లాక్ డౌన్ లోనూ అప్రతిహత౦ గా  సాగిన నా సాహితీ వ్యాసంగం

లాక్ డౌన్ లోనూ అప్రతిహత౦ గా  సాగిన నా సాహితీ వ్యాసంగం

కరోనా వలన21-3-20నుంచి 15-5-20వరకు అమలైన 46రోజుల లాక్ డౌన్ కాలం లోకూడా నా లాప్ టాప్ కు నాకూ అంతర్జాల సాహిత్య వ్యాసంగం లో ‘’డౌన్’’లేదు .అది భగవత్ కృప .అక్షర సేద్యం అనంతంగా నే సాగింది.ఆ వివరాలు మీ ముందుంచుతున్నాను –

మార్చి నెల 11 రోజులు -21శనివారం  సాయంత్రం శ్రీ సువర్చలా౦జనేయ దేవాలయం లో స్వామి పాదాల శ్రీ శార్వరి ఉగాది వేడుకలలో ఆవిష్కరించాల్సిన 3పుస్తకాలు ఉంచి ఆయనే ఆవిష్కరించిన అనుభూతి పొందాం   . ఆవిషయం చిత్రాలతోఅనుకోకుండా సరసభారతి 3పుస్తకాల ఆవిష్కరణ  రాశాను  .మర్నాడు 22.వ తేదీ ఆదివారం నాడు అప్పటికే ఉయ్యూరు వచ్చిన అతిధులకు మా ఇంట్లో భోజనాలు ఏర్పాటు చేసి ,వారికి ఇవ్వాల్సిన పురస్కారాలు అందించి ,చిత్రాలతో వివరాలు రాశాను .అదే రోజు ‘’నిజం ‘’అనే కరోనా వ్యంగ్య కవిత రాశాను .23న ఊసుల్లో ఉయ్యూరు పుస్తకం కవర్ పేజీలు  ,లోపలి ముఖ్యవిషయాలు దాతల పేర్లతో సహా అందరికీ పంపాను .అలాగే రెండవపుస్తకం ‘’సోమనాద్ నుంచి కాశీ విశ్వనాద్ ‘’దాకాలోని ముఖ్య విషయాలూ ,మూడవ పుస్తకం ‘’ఆధునిక ఆంద్ర శాస్త్ర మణిరత్నాలు ‘’లోని ముఖ్యవిషయాలు ,ఉగాది జ్ఞాపిక కూడా స్కాన్ చేసి అందరికీ పంపాను .24న ఉగాది కవిసమ్మేలనం లోని విషయం ‘’మా వూరు –మా వాళ్ళు ‘’పై నేను రాసిన కవిత అందరికీ పంపాను. శ్రీ శార్వరి ఉగాది పంచా౦గ శ్రవణం కు ఒక రోజు ముందు రాచకీయ ‘’పన్’’ (పంచ్} ‘’ఆగం ‘’వ్యాసం రాశాను .25-శ్రీ శార్వరి ఉగాది శుభాకాంక్షలు సాహితీ బంధువులందరికీ తెలియజేశాను 26న గీర్వాణకవుల కవితా గీర్వాణం-4వభాగం 516 –శ్రీమద్భాగవతకావ్య సౌందర్య కర్త-శివ శరణ్ శర్మ ద్వివేది (1928), ‘’ఇకనైనా పక్కా ప్లాన్ తో కదలండి ప్రభువుల్లారా,ప్రజా సేవకుల్లారా !వ్యాసాలు  రాశాను గీర్వాణకవుల కవితా గీర్వాణం-4వభాగం521-కేదార ఖండ పురాణకర్త –వాచస్పతి ద్వివేది (1938) వ్యాసాలు  రాశాను.సాయంత్రం ఆన్ లైన్ పంచాంగ శ్రవణం ఇంటినుంచే చేశాను 27నశ్రీ శృంగేరి స్వామి రచించిన కరోనా ను అరికట్టే స్తోత్రం అందరికీ పంపాను.సరసభారతి మూడు పుస్తకాల పరిచయం ఫేస్ బుక్ లో లైవ్ చేశాను .  గీర్వాణకవుల కవితా గీర్వాణం-4వభాగం-బోధి  చర్య వార్తారహ కర్త –ప్రఫుల్ గాడ్పాల్(1981..28తేది  సరసభారతి పుస్తకపరిచయంలో ట్రయల్ రన్ గా  ఫేస్ బుక్ లైవ్ లో ఉదయం 10గంటలకు మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారి ”శతజయంతి కరదీపిక ‘పరిచయం చేశాను గీర్వాణకవుల కవితా గీర్వాణం-4వభాగం

541-రుక్ సూక్త మంజూష కర్త –గౌతమ్ (1936) 542- -యాజ్ఞ్యవల్క్య సహస్ర నామావళి కర్త –పరశురామ ఘనాపాఠి(1914)543-నీలమత పురాణ కర్త –వేదకుమారి ఘాయ్(1931 544-అభావ విమర్శ కర్త –దీపక్ ఘోష్ (1941) 545-కొల్లాల అమృతా చే కర్త -. ,వాసుదేవ పురుషోత్తం గిండే(1937) 546-భైరవీ మహా విద్య కర్త – గోస్వామి ప్రహ్లాద్ గిరి (1959) 547-వాది వినోద కర్త –విశ్వ౦భర్ నాద గిరి –(1953) 548-జైమిని సూత్ర కర్త –పి.వి.గోపకుమార్ (1971) 549-వ్యవహార సూక్త కర్త –కాశీనాద్ గోపాల గోరె (1936) 550-సంస్కృత పాఠ సంగ్రహ కర్త –భారతి గోస్వామి (1962 వ్యాసాలూ రాశాను .28 న ‘’గిరీష భాష్యం ‘’అనే కరోనా సరదా రచన చేశాను .29 ఆదివారం –‘’ప్రపంచ కుగ్రామం ప్రచండంగా కునారిల్లుతోంది ‘’కవిత గీర్వాణకవుల కవితా గీర్వాణం-4వభాగం551-భావ శతక కర్త –చంద్ర కిషోర్ గోస్వామి (1938), 552-హఠ యోగ ప్రదీపిక కర్త –గోకులేంద్ర నారాయణ దేవ గోస్వామి (1968) 553-విరహిణీ వ్రజా౦గనా కర్త –గోర్ కిషన్ గోస్వామి (20శతాబ్ది ) 554-సింహ సిద్ధాంత సి౦ధు కర్త –హరి కృష్ణ గోస్వామి( 1909-1979) 555-వర్షావలి కర్త –హరిరాయ్ గోస్వామి (1950) 556-మహాత్మా విదుర కర్త –రోహిణీ వల్లభ శాస్త్రి గోస్వామి (1952) 557-అవయవ చింతామణి కర్త –సుబుద్ధి చరణ్ గోస్వామి (1944) 558-స్మార్త ప్రభు కర్త –విద్యాధర్ గౌర్ (1886-1941) 559-ధర్మ విజయ చంపు కర్త –కె.వి .గోవిందం (1948) 560-పంచనద దేశస్తవః-కర్త –పండిట్ చంద్రశేఖర శర్మ గులేరి (1883-1922) వ్యాసాలు రాశాను .30న రక్తబీజుని రక్త సంబంధివా ?కవిత , గీర్వాణకవుల కవితా గీర్వాణం-4వభాగం

561-వాణికీతౌ యక్షౌ పునరాయతౌ కర్త –గుళ్ళపల్లి శ్రీ రామ కృష్ణ మూర్తి (1918) 562-ఉదాహరణ కావ్య కర్త –సంగీత గుండేచ(1974) 563-అభినవ సీతా రామ సంవాద ఝరి కర్త –బచ్చు సుబ్బారాయ గుప్త (1902) 564-సులభ సోపాన కర్త –అఘోరే నాథ గుప్త (1841) 565-చందోలోకారమంజరి కర్త –కాంత గుప్త (1935) 566-వేదాంత సార కర్త –మనోరమా గుప్త (1956) 567-మూల్యాన్య మూల్యాని కర్త –శశి గుప్త( 1946) 568-ఋగ్వేద పరిచయ కర్త –సుదీర్ కుమార్ గుప్తా (1917) 569-సంస్కృత ఛందో విధానం కర్త-వినోద్ కుమార్ గుప్తా (1972) 570-హితోప దేశ నీతి శతక కర్త – బ్రిజేంద్ర సింగ్ గుజార్ (1972)31-మంగళవారం –ఫేస్ బుక్ లో ఆన్ లైన్ పుస్తక పరిచయం 28నుంచి 4వ రోజు

ఏప్రిల్ నెల -1 బుధవారం –కరోనా ఆర్ధికంగా ‘’క్యా కరోనా ?’’వ్యాసం 2-కరోనా కల్యాణం –హాస్య రచన , మహిళా వివాహ చట్టాల కోసం ఉద్యమించిన ఇండో నేషియా లాయర్ –సోయెవాండో సోయెరాస్నో నాని విహంగ వెబ్ మేగజైన్ కు రాసిన వ్యాసం 3-మానవత్వం పరిమళించిన వేళ-ఉయ్యూరులో మా రమణ ,అంజనేయుల మిత్రబృందం నిరుపేదల ఇళ్ళకు వెళ్లి ఆహార పోట్లాలపాకేట్ అందించిన విషయంపై చిరువ్యాసం, విలవిల-కలకల ఇళ్ళల్లో జనం లాక్ దౌన్ కరోనాతో విలవిల ,అరణ్యంలో తమజోలికి రానందుకు జంతువుల కళకళ(కలకల)ఊహా  చిత్రరచన. 4.ప్రపంచ దేశాల సారస్వతం 31- నికారుగ్వన్ సాహిత్యం.5-సోమవారం ఉదయం 10గం నుంచి ఫేస్ లైవ్ లో ‘’కథాసుధ’’  ప్రపంచ దేశాల సారస్వతం-12రోజులు . 32-కోస్టా రికన్ సాహిత్యం ,ప్రపంచ దేశాల సారస్వతం33-పెరూ వియన్ సాహిత్యం,.6న  ‘’కరోనాకు ‘’కరోనా చెప్పు ‘’కవిత 8-7న ప్రపంచ దేశాల సారస్వతం 34-వెనిజులియన్ సాహిత్యం  8నప్రపంచ దేశాల సారస్వతం35-గయనీస్ సాహిత్యం ,56 ఏళ్ళ క్రితం శిష్యురాలు ,,నన్ను మామయ్యా అని ఆత్మీయంగాపిలిచే భ్రమరాంబ ఫోన్  -చిరువ్యాసం9న ప్రపంచ దేశాల సారస్వతం 36-పరాగ్వేనియన్ సాహిత్యం, ‘’అమ్మా, అదీ’’ కవిత కరోనాపై 10న ప్రపంచ దేశాల సారస్వతం 37-ఉరుగ్వేనియన్ సాహిత్యం11న ప్రపంచ దేశాల సారస్వతం 38-ఫాక్ లాండియన్ సాహిత్యం12న ప్రపంచ దేశాల సారస్వతం 39-సౌత్ జార్జియన్ సాహిత్యం.13న సేవకు మారుపేరు-‘’లేడీ విత్ దిలాంప్’’ ఫ్లారెన్స్ నైటింగేల్(విహంగకు ప్రత్యేకం )వ్యాసం .14న ప్రపంచ దేశాల సారస్వతం 40-గ్రీన్ లాండిక్ సాహిత్యం15,16 ,17న- ప్రపంచ దేశాల సారస్వతం 41-ఫ్రెంచ్ సాహిత్యం -1,2,3భాగాలు17,18,19న- ప్రపంచ దేశాల సారస్వతం42-రష్యన్ సాహిత్యం-1,2,3,4భాగాలు 17-19వరకు  సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-1-ధారావాహిక ప్రారంభం -3భాగాలు 20న సార్ధక స్మృతి దిన౦ –మా అక్కయ్య శ్రీమతి వేలూరి దుర్గ మరణించిన న 2వ ఏడాది తిదినాడు ,మాబావ మేనల్లుల్లు పంపిన డబ్బుతో ఉయ్యూరులో రమణ మిత్రబృందం నిరుపేదలకు ఆహార పొట్లాల పాకెట్స్ ఇళ్ళకు వెళ్లి అందించిన విషయంపై చిరువ్యాసం 20 నుండి 30వరకు సుందరకాండ లో హనుమ బహుముఖీయ వ్యక్తిత్వం -4నుంచి 14భాగం -11వ్యాసాలు 21న  ప్రపంచ దేశాలసారస్వతం 43-కిరబటిన్ సాహిత్యం 22న ప్రపంచ దేశాలసారస్వతం 44-లెసెతోవియన్సాహిత్యం, లాక్ డౌన్ బ్రూ ‘’స్లీ లలు-సరదా రచన.23నప్రపంచ దేశాలసారస్వతం45-మార్టిన్ ఐలాండ్స్ సాహిత్యం, కరోనా కామాక్షీ మీనాక్షి కబుర్లు  -సరదావ్యాసం 24న ప్రపంచ దేశాలసారస్వతం 45-మైక్రో నేషియాసాహిత్యం25న –పరశురామ జయంతి సందర్భంగా ‘’రేడియో బావగారి కబుర్లు -1.26న – ప్రపంచ దేశాలసారస్వతం 47-నౌరు దేశసాహిత్యం, ప్రపంచ దేశాలసారస్వతం 48-ఉత్తర కొరియన్  సాహిత్యం27న రేడియో బావగారికబుర్లు -2-28న – ప్రపంచ దేశాలసారస్వతం 49-పలావు దేశసాహిత్యం28న ప్రపంచ దేశాలసారస్వతం 49-పలావు దేశసాహిత్యం ,రేడియో బావగారి కబుర్లు -3 29న- ప్రపంచ దేశాలసారస్వతం 50-సోమోవా దేశసాహిత్యం30న ప్రపంచ దేశాలసారస్వతం 51-సావో టోమ్ అండ్ప్రిన్సిపి దేశ సాహిత్యం, ప్రపంచ దేశాలసారస్వతం 52- సాలోమన్ఐలాండ్స్ సాహిత్యం
మేనెల -1న – కరోనా భువనవిజయం రూపకం, ప్రపంచ దేశాలసారస్వతం 53-  తజకిస్తాన్  సాహిత్యం –సుందర కాండలో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -15నుంచి 26ఎపిసోడ్ వరకు మే1నుంచి  15వరకు -12వ్యాసాలు ప్రపంచ దేశాలసారస్వతం 53- తజకిస్తాన్ సాహిత్యం.2-ప్రపంచ దేశాల సారస్వతం -54-అంగోలా దేశ సాహిత్యం 3న –‘’ స్టేహోం జీరోలు కరోనా-సరదారచన –లేడీ విత్ దిలాంప్ –ఫ్లారెన్స్ నైటింగేల్-విహంగ వెబ్ మహిళామాసపత్రికలో వ్యాసం, ప్రపంచ దేశాల సారస్వతం 55- తుర్కేమెనిస్తాన్ దేశ సాహిత్యం4న –‘’హాస్య దినం ‘’ముళ్ళపూడి వెంకటరమణకు హాస్యాంజలి,ప్రపంచ దేశాల  సారస్వతం 56- తువాలు దేశ సాహిత్యం5న – ప్రపంచ దేశాల సారస్వతం 58-జర్మన్ సాహిత్యం -1-6న-శ్రీ హనుమజ్జయంతి కార్యక్రమం –నృసింహ జయంతి సందార్భంగా  ‘’రేడియో బావగారికబుర్లు ‘’-4.7న అన్నమయ్య బుద్ధజయంతి సందర్భంగా ‘’రేడియో బావగారికబుర్లు -5’’-9 నప్రపంచ దేశాల సారస్వతం 59-హంగేరియన్ సాహిత్యం, ప్రపంచ దేశాల సారస్వతం 60-బోస్నియా అండ్ హెర్జె గోవినా సాహిత్యం  ,ప్రపంచ దేశాల సారస్వతం –బల్గేరియన్ సాహిత్యం 10న ప్రపంచ దేశాల సారస్వతం-62క్రోషియన్ దేశ సాహిత్యం11న  ప్రపంచ దేశాలసారస్వతం 63-సైప్రస్ సాహిత్యం,ప్రపంచ దేశాల సారస్వతం -64-అల్బేనియన్ సాహిత్యం,12న-ప్రపంచదేశాల సారస్వత౦ 65-బెలారస్ దేశ సాహిత్యం 13న ప్రపంచ దేశాలసారస్వతం 66-ఎస్టోనియా దేశ  సాహిత్యం14న ప్రపంచ దేశాలసారస్వతం-కసావోదేశ సాహిత్యం, ప్రపంచ దేశాలసారస్వతం 67-లాట్వియా దేశ సాహిత్యం15న- ప్రపంచ దేశాలసారస్వతం-68 లీ చెస్టీస్ దేశ సాహిత్యం  , ప్రపంచ దేశాలసారస్వతం69-లక్సంబర్గ్ దేశ సాహిత్యం
ఇదీ కరోనా లాక్ డౌన్ కాలం  లో అంతర్జాలం లో నా సాహితీ పురోగతి.
లాక్ డౌన్ బ్రేక్ డౌన్అయిన మే 16నుంచీ మళ్ళీ నిరంతరంగా ప్రపంచ దేశాల సారస్వతం లో 108 దేశాలు అంటే ఆసియా ఐరోపా ఖండాల దేశాలు ,లాటిన్ అమెరికాదేశాలు ,ఆఫ్రికాలో కొన్ని దేశాలలో  సాహిత్యం గురించీ ,బకదాల్భ్యుడు-21భాగాలు ,సుందరకాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం 27నుంచి 58వరకు -32భాగాలు ,పద్మ భూషణ్ ఖాజీ నజ్రుల్ ఇస్లాం బెంగాలీ కవితల 5ఆంగ్లానువాదాలకు నా తెలుగు అనువాదం నిన్నటివరకు 24-6-20వరకు రాశాను.ఇదంతా మా శ్రీ  సువర్చలాన్జనేయస్వామివార్ల,  శ్రీ సరస్వతీ మాతఅనుగ్రహం ,మా తలిదండ్రుల ఆశీస్సులు వల్లనే జరిగినదని వినయంగా తెలుపు కొంటున్నాను.

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -25-6-20-ఉయ్యూరు  .

Posted in రచనలు | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-58

eenసుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-58

రావణ రాకగురించి హనుమ వివరిస్తూ ‘’రావణుడు తనభార్యలతో సీత ఉన్న చోటుకు వచ్చాడు ఆమె శరీరాన్ని చేతులతో ఆచ్చాదనగా కప్పుకొనగా ,భయపడిన,రక్షకులెవరూలేని వణుకు చున్న ఆమెను చూసి ,’’భూమిపై వంగి నమస్కరించి’’ తనను ఆదరి౦పు మని కోరాడు . ఇలా నమస్కరించాడని వాల్మీకి 20వసర్గలో చెప్పనే లేదు .అంతేకాదు ఇక్కడ రావణుడికి సీత పరమ శక్తి స్వరూపిణిగా కనిపించి ఉంటుంది .దైవీ శక్తిని ఆమెలో వాడు చూశాడు .అందుకే తలవంచి నమస్కరించాడు అని నాకనిపిస్తోంది .

‘’తదృస్ట్వాథ వరారోహా సీతా రక్షో మహాబలం –సంకుచ్యోరూ స్తనౌ పీనౌ బాహుభ్యాం పరి రభ్యచ ‘’విత్రస్తాం పరమోద్విగ్నా౦ వీక్షమాణా౦ తతస్తతః –త్రాణం కించి దపశ్య౦తీంవేమమానాం తపస్వినీం ‘’

‘’తామువాచ దశగ్రీవ స్సీతాంపరమ దుఖితాం-‘’అవాక్చిరాఃప్రపతితో ‘’బహుమన్వస్వ మామితి

 ‘’తానిచ్చిన రెండునెలలగడువు లోపల తన్ను ఆదరించకపోతే ముగియగానే ఆమెరక్తం తాగుతానన్నాడు .వాడిమాటలకు ఆమెకు కోపం వచ్చి’’రాక్షసాధమా !అమిత తేజశ్శాలి రాముని భార్యను ,ఇక్ష్వాకు వంశమహారాజు దశరథునికోడలిని .నన్ను అనరాని మాటలు అంటున్న నీనాలుక ఎందుకు తెగి పడకుండా ఉంది ?పాపిస్టుడా! నా భర్త దగ్గర లేని సమయం లో ఆయనకు తెలీకుండా నన్ను అపహరించి తెచ్చావ్ .దీన్ని బట్టి నీపరాక్రమమ యెంత అల్పమైనదో తెలుస్తోంది . రాముడి దాస్యం చేయటానికి కూడా నువ్వు పనికి రావు .అనేకయాగాలు చేసిన సత్యసంధుడు రాముడు .యుద్ధం లో అరివీరభయంకరుడు .నీకూ ఆయనకూ పోలికేమిటి ?’’అని అనగానే వాడి కోపం పరాకాష్ట కు పోయి సీతను చంపే ప్రయత్నం చేయగా ,రాక్షసా౦గనలు  హాహాకారం చేశారు .22వ సర్గలో రావణుడు సీతను చంపటానికి ప్రయత్నించి నట్లు చెప్పలేదు .రెండు నెలల లోపు మాట వినకపోతే   చంపమనిమాత్రమె  కాపలా రాక్షసులకు చెప్పాడు .కానీ ఇది హనుమ చెబుతున్న కథ కనుక కొంత మిర్చీ మసాలా దట్టించి వానరులకు వాడిపై కోపం, సీతపై అపార సానుభూతి కలిగేట్లు చెప్పి ఉంటాడు .సెకండ్ వర్షన్ ఎప్పుడూ నాటకీయంగా ఉండటం లోక సహజం .

‘’యది చేత్వం తు దర్పా న్మాంనాభినందసి గర్వితే –ద్వౌ మాసావంతరం సీతే పాస్యామి రుధిరం తవ ‘’

‘’రాక్షసాధమ రామస్య భార్యామమిత తేజసః-ఇక్ష్వాకు కులనాథస్య స్నుషాం దశరథస్య చ –అవాచ్యం వద తోజిహ్వా కథం  న పతితా తవ ‘’

‘’న త్వం రామస్యసదృశోదాస్యే ప్యస్య న యుజ్యతే ‘’

‘’వివృత్య నయనే  క్రూరేముష్టి ముద్యమ్యదక్షిణం –మైథిలీం హంతుమారబ్దః స్త్రీభి ర్హాహాకార కృతం తదా’’

‘’అప్పుడు రావణ భార్య లలో శ్రేష్టురాలు మండోదరి ,రావణుడి క్రూర కృత్యాన్ని’ దేవ, గ౦ధర్వ యక్ష కాంత లుండగా వారితో క్రీడించక, సీతతో నీకేమిటి పని అని బుజ్జగించి   నివారించి,అంతఃపురానికి తీసుకు వెళ్ళింది .’’’

 ఇక్కడ కూడా లోగడ సర్గలో చెప్పినదానికి విరుద్ధంగా ఉన్నది అక్కడ 22వ సర్గలో దాన్యమాలి  రావణుడిని కౌగిలించి నచ్చచెప్పి తీసుకు వెళ్ళినట్లు ఉన్నది .అక్కడ మండోదరి ప్రసక్తి లేదు .ఇక్కడ ఆమే రావణుడు తిరిగి వెళ్ళటానికి ముఖ్య పాత్ర వహించింది .హనుమకు ఈ ఇద్దరు తేడా అని  తెలీదా ?మండోదరి అలా చేసింది అంటే ఎఫెక్టివ్ గా ఉంటుందనా ?ఇదేదో మాజిక్ గా ఉంది .

‘’స్త్రీణా౦ మధ్యా త్సము త్పత్య తస్య భార్యా దురాత్మనః –వరా మండోదరీ నామ తయా స ప్రతి షేదితః ‘’

‘’దేవ గ౦ధర్వ కన్యాభి ర్యక్ష కన్యాభిరేవచ-సార్ధం ప్రభో రమస్వేహ సీతాయా కిం కరిష్యసి ?’’

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-6-20-ఉయ్యూరు

‘’

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -10చివరిభాగం )

ప్రపంచ దేశాల సారస్వతం

108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -10చివరిభాగం )

20వ శతాబ్దం మొదట్లో జోసెఫ్ కాన్రాడ్ తన సముద్ర ప్రయాణాన్నివాస్తవంగా  గొప్పగా వర్ణిస్తూ ‘’ది నిగ్గర్ ఆఫ్ ది నార్సిసస్’’,లార్డ్ జిమ్ ,టైఫూన్ నవలలు రాశాడు .మరో మేధావి హెచ్ జి వెల్స్’’ది హిస్టరీ ఆఫ్ మిస్టర్ పాలీ ‘’,టోనే-బంగేనవలలో సంస్కరణాభి లాష వ్యక్తం చేశాడు ఆరార్డ్ బెన్నెట్ మధ్యతరగతి ప్రజల నిజజీవితాన్ని ‘’ది ఓల్డ్ వైఫ్స్ టేల్,’’నవల రాస్తే ,ఉన్నతస్థాయి కుటుంబంలో మూడు తరాలమధ్య పరిణామాలను మనోజ్ఞంగా జాన్ గాల్స్ వర్దీతననవల ‘’ఫోర్సైట్ సాగా ‘’ లో చిత్రించాడు .చైతన్య స్రవంతి ప్రక్రియలో జేమ్స్ జాయిస్ ‘’యులిసిస్ ‘’,ఫినిగన్స్ వేక్’’నవలలు రాశాడు .మిసెస్ డాలోవె,వంటి అత్యుత్తమకథలు వర్జీనియా ఉల్ఫ్  రాస్తే,డి.హేచ్ లారెన్స్ ‘’సన్స్ అండ్ లవర్స్ ,దిరెయిన్ బ్రో ,లేడీచాటర్లీన్ నవలలో శృంగారం రంగరిస్తే కల్లోలపరిస్తే ,ఆల్డస్ హక్స్లీ భావోద్వేగానికీ వివేకానికి నడుమ జరిగే సంఘర్షణ లను ‘’యా౦టిక్ హో ,,పాయింట్ కౌంటర్ పాయింట్ ,ఎ బ్రేవ్ న్యూ వరల్డ్, దిఏప్ అండ్  దిఎసెన్స్’’నవలలు రాశాడు .సోమర్ సెట్ మాంప్రజాదరణ పొందే గొప్పనవలలు ‘’దిమూన్ అండ్ సిక్స్ పెన్స్ ,ఆఫ్ హ్యూమన్ బా౦డేజ్,కేక్స్ అండ్ ఏల్,ది రేజర్స్ ఎడ్జ్  రాశాడు.ఇవికాక ‘’షెప్పీ , ది లెటర్ మొదలైన నాటకాలూ దిరెయిన్ ,హిజ్ ఎక్సేలెన్సి,మిస్టర్ నో ఆల్ వంటి రసవత్తర కథలూ రాశాడు .గ్రాహం గ్రీన్ నైతిక సంఘర్షణ ను చాలా సరసంగా నవలలో చిత్రిస్తే ,కేథరీన్ మానస్ ఫీల్డ్ కథానికా రచనలో నూతన పోకడలు చూపింది .వెల్స్ గాళ్స్ వర్దీ ,హక్స్లీ మొదలైనవారు నవలలో తోపాటు చిరస్మరణీయ కథలనూ సృష్టించారు .

  20వ శతాబ్ది నాటక రచయితలలో శిఖరాయమానుడు జార్జ్ బెర్నార్డ్ షా.సాంఘిక సిద్ధాంతాల ప్రచారానికి నాటకాలను ఉపయోగించాడు .మాన్ అండ్ సూపర్ మాన్ ,పిగ్మాలియన్ ,మిసెస్ వారన్స్ ప్రొఫెషన్ ,సీజర్ అండ్ క్లియోపాట్రా,యాన్డ్రోకలిస్ అండ్ ది లయన్ ,హార్ట్ బ్రేక్ హౌస్ ,సెయింట్ జోన్ ,బాక్ టు మెథు సెలా ,వంటి మనోజ్ఞానాటకాలు సృష్టించాడు  .ఆయన కుశాగ్ర బుద్ధి వాక్ చమత్కారం ,ధర్మ ప్రబోధ తత్పరత  అన్నిటిలో గోచరిస్తుంది .గాల్స్ వర్దీ కూడాసా౦ఘిక  ప్రయోజనం తో ‘’ది సిల్వర్ బాక్స్ ,స్ట్రైఫ్,జస్టిస్ మున్నగు ప్రసిద్ధ నాటకాలు రాశాడు .ఏ వైపుకూ మొగ్గకుండా తటస్థంగా ఉంటూ రచన చేశాడు .జేమ్స్ బారీ రస వంతమైన ‘’పీటర్ ప్యాన్ ,ది అడ్మిరబుల్ క్రైటన్ నాటకాలు రాస్తే ,హాస్యరస ప్రదాననాటకాలు నోయెల్ కవార్డ్ రాయగా ,యేట్స్ ,మిలింగ్టన్సిన్జ్ ,జార్జ్ మూర్ ,జార్జ్ రస్సెల్ ,లార్డ్న్,సీన్ ఓ కేసీ వగైరాలు ప్రయోగాత్మక నాటకాలు రాశారు   .జేబీ ప్రీస్ట్లీ వర్తమాన సమాజ స్థితి ని సొగసుగా నాటకాలలో ప్రతిఫలి౦ప జేశాడు .వాల్ గియర్ గుడ్ ,లూయీ మేక్సీన్ శ్రవ్యనాటకాలు కొత్త ప్రయోగాలతో రాశారు .

  వార్తాపత్రికలు కూడాసాహిత్యానికి మంచిప్రోత్సాహమిచ్చాయి .ఉత్తమస్థాయి వ్యాసాలూ అసంఖ్యాకంగావచ్చాయి .ఆత్మాశ్రయపద్ధతిలో చార్లేస్ లాంబ్ రాసిన విధానం లో చెస్ట ర్టన్,హైలేర్ బెలాక్ ,ఎజి గార్డనర్,రాబర్ట్ లిండ్ ,.ఇ.వి.లూకాస్ ,మాక్స్ బియర్ బం,జే.బీ .ప్రీస్ట్లీ లు ఆహ్లాదమైన వ్యాస రచన చేశారు ,డబ్ల్యు ఎన్ హడ్సన్ ప్రకృతి వర్ణనాత్మక రచనలు చేశాడు .లిట్టన్ స్ట్రాచీ ‘’ఎమినేంట్ విక్టోరియన్స్’’రచనలో కొత్తదారి తొక్కాడు.టి.ఎ .లారెన్స్  విన్స్టన్ చర్చిల్ చరిత్రగ్రంథాలను సాహిత్య గౌరవంకలిగేట్లు రాశారు.సెయింట్స్ బరీ ,ఆలివర్ ఎల్టన్, వాల్టర్ రాలీ ,ఎసి బ్రాడ్లీ ,క్విల్లర్ కూచ్ డబ్ల్యు పీకార్ ,గిల్బర్ట్ మరి,హెర్బర్ట్ గ్రియర్సన్ ఐ ఏ రిచర్డ్స్ టిల్యార్డ్,డేవిడ్ డై చెస్ ,హెలెన్ డాబీ షైర్ వగైరాలూ మంచి వ్యాసకర్తలే .

  రెం.ప్ర.యు .లో అన్వా  అణ్వాయు ధాల వాడకం వలన విశ్వ శాంతి నశించి ,మానవాళి నామరూపాలు లేకుండా పోతుందనే ప్రమాద మేర్పడింది .పూర్వ విశ్వాసాలు ,సాంఘిక సూత్రాలు సడలిపోయాయి .1950 తర్వాత నవతరం రచయితలు –యాంగ్రీ య౦గ్ మెన్ పేరుతొ వర్తమానమే ముఖ్యం అనే ధోరణిలో రాశారు .సంఘం లో వ్యక్తులలో ఉన్న  వంచనను దుమ్మెత్తి పోశారు .సమాజ యదార్ధ స్థితిని గీతాలలో గేయాలలో నవలలలో చిత్రించారు .వీరిలో జాన్ వెయిన్ రాసిన ‘’హారీ అన్డౌన్,’’కింగ్స్లే ఏమిస్ రాసిన ‘’లకీ జిమ్ ‘’నవలలు చాలా విజయవంతమయ్యాయి.

   21వ శతాబ్దం లో గ్లోబల్ వార్మింగ్ ,పర్షియన్ గల్ఫ్ వార్ లపై గొప్పరచనలు వచ్చాయి .బెన్నెట్ 2006 లో రాసిన ‘’హిస్టరీ ఆఫ్ బాయ్స్ ‘’నాటకం లో 1980లో ఇంగ్లాండ్ ఉత్తర తీరంలోని స్కూలు విద్యార్ధుల మనస్తత్వాన్ని ప్రతి బి౦బి౦ చింది .డేవిడ్ మిచెల్ ‘’క్లౌడ్ అట్లాస్ట్ ‘’ నవలలో  లో 19,20వ శతాబ్దుల స్థితిగతులున్నాయి .మైకేల్ ఫేబర్ రాసిన ‘’క్రిమ్సన్ పెటల్ అండ్ ది వైట్ ‘’లో విక్టోరియన్ నవల పోకడ చూపాడు .హీన్లీ –ఎలెక్ట్రిక్ లైట్ ,డిస్ట్రిక్ట్ అండ్ సర్కిల్ కవితా సంపుటులు రాశాడు .2004లో వచ్చిన ‘’బరియల్ ఎట్ ధేబ్స్’’-స్ప్ఫిక్లిస్ రాసిన ‘’యాంటిగొని’’కి అనునాదం గా ఉంటుంది .

  మార్టిన్ ఏమిస్ ,పాట్ బార్కర్ ,బెర్మిక్ సమ్మర్ఫీల్ద్ ,టాంక్లైన్ ,కెన్ ఫ్లాలేట,రాంకిన్, రీమాన్ ,జాక్ వైట్ ,రియాన్ బాండ్ వగైరా 21వ శతాబ్ది నవలాకారులు .బాలసాహిత్య రచనలలో  చార్లీ అండ్ లోలా ,హారీపార్టర్ మొదలైనవి బ్లాక్ బస్టర్అయాయి .

   సమకాలీననవలా  సాహిత్యం  –జెడి స్మిత్ –వైట్ టీత్ ,సారావాటర్స్ –దిపేయింగ్ గెస్ట్స్ ,నీల్ గే మాన్ –దిఓషన్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది లేన్ ,డేవిడ్ మిచెల్-క్లౌడ్ అట్లాస్ ,కేటే అట్కిన్సన్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్ ,హిలరి మాన్టేల్ ఉల్ఫ్ హాల్ ,రూత్ వేర్-ఇన్ ఏ డార్క్ డార్క్ వుడ్ ,దిగర్ల్ నెక్స్ట్ డోర్,జోజో మోఎస్ –మీ బిఫోర్ యు ,ఇయాన్ మెక్ ఇవాన్ –అటోన్మెంట్ ,జూలియన్ బార్న్స్ –దిసెన్స్ ఆఫ్ ఎండింగ్,క్రిస్ క్లీవ్ –లిటిల్ బీ నవలలు మంచి పేరుపొందాయి .

సమకాలీన కవిత్వం –రాయ్ ఫిషర్ ,ప్రియాన్నే ,ధాంసన్ ,అందరూ క్రోజియర్ ,జాన్ సిల్కిన్ ,టోనీ హారిసన్ ,కరోల్ ఆన్ డఫే మొదలైన కవులు .

సమకాలీన నాటక రచయితలు –కరైల్ చర్చిల్ ,నినా రైనే ,బోలా అగబాజే ,లూసీ ప్రేబుల్ ,రాయ్ విలియమ్స్ ,టేర్రిజాన్సన్ ,జో పెన్హాల్ తానికాగుప్తా ,జేజ బట్టర్ వర్త్ .

సాహిత్య నోబెల్ పురస్కార గ్రహీతలు –రుడ్యార్డ్ కిప్లింగ్ ,జాన్ గాల్స్ వర్దీ ,టిఎస్ ఇలియట్ ,బెర్ట్రాండ్ రసెల్ ,విన్స్టన్ చర్చిల్ ,విలియం గోల్డింగ్ ,హరాల్డ్ పింటర్ ,డోరిస్ లెస్సింగ్ (2007)

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-6-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -57

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -57

‘’సింహికా హననాన్ని తలచుకొంటూ కొండలతో ఉన్న దక్షిణ సముద్ర తీరం చేరాను .ఇక్కడే లంకానగరం ఉంది’’అని మళ్ళీ తన సింహళ యాత్రా వృత్తాంతం కొన సాగిస్తూ హనుమ ‘’సూర్యుడు అస్తమించాక ,అక్కడి భయంకర నిశాచరులకు తెలియకుండా లంకానగరం లో ప్రవేశించాను .అప్పుడు ఒక  ప్రళయకాల గర్జన చేస్తూ మండే అగ్నిలాంటి వెంట్రుకలు ,న్న రాక్షసి నన్ను చంపటానికి మీదకొస్తే ఎడమ చేతి పిడికిలి తో ఒక్క పోటు పొడిఛి ఓడించి,రాత్రికాలం లో లంకలో చేరగా ఆమె తాను  లంకాధి దేవతనని ,నా పరాక్రమంతో ఆమెను జయి౦చాను కనుక,ఇక సకల రాక్షసులను జయిస్తాను అని శుభం పలికింది .తర్వాత రావణ అంతఃపురం చేరి ,రాత్రి అంతా గాలి౦చినా,,నాసీత జాడ కనిపించలేదు .దుఃఖ సముద్రం లోపడి ఒడ్డు కనిపించలేదు .తర్వాత గృహ ,ఉద్యానవనాలన్నీ తెతికా .అప్పుడు పెద్ద అశోక వనం లో శి౦శుపా వృక్షం పైకెక్కి బంగారు రంగు అరటి తోటలు చూశా .ఆవృక్షం దగ్గర  వరవర్ణిని అంటే శీతాకాలం లో సుఖమైన ఉష్ణం ,వేసవిలో చల్లని శరీరం కల ,భక్తానురాగమున్న,నడియవ్వనంలో ఉన్న తామరరేకులవంటి కనులున్న ,ఉపవాసంతో కృశించిన ముఖం కల సీతాదేవిని చూశాను –

‘’అదూరే శింశుపా వృక్షస్యాత్ పశ్యామి వరవర్ణినీమ్-శ్యామాం కమలపత్రాక్షీ ముపవాస కృశాసనాం ‘’

‘’ఆమె రావణుడు అపహరించినప్పుడు ఏ వస్త్రాన్ని దాల్చి ఉన్నదో ,,ఇప్పుడూ అదే వస్త్రాన్ని దాల్చి ,కేశాలు ధూళి దూసరితాలతో మలినమై ,సంతాపం తో దీనంగా సదా భర్తృ హితాన్ని కోరుతోంది .సీత ను ఫోటో తీసి చూపించి నట్లు౦ది కదా హనుమ అంటే వాల్మీకి వర్ణన .

‘’తదేక వాస స్సంవీతాం రాజోధ్వస్త శిరోరుహాం –శోక సంతీప దీనాంగీం సీతాం భర్తృహితే స్థితాం’’

‘’రక్తమాంసాలు తినే ఆడ పులుల మధ్య ఉన్న ఆడ లేడి లాగా సీత వికృత భయంకర రాక్షస స్త్రీలచేత పరివేస్టింపబడి ఉన్నది.గొప్ప ఉపమాన౦ ఇది .-

‘’రాక్షసీభి ర్విరూపాభి రభి సంవృతాం-మాంస శోణిత భక్షాభి ర్వ్యాఘ్రీభి ర్హరిణీ మివ ‘’

‘’ఆమె అనుక్షణం భర్తనే తలచుకొంటూ ,మాటిమాటికీ రాక్షసస్త్రీలు  భయపెడుతుంటే ,ఒంటి జడ తో దీనంగా ,నేలమీదే పడుకొంటూ ,హేమంతంలో కళ తప్పిన కమల సమూహం లాగా,రావణ వైముఖ్యం తో ,చనిపోటానికి సిద్ధపడిన ఆమెను ఎలాగో చూడగలిగాను’’-

-‘’సామయా రాక్షసీ మధ్యే తర్జ్యమానా ముహుర్ముహుః-‘’ఏక వేణీ,ధరా దీనా భర్తృచింత పరాయణా  ‘’’భూమి శయ్యా వివర్ణా౦గీ పద్మినీవ హిమాగమే ‘’

‘’ఆమె దీనావస్థ చూస్తూ ఆ చెట్టుమీద కూర్చుని అన్నీ చూస్తుండగా మొలత్రాటి చిరుగజ్జెలు,అందెల మ్రోతలతో గంభీరమైన కోలాహలం రావణ భవనం నుంచి వినిపించింది .నేను కలవరపాటుతో నా శరీరం చిన్నది చేసుకొని ఆ వృక్షంపై దట్టమైన ఆకులమధ్య పక్షిలాగా కూర్చున్నాను .అప్పుడు రావణుడి భార్యలు ,మహాబలశాలి రావణుడు సీత ఉన్న చోటుకు వచ్చారు .హనుమకున్న సద్యో స్పురణ కు వెంటనే తగినట్లు స్పందించటానికి ఇది గొప్ప ఉదాహరణమే .

‘’తతోహం పరమోద్విగ్నఃస్వం రూపం ప్రతిసంహరన్-అహం తు శింశుపా వృక్షే పక్షీవ గహనే స్థితః ‘’

సశేషం

మీ గబ్బిట దుర్గాప్రసాద్ -23-6-20-ఉయ్యూరు  

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

5-మానవాత్మా భయపడకు –పద్మభూషణ్  ఖాజీ నజ్రుల్ ఇస్లాం కవిత

5-మానవాత్మా భయపడకు –పద్మభూషణ్  ఖాజీ నజ్రుల్ ఇస్లాం కవిత

  ఇవాల్టి అధికారం ముళ్ళు, దెయ్యాల చేస్టలకు ప్రతినిధి

అధికార దాహంతో అక్కడ రాక్షసులు ఆటాడుకొంటూ తీరిక కేకుండా ఉన్నారు

భయపడకు ఓ మానవాత్మా దుఖంతో పొంగిపొరలి కన్నీరు కార్చకు

పాతళలోకపు తాగుబోతు ఇక ఎంతో కాలం అక్కడ ఉండలేడు

అన్యాయం, చేసిన తప్పుల ముళ్ళతో   అతని కిరీటం నల్లమచ్చలతో వెలవెల బోయింది

అణచబడిన వారి శాపాలతో అతడి ఖడ్గం త్రుప్పుపట్టింది

ముదురు పసుపురంగు పులుముకొని ఆకాశం

 ఋతుపవన  వర్షాల తుఫానుతో

వంచనాశిల్పమున్న దురాశాపరులపై

అత్యంత శక్తిమంతంగా విరుచుకు పడుతుంది

ఇది అందమైన సంధ్యాసమయం .

వారిలోని అగ్ని ప్రపంచామంతా వ్యాపిస్తుంది .

ఆ మహాగ్ని  జ్వాలల్లో  వారెక్కడున్నా మాడిమసి కావాల్సిందే .

ఓసత్యమార్గ గామీ !దిగులు, భయం వద్దు .

శాంతికాముకులకు ఓటమి ఉండనే ఉండదు ప్రియతమా .

ఒక్కోసారి శాంతిప్రేమికుల శత్రువులు ముసుగు లో ఉండి గెలవ్వచ్చు

చివరికి వారికి దక్కేది పరాభవం ,అవమానంతో మరణమే .

గాలి ఉధృతంగా వీస్తే రోడ్డు మీద దుమ్ము ఎగిరిపోతుంది

అది చూసి దాన్ని వారి ఉత్థాన౦ అనుకుంటే ,అది పొరబాటే .

నిజంగా ఉన్నతి సాధించేవారికి  దారిలో ఈ చెత్త అడ్డు నిలుస్తుంది

రోడ్లను జారేట్లుగా చేస్తుంది కాని బురదది ఆనాటి విజయం మాత్రం కాదు .

విజయమైనా ,ఓటమి అయినా ప్రశాంత చిత్తులు ఒకటిగానే భావిస్తారు .

మనం గెలిస్తే దైవానికి,ఆయన ,కీర్తికీ ,పేరుకీ మనం  గెలుపును అంకితమిస్తాం

ఓడిపోతే ఆయనే మనల్ని తర్వాత పరామర్శిస్తాడు

ఒకవేళ యుద్ధం లో గాయపడితే ,ఆయనకు శాశ్వతంగా అత్యంత ప్రేమాస్పదులమౌతాం

పక వేళ వాళ్ళు గెలిస్తే ,వెనకడుగు మాత్రం వేయద్దు .

మన ప్రభువు మనల్ని పరీక్షిస్తాడు  దాన్ని ఆయన లీలగా గ్రహించాలి మనం

ఓడిన వారికి పోగొట్టుకున్న వారినిమళ్ళీ వెనక్కు తెస్తుందాఎక్కడైనా ద్వేషం ?

వారి మనసులు గెలవటానికి మొదట మన హృదయాలను  కరగించుకోవాలి .

కావాలనే ఎవరైనా ఎదుటి వారిని అణగద్రొక్కి ,హక్కుల్ని లాగేస్తే

వారికి వ్యతిరేకంగా భగవాన్ ఖడ్గం ఎప్పుడూ  నిటారుగా సిద్ధంగా ఉంటుంది .

అజ్ఞానులు దారితప్పితే కఠినంగా చూడకు

వారినిప్రేమించి, వారికోసం ప్రార్ధిస్తే వాళ్ళే సత్యం తెలిసి తిరిగొస్తారు

పరమాత్మ పేరుతో అన్ని  దేశాలవారినీ ఆహ్వానించు

ప్రేమ, ఆదరణలతో వారిని ఆహ్వానించేప్పుడు నీ చేతిలో ఖడ్గం ఉండాలి

నీపై పరమాత్మ ఆశీస్సు వర్షిస్తే ,ప్రపంచమంతా నీకే అనుకూలమౌతుంది

సత్యానికి శత్రువులైనవారు మాడి మసి కాక తప్పదు.

మనమధ్య ఉన్న హృదయాలపై కూడా ప్రలోభ మరక పడుతుంది

భగవంతుని ఖండన శిక్ష ఎదుర్కొకముందే  వారూ  క్రమశిక్షణకు అర్హులే .

  మొండి పట్టుదలున్న నూతన సైనికులారా పదండి ముందుకు

మనల్ని అడ్డగించి ,ఆపేశక్తి ఎవరికీ లేదు

విశ్వాస ,సహనాలు  కడదాకా వీడని మీ ,నా నమ్మకమైన మిత్రులు

అలాంటి మన దారిలో చంద్రుడెప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాడు

దిగులు వద్దు భయం వద్దు –అసత్యం తప్పక అదృశ్యమౌతుంది

ఓనా సోదరా!సత్యమే జయిస్తుంది ఎప్పుడూ –సత్యమేవ జయతే

పిరికి వారిని ఎర్రకళ్ళతోచూస్తే ,వాళ్ళపని అయిపోయినట్లే

ఈ ప్రపంచం ప్రజలందరిదే కాని ‘’సింహాసనానిది కాదు’’ అని ధైర్యంగా ప్రకటించు

భగవత్ శక్తి నిండిన వారి ముందు , విశ్వ ప్రభువు అధికారం ముందు వారి తలలు తెగి పడాల్సిందే .

‘’నౌకాదిపతుల ‘’అధికారం అంతం కావస్తోంది –అది ఎంతోదూరం లేదు –

విశ్వ చక్రవర్తికే  దేశాలన్నీ చెందుతాయ్ –

రక్తం మరిగిన రాబందులారా జాగ్రతో౦ జాగ్రత్త –

భగవదదికారం మరచి ఇతరులను వంచించి

మోసం చేయటానికి యెంత గుండె ధైర్యము౦ డాలి?

దేవుడికి ఒక్కడికే తప్ప మనం ఎవరికీ భయపడం

 ప్రియాతి ప్రియమైన సర్వశక్తి వంతుడైన పరమాత్మ మాత్రమే మన మార్గ దర్శి.

 ఆకాశం ,సూర్య, చంద్ర, ఖగోళ ,నక్షత్రాలన్నీ

సాక్షీభూతంగా చూస్తూ గమనిస్తూనే  ఉంటాయ్

 సత్యమార్గంలో నడిచే దెవరో, పెడమార్గం లో పోతున్న దెవరో  .

భయం వద్దు దిగులు వద్దు సోదరా.అసత్యం  తప్పక అంతమౌతుంది .

సత్యమే తప్పక గెలుస్తుంది సోదరా –సత్యమేవ జయతే .

ఆధారం –పద్మభూషణ్ నజ్రుల్ ఇస్లాం  –ప్రియో జైజై బోలోనా ‘’బెంగాలీ కవిత కు-కాష్పియా భిల్లా ఆంగ్లానువాదం

 మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -23-6-20-ఉయ్యూరు

Posted in కవితలు | Tagged | Leave a comment

సుందర కాండలో హనుమ బహుముఖీయ వ్యక్తిత్వం -56

సుందర కాండలో హనుమ బహుముఖీయ వ్యక్తిత్వం -56

జాంబవంతాదులు హనుమ చుట్టూ మహేంద్ర పర్వతం పై కూర్చుని ఉండగా, జాంబవంతుడు సంతోష పులకిత గాత్రంతో హనుమను ‘’సీతా దేవిని చూసి వచ్చిన విధానమంతా వివరించు ‘హనుమా ‘.ఆమెను ఎక్కడ ఎలా చూశావ్ ?ఎలాఉంది ?క్రూర రావణుడు ఆమె పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాడు?అన్ని విషయాలూ యధాతధంగా మా అందరికీ తెలిజేయి .అంతా విని మనం ఏంచేయాలో ఆలోచిద్దాం.మనం కిష్కింధకు వెళ్లి రాముడి సన్నిధిలో ఏం చెప్పాలో ,దేన్నీ దాచాలో బుద్ధిమంతుడవైన నువ్వు మాకు చెప్పు ‘’ అని అడిగాడు .దూర దృష్టి ఉన్నవాడుకనుక రాముడి హృదయం గాయపడే మాటలు చెప్పకుండా మిగిలిన విషయాలు చెప్పి ఆయన్ను కర్తవ్య పరాయణుడిని చేయాలని పెద్దాయన తలపు .సరాసరి రాముడి దగ్గరే సర్వ విషయాలు చెప్పటం ప్రమాదకరం .కనుక ముందుగా తాము విని ,అవసరమైతే విషయాలను కొంత సెన్సార్ చేసి ,ముఖ్యవిషయాలు రాముడికి చెప్పటం రాజనీతి .ఇప్పటివాడా ఋక్షరాజు జాంబవంతుడు?గ్రాండ్ ఓల్డ్ మాన్ . .అన్నీ కాచి వడపోసిన ముదురుఘటం.

‘’కథందృష్టాత్వయాదేవి ,కథంవా తత్ర వర్తతే –తస్యాం వా స కథంవృత్తఃక్రూరకర్మా దశాననః ‘’

‘’తత్వత స్సర్వ మేతన్నః ప్రబ్రూహి త్వం మహా కపే-శ్రుతార్దాశ్చింత యిష్యామో భూయః కార్య వినిశ్చయ౦

 ‘’యశ్చార్ధస్తత్ర వక్తవ్యో గతై రస్మాభి రాత్మవాన్ –రక్షితవ్యంచ యత్ర త్రతద్భవా న్వ్యాకరోతు నః ‘’

  వృద్ధవాన్ జా౦బవాన్ అలా అడగ౦గానే సంతోషం తో ఒడలు పులకించి ,సీతాదేవినిస్మరించి నమస్కరించి ఇలా చెప్పటం ప్రారంభించాడు –‘’మీరంతా చూస్తుండగా మహేంద్ర పర్వతం నుంచి సముద్ర దక్షిణ తీరం చేరటానికి ఆకాశం లోకి ఎగిరా కదా .అలా ఆకాశం లో పోతుంటే బంగారు శిఖరాలతో దివ్యమైన పర్వతం నన్ను నిరోధించటానికా అన్నట్లు భావించి దగ్గరకు వెళ్లి ,దాన్ని పగలకొట్టాలనే ఉద్దేశ్యంతో ముందు ‘’శాంపిల్’’ గా నా తోకతో ఝాడించి కొట్టాను .అంతే అది వెయ్యిముక్కలైంది .నా ప్రయత్నం గ్రహించి ఆ మహాపర్వత౦’’పుత్రా !అని నన్ను ప్రేమగా పిలిచి ,తనపేరు మైనాకుడు అని సముద్రం లో ఉంటానని ,ఒకప్పుడు పర్వతాలకు రెక్కలు ఉండేవని వాటితో ఆకాశం లో ఎగిరి ప్రాణులకు బాధకలిగించేవనీ ,అప్పుడు పాకాసుర సంహారి దేవేంద్రుడు వాటి రెక్కలను వజ్రాయుధం తో ముక్కలు చేశాడనీ ,మా తండ్రి వాయుదేవుడు తనను దేవేంద్రుని బారి నుంచి తప్పించి ,ఈ సముద్రం లో పడేసి ఇంద్రుడికి  కనపడకుండా చేశాడనీ ,తానూ రాముడికి సహాయం చేయటానికే వచ్చానననిచెప్పగా ,రామబాణం లాగా తనప్రయాణ౦  ఎక్కడా ఆగటానికి వీల్లేదని చెప్పి ,ఆయన అనుమతితో  మళ్ళీ ప్రయాణం సాగించాను . అప్పటిదాకా మానవాకారం తో మాట్లాడిన ఆపర్వత౦,మళ్ళీ పర్వత రూపం పొంది సముద్రంలో ఉన్నది ‘’

‘’క్రుతామే మనసా బుద్ధి ర్భేత్తవ్యోయం మయేతిచ-ప్రహతంచ మయా తస్య లంగూలేన మహాగిరేః-శిఖరం సూర్య సంకాశం వ్యసీర్యత సహస్ర ధా’’

 మొదటి సర్గ లో హనుమ మైనాకుడిని తోకతో కొట్టి’’ వేయి ముక్కలు ‘’చేసినట్లు లేదు .ఇప్పుడే ఈవిషయం చెప్పాడు .

  ‘’చాలాకాలం ప్రయాణం చేశాక సర్పాలకు తల్లి సురస సముద్ర మధ్యంలో కనిపించి ,నన్ను తనకు దేవతలు ఆహారంగా ఇచ్చారు కనుక నన్ను తినేస్తాను అన్నది .రామకార్యానికి రెండవ విఘ్నం కలుగుతోందని భావించి  నమస్కరించి ,ఆమెతో రామ వృత్తాంతం టూకీ గా చెప్పిరామదూతగా వెడుతున్న నాకు   అడ్డం రావద్దని ,కావాలంటే లంకనుంచి తిరిగి వచ్చేటప్పుడు ఆహారం అవుతానని రామకార్యానికి ఆమెనుకూడా సాయం చేయమని కోరాను.నా మాట వినకుండా తన్ను ఎవరూ తప్పించుకోలేరు అని చెప్పగా  తెలివిగా పది యోజనాల పొడవున్న నేను పదిహేను యోజనాల పొడవున్నవాడిగా మారగా, నన్ను బట్టి ఆమె కూడా నోరు పెంచటం ప్రారంభించగా ,అమాంతం ఒక్కసారిగా నా శరీరాన్ని బాగా కుదించుకొని ఆమె నోటిలో దూరి ,క్షణం లో బయటకు వచ్చేశాను .అప్పుడు సురస  సహజ వేషంతో కనిపించి ‘’సౌమ్య వానర శ్రేస్టా ! ఇంక సుఖంగా వెళ్ళు .నీకు కార్యసిద్ధి అవుగాక .మహాత్ముడైన రామునితో సీతను కలుపు .సుఖం ,శుభం భూయాత్ .నీ బుద్ధి కౌశలానికి చాలా సంతోషించాను ‘’అనగా భూతగణాలన్నీ ‘’భేష్ భేష్ ‘’అని ప్రశంసించాయి –

‘’రామో దాశరధిఃశ్రీమాన్  ప్రవిస్టోదండకావనం –లక్ష్మణేన సహభ్రాత్రా సీతాయాచ పరంతపః

‘’తస్య సీతాహృతా భార్యా రావణేన దురాత్మనా –తస్యాస్సకాశం దూతోహం గమిష్యే రామ శాసనాత్ ‘-కర్తు మర్హసి రామస్య సాహాయ్యం విషయే సతీ’’అథవా మైథిలీం దృష్ట్వారామచాక్లిస్టకారిణం’’

‘’అర్ధ సిద్ధై హరి శ్రేష్ఠ గచ్ఛ సౌమ్య యధాసుఖం –సమానయ చ వైదేహీ౦రాఘవేణ మహాత్మనః –సుఖీభవ మహాబాహో ప్రీతాస్మి తవ వానర’’

‘’సాదు సాధ్వీతిసర్వ భూతైఃప్రశంసితః ‘’

‘’మళ్ళీ మహావేగంతో బయల్దేరాను .నా నీడను బట్టిఎవరో వెనక్కు లాగుతున్నట్లు అనిపించింది .కానీ నాకెవ్వరూ కనబడలేదు .నావేగం తగ్గగా అన్ని వైపులా చూస్తూ కారణం ఏమిటో అని చూసినా నాకేమీ కనిపించలేదు .నాకు మూడో విఘ్నం కలిగించటానికి ప్రయత్నించిన జంతువేదో తెలియలేదు .ఒకసారి  కిందకి చూడగా భయంకర రాక్షసి ఒకటి నీటిలో కనిపించింది .అది నన్ను చూసి అట్టహాసం చేసి ‘’ఓ మహా శరీరా !ఆకలిగా ఉన్న నాకు నువ్వు భలే ఆహారంగా దొరికావు .ఎక్కడికీ పోతావు పెద్దోడా ?చాలాకాలం గా ఆహారం లేని నాకు పుష్టిగా నువ్వు ఆహారంగా దొరికావ్’అన్నది ..ఆవిడ మాట కాదనటం ఎ౦దుకని సరే అని ,ఆమె నోటికంటే ,నా శరీరం బాగా పెంచాను .నన్ను చూసి ఆమె కూడా నోరు పెంచింది .నాసామర్ధ్యం, కామరూపం ,నేను చేయగల అపకారం ఆమెకు తెలీదు పాపం .క్షణంలో నా రూపం అతి సూక్షం చేసుకొని ఆవిడ నోట్లో ప్రవేశించి గుండెను చీల్చి ఒక్కసారి మళ్ళీ ఆకాశం లోకి ఎగిరాను..పర్వతాకారం గా ఉన్న ఆరాక్షసి భుజాల కీళ్ళు సడలిపోయి సముద్రంలో మునిగిపోయింది .ఆకాశ సిద్ధ చారణులు ‘’భయంకర సింహిక రాక్షసిని హనుమ శీఘ్రంగా సంహరించాడు ‘’అని అనటం నాకు వినిపించింది .

‘’నచ మాం సాదు బుబుదే మమవా నికృతం కృతం –తతోహం విపులం రూపం సంక్షిప్య నిమిషా౦త రాత్ ‘’

‘’తతోహం విపులం రూపం సంక్షిప్య నిమిషాన్తరాత్-తస్యా హృదయ మాదాయ ప్రపతామి నభాస్థలం’’

‘’సా విసృష్ట భుజా భీమా పపాత లవణా౦ భసి-మయా పర్వత సంకాశా నికృత్త హృదయాసతీ’’

‘’శృణోమి ఖగతానాం చ సిద్ధానాం చారణై స్సహ –రాక్షసీ సింహికా భీమా క్షిప్రం హనుమతా హతా ‘’

విడిచిన రామ బాణం లక్ష్యం చేరేదాకా విశ్రమించాడో అలాగే హనుమ లంకకు వెళ్ళేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు నాన్ స్టాప్ గా ప్రయాణం చేశాడు అని మనం గుర్తుంచుకోవాలి అదీ ఆయన ప్రతిభా, సామర్ధ్యం, పట్టుదల ,కార్యదీక్ష ,అంకితభావం ,ధీశక్తీ,చిత్త శుద్ధీ .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-6-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మాతా ఆనందమయీ రాక –పద్మభూషణ్ ఖాజీ నజ్రుల్ ఇస్లాం కవిత

మట్టి విగ్రహం వెనకాల

ఎంతకాలం దాగి ఉంటావు ?

స్వర్గం ఈ నాడు దయా రహిత

క్రూరుల చేత అణచ బడి ఉంది.

దేవునిపిల్లలు కొరడా

దెబ్బలు తింటున్నారు

వీరోచిచ యువకులు

నిర్దాక్షిణ్యంగా ఉరి తీయబడుతున్నారు

భారత దేశం ఇవాళ వధ్యశిల అయింది

ఇంకెప్పుడు వస్తావ్ ఓలయకారుడా ?

భగవత్ సైనికులు  నేడు

సుదూర ప్రాంతాలలో

ప్రవాస౦లొ కఠిన కూలీ పని

అనే శిక్ష అనుభవిస్తున్నారు .

నువ్వు చేత్తో ఖడ్గం పట్టి రాకపోతే

ఇప్పుడు యుద్ధరంగానికి ఎవరొస్తారు ?

ఆధారం -పద్మ భూషణ్ ఖాజీ నజ్రుల్ ఇస్లాం బెంగాలీకవితకు సాజెద్ కమాల్ చేసిన ఆంగ్లానువాదం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-6-20-ఉయ్యూరు

Posted in కవితలు | Tagged | Leave a comment

నేను వెళ్తాను  అనొద్దు  –ఖాజీ నజ్రుల్ ఇస్లాం కవిత  

నేను వెళ్తాను  అనొద్దు  –ఖాజీ నజ్రుల్ ఇస్లాం కవిత

ఓనా ప్రియాతి ప్రియా !నేను

వెళ్లాల్సి  ఉంటుందని అనొద్దు.

నాతో ఆటలాడ వద్దు వద్దు వద్దు వద్దు .

ఇవాళ తోటలో పూలు చెప్పని

 భావాలతో శ్రుతికలుపుతున్నాయ్

వాటిని నేను సిగ్గుతో ,బాదితభావాల

వలన  చెప్పలేకపోతున్నాను.

ఈ సిగ్గు ఎక్కడి నుంచి వచ్చి

నన్ను చుట్టేసిందో ఎవరికి తెల్సు ?

 కన్య మొదటి ప్రేమచూపులా

నీ కళ్ళల్లోకి చూడలేను

ఎంత లోతుగా నేను భావిస్తే

అంత సిగ్గు నన్ను ముంచేస్తోంది

అంత సిగ్గరినౌతున్నాను నేను

నా ఆశలను నీపాదాల

క్రింద వేసి నలిపేయొద్దు.

ఆధారం –ఖాజీ నజ్రుల్ ఇస్లాం ‘’ప్రియో జైజై బోలానా ‘’బెంగాలీ కవితకు –కాష్ఫియా భిల్లా ఆంగ్లానువాదం కు నా  తెలుగు స్వేచ్ఛానువాదం .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-6-20-ఉయ్యూరు

Posted in కవితలు | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం

 

ప్రపంచ దేశాల సారస్వతం

108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -9

విక్టోరియాయుగ రచయితలు సాహిత్యం వినోదం కోసమేకాక సంఘ సంస్కరణకూ తోడ్పడాలని భావించి ప్రయోజనాత్మక రచనలే  చేశారు .19వ శతాబ్దం చివర దీనికి విరుద్ధంగా ‘’కళకళ కోసమే ‘’అనే సౌందర్య ప్రదానవాదం (ఈస్తటిక్ మువ్ మెంట్ )వచ్చింది .సాహిత్యనికేకాక కళలన్నిటికీ శిల్ప సౌందర్యమే పరమావధి అనీ ,ధర్మప్రబోధంతో దానికి సంబంధం లేదనీ భావించారు .వాల్టర్ పేటర్’’ది రినైజాన్స్ ‘’అనే వ్యాసం లో ఈసిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు .అతడి వచన శైలి రమ్యం .ఈయన్ను సమర్ధించాడు ఆస్కార్ వైల్డ్ .వైల్డ్ వ్యాసాలూ ,’’ది పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే’’నవల ,’’ది  ఇంపార్టన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్ ‘’’’లేడీ విండర్ మియర్స్ ఫాన్’’హాస్యనాటకాలు  చాలా ప్రసిద్ధమైనాయి .మెరుపు తీగలవంటి చతురోక్తులకు వైల్డ్ పెట్టిందిపేరు .

  చిన్న కథ 19వ శతాబ్దం లోనే రూపు దాల్చింది .డికెన్స్ స్టీవెన్సన్ ,ఆస్కార్వైల్డ్ లు నవలలతో పాటు గొప్ప కథలూ రాశారు. అసామాన్య నైపుణ్యంతో కథానికా  రచనకు కొత్త రూపు ,ఊపు తెచ్చినవాడు రుడ్యార్డ్ కిప్లింగ్ .ఇండియాలో కొంతకాలం పత్రికా రచయితగా ఉండి,అక్కడి ప్రజాజీవితాన్ని వాటిలో పొందుపరచాడు .అతడి నవల ‘’కిం ‘’ప్రసిద్ధమైంది .19శతాబ్ది చివరలో ఫ్రాన్సిస్ టాంసన్’’దిహౌన్డ్ ఆఫ్ హెవెన్ ‘’భక్తిరస ప్రథానకావ్యం రాశాడు .మనిషి మర్చిపోయినా అతడిని వెంబడించేదేవుని కరుణా తత్పరత ఇందులో ఉంటుంది.జేరార్డ్ మాన్లి హాప్కిన్స్ ఆధ్యాత్మిక భావ బంధుర కావ్యాలు గొప్ప శిల్ప చమత్కృతి తో రాశాడు .అందులో ‘’ది టెస్టమెంట్ ఆఫ్ బ్యూటీ ‘’అద్భుతః .

  శామ్యూల్ బట్లర్  విక్టోరియా యుగ విశ్వాసాలపై తిరగబడి ‘’ఎరివాన్ ‘’,ది వే ఆఫ్ అల్ ఫ్లెష్ ‘’నవలలతో 20వ శతాబ్ది రచయితలకు మార్గ దర్శి అయ్యాడు .థామస్ హార్డీ’’ది రిటర్న్ ఆఫ్ది నేటివ్ ‘’,ది మేయరాఫ్ కాస్టర్ బ్రిడ్జ్ ‘’,టెస్ ఆఫ్ది డాబర్ విల్స్ ,జూడ్ దిఅబ్ స్క్యూర్’’నవలలలో ప్రతికూలశక్తులమధ్య ,కస్టాలకెరటాలు ఎదుర్కుంటూ బతుకు బండీ మోసే సామాన్యుల విషాద దయనీయ స్థితిని వర్ణించాడు .అతనిలోని తాత్విక దృష్టి’’ది డైనాస్ట్స్’’వంటి నాటకాలలో ,గీతాలలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది .

  20వ శతాబ్దం లో మళ్ళీ సంప్రదాయం పై వైముఖ్యం ఏర్పడి రాజకీయ మార్పులు వైజ్ఞానిక రంగ పురోగతి మొదలైన వాటిపై రచయితలకు మోజు పెరిగి వాస్తవిక వాదం వచ్చింది .సిగ్మండ్ ఫ్రాయిడ్ సైకో అనాలిసిస్ అంటే మనో విశ్లేషణ శాస్త్ర సిద్దా౦త౦  ,’’ఫేబియన్ ‘’సామ్యవాదం ,నీషే, బెర్గ్ సన్ ,జీన్ పాల్ సాత్రే తత్వవేత్తల రచనలు సాహిత్యం లో కొత్తపోకడలను తెచ్చాయి .ఏ. యి. హౌస్మన్ కవి ‘’ఏ ష్రాప్ సైడ్ లాడ్’’,లాస్ట్ పోయెమ్స్ కవితా సంపుటులు ,మంచి గీతాలు రాశాడు .నిరాశామయ జీవితం లో అవి మనో ధైర్యానిస్తాయి .డబ్ల్యు బి యేట్స్ ,వాల్టర్ డీలామేర్ కవులు కాల్పనిక సాహిత్యం లోని కమనీయ ఘట్టాలను కొత్త కోణం లో వర్ణించారు .జాన్ మేస్ ఫీల్డ్ ‘’దివిడో ఆఫ్ ది బై స్ట్రీట్ ‘’ది ఎవర లాస్తింగ్ మెర్సి’’కావ్యాలలో మంచీ చెడూ ,పాపపుణ్యాలు ,దైవకరుణల మధ్య ఏర్పడే సంఘర్షణ ను మహోన్నతంగా చిత్రించాడు .మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో యువత లో కలిగిన మానసిక సంక్షోభాన్ని రూపర్ట్ బ్రూక్ ,సీగ్  ఫ్రీడ్ సెసూన్ ,విల్ఫ్రెడ్ ఓవెన్ ,రాబర్ట్ గ్రేవ్స్ కృతులలో హృదయవిదారకంగా వర్ణించారు.

కాల్పనికోద్యమంలో వచ్చిన మధుర కోమల పదావళి నిర్జీవమై పోయి ,వర్తమాన జీవిత మానసిక స్థితి వర్ణించటానికి అనుకూలంగా లేదని తిరస్కరించి ,నిత్యజీవిత వ్యవహారం లో ఉన్న పదాలతో కొత్త భావాలు తెలియ జేయవచ్చు అని శబ్ద చిత్రాల సృష్టి అనే పేరుతో సంకేత ప్రథానవాదం –ఇమేజిస్ట్ మువ్ మెంట్ 1912నుంచి వచ్చింది .వర్ణనా శిల్పంతో నవ్యత తెచ్చారుకవులు .ఈకవులలో ఇలియట్ ,అగ్ర గణ్యుడు.అమెరికాలో పుట్టి ఇంగ్లాండ్లో స్థిరపడ్డాడు .ఇలియట్ రాసిన ‘’వేస్ట్ లాండ్ ‘’కావ్యం నవ్యకవిత్వావతరణకు నాందీ గీతం అయింది  ఒకరకంగా నవ్యకవిత్వానికి ‘’బైబిల్ ‘’అయింది . ‘’మర్డర్ ఆన్ ది కేతెడ్రిల్,దిఫామిలి రీ యూనియన్ ,నాటకాలు ,ది సేక్రేడ్ వుడ్ ‘’అనే సాహిత్య విమర్శ అతని మేధో వికాసానికి గొప్ప ఉదాహరణలు .మొ.ప్ర.యు .తర్వాత మానవాళిలో ఏర్పడిన నైరాశ్యం ను తన రచనల్లో  అద్భుతంగా తీర్చి దిద్దినమేదావి .సిసిల్ డేలూయీస్ ,డబ్ల్యు హెచ్ ఔడెన్,లూయీ మేక్లీస్ ,స్టీఫెన్ స్పెండర్ కవులకు వాళ్ళ కృతులకు మంచి గౌరవమే ఉన్నది ‘

  సశేషం

సూర్యగ్రహణ కానుక

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-6-21

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

నజ్రుల్ ఇస్లాం కవిత –దరిద్రం

నజ్రుల్ ఇస్లాం కవిత –దరిద్రం

ఓ దరిద్రమా !నన్ను నువ్వు గొప్పవాడిని చేశావ్

ముళ్ళ కిరీటం దాల్చిన ఏసు క్రీస్తు

 కున్న గౌరవం కలిగించావ్ నాకు

అన్నీ బయటపెట్టే ధైర్యాన్నిచ్చావ్ .

పెంకితనం నగ్నకనులు వాడి

 నాలుక ఇచ్చిన నీకు రుణపడి ఉంటాను

నీ శాపం నా వయోలిన్ ను ఖడ్గం గా మార్చింది

ఓ శాంత కారుణ్య మూర్తీ !నీ భయంకరాగ్ని

నా స్వర్గాన్ని బంజరుగా మార్చింది

ఓ నాబిడ్డా !నా ప్రేమ మూర్తీ

 కనీసం ఒక పాల చుక్క

కూడా నీకు ఇవ్వలేకపోయాను

నేను  ఆనందించే  అర్హత కోల్పోయాను

దరిద్ర౦ నా ఇంటి ద్వారలమధ్య

నిరంతరం ఏడుస్తూనే  ఉంటుంది

నా భార్యా ,నా పిల్లాడిలాగానే

వంశీని ఎవరు ఊదుతారు ఇప్పుడు ?

ఆధారం –బెంగాలీ ,బంగ్లా దేశి కవి- కాజీ నజ్రుల్ ఇస్లాం బెంగాలీ కవితకు, కబీర్ చౌదరి చేసిన ఇంగ్లీష్ అనువాదం

Posted in సేకరణలు | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-54

 

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-54

  చేయాల్సిన లంకా దహనం కూడా సంతృప్తిగా చేసి హనుమ శింశుపా వృక్షం క్రింద ఉన్న సీతాదేవిని దర్శించి నమస్కరిచి ‘’నా భాగ్యవశం వలన అమ్మా నిన్ను ఏ ఆపదారాని దానిగా చూస్తున్నాను ‘’అన్నాడు .సీతకూడాతిరుగు ప్రయాణానికి సిద్ధ పడిన హనుమను ఆత్మీయంగా పలకరించి ‘’హనుమా !శత్రు సంహారకా !నువ్వొక్కడివే సర్వ రాక్షస సంహారం చేసి, నన్ను నా రామునికి సమర్పి౦చ గలసమర్దుడవు .దీనివల్ల నీకీర్తి పెరుగుతు౦ దనే కాని రాముని కీర్తి పెరగదు .ఆయనే వచ్చి శత్రు రాక్షసులను చంపటమే శ్రేయస్కరం శోభకరం .నువ్వు వెళ్లి ఆయనకు అన్ని విషయాలు చెప్పి ,ఇక్కడికి రావటానికి తగిన ప్రయత్నాలకు అనుగుణ౦గా నువ్వు ఆయనకు చెప్పు .

  హనుమ సీతకు ప్రత్యుత్తరంగా ‘’అమ్మా !రాముడు అన్నిరకాల సైన్యంతో త్వరలోనే ఇక్కడికివచ్చి రాక్షుల౦దర్నీ చంపి, నీ శోకం తీరుస్తాడు ‘’అని ఓదార్పుగా చెప్పి తిరుగు ప్రయాణం చేయబోతూ ,సీతకు వీడ్కోలు చెప్పి అత్యంత త్వరగా రామ దర్శనం చేయాలన్న హడావిడిలో’’ అరిష్టం ‘’అనే పర్వత శ్రేస్టాన్ని ఎక్కి అనేక జలపాతాలతో అనేక వృక్ష ఫల పుష్పజాతులతో పక్షులు జంతువుల సమూహాలతో ఉన్న ,గాలికికదలే కీచకాలు  వెదురు పొదల ధ్వనితో  బుసలు కొట్టే సర్ప సమూహాలతో .తపస్సుకు ఉపయోగపడే ప్రశాంత గుహలతో  మేఘాలను అందుకొనే శిఖర సమూహాలతో ,దాతు స్రావంతో ఉన్నఅరిస్ట పర్వత శిఖరం ఎక్కి ,ఒక్కతొక్కు తొక్కగా కొన్ని కొండ చరియలు విరిగిపడగా హనుమ దక్షిణ తీరం నుంచి ఉత్తర తీరానికి ప్రయాణి౦చాలని బయల్దేరాడు  .ఆ పర్వతం పై ఉన్న సకల పుష్ప జాలం హనుమకు వీడ్కోలు చెబుతున్నట్లు పూల వాన కురిపించాయి .పెద్ద చెట్లు విరిగి నేల వ్రాలాయి .

  గుహా౦తర్భాగం లో ఉన్న సింహాలు హనుమ పాద ఘట్టనం తో పీడింపబడి  భయంతో భీకరంగా అరవగా ఆ ధ్వని  ఆకాశాన్ని చీల్చుకొని అంతటా వినబడింది –

‘’ఆరురోహ గిరి శ్రేష్ట మరిస్ట మరిమర్దనః-తుంగ పద్మకజుస్టాభి ర్నీలాభి ర్వనరాజిభిః’’

‘’కందరాన్తరస్థానాంపీడితానాం మహౌజసాం-సిమ్హానాం –నినదో భీమో నభో భిన్దన్ స శుశ్రువే ‘’

  ఈ భయంకర ధ్వనులకు విద్యాధర స్త్రీలు భయంతో వస్త్రాలు జారి, చిందరవందరై ,ఆభరణాలు స్థానాలు తప్పి ,పర్వతం ఉంచి ఆకాశానికి ఎగిరాయి –

‘’స స్రస్తవ్యా విద్ధవసనా  వ్యాకులీకృత భూషణాః-విద్యాధర్యస్సముపాతాళానికి పేతుః  సహసా ధరణీధరాత్ ‘’

పెద్ద పెద్ద పాములు యెర్రని నాలుకలతో ,విషసర్పాలతలలు పర్వతం నుంచి పైకి ఎగిరిపోయాయి .కిన్నర విద్యాధర గందర్వ,యక్షులు తమ స్థానాలు కోల్పోయి గత్యంతరం లేక వాళ్ళూ ఆకాశం లో చేరారు .హనుమ త్రొక్కిడికి అరిష్టపర్వతం పాతాళానికి కుంగిపోయింది .-

స చ భూమిధరః శ్రీమాన్ బలినా తేన పీడితః – ‘’సవృక్ష శిఖరోదగ్రః ప్రవి వేశ రసాతలం ‘’

పదియోజనాల వెడల్పు ,ముప్ఫై యోజనాల ఎత్తు ఉన్న అరిష్ట పర్వతం అణగారి భూమితో సమానమైనది .

‘’దశయోజన విస్తార స్త్రి౦శద్యోజన ముచ్చ్రితః –ధరణ్యాం సమతాం యాతః స బభూవ ధరాధరః ‘’  తీవ్ర తరంగాలతో కొట్టబడిన తీర ప్రదేశం కల భయంకర సముద్రాన్ని అవలీలగా దాటటానికి బలవాన్ వీర్యవాన్ దీమాన్ హనుమాన్ ఒక్క సారిగా ఆకాశంలోకి ఎగిరాడు –

‘’స లిలంఘ యిషుర్భీమం సలిలం లవణార్ణవం-కల్లోలా స్ఫాల వేలాంత ముత్పపాత నభో హరిః’’

 ఇది 34శ్లోకాల 56 వ సర్గ

 ఇందులో హనుమ మళ్ళీ చివరిసారిగా సీతాదేవిని చూసి ,ఆమె దుఖాన్ని పోగొట్టే మాటలు చెప్పి ,రాముడు  ససైన్యంగా త్వరలో వస్తాడనే భరోసా ఇచ్చి ,సెలవు తీసుకొని తిరుగు ప్రయాణానికి బయల్దేరాడు .ఇప్పుడు అరిష్ట పర్వతం ఎక్కాడు ఆకాశం లోకి ఎగరటానికి .ఆయన  త్రోక్కుడికి’’ అరిస్టం’’ పాతాళానికి దిగిపోయింది .ఇక్కడ నాకు ఏమి అనిపించిందంటే అన్ని రూపాలలో ఉన్న అరిష్టం తొలగిపోయి, రాముడు రావటానికి’’ లైన్ క్లియర్ ‘’అయింది అని .సీత హనుమ పరాక్రమం ను మెచ్చి ,ఐతే సీత దుఖం రాముడు వచ్చి తీర్చాల్సిందే కాని, ,హనుమ చేయాల్సినపని కాదని స్పష్టం చేసింది .ఆయన త్వరగా వచ్చేట్లు నచ్చ చెప్పమని నొక్కి మరొక్కసారి చెప్పింది .కనుక ఆశావహంగా ఈ సర్గ ముగిసింది .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -20-6-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -8

ప్రపంచ దేశాల సారస్వతం

108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -8

మాధ్యూ ఆర్నాల్డ్ తనకాల సమకాలికుల  మానసిక వ్యధలను ‘’ది స్కాలర్ జిప్సీ ‘’’’థిర్సిస్’’,’’రగ్బీ చాపెల్ ‘’కావ్యాలలో గొప్పగాచిత్రించాడు .ఆయనరాసిన ‘’సోహ్రాబ్ అండ్ రుస్తుం ‘’’’మేరపి ‘’ట్రాజేడీలు చిరస్మరణీయాలు .సాహిత్య విమర్శకాగ్రేసరుడు ఆర్నాల్డ్ .కవిత్వ ప్రయోజనం ,సాహిత్య  విమర్శఅవసరాలగురించి ప్రయోజనాత్మక విలువైన వ్యాసాలూ రాశాడు .వర్డ్స్ వర్త్ మొదలైన కవుల కవితా శిల్పాన్ని ప్రామాణికంగా విశ్లేషించి రాశాడు .ఈకవికి అత్యంత ఆప్తుడైన ఆర్ధర్ యూక్లిఫ్ఫ్ రచనలలో అప్పటి విద్యావంతుల మనస్తత్వం ప్రతి ఫలిస్తుంది .

  అప్పుడే ఎడ్వర్డ్ ఫిట్స్ ఫిట్జెరాల్డ్ పార్శీభాషలోని ఉమర్ ఖయ్యాం రుబాయిత్ లను చేసిన స్వేచ్చానువాదం బహుళ జనాదరణ పొందింది .మతవిశ్వాసం తగ్గి ,భౌతిక వాదం పెరిగి తే వచ్చే అనర్ధాన్ని జేమ్స్ టాంసన్ కవి ‘’డూమ్ ఆఫ్ ఎ సిటి ‘’,’’ది సిటిఆఫ్ డ్రెడ్ఫుల్ నైట్ ‘’కావ్యాలలో చిత్రించాడు .నాటి వచనరచనా భీష్ములు కార్లైల్ ,రస్కిన్ ,న్యూమన్ ,మెకాలే .సమాజలోపాలను ఎత్తి చూపి ప్రజా దృష్టికి తెచ్చారు .ఆదర్శ సమాజ నిర్మాణానికి కార్లైల్ ,రస్కిన్ లు రచనలు చేశారు .కార్లైల్ రాసిన ‘’సార్టర్ రి పార్టర్’’,ఫ్రెంచ్ రివల్యూషన్ ,హీరోస్ అండ్ హీరో వర్షిప్ గ్రంథాలు విలువైనవి. రస్కిన్ రాసిన ‘’సేసెం అండ్ లిలీస్ ‘’అన్ టు ది లాస్ట్ ‘’క్రౌన్ ఆఫ్ వైల్డ్ ఆలివ్ ‘’గ్రంథాలు ప్రసిద్ధమైనవి .ఆదర్శ విశ్వ విద్యాలయ లక్షణాలను కార్డినల్ న్యూమాన్ ‘’ది ఐడియా ఆఫ్ ఎ యూని వర్సిటి ‘’లో అత్య౦త సమర్ధవంతంగా రాశాడు ..తేజోమయ కా౦తిమార్గంలోకిదారి చూపమని ఆయనరాసిన ‘’లీడ్ కై౦డ్లి  లైట్ ‘’అనే ప్రార్ధన విశ్వ విఖ్యాత గీతమైంది .జాన్ స్టువార్ట్ మిల్ తన స్వీయ చరిత్ర ,స్వాతంత్ర్యం గూర్చి రాసిన వ్యాసాలు ,మెకాలే రాసిన ‘’ఇగ్లీష్ దేశ చరిత్ర ‘’గొప్ప కరదీపికలు .చారిత్రకాలే అయినా  శైలీ  రమ్యతవలన సాహిత్య గౌరవం పొందాయి .

 ఆనాటి వచన రచనలో సామాజిక నవలారచయిటలలో శిఖరాయమానుడు చార్లెస్ డికెన్స్ .జీవళ తోరాణించే పాత్రలను ఆయన సృష్టించాడు .కరుణ హాస్యాలతో ,కథన శిల్పంతో వర్ణన నైపుణ్యంతో అనితర సాధ్య ప్రతిభ ప్రదర్శించి ‘’ఎ టెల్ ఆఫ్ టు సిటీస్ ‘’ఆలివర్ ట్విస్ట్ ,డేవిడ్ కాపర్ ఫీల్డ్, గ్రేట్ ఎక్స్ పెక్టేషన్స్ ,,పిక్విక్ పేపర్స్ ,నికలస్ నికల్ బి ‘’,మార్టిన్ చూజిల్ విట్ వంటి అత్యుత్తమ శ్రేణి నవలలు రాసి ప్రపంచ ప్రసిద్ధుడయ్యాడు .ఆనాటి అథోజగత్ సహోదరుల దీనహీన దయనీయ జీవితాలను కళ్ళకు కట్టినట్లు చిత్రింఛి పరిష్కారమార్గాలను సూచింఛి మార్గదర్శి అయ్యాడు .ఆంగ్ల నవలాకర్తలలో  డికెన్స్ కు మించిన వారులేరు లేరు లేరు అని ఎలుగెత్తి చాటారు ఆనాటి ప్రముఖ సాహితీ విమర్శక విశ్లేషక నవలా రచయితలైన స్టీఫెన్ లీ కాక్,సోమర్సెట్ మాం లు .

  డికెన్స్ సామాన్య అతి సామాన్యుల  గురించి రాస్తే ,అప్పటి ఉన్నత వర్గీయుల చిద్విలాస భోగాలను రచనలలో పొందు పరఛి అన్యాపదేశంగా వారిపోకడలను విమర్శించాడు  థాకరే.ఈయన నవలలో ‘’వానిటి ఫెయిర్ ‘’హెన్రి ఎస్మండ్ ,పెంఢెనిస్ ముఖ్యమైనవి .మేరీ ఇయాన్ ‘’జార్జ్ ఇలియట్ ‘’మారుపేరుతో ‘’యాడం బీడ్’’,ది మిల్ ఆన్ దిప్లాన్ ,సైలాస్ మార్నర్ ,మిడిల్ మార్చ్ నవాలలతో నైతిక సంఘర్ష ,విషాద భావోద్వేగం ,చిత్రించింది .జార్జ్ మెరెడిత్ సుకుమార హాస్య వ్య్నగ్యాలను పండిస్తూ ది  ఆర్డియల్ ఆఫ్ రిచర్డ్ ఫెవేరెల్ ‘’దిఈగోయిస్ట్ ‘’నవలలు రాశాడు .ఆకాలం లో అందరూ నవలా రచయితలే అనిపించి వేలాది నవలలు రాసి వదిలారు .విలియం విల్కీ కాలిన్స్ ,’’ది వుమన్ ఇన్ వైట్’’,రాస్తే ,షార్లెట్ బ్రాంటీ’’జేన్ ఐర్’’,ఎమిలీ బ్రా౦టీ’’విదరింగ్ హైట్స్ ‘,చార్లెస్ కిన్గ్స్లీ ‘’హె హెవర్డ్ దివేక్’’,యాంటోని ట్రల్లోప్’’బార్చెస్టర్ టవర్స్’’,చార్లెస్ రీడ్ ‘’ది క్లాయిస్టర్ అండ్ ది హార్త్ ,టామస్ హ్యూస్’’టాం బ్రౌన్స్ స్కూల్ డేస్’’’,బ్లాక్ మూర్ ‘’లార్నాడూన్’’,మిసెస్ గాస్కెల్’’క్రాన్ ఫర్డ్’’ముఖ్యమైనవి .వీరికి భిన్నంగా రాబర్ట్ లూయీ స్టీ వెన్సన్ వాస్తవ చిత్రణకాకుండా కల్పనా కథలతో ‘’ట్రెజర్ ఐలాండ్ ‘’డాక్టర్ జెకిల్ అండ్ మిస్టర్ హైడ్ వంటి స్ప్లిట్ పర్సనాలిటి గలపాత్రతో వినోద నవలలు రాశాడు .ప్రసన్న మాదుర్యం భావ గాంభీర్యంతో ఎన్నో వ్యాసాలుకూడా రాశాడు స్టీవెన్సన్ .

  కళలకు ఇయ్యాల్సిన ప్రాముఖ్యాన్ని గురించిరస్కిన్ చేసిన పరిశోధన ఫలితంగా ‘’ప్రీ రాఫెలైట్’’  సాహిత్యోద్యమం వచ్చి హోల్మన్ హంట్ ,మిల్లియాట్ ,డిజి రోసెట్టీ అనే యువ చిత్రకారులు సారధ్యం వహించి నవజీవనానికి సౌందర్యమే సాధనం అనీ ,సౌందర్యం ఉన్న కళలేసమాజ వికాసానికి తోడ్పడుతాయని ప్రచారం చేశారు .వీరిలో రాసేట్టీ ,విలియం మారిస్ ,స్విన్ బర్న్ కవులు ముఖ్యులు .రహస్యవాదం పై మోజు సింబాలిజం  ,రస స్పోరక శబ్ద చిత్రాలు -ఇమేజరీ కల్పనా వీరికావ్యాలలో పుష్కలం .రోసేట్టే రాసిన ‘’ది బ్లెస్సెడ్ డా మొజల్ ,ఖండకావ్యం ,మారిస్ రాసిన ‘’ది ఎర్ది పారడైజ్’’,కాల్పనిక కథాకావ్యం ,స్విన్ బర్న్స్ ‘’అటలాంటా ఇన్ కాలిడన్’’,రూపకం రసవంతమైనవి .రోసేట్టీ సోదరి క్రిస్టినా రోసేట్టీ ‘’మై హార్ట్ ఈజ్ లైక్ ఎ సింగింగ్ బర్డ్ ‘’వంటి భావగీతాలు రాసింది .కోవెంట్రి పాట్మోర్ ‘’దిఏంజెల్ ఇన్ ది హౌస్ ‘’అనే రమణీయ కావ్యం రాశాడు .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -20-6-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

‘’బక దాల్భ్యుడు ‘’ఇంగ్లీస్ లో రాసిన రచయిత Petteri Koskikallio పరిచయం

‘’బక దాల్భ్యుడు ‘’ఇంగ్లీస్ లో రాసిన రచయిత Petteri Koskikallio పరిచయం

1962లో Petteri Koskikallio ఫిన్ లాండ్ దేశం ‘’ హెల్సెంకి ‘’లో పుట్టాడు .1971లో మొదటి సారి ఇండియా వచ్చాడు .2013 జులై 13నుంచి 18వరకు హేల్సెంకిలో జరిగిన 12వ ‘’ప్రపంచ సంస్కృత సమ్మేళనం’’ కు కార్యదర్శిగా పని చేశాడు .తాను  రాసిన పుస్తకాలు రిసెర్చ్ పేపర్లూ అన్నీ ప్రచురించాడు .1979లో ASKO PORPOLA తో కలిసి కేరళ ,తమిళనాడు ,కర్నాటక లోని గ్రామాలను సందర్శించి కావాల్సిన సమాచారం అంతా సంపాదించుకొన్నాడు .భారతీయ పురాణాలపై తన అభిప్రాయాన్ని’’ From Classical to Postclassical:

Changing Ideologies and Changing Epics in India  గా

“నా స్వంత పనిలో ప్రధాన ఇతివృత్తం కర్మ మరియు కర్మ ఆలోచన. భారతీయ సాహిత్యం ద్వారా ఫిల్టర్ చేసిన త్యాగం గురించి నేను వేర్వేరు ఆలోచనలను పరిశోధించాను. ఈ విధంగా, నేను వేద పూర్వ ఆలోచనల నుండి వేద కర్మవాదం యొక్క బలి అర్పణ వ్యవస్థకు మరియు మునుపటి కర్మ విధానం (కోస్కికల్లియో 1993) గురించి వేదానంతర ఆలోచనలకు దీర్ఘకాలిక కర్మ మార్పును అనుసరించాను. శాస్త్రీయ వేద కర్మవాదానికి సంబంధించి “పోస్ట్‌క్లాసికల్” అనే విస్తృత పదం కింద నేను పురాణాలను గ్రంథాల కార్పస్‌గా ఉపయోగించాను.”

ఒకే ఇతిహాసం యొక్క విశ్లేషణాత్మక అధ్యయనం నేపథ్యంలోకి నెట్టివేయబడినప్పటికీ, వివిధ పురాణ గ్రంథాల అధ్యయనం ఇండాలజీలో పుంజుకుంది. కాబట్టి, ఇండోలాజికల్ మరియు జానపద పరిశోధనలు ఇటీవల ఒకదానికొకటి ప్రభావవంతంగా ప్రభావితమయ్యాయని మేము చెప్పగలం. వివిధ స్థాయిల నుండి పురాణ పదార్థాలను ఉపయోగించడం ద్వారా ఒక ప్రశ్నను అధ్యయనం చేసే పద్ధతి (శాస్త్రీయ వచనం, దాని విభిన్న పున ell ప్రచురణలు, పురాణ ఇతివృత్తాలపై కూర్చిన సాహిత్య సంస్కరణలు, స్థానిక గ్రంథాలు, మౌఖిక పదార్థాలు) ప్రవేశపెట్టబడ్డాయి మరియు మరింత విస్తృతంగా వర్తింపజేయబడ్డాయి. ఒక ఉదాహరణ ఏమిటంటే, మెకిమ్ మారియట్ మరియు జాన్ లెవిట్ “దక్షిణ ఆసియాలో సంప్రదాయ చరిత్రను వివరించడానికి ద్రవ రూపకం” అని పిలుస్తారు (లీవిట్ 1991: 444-45 చూడండి). అంటే వివిధ వర్గాల (స్థిర వచనం మరియు జానపద వచనం) మధ్య నిరంతర పరస్పర మార్పిడి పరిగణనలోకి తీసుకోబడింది. ఈ పదం వెనుక భారతీయ కథల సేకరణల యొక్క “మహాసముద్ర” పరిభాష కూడా ఉంది

146 పేటేరి కోస్కిల్లియో ఉదాహరణ కాథ్ సరిట్స్ గారా = “ఓషన్ ఆఫ్ స్ట్రీమ్స్ ఆఫ్ స్టోరీ”). పురాణాల యొక్క ఈ సమగ్ర దృక్పథంతో పాటు, ఒక ఇతిహాసం యొక్క సంస్కృత సంస్కరణల ప్రాధాన్యత కూడా ప్రశ్నించబడుతుంది. ఎ. కె. రామానుజన్ చెప్పినట్లుగా, “ఏ హిందువుడూ మహభారతను మొదటిసారి చదవలేదు. అతను దానిని చదివినప్పుడు, అతను సాధారణంగా దీనిని సంస్కృతంలో చదవడు ”(1991: 419).

ఈ book ఐడియాలజీలను మార్చడం మరియు ఎపిక్స్ మార్చడం 145
ఏదేమైనా, శాస్త్రీయ మరియు పోస్ట్-క్లాసికల్ భావనలు మొత్తం భారతీయ ఇతిహాసాలకు వర్తింపజేయబడ్డాయి-వాస్తవానికి అలాంటి మొత్తం ఉంటే. ఈ విధంగా, నేను రెండు గొప్ప పురాణాల (క్లాసికల్) మరియు తరువాత గ్రంథాల యొక్క సమ్మేళనాన్ని ఒకదానికొకటి పురాణ కథాంశాన్ని (పోస్ట్-క్లాసికల్) ఉపయోగించి వేరు చేసాను. ఈ శాస్త్రీయ అనంతర సాహిత్య రచనలు ఒక ఇతిహాసం యొక్క కొన్ని భాగాలను వివరించవచ్చు లేదా మొత్తం ఇతిహాసాన్ని తిరిగి చెప్పగలవు, మహ భ రాత మరియు Ramnyaa a. కొన్నిసార్లు క్లాసికల్ అనంతర పురాణ గ్రంథాలు ప్రాచీన పురాణ సంప్రదాయంలో మరొక శాఖగా చెప్పుకుంటాయి. శాస్త్రీయ మరియు పోస్ట్-క్లాసికల్ పురాణ గ్రంథాల మధ్య వ్యత్యాసం కేవలం సాహిత్య కూర్పు లేదా నిర్మాణ సూత్రాల విషయం మాత్రమే కాదు, భావజాలం యొక్క విషయం అని గుర్తుంచుకోవడం విలువ.

భక్తి మతంతో పాటు, పురాణ సంప్రదాయాన్ని వారి స్వంత అభిప్రాయాలను ప్రచారం చేయడానికి ఉపయోగించిన ఇతర భావజాలాలు కూడా ఉన్నాయి. వీటికి ఒక ఉదాహరణ జైన మతం. భారతీయ చరిత్రలో, జైనలు తమ సొంత సిద్ధాంత రంగానికి లోపల లేదా వెలుపల సాహిత్య సంప్రదాయాన్ని పరిరక్షించడంలో చాలా శక్తిని కేటాయించారు. భారతీయ కథా సాహిత్యం యొక్క చాలా మంది కంపైలర్లు జైనులు. ముఖ్యంగా మధ్య యుగాలలో జైన మతం బాగా ప్రాచుర్యం పొందింది మరియు వివిధ రాజ వంశాలు కూడా దక్షిణ మరియు పశ్చిమ భారతదేశంలో జైన సంస్కృతిని పోషించాయి. అదే సమయంలో పి అవాస్ మరియు కె ఎ గురించి కథల యొక్క ప్రజాదరణ వారి ఎత్తులో ఉంది. పర్యవసానంగా, మహ భరత యొక్క హీరోలు మరియు దాని అనుబంధ హరివా a జైన మత సాహిత్యానికి కూడా అనుగుణంగా ఉన్నారు, మరియు అనేక జైన-భ రాతాలు, జైన-హరివా, మరియు జైన-ఆర్ ఎం యా ఉనికిలోకి వచ్చారు 5 ఇవి సాధారణంగా ఒక రచయిత రచనలు మరియు అవి సంస్కృతంలో, ప్రాకృత భాషలలో లేదా స్థానిక భాషలలో వ్రాయబడతాయి. జైన ఇతిహాసాలలో ముఖ్యమైనది జినసేన యొక్క హరివా అపూర్. ఈ “ముఖ్యమైన జైన మహ్ భ రాత” ​​మళ్ళీ శాస్త్రీయ మహ భ రాత నుండి గణనీయంగా తప్పుతుంది. హరివా అపుర్ పి ఇవా కథను ఇరవై రెండవ సార్వత్రిక ఉపాధ్యాయుడి జీవిత చరిత్రతో కలుపుతుంది (తీర్థంకరు ) జైన మతం యొక్క, దీనిని నేమి లేదా అరి అనీమి అని పిలుస్తారు. ఈ పని K యొక్క జీవితంపై కూడా కేంద్రీకరిస్తుంది, కానీ జైమినిబ్ రాటా మరియు కొంతవరకు మహ్ భ రాతలా కాకుండా, ఇది అతన్ని ఒక పరమ దేవుడిగా చూపించదు. K యొక్క పాత్ర యువరాజు మరియు యుద్ధ వీరుడి పాత్ర; అతను గౌరవప్రదమైన వ్యక్తి కాని జైన ఆదర్శానికి అనుగుణంగా ఉన్న వ్యక్తి కాదు. వచనంలో జైనవాద భావజాలాన్ని వివరించే అదనపు లక్షణాలు, ఇతరత్రా, తీవ్రమైన తపస్సు తరువాత పి అవాస్ సాధించిన తుది మోక్షం (మోక్ ఎ) మరియు దాని ప్రకారం K యొక్క సోదరుడు బాలార్ మా జైన సన్యాసి అయ్యారు.

నా చివరి ఉదాహరణ ఉదాహరణలు మరింత ప్రాంతీయ స్థాయి నుండి. భారతదేశం అంతటా పోస్ట్‌పిక్ రీటెల్లింగ్‌లను కనుగొనవచ్చు, కాని పురాణ సంప్రదాయం మరియు విభిన్న భావజాలాల మధ్య సంబంధాలను అధ్యయనం చేసినప్పుడు, అత్యంత ఆసక్తికరమైన ప్రాంతాలలో ఒకటి నైరుతి భారతదేశంలోని కర్ణాటక. కన్నడ సాహిత్యంలో గొప్ప సైద్ధాంతిక సాంప్రదాయం ఉంది, ఇందులో వివిధ సైద్ధాంతిక ధోరణులు ప్రాతినిధ్యం వహిస్తాయి. ఉదాహరణకు, తమిళ సంస్కృతి వలె కాకుండా, కన్నడకు దేశీయ ఇతిహాసాలు లేవు. అందువల్ల కన్నడ సాహిత్యం యొక్క ముఖ్య లక్షణం “ప్రభావాలను ఏకీకృతం చేసే సామర్థ్యం” (ఐతాల్ 1987: 1). కన్నడలో పురాణాల యొక్క భక్తి-ఆధారిత మరియు జైనిస్ట్ వెర్షన్లను మనం కనుగొనవచ్చు, కాని ఇతర రకాల ఉద్ఘాటనలు కూడా ఉన్నాయి. కన్నడలో Jaiminibh మండలాల నుండి చేకూరుస్తారు యొక్క ప్రారంభ మరియు అత్యంత ముఖ్యమైన స్థానిక సంస్కరణ Lak m ద్వారా రాయబడింది
a (పదమూడవ శతాబ్దం). సుమిత్రా బాయి మరియు జైడెన్‌బోస్ 1991 లో వివరాలను చూడండి.
ఐడియాలజీలను మార్చడం మరియు ఎపిక్స్ మార్చడం 151
మహ్ భరతం ఆధారంగా మరియు క్రి అభక్తి ఆధిపత్యం కలిగిన మరో కన్నడ రచన పదిహేనవ శతాబ్దపు కర్ అటా-భ రత-కథమాజార్ లేదా కన్న
కుం రావి సా (ములగి 1990; రావు 1990) చేత అభ రాత. కన్నడలోని మహభారత మొత్తాన్ని మొదటిగా తిరిగి చెప్పడం జైన కవి పంపా (పదవ శతాబ్దం) యొక్క విక్రమ్ రునావిజయం లేదా పంపాబ్ రాటా. ఎస్ హసబ్ మావిజయం లేదా గాడ్ యుద్ధ అనే ఆసక్తికరమైన కన్నడ వచనం కూడా అదే శతాబ్దానికి చెందినది. రన్న రాసిన మహ భ రాత యొక్క ఈ చివరి వెర్షన్, భీక మా, భీకర పోరాట యోధుడు, ఐదు పి.అవాస్ మరియు అతని బొమ్మపై దృష్టి కేంద్రీకరిస్తుంది. 6 ముగింపులో, భారతీయ ఇతిహాసాలు మరియు భావజాల స్పెక్ట్రం మధ్య సంబంధంలో అధ్యయనం చేయవలసినవి చాలా ఉన్నాయని మేము చెప్పగలం. ఈ విషయం చాలా వైవిధ్యమైనది, ఎందుకంటే విస్తృతమైన గ్రంథాల సేకరణ-నోటి పదార్థం మాత్రమే. రెండు ఇతిహాసాల యొక్క శాస్త్రీయ సంస్కరణల్లో కూడా చాలా భిన్నమైన ఆలోచనలు ఉన్నాయి, కాని పోస్ట్‌క్లాసికల్ సాహిత్యానికి మన ఆసక్తిని విస్తరించినప్పుడు, ఇటువంటి వైరుధ్యాలు గుణించాలి. విభిన్న భావజాలం కొరకు ఇతిహాస కథ యొక్క నైపుణ్యం కలిగిన “వినియోగం” ను అర్థం చేసుకోవడానికి మరియు విశ్లేషించడానికి ఒక మార్గం వివిధ పాత్రలలో మరియు వారి సంబంధాలపై వేర్వేరు రీటెల్లింగ్‌లలో దృష్టి పెట్టడం. ఈ విధానం వెనుక ఉన్న తర్కం భావజాలం మోసేవారిలో పురాణ వీరుల పాత్ర. మహ భరత యొక్క అక్షరాలు కూడా “ఏకవచనం కాదు, ప్రతినిధి, ఒక రకమైన టోకెన్లు” (రామానుజన్ 1991: 427). వాస్తవానికి, టోకెన్లు మరియు భావజాలాల నాటకానికి ఇతిహాసాలు మరియు సాహిత్యాన్ని తగ్గించడం ప్రమాదకరమైనదిగా భావించవచ్చు. కథల యొక్క వ్యక్తీకరణ పలుచబడిందని మరియు దాని యొక్క చాలా సూక్ష్మ నైపుణ్యాలను కోల్పోతుందని కూడా దీని అర్థం. ఏదేమైనా, భారతీయ ఇతిహాసాల యొక్క విస్తారమైన పరిధిలో ఈ విధానానికి కూడా అవకాశం ఉంది.

 

Petteri Koskikallio రాసి ప్రచురించాడు .

ఇంతకంటే అతని గురించి వివరాలు తెలియలేదు .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -20-6-20

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | 1 Comment

బక దాల్భ్యుడు -21(చివరిభాగం )

బక దాల్భ్యుడు -21(చివరిభాగం )

కర్మ జ్ఞానాలమధ్య సందిగ్ధత జైమినేయ ఆశ్వమేదంలో బకదాల్భ్యడు యాగకర్మి గా,మధ్యవర్తి గా  కనిపిస్తాడు .ఇక్కడ ఈ విషయంకాక మూడోమార్గం భక్తిని ప్రవచించాడు .వటపత్రశాయి ఉదంతంలో అసలైన సత్యాన్ని బకుడికి బోధించాడు .కేశిధ్వజుడు రెండుమార్గాలనూ అనుసరిస్తే ,ఖాన్డికుడు కర్మనే ఎంచుకొన్నాడు .అంతిమ సత్యానికి రెండూ వేరు దార్లు అయినా రెండిటినీ కలిపితేనే సాధ్యం అని మనకు తెలుస్తోంది .

    ముగింపు

వేదసాహిత్యం ,వేదానంతర సాహిత్యాలలో  సామాన్య వ్యక్తులకు కూడా లబ్ధ ప్రతిష్టులైనవారితో సమాన ప్రాతినిధ్యం ఇచ్చినట్లు కనిపిస్తోంది .బకదాల్భ్యుడు వేదాకాలనికిముండదు వేదకాలం లోనూ వేదాన౦తర కాలంలోనూ సనాతనభావాలను అనుసరిస్తూనే ఉన్నాడు .ఋగ్వేదంలోని ఆకాశ గమన కేశిగా  ,సత్రయాగిగా  ,వ్రాత్యకర్మయోగిగా ,పవిత్ర సన్యాసిగా ,పేరుపొందిన పక్షిగా ,తీవ్రస్వభావి అయిన దైవాంశ సంభూతుడుగా ,భయంకర పక్షి రాక్షసుడుగా ,పురాణకాలం లో తీర్దాలు సందర్శించి వాటి ప్రభావాలు వివరించే వాడుగా ,బ్రాహణులలో బ్రాహ్మీమూర్తిగా సర్వం తెలిసినవాడుగా ,సంప్రదాయ బోధకుడుగా బహురూపాలలో  కనిపిస్తున్నాడు .

  వేదకర్మకాండ గ్రంథాలలో పితృ వంశ నామధేయుడిగా దాల్భ్యుడు కనిపిస్తాడు .అయినా వేదదాల్భ్యుడు (బక,కేశి ,చైకితాన్య )మిడిమిడి జ్ఞానంతో ,కర్మకాండ తెలిసిన వాడుగా  ప్రత్యర్ధితో వైరంతో శాపాలిచ్చేవాడుగా ,అందులో కురు పాంచాలుర మధ్య పోటీదారుగా కనిపిస్తాడు.బకాదాల్భ్యలేక గ్లవ మైత్రేయ ,చైకితానేయ లేక చైకితాన్య దాల్భ్యుడు సామవేద ఉద్గాతలలో కనిపిస్తాడు  .కానీ కేశి దాల్భ్యుడు యాగలేక యజ్ఞ యజమాని ఐన క్షత్రియుడుగా కనిపిస్తాడు  అనేక దాల్భ్య వృత్తాంతాలలో తరచుగా కర్మిస్టి గా సత్రయాగ లేక వ్రాత్య బృందాలలో కనిపిస్తాడు .వేదసాహిత్యంలో కేశి దాల్భ్యుడికి ప్రత్యేక పాత్ర ఉన్నది.వేదానంతర సాహిత్యంలో ఇలాంటి ప్రాముఖ్యత ఆయనకు ఎక్కడా లేదు .అయినా ఆయనకు బకాదాల్భ్య వంటి విడదీయరాని సంక్లిష్ట నేపధ్యం ఉన్నట్లు కనిపిస్తుంది .అసురకేశి చావు రెండుగా చీల్చబడటం తో జరుగుతుంది .ఏ దోషం లేని కేశిదాల్భ్యుడు అనేక పురాణాలలో కనిపిస్తాడు .

  ఋగ్వేదంలోని ఎగిరే కేశి ,దాల్భ్యుడు ,వ్రాత్యకర్మలతో లింకున్న వేదానంతర పాత్ర.జైమినేయ అశ్వమేధం లోని బకదాల్భ్యుడు ,ఋగ్వేద కేశిమూలాలున్నవాడు అనిపిస్తాడు .ఆకాశగమన దాల్భ్యుడు ఋగ్వేదంలోని  కర్మకాండ రహస్యాలు తెలిసిన గ౦ధర్వ ,అప్సరసలతో  సంబంధమున్నవాడు .జాతక కథలలో రోషావేశమున్న దైవాంశ కల బకుడుగా అనేక పక్షిజాతుల నాయకుడుగా జైమినేయ అశ్వమేధ౦లొని బకదాల్భ్యుడుగా కన్పిస్తాడు.దాల్భ్యుడి అతీత శక్తులకు నేపధ్యం బక,కేశి లు రాక్షసగణాలుగా, అసురులుగా మారటమే .ఈపతనం అంతా భయంకరాకారం కల బెగ్గురు పక్షుల అంటే బకలేక కారిక ద్వారా వచ్చిందే .ఇక్కడే బకుడికీ, యమ అవతారానికి సంబంధం కలిగింది .కేశి పదం లో అంతరార్ధం దీర్ఘ కేశాలున్నవాడే అనికాకుండా ,కర్మిస్టి భూత పిశాచ భేతాళ రూపలున్నవాడు అనికూడా .ఇతిహాస ,పురాణాలలో రాక్షస బకునికి సోదరులు ,బంధుగణం ఉన్నట్లు చెప్పబడింది .బక గణం అనేది ప్రపంచం చుట్టూ తిరిగే దుస్టాత్మలకు,సమూహంగా జీవించే సామాన్య పక్షిజాలానికి మధ్య   సమీకరణం  వంటిది  .బాగా సమీక్షిస్తే బకం  అనే భావన , వేదం కాలానంతర  బకదాల్భ్యుడు- వేద  బకదాల్భ్యుని చక్రభ్రమణమే(రీ సైక్లింగ్) .వేదానంతర బక దాల్భ్యుడు అనేక కొంగ లక్షణాలకలగా పులగమైన (కాన్ గ్లొమేరేషన్)ఉన్న ఎగిరే శక్తికల పితృవంశ పేరున్న దాల్భ్యుడే  ఇదికాక కొంగకున్న అవలక్షణాలైన విశ్వాస ఘాతుకం కపటం ,దొంగజపం ముసలి తనం ఉన్నవాడే .ఒక్కోసారి పక్షిరూపం లో రూక్ష దైవీ భూత శక్తితో సర్వజ్ఞుడైన పక్షిరాజుగా ,ఎగిరే శక్తిఉన్న శివుని అవతార అంశగాకనిపిస్తాడు .కర్మిస్టులైన వ్రాత్యులయెడ, వేద బ్రాహ్మణుల వైఖరికి  ధ్యానబకం  ప్రతీక .బక అంటే బ్రాహ్మణుల వ్యంగ్య చిత్రం (కారి కేచర్ ).బకం అంటే అణచబడిన బ్రాహ్మణుల భయం ,కోపం ,దూకుడు శత్రుత్వాల ప్రతిబింబమే సామూహికంగా ,వ్యక్తిగతంగా .

   ఈ 21 ఎపిసోడ్ ల ధారావాహికం ‘’బకాదాల్భ్యుడు ‘’కు ఆధారం – SOCIATES ORIENTALIS FENNICA –HELSINKI-1999లో  ప్రచురించిన ’STUDIA ORENTALIA’’-85 VOLUME .లో ‘’ BAKA DÄLBHYA: A COMPLEX CHARACTER

IN VEDIC RITUAL TEXTS, EPICS AND PURÄlyAs

రచయిత -Petteri Koskikallio

ఈ రచయితకు ప్రేరణ – సంజసేన్ నాస్టాల్జియా కవిత –

[Or I wish I we¡e a minor character

in an age-old myth

flitting about the background,

unexplained, once or twicel

అందుకే ఇంతకష్టపడి ఇష్టపడి ఇంతపరిశోధన ,పరిశీలన ,తులనాత్మక అధ్యయనం చేసి వెన్నముద్ద తీసి చేతిలో పెట్టినట్లు పెట్టాడు బకాదాల్భ్యుని గురించి అతని ఓపిక శ్రమ అన్వేషణ ,తపన కు జేజేలు .ఇతని ఇతర పుస్తకాలు –వేదిక్ ఇన్వెస్టి గేషన్స్,లాజిక్ ఇన్ ఎర్లియర్ క్లాసికల్  ఇండియా,ఆరిజిన్ అండ్ గ్రోత్ ఆఫ్  దిపురానిక్  టెక్స్ట్ కార్పస్ ,స్క్రిప్ట్ అండ్ ఇమేజ్ ,జైనా స్టడీస్ .-మొదలైనవి .

 మహాభక్తుల పైశ్లోకం జ్ఞాపకం వచ్చి అందులో దాల్భ్య పేరు చూసి ఆయనెవరో తెలుసుకోవాలని అన్వేషించిన నాకు కొంత సమాచారం దొరికి ‘’ఎవరీ దాల్భ్యుడు ?’’వ్యాసం రాశాను .మా అబ్బాయి శర్మ నా తపన గ్రహించి పై పుస్తకాన్ని లింక్ ద్వారా పంపాడు .మొదలు పెట్టి చదువుతుంటే ఎన్నో ఆసక్తికర విశేషాలు గోచరించి వెంటనే ‘’బక దాల్భ్యుడు’శీర్షికతో 27-5-20న ప్రార౦భించి ఇవాళ 19-6-20న చివరి ఎపిసోడ్ 21తో ముగిస్తున్నాను .ఏ దేశం కన్న బిడ్డో ఆ రచయిత మన వేద ఉపనిషత్ ఇతిహాస పురానణాలపై సాదికారాధ్యయనం చేసి అమూల్య విషయాలు అందించాడు .అతడు ఏ దేశంవాడో నెట్ లో వెతికితే నాకు దొరకలా .దొరికాక అతిని గురించి రాసి ఋణం తీర్చుకొంటాను .ఇంతదాకా నాతో మీరూ బకంగా ఎగురుతూ ఆస్వాది౦చి నందుకు ధన్యవాదాలు .

  సమాప్తి

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -19-6-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | 1 Comment

బక దాల్భ్యుడు -20

బక దాల్భ్యుడు -20

మత్చ్య పురాణం 24.22.-27,పద్మపురాణం 12.65-69 ల ప్రకారం కేశి ని పురూరవుడు కొట్టాడు .ఒకప్పుడు వాడు చిత్రలేఖ ,ఊర్వశి లను  ఎత్తుకు పోతుంటే ,ఇంద్రుని దర్శనానికి వెడుతున్నపురూరవుడు చూసి వాడితో యుద్ధం చేస్తే వాడు ఓడిపోయి వాయవ్యాస్త్రంతో పారిపోయాడు  –‘’వినిర్జి ‘’ .పురూరవుడు ఊర్వశిని ఇంద్రునికి అప్పగించి అభిమానం సంపాదించగా  12.69 ఇంద్రుడు ఊర్వశిని పురూరవుడికి ఇచ్చేశాడు .చిత్రలేఖ గతి ఏమైందో మాత్రం చెప్పలేదు .కంసుడి రాక్షసముఠా లో కేశి కూడా ఉన్నాడు .కంసుడు వీడిన కృష్ణబలరాములను చంపటానికి అశ్వరూపంలో పంపితే  వాడు నోరు తెరిచి మీదపడబోతే బెదరని కన్నయ్య బృందావనం లో వాడి నోట్లో ఎడమ చెయ్యి పెట్టి ,వాడి దంతాలు పగలకొట్టి లోపలి దూరి చీల్చగా వాడు ఏమీ చేయలేక చెమటలు కక్కుకొని ,చొంగ కార్చి ,కక్కుకొని ,ఉచ్చపోసుకొని ఊపిరాడక ఉంటె చేతులు మరీ పెంచి బాలకృష్ణుడు వాడిని  చంపాడు .భాగవతం లో కేశి అనిమాత్రమే ఉంటె ,బ్రహ్మ పురాణంలో వాజీ ,దైత్యవాజీ,దుస్ట  వాజి అనీ  ,హరివంశం లో  దైత్య ,కేశి తురగ దానవ ,దుస్టో స్వో వనగోచరః ,హయాధమః ,కేశి తురగ సత్తమ అని ఉన్నది .హరివంశ కేశి దుస్టరాక్షసుడు, మానవ మాంసాహారి,కోపమొస్తే యుద్ధానికి పెద్దపెద్ద చెట్లు పీకేస్తాడు  .చివరికి ఓడిపోయి నేలపైబడి రెండుగా చీల్చబడి ప్రాణాలు పోగొట్టుకొంటాడు .భాగవతంలో వాడిని రెండుగాచీల్చినట్లు లేదు .

   రాక్షసంహారంలో సాధారణంగా రెండుగా చీల్చటం ఒక క్రీడ.భీముడు బకాసురవధలో ,,కృష్ణుడు బకాసుర సంహారంలో రెండుగా చీల్చే చంపారు .దాల్భ్యాసుర ,బక,కేశి ఉదంతాలు సమా౦తరాలు .కృష్ణుడు బకుడిని తురగాసురుడిని చంపినపుడు వాళ్ళిద్దరూ నోళ్ళు పెద్దగా తెరచి ,శరీరం రెండు సగాలై చచ్చారు .ఊర్వశి చిత్రలేఖ కేశి ఉదంతంలో ఊర్వశి మంచి వైపుకు అంటే దేవతలా వైపుకు ,,చిత్రలేఖ చెడు అంటే కేశి దైత్యుని వైపుకు మొగ్గారు  .ఇంద్రుడు కేశి అసురుడువేసిన గదను ,పర్వతశిఖరాన్నీ రెండుగా చీల్చాడు .కాని కేశి చావలేదు పారిపోయాడు .గుర్రం రూపంలో వచ్చిన వీడినే కృష్ణుడు రెండుగాచీల్చి చంపాడు .

  విష్ణు పురాణం లో ఖా౦డిక్య, కేశిధ్వజ రాజ సోదరుల వృత్తాంతం  ఉన్నది .ఖా౦డిక్యుడు కర్మ మార్గావలంబి .కేశి అడవికి వెళ్లి జ్ఞానసముపార్జన చేసి మృత్యు సముద్రం దాటాలనుకొని యాగం చేస్తుంటే ఒకపులివచ్చి యాగ ధేనువును చంపేసింది .దీనికి ప్రాయశ్చిత్తం ఎవరికీ తోచక ,కసేరునుతర్వాత సునకుని కలిస్తే దీనిగురించి చెప్పగలిగేవాడు ఖా౦డిక్యుడు మాత్రమె అంటే గుర్రమెక్కి అతన్ని కలవాలని వెడితే  అతడుతనపైకి దాడికి వస్తున్నాడేమో అనుకొనగా ,కాదని నచ్చచెప్పగా అతడు తన మంత్రుల అభిప్రాయం అడిగితె వాళ్ళు అతడిసోదరుని చంపి రాజ్యభాగం పొందమని సలహా ఇచ్చారు .అతడికి ఈలోకం జయించాలా పరలోకాన్నా అనే సందిగ్ధం ఏర్పడి ,ఉత్తమలోక ప్రాప్తినే కోరుకొని సోదరుడికి ప్రాయశ్చిత్త విధానం సాకల్యంగా తెలియజేసి ,యాగం పూర్తి చేయించాడు .కేశికి పరలోక ప్రాప్తి పోయి ఇహలోక ప్రాప్తి దక్కింది .

  మరో సారి మళ్ళీ వీళ్ళిద్దరూ కలిశారు .తనయాగం నిర్విఘ్నంగా కొనసాగేట్లు చేసిన సోదరుడికి కేశి  గురు దక్షిణ ఇవ్వాలని భావించి ఏమివ్వమంటావు అనిఅడిగితే ,రాజ్యంకోరకుండా ఖా౦డిక్యుడు’’క్లేశం నుంచి విముక్తి చెందే మార్గం ‘’బోధించమనికోరాడు –‘’క్లేశప్రషామయాలం యత్ కర్మా ‘’ .రాజ్యం కోరనందుకు అమితాశ్చర్యం పొంది,ఖాండి ‘’అవిద్య  స్వరూపం  ‘’బోధించాడు –‘’అవిద్యాః స్వరూపం ‘’. ‘’ఖాన్డిక్య కేశిధ్వజ సంవాదం ‘’పేరుతోకృష్ణ దేవరాయలు’’ ఆమక్తమాల్యద ‘’ప్రబంధంలో అద్భుతంగా చిత్రించాడు .మిగిలినవిషయాలు తర్వాత .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-6-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బక దాల్భ్యుడు -19

బక దాల్భ్యుడు -19

      ఆది

మార్కండేయ పురాణం -9లో  ,దేవీ భాగవతం -6.12-13లో ‘’ఆదిబక ‘’ప్రస్తావన ఉన్నది .రాజా హరిశ్చంద్రుడు తన పురోహితుడు వసిష్ట మహర్షి ఆధ్వర్యం లో చేసిన యాగం లో విశ్వామిత్రుడు వచ్చి విఘ్నం చేయబోతే వసిష్టుడు ‘’బకం’’గా పుట్టమని  శాపమిస్తే ఆయన ఈయన్ను ‘’ఆది’’గా పుట్టమని శపించాడు .వీరిద్దరూ మహా బకాలుగా మారి మహాభయంకరంగా  ఆకాశయుద్ధం చేస్తే ,బ్రహ్మవచ్చి శాంతపరచితే ,అప్పటినుంచి ఇద్దరు ఋషులు మిత్రులయ్యారు .భాగవతంలో ఆదిబకవృత్తాంతంలో  వశిష్టుడు బ్రాహ్మణుడు అయితే ,విశ్వామిత్రుడు క్షత్రియుడు బక రూపం పొందాడు .కేశి దాల్భ్యుడు ఇక్కడ గుర్తుకొస్తాడు .మార్కండేయపురాణ౦  లో వసిస్ట మహర్షి విశ్వామిత్రుని నీచదుర్మార్గ  బ్రాహ్మణుడిగా సంబోధిస్తాడు-9.9-‘’దురాత్మా బ్రహ్మద్విస్’’.దేవీ భాగవతం లో విశ్వామిత్రుడు ఎందుకు బకం గా మారాడో వివరంగా ఉన్నది -6.1332-.హరిశ్చద్ర మహారాజుదగ్గరకు ముసలి బ్రాహ్మణ వేషంలో వెడితే ‘’వృద్ధ బ్రాహ్మణ వేషేణ’’.వశిష్టుడు గుర్తించి ,ఆయన ప్రవర్తన బకధర్మం లాగా ఉందని ’’బకధర్మా  బకాద్యాన పరా ‘’ అని తిట్టి  శపించాడు .

  విశ్వామిత్ర బకుడికి ఆజన్మవిరోది ఆది అనే వసిస్టబకం.వసిస్టుడు బ్రాహ్మణుడే అయినా సద్బ్రాహ్మణుడు కాదు అని దేవీభాగవతం 6.12.25 లో ఉంది .గంగాతీరంలో ఉన్నంతమాత్రాన రుషులలో దివ్యత్వం పొందటంలో అసూయా ద్వేషాలు పోలేదని అన్నది .

  అశ్వఘోషుడు బుద్ధ చరిత్రకావ్యం లో ఎలి లేక అలి ,పక ల మధ్య ద్వేషం పెరిగినట్లు చెప్పాడు .వీళ్ళే ఆది,బక అయి ఉండాలి .హాలాయుధ ,బక అని జాన్ స్టన్ అన్నాడు .బకుడు అతడి రాక్షసగణ౦ జానపద కథల్లోకీ ఎక్కారు .తమిళ కథలలోబకుడు లేక పకాచురన్  కు 200 తలల వారసులున్నారు .వారిలో ఆచలమ్మాన్ ,రోచకన్,మలై యుకాచురన్ లున్నారు .అల౦బుసుడి పేరు మాత్రంబకుని చిన్నతమ్ముడిగా  అలాగే ఉంది మారలేదు .వీరంతా భీమునిపై ద్వేష విరోధాలు పెంచుకోన్న వాళ్లే.

      కేశి

వేదకాలం తర్వాత మనం బకదాల్భ్య, దాల్భ్య,బక విషయాలు వివరంగా తెలుసుకొన్నాం .ఇప్పుడు కేశి గురించి ఒకసారి ఆలోచిద్దాం .బకునిలాగా కేశికూడా అసురబృందంతో కనిపిస్తాడు .వేదకాలం తర్వాత కేశి దాల్భ్యుడి పాత్ర కనిపించదు .అధర్వ వేదం లో గర్భిణీ స్త్రీల రక్షణకోసం చేసే స్తోత్రం లో నల్లగా ,పొడవైన కేశాలున్న పిలకతో ,కోలముఖ పురుషాంగం ఉన్న అసురుడు గర్భిణీ స్త్రీల పిరుదులు ,యోని లను వేధిస్తాడు 8.6.5.-‘’యః కృష్ణా కేశ్యాసుర స్తంబజా ఉత తుందికాః’’.పొడవైన జుట్టు ఉంటె గుర్రం, సింహం కూడా కావచ్చు.కానీ వేదకాలం తర్వాత సాహిత్యం లో యాదవ వంశంలో జన్మించినవారిజాబితాలో వసుదేవ కౌసల్యల కొడుకు కేశి పేరు ఉన్నది .9.24.48 .కేశిని పేరు చాలా చోట్ల ఆడవారి పేర్లలో వచ్చింది .

  భాగవతం లో బాలకృష్ణుడు ఆశ్వాకార అసురుడు కేశిని చంపాడు  .మళ్ళీ ఇంకెక్కేడా కేశిపేరు రాలేదు .భారతంలో చాలా చోట్ల వస్తుంది .కశ్యపమహర్షి కి దనువుకు పుత్రులైన దానవులలో  వీడి పేరుంది -1.59.22.కాని వాడు కృష్ణుడి శత్రువు .కృష్ణుడు మధురలో మామకంసుని, కేశిని సంహరించాడు-14.69. 23,16.7.9.ఇదే విషయం అశ్వ ఘోషుడి’’సౌందర నందం ‘’లోనూ ఉన్నది .కేశి సంహారకుడుగా కృష్ణుడినామాలలో తరచుగావస్తుంది .కృష్ణుడిని కేశవా అనీ అంటారు –‘’కేశవః కేశి సూదనః ‘’-2.30.11 ,9.62.69.’’కేశవం కేశిహన్తారం ‘’-2.36.2.’’కేశవాః,కేశిహా ,హరిః-13.135.82.

 భారతం 3.213.9-13లోకృష్ణుడి శత్రవు కేశికాదు ఇంద్రుడు .దేవ దానవ యుద్ధాలకాలం లో ,ఇంద్రుడి పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పుడు మానస పర్వతానికి కొత్త సేనానికోసం వెడతాడు .(స్కందుడిని ఒప్పించి  ఆహ్వానిస్తాడు ).అక్కడ ఒక అమ్మాయి ఆర్తనాదం విని ఆమె ప్రజాపతి కూతురు దేవసేన(దేవతల సేనాని )ను కేశి బలాత్కరించబోతుండగా చూసి ,అప్పటికే వాడు ఆమె సోదరి దైత్య సేన(దైత్యుల సేనాని )ను వశపరచుకొనగా ఆమె అంగీకరించగా ,దేవ సేనను కాపాడే ప్రయత్నం ఇంద్రుడు చేయగా వాడు ‘’యెర్ర ఖనిజ పర్వతం ‘’లాగా కిరీటం ,గదతో  కనిపించాడు  3.213.9-‘’కిరీటం గద పాణిం ధాతుమంతం ఇవాచలం ‘’.వాడితో యుద్ధం చేశాడు .వాడు వేసిన గదను పర్వత శిఖరాన్నీ  వజ్రాయుధంతో రెండుముక్కలు చేయగా  అందులో ఒకముక్క కేశి రాక్షసుడిపైనే పడి,గిలగిల తన్నుకొని లేచి ,ఆబాలిక జోలికి పోకుండా కాలికి బుద్ధి చెప్పాడు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -18-6-20-ఉయ్యూరు  ,

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-53

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-53

లంకను సర్వవిధాలాతన వాలాగ్నితో  దహింప జేసినమహాబల హరిసత్తమ  హనుమ ,సముద్ర జలాలలో తోకను ముంచి అగ్ని చర్చాడు –

‘’లంకాం సమస్తాంసందీప్య లాంగూలాగ్నిం మహాబలః –నిర్వాపయామాస తదా సముద్రే హరి సత్తమః ‘’

సర్వవిధాల విభవం చెడిన లంకను ఒకసారి మళ్ళీ చూసిఒక్కసారి భయపడి తననుతాను ని౦ది౦చుకొని  మనసులో’’   లంకను కాల్చి యెంత నింద్యమైన పని చేశాను ?ప్రజ్వరిల్లే అగ్నిని నీళ్ళతో చల్లార్చినట్లు ,ఎవరు తనకోపాన్ని స్వబుద్ధితో నిరోధించుకొంటారో వారు మహాత్ములగు పురుష శ్రేస్టులు,మహాత్ములుకదా?’’-ఈ శ్లోకం లోకం లో బాగా ప్రచారమైంది .

‘’ధన్యా స్తే పురుష శ్రేష్టా ఏ బుద్ధ్యా కోప ముత్థి తమ్-నిరు౦ధ౦తి-మహాత్మానో దీప్త మగ్ని మివా౦ భసా’’

‘’కోపం  హద్దు మీరితే పాపం చేయకుండా ఎవరుంటారు ?కోపంతో పెద్దలను కూడా చంపుతారు ,కఠినమైన మాటలతో  సత్పురుషులను ఆక్షేపిస్తారు –

‘’క్రుద్ధఃపాపం న కుర్యాత్కః క్రుద్ధోహవ్యా ద్గురూనపి –క్రుద్ధః పరుషాయా వాచా నర స్సాధూనదిక్షిపేత్’’

విపరీతమైన కోపం లో ఏది మాట్లాడాలో ఏది కూడదో తెలీదు .కోపించిన వాడు చేయరాని పని ,ఎక్కడా మాట్లాడరానిది ఉండదు లోకం లో.

‘’వాచ్యావాచ్యం ప్రకుపితో న విజానాతి కర్హిచిత్ –నా కార్య మస్తి క్రుద్ధస్య నా వాచ్యం విద్యతే క్వచిత్ ‘’

‘’మనిషిలో పెల్లుబికి ఉన్న కోపాన్ని శిధిలమైనకుబుసాన్ని పాము  వదిలేసినట్లు ఓర్పుతో తొలగించుకున్నవాడే పురుషుడు అనబడుతాడు .ఇదికూడా అద్భుత ఉపమానం

‘’య స్సముత్పతితం క్రోధం క్షమయైవ నిరస్యతి –యథోరగస్త్వచం జీర్ణా౦ సవై పురుష ఉచ్యతే’’

‘’ముందూ  వెనుకలు చూడకుండా ఆలోచించకుండా మహాపాపం చేసి సీతాదేవిని కాల్చి స్వామి ద్రోహి, ఘాతకుడినీ అయ్యాను .లంక అంతాపూర్తిగా కాలిపోతే ,జనకీదేవికూడా తగులబడే ఉంటుంది .తెలీకుండా నా ప్రభువు కార్యం పాడు చేశాను .ఎవర్ని వెతకటానికి ఇంత దూరం శ్రమపడి వచ్చానో ,ఆపనిని పూర్తిగా నాశనం చేశాను .లంకను కలచి సీత సంరక్షణ చేయలేకపోయిన మందభాగ్యుడను ‘’-పశ్చాత్తాపం తో చేసిన పాపాలన్నీ పోతాయి అనటానికి ఈ దృశ్యం ఉదాహరణ .తొందరపాటు తెచ్చే అనర్ధం ఎలా ఉంటుందో చెప్పే విషయం .

‘’అచింత యిత్వా తాం సీతా మగ్నిదం స్వామి ఘాతుకం –యది దగ్దా త్వియం లంకా నూనా మార్యాపి జానకీ –దగ్దా తేన మయా భర్తుర్హతం కార్య మజానతా –మయాహిదహతా లంకాం న సీతా పరిరక్షితా ‘’

‘’నా అన్వేషణ ఎవరికోసమో ఆ సీతాదేవినే నాశనం చేసుకొన్నాను .లంకలో ఏమూలా మిగలక దహనమైంది కనుక ఆమె తగులబడే ఉంటుంది .నా అవివేకం వలన నాస్వామికార్యం  చెడిపోయి౦ది కనుక నా ప్రాణాలు ఇక్కడే వదలటం మంచిది .అగ్నిలో దూకనా బడబాగ్నిలో పడనా సముద్రం లోపడి ,అందులోని జీవులకు ఆహారమవ్వనా .మొత్తం దూతకార్యం వ్యర్ధం చేసి ఏముఖం పెట్టుకొని సుగ్రీవ రామాదులను చూడగలను ?నాలోని కోతిస్వభావాన్ని చంచలత్వాన్నీ,రోష దోషాన్నీ ప్రదర్శించిన వెర్రి వెంగళప్పను .అని తనను తానె బాగా ఎస్టిమేట్ చేసుకొన్నాడు హనుమ .ఇదీ ఆయన వ్యక్తిత్వం లో భాగమే. ఆత్మ విమర్శ లేనిది మనిషి ఎదగడు .ఎదిగే, ఎదిగిన,ఎదుగుతున్న మహాకపి కనుక చక్కగా తాపీగా తనపనులన్నిటినీ ఒకసారి నెమరేసుకొని పశ్చాత్తాపం చెందాడు .చేసిన దోషానికి ప్రతిక్రియలు అన్ని కోణాలనుంచీ ఆలోచించాడు .తనవానర చేష్టలను చెప్పుతో ‘’సారీ తనవాలం’’తోనే కొట్టుకున్న ఘనుడు సుందర హనుమ .చెడ్డ పని చేశానని పించినపుడు మనసు పరిపరి విధాల పొతు౦దనటానికి ఈ  విషయం కూడా గొప్ప సాక్ష్యమే .

‘’ఈషత్కార మిదం కార్యం కృతమాసీ న్న సంశయః –తస్య క్రోదాభి భూతేన మయా మూలక్షయః కృతః’’

‘’వినస్టా జానకీ నూనం న హ్య దగ్ధః ప్రదృశ్యతే –లంకాయా౦ కశ్చిదుద్దేశసర్వాభస్మీ కృతా పురీ ‘’కిమగ్నౌనిపతామ్యద్య‘’ ఆహోస్వి ద్బడబా ముఖే –శరీర మాహో సత్వానాందద్మి సాగర వాసినం ‘’

‘’ఈషత్కారమిదం ‘’శ్లోకం మల్లాది చంద్ర శేఖర శాస్త్రిగారు తరచూ ఉటంకిస్తారు .

‘’మయా ఖలుతదే వేదం రోష దోషాత్ ప్రదర్శితం -ప్రథితం  త్రిషు లోకేషు కపిత్వ మనవస్థితం

‘’రజో గుణంతో నేను చేసిన పని ఎందుకూ పనికి రాకుండా పోయింది .రజో గుణానికి కారణమైన క్రోధానికి లోబడి సమర్ధత ఉన్నా ,సీతను రక్షించలేక పోయాను .ఆమె మరణిస్తే రామ సోదరులు ఎలా బ్రతుకుతారు? .వాళ్ళు లేకపోతె సుగ్రీవుడు ,అతని బంధువులు అందరూ నశిస్తారు ‘’-రజో గుణం ఎలా కొంపకు అగ్గేట్టేస్తుందో హనుమ తో చెప్పించాడు మహర్షి .రజస్సు వలన కోపం ,క్రోధం పెరిగి చేయరాని అనర్ధాలన్నీ చేయిస్తుంది .దాన్ని అదుపులో పెట్టుకొంటేనే మనిషి మనీషి అవుతాడు .లేకపోతె పతనం అంచున నిలబడిపోతాడు .సీత మరణం ఎందరికి మరణకారకమౌతుందో హనుమ గొప్పగా విశ్లేషించుకొన్నాడు .ఏదో ఆకుటు౦బానికె నాశనం కాదు ,సుగ్రీవాది కపి వరులకు కూడా .అదీ ఇంతటితో ఆగితే పరవాలేదు .మొత్తం అయోధ్య,మిథిల ప్రజలందరికీ జీర్ణించుకోలేని విషయమై మరణ కారణం అవుతుంది .ఇక్కడే హనుమలో ఉన్న అసలైన మానవత్వాన్ని అందించాడు మహర్షి .

ధిగస్తు రాజసం భావ మనీశ మనవస్థి తం –ఈశ్వరేణాపి యద్రాగా న్మయా సీతా న రక్షితా ‘’

‘’వినస్టాయాంతు సీతాయాంతావుభౌ వినశిష్యతః –తయోర్వినాశే సుగ్రీవః సబంధు ర్విన శిష్యతి’’

‘’ఏత దేవ వచః శ్రుత్వా భరతో భ్రాతృ వత్సలః  -ధర్మాత్మా సహ శాత్రుఘ్నః కథంశక్ష్యతి జీవితుం ‘’

‘’ధర్మనిస్టకల ఇక్ష్వాకు వంశజులైన రామాదులు నలుగురు నశిస్తే ,ప్రజలంతా శోక పీడితులవటం తధ్యం .భాగ్య హీనం తో నేను ధర్మార్ధ సంగ్రహణం చేయకుండా ,రోషం అనే దోషం పట్టి పీడించి లోకానికే చేటు తెచ్చాననటం స్పష్టం ‘ ధర్మార్ధ సంగ్రహణం చేయకపోవటం వల్ల కలిగే చేటు రోషదోషం  అనే పిశాచిపడితే కలిగే అనర్ధం చక్కగా విశ్లేషించాడు .ఇవన్నీ ఆయనకే కాదు మనకందరికీ మహా వాక్యాలులాగా మహా నీతి వాక్యాలు .తొందరపడటం యెంత ప్రమాదమో చెప్పే సందర్భం .

‘’ఇక్ష్వాకు వంశే దర్మిస్టే గతే నాశ మసంశయం –భవిష్యంతి ప్రజా స్సర్వా శ్శోక సంతాప పీడితాః’’

‘’తదహం భాగ్య రహితో లుప్త ధర్మార్ధ సంగ్రహః –రోష దోష పరీతాత్మావ్యక్తం లోక వినాశానః ‘’

ఇలా బాధతోమధనపడుతున్న హనుమకు కొన్ని శుభ శకునాలు గోచరించగా మళ్ళీ మనసులో ‘’అనవద్య సౌందర్య రాశి ,మంగళ రూపిణిసీతా దేవికి ఆమె తేజస్సే రక్షణగా ఉండగా,ఆమె నశించదు.అగ్ని అగ్నిని దహి౦పదు కదా !ధర్మాత్ముడు ,మహా తేజశ్శాలి రాముని భార్య సీతకు ఆనే పవిత్ర నడవడి శీలమే రక్షిస్తుంది .అగ్ని ఆమెను తాకటానికి కూడా అర్హుడు కాడు’’అనుకొన్నాడు .అసలు అగ్నికి రక్షణ ఏమిటి .అగ్ని జోలికి ఎవరొచ్చినా మసి అవటమే కదా .ఆమె శీలమేసీతాదేవి అగ్ని లాంటి రక్ష .ఆమె తేజస్సు ఆమెకు సంరక్షణ .అగ్ని హోత్రుడు కూడా ఆమెను తాకటానికి పనికి రాడు అని హనుమ అన్నాడు అంటే ఆమె శీల పావిత్ర్యం, పాతి వ్రత్యం ఎంతటి మహోన్నతమైనవో ఆమెను చూడగానే గ్రహించిన సూక్ష్మగ్రాహి హనుమ .మొదట్లో ఏదో కొ౦పమునిగిపోయినట్లు బాధ ,భయం పడ్డాడుకాని తరచిచూసి ఆమెను ఎవరూ ఎమీచేయలేరని సిద్దా౦తీకరించాడు.అందుకే రావణ సంహారానంతరం రాముడు ఆమె శీలపరీక్షకు అగ్ని పరీక్ష పెడితే ,అగ్ని ఆమెను  తాకటానికి కూడా భయపడి  మిన్నకుండిపోయాడు .కనుకనే  ఆమె అగ్ని స్వరూపిణి అన్నాడుహనుమ అగ్ని మరో అగ్నిని దహనం చేయదు చేయలేదు అని తీర్మానించాడు .ఎరుక కలగటం అంటే ఇదీ .మొదట్లో కపి లక్షణం తర్వాత ‘’మహాకపి దీవిశాలత ‘’హనుమ వ్యక్తిత్వంలో భాగం . ఆయన భయపడినట్లు ఏదీ జరగలేదు కనుక సరిపోయింది .జరిగి ఉంటె ?ఊహించరాని మహా విపత్తు .

‘’అథవా చారు సర్వాంగీ రక్షితా స్వేన తేజసా –న న శిష్యతి కళ్యాణీ నాగ్ని రగ్నౌ ప్రవర్తతే ‘’

‘’నహి ధర్మాస్తనస్తస్య భార్యా మమిత తేజసః –స్వచారిత్రాభి గుప్తాం తాంస్ప్ర ష్టుమర్హతి పావకః ‘’

మరికొంత విచారణ చేస్తూ హనుమ ‘’కాల్చటం అగ్ని స్వభావం .దానికి నాశనం లేదు .సర్వకాల సర్వావస్తల లోనూ  దానికి దహన శక్తి ఉంటుంది .అగ్ని’’ఆఫ్టరాల్ ‘’ నాతోకనే కాల్చలేకపోతే ,పూజ్యురాలు అగ్ని హోత్రం వంటి సీత జోలికి వెళ్ళే సాహసం చేయగలడా ‘’అనుకోని మైనాక వృత్తాంతం ఒకసారి గుర్తుకు తెచ్చుకొని, ఆశ్చర్యపడి మళ్ళీ మనసులో ‘’తపం ,సత్యం, అనన్య పతిభక్తి తో సీతాదేవి అగ్నినే దహిస్తుంది కానీ ,అగ్ని ఆమెను ఏమీచేయలేదు’’అనుకోని ఆమె ధర్మ పాతివ్రత్యాలను స్మరిస్తూ ఉండగా మహాత్ములైన చారణుల వాక్యాలు’’ఆహా !ఏమి ఆశ్చర్యం?హనుమంతుడు రాక్షసుల ఇళ్ళల్లోభయంకర దుస్సహజమైన అగ్నిని రగిల్చి  దుష్కర కార్యం అద్భుతంగా చేశాడు .పారిపోయే రాక్షస స్త్రీలు ,ఆబాల వృద్ధుల జనాల కలకలం ,పెద్ద ధ్వనులతో కొండ గుహ లలో నాదం ప్రతిధ్వనిస్తుండగా ,ఆక్రందనలు చేస్తున్నట్లుగా ,మిద్దె, ద్వార, ప్రాకారాలతో లంక అంతా తగలబడింది కానీ సీత కాలక పోవటం ఆశ్చర్యం కలిగించింది  ‘’  అన్నమాటలు హనుమకు వినిపించాయి .తనకు కనిపించిన శుభ శకునాలు ,తన మనో నిశ్చయం ,సీతా దేవి పాతి వ్రత్యం ,రామ ప్రభావం మొదలైన సుగుణాల కారణాలతో ,చారణ వాక్యాలతో మనసులో ఆనందం పొందాడు .ఉపశమనం కలిగింది .

‘’అహో ఖలు కృతం కర్మదుష్కరం హి హనూమమతా –అగ్నిం విసృజతా భీక్ష్ణ౦ భీమం రాక్షస వేశ్మని’’

‘’ప్రపలాయిత రక్షః స్త్రీ బాల వృద్ధసమాకులా –జనకోలాహలాధ్మాతా క్రందంతీ వాద్రి కందరే ‘’

‘’దగ్ధేయం నగరీ సర్వా సాట్ట ప్రాకార తోరణా-‘’జానకీ న చ దగ్ధేతి’’విస్మయో ద్భుత ఏవ నః ‘’

చివరికి హనుమ తనకోరిక నెరవేరి సీతకు ఏ ఆపదా కలగలేదని తెలిసికొని ,మళ్ళీ ఒక్కసారి ఆమెను దర్శించి తిరిగి వెళ్లాలని నిశ్చయించుకొన్నాడు .ఎవరో ఆకాశ రామన్నలు చెబితే నమ్మి వెళ్ళిపోతే హనుమ ఎలా అవుతాడు ?తానూ స్వయంగా సీతను చూసి ఎసర్టైన్ చేసుకొని సంతృప్తి చెందాకే తిరుగు ప్రయాణం చేయాలన్నది మహామతిమాన్ హనుమాన్ తీసుకొన్న మరో మెగా నిర్ణయం .అందుకే సుందర కాండ అంతసుందరమైనది .

‘’తతః కపిః ప్రాప్త మనోరథార్ధ-స్తా మక్షతాం రాజసుతాంవిదిత్వా –ప్రత్యక్షత స్తాంపునరేవ దృష్ట్వా –ప్రతి ప్రయాణాయ మతిం చకార ‘’

ఇది 35శ్లోకాల 58వ అధ్యాయం

ఈ సర్గ లో కోటబుల్ కోట్ లైన శ్లోకాలు చాలా ఉన్నాయి .అన్నీ ఆణిముత్యాలే .నేనూ, చాలామంది రేడియో లో సూక్తిసుధలో ,ఆలోచనాలోచనం లో ఉపయోగించుకొన్నవే .ప్రవచనాలలో మహామహులంతా ఉదాహరించేవే .అంతటి సార్వకాలికమైన సత్యాలున్న శ్లోకాలు మాత్రమే కావు. మహర్షి మాటలు .శిరో దార్యాలే .కనుక ఈ సర్గ కూడా చాలా ముఖ్యమైనదే అని పిస్తుంది .హనుమ గుంజాటన ,మనో నిశ్చయం ,తాను చేసిన పని అవతలి వాళ్లకు అపకారం చేస్తే బాగానే ఉంటుంది కాని. ‘’మన అనుకొన్న’’  వాళ్లకు ఏదైనా జరిగితే తట్టుకోలేరు .అదీ లోక సహజం .దీన్నీ గొప్పగా చిత్రించాడు .తన కోతి చేస్టలకూ బాధ పడ్డాడు .చివరకు సీతారాముల నిర్మల నిష్కల్మష మనస్తత్వం కూడా లోకానికి చాటాడు .

ఈ సర్గలో హనుమ  అంతర్మధనాన్ని  మహోత్క్రుస్టం గా వాల్మీకి కవి తీర్చి దిద్దాడు .హనుమ ఏక పాత్రాభినయానికి ,సర్వ గుణ ,రస ,అలంకార సుశోభిత౦గా రాశాడు కవివాల్మీకి .ఎవరైనా ఈ సర్గను ఏక పాత్రాభినయం చేశారో లేదో నాకు తెలీదుకానీ ,చేస్తే మహాద్భుత రసకందాయంగా ఉంటుందన్నది మాత్రం సత్యం .మహర్షి రచనా ,మజాకానా !

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -18-6-20-ఉయ్యూరు .

 

 

 

 

‘’

 

 

 

‘’

 

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అమ్మాయి విజ్జి- అవధాని మారేజ్ డే సందర్భంగా మన సువర్చల ఆంజ నేయాలయం లో ప్రత్యేక పూజ వడమాల

ఇవాళ విజ్జి అవధాని మారేజ్ డే సందర్భంగా మన సువర్చల ఆంజ నేయాలయం లో ప్రత్యేక పూజ వడమాల

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఆచార్య శ్రీ వంగపల్లి విశ్వనాథం -గారు యువభారతి కన్వీనర్ -హైదరాబాద్ -గారి అమృత హృదయం0

ప్రియమైన శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ గారికి,

ఎంతో ఆప్యాయతతో, ప్రతి పుస్తకంపైనా, నాపేరు వ్రాసి, మీ సంతకంతో పంపినందుకు,
నేను తీర్చుకోలేని అభిమానభారాన్ని నాపై ప్రేమతో మోపారు.

మీ పాండిత్యం,  పట్టుదల, పదిమందికీ ఉపయోగపడాలనే కృషి, ఉయ్యురు చేసుకున్న పుణ్యఫలం.
మీ అపారమైన పూర్వజన్మ సుకృతం.
మీ పరిచయం నా భాగ్యంగా భావిస్తున్నాను.
మీరు, నాకన్నా, ఒక 7 నెలలు పెద్ద.
ఎన్నింటిలోనో, చాలా, చాలా శిఖరాయమానమైన కృషి
అభినందనీయమైన కృషి సాధించి చూపించారు.
పదికాలాలపాటు, ఎందరికో ఉపయోగపడే పుస్తకాలు రచించారు.
సాహితీ చైతన్యాన్ని కాపాడుతున్నారు.
ఆ పరమేశ్వరానుగ్రహం సంతతధారగా మీపై కురుస్తూ ఉండాలని, మనసారా ప్రార్థిస్తాను.

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -7

ప్రపంచ దేశాల సారస్వతం

108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -7

  తరువాత తరం లోలార్డ్  బైరన్ షెల్లీ ,కీట్స్ కవులు కాల్పనిక కవిత్వాన్ని కొత్త సొగసులతో నింపారు .ఫ్రెంచ్ విప్లవ జ్వాలలు చల్లారాక యూరప్ లో ఆవరించిన నిరాశా వాతావరణాన్ని బైరన్ తన కవితల్లో ప్రతిఫలింప జేశాడు .మనసులో ఏర్పడిన ఆధ్యాత్మిక సంఘర్షణ ‘’చైల్డ్ హెరాల్డ్స్ పిల్గ్రిమేజ్‘’,డాన్ జువాన్ ‘’కావ్యాలలో ,’’మాన్ ఫ్రెడ్’’,’’కెయిన్ ‘’నాటకాలలో కనిపిస్తుంది .తనకావ్యాలలో తప్పులు చూపిన విమర్శకులను బైరన్ ‘’ఇంగ్లీష్ బార్డ్స్ అండ్ స్కాచ్ రెవ్యూయర్స్ ‘’అని అధిక్షేపించాడు మన తిట్టుకవి భీమన ,వికటకవి తెనాలి రామలింగనిలా .

  ఈ నిరాశ లో విప్లవం సుస్థిర వ్యవస్థకు దారి తీస్తుందని ,మానవులకు మహోజ్వల భవిష్యత్తు ఏర్పడుతుందని ఎలుగెత్తి చాటిన ఆదర్శ వాదకవి పి.బి .షెల్లీ .లిరిక్ కవిత్వం లో షెల్లీ కి మించినవాడు మళ్ళీ పుట్టలేదు .’’దిస్కైలార్క్ ,’’ది క్లౌడ్ ‘’,ది సెన్సిటివ్ ప్లాంట్ ‘’,’’ఓడ్ టు ది వెస్ట్ విండ్’’,’’ఎ లామెంట్ ‘’గీతాలలో ఉన్న రస స్పూర్తి నాన్యతో దర్శనీయం .’’ది రివోల్ట్ ఆఫ్ ఇస్లాం ‘’కావ్యం లో మానవుని మంచితనంపై షెల్లీ కున్న విశ్వాసం చిరస్మరణీయం .’’ప్రొమీథియన్ అన్ బౌండ్ ‘’అనే గేయ నాటకం లోనూ ఇది ప్రతిఫలించింది .కీట్స్ కవి మరణం పై ‘’ఎగొనీస్’’అనే కలకాలం నిలిచిపోయే విషాద గీతిక రాశాడు .కావ్య ప్రయోజనం పై తన సిద్ధాంతాన్ని ‘’డిఫెన్స్ ఆఫ్ పొయెట్రి’’ గొప్పగా చర్చించాడు .కృష్ణ శాస్త్రి జ్ఞాపకమొస్తాడు .అందుకే శ్రీశ్రీ కృష్ణశాస్త్రి మరణానికి స్పందించి ‘’షెల్లీ మళ్ళీ మరణించాడు ‘’అన్నాడు .

  ‘’సత్యమే సౌందర్యం సౌందర్యమే సత్యం ‘’అని జీవితం లోనూ కవిత్వం లోనూ నమ్మి సౌందర్యాన్ని ఆరాధించిన మధుర హృదయ కవి జాన్ కీట్స్ .’’ది ఈవ్ ఆఫ్ సెయింట్ ఆగ్నెస్’’,’’ఇసబెలా ‘’,అనే సుందర రసబంధుర కావ్యాలు ,’’టు ఆటం’’,’’టు ఎ నైటింగేల్’’’’,ఆన్ ది గ్రీషియన్ ఆర్న్’’,’’టు మెలాంకలి’’ వంటి భావ గీత కర్త కీట్స్ .మన తిలక్ గుర్తుకొస్తాడు .

బైరన్, షెల్లీ ,కీట్స్ లు అవినాభావ సంబంధమున్న  ఆధునిక ఆంగ్ల కవిత్రయం .

  19 వ శతాబ్ది ‘’ఎడింబరో రివ్యు ‘’,క్వార్టర్లీ రివ్యు ‘’,బ్లాక్ వుడ్స్ మేగజైన్ ,లండన్ మాగజైన్ వంటి ప్రసిద్ధ పత్రికలు సాహిత్య సమాలోచనలకు బాగా తోడ్పడ్డాయి .మొదటి మూడూ స్కాట్ లాండ్ నుంచి వచ్చినవే కాని కాల్పనిక ,కవిత్వాన్ని వర్డ్స్ వర్త్ కవిత్వాన్ని దుమ్మెత్తి పోసి చివరకు వ్యక్తీ దూషణదాకా వెళ్ళాయి .అప్పటి వచన రచయితలలో టామన్ డీక్వెన్సి ,చార్లెస్ లాంబ్ ,విలియం హాజ్లిట్ , లే హంట్ లు ముఖ్యులు ఆల౦కారిక శైలి డీక్వెన్సీ ది.’’కన్ఫెషన్స్ఆఫ్ యాన్ ఇంగ్లీష్ ఓపియం ఈటర్ ‘’ (మత్తు మందు భాయి )ఆత్మాశ్రయ వచన రచనకు గొప్ప ఉదాహరణ .మృదుహాస్య శైలిలో లాంబ్ ‘’ఈలియా ‘’అనే మారుపేరుతోచాలా వ్యాసాలూ ,షేక్స్ పియర్ నాటక రంగస్థల అభినయ ఔచిత్య అనౌచిత్యాలపై రాసిన సాహిత్య విమర్శ శిఖరాయమానం .షేక్స్పియర్ నాటక కథలను ‘’టేల్స్’’రూపంగా అతని సోదరి అందించింది ఇందులో లాంబ్ కూడా భాగస్వామి .షేక్స్పియర్ తో ఏర్పడిన వైరుధ్యాన్ని ఇలా మాన్పుకొనే ప్రయత్నం చేశాడు .  విలియం హాజ్లిట్ ను ‘’విమర్శకులకు విమర్శకుడు ‘’అంటారు .ఆయన వ్యాసాలు స్పూర్తి దాయకాలు .కీట్స్ కవి హృదయాన్నీ కాల్పనిక కవిత్వాన్ని ఆవిష్క రించిన వాడు  కీట్స్ స్నేహితుడు లే హంట్ .తామస్ లవ్ పీకాక్ అనే నవలారచయిత ‘’హెడ్ లాంగ్ హాల్ ‘’,నైట్ మేర్ ఎబ్బీ ‘’,క్రోచెట్ కాజిల్ ‘’నవలలలో ఆ నాటి సమాజాన్ని వ్యంగ్య ధోరణిలో విమర్శించాడు .నవలమధ్య భావగీతాలూ రాశాడు మన ‘’అడివి బాపి బావ’’ లాగా .

  1832నుండి 19వ శతాబ్దిలో మిగిలినకాలాన్ని ‘’విక్టోరియా యుగం ‘’అంటారు .విక్టోరియారాణిపాలనకాలం లో దేశం అన్ని విధాలా శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లింది .కాని సాంఘిక ,ధార్మిక ,వైజ్ఞానిక రంగాలలో గొప్ప సంచలనం కలిగింది .చార్లెస్ డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని కనిపెట్టాడు .ఇది బైబిల్ లోని సృష్టి విధానానికి విరుద్ధం .దీనితో ప్రకృతి శాస్త్రం మత సిద్ధాంతాలమధ్య  ఘర్షణ ఏర్పడింది  .హెర్బర్ట్ స్పెన్సర్ ,ధామస్ హగ్లీ వంటిమేదావులు సైన్స్ ను సమర్ధించారు .కొందరు ఈ రెండిటిమధ్య సమన్వయ౦  కోసం పాటు బడ్డారు .యంత్రావిర్భావం తో పారిశ్రామిక విప్లవం వచ్చింది .దీనితో మళ్ళీ కొత్త సమస్యలేర్పడి,సైన్స్ లో ప్రకృతి శాస్త్ర ప్రాధాన్యం,రాజకీయంగా ప్రజాస్వామ్య సిద్ధాంత వికాసం ,,మత విశ్వాసాలలో అనిశ్చిత స్థితి గా ఈ యుగ లక్షణాలను విశ్లేషకులు భావించారు.ప్రజలకు భోగ లాలసత పెరిగి ,మనో వికాసం కలిగించే కళలను మర్చి పోయి అనాగరకులౌతున్నారని కొందరి భావన .సంస్కృతీ వికాసానికి సంస్కర్తలు నడుం కట్టారు .ఇవన్నీ ఆనాటి సాహిత్యంలో స్పష్టంగా ప్రతిఫలించాయి .

 ఆ నాటి మేటి కవి ఆల్ఫ్రెడ్ టెన్నిసన్ కావ్యాలలో అప్పటి జిజ్ఞాసువుల సందిగ్ధ మానసిక స్థితిని స్పష్టంగా చూపించాడు .పదలాలిత్యానికి అతడు గొప్ప ఉదాహరణ .మన సంస సంస్కృతకవి దండి లాగా .ఆర్ధర్ రాజు గురించిన ప్రాచీన గాథలను సేకరించి ,అసమాన శిల్పం తో ఆనాటి మనోజ్ఞ వాతావరణాన్ని కళ్ళముందు ఉంచుతూ ‘’ది ఇడిల్స్ ఆఫ్ ది కింగ్ ‘’కావ్యం రాశాడు .తనమిత్రుని స్మృతి చిహ్నంగా ‘’ఇన్ మెమోరియం’’కావ్యం రాసి తన ఆధ్యాత్మిక వేదనకు వేదిక చేశాడు .ఈయన లఘుకావ్యాలన్నీ కమ్మచ్చు తీసిన కళాఖండాలే .రాబర్ట్ బ్రౌనింగ్ అల్పాక్షరాలతో అనల్పార్ధాలు సృష్టించి ఆడర్శవాదంతో ప్రేమ దివ్యమైనదనీ ,ఆత్మ వికాసం కలిగించి స్వర్గానికి చేరుస్తుందని తనకావ్యాలన్నిట్లో చెప్పాడు .అతని రచనలలో ‘’హిప్పా పాసెస్ నాటకం ,ఆండ్రియా డెల్ సార్టో’’,ఎజ్ట్ వాగ్లర్ ,రబ్బీ జెన్ ఎజ్రా ఖండకావ్యాలు ,’’హోమ్ థాట్స్ ఫ్రం ఎబ్రాడ్ వంటి రసవత్తర ఆత్మాశ్రయ గీతాలు ఉన్నాయి .హిరణ్య కశిపుడు లాగా దేవుడు కలడో లేడో అనే సందిగ్ధంతో ఊగుతుండే ఆనాటి మనుషులకు ‘’దేవుడు స్వర్గం లో ఉన్నాడు ప్రపంచమంతా సవ్యంగానే ఉంది ‘’అని భరోసా ఇచ్చాడు బ్రౌనింగ్ .భార్య ఎలిజబెత్ బార్రెల్ బ్రౌనింగ్ గొప్ప కవితా శక్తితో ‘’క్రై ఆఫ్ ది చిల్డ్రన్ ‘’,ఆరోరాలే ,వంటి కరుణ రసకావ్యాలు ,అనేక సానెట్లూ రాసి అర్ధాంగి అనిపించింది .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -17-6-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

డా రాచకొండ శర్మగారి ”మైదానంలో సూర్యోదయం ”పై నా సమీక్ష -ఏప్రిల్ రమ్యభారతిలో

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

బక దాల్భ్యుడు -18

బక దాల్భ్యుడు -18

భారత అరణ్య పర్వంలో యక్ష ప్రశ్న ఉదంతం 3.295-298లో ఒకమడుగులోని నీరు తాగి పాండవ సోదరులలో నలుగురుఒకరితరువాత ఒకరు  అదృశ్యమవగా చివరకు ధర్మరాజు వచ్చి,ఆకాశం నుంచి వినిపించే యక్షుని మాట లెక్క చేయ కుండా ఉంటె యక్షుడు తానె ఆయన సోదరులను దాచానని తనపేరు బకుడు అనీ తాను జలం లో ఉండే చేపలు,మొక్కలు  తింటానని  చెప్పాడు -3.297-11-‘’అహం బకాః శైవల మత్స్య భక్షషో’’..చివరికి యక్షుడు అడిగిన ప్రశ్నలన్నిటికీ సంతృప్తిగా సమాధానాలు చెప్పగా ఆయన సోదరులను అప్పగించాడు .యక్షలో య బదులు ర పెడితే రాక్షసుడు అవుతాడు .ఒకరితరువాత మరొకరిని తినటం బకలక్షణం అని మనం మర్చిపోరాదు .

  బాలకృష్ణుడు బకాసుర వధ చేశాడు .భాగవతం 10.11.46-53లో నంద గోపుడు బృందావనానికి తన పరివారం తో మారాడు .గోపాలురతో కృష్ణ బలరాములు గోవులను కాస్తూ ఒక సరస్సు దగ్గరకు వచ్చారు .అక్కడ అకస్మాత్తుగా బకాసురుడు భీకర శరీరం కొంగరూపం లో కనిపించాడు -10.11.48’’బకో నామ మహాన్  అసురో బకరూపా ధృక్’’.ఆ బకం ఒక్కసారిగా బాలకృష్ణుని మింగేసి ,గొంతులో విపరీతమైన అగ్ని మంట ఉన్నట్లు  బాధపడి వెంటనే కక్కేసింది .కృష్ణుడు బయట పడగానే తనపెద్ద ముక్కుతో దాడి చేసింది .దాని ముక్కు పట్టుకొని రెండుగా చీల్చి చంపేశాడు –‘’లీలయా ‘’.

  పద్మ పురాణ ఉత్తర ఖండం -245.95-100లో కృష్ణుడు బకాసురుడిని దాని రెక్కలపై మట్టి ముద్దలు వేసి చంపాడని ఉన్నది –‘’లోస్టం ఉద్యమ్నలీలయా తదాయామాస పక్షంతే’’.దీన్ని బట్టి తేలింది బృందావన అరణ్యం అసుర నిలయం .యక్ష ప్రశ్నలలో పాండవ సోదరులను మింగిన బకం భీముడు తన వంశంవాడైన బకాసురుడిని చీల్చి చంపటానికి తీర్చుకొన ప్రతీకారం అనిపిస్తుంది .రాక్షస అసుర యక్షులు లకు భీకర బకాలతో సంబంధం ఉన్నవాళ్ళు .ఒక బకుడి పేరు దైత్య అనీ పురాణకథనం .కృష్ణుడు బకాసుర ఇతర రాక్షసుల  వధ చేశాక దేవతలను అసురులను జయించిన దైత్యులను తొలగించేశాడు భాగవతం 10.46.26-దైత్యాః సురాసుర జితో హతా యేన’’.స్కాందపురాణ ప్రభాస ఖండ 4.20లో అనేకమంది దైత్యులు కృష్ణ బలరాములచేత వారి చక్రహలాయుదాలతో చంపబడినారని ఉంది-4.20.50-‘’సంకర్షణో జనార్దనౌచక్రా లా౦గల ఘటేన జఘ్నతుర్  దానవోత్తమాన్ ‘’.అందులో బకుడు కూడా ఒకడు 25-‘’బకాస్ చదైత్యో బహుసైన్య సమన్వితః ‘’బకుడిని చక్రాయుధంతో కృష్ణుడు సంహరించాడు -51-‘’చక్రేణచ శిరః కయాచ్చిచ్ఛేదాసు బకస్య వై ‘’ .

  భాగవతం లో బకాసురుని సోదరిపేరు బకి .ఈపేరు పూతనను కు వర్తిస్తుంది .3.2.23లో పూతనను బకి అని చెప్పింది.అంటే చనిపోయిన  కొంగ లాంటిది కామరూపం లో ఆకాశ సంచారం చేసింది .ఇదిపూతన లక్షణం .హరివంశం -50.20లో పూతన పక్షి గా చెప్పబడింది కూడా .ఈ ఆడ రాక్షసి మాయోపాయంగా అటూ ఇటూ ఎగురుతూ ఒక్కసారి అకస్మాత్తుగా దాడి చేస్తుంది .ఇది అగ్నిశిఖా అనే రాక్షసి లక్షణం .ఇది కొంగ రూపి.దీన్ని వేదంలో చెప్పబడిన కేశి దాల్భ్యుడు అనిపిస్తుంది .పురాణ ఇతిహాసాలలో అసుర రాక్షసులకు కుటు౦బాలున్నట్లు,వీరికి అన్నిరూపాలు దాల్చే శక్తి ఉన్నట్లు ,జంతు పక్షి రూపాలూ పొందినట్లు ఉన్నది .ముఖ్యంగా బక రూపం అందులో ఒకటి .రామాయణం లో రావణుడు చనిపోయాక సహస్ర స్కంద రావణుడు ,మహిరావణుడు గురించి వస్తుంది .వీళ్ళు రావణుని బంధువులే  .బకాసురుడు బ్రహ్మ రాక్షసుడు కనుక తన శత్రువులను చంపటానికి బహువేషాలు ధరించాడు .బకుని అన్నలు కిమ్మీరుడు, అల౦బ ఆలాయుదులు .హిడి౦బుడిని బకుని దగ్గర బంధువుగా చెప్పలేదు .కాని బకుని జంటగా చాలాసార్లు వస్తాడు .బకుని ముఖ్యానుయాయి ‘’ఆది’’.

 కిమ్మీరలేక కిర్మీర అంటే రంగులు మార్చేవాడు .భారత అరణ్య పర్వ12వ అధ్యాయం ‘’కిమ్మీర వధ ‘’3.12.6-9లో పెద్ద కోరలు భయంకర శబ్దం చేస్తూ నిలబడ్డ జుట్టుతో –‘’ఊర్ధ్వ  శిరోరుహా ‘’మహారాక్షసుడురుతుపవనంలాగా  ఉన్నాడనిచేప్పింది –సబాలకం ఇవ అంబుదం’’అంటే బకుని సోదరుడు .కిర్మీరుడు తన శక్తులతో పాండవులను ఎర వేద్దామని ప్రయత్నిస్తే ధౌమ్యుడు శక్తిగల రాక్షస సంహార  మంత్రాలను ఉచ్చరించిమాయలు పారకుండా చేశాడు . –‘’రక్షోఘ్నైర్ వివిధైర్ మంత్రైర్’’.తన తమ్ముడు బకాసురుడిని,-‘’అహం బకాస్య వై భ్రాతా ‘’స్నేహితుడు హిడి౦బా సురుడిని-32  భీముడు చంపినపగ తీర్చుకోవటానికి కిర్మీరుడు భీముడితో మల్లయుద్ధం చేశాడు-32.చివరికి భీముడు బలి  పశువు ను సంహరించినట్లు కిర్మీరుడిని హతం చేశాడు-63  -‘’పశుమార౦ అమారయన్ ‘’ .

  మిగిలిన సోదరులైన అలంబుస అలాయుధ  కౌరవ సైన్యంలో చేరిన రాక్షససోదరులు .ఇద్దరూ అనేక మాయలతో భీముడితో యుద్ధం చేస్తే, భీముడికొడుకు ఘటోత్కచుడు కూడా రాక్షసాంశ ఉన్నవాడుకనుక అవే కిటుకులు ప్రయోగించి వారిద్దర్నీ చంపాడు .అల౦బుసుడి మొదటి శత్రువు ఆర్ష్య శృంగి-7.83.,13.84 ,40.అల౦బు పక్షిరూపం పొందలేదుకాని పన్నగ రూపం పొందాడు-‘’పన్నగా ‘’ .అర్జునునికొడుకుసగం నాగు పాము రూపంలో ఉన్న  ఐరావణు డితోఆలంబ  పోరాడుతూ ,తాను  గరుత్మంతుడు రూపం పొందినట్లు భ్రమకల్పింఛి చంపాడు  -6.86.68-69.

  అలాయుధుడు భారతం-7 .151-153ప్రకారం బక భ్రాత్రుడే-బక భ్రాత్రుర్’’బకజ్ఞాతి -153.33.భీముడితో యుద్ధానికి దిగి ,చివరకి ఘటోత్కచునితో మాయయుద్ధం చేసినపుడు వాలిసుగ్రీవుల్లా ఉన్నారని పోల్చారు -7.153.37.అలమ్బుస అలాయుదులు కూడా బహు రూపదారులైన , మాయావులైన రాక్షస సోదరులు అని తెలుస్తోంది .మరోకేరక్టర్ ఆది గురించి తరువాత తెలుసుకొందాం .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -17-6-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-52

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-52

లంకను చూస్తూ ,తనమనసులోని కోరిక తీరగా అధిక ఉత్సాహంతో తరువాత కర్తవ్య౦  గూర్చి ఇలా ఆలోచించాడు ‘’అశోక వన భంగం చేశా .మహామహులైన రాక్షస సంహారం చేశా .ఇక మిగిలింది లంకా దహనమే .ఇదిఒక్కటి పూర్తి చేస్తే ,ఇప్పటిదాకా చేసిన పనులవలన పొందిన ఆయాసం తగ్గుతుంది .కొద్ది ప్రయత్నం తో చేసే ఈ పని వలన నా శ్రమ ఫలిస్తుంది .

‘’అల్పయత్నేన కార్యేస్మిన్ మమసాత్స ఫలః శ్రమః ‘’

‘’నాతోకకున్న నిప్పుతో ఈ మహాగృహాలు తగలబెట్టి అగ్నికి సంతర్పణ చేస్తాను ‘’.న్యాయమేకదా.తోక కాలకుండా చల్లబరచిన అగ్ని దేవుడికి కృతజ్ఞతగా ఆ మాత్రమైనా చేయాలి లేకపోతే  కృతఘ్నుడు అయిపోతాడు .అది ఆయన రక్తంలో లేదు .అందుకే చక్కగా ఆలోచించాడు .

‘’యోహ్యయం మమ లాంగూలే దీప్యతే హవ్యవాహనః –అస్య సంతర్పణ౦ న్యాయ్యం కర్తు మే ధిర్గృహో త్తమైః’’

మెరుపులతో ఉన్న మేఘం లాగా  వేగం తో మారుతి, మండే తోకతో లంకాపుర భవనాల పైభాగాలపై తిరిగాడు .ఒక ఇంటినుంచి మరో ఇంటికి కోతిలాగా దూకుతూ ,ఉద్యాన మహా భవనాలలో సంచరించాడు .ముందుగా ప్రహస్తుని ఇంటిపై దిగి చిచ్చుపెట్టి .తర్వాత మహాపార్శ్వుడు  వజ్ర దంష్ట్ర ,తేజశ్శాలి శుక ,ధీశాలి సారణ ,ఇళ్ళను తగలెట్టాడు .తర్వాత కోటాలో ఇంద్రజిత్ ,జంబుమాలి ,సుమాలి రాక్షస గృహాలకు ‘’అగ్గెట్టాడు’..తర్వాత రశ్మికేత  సూర్య శత్రు ,హ్రస్వ కర్ణ ,దంష్ట్ర,రోమశ ,యుద్ధోన్మత్త,మత్త,ధ్వజగ్రీవ ,భీకరుడైన విద్యుజ్జిహ్మ,హస్తిముఖ కొంపలకు  చిచ్చెట్టి ,పిమ్మట కరాళ,పిశాచ ,శోణితాక్ష  ,,కుంభకర్ణ ,మకరాక్ష ,యజ్ఞ శత్రు ,బ్రహ్మ శత్రు ,నరాంతక ,కుంభ ,దురితాత్ముడైన నికుంభ ,గృహాలను వరుసపెట్టి తగలబెట్టాడు .ఒక్క విభీషణుడి గృహాన్ని మాత్రం కాల్చకుండా వదిలేశాడు ‘.కారణం కృతజ్ఞత .రావణ కొలువులో రాక్షసరాజుకు నీతిపాఠం చెప్పగల  రాక్షస వీరుడు ,దూత ను చంపకూడదు అనే రాజ ధర్మాన్ని రాజుకు రాజుకు గుర్తు చేసి తనకు ప్రాణభయం లేకుండా మహోపకారం చేసినవాడు కనుక .

‘’వర్జయిత్వా మహా తేజా విభీషణ గృహం ప్రతి ‘’

 లంకలోని సకల రాక్షస గృహాలను కాల్చివేసి ,చివరికి రావణుడి భవనం దగ్గరకు వచ్చాడు .బహురత్న శోభితమై ,సకల శుభ లక్షణాలతో మేరుమందరం లా ఉన్నతమైన రావణ ప్రధాన భవనాన్ని తన’’తోకాగ్ని’’తో  కాల్చి ,ప్రళయ కాల మేఘంలాగా సింహ గర్జన చేశాడు .

‘’తతస్తస్మిన్ గృహే ముఖ్యే నానారత్న విభూశితే –మేరు మందర సంకాశే సర్వ మంగళ శోభితే ‘’ప్రదీప్త మగ్ని ముత్చ్రుజ్య లాంగూలాగ్రే ప్రతిస్టితమ్-’నానాద హనుమాన్ వీరో యుగాంత జలదో యథా’’

 ఇప్పుడు అగ్నికి వాయువు తోడ్పడి మహా వేగంగా  వీస్తుండగా లాంగూలాగ్ని ప్రళయాగ్ని లాగా ప్రజ్వరిల్లింది .వాయువు బాగా సహకరించి ఆ అగ్నిని నిమిషాలమీద అన్ని  ఇళ్ళకూ పాకించి మహోపకారం చేశాడు హనుమకు .మహా దారుణ నష్టం కలిగించాడు లంకకూ రావణ సమూహానికి .ఇప్పటిదాకా వాడు వీచమంటే వీయటం, వద్దంటే మానేయటంలా ఆయన బానిస బతుకు గడిపాడు .ఇప్పుడు తనకోపం పగ ప్రతీకారం తీర్చుకోవటానికి ప్రళయ  జంఝ లా విజ్రు౦భించాడు .తనకూ ఒక చాన్స్ లంకాదహనం లో లభించినందుకు మహదానందపడ్డాడు.

 బంగారు కిటికీలు ,ముత్యాల మణుల రత్నాల తో నిర్మిత భవనాలు మాడి భస్మమైపోయాయి .పుణ్యం తీరగానే ఆకాశం నుంచి నేలకు పడిన సిద్ధుల భవనాల్లాగా రాక్షసభవన విమానాలు విరిగి నేల గూలాయి –

‘’తాని భగ్న విమానాని నిపేతు ర్వసుదాతలే-భవనానీవ సిద్ధానా మంబరాత్ పుణ్య సంక్షయే’’

అందమైన విలాసవంతమైన తమభవనాలన్నీ తగలబడుతుంటే,కాపాడుకొనే ప్రయత్నాలు చేస్తూ యజమానులు ‘’అయ్యో !అగ్నియే వానర రూపం లో వచ్చి దహించింది ‘’అని ఏడుస్తూ ,పారిపోతున్న చేసే భీకర నాదాలు అన్ని వైపులనుంచి  వినిపించాయి’’-

‘’నూన మేషోగ్నిరాయాతః కపి రూపేణ హో యితిః

పాలుతాగే పసిపాపలను చంకనెత్తుకొని స్త్రీలు కురులు వదిలేసి ,ఆక్రందనం చేస్తూ తగులబడుతున్న ఇళ్ళ నుండి నేలపై బడ్డారు –‘

‘’క్రందత్య స్సహసా పేతుః  స్తనంధయధరాఃస్త్రియః –కాశ్చి దగ్నిపరీతేభ్యో హర్మ్యేభ్యోముక్త మూర్ధ జాః’’

అట్లా పడినా వాల్మీకికి  వాళ్ళు ఆకాశం నుంచి నేలమీద పడిన మెరుపుతీగాల్లాగా కనిపించారు-

‘’పతంత్యో రేజిరేభ్య స్సౌదామినస్య ఇవా౦బరాత్ ‘’

కాలిన  భవనాలనుంచి వాటికి అలంకరించిన వజ్ర వైడూర్య రత్న,ముత్య,వెండి బంగారాదులన్నీ కరిగి ‘నీఱై’’అంటే భస్మమై అంటే బంగారమైప్రవహించటం హనుమ చూశాడు .రత్నం లోనూ బొగ్గు లోనూ ఉండే మూలపదార్ధం ఎలిమెంట్ కార్బన్ అనే పరమ సత్యం ఇక్కడ ఆవిష్కారమై౦ దని పించి౦దినాకు .వజ్రంకాలిస్తే వచ్చేది బొగ్గే .

అగ్ని కట్టెలు ,గడ్డి చేత తృప్తి చెందదు.అలాగే హనుమ రాక్షస గృహ దహనంతో తృప్తి చెందలేదు ,అలాగే భూమి కూడా చావబడిన రాక్షసుల చేత తృప్తి చెందలేదట ‘.మూడూ పంచభూతాలలోనివేగా .వాటికి దాహం ఎక్కువ . అందుకే ఈ నష్టం వాళ్లకు ఆనలేదు తృప్తి కలిగించలేకపోయింది .ఇంకా ఎక్కువ నష్టం కావాలన్నమాట

‘’వజ్ర విద్రుమ వైదూర్య’ ముక్తా రజత స౦హితాన్-విచిత్రాన్ భవనాన్ ధాతూన్ స్యన్దమానాన్ దదర్శ సః’’

‘’నాగ్నిస్త్రుప్యతి కాష్టానా౦ ,తృణానాంహరియూధపః –నాగ్నేర్నాపి విశస్తానాం రాక్షసానాం వసుంధరా ‘’

 తగల లబడిన సకల వస్తుజాలం మోదుగ పువ్వుల్లాగా ,బూరుగ పూలలా ,కు౦కుమలా వాటి ద్రవ్య స్వభావాన్ని బట్టి ప్రకాశించాయి .త్రిపురాలు రుద్రునిచే కాల్చబడినట్లు ,లంకానగరం వేగవాన్ బలవాన్ మహాన్  హనుమాన్ చేత దగ్ధం చేయబడింది-

‘’హనూమతా వేగవతావానరేణ మహాత్మనా –లంకాపురం ప్రదగ్ధం  త రుద్రేణ త్రిపురాయథా’’

హనుమ   అంటించి విడిచిన అగ్ని లంకాపురాగ్రాన ప్రజ్వరిల్లిన భయంకరాగ్ని ,జ్వాలానల సమూహాలను ప్రజ్వ లింప జేసి విరాజిల్లింది . వాయువు  తోడైన  ఆ ఆగ్ని,ప్రళయాగ్ని వేగంతో పొగ లేకుండా ప్రకాశిస్తూ ,రాక్షస భవనాలలో తిరుగాడుతూ ,రాక్షస శరీరాలు అనే నేతితో ప్రజ్వరిల్లజేయబ డిన జ్వాలల్లాగాఆకాశం అంటుతూ పెరిగాయి –

యుగాన్తకాలానల ఉల్య వేగ –స్సమారుతో గ్నిర్వవృదే దివి స్పృక్-‘’విదూమ రశ్మి ర్భవనేషు సక్తో –రక్షశ్శరీరాజ్య సమర్పితార్చిః’’

ఆ మహాగ్ని కోటి సూర్య ప్రభా భాసితంగా ,లంకానగరం అంతా చుట్టి వ్యాపి౦చి పిడుగుల్లాంటి భయంకర శబ్దాలు చేస్తూ ,బ్రహ్మాండాన్ని బద్దలు చేస్తోందేమో ననిపిస్తోంది-

 –ఆదిత్య కోటీర సదృశ స్సుతేజా –లంకాం సమస్తాం పరివార్య తిస్టన్-లంకాం సమస్తాంపరివార్య తిస్టన్-శబ్దై రనేకై రశని  ప్రరూఢై-ర్భిందన్నివాండం ప్రభవౌ మహాగ్నిః ‘’

ఆకాశ పర్యంతం వ్యాపించిన  ఆ ఆగ్నిరూక్ష కాంతితో,మోదుగుపూల రంగుమంటలతో కనిపించి క్రమగా మంటలు తగ్గి ,పొగ చేత వ్యాపించిన మేఘాల్లాగా నల్లకలువల్లాగా ప్రకాశించాయి –

‘’తత్రామ్బరా దగ్ని రతి ప్రవృద్ధో –రూక్ష ప్రభః కింశుక పుష్ప చూడః-నిర్వాణ దూమాకుల రాజయశ్చ-నీలోత్పలాభాః ప్రచకాశిరే భ్రాః’’

‘’ ఈకోతిగాడుయముడో ,వరుణుడో ,వాయువో ,రుద్రుడో అగ్ని,సూర్య కుబేర చంద్రుడో అయిఉంటాడు .కేవల వానరుడు మాత్రం కాదు .స్వయంగా యముడేమో””?ఒక వేళఅన్నిలోకాలకు తాత ,సకల జీవ పోషకుడు ఐన బ్రహ్మ కోపం సకల రాక్షస సంహారానికై వీడి రూపం లో వచ్చినదా  ?-

-కిం బ్రాహ్మణ స్సర్వ పితామహస్య -‘’సర్వస్య ధాతుశ్చతురాననస్య –ఇహా  గతో వానర రూపదారీ –రక్షోప సంహార కరః ప్రకోపః ‘’

‘’మూడు విధాలుగా పరి చ్ఛేద శూన్యమైనదీ ,ఇంద్రియ గోచరం కానిదీ ,కేవల మనసుకూ తెలియ శక్యం కానిదీ ,అద్వితీయమైనదీ ,ఐన వైష్ణవ తేజం తన అసాధారణ ఆశ్చర్యకర శక్తితో ఈ కపి రూపం దాల్చి వచ్చిందా ?’’అని జ్ఞానాదధికులైన రాక్షసులు అందరూ ఒక చోట చేరి చర్చించుకున్నారు –

‘’కిం వైష్ణవం వా కపి రూప  మేత్య –రక్షో వినాశాయ వరం సుతేజః –అనంత మవ్యక్త మచిన్త్యమేకం-స్వమాయయా సాంప్రత మాగతమ్ వా ‘’

 లంకలోని సకల వస్తుజాలం రాక్షస ,అశ్వ ఏనుగు ,పక్షి మృగాలు భీకరమైన అరుపులతో రథ, వృక్షాదులు కాలటం వలన ఏర్పడిన ధ్వనితో ఆ లంక దీన స్థితి లో భీకరధ్వనులు కలది అయింది చేష్ట లుడిగి .

‘’అయ్యో తండ్రీ !అయ్యో కొడుకా !అయ్యో ప్రియుడా !మిత్రుడా !పుణ్యాలతో  మంచి భోగాలు అనుభవించినఓ జీవితమా !’’అనుకొంటూ రాక్షసులు చేసే దీనాలాపనలు అంతటా వ్యాపించి భయం గొలుపుతున్నాయి –

‘’హా తాత హా పుత్రక కాంత మిత్ర –హా జీవితం భోగయుతం పుణ్యం –రక్షోభి రేవం బహుదా బృవద్భిః  -శబ్దః కృతో ఘోరతర స్సుభీమః ‘’

 అందరూ అన్ని విధాలుగా శాపోప హతుల్లా చనిపోయినట్లుంది నగరం .ప్రళయ కాలం లో భగవంతుని కోపం తో నాశనం చేయబడిన  భూమి  లాగా ఉన్న దీనమైన లంకను హనుమ చూశాడు .చేయాల్సిన విధ్వంసం అంతా చేసేసి ,ఇక తనకు ఏమీ పట్టనట్లు కిమిన్నాస్తి గా ఉండిపోయి త్రికూట పర్వతం పై హాయిగా కూర్చున్నాడు .ఒకసారి రాముడిని మనసులో స్మరి౦చాడు .ఇలాంటి దానికోసం ఆకాశం లో కాచుకు కూర్చున్న దేవతలు పొగడ్తలజల్లు కురిపించారు .ఈవనం తగులబెట్టటం,లంకాదహనం చేసిన హనుమాన్ ను వాల్మీకి మనసారా పొగడ్తలు చేసి తన ఆనందాన్నీ పొందుపరచి మనకూ ఆనందం కూర్చాడు –

‘’మహాబలం మారుత తుల్యవేగం ,మహామతిం వాయు సుతం,వరిష్టం-ప్రతుస్టువుర్దేవ గణాశ్చసర్వే’’

‘’భంక్త్వా వనం  మహా తేజా హత్వా రక్షాంసిసంయుగే –దగ్ధ్వా లంకాపురీం రమ్యాం రరాజ స మహాకపిః’’

  దేవతలతో పాటు కోరస్ పాడారు గంధర్వ,సిద్ధ ,మహర్షులు .వీరికి ఆనందం ,ఆశ్చర్యమూ  కలిగాయి –

‘’తత్ర దేవా స్స గంధర్వా  స్సిద్ధాశ్చ పరమర్షయః –దృష్ట్వా లంకాం ప్రదగ్దాం తాం విస్మయం పరమం గతాః’’

హనుమను చూసి సకల భూత గణాలు ప్రళయాగ్ని అనుకొన్నాయి .వీరితో పాటు వంతకలిపారు విద్యాధర నాగ రాక్షస ,యక్ష మహాభూతాలు మహదానందంగా .అక్కడ వాళ్ళు లంకలో ఏడ్పులు ,పెడబొబ్బలు .ఇక్కడ ఆకాశం లో వీరంతా కేరింతలు ,పులకరింతలు అభినందనలు .’’ఒళ్ళు కాలి ఒకడు ఏడుస్తుంటే చుట్టకాల్చుకోటానికి నిప్పు కావాలని అడిగాడు వేరొకడు ‘’అన్న సామెతగా ఉంది దృశ్యం .

‘’దేవాశ్చ సర్వేముని పుంగ వాశ్చ-గ౦ధర్వ విద్యాధర నాగ యక్షాః- భూతాని సర్వాణి మహా౦ తి తత్ర –జగ్ముః  పరాం ప్రీతి మతుల్య రూపం ‘’.

  ఇది 51శ్లోకాల 54 వ సర్గ .

ఇదంతా హనుమ’’ లంకాదహన విభూతి యోగమే’.కడుపు  నిండా కాల్చాడు లంకను. కళ్ళనిండా ఆ కాల్పుల దృశ్యాలను చూసుకొన్నాడు .రాక్షసుల ఆర్తనదాలు వీనుల విందుగా విన్నాడు .సీతాపహరణం అనే పెద్ద తప్పుకు శాంపిల్ చెప్పుదెబ్బ గా చేశాడు .ఇన్నిఇళ్ళు మాడి మసి అయి మహా తేజస్సుతో ఉన్న లంకానగరాన్ని మరు భూమిగా మార్చాడు .రావణ రాక్షసుల గర్వానికి రెండవ పెద్ద దెబ్బ కొట్టాడు .భవిష్యత్తులో విభీషణుడు దుస్ట రావణుడి చెంత ఉండలేడని ,మహా వైష్ణవ భక్తుడు కనుక రామపాదాలను తప్పక చేరుతాడని , చేరక తప్పదని  ఊహించి కూడా ఆ ఇంటి జోలికి పోలేదు..చాలామంది రాక్షసుల కొంపలు తగులబెట్టాడు .ఈపేర్లన్నీ ఎలా తెలుసు ఆయనకు ?బయట నేమ్ ప్లేట్లు పెట్టుకొన్నారా ? అనుకోవచ్చు.ఏ కావ్యంలోనైనా  రచనలోనైనా గ్రంథకర్తే చెబుతాడు   .

  ఈ దహనకాండ సర్గలోనూ  మహర్షి వాల్మీకి చాలసందర్భ శుద్ధిగా ఉపమాలంకారాలు వాడి శ్లోకాలకు శోభ కూర్చాడు .చెప్పాల్సిన విషయం స్పష్టంగా అర్ధమయేట్లు చెప్పి రంజింప జేశాడు .అగ్నికి సంతర్పణం చేస్తానన్నాడు హనుమ . సుమారు యాభై ఏళ్ళ క్రితం వరకు ఆంద్ర దేశం లో  కాశీ రామేశ్వర తీర్ధ యాత్రలు చేసిన వారు ఇళ్ళకు క్షేమ౦గా తిరిగి వచ్చినప్పుడుఇళ్ళ వద్ద ఆయా దేవతాపూజ చేసి కాశీ సంతర్పణ రామేశ్వర  సంతర్పణ చేసి  బంధు మిత్రగణాలను ఆహ్వానించి ,తాము తెచ్చిన గంగోదకం పాత్రలు, కాశీ కాలభైరవ తోరాలు పంచిపెట్టి కమ్మని విందు ఇచ్చేవారు .అప్పుడు ప్రయాణ సౌకర్యాలు తక్కువ కాశీకి వెళ్ళినవాడు తిరిగి వస్తాడనే నమ్మకం తక్కువున్న కాలం ,‘’కాశీకి పోయిన వాడు కాటికి పోయిన వాడితో సమానం ‘’అన్న సామెత బాగా వ్యాపించి ఉన్నకాలం కనుక అంతటి ఆనందోత్సవాలు జరిపేవారు .ఉత్తర భారతం లో కూడాఇలాంటివి జరిపేవారా ?మనకు తెలీదు .కాని వాల్మీకి మాత్రం చక్కని ‘’తెలుగు సంతర్పణ ‘’చేయించాడు అగ్ని హోత్రుడికి లంకాదహనం తో .

 కాలే లంకా ,అందులోంచి వచ్చే పిడుగుల్లాంటి వింత ధ్వనులు ,కార్చిచ్చులాంటి వాలాగ్ని ,జ్వాలాగ్ని రంగు మోదుగు పూలలా ఉందనటం ,దహ్యమాన వస్తువుల కు అనుగుణంగా అగ్ని శిఖమోదుగ, బూరుగు ,పూల రంగు ,కుంకుమవర్ణ శోభితమవటం మహా గొప్ప అలంకారాలు .విలువైన రత్న వజ్ర స్వర్ణ రజతాదులు కాలి ప్రవాహమై ప్రవహించటం కళ్ళకు కట్టినట్లు వర్ణించాడు కవి వాల్మీకి .అగ్నికి ఆహుతైన జనం పెట్టె శోకాలు ,హృదయ విదారకంగా చూపాడు .తండ్రులను కొడుకులను పిల్లలను భర్తలను భార్యలను మిత్రులను కోల్పోయిన వారి రోదనాలు ఎంతటి కర్కోటక హృదయాన్నైనా ద్రవింప జేస్తుంది .అదీ కవితా శిల్పం .

  కాలి బూడిదైన లంక శాపం చేత దగ్ధమైనట్లు  ,ప్రళయం లో భగవంతుని కోపం చేత నాశనం చేయబడిన భూమిలా కనిపించిందని సొగసైన వర్ణన చేశాడు .అసలు ఇంత వినాశనానికి కారణం ఏమిటి అని వితర్కి౦చుకొన్నారు జనం.దిక్పాలకులలో ఎవరో ఒకరు వానర రూపం లో వచ్చి ఉండాలని ,లేకపోతె సకల లోక పితామహ బ్రహ్మదేవుని కోపమే ఈ రూపంలో వచ్చి నాశనం చేసిందని కొంచెం పై ఆలోచన ఉన్నవారు భావించారు .ఎవరూకాడు యమధర్మరాజే లేక ప్రళయకాల రుద్రుడే  వచ్చి ఉంటాడు ‘’బాబాయ్’’ అనుకొన్నారు మరి కొందరు .ఆ పై స్థాయి బుద్ధి సూక్ష్మత ఉన్నవారు మాత్రం’’రచ్చ బండ’’ దగ్గర చేరి తీరికగా  సృష్టి,స్థితి లయాలకు  ఆదిమూలం,త్రివిధ పరిచ్చేద్య శూన్యం ,ఆద్యంతాలు లేని ,అద్వితీయమైనది మనోవాగతీతమైనది,తెలుసుకోవటానికి అసాధ్యమైనది   అయిన పరబ్రహ్మ౦  అనే వైష్ణవ తేజమే ఆశ్చర్య శక్తితో కపి రూపంగా వచ్చి౦ది అనుకొన్నారు .విష్ణుమూర్తికి మహాకపి అనే పేరు కూడా ఉంది కదా .ఈ ఊహ బాగానే ఉంది . ఇందరి ఊహలకు హనుమ  గొప్ప పనికల్పించాడు తాను  చేసిన లంకాదహనం తో .ఇదీ ఆయన వ్యక్తిత్వంలో ఒక భాగమే .

  ఇది లంకా దహనమే కదా ఏదో పైపైన లాగించేద్దాం అనుకోని మొదలుపెడితే ఏదీ వదలానిపించక అన్నిటినీ  స్ప్రు శి౦చాల్సి  వచ్చింది .దేన్నీ విడువ బుద్ధికాలేదు .అంతటి చిక్కదనం చక్కదనం ఉంది ఈ సర్గలో .కవి మహర్షి వాల్మీకి కి మరోమారు కైమోడ్పులు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -16-6-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సరసభారతి పుస్తక ప్రసాద వితరణ

సాహితీ బంధువులకు శుభ కామనలు -శ్రీ శార్వరి ఉగాది వేడుకలలో సరసభారతి మార్చి 22వ తేదీ 3పుస్తకాలు ఆవిష్కరించి ,ప్రముఖులకు పురస్కారాలు  అందించి ,కవిసమ్మేళనం ఘనంగా నిర్వహించాలనుకొన్న ప్రయత్నం కరోనా వ్యాప్తి ,లాక్ డౌన్ వలన సాధ్యం కాక మాశ్రీ సువర్చలాన్జనేయ స్వామి పాదాల వద్ద ఆ మూడు పుస్తకాలు ఉంచి ,ఆవిష్కరించి నట్లు గా భావించాం . అప్పటికే ఉయ్యూరుకు వచ్చిన అతిధులకు మా ఇంట్లోనే సన్మానించి పురస్కారాలు,పుస్తకాలూ  అందజేశాము అనే  ఇదివరకే మీకు తెలియ జేశాము  .

  ఎప్పటికప్పుడు లాక్ డౌన్ పొడిగింపు వలన మిగిలినవారిని  పిలవటం కుదరక వదిలేసాం ”
 ఐతే  దేవాలయం లో జరిగిన శ్రీ హనుమజ్జయంతి ,కళ్యాణం సందర్భంగా వచ్చిన భక్తులు సుమారు 90మందికి మూఢుపుస్తకాల 30సెట్లు  అందజేశాము
 బస్సులు రైళ్లు కదలిక ప్రారంభమయ్యాక ఆహ్వానింపబడిన అతిధులకు కవి మిత్రులకు ,బుక్ పోస్ట్ లో మూఢుపుస్తకాల సెట్ లు జూన్ 3నుంచి ఈ రోజు16 వ తేదీవరకు 14రోజులలో బంధుమిత్రులు అభిమానులు స్పాన్సర్లు లకు ,శ్రేయోభిలాషులకు 110 సెట్లు అంటే 330 పుస్తకాలు ,కొరియర్ ద్వారా 33మందికి అంటే 99పుస్తకాలు ,అమెరికాలో మా అమ్మాయికి 20పుస్తకాలు( ,ఊసుల్లో )ఒంటిమిట్ట డాక్టర్ శివ గారిద్వారా అక్కడ మిత్రులకు 30పుస్తకాలు_(సోమనాధ్ -కాశీ ) ,మా ఇంట్లో సన్మానించినవారికి ఇంటికి వచ్చినవారికి 15సెట్లు అంటే 45పుస్తకాలు అందజేశాము .అంటే మొత్తం-188 సెట్లు ,అనగా 564పుస్తకాలు  విడిపుస్తకాలు 20+30= 50  మొత్తం 614పుస్తకాలు మహదానందంగా ఉచితంగా ,పవిత్ర కర్తవ్యంగా అందజేశాము . ఎప్పుడు ఆహ్వానించినా వెంటనే స్పందించి వచ్చి జయప్రద0చేసే కవిమిత్రులు  రాలేక పోయారు కనుక వారి ఇళ్లకు పుస్తకాలు పంపి వారిని సంతృప్తి పరచాలన్నది నా ధ్యేయం . ఈ 14రోజులూ పుస్తకాలలో వారి పేర్లు  రాయటం సెట్ లను ,కవర్ లలో పెట్టటం అడ్రస్ లు రాయటం , తగినన్ని స్టా0పులు  అంటించి,ట్వైన్  దారంతో గట్టిగాకట్టటం  అంతా ఒంటిచేత్తో చేశాను .వీటిని పోస్టాఫీస్కు తీసుకువెళ్లి పోస్ట్ బాక్స్ వేసే పని మా మనవడు చరణ్ ,మనవరాలు రమ్య సమర్ధంగా చేశారు ,ఒక్కోరోజు 15నుంచి 20పాకెట్స్ పంపాము . స్థానిక పొస్తల్  డిపార్ట్మెంట్ వారి సౌజన్యం ముఖ్యంగా     మా పోస్ట్ మాన్  కమ్ సార్దర్  శ్రమ మరువ లేనిది .అలాగే వివిధ పోస్టాఫీసులలో ఉన్న పోస్టల్ సిబ్బంది ,డెలివరీ చేసిన పోస్ట్ మెన్  సేవలు శ్లాఘనీయం . పుస్తకాల సెట్ అందినవారంతా మెయిల్ లేక ఫోన్ ద్వారా తెలియజేయటమూ అభినందనీయం .ఇలా సాహితీ సేవలో అందరం భాగస్వామ్యులయ్యామని సంతోషంగా ఉంది మరొక్కమారు అందరికి సరసభారతి తరఫున ,నా తరఫున ధన్యవాదాలు తెలియ జేస్తున్నాను -దుర్గాప్రసాద్-16-6-20
Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

బక దాల్భ్యుడు -17

బక దాల్భ్యుడు -17

              పక్షిరాక్షసి

ఇప్పటి దాకా మనకు  తెలిసిన  అనేక  వృత్తాంతాలప్రకారం బక పేరుతొ ఉన్న అనేక పాత్రలు కృతఘ్నత అపనమ్మకం ,కపటం ,మాయ లకు ఆనవాలు గా ఉన్నాయి .దీనితోపాటు దైవీభూతమైన కొన్నిపాత్రలు రాక్షస అసురులులాగా భయంకర బకాలుగా కూడా ఉన్నాయి .అందులో చివరిది రాక్షస తత్త్వం .కొంగముఖం లో ఉండే యముడి మంత్రి గురించి చిత్రరూప   కొంగల గురించీ తెలుసుకొన్నాం .వీటన్నిటి వలన మనం నేర్వదగిన  సత్యం నీతి ఒకటి ఉన్నది .ఇలాంటి మనస్తత్వమున్నవాళ్ళు పతనం చెందుతారు .వైష్ణవ ఉపనిషత్ లో బకాసురుడు పొగరు బోతు. గర్వానికిప్రతిఇది –కృష్ణ –ఉపనిషత్ 14-‘’గర్వోరాక్షసః గర్వో బకః’’.కొన్నిపురాణాలలో బక కు బహు వచనాలూ ఉన్నాయి .బ్రహ్మాండ పురాణం  క్రూర భయంకర రాక్షససమూహాన్ని ‘’బకులు ‘’అన్నది.వీళ్ళు వృత్రాసురుని కొడుకులే  కాని తర్వాత ఇంద్రుడికి సేవకులయ్యారు .బక,యక్షరాజు కుబేరుడికీ సంబంధమున్నది .వాయు పురాణం యక్ష మణివర కొడుకుల్లో బకపేరున్నవాడు న్నాడు -69.160.మణి వరుని కొడుకులను గుహ్యకులనీ వీరు కైలాసంలో   రాజాస్థానంలో ముఖ్యులని కూడా చెప్పింది .బక రాక్షసుడిని భీమ, కృష్ణులు సంహరించారు .కనుక ‘’దావే’’పండితుడు ఇలాంటి దాన్ని ‘’పక్షిరాక్షసి ‘’అన్నాడు.

భారతం ఆదిపర్వంలో ‘’బకవధ ‘’ఉపాఖ్యానం-1.145-152.  ద్రౌపది పాత్ర ప్రవేశానికి ముందు హిడింబాసుర వధ జరిగింది .పాండవులు తల్లి కుంతీ దేవితో సహా సంచారం చేస్తూ గంగానదీ తీర ఏక చక్రపురం లో బ్రాహ్మణ వేష ధారణతో గడిపారు . అది ద్రుపద రాజు పాలనలో ఉన్న ‘’వేత్రకీయాగ్రహారం ‘’.ఒకరోజు నలుగురు సోదరులు భిక్షకువెడితే ఇంట్లో కుంతీ ,భీముడు ఉన్నారు .తమకు స్థానం ఆతిధ్యం ఇస్తున్న బ్రాహ్మణ కుటుంబం లో రోదనలు వినిపించాయి .కారణం అడిగితే యజమాని వివరించాడు -1.148-152.’’పురుషాదక’ మనుషులను తినే బకాసురరాక్షస రాజు  సంరక్షణలో లో తమప్రాంతం ఉందనీ వాడు గొప్పరాక్షస గణంతో దగ్గరున్న అరణ్యంలో ఉంటాడని ,రక్షణకోసం వాడికి రోజూ ఒక మనిషి, దున్నపోతులబ౦డీతో బండెడు అన్నం పంపాలనీ ఆరోజు తమ గృహం వంతు వచ్చిందని ,వాడికిఆహారం సమర్పించటం తమకు అసాధ్యమనీ చెప్పాడు .అప్పుడు కుంతి వారిని ఓదార్చి తనకొడుకు భీముడు అత్యంత బలసంపన్నుడు తెలివి తేటలున్నవాడు కనుక తాను  అన్నం బండీతో అతడిని బకాసురుని దగ్గరకు పంపిస్తాననీ అభయమిచ్చి౦ది -149.14.’’వీర్యవాన్ మంత్రసిద్ధాస్  చ తేజస్వి ‘’.భీముడు మాంచి హుషారుగా వెళ్లి వాడిని పేరుపెట్టి బిగ్గరగా పిలిచాడు .అప్పటికే బండీలో ఉన్న అన్నమంతా భీముడు తినేశాడు .వాడు వచ్చి చూసి గర్జించి భీముడితో తలపడ్డాడు .వాడిని సునాయాసంగా రెండుగా చీల్చేశాడు భీమ .వాడు చావగానే వాడి అనుచరులంతా భీముడికి స్నేహితులయ్యారు .వాడి శరీరాన్నీ  ఈడ్చుకు వచ్చి  ఏక చక్రపురసి౦హద్వారం  వద్ద పడేసి,ఇక వాడి వలన ప్రమాదం తప్పిందని చాటాడు .బకవధ వృత్తాంతం పై మేడలిన్  బియార్డో,వ్యాఖ్యాత్రి ఆల్ఫ్ హిల్టే బీ లిటిల్ ల రచనలను బట్టి భారతీయ కొంగల మైధాలజి అర్ధం చేసుకోవటం తేలికయినది .కాని రాక్షస బకులకు ,సాధారణ కొంగలకు మధ్యున్న లింక్ తెలియాలి .

  హిటెల్  బీటెల్  అంచనాప్రకారం ‘’వేట్రకీయాగ్రహారం ‘’బ్రాహ్మణ సంస్కృతికి విరుద్ధ౦గా ఉండే  చిత్తడి భూమి .బకరాక్షాస నివాసం ఇదే .బక అనే కొంగపచ్చి మాంసం ,చచ్చిన చేపలు తింటుంది .బకాసురుడు బ్రహ్మరాక్షసజాతి వాడు అంటే  బ్రాహ్మణుడు శాపవశాన రాక్షసుడైన వాడు .బలహీన రాజు వలన వాడి ఆటలు సాగాయి .బకుడు సంక్షోభ కారకుడు .ఐతే బకుడు రాక్షసుడు అవటంలో ప్రతీక ఏమిటి ?కొంగలకు చేపలకు సంబంధమేమిటి?

 బకుడి లాంటి వారి నైతికత వారి సామాజిక నేపధ్యంపై ఆధార పడి ఉంటుంది .బ్రాహ్మణుడుగా బకుడు ని౦ద్యుడే కాని క్షత్రియుడుగా వందనీయుడే .బ్రహ్మ రాక్షస గుణం అతడి లోనిక్షత్రియ బక సంజాతమే ,కాని బ్రాహ్మణులకు భీకరమైనది .అణచబడిన బ్రాహ్మణుల తీవ్రస్వభావానికి ప్రతీక .బక రాక్షసుడు భారతం లో బ్రహ్మరాక్షసుల ప్రతినిధి .రామాయణం లో రావణాసురుడు లాగా .పులస్య  బ్రహ్మ  సంజాతులు  కనుక రాక్షసులంతా బ్రాహ్మణులే .ఇప్పుడు పులస్య రాక్షసుల మధ్యలింకేమితో తెలుసుకోవాలి .పద్మ పురాణం లో పులస్త్యుడు దాల్భ్యుడికి వైష్ణవం బోధించాడు .కనుక పులస్యుడికి బకుడికి ఈరక మైన  గురు శిష్య సంబంధం అంటే పులస్త్య  రాక్షసులకు కూడా ఉన్నట్లేకదా .కనుక పద్మపురాణ  దాల్భ్యుడు అంటే బక దాల్భ్యుడే .అంతేకాక పులస్త్యుడు రాక్షస వంశ మూల పురుషుడు కూడా . కనుక అనుమానాస్పద వ్రాత్య లేక అసుర లక్షణం అంతర్గతంగా పితృపరంగా దాల్భ్యుడికి అనువంశికంగా చేరిందన్నమాట .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -15-6-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-51

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-51

విభీషణుడి మాటలకు తలపంకించి రావణుడు ‘’బాగా చెప్పావు .దూతను వధించటం ని౦ద్యమే .కనుక వేరే దండన విధించాలి .కోతులకు తోక మహా ముచ్చటైన అలంకారం  దాన్ని కాల్చండి.ఆకాలిన తోకతో అతడు ఇక్కడినుంచి వెళ్ళాలి .దీనుడై అంగవైకల్యం తో కృశించిన ఉన్న ఇతడిని  ,సోదర బందుమిత్రాదులుచూడాలి ‘’అని చెప్పి .సేవకులతో ‘’నాలుగు వీధుల్లో వీడిని తోక కాలుతుండగా ,అందరూ చూసేట్లు త్రిప్పండి ‘’అని ఆనతిచ్చాడు –‘’’’సంయగుక్తం హి భవతా దూత వధ్యా విగర్హితా –అవశ్యం  తు వధాధన్యః క్రియతామస్య నిగ్రహః ‘’

‘’కపీనాం లాంగూల మిష్టం భవతి భూషణం –తదస్య దీప్యతాం శీఘ్రం తేన దగ్దేన గచ్ఛతు’’

‘’తతః పశ్యం త్విమం దీన మంగ వైరూప్య కర్శితం –సమిత్ర జ్ఞాతయ స్సర్వే బాంధవా స సుహృజ్జనాః’’

ఆజ్ఞాపయరాక్ష సేంద్రఃపురం సర్వం సచత్వరం – ‘’లాంగూలేన ప్రదీప్తేన  రక్షోభిః పరి ణీయతాం-‘’

 ఇంకేముంది కోతితో ఆడుకోవాలని ముచ్చటపడ్డ రాక్షసులు చినిగిన గుడ్డ పేలికలు తోక కు పూర్తిగా చుడుతుంటే ,కొంటె హనుమ ఇదే సమయమని తన శరీరాన్ని పెంచేశాడు .ఆయన పెంచుతూనే ఉన్నాడు వీళ్ళు చుట్టుతూనే ఉన్నారు .ద్రౌపదీ వస్త్రాపరణంలో చీర ఊడుతుంటే మరో చీర దాని స్థానం లో ‘’కన్నయ్యన్నయ్య’’ కనికట్టుతో చుట్టుకొన్నట్లుంది  దృశ్యం . గుడ్డముక్కలను నూనె తో తడిపి నిప్పు అంటించారు వినోదం చూడటానికి .అవతలి ఇల్లు కాలుతుంటే మనకు వినోదం చూడటానికి తర్వాత కాలేది మన కొంపే కదా అనే ఇంగితం ఉండదు .ఆనిప్పు  వాళ్ళ కొ౦పకే  అన్న సంగతి తెలీదు పాపం వారికి .ఊరుకుంటాడా ‘’కోతిమారాజు’’ ? మండే  తోకతో వాళ్ళను ఎడా  పెడావాయించి  బాదేశాడు.ఇది ‘’శాంపిల్ దెబ్బలే’’ ,తర్వాత చావు దెబ్బలు తప్పవు  .ఇళ్ళల్లోని ఆబాల వృద్ధ రాక్షసులంతా వీధుల్లోకి ఆనందం తో వచ్చి చోద్యం చూశారు .మళ్ళీ రాక్షసులు తనను బంధించగా హనుమ ‘’నేను బంధింపబడి ఉన్నా వీళ్ళు నన్ను వదలరు కనుక బంధనాలు చేదించుకొని ,పైకెగసి వీళ్ళను చంపుతా .నేను  నా యజమాని మేలు కోరి ,ఇక్కడ తిరుగుతుంటే ,దుర్మార్గులు వీళ్ళు నన్ను బంధించారు .దానికి ప్రతీకారం చేయలేదు .వీళ్ళందర్నీ చంప టానికి  నేను ఒక్కడినే చాలు .రాముడు ప్రతిజ్ఞ చేశాడుకనుక అయన ప్రీతికోసం నన్ను నాల్గు వైపులా త్రిప్పుతారు వీళ్ళు . శ్రమ లేకుండా లంక అంతా చూసే అవకాశం కలుగుతోంది కనుక వాళ్ళ ఆగడాన్ని సహిస్తాను .నేను రాత్రిపూట లంకలో తిరిగాను కనుక నగర రక్షణ దుర్గాలు ,ఇతర విషయాలు తెలుసుకోవటం కుదరలేదు . ప్రాతః కాలం లో లంక అంతా పరిశీలించి చూస్తాను .నన్ను బాధించినా ,పీడించినా సహిస్తాను ‘’అనుకొన్నాడు యుక్తియుక్తమైన ఆలోచన .వచ్చిన పని ఏవిధంగా నెరవేరుతుంది ఇదంతా చూడకుండా ?కిష్కింధకు వెడితే ఇక్కడి విషయాలు అడిగితె ఏం చెబుతాడు ?షేక్స్పియర్ మొహం వేయాల్సి వస్తుంది .తన ఆకారం కప్పి పుచ్చుకొనగా హర్షాతి రేకంతో  అతడిని పట్టి తీసుకు వెడుతూ శంఖాలు ఊదుతూ భేరీలు మోగిస్తూ రచ్చరచ్చగా  వీధులన్నీ త్రిప్పారు .తిరుగుతూ బాధ భరిస్తూ లంకను కూలంకషంగా పరికించి పరిశీలించి,పరిశోధించి  చూశాడు.మహా వీధులు ,క్రాస్ రోడ్లు ,సందులు గొందులు చిన్నా ,పెద్దా ఇళ్ళూ, భవనాలు అంతర్ద్వార, బహిర్ద్వారాలు ,లోగిళ్ళు ,ముంగిళ్ళు పరీక్షించి చూసి అవగతం చేసుకొన్నాడు .’’వీడు దొంగ దొంగ ‘’అని పరిచయం చేస్తూ ,అరుస్తూ త్రిప్పారు .పాపం ఎంతటి కాక తగులుతూ ,బాధ భరిస్తూ ,రామకార్య నిర్వహణకోసం,అవమానమూ  ఓర్చుకున్నాడో రామభక్త హనుమ .కార్య దీక్ష అంటే అదీ .

‘’చత్వరేషు చతుష్కేషు రాజమార్గే తథైవచ –ఘోషయంతికపిం సర్వే’’చారీక ‘’ఇతి రాక్షసాః’’

  ఈ వార్త సీతకు రాక్షస స్త్రీలు  –‘’సీతా !నీతో మాట్లాడిన ఆ ఎర్రమూతికోతి తోకకు నిప్పెట్టి రాక్షసులు లంకానగరం అంతా తిప్పుతున్నారు’’అని చెప్పారు

‘’యస్త్వయా కృత సంవాద స్సీతే  తామ్రముఖః కపిః-లాంగూలేన ప్రదీప్తేన సఏష  పరిణీయతే’’

  ఆమాటలకు సీత తన ప్రాణాలనే అపహరించినట్లు దుఖపడి అగ్నిని ధ్యాని౦చిఉపాశించింది  –‘’అగ్ని దేవా !నేను పతి సేవ ,తపస్సు చేసి ఉంటె ,పతివ్రతనైతే నువ్వు హనుమంతుని శరీరం కాలకుండా చల్లగా ఉండేట్లు చేయి .దీమంతుడైన నాపతి పై కొంచెమైనా దయ ఉంటె ,హనుమ శరీరాన్ని కాల్చక చల్లగాఉండు.నేను పాతివ్రత్యంతోఉన్నట్లు  రామ సమాగమనం కోసం ప్రతీక్షిస్తున్నట్లు ,ధర్మాత్ముడైన రాముడికి తెలిసిఉంటే ,హనుమ అనుకొంటే హనుమపట్ల చల్లగా ఉండు .సత్యప్రతిజ్ఞ కల పూజ్య సుగ్రీవుడు నన్ను ఈ దుఃఖసాగరం నుంచి తరి౦ప జేసెనేని ,నువ్వు హనుమంతుని బాధించక చల్లగా ఉండు ‘’   అని పరిశుద్ధ మనసుతో నాలుగు శ్లోకాలతో  ప్రార్ధించింది –

‘’మంగళాభి ముఖీ తస్య సా తదాసీ న్మహాకపేః-ఉపతస్థే విశాలాక్షీ ప్రయాతా హవ్యవాహన౦ ‘’

‘’యద్యస్తి పతి శుశ్రూషా యద్యస్తి చరితం తపః –యది చాస్త్వేక పత్నీత్వం’’శీతో భవ హనూమతః’’ ‘’

‘’యది కించి దనుక్రోష స్తస్య మయ్యస్తి ధీమతః –యది వా భాగ్య శేషో మే ‘’శీతో భవ హనూమతః ‘’

‘’యది మాం వృత్త సంపన్నానాం ,తత్సమాగమలాలసాం –స విజానీతి ధర్మాత్మా ‘’శీతో భవ హనూమతహః ‘’

‘’’యది మాం తారయేదార్య ’స్సుగ్రీవ స్సత్య సంగరః –అస్మాద్దుఖా౦బుసంరో’’ధాచ్ఛీతో భవ  హనూమతః ‘’

‘ఆమె ప్రార్ధనలు విని వేడి తోక లోని అగ్ని శాంతించి  ,సీతాదేవితో’’ హనుమ కు శుభమే’’ అని తెలియ జేస్తున్నట్లుగా ప్రదక్షిణ జ్వాలతో మండాడు .అ అనలమే చల్లబడితే తండ్రి అనిలుడు ఊరు కుంటాడా ?తనవంతు కర్తవ్యాన్నీ తీరుస్తూ మంచులాగా చల్లగా వీస్తూ సీతకు ,హనుమకు సుఖం కలిగేట్లు వీచాడు .’’అగ్నికి వాయువు తోడైనట్లు’’అనే  సామెత ఉంది .అగ్ని ప్రమాదం జరిగినప్పుడు గాలిబాగా వీస్తే ఉపయోగించే సామెత .ఇక్కడ రివర్స్ లో అగ్ని చల్లదనానికి వాయువుకూడా మరింత చల్లగా వీచి తామిద్దరం భాయీ భాయీ,జిగినీ దోస్తులం  అని నిరూపించుకొన్నారు .ఇలా అగ్నికి చల్లదనం లో వాయువు తోడుపడటం అరుదైన సంఘటన, దృశ్యమూను.

  ఈ ‘’బిహైండ్ ది కర్టెన్ ‘’విషయం పాపం హనుమకేం తెలుసు ?మనసులో ‘’అగ్ని నన్ను ఎందుకు దహించటం లేదు .పెద్దపెద్ద జ్వాలలేఉన్నా , నాకేమాత్రం బాధ కనిపించటం లేదు చందనం, వట్టి  వేళ్ళ గంధం పూసినట్లు నా తోక చివర చల్లగా ఉందేమిటి ?ఇదంతా రామ ప్రభావమే .ఆయన ప్రభావంతోనే సముద్రమధ్యలో మైనాకుడు పైకి వచ్చాడు కదా .అతనికే రామకార్యం మీద ఆసక్తి ఉంటె ,అగ్ని ఎందుకు సహకరించడు?సీత సౌమ్యత రాముని తేజస్సు ,వాయు దేవుని  స్నేహం వలనా దహించే స్వభావం కల అగ్ని నన్ను కాల్చటం లేదు ‘’అనుకొన్నాడు .

‘’దాహ్యమానేచ లాంగూలేచిన్తయామాస వానరః – ‘ప్రదీప్తోగ్ని రయంకస్మాన్న మాం దహతి సర్వతః –

‘’దృశ్యతే చ మహా జ్వాలః కరోతి న చ మేరుజం –శిశిరస్యేవ సంపాతో లాంగూలాగ్రే  ప్రతిష్టి తః’’

‘’రామ ప్రభావా దాశ్చర్యం పర్వత స్సరితాం వతౌ-యది తావత్సముద్రస్య మైనాకస్య ధీమతః –రామార్ధం సంభ్రమ స్తాదృక్ మగ్నిర్నకరిష్యతి ?

‘’సీతాయాశ్చానృశం స్యేనతేజసా రాఘవస్యచ –పితుశ్చ మామ సఖ్యేన న మాం దహతి పావకః ‘’

వెంటనే సింహ నాదం చేస్తూ పైకి యెగిరి ,రాక్షస సంచారం లేని పురద్వారం దగ్గరకు వెళ్లి ,మళ్ళీ పొట్టి రూపం పొందగా బంధనాలన్నీ విడిపోయాయి –

‘’స భూత్వా శైల సంకాశః క్షణేనపునరాత్మవాన్ –హ్రస్వతాంపరమాం ప్రాప్తో బంధనా న్యావశాతయత్ ‘’

.బంధన విముక్తుడైన వెంటనే మళ్ళీ పర్వతాకారం దాల్చి అక్కడున్న ఇనుప గుదియ చూసి,దానితో కావలి రాక్షసులను వాయి౦ చేసి చంపి  లంకను చూస్తూ తోకనుండి వచ్చే అగ్ని జ్వాలలు మాలగా ఉన్నవాడుగా ,కిరణ సమూహంతో ఉన్న సూర్యుడులా భాసి౦ చాడు హనుమ –

స తా న్నిహత్వా రణ చండ విక్రమః –స్సమీక్ష మాణః‘’పునరేవ లంకాం-ప్రదీప్త లాంగూలాకృతార్చిమాలీ –ప్రకాశాతదిత్య ఇవార్చి మాలీ ‘’

ఇది 45 శ్లోకాల 53వసర్గ

 వనం విరగ్గొట్టి ,పంపిన కింకర ద్వారపాలక మంత్రికుమార సేనాపతులనే ససైన్యంగా చంపిన హనుమ దీమత్వాన్ని అంచనా వేయలేక పోయాడు రావణుడు .లేకపోతె తోకను కాల్చమని చెప్పటం ఏమిటి ?అసలు రాక్షసులు కవ్వి౦చక ముందే అశోక వననాశనం చేశాడు .తోకకాలిస్తే ఇంకేం ప్రమాదం తెస్తాడో అనే బేసిక్ ఆలోచన  మంత్రాంగం తెలిసిన అతడికి రాకపోవటం విడ్డూరంగా ఉంది. కొలువులో అందరు మేదావులున్నా ఎవరికీ ఈ ఆలోచన తట్టలేదు .విభీషణుడికి తట్టే ఉండచ్చు .కానీ చెబితేఈ ‘’మొండి ము౦డావాడి ‘’వల్ల  ఏ ప్రమాదమో ఏదో చంపకుండా వదిలి రాజనీతిని కాపాడుకోనేట్లు అన్నతో చేయి౦చాను కదా అని తృప్తి పడి  మిన్నకుండి పోయాడని పిస్తుంది .హనుమ ‘’మామూలోడు ‘’కాదు .తోకకు గుడ్డలు చుట్టేప్పుడు ,నగర వీధుల్లో త్రిప్పినప్పుడు పర్వత సన్నిభ ఆకారం లో ఉన్నాడు .అలాగే పైకీ ఎగిరాడు .ద్వారం దగ్గరకొచ్చాక ,బుద్ధి పాదరసంలా పనిచేసి వామనత్వం పొంది తనబంధనాలు ఆటోమేటిక్ గా ఊడి పోయేట్లు చేసుకొన్నాడు .ఇదే సమయానికితగినట్లు ప్రవర్తించటం ఆలోచించటం ఆచరించటం అంటే .అది హనుమ లో పుష్కలంగా ఉన్నది .

  హనుమ తోకకు నిప్పెట్టారని రాక్షస వనితలు సీతకు చెబితే ఆమె తల్లడిల్లి పోయింది .తనకోసం ఇంతదూరం వచ్చిన రామదూయ అయిన  వాడికి ఏ అపాయం జరుగరాదు అని భావించి అగ్నిని ప్రార్ధించి తనవ్యక్తిత్వాన్ని రామ ప్రభావాన్నీ ,సుగ్రీవ సంకల్పాన్నీ ప్రవర లాగా చెప్పుకొని ‘’శీతో భవ హనూమతః ‘’అని మనస్పూర్తిగా నాలుగు సార్లు ప్రార్ధించింది .పతివ్రత ఐన ఆమె ప్రార్ధన మన్ని౦చక పోతే అగ్నికి పుట్టగతులుండవు.అందుకే హనుమ తోకకు చందనం , వట్టివేళ్ళగంధం వెన్నపూస  పట్టించినంత గా  వెంటనే చల్లబడ్డాడు .తనధర్మం తానూ చేశాడు రామకార్యం కోసం .డూడూ బసవన్నలా వాయుదేవుడు కూడా సహకరించి మలయ మారుతంలా వీచి చల్లబరచాడు.

  తోక మంటలను అంతకు ముందు భరిస్తూ నగరమంతా తిరిగాడు .ఊరికే తిరగటమా అది కానే కాదు .ప్రతిఅంగుళం లోనూ ఏముందో బైనాక్యులర్ కళ్ళతోనూ, ఎక్స్ రే నేత్రాలతోనూ   చూసిమెదడు   మనస్సులో గ్రాఫిక్ చిత్రాలు గీసుకొన్నాడు రామ సుగ్రీవులకు నివేదించటానికి .లంకవాసులకు హనుమ లాంగూల దహనమే చివరి వినోదం అయింది .ఐతే బాగా ఎంజాయ్ చేశారు బాజా భజంత్రీల డప్పుల మోతలమధ్య .హనుమనూ చాలాదగ్గరగా చూడగలిగారు .ఆతర్వాత ఇళ్ళూ,ఒళ్ళూకాలి లబో దిబోలేగా .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-6-20-ఉయ్యూరు

‘’

‘’

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బక దాల్భ్యుడు -16

బక దాల్భ్యుడు -16

రాజరిక బకానికి బ్రాహ్మణ బకానికిలాగా ఋణాత్మక లక్షణాలు లేవు .రాజతరంగిణి-1.325-335 లో  కాశ్మీరరాజులలో’’బక’’ పేరున్న రాజున్నాడు .క్రూరుడైన తండ్రి మిహిర కులుడుగా కాక సౌమ్యంగా ఉండేవాడు -1.289-325.ఒకసారి యితడు తాంత్రిక కార్యం లో ఉన్నాడు -1.331-35.అప్పుడు భట్ట  యోగీశ్వరి మంత్రం ప్రభావం వలన స్పృహ తప్పాడు .ఆమె అందమైన స్త్రీగా మారి మోహ పరవశత్వంతో రాజును ఒక పెద్ద యాగం పాల్గొనటానికి –యాగోత్సవ మహాత్మ్యం  ప్రలోభపెట్టింది.దేవి చక్రమాతృ చక్రం లో కూర్చోపెట్టింది .దీనితో భట్టా కు అద్భుత శక్తులేర్పడి ,ఒక్కసారి ఆకాశానికి ఎగిరింది .

 ఈ బకరాజు ‘’బకేశ్వర దేవాలయం ‘’,బకావతి కాలువ నిర్మించాడు .ఈ రెండు బకశ్వభ్ర లో ఉన్నాయి -1.329.కథా సరిత్సాగరం -6.76,6.166లో  నర్మదానదీ తీరంలో ‘’బక కచ్ఛ ప తీర్ధం’’ ఉన్నట్లు చెప్పబడింది .స్కందపురాణ౦ అవంత్యఖండం -3.230.103 లోనూ బకేశ్వర తీర్ధం ఉన్నది .నారద పంచరాత్రం 2.2.82లో బకద్వీప వర్ణన ఉన్నది ఏడు ద్వీపాలలో   ఇది అయిదవది .క్రౌంచద్వీపం పేరు మహాభారతం ,అనేకపురాణాలలో  6.12.3,6.13.7,17.20ఉంది.అక్కడ ప్రసిద్ధ క్రౌంచ పర్వతం ఉంటుంది .

  కొందరిపేర్లలో బక శబ్దం ఉన్నది –విశ్వామిత్రకొడుకు బకనాఖుడు –భారతం -13.40.57.సిద్ధాంత కౌముది 11.46.ఇలారాజుల స్థలాల పేర్లలోనే కాకుండా కొన్ని జాతులపేర్లలోనూ వస్తుంది .మార్కండేయం-55.42లో’’క్రౌంచ కురు బకాస్ చైవ ‘’అని ఉంది .కనుక బకాలకు క్రౌన్చాలకు ఏదో విడదీయరాని సంభంధం ఉన్నది .భీష్మ పర్వం లో ‘’బక కొకరాకాః అని ఉంది .కొన్ని ఎడిషన్స్ లో ‘’వ్యూకాస్ కోక బకాస్ ‘’అనీ ,త్రయన్గాః కోక రాకాః’’అనీ ఉన్నది.పక్షిరాక్షసి గా కూడాఉంది ఆ వివరాలు తర్వాత .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-6-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -6

ప్రపంచ దేశాల సారస్వతం

108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -6

య౦గ్ అనే రచయిత అనుకరణమాని స్వయంగా ప్రకృతితో సాన్నిహిత్యాన్ని అనుభవించి ,వ్యక్తిగత ప్రతిభతో స్వేచ్చగా కవిత్వం రాయమని కవులను హెచ్చరించాడు .దానిని  గ్రహించి ప్రకృతి శోభ ,నిరాడంబర జీవితం వస్తువులుగా ,సరళ మాధుర్యంతో సామాన్య పదాలను వాడుతూ కవిత్వం రాశారు .వీరిని 19శతాబ్ది కాల్పనిక సాహిత్య పునరుజ్జీవన వైతాళికులు అన్నారు .వీరిలో గ్రే ,కాలిన్స్ ,కూపర్ ,బర్న్స్ ,బ్లేక్ కవులు ముఖ్యులు .తామస్ గ్రే రాసిన ‘’ఎలిజీ  రిటెన్ ఇన్ ఎ కంట్రీ యార్డ్ ‘’మిక్కిలి ప్రసిద్ధమూ ప్రశస్తమూ .కాలిన్స్ ‘’ఓడ్ టు ఈవెనింగ్ ‘’లో సంధ్యాకాల ప్రశాంత శోభ వర్ణించాడు .చిన్నతనం లోనే తల్లిని కోల్పోయిన విలియం కూపర్ ,అనుకుందా తల్లి చిత్ర పటం కనిపిస్తే ,ఆనంద విషాదాలలో ఊగిపోతూ రాసిన కవిత్వం ఉజ్వల భావ దీప్తికి గొప్ప ఉదాహరణ .రాబర్ట్ బర్న్స్ ప్రణయం సుఖదుఖాలు దేశభక్తి పై రసవంతమైన గొప్ప కవిత్వం రాశాడు .విలియం బ్లేక్ తాత్విక దృష్టితో ‘’సాంగ్స్ ఆఫ్ ఇన్నో సెన్స్ ,’’సాంగ్స్ ఆఫ్ ఎక్స్పీ రిఎన్సేస్ ‘’లలో ఆధ్యాత్మిక మార్మిక భావాలను శైలీ  రామణీయకత్వం తో రాశాడు.అవన్నీ అప్రయత్నంగా రాసిన ఆణిముత్యాలే .

  అప్పుడే బిషప్ పెర్సీ నిసర్గ సుందర ప్రాచీన జానపదాలను సేకరించి ప్రచురించాడు .అదే ధోరణిలో  మేక్ఫర్సన్ తానె రాసి ఓసియన్ అనే పూర్వకవి రాశాడని కలరింగ్ ఇచ్చి ముద్రించాడు .చాటర్టన్ ‘’రౌలీ ‘’గేయాలు రాశాడు .కాల్పనిక కవిత్వం పై దృష్టిమరల్చటానికి ఇవన్నీ మార్గ దర్శకాలయ్యాయి .రాజకీయ వాతావరణమూ తోడ్పడింది .హ్యూమనిజం స్వేచ్చాకవిత్వానికి పరోక్ష ప్రేరకమైంది .18వశతాబ్దం ముగిసే నాటికి కాల్పనిక కవిత్వం మూడుపూలు ఆరుకాయలుగా వికసించింది .

  వర్డ్స్ వర్త్ ,కాల్రిడ్జ్ కవులిద్దరూ సాహిత్య పునరుజ్జీవనానికి నాయకత్వం వహించారు వస్తువు భాష భావం శైలి లలో కొత్తదనం ప్రదర్శించే రస గీతాలు రాశారు .1798లో వాటిని ‘’లిరికల్ బాలడ్స్ ‘’పేరుతో ప్రచురించారు .మొదట్లో కొందరు ఈసడి౦చినా ,క్రమంగా అవే మహా ప్రాచుర్యం పొందాయి .వర్డ్స్ వర్త్ ప్రకృతి సౌందర్య దర్శనం చేసి ఆత్మాశ్రయ మైన ఆహ్లాద గీతాలు చాలా రాశాడు .’’మైకేల్ ‘’అనే కథాకావ్యం,తన ఆధ్యాత్మిక విశ్వాసాల వ్యాఖ్యానంగా ‘’టింటర్న్ఎబ్బీలైన్స్ ‘’’’దిఇమ్మోర్టాలిటి ఓడ్’’మొదలైన ప్రశస్తకావ్యాలు రాశాడు .భారవి మహాకవిలాగా అర్ధ గౌరవంతో ఈయన కవిత్వం గౌరవం పొంది ‘’ప్రకృతికవి ‘’అనిపించుకొన్నాడు .ఈయన స్నేహితుడు జిజ్ఞాసువైన కాల్రిడ్జ్  తత్వశాస్త్రాన్ని కూలంకషంగా చదివి ,విషాదం తో జీవితాన్ని మోస్తూ తన ఆత్మ వేదననే మహా కవితగా మార్చి ‘’ది ఏన్శేంట్ మారినర్ ,’’క్రిస్టబెల్ ,కుబ్లాఖాన్ ,కాల్పనిక కావ్యాలు ,’’ది నైటింగేల్’’,ది డిజెక్షన్ ఓడ్ వంటి తాత్విక ,స్వీయ కథాత్మక గీతాలను అత్యంత ప్రతిభాన్విత౦ గా రాశాడు .షేక్స్ పియర్ నాటకాలకు కాల్ రిడ్జ్ వ్యాఖ్యానం మన మల్లి నాథ సూరి వ్యాఖ్యానాలకు  సమానం .తన ఆత్మకథ ‘’బయోగ్రాఫియా లిటరేరియా ‘’గా రాసుకొన్నాడు .

   ఈ ఇద్దరి సమకాలికులైన రాబర్ట్ సౌదే, వాల్టర్, సావేజ్ లాండర్ ,టామస్ కాంబెల్ ,టామస్ మోర్ కవులు ఖండకావ్యాలు కలకండ మాధుర్యంగా రాశారు .సౌదే ‘’ది ఇంచ్ కేప్ రాక ,’’బాటిల్ ఆఫ్ బెన్హీం’’,ది స్కాలర్ పద్య కృతులు ,నెల్సన్ జీవిత చరిత్రరాశాడు .లాండర్ ‘’ఇమాజినరి కాన్వర్జేషన్స్’’,వచన రచనలో సుప్రసిద్ధ చారిత్రిక వ్యక్తులమధ్య కల్పిత సంభాషణలను అతి చమత్కారంగా ఊహించి రాశాడు  .కాంబెల్ ‘’లార్డ్ అలిన్స్ డాటర్,హో హేన్ లిండేన్,ది బాటిల్ ఆఫ్ ది బాల్టిక్ ‘’వంటి రమ్య రచనలు చేశాడు .టామస్ మూర్ ‘’లాల్లా రూఖ్ ‘’అనే కల్పిత కావ్యం లో అక్బర్ ,సలీం నూర్ మహల్ మొదలైన మొగల రాజవంశీయుల గాథలను వర్ణించాడు .రసవంతమైన ‘’ఐరిష్ మెలడీస్’’గీతాలూ రాశాడు .

  వీర గాథా కావ్యాలను సర్ వాల్టర్ ష్కాట్ రాసి ప్రసిద్ధి కెక్కాడు ‘’ది డే ఆఫ్ లాస్ట్ మిస్ట్రెల్,మార్మియన్ ,ది లేడీ ఆఫ్ ది లేక్ కథా కావ్యాలురాశాడు తర్వాత దృష్టి నవలా రచనపై పడి,అనేక చారిత్రకనవాలలు రాసి మార్గ దర్శి అయ్యాడు .అందులో వేవర్లీ ,గైమానేరింగ్ ,రాబ్ రాయ్ ,దిహార్ట్ ఆఫ్ మిడ్లోథియన్,దిబ్రైడ్ ఆఫ్ లామర్ మూర్ ,ఇవాన్ హో ,కేనిల్ వర్త్ ,క్వెంటిన్ డల్వార్డ్,ది టాలిస్ మన్ ముఖ్యమైనవి .స్కాట్ జీవిత చరిత్రను అల్లుడు జాన్ లాక్ హార్ట్ రాశాడు .దీనికి గొప్ప పేరొచ్చింది .జేన్ ఆస్టేన్ రచయిత్రి ‘’సెన్స్ అండ్ సెన్సిబిలిటి ‘’ప్రైడ్ అండ్ ప్రిజుడిస్’’,మానస్ ఫీల్డ్ పార్క్ ,ఎమ్మా ,నార్దంగర్ఎబ్బీ ,పెర్సుయేషన్ నవలలనుకల్పనలులేకుండా ,తెలిసిన వాతావరణం లో తన వర్గానికి చెందిన స్త్రీ పురుషుల మనస్తత్వాలను వారి వినోద విహారాలను ,సమస్యలను సరసహాస్యంతో   రాసి ప్రజాదరణ పొంది౦ది .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -13-6-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బక దాల్భ్యుడు -15

బక దాల్భ్యుడు -15

               మాయారూప మరో దేవుడు –

బక  ,మార్కండేయు లిద్దరూ అధిక గర్వం తో పతనం చెందారు .బౌద్ధ జాతక కథలూ ఇదే చెప్పాయి.బకబ్రహ్మజాతకం అనే  405జాతక కథలో బకుడు స్వర్గ లోక దేవుడైన బ్రహ్మ .ఆయన భూమిపై చేసిన తపస్సు ఫలితంగా అనేక కల్పాలు వేర్వేరు బ్రహ్మలోకాల లో ఉన్నాడు.అభస్సార బ్రహ్మలోకం లో ఉండగా,అంతకంటే ఉత్కృష్ట స్థితి లేదు అని పొరబాటుగా భావించాడు.ఈ బ్రహ్మలోకానికి బుద్ధుడు వచ్చినపుడు బకుడు ఆయనకు  తాను  మనసులో అనుకొన్నది చెప్పాడు .అతడి గత జన్మల విషయాలు చెప్పి అతడి అభిప్రాయం తప్పు అని తెలియ జేయాగా తప్పు తెలుసుకొన్నాడు .బుద్ధుడు పది వేల బ్రాహ్మల మనసులకు విముక్తి కలిగించాడు.అంటే బుద్ధుడు బకుడిని గతజన్మలలో కలుసు కొన్నాడు .

  బకుడు ఒక జన్మలో ముసలి తపస్వి కేశవుడు గా ఉండగా ,బుద్ధుడు ఆయనకు యువ కు డైన కప్పా అనే శిష్యుడు .ఇదే కేశవ జాతక -346.ఒకసారి వారణాసి రాజు బకుని అతని శిష్యులను హిమాలయాలకు పంపి ,ఆయన్ను తన రాజభవనం లో ముసలితనం గడపమని  కోరాడు  .అక్కడ ఉండగా జబ్బు పడి ,ముఖ్యశిష్యుడు కప్పా ను కలుసుకున్నతర్వాతనే  జబ్బు తగ్గింది .జైమినీయ అశ్వ మేధం లో బక, కృష్ణుల కలయిక ,జాతకకథలలో  బ్రహ్మలోక బుద్ధుల కలయిక ఒకే మాదిరిగా ఉన్నాయి .కేశవ అంటే కేశి దాల్భ్యుడు .జాతక కథలప్రకారం ఒకే బకుడు ఒక జన్మలో కేశి దాల్భ్యుడుగా ,మరో జన్మలో బకదాల్భ్యుడుగా పుట్టాడన్నమాట ..                      పక్షిరాజు

కొన్ని ఆఖ్యానాలలో బకుడు రాజుగా చెప్పబడ్డాడు ఆ రాచ పక్షి పూర్వజన్మలో పక్షిగాలేక  పక్షిరాజుగా  చెప్పబడ్డాడు .ఆరాజ బకుడు దైవాంశ సంభూతుడు అయిఉండాలి .పక్షిరాజు కు విశేషమైన విషయం ఉండి ఉండాలి .కునాల జాతకం-536 ప్రకారం రాజరిక బకుడు వారణాసి ప్రభువు .ఇందులో రాజకునాల ఆటే బుద్ధుడి పూర్వ జన్మ .ఆ కునాలపక్షికి ఎప్పుడూ 3500 కోడి పక్షులు కాపలాగా వాహకులుగా  ఉంటాయి . ఆ ఆడ పక్షులు  గమ్యం లేకుండా గాలి ఎటు వీస్తే అటు ఆయన్ను మోసుకుపోవటం తో విసుగుపుట్టి  ,వాటి అవిదేయత,కృతఘ్నత కు తగిన శాస్తిగా అవి నశించాలని శాపమిచ్చాడు .

  కౌవెల్(1895-1907) సేకరించిన బౌద్ధజాతక కథలలో  v-236-240 ప్రకారం మంచి ఉపజ్ఞ ఉన్నమానవ రాజు బకుడు బీద అత్యంత  అందవికార యువతి ‘’పంచపాప’’ ను ప్రేమించాడు .అందవికారి అయినా ఆమె చేతి మెత్తని స్పర్శతో మగవారిని ఆకర్షించేది .అనేక సందర్భాల పరిచయంతో ఆమెను దేవేరిగా చేసుకొన్నాడు .తర్వాత ఆమెను నది అవతలి తీరాన ఉన్న  పారవీయ రాజుతో పంచుకొన్నాడు  .కనుక పంచపాప నది అవతలికి వెళ్లి అతనితో కొన్ని రోజులు గడిపి వస్తూండేది .ఇలా ఆ ఇద్దరినీ నావ నడిపే ముసలి బట్టతలకుంటి వాడి సాయంతో  మోసం చేసింది . .

   మరొక రాజరిక బకుడు భారతం శాంతి పర్వం12.162-28 లో కనిపిస్తాడు .బకరాజ బకాధిపతి బకేంద్ర మొదలైన పేర్లతో ద్వేషపూరిత కొంగలరాజు ,దుర్మార్గ బ్రాహ్మణుడు గౌతముని తో కనిపిస్తాడు .ఉత్తర మ్లేచ్చులమధ్య   ఈ కథ జరుగుతుంది .మధ్యదేశంలో సద్బ్రాహ్మణ కులం లో పుట్టిన గౌతముడు ఉత్తరాన స్థిరరపడ్డాడు .దస్యుల గ్రామంలో శూద్ర భార్యతో బోయవాడుగా జీవిస్తున్నాడు -12.162.28-37.ఒకరోజు పక్షులవేటకోసం సముద్రం వైపుకు వెడుతూ మధ్యలో ఒక అడవిలో దారి తప్పాడు .అక్కడ ఒక మెరిసే పక్షి కనిపించింది .అది బకరాజు .అతడు దక్ష ప్రజాపతికూతురుదేవకన్య కు  ,కశ్యప మహర్షికి జన్మించినవాడు .ఆ పక్షిపేరు రాజధర్మ .అప్పుడే అతడు నాడీ జంఘ పేరుతో బ్రహ్మలోకం లో ఉంటూ ఇప్పుడు  తన ఇంటికి  తిరిగి వస్తున్నాడు -12.163.17-20.గౌతముడికి రాజధర్మ గొప్ప ఆతిధ్యమిచ్చాడు .తాను పక్షుల వేటకు సముద్ర తీరానికి వెడుతున్నానని గౌతముడు చెప్పగా రాజధర్మ అతడిని తనప్రియమిత్రుడు రాక్షసరాజు విరూపాక్షుని దగ్గరకు వెళ్ళమని ,అతడు ఆషాఢ,మాఘ ,కార్తీక పౌర్ణములనాడు బ్రాహ్మణులకు భూరి దక్షిణ కానుకలు ఇస్తాడని చెప్పాడు .అలాగే వెళ్లి రాక్షసరాజు ఇచ్చిన అపార స్వర్ణం మోసుకుంటూ మళ్ళీ రాజధర్మ ఇంటికి వచ్చి దారిలో ఏమీ తినకపోవటం తో ఆకలి ఎక్కువై విశ్వాసఘాతుకంగా ఆపక్షిరాజు నే చంపి తినేశాడు .ఇది తెలిసి విరూపాక్షుడు తన సైన్యాన్ని  గౌతముడిని చంపమనిపంపితే వాళ్ళు అతడిని ముక్కలు ముక్కలుగా నరకగా రాక్షసులు ,దస్యులు కూడా అలాంటి కృతఘ్నుడి మాంసం తినటానికి నిరాకరించారు .చివరికి సురభి దేవత బకుడిని పునరుద్ధరించింది .ఆశ్చర్యంగా ఆ పక్షిరాజు ఆమెను గౌతముడిని కూడాబ్రతికించమని కోరింది .అలాగే చేసింది సురభి .బకుడు ఆబ్రాహ్మణుడిని సంతోషంగా కౌగలించుకొన్నాడు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -13-6-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-50

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-50

కోపం తో మూఢుడైన రాక్షసరాజు రావణుడు హనుమ ను చంపమని తీవ్రంగా ఆజ్ఞాపించాడు .దూతకార్యానికి వచ్చిన వాడిని చంపటం భావ్యం కాదన్నాడు వాక్య విశారద విభీషణుడు .ఆతడిని ఆపటానికి ఏమి ఆలోచించాలా అని మధనపడ్డాడు .అన్నను సామవచనాలతో  మనసు మెత్త పడేట్లు చేద్దామనుకొని ,చాలా కౌశల్యమైన మాటలతో ‘’రాక్షసరాజా !ఈ వానరుడిని క్షమించు .అతనిపై కోపం వద్దు .ఏ పని చేయాలో ఏపని చేయరాదో తెలిసిన రాజశ్రేస్టులు దూతను వధించరు .అసలు వానరుని చంపటం రాజధర్మం కాదు .నింద్యమైనదికూడా.అది నీ వంటి వీరునికి తగని పని .-

‘’నిశ్చితార్ధ స్తతస్సామ్నా పూజ్య శత్రు జిదగ్రజం –ఉవాచ హిత  మత్యర్ధం వాక్యం వాక్య విశారదః ‘’

‘’క్షమస్వ, రోషం త్యజ రాక్షసేంద్ర –ప్రసీద మద్వాక్య మిదం శృణుష్వ-వధం న కుర్వంతిపరావరజ్ఞాః-దూతస్య సంతో వసుధాదిపేంద్రాః’’

‘’రాజ ధర్మ విరుద్ధం చ లోక వృత్తేశ్చ  గర్హితం –తవదాస దృశం వీర కపే రస్య ప్రమాపణం’’

రాజా !ధర్మజ్ఞుడవు,కృతజ్ఞుడవు.రాజధర్మ కుశలుడవు కర్తవ్యాకర్తవ్యాలు బాగా తెలిసిన వాడవు .పరమార్ధం తెలిసిన వివేకివి .నీలాంటి పండితుడు రోషంతో కలుషితులైతే ,వివిధ శాస్త్రాలు చదివి ,జ్ఞానం సంపాదించటం శ్రమ వ్యర్ధమే అవుతాయికదా.కనుక అన్నీ క్షుణ్ణంగా తెలిసిన నువ్వు యుక్తాయుక్తాలతో ఆలోచించి ఈ దూతను దండించు ‘’అని చెప్పి కూర్చున్నాడు .-

‘’గృహ్యంతే యది రోషేణ త్వాదృశోపివిపశ్చితః-తతశ్శాస్త్ర విపశ్చిత్వం శ్రమ ఏవ హి కేవలం ‘’

‘’తస్మాత్ ప్రసీద శత్రుఘ్న రాక్షసేంద్ర దురాసద –యుక్తాయుక్తం వినిశ్చిత్య దూత దండోవిధీయతాం ‘’

  విభీషణుడి మాటలకు అరికాలి మంట నెత్తికెక్కిన రావణుడు ‘’శత్రునాశకా ,విభీషణా!పాపుల్ని చంపితే పాపం రాదు .రాజద్రోహం చేసిన వీడు పాపి కనుక  చంపేస్తాను .’’అన్నాడు –

‘’న పాపానాం వధేపాపం విద్యతే శత్రుసూదన –తస్మాదేనం వదిష్యామి వానరం పాపచారిణం’’

అన్నమాటలు విన్న తమ్ముడు తన పట్టు వదలకుండా ‘’రాజా !ప్రసన్నుడవు కావలసినది గా కోరుతున్నాను.ధర్మార్ధ యుక్తమైన నా మాట విను .యజమాని ఆజ్ఞను దూత నిర్వహిస్తాడు కనుక ఏ జాతిలో కూడా దూతను చంపటం అనేది లేదు –

‘’దూతాన్ నవధ్యాన్ సమయేషు రాజన్ –సర్వేషు సర్వత్ర వదంతి సంతః

రాజా !యితడు బలమైన శత్రువు అనటం లో సందేహం ఏమాత్రం లేదు .అతడు చేసిన అపకారం కూడా చాలా పెద్దదే .అయినా సత్పురుషులు దూత వధను దండంగా పేర్కొనరు .దూతకు విధించే శిక్షలు వేరే ఉన్నాయి .అంగవైకల్యం కలిగించటం ,కొరడాలతో కొట్టటం ,గుండుగీయించటం ,ముద్ర వేయటం దూతకు విధించే శిక్షలు అనే చెప్పారుకాని దూతవధ ఎక్కడా ఇంతవరకు విని ఉండలేదు .-

‘’అశంశయం శత్రు రయం ప్రవృద్ధః  -కృతం హ్యనే నాప్రియ మప్రమేయం –న దూత వధ్యాంప్రవదంతిసంతో –దూతస్య దృష్టాబహవో హి దండాః’’

‘’వైరూప్య మంగేషు కశాభి ఘాతో-మౌ౦డ్య౦ తథా లక్షణసన్నిపాతః  -ఏతాన్ హిదూతే ప్రవదంతి దండాన్ –వధస్య దూతస్య న నః శ్రుతోపి ‘’

అన్నా !ధర్మాధర్మాలలో సుశిక్షితమైన బుద్ధి కలిగి ఉత్కృష్ట ,అప కృస్టాలు తెలిసి ,కార్య నిర్వహణ చేసే నీవంటివాడు కోపించటం ఏమిటి ?ధీరులు కోపం నిగ్రహించు కొంటారు కదా .ధర్మ శాస్త్ర ,లౌకిక విషయ ,శాస్త్రార్ధాలను తెలుసుకొని వాటిని మర్చిపోకుండా ఉండటం లో నీకు సమానులులేరు .సురాసురులలో నువ్వు ఉత్తముడవు .కోతిని చంపటం లో గుణ విశేషం ఏదీ నాకు కనిపించటం లేదు .నువ్వు వేసే దండన ఇతడికి కాక ,ఇతడిని పంపిన వాడికి వర్తి౦చేట్లు చెయ్యి .యోగ్యుడైనా  అయోగ్యుడైనా యితడు పరులచే పంపబడిన వాడు .అతడిమాటలు పరాధీనమైన మాటలు కనుక దండి౦ప  తగనివాడు .ఇతడిని చంపితే ఇంతదూరం రాగలిగే  వేరొక దూత కనపడడు.కనుక వది౦చవద్దు.అలాంటి ప్రయత్నం ఇంద్రాదులపై చెయ్యి .యితడు ఇక్కడ మరణిస్తే రామలక్ష్మణులను యుద్ధానికి ప్రేరేపించే వేరొక దూత ఉండడు.సర్వ శత్రు సంహారకుడవైన రాజా! ఆ సోదరులతో చేయాల్సిన యుద్దావకాశాన్ని జార విడుచుకోవద్దు –

‘’పరాక్రమోత్సాహ మనస్వినాం చ –సురాసురాణామపి దుర్జయేన –త్వయా మనోనందన నైరుతానాం-యుద్ధాయతి ర్నాశయితుం న యుక్తా ‘’

‘’నీ దగ్గర సర్వ సమర్ధులైన యోగ్యులైన సేవక సైనికులు కోట్లాది మ౦దిఉన్నారు .అందులో కొద్ది భాగ౦ సైన్యాన్ని తీసుకొని నీ ఆజ్ఞతోకొందరు మహాయోధులు వెళ్లి ,రామ సోదరులను బంధించి నీ శత్రువులకు నీ ప్రభావం ఎలాంటిదో చూపించాలి ‘’అని అత్యంత రాజనీతిజ్ఞతతో తమ్ముడు విభీషణుడు చెప్పిన మాటలకు అన్న రావణుడు శాంతించి బుద్ధిపూర్వకంగా అంగీకరించాడు –

‘’తదేక దేశేన బలస్య తావత్ –కే చిత్తివా దేశ కృతోభియాంతు –తౌ రాజపుత్రౌ విని గృహ్య మూడ్హౌ-పరేషు తే భావయితుం ప్రభావం ‘’

‘’నిశాచరాణా మదిపోనుజస్య –విభీషణ స్యోత్తమ వాక్య మిష్టం –జగ్రాహ బుద్ధ్యా సురలోక శత్రు- ర్మహాబలో రాక్షస రాజముఖ్యః ‘’

ఇది 26శోకాల 52వ సర్గ

ఇందులో రావణుడి దు౦దుడుకుతనం ,ఆవేశం తో వచ్చిన కోపం ఆలోచనా రాహిత్యం ,మరచిపోయిన మూల రాజనీతి మనకు స్పష్టంగా కనిపిస్తుంది .తమ్ముడు విభీషనుడిలో  అత్య౦త వివేకం ధీబలం ,రాజనీతి ,ప్రపంచజ్ఞానం విస్పష్టంగా దర్శనమిస్తుంది .అన్నగారి కోపం తగ్గించి శా౦త పరచనిదే సమస్య పరిష్కారం కాదు కనుక అతడి శాస్త్రజ్ఞానం ,పరాక్రమవిశేషాలు  అతడిని ఎదిరించే సాహసం ఎవరిలోనూ లేదనే విషయం చెప్పి కొంత ధూపం వేసి మెత్తబడేట్లు చేశాడు  .నేర్చిన శాస్త్రార్ద జ్ఞానం విఫలం కారాదనీ చెప్పాడు .కోపం అనర్ధదాయకమనీ  దూత వధ అనేది ఏ రాజ ధర్మంలోనూ లేనిదని అది ఆటవిక చర్య అని తపస్వి మేధావి రాజకీయ దురంధరుడు అయిన రావణుడు చేయాల్సినపనికాదని అది అత్యంత హేయ , నీచ,నికృష్ట  కృత్యమని  స్పష్టం చేశాడు  .యుక్తాయుక్తాలు విచారించి శిక్షించమన్నాడు . వానరుడు రాజద్రోహం  చేశాడు .కనుక  దండనార్హుడు అని ఒక మెలిక పెట్టాడు రావణుడు .తనవాదన మరీ ఒక వైపే ఉ౦దేమోననే అనుమానం వచ్చి వానరుడు మహాబలశాలేకాక లంకకు పెద్ద నష్టం కూడా చేశాడు అనటంలో సందేహం లేదనీ చెప్పాడు .దూత తనను పంపినవారు ఏది, ఎలా చెప్పమంటే అలా చెబుతారు .అందులో వాళ్ళ స్వంతమాటలేమీ ఉండవు. దూతవాక్యం అంటే పంపినవాడు చెప్పిన మాటలే .’’కాళిదాసు కవిత్వం కొంత నాపైత్యం కొంత’’ అన్నట్లుగా దూత  స్వంత పైత్యం ఉండదు .వాడికి వేసే శిక్షపంపినవాడికి బుద్ధి వచ్చేట్లు చేయటం రాజనీతి అన్నాడు .దూతను దండించేందుకు ఎన్నో రకాలు చెప్పబడ్డాయి కనుక అందులో ఏదో ఒకటి చేసి ,వాడిని పంపిస్తే ,వాడు వెళ్లి పంపినవాడితో తనగోడు చెప్పుకొంటాడు .వీడిని ఇక్కడే హతమారిస్తే ఈకాకను అక్కడికి చేర వేసే వారు ఉండరు .రావణుడికి కావాల్సింది రామసోదరులతో యుద్ధం .అన౦త సేనావాహినిలో కొంతమందిని సోదరులదగ్గరకు పంపి వాళ్ళను బంధించి తెమ్మనటం ఒక గొప్ప ఆలోచన .రాక్షససైన్యానికి అవలీల అయిన పనికూడా .విభీషణుడి ఈ మంత్రం బాగా పారింది ,ఠక్కున అతుక్కుంది రావణ హృదయానికి .వెంటనే ‘’ఐ అగ్రీ విత్ యు ‘’అన్నట్లు  తలూపి వధ ఆలోచన విరమించి తమ్ముడి ఆలోచనను అంగీకరించాడు .హనుమ బతికి బయట పడ్డాడు ‘’చూచిరమ్మంటే కాల్చివచ్చినట్లు’’ లంకాదహనం చేయటానికి .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-6-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

తిధుల ప్రకారం పుట్టిన రోజు

తిధుల ప్రకారం పుట్టిన రోజు

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

బక దాల్భ్యుడు -14

బక దాల్భ్యుడు -14

బృహదారణ్యక ,ఐతరేయ ఆరణ్యకాలలో గాలవ మహర్షి అసలు పేరు వస్తుంది .అతడు విశ్వామిత్రుని కొడుకు .ఒకసారి విశ్వామిత్రుడు చాలాకాలం ఇ౦టికిదూరంగా ఉండాల్సి వచ్చినపుడు ,తన పిల్లలను పోషించటానికి విశ్వామిత్రుడి భార్య పిల్లలో మధ్యవాడిని అమ్మి మిగిలిన వారిని పోషించాలి అనుకొంటుంది .దర్భలతో తాడు పేని ఆ దురదృష్ట వంతుడి మెడకు తగిలించింది అమ్మటానికి తీసుకు వెడుతుంటే దారిలో సత్యవ్రత మహారాజు(తర్వాత త్రిశంకు అయ్యాడు ) కనిపించి  ఆకుటుంబాన్ని తాను  ఆదుకొంటానని చెప్పిఆకుర్రాడి  గళానికి ఉన్న దర్భతాడు తీసేయ్యమని చెప్పాడు .అప్పటినుంచి అతడు’’ గాలవుడు ‘’గా పిలువబడ్డాడు. అప్పటిదాకా అతని అసలు పేరు ఎవరికీ తెలియదు.మరో రకంగా కూడా దర్భ తాడు మెడకు ఉన్నవాడు కనుక దార్భ్యుడు లేక దాల్భ్యుడు అయి ఉండచ్చు .చివరగా వేదాలలో చెప్పబడిన గ్లవ లేక గాలవ  కు పురాణాలలోని దాల్భ్యునికి మధ్య ఒక సన్నని తాడు లంకెగా ఉన్నట్లు అనిపిస్తుంది .

భగవదవతారం

మహాభారత ,పురాణ విషయాలవలన మార్కండేయ ,మహా వృద్ధ జంతుపువులు  శివగణాలు అని తెలిసింది .శివ ,మార్కండేయులమధ్య మళ్ళీ ఒక కొంగ వచ్చి దూరిన విషయం తెలుసుకొందాం .స్కాందపురాణం ‘’ఆవత్య ఖండం ‘’3.8.లో బకకల్పం లయమయ్యే సందర్భంలో శివుడు ఒక కొంగ రూపం దాల్చాడు -3.8.53-‘’బకే పురాకల్పే’’.కల్పాల మధ్య చిరంజీవి మార్కండేయుడు తపస్సు చేస్తూ అనంత జలరాశిలో మునిగిపోయాడు .బయటపడటానికి ఈదుకొంటూ వస్తుంటే కంఠాభరణం లాగా తళతళ మెరిసే  తెల్లని కొంగ ఒకటి  ఆయనవైపు ఈదుకొంటూ రావటం చూశాడు .ఆకొంగ తానె శివుడు విష్ణు బ్రహ్మ అనీ తానె ఈప్రళయం సృష్టించానని చెప్పింది 3.8.7.ఆ మహాబకం మహర్షిని తనవీపుపై కూర్చోమని చెప్పి ,కూర్చోగానే ఆకాశం లోకి యెగిరి వెడుతుంటే ,నీటి అంచున పదిమంది స్త్రీలు కనిపించారు -3.8.14-16 .క్రమంగా అంతరిక్ష౦ లోకి ఎగురుతూ స్పష్టంగా స్వర్గ నగరాలను దర్శించాడు .అనేక వర్ణాల శివలింగాన్ని అవగతం చేసుకొన్నాడు -3.8.24-26.ఇప్పుడు మళ్ళీ ఆపదిమంది స్త్రీలు శివలింగాన్ని పూజించటం గమనించాడు ఆ స్త్రీలు నదుల మానవ రూపాలు .అందులో కల్ప వాహిని నర్మద అతడు చూసినవాటి అంతరార్ధం వివరించింది .3.8.39-47.మార్కండేయుడు ఆ స్త్రీలు నదీమతల్లులని ,ఆలింగం ,బకం,శివుని వేర్వేరు స్వరూపాలని అర్ధం చేసుకొన్నాడు-3-8.43 –‘’మహాదేవో లింగ మూర్తిర్’’.3.8.49-‘’దేవేశో బకరూపో మహేశ్వరః ‘’.నర్మదానది వృత్తాంతం తర్వాత  ఆ దృశ్యం క్రమంగా అదృశ్యమైంది .వెంటనే మొదట్లో మార్కండేయుడు నదిలో స్నానం చేసి శివుని అభిషేకిస్తున్నట్లు అనిపించి కాసేపటికి అదీ అదృశ్యమై ఆయన స్థిరంగా భూమి మీదనే ఉన్నట్లు అనిపించింది .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-6-20-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -5

ప్రపంచ దేశాల సారస్వతం

108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -5

అపార పాండిత్య ,వ్యక్తిత్వ ప్రతిభతో విద్వజ్జన వందితుడైన వాగను శాసన(డిక్టేటర్ ఆఫ్ ఇంగ్లిష్ లిటరేచర్ ) బిరుదాంకితుడు ‘’డాక్టర్ శామ్యూల్ జాన్సన్ తొలి ప్రామాణిక ఇంగ్లిష్ డిక్షనరీ కూర్చాడు .’’ది రా౦బ్లర్ ,’’ది ఐడ్లర్ ,అనే ధార్మిక వ్యాస సంపుటులు ,’’దివానిటి ఆఫ్ ది హ్యూమన్ విషెస్ ‘’పద్యకావ్యం ‘’ఐరీన్ ‘’నాటకం ,’’రసెలాస్ ‘’వచన కథ కూడా రాశాడు షేక్స్పియర్ నాటకాలకు విశేషమైన పీఠికలు,ఆంగ్లకవుల చరిత్ర గా ‘’లైవ్స్ ఆఫ్ దిపోయెట్స్’’అనే బృహద్గ్రంథం ఆయన సాహితీ విమర్శకు నిలువెత్తు నిదర్శనం .సాహితీ సదస్సును నిర్వహిస్తూ సమకాలీన రచయితలను ప్రోత్సహించేవాడు .ఆయన చెప్పినప్రతి మాట సాహిత్యమే, ఆయన కున్న ప్రతి అభిప్రాయం పరమ ప్రామాణికమే .జాన్సన్ మిత్రుడు శిష్యుడు జేమ్స్ బాస్వె ల్ ‘’లైఫ్ ఆఫ్ సామ్యుల్ జాన్సన్ ‘’జీవిత చరిత్ర రాసి’’ లైఫ్ హిస్టరీ’’లలో తలమానికంగా నిలిపాడు  .దీనికి సాటి వచ్చేది మరొకటి లేదని అందరి విశ్వాసం .జాన్సన్ భావాలకు ,ఆయన హృదయాన్ని ఆవిష్కరించే చక్కని భాష్యం చెప్పాడు .కనుక ఎవరైనా గొప్పశిష్యుడు ఉంటె అతడిని ‘’జాన్సన్స్ బాస్వెల్ ‘’అంటారు .మన తెలుగులో కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి కవిత్వం కవితా హృదయం గొప్ప గా ఆవిష్కరించినవారు ఆయన శిష్యులైన బ్రహ్మశ్రీ మల్లంపల్లి శరభయ్య గారు .అందుకే ఆయన్ను ‘’విశ్వనాథజాన్సన్ కు శరభయ్య బాస్వెల్’’అన్నాను నేను ఏదో వ్యాసంలో .

   18వ శతాబ్దిలో నవల అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రక్రియ .నవలా రచనకు ఆద్యుడైన రిచర్డ్ సన్-‘’పామెలా ‘’,క్లారిస్సా ‘’నవలలు రాసి ,హృదయ నైర్మల్యాన్నిగొప్పగా చిత్రించాడు .ఫీల్డింగ్ నిత్యజీవిత విషయాలను ‘’జోసెఫ్  ,టాం జోన్స్’’నవలలుగా రాశాడు .వాస్తవికతకు అద్దం పడుతూ స్మాలెట్-‘’రరొడరిక్ రాండం ‘’మొదలైన నవలలు రాశాడు .నవలా రచయితగా విశేష ఆదరాన్ని లారెన్స్ స్టెర్న్ తన  నవలలు ‘’డిస్ట్రం షాండీ  ‘’,ఎ సెంటిమెంటల్ జర్నీ ‘’తో సాధించాడు. ఆనాటి వారిలో సర్వతోముఖ ప్రతిభ చూపినవాడు ఆలివర్ గోల్డ్ స్మిత్ .తనకావ్యాలతో శామ్యూల్ జాన్సన్ ను కూడా మెప్పించాడు .అతడి దిట్రావెలర్ ,ది దడిజర్టెడ్ విలేజ్ ‘’గొప్ప పద్యకావ్యాలు ‘’షి స్టూప్స్ టు  కాంకర్ ‘’ హాస్యనాటకం రాశాడు .గోల్డ్ స్మిత్ అంటే ముందు అందరికీ గుర్తుకొచ్చేది ఆయన అత్యుత్తమ శ్రేణి అద్భుతనవల ‘’వికార్ ఆఫ్ వేక్ ఫీల్డ్’’.సరస హాస్యం తో ‘’ది సిటిజన్ ఆఫ్ ది వరల్డ్ ‘’పేరుతో రాసిన వ్యాసమాల సమాజం మేలు,కీడు లను పరామర్శించి౦ది .

  ఎడ్మండ్ బర్క్ ఉపన్యాసాలంటే ఆనాడు విపరీతమైన క్రేజు .గంభీరంగా సాహిత్య గుణాలతో అవి విశేషంగా ఆకర్షించి సాహిత్య గౌరవం పొందాయి .ఎడ్వర్డ్ గిబ్బన్ ‘’ది డిక్లైన్ అండ్ ఫాల్ ఆఫ్ ది రోమన్ ఎంపైర్ ‘’అనే చారిత్రిక గ్రంథం రాసి సాహిత్య ప్రతిష్ట పొందాడు .అదే కాలం లో లేఖా సాహిత్యానికీ గిరాకీ బాగానే ఉండేది .హోరేస్ వాల్పోల్ ,లార్డ్ చెస్టర్ ఫీల్డ్ రాసిన లెటర్స్ అన్నీ గ్రంథ రూపం పొంది సాహిత్యంలో సముచిత స్థానం సాధించాయి .జాన్సన్ వాడి బాణాలవంటి మాటలతో పనికిమాలిన చెస్టర్ ఫీల్డ్ స్నేహ సహకారాలను నిరాకరిస్తూ రాసిన ఉత్తరం లేఖా సాహిత్య ప్రక్రియలో మణి పూస..చతురోక్తులతో ,శ్రుతిమించిన హాస్యంతో షెరిడన్ రాసిన  ‘’దిరైవల్స్ ,’’ది స్కూల్ ఫర్ స్కాండల్ ‘’నాటకాలు బాగా పేలాయి .లేని పాండిత్యాని ప్రదర్శించాలనే చాపల్యం తో అర్ధం పర్ధం సమయం సందర్భం లేకుండా మాట్లాడుతూ ఒక పుస్తకం లో ఉన్నపాత్రను వేరోకదానిలో ఉన్నట్లు ,ఒక గ్రంధం లోని పాత్ర మాటలు వేరోకదానిలో కోట్ చేసి  నలుగురిలో నవ్వులపాలయ్యే వారిని  ఆతడు ‘’మిసెస్ మేలప్రాప్’’అనే స్త్రీ పాత్రద్వారా గేలి చేశాడు .ఆపాత్ర ఒక కాయినేజ్ మాట అయింది.

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -11-6-20-ఉయ్యూరు .

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-49

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-49

 భయంకర బలపరాక్రమ తేజస్సులతో ఉన్నదశకంఠ రావణుడిని వానర వీర హనుమాన్ చూసి ,భయం తొట్రు పాటూ ఏ మాత్రం లేకుండా ,అర్ధవంతమైన మాటలతో ‘’నేను రామదూతనైన ,వానర రాజు సుగ్రీవుని సందేశం తో లంకకు వచ్చాను .నీ సోదరునిలాగా సుగ్రీవుడు నీకు హితుడు .నిన్ను కుశలప్రశ్నలు అడిగాడు –‘’తమ్ సమీక్ష్య మహాసత్వం సత్వవాన్ హరిసత్తమః –వాక్య మర్దవ దవ్యగ్ర స్తమువాచ దశాననం ‘’

‘’అహం సుగ్రీవ సందేశా దిహప్రాప్త స్తవాలయం –రాక్షసేంద్ర హరీశ స్త్వాంభ్రాతా కుశలమబ్రవీత్ ‘’

‘’స్నేహితుడి లాగా హితం తో సుగ్రీవుడు నీకు పంపిన సందేశం విను .అది నీకు ఈలోకం లో ,పరలోకం  లో కూడా అభ్యుదయం కలిగిస్తుంది ‘

‘’భ్రాతుః శ్రుణు సమాదేశం సుగ్రీవస్య మహాత్మనః –ధర్మార్ధోప  హితం వాక్య మిహ చాముత్ర చ క్షమం’’

అని చెప్పి ఇది వరకు తాను అశోక వనం భగ్నం చేసేముందు చెప్పిన శ్లోకాలను సుగ్రీవుడు చెప్పినట్లుగా రికార్డ్ పెట్టాడు హనుమ- ‘’రాజా దశరదోనామ రథకున్జర వాజిమాన్ ‘’నుంచి రాముడుసుగ్రీవ స్నేహం చేసి వాలిని చంపి సుగ్రీవుని రాజును చేసేదాకా 7శ్లోకాలలో వాయి౦చి పారేశాడు –

‘’తత స్టేన మృధేహత్వా రాపుత్రేణ వాలినం –సుగ్రీవ స్థాపితో రాజ్యేహర్యక్షాణా౦ గణేశ్వరః ‘’

‘’రాజా !వాలి నీకు పూర్వం పరిచయమున్నవాడే గా .అతడిని ఒకే ఒక్క బాణం తో రాముడు చంపాడు తెలుసా .

‘’త్వయా విజ్ఞాత పూర్వ శ్చ వాలీ వానర పుంగవః –రామేణ నిహత స్సంఖ్యేశరే ణైకేన వానరః ‘’

 మా రాజు సుగ్రీవుడు సత్య ప్రతిజ్ఞకలవాడు కనుక సీత అన్వేషణకై అన్ని దిక్కులకు లక్షలకొద్దీ వానర సైన్యం పంపాడు.వారిలో కొందరు  గరుత్మంతు నికి , కొందరు వాయువుకు వేగం లో సాటైనవారు –

‘’వైనతేన సమాఃకేచిత్  కేచిత్తత్రానిలోపమాః-అసంగ గతయః శీఘ్రా హరి వీరా మహా బలహ ‘’

‘’అందులో రాజా !నేనువాయుపుత్ర  హనుమంతుడను .సీత జాడకోసం నూరు యోజనాల సముద్రాన్ని అవలీలగా దాటి మీ లంకకు వచ్చాను .లంకంతా గాలిస్తూ ,ఇక్కడ ఆమెను చూశాను .నువ్వు శాస్త్రోక్త ధర్మ స్వరూపం తెలిసిన మహా ప్రాజ్ఞుడవు .మహాతపస్వివి .పరభార్యను అలా నిరోధించటం నీకు తగని పని.నీలాంటి బుద్ధిమంతులు అపాయకర ,ఆత్మవినాశాకర ధర్మ విరుద్దాలైన పనులలో తలదూర్చరు –

‘’తద్భవాన్ దృస్ట ధర్మార్థ  స్తపః కృత పరిగ్రహః –పరదారా న్మహాప్రాజ్ఞ నొప రుద్ధుం త్వమర్హసి ‘’

అని చాలా నెమ్మదిగా మెత్తగా ,ధర్మపరడని తపస్వి అనీ పొగుడుతూ ,చేసినపని చాలా నీచమైనదని అలాంటి వాడు చేయతగనిపని అనీ హితవు చెప్పాడు .కొంచెం స్వరం పెంచి ‘’రావణా !రాముడు కోపిస్తే ,తమ్ముడు లక్ష్మణస్వామి విడిచిన బాణం కు ఎదురు నిలిచే సాహసం దేవాసురులలో ఎవరూ చేయ లేరు .ఆయనకు అపకారం చేస్తే ముల్లోక్లాలలో ఒక్కడు  కూడా సుఖంగా ఉండలేడు  అని   స్పష్టంచేశాడు –

‘’తస్య లక్షణ ముక్తానాం రామ కోపాను వర్తినీం -శరాణామగ్రతః స్థాతుం శక్తో దేవా సురేష్వపి’’.

‘’న చాపిత్రిషు లోకేషు రాజన్ విద్యేత కశ్చన-రాఘవస్య వ్యళీకం యః కృత్వా సుఖ మవాప్ను యాత్ ‘’

ఇప్పటిదాకా జరిగిన చెడు గురించి ,రామసోదర పరాక్రమ వీరాలగురించి హెచ్చరిక గా చెప్పాడు దీమాన్ హనుమాన్ .అసలే మొండి ముండావాడు కొంచెం కఠినంగా నే వాడు చెయ్యాల్సి౦దేదో ,దేని వలన ప్రమాదం తప్పుతుందో  సూటిగా చెప్పాలనుకొని ‘’రాజా !ధర్మ అర్ధ సమ్మతమైన నా మాటలు విని భూత వర్తమాన  భవిష్యత్తులలో మేలు కలిగేట్లుగా ఆలోచించి సీతా దేవిని శ్రీరాముడికి  సమర్పించు ‘’ –

‘’తత్రికాల హితం వాక్యం ధర్మ్యమర్థాను బంధి చ –మన్యస్వ నరదేవాయ జానకీ ప్రతి దీయతాం’’

రావణా !అనితర సాధ్యమైన సీతా దర్శనం నాకు లభించింది .ఆమెను ఇక్కడి నుండి తీసుకు వెళ్ళటం ఎలాగో రాముడే నిర్ణయిస్తాడు .మూర్తీభవించిన శోకదేవతలా సీత ఉన్నది .పొరబాటున ఆమెను వశం చేసుకోవాలని అనుకోకు. ఆమె అయిదు తలల సర్పం .నీ ప్రాణాలు తీస్తుంది అని నీకు తెలియనట్లుంది ,జాగ్రత్త .-

‘’లక్షితేయం మయా సీతా తథా శోక పరాయణా-గృహ్య యాం నాభి జానాసి పంచాస్య మివ పన్నగీం ‘’

‘’ఆహారం లో విషం కలిస్తే ఎలా జీర్ణం కాదో ,అలాగే సీత కూడా దేవతలకు అసురులకు వశీకరింప శక్యం కానిది –

‘’  నేయం జరయితు శక్యా సాసురై రమరైరపి- ‘’విష సంసృస్ట మత్యర్ధం భుక్తమన్న మివౌజసా –రాక్షసరాజా !ఎంతో శమించి తపస్సు చేసి న ధర్మానికిప్రతిఫలంగా దీర్ఘాయుస్సు పొందావు .దాన్ని నాశనం చేసుకోవద్దు .నీ తపస్సుతో పొందిన వరంతో దేవాసురులు నిన్ను చంపలేరని అనుకొన్నా నీకు మృత్యువు తప్పదు-‘

’తపస్సంతాప లబ్ధస్తే యోయం ధర్మ పరిగ్రహః –న స నాశయితుం న్యాయ్య ఆత్మప్రాణ పరిగ్రహః

‘’అవధ్యతాం తపోభి ర్యాం భవాన్ సమను పశ్యతి-ఆత్మనస్సాసురై ర్దేవైర్హేతు స్తత్రా ప్యయం మహాన్ ‘’

రావణుడు చావు విషయంలో తనకు  నర వానరులవలన భయం లేదని ముందే శివుడికి చెప్పాడు ఆ విషయాన్ని హనుమ అన్యాపదేశంగా ‘’సుగ్రీవుడు దేవుడు కాదు ,అసురుడు ,రాక్షసుడు కూడా కాదు.గ౦ధర్వ యక్ష ఉరగుడూ కాదు.ఎవరివలన చావు రాకూడదు అని కోరుకున్నావో వారిలో ఎవరూ కాదు .కనుక సుగ్రీవ వానరరాజు రాజునుంచి ప్రాణాలు ఎలాకాపాడుకో గలవయ్యా ?

‘’న దానవో న గంధర్వో న యక్షో న చ పన్నగః –తస్మాత్ ప్రాణ పరిత్రాణం కథం రాజన్ కరిష్యతి ‘’’సరే బాగానే ఉంది .ఇప్పటిదాకా నేను చేసిన అధర్మానికి ఫలం అనుభవించకుండా ఉండటం ఎలా ?అను కుంటున్నావా ?అధర్మ ఫలం ధర్మ ఫలం తో కలియదు ధర్మఫాలం పూర్వపు ధర్మ ఫలం తో  చేరుతుంది .నీ అధర్మం ధర్మాన్ని నశింపజేస్తుంది కనుక అధర్మం నిలవదు .ధర్మం అధర్మాన్ని పో గొడుతుందే,అధర్మం ధర్మాన్ని నాశనం చేయలేదు .కనుక ధర్మాచరణ చేస్తే నీ పాపాలన్నీ పటాపంచలౌతాయి .నేను పూర్వం చాలాధర్మకార్యాలు చేశాను దానిఫాలం చాలా మూలుగుతోంది  అది నా పాపాలను అధర్మాన్ని పోగొట్టదా’’అని ఆలోచిస్తున్నావేమో .నీ ధర్మఫలం అంతా క్షయ మైంది .కనుక నువ్వు ఇప్పుడు అధర్మ ఫలం అనుభవించక తప్పదు అని గ్రహించు –

‘’నతు ధర్మోప సంహార మాధర్మఫల సంహితం-తదేవ ఫలమన్వేతి ధర్మ శ్చాధర్మ నాశనః ‘’

‘’ప్రాప్తం ధర్మఫలం తావద్భవతా నాత్ర సంశయః –ఫలమస్యా ప్యాధర్మస్య క్షిప్రమేవ ప్రపత్స్యసే ‘’

అని మానవ వానరుల చేతిలో నీ చావు తప్పదన్న రహస్యం తనకు తెలిసి౦దని కుండబద్దలు కొట్టి చెప్పాడు .వాడి ధర్మాధర్మాఫాలం తాలూకు  జమా ఖర్చులు లెక్క చెప్పి పుణ్యఫలం జీరో, నిల్ అని చెప్పి ,ఇక పాఫలం అనుభవించటానికి సిద్ధంగా ఉండమన్నాడు .

‘’రాజా !జనస్థానం ఆలో రాముడు ఒక్కడే 14వేల మంది రాక్షస సంహారం చేశాడు ,నీకు అన్నిటా పెద్దవాడైన వాలి ఆయన చేతిలో చచ్చాడని ,రామ సుగ్రీవ మైత్రి అత్యంత  దృఢమైనదనీ తెలుసుకొని నీకు హితం ఏదో ఊహించు .నేనొక్కడినే లంకలో సర్వస్వం నాశనం చేయగలను .కాని అలాచేయమని రామాజ్ఞ లేదు నాకు-‘’

‘’కామం ఖల్వహ మప్యేక స్సవాజి రథ కుంజరాం-లంకా౦నాశయితుమ్ శక్త స్వైష న నిశ్చయః ‘’మరో విషయం రాజా !సీతను చేరబట్టిన శత్రువైన వాడిని నాశనం చేస్తానని రాముడు వానర ,ఋక్షసమక్షంలో ప్రతిజ్ఞ చేశాడు .ఆయనకు అపకారం తలబెడితే దేవేంద్రుదికే దిక్కు ఉండదు నీవొక లెక్కా ?

‘’రామేణ హి ప్రతిజ్ఞాతమ్ హర్ఋక్ష గణ సన్నిధౌ –ఉత్సాదన మమిత్రాణా౦ సీతా యైస్తు ప్రధర్షితా’’

‘’సీత అంటే సకల లంకానగరం నాశనం చేసే కాళరాత్రి అనే మహా శక్తి అని గ్రహించు

‘’యాం సీతే త్యభిజానాసి ఎయం తిస్టతి తే వశే –కాళరాత్రీతి తాం విద్ధిసర్వ లంకా వినాశినీం ‘’

సీత రూపం లో ఉన్న యమపాశాన్ని స్వయంగా నీ మెడకు చుట్టుకోకు .సరిగ్గా ఆలోచించు .సీత కోపం తో తగులబడి ,రామకోప పీడితమై నీలంక అంతా అన్నిటితో సహా కొద్దికాలం లోనే కాలిపోవటం చూస్తావు .నీ మిత్ర బాంధవ సోదర ,కుమారమంత్రి,హితభార్యలు లంకను వినాశనం చెందించకు –

‘’తదలం కాలపాశేన సీతా విగ్రహ రూపిణా-స్వయం స్కంధావ సక్తేన క్షమ మాత్మని చిన్త్యతాం ‘’

‘’సీతాయా స్తేజసా దగ్దాం రామకోప ప్రపీడితాం-దహ్యమానా మిమాం పశ్య పురీం సాట్టప్రపీడితాం’’

‘’స్వాని మిత్రాణి మంత్రీం శ్చ-జ్ఞాతీన్ భాత్రూన్ సుతాన్ హితాన్ –భోగాన్ దారాంశ్చ లంకాం చ-మా వినాశ ముపానయ ‘’

రావణా !చిలక్కి చెప్పినట్లు చెబుతున్నా విను .ప్రత్యేకంగా రామదూతగా వచ్చిన వానరుడను .నామాట పాటించు .’’అన్నాడు

‘సత్యం రాక్షస రాజేంద్ర శృణుష్వవచనం మమ- రామదాసస్య దూతస్య వానరస్య విశేషతః ‘’

రాముడు అంటే ఎవరో నీకు తెలీదు తెలియ జెబుతున్నా విని నీ బుద్ధి మార్చుకో .సర్వలోకాలు ,పంచ మహాభూతాలు,బ్రహ్మ సృష్టించిన సకల స్థావర జంగమ రాశి ,ప్రళయ కాలం లో రుద్రుని ద్వారా లయింప జేయటానికీ ,మళ్ళీ కల్పాది లో పూర్వం లా సృస్టించటానికి మహాయశ్వి రాముడు సర్వ సమర్ధుడు .దేవాసుర రాజ ,రాక్షస విద్యాధర ,గ౦ధర్వ నాగ సిద్ధ కిన్నర కింపురుష ,పక్షి జాతులలోనూ సర్వ భూతాలలోనూ సకల ప్రదేశాలలోనో సర్వకాలాల్లోనూ విష్ణువు తో సమానమైన పరాక్రమం కల రామునినితో ఎదురు నిలిచే వారు లేరు –

‘’సర్వాన్ లోకాన్ సుసంహృత్య సభూతాన్ స చరాచరాన్ –పునరేవ తథాస్రస్టు౦ శక్తో రామో మహాశయాః

‘’దేవాసుర నరేంద్రేషు,యక్ష రక్షో గణేశు చ –విద్యాధరేషు సర్వేషు గంధర్వేషూరగేషు చ

‘’సిద్దేషు కిన్నరేంద్రేషు పతత్రిషు చ సర్వతః –సర్వ భూతేషు సర్వత్ర సర్వ కాలేషు నాస్తి సః

యో రామం ప్రతి యుధ్యేత విష్ణు తుల్య పరాక్రమమ ‘’

‘’కనుక దశ కంఠా!అన్నిలోకాలకు ప్రభువు ,రాజ శ్రేష్టుడు అయిన శ్రీ రామచంద్ర మూర్తి కి ఇలాంటి అపకారం చేసి జీవించటం దుర్లభం .రాముని ఎదుట నిలువగలిగిన వారేవ్వరూ లేరు అని తెలుసుకో –

‘’సర్వ లోకేశ్వర స్స్యైవం కృత్వా విప్రియ ముత్తమ౦ –రామస్య రాజ సింహస్య దుర్లభం తవ జీవితం ‘’

రాక్షసరాజా రావణా !స్వయంభు ఐన చతుర్ముఖ బ్రహ్మ ,ముక్కంటి మహేశ్వరుడు ,త్రిపురారి రుద్రుడు ,మూడులోకాల నాయకుడు పరమైశ్వర్య సంపన్నుడు దేవేంద్రుడు కాని రాముడు చంపాలను కొన్నవాడిని ఎట్టి పరిస్థితి లోనూ కాపాడలేరని గ్రహించు ‘’

‘’బ్రహ్మా స్వయంభూ శ్చతురాననో వా –రుద్ర స్త్రిణేత్రస్త్రిపురాంతకో వా –త్రాతుం న శక్తా యుధి రామవధ్యం ‘’

ఇలా చెప్పాల్సిందంతా సవివరం గా జంకూ గొంకూ లేకండా అతి స్పష్టంగా తేటతెల్లంగా అన్ని కోణాల నుంచి తన దూత వాక్యాలను అత్యంత సమర్ధంగాగంభీరంగా  చెప్పిన హనుమంతుని యుక్తియుక్తమైన , వచనాలను విని సాటిలేని పరాక్రమశాలి రాక్షసరాజు రావణాసురుడు కోప౦ నషాళానికి అంటి  గుడ్లు తిప్పుతూ వానర శ్రేష్ట హనుమను చంపమని ఆదేశించాడు .

‘’స సౌస్ట వో పేత మదీన వాదినః –కపేర్నిశమ్యాప్రతిమో ప్రియం వచః –దశాననః కోప వివ్రుత్త లోచన-స్సమాదిశ త్తస్య వాదం మహా కపేః’’

  ఇది 45శ్లోకాల అత్యంత ముఖ్యమైఅన హనుమ దూత కర్తవ్య సర్గ

సీతారాములు మామూలు మనుషులుకారు అవతార మూర్తులు అని విస్పష్టంగా హనుమ రావణుడికి చెప్పాడు .ఇద్దరిలో ఎవరికి కోపమొచ్చినా లంక భస్మం అవాల్సింది .వారికి జరిగిన అవమానం తీవ్రమైనది .దానికి వారు తప్పక ప్రతీకారం తీర్చుకొంటారు .రాముడి పరాక్రమమం ముందు ఏలోకం లోనూ ఎవరూ సాటికారు.ఆయన చంపాలనుకున్నవాడిని అభయమిచ్చి కాపాడే మొనగాడు ఏలోకం లోనూ లేడు.నాలుగు ముఖాలున్న సృష్టికర్త బ్రహ్మ ఏమీ చేయలేడు.మూడవకంటితో దహనం చేయగల శివుడు చేతులెత్తేయాల్సిందే .ప్రపంచలయం చేసే రుద్రుడు ఏమీ చేయలేక రోదిన్చాల్సిందే .ఇక దేవేంద్రుడి మాట చెప్పేదేముంది ఆయనే తన ఆపదలకు వారి దగ్గరకు వెళ్లి మొక్కుకోవాలి .

  సకల చరాచారాన్ని సృష్టించి పోషించి లయం చేసే శక్తి రామునికి ఉంది అందుకే ఆయన ‘’రామబ్రహ్మం ‘’’ బ్రహ్మం అన్ని చోట్లా అన్నికాలాలలో సర్వభూతాలలో ఉన్నట్లే రాముడు ‘’ ‘’omniscient ,omnipresent ,omnipotent ‘’అనీ ఆయన్ను తప్పించుకోవటం అసాధ్యమనీ చెప్పాడు .తాను వానరుడు.తనకంటే ఉత్తమజాతి రాక్షసరాజు తనతో చెప్పించుకోవటం భావ్యం సభ్యతా కాదన్నాడు .సీత పంచముఖ కాలసర్పం ,కాలపాశం ఆమె కు కీడు చేస్తే దు౦పనాశనమే అన్నాడు .అసలు రాముడిదాకా ఎందుకు సకల లంక వినాశనం చేసే సమర్ధత తనకున్నదని చెప్పాడు .కాని రామాజ్న లేదనీ ,ఆయన ప్రతిజ్ఞా చెల్లాలనీ ,తనకే ఇంట శక్తి ఉంటె తనను పంపిన ప్రభువుకు ఎంతటి శక్తి ఉంటుందో ఆలోచి౦చ మన్నాడు .ప్రభుకే అలాంటి శక్తి ఉంటే ,ప్రభువులకు ప్రభువు రామస్వామి కి ఎంతటి తేజబలపరాక్రమాలు౦టాయో గ్రహించమన్నాడు .చాలా సమర్ధంగా ధర్మాధర్మ విచారణ చేసి కూడా హితం చెప్పాడు .రావణ ధర్మఫలం సీతాపహరహతో  ‘’హళ్లికి హళ్లి సున్నకు సున్న’’అయి పోయి  అధర్మ ఫలం పెరిగి నాశనం చేయటానికి సిద్ధంగా ఉ౦దన్నాడు .ఎవరూ రాలేని లంకకు శతయోజనవిస్తీర్ణ మహా సముద్రం పై యెగిరి తాను  చేరానని ,తనలాంటి తనకంటే విశేష బలపరాక్రమ వానర సి౦హులు లున్నారని వారికి వాయు ,గరుడ వేగం ఉందనీ ,కనుక కోతులు భల్లూకాలు అని తేలికగా భావి౦చవద్దనీ చెప్పాడు. వాలి పరాక్రమం తెలుసు నీకు అన్నాడు .పూర్వం ఒకసారి రావణుడు ఏదో కోతి పని చేస్తే కోపంతో వాలి వాడిని తన చంకలో పెట్టుకొని సప్త సముద్రాలలో ముంచి తేలిస్తే, ఊపిరాడక కాళ్ళ బేరానికి వస్తే క్షమించి వదిలాడు వాలి .అలాంటి అమిత తేజో సంపన్నుడైన వాలినే రాముడు ఒకే ఒక్క బాణం తో చంపాడు అని భయపెట్టాడు .వానర భల్లూక సైన్య సమూహాలముందు శ్రీరాముడు సీతాపహరణం చేసినవాడిని సంహరిస్తానని ప్రతిజ్ఞ చేశాడని ,రామ ప్రతిజ్ఞా, రామ బాణం తిరుగులేనివని  స్పష్టంగా చెప్పాడు .

  ఎంతటి ధర్మసూక్ష్మాలు హనుమకు తెలుసో మనకు ఆశ్చర్యమేస్తుంది .అరటి పండు వలిచి చేతిలో పెట్టినట్లు పగవాడికి అంత విస్పష్టంగా సుగ్రీవ దూత గా హనుమ మహా నేర్పుగా మాట్లాడాడు .సుగ్రీవ వచనాలు అని మొదలుపెట్టి ,తర్వాత అంతా తన మాటలుగానే చెప్పటం మరో విశేషం అని పించింది .ఇహలోకం లోనూ పరలోకం లోనూ హితమైన మాటలు చెబుతున్నా విను అని బుజ్జగించి చెప్పాడు .వినకపోతే నీఖర్మం అన్నాడు తెగేసి .ఆత్మ వినాశనం తెచ్చే పనులు చేయొద్దు అన్నాడు ,తనతో పాటు అందర్నీ, లంకనూ కాపాడుకోమని ముద్దుగా చెప్పాడు .లేక పొతే జరగబోయేది  మైండ్ బ్లాక్ అయ్యేట్లు ‘’బిగ్ స్క్రీన్ ‘’మీద చూపించాడు  .వినాశకాలే విపరీత బుద్ధి అన్నదాన్ని నిజం చేయకు అనీ చెప్పాడు .చేసిన తప్పులు చెంపలు వాయిన్చుకొంటే పోతాయి అన్నట్లు ,పశ్చాత్తాపం చెంది సీతామహాదేవిని శ్రీరామ చంద్ర ప్రభువుకు సమర్పించి తనను సర్వ లంకా సామ్రాజ్యాన్ని కాపాడుకోమన్నాడు .శరణు అంటే రాముడు ఎవరినైనా క్షమిస్తాడని చెప్పకనే చెప్పాడు .శరణాగత రక్షణ రాముని ప్రత్యేకత ‘’అభయం సర్వ భూతేభ్యః ఏతద్ వ్రతం మమ’’అని చాటుకున్న ఉదార హృదయుడు .

   ఈ హనుమ’’ దూతం’’ తో ప్రేరణ చెంది, శ్రీకృష్ణుడు భారతంలో రాయబారం నడిపాడు –‘’నా పలుకులు విశ్వసింపు ‘’ అలుగుటయే ఎరు౦గని  మహామహితాత్ముడజాత  శత్రువే అలగిన నాడు , సాగరములన్నియు  ఏకము కాకపోవునే ‘’,జెండాపై కపి రాజు ,ముందు సిత వాజిశ్రేణి౦  గూర్చి, నే దండంబున్ గొనితోలు  స్య౦దనము మీదన్ నారి  సారించి  గాండీవంబు ధరించి ఫల్గుణుడు మూకన్  చెండుడు చున్నప్పుడు –ఒక్కండును ఒక్కండునునీమొర నాలకి౦పడు’’ లకు హనుమ మాటలే మార్గదర్శకాలు .ఈ సర్గలో దాదాపు అన్ని శ్లోకాలు ఉదహరింప దగినవే .దేనికదే ప్రత్యేకం .అందుకే వదలకుండా అన్నీ రాశాను. వాటి సారమూ తెలియ జేశాను .ఇంతగొప్పగా ఈ సీన్ పండింప జేసిన వాల్మీకి మహర్షికి కైమోడ్పులు ఘటిస్తూ ,ఏకపాత్రాభినయంలా హనుమ చూపిన సర్వ హావభావాలకు అంజలి ఘటిస్తున్నాను .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -11-6-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బక దాల్భ్యుడు -13

బక దాల్భ్యుడు -13

స్కంద పురాణం ప్రకారం ప్రజాపతి బ్రహ్మ ఇంద్రద్యుమ్న రాజును స్వర్గం లో కలిశాడు .ఆయనను చేసిన పుణ్యాలు ,పొందిన కీర్తి ని బట్టి ఒక వంద  కల్పాల కాలం భౌతికశరీరం తో స్వర్గం లో ఉండే ట్లు  అనుగ్రహించాడు .తరవాత అంతా భారత౦ లో ఉన్నదే .ఇక్కడ తాబేలు పేరు ‘’మంధరక’’ మానస సరోవరం లో ఉంటోంది .అందులోని పాత్రలు ఒక్కొక్కరు ఎంతకాలం జీవి౦చాయో లెక్క కూడా ఉన్నది .మార్కండేయుడు -7కల్పాలు ,బకం-14కల్పాలు ,గుడ్లగూబ -28,తోడేలు -56కల్పాలు,తాబేలు -112కల్పాలు  బ్రతికారు  .ఈ పురాణంలోని మహేశ్వర ఖండం అంతా శివుని గురించే .మహీ నది  సముద్రంతో కలిసే ఒక తీర్ధం వివరాలున్నాయి .అక్కడి శివుడు ఇంద్రద్యుమ్నేశ్వర లింగం .మార్కండేయుడు ,పైన చెప్పబడిన జంతువులూ శాపగ్రస్తులైన రుద్ర గణాలు .ఇంద్రద్యుమ్నుడు తాత్కాలికంగా భూమి మీద ఉండాలని అనుకోకుండా  బకంతో సహా పై జంతువులతో కలిసి ఇక్కడ తపస్సు ధ్యానాదులను శివునితో సారూప్య ముక్తికోసం చేశాడు -2.13.205-08.

  మార్కండేయుడు మాత్రం జీవన్ముక్తుడయ్యాడు.శివుడు ‘’లోమాంశ’’ రుషినీ అలాగే చేశాడు. ఈయన వయసు ఇంద్ర ద్యుమ్న ,తాబేలు లకంటే చాలా ఎక్కువ .కల్పానికి ఒక్క శిరోజం ఊడిపోతుందనీ ,అన్నీ శిరోజాలూ ఊడిపోయే దాకా తాను  బ్రతుకు తాననీ ఆయనే చెప్పుకొన్నాడు .కల్పాలు లయమైన కాలం లోకూడా లోమా౦శుడు జీవించే ఉంటాడు .కనుక యితడు వేదకాలానంతరం వాడుగా లోమాంశ లేక రోమాంశ అంటే పొడవైన జుట్టున్నవాడు గా  కేశి అంటే దీర్ఘ కేశాలున్నవాడుగా అంటే బక దాల్భ్యుడుగా భావించవచ్చు .లోమామ్శుడు ఉత్తర ప్రాంతం వాడు అనీ ఉన్నది-మణి-1975-458.కనుక బకనాడీ జంఘ ,ఇతర పేర్కొనబడిన దీర్ఘ జీవితం ఉన్న పై ముసలి జంతువులూ  అన్నీ హిమాలయ ప్రాంతంలో ఉండేవి .

 తనకు దీర్ఘ జీవితం ప్రసాది౦చి౦ది శివుడే అని నాడీ జన్ఘుడు చెప్పాడు .యితడు పూర్వం ‘’అనార్త ‘’మహారాజు .విశ్వ రూప పారాశర్యుని  బ్రాహ్మణ కుమారుడు.చిలిపి వాడు .ఒకరోజుతండ్రి పూజించే మరకత శివలింగాన్ని దొంగిలించి ఒక మకర సంక్రాంతి నాడు నేతి ఘటం లో దాచాడు .శివుడు ఈ రకమైన కొత్త అభిషేకానికి మహా ప్రీతి చెంది దీనికి ‘’ఘ్రుత కంబాల పూజ ‘’అనిపేరు పెట్టాడు  .ఈ పుణ్య ఫలితం గా ఆ  బ్రాహ్మణ యువకుడు అనార్త  మహారాజుగా పుట్టాడు .అతనికి గతజన్మవిషయాలు గుర్తున్నాయి .అప్పటినుంచి శివలింగాన్ని  నేతితోనే  అభిషేకించాడు .శివ దర్శనం కలిగి వరం కోరుకోమంటే కోరిక తీర్చి కైలాస గణ నాయకుని చేయగా ‘’ ప్రతీపపాలక ‘’నామం పొందాడు .

 పదవి పతనానికీ దారి తీసింది .ఇష్టమొచ్చినట్లు తిరిగాడు నాడీ.ఈ తిరుగుళ్ళలో గాలవ రుషి పరిచయమై ,ఆయన భార్యపై మోజుతో శిష్యుడిగా చేరాడు .ఒకసారి ఆమెను బలాత్కారించబోగా  ఆమె అరుపులు విని రుషివచ్చి తీవ్ర పదజాలంతో స్తబ్దుడవై దీర్ఘకాలం కొంగవై పొమ్మని  శపించాడు .అప్పటినుంచి కొంగ నైజం వచ్చింది –స్కందం –మా ఖండం -2.7.94.కశ్యప వంశంలో బకునిగా పుట్టాడు .ఇంద్ర ద్యుమ్నునికి సహాయం చేస్తే, శాప విమోచనం అనీ మహర్షి అనుగ్రహించాడు -2.7.109-110.

నాడీ జన్ఘుని బకనైజం అన్ని రూపాలలో కనిపిస్తుంది .విశ్వరూపుడు తనకొడుకును ‘’బక’’అని పిలిచేవాడు .గాలవ కథలలో చాలా సార్లు ఈ నైజం చూపాడు .ఆయన శిష్యుడివి ఎలా అయ్యావు అని  అడిగితె పూర్వ బకజన్మ వల్లనే అని చెప్పాడు .వీడు గురు భార్యను ఎత్తుకు పోదామని ప్రయత్నిస్తుంటే ఆమె వాడిని  ‘’బకవృత్తి ‘’గాడు అనిఅంటే ధర్మం ముసుగులో ఉండే కపటి అని  తిట్టింది .గాలవ శాపంతో వాడు కదలలేడు అంటే చిత్రంలో బొమ్మలా ఉండిపోయాడు .వృద్ధ బకుడు ,అత్తి చెట్టు తో కలిసి కనిపిస్తాడు .ముని శపించగానే అశ్వత్ధ మొక్క  ఆకులులాగా కంపించిపోయాడు .

  బక సంబంధమైన అన్ని కథలలో బకాదాల్భ్యుని నైజం కొంగ బుద్దిగానే కనిపిస్తుంది .నాడీ జంఘ వృత్తాంతం లో మూర్తీభవించిన బకత్వమే మనం చూశాం .నమ్మశక్యం కాని ,పనికిమాలిన యోగ్యతలేని అసమర్ధ ,కపట ముని వృత్తికల స్తబ్దుడైన ,వ్యభిచార ముసలి వాడుగా అతడు కనిపిస్తాడు .అల్లరిచిల్లర కొడుకును తండ్రే బక అంటే వాడి నైజం అర్ధమౌతుంది .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -10-6-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -4

ప్రపంచ దేశాల సారస్వతం

108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -4

ఆనాటి కవులలో ముఖ్యుడు జాన్ మిల్టన్ .అద్భుత ప్రతిభా వ్యుత్పత్తులతో ఆయనరాసిన ‘’పారడైజ్ లాస్ట్ ‘’కావ్యం పద్య కావ్య శిరో రత్నం .ఆయనే రాసిన’’లలేగ్రో ,ఇల్ పెన్స రోసో పద్యకావ్యాలు ,కోమస్ నాటకం ‘’లిసిడాస్’’అనే విషాద గీతం ఆయన ప్రతిబా సర్వస్వాలు .జీవిత చరమాంకం లో ‘’పారడైజ్ రీ గైన్డ్’’కావ్యం,’’శాంసన్ ఎగొనిస్టస్’’నాటకం రాశాడు .వచనరచనలూ చాలా  చేశాడు .వాక్ స్వాతంత్ర్యం కోరుతూ రాసిన ‘ఏరియో పెజీటీక ‘’గ్రంథం విలువైనది .

   అధిక్షేప కావ్య రచనలతో దూసుకు పోయినవాడు జాన్ డ్రైడేన్.’’అబ్సలం అండ్ అకిట ఫెల్’’’’దిమెడల్ ,మెక్ ఫ్లేక్నో కావ్యాలలో ఆనాటి రాచకీయ వాతావరణం మనుషుల దుర్నీతి వ్యంగ్యంగా విమర్శించాడు .’’అలగ్జా౦డర్స్ ఫీస్ట్ ‘’,ది హైండ్ అండ్ ది పాంథర్లలోకూడా ఈవ్య౦గ్య వైభవం స్పష్టంగా కనిపిస్తుంది .డ్రైడేన్ తనకావ్య రచనకు ‘’హీరోయిక్ కప్లెట్ ‘’అనే ద్విపదను అత్యంత నైపుణ్యంతో ఉపయోగించి మార్గ దర్శకుడయ్యాడు .సాహిత్య శాస్త్ర సిద్దా౦తాలనుకూడా చాలా దక్షతతో విమర్శించాడు .కొత్తగా ప్రసన్న సరళ వచనకు దారి చూపి కొన్ని సాహిత్య వ్యాసాలుకూడా రాశాడు .నాటి నాటక కర్తలలో అతనిది ప్రత్యేక స్థానం .మార్క్ ఆంటోని విషాద గాథను ‘లవ్ ఫర్ లవ్ ‘’నాటకం లో అమోఘంగా చిత్రించి రాశాడు .

   ఆ నాటి సుఖాంత నాటకాలు కథా సంవిధాన ప్రతిభకు నిదర్శనాలు కాని నీతి లేకపోవటం పెద్ద లోటు .ఓట్వే,ఎథరిజ్ ,విచర్లి ,కాన్గ్రీన్ ,ఫార్క్వర్ ఈనాటకకర్తలలో ముఖ్యులు .కాన్గ్రీన్ రాసిన ‘’లవ్ ఫర్ లవ్ ‘’,ది వె ఆఫ్ ది వరల్డ్ నాటకాలు వీటిలో ప్రసిద్ధాలు .వచనం ఆనాడు పలు వింత విశిష్ట పోకడలు పోయింది .వైదుష్యం జోడించి గంభీరశైలిలో రాబర్ట్ బర్టన్ రాసిన ‘’ది అనాటమీ ఆఫ్ మెలాంకలి’’గ్రంథం,కవిత్వం తో పోటీగా రమణీయ శైలిలో టామస్ బ్రౌన్ రాసిన ‘’రివిజియో మెడిచి ‘’,హైడ్రియో టేఫియా’’, లలిత ఆలంకారికశైలిలో జేరేమి టియ్లర్’’రాసిన హోలీ లివింగ్ ,హోలీ డైయింగ్ అనే ధార్మిక గ్రంథాలు ,సరళ సుందరంగా ఉన్నడ్రైడేన్ విమర్శనావ్యాసాలూ  ,ప్రసంగ ధోరణిగా ఐజాక్ వాల్టన్ రాసిన ‘’ది కంప్లీట్ యా౦గ్లర్’’,నిత్య వ్యవహార భాషలో శామ్యుల్ పెపిన్ రాసిన ‘’డైరీ ‘’చాలా విలువైన వచన రచనలు .జాన్ బన్యన్ పెద్దగా చదువుకోకపోయినా బైబిల్ ను నిత్య పారాయణ చేయటం తో వచ్చిన పాండిత్యంతో ‘’ది పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ ‘’అనే ‘’ఎలిగరి ‘’అంటే అన్యాపదేశాన్ని గొప్పగా పండించాడు .పాపపంకిల మార్గం నుంచి దైవ  సన్నిధానానికి చేరాలని భక్తుడు చేసే యాత్రలో తటస్తించే అనేక అనుభవాలను మహా సొగసుగా వర్ణించాడు .  సమాజం నీతి బాహ్య విశ్రుమ్ఖలత్వం పై విరక్తి పుట్టి ,18వ శతాబ్దిలో నవమార్గ కవితా సంప్రదాయం –నియోక్లాసికల్ స్కూల్ ఏర్పడింది .ప్రాచీన లాటిన్ కవిత్వ రీతులపై మోజు పుట్టింది .భావనకంటే బుద్ధికి ప్రాధాన్యమేర్పడింది .దీనితో వ్యంగ్య ,ప్రబోధాత్మక కావ్యాలు కుప్పలు తెప్పలుగా వచ్చాయి .ప్రకృతి అందాలను వదిలేసి నాగరక జీవిత తళుకు బెలుకులపై ఆసక్తి పెరిగి ,వాటినే కవితా వస్తువులుగా తీసుకొన్నారు .లాలిత్యం లోపించి కృత్రిమత హెచ్చింది .దీనికి పితామహుడు అలేగ్జాండర్ పోప్ .ఈతనికావ్యాలలో నవమార్గ కవితా సంప్రదాయం లోని గుణాలు దోషాలు కనిపిస్తాయి .తన కవిత్వ సిద్ధాంతాన్ని ‘’ఎస్సే ఆన్ క్రిటిసిజం ‘’అనే కావ్యం లో ,సాంఘిక విశ్వాసాలకు ‘’ఎస్సే ఆన్ మాన్’’రాశాడు .హోమర్ ఇలియడ్ కు ఇంగ్లీష్ లోస్వతంత్ర అనువాదం చేశాడు .’’ది రేప్ ఆఫ్ ది లాక్ ‘’వ్యంగ్య కావ్యం  లో ఉన్నత కుటుంబ వ్యక్తుల నిరర్ధక విలాస జీవితాలను మెత్తని చెప్పుతో కొట్టి మందలించాడు .పరిహాస రసికత్వం లో మాంచి రసపట్టున్నవాడు పోప్..తన విరోధులను కడిగి పారెయ్యటానికి ‘’డన్సియడ్ ‘’అనే అధిక్షేప కావ్యమే రాశాడు .ఇతని కవిత్వానికి ప్రాణం ఛలోక్తి .ఇతనికవిత్వ పద్యపంక్తులు సామెతలుగా లోకంలో విస్తృత ప్రచారం పొంది మన ‘’వేమన’’ గుర్తుకు వస్తాడు .ఒక రకంగా ‘’సాహిత్య దినుసుల పోపు డబ్బా ‘’పోప్ కవి అనిపిస్తుంది .

  పోప్ అనుయానకవులు ఎడ్వర్డ్ య౦గ్ ,మాధ్యూ ప్రయర్ ,జాన్ గే.జేమ్స్ టామ్సన్ఋతువులను వర్ణిస్తూ ‘’సీజన్స్ ‘’రాసి మధుర భావనకు ప్రాధాన్యం తెచ్చాడు .భావ ప్రకటనకు కవిత్వం కంటే వచనమే హాయి అనిపించి, డేనియల్ డీఫోరాసిన కల్పిత కథ యదార్ధమే అని నమ్మి౦ చేట్లుగా ‘’రాబిన్సన్ క్రూసో ‘’ బహుళ ప్రజాదరణ పొంది ,బాలవాగ్మయం లో  అందర్నీ ఫోఫో అని వెనక్కి నెట్టేసి సుస్థిర స్థానం పొందాడు డీఫో.స౦వాద  శైలికి ప్రాణ ప్రతిష్ట చేసి ,సరళ సుబోధకంగా రాసినవాడు ‘’జొనాథన్ స్విఫ్ట్ ‘’.’’ది బాటిల్ ఆఫ్ ది బుక్స్ ‘’లో ప్రాచీన ,ఆధునిక మార్గాలమధ్య సంఘర్షణను ,క్రైస్తవ మతశాఖలమధ్య అంతః కలహాలను ‘’ది టేల్  ఆఫ్ ఎ టబ్’’ (నూతిలోని కప్పలు ?) లోనూ విమర్శించాడు .మొత్తం మానవ జాతిపై ఏర్పడిని తన విరక్తిని ‘’గలివర్స్ ట్రావెల్స్ ‘’లో అధిక్షేప రచనగా ,వచన కథా కావ్యంగా నిర్మించాడు .మానవ సమాజం లోని అనేక లోపాలను అందులో ఎత్తి చూపాడు .అందులోనే ఉన్న ‘’యాహూ ‘’పదం మనకు’’ యాహూ డాట్ కాం’’ కు దారి చూపింది .అది స్విఫ్ట్ ‘’కాయనేజ్డ్ వర్డ్ ‘’.

  ఆనాటి పత్రికలు వ్యాసరచన బాగా ప్రోత్సహించాయి .రిచర్డ్ స్టీల్ ,జోసెఫ్ యుడిసన్ఇద్దరు కలిసి ‘’ది టాట్లర్ ‘’అనే పత్రికలో ,తర్వాత ‘’డి స్పెక్టేటర్’’పత్రికలో సమకాలీన సమస్యలను నిష్పక్షపాతంగా సౌమ్యంగా  మృదు హాస్య భరితంగా ,రసవంతంగా అనేక వ్యాసాలూ రాశారు .వీరు సృష్టించిన ఐజాక్ బికర్ స్టాఫ్ ,సర్ రోజర్ డీ కవర్లి పాత్రలు సాహిత్యం లో అమరత్వం పొందాయి .

   సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -9-6-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బక దాల్భ్యుడు -12

బక దాల్భ్యుడు -12

ధ్యాన కపటి –నిదానం ,తలవంచుకొని ఉండటం ,అకస్మాత్తుగా దాడి చేయటం కొంగ నైజాలు .ఇలాగే ఉండే వాడిని’’ బకవ్రతికుడు’’అంటారు ఇద్దరూ కపటులే.మౌని బకం అంటే ఆలోచనకోల్పోయి ధ్యానం చేసేవాడనీ అర్ధం .వంచన ,ధ్యానం కొంగ సహజాలు .ఆలోచనలో ఉన్నట్లు ధ్యానంలో ఉన్నట్లూ అనిపించినా అది తనను  నమ్మిన చేపలను  హాయిగా గుటకాయస్వాహా చేస్తుంది  –‘ప్రకటిత ధ్యానోపి ‘’.మరో లక్షణం విచారం లో ఉన్నట్లు కనిపించటం ,,బ్రాహ్మణుడి లా నటించటం.జాతక కథలలో బక జాతకం ఒకటి ఉన్నది .బోధి సత్వుడు ఒకసారి చేప రూపం లో ఉంటూ బక నైజం తెలిసి దానికి ఆహారం కాకుండా ఉంటాడు .ఆ చేప రెం డు శ్లోకాలు చెప్పింది-

See that twice-bom bird, how white –

Like a water-lily seeming;

Wings outspread to left and right –

Oh, how piousl dreaming, dreaming!

What he is ye do not know,

Or you would not sing his Praises.

He is our most treacherous foe;

That is why no wing ¡e ¡6¡5″s

 బుద్ధి మంతుడు బకంలాగా ఉంటూ ఇంద్రియ నిగ్రహం కలిగి ,సమయానికి తగినట్లు ప్రవర్తించాలి అని కూడా బకంమనకు పాఠం చెబుతుంది .బకం అంటే ధ్యాన సంపన్నమైనదిగా చెప్పబడింది –‘’బకో ధ్యానవాన్ ‘’.పక్షులకున్న సుందర మనోహర లక్షణాలు కొంగకు లేవు .కాని వాటికి లేని వ్రతం కొంగకున్నది .ఈ లక్షణమే పాడే, కూసే పక్షులకంటే, అంటే అతిగా మాట్లాడే, గోల చేసే వాటికంటే ఇది ప్రత్యేకంగా కనిపిస్తుంది-అంటే ముఖ దోషం వాటికుంటే దీనికి లేదు .విష్ణు ,గరుడ పురాణాలు  మను ధర్మశాస్త్రం కొ౦గలను చంపటం నేరమని ఘోషించాయి .

  .కార్తీకమాసంలో అయిదు రోజులు మాంసాహారం తినరాదు .అదే ‘’బకపంచాక’’ గా స్మృతులలో చెప్పబడింది .ఎందుకు ఈ పేరొచ్చింది ?కొంగలు కూడా ఆ అయిదు రోజులూ మాంసం తినవు –కాణేపండితుడు -1974-335.ఒక వేళ ఈ అయిదు రోజుల్లో ఎవరైనా మాంసం తింటే, కొంగ చేసిన పాపాపలన్నీ భరించాల్సి వస్తుంది .ఒక జాతక కథలో కొంగ ఉపవాసం గురించి ఉన్నది-జాతక 300. ఆ కథపేరు –వ(బ)కజాతక .గంగానది ప్రక్కనున్న రాతిపై ఉండే కొంగ వానాకాలం లో నీరు బండ చుట్టూ చేరితే ,ఒంటరిదై,ఆకలి తో అలమటిస్తూ ఉపవాసం ఉండాలను కొంటుంది –‘’ఉపోశథా కమ్మ ‘’.ఆసమయం లో బోధిసత్వుడు స్వర్గంలో ‘’సక్క’’ అనే రాజుగా ఉన్నాడు .ఈ బక ఉపవాస మర్మమేమిటో పరీక్షించాలనుకొని ,మేక రూపం దాల్చి ఆ కొంగ సమీపానికి వచ్చాడు .దాన్ని చూడంగానే నోరూరి తినాలనిపించి ఉపవాసం మర్నాటికి వాయిదా వేసుకున్నది .ఆ మేక అందినట్లే అంది దూరం పోతోంది అప్పుడు అది ‘’నా ఉపవాస వ్రతం ‘’చెడగొట్టుకో  కూడదు అనుకొన్నది .ఈ బకకథ చూస్తె నీటితో సంబంధమున్న బకదాల్భ్య /మార్కండేయ కథ గుర్తుకొస్తుంది కదా .వీటికి గొప్ప లింకులున్నాయి .జాతక కధలలో రెండు వ్రాత ప్రతులలో తప్ప మిగిలిన వాటిలో ‘’వక ‘’అనే ఉన్నది .ఈరెండిటిలో’’ బక’’ ఉన్నది .పాళీ భాషలో ‘’వక’’ అంటే తోడేలు (వృకం )అని అర్ధం కూడా ఉన్నది .ఇక్కడి కథలో అది ఎగరలేదు కనుక ,అది తోడేలు అయి ఉంటుంది .ఇక్కడ మనకు కొంగ, తోడేలువిషయాలురెండూ కలిసిపోయాయి .

ముసలి పక్షి –బకదాల్భ్యుని విషయంలో ఆయన వయసు కూడా చర్చించాం .ఇంద్ర ద్యుమ్న రాజు కథలో ఒక కొంగ ‘’నాడీ జ౦ఘుడు’’అంటే పొడవైన కాళ్ళున్నవాడు గా పరిచయమయ్యాడు .ఇందులో మార్కండేయమహర్షి ది ముఖ్యపాత్ర .ఈకథ భారతం అరణ్యపర్వం 3.191లో ఉన్నది .ఇదే ఇంకా వివరంగా స్కందపురాణం ఉమామహేశ్వర ఖండం  2.7.13లో ఉన్నది .భారతం లో మార్కండేయులు పాండవులకు సంక్షిప్తంగా చెప్పాడు .స్వర్గం లో ఉన్న ఇంద్ర ద్యుమ్నుడు పుణ్యం ఖాతా  కీర్తి అయిపోగానే భూమిపై పడతాడు .భూలోకపు కీర్తి స్వర్గంలో చాలాకాలం ఉన్నందున హరించి పోగా తన గతకాల విషయాలు చెప్పగలవారేవరైనా ఉన్నారేమో అని అడిగితె ఆయన ఎవరికీ గుర్తు లేడని అందరూ చెప్పారు.మార్కండేయుని కలిస్తే ఆయన’’ ప్రాకార కర్ణ’’ అనే తనకంటే పెద్దవాడైన గుడ్లగూబ ను అడగమంటే, అడిగితె ఇంద్రద్యుమ్నుడు గుర్తు లేడు అని ,ఇంద్రద్యుమ్న సరోవరం లో ఉన్న ‘’బక  నాడీజన్ఘుడు’’ తనకంటే వయసులో పెద్ద అని చెప్పగా ,ఆఇద్దరితో కలిసి వెళ్లి చూస్తె, ముసలి దానిలాకనిపించలేదు .అందరూ కలిసి అదే సరస్సులో ఉన్న ‘’ఆకూపార ‘’అనే తాబేలు ను అడిగితె ,అది రాజును చూసి కన్నీరు కార్చింది .దీని వీపు మీదే పూర్వం ఇంద్రద్యుమ్నుడు అగ్నిహోత్రం చేశాడు .ఆయన యజ్ఞదక్షిణగా ఇచ్చిన పశువుల నడకవల్లనే ఇంద్రద్యుమ్న సరోవరం ఏర్పడింది .తాబేలు చెప్పిన ఈ విషయాలవలన రాజు నిర్వహించిన ధర్మం,  పొందిన కీర్తిభూమిపై  నిలిచాయి .చివరికి స్వర్గం నుంచి దివ్య రథం వచ్చి ఇంద్రద్యుమ్నుని మళ్ళీస్వర్గానికి దేవతలుతీసుకు వెడతారు .ఇక్కడ మనం తెలుసుకొన్న ముఖ్యవిషయం మార్కండేయ రుషి  కంటే బకం ఎక్కువ కాలం జీవించింది .స్కంద పురాణంలో మరింత ఎక్కువగా ఆకర్షణీయంగా ఉన్నకథ తర్వాత తెలుసుకొందాం .

   సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -9-6-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-48

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-48

గోరోచనవర్ణ నేత్రాలు ,మహాతేజస్వి ,వానర శ్రేష్టుడు అయిన హనుమను రావణుడు చూసి సందేహం కలిగి మనసులో ‘’ఇతడు సాక్షాత్తు నందీశ్వరుడు ‘’లాగా ఉన్నాడేమిటి ?’’అనుకొన్నాడు –

‘’’’శంకాహృతాత్మా దధ్యౌ స కపీన్ద్ర౦ తేజసావృతం –కిమేశ భాగావాన్న౦దీ భవే సాక్షా దిహాగతః’’

పూర్వం నేను కైలాసాన్ని పెకలిచినపుడు నాకు శాపమిచ్చిన నందీశ్వరుడు కాని బలికొడుకు బాణ రాక్షసుడు కానీ కోతిరూపంలో వచ్చాడా ?’-

‘’యేన శప్తోస్మి కైలాసే –మయా సంచాలితే పురా –సోయం వానర మూర్తిఃస్యాత్ –కిం స్విత్ బాణోపి వా సురః’’

’అనుకుని కోపంతో కన్నులు ఎర్రబడి మంత్రి ప్రహస్తునితో ఇలాన్నాడు ‘’ఇతడు ఏ దేశం నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చాడో  నా వనం పాడు చేయట౦ లో ప్రయోజనమేమిటో ,రాక్షస స్త్రీలను భయపెట్ట టానికి కారణమేమిటో ఎదిరించటానికి సాధ్యం కాని లంకానగారానికి రావటానికి కారణమేమిటో ఆ దురాత్ముని అడుగు ‘’అన్నాడు .

 వెంటనే ప్రహస్తుడు ‘’వానరా !ఊరడిల్లు.నీకు శుభం కలుగుగాక ,భయపడకు .ఇంద్రుడు పంపగా వచ్చావా ,కుబేర ,యమ,   వరుణ చారుడుగా వచ్చావో భయం లేకుండా చెప్పు వదిలేస్తాం .లేక విజయం కోరే విష్ణువు చే పంపబడిన దూతవా ?వానరుడవైనా నీ తేజస్సు అమోఘం .నిజం చెప్పు .అబద్ధం చెబితే నువ్వు బతకటం దుర్లభం .అసలు ఏ ఉద్దేశ్య౦ తో లంకు వచ్చావో చెప్పు .’’అని అన్నాడు

‘’యది వైశ్రవణస్యత్వం యమస్య వరుణస్యచ –చార రూపమిదం కృత్వా ప్రవిస్టో నః పురీ మిమాం ‘’

‘’విష్ణునా ప్రేషితో వా దూతో విజయ కామక్షి ణః

‘’నహి తో వానరం తేజో రూప మాత్రం తు వానరం ‘’

‘’అనృతం వదశ్చాపిదుర్లభం తవ జీవితం

అథవాయన్నిమిత్తం తే ప్రవేశో రావణాలయే’’

 అప్పుడు వానర శ్రేష్ట హనుమాన్ సూటిగా రావణుడి తోనే ‘’నేను దేవేంద్ర ,యమ ,వరుణులు పంపిన దూతను కాను .కుబేరునితో నాకు స్నేహం లేదు .విష్ణువు నన్ను పంపలేదు .జాతిగా వానరుడినే కాని వానర రూపం పొందిన వేరొకడిని కానే కాను . రాక్షస రాజు రావణుడిని చూడటం దుర్లభం కనుక ఆయన్ను చూడటానికే వనం ధ్వంసం చేశాను –‘’అన్నాడు

‘’అబ్రవీ న్నాస్మి శక్రస్య యమస్య ,వరుణస్య వా –ధనదేన న మే సఖ్యం విష్ణునా నాస్మి చోదితః

‘’జాతి రేవ మమత్వేషావానరో హ మిహాగతః

‘’దర్శనే రాక్ష సేన్ద్రస్య దుర్లభే తదిదంమయా –వనం రాక్షస రాజస్య దర్శనార్ధే వినాశితం’’

‘’అప్పుడు బలవంతులైన ,యుద్ధం కోరే రాక్షసులు నాపై కి వచ్చారు. ఆత్మ రక్షణ కోసంనేను వాళ్ళతో పోట్లాడాను .నన్ను ఏ శస్త్రాస్త్రాలు బంధించలేవని బ్రహ్మ దేవుడు నాకు వరమిచ్చాడు .రావణుడిని చూడటానికే నేను బ్రహ్మాస్త్ర బంధనం అలాగే ఉంచుకున్నాను .మీవాళ్ళు త్రాళ్ళతో కట్టటం తో బ్రహ్మాస్త్ర బంధనం తొలగి పోయింది .నేనొక రాజ కార్యం కోసం ఇక్కడికి వచ్చాను .నేను అమిత పరాక్రమ శాలి రాముని దూతను .నీ మంచికోసం నేను చెప్పే మాటలు జాగ్రత్తగా విను ‘’అన్నాడు హెచ్చరికగా హనుమ .

‘’తతస్తే రాక్షసాఃప్రాప్తా బలినో యుద్ధ కా౦క్షిణః-రక్షణార్ధంతు దేహస్య ప్రతి యుద్ధా మయారణే’’’’

‘’అస్త్ర పాశైర్న శక్యోహం బద్ధుం దేవాసురైరపి-పితామహా దేష వరో మమాప్యేషోభ్యుపాగతః ‘’

‘’కేనపి రాజ కార్యేణసంప్రాప్తోస్మి తవాన్తికం –దూతోహ మితి విజ్ఞేయో రాఘవస్యామి తౌజసః

శ్రూయతాం చాపి వచనం మమ పథ్య మిదం ప్రభో ‘’

  ఇది 18శ్లోకాల 50వ సర్గ .

కిందటి సర్గలో హనుమ రావణ వైభవానికి ఆశ్చర్యపోతే ,ఈ సర్గలో రావణుడికి గతంలో జరిగిన విషయాలు,అనుభవాలు  హనుమను చూడగా స్పురణకు వచ్చాయి .హనుమలో భగవంతుడైన నందీశ్వరుడు కనపడ్డాడు .ఆయన పెట్టిన శాపం గుర్తుకు వచ్చింది .లేకపోతె కోతికి అంతటి తేజస్సేమిటి విడ్డూరం కాకపొతే ?ప్రహస్తుడు కూడా మంచి ప్రశ్నలే సంధించాడు .నిజం చెబితే వదిలేస్తామని ,అబద్దమాడితే చావు తప్పదని హెచ్చరించాడు  .అన్ని ప్రశ్నలకు యుక్తియుక్తమైన సమాధానాలే చెప్పాడు దీమాన్ హనుమాన్ .ఏ దేవుడూ దేవతా పంపిన దూతను కాను అని నిష్కర్షగా చెప్పాడు .అశోక వనం భగ్నం చేయటానికి కారణం రావణుడిని చూడాలన్న ‘’చపలత్వమే’’ అన్నాడు .అమిత పరాక్రములైన రావణ రాక్షసులు అనవసరంగా తనపైకి కాలుదువ్వి వచ్చారని ఆత్మ రక్షణకోసం వారితో పోరాడవలసి వచ్చిందని యుక్తియుక్తంగా చెప్పటం హనుమ ధీనిధి అని తెలియ జేస్తుంది ‘’ఆత్మ రక్షణ కోసం –రక్షణార్ధం తు దేహస్య ‘’ ‘’అన్నమాట సుప్రీం కోర్టులో కూడా తిరుగులేని మాట .అప్పీలు లేని మాటకూడా .ఇక్కడే పురాణప్రవచ ప్రవీణ బ్రహ్మశ్రీ మల్లాది చంద్ర శేఖర శాస్త్రిగారుచాలా తమాషాగా చెబుతారు ‘’రాజా !నేను మీ వాళ్ళ మీదకు వెళ్ళానా  ?లేక వాళ్ళే నా మీదకొచ్చారా ?తెలుసుకో .ఏదో ప్రాణ రక్షణార్ధం వాళ్ళను అలా ఇలా వాయించా .ఆయువు మూడిచచ్చారు.ఇందులో నా తప్పేమీ లేదు మహారాజా !’’అని సరదాగా చెబుతారు

  తనకు బ్రహ్మ ఇచ్చిన వరం వలన ఏ అస్త్రాలు తనను బంది౦లేవని  బ్రహ్మాస్త్రానికి ఆయనమాటమీదే  బద్ధుడనై ఉండిపోయాను అనీ,మీ అబ్బాయి పౌరుష పరాక్రమాలకు నేను లొంగిరాలేదు అవి నన్నేమీ చేయలేవు అని అన్యాపదేశంగా చెప్పాడు ..మహాత్ముడైనశ్రీరాముని దూతను అని విస్పష్టంగా చెప్పాడు .రావణ హితం కోసం తాను  చెప్పే మాటలు శ్రద్ధగా ఆలకించమని హెచ్చరికా చేశాడు హనుమ .ఇక్కడే మహర్షి మంచి సస్పెన్స్ సృష్టించి తరువాత ఏమి జరుగుతుందో అనేఉత్సుకత కలిగించాడు .అది తెలుసుకోవటానికి రేపటి దాకా ఆగాలిగా మరి ?అంతేగా మరి  ?

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-6-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -3

ప్రపంచ దేశాల సారస్వతం108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -3

   అప్పుడే నాటకసాహిత్యానికి గొప్ప ఊపు వచ్చి ,ప్రేక్షకాదరణ పెరిగి  నాటకాలు వచ్చాయి కాని ఇవన్నీ గ్రీకు ప్రేరణతో వచ్చి విజయం పొందలేదు .అప్పుడే స్వతంత్ర ఆలోచన వచ్చి జాన్ లిలీ ,టామాస్ కిడ్ ,జార్జి పీల్ ,ధామస్ లాడ్జ్ ,రాబర్ట్ గ్రీన్ ,ధామస్ నాష్ మంచి నాటకాలు రాశారు .మహోజ్వల భావనా పటిమతో క్రిస్టఫర్ మార్లో ‘’టాంబర్లేన్ ‘’,డాక్టర్ ఫాస్టస్,దిజ్యూ ఆఫ్ మాల్టా,ఎడ్వర్డ్ ది సెకండ్ రాసి మహానాటక రచయిత అనిపించాడు .అతడే ‘’హీరో అండ్ లియాండర్ ‘’పద్యకావ్యమూ  రాశాడు .,

  విలియం షేక్స్ పియర్ నాటకాలు జగద్విఖ్యాతమై శిఖరారోహణం చేశాయి .నాటక వాజ్మయం లో ఆయన స్పృశించని పార్శ్వం లేదు .మొత్తం 37నాటకాలు రాశాడు .అందులో –ఎ మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీం ,దిమర్చెంట్ ఆఫ్ వెనిస్ ,మచ్ యాడో అబౌట్ నథింగ్,యాజ్ యు లైక్ ఇట్ , ట్వేల్ఫ్త్  నైట్  నాటకాలు సుఖాంతాలు .రిచర్డ్ ది సెకండ్ ,హెన్రి దిఫోర్త్ ,హెన్రి ది ఫిఫ్త్ ,లు చారిత్రకాలు .జూలియస్ సీజర్,ఆంటోనీ అండ్ క్లియోపాట్రా,లు రోమన్ నాటకాలు .రోమియో అండ్ జూలియట్ ,హామ్లెట్ ,ఒథెల్లో,మేక్బెత్,కింగ్ లియర్  విశాదంతాలు అంటే ట్రాజెడీలు.సిమ్బలీన్ ,ది వింటర్స్ టేల్,దిటెంపెస్ట్ లు కాల్పనిక నాటకాలు .భావన ,పాత్రనిర్వాహణ,పోషణ శైలి ,మంజుల శబ్దనిర్మాణ౦,విశ్వ జనీన ధార్మికత ఆయన ప్రత్యేకతలు అది నాటక రంగానికి స్వర్ణయుగమే .జాతీయ కవి –బార్డ్ ఆఫ్ ఆవన్ అన్నారు షేక్స్ పియర్ మహాకవిని .

  వినోదం తోపాటు ధర్మప్రతిపాదనాచేసి నాటకాలు రాసినవాడు బెన్ జాన్సన్ .ఆనాటి వాస్తవిక జీవితాలను వస్తువులుగాతీసుకొని నాటకాలు రాశాడు .వీటిలో ‘’ఎవిరిమాన్ ఇన్ హిజ్ హ్యూమర్ ,ది ఆల్కమిస్ట్  ,వాల్పోన్ ముఖ్యమైనవి ,జాన్ వెబ్ స్టర్ విషాదా౦తనాటకాలు –వైట్ డెవిల్ ,ది డచెస్ ఆఫ్ మల్ఫీ రాశాడు వీటిలో భయానక సన్నివేశాలు మితిమీరి భయభ్రాంతుల్ని చేస్తాయి .జాన్ ఫోర్డ్ రాసిన ‘’ది బ్రోకెన్ హార్ట్ ‘’కరుణ రసాత్మకనాటకంఫ్రాన్సిస్ బోమంట్ ,జాన్ ఫ్లెచర్ కవులిద్దరూ కలిసి ‘’ఫైలాస్టర్’’,ది మెయిడ్స్ ట్రాజడి రాసి గొప్ప ప్రజా దరణ పొందారు .ఫిలిప్ మాసిన్జర్ ‘ఎ న్యు వే టుపే ఓల్డ్ డెట్స్ ‘’నాటకం సరసహాస్యంతో గిలిగింతలు పెడుతుంది .

  అదేకాలం లో ఫ్రాన్సిస్ బేకన్ ఇంగ్లీష్ సాహిత్యానికి వ్యాసం అనే ఎస్సే అనే నూతన సాహిత్య ప్రక్రియ  ను పరిచయం చేసి ఆంగ్ల సాహిత్య ‘’వ్యాసు’’డు అయ్యాడు .ఈ పేరును మొదట ఫెంచ్ రచయిత మాన్టైన్ ఉపయోగించి తన స్వీయ చరిత్రను రాసుకొన్నాడు. కాని బేకన్ సార్వకాలీన గుణాలను ఆదర్శాలను గురించి నభూతోగా వ్యాస పరమపర రాశాడు.బేకన్ ఎస్సేస్ అంటే విపరీతమైన మోజు అన్నికాలాల్లో అన్ని వయసులవారికీ ఉన్నది .ఎస్సేకు మార్గదర్శి బేకన్ –కాదు’’ బీకన్ లైట్ ‘’.కాంటర్ బరీ చర్చి ఫాదర్ టామస్ కార్మర్ రాసిన  ‘’ది ఫస్ట్ ప్రేయర్ బుక్ ‘’ను గంభీర్య సౌకుమార్య వచన శైలితో రాశాడు .ఆకాల వచనరచనలో మకుటాయమానం ‘’ది ఆథ రైజ్డ్ వెర్షన్ ‘’అనే బైబిల్ అనువాదం .మాధుర్యం తో ఉన్న వాక్యాలు ఆకర్షణీయంగా ఉంటాయి .అప్పటికే భాషలో అనేకశబ్ద చిత్రాలు నుడికారం చేరి ఇంగ్లీష్ సాహిత్యం సుసంపన్నమైంది ‘.

  17వ శతాబ్దం లో కవిత్వం లో ఒక ఒక విచక్షణ మార్గమేర్పడింది.ఆధ్యాత్మికంగా కాక ఇతర విషయాలపై కవులు స్వేచ్చగా స్పందించి గీతాలు రాశారు .వీటికి మెటాఫిజికల్ గీతాలని పేరుపెట్టారు .ఒకరకంగా కాల్పనిక౦ పై తిరుగు బాటే ఇది .సుందరమైన భాషకు బదులు తార్కిక దృష్టి పెరిగింది .రమణీయ కవి సమయాలకు బదులు విచిత్ర సాదృశ్యాలు చోటు చేసుకొన్నాయి మార్దవం లేకపోవటం వలన కవుల ప్రతిభ ‘’సర్కస్  ఫీట్ గా ‘’ మారింది .దీనికి మార్గ దర్శి జాన్ డన్ అనే క్రైస్తవ మతాధికారి .ఈమార్గం లో తాత్విక కవిత్వం రాసిన వారిలో –జార్జి హెర్బర్ట్ ,హేన్రివాన్ ,రిచర్డ్ క్రాషా ,ఇబ్రహీం కౌలే ఉన్నారు .ఈ మార్గం తొక్కకుండా సంప్రదాయ కవిత్వంలో సొగసైన కావ్యాలు  రాసినవారూ ఉన్నారు వారిలో రాబర్ట్ హెరిక్ ,యా౦ డ్రూమార్వెల్ ,ఎడ్మండ్ వాలర్ ,రిచర్డ్ లవ్ లేస్,శామ్యూల్ బట్లర్ ముఖ్యులు .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-6-20-ఉయ్యూరు.

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బక దాల్భ్యుడు -11

బక దాల్భ్యుడు -11

శ్రీ కృష్ణుని భార్యల దుర దృష్టాలకు దాల్భ్యుడు ముఖ్యకారణం చెప్పాడు .వారు అసలు అప్సరసలు .అగ్నిహోత్రుని కుమార్తెలు .వారంతా ఒకసారినారదమహర్షి ని తామంతా నారాయణుడిని భర్తగా పొందాలంటే ఏమి చేయాలని అడిగారు .అంటే వీరికి మొదట్లో కృష్ణునిపై ప్రేమ ఉన్నది .తర్వాత వాళ్ళు నారద శాపానికి గురయ్యారు .దీనికికారణం వాళ్ళు ఆయన్ను ప్రశ్నించే ముందు నమస్కారం చేయటం మర్చిపోవటమే .మత్చ్యపురాణం 70.25,పద్మపురాణం శ్రీ కృష్ణఖండం -23.100.-  ‘’నారద శాపేన కేశవాయచ ‘’.దాల్భ్యుడు దీనికి పరిష్కారంగా వేశ్యలు ముక్తిపొందటానికి ‘’అనంగ దానవ్రతం ‘’చేయమని సలహా ఇచ్చాడు .ఈవ్రతంలో విష్ణుమూర్తిని’’ కామ దేవుని’’గా ఆరాధించటం ఉంటుంది ..ఈ సందర్భంలో దాల్భ్యుడు వ్రతాలు చేయించటం లో దిట్టగా పరిచయం చేయబడ్డాడు  .కేశవుని చేత ముందే దాల్భ్యుడు ఆదేశి౦చ బడ్డాడు అని వారికి తెలుసు .మత్చ్య -70.18,పద్మ -23.92—ఆదిస్టోసి పురాబ్రాహ్మణ కేశవేనచ ధీమతా’’.దీన్నిబట్టి దాల్భ్యుడు మహిమగలమహర్షి ,సమాజానికి అతీతుడు,కృష్ణ భక్తులకు  మార్గ నిర్దేశనం చేయగల సమర్ధుడు .దాల్భ్యుడుఅప్సరసలతో మాట్లాడటం, తర్వాత భవిష్యత్తులో యాదవ వంశం అంతా క్షయమయ్యాక గోపికలతో సంభాషించటం చూస్తె ఆయన కాలాతీతుడు అని తెలుస్తోంది .గోపికలుకూడా దాసులుగా చాలా జన్మలు పొందారు .అన్ని జన్మలలో అంటే అప్సరస జన్మలనుంచీ గోపికా జన్మలదాకా-దాస దాస్యులు గా  దాల్భ్య లేక చైకితాన దాల్భ్యను వారు కలుసుకొన్నారు .

  పతనం చెందిన అప్సరసలు అనే గోపికలపేర్లు వేదం ఆర్యుల శత్రువుల పేర్లుగా’దస్యులుగా రెండు సార్లు వచ్చాయి .పుట్టుకే లేని వీరిని దాసులు అన్నారు .పద్మపురాణం లో దాస బదులు దాసాలేక జాలరి లేక నావికుడు  అన్నారు  .వీరినే సరదాకి దొంగలు అన్నారు .బ్రహ్మకు శివుడు గోపికల భవిష్యత్తు చెబుతూ దాల్భ్య ప్రసక్తి  తెచ్చాడు.వారి దాస్య విముక్తి సముద్రంనుంచి పుట్టిన రుషివల్లనే సాధ్యం అన్నాడు  .ఆ రుషి బకలేక చైకితాన దాల్భ్యుడు .

  పద్మపురాణం దాల్భ్యుని’’ విముక్తిదాత ‘’ఉద్ధర్త్రు  దాసానాం ఆశ్రిత ఉత్తర ‘’అని చెప్పింది .ఇక్కడ దాల్భ్యునికి ఉత్తర దాసులతో పరిచయం కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది .దేవ వేశ్యల కు విముక్తి ఎందుకు కలిగించాడో తెలియటం లేదు .దాసులు సముద్ర తీరాలలో ఉంటారుఅని .తెలుస్తోంది .మత్చ్యపురాణం ప్రకారం దాసులు-యాదవుల అపజయం తర్వాత  కృష్ణుని భార్యలను అపహరించి సముద్ర తీరంలో ఉంచారు –‘’హ్రతాసు కృష్ణ పత్నీషు దాస భోగ్యాసు చామ్బుధౌ ‘’

 బకదాల్భ్యుడు –కొంగ

అతడికి కొంగ అంటే బక పేరు ఎందుకొచ్చింది ?పాశ్చాత్య పరిశీలకుడు పాల్ ధీం సంస్కృతంలో ఉన్న పక్షుల నామాలపై రిసెర్చ్ చేసి అనేకరకాల కొంగల గురించి సుభాషితరత్నావలి లో ఉన్న విషయాలూ సేకరించాడు .వీటన్నిటి బట్టి బకఅంటే బూడిదరంగు బాతు- గ్రే హెరాన్—ఆర్డియా సినేరియా -అని నిర్ణయించాడు .కనుక మనం సాధారణంగా చెప్పే క్రేన్ అంటే కొంగ కు బక హస్తి మశకాంతర భేదం ఉన్నదన్నమాట. బక ను మామూలు కొంగ అనటం తప్పు .ఇండో –యూరోపియన్ ఎటిమాలజి ప్రకారం బక అంటే బ్+ఆక  అంటే నీటికి కావలి ఉండేది –వాటర్ వాచర్ .ఇంత గొడవ ఉంది బక నామం లో .

నమ్మరాని కొంగ –హిందూ ధర్మ శాస్త్రాలలో ,కథా సాహిత్యంలో కొంగ ను నమ్మరానిదిగా చిత్రి౦చారు .నమ్మకద్రోహి గా పైకి మంచిగా ఉంటూ కుత్సితం చేసేదిగా అనేకకథలు ఉన్నాయి.మానవ ధర్మశాస్త్రం 4.196ప్రకారం  One who hangs his head,

who is bent upon injuring others and upon his own gain,

dishonest, and falsely modest,

such a twice-bom is said to act like

ఈ బుద్ధిని బకత్వం అని బకవ్రతం కొంగజపం అనీ అంటారు .పంచతంత్ర ,హితోపదేశాలలో ‘’మోసపూరిత బక మహాత్మ్య ‘’కథలెన్నో ఉన్నాయి .అన్నీ మనకు తెలుసుకూడా .కొంగల ఆహారం చేపలు .ముసలితనం లో వంచన చేసి వాటిని భక్షించటం దాని నైజం .రాజుఅర్ధ సంపాదనలో  ‘’బక నైజం’’కలిగిఉండాలనే హితోపదేశం కూడా ఉంది – ‘’బకవత్ చింత ఏత్ అర్ధాన్’’.అంటే మౌని బకం అంటే కొంగ జపం చేస్తూ అకస్మాత్తుగా రంగ౦లోకి జాలి,దయా లేకుండా దూకాలని భావం .

  బ్రాహ్మణుడికి బకనైజంపనికి రాదు .గరుడ పురాణం లాంటి వాటిలో హేయంగా చెప్పారు అలాంటివారికి గౌరవమర్యాదలు చూపవద్దని విష్ణుపురాణం చెప్పింది అలా౦టిబ్రాహ్మడికి మంచి నీరుకూడా ఇవ్వద్దన్నది మను  ధర్మశాస్త్రం .వీరిని’’ బైడాలవ్రతులు ‘’అంటే పిల్లులు లాంటి వాళ్ళు అన్నది .దీనికీ దానికీ తేడా ఏమిటి అంటే కొంగ తలవంచి ఉంటుంది ధ్యానం చేస్తున్నట్లు .పిల్లి దొంగ చూపులు చూస్తుంది మనిషి చాటు కావటానికి ,బకవ్రతులు   మార్జాల లింగినులు ‘’అంధ తమిశ్రం ‘’లో పడతారునరకం లో అంటే పూర్తి చీకటికోట్లో.. తర్వాత జన్మలన్నీ నికృష్ట జన్మలే పొందుతారు .అగ్నిని దొంగిలించినా ,పాలు దొంగిలించినా వచ్చేది కొంగజన్మే అని మను,  గరుడ ,మహాభారతాలు చెప్పాయి.నరకం లో మిగతా జంతువులతో  కొంగ  జీవులను  చీలుస్తుంది ,యముడి మంత్రులలో ఒకడు కొంగ మొహంతో ఉంటాడు  అనివిష్ణు పురాణం ఉవాచ-43.37.కనుక బకనైజం ఉన్న వారితో జాగ్రతోం జాగ్రతగా మనం మసలాలి .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-6-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-47

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-47

  భయంకర మహా పరాక్రమ శాలి హనుమ మనసులో ‘’రావణుడు వచ్చి నాతో యుద్ధం చేస్తాడనుకొని అన్ని ప్రయత్నాలూ చేశాను .కాని ఉన్నచోటు కదలకుండా ఆసనం వీడకుండా కొడుకు ఇంద్రజిత్తు ను పంపి నన్ను బంధించి తెప్పించుకొన్న రాజనీతిజ్ఞుడు ‘’అనుకొని ఆశ్చర్యపడి,రోషం తో కన్ను లెర్రబడి రాక్షసరాజును చూశాడు .ముత్యాలు కూర్చిన బంగారు కిరీటం తో రావణుడు మరింతగా ప్రకాశించాడు .మనస్సంకల్ప మాత్రంగా సృష్టించిన ఆశ్చర్యకరమైన బంగారు నగలు  వేసుకొని కాంతి వంతంగా కనిపించాడు .

‘’తత స్సకర్మణా తస్య విస్మితో భీమ విక్రమః –హనుమాన్ రోష తామ్రాక్షో రక్షోధిప మవైక్షత.’’

‘’హైమైరాభరణై శ్చిత్రై  ర్మనసేవ ప్రకల్పితైః’’

పట్టుబట్టలు కట్టి ఒంటికి రక్త చందనం ,కస్తూరి మొదలైన గంధపు పూతలతో ఉన్నాడు. బాగా తెరువ బడిన నోళ్ళు ,అందమైన యెర్రని కళ్ళు ,చూసే వారికి భయం కలిగించే వాడి యైన పెద్ద కోరలు ,వేలాడే పెదవులు ఉన్న పది తలలతో వీరత్వ తేజస్సులతో ,దుస్టమృగాలతో  శిఖరాలున్న పర్వతం లాగా ఉన్నాడు రావణుడు .కాటుకరాశినల్లదనం ,వక్షస్థలం పై పూర్ణ చంద్రునిలా విలసిల్లె హారాలు తో కొంగలతో ఉన్న మేఘం లాగా ఉన్నాడు

‘’నీలాంజన చయ ప్రఖ్యం హారేణోరసి రాజతా-పూర్ణ చంద్రాభ వక్త్రేణ స బలాక మివాంబుదం’’

బలిష్టమైన బాహువులకు భుజకీర్తులు చందనం పూతలతో అయిదు తలల పాముల్లాగా ఉన్నాయి .బాగా పెద్దది,స్పటికాలు పొదిగి ,చిత్ర వర్ణాలతో ,మధ్యమధ్య రత్నాల కూర్పు తో అత్యంత సుందరంగా రావణ సింహాసనం ఉన్నది .అందమైన చానలు ఆయన చుట్టూ నుంచుని వింజామరలు వీస్తున్నారు.

‘’మహతి స్పాటికే చిత్రే రత్న సంయోగ సంస్కృతే –ఉత్తమాస్తరణాస్తీర్ణే సూప విస్టంవరాసనే ‘’

దుర్ధర ,మహాపార్శ్వ ప్రహస్త ,నికుంభ మంత్రులతో నాలుగు సముద్రాలతో పరివేష్టించి ఉన్న భూమి లాగా ఉన్నాడు –

‘’కృత్స్నః పరివృతో లోక శ్చతుర్భి రివ సాగరైః’’

మంత్రశాస్త్రం తెలిసిన మంత్రవేత్తలు ,దీమంతులైన రాక్షసులు తో దేవతల చే సేవి౦పబడే దేవేంద్రునిలా ఉన్నాడు –

‘’అన్వాస్యమాన రక్షోభి స్సురైరివ సురేశ్వరం ‘’

నల్లని రూపంతో బంగారు సింహాసనం పై కూర్చున్న రావణుడు మేరు శిఖరం అధిరోహించిన జలపూర్ణమైన నల్లని మేఘంలా ఉన్నాడు ‘

‘’విస్టితం మేరు శిఖరే సతోయమివ తోయదం ‘’

  రాక్షసులు తన్ను విపరీతంగా పీడిస్తున్నా ,కన్ను ఆర్పకుండా రావణుడి వైభవాన్ని నోరు వెళ్ళబెట్టి చూస్తున్నాడు హనుమ.

‘’ఆహా ఏమి రూపం ఏమి ధైర్యం ఏమి బలం ?సకలప్రశస్త లక్షణాలతో రాక్షసరాజు రావణుడు శోభిస్తున్నాడు .సీతా దేవి పట్ల అలా  అధర్మాన్ని  ఆచరించి ఉండకపోయి ఉంటె దేవేంద్ర సహిత దేవలోకానికే అధిపతి కాదగినవాడు –

‘’అహో రూప మహోధైర్య మహో సత్వ మహో ద్యుతిః-అహో రాక్షస రాజస్య సర్వ లక్షణ యుక్తతా ‘’

‘’యద్యధర్మో న బలవాన్ స్యాదయం రాక్షసేశ్వరః –స్యాదయం సురలోకస్య సశక్రస్యాపి రక్షితా ‘’

  ‘’వీడి భీకర పరద్రోహాచరణ రూపమైన అధర్మ కార్యాలకు అమర దానవ సకల లోక జనులు భయపడుతున్నారు

‘’అస్య క్రూరై ర్న్రుశంసైశ్చ కర్మభి ర్లోక కుత్సి తైః-సర్వే బిభ్యతి  ఖల్వస్మా ల్లోకా స్సామర దానవాః’’

వీడికి కోపం వస్తే ప్రపంచమంతా ఏక సముద్రం చేయగలడు’’అని రావణ రూప పరాక్రమ విక్రమబలశౌర్య వైభవాలను గురించి అనేక విధాలుగా ఆలోచించాడు హరిసత్తముడైన హనుమ .

‘’అయం హ్యుత్సహతే క్రుద్ధం కర్తు మేకార్ణవం జగత్’’

 ఇది 20శ్లోకాల 49వ సర్గ .

   హనుమ మొదట్లోనే రావణ రాజనీతికి ఫిదా అయ్యాడు యెట్లా ?తనదగ్గరకు రప్పించుకొనే సకల ప్రయత్నాలూ తాను  చేస్తే వాడు తానుకదలకుండా కొడుకును పంపి తన్ను బంధించి తనదగ్గరకు రావణుడు తెప్పించుకొన్నాడు .ఇందులో హనుమకు రావణుని గొప్ప రాజనీతి కనిపించింది .తనదగ్గరకు వస్తాడనుకొంటే తననే అతని దగ్గరకు తెప్పించుకోవటం మహా రాజనీతికాదా .ఏమాలోచన హనుమది ?ఇందులో రావణ వైభవం  పూస గుచ్చినట్లువర్ణించి  హనుమతో మహర్షి వాల్మీకి   చెప్పించాడు. రావణుడు మందర పర్వతంలాగా ఉన్నాడుకాని చుట్టూ అనేక దుస్టమృగాలున్నాయి  .ఇక్కడ దుష్టరాక్షసులున్నారని భావం .ఇంకేమీ ఉపమానం దొరకనట్లు వాల్మీకి వాడిని కొంగలతో కూడిన మేఘంలా ఉన్నాడన్నాడు .హంసలతో ఉన్న మేఘం ఉత్తమ ఉపమ .ఇది నీచోపమ వాడికి తగిందే .భుజాలు అయిదుతలల పాముల్లాఉన్నాయట .ఇక్కడ వాటిలో విషం ఉన్నట్లు అనుకోవాలి .  సింహాసనం స్వర్ణ  రత్నమయం జిగ్ జిగేల్ గా పసుపు రంగులో ఉంటె అందులో వీడు నల్ల తుమ్మ మొద్దులాగా ఉన్నాడని పిస్తుంది .చతుస్సముద్ర వేలావలయిత భూమండలం లాగా రావణుడున్నాడు .చాలా గొప్ప వర్ణన .మేరు శిఖరం పై కారు మేఘం లా కనిపించాడు హనుమకు .త్రాళ్ళతో బంధించి రాక్షసులు హింసిస్తున్నా హనుమ తదేక దృష్టితో రావణుడిని చూశాడు అంటే ఏదో లోకోత్తర మహత్తర ఆకర్షణ వాడిలో ఉందన్నమాట .

  రావణుడి గురించి హనుమతో వాల్మీకి చెప్పించిన రెండు శ్లోకాలు సాహిత్య చరిత్రలో సువర్ణ  మయంగా భాసిస్తూ అందరి నోళ్ళలోనూ నానుతున్నాయి .ఉదాహరణ రూపం గా వ్యాప్తి చెందుతున్నాయి .ఇన్ని సుగుణాలున్నా సీతాపహరణం అనే ఒకే ఒక్క దుర్గుణం  వాడి గుణాలకు పెద్ద చేటు తెచ్చింది .లేకుంటే ఇంద్ర పదవి కి సర్వవిధాలా అర్హత ఉంది వాడికి .లోకం లో ఉన్న ఒక ముతక సామెత  ‘’మనిషి మంచోడేరా గుణం గుడిసేటిది ‘’వీడికి పూర్తిగా సరిపోతుంది .ఇ౦తవరకు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు .చూపులతోనే సరి .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-6-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -2

ప్రపంచ దేశాల సారస్వతం

108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -2

చాసర్ మహాకవి ఇంగ్లీష్ భాషను మహా కావ్య రచనకు అనుకూలంగా సంస్కరించి ,పునరుజ్జీవన ఉద్యమానికి ఊపిరులూది ,ఇతర యూరోపియన్ భాషలలోని మంచి సంప్రదాయాలను స్వీకరించి ,కొత్త అలంకారాలతో భాషకు నగలు సమకూర్చాడు .రసాలంకార కృతులకు మార్గ దర్శిగా నిలిచాడు .డి బుక్ ఆఫ్ ది డచెస్ ,దిహౌస్ ఆఫ్ ఫ్రేమ్,ట్రాయిలస్ అండ్ క్రేసీడ్ కావ్యాలు రాశాడు .ఆయన రాసిన ‘’కాంటర్ బరీ టేల్స్’’లో ప్రతిభ శతపత్ర పద్మం లా వికశించింది .లండన్ నుంచి కేంటర్ బరీ కి యాత్రగా వెళ్ళే క్రైస్తవులు మార్గమధ్యమంలో కాలక్షేపానికి చెప్పినట్లు భావిస్తూ రాసిన కథలివి  .వివిధ యాత్రికుల రూపు రేఖలు మనో వృత్తులను,శీలం, హావభావాలను  అద్భుతంగా చిత్రించాడు .చాసర్ రాజాస్థాన ఉద్యోగిగా ,సైనికుడుగా ,తరచూ దేశాటనం చేసినవాడుగా తనా అనుభావాలను రంగరించి రాసిన కావ్యం .అతిసహాజ వర్ణనలకు నిలయం .చర్చి పెద్దలు మతం మాటున చేసే దుర్నీతిని మెత్తమెత్తగా మందలించాడు .సరస వ్యంగ్య హాస్యకావ్యంగా దీన్ని మలిఛి ‘’ఆంగ్ల సాహిత్య పిత ‘’అనిపించాడు చాసర్ .1343లోపుట్టి 1400లో మరణించాడు .

  చాసర్ కాలం లో అంతటి ప్రతిభ ఉన్న  సమకాలిక కవులు లేరు .జాన్ గవర్ ,విలియంలాంగ్ లాండ్ లు సంఘ దురాచారాలపై కావ్యాలు అల్లారు కాని కావ్యగుణ౦ లేదు .వచనరచనలో ‘’దిట్రావెల్స్ ఆఫ్ మాంటి విల్’’ప్రసిద్ధమైనది.దాదాపు వందేళ్ళు చాసర్ నే అనుకరించి కవులు రాశారు .వీరిలో జాన్ విడ్ గేట్,విలియం డన్బార్ లు మాత్రమె లెక్కలోకి వస్తారు .క్రమంగా మార్గకవిత మందగించి దేశికవిత అంటే జానపదం  ప్రాధాన్యం పొందింది .జానపద గీతాలలో ‘’చేవ్వీ చేజ్’’,సర్ పాట్రిక్ స్పెన్స్ ‘’ముఖ్యమైనవి 15వ శతాబ్దం లో కింగ్ ఆర్ధర్ గురించి చిత్ర విచిత్ర కథలను సేకరించి సర్ జాన్ మెలోరి ‘’మోర్ట్ డి ఆర్ధర్ ‘’అనే వచన కథాకావ్యం రాశాడు.

  విలియం కాక్ స్టన్ మొదటిసారిగా ముద్రణా యంత్రాన్ని స్థాపించి ,కొత్త తరహాపుస్తకాలు ముద్రించి ,సాంస్కృతిక పునరుజ్జీవనానికి విశేష కృషి చేశాడు .విలియం టెండేల్ మైల్స్,కవర్ డేల్ లు బైబిల్ ను ఆకర్షణీయ శైలిలో  ఇంగ్లిష్ లోకి అనువదించి ఆకర్షణీయంగా ముద్రించారు .అదేసమయంలో సర్ థామస్ మూర్ ‘’యుటోపియా ‘’అనే వచనరచన చేసి ఆదర్శ సమాజ చిత్రణ చేశాడు .16వ శతాబ్దిలో సర్ థామస్ వయట్ ,ఎర్ల్ ఆఫ్ సర్రేకవులు ఇటాలియన్ చందోరీతిని అనుసరించి ఇటాలియన్ ప్రణయ కవిత్వాన్ని ఇంగ్లీష్ లో అనువ’’దించి’’ గేయకవితకు పట్టాభి షేకం చేశారు .ఇవే కాల్పనికోద్యమ లతకు పూసిన తొలిపుష్పాలు .

   క్రైస్తవ మత ప్రచారానికి చర్చి లలో పర్వదినానలో మత సంబంధ నాటక ప్రదర్శనలు నిర్వహించారు.బైబిల్ కథలు అపోజిల్స్ దివ్య లీలలు ప్రదర్శించేవారు .వీటికి మిస్టరీలు అని మిరకిల్ ప్లేస్ అనీ అన్నారు .హాస్యం కూడా జోడించేవారు .క్రమంగా వీటిని చర్చికి బయట బజారులలో నిర్వహించారు .కొంతకాలానికి ‘’మొరాలిటి ప్లేస్’’అనే కొత్తనాటకాలు వచ్చాయి .పుణ్యపాప ధర్మాధర్మాలే పాత్రలుగా కల్పించి ధర్మ బోధకు ఉపయోగించారు .వీటిలో ‘’ఎవిరి మన్’’విశిష్టమైనది .వ్యంగ్య విమర్శతో ‘’ఇంటర్ లూడ్స్ ‘’కూడా వచ్చాయి .వీటిలో జాన్ హేవుడ్ రాసిన ‘’ఫోర్ పీస్ ‘’చెప్పుకో తగినది .క్రమంగా మతానికి దూరమై వినోదమే ప్రధానమైంది .

   16వ శాతాబ్దానికి గ్రీక్ లాటిన్ నాటకాలు ఆధారంగా ఇంగ్లీష్ నాటకాలను తీర్చి దిద్దారు .సర్వా౦గ సుందర నాటకాలలో నికాలస్ ఉడాల్ రాసిన ‘’రాయిస్టర్ ,డాయిస్టార్’’అనే సుఖా౦తనాటకం ,టామస్ సాక్విల్,టామస్ నార్టన్ కలిసిరాసిన ‘’గార్బోడక్’’మొదటి ట్రాజెడి.నాటకానికి అధిక ప్రాధాన్యత కలిగింది .అందుకే ఈ శతాబ్దం జగత్ ప్రసిద్ధ నాటకాలకు భూమిక అయింది .మొదటి ఎలిజబెత్ రాణి పాలించిన 16వ శతాబ్ది ఉత్తరార్ధం ఇంగ్లీష్ సాహిత్యానికి స్వర్ణయుగం .దేశామంతానవ చైతన్యం వెల్లి విరిసింది .అనేక రంగాలలో దేశం అగ్రగామి అయింది .జాతీయత కొత్త చిగుళ్ళు తొడిగింది .ప్రజల ఆనంద  ఉత్సాహాలు సాహిత్యంలోనూ ప్రతిధ్వనించి ప్రతిఫలించింది .మహాకవులు అనేకులు రచనలు చేశారు .యూరప్ ను చుట్టుముట్టిన సాంస్కృతిక పునరుజ్జీవనం ఇంగ్లిష్ సాహిత్యంపై గొప్ప ప్రభావం కలిగించింది .

  ఎడ్వర్డ్ స్పెన్సర్ కాల్పనిక కవిత్వ లక్షణాలను అవగాహన చేసుకొని సౌందర్య భరితకావ్యాలు రాశాడు .లలితకోమల పదాలతో హృదయాలను ఆకట్టుకొన్నాడు అద్భుత శబ్ద చిత్రాలు సృష్టింఛి రసానంద పారవశ్యం కలిగింఛి తనకు తానె సాటి అనిపించుకొన్నాడు స్పెన్సర్.అతని ప్రతిభకు గీటు రాళ్ళు –‘’ది షేఫెర్డ్స్ కాలెండర్ ,యామోరెట్టీ,ఎపిథ లేమియం లఘుకావ్యాలు .కాని ఆయనకీర్తి స్తంభానికి మూలాధారం ‘’ది ఫెయిర్ క్వీన్ ‘’కావ్యం .ఇంగ్లీష్ జాతి అనుభవించిన విజయోత్సవాలను ఈ కావ్యం తేజోమయం చేసింది ‘’అతని అతులిత మాధురీ మహిమ తరతరాలకవులను ప్రేరేపించింది .శబ్ద చిత్ర కల్పనా, శయ్యా సౌభాగ్యం స్పెన్సర్ ను ‘’పొయట్స్ పొయెట్’’అంటే కవీనాం కవిః ని చేశాయి .మన పెద్దనామాత్యుడు గుర్తుకొస్తాడు .ఆకాలం లో శృంగారం అంగాంగం లో పరవళ్ళు తొక్కింది .డేనియల్,డ్రేటన్,కామ్పియన్ వీరిలో ముఖ్యులు ఇటాలియన్ సానెట్ ను ఆంగ్లం లో తీసుకొని ప్రణయకవిత్వం తో ర౦గ రించారు .స్పెన్సర్ కు  మిత్రుడు  ,ఆప్తుడు సర్ ఫిలిప్ సిడ్నీ ‘’ఆస్ట్ర ఫెల్ అండ్ స్టెల్లా’’ప్రణయకావ్యం రాశాడు .ఇతడే ‘’ది ఆర్కేడియా’’అనే సుదీర్ఘ వాచన కథను,’’ది అపాలజీ ఫర్ పొయెట్రి’’అనే విమర్శ గ్రంథం కూడా రాశాడు .ఇంగ్లిష్ సాహిత్యం లో కావ్య ప్రయోజనానికి దిక్సూచి సిడ్నీ రచనే .

   సశేషం

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బక దాల్భ్యుడు -10

 

బక దాల్భ్యుడు -10

ద్వైతవన౦ లో  బకదాల్భ్యుడు స్వచ్చమైన వేదమంత్రవేత్తగానే కాక అతడు బ్రాహ్మణుల ప్రాముఖ్యం పై ఒక ఉపన్యాసం కూడా చేశాడు .ఇలా బ్రాహ్మణ విధానంగా ఉండే బకుని వామన పురాణం లో ధృత రాష్ట్ర విషయం లో బ్రాహ్మణ నీతులు కూడా చెప్పినవాడిగా చూపబడింది .జైమినేయ అశ్వమేధ౦  లో అతడు ఉత్తర సముద్ర మధ్య లోని దీవిలో,  వేదకాలానంతరం సరస్వతీ నదీతీరం లోనూ ,అరణ్యమధ్య౦ లో ఉన్న ద్వైతవనం లోనూ   కనిపించాడు ,.భారతం అరణ్య పర్వం 193అధ్యాయం లో మార్కండేయ మహర్షిని బకరుషి దీర్ఘ కాల వయసు గురించి ప్రశ్నించినట్లుంది .అంటే దీర్ఘకాలం ఆయన జీవించాడని అర్ధం .భారతం 9.40లో ‘’బక వృద్ధో ‘’అని ఉంది .జైమినేయాశ్వమేధం లో బకదాల్భ్యుడు మార్కండేయునితో తాను చూసిన 20మంది ప్రముఖ బ్రాహ్మణులలో ఒకడుగా  వారంతా చనిపోయినట్లుగా చెప్పాడు  .

  మార్కండేయ సమావేశం లో ధర్మరాజు ఆయన్ను బక విషయం పై చాలాసార్లు అడిగాడు . అధ్యాయం 4వ శ్లోకం లో ఋషిని తాను  ‘’బక,దాల్భ్యులు మహా విద్యావేత్తలని,చాలాకాలం జీవించారని విన్నాను’’అని చెప్పాడు –బకదాల్భ్యా మహాత్మానౌ శ్రుయేతే  చిరజీవనౌ దేవరాజస్యాతావ్ రుషి లోక సమ్మతౌ’’.ఇక్కడ ఇద్దరూ వేరు వేరు గా చెప్పబడ్డారు కాని ఇది పొరబాటు ఒక్కరే బకదాల్భ్యుడు.

  ఒకసారి ఇంద్రుడు అసురులతో యుద్ధం చేసి అలసి కిందకు చూస్తె అద్భుతమైన జల వనరులున్న రుషికుటీరం కనిపిస్తే కిందికి దిగి అది బకదాల్భ్యుని ఆశ్రమ౦ గా తెలుసుకొన్నాడు .అది తూర్పు సముద్ర తీరాన ఉన్నది –‘’పూర్వస్యాం దిశి రమ్యాయాం సముద్రా భ్యషతో’’ –భారతం -3193.13.ఇంద్రునిరాకకు సంతోషించి ఎంతోకాలానికి ‘’కృష్ణ’’ సందర్శనం కలిగిందని సంతోషించాడు జైమినేయ  అశ్వమేధం -60.12-13.ఆర్ఘ్యపాద్యాలిచ్చి పూజించాడు .అనంతరం ఇంద్రుడు ఆయనను దీర్హకాలం జీవించటం లో ఉన్న కస్ట సుఖాలేమిటి అని అడిగాడు 3.193.15,17-27.బకుడు దీనికి సమాధానం దాటేసి ఆధ్యాత్మిక నీతి విషయాలు చెప్పాడు .స్వతంత్ర జీవనంలో సౌఖ్యం చెప్పి బ్రాహ్మణ అతిధులకు అన్నం పెట్టటం లో ఆనందం ఉందన్నాడు .ఇక్కడ మళ్ళీ మనకు ధర్మశాస్త్ర విలువలకు కట్టుబడే  బ్రాహ్మణాభిమాని బకుడుకనిపిస్తాడు . ఇవన్నీ చూస్తే,బకుడు మార్కండేయునికి ప్రత్యర్ధి అనిపిస్తాడు .చాలాకాలం జీవించి మార్కండేయ చిరంజీవి స్థానాన్ని బకదాల్భ్యుడు కైవశం చేసుకొన్నాడు .మరో విషయం పరిమిత జ్ఞానం ఉన్న బక దాల్భ్యుడు లాంటి వారికి మార్కండేయుడు’’ మోడల్ ఫిగర్’’ .

   జైమినేశ అశ్వమేధం లో బకదాల్భ్యుడు వటపత్ర శాయి ని కూడా చూసినట్లు ఉన్నది .బకుడు నదీ తీరం లోకాక సముద్ర మధ్యమం లో తపస్సు చేశాడు .ఒక ఉభయ చరం సహాయం తో అక్కడ తలపైఒక ఆకు పెట్టుకొన్న ఒక ఋషిని చూశాడు ఇది మార్కండేయం తో సరిపోతోంది .మార్కండేయం లో  ఆదిమ సముద్రం లో వటపత్రంపై శయనించిన ఒక బాలునిఅంటే విష్ణుమూర్తి ని  ఒక రుషి చూశాడు అని ఉన్నది .ఇలాంటివి చాలాపురాణాలలో ఉన్నాయి .

పద్మ పురాణ౦ ఉత్తర ఖండం  ధృత రాష్ట్ర ఉదంతంలో 44అధ్యాయం లో ‘’విజయ ఏకాదశి వ్రతం ‘’లో త్రేతాయుగ కథ చెబుతూ రాముడు సముద్రాన్ని దాటటానికి అనేక ప్రయత్నాలు చేసి లక్ష్మణుడిని సలహా అడిగితె దగ్గరలోనేలంకకు భూమికి మధ్య  బకదాల్భ్యముని ఉన్నాడు ,ఆయన కారణ జన్ముడు ,అనేకమంది మహర్షులతో అక్కడ ఉంటున్నాడు ఆయన్ను దర్శిస్తే ఉపాయంచెబుతాడు అని చెప్పాడు –మహాముని కేనాపి కారణేనైవ ప్రవిస్టో మానుషిం తనూం’’. రాముడు ఆయన్ను సందర్శించాగానే ఆయన ‘’ఆదిదేవ పురాణ పురుషోత్తమ ‘’దర్శనం లభించినందుకు ఆనందించి’’ ఫాల్గుణ బహుళ ఏకాదశినాడు ‘’విజయ ఏకాదశి వ్రతం ‘’చేయమని చెప్పాడు .ఆ వ్రత విధానం వివరించాడు 21-35.కాయగూరలను నైవేద్యం ,ఆవునేయి దీపారాధనలు ,బంగారు నారాయణవిగ్రహం,బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు వగైరా లన్నీ ఉన్నాయి .సూక్ష్మంలో మోక్షం లాగా బకుడు చెప్పిన ఈ వ్రత ఫలం ‘’వాజపేయయాగం ‘’చేసినంత  ఫలం  .ప.పు -ఉ. ఖ.-44.39.దీన్ని బట్టి మనకు బకదాల్భ్యుడు వేదకాలంలో వేదవిహిత యజ్ఞ యాగాలు చేయటమేకాక  వేదానంతర కాలం లోనూ బ్రాహ్మణులతో మహర్షులతో కలసి సంచరిస్తూ కర్మకాండలు చేస్తూ స్థిరమైన ఆశ్రమ౦  స్థాపించుకొని జీవించాడు .అయినా ఆయనను నైమిశేయునిగ భారతం చెప్పింది .బకుడు కనిపించిన ప్రతిచోటులోనూ నీరు ఉండటం మరో విశేషం .ఇంకో విశేషం చిరంజీవి మార్కండేయ మహర్షికంటే వృద్ధుడు .బకదాల్భ్యుడు శ్రీరామ ,శ్రీ కృష్ణులను చూశాడు .ఈకలయికలలో అనేక ఆధ్యాత్మక విషయాలతో పాటు  బ్రాహ్మణులఎడ చూపవలసిన గౌరవమర్యాదల చర్చకూడా అర్ధవంతంగా  జరిగింది  .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-6-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-46

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-46

తనకు మండోదరికి జన్మించిన  అక్ష కుమార మరణం తో కుంగినా , నెమ్మదిగా మనసు దిటవు చేసుకొని రావణుడు మేఘనాధుడు అనే తనకొడుకు ఇంద్రజిత్ తో ‘’అస్త్ర శస్త్ర కోవిదుడవు .నీపరాక్రమ౦ సురాసురులకు బాగా తెలుసు .బ్రహ్మను ఆరాధించి బ్రహ్మాస్త్రం పొందావు .దేవేంద్రుని జయించి ఇంద్రజిత్ అనిపించుకొన్నావు .నీ బుద్ధి వైభవం దేశకాలపాత్ర తెలిసిన యుద్ధ నైపుణ్యం ఉన్నవాడవు .తపము యుద్ధం ,పరాక్రమ౦ ,అస్త్ర శస్త్ర బలాలలో అన్నిటా నాకు సమానమైన వాడవు .నువ్వు యుద్ధం లో నిలిస్తే నీకు జయ౦  అనేది నిశ్చయమే .కింకర ,జంబుమాలి అమాత్యపుత్ర ,పంచ సేనానులు ,వారి సైన్యంతో సహా చనిపోయారు –

‘’మమాను రూపం తపసో బలం చ తే-పరాక్రమ శ్చాస్త్రబలం చ సంయుగే –న త్వాం సమాసాద్య రణావ మర్దే-మశ్శ్రమం గచ్చతి నిశ్చితార్ధం ‘’

‘’నీ సోదరుడు అక్షయ కుమారుడూ గతించాడు .నాబలం వారిలో మాత్రమె లేదు ఆ బలం నీలోనే ఉంది –‘

‘’అమాత్యపుత్రా వీరాశ్చపంచ సేనా గ్రయాయినః –బలాని సు సమృద్ధాని సాశ్వ నాగ రథానిచ’’

‘’సహోదర స్తే దయితః కుమారోక్షశ్చ సూదితః –నహి తేష్వేవ  మే సారో యస్త్వ య్యరి నిషూదన ‘’

 సామూహికంగా మన యోధులను పరిమార్చిన ఆ వానరుని ఎదుట సైన్యం ఉపయోగ పడదు .వజ్రం లాంటి ఆయుధం కూడా నిష్ఫలమే .వాడి గమన వేగం వాయువుకు కూడా లేదు .వాడు అగ్ని తేజో మూర్తి కనుక పిడికిలి దెబ్బలకు చావడు-

న వీర సేనా గణశోచ్యవంతి-న వజ్రమాదాయ విశాల సారం –న మారుత స్యాస్య గ తేః ప్రమాణం –నచాగ్ని కల్పః కరణేన హ౦తుం’’

కనుక నీ బుద్ధిబలంతో ఆలోచించి వాడి పరాక్రమం గుర్తించి ,నీ దివ్యాస్త్రాలప్రభావం చింతిస్తూ వెళ్ళు .అపాయం కలగకుండా కార్యం నెరవేర్చు .చిన్నవాడివైనా నిన్ను పంపటం నాకు భావ్యంగా లేదుకాని ఇది రాజ ధర్మం.క్షత్రియాలోచనం .బంధుత్వం ఇక్కడ లెక్కచేయరాదు-

‘’న ఖిల్వియం మతిః శ్రేస్టా-యత్వాం సంప్రేషయా మ్యహం –ఇయం చ రాజ ధార్మాణాం-క్షత్రస్య మతిర్మతాః’’

‘’ యుద్ధం లో విజయం కోసం వివిధ ఆయుధాలు ఉపయోగించాలి’’అని అన్నిరకాల జాగ్రత్తలు యుద్ధనీతి బోధించగా ,ఇంద్రజిత్ శిరసువంచి నమస్కరించి ,తండ్రికి ప్రదక్షిణ చేసి ,యోధులు ముందుకు సాగుతుండగా సముద్రంలా ఉప్పొంగి యుద్ధానికి బయల్దేరాడు .నాలుగు సింహాల రథం ఎక్కి,మనోవేగంతో యుద్ధభూమికి చేరాడు .హనుమ వాడి రథధ్వని వింటినారి ధ్వని విని ఆనందించాడు  .దిక్కులు కలుషితాలై ,క్రూరమృగాలు బిగ్గరగా అరచాయి .ఇంద్రజిత్ యుద్ధాన్ని చూడటానికి ఆకాశం లో దేవముని గ౦ధర్వ గణాలన్నీ చేరాయి .హనుమగురుడికి ఉత్సాహం ఉరకలు వేసి శరీరం పెంచి మహాసి౦హ నాదం చేశాడు  .వాడు ప్రయోగించే బాణాలను మెలకువగా తప్పించుకొంటున్నాడు .హనుమ ఒక్క సారిగా పైకి ఎగిరాడు .అతడి బాణాలను నిష్ఫలం చేశాడు .సకలజనాలను రంజిల్లజేసే ఘోర యుద్ధం ఇద్దరి మధ్యా జరిగింది .ఇద్దరూ అసాధ్యులే అనిపించారు .

  ఎన్ని బాణాలు వేసినా వానరుడు లొంగటం లేదని గ్రహించి ,అతడిని చంపటం అసాధ్యం అనీ తెలుసుకొని ,అతడిని పట్టుకొనే ఉపాయం ఆలోచించి ఇంద్రజిత్తు వాయు సుతునిపై బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు –

‘’తతః పైతామహం వీరః స్సోస్త్ర మస్త్రవిదాంవరః –సందధే సుమహాతేజాస్తం హరి ప్రవరం ప్రతి ‘’

అవధ్యోయ మితిజ్ఞాత్వా త మస్త్రేణాస్త్ర తత్వ విత్ –నిజగ్రాహ మహాబాహు ర్మారుతాత్మజ మి౦ద్రజిత్ ‘’

 ఇంద్రజిత్ సంధించిన బ్రహాస్త్రానికి బంధితుడై  చేష్టలుడిగి హనుమ నేలమీద పడ్డాడు

బ్రహ్మ దేవుని వరం వలన బ్రహ్మాస్త్రం తనను ఏమీ చేయలేదు అని గుర్తుకు వచ్చి ,’’ముహూర్తకాలం లోనే దాని నుంచి విముక్తి చెందుతావు ‘’అని చెప్పినమాటకూడా జ్ఞప్తికి వచ్చి,తానూ బ్రహ్మాస్త్రానికి కాని కట్టుపడను అని ఇంద్రజిత్ తెలిసి ప్రయోగించాడుకనుక ఏమీ చేయకుండా దానికి బద్ధుడయ్యాడు  .బ్రహ్మ మహేంద్ర వాయు దేవులు తనను  రక్షింపగా,ఇప్పుడు ఈరాక్షస బంధనం రావణునినిచూడటానికి ఉపయోగ పడిందని భావించాడు .రాక్షసులు చుట్టుముట్టి బందిస్తుంటే పెద్దగా గర్జించాడు .కదలికలేని కపి వీరుని చూసి వాళ్ళు జనపనార ,నార చీరల తో త్రాళ్ళు పేని హనుమను బంధించారు .ఈ బంధనం వలన రాక్షసరాజును చూసే అవకాశం కలుగుతోందని సంబర పడ్డాడు .త్రాళ్ళ చేత బంది౦ప బడగా బ్రహ్మాస్త్ర బంధం తొలగి పోయింది .అస్త్ర బంధికి వేరొక బంధం కుదరదు,నిలువదు  కదా –

 ‘’స బద్ధ స్టేన వల్కేన విముక్తో స్త్రేణ వీర్యవాన్ –   ‘’అస్త్ర బంధస్సచాన్యం హిన బంధ మనువర్తతే  ‘’

 త్రాళ్ళతో కట్టటం తో బ్రహ్మాస్త్ర బంధనం వీడిపోయిందని గ్రహించి ఇంద్రజిత్ ‘’ఇతర బంధనాలతో బ్రహ్మాస్త్ర బంధం నిలువదుకదా’.నా మహాకార్యం ఇలా నిష్ప్రయోజనమైంది .మా సన్యాసులకు మంత్రం ప్రభావం సంగతి తెలీదు .ఒకసారి బ్రహ్మాస్త్రం వ్యర్ధమైతే ,మళ్ళీ ప్రయోగించటానికీ ,వేరే అస్త్రప్రయోగానికీ కుదరదు ‘’అని బాధపడగా హనుమ బంధం విడిపోయిన సంగతి గమనించక ,రాక్షసులు లాక్కు పోతుంటే అలాగే ఉన్నాడు  .-‘’విముక్త మస్త్రేణజగామ చిన్తాం-నాన్యేన బద్ధోహ్యనువర్తతే స్త్రం’’

కట్టెలతో బాదుతూ ,పిడికిళ్ళతో మోదుతూ రావణ సమక్షానికి తీసుకు వెళ్ళారు .బంధనాలతో ఉన్న మహాకపిని ఇంద్రజిత్ తన తండ్రికీ కొలువు కూటం లో ఉన్నవారికీ చూపించాడు .కొలువులోని వారు ‘’ఎవడు వీడు ఎక్కడనుండి వచ్చాడు ఎక్కడ దిగాడు ,ఇక్కడికి ఎందుకొచ్చాడు అసలు ఎవరివాడు “’అంటూ గుసగుసలాడుకొన్నారు ‘’వాడిని చంపండి  నరకండి ,కాల్చండి తినండి ‘’అని రాక్షులు అరచారు .మంత్రి పరివేష్టితుడైన రాక్షసరాజు రావణాసురుడిని హనుమ చూస్తె ,వాడు అటూ ఇటూ త్రాళ్ళతో లాగబడే హనుమను చూశాడు .అక్కడున్నవారిని వానరుడి సంగతి అడిగి తెలుసుకోమని ఆనతిచ్చాడు .వాళ్ళు అతనిపై ప్రశ్నల వర్షం కురిపించగా ‘’నేను వానరరాజు సుగ్రీవుని వద్ద నుంచి వచ్చిన దూతను ‘’అని మాత్రం చెప్పాడు

‘’నివేదయామాస హరీశ్వరస్య –దూత స్సకాశా దహ  మాగతోస్మి’’

ఇది 62శ్లోకాల 48వసర్గ

రావణుడికి ఎవరికి ఎలా ‘’తైరు ‘’కొట్టాలో బాగా తెలుసు .మేఘనాధుడు అంటే ప్రాణ సమానుడే కాదు బలబుద్ధిపరాక్రమాలలో కూడా తనకు సాటైనవాడేకాదు ఇంద్రుని  జయించినవాడు .కనుక వాడు తొందరపడి యుద్ధం లో చనిపోతే వారసులే ఉండరు కనుక ముందూ వెనకా ఆలోచించి వానర పరాక్రమ విశేషాలు క్షుణ్ణంగా తెలిపి ,ప్రాణాలతో పట్టుకు రమ్మన్నాడే కాని చంపమని చెప్పలేదు .చంపే దాకావస్తే ఎవరు చస్తారో ఎవరు మిగులుతారో తెలీదుకదా.అందులో జయం అనిశ్చితం చంచలం అని ఇదివరకు చెప్పాడు అక్షకుమారుని పంపిస్తూ .ఎందుకు వీడిని పంపాల్సి వస్తోందో అందులో ఉన్న రాజ, క్షత్రియ ధర్మం తేట తెల్లంగా చెప్పాడు రాజు .పేగు బంధం క్షాత్ర ధర్మం ముందు నిలువదు అనీ చెప్పాడు .మరింత వివరంగా మహాకపి ముందు సైన్యం మహా ఆయుధాలు బలాదూర్ అనీ చెప్పాడు .ఉన్న శస్త్రాస్త్రాలన్నీ ఉపయోగించమనీ చెప్పినా ,మిగిలింది కేవలం యుక్తి .దానితో బంధించి తేవాలి . రెట్టించిన ఉత్సాహంతో వెళ్లి వాడు హనుమతో కలబడ్డాడు .ఇద్దరూ ఒకరికి కారు తీసిపోకుండా యుద్ధం చేసి దేవతల, మునులను ఆశ్చర్యపరచారు .’’గివ్ హిం ఎ లాంగ్ రోప్’’అన్నట్లు ఇంద్రజిత్ అన్ని రకాల ప్రయోగాలు చేసి విసిగి ,హనుమ ప్రాణం తీయటం సాధ్యం కాదని గ్రహించి బంధనమే ఉభయతారకం అని గ్రహించి దానికోసమే బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు .అది చేయాల్సిన పని చేసి బంధించింది .కాని ఇదివరకే బ్రహ్మవరం ఉ౦ది కనుక బంధనం క్షణ భంగురం అని తాతగారే చెప్పారు కనుక కిమిన్నాస్తి గా ఊరుకున్నాడు .ఇక్కడేఆయనకు ఒక’’ బ్లెస్ ఇన్ డిస్గై స్’’లాగా  వాళ్ళు బంధించి రావణుడి దగ్గరకు తీసుకు వెడతారు కనుక  తనకు కావాల్సిందీ రాక్షసరాజును  స్వయంగా చూసి హితం చెప్పాలనుకొన్నాడుకనుక బాగుందని గమ్మున ఉండిపోయాడు .రోగీ పద్యమే కోరాడు డాక్టరూ అదే చెప్పాడు అన్నట్లు సరిపోయింది .  బ్రహ్మాస్త్రం తో బంధించిన మోజు క్షణభంగురమై  తెలివి లేని రాక్షసమూక త్రాళ్ళతో కట్టేయటం తో వ్యర్ధమైంది .ఇప్పుడుహనుమ’’ ఫ్రీ బర్డ్ ‘’అది తెలిసినా తెలియనట్లే ఉన్నాడు .రాక్షసమూక లాక్కు వెడుతున్నా ఏమీ అనుకోక తనను కాదులే అనుకొన్నట్లు ప్రవర్తించాడు .చివరికి ఈ బంధనం రాక్షస రాజును చూడటానికి చక్కగా ఉపయోగపడింది .తనకార్యం దాదాపు సఫలీ కృతం అయింది .హనుమకు రావణుడు ‘’తేజో బలసమన్వితుడై ప్రజ్వరిల్లే సూర్యుడిలాగా అవుపించాడు . తాళ్ళతో అటూ ఇటూ లాగబడే హనుమను చూశాడు రాజు .కొంచెం గర్వంకూడా కలిగి ఉంటుంది .తనకొడుకు,తనమాట నిలబెట్టి  అన్నంతపనీ చేసి కోతిని పట్టి తెచ్చిన౦దుకు.తాను సూటిగా దూతను  అడుగరాదుకనుక మంత్రిమొదలైన వారితో అడిగించాడు రాజు .అన్నిటికీ ముక్తసరిగా ఒక్కటే సమాధానం ‘’నేను సుగ్రీవ దూతను ‘’అని .

 సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-6-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బక దాల్భ్యుడు -8 ,9

బక దాల్భ్యుడు -8

చైకితాన్య లేక బ్రహ్మదత్త చైకితాన్య పేరు వైదిక సాహిత్యంలోఉపనిషత్తులు ,లేక బ్రాహ్మణాలలో  వినిపిస్తుంది.వారు ఒకరుకాదు ఇద్దరు అనిపిస్తుంది .ఛాందోగ్య ఉపనిషత్ -1.8-9లోమాత్రమే చైకితాన్య దాల్భ్య పేరు మిగిలినవాటిలో బ్రహ్మదత్త లేక దాల్భ్య  పేరు వస్తుంది .కనుక బ్రహ్మదత్తుడు చైకితాన్య దాల్భ్యుడి కొడుకు అయి ఉంటాడు .ఉద్గాత విషయ చర్చలొ  ఈపేరు వచ్చింది.ఈచర్చ ముగ్గురు సామవేద నిపుణులు –చేకితాన దాల్భ్య ,శీలక సాల్వావత్య ,ప్రవాధన జైవాలి మధ్య జరిగింది .మొదట శిలాక -చైకితాన్యుని  సామవేది మరోలోకానికి వెళ్ళటానికి ఆధారం ఏమిటి అని ప్రశ్నిస్తాడు . స్వర్గం సామవేద మాధుర్యానికి నిలయం కాదని శిలాకుని భావం .మరోలోకం వెళ్ళినవాడు మళ్ళీ ఈలోకానికే రావాలి అనీ అంటాడు .ఈ రెండిటిని త్రోసిరాజని రాజు ప్రవాహనుడు ఉపనిషత్ ను౦చి ఉదాహరణ ఇస్తాడు .అంతేకాక ఈ లోకం ఆధారభూతం కాదనీ ,చివర ఆధారం ఆకాశం లో ఉందని ,అదే అంతరిక్షంలో ఉండే బ్రహ్మం అనీ వివరిస్తాడు .

  ఇక్కడ చేకితానుడు ఉద్గాత విషయం లో అపరిపక్వ దశలో ఉన్నట్లు తెలుస్తుంది .బ్రహ్మదత్త చైకితాన్య కు కొన్ని ప్రత్యేక సామాలు  పలకటం లో సరైన సామర్ధ్యం లేదని తెలుస్తోంది .కురు దేశీయులు కూడా బ్రహ్మదత్త సామర్ధ్యాన్ని మెచ్చలేదు .పై అధ్యాయం లోనే రాజు జైవాలి మరొక గాలూనస అర్క శాక్యాయన అనే సాలావాత్యతో కలిసి చర్చించాడు .జె .యు. బి.1.59లో చైకితాన్యుడిని బ్రహ్మదత్తగా ఉద్గాతగా చెప్పబడింది .బ్రహ్మదత్తుడు కురు యాగనిపుణుడు అభిప్రతారిన కాక్ష్యసేనిని కలిసినట్లు ,శౌనక పౌరోహిత్యాన్ని’’మధుపర్క కాండ’’ లో కాదన్నట్లు ఉన్నది .అవమానపడిన శౌనకుడు సామవేద జ్ఞానంపై ప్రశ్నలు సంధిస్తే ,బ్రహ్మదత్తుడు ప్రతిదానికీ అద్భుతమైన సమాధానాలు చెప్పాడు .ఇక్కడకూడా ప్రత్యర్ధులు కురు దేశం వారే .కనుక బ్రహ్మదత్త చైకితాన్యుడు పా౦చాలుడు అని అర్ధమౌతోంది.

  బృహదారణ్యక ఉపనిషత్ 1.3.24,జెబి1.337-38లలోకూడా ఉదంతాలున్నాయి మొదటి దానిలో దాల్భ్యుని పేరు లేదు .అక్కడ యాగ వేదాంతం,ఉద్గాత స్వభావం లపైనే చర్చ .ఇందులోనే 1.3.24లో బ్రహ్మదత్తుని సామవేత్తగా సోమరసం  త్రాగినవాడిగా చెప్పింది .ఇక్కడా ఉచ్చారణ విషయ చర్చమాత్రమే .బ్రహ్మదత్త స్వావాస్య మాధుర్యం తో  చేసిన  గానం పై ,గాలూనులు అభ్యంతరం చెప్పగా ,అతడు దానికి మూలం వివరించాడు .ఇక్కడకూడా శ్వావాశ్వుడు అర్కానసుడికొడుకుగానే చెప్పబడి,సమిధలకోసం బయటకు వెడితే ,అతని స్పర్ధదారులు సత్రయాగం చేసి స్వర్గం చేరారు –ప్రాతిసత్రానః ‘’.అక్కడినుంచే స్తోభగానం చేస్తూ ,అతడినీ రమ్మని పిలిచారు .వీటన్నిటిలో ఒకే దాల్భ్యుడు అనేక  సందర్భాలలో కనిపిస్తాడు .బ్రహ్మదత్త సత్రయాగ బృందం లో ఉన్నాడని చైకితాన్యుడు సామవేదగాన నిపుణుడు అనీ ,సత్రయాగంలో స్తోభ గానం చేసేవాడని తెలుస్తోంది .శ్వావశ్వకూడా ఈయాగం చేసేవాడే  .ఒక శ్యావశ్వ రహవీతిదార్భ్య అనే పేరున్న యాగ యజమానికూడా  .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-6-20-ఉయ్యూరు

బక దాల్భ్యుడు -9

వేదం లో చెప్పబడిన చివరి దాల్భ్యుడు నాగారి దాల్భ్యుడు .జెబి1.257లో ఒక బ్రాహ్మణుడు ఆహుతులను ఏ దిక్కులో వేయాలి అని అడిగితె నాగారి దాల్భ్యుడు యజమాని సౌఖ్య సంపదలకోసమైతే ఊర్ధ్వంగా వేయాలి అని చెప్పాడని ఉన్నది –‘’తద్ ధా నాగారినం దాల్భ్యం బ్రాహ్మణః ప్రప్రచ్ఛకద్యర్ యజ్ఞాఇతి ‘’-‘’ఊర్ధ్వ ఏవ పురుషం అన్వయత్తా ఇతి’’-‘’యా యు ఏనం ప్రత్యాన్చం వేద ప్రత్యయన్ భూతిం భవతి ‘’.ఇంతకంటే అతనిగురించి వివరం లేదు .బౌదాయన శ్రౌత సూత్రం ప్రవరలు, గోత్రాల  జాబితాలో దార్భ్య ,దార్భి ,దార్భ్యాయన పేర్లున్నాయి .దార్భ్య పేరు ప్రవరలో  హరిత భరద్వాజులుగా చెప్పబడింది  .దార్భి పేరు ప్రవరలో రెండు సార్లు వచ్చింది .భారద్వాజులలో దార్భ్యులుగా ,అయాస్య గౌతములలో   దార్భి గా ఉన్నది .వీటిలో ఇంటిపేరు దార్భ్యయాన అనీ ,ప్రవరలలో దార్భాయనులు అనీ వీరి గోత్రాలు వత్స భార్గవ ,మరియు లౌకాస్య భార్గవ అని ఉన్నది .

  రథ దాల్భ్యులలో రహవీతి,రహప్రోతలు క్షత్రియులు .రహ వీతివిషయం లో ఋషులకు రాజర్షులకు అంటే బ్రాహ్మణులకు క్షత్రియులకు మధ్య అతి దగ్గర సంబంధం కనిపిస్తోంది.అంటే రాజ కుటుంబాలు బ్రాహ్మణ కుటుంబం వారిని వివాహమాడి  వారినుంచి యాగరహస్యాలు సంపాదించి ఉంటారు .అందులో  నిష్ణాతులై బ్రాహ్మణ యాగ వేత్తలను చర్చలలో ఓడించినట్లుకూడా అర్ధమౌతోంది .

      చైకితాన ,బ్రహ్మ దత్త చైకితానలు మాత్రం సామవేద గాయకులు .మనం చూసిన అనేక విషయాలలో చైకితాయన అనే ఆయన బకఅనబడే గ్లావ(గాలవ ) మైత్రేయుడే.ఈ ఇద్దరు సామగాయకులే .పోటీలలో ఒకసారి గెలుపు మరో సారి ఓటమి పొందారు .ఇద్దరూ ఉద్గీతలోని వేదాంత రహస్యాలు చర్చి౦చినవారే ,సత్రయాగ సమూహాలతో సంబంధమున్నవారే .బక,కేశినులతర్వాత బ్రహ్మదత్త చైకితాన్య వస్తాడు .ఇతనికి కురు రాజులతో బంధం ఉంది(పా౦చాలురతో కూడానా ?) . ఇప్పటిదాకా మనం వేద సాహిత్యంలో బదాల్భ్యుని గురించిసవివరంగా చర్చించాం .ఇక ఇప్పుడు ‘’వేదానంతర సాహిత్యం’’ లో బకదాల్భ్యుని గురించి తెలుసుకొందాం .

వేద సాహిత్యానంతరం –అంటే ముఖ్యంగా మహాభారతం ,పురాణాలలో అని అర్ధం .తర్వాత జాతక కధలు ధర్మశాస్త్రాలు చూద్దాం .

                 బకదాల్భ్యుడు –

మహాభారత ,వామన పురాణం సారో మహాత్మ్యం లో బకదాల్భ్యుని గురించి ఉన్నది .ఈ రెండిటిలో సరస్వతి నదికి అనేక తీర్దాలున్నాయి .భారతం శల్యపర్వం లో బలరాముడు ద్వారకనుంచి కురుక్షేత్రానికి తీర్ధయాత్ర చేశాడు .వామనం లోరోమహర్షణుడు రుషి సమూహాలకు సరస్వతి నదీ తీర్దాలగురించి వివరిస్తాడు .బక దాల్భ్యుడు హోమం నిర్వహించినచోటు అవకీర్ణ తీర్ధం .కాని తీర్ధ వర్ణన లో అతడిపేరు మనకు కనిపించదు.మహాభారతం వేదానికి అనుసరించి రాయబడింది కనుక ఇందులోనిదే యదార్ధం .అప్పటికి బకుడు నైమిశ ఋషులతో  ,సత్రయాగాలు చేస్తున్నాడు .బక -ధృత రాస్ట్రుని  కలవకముందే నైమిశం లో 12ఏళ్ళ విశ్వజిత్ యాగం చేశాడు .పాంచాలురు ఇచ్చిన కానుకల జాబితా కూడా ఉన్నది .గోవులు 21.(కథా సంహితలో కానుకలు కురురాజులిచ్చినట్లు గొవులు27అని ఉంది)రాజు పశువు మరణం ‘’యద్ర చయామృతా’’అంటే అనుకోకుండా ,అకస్మాత్తుగా చనిపోయాయి .భారతం లో కూడా బకదాల్భ్యుడు   మృత పశువు మాంసాన్నిరాజు వినాశనం కోసం  ఆహుతిచ్చాడు .యాగవేడికి అక్కడి పశు హింసకు ఋషికి ఆగని క్రోధం రావటమే .సంహితలో, భారతం లో కూడా బకుడు బయటివాడు సత్రయాగ నిర్వాహకుడు ,వేత్త  అతనికి రాజు కోపం తెప్పించి ఉండాల్సి౦ది కాదు అనిపిస్తుంది .నిగ్రహానుగ్రహ సమర్ధుడు కనుక వేదకాండ ప్రకారమే శిక్షించాడు .మళ్ళీ పునరాహూతి అందించి అదే విధంగా అనుగ్రహమూచూపాడు .ఈ విషయంలో వామనపురాణ౦ రెండు నీతులు బోధించింది .ఒకటి బ్రాహ్మణులను అవమాన పరిస్తే ,శిక్షతప్పదు.రెండవది అవకీర్ణ తీర్ధం లో భక్తీ శ్రద్ధలతో స్నానం చేస్తే కోరిక నెరవేరుతుంది .

  భారతం సభాపర్వం లో మరో చోట యుధిస్టిరుని నూతన సమావేశ మందిరం లో   సందర్శించ టానికి  వెళ్ళిన మహర్షుల పెద్ద జాబితాలోబకదాల్భ్యుని పేరుకూడా ఉన్నది .అరణ్యపర్వం లో ఆయనే మహర్షుల సమూహానికి నాయకుడుగా వెళ్లి ద్వైతవనం లో ఉన్న పాండవులతో  మాట్లాడినట్లున్నది .అక్కడి అరణ్యం అంతా వేదమన్త్ర ఘోషతో దద్దరిల్లుతుంటే బకదాల్భ్యుడు ‘’అగ్నికి ఆహుతులిచ్చే సమయం ఆసన్నమైంది ‘’అన్నాడు –‘’బ్రాహ్మణానాం తపస్వినాం హోమ వేలాం’’..అక్కడ ద్వైతవన సరస్సువద్దఅపుడు భ్రుగు,ఆంగీరస ,వశిష్ట ,కాశ్యప,అగస్త్య కుటుంబాలకు చెందిన మహర్షులంతా పాండవులతో ఉన్నారు .ఇక్కడ బ్రాహ్మణ క్షత్రియులమధ్య ఉండాల్సిన సహకారం గోచరించి౦ది .చివరకు బకదాల్భ్యుడు ఇతర బ్రాహ్మణులతో కలిసి ధర్మరాజును మనసారా కీర్తించి ,ఆశీర్వదించి సెలవు తీసుకొన్నాడు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-6-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment