సరస్వతీ సమర్చనం

సరస్వతీ సమర్చనం

సరసమైన అక్షరాలపొందికతో
రససమంచితమైన పదాల అల్లికలతో
సహృదయ హృదయాలను వెలిగింపచేస్తూ
భాషా భారతికి సేవలందిస్తూ
రమణీయమైన రచనలతో
తీరైన కావ్యముల ద్వారా
ఎందరోమహానుభావులను
పాఠకలోకానికి పరిచయంచేస్తూ
సరసభారతి సాహితీ సంస్థద్వారా
“తెలుగులో మాట్లాడటం మనజన్మహక్కంటూ”
మాతృభాషను మాతను మరువరాదంటూ
సరస్వతీ సమర్చనం చేస్తున్న
పెద్దలు మాన్యులు శ్రీదుర్గాప్రసాద్ దంపతులు
సహస్రచంద్రదర్శన వేడుకలేకాక
శతవసంతాల పండుగనుజరుపుకోవాలని
వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలను
ప్రసాదించాలని మనసారా
మనసారా ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను.

డా.మైలవరపు లలితకుమారి
గుంటూరు.
9959510422.

Posted in పద్య రత్నములు | Tagged | Leave a comment

సహస్ర చంద్రదర్శన సౌభాగ్య మహోత్సవ పద్య రత్నములు

సహస్ర చంద్రదర్శన సౌభాగ్య మహోత్సవ పద్య రత్నములు

దైవతాశీస్సు!
శ్రీ ‘సువర్చలాదేవి’తో స్థిరముగాను, పూర్వకాలాన ‘నుయ్యూరు’ పురమునందు,
‘గబ్బిటాన్వయ’ పుణ్యంపు గరిమ మహిమ, తెలుప; స్థాపించుకొన్నట్టి దేవ ‘హనుమ’
గుణధనమున వెలిగెడు నీ గొప్పవాని, శిష్టు, దుర్గాప్రసాదు నా శీర్వదించు!

వేకువఝామునన్ గడగి  వేదవిశేష సుమంత్ర శేముషిన్,
చేకొని ‘యాంజనేయుని’కి సేవలుచేసిన పుణ్య భాగ్యమే,
నీ కమనీయ గ్రాత్ర వరణీయమహీయ వదాన్యసూత్రమై
సాకెనటంచు నెంచి, మనసా వచసా నతులన్ వచించెదన్!

గబ్బిట వంశ వర్ధనుడు! గౌరవ ‘దుర్గ ప్రసాదు మాస్టరున్’,
నిబ్బరమైన ప్రఙ్ఞకును, నిర్మలవర్తన మేలుబంతిగాన్,
కబ్బములెన్నొ  వ్రాసిన  ప్రకాండుడునై, గురుతుల్యుడై,
యబ్బిన విద్యలందఱకు నందగ జూచుట, ‘నెంత ధన్యుడో’!

సొగసు నిండార పండిన సోకుగాడు!
నిత్య పరిశుభ్ర సరిదభ్ర నీటుగాడు!
అందరిని కుదిపి కదుపు నాటగాడు!
పొగరు పండించి పెంచె, నీ పోటుగాడు!

వీరి వర్తనకు మత్తకోకిలా కీర్తన!
‘నెమ్మదిన్’ తన కోశమందున నిల్వజేయని వీరుడున్,
మమ్మునందరి దుమ్ము దుల్పుచు మారుపల్కగజేయకన్,
సమ్మతంబున వారి వెన్కనె సాగునట్టుల జేయుటన్
యిమ్మహాత్ముని ‘యాంజనేయుడె’ యెల్లవేళలగాచుతన్!

                                                         భవదీయుడు.
                                                              సరస కవిరాజు
                                                 విద్వాన్  నవులూరి రమేశ్ బాబు,
                                                              ఉయ్యూరు.  

—

Posted in పద్య రత్నములు | Leave a comment

కె.ఎన్.కేసరి గారి ముచ్చట్లు.1వ భాగం

Posted in రచనలు | Tagged | Leave a comment

Sarasabharati 27.06.22 program live

Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

ఇవాళ నా పుట్టిన రోజు

ఇవాళ నా పుట్టిన రోజు

 ఇవాళ 27-6-22 సోమవారం  నా పుట్టిన రోజు .82 వెళ్లి 83 వచ్చిన సందర్భంగా  సాహితీ బంధువులకు ,సాహిత్యాభిమానులకు ,హితులకు ,మిత్రులకు ,బంధువులకు ,కుటుంబ సభ్యులకు  శుభ కామనలు. గబ్బిట దుర్గా ప్రసాద్ – 

Posted in సమయం - సందర్భం | 1 Comment

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్ -2

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్ -2

1757ప్లాసీ యుద్ధం తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాలో తమపాలన మొదలు పెట్టేనాటికి తూర్పు భారతమంతా అరాచకంగా ఉంది .శాంతి భద్రతలు లేవు .ఇది 19వ శతాబ్ది  ప్రారంభందాకా కొనసాగింది .డబ్బుకు న్యాయం అమ్ముడు పోయింది .బ్రిటిష్ వారికి జీతాలేక్కువ ఇండియన్ లకుచాలా తక్కువ .దేశీయులు కూడా విదేశీయులతో పాటు అవినీతి లంచ గొండి తనానికి కేరాఫ్ అడ్రస్ అయ్యారు .ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా లో ఆర్ .సి దత్  ఇలా రాశాడు -‘’బెంగాల్ లో అప్పుడు దోపిడీ దొంగలు బందిపోట్లు అందలమేక్కారు .వారిని మేజిస్ట్రేట్లు  కూడా ఏమీ చేయలేకపోయారు .కారణం పోలీసుల జీతాలు అతి తక్కువకనుక లంచాలకు అలవాటు పడ్డారు .వీరి సహకారం  సరిగ్గా మేజిస్ట్రేట్ లకు దక్కలేదు .పెద్ద పట్టణాలు వ్యాపారకేంద్రాల్లో బందిపోట్ల దాడులు తీవ్రంగా ఉండేవి .గ్రామాలు భయంతో కంపించేవి .బందిపోటు నాయకులు మారినప్పుడల్లా వారిని ప్రసన్నం చేసుకోవటానికి మూల్యం చెల్లించాల్సి వచ్చేది .1800 నుంచి పదేళ్ళు దేశం విపత్కర పరిస్థితులలో కొట్టు మిట్టాడింది .బజార్లలో మార్కెట్ లలో ‘’బెంగాల్ రాజ్ రాయ్ ‘’ల గురించి కధలు గాధలుగా చెప్పుకొనేవారు .తగిన అధికారాలు లేక మేజిస్ట్రేట్లు, పోలీసులు అచేతనులయ్యారు .ప్రజలు దుస్థితి కి తలవొగ్గారు .పాలకుల చర్యలు ప్రజల్ని మరింత సంక్షోభాపెత్తాయి .తప్పుడు సమాచారాలతో భారీగా అరెస్ట్ లు జరిగాయి .బందిపోట్లతో పాటు పోలీసుల పీడా కూడా జనాలను కుంగదీసింది .బ్రిటిష్ పాలన అంతం అయేదాకా ఈ పరిస్థితి ఉంది .దేశభాషలు ఆచారాలు సంప్రదాయాలు ,సామాజిక వ్యవస్థ తెలీని  బ్రిటిష్ అధికారులు ,ప్రాపకం సంపాదించిన వారి సాయంతో మరింత అన్యాయాలు చేయించారు .మోకాళ్ళ  మెదడు లోని ట్యూబ్ లైట్లు వెలిగి ,పాలన ,న్యాయ వ్యవస్థ,బాధ్యతాయుత పదవులలో విషయజ్ఞులైన సమర్ధులైన భారతీయులను నియమించాలి అని బ్రిటిష్ అధికారులు గుర్తించారు .కానీ తక్కువ జీతాలతో నియమించారు .ఈ పరిణామ తో భారత్ లో ఆంగ్లేయ విద్య కు నాంది పలికారు .భారతీయ ప్రభుత్వ సిబ్బందికి విషయ పరిజ్ఞానం అందించటమే వారి ముఖ్యోద్దేశం .కంపెని వాణిజ్య విధానాలతో దేశీయ పరిశ్రమలైన స్పిన్నింగ్ డైయింగ్ ,నూలు ,పట్టు పరిశ్రమలు  బాగా దెబ్బ తిన్నాయి .ఇదే అదనుగా బ్రిటిష్ వస్తువులు దేశీయులపై రుద్దటం మొదలు పెట్టారు .కొద్దికాలం లోనే దేశీయ వస్త్రాల ఉత్పత్తి దారులకు ,వారి పట్టు ,నూలు బట్టలకు స్థానం లేకుండా పోయింది ..దేశీ వస్త్రాలపై 67శాతం పన్ను విధించటం వలన ,యంత్ర వస్త్రాల తయారీ ధాటికి తట్టుకోలేక  అదృశ్యమయ్యాయి .నూలు విదేశాలకు ఎగుమతి అయ్యేది .వీటన్నిటితో భారత దేశం ఉత్పాదక స్థాయి నుంచి పతనం చెంది ,కేవలం వ్యావసాయక దేశంగా మారిపోయింది .నూలు వస్త్రాల ఎగుమతులు విపరీతంగా పెరిగిపోయాయి .

  గుత్తాదిపత్యంతో అక్రమ లాభాలు ఆర్జిస్తూ,,చార్జీలపేరుతో దేశాన్ని కొల్లగొట్టింది కంపెని ప్రభుత్వం .బ్రిటన్ కు చెల్లించాల్సిన వడ్డీ పై  వడ్డీ ,రైల్వే మిలిటరీ చార్జీలపై వడ్డీ ముక్కు పిండి వసూలు చేశారు .దేశీయ రాజులపైన ,ఆఫ్ఘనిస్తాన్ చైనా బర్మా నేపాల్ పై యుద్ధాల పైనా అయిన ఖర్చులు మననుండే  గుంజుకొన్నారు .1858లో ఈస్ట్ ఇండియా కంపెని పాలనను బ్రిటిష్ సింహాసనానికి ధారాదత్తం చేశాక ,మన దేశపు రుణ భారం పేరిట 15కోట్లు బ్రిటిష్ రాజ్యం ముక్కు పిండి వసూలు చేసింది .1857 సిపాయి తిరుగుబాటు ఖర్చు,1867 అబిసీనియా పై యుద్ధం ఖర్చూ  కూడా రాబట్టుకొన్నారు .1900 నాటికి మన రుణ భారం 2కోట్ల 40లక్షలు .

  దేశంలో పండిన ఆహార ధాన్యాలు విదేశాలకు ఎగుమతి చేయటం తో పేదరికం తీవ్ర స్థాయికి చేరింది .తరచుగా కరువులు  ,మహామారి1770-19౦౦ మధ్య 22సార్లు వ్యాప్తి వలనఆకలి బాధతో కోట్లాది జనం మలమలమాడి నశించారు  .కరువు తాండవమాడే కాలం లోనూ పన్నులు పెంచి పీడించారు .1866-67 ఘోర కరువుకాలం లోకూడా ,అంతకు ముందు ఎప్పుడూ లేనంత ఎక్కువగా ఆహారధాన్యాలు ఇండియానుంచి ఎగుమతి చేసి జనం చావుకు కారకులయ్యారు .

  ఉన్న ఒకే ఒక ఆదాయ వనరు వ్యవసాయం పైన కూడా అధికపన్నులు వసూలు చేసి రైతుల నడ్డి విరగగొట్టారు .దేశం భూకమత౦ గా  మారి ,దేశం లో పండింది ఏదైనా తమదే అనే నిర్ణయానికి వచ్చారు .రైతులు ,కూలీలు పొట్టగడవక బంది పోట్లుగా మారారు .1793లో సుంకాలు లేవీల వసూలు అధికారం లాండ్ లార్డ్ లనబడే బడా ధనికభూస్వాములకు  అప్పగించారు  .వసూలు చేసినదానిలోసి౦హభాగం అంటే 90శాతం ప్రభుత్వానికి అప్పగించాలని షరతు పెట్టారు .దీనితో భూస్వాములు సాధికార రెవిన్యు ఏజెంట్లయ్యారు .వాళ్ళు రైతులపై అదనపు పన్ను వసూలు చేసి విలాసాలకు ఉపయోగించుకొన్నారు .ఇలా సింహాసనానికి సొమ్ము దోచిపెట్టారు భూస్వాములు .అక్రమ పన్నులలో  తలపన్ను అంటే ‘’పోన్ టాక్స్’’ఒకటి .మనుషులుపశువులు పై ఈ టాక్స్ వసూలు చేసి భూస్వాములు తమ బొక్కసాలు నింపుకున్నారు బొర్రలు పెంచుకొన్నారు .తిండి గిజలు ,జనుము కొని బ్రిటిష్ దొరలతో  నీలి అంటే ఇండిగోతోటల పెంపకం దారులతో కుమ్మక్కై ,కౌలు రైతుల్ని పీడిస్తూ అంతులేని  అధికారం  చెలాయించారు .బక్కరైతులు బిక్క చచ్చి న్యాయ పోరాటం కూడా చేయలేక  శక్తి హీనులైపోయారు .తెల్లదొరల రక్షణలో ఉంటూ ,అనాగరకంగా రైతులను అణగదొక్కుతూ బలవంతంగా నీలి పండించేవారు .దీన్ని తక్కువ ధరకే కొని ఎక్కువధరకు అమ్మి  విపరీతంగా లాభాలు పొంది,రైతులకడుపులు కొట్టి నిర్భాగ్యుల్ని చేసి తాము  ఆధునిక కుబేరులయ్యారు బొర్రా సాబ్ లయ్యారు .

  భారత దేశంలో నీలి విప్లవం ‘’ఇండిగో రివోల్ట్ ‘’తో జాతీయ ఉద్యమానికి నాంది పలికింది .జర్మన్ శాస్త్ర వేత్తలు1880లో  సింధటిక్ రంగులు కనిపెట్టే దాకా నీలి రంగు రాజ్యమేలింది  .బెంగాల్ లో సుమారు 400 ఇండిగో కర్మాగారాలు ఉండేవి .నీలి పండించని రైతులపై భూస్వాములు ఏదో ఒక సాకుతో కక్ష తీర్చుకొనేవారు .ఆక్రమ నిర్బంధం తో చాలామంది రైతులు మరణించారు .1810లో వచ్చిన సర్క్యులర్ దాకా అంటే బెంగాల్ ప్రజలు ఎదురు తిరిగేదాకా  సుమారు అర్ధ శతాబ్దం నీలి రైతులపై అణచి వేతకొనసాగింది .1860లో ‘’ఇండిగో డిస్టర్బెంస్ ‘’అనే తిరుగుబాటు వచ్చాక బ్రిటిష్ నీలి పెంపక దార్లను తన్ని తరిమేశారు .నీలి పెంపకాన్ని ఎదిరించి బ్రిటిష్  వారి ఇళ్ళ పైనా  నీలి  ఫాక్టరీలపైనా ప్రజలు దాడులు చేశారు .బడుగు రైతుల ఈ తిరుగు బాటును పత్రికలూ బాగా సమర్ధించాయి .జెస్సోర్ జిల్లలో శిశిర్ కుమార్ ఘోష్ ,ఆయన తమ్ముడు మోతీ లాల్ ఘోష్ లు  నీలి రైతుల ఆందోళనకు మద్దతు పలికారు .దీన బంధు మిశ్రా రాసిన .’’నీల్ దర్పణ్’’-మిర్రర్ ఆఫ్ ఇండిగో నాటకం వాడవాడలా ప్రదర్శింఛి రైతు ఉద్యమానికి తిరుగులేని బలం చేకూర్చారు .ప్రజల్లో బ్రిటిషర్లపై అసహ్యం కలిగింది. మైఖేల్ మధుసూదన దత్ ఈ నాటకాన్ని ఇంగ్లీష్ లోకి  అనువదించి ‘రివరెండ్ జే లాంగ్ ‘అనే మారు పేరుతొ ప్రచురించాడు .ప్రభుత్వం ప్రాసిక్యూట్ చేసి వెయ్యిరూపాయల జరిమానా ,  నెల రోజులు జైలు శిక్ష వధించింది .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -25-6-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సరస భారతి సాహితీ పుష్కరోత్సవం ఆహ్వాన పత్రిక

Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన,అమృత బజార్ పత్రిక స్థాపకుడు , స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్ -1

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన,అమృత బజార్ పత్రిక స్థాపకుడు , స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్ -1

సచ్చీంద్ర లాల్ ఘోష్ బెంగాలీ లో రాసిన దానికి శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ ‘’మోతీలాల్ ఘోష్ ‘’గా తెలుగు అనువాదం చేయగా, కేంద్ర సాహిత్య అకాడెమి1992లో పుస్తకంగా ప్రచురించింది .వెల-37 రూపాయలు .పుస్తకం ద్వితీయ ముద్రణ భాగ్యం పొందింది .

  19వ శతాబ్దం మొదట్లో జాతీయోద్యమమ ,,భారతీయ జర్నలిజం జమిలిగా ఒకదాని నొకటి కాపాడుకొంటూ నడిచాయి .దేశం స్వాతంత్ర్యం పొందేదాకా ఈ రెండు జోడు గుర్రాలస్వారి చేశాయి .1757నుంచి 1910దాకా కలకత్తా నగరం బ్రిటిష్ పాలనలో పాలనా యంత్రా౦గానికి  రాజధానిగా ,తూర్పు భాగాన ప్రధాన వ్యాపార కేంద్రం గా ఉంది .అందువలన జాతీయోద్యమం అక్కడే పుట్టింది .కలకత్తా ,బెంగాలీలు జాతీయోద్యమం లో  అసామాన్య పాత్ర నిర్వహించారు .కలకత్తా పత్రికల సంపాదకులు భారత రాజకీయ లక్ష్యాలను ,అభిప్రాయాలను విస్తృతంగా ప్రచారం చేశారు.దాదాపు 50 ఏళ్ళ పాటు ఆ లక్ష్యాలు ,కార్యక్రమాలను రూపొందించి ,నిర్దేశించింది ఈ సంపాదకులే .దేశానికి రాజకీయ జాగృతి కలిగిన మొదటి దశలో ముగ్గురు మహానుభావులు మూడు మార్గాలలో చైతన్య రధాలను నడిపించి సారధులయ్యారు .అన్నగారైన శిశిర్ కుమార్ ఘోష్ శిష్యరికం ,తర్ఫీదు లో మోతీలాల్ ఘోష్ స్వాతంత్రోద్యమ కారుడుగా రూపొందాడు ,శాంతియుత ప్రతిఘటనకు ప్రజలను సమాయత్తం చేశాడు .బ్రిటిష్ పాలన తొలగించటానికి ,,స్వాతంత్ర్యం సాధించటానికి ,బ్రిటిష్ వలస రాజ్యమైన ఇండియా స్వీయ పాలనకోసం పోరాటం చేయటానికి సురేంద్ర నాథ బెనర్జీ పిలుపు నిచ్చాడు .అరవింద ఘోష్ సంపూర్ణ స్వరాజ్యం  ప్రతిపాదించాడు .ఆ విప్లవోద్యమానికి సిద్ధాంత కర్త కూడా అయ్యాడు .దేశ రాజకీయ పోరాట మౌలిక ప్రముఖులలో అరవిందులు ఒకరు .చిన్న కుగ్రామం నుంచి వచ్చిన మోతీలాల్ ఘోష్  పై ప్రముఖ వర్గానికి చెందిన వాడు కాదు .ఆ నాటి గ్రామీణ ప్రజల సాధకబాధకాలు గ్రహించి స్వాతంత్రోద్యమం వైపు మళ్ళినవాడు .గ్రామీణ ప్రజలను కాపాడాలంటే ,విదేశీ పాలకులను తరిమి కొట్టాల్సిందే అని భావించి గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం స్వాతంత్రోద్యమం లో అడుగుపెట్టాడు .

  కాలం ఆ తర్వాత మహా వేగంగా గడవటం తో ,వర్తమాన భారతం ఆ  స్వాతంత్రోద్యమ ప్రారంభకులను మర్చే పోయింది .కానీ గాంధీ ,నెహ్రూలు ఈ మహానుభావులను తరచూ స్మరించేవారు .వంకలేని తిన్ననైన జీవితం మోతీలాల్ ఘోష్ ది.పత్రికా రచనలో కర్తవ్య దీక్షలో ఆయన జీవితం పండి పోయింది .జాతీయోద్యమ ,స్వాతంత్ర్య పోరాటాలలో గ్రామీణ ప్రజలకు ప్రాతినిధ్యం వహించి ,అత్యంత ప్రముఖ వ్యక్తిగా భాసిల్లాడు .ఆయన వ్యక్తిగత జీవితం కంటే ప్రజాజీవిత విశేషాలు కార్యక్రమాలు ,కార్య కలాపాలకే అత్యధిక ప్రాధాన్యత నిచ్చి ఈ చిన్న పుస్తకం రాశానని బెంగాలీ రచయిత సచ్చీంద్ర లాల్ ఘోష్ వివరించాడు  .

  ప్రవేశిక

18వ శతాబ్దిలో బ్రిటిష్ వ్యాపారులు బెంగాల్ ను చేజిక్కించుకొని పాలన చేశారు .ఈ పునాదులపై విస్తరిల్లిన కలకత్తా మహా నగరం రాజకీయ ఉద్యమాలకు ,వ్యాపారాలకు గొప్ప కేంద్రమై ప్రాముఖ్యం పొందింది .స్వదేశే విదేశీ పాలకులమధ్య సాంస్కృతిక ఘర్షణలకు కూడా ఈ నగరం కేంద్రమైంది .మొగల్ సామ్రాజ్యం లో రాజకీయ ఐక్యత సాధించిన భారత్ ,బ్రిటిష్ వ్యాపారులు వచ్చాక ,చిన్న చిన్న రాజ్యాలు పరస్పరం ఘర్షణలకు దిగాయి .బ్రిటిష్ వారిచే అణచి వేయబడిన ప్రజలు ,రాజకీయ అధికార మార్పిడిని పెద్దగా పట్టించుకోలేదు .1757లో జరిగిన ప్లాసీ యుద్ధం లో ,బెంగాల్ పై ఆధిపత్యం చేతులు మారిన తరుణం లో ప్రజలు నిస్సహాయంగా ఉండి పోయారే తప్ప ,ప్రతిఘటన ప్రయత్నం చేయకపోవటం తో భారత దేశ భవిష్యత్తు స్థంభించి పోయింది .’’’లక్షల సంఖ్యలో ఉన్న బెంగాల్ జనాభా యూరోపియన్లను తరిమి వేయాలి అని యేమాత్రమైనా అనుకుని ఉంటె,రాళ్ళు రప్పలతో ఆ లక్ష్యాన్ని సాధించగలిగి ఉండేవారు .కాని వాళ్ళను స్తబ్దత ఆవరించింది ‘’అన్నాడు బ్రిటిష్ పార్లమెంట్ సెలెక్ట్ కమిటీ సమావేశం లో రాబర్ట్ క్లైవ్.

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-6-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సరస భారతి సాహితీ పుష్కరోత్సవం ఫైనల్ ఆహ్వాన పత్రిక

సరస భారతి సాహితీ పుష్కరోత్సవం ఫైనల్ ఆహ్వాన పత్రిక .చివర ఇచ్చిన లింక్ ను గమనించండి

Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

  శ్రీ మహమ్మద్ హుస్సేన్ రాసిన హరిహర నాథ శతకం -2(చివరి భాగం )

  శ్రీ మహమ్మద్ హుస్సేన్ రాసిన హరిహర నాథ శతకం -2(చివరి భాగం )

‘’శ్రీకరమై నీ నామము –ధీకరము నగణ్యపుణ్య దీప్తి కరమ్మై-లోకోత్తర శీలకర-మ్మై కావుట మమ్ము నెపుడు హరిహరనాథా ‘’అని కంద శతకం మొదలుపెట్టి మహమ్మద్ కవి .’’క౦దమ్ములు భక్తి రసా-నందంబులు ,నవ రసార్ద్ర నానాగుణమా –కందంబులువరశిల్పపు -టందంబులు స్వీకరింపు హరిహరనాథా ‘’అని ప్రార్ధించి క౦ద౦ అందంగా చెప్పారు .’’నీ కరుణ కృతార్ధ సుధా –సేకరణ ,మఖర్వ వృజిన జీమూత విశు-ష్కీకరుణ మపూర్వ ప్ర-జ్ఞా కరణ మకారణముగ’అంటూ కవితా రామణీయకంగా అన్నారు .’’కవి ‘’ముసిలి’’మ్మట వ్రాసెడి-కవనమ్ముజాను తెనుగునట కవితా ప్రభువో –భవహర హరిహర పతివట-హవణిల్లదే సుంత వింత ‘’అని మనకొచ్చే అనుమానం ఆయనకే వచ్చి సమాధానం చెప్పారు .’’ఇరు తెగల అఖిల మతుల నరిగెడి వారలకు హరిహర నాథుడు పతి అని శివ విష్ణు అద్వైతాన్ని తెలియజేశారు .క్రోధం అధముని విత్తం,బాధాకరం ,కుటిల వ్యాపారానికి సాధన కనుక ఆ వ్యాధినుంచి విముక్తి చేయమని వేడారు .

  శత్రువులకంటే అంతశ్శత్రువులే పరమ డేంజర్.వీటినుంచి బయట పడేట్లు చేయి .ఇదికాదు అదికాదు అంటూ అన్నీకాదని దేన్నీ చెప్పలేకపోయాయి పరమాత్మను .నీ కరుణా పీయూషాన్నిజుర్రకపోతే వెయ్యి పుటాలు పెట్టినా అజ్ఞానం తొలగదు .’అక్కజపు నింగి రిక్కల –లెక్కను దక్కువలు సేయులే –నా దొసగుల్-ఉక్కు సెడే-బెక్కు యతనము –లక్కున గ్రక్కున గదింపు ‘’ .పూచిక పుల్లను కూడా కదల్చ లేని వాడిని –‘’నీ చెయిది విశ్వ సృజనము ‘’కనుక నీ కరుణ యాచిస్తున్నాను .ఇంగువ కట్టిన గుడ్డ వాసన అంతావ్యాపించినట్లు పూర్వజన్మ పాపాలన్నీ నావెంట వచ్చాయి దాన్ని వదిలించు .’ఏ నాటి కు సంస్కారమో ‘’అని మొదటి పంక్తి తో మూడు పద్యాలురాసి కుసంస్కారం ,ఇంద్రియ లోలత్వం ,జ్ఞానులను సాధువులను చులకన చేయటం లో కొట్టు మిట్టాడే వారిని ఉద్ధరించు అని కోరారు .అలాగే ‘’నీ యాజ్ఞామాత్రమ్మున’’తో అయిదు పద్యాలురాసి వాయువు వరుణుడు క్రమం తప్పకుండా విధి నిర్వహణ చేస్తున్నారు ,చంద్ర సూర్యులు వేడి వెలుగు ఇస్తున్నారు ,సప్త సముద్రాలు తమ ధర్మాలను నేరవేరుస్తున్నాయి ,పంచ భూతాలూ ప్రకృతి ధర్మాలను తుచ పాటిస్తున్నాయి ,నీ ఆజ్ఞ లేకుండా చీమకూడా కదలదు అని ఉపనిషత్ రహస్యాలను అందంగా కందంలో బంధించారు .’’బలవంత మెంత చేసినా  భోగాలపై ఆసక్తి పోగొట్టమని ,,విషయ వాంఛలను తుదముట్టించమని ,పర ద్రవ్యాపేక్ష కూకటి వ్రేళ్ళతో కూల్చమని వేడుకొన్నారు .’’నీ కూర్మిలేకుండా మేమేమీ సాధించలేం ‘’.నీ నెనరు లేకపోతె స్నానధ్యానజపతపాలు ఫలించవు .చేతులు కాలాక ఆకులు పట్టుకొన్నట్లు పాపకూపాల్లో పడి క్షోభిస్తున్న నాకు నువ్వే దిక్కు .’’తెలివి తక్కువ ఆకలి ఎక్కువ ‘’అనే సామెత నిజం అవటానికి నన్ను పుట్టి౦చావు  –లెక్కకు మించిన ఇక్కట్లతో చతికిలపడ్డాను’’  అంటారుకవి .నీ సంకల్ప బలం కొంచెం ఉంటె చాలు సింధువు  బిందువు అవుతుంది హిమాలయం వట్టి రాయి అవుతుంది .నీ యక్కటికము బోలని –మాయత్నము పురుషాహంకారమా –కాదు ప్రభూ ‘నీ వద్ద అద్దం వెలుగులు చిమ్మగలుగుతుందా ‘’అని వేదాంత రహస్యం బోధించారు .

  ‘’ నా మేధా వైదగ్ధ్యం –నీ ము౦గల దాప నేర్తునె?’’తల్లి పుట్టిల్లు మేనమామకు తెలీదా స్వామీ ?ఎండినమాను చిగిర్చివసంతం లో శోభించినట్లు ‘బెండు పడిఉన్ననన్ను నువ్వే అనునయించాలి .ఏదో అభిశాపం నాపై దారుణ దాహమూని- బలవత్కామోన్మాదిగ బాధిస్తోంది తరుణోపాయం నువ్వే చెప్పాలి .గోరంత గౌరవం వస్తే కొండంతగా చాటి చెప్పుకొని భీర స్వా౦త౦తో అల్పునిగా బతికే నాకు నువ్వే ఏడుగడ హరిహరా ..కొండంత దేవుడికి కొండంత పత్రి ఇచ్చుకోలేముకదాకనుక ‘’గుండియనుడుగర సేసెద –నండగ నీ నెనరు నింపు ‘అని ప్రార్ధించారు కవి .’’దేవర చిత్తం నా భాగ్యం ‘అంటూ 113 వ పద్యంతో శతకం పూర్తి చేశారు .

  శతకానికి అనుబంధంగా ప్రాతస్మరణ ,నిద్రా సమయస్మరణ ,కూడా కందాలు రాసి చివరి కందాలలో ‘’పది తొమ్మిది వందల నలు –బది ఏడవ వత్సరా౦త  వాసరముల స-మ్మదమున దీని రచియించితి –నదిరా క్రీస్తు శకమ౦దు హరిహరనాథా ‘’అనీ తర్వాతపద్యంలో ద్వారకా తిరుమల పుణ్య క్షేత్రానికి సమీపం లోని ‘’దొరసాని పురం ‘’లో జన్మించాననిచెప్పారు .130వ పద్యం లో ‘’దీని రచించిన నీ –సేవానిరతున్ ,గుణ గణాఢ్యు  ,వరమహమ్మద్ హు –స్సేనాఖ్యు గవిత్వ పద –ధ్యానపరున్,నన్ను గావు హరిహర నాథా ‘’అని శతకం పూర్తి చేశారు కవి మహమ్మద్ హుస్సేన్ జీ .

  దీనికి బోనస్ గా ‘’పంజాబ్ దురంతాలు ‘’శీర్షికతో 45 పద్యాలు రాసి ఆ దృశ్యాలను కళ్ళకు కట్టించారు .కవి గారు లోతైన పాండిత్యం ,సకల శాస్త్రాలలో గొప్ప అవగాహన ఉన్నవారు. మీదు మిక్కిలి ఆంద్ర ఆస్థానకవులు శ్రీపాద వారి ప్రియశిష్యులు .వారి వాత్సల్యామృతాన్ని పుష్కలంగా గ్రోలినవారు .ద్రాక్షాపాక౦గా ,సరళ మృదు మధుర పదజాలంతో రాసిన శతకం .హరిహరనాథునికి మరో అరుదైన కానుక ఇది .భక్తకబీర్ రామనామ  పారాయణ చేసి ధన్యుడైనట్లు మహమ్మద్ హుస్సేన్ కవిగారు హరిహరనాథుని స్మరించి ధన్యులయ్యారు .వారికి ఆంధ్రలోకం కృతజ్ఞత తో కైమోడ్పు ఘటి౦చాలి .ఈ శతాకాన్ని, కవి హుసేన్ గార్ని పరిచయం చేసే మహద్భాగ్యం నాకు కలిగినందుకు పొంగిపోతున్నాను .

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -23-6-22-ఉయ్యూరు    

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ మతి కోనేరు కల్పన ‘’ఒకటి తక్కువ పదారు వన్నెలతో ‘’ చిన్నెలతో వినిపించిన తెలుగింటి’’ గుండె చప్పుళ్ళు ‘

శ్రీ మతి కోనేరు కల్పన ‘’ఒకటి తక్కువ పదారు వన్నెలతో ‘’ చిన్నెలతో వినిపించిన తెలుగింటి’’ గుండె చప్పుళ్ళు ‘’

శ్రీమతి కోనేరు కల్పన గారితో సుమారుపాతికేళ్ళకు పైగాసాహితీ అనుబంధం ఉంది .సరసభారతి ఆస్థానకవులలొ ఆమె కూడా ఒక మాణిక్యం .నిన్న నా సహస్ర చంద్ర మాసోత్సవానికి కుమారుడు, మనవడు లతో కలిసి వచ్చి మా శ్రీ సువర్చలాన్జనేయస్వామిని దర్శించి మాకు పట్టు బట్టలు పెట్టి  మా ఆతిధ్యం స్వీకరించి ,తాను  నవంబర్ లో ప్రచురించిన ‘’గుండె చప్పుడు ‘’కథా సంపుటి అందించారు ,ముక్కు సూటి మనీషి.కథల్లో కవిత్వం లో అదే కనిపించి ఆమెకు విశిష్టను కలిగించాయి .ఆమె సాహితీ ప్రస్థానం సుదీర్ఘం .రావి( వారి )వృక్షం క్రింద  ఎదిగిన కవి .బందరు సాహితీ మిత్రుల ప్రధాన కార్యదర్శి ,కోశాధికారి ,ఉపాధ్యక్షురాలు ,అందుకే ఈపుస్తకాన్ని తన మెంటార్ డా రావిరంగారావు గారికి ఆయన సాహిత్య స్వర్ణోత్సవ కానుకగా అంకితమిచ్చారు .ఇవాళ ఉదయమే ఆపుస్తకం చదివి ,నా స్పందన తెలియజేస్తున్నాను .

 ‘’ అన్ని పనులు సవ్యంగా జరగాలంటే కృష్ణ సారధ్యం కావాలి కానీ శల్య సారధ్యం కాదు.సాయం చేయలేక పొతే కాం గా ఉండండి .నా చేతనయినట్లు నేనే చేసుకొంటాను ‘’అని భర్త కు యాక్సిడెంట్ జరిగి ,కోలుకుంటూ ,కూతురు పెళ్లి నిశ్చయమై ,పనులతో సతమత మౌతుంటే మరిది చేతనైన సాయం చేయకుండా చీటికీ మాటికీ అడ్డువస్తూ చీకాకు కలిగిస్తూ దెప్పుతూ ఉంటె ఒక ఇంటి వదిన గారు మరిదికి పెట్టిన గడ్డి ‘’సారధ్యం ‘’కథ..దొడ్డ మనసు తో  బీదా బిక్కీలకు అన్నిరకాలసాయం అందిస్తూ ఆమె పేరేవరికీ తెలియకపోయినా ‘’దొడ్డమ్మా’’అంటూ అందరి చేత పిలిపించుకునే దొడ్డమ్మ పశువులు పొలాలకు వెడుతూ పేడ వేస్తె వాటి ‘’కడి ‘’లలో గింజలను ఏరుకోవటానికి నిర్భాగ్యులు ఎదురు చూసే కరువు వచ్చి అతలాకుతలం చేస్తోంది జనాన్ని .ఆమె రోజూ ఇంటికి ఇళ్ళకు గింజలు పంపుతుంది .జీత గాళ్ళ ఇళ్ళకు ఒక పూట అన్నం పంపుతుంది. ఒక పొరుగూరి వాడు ఆమె ఆనూ పానులను ,ఆమెకు నమ్మకమైన వాడిద్వారా కూపీ లాగుతుంటే వాడికి అనుమానమొచ్చి ఆమె చెవిలో వేస్తె ,బందిపోట్లు దోచుకోవటానికి వస్తున్నారని గ్రహించి తన ఇంట్లో ఉన్న రెండు లంకె బిందెల్లో ఒక దాన్ని ఎవరికి తెలీకుండా ఒక చోట పాటించి రెండవదాన్ని తన దత్తుడి౦ట్లో పెట్టించి ,తలుపులేసుకొని అడ్డ గడియకూడా పెట్టుకొని ఇంట్లో కాపలా లేకుండానే ధైర్యంగా పడుకొన్నది దొడ్డమ్మ. ఆరాత్రే .నిశిరాత్రి నలుగురు బందిపోట్లు తలుపులు  బాదుతూ తియ్యకపోతే విరగ్గొడతా మంటే తలుపులు తీయగా వాళ్ళు దౌర్జన్యంగా ప్రవేశించి లంకె బిందేలేక్కడున్నాయో చెప్పమంటే మా ఆయనతోనే మా వైభవమూ పోయింది ఆయన చేసిన  అప్పులు తీర్చటానికే అవి చాలలేదు ‘’లౌక్యంగా  చెప్పగా నిజం చెప్పకపోతే ‘’నీ కొడుకును చంపేస్తాం ‘’అంటే ‘’వాడు టైఫాయిడ్ తో బాధ పడుతున్నాడు చంపితే పాపం రా ‘’అని చెప్పి తన చేతులకున్న గాజులు మెడలోని ఒంటిపేట గొలుసు తీసి అక్కడ పెట్టి అవే తనదగ్గరున్నవి అనిచెప్పి తీసుకు వెళ్లమంది .వాళ్ళు ఇల్లంతా వెతికి ఏమీ దొరక్క పెరట్లోనూ తవ్వి అక్కడా శూన్యం అని తెలుసుకొని వెళ్లిపోతుంటే ‘’ఆశగా వచ్చారు ఉసూరు మంటూ వెళ్ళకండి కాస్త అన్నం మామిడిఊరగాయ  ఉంది నాలుగు ముద్దలు తిని పొండి’’అన్న దొడ్డ ఇల్లాలు దొడ్డమ్మ ‘’బందిపోట్లు కథ ‘’లో దొడ్డమ్మలోని దాతృత్వం మేధావితనం కనికరం అన్ని కోణాలలోనుంచి ఆవిష్కరించిన కత ఇది .

 డబ్బు ఎక్కువైతే ఒంటరితనమే వేధిస్తుంది ఎవర్నీ నమ్మలేం .శరీరసుఖాలెన్ని ఉన్నా మనసుకు సాంత్వన ఇచ్చేవాటిపైనే ఆధారపడాలి .తను భార్యా పిల్లలతో సంతృప్తిగా జీవిస్తున్నానని శివం  ప్రాణ స్నేహితుడు సత్యం తో  అంటే ‘’నాకు ఇవేమీ తెలీవు నా పిల్లలు వాళ్ళ బతుకు వాళ్ళు బతుకు తున్నారు నేనుమాత్రం అనాధ ,వృద్ధాశ్రమాలు తరుగుతూ సీనియర్ సిటిజెన్స్ పెన్షనర్స్ తో  గడుపుతూ ఖానం తీరిక లేకుండా ఉన్నాను .వాళ్ళ సమస్యలు తీర్చి వాళ్ళు సుఖపడుతుంటే చూసి ఆనందిస్తున్నాను .ఇదే నాడ్యూటీ గా భావిస్తాను .ఆనందంగా ఉన్నానా లేనా అనే ఆలోచనే నాకు రాదు ‘’అ౦టాడుసత్యం ‘’సత్యం శివంసుందరం ‘’లో .ఆప్యాయంగా ఆత్మీయంగా ఆతిధ్యమిచ్చి అన్నం పెడితే అది చింతకాయ పచ్చడితోనైనా పచ్చి పులుసుతోనైనా ‘’అమృతోపమానం గా ఉంటుందని చెప్పిన కథ ‘’కొత్తాకు బుట్ట ‘’.ఇంతకూ కొత్తాకు బుట్ట అంటే ఏమిటి ?పనసాకుల్ని మడిచి చిన్న చిన్న బుట్టలుగా కుట్టటం.వీటిలో ఇడ్లీ పిండి వేసి   ఆవిరిమీద ఉడికిస్తే రుచి అదుర్స్ .అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ‘’అవుట్ స్టాండింగ్ ఉద్యోగాలు ‘’అని చక్కగా విశ్లేషించి చెప్పిదే ‘’’నేనూ మనిషినే ‘’.చిత్తజల్లు లో ఒక గౌరవ నీయ వంశానికి తాను  వారసుడిని ఇవ్వ బోతున్నానని  ఆ ఇల్లాలు వసంత ఆనంద పడింది .ఇంటికోచిన భర్తకు తనకు ఆరవనెల ,ఆనందంతో గంతులేయకుండా తనకు పిల్లలు ఇష్టం లేదని అబార్షన్ చేయించుకోమని సీరియస్ గాభర్త వెంకట్  చెబితే షాకై ఏమి చేయాలో తోచకుండా ఉంటె సాయంత్రం డాక్టర్ దగ్గరకు తీసుకు వెడితే ఆస్థితిలో అబార్షన్ డేంజర్ అని,తనకు ఆమె మాత్రమె కావాలని మళ్ళీ భర్త అని .ఆమెను పట్టించుకోకుండా  ఉంటె ,ఆమెలోస్త్రీత్వం మాతృత్వం భర్తపై అనురాగం త్రివేణీ సంగమ౦గా ఉద్ద్రుతమై పొంగుతుంటే తట్టుకోలేక పోతోంది .పుట్టిన బిడ్డను మాయకుండలో కుక్కుతుంటే ప్రక్కనున్న రాజేశ్వరి రాగా కంగారుపడి బిడ్డ చచ్చిపోయిందని చెప్పగా ఆమె అన్నీ శుభ్రం చేసి ఆమెను పడుకోబెట్టింది .సాయంత్రం  వెంకట్ రాగా  విషయం చెప్పింది రాజేశ్వరి .డాక్టర్ కు  చూపించి మందులిప్పిస్తున్నాడు .ఇల్లుకట్టి రిజిస్ట్రెషన్లో భార్యపేరు చిత్తజల్లు వసంతమ అని ని రాయి౦చగా  చూసి ఆశ్చర్యపోయి ,తనను ఇంకా వెలయాలుగానే చూస్తున్నాడని అనుకుని ,తనకడుపున పుట్టిన బిడ్డను తన వారసునిగా అంగీకరిస్తేనే కదా తనకు గౌరవం అని భావించింది .అతడు పిల్లాడిని ముద్దాటటం చూసి విస్తు పోయింది .కుర్రాడు ఒక రోజు అతడిని ‘’పాండురాజు చనిపోతే ధర్మాత్ముడు విదురుడు రాజవ్వాలి కదా ధృత  రాష్ట్రుడు ఎలాయ్యాడు ?అని అడుగుంటే విన్నది వసంత .అతడు ‘’విదురుడు దాసీ పుత్రుడు .అందుకే రాజు కాలేదు ‘’అన్నాడు .వసంతకు భ్రమల మబ్బులు వీడాయి ‘’వాళ్ళు బీజం వేసిన వారికి కానీ ,క్షేత్రానికి కానీ వారసులు కాదు .ఆక్షేత్రాల స్వంతదారునికి వారసులయ్యారు ‘’అంటూ భర్త  కళ్ళలోకి  తీక్షణంగా అర్ధవంతంగా  చూసింది .అతనికి అర్ధం కాకపోయినా ఆ చూపు అతని గుండెలో బాకులా గుచ్చుకొన్నది .మళ్ళీ ‘’వాళ్ళు బీజం వేసిన వ్యాసమహర్షి సంతానంగా పెరగలేదు .క్షేత్రాలయిన క్షత్రియ స్త్రీల వారసులుగానూ పెరగలేదు .ఆ క్షేత్రాల స్వంత దారులైన వారి వంశం పేరున పెరిగారు. దాసీ అయిన విదురుడి తల్లిని వాళ్ళెవరూ పెళ్లి చేసుకోలేదు .కనుక అతడు వీళ్ళ వారసుడు కాలేదు కనుక ఇప్పుడు చెప్పండి .నేనిప్పుడు ఎవరి సొంతం ?నాకు పుట్టిన పిల్లలు ఎవరికీ వారసులు ??’అనగానే వెంకట్ తలది౦చు కొన్నాడు .ఇది ధర్మ సందేహాలు లో మల్లాది వారు చెప్పే ధర్మ సూక్ష్మం లాఉంది.పరిణతి చెందిన కథ రచయిత్రి కనుక కల్పనగారు ఈ కథను ఆద్యంతం గొప్పగా రాశారు  .శీర్షికా గొప్పగా పెట్టారు

  ఇలాంటివి 15 కథలున్న పుస్తకమే ‘’కల్పనగారి ‘’గుండె చప్పుడు ‘’అందరి గుండెలను తాకే కథా కదంబం .తప్పక చదివి ఆనందించాల్సిన పుస్తకం .కల్పన గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను .

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -21-6-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

28 -అలంకారాభాస హాస్యం

28 -అలంకారాభాస హాస్యం

సుమారు ఆరు నెలలక్రితం’’హేత్వాభాస హాస్యం ‘గురించి రాశాను .ఇవాళ ‘’అల౦కారా భాస హాస్యం ‘’గురించి తెలియజేస్తున్నాను .శరీరానికీ ,కావ్యానికీ అలంకారాలు అందం కోసమే .ఆమె ముఖం చంద్రుని వలే ఉంది అంటే ఉపమాలంకారం కానీ ఆమెముఖం సిబ్బి లాగా ఉంది అంటే మాత్రం అది ఉపమకు ఆభాసం .అలంకారం ఉచితమైనదిగా ఉదాత్త గాంభీర్యంగా ఉండాలి ఈ లక్షణాలు కోల్పోతే ,వికృత భావ గర్భితంగా ఉంటె ,అది అభాస రూపం పొందింది అంటారు అని మునిమాణిక్యం గారు సెలవిచ్చారు .అయితే అభాస రూపం లో అలంకారం ఉంటె హాస్యం పుడుతు౦ది.అదే చమత్కారం .

 అభాస రూపం –లాక్షణికులు కొన్ని పదాలను కావ్యపరంగా నిర్వచించారు .వాటికి హాస్య పరంగా కొత్త అర్ధాలను సృష్టించుకొని హాస్యరసానికి హాస్య భేద ,ప్రభేదాలను సూచి౦చటానికి తగిన పారిభాషిక పదజాలాను సృష్టించుకోవాల్సిన అవసరం వచ్చిందన్నారు మునిమాణిక్యం .ప్రసిద్ధమైన ఉపమ ఉత్ప్రేక్ష ,మొదలైన అలంకారాలు ఆభాస రూపం లో హాస్యం కోసం ఉపయోగించుకోవచ్చు అని మాస్టారు  ఉవాచ .అప్పుడు వాటి ఉదాత్తత ,గాంభీర్యం కోల్పోతాయి .దానినే తాను  ‘’అభాస రూపం పొందటం ‘’అన్నాను అన్నారు సార్.ఈ అలంకారాలు హాస్యానికి ఎలా ఉపయోగ పడతాయో చూద్దాం .

 ఉపమా భాస హాస్యం –ఆమె జడగరిటెకాడ లాగా ఉంది .కీర్తిని శరశ్చంద్ర చంద్రిక లాగా ఉంది అనటం మామూలు .కానీ ఆ కీర్తిని కొబ్బరిముక్కతో ,కర్పూరం తో పోలిస్తే అలంకారం ఆభాసం అయి హాస్యం పుడుతుందన్నారు మునిమాణిక్యం గారు .చీకటిని నల్లసిరాతో ,మేఘాలను సిగ రేట్ పొగతో పోల్చినా ఇలాగే నవ్వు పుడుతుంది అంటారు సార్.

  చిలకమర్తి వారి నరకాసుర వధ లో మందపాలుడు రంభను ‘’ఈమె చక్కని చుక్క .దాని శరీర కాంతి తాటి పేషం వలె ఉంటుంది .వెంట్రుకలు మసిబొగ్గు నలుపు .కొప్పు మాలకాకి ,కళ్ళు ఆలు చిప్పలు లాగా ,మొగం ఇత్తడి సిబ్బిలాగా గుండ్రంగా ఉంటుంది ‘’అన్నాడని మునిమాణిక్యంగారు చెప్పారు .ఇది కొంత జుగుప్స కలిగించేదే అయినా ,మనవాళ్ళు మనకు అందించిన హాస్యం ఇదే అన్నారు మాస్టారు .

  విరోధాలంకారం –పైకి మాత్రం విరోధం కనిపిస్తూ ,అంతరార్ధం లో విరోధం లేకపోతె విరోధాలంకారం అంటారు .’’హాస్య పరంగా విరుద్ధ భావాల పదాల సంయోగం విరుద్ధం ‘’అని మాస్టారు సింపుల్ గా డిఫైన్ చేశారు .ఉదాహరణ –అతడు ప్రకాశవంతమైన చీకటిలో నడుస్తున్నాడు .వాడు మందగమనం తో పరిగెత్తాడు .వీటిలో భిన్నార్ధా  లైన పదాలను ఒకదానికొకటి విరుద్ధమైన వాటిని కలపటం జరిగింది .ఇది ఒక రకమైన ‘’వాక్చమత్కృతి ‘’అన్నారు మునిమాణిక్యం .’’ప్రొఫెసర్ గారు ఏం చేస్తున్నారు ?’’అన్న ప్రశ్నకు  శిష్యుడు ‘’మర్చిపోయిన వాట్ని గుర్తుకు తెచ్చు కుంటున్నారు ‘’’అన్నాడు .మర్చి పొతే ,మళ్ళీ జ్ఞాపకానికి ఎలా వస్తాయి .కనుక ఇది విరుద్ధ భావ సంకలనం అని తేల్చారు మునిమాణిక్యం సార్.

  ఇంకో రకమైన విరుద్ధం  -ప్రసిద్ధ విషయాలకు విరుద్ధంగా మాట్లాడటం .-‘’ఇటలీలోని హిమాలయ గుహలలో ఋషులు తపస్సు చేస్తున్నారు ‘’అంటే విరుద్ధంగా కనిపిస్తుంది .మృచ్ఛకటికం లో రాజుగారి బామ్మర్ది శకారుడు ‘ఏను దుశ్శాసనుని వలె నీ కొప్పు దొరకొందును.జమదగ్ని కొడుకు భీమసేనుడేతెంచిఆపునో ,లేక చాన కుంతికి ఆత్మజుండు శంకరుడు ఆపగల డో”?అంటాడు .ఇది ప్రసిద్ధమైన కవిసమయాలున్న విరుద్ధం అన్నారు మునిమాణిక్యంగారు.అలాగే ‘’కోకిల మావి చివుళ్ళు తిని కడుపు నెప్పితో అరుస్తోంది ‘’అంటే అది విరుద్ధ సమయం కనుక నవ్వొస్తుంది అన్నారు .

 మరో రకం హాస్యం –భర్త భార్యను సినిమాకు రమ్మనిఎన్ని సార్లు పిల్చినా రాకపోతే ‘’వాస్తావా రావా ??’’అని గట్టిగా అరిస్తే ‘’వస్తానండీ ‘’అని ఆమె అంటే .’’ఈముక్క ముందే చెప్పి చావచ్చు కదా ‘’అని అయ్యవారంటే ‘’చెప్పాను చాలాసేపటి కిందటే ‘’అంటే ‘’ఏమని అఘోరించావ్ ‘’అని ఆయన అంటే ‘’ఒక నిమిషం లో వస్తానని అరగంట కిందటే చెప్పాను మీకు ‘’అంటే నవ్వకుండా ఉండలేం .ఇందులో కాలానికి సంబంధించిన వైరుధ్యం ఉంది అన్నారు మునిమాణిక్యంగారు .మరో తమాషా ‘’కృష్ణ శాస్త్రి గారికి 49 వెళ్ళటానికి రెండుమూడు ఏళ్ళు పట్టిందట పాపం.ఎంత బాధ పడ్డాడో ?’’ ‘’అని ఒక కవి మిత్రుడన్నాడని సెలవిచ్చారు మాస్టారు  .ఇవన్నీ విరుద్ధా లంకార ఆభాస  రూపాలు అన్నారాయన .

మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో

 సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-6-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ మహమ్మద్ హుస్సేన్ రాసిన   హరిహర నాథ శతకం -1

శ్రీ మహమ్మద్ హుస్సేన్ రాసిన   హరిహర నాథ శతకం -1

పశ్చిమ గోదావరిజిల్లా భీమడోలు మండలం దొరసాని పాడు గ్రామానికి చెందిన టీచరు ,కవి మహమ్మద్ హుస్సేన్ గారు హరిహర నాథ శతకం రచించి ,1959లో ప్రచురించారు .ఈశతకానికి ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవి శ్రీ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రిగారు అభిప్రాయం రాస్తూ ‘’ఎలిమెంటరి స్కూల్ మాస్టర్ అయిన మహమ్మద్ హుస్సేన్ నాకు 20ఏళ్ళ నుంచి పరిచయం ..శిష్యప్రాయుడు .గర్వం లేని సజ్జనుడు .మతసహనమున్నవాడు .ఈ శతకం లో కవిత్వం సరళం ధారాళం,మనోహరం .చక్కని కల్పనలతో భక్తి రస ప్రవాహంగా రాశాడు .ఇప్పటికే 15పుస్తకాలు రచించిన సామర్ధ్యం ఉన్నవాడు .చదివి ఆదరించి ప్రోత్సహించమని కోరుతున్నాను ‘’అన్నారు .

  భీమడోలు BDO శ్రీ బాలకృష్ణ ‘’ఈ కవి నాకు చాలాకాలంగా పరిచయమున్నవాడు .ఈ శతకం మధుర మంజులంగా రాశారు .కందాన్ని అందంగా  నడిపించిన  నేర్పున్నవారు .శతకం చదివి ఆనందంతో పులకిస్తారు అందరూ .అభ్యుదయకవిగా పేరు పొందాలి ‘అని అభిప్రాయం రాశారు .

  శతకాన్ని కవిగారు వితరణశీలి విద్యాభిమాని శ్రీమతి గారపాటి హైమవతీ దేవి ఆర్ధిక సాయంతో ప్రచురించినట్లు కందపద్యాలలో కృతజ్ఞత చెప్పుకొన్నారు .’’హరిహర నాథ స్మరణ –స్ఫురణం బాధ్యాత్మిక ప్రబుద్ధ విశుద్ధం –బరయుము ,మద్రచితంబిది-హరిహరనాథ శతకము మహత్కృతి చరితా ‘’అని వినయంగా చెప్పి ‘’ఆశుకవిని గాను ,హాస్య చతురత లేదు –గర్భ బంధ చిత్ర కవిత రాదు –దేవ దేవు డిచ్చు భావభక్తి ప్రేర-ణ౦బు మామక కవనంబు డంబు’’అని విస్పష్టంగా చెప్పుకున్నాడుకవి .కవి గారి అభ్యర్ధన పై హైమవతీ దేవిగారు ‘’మీరు కవితారూపం లో మానవ కల్యాణానికి ,విజ్ఞాన దాయకంగా వికసించు మీ వాణి ద్వారా మానవ  అజ్ఞాన అంధకారాన్ని పారద్రోలుతూ మహోపకారం చేస్తున్నారు .విద్యపై నాకున్న అభిమానం తో 116రూపాయలు మీకు అందిస్తునాను. గ్రహించి శతక ముద్రణకు ఉపయోగించండి ‘’అని రాశారు .అనన్య వదాన్య శేఖరులు ,కేవల కీర్తి వాంఛా పరులు ఉదార మనస్సంపన్నులు గుండుగొలను వాసి శ్రీ మావులేటి సోమరాజు గారిని కీర్తిస్తూ కవి రెండు పద్యాలు రాసి ‘’కృతులు శాశ్వత బుధనుత కీర్తి నిధులు –బళిర మిము నుతింప నేపాటి వాడను ‘అని వినయం ప్రకటించారు కవి .

   ఆకాంక్ష లో హుసేన్ జీ ‘’సార్దీకృత జన్ముడుగా నర్ధింటు ననుగ్రహింప హరిహరనాధా ‘’,’’వెలి చూపును ,లోజూపును –వెలివోని సుధీ బలమ్ము విలసి౦చు  సము –జ్జ్వల ఫాలజ్యోతిని నా –నకలవడ  ,నిలబడ నొనర్పు హరిహరనాథా ‘’  .హరిహరనాథా మకుటంతో ఉన్న ఇది కందాల శతకం ‘ఇందులోని అందాలు తర్వాత తెలుసుకొందాం .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -19-6-22-ఉయ్యూరు  

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

విశ్వ పుత్రిక తోరూ దత్-11(చివరి భాగం )

విశ్వ పుత్రిక తోరూ దత్-11(చివరి భాగం )

ఇరవై ఏళ్ళు  

ఇంగ్లాండ్ యువరాజు రావటం వెళ్ళటం జరిగాక కలకత్తా నిస్తబ్ద౦గా  ఉంది .తోరూ ఆయన్ను చాలాదగ్గరగా చూసి అందగాడు నీలికన్నుల వాడు తెలుపు బట్టతలా  అని మేరీకి జాబు రాసింది .ఆయన్ను చూడటానికి కాశ్మీర్ రాజు 40లక్షల తలపాగాతో వచ్చి ,101కాశ్మీర్ శాలువలు ,నవరత్నాలు పొదిగిన బంగారు  హుక్కా ,బంగారపు భోజన సామాను బహుమతులుగా ఇచ్చాడు.బాబూ జగదానంద ముఖర్జీ యువరాజును తన ఇంటికి ఆహ్వానించి,ఆడవాళ్ళను పరిచయం చేసి  మర్యాద చేశాడు .ఇది జనం లో సంచలనం కలిగించింది .స్త్రీలను పరిచయం చేస్తానంటేనే వచ్చాడు యువరాజు .దీన్ని సభ్యసమాజం తప్పు పట్టి దీనిపై వ్యతిరేకంగా నాటకాలు రాసి ప్రదర్శించారు .దీన్ని బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది .తోరూ పుస్తకముద్రణ దాదాపు పూర్తయింది .

  మిల్లె క్లారిస్ బాదర్ అనే ఫ్రెంచ్ మహిళ భారతీయ వీర వనితలపై రాసిన పుస్తకం తోరూను బాగా ఆకర్షించింది .దీన్ని అనువదించటానికి ఆమెనుంచి పర్మిషన్ తెప్పించుకున్నది .బాదర్ కు ఉత్తరం రాస్తూభారత దేశం లో  భర్త అసమర్దుడూ స్వార్ధ పరుడు అయినా సరే భార్య భర్తకు సర్వ సమర్పణ చేసి ఆరాధిస్తుంది ఇది ఆశ్చర్యం కదా ‘’అన్నది .మార్చి 4న తోరూకు 20ఏళ్ళు వచ్చాయి .పుట్టిన రోజు నాడే బాదర్ పంపిన పుస్తకం అందింది .మార్చి 24 నాడే ‘’షీఫ్ ‘’కూడా విడుదలైంది .అన్ని దినపత్రికలు రోజూ చదివేది .మానవత్వం ను అగౌరవపరుస్తూ పేపర్లలో వచ్చే వార్తలను ఆమె బాగా ఖండించి మేరీకి రాసేది .ఉత్తరాలలో హిందూ శబ్దానికి బదులు ‘’దేశీయ ‘’అని వాడేది .హిందూస్త్రీల భద్రతా విషయం లో ఆమెకు ఆదుర్దా ఉండేది .ఆనందమోహన్ బోస్ చాలా సార్లు తోరూ ను చూడటానికి వచ్చాడు .యుక్త వయసు కన్యల కోసం తాను  నడిపే స్కూల్ వ్యవహారాలు  చూడమని తోరూ ను కోరేవాడు .ఇండియాలో ఉంటె తోరూ స్త్రీ విద్యా వ్యాప్తికి చాలా తోడ్పడుతుందని ఆయన బాగా విశ్వసించాడు .

  తొరూ రోజులు దగ్గర పడుతున్నాయి .ఆమెను పాడనివ్వటం లేదు .ఆంక్షలు భరించలేక ‘’నన్నుఒక గాజు పెట్టెలో పెట్టండి ‘’అని విసుక్కునేది .హ్యూగో నవలలు ఫ్రెంచ్ కవితలు అనువదిస్తూనే ఉంది .’’షీఫ్ ‘’పుస్తకం జోరుగా అమ్ముడయి మంచి ఉత్సాహం తెచ్చింది .ఆమె కవితలు కొన్ని ‘’కలకత్తా రివ్యు ‘’పత్రికలో ప్రచురించటానికి తీసుకొని తండ్రికీ కూతురుకు గొప్ప జోష్ ఇచ్చింది .బెంగాల్ పత్రిక ఆమెను రచనలు పంపమని ఎప్పుడూ కోరేది .సోలరి, సెంట్ చాన్ ,గామెటి ది గ్రామెంట్,ఆగస్ట్ వాక్వేరి ధియో షెల్ గెటే,వాల్టర్ ,మార్నేర్ ,,విక్టర్ హ్యూగో రచనలు అనువదించి పంపేది .

  1876డిసెంబర్ నాటికీ తోరూ తీవ్రంగా జబ్బు పడింది .ఇంటి డాక్టర్ ఊరు వెళ్ళటం తో వైద్య కళాశాల డాక్టర్ స్మిత్ వచ్చి చూసి మందులిచ్చేవాడు .కళ్ళలో నుంచి రక్తం కారేది. ఏమందులవలన ఇది తగ్గలేదు .డిజిటాలిసిస్ కూడా ప్రభావం చూపలేదు .ఒకసారి డాక్టర్ స్మిత్ విజిట్ కు వచ్చినప్పుడు ఆమె పక్కనే ఉన్న ‘’షీఫ్ ‘’పుస్తకం చూసి ఆమె రాసిందే అని అడిగి తెలుసుకొని ఆమెపై మరీ శ్రద్ధతో వైద్యం చేశాడు .

 విశ్వం నుంచి విశ్వ పుత్రిక నిష్క్రమణం

క్లారిసే బాదర్ కు తోరూకు గాఢ స్నేహమేర్పడింది. క్లారిసే రాసిన పుస్తకాన్ని అనువదించటానికి పర్మిషన్ ఇమ్మని కోరగా ఆమె ‘’నేను రాసి గంగాతీర ప్రాచీనార్యులకు అంకితమిచ్చిన పుస్తకాన్ని అనువాదం చేయాలనుకొంటున్నది నేను మెచ్చే హైందవ నాయికల వారాసు రాలు కాబోలు ‘’అని సంతోషంగా అనుమతించింది క్లారేస్ .1877ఏప్రిల్ లో తోరూ జబ్బు బాగా ఎక్కువైపోయింది .ఈవిషయాన్ని మేరీకి ఉత్తరంలో తెలియజేసి ఆమెఫోటో పంపమని,ఇక యూరప్ రాలేము అని  తెలియజేసింది .మేరీ బాధ పడుతూ జవాబు  రాసి,ఫోటో పంపింది  .జులై 3న యేవో మూడు లైన్లు తప్ప రాయలేకపోయింది .ఆగస్ట్ 30న తోరూ మరణించినట్లు తండ్రి మేరీకిఉత్తర౦  లో తెలిపాడు .చివరిదాకా హ్యూగో రచనలను అత్యాసక్తిగా చదివింది .ప్రాణప్రదంగా చూసుకొన్ని కొడుకు ,ఇద్దరు కూతుళ్ళు తమ కళ్ళ ముందే చనిపోవటం ఆ తలిదండ్రులు జీర్ణించుకోలేక పోయారు .

  షీఫ్ బాగా ఆకర్షించింది సాహిత్య ప్రియులను –అందులో –‘’నువ్వు నిజంగానే పునర్జీవిస్తావు –నీ ఆశ నికరమైనది ‘’అన్నపంక్తులు చదివి చలించని వారులేరు –‘’సుందరమైన వదనం మీద –మందహాసం కరగిపోయినట్లే –అంతరించింది –నీ మీద నాకున్న ప్రేమ –నిన్ను విస్మృతికి తెచ్చే –శాపాలనుండి కాపాడుతుంది ‘’అన్నకవితను ఇ.జె.ధాంసన్ బాగా మెచ్చాడు .21ఏళ్ళకే విశ్వ పుత్రిక తోరూ దత్ ఈ విశ్వం నుంచి నిష్క్రమించింది .  

  ఆధారం –పద్మిని సేన్ గుప్తా రచనకు ఆచార్య నాయని కృష్ణకుమారి అనువాద పుస్తకం ‘’తోరూ దత్’’.

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-6-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

సరసభారతి’’ పుష్కర కాల ప్రగతి ‘’ మరియు గబ్బిట దుర్గాప్రసాద్  సాహిత్య ప్రగతి (అందరి అవగాహన కోసం )

సరసభారతి’’ పుష్కర కాల ప్రగతి ‘’ మరియు గబ్బిటదుర్గాప్రసాద్   సాహిత్య ప్రగతి (అందరి అవగాహన కోసం )

 సరసభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు

స్థాపన -24-11-2009

కార్యక్రమాలు

1-ప్రతి ఏటా ఉగాది కవి సమ్మేళనం ,ఆకవితలను 1-నవకవితా వసంతం 2-మా అక్కయ్య 3-మా అన్నయ్య 4-ఆదిత్య హృదయం 5-వసుధైక కుటుంబం పుస్తకాలుగా ప్రచురణ

2-ప్రముఖ కవిపండితులకు స్వర్గీయ విద్వాన్ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి శ్రీమతి భవనమ్మ గార్ల స్మారక పురస్కారాలు శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ డా ,కోట నిత్యానందశాస్స్త్రి సశ్రీ మండలి బుద్ధప్రసాద్ ,,శ్రీనోరి సుబ్రహ్మణ్యశాస్త్రి ,బౌద్ధ భిక్షు శ్రీ అన్నపరెడ్డి  వెంకటేశ్వర రెడ్డి ,ఈల విద్వాంసులు శ్రీ కొమరవోలు శివ ప్రసాద్ ,ఆధునిక పికాసో శ్రీ ఎస్ వి రామారావు ,అంతర్జాతీయ ఆర్ధిక శాస్త్రవేత్త ,అమెరికాలో ఉంటున్న ఉయ్యూరు వాసి శ్రీ ఆరిక పూడి ప్రేం చ౦ద్ గారికి ,బెజవాడ రేడియో స్టేషన్ డైరెక్టర్లు శ్రీ మంగళగిరి ఆదిత్య ప్రసాద్ ,శ్రీమతి మున్జులూరి కృష్ణకుమారి మొదలైనవారికి అందజేత .

3-39పుస్తకాల ప్రచురణ .అందులో శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ రాసినవి 26.అన్నీ రిసెర్చ్ స్థాయి పుస్తకాలే

4-ముగ్గురు కవులచే శ్రీ సువర్చలన్జనేయ స్వామి పై మూడు శతకాలు రచి౦ప జేసిఒక్కొక్కరికి 10వేలరూపాయలు నగదు నూతన వస్త్రాలతో  ఘనంగా సత్కరించటం

5-ప్రతి ఏడాది శ్రీత్యాగరాజ ఆరాధనోత్సవాలు నిర్వహించటం

6-సంగీత కచేరీలు శ్రీమతి సింగరాజు కల్యాణిశ్రీమతి కాళీ పట్నపు ఉమా ,శ్రీ గోపాలం ,శ్రీ శివప్రసాద్,శ్రీమతి చిడంబరి  ల చే నిర్వహణ

7-అమెరికా లోని నార్త్ కరోలిన రాష్ట్రం షార్లెట్ లో సరసభారతి శాఖ ఏర్పరచి కార్యక్రమాలు నిర్వహించి ‘’షార్లెట్ సాహితీ మైత్రీ బంధం ‘పుస్తకాన్ని ’అక్కడా ,ఇక్కడా ఉగాదికి ఆవిష్కరించటం ,’’అణుశాస్త్ర వేత్త డా .ఆకునూరివెంకట  రామయ్య’’ పుస్తకాన్ని అమెరికాలో రెండు చోట్ల ,ఇక్కడ కూడా శ్రీ వై విబి రాజేంద్ర ప్రసాద్ తో ఆవిష్కరి౦ప జేయటం

8-ప్రతి ఏడాది సెప్టెంబర్ 5 గురు పూజోత్సవం నాడు కోటగురు వరేణ్యులు స్వర్గీయ శ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి ,శ్రీమతి సీతమ్మ దంపతుల స్మారక పురస్కారాలు శ్రీమైనేని ,శ్రీ కోట గురుపుత్రుల సహకారంతో పేద ప్రతిభగల విద్యార్ధులకు ఒక్కొక్కరికి 10 వేలరూపాయలు అందించటం

9-నిరతాన్నదాత శ్రీమతి డొక్కా సీతమ్మగారి స్మారక పురస్కారాలను వారి ఇనిమనవడు శ్రీ  డొక్కా రాం భద్ర గారి సహకారం తో ప్రతిభ ఉన్న పేద విద్యార్ధులకు అందించటం

10-సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించటం

11-తెలుగుభాషా దినోత్సవం జరిపి తెలుగులో కృషి చేసినవారిని సన్మానించటం

12-అంతర్జాతీయ తెలుగు బడి పురస్కారాలను కరోనా బాధిత సమయం లోనూ విద్యా బోధన చేసిన 5గురు ఉపాధ్యాయులకు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్ శాఖ నిర్వహిస్తున్న శ్రీ డొక్కా రాంభద్ర గారి సౌజన్యంతో,సరసభారతి సహకారంతో  ఒకొక్కరికిసుమారు  25వేల రూపాయలు  అందించటం  .

13-గురజాడ ,విశ్వకవి రవీంద్రుల 150వ జయంతి కాలేజీ విద్యార్ధుల సమక్షం లో జరపటం

14-సరసభారతి ముఖ్యమైన ప్రచురణలు కాలేజీ విద్యార్ధుల సమక్షం లో ఆవిష్కరింప జేయటం

15-కాలేజీ విద్యార్ధుల,హైస్కూల్ విద్యార్ధుల  సమక్షం లో శ్రీ కృష్ణశాస్త్రి ,శ్రీ భరద్వాజ మొదలైన ప్రముఖులపై ప్రసిద్దులైనవారిచే ప్రేరణాత్మక ప్రసంగాలు చేయించటం

16-శతాధిక  గ్రంథకర్త ,శతవృద్ధు కవిసామ్రాట్ శ్రీ చింతలపాటి నరసింహ దీక్షిత శర్మగారికి ఘన సన్మానం

 17- శ్రీమైనేని గోపాలకృష్ణ గారి సహకారంతో ‘బాపు –రమణ ‘’ల స్మారక పురస్కారాలను ప్రఖ్యాత కధకులు శ్రీ వేదగిరి రాం బాబు గారికి కు ,ప్రముఖ చిత్రకారులు శ్రీ శీలా వీర్రాజు గారికి  అందజేయటం

18-శ్రీ మైనేని గోపాలకృష్ణ గారి సౌజన్యంతో శ్రీ కాళీ పట్నం రామారావు గారు నిర్వహిస్తున్న ‘’కధానిలయం ‘’కు 15వేల రూపాయలు అందించటం

19- శ్రీ మైనేని గోపాలకృష్ణ గారి సౌజన్యంతో సద్గురు శ్రీ శివానంద మూర్తి గారి ‘’సనాతన చారిటబుల్ ట్రస్ట్ ‘’కు రూ 11,116 అందజేయటం

20- శ్రీ మైనేని గోపాలకృష్ణ గారి సౌజన్యంతో మచిలీ పట్నం లోని కృష్ణా యూని వర్సిటి తెలుగు శాఖ అభి వృద్ధికి 20 వేలరూపాయల విరాళం అందజేయటం మొదలైనవి

21-కరోనా రెండేళ్లలో వచ్చిన శ్రీ శార్వరి ,,శ్రీ ప్లవ ఉగాది వేడుకలను కవిసమ్మేళనం మినహా 3+2 =5పుస్తకాల ఆవిష్కరణ ,ఉగాది పురస్కారాలను కూడా శ్రీసువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో ఆ రెండేళ్ళు నిర్వహి౦చి ,సాహితీ బంధువులకు అభిమానులకు కవులకు అతిధులకు అందరికి ఆవిష్కరణల తర్వాత వెంటనే బుక్ పోస్ట్ లో పుస్తకాలు పంపి రికార్డ్ సృష్టించాం..

  గబ్బిట దుర్గా ప్రసాద్ బయోడేటా

 పేరు– గబ్బిట దుర్గాప్రసాద్

 జననం -27-6-1940-ఉయ్యూరు -కృష్ణా జిల్లా

తలిదండ్రులు -గబ్బిట భవానమ్మ ,మృత్యుంజయ శాస్త్రి –

విద్య -ఎం ఏ ,తెలుగు ,బి.ఎస్ సి. బి.ఎడ్ .

భార్య -ప్రభావతి

ఉద్యోగం -ఫిజికల్ సైన్స్ టీచర్, పధానోపాధ్యాయుడు  -కృష్ణా జిల్లా పరిషత్ (1963-1998)

సంతానం –గబ్బిట మృత్యుంజయ శాస్త్రి ,సమత

             సంకల్ప్,భువన్ సాయి తేజ

             లక్ష్మీ నరసింహ శర్మ ,ఇందిర

             శ్రీ హర్ష సాయి ,హర్షి తాంజని

             నాగ గోపాల కృష్ణ మూర్తి ,రాణి

              సుస్మిత్  శ్రీ చరణ్ గౌతం ,,రమ్య

            వెంకట రమణ ,మహేశ్వరి

           కోమలి విజయలక్ష్మి ,సా౦బావధాని

                శ్రీకేత్ ,ఆశుతోష్ ,పీయూష్

1-సాహిత్య వ్యాసంగం –  అధ్యకుడు-సరభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ-ఉయ్యూరు –12ఏళ్ళలో 165 కార్యక్రమాల నిర్వహణ .ప్రతి సంవత్సరం ఉగాది వేడుకలు నిర్వహి౦ఛి  ప్రముఖులను సన్మాని౦చటం ,జిల్లాలోని ప్రముఖులతో కవిసమ్మేళనం నిర్వహించటం ,పుస్తకావిష్కరణలు .

  ఉయ్యూరు శ్రీ సువర్చలా౦జ నేయ దేవాలయ వంశ పారంపర్య ధర్మకర్త –స్వామి సేవలో, అనునిత్య సాహితీ  వ్యాసంగం లో ధన్యత ..సరసభారతి ,శ్రీ సువర్చలాజనేయ అనే 2 బ్లాగుల నిర్వహణ .నిత్యం అంతర్జాల రచన.

2-ముద్రి౦పబడిన స్వీయ రచనలు -1-ఆంద్ర వేద శాస్త్ర విద్యాలంకారులు 2-జనవేమన 3-దర్శనీయ దేవాలయాలు 4-శ్రీ హనుమత్ కథా నిధి 5-శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం 6- సిద్ధ యోగిపు౦గవులు  7-మహిళా మాణిక్యాలు 8-పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు (125మంది ఇంగ్లాండ్, అమెరికా దేశాల కవుల చరిత్ర )

9- దర్శనీయ దైవ క్షేత్రాలు 10-గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-3 భాగాలు (మొదటిభాగం లో 146 మంది రెండవభాగం లో 482మంది మూడవభాగం లో 462మంది మొత్తం 1090మంది  సంస్కృత కవుల జీవిత, సాహిత్య సమగ్ర విషయాలు )11-దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు-2భాగాలు  (మొదటిభాగం లో దేశ ,విదేశాలలోని 201 ,రెండవ భాగం లో 221-మొత్తం 422ఆంజనేయ దేవాలయాల విశేషాలు ) 4 భాగం –అంతర్జాలం లో 700 మంది కవులపై ,12-కేమోటాలాజి పిత డా.కొలచల సీతారామయ్య—తెలుగులో వచ్చిన మొట్టమొదటి పుస్తకం  (ఉయ్యూరుకు చెందిన ఆయిల్ సైన్స్ శాస్త్రవేత్త .రష్యా లో స్థిరపడి ఆ దేశ శాస్త్ర సాంకేతికతకు తోడ్పడిన శాస్త్రజ్ఞుడు )13-దైవ చిత్తం (ప్రఖ్యాత శాస్త్రవేత్త –స్టీఫెన్ హాకింగ్ రాసిన –‘’ది ఆరిజిన్ ఆఫ్ టైం ‘’లోని విషయాలను మన వేద,ఉపనిషత్ ,పురాణాల లోని విషయాలతో పోల్చిన తులనాత్మకరచన 14-బ్రహ్మశ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారి శతజయంతి  కరదీపిక  15-ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు (ప్రపంచ చరిత్రను మలుపు త్రిప్పిన వివిధ రంగాలకు చెందిన 91 మంది ప్రపంచ ప్రముఖుల జీవితం ,కృషి పై 704పేజీల సమగ్ర గ్రంథం)16-షార్లెట్ సాహితీ మైత్రీ బంధం (2012,2017లలో మేము అమెరికా నార్త్ కరోలిన  లోని షార్లెట్ నగర సందర్శనం -అక్కడి వ్యక్తుల ,సాహిత్య సాంస్కృతిక సంస్థల ,,సరసభారతి స్థాపన ,కార్యక్రమాల విశేషాల యాత్రా సాహిత్యం ) 17-అణుశాస్త్ర వేత్త డా.ఆకునూరి వెంకట రామయ్య- (117 వ మూలకం టెన్నిస్సిన్ –‘’Ts’’ ను ఆవిష్కరించిన ఆంద్ర అణుశాస్త్ర వేత్త)  తెలుగులో వీరిపై వెలువడినతొలి పుస్తకం –అమెరికాలో రెండు చోట్ల ,ఉయ్యూరులో మూడవసారి ఆవిష్కరింపబడిన అరుదైన పుస్తకం 19-ప్రయోగాత్మక కాంతి శాస్త్ర పరిశోధన పిత –డా .పుచ్చా వెంకటేశ్వర్లు (లేజర్ కిరణాలపై అత్యద్భుత ప్రయోగాలు చేసి ,ఎందరికో మార్గదర్శి యై ,ఆలిఘర్ ముస్లిం యూని వర్సిటి ,కాన్పూర్ ఐ. ఐ .టి.,అలబామా అగ్రికల్చరల్ అండ్  మెకానికల్ యూని వర్సి టీల స్థాపన ,అభివృద్ధిలో భాగస్వామి ఐన  ఆంద్ర శాస్త్ర సాంకేతిక వేత్త )-వీరిపై  తెలుగులో వచ్చిన మొట్ట మొదటి పుస్తకం .

3- 22-3-20 సరసభారతి 150 వ కార్యక్రమంగా  నిర్వహిస్తున్నశ్రీ శార్వరి ఉగాది వేడుకలలో ఆవిష్కరి౦పబడిన   పుస్తకాలు -1-ఊసుల్లో ఉయ్యూరు ( ఉయ్యూరుతో ,అక్కడి వ్యక్తులు,సంస్థలు మొదలైనవాటితో నాకున్న 75ఏళ్ళ అనుబంధం ,జ్ఞాపకాలు అనుభవాల నాస్టాల్జియా )

2-సోమనాథ్ నుంచి కాశీ విశ్వనాథ్ దాకా (2002 నుంచి 2015 వరకు -6 రాష్ట్రాలలో మా క్షేత్ర సందర్శన విశేషాల యాత్రా సాహిత్యం)

3-ఆధునిక ఆంద్ర శాస్త్ర మాణిక్యాలు  (వివిధరంగాలకు చెందిన 62మంది ఆంద్ర శాస్త్రవేత్తల జీవిత విశేషాలు, చేసిన అమోఘ కృషి )

శ్రీప్లవ ఉగాదికి ఆవిష్కరించిన పుస్తకాలు -1-వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష (25)02-ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు(26)

4-  నా సంపాదకత్వం లో సరసభారతి ప్రచురించిన పుస్తకాలు

          1-జ్యోతిస్సంశ్లేషణం 2-ఉయ్యూరు ఊసులు 3-నవకవితా వసంతం 4-మా అక్కయ్య 5-‘’ఆదిత్య ‘’హృదయం 6-త్యాగి పే’’రెడీలు’’7-శ్రీరామవాణి 8-మా అన్నయ్య 9-శ్రీ సువర్చలా వాయు నందన శతకం 10-శ్రీ సువర్చలా మారుతి శతకం 11-శ్రీ సువర్చలేశ్వర శతకం 12-వసుధైక కుటుంబం 13-  Nucleaar Scentist Dr.Akunuri  Venkata Ramayya 14-సాహితీ స్రవంతి (సాహితీ మండలి తరఫున )

5- రేడియోలోసాహిత్య ధార్మిక ప్రసంగాలు

6-గత రెండేళ్లుగా సరసభారతి ఫేస్ బుక్ ద్వారా ,విద్యారణ్య స్వామి రచించిన శంకర విజయం ,వ్యాస విరచిత బ్రహ్మసూత్రాలు ,ద్వాదశ ఉపనిషత్తులు ,కాలిదాస మహాకవి ,కృష్ణ శాస్త్రి ,శ్రీపాద ,మధురాంతకం ,కేతు విశ్వనాధ రెడ్డి ,మల్లాది రామ కృష్ణ శాస్త్రి ,గంధం యాజ్ఞ వల్క్య శర్మ గంధం వేంకాస్వామి శర్మ ,గుంటూరు శేషేంద్రశర్మ ‘’షోడశి ‘’,స్వర్ణ హంస ,,సోమనాద్ నుంచి కాశీ విశ్వనాద్ దాకా ,ఆధునిక ప్రపంచ నిర్మాతలు షార్లెట్ సాహితీ మైత్రీ బంధం ,బ్రహ్మ వైవర్త పురాణం ,శివపురాణం ,శివతాండవం ,అనంతకాలం లో నేనూ ,నా దారి తీరు (స్వీయ జీవిత చరిత్ర ),మొదలైన వాటిపై , ప్రత్యక్ష ప్రసార ప్రసంగాలు .

7-5 సార్లు అమెరికా సందర్శన .ఐదవసారి నార్త్ కరోలినా షార్లెట్ కు రెండవ సారి వెళ్ళినపుడు  సరసభారతి స్థాపించి 6 కార్యక్రమాల నిర్వహణ

8-అంతర్జాలం లో నేను రాసి,,గ్రంథ రూపం దాల్చని  వివిధ రచనలు

     1-గణిత  వేదాంత  తత్వ కోవిదుడు శాస్త్ర వేత్త –ఇమాన్యుల్ కాంట్ 2-సింఫనీ మాంత్రికుడు –బీథోవెన్ 3-కోన సీమ ఆహితాగ్నులు 4-వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాథ సూరి మనీష  5-అలనాటి విజ్ఞాన శాస్త్ర వేత్తలు 6-యాజ్ఞ్యవల్క్య మహర్షి జీవితం 7-కాశీఖండం 8-భీమఖండం 9-గౌతమీ మహాత్మ్యం 10-నా దారి తీరు (స్వీయ చరిత్ర )11-కోరాడ రామకృష్ణయ్య గారి కోవిదత్వం 12-ప్రపంచ దేశాల సాహిత్యం 13-గానకవి రాజు –సంగీత సద్గురు త్యాగరాజ స్వామి 14-ప్రసిద్ధాంధ్ర మంత్రి పుంగవులు 15-కిరాతార్జునీయం 16-గీర్వాణకవుల కవితా  గీర్వాణం-4 వ భాగం -650మంది సంస్కృత రచయితల సాహితీ విశేషాలు 17-పంచారామ క్షేత్ర విశేషాలు 18-చిత్రకళా విశ్వనాథుని కీర్తి కిరీటం లో మరో ఆభరణం –శంకరాభరణం 19-కృష్ణా జిల్లా సంస్థానాలు –సాహిత్య సేవ 20-అమరగాయకుడు ఘంటసాల 21-విరాట ఉద్యోగాదిపర్వాలలో తిక్కన పద్య సౌరభం 22-శ్రీ కృష్ణ తత్త్వం 23-సదా శివ  బ్రహ్మేంద్ర  కీర్తనలలో అద్వైతామృతం 24-ఫాహియాన్ సఫల యాత్ర 25-స్వామి శివానందుల ఉపనిషత్ సారం 26-కన్యాశుల్కం లో కరటక శాస్త్రి 27-దర్శనీయ శివాలయాలు 28-దర్శనీయ దేవీ ఆలయాలు 29-దర్శనీయ వినాయక దేవాలయాలు 30-కేతు విశ్వనాధ రెడ్డి కథలు 31-మధురాంతకం రాజారాం కథలు 32-గొల్లపూడి కథామారుతీరావు  33-వేలూరి శివరామ శాస్త్రిగారి కథలు34-కాళిదాసు శకుంతల 35-పుట్టపర్తివారి శివతాండవం 36-విప్లవసింహం –ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 37-ప్రాచీనకాశీ నగరం 38-ముద్రా రాక్షసం లో మానవీయ ముద్ర 39-వందేళ్ళ తెలుగు కథ సామాజికాంశం 40-బ్రాహ్మణాల కథా కమామీషు 41-వీక్లీ అమెరికా 42- అమెరికా డైరి 43-వరద సాహితీ స్రవంతి 44-కొందరు హిమాలయ యోగులు 45-అలంకారిక ఆనంద నందనం 46-శ్రీ శంకరుల శివానందలహరి ఆంతర్యం 47-గాంధీజీ -21వ శతాబ్ది 48-ఇది విన్నారా కన్నారా (సంగీత జ్ఞుల విశేషాలు )49-బాపు-రమణీయం 50- ఖడ్గతిక్కన కావ్య సమీక్ష 51-దాక్షిణాత్య గానకళా తపస్సంపన్నులు (త్యాగరాజ స్వామి ,శిష్య ప్రశిష్య పరంపర ,సమకాలికులు నుంచి నేటివరకు ఆంధ్రగాయకులు ).52-మహా భక్త శిఖామణులు .53-అనుభూతికవి తిలక్ 54-అధర్వవేదం –వ్రాత్యఖండం ‘’డా సంపూర్ణానంద్ ఇంగ్లిష్ పుస్తకానికి నా అనువాదం 54-చరిత్ర కెక్కని చరితార్ధులు 55-శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్యలహరి 56-అమెరికాలో జర్మన్ హవా 57- నాద యోగం 58-జ్ఞానదుడు నారదుడు 59-అస్వత్ధామ 60-మత్స్వప్నః –బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారి రచన  విశేషాలు 61-మహిళా జాతి రత్నాలు

62-మన మరుపున పడిన మన వెండి తెర మహానుభావులు –శేర్ర్శికలో 300మందిని పరిచయం చేయటం 63-వీకీ పీడియ లో చోటు చేసుకొనని  సుమారు 50 శతకాలను ,కవులను రచయితలను ,వివిధ రంగాలకు చెందినప్రముఖులను సుమారు 50 మంది ని పరిచయం మొదలైనవి  చేశాను

  9-విహంగ మహిళా వెబ్ మాసపత్రికు 2012నుంచి ఇప్పటివరకు ప్రతినెలా వివిధరంగాలలోప్రపంచ  ప్రసిద్ధులైన మహిళ పై ధారావాహికంగా సుమారు 120మంది మహిళా మాణిక్యాలపై రాశాను .వారి అవార్డ్ కూడా అందుకొన్నాను .

 పొందిన సాహితీ పురస్కారాలు

1 -ఆంద్ర సారస్వత   సమితి –మచిలీ పట్నం  వారి పురస్కారం

2-చిన్నయసూరి పురస్కారం

3-విహంగ వెబ్   మహిళా మాసపత్రిక పురస్కారం –జనవరి 2017

4-శారదా స్రవంతి-విజయవాడ  ఉగాది పురస్కారం -2019ఏప్రిల్

5-సర్వేపల్లి చారిటబుల్ ట్రస్ట్ –నెల్లూరు –ఉగాది పురస్కారం –ఏప్రిల్-2019

6-శ్రీ పుట్టి వెంకటేశ్వరరావు సారక సాహితీ పురస్కారం-గుడివాడ  –జూన్ -2019

7-నోరి చారిటబుల్ ట్రస్ట్  వారి –కళా సుబ్బారావు స్మారక సాహితీ పురస్కారం –త్యాగరాజ గానసభ –హైదరాబాద్

8-ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం అందజేసిన ‘’జ్ఞానజ్యోతి ‘’పురస్కారం –నవంబర్ 2019.

9-కళా ప్రపూర్ణ బ్రహ్మశ్రీ చర్ల గణపతి శాస్త్రి శ్రీమతి సుశీల గార్ల స్మారక  సాహితీ పురస్కారం జనవరి 2021

                    గబ్బిట దుర్గా ప్రసాద్ –19-6-22-ఉయ్యూరు

                     సరసభారతి అధ్యక్షుడు

Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

విశ్వ పుత్రిక తోరూ దత్-10

విశ్వ పుత్రిక తోరూ దత్-10

ఒక్కత్తీ

ఆరూ చనిపోయాక నెమ్మదిగా అందరూ చాలాకాలానికి మామూలు స్థితికి వచ్చారు .తోరూ మేరేకిఉత్తరాలు రాస్తూ ఇంగ్లాండ్ పై ప్రేమను చూపిస్తూనే ఉంది ఆమె తండ్రికి వర్డ్స్ వర్త్ కవి నివసించిన వెస్ట్ మోర్లాండ్ ,అక్కడి విండర్ మెర్ సరస్సు ,దగ్గర కేస్విన్ చాలా ఇష్టం .చదువులోనే ఎక్కువ కాలం గడుపుతున్నా తొరూ వంటరితనం భరించలేక పోతోంది .గణిత శాస్త్ర పరిజ్ఞానానికి పదును పెట్టటం మొదలు పెట్టింది .అప్పుడు బెంగాల్ కరువు విపరీతంగా కబళించేస్తోంది .దానిపై తోరూ’’మనుషులందరూ అస్థిపంజరాల్లా ఉన్నారు .ఎముకలు బయటకు పొడుచుకొని వస్తున్నాయి .అన్నం కోసం ఒకరితో ఒకరు కొట్టుకొంటున్నారు .పిల్లల చేతుల్లోని తినుబండారాలను తల్లులు లాగేసుకొంటూ హృదయ విదారకంగా కనిపిస్తున్నారు ‘’అని రాసింది .

 కొన్ని నెలల తర్వాత దత్తు కుటుంబం బాగ్ మరీ తోటలోకి మారారు .కానీ ఆరూ స్మృతులు వెంటాడి ఉండటానికి భయమేసింది .సంస్కృతం నేర్వాలని తోరూ తీవ్రంగా భావించింది .తండ్రి ఏర్పాటు చేశాడు –‘’వెలుతురులో రాణించే-అతి చిక్కని శబ్దరాహిత్యం –అక్కడ ఒక దేవత –దేవతకు మారుగా –మంచం పక్కనే కూర్చుని –ఓర్పుగా నన్నే చూస్తున్న మానాన్న –నా చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని కన్నీళ్లు ఆపుకొంటున్నాడు ‘’అని అద్భుత కవిత రాసింది .ఇందులో తాత్వికత కనిపిస్తుంది .విలియం బ్లేక్ తాత్వికత దర్శనమిస్తుంది .ఆమె రాసిన కవితల్ని చదువుతూనే ఆమె మరో ప్రపంచం లోకి జారిపోయున్నట్లు కనిపిస్తుంది .మృత్యువును కూడా మంచితనం పోతపోసిన వాడి గానే ఊహించింది –ఓ మృత్యూ !ఇంకా ఎప్పుడు ??’’అని ఆహ్వానించింది .సెయింట్ జాన్ చెప్పినట్లు ‘’మృత్యువు చీకట్లో మెరుస్తుంది .తనకు తానె వస్తుంది దానికి స్వాగతం చెప్పిన వారంతా దేవుని బిడ్డలే ‘’ .

  తోరూకు లి కాంటేడిలైల్ అంటే ప్రత్యెక అభిమానం .అతనిపై ఒక ప్రత్యేకవ్యాసం 1874 చివర్లో బెంగాల్ పత్రికలో రాసింది .అతని కవితల్ని ‘’లా మార్టే డీ వాల్మీకి ‘’పేరుతొ అనువదించింది .1874 చివర మళ్ళీ ఆమెకు జబ్బు చేసింది .

   1875

1875 జనవరి ఒకటిన తోరూ తన స్నేహితురాలికి న్యు యియర్ గ్రీటింగ్స్ చెప్పింది .ఫిబ్రవరిలో జబ్బు ఎక్కువైంది కనుక విదేశ యానానికి ఏర్పాట్లు జరగలేదు .ఎలిజబెత్ బ్రౌనింగ్ కవితలు ఇష్టంగా చదువుతోంది .బ్లీక్ హౌస్ కూడా చదివి అనువాదాలు చేసి బెంగాలీ పత్రికకు పంపేది .అప్పుడే ఇంగ్లాండ్ నుంచి కొత్త పుస్తకాలు వచ్చాయి .వేల్స్ యువరాజు 7వ ఎడ్వర్డ్ ఇండియా రాబోతున్నాడు .జులైలో తోరూ నాయనమ్మ చనిపోయింది .తొరూ చాతీమీద ప్లాస్టర్ పట్టీ వేయటంతో ఎక్కడికీ కదలటానికి వీల్లేకపోయింది .సెప్టెంబర్ లో యువరాజు రాక కోలాహలంతో కలకత్తా నిండిపోయింది .ఈ సమయం లో తన దిన చర్య గురించి ‘’తెల్లవారుజామున 4-30కే లేస్తాను .నాకూ నాన్నకు రెండుకప్పుల చాకొలేట్ తయారు చేస్తా .బట్టలు మార్చుకొని అమ్మా నాన్న లను చూస్తా. నాన్న చుట్ట కాలుస్తూ కనిపిస్తాడు .పైకి వెళ్లి ఒకసారి ప్రకృతిని చూసి పని వాళ్లకు చేపలకు ఆహారం పెట్టమని అందిస్తా .మా గుర్రాలు జెంటిల్, చానేట్లు ను తనివితీరా చూస్తా వాటికి దాణా పెట్టిన్చాక మా ఫలహారాలు చేస్తాం . అమ్మ వంటిట్లో వంటపనికి వెడుతుంది .నేను పుస్తకం పట్టుకొంటా నాన్న రాతపనిలో ఉంటాడు .12కు భోజనం చేసి 3గంటలదాకా చదువు లేక రాత .తర్వాత ఒక సీతాఫలమో బత్తాయో తింటా .కాసేపు తోటలో షికారు .రాత్రి 7కు భోజనాలు పూర్తీ .8-30కు టీతాగి రాత్రి 10కి హాయిగా పడుకోవటమే ‘’అని రాసుకొన్నది .

   ఆత్మకూ పరమాత్మకూ ఉన్న సంబంధాన్ని ఒక కవితలో ఇలా రాసింది తోరూ-‘’రహస్యంగా గుంపులో నుంచి –ఆత్మను ఒకదాన్ని –పరమాత్మ పరిగ్రహిస్తాడు –విచారం, లోపాలనుండి –మెల్లగా ముందుకు నడిపిస్తూ –నిబ్బరంగా గమ్యానికి చేరుస్తాడు –చిరుసూది లాంటి ఆత్మను చూసి చిరునవ్వు నవ్వుకొంటాడు –తను చేసిన పనికి మురిసిపోతాడు ‘’.1869 డ్యూక్ ఆఫ్ ఎడింబరో కలకత్తా వస్తే 9వేలమంది ప్రేక్షకులు బాణా సంచా కాల్చటం తెల్సి ‘’డబ్బు ను బూడిద చెయ్యటం అంటే ఇదేగా ‘’అన్నది .తండ్రి గుర్రపు పందాలకు తీసుకు వెడతాను అంటే అంతగా ఉత్సాహం చూపలేదు .ఆమె స్వంత రచన ‘’ఫ్రెంచ్ క్షేత్రం లో మెరిసే కంకులు ‘’పూర్తీ చేసింది .దీన్ని చాలామంది విమర్శకులు మెచ్చారు –‘’పుష్ప వర్ణ శబలితాలుగా పుష్ప పత్రాలు విచ్చుకొన్నాయి ‘’లాంటి లైన్లు చాలాఉన్నాయి అందులో .

 పుస్తకం పూర్తయింది కనుక తండ్రీ కూతురు  సంస్కృత  అధ్యయనం మొదలెట్టారు .డిసెంబర్ 4న పాఠాలు మొదలయ్యాయి .రామాయణ మహాభారతాలను సంస్కృతంలో చదవాలని ఆమె కోరిక .తోరూచూడటానికి రోజూ చాలామంది వచ్చేవారు .ఇంగ్లాండ్ నుంచి మిస్ ఆడాస్మిత్ కలకత్తా వస్తే తండ్రి ఆమెను బాగ్ మరీకు తీసుకు వస్తే మేనత్త ఆమెకు ‘’కాస్కేట్ ఆఫ్ జేమ్స్ ‘’చూపిస్తే ఆ ఇల్లూ ఆ తోట ఆమెకు భూలోక స్వర్గం లా అనిపించి ,ఈ ఆనందాన్ని అనుభవించకుండా ఈ కుటుంబం ఎందుకు ఇంగ్లాండ్ వెళ్ళాలను కొంటున్నారు అని ఆశ్చర్యపోయింది .

  డిసెంబర్ లో వచ్చే యువరాజు స్వాగతానికి కలకత్తా అంతా పెళ్లి ముస్తాబు చేసుకొన్నది .రాజులు అందరూ వచ్చి విడిది చేశారు .ఒక రాజు రత్నాలు ముత్యాలుపొదిగిన   చొక్కా పది లక్షలు ఖర్చు చేసి తయారు చేయిన్చుకొన్నాడు .ఒక రాజు తన ఆస్థానానికి యువరాజు వస్తే ఖర్చు చేయటానికి 30లక్షలతో సిద్ధంగా ఉన్నాడు .

  తప్పులు పడకుండా పది నెలలలో సంస్కృతం చదవటం అలవాటయింది తోరూకు .రోజురోజుకు ఆమె ఆరోగ్యం క్షీణిస్తోంది .సెప్టెంబర్ వరకు శ్రమ పడవద్దని డాక్టర్లు సూచించారు .తనకు నేర్పుతున్న గురువు గొప్పతనం గురింఛి మేరీకి రాసింది .1976జులైలో ‘వ్యాకరణం చాలా కష్టంగా ఉంది .రుజుపధం లో మూడు భాగాలు పూర్తీ చేశాను .కాళిదాసు శాకుంతలం మొదలు పెట్టాలి ‘’అని రాసింది .కానీ చదువు మూలపడింది .

 సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -18-6-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

విశ్వ పుత్రిక తోరూ దత్-10స్వదేశాగమనం -2

విశ్వ పుత్రిక తోరూ దత్-10
స్వదేశాగమనం -2
రాం బగత్ లో ఉన్న పుస్తకాలన్నీ బాగ్ మరీ కి తరలించటం వలన తోరూకు చేతినిండా పుస్తకాలు దొరికాయి చదవటానికి .జీవితాలు ప్రశాంతంగా సాగుతున్నందున తాను  అనేక పుస్తకాలు చదవగలిగానని తోరూ చెప్పింది .భోజనం టిఫిన్ టెన్నిస్ విహారాలకు సమయం బాగా తగ్గించి పుస్తకాలే చదివి పుస్తకాల పురుగుయింది .లండన్ నుంచి ‘’మండేస్ రివ్యు ‘’తెప్పించుకోనేది  .హాటర్ దంపతులు లండన్ నుంచి ఇంగ్లీష్ ఫ్రెంచ్ పుస్తకాలు పంపేవారు .సమకాలిక రచనలన్నీ చదివే అదృష్టం కలిగింది .ప్రముఖ కవులు రచయితలైన కార్లైల్, బ్రాంటి సిస్టర్స్ ,బైరన్ ,ధాకరే ,కాల్రిడ్జ్, టెన్నిసన్ ,బ్రౌనింగ్ ,ఇలియట్ ,లిట్టన్ పేర్లు ఆమె తరచుగా పెర్కొనేది .ఫ్రెంచ్ పుస్తకాలనీ లోతుగా అధ్యయనం చేసేది .మోలియర్ హాస్యనాటకాలు ,మిగేట్ విప్లవ  చరిత్ర ,రోసేల్ వ్యాసాలూ హ్యూగో రచనలు ,టైన్ యాత్రా విశేషాలు ,సెస్ టైన్ రచనలు అన్నీ చదివేది .ఫ్రెంచ్ కాల్పనిక సాహిత్యాన్ని కూడా ఔపోసనపట్టింది ..తోరూ అతి నాజూకుగా సగం విచ్చిన గులాబి మొగ్గ .హిందూ గృహ కుటుంబం లో సువాసనలు వెదజల్లే మనోహర ముకుళం’’అన్నాడు ఆమె జీవిత చరిత్రకారుడు హరిహరదాస్ .చిన్నా ,పెద్దా అంతా తొరూ ను ‘’దీదీ’’అంటూ ఆప్యాయంగా పిలిచేవారు .కళ్ళలో కారుణ్యం తొణికిస లాడేది.డాక్టర్ హంటర్ ఆమెకు ఎన్నో ఉత్తరాలు రాసేవాడు .
   తోరూ జీవితావసరాలు చాలా చిన్నవి .ఒక దోమ తెర,పొద్దున్నే తన గుర్రాల్ని చూడటం ,తురాయి చెట్టు చూస్తూ మురిసిపోవటం ,తల్లి పాట,చివరకు తానూ మృత్యు ముఖాన ఉన్నప్పుడు తన చేతిలో ఇమిడిపోయిన తండ్రి స్పర్శ తో తన అల్పాయుష్క జీవితాన్ని అనుభవించింది .’’తోరూ ఉత్తరాలలో నిష్కాపట్య౦ ,,అర్ధవత్వం ,మనసును ఆకర్షించే మంచితనం ,సరళత ,అన్నీ పరిపూర్ణంగా ఉండి,ఆమె ను నా దగ్గరగా తెచ్చి నన్ను ఆకర్షించాయి ‘’అని రాసుకుంది బాదేర్. 
  అకాల మరణం
దత్తు కుటుంబం ఇండియాకు తిరిగి వచ్చాక ఆరూ తోరూ ల ఫ్రెంచ్ కవితల అనువాదాలను సేకరించి బెంగాల్ పత్రిక లో ప్రచురణకు ఇవ్వటం తో సమయం గడిచిపోయింది .తోరూ అనువాదాలు సీరియల్ వచ్చాయి. ఆరు తక్కువే రాసింది .1874 ప్రారంభం నుంచి వీరి కవితలు బెంగాల్ పత్రికలో సీరియల్గా వచ్చాయి. బుద్ధి శ్రమా ఎక్కువై తోరూ కలలలో తేలిపోయి ఉద్రేకంలో ఊగిపోయింది .బలహీన ఆరోగ్యంతో  అయిదు నెలల భరించరాని ఏకాంతవాసం లో ఆమె సాధించిన ఫలితం ,ఆ బలహీన శరీరం ఎందుకింత త్వరగా నిర్జీవమై పోయిందో అర్ధమౌతుంది .
1874మొదట్లో ఆరు తోరూ లిద్దరికీ జబ్బు చేసింది .తోరూలో క్షయ చిహ్నాలు కనిపించాయి .మార్చిలో కొద్దిగా కోలుకున్నది .వేసవిలో కొంత ఉల్లాసంగా ఉంది కానీ ఆరు ఆరోగ్యం మాత్రం బాగుపడలేదు .ఉన్నట్టుండి ఆరూ  చనిపోయి ఇంట్లో తీవ్ర విషాదాన్ని నింపేసింది. భగవంతుడిని నమ్మటం తప్ప ఎవరూ ఏమీ చేయలేకపోయారు ..తనకూ అదే గతి అని తొరూ తెలుసుకొన్నది. ఆరూ లేని ఒంటరితనాన్ని భరించ లేకుండా ఉన్నానని ‘’మేరీ కి బాధా తప్త హృదయంతో రాసింది .అనారోగ్యంతో బాధపడుతున్నా ,సాహిత్యవ్యాసంగంలో అక్కా చెల్లెలు బాగానే గడిపేవారు .ఆరూ రాసిన 7కవితలు ‘’షీఫ్’’బెంగాలీ పత్రికలో ప్రచురితాలయ్యాయి .ఆరూ అనువదించిన  విక్టర్ హ్యూగో రచన 1974 ఏప్రిల్ లో ‘మార్నింగ్ సెనేరేడ్’’లో ప్రచురితమైంది. దీనిపై ఎక్సామినర్ పత్రికలో విమర్శరాస్తూ ఎడ్మండ్ గాస్ అది తోరూ రచన అని పొరబాటు పడ్డాడు ‘నీ అందమంతా –నీ కళ్ళకోసమే కదూ –ఊరికే నిద్రపోకు –జాగ్రత్తగా విను –పదేపదే రోదిస్తున్నాను నేను –ఇంతకీ ఎక్కడున్నావు నీవు?’’.ఇది చిన్నదేకాని అత్యుత్తం శ్రేణికవిత. ఆరూ చనిపోయే ముందు తొరూ కూడా బెంగాల్ పత్రికకు 7కవితలు పంపింది .అక్క చెల్లెళ్ళు ఇద్దరూ ఈ పత్రికకు 14కవితలు రాశారు .అందులో ఆర్నాల్డ్ కవిత ‘’ది లీఫ్ ‘’కు తోరూ చేసిన అనువాదం చాలామందిని ఆకర్షించింది –‘’రోజాలకైనా –నాజూకు రేకలు రాలక తప్పదు –మరి నాకెందుకు అంటి పెట్టుకు ఉండాలనే తపన’’ ?,
  సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-6-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

విశ్వ పుత్రిక తోరూ దత్-9

విశ్వ పుత్రిక తోరూ దత్-9

ఇంగ్లాండ్ లో తోరూ కుటుంబం -2

కేంబ్రిడ్జి లో దత్తు కుటుంబానికి మరో స్నేహితుడు క్లిఫర్డ్ పరిచయమయాడు .దత్తు తనకుటు౦బాన్ని కేం బ్రిడ్జి నుంచి సముద్ర తీరం లో ఉన్న సెంట్ లియోనార్డ్ కు మార్చాడు .చివరిదాకా అక్కడే ఉన్నారు .తోరూకు, తండ్రికి  మాస్టర్ గిరాల్ద్ ఫ్రెంచ్ చెప్పేవాడు .ఆరూ ఆరోగ్యం బాగుండక బలహీనం గా ఉండటం వలన ఫ్రెంచ్ నేర్వలేదు .ఫామిలి ఆల్బం నుంచి మూడు కవితలు ఆయన ఫ్రెంచ్ లోకి అనువదించాడు .ఆరూ తొరూ ల ఫోటో ఇక్కడ తీసిందే .19ఏళ్ళ వయసున్న ఆరూ అనారోగ్యం వలన ఇంకా పెద్ద గా కనిపించేది .తోరూ మిసమిస లాడుతూ అందంగా చలాకీ గా ఉండేది .ఆమె వయసుఅప్పుడు 17.ఆ అందం ఆకర్షణ చలాకీ తనం ఉన్న తోరూను మరో అయిదేళ్ళలో క్షయ వ్యాధి బలి తీసుకొన్నది అంటే ఎవరూ నమ్మలేరు .మరో రెండేళ్లలో ఆరూ జీవితమూ సమాప్తమౌబోతోంది.ఇద్దరూ కుచ్చులు కుచ్చులుగా ఉన్న విక్టోరియన్ గౌన్లు వేసుకొని యువ రాణీలు లాగా ఉండేవారు .వాళ్ళ ఫోటోలు చూశాక చీర కట్టుకొంటే మరెంత అందంగా ఉండేవారో అనిపిస్తుంది .

  తోరూ ప్రచురించిన ‘భారత దేశపు ప్రాచీన గేయ గాధలు ‘లో ఆమె కవిత ‘నియర్ హేస్టింగ్స్ ‘’కూడా ఉంది .ఇందులో ఆరూ ఆరోగ్యం పై ఆందోళన ఉంది –సముద్రతీరాన జలకన్యల్లా తిరిగాం . దూరంగా ఏకత్వాన్ని భజించే –ఆకాశమూ భూమి –అలసటగా విసుగును మోస్తూ -మెల్లగా అక్కడ తిరిగే మేము రోగ గ్రస్తులం –ఫిర్యాదులు తెలీని అక్క అక్కడే కూర్చుండి పోయేది –మహర్షికి ఉండాల్సిన లక్షణాలన్నీ -అక్కడమాకు కనిపించిన ఆమెలో  ఉన్నాయి –తల్లీ ఆ పరమేశ్వరుడు చల్లగా చూడాలి మీ ఇద్దర్నీ ‘’అని దీవిన్చినట్లనిపి౦చి౦ది’’.

  గోవిన్ చందర్ 1873లో తనకుటు౦బ౦ సహా ‘’లైనర్ పెషావర్ ‘’లో ఇండియాకు ప్రయాణమయ్యాడు .

  స్వదేశాగమనం

1873 సెప్టెంబర్ నుంచి 53ఉత్తరాలు మేరీకి తోరూ రాసిందని ఆమె జీవిత చరిత్రకారుడు హరదాస్ రాశాడు .వీటిలో సాహిత్యం గుబాళిం చేది విక్టోరియాయుగ రచయితల హాస్యం ప్రతి బి౦బించేది.గొప్ప సాహిత్య విమర్శలూ ఉండేవి .ఉత్తరాలు రాయటం లో అసామాన్య ప్రతిభ కనిపించేది .పెషావర్ లైనర్ లో ప్రయాణం చేస్తూ జిబ్రాల్టర్ దగ్గర మేరీ కి ఉత్తరం రాసింది  .

కలకత్తాలో ఆమెజీవితం చాలా హుషారుగా గడిపింది .ఇంగ్లాండ్ నుంచి వచ్చిన ఏడాదికే ఆమెకు  క్షయ సోకింది  .1873 డిసెంబర్ నుంచి కలకత్తానుంచి ఉత్తరాలు రాసింది .దారిలో సింహళం లో ఒక రోజు ఆన౦ద౦ గా  గడిపారు .ఇండియారాగానే బంధువులు అపూర్వ స్వాగతమిచ్చారు .విశాలమైన తోట చేపలకు చిన్న చిన్న చెరువులు ఫలవృక్షాలు అనేకరకాల పుష్పాలు  చెట్లు వాటిపై కోతులు ,అనేకరంగులపిట్టలు ,సీతాకోక చిలుకలు కనువిందు చేసేవి. నాలుగేళ్ల దాకా వీటి సొందర్యమంతా వర్ణిస్తూ మేరీకి జాబులు రాసేది తొరూ .

  జీవితం ప్రశాంతంగా గడిచిపోతోంది .తల్లి కమ్మగా పాటలు పాడేది .ఈ ఆనందం అంతా ‘’సీత ‘కవితలో గొప్పగా నిక్షిప్తం చేసింది  .

 సశేషం

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -16-6-22-ఉయ్యూరు 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -302

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -302

302-‘’ఎగిరి పొతే ఎంత బాగుంటుందో ‘’పాట ఫేం పాటల మాటల రచయిత –సాహితీ

సాహితి పేరుతో తెలుగు సినిమారంగంలో గేయ రచయితగా, సంభాషణల రచయితగా చలామణీ అవుతున్న రచయిత అసలు పేరు చెరుకుపల్లి శ్రీరామచంద్రమూర్తి. ఇతడు కృష్ణా జిల్లా, మైలవరం మండలం, వెల్వడం గ్రామంలో జన్మించాడు. ఇతడు వెల్వడం గ్రామంలో ఎస్.ఎస్.సి, వరంగల్లులో ఇంటర్మీడియట్,నూజివీడులో డిగ్రీ చదివాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి స్నాతకోత్తర పట్టా పొందాడు. ఇతడు గుడివాడలో ఒక ట్యుటోరియల్ కాలేజీలో లెక్చరర్‌గా కొంతకాలం ఉద్యోగం చేశాడు[3].

సినిమా రంగం

సినిమాలలో అవకాశం కోసం 1974లో మద్రాసుకు వెళ్లాడు. మొదట ఆత్రేయ వద్ద సహాయకునిగా చేరాడు. గురువు దగ్గర మెలకువలు నేర్చుకుంటూనే ప్రయత్నాలు మొదలు పెట్టాడు. 1979లో విజయనిర్మల దర్శకత్వంలో కృష్ణ హీరోగా తెరకెక్కిన కిలాడి కృష్ణుడు సినిమాలో తొలి పాటను రచించాడు. తరువాత ఇతనికి అనేక అవకాశాలు వెనువెంటనే వచ్చాయి. ఇతడు మూడున్నర దశాబ్దాలలో 500కు పైగా పాటలు, 100 ప్రైవేటు ఆల్బమ్స్, 30 డబ్బింగ్ సినిమాలకు పాటలను అందించాడు. కేవలం పాటలే కాక “మల్లన్న”, “జర్నీ” వంటి సినిమాలకు సంభాషణలు కూడా అందించాడు[3].

ఇతని కలం తనదైన శైలిలో పాటకు పట్టాభిషేకం చేస్తుంది. ఈయన పాటలో పదాలు స్వరాల మధ్య విసిరేసినట్టుండవు. స్వరంపై పైచేయి సాధించడానికి పోటీ పడుతున్నట్టుంటాయి. ఇతడు రాసిన “జాబిలికీ వెన్నెలకీ”, “ఎగిరిపోతే ఎంత బాగుంటుంది” పాటలు అశేష ఆదరణ పొందాయి.[4] ఇతడు సుమారు 1000 తెలుగు సినిమా పాటలు రాసాడు. ఆంధ్రప్రదేశ్ యొక్క వివిధ యాస, మాండలికాలతో జానపద గీతాలను రాసినందున సినిమా పరిశ్రమలో ప్రసిద్ది చెందాడు. ఇతను దూర ప్రాంతాలు ప్రయాణం చేసి, ప్రజలతో సంభాషించి, వారి వ్యావహారిక పదాలు, పదజాలాన్ని సేకరించి జానపద కవిత్వంలో తనకు ఒక ప్రత్యేకమైన చిహ్నాన్ని సృష్టించాడు. అతడు మొండిమొగుడు పెంకి పెళ్ళాం చిత్రంలో విజయశాంతి పాత్రకు రాసిన “లాలూ దర్వాజ లష్కర్ బోనాల్ పండుగ” పాట పెద్ద హిట్ అయింది. ఇతను అందమైన, గొప్ప యాసలను రాసాడని భావిస్తారు.[5]

సినిమాల జాబితా

గేయ రచయితగా

1.   కిలాడి కృష్ణుడు (1980)

2.   రామ్ రాబర్ట్ రహీమ్ (1980)

3.   వాడనిమల్లి (1981)

4.   అతిరధుడు (1991)

5.   ఆగ్రహం (1991)

6.   ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్ (1991)

7.   అప్పుల అప్పారావు (1992)

8.   వద్దు బావా తప్పు (1993)

9.   ఘరానా అల్లుడు (1994)

10. అమ్మలేని పుట్టిల్లు (1995)

11. ఆంటీ (1995)

12. ఆలీబాబా అద్భుతదీపం (1995)

13. ఆడాళ్లా మజాకా? (1995)

14. అక్కుమ్ బక్కుమ్ (1996)

15. ఇల్లాలు (1997)

16. దొంగాట (1997)

17. అల్లరి పెళ్లాం (1998)

18. డాడీ డాడీ (1998)

19. ఆవిడే శ్యామల (1999)

20. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం (2001)

21. తప్పుచేసి పప్పుకూడు (2002)

22. అదృష్టం (2002)

23. వెంకీ (2004)

24. ఖుషి ఖుషీగా (2004)

25. సఖియా (2004)

26. మాస్ (2004)

27. బాస్ (2006)

28. ఆటాడిస్తా (2008)

29. భలే దొంగలు (2008)

30. బ్లేడ్ బాబ్జీ (2008)

31. సమర్ధుడు (2009)

32. వేదం (2009)

33. మిరపకాయ్ (2011)

34. ప్రేమ కావాలి (2011)

35. ఢమరుకం (2012)

36. రామయ్యా వస్తావయ్యా (2013)

37. చల్‌ మోహన రంగా (2018)

సంభాషణల రచయితగా[మార్చు]

1.   మల్లన్న

2.   జర్నీ

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -16-6-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

విశ్వ పుత్రిక తోరూ దత్-8

విశ్వ పుత్రిక తోరూ దత్-8

ఇంగ్లాండ్ లో తోరూ కుటుంబం

దత్తు కుటుంబం ఇంగ్లాండ్ లో లండన్ లోని చారింగ్ క్లాస్ హోటల్ లో ముందు బస చేసి ,తర్వాత బంధువు రమేష్ చందర్ మాట్లాడిఉన్చిన  గ్రాస్ వెనర్ హోటల్ గదుల్లో ఉన్నారు .తర్వాత బ్రాండం లో అన్ని వసతులు ఉన్న ఇంట్లో చేరారు .సిడ్నీ ప్లేస్ ,ఆన్ స్లో స్వేర్ లో 9వ నంబర్ ఇల్లు అది .ఇక్కడే అక్కచెల్లెళ్ళు ఫ్రెంచ్ కవితల్ని ఇంగ్లీష్ లోకి అనువదించారు .గోవిన్ కుటుంబం అందరితో బాగానే పరిచయాలు పెంచుకొన్నారు .దత్ ఫామిలి ఆల్బం లో ఉన్న తనకొడుకు మరణానికి చెందినతనకవితలు నీళ్ళు నిండిన కళ్ళతో   రమేష్ కు చదివి వినిపించేవాడు .దాన్ని పుస్తకంగా ప్రచురించి అతనికి ఒకకాపీ ఇచ్చాడు .మరో బంధువు అరుణ్ చందర్ దత్తు అంటే తోరూకు బాగా అభిమానం ..అతడు కేంబ్రిడ్జి కార్పస్ క్రిష్టి కాలేజి లో డిగ్రీ పొంది అక్కడే స్థిరపడ్డాడు .గొప్ప  డాక్టర్ గా పేరు తెచ్చుకొని ఆంగ్ల వనితను పెళ్ళాడి సుఖంగా ఉన్నాడు .

  ఇంగ్లాండ్ లో ఆరూ తొరూ లు హాయిగా కాలక్షేపం చేశారు. సర్ జార్జి మెక్ ఫర్న్,సర్ బార్టర్ ఫ్రేరీ లతో పరిచయం కలిగింది .మెక్ ఫెర్న్ భార్య వీళ్ళిద్దరికీ సంగీతం నేర్పింది .సర్ బార్టర్ 1862నుంచి 67దాకా బెంగాల్ గవర్నర్ గా ఉన్నాడు .ఫ్రేరీ దంపతులతో తొరూ వింబుల్డన్ లో చాలా రోజులు కులాసాగా గడిపింది .షేక్స్పియర్ నాటకాలను ఫ్రెంచ్ లోకి అనువాదం చేసిన,విక్టర్ హ్యూగోకు స్నేహితుడు అయిన  సెవేలియర్ డి.చాటర్టన్ కూడా పరిచయమయ్యాడు .

  పెద్దదైన ఆరు తోరూ కన్నా మానసికంగా చిన్నది .తోరూకున్న చొరవ లేదామెకు .ఒకరకంగా ఆరూ కు మార్గదర్శి తొరూ .ఇద్దరిమధ్య గొప్పఅనుబంధమే ఉండేది .నవలలు కాకుండా చారిత్రిక గ్రంధాలు చదవమని లార్డ్ లారెన్స్  హితవు చెప్పేవాడు .ఆమెచరిత్ర అంతా బూటకం నవల లో అంతా నిజమే ఉంటుంది అని జవాబిచ్చింది .ఆరూ పై తోరూ పెద్దరికానికి తల్లీ తండ్రీ అభ్యంతరం చెప్పలేదు .తోరూ జ్ఞాపక శక్తి అమోఘం .తాను  చేసిన అనువాదాలన్నీ ఆమెకు కంఠతా వచ్చు .ఆమె గొప్పశ్రద్ధతో అధ్యయనం చేసేది .సందేహం వస్తే నిఘంటువులు విజ్ఞాన సర్వస్వాలు రిఫర్ చేసేది .ఆ వివరనలన్నీ రాసుకొని జాగ్రత్తగా ఉంచుకోనేది .తండ్రికి కూతురు కు ఈ విషయం లో అభిప్రాయ భేదం వస్తే కూతురు తోరూ మాటే నిజమయ్యేది.ఆమెదే గెలుపు అని తండ్రికూడా చెప్పేవాడు .తాను ఎప్పుడైనా తండ్రి చేతిలో ఓడిపోతే ‘’నా తెలివి తెల్లవారి నట్లుంది నువ్వు పెద్దవాడివి పూర్ణ పురుషుడవు  ‘’అని బాధపడకుండా తప్పుకునేది .

  దత్తు కుటుంబం అంతా1837నుంచి 43వరకు కలకత్తా సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి  సర్ ఎడ్వర్డ్ రెయాన్ తో సన్నిహితంగా ఉండేది .డికెన్స్, ధాకరే వంటి వారికి ఆయన ముఖ్య స్నేహితుడు .ఒకసారి ఆయన ‘’మీకు ధాకరే కూతుళ్ళు తెలుసా ?మీ ప్రక్కనే ఉంటారు ‘’అని అడిగితె తెలియదని తోరూ చెప్పింది .’’ఆయన నవలల లో ఏది ఇష్టం ?అని అడిగితె ‘’అందరికి నచ్చిన పెండరిన్ .కానీ దీనికంటే గొప్ప కళాఖండం ‘’ఎస్మాండ్ ‘’‘’అన్నది తోరూ .పిల్లలిద్దరి చదువులు ఎలా సాగుతున్నాయో చూడటానికి తండ్రి శ్రీమతి లాలేన్స్ ను పర్య వేక్షకురాలుగా కుదిర్చాడు .

  అసలే అంత౦త మాత్రం ఆరోగ్యాలున్న అక్క చెల్లెళ్ళకు దినచర్య చాలా భారంగా ఉండేది .ఊపిరి పీల్చుకోవటానికి కూడా వీలు౦డేదికాదు .ఇండియా వచ్చినా తొరూ ఆరోగ్యం మెరుగు పడలేదు పైపెచ్చు దినచర్య  ఎక్కువగానే ఉండేది .దీన్ని గురించి ‘’ఉత్తరం రాసే తీరిక కూడా లేదు .ఉదయం ఏడున్నరకు పియానోక్లాసులు .తర్వాత టిఫిన్ చేసి బైబిల్ ఒక గంట చదవాలి  .మళ్ళీ పియానో తోమ్మిదిన్నరదాకా .తర్వాత టైమ్స్ పత్రిక  చదవటం .పదింటికి లాలేన్స్ వచ్చి మధ్యాహ్నం మూడున్నర దాక తోముతారు .నాలుగింటికి నాన్నతో కలిసి పఠనం.శుక్రవారం మిసెస్ మెన్ ఫారన్ వచ్చి సంగీతం నేర్పుతారు .సోమవారాలు మిస్టర్ పార్ ఇంటికి వెళ్లి సంగీతం నేర్చుకొంటాం .ఆతర్వాత మళ్ళీ పియానో ‘అని ఆమె ఒక స్నేహితురాలికి ఉత్తరం రాసింది .

  ఇంగ్లాండ్ లో ఉన్నా ఫ్రెంచ్ అధ్యయనం కొనసాగించారు .ఇంట్లో ఇటాలియన్ సేవకుడు ఉండటంతో అతనితో మాట్లాడటం వలన ఫ్రెంచ్ బాగా వచ్చింది .వంటమనిషి ఇసాబెల్ కు భారతీయ వంటకాలు వండటం వీళ్ళు నేర్పారు .అప్పుడప్పుడు ‘’ఐ మీ రోబ్సర్డ్’’,’’మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీం ‘’వంటి నాటకాలు వెళ్లి చూసేవారు .1871లో దత్తు కుటుంబం కేంబ్రిడ్జి లో పార్కర్స్ పీన్ కు ఎదురుగా రీజెంట్ వీధిలో ఉన్నారు .స్త్రీలకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సభలకు వెళ్లి ప్రసంగాలు శ్రద్ధగా వినేవారు .ఇక్కడ ఫ్రెంచ్ నేర్పటానికి బోగెల్ అనే టీచర్ కుదిరాడు .కేం బ్రిడ్జి లో తోరూకు ముఖ్య ఆకర్షణ మేరీ మార్టిన్ .తర్వాత ప్రాణప్రద స్నేహిహితురాలైంది.ఎంతో లేఖాయణం ఇద్దరిమధ్యా జరిగి, సాహిత్య చరిత్రలో స్థానం సంపాదించుకొన్నది  .హరిహర దాసు రాసిన తోరూ జీవిత చరిత్రకు సహాయకారిణి మిస్ మార్టెన్ .ఆయన ఈమెను 1913లో కలకత్తాలో కల్సి విషయ సేకరణ చేశాడు .లేఖాయణం ప్రచురించటానికి ఆమె నుండి అనుమతి పొందాడు .ఆ కృతజ్ఞత ప్రకటించటానికే ఆపుస్తకాన్ని ఆమెకే అంకితమిచ్చాడు-‘’తాను  చూపిన మెత్తనైన సానుభూతికి –కృతజ్ఞతతో ఎంతొప్రేమతో –తనభారతీయ స్నేహితురాలూ ,-ప్రాణం మిత్రమూ అయిన –తోరూదత్ స్మృతికావ్యం –మేరీ ఐ .ఆర్ .మార్టిన్ కు అంకితం చేయబడుతోంది ‘’అని హృదయపూర్వకంగా తెలియజేశాడు తోరూ దత్ జీవిత చరిత్ర చేసిన హరిహరదాస్ .తోరూ చనిపోయిన చాలాకానికి అంటే 1910-13మధ్య మేరీ మిషనరీ గా కలకత్తాకు వచ్చింది .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -15-6-22-ఉయ్యూరు  

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సహస్ర చంద్ర దర్సన -మహోత్సవ ఆహ్వానం

Posted in సమయం - సందర్భం | Leave a comment

విశ్వ పుత్రిక తోరూ దత్-7

విశ్వ పుత్రిక తోరూ దత్-7

ఫ్రాన్స్ లో తోరూ

గోవిన్ చందర్ కుటుంబం ముందు మార్సేల్స్ చేరి అక్కడి నుంచి నైస్ కు వెళ్ళింది .1870 వసంతం దాక అక్కడే ఉండి,స్కూల్ లో తొరూ ఆరూ చేరి ఫ్రెంచ్ చదివారు .కొన్ని నెలలతర్వాత తండ్రి ఇంటివద్దనే ష్వేయర్ అనే టీచర్ తో చదువు చెప్పించాడు .అప్పుడే ఫ్రెంచ్ సాహిత్యపు లోతులు తరచారు అక్క చెల్లెళ్ళు .అప్పటి అ సాహిత్యం లో స్వాతంత్ర్య కాంక్ష ప్రముఖంగా ఉండేది .జార్జి సాన్డ్స్ నవలలో స్త్రీస్వాతంత్ర్యం కూడా ఉంది .తోరూకు ఫ్రాన్స్ పై అభిమానం పెరిగిపోయింది .’’ఎవరూ మార్చలేని ,అధికారం  చెలాయించ లేని ఫ్రెంచ్ మహిళ ను నేను ‘’అని రాసుకొన్నది .

  నైస్ లో ఈ కుటుంబం హెలేవిటి హోటల్ లో ఉండేది .ఇక్కడి నుంచి కలకత్తాలోని బంధువు అరుణ్ చందర్ కు ఉత్తరాలు రాసేది తోరూ.లెంట్ సమయంలో కాధలిక్కులు కలివిడిగా పెద్దమనిషి తరహాగా ఉంటారని రాసింది .ఒకరోజు కుటుంబ మంతా సంతకు బయల్దేరారు .తలిదండ్రులు ఒక డొక్కు బండీ ఎక్కితే ఆడపిల్లలిద్దరూ మిస్టర్ ఇలియట్ తో వెళ్ళారు .ఇతడు మిసెస్ బార్టన్ తమ్ముడు .ఒక డాబా ఎక్కి కుర్చీలపై నుంచుని సంతా అంతా చూశారు ..ఒక డాక్టర్ భార్య వీరి కుటుంబానికి సన్నిహితంగా ఉండేది .ఆమె పిల్లలిద్దర్నీ ఫ్రెంచ్ లోనే మాట్లాడమని హితవు చెప్పేది .తప్పులు మాట్లాడినా ప్రోత్సహించేది .

  ఆకాలం లో ఇంగ్లాండ్ కంటే ఫ్రాన్స్ కు పేరు ప్రతిష్టలు ఎక్కువ .ఫ్రెంచ్ బాలికలు అధునాతన బెంగాలీ బాలికలకంటే మెరుగ్గా ఉండటం తోరూను ఆకర్షించింది .తన నవలలో ఒకదానిలో అలాంటి ఫ్రెంచ్ బాలిక ను మార్గరెట్ పేరుతొ చక్కగా చిత్రించింది .జేమ్స్ డామేష్టర్ ఫ్రెంచ్ సాహిత్యం లో తోరూకున్న అద్భుత పరిచయానికి అబ్బురపడ్డాడు .నైస్ లో దత్తు కుటుంబం ‘’ప్రోమెనేడ్ డెస్ యా౦ గ్లాయిస్ ‘’లో నివసించింది .అక్కడి బహు వర్ణమిశ్రమంగా ఉన్న మేడిటరేనియన్ దృశ్యానికి ముగ్దురాలైంది .ద్రాక్ష తీగలు ,పళ్ళ తోటలు , నీలి సముద్రం లను చూసి అక్క చెల్లెళ్ళలో కవితాత్మ మేలుకొన్నది .కాన్స్ నుంచి మొనాకో కు చేసిన ప్రయాణం తన్మయులను చేసింది .అక్కడి జీవన మాధుర్యానికి చలించిపోయారు .దక్షిణ ఫ్రాన్స్ లో ఉన్న ఈ చల్లని వాతావరణం ఆరూ కు పడలేదు .కనుక అక్కడి నుంచి వెళ్లి పోవాలనుకొన్నారు .ఇంగ్లాండ్ లో ఉంటె ఆరూ ఆరోగ్యం బాగు పడుతు౦దనుకొన్నాడుతండ్రి  .కానీ అక్కడ చలీతేమా ఎక్కువ అన్న సంగతి ఆలోచి౦చినట్లు లేదు .1870లో శ్రీమతి బార్డాన్ తో సహా ఇంగ్లాండ్ చేరారు .’’వాళ్లకు కళ చరిత్ర బాగా తెలుసు .అది వాళ్ళనాన్న గారి కృషే .ఒకసారి కానన్ చైల్దర్ హౌస్ కు వీళ్ళను తీసుకు వెళ్లి అక్కడ కంచుతో చేసిన చనిపోతున్న మల్లుడి విగ్రహం చూపించి ఎవరిదీ అని అడిగ్తే ఆరూ తొరూ లిద్దరూ చటుక్కున సమాధానం చెప్పి నన్ను ఆశ్చర్యం లో ముంచేశారు వాళ్ళు రోమ్ ను చూడకపోయినా.పుస్తకాలద్వారా గ్రహించారన్నమాట .ఫ్రాన్స్ కష్టదశలో ఉన్నప్పుడు మా దేశం పై తొరూ ప్రేమ వర్షించింది ‘’‘’అని రాసింది బార్డాన్ .14ఏళ్లవయసులో తోరూ కు బిస్మార్క్ రాజకీయం పట్ల అయిష్టత ఉండేది .యుద్ధం ప్రారంభమైనప్పుడు ఆమె మనస్సంతా ఫ్రాన్స్ క్షేమం మీదే ఉండేది .1851లో ఫ్రాన్స్ శాసన సభలో విక్టర్ హ్యూగో చేసిన ప్రసంగాన్ని ‘’సమకాలీన చరిత్రలో ఒకరంగం ‘’పేరుతొ తోరూఅనువదించి  బెంగాల్ పత్రికకు పంపితే ప్రచురితమైంది .ఫ్రెంచ్ రాజ్యాంగం లో కొన్ని మార్పులు కావాలని కొందరు అంటే హ్యూగో ‘’అలా చేస్తే నెపోలియన్ ఫ్రాన్స్ కు రాజుగా చేసి అమితమైన అధికారాన్ని కట్ట బెట్టి నట్లే ‘’అని ధైర్యంగా వ్యతిరేకించిన ప్రజాస్వామ్యవాది .తొరూ దీన్ని బాగా బలపరచింది .మిస్టర్ ధియర్ ఉపన్యాసాన్నికూడా అనువదించి బెంగాలీ మేగజైన్ కు పంపగా ప్రచురితమైంది .1870లో ఫ్రాన్స్ ప్రష్యా పై యుద్ధ ప్రకటన  చేయటాన్ని ఆయన ఖండించాడు .ఒక చిన్న బాలిక ఇంతగా రాజకీయంగా పరిణత బుద్ధి చూపటం అమితాశ్చర్యకరం .ఆమె తనను ఫ్రెంచ్ బాలికగా మలచుకున్నది .

 1871జనవరి సంచికలో తనకు ఫ్రెంచ్ దేశమంటే ఎంత గౌరవమో వెల్లడించింది తొరూ .ఆమె ఫ్రెంచ్ దేశభక్తుడికియేమాత్రం తీసి పోదు ..’’మేము పారిస్ లో ఉన్నది కొద్దికాలమే అయినా అదెంత అందమైన ప్రదేశం ,అవేమి వీధులు ,,అదెంత సేన .కానీ ఇప్పుడు ఎంతగానో పతనమై పోయింది.నగరాలన్నిటికి తలమానికమే అయినా ,ఇప్పుడు దాని నిండా దుఖం పొంగి ప్రవహిస్తోంది  ‘’అని బాధపడింది.ఫ్రాన్స్ పతనానికి నాస్తికతే కారణం  అనీ అందుకే దేవుడు దాన్ని శపించాడని భావించింది –‘’ఎంత పతనం చెందావ్ ఫ్రాన్స్ !ఇంత అవమానం భరించాక ఇక నువ్వు తప్పని సరిగా భగవంతుని పూజించి సేవించు .నీ కోసం నా గుండె ఎలా ముక్కలై పోతోందా తెలుసా ??అని వాపోయింది చిన్నారి తొరూ .15ఏళ్ళ వయసులో ఆమె రాసిన కవితలో ఆమె కున్న పరిపక్వత కనిపిస్తుంది .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -14-6-22-ఉయ్యూరు   

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

పామర్రు జిల్లాపరిషత్ హైస్కూల్ 1986-87 పదవతరగతి బాచ్ పూర్వ విద్యార్ధుల సమ్మేళనం ,గురు వందనం ఆహ్వానం

పామర్రు జిల్లాపరిషత్ హైస్కూ ల్ 1986-87 పదవతరగతి బాచ్ పూర్వ విద్యార్ధుల సమ్మేళనం ,గురు వందనం ఆహ్వానం

Posted in రచనలు | Leave a comment

విశ్వ పుత్రిక తోరూ దత్-6

విశ్వ పుత్రిక తోరూ దత్-6

తోరూ బాల్యం

కలకత్తా మధ్యలో మాణిక్ తలావీధిలో రామబాగన్ లో తొరూ దత్ 4-3-1856 న పుట్టింది .పెద్ద వాడు అబ్జూ పుట్టి 14ఏళ్ళకు ,అక్క ఆరూ 1854లో పుట్టిన 20ఏళ్ళకే చనిపోయారు . .తొరూ 21ఏళ్ళు మాత్రమె బతికి 30-8-1877న మరణించింది .గోవిన్ దత్ కుటుంబమంతా కారన్ వాలీస్ స్క్వేర్ లో ఉన్న చర్చిలో మత పరివర్తనం పొందారు .పిల్లలు ముగ్గురికి బాబూ సాహెబ్ చందర్ బెనర్జీ టీచర్ .ఆయన మేనకోడలు భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడైన w.c.బెనర్జీ భార్య .బాబూ సాహెబ్ దగ్గరే మిల్టన్ రాసిన పారడైజ్ లాస్ట్ మొదటి మూడు భాగాలు చదివారు .ముగ్గురికిఅదంతా కంఠతా వచ్చు.అక్క చెల్లెళ్ళు పియానోతోపాటు ఇంగ్లీష్ సంగీతాన్ని మిసెస్ సెనేస్ వద్ద నేర్చారు .మంచి సంగీతకారులుగా గుర్తింపు పొందారు .విశాలమైన ఇల్లు తోట నౌకర్లు చాకర్లు బంధువులతో వాళ్ళ బాల్యం హాయిగా గడచిపోతుండగా 1865లో అన్న అబ్జూ అకస్మాత్తుగా చనిపోయి భరించరాని దుఖాన్ని కలిగించాడు .కొడుకు మరణం తో కుంగిపోయిన తండ్రి మిగిలిన ఇద్దరు పిల్లలనీ కోల్పోతానేమో అనే బెంగ ,భయం పెట్టుకొన్నాడు .కోడుకుపై ఒక కవిత రాశాడు –‘గడిచే రోజుల్ని బరువుగా లేక్కేస్తూ –అలసిన మనసుతో –ఒంటరిగా గుండెలు పగిలి మిగిలిపోయాను ‘.దైవాన్నే నమ్మాడు .తన సంతానం గురించి రాసిన కవితలో ఆయన –‘’జనముద్దు బిడ్డ నా పెద్దకొడుకు –ఆంతర్యం లో పసివాడు –వాడి వయసులో అంత ఎత్తు ఎదిగిన వాళ్ళు లేరు –ఇంటికి దీపం నా రెండో బిడ్డ –గుండెనిండా బెరుకూ భయమూ –తటాలున ఎర్రబడే బుగ్గలు –నిటారుగా తీర్చిన కనుబొమలు –ఆమె తీరు నిర్మలం గంభీరం –సాయం సంధ్యానక్షత్రకా౦తిలాగా శాంతం సుందరం –చిట్ట చివరిబాల-అర్భకంగా అచ్చర కూనలా –అందాలు చిమ్మేపసిపాప –‘’

  1869లో చలికాలం లో యూరప్ వెళ్లేముందు కలకత్తాలో ఆకుటుంబం కొంతకాలం గడిపి౦ది .అక్కడి తోటలో ఇల్లు అంటేతోరూకు బాగా ఇష్టం అద్భుతమైన కవిత్వం ఆక్కడి ప్రకృతిపై రాసింది –‘’బ్రహ్మ రాక్షసుల్లా అశ్వత్ధ వృక్షాలు జడలుకట్టిన గచ్చ తీగేలపోదలు – అడవి ద్రాక్ష తీగ గుంపు –గ్రామ్యవనితల భూషణాలై –ఆర్యకవితను వాసికెక్కిన –శిరీష కుసుమ సందడి –అదంతా పచ్చదనాల కడలి –తూర్పున నిలుచున్నా వెదురు పొదల సౌందర్యాన్ని మించింది ఏదీ లేదు –సృష్టి ఆదిలో ఈడేన్ తోటను చూసిన ఆనందం ‘’ఇలాంటి బాగ్ మరీ తోటలో గడిచిన బాల్యం ఆమెది .మిస్ ఎలిజబెత్ కాటన్ తోరూ కు వీరాభిమాని .తోరూచనిపోయిన 30 ఏళ్ళకు వచ్చి అదంతాచూసి ఆమె కవిత్వాన్ని ఆతోట సౌందర్యాన్నీ వాటిని ఆమె వర్ణించిన తీరుకు అప్రతిభురాలైంది .

  తొరూ ఆరూ లకు ఫ్రాన్స్ అంటే బాగా ఇష్టం .ఫ్రెంచ్ వాళ్ళు తోరూను ఫ్రెంచ్ అమ్మాయి అనే అనుకొనేవారు .ఫ్రాన్స్ అంటే ప్రాణంగా భావించింది ఆతర్వాత భారతదేశం పై నెమ్మదిగా ఆరాధన కలిగింది తోరూ కు .

   సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -12-6-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

విశ్వ పుత్రిక తోరూ దత్-5

విశ్వ పుత్రిక తోరూ దత్-5

రాం బగాన్ లో

దత్తు కుటుంబం మొదట్లో బెంగాల్ లోని బర్ద్వాన్ జిల్లా అజాపూర్ లో ఉండేవారు కాయస్తులు .నీలమణి దత్ 3-1-1757న జన్మించాడు .తన వ్యక్తిత్వం వలన అందరికి స్పూర్తి కలిగించాడు .ఆయన తండ్రి కొందరు కుటుంబ సభ్యులని బర్ద్వాన్ లోనే వదిలిపెట్టి కలకత్తా లోని రాం బాగాన్ కు  చేరాడు .ఉదారస్వభావంతో అందరికి దగ్గరయ్యాడు .నీలమణి కి రసమయి హరీష్ ,పీతాంబర్ అనే ముగ్గురు కొడుకులు .రసమయి మూడవకొడుకు తోరూతండ్రి గోవిన్ దత్ .మిగిలిన వాళ్ళు కిషన్ చందర్ ,కైలాస చందర్ హరి చందర్ ,గిరి చందర్ .పీతాంబరుని పిల్లలు ఈశాన చందర్ ,శశి చందర్ .ఈశానుడి కొడుకే ప్రసిద్ధ రచయిత ,తత్వవేత్త రమేష్ చందర్ .ఇప్పటికీ ఆయన నివసించిన ఇల్లు ఉంది .అందులో ఆయన చుట్టం అశోక దత్ ఉంటాడు .

  తోరూ తాత రసమయి దత్ ఆంగ్ల సాహిత్యాన్నీ అర్దికశాస్త్రాన్నీ బాగా అభ్యసించాడు .హిందూకాలేజీ కమిటి గౌరవ కార్యదర్శి .స్మాల్ కోర్ట్ లో జడ్జి ,అప్పిలేట్ కోర్ట్ లో కమీషనర్ .ఆయన లైబ్రరీ లోని ఇంగ్లీష్ సాహిత్య పుస్తకాలు ఇంటి వారందర్నీ ఆకర్షించాయి .రసమయి తండ్రి బాగా డబ్బు ఖర్చు చేసి పూజా పునస్కారాలు దాన ధర్మాలు చేయటం కొడుకుకు ఇష్టం ఉండేదికాదు .అందుకే సనాతన బ్రాహ్మణ్యం పై ఈసడింపు పెరిగింది .తోరూ పుట్టటానికి రెండేళ్ళ ముందే 14-5-1854న రసమయి చనిపోయాడు .బైబిల్ లో ఇంట్లో వారందరికీ ఆయన మార్గదర్శి .

 దత్తు కుటుంబం క్రైస్తవానికి మారటానికి కారణాలు s.m.మాకే 29-6-1854న రాసిన ఉత్తరం లో ఉన్నాయి .రసమయి చనిపోయి దహనక్రియలు పూర్తయ్యాక ,పెద్దకొడుకు కిషన్ కు తీవ్రంగా జబ్బు చేసి,చనిపోయాడు .చావు బతుకులతో ఉన్న అన్నకోసం తమ్ముడు గిరీష్ ‘’అజిల్ వీ టెంపుల్ ‘’అనే మిషనరీని పిలిపించి ,తన అన్న చనిపోయేముందు పరలోకం చూశాడని ,క్రైస్తవం పై నమ్మకం పెంచుకున్నాడని ,మతం తీసుకోవటానికి కూడా సిద్ధపడ్డాడని చెప్పాడు  .ఈమిషనరి రావటం ఇంట్లో వారికి ఇష్టం లేదు .గిరీష్ తానె మతం తీసుకొని అన్నకు క్రైస్తవం ఇప్పించాడు .కొన ఊపిరితో ఉన్న కిషన్ ఇంట్లో వారందర్నీ క్రైస్తవం తీసుకోమని చెప్పి చనిపోయాడు .

  కిషన్ చనిపోయాక ఇంట్లో వారంతా బాగాచర్చించుకొని క్రైస్తవం తీసుకోవటానికి సిద్ధపడ్డారు .కానీ స్త్రీలు వ్యతిరేకించారు .1862లో కానీ దత్తు కుటుంబ సభ్యులంతా క్రైస్తవులు కాలేకపోయారు .గోవిన్ బాబు బృందావన్ మిట్టల్ కూతురు హిందూపురాణాలను పుక్కిటపట్టిన సంప్రదాయవాదిక్షేత్రమణి ని పెళ్ళాడాడు.ఆమె బెంగాలీ బాగావచ్చిన విద్యావేత్త .ఇంటి పెత్తనం అంతా ఆమెదే .కూతురు తోరూ కు పురాణగాధలు కధలుగా గీతాలుగా చెప్పేది .తల్లిపాడే ఆపాటలకు ఆమెకు కంటి నుండి ఆనంద బాష్పాలు రాలేవి .1862లో ఈమె క్రైస్తవం పుచ్చుకొన్నా ,హిందూ విశ్వాసాలను మనసులో భద్ర పరచుకొనే ఉంది .క్రమంగా ఆమె పూర్తి విశ్వాసంకల క్రైస్తవురాలయింది .భర్త తనకూ భార్యకూ మధ్య పెద్ద అఘాతం ఏర్పడుతుందేమో నని భయపడ్డాడు కానీ అలా జరగాకయేసరికి ఊపిరి పీల్చుకొని ఆ భావాలను ఒకకవితలో నిక్షిప్తం చేశాడు –‘’ఒద్దువెళ్లి పోవద్దు –ఒక్క నిమిషం నిలు –నన్ను శపిస్తూ చీదరించుకోకు –అందరిలాగే నువ్వూ –నన్ను అడవిలో వదిలేసి పోవద్దు –ప్రతిమల్ని నిరసిస్తూ –ప్రభువు ము౦దు మోకరిల్లె –నన్ను వదిలేసి వెళ్ళద్దు ‘’

  పెళ్ళయ్యాక ఆమె ఇంగ్లీష్ జ్ఞానాన్ని బాగా పెంచుకొన్నది .’’ది బ్లడ్ ఆఫ్ జీసెస్ ‘’ను బెంగాలీలోకి అనువదించింది .దీన్ని ట్రాక్ట్ అండ్ బుక్ సొసైటీ ముద్రించింది .ఆకుటుంబం లోఎక్కువకాలం బతికింది ఈమె మాత్రమె .పవిత్ర యోగినిలా బతికి క్షేత్రమణి1900లో మరణించింది .కూతుళ్ళు ఇద్దరిపైనా ఈమె ప్రభావం తండ్రి ప్రభావం బలంగా ఉన్నాయి .తండ్రి నుంచి తెలివి పాండిత్యం,తల్లి నుంచి  నైతిక హృదయ సౌందర్యమ నిర్మలత్వం  తోరూ పొందింది .

  రసమయి కొడుకుల్లో గోవిన్ పరమ ఉదారుడు .హిందూకాలేజిలో చేరి ప్రొఫెసర్ రిచర్డ్సన్ గారి ముఖ్య శిష్యుడయ్యాడు .గోవిన్ ,మధుసూదన్ కలిసి కాలేజీలో నాటకాలు ఆడారు .షేక్స్పియర్ పోయెట్రి ఎలా చదవాలో గురువు వద్ద నేర్చాడు .ఆకాలం లో హిందూకాలేజీ అనేకమంది రచయితల్ని కవులనూ తయారు చేసింది .చిన్నప్పటి నుంచి కవిత్వం రాసే అలవాటున్న గోవిన్ కొన్నికవిత లను ఒక సంపుటంగా ప్రచురిస్తే బ్లాక్ వుడ్ పత్రిక చక్కని విమర్శ చేసి ప్రోత్సహించింది .చదువు పూర్తయ్యాక ప్రభుత్వ శాఖలో ఆదాయ వ్యయ శాఖాదికారయ్యాడు .బెంగాలీలను చిన్న చూపు చూస్తున్నాడు అనే అభియోగం తో బొంబాయికి బదిలీ చేశారు .అక్కడ కుటుంబం పెట్టినా ఉద్యోగం ప్రోత్సాహకంగా లేక రాజీనామా చేసి ,కలకత్తా వచ్చి సాహిత్య, మత కార్యక్రమాలలో మునిగిపోయాడు .

  1873లో లండన్ నుంచి కుటుంబం తో తిరిగొచ్చాడు లండన్ లో  అక్క ఆరూను ప్రతిభా వంతురాలు తోరూను పెద్ద జబ్బు కబళించగా ఇండియా వచ్చారు .ఇంగ్లాండ్ లో తొరూ రాసిన కవిత్వాన్ని ఎడ్మండ్ గాసే బాగా మెచ్చుకొన్నాడు .ఆమె ఇంకొంచెం కాలం బతికి ఉంటె ఆంగ్ల సాహిత్యం లో తన పేరు చిర స్థాయిగా నిలుపుకోనేది అని కితాబిచ్చాడు .ఇద్దరు పిల్లల మరణం తర్వాత తండ్రి కొద్దికాలం మాత్రమె జీవించి ఉన్నాడు .తర్వాత భార్య ఆయన్ను అనుసరించింది .

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -11-6-22-ఉయ్యూరు   

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సరస భారతి 165వ కార్యక్రమం గా ‘’సాహితీ పుష్కర మహోత్సవం ‘’

సరస భారతి 165వ కార్యక్రమం గా ‘’సాహితీ పుష్కర మహోత్సవం ‘’
(ఇదే ఫైనల్ ఇన్విటేషన్ –కొన్ని రోజుల తర్వాత దీనినే కార్డ్ సైజు లో కలర్ లో డిజైన్ చేసి పెడతాము .ఈ వాట్సాప్ ఇన్విటేషన్ నే అసలైన ఆహ్వానంగా భావించి అతిధులు ,సన్మానితులు ,కవులు అందరూవిచ్చేసి జయప్రదం చేయవలసినదిగా మనవి .)
సాహితీ బంధువులకు శుభ కామనలు .. సరసభారతి సాహిత్య సాంస్క్రుతిక సంస్థ స్థాపించి 12 సంవత్సరాలు అయిన సందర్భంగా ,సరసభారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ గారి ‘’సహస్ర చంద్ర మాసోత్సవం ‘’’’ను పురస్కరించుకొని
27-6-2022 సోమవారం సాయంత్రం 4 గం.లకు సరసభారతి 165వ కార్యక్రమంగా ‘’సాహితీ పుష్కరోత్సవం’’,ఉయ్యూరులోని టాక్సీ స్టాండ్ వెనుక ఉన్న ‘’శాఖా గ్రంధాలయం నందు ( A/C లైబ్రరి )నిర్వహిస్తున్నాము.
దీనిలోపుస్తకావిష్కరణ , సంగీవవిభావరి ,కవి సమ్మేళనం , ‘’సరస భారతి ప్రతిభా పురస్కార ప్రదానం ‘’ మొదలైన వి ఉంటాయి .కవి పండితులు ,సాహితీ మిత్రులు ,సంగీత సాహిత్యాభిమానులు పాల్గొని జయ ప్రదం చేయ ప్రార్ధన .
మొత్తం సభా కార్యక్రమ నిర్వహణ ,పర్యవేక్షణ – శ్రీ దండి భట్ల దత్తాత్రేయ శర్మ –‘’హాస్య దండి ‘’తెలుగు భాషా సమాఖ్య కోశాధికారి ,హాస్యలహరి కార్య దర్శి’’ ప్రముఖ కవి ,విశ్లేషకుడు,సంస్కృతాంధ్ర ప్రజ్ఞానిది స్వర్గీయ శ్రీ కె.వై.ఎల్.ఎన్.’’కళాపీఠంసంస్థాపకులు – విజయవాడ
సహకారం –శ్రీమతి మాది రాజు శివ లక్ష్మి –సరసభారతి కార్యదర్శి
కార్యక్రమ వివరం –
సాయంత్రం -3-30నుండి 4 గం వరకు –అల్పాహారం
సాయంత్రం 4గం.నుండి 4-30 వరకు
-శ్రీమతి ఏలేశ్వరపు రాధికా సుబ్రహ్మణ్యం (మచిలీ పట్నం )గారిచే ‘’సంగీత విభావరి ‘’
సాయంత్రం 4-30గం .నుండి 5-30 వరకు –కవి సమ్మేళనం
కవి సమ్మేళనం –అంశం –‘’సరసభారతి సాహితీ పుష్కరోత్సవం ‘’
మనవి -5పద్యాలు లేక 15పంక్తుల వచన కవిత్వం .చదివిన తర్వాత కాపీ సరసభారతికి అందజేయ మనవి .అతిధులు ,పురస్కార గ్రహీతలు కూడా ఇందులో పాల్గొనవచ్చు .అందరికి అవే నిబంధనలు వర్తిస్తాయి .
సాయంత్రం -5-30 గం నుండి -5.45వరకు –పుస్తకావిష్కరణ
‘’Nuclear scientist Dr.Akunuri Venkata Rmayya’’( శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ రచించిన ‘’అణుశాస్త్ర వేత్త డా.ఆకునూరి రామయ్య ‘’పుస్తకానికి ‘’ఆంగ్లానువాద పుస్తకం ‘’ ఆవిష్కరణ –-స్పాన్సర్ –శ్రీ మైనేని గోపాల కృష్ణ ,శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా )
ఆవిష్కర్త శ్రీ వై. వి.బి. రాజేంద్ర ప్రసాద్ – శాసనమండలి మాజీ సభ్యులు .
సాయంత్రం -5-45నుండి 7-15 వరకు సరసభారతి సాహితీ పురస్కార ప్రదానం పురస్కార గ్రహీతల స్పందన
-సాహితీ క్షేత్రం లో అపూర్వ సేవలు అందించిన వారికి విశిష్ట సాహితీ పురస్కార ప్రదానం ,
1- బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి ,-చీరాల
గీర్వాణ, ఆంధ్ర, ఆంగ్ల,భాషా నిపుణులు ,హనుమాన్ ఆధ్యాత్మిక కేంద్ర సంస్థాపకులు ,పరాశర సంహితపై అధారిటి ,సనాతన ధర్మ జ్యోతి సంపాదకులు , ఆధ్యాత్మిక ప్రవచన ప్రముఖులు –చీరాల ,
2- శ్రీ ఆముదాల మురళి-అవధాన కిరీటి -తిరుపతి,
3–,శ్రీ బెల్లంకొండ నాగేశ్వరరావు -బాలసాహిత్య శ్రీ ,బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ,తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ విజేత ,తెలుగు భాషోద్యమ నాయకులు –, చెన్నై
4- శ్రీమాన్ గుడిమెట్ల చెన్నయ్య- జనని సాహిత్య సాంస్కృతిక సంఘం వ్యవస్థాపక కార్యదర్శి ,నటుడు ,రచయిత,సాహిత్య సేవా పారాయణ – చెన్నై
5- శ్రీ గంధం యాజ్ఞవల్క్య శర్మ- అపూర్వ కథా రచయిత (నరసరావుపేట )
6-,,శ్రీ చలపాక ప్రకాష్ ,-ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి ,రమ్యభారతి సంపాదకులు,కవి ,కధకులు విమర్శకులు ,ప్రచురణ కర్త ,శ్రీ చలపాక ప్రకాష్ -విజయవాడ ,
7- శ్రీ యల్లపు కళాసాగర్ -64 కళలు తెలుగు అంతర్జాల సకల కళల సమాహార పత్రిక నిర్వాహకులు ,చిత్రకారనిపుణులు- విజయవాడ
8-, డా .ఎన్ .భాస్కరరావు–,సోషల్ రిసెర్చ్ పయనీర్ – ఢిల్లీ
9- డా. చిల్లర భవానీ దేవి- వివిధ సాహిత్య ప్రక్రియల నిపుణ – హైదరాబాద్
,10- డా. నోముల నర్మదా రెడ్డి -ప్రముఖ ప్రపంచ పర్యాటకురాలు ,గాయని ,పర్యాటక రచయిత్రి ,క్రీడా కారిణి -హైదరాబాద్,
11- చి.ఉప్పలధడియం భరత శర్మ- బాలఅష్టావధాని –తిరుపతి
12-డా .టేకుమళ్ళ వెంకటప్పయ్య – శ్రీ అద్దేపల్లి రామమోహనరావు గారిపై పి.హెచ్.డి.చేసి ఆధునిక ప్రబంధం ‘’ధర్మ దత్తోదయం ‘’, నిర్మాత ,అన్నమయ్య పద్య సంకలన , ,అన్నమాచార్య అష్టోత్తర శతం కర్త –నెల్లూరు

  • విశేష సాహితీ పురస్కార ప్రదానం
    1- –శ్రీ గాడేపల్లి వెంకట రామ కృష్ణా రావు -ఆంధ్ర ప్రదేశ్ పురావస్తు,మరియు ప్రదర్శనల శాఖ విశ్రాంత సంచాలకులు – హైదరాబాద్
    2- శ్రీ కానూరి బదరీ నాథ్ -విశిష్ట చారిత్రిక పరిశోధకులు ,ప్రాంతీయ చరిత్ర రచయిత- తణుకు
    3- శ్రీ శిష్టు సత్య రాజేష్- గోదావరి రచయితల సంఘం అధ్యక్షుడు,బహుకార్యక్రమ నిర్వాహకుడు ,పుస్తక ప్రచురణకర్త – రాజమండ్రి
    4 శ్రీ కంభంపాటి వెంకట సుబ్రహ్మణ్యం-,ఉయ్యూరులో 1977-78లో ఆర్ట్ ఫిలిం ప్రదర్శనకు’ఉయ్యూరు ఫిలిం క్లబ్ ‘’స్థాపించిన’’ విజనరీ’’ ,హాస్య రచయిత ,కార్టూనిస్ట్, ప్రస్తుతం కుర్తాళ శ్రీ సిద్దేశ్వరి పీఠ సేవకులు,ఆధ్యాత్మిక వేత్త -కుర్తాళం
    4- శ్రీమతి లేళ్ళ శ్రీదేవి (డిస్టింక్షన్ లో అన్ని డిగ్రీలు పొందిన విద్యావతి ),శ్రీ రమేష్((IIT Alumni and musicologist )- ,సాహిత్య ,సామాజిక సేవ లో తరిస్తున్నదంపతులు –చెన్నై
    5- శ్రీ పంతుల వెంకటేశ్వరరావు -శారదా సమితి సంస్థాపకులు ,తెలుగు పండితులు ,కవి ,విమర్శకులు,ప్రవచన ధురీణ –విజయవాడ
    6- శ్రీమతి కోనేరు కల్పన -కవి, కథా రచయిత్రి –విజయవాడ
    7- ,శ్రీ పెదప్రోలువిజయ సారధి -కవి ,విశ్లేషకులు -ఉయ్యూరు
    8- శ్రీ బి.హేచ్ .వి ..కృష్ణ రావు – శాఖా గ్రంలయాదికారి -ఉయ్యూరు
    9- శ్రీమతి కె.స్రవంతి -శాఖా గ్రందాలయాది కారిణి – ఉయ్యూరు
    సరసభారతి అపూర్వ సౌజన్య పురస్కారప్రదానం –శ్రీమతి పువ్వుల కరుణానిధి ,శ్రీ నరసింహారావు దంపతులకు -ఉయ్యూరు
    రాత్రి -7-15గం.లకు విందు
    . ఆహ్వానించు వారు
    శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి –సరసభారతి గౌరవాధ్యక్షురాలు
    శ్రీ గబ్బిటదుర్గా ప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు
    శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి –సరసభారతి కార్యదర్శి
    శ్రీ గబ్బిట వెంకటరమణ –సరసభారతి కోశాధికారి
    శ్రీ వి.బి.జి.రావు –సరసభారతి సాంకేతిక నిపుణులు
    శ్రీ మైనేని గోపాలకృష్ణ శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా ) ,శ్రీ సుంకర కోటేశ్వరరావు(హైదరాబాద్ ) ,డా ఆకునూరి రామయ్య శ్రీమతి కృష్ణ మయి దంపతులు (అమెరికా )డా.రాచకొండ నరసింహ శర్మ(విశాఖ పట్నం ) ,శ్రీ వేలూరి వివేకానంద్ (హైదరాబాద్ ),శ్రీ కోమలి సా౦బావధానిశ్రీమతి విజయలక్ష్మి దంపతులు (అమెరికా )శ్రీ పువ్వుల నరసింహారావు ,శ్రీమతి కరుణానిధి దంపతులు (ఉయ్యూరు ),శ్రీ వేలూరి మృత్యుంజయ శాస్త్రి శ్రీమతి విజయ లక్ష్మి దంపతులు (అమెరికా )శ్రీ జగదీశ్ శ్రీమతి లక్ష్మి దంపతులు (అమెరికా )మరియు షార్లెట్ సరసభారతి మొదలైన వారి సౌజన్యంతో –
    సభ నిర్వహణ సహకారం
    శ్రీ గబ్బిట రామనాధ బాబు ,శ్రీ కోనేరు చంద్ర శేఖరరావు ,శ్రీమతి సీతం రాజు మల్లిక,శ్రీ మాదిరాజు శ్రీనివాస శర్మ ,శ్రీ చౌడాడ చిన అప్పల నాయుడు
    కవి సమ్మేళనం లో పాల్గొనే కవి మిత్రులు
    1-శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజి 2-శ్రీ తుమ్మోజు రామ లక్ష్మణా చార్యులు,3-శ్రీవిష్ణుభొట్ల రామ కృష్ణ,-4-శ్రీ కందికొండ రవి కిరణ్ ,5-శ్రీమతి ముదిగొం-డ సీతారావమ్మ ,6-శ్రీమతి మందరపు హైమవతి,7-,శ్రీమతి-వి.శ్రీ ఉమా మహేశ్వరి, 8-,శ్రీమతి-.ఎస్.అన్నపూర్ణ,9–శ్రీమతికొమాండూరి కృష్ణా, 10-శ్రీమతిలక్కరాజు వాణీ సరోజిని ,11-శ్రీమతి వడ్డాది లక్ష్మీ సుభద్ర,12-శ్రీమతి.ఆదుర్తి సుహాసిని-,13-శ్రీమతిఓలేటి ఉమాసరస్వతి,14-,శ్రీమతి-సింహాద్రి వాణి, 15-శ్రీమతి తుమ్మల.స్నిగ్ధ మాధవి,16-శ్రీమతి సోమరాజుపల్లి విజయ కుమారి,17-శ్రీమతిసామినేని శైలజ(విజయవాడ ) -18శ్రీమతివారణాసి సూర్యకుమారి, 19-శ్రీమతిగురజాడ రాజ రాజేశ్వరి, -20-శ్రీమతిజి మేరీ కృపాబాయి, 21శ్రీమతి గుడిపూడి రాధికారాణి, 22-శ్రీమతి కె కె డి మహాలక్ష్మి, 23-శ్రీమతి చిల్లరిగె ప్రమీల, 24-శ్రీ అన్నం లాల్బహదూర్ శాస్త్రి (మచిలీ పట్నం ) -.25-శ్రీ వసుధ బసవేశ్వర రావు(గుడివాడ )26-శ్రీ అక్షరం ప్రభాకర్ (మానుకోట –వరంగల్ జిల్లా )27-మోకా మాధవరావు (జగ్గయ్యపేట )28- శ్రీమతి.సింహాద్రి పద్మ(అవనిగడ్డ ) 29-శ్రీమతి పెళ్లూరి శేషుకుమారి(నెప్పల్లి )30- శ్రీ కాట్రగడ్డ వెంకటరావు(గూడూరు ) 31శ్రీ మైనేపల్లి సుబ్రహ్మణ్యం(ఆకునూరు )32,డా.దీవిచిన్మయ , 33-శ్రీ మాదిరాజు శ్రీనివాసశర్మ, 34-శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి (ఉయ్యూరు )-
    సభ నిర్వహణ సహకారం
    శ్రీ గబ్బిట రామనాధ బాబు ,శ్రీ కోనేరు చంద్ర శేఖరరావు ,శ్రీమతి సీతం రాజు మల్లిక,శ్రీ మాదిరాజు శ్రీనివాస శర్మ ,శ్రీ చౌడాడ చిన అప్పల నాయుడు
    తెలుగులో మాట్లాడటం మన జన్మ హక్కు
    -11-6-22. ఉయ్యూరు
Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

విశ్వ పుత్రిక తోరూ దత్-4

విశ్వ పుత్రిక తోరూ దత్-4
మైకేల్ మధుసూదన దత్ హిందూకాలేజిలో చదివి ప్రిన్సిపాల్ రిచర్డ్సన్ కుప్రియశిష్యుడైనాడు .అంతకు ముందు కాశీప్రసాద్ ,రాజనారాయణ అక్కడే చదివారు .మధు 1883లో క్రైస్తవం తీసుకొని ,కొద్దికాలం కలకత్తా బిషప్ కాలేజిలో పని చేసి ,1849లో మద్రాస్ వెళ్ళాడు..మొదట్లో ఇంగ్లీష్ లో తర్వాత బెంగాలీలో రాసి కవిగా నాటకకర్త గా ప్రసిద్ధుడయ్యాడు .1876లో తోరూ తన ఇంగ్లీష్ స్నేహితురాలికి జాబురాస్తూ మధుసూదన్ దత్తు గురించి రాసింది .అప్పుడే అచ్చయిన తన ‘షీఫ్ గ్లీన్డ్ ఇన్ ఫ్రెంచ్ ఫీల్డ్స్ ‘’ను బెంగాలీ పత్రికలో చక్కగా విమర్శించారనీ ,విద్యావంతుల్లో కూడా వ్యక్తం కాని సంస్కృతి అందులో కనిపించిందనీ ,తాను  మధు కుటుంబానికి చెందినదానిని అని పొరబాటు పడ్డాడని తెలిపింది .అతడు జేస్సూర్ జిల్లా సాగర్ దారీ గ్రామం వాడని కూడా రాసింది .
   1851లో తోరూపినతండ్రి హరిచందన దత్ ‘’ఫ్యూజిటివ్ పోయెమ్స్ ‘అనే కావ్యం రాసి ప్రచురించాడు .ఆధ్యాత్మిక నీతి కవితాత్మక రచనలు కూడా చేశాడు .ఇంకో పినతండ్రి గిరీష్ చందర్ ‘’చెర్రీ బ్లాసమ్స్’’కావ్యం రాశాడు .వీళ్ళు ‘’దత్ ఫామిలి ఆల్బం ‘’లో తరచురాసేకవులు .దీన్ని 1870లో తోరూ దత్ తండ్రి గోవిన్ చందర్ దత్ ప్రచురించాడు .ఆయన మేనల్లుడుఉమేష్ దత్ పద్యాలూ ఇందులో ఉన్నాయి .దీన్ని లాంగ్ మన్ అండ్ గ్రీన్ సంస్థ ప్రచురించింది .ఇది చాలామంది బెంగాలీ కవులను ఉత్తేజితం చేసి,సాహిత్యపు విలువ పెంచింది .ఒకరకంగాఇది  బెంగాలీల మొదటి ఆంగ్ల కవితా సంపుటి .బెంగాలీల పాత రచనకు ప్రాతినిధ్యం వహించింది కూడా .మధు సూదన్ రాసిన ‘’కాప్టివ్ లేడీ ‘’కూడా ఇలాంటిదే .డి.ఎఫ్.ఎ.లో తోరూవికాని, చెల్లెలు ఆరూ వికానీ కవితలు లేవు .1873లో వీళ్ళు ఇండియాకు తిరిగివచ్చాకనే తమరచనల ప్రచురణ గురించి ఆలోచించారు .అప్పటినుంచి బెంగాల్ పత్రికకు రాస్తూనే ఉన్నారు .ఇంగ్లాండ్ లో ఉన్నప్పుడు ఫ్రెంచ్ కవితల్ని ఇంగ్లీష్ లోకి అనువదించేవారు .
  డి.ఎఫ్.ఎ.అంటే దత్ ఫామిలి ఆల్బం లో తొరూ తండ్రి 66కవితలురాశాడు .ఆయన శైలి 17వ శతాబ్దికి చెందినదిగా వింతగా ఉండేది ..ఉమేష్ 73రాశాడు .ఈపుస్తకం ప్రతిభా పూర్ణమైన ఒక కుటుంబానికి స్మృతి చిహ్నంగా మాత్రమె కాక ,కలకత్తాలో ఉన్నత ఆంగ్ల విద్య ను ప్రోత్సహించిన ఉపాధ్యాయులకు అభినందన పత్రం లాగా కూడా ఉండేది .తోరూ కు ఈ గ్రంథం అంటే విపరీతమైన ఇష్టం .ఆమె స్నేహితుతాలు మేరీ ఈపుస్తకం పై విమర్శరాసి క్వీన్స్ మేగజైన్ కు పంపితే ప్రచురణకు స్వీకరించ లేదు .వాళ్ళు అంతేలే అని సరిపుచ్చుకోన్నది .ఆకుటుంబం లో మరో కవి శశి చంద్ర దత్ ‘’విజన్ ఆఫ్ సుమేరు ‘’మరికొన్నికవితలు 1878లో రాసి ప్రచురించాడు .ఇతని పినతండ్రి గోవిన్ దత్ బంధువు రమేష చంద్ర దత్ ఆకుటు౦బ కవులలో  మహా గొప్పకవి .ఈయన తొరూ ఆరూలకవిత్వాలను మెచ్చేవాడు .
   19వ శతాబ్దం ఇంగ్లీష్ ప్రవేశపెట్టటం తోపాటు వైజ్ఞానిక సంస్కరణలు మత సంబంధ గుర్తింపుతో ప్రసిద్ధికెక్కింది .అప్పుడే యూరోపియన్లు భారతీయ విజ్ఞానానికి బాగా ఆకర్షితులయ్యారు .ఇంతకు  కొద్దికాలం క్రితమే  కలకత్తాలో రాయల్ ఏషియాటిక్ సొసైటీ పుట్టి సర్ విలియం జోన్స్ ,జాన్ విల్సన్ ,సర్ ఎడ్విన్ ఆర్నాల్డ్ ,సర్ విలియం హంటర్  మొదలైన వారు భారతీయప్రాచీన విజ్ఞానానికి పూర్తిగా ఆకర్షితులయ్యారు .ఇలాంటి సారవంతమైన సృజనాత్మకమైన కాలం లో తోరూజీవించి ,దేదీప్యమానంగా వెలిగి ,పుట్టిన వందేళ్ళ తర్వాతకూడా సాహిత్యరంగాన్ని వెలిగిస్తూ ధ్రువ తారగా నిలిచింది .
   సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -10-6-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

 విశ్వ పుత్రిక తోరూ దత్-3

 విశ్వ పుత్రిక తోరూ దత్-3

బెంగాల్ వాతావరణం

ఆంగ్లేయులు బెంగాల్ ను స్వాధీనం చేసుకొన్నప్పుడు జనం లో ప్రతిఘటన పెద్దగా కనిపించ లేదు .భావాల్లో ఆలోచనా విధానం లో మార్పులు రావాలని ఆ ప్రజ కోరారు .బెంగాల్ బ్రిటన్ తో పాటు సమాన హోదా పొందిందని భావించారు .భావ పునరుద్ధరణ కావాలన్నది అందరి కోరిక .’’ఆధునిక జనకుడు’’ రాజారామమోహన రాయ్ తన దేశాన్ని కొత్త జీవంతో నింపే ప్రయత్నం చేశాడు .ప్రాక్ పశ్చిమ స్నేహహస్తం నవ సాహిత్యం లో ప్రవేశ పెట్టాడు .ఫ్రాన్స్ దేశం ఎగరేసిన జాతీయ పతాకం చూసి సంతోషం పట్టలేక ఎగిరిగంతులేసి కాలు విరగ కొట్టుకున్నాడు .మత విద్యా జాగృతికి సంస్కరణకు ముందు నిలిచాడు .బెంగాల్ విద్యా వైజ్ఞానిక మత సా౦ఘికరంగాల్లో పునర్జన్మ పొందటానికి రామ మొహనుడే ముఖ్య కారణం .1817లో ఆయనా ,బెంగాల్ సంస్కరణ వాదులుఆంగ్ల మిత్రులతో  కలిసి ఆంగ్ల బెంగాలీసమైక్యాన్ని చాటే మొదటి హిందూ కాలేజి 100మంది విద్యార్ధులతో ప్రారంభించారు .మరుసటిఏదాది కేరీ వార్డ్,మార్ష్ మన్ అనే మిషనరీలు షెరాపూర్ కాలేజి పెట్టారు .ఈ ముగ్గురు బెంగాల్ పునరుజ్జీవనానినికి జీవితాలు ధారపోసిన మహనీయులు .దీని మొదటి ప్రిన్సిపాల్ డా డఫ్.రెండవవాడు డేవిడ్ లేష్టర్ రిచర్డ్ సన్.

  తొరూ దత్ కుటుంబానికి చెందిన నీలమణి దత్తుకు కేరీ మంచి మిత్రుడు .18వ శతాబ్ది ఉత్తరార్ధం లో హైందవ విద్యావంతుల్లో నీలమణి ఒకడు .రామమోహన్ మిషనరీలతో కలిసి తిరిగినట్లే ఈయనా వాళ్ళతో తిరిగాడు .హిందూ జీవితం పై ఈ మిషనరీల ప్రభావం ఆ రోజుల్లో బాగా ఎక్కువే .ఇక్కడ ప్రారంభమైన నవీన వైజ్ఞానికోద్యమం క్రైస్తవ విధానంతో కలిసి సాగింది .హీబ్రూ గ్రీక్ భాషల్ని చదివి రామమోహన్ బైబిల్ మూలం చదివి బాగా అర్ధం చేసుకొన్నాడు .ఆనాటి విద్యావంతులు చాలామంది గ్రీక్ లాటన్ ఫ్రెంచ్ జర్మని భాషల్ని ఆసక్తిగా నేర్చుకొన్నారు .

  కేరీ ఇండియాలో స్థిరపడటానికి నీలమణి దత్ చాలా సహాయం చేశాడు .ఎవరూ లేని అతనికి తన ఇంట్లోనే  ఆశ్రయమిచ్చాడుకూడా .భార్య పిచ్చిది .పిల్లలు రోగగ్రస్తులు .ఈ సహాయాన్ని కేరీ ఎన్నడూ మర్చిపోలేదు .మాణిక్ తలా వీధిలో నీలమణి ఇల్లు’’రాం బాగన్ ‘’ ఉండేది.ఇదే కేరీకీ స్వగృహమే అయింది .ఇదే తర్వాత తోరూ దత్ ఇల్లుకూడా అయింది .సంపన్నుడైన నీలమణి పూజలు దానాలు ధర్మాలు బాగా చేసి చివరికి చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఉన్నప్పుడు కెరీయే ఆదుకొన్నాడు .

  హిందువులను ఇంగ్లీష్ రచనా వ్యాసంగం బాగా ఆకర్షించింది .బెంగాల్ మొదటి తరం కవులలో హెన్రి లూయీ వివియన్ డెరోజియా(1809-1831)ఒకరు .హిందూకాలేజిలో గుమాస్తాగా చేరి లెక్చరర్ అయ్యాడు .తల్లి హిందూ తండ్రి పోర్చుగీస్ ..ఆయన ‘’జన్ఘీరా పకీరు –ఇతర రచనలు ‘’కావ్యం రాసి బాగా ప్రసిద్ధుడయ్యాడు .ఆకాలేజి ప్రిన్సిపాల్ రిచర్డ్సన్ ‘’లిటరరీ గెజిట్ ‘’సంపాదకుడు .ఇతడు రాసిన ‘’బెంగాలీ పత్రాలు ‘’ ఆనాటి బెంగాలీ కవులపై విశేష ప్రభావం కలిగించాయి . .

  1874లో తోరూ బెంగాలీపత్రికలో డేరోజియాపై ఒక వ్యాసం రాసింది .కాశీప్రసాద్ ఘోష్ అనే కవి  డేరోజియా ను అనుసరించి ఇంగ్లీష్ లో పద్యాలు రాసేవాడు .ఈయనే మొదటి బెంగాలీ ఆంగ్లకవి .ఈయన రచించిన షాయర్ మొదలైన కవితలు 1830లో ప్రచురితమయ్యాయి .1835కు పూర్వం మోహన్ లాల్ ,హసన్ ఆలీ ,రాజ గోపాల్ అనే ముగ్గురు కవులు ఉండేవారు .రాజనారాయణ దత్ ప్రాచీన గాధా పద్ధతిలో రాసిన ‘’ఓస్మిన్’’,అరేబియన్ టేల్  ‘’1844లో రిచర్డ్సన్ కు అంకితమిచ్చాడు .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -8-6-22-ఉయ్యూరు–

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

విశ్వ పుత్రిక తోరూ దత్ -2

విశ్వ పుత్రిక తోరూ దత్ -2

ఎమిలీ బ్రాంటి కవిత్వం ,తొరూ కవిత్వం చదువుతుంటే మనలో రకరకాల అంచనాలు మొదలౌతాయి .ఆవూహలు తీర్మానాలు మనల్ని నిలవనివ్వవు కదిల్చి వేస్తాయి .బిరాన్జర్ రాసిన ‘’నా వ్యాపకం ‘’కవితను ఈమె అనువదించింది .నిజంగా అలాటిటి కవిత్వం రాసే సామర్ధ్యం తొరూ కు ఉంది –‘’అన్నిటా అతి తక్కువగా నిరసి౦పబడినదాన్ని –ఈ పెదాలనుండీ చీల్చుకోస్తున్న రోదన –దురంత పరితాపం వల్లనే బయట పడుతుంది –దీనికి ఉపశమనంగా భగవంతుడు చెబుతున్నాడు –‘’పాడు పిచ్చి తల్లీ !పరవశించిపాడు ‘’.బాధా, బుద్ధికి అందని దురదృష్టం చిక్కటి చీకటిలా ఆమె వెంట బడ్డాయి .కవికూడా తన ఆత్మీయతా ముద్ర చేత తనవైపుకు ఆకర్షించు కొంటూనే ఉంటాడు ‘’.

  అద్భుతవ్యక్తి తోరూ ఎన్నో భాషల్ని వశం చేసుకొన్నది .మూడు భాషలపై మాస్టరీ సాధించి వాటిలోనే రచనలు చేసి సామర్ధ్యం నిరూపించింది .పదినెలలలో సంస్కృతం నేర్చి ,దాని అనువాదాలుకూడా చేసింది .ఒక స్నేహితురాలికి రాసిన ఉత్తరం లో భారతీయ ప్రాచీన సాహిత్యాన్ని మధించాలని ఉందని రాసింది –‘’గొప్ప పేరు ప్రతిష్ట పొందిన రామాయణ భారతాలను  వాటి మూల భాషలోనే చదవాలని ఉంది .మళ్ళీ కేంబ్రిడ్జ్ వెళ్ళే లోపు సంస్కృతాన్ని మదిస్తాను .అక్కడికి రావాలని యెంత తపన పడుతున్నానో తెలుసా నీకు ‘?అని రాసింది .బెంగాలీ బాగా మాట్లాడినా అందులో రాయటం పట్టుబడ లేదు ఆమెకు .1975డిసెంబర్ లో సంస్కృతం అధ్యయనం మొదలుపెట్టి 1976కల్లా అందర్నీ ఆశ్చర్యపోయేట్లు నేర్చింది .స్నేహితురాలు మేరీకి ఉత్తరం రాస్తూ ‘’ఈ సారి ఫ్రెంచ్ సాహిత్య క్షేత్రం నుంచి గాక ,సంస్కృత క్షేత్రం నుంచి పెద్ద ధాన్యపు పనను కూడా బెడతాను ఇప్పటికే రెండు మూడు కంకుల్ని చేరవేశాను ‘’అన్నది . ఆమె రాసిన ‘’హిందూ దేశపు గేయ గాథలు ,,పురాణకధలు ‘’పుస్తకం ఆమె చనిపోయాక1878లో అచ్చయింది .ఇప్పటికి ఆమె ఫ్రెంచ్ ఆంగ్ల సాహిత్య మోజును వదిలేసి హిందూ దేశ సాహిత్యం పై గొప్పగా మనసు పడ్డది .ఆమె రాసిన గేయగాథలలో  ఉన్నదంతా భారత దేశానికి సంబంధించిన విషయాలే .ఆమె రాసిన సావిత్రి ,ప్రహ్లాద లలో ఆసియా ఖండ ఆత్మ యొక్క అంతర్ దృష్టిని చూపించింది .అంతబాగా ఏ నవీన ప్రాచ్య వాదీ ఆవిష్కరించ లేకపోయాడు.ఆమె అనువదించిన  ‘’జోగాఢ్య ఉమ’’కూడా కల్పనతో ఉన్న కవితా శిల్ప ఖండమే .ఇవి ఆమె ఆన౦దబాష్పాలు రాలుస్తూ పదేపదేపాడుకొనే పదాలే ..మన సంస్కృతి పయనించే అద్భుత పధం లో తోరూ ఒక మైలు రాయి .

  ఫ్రెంచ్ ఇంగ్లీష్ లలో ఆమె గుణజ్ఞురాలు రసజ్ఞురాలు .కానీ వ్యక్తిత్వం ఆలోచన ఊహల్లో మాత్రం నూటికి నూరుపాళ్ళు హైందవ స్త్రీ .ఇండియాతర్వాత ఫ్రాన్స్ ను అభిమాని౦చినా ఇంగ్లాండ్ లో స్థిరపడి పోయింది .కారణం హిందూ స్త్రీలకంటే ఆంగ్ల స్త్రీలకు  స్వేచ్చ ఎక్కువ అని భావించి ఉండచ్చు.19వ శతాబ్ది మధ్యలో చాలామంది బెంగాలీ స్త్రీలు తెరచాటుగానే ఉండేవారు .ఆమె ఇతర దేశాలలో ఉన్నప్పుడు ఇండియాలో ఎక్కువ ఆంక్షలు చూసింది .అందుకే అంతర్జాతీయ పరిధిలో హైందవ తత్త్వం తో కూడిన క్రైస్తవాన్ని ఇష్టపడి అనుసరించింది .కానీ శివుడు విష్ణువు ఆమె పై గొప్ప ప్రభావం కలిగించారు .అందుకే పురాణాలవైపుకు మనసు మళ్ళింది .దేవీదేవులు నాయికా నాయకులు ఆమెకు ఎంతగానో ఇష్టం .ఆమె అభిమాని గాసే ‘’తోరూ కవితలు వేదాల గాంభీర్యం నింపుకొని సరళంగా శోభిల్లాయి .అపత్వం  నీచత్వం వాటిలో లేనేలేవు ‘’అన్నాడు .

  ‘’బెంగాల్ ఆడపడుచు తోరూ ప్రపంచం నుంచి అబ్బురాన్నీ అభినందనల్ని అందుకొన్న వప్రసాదిని .జాతీ సంప్రదాయం వలన హిందువు ,విద్యవలన ఆంగ్ల వనిత .18ఏళ్ళవయసులోఆంగ్ల ఫ్రెంచ్ కవులను లోతుగా అధ్యయనం చేసి ఇండియన్ లకు చక్కగా పరిచయం చేసింది .తనలో ఆమూడు దేశాలతత్వాలు సంప్రదాయాలు మిళితం  చేసుకొన్నది .తనపా౦డిత్యం విరగ బూసె సమయం లో ,ప్రతిభ పరిపూర్ణ మయే వయసులో ఇరవై ఏళ్ళకే తొరూ దత్ లోకాన్ని విడిచి వెళ్లి పోయింది .ప్రపంచ సాహిత్యం లో తోరూలాంటి వ్యక్తి లేనేలేరు .ఆమెకు ఆమె సాటి .

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-6-22-ఉయ్యూరు      

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

విశ్వ పుత్రిక తోరూ దత్ -1

విశ్వ పుత్రిక తోరూ దత్ -1

పద్మిని సేన్ గుప్త రాసిన పుస్తకానికి ఆచార్య నాయని కృష్ణకుమారి తెలుగులోకి ‘’తోరూదత్’’అనే పేరుతొ అనువదించగా సాహిత్య అకాడెమి 1977లో ప్రచురించింది .వెల-2-30.దీన్ని’’ విశ్వ పుత్రిక తోరూ దత్ ‘’శీర్షికతో మీకు అందిస్తున్నాను .

   తోరూదత్ ప్రపంచానికి వర ప్రసాదిని .బెంగాల్ లో గంగ ఒడ్డున జన్మించినా ఆమె మనసుమాత్రం జాతి భాషా సంకుచితాలను దాటి ,ఇంగ్లీష్ ఫ్రెంచ్ భాషా సౌందర్యాలను ఆకళింపు చేసుకొని ,ఆ భాషలనే వాహికలుగా గ్రహించి సర్వ విద్యల్నీ కరతలామలకం చేసుకొన్నది .ఆభాషణ రుణాన్ని రచనలద్వారా తీర్చుకోన్నది .దీనితోతన మాతృదేశాన్ని ప్రపంచ సాహిత్య పటం లో ప్రధానమైనదిగా గుర్తి౦చేట్లు చేసింది .అసలు ఆమె తన మాతృభాష బెంగాలులో రచనలే చేయలేదు అంటే ఆశ్చర్యపోతాం .

  ఆమె జీవించినకాలం లో ఇండియా లార్డ్ విలియం బెంటిక్ ,లార్డ్ మెకాలే లు భారతీయులలో ఇంగ్లీష్ వ్యాప్తికోసం తంటాలు పడేవారు .దానికి డబ్బు మంచినీళ్ళులా ఖర్చు చేశారు .కనుక దేశీయులకు ఇంగ్లీష్ నేర్చుకోవటం తప్పని సరి అయింది .పరభాష నెత్తిన రుద్దటం పై దోషం అనిపించలేదు.అక్షరజ్ఞానమున్న ప్రతి వారూ అలానే చేశారు కనుక తోరూ దత్ ను తప్పు పట్టలేము .తండ్రి వద్ద సంస్కృతం లో గొప్ప ప్రవేశం పొందింది .ఆమెకు ఆయుర్దాయం పరి పూర్ణంగా ఉండి ఉంటే తన సృజనాత్మక సాహిత్యాన్ని తప్పని సరిగా భారతీయం చేసి ఉండేది .తన సంప్రదాయం సంస్కృతీ వారసత్వం ఆమెను క్రమంగా తన్మయురాలిని చేసేశాయి .అన్నిటా ఈశ్వర తత్వమే ఉందన్న భావన కలిగించేది .  తాత్వికురాలైన తోరూ,చిన్నవయసులో చెల్లెలు ‘’ఆరు ‘’చనిపోతే –‘నోరు చెప్పగలిగీ –కలం రాయగలిగీ –ఎక్కువవిచారాన్ని కలిగించే –మాటలివీ-ఇది ఇలా జరిగి ఉండేది ‘’అని విలపించింది ఇరవై ఒక్క ఏళ్ళకే చనిపోయిన తోరూఫ్రెంచ్ ఇంగ్లీష్ లను జీర్ణించుకొని ఆభాషల్లోనే రాసింది  కాని ఆతత్వం తన దేశానికి కాకుండా పోయింది .ఆమెను ఎవరూ ఎప్పుడూ ఈ దేశం నుంచి బహిష్కరించలేదు .రచయితలూ పత్రికలూ ఆమెనుస్మరించినట్లు ఇంగ్లీష్ లో రాసే వేరెవర్నీ స్మరించలేదు .మనదేశం తయారు చేసిన గొప్పవారి పట్టిక లో తోరూ పేరూ ఉందని గుర్తించాలి .ఇప్పటికీఆమే ఉత్తమ రచయితగానే గుర్తింపు లో ఉంది .

  తోరూ ను అంచనా వేయాలంటే ఆమె జీవితాన్నీ,అందులో ఆమె పొందిన విషాద భారాన్నీ ఆవిడ రచనలతో కలిపి చూడాల్సిందే .ఆమె కవన శక్తీ ,పాండిత్యం ఆమె రచనలలో భాగాలే .విడదీసి చూడ లేము .ఆమె రాసినలేఖలు, చేసినస్నేహాలు ఆమె పై ఒక అంచనాకు రావటానికి తోడ్పడతాయి .అందుకే విల్ఫ్రెడ్ఓవెన్ ‘’కవిత్వం తోరూ జీవితం లో పరచుకొన్న విషాదం లోనే ఉంది ‘’అని గొప్పగా కనిపెట్టి చెప్పాడు .ఆమెకూ ఆమె విషాద జీవితానికీ కవిత్వానికీ విడదీయరాని సంబంధం ఉందని విమర్శకులు విశ్లేషకులు ముక్త కంఠం తో విశ్వ వ్యాప్తంగా చెప్పారు .అందం విషాదం మృత్యు భీకరత్వం ఆమె జీవితం తో చెర్లాటలాడాయి.

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -6-6-22-ఉయ్యూరు  

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ద్వారకాపతి శతకం -2(చివరిభాగం )

శ్రీ ద్వారకాపతి శతకం -2(చివరిభాగం )

‘నలువయి సృష్టి సల్పితి,జనార్దనుపేర బెంచుచుంటి వీ-లనరగా జంద్ర శేఖరుడ వై నశియి౦పగా బుచ్చుచుంటి వి’’నిర్మలంగా మూడు పేర్లూ నీవే .తర్వాత మత్యావతార,కూర్మ ,వరాహ నరసింహ ,వామన పరశురామ ,రామ,కృష్ణ ,బుద్ధ ,కల్కి అవతారాలు, చేసిన అద్భుతకార్యాలు వేర్వేరు పద్యాలలో వర్ణించి’వేల్పుల గిడ్డివేల్పుల నవీనపు బువ్వలబెట్టి ప్రోచు నా –వేల్పుల వేల్పు వౌదు ‘’అని తనకు శరణు ఇమ్మనికోరాడు కవి .వేద పరిపూర్ణులను చూస్తె నీకు సంతోషం ,శాస్త్ర సంవాదుల్ని చూస్తె ఆనందం ,పండిత భాషకు ఆహ్లాదం చెందుతావు ,వివాదం వస్తే కాలుదువ్వుతావు అన్నాడు  , ‘’క్షాత్రవ శిక్ష సల్పగా విచక్షణ దక్షుడవౌదు .ఆ క్షాత్రపు చిహ్న లొందుచూ,విశాలయశస్సు పొందావు .  ‘’గొల్ల చేడియలను వికార చేష్టలతో మోహపెట్టావు ,జార చోర బిరుదులూ పొందావుకానీ వేదాలకు ఆధారమే నీవని నాకు తెలుసు .’’వెన్న దొంగవై రంగడవన్న కీర్తిపొందావు.సిరికి మగడవైన నువ్వు మమ్మల్ని దరిద్రం లో ఉంచటం నీ మగసిరికే అవమానం .’’దారము కూర్చు పుష్పముల దండ గతిన్ వసియించి ,జీవులం దారయ నీవే యంతట మహాత్ముడవు ‘’అని చక్కగా చెప్పాడు .

  శ్లేషలకు ఉబ్బిపోతారు కొందరు ,ఆడవాళ్ళుకూడా అంతే కానీ ‘’గొప్పగా మృదూక్తి పద్య సంభాషలకు లోకులు గొప్పగా ఆన౦దిస్తారు .జుట్టూ జుట్టూ ముడివెయ్యటం లో మహా నేర్పరివి .కౌరవులని చీల్చి పాండవులకు రాజ్యమిప్పించావు .అలాగే నాకోరిక తీర్చు .’’అపగత కిల్బిషు డవు,మహాత్ముడవు అలాంటి నిన్ను నా చపల కాంక్షతో నిన్ను ని౦ది౦చాను .నీభక్తినిచ్చి నన్నుకాపాడు .చరాచరాలకు నువ్వు జీవనం ,నీ విలసనం ప్రాణులకు విస్తృత తేజం ,నన్నుకాపాడు .’’ఫుల్ల సరోజనేత్ర ,పరిపూర్ణ జలా౦బుదగాత్ర ,శాంభవీ –వల్లభ మిత్ర ,లోకనుతిపాత్ర మహాఘలతాలవిత్ర స-ద్ధల్లకపత్ర చిత్రతర దామ విదర్భ సుతా కళత్ర రా –జిల్లెడుత్వత్క్రుపా రసముం జిందవె నాపయి ద్వారకాపతీ’అని పరవశంతో కవి కీర్తించాడు .

  ‘’సూనృత భాష ,నీల ఘన సుందరవేష,యశో విశేష సు-జ్ఞాన మనో విభూష వర కౌస్తుభన్మణి కాంతి పూషసం-ధానిత  సర్వ భక్త వరదానక తోష ,యశేష లోక దు-ర్మానిత భూరిదోష ‘’అంటూ భక్తపోతనలా తేనెలు రంగరించి కవిత్వం చిలికించాడు ఈభక్తకవి .  ‘’నెలకు ద్రివృష్టి నింపి ధరణిలో సస్య గో సంవృద్దిపెంచి ,సర్వజీవులు ఆనంద మయ సుఖ జీవనం చేసేట్లు చెయ్యమని ద్వారకాపతి ని వేడుకొన్నాడు .చివరి పద్యంగా చంపకమాలలో –‘’యువ యను నేటమాధవ సితో త్ప్రతిపత్ధిర వాసరా౦ మం-దవిరళ భక్తి దావక పదాంబుజ యుగ్మ సదర్చ సేయనే –ప్రవిమల పద్య పుష్పముల బాగుగనూటొకయెన్మిది౦టి మా –ధవ యిడియుంటి గొంచునను దన్పవె నీ కృప ద్వారకాపతీ’అని శతకం ముగించారు శ్రీమదాది భట్ట శ్రీరామ మూర్తి కవి .

 మంచి భక్తి శతకం ,విశ్వనాథ ఆశీస్సు పొందిన కవి రచన .సర్వోత్క్రుష్టంగా సాగింది .చదివి ఆనందించి తరించాల్సిన శతకం .పరిచయం చేసే భాగ్యం నాకు దక్కింది .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-6-22-ఉయ్యూరు–

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ ద్వారకాపతి శతకం-1

శ్రీ ద్వారకాపతి శతకం-1

విశాఖ జిల్లా బొబ్బిలి తాలూకా అజ్జాడ వాస్తవ్యులు శ్రీ మదాది భట్ట శ్రీరామ మూర్తి కవి శ్రీ ద్వారకాపతి శతకం రచించి ,కృష్ణాజిల్లా కైకలూరు తాలూకా శోభనాద్రి పుర అగ్రహార వాస్తవ్యులు బ్రహ్మశ్రీ కాశీ నాధుని సుబ్బారావు గారి ద్రవ్య సహాయం చేత  బెజవాడ ఆంద్ర గ్రంధాలయ ముద్రాక్షరశాలలో శ్రీ కుందా లక్ష్మీ నరసింహయ్య చేత 1942లో ముద్రించారు .వెల-4అణాలు .

సీస పద్యం లో ఆశీస్సు పలుకుతూ ‘’ఆత్రేయస గోత్రులు శ్రీ కాశీ నాథ నాగ లింగారాధ్య తాత ,శ్రీలలితాంబ పుత్రుడు మల్లయ్యఅన్నపూర్ణ గారి పుత్రుడు సుబ్బారావు ,భార్య మహలక్ష్మి ని వివాహమాడి తాత,తండ్రులు లాగా ధర్మతత్పరతతో దాత అయి ప్రఖ్యాతి పొందాడు వారిని ద్వారకాపతి కాపాడాలని’’ అన్నారుకవి .

   పీఠిక లో కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ గారు ‘’ఈ కవి రాసిన శ్రీమద్రామాయణ గీతమాలికలు అక్కడక్కడ చదివాను. ధార అనర్గళం గా ఉంది .మకార ప్రాసతో కుంటు పడకుండా రసం చెడకుండా రాయటం అసాధ్యమే .మధు వాహిని ప్రవహి౦పజేశాడు .వీరి రామాయణ కీర్తనలు రమ్యాతి రమ్యాలు.సుబ్రహ్మణ్య కవి ఆధ్యాత్మ రామాయణానికి వన్నె పెట్టినట్లున్నాయి .ఈకవి రాసిన గీతాకావ్యం, నారాయణ శతకం పాండిత్యానికి ప్రతిభకు నిదర్శనం .క్రమాంత స్వాధ్యాయులైన ఈకవి జ్యోతిష పాండిత్యం లో దిట్ట .ఇలాంటి గుణ గరిష్ఠుడైన ఈ కవి మాటలు గుండెకు సూటిగా తాకుతాయి .ఇదంతా అక్షర సత్యం .’’అన్నారు .ద్వారకాపతీ అనే మకుటం తో ఉత్పల ,చంపక మాలపద్యాలతో శతకం కూర్చి సుగంధాన్ని వెద జల్లారు .

 మొదటి పద్యం ఉత్పలమాలలో –‘’శ్రీ రమణీ మనోహర విశేష కృపాకరయాదవాన్వాయో –దార పయోధి శీతకర దానవదూర ,వినమ్ర దాసమం-దార మధాంధ చైద్య ముఖ దర్ప కుఠార,కళింద నందినీ –తీర విహార గోపవర ధీర వశీకర ద్వారకాపతీ’అని స్వామిని స్తుతి౦చాడుకవి .విఘ్నాలుకలిగి౦చవద్దు అని గణపతిని కోరి ,వాణిని తన నాలుకపై నర్తించమని ప్రార్ధించి ,వాల్మీకి వ్యాస కాళిదాసాదులను స్మరించి ,సిరికి తలిదండ్రులకు నమస్కరించి తర్వాత తన వంశాన్ని గురించి చెప్పుకొన్నాడు ౦-భారద్వాజవంశం లో రామయలక్ష్మి తన తాతగారు .అవధాని ,ఉపాధ్యాయుల వెంకటా ర్యుని సుబ్బమ దంపతుల కుమార్తె కాత్యాయని సాటి పాపమ,తల్లీ తండ్రీ .తనపేరు రామమూర్తి అని చెప్పుకొన్నాడు .తర్వాత విశేషాలు రేపు తెలుసుకొందాం .

   సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్-5-6-22-ఉయ్యూరు 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కేసరి గారి చిన్ననాటి ముచ్చట్లు -2

కేసరి గారి చిన్ననాటి ముచ్చట్లు -2

 ఆ కాలం లోతద్దినం నాడుమాత్రమే వరి అన్నం తినేవారు మిగిలిన రోజుల్లో జొన్నలు సజ్జలు వరిగలు వండుకొని తినేవారు .డబ్బిచ్చి బియ్యం నెయ్యి కొనేవారు .కేసరి తల్లి పొలాలకు వెళ్లి కందికంప పీక్కొని వచ్చి వంట చెరుకుగా వాడేది .మళ్ళీ పైరు వేసే లోపు వీటిని సమూలంగా త్రవ్వి తీసేవారు .అవి పొరబాటున కాలిలో గుచ్చుకొంటే గాయం త్వరగా మానేది కాదు .కూలీలతో పీకిస్తే చాలా డబ్బు అవుతుంది కనుక రైతుల భార్యలే వచ్చి తవ్వుకొని తీసుకు వెళ్ళేవారు .కేసరి తల్లి సంవత్సరానికి సరిపడా కండి కంప పోగేసి జాగ్రత్త చేసేది .

  కేసరి బంధువు అదే వూళ్ళో ములుకుట్ల కృష్ణయ్య భిక్షాటన, పౌరోహిత్యం చేసేవాడు .సమీపగ్రామం బసవన్న పాలెం కూడా వెళ్ళే వాడు .కేసరికి ఊళ్ళో బిచ్చమెత్తుకోట౦ సిగ్గుగా ఉండేది .అందుకని కృష్ణయ్యతో కలిసి బసవన్నపాలెం కు జోలేకట్టుకొని ఒకసారి వెళ్ళాడు .చిన్న వాడుకనుక ఆదరించి ఆయనకంటే ఎక్కువ బిచ్చెం వేసేవారు .జోలి మోయలేనంత బరువు అయ్యేది .కృష్ణయ్య గారే ఆమూట కూడా కొంత దూరం మోసి సాయం చేశాడు . ఇంటికి చేరగానే మూట చూసి తల్లి చాలా సంతోషించింది . .కానీ ఆయనపడిన కష్టం ఆయాసం చెమట చూసి చలించిపోయింది . .స్నానం చేయించి అన్నం పెట్టి నిద్ర పుచ్చింది . .తల్లి ఆయన కాళ్ళ దగ్గర కూర్చుని ఏడ్చండి  .కాళ్ళలో ముళ్ళు గుచ్చుకొని ఉండటం చూసి వ్యధ చెందింది .ఈయనకు మెలకువ వచ్చి ఎందుకేడుస్తున్నావని తల్లిని అడిగితె కాళ్ళలో దిగిన తుమ్మ ముళ్ళు చూపించి మరీ ఏడ్చేసింది. సూదితో నెమ్మదిగా ముళ్ళు తీసేసి మళ్ళీ ఎప్పుడూ భిక్షాటనకు వెళ్ళను అని ప్రమాణం చేయించింది .ఆతల్లి హృదయం అంతగా తల్లడిల్లి౦దన్నమాట .

  వీరింటి ఎదురుగానే మేనమామ ములుకుట్ల మహాదేవయ్య గారిల్లు .కానీ వారినుంచి కానీ కూడా సహాయం అందేది కాదు .ఆయన మంచివాడే ధర్మరాజు ,భార్య పరమగయ్యాళి. ఆవిడకు ఆయనే గాక ఊరుఊరంతా భయపడేది .జగడాలమారి ఆమె తిట్టినతిట్టు తిట్టకుండా రెండు గంటలు తిట్టేది .భార్యకు భయపడి మేనమామ ఏమీ వీరికి సాయం చేయలేక నిస్సహాయంగా చూస్తూ ఉండేవాడు .కనుక తల్లిస్వయం శక్తితోనే ఏదో సంపాదిస్తూ ,తాను ఒంటిపూట తింటూ కొడుకుకు  రెండు లేకమూడు పూటలా భోజనం అమర్చేది.కంటికి రెప్పలాగా కాపాడేది. ఆమె కష్టాలు చూడలేక ఒకరోజు ఇంట్లో చెప్పకుండా మద్రాస్ కు కాలినడకన నడిచి వెళ్ళాడు బాలకేసరి .

    మద్రాస్ జీవితం

మద్రాస్ లో ప్రతి డిసెంబర్ చివరి వారం లో  రాణీ తోట అనే పీపుల్స్ పార్క్ లో ‘’పార్క్ ఫేర్ వేడుకలు ‘జరిగేవి .మద్రాస్ రాష్ట్ర ప్రజలు వేసవిలో ఊటీ వెడతారు .అందుకని చిన్నచిన్న ఉద్యోగులు మద్రాస్ వెళ్ళేవారు .కుటుంబాలతో తరలి వచ్చేవారు .వీరందరివలన వ్యాపారాలు బాగా జరిగేవి .ఈప్రదర్శనలకు కొబ్బరాకులతో,బొంగులతో  పెద్ద పెద్ద ఆవరణలు రెండు  కట్టేవారు .మొదటిది ఇన్నర్ సర్కిల్ రెండోది ఔటర్ సర్కిల్ .మొదటి దానిలో విలువైన వస్తువులు ప్రదర్శనకు పెట్టేవారు రెండవదానిలో కాఫీ హోటల్లు సోడా బడ్డీలు ,లాటరీ కొట్లు ఉండేవి .ఒక్కొక్క ఆవరణకు నాలుగు ద్వారాలు౦డేవి .గేట్ల దగ్గర పోలీసు కాపలా తోపాటు కాంట్రాక్టర్ల మనుషులుకూడా కాపలా ఉండేవారు .బయటహాలుకు అర్ధణా ,లోపలిదానికి నాలుగు అణాలు టికెట్ .అర్ధణా ఇచ్చి లోపలి వెళ్లి ,పావలా ఇచ్చి లోపలి ఆవరణలోకి వెళ్ళాలి .

  అప్పటికి మద్రాస్ లో ఇంకా కరెంట్ రాలేదు .రాత్రిళ్ళు వెలుతురుకోసం కిరసనాయిల్ పోసిన తగరపు బుడ్లు ను లోపలా బయటా తోరణాలుగా కట్టేవారు .వీటిని సాయంత్రం అయిదుకు వెలిగించటం మొదలుపెడితేకానీ చీకటి పడేసరికి పూర్తయ్యేదికాదు.అప్పుడు కేసరి మద్రాస్ లో చదువుతున్నాడు .వాళ్ళమ్మ ఒకసారి మద్రాస్ వచ్చి కొడుకును చూసింది .ఆమె వచ్చినప్పుడు కొత్వాలు బజారుదగ్గర ఆచారప్పన్ వీధిలో ఒకగదిని నెలకు 12అణాలు అద్దెకు తీసుకొని ఉన్నారు .

 1886లో రాణీ తోటలో వేడుకలు ప్రారంభమై మూడేళ్ళయింది .ఆ ఏడూ అలానే సంరంభంగా వేడుకలు మొదలయ్యాయి .కేసరి తన ఇంటి యజమాని గారబ్బాయితో వేడుకలు చూడటానికి వెళ్ళాడు .బయట రంగుల రాట్నంఎక్కి హాయి అనుభవించి ,’’చుక్కాణి’’ అంటే బయోస్కోప్ లో కాశీ రామేశ్వరాలు చూసి సంతోషించారు .ఆకుర్రాడు లోపలకు పోదామన్నాడు .అర్ధణా తనదగ్గర లేదన్నాడు కేసరి .అఆకుర్రడి దగ్గర అర్ధణా ఉంటె విడిచి వెళ్ళలేక వెళ్ళలేక లోపలి ఒక్కడే వెళ్ళాడు .వాడి చేతిలో అర్ధణా ఉ౦దికనుక లోపలి వెళ్ళాడు. ఆ అర్ధణా లేని నిర్భాగ్యుడు కేసరి లోపలి వెళ్ళలేక పోయాడు .అప్పటికే సాయంకాలం 6అయింది . కాసేపటికి లోపలినుంచి పొగలు మంటలు వచ్చి వెదురు బొంగులు పేఠేల్  ,పెఠీల్ మని కాలుతూ పగులుతున్న శబ్దం లోపలి నుంచి వినబడుతోంది .ఆ పొగలో కళ్ళు కనపడక తొక్కిసలాట జరిగి ,కాళ్ళకింద పసిపిల్లలు నలిగి పోయారు ధనవంతుల కుటుంబాలు చాలావచ్చాయి ప్రదర్శనకు .ఆడ మగ పిల్లా జెల్లా అందరూ ఆమంటల్లో మాడి మసి అయిపోయారు .అరగంటలో అంతా రుద్రభూమయిపోయింది .మంటల వేడికి తట్టుకోలేక కూవం నదిలో దూకారు కొందరు .ఆభరణాల ప్రదర్శనలో ఉన్నవారు వాటిని వదిలి రాలేక అక్కడే సజీవంగా దహనమయ్యారు .సందట్లో సడేమియా లాగా దొంగతనాలకు పెద్దగా అవకాశం కలిగింది వీలైనంత దోచుకొని పోయారు .ఆభరణాల బంగారం వెండి కరిగి ముద్దలయ్యాయి .ఆరోజు అమావాస్య కూడా కావటం తో కన్నుపొడుచుకున్నా వెలుతురూ లేదు .పోలీసు వారొచ్చి నిప్పునార్పు యంత్రాలతో మంటల్ని ఆర్పేశారు .అయినా తగినన్ని ఫైర్ ఇంజన్లు లేవు అప్పుడు .

  క్రిష్టియన్ కాలేజి ప్రిన్సిపాల్ మిల్లర్ దొర వచ్చితానేస్వయంగా గుంజలపై ఉన్న పందిళ్లను దులిపి లోపలి స్త్రీ శిశువులను బయటికి తెచ్చికాపాడాడు .బాధితులకు చేతనైన సాయం చేశాడు .కాలేజికి వెళ్లి రిజిస్టర్లు తనిఖీ చేసి విద్యార్ధుల యోగ క్షేమాలు కనుక్కొని తలిదండ్రులకు వెంటనే తెలియజేశాడు .తెల్లారేసరికి అక్కడ కరిగి ఉన్న బంగారం వెండి ముద్దలు మాయమైపోయాయి .చనిపోయిన వారి బంధువులంతా అక్కడ శవ జాగరణం చేసి మర్నాడు ఉదయం తమ వారిని గుర్తు పట్టగలిగారు .గుర్తు పట్టలేక పోయినవార్కి సామూహికంగా అంత్యక్రియలు జరిపించారు .చావుతప్పి బయట పడినవారిలో కసరత్తు చేసిన బలశాలి కొల్లా కన్నయ్య శ్రేష్టి ఉన్నాడు .పల్టీకొట్టి దూకుతూ బయటపడ్డాడు. అప్పుడు ఆయనమెడలో ఉన్నపగడాలహారం జారిపోయింది .అది దొరికినవాడు సెట్టిగారింటికి మర్నాడు తీసుకు వెళ్లి ఇచ్చి బహుమానం పొందాడు .

  బాలకేసరి లోపలి వెళ్ళకుండా బయటనే తిరుగుతూ ,లోపలి వెళ్ళిన ఇంటియజమాని కొడుకుకోసం బయట చాలా సేపు నిరీక్షించాడు .అతడు కనపడలేదు. కేసరి తల్లి రొప్పుతూ రోజుతూ పరిగెత్తుకు వచ్చి కొడుకును చూసి కావలించుకొని ఊరట చెందింది .ఆమెను తీసుకొని సెంట్రల్ స్టేషన్ గేటు ఎదురుగా జనరల్ హాస్పిటల్  ఆవరణ  గోడపక్కన కూర్చుని తల్లీ కొడుకు సేద తేరారు .ఒంటేద్దుబండిలో రాత్రికి ఇంటికి చేరారు .ఇంటియజమానిభార్య తనతో వచ్చిన వాళ్ళ అబ్బాయి సంగతి అడిగితె జరిగింది. అంతా చెప్పగా ఆమె వెళ్లి యెంత వెతికినా జాడ దొరక్క నిరాశతో తిరిగి వచ్చింది .

 (ఇక్కడే ఆతర్వాత1960-70లలో  సెకండ్ హాండ్ బుక్ షాపులు ఉండేవి ,’’మూర్ మార్కెట్’’ అనే వారు .అన్నీ తక్కువధరకే దొరికేవి .అవీ ఆతర్వాత కాలిపోయాయి.మేము చాలాపుస్తకాలు వస్తువులు కొన్నా౦ .వాటిని ఇప్పుడు పారిస్ కు దూరంగా ఏర్పాటు చేశారు ).  

  సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -4-6-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కేసరి గారి చిన్ననాటి ముచ్చట్లు -1

కేసరి గారి చిన్ననాటి ముచ్చట్లు -1
తల్లికి కె ఎన్ కేసరి(కోట నరసింహం –కోట లో కె,నారా మాత్రం ఉంచుకొని సింహం బదులు కేసరి అని మార్చుకొని  కె.ఎన్ .కేసరి అయ్యారు )గారొక్కరే సంతానం .ఆడపిల్ల లేని కొరత తీర్చుకోటానికి అమ్మాయి వేషం వేసి ఇరుగంమలకు పోరుగంమలకు చూపించి ముచ్చట తీర్చుకొనేవారు .అయిదవ ఏటనే పిచ్చయ్య గారి వీధి బడిలో చేరారు .ఆయనకు చదువు చెప్పే సత్తా లేకున్నా ,బెత్తం తో వీపులు చీరేసి భయపెట్టేవాడు .నెలజీతం లేదు పిల్లలు భోజన పదార్దాలైన పరిగలను కాయగూరాలని పిల్లలు తెచ్చిచ్చే వారు .అవి సమర్పించిన వారికి దెబ్బలు ఉండేవికావు .పిల్లల సంఖ్యను బట్టి ప్రభుత్వం సంవత్సరానికి కొంత గ్రాంట్ ఇచ్చేది .దానికోసం ఎదురుచూస్తూ బడిలో ఆయన పిల్లల్ని చేర్చుకోనేవాడు .కొత్తపిల్లలు చేరితే పప్పు బెల్లాలు పంచిపెట్టేవాడు .జీతం వరహా అంటే నాలుగు రూపాయలు .కానీ ఇవ్వగల సమర్ధులు ఉండేవారుతక్కువే  .ఈ జీతాలు వగైరాలే వలననే ఆయన ఇంట్లో పొయ్యిలో పిల్లి లేచేది .పూరిపాకలో బడి జరిగేది .
  గుంత ఓనమాలు నేర్చి తర్వాత కొయ్యపలకలపై రాసేవాళ్ళు పిల్లలు .పలకకు నీలిమందు దోసాకు పసరు పట్టించి బాగా రుద్ది ఎండలో పెట్టేవారు .అప్పుడు బలపాలతో రాస్తే బాగా కనిపించేది .బలపం కోపులు అనే తెల్లటి రాళ్ళు ఉండేవి .వాటిని తెచ్చి రంపం తో సన్నగా కోసి రాసేవారు .నాలుగైదేళ్ళ చదువు తర్వాత పెద్ద పుస్తకం అంటే రామాయణం ,భారతం భాగవతం పట్టించి చది విన్చేవారు .సరస్వతి పూజ చేయించి పంతులుగారు రామాయణం పట్టించేవారు .అది అయ్యాక పప్పు బెల్లాలు పంచి సెలవిచ్చేవారు .ఆ బడిలో ఈ పెద్ద పుస్తకం తో చదువు పూర్తయ్యినట్లే . పేద కేసరి గారికి పంతులు దెబ్బలు తప్ప చదువు అబ్బలేదు .ఇంటి వద్ద తల్లికి సాయం చేయాల్సి ఉండటం తో బడికి కూడా క్రమంగా వెళ్ళే వాడు కాదు .పొద్దున్నే గుండ్లకమ్మ నదికి వెళ్లి ,కాలకృత్యాలు తీర్చుకొని ,చిన్న కావడిలో రెండు తప్పాలలతో ఇంటికి నీరు తెచ్చేవాడు .చద్దన్నం తిని ఎవరిపోలం లోకైనా వెళ్లి వంకాయలో గో౦గూరో ,దోసకాయలో మెరపకాయలో ,జొన్న కంకులో సజ్జ కంకులో లో అడిగి తెచ్చుకొని వాళ్ళ అమ్మగారికి ఇచ్చేవాడు
ఇంటి దగ్గరున్న ఉప్పలవారి మర్రి చెట్టు పెద్ద  ఆకులు కోసి విస్తరాకులు కుట్టి అందులో తినేవారు .ఒకసారి చెట్టు ఎక్కి కళ్ళు తిరిగి దిగలేకపోతే ఎవరో వచ్చి పగ్గం తో దించారు .తర్వాత చెట్టు ఎక్కటం మాని దోటీ తో ఆకులు కోసి తెచ్చి విస్తళ్ళు కుట్టేవాడు .జొన్నదంటు ఈనెలను సన్నగా చీల్చి ,విస్తళ్ళను మహా నాజూకుగా కుట్టేవాడు .మిషన్ కుట్టు లాగా ఉండేదని తల్లితో సహా అందరూ మెచ్చేవారు .తల్లి రవికలు కుట్టటం లో మహానేర్పరి ఆడవాళ్ళు వచ్చి కుట్టిన్చుకోనేవారు .సాదారవికకు ముక్కాలు అణా,పూలు వేసి కుడితే అణా తీసుకొనేవారు .తేళ్ళు మండ్రగబ్బలు పక్షులబొమ్మలు వేసి కుడితే రెండు అణాలు అంటే బెడ ఇచ్చేవారు .అప్పటి నాజూకు వస్త్రాలు పాలచాయ కోకలు , నల్లచాయ రవికలు ,గువ్వకన్ను నెమలికన్ను అద్దకం రవికలు .అట్లతద్దినాడు స్త్రీలు ఈ అలంకారాలతో కొప్పు నిండా బంతి పూలతో సిన్గారించుకోనేవారు .కోలాహలంగా ఉయ్యాలలు ఊగేవారు .అప్పటివి జాతీయ క్రీడా వినోదాలు దేహానికి పుష్టినిచ్చేవి .తల్లి రవికకలు కుట్టి సంపాదించింది కుటుంబానికి బోతటా బోటిగా సరిపోయేది .
  సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-6-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

పేద బాలికల విద్యకోసం నోటర్ డాం సంస్థలు నిర్మించి సేవ చేసినఫ్రెంచ్ మదర్ సుపీరియర్ –సెయింట్ జూలీ బిలియర్ట్ –గబ్బిట దుర్గాప్రసాద్.

పేద బాలికల విద్యకోసం నోటర్ డాం సంస్థలు నిర్మించి సేవ చేసినఫ్రెంచ్ మదర్ సుపీరియర్ –సెయింట్ జూలీ బిలియర్ట్ –గబ్బిట దుర్గాప్రసాద్.విహంగ మహిళా వెబ్ మాసపత్రిక .జూన్
01/06/2022 గబ్బిట దుర్గాప్రసాద్
మేరీ రోజ్ జూలీ బిలియర్ట్ 12-7-1751న ఫ్రాన్స్ లోని కువిలీ లో జీన్ ఫ్రాన్సిస్ బిలియంట్ ,మేరీ లూసీ ఆంటోనెట్ దంపతులకు జన్మించి ఏడుగురు సంతానం లో ఆరవ పిల్ల .ఏడవ ఏటనే’’ కాటేచిసం ‘’కంఠతా పట్టి తన స్నేహితురాల్లను పిలిచి అప్పగింఛి ఆశ్చర్యపరచేది .ఆమె అంకుల్ తిబాల్ట్ గుల్బెర్ట్ నడిపే బడిలో ప్రాధమిక విద్య నేర్చింది .ప్రీస్ట్ ఫాదర్ డాంగి చర్చిలో ఆయన సమక్షం లో మొదటి కమ్యూనియన్ చేయగా ఆమె వయసు 9అని నిర్ధారించాడు .అయిదేళ్ళ తర్వాత ‘’చాస్టిటి’’అనే శీల ప్రవర్తనం పై ప్రతిజ్ఞ చేసింది .కుటుంబం అప్పుల పాలయి నందున టీన్ ఏజ్ లో శారీరక కష్టం చేసి సంపాదించి కుటుంబానికి సాయపడేది  .
  ఆమె పవిత్ర ,విశుద్ధ ప్రవర్తనకు అందరూ ఆశ్చర్యంతో మురిసి పోయి ‘’సెయింట్ ఆఫ్ కువిల్లీ ‘’అని గౌరవంగా సంబోధించేవారు .ఇరవై రెండేళ్ళ వయసులో  తండ్రి పై,ఆయన అజ్ఞాత విరోధి అకస్మాత్తుగా జరిపిన పిస్టల్ కాల్పులలో ఆమె కింది శరీరభాగం పాక్షిక పక్షవాతానికి గురైంది .తర్వాత కొన్నేళ్ళకే ఆమె మంచానికే పరిమితమైపోయి 30ఏళ్ళు ఉండిపోయింది .ఈకాలం లో నిత్య పవిత్ర ప్రార్ధనలతో అనుభూతులతో ,అసాధారణ ప్రార్ధనా పరురాలైంది.తర్వాత జీవితకాలమంతా చుట్టు ప్రక్కల పిల్లలను రప్పించి వారిని ‘’మొదటి కమ్యూనియన్ ‘’కు శిక్షణ ఇచ్చేది .
1789  ఫ్రెంచ్ విప్లవ కాలం లో రివాల్యూషనరి సైన్యం మత విశ్వాసమున్న వారిని గుర్తించి నిర్దాక్షిణ్యంగా చంపేది. ఆమె స్నేహితులు ఆమెను కువిలీ నుంచి ఒక గడ్డి బండి లో రహస్యంగా  అక్కడి నుంచి తప్పించారు. కా౦ పీన్  చేరి అక్కడ రోజుకో ఇంట్లో రహస్యంగా గడుపుతూ ,విపరీతమైన శారీరక బాధలను తట్టుకొంటూ గడిపింది .కొంతకాలం ఆమె కు మాటకూడా పడిపోయింది .కానీ ఈ కాలం ఆమె మానసికం గా , ఆధ్యాత్మికంగా ఎదగటానికి అద్భుతంగా ఉపయోగపడింది .ఆమెకు ఒక రోజు ఒక విజన్ కనిపించి ,ఒక అదృశ్య వాక్కు ‘’ “Behold these spiritual daughters whom I give you in an institute marked by the cross.”అని చెప్పినట్లు గ్రహించింది .
ఇలా గడపగడపకు తిరుగుతూ ప్రవాస జీవితం గడుపుతున్న జూలీ కి ఒక రోజు అరిష్టోక్రాటిక్ మహిళ ఫ్రాంకాయిస్ బ్లిన్ డీ బోర్డన్ తో పరిచయం కలిగి౦ది .జూలీ లోని   మతవిశ్వాసానికి ,బోధనా పటిమకు అబ్బురపడి ఆశ్రయమిచ్చింది  .ఇద్దరూ కలిసి ‘’ఇన్ ష్టిట్యూట్ ఆఫ్ నోటర్ డాం’’అనే పేద యువ క్రిస్టియన్ విద్యార్ధినులకు  విద్య నేర్పించే సంస్థ ను నెలకొల్పారు .ఇందులోనే వారికి కేటాక్రిస్ట్ లో శిక్షణ కూడా ఇచ్చేవారు .మొదటి ఏడాది పూర్తికాగానే మొదటి నోటర్ డాం బాచ్ సిస్టర్స్  ప్రతిజ్ఞ చేశారు . అదే కాలం లో జూలీ బిలియర్ట్ వ్యాధికూడా అకస్మాత్తుగా మాయమై ఆమె మామూలు ఆరోగ్యవంతురాలైంది.22ఏళ్ళ తర్వాత మొదటిసారిగా ఆమె నడవటం మొదలు పెట్టింది .
  జూలీ మనసంతా బీదప్రజల అవసరాలు తీర్చటం వారి విద్యపైనే ఉండేది .సమాజంలోని ఇతరులకు కూడా క్రైస్తవ బోధన అవసరమని గ్రహించింది .ఆ ధ్యేయం తో  జీవితకాలమంతా ఫ్రాన్స్ ,బెల్జియం దేశాలలో నోటర్ డాం లాంటి సంస్థలను ,స్కూల్స్ ను ఎన్నిటినో నెలకొల్పి పేదలకు విద్యాదానం చేసింది .తర్వాత జూలీ ,ఫ్రాంకాయిస్  లు మాతృ సంస్థ ను బెల్జియం లోని నెమర్ కు మార్చారు
జూలీ కి ఆమె శారీరక ఇబ్బంది ప్రజా సేవలో ఆటంకం కలిగించలేదు .టీచింగ్ ఆర్డర్ ను తీర్చి దిద్దటం పేదలకు ధనికులకు కూడా అవసరమైన విద్య అందివ్వటం లో ఆమె చేసిన కృషి అద్వితీయం .అప్పటి భయంకర పరిస్థితులలో,భీభత్స పాలనలో  ఆమె ఇంటికే పరిమితమైపోయింది .రాబెస్ పియర్రీ పతనం తర్వాత అకస్మాత్తుగా చావునుంచి తప్పించుకోగలిగింది .అప్పుడు ఈ ‘’సెయింట్ చుట్టూ అక్కడి ఉన్నత వంశపు యువతులందరూ కలిసి ఒక బృందంగా ఏర్పడగా ,వారికి భగవంతుని నమ్మి పవిత్ర జీవనం సాగించటం ,తోటి అనాధలకు సేవచేయటం నేర్పింది .వీరంతా నియామబద్ధ జీవితాలు గడుపుతూ పవిత్ర జీవితంతో లోకులకు సాయం చేస్తూ జీవితాలను ధన్యం చేసుకొన్నారు .
1803 లో ఫాదర్ వారిన్ బిపఫ్ అమీన్స్ ల ఆశీస్సులతో చాలామంది ఈ ఇద్దరు సుపీరియర్స్ కు  బిలియర్ట్ ,డీబౌర్డాన్ లకు  సహాయకులుగా ఉండటానికి స్వచ్చందంగా ముందుకు వచ్చారు .అందులో ముందుగా ఎనిమిది మంది అనాధలు ముందుకు వచ్చారు .1-6-1804న బిలియంట్ కు ఆమె సుపీరియర్స్ ప్రార్ధనల ఫలితంగా పక్షవాతం నయమైంది .అప్పుడు వీరంతా కలిసి అక్టోబర్ 15న తమ ఇంటిపేర్లను సెయింట్స్ పేర్లుగా మార్చుకొన్నారు .క్రిస్టియన్ బాలికల విద్యావ్యాప్తి చేయాలని నిర్ణయించారు .దీనికోసం అనేక కాన్వెంట్ లు నెలకొల్పి వాటిని పర్యవేక్షి౦చ టానికి సమర్ధులను నియమించారు.’సిస్టర్స్ ఆఫ్ నోటర్ డాం’’అనే సంస్థ ఇలా ఏర్పాటైంది .ఈ వ్యవహారమంతా బిలియర్ట్ చాల బ్రిలియంట్ గా నిర్వహించింది .ఆమెకు మదర్ సెయింట్ జోసెఫ్ సహాయం చేసింది .19-7-1806లో ఈ సంస్థ ఇంపీరియల్ డిక్రీ ద్వారా గుర్తింపు పొంది౦ది అప్పుడు సభ్యులు 30మంది ఉన్నారు .ఆతర్వాత ఈసంస్థలుఫ్రాన్స్ ,బెల్జియం దేశాలలో అనేక టౌన్ లలో ఏర్పాటయ్యాయి .అందులో ఘెంట్ ,నమూర్ లోని సంస్థలు బాగా  పేరుపొందాయి .మదర్ జోసెఫ్ మొదటి సుపీరియర్ అయింది వీటికి .
  ఆ సిటికమ్యూనిటి కన్ఫేషర్ వానిస్  వెళ్ళాక ది ఆబే డీ సంబూసి డీసెయింట్ ఎస్టేవ్ చాలాసమర్ధతతో నిర్వహిస్తూ ,అనేక కాంగ్రి గేషన్ లను స్థాపించి ,పురాతన సనాతన విధాలతో కలుపుతూ వాటి మధ్య గొప్ప సమన్వయము సాధించాడు .బిషప్ డేమాన్దాల్క్స్ పై గొప్ప ప్రభావం కల్గించగా ,బిలియర్ట్ కు దియోసిస్ ఆఫ్ అమీన్స్ ను విడువక తప్ప లేదు .అప్పుడు పిసాని డీలాగౌడే అనే నార్మన్ బిషప్ బిలియర్ట్ ను ఆహ్వానించి అక్కడి సెంటర్ బాధ్యతలు అప్పగింఛి నూతన విధానాలకు శ్రీకారం చుట్టమని ఆదేశించాడు .
  బిలియర్ట్ అక్కడికి వెళ్లి అక్కడి వారిని వారికీ నచ్చిన విధానం లో ఉండటానికి లేక తనను అనుసరించటానికి స్వేచ్చ నిచ్చింది .ఇలా 1809 మధ్యలో నామర్ కా  న్వెంట్ ఆ సంస్థ కు గొప్పకేంద్రమై,ఇప్పటికీ నిలిచింది .తర్వాత ఆమెను అమీన్స్ కు తిరిగి వెళ్లి అక్కడి సంస్థను పునర్నిర్మించామన్నాడు .కాని ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ,అక్కడ డబ్బులూ లేవు ,ఆసక్తి ఉన్నవారూ లేకపోవటం తో వెంటనే నామర్ కు  తిరిగి వచ్చేసింది .
  జీవితం లో చివరి పదేళ్ళు అక్కడి డాటర్స్ ను పవిత్ర జీవనం ,ఆధ్యాత్మిక శక్తి కేంద్రాలుగా మార్చే ప్రయత్నం చేసి కృత కృత్యురాలైంది .దైవ సాన్నిధ్యం లో ప్రతిక్షణం ఉంటూ ఎందఱో పవిత్ర ఆత్మలకు మార్గదర్శి అయింది .1804-1816 మధ్య 12 ఏళ్ళు బిలియర్ట్ 15కాన్వెంట్ లను స్థాపించి ,120సార్లు అక్కడికి వెళ్లి వస్తూ ,వాటి అభి వృద్ధిని పర్యవేక్షించింది .డాటర్స్ తో ఎన్నో ఆంతరంగిక సమావేశాలు నిర్వహించి వారిని తీర్చి దిద్దింది .ఆమె రాసిన వందలాది ఉత్తరాలు మాతృ సంస్థలో ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి .
  1815లో బెల్జియం నెపోలియన్ యుద్ధాలకు కేంద్రమైంది .మదర్ జనరల్ బిల్లియర్ట్ చాలా ఆందోళనకు గురైంది .దీనికి కారణ౦  ఆమె సంస్థలు చాలాభాగం అ సైన్యం వెళ్ళే మార్గం లో ఉండటమే .కానీ వారెవరికీ గాయాలు తగలలేదు .1816 జనవరిలో మదర్ కొద్దిగా జబ్బు పడింది .64వ ఏట 13-5-1816న బెల్జియం లోని మదర్ హౌస్ లో సుపీరియర్ మదర్ జూలీ బిలియర్ట్ తుది శ్వాస వదిలి ,దేవుని చేరింది .ఆమె కానో నైజేషన్ 1881లో ప్రారంభమైంది .13-5-1906లో పోప్ ప యస్-10 బ్యూటిఫై చేస్తే,1969లో ఆరవ పోప్ పాల్ కానోనైజ్ చేశాడు .లోకమంతా బిలియర్ట్ వదాన్యత ను గొప్పగా శ్లాఘించారు .ఆమె గౌరవార్ధం  వందలాది  స్కూళ్ళు నిర్మించారు .అమెరికాలో కూడా నోటర్ డాంస్కూల్స్ స్థాపించబడ్డాయి .నోటార్ డాండీ నామర్ యూని వర్సిటి ఏర్పడింది .అలాగే ఇంగ్లాండ్ లోనూ ఇవి వెలిసి ఆమె సేవలను నిత్యం స్మరిస్తున్నారు .1969లో ఇంగ్లాండ్ లోని మెర్సిసైడ్ లో ఆధునికంగా నిర్మించిన చర్చి ని ఆమెకు అంకితం చేశారు .ఆమె స్థాపించిన సంస్థలు ఇప్పటికీ నిరుపేదల విద్యకు గొప్ప సాయమందిస్తున్నాయి .’’టీచింగ్ ది చిల్ద్రెన్ వాట్ దే నీడ్ టు నో ఫర్ లైఫ్ ‘’అనే జూలీ బిలియర్ట్ స్పూర్తి ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉంది .జాలీ బిలియర్ట్ ‘మొట్టమొదటి సుపీరియర్ జనరల్ ఆఫ్ ది కాంగ్రి గేషన్ ఆఫ్ ది సిస్టర్స్ ఆఫ్ నోటార్ డాం డీ నమూర్ ‘’.
The Catholic Church holds that “all who die in God’s grace and friendship but still imperfectly purified” undergo the process of purification which the Church calls purgatory, “so as to achieve the holiness necessary to enter the joy of heaven“.
మనం ఏదైనా సాయం కోసం స్నేహితుల్ని ఇతర బంధువుల్ని కోరినట్లు ఈ సంస్థవారు మనతరఫున వారికి సాయం చేయమని దేవుడిని ప్రార్ధిస్తారు .
–గబ్బిట దుర్గాప్రసాద్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~.

Posted in రచనలు | Leave a comment

భరతముని నాట్య శాస్త్ర అనువాదకులు ,తెలుగు నాటక వికాసం కర్త ,నాట్య సామ్రాట్,నాటక రత్న ,కళా రత్న  బిరుదాంకితులు,మనం మరచిపోయిన ఆధునిక భరత ముని – డా .పోణంగి శ్రీ రామ అప్పా రావు గారు

భరతముని నాట్య శాస్త్ర అనువాదకులు ,తెలుగు నాటక వికాసం కర్త ,నాట్య సామ్రాట్,నాటక రత్న ,కళా రత్న  బిరుదాంకితులు,మనం మరచిపోయిన ఆధునిక భరత ముని – డా .పోణంగి శ్రీ రామ అప్పా రావు గారు
జననం – విద్యాభ్యాసం
అప్పారావు 1923, జూలై 21 వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా, కొవ్వూరు తాలూకా, బందపురంలో జన్మించారు. కొవ్వూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలోను, విజయవాడ శ్రీరాజా రంగయ్యప్పారావు కళాశాలలోనూ, ఆంధ్ర విశ్వవిద్యాలయంలోను విద్యాభ్యాసం చేశారు.తలి దండ్రులు లక్ష్మీ నరసమ్మ ,శ్రీరామ మూర్తి .
ఇతర వివరాలు
’తెలుగు నాటకవికాసం‘ అనే అంశంపై పరిశోధన చేసి 1961 లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా స్వీకరించాడరు. తెలుగు నాటక రంగాన్ని గురించిన సర్వ సమగ్రమైన గ్రంథమిది. 1967లో ఈ గ్రంథం వెలువడిన నాటినుంచి నాటకరంగానికి ప్రామాణిక గ్రంథంగా విరాజిల్లుతుంది. దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది.’’సంస్కృత శాస్త్రాలునృత్త , నృత్య నాట్యాలు ,-చతుర్విధ అభినయాలు ‘’పై విశిష్ట గ్రంథరచన -1986-88 కాలం లో రాశారు
అప్పారావు వృత్తిరీత్యా అధ్యాపకులు . భీమవరం, రాజమహేంద్రవరం, మద్రాసు, కడప, శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజీల్లోనూ, మద్రాసు ప్రెసిడెన్సి కాలేజీలోనూ కొంతకాలం ఉపస్యాసకుడిగా పనిచేశారు. విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయం లోను పాఠ్యగ్రంథ జాతీయకరణ ప్రత్యేకోద్యోగిగా పనిచేశారు.తెలుగు అకాడెమీ ,,అంతర్జాతీయ తెలుగు సంస్థల డైరెక్టర్ గాపని చేసి సాంస్కృతిక శాఖ డైరెక్టర్ గా -1983లో పదవీ విరమణ చేశారు .
  మలేసియా ,సింగపూర్ ,లండన్ ,ప్రాగ్ ,వియన్నా ,అమెరికాలను సందర్శించారు
భరతముని ‘నాట్యశాస్త్రం’ను తెలుగులో అనువదించి ప్రపంచానికి అందించారు. ఈ గ్రంథానికి కేంద్రసాహిత్య అకాడమీ బహుమతి లభించింది. శ్రీ కాళ హస్తీశ్వర మహాత్మ్యాన్ని విపుల పీఠిక తో 1968లో ప్రచురించారు 1983లో విషాద సారంగధర ను విస్తృత పీఠిక ముద్రించారు .Historical tebles ,selected prayers ,Anoyims  and synonyms -1973లో ప్రచురించారు .’’మానవల్లి కవి రచనలు ‘’1972లో తెలుగులోనూ ,1986లో ఇంగ్లీష్ లోను ప్రచురించారు ఇతర రచనలు తాజ్ మహల్ (నాటిక), విశ్వభారతి (నవల), వేణువు (పద్యాత్మక గద్యము), నాట్యశాస్త్రము (గుప్తభావప్రకాశికాసహితము-జాతీయ బహుమతి పొందన గ్రంథం), నాటకరచనాప్రయోగములు (సిద్ధాంత గ్రంథము), తెలుగు నాటక వికాసము (డాక్టరేట్ పట్ట పరిశోధన వ్యాసము).నృత్య కళ-తెలుగు దేశం –తెలుగు నృత్య రత్నావళి కి 70పేజీల పీఠిక-1974,ధర్మవరం రామకృష్ణ మాచార్య –జీవితం ,రచనలు -1986,భారతీయ నాటక రంగం –శ్రీ ఆద్య రంగాచారి  గారి ఆంగ్ల గ్రంధానికి అనువాదం -1980,అభినయ దర్పణం -1987,నాట్య శాస్త్రం –విశ్లేషణాత్మక అధ్యయనం -1988,సాత్వికాభినయం -1993,వైఖానసాగమనం -1993,ఉత్తమా౦గాభినయం-1993,శారీరాభినయం -1994,చేష్టాకృతాభినయం -1994,చిత్ర సూత్రం -1994,హస్తాభినయం -1994.
1994 నాటికి -అముద్రిత రచనలు -ప్రధమాంధ్ర నాటక కర్తలు ,ఆంద్ర అలంకారికులు ,,సాహిత్య సంప్రదాయాలు ,ప్రాచీన నృత్యాలు
సత్కారసన్మానాలు – అప్పారావు 1987 లో కలకత్తాలో జరిగిన విశ్వ ఉన్నయన్ సంసద్లో రాష్ట్ర నాట్య సామ్రాట్ బిరుదును, 1990లో హైదరాబాదు యువ కళావాహిని వారిచే నాటక రత్న బిరుదాన్ని, 1992 లో శ్రీకాళహస్తి భరతముని ఆర్ట్స్ అకాడెమీ వారిచే కళారత్న బిరుదాన్ని అందుకున్నారు.[1]
నాట్య శాస్త్రం కు ఉత్తమ గ్రంథ కర్త గా 1961లో జాతీయ బహుమానం అందుకొన్నారు .1975లో ప్రధమ ప్రపంచ తెలుగు మహా సభలకు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు .1980ఉత్తమకళాశాల అధ్యాపక సన్మానం పొందారు .1994లో మద్రాస్ తెలుగు అకాడెమీ ఉగాది పురస్కారం ,19-11-94న రాజాలక్ష్మీ పురస్కారం అందుకొన్నారు
ఆంద్ర ప్రదేశ్ పాఠ్య గ్రందాల జాతీయీ కరణ రివ్యు కమిటి -1964,ఆంద్ర ప్రదేశ్ సంగీత నాటక అకాడెమి -1964-65,పానుగంటి లక్ష్మీ నరసింహారావు శాత జయంతి ఉత్సవ కమిటి -1965,ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక అకాడేమీ ల రివ్యు కమిటీ -1972-73, కేంద్ర ప్రభుత్వ హిందీ గ్రంథ అకాడెమీ ల రివ్యు కమిటీ  -1976,ఆంద్ర ప్రదేశ్ నృత్య అకాడెమి -1981 లలో విశిష్ట సేవలు అందించారు
1988నుంచి –హైదరాబాద్ కేంద్ర విశ్వ విద్యాలయం లో ప్రదర్శన కళలు లో ఆచార్యులు
మరణం
నాటకరంగ పరిశోధనలో విశేషంగా కృషిచేసిన అప్పారావు 2005, జూలై 2 న కన్నుమూశారు
నేను అప్పారావు గారిని కూచిపూడిలో జరిగిన సిద్ధేంద్ర యోగి ఉత్సవాలలో ప్రసంగిస్తుండగా చూసిన అదృష్ట వంతుడిని .పరిచయం చేసుకొని మాట్లాడాను .అప్పుడు ఆయన బొంబాయి నుంచి కళల పై ఒక త్రైమాసపత్రిక ఇంగ్లీష్ లో నడుపుతున్నారు .అందులో డా.వేదాంతం చిన సత్యం గారిపై ఒక ప్రత్యెక సంచిక కూడా తెచ్చారు అది నేను కొని భద్రపరచుకోన్నాను .
  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -3-6-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

ప్రఖ్యాత ఆయుర్వేద డాక్టరై ,’’కేసరి కుటీరం ‘’స్థాపించిలోధ్ర మొదలైన మందులు తయారు చేసి’’ గృహలక్ష్మి ‘’అనే వారపత్రిక ద్వారా దాదాపు అర్ధశతాబ్ది సాహిత్య సేవ చేసి,’’స్వర్ణ కంకణాలతో ‘’ ప్రముఖ మహిళలను సత్కరించి, మద్రాస్లో కేసరి ఉన్నత విద్యాలయం స్థాపించి విద్యాసేవ చేసిన మనం మరచిపోయిన మహానుభావుడు – కె.ఎన్. కేసరి అనే శ్రీ కోట నరసింహం గారు

ప్రఖ్యాత ఆయుర్వేద డాక్టరై ,’’కేసరి కుటీరం ‘’స్థాపించి లోధ్ర మొదలైన మందులు తయారు చేసి’’ గృహలక్ష్మి ‘’అనే వారపత్రిక ద్వారా దాదాపు అర్ధ శతాబ్ది సాహిత్య సేవ చేసి,’’స్వర్ణ కంకణాలతో ‘’ ప్రముఖ మహిళలను సత్కరించి, మద్రాస్ లో కేసరి ఉన్నత విద్యాలయం స్థాపించి విద్యాసేవ చేసిన మనం మరచిపోయిన మహానుభావుడు – కె.ఎన్. కేసరి అనే శ్రీ కోట నరసింహం గారు

కె.ఎన్.కేసరి (1875 – 1953) గా పేరు పొందిన ఈయన అసలు పేరు కోట నరసింహం. కేసరి కుటీరం అనే ఔషధశాల స్థాపకుడు. మదరాసులోని మైలాపూరులో కేసరి పాఠశాలను స్థాపించాడు. కేసరి దానశీలిగా పేరు గాంచారు. స్త్రీ జనోద్దరణకై గృహలక్ష్మి మాసపత్రికను స్థాపించాడు. కర్నాటక సంగీత విద్వాంసుడు, సినీ గాయకుడైన ఉన్ని కృష్ణన్ ఆయన మునిమనుమడు.[1]

బాల్యం

కేసరి, 1875 ఏప్రిల్ 26 న ప్రస్తుత ప్రకాశం జిల్లాలోని మద్దిపాడు మండలానికి చెందిన ఇనమనమెళ్ళూరు గ్రామంలో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు. వీరిది పేద కుటుంబం. కేసరికి ఐదేళ్ల వయసులో తండ్రి మరణించాడు. తల్లికి ఇంటి పనుల్లో సహాయం చేస్తూ ఉండటం వల్ల బడికి సరిగా వెళ్ళగలిగేవాడు కాదు. తల్లి దర్జీ పని చేస్తుండేది. తల్లి కష్టపడి తనను పెంచి పెద్ద చేస్తుండటం గమనించిన ఈయన, తన పదకొండేళ్ళ వయసులో కాలినడకనే మద్రాసు చేరుకుని అక్కడే చదువుకోవడం మొదలు పెట్టాడు. హిందూ ధార్మిక పాఠశాలలో స్కాలర్‌షిప్పు పొందాడు. కొంతకాలానికి 1889లో తల్లి కూడా మద్రాసుకు వచ్చి అతనితో ఉండసాగింది. ఆ తర్వాత కొద్దికాలానికే ఆమె జబ్బుచేసి మరణించింది. ఆయన తన చిన్ననాటి జ్ఞాపకాలను “నా చిన్ననాటి ముచ్చట్లు” అనే పుస్తకంగా ప్రచురించాడు.[2]

వైద్యవృత్తి

చదువు పూర్తి చేసుకుని పలుచోట్ల ఉద్యోగ ప్రయత్నాలు చేసినా అవేమీ సత్ఫలితాలను ఇవ్వలేదు. తర్వాత ఆయన వైద్యం నేర్చుకోవడం ప్రారంభించాడు. కోమట్ల సహాయంతో శ్రీ కన్యకాపరమేశ్వరీ ఆయుర్వేద వైద్య కళాశాలలో కొలువు సంపాదించాడు. 1900 సంవత్సరంలో మద్రాసు జార్జిటౌన్ నారాయణ మొదలి వీధిలో ఒక చిన్న బాడుగ ఇంటిలో కేసరి కుటీరము పేరుతో మందుల తయారీ సంస్థను ప్రారంభించాడు.

సామాజిక కృషి

1928లో కేసరి, సామాజిక రాజకీయ రంగాలలో మహిళను ప్రోత్సహించేందుకై గృహలక్ష్మి అనే తెలుగు వారపత్రికను స్థాపించి, దానికి వ్యవస్థాపక సంపాదకుడిగా,[3] మహిళా రచయితలను పెంపొందించాడు.[4] మహిళా రచయితలను సత్కరించేందుకు గృహలక్షి స్వర్ణకంకణమనే పురస్కారాన్ని స్థాపించాడు.[5]

1943లో కేసరి మద్రాసులోని మైలాపూరు తెలుగు ప్రాథమిక పాఠశాల యొక్క యాజమాన్యపు బాధ్యతలను తీసుకొని దానికి తగిన నిధులు సమకూర్చి, ఉన్నత పాఠశాల స్థాయికి తీసుకెళ్ళాడు[6] 1951లో తన విద్యాభివృద్ధి పనులను మరింత విస్తరించడానికి కేసరి విద్యాసంస్థ అనే ధర్మాదాయసంస్థను ఏర్పాటుచేసాడు. ఆ సంస్థ తన ఆధ్వర్యంలో ఇప్పడు అనేక పాఠశాలలను నడిపిస్తున్నది.[7]

కేసరి కుటీరం ఉత్పాదనలు

· అమృత, రక్తశుద్ధిద్రావకము

· అర్క, సర్వజ్వరనివారిణి

· కేసరి డెంటల్ క్రీం, దంతధావన నవనీతము

· కేసరి పుష్పత్రయము

· లోధ్ర

రచనలు
ఆయన జీవిత విశేషాలను చిన్ననాటి ముచ్చట్లు పేరుతో పుస్తకంగా రాశాడు.[8] పుస్తకంగా విడుదలైన తర్వాత వీరి జీవిత విశేషాలను ధారావాహికగా జగతి (పత్రిక) లో జూలై 1989 నుండి ప్రచురించబడింది.[

గృహ 20వ శతాబ్దంలో ప్రముఖ ఆయుర్వేద వైద్యనిపుణులు కె.యన్. కేసరి స్త్రీల సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేరు. 1924 లో గృహలక్ష్మి మాసపత్రిక స్థాపించి స్త్రీవిద్యకీ, రచనావ్యాసంగానికి కృషి చేసేరు. 1934లో స్వర్ణకంకణము పురస్కారము ప్రారంభించి సాహిత్య, సాంస్కృతిక, తదితర రంగాలలో విశిష్టసేవ చేసిన స్త్రీలను సత్కరిస్తున్నారు. ఆధునిక యుగంలో స్త్రీలని క్రమపద్ధతిలో ఏటా సత్కరించడం ఈ స్వర్ణకంకణముతో మొదలయింది.

స్వర్ణకంకణముతో సత్కారం పొందిన మహిళలు

కనుపర్తి వరలక్ష్మమ్మ (1934)
చిలకపాటి సీతాంబ (1935)
కాంచనపల్లి కనకమ్మ (1936)
పులవర్తి కమలావతి (1937)
బాలాంత్రపు శేషమ్మ, రత్నాల కమలాబాయి (1938)

బాలాంత్రపు శేషమ్మ (1939లో పురస్కార గ్రహీత)
వి. రాధామనోహరి, చేబ్రోలు సరస్వతీదేవి (1940)
బత్తుల కామాక్షమ్మ (1941)
ఉన్నవ లక్ష్మీబాయమ్మ (1948)
బెంగుళూరు నాగరత్నమ్మ (1949)
గిడుగు లక్ష్మీకాంతమ్మ (1951)
స్థానాపతి రుక్మిణమ్మ (1952)
ఊటుకూరి లక్ష్మీకాన్తమ్మ (1953)
పొణకా కనకమ్మ(1955)
కొమ్మూరి పద్మావతీదేవి (1956)
కె. రామలక్ష్మి(1957)
దేశిరాజు భారతీదేవి(1958)
గుడిపూడి ఇందుమతీదేవి (1959)
కానుకొల్లు చంద్రమతి(1960)
ఎ. కనకదుర్గా రామచంద్రన్ (1961)
1962, 1963 సంవత్సరాలలో బహుమతులు ఇవ్వలేదు.

ఇల్లిందల సరస్వతీదేవి (1964)
తెన్నేటి హేమలత (1965)
ద్వివేదుల విశాలాక్షి (1966)
కోడూరి కౌసల్యాదేవి (1967)
ముప్పాళ్ళ రంగనాయకమ్మ (1968)
యద్దనపూడి సులోచనారాణి (1969)
ఐ.వి.యస్. అచ్యుతవల్లి (1970)
డి. కామేశ్వరి (1971)
సి. ఆనందారామం (1972)
కోడూరి లీలావతి (1974)
ద్వారక పార్థసారథి (1975)
వాసిరెడ్డి సీతాదేవి (1976)
గుళ్ళపల్లి సుందరమ్మ (1977)
మాదిరెడ్డి సులోచన (1978)
తురగా జానకీరాణి (1982)
అవసరాల (వింజమూరి) సీతాదేవి (1984)
జె.భాగ్యలక్ష్మి (1986)
నాయని కృష్ణకుమారి
వేదుల మీనాక్షీదేవి
మాలతీ చందూర్
ఉన్నవ విజయలక్ష్మి
పోలాప్రగడ రాజ్యలక్ష్మి
శారదా అశోకవర్థన్
వాసా ప్రభావతి

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-6-22-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Leave a comment

శ్రీ భీమ లింగేశ్వర శతకం -2(చివరిభాగం )

శ్రీ భీమ లింగేశ్వర శతకం -2(చివరిభాగం )
మొదటి పద్యం –‘శ్రీ వాణీశ ముఖామర ప్రకరస౦సేవ్యాంఘ్రీ పంకేరుహా –భావాతీత సుమంగళా౦చిత గుణా,భద్రేభ చర్మాంబరా
ధీ విభ్రాజిత దాసకల్ప కుజ దాత్రీ భ్రున్నివాసొన్నతా –గ్రావా ధీశ కుమారికా రమణ భర్గా శ్రీ రామ లింగేశ్వరా ‘’అని మొదలుపెట్టి ‘’ఘనపా౦డిత్యం ,సూరి జన సాంగత్యం సాధన సంపత్తి తనకు లేవని ,శివునిపై భారమేసి శతకం రాస్తున్నాని చెప్పాడు .ఆయన్నుసేవి౦చినవారి పాపాలుపోతాయి ,ఆయన స్మరణైక దాస్యమిమ్మని ,,ఆయన మహిమలు పొగడటానికి శక్యం కాదని ,ఆత్మలో ఆయన పాదాబ్జాలు కొలిచే భాగ్యమిమ్మని కోరుతూ ‘’రారా శైల నికేతనా వడిని సంరక్షించ’’అంటూ ఆయనలాంటి వారు లేరనీ ,’’రంగత్తు౦గ తరంగ గంగ ‘’ను సుమూర్ధం లో ,’’మకుటాగ్రం లో రోహిణీ పతిని దాల్చి శరణన్న వారిని వెంటనే కాపాడేవాడని స్తుతించాడు .ఎద్దు వాహనం క్రూరసర్పాలు హారాలు ధరించటం ఎందుకు నీ మిత్రుడు ధనాధిపతి కదా అన్నాడు .
‘’పరి పూర్ణుడవు ,నిర్వికల్పుడవు శోభా రమ్య దేహుండు ,విద్ధరుచిన్,ప్రాపగు దేవతా మణివి,ఆద్యంతాలు లేనివాడవు ‘’అని కీర్తించాడు .మూర్ఖుడైన వాడి జడాత్మను మార్చటానికియే విజ్ఞుడూ సమర్ధుడు కాడు.’’దక్షుం డద్వర మొప్ప జేయ నట దాక్షయణీపిల్వకే –నక్షుద్రోక్తి ని బోవ ,తారచట గర్వా౦ధ౦బున దూల ప్ర-త్యక్ష ప్రౌఢిని ప్రాణముల్ విడువ వీరావేశతన్ వీరభ –ద్రాక్షుద్ర స్థితి జంప జేసితివి కావా భీమలింగేశ్వారా ‘’అని క్షకార ప్రాసతో దక్ష యజ్ఞ ధ్వంసాన్ని కనులకు కట్టి నట్టు వర్ణించి శ్రీనాధుడు భీమ ఖండం లో క్షకార ప్రాసతో వ్యాసుడుభిక్షా పాత్ర నేలకేసికోట్టటం అన్నపూర్ణమ్మ పిలిచి పెట్టిన కమ్మని భోజనం గుర్తుకు తెచ్చాడు కవి . ,చీమకు ఏ వస్తువు కనిపించినా తన వారికి జాడలు చూపించినట్లు నాకూ దారి చూపించు ‘క్రీడా ఖేలన శైల కంధర హరా శ్రీ భీమేశ లింగేశ్వరా ‘’అని లోకోక్తిగా వేడుకొన్నాడు .సత్యమే జగత్తును ఉద్ధరిస్తుంది అదే మోక్షాన్ని,ఆన౦దాని యిస్తుంది .
‘’పద వైశద్యం అర్ధగౌరవం శోభారమ్యభావం కల చంచలాక్షి లాగా బుద్ధిబలం తో ప్రబంధాలను సత్పద వైశద్యంతో అర్ధగౌరవ శోభా రమ్యత తో రాసేవాడే కవి అన్నాడు ఈకవి ..’’కనులా కల్మష పూతిగంధజల ముక్త ద్వారకా చా౦కముల్ –చనులా క్షీర ప్రవాహ వాహయుగమాంస స్ఫారకంకాళముల్-వెనులా ?బంధుర శల్య సంచయ కళా వేశ్మైక చర్మా ధ్యముల్ –‘’అలాంటి వామాక్షులను కోరటం సబబా ?అని వేదాంత ప్రవచనం చేశాడు కవి .’’శివ ఈశాన పరాత్పరా వరద దాక్షి ణ్యైకభావా౦ బుధీ-పవమానప్రియ భాస్కరాబ్జ నయనా బాలేందు మౌళీహరా –భవమృత్యుంజయ పార్వతీ రమణ సౌభాగ్యప్రదాధీమణీ’’అని ఎలుగెత్తి స్తోత్రం చేశాడు ఆర్తిగా .చంద్రుడు ఏ చుట్టమయ్యా నీకు నెత్తికేక్కి౦చు కొన్నావ్ ?అని ఈసడింపుగా అన్నాడు .
‘’స్వర్ణ గ్రావము కార్ముకంబు రాజతక్ష్మా ద్రంబు వాసంబు –సంపూర్ణజ్యొత మణీప్రముక్త చాయ శంభూ తాబ్ది తూణంబుశ్రీ –పూర్ణ స్ఫారుడవై కరంబు సతతంబు న్ భిక్ష మందేగేదో-కర్ణ భ్రాజిత కుండలా తగునె ఏగన్ భీమ లింగేశ్వరా “’అని ‘’వాయించాడు’’ .పూలను రువ్విన వాడికి దేహం లేకుండా చేశావు .మరి రాళ్ళు రువ్వితే ఏం చేస్తావ్ (ఏం పీకుతావ్ )అని దేప్పిపోడిచాడు .నీటిలో వహ్నిలో కాష్టం లో బయలులో నీరేజం లో భూమిలో వాయువులో సకలప్రాణులలో సంక్రా౦త౦ ఎప్పుడూ ఉంటాడు శివుడు అని ఆయన విభూతిని కీర్తించాడు .అపరిచ్చిన్నం అద్వితీయం ఆద్యన్తశూన్యం అయిన బ్రహ్మం ఒక్కటే సదానందంగా వెలుగుతూ ఉంటుంది .అంటూ 88పద్యాలు చెప్పాడు .
89నుంచి ‘’శ్రీ భీమేశా వరద కవి నుతపద’’లోని మొదటి అక్షరాలతో 91వరకు పద్యాలు చెప్పాడు .99వ పద్యం లో –‘జయ సర్వేశ్వరా శాశ్వతా గిరిధరా సర్వం సహా వందితపదాచంచత్కటాక్షోదయా -జయకాత్యాయినీ నాయకా శశిధరా ,సంక్రందనాభ్యర్చితా –జయ మృత్యుంజయ జూలకల్లు పురవాసా భీమ లింగేశ్వరా ‘’అని పార్వతీ వల్లభుని స్తుతించి ,తర్వాత రెండుపద్యాలలో తనగురించి చెప్పి ‘’శ్రీ భీమ లి౦గేశ్వరార్పణ మస్తు ‘’అంటూ 101పద్యంతో శతకం ముగించాడు శానం పూడి వరద రాజ కవి .
చక్కని ధారా శుద్ధి విశుద్ధమైన భక్తీ తాత్పర్యాలు గొప్ప ఊహా ,కమనీయ కవిత్వం తో శతకం అత్యద్భుతంగా నడిచింది .భక్తులకు కొంగు బంగారం గా వెలసిన శతకమిది .దీన్ని గురించి, కవి గురించి మన మహానుభావుల దృష్టిలో పడి నట్లు తోచదు .ఈ కవినీ, శతకాన్ని పరిచయం చేసే మహద్భాగ్యం నాకు కలిగింది .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-6-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | 1 Comment

గ్రీకు ,సంస్కృత ,ఆంగ్ల ,తెలుగు నాటక దర్శకుడు ,నటుడు ,రచయిత,నూరేల్లతెలుగు నాటక రంగం

గ్రీకు ,సంస్కృత ,ఆంగ్ల ,తెలుగు నాటక దర్శకుడు ,నటుడు ,రచయిత,నూరేల్లతెలుగు నాటక రంగం సంపాదకులు ,రసమయి ,అప్పాజోష్యుల పురస్కార గ్రహీత –డా .మొదలి నాగభూషణ శర్మ
మొదలి నాగభూషణ శర్మ (జూలై 24, 1935 – జనవరి 15, 2019) రంగస్థల నటుడు, దర్శకుడు, నాటక రచయిత, అధ్యాపకుడు, విమర్శకుడు, పరిశోధకుడు.[1]
జననం
నాగభూషణ శర్మ 1935, జూలై 24 తేదీన గుంటూరు జిల్లా, ధూళిపూడి గ్రామంలో జన్మించాడు.[2] ఇతని తల్లి కామేశ్వరమ్మ. తండ్రి సుబ్రహ్మణ్యశర్మ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు.
రంగస్థల ప్రస్థానం
ఇతని తండ్రి కూడా స్వయంగా నాటక రచయిత, ప్రయోక్త, కథా రచయిత. అతని స్ఫూర్తి వల్లనే నాగభూషణ శర్మ నాటకరంగంలోకి వచ్చాడు. తండ్రి నేతృత్వంలో ఎనిమిదవ ఏటనే రంగస్థలంపై తొలిపాఠాలు నేర్చిన శర్మ కాలేజీ రోజుల్లో బందరులో కన్యాశుల్కం నాటకంలో మధురవాణి పాత్రను ధరించి పేరుపొందాడు. కళాశాలలో చదువుతుండగానే ఆయన తొలి రచన అన్వేషణ 1954లో భారతిలో ప్రచురితమైంది.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ ఆంగ్ల సాహిత్య పట్టభద్రుడై నాగభూషణ శర్మ, అమెరికా లోని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయంలో నాటకదర్శకత్వంలో ఎం.ఎఫ్.ఏ పట్టా పొందాడు. నాటకమే ప్రధానాశంగా పరిశోధన చేసి డాక్టరేటు అందుకున్నాడు. ఆ తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంగ్లీషు శాఖ లోను, నాటక శాఖ లోను ఆచార్యుడిగా పనిచేశాడు.
విదేశాలలో పర్యటించి, వివిధ నాటక ప్రయోగ రీతుల్ని అధ్యయనం చేసి శిక్షణ పొందాడు. నవల, నాటక సాహిత్యానికి చెందిన అనేక పరిశోధనాత్మక వ్యాసాలు పత్రికల్లో ప్రకటించాడు.
ది విజిట్, కింగ్ ఈడిపస్, హయవదన, తుగ్లక్, మృచ్ఛకటిక, వెయిటింగ్ ఫర్ గోడో వంటి గ్రీకు, సంస్కృత, ఆంగ్ల నాటకాలకు దర్శకత్వం వహించి హైదరాబాదు డ్రమటిక్ సర్కిల్ ఆధ్వర్యంలో ప్రదర్శించాడు. అడ్డదారి, పెళ్ళికి పది నిమిషాల ముందు, మదనకామరాజు కథ, ప్రజానాయకుడు ప్రకాశం వంటి స్వతంత్ర నాటకాలను, యాంటిగని, మాక్‌బెత్, డాల్స్‌హౌస్, ఎనిమీ ఆఫ్‌ది పీపుల్, ఎంపరర్‌జోన్స్, వెయిటింగ్ ఫర్ గోడో, కాయితం పులి, హయవదన, సాంబశివ ప్రహసనం వంటి గొప్ప పాశ్చాత్య, భారతీయ నాటకాలను స్వేచ్ఛానువాదం చేశాడు. ప్రజా నాయకుడు ప్రకాశం నాటకాన్ని దేశవ్యాప్తంగా ప్రదర్శించాడు.
విషాదాంతం, జంట పక్షులు, సంభవామి, నరజాతి చరిత్ర, మన్మధుడు మళ్లీ పుట్టాడు, రాజా ఈడిపస్ (అనువాదం), ప్రజానాయకుడు ప్రకాశం మొదలైన నాటకాలను, అన్వేషణ, అడ్డదారి, ఆగస్టు 15, జననీ జన్మభూమి, రాజదండం మొదలైన నాటికలను రచించాడు. ఈయన దాదాపు 70 నాటకాలు, నాటికలు, రేడియో నాటికలు వ్రాశాడు. స్వతంత్ర నాటకాలే కాక అనేక అనువాద నాటకాలు కూడా వ్రాశాడు. ఈయన దర్శకత్వంలో ఇరవైకి పైగా ఆంగ్ల నాటకాలు, అరవైకి పైగా తెలుగు నాటకాలు ఈయన దర్శకత్వంలో ప్రదర్శించబడ్డాయి.
తెలుగు సాహిత్యం- గాంధీజీ ప్రభావం, నూరేళ్ళ తెలుగునాటకరంగం (సంపాదకులు), లోచన (వ్యాస సంపుటి) వీరి ఇతర రచనలు. ‘ప్రకాశం’ నాటకానికి తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పురస్కారం లభించింది. నాటక, కళారంగాల్లో విశేష కృషి చేసిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రదానం చేసే ప్రతిష్ఠాత్మక నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారానికి 2013 లో ఈయన ఎంపికయ్యాడు.[3] 2019, జనవరి 6న తెనాలిలో అప్పాజోస్యుల-విష్ణుభొట్ల-కందాళం ఫౌండేషన్ వారి ప్రతిభా వైజయంతి జీవితకాల సాధన పురస్కారం అందుకున్నాడు.[1]
పురస్కారాలు
1. రసమయి రంగస్థల పురస్కారం (2017)[4]
మరణం
నాగభూషణశర్మ 2019, జనవరి 15న తెనాలిలో మరణించారు
నాటకాన్ని శ్వాసిస్తూ, నాటకం ఔన్నత్యాన్ని స్వప్నిస్తూ ఆ రంగానికి ఏడుపదుల కాలాన్ని అంకి తం చేసిన మహనీయుడు ఆచార్య మొదలి నాగ భూషణశర్మ. కాలేజి రోజుల్లో కన్యాశుల్కంలో మధు రవాణి వేషంతో నటుడిగా నాటక కళాసేవ ఆరం భించి, నాటక దర్శకుడిగా, రచయితగా, అధ్యాపకు డిగా, పరిశోధకుడిగా నాటకానికి బహుముఖీన సేవ లందించారు. తెలుగు నాటకాలే కాదు, విదేశాల్లోని ఉత్తమ నాటకాలను అద్భుత ప్రయోగాలతో ప్రద ర్శించి, తెలుగు ప్రజలకు నాటకవిందు చేశారు. నాటక, గాయక ప్రముఖులపై పుస్తకాలను తీసుకొ చ్చారు. తోలుబొమ్మలాటను జపనీయుల కళ్లకు కట్టారు. తెలుగు డ్రామా అండ్‌ థియేటర్‌ చరిత్రను ఇంగ్లిష్, తెలుగులో రాయాలనే తపనతో కృషిచేస్తున్న తరుణంలో ఆయన కన్నుమూయటం తెలుగు నాటకానికి తీరనిలోటు.
ఆచార్య మొదలి నాగభూషణశర్మ (84) పూర్వీ కులది గుంటూరు జిల్లాలోని బ్రాహ్మణకోడూరు. తండ్రి సుబ్రహ్మణ్యశర్మ ఉద్యోగరీత్యా ఇదే జిల్లాలోని రేపల్లె దగ్గరగల ధూళిపూడిలో స్థిరపడ్డారు. అక్కడే 1935 జూలై 24న నాగభూషణశర్మ జన్మించారు. పాఠశాల దశనుంచే ఆయనకు రంగస్థలంపై అను బం«ధం ఏర్పడింది. విజయవాడ, బందరులో కాలేజి చదివే రోజుల్లో ఆ బంధం మరింత పెరిగింది. ‘మధుర వాణి’గా 50 ప్రదర్శనల్లో నటించారు. ‘భారతి’లో ప్రచురితమైన తొలి నాటకం ‘అన్వేషణ’ రాసిందీ ఆ రోజుల్లోనే. హైదరాబాద్‌లో ఎంఏ, పీహెచ్‌డీ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంగ్లిష్‌ అధ్యాపకుడిగా చేరారు. కొంతకాలం తర్వాత అమెరికాలోని ఇల్లినాయ్‌ యూనివర్సిటీలో ఎంఎఫ్‌ఏ (థియేటర్‌) చేశారు. తిరిగి రాగానే ఉస్మానియా యూనివర్సిటీలో ప్రారంభించిన థియేటర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ శాఖకు తొలి అధిపతిగా మొదలిని నియమించారు.
చాట్ల శ్రీరాములు, రాజా రామదాస్‌ వంటి నిష్ణాతులను అధ్యాపకులుగా చేర్చుకుని, నాటకకళ వికాసానికి నాగభూషణ శర్మ శ్రద్ధపెట్టారు. పలు నాటకాలనే కాదు, ఆచార్య ఆత్రేయ నాటకోత్సవాన్ని విజయవంతంగా ప్రదర్శించారు. నాటకరంగ ప్రము ఖులు డీఎస్‌ఎన్‌ మూర్తి, తనికెళ్ల భరణి, తల్లావ ఝుల సుందరం, భిక్షు, భాస్కర్, హవల్కర్, విద్యా సాగర్, జీఎస్‌ ప్రసాద్‌రెడ్డి వంటి ప్రముఖులు ఉస్మా నియా థియేటర్‌ ఆర్ట్స్‌ శాఖ నుంచి పట్టాలు తీసు కున్నవారే. 1988లో సెంట్రల్‌ యూనివర్సిటీలో సరోజినీనాయుడు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పెర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌ ప్రారంభమైనపుడు శర్మ తొలి డీన్‌గా నియమితుల య్యారు. ఆ స్కూలును కళల వికాసానికి అనువైన దిగా రూపుదిద్దారు శర్మ.
మరోవైపు నాటకరచన, దర్శకత్వం బాధ్యత లను అపూర్వంగా నిర్వహించారు. తెలుగులో 60, 28 ఇంగ్లిష్‌ నాటకాలకు దర్శకత్వం వహించారు. విదేశీ భాషలకు చెందిన అనేక కళాఖండాలను తెలు గులోకి అనువదించి, ప్రదర్శింపజేశారు. వీటిలో ‘రాజా ఈడిపస్‌’, ‘ది విజిట్‌’, ‘మ్యాడ్‌ విమెన్‌ ఆఫ్‌ చల్లియట్‌’, ‘హయవదన’, ‘మృచ్ఛకటిక’ వంటి నాటకాలు ప్రముఖమైనవి. వీటిలోని ప్రయోగాలు అనితరసాధ్యం. హైదరాబాద్‌లోని రసరంజని సంస్థకు అనేక నాటకాలను ప్రదర్శించారు. వీటిలో టంగుటూరి ప్రకాశం పంతులు ఆత్మకథను ‘ప్రజా నాయకుడు ప్రకాశం’ నాటకంగా, తన దర్శకత్వంలో రాష్ట్రమంతా ప్రదర్శించారు. హెన్నిక్‌ ఇబ్సెన్‌ నాటకం ‘డాల్స్‌ హౌస్‌’ తెలుగులో ‘బొమ్మరిల్లు’గా, బెర్టాల్ట్‌ బ్రెచెట్‌ ఇంగ్లిష్‌ నాటకం ‘తెల్లసున్నా’గా శామ్యూల్‌ బకెట్‌ రచన ‘దేవుడయ్యి వస్తాడట’ పేరుతోనూ తన దర్శకత్వంలోనే ప్రదర్శనలకు సిద్ధంగా ఉంచారు.
సాహిత్యం, కళలు, జానపదం, నాటకం, అను వాదాలు, విమర్శలు… ఇలా అన్ని ప్రక్రియల్లోనూ 14 పుస్తకాలు రాశారు. 1975లో రాష్ట్ర సంగీత నాటక అకాడమీ జానపద కళోత్సవాల కోసమని నటరాజ రామకృష్ణతో కలిసి 300 గ్రామాలు తిరిగి 750 మంది కళాకారులను ఆ ఉత్సవంలో పాల్గొనేలా చేశారు. 64 కళారూపాలను ‘ఫోక్‌ పెర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌ ఆఫ్‌ ఆంధ్ర ప్రదేశ్‌’ పుస్తకంగా తీసుకొచ్చారు. తోలుబొమ్మలాట బృందాన్ని జపాన్‌ తీసుకెళ్లి 15 పట్టణాల్లో ప్రదర్శిం పజేశారు. నాటకరంగ సేవలకుగాను నాగభూషణ శర్మ కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని, రాష్ట్ర ప్రభుత్వ ఎన్టీఆర్‌ రంగస్థల పురస్కారాన్ని, గతేడాది ‘కళారత్న’ గౌరవాన్ని స్వీకరించారు. ఈనెల 6న తెనాలిలో అజో–విభొ– కందాళం ఫౌండేషన్‌ వారి ప్రతిభా వైజయంతి జీవితకాల సాధన పుర స్కారాన్నిఅందుకున్నారు.మీ -గబ్బిటదుర్గాప్రసాద్ 2-6-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

శ్రీ భీమ లింగేశ్వర శతకం -1

శ్రీ భీమ లింగేశ్వర శతకం -1

పల్నాడు తాలూకా జూలకల్లు గ్రామవాసి శ్రీ శానం పూడి వరద కవి శ్రీ భీమేశ్వర లింగ శతకం రాసి ,వినుకొండ తాలూక ముప్పాళ్ళ గ్రామస్తులు శ్రీ కాకుమాను కాశీ విశ్వానాథం ఆర్ధిక సహకారం తో గుంటూరు కన్యకా ముద్రాక్షర శాలలో శ్రీ పెండేల చక్రపాణి సోదరుల చే 1924లో ముద్రించారు .’’కృతి గ్రహింపు ము బిడ్డలకింపు నింపు –దీవెనలు సల్పి మనుపుము దీర్ణమతిని –రామయామాత్య గృహిణి సాధ్వీమతల్లి –విష్ణు పద రోలంబ వేంక మాంబ’’అని శ్రీమతి వే౦క మాంబ కు అంకితమిచ్చారు .

  భూమిక లో కవి వచనం లో తాను  జూలకంటి భీమేశ్వరుని పేర ఒక శతకం రాయటానికి 28-8-1922 న పూనుకొని పది పద్యాలురాసి ,తీవ్రమైన వ్యాధితో పది నెలలు ఇబ్బందులు పడి,వ్యాధి నివారణ పొందాక మళ్ళీ ఉత్సాహంతో మొత్తం 50పద్యాలు రాసి ,మేళ్ళ వాగు స్కూలు నుంచి ముప్పాళ్ళ స్కూలు కు బదిలీ అయి తృతీయ ప్రధానోపాధ్యాయుడై ,కొద్దికాలం లోనే శతకం పూర్తీ చేసి శ్రీ భీమ లింగేశ్వరుని సమర్పించి నట్లు చెప్పాడు కవి .

  అందులోనే దేవాలయ చరిత్ర గురించి చెబుతూ పల్నాడు తాలూకా జూలకల్లు లో శ్రీ భీమేశ్వర స్వామి వెలసి ఉన్నాడని ,కాకతి రాజులు ప్రతిష్ట చేశారని చెప్పే శిలా శాసనాలున్నాయని ,నిత్యపూజాదికాలు ఉత్సవాలు జరపటానికి తగిన భూ వసతి కూడా కల్పించారని ,ఆ గ్రామం లో ని గుంటుపల్లి వారు ఆలయాన్ని శ్రద్ధా భక్తులతో నిర్వహిస్తున్నారని చెప్పారు. ముప్పాళ్ళ వాసి వైశ్యకుల ప్రముఖులు శ్రీ కాకుమాను కాశీ విశ్వనాథం  ఈ శతక ముద్రణకు కావలసిన ధన సహాయం చేశారనీ ,వారు ,వారి వంశీకులు ఆ చంద్ర తారార్కం గా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరారు .శ్రీ కింతాడ వీరభాద్రాచారి కవి గారి కృషిని పద్యం లో అభినందించారు .

  శతకం లో మొదట వంశ వర్ణ చేశాడు కవి .మొదటి సీసపద్యం లో శ్రీ ఆది నారాయణ స్వామిని స్తుతించాడు .తర్వాత వైశ్య వర్ణం ఏర్పడిన విధానం ,కాకుమాను వారి వంశం గురించి చెప్పి వారిది నాభిళ్ళ గోత్రం అనీ అందులో బసవయ్యగారు ప్రముఖులనీ ,ఆయన భార్య శాయమ్మ అనీ ,వారికి ఆరుగురు పుత్రులని ,అందులో రంగయ అనంతమ్మను పెళ్లాదాడని , వీరి సంతానం లో పట్టాభి రామయ్య దంపతులకు కలిగిన కాశీ విశ్వనాధం కనకా౦బను పెళ్ళాడి ,ఆమె కొద్దికాలానికే చనిపోతే ఆమె చెల్లెలు అన్నపూర్ణను ద్వితీయం చేసుకొని గొప్ప శ్రీమతుడై దాతగా కీర్తిపొంది,ఈ శతకాన్ని ముద్రించటానికి ధనం అందించాడు .తర్వాత కవిగారు ఆయనకు పద్యాశీస్సులు వర్షించారు.

  శ్రీ గోపాలుని హనుమంత రాయ శాస్త్రి ,అష్టావధాని శ్రీ పోతరాజు లక్ష్మీ నరసింహకవి పద్యాలతో కవిని అభినందించారు .

 కవిగారు ముందుగా ‘’శ్రీ మన్మహా దేవ దేవేశ  -సోమార్ధ జూటాగ్ర-భూమీధరాధీశ కన్యా మనః పద్మ షట్పాద-శ్రీదా-సుధా ధామ మందార –బృందారకాధీశ దంతావళ శ్రేష్ఠ దుగ్దోధదీ ట్కుంద-డి౦డీర ధావల్యకీర్తుజ్వలా ‘’అంటూ దండకం మొదలుపెట్టి ‘’క్రూర రాత్రి౦చరధ్వంస –శ్రీ జూలకల్వాస శ్రీ భీమ లింగేశ –నే దండకంబొండు,నీనామ రూపంబులన్ జేసి యర్పించితిన్ –దీని రత్నోరు హారంబుగా దాల్పవే –నాపయిన్ నీ కృపన్ నిల్పవే –శూల హస్తా –నమస్తే నమస్తే నమస్తే నమః ‘’అని భక్తి చిప్పిలేట్లు ముగించాడు .మత్తేభ ,శార్దూల పద్యాలతో ‘’భీమ లింగేశ్వరా ‘’మకుటంతో రాసిన పద్య శతకం ఇది .

  సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-6-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

జయశంకర ప్రసాద్ -10(చివరి భాగం )

జయశంకర ప్రసాద్ -10(చివరి భాగం )

కామాయిని కావ్య సంశ్లేషణం -4(చివరిభాగం )

సామూహిక హత్యతో ఉన్న ‘’సంఘర్షణ పర్వం ‘’పూర్తయ్యాక ,’నిర్వేద సర్గం ‘’మొదలౌతుంది .మనువు శరీరమంతా గాయాలే .గ్లాని తో ఉన్న ఇడ అతన్ని చూసి పాత రోజులు గుర్తుకు తెచ్చుకుంటుంది .అసహ్యం –మమతల మధ్య అంతర్ సంఘర్షణ లో కకా వికలమౌతుంది .శ్రద్ధ కొడుకుతోసహా అక్కడికి వస్తుంది .ఆమె మాటలు అంతటా ప్రతిధ్వనిస్తాయి .అతనిలో రేగిన తుఫాను గమనిస్తుంది .వ్యాకులం లో మేల్కొనే ఉన్న మనువు ఎక్కడికో పరిగెత్తి పోతాడు .దర్శన్ సర్గ లో కొడుకును ఇడకుఅప్పగించి ఆమె అతని కోసం పరిగెత్తిపట్టుకొంటు౦ది . ఇడ తన హృదయబాధను శ్రద్ధకు తెలియజేస్తుంది .విరహం ,కలయిక నిత్య నిరతమైన ఈ జగత్తు నిత్య చితి రూపం అని పిస్తుంది .శ్రద్ధ కొడుకును అక్కున చేర్చుకొని ‘’సౌమ్యుడా !ఇడ నిర్మలానురాగం నీ దుఖాన్ని హరిస్తుంది .నువ్వు ఆలోచనా పరుడవు .మానవ సౌభాగ్యానికి భూమిక తయారు చేయి .సమరసభావాన్ని చాటు’’అని బోధిస్తుంది . .

  శ్రద్ధ మనువును కలుస్తుంది .ఆమె ‘’లోకాగ్ని లో కాలి కరిగిన ,మూసలో పోసిన విశ్వామిత్ర మాత్రు భూమిలా కనబడుతుంది .అతని రుణ విద్యుత్ ధన విద్యుత్ గా మారుతోందని చెబుతుంది .అతడు ఇప్పుడు స్వతంత్రుడు అని గుర్తు చేస్తుంది .కొన్నేళ్ళ క్రితం అక్కడే తాను అతనికి సర్వం సమర్పించు కొన్నాను అని చెబుతుంది .ఇద్దరం కలిసి శాంతి ప్రభాతం దగ్గరకు వెడదాం అంటుంది .

  తర్వాత అధ్యాయం ‘రహస్యం ‘’లో శ్రద్ధా ,మనువులు హిమాలయా రోహణం చేస్తూ౦డగా,మనువు అలసి పొతే ,ఆమె ధైర్యం చెప్పి ,ఎక్కడున్నామో చూడమంటే అతనికి ‘’మూడు అలోక బిందువులు ‘’కనిపిస్తాయి .ఆతడు మూడు లోకాల ప్రతినిధిగా ,అది ఇచ్చ జ్ఞానం క్రియల ప్రపంచం అని చెబుతుంది కామాయిని .అతడు ఆ త్రికోణ కేంద్ర బిందువు అనీ ,ఇచ్చాలోకం ఎర్రగా సుందరంగా జీవిత మధ్యప్రాంత౦ గా  ఉండి మధురలాలసతో కూడి మాయ రాజ్యం చేస్తుందని చెబుతుంది .రెండవ వృత్తాకారం కర్మలోకం .నియతి ,ప్రేరణ ప్రకారం ఇక్కడ చక్రం విరామం లేకుండా తిరుగుతుంది .ఇచ్చాలోకపు సుఖాలు ఇక్కడ దుఖాలుగా మారుతాయి .ఇక్కడ నిరంతర పోరాట వైఫల్యాలు కోలాహలం రాజ్యమేలుతాయి .భయపడి మూడవ లోకం గురించి అడుగుతాడు .అది జ్ఞాన క్షేత్రమని ,నిర్మలత్వం ఉదాసీనత ఇక్కడ ఉంటాయని ,అక్కడి మరుభూమిలా ఎండిన నది మెరుపుతో సమానమని ,ఇక్కడి మనుషులు భ్రమతోకూడిన శాంతి నెలకొల్పుతారు .శాస్త్ర పరిరక్షణ వారి బాధ్యత అని తెలియజేస్తుంది .దివ్య అనాహత నినాదం లో –శ్రద్ధాయుతుడైన మనువు తన్మయు డౌతాడు ‘’.

   ఆనంద సర్గ ఉపసంహార సర్గ .మానససరోవరం వైపు వెళ్ళే యాత్రిక సమూహం కనిపిస్తుంది .ఆ సమూహం లో మనువు శ్రద్ధా ఇడా,మనువు పుత్రుడు మానవుడు కూడా ఉన్నారు .మానససరోవరం చేరి అక్కడ మనువు ధ్యానమగ్నుడౌతాడు .అందరూ పరమ పవిత్ర భావనకు లోనౌతారు .శ్రద్ధ ఒడిలో కొడుకు మానవుడు ఉంటాడు .పాదాలవద్ద ఇడ నత మస్తక అయింది .కైలాసాన్ని చూపిస్తూ మనువు ‘’రెండు అనే భావనే విస్మృతి .ఈ అద్వైతాన్ని చూడండి ‘’అంటాడు –‘’నేను అనే చేతనా –అందర్నీ స్ప్రుశిం చేలా –అన్ని విభిన్న పరిస్థితుల –మత్తు గుటక తాగినట్లుగా ‘’ఉందన్నాడు .ఈ దృశ్యం లో కామాయిని ‘’ఈ జగతి ఏకైక మంగళకరమైన కోరిక గా ‘’కామం సంపూర్ణ ప్రతిమలా ,విశ్వ చైతన్యం పులకింత గా వర్ణించాడు జయశంకర ప్రసాద్ .-‘తనదంటూ ఉన్న ఒక కళలో –జడ చేతనాలు సమరసంగా ఉన్నాయి –సౌందర్యం రూపు దాల్చి –చైతన్య విలసితమైంది –గాఢ మైన ఆనందం అఖండం ‘’అంటాడు ప్రసాద్. ఆ ఆనంద సంగీతమే అన్నిటా ప్రతిధ్వనిస్తుంది .మానవ పరిణతి ఆశించి రాసిన కావ్యమే కామాయిని .

  ఆధారం –రమేశ్ చంద్ర శాహ రచనకు డా ఎ బి సాయి ప్రసాద్ చేసిన తెలుగు అనువాదం ‘జయశంకర ప్రసాద్ ‘’పుస్తకం .

  మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -31-5-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

జయశంకర ప్రసాద్

జయశంకర ప్రసాద్ -9
కామాయిని కావ్య సంశ్లేషణం -3
లజ్జ అధ్యాయం తర్వాత కథ త్వరత్వరగా జరిగిపోతుంది .ఆత్మ విశ్వాసం మేల్కొన్న మనువు యజ్ఞం చేస్తాడు .కాని యజ్ఞ విధానం మర్చి పోవటంతో ఒక పురోహితుడు అవసరమై అకులి ,కులాతుడు అనే ఇద్దరు ఆసుర వచ్చి కామాయిని గారాబంగా పెంచుకొన్న జింకపిల్లను కూడా బలి ఇవ్వటానికి సిద్ధపడి,మనువును ఒప్పిస్తారు .తిరిగి వచ్చిన శ్రద్ధ ఈ దృశ్యాన్ని చూసి తట్టుకోలేక పోతుంది .ముందుముందు రాబోయే అరిష్టాలు తలచుకొని కుమిలి పోయి మనువును నిందిస్తుంది .అతడేవొఆదర్శాలు వల్లిస్తే ,తీవ్రంగా ఖండిస్తుంది .సృష్టి అనేది భగవంతుడు నిరాఘాటంగా నిరంతరంగా సాగించే యజ్ఞమని ,సృష్టి వికసనం లో మానవుడు సహభాగస్తుడనీ,మనిషి ఈ బ్రహ్మాండానికి కేంద్రం కాదని హితవు చెబుతుంది .ఆమె తర్కానికి అతని వద్ద సమాధానం లేక పోవటం తో మనువు మౌనంగా ఉంటాడు .ఆమెతో ఏకీభవిస్తున్నట్లు నటించి సోమరస౦ గిన్నెను ఆమెకిస్తూ ‘’నువ్వు చెప్పినట్లే చేస్తా ‘’అంటాడు .అతడిని నమ్మి సోమరసం అమాంతంగా తాగేస్తుంది .
ఎనిమిదవ అధ్యాయం లో నాయకుడు మనస్తత్వ వేత్త అయిన ఆయన ఈర్ష .శ్రద్ధ గర్భం దాలుస్తుంది .ఆమెలో ఉండే ఆకర్షణ అందం చంచలత్వాదులు క్రమంగా తగ్గిపోయి ,అతని మనసు మారటం ప్రారంభమౌతుంది.అసుర పురోహిత ప్రభావం తో మనువు పూర్తిగా మారిపోతాడు .వేట వ్యసనం అవుతుంది .పేరాశ పెరిగి అసంతృప్తి చోటు చేసుకొంటుంది .శ్రద్ధ మాతృ సౌందర్యం అతడిని కాల్చుకు తింటుంది .గార్హస్త్యం గుది బండ అనుకొంటాడు .ఎందుకు విచ్చలవిడిగా ఉండకూడదు అని తర్కిస్తాడు .
‘’ఇడా ‘’ పేరున్న తొమ్మిదవ అధ్యాయం లో సారస్వత దేశం లో మనువు సరస్వతి నదిఒడ్డున ఒంటరిగా ఉంటాడు .దేవతల నాగరకతకు శంకు స్థాపన జరిగిన ప్రదేశం అది .ప్రస్తుతం ఊసర క్షేత్రం అయింది .దేవాసుర యుద్ధాలు గుర్తుకొచ్చి ,అసురులు శరీరాన్ని పూజించటం ,దేవతలు అహంకారం తో తమరినే ఆత్మగా భావించటం గుర్తుకొస్తుంది .నిజమైన ఆత్మజ్ఞానం లేకుండా దేవరాక్షసులు ఉండిపోయారు .ఇద్దరూ వంచితులై పోరాటానికి దిగారు .సంస్కార బీజాలు నిర్మూలనం కాకపోగా తిరిగి పుట్టి ,శ్రద్ధను పరిత్యజించటం దాకా సాగింది .మనువు మనసును కామభావన తొలి చేస్తూ ‘’ఆ సౌందర్య సాగరం లో నువ్వు గరళపాత్రనే ని౦పుకున్నావు ,నీ ప్రజాహితభావాలు కలుషితమయ్యాయి ,భవిష్యత్తులో కూడా కోపిష్టిగా నే ఉంటావు ,నిజమైన శ్రద్ధ రహస్యాన్ని ప్రజలు మర్చి పోతారు ,స్వర్గం ఎక్కడో లేదు .ఈ భూమి కళ్యాణ వేదిక .అది తన అతిక్రమణలో సహజ రహస్యాన్ని మరచి పరలోక వంచనకు గురౌతుంది .బుద్ధి భ్రాంతిలో కొట్టుమిట్టాడుతుంది .’’
తర్వాత మనువు బుద్ధికి ప్రతీక అయిన ‘’ఇడ’’ను కలుస్తాడు .ఆమె ఒకప్పుడు రాణిగా ఉండి పాలించిన ప్రాంతం అది .అతని వ్యధ విన్న ఆమె అతడు పరిపూర్ణుడు అని ,అతడికి కావాల్సిన సహాయమతడే చేసుకోవాలని ,,సకల ఐశ్వర్యనిలయ ప్రకృతి అతనికోసం నిరీక్షిస్తోందనీ ,కంటికి కప్పిన పొర తొలగించు కోమని ,అందర్నీ శాసిస్తూ యోగ్యతలు విస్తరించు కోమని ,అతడే నిర్ణాయకుడు ‘’అని బోధిస్తుంది ఇడ.
పదవ అధ్యాయం లో శ్రద్ధకు ఒక కలవస్తుంది .అందులో సారస్వత దేశం లో మనువు ఇడ తో కలిసి పాలిస్తున్నట్లు ,సంస్కారయుత నాగరకతను సృష్టిస్తున్నట్లు అవన్నీ చూస్తూ ఒక ఆశ్చర్యకర మహలు లో ప్రవేశించినట్లు అక్కడ సింహాసనం పై మనువు ను చూసినట్లు ,ఇడఅతనికి మధుపాత్ర అందిస్తున్నట్లు ,అతడు ఆమెతో ‘’ఇంత సుందర హర్మ్యం నిర్మించానుకానీ ఇక్కడ నా హృదయ మందిరం లో ఎవరుంటారు ?’’అని అడిగినట్లు ,జవాబుగా ఇడ’’నేను నీ ప్రజలలోని ఆర్తి ని ‘’అన్నట్లు ,కామంద మనువు ఆమెను బాహువులలో బందించినట్లు ,భయకంపితయై ఆమె అతడిని తోసేసినట్లు ,అతడి చేస్ట అక్కడ అల్లకల్లోలం సృష్టించినట్లు ,బాధిత ప్రజాసమూహం అతనివైపు విపరీతమైన కోపంతో రావటం ,ప్రజలు తిరగ బడుతున్నారనే భయంతో మనువు ప్రధాన ద్వారాన్ని మూసేయించటం ‘’కలలోస్పష్టంగా చూసింది శ్రద్ధ .
ఆమె కల నిజమే .సారస్వత దేశ ప్రజలు బాధలు పడుతూ ఉంటారు మహల్ లో మనువు ఆలోచిస్తూ ఉంటాడు .సాను సర్వాధికారినని ప్రజలకు అనేక మేళ్ళు కలిగించాననీ,అయినా వారికి విశ్వాసం లేదని అనుకొంటాడు . ఇడఅక్కడికి వచ్చి ‘’శాసనం చేసినవాడే ఉల్లంఘిస్తే వాడికిసర్వనాశనం తప్పదు .ఏప్రజాపతీ ఇప్పటిదాకా హద్దు లేని అధికారం అనుభవించలేదు .ఇక ముందు కూడా అనుభవించడు ‘’అని స్పష్టంగా చెప్పింది –‘’రాగం తాళం పాటించిన లయను తప్పిపోనివ్వకు –తెలియకుండానే నువ్వు వివాద స్వరాన్ని వదలకు ‘’అని హెచ్చరిస్తుంది .
మనువు ప్రతిక్రియ ఉగ్రరూపం దాలుస్తుంది .ఇడను’’ మాయావి ‘’అని దూషిస్తాడు .ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తాడు .సింహద్వారం తెరుచుకొంటుంది .ప్రజలు లోపలి ప్రవేశించి ‘’నువ్వే లోభగుణాలను నేర్పావు .యంత్రాలు ప్రవేశపెట్టి మాసహజ శక్తులను ధ్వంసం చేశావు ‘’అని కోపంగా విరుచుకు పడగా తోక తొక్కిన పాములా,క్రోధం తో ఊగిపోయాడు .’’ప్రకృతి చేతిలో కీలు బొమ్మల్లారా ‘’అంటూ నిందిస్తాడు .ఆకులి, కిలాతుడు ఈతిరుగు బాటుకు నాయకత్వం వహించటం చూసి ఆశ్చర్యపోతాడు .వాళ్ళను ధరాశాయిలుగా మార్చి ఆఘర్షణలో మనువు కూడా గాయపడతాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -30-5-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

జయశంకర ప్రసాద్ -8

జయశంకర ప్రసాద్ -8

కామాయిని కావ్య సంశ్లేషణం -2

 కామాయిని రెండవ సర్గ పేరు ఆశ .ప్రళయ కాళ రాత్రి తన వికృత స్వరూపం చూపించి నీటిలో అదృశ్యమౌతుంది .ఉషస్సు తన బంగారు కిరణాలతో జయలక్ష్మిలా ఉదయిస్తుంది .ఇందులో మనుషుల అంతరంగాన్ని బయట పడేస్తాడు కవి జయశంకర ప్రసాద్ .హిమ ఆచ్చాదం తొలగి భూమి నెమ్మదిగా బయట పడింది .వనస్పతులు మత్తుగా లేచాయి .ప్రకృతి చైతన్యమైంది .జలధి తల్పం పై భూమి పెళ్ళికూతురు రాత్రి కోలాహల జ్ఞాపకాలతో అలిగి ఒదిగి కూర్చుంది .ఈ ప్రళయం వెనక ఉన్న శక్తి ఏది ?అనే ప్రశ్న వచ్చింది .దేవతాశక్తి అయిన పకృతి శక్తి అని సమాధానం దొరికింది .దైవత్వం ఒక భ్రమ మాత్రమే .మనం తోలు బొమ్మలమే అనే భావం కలిగింది .ప్రకృతికి కావాల్సిన జీవరసాన్ని ఎవరిస్తున్నారు ?ఆ అస్తిత్వం ఎక్కడుంది ?ఎవరి ఆజ్ఞల్ని గ్రహనక్షత్రాలు పాటిస్తున్నాయి ?మనువుకు ఈ అస్తిత్వపు చిరు సవ్వడి వినిపిస్తుంది .అది అనంత రమణీయం .దీనితో లోలోపల ఒక మెలకువ కలుగుతుంది –‘’వరం లాంటి భావం నా చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది .నేను ఉంటానని నేనూ స్వరం కలిపాను ‘’

  ఈ జిగీష తర్వాత మనువు ఒక గుహలో నుంచి తన జీవిత చర్చ చేస్తాడు .జీవితానుభవం ఒక యజ్ఞ రూపం లో కనిపిస్తుంది .అది ఆయన నిత్యజీవితం లో అంతర్భాగమే అయిపోతుంది .అనుభూతి చింతనలు క్రమంగా విస్తరించి అంతర్జగత్తును ఆవిష్కరిస్తాయి .ఒంటరిగా ఉన్నానన్న తీవ్రభావన ఆయన్ను కలవర పెడుతుంది  .

   శ్రద్ధా సర్గ లో కవి సుందర ఛందస్సులా మనువు శ్రద్ధను దర్శిస్తాడు .ఆమె వేసిన జిజ్ఞా పూర్వక ప్రశ్నకు సమాధానమిస్తూ ‘’నేను భూమ్యాకాశాలమధ్య నిరపాయంగా వేలాడుతున్న జీవన రహస్యాన్ని విస్మృతి చైతన్య రహిత స్తూపాన్ని ‘’అని పరిచయం చేసుకొంటాడు .ఆమె అతని గుండెల్లో ఆశ రేపుతుంది .’’శ్రుణ్వంతు విశ్వే అమృతస్య పుత్రః ‘’లాంటి ధైర్యాన్నిస్తాడు .ఆమె అతడిని ‘’చేతన సుందర చరిత్ర లాంటి అఖిలమానవ భావ సత్యం వైపుకు ఉన్ముఖుడిని చేస్తుంది .ఆమె సాంగత్యం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది .మధుమాస అనుభూతి కల్గిస్తుంది .మోహం మొలకెత్తుతుంది .ఒకరాత్రి కలలో ‘’కామం ‘’స్వరం వినిపించి ,సృష్టిలీలను ప్రేరేపించే మూలశక్తి అయిన ప్రేమకళను పరిచయం చేస్తుంది .దాన్ని పొందే యోగ్యత సాధించమని మనువు మనసు బోధిస్తుంది .

‘’వాసన ‘’అనే నాలుగవ అధ్యాయం లో మను –శ్రద్ధ ల సహజీవనం తళుక్కుమంటు౦ది .తర్వాత అతడి ఈర్ష్య ,అధికార దర్పం వ్యక్తమౌతాయి .ఇందులో స్త్రీ పట్ల పురుషుడి కోరిక మేల్కోవటం దాని అభి వ్యక్తీ దృశ్యాలు ఉంటాయి .శ్రద్ధ లోని స్త్రీత్వం కొంత చలిస్తుంది –‘’నారీత్వపు ఆ ఆది మధురాను భావం –నాలో పె౦పొందిస్తోంది అనురాగం –మధుర క్రీడా చింతనతో ఉత్సాహం మీటగా పలికి౦ది ఆనందం తో హృదయం ‘’అంటుంది .

  ‘’లజ్జ ‘’అధ్యాయం లో   స్త్రీ హృదయపు అత్యంత సూక్ష్మ గుణగణాలపై రాయబడింది..సమర్పణకు ముందు అంతర్ జగత్ భావ సృష్టి ,దాని కార్యకలాపాలతో కూడిన సంవేదనాత్మక సృష్టి హిందీ సాహిత్యం లో అంతకు ముందు లేనే లేదు .ప్రసాద్ కవిత్వం మంత్రం ముగ్ధుల్ని చేస్తుంది .’’ది ఆఫుల్ డేయరింగ్ ఆఫ్ ఎ మూమెంట్స్ సరెండర్  ‘’అన్నాడు ఆంగ్లకవి .స్త్రీ హృదయం దృష్టిలో ఈ సమర్పణ భావం తీవ్రంగా హృదయానికి హత్తుకోనేట్లు చిత్రించాడు ప్రతిభతో ప్రసాద్ .చాయావాదకవిత్వం రాసిన జయశంకర్ సర్వ శ్రేష్ఠ ఐంద్రియ కవిత్వమూ రాసి సవ్యసాచి అయ్యాడు .-‘’కోమల కిసలయాల కొంగులో –దాగిన అతి చిన్నారి మొగ్గలా-సాయం కాల దుమ్ము తెరలో –ప్రకాశించే దీప స్వరంలా –మెరిసే మనసు ఉన్మాదంలా-సురభిత అలల నీడలలో –బుడగ వైభవం చిమ్ముతోంది –సరస వసంత కుతూహలంలా –కనులనిండిన నీటితో ఉంది ‘’.

  లజ్జ లో స్త్రీకి అధిక ప్రాధాన్యమిచ్చి భారతీయతకు అద్దంపట్టాడు జయశంకర్ .’’సౌందర్యం అని దేన్నీ అంటారో –ఎవరిలో అది ఎప్పుడూ జాగృతమౌతుందో –ఆ చపలత్వ ధాత్రినేను-తగలబోయే దెబ్బలని నిదానంగా తెలియజేస్తాను’’ .ఇందులో మనసుయొక్క జ్ఞాన సరసత్వం ,దాని అనుభవ పరిపక్వత స్పష్టం చేస్తాడు కవి –‘’ఎప్పుడూ జాగృతి కోరను –కదలను మెదలను –పిచ్చివానిలా ఆలోచించ లేక పోతున్నాను –పురుష తరువు పరిష్వంగం లో –లతలా ఉయ్యాలలూగుతున్నాను .’’ఆమె లోని ఈ అంతర్ నాట్యం వ్యాఖ్యానం చేస్తుంది .దీనితో పాఠకులు ఒక ఆశ్చర్యకర ఆట౦కాన్ని అనుభవిస్తారు .-‘’ఈ అర్పణలో ఏ ముంది ?త్యాగం పోగు మాత్రమె –ఇచ్చి ,బదులుగా మరేదీ తీసుకోలేను’’అంటుంది .ఇందులో    యేట్స్ కవి రాసిన’’ క్రేజీ గన్ ‘’లో లాగా ‘’హోల్ నెస్’’ను సంపూర్ణత్వం తో సమర్పణ చేసిందని పిస్తుంది .అధ్యాయం చివర్లో –‘’ఓనారీ!నువ్వు కేవలం శ్రద్ధవు –విశ్వాసం వెండికొండ బాటలపై-జీవితపు ఈ సుందర సమతలం పై –పీయూష ధార గా ప్రవహించు ‘’.ఇక్కడే ఇలియట్ రాసిన ‘’వేస్ట్ లాండ్’’  కావ్యం గుర్తుకొస్తుంది .

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-5-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సరస భారతి 165వ కార్యక్రమం గా ‘’సాహితీ పుష్కర మహోత్సవం ‘’ –(బులెటిన్ -2)

సరస భారతి 165వ కార్యక్రమం గా ‘’సాహితీ పుష్కర మహోత్సవం ‘’ –(బులెటిన్ -2)

సాహితీ బంధువులకు శుభ కామనలు –

సరసభారతి స్థాపించి 12 సంవత్సరాలు అయిన సందర్భంగా ,సరసభారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ గారి ‘’సహస్ర చంద్ర మాసోత్సవం ‘’’’సందర్భంగా

27-6-2022 సోమవారం సాయంత్రం 4 గం.లకు సరసభారతి 165వ కార్యక్రమంగా ‘’సాహితీ పుష్కరోత్సవం’’,ఉయ్యూరులోని టాక్సీ స్టాండ్ వెనుక ఉన్న ‘’శాఖా గ్రంధాలయం నందు ( A/C లైబ్రరి )నిర్వహిస్తున్నాము .ముఖ్య కార్యక్రమాలు –

1-శ్రీమతి ఏలేశ్వరపు రాధికా సుబ్రహ్మణ్యం (మచిలీ పట్నం )గారిచే ‘’సంగీత విభావరి ‘’

2-శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ రచించిన ‘’అణుశాస్త్ర వేత్త డా.ఆకునూరి రామయ్య ‘’కు ‘’ఆంగ్లానువాద పుస్తకం ‘’ ఆవిష్కరణ –ఆవిష్కర్త శ్రీ వై విబి రాజేంద్ర ప్రసాద్ – శాసనమండలి మాజీ సభ్యులు .

3-  కోరకుండానే సరసభారతి కి విరాళాలను అందించిన వదాన్యులైన శ్రీ మైనేని గోపాలకృష్ణ శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా ) ,శ్రీ సుంకర కోటేశ్వరరావు(హైదరాబాద్ ) ,డా ఆకునూరి రామయ్య శ్రీమతి కృష్ణ మయి దంపతులు (అమెరికా )డా.రాచకొండ నరసింహ శర్మ(విశాఖ పట్నం ) ,శ్రీ వేలూరి వివేకానంద్ (హైదరాబాద్ ),శ్రీ కోమలి సా౦బావధానిశ్రీమతి విజయలక్ష్మి దంపతులు (అమెరికా )శ్రీ పువ్వుల నరసింహారావు ,శ్రీమతి కరుణానిధి దంపతులు (ఉయ్యూరు ),శ్రీ వేలూరి మృత్యుంజయ శాస్త్రి శ్రీమతి విజయ లక్ష్మి దంపతులు (అమెరికా )శ్రీ జగదీశ్ శ్రీమతి లక్ష్మి దంపతులు (అమెరికా )షార్లెట్ సరసభారతి మొదలైన వారి   సౌజన్యంతో సాహితీ క్షేత్రం లో అపూర్వ సేవలు అందించిన –ఆధ్యాత్మిక ప్రవచన ప్రముఖులు బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి (చీరాల ),అవధాన రవళి శ్రీ ఆముదాల మురళి (తిరుపతి ),బాలసాహిత్య శ్రీ శ్రీ బెల్లంకొండ నాగేశ్వరరావు (చెన్నై) ,అపూర్వ కథా రచయితశ్రీ గంధం యాజ్ఞవల్క్య శర్మ (నరసరాపేట ),రమ్యభారతి సంపాదకులు ,శ్రీ చలపాక ప్రకాష్ (విజయవాడ ),64 కళల నిపుణ శ్రీ వై.కళాసాగర్ (విజయవాడ ),సోషల్ రిసెర్చ్ పయనీర్  డా .ఎన్ .భాస్కరరావు(ఢిల్లీ) వివిధ సాహిత్య ప్రక్రియల నిపుణ  డా.  చిల్లర భవానీ దేవి (హైదరాబాద్ ),ప్రపంచ పర్యాటకురాలు గ్రంథకర్త,క్రీడాకారిణి డా.  నోముల నర్మదా రెడ్డి (హైదరాబాద్ ),ప్రముఖ సాహితీ వేత్త శ్రీమతి మైలవరపు అరుణ కుమారి(గుంటూరు ), బాలఅష్టావధాని  చి.ఉప్పలధడియం భరత శర్మ(తిరుపతి ) స్థానిక చరిత్ర పరిశోధకులు శ్రీ కానూరి బదరీనాథ్ (తణుకు )గోదావరి జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు –శిష్టు సత్య రాజేష్ (అమలాపురం),సాహితీ,ఆధ్యాత్మిక వేత్త  శ్రీ కంభం పాటి సుబ్రహ్మణ్యం(కుర్తాళం)  మొదలైన సాహితీ ప్రముఖులకు’’సరసభారతి  విశిష్టసాహితీ సేవా పురస్కారాలు’’, సాహితీ సేవా పురస్కారాల  ప్రదానం .

4-‘’సరసభారతి సాహితీ పుష్కరోత్సవం ‘’ అనే అంశం పై ప్రముఖ కవులచే కవిసమ్మేళనం .

 కార్యక్రమ నిర్వహణ ,పర్యవేక్షణ –ప్రముఖ కవి ,విశ్లేషకుడు శ్రీ దండి భట్ల దత్తాత్రేయ శర్మ (విజయవాడ )

     సహకారం –శ్రీమతి మాది రాజు శివ లక్ష్మి –సరసభారతి కార్యదర్శి

 కవులు ,కళాకారులు ,సాహితీ వేత్తలు ,అతిధులు ,సాహితీ బంధువులు విచ్చేసి జయప్రదం చేయ ప్రార్ధన .

                   ఆహ్వానించు వారు

 జోశ్యుల శ్యామలాదేవి –సరసభారతి గౌరవాధ్యక్షురాలు

శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి –సరసభారతి కార్యదర్శి

శ్రీ గబ్బిట వెంకటరమణ –సరసభారతి కోశాధికారి

శ్రీ వి.బి.జి.రావు –సరసభారతి సాంకేతిక నిపుణులు

తెలుగులో మాట్లాడటం మన జన్మ హక్కు

 కవి సమ్మేళనం లో పాల్గొనే కవుల తో సహా మరిన్ని వివరాలు ‘’బులెటిన్ -3’’ లో తర్వాత తెలియజేస్తాం .

 27-5-22-ఉయ్యూరు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

జయశంకర ప్రసాద్ -7

జయశంకర ప్రసాద్ -7
కామాయిని కావ్య సంశ్లేషణం -1
‘’జడ చేతనాలు సమరసంగా ఉన్నాయి –సుందర సాకార రూపం ఏర్పడింది –చైతన్యపు విలసనం –అఖండంగా చిక్కగా ఆనందం వెల్లి విరిసింది ‘’అని కామా యిని మహాకావ్యం లో జయశంకర ప్రసాద్ చివరి వాక్యాలు రాశాడు .ఆ ఆనందం జీవితాంతం వ్యాపించి ఉన్న సాధన యొక్క పరమ ఉత్కర్ష .దీనిప్రారంభం ప్రళయ తాండవం తో కమ్ముకున్న ప్రకృతి రంగస్థలం పై జరిగింది .ఇలాంటి కథ అనేక దేశాలలో వ్యాపించి ఉన్నదే .కానీ ప్రసాద్ ఇందులో విశ్వ మానవుడి ఆత్మ కథను వినిపించాలనీ, వినాలనీ అనుకొన్న కళాకారుడికి సహజ స్వభావం కూడా .ఈ కావ్యం లో మనస్తత్వ శాస్త్రం ,,చరిత్ర ,ఆదిమతత్వం ,ఆధునికత ,మత సంబంధ సంవేదన ,మత ప్రమేయం లేని దృష్టి ,నాటకం ,కవిత్వం అన్నీ ఒక బిందువులో ఏకాగ్రమై దర్శన మిస్తాయి ..ఇది కావ్య నాటక కథ ఉన్న మహా కావ్యం .
‘’హిమగిరి ఉత్తుంగ శిఖరం పై-శిలల శీతల ఛాయలో కూర్చుని-తడి ఆరని కన్నులతో ఒక పురుషుడు –ప్రళయ ప్రవాహాన్ని చూస్తున్నాడు.-కింద నీరు ,పైన మంచు –ఒకటి తరళం మరొకటి సఘనం –ప్రథానతత్వం రెండిట్లో ఒకటే –దాన్ని జడం అనండి చేతనం అనండి –తరల తపస్విలా ఆతను కూర్చున్నాడు –సుర స్మశానం లో సాధన చేస్తున్నాడు –దిగువనున్న ప్రళయ సింధు అలలు –కరుణా జనకం గా నశిస్తున్నాయి ‘’ ఆతరుణ తపస్వి మనువు . మనుష్యత్వం ఉన్న మహాకావ్య నాయకుడు .వేద,పురాణ ఇతిహాసాలలో మను చరిత్ర ఉంది .అతడు మానవతా నవ యుగ ప్రవర్తకుడు .మనువు, శ్రద్ధల దంపతులకు మానవుడు ఉద్భవించి ,మానవ వికాసానికి తోడ్పడ్డాడు .ఇదొక ‘’అల్లిగరి’’ మాత్రమె .ఇందులో సార్ధకత ,సంగీతం ఇమిడి ఉన్నాయి .ప్రసాద్ వేదాంతం సహజ అంతర్ దృష్టి .మైధిలీశరణ్ గుప్త కవి తో ఏమాత్రం తీసిపోని మహాకవి జయశంకర్ .ఇరవై వ శతాబ్దపు మనిషి ,మానవాళికి ద్రోహం చేసే జాతీయతావాదం సారం లేని అంతర్జాతీయతా వాదాల మధ్య ఇరుక్కున్న మనిషిని ఉద్ధరించే మార్గం చూపాడు .శ్రద్ధ విషయం లో కవి సహజ వివేకంతో ఉంటాడు .ఆమే కవితకు ఆరవ ప్రాణం .మొదటి దేవుడు కాముడు కుమార్తె గా కామాయిని ని భావిస్తారు .ఋగ్వేదం లో శ్రద్ధ ,మనువు ఋషులు .ఈ అస్తిత్వం లో స్త్రీ ,పురుష తత్వాలు మిశ్రితాలై ఉంటాయి .ఈ శ్రద్ధనే కవి తన సృజనాత్మక కల్పనా ,సంపూర్ణ స్వాదీనతా ,స్పూర్తి లతో సృష్టించాడు .
సూక్షం గా కథ
జలప్రళయం కామాయినీ కావ్యానికి నేపధ్యం .శతపద బ్రాహ్మణం 8వ అధ్యాయం లో జలప్రళయ వర్ణన ఉంది .ప్రసాద్ ఇది మన దేశ గాథ గా నే చెప్పాడు .ఈ జలప్రళయం ద్వారా విలక్షణ మానవులకు ,ఒక విభిన్న సంస్కృతిని సృష్టించటానికి దేవతలు మనువుకు ఒకావకాశం ఇస్తారు .దేవతల విచ్చలవిడి వలన వారి సంస్కృతీ నాశనమౌతుంది .అప్పుడు వచ్చిన ప్రళయం లో ఒక్క మనువు మాత్రమె బతికి బయట పడ్డాడు .అతడే మానవ దృష్టికీ సంస్కృతికి శ్రీకారం చుట్టాడు .ఒకరకం గా శాపం వరంగా మారుతుంది .ఈ విపత్తు వలన మనువు తానూ లోపలా బయటా కూడా శిధిలమై పోయినట్లు భావిస్తాడు .ఆత్మ చేతనం అనే కొత్త విధిని చేబడతాడు .దీనిద్వారా మానవీయ ప్రవృత్తులను ,భావాలు బుద్ధి సంపదను పొందుతాడు .
జలప్రళయ తీవ్రత తగ్గి భూమి క్రమగా బయట పడుతుంది .ఈ నేపధ్యం లో మనువు మనసులో చింత రేగుతుంది .గతమంతా ముందు సుళ్ళు తిరుగుతుంది .అమరత్వ౦ లేని జీవితతం తో గర్వంగా ఉండే రూపాన్ని దర్శిస్తాడు .మృత్యువు యదార్ధం అనే భావన కలుగుతుంది .ఈ జీవితం మృత్యువు యొక్క ఆశ అని తెలుస్తుంది .మానవ బుద్ధి మనువులో జాగృతమై ,మనం మారే కీలు బొమ్మలమని ,దేవతలం కాము అనే భావన స్థిర పడుతుంది .మార్పు లక్షణమే చింత ,అది తప్పని సరి అని తెలుస్తుంది .ఈ చింత మొదటిరేఖ విశ్వ వనం లో సంచరించే వ్యాలం తో పోలుస్తాడు .పుణ్య సృష్టిలో సుందర పాపమే చింత అని పోలుస్తాడు .ఇది అగ్ని పర్వతం ప్రేలేటప్పుడు వచ్చే భయంకర శబ్దం లాంటిది .అభావపు చపల బాలిక వంటిది .ఇది హృదయాకాశ ధూమకేతువు .అది కనిపించటం అమంగళం అనిష్టం అని అందరి నమ్మకం .ఇదంతా మొదటి సర్గలోని విషయాలు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-5-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment