విదేశీ సంస్కృత విద్వాంసులు 45-విదేశాలలో సంస్క్రుతాధ్యయనం 6-ఇండోనేషియా దేశం

విదేశీ సంస్కృత విద్వాంసులు

45-విదేశాలలో సంస్క్రుతాధ్యయనం

6-ఇండోనేషియా దేశం

క్రీశ 1 -4శతాబ్దాలమధ్య ఇండోనేషియాలో భారతీయ రాజుల  పాలన జరిగింది .కంబూజ  అని నేడు పిలువబడుతున్న కా౦భోజలో శ్రీమార ,కౌండిన్య ,సుమత్రలో శ్రీ విజయ ,జావా ,బాలీ లలో శైలేంద్ర వంశాలు  పాలించాయి .రామాయణ భారతాలలో బౌద్ధ గ్రంధాలలో దీవులమధ్య సాహస కృత్యాల వర్ణన కనిపిస్తుంది .నౌకా వాణిజ్యం చేసేవారిని సార్ధ వాహులన్నారు .వేణు పథ,అజపథ,మేష పథ మార్గాలలో వీరు ప్రయాణించారు .గుణాఢ్యుని బృహత్కథలోనూ ఈ విశేషాలున్నాయి .ఇక్కడి వాల్మీకి రామాయణం లో సీత జాడకోసం వినత అనే సైన్యాధికారి ఇక్కడికి వచ్చింది .సుగ్రీవుడు ఫసిఫిక్ దీవులగురించి బాగా వర్ణించి చెప్పాడు –

ఫసిఫిక్ సముద్రంలో చెల్లాచెదరైన దీవులు ఇండియా గ్రీక్ చైనా అరేబియా దేశాలవారివే .పురాణవర్మ 4వ శతాబ్దిలో జావాను  పాలించిన శాసనం ఉంది .మధ్యజావాలో బుకీర్ హిల్స్ పైన ఉన్న పూతికేశ్వర శివాలయం లో ని 12సంస్కృత శ్లోకాల శిలాశాసనంపై జావా –హిందూ సామ్రాజ్య వివరాలున్నాయి .కథ ద్వీపం అనే మలేషియాలో సన్నాహ రాజు పాలన ఉండేది .మతారం కదిరి ,సింహసారి ,మజాపహిత్ వంశాల పాలన క్రీశ 732నుంచి 1486వరకు జరిగింది .

  ఇవాల్టి ఇండోనేషియా అంటే 3200 కిలోమీటర్లు తూర్పు పడమరలలో ,1800 కిలోమీటర్లు ఉత్తర దక్షిణాలలో వ్యాపించిన 13677దీవుల సముదాయం .16శతాబ్దాల హిందూపాలన తరవాత జావా ముస్లి౦ రాజ్య౦, ఆ తర్వాత డచ్ రాజ్యమైంది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్ ఆపిమ్మట జపనీయుల కిందకు వచ్చింది .సుకర్నో నాయకత్వాన .హత్తా తోడ్పాటుతో 17-8-1945 స్వతంత్ర దేశమైంది .అయితే సాంస్కృతికంగా పూర్వవిదానాన్నే అవలంబించి అభివృద్ధి చేశాడు సుకర్నో .జావారాజులు పొడవైన సంస్కృత బిరుదులే ఇష్టపడ్డారు .శాసనాలు సంస్కృతం లోనేరాయించారు .హరిసేంది సముద్రగుప్త ప్రశస్తి కి విశేష ఆదరణ ఉండేది .వందలాది సంస్కృత శాసనాలున్నాయి .జావా హిందూ రాజులు సంస్కృతం స్థానిక మలయన్ అనే జావి కలిసిన భాష ‘’కివి ‘’భాష ను ప్రోత్సహించారు .

  ఇండోనేషియా సాహిత్యం కాకవీన్ అంటే సంస్కృత కావ్య సాహిత్యం ,కిడుంగ అంటే అపభ్రంశ సంస్కృతం  జేగూరితాన్ అంటే స్థానిక జానపద సాహిత్యం గా కనిపిస్తుంది .సంస్కృత కావ్యాలన్నీ రామాయణ భారత ఇతిహాసాలు  జావా భాష లోకి అనువాదం పొందాయి సంస్కృత నీతి శాస్త్రం ,రాజనీతి శాస్త్రాలుకూడా అనువాదం పొందాయి ,కామశాస్త్రం స్మరతంత్రంగా అనువాదమైంది .సంస్కృత బాలినీస్ అనుబంధం పెరిగింది .కాళిదాస కావ్యాలన్నీ అనువాదం పొందాయి .తత్వ శాస్త్రం ‘’తుతూర్’’గా అనువాదమైంది ..హిందూ పండుగలు వైభవంగా నిర్వహిస్తారు .విమాన యాన సంస్థ లో గరుడ విమానాలున్నాయి .శివుడిని దాలెం ,విష్ణువును పూసే ,బ్రహ్మ ను దేశే, పితర ను దద్యా ,దేవాలయం పుర గా పిలుస్తారు .బాలిలో సంస్కృత విద్యాలయాలు రిసెర్చ్ కేంద్రాలున్నాయి .ఇన్ ష్టిట్యూట్ ఆఫ్ హిందూ ధర్మ ఏర్పడింది .సింగరాజ లో వ్రాతప్రతుల లైబ్రరి ఉంది  బాలి రాష్ట్రప్రభుత్వం ఉదయన యూని వర్సిటి  నెలకొల్పింది .మహాసరస్వతి యూని వర్సిటి సిటీ మధ్యలో ఉంది . వైస్ చాన్సలర్ సంస్కృత పండితుడైన మిస్టర్ తాంబ .

7-మెక్సికో దేశం

మెక్సికో లో సంస్కృత అధ్యయన ప్రారంభానికి నాంది పలికినవాడు అస్సాం కు చెందిన ప్రొఫెసర్ హేరంబ లాల్ గుప్త .ఈయన ఇంగ్లాండ్ లో ఉండి భారత స్వాతంత్ర్య సమరం నడిపాడు .జర్మని అమెరికాలలో సీక్రెట్ స్పై సర్వీస్ లో పని చేశాడు .1927లో అమెరికాలో అరెస్టయి విచారణ ఎదుర్కొని ,అక్కడినుంచి తప్పించుకొని మెక్సికో సరిహద్దు చేరగా అక్కడి రైతులు అతడు చాలా నీరసంగా ఉండటం గమనించి ,కాపాడారు .అత్య౦త పేదరికం తో మెక్సికో సిటీ చేరి ,మెక్సికో యూని వర్సిటి లో సంస్కృత బోధనకు కుదిరి 17ఏళ్ళు1930-47 పని చేశాడు .ఆన్త్రోపాలజిస్ట్ అయిన గుప్త మెక్సికో సంస్కృతం పై అభిరుచి కలిగించి సంస్కృత జ్యోతి వెలిగించాడు .మెక్సికోలో రాజకీయ శరణార్ధిగా ఉంటూ అక్కడి అమ్మాయినే పెళ్ళాడి,చనిపోయేనాటికి 3లక్షల మెక్సికన్ పిసోస్ ధనంతో  బాగా సంపన్నుడయ్యాడు.ఇదంతా విడాకులు పొందిన భార్యకు దక్కింది .ఆయన అస్తికలు మాత్రం ఇండియాకు పంపారు .

  1963లో ప్రొఫెసర్ లేసిడిరో లాంగ్ గుప్తా స్థానంలో సంస్కృతం బోధించి 1968లో చనిపోయాడు .తర్వాత నేషనల్ యూని వర్సిటి ప్రొఫెసర్ మిగుల్ కోరోజో మూడి సంస్కృతం నేర్పాడు .ఇతడు గుప్తాగారి శిష్యుడే .సంస్కృత అధ్యయనం , యూని వర్సిటిలో బాగా వేర్లు  పాతుకున్నది .సంస్కృత గ్రీక్ లాటిన్ అవెస్తా తులనాత్మక అధ్యయనం ఇక్కడ బాగా జరిగింది .తర్వాత ఇదే పోస్ట్ గ్రాడ్యుయేట్  రిసెర్చ్ సెంటర్-‘’ఎల్ కోలీజియి డి మెక్సికో ‘’గా 1940 లో   మారి ,ఫ్రాన్స్ లోని పారిస్ లో’’  కాలేజ్ డిఫ్రాన్స్’’ ఏర్పడటానికి మార్గదర్శి అయింది .ప్రొఫెసర్లను తయారు చేసింది .డేమోగ్రఫీ ఇంటర్ నేషనల్ రిలేషన్స్ ,ఎకనామిక్స్ ,ఓరియంటాలజి లపై రిసెర్చ్ జరిగింది .ఎల్ కాలేజి మొదటి ప్రొఫెసర్ డాన్ డేనియల్ కోసియో విల్లెగాస్ ,సిల్వియో జావాల లు సంస్కృత శాస్త్రీయ అధ్యయనానికి తెర దీశారు.

  ప్రొఫెసర్ సిల్వెన్ లెవి ,లూయిస్ రెనౌ అనే ఫ్రెంచ్ ఇండాలజిస్ట్ లు 12ఏళ్ళలో అద్భుత కృషి చేశారు 1934లో శ్రీహర్షుని రత్నావళి ప్రియదర్శిక ,,రుతుసంహార కావ్యం ,లాటిన్ వ్యాకరణ చరిత్ర ముద్రించారు .ప్రొఫెసర్ గ్రేషిలా డీ లా లామా సెంటర్ ఆఫ్ ఒరియంటల్ స్టడీస్ డైరెక్టర్ అయి ,సంస్కృత ప్రొఫెసర్ కూడా అయి , .భారతీయ న్యాయ వేదాంత అధ్యయనం చేయించి అద్వైత వేదాంతానికి స్కాలర్షిప్ కూడా ఏర్పాటు చేసింది .గౌడపాద కారిక ,మాండుక్య ఉపనిషత్ లకు భాష్యం రాసింది .వేదాంత పరిభాష,కేశవ మిశ్రుని తర్కభాష లను స్పానిష్ అనువాదం చేసి ప్రచురించింది .ప్రొఫెసర్ గోండా రాసిన సంస్కృత గ్రామర్ ను స్పానిష్ లోకి అనువదించింది .

  మొరోనాన్ డీ పెరు విద్యార్ధిగా  లామా వద్ద సంస్కృత వ్యాకరణం వేదాంతం ,సాంఖ్యం అభ్యసించాడు .ఇప్పుడు ఇండియన్ ఇండాలజీ పై అక్కడ అభిరుచి పెరిగింది .ప్రొఫెసర్ జోషి సంస్కృత కృషికి బిర్లా అవార్డ్ శ్రీవాని అవార్డ్ సాహిత్యకాడేమి అవార్డ్  వంటి ఎన్నెన్నో అవార్డులు పొందాడు  . ఆర్ వి జోషి మోహ భగ్నం  మహాకావ్యం ,శ్రీకృష్ణ కర్ణామృతం ,వేంకటాధ్వరి లక్ష్మీ సహస్రనామం ,రస పంచాధ్యాయి ,ప్రజ్ఞాపారిజాతం ,శివలింగ రహస్యం ,భక్తి మీమాంస ,స్పర్శాస్పర్శ వివేకం ,ఉపదేశ వల్లి ,రామప్రతాప చరితం సువర్ణమాల ,పతంజలి యోగ సూత్ర మొదలైన 20గ్రంధాలు జోషి ఆధ్వర్యాన ప్రచురి౦ప బడ్డాయి .ప్రోఫెసర్ రసిక్  విహారి జోషి నేషనల్ యూనివర్సిటిలో సంస్కృతం ,ఇండియన్ ఫిలాసఫీ అండ్ రెలిజియన్ బోధించాడు .ప్రొఫెసర్ జువాన్ మైగుల్  డీ మోరా ఫైలాలజి శాఖలో పని చేస్తూ భార్య లుడ్వికా      తో కలిసి ఋగ్వేదం, ఉత్తరరామ చరితం స్పానిష్ భాషలో ప్రచురించారు

  1970నుంచి ప్రొఫెసర్ డేవిడ్ లోరెంజాన్  ఎల్ కోల్లెజియం లో పనిచేస్తూ శైవ శాఖలు ,కాపాలికా ,కాలముఖా లపై అద్భుత పరిశోధనలు చేశాడు .1980లోడా. బెంజమిన్ ప్రిసియాడో చేరి  పురాణాలు కృష్ణ కథలుపై రిసెర్చ్ చేశాడు .అతదూర,సన్యాస బౌద్ధ ,తాంత్రికం  మొదలైన పుస్తక ప్రచురణ చేశాడు .ఇప్పుడు భగవద్గీత భారతం లకు స్పానిష్ అనువాదం చేస్తున్నాడు  .

8-నేపాల్ దేశం

హిమవత్ఖండం అనే నేపాల్ మహాత్మ్యం అతి పవిత్రమైన నేపాల్ గ్రంధం .నేపాల్ జనకమహారాజు కుమార్తె సీతాదేవికి గౌతమబుద్దునికి  జన్మస్థానం .ఇక్కడే మహర్షి వాల్మీకి రామాయణ మహాకావ్యం రాశాడు .మహర్షి యాజ్ఞవల్క్యుడు జనకమహారాజుతో  నిత్యం వేదాంత చర్చ చేసేవాడు .జడభరత ,పులస్య ఋష్యశృంగ మహర్షులు పుట్టిన చోటుకూడా పాణిని వ్యాకరణ ప్రచారం చేశాడు .కనుక అనాదికాలం నుంచి సంస్క్రుతకేంద్రంగా ఉంది నేపాల్ .లిచ్చవి రాజులు భారతీయ ఇతిహాస,పురాణాలను బాగా ఆదరించారు .కిరాత రాజులపా లనలో సంస్కృత బోధన అత్యున్నతస్థాయి లో వెలిగింది .సంస్కృత విద్వాంసులకు కవులకు రాజాదరణఎక్కువ  సంస్కృతం లో అనేక గ్రంథాలు ఇక్కడ రచింప బడినాయి .టిబెటన్లు నేపాల్ వచ్చి తంత్ర శాస్త్రం నేర్చేవారు .బౌద్ధ సిద్ధాంతం కూడా ఇక్కడ బాగా వ్యాపించింది .12వ శతాబ్దిను౦చి 18వ శతాబ్దం వరకు మల్లరాజులపాలన సాగింది .సంస్కృతం మాతృభాషకాకపోయినా మాధ్యమంగా చెలామణి అయింది .వ్యాకరణ ,జ్యోతిష ఆయుర్వేద తంత్ర లపై అనేక ప్రసిద్ధ గ్రంథాలు రచి౦ప బడినాయి  .వేదాలు ధర్మశాస్త్రాలపై వ్యాఖ్యానాలు వెలువడినాయి .ఆయుర్వేద బోధనా జరిగింది.

  నేపాల్ ను మల్లరాజులు పాలిస్తున్న  ప్పుడు ఇండియాలో విక్రమ సింహ వవిశ్వ విద్యాలయ౦  మహా ప్రాభవం లో ఉండేది .నేపాల్ చరిత్రకారుడు సూర్య విక్రం జ్యావలి రాసినదాన్ని బట్టి రత్నకీర్తి వైరోచన ,కనకశ్రీ వంటి మహా విద్వాంసులు ఈ విశ్వవిద్యాలయం లో చదివారు ,నేపాలీలు ఖాట్మండు కనుమ దాటి టిబెట్ గుండా  ఇండియావచ్చినలంద విక్రమశింహ యూని వర్సిటీలలో  తంత్రవిద్య నేర్చేవారు .పడమటి నేపాల్ ను ఖాస్ రాజులు పాలిస్తున్నప్పుడు సంస్కృతం గొప్ప వెలుగు వెలిగింది .రాజులందరూ సంస్కృతం లో నిష్ణాతులే కావ్యాలూ రాశారు .సిమ్హాగ్రద్ రాజు హిందూమత వ్యాప్తికి కృషి చేశాడు .12-14శాతాబ్దాలమధ్య ఇక్కడ  సంస్కృతం ఓ వెలుగు వెలిగింది .భారతీయ సంస్కృత విద్వాంసులు నేపాల్ వచ్చి తంత్రం,బౌద్ధం నేర్చేవారు .నేపాల్ ఐక్యత జరిగి సంస్కృతానికి వికసనం జరిగింది .విద్యాలయాలలో సంస్కృతం తప్పక ఒక ముఖ్య సబ్జెక్ట్ గా ఉండేది .రాణా వంశపాలన వరకు ఇలా కొనసాగింది .న్యాయస్థానాలలోనూ , అత్యున్నత ప్రభుత్వ పదవులలో సంస్కృతం లో నిష్ణాతులకే ఉద్యోగాలు ఇచ్చేవారు .సంస్కృత  తాంత్రిక  పుస్తకాలైన ‘’పురసే హర్యానవ ‘’,’’పునశ్చరణ దీపిక ,నాటకాలు జయరాహుకర్ ,సత్కర్మ రత్నావళి మొదలైనవి రాణా బహదూర్ షా ,గీర్వాణషా ల పరిపాలనా కాలం లో రచిప బడినాయి .

   1931తర్వాత సంస్కృత పాఠశాలలు ఏర్పడ్డాయి .జనక పూర్ ,మతిహని లలో సంస్కృత విశ్వ విద్యాలయాలు1955,1968లలో  నెలకొల్పారు .మాస్టర్ డిగ్రీ అయిన  ఆచార్య స్థాయి వరకు సంసృత బోధన జరిగింది .జంగ్ బహదూర్ రాజు బ్రిటన్ వెళ్లి తిరిగొచ్చాక నీల్ దేవ్ పంత్ ,వాచస్పతి పంత్ అనే విద్వాంసులు1915లో ఖాట్మండు లో  సంస్కృత విద్యాలయాలు స్థాపించారుకాని వెంటనే మూతపడ్డాయి .రాజుకొడుకు జిత్ జంగ్ 1931 రాజరాజేశ్వరి, ఖాత్మాండ్ లలో రెండు సంస్కృత స్కూళ్ళు ఏర్పాటు చేశాడు .తర్వాత దింగ్లా, భోజ్పూర్ లలోనూ సదానంద బ్రహ్మచారి ఆధ్వర్యం లో ప్రారంభించాడు.1934లో రాణీ కొఠారిలో సంస్కృత హైస్కూల్ స్థాపించాడు .రాణా బీర్ షంషేర్ 1984లో పశ్చిమమూల ఉన్న రాణి పోఖారిలో వేదం ,పురాణ వ్యాకరణ ,జ్యోతిషాలు నేర్పటానికి ప్రారంభించాడు

  2004లో   ‘జయతు సంస్కృతం ‘’అనే విద్యార్ధి ఉద్యమం తీవ్రంగా జరిగి సంస్కృత సెకండరీ ,హయ్యర్ స్థాయి బోదనలో హిస్టరీ జాగ్రఫీ కూడా చేర్చాలని డిమాండ్ చేయగా విజయవంతమై ప్రభుత్వం అంగీకరించి 2007లో ప్రజాప్రభుత్వం ఏర్పడినతర్వాత అమలు చేసింది . 2009లో రాజా త్రిభువన ప్రభుత్వ సంస్కృత కాలేజి ఆవిష్కరించాడు .మరి రెండుచోట్ల ధరన్,డాంగ్ లలో కూడా ఏర్పాటయ్యాయి .ఇవి 2016లో ఏర్పాటైన త్రిభువన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా పని చేస్తున్నాయి .ఇప్పుడు 50సంస్కృత సెకండరి స్కూళ్ళు ,వేదం వ్యాకరణ జ్యోతిష న్యాయ ,సాహిత్యాలు  బోధిస్తున్నాయి .కర్మకాండ ఆయుర్వేదం యోగాలనూ బోధిస్తున్నారు .సంస్కృతం లో మార్కులకు పరిగణన ఎక్కువే .

  సశేషం

మీ-గబ్బిటదుర్గాప్రసాద్ -18-12-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

17.12.2020 గోరసం వారు బాలుపై తెచ్చిన 88మందికవుల కవితల నీరాజనం జూమ్ ద్వారా సాతంత్రం 6గంటలకు ఆవిష్కరణ జరిగింది

 

 

“గోదావరి రచయితల సంఘం(గోరసం)”చే ఈరోజు అనగా 17 డిసంబర్ 2020 నాడు జూమ్ వేదికగా ప్రముఖ గాయకుడు కీ.శే. శ్రీ ఎస్.పి.బాలు గారికి కవితార్చన సంకలనాన్ని ఈరోజు గోరసం సంస్థ ఆవిష్కరణ చేసింది. దీనిలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ జానపద అకాడమీ పూర్వాధ్యక్షులు శ్రీ పొట్లూరి హరికృష్ణ గారు, ప్రముఖ మాటల పాటల రచయిత శ్రీ వెన్నెలకంటి గారు, ప్రముఖ కవి విమర్శకులు శ్రీ దాస్యం సేనాధిపతి గారు, ఆంధ్ర రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ చలపాక ప్రకాష్ గారు, గురువులు సరసభారతి సాహిత్య సేవాసంస్థ ఉయ్యూరుకు చెందిన శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ గారు, తెలంగాణా సాహిత్య కళాపీఠం అధ్యక్షురాలు శ్రీమతి దాసరి శాంతాకుమారి గారు, అక్షరకౌముది సాహిత్య సాంస్కృతిక అధ్యక్షులు శ్రీ తులసి వెంకటరమణాచార్యులు గారు, తెలుగు భాషాచైతన్య సమితి అధ్యక్షులు శ్రీ బడేసాబ్ గారు, తెలుగుభారతి అధ్యక్షులు శ్రీ పక్కిరవి శేఖర సత్యనారాయణమూర్తి గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమములో గంధ్ర సమీక్షను ప్రముఖ బాలసాహిత్య రచయిత్రి-విభిన్న ప్రక్రియల రచయిత్రి అయిన శ్రీమతి గుడిపూడి రాధికారాణి గారు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గోరసం అధ్యక్షులు శ్రీ శిష్టు సత్య రాజేష్ గారు అధ్యక్షత వహించారు. గోరసం కార్యవర్గం పాల్గొన్నారు. 

 

శిష్టు సత్య రాజేష్

.

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

విదేశీ సంస్కృత విద్వాంసులు 44-విదేశాలలో సంస్క్రుతాధ్యయనం

విదేశీ సంస్కృత విద్వాంసులు

44-విదేశాలలో సంస్క్రుతాధ్యయనం

4-జర్మని దేశం

జర్మనీ దేశం లో సంస్కృతం పై అభిమానం 19వ శతాబ్ది ప్రారంభం లో క్లాసిక్ రచయిత జే .డబ్ల్యు .వాన్ గోథే తో ప్రారంభమై,జే బి హెర్డర్ తో స్థిరపడింది  .వాన్ షెలేగల్ ,అనే హంబోల్ట్ ఇండియన్ స్టడీస్ కు పీఠాలను 1818లో బాన్ ,1821లో బెర్లిన్,1826లో కీన్స్ బెర్గ్  యూని  వర్సిటీలలో నెలకొల్పటం తో గొప్ప ప్రోత్సాహం లభించింది .యూని వర్సిటీలలో సంస్కృత విద్యాబోధన 2001లో ప్రారంభమైంది .రాజకీయాలు ,ప్రోత్సాహం లేకపోవటం నిధులు సమకూరక పోవటం ఇబ్బందులు కల్పించాయి .తర్వాత కొన్ని పీఠాల తొలగింపు కూడా జరిగింది .

  బెర్లిన్ లో ‘’వశిష్ట ధర్మ సూత్ర’’  రూపు దాల్చుతోంది .లేఖా పధ్ధతి తయారౌతోంది .జైమినీయ బ్రాహ్మణం ముద్రి౦ప బడింది.హిదూ దేవతారాధన పై పరిశోధనలు జరిగాయి .బోఖం లో శ్రౌత సూత్రాలు పై పరిశోధన జరిగింది .బాన్ లో భారతీయ పంచాంగ గణనం పై పరిశోధన జరిగింది .చాళుక్యులకాలం నాటి బ్రాహ్మణాలు,కంబోడియా శాసనలలో సంస్కృతం ,బౌద్ధసంస్కృతం లపై పరిశోధనలు జరిగాయి . ఫ్రాంక్ ఫర్ట్ లో సంస్కృత రచనలన్నీ డిజిటలైజ్ చేయటం జరిగింది .ఫ్రీ బర్గ్ లో పాకిస్తాన్ శిలాశాసనాలపై ,కావ్యాలలో,త్రిపిటకాలపై సంస్కృతం పై ,అనర్ఘ రాహ్జవం అనువాదం ,గిలిగిత్ వ్రాతప్రతులు పై పరిశోధన జరుగుతోంది .గోట్టేన్ బెర్గ్ లో శ్రీలంకలో సంస్కృతం ,సర్వాస్తి వాదం ,మహా పరి నిర్వాణ సూత్రంప్రచురణ , బౌద్ధ గ్రంధాలపై సంస్కృత నిఘంటువు ,ఉత్పత్తి ప్రకరణ ప్రచురణ జరిగాయి .హాం బర్గ్ లో గ్రందాల పరిరక్షణ జరిగింది రఘు వంశం ,న్యాయ వైశేషిక పై పరిశోధన జరిగింది .హీడేల్ బెర్గ్ లో ఒరిస్సాలో మహిమా ధర్మం ఉద్యమం ,సంస్కృత సింటాక్స్,పశుపతి నాథ దేవాలయం లో పూజారుల సంఘర్షణ లపై అధ్యయనం చేశారు .కీల్ లో హరి వంశం పై ,భట్టికావ్యం లో పదవ సర్గ ,,ప్రాచీన భారత ,గ్రీక్ ఫిలాసఫీ లలో విభేదాలు ,.లేప్జిగ్ లో ప్రాకృత కావ్యాలు ఖాట్మండు లోని స్వయంభూ చైత్య వేదసూక్తులు,కౌటిల్య అర్ధ శాస్త్రం పై గొప్ప పరిశోధనలు జరిగాయి .మైంజ్ లో ఋగ్వేదం శాకుంతలం పైనా ,పంచతంత్ర అధ్యయనం చదరంగ చరిత్ర ,కాళిదాస కవిత్వం లో రూపక శోభ .మార్బర్గ్ లో టిబెట్ లోని సంస్కృత గ్రంధాలు ,ఆర్యసూర జాతకమాల లో వేదాంత విషయాలు ,కావ్యాదర్శం ,మహాసంవరతుని కథలపై రిసెర్చ్ జరిగింది .మ్యూన్ చెన్ లో సంస్కృత నాటకాలు ,జైనం భారతీయ క్రీడలు ,కాలచక్రం ,మృత్యువనాన లపై పరిశోధనలు జరిగాయి .మ్యూన్ స్టర్ లో సర్వాస్తివాదం ,శంకర ,వేదసాహిత్యం ట్యూ బింగెన్ లో సంస్కృత నాటక శాలలుపై ,వ్యూర్జ్ బర్గ్ లో వేద వచన గ్రంథాలు పై విశిష్ట పరిశోధనలు జరిగాయి . ,,

5-హంగేరి దేశం

బుడాపెస్ట్ లోని  రొట్వోస్  లోరాండ్ యూనివర్సిటి  ఇండో యూరోపియన్ లింగ్విస్టిక్స్ డిపార్ట్ మెంట్ లో సంస్కృతం లోనాలుగేళ్ళ  ఎం .ఏ. క్లాసులు ప్రారంభించారు .1995లో బోధనకు అంతరాయం కలిగింది .రీడర్ పోస్ట్ తీసేశారు .యూని వర్సిటి ఆఫ్ స్వేజ్డ్ లో ప్రాచీన హిస్టరీ శాఖలో అడ్వాన్సేడ్ సంస్కృత ప్రాధమిక క్లాసులు నిర్వహించారు .మతగ్రంధాల అధ్యయనం చేయించారు .బుడాపెస్ట్ లోని టాన్ కపూజా అంటే ధర్మద్వారం కాలేజిలో సంస్కృత కోర్సుల బోధన జరిగింది .బుద్ధిష్ట్ కాలేజి సంస్కృత ఉపాధ్యాయుడు టైబార్ కోర్ట్ వెలేసి పైకాలేజిలో ప్రాక్టికల్ సంస్కృత గ్రామర్ బోధించాడు .ప్రపంచ సంస్కృత సమ్మేళనాలు నిర్వహించారు .ప్రొఫెసర్ జోజేఫ్ వెక్రేడి వాల్మీకి రామాయణంకు అశ్వ ఘోషుని బుద్ధచారితం కు  హంగేరియన్ భాషానువాదం చేశాడు .బౌద్ధ గ్రంథాలు జాతక,ధమ్మపద లకు అనువాదం జరిపాడు .మానవ ధర్మ శాస్త్ర ,దశకుమార చారిత్ర లకు జూడిత్ ఫీయర్ అనువాదాలు రాశాడు.నాగార్జునుని రత్నావళి కి మూలమధ్యమకారిక కు ఫెరెంక్ రుజ్సా అనువాదాలు రాశాడు  బ్రహ్మసూత్ర శంకరభాష్యానికి అనువాదం జరిగింది .ప్రొఫెసర్ గూలా వోజ్టిల్లామనుధర్మశాస్త్రం లోని ఏడవఅధ్యాయం పై పరిశోధన పత్రం రాశాడు .కృషి శాస్త్ర ను ప్రచురించాడు .కృషి సమయనిర్ణయం రాశాడు ఇండో ఆర్యన్  భాషలపై పరిశోధనలు జరిగాయి .’’గోధూమ’’ అనేమాట అనేక  ఇండో యూరోపియన్ భాషలలోకి చేరింది .ప్రస్తుతం కామశాస్త్రం ,దామోదర గుప్తుని కుట్టానీమాటం లపై పరిశోధనలు జరుగుతున్నాయి .అనేక జర్నల్స్ కూడా సంస్కృత వ్యాప్తికి సహకరిస్తున్నాయి .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -17-12-20-ఉయ్యూరు  

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ చర్ల గణపతి శాస్త్రి, శ్రీమతి చర్ల సుశీల దంపతుల సాహిత్య ,సేవా పురస్కార ప్రదానం

శ్రీ చర్ల గణపతి శాస్త్రి, శ్రీమతి చర్ల సుశీల దంపతుల సాహిత్య ,సేవా పురస్కార ప్రదానం

సాహితీ బంధువులకు శుభకామనలు –2021నూతన ఆంగ్లసంవత్సరం ,సంక్రాంతి శుభాకాంక్షలు –

శ్రీ చర్ల సుశీల వృద్ధాశ్రమ నిర్వాహకులు డా చర్ల మృదుల గారు  నాలుగు రోజులక్రితం నిడదవోలు నుంచి ఫోన్ చేసి 10-1-2021 ఆదివారం ఉదయం 10గంటలకు నిడద వోలు దగ్గర మల్లవరం లోని తమ తలిదండ్రుల పేర వున్న వృద్ధాశ్రమ ప్రాంగణం లో తమ పితృదేవులు బహు గ్రంథ కర్త , కళాప్రపూర్ణ, బ్రహ్మశ్రీ చర్ల గణపతి శాస్త్రి గారి స్మారక సాహిత్య పురస్కారం నాకూ ,తమ మాతృమూర్తి  సాంఘిక సేవా తత్పరురాలు శ్రీమతి చర్ల సుశీల గారి స్మారక సేవా పురస్కారాన్ని  మా శ్రీమతి శ్రీమతి ప్రభావతికి అందజేయటానికి చర్ల సిస్టర్స్ మరియు వృద్ధాశ్రమ నిర్వాహకులు నిర్ణయించామని తెలియజేయగా ,వినమ్రంగా అంగీకరించామని సంతోషంగా మీకు తెలియ జేస్తున్నాను .మిగిలిన వివరాలు ఆహ్వానపత్రం ద్వారా తెలియ జేస్తాము .మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -17-12-20-ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.29 చతుర్దశ సర్గ -3

కిరాతార్జునీయం Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

విదేశీ సంస్కృత విద్వాంసులు 43-విదేశాలలో సంస్క్రుతాధ్యయనం

విదేశీ సంస్కృత విద్వాంసులు

43-విదేశాలలో సంస్క్రుతాధ్యయనం

1-కెనడా దేశం –1996-2001

అశోక్ అక్లుజ్ కర్- వాన్కూవర్ లోని  యూని వర్సిటి ఆఫ్ బ్రిటిష్ కొలంబియా లో ఏషియన్ స్టడీస్ డిపార్ట్ మెంట్ లో రిసెర్చ్ స్కాలర్ .భర్తృహరి ,ఆయన వ్యాఖ్యాతలపై పరిశోధన చేశాడు .కకెనడలో సంస్కృతం పై పరిశోధన చేశాడు .ముక్తాక్ అక్లుజ్ కర్ –భర్తృహరి పునరావృత్తులు పై పరిశోధన చేశాడు .విద్యుత్ అక్లుజ్ కర్ –సంత్ సంప్రదాయం పై నా ,లియోనా ఆండర్సన్ –హిందూమతం పండుగలు ,ఎ. డబ్ల్యు. బార్బర్ –దక్షిణ తూర్పు ఆసియా బౌద్ధం పైనా ,మందాక్రాంత బోస్ –సంస్కృతసాహిత్యం లో నృత్యం , జాన్ బ్రెజినిస్కి –కృష్ణభక్తి ,విత్ బుబెనిక్ –సంస్కృతం –అపభ్రంశ సంబంధాలు ,వి.కృష్ణ చారి –సంస్కృత విమర్శ, ఆండ్రే కొట్యూర్-హరివంశ౦  భారతం లో భాగం ,గిల్లెన్ బ్రెండాన్ –  సంస్కృత భాషా శాస్త్రం –ఫిలాసఫీ ,రిచర్డ్ హేయస్-ధర్మాకృతి రాసిన ప్రమాణ వార్తిక స్వ వృత్తి,క్లాస్ క్లోస్టర్మీర్ –మాధవాచార్య కృత శంకర దర్శనం ,రోజేర్ మార్కో రేల్లీ –అద్వైత వేదాంత ,టిఎస్ రుక్మణి-అద్వైత వేదాన్త,,భక్తి ,యోగ ,అరవింద్ శర్మ –శంకర ఆన్ స్థిత ప్రజ్ఞ,బ్రజ్ మోహన్ సిన్హా –హిందూమతం- గీత ,శ్రీనివాస్ తిలక్ –మహాభారతం ,-వ్యాకరణం ,నాటకీయత ,అలంకార శాస్త్రం,ఎ.కే. వార్డర్ –కావ్య ,పాళీ ,బౌద్ధం .లపై పరిహోధనలు చేసి పుస్తకాలు ప్రచురించారు .

2-క్రోషియా దేశం

    18వ శతాబ్దం లో పాలినాస్ ఆన్ పిలువబడే ఫిలిప్ వేస్డిన్-1748-1806మొదటి సంస్కృత గ్రామర్ ‘’సిధారుబం  సేయు గ్రమాటికా సాంస్కర్డమికా ‘’1790లో రాసి రోమ్ లో  ప్రచురించాడు.19వ శతాబ్దిలో క్రోషియన్ ఫైలాలజిస్ట్ లు ఓల్డ్ స్లావోనిక్ మరియు సంస్క్రుతాలను రిసెర్చ్ కోసం ఎన్నుకున్నారు .జాగ్రెబ్ యూని వర్సిటిలోమొదటి బోధనాంశంగా సంస్కృత౦ ఉండేది .  .1959లో ఇండాలజీ పీఠంఏర్పడి , స్వెటోజర్ పెట్రోవిక్ కంపారటివ్ లిటరేచర్ ప్రొఫెసర్  అయ్యాడు .మొదటి ఇండాలజీ ప్రొఫెసర్ రాడోస్లావ్ కాటికిక్ తో కలిసి ఇండియన్ స్టడీస్ కర్రిక్యులం తయారు చేశాడు .తర్వాత ఫిలాసఫీలో ఇండియన్ ఫిలాసఫీ శాఖ ఏర్పడి,కంపల్సరి చేశారు .ఇండియన్ ఫిలాసఫీకి మొదటిప్రోఫేసర్ సేదోమిన్ వేల్జాకిక్ .తర్వాత శ్రీలంక వెళ్లి బౌద్ధ సన్యాసి అయి చాలా రాశాడు .ఆయన శిష్యురాళ్ళు డా.రాదా ఇవేకోవిక్ ,ఇండియన్ ఫిలాసఫిపై చాలా రాసింది .కాటికిక్ తర్వాత ఆయన శిష్యురాలు డా.మిల్కా జాక్ పింహాక్ ప్రోఫెసర్ అయి ,  వేదిక్ గ్రామర్ పై పరిశోధనలు చేయించింది .కాటికిక్ శిష్యురాలు ప్రొఫెసర్ డ్వార్కా మాటిసిక్ సంస్కృత ఇతిహాసాలు కావ్యాలపై అభిరుచి చూపింది .చాలా విలువైన రిసెర్చ్ పేపర్లు రాసి ప్రచురించింది.తంత్రాఖ్యాయిక,ఉభయాభిసారిక లకు కు  క్రోషియన్ భాషాను వాదం చేసింది.ప్రస్తుత ప్రొఫెసర్ మిస్లావ్ జేజిక్ భగవద్గీత,ఋగ్వేద మంత్రాలపై పరిశోధన చేశాడు .ఇటీవలే ఉపనిషత్ లకు అనువాదం రాసి ప్రచురించాడు .సారా గోంక్ మొకానిన్ భారతీయ సాహిత్యం పై ఎన్నో వ్యాసాలూ రాసింది .నాట్యం పై రిసెర్చ్ చేసింది మృచ్చకటిక నాటకం అనువాదం చేసి ప్రదర్శించింది .జేరాన్ మిసురాక్ ఈమధ్యే మేఘదూత కావ్యాన్ని భగవద్గీతనూ అనువాదం చేసింది .

1874నుంచి క్రోషియాలో సంస్కృత బోధన జరుగుతోంది .యూనివర్సిటి ఆఫ్ జాగ్రెబ్ ,లో అతిముఖ్యమైన సంస్కృత గ్రంథాల అనువాదం జరిగింది.పెరో బుడామిని –కాళిదాస శాకుంతలం  ,భేతాళపంచ వింశతిక లనుక్రోషియన్ భాషలొకిఅనువది౦చాడు .దియేటర్ లలో సంస్కృత నాటక ప్రదర్శన నిర్వహిస్తున్నారు .1895లో మృచ్చకటిక నాటకాన్ని వసంత సేన పేరుతొ జాగ్రెబ్ లో ప్రదర్శించారు .1897లో శాకుంతలం ప్రదర్శించారు.

3-ఫ్రాన్స్ దేశం

ఫ్రెంచ్ జెసూట్ మిషనరీ జీన్ ఫ్రాన్కోసిస్ పాన్స్ 1698నుండి ఇండియాలోబెంగాల్ లో  ఉండి బోపదేవ్ వ్యాకరణం ద్వారా సంస్కృతం అధ్యయనం చేశాడు .సంస్కృత గ్రామర్ ను సగం లాటిన్ సగం ఫ్రెంచ్ భాషలో రాశాడు .అమరకోశం లాటినీకరించాడు .సంస్కృత బెంగాలీ భాషలలో ఉన్న 250 తాళపత్ర గ్రంథాలు సేకరింఛి పారిస్ లోని కింగ్ లైబ్రరీకి పంపాడు .మరో జెసూట్ మిషనరీ ఫ్రాంకోయిస్ కోర్డాక్స్ సంస్కృత భాష కు ,యూరోపియన్ భాషలకు ఉన్న సంబంధంపై శోధించి గొప్ప వ్యాసాలూ రాశాడు .యాన్క్విటిల్ డుపెరాన్ 1731-1805 హిందూ ,పార్సీ గ్రంథాల అధ్యయనం కోసమే ఇండియా వచ్చాడు .చాలా ఏళ్ళు ఉండి జెండ్ అవస్తా , ,ఉపనిషత్తులను లాటిన్ అనువాదం చేశాడు .తర్వాత దారా షికో రాసిన  పర్షియన్ కావ్యాన్ని కూడా అనువాదం చేసి 1802-03లో ప్రచురించాడు .ఇతడి ప్రభావం చాలా ఎక్కువ .

  కాలేజ్ డీ ఫ్రాన్స్ లో సంస్కృత పీఠం1814లో ఏర్పడిన  తర్వాత ఫ్రాన్స్ లో  సంస్క్రుతాభిరుచి పెరిగింది .యూరప్ లో ఏర్పడిన మొదటి పీఠం ఇదే .ఏ ఎల్ చేజి పోన్స్ గ్రామర్ ద్వారా సంస్కృతం నేర్చి ,1830లో బెంగాలి భాషలో ఉన్న కాళిదాసు శాకుంతలం ను అనువదించి ప్రచురించాడు .ఇతడితర్వాత యూజీన్ బర్నౌఫ్ 1801-1852 శాస్త్రీయంగా సంస్కృత అధ్యయనం  పై దృష్టిపెట్టాడు .హిందూ బౌద్ధ గ్రంథాలను అధ్యయనం చేయించాడు .భాగవత పురాణం కు ఫ్రెంచ్ అనువాదం చేసి ప్రచురించాడు సంస్కృత బౌద్ధ గ్రంథం’’సద్ధర్మ పుండరీక సూత్రా ‘’ను అనువదించాడు .రెండు శతాబ్దాలకాలం లో సంస్కృత వాజ్మయం అంతా ఫ్రాన్స్ వారు అధ్యయనం చేసి తమభాషలోకి అనువది౦చుకొన్నారు .

 1663లో స్థాపించబడిన మరో విద్యాకేంద్రం అకాడెమి ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ అండ్ హ్యుమానిటీస్ లో 55మంది పరిశోధనలు చేశారు ప్రాథమిక స్థాయి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు సంస్కృత బోధన జరిగింది .ఋగ్వేదం పై కూలంకషంగా పరిశోధన జరిగింది .లియాన్ యూనివర్సిటి లో మహాభారతం పై విస్తృత పరిశోధనలు చేశారు .మూడవ విద్యాకేంద్రం ఈకోల్ లో1868లో  ఏర్పడిన ‘’ప్రాక్టికల్ స్కూల్  ఫర్ హయ్యర్ స్టడీస్’’సార్వత్రిక విద్యకు ద్వారాలు తెరిచి మహోపకారం చేసింది .హిస్టరీ, ఫైలాలజి, రిలీజియన్ లకు అధికప్రాధాన్య మిచ్చింది .తాంత్రికం శైవం ,వ్యాకరణ మీమాంస ,న్యాయ అలంకార శాస్త్ర సాంఖ్య యోగ ఆయుర్వేదాలకు విశేఖ ప్రాముఖ్యత నిచ్చింది .సంస్కృత గణితాధ్యయనం పై అభి రుచి కల్పించింది .పతంజలి మహాభాష్యానికి వ్యాఖ్యానం రాసిన సాంప్రదాయ మహా విద్యావేత్త ఎం.ఎస్. నరసింహా చార్య వద్ద సిల్వేనియాన్ ఫిల్లిజోట్ వ్యాకరణం అభ్యసించాడు .మహాభాష్య౦  లోని ప్రదీప, ఉద్దోత అనే రెండు భాగాలకు అనువాదం రాసి ప్రచురించాడు .శైవ ఆగమాలకూ అనువాదాలు చేశారు .మధ్యయుగానికి చెందిన ‘’సోమ శంభు పధ్ధతి ‘’ని హెలెన్ బ్రన్నార్ లాకక్స్ కృషితో వెలువడిం ది.మరోముఖ్యమైన సంస్థ –నేషనల్  సెంటర్ ఫర్ సైంటిఫిక్ రిసెర్చ్ ‘’ఏర్పడి అన్ని సైన్స్ విషయాలపై రిసెర్చ్ కు అవకాశం కల్పించింది .సంస్కృత అధ్యయనానికీ అవకాశం కల్పించింది .ఈవిధంగా ఫ్రాన్స్ దేశం సంస్కృత అధ్యయనానికి అన్ని విధాలా తోడ్పడి అగ్రభాగాన నిలిచింది .

 సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -16-12-20-ఉయ్యూరు .

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.28 చతుర్దశ సర్గ -2

కిరాతార్జునీయం-.28

చతుర్దశ సర్గ -2

కిరాతునితో కిరీటి ఇంకా ఇలా చెబుతున్నాడు ‘’మీ రాజు నా స్నేహానికి యోగ్యుడు అని ఎలాచచెప్పగలవు ?అతడికి మునులంటే ఈర్ష్య .గుణోన్నతులైన వారిని ద్వేషించే విరోధులు సజ్జనులకు ఎప్పుడూ శత్రువులే –‘’సఖా న యుక్తః కథితఃకథం త్వయా –యదృచ్ఛయా సూయతి యస్తపస్యతే –గుణార్జనోచ్ఛ్రాయ విరుద్ధ బుద్ధయః –ప్రకృత్యమిత్రా హి సతామసాధనః .మేము వర్ణాశ్రమ ధర్మ సంరక్షుకులమైన క్షత్రియులం .హీనజాతి హి౦సామార్గగామి మీ రాజుతో స్నేహం ఎలా చేస్తాం ?ఏనుగులు నక్కలతో స్నేహం చేస్తాయా ?మీరాజుతో అందుకే స్నేహం కుదరదు .-‘’వయం కృవర్ణాశ్రమ రక్షణోచితాః-క్వ జాతిహీనా మృగ జీవితచ్ఛిదః-సహాప కృష్టైర్మహతాం న సంగత౦ –భవంతి గోమాయు సఖా న దంతినః’’ .మూర్ఖుడు  సజ్జనులను అవమాని౦చినంత మాత్రాన వాళ్ళ ధీరత్వానికి లోటు ఏమీరాదు.సమాన పరాక్రమ౦,  వంశం, ,పౌరుషం ఉన్నవారు అతిక్రమిస్తేనే అది అవమానమౌతుంది –‘’పరోవ జానాతి యదజ్ఞతా జడ-స్తదున్నతాం న విహంతిధీరతాం-సమాన వీర్యా న్వయ పౌరు షేషు యః-కరోత్యతి క్రాంతి మాసౌ తిరస్క్రియా’’ .సజ్జనులు నీచులతో వైరం పెంచుకొంటే వారి కీర్తికే చెడ్డ పేరొస్తుంది.వారి తో స్నేహం చేస్తే గుణాలు  చెడిపోతాయి .అందుకే నీచులతో సజ్జనులు ఉపేక్షా భావం తో ఉంటారు .ఈ రెండు కారణాలవలన మీరాజు పలికిన తిరస్కార వాక్యాలు సహించాను .కాదూ కూడదూ అంటూ ,బాణాన్ని తీసుకోవటానికే ఇక్కడికి వస్తే ,భయంకర సర్పం పడగపై శిరోమణి గ్రహించటానికి వచ్చిన వాడి గతేపడుతుంది –‘’మయా మృగాన్ హంతు రనేన హేతునా –య విరుద్ధ మాక్షేప వచస్తి తిక్షితం –శరార్థమే ష్యత్యథ లప్స్యతే గతిం –శిరోమణిం దృష్టివిషాజ్జి ఘ్రుక్షతః ‘’.’

   ఇలా అర్జునుడు తన అభిప్రాయం చెప్పగా కిరాతుడు సైన్య సమేతంగా ఉన్న శివుడి దగ్గరకు విషయం చెప్పటానికి వెళ్ళాడు .తర్వాత కిరాత సేనాపతి ఆజ్ఞతో సేన భయంకర శబ్దాలు చేస్తూ బయల్దేరింది .ప్రళయం లో సుడిగాలితో సముద్ర తరంగాలు ఎగసి పడుతున్నట్లుగా ఉంది .అప్పుడే అనుకూలవాయువు వీచింది .సుగంధ తు౦పురులతోసేన పతాకాలు రెపరెప లాడుతూ యుద్ధానికి తొందర చేస్తున్నట్లు ఆగాలి సేనకు ముందే వీచింది .జయజయ ధ్వానాలు అల్లతాడు ధ్వనులు పర్వత గుహలనుంచి భూమిని కంపింప జేస్తూ దిక్కులన్నిటా వ్యాపించింది .తీక్ష్ణమైన కిరాతుల శస్త్రాలపై పడిన సూర్య కిరణాలు అధికకా౦తితో అని దిక్కుల్నీ కాల్చి వేస్తున్నట్లు ప్రకాశించాయి –‘వనే సదాం హేతిషుభిన్న విగ్రహై –ర్విపు స్పురే రశ్మి మతో మరీచిభిః’’.  శివుడు విశాల వక్షస్థలం తో ఒక వైపు ఆచ్ఛాదించి ,అల్లెత్రాడు లాగి ,ధనుస్సును మండలాకారం గా చేసి భయంకర ధ్వని కల్పిస్తూ ,తన ప్రభావం తో రెండుప్రక్కలా భూమిని వ్యాపించాడు .ప్రమథ గణాలుమధ్యలో ఉన్నా ,వారందరికీ పైనే ఉన్నట్లు ప్రకాశించాడు –‘’వితత్య పక్షద్వయ మాయత౦ బభౌ –విభుర్గణానాముపరీవ మధ్యగః ‘’.

  గణాలు సమాన వేగంగా పోటీ పడుతూ ముందుకు సాగుతోంది .వనాలు శ్వాస పీల్చుకోవటానికి కూడా వీలు లేనట్లు అతలాకుతలమయ్యాయి –‘’గణైరవి చ్చేదనిరుద్ధ మాబభౌ –వనం నిరు చ్ఛ్వాస మివాకులాకులం .సేన పర్వతాలు ఎక్కుతూ దిగుతూ పోతుంటే ,క్షణం లో ఎత్తుపెరిగి ,మరుక్షణం లో లోతుగా మారినట్లు కనిపించాయి –‘’కిరాత సైన్యే రపిధాయ  రేచితా –భువః క్షణం నిమ్నత యేవ భేజిరే ‘’.సైన్యం పెద్దపెద్ద అ౦గ లేస్తూ వెడుతుంటే తీగలు తొక్కిడికి గురై ,సైన్యవేగంవలన ఏర్పడిన గాలితో మద్ది ,చందన వృక్షాలు అటూ ఇటూ ఊగి వనాలు గణాలకు తలవాల్చాయా అని పించింది .

 ఇక్కడ  మద జలం కారి చిక్కిపోయిన ఏనుగులా ఘోర తపస్సు తో చిక్కి బక్క అయిన అర్జునుడు ఉన్నాడు .దిక్కులను కాల్చే అగ్ని తేజస్సుతో ఉన్నాడు  -‘’పరిజ్వలంతం నిధనాయ భూ భ్రుతాం-దహంత మాశాఇవ జాత వేదసం ‘’.  ,అనుకూల మిత్రుని పొందే కోరికగా ,జయం పొందే కాంక్షగా అమ్ములపొది నుంచి అలవోకగా ఒక బాణం తీయటం లో –విఫలమై ,ప్రతీకారం తీర్చుకోవాలనే సముద్రం లాంటి కిరాత సేన ను నిర్లక్షంగా చూశాడు .-‘’అనాదరోపాత్త  ధృతైక సాయకం –జయేనుకూలే సుహృదీవస స్పృహం-శనై రపూర్ణప్రతీకార పెలవే-నివేశయంతంనయనే బలో  దధౌ ‘’

  ఆపదలను దూరం చేసే గా౦డీవాన్ని ధరించి ,సహజ సిద్ధ స్థితి లో కూర్చుని దాటరాని మహా సముద్రంలా భాసి౦చాడు. అర్జునముని –‘’నిషణ్ణ మాప త్ప్రతి కారకార ణే-శరాసనే ధైర్య ఇవానపాయినీ –అల౦ఘనీయం ప్రకృతావపి స్థితం –నివాత నిష్కంప మివాపగాపతిం .’’ఎదురుగా చచ్చి పడిఉన్న పందివధ కారణంగా అర్జునుడు మృత్యు భయంకర రూపం గా ఉన్నాడు .యజ్ఞం లో బ్రాహ్మణ ఆహ్వానం పై వచ్చిన సాక్షాత్ రుద్రునిలా తపోరుద్రుడు అర్జునుడు ఉన్నాడు –‘’ఉపే యుషీం బిభ్రత మంతక ద్యుతిం – వధాదదూరే పతితస్య దంష్ష్ట్రిణః-పురః సమావేశిత సత్పశుం ద్విజైః-పతిం పశూనా మివ హూతమధ్వరే’’.ధైర్యంతో ఇతరుల గౌరవాన్ని జయి౦చేట్లు గంభీరంగా ఉన్నాడు .నాలుగు వైపులా దట్టమైన చెట్లు పెరిగి వ్యాపించి అంధకారం కలిగించే మహాపర్వతంలా ఉన్నాడు –‘’విజేన నీతంవిజితాన్య గౌరవం –గాభీరతాం ధైర్య గుణేన భూయసా -వనోదయేన ఘనోరు వీరుధా-సమంధ కారీకృత ముత్త మాచలం ‘’.మహా వృషభ మూపురం వంటి ఎగు బుజాలు ,లావైన బలమైన మెడ,కోట గోడ లా విశాలమైన  వక్షస్థలం కలిగి ఉన్న అర్జునుడు మహాభారమైన భూమిని సముద్రం నుంచి ఉద్ధరించే మహా ఆది వరాహ మైన  విష్ణుమూర్తిలా లా భాసి౦చాడు-‘’మహార్షభస్కంధమనూన కంధరం –బృహచ్ఛిలా వప్ర ఘనేన వక్షసా –సముజ్జి హీర్షు౦ జగతీంమహా భరాం-మహా వరాహం మహాతోర్ణ వాదివ ‘’

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -15-12-20-ఉయ్యూరు

 .

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో కార్తీక బహుళ శనివారం 12-12-20 రాత్రి లక్ష దీపారధన అనే అయ్యప్పేశ్వర చక్రరూప దీప మహోత్సవం

ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో కార్తీక బహుళ శనివారం 12-12-20 రాత్రి లక్ష దీపారధన అనే అయ్యప్పేశ్వర చక్రరూప దీప మహోత్సవం

 

https://photos.google.com/album/AF1QipM-O2q4FAVv21i-tdl0U1eyxSuTu5W5hxDbySXk

Posted in దేవాలయం | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.26 త్రయోదశ సర్గ -3(చివరి భాగం )

కిరాతార్జునీయం-.26

త్రయోదశ సర్గ -3(చివరి భాగం )

 శివుడు పంపిన భిల్లుడు అర్జునుడితో ఇంకా ఇలా అంటున్నాడు ‘’సూర్య తేజస్సు ను మించిన నువ్వు వరాహాన్ని చంపిన మా నాయకుడి బాణాన్ని అపహరించటం తగిన పనికాదు.మనువు మొదలైన వారు ఉత్తమ మార్గాలను బోధించారు. నువ్వే అధర్మగా ప్రవర్తిస్తే మిగతావారి సంగతేమిటి ?ఆత్మజ్ఞానులైన యతులు జనన మరణాలు జయించి విపత్తులకు కారణమైన అపమార్గం లో ప్రవేశించకుండా సన్మార్గం బోధిస్తున్నారు .అంటే నువ్వు సన్మార్గం, సచ్చీలం ఎప్పుడూ వదలకూడదని సూచన .తపస్సులో నిరతులైనవారికి వినయం పుణ్యాన్నిస్తుంది .సుఖం కోరితే సంపదలిస్తుంది. యోగులకు ముక్తి నిస్తుంది .అంటే వినయశీలం చతుర్విధ అర్ధాలను ఇస్తుందని భావం –‘’తిష్టతాం తపసి పుణ్య మానజన్ –సంపదో సుగుణయన్ సుఖైషితాం –యోగినాం పరిణమన్విముక్తయే –కేన నాస్తు వినయః సతాం ప్రియః .నీబాణం మా యజమాని  బాణం లాగానే ఉండి ఉండచ్చు .ఐతే ఇతరులబాణాన్నితీసుకోవటానికి అపసవ్యమార్గం లో ప్రయత్నిస్తున్నావు .అభిమాని, సజ్జనుడు అయిన నువ్వు    నిస్పృహతో ఈ పని చేయటం తప్పు .ఇతరులు చంపిన మృగాన్ని మళ్ళీ కొట్టటం కూడా తప్పే .,సిగ్గు మాలిన పనే –‘’అన్యదీయ విశిఖే న కేవలం –నిస్పృహస్య భవితవ్య మాహృతే –వ్రీడి తవ్యమపి తే సచేతసః ‘’.మా యజమాని కిరాతపతి నీపని ఉత్కంఠ తో విని  సంతోషిస్తారో ,లజ్జితులౌతారోతెలీదు .ఎవరైనా మాస్వామిని కీర్తిస్తారు .స్వామి పేరు పరిహాసంగా చెప్పటానికి సిగ్గు పడతారు అనగా మహాత్ములు తమకీర్తిని గురించి గొప్పగా వినటానికి ఇష్టపడరు అని భావం .ఆత్మ ప్రశంస నచ్చని మా స్వామి ఇతరుల దోషాలను గుణాలు అని ఎలాచేప్తారు ?అయినా అవసరం వచ్చినప్పుడు చెప్పక తప్పదు .ఒకవేళ మా స్వామి పందిని చంపక పోయి ఉన్నట్లయితే ,ఏమయ్యేదో అనే భయవార్త చెప్పరాదు .దేవుడు నీకు అలాంటి ఆపద కల్పించరాదు-‘’దుర్వచనం తదథ మాస్మభూనృగ-స్తయ్యసౌ యదకరిస్య దోజసా –నైవ మాశు యది వాహినీ పతిః-ప్రత్యపత్స్వ త శితేన పత్రిణా’’.ఇద్రుని వజ్రాయుధం లా బలీయమైన ఈ వరాహాన్ని  మాస్వామి కిరాతపతి తప్ప ఎవరూ చంపలేరు-‘’కోన్విమం హరి తురంగ మాయుధ స్థేయసీం దధత మంగ సంహతిం –వేగవత్తర మృతే చమూ పతే –ర్హంతు మార్హృతి శరేణ దంష్ట్రిణ౦’’

  మా కిరాత ప్రభువు ప్రాణ సంకటం లో కూడా ఉపకారం చేస్తాడు .అసలు ఆయన నీ మిత్రుడే అన్న సంగతి నీకు తెలుసా ?అతనితో విరోధం పెట్టుకోవటం సజ్జనులకు ఆశ్రయమైన కృతజ్ఞత ను కాదనటమే . కృతఘ్నుడివి కావద్దు –‘’మిత్ర మిష్ట ముపకారి సంశయే –మేదినీ పతిరయం తథా చతే-త౦ విరోధ్యభవతా నిరాసి మా-సజ్జనైక పతిః-కృతజ్ఞతా ‘’.విజయం కోరేవారికి మిత్రలాభం అన్ని సంపదలకంటే గొప్పది .సంపదలు కష్ట సాధ్యాలు .సాధించినా నిలవవు .మిత్రలాభం ఉపకారం తో తేలికౌతు౦ది.రక్షించటం కష్టం కాదు .అది మనల్ని రక్షిస్తుంది .చివర్లో సుఖమిస్తుంది –‘’లభ్య మేక సుకృతేన దుర్లభా –రక్షితార మను రక్ష్య భూతయః –స్వంతమంత విరసా జిగీషతాం –మిత్ర లాభ మను లాభ సంపదః ‘’.దన  సంపదలు చంచలాలు.నశి౦చేవికూడా .భూమి బలవంతులకే స్వాధీనం .స్థిరమైనవాడు ఐన మాస్వామి స్వయంగా వస్తే అవమాని౦చ వద్దు .అంతమంచి స్నేహితుడు దొరకటం నీ అదృష్టమే –‘’చంచలం వసు నితాన్తమున్నతా –మేదినీ మపి హరంత్యరాతయః –భూధర స్థిరము పెయ మాగత౦-మావ మంస్తసుహృదం మహీపతిం ‘’.

 నువ్వు శత్రు సంహారానికే తపస్సు చేస్తున్నావు .మోక్షం కోరేవారికి ఆయుధాల అవసరం లేదు కదా .మా కిరాత రాజు స్నేహం చేస్తే ,నీ తపస్సు ఫలిస్తుంది .మా రాజు  వద్ద గుర్రాలు పుట్టే చోటు ,ఏనుగుల ఉత్పత్తి స్థానమైన అడవి ,రత్నాల గనులు చాలా ఉన్నాయి .బంగారు బాణాలు ఎందుకు ?.మా రాజు అవమానం మాత్రం సహి౦చలేడని గ్రహించు –‘’వాజి భూమి ‘’రిభారాజ కాననం -.సంతి రత్న నిచయా శ్చ భూరిశః –కా౦చనేన కిమివాస్య పత్రిణా-కేవలం న సహతే విలంఘనం ‘’.ఇతరులు గర్వంతో దుమ్ము రేపినా,మా  ఏలిక సహించలేడు .ప్రార్ధిస్తే ప్రాణాలైనా ఇస్తాడు .అతడికి ధనంతో పనేమిటి ?-‘’సావ లేప ముప లిప్సితే పరై-రభ్యుపైతివికృతిం రజస్యపి –  ఆర్థితస్తు న మహన్సమీహతే –జీవితం కిము ధనంధనాయితుం ‘’.కనుక మా రాజు బాణం అయనకిచ్చి,శ్రీరామ సుగ్రీవ మైత్రి లాగా దైవికంగా కలిగిన ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవటం శ్రేయస్కరం .ఉభయుల మైత్రి మంచిది .-‘’తత్తదీయ విశిఖాతిసర్జనా-దస్తు వాంగురు యాదృచ్ఛ యాగతం-రాఘవ ప్లవగ రాజ యోరివ-ప్రేమ యుక్త మితరేతరాశ్రయం ‘’.నీతో అబద్ధం చెప్పటం మాకు ఇష్టం లేదు .తపస్వుల బాణాలు తీసుకొనే కోరికమాకెందుకు ?మా దగ్గర ఇలాంటి బాణాలు ఎన్నో ఉన్నాయి .అవివజ్రాయుధం కంటే గొప్పవి .నీ బాణాలంటివి ఆయన కావాలనుకొంటే కోకొల్లలు వచ్చి పడతాయి .నీ లాంటి మహానుభావులు మిత్రత్వం తో యాచిస్తే ,ఈ భూమండలాన్నే జయించి ఇవ్వగలడు.-‘’మార్గణై  రథ తవ ప్రయోజనం –నాథ సేకిము పతింన భూభ్రుతః-తద్విధం సుహృద మేత్య సోర్ధినం –కిం న యచ్ఛతివిజిత్య మేదినీం ‘’.బ్రాహ్మణ చాపల్యం తో నువ్వు చంపిన పంది మాస్వామి ఎన్నుకొన్నది .దీన్ని మా రాజు క్షమించడు .ఆలోచన లేకుండా చేసే అపరాధం అజ్ఞానాన్ని దాచేస్తుంది .ఆ౦టే తెలివి లేని వారి తప్పు తప్పు కాదు అనిభావం . బ్రాహ్మణ కులం, కాషాయ వేషం, తపస్సు విరుద్ధమైనవి. ఇలాంటి తప్పు మళ్ళీ చేయకు .చెడు దారిలో నడిచే వారి చెడు బుద్ధి ఇహపరాలకు చేటు తెస్తుంది –‘’జన్మ మేష తపసాం విరోదినీం –మా కృథాఃపూన రమూమ పక్రియాం-అపదేత్యు భయలోక దూష ణీ-వర్తమాన పథేహి దుర్మతిం’’.

  ఇప్పుడు పితృ దేవతలకు శ్రార్ధం లేదు. దేవతార్చన కూడా లేదుకదా ఎందుకు ఆపందిని కొట్టావు ?దాని మానాన దాన్ని పోనిస్తే బాగుండేది కదా .చూడటానికి సత్పురుషుడు లాగా ఉన్నావు .చాంచల్యం వదిలేయి .నీ అపకారాలు ఎప్పుడూ ఎవరు సహిస్తారు ?ప్రళయకాల వాయువులు సముద్రాలకు క్షోభ తెచ్చినట్లు ,ప్రతిసారీ చేయరాని పనులు చేస్తే, ధైర్యవంతులు కూడా క్షోభకు గురౌతారు .మా రాజు అస్త్రవిద్యలో అసామాన్యుడు .ఏదో కొండల్లో కోనల్లో ఉండేవాడు కదా అని తిరస్కరించకు .ఇంద్రుడు ఈ పర్వతాన్ని రక్షించమని స్వయంగా కోరటం వలన ఇక్కడ ఉంటున్నాడు మా రాజు .-‘’అస్త్ర వేదవిదయం మహీ పతిః-పర్వతీయ ఇతి మావా జీ గణః-గోపితుం భువ మిమాం మరుత్వతా –శైలవాస మను నీయ లంభితః ‘’.ముని విషయం లో తప్పు కాస్తాను అని మా స్వామి చెప్పాడు .కనుక నువ్వు కూడా ఆ బాణాన్ని ఇచ్చేసి స్నేహం చేసి, సకల సంపదలు పొందు .-‘’తత్తితిక్షితమిదం మయా మునే –రిత్య వోచత వచశ్చమూ పతిః-బాణ మత్రభవతే నిజం దిశ-న్నాప్నుహి త్వమపి సర్వ సంపదః ‘’.ఎవరివలన శుభాలు , సద్గుణాలు,సదాచారం  అలవడుతాయో ,ఆపదలు తొలగి పోతాయో అలాంటి అనేక గుణాలున్న సత్సా౦గత్యాన్ని కల్గించే స్నేహాన్ని ఎవడు  వదులు కొంటాడు స్వామీ .వాడియైన అస్త్రాలు ,సర్పాలతో కూడిన తరంగాలున్న సముద్రం వంటి మా కిరాత రాజు చెలియలి కట్ట ఆపి నట్లు, అదుగో ఆ చెట్ల చాటున సమయం కోసం నిలిచి ఉన్నాడు చూడు ‘’అని రాయబారి తన సేనాపతిని చేతితో చూపాడు –‘’ దృశ్యతామయ మనోకహాన్తరే-తిగ్మహేతిపృతనాభి రన్వితః –సాహి వీచిరివ సింధు రుద్ధతో –భూపతిః సమయ సేతు వారితః ‘’.ఓ దీశాలీ !అదుగో మాప్రభువు స్థిరంగా ఇంద్ర ధ్వజ శోభకంటే గొప్పగా ,ఆది శేషునిలాగా స్థూలంగా ఉన్న ధనుస్సు ఎక్కు పెట్టి సిద్ధంగా ఉన్నాడు .అతని కోరిక మన్నించి స్నేహం చేస్తే నీకోరికలన్నీ తీరుతాయి ‘’అన్నాడు కిరాత శివ దూత .

   సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -13-12-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ధనుర్మాసం లో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర వైభవం ప్రత్యక్ష ప్రసారం 

ధనుర్మాసం లో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర వైభవం ప్రత్యక్ష ప్రసారం 

  సాహితీ బంధువులకు శుభకామనలు .డిసెంబర్ 14 సోమవారం తో శ్రీ శంకరవిజయం ఏడవ సర్గ ప్రత్యక్ష ప్రసారం పూర్తీ చేసి ,మళ్ళీ మాఘమాసం లో మిగిలిన సర్గలు పూర్తీ చేయాలని సంకల్పం .
 ఇది వరకే ప్రకటించినట్లు ఈ డిసెంబర్ 15 మంగళవారం నుంచి మాధవమాసమైన మార్గశిరం -ధనుర్మాసం ప్రారంభామౌతుందికనుక ఆ రోజు ఉదయం 10 గంటలనుంచి ”శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర వైభవం” ధారావాహికం గా ప్రత్యక్ష ప్రసారం ఫేస్ బుక్ ద్వారా జరుగుతుంది -దుర్గాప్రసాద్
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.25 త్రయోదశ సర్గ -2

కిరాతార్జునీయం-.25

త్రయోదశ సర్గ -2

శంకరుని బాణం రెక్కల నుంచి వచ్చిన ధ్వని పాములపై గరుత్మంతుని  దాడి లాగా హృదయాన్ని చెవుల్ని భేదిస్తూ ప్రతిధ్వనించింది .శివుని మూడోకంటి అగ్ని జ్వాలలాగా పిశంగ(ఎరుపు ) వర్ణపు కాంతితో ప్రకాశిస్తూ అత్యంత వేగంగా వస్తూ ఆకాశం లో పిడుగులు పడినట్లు అనిపించింది .-‘’నయనాదివ శూలినః ప్రవృత్తై-ర్మనసోప్యాశుపరంయతః పిశంగైః-విదధే విలసత్తడిల్లతాభైః-కిరణైర్వ్యోమని మార్గ ణస్యమార్గః ‘’.శివబాణ౦  వెడలిన క్షణం లోనే ,శివునికి దగ్గరున్న ప్రమథ గణం,వరాహానికి దగ్గరలో ఉన్నఆకాశ సంచారు.లైన సిద్ధ చారణాదులు వరాహం శరీరం లో ప్రవేశించటం చూశారు .అంటే ప్రయోగించటం ,దానికి తగలటం ఏకకాలం లోనే జరిగిందని భావం –‘’అపయంధనుషః శివాంతికస్థై-ర్వివరే సద్భి  రభిఖ్యయా జిహానః –యుగ పద్దదృశేవిశన్వరాహం-తదుపోఢైశ్చనభశ్చరైఃపుషత్కః’’.శివబాణ౦కానుగ లాగా నల్లగా ఉన్న ఆ పంది శరీరం లో ప్రవేశించగా ఆకాశ చారులు నీటిని చీల్చుకొని భూమిలోకి ప్రవేశించే జలచరం అనుకొన్నారు –‘’స తమాల నిభే రిపౌ సురాణా౦-ఘన నీహార ఇవా విషక్త వేగః-భయ విఫ్లుత మీక్షితో నభ స్థై –ర్జగతీంగ్రాహ ఇవాపగాం జగాహే ‘’.

  శివుడు బాణం వేసిన సమయం లోనే అర్జునుడు కూడా ప్రయోగించిన బాణం ప్రాణులకు పీడకలిగిస్తూ ఆకాశంలో ప్రకాశించి ,దాని చివర ఉన్న గోరు ఆకారపు లోహపు ములికి కోపించిన యముడిచూపుడు వేలులాగా శోభించింది –‘’సపది ప్రియరూప పర్వ రేఖః –సీతా లోహానగ్ర నఖా ఖమాస సాద-కుపితా౦తకతర్జనాంగులిశ్రీ –ర్వ్యథయన్ ప్రాణ భ్రుతఃకపి ధ్వజేషుః’’.మంత్ర చోదిత అర్జున బాణం ,తోక చుక్క కాంతితో ,మహా శబ్దం తో అడవిని ప్రకాశి౦పజేస్తూ ,పక్షులను చెదరగొట్టింది..అర్జునుని ధనుస్సు నుంచి బయల్దేరటం ,ప్రయాణించటం ,లక్ష్యాన్ని భేదించటం అన్నీ ఏకకాలం లో జరిగినట్లనిపించింది.ఆలోచన ముందా తర్వాతా అనే తేడా తెలీలేదనిపించింది . –‘’అవి భావిత నిష్క్రమ ప్రయాణః-శమితాయామ ఇవాతిరంహసాసః-సహ పూర్వతరం ను చిత్తవృత్తే-రపతి త్వాను చకార లక్ష్య భేదం ‘’. పందికి రెండవవైపు అంటే శివబాణ౦ తగిలిన దానికి రెండో వైపు దూసుకుపోయి,మనుష్యప్రయత్నానికి దైవ ప్రయత్నం తోడయినట్లుగా ఉంది .’’స వృషధ్వజసాయకా వభిన్నం –జయహెతుఃప్రతికాయ మేష ణీయం-లఘు సా౦ధయితుం శరః ప్రసేసే-విధినేవార్థ ముదీరితంప్రయత్నః’’ .అవివేకం ,వృధా శ్రమ ధనాన్ని ఎలా పోగొడతాయో,అత్యాశ సంపాదన ఆశ్రయించిన వారి ప్రేమను ఎలా దూరం చేస్తాయో దుర్నీతి అనవదానత ఎలా జయం కోరిన వారిని చెడ గొడతాయో అలా శివుడు,అర్జునుడు ప్రయోగించిన బాణాలు వరాహాన్ని నిర్జీవం చేశాయి –‘’అవివేక వృధాశ్రమా వివార్ధం –క్షయ లోభా వివ సంశ్రితానురాగం -విజిగీషు  మివా నయ ప్రమాదా –వవసాదంవిశిఖౌ వివిన్యతుస్తం ‘’.ఆపంది మృత్యు వాత పడుతూ ,వేగం తగ్గి ,నాలుగు వైపులా దొర్లుతూ ,,సూర్యుడు నేలమీద పడినట్లు ,భూమి చుట్టూ చెట్లతోనిండి నట్లు భావించి ,చుట్టూ గిరగిరా తిరిగి నేలకు ఒరిగింది .పంది చావు కళ్ళకు కట్టినట్లు గా చూపించిన భారవి కవి కవిత్వానికి కైమోడ్పు .-‘’అథ దీర్ఘతమ౦ తమః ప్రవేక్ష్యన్ –సహసా రుగ్జర యః’’ స సంభ్ర మేణ-నిపతంత మివో ష్ణ రశ్మి ముర్వ్యాం-వలయీ భూత తరుం ధరాం చ మేనే’’.

  నేలమీద పడి వేడి రక్తం తో తడుపుతూ ,కాలిగిట్ట లతో ,నోటి కోరలతో రాళ్ళను  పొడుస్తూ ఒక్కక్షణం ఆర్జునుడిని చూసి ,కోపంతో ఘుర్ ఘుర్ మంటూ  గర్జిస్తూ ప్రాణం వదిలింది .’’అసుభిఃక్షణ మీక్షితే౦ద్రసూను –ర్విహతా మర్ష గురు ధ్వని ర్నిరాసే ‘’ .పంది చనిపోయాక అర్జునుడు తన బాణం తీసుకోవటానికి దగ్గర కొచ్చాడు .అతని దగ్గర చాలా బాణాలున్నా ,ఈ బాణమే దాన్ని చంపిందని కృతజ్ఞతా భావంతో వచ్చాడు .ఎప్పుడోచేసిన ఉపకారం కన్నా ,తత్కాలం లో చేసిన సహాయాన్ని అభినందిచటం లోక సహజం కదా .-‘’స్ఫుట పౌరుష మాపపాతపార్థ –స్తమథ ప్రాజ్య శరః జిఘ్రుక్షుః-న తథాకృత వేదినాం కరిష్యన్-ప్రియతా మేతియథా కృతావ ధానః ‘’.నీచునికి చేసిన ఉపకారం వ్యర్ధమైనట్లు ,పందిని కొట్టిన బాణం  కనిపించలేదు .తన పరాక్రమం వ్యర్ధమై౦దని సిగ్గుతో తలది౦చు కొన్నాడు ధనంజయుడు .-‘’ఉపకార ఇవా సతి ప్రయుక్తః స్థితి మప్రాప్య మృగే గతః ప్రణాశం-కృత శక్తిరథోముఖోగురుత్వాజ్జనిత వ్రీడఇవాత్మ పౌరుషః’’.ఉజ్వలకా౦తితో ఉన్నా ,తన బాణం పరాక్రమం గురించి ప్రశ్నిస్తున్నాడా అన్నట్లు మాటి మాటికీ కళ్ళతో పందిని కావలి౦చు కొంటున్నాడా అన్నట్లు చూశాడు .ఉత్తములు తమ పరాక్రమమం చూపితల ఎగరేయరు.-‘’స సముద్ధరతా విచి౦త్య తేన –స్వరుచిం కీర్తిమివోత్తమాందధానః –అనుయుక్త ఇవ స్వవార్త ముచ్చైః-పరిరేభే ను భ్రుశంవిలోచనాభ్యాం ‘’ .పందిలో గుచ్చిన తన బాణాన్ని వెతుకుతున్న అర్జునుడి దగ్గరకు శివుని సందేశం చెప్పటానికి వచ్చిన ధనుర్ధారి అయిన ఒక కిరాతుని చూశాడు.అతడు మర్యాదగా నమస్కారం చేసి ,శాంతంగా యుక్తియుక్తంగా ఇలా చెప్పాడు –‘’నీ శాంతం నీహృదయ స్వభావాన్ని,వినయాన్నీ  తెలియజేస్తోంది  .గొప్ప తేజస్సుతో చేసిన తపస్సు శుద్ధశాస్త్రజ్ఞానాన్ని తెలియ జేస్తోంది .దేవతలతో పోల్చదగిన నీ ఆకారం నీ ఆకృతికి విరుద్ధమైన వంశాన్ని ప్రకటిస్తోంది-‘’శాంతతా వినయ యోగి మానసం –భూరి ధామ విమలం తపః శ్రుతం –ప్రాహ తే ను సదృశీ దివౌకసా –మన్వవాయ మవదాతమాకృతిః’’.ముని వేషం లోనూ మహా ప్రకాశమానం గా ఉన్నావు .నీ మహత్వం ఇతర రాజులను తక్కువ చేస్తుంది .ఇంద్రకీలం లో ఉంటూ ,ఇంద్రుని ద్వారా త్రిలోకాధిపత్యం చేయిస్తున్నట్లుంది . తస్విగా ఉన్నా,సకల సంపన్నుడి లాగానే ఉన్నావు  . ఒంటరిగా ఉన్నా ,తేజస్సుతో మంత్రులతో ఉన్నట్లుగానే భాసిస్తున్నావు –‘’తాపసోపి విభూతాముపే యివా –నాస్పదం తవమసి సర్వ సంపదాం-దృశ్యతే హిభవతో వినా జనై-రన్వితస్య సచివైరివ ద్యుతిః..నీకు జయలక్ష్మి ప్రాప్తించటం ఆశ్చర్యం కలిగించేది కాదు .ముక్తిని గురించి చి౦తించాల్సిన పనీలేదు .అది నీకు దుర్లభం ఏమీకాదు .రజస్తమో గుణాలను  జయించిన వారికి సిద్ధించని కోరిక ఉండదు కదా ‘’అన్నాడు భిల్లుడు అర్జునుడితో .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -11-12-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.24 త్రయోదశ సర్గ -1

కిరాతార్జునీయం-.24

త్రయోదశ సర్గ -1

అర్జునుడు దగ్గరకొస్తున్న సూకరాన్ని చూశాడు .అది చీల్చటానికి వీల్లేని పర్వతంలా ,రెండు కోరలతో భయంకరం గా ఉంది .కోపం తో నిక్క బొడుచుకున్న జడలతో విజయమే ప్రధానంగా మిగతా వ్యవహారాలూ మాని వస్తున్న పందిని అర్జునుడు చూసి ,అనమాని౦చగా, మనసులో అనేక ఊహలు తోచాయి .అది ముట్టెతో బలిసిన చెట్లు కూల్చగలదు .భుజాలతో రుద్దుతూ పర్వతాల రాళ్ళను దొర్లి౦చ గలదు .ఒంటిగా వస్తూ నన్ను యుద్ధానికి పిలుస్తు నావైపుకే వస్తున్నట్లుంది .నా తపో ప్రభావంతో క్రూర జంతువులు  కూడా హి౦సమాని సహజీవనం చేస్తున్నాయి .ఇది భిన్నం గా ప్రవర్తిస్తోంది .ఇది మాయేమో?అని సందేహించాడు .పూర్వ జన్మ లో శత్రుత్వం దానిలో పోయినట్లు లేదు .విరోధి మృగాలు దగ్గరగా తిరుగుతున్నా ,వాటిని వదిలేసి ,నావైపే రావటం నా అనుమానాన్ని బలపరుస్తోంది .ఇది వరాహం కాదు .నా ప్రాణాలు హరించే ఎవడో అయి ఉంటాడు .మనిషి ప్రసన్నంగా ఉంటే ,హితైషిగా ,కలుషితమైతే శత్రువుగా  సూచిస్తుంది .నా మనసు కలుషితం చేసింది కనుక ఇది నన్ను చంపటానికి వచ్చే శత్రువు అవటం ఖాయం –‘’న మృగః ఖలు కో ప్యయం జిఘాంసుః-స్థలతి హ్యత్ర తథా  భ్రుశం  మనోమే –విమలం కలుషీ భవచ్చ చేతః –కథ యత్యేవహితైషిణం రిపుం వా ‘’.అయినా నేను మునిని .ఎవరికీ అపకారం చేసే వాడిని కాను .భయమెందుకు ?అని అభిమానం కలిగి ఉండటం మంచిది కాదు ఇతరుల వృద్ధి ని ఓర్వలేని వారు ఏ ధర్మం, నీతి,పాటిస్తారు ?కనుక ఇది శత్రువుల కుట్ర కావచ్చు .-పర వృద్ధి షుబద్ధ మత్సరాణాం-కిమివ హ్యస్తి దురాత్మనా మనులంఘ్యం ‘’.ఆ పంది దానవుడో రాక్షసుడో అయి ఉంటుంది.మామూలు అడవి జంతువులకంటే మహా బలిష్టంగా ఉంది .ఈ ప్రాంతాన్ని ఆక్రమించటానికి మాయతో వేట వాతావరణం కల్పిస్తోంది .దీనికి అడవి మృగాలు భయం తో పారిపోతున్నాయి .దుర్యోధనుడు చేసిన సత్కారాలు పొంది ,వాడికి మేలు చేయాలని ,ఇక్కడి జంతువుల్ని కలవర పరుస్తూ  ,ఈ పంది రూపం పొంది ఉండచ్చు –‘’క్షుభితం వన గోచరాభి యోగాత్ –గణమాశిశ్రియ దాకులం తిరశ్చా౦ ‘’.

   ఒక వేళ ఖాండవ దహనం లో బంధువులంతా కాలిపోగా తక్షకుని కొడుకు అశ్వ సేనుడనే నాగరాజు నా మీద ప్రతీకారం తీర్చుకోవటానికి వస్తున్నాడా ?లేక అన్నగారు భీమ సేనుని కోపానికి గురైనవాడెవడైనా వస్తున్నాడా ?ఏమైనా ఈ బలిసిన పంది నన్ను చంపటానికి వచ్చేదే అనుమానం లేదు .కనుక దీన్నితప్పక  చంపాల్సిందే .జ్ఞానులు శత్రు సంహారం గొప్ప లాభం అంటారు –‘’పరమం లాభ మరాతిభంగమాహుః’’.నేను తపస్సు చేసే ఆశ్రమం లో చిద్రాన్వేషకులైన శత్రువులు ప్రవేశించ కుండా తపస్సు చేయమని ,వ్యాసమహర్షి బోధించారు .కనుక ఈ పందిని మట్టుపెట్టాల్సిందే .దుష్ట శిక్షణ లో హింస దోషం కాదు –‘’కురుతాతతపామ్య మార్గ దాయీ –విజయా యేత్య ల మన్వశాన్ము నిర్మాం-బాలి నశ్చవధా దృతేస్యశక్యం –వ్రత సంరక్షణ మన్యథా న కర్తుం..గాండీవం ధరించి శత్రు చేదనం చేయగల వాడి బాణాన్ని మంత్రి సహాయం లాగా అందుకొన్నాడు ధనుంజయుడు .-‘’సచివః శుద్ధ ఇవా దదే చ బాణః’’.పూజ్యుడు ,సత్పరాయణుడు ,ఔదార్యాది గుణాలున్న మంచి స్నేహితుడు ధనబలం లేని సమయం లో ఎలా అనుకూలంగా నడుచు కొంటాడో ,అట్లా సారవంతం బలం కలిగిన గాండీవం తపస్సుతో క్షీణించిన క్రీడి అల్లె త్రాడు లాగి బాణం సంధించగా నమ్రభావం పొందింది –‘’అనుభావవతా గురు స్థిరత్వా –దవి సంవాదిధనుర్ధనంజయేన-స్వబల వ్యసనే పి పీడ్య మానం –గుణవన్మిత్రమివానతింప్రపేదే’’..అర్జునుడు సంధించిన అల్లెత్రాడుధ్వనికి ఏర్పడిన భీకర ధ్వని పర్వతగుహల్లో వ్యాపించి ,అతడు పాదం మోపటం తో పర్వతం స్థిరత్వం కోల్పోయింది .అదే సమయం లో శివుడు ధనుస్సు యొక్క అల్లెత్రాడు లాగిన ధ్వని త్రిపురాలను ధ్వంసం చేసినప్పటి ధ్వనిలా భయంకరాకారం తో అర్జునుడిని  చూశాడు .శత్రు సంహారం కోసం ఒకే సారి సంధించిన శివార్జునుల బాణాల మధ్య వరాహం చేరింది .ఈ ఇద్దరి మధ్యా ఆ పంది చేరటం తో ఈశ్వర పినాక ధనువు నుంచి బాణం మేఘంతో కూడిన మెరుపు ,పిడుగు లాగా వెలువడి ఏనుగులకు భయం కలిగించింది –‘’అథ దీపిత వారి వాహ వర్త్మా-రవ విత్రాసిత వారణాదవార్యః –నిపపాత జవాదిషుః పినాకా –న్మహతోభ్రాదివవైద్యుతః కృశానుః’’.

   సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-12-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.23పన్నెండవ సర్గ -2(చివరి భాగం )

కిరాతార్జునీయం-.23 పన్నెండవ సర్గ -2(చివరి భాగం )

 

మహర్షులు దర్శించిన శివుడు హిమాలయం పై ఉండటం తోపర్వతాలు సముద్రాలు ఆకాశం దిక్కులు అన్నిటినీ కల్గిన ఈ విశ్వాన్ని తన ప్రకాశం తో వ్యాపించి నట్లున్నాడు .రెండు మోకాళ్ళు చేర్చి భయంకర శేషుడనే సర్పం తో చుట్టి ఉన్న శంకరుడు సూర్యకా౦తితో లోకాలోక పర్వతాల దాకా ఉన్న విశ్వంలాగా ప్రకాశిస్తున్నాడు –‘’అనుజాను మధ్య మవసక్త వితత వపుషా మహాహినా –లోకమఖిల మివ భూమి భ్రుతా రవితేజ సామవధి నాధివేష్టితం’’.మంచులాగా తెల్లగా ,శుభ్రంగా ఉన్న యజ్ఞోపవీతం గా ఉన్న  శేషుడిని తన నీల కంఠం రంగుతో సమానం చేస్తూ ఉన్న శివుడు కనిపించాడు –‘’పరిణాహినా తుహిన రాశి విశద ముపవీత సూత్రతాం –నీత మురగ మనురంజయతా శితినా గలేన విలసన్మరీచినా ‘’.మలాతీ పుష్ప సమానంగా ఉన్నశుభ్రమైన కపాలం అనే కలువను వికసింప జేసే చంద్ర కిరణాలు అనే యెర్రని జడలతోవ్యాపి౦ప జేస్తున్నాడు .నాల్గు దిక్కులా వ్యాపించే ఆ జటాసమూహం గంగాజలం లో మిగులు నీటిని శిరస్సు లో ధరించినట్టుగా శివుడు భాసి౦ చాడు .-‘’ఫ్లుతమాలతీసిత కపాల కుముద మవరుద్ధ మూర్ధజం –శేషమివ సుర సరి త్పయసాం శిరసా విసారి శశిధామ బిభ్రతం ‘’.ఋషులు శంకరునికి ఎదురుగా వెళ్లి ,ఆయన నేత్ర సంజ్ఞతోనే అర్జునతపస్సు వలన లోకాలకు కలుగబోయే ఆశుభాన్ని విన్నవించారు .’’ఓ పురుషోత్తమా శంకరా !భయం కలిగించే శరీర బలం కల వృత్రాసురుడి లా ఉన్న  ఒక  పురుషుడు తపస్సు చేస్తున్నాడు .అతని ప్రకాశం సూర్య ప్రకాశాన్ని మించింది .అతడు రెండు అమ్ములపొదులు ,ధనుస్సు కవచం ఖడ్గం జటావల్కలాలు ధరించి ఉన్నాడు .ఇవి ముని ధర్మానికి వ్యతిరేక వస్తువులు అయినా అతనికి మహా శోభ కలిగిస్తున్నాయి .అదే ఆశ్చర్యంగా ఉంది .అతడు కదిల్తే భూమి కంపిస్తోంది. సమాధి గతుడై ఇంద్రియాలను స్తంభింప జేయటం తో దిక్కులన్నిటా వాయువు ,గ్రహ ,నక్షత్రాలు తో కూడిన ఆకాశమే స్తంభించింది –‘’చాలానే వనిశ్చలతి తస్య కరణ నియమే సదిఞ్ముఖం –స్తంభ మనుభవతి శాంత మరుద్గ్రహ తారకా గణయుతం నభ స్థలం ‘’.అతడు త్వరలోనే విశ్వాన్ని జయిస్తాడు .తపస్సుతో సాధ్యం కానిది లేదుకదా –‘’విశ్వమిదమపి దధాతి పురా కిమి వాస్తి యన్న తపసా మదుష్కరం ‘’.ముల్లోకాలు ఒకేసారి జయి౦ చాలనో ,సంహరించాలనో లేక మోక్షమే కోరుతున్నాడో అర్ధం కావటం లేదు .అతని తేజస్సును మేము సహించలేక పోతున్నాం –‘’విజిగీషతే యది ,జగంతి,యుగ పదథ సామజి హీర్షతి-ప్రాప్తు మభవ మభి వా౦ఛతి వా వయమస్య నో విషహితం క్షమా రుచః ‘’

   స్వామీ శంకరా !ఇంకా ఎందుకు ఉపేక్ష చేస్తున్నారు ?కారణం ఏమిటి ?మీకు తెలీనిది ఉండదు .అభయదాతా!మమ్మల్ని రక్షించే సమర్ధులు మీరే .మీ రక్షణలో మాకు అవమానం జరుగాకుండు గాక .-‘’త్రాతు మలమ భయదార్హసి నస్త్వయి మా స్మ శాసతి భవత్పరాభవః ‘’.ఇలా మునులు ప్రార్ధించగా అ౦ధకా౦తకు డైన శివుడు నభో౦త రాళం ప్రతిధ్వని౦చేట్లు,ఉప్పొంగే సముద్ర గర్జన ధ్వనితో ఇలా అన్నాడు .’’మహర్షులారా ! బదరికాశ్రమం లో ఉంటూ లోకసృస్టి,సంహారాలు చేసే విష్ణువు అంశమే ‘’నరుడు ‘’గా పిలువబడే అర్జునుడు .సాధారణ ముని కాదు .సాక్షాత్ నారాయణా౦శ  సంభూతుడు –‘’బదరీ తపోవన నివాస నిరత మవగాత మాన్యథా-ధాతు రుదయ నిదనే జగతాం నర మంశ మాదిపురుషస్య గాం గతం ‘’అతడు లోకాలకు బాధ కలిగించే వారు ,ఇంద్రుని శక్తిని లెక్కచేయని వారు అయిన శత్రువులను జయి౦చాలనే కోరికతో నన్ను ఆరాధిస్తూ తపస్సు చేస్తున్నాడు .కనుక భయపడాల్సిన పనిలేదు –‘’ద్విషతః పరాసిషురేష సకల భువనాభి తాపినః-క్రాంత కులిశ కర వీర్య బలాన్మ దుపాసనం  విహిత వాన్మహత్తపః ‘’తపస్సంపన్ను డైన అర్జుండు , శ్రీ కృష్ణ భగవానుడు బ్రహ్మ ప్రార్ధిస్తే ,భూమి మీది సకల అసుర సంహారం కోసం మనుషులుగా కృష్ణార్జునులుగా జన్మించారు వారు సాక్షాత్తు నర నారాయణులే.ఈ విషయం తెలుసుకొన్న మూకాసురుడు అర్జునుడిని చంపటానికి వెడుతున్నాడు  .కనుక మీరుకూడా నాతో రండి అక్కడ ఏం జరుగుతుందో చూడటానికి. అర్జున ఆశ్రమానికి వెంటనే వెళ్ళాలిమనం  .క్రూర మూకాసురుడు ఏకాంతం లో ఉన్న అర్జునుడిని ఎదుర్కోవటం చేతకాక,అనుమానం  రాకుండా ఉండటానికి  వరాహ రూపం  ధరించి ,విజయం సాధించాలని చూస్తున్నాడు –‘’వివరేపి నైన మనిగూఢ మభిభవితుమేష పారయన్-పాప నిరతి రవిశంకితయా విజయం వ్యవస్యతి వరాహ మాయయా ‘’.నేను కిరాత రాజు వేషం తో మూకాసురుడిని చంపగా ,వాడి అయిన బాణాన్ని వదిలిన అర్జునుడు వేట నియమాలను అనుసరించి నాతొ వివాద౦లొ పడతాడు –‘’నిహతే విడంబిత కిరాత నృపతివపుషా రిపౌ మయా –ముక్త నిశిత విశిఖః ప్రసభం మృగయా వివాద మయమా చరిష్యతి ‘’అర్జునుడు తపో నియమాలతో బాగా చిక్కి పోయాడు .సహాయం కూడా ఎవరూ లేని ఒంటరి వాడు .అయినా ,సహజ సిద్ధ,సాటిలేని  పరాక్రమం తో ఉన్న అతడి భుజపరాక్రమ విక్రమాన్ని చూడండి –‘’తపసా నిపీడిత కృశస్య విరహిత సహాయ సంపదః –సత్వ విహిత మతులం . భుజయోర్బలమస్య పశ్యత మృధేధికుప్యతః ‘’.ఈవిధంగా మునులకు చెప్పిన పరమేశ్వరుడు నుదుట హరిచందనం అడ్డ దిడ్డంగా పూసుకొనగా ,ఒళ్ళు పులకరించి ,ఏనుగు గండస్థల ముత్యాలు కూర్చిన హారం ధరించాడు .

   పొడవైన శిరోజాలున్న జడలలోవికసిత పుష్పాలు ధరింఛి ముడి వేశాడు .నెమలి కన్నుల కమ్మలు పెట్టుకొని కణతలకు శోభ చేకూర్చాడు . ఎర్రని కళ్ళతో భయ౦ కల్పిస్తున్నాడు .-‘’వదనేన పుష్పిత లతా౦త ఇయమిత విలంబి మౌలినా –బిభ్రదరుణ నయనేన రుచం శిఖి పిచ్ఛలా౦చిత కపోల భిత్తినా’’.  కిరాత సేనాపతి గా మారిన  శివుడు మేఘగర్జన లాగా ధ్వనించే ,బాణం తో ఉన్న ధనుస్సు ధరించి ,అందమైన మేఘంలాగా కనిపించాడు .ప్రమథ గణాలు శూల ,పరశు ,బాణం చాపం మొదలైన ఆయుధాలతో కిరాత సైన్యంగా శివుడికి సహాయంగా నిలిచారు .ఈశ్వరాజ్ఞ అనుసరించి ,వారంతా ఇంద్ర కీలాద్రి చేరి అక్కడి అడవిలో ఎవరు ఏవైపున ఉండాలో నిర్ణయించుకొని వేట నెపం తో నాలుగు వైపులా భయంకర నినాదాలిస్తూ అట్టహాసంగా బయల్దేరారు .అడవిలోని పక్షులు జంతువులూ భీతితో అరుస్తూ బయటికి రాగా , ఇంద్రకీలాద్రి గుహలు భయంతో అరుస్తున్నట్లు అనిపించింది .జాతివైరం ఉన్న మృగాలు పరస్పరం కోపం చూపలేదు .భయం తో వచ్చిన కస్టాలు సహజ శత్రుత్వాన్ని కూడాతొలగిస్తాయి .-‘’ఘ్న౦తి సహజమపి భూరి భియః సమమాగతాః సపది వైరామాపదః ‘’.వెదురు పొదల్లోని చిక్కిన చమరీ మృగాలు  అందమైన తోకలు విడిపించు కోవటం లో శివగణ౦  ఆర్భాటాన్ని కూడా లెక్కచేయకుండా ధైర్యంగా ఉన్నాయి .మదజలం స్రవిస్తున్న ఏనుగులు ,జూలు విదిలిస్తున్న సింహాలు శివ సైనికులను చూసి భయపడలేదు. నదులు భయంతో యెగిరి పడే చేపలతో నిండాయి .తీరాలు బురదగా మారాయి .ఏనుగుల రాపిడికి  విరిగిన యెర్ర చందనం చెట్ల రసంతో నీరు ఎర్రబడింది .చల్లని గాలి అలసట తీర్చింది .దున్నల ఘర్షణ వలన అగురు ,తమాల ,తుంగదుంపల పరిమళం గాలిలో కలిసింది .రాళ్ళలో మొలిచే శిలాజిత్తు చిలక రంగులో ఉండేపువ్వుల్ని  వెద జల్లుతూ అలసట తీరుస్తోందని భావం .భయంతో పరిగెత్తే సంక్షోభం తో గ్రీష్మం లో లాగా సరస్సులు దుర్దశ పొందాయి. నీటిని జంతువులు  కలచి వేశాయి .తీరం లోని అరటి చెట్లు ,నివ్వరి ధాన్యం నేలకు ఒరిగాయి .తామర తూడులు వాడాయి .ఇలా శంకరుడు ఇంద్రకీల శిఖరం పై ఉన్న వృక్ష జీవ జాలాన్ని కలచి వేస్తూ ,సంతోషంతో ఆడ లేళ్ళు కొరికిన తీగలున్న అర్జున ఆశ్రమానికి చేరాడు .తర్వాత శివుడు అర్జునునిఎదురుగా ఉన్న మూకాసురుడిని చూశాడు .వాడు మేఘంలాగా నల్లగా పంది ఆకారం లో ముట్టె తో భూమిని పెళ్లగిస్తున్నాడు .-‘’పోత్ర నికషణవిభిన్న భువం దనుజం దధాన మథ సౌకరం వపుః’’.ప్రకాశమాన శివుడు దేవనది మందాకినీ తీరం లో సైన్యాన్ని నిలిపి ,కొందరు సైనికులతో చెట్లు ,పొదలు చాటుగా మూకాసురుని అడుగు జాడలను అనుసరించి బయల్దేరాడు –కచ్చా౦తే సుర సరితో నిధాయ సేనామన్వీతః స కతిపయైః కిరాత వర్యైః-ప్రచ్చన్నస్త రుగహనైసగుల్మ జాలైః లక్ష్మీ వానను పదమస్య సంప్ర తస్థే’’.

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -9-12-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ సువర్చలాంజనేయ దేవాలయం లో ధనుర్మాస ప్రత్యేక పూజలు

ఉయ్యూరు శ్రీ సువర్చలా౦జనేయ స్వామి దేవాలయం లో  మార్గశిర శుద్ధ విదియ 16-12-20 తెల్లవారితే బుధవారం నుండి  13-1-2001మార్గశిర బహుళ అమావాస్య 13-1-2001 భోగి వరకు ధనుర్మాసం సందర్భంగా  ప్రతి రోజూ ఉదయం 5-30నుండి స్వామి వారలకు సుప్రభాత సేవ ,తిరుప్పావై ,శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారలకు అష్టోత్తర  ,సహస్రనామార్చన ,శ్రీ గోదా రంగనాయక స్వాములకు  అష్టోత్తర పూజ ,,ముకుందమాల స్తోత్ర పఠనం,సుందర కాండ పారాయణ ఉదయం 6-30కు నైవేద్యం ,హారతి ,పంత్రపుష్పం,తీర్ధ ప్రసాద వినియోగం నిర్వహింప బడును .భక్తులు పాల్గొని స్వామి వారల అనుగ్రహ౦ పొందమని మనవి .

 27-12-20 ఆదివారం  శ్రీ హనుమద్ వ్రతం  25-12-20 నుండి త్రయాహ్నికంగా నిర్వహింపబడును

25-12-20 మార్గశిర శుద్ధ  ఏకాదశి శుక్రవారం- ముక్కోటి (వైకుంఠ)ఏకాదశి సందర్భంగా ఉదయం 4 గంటలకే ప్రత్యేక పూజ ,పుష్పాలంకరణ ,వివిధ రకాలపుష్పాలతో పూజ ,ఉదయం 5గంటలకు ఉత్తరద్వార దర్శనం ఉంటాయి .

26-12-20 శనివారం మార్గశిర శుద్ధ ద్వాదశి -ఉదయం 9 గంటలకు గంధ సిందూరం , వివిధ పండ్లతో ప్రత్యేక  పూజ

27-12-20 మార్గశిర శుద్ధ త్రయోదశి ఆదివారం –శ్రీ హనుంద్ వ్రతం  సందర్భంగా

  ఉదయం 9గంటలకు –పంపాకలశ  ఆవాహన ,అష్టోత్తర పూజ ,13ముడులున్న తోరాలకు పూజ ,స్వామి వారలకు తమలపాకులతో అష్టోత్తర సహస్ర నామ ప్రత్యేకపూజ మంత్రం తో తోరదారణ  –అనంతరం అయిదు కథలతో,శ్రీ హనుమద్ వ్రతం ,నైవేద్యం, హారతి,మంత్రపుష్పం , తీర్ధ ప్రసాద  వినియోగం .

1-1-2021-శుక్ర వారం –నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా ఉదయం 5-30గంటలకు –‘’లడ్డూలతో ‘’స్వామివార్లకు ప్రత్యేక పూజ  .అనంతరం భక్తులకు లడ్డూ ప్రసాద వినియోగం .

10-1-21 -ఆదివారం ఉదయం 5-30గంటలకు స్వామివార్లకు’’ అరిసెలతో’’ ప్రత్యేక అర్చన

13-1-21-బుధవారం –భోగి పండుగ –ఉదయం 5-30గంటలకు వివిధ కూరగాయలతో స్వామివార్లకు శాకంభరీ పూజ

         ఉదయం 9-30 గంటలకు –శ్రీ సువర్చలా౦జ నేయ స్వామి వారలకు ,శ్రీ గోదా, రంగ నాథ స్వామి వారలకు శాంతి కళ్యాణ మహోత్సవం

14-1-21-గురువారం –మకర సంక్రాంతి పండుగ –ఉదయం 7-30గంటలకు- సంక్రాంతి పురుషుని విశేషాల వివరణ

15-1-21-శుక్రవారం కనుమ పండుగ .

   గబ్బిట దుర్గా ప్రసాద్ –ఆలయ ధర్మకర్త ,మరియు భక్త బృందం

ఉయ్యూరు -9-12-20.

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో కార్తీక చివరి మంగళవారం 8-12-20 ఓంకారాది దీపాలంకరణ

https://photos.google.com/share/AF1QipOsEmdTRSAGtFWBDcBEA5iZjzHY2ZcaDFeIS7dngwhkgOZ375MrpluYuEge4LiHkA/photo/AF1QipOr4jiY1dlZmercGxG8c2yiWkU1ro53gqHS32mw?key=djFzZjEyeGpZQkFZQ2JpcEdpQVp0Qy1UbWJsRWxB

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | 1 Comment

కిరాతార్జునీయం-.22      పన్నెండవ సర్గ -1

కిరాతార్జునీయం-.22

పన్నెండవ సర్గ -1

ఇంద్రుడు అంతర్ధానమయ్యాక,ఇంద్ర తనయుడు సంతోషం తో అలసట లేకుండా శంకరుడిని మెప్పించటానికి తపస్సు ప్రారంభించాడు .సూర్యునికి ఎదురుగా ఒంటికాలిపై నిలిచి ,బాహ్యాభ్యంతర శుచితో జయమే లక్ష్యంగా ,నిరాహారుడై ఎన్నో రోజులు దీక్షగా తపస్సు చేశాడు –‘’అభి రశ్మి మాలి విమలస్య ,ధృత జయ ధృతేరానాషు షః-తస్య భువి బహు తిథాస్తిథయః.ప్రతి జగ్మురేక చరణం నిషీదతః .శరీరం ,ఇంద్రియాలను తపి౦ప జేస్తూ,దుఖాలు సహిస్తూ ,పర్వతం లాగా నిశ్చేష్టుడై స్థిరంగా ఉన్నాడు.గొప్ప వారి ధైర్యం ఊహించనలవి కానిది-‘’వ్యాప నగపతి రివ స్థిరతాం,మహతాం హి ధైర్య మవిభావ్య వైభవం ‘’.పండి పరిమళాలు వెదజల్లే ఫలాల మీద , చల్లని నీటిపై ఆకర్షితుడు కాలేదు .పుణ్యాత్ములకు తపస్సు అమృతమవుతుంది .-‘’న పపాత సన్నిహిత పక్తిసురభిషు ఫలేషు మానసం –తస్య శుచిని,శిశిరే చ పయస్యమృతాయతే హి సుతపః సుకర్మణా౦.అంత గొప్ప తపస్సు చేశానని ఆశ్చర్యపోలేదు .ఫలితం ఆలస్యమౌతుందని విషాదమూ లేదు .అలసటా లేదు .శక్తి తగ్గినా ,రజస్తమో గుణాలు అతని సత్వ గుణాన్ని తగ్గించ లేకపోయాయి .పరాక్రమం ఏ మాత్రం సడలలేదు .-‘’న విసిస్మియే న విషాద ముహురలసాం న చాదదే-సత్వ మురు ధృతి రజస్తమసీ,నహతః స్మతస్య హత శక్తి పేలవే .’’.శరీరం కృశించింది.అయినా ముల్లోకాలు జయించాడు .అతని శరీరాన్ని చూసి తత్వజ్ఞులు కూడా భయపడతారు .మాన ధనులకు సాధ్యం కానిది లేదు లోకం లో .-‘’త్రాస జననమపి తత్వ విదా౦ కిమి వాస్తి యన్న సుకరం    ,మనస్విభిః’’.అర్ధరాత్రి మండే అగ్నికంటే తేజస్సుగా ,సముద్రం కంటే గంభీరంగా ,పర్వతం కంటే ఔన్నత్యంగా భాసిం చాడు .-‘’జ్వలతో నలాదను నిశీథ మదిక రుచిర మంభసాంనిధేః-ధైర్య గుణ మవజయ న్విజయీ దదృశే సమున్నతరః స శైలతః ‘’.ఏకాంతంగా జపిస్తుంటే ,ముఖం సూర్య మండల ప్రకాశం పొందింది. దంతకాంతి చుట్టూ ప్రసరించి పరి వేషంగా సూర్య శోభ పొందింది .కవచం ధరించి ,యజ్ఞోపవీతం ఉన్న భుజం పై ధనుస్సు ఎక్కు పెట్టి ,ఇంద్రతనయుడు ,ఇంద్ర ధనుస్సు ఆవరించిన మహారణ్యహిమాలయం లా ఉన్నాడు .-కవచ స భిభ్ర దుపవీత పదనిహిత సజయ కార్ముకః –శైల పతిరివ మహేంద్ర ధనుః పరివీత భీమ గహనో విదిద్యుతే.’’.చిక్కిన శరీరంతో స్నానానికి వెడుతుంటే అతడి ప్రతి అడుగు భారానికీ హిమవత్పర్వతం కుంగి పోతోంది .శరీరభారం తగ్గినా అర్జునుని అంతః సారం ప్రాధాన్యం వహించిందని భావం .

   ఊర్ధ్వబాహుడై ,తపస్సు చేస్తుంటే విస్తృతమైన తేజస్సు అతని శిరస్సు చుట్టూ నేకాక ,భూ నభో౦త రాలలో కూడా వ్యాపించి,మునులకు ,దేవతలకు దుర్ధర్షమై ఇబ్బంది పెట్టింది –‘’పరికీర్ణ ముద్యుత భుజస్య భువన వివరే దురాసదం –జ్యోతి రుపరి శిరసో వితతం జగృహే నిజాన్ముని దివౌకసాం పథః’’.తపస్సు తేజస్సుకు  కృష్ణ పక్షం లోని రాత్రులలో కూడా చీకటి లేనేలేదు అందుకని చంద్రకాంతి ఆకాశాన్ని వదలలేదు –‘’రజనీషు రాజ తనయస్య బహుల సమయే పిదామభిః-భిన్న తిమిర నికరం న జహే శిశిరస్మి సంగమ యూజ నభఃశ్రియా ‘’.శిరస్సు నుంచి వెలువడిన తపస్సు యొక్క తేజో కిరణాలవిపరీత కాంతి వలన ,ఆకాశ సూర్యుడు సిగ్గుతో మ్లానుడై ప్రకాశించటం లేదు –‘’మహతా మయూఖా నిచ యేన శమిత రుచి జిష్ణు జన్మనా –హ్రీతమివ నభసి వీత మలే న విరాజతే స్మవపు రంశు మాలినః ‘’

  ఎర్రని జటల తేజో కిరణాలు వెలువడ్డాయి .ధనుస్సు ఎక్కు పెట్టాడు .ఇది చూసి అసురనగరాలను కాల్చటానికి సిద్ధపడిన రుద్రుడేమో అనుకొన్నారు జనం . పరీక్షించి చూసి ,కంటి మంట లేదుకనుక రుద్రుడు కాదను కొన్నారు-‘’తముదీరితా రుణ జటాంశుమధి గుణ శరాసనం జనాః –రుద్ర మనుదిత లలాట దృశ్యం  దదృశుర్మిమ౦థిషు మివా సురీః పురీః’’.అర్జునుడు సాధారణ మానవుడు కాదు దేవేంద్రుడో ,సూర్యుడో  ,మంటల అగ్ని దేవుడో అనుకొన్నారు జనం .ఇంతటి ఘోర తపస్సు మామూలు మనిషి చేయలేడు అని భావించారు .-‘’మారుతం పతిః స్విదహిమాంశు రుత పృథుశిఖః శిఖీ తపః –తప్తు మసుకర ముపక్ర మతే న జనో య మిత్యవయయే న తాపసైః’’.అర్జున తపో తేజం అంతటా వ్యాపించినా ,అగ్నిలాగా చెట్లను కాల్చటం లేదు ,సూర్యునిలా నీటిని ఆవిరి చేయటం లేదు కాని సిద్ధ చారణ గణాల తపస్వులకు సహించటం కష్టం గా ఉంది .అంటే అతడి తపస్సు అలౌకికం అని భావం .ఔదార్యం మొదలైన గుణాలు వినయాన్ని ఆశ్రయించినట్లు ,నీతి దుర్నీతినితొలగించి వివేకాన్ని ఆశ్రయించినట్లు, నిర్దిష్ట సమయాలు ప్రమాణాన్ని చేరినట్లు ,శరణు లేని మహర్షులు శివంకరుడైన శివుడిని శరణు కోరటానికి ఆయన వద్దకు వెళ్లారు –‘’వినయం గుణా ఇవ వివేక మపనయభిదం నయా ఇవ –న్యాయ మవదయ ఇవా శరణాఃశరణం యయుః శివ మథో మహర్షయః ‘’.అరుణ తపో తేజస్సనేకిరణాలతో కండ్లు మూసుకు పోతున్న మహర్షులు వెంటనే శివుడిని చేరలేకపోయారు .కాసేపాగి చేరి శివ స్తోత్రాలు చేశారు .అందమైన శరీరం త్రినేత్రాలతో ఉన్న శంకర దర్శనం చేశారు .అంటే శివుడు ప్రత్యక్షమయ్యాడు అని భావం .మొదటి శ్లోకం లో విశాలమైన నందీశ్వరుని మూపు పై చేతులు  ఉంచి ,పార్వతీ దేవి కుఛ సౌభాగ్యాన్ని స్పర్శ సుఖాన్ని అనుభవిస్తున్నట్లు  శివుడు ఉన్నాడని వర్ణించారు .-‘’కకుదే వృషస్యకృత బాహు మకృశ పరిణాహ శాలినీ –స్పర్శ సుఖ మనుభవం తముమా కుఛ యుగ్మ మండల ఇవార్ద్రచందనే ‘’.

 సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-12-20-ఉయ్యూరు

 .

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.21      పదకొండవ సర్గ -4(చివరి భాగం )

కిరాతార్జునీయం-.21

పదకొండవ సర్గ -4(చివరి భాగం )

అర్జునుడు ముసలి తాపసి వేషంలో ఉన్న ఇంద్రునితో ఇంకా చెబుతున్నాడు ‘’మనిషి అభిమానం తో ఉన్నంతకాలం సంపద నిలుస్తుంది .కీర్తికూడా స్థిరంగా ఉంటుంది .మానహీనుడు యశోహీనుడు ,సంపత్ హీనుడౌతాడు.వాడికి లోకం లో ఇంకేమీమిగలదు .—తావదాశ్రీ యతే లక్ష్మ్యా –తావదస్య స్థిరం యశః -పురుష స్తావదేవాసౌ యావన్మానాన్నహీయతే ‘’  .దట్టమైన అడవులున్న బాగా ఎత్తైన పర్వతాలనైనాచేర వచ్చు కాని పరాక్రమ శీలి ,అభిమానవంతుడు మాత్రం ఎవరికీ సాధ్యమయ్యే వాడు మాత్రం కాదు.-‘’దురాసదన వన జ్యాయాన్ గంయస్తు౦గోపి భూధరః –నజహాతి మహౌజస్కం మాన ప్రాంశు మలంఘ్యతా ‘’.వంశానికి ప్రతిష్ట తెచ్చే వారి వల్లనే భూమికి ‘’వసుంధరా ‘’అనే పేరు సార్ధకమైంది వారునిష్కలంక కీర్తితో చంద్రమండలాన్ని సిగ్గుపడేట్లు చేస్తారు.’’గురూం కుర్వ౦తి తే వంశ్యానన్వర్దా తిర్వసు౦ధరా-యేషాం యశాంసి శుభ్రాణి హరిప యంతీ౦దు మండలం .’’ఎండిన కర్రను పిడుగుపడి కాల్చినట్లు ,కోపాన్ని శత్రు సంహారం లో ప్రదర్శించే వారు వారే అంతటి వారుకావాలని ఆశీర్వచానాలలో ఉదహరిస్తారు .అంటే మనస్విత వదలకూడదు అని భావం –‘’ఉదాహరణ మాశీః షు ప్రథమే తే మనస్వినాం శుష్కేఆశని రివా మర్షోయైరారాతి షుపాత్యతే ‘’.నేను చంచల సుఖాలకోసం తపస్సు చేయటం లేదు .ధనసంపాదనకోసం కాదు .అస్త్రాలకు భయపడి మోక్షం కోరటం లేదు .శత్రువుల కపటంవలన అంటిన బురద అనే అపకీర్తి ని  ,విధవలైన శత్రు స్త్రీల కన్నీటితో కడిగి తొలగించాలన్నదే నా కోరిక –‘’పరమార్ష్టుమయశః పంక మి చ్ఛేయంచద్మనాకృతం-వైధవ్య తాపితారాతివనితా లోచనా౦బుభిః’’.లోకం లో సజ్జనులు నన్ను పరిహాసం చేయచ్చు లేక భ్రాంతిలో ఉన్నాననవచ్చు .కానీ నువ్వు చేసిన మోక్షరూప ఉపదేశం నిష్ఫలమై౦దని సిగ్గు పడకు.శత్రు నిర్మూలనం చేసి వంశ పరంగా వస్తున్న రాజ్య లక్ష్మిని ఉద్ధరించకుండా వచ్చే మోక్షం కూడా విజయశ్రీకి  అడ్డుగానే భావిస్తాను .’’వంశ లక్ష్మీ మనుధృత్య సాము చ్ఛేదేనవిద్విషాం-నిర్వాణ మపిమన్యేహమంతరాయ౦ జయశ్రియం ‘’.శత్రువులు అపహరించిన కీర్తిని బాణం తో మళ్ళీ సాధించాలి .అలా చేయకపోతే పుటక వ్యర్ధమే .చచ్చినవాడితో సమానం .గడ్డిపోచ విలువకూడా పొందలేడు-‘’ఆజన్మా పురుష స్తావ ద్గతాసు స్తృణమేవ వా  -యావన్నేషుభిరా దత్తేవిలుప్త మరిభి ర్యశః ‘’.

  శత్రువుపై తప్పక ప్రతీకారం తీర్చుకోవాలి .అలా చేయకపోతే దోషమే .ముసలి మునీ !నువ్వే చెప్పు- శత్రు సంహారం లేకుండా మనిషి కోపం శాంతిస్తుందా ?శత్రు సంహారం చేయని వాడిని పురుషుడు అనవచ్చా ?’’అని ప్రశ్నించాడు –‘’అనిర్జయేన ద్విషతాం యస్యామర్షః ప్రశామ్యతి-పురుషోక్తిః కథం తస్మిన్ బ్రూహి త్వం హి తపోధన ‘’.పురష జన్మతో చెప్పబడే పురుష శబ్దం తో ఏమీ కాదు .పశు ,పక్ష్యాదుల్లోనూ పురుష జాతి ఉంది .గుణ గ్రహణపారీణులు ప్రశంసించి ,వెంటనే ఆదర్శం గా తీసుకోబడే వాడే  పురుషుడు .-‘’కృతం పురుష శబ్దేన జాతి మాత్రావలంబినా –యో౦గీకృత గుణైః శ్లాఘ్యః సవిస్మ యముదా హృతః ‘’.సభలలో సంభాషణలలో గౌరవంగా తీసుకోనబడే వాడు వినే వాళ్ళ తేజస్సు ను కూడా మింగేసే వాడూ ,శత్రువుల చేతకూడాఅభినందింపబడే వాడూ అతడే అభిమాన వంతులలో గణనీయుడైన పురుషుడు అవుతాడు .-‘’గ్రసమాన మివా౦ జసి సాదసా గౌర వేరిత౦ –నామ యస్యాభి న౦ద౦తి ద్విషోపిస పుమాన్పుమాన్ ‘’.మారాజైన ధర్మ రాజు మా శత్రువులపై ప్రతీకారం తీర్చుకోవటానికి నన్నేకోరాడు .దాహం వేసిన వాడు దోసెడు నీళ్ళుకోరినట్లు నన్ను కోరాడు .-‘’యథా ప్రతిజ్ఞంద్విషతాంయుధి ప్రతి చికీర్షయా –మమైవా ధ్యేతి నృపతిస్తృష్యన్నివ  జలాంజలె

జలా౦జలేః’’.యజమాని ఆపదలో ఉంటె అతడిఆజ్ఞ పాలి౦చని వాడుతన నిర్మల వంశానికి చంద్రునిలో మచ్చ లాగా  కుల ఘాతకు డౌతాడు.అంటే ధర్మరాజు ఆజ్ఞ నాకు శిరో దార్యం ..-‘’స వంశస్యావ దాత స్య శశాంక స్యేవ లాంఛనం-కృఛ్చ్రేషువ్యర్ధయా యత్ర భూయతే భర్తు రాజ్ఞయా’’.సరేకానీ గృహస్థాశ్రమానికి ముందే ధర్మానికి విరుద్ధమైన ముని వృత్తి నాకు ఎందుకు ఉప దేశిస్తున్నావు సామీ ? బ్రహ్మ చర్య ,గృహస్థాశ్రమ, వానప్రస్థ,సన్యాసం కదా వరుస .నేనింకా  గృహస్థుడినే అని భావం .శత్రు ప్రతీకార భారం ఇంకా నామీద ఉంది మా అమ్మగారు కుంతీదేవి కూడా మాదగ్గరలేదు .అన్న ధర్మరాజు గారే మాకు అన్నిటికీ పెద్ద ఆయన ఆచార నిష్ఠ ఉన్నవాడు .ఈ మూడు కారణాలవలన నేను స్వతంత్రంగా ఏమీ చేయకూడదు .అందుకే గృహస్థాశ్రమ ధర్మాలు ఎన్నోఆచరించ లేకపోతున్నాను .అభిమానవంతులు తమపని ధర్మాన్ని తాము చేస్తారు .దాన్ని ఉల్లంఘించరు.శత్రువుతో అపకారం పొందినవాడు యుద్ధం నుంచి దూరం కాడు. ప్రతీకారం తీర్చుకోనేదాకా శ్రమిస్తాడు-‘’స్వధర్మ మను రుంధంతే నాతిక్రమ మరాతిభిః-పలాయంతేకృతద్వంసా నాహవా న్మాన శాలినః ‘’.సుడిగాలితో చెల్లా చెదరైన మేఘం లాగా ,ఇంద్రకీలాద్రి పై నేనూ విలీనమౌతాను లేదా ఇంద్రుడిని మెప్పించి అపకీర్తి ముల్లుతొలగిస్తాను .ఇదే నా నిశ్చిభిప్రాయం’’ అని  ఇంద్రతనయుడు అర్జునుడు ,ముసలి ముని వేషం లో వచ్చిన ఇంద్రుడికి చెప్పాడు –‘’విచ్చిన్నాభ్రవిలాయం వా విలీయే నాగ మూర్ధని –ఆరాధ్య వా సహస్రాక్షమ యశః  శల్య ముద్ధరే ‘’.

  తన మనో నిశ్చయాన్ని నిర్భయంగా చెప్పిన అర్జునుడికి ఇంద్రుడు తన నిజరూపం తో ప్రత్యక్షమై ,రెండు చేతులతో గట్టిగా ఆలింగనం చేసుకొని,అతడి అభీష్ట సిద్దికీ ,సంసారం లో సరిగమలు సరిదిద్దుకోవటానికీ ,పాపాలను తొలగించే పరమేశ్వరుని గురించి తపస్సు చేయమని ఉపదేశించాడు .-‘’ఇత్యుక్త వంతం పరి రభ్యదోర్భ్యాం తనూజ మా విష్కృత దివ్య మూర్తిః-అఘోపఘాత౦ మఘవా విభూత్యై  భవోద్భావా రాదన మాది దేశ ‘’.అర్జునుడి తో ఇంద్రుడు ‘’శివుడు నీ తపస్సుకు ప్రసన్నుడవగానే, లోక పాలకుల౦దరి తో కూడా నేను గొప్ప శక్తిని ప్రసాదిస్తాను .దాని ప్రభావం తో నువ్వు శత్రు రాజ్య లక్ష్మిని నీకు అనురాగవతిగా చేసుకోగలవు ‘’అనిచెప్పి , అంతర్ధానమయ్యాడు.

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-12-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

  సార్ధకమైన ఆదివారం

   సార్ధకమైన ఆదివారం

సాహితీ బంధువులకు శుభకామనలు .నిన్న 6-12- 20 కార్తీక బహుళ షష్ఠి ఆదివారం మా ఇంటి పెరటిలో ఉన్న ఉసిరి వృక్షం క్రింద ఉదయం 9గంటల నుండి 11 గంటల వరకు నేనూ మా అబ్బాయి మూర్తి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, దశ శాంతులు సామ్రాజ్య పట్టాభి షేకంతో తో సహా చేసి, శివ  అస్టోత్తర   శతనామపూజ,  బిల్వార్చన చేశాం .తర్వాత 11గం నుండి నేనూ మా శ్రీమతి, మా అబ్బాయి మూర్తి ,కోడలు రాణి   నవగ్రహాలకూ అష్టోత్తర పూజ ,శ్రీ సత్యనారాయణ స్వామికి అష్టోత్తర సహస్రనామపూజ ,,అభిషేకం సత్యనారాయణస్వామి  వ్రతం ,అయిదు కథలు తోనూ తర్వాత శ్రీ వేంక టేశ్వర దీపారాధన అష్టోత్తరపూజ, తులసి అష్టోత్తర పూజ చేసేసరికి మధ్యాహ్నం 1.45గం అయింది . బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు అందజేశాం .అప్పుడు బంధుమిత్రులతో    మామిడికాయపప్పు,అరటిఊచ  ఆవపెట్టి కూర ,బెండకాయ వేపుడు ,నేతిబీరకాయ పచ్చడి ,దోసావకాయ ,కాలీఫ్లవర్ ఊరగాయ ,పరవాన్నం,చక్రపొంగలి పులిహోర, పులుసు ,అప్పడం ,పెరుగు లతో ఉసిరి చెట్టు కింద కార్తీక వనభోజనం చేశాం .అందరి భోజనాలు ఆయే సరికి మధ్యాహ్నం 3 అయింది .  వంట అంతా మా కోడలు, ప్రక్కనున్న మామ్మగారు ,మా శ్రీమతి చేశారు .వడ్డన మల్లికా౦బగారు ,మూర్తి, రాణి ,చరణ్ ,రమ్య చేశారు .మా దేవాలయ అర్చక దంపతులు మా అన్నగారబ్బాయి రాంబాబు,దంపతులు , మా వదిన గారు ,అద్దెకున్న గోపాలకృష్ణమూర్తి గారు,, భార్య గారు ,అద్దెకుంటున్న సుబ్రహ్మణ్యంగారు అతిధులు.

   మధ్యాహ్నం 3-30కు కారులో నేనూ మామనవడు చరణ్ ,మనవరాలు రమ్య బయల్దేరి కృష్ణకట్ట మీదుగా నడకుదురు శ్రీ పృధ్వీశ్వర దేవాలయ సందర్శన చేసి అక్కడ మాత్రమే పెరుగుతున్న అపురూప మైన  పాటలీ పుష్ప వృక్షాలు చూసి అక్కడే నరకాసుర వధ జరిగిందన్న ఐతిహ్యం మా వాళ్లకు చెప్పాను ..అక్కడి నుంచి చల్లపల్లి మీదుగా కప్తానుపాలెం వెళ్లి  అక్కడ ఉంటున్న 57 ఏళ్ళక్రితం మోపిదేవి హైస్కూల్ శిష్యుడు అడవి శ్రీరామ మూర్తి ఇంటికి వెళ్లి ,వాళ్ళమ్మ గారిని, భార్యను చూసి సత్యనారాయణ స్వామి ప్రసాదం ఇచ్చాం .అక్కడి నుంచి శ్రీరామమూర్తిని తీసుకొని అందరం చల్లపల్లి మీదుగా  అమరగాయకులు శ్రీ ఘంటసాల జన్మించిన టేకుపల్లి గ్రామం చేరి అక్కడ ఎలిమెంటరి స్కూలు ఆవరణలో గానగంధర్వ బాలసుబ్రహ్మణ్యం గారి చేత ప్రతిష్టింప బడిన ఘంటసాలమాస్టారి  విగ్రహాన్నిచీకట్లోనే చూశాం .అక్కడే కంచి కామకోటి పీఠం ఆధ్వర్యం లో నిర్వహింపబడుతున్న శ్రీ రామలింగేశ్వర స్వామి దర్శనం చేసి , అక్కడినుండి పెదకళ్ళేపల్లి చేరి అక్కడి శ్రీ దుర్గా నాగేశ్వరస్వామి దర్శనం చేసి ,సత్యస్తంభం  చూశాం ..ఇక్కడే ప్రముఖ సాహితీ వేత్త  శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు,సినీ గేయరచయిత శ్రీ  వేటూరి సుందరరామమూర్తిగారు ,మహా సంగీత విద్వాంసులు శ్రీ సుసర్ల దక్షిణా మూర్తి శాస్త్రిగారు,,ఆయన మనవడు  సినీ సంగీత దర్శకులు శ్రీ సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి జన్మించారు .కృష్ణా నదీతీరంలో ఉన్న కదళీవనాలు అంటే అరటి చెట్లు విశేషంగా ఉన్న కదళీ పల్లి అనే కళ్ళే పల్లి దక్షిణ కాశిగా పేరుపొందిన  సుప్రసిద్ధ పుణ్య క్షేత్రం .ఇక్కడ ఓరియెంటల్ హై స్కూల్ ఉంది . 1999లో వేటూరి ఇక్కడే తమ ఇంట్లో రెండు రోజుల సాహిత్య కార్యక్రమం అన్ని ఖర్చులూతానే భరించి నభూతో గా నిర్వహించారు .మొదటి రోజున మా దంపతులం కూడా వెళ్లి వేటూరి సుందరరామ మూర్తిగారి కమ్మని షడ్రసోపేత భోజనాన్ని ఆతిధ్యాన్నిఆదరణ ను  దర్శకుడు  విశ్వనాద్ దేవదాస్ కనకాల దంపతులు, జంధ్యాల, నటి ,,నాట్య మయూరి సబిత  ల తోపాటు అనుభవించి అనుభూతి పొందాం .ఆడిటోరియం లో జరిగిన సభలో శ్రీ బుద్ధప్రసాద్ వగైరా పాల్గొన్నారు .

 

https://photos.google.com/share/AF1QipMoVYFdhQjxDS0LiBza_5dGEl_dkA6iQymxSSnd3f0KrnFzm1DPhMYjezqCPnZ18Q?pli=1&key=bEtfOXl2M3kyTURvU20tNFNQTEhkTnNBeWcwNDNn

 

  కళ్ళేపల్లి నుంచి నేను 33ఏళ్ళ క్రితం అంటే 1987లో హెడ్ మాస్టర్ గా పనిచేసిన మంగళాపురం మీదుగా లక్ష్మీ పురం చేరి,  అక్కడ నా దగ్గర మంగళాపురం లో ,అంతకు ముందు వత్సవాయి హైస్కూల్ లో అటెండర్ గా పనిచేసిన మేమంతా’’ బాణం’’అని పిలిచిన ప్రస్తుతం చల్లపల్లి మండల పరిషత్ లో S.O.గా పనిచేస్తున్న పోతుమూడి వెంకటేశ్వరరావు కుమారుడు వెంకట రఘు ,హరిచందన  వివాహానికి హాజరయ్యాం.అతడు 15రోజులక్రితం కుమారుడితో ఉయ్యూరు వచ్చిశుభలేఖ ఇచ్చి తప్పక రమ్మని కోరితే వెళ్లాం . వత్సవాయిలో పని చేసినప్పుడు అతడు ట్రాన్స్ ఫర్ అయి వెడుతూ ,‘’సార్ మళ్ళీ మీ దగ్గరే పని చేయాలని ఉంది ‘’అన్నమాట ఉయ్యూరు వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకొన్నాడు .అలాగే మళ్ళీ మంగళాపురం లో నా దగ్గరే పని చేశాడు  . నేను రోజూ ఉయ్యూరు నుంచే వచ్చేవాడిని .చాలా ఇబ్బందిగా ఉండేది ప్రయాణం చల్లపల్లి లక్ష్మీ పురం చేరటం తేలికగానే ఉండేది. అక్కడి నుంచి మంగళాపురానికి బస్ సరిగ్గా ఉండేది కాదు .రిక్షాలో వెళ్ళాల్సి వచ్చేది .నేను  ముందే వెళ్లి ,బాణం ఇంట్లో కాసేపు కూర్చుని అతనిభార్య ఇచ్చిన కాఫీ లేక మజ్జిగ తాగి ,అతడి సైకిల్ పై  స్కూలుకు వెళ్ళేవాడిని అదీ మా అనుబంధం .తర్వాత మూడు నెలలో నాలుగు నెలలో మంగళాపురం లో స్కూలుకు దగ్గరలోనే ఉన్న  మాలెం పాటి వేణు గారింట్లో ఒకగదిలో అద్దె కున్నాను. వేణుభార్య విజయ ను ‘’అమ్మాయీ ‘’అని పిలిచే వాడిని .ఆమె మామగారు ఉండేవారు .అందరూ ఆత్మీయంగా చూసేవారు .అమ్మాయి మాత్రం నన్ను కన్న తండ్రి లాగా చూసుకొనేది. ఉదయం కాఫీ,, మధ్యాహ్నం టీ సాయంత్రం టీ, వీలైనప్పుడల్లా ఇడ్లీ గారే చేసి పెట్టేది..పెరుగు, పాలు, మజ్జిగ ఫ్రీ .ట్యూషన్ కూడా చెప్పా  టెన్త్  పిల్లలకు .మా వివాహ౦ జరిగి 25ఏళ్ళు అయిన సందర్భంగా స్కూల్ లో గ్రాండ్ పార్టీ ఇచ్చాము. ఉయ్యూరునుంచి మా శ్రీమతి మా అమ్మాయి విజ్జి  మా అబ్బాయిలు కూడా వచ్చారు .నన్ను చూసి తర్వాత పాండురంగా చారి  అనే డ్రాయింగ్ మాస్టారు అలాంటి పార్టీ ఇస్తే ,తర్వాత అందరూ ఏదో ఒకకారణంగా పార్టీలిచ్చారు    .అమ్మాయి ,వేణు ఆ తర్వాత మూడు నాలుగు సార్లు ఉయ్యూరు వచ్చారు . ఫోన్ లో మాట్లాడేవారు  .వాళ్ళ అమ్మాయి పెళ్ళికి కూడా నేను వెళ్లాను . అమ్మాయిని చూడాలనుకొని బాణం కు మెసేజ్ పెడితే అతడు చదివి ఫోన్ చేసి రెండేళ్ళక్రితం విజయ చనిపోయిన విషాద వార్త చెప్పాడు .లేకపోతె వాళ్ళ ఇంటికి కూడా వెళ్లి ఉండేవాళ్ళం . నేను వచ్చినందుకు బాణం దంపతులు ఎంతో సంతోషించారు .చాలా గ్రాండ్ గా జరిగింది వివాహం .మాజీ మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర కూడా వివాహానికి హాజరయ్యారు .ఆయనకు సరసభారతి ఉగాది ఆవిష్కరణ పుస్తకాలు మూడు ఇస్తే ,చాలా ఆప్యాయంగా అందుకొని   ఫోటో తీయి౦చు కొన్నారు . చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రావీన్ద్రగారిని చాలా సాహిత్యసభాలలో చూశాను .ప్రభుత్వ సాహితీ పురస్కారం కూడా బెజవాడ సంగీత కాలేజిలో ఆయన ,ఇతర మంత్రుల సమక్షం లో అందుకొన్నాను .ఇవన్నీ జ్ఞాపకమోచ్చాయి .ముహూర్తం రాత్రి 7.50కి చూసి, దంపతులను ఆశీర్వదించి ,కానుక కవర్ పెళ్లి కొడుకు చేతిలోపెట్టి ,బయల్దేరగా బాణం వచ్చి చాలాసంతోషంగా ఉందని చెప్పి భోజనం చేయమని కోరితే కార్తీకమాసమని చెప్పి  రాత్రి 8గం.లకు బయల్దేరి 9.కి ఉయ్యూరు చేరాం .మా కారు డ్రైవర్ కం ఓనర్ శుశీల్ బాగా,జాగ్రత్తగా  డ్రైవ్ చేశాడు .

  కార్తీకమాసం ఆదివారం అభిషేకం ,సత్యనారాయణస్వామి వ్రతం ,వనభోజనం ,మూడు శివ క్షేత్రాల దర్శనం ,వివాహ వేడుక కు హాగారు ల తో ధన్యమయ్యాం  .

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-12-20-ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కార్తీక బహుళ షష్ఠి 6-12-20ఆదివారం మా ఇంటి ఉసిరి చెట్టుక్రింద మహాన్యాసపూర్వక అభిషేకం,బిల్వదళపూజ ,శ్రీ సత్యనారాయణ వ్రతం, శ్రీ వేంకటేశ్వర దీపారాధన, బంధు మిత్రులతో కార్తీక వనభోజనం

కార్తీక బహుళ షష్ఠి 6-12-20ఆదివారం మా ఇంటి ఉసిరి చెట్టుక్రింద మహాన్యాసపూర్వక అభిషేకం,బిల్వదళపూజ ,శ్రీ సత్యనారాయణ వ్రతం, శ్రీ వేంకటేశ్వర దీపారాధన, బంధు మిత్రులతో కార్తీక వనభోజనం

https://photos.google.com/share/AF1QipOZK-YDfb09Tj3Ha24fPGPzx-wteFFXqQVyhHoYQeh03mKScTC0jiKnhwB_CKacPg/photo/AF1QipNNT5-8YyueCmJLyByHk_hWH7iKVz81UjWvno6a?key=MTQyNU5lbjdTcUlJNmtUTWhaalRHOVB3ZlprRU1R

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

సంస్కృత పండితులు శ్రీ దోర్బల విశ్వనాథ శర్మ గారు అస్తమయం !

సంస్కృత పండితులు శ్రీ దోర్బల విశ్వనాథ శర్మ గారు అస్తమయం !
ప్రముఖసంస్కృతాంధ్రవిద్వత్కవి, మహామహోపాధ్యాయ శ్రీ దోర్బల విశ్వనాథశర్మ గారు అనారోగ్యంతో నిన్న రాత్రి 1.30 గంటలకు హైదరాబాదులో పరమపదించారు. వారి వయస్సు 90 సంవత్సరాలు. వీరు ప్రముఖ సంస్కృత పండితులు శ్రీ దోర్బల ప్రభాకర శర్మ గారికి సహోదరులు. 1931 లో అప్పటి మెదక్ జిల్లా రామాయంపేటలో జన్మించిన శర్మ గారు సంస్కృతాంధ్రభాషలలో అపారపాండిత్యాన్ని సంపాదించి లబ్ధప్రతిష్ఠులయ్యారు. ఆయన రచించిన ‘శ్రీలాలిత్యం’ అశేషపాఠకాభిమానులను అలరించింది.సంస్కృతాంధ్రభాషలలో శతకాలూ,కావ్యాలూ,వ్యాఖ్యానాలూ శతాధికంగా రచించి ఉభయభాషలలోనూ అపారకీర్తిని గడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున విశిష్ట సేవాపురస్కారంతో ముఖ్యమంత్రి చేతుల మీదుగా సత్కారాన్ని అందుకున్నారు. అనేక జాతీయ స్థాయి రాష్ట్రస్థాయి పురస్కారాలను, సత్కారాలను పొందారు—-అప్పల శ్యాం ప్రణీత శర్మ గారు ఫేస్ బుక్ లో పెట్టిన వార్త
Posted in సమయం - సందర్భం | Leave a comment

కిరాతార్జునీయం-.20    పదకొండవ సర్గ -3.

కిరాతార్జునీయం-.20         పదకొండవ సర్గ -3.

అర్జునుడు ఇంద్రుడితో’’ఇలాంటి ప్రియవచానాలు ఎవరు చెబుతారు .నీలాంటి బుద్ధి మంతులకు  తప్ప మరొకరికి సాధ్యం కాదు ‘’-‘’వ్యాకుర్యాత్కః ప్రియం వాక్యం యో వక్తా నేదృగాశయః .నేను ఎందుకు తపస్సు చేస్తున్నానో దాని నేపధ్యం మీకు తెలియదు .సాధారణ ముని అనుకొని,మోక్ష ధర్మం ఉపదేశించావు .-‘’శాసితం యేన మాం ధర్మం మునిభి స్తుల్య  మిచ్ఛసి’’.పూర్వాపరాలు తెలీకుండా చేసే ఉపదేశం బృహస్పతి చెప్పినా వృధా అవుతుంది .నీతివిరుద్ధ ప్రయత్నం విఫలమైనట్లే ఇదీ నిష్ఫలమౌతుంది –వాచస్పతే రపి -‘’అవిజ్ఞాత ప్రబంధస్య ‘’వ్రజత్యఫలతామేవ నయద్రుహ ఇవే హితం ‘’         .నక్షత్రాలు ప్రకాశించే ఆకాశానికి పగలు పనికి రానట్లు ,మీ ఉపదేశానికినేను పాత్రుడిని కాను -.’’శ్రేయసో ప్యస్య తే తాత వచసోనాస్మి భాజనం –నభసః స్ఫుట తారస్య రాత్రే రివవిపర్యయఃనేను పాండు రాజ  కుంతీ దేవి దంపతుల కుమారుడిని .ఆర్జునుడిని . దాయాది కౌరవులు రాజ్య బహిష్కారం చేయగా అరణ్యవాసం చేస్తున్నఅన్నగారు ధర్మరాజు ఆజ్ఞతో ఇక్కడ తపస్సు చేయటానికి వచ్చాను .-‘’క్షత్రియస్తనయః పా౦డో రహం పార్థోధనంజయః –స్థితః.ప్రాంతస్య దాయాదైర్భ్రాతుర్జ్యేష్టస్య శాసనే ‘’..పూజ్య కృష్ణ ద్వైపాయన మహర్షి ఆజ్ఞాపించగా ఈ రకంగా తపో నిష్ఠ లో ఉన్నాను .ఇంద్రుని ప్రసన్నం చేసుకొనే ప్రయత్నం లో ఉన్నాను .ఇంద్రుడు క్షత్రియ దేవుడు కనుక సుఖారాధ్యుడు అని భావం .-‘’కృష్ణ ద్వైపాయ నాదేశాత్ విభిర్ని వ్రత మీద్రుశం .-భ్రుశమారాదనే యత్తః స్వారాధ్యస్య ‘’.మరుత్వతః.కపట పాచికలతో ఆడి, ధర్మరాజు రాజ్యం,సోదరులు నల్గురు భార్య ద్రౌపదిని స్వయంగా పణంగా ఒడ్డి ఓడిపోయాడు .ఏదో జరగాల్సిందేదో అలా జరిగిపోయింది ‘’భవితవ్యతాఖలు బలవతీ ‘’ సూక్తి నిజమైంది .’’దురక్షాం దీవ్యతా రాజ్ఞా రాజ్యమాత్మావయం వధూః-నీతాని ణతాం నూను నమీదృశీభావితవ్యయా ‘’.నేను లేకుండా మిగతా సోదరులతో ఉన్న యుధిస్టిరుడుద్రౌపదీ దీర్ఘ రాత్రులు గడపలేక ఇబ్బంది పడ్డారు .నాకోసం వాళ్ళు, వారికోసం నేను బాధ పడుతుంటే వైరాగ్య భావన కలుగదు కదా –‘’తేనానుజ సహాయేన ద్రౌపది వినా   –భ్రుశ మా యామి యామాసు యామినీ ష్వభితప్యతే ‘’.కౌరవ సభలో మా ధర్మపత్ని ద్రౌపది కొంగు లాగి సిగ్గు పడేట్లుచేశారు .నీచమైన మాటలశూలాలతో మా ననస్సులకు గాయాలు చేశారు –‘’హృతోత్తరీయాం ప్రసభం సభాయామాగత హ్రియః –మర్మచ్ఛిదానో వచసా నిరతకక్ష న్నరాయతః ‘’.కాలపురుష మృత్యువు భీష్మాదులున్న సభలో ద్రోపదిని ఈడ్చుకురావటం మమ్మల్ని కూడా అలాగే ఈడ్చాలనే ప్రయత్నం లో ఉన్నట్లు అర్ధమైంది .’’వినాశకాలే విపరీత బుద్ధిః’’లోకోక్తికి ఉదాహరణగా నిలిచారు’’ –‘’ఉపాధత్త సపత్నేషు కృష్ణాయా గురు సన్నిధౌ –భావమాన యనే సత్యాః సత్యం కార మివా౦ తకః ‘’

   దుశ్శాసనుడు సభలోకి ఆమెను ఈడ్చుకొని వచ్చినప్పుడు ,సభాజనం క్షణ కాలం చూశారు .తర్వాత తలలు తిప్పుకొన్నారు అది సాయం వేళసూర్యుని కెదురుగా ఉన్న చెట్టు నీడ క్షణ కాలం ఉన్నట్లుగా అనిపించింది –‘’అభి సాయార్క మా వృత్తాం.చాయా మివ మహా తరోః.’’ఏ పనీ చేయలేని నీ భర్తలను చూసి మాత్రం ప్రయోజనం ఏముంది అన్నట్లు ద్రౌపది కళ్ళను కన్నీరు కప్పేసింది – ‘’ఆయథార్ధ క్రియా రంభైః పతిభిఃకిం తవైక్షి తైః-అరుధ్యేతామితీ వాస్యా నయనే బాష్ప వారిణా  ‘’.మా దుర్దశకు  మా పెద్దన్న ధర్మరాజు గారే సహించాడు శత్రునాశనం ఎప్పుడైనా సులభమే .ఇవాళకాకపోతే రేపైనా తప్పదు..కాని సజ్జనులమధ్య అపవాదు మంచిది కాదు కదా .ఆది తప్పిన వాడు అనే పేరు రాకూడదని అన్నగారి ఉపేక్ష .-‘’సోఢవాన్నో దశా మంత్యాం జ్యాయేనేవ గుణప్రియః –సులభో హి ద్విషాం భంగోదుర్లభా సత్స్వ్య వాచ్యతా ‘’.సముద్రజలం చెలియలికట్ట దాటరాదు అనే మర్యాద తో అతలాకుతలమౌతుంది అయినా స్వచ్చంగానే ఉంటుంది .అలాగే అభిమాన వంతుడైన ధర్మరాజు మనస్సు కూడా ప్రతిజ్ఞాభంగం కాకూడదని వ్యాకులమైంది అయినా మనస్సుమాత్రం .స్వచ్చంగా సంయమనం పాటిస్తోంది –‘’స్థిత్యతి క్రాంతి భీరూణిస్వచ్ఛాన్యాకులితాన్యపి-తోయాని తోయరాశీనాం మనాంసి  చ మనస్వినాం .ధృత రాష్ట్ర కుమారులతో మా మైత్రి మా శత్రుత్వానికి కారణమయింది .నీడ కోసం కూలిపోయే నది గట్టు ను ఆశ్రయిస్తే అదికూలి ప్రాణం తీసినట్లు ,దుర్జన స్నేహం అనర్ధ దాయకమే .మిత్ర ద్రోహమే దీనికి కారణం .—దార్త రాష్ట్రైః సహప్రీతి ర్వైర మస్మాస్వ సూయతః –అసన్మైత్రీ హి దోషాయ కూల చ్ఛాయేవసేవితా ‘’.

  లోకనిందకు భయపడని మంచి చెడు విషయం లో తారతమ్యం లేని దురాచార దుష్టుని మనసు దైవ విదిలాగా ఊహకు అందనిది .వాడి పనిని బట్టే అది బయట పడుతుంది ..-‘’అపవాద భీతస్య సమస్య గుణ దోషయోః-అసద్వ్రుత్తేరహో వృత్తం దుర్విభావం  విధేరివ’’.శత్రు అవమానం పొందిన నామనస్సు వెంటనే బ్రద్దలయ్యేట్లుంది.ప్రతీకారం తీర్చుకోవాలన్న నా కోపం దానికి సాయపడి కాపాడింది .బతికి ఉండటానికి కారణం ప్రతీకారం తీర్చుకోవటానికే –ద్వంసేత హృదయం సద్యః పరి భూతస్య మే పరైః-యద్యమర్షఃప్రతీకారం భుజా లంబం నలంభయేత్’’.శత్రువుల అవమానం తో మృగాలుగా గడుపుతున్న మేము ఒకరి కొకరం చూసుకొని సిగ్గుతో తలవంచు కుంటున్నాం .స్నేహబృందం మాట చెప్పేదేముంది ?-‘’అవదూతాయాభి ర్నీతా హిరణై స్తుల్య వృత్తి తాం-అన్యోన్యస్యాపి జిహ్రీమః కిం పునః సహవాసినాం ‘’.అభిమానం వదిలితే నమ్రత, దుర్బలత్వం గౌరవహాని కలుగుతాయి అలాటి మానహీండు గడ్డి పోచతో సమానం .ఎన్నికస్టాలొచ్చినా అభిమానం వదలరాదు కదా ‘’-శక్తి వైకల్య నమ్రస్యనిః సారత్వా ల్లఘీ యశసః-జన్మినో మాన  హీనస్య తృణస్య చ సమాగతిః’’.పర్వత శిఖరాలలో దాట శక్యం కాని శిఖరాన్ని చూసి గొప్ప అభిమానం ఏ కారణంగా నూ సతోషం పొందదు.అనుల్లంఘ నీయత్వమే గొప్పవారికి  ప్రీతి కలిగిస్తుంది –‘’అనుల్లంఘ్యం తత్త దురీక్ష్యయద్య దుచ్చైర్మహీ భ్రుతాం-ప్రియతాం జ్యాయసీ౦ మాగాన్మహతాం కేన తుంగతా ‘.’

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -5-12-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.19      పదకొండవ సర్గ -2

 

కిరాతార్జునీయం-.19

పదకొండవ సర్గ -2

 ఇంద్రుడు అర్జునుడితో ఇంకా ఇలా చెబుతున్నాడు ‘’ప్రాణుల్ని చంపి చంచలమైన సంపదలు పొందేవాడు నదులకు సముద్రం ఆశ్రయం అన్నట్లుగా ఆపదలకుఆశ్రయమౌతాడు .-‘’ఉదన్వానివ సి౦దూనామాపదామేతిపాత్రతాం .’’సాధన సంపత్తు ఉంటేనే సంపదలు లభిస్తాయి .దాన్ని రక్షించుకోవటానికి చాలా శ్రమపడాలి .భయాలు పెరుగుతాయి. సంపదను మించిన విపత్తు, దుఖం మరొకటి లేదు .ఆపదల భయాలే భేద౦ ,భయం .సాధన సంపత్తి తో ఆపదలు దూరమౌతాయి .-‘’యా గమ్యాఃసత్సహాయానాం యాసు భేదో  భయం యతః –తాసాం కిం యన్న దుఖాయ విపదామివ సంపదా౦’’.పొందరాని విశ్వాసం తో కలిగిన సంతోష రూప సుఖం తో క్రూరుడైన శత్రువు ధనాన్ని పాము పడగలతోసమానమైన దాన్ని పొందిన ధనవంతుడికి ఏ కష్టాలైనా దుర్లభాలు కావు .అంటే భోగ లాలసలతో మునిగిన ధనవంతుడు సులభంగా ఆపదలు పొందుతాడు .విష సర్పం ఎవడి వల్లనైనా చావాల్సింది . అలాగే డబ్బాశ ఉన్న వాడుకూడా .-దూర సదా నరీ నుగ్రాన్ ధృతే ర్విశ్వాస జన్మనః –భోగాన్భోగాని వాహే యాన ధ్యాస్యాపన్న దుర్లభా ‘’.సంపత్తుకు భేద భావం ఉండదు .దానికి ఇష్టమైన వారు అంటూ ఉండరు .మూర్ఖులు మాత్రం అనురక్తులు కాని స్త్రీల యందు అనురక్తు లైనట్లు సంపద కోరుతారు .ప్రాణులు వామశీలం కలవారవటం సహజం కదా .-‘’నాంత రజ్ఞాః శ్రియో జాతుప్రియై రాసాం న భూయతే –ఆసక్తా స్తా స్వమీ మూఢా వామశీలా హి జ౦తవః’’.చెడు స్వభావం ఉన్న వారిని  సంపదలు వదిలేస్తాయి .ఇవి చంచలమైనవి  అనటం లో తప్పే లేదు.అర్ధం పురుషార్ధం కాదు .- ’సాధు వృత్తానపిక్షుద్రా విక్షి పంత్యేవసంపదః ‘’.ప్రాణుల స్థితి కూడా చంచలమైనదే.ధర్మనాశనం చేయద్దు .సజ్జనులు న్యాయాన్నే ఆశ్రయిస్తారు .అంటే సజ్జనులు కూడా హత్యలాంటివి చేస్తే లోకం లో సజ్జనత్వం ఉండదు .-‘’భావాన్మా స్మవధీ న్న్యాయ్యంన్యాయాదారా హిసాధవః ‘’.యుద్ధ ప్రయత్నం మాను .ముక్తి నిచ్చేతపస్సును చెరపకు .జనన మరణ బంధాన్ని వదలాలంటే శాంతాన్ని ఆశ్రయించాలి .-అంటే విజయం పొందాలనే కోరిక వదిలెయ్యి అనిభావం –‘’విజహీహి రణో త్సాహం మా తపః సాధునీనశః –ఉచ్ఛేదం జన్మనః కర్తు మేధి శాంతస్తపో ధనః ‘’.

 ముందు అంతఃశత్రువులను జయించు .వాటిని జయిస్తే లోకాలన్నీ జయించి నట్లే .-‘’జీయంతా౦ దుర్జయా దేహే రిపవ శ్చక్షురాదయః –జితేషునను లోకోయం తేషు కృత్స్నస్త్వయా జితః ‘’.జితేంద్రియుడు కాని వాడు కార్య సాధకుడు కాలేడు.పరాధీనుడు నీచ ప్రవృత్తికలవాడు సిగ్గులేని వాడవుతాడు .పశువులాగా లోకుల్ని అనుసరిస్తాడు .-‘’అవిధే యే౦ద్రియః పుంసాం గౌరి వైతివిధేయతాం’’.ఇవాల్టి సుఖం రేపు గుర్తుకు తెచ్చుకోనేదే అవుతుంది. దాని అనుభవం పొందలేవు .విషయ సుఖాలు స్వప్నాల వంటివి .దానికి లొంగక పోవటం మంచిది .-‘’ఇతి స్వప్నోపమాన్ మత్వా కామాన్ మా గాస్తదంగతాం’’.కోరికలువిశ్వాస ఘాతుకాలే కాక వంచిస్తాయి .ప్రేమ చూపినా దుఖాన్నే కల్గిస్తాయి ఇంద్రియ లోలత్వం వలన స్వయంగా వదిలి పోతాయి .వదిలించుకోవాలన్నా వదలవు .ఇవి పెద్ద కష్టాన్ని తెచ్చే శత్రువులు .-‘’సుదుస్త్యజా స్త్యజంతో పికామాఃకస్టాహిశత్రవః ‘’.త్వరలోనే నీకు ఇంద్రకీలం ముక్తి నిస్తుంది .ఈ ప్రదేశం గంగానది అంతటి పవిత్రం .అయుధాలు మాత్రం వదలాలి .-వివిక్తే స్మిన్నగే భూయః ప్లావితే జహ్ను కన్యయా –ప్రత్యా సీదతి ముక్తిస్త్వాం పురా మా భూరుదాయుదః ‘’.ఇలా ఇంద్రుడు చెప్పగానే ఇంద్ర తనయుడు వినయం తో మధురంగా ఇలా అన్నాడు ‘’మహర్షీ !నీ వాక్యం సరళ సుగమం .మనోహరం .సమాస లాలిత్యం ఓజో గుణం ఉన్న శబ్దాలు పలికావు .గంభీరార్ధం కలమాటలవి .కొద్దిమాటల్లో అన౦త భావాన్నిచ్చేవి పరస్పరా కాంక్ష కల్గి౦చేవి కూడా.అధ్యాహారాదులు లేకుండా తాత్పర్యం పూర్తిగా వెలువరించాయి –‘’ప్రసాద రమ్యమోజస్విగరీయో లాఘవాన్వితం –సాకా౦క్ష మనుపస్కారం విష్వగ్గతి నిరాకులం ‘’.నీమాటలు యుక్తిసారాలు .ప్రతివాదులు కూడా ఖండించటానికి వీ  ల్లేనివి. అనుమానాదుల తో బాధించనివి .వేద వాక్య సమానాలు.-‘’న్యాయ నిర్ణేత సారత్వాన్నిరపేక్షమివాగమే –అప్రకంప్యతయా న్యేషామామ్నాయ వచనోపమం ‘’.నీమాటలు ఇతరులు కాదనటానికి వీల్లేనివి .సాగర మంత లోతైనవి. పరమ పురుషార్ధాలు.మునుల మనసులాగా పరమ శాంతమైనవి –‘’అల౦ఘ్యత్వా జ్జనైరన్యైః క్షుబితోదన్వ దూర్జితం-ఔదార్యా దర్ద సంపత్తేః శాంతం చిత్తమృషేరివ’’.

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-12-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.18      పదకొండవ సర్గ -1    

కిరాతార్జునీయం-.18

పదకొండవ సర్గ -1

 ఇంద్రకీలం నుంచి జండా ఎత్తి స్వర్గం వెళ్లి ఇంద్రునితో అర్జునముని   జితేన్ద్రియత్వాన్ని చెప్పగా, ఆయన చాలా  సంతోషంపొంది ,ఆశ్రమానికి వృద్ధముని రూపం లో చేరాడు ..’’అజగామాశ్రమంజిష్ణో  ప్రతీతః పాక శాసనః ‘’ .ఇంద్రుని అర్జునుడు చూశాడు .తెల్ల వెంట్రుకలు జడలు కట్టి,అస్తమయం లో సంధ్యలాఉన్నాడు.-‘’పృక్త  ఏందు కరైరహ్నః పర్యంత ఇవ సంధ్యయా ‘’.కళ్ళను తెల్లని కనుబొమలు మూయగా మంచు కురిస్తే ,వాడిన కమలం లా కనిపిస్తున్నాయి .అతడు కమలాలున్న కొలనులా ఉన్నాడు .బాగా బరువుగా వంగిన నడుముతో ,పొట్ట కనిపిస్తూ కర్ర తో నడిచే ముసలాడి గా కనిపించాడు .మారు వేషం లో ఉన్నా ,కొద్దిపాటి మేఘాలు కప్పిన సూర్యునిలా ప్రకాశమానం గా  ఉన్నాడు.-‘అ౦శు మానివ తన్వ భ్రపటలచ్ఛన్న విగ్రహః ‘’.ముసలి ఇంద్రుడు ఆశ్రమ శోభను పెంచుతున్నాడు .ఇంద్రుని చూసి ఇంద్రతనయుడు ఆదర స్నేహాలతో చాలించాడు .బంధువు విషయం లో బంధుత్వం తెలీక పోయినా ,మనసు మాత్రం బలంగా ఆనందిస్తుంది .-‘’అవిజ్ఞాతేపి బన్ధౌ హి బలాత్ప్ర హ్లాదతే మనః ‘’.కొడుకిచ్చిన ఆతిధ్యానికి సంతృప్తి చెంది ,ఆసనంపై కూర్చుని’’ యవ్వనం లో తపస్సు మొదలుపెట్టి ,మంచి పనే చేస్తున్నావు .మా లాంటి వృద్ధులు కూడా విషయసుఖాలకు ఉవ్విళ్ళూరు తుంటాం .నీలాంటి యువకుల సంగతి ఏం చెప్పాలి .’.నీ సుందర శరీర సంపదకుతపోరూప గుణం కలిసి పోయింది .రూప సంపద చాలాచోట్ల ఉంటుంది కాని గుణ సంపద ఉండటం దుర్లభం .యవ్వనం శరత్తు మేఘాలనీడలాగా చంచలమై వెళ్లి పోతుంది .విషయ సుఖం తాత్కాలికమే చివరికి దుఖాన్నే ఇస్తుంది .ప్రాణులకు ఎప్పుడూ ఆపదలే .జనన ,జీవన మరణాలు తప్పు అని తెలుసుకొన్న వాడు మోక్షం కోసం ప్రయత్నిస్తాడు కనుక నీ పని మంచిదే .నీ మనసు మంచిది .ఈ శుభ ఆలోచన రావటం విశేషం .కానీ నీ వేష అనుమానంగా ఉంది .-‘’విరుద్ధః కేవలం వేషః సందేహ యతిమే మనః ‘’.నీ వేషం యుద్ధానికి తయారైన వాడిలా కవచం  ఉంది.మునులు సాధారణంగా జింక చర్మం నార బట్టలు కడతారు –‘’మహే షుధే ధనుర్భీమం భూతానా మనభి ద్రుహః ‘’

  మోక్షాని కోరే నువ్వు రెండు అమ్ములపొదులతో ధనుస్సు ఎందుకయ్యా ?జంతు హింస నీకు నిషిద్ధం కదా .-ప్రపి త్సోఃకిం చ తేముక్తిం నిఃస్ప్రుహస్య కలేవరే –మహేషుధీ ధనుర్భీమం భూతానామనభి ద్రుహః ‘’.నీ ఖడ్గం చావుకు మరో భుజంగా ,ప్రాణులకు భయంకలిగించేదిగా ఉంది .అది తపస్సుకు శాంతి కలిగించదు కదా .-‘భయంకరః ప్రాణ భ్రుతాంమృత్యోర్భుజ ఇవా పరః –అసిస్తవ తపస్థస్యన సమర్ధ యతేశమం ‘’.పూజ్యుడవైన నువ్వు శత్రువుపై జయం కోరుతున్నావు.శాంత పురుషులైన తపోధనులెక్కడ ? కోపానికి చిహ్నమైన ఆయుధ మెక్కడ ?కనుక నీ వాలకం పరస్పర విరుద్ధంగా ఉంది .-‘’జయమత్ర భవాన్నూన మరాతి ష్వభిలాషుకః –క్రోధ లక్శ్మక్షమా వంతః క్వాయుధం కవ తపోధనాః ‘’.మోక్షానికి ఉప యోగ పడే పనులు హింసకు ఉపయోగించిన వాడు మూర్ఖుడు .అలసటను తొలగించే తేట నీటిని బురదగా మార్చే వాడితో  సమానం –‘’యః కరోతి వధో దర్కానిః శ్రేయస కరీః క్రియాః-గ్లాని దోష చ్ఛిదః స్వ చ్ఛాః స మూఢః పంకయత్యపః ‘’.హి౦సాది దోషాలకు మూలం అర్ధ, కామాలే .వాటికి బలం చేకూర్చద్దు.ఈ రెండూ తత్వజ్ఞానానికి లొంగేవికావు.-‘’మూలందోషస్య హింసా దే రర్ధ కామౌ స్మమా వపుః-తా హితత్వావ బోధస్య దురు చ్ఛేదావుపప్లవౌ’’.

సశేషం

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో కార్తీక 1-12-20మూడవ మంగళవారం మహా శివ లింగ దీపాలంకరణ

శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో కార్తీక 1-12-20మూడవ మంగళవారం మహా శివ లింగ దీపాలంకరణ

 

 

https://photos.google.com/share/AF1QipMjPo4iV-V7Xjicv9NQ28T6783BQSvk5VAIsjHEbMjpGXVTXUKI_ewdJmwdISsB8w?pli=1&key=N3ZBbUVjZVh5dkhtV1Jrci1NNTd3UDlZV1pYZ3hn

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

తొలికంప్యూటర్ ప్రోగ్రామర్, గణిత వేత్త- అగస్టా ఆడా లవ్ లేస్(వ్యాసం )–గబ్బిట దుర్గా ప్రసాద్ 

తొలికంప్యూటర్ ప్రోగ్రామర్, గణిత వేత్త- అగస్టా ఆడా లవ్ లేస్(వ్యాసం )–గబ్బిట దుర్గా ప్రసాద్ 


1815 డిసెంబర్ 15 న ఆంగ్ల కవి లార్డ్ బైరన్ ,లేడీ బైరన్ దంపతులకు జన్మించింది అగస్టా ఆడా.ఎనిమిదవ ఏట తండ్రి బైరన్ గ్రీకు ప్రజాయుద్ధం లో చనిపోయాడు .తల్లి కూతురికి గణిత౦ ,లాజిక్ లపై ఉన్న శ్రద్ధను హర్షించలేకపోయింది .తల్లికూడా చనిపోయాక తన చదువుపై శ్రద్ధపెట్టింది ఆడా .గణితం ,సైన్స్ లలో విలియం ఫ్రెండ్ ,విలియం కింగ్ ,19వ శతాబ్ది రిసెర్చర్ ,సైంటిఫిక్ ఆధర్ మేరీ సోమర్ విల్లీ ఆమెకు ప్రత్యేకశిక్షణ ఇచ్చారు .తర్వాత ఆమెను తీర్చి దిద్దినవాడు గణిత వేత్త, లాజీషియన్ ఆగస్టస్ డీ మోర్గాన్ . 1932నుంచి అంటే ఆమె17వ ఏట నుంచే లెక్కలలో అసాధారణ శక్తి సామర్ధ్యాలు బయట పడినాయి .ఇదే జీవితాంతం ఆమె ను గణితం వైపు నడిపాయి .ఆమె తెలివి తేటలు శక్తి సామర్ధ్యాలు గమనించిన మోర్గాన్ ఆమె తల్లికి ఉత్తరం రాస్తూ ‘’మీ అమ్మాయికి గణితం లో ఉన్న నేర్పు సామర్ధ్యాలు ఆమెను’’ అసలైన మాధమాటికల్ ఇన్వెస్టి గేటర్ ‘’గా బహుశా అగ్రశ్రేణి గణితవేత్త ‘’ను చేస్తాయి ‘’అని చెప్పి ఆమె ను చక్కగా ఎస్టిమేట్ చేశాడు .డిఫరెంషియల్ కాల్క్యులస్ అభ్యసిస్తూ లవ్ లేస్ ‘’ I may remark that the curious transformations many formulae can undergo, the unsuspected and to a beginner apparently impossible identity of forms exceedingly dissimilar at first sight, is I think one of the chief difficulties in the early part of mathematical studies. I am often reminded of certain sprites and fairies one reads of, who are at one’s elbows in one shape now, and the next minute in a form most dissimilar[‘’ అని పొయెటిక్ గా డీమొరాన్ కు రాసింది .’’అంతర్ దృష్టి(ఇంట్యూషన్),ఊహ లను క్లిష్టమైన గణిత ,సైంటిఫిక్ కాన్సెప్ట్ లకు వర్తింప చేయవచ్చు ‘’అని ఆమె చెప్పేది .

1835లో విలియం కింగ్ ను వివాహం చేసుకొన్నది. అతడు 1938లో ఎరల్ గా నియమి౦ప బడగా,ఆడా’’కౌ౦టేస్ ఆఫ్ లవ్ లేస్’’అయింది .వీరికి ముగ్గురు సంతానం .ఆడా తనకున్న సాంఘిక చొరవ,ఆసక్తి తో ఆండ్రూ క్రాస్ ,రాబర్ట్ బాబ్బేజ్,మైకేల్ ఫారడే వంటి సైంటిస్ట్ లు , నవలా రచయిత చార్లెస్ డికెన్స్ తో పరిచయమేర్పడి,చదువు కొనసాగించాలని నిశ్చయించింది .తన ఆలోచన ను ఆమె ‘’పొయెటిక్ సైన్స్ అనీ ,తనను అనలిస్ట్ (మెటా ఫిజిషియన్ )అనీ చెప్పుకొంది.

టీనేజ్ లో ఉండగా ఆమె శాస్త్రీయ ధోరణి వలన ‘’ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ ‘’గా ప్రసిద్ధుడైన చార్లెస్ బాబ్బేజ్ తో స్నేహం, కలిసి పని చేయటం జరిగింది .ఆయనకనిపెట్టిన ‘’అనలిటికల్ ఇంజన్ ‘’పై ఆసక్తి పెరిగింది .బాబ్బేజ్ ను 1933 జూన్ లో మొదటి సారి కలుసుకొన్నది లవ్ లేస్.1842-43 మధ్య లూగీ మెనాబ్రియా అనే మిలిటరీ ఇంజనీర్ కంప్యూటర్ పై రాసిన వ్యాసాన్ని ఈమె అనువాదం చేసి,దానికి అనుబంధంగా అనేక విషయాలు ‘’నోట్స్ ‘’గా జత చేసింది .ఈ నోట్స్ తొలి ’’కంప్యూటర్ చరిత్ర ‘’కు నాంది అనీ ,అదే’’ మొదటి కంప్యూటర్ ప్రోగ్రాం’’ అనీ ,అదే ఆ మెషీన్ చేసే ‘’ఆల్గోరిదం’’అనీ అందరూ లవ్ లేస్ ను అభినందించారు

.దీని తర్వాత లవ్ లేస్ కంప్యూటర్ కేవలం లెక్కలకు మాత్రమే పరిమితం కాకూడదని భావించి ,ఇతరమైన పనులకు ఎలా వాడవచ్చో ఊహించి రూపకల్పన చేసింది .ఆమె చెప్పిన ‘’పొయెటికల్ సైన్స్ ‘’ఆలోచనలతో ఆ యంత్రం వ్యక్తులకు, సమాజానికీ సాంకేతిక సంధాన కర్త గా ఎలా ఉపయోగించవచ్చునో అనే దానిపై తీవ్రంగా ఆలోచన చేసింది .ఇదేకాక’’ ఫ్రేనాలజి’’ అంటే పుర్రె ను అనుసరించి మనిషి స్వభావాన్ని తెలుసుకోవటం ,మెస్మరిజం అంటే ఇంద్రజాలం ల పైనా ఆసక్తి ఉండేది. బాగా అధ్యయనం చేసింది ..బాబ్బేజ్ దగ్గర పని పూర్తయ్యాక,ఇతర ప్రాజెక్ట్ వర్క్ చేసింది . ఆసంవత్సరమే ఆయన ‘’ Forget this world and all its troubles and if possible its multitudinous Charlatans—every thing in short but the Enchantress of Number’’అని ఒక లెటర్ రాశాడు .

1842-43 తొమ్మిది నెలల కాలంలో ఇటాలియన్ గణిత వేత్త’’ లూగీ మెనాబ్రియా’’రాసిన ‘’బాబ్బేజ్ కనిపెట్టిన ‘’అనలిటికల్ ఇంజన్ ‘’ఆర్టికల్ ను అనువదించింది .ఆ యంత్రంపనిని అర్ధం చేసుకోవటం కష్టమనీ , అందుకే విపులమైన నోట్స్ జత చేస్తున్నాననీ తెలిపింది .కానీ బ్రిటిష్ సంస్థలు దీనిపై పెద్దగా ఆసక్తి కనబరచలేదు .ఈ అనలిటికల్ ఇంజన్ అసలైన ‘’డిఫరెన్స్ ఇంజన్ ‘’కుఎలా భిన్నమైనదో సంపూర్ణమైన వివరాలు తెలియజేసింది .ఆమె రాసిన ఈనోట్స్ ను సైంటిఫిక్ లోకం బహుధా అభినందించింది .ముఖ్యంగాఎలెక్ట్రో మాగ్న టిజం ,మాగ్నెటిక్ఇండక్షన్ ,ఎలక్ట్రాలిసిస్ లను కనిపెట్టిన మైకేల్ ఫారడే శాస్త్రవేత్త ఆమె రైటింగ్ ను పూర్తిగా ,మనస్పూర్తిగా బలపరచాడు . ఆమె నోట్స్ అసలు ఆర్టికల్ కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉంది .బర్నౌలి నంబర్స్ సీక్వెన్స్ ను కాల్క్యు లేట్ చేయటం లో ఎలా సహాయపడుతుందో ,ఆ యంత్రాన్ని యెంత ఖచ్చితంగా పని చేయించ వచ్చనో లవ్ లేస్ తన నోట్స్ లో స్పష్టంగా తెలియజేసింది .బాబ్బేజ్ ఆలోచించిన ‘’ డిఫరెన్స్ ఇంజన్’’ను 2002లో మాత్రమే లండన్ లో నిర్మించి పూర్తి చేయటం జరిగింది .లవ్ లేస్ రాసిన నోట్స్ ను ప్రపంచం లోనే మొట్టమొదటి కంప్యూటర్ ప్రోగ్రాం గా ,ఆమెను తొలి కంప్యూటర్ ప్రోగ్రామర్ గా సైంటిస్ట్ లోకం గుర్తించి గౌరవించింది .ఆమె నోట్స్ ను ‘’నోట్ G’’గా పిలుస్తారు .’’ఆర్టి ఫిషియల్ ఇంటలి జెన్స్’’ను ఈ నోట్స్ఒప్పుకోలేదు .ఆమె ‘’ఈ అనలిటికల్ ఇంజన్ మనం ఇచ్చిన ఆర్డర్ లను ఎలా చేయమని చెబితే అలానే చేస్తుంది కానీ ఎలాంటి అనలిటికల్ సంబంధాలు ,లేక వాస్తవాలను ముందే ఊహించి చెప్పే శక్తి దానికి లేదు ‘’అని చెప్పింది .కాలక్రమం లో అలాన్ టూరింగ్ ఈ భావన సరికాదన్నాడు .ప్రభుత్వం పట్టించుకోక పోవటం తో బాబ్బేజ్ ఆమెను తను రాసినదాన్ని వెనక్కితీసుకోమని కోరాడు .కానీ ఆమె ఒప్పుకోలేదు .1851ఆగస్ట్ 12న ఆమె మరణ సందర్భంగా తనను మన్నించమని బాబ్బేజ్ ను కోరింది .ఆమె నోట్స్ అంతా ఆల్ఫబెటికల్ ఆర్డర్ లో A నుంచి G వరకు వర్గీకరించి భద్ర పరచారు .ఆ ఇంజన్ పూర్తికాలేదు ,ఆమె ప్రోగ్రాం టెస్ట్ చేయబడలేదు .

1844లో స్వయంగా ‘’మెదడు ఏ విధంగా ఆలోచనల ,భావాల ను అందజేస్తుంది –అంటే’’కాల్క్యులస్ ఆఫ్ ది మెంటల్ సిస్టం’’ పై అధ్యయనం చేయాలని ఉందని మిత్రుడు ఒరోన్జో గ్రీగ్ కు రాసింది .కానీ ఈపని పూర్తి చేయలేకపోయింది . ఈ ఆలోచనలలో ఉండగానే ఆమె ఎలెక్ట్రికల్ ఇంజనీర్ ఆండ్రూ క్రాస్ ను వెళ్లి కలిసి విద్యుత్ ప్రయోగాలు ఎలాచేయాలో అడిగి తెలుసు కొంది.ఆ ఏడాదే ఆమె ‘’బేరన్ కార్ల్ రీచేన్ బాక్ ‘’రాసిన రిసేర్చేస్ ఇన్ మాగ్నటిజం పరిశోధన పత్రం పైఅద్భుతమైన సమీక్ష రాసింది కాని ప్రచురించలేక పోయింది .1951లో ఆమెకు కేన్సర్ మొదటి దశ తో బాధ పడింది .తర్వాత తాను గణితానికి ,సంగీతానికి ఉన్న సంబంధం పై కొంత పరిశోధనలు చేస్తున్నట్లు తల్లికి ఉత్తరం రాసి తెలియజేసింది .

1953లో ఆమె మరణించిన శతాబ్ద౦ తర్వాత ఆడా లవ్ లేస్ రాసిన నోట్స్ ముద్రించారు .ఆతర్వాత ఈ ఇంజన్ ప్రాధమిక కంప్యూటర్ గా ,ఆమె నోట్స్ ను కంప్యూటర్ ,సాఫ్ట్ వేర్ కు వర్ణన గా ప్రకటించారు .కంప్యూటింగ్ హిస్టరీ స్పెషలిస్ట్ డోరాన్ స్వేడ్ లవ్ లేస్ ను

1. She was a mathematical genius

2. She made an influential contribution to the analytical engine

3. She was the first computer programmer

4. She was a prophet of the computer age

అంటూ అభి వర్ణించాడు .

ఇంతటి గణిత మేధావి ,’’రైట్ ఆనరబుల్ ది కౌంటేస్ ఆఫ్ లవ్ లేస్’’27-11-1852 న 36వ ఏట యూరెటిన్ కేన్సర్ వ్యాధితో మరణించింది .నాటింగ్ హాం షైర్ లో తండ్రి లార్డ్ బైరన్ కవి సమాధి ప్రక్కనే ,ఆమె కోరికపై ఈమెనూ సమాధి చేశారు .

-గబ్బిట దుర్గా ప్రసాద్ 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.17      దశమ సర్గ -3(చివరి భాగం )   

కిరాతార్జునీయం-.17

దశమ సర్గ -3(చివరి భాగం )

అర్జునునిపై అప్సరసలు నిల్పిన చూపులో రసభావాలు లేనేలేవు .చేతులు అభినయించలేదు .చూపు అర్జునునిపైనే నిలిచిపోయింది తప్ప మరో పక్క కి తిరగలేదు –‘’ప్రకృత మను ససార నాభి నేయం –ప్రవిక సదంగులి పాణిపల్లవం వా –ప్రథమ ముప హితం విలాసి చక్షుః-సితతురగే  న చచాల నర్తకీనాం ‘’.పాదాల లాక్షారసం నేల ముద్రలుగానే మిగిలాయి .వాటిని చూసిన తుమ్మెదలు నవవికసిత కమలం అనే భ్రాంతి తో వాటిపై మూగాయి .పాదాలలత్తు  కకు కడిమి పూల కేసరాలు  అంటుకొని ,అప్సరసల అనురాగ వేడిలో కరిగి మనసులోని ప్రేమ మూర్తీభవించినదా అని పించింది .అడుగుల గుర్తుల్లో లాక్షారసం వాళ్ళ మనోగత అనురాగమే అనే ఉత్ప్రేక్ష .ఒక అచ్చర అతడిఎదురుకు రాగానే ,చెలుల చాటు నుంచి ,తన విపరీత అనురాగాన్ని దాచే ప్రయత్నం చేసింది .దాస్తే కోరికలు పెరుగుతాయని తెలీదేమో !-‘’స్ఫుట మభిలషితం బభూవ వధ్వా –వదతి హి స౦వృతి రేవ కామితాని ‘’.బాగా వీచే గాలికి మరో ఆమె వస్త్రం నడుము నుంచి జారి సిగ్గులమొగ్గ అయింది .ఆమె తొడలను చూసి సవతులే ఆశ్చర్యపోయారంటే మిగతా వాళ్ళ సంగతి చెప్పాలా ?మరో ఆమె మన్మథ తాపం తో తామరకాడలను కంకణంగా పెట్టుకొని ,చేతుల్లో గంధం పూసుకొన్న ముఖం పెట్టుకొని  మద్యం తాగకున్నా ,మత్తెక్కే కళ్ళతో తదేకంగా అర్జునమునిని చూస్తోంది .మరో ఆవిడ తనమనసు మనసులోలేక అన్యమనస్కత అయి ‘’మనః స౦గమం ‘’అనే మన్మథావస్థ ప్రదర్శించింది .మన్మథ తాపం తో నోరు ఎండి ఏమీ చెప్పలేకపోయింది.మరో స్త్రీ .కళ్ళనుండి జాలువారే కన్నీరు చూసి చెలికత్తెల మనసులు దుఖం తో బరువెక్కాయి .ఇది మూర్ఛావస్థ.మెత్తని పూలపాన్పు వదిలేసి ,చిగురాకులనేలపై పడుకొంది.విరహం భరించలేక సుఖం చల్లదనం ఇచ్చే అతడి ఒడి చేరాలను కొన్నది .ఇది ‘’అరతి జాగరం  ‘’అనే మన్మథావస్థ.’’కృశించిన మా నాయిక కోర్కె తీర్చు .ఆమె అన్నీ వదిలి నీ పొందే కోరుతోంది’’అని ఆమె చెలికత్తె మునికి ఫిర్యాదు చేసింది .’’కాఠిన్యం వదిలి మాట్లాడు .మునుల మనసు మెత్తగా ఉంటుంది కదా .!’’అని విన్నవి౦చు కొన్నది .అదృష్ట హీనులు తమకు చేరిన మంచిని కూడా ఉపయోగించుకోలేరు .ఇవన్నీ విప్రలంభ శృంగార౦  లోని వ్యభి చారీ భావాన్ని తెలియ జేసేవే –‘’ఉపగత మవ ధీరయ౦త్య భవ్యాః-స నిపుణ మేత్యకయాచి దేవ మూచే ‘’.మరో అప్సర విలాసంగా నడుమాడిస్తూ ,ఒక చేత్తో తలవెంట్రుకలు ముడుచు కొంటూ కటాక్షం అనే మన్మథ బాణం  మునిపై ప్రయోగించింది .-‘’సురపతి తనయే పరా నిరాసే-మనసిజ జైత్ర శరం విలోచనార్ధం ‘’.

   విశాల స్తనభారం తో కొద్దిగా వంగిన ఒక అప్సర పుష్పించిన మామిడి చెట్టును పట్టు కొని విలాసంగా నిలబడింది .సగం వంగిన ఆమె శరీరం అల్లెత్రాడు లాగిన మన్మథ ధనుస్సులాగా ఉంది.అ౦గా౦గ ప్రదర్శనతో లోబరచుకొనే ప్రయత్నం చేసిందని భావం .మరో అప్సర చీర ముడిజారిన   నీలం రంగు చీర పట్టుకొని , వెళ్ళాలని లేకపోయినా  ,సిగ్గు ముంచెత్తి బయల్దేరి ,జారిన మొలనూలు అడ్డు కొన్నట్లు నటించి ముని ముందు నిలిచిపోయింది .ఒకామె ‘’నీ మనసులోశాంతి నిజంగా ఉంటే ధనుస్సు ఎందుకు ధరించావు .వంచకుడివి .విషయాభిలాష ఉన్నవాడివి. నీకు కావాల్సింది ముక్తికాదు.నీమనసులో నీ ప్రాణేశ్వరి దాగి ఉంది.ఇతరులను ఇష్టపడటానికి ఒప్పుకోవటం లేదు అందుకే మమ్మల్ని అవహేళన చేస్తున్నావు ‘’అని దెప్పింది .ఒకామె కింది పెదవి ఈర్ష్యతో కదిల్తే ,కోపంతో అర్జునమునిని చూస్తూ ,మానమర్యాదలు సిగ్గూ ఒగ్గేసి ,పెద్దలనే గౌరవం కూడా లేకండా చెవి అలంకారంగా ఉన్న కలువతో అతడి వక్షస్థలం పై కొట్టింది –‘’ఇతి విషమిత చక్షుషా భి ధాయ –స్ఫూర దధరోష్టమసూయయా కయాచిత్ –అగణిత గురు మాన లజ్జ యాసౌ –స్వయమురసి శ్రవణోత్పలేన జఘ్నే’’.ఇంకో అచ్చర వినయంతో హావభావాలు ఒలకబోస్తూ దగ్గరకొచ్చి చిరు నగవుతో తన కణతలఅందాన్ని పెంచుతూ ,చెవిదాకా వ్యాపించిన కళ్ళతో తదేకంగా ఔత్సుక్య భావం తో  చూసింది .

  ఏమీ చేయలేక చేతు లెత్తేసి, తెల్లజండా చూపిస్తున్నట్లుగా దీనం గా ,సిగ్గు వదిలి ఏడ్చారు .కోపంతో ఉన్న ప్రియుని పొందుకు ఇదే చివరి అస్త్రం .అరకన్నులతో చూడటం ,సిగ్గు ,అలసట విరహం, పాలి పోయిన దేహం, దుఖించటం అనే అలంకారాలు ధరించారు. మన్మథుడు కల్పించిన ఈ అవస్థలే  వారి అందాల్ని పెంచుతున్నాయి .మెల్లని నడక హంస నడకలను మించింది జఘన భారం తో వంపు చూపులు వ్యర్ధమైనాయి –‘’స్థిత మురు జఘన స్థలాతిభారా –దుదిత పరిశ్రమ జిహ్మి తేక్షణం వా ‘’.గాఢంగాగుచ్చుకొన్న మన్మథ బాణాల వలన పలికే మాటల్లో స్పష్టత లేదు .కళ్ళు తెరచి ,కనుబొమలు ఎగరేస్తూ చూసే చూపులు మనోహరంగానే ఉన్నాయి ‘’అధిక వితత లోచనం వధూనా –మయుగప దున్నమిత భ్రువీక్షితం చ ‘’.వారి హావ భావ చేష్టలు మనసు హరి౦చేవే అయినా ,స్థిర సమాధి గతుడైన అర్జునముని విషయం లో వ్యర్ధమయ్యాయి .రౌద్ర -శృంగాలు విరోధి రసాలు .మనస్వికి మనసులో పరిశోధన జ్వలిస్తూ ఉంటుంది .అందుకే సుఖాపేక్ష ఉండదు .’’రుచికరమపి నార్థవత్ బభూవ –స్తిమిత సమాధి శుచౌ పృథాతనూజే –జ్వలయతి మహతాం మనా౦స్య మర్షే –న హి లభతేవసరం సుఖాభి లాషః’’.అర్జున ముని తీవ్ర తపస్సుతో మహే౦ద్రుని ఆరాధించి ,శత్రు నాశనం చేసి ,రాజ్య లక్ష్మిని పొందాలనే కాంక్షతో ఉండటం చూసి ,తమ ప్రణయ ప్రార్ధన వ్యర్ధం కావటం తో ,ఉద్వేగ మనస్కులై అప్సరసలు గంధర్వులతో కలిసి మళ్ళీ తమ స్వస్థానానికి వెళ్ళారు .

‘’స్వయం సంరాధ్యైవ౦ శత మఖ మఖండేన తపసా –పరో చ్ఛిత్యా లభ్యామభి లషతి లక్ష్మీం  హరి సుతే –మనోభిః సోద్వేగైః ప్రణయ విహతి ధ్వస్త రుచయః –స గంధర్వా ధామ త్రిదశ వనితాః స్వంప్రతి యయుః’’.

సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -2-12-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సరస భారతి శ్రీ ప్లవ ఉగాది పుస్తక ఆవిష్కరణ

  1. సరస భారతి శ్రీ ప్లవ ఉగాది పుస్తక ఆవిష్కరణ
సాహితీ బంధువులకు శుభ కామానలు –
శ్రీ ప్లవ నామసంవత్సర ఉగాది వేడుకలలో నేను అంతర్జాలం లో సుమారు నాలుగేళ్ళక్రితం  రాసిన ”వ్యాఖ్యానచక్రవర్తి కోలాచలం  మల్లినాథ సూరి మనీష ”ను సరస భారతిఆత్మీయులు శ్రీ మైనేని గోపాలకృష్ణ శ్రీమతి సత్యవతి దంపతుల (అమెరికా )స్పాన్సర్ షిప్ తో  సరస భారతి  తరఫున  ముద్రించి ,ఆవిష్కరింప చేయాలని భావిస్తున్నామని తెలియ జేయటానికి సంతోషం గా ఉంది .-దీనికి ముందు మాటలు రాసి, విలువ పెంచమని  డా పుట్టపర్తి నాగ పద్మిని గారిని కోరాం .అంగీకారం కోసం ఎదురు చూస్తున్నాం మీ-దుర్గాప్రసాద్ -2-12-20 -ఉయ్యూరు
Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

కిరాతార్జునీయం-.16      దశమ సర్గ -2            

కిరాతార్జునీయం-.16

దశమ సర్గ -2

అన్ని దిశలా అర్జున పుష్పాలు వికసి౦చటం తో దాని పరిమళం వ్యాపించి ,అంతా కామ వికారం పొంది ,ధైర్యం సడలి కొత్త అనుభవం పొందింది .దుఖితులను కూడా సంతోష పడేట్లు పండిన నేరేడు పళ్ళను తిని ఆడకోయిల కొత్తరాగాలతో గళమెత్తిగానం చేస్తోంది –పరి భ్రుత యువతిః స్వనం వితేనే –నవనయోజిత కంఠరాగ రమ్యం ‘’.కడిమి చెట్ల గాలి ,మత్తెక్కే నెమళ్ళ క్రేంకారం సామాన్యులని  ఆకర్షించింది .మహాత్ముల సమాధిని భగ్నం చేయటం అంత  తేలికకాదనిపించింది –‘’జన ఇవ  న  ధృతేశ్చ చాల జిష్ణు –ర్నహి మహతాంసుకరః సమాధి భంగః ‘’.వధూ వరుల సమాగమం లా  వర్షర్తు, శరత్తులసంధికాలం శోభించింది. బాణం ధరించినందువల్ల క్షత్రియ స్త్రీ ధ్వనించింది .శరత్ స్త్రీ తామర తూళ్ళు అనే కంకణాలు ధరించింది.కలువ సమూహం వస్త్రాచ్ఛాదన అయింది .నీల ఝ౦టి  అనే చెట్టు పూలనే బాణాలుగా ధరించి రాగా ,వర్షర్తు అనే వరుడు తెల్ల తామర చేతులు చాపి ఆలంబన మిచ్చాడు .-‘’ధృతబిస వలయా వలిర్వహంతీ-కుముద వనైకదుకూల మాత్త బాణా-శరదమలతరే సరోజ పాణౌ-ఘన సమయేన వధూరివా ల లంబే…నెమళ్ళకేమ్కారాలు ,హంసల మనోహర స్వరాలూ కలిసిపోయాయి .కలువ పంక్తులు ,కడిమి పూల వర్షం తో కలిసి శోభ పెంచాయి అధిక గుణాల పదార్ధాలు కలిసి మరింత శోభనివ్వటం సహజమే –‘’సమద శిఖి ఋతాని హంస నాదైః –కుముద వనాని కదంబ పుష్ప వృష్ట్యా-శ్రియ మతి శయనీం నమేత్య జుగ్ము –ర్గుణ మహతాం మహాతే గుణాయ యోగః ‘’.దగ్గరలో ఉన్న కదంబ పుష్ప, రాలిన మొగలిపూల  మకరందం వదిలి తుమ్మెదలు బాగా మకరందమున్న ఇప్ప పూలపై వాలి వాటిని నల్లగా చేశాయి తొడిమ మాత్రమే నల్లగా ఉండే ఇప్పపువ్వు పూర్తి గా నలుపుగా మారిందని భావం .’’ప్రియ మధుర సనాని షట్పదాలీ-మలినయతి స్మవినీల బంధనాని ‘’.నీటి బిందువులతో ఉన్న పచ్చిక పై ఇంద్ర గోపాల అనే యెర్రని పురుగులు ముడుచుకొన్న దిరిసెన పూల యెర్రని కాంతి పొందాయి .-‘’అవిరల వపుషః సురేంద్ర గోపా –వికచ పలశచయ శ్రియం సమీయుః’’.కాలం కాని కాలం లో వచ్చిన హేమంతం వలన ప్రియంగు వృక్షాలు గుత్తులు గుత్తులుగా పూశాయి .వికషిత మల్లెల పరిమళం తో గాలి వీస్తే ,దట్టంగా మంచు బిందువులు కురిశాయి .లవంగ లతలు లొద్దుగపూలు వికసించటంతో వాటి సుగంధం మోస్తున్న గాలి అందరికీ సంతోషం కలిగిస్తోంది .కాని అర్జునుడి మనసు మాత్రం చలించలేదు .జయమే లక్ష్యం గా  ఉన్నవారి మనసు నీతిబాహ్యం కాదు కదా .-‘’వికృతి ముపయయౌ స పాండు సూను-శ్చలతినయాన్న జిగీషతాం హి చేతః ‘’.హేమంతం చివర శిశిరం ప్రారంభం సంధికాలం లో మామిడి చెట్లు కొన్ని పూశాయి .కొద్దిగా మంచు పడుతోంది .వావిలి చెట్లు వికసించాయి .వీటన్నిటి పరిమళం కామునికి సహకారిగా మారింది .

పూల వనాలు చేరాలనుకొన్న వసంత లక్ష్మి చిగురించిన మామిడి కొమ్మను పట్టుకొని తుమ్మెద రొద అందెల రవళికాగా పద్మ వనాలను వదిలింది .’’క్వణదాలికుల నూపురా నిరాసే – నలిన వనేషు పదం వసంత లక్ష్మీః’’.వికసించిన పూల పెదవి కదలిస్తున్న గోరంత చెట్లనే మధువును చూస్తూ ,కొత్తగా చిగిర్చిన అశోక చెట్టు పై బాణం ధరించిన మన్మథుడిని అప్సరసలు చూసినట్లు భావించారు .మెల్లగా వీస్తున్న మలయానిలం తో కదల్చబడిన తామర ముఖాలనే పద్మాలపై తుమ్మెదలు చేరి ముంగురుల అందాన్ని కలిగించాయి .-‘’ముహురనుపతా విధూయ మానం –విరచిత సంహతి దక్షిణా నిలేన –అలికుల మలకాకృతిం ప్రపేదే-నలిన ముఖాంత విసర్పి పంకజిన్యాః’’.సాల వృక్షం కొమ్మ అనే వధువు పుష్పమనే ముఖాన్ని ,చిగురు అనే పెదవిని ,మకరందమనే మధువును కలిగి గాలితో కదులుతూ కోపించినట్లు కనిపించింది .తుమ్మెద అనే ప్రియుడు మాటి మాటికీ దాన్ని సమీపించి కోపం తగ్గించటానికి చేరినట్లు భావన .

జితేంద్రియత్వం ఉన్నంత వరకు అతడిని శత్రువు జయించలేడు.ముల్లోకాలూ జయించినా వసంతం జితేంద్రియ ఆర్జునుడిని జయించలేకపోయింది –‘’ప్రభవతి న తదాపరో విజేతుం –భవతి జితే౦ద్రియతా యదాత్మ రక్షా –అవజిత భువన స్తథా హిలేభే-సిత తురగే విజయం న పుష్పమాసః ‘’సితతురగుడు అంటే అర్జునుడు . వసంత ,హేమంతాలలాగే గ్రీష్మఋతువూ నువ్వు  కూడా అర్జునుడి చేత తిరస్కరింపడినావుకదా .  లోకం లో  నీ గౌరవం మాత్రం ఏమి ఏడ్చింది లే .మల్లెలు వికసించాయి అని అర్ధం .బలమున్నవైనా తమలో తమకు స్పర్ధ ఉంటె ఆసైన్యం శత్రువులను జయించలేదు .లోకాలన్నీ జయించిన ఋతువులు ఆర్జునుడిని క్షణకాలమైనా జయించ లేకపోయాయి.కానీ అప్సరసలమనసుల్లో కాముని ప్రవేశ పెట్టగాలిగాయి .తమ ఆయుధం శత్రువులపై కాక తమపైనే ప్రయోగి౦చు కొన్నట్లు అయిందని భావం ..-‘’అవిహిత హరిసూను విక్రియాణి-త్రిదశ వధూషు మనోభవం  వితేనుః’’..గ౦ధర్వ వీణాగానం ,ఋతు విజ్రు౦భణ కూడా ఏమీ చేయలేక పోయాయి  .  అప్సరసల కళ్ళు అర్జునుని అంగ ప్రత్య౦గాల లోనే నిమగ్నమయ్యాయి .వికసిత మల్లెలు వారికి ఆకర్షణ కాలేదు .అంటే వారికి కలిగింది చక్షు ప్రీతి మాత్రమే .అందం తో ఆర్జునుడిని వశం చేసుకోవాలని వచ్చారు .కాని అర్జునుడే వారిలో మన్మధ వికారాలు కలిగించి ఉల్టాపల్టా చేశాడు .-‘’ముని మఖి ముఖతాం నివీషవోయాః-సముపయయుః కమనీయతా గుణేన-మదన ముప దధే సఏవ తాసాం –దురదిగమనా హి గతిః ప్రయోజనాం’’.

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -1-12-20-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనమెరుగని మహా భక్తులు -3 2-నిరతాన్నదాత ,మహా భక్త శిఖామణి-బందా పరదేశి

మనమెరుగని మహా భక్తులు -3

2-నిరతాన్నదాత ,మహా భక్త శిఖామణి-బందా పరదేశి

17వ శతాబ్దం లో నియోగి కుటుంబం లో  గుంటూరు జిల్లా వేటపాలెం లో పుట్టిన బందా పరదేశి కరణీకం చేసేవాడు .ఎవ్వరినీ చెయ్యి చాచిన వాడు కాదు .భార్యకమలాంబ  కూడా చక్కగా సహకరించేది .నిత్య అన్నదానం తో దంపతులు తరించేవారు .ఈ వంశం వారు ఇప్పటికీ చీరాల ,వేటపాలెం లో ఉన్నారు .వీరిలో బందా వెంకట నరసయ్యగారు ఒకరు .బందాదంపతులు ఒక్క రోజు కూడా అన్న దానం చేయని రోజే లేదు .ఏకాదశి వ్రతం తప్పని సరి .ద్వాదశినాడు 12మందికి తక్కువకాకుండా ,108కి మించకుండా అన్న సంతర్పణ చేసేవారు .వ్రతం రోజు జాగరణం చేసేవారు .భోజనం చేసి వెళ్ళే వారిని పంపలేక పంపలేక పంపించే వారు .ఇలా నిత్యఖర్చుతో ఉన్న ఆస్తి అంతా హారతి కర్పూరమై హరించి చివరికి భార్య మెడలో మంగళ సూత్రం కూడా అమ్మే పరిస్థితి కలిగింది .

చేతిలో చిల్లి గవ్వ లేని నిర్భాగ్యం బందా దంపతులను ఆవహించింది .భార్యను వెంటపెట్టుకొని అర్ధరాత్రి ఇల్లు వదిలి బాపట్ల తూర్పు సత్రం చేరి జరగవలసినదాన్ని గురించి భార్యా భర్తలు ఆలోచిస్తున్నారు .ఆ రోజు ఉదయమే ఆ సత్రం లోదిగిన  నిరుపేద స్త్రీ ఆకలితోఅలమటిస్తున్నతనపిల్లలకు ‘’ఇదుగో సెనగపప్పు మాత్రమమే ఉంది తిని నీళ్ళు తాగి పడుకోండి.రేపు పొద్దున్న పదింటికి  వేటపాలెం లో  బందా పరదేశి గారింటికి వెడితేఅమృతాన్నం పెడతారు ఆ మహాదాతలైన దంపతులు ‘’అని ఊరడిస్తుండట౦  బందాగారి చెవిన పడింది .వెంటనే భార్యకు చెప్పితమింట్లో ఒక కుందీ ,రోలు ఉన్నాయికనుక వాటిని అమ్మేసి ఆ పేద స్త్రీకి పిల్లలకు భోజనం ఏర్పాటు చేద్దామని చెప్పి ,వారు వచ్చే లోపే తాము ఇంటికి చేరాలని తొందరబెట్టి అప్పటికప్పుడు ఇద్దరు నడిచి వేటపాలెం చేరారు  .బొమ్మి శెట్టి సుందర రాజం అనే వైశ్యునికి ,రోలు రెండు రూపాయలకు అమ్మేసి,బియ్యం పప్పుఉప్పూ కూరలు తెచ్చి వంట చేసి సిద్ధంగా ఉండగా  అతిధులు రాగా వారికి ఆప్యాయంగా వడ్డించి తినిపించి  సాగనంపి ,తమ బీద స్థితి తెలియజేసి ,సంతృప్తి చెందారు బందా దంపతులు . రోలును తీసుకోనిపోమ్మని వైశ్యునికి కబురు పంపారు .అతడు వచ్చి ఆ రోలు తీసే ప్రయత్నం లో ఉండగా దానికింద మొహరీల బిందె కనిపించింది .

వైశ్యుడు ఆబిందేను చూసి దాన్ని పరదేశి గారికి ఇవ్వబోగా ,ఆయన  తన ఇంట్లో అలాంటి బిందేకాని మొహరీలు కానీ ఎప్పుడూ లేవు అని నిజం చెప్పి  రోలుతో సహా ఆ మోహరీ బిందె కూడా వైశ్యుడిదే అని నిష్కర్షగా చెప్పారు .ధర్మాత్ముడైన వైశ్యుడు రోలుమాత్రమే తనది బిందె తనదికాదని చెప్పి రోలు తీసుకు వెళ్ళాడు .శ్రీ రామచంద్ర ప్రభువే తమ నిరతాన్న దానానికి ఇలా మొహరీల బిందె ఏర్పాటు చేశాడని ఆ దేవదేవుని వేనోళ్ళ స్తుతించి మళ్ళీ సంతృప్తిగా నిరతాన్న దానం చేయటం మొదలు పెట్టారు .బందా పరదేశి దంపతుల పేరు దేశం లో  గ్రామగ్రామాన మారు మోగింది .ఇది విన్న కొందరు అసూయా పరులు ప్రభుత్వానికిఫిర్యాదు చేశారు .అమరావతి ప్రభువు వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు నిరతాన్న ప్రదాత కనుక ఈ ఫిర్యాదును లెక్క చేయలేదు .దీనితో బందా దంపతులకీర్తి ఆసేతు హిమాచలపర్యంతం వ్యాపించింది .

క్రీ.శ.1670లో వచ్చిన గంగానది పుష్కర స్నానానికి వాసి రెడ్డి ప్రభువు గురువుగారితో కలిసి కాశీ వెళ్ళారు .పుష్కర స్నానం చేస్తూ ప్రభువు  బ్రాహ్మణులకు విపరీతంగా దాన ధర్మాలు చేసి అందరి ప్రశంసలు పొందాడు .అక్కడి వారు  ‘’ నిరతాన్నదాత బందా పరదేశి గారు ఉండే ఆంద్ర దేశపు ప్రభువు  వెంకటాద్రి నాయుడుగారు ‘’అని చెప్పుకోవటం రాజుగారు విని ,మహా సంతోషించి ,ఆయనకు తన రాజధానిలో ఘన సత్కారం చేయాలని సంకల్పించుకొన్నాడు .యాత్ర ముగించి రాజధాని అమరావతి  చేరి బందా వారిని నోటీసు ఇచ్చి పిలిపించి ,’’నాకు  తెలియ కుండా వేట పాలెం విడిచి  వెళ్ళ వద్దు’’అని ఆంక్ష విధించాడు .రాజాజ్ఞ కనుక ఒక ఏడాది అమరావతిలోనే ఉండిపోయారు .

ఒక ద్వాదశి నాడు ఉదయం కాలినడక లో వెడుతుంటే ఒక  ఇంటిముందు వందలకొద్దీ బ్రాహ్మణులూ చేతులు కడుక్కోవటం చూశాడు .ఏమిటి విశేషం అని వారిని అడుగగా పరదేశి గారి ద్వాదశి పారాయణ భోజనం ఆహ్వానానికి వచ్చినట్లు చెప్పారు .పరమ సంతోషం వెలిబుచ్చి వేటపాలెం వెళ్ళగా పరదేశిగారి భార్య కమలాంబ గారు చేసే అన్నదానం కనులారా చూసి ,ఆ అమ్మ భిక్ష  తాను  కూడా చేయదలచినట్లు కబురుపంపి ,సపరి వారంగా వెళ్లి సంతోషంగా భోజనం చేసి ,సత్కారం పొందాడు వెంకటాద్రి ప్రభువు .ఆమెకు సంతోషంగా కృతజ్ఞతలు చెప్పగా ఆమె ‘’అన్నగారూ! తోబుట్టువును మరవ కండి ‘’అని చెప్పింది .ఉబ్బి తబ్బిబ్బై ప్రభువు అమరావతి చేరాడు .పరదేశిగారి తో ‘’మిమ్మల్నిఅనవసరంగా కష్టపెట్టాను .క్షమించండి ‘’అని విన్నపాలు చెప్పి ,అర్ధ సింహాసం మీద తనప్రక్కన కూర్చో బెట్టి విలువైన బహుమతులతో సత్కరించాడుప్రభువు .ఇంతగా అన్నదానం చేయటానికి ద్రవ్యదాత ఎవరని ప్రశ్నిస్తే అద్దేపల్లి సుబ్బయ్య శ్రేష్టి అని చెప్పగా ,ఆయన్ను పిలిపించి ‘’పరదేశిగారి అన్న సంతర్పణకు మీరు ఇచ్చిన డబ్బు యెంత ?’’అని అడుగగా ‘’ప్రభూ !పరదేశిగారికి తిరిగి తీసుకొనే ఉద్దేశ్యంతో నేను డబ్బు ఇవ్వలేదు .కనుక పద్దు రాయలేదు .కాబట్టి  యెంత ఇచ్చానోచేప్పలేను ‘’అన్నాడు .దిమ్మతిరిగి బొమ్మ కనిపించి వెంకటాద్రి నాయుడు ‘’ఔదార్యం అంటే ఇలా ఉండాలి ‘’అనుకోని ‘’నాకు తెలీకుండా ఆయనకు డబ్బు ఇచ్చే అధికారం నీకు ఎక్కడిది ?అనుమతిలేకుండా చేశావు .అయినా క్షమిస్తున్నా.ఆయనకిచ్చిన డబ్బు అంతా నేను నీకు ఇచ్చేస్తా తీసుకో’’అన్నాడు .శ్రేష్టి ‘’మీరిచ్చే శిక్షకంటే ,భగవంతుడు ఇచ్చే శిక్ష పెద్దది .సత్సంకల్పానికి పాపకూపంలో పడి పోతానేమో నని భయంగా ఉంది మన్నించండి ‘’అన్నాడు వినయంగా .’’సరే నువ్వు చెప్పింది కూడా బాగుంది .నేను పరదేశిగారికి నువ్వు ఇచ్చిన డబ్బు అంతా తిరిగి నీకు ఇచ్చేస్తా తీసుకో .ఆయనకు ఘన సన్మానం చేస్తాను. నువ్వుకూడా పాల్గొని ఆ డబ్బు ఆయన సన్మానానికి ఖర్చు చెయ్యి .ఇద్దరం ధన్యులమవుతాం ‘’అన్నాడు సెట్టి సమ్మతించాడు .

అన్నప్రకారమే వెంకటాద్రి నాయుడు బందా పరదేశి గారికి  ఘన సన్మానం చేసి ,కమలా౦బ గారిని పిలిపించి కాశీలో ఆంద్ర ప్రభుత్వం నిర్వహించే అన్నదాన సత్రానికి పరదేశిగారిని అధికారిగా చేయటానికి ఆమెను ఒప్పింఛి వేటపాలెం సత్రానికి కమలాంబ గారిని అధికారిని చేశాడు .వారణాశిలో తన బాధ్యతలు అత్యంత సమర్ధంగా సంతృప్తిగా నిర్వహించి పరదేశిగారు ,వేటపాలెం చేరి ,క్రీ శ 1785లో ఆ విశ్వేశ్వరుని లో ఐక్యమయ్యారు  .రెండేళ్ళ తరువాత భార్య కమలాంబ గారు కూడా కైవల్యం చెందారు .

బందా పరదేశి గారి గురించి నిరతాన్నదాత అపర అన్నపూర్ణ శ్రీమతి డొక్కాసీతమ్మ గారి లాగా    ఆంద్ర దేశంలో పెద్దగా ఎవరికీ తెలియదు .సత్రం సంఘటన ఇద్దరి జీవితాలలొ చోటు చేసుకోవటం తమాషా గా ఉంది .అమరావతి ప్రభువు ఈయనను ఆదరిస్తే ,పిఠాపురం రాజా ఆమెను గుర్తించారు .ఇద్దరూ కారణ జన్ములు.ఆంధ్రులకు ప్రాతస్మరణీయులు .

ఆధారం –శ్రీ పంగులూరి వీర రాఘవుడు గారి రచన ‘’ఆంద్ర మహా భక్త విజయం ‘’

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-12-20-ఉయ్యూరు

 

 


Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రాతార్జునీయం-.15      దశమ సర్గ -1            

రాతార్జునీయం-.15

దశమ సర్గ -1

తెల్లవారగానే అర్జునుని ప్రలోభ పెట్టటానికి అప్సరసలు అందరూ బయల్దేరారు .రాత్రి సంభోగం తో వచ్చిన కొత్త అందం తో ,మాంచి అలంకరణతో మన్మథ విలాసాలు వెదజల్లుతూ వెళ్ళారు .స్తన ,పిరుదుల భారం తో నెమ్మదిగా నడవాల్సి వచ్చింది .లత్తుక పాదాలలతో స్త్రీలు ముందు నడువగా ,నేలపై గడ్డి దర్భ వంటి నల్లని గడ్డి లాక్షారవం అంటుకొని వర్షాకాలం లో వ్యాపించే యెర్రని కీటకాలు నేలంతా వ్యాపించాయా అన్నట్లున్నది .మొలనూలు కాలి గజ్జల సందడి ఇద్రకీల గుహలలో ప్రతిధ్వనించింది .హంస, సారసాలు అరవగా మనోహర ధ్వని వ్యాపించింది .ఫలపుష్పాలతో ఉన్న చెట్లవద్ద క్రూర మృగాలైన సి౦హాలతోపాటు ,సాదువులైన లేళ్ళు  కూడా కలిసి ఉండటం చూసి ఆశ్చర్యపోయారు .మనసు ఉద్విగ్నత చెంది,అర్జునముని స్తావరం దగ్గరే ఉందని తెలుసుకొన్నారు .-‘’అభిద దురభితో మునిం వదూభ్యః –సముదిత సాధ్వస విక్లబం  చచేతః ‘’.రాజర్షి అర్జునుడున్న చోట అప్సర గంధర్వులకు ధైర్యం సన్నగిల్లింది .పరమ ప్రభావంతో ఉన్న తాపసులకు అసాధ్యం ఉండదు కదా –‘’ఉపహిత పరమ ప్రభావ ధామ్నాం –నహి జయినాం తపసా మలంఘ్య మస్తి ‘’  .ఇసుకలో అర్జునుని కాలి గుర్తులు కనిపింఛి భయపడ్డారు .ఆ అడుగుల్లో అతిమానుష ధ్వజం ,చక్రం మొదలైన గుర్తులు కన్పించాయి .

‘’స చకిత మివ విస్మయాకులాభిహ్ –శుచి సికతా స్వతిమానుషాణితాభిహ్ –క్షితిషు దద్రుశిరే పదాని జిష్నో-రుపహిత కేతురథాంగలా౦నాని’’.అక్కడి ఋతు సమృద్ధికి అర్జునముని ప్రభావమే కారణమని గ్రహించారు .-‘’రుతురివతారు వీరుధాం సమృధ్యా-యువతి జనైర్జ గృహేముని ప్రభావః ‘’.అక్కడి అశోకం బాగా ఆదరాన్ని కల్గించింది దానికొమ్మపై నీరు కారున్న ముని వస్త్రం ఆరేయటం తో అది వంగింది .అందుకే రాపిడి వల్ల చిగురాకులు నేల వ్రాలాయి .గొప్పవారి సేవవలన గొప్పతనమే వస్తుంది..అచ్చరలు కూడా ప్రభావితులయ్యారని భావం  –‘’బహుమతి మదికాం యయావ శోకః –పరిజనతాపి గుణాయ సద్గుణానాం’’.  యమనియమాదు లతో కృశించినా,బలిష్టమైన అంగాలు ,ఆయుధాలు ఉన్న ఆర్జునుడిని చూశారు. అథర్వణ వేదం లో చెప్పిన మంత్రాలలో అభ్యుదయం కోసం శాంతాన్ని ,అభి చారిక క్రియ కోసం అంటే శత్రు సంహారం కోసం క్రీడి ఆయుధాన్ని ధరించటం వాళ్ళు చూశారు.శాంతమూర్తి అయినా ఉగ్రత్వమూ తగ్గలేదని గ్రహించారు –‘’యమనియమ కృశీకృత స్థిరా౦గః –పరి దదృశేవిధృతాయుధః స తాభిః-అనుపమశమ దీప్తితా గరీయాన్ –కృత పద పంక్తి రథర్వణేవ వేదః ‘’

  అర్జునుడు చంద్రునిలా ఆహ్లాదం కలిగించే కిరణ సముదాయం చుట్టూ కలిగి ఉన్నాడు .ఇంద్రకీల పర్వతం లో ఒక శిఖరాన్ని మాత్రమే నివాసంగా చేసుకొన్నా ,పర్వతం మొత్తం ప్రభావితం చేస్తున్నాడు –‘’శశధర ఇవ లోచనాభి రామై-ర్గగనవిసారిభి ర౦శుభిః పరీతః –శిఖర నిచయ మేక సాను సద్మా –సకల మివాపి దధన్మహీధరస్య ‘’.గంగాతీరం లో తపస్సు చేస్తూ యెర్రని జటలతో  యజ్ఞం లో హవిస్సులు వ్రేల్చినపుడు పైకి లేస్తున్న అగ్ని జ్వాలలాగా ప్రకాశిస్తున్నాడు –‘’సురసరితి పరం తపోధిగచ్ఛన్-విధృత పిశంగ బృహజ్జటాకలాపః –హవిరివ వితతః శిఖాసమూహైః-సమభి లష న్నుపవేది జాత వేదాః’’.శరీరానికి తగిన ప్రయత్నం ,దానికి తగ్గ క్రియ ,అందుకు తగ్గతపస్సు ,దానికి విజయమే ఫలంగా శ్రద్ధా అర్జునుడు చూపిస్తున్నాడు .’’సదృశ మతను మా కృతేఃప్రయత్నం –తదనుగుణా మపరైఃక్రియ మలంఘ్యా౦ –దధత లఘు తపః క్రియాను రూపం –వియతీం చ తపః సమాం సమృద్ధిం’’.నియమాలతో క్షీణించినా ,ఇంకా పర్వత బలం తో ఉన్నాడు .శాంతం ఉన్నా ఇతరులకు లొంగని వాడు .ఏకాంతం లో ఉన్నా మంత్రులతో కల్సి ఉన్నట్లే ధైర్యంగా ఉన్న అర్జునుడు,ఇంద్ర సమాన తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు –‘’చిర నియమ కృశోపిశైల సారః –శమనిరతోపిదురాసదః ప్రకృత్యా-స సచివ ఇవ నిర్జనే పి తిష్ట-న్మునిరపితుల్య రుచి స్త్రిలోక భర్తుః’’.

 లోకాలన్నిటి పరాక్రమ తేజస్సులను తిరస్కరించేది ,త్రిలోక రక్షణకు సమర్ధమైన అర్జున శరీరాన్ని చూసి అప్సరసలు ,విజయం కోసం విజయుడు చేసే తపస్సు  నిష్ఫలం అనుకొన్నారు అంటే ముల్లోకా విజేతకు ఇంకా తపస్సు ఎందుకు అని భావం .-‘’తను మవజిత లోక సారధామ్నీం –త్రిభువన గుప్తి సహాంవిలోక యంత్యః –అవయయు రమరస్త్రియోస్య యత్నం –విజయ ఫలే విఫలం తపోధికారే ‘’ .సాధారణ తాపసుల్ని ,దానవుల్నీ మాకొంగుల్లో ముడేసుకొన్నాం.ఇప్పుడు ఇంద్రుడు ముల్లోక విజేత అయిన ముని ని వశం చేసుకోమని నియమించాడు మమ్మల్ని .మా శక్తి చాటుకోవటానికి మ౦చి అవకాశం వచ్చింది అనుకొన్నారు దేవ వేశ్యలు .-‘’ముని దనుతనయాన్ విలోభ్య సద్యః –ప్రతను బలాన్యధి తిష్ట తస్త పా౦సి-అలఘుని బహుమేదిరే చ తాఃస్వం-కులిశ భ్రుశావిహితం పదేనియోగం ‘’

  అర్జునుడి ని ప్రలోభ పెట్టె కృత్రిమ ప్రయత్నం చేస్తున్న వారిలో వెంటనే మన్మథుడు ఆవేశి౦ చాడు. యవ్వన మాధుర్య శోభ  మనసుని హరిస్తుంది .వీళ్ళు యువతులు .అతడు మాంచి యవ్వనం లో ఉన్నాడు .అంటే అతన్ని చూడగానే వీళ్ళే మదన కా౦క్షలో పడ్డారని భావం .

‘’అథ కృతక విలోభనం విధిత్సౌ-యువతి జనే హరి సూను దర్శనేన –ప్రసభ మవతతార జిత్త జన్మా-హరతి మనో మధురా హి యౌవన శ్రీః’’.మన్మధుడు ఆవేశించాగానే అప్సరలు గంధర్వుల వైపు సాభిప్రాయంగా చూడగా, వాళ్ళు వీణ మృదంగాలతో మనసు హరించే ధ్వనిని ఆకాశం  నిండేట్టు పలికించగా ,అక్కడ ఋతు శోభ ఏర్పడింది .ఆకాశం నీటి మేఘాలతో ఆవృతమైంది. మెరుపులకాంతి వ్యాపించింది .ఎడబాటు లో దంపతులను ఏకం చేసేట్టు ఉరుములురిమినాయి –‘’వ్యవహిత రతి విగ్రహైర్వితేనే-జలగురుభిః స్తని తైర్దిగంత రేషు ‘’

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-11-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సాకర్ విజార్డ్ జోహార్ 

 

సాకర్ విజార్డ్ జోహార్

నీ చేతిలోఉన్నది  మంత్రమా,యంత్రమా సాకర్ వీరా!

గోల్స్ కొట్టటం నీకు ఉగ్గుబాలతో అబ్బిన విద్యా మహాశయా!

సాకర్ శాసన కర్తా !పోస్ట్ పై నీ దాడి

వ్యూహాత్మకం ప్రత్యర్ధి చిత్తస్థైర్య విధ్వంసనం

కల్పితగోల్స్ నీ ప్రత్యేకతై మిరుమిట్లు గొల్పించి

విజయం నీ ముందుంఛి  ‘’ఎల్ పైబ్ దివోరో’’ను చేశాయ్ నిన్ను

నీ సాకర్ మంత్రజాల౦  ప్రత్యర్దులచే  లాల్ సలాం చేయించాయి

బార్సిలోనా ,నటోలీ,బోటేన్ హాం క్లబ్ లకు

అన్నీ నువ్వే అయి విజయ దుందుభి మోగించావ్

సాకర్ శిఖారోహణ చేసినా ,కొకైన్ కు బానిసత్వం

నీ కెరీర్ పాలిటి శాపమై వెంటాడి వేధించింది

ఎక్కడో అర్జెంటీనా వాడి వైనా నీ ఆటకౌశలం

ప్రపంచ ప్రజలందర్నీ సమ్మోహ పరచి

అందరి వాడవయ్యావు’’ఓ గోల్డెన్ బాయ్’’ మారడోనా డీగో

గోల్ ఆఫ్ ది సెంచరి చేసిన నీ హస్తం ‘’హాండ్ ఆఫ్ గాడ్ ‘’

వామన మూర్తి వైనా సాకర్ త్రివిక్రమడవై

విశ్వవిజయం సాధించిన నువ్వు చిరంజీవివే.

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-11-20-ఉయ్యూరు

 


Posted in సమయం - సందర్భం | Leave a comment

కిరాతార్జునీయం-.14 నవమ సర్గ -3(చివరి భాగం )

కిరాతార్జునీయం-.14

నవమ సర్గ -3(చివరి భాగం )

ప్రియునితో కొత్త కలయికతో ఒక నాయిక ఒళ్ళు గగుర్పొడిచి,చెమట పొటమరించి ,అలాగే గుండెపై పడుకొన్నది .అలంకారం చెదిరినా అదేఅల౦కార మయింది .మద్యం మత్తు సిగ్గు పోగొట్టి ,ఆపని మన్మధుడు చేశాడా లేక మదమా అనే అనుమానం కలిగింది .రెండూ వారిని ఆపలేక పోయాయి అంటే సరి పోతుంది .ఒక దూతిక ఒక కామునితో తన నాయికచూపు  అతని కోసంగుమ్మం  లోనే ఉందనీ ,అరచేతుల్లో కణతలు చేర్చి అతడి గురి౦ చే ఆలొచిస్తోందనీ ,ఒక్క మాటలో ఆమె జీవితం అతడి పైనే ఆధార పడి ఉందనీ ,కలహాలెందుకు? అన్నది ఆమెకల హా౦తరిత అన్న మాట .మొదట ఓరగా చూసి ,ప్రియుని గుండెపై పడుకోవటాన్ని అడ్డుకొనగా సిగ్గు అందాన్ని కలిగించింది. ప్రియ సంగమం లో సిగ్గు పారిపోయింది .ప్రియుడి తప్పు ప్రియురాలికి తెలిసి కోపిస్తే ,ఆ సాకుతో వాడు వెళ్లి పోవాలని ప్రయత్నిస్తే ,వేదనతో కన్నీరు పెట్టుకొనగా ఆగిపోయాడు .ఈమె అధీర ఖండిత .విశ్వాసం లేని నాయకుడిని గూర్చి నాయిక ఏడుస్తుంది అయినా వాడిని ప్రేమించినట్లు ,పొందుకోరుతున్నట్లు ,పులకాంకిత దేహం తెలుపు తోంది .ఈమె కూడా అధీరా ఖండిత నాయికయే .

  చంచల దృష్టి తో చూస్తున్న ప్రియురాలి ముఖాన్ని అకస్మాత్తుగా ప్రియుడు ముద్దు పెట్టుకొన్నాడు .ఆమె చీరముడి వీడి చీర కూడా సిగ్గుతో జారిపోయింది .జారిన చీరను మొలనూలు వద్ద ఆగిపోగా ,ప్రియుడు ఆమాత్రం అడ్డంఎందుకని పూర్తిగా లాగేశాడు .ఆమె తన స్తూల చనుగవతో వాడిని గుండ్రంగా చుట్టుకొని  కంట పడనీయ లేదు .రతిక్రీడలో గట్టి కౌగిలింతలు ,నఖ క్షతాలు ,చుంబనాలు దంత క్షతాలు జోరుగా సాగాయి .మన్మధుడు తన సౌకర్యం కోసం సంయోగం లోనూ వియోగం లోనూ క్రూరత్వాన్నే ప్రదర్శిస్తాడు .-‘’సౌకుమార్య గుణ సంభ్రుత కీర్తి –ర్వాను ఏవ సురతేశ్వరపి కామః ‘’.సంభోగం లో అప్సరసలు డగ్గుత్తిక పొంది ,సరిగా మాటలు రావటం లేదు. చేతులు ఆడిస్తూ ,ఛీఛీ అంటూ ,కళ్ళు సగం మూస్తూ ,ఆనంద పారవశ్యం పొందారు .ప్రియులైన గంధర్వులు అచ్చరల ఆధార పానం, మద్య పానం కోరి అనుభవించారు .దీనితో రతి అడ్డూ ఆపూ లేకుండా సాగి కొత్త అనుభూతులనిచ్చింది .కలయిక లలో  అలకలు మాయమయ్యాయి  .మద్యం తో వివాదం పోయింది .అలా సంతృప్తి చెందిన జంటలపై కాముడు బాణ ప్రయోగం చేయ లేక  పోయాడు –‘’మానినీ జన ఉపాహిత సంధౌ –సందధే ధనుషి నేషు మన౦గః’’.కోపం తో ఉంటేఅనునయిస్తూ ,సపర్యలతో స్వాధీనం చేసుకొంటూ ,కలిసి మద్యం తాగుతూ హాయిగా రమించారు .సిగ్గు, బద్ధకం వదిలి చాతుర్య ప్రదర్శన చేశారు .తాముతాగి ప్రియులకు అందించారు .కలిసి పుచ్చుకొన్నారు .మాటిమాటికీ రుచిమారి అనుభవం పెరిగింది .మద్యం లోని లేత మోదుగాకులు ,కలువ పూ రేకులు కనుబొమమలకు కొత్త అందాన్ని ఇచ్చాయి. మద్యం సాకుతో ప్రియురాలి పెదవి నొక్కి హాయి పొందారు .ప్రియులు ఇచ్చిన మద్యం ప్రియు రాళ్ళకు మరీ మధురం అని పించింది .గుణం ఉన్న వస్తువు ఆశ్రయాన్ని బట్టి మరింత గుణాన్ని పొందుతుంది కదా –‘’ప్రాప్యతే గుణ వతాని గుణానాం-వ్యక్త మాశ్రయవశేన విశేషః –  ‘’తత్తధాహి దయితానన దత్తం –వ్యానశే మధు రసాతిశ యేన’’ .స్ఫటిక పాన పాత్రలలో ప్రతిబింబించిన దంతక్షతాలను చూసుకొని సంబరపడ్డారు .తెగతాగటం వలన పెదవుల లత్తుక కరగి క్షతాలు బాగా కనిపించాయి .అవి గాడ్హాను రాగానికితీపి గుర్తులు .అందుకే ‘’ఆన౦దో బ్రహ్మ’’ గా ఉన్నారు .కళ్ళకు ఎరుపుదనమిచ్చి,పదవుల ఎర్రదనం హరించి ,ముఖాలకు తమ పరిమళాలనిచ్చి ,ముఖగందాన్ని తాము తీసుకొని ఈ వారుణి ఆ స్త్రీల గుణాలను కావాలనే తీసుకోన్నదా,లేక భ్రమతో ఒకదానికొకటి తీసుకొందాతెలియటంలేదు .ఒక నాయిక కళ్ళలో సమాన అలంకారంగా ఉన్న కర్నో త్పలం వ్యర్ధమై౦దని,పనికిరాదని గ్రహించి మద్యం వలన వచ్చిన ఎరుపుదనం మిత్రునిలా తన రంగును నల్లకలువపై ప్రసరింప జేసింది  .అందుకే కలువ చెవి అల౦కార౦  గానే మిగిలిపోయింది .మందు బాగా కొట్టటం తో పెదిమల రంగు పోయి ,ప్రియుడి దంతాల నొక్కులు బాగా కనిపిస్తున్నాయి .అదీఅలంకారంగానే ఉంది .మత్తు కాంతి ఒళ్ళంతా వ్యాపించినా ,ఎరుపు కళ్ళలో ,పగడం రంగున్న కణతల్లో అద్దం లో ప్రతిఫలించినట్లు వ్యాపించింది .కోపపుస్త్రీల వికారం పురుషులకువశీకరణం గా ఉంది .మద్యం ప్రవర్తనలో మార్పు తెచ్చినా ,అదే మగాళ్ళకు మేలు చేసింది .ఇద్దరూ ఫుల్ గా మందుకొట్టటం వలన ఒకే వర్గంవారైనారు .మద్యం మత్తు లో రవిక చీర ఊడినా శారీరక బాహ్య స్పృహే లేదు .సిగ్గు విలవిల లాడింది వారి ప్రవర్తన చూసి ,వదిలి పోలేకపోయింది .మద్యంకిక్కు చెలులు ఉన్నారన్న జ్ఞానం కూడా లేకు౦డా చేసింది .మద్యపాన మత్తు అనేక కొత్త రకాల సిగ్గును అనుకరించింది .కౌగిలిలో చేష్టలు లేకపోవటం ,సిగ్గులోనూ ,మద్యం లోనూ కలిగే సమాన గుణాలు .అందుకే వీటి పోలిక అనుకరణ లాగా అనిపించింది ..అభిమానవతి అయినా ,ప్రియుడి ఒడిలో కూరుకు పోయింది .చంచలస్వభావ మద్యం గుణ దోషాల విషయం లో రహస్యాలను బయట పెడుతుంది అనేది నిజం —‘’కారయిత్య నిభ్రుతా గుణ దోషే –వారుణీ ఖలు రహస్య విభేదం ‘’.మద్యం కిక్కుతో రాతి క్రీడమహా మాధుర్యం పొందింది .ఆ ఆన౦దాతి శయం వలన మదనోదయం ఉద్రేకం తో పాటు కొత్త రూపం కూడా పొందింది .

  మద్యం మత్తులో ఉంటే ప్రియుడు ఇంకో దానితో ‘’జంప్ జిలానీ’’అవుతాడేమో అనే అనుమానం తో’’ తీర్ధం పుచ్చుకోటం’’ తగ్గించారు .ప్రేమలేకపోతే భయం ,అనుమానం కలగటం సహజమే.-‘’యోషితో న మదిరాం భ్రుశ మీషుహ్-ప్రేమ పశ్యతి భయాన్య పదేపి’’.ఏకాంతం ,మన్మధుడు ,మధుపానం మత్తు ,చంద్రుడు, సంభోగం మరో లోకానికి తీసుకు వెడతాయి .అందుకే  ఈఅప్సరసలకు హద్దు అనేదే లేదు-   ‘’చిత్త నిర్వృతి విధాయి వివిక్తం-మన్మధోమధు మదః శశి భాసః –సంగమశ్చ దయితైహ్ స్మనయ౦తి –ప్రేమ కామపి భువం ప్రమదానాం ‘’.పురుషాతనం తో సహా సకల విధ రతి క్రీడలు సిగ్గూ లజ్జా లేకుండా చేసి అనుభవించగా వాడి వత్తలైన పూల దండలు పడక అంతా పరచుకోగా మన్మదుడికే  మత్తెక్కినట్లు అనిపించింది .ఇస్టమైనవారు చేయలేని పని ఉండదు అనిపించింది –‘’మానినీ రతివిధౌ కుసుమేషు –ర్మత్తమత్తఇవ విభ్రమ మాప ‘’.

  స్త్రీలు రతి రసాస్వాదనలో మునిగి పోగా మగాళ్ళు రెచ్చిపోయి వారిస్టంవచ్చినట్లు  ప్రవర్తించి ,అన్ని చోట్లా అంటే స్థానం కాని స్థానాలలో కూడా చు౦బన  తాడనాలతో విజ్రు౦భిం చారు  .అదీ అందంగానే ఉంది .ఇలా మాంచి ఊపులో ఉండగా వైతాళికుల మంగళ ధ్వానాలు వినిపించాయి .అర్ధరాత్రి దాటిందని తెలిసింది .వాళ్లకు రాత్రి బాగా సంకోచి౦చి౦దని పించింది.మొత్తం మీద రాత్రంతా ఆగమాగ౦ చేసి ఇక లేవక తప్పదని తెలిసి ,ఎడబాటుకు కుంగుతూ ,మళ్ళీ’’ ఇన్నింగ్స్’’ప్రారంభించి,మరింత స౦తృప్తి చెంది లేవటానికి సిద్ధపడ్డారు .సంభోగ శ్రమతో అలసిన అర్ధనిమీలిత స్త్రీలకు శరీర మర్దన ద్వారా సేవ చేయటానికా అన్నట్లు ప్రాతః కాలపు మంద పవనాలు సౌదాల్లోకి ప్రవేశించాయి .అక్కడి నలిగినపూల పరిమళం , మద్యం వాసన ,చందనాదుల అంగాంగ రాగాల గంధాన్ని ఆ వాయువులు  అన్ని చోట్లా వ్యాపింప జేశాయి  .ఇంకా కొద్దిగా మత్తు ఉన్నా అందంగానే ఉన్నారు స్త్రీలు .కళ్ళు కాళ్ళు నిలవటం లేదు .ఆ స్త్రీల విరహ వ్యాకులత పోగొట్టటానికి రాత్రి సంభోగ చిహ్నామైన నఖక్షతాది లక్ష్మీ సంపద విడువని చెలికత్తెలాగా వారి శరీరాన్ని అంటుకొనే ఉంది. అ౦గ రాగాలు గోటి నొక్కుల్లో మిగిలాయి .మద్యపానం, ఆధర పానం వలన పెదవుల ఎరుపు పోయింది .వాటి శోభా లక్ష్మి యే ఆ స్త్రీలను పట్టుకొని ,చెలి కత్తెల్లాగా  సాంత్వన  చేకూర్చాయని కవి భావం –‘’గతవతి నఖ లేఖా లక్ష్యతా మంగరాగే –సమద దయిత పీతా తామ్ర బి౦బా ధరాణా౦ –విరహ విదుర మిస్టా సత్సఖీ వా౦గ నానాం  -హృదయ మవలలంబే రాత్రి సంభోగ లక్ష్మీహ్ ‘’

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-11-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.13 నవమ సర్గ -2

కిరాతార్జునీయం-.13

నవమ సర్గ -2

చంద్రుడు దగ్గరకు రావటంతో కిరణ సముదాయం వక్రత్వం పోగొట్టుకొని నిటారుగా దిగంతాలకు పాకింది .అది లోకమంతా శ్వాస పీల్చుకొన్నట్లున్నది .అంటే చంద్ర కాంతి తో లోకం ఆనంది౦చి౦దని భావం –‘’నిహ్ సృతస్తిమిరభార నిరోధా –దుచ్చ్వసన్నివ రరాజ దిగంతః ‘’.స్వచ్ఛ పగడ కాంతి కళలతో నాలుగువైపులా అంధకారాన్ని దూరం గా పైకి తరిమేశాడు .పూర్వం అది వరాహం కోరతో భూమిని సముద్రం లో నుంచి పైకితోసినట్లున్నది .చంద్ర కళ ఆది వరాహం కొమ్ము కోర గా భావించాడు కవి –‘’లేఖయా విమల విద్రుమ భాసా –సంతతం తిమిర మిందు రుదాసతే –దంష్ట్రయా కనక టంపిశంగ్యా –మండలం భువ ఇవాది వరాహః ‘’.కిరణాలతో ఆకాశాన్ని ప్రకాశింప జేస్తూ ,కు౦కుమ రాగ స్తనమండలం లాగా ప్రకాశిస్తూ ,,తూర్పు సముద్రం నుండి చంద్రుడు పైకి వచ్చాడు .బంగారు కలశం లాగా భాసించాడు –‘’హేమకుంభ ఇవ పూర్వ పయోధే –రున్మమజ్జ శనకై స్తుహాయ్ నా౦శుహ్’’.ఇంకా కొంత చీకటి ఉండి,రాత్రిని ముఖం పై కప్పుకొన్న ముసుగు తొలగించినా ,సిగ్గు తో ముడుచుకొన్న కొత్త పెళ్లి కూతుర్లా లోకం తృప్తి చెందకుండా చూస్తూనే ఉంది –‘’వ్యంశుక స్పుట ముఖీ మతి జిహ్మాం-వ్రీడయా  నవ వధూ మివ లోకః ‘’.పర్వతాలలో ఇంకా చీకటే ఉంది .దిక్కుల మొదళ్ళలో  కాంతి వ్యాపించలేదు అయినా రాత్రిమాత్రం అందంగా ఉన్నది –దిజ్ముఖేషున చ దామ వికీర్ణం –భూషితైవ రజనీ హిమ భాసా ‘’.నెమ్మదిగా ఆకాశం చేరిన చంద్రుడు విరహ స్త్రీల వేడికన్నీటి చూపులను సహిస్తూ ,భయపడినట్లు నెమ్మదిగా ప్రయాణిస్తున్నాడు –‘’మందమంద ముదితః ప్రయయౌ ఖం –భీత భీత ఇవ శీత మయూఖాః’’.కిరణాల చేతులతో నక్షత్ర నాయిక కంతాలపైప్రసరింప జేసి ,ఆలింగనం చేసుకొన్నాడు .అతని ఎరుపుదనం నక్షత్రాల చుట్టూ వ్యాపించి,అంగరాగ శోభ కలిగించింది .మొత్తం చీకటిని పోగొట్ట్టిన చంద్రుడు క్షీర సముద్రాన్ని మధించినప్పుడు అందులోని పాలు పైకి ఉబికి ఎత్తైన చెట్ల వనాలను ము౦చినట్లుంది –‘’క్షీర సింధురివమందరభిన్నః –కాననాన్య విరలోచ్చ తరూణి’’.వృక్షాల కింది భాగం లోఆకుల మధ్య నుండి  చంద్ర కిరణాలు వ్యాపించి నేలపై తెల్లని ముగ్గులతో అలంకరించిన నివాస గృహాలా అని పించాయి .పగటి ఎండలో భార్యతో కలిసి ఆడిన చక్రవాకం ,రాత్రి చంద్ర కిరణాలను సహించలేక పోయింది. దుఖం లో ఉంటె ప్రతిదీ సహి౦చరానిదే అవుతుంది.-‘’ఆతపే ధృతి మతాసహా వధ్వా –  యామినీ విరహిణావిహగేన-సేహిరే  న కిరణా హిమరశ్మే-ర్దుఖితే మనసి సర్వ మసహ్యం ‘’.

   నీటి తు౦పురులను ,కలువల గంధాన్నీ ,పరాగాన్నీ వెదజల్లుతున్నరాత్రి గాలి సుఖం గా నిద్రిస్తున్న పక్షులున్న చెట్లను కొద్దిగా కదిలిస్తోంది .కాముడు పరిమళ ద్రవ్యాలు పూసుకొన్న చేతి తో ప్రియురాల్ని తనవైపు ఆకర్షించి నట్లు ఉన్నదని భావం .-అదుధావ పరిలీన విహంగా –యమినీ మరుదపాం వనరాజిహ్ ‘’.రాత్రి అనే రమణి మన్మధుడికి పట్టాభి షేకం చేయటానికి ఎత్తిన వెండి కలశం లాగా చంద్రుడు పైకొచ్చాడు .ఆ కలశం లో మంచు కిరణాలే నీరు .చంద్రునిలోని మచ్చ నల్లకలువ పూవు .-‘’సంవిధాతు మభి షేక ముదాసే –మన్మధస్య లసదంశు జలౌఘః –యామినీ వనితయా తత చిహ్నః  -సోత్పలో రజత కుంభ ఇవేందుహ్’’.ఎంత పరాక్రమం ఉన్నాసాయం చేసే వాడు లేకపోతె రాణించ లేడు .అందుకే మన్మధుడు చంద్ర కిరణాలే బాణాలుగా సాయం తీసుకొని ధనువు వంచాడు –‘’ఓజసామపి ఖలు నూననుమనూనం –నా సహాయ ముపయాతిజయశ్రీహ్-యద్విభుహ్ శశి మయూఖః స-న్నాదదేవిజయ చాప మనంగః’’.

  సురత క్రీడకు సమయమైనదని అప్సరసలు ,మళ్ళీ మళ్ళీ అలంకారం చేసుకొంటున్నారు .ప్రియులరాకకోసం దూతికల్ని పంపటం, ఆరా తీయటం చేస్తున్నారు .ప్రియ విరహం తో వారి అలంకారాలు,క్రీడా గృహ అలంకారాలు  వారికే నచ్చటం లేదు .విరహం సహించలేక తామే బయల్దేరారు ..ఒకామె ఆ ఇంటికి వెళ్ళకు అక్కడ నీ  సవతి ఉంది అని హెచ్చరి౦చినా మద్యం మత్తు లో మాట వినక మనసు శరీరం దుర్బలం చేసుకొన్నది .అదే సహాయం ,ఆసరా అనుకొన్నది .-‘’మానినీభి రప హస్తి త ధైర్యః –సాదయన్నపి మదో వలల౦బే’’ .ప్రియులు ప్రియురాళ్ళ ఇళ్ళకు చేరారు దారి మర్చిపోలేదు .మన్మధుని వలన బుద్ధి నశించినా ,ఆ మరుపు మేలే చేస్తుంది –‘’మన్మధేన పరిలుప్త మతీనాం –ప్రాయశః స్ఖలిత మాప్యుపకారీ ‘’.త్వరగా ప్రియుడిని పొందాలని తానే  వాడి ఇంటికి వెళ్లి ఒక స్త్రీ కణతలపై పులకా౦కురాలు కలిగి ,చెమటతో పత్ర రచన తిలకం చెదరి పోయింది .కాని సహజ సౌందర్యం తో చంద్రుని జయించింది –‘’నిర్జగాయ ముఖ మిందు మఖండం-ఖండ పత్ర తిలకా కృతి కాంత్యా ‘’.నాయిక చెలి తో ‘’ఆ దూర్తుని సంగతి అంతా నాకు చెప్పు .వాడిని అనుమానం లేకుండా నిందించు ‘’అంటే చెలి ‘’భర్త విషయం లో పౌరుషం మాటలు పనికి రావు ‘’అన్నది .నాయిక ‘’ఐతే బతిమాలి ఓదార్చి తీసుకురా ‘’అంటే ‘’అపకారాలు చేసిన వాడిని బ్రతి మాలడం ఎలా?’’అంది .’’ఒసే అందాలరాసీ !  ప్రియుడి విషయం లో కోపం దేనికే ?’’అంటూండగానే ప్రియుడు వచ్చి,ఆ మాటలు విని బహురస  ధైర్యాన్నిపొందారు .అంటే నవ్వు ,దాష్ణీకం ,ప్రేమ ,మనం ఏం చేసినా ఫర్లేదు అనే ధైర్యం కలిగింది భావం . క్రీడా గృహం లో ఏయే వింతలు విశేషాలు ప్రదర్శిస్తారో తెలుసుకోవాలంటే రేపటి దాకా ఆగాలిగా మరి, అంతేగా మరి !

సశేషం

 మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-11-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.12 నవమ సర్గ -1

 

కిరాతార్జునీయం-.12

నవమ సర్గ -1

జలక్రీడల తర్వాత ప్రియుల పొందుకోసం అప్సరసలు ఆరాట పడగా ,మనం అడ్డం ఎందుకని సూర్యుడు పడమట వాలాడు .ఒక వైపు వంగిన సూరీడు ఆకాశం ముత్యాలహారం ధరించిందా అని పించింది .అంటే సూర్య నాయక్ తనవైపు వంగగా ,ఆకాశ నాయిక మరో వైపు పొరలగ ముత్యాలహారం కదలికగా కాంతి ఆకర్షింప బడిందని భావన .సూర్యుడు దాహంతో కిరణాలనే చేతులతో పద్మం లోని మధువును అతిగా తాగగా యెర్రని దేహం తో నేల వాలాడు .అతిగా మద్యం తాగినవాడు మత్తులో ఎరుపెక్కి నేలకూలినట్లు సూర్యుడున్నాడని భావం –‘’అంశు పాణి భి రతీవ పిపాసుహ్ –పద్మజం మధ భ్రుశం రస౦  యిత్వా –క్షీబతా మివ గతః క్షితి మేష్య౦ –ల్లోహితం వపురువాహ పతంగః ‘’.ఎర్రబడి అస్తమిస్తున్న సూర్యుడు అందరికీ ఆనందం పంచాడు .భూమి వేడి తగ్గింది . ఆవేడి చక్రవాకాల హృదయాలలో ప్రవేశించి౦ది .చక్రవాకాలు రాత్రి వేళ చూడలేవు. అందుకని తమ సహచరులను చూడ లేక పోతామేమో అనే విరహ బాధ వాటి మనస్సులో చోటు చేసుకొన్నది అని భావం .సగం అస్తమించిన సూర్యుడి కిరణ తేజస్సు తూర్పు వెళ్ళలేక ,పడమటి సూర్యునీ ఆశ్రయించలేక తేజో విహీనమైంది .సేవించిన యజమాని మధ్యలో వదిలేస్తే సేవకుని పని రెండిటికీ చెడిన రేవడి లాగా అవుతుంది కదా –‘’ముక్తమాల లఘు రుజ్ఘితపూర్వహ్-పశ్చిమే నభసి సంభ్రుత సాంద్రహ్ –సామి మజ్జతి రవౌ న విరేజే –భిన్న జిహ్మ ఇవ రశ్మి సమూహః ‘’.సూర్యకాంతి కుంకుమ లాఎర్రనై మేడలోని కిటికీల గుండా ప్రసరించగా ,అప్సరసలు ప్రియుడు పంపిన దూతికలు సాయం అలంకారాలకు తొందర పెడుతున్నాయా అన్నట్లు ఆదరంగా చూశారు .సూర్యుడు పై శిఖరాలలోని చెట్లను యెర్రని కిరణాలతో ఆధారంగా పట్టుకొని ,పడమటి కొండలోని దట్టమైన అడవిలోకో ,సముద్రం లోకో ,భూమి లోకో వెళ్ళాడు .తర్వాత గమన వేగం పెరగటం తో ఎక్కడికి వెళ్లిందీ గుర్తించలేక పోయారు .-‘’’’అగ్ర సానుషు నితాంత పిశంగై –ర్భూరుహా న్మ్రుదుకరైవ లంబ్య-అస్తశైల గహనం ను వివస్వా –నావివేశ జలదిం ను మహీం ను ‘’.ఇళ్ళకు చేరుతూ పక్షులు కిలకిలారావం చేస్తున్నాయి. సంధ్యా సమయం దాటటం తో ఎరుపు దనం తగ్గింది  .సంధ్య సూర్యోదయాత్పూర్వ పరిస్థితి పొందింది .అంటే చీకట్లు క్రమంగా ఆవరిస్తున్నాయని భావం .పైన మేఘాల వరుస ,కింద సంధ్యారాగం తో పడమటి ఆకాశం తరంగాలతో అలంకరించబడిన పగడ కాంతులతో అందంగా ఉన్న సముద్ర శోభ పొందింది –‘’ఆస్థితః స్థగిత వారిద పంక్త్యా-సంధ్యయా గగన పశ్చిమ భాగః –సోర్మి విద్రుమ వితాన విభాసా –రంజితస్య జలధేహ్ శ్రియ మూహే ‘’

  దోసిలి వొగ్గి ,తలవంచి ఏకాగ్రత తో ఉపాసించే  జనాన్ని వదిలి ,వారి ప్రేమను కాదని ,సంధ్య మరో దారిలో పోవటం చాంచల్యం తో దుర్జన మైత్రిని అనుకరించింది .సంధ్యా వందనాది క్రియలతో ప్రేమించే జనాన్ని వదిలి ,సంధ్యాసమయం దాటి పోయిందని భావన –‘’ప్రాంజలా వపి జనే నతమూర్ధ్ని –సంధ్యయాను విదధే విరమంత్యా –చాపలేన సుజనేతర మైత్రీ ‘’.ఉదయపు ఎండకు ఎక్కడో దాక్కున్న చీకటి ఎండ లేకపోవటం తో పల్లాల నుండి క్రమంగా సమతలం చేరి ఆక్రమించింది .-‘’ఔషతాప భయాదప లీనం –వాసరచ్ఛవివిరామ పటీయః –స౦ నిపత్య శనకైరివ నిమ్నా –దంధకార ముద వాప సామాని ‘’.చీకటి బాగా వ్యాపించటం తో అన్నీ ఒక చోటనే చేరినట్లుంది .అంటే తారతమ్యాలు తెలీటం లేదు .చీకటి అన్నీ తనలో దాచేసుకొంది అని భావం –‘’ఏకతామివ గతస్య వివేకః –కస్య చిన్న మహతో ప్యుపలేభే –భాస్వతా నిదధిరే భువనానా –మాత్మనీవ పతికేన విశేషాహ్’’.చక్రవాకాలలో వియోగం పెరిగింది దైవ నిర్ణయానికి అడ్డు లేదుకదా .రాత్రిళ్ళు కళ్ళు కనిపించవు కనుక దైవాజ్ఞగా విరహం అనుభవిస్తున్నాయి .తన ప్రియు రాలితో మాట్లాడ గలుగుతోందే కాని చూడలేక,తాక లేక  పోతోంది  ఈ దుర్దశను చూసి పద్మ నాళంముడుచుకున్న ముఖ పద్మాన్ని కిందికి వాల్చింది .ఇతరుల దుఃఖ వియోగ బాధ చూసి స్త్రీలు ఉదాసీను లౌతారు కదా –‘’యచ్ఛతిప్రతి ముఖం దయితాయై-వాచమంతిక గతేపి శకుంతౌ-నీయతే స్మ సతి ముజ్గ్హిత హర్షం –పంకజం ముఖ మివా౦బురు హిణ్యా ‘’

  చీకటి దట్టంగా వ్యాపించి పర్వతాలకు నలుపు రంగు పూసిందా,ఆకాశం భూమిపైకి వంగిందా,నల్లటి దుప్పటి కప్పిందా,ఎత్తు ,పల్లాల భూమి చదునైనదా,దిక్కులే లేకుండా పోయాయా  అన్నట్లు చీకటి ముసిరి గుర్తించకుండా చేసింది –‘’రంజితాను వివిధా స్తరు శైలా –నామితం ను గగనం స్థగితం ను-పూరితా ను విష మేఘ ధరిత్రీ –సంహతా ను కకుభ స్తిమి రేణ’’.కాంతి పద్మాలను వదిలి నక్షత్రాలతో ప్రకాశించే ఆకాశం చేరింది .ఆపద లేకుండా ఉండటానికే ప్రతి వాడూ ప్రయత్నిస్తాడు కదా –‘’రాత్రి రాగ మలినాని వికాసం –పంకజాని రహయంతి విహాయః –స్పష్ట తార మియాయ నభఃశ్రీహ్-ర్వస్తు మిచ్ఛతినిరాపది సర్వః ‘’.

  తూర్పున చంద్రోయమై దాని కాంతి మొగలి పూ కేసరకాంతి లా ఉంది .కర్పూరపు పొడి పిడికిటితో చల్లినట్లు అంతటా వ్యాపించింది –‘’వ్యానశే శశ ధరేణ విముక్తః –కేతకీ కుసుమ కేసర పాండుహ్-చూర్ణ ముష్టి రివ లంభిత కాంతి –ర్వాసవస్య దిశా మంశు సమూహః ‘’.తూర్పు అనే నాయిక చంద్ర నాయకుడు  సమీపించటం తో చీకటి ముఖం దుఖం వదిలేసి నవ్వులాంటి కిరణాలతో ఉజ్వలంగా ప్రకాశించింది .అంటే చీకటిని దూరం చేస్తూ చంద్రోదయం అయిందని అర్ధం .ఉదయగిరి నుంచి చంద్ర కిరణ సమూహం నల్లకలువ కాంతి గల ఆకాశం లోకి వ్యాపించింది .ఆకాంతి ఆకాశం లో,సముద్రం లో చేరి తెల్లని గంగానది నీరు మరింత స్వచ్చంగా ప్రకాశించింది .-‘’నీల నీరజ నిభే హిమ గౌరం –శైల రుద్ధ వపుషః సిత రశ్మేహ్-ఖే రరాజ నిపతత్కరజాలం –వారి ధేహ్ పయసి గా౦గమివామ్భః ‘’.ఆకాశ అంధకారాన్ని చంద్రుడు ఉదయ కిరణాలతో ముందుకు తోస్తూ ,శివుడు నల్లని గజ చర్మాన్ని తీసి ముందుకు తోసినట్లుగా భాసి౦చాడు.చీకటి గజ చర్మం,చంద్రుడు సాక్షాత్తు  శివుడు అనిపించారని భావం –‘’ద్యా౦ నిరుంద దతి నీలఘ నాభం –ధ్వాంత ముద్యత కరేణ పురస్తాత్ –క్షిప్య మాణ మసితేతర భాసా –శంభు నేవ కరి చర్మ చ కాసే ‘’

  సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-11-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.11 అష్టమ సర్గ -2(చివరి భాగం )

కిరాతార్జునీయం-.11

అష్టమ సర్గ -2(చివరి భాగం )

చిగురాకులు కోయటం తో అచ్చరల చేతులు ఎర్రబడ్డాయి .పుప్పొడి అంటి పాలిండ్లు పసుపు రంగు పొందాయి. పూల వాసనతో శరీరాలు పరిమళం పొందాయి .తమ సౌందర్యం పెంపు కోసం సామగ్రి అంతా చెట్ల నుండే పొందారు .ఇంద్రకీలం లో ప్రతి అడుగులోనూ త్రుళ్ళి పడుతున్నారు. ఏనుగు తొండం లా లావైన తొడల వలన నడక లో శ్రమ పడ్డారు .కొత్త చిగుళ్ళ వంటి పాదాలు నడవ లేక తడ బడుతున్నాయి ఈ తుళ్ళింత మధుపానం వల్లనేమో అనిపిస్తోంది .(బహుశా అర్జున  మౌని ముందు కూడా ఈ తడబాటు జరుగుందేమో నని సూచన కావచ్చు నని నా ఊహ ).మొలనూలి మణి కాంతులు నితంబాలకాంతిని వెలువరిస్తున్నాయి .అవి గంగనీటి నుండి అప్పుడే బయట పడిన ఇసుక మేటల శోభను జయి౦చినట్లున్నాయి .పాదాల ముద్రలు ఇసుకలో ముద్రింప బడినాయి .నాభి ప్రదేశాలు వికసిత కమలాల మొగ్గలఅందాన్ని కలిగి ,కొకముడి దగ్గర ఆకట్టుకొనే శోభ పొందాయి .పొట్ట మధ్య భాగం లో వలి త్రయం అందం గా ఉంది .జఘనం పై ఉన్నత ,విశాల స్తనాలు బరువు తో పొట్ట పైభాగం లోపలి కి వంగింది .కళ్ళకు చెమట ఆవరించటం తో పూర్తిగా కళ్ళు తెరవ లేకపొతున్నారు .ఆకళ్ళు మంచు తో స్పష్టంగారేకులు  కనిపించని కమలాల్లా ఉన్నాయి .ముఖాలు కూడా అలానే ఉన్నాయి –‘’సమాన కాంతీని తుషార భూష నైహ్-సరోరు హైరస్ఫుట పత్ర ప౦క్తి భిహ్ –చితాని ఘర్మా౦బు కనైహ్  సమంతతో-ముఖాన్యనుత్ఫుల్ల విలోచనాని చ ‘’

  నెమ్మదిగా నడుస్తున్న అప్ససరల అంగాంగ సౌందర్య చేష్టలు చూస్తున్న గంధర్వులు అదే మొదటి సారిగా చూసిన అనుభూతి పొందారు ..పూలు కోశాక, గంగానది ని చూశారు .చేపలతో కదల్చబడి ప్రసన్నంగా ఉన్న పద్మం కలది ,బురద లేని తీరాన్ని తాకుతున్న అలలు అనే చేతులతో ,రాయంచల కలకలారావాలతో పిలుస్తోందా అని పించింది .అంటే గంగ అనే స్త్రీ స్నానానికి రమ్మని పిలుస్తున్న భావన కలిగించిందని భావం .మందమారుతం వీచింది అది తరంగాలపై వస్తూ తుమ్పురుల చల్లదనం పద్మాల పరిమళం పొంది వేడిని కూడా తగ్గించి, వారికి  ఆలింగన సౌఖ్యం కలిగించింది .విలాసమైన నడకలతోహంస నడకలను ,పిరుదుల వైశాల్యం తో ఇసుక తిన్నెలను ,విశాల నేత్రాల ముఖాలతో పద్మాలను సామ్యగుణ౦  తో అప్సరసలు నిరసించారు .వీరికున్న నేత్రాలు పద్మాలకు లేనందున గుణ నిరసన జరిగింది .

  గంధర్వులు ముందు నదిలో దిగి దారి చూపారు .తర్వాత దేవా౦గనలు భయభయంగా మొదటి సారి అన్నట్లు  గంగలోదిగారు .వారు నీటిలో దిగగానే తరంగాలు చీలి తీరం దాకా వ్యాపించాయి తీరానున్న నీటి పక్షులు భయంగా పారి పోయాయి .గట్టిగా ఉన్న గంధర్వుల వక్ష స్తలాలతో విశాల చనుల అప్సరసల తాకిడితో నీటి తరంగాలు ముక్కలై తీరమంతా వ్యాపించి అల్లకల్లోలమైంది .గంగ వీళ్ళ జలక్రీడలకు కోపించి క్షోభించినట్లు గా ఉంది –తటాభి నీతేన విభిన్న వీచినా –రుషేవ భేజే కలుషత్వ మంభసా ‘’.తల వెంట్రుకలు చెదిరి ,పూదండలు జారి ,చందనాదులు కరగి పోగా అప్సరసలకు తాము చేసిన అపరాధం వల్ల ఇలా జరిగిందా అని భయపడి నట్లు నీటి తరంగాలు మాటిమాటికీ వణకు తున్నాయి –‘’అతి ప్రసంగా ద్విహితాగసో ముహుహ్ –ప్రకంప మీయుహ్ సభయా ఇవోర్మయః ‘’

నఖక్షతాలు సవతులకు కనిపించకుండా గంధం వంటివి పూస్తే ,అవి నీటిలో కరిగి బయటపడ్డాయి .ప్రియుల ప్రేమకు చిహ్నాలైన వాటిని మిగిలిన కుంకుమ తో మధురస్మృతులు పొందారు .చెలికత్తెలు రెండు తుమ్మెదలు వాలిన పద్మపత్రాలా లేక తమ నాయకి చంచల నేత్రాలా ,చెలి కేశపాశామా లేక తుమ్మెద సమూహమా అని ఆశ్చర్యపోయారు .చిరు నవ్వు దాచుకోనందున బయట పడిన దంతాలు అనే కేసరాలున్న ముఖమా ,లేక వికసిత పద్మమా అంటూ పద్మవనం లో దాగిన తమ చెలికత్తెను మిగతా స్త్రీలు చాలా సేపటికి గుర్తించారు .నాయిక నేత్రాలు తుమ్మెదలు వ్రాలిన పద్మ పత్రాల్లా ,ముడిచిన జుట్టుతుమ్మెదల బృందం గా ,దంతకా౦తు లే కేసరాలుగా ఉన్న ముఖంగా ఉన్నది అని భావం .

  ఒక  నాయిక సవతి చూస్తుండగానే ప్రియుడు కూర్చిన పూలదండను పాలిండ్లపైధరించి  నీటిలో తడిసి వాడినా తీసి పారెయ్యలేదు . అంటే ప్రేమకున్న ప్రాధాన్యం దండకు లేదని భావం .కళ్ళ చుట్టూ ఉన్న ఎర్రదనాన్నికాటుక  అడ్డు కొంటో౦ది .నీటిలో కాటుక కరిగిపోయినా ,కనుల ఎరుపుదనం నేత్రాల తెలుపు దనాన్ని పోగొట్టిందే కాని కళ్ళ అందాన్ని పోగొట్టలేదు ఎర్రదనం కళ్ళకు అలంకారంగా మారిందని భావం .పూల మాలలు గంగానదీ వేగానికి తేలుతూ కొట్టుకుపోయాయి .ధనాది కారాల ఆశతో దుష్టులు  వెళ్ళ గొడితే మంత్రుల పరిస్థితి లా ఉంది .ఆ మంత్రులు కూడా స్థాన భ్రస్టులై చులకన కావటం లాంటిదే ఈ పూలదండలు నలిగి నీటిలో కొట్టుకొని తేలిపోవటం  కూడా –‘’ద్యుతం వహంతో వనితా వతంసకా –హృతాః ప్రలోభాదివ వేగి భి ర్జలైహ్ –ఉప ఫ్లుతా స్తత క్షణ న శోచ నీయతాం –చ్యుతాది కారాః సచివా ఇవా యయుహ్ ‘’

  శరీరాలకు అల౦కార౦ కోసం పూసుకున్నవన్నీ నీటిలో కరిగే పోయినా ,సహజ సౌందర్యం అలానే ఉంది .అప్సరసలు వస్తువులకే అలంకారం తెస్తారని వారి ప్రియులు భావించారు .నదిలో స్నానించిన సవతుల నఖ క్షతాలుల చూసి సవతులు భగ్గుమన్నారు .అప్సరసల అలంకారాలన్నీ గంగ నీటిలో ఉండటం చేత వీళ్ళ ఆదిక్యంఏమీ కనిపించలేదు .గంగార్పణం .చేతులతో నీటిని కదలిస్తుంటే మద్దెల మోతగా స్తనాలు కదుల్తున్నాయి .చలితో వణుకుతూ నృత్యం చేస్తున్నాయా అని పించాయి .—ముహుహ్ స్తనైస్తాల సమం సమాదదే-మనో రమం నృత్యమివ ప్రవేపితాం ‘’.వారి ముఖాలు నీటిలో ప్రతిబింబించాయి స్త్రీలకూ సంతోషం కలిగించేట్లు గంగానది అత్యంత స్వచ్చంగా ఉంది .నిర్మల మనస్కులు పరోపకారులౌతారు –‘’కృతాను కూల్యా సురరాజ యోషితాం-ప్రసాద సాఫల్య మవాప జాహ్నవీ ‘’.

  వారి తొడలను చేపలు తాకగా భయపడి,చేతులు అటూఇటూ కదిల్చారు .చేపతాకిన అప్సరస భయంతో ప్రియుడిని వాటేసుకొని  సంతోషం  కలిగించింది. కృతక చేస్టలకంటే సహజ ప్రేమ ను ప్రకటించే చేస్టతో స్త్రీలు ప్రియుల మనసు దోచుకొంటారు కదా –‘’అకృత్రిమ ప్రేమ రసాహి తైర్మనో –హరంతి రామాః కృతకైరపీహితైహ్’’.నీటిలో మునిగి స్నానం చేయటం వలన తలవెంట్రుకలు చెదిరి ముఖాలపై పడి,తుమ్మెదలు మూగిన పద్మాలనిపించాయి .ఒక అప్సరస నీటిలో మునిగినట్లు నటించి,  భయం లేకుండా ప్రవర్తించి, ప్రియుడినిఅల్లుకొని ఆన౦దించి ,చెలికత్తెలకు మాత్రం భయంతో ఆధారంగా అతడిని పట్టుకొన్న భావన కలిగించింది .ప్రియులు చేతులతో నీటిని ప్రేయసులమీద చల్లుతుంటే విలాసంగా నవ్వుతూ చేతులు అడ్డు పెట్టు కొన్నారు .దీనితో ఉచ్చ్వాస నిశ్వాసాలు ఎక్కువై స్తనాలు వణుకుతున్నట్లు  కదుల్తున్నాయి .తియ్యటిమాటలతో ప్రియురాళ్ళను  ప్రియులు అనున యిస్తున్నారు .కనురెప్పలు కిందకు వాల్చి నీటి బి౦దువు లున్న కనురెప్పలను మూసుకొంటున్నారు .దోసిలి నిండిన నీటితో ప్రేయసి ప్రియుడిపై చల్లబోతుంటే ,అతడు పట్టుకొని ఆమె పైనే చల్లగా,ఆమె నీవీ బంధం ఊడగా, మొలనూలుకాపాడింది .కాటుకలేనికళ్ళు,లాక్షారసం లేనిపెదవుల కంపం ,నుదుటి ముడతలు వారికి అందాన్ని కలిగించాయి .అర్ధనిమీలిత నేత్రాలతో ఒకామె ప్రియుడిని కవ్వించిన ప్రేయసి కంపం కలిగి స్తనాలు ఊగి ,మన్మధ వికారం అని పించింది .సవతిని నీటితో సరదాగా తడపటం చూసి ఒక నాయిక సహించలేక పోయింది .ఇలా ఇస్టాపూర్తిగా జలక్రీడ పూర్తి చేసి ,తీరం చేరారు .స్త్రీల విరహం తాళలేక ముందుకు నది సాగిపోతోందా అని పించింది .ఆప్తులు దూరమైపోతుంటే కొంత దూరం సాగనంపటం ఆనవాయితీ –‘’ఉత్సర్పి తోర్మియ లంఘిత తీర దేశ –మౌత్సుక్య నున్నమివ వారి పురః ప్రతస్థే ‘’.వీరు తీరం చేరగానే చక్రవాకాలు వేరే తీరానికి  వెళ్ళాయి .కమలశోభ తగ్గింది .ఆకాశ గంగా జలంతో వాళ్ళ హారాలమాలిన్యం వదిలిపోయి ప్రకాశించాయి.వాళ్ళు నక్షత్రాల వెన్నెల రాత్రుల్లా శోభించారు –‘’సంరేజిరే సురసరిజ్జల దౌత హారా –స్తారా వితాన తరలా ఇవ యామవత్యః’’.అప్సరసల అంగరాగ చందనం కలిసి గంగాజలం రంగుమారింది తొందరలో తెగిన హారాల మణుల కాంతి చేరటం తో అనేక రంగుల హ౦గు ,పొంగు పొందింది .నది దేవకాంతల పుక్కిలి౦పులతో అలలేర్పడ్డాయి .వీటన్నిటితో నది శయనీయ పడక శోభ పొందింది .-‘’సంక్రాంత చందన రసాహిత వర్ణ భేదం –విచ్చిన్న భూషణ మణి ప్రకరాంశు చిత్రం –బద్ధోర్మి  నాక వనితా పరి భుక్త ముక్తం –సింధోర్బ భార సలిలం శయనీయ లక్ష్మీం ‘’

  సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -26-11-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.10 అష్టమ సర్గ -1

కిరాతార్జునీయం-.10

అష్టమ సర్గ -1

తమకోసం నిర్మించుకొన్న గ౦ధర్వ నగరం లో అప్సరసలు వనవిహారం చేయాలని బయల్దేరారు .ఆనగరం నానా వర్ణాలతో ఇంద్ర ధనుస్సును తలపిస్తోంది .-‘’సురా౦గనా గోపతి చాప గోపురం –పురం వనానాం విజి గీర్షయా జహుహ్ ‘’తమ ప్రియులైన గంధర్వులతో వనవిహారం చేస్తుంటే వాళ్ళ కాంతి పర్వత శిఖరాలపైఉన్న వృక్షాలు,తీగలపై  ప్రసరించి విద్యుత్ కాంతులతో మెరుపు లేమో అనిపించాయి .అప్సరలు భూమిపై సంచరించటం వలన ఆకాశ గమనం కంటే ఎక్కువ సంతోషం పొందారు .నేలపై నడవటం తో ఎత్తైన పాలిండ్ల శ్రమ ,జఘన పరిశ్రమ కూడా తొలగి పోయింది .కంకణాది కాలి అందేల ధ్వని కూడా అందం పెరగటానికి కారణమైంది .చెట్లు వంగి వారిపై పుష్ప వృష్టి కురిపిస్తున్నాయి .వాళ్ళ శరీర అ౦గ రాగాల పరిమళాలకు ఆకర్షింపబడి తుమ్మెదలు వాళ్ళనే ముసరు తున్నాయి  .లత్తుక ఉన్న అరచేతులు ,చిగురాకులు  గా ఉన్న గోళ్ళకాంతులు పూల గుత్తులేమో అనుకొని తుమ్మెదలు వాళ్ళ మీద వాలుతున్నాయని భావం .అశోక వృక్ష౦ కొమ్మపై తుమ్మెదలు పూల మకరందం తాగుతుంటే చిగురాకులు అల్లాలాడు తుంటే అప్సరలు ఆనందంగా చూశారు .ఈ దృశ్యం ప్రియుడు అధరోస్టం పానం చేస్తూ కొరికితే చేతులతో దులపరించుకొనే నాయిక  లా కనిపించింది .-‘’విదంబ యంతీ దదృశే వధూ జనైహ్ –రమంద దష్ఠ కరా వధూనాననం ‘’.ఒక అచ్చర మరో అప్సరసతో ‘’చిగురాకుల్లా మనోహరంగా ఉన్న చేతుల్ని అనవసరంగా ఎందుకు విదిలిస్తావ్ ?తుమ్మెదల బారు కల్పలత అనే భ్రాంతితో నీ దగ్గరకు చేరింది భయం అక్కర్లేదు ‘’అన్నది .ప్రాణాయా కోపంతో ఉన్న నాయిక చెలి ‘’కోపం వదిలి ప్రియుని చేరు .మనసు చంచలమైనది .తర్వాత పశ్చాత్తాపం పడతావు ‘’అని చెప్పి ప్రసన్ను రాలిని చేసింది .

   ఆ వనం లోని నదులు ఎత్తుగా పెరిగిన కాశ గడ్డి అనే వస్త్రాలను చుట్టుకొన్నాయి .ధ్వనిస్తున్న బెగ్గురుపక్షుల బారు మొలనూలుగా ఉంది .ఎత్తైన తీర ప్రాంత ఇసుకతిన్నెలే పిరుదులు  .ఎత్తునుంచి పడే నీటి బిందువులు ముక్కలుగా చెదరి అన్ని వైపులకు వ్యాపింఛి ముత్యాల్లా స్వచ్చంగా ,ప్రియుని చల్లని ఒడి గా ఉన్నాయి.వనం యొక్క హాసమా అన్నట్లు తెల్లగా ప్రకాశిస్తున్నాయి –‘’ప్రియాంక శీతాః శుచి మౌక్తిక త్విషో-వన ప్రహాసా ఇవ వారి బిందవః ‘’నిశ్చలంగా ఉన్న తుమ్మెదలేకాటుకగా ఉన్న పుప్పొడి ,పుష్పాలు అనే నేత్రాలతో తమ ప్రియ చెలికత్తెలను నమ్రభావంతో చూస్తున్నాయా అన్నట్లు వంగి ఉన్న తీగలు వనానికి శోభ కూరుస్తున్నాయి .-‘’స్థిర ద్విరేఫా౦జన శారి తోదరై-ర్విసారిభిహ్ పుష్ప విలోచనై ర్లతా ‘’.

  చందన వృక్షాలను మద గజాలు గండ స్థలాలతో రాసు కొంటుంటే ,అవి శ్యామల వర్ణంపొంది పర్వత పైభాగాలకు చేర్తున్నాయా అని పించాయి .వీటికి అప్సరసలు ఆన౦దించారు .అందుబాటులో పూలున్నా ప్రియ రాళ్లకోసం గంధర్వులు తామే కోసి సంతోషం కలిగిస్తున్నారు .ఒక గంధర్వుడు పూలు కోస్తూ మరో నాయిక పేరు పలకగా నాయిక నీరు నిండిన కళ్ళతో పాదాలు నేలకేసి రాసి,కోపం ప్రకటించింది .ఒక అప్సరస ప్రియుడితో మాట్లాడుతూ చూపు అతనిపైనే లగ్నం చేసింది .కొకముడి ఊడినా గుర్తి౦చ లేదు .వేరే వస్త్రమూ కట్టుకోలేదు చేతులు వృధాగా పూలపై పడటమూ గమనించలేదు .ప్రియునిమాటలు ,రూపాలకు ఆమె మత్తెక్కి పోయి౦దన్నమాట .ప్రియుడు పూలదండకట్టి ఇస్తే తలలో తురుముకొని ఒకనాయిక అతనికి చనులతో, విశాలమైన పిరుదులతో గట్టి  ఆలింగన సౌఖ్యం కలిగించింది .ఒకావిడ లావైన పిరుదులతో లేవటం తో, కొకముడి వీడి వ్రేలాడింది .పై వస్త్రం జారిపోయి స్తనాల అందం బయట పడింది. శరీరం సాగి పొట్టపై ముడతలు మాయమై నూగారు స్పష్టంగా కన్పించింది .పైపొట్ట ను చాచ న౦దున తో పొట్టిదై౦ది .పూలుకోసే నెపంతో ప్రియుడిని అంగాంగ సౌందర్యం ప్రదర్శిస్తూ కవ్విస్తోంది ఒకామె . నాయిక కంట్లో పుప్పొడి పడగా ప్రియుడు తొలగించటానికి నానా హైరానా పడ్డాడు .ఆమె ఎత్తైన లావైన పాలిండ్లతో అతడిని కుమ్మేసింది ..అప్సరసలు వనం లోని ఆకులు పూలు అలంకరించుకొనగా వనలక్ష్మి శోభ వారినే వరించింనిపించింది .

 ఇప్పటిదాకా మనల్ని చెట్లూ చేమలూ నదులు ఇసుకతిన్నెలచుట్టూ తిప్పి అప్సరసల కామ చేష్టలను విపులంగా వర్ణిస్తూ ,అర్జునుడు ఏమయ్యాడో ఆ గోడే పట్టించుకోకుండా అతనిపై చూపాల్సిన ఈ మన్మధ వికారాల్ని ఇక్కడే ఇప్పుడే తమలో తాము చూపుకొంటూ ,చూపుతూ ‘’ట్రయల్ రన్’’ గా చూపిస్తూ  , వర్ణలతో కమ్మేసి ,కుమ్మేశాడు కవి భారవి .తర్వాతైనా కధ ఒక అర౦గుళమైనా కదుల్తుందేమో రేపు చూద్దాం .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-11-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

“శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో కొత్తగా ఏర్పాటు చేసిన c.c.కెమెరాల సాక్షిగా24-11-20 కార్తీక రెండవ మంగళవారం ఓంకార ,స్వస్తిక, త్రిశూల దీపాలంకార శోభ ”

“శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో కొత్తగా ఏర్పాటు చేసిన c.c.కెమెరాల సాక్షిగా24-11-20 కార్తీక రెండవ మంగళవారం ఓంకార ,స్వస్తిక, త్రిశూల దీపాలంకార శోభ ” with yougabbita prasad shared “శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో కొత్తగా ఏర్పాటు చేసిన c.c.కెమెరాల సాక్షిగా24-11-20 కార్తీక రెండవ మంగళవారం ఓంకార ,స్వస్తిక, త్రిశూల దీపాలంకార శోభ ” with yougabbita prasad shared “శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో కొత్తగా ఏర్పాటు చేసిన c.c.కెమెరాల సాక్షిగా24-11-20 కార్తీక రెండవ మంగళవారం ఓంకార ,స్వస్తిక, త్రిశూల దీపాలంకార శోభ ” with youhttps://accounts.google.com/AccountChooser?Email=gln.sarma@gmail.com&continue=https://photos.google.com/share/AF1QipMNOzJg5DoM1jj8LvmndhDolHu6cukgdqxA4xGhhRYpWZCznRLcvPYegTvr0g6i6w?key%3DZ3BQczN3VU8yLUFXNmhfNVZLa3JKOV9aVEhySUdR

Posted in దేవాలయం | Leave a comment

కిరాతార్జునీయం-.9 సప్తమ సర్గ -2(చివరి భాగం )

కిరాతార్జునీయం-.9

సప్తమ సర్గ -2(చివరి భాగం )

ఇంద్రకీలం పై సమతల నదీ తీర ప్రదేశం మీదఇసుకలో  గుర్రాలు దిగాయి .ఆకాశ గమనం లో ఆరితేరినవి కనుక వాటికి సమతలం చేరటం సులభమే .ఇసుకలో వాటి గిట్టల గుర్తులు స్పష్టంగా కనిపించాయి .ధ్వనిస్తూ పారే నదుల తో పర్వతం పైభాగాన ప్రతిధ్వని విన్న నెమళ్ళు మేఘ గర్జన భ్రాంతి తో తలలు పైకెత్తి ఆసక్తిగాచూస్తున్నాయి –‘’ఉద్గ్రీవై ర్ఘన రవ శంకయా మయోరైహ్ –సోత్కంత ధ్వని రుపశుశ్రు వే ర ధా నాం ‘’.పైన ఉన్న నీల మణుల నుండి నిరంతరం ప్రసరిస్తున్న కాంతులతో పైనుండి పడే జలధార బాగా నీలం రంగుపొంది ఆకాశం మధ్యలో పగిలిందా అని అచ్చరలు అచ్చెరువుతో చూశారు .-‘’విచ్ఛిన్నా మివ వనితా నభో౦తరాలే-వప్రామ్భః స్రుతి మవలోక యాంబభూవుహ్ ‘’.దిగ్గజాలు అడవిలోని మదపు టేనుగుల్ని చూసి ,కోపం తో మావటి వాడిని కూడా లెక్క చేయకుండా తమ ఆడ ఏనుగులపై మనసు పడి ముందుకు సాగాయి .రధ చక్రాల వలన ఎగసిన యెర్రని ధూళి తో దేవతా స్త్రీల సేన అడవుల్లో వ్యాపించింది .వర్షాకాలం మొదట్లో యెర్రని నీరు గల గంగానదిలా సేన కనిపిచింది .-‘’అతేనే వనగహనానివాహినీ సా –ఘర్మా౦తక్షుభిత జలేవ జహ్ను కన్యా ‘’.

  గంగా తీర అందమైన వాస యోగ్యమైన ప్రదేశం లో అందరూ బస చేశారు .మణులకాంతి లాంటి ఇసుకతిన్నెలు ,చెట్ల నుంచి రాలిన పూలతో నిండిన ,దట్టమైన పచ్చిక పరచిన ప్రదేశం అది .ఇంద్రకీల౦  పై గ౦ధర్వ సేన ,పూర్వం ఎరుగని శోభ పొందారు .మహాత్ముల సంబంధం వలన సమకూరనిది ఏముంటుంది ?-‘’సమసక్తౌ కిమ సులభం మహోదయానా-ముచ్ఛ్రాయాంనయతి యదృచ్ఛయాపి యోగః ‘’.పరిమళ భరిత పూల చెట్ల శోభ ,నిర్జన ప్రదేశం ,కొత్తగాచిగిర్చిన తీగల సంపద ఉన్న ప్రదేశమది .ఆ సౌఖ్యం అప్సరసలుఅనుభవి౦చటం తో అది సాఫల్యం పొందింది .ఇతరులకుపయోగించేదే సంపద .-‘’సాఫల్యం యయు రమరా౦గనొప భుక్తాః-సా లక్ష్మీ రుపకురుతే యయా పరేషాం’’.అలసిన ఆస్త్రీలు చందన వృక్షాలున్నా చల్లదనం పొందలేకపోయారు .ఆ చెట్ల కొమ్మల్లో ఉన్న పాముల శ్వాస తో చిగురాకులు కదులుతుండగా భయపడ్డారు .చెడ్డ వారిని చేర దీసిన రాజు కూడా దూరంగా ఉంచదగిన వాడే కదా .-‘’క్లా౦తోపి త్రిదశ వధూ జనః పురస్తా –ల్లీనా హిశ్వసి త విలోల పల్లవానాం –సేవ్యానాం హత వినయై రివా వృతానాం-సంపర్కం హత వినయై రివా వృతానాం-సంపర్కం పరి హరతి సమ చందనానాం ‘’.

మావటి వాళ్ళు ఏనుగులపై ఉన్న ధ్వజ, కవచ, గుడార సామాను నేలపై దించి ,ఏనుగుల్ని సమప్రదేశం లో వదిలారు .ప్రళయ కాలం లో వీచే గాలి చెట్టు, చేమలను కూల్చగా బోడిగా కనిపించే పర్వతాలలాగా ఆ ఏనుగులు నేలపై పడుకొని కనిపించాయి –‘ ‘’అక్షిప్తద్రుమ గహనా యుగాంత వాతైహ్ –పర్యస్తా గిరయః ఇవ ద్విపా విరేజుహ్ ‘’.ఒకగాజరాజు ప్రయాణపు బడలికతో వచ్చే నిద్రను వదిలి ,మదజలం తో బురదగా మారిన ఆచోటును వదిలేసింది .అప్పుడే మద వాసనకు ఆకర్షితమైన తుమ్మెదలు అక్కడికి చేరాయి .ఆదృశ్యం తొందరలో ఏనుగు లేచినప్పుడు తెగిన కట్టేసే త్రాడా అన్నట్లుగా తుమ్మెద పంక్తి కనిపించింది .-‘’శయ్యాంతే కులమలినా౦ క్షణం విలీనం –సంరంభ చ్యుత మివ శ్రుమ్ఖలం చకాశే ‘’

 లేచిన ఏనుగు కు గంగా ప్రవాహం అడ్డు పడింది .అంకుశంతో బలంగా తలపై మావటి పొడిచినా లెక్క చేయలేదు .గంగ నీరు తాగి,తొండం తో మావటికి భయపడుతూనే నీరు పైకి చిమ్మింది .ఆ నీరు యెర్రని మదధారలుగల గండ స్థలం నుంచి కిందికి జారుతూ గంగనీరూ ఎరుపెక్కింది .మరో ఏనుగు దాహంగా ఉన్నా ,ఏనుగు మద జలం తో కలిసిన ఆ నీటిని తాగటానికి ఇష్టపడక ,వాసన చూసి కోపం తో రెండవ తీరం వైపు కళ్ళు తిప్పి చూసి ,అది చల్లని నీరే అయినా తాగలేదు .గంగలో జలక్రీడ చేస్తున్న ఏనుగులు మదజలం తో గంగనీటిని పరిమళ భరితం చేసి ,కమలాల పచ్చని కేసరాలతో గండ స్థలం పై ఉన్న యెర్రని మద రేఖలను కప్పుకొని ,ఒడ్డుకు చేరాయి –‘’కింజల్క వ్యవహిత తామ్రదాన లేఖై-రుత్తేరుహ్ సరసిజ గన్ధిభిహ్ కపొలైహ్ ‘’.సేన ధూళి గంగనీటిపై చేరి ,తరంగాలు తీరాన్నితాకుతూ ,ఏనుగులు తు౦చేసిన తామర పూల పుప్పొడి పచ్చగా వ్యాపించి నదికి మా౦జిస్ట(Rubia cordifolia Linn)-(ఎరుపు ,పసుపు రంగుల  సమ్మేళనరంగు ) రంగు కల వస్త్రం లా శోభ కూర్చింది .మాన్జిస్ట  రక్తశుద్ధికీ ఉపయోగపడే వనౌషధ తీగ-‘’మతన్గోన్మధిత సరోజ రేణుపింగం –మాంజి స్టం వసన.మివాంబునిర్బభాసే ‘’

  ఇరుగుడు చెట్లకు కట్టబడిన ఏనుగులు వెనక పాదాలూ భుజాలూ కదిలిస్తూ ముందు వెనుకలకు ఊగుతున్నాయి. మద ధారలు కారుతున్నాయి .చూడటానికి అవి నీటి ధారలతో తడిసి పర్వత గండ శిలలు జారి పడుతున్నాయా అని పించాయి .-‘’సంప్రాప్తే నిస్తృత మదా౦ బు భిర్గజైహ్ –ప్రస్యందిప్రచలిత గండ శైల శోభా ‘’.సప్త నాడుల ద్వారా యెడ తెరిపి లేకుండా మదాన్ని వర్షిస్తుంటే నేలపై దుమ్ము అణగిపోయింది .ఆమదజల పరిమళం ఏలకు తీగల వాసన లాగా ఉంది .వాయువు ఈ సుగంధాన్ని అంతటా వ్యాపింప జేస్తోంది .దిగ్గజాల ఘీ౦కారాలను విన్న సింహాలు నిద్ర చెదిరి సంక్షోభం పొందాయి. చకోరాలు  నెమళ్లు మేఘ గర్జన అని భ్రాంతి చెందాయి –‘’అకేతను శ్చకిత చకోర ,నీలకంతాన్-కచ్చాంతా నమర హేభ  బృంహి తాని ‘’.దీవ సేన విడిది చేసిన ప్రదేశం చక్కగా అలంకరించ బడి,ఉద్యానవన శోభ పొందింది అప్సరసలు మార్గాయాసం పోగొట్టుకోవటానికి వస్త్రాలు, ఆభరణాలుతీసేసి చెట్ల కొమ్మలకు తగిలించారు .చెట్ల నీడలో సేద తీరుతూ   ఆ ఉద్యానవన శోభలో మైమరచారు .

  సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -24-11-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-. సప్తమ సర్గ -1

కిరాతార్జునీయం-.

సప్తమ సర్గ -1

దేవేంద్రుడికి నమస్కరించి అప్సరసలు తమ నివాసాలకు బయల్దేరారు .ప్రభు సన్మానం తో వారి సహజ సౌందర్యం  మరింత పెరిగింది .ఆ అందం చూడటానికి సహస్రాక్షుని కళ్ళు చాలటం లేదు.

 ఇంద్రుని సహచర గంధర్వులు ,అప్సరసలకు రక్షకులుగా అలంకరించిన రధాలు ,ఏనుగులతో  బయల్దేరారు .ఆ ధ్వని విమానాల్లోంచి ప్రతిధ్వనించి మృదంగ ధ్వనిగా వ్యాపించి వారి ప్రయాణ శోభను చాటింది –‘’శ్రీ మద్భిహ్ సరధ,గజైహ్ సురా౦గ నానాం –గుప్తానా మధ సచివై స్త్రిలోక భర్త్రుహ్ –సమ్మూర్చన్నలవిమాన రంధ్రభిన్నః –ప్రస్దానం సమభి దదే మృదంగ నాదం ‘’

సూర్య మండల౦ పై నుంచి వెడుతున్న అప్సరసలకు  గొడుగుల  అవసరం లేకపోయింది .సూర్యకిరణాలే సోకనప్పుడు గొడుగు లెందుకు అని భావం –రామాణాముపరి వివస్వతః స్థితానాం –నా సేదే చరిత గుణత్వమాతపత్రైహ్’’.గాలి ప్రతికూలంగా వీచటం తో వారి కణతలలో ఎర్రదనం ఏర్పడి ,అది మదిరాపాన వలన ఏర్పడిన ఎరుపుతో సమానంగా ఉంది .ప్రతికూల వాయువు అనటం వలన వారి ప్రయత్నానికి ప్రతికూల ఫలితమే లభిస్తుంది అనే సూచన ఉన్నది. ‘దూతానా మభి ముఖ పాతిభిహ్ సమీరై –రాయాసాద విశద లోచానోత్పలానాం –అనిన్యే మదజనితాం శ్రియం వధూనా-ముష్ణా౦శుద్యుతి జనితః కపోల రాగః ‘’.దేవతలప్రభావం తో కిందపడకుండా ఆకాశం లో నిలిచి ,వేగంగా లాగే గుర్రాల రధ సమూహం ఆకాశం లో నిరాధారం గా ఉండటం తో చక్ర భ్రమణం లేక విమాన పద్ధతినే అనుసరించి నట్లని పిస్తోంది .దేవా౦గనల చమట క్రమంగా  స్తన మండలం చేరి అక్కడి గంధపు పూతను కరిగించి పులకా౦కురాలు కలిగించాయి.నుదుటి బొట్టు చెరిగి౦ది. చమట బిందువులు ముత్యాల శోభ కలిగించాయి .అందమైన వారికి వికారం కూడా అందంగా మారుతుంది –‘’సంపేదే శ్రమ సలిలోద్గమో విభూషాం—రమ్యాణా౦ విక్రుతరపిశ్రియం తనోతి ‘’

 జండాల ఎరుపు కాంతి పొడుగ్గా సాగదీసినట్లున్నది .ఆకాశపు మెరుపు కాంతి ఒరిపిడి రాయి వలన కలిగిన బంగారపు పొడి కాంతి లో ఉంది .పూలకంటే సుకుమారులైన అప్సరసలు సూర్యకిరణ వేడికి తట్టుకొనగలగటం గంధర్వులకు  ఆశ్చర్యం కలిగించి,బ్రహ్మదేవుని సృష్టి వైచిత్రికి అబ్బుర పడ్డారు –గంధర్వైరధిగత  విస్మయైహ్ ప్రతీయే-కళ్యాణీ విదిషు విచిత్రతా విధాతుహ్ ‘’’’శరీరం లోని సప్త రంధ్రాల ద్వారా మద జలం కారుస్తున్న ఏనుగులు మేఘాల్లా ఉన్నాయి .వాటి ముఖంపై ఉన్న సిందూరం సూర్యకాంతి తో ప్రకాశిస్తోంది. బంగారు శ్రు౦ఖల మెరుపులాగా ,మదదార వర్షం లా ఉంది .-‘’సిన్దూరైహ్ కృత రుచయః సహేమ కక్ష్యాః-స్రోతోభిస్త్రిదశ గజా మదం క్షరంతః –సాదృశ్యం యయురా రుణా౦ శురాగభిన్నై-ర్వర్షద్భిహ్ స్పురిత శత హ్రదైహ్-పయదైహ్’’

  దేవా౦గనల సేన పైనుంచి గంగాతీరం చేరి౦ది. గంగా నది దిక్కులనే స్త్రీలు అల్లిన జడ లాగా కనిపించింది –‘’ఆకాశాముప రచితా మివైక వేణీం –రమ్యోర్మిం త్రిదశ నదీ౦ యయుర్బలాని ‘’.పూ దేన తాగట౦ తో మత్తిల్లిన తుమ్మెదలు ఒకే చోట చేరటం తో పరాగం తో  కలిసిన గాలి కమలాలను కదిల్చి ,గంగా తరంగ చల్లదనాన్నీ పొంది అప్సరసల శ్రమ తాపాన్ని పోగొట్టింది .-‘’ఆమత్త భ్రమర కులాకులాని దున్వ –న్నుద్ధూత గ్రదిత రజాంసి పంకజాని –కా౦తానాం- గగన నదీ తరంగ శీతః –సంతాపం విరమయతి స్మ మాతరిశ్వా’’.నుదుటి తిలకాలను తడిపి పోగొట్టినా ,వారి అలసట తీరినందున మేఘాలు వాళ్లకు సన్మాన యోగ్యమయ్యాయి .చిన్నతప్పు పెద్ద మేలును తుడిచేయలేదు కదా .అశ్వాలు గజాలు నీటిలో దిగి జలక్రీడ చేస్తు౦టే,మందాకినీ తరంగాలు పైకెగసి పైనున్న విమానాలను తాకి ,వెనక్కి వస్తున్నాయి .ఇలాంటి అనుభవం అంతకు ముందు జరగలేదు .ఆకాశానికి ఒడ్డు ఉండదు. విమానాలు అడ్డుకోవటం తో మొదటి సారే జరిగిందని భావం –‘’తత్పూర్వం ప్రతి విదధే సురాపగాయాః-వప్రాంత స్ఖలిత వివర్తనం పయోభిహ్’’.సూర్యాది మండలాల ను దాటి రధ చక్రాల అంచులకు తగిలి ,దేవతలా అరుగులు కూలుస్తూ అప్సరసల రధాలు ముందుకు వెళ్ళాయి.మేఘాలను దాటుతూ అక్కడి నీటిని కలచి వేస్తూ అడ్డు లేకుండా సాగాయి ..ఏనుగు దంతాల ఒరిపిడి తో నీటి బిందువులు రాలుస్తున్న మేఘాలు ,ఎండతాకిడి పొందిన దేవలోక ఏనుగులకు మంచి ఆనందాన్నే కలిగిస్తున్నాయి .సత్పురుషులు తాము బాధ పడుతూ కూడా ఇతరులకు ఉపకారం చేస్తూ ఉంటారు .-‘’యుక్తానాం ఖలు మహతాం పరోపకారే-కళ్యాణీ భవతి రుజత్స్వపి ప్రవ్రుత్తిహ్ ‘’.వేగంగా వీస్తున్న గాలి కాముకుడు లాగా అప్సరసల అందమైన వస్త్రాలు తొలగిస్తూంటే , వారి మణి మేఖలల (మొల త్రాళ్ళ )కాంతులు ,రెండు తొడలు కనిపించకుండా ఆవరించి ,లో దుస్తుల్లా (అండర్ వేర్ ) లా మారాయి .తరంగాల గుర్తులతో అందమైన ఇసుక ప్రదేశాల లాగా కనిపించే నీరు లేని మేఘాలు చెదిరిన కారణంగా, ఇంద్ర ధనుస్సు సరిగ్గా కనిపించటం లేదు .కాని వారు ధరించిన మణుల కాంతి ప్రసారం చేత హరివిల్లుకు సంపూర్ణత్వం సిద్ధించింది ..అక్కడ పనులు ఎలా చేయాలని మాట్లాడుకొంటూ  అప్సరసల సమూహం పక్షులు సంచరించే ఆకాశ మార్గం దాటి ఇంద్రకీల సానువు చేరింది .అక్కడ నీరు లేని తెల్లని మబ్బులు మాత్రమే ఉన్నాయి .ఇంద్రకీలం చేరిన అప్సరసలు ఆకాశ గంగ లాగా ప్రకాశించారు .వారి ముఖాలు విప్పారాయి .వారి మాటలే మద్దెల మోతగాఉంది .వారు ఆకాశ గంగనే  తలపించారు –సాతూర్యధ్వని త గభీర మా పతంతీ-భూ భర్తుహ్ శిరసి నభో నదీవ రేజే ‘’.ఆకాశ మేఘాలు కప్పులాగా ఉండగా ,కిందికి దిగే రధాల,గుర్రాల ,కళ్ళాలు లాగి పట్టు కోవటం తో వాటి శరీరము౦దుభాగం  కుంచించుకు పోయినట్లు కనిపించింది. తలలు వంచి అతికష్టం మీద గుర్రాలు భూమిపైకి చేరాయి –‘’అనిన్యు ర్నియమిత రశ్మి భుగ్న ఘోణాః- కృచ్ చ్రేణ క్షితి మవనామి నస్తురంగా ‘’.ఇంద్రకీలం పై దిగుతున్న దివిజ గజాలు రెండు ప్రక్కలా మేఘాలతో సముద్రం లోని మైనాకం మొదలైన పర్వతాల్లా కనిపించాయి –‘’మహేంద్రం నగమభితః కరేణు వర్యాః-పర్యంత స్థిత జలదా దివః పత౦తః –సాదృశ్యం నిలయన నిష్ప్రకంప పక్షై-రాజ గ్ముర్జ నిధి శాయి భిర్ణ గేంద్రైహ్’’

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -23-11-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం- ఆరవ సర్గ -2.

 

కిరాతార్జునీయం-

ఆరవ సర్గ -2.

పూల కోసం చిగురాకుల దోసిళ్ళతో చెట్లను వంచుతూ ,పడుకోవటానికి కొత్త మెత్తని లేబచ్చిక తో భూమిని కప్పుతూ అనుకూల వాతావరణం ఏర్పాటు జరిగింది .మేఘాలు లేని ఆకాశం నుంచి జారే నీటి బిందువులు నేలపై దుమ్మును అణచి వేశాయి .తపో నిమగ్నుడైన క్రీడికి అన్నీ ప్రశాంత వాతావరణం కలిపిస్తున్నాయి .శుభ శకున రూపంగా ఎదురుగా ఉన్న పుష్పాన్ని చూసి ఆశ్చర్యపడలేదు .జితే౦ద్రియులకు ఫలప్రాప్తి రూప అనుభవం కూడా ధైర్యాన్ని  సడల నీయదు-‘’స జగామ విస్మయ వశం వశినాం-న నిహ౦తి ధైర్య మనుభావ గుణః ‘’

ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే తపోఫలం అనుభవిస్తున్న ఆర్జునుడిని చూసి అసూయ పడిన దేవతలు ఇంద్ర పదవి కోసం చేస్తున్నాడేమో అని భయపడి అమరావతికి  వార్త తెలియ జేయటానికి వెళ్ళారు-‘’ఉపతస్ధు రా స్థితవిషాద ధియః –శతయజ్వనో వనచరావసతిమ్’’.

  వనదేవతలు వెళ్లి నమస్కరించి తమపనిలో జరిగిన శైదిల్యం గురించి ఇంద్రునికి  చెప్పారు .’’మహేంద్రా !పవిత్ర వల్కలాలతో ఇతరులకు అసాధ్యమైన తేజస్సుతో ఒక పుణ్య పురుషుడు ఇంద్రకీలం పై తీక్ష్ణ తపస్సు చేస్తున్నాడు .ఆ తపశ్శక్తికి లోకం తల్లడిల్లు తోంది .ఏదో గొప్ప కార్య సాధనకోసమే తపస్సు చేస్తున్నట్లు తెలుస్తోంది –‘’మహాతే జయాయ మనఘన్ననఘః –పురుషస్తపస్యతి తపం జగతీం ‘’  .అతడు భయం గొలిపే సర్పాల వంటి భుజాలతో శత్రు భయంకరమైన ధనుస్సుతో ఉన్నాడు .మహాతపస్సుతో మహామునులనూ అతిశయించాడు .

‘’అమలేన తస్య ధృత సచ్చరితా –శ్చరితేన చాతశయితా మునయః ‘’

 అతనితపస్సుకు పంచభూతాలు అనుకూలమై భక్తులా అన్నట్లున్నాయి. గాలి శుభంకరంగా ,భూమిపచ్చికతో ,ఆకాశం నిర్మలంగా ఉంటూ ,నీటి తుమ్పురులతో ధూళి అణచబడింది –‘’గుణ సంపదాను గుణతాం గమితః –కురుతేస్య భక్తి మివ భూత గణః’’.అ తపస్వికి మృగాలు కూడా కలహాలు మాని గురువుకు శిష్యుల్లా మెలగు తున్నాయి .పూల చెట్లు వంగి కోసుకోవటానికి వీలు కలిగిస్తున్నాయి .నీకు ఎలా స్వాదీనమైందో ఇంద్ర కీలాద్రి, అతనికీ అలానే స్వాధీన మైంది –‘’ఇతరేతరా నభి భవేన మృగా –స్తముపాసతే గురు మివా౦త సదః –వినమంతి చాస్య తరవః ప్రచయే –పరవాన్ స తేన భవతేవ నగః ‘’

ఘోర తపస్సులో ఉన్నా అలసట చెందటం లేదు .అందం పెరిగి శరీరం విజయ సూచకంగా ఉంది .అతడిని సందర్శించే జనం ఆ తపో వైభవానికి భయపడుతున్నారు .-‘’శామినోపి తస్య నవ సంగమనే –విభు తాను షంగి భయమేతి జనః ‘’.అతడు రుషి వంశ సంజాతుడో దైత్యుడో,రాజవంశీకుడోమేము చెప్పలేము .,సమర్దులమూ కాము .నీ వనం లో అతని వాలకం ఏమిటో అర్ధం కాలేదు ..అనేక రకాలుగా ఆలోచించి మీకు చెప్పాలో చెప్పకూడదో తెలీక ,అల్పజ్ఞానులమైన మేము ,వివేక వంతులైన ఋషులతో పోల్చుకోలేము కదా –‘’అసధ ప్యదః సహితు,మర్హసి నః –క్వ వనేచరాః క్వ నిపుణా యతయః ‘’

  మహేంద్రుడు ఆ యక్షులు చెప్పిన మాటలతో తన ప్రియ పుత్రుడు అర్జునుడే తపస్సు చేస్తున్నాడని గ్రహించి సంతోషించాడు .కానీ ఆన౦దాన్ని పైకి తెలియ నీయలేదు .ప్రభువుల ఆలోచనా రీతి నీతి మార్గాను సారంగా ఉంటుంది .-‘’అధిగమ్య గుహ్యక గణాదితిత-న్మనసః ప్రియం ప్రియసుతస్య తపః –నిజగోప హర్ష ముదితం మఘవా –నాయవర్త్మగాః ప్రభవతాం హి ధియః ‘’.సమాధి స్థితిలో అర్జునుడే అని నిర్ధారణ చేసుకొని ,అతని నియమ నిస్ట లను తెలుసుకోవాలని దేవ కన్యలతో ఒక పన్నాగం పన్ని వాళ్ళతో ఇలా అన్నాడు  –‘’ఉపలబ్దు మస్య నియమ స్థిరతాం సుర సుందరీతి వచోభి దధే’’

‘’మర్మాన్ని భేదించే అస్త్రాలు మా దగ్గర లేవు .మీలా సుకుమారంగా ఎంతదూరమైనా  వెళ్ళగలిగే నిష్ప్రయోజనం కాని ,ప్రతీకారం లేని మన్మధ విజయాన్ని చేకూర్చే దీ లేదు .’’అంటే అలాంటి గుణాలన్నీ మీవద్దనే  ఉన్నాయని భావం –అవిపక్ష మస్త్ర మపరం కతమ-ద్విజయాయ యూయమివ చిత్తభువః ‘’.యోగుల రజో గుణం తొలగించే తత్వజ్ఞానమే నీరు .అలాంటి యోగులు కూడా మీ ఓర చూపుతో యోగాన్ని వదిలేస్తున్నారు .మహా వైరాగ్యులే మీకు గులాములైతే మామూలు మనుషులు లెక్కే లేదు మీకు ‘’-పరిపీడ మానమివ వో సకలై-రవసాద మేతినయనా౦జలిభిహ్ ‘’.లోకం లోని అందాలన్నీ రాశీభూతం చేసి బ్రహ్మ మిమ్మల్ని సృస్టించాడు .అందుకే మీకోసమే,మీ పొందుకోసమే  జనం స్వర్గానికి వస్తారు .గాంధర్వం మొదలైన కళలలోనేర్పరులైన మీరు ,గంధర్వాదులతో కలసి వెళ్లి ,అతడి తపస్సు భంగం చేయండి .మీకు వశం కాని వారెవరూ ఉండరు-‘’హృత వీత రాగ మ’’నసాంనను వహః –సుఖ సంగినః ప్రతి సుఖా వజితః’’ఆ తపస్వి స్త్రీ సుఖం కోసమే తపస్సు చేస్తున్నాడు తప్ప సంసార బంధన విముక్తికి కానే కాదు .కారణం ధనుస్సు ధరించి ఉండటమే .ముక్తి హింసతో రాదు కనుక అతడు ముముక్షువు కాదు.మీపని తేలికే ‘’-అవి మృష్య  మేతదఖిల ష్యతి స –ద్విషతాం  వధేన విషయాభి రతిం-భవ వీతయే న హి తధాస విధిహ్ –క్వ శరాసనం క్వ చవిముక్తి పధః’’.ఆ తేజస్వి ఇతరమునులు లాగా కోపం తో శపిస్తాడు అనే అనుమానం వద్దు.యశస్సు కాపాడాలను కొనే వారు స్త్రీల విషయం లో హి౦సా మార్గం అవలంబించరు.కనుక భయం వద్దు .-‘’స్వయం శా౦సి విక్రమవతామవతాం –న వధూ ష్వ  ఘాని విమృశంతి ధియః’’

 తమను ఎంతగానో ప్రశంసించిన ప్రభువు ఇంద్రుని ఆజ్ఞతో ఆనందంగా అప్సరస బృందం అర్జున తపోభంగానికి సమాయత్తమై బయల్దేరారు –ప్రభువు ఆదరం పొంది నియోగించిన పనిలో నిబద్ధంగా ప్రవర్తించే  సేవకులు తేజో వృద్ధి పొందటం సహజమే –

‘’లేఖే పరాం ద్యుతి మమర్త్య వధూ సమూహః –సంభావనా హృది కృతస్య తనోతి తేజః ‘’

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -22-11-20-ఉయ్యూరు

‘’

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బాణం

33ఏళ్ళక్రితం వత్సవాయి ,మంగళాపురం హైస్కూల్ హెడ్ మాస్టర్ గా నేను ఉన్నప్పుడు అటెండర్ గా పని చేసిన బాణం వెంకటేశ్వరరావు ,కుమారుడి పెండ్లి పిలుపు కోసం   మాఇంట్లో

Posted in సమయం - సందర్భం | Leave a comment

కిరాతార్జునీయం- ఆరవ సర్గ -1.

కిరాతార్జునీయం-

ఆరవ సర్గ -1.

ఇంద్ర కీల పర్వతం చేరిన ఇంద్ర తనయుడు అర్జునుడు బంగారు రంగు చరియలతో ఉన్న శిఖరాన్ని చూసి ,గంగానదికి ఎదురుగా వెడుతూ విష్ణుమూర్తి గరడుని పై అధిరోహించినట్లు   అధిరోహించాడు.తుమ్మెదల ఝ౦కారమే  జయజయ ద్వానాలుగా, గాలికి వంగి ఊగుతున్న  పూల చెట్లే వంది మాగధుల్లా పూలతో అభిషేకించాయి .-‘’పవనేరి తాకుల విజిహ్మ శిఖా –జగతీరుహో వచ్చా కరుహ్ కుసుమైహ్’’.ఇంద్ర కీలంప సానుకూలంగా గాలులు వీచాయి. తుమ్మెద ఝ౦కార౦  స్వాగతం అనిపించింది. కమలాల పరాగ పరిమళం  వెద జల్లగా, సన్నని గంగాజల బిందువులు చల్లదనం కలిగించాయి .మిత్రులు తమ స్నేహితులురాగా ఎదురేగి కౌగలించి సంతోష పరచినట్లు గాలి వీచింది –‘’’’అవధూత పంకజ పరాగ కణా –స్తను  జాహ్నవీ సలిల వీచి భిదః-పరి రేఖిరే భి ముఖమేత్య సుఖాః-సుహృదః సఖాయ మివ త౦ మరుతః ‘’

పైనుండి పడే బండరాళ్లు చూర్ణం అవుతున్నప్పటి ధ్వని ,కిందికి జారుతూ పారే నీటి గలగలధ్వని అర్జునునికి శుభ మంగళ వాద్య ధ్వని గా  భాసి౦చాయి..ఎత్తైన దేవదారు వృక్షాలను కూల్చేవేగంగా పారే గంగానది లో నీటి ప్రబ్బలి చెట్ల సమూహం ప్రణామం చేస్తున్నట్లు అనిపించాయి .ప్రవాహ వేగానికి వంగి ఆచేట్లు, వేగం తగ్గగానే నిటారుగా లేస్తాయి .అవి వినయవంతుల్లా అనిపించాయి .-‘’స దదర్శ వేతసవనా చరితాం-ప్రణతిం బలీయసి సమృద్ధి కరీం ‘’.గంగానదిలోకమలాల పుప్పొడి తో ఎర్రనైన గంగా నది జాలానికి  కలహంస సమూహం నదికి పైట లాగా అనిపిచింది –‘’సరి దుత్తరీయ మివ సంహతి మ-త్స తరంగరంగి కలహంస కులం ‘’   .ఏనుగులు దంతాలతో పోట్లాడు కొంటున్నాయి వాటి మదజలానికి తుమ్మెదలు ఆకాశం లో ఝ౦కార౦   చేస్తున్నాయి .దీన్ని చూస్తూ అలా ఉండి పోయాడు పార్ధుడు .గొప్పవారి విరోధమూ గొప్ప ఆనందాన్నే కలిగిస్తుంది .ఏనుగుల విరోధం తుమ్మెదలకు ,అర్జునుడికీ వినోదం కలిగించిందని భావం –‘’అధికాం సరోధసి బబంధ ద్యుతిం –మహాతే రుజన్నపి గుణాయ మహాన్ ‘’.ఆడ చక్రవాకం తన మగ జంట కోసం గంగా నది అలలలో వెతుకుతూ దీనాలాపం చేస్తోంది. దాని ప్రేమను అభినందించాడు క్రీడి .గంగా తరంగాలలో మణుల కాంతి ప్రతి ఫలించగా ,నదిలో మణులున్నాయేమోననుకొన్నాడు .ఏనుగును వెతకటానికి వెయ్యి కళ్ళతో చూస్తోందా నది అనిపించింది .

  నదీ తీరం లోనోరు తెరచిన ఒక  ముత్యపు చిప్పనవ వధువును మేల్కొల్పి ఆవులిస్తూ ,ఆనందాశ్రువులు రాలుస్తున్నట్లు ఉంది .ఇసుక మేట పడకగా ,చిప్ప తెరచుకోవటం ఆవలింతగా  ,ముత్యాల వరుస దంత పంక్తిగా జలబిందువులు ఆనంద బాష్పాలుగా ఉండటం అర్జునుని మనసు పరవశం చెందింది .-‘’ప్రతి బోధ జ్రు౦భణ విభిన్నముఖీ –పులినే సరోరుహ దృశా దదృశే –పతదచ్ఛ మౌక్తిక మణి ప్రకరా –గలదశ్రు బిండురివ శుక్తి వధూహ్’’.నదిలోని పగడపు తీగలు కామోద్రేకం కలిగించే దంతకాంతి గల ప్రియురాలి క్రింది పెదవి లా ఉండి,ఆ అనుభవాన్ని గుర్తుకు తెస్తోంది .నదిలో ఈదే గజాల మద గంధాన్ని ఆఘ్రాణించి ,నీటిపైకి లేచిన ఏనుగులు తమపైకి వచ్చే ఏనుగులేమో అనే భ్రమపడిన దృశ్యాన్ని చూశాడు .ఆకాశామంతా ఎత్తుకు ఎగిరే జలాన్ని చూసి ఆశ్చర్యపోయాడు .హఠాత్తుగా తనపైకి ఎగిరే బుసలు కొట్టే పాములాగా శరత్తులోని మేఘం లాగా తెల్లగా గుండ్రం గా ఉంది .-‘’ప్రహితం దివి ప్రజవిభి శ్వసితైహ్-శరదభ్ర విభ్రమ మపాం పటలం ‘’.తీరం లోని ఇసుక తిన్నెలు చేపలు నాలుగు వైపులా ఎగరటమే నేత్రాలుగా ,దేవలోక గంగ ను చేరుతున్నాయి. విశాల పిరుదులు,చంచల ఆకర్షణీయనేత్రాలు  ఉన్న సఖుల లాగా ఆ నదులను దాటి ముందుకు వెళ్ళాడు .

 ఇంద్రకీల పర్వత మధ్య వనాన్ని పార్ధుడు చేరాడు .పుష్పించిన చెట్లు వంగి ,అలంకారమైన తీగలు చుట్టూ ఉండి,అక్కడి భూమి అత్యంత పవిత్రంగా ,వనభూమి మనసు ఆకారం పొందిందా అన్నట్లు పరమ ప్రశాంతంగా ఉన్నది –‘’మనసః ప్రసత్తిమివ మూర్ధ్ని గిరేహ్-శుచి మాససాద స వనాంతం ‘’

  ఇంద్రకీల పర్వత వనం మధ్యలోకిఅర్జునుడు ప్రవేశించాడు అది నిర్జనంగా తపస్సుకు అత్యంత ఆనుకూల్యంగా ఉందని పించి,ఉత్సాహం కలిగింది .అక్కడ యోగ శాస్త్రాను సారం అర్జునుడు బుద్ధిని స్వాధీనం చేసుకొని ,దుష్కర తపస్సు చేయటం మొదలు పెట్టాడు .తపోనియమ కస్టాలు ఏవీ అనిపించలేదు  జి తేన్ద్రియులు దుఃఖ కారకం ఏదీ ఉండదు కదా !

‘’ప్రణిధాయ తత్ర విధినా ధధియం నాథ ధియం –దధతః పురాతన మునేర్ము నితాం-శ్రమ మాదదాధ సుకరం న తపః –కిమివావ సాదకర మాత్మ వతాం’’.ఇంద్రియ జయమే ముఖ్యసాధనంగా ,పవిత్ర గుణాలతో అజ్ఞానాన్ని అణచి  ప్రతిరోజూ వృద్ధి పొందే కళలున్న చంద్రుడిలా తపస్సు వృద్ధి చేశాడు .వివేకం తో తత్వాన్ని గుర్తించి ,కామక్రోధాది వికారాలు లేకుండా ,శాంతి సుఖాన్ని అనుభవిస్తూ ,విఘ్నాలు కలిగించే విషయ వాంఛలను విసర్జించి తీవ్ర తపస్సు చేశాడు –‘’ప్రతి ఘాతినీం విషయ సంగ రతిం –నిరుపప్లవః శమ సుఖాను భవః ‘’.త్రికరణ శుద్ధిగా ఇంద్రుని మెప్పించే తపస్సులో మగ్నమానసుడైన అర్జునుడు స్వభావ సిద్దాలైన వీర శాంత రసాలకు పుష్టి చేకూర్చే తేజస్సులను ఒకే సారి ధరించాడు .అంటే వీరోచిత శస్త్రాస్త్రాలు ఉన్నా ,అహింస ,శాంతి మొదలైన తాపస గుణాలను ధరించి ,ఉపాసన చేబట్టాడు .-‘’సహ జేతరౌ జయ శమౌ దధతీ-బిభారాం బభూవ యుగ ప న్మహసీ ‘

  మరకత మణి శరీర ఛాయతో ,నియమ  నిష్టలవలన ఎరుపు రంగు జడలు తలనిండా వ్యాపించి అర్జునుడు తమాల వృక్షం లాగా కనిపిస్తున్నాడు –‘’ఉపమాం యయావరణ దీదితి భిహ్ –పరి మృస్ట మూర్ధని తమాల తరౌ ‘’.ఆయుధ ధారి అయినా ,శాంతం తో సామాన్య మునిజనాన్ని మించి పోయాడు .రజో గుణం లేనందున మృగాలకూ విశ్వాస పాత్రు డైనాడు .దయా దాక్షిణ్యాలు ఎవరినైనా వశం చేసుకొంటాయి .పరిశుద్ధ ప్రవర్తనే విశ్వాసానికి కారణమౌతుంది –‘’రమయాం చకార విరజాః స మృగాన్-కమి వేశతే  రమయితాం న గుణాః’’.వాయువు మెల్లగా వీచి సుగంధం వెదజల్లుతూ సహకరిస్తూ గ్రీష్మం లోని వేడిని తగ్గించి చల్లగా స్పర్శనిస్తోంది తపస్సు చేస్తున్న అర్జునుడికి ‘’.’

‘’అనుకూల పాతిన మచండ గతిం .కిరతా సుగంధి మభితః పవనం –అవదీరితార్తవ గుణం సుఖతాం –నయతా రుచాం నిచయ మంషు మతః ‘’

  సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -21-11-20-ఉయ్యూరు

‘’-

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం- అయిదవ సర్గ-3(చివరి భాగం)

కిరాతార్జునీయం-

అయిదవ సర్గ-3(చివరి భాగం) .

శంకరుడు పార్వతి పాణి గ్రహణం చేసేటప్పుడు శివుడి చేతి కంకణం వంటి సర్పం జారి పడితే , భయపడిన  శుభావహమైన ఓషధులున్నపార్వతి చేతిని గ్రహించాడు .ఆమె చూపులూ భయం పొందాయి –‘’విన్యస్త మంగళ మహౌషధరీ శ్వరాయ –స్రస్తోరగ ప్రతి సరేణ కరేణ పాణిహ్’’.పర్వత మణి కాంతులు ఆకాశం లోకి వ్యాపించగా ,పైనుండి సూర్య సహస్ర కిరణాలు కిందికి ప్రసరించి ,కలిసిపోయి సూర్యుడికి ఉన్న ‘’సహస్ర రశ్మి ‘’అనే సంఖ్యా పదం దాటి పోయింది .త్రిపురాసుర సంహారం చేసిన శివుని సంతోష పరచటానికి కుబేరుడు ఇక్కడ కైలాస పర్వతం లో అలకా పురిని ఉన్నత శిఖరాలతో  నిర్మించాడు.ఇక్కడికి రాగానే సూర్యుడు ఆకాలం లో అస్తమిస్తున్నట్లు కనిపిస్తాడు .అంటే గోపురాలు అంత ఎత్తుగా ఉన్నాయని భావం –‘’స ఏష  కైలాస ఉపా౦తసర్పిణః-కరోత్య కాలాస్తమయం  వివస్వతః ‘’  .

 పర్వత శిఖర వివిధ మణి కాంతులు శరత్తులో నీరు తగ్గటం వలన మేఘాలలో అస్పష్టంగా ఇంద్ర ధనుస్సును పూరించటానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించాయి .శంకర శిరసులోని చంద్రుని కాంతి, కొత్తగా చిగిర్చిన చెట్ల చిగురాకులను తడిపేవి .అమృతం స్రవించే చంద్ర కిరణాలతో కృష్ణ పక్షం రాత్రులలో కూడా  అరణ్యాన్ని తెల్లగా చేస్తున్నాయి .కైలాస పర్వతం విశాలమైన దుప్పటి లాగా వనాన్ని బంగారు కాంతి మయం చేస్తోంది..బంగారు మయాలైన గుహలు మీ తండ్రి ఇంద్రునికి చాలా ఇష్టం అందుకే ‘’ఇంద్ర కీలాద్రి ‘’అయి౦దన్నాడు యక్షుడు అర్జునునితో .—ఆయ మానేక హిరణ్మయ కందర –స్తవ పితుర్దయితో జగతీ ధరః ‘’’ఇంద్ర కీలాద్రి నుంచి సూర్యకాంతి రెండింతలై ,దగ్గరలోని భూ ప్రదేశాలను కాంతిమంతం చేస్తోంది అది మెరుపుల కాంతిని  అనుక రిస్తో౦దని  పిస్తోంది .

 మదజలం తో తడిసిన చందన వృక్షాలు ఐరావతం వచ్చి వెళ్ళిన జాడ తెలియజేస్తోంది .దాని రాపిడికి భయపడి పాములు పారిపోయాయి .ఇంద్ర నీల మణుల కాంతితో సూర్య కాంతి కలిసిపోయి గుహ కాంతి విహీనమైంది . అది సూర్య కాంతిని చీకటి కప్పేసినట్లున్నది .ఇంద్ర నీల పర్వతం పై శాంత స్వభావం ఉన్న వాడైనా ,అప్రమత్రంగా శస్త్రం తో సిద్ధంగా ఉండాల్సిందే అని  మహర్షి వ్యాసుడు నీకు ఉపదేశించి నట్లు ఇక్కడ అర్జునా నువ్వు తపస్సు చేయాలి .మంచి పనులకు విఘ్నాలుఎదురౌతాయి .కనుక సర్వ సన్నద్ధంగా తపం చేయి –‘’భవ్యో భవన్నపి మునేరిహ శాసనేన –క్షాత్రే స్థితః పధి తపస్య హత ప్రమాదః –ప్రాయేణ సత్యపి హితార్ధ కరే విధౌ హి-శ్రేయాంసి లబ్దు మసుఖాని వినా౦త రాయైహ్’’

అర్జునా !గుర్రాల్లా చంచలమైన నీ ఇంద్రియాలు చెడు మార్గం లో పోనివ్వకు. తపస్సులో ఉన్న క్లేశాన్ని తొలగించి శంకరుడు నీ ఉత్సాహం పె౦పొ౦ది౦చు గాక .లోక పాలకులు నీ సాధన అనుస్టానాన్నిఅధికంగా ఫలవంతం చేయుగాక –‘’మా భూ న్న పధహ్రుతస్త వే౦ద్రియాశ్వాః-సంతాపే దిశతు శివాఃశివాం ప్రసక్తీం-రక్షం తస్తపసి బలం చ లోక పాలాః-కళ్యాణీ మదిక ఫలాం క్రియాం క్రియాసు ‘’

‘ఇలా యక్షుడు చెప్పాల్సిన హితోక్తులన్నీ చెప్పి ,తన స్థానానికి వెళ్ళిపోయాడు .అర్జునుడు ఉత్కంఠ పొంది ఆలోచనలో పడ్డాడు.ఇస్టు లైన సత్పురుషుల ఎడబాటు బాగా బాధ కలిగించటం సహజమే కదా –‘’ ‘’ఇత్యుక్త్వా సపది హితం ప్రియం ప్రియార్హే –ధామ స్వం గతవతి రాజరాజ భ్రుత్యే –సోత్క౦ఠం  కిమపి పృదా సుతః ప్రపద్యౌ –సంధత్తే భ్రుశ మరతిం హి సద్వియోగః ‘’

పరిపూర్ణమైన ఉత్సాహ లక్ష్మీ సమేతుడై అర్జునుడు ఆ ఇంద్ర కీలాద్రి పర్వతం చేరాడు.దాన్ని ఏ బలం తోనూ అతిక్రమించ లేం.ఇది సత్వర ఫలితాలనిచ్చేదికూడా .తానూ చాలాకాలం గా దర్శించాలనుకొన్నదీ కూడా ఈ ఇంద్ర కీలాద్రే .అందుకే ఇక్కడ తపస్సుకు ఎన్నుకొన్నాడు అర్జునుడు –‘’తమనతిశయనీం సర్వతః సార యోగాత్ –దవిరహిత మనేకానాం కభాజా ఫలేన –అకృశమకృ శ లక్ష్మీ శ్చేత సా శంసితం స –స్వమివ పురుషకారం శైల మభ్యా ససాద ‘’

ఐదవ సర్గ సంపూర్ణం

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -20-11-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం- అయిదవ సర్గ-2.

కిరాతార్జునీయం-

అయిదవ సర్గ-2.

యక్షుడు అర్జునునితో ‘’తెల్లని మంచు తో ఉన్న హిమవన్న గ శిఖరాలు ఆకాశాన్ని అనేక భాగాలుగా చేస్తున్నాయి .అంటే ఈ పర్వతాన్ని చూసిన వారి పాపాలు తొలగిస్తోంది .పర్వతం మధ్యభాగం లోని వృక్షా లెక్కిచూసి  దాన్ని కొంచెం గా నే వర్ణించ గలం.వేదాలు కూడా పరమాత్మను కొంచెమే పరిచయం చేయగలవు .బ్రహ్మ మాత్రమే దీన్ని వర్ణించ గల సమర్ధుడు –‘’ఇహ దురధిగమైహ్ కించి దావాగమైహ్ –సతత మసుతరం వర్ణ యంత్యంతరం –అము మపి విపినం  వేద దిగ్వ్యాపినం –పురుష మివ పరం పద్మయోనిహ్ పరం ‘’.ఇది భర్త్రు సంగమం తో తృప్తి చెందినా ,మానవతులైన స్త్రీలు అక్కడి చిగురాకులు ,పూల పూలదరిళ్ళు,సుందర సరోవరాలు ప్రేరేపిస్తే మళ్ళీ భర్త సమాగమాన్ని కోరుతున్నారు .నీతి గల భాగ్య శాలికి  ఇది ఎప్పుడూ సులభమైనదే నవనిదులున్న కుబేరునీ ప్రసన్నం చేస్తుంది అత్యంత ధన సంపదలతో ఇది పరిపూర్ణ మైంది .కనుకనే భూ, స్వర్గ  పాతాళాలను కూడా అధిగమించి శోభిస్తోంది –‘’సులభైహ్ సదా నయత వతా యవతా –నిధి గుహ్య కాధిపరమైహ్ వరమైహ్ –యమునా ధనైహ్ క్షితి భ్రుతాతి భ్రుతా –సమతీత్య భాతి జగతీ జగతీ ‘’.

  ‘’ముల్లోకాలూ దీనితో సరి తూగలేవు .ప్రజలు గుర్తించని వైభవం గల శివుడే ఇక్కడ సదా ఉంటున్నాడు కనుక ధర్మ క్షేత్రం కూడా ఇది .’’అధి వసతి సదా యదైనం జనై-రవిదిత విభావో భవానీ పతిహ్’’.పునర్జన్మ ,ముసలితనం భయాలు లేని బ్రహ్మజ్ఞానం అంటే ముక్తి పొందగోరే ముముక్షువులకు శాస్త్ర జ్ఞానం లాగా హిమాలయం అజ్ఞానం పోగొట్టి, తత్వజ్ఞానం కలిగిస్తుంది .కనుక భోగభూమి మాత్రమె కాదు ఇది యోగభూమీ ,ముక్తిప్రద పుణ్య క్షేత్రం కూడా .-

‘’వీత జన్మ రసం పరం శుచి –బ్రహ్మణః పద ముపైతు మిచ్ఛ తాం-ఆగమాదివ తమోపహాదితః –సంభవ౦తి మతయోభవచ్ఛిదః’’

ఇక్కడ దేవతాస్త్రీల కోసం పూలపాన్పులు వారి వివిధ సురత విధానాలను సూచిస్తున్నాయి .కాలి లత్తుక రసం అక్కడ ముద్రిత మైంది వాడిన పూలహారాలు రాలి పడ్డాయి .పొర్లటం తో ఏర్పడ్డ మడతలు వారి కామోద్రేకాన్ని ,ఆశతో జరిపిన సురత క్రియ విశేషాలను తెలియ జేస్తున్నాయి .ఈ పర్వతం లోఓషధులు నీతిగల రాజు విషయంలో రాజ్య లక్ష్మి సదా నివసించి నట్లు ,ఈ క్షేత్ర గుణాన్ని పొంది ,రాత్రిం బగళ్ళు వెలుగుతున్నాయి .-‘’నయశాలిని శ్రియ ఇవాధి పతౌ –విరమంతి న జ్వలితు మౌషధయః  ‘’.ఇక్కడి గోరువంకలు అరుస్తున్నాయి .పూల బరువుతో చెట్లు వంగాయి .సరస్సులు కమలాలతో శోభాయమానంగా ఉన్నాయి .విశాల మైన కొమ్మలతో చెట్లున్నాయి .వేడిని తగ్గించే నదులు  ఏనుగులకు ప్రీతి కల్గిస్తున్నాయి .తుమ్మెదలున్న మామిడి పూ గుత్తి గంధం తోసమానమైన మద జలం కారుస్తూ పరిమళం వెదజల్లుతున్నాయి .దేవతా గజేంద్రాలుతమ కపోలాల దురద పోగొట్టు కోవటానికి మామిడి చెట్లను రాసు కొంటుంటే వసంతం రాకపోయినా ,కాలం కాని కాలం లో కోయిలలు ఆ పరిమళానికి ఆకర్షింప బడి మదాన్ని పొందాయి –‘’సదృశ్యం గత మపనిద్ర చూత గంధై-రామోదం మదజల సేకజం దధానః –ఏతస్మి న్మదయతికోకిలా  న కాలే -లీనాలిహ్ సుర కరిణా౦ కపోల కాషః’’

‘’అప్సరసల కటి ప్రదేశాలతో అందమైనదీ ,కలకలారావం చేసే నదాలతో హిమవంతం ,పాతాళ లోక రక్షకుడైన వాసుకి కి అత్యంత ప్రీతి పాత్రమైన అమృత౦ చాలాకాలం గా ఉండటం వలన ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకొన్నాడు .అంటే పాతాళ ,భూలోకాల్లో అమృతం లేదు,ఇక్కడే ఉంది  అని భావం –‘’మతా ఫణవతోవతో రసపరా –పరాంత వ సుధాసుధాధివసతి  ‘’.హిమాలయాలలో అందమైన పొదరిళ్ల భవనాలు ,ప్రకాశించే ఓషధులే దీపాలు .హరి చందనం అంటే కల్ప వృక్ష చిగురాకులే పడకలు ,సురత శ్రమ పోగొట్టే కమల వనాల వాయువులు దేవతా స్త్రీలకు స్వర్గాన్ని కూడా గుర్తు చేసుకో నివ్వటం లేదు .అంటే స్వర్గ సుఖాలన్నీ ఇక్కడే లభిస్తున్నాయి .ఇక్కడే పార్వతి చాలాకాలం నీళ్ళల్లో ఉండి తపస్సు చేసింది నీటిలో ఎగిరే చేపలను ఆమె చంచల నేత్రాలతో చూసింది .అలాంటి పార్వతిని చెమట బిందువులు కారుతున్న వేళ్ళున్న చేతులతో శివుడు పట్టు కొన్నాడు .చెమట సాత్విక భావం .ఇక్కడ శివ పార్వతీ కల్యాణం శోభాయమానంగా జరిగింది –

‘’ఈశార్ద మంభసి చిరాయ తపశ్చరంత్యా –యాదో విలంఘన విలోల విలోచనాయాః-ఆలంబతాగ్ర కరమత్ర భవో భవాన్యాః-శ్చోతన్నిదాఘ సలిలితాంగు లినా కరేణ’’

దేవ దానవులు అమృతం కోసం ఈ మందరాన్నే కవ్వం గా,వాసుకిని తాడుగా  చేసి సముద్రం చిలికారు .మధన సమయం లో నీరు అటూ ఇటూ నాలుగు వైపులా యెగిరి పడటం తో పాతాళలోకం స్పష్టంగా కనిపించింది .అప్పు డేర్పడిన గుర్తులు మందరానికి ఇప్పుడూ కనిపిస్తాయి. మందరం ఎత్తైన శిఖారలతో ఆకాశం చీలినట్లు కనిపిస్తుంది .ఇక్కడి సూర్య కిరణాలతో వ్యాపించి ఇంద్ర నీల మణులు ఉండటం చేత బాగా ఉత్కర్ష పొంది ,హంసలతో పోలిక ఉన్న స్పటిక వెండి గోడలు మధ్యాహ్నం కూడా వెన్నెల భ్రాంతి కలిగిస్తోంది .ఈ పర్వతం పై వ్యాపించిన అనేక రత్నాల కాంతుల వ్యాపనం వలన ప్రాకారాల మధ్య గట్టి గోడలు నిర్మించినట్లు అనిపిస్తుంది .కానీ వాయు చలనం వలన ఆ భ్రాంతి తొలగి పోతోంది .కొత్త గడ్డి ప్రదేశాలు మనోహర కాంతితో ఉన్నాయి నల్లకలువల వనాలు కొత్తగా శ్యామల వర్ణం పొందుతున్నాయి .అనేక రంగుల పుష్పాల వృక్షాలు ఆకులు పండినా రాలటం లేదు .లేళ్ళు కొరకగా మిగిలిన మొదళ్ళతో మొలిచిన లేత పచ్చిక ,సూర్య కాంతితో మరకత మణుల కాంతులు కలిసి పోయి బాగా ప్రకాశిస్తున్నాయి .ఆ లే బచ్చిక లేత చిలకల రెక్కల్లా మెత్తగా ఉంది. లేళ్ళు ఆ కాంతుల్ని  లేత పచ్చిక అనుకోని నాకి వదిలేస్తున్నాయి .మెట్టతామర వనం నుంచి ఆకాశం లోకిసుడి గాలితో  ఎగిరి,ఆకాశం లో మండలాకారంగా వ్యాపించిన కమల పుష్పాలలోని పరాగం బంగారు ఛత్రం లాగా శోభించింది –

‘’ఉత్ఫుల్ల స్థల నలినీవ నాద ముష్మా –దుద్ధూతః సరసిజసంభవః  పరాగః –వాత్యాభి ర్వియతి వివర్తితః సమంతా-దాధత్తే కనకమయాత పత్ర  లక్ష్మీం’’’-ఇక్కడి గంగాతీరం లోని పద పంక్తి పార్వతీ పరమేశ్వరుల అర్ధ శరీరాల కలయికను తెలుపుతోంది .ఆ పాద ముద్రలో ఒకటి లత్తుక ముద్ర కలిగి చిన్నది గా ఉన్నది కనుక .ఉదయ సంధ్య లో ప్రదక్షిణాల వలన పద పంక్తి పరి వర్తనం చెందింది –‘’ఇహ స నియమయోహ్సురాపగాయా –ముషసి  సయావక సవ్య పాద రేఖా –కధయతిశివయోహ్ శరీర యోగం –విషమ పదా పదవీ వివర్త నేషు’’

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-11-20-ఉయ్యూరు ,

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం- అయిదవ సర్గ-1

కిరాతార్జునీయం-

అయిదవ సర్గ-1 .

హిమాలయం చేరిన అర్జునుడు అది మేరు పర్వతాన్ని జయి౦చా లనే కోరికతో అంటే దిగంతాలకు వ్యపించాలనే ఉత్కంఠ తో అంతటి ఎత్తుకు ఎదిగిందా అని పించింది .దానికి మూడు కారణాలు కనిపించాయి అతనికి .ఒక వైపు సూర్య కిరణాలతో ప్రకాశిస్తూ,మరో వైపు దట్టమైన చీకటి ఆవరించి ఉంది .ముందువైపు అట్టహాసంతో ప్రకాశిస్తూ ,వెనకవైపు గజచర్మ ధారి శివునిలాగా కనిపి౦చి కను విందు చేస్తోంది . .-‘’తపన మండల దీపిత మేకతః –సతత నైశతమో వృతత మన్యతః –హసిత భిన్న తమిస్ర చయం పురః –శివ మివానుగత౦ గజ చర్మణా’’

హిమపర్వత౦ లో భూలోక వాసులు ,ఆకాశం లోని వారూ ,స్వర్గం లోనివారూ కూడానివాసమున్నారు .కనుక వారికి తన వ్యాపకత్వాన్ని తెలియ జేయటానికి తన ప్రతినిధిగా దీన్ని శివుడు ఏర్పాటు చేశాడా ?అని పించింది అంటే స్వర్గ మర్త్య ఆకాశాలను ఆవరించి ఔన్నత్యం చూపింది –‘’క్షితి నభఃసురలోక నివాసిభిహ్ –కృత నికేతన మదృస్టపరస్పరైహ్ –ప్రధయితుంవిభుతా మభి నిర్మితం –ప్రతినిదిం జగతామివ శంభూనా ‘’

హిమవత్పర్వతం శేషుని తో సమానమైన తెలుపు రంగుతో మిన్ను నంటినది .బంగారు రేఖలతో ప్రకాశించే సానువులు ఉండటం తో ఆకాశం లోని మేఘాలను తిరస్కరిస్తున్న శిఖరాలతో ఎంతో ఉన్నతం గా ఉంది .-‘’భుజగరాజ సితెన నభః శ్రితా-కనకరాజి విరాజిత సానునా –సముదితం నిచయేన తడిత్వతీం-లంఘయితా శరదంబుద సంహతిం ‘’

 హిమాలయానికి మణి కాంతులే వస్త్రాలు .దేవతాస్త్రీలు అనుభవించటానికి తగిన పొదరిళ్ళున్నాయి .ఎత్తైన బండ రాళ్ళ మధ్య ఉన్న విశాల ప్రదేశాలే పురద్వారాలుగా ఉన్నాయి .పుష్పవనాలతో అంతటా ఉండటం వలన పర్వత ప్రాంతమంతా నగరాలు నిండి ఉన్నాయా అని పించింది .వర్షాకాలం వెళ్లి పోయింది కనుక నీరు లేని మేఘాలు ,ఉరుములు లేకుండా తెల్లగా వేలాడు తున్నాయి .వజ్రాయుధం తో ఇంద్రుడు నరికిన రెక్కలు మళ్ళీ మొలిచాయా అని పించింది –‘’’’ఉదిత పక్ష మివార తనిహ్ స్వనైహ్ –పృధు నితంబ విలంబి భి రంబుదైహ్’’’’

పర్వతం లోని ఏనుగులు దంతాలతో సానువులను పొడవగా నీరు వచ్చి ఏర్పడిన చెరువులు గా ఏర్పడ్డాయి .స్నానాదులకు అనుకూలమై నిండుగా ఉన్న నీటితో నదులు వేగంగా ప్రవహిస్తున్నాయి .కడిమి చెట్లు పూలతో శోభిస్తున్నాయి .తమాల వృక్ష వనం దట్టంగా ఆవరించింది .కొంచెం మంచు బిందువులు పడుతున్నాయి .అందమైన ముఖాల మదపు టేనుగులు నిరంతర సంచారం చేస్తున్నాయి .హిమాలయం లో రత్నాలు లేని శిఖరాలు ,పొదరిళ్ళు లేని గుహలు ,అందమైన కమలాలు ఇసుక తిన్నెలు లేని నదులు ,పూలు లేని చెట్లూ లేవు .ఇసుక తిన్నెలు పిరుదులుగా,కమలాలు ముఖాలుగా నదీ స్త్రీలున్నారు వారి విహారాలకు రత్న శిఖరాలు వెలుగునిస్తే ,గుహల ముందున్న పొదరిళ్ళు సేదతీరటానికి ఉపయోగంగా ఉన్నాయి –‘’రహిత రత్న చయా న్న శిలోచ్చయా –నపలత భవనా న దరీ భువః –  విపులా౦బురుహా  న సరిద్వధూ-రకకుసుమా౦ ధతం న మహీ రుహః ‘’

హిమాలయం అందమైన మొల త్రాళ్ళతో ఉన్న దేవతా స్త్రీల పిరుదులతో అడ్డు కో బడి,నెమ్మదిగా ప్రవహించే నదులతో ,మనోహరాలైన తీగలు, పొగడలు  ఆకర్షిస్తే చేరిన పాములు అంతటా వ్యాపించి అందంగా ,మరో స్వర్గం లా భాసించింది –

‘’పృదిత సింధు మనీ రశనైహ్ శనైహ్-అమరలోక వధూ జఘనై ర్ఘనైహ్-ఫణ భ్రుతా మభితో వితతం తతం –దయిత రమ్య లతా వకులైహ్కులైహ్’’

అనేక రకాల మణుల కాంతితో శుభ్రమైన మంచు శిఖరాలు ఇంద్ర ధనుస్సు కల్గిన మేఘాల్లా ఉన్నాయి .కాని ఒక్క సారి గర్జించటం తో అవి శిఖరాలుకావు మేఘాలే అనే నిజం తెలుస్తోంది .ఎప్పుడూ వికసించే కమలాలతో రాజ హంస లతో నిర్మలజలం ఉన్న మానస సరో వరం అక్కడ ఉన్నది ఒకప్పుడు ఈర్ష్యతో కోపించిన పార్వతితో కలహించిన ప్రమధ గణ౦ కూడా అవిద్యాది దోష రహితుడైన శంకరుడు నివాసంగా ఉన్నాడు –‘’వికచ వారిరుహం దధతంసరః –సకల హంస గణం శుచి మానసం –శివ మగాత్మజయా చ కృతేర్ష్యయా –సకలహం స గణం శుచి మానసం ‘’

హిమవంతం చంద్ర సూర్యాదుల దేవయానాలను ప్రకాశింప జేస్తూ ,ఓషధుల రాపిడి వలన కలిగిన అగ్నితో దేదీప్యమానంగా ఉంది .శివ గణాలు ప్రతి రాత్రీ ఆ మంటలను చూసి ఈ శ్వరుడు చేసిన త్రిపుర దాహ వృత్తాంతాన్ని గుర్తుకు తెస్తోంది –‘’

‘’గ్రహ విమాన గణాభితో దివం –జ్వలయతౌషధి జేన కృశానునా –ముహురను స్మరయ౦తమను క్షపం –త్రిపుర దాహ ముమాపతి సేవినః ‘’

 హిమవత్పర్వత శిఖరాలలో గంగానది ఉంది .ఎత్తైన రాళ్ళు తిప్పలు అడ్డురాగా వాటిపై నుంచి పారే ప్పుడు తుపుర్లు తు౦పుర్లు గా ఎగసి పడుతోంది ఆ దృశ్యం గంగానది తెల్లని చామరం వీస్తున్నట్లు గా ఉంది –‘’దధత మున్నత సాను సముద్ధతాం-ధృత సిత వ్యజనామివ జాహ్నవీం ‘’

ఈ పర్వత వైభవం చూసి అర్జునుడు పొంగిపోయి ,యక్షుడితో ఇలా అన్నాడు (.అడగకుండా చెప్పటం వినేవాడు ఉంటే బాగానే ఉంటుంది కదా) –‘’స జగదే వచనం ప్రియమాదరా –న్ముఖరతా వసరే హాయ్ విరాజతే ‘’

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -18-11-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment