్యారు. ఆ సమయంలో పలు నిఘంటు నిర్మాణాల్లో క్రియాశీల పాత్ర పోషించారు. వృత్తి పదకోశం రూపకల్పనలో ప్రఖ్యాత భాషావేత్త భద్రిరాజు కృష్ణమూర్తికి సహాయకుడిగా పని చేశారు. నలభై వేల పదాలతో ‘ఇంగ్లిషు-తెలుగు-ఇంగ్లిషు’ నిఘంటువును సంకలనం చేశారు.

పాఠ్య పుస్తకాల రూపకల్పనలోనూ ముఖ్య భూమిక పోషించారు. తెలుగు అకాడమీలో సుదీర్ఘ కాలం సేవలు అందించిన పోరంకి దక్షిణామూర్తి డిప్యూటీ డైరెక్టరుగా 1993లో పదవీ విరమణ చేశారు. అనంతరం పాత్రికేయ విద్యార్థులకు తెలుగు పాఠాలు బోధించారు. తెలంగాణ మాండలికంలో ‘ముత్యాల పందిరి’, రాయలసీమ మాండలికంలో ‘రంగవల్లి’, కోస్తాంధ్ర మాండలికంలో ‘వెలుగూ వెన్నెలా గోదారి’ నవలలను ఆయన రచించారు. అలా మూడు మాండలికాల్లోనూ నవలలు రచించిన తొలి వ్యక్తిగా ఖ్యాతి పొందారు.

మరెన్నో కథలు, నవలలు, పరిశోధనా వ్యాసాలతో కలిపి సుమారు 40 పుస్తకాలు రచించారు. లెక్కకు మిక్కిలిగా అనువాదాలు చేశారు. అన్నిటి కంటే ముఖ్యంగా, పరమహంస యోగానంద జీవిత చరిత్ర ‘ఒక యోగి ఆత్మకథ’ను ఆయన తెలుగులోకి అనువదించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రియా యోగులందరికీ ఇది ఓ పాఠ్య గ్రంథమైంది. ఇదే పుస్తకానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తమ అనువాద పురస్కారాన్ని ప్రదానం చేసింది. కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు కమిటీకి సభ్యుడిగానూ ఆయన పని చేశారు.

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

సరసభారతి శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది వేడుకలు-4-4-21

సరసభారతి శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది వేడుకలు-4-4-21

  సాహితీ బంధువులకు శుభ కామనలు -సరసభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది వేడుకలను  ఉగాదికి పదిరోజులముందు 4-4-21 ఆదివారం సాయంత్రం జరపాలని నిర్ణయించాము .కార్యక్రమం లో జీవన సాఫల్య పురస్కారం ,ఉగాది సాహితీ పురస్కారాలు ,స్వయం సిద్ధ పురస్కారాలు అందజేయబడుతాయి . సంగీత కచేరి ,మూడు పుస్తకాల ఆవిష్కరణ ,కవిసమ్మేళనం నిర్వహిస్తాము . వేదిక ,మిగిలిన విషయాలు ఫిబ్రవరి చివరివారం లో అంద జేస్తాము .సంగీత,సాహిత్యాభిమానులు ,కవిమిత్రులు   విశేషంగా పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన .  గబ్బిట దుర్గాప్రసాద్-సరసభారతి అధ్యక్షులు  -7-2-21-ఉయ్యూరు 

Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

శ్రీ శంకర విజయం Facebook live Links

శ్రీ శంకర విజయం Facebook live Links

 

Date Episode Link   శ్రీ శంకర విజయం.
14th dec 2020 27 https://www.facebook.com/sarasabharathi.vuyyuru/videos/3541749515900867/

 

https://www.facebook.com/sarasabharathi.vuyyuru/videos/3541825899226562/

 

13th Dec 2020 26 https://www.facebook.com/sarasabharathi.vuyyuru/videos/3539102129498939/
12 dec 2020 25 https://www.facebook.com/sarasabharathi.vuyyuru/videos/3536511286424690/

 

11 Dec 2020 24 https://www.facebook.com/sarasabharathi.vuyyuru/videos/3533816880027464/
10 dec 2020 23 https://www.facebook.com/sarasabharathi.vuyyuru/videos/3531227443619741/

 

9 dec 2020 22 https://www.facebook.com/sarasabharathi.vuyyuru/videos/3528724093870076/

 

8 dec 2020 21 https://www.facebook.com/sarasabharathi.vuyyuru/videos/3526083267467492/

 

7 dec 2020 20 https://www.facebook.com/sarasabharathi.vuyyuru/videos/3523586354383850/

https://www.facebook.com/sarasabharathi.vuyyuru/videos/3523483537727465/

 

5 dec 2020 19 https://www.facebook.com/sarasabharathi.vuyyuru/videos/3518334941575658/
4dec 2020 18 https://www.facebook.com/sarasabharathi.vuyyuru/videos/3515595211849631/
3dec 2020 17 https://www.facebook.com/sarasabharathi.vuyyuru/videos/3512793225463163/
2dec 2020 16 https://www.facebook.com/sarasabharathi.vuyyuru/videos/3510172342391918/

https://www.facebook.com/sarasabharathi.vuyyuru/videos/3510085309067288/

30 nov 2020 15 https://www.facebook.com/sarasabharathi.vuyyuru/videos/3504572182951934/

 

29 nov 2020 14 https://www.facebook.com/sarasabharathi.vuyyuru/videos/3501862323222920/

 

28 nov 2020 13 https://www.facebook.com/sarasabharathi.vuyyuru/videos/3499096126832873/

 

27 nov 2020 12 https://www.facebook.com/sarasabharathi.vuyyuru/videos/3496368543772298/

 

26 nov 2020 11 https://www.facebook.com/sarasabharathi.vuyyuru/videos/3493641994044953/

 

25 Nov 2020 10 https://www.facebook.com/sarasabharathi.vuyyuru/videos/3490987000977119/

 

24 nov 2020 9 https://www.facebook.com/sarasabharathi.vuyyuru/videos/3488159361259883/

 

23 nov 2020 8 https://www.facebook.com/sarasabharathi.vuyyuru/videos/3485469004862252/

 

22 nov 2020 7 https://www.facebook.com/sarasabharathi.vuyyuru/videos/3482793975129755/

 

21 nov 2020 6 https://www.facebook.com/sarasabharathi.vuyyuru/videos/3480099752065844/

 

20 nov 2020 5 https://www.facebook.com/sarasabharathi.vuyyuru/videos/3477296359012850/

 

19 nov 2020 4 https://www.facebook.com/sarasabharathi.vuyyuru/videos/3474737285935424/

https://www.facebook.com/sarasabharathi.vuyyuru/videos/3474784685930684/

https://www.facebook.com/sarasabharathi.vuyyuru/videos/3474677259274760/

 

18 nov 2020 3 https://www.facebook.com/sarasabharathi.vuyyuru/videos/3471999339542552/

 

17 nov 2020 2 https://www.facebook.com/sarasabharathi.vuyyuru/videos/3469222076486945/

 

16 nov 2020 1 https://www.facebook.com/sarasabharathi.vuyyuru/videos/3466444760098010/

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సోమవారం నుంచి సరస్వతీపుత్రుని శివతాండవం

సోమవారం నుంచి సరస్వతీపుత్రుని శివతాండవం ”

 సాహితీ బంధువులకు శుభకామనలు -సరసభారతి ఫేస్ బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రాసారం చేస్తున్న ”సంగీతసద్గురు శ్రీ త్యాగరాజ స్వామి ”రేపటితో పూర్తి అవుతుంది .
   8-2-21 సోమవారం ఉదయం 10గం.నుండి ”సరస్వతీ పుత్రుని శివతాండవం ”ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమవుతుంది .ఇది పూర్తికాగానే   రెండవభాగంగా శ్రీ మాధవ విద్యారణ్య స్వామి రచించిన ”శ్రీశంకర విజయం ”8 వ సర్గ నుండి ప్రారంభమవుతుందని తెలియజేయటానికి సంతోషంగా ఉంది -దుర్గాప్రసాద్ -6-2-21-ఉయ్యూరు
Posted in సమీక్ష | Leave a comment

సరస భారతి త్యగారాజ ఆరాధనోత్సవం పై జ్యోతి కధనం -4-2-21

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

రేడియో టాక్

https://voca.ro/1ooYBePWMrWC

Durga Prasad garu Namasthe Today morning your talk was broadcast in AIR Vijayawada. Congratulations sir to your golden tone and good analyzation of the subject. Thank you sir BeeramSundararao Chirala 9848039080

Posted in రేడియో లో | Tagged | Leave a comment

సరసభారతి 155 వ కార్యక్రమంగా 2-2-21 మంగళవారం శ్రీ త్యాగరాజస్వామి 172 వ ఆరాధనోత్సవం

సరసభారతి 155 వ కార్యక్రమంగా 2-2-21 మంగళవారం శ్రీ త్యాగరాజస్వామి 172 వ ఆరాధనోత్సవం

ప్రతి మనిషికి సంగీత, సాహిత్యం పట్ల మక్కువ ఉండాలని మక్కువ ఉండాలని శాసనమండలి సభ్యులు శ్రీ వైవిబి రాజేంద్ర ప్రసాద్ అన్నారు . ఉయ్యూరులోని శ్రీ సువర్ఛలాంజనేయ స్వామి వారి సన్నిధిలో మంగళవారం రాత్రి సంగీత సద్గురు అరి త్యాగరాజ స్వామి వారి 172 వ ఆరాధానోత్సవాన్ని ‘సరస భారతి’ సాహిత్య సాంస్కృతిక సంస్థ తమ 155వ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
సంగీత సద్గురు త్యాగరాజ స్వామి కీర్తనలు వింటే మానసిక వత్తిడి నుండి ఉపశమనం దొరుకుతుందని, ఆయన కీర్తనలు అజరామరమని తెలిపారు . ఇప్పటి సమాజంలో తగ్గిపోతున్న సంగీత ఉనికిని మన ఉయ్యూరు పట్టణంలో సరసభారతి సాహిత్య సంస్థ ఇటువంటి సభను ఏర్పాటు చేసి సంగీత సేవ చేయడం అభినందనీయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకులు, సరస భారతి గౌరవాధ్యక్షులు శ్రీమతి జోస్యుల శ్యామలా దేవి, శ్రీమతి జి.మాధవి, చిరంజీవి జి.నితిన్ కౌశిక్, శ్రీ ఆర్. సురేష్ లు పాల్గొని త్యాగరాజ స్వామివారి కీర్తనలను ఆలపించారు. వీటితో పాటుగా అమర గాయకులు స్వర్గీయ ఘంటసాల గారు, మంగళంపల్లి బాల మురళీ కృష్ణ గారు, యస్.పి. బాల సుబ్రహ్మణ్యం గారు పాడిన పాటలను కూడా గాయకులు అద్భుతంగా ఆలపించి, ఆ మహనీయులను గుర్తు చేసుకున్నారు. ఆనంతరం బాలు గారి స్వగ్రామనైన నెల్లూరులో బాలు గారి ఇంటిపక్కనే నివసించి, బాల్యంలో ‘బాలు’ గారితో అనుబంధం కలిగిన శ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్య బాలు గారితో తమ అనుబంధాన్ని తెలుపుతూ.. చిరు ప్రసంగం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనమండలి సభ్యులు శ్రీ వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్ గాయకులను ఉచితరీతిన సత్కరించారు.. సరస భారతి అధ్యక్షులు, తమ గురువులు అయిన శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ గారు 8 పదుల వయసులో కూడా సాహిత్యం, సంస్కృతిపై గల ఆసక్తితో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ.. నేటి యువతరానికి ఆదర్శంగా నిలిచారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని గబ్బిట రమణ, వై.వి. గంగాధర రావు, మాదిరాజు శివలక్ష్మి నిర్వహించారు..

https://www.facebook.com/photo/?fbid=3672966436112507&set=pcb.3672972249445259

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

విస్మృత పౌరహక్కుల ఉద్యమ మహిళా నేత –క్లాడెట్టీ కోల్విన్ -గబ్బిట దుర్గాప్రసాద్

image.png

క్లాడెట్టీ కోల్విన్ 5-9-1939న మేరీ జేన్ గాడ్ స్టన్,సిపి ఆస్టిన్ అనే నిరుపేద ఆఫ్రికన్ అమెరికన్ దంపతులకు అలబామా రాష్ట్రం మాంట్ గోమరిలో జన్మించింది .పేదరికం వలన కూతుర్నిపెంచే స్తొమత లేక తల్లి మేరీ ముత్తాత అమ్మమ్మలు మేరీ అన్నే.క్యుపి కొల్విన్ దంపతులకు దత్తతగా అప్పగించారు . అలబామా రాష్ట్రం లోని మాంట్ గోమరీలో అత్యంత పేదరికం లో కొల్విన్ పెరిగింది .ఈమె ఇద్దరు సోదరీమణులు డాల్ఫిన్ ,వెల్మా .ఇందులో వెల్మాకు చిన్నతనం లోనే పోలియో వచ్చి 13వ ఏడు రాకుండానే చనిపోయింది .

క్లాడేట్టీ బుకర్ టి.వాషింగ్టన్ హైస్కూల్ లో చదివి NAACP Youth Council
మెంబర్ అయి,తన మార్గ నిర్దేశకుడు రోజా పార్క్ తో పరిచయం పొందింది .పౌరహక్కులగురించి అవగాహన పొందింది .

1955లో బుకర్ స్కూల్ లో చదువువుతున్నప్పుడు సిటీ బస్ లోనే స్కూల్ కు వెళ్లి వచ్చేది .ఈ బస్ లో దాదాపు అందరూ నల్లజాతి వారే ప్రయాణం చేసేవారు. జాతి వివక్షత బాగా ఉన్న ఆకాలం లో 1955 మార్చి 12 న ఆమె స్కూల్ నుంచి ఇంటికి ఆ బస్ లో తిరిగి వస్తుండగా , ఎమర్జెన్సీ గేట్ కు రెండుసీట్ల అవతల ఉన్న సీటులో కూర్చుని ఉండగా ,ఒక తెల్లావిడ బస్ ఎక్కగా డ్రైవర్ కొల్విన్ ను మరో ముగ్గుర్ని వెనక్కి వెళ్లి సర్దుకోమని చెప్పి తెల్ల ఆవిడకు ఆ సీటు ఇమ్మన్నాడు .ఆ ముగ్గురు వెనక్కి వెళ్ళారు.కొల్విన్ ప్రక్క సీట్ లో గర్భవతి హామిల్టన్ అనే నల్లజాతి స్త్రీ కూర్చుని ఉంది .అద్దం లోనుంచి డ్రైవర్ చూసి ఆ గర్భవతిని లేచి నుంచుని తెల్లావిడకు సీట్ ఇమ్మన్నాడు లేకపోతె పోలీస్ ను పిలుస్తానన్నాడు .ఆమె తాను లేచి నున్చోలేనని దీనంగా చెప్పింది .పోలీస్ వచ్చి ఆమెను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్ళారు. ఇలాంటి సంఘటనలోనే NAACP సెక్రెటరి రోజా పార్క్స్ అరెస్ట్ కు తొమ్మిది నెలల ముందు ఈపై సంఘటన జరిగింది .ఈ సంఘటనకు కొల్విన్ మనసు గాయమైతే తల్లి ఊరడించినది .రోసా ను ఎవరూ ఏమీ చేయలేరని,ఉద్యమకారులు ఉపేక్ష వహించరని ,త్వరలో న్యాయం జరుగుతుందనీ ఉద్బోధి౦చి౦చి౦ది.

ఆ బస్ లో తనను కూడా లేచి వెనక్కి వెళ్ళమన్నప్పుడు కొల్విన్ తాను స్కూల్ లో జరిగిన పరీక్ష పేపరు గురించి అందులో జాతి వర్ణ వివక్షత గురించిన సమాధానాలగురించి ఆలోచిస్తోంది .నల్లజాతి వారు బ్రౌన్ కలర్ పేపర్ బాగ్ తో స్కూల్ కు వెళ్ళాలి .కాలిపాదాల డ్రాయింగ్ వేసి స్టోర్స్ లో ఇవ్వాలి. ‘’తెల్లవాళ్ళు ఉన్నంత పరిశుభ్రంగా నీట్ గా మీరు డ్రెస్ వేసుకోరు కనుకనే ఈ విచక్షణ ‘’అని కామెంట్ చేసేవారు .దగ్గరున్న అద్దం లోంచి వెనక్కి చూస్తూ క్రిక్కిరిసిన ఆబస్ లో కొల్విన్ ను లేచి నుంచుని వైట్ వుమన్ కు సీట్ ఇమ్మని డ్రైవర్ ఆదేశించాడు .కానీ కొల్విన్ ఆ మాట వినిపించుకోలేదు ‘’ఇది నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ‘’అని తేల్చి చెప్పి,కదలకుండా సీట్ లోనే కూర్చుండి పోయింది .బలవంతంగా ఇద్దరు మనుషులు చెరో భుజం పట్టుకొని బ రెండు చేతులకు బేడీలు వేసి బస్ నుంచి నెట్టేస్తే ‘’రాజ్యాంగ హక్కును కాలరాస్తున్నారు మీరు ‘’అని గట్టిగా అరచింది కొల్విన్ .కొల్విన్ అరచిన అరుపు కేక ,ప్రొటెస్ట్ అమెరికాలో నల్లజాతి పౌరహక్కులకోసం పెట్టిన మొట్టమొదటి నిరసన,న్యాయం కోసం పెట్టిన తొలి కేక అని ఆమె గుర్తు చేసుకొన్నది .

కోల్విన్ పోలీస్ స్టేషన్ కు తీసుకొని వెళ్లి అక్కడ ఆమె శరీరం పై సెక్సువల్ కామెంట్స్ చేశారు .ప్రశాంతతకు భంగం కలిగించిందని ,జాతి విచక్షణ సూత్రాలను అధిగమించి ,పోలీస్ ఆఫీసర్ తో పోట్లాడి,దాడి చేసిందని కోర్టులో కేసుపెట్టారు.అవన్నీ తప్పుడు ఆరోపణలే నని,పోలీస్ ఆఫీసర్ తనపక్క సీట్ లో కూర్చున్నాడని ఆరోజులలో అలాకూర్చుని సెక్స్ కు ప్రోత్సహించటం ఉండేదని కొల్విన్ సమాధానమిచ్చింది .

కొల్విన్ తరఫున మాంట్ గోమరికి చెందిన ‘’మాంట్ గోమరి ఇంప్రూవ్ మెంట్ అసోసియేషన్ ‘’ లాయర్ ఫ్రెడ్ గ్రే వాదించాడు .జువెలిన్ కోర్ట్ ఆమె దే తప్పు అని తీర్పు చెబితే మాంట్ గోమరి సర్క్యూట్ కోర్ట్ కు 1955 మే 6 న అపీల్ చేసింది .అన్ని ఆరోపణలు కొట్టేసి ,పోలీస్ ఆఫీసర్ పై దాడి చేసింది అన్నదాన్ని మాత్రమే పరిగణన లోకి తీసుకొన్నది కోర్ట్ .కొల్విన్ తాను ఏనాటికైనా అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలని కలలు కనేది .

బ్రౌడర్ వి. గేల్ కేసులో కొల్విన్ తో పాటు మరో నలుగురు ముద్దాయిలున్నారు .ఫెడరల్ కోర్ట్ లో కేసు నడిచింది .’’పోలీస్ ఆఫీసర్ కు సివిల్ రైట్స్ లేవు .ఇది నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ‘’అని నిందలు చేస్తూనే ఉంది ఆమె గర్భవతి కూడా .చివరికి కేసు కొట్టేశారు .సుప్రీం కోర్ట్ లోనూ పోలీసులకు వ్యతిరేకంగానే తీర్పు వచ్చి జాతి వివక్షత నేరమని పోలీసులు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని ,ఈ కేసు ఇంతటితో సమాప్తి చేమని సూచించింది .

మాంట్ గోమరి బస్ కేసు జాతీయ స్థాయిలో ప్రచారం పొందింది .కొల్విన్ న్యు యార్క్ సిటి చేరింది .1964-65 వరకు జాతీయ పౌరహక్కుల చట్టం ఆమోదం పొందలేదు .నల్లజాతి సమైక్యతకు రోసా పార్క్స్ నాయకత్వాన్నే నల్లజాతి వారు కోరుకున్నారు .ఈమెకు పరిణతి, ఉద్యోగం ఉండటమేకాక యవ్వనం లో ఉంది కనుక సమర్ధ నాయకత్వం ఇవ్వగలుగుతుందని నమ్మారు .పార్క్స్ రాకతో కోల్విన్ వంటి వారు చరిత్రలో విస్మ్రుతులయ్యారు .2005లో ‘’మాంట్ గోమరి అడ్వర్ టైజర్ ‘’పత్రిక ఇంటర్వ్యు లో ‘’నేను ఆ బస్ లో కూర్చున్నందుకు మరీ మరీ గర్వపడుతున్నాను. నాకంటే పౌరహక్కుల ఉద్యమ నేతగా రోసా ఉండటమే మంచిది ఆమె సమర్దవంత నాయకు రాలు అవుతుంది’’ అని గర్వంగా వినయంగా అన్నది .20-5-2018 న కోల్విన్ ను పౌరహక్కుల ఉద్యమనేతగా సేవల౦దించి నందుకు కాంగ్రెస్మాన్ జో క్రౌలి జీవన సాఫల్య పురస్కారం అందించి’’కాంగ్రెషనల్ సర్టిఫికేట్ అండ్ అమెరికన్ ఫ్లాగ్ ‘’తో ఘనంగా సత్కరించాడు.

తనకు గుర్తింపు లేదన్న నిరాశ లేదని చెబుతూ కోల్విన్ ఇలా అన్నది – I don’t think there’s room for many more icons. I think that history only has room enough for certain—you know, how many icons can you choose? So, you know, I think you compare history, like—most historians say Columbus discovered America, and it was already populated. But they don’t say that Columbus discovered America; they should say, for the European people, that is, you know, their discovery of the new world.[31]

— Claudette Colvin

కానీ In 2016, the Smithsonian Institution and its National Museum of African-American History and Culture (NMAAHC) were challenged by Colvin and her family, who asked that Colvin be given a more prominent mention in the history of the civil rights movement. The NMAAHC has a section dedicated to Rosa Parks, which Colvin does not want taken away, but her family’s goal is is to get the historical record right, and for officials to include Colvin’s part of history. Colvin was not invited officially for the formal dedication of the museum, which opened to the public in September 2016.[

2000 లో ట్రాయ్ యూని వర్సిటీ మాంట్ గోమారి లో ’రోసా పార్క్స్ మ్యూజియం ‘’ప్రారంభిస్తూ కోల్విన్ ను కూడా పాల్గొని అనుభవాలు పంచుకోమని కోరగా They’ve already called it the Rosa Parks museum, so they’ve already made up their minds what the story is.”అని మర్యాదగా తిరస్కరించింది . Rev. Joseph Rembert said, “If nobody did anything for Claudette Colvin in the past why don’t we do something for her right now?” He contacted Montgomery Councilmen Charles Jinright and Tracy Larkin, and in 2017, the Council passed a resolution for a proclamation honoring Colvin. March 2 was named Claudette Colvin Day in Montgomery. Mayor Todd Strange presented the proclamation and, when speaking of Colvin, said, “She was an early foot soldier in our civil rights, and we did not want this opportunity to go by without declaring March 2 as Claudette Colvin Day to thank her for her leadership in the modern day civil rights movement.” Rembert said, “I know people have heard her name before, but I just thought we should have a day to celebrate her.” Colvin could not attend the proclamation due to health concerns.[34]

In 2019 a statue of Rosa Parks was unveiled in Montgomery, Alabama, and four granite markers were also unveiled near the statue on the same day to honor four plaintiffs in Browder v. Gayle, including Colvin.[35][36][37]

అమెరికా కవి లారియట్ రీటా డోవే కోల్మిన్ ను స్మరిస్తూ “Claudette Colvin Goes To Work ‘’ కవిత రాసింది .దీన్ని పాటగా మార్చి మెక్ కచ్చియన్ చేత వర్జీనియా పారామౌంట్ దియేటర్ లో2006లో మొదటి ప్రదర్శన ఇవ్వబడింది .తర్వాత అనేక చానల్స్ లో నాటకాలుగా ఆమె చరిత్ర వచ్చింది .రోసా పార్క్స్ కు మార్టిన్ లూధర్ కింగ్ కు ప్రేరణ క్లాడెట్టీ కోల్విన్అన్నది నిర్వివాదాంశం .అందుకే ప్రసిద్ధ అమెరికన్ if the ACLU had used her act of civil disobedience, rather than that of Rosa Parks’ eight months later, to highlight the injustice of segregation, a young preacher named Dr. Martin Luther King Jr. may never have attracted national attention, and America probably would not have had his voice for the Civil Rights Movement. ‘’అని కీర్తించాడు కొల్విన్ ను .ఇలా విస్మృత పౌర హక్కుల నేతగా చరిత్ర లో మిగిలి పోయింది కోల్విన్.

image.png

-గబ్బిట దుర్గాప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీమదష్టోత్తర హనుమచ్చతకం

శ్రీమదష్టోత్తర హనుమచ్చతకం

శ్రీ పాటి బండ్ల వీరదాసు అనే భక్త శిఖామణి వ్రాసిన’’ శ్రీమదష్టోత్తర హనుమచ్చతకం’’ను సత్తెనపల్లి లోని శ్రీ వీరయార్య వాజ్మయ సమితి 1952లో రేపల్లె ప్రభాత్ ప్రింటర్స్ లో ముద్రించింది . దీనికి శ్రీ వీరయార్య వాజ్మయసమితి కార్యదర్శి శ్రీ బోడేపూడి వెంకటరావు రాసిన ‘’ఒక్కమాట’’ లో –వీరయార్యునిస్వగ్రామం దీపాల దిన్నెపాలెం  లో వెలసిన శ్రీ హనుమతుని పై ఉన్న భక్తి తాత్పర్యాలకు నిదర్శనం గా ఈ శతకం రచించారు ద్వితీయముద్రణ 1998లో జరిగింది .శ్రీ దాసరి పరిపూర్ణయ్య నాయుడు గారు పూర్తి ఆర్ధికసాయం అందించారు .అలాగే వీరయార్యుని ఇతర కృతులూ ముద్రించాలని భావిస్తున్నాం ‘’అని తెలియజేశారు .

 వీరయార్యునిశతకంకం లో  మొదటి పద్యం –‘’శ్రీ వసుధాత్మజ రాముల –సేవన్మేప్పించి తత్వ సిద్ధు డవౌ నీ- సేవకుడను గీర్తించెద-బ్రోవుము దీపాల దిన్నెపురవర హనుమా ‘’

నాలుగవ పద్యం –‘’భవవార్ధి దాటవచ్చును –భువనాత్మక నీదు పాద పూజ నటంచున్ –దవిలి వచి౦తురు ప్రాజ్ఞులు-పవనజ దీపాల దిన్నె పాలెపు హనుమా ‘’’ఛందస్సు తెలియకపొయినా స్వామి కృపతో సుందర కందాలు గూర్చగలిగే నేర్పు కలిగిందనీ –‘’శంకలు మాని ఛి బ్రోవుము –సంకటహర జాలమేల ?’’అంటాడు .’’వక్ష చరోత్తమ నీవతి-దక్షుడవై  వనము బెరికిదర్ప మెలర్పన్ –యక్షుని జంపియు గరువపు –రాక్షసులగొట్టి నావు రణమున హనుమా ‘’అని లంకలో వీరహనుమాన్ కృత్యాన్ని వీరోచితంగా పొగిడాడు కవి .’’నీరాటం లో పట్టిన దాన్ని పోరాటం చేసి చంపి ,దీరాటోపత  రాముని ఆరాటం తీర్చావంటాడు .రోగాలు, రాగాలు వేగంగా పరిమార్చమన్నాడు .’’హరి కమలాకర హంసా –వరతాపస నిచయ హృదయ వారిజ హంసా –యరివర్గ భయద హంసా –పరమాత్మా నను గావు భక్తుడహనుమా ‘’అని హంస శబ్దాన్ని సాభిప్రాయంగా ప్రయోగించి భక్త హంస అని పించాడు .

 చండీ మొండీ దండీ గ్రహాలన్నీ హనుమపేరు చెబితే పరార్ అంటూ ‘’అరయంగ సువర్చలయను –తరుణీ మణితోడ నిరుపమ సౌఖ్యము నొందెడు-కరుణాకరనాకు నీవె గతి యగు హనుమా ‘’అని సువర్చలాన్జనేయం ను స్తుతించాడు ,’’అంజని వరపుత్రుని భవ  –భంజను  దీపాల దిన్నెపాలెపు వాసున్ –రంజను గొల్చెద రయమున –మంజుల తరగాత్రు నిన్ను మది నిడిహనుమా ‘’అని దీపాలదిన్నె హనుమకు కంద దీపాల దివ్వెల వెలుగు కురిపించాడు సత్కవి వీరయార్య ..పరధన,పరభామల హరి౦చాలనుకొనే మనసును అతి రయంగా మార్చేవి స్వామి చరణాలు అంటాడు ‘’తత్వ బోధ చేస్తూ –‘’కాయముధారుణిపాలగు –ప్రాయము బల్వెతలపాలగు పసిడియు గలుగన్ – దాయలపాలగు నెదలో –బాయని నీ సేవ తనదు పాలగు హనుమా ‘’అని యదార్ధం చెప్పాడు .

‘’శరణంటినినీవే నా-దొరవంటినిదునుము నాదుదురితము లంటిన్-పరమంటిని  నీ సేవ యే-కరుణాకర బ్రోవమంటి గదరా హనుమా ‘’అలాగే ‘’హనుమంత వాయుతనయా –వనచర వరకీర్తి మంతవరగుణ నిలయా –దనుజాంతక దీనావన –యని నిను నమ్మి స్మరియి౦చు వాడనయ్యా హనుమా ‘’.తనశతకం చదివితే ఎలాంటి ఫలితం కలుగుతుందో చెబుతూ –‘’భూతలి నీశతకంబును –భూతంబులు సోకి దుఖమొందెడిజనముల్ –బ్రాతిగ బూజించిన నా –భూతములే దుఖమొందిపోవును హనుమా ‘’

  చివరలో తన వంశం గురించి చెప్పుకొన్నాడుకవి –‘’ధర బాపయ సుబ్బమలకు –వరపుత్రుడపాటి బండ్ల వంశోడ్భవుడన్ –గరుణించు వీరయాఖ్యుడ-గరువలి సుత వేరు సేయగాదిక హనుమా ‘’.తనగురువు పీరోజీ గురించి ఘనంగా –‘’పులహరి పీర్దేశికవరు –విలసత్కృప నొందినాడ వేడుకలలరన్  -లలితంబుగ జెప్పితి నిటు –వలదిక దప్పొప్పు లెన్నవాయుజ హనుమా ‘’108వ పద్యం –‘’పుడమిని నీ శతంబును –గడు భక్తినిజదువ ,వినిన గాంతురు వారల్ – కడు సంపదలును సిరులును –గడకును గైవల్యపదవి గలుగును హనుమా ‘’అని ఫలశ్రుతి చెప్పి  సాయుజ్యం కూడా లభిస్తుందని నొక్కి వక్కాణించాడు వీరయార్య హనుమ  భక్తకవి .చక్కని ధారా, శబ్దసౌందర్యం ,భావ పరిమళం ,భక్తి గరిమ శ్రేష్ఠ కవనం తో శతకం ముగ్ధమనోహరంగా ఉంది .భక్తి శతకాలలో తప్పక చేరాల్సిన శతకం వీరయార్యుని ‘’శ్రీ హనుమష్టోత్తర శతకం ‘’.

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -1-2-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

32నుంచి మహా భక్త శిఖామణులు 32-భక్త మణి పాటిబండ్ల వీరయార్య

32నుంచి మహా భక్త శిఖామణులు

32-భక్త మణి పాటిబండ్ల వీరయార్య

పాటిబండ్ల వీరయ్య గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా దీపాలదిన్నె గ్రామం లో బాపయ్య ,బాపమ్మ దంపతులకు 1867లో పుట్టాడు .భార్య వెంకట నరసమ్మ .ఎనిమిదో ఏట బులహరి పీరోజీ  మహర్షి వారం రోజులు ఆధ్యాత్మిక ప్రవచాలు చేస్తున్నప్పుడు ,విని అడగకుండా గురు సేవ చేశాడు .నిర౦తరం ఆయన వెంటఉంటూ అనుగ్రహం పొందాడు .12వ ఏట దేవాబత్తుని అచ్చమాంబ ను తనకు పీరోజీ తో ఉపదేశం ఇప్పించమని కోరగా ,ఆమె ఆయనకు చెప్పగా ,సమయం కోసం వేచి ఉండమని చెప్పారు .15వ ఏడు  రాగానే పీరోజీ గురువు పిలిపించి కోర్కె తీర్చారు. అప్పటి నుంచి ఇంటిపనులలో తలిదండ్రులకు తోడ్పడుతూ ,రాత్రి భోజనం చేసి,సత్తేనపల్లి వెళ్లి ,గురు సేవ చేసి ఉదయాన్నే మళ్ళీ ఇల్లు చేరేవాడు .ఇలా మూడేళ్ళు గడిచాయి .

 ఒక రోజు గురు సేవలో నిద్రరాగా తనను తాననే సంబాలించుకొని పొరపాటు క్షమించమని గురువును కోరగా  ఏమీ అనకుండా అనుగ్రహం చూపాడు .గురూప దేశం పొందిన మూడేళ్ళకు ఏదైనా మహిమ ప్రయోగించమని కోరగా .హస్తమస్తకప్రయోగం తో ఏకత్వాన్ని ప్రసాదించాడు .యోగ సిద్ధి లభించింది .సాత్విక లక్షణాలు పెరిగి ,అప్పుడప్పుడు మైమరచిపోతున్నా  వ్యవసాయ కార్యాలు యధా విధిగా చేసేవాడు .ఒక రోజు ఉదయం చద్ది తిని అరక దున్నటానికి పొలం వెళ్ళాడు .ఎద్దులని మేతకు వదిలి ,తుమ్మచెట్టుకింద ఖేచరీ ముద్రతో కూర్చుని ,సమాధిగతుడయ్యాడు .మేత తిన్న ఎడ్లు ఇల్లు చేరాయి .కొడుకు రాలేదని భయపడి తండ్రి వస్తే నిశ్చలలసమాది లో కనిపించగా ఆశ్చర్యపోయాడు .ఒళ్ళంతా గండు చీమలు పాకుతున్నాయి .తన ఉత్తరీయం తో చీమల్ని దులుపుతుంటే వీరయ్య స్పృహలోకి వచ్చాడు .తండ్రితో ఇంటికి చేరాడు .

   కొడుకు ధ్యానయోగం అర్ధం చేసుకొని పొలం పనులు చెప్పటం మానేశాడు తండ్రి .సత్తెనపల్లి లోనే ఉంటూ గురు సేవలో ,ఆధ్యాత్మిక విషయ అవగాహనలో ధన్యుడయ్యాడు వీరయ్య .పీరోజీ గారికి నంజువ్యాది ఎక్కువై నందున కంటికి రెప్పలాగా గురువును కాపాడాడు .8-7-1886 న ఉదయం 8గంటలకు తండ్రి నుంచి వచ్చిన ఉత్తరం చూసి ఆయన తీవ్రవ్యాధితో బాధపడుతున్నాడని గ్రహించి గురువు ఆనతి పొంది ఇంటికి చేరి తండ్రి ఆరోగ్యం కుదుటపడటానికి అన్ని ప్రయత్నాలు  చేస్తుండగా 19-7-1886న పీరోజీ గురువు మహా సమాధి చెందినట్లు తెలిసినా వెళ్ళలేక పోయాడు వీరయ్య .పగలంతా తండ్రి సేవలో గడిపి రాత్రి నిద్రపోతే గురువు కలలో కనిపించి తాను  శివ సన్నిధికి చేరానని చెప్పి అదృశ్యమయ్యారు .మర్నాడు ఉదయం ఆ వార్త తండ్రికి చెప్పి అనుమతి పొంది సత్తెనపల్లి వెళ్లి  ,అంత్యక్రియలు యధావిధిగా జరిపించి గురుపత్ని వీరాబాయిని, గురుపుత్రులను ఓదార్ఛి మైమరచి ఉండగా గురు దర్శనం కలిగి తానూ ,శిష్యుడూ శాశ్వతులమే అనీ ,ఇద్దరి గమ్య౦ ఒక్కటే అని బోధచేశారు .ఈ విషయం గురుపత్నికి కుమారులకు అందరికీ తెలిపి అందరి వద్దా సెలవు పొంది స్వగ్రామం చేరాడు .

  పెళ్లి చేసుకోను అన్న వీరయ్యను గురుపత్ని ఒప్పించి వెంకట నరసమ్మ అనే కన్యతో వివాహం జరిపించారు .ఒక కూతురుపుట్ట గానే ఆత్మ సన్యాసం తీసుకొని ,జీవితాంతం బ్రహ్మ చర్యాన్ని పాటించాడు వీరయ్య .గురువుగారి సమాధికిఅధ్యక్షులైన గురుపుత్రుడు లక్ష్మోజీ గారికీ నంజు వ్యాధి వచ్చి ,పిఠాపురం తీసుకు వెళ్లి మందులు ఇప్పించినా తగ్గకపోతే లక్ష్మోజీ,గురుపత్నుల   కోరికపై వీరయ్యార్యుడు పీఠాదిపత్యం  స్వీకరించారు.గురుపత్ని సాయంతో ఆశ్రమాన్ని అన్ని విధాలుగా అభి వృద్ధి చేసి సంస్కృతాంధ్రాలలో గొప్ప పాండిత్యం సాధి౦చి ,ఆశుకవిత్వ౦ చెప్పటం తో మహాకవి అయ్యాడు . గురువుగారి మనవడుపీరోజీ బాబుకు  ఆశ్రమ బాధ్యత అప్పగించి దుందుభి నామ సంవత్సర కార్తీక శుద్ధ పంచమి 9-11-1922 న హరి నామ స్మరణ చేస్తూ వీరయార్యుడు పరమపదం పొందారు .తనకు జరగాల్సిన అపర కర్మ విధానం శిష్యులకు వివరిస్తూ గురువు రాసిన ఆచలాద్వైత సిద్ధాంత గ్రంథం మననం చేస్తూ ,పూర్తి స్పృహతో వీరయార్యుడు దేహం వదిలారు .భార్య వెంకట నరసమ్మ ‘’నాకేమి సందేశం ఇస్తున్నారు ?’’అని అడిగితే ‘’ఐహికం అనేది లేదు సర్వ వ్యాపకమైన సచ్చిదానంద పరబ్రహ్మమే ఉంది .దాన్ని అనుభవించు ‘’అని చెప్పారు .పీరోజీ గారి సమాధి దగ్గరే ఈయన సమాథి కూడా ఏర్పాటు చేశారు .ఇనగంటి పున్నమార్యుడు వీరయార్యుని ముఖ్య శిష్యుడు .గురువు గారి వెంట తిరిగే కుక్క అనుకోకుండా వస్తే ,దాన్ని తన ఇష్ట దైవంగా భావించి పాదప్రక్షాళనం మొదలైన సపర్యలు చేసి పూజించి ,గురువుకు అప్పగించిన ధన్యజీవి వీరయార్యుడు .

  సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -31-1-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సరసభారతి ఆధ్వర్యం లో 172వ త్యాగరాజ ఆరాధనోత్సవం

సరసభారతి ఆధ్వర్యం లో 172వ త్యాగరాజ ఆరాధనోత్సవం

Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

మహా భక్త శిఖామణులు 31-మహర్షి పీరోజీ

మహా భక్త శిఖామణులు

31-మహర్షి పీరోజీ

రామనామ జపసిద్ధి పొందిన పీరోజీ 1829విరోధి ఆశాఢ శుద్ధ ఏకాదశి నాడు నర్సోజీ, నర్సూబాయ్ దంపతులకు జన్మించాడు  .తమ్ముళ్ళు వెంకోజీ ,గోపాలరావు .చిన్ననాటనుంచే భగవధ్యానం భక్తీ అబ్బాయి .పదేళ్ళకే సంస్కృతం లో పాండిత్యం అబ్బింది .పన్నెండేళ్ళకే  కవిత్వం రాశాడు .సహజ పాండిత్య ప్రకర్ష ఉన్నవాడు .ఒకరోజు అనుకోకుండా చిదానంద యోగి వచ్చి ఇతని అభిలాష గమనించి తారమంత్రం ఉపదేశించి వెళ్ళాడు .భక్తి శ్రద్ధలతో జపం చేసి సిద్ధి పొందాడు .

  15వ ఏట వీరాబాయ్ తో పెళ్లి అయింది .ఆమె సాధ్వి సుశీల .భర్తకు అన్ని విధాలా సహకరించేది .సద్గ్రంథ రచన చేయాలనే కోరికతో పీరోజీభద్రాచలం వెళ్లి ఇష్టదైవం శ్రీరాముని దర్శించి ,పులకిత గాత్రుడై స్వీయ కృతులు రామునకర్పించి ధన్యుడయ్యాడు .తనకున్నజ్ఞానాన్ని శిష్యులకు బోధిస్తూ వారిని సన్మార్గం లో నడిపేవాడు .క్రమంగా శిష్యులు పెరిగి జమీందారు అభిమానమూ పొంది పేరుపొందాడు అపరాదత్తావతారం హుస్నాబాద్ నివాసి మాణిక్ ప్రభు పీరోజి శిష్యుడైనాడు .1889 జులై 9న విరోధి వత్సర ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు మహర్షి పీరోజి రామనామ స్మరణ చేస్తూ ,లింగోద్భవ కాలం లో పరమపదం చేరారు.

  మహర్షి పీరోజీ 1-నవ కుసుమమాల 2పన్నగాచల నాయక శతకం 3-గజేంద్ర మోక్షం 4-పరమానంద సుధా లహరి 5-దశావతార దండకం 6-శేష గురు శతకం 7-నమశ్శివాయగేయాలు 8-సాత్రాజితీయం 9-పంచీకరణం 10-శ్రీరామ శతకం 11-స్వప్రకాశం 12-ఆచార్య శతకం 13-తత్వ సంగ్రహం 14-ప్రహ్లాద చరిత్ర  రాశారు .

  మహర్షి అనేక దివ్యమహిమలు చూపారు .బవిరి శెట్టి ఓబయ్య అనే వైశ్యుడు ,తన చేలో పశువులు పడి తిన్నాయనే కోపం తో పశులకాపరి తిట్టి ఆవులను బందలదొడ్డి లో పెడుతుంటే మహర్షి చూసి అతనికి వచ్చే ప్రమాదం తెలీకుండా ఉన్నాడని  అతనిపై జాలిపడ్డారు.ఆ రాత్రి ఓబయ్య, భార్య విపరీతం గా పోట్లాడుకొని ,భార్యను బయటికి నెట్టి తలుపులు బిగించుకొని ఉరేసుకొని చనిపోయాడు .దీన్ని బట్టి పీరోజే మహర్షి త్రికాల వేది అనే నమ్మకం కలిగింది .మరోసారి పనిమీద వేశ్యా వీధినుంచి వెడుతూ ఉండగా శ్రీహరి అనే వేశ్య కామ చేష్టలతో మహర్షి ని ఇంట్లోకి రమ్మని  కోరింది .లోపలి వెళ్ళగా ఉచితాసనం పై కూర్చోపెట్టి అన్ని రకాల సపర్యలు చేసి తన కోరిక  వెళ్ళబెట్టింది .కోప పడకుండా చిరు నవ్వుతో సోదరీ భావం తో జ్ఞానబోధ చేసి ,ప్రేమ దృష్టి ప్రసాదించి ఆ రొంపి లో నుంచి ఉద్దరించారు .

  మరోసారి అడవిలో మేసే జమీందారు గారి ఆవును ఒక పెద్దపులి పట్టుకోగా ఆమార్గాన భజన చేసుకొంటూ వెడుతున్న మహర్షి చూసి చేతికర్ర తోఝడిపించి  ఇస్,ఇస్ అంటూ అదలించగా అది ఆవును వదిలి పోగా , వెంట ఉన్న భక్తులకు వారి సర్వజ్ఞత్వం అర్ధమైంది .ఒకసారి నీలిమందు వ్యాపారం చేసే కోట అప్పయ్య ‘’ఇప్పుడు నీలిమందు అమ్మితే లాభమా నష్టమా చెప్పండి ‘’అని అడిగితె ‘’లాభ నష్టాల మాట తర్వాత ముందు అర్జెంట్ గా గిడ్డంగి ఖాళీచేయించు ‘’అన్నారు .మహర్షి మాటపై నమ్మకం తో ఆరోజే ఖాళీ చేశాడు మర్నాడు  అగ్ని ప్రమాదం లో అతడి నీలిమందు గోడౌన్ పూర్తిగా తగలబడింది .

  పంధ్యా కోటప్ప అనే ఆయన ‘’దేవుడిని చూపించండి ‘’అని ‘’ పరిహాసంగా అడిగితె ‘’పిచ్చోడా పో పో ‘’అన్నారు .అంతే అతడు నిజంగానే పిచ్చివాడై తిరిగాడు .అతడి బంధుజనం వచ్చి కాళ్ళపై పడి ప్రార్ధిస్తే దయాళువై పిచ్చిని భక్తిగా మార్చి శిష్యుడిని చేసుకొని ఆదరించిన నిష్కళంకుడు పీరోజీ .భార్య నర్సూ బాయి కి కలరాసోకిందని ఉత్తరం వస్తే ,అమావాస్య రోజు చిలుకూరు నుంచి సత్తెనపల్లికి వెడుతుంటే నలుగురు దొంగలు అడ్డగించగా ,వారిని శ్రీరామ సోదరులుగా భావించి ‘’ఎంతో బ్రహ్మానందమాయెనే-మన చింతలన్నియు తీరిపోయేనే ‘’ అని పాడుతూ నృత్యం చేస్తే ,దొంగల బుద్ధిమారి ,తప్పులు మన్నించమని పాదాలపై పడితే కనికరిస్తే వాళ్ళు సత్తెనపల్లి దాకా తోడు వెళ్ళారు .తర్వాత శిష్యులయ్యారు కూడా .సత్తెనపల్లి చేరి మరణ శయ్యమీద ఉన్న భార్యను తల్లిపాలు లేక అలమటించే పిల్లాడిని చూసి ,కలరాభయం తో గజగాజలాడు తున్న ఊరి జన దీన వదనాలను చూసి వెంటనే చెరువుకు వెళ్లి స్నానం చేసి ఒడ్డునున్న చెట్టు కింద కూర్చుని తపం ప్రారంభించగా ఆ సాయంకాలానికే ఊళ్ళో కలరా తగ్గటం మొదలైంది .కలరానుంచి భార్యతో సహా అందరూ తేరుకొని సంపూర్ణారోగ్యం పొందారు .

 ఒకసారి భద్రాచల యాత్రకు వెడుతుంటే దారిలో మొలకల పల్లి దగ్గర ఆగి వంట ప్రయత్నం చేస్తుంటే బండీ లో వేసిన బియ్యం బస్తాకనిపించలేదు  .ఇంతలో ఒక కొత్తవ్యక్తి దారిలో బియ్యం బస్తా కనిపించిందని చెప్పి అప్పగించి వెళ్ళాడు .వంటలుపూర్తయి అందరూ హాయిగా భోజనాలు చేశారు .ఇది మహర్షి 54వ ఏట జరిగింది .’’యెంత దయార్ద్ర మానసుడవు –నే నెంత వేడిన గనపడవు ‘’అని ఆర్తిగా పాడుకొంటూ భద్రగిరి చేరి శ్రీరామ దర్శనం చేశారు మహర్షి పీరోజీ .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-1-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

చింతలూరుశ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద నిలయ సంస్థాపకులు –శ్రీ ద్విభాష్యం వెంకటేశ్వర్లు

చింతలూరుశ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద నిలయ సంస్థాపకులు –శ్రీ ద్విభాష్యం వెంకటేశ్వర్లు  మద్రాస్లోని ఆచంట లక్ష్మీపతి గారి ,శ్రీ దీవి గోపాలాచార్యులు తర్వాత ఆంద్ర దేశం లో ఆయుర్వేద వైద్యానికి శక్తియుక్తులు ధార పోసి పోషించినవారు శ్రీ ద్విభాష్యం  వెంకటేశ్వర్లు.ఈ ఆయుర్వేద భిషగ్వరుని జీవితం పై శ్రీ ఓలేటి సూర్యనారాయణ శాస్త్రి పుస్తకం రాస్తే ,ఆ ఆయుర్వేదనిలయం ప్రొప్రైటర్ శ్రీ ద్విభాష్యం  వెంకట సూర్యనారాయణ మూర్తి  కాకినాడ జార్జి ప్రెస్ లో 1951లో ముద్రించి లోకానికి అందించి మహోపకారం చేశారు .వెంకటేశ్వర్లుగారు 24-12-1884 న జన్మించి ,67సంవత్సరాలు సార్ధక జీవితం గడిపి 25-6-1949 న మరణించారు .

  ఈ పుస్తకం లో  శ్రీ నరసింహ దేవర సత్యనారాయణ రాసిన  ముందు మాటలలో ‘’   వెంకటేశ్వర్లు గారు మా తండ్రిగారి పినతల్లి కుమారులు ..మా సన్నిహిత గ్రామ వాసులు చిన్నప్పటి నుంచి మా మధ్య మైత్రీ బంధం ఉంది .నా కంటే పదేళ్ళు పెద్ద .నాపై పుత్రవాత్సల్యమున్నవారు .కనుక వారి జీవిత చారిత్రకు తొలిపలుకులు పలకటం నా అదృష్టం.వారి వివాహానికి మా తలిదండ్రులతో తీపర్రు వెళ్లాను. ఆయన మేనమామ కూతురే భార్య .మా తండ్రి గారు సంస్కృత నాటక అలంకార సాహిత్యం లో ప్రసిద్దులై పాఠాలు చెప్పేవారు అప్పటికే వెంకటేశ్వర్లగారి తల్లి చనిపోయింది .తండ్రీ ఈయన ముగ్గురు సోదరులు చితలూరులో ఆయుర్వేద వైద్యం చేస్తూ జీవిస్తున్నారు .

  భార్య కాపురానికి వచ్చిన వేళా విశేషం వలన వైద్యం దినదినాభి వృద్ధి చెంది సోదరుల౦తా  సంపాదనా పరులై కుటుంబం లో సంపద పెరిగింది .వీరి అన్న బుచ్చయ్యగారూ గొప్ప వైద్యులే  .ఆకుటుంబం వారు సుమారు 200ఎకరాల సుక్షేత్రమైన మాగాణి సంపాదించారు .ఔషధ వ్యాపారం వలన ఏటా సుమారు మూడు లక్షల రూపాయల ఆదాయం నలభై బ్రాంచీలతో మూడు పూలు ఆరుకాయలు లా వర్దిల్లింది . ఏడాదికి 30వేలు ఆదాయం పన్ను చెల్లించేవారు. గుమాస్తాలు పనివారలకు రోజు వారీగా కనీసం వంద రూపాయలు ఇచ్చేవారు .కొంతకాలం వైద్య వృత్తి చేసి తర్వాత పూర్తికాలం శాస్త్రీయ ఆయుర్వేద ఔషధ వ్యాప్తికే అంకితమ య్యారు .

  ఆ శతాబ్దారంభం లో పండిత శ్రీ దీవి గోపాలాచార్యులు ప్రసిద్ధ ఆయుర్వేద ఔషధాలు నాణ్యంగా  స్వయంగా   తయారు చేయించి వ్యాప్తి చేసి ఆయుర్వేద గౌరవం పెంచారు .అల్లోపతి వైద్యులైన శ్రీ ఆచంట లక్ష్మీ పతి గారు ఆయుర్వేదం లోకి మారి ,ఫార్మసి స్థాపించి ,ఆయుర్వేద సంప్రదాయం ఔషధాలు ఖిలం కాకుండా గొప్ప కృషి చేశారు .పానగల్ ప్రధాని హయాం లో జిల్లా బోర్డు ,మునిసిపాలిటీ లలో ఆయుర్వేద ఆస్పత్రులు వెలిశాయి .అప్పుడే వెంకటేశ్వర్లుగారు ఆయుర్వేద ఔషధాలను విరివిగాకల్తీలేని  తయారు ,ప్రదర్శనలూ నిర్వహించి గొప్ప పేరు పొందారు .అప్పటికే సుమారు 15రకాల ఔషధాలు తయారు చేస్తున్నా తృప్తి పడకుండా ,చరక సుశ్రుత యోగరత్నావళి  మొదలైన గ్రంథాలలో ఉన్న రసౌషధాలు, ,లేహ్యాలు చూర్నాలు ఆసవాలు అరిస్టాలు,తైలాలు తయారు చేసి, ఏటా జరిగే అఖిలభారత ప్రదర్శనకు పంపేవారు .వీరి ఓషధ గుణాలను పరీక్షించి ప్రశంసించి ఎన్నెన్నో యోగ్యతాపత్రాలు అందించేవారు  .

  మొదటి ,రెండు ప్రపంచ యుద్దాలతర్వాత విదేశీ మందులకే గిరాకీ ఎక్కువగా ఉండేది .కాని అవి దొరకటం కష్టమైసామాన్యులకుదూరమయ్యాయి .అప్పుడు అందరి దృష్టి దేశీయమైన ఆయుర్వేదం పై  పడింది ,అభిమానం పెరిగి అందుబాటులో ఉండటం వలన విశేష వ్యాప్తి చెందింది .

  శ్రీ కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారి ‘’అమృతాంజనం’’ తలనిప్పికి క్లిక్ అయింది. కేసర్ గారు ‘’లోధ్ర ‘’ఔషధం తో ప్రసిద్ధి పొందారు .జమ్మి వారి ‘’లివర్ క్యూర్ ‘’చింతామణి అయింది కానీ వెంకటేశ్వర్లుగారి ప్రతి ఔషధమూ దివ్య గుణ భరితమైంది  .దీనికి కారణం ఆయన సత్ప్రవర్తన నిర్మలహృదయం వినయం కృత్రిమత లేని సౌజన్యం మాయమర్మం లేని వ్యవహారం .మహా శ్రీమంతులైనా పేదల యెడ దయ సానుభూతి ఆపన్నులకు స్నేహ హస్తాలు చాచటం ఆర్తులపై కనికరం సేవకులపై వాత్సల్యం ఆపన్నులకు వితరణ పెరిగాయే కాని తరగ లేదు .

   ఆయుర్వేద మూల పురుషుడు శ్రీ ధన్వంతరి కి చి౦తలూరులో వెంకటేశ్వర్లుగారు దేవాలయం నిర్మించి ,నిత్యపూజాదికాలకు నిర్విఘ్నంగా జరగటానికి ఏర్పాటు చేశారు. ఎనిమిది ఎకరాల భూమిని ఆ దేవాలయానికి పట్టారాసి సమర్పించిన అమృత హృదయులాయన. వింజరం గ్రామం లో  వేదపాఠశాల కట్టించి ,విద్యావ్యాప్తికి కృషి చేసి పది వేలరూపాయలు శాశ్వత నిధి సమకూర్చారు .ఎన్నో సత్రాలు సావిడులు,బావులు ,ఆరామాలు   నిర్మించారు  విద్యార్ధులకు ఉపకార వేతనాలిచ్చేవారు .తండ్రికాలం నుంచి అందరికీ ఉచితవైద్యమే .వీరూ దాన్ని కొనసాగించి విశేషమైన పేరు పరపతి ,ప్రజాదరణ సాధించారు .వీరి సోదరుడు  సుబ్బారాయుడుగారు కార్య దర్శిగా  ఉంటూ ఆ సంస్థ వ్యాపారాన్ని ఏడాదికి 3లక్షలకు   పెంచారు .

  ఆవూరి కో ఆపరేటివ్ లాండ్ మార్ట్ గేజ్ బ్యాంక్ ,  ,కో ఆపరేటివ్ రూరల్ బ్యాంక్ ,ఉత్పత్తి కొనుగోలు దార్ల సంఘం,పశు సంపత్తి  వృద్ధి సహకారసంఘం మొదలైన వాటిలో సభ్యులుగానే ఉన్నారు,కానిపదవులు కోరుకోలేదు.తమ సంస్థలో ఎందరికో ఉద్యోగాలిచ్చి ఆదుకొన్నారు .వేదపాఠశాలకిచ్చిన పది వేలరూపాయలు ఆలమూరు కోఆపరేటివ్ రూరల్ బ్యాంక్ లోనే డిపాజిట్ చేశారు .వివిధ బ్రాంచీలనుంచి వచ్చే డబ్బంతా డ్రాఫ్ట్ ల రూపంగానే ఈబాంక్ కి చేరేట్లు చేశారు .ఎంతోప్రాభవం పెరిగినా పల్లెటూరు  చి౦తలూరు వదలలేదు .నిత్యం వేలాది రూపాయలు మనియార్డర్లు , డ్రాఫ్ట్ ల రూపం లో వస్తూనే ఉంటాయి .ఇంతటి ఆదర్శ పురుషుని జీవిత చరిత్ర రాసిన శ్రీ ఓలేటి సూర్యనారాయణ మూర్తి ధన్యులు .నాకు పరిచయమున్న వెంకటేశ్వర్లు గారి పుస్తకానికి నేను ముందుమాట రాయటం నా అదృష్టం-‘’అన్నారు నరసింహ దేవర సత్యనారాయణ .

‘’Lives of great men all remind us –We can make our lives sublime –And departing ,leave behind us –Foot prints on the sands of time –F00t prints that perhaps another –Sailing over  life’s solemn aims –A forlorn and  ship wrecked brother –Seeing all ,shall take heart again –Let us ,then be up and doing –With a heart  for any fate –Still achieving ,still pursuing –Learn to labour and wait ‘’  

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-1-21-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 30-నృసింహ భక్తురాలు నిరతాన్న దాత -కైవారం బాలాంబ

మహా భక్త శిఖామణులు

30-నృసింహ భక్తురాలు నిరతాన్న దాత -కైవారం బాలాంబ

కైవారం సుబ్బావధాని సత్యమార్గం లో నడిచే వాడు .మధురభాషి. ఎవ్వర్నీ చెయ్యి చాచి అడగని వాడు .నిర్లిప్తుడు .ఆయన భార్య ఉత్తమా ఇల్లాలు కైవారం బాలాంబ .దంపతులకు 18ఏళ్ళ  దాంపత్య  జీవితం లో సంతానం కలుగ లేదు .బావగారి కొడుకు నారాయణ ను అల్లారు ముద్దుగా పెంచారు .ఇతడు ఆటలాడు తూ జారి నూతిలో పడ్డాడు .ఎక్కడున్నాడో తెలీక ‘’లక్ష్మీ నృసింహ స్మరణ చేస్తూ ‘’నాయనా నారాయణా !ఎక్కడున్నావు తండ్రీ ‘’అని వాపోతుంటే ‘’అమ్మా భయం లేదు .ఎవరో దివ్యపురుషుడు నన్ను చేతులతో ఎత్తుకొని నూతి గట్టు మీద కూర్చోబెట్టి వెళ్ళిపోయాడు ‘’అని చెప్పాడు .భగవత్ లీలకు ఆశ్చర్యపడుతూ నారాయణ ను ఇంటికి తెప్పించింది .

  1888లో తన నలభై వ ఏట భర్త సుబ్బావధాని మరణించగా ,శ్రద్ధగా అపరకర్మలు నిర్వహి౦పజేసి రోజూ రెండు సార్లు నృసింహస్వామి దర్శనం చేస్తూ మనశ్శాంతి పొందింది బాలమ్మ .బులుమళ్ళనరసింహా చారి వలన తిరు మంత్రోప దేశం పొంది ,మంత్రం సిద్ధి ,దివ్య సాక్షాత్కారం పొందింది . వైదిక విధానం లోకాక వైష్ణవ విధానం లో మంత్రోప దేశం పొందిందని సాటి బ్రాహ్మణులు పీఠాదిపతికి ఫిర్యాదు చేశారు .ఆయన బాలాంబ గారిని పిలిపించి స్వయంగా పరీక్షించి ఫిర్యాదీలను మందలించి తరిమేశారు .

  ఒక రోజు కుంభ వృష్టి కురుస్తుంటే ,తలదాచుకోవటానికి ఒక గుహ దగ్గరకు వెళ్ళింది .గుహలోపలి నుంచి బురద నీరు ఒక్క సారిగా బయటికి రావటం  ఆప్రవాహం ఆమెను ఈడ్చి కొట్టటం తో కింద గుంటలో పడి స్పృహ తప్పింది  .వర్షం ఆగాక  నీటితో ఆ గుంట నిండి పోయి ,ఆమె ఎవరికీ కనిపించలేదు .ప్రతి రోజఉదయమూ  బాలాంబ గారి యోగ క్షేమాలు విచారించటానికి వచ్చే హనుంమంతయ్య గారు వచ్చి ,అమ్మగారు కనిపించకపోతే చుట్టుప్రక్కల వెతుకుతూ ఆ గుంటలో ఉన్నట్లు తెలుసుకొని మనుషులతో అందులోనుంచి బయటికి తీయించి ఉపచారాలు చేయించగా కొంత సేపటికి బాలాంబ గారికి స్మృతి కలిగింది .అందరూ సంతోషించారు .

  మరోసారి బాలా౦బగారి నడవడిక పై ప్రత్యర్ధులు కొందరు లేని పోనీ  ఆరోపణలు చేస్తే భరించలేక ప్రాణత్యాగం చేసుకోవటానికి లోతైన నూతి లోకి దూకగా భక్తవరదుడు లక్ష్మీ నృసింహస్వామి కాపాడి అంతర్హితు డయ్యాడు  . ఇలా చాలా సార్లు ఆమె పై ఆరోపణలు రావటం నరసింహస్వామి కాపాడటం జరిగింది .ఒక సారి నరసింహస్వామి అయిదేళ్ళ బాలుడుగా కనిపించి ‘’అమ్మా !నాకు ఆకలిగా ఉంది అన్న౦ పెట్టు ‘’అని అడిగితే ,అమ్మ గ్రహించి చేతులు రెండూ జోడించి ‘’నరసింహ దేవా !ఈ అబలను పరిహసిచ టానికి బాలుడవై వచ్చావా ?విశ్వ గర్భుడవైన నీకు అన్నం పెట్టటానికి నేనెవరి నయ్యా “”అని పాదాలపై పడి స్మృతికోల్పోతే ,స్వామి నిజరూప దర్శనం అనుగ్రహించి ‘’అవ్వా !నీ వలన ఇక్కడ నిరతాన్న దానం అవిఘ్నంగా జరుగుతుంది .నీ దీక్ష నిర్విఘ్నంగా సాగు గాక ‘’అని చెప్పి అదృశ్యమయ్యాడు .

   స్వామిఅనుగ్రహం తో నిరతాన్నదానం నిర్విఘ్నం గా   సాగిపోతోంది.అడగకుండా నే భోజన పదార్ధాలు కుప్పలు తెప్పలుగా  వచ్చి పడేవి.ఈ వైభవాన్ని కూడా జీర్ణించుకోలేని ప్రత్యర్ధులు ఆమె శిరోజాలు తీసేయకపోతే వెలి వేస్తామని బెదిరించారు .వారి బాధ భరించలేక మంగలిని పిలిపించి ము౦డనంచేయించుకోవటానికి సిద్ధపడింది .క్షురకుడు కత్తిపట్టుకొని జుట్టు గొరుగుదామని ప్రయత్నిస్తే , అమ్మ గారి బదులు సింహం కనిపించి వాడు భయం తో పారిపోయాడు .ఒకసారి ఒక రచయిత మల్లాది సుబ్బదాసు గారి జీవితచరిత్ర రాయాలనుకొని బాలా౦బగారిని విశేషాలు తెలియ జేయమనికోరితే  వివరాలు చెప్పి ఆరోజులు  మహాలయ పక్షం రోజులుకనుక పితృప్రీతికరం కనుక ఆ రాత్రి భోజనమా ఫలహారమా అని అడిగితె ఫలహారమే  అని చెబితే ,పిండి చేయించనా అంటే సరే అనగా ,చేయించి పీట వేసి కూర్చోపెట్టగా ఆయన ప్రక్కన మరో పీట మీద ఇంకొక అతిధి కూర్చోగా ఇద్దరికీ అమ్మగారు దోసెడు దోసెడు అరిసెలు వడ్డించారు .రెండు అరిసెలతో కడుపు నిండిపోయింది .మళ్ళీ రెండు పెరుగు ఆవడలు ,రెండు లడ్డూలు వడ్డించారు .తినేలోపు ‘’పిండి చేయమన్నావుగా నాయనా ‘’అంటూ విస్తరిలో కుమ్మరించి ,చిక్కని మజ్జిగ పోసి తినమంటే ఆ రచయిత ‘’అమ్మా! అన్నదానం పేరుతొ అతిధుల ప్రాణాలు తీస్తున్నావు .ఇది కడుపు అనుకొన్నావా కళ్ళేపల్లి చెరువు అనుకొన్నావా? ఖాళీ ఉండద్దా తినటానికి ?’’అని సరదాగా అంటే ‘’నాయనా !నరసింహ నామ స్మరణ చెయ్యి అని మూడు సార్లు నామాన్ని అనిపించగా కడుపుఖాళీ అయి అన్నీ ఆబగా తినేశాడట .

   మరో సారి సంక్రాంతి రోజున సత్రం లో బ్రాహ్మణులు భోజనాలు చేస్తుంటే ,బాలా౦బ గారు బంతులన్నిటినీ తిరుగుతూ పర్యవేక్షణ చేస్తుంటే ,వ౦టవాడు వచ్చి ‘’అమ్మా !దొడ్డి గుమ్మం నుంచి ఒక పంచముడు లోపలి వస్తుంటే బ్రాహ్మణ భోజనాలు అయ్యేదాకా ఆగమంటే ఆగటం లేదు’’ అని చెప్పగా వెంటనే అతడి దగ్గరకు వెళ్లి దొడ్లో ఒక చోట విస్తరి వేయించి  వడ్డింప జేసి తృప్తిగా భోజనం పెట్టించారు బాలా౦బ గారు .అమ్మగారు చూస్తుండగానే అతడు అదృశ్యమయ్యాడు పానకాల నరసింహ స్వామి ఆ వేషం  లో వచ్చాడని గ్రహించారు .ఒకసారి మంగళగిరి తిరునాళ్ళకు వేలాది మంది వస్తే ,18 మానికల బియ్యం  బాలభోగానికి వండించారు .ఐదారువందలమంది బాలురు బాలభోగానికి వచ్చి కూర్చున్నారు .వండిన అన్నం సరిపోదని వంటవాళ్లు గుంజాటన పడుతుంటే ముసలితనంలో ఉన్న బాలాంబగారు వచ్చి అన్నం రాశి పోయించి గుడ్డ కప్పి కర్పూరహారతి పట్టి ,తానేఅన్నాన్ని పళ్ళాలలో నింపి ఇస్తుంటే ఎన్ని పళ్ళాలులు తీసినా రాశి తరగక అందర్నీ ఆశ్చర్యపరచింది .అదంతా నరసింహస్వామి ప్రభావం అని వినమ్రంగా అమ్మగారు చెప్పేవారు.

  మరోసారి బ్రాహ్మణ సంతర్పణకు విపరీతంగా బ్రాహ్మణులు వచ్చారు .వడ్డనలు పూర్తయ్యాయి .అభేరించటానికి కూడా నెయ్యి లేదు .వడ్డనవారు గుసగుసలాడుతుంటే విని పళ్ళెం లో కర్పూం వెలిగించి వాకిట్లో నిలబడి నరసింహస్వామికి హారతిచ్చి నిలబడగా కర్నూలు నుంచి సెల్ఫ్ ఆర్డర్ తో నేతి డబ్బాల బండి వాకిట్లోకి వచ్చి ,అమ్మగారికి అప్పగించి రసీదు పొంది వెళ్ళిపోయాడు బాలా౦బగారి భక్తీ తపరతకుందరూ పొంగిపోయారు .ఈ నెయ్యి తో సంతర్పణ వైభవంగా పూర్తి చేశారు . నరసింహస్వామి వెంటఉండి నడిపిస్తున్న నిరతాన్న దానంతో  తరించిన కైవారం బాలా౦బ గారు 79 వ ఏట నృసింహ స్వామిలో ఐక్యమయ్యారు .

 సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -28-1-21-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

తాటి కొండ గేయమాలిక  

తాటి కొండ గేయమాలిక

అడ్లూరి అయోధ్యరామకవి రచించిన ‘’తాటి కొండ  గేయమాలిక  ‘’విజ్ఞాన గ్రంధాలయం వారి ఆరవ ప్రచురణ గా వరంగల్ రంగాఆర్ట్ ప్రెస్ లో పార్ధివ జ్యేష్టం 1945లో ప్రచురింపబడింది .వెల పది అణాలు .పుస్తకప్రచురణకు మహారాజ ,రాజ ,సామాన్య పోషకులు ద్రవ్య సాయం చేశారు ఆంద్ర పితామహ శ్రీ మాడ పాటి హన్మంతరావు గారి షష్టిపూర్తికి వందన సమర్పణ గా అ౦కిత తమివ్వబడింది .

కవిగారి విజ్ఞప్తి మాటలలో తాను విశ్వనాథ వారి కిన్నెరసాని పాటలు చదివిన ప్రేరణ తో తాటికొండ గీతికలు రాసినట్లు ,గేయాలన్నీ ట్యూనింగ్ కు సెట్ అయినవే అని చెప్పారు .శతావధానులు శ్రీ శ్రీనివాస సోదరులు ము౦దుమాటలుగా తమ కవిపండితాభిప్రాయం తెలియ జేశారు –తాటి కొండ గ్రామం చుట్టూ తాడి చెట్లు నాలుగు వైపులా ఉన్నాయని ,ఇక్కడే రామ వనవాస ఘట్టం మొదటి ప్రదర్శన జరిగిందని ,నగరాజు తాళవృక్ష శిష్య బృందం తో సీతారామ లక్ష్మణులకు వనచారి ఆతిధ్యమిచ్చి ధన్యుడైనాడు .అతడు  రుషి పుంగవుని గా  నిల్చి నగపుటార్తి తెలిపినట్లు సీతాదేవికి కనిపించగా అక్కడే విడిది చేద్దామని సిఫార్సు చేసి ,అతడి తపస్సు ఫలించేట్లు చేసింది .

వినోదార్ధం సీతారాములు పచ్చీసు ఆట ఆడారు. నాలుగాటలలో సీతను రాముడు ఓడించినా ఆమె భర్త గెల్చినందుకు సంబర పడగా రాముడు అబ్బురపడ్డాడు .మర్నాడు కావాలని తానె ఓడిపోయాడు రాముడు .భర్త ఓడటం అమంగళ౦ గా  ఆమె భావించి రోదించింది  .ఇదీ ఇందులో విషయం. కవి అయోధ్యరామయ్య దీనితోపాటు తన వివిధ ఖండకావ్యాలలోని గేయాలనూ దీనికి జత చేశాడు .ఇవి అనేకరాగాలు వరుసలలో మనోహరంగా ఉన్నాయి ‘’అని కవి హృదయాన్ని చక్కగా ఆవిష్కరించారు .కవి సామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ గారు ‘’ఇది సీతా పాతివ్రత్య గుణ చిహ్నం .కవి భావుకుడు జాతీయవాది .గేయాలలో ‘’లచ్చిమొర’’చాలా బాగుంది .పల్లె సొగసు సమృద్ధి గొప్పగా వర్ణించాడు కవి .కవిత్వాన్ని కొంత మెరుగు పరచుకోవాలి ‘’‘’అని అభిప్రాయం రాశారు .

ఇందులో వనవాసం నాగరాజు ,నివాసం ,షోడశోపచారాలు ,చదరంగం ,సీత దుఖం ,వీడుకోలు ,వరము ,అనే శీర్షికలున్నాయి .చివరిదైన వరం –లో –‘’ఈ కొండ ఈ సెలయేరు ఈ వృక్షముల పంక్తి –ఎంతో ధన్యంబౌటచే –మనమిచట నివసించి –అనుపానమైన -మోదమున మూన్నాళ్ళు ముచ్చటగా గడుపుచూ –ఆడినా చదరం యాటా- దాని చే –నిరువురకు జరిగినా మాట-ముందు కలియుగమందు బుట్టెడి-స్త్రీపురుషులకు చిత్త శుద్ధి ని –కలుగ జేయుచు దంపతుల వి-ధ్యుక్త ధర్మంబూ జూపుచూ –ముక్తి దాయకమై ఇలా –సంపూజ్యమై ఒప్పున్ –మనమాడు చదరంగ –మును జ్ఞప్తి కేలయించు –యాకృతిన్ గ్రామం మొక-టై ఇతన బె౦పొ౦దు-దాని నామ౦బూ  -తాడి కొండ యనన్-ధారుణిన్ కీర్తి గను చుండు ‘’అని వరం ఇచ్చి ఈగ్రామంలో ఒక  కవి ఈ విషయాన్ని కావ్యంగా రాస్తాడని చెప్పారు ‘’ఈ సెలయేరు ప్రవహించి ప్రవహించి కృష్ణానదిన్ గలయు ‘’అనీ సెలవిచ్చారు ‘’భక్తులను బ్రోవగ  ఈ చోట –మన రూపు లుండు –‘’

అనుబ౦ధ౦ గా ఉన్న గేయమాలిక లో –ఆంద్ర జాతీయ గేయము ,వినతి ,వలదు ,లచ్చిమొర,ఆగమనం ,ఎప్పుడు ,నేను నా దేశం ,ప్రార్ధన మొదలైన గీయాలున్నాయి .

కిన్నెరసాని ప్రేరణగా రాసినా ఈ ‘’తాటి కొండ ‘’ అంతగా ప్రజాదరణ పొందినట్లు లేదు .ఎవరూ ఉదాహరించిన దాఖలాలూ లేవు .ఆంద్ర దేశం లో సీతారాములు విహరించిన పవిత్ర స్థలాలు చాలాఉన్నాయి .రికార్డ్ కెక్కాయి .ఆపుణ్యం ఈ గ్రామానికి దక్కటం అదృష్టం.

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-1-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 29-కృష్ణాన౦దావదూత  

మహా భక్త శిఖామణులు

29-కృష్ణాన౦దావదూత

18వ శతాబ్దిలో నెల్లూరు జిల్లా లక్కవరం శివారు నాగ భొట్ల పాలెం70వ ఏట  చేరిన కృష్ణానందుడు మాంచి దేహ పటిమ కలవాడు .రోజుకు మూడామడల దూరం సునాయాసంగా నడిచేవాడు .లక్కవర మల్లపరాజు శివరాత్రి ఉత్సవాన్ని చూడటానికి శ్రీ శైలం వెడుతూ  ఈయన దగ్గరకు వస్తే ‘’శ్రీశైలం వెడుతున్నావా ?సంతోషం .మల్లికార్జున స్వామికి నా నమస్కారం తెలియ జేయి ‘’అని ఆశీర్వదించాడు .ఆయన ఆశ్చర్యపోయి ‘’స్వామీ ! నేనెవరినో ఎక్కడికి వెడుతున్నానో నేను చెప్పకుండానే మీరు అన్నీ చెప్పిన దైవజ్ఞులు .మేకు తెలియని విషయం ఉండదు ‘’అని కృతజ్ఞతావందనం చేసి వెళ్ళాడు .శ్రీగిరి చేరి ధూళి దర్శనంకోసం అధికారుల అనుమతిని అడుగుతుంటే ,మన కృష్ణావదూతగారు మల్లికార్జున దర్శనం చేసి మనరాజు గారికి ఎదురై ఆశ్చర్యం కలిగించారు  . చిరు నవ్వుతో రాజు గారిని ‘’ఎంతసేపైంది వచ్చి మీతో ఎవరరెవరొచ్చారు ?’’అని ప్రశ్నిస్తే అవాక్కై నిలబడితే ‘’నేను కృష్ణావదూతను .మీవెనకాలే నేనూ బయల్దేరి వచ్చాను. శిఖరేశ్వరం దగ్గర మిమ్మల్ని చూశాను .నడవ లేనేమో అనే భయం తో అక్కడ కూర్చోలేదు ‘’అన్నారు .అవధూత సర్వజ్ఞత్వం అర్ధమై రాజు గారు ధూళి దర్శనంచేసి , అవధూత సర్వజ్ఞులని గ్రహించి శివరాత్రి ఉత్సవం కన్నుల పండువుగా చూసి అవదూతగారితో ఇంటికి చేరి,యాత్రా విశేషాలను అందరికీ ఆశ్చర్యం గా తెలియజేశారు  .

    అవదూతగారు రోజూ అర్ధరాత్రి బయల్దేరి ఋషుల ఆవాసభూమి అని పిలువబడే సీమకుర్తి కొండకు వెళ్లి ,మర్నాడు వేకువనే నాగభొట్ల పాలెం చేరేవారు .దీన్ని కనిపెట్టటానికి అన్నం భొట్లుశాస్త్రి  ఆయనకు తెలీకుండా వెంట వెళ్ళేవాడు కానీ ఎప్పుడూ కనిపించ లేదు .ఒకసారి అవధూత పడుకున్న ఇంట్లోనే శాస్త్రి గారు. కూడా పడుకొన్నాడు .అవదూతగారు యధాప్రకారం అర్ధరాత్రి లేచి ఇంటి బయటకు వచ్చి ,తలుపు దగ్గిరికి వేసి వెళ్ళిపోయారు .శాస్త్రి ఆయన వెంట వెళ్ళటానికి వెడితే తలుపు బిగుసుకుపోయి యెంత ప్రయత్నించినాతెరుచుకో లేదు .అరుపులు కేకలతో చుట్టుప్రక్కలవారిని పిలిచే ప్రయత్నం చేసినా ,వాళ్ళు వచ్చి తలుపు తీసే ప్రయత్నం చేసినా తలుపులు తెరుచుకోలేదు .వేకువజామున పిట్టలు అరిచే సమయం లో తలుపులు వాటంతతికి అవే తెరుచుకొన్నాయి .శాస్త్రి అప్పుడు బయటికొచ్చి కొంప చేరాడు  అవధూత గారు మామూలుగా వచ్చే సమయానికే వచ్చారు .

   శాస్త్రి మర్నాడు రాత్రికూడా అవధూత వెంట వెళ్ళే ప్రయత్నం చేశాడు .ఆయన గమనం తెలీలేదుకాని ఒక పెద్ద భూతం కనిపించి భయపెడితే  మూర్చపోయాడు అక్కడే .తెల్లారి నిద్ర లేచినట్లు మామూలుగా లేచి ,అవధూత దర్శనమై పాదాలపై వ్రాలి క్షమాపణ కోరాడు .క్షమించి మళ్ళీ అలాంటి ప్రయత్నం చేస్తే ప్రమాదం అని హెచ్చరించారు అవధూత .

  ఒక సారి చలిజ్వరం తో బాధపడుతున్నఅవధూత గారిని చూడటానికి  లక్కవరం గ్రామస్తులు కొందరు అవదూతగారి దగ్గరకు వచ్చారు .వాళ్ళని కూర్చోమని చెప్పి తనకు వాళ్లకు మధ్య అడ్డం గా  ఒక కర్ర పడేశారు .కాసేపటికి ఆ కర్ర గజగజ వణకటం ప్రారంభించింది .అదేమీ విచిత్రం అని ఆయనను అడిగితే ‘’ప్రారబ్ధ వశాన నన్ను ఆశ్రయించిన జ్వరం ఈ కర్రలో ప్రవేశ పెట్టటం వలన అలా వణికింది నా చలిజ్వరం తగ్గి ,అది అనుభవించింది .పాపం మీరు నన్ను చూడటానికి వచ్చారు నా జబ్బు తగ్గిందని చూపటానికే ఇలా చేశాను .మాయ స్వాదీనమైతే ఏ బాధా ఉండదు మనం పొందే కష్టసుఖాలు మాయావినోదాలు .సహన శక్తి అందరూ అలవర్చుకోవాలి ‘’ ‘’అని బోధించారు . .

  ఒక రోజు శిష్యులను పిలిచి తాము దేహ యాత్ర చాలిస్తున్నామని  ,శరీరాన్ని లక్కవరం లోసమాది చేయమని చెప్పి ,కపాల భేదం చేసుకొని పరమపదం పొందారు అవదూతగారు .ఆయన కోరినట్లే గ్రామస్తులు శిష్యులు చేసి,  వారి బృందావనానికి నిత్య ధూప దీప నైవేద్యాలకోసం గ్రామస్తులు 18ఎకరాల భూమి సమకూర్చారు .ప్రతి పుష్యమాసం శ్రీవారి వార్షికోత్సవం ఘనంగా నిర్వహిస్తారు .అవధూత గారి ముఖ్య శిష్యులు లక్కవరపు అయ్యపరాజు పంతులుగారు పొతకామూరు నివాసి అయినా ,లక్కవరం అనే పేరుతొ ఊరు నిర్మించి ,శివ ప్రతిష్ట చేసి నిత్య శివార్చన చేసిన పుణ్యమూర్తి .ఎనిమిది తరాలనుంచి ఈ వంశం వారు ఈ ఊళ్ళో ఉంటున్నారు .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-1-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సంగీత సద్గురు త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవం

సరసభారతి 155 వ కార్యక్రమంగా సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారి 174వ ఆరాధనోత్సవ౦ పుష్య బహుళ పంచమి 2-2-21 మంగళవారం సాయంత్రం 6.30గం.లకు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో నిర్వహింపబడుతుంది .ఆ సాయంత్రం 6గం లకు శ్రీ త్యాగరాజస్వామికి అష్టోత్తర పూజ జరుగుతుంది .అనంతరం స్థానిక ,ఇతర ప్రదేశాలనుండి,ఉత్సాహం గా పాల్గొనే గాయనీ గాయకులు ’’ శ్రీ త్యాగరాజ పంచ రత్న కీర్తనలు ’’ గానం చేస్తారు .ఇతర కృతులతో అలరిస్తారు .’’పాడుతా తీయగా ‘’ఫేం శ్రీ వంశీ ప్రత్యేకంగా పాల్గొనే ఈ కార్యక్రమానికి సాహిత్య ,సంగీత అభిమానులు విశేషంగా పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన .

అమరగాయకులు స్వర్గీయ ఘంటసాల వేంకటేశ్వరరావు,పద్మ విభూషణ్ డా .మంగళం పల్లి బాల మురళీ కృష్ణ  ,ఇటీవలే మరణించిన పద్మ భూషణ్ శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం (బాలు )సంస్మరణ జరుగును .

పాల్గొను గాయనీ గాయకులు

1-శ్రీమతి జోశ్యుల శ్యామలా దేవి –సరసభారతి గౌరవాధ్యక్షులు –నిర్వాహకురాలు

2-శ్రీ వంశీ –‘’పాడుతా తీయగా’’ ఫేం-మచిలీ పట్నం

3– శ్రీమతి వి.శాంతి శ్రీ –మ్యూజిక్ లెక్చరర్ –గుడివాడ

4-శ్రీమతి టేకుమళ్ళ చిదంబరి –ప్రముఖ సంగీత విద్వాంసురాలు , రేడియో, టివి గాయని –విజయవాడ

5-శ్రీ రొయ్యూరు సురేష్ –వర్ధమాన గాయకుడు –విజయవాడ

6-శ్రీమతి పి.పద్మజ –వర్ధమాన గాయని -ఉయ్యూరు

7-శ్రీమతి జి.మాధవి –గాయని ,-ఉయ్యూరు

8,చిరంజీవి నితిన్ కౌశిక్-వర్ధమాన యువగాయకుడు –ఉయ్యూరు

9– గానగంధర్వ స్వర్గీయ శ్రీ’’ బాలు’’ పై ప్రముఖ కవి, విమర్శకుడు శ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్య గారి ప్రసంగం (15 నిమిషాలు )

10–కార్యక్రమ నిర్వహణ –శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి –సరసభారతి కార్యదర్శి

 శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి – శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి    శ్రీ గబ్బిట  వెంకట  రమణ    

గౌరవాధ్యక్షురాలు                      కార్య దర్శి                        కోశాధికారి

                        గబ్బిట దుర్గాప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు -27-1-21-ఉయ్యూరు

      

image.png

                                                       

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 28- మువ్వ గోపాలకృష్ణ పద దాసు -శ్రీ పువ్వాడ శ్రీరామ దాసు

మహా భక్త శిఖామణులు

28- మువ్వ గోపాలకృష్ణ పద దాసు -శ్రీ పువ్వాడ శ్రీరామ దాసు

శ్రీ పువ్వాడ శ్రీరాములు గారు కృష్ణా జిల్లా దివితాలూకా మువ్వగోపాలుని మొవ్వ క్షేత్ర వాసి .మహా కృష్ణ భక్తులు .పదకవితలు రాసి చరితార్దులయ్యారు .’’ఆయనకీర్తన లలో భక్తి పారవశ్యత ప్రస్ఫుటం .శబ్ద సౌష్టవం ,కవితా స్వారస్యం తోపాటు శరణాగతి ఎక్కువగా కనిపిస్తుంది .జప తపో నిష్టులైన దాసుగారు మహామహిమాన్వితులు .ఒకరోజు పొలం లో తిరుగుతుంటే త్రాచు పాము కాటు వేసింది .లెక్క చేయకుండా ఇంటికి వచ్చిజపం లో మునిగిపోతే ఆ పామే ఇంటికి వచ్చి ఆ విషాన్ని పీల్చేసి ఆయనకు ఏ ప్రమాదం రాకుండా కాపాడి వెళ్ళింది .దాసుగారు కృష్ణ ,శివ కీర్తనలతో పాటు తెలుగు వారి కే ప్రత్యేకమైన జావళీలు కూడా రాశారు .మొవ్వవాసి క్షేత్రయ్య శృంగారం తో దున్నేస్తే, దాసుగారు భక్తీ ఆర్తీ శరణాగతి తో భావ బంధురంగా రాశారు ‘’అని ప్రసిద్ధ కవి శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజి గారి తల్లిగారు శ్రీమతి పువ్వాడ అనసూయమ్మ గారు చెప్పారు .దాసుగారు సోమయాజిగారికి పెద తాతగారనీ ,దాసుగారి కీర్తనలకు తానె బాణీలు కట్టి పాడే దానినని ,శివరాత్రి జాగరణ లో వీటితో సంగీత నృత్యం కూడా చేయించానని ఆమె గుర్తు చేసుకొంటూ తమ కుమారుడు సోమయాజిగారు పెదతాతగారి పై పుస్తకం తెస్తూ అందులో వారికీర్తనలు చేర్చి ప్రచురించటం సంతోషంగా ఉందని తెలియజేశారు .

  సుమారు 25ఏళ్ళ క్రితం మొవ్వలో మొవ్వ కాలేజి తెలుగు లెక్చరర్ డా.వై శ్రీలత గారు క్షేత్రయ్య పదకవితోత్సవం రెండు రోజులపాటు నభూతో గా జరిపి నప్పుడు ,సోమయాజి గారు నాప్రక్కన కూర్చుని శ్రీరాములు దాసుగారి గురించి కొంత చెప్పారు .రేడియో లో ఉదయం వచ్చే భక్తిరంజని కార్యక్రమం లో దాసు గారి కీర్తనలు వినేవాడిని .చాలా ప్రత్యేకంగానూ బాగున్నాయని అనిపించేవి .ఈ సభలో శ్రీమతి మంగళగిరి ప్రమీలా రాణి గారు కూడా పాల్గొన్నారు ఆమె నాకు బాగా పరిచయం అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడేవారు కూడా .సుమారు నాలుగేళ్ళక్రితం ఆమె పరమపదించి పదకవితకు తీరని లోపం చేకూర్చారు .నిన్న సోమయాజి గారు తాము ప్రచురించిన దాసు గారి పుస్తకం పిడిఎఫ్ పంపుతూ ‘’ఇందులోని పదకర్త ను మీ దృష్టికి తేవటం నాకు ఆనందకరం ‘’అని  చినుకు నర్మగర్భంగా చిలికారు. బహుశా నేను మహా భక్త శిఖామనులను గురించిఅంతర్జాలం లో రాస్తున్నందున నా దృష్టికి వారి పెద తాతగారు రాలేదేదనే అభి ప్రాయమూ ఉండి ఉండచ్చు లేక చనువుగా ‘’రాయండి ‘’అనే ఆదేశమైనా కావచ్చు .ఏదైనా ఒక మహా భక్తకవి గురించి పరిచయం చేయటం  నా అదృష్టమే కాదు ధర్మం, విధి కూడా. అందుకు మహదానందంగా ఉంది .

  ఈ పుస్తకానికి ముందుమాటలు రాసిన పద సంగీత పరిషత్ స్థాపకురాలు ,సాహిత్య రత్న డా శ్రీమతి మంగళగిరి ప్రమీలా రాణి పువ్వాడ శ్రీరాములుగారి తండ్రి శ్రీ గుర్రాజు గారు, తాతగారు వెంకటాచలం గారు అనీ వీరిది ‘’చికితస ‘’గోత్రం అనీ ,మొవ్వలోని కృష్ణునిపై ,భీమేశ్వరునిపై పదాలు రాసి శివ కేశవ భేదం లేని స్మార్తులనీ తెలియ జేశారు.’’నందీ వాహనుడై వచ్చే నమ్మా  —మేల్ మేల్ భీమలింగా ‘’,జయరామ లింగ జయరామ లింగ ‘’పదాలు చాలా ప్రసిద్ధమైనవనీ విస్తృతంగా వ్యాప్తి చెందాయని చెప్పారు .దాసు గారి కీర్తనలలో బహు ముద్రలు ఉండటం ప్రత్యేకం అన్నారు .మువ్వ మువ్వ గోపాల ,శ్రీరామ దాస ,మువ్వ నివాస ‘’అనేవి ఆముద్రలు అన్నారు .’’ఎన్నడు చూడగ లేదు –ఈత డెవ డమ్మా-పన్నగ శయనుడు  -మువ్వ గోపాలుడే కొమ్మా ‘’పదం దశావతార వర్ణనా ప్రాముఖ్యం కలది .ఇది ఇద్దరి స్త్రీల మధ్య సంవాదన గేయం కనుక నాటకీయత ఉండి,వినేవారికి విషయం తేలికగా అర్ధమౌతు౦దన్నారు ప్రమీలారాణి గారు .పదకర్త శ్రీరాములు దాసుగారు బాగా ప్రచారం లో ఉన్న బిలహరి, ఆనంద భైరవి,కేదార గౌళ ,మధ్యమావతి  శ్రీరాగాలలో కీర్తనలు సంచరించారు .భగవత్చేవా పరాయణులైన దాసుగారు స్వామివార్లకు నిత్యోత్సవ సేవలు కడు భక్తితో నిర్వహించి తరించేవారు .’’యజ్ఞాది కర్మా చర.ణ కంటే నీ భక్తి భాగ్య సుధానిధి దే జన్మము ‘’అని నాదబ్రహ్మ త్యాగ రాజస్వామి జయమనోహరి రాగం లో రాసిన కృతి లోని భావాన్ని గ్రహించి భక్తి భావం తో పదకవితా స్రవంతిని ఆంధ్రులకు అందించిన శ్రీ పువ్వాడ శ్రీరాములు దాసు గారి జన్మ ధన్యం ‘’ అని నిండుమనసుతో కీర్తించిన పదకవితా ప్రచారక ప్రమీలారాణి గారి ముందుమాటలు సువర్ణానికి సువాసన అద్దాయి .పుస్తక గౌరవం మరింత పెరిగింది .ఈ చిరుపొత్తం 1991లో ప్రచురితమైంది. బహుశా వెల అమూల్యం .

  ఇందులో శ్రీరామ దాసు గారు మువ్వ గోపాలునిపై 1-ఎక్కడ ఉన్నావు కృష్ణా నేనెంత వేడిన రావు ‘’2-ఎన్నడు చూడలేదు ఈత డెవరమ్మా ‘’3-అదుగో గోపాలుడు వచ్చే నమ్మలారా 4-రారా పోదామురారా లేచి రారా పోదాము 5-బాలెంతరాలనురా కృష్ణా –‘’అల్ల ‘’పని కోర్వ జాలనురా .కీర్తనలు ఉన్నాయి .భీమేశునిపై 6-మేల్ మేల్ భీమ లింగ 7-జయరామలింగ జయ రామ లింగ 8-నందీ వాహనుడై వచ్చెనమ్మా 9-దశరధ రామ పరాకు ‘’10-రామ సదానంద రామ గోవింద ‘’అనే శిధిలమై కాలగార్భాన కలిసిన వికాక మిగిలిన మొత్తం పది కీర్తనలే దక్కి ముద్రణ భాగ్యం పొందాయి. పెదతాతగారి పై అనన్య భక్తీ గౌరవాలున్న శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజి గారు ఈ కరదీపిక ప్రచురించి ఆంధ్రలోకానికి మహోపకారం చేసి ,200 ఏళ్ళ తర్వాత మళ్ళీ మువ్వ గోపాలస్వామికి పద మంజీరాల ధ్వనులతో కనువిందు వీనులవిందు చేకూర్చి నందుకు అభినందనీయులు .ఇందులో పువ్వాడ వారి వంశ వృక్షం కూడా జతచేయటం మరో గొప్ప విషయం

 సశేషం

  రిపబ్లిక్ డే శుభాకాంక్షలతో

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -26-1-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 27- భద్రాద్రి రామ భక్త శిఖామణి అమరవాది  వెంకట రామానుజా చార్యులు

మహా భక్త శిఖామణులు

27- భద్రాద్రి రామ భక్త శిఖామణి అమరవాది  వెంకట రామానుజా చార్యులు

    శ్రీరామార్పణ౦

గోల్కొండ రాజ్యాన్ని ఔరంగజేబు  పాలించి భంగపడ్డాక,17వ శతాబ్దిలో భద్రాచలం జమీందారు పాలనలో ఉండేది .స్వామికార్యాలు అవిచ్చిన్నంగా జరిగేవి .ఆయన పేరు వగైరాలు ఎవరికీ తెలియవు .ఈ క్షేత్రం లో అమరవాది కామళ్ళ వెంకట రామానుజా చార్యులు అనే దివ్య పురుషుడు ఉండేవాడు .తలిదండ్రుల పేర్లు తెలియవు కానీ ఇప్పటికీ ఈ వంశం వారు అక్కడ ఉన్నారు ఇతడికి ముందుపుట్టిన పిల్లలు వెంటనే చని పోవటం చేత తలిదండ్రులు ఇతడిని శ్రీరాముడికి అర్పించారు .ఇతడు మధ్యాహ్న సమయం లో దేవుడికిచ్చే బలి మెతుకులు తిని,,రామ తీర్ధం తాగి  జీవించేవాడు .

 సహజ పాండిత్యం ,శ్రీ రామ దర్శనం, కళ్యానోత్సవ విధి విధాన రచన

  సహజ పాండిత్యం అబ్బి ఉపనయనం జరిగి రామభక్తి మరింత పెరిగింది .సర్వావస్ద లలో  రామనామం చేసేవాడు .ఉదయమే లేవటం స్నాన సంధ్యాదులు పూర్తి చేసి , రాముడికి షోడశోప చార పూజ చేసి ప్రసాదం తిని దూరంగా వెళ్లి తత్వ విచారం చేస్తూ తాను  తరించి ,ఇతరులనూ తరింప జేసేవాడు .ఒకసారి సంప్రజ్ఞాత సమాధి లో శ్రీరామ దర్శనం కలిగి ,పులకితుడై స్తుతి చేసి ఆనంద పారవశ్యం పొందాడు .రాముడు ‘’వత్సా !నా ఉత్సవ ప్రక్రియ అంతా ఆగమ శాస్త్ర విధానం గా పొందుపరచి ,మూల గ్రంథానికి,ఖండ వరుస రాసి నా కోర్కె తీర్చు ‘’అని చెప్పి అదృశ్యమైనాడు .పండిత శ్రేష్టులకే అత్యంత కష్టమైన ఆపనిని సహజ పాండిత్యం తో పూర్తి చేసి శ్రీరామానుగ్రహం పొందాడు ఆయన రాసిన ఆ ప్రక్రియను అనుసరించే ఇప్పటికీ భద్రాద్రి సీతారామకల్యాణ విధి జరుగుతోంది .

   పాల్వంచలో మట్టి సీతారామ విగ్రహ నిర్మాణం భద్రాద్రిలో అదృశ్యమైన శ్రీరాముడు

  ఆలయ ధర్మకర్త ఒక సారి ఆలయానికి వస్తే  ఈయన తగిన మర్యాద చేయలేదనే కోపం తో ,తనపాలనలో ఎక్కడా ఆయన ఉండకూడదనే చండ శాసనం  చేశాడు  .చేసేది లేక ,భద్రాద్రి వదిలేసి పాల్వంచ చేరి మట్టితో సీతారామ విగ్రహాలు చేసి ,ప్రాణ ప్రతిష్ట ,కళావాహనం చేసి,పలువిధాల స్తుతించి సుముఖుని చేసుకొన్నాడు .రాముడు సాక్షాత్కరించి ‘’నాయనా !నువ్వు లేని భద్రాద్రి లో నేనూ ఉండను .ఇక్కడే నీతో పాటు ఉంటాను ‘’అనగా పరమానందం పొందాడు .మర్నాడు భద్రాచలం లో పూజారులకు అర్చా మూర్తులు కనిపించలేదు .జమీందారుకు విషయం తెలిసి నడిచి పాల్వంచకు వచ్చి అమరవాది ఆచార్యుల పాదాలపై వ్రాలి క్షమించమని ప్రార్ధించగా ,మనసు కరిగి ఈ మట్టి విగ్రహాలు తీసుకొని భద్రాద్రి చేరాడు .

    యవన సేన నుంచి భద్రాద్రి రాముని కాపాడిన విధం

ఒక సారి యవన భటులు భద్రగిరి ముట్టడించి ,ఆలయ ప్రవేశం చేయ బోతుండగా ,జమీందారు ఆచార్యులవారిని పిలిపించి ఈ ఆపద గట్టెక్కించమని కోరాడు .వారి వలన ఏ ప్రమాదం రాదనీ హామీ ఇచ్చారు ఆచార్యులు  .ఆయన్ను పంపించేసి తానొక్కడే ఆలయం లో రామభజన చేస్తూ కూర్చున్నారు ఆచార్యస్వామి ..ఆలయం లో హడావిడి లేదుకనుక యవన భటులు ఇద్దరు మాత్రమే ఆలయం లోకి ప్రవేశించగా విగ్రహాలు కనిపించలేదు .ఇక్కడ విగ్రహాలు లేవని భావించి వాళ్ళు వెళ్ళిపోయారు .

 గోదావరి లోదాచిన  ఉత్సవవిగ్రహాల విషయం –ఫణిగిరి సీతా దేవి భద్రాద్రి చేరటం

  ఒకసారి అర్చక బృందం ఆచార్యుల వారికి చెప్పకుండా ఉత్సవిగ్రహాలను గోదావరిలో దాచి యవ్వన బారి నుంచి కాపాడారు .గోదారి వరదలతో  ఉధృతంగా ప్రవహించి ఉత్సవ మూర్తులను తీయటానికి అవకాశం కలగ లేదు .వరద తగ్గాక దాచిన చోట వెదికితే ఉత్సవ విగ్రహాలు కనిపించలేదు అర్చకులకు .ఈ విషయం జమీందారుకు చెబుతూ ‘’రోజూ అర్ధరాత్రి వేళ గోదావరి నీటిలో నుంచి తమల్ని పిలుస్తున్నట్లుగా శబ్దాలు వస్తున్నాయి కాని అంతు పట్టటం లేదు ‘’అని చెప్పారు .ఆలయం లో ‘’ఉత్సవ భీరం’’ లేదని అర్ధమయి ,శ్రీరాముడే గోదావరి నీటి లో నుంచి మాట్లాడుతున్నాడని గ్రహించి ,ఆచార్యులవారికి తెలియ జేశాడు .ఆయన ‘’భయం అక్కర లేదు రేపు మధ్యాహ్నం ఉత్సవ భీరం గోదావరి పై తేలుతూ కనిపిస్తాయి ‘’అని చెప్పారు .మర్నాడు పూజారులు వెళ్లి చూస్తె సీతా దేవి విగ్రహం మాత్రం కనిపించలేదు .ఆచార్యుల వారికీ విషయం చెబితే ‘’రాముడు సీతను గోదావరికి అర్పించాడు ఫణిగిరి ఆలయం లోని సీతా దేవి ఉత్సవ విగ్రహం తీసుకు రమ్మని చెప్పి పంపించగా అక్కడి జమీందార్లు ఒప్పుకోక భద్రగిరిపై దండ యాత్ర చేశారు ఫణిగిరి జమీందారు కలలో రాముడు కనిపించి ‘’అనవసరంగా అడ్డు చెప్పకు విగ్రహం ఇచ్చి పంపించు ‘’అని ఆనతి ఇవ్వగా ఇచ్చిపంపాడు .ఇప్పుడు భద్రాచలం లో శ్రీరాముని ప్రక్కన ఉన్న ఉత్సవిగ్రహం ఫణిగిరి నుంచి తెచ్చినదే .

   మహా ప్రస్ధానం

ఈ విధంగా భద్రాచల రామాలయ ఉత్సవాలకు ఆగమ విధి విధానం ఏర్పాటు చేసి ఆలయాన్ని యవన బాధ నుంచి కాపాడి పోయిన సీతామ్మవారి విగ్రహాన్ని ఫణి గిరి నుంచి తెప్పించిన మహోన్నత భక్త శిఖామణులు శ్రీమాన్ అమరవాది రామ చంద్రాచార్యులవారు 70వ ఏట శ్రీరామ సన్నిధి చేరుకొన్నారు .

  సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -25-1-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment