కృష్ణాజిల్లా రచయితల సంఘం l— 6 నెలల కరోనా కష్టకాలంలో నేను – నా సాహిత్య కృషి 1

కృష్ణాజిల్లా రచయితల సంఘం l

6 నెలల కరోనా కష్టకాలంలో నేను – నా సాహిత్య కృషి 1

@2hr 16m  YOU CAN SEE

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కృష్ణాజిల్లా రచయితల సంఘం జూమ్ ప్రోగ్రామ్

కృష్ణాజిల్లా రచయితల సంఘం ఈ నెల 17,18 శని ఆదివారాలలో సాయంత్రం 5-30 కి జూమ్ ప్రోగ్రామ్ గా ”6నెలల కరోనా కష్టకాలం లో నేను నా సాహిత్య కృషి ”కార్యక్రమం లో నాకూ17వ తేదీ  భాగస్వామ్యం కలిపించారు -దుర్గాప్రసాద్

www.youtube.com/cultural live లో వీక్షించవచ్చు 
Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

శ్రీ ముఖలింగేశ్వరశతకం -2(చివరి భాగం )

శ్రీ ముఖలింగేశ్వరశతకం -2(చివరి భాగం )

మొదటిపద్యం –‘’శ్రీ కంఠ రజిత గిరినివాస విశ్వేశ –లోక రక్షక దేవశోకనాశ-మందరాచలదీర మహిత దివ్యప్రభా –ఫాలలోచన కోటి భాను తేజ –సోమ సూర్యాగ్ని సుశోభిత నేత్ర ని-గమగోచర శశా౦క ఖండ మకుట –హిమశైల జాదిప హేమాద్రి ధన్విత్రి-పురనాశన త్రిశూలి భుజగ హార-భక్త జన రక్షనిఖిలసంపత్సమేత-పూత చారిత్ర మమ్మిల బ్రోవుమయ్య –ముక్తి దాయక సర్వేశ భక్త వరద –అంగభవ భంగ శ్రీ ముఖ లింగవాస ‘’

3-శ్రీముఖ లింగాన శీతాంశు ధర యమ్మ –వారాహి తోడుగ వరలినావు’’ –

6-వామదేవుని యజ్ఞభాగంబు గైకొన –వేంచేసి గాంధర్వ బృందమెల్ల-కండకావరమున కన్నుగానక భిల్ల –వనితల జెరచిరి వక్రబుద్ధి-వామదేవుడు వారల శపియింప-భిల్లులై తిరిగిరి భీతి గొనుచు –ద్వాపరా౦తము న౦దు వారాహి దేవితో –ఇప్ప చెట్టు మొదల ఇచట వెలసి –ఆననాబ్జము లింగాన యమర దాల్చి –శాపమంతము జేసితి   శైల చాప ‘’

12-‘’ఒక వంక నెలవంక నకలంకముగదాల్చి –మకుట కిరణజాల మొకటి వెలుగ –దక్షిణ కరమందు దగ పుర్రె ధరియించి –దాపట బూని సుదర్శనంబు-గళసీమ కుడిప్రక్క కంకాళములు వేర-ముత్యాల హారంబు మురుపు సూప –ఫాలమందును నేత్ర పద్మ౦బు బొలుపార – వక్షమందున కౌస్తుభంబు మెరయ –హరిహరాద్వైతము దెలుప నాలయమున –వెలుగు నీ మూర్తి నే గొల్చి వినుతి జేతు’’

అంటూ స్వామి హరిహరాద్వైత రూపాన్ని కళ్ళముందుకట్టించారు కవి .

15-చిత్ర సేనుడు భార్య ‘’చిత్తని’’యామోద-మును బొంది చిత్కళ మనువు గొనియె-అన్ని కాలములందు నమరంగ బూచెడి-ఇప్ప శాఖల నిచ్చె నిరువురకు ‘’చిత్కళ భక్తికి బంగారు పుష్పాలిచ్చి ,చిత్తిని చెట్టు మొదలంటా ఖండించగా ముఖ రూపాన్ని పొందాడు స్వామి .వేదముఖోద్గత నాలుగు వేదాలు ,వ్యాకరణ౦  మొదలైన షడంగాలు  విజ్ఞాన వార్తాది విద్యలు సర్వ శకున ధర్మ సాముద్రికాలు ,దాతు పదతద్ధితాలు చదివితే బుద్ధి పెరుగుతుంది కాని-‘’కైవల్యపదము గాంచ గలడె- నీదు నామ స్మరణ లేక నిగమవేద్య’’అని చదువులు ముక్తిమార్గం చూపించవన్న ఎరుక తెలియజేశాడు కవి .

45-జయ భూత నాథాయ జయ చంద్ర చూడాయ –జయ నీల కంఠాయ జయము జయము —జయ వేద వేద్యాయ జయ కృత్తినివాసాయ –జయ నాగ భూషాయ జయము జయము ‘’

  ఈ సీసాలు శ్రీనాథ మహాకవిని ఆయన శివభక్తి తత్పపరత ను గుర్తుకు తెస్తున్నాయి .

59-ఓంకార మనువుగా యురగభూషణు మంత్ర-పఠనము జేయునవియె వక్త్రములు –నిష్టమై భస్మమ్ము నిండార బూసిన- తనువు తర్కి౦ప గా తనువు సుమ్ము ‘’పద్యం పోతనగారి ‘’కమలాప్తు నర్చి౦చు కరముకరము ,శ్రీనాథు  వర్ణించుజిహ్వ జిహ్వ ‘’పద్యానికి కు సాటిగా పోటీగా ఉంది .

కాటుక కొండను సముద్రంలో కలిపి సిరాచేసి ,కల్ప వృక్ష శాఖలు ఖండించి కలాలు గా చేసి విద్యలరాణి వాణి లోకాలున్న౦తకాలం రాయలనుకొన్నా ‘’వ్రాయ దరమే ‘’అంటారు కవి శంకరాచార్య స్పూర్తితో .శర్వుడుగా జలమూర్తి ,భవనామం తో వసుధ , ఉగ్రనామంతో హుత భుక్ అంటే అగ్ని ,మహాదేవ నామం తో అబ్జుడు ,భీమనామం తో వ్యోమకేశుడు ,రుద్రనామం మారుతుడు ,పశుపతి నామంతో యజ్ఞపురుషుడు.ఈశాన నామంతో సూర్యుడు ,పంచభూతాలు ఇన శశి పావకులుగా  వెలిగే అష్టమూర్తి శివుడు అని చక్కగా వర్ణించారు .ఓంలో నాథుడు,అ ఉ మలతో త్రిగుణా త్మకుడు వేదత్రయం ,విశ్వకర్తలు జాగ్రత్ స్వప్న సుషుప్తులు,ప్రాజ్ఞ తైజస విశ్వ పరమ రూపాలు శరీర త్రయం వర్ణాలకు ఆద్యుడు ఒట్టిఓంకార రూపుడు శివమహా దేవుడు అని తత్వమంతా విప్పి చెప్పారు 70వ పద్యం లో .90వ పద్యంలో గాలికి గంగకు అగ్నికి భూమికి శరీర౦లొని  రక్తమాంసాలు  ,పాలకు సూర్యునికి ప్రకృతికి వృక్షాలు లతలకు పూలకు కులమేది అని తార్కిక ప్రశ్నలు  సంధించి ‘’కుసుమ కోదండ హర  నీకు కులము గలదె-గుణము గొప్పది గావలెకులములేల ‘’అని మనకు చెంప దెబ్బలు వాయిస్తాడు కవి .

100-నీదు లింగము గననీలలోహిత రాయి –శంకరా నీ సతి శైలతనయ –నీహార శైలుండు నీ మామ బాంధవ –వర్గంబు పరికింప భర్గ శిలలు –భవదీయ చాపము పశుపతీ శిల గదా-‘’మెడలో పుర్రెలమాల ,చేతిలో పుర్రె ,ఉన్న నీవుమాత్రం ‘’కారుణ్య వత్సలుడవు ‘’అంటాడు చమత్కారంగా కవి .

108- వ పద్యంలో తన గురించి చెప్పుకొన్నాడు .కోమర్తి గ్రామవాసి .హరితస గోత్రం .పేరు రమణయ్య .తండ్రి మాధ్వుడు మహిత యశ శ్శాలి ,సత్వ గుణ సంపన్నుడైన గ్రామాధికారి నరసింగ రాయడు .తల్లి రమణమ్మ . వ్యక్తిగా తీర్చి దిద్దినవారు చొప్పల్లి జగన్నాథ స్వామి ,తెలుగు భాషా యోష తీరు తెన్నులు చెప్పి అభిలాష కలిగించినవారు గంటి నరసింహ శాస్త్రి .పద్యం అల్లటం కర్రి సుబ్బారావు ,రాఘవ పాండవీయం బోధించినవారు బంకుపల్లి సూర్యనారాయణ శాస్త్రి,రఘువంశం లక్ష్మణ శాస్త్రి  గార్లు బోధించారు. ఈ విధంగా పరమభక్తాగ్రేసరకవి శ్రీ మొసలికంటి వెంకటరమణయ్య గారినీ వారి’’శ్రీ ముఖ లింగేశ్వర శతకం’’ను పరిచయం చేసే భాగ్యం నాకు కలిగింది . తెలుగు లెక్చరర్ అవటం సంస్కృతాంధ్రాలలో మంచి పట్టు ఉండటం ,శాస్త్ర పరిచయం లోతుగా ఉండటం తో శతకరచన  శ్రేష్టంగా కనిపిస్తుంది ..

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -16-10-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ ముఖలింగేశ్వరశతకం -1

శ్రీ ముఖలింగేశ్వరశతకం -1

 

శ్రీ ముఖలింగేశ్వరం అనే ‘’శివ మహిమ’’ పుస్తకాన్ని నరసన్నపేట తెలుగు ఉపన్యాసకులు శ్రీ మొసలికంటి వెంకట రమణయ్య తిరుమల తిరుపతి దేవస్థానం ద్రవ్యసాయం తో నరసన్నపేట సిద్ధాశ్రమం ద్వారా ప్రచురింఛి తిరుమలేశునికి అంకితమిచ్చి శివ కేశవాద్వైతాన్ని చాటారు . .వెల అమూల్యం .

ముఖ లింగేశ్వర దేవాలయం

ముఖలింగ క్షేత్రం శ్రీ కాకుళం జిల్లాలో వంశధార నదీ తీరాన ఉన్నది .ఒకప్పటి గంగ వంశ రాజుల రాజధాని .దీనికి రెండు కిలోమీటర్ల దూరం లో ‘’నగరి కటకం ‘’ఆ రాజుల అంతఃపుర ప్రాంతం .నగరి అంటే రాజాంతఃపురం .తూర్పు గంగవంశ 12వశతాబ్దికి చెందిన రాజు అనంత వర్మ చోడ గంగడు బాగా ప్రసిద్ధుడు .రాజ్యాన్ని ఒరిస్సాలోని మహానది వరకు విస్తరింఛి ‘’ఉత్కళ ప్రబువు ‘’,త్రికళింగాధిపతి ‘’బిరుదులు  పొందాడు .భువనేశ్వర్ లోని మేఘేశ్వర అనంత వాసుదేవ ,పూరీ జగన్నాథ స్వామి దేవాలయాల శిల్పాలు గంగవంశరాజులవే .ముఖలింగేశ్వర శిల్పాలు ఈ శిల్పాలనే పోలి ఉంటాయి .

ముఖలింగ౦ లో మూడు  దేవాలయాలున్నాయి .ప్రథాన ఆలయలయం కాకుండా ఊరి బయట పశ్చిమాభిముఖంగా ఉన్న సోమేశ్వరాలయాన్ని చంద్రుడు తనకుష్టు వ్యాధి నివారణకోసం నిర్మించాడు గంగవంశ రాజు హస్తి వర్మ క్రీ.శ.573ఈ ప్రాంతాన్ని పాలిస్తూ ముఖలింగేశ్వరాలయం నిర్మించాడు 11వ శతాబ్దం లోఅనంత వర్మ కట్టిందని కొందరి అభిప్రాయం , హస్తి వర్మ నిర్మిస్తే అనంతవర్మ పునరుద్ధరణ చేసి ఉండచ్చు .ఆలయ గోడలపై గణపతి ,మహిషాసురమర్దిని ,అర్ధనారీశ్వర శిల్పాలు నయన మనోహరాలు .సున్నం ఎక్కడా వాడిన జాడ లేదు .ఎర్ర రాళ్ళను చెక్కి వరుసగా అమర్చారు అంతే.ఇది ఇండో- ఆర్యన్ శిల్ప విధానం .ప్రధానమైన ‘’మధుకేశ్వరాలయ’’శిల్పకళ భీమేశ్వరాలయ శిల్పకళ భిన్నంగా ఉంటాయి .కనుక ఒకే కాలం నాడు కట్టినవి కాదు .

పాండవ భీముడు భీమేశ్వరాలయ శ్రీ భీమ లింగ ప్రతిష్ట చేశాడని ,గంగవంశరాజు రెండవ వజ్రహస్తుడు11వ శతాబ్ది మొదట్లో  ఆలయ నిర్మాణం చేశాడని తెలుస్తోంది  .దీనిలో చోళ శిల్ప కళ ద్యోతకం .వేంగి చాళుక్యరాజు శక్తివర్మ సోదరుడు విమలాదిత్యుడు ఈ ఆలయ నిర్మాణానికి సహాయం చేసినట్లు చారిత్రకాధారాలున్నాయి .

ప్రథాన ఆలయ శిల్పకళ ముచ్చటగా ఉంటుంది .ఆలయం నాలుగుమూలల నాలుగు చిన్న ఆలయాలున్నాయి .పడమటి ఆలయం లో హరిహర మూర్ర్తి మతసామరస్యానికి ప్రతీక .ఆలయ గోడలపై శివలీలలు చెక్కారు .కాశీ ‘’ఆనంద కాననం ‘’అయితే ,శ్రీ ముఖలింగం’’ గోవింద కాననం ‘’గా అభి వర్ణిస్తారు .అందుకే దక్షిణ కాశి అంటారు .స్కాంద పురాణంలో ఈ ఆలయ వివరాలున్నాయి .శివుని శాపానికి వ్యాసుడు కాశీ వదలాల్సి వచ్చి బాధ పడుతుంటే దేవ సేనాని కుమారస్వామి ప్రత్యక్షమై ‘’శ్రీ ముఖలింగేశ్వర క్షేత్ర మహాత్మ్యం వివరించి అది దక్షిణ కాశి అని భరోసా ఇచ్చాడు .కృతయుగం లో గోవి౦దేశ్వర  సువర్ణలింగం , త్రేతాయుగం లో మధుకేశ్వర రజత లింగం  ద్వాపరం లో జ౦తీశ్వర కాంస్యలింగం గా వెలసిన పరమేశ్వరుడు కలియుగం లో లింగం లో ముఖం దాల్చి శ్రీ ముఖ లి౦గేశ్వరుడుగా వెలసి పూజల౦దు కొంటున్నాడు .అందుకే ముఖలింగ క్షేత్రం అయింది .

ద్వాపరం చివరకు ఇదంతా గొప్ప కీకారణ్యం .మనోహర వంశధార నదీ తీరం లో పరమేశ్వరా౦శ సంభూతుడు వామ దేవ మహర్షి యజ్ఞం చేశాడు .ఈ క్షేత్రం చుట్టూ చాలా పుణ్య తీర్దాలేర్పడ్డాయి .ఈ క్షేత్రసందర్శనంచేసిన మునులు యోగులు అనేక శివలింగాలు ప్రతిస్టించారు .మంకణేశ్వర,స్వప్నేశ్వర ,సూర్యేశ్వర ,సోమేశ్వర ,భీమేశ్వర మొదలైన లింగాలున్నాయి .

ఈ క్షేత్రానికి తూర్పున రత్నగిరి దానిపై విష్ణుమూర్తి పద్మనాభస్వామిగా వెలసి క్షేత్ర పాలకుడుగా ఉన్నాడు .దక్షిణాన వటాద్రిపై మంకణేశ్వరుడు వెలిస్తే ,దక్షిణాన స్వప్నేశ్వరుడు వెలసి దుస్వప్న దోషనివారణ చేస్తున్నాడు .ఉత్తరాన సూర్య ప్రతిష్టిత సూర్యేశ్వరలింగం సూర్య తీర్ధం ఉన్నాయి .చర్మవ్యాధులను నివారిస్తాడు .దక్షిణాన సిద్దేశ్వర లింగం తీర్ధం సర్వ సిద్ధులు కలిగిస్తుంది .ఇంత ప్రసిద్ధమైన ఈ క్షేత్రానికి ప్రచారం చాలా తక్కువగానే ఉన్నది .

ఈ క్షేత్ర మహాత్మ్యం రాసిన కవి చిన్నతనం లో చాలాసార్లు ఈక్షేత్ర దర్శనం చేశారు .1988 తన దగ్గర బంధువులతో దర్శించినపుడు అర్చకస్వామి శ్రీ తమ్మా తిరుపతి రావు ‘’ఈ క్షేత్రం గురించి మీరేదైనా రాయరాదా ?”’అని ప్రేరణకలిగిస్తే అది స్వామి ప్రేరణ అనిపించి మనసులో సీసపద్యం లోని ఎత్తుగీతి చివరి రెడుపాదాలు –‘’ముక్తి దాయక సర్వేశ భక్తవరద –అంగ భవ భంగ శ్రీ ముఖ లింగవాస ‘’ మకుటంగా భాసించింది.అనేక విషయాలు సేకరించి ,శివలీలలు కూడా చేరిస్తే బాగుంటుంది అనిపించి ,పురాణ గాథలను లఘు టీకా తో సహా సంపూర్ణం చేశారు ఇలాంటి ప్రయత్నం శతక వాజ్మయం లో అంతవరకూ రాలేదని కవి చెప్పారు చిన్నతనం లోనే తల్లిని కోల్పోయిన తనను అక్కగారినీ అనురాగం పంచి పెద్ద చేసిన పినతండ్రి శ్రీ మొసలికంటి వెంకటసన్యాసయ్య గారిని స్మరించారు .విజయనగర మహారాజ కళాశాలవిశ్రాంత అధ్యక్షులు శ్రీమానాప్రగడ శేషసాయి ‘’రసతరంగం ‘’అనీ ,అరసవల్లి సూర్య దేవాలయ ఆగమపాఠశాల సంస్కృత అధ్యాపకులు శ్రీ ఆరవెల్లి లక్ష్మీ నారాయణా చార్యులు మున్నుడిలో ‘’ఇక్కడి లింగ౦ ఇప్పచెట్టు అంటే ‘’మధూకం ‘’మూలం నుండి ఉద్భవి౦చి నందున ‘’మధు కేశ్వరలింగం అనటం సార్ధకం .దారురూపంగా స్వామి దర్శనమివ్వటం ఆశ్చర్యం ‘’అన్నారు .పూరీలోజగన్నాథస్వామి అన్నబలరాముడు సోదరిసుభద్ర లతో దారు శిల్పాలుగా దర్శనమిస్తారనిమనకు తెలుసు ఇక్కడ శివుడు అరుదైన దారు లింగంగా  ఉద్భవించాడు .ఇదీ ఈక్షేత్ర విశేషం ..శ్రీకాకుళం ప్రభుత్వ కళాశాల విశ్రాంత ఆంద్ర భాష ఉపన్యాసకులు శ్రీ గెడ్డావు సత్యం ‘’ధారాళంగా సీసపద్య రచన జరిగింది .వివిధ క్షేత్రాలలో వివిధనామాలతో వెలయు భవుని వర్ణన భవ నాశకంగా ఉన్నది .చదివి శివుని కారుణ్యా మృతం ‘’పొందుతారు ‘’అని ఆశీస్సులదించారు .

సశేషం

మీ గబ్బిట దుర్గాప్రసాద్ -16-10-20-ఉయ్యూరు .

— 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా త్యాగి మద్దూరి అన్నపూర్ణయ్య-7

మహా త్యాగి మద్దూరి  అన్నపూర్ణయ్య-7

ఆంద్ర దేశం లో అతివాద ప్రథమ నాయకుడు బులుసు సాంబమూర్తిగారు .ఈయనే తనగురువు అన్నారు పూర్ణయ్యగారు .1921తూగోజి రాజకీయ మహా సభలో పూర్ణ స్వరాజ్యం సాధించాలని  బులుసు  ప్రతిపాదించారు .ప్రకాశం తొందర పడవద్దని హితవు చెప్పారు .తీర్మానం నెగ్గించుకొన్నారు సాంబమూర్తి .ఆయన తీర్పే ఆనాడు అందరికీ శిరోధార్యం .కాంగ్రెస్ సభలలో కొడుకు చనిపోయినా సభలలో పాల్గొన్న స్థిత ప్రజ్ఞుడు సాంబమూర్తిగారు .1928లో మద్దూరి వారికీ అఖిలభారత కాంగ్రెస్ సభ్యత్వం లభించింది .1927మద్రాస్ కాంగ్రెస్ సభలో నెహ్రు శ్రీనివాస అయ్యంగార్ డాక్టర్ అన్సారి మొదలైనవారు పట్టుబట్టి సంపూర్ణ స్వరాజ్యం తీర్మానం చేయించారు .దీనితో స్వత౦త్ర  సాధనకు బలం చేకూరి అయ్యంగార్ అధ్యక్షతన ’’ ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్’’ ఏర్పడింది .నెహ్రు బోస్ లు కార్యదర్శులు .సాంబమూర్తి సర్దార్ శార్దూల్ సింగ్ ,అన్నపూర్ణయ్య గార్లు ముఖ్య కార్తకర్తలు .

లీగ్ కు ఆంధ్రాలో బులుసు అధ్యక్షులు .దువ్వూరి వారు విస్తృతంగా పర్యటించి లీగ్ కు గొప్ప మద్దతు కూడా గట్టారు .పత్రిక కూడా సంపూర్ణ స్వరాజ్యం కే మద్దతు ప్రకటించింది .1936ఫిబ్రవరి 29 నెల్లూరు జిల్లా యువజనులను ఉద్దేశించి ప్రసంగించి పూర్ణయ్యగారుకాంగ్రెస్ ను వశం చేసుకొని ‘’కార్మిక కర్షక పరిషత్ ‘’స్థాపించారు .

రాజమండ్రి అల్యూమినం వ్యాపారానికి అనువైన చోటు .కాంగ్రెస్ అభిమాని సేట్ జీవన్ లాల్ ఈ వ్యాపారం కోసం రాజమండ్రి వచ్చాడు.గ్రామీణ ప్రాంతాలలో పని చేసేవారికి తన ఆదాయం లో కొంత భాగం కేటాయిస్తానని సుబ్రహ్మణ్యం గారికి హామీ ఇచ్చాడు .సీతానగర్ ఆశ్రమ స్థాపనకూ లాల్ బాగా ఆర్ధిక సాయం చేశాడు .గ్రామోద్యోగులతో రాజీనామా చేయించి ఉద్యమం లో చేర్పించాడు .14ఎకరాలలో ఉన్న ఆశ్రమం అందరి సహకారం తో 12పక్కా  ఇళ్ళుకట్టించింది .మంచినీటి వసతి ,ఖద్దరుప్రచారం ఉచిత వైద్య సేవ, పత్రిక నిర్వహణ ముఖ్యకార్యక్రమాలుగా ఆశ్రమం వర్ధిల్లింది .మద్దూరి వారి తమ్ముడు కృష్ణమూర్తి,వంగల సత్యనారాయణ కంపోజింగ్ చేసేవారు .ఆశ్రమవాసులు కుటుంబాలతో ఉండేవారు .అవసరాలను బట్టి జీతాలు అందేవి .సుబ్రహ్మణ్య౦ గారికి 50,దువ్వూరికి 49,లింగరాజుగారికి కు 35రూపాయల జీతం.ఇదొక సామ్యవాద ప్రయోగంగా ప్రశంసలు పొందింది .1933లో గాంధీ రెండవ సారి ఇక్కడికి వచ్చి 1932లో ఆశ్రమం పై జరిగిన దాడికి మనస్తాపం చెందాడు .

1932జనవరి 5న మద్రాస్ గెజిట్ లో ఆశ్రమం చట్ట విరుద్ధమైనదని ప్రకటించింది .ఆశ్రమ కృషి దేశమంతా హర్షించింది .1930లో సీతానగరం పోలీస్ కాంప్ గా మారింది .సత్యాగ్రహ శిక్షణ ఆశ్రమం లో జరిగినంతకాలం ప్రజలు తండోపతండాలుగా తీర్ధ ప్రజలా వచ్చి సందర్శించేవారు .శిక్షణకు దేశం నలుమూలలనుంచి వచ్చేవారు .అన౦తపురం నుంచి వచ్చిన  హరే సముద్రం నరసింగరావు ‘’ఈ ఆశ్రమంలో నెలరోజులు గడిపాను దాదాపు 200కుటుంబాలవారు ఇందులో పని చేస్తున్నారు .పెద్ద ఖాదీ భాండారం ఉంది నెలకు రెండువేలరూపాయల ఖద్దరు తయారు చేస్తున్నారు .కాంగ్రెస్ వారపత్రిక నడుపుతున్నారు .గొప్ప ఆస్పత్రి, గ్రంథాలయంఉన్నాయి .అనాథ పిల్లలు చాలామంది పని చేస్తున్నారు .ఆశ్రమనిర్వాహకులు సుబ్రహ్మణ్యంగారు  ప్రస్తుతం వెల్లూరు జైలులో ఉన్నారు .ఇక్కడ శిక్షణ పొందిన వందమంది తో మేము మహర్షి బులుసు సాంబమూర్తి గారి నాయకత్వం లో  సాయంత్రం నాలుగు గంటలకు కాకినాడ బయల్దేరి ,ఒకగంటలో కాకినాడ చేరాం .ఆ దృశ్యం చూడాల్సిందే కాని రాయనలవి కానిది .అప్పటికే గాంధీజీ దండి చేరి ఉప్పు సత్యాగ్రహం చేస్తున్నారు .మేమూఆయన   ఆజ్ఞా అనుసరించి  కాకినాడలో  చట్ట ధిక్కారం చేసి ఉప్పు తయారు చేశాం .రోజుకు 5లేక 6మణుగుల ఉప్పు నెలరోజులు తయారు చేసి బహిరంగం గా అమ్మితే వెయ్యి రూపాయలు వచ్చాయి ‘’అని రాశాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -15-10-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కొమరి పురీశ్వర శతకం

కొమరి పురీశ్వర శతకం

తూర్పు గోదావరి జిల్లా రామ చంద్ర పురం తాలూకా కొమరిపాలెం గ్రామ కాపురస్తులు సహజకవి,ఈశ్వర భక్తుడు  శ్రీ తగరం పూడి అప్పస్వామి ‘’అందరు కవులలాగా సీస ,కంద చంపక ఉత్పలమాల తేటగీతాదులతో కాకుండా కేవలం ’ పంచ చామర వృత్తం తోరాస్తున్నాన’’ని చెప్పి,  సవాలుగా శ్రీ కొమర్పురీశ్వర శతకం ‘’బాహ్యాభ్యంతర అర్ధాలతో రాశాడు .చివరలో నీతిపద్యాలు ,తత్వాలు   ఆధ్యాత్మ రామాయణం నేపధ్యంగా దండకం ,పిమ్మట విభిన్న రాగాలలో ఆధ్యాత్మ కేర్తనాలు కూడా  రాసి చేర్చాడు .ఇది రాయవరం మేరీ ముద్రాక్షర శాలలో శ్రీ మల్లిడి సత్తి రెడ్డి గారి చే  1931 లో ముద్రింపబడింది .వెల కేవలం నాలుగు అణాలు మాత్రమే.

  తాను  మహాకవిని ,బుధుడను ,కోవిదుడను ‘’విశేష శాస్ర్తి ‘’,కూడా కానని తజ్ఞుడనుమాత్రమె నని ,గొప్పకోసం కాదని ముక్తి కోసమే రాశానని విద్వజ్జన విధేయుడుగా ఉత్పలమాలలో చెప్పు కున్నాడు కవి .మహారాజ ఠీవిగా ‘’పంచచామరం’’ వీచాడుకవి కొమరపురి ఈశ్వరుడికి శతక పద్యాలతో .మహా ప్రవాహ శైలి .తాత్విక చింతన లోతుగా కనిపిస్తుంది .నిండిన ఈశ్వర భక్తి కవి సొమ్ము .మొదటిపద్యం –

1-‘’నమోస్తుతే గజాసురారి నాగరాజ కంకణా-సమాన భూత రక్షితార్ధ సర్వ వ్యాపి శంకరా –సుమోక్ష లబ్ధ నీలకంఠ చంద్ర శేఖరా హరా –సుమాశరా౦తకా మహేశ శ్రీ కొమర్పురీశ్వరా ‘’

3-శుభాంగ లింగ ఫాలనేత్ర శుద్ధ తత్వ కోవిదా –కు౦భేంద్ర నెచ్చెలీ కపాలి గోతురంగ నిర్గుణా –ప్రభా౦తరంగ పాపభంగ బ్రహ్మ వేద్దిగంబరా – శుభాంకరేసుపూజితా౦ఘ్ర శ్రీ కొమర్పురీశ్వరా ‘’

‘’శబ్ద లక్షణాలు నిఘంటు ,కావ్యాలూ ,యతులు గణాలు ప్రాసలు వగైరా ‘’ఎరూంగ’’అని వినయంగా చెప్పుకొని ‘’నీ కృపన్ రచిస్తి ‘’అన్నాడు స్వామితో .

8-ధనంబు కౌను రాజుగా ,గుణంబు కౌనెరాజుగా –గుణ౦బె రాజు పూర్తి యైన గొప్ప చక్రవర్తియే –వనంబు కౌనె రాజుగా ,దినంబు కౌను నెంచగా ,ఇనున్డురాజుగా నిజమ్ము —‘’

21-జలంబు నగ్ని గాలిపృథ్వి జన్మ మూల దుంప ‘’అంటాడు

30-నరంబు నాళ్ళు కీళ్ళు తోళ్ళు నక్కకైన జొక్కదే-పరంబు పో దినంబునందుపనికిరాదు గవ్వకున్ ‘’అని తత్వ బోధచేశాడు ‘’అహం అహం అంటూ ఉంటె సతీసుతులు త్రిగుణాలు  హంమెల్లగా నశిస్తుంది ‘.

‘’మొదటి’’ అనటానికి ‘’మొదాటి ‘’అ౦టాడుకవి సరదాగా .శరీరమే వనం చిత్తమే మృగం గురు కృప తుపాకి ‘’గొప్ప నిష్ఠ గుండు గా .-సరీగ జేస్తే బరు ఫైరు జచ్చు మాయ జంతువున్ ‘’అని ఆధునికంగా శంకరాచార్య శివానంద లహరి శ్లోకానికి భావం గా చెప్పాడు.’’మకార్వుకార మధ్యనున్న మాయదౌ ప్రపంచకం ‘’,’’ప్రకాశమైన పూర్ణ బ్రహ్మమందు నశ్యమే –వికారమౌ ప్రపంచకా విశేషం ‘’,’’మనస్సు కార్యకారణ౦బు మాతృ పితృ జాయలున్ ‘’’’ఫిరంగి గుండు నాటకుండ ఫెళ్ళు ఫెళ్ళు గూలునా –తరంతరాలనుంఛి యున్న దండి దిన కోటయున్’’లాగా అనాదిగా ఉన్నమాయ కూడా గట్టి దెబ్బకే కూలుతుంది .ఫిరంగి, తుపాకీ పేల్చేసత్తా ఉన్నవాడేమో కవి అనిపిస్తుంది.

98 -వ పద్యం లో తన ఇంటి పేరు తగరంపూడి  అనీ కులం విశ్వ బ్రాహ్మణమనీ ,సనాతన గోత్రమనీ ,తనపేరు అప్పస్వామి అనీ చెప్పుకొన్నాడు కవి .

102వ చివరి పద్యం లో ‘’సమర్పణంబు నీకు నావి సర్వ రాగ ద్వేషముల్ –సమర్పణంబు నీకు నావి సర్వ పాప పుణ్యముల్ –సమర్పణంబునీకు పంచచామర సుమాళితో-సమర్పణంబు గైకొ దేవ’’శ్రీ కొమర్పురీశ్వరా ‘’

తర్వాత మాలిని సుగంధి వృత్త పద్యాలు చెప్పాడు. ఆతర్వాత ఆత్మ రామాయణ ‘’దండ’’కం కూడా అదే బిగువుతో కూర్చాడు  .పిమ్మట కొన్ని సీసాలు తేటగీతులు పేర్చి  ,కాఫీ నాదనామక్రియ ,ముఖారి వగైరా రాగాలలో ఆధ్యాత్మ బంధుర కీర్తనలు రాసి వాసి తెచ్చి సాహిత్యం తోపాటు సంగీతం లోనూ సహజకవినే అని తన సత్తా నిరుపించాడు కవి అప్ప స్వామి .ఈ కవి గురించీ ఎవరూ ఎక్కడా పొక్కకపోవటం కూడా ఆశ్చర్యజనకమే .

  అయితే కవి స్తుతించిన ఈశ్వరుడు ఏ పట్టణం లోని దేవుడో ఎక్కడా పేర్కొన లేదు .ఆదైవం విశేషాలూ లేవు .మామూలు ఈశ్వర స్తుతి మాత్రమే కనిపిస్తుంది .నా ఊహ ప్రకారంప్రకారంకుమారారామ భీమేశ్వరాస్వామిలేక ద్రాక్షారామ భీమేశ్వర స్వామి అయి ఉంటాడు .

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -15-10-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

జీడికంటిశ్రీరామచంద్ర దేవాలయం

జీడికంటి శ్రీరామచంద్ర దేవాలయం

నల్గొండ జిల్లా జీడికంటి లేక జీడి కల్ క్షేత్రం లో శ్రీ సీతారామ చంద్రస్వామి దేవాలయం చాలా ప్రసిద్ధమైనది .ఈ స్వామిపై ఆ జిల్లాలోని రామన్న పేట వాస్తవ్యులు ,వైష్ణవ భక్తులు కేశవ పట్నం నరసయ్య గారు ‘’జీడికంటి రామ శతకం ‘’రాసి ఆస్వామికే అంకిత మిచ్చారు .కవిగారు ‘’వానకొండ శతకం ‘’నిర్యోష్ఠ్య౦  గా రాశారు .జీడికొండ శతకం లో అంత్యప్రాస ‘’క’’నుంచి ప్రారంభించి ‘’ళ’’వరకు రాశారు .అందుచే దేశ ,గ్రామ్యపదాలకూ స్థానం కల్పించారు .శతకం ఆద్యంతం భక్తి రసప్రవాహంగా సాగింది .సర్వులకు అర్ధమయ్యే సరళ శైలి లో రాశారు .శతకాన్ని కొలనుపాక లోని ‘’బహిరామియా గ్రంథాలయం’’వారు 9-2-34 న ముద్రించి అందించారు .మచ్చుకి రెండు పద్యాలు-

1-శ్రీరామ రామ నిన్ సేవింతు తొల్లింటి నేటి నేరముల మన్నింపు మంటి –ఏకాకివై బ్రోతె లోకాల నన్నింటి నతి జేతుగావవేనన్ను నొంటి-అనిలో ప్రతాప మేమని జెప్పనీ వింటి తరి బాణముల విచిత్రంబు

పొంటి మును మున్నెనిను గొల్చి ఘనుడయ్యె ముక్కంటి ధర మి౦ -చె సిరి నీ పదములంటి –ఘన దయాంబుధి వంచు నిక్కముగ వింటి-గావబూనెద వేని మేల్గంటి మంట-సిరులకిరవైన జుంటిశ్రీ జీడి కంటిధామ సుగుణాభిరామ శ్రీరామ రామ ‘’

100-‘’తెలియ గోరుదు రెంతోదేరి నిన్ దేవళ్ళునినుతి౦చ రాదు నిన్వేయి నోళ్ళు –గల శేషునకునైన కాదు వింత పోకిళ్ళు ,పరమార్ధ బోధినీ పావుకోళ్లు

కడుబాడి నిను నారదుడు వైచు పి౦పిళ్ళు దనుజులపై మహోత్తరపు తళ్లు-బరిగించి సురలకు గరుణించికడు త్రుళ్ళుబొడమ బోజేసితెపూటకూళ్ళు-యెంత భావమైన నిను దల్చినంత వ్రేళ్ళుబర్వగా జేసితివి నీళ్ళపైన రాళ్ళు –సిరులకిరువైన జుంటి శ్రీ జీడిగంటి ధామ సుగుణాభిరామ శ్రీరామ రామ ‘’

మంగళం మంగళం మంగళం

కవి దారాశుద్ధిగా పద్యాలను రామబాణం లాగా శరవేగంగా పరిగెత్తించారు .అందమైన పదబంధాలు ,శ్రీరామ వీర విక్రమపరాక్రమ శౌర్య ధైర్యాలు కళ్ళకు కట్టించారు .భక్తి గోదారినే ప్రవహిప జేశారు .ఇంతటి కవి ప్రతిభ లోకం గుర్తించినట్లు ,ఎక్కడా ఎవరూ ఉదాహరించిన దాఖలాలు లేవు . ఈ భక్త కవి వరేణ్యులు శ్రీ కేశవ పట్నం నరసయ్య గారినీ , వారి శతకాన్నీ ,జీడి కంటి శ్రీరామాలయాన్నిపరిచయం చేయటం నా అదృష్టం గా భావిస్తున్నాను .

              ఆలయ చరిత్ర

శ్రీ రామచంద్ర స్వామి దేవస్థానం జనగాం సమీపంలోని జీడికల్ గ్రామంలో ఉన్న ఒక ప్రసిద్ధ శ్రీరామ ఆలయం.ఒక స్థానిక కథనం ప్రకారం, ఆలయ ఉనికి ‘తత్రేతాయుగ౦ ’ నాటిది, ఇక్కడే రాముడు ప్రవాసంలో ఉన్నప్పుడు, రాక్షస, మారిచులను  బాణంతో కాల్చి చంపాడని చెబుతారు, అతడు బంగారు జింకల వేషంలో వస్తాడు. మారీచుడు  రాముడి క్షమాపణ కోరినప్పుడు  ఆయనను ఆరాధిస్తానని వాగ్దానం చేస్తే ,  కొండపై  ఈ ఆలయం లో ‘స్వయంభు’గా ఉద్భవించటానికి అంగీకరిస్తాడు. శ్రీ రాముడి పాదుక లేదా బంగారు జింక మరణించిన ప్రదేశం, స్థానికంగా ప్రసిద్ధి ” లేడి బండ “,అంటారు  ప్రతి భవనం, ఇది ఒక రాయి లేదా మట్టితో లేదా సహజ రాతి శిల లోపల ఉన్న చెరువుతో అయినా,  శ్రీ రాముడు బంగారు జింకల కోసం తన వెంట పడేటప్పుడు ఈ స్థలాన్ని సందర్శించినట్లు ఆధారాలు విసిరాడు. స్థానిక పురాణాలప్రకారం   రాముడు  వనవాసులో, భరద్వాజమహర్షి   సలహా మేరకు మలయావతి నదికి ఎదురుగా ఉన్న అందమైన కొండ చిత్రకూట్ వద్ద ఉన్న ప్రశాంత ప్రకృతి వైభవం చూసి బస చేశాడు.  ఇది భారతదేశంలోని అనేక ఋషులకు నిలయంగా మారింది. ఒక రోజున,  రామపత్ని సీతాదేవి  ఒక అందమైన బంగారు జింకను తీసుకువెళ్ళి, తన గుడిసె ఇంటి తోటను అలంకరించి, తన కు ఆనందం కలిగించమని కోరింది . జింకను చనిపోయినట్లుగా లేదా సజీవంగా తీసుకురావడానికి తనను తాను సాహసించి, సీత దేవిని విడిచిపెట్టి, తను  లేకపోవడంతో ఆమెను రక్షించడానికి తన సోదరుడు శ్రీ లక్ష్మణుడిని అప్పగించాడు. ప్రభువు  బంగారు జింకను వెంబడించి స్వామి దాన్ని పట్టుకొని   సజీవంగా తీసుకురావడానికి విసిగిపోయి, దానిపై మోకాలు బండపై ఆనించి లేడిని బాణం తో సంహరించాడు .బాణం వేసి, బాధించి, రాతిపై పడేలా చేస్తాడు . కింద పడిపోయిన తరువాత జింక తనను తాను మానవ రూపంగా మారి , స్వామిపై కోపం తో  తన  పేరు చిత్రరాధ అని అర్ధం మరియు కౌషిక మహా రుషి  చేత శపించబడ్డాననీ , శ్రీ రామ బాణం ద్వారా విముక్తి పొందుతున్నాననీ స్వామిని ప్రశంసించాడు. శ్రీ రాముడు ఆనందించాడు .దీని ద్వారా చిత్రరాధకు ఏమైనా కోరిక ఉందా అని అడుగుతాడు రాముడు . చిత్రరాధ ప్రభువు పవిత్ర పాదాలను తాకిన నీటిని అడుగుతాడు. అక్కడ ఉన్న శ్రీరాముడు తన బొటనవేలితో దగ్గరలో ఉన్న ఒక చిన్న రాతిని నొక్కి, దాని గుండా ప్రవహించమని  గంగను ప్రార్థిస్తాడు, అది అలాగే ప్రవహించగా  “ఉత్తర గంగ” గా పిలిచాడు ..ఈ నీటితో రాముడు సంధ్యావందనం చేశాడు . ఈ రోజు కూడా, రంధ్రం నుండి దుమ్మును  తీసేస్తే , వేళ్లు తడిసిపోవడాన్ని అనుభవించవచ్చు.ఒకప్పుడు ఇక్కడే వాల్మీకి మహర్షి ఆశ్రమం ఉండేది .ఇప్పటికీ వాల్మీకి గుహ కనిపిస్తుంది .కొండకు నైరుతిలో శ్రీ ఆంజనేయస్వామి విగ్రహం ఉన్నది  శ్రీ రాముడి విగ్రహాన్ని తన ముందు ఉంచి గొప్ప తపస్సులో ఉన్న సమీప వీర ఋషిని కూడా రాముడు  ఆశీర్వదిస్తాడు .ఆయనకోరికమేరకు భూమిపై తన జీవితాంతం  “పాద సేవ”  చేయటానికి అవకాశం అడుగుతాడు. శ్రీరాముడు  సంతోషంగా అంగీకరించి , తాను చేసిన , విగ్రహంగా మారి  అర్చి౦చినవారికి   సకల కోరికలు తీరుస్తానని అభయమిస్తాడ .  ఈ ప్రదేశంలో తన పాదాల గుర్తులు  దుస్తులు  వదిలివేసి, ఈ ప్రదేశం ‘’వీరాచలం ‘’గా ప్రసిద్ది చెందుతుందని చెబుతాడు . ఇప్పటికీ   ఈ ప్రదేశంలో అడుగు పెడితే, ఒక రాతితో ఉన్న చెరువు మరియు శ్రీ రామ పాదుకా ఆరాధనలో ఉన్నట్లు గమనించవచ్చు. ఆలయ ప్రాంగణంలో నీటిని ఉపయోగిస్తున్నప్పటికీ, చరిత్రలో ఇప్పటివరకు నీటి మట్టం తగ్గలేదు , పెరగలేదు. వేసవిలో కూడా ఎండిపోని చెరువుపై ఈ ఆలయం నిర్మించబడింది..మొదట్లో పంచలోహ విగ్రహాలు ఉండేవి .ఎన్నో శతాబ్దాలుగా ఇక్కడ మానవ , ఆవాసాలున్నట్లు రాక్షస గుడ్లు,టైటా పెంకులు , బూడిద మట్టి  గుర్తులు కనిపిస్తాయి .రామ టెంకిలు ఆనవాళ్ళు కూడా కనిపించేవట .

  ఇంకో ఆసక్తి కరమైన విషయం ఒకటిఉంది .పూర్వం వీరుడు ,భద్రుడు అనే సోదరులు ఉండేవారు భద్రుడు గోదావరి తీరాన వీరుడు ,గోదారి ఆవలి ఒడ్డున శ్రీ రామునికోసం ఘోర తపస్సు చేశారు .ఇద్దరికీ శ్రీ మహావిష్ణువు ఏకకాలం లో దర్శనమిచ్చాడు .భద్రుడికోరికపై భద్రాచలం లో వెలసి దక్షిణ అయోధ్యగా ,,వీరుడికోరికపై వీరాచలం లో శ్రీ రామచంద్రమూర్తిగా కొలువై ఉన్నాడు .కాలక్రమంలో వీరాచలం జీడికల్ గా మార్పు చెందింది .భద్రాచలం భక్తరామదాసు వలన ప్రసిద్ధ క్షేత్రం అయితే ,వీరాచల౦  మాత్రం నీరసాచలం గా  ఎదుగూ బొదుగూ లేకుండా పోయింది .

  మరో కథనం ప్రకారం పూర్వం భీమ సేనుడు చంద్ర సేనుడు అనే రాజులు యుద్ధం చేస్తే చంద్ర సేనుడు ఓడిపోయి చనిపోతాడు .అతడి కవలపిల్లలు బాలచంద్రుడు ,బాల చంద్రిక వేర్వేరు చోట్ల పెరిగి ,స్వయంవరం లో ఈ ఇద్దరూ అన్నా చెల్లీ అని తెలియక పెళ్లి చేసుకాగా శరీరాలు వెంటనే నల్లబడి పోయాయి .ఆకాశవాణి వారిని 101పుణ్య క్షేత్రాలు సందర్శించమని చెబితే ,జీడికల్ చేరి కొండపై ఉన్న జీడి గుండం ,పాలగుండం లలో స్నానం చేస్తే ,మళ్ళీ మామూలు రంగు వచ్చి ,పాపవిమోచనం జరిగిందట .ఈ గుండా ల స్నానం పాప విమోచనంగా భక్తుల విశ్వాసం .

   ఈ జీడికంటి రామాలయం భద్రాచల రామాలయం కంటే పురాతనమైనది .భద్రాచల దేవాలయ పూజారులుకూడా ఈ విషయాన్ని ధృవీకరించారు.వేల యకరాలు  ఈనాము భూములున్నా పట్టించుకొనే నాథుడే లేడు.పూర్వం యాదాద్రి నరసింహ స్వామికి ఇక్కడినుంచే ధూప దీప నైవేద్యాలు  వెళ్ళేవట .యాదాద్రి నారసి౦హుని కి భారీగా ధనం అప్పుగా ఈ వీర రాముడు ఇచ్చాడట కూడా .ఈ స్వామికి గుంటూరుజిల్లా వట్టిచెరువు మండలం కొర్లేపాడులో12ఎకరాలు ,జీడికల్లు లో 50ఎకరాలు ,గుమ్మడి వెల్లి గ్రామంలో 35ఎకరాలు ఉభయ ఆంధ్రరాష్ట్రాలలో ఇంకా చాలా చోట్ల ఈనాం భూములున్నాయి .శ్రీరామనవమికి సీతారామకల్యాణం కాక కార్తీకమాసం లో నెలరోజుల జాతర సమయం లోనూ   మరోసారి కూడా అంటే ఏడాదికి రెండుసార్లు కల్యాణం  జరుపుతున్నారు .మహారాష్ట్ర కర్నాటక లనుంచి కూడాశేష సంఖ్యలో భక్తులు వచ్చి దర్శించి తరిస్తారు  అందుకే రెండవ భద్రాద్రి అంటారు .భద్రాచల రాముడు ప్రేమకు ప్రతీక అయితే వీరాచల రాముడు వీరత్వానికి ప్రతీక సరైన రోడ్డు సౌకర్యం లేకపోవటమూ ఇబ్బందిగానే ఉంది .భద్రాచలం తో పాటు జీడికంటి రామాలయాన్ని కూడా అభి వృద్ధి చేయాలని భక్తులు ప్రజలు తెలంగాణా ప్రభుత్వాన్ని కోరుతున్నారు .మళ్ళీ పునర్వైభవం పొందాలని కోరుకొందాం .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-10-20-

Posted in దేవాలయం | Tagged | Leave a comment

నడిగడ్డ పుర శ్రీఆంజనేయ దేవాలయం

నడిగడ్డ పుర శ్రీఆంజనేయ దేవాలయం

గుంటూరు జిల్లా వినుకొండ తాలూకా నడిగడ్డ గ్రామం లో వేంచేచసి ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయం భక్తులకోరికలను తక్షణమే తీర్చే మహిమకలది .ఈ స్వామిని దర్శించి ,పరవశించి,ధ్యానమగ్నమైన  అన్న సముద్రం కవి శ్రీ శిష్టు వేంకట సుబ్బయ్య శాస్త్రి గారికి అప్పటికప్పుడు ‘’నడిగడ్డ పురా౦జ నేయ నతజన గేయా ‘’అనేమకుటం గల పద్య  పంక్తి మనసులో స్పురించి ఆయనకే ఆశ్చర్యం కలిగింఛి, నిండారు భక్తి ప్రపత్తులతో బయటికే చెప్పేశారు  .అక్కడి భక్తబృందం పరమానందం  పొంది కవిగారిని ఆ దివ్య మకుటంతో స్వామిపై శతకం రాయమని ప్రార్ధించారు .ఏక ప్రాస తో రాయటం కష్టమే అనిపించినా భారమంతా ప్రసన్నాంజనేయుని పై వేసి,తనజన్మ కృతార్ధమైనదని భావించి  క౦ద౦  లోఅందమైన  శతకం రాయటానికి సిద్ధపడి ‘’సరే ‘’అన్నారు శాస్త్రిగారు  .

 కందపద్యాలలో ‘’నడిగడ్డ పురా౦జ నేయ శతకం ‘’ భక్తి తాత్పర్యాలతో రచించి ప్రముఖ కవి పండితులు బ్రహ్మశ్రీ గాడేపల్లి వీర రాఘవ శాస్త్రి గారికీ ,శ్రీ ఉప్పల పిచ్చయ్య శాస్త్రి గారికీ ,మద్దులపల్లి గురు బ్రహ్మ శర్మగారికి చూపించి ,వారి మెప్పును ఆశీర్వాదపూర్వక పద్యాలను పొందారు .శతకముద్రణ  కు కావలసిన ద్రవ్యాన్ని కవిగారి అనుజుడు శ్రీ శిష్టుపురుషోత్తమయ్య అందించగా ఆశీర్వాదకపద్యాలు చెప్పారు .నరసరావు పేట శ్రీ కోటీశ్వర ముద్రాలయం లో 1937లో ప్రచురించారు .వెల కేవలం 2అణాలు మాత్రమే . ఈ శతకం లో కవి గారి మిత్రుడు శ్రీ గురుబ్రహ్మ శర్మ రాసిన ఆంజనేయ దండకం ,శ్రీ సత్యనారాయణ స్తోత్ర అష్టకం,శ్రీ భారతుల పేరి శాస్త్రి అనే శ్రీ రంగకవి రచించిన శ్రీ త్రిపుర సుందరీ స్తోత్ర చూర్ణిక కవిని ,శతకాన్నీ ప్రశంసించిన విద్వత్కవుల ప్రశంసలు కూడా చేర్ఛి సుసంపన్నం చేశారు .

గాడేపల్లి వారి ప్రశంస –‘’నడిగడ్డ యా౦జనేయుని-కడు చిత్ర చరిత్ర నీవు కందశతకమే – ర్పడ జేసి తుడిచి తఘముల-గడచితి సంసార వార్ధి కవికులతిలకా ‘’

అంటూ ‘’ఏక ప్రాసతో అనేక చారిత్రాత్మక ప్రహేలలను రాయటం  ఆయనకే తగినదని మెచ్చారు

. ’లాలిత కందపద్య సమలంకృత కావ్య వచోను ష౦గభా –వావళి ననేక రీతులుగా హర్ష మనస్కుడవై రచించి దే

వాళి శిరః కిరీట మణిహారివిభాలసదంఘ్రి మారుతిన్ –లాలన చేసి వేడితివి లాక్షణికాగ్రణు లెల్లమెచ్చగన్’’

ఉప్పలవారు-‘’అనుపమ శబ్ద గు౦ఫన రసార్ద్ర పరి స్ఫురణంబుగల్గి-‘’న శిష్టు వంశ భానుడైనకవి రాసిన శతకం ‘’కేవలమోదము గూర్చె నా మనంబునకు ‘’అని భుజం తట్టారు .

గురుబ్రహ్మ శర్మ –‘’అబ్బా !’’డ’’ప్రాసంబును –బ్రబ్బి శతకమల్లు టెంతపని !యెట్టిదినీ –నిబ్బరము !శిష్టు వేంకట-సుబ్బయ కవి చంద్ర చిరయశో గణ సాంద్రా ‘’

 అని కవి బ్రాహ్మలు ముగ్గురు కమ్మని ఆశీర్వాద పనసలు చదివి ప్రోత్సహించారు .ఇందులోనే కవిగారి ప్రతిభ ఎంతటిదో మనకు అవగత మౌతుంది .

 కవిగారి శతక మకరందం లో మొదటి కంద పద్యం –

‘’అడుగులకు మడుగు లొడ్డుచు –నడుముం గట్టికొని పలు ప్రణామంబులనే-నిడికొలిచెద రక్షింపుము –నడిగడ్డ పురా౦జనేయ నతజన గేయా ‘’

తనకు గురువులు లఘువులు ప్రాసలు గణాలు తెలీవనీ వినయంగా చెప్పుకొని ,ఇన్నేళ్ళు బ్రహ్మచర్యం ఎలాగడిపావయ్యా  అని ఆశ్చర్యపోయాడు కవి .’’వడి యోజన శతమొక్కు –మ్మడిదుమికి ,దశాస్యు వీటి మంగళ విభవం ‘’అడుగంట చేశావని స్వామిని పొగిడాడు ..’’ఒడబడ వన్యాయమునకు –దడ బెడ వెట్టెట్టిక్లిష్ట తరయోజనలన్-సుడివడవెంతటి శ్రమకు ‘’అంటాడు . 20వ పద్యం –‘’పడి భక్తి నీపదంబులు –విడువక పూజించుభక్త వితతికిసౌఖ్యం  – బెడలేకయొసగిప్రోతువు – నడిగడ్డ పురా౦జనేయ నతజన గేయా’’

‘’గడియన్ మూడు జగంబులు –వాడకి౦పగజాలినట్టి వాడవు ‘’

‘’గుడిగుడిని దోకని౦చుక – ముడుచుక నిలుచున్ననీకు మొక్క విపత్తుల్ -విడుదల భరింతువు ‘’ అని తమాషాగాచెప్పాడు.

–‘’ఉడు గణముడుల్లజేయగ-నుడుపతిఖరకారుల తాళమొనరింప ‘’జగాలను ఉడికింప చేస్తావు . ‘’జడియక లంక౦ గాల్చెడు-నెడరావణు ననుజు గృహము ‘’తగలెయ్యకుండా కృప చూపావు .’’జడివానలలోన బడుపెను –పిడుగు క్రియన్ బంక్తికంఠుపీఠంపగుల గొట్టావు ‘’

‘’కడగి నవ వ్యాకృతుల౦ –గడి తీరిన పండితుడవు’’,’’జడు మైరావణుదునిమిన-యెడ ‘’ఇంతటి దీమంతుడవు నువ్వే అని కొనియాడాడు

‘’పుడమి శశి రవులు జుక్కలు –జెడకుండునొ,యెంతవరకు క్షితి నంతటిదా-కుడుగక నిల్పుము శతకము – నడిగడ్డ పురా౦జనేయ నతజన గేయా’’అని 99వ పద్యం చెప్పి ,100వ పద్యం లో  తన ఇంటిపేరు శిష్టు అనీ, హరితస గోత్రం అనీ ,తండ్రి శేషయ అనీ తనపేరు వేంకట సుబ్బయ్య శాస్త్రి అని శతకాన్నిశాలివాహన శకం 1850లో అంటే 1937 సెప్టెంబర్ 5న పూర్తి చేశాననీ చెప్పుకొన్నాడు కవి .ఇంతకుమించి కవిగురించికాని శ్రీ నడిగడ్డ ఆ౦జ నేయదేవాలయం గురించికాని విశేషాలేమీ లేవు .శతకం లో ఆంజనేయ జననంనుంచి ఆయన విశేషాలనే కవి వర్ణించాడు క్షేత్రమాహాత్మ్యం గురించి చెప్పనే లేదు .కానీ ఒక మహా గొప్ప’’కందకవి’’ ని  ,పరిచయం చేశానన్న సంతృప్తి, క్షేత్రం పేరుమాత్రమే చెప్పగలిగానన్న అసంతృప్తీ  మాత్రం నాకు ఉండిపోయింది  .

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-10-20-ఉయ్యూరు

Click to access 2015.330868.13225-Shrii.pdf

Posted in దేవాలయం | Tagged | Leave a comment

శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో -శ్రీ శార్వరి నవరాత్రి ప్రత్యేక కార్యక్రమాలు

 

శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో -శ్రీ శార్వరి నవరాత్రి ప్రత్యేక కార్యక్రమాలు

ఉయ్యూరు శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం లో నిజ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి 17-10-20 శనివారం నుండి 25-10-20శుద్ధ దశమి ఆదివారం వరకు నవరాత్రి దసరా ఉత్సవాల సందర్భం గా  ప్రతిరోజూ సాయంత్రం 6-30నుండి నుండి స్వామి వార్లకు ప్రత్యేకపూజ ,,శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారికి ,నిత్యఅలంకరణ , విశేష పూజ 7-30కు నైవేద్యం, హారతి,మంత్రపుష్పం ,తీర్ధ ప్రసాద వినియోగం  నిర్వహింపబడును .విజయ దశమినాడు శమీపూజ జరుగును  భక్తులు కోవిడ్  నిబంధనలు పాటిస్తూ పాల్గొని స్వామివార్ల అనుగ్రహానికి పాత్రులు కావలసినదిగా మనవి . 

                                                         గబ్బిట  దుర్గాప్రసాద్ -ఆలయ ధర్మకర్త –14-10-20
                                                                             మరియు భక్త బృందం
Posted in దేవాలయం | Leave a comment

మిసిమి ‘’విజ్ఞాన సర్వస్వ కలిమి ‘’

 

మిసిమి ‘’విజ్ఞాన సర్వస్వ కలిమి ‘’

అక్టోబర్ మిసిమి మహాత్ముని స్మృతి నీరాజనంగా ముఖ చిత్రాలతో ,ఆయనకు వచ్చిన ఆధ్యాత్మిక సందేహాలూ , శతావధాని రాజచంద్ర వివరణాత్మక సమాధానాలతో మోక్ష గామిని చేయటం మనకు దాదాపుతెలియనివే ,తెలిసిన  బాపూ పురుడుపోసిన కావూరు వినయాశ్రమ విశేషాలు కమ్మగా ఉంటే ,నాట్య సంస్కృతికి కూచి పూడి ఆభరణమైన విషయాలను  అందులో నిష్ణాతులైన శ్రీ పప్పు గారు వివరించిన తీరు పప్పు ధప్పళమే అయింది .యక్షగాన ప్రక్రియ వివరిస్తూ దాని జానపద రూపం’’ కొరవంజి’’ అని పరిశోధన చేసి చెప్పింది పంచాగ్నుల ఆది నారాయణ శాస్త్రి అని చాటుతూ అడపా వారు ‘’భద్రాయువు ‘’చరిత్రను క్లుప్తంగా గొప్పగా రాశారు .’’నేను భారతీయుడను ‘’అని చెప్పుకున్న కె..కె. మహమ్మద్ నిజాయితీ ప్రభుత్వోద్యోగి అనీ ,పురాతత్వ శాస్త్ర వేత్త అనీ ,చాలా పురాతన దేవాలయ ,మసీదు,చర్చి లను వెలుగులో కి తెచ్చిన ఘనుడని నటుడు భరణి భరోసాగా చెప్పాడు .ఒరిస్సా మాజీ  ముఖ్యమంత్రి బిజూ కుమార్తె, నేటి ముఖ్య మంత్రి నవీన్ సోదరి పద్మశ్రీ గీతా మెహతా పై రావెళ్ళవ్యాసం లో ఫెమినిజం ఇంకా పాశ్చాత్య దేశాలలో  పాకకముందే గీత ఒక కోఆపరేటివ్ సొసైటీ SEWA పేరుతొ స్థాపించి సభ్యులు వారికి వారే లోన్లు ఇచ్చుకొనే పధ్ధతి కి నాంది పలకటం ఆశ్చర్యం ,మార్క్ ట్వేన్ మిసిసిపి నది ఎలా పైకి పైకి తీసుకు వెళ్ళాడో,మెహతాకూడా నర్మదా నదిని ఆస్థాయికితీసుకు  వెళ్ళిందన్నదన్న సత్యం తెలిసి గర్విస్తాం  .ఆమె రాజ్ నవల కర్మాకోలా ఆలోచనలు రేకెత్తి౦చేవే  .బర్మాకు వెళ్ళిన మొదటి వారు తెలుగువారేనని ,వారిని ‘’తలైంగులు’’ అని అక్కడ అంటారని  వారిలో సోమరాజు రామారావు ఆదికవి అన్న  బద్రి వ్యాసం బంగారం.నల్లవారి నిరసన సంగీతమైన ఉడ్ స్టాక్  ఉత్సవం ,సబాల్టర్స్ చైతన్యం పై కట్టు చాలాగాట్టిగా నిర్మొహమాటం గా రాశాడు  .మహాచిత్రకారుడు పికాసో ‘’మృగ’’తృష్ణ ‘’కు బలైన ప్రేయసి ,  సమానస్థాయి చిత్రకారిణి ‘’టేడ్ మాడరన్ ‘’జీవిత దయనీయ గాథను కళ్ళకు కట్టించిన తంగెడప్రసాద్ అభినందనీయుడు .విలక్షణ కంఠస్వరమున్న నాటకనటుడు సూరిబాబు ,తెలుగు రాముడు, కాకతీయ సాహిత్యం ,కుప్పా వారి తత్వ కవితా కల్యాణం వంటి విలువైన వైవిధ్యభరిత రిసెర్చ్ లాంటి వ్యాసాలతో’’అక్టోబర్ మిసిమి విజ్ఞాన సర్వస్వ కలిమి’’లా భాసించింది . సుమారు పదేళ్ళక్రితం నేను శూద్రకమహాకవి భాణ౦ పై రాసిన ‘’ ‘పద్మ ప్రాభృతకము’’అంటే తామరపువ్వుకానుక వ్యాసం మిసిమికి ఎలా చేరిందోతెలియదు కాని చోటు చేసుకొని నాకూ ఆకలిమిలో భాగస్వామ్యం కల్పించింది . .ఒకప్పుడు గ్రీకు ఇతర పాశ్చాత్య వాసనలు ,ఆ తర్వాత బౌద్ధ సిద్ధాంత రాద్ధాంతాలతో ఉండే మిసిమి ఇప్పుడు సంప్రదాయ బద్ధంగా భారతీయతతో మిసమిస లాడటం సంతోషంగా ఉంది . సంపాదకులకు ధన్యవాదాలు .

గబ్బిట దుర్గాప్రసాద్ -13-10-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

మహా త్యాగి మద్దూరి అన్నపూర్ణయ్య-6

మహా త్యాగి మద్దూరి  అన్నపూర్ణయ్య-6

‘’చిచ్చులపిడుగు ‘’ ఏకాంకిక రాసిన  రామచంద్రుని వెంకటప్ప స్వగ్రామం ఒంగోలుదగ్గర టంగుటూరు .అచ్యుతుని వెంకటరావు అనే మారు పేరుతొ కాంగ్రెస్ ప్రచారం చేసి ఆరునెలలు జైలు కెళ్ళాడు  .రాజమండ్రి జైలులో బులుసు సంబమూర్తిగారితో పరిచయమేర్పడి కుడిభుజంగా ఉంటూ ,విడుదల తర్వాత ఆయనతో కాకినాడ చేరాడు .సీతానగరం ఆశ్రమం ఏర్పడినప్పుడు మూర్తిగారు అతనిని డా సుబ్రహ్మణ్యం గారికి అప్పగించారు .వెంకటప్ప మద్రాస్ లో జరిగిన ‘’నీల్ ‘’సత్యాగ్రహం లో ముఖ్యపాత్ర పోషించాడు .ఆంగ్ల సంస్కృతాలు క్షుణ్ణంగా అభ్యసించినవాడు ,గొప్ప పరిశోధకుడుకూడా .’’చెన్నపట్నం తెలుగు పట్నం ‘’అనే ఆయన పుస్తకం బాగా ప్రచారమైంది .ఆంధ్రులలో స్వాతంత్ర కాంక్ష పెరటానికే చిచ్చుల పిడుగు రాశానని చెప్పాడు .

నాటిక మొదటి రంగం లో మంగల్ పాండే స్వగతంగా ‘’ఓ ఆంగ్లపిశాచామా ఇంకా నీ ఆకలి తీరలేదా ఎప్పటికి తీరుతుందే రాక్షసీ ‘’అన్న డైలాగ్ ఉద్రేకం కలిగిస్తుంది .రెండవ రంగం లో పాండే -హ్యూసన్ ,బౌ అనే ఆంగ్ల అధికారులను కాల్చగా గురి తప్పుతుంది .చివరికి బౌ ను అనేక కత్తిపోట్లతో చంపేస్తాడు .ఈలోగాహ్యూసన్ లేవబోతుంటే ఒక సిపాయి తుపాకిడమతో కొట్టి చంపేస్తాడు .కాసేపటికి వీలర్ అనే సైనికాదికారివచ్చి మంగలపా౦డ్యాను బంధించమని ఆర్డర్ ఇస్తాడు .పాండ్యా బ్రాహ్మణుడు కనుక అతనిపై ఎవరూ చెయ్యి వెయ్యరని జిమేదారు చెబుతాడు .ఇంతలో హీర్సే అనే మరో సైనికాధికారి తన ఇద్దరు  కొడుకులతో అక్కడికి వచ్చి పాండే ను చంపటానికి సిద్ధపడితే ,పాండ్యా తనను తానే కాల్చుకొనగా, గాయపడిన అతడిని జమేదారు ఆస్పత్రికి చేరుస్తాడు .పా౦డ్యా ఉరితీసే ఘట్టం తో మూడవ రంగం ముగుస్తుంది .ఉరి తీసేముందు చివరి కోరిక ఏమిటి అని అడిగితే ‘’మీ జాతి వాళ్ళందరికీ ప్రాణాలపై ఆశ ఉంటే ,మా దేశం విదిచిపొండి’’అంటూ ఉరికంబం ఎక్కుతాడు మంగళ పాండ్యా .రచయిత నాటకం చివర అహింసావాదం ప్రవేశపెడితే అన్నపూర్ణయ్యగారు దాన్ని తీసేసి పత్రికలో వేశారు .నాటికను ప్రభుత్వం నిషేధించటం దువ్వూరిగారికి రెండేళ్ళు శిక్షపడటం మనకు తెలిసిన విషయమే .1929లో గుంటూరులోయూత్ లీగ్ ఈ నాటికను మునిసిపల్ చైర్మన్ బారిస్టర్ నడింపల్లి నరసింహారావు ,అండ దండలతో పోలీసుల కళ్ళు కప్పిఆమంచర్ల గోపాలరావు ,కోనవల్లి సుబ్రహ్మణ్యం ,మాడభూషి వెంకటా చారి ప్రదర్శించారు .ప్రేక్షకులలో కొండా వెంకటప్పగారు కూడా ఉన్నా ,సాక్ష్యం దొరక్క యెవరినీ ఆరెస్ట్ చేయలేదు  .నాటిక రచయిత పేరు చెప్పమని దువ్వూరి వారిని ,లింగారజుగారినీ యెంత ఒత్తిడి పెట్టినా పత్రిక నైతిక సూత్రాలనను సరించి చెప్పటానికి నిరాకరించారు .

1950లో ఈ నాటికపై నిషేధం తొలగింది .రచయిత స్వయంగా దాన్ని ప్రచురించి అన్నపూర్ణయ్య గారి దివంగత వీర ధర్మపత్నిమద్దూరి వెంకట రమణమ్మగారికి అంకితమిచ్చాడు  .తానే రచయితను అని కోర్టులో చెప్పటానికి సిద్ధపడినా, పూర్ణయ్య గారు వద్దు అని వారించటమేకాక వేలూరు జైలుకు వెడుతూ ఒక ఉత్తరం లో ‘’నీ రచన మూలంగానేను బాధ పడ్డానని  ఎప్పుడూ అనుకోలేదు .నేను దాన్ని చూసి చదివి మెచ్చి ప్రచురించాను  .పూర్తి బాధ్యత నాదే  .నువ్వు బాధపడకు .నేనేదో మర్యాద కోసం రాయటం లేదు మనఃపూర్వకం గా ఈలేఖ రాస్తున్నాను ‘’అని రాసిన మహోత్కృష్ట హృదయం .ఉత్తమ సంపాదకత్వ లక్షణం అన్నపూర్ణయ్య గారిది.

తనపై మోపిన నేరానికి సమాధానంగా దువ్వూరి వారు కలెక్టర్ ఎదుట సుదీర్ఘ ప్రకటన చేశారు-‘’1857నాటి స్వాతంత్ర్య సమరాన్ని సహజంగా చరిత్ర ఆధారంగా చూపటమే నా ఉద్దేశ్యం .పాండ్యా ధైర్యశాలి అయిన నాయకుడు ఇది నిజగా జరిగిన కథ .కాని అతడిని ఆదర్శ ప్రాయుడుగా చూపించలేదు .నేను దౌర్జన్య రాహిత్యవాదిని.నాకతడు ఎలా ఆదర్శం అవుతాడు?.అతడు తొందరపడ్డాడు లేకపోతే ఇండియాకు స్వాతంత్ర్యం ఎప్పుడో వచ్చి ఉండేది నా పత్రిక దౌర్జన్యం సహించదు .నా కాంగ్రెస్ లోకాని ,యువజన సంఘం లోకానిదౌర్జన్యం అనే మాటే వినిపించదు.కనుక నాలో దౌర్జన్యం ఎలా వస్తుంది ?సర్వమత సమత్వాన్ని ఆచరించే యువజన సంఘం అధ్యక్షుడ నైన నేను మత విద్వేషాన్ని ఎలా పెంచుతానని అనుకొన్నారు మీరు ‘’?

వీర సావర్కార్ రాసిన ‘’భారత స్వాతంత్ర్య సమరం ‘’,చార్లెస్ బాల్ రాసిన ‘’మ్యుటిని చరిత్ర –రాబర్ట్స్ ప్రభువు ‘’,’’ఇండియాలో నా40సంవత్సారాల జీవితం ‘’అనే పుస్తకాలే తన చిచ్చులపిడుగు నాటికకు  ఆధారం అని రచయిత వెంకటప్పయ్య చెప్పాడు.  మెడోస్ టైలర్ ‘’రాసిన ‘’సీతా ‘’నవల దీనికి ఆధారమన్నారు లింగరాజుగారు ..

బెంగాల్ యువకుడు జతీన్ బోస్ జైలులో మానవతా దృక్పధం కోసం 63రోజులు నిరాహార దీక్ష చేసి 14-9-1929న అమరజీవి అయ్యాడు .అతడి దీక్షకు మద్దతుగా మద్దూరి,ఆచార్య రంగా రాజమండ్రి గోదావరీ తీరంలో గొప్ప సభ నిర్వహించారు  .జతీన్ మరణంతో కళ్ళు తెరిచిన ప్రభుత్వం ఖైదీలను  A.B,Cతరగతులుగా విభజిస్తూజైలు నిబంధనలు మార్చింది .అన్నపూర్ణయ్య  గారి అరెస్ట్ కు ముందు ఈమార్పులు రాలేదు తర్వాత వచ్చినా అమలు చేయమని ఆయన కోరనూ లేదు .ప్రభుత్వానికీ ఆ ఇంగితం కలగలేదు .మద్రాస్ శాసనమండలి లో ఈవిషయం చర్చకు వస్తే ,అనంతపురం నుంచి వెలువడే ‘’శ్రీ సాధన ‘’పత్రిక ‘’న్యాయశాఖ చూసే కృష్ణన్ నాయర్ భారతీయుడై ఉండికూడా ఈ అకృత్యానికి ఒడిగట్టటం దారుణం ‘’అని విచారం వ్యక్తం చేస్తూ రాసింది . ప్రతిపక్షకాంగ్రెస్ నాయకుడు సత్యమూర్తి ఘోరం అని నిరసన తెల్పి’’ ఈ తీర్మానం తెచ్చిన ప్రభుత్వ సభ్యుడు మద్రాస్ చరిత్రలో నామరూపాలు లేకుండా చనిపోతాడు కాని అన్నపూర్ణయ్య పేరు మాత్రం సువర్ణాక్షరాలతో లిఖి౦చబడుతుంది .దేశ గౌరవ ,స్వాతంత్ర్యాలను పరిరక్షించిన వ్యక్తిగా భావితరం అన్నపూర్ణయ్య ను జ్ఞాపకం ఉంచుకొంటుంది ‘’అని అద్భుత ప్రసంగం చేశాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -13-10-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా త్యాగి మద్దూరి అన్నపూర్ణయ్య-5

మహా త్యాగి మద్దూరి  అన్నపూర్ణయ్య-5

‘’కాంగ్రెస్ ‘’మొదటి పత్రిక ఒక ఫుల్ స్కేప్ కాగితం పై సైక్లో స్టైల్ లో వెలువడింది తర్వాత 14పేజీలలో రాయల్ సైజ్ లో వచ్చేది .’’విదేశీ వస్తువులు బ్రిటిష్ వస్తువులు ,మత్తు పదార్ధాల ప్రకటనలు పత్రిక ముద్రించదు.ఆధిని వేశ ప్రతిపత్తికి అనుకూలం గా సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని ప్రతిపాదిస్తుంది ‘’అని పత్రిక నివేదికలో పేర్కొన్నారు.తెలుగు అక్షరాలతో హిందీ పాఠాలుప్రచురించేవారు .ప్రముఖ పాత్రికేయుడు కోటం రాజు రామారావు వచ్చి చూసి సిబ్బంది అందరూ అన్ని పనులుఅచ్చు కూర్పుతో సహా చేస్తున్నారు  అని మెచ్చాడు .రామచంద్రుని వెంకటప్ప రాసిన ‘’చిచ్చల పిడుగు ‘’ఏకాంకిక ను 1929మే7పత్రికలో ముద్రించిన౦దుకు దేశ ద్రోహం కింద అన్నపూర్ణయ్య గారికి రెండున్నరఏళ్ళ జైలు శిక్ష పడింది  .మే 13న అరెస్ట్ కాగా క్రోవ్విడి లింగరాజు  సంపాదకు డైనాడు .1930మార్చి పత్రిక లో భగత్ సింగ్ ఉరితీతను ఖండిస్తూ ‘’వీరబలి ‘’వ్యాసం ప్రచురించినందుకు లింగరాజుకు రెండేళ్ళ ఖైదు శిక్ష విధించారు  .అన్నపూర్ణయ్య గారి అరెస్ట్ తర్వాత హిందూ పత్రిక లో ఒక అన్నపూర్ణయ్య ఒక ప్రకటన ఇచ్చారు .’’మా నాయకుడు సాంబమూర్తి అరెస్ట్ అయ్యాక ,నా అరెస్ట్ ఆశ్చర్యం కలిగించలేదు .ఈ ఏడు దేశమంతా జరిగిన యువజనుల అరెస్టులు  చూస్తె స్వాతంత్ర్య ఉద్యమాన్ని అణచి వేయటమే అధికారుల లక్ష్యం అనిపిస్తోంది .ఇది మా పత్రికపై దురాక్రమణ గా భావిస్తాము .మేము భయపడలేదు .ఇద్దరు సంపాదకులను జైలులో పెట్టినప్పుడేమేము బతికి బట్టకట్టాం .నా నిర్బంధం తర్వాతకూడా బావుటా ఎగురుతూనే ఉంటుంది .ఈ కస్ట సమయం లో ప్రజలు మాకు అండగా నిలబడుతారనటం లో సందేహం లేదు ‘’.మద్దూరి అరెస్ట్ ను ఖండిస్తూ కలావెంకటరావు స్టేట్ మెంట్ రాసిస్తే టెలిగ్రాఫ్ వాళ్ళు తీసుకోలేదు .

  లింగరాజు అరెస్ట్ తర్వాత వెంకటప్ప ఎడిటర్ అయ్యాడు .1931సెప్టెంబర్ లో జైలు నుంచి విడుదలై మద్దూరి మళ్ళీ సంపాదక బాధ్యతలు చేబట్టారు .1932జనవరిలో పోలీసు దాడి వరకు ఆయనే సంపాదకుడు .1922లో ప్రారంభమై పదేళ్ళలో చరిత్ర సృష్టించింది .కాంగ్రెస్ పత్రిక తో సంబంధమున్న వెంకటప్పయ్య ,కాండ్రేగుల రామ చంద్రరావు ,చుండ్రు పట్ల హనుమంతరావు లుకూడా జైలు కెళ్ళారు .

1929మే 21న స్వాతంత్ర్య సంచికగా వెలువడిన కాంగ్రెస్ పత్రిక ను  ఆంధ్రపత్రిక  సమీక్షిస్తూ ‘’10వ తేదీ 8వ సంపుటి16వ సంచిక లో 16పేజీలున్నాయి .స్వాతంత్ర్యయుద్ధ నాయకుడు నానా డూండీ పంత్ సాహెబ్ ,జగదీశ పురాధీశుడు 80ఏళ్ళ వృద్దురాణాకుమార్ సింహ ల ముఖ చిత్రాలతో ఆద్యంతం గంభీరంగా ఉన్నది .చిచ్చలపిడుగు ఏకాంకిక ,రాణాకుమార సింహుడు ,,1857ఝాన్సీ లక్ష్మీ బాయ్ అగ్ని ప్రవేశం ,తాంతియా తోపీ వ్యాసాలూ ,కవికుమారుల కుసుమాంజలి మొదలైనవి ఉన్నాయి ‘’అని మెచ్చింది .

 సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-10-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రసార ప్రయోక్త, పారమార్థికుడు వేటూరి ఆనందమూర్తి

ప్రొఫెసర్ గిడుగు సీతాపతిగారు   వేటూరి వారి ప్రత్యేకతను వివరిస్తూ ‘’మన ప్రాచీన ,మధ్యయుగ రచయితలు తమ వచన రచనలలో కొన్ని వ్యావాహారిక పద్ధతులు అనుసరించారు అసలు రచనలో మరోరకమైన వ్యాకరణ భాష ,శైలి లో రాస్తూనే . తాళపత్రాలలో ఉన్న ఈ విషయాలను అంతకు ముందు ఎవరూ గుర్తించనే లేదు .వాటినన్నిటినీ తేటతెల్లంగా ఉదాహరించారు వేటూరి ,మా తండ్రి రామమూర్తి ,గురజాడ గార్లు .అలాంటి వాటిని కొన్ని ప్రముఖ ప్రచురణ సంస్థలు సవరణ చేసి గ్రాంధికం అక్కడ చొప్పించి ముద్రించాయి.దానివలన భాషా సౌందర్యం దెబ్బతిన్నది అని ప్రభాకర శాస్త్రిగారన్నారు ‘’.

  వ్యావహారిక భాషోద్యమం లో వేటూరి వారి ప్రతిస్పందనలు –

‘’నవ్య సాహిత్య పరిషత్ ,ప్రతిభ పత్రిక స్థాపనలో గురజాడ, గిడుగు వారి ముఖ్య పాత్ర ఉన్నది  వారిద్దరూ నాకు ముఖ్యమిత్రులే .నేనూ వారితో చేతులు కలిపి పని చేశానుకనుక .మీరు ఆనందంగా అనుభవిస్తున్న ఆధునిక తెలుగు పునర్జీవన వైభవం అంతా  మా సమష్టి కృషి యే.మా  ఆ నాటి స్నేహానికి సాక్షులెవరూ ఇక్కడ మీలో కనిపించటం లేదు .ఇదంతా 1916-17కాలం నాటి విషయాలు అంటే ఇప్పటికి సుమారు ముప్ఫై ఏళ్ళ క్రిందటిమాట అన్నమాట .గురజాడ కొత్తకవిత కన్యక లేక పూర్ణమ్మ వైభవంగా ఆనందంగా ఆవిష్కరించిన వారిలో నేనూ ఉన్నాను .ఆయనవి ముద్రించాల్సినవి ఇంకాచాలా ఉన్నాయి .గురజాడ కవిత్వ సూక్ష్మ నైపుణ్యాలు ,సమర్ధత ,శ్రేష్టత ఇక్కడున్నవారికి ఎవరికీ తెలియదు .గురజాడ కుమారుడు రామదాసు తనతండ్రి కవితా సంపుటికి ముందుమాట రాయమని నన్ను కోరాడు .సరే నన్నాను .కాని అది మేము అనుకొన్నట్లు జరగలేదు .వాడుక భాషా ఉద్యమ౦ విషయం లో నేను ,నా స్నేహితుడు గిడుగు అభిప్రాయంతో ఏకీ భావిస్తాను .1912-13కాలం లో నేను   గ్రాంధికవాదులు అడ్డు పడుతున్నా,వాడుక భాషలోనే కొన్ని పుస్తకాలు రాసి ప్రచురించాను .అది అలాఉంచితే ,వాడుక  భాషలో  వేదికలపై మాట్లాడటం కూడా నిషిద్ధమే అప్పుడు  .గురజాడ చనిపోయి చాలాకాలమైనా,  గిడుగు ఒక్కడే ఆఉద్యమాన్ని కడదాకా నిర్వహించి విజయం సాధించాడు రెండవ ప్రపంచ యుద్ధం లో ప్రెసిడెంట్ రూజ్ వెల్ట్ లాగా .  భట్టబాణభట్టు  కొడుకు  భట్టు భూషణుడు లాగా నా స్నేహితుడు గిడుగు రామమూర్తి కొడుకు సీతాపతి ఆ మార్గం లో తండ్రి ఆశయాలు సాధించటానికి పూర్తిగా సర్వ సన్నద్ధ మై పని చేస్తున్నాడు .’’అన్నారు వేటూరి ప్రభాకర శాస్త్రిగారు .ఈ విషయాలను కుమారుడు డా. ఆనందమూర్తి తెలియ జేశారు .

   వ్యావహారిక భాషోద్యమం లో వివిధ దశలు

1-  గురజాడ అప్పారావు కన్యాశుల్కం నాటకం ను  వ్యావహారిక భాషలో 1897లో మొదటి ముద్రణను ,1907 లో రెండవ ఎడిషన్ గానూ తెచ్చాడు .

2-1910లో రాజమండ్రిలో గురజాడ ‘’ఆంద్ర భాషా ప్రవర్తక సంఘం ‘’స్థాపించాడు .

3-1913లో మద్రాస్ ప్రభుత్వం ‘’కాంపోజిషన్ కమిటీ ‘’ని నియమించింది .చాలావాడి వేడి చర్చలు జరిగాక ‘’వ్యావహారిక భాషా సంస్కరణ ‘’తీర్మానం చివరికి ఓడిపోయింది .గురజాడ దీనిపై ‘’డిస్సెంట్ నోట్’’రాసి కమిటీకి సమర్పించాడు .ఇదే ఉద్యమంలో మైలురాయిగా నిలిచింది .

4-1919లోవ్యావహారికం పై  ప్రజాదృక్పధం లో క్రమమైన సానుకూలమైన మార్పుకనిపించింది

5-సవర భాష ఉద్ధరణ కార్యక్రమం గిడుగు చేబట్టాడు .

6-1936లో నవ్య సాహిత్య పరిషత్ ఏర్పాటై, దానికిఅనుబంధంగా,ఉద్యమ వ్యాప్తికి తోడ్పాటుగా ‘’ప్రతిభ ‘’పత్రిక స్థాపన జరిగింది .

7-1937లో ఉద్యమాన్ని బలపరుస్తూ తాపీ ధర్మారావు ‘’జనవాణి ‘’పత్రిక నెలకొల్పాడు .

8- 1940లో గిడుగు ‘’ప్రజామిత్ర ‘’పత్రికలో ‘’తుది విన్నపం ‘’ప్రచురితమై చర్చ విజయవంతమైంది

9-వ్యావహారిక భాషోద్యమ నాయకుడు గిడుగు వెంకట రామమూర్తి 1940జనవరి  22న ప్రశాంతంగా కన్ను మూశాడు .

  సమాంతర మారిషస్

1-1965కు ముందుఅంతరించే  తెలుగు భాష అద్భుత మాయాజాలంగా స్థానికుల పట్టుదల బయటివారి సహకారం వలన మారిషస్ దేశం లో బ్రతికింది  . ఈ విషయం లో పండిట్ రామమూర్తి ,పండిట్ గున్నయ్య ఒట్టు,పండిట్ గురయ్యలు చిరస్మరణీయులు .వీరుకాక 1966లోనూ ,ఆతర్వాత ఊతం ఇచ్చిన డజన్లకొద్దీ ఉత్సాహవంతులైన టీచర్లూ అభినందనీయులే .

2- SAAMS అనేది   MAMS  ను బాగా ప్రభావితం చేసింది .

3-1966-70లోభారతీయ భాషల  మొదటి దశ  ITEC నిపుణులు వచ్చారు

4-1976-79లో వ్యావహారిక భాష ప్రైమరీ , సెకండరీ స్థాయిలలో ప్రవేశ పెట్టబడింది .మహాత్మాగాంధీ ఇన్ స్టిట్యూట్ స్థాపన జరిగింది .

5-2014లోనూ, ఇప్పుడూ-ఉత్సాహం ఉత్తేజం కలిగించే క్రమానుగత  ప్రభుత్వ తోడ్పాటు లభించింది .తెలుగు స్పీకింగ్ యూనియన్ అంటే తెలుగు ‘’మాట్లాడే వారి సమాఖ్య’’ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కల్చర్ శాఖ సంరక్షణలో సంయుక్తంగా  ఏర్పడింది

6-మారిషస్ జాతీయతపై ప్రేమ , ,తెలుగు భాష పై ప్రేమ ,ధర్మం పై ప్రేమ అనేవి శారీరక మానసిక ఆధ్యాత్మికత గా రూపొందాయి మారిషస్ లో .

   ఆధారం –ప్రొఫెసర్ వేటూరి ఆనందమూర్తి గారి రచనలు

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -11-10-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రసార ప్రయోక్త, పారమార్థికుడు

ప్రసార ప్రయోక్త, పారమార్థికుడు

 

దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఆచంట జానకిరాం, గుర్రం జాషువా, దాశరథి, రావూరి భరద్వాజ, భాస్కరభట్ల, గోపీచంద్, బుచ్చిబాబు వంటి ప్రముఖుల కోవలో చెప్పుకోదగ్గ రేడియో కళాకారుడు వేలూరి సహజానంద. 1977లో పెనుతుఫానుతో దివిసీమ కకావికలమైనపుడు సహజానంద రూపొందిచిన అశ్రుఘోష కార్యక్రమం విలక్షణమైనది, అపురూపమైనది.

హైదరాబాదు ఆకాశవాణిలో సుమారు రెండు దశాబ్దాలు పని చేసి, సర్వీసులో ఉండగానే కనుమూసిన సాహిత్యవేత్త, ఆధ్యాత్మికవేత్త, ఆకాశవాణి ప్రయోక్త వేలూరి సహజానంద (1920–1978). తొలి నుంచి భగవద్గీత మీద ఎనలేని ఆసక్తితో రచనలు చేసిన సహజానంద ఆకాశవాణిలో కూడా గీత గురించి చక్కని ప్రసంగాలు ఎన్నో చేశారు. ఈ చిరు ప్రసంగాలు ‘గీతా దీపం’ అనే పేరుతో రెండు సంపుటాలుగా అందుబాటులో ఉన్నాయి. దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఆచంట జానకిరాం, గుర్రం జాషువా, దాశరథి, రావూరి భరద్వాజ, భాస్కరభట్ల, గోపీచంద్, బుచ్చిబాబు వంటి ప్రముఖుల కోవలో చెప్పుకోదగ్గ రేడియోమూర్తి వేలూరి సహజానంద. 1920 అక్టోబరు 8న కృష్ణాజిల్లా చిరివాడలో యజ్ఞనారాయణ శాస్త్రి, లక్ష్మీనరసమ్మ దంపతులకు జన్మించిన సహజానందకు మహాపండితులు వేలూరి శివరామశాస్త్రి పినతండ్రి. అరవిందుల అనువాదకులు చంద్రశేఖరం మరో పినతండ్రి.

తొలుత ఆంధ్రరాష్ట్రం, పిమ్మట ఆంధ్రప్రదేశ్‌లో పౌరసంబంధాల శాఖలో ఎనిమిదేళ్ళు పని చేసిన సహజానంద 1960లో హైదరాబాదు ఆకాశవాణిలో పంచవర్ష ప్రణాళికల ప్రచార విభాగంలో ప్రొడ్యూసర్‌గా చేరారు. ఆ బాధ్యతలు నిర్వహిస్తూ ‘వ్యాఖ్య’ అనే కార్యక్రమాన్ని ప్రతి నిత్యం రూపొందించేవారు. ఆకాశవాణిలో ఎంతోమంది సాహితీమూర్తులను శ్రోతలకు పరిచయం చేశారు. జాతీయ కవిసమ్మేళనం కూడా నిర్వహించేవారు. ఆయన తర్వాత ఆ బాధ్యతలను రావూరి భరద్వాజ నిర్వహించారు. దాశరథి కృష్ణమాచార్యుల విదేశీ పర్యటన గురించి పరిచయం చేసింది వేలూరి సహజానందే. ‘మాలపల్లి’ నవల ఆధారంగా ప్రదర్శించిన నాటకం చూసి, రేడియోకు అనుగుణంగా దానిని రూపొందించమని నగ్నమునిని కోరారు సహజానంద. అలా రేడియోలో ‘మాలపల్లి’ మరోసారి తెలుగువారిని చేరింది, ఆకాశవాణి ఆణిముత్యంగా మిగిలింది. తెన్నేటి విశ్వనాథం, మాడభూషి అనంతశయనం అయ్యంగార్, యన్‌.జి. రంగా, కాసుబ్రహ్మానంద రెడ్డి, నార్ల వెంకటేశ్వరరావు ఇత్యాదుల అభిప్రాయాలతో టంగుటూరి ప్రకాశం గురించి సహజానంద రూపొందించిన కార్యక్రమం ఇప్పుడు యూట్యూబ్‌లో అలరిస్తోంది.

పటాటోపం లేకుండా అర్థవంతంగా, అలవోకగా రేడియోలో ప్రసంగించడం సహజానందలో గమనించవచ్చు. రేడియో సంపర్కంతో ఆయన మాట్లాడే చిన్నచిన్న వాక్యాలు, వినేవారికి ఆహ్లాదం కలిగిస్తాయి. ఆయన కనుమూసేదాకా ప్రతియేటా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టే వార్షికబడ్జెట్‌ను తెలుగులోకి అనువదించి ప్రతిని సిద్ధం చేసేవారు. కొన్ని సంవత్సరాలుగా ఆర్థిక విషయాల వ్యక్తీకరణ, పదాల వినియోగం స్థిరపడడంలో సహజానంద కృషి విశేషమైనదీ, విలక్షణమైనదీ. రెండు పదుల వయసు మించకముందే జర్నలిస్టుగా ‘తెలుగు విద్యార్థి’లో రచనలు చేశారు. మూడుపదులకు జిడ్డు కృష్ణమూర్తి రచన ‘ఎడ్యుకేషన్ అండ్ మీనింగ్ ఆఫ్ లైఫ్’ను ‘విద్యార్థి జీవితాశయాలు’ పేరిట అనువదించారు. జీవితపు సంక్లిష్టతను పరిశీలించడం ఆయనకు ఆసక్తి కావచ్చు. ఈడిపస్ కాంప్లెక్స్ లాంటి దాన్ని చిత్రించే వేలూరి చంద్రశేఖరం రచన ‘కాంచనమాల’ను రేడియో నాటకంగా సహజానంద చక్కగా రూపొందించి పేరు పొందారని, ఆ నాటకంలో ‘తిష్యరక్షతి’ పాత్ర ధరించిన శారదా శ్రీనివాసన్ అంటారు. 1977లో పెనుతుఫానుతో దివిసీమ కకావికలమైనపుడు ఆకాశవాణి చేసిన ప్రసార సేవ విలక్షణమైనది, అపురూపమైనది. ఈ నేపథ్యంలో వేలూరి సహజానంద రూపొందించిన ‘అశ్రుఘోష’ ఆకాశవాణి కార్యక్రమానికి జాతీయ వార్షిక బహుమతి లభించింది. 1920 అక్టోబరు 8న జన్మించిన వేలూరి సహజానంద 1978 నవంబరు 10న రిటైరు కాకుండానే కనుమూశారు.

హడావుడి, ఆర్భాటం లేకుండా నెమ్మదిగా కనబడే పరమ శాంతమూర్తి అని ఆయననెరిగిన సాహితీవేత్త నగ్నముని అంటారు.

డా. నాగసూరి వేణుగోపాల్

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పరిశోధన’’ ఆనందమూర్తి’’ శ్రీ వేటూరి -1

పరిశోధన’’ ఆనంద మూర్తి’’ శ్రీ వేటూరి -1

తండ్రి చేసిన పరిశోధన కొనసాగించటం చరిత్రలో అరుదైన విషయం .అలాంటి దాన్ని సాధించిన వారు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి కుమారుడు ప్రొఫెసర్ శ్రీ ఆనంద మూర్తి .తాళ్ళపాక కవుల సంగీత పదాలపై చాలా కృషి జరగాలని భావించి తాళ్ళపాక కవుల సంగీత విజ్ఞానపు మెరుగులు కనుగొనే ప్రయత్నం లో ఏడు కొత్త పాటలు కనిపెట్టారు .ఆనందమూర్తి గారు ఉస్మానియా యూని వర్సిటి ప్రొఫెసర్ గా పని చేసి రిటైర్ అయ్యారు .టాగూర్ నేషనల్ ఫెలోషిప్ గ్రహీత కూడా .85వ ఏట కాకినాడలో తెలుగు సాహిత్య కృషికి గాను దంటు భాస్కరరావు స్మారక జీవిత సాఫల్య పురస్కారం అందుకొన్నారు.ఆయన పిహెచ్ డి చేసిన ‘’తెలుగు సాహిత్యం పై వైష్ణవం ప్రభావం –అందులో ప్రత్యేకంగా తాళ్ళపాక కవుల ప్రభావం ‘’పరిశోధన గ్రంథం రెండవ ప్రచురణ కూడా ఆవేదికపై జరిగింది .తండ్రిగారు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి పరిశోధన వారసత్వం కొనసాగిస్తున్నారు ఆనందంగా ప్రొఫెసర్ ఆనందమూర్తి .శాస్త్రిగారు తెలుగు సాహిత్యం తాళ్ళపాకఅన్నమాచార్యులపై పై గొప్ప పరిశోధన చేసినవారని మనకు తెలిసిన విషయమే.తనకు ఫెలోషిప్ వచ్చిన సందర్భం లో మూర్తి గారు ‘’ఈ ఫెలోషిప్ నాకు ఇండియాలో ఏ రిఫరెన్స్ లైబ్రరీకైనా వెళ్లి ,నా పరిశోధన సాగింఛి ,పూర్తి చేయటానికి ఒక పాస్ పార్ట్ లాంటిది .నేను చాలా ప్రయాణం చేసి నా రిసెర్చ్ కోసం ఎంతో నోట్స్ సంపాదించాలి ‘’అన్నారు .

ఆనందమూర్తి గారు పై ప్రాజెక్ట్ వర్క్ తో సరి పుచ్చుకోలేదు .కొన్ని శతాబ్దాల క్రితం ‘’’మారీచ దేశం ‘’అయిన మారిషస్ కు వలస వెళ్ళిన తెలుగు ప్రజల జీవిత విధానాలలో వచ్చిన మార్పులను కూడా తెలియ జేసిన విషయం చాలామందికి తెలియ దేమో .1966-70కాలం లో ఆయన మారిషస్ లో విద్యాశాఖాధికారి గా ఉన్నప్పుడు ట్రెయినింగ్ కాలేజి లో తెలుగు శాఖను ఏర్పాటు చేయటం లో గొప్ప కృషి చేశారు .మరొక నాలుగేళ్ళు 1976నుంచి ,అక్కడే పని చేసి ,ఆదేశం లో జరిగిన సెమినార్లు వర్క్ షాప్ లలో భాగం పంచుకొన్నారు .అక్కడ ఆర్కైవ్ లను పరిశీలిస్తుంటే ‘’ఆంధ్ర దేశం లో కాకినాడ దగ్గరున్న’’ కొరింగ ‘’ లో పొన్నమండ వెంకట రెడ్డికి నాలుగు నౌకలు ఉన్నట్లు ,వాటిని 1827లో అక్కడి నుంచి కూలీలను మారిషస్ కు రవాణా చేసినట్లు కనుగొన్నారు .ఆయన షిప్ ‘’కొరంగి పాకెట్’’ లో అక్కడి నుంచి మారిషస్ కు మొదటి దఫా 300మంది కూలీలను పంపినట్లు రికార్డ్ అయి ఉందని చెప్పారు .కొరంగి నుంచివచ్చిన ఈ తెలుగు వారిని మారిష లో ‘’కొరంగిలు ‘’అని పిలిచేవారట .ఇక్కడి మొదటి తరం తెలుగు వారి పేర్లనే ఇప్పటి తరం వారుకూడా ఇంటి పేరుగా చెప్పు కొంటారు .అక్కడి తెలుగు వాళ్ళ ఇంటిపేర్లు’’ ఓబిగాడు ,అప్పడు ‘’ గా ఉండటం మనకు ఆశ్చర్యం కలిగిస్తుందని మూర్తిగారు అన్నారు

అన్నమయ్య సాహిత్యంపై అధ్యయనం చేశారు .. ప్రభాకర సంపూర్ణ గ్రంథావళి సంపాదకుడు. మణిమంజరి అనే అర్ధవార్షిక పత్రికకు సంపాదకత్వం వహించి నడిపారు. హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకు అధ్యక్షుడిగా 1989-1990లలో పనిచేశారు. సాహిత్య అకాడమీ భాషాసమ్మాన్ పురస్కారం(2006), శ్రీకృష్ణదేవరాయ పురస్కారం,సనాతన ధర్మ ఛారిటబుల్ ట్రస్టువారి శ్ శ్రీరామనవమి ప్రతిభా పురస్కారం (2010) మొదలైన అనేక పురస్కారాలు పొందారు.

రచనలు
1. తాళ్లపాక కవుల కృతులు వివిధ సాహితీ ప్రక్రియలు

2. తాళ్లపాకకవుల పదకవితలు భాషా ప్రయోగ విశేషాలు

3. క్షేత్రజ్ఞులు పదసాహితి

4. మన వాగ్గేయకారులు-తొలి సంకీర్తన కవులు

. 2017,ఫిబ్రవరి-7న, కీ.శే.వేటూరి ప్రభాకరశాస్త్రి 130వ జయంతి ఉత్సవాల సందర్భంగా, పెదకళ్ళేపల్లి గ్రామ౦ లో, వీరు రచించిన ఆంధ్ర సాహిత్యంపై విష్ణు మత ప్రభావం – తాళ్ళపాక కవులు అను గ్రంధావిష్కరణ జరిగినది. .

గిడుగు వారినీ వేటూరి వారినీ పోలుస్తూ ఆనందమూర్తిగారు ‘’గిడుగు వరద గోదావరి .వేటూరి ప్రసన్న కృష్ణ వేణ్ణ’’అన్నారు బాపిరాజు కృష్ణానదిని ‘’కన్నబెన్న ‘’అని ముద్దుగా పిలిచాడు.గిడుగు వ్యావహారిక భాషోద్యమ నాయకుడు .వేటూరి నిశబ్ద అనుయాయి ,భాగస్వామి .వారిద్దరు ఆఉద్యమ౦ లో తెలుగు భాష కు జీవం ,తేజస్సు కూర్చిన మహానుభావులు .గిడుగు వెంకట రామమూర్తి గారు వ్యావహారిక భాషోద్యమం లో చివరిదాకా అంతు లేని పోరాటం సలిపి ,1940లో ప్రశాంతంగా ,రెండవ ప్రపంచయుద్ధం తర్వాత అమెరికన్ ప్రెసిడెంట్ రూజ్ వెల్ట్ లాగా మరణించారు అంటారు ఆనంద మూర్తి గారు ..

.సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -11-10-20-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన సుకవి ఆత్రేయ -3(చివరి భాగం )

 సాధారణంగా ఆత్రేయ రాత్రిళ్ళు మెరీనా బీచ్ కు వెళ్లి రాస్తూ ఉండేవాడు .వెలుగు నీడలు సినిమాకు ఆత్రేయతో అర్ధవంతమైన డైలాగ్స్ రాయించాలని నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు ఆత్రేయకు ఒకకారు అసిస్టెంట్ డైరెక్టర్ కేవిరావు, బాయ్ నీ అప్పగించి కేరళలోని పీచీ డాం గెస్ట్ హౌస్ కు పంపాడు. నెలరోజుల్లో స్క్రిప్ట్ రెడీ చేసేశాడు ఆత్రేయ మధురస్వప్నం సినిమాకు మాటలు రాస్తూ క్లైమాక్స్  సీన్ డైలాగులుగోదావరిలో పడవ మీద రాస్తానంటే డైరెక్టర్ రాఘవేంద్రరావు ఏర్పాటు చేశాడు. అయిదు వందలకోసం ఒకసారి మూడు వందలు ఖర్చుచేసి టాక్సీలో  వెళ్ళిననఘనుడు ,డబ్బు పుష్కలంగా ఉంటే ఖర్చు చేసేదాకా నిద్రపోయేవాడు కాదు .డబ్బులేకపోతే డబ్బుకోసం నిర్మాత చుట్టూ తిరిగేవాడు .సిల్క్ బట్టలు సెంట్లు పెన్నులు నాజూకు కాగితాలు ఫైల్స్ కోసం పిచ్చగా డబ్బు తగలేసేవాడు .తను నిర్మించి డైరెక్ట్ చేసిన వాగ్దానం సినిమాలో దాశరధి చేత పాట రాయించిన సహృదయుడు .’’నా కంటిపాపలో నిలిచిపోరా ‘’పాట రాశాడు దాశరధి .శ్రీ శ్రీ రెండు పాటలు 1-కాశీపట్నం చూడర బాబు 2-రేలంగి చెప్పిఅన హరికథ .

  రుణానుబంధం ,దేశమంటే మట్టికాదోయ్ మొదలైన సినిమాలకు కథారచయిత .మూగమనసులు కు ఆత్రేయ ముళ్ళపూడి , డా ఆనంద్ కు ఆత్రేయ వి మధుసూదనరావు వాగ్దానం కు ఆత్రేయ ,బొల్లిముంత ,తోడికోడళ్ళు కు ఆత్రేయ ఆదుర్తి ,కథానుసరణలు చేశారు .సతీ సావిత్రి ,ఆదర్శకుటుంబం లకు ఆత్రేయ ,ప్రత్యగాత్మ ,మంచిమనసులుకు ఆత్రేయ ఆదుర్తి ,కన్నతల్లికి ఆత్రేయ జగన్నాథం స్క్రీన్ ప్లే రాశారు .కోడెనాగు, ఆదర్శం సినిమాలలో ఆత్రేయ నటించాడు .కోడెనాగులో రామశర్మ పాత్రలో జీవించాడు. భామాకలాపం లో అతిధిపాత్ర వేశాడు .తెలుగు సినీ పరిశ్రమలో ‘’అ’’త్రయం అంటే అక్కినేని, ఆదుర్తి,  ఆత్రేయ  కాంబినేషన్ కనకవర్ష మే కురిపించింది .

   ఆత్రేయ ఆత్మకథ రాస్తుంటే ,భార్య పద్మావతి గారు ఆయన ప్రవర్తనతో విసిగిపోయి ఒక కార్డు రాస్తూ ‘’ఊరికే ఆత్మకథ రాయటం కాదు, అవతలివారికి జరిగినఅన్యాయాన్ని కూడా అందులో రాయండి ‘’అని రాసి ఆ విషయం మర్చి పోయింది .తన  ఆత్మకథలో భార్యగురించి  రాయటమే కాదు ఆ ఉత్తరాన్ని సీలు చేసి ఆంద్ర జ్యోతికిచ్చి తాను  చనిపోయాక ప్రింట్ చేయమని వాగ్దానం కూడా తీసుకొన్నాడు .

   ఆత్రేయ రచనలపై పరిశోధనలు జరిగాయి .’’ఆత్రేయ నాటికా సాహితి ‘’లఘు సిద్ధాంత వ్యాసం శ్రీ ఎ.వి .రవీంద్రకుమార్ రాసి వెంకటేశ్వరాయూని వర్సిటీలో 1980లో సమర్పించాడు .పైడిపాల సత్యనారాయణ రెడ్డి ‘’ఆత్రేయ నాటకాలు –పూర్వాపరాలు ‘’లఘుసిద్ధాంత వ్యాసం రాసి 1984లో ఆంధ్రాయూని వర్సిటీలో సమర్పించాడు .ఆత్రేయ – అభ్యుదయ ఆదర్శాలు ‘’పరిశోధనా గ్రంథం కే .రాధాదేవి రాసి మద్రాస్ యూనివర్సిటీకి 1990లోసమర్పించింది .కే స్వర్ణలత ‘’ఆత్రేయ –విశ్వశాంతి వైశిష్య౦  ‘’పరిశోధన గ్రంథం రాసి ,నాగార్జున విశ్వవిద్యాలయం లో 1992లో సమర్పించారు .డా కే.బి .లక్ష్మి ‘’ఆత్రేయ సినీగీతాలు ‘’సిద్ధాంతవ్యాసం రాసి 1994 కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం లో సమర్పించారు .’’ఆత్రేయ –కణ్ణదాసన్ పాటలు –ఒక పరిశీలన ‘’వ్యాసాన్ని ఆదుర్తి వెంకట నాగ శోభ రాసి,మద్రాస్ యూని వర్సిటీకి సమర్పించింది .’’మనసుకవి ఆత్రేయ నాటక సాహిత్యం –సంభాషణలు ‘’పరిశోధన గ్రంథం ‘’ఆత్రేయ సినిమా సంభాషణలు –ఒకపరిశీలన ‘’అంశం పై పరిశోధన గ్రంథంకూడా రాసి 2000లో ఆంద్ర విశ్వ విద్యాలయానికి శ్రీ తలకోటి పృధ్వీ రాజ్ సమర్పించారు .ఈయనే ‘’మహాకవి ఆత్రేయ ‘’డాక్యుమెంటరి చిత్రం కూడా రూపొందించారు .

  డా. తలకోటి  ‘’ఆత్రేయ సాహితీ స్రవంతి ‘’స్థాపించి జాలాదికి ,ఆత్రేయ శిష్యుడు గురు చరణ్ కు పురస్కారం అందించారు .ఆత్రేయ ఆణిముత్యాలు సిడి విడుదల చేశారు .గొల్లపూడి మొదలైన ప్రముఖులతో ఇంటర్వ్యు చేసి ‘’ఆత్రేయ సాహిత్యం వ్యక్తిత్వం ‘’ఆడియో సిడి తెచ్చారు .ఆత్రేయపాటలు ,సంభాషణా చాణక్యుడు అనే వీడియో, సిడిలు తెచ్చారు .ఆత్రేయ జీవితం సాహిత్యం ,ఆత్రేయమొదటి చివరిపాటలు, వీణపాటలు సినీ సంభాషణలు మొదలైన డాక్యుమెంటరీలు తయారు చేసి యుట్యూబ్ లో పెట్టారు .’’ఆచార్య ఆత్రేయ. కాం ‘’పేరుతొ వెబ్ సైట్ నిర్వహించారు .అనకాపల్లిలో ఆత్రేయ విగ్రహం నెలకొల్పాలని ఆలోచనలో ఉన్నారు .

  సమాప్తం

ఆధారం –‘’డా తలకోటి పృధ్వీరాజ్ ‘రాసిన ‘’నేనూ –ఆత్రేయ ‘’’eబుక్ ‘’

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ తిరునారాయణ పుర క్షేత్ర మహాత్మ్యం -3-చివరిభాగం

శ్రీ తిరునారాయణ పుర క్షేత్ర మహాత్మ్యం -3-చివరిభాగం

యాదవగిరికి నాలుగు వైపులా అష్టాక్షరీ మహా మంత్రాలతో అష్ట తీర్దాలు ఏర్పడి భక్తులను ఆదుకొంటున్నాయి .ఒక యదువంశరాజు పర్వతం చుట్టూ నాలుగు వైపులా కోటకట్టించి ‘’మేలు కోట ‘’అని పేరుపెట్టాడు .అప్పటినుంచి యతి నారాయణపురం ను మేల్కోట అంటున్నారు .ఫాల్గుణ శుద్ధ రోహిణీ నక్షత్రం రోజున స్వామికి బ్రహ్మోత్సవ ధ్వజారోహణం ,ముందురోజు కళ్యాణ పుష్కరిణీ తీర మంటపం లో కల్యాణం ,పుష్యమి నక్షత్రం నాడు వైరముడి ,మర్నాడు రాజముడి ,రధోత్సవం ,హస్తా నక్షత్రం నాడు తీర్ధ వారిఉత్సవం ,తర్వాత రోజు సహస్ర కలశ తిరు మంజనం ,చూర్నాభిషేకం ,మర్నాడు ఉత్సవమోర్తులను గర్భ గుడిలో ఉంచి, ఆమర్నాడు అన్నకోటి మహోత్సవం చేస్తారు .

   రామానుజాచార్యులు విఠలదేవుని శిష్యుడిని చేసుకొని జైనులను ఓడించి ,స్వామి ఆనతితో,తిరునారాయణపురం వచ్చి అతని సాయంతో కోవెల, మండపాదులు కట్టించి ,బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిపిస్తూ 12ఏళ్ళు ఉండి,శ్రీరంగానికి మళ్ళీ వెళ్ళే ప్రయత్నం లో ఉంటె ,ఇక్కడి అర్చక,పరిచారక బృందం  52 మంది ఆచార్యస్వామిని వదిలి ఉండలేమని  బాధ పడుతుంటే తన ప్రతిబి౦బ౦తో ఒక అర్చా విగ్రహం చేయించి ,ప్రతిష్టించి గాఢాలింగనం తో ప్రాణ ప్రతిస్ట  చేసి  తెర చాటు చేయింఛి ,వాళ్ళు మాట్లాడితెతనవిగ్రహం కూడా మాట్లాడుతుందని చెప్పగా వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడిగితే, విగ్రహం అన్నిటికీ  చక్కని సమాధానాలు చెప్పగా, వారు చాలా సంతోహించి ఆచార్యులవారి శ్రీరంగ ప్రయాణానికి ఆమోదం చెప్పగా, ఆయనా వదలలేక వదలలేక బయల్దేరి శ్రీంగం చేరి శ్రీ రంగనాథ స్వామి సేవ చేస్తూ ఉన్నారు  .

  తిరునారాయణ స్వామి సన్నిధికి తూర్పున కురుత్తాళ్వార్ సన్నిధి ,దానిప్రక్క పిళ్ళలోకాళ్వార్  సన్నిధి, సంపత్కుమార సన్నిధి, ఎదురుగా స్థంభంలోరాజ ఉడయార్ విగ్రహం ,బయట ఉమ్మడి కృష్ణరాయలు  నలుగుర భార్యలతో ఉన్న విగ్రహం ఉన్నాయి.ముఖ్య దేవాలయానికి ముందు అతిపెద్ద బదరీ వృక్షం  బద్రీ నాథ దేవాలయం ,దానివెనుక రామానుజ మఠం,పట్టాభిరామ దేవాలయం ,దానిప్రక్క శెల్వరాజ మంచినీటి కొలను ,ఉత్తర మాడ వీధిలో మనవాళ మహాముని గుడి ,రాజవీధిలో వసంతోత్సవ బంగాళా ,దానికెదురుగా వేదాంత దేశికుల గుడి ఉన్నాయి .

   వైరముడి మహోత్సవానికి ముందురోజు మైసూర్ రాజాస్థానం నుంచి వైరముడి ,రాజముడి రాజభటులతో గౌరవంగా బయల్దేరి ఆరాత్రి శ్రీరంగపట్నం చేరి ,అక్కడ స్వామి సన్నిధిలో పూజాదికాలు పొంది, మర్నాడు ఉదయం బయల్దేరి దారిలో పూజలు అందుకొంటూ సాయంత్రానికి తిరునారాయణ పురం చేరి, మాడ వీధి ప్రదక్షణాలయ్యాక ముందుగా రామానుజ ఆలయం చేరతాయి .వైరముడి సంపత్కుమారులకు సమర్పించి గరుడవాహనం పై తిరువీధి ఉత్సవం జరిపించుకొని ,వాహనమంటపం చేరి ,వైరముడి ని ఎత్తించి, రాజముడి ని సమర్పిస్తారు .మర్నాడు ఉదయం 10గంటలకు వైరముడిని మాత్రమె భటుల సాయం తో మైసూర్ సంస్థానానికి చేరుస్తారు .బ్రహ్మోత్సవ సమయం లో పాదుషా అతడికొడుకు ,వరనందిని ఇక్కడికి వచ్చి కనులారా చూసి తమ అల్లుడికి పాదుషా అరుదైన కానుక లర్పించి  బలిపీఠం దాకా వెళ్లి దర్శించి వెడతారు .

   రామానుజులు ఢిల్లీ కి  వెడితే తే పాదుషా గౌరవ సన్మానం చేస్తాడు .ఆచార్యులు తన సేవలో ఉన్న పంచములకు ‘’కులత్తారు ‘’బిరుదు నిచ్చి ,బ్రహ్మోత్సవాలలో వీరందరికీ పుష్కరిణీ స్నాన ,స్వామి సన్నిధి సేవ ఏ ఆటంకం లేకుండాజరిగేట్లు చూస్తారు .పూరీ జగన్నాథంలో ప్రసాద పావనత్వం ,తిరుమలలో తీర్ధ పావనత్వం ఉంటె, ఇక్కడ తిరునరాయణ పురం లో స్పర్శ పావనత్వం ఉంటుంది .ఈవిషయం రామాయణం,గురుపరంపరాప్రభావం ,ప్రపన్నామృతం వంటి గ్రంథాలలోనూ ఉంది .

‘’కళ్యాణీ ఎలసద్యతుగిరినారాయణార్ధి కల్ప తరో-సంపత్కుమార భవ తే నిత్య శ్రీర్నిత్య మంగళం భూయాత్ ‘’

కమలా కుచ కస్తూరీ కర్దవా౦కిత వక్షసే –యాదవాద్రి నివాస సంపత్పుత్రాయ మంగళం ‘’

ఈ పురం లో చాలా కుల్లం లు అంటే కొలనులున్నాయి .మంచినీటికి వేరే స్నానికి వేరే ,స్వామి అభిషేకపూజాదులకు వేరే ప్రత్యేక కొలనులున్నాయి .వైష్ణవ భక్తులు ముందుగా రామానుజ దర్శనం చేసి తర్వాత తిరునారాయణ మూల విరాట్ దర్శనం చేస్తారు .కొండపై శ్రీ యోగ నరసింహస్వామి దేవాలయం ఉంది.మెట్లు శిధిలమై ఉంటాయి .క్రీశ.798కి చెందిన కులశేఖర మహారాజు అనే కులశేఖర ఆళ్వార్ తన రాజ్య సర్వస్వాన్ని తిరువనంతపుర శ్రీ అన౦త పద్మనాభస్వామికి సమర్పించి ,కొడుకు తో తరచుగా ఈ ఆలయానికి వచ్చి తిరునారాయణ స్వామి  దర్శనం చేసుకొని తనకవిత్వం వినిపించేవాడు .జీవితం చివరి రోజులలో కూడా వచ్చి దర్శించినట్లు ఆధారాలున్నాయి .’’దక్షిణ బదరి క్షేత్రం అని ప్రసిద్ధి చెందిన’’క్షేత్రం ఇది .

  ఒక సారి రామానుజాచార్యులవారిని చోళ రాజులు శ్రీరంగం నుండి  వెడలగొడితే ,ఆయన తిరునారాయణపురం దగ్గరున్న తొండనూరు వచ్చి ,ఇక్కడి విఠలదేవరాజుకు ,ఆయన కూతురికి పిశాచం పట్టి పీడిస్తుంటే మంత్ర  ప్రభావంతో వదలించ దలచగా .ఆచార్యులవద్దపవిత్ర విభూతి అయిపోయిందని గ్రహించగా నారాయణ స్వామి కలలో కనిపించి ,కొండప్రక్క గోతిలో ఉంది చూడమని చెప్పగా ,విఠలదేవుడితో అక్కడికి వెళ్లి మూలవిరాట్ ను కనుగొని ప్రతిష్టించి దేవాలయం నిర్మించారు .

ఆధారం –  ‘’ఆరు అధ్యాయాల నారదీయ పురాణా౦ర్గత మహాక్షేత్ర శ్రీ తిరు నారాయణపుర మహాత్మ్యం ‘’

ముద్రణ –శ్రీరంగం ఎ. సుదర్శన్ అండ్ సన్స్ వారిచే 1927లో శ్రీనికేట ముద్రక్షరశాలలో ముద్రింపబడింది .వెల –అణాలు 6.

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -10-10-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

, శ్రీ తిరునారాయణ పుర క్షేత్ర మహాత్మ్యం -2

, శ్రీ తిరునారాయణ పుర క్షేత్ర మహాత్మ్యం -2

 ఒకసారి బలరాముడు ఇక్కడకు వచ్చి పుష్కరిణీ స్నానం చేసి తిరునాయణ దర్శనం చేసి ,తమింట్లో ఉన్న రామప్రియ మూర్తికీ ఇక్కడి స్వామికీ తేడా ఏమీ లేదని గ్రహించి ,బృందావనం వెళ్లి కృష్ణుడికి చెప్పాడు .ఆయనక్కూడా స్వామిని దర్శించాలనే కోరికకలిగి పరివారంతోనూ తామ అర్చామూర్తి రామప్రియ తోనూ తరలి వచ్చి ,స్వామిని అర్చించి ,రామప్రియమూర్తిని తిరునారాయణ స్వామిప్రక్కనేసింహాసనం పై  ఉంచి ప్రతిష్ట చేసి పూజించి ఆనందించాడు .అప్పటినుంచి యదు  వంశ రాజులందరూ యాదవగిరి నుంచే రాజ్యపాలన చేశారు.అందుకే యాదవాద్రి గా పేరుపొందింది .

  ఢిల్లీ పాదుషా హిందూ విగ్రహ ధ్వంసం చేస్తూ ,ఇక్కడి రామప్రియ స్వామి విగ్రహాన్నికొల్లగొట్టి తీసుకు పోతే ,అతడి కూతురు వరనందిని ఆవిగ్రహం ముచ్చట గా ఉన్నందున ఆటలాడుకోవటానికి తన అంతః  పురానికి తీసుకు వెళ్ళింది .తిరునారాయణపుర దేవాలయ జీర్ణోద్ధారణ చేసిన యతిరాజులు అంటే భగ వద్రామానుజులు ,బ్రహ్మోత్సవాలు చేయటానికి ఇక్కడికి రాగా ఉత్సవమూర్తి అయిన రామప్రియ కనిపించకపోతే చి౦తి స్తుండగా స్వప్నం లో నారాయణస్వామి కనిపించి ఢిల్లీ పాదుషా దగ్గర ఉందని ,వెంటనే తెమ్మని ఆజ్ఞాపించాడు .

  రామానుజులు శిష్య ప్రశిష్యులతో ఢిల్లీ వెళ్లి,పాదుషాను కలిసి తాము వచ్చినపని చెప్పారు .తన ఉగ్రాణం తెరిపించి అందులో ఉందేమో చూడమన్నాడు .అందులో లేదు .స్వామి కలలో కనిపించి అతనికూతురు దగ్గర ఆవిగ్రహం ఉందని చెప్పగా మర్నాడు పాదుషాకు  ఆవిషయం తెలియజేయగా ,అతడు ‘’మీ దేవుడు మీరు పిలిస్తే వస్తాడా ?’’అని అడిగితే రామానుజులు తప్పక వస్తాడని చెప్పగా ,యతిరాజు ధ్యానించి స్వామిని రమ్మని పిలిచారు .అంతః పురంలోని రామప్రియ విగ్రహం కాలిఅందెల సవ్వడితో నడుచుకొంటూ  రామానుజులవద్దకు రాగా వారు పరమానందంతో స్వామి శిరస్సు మూర్కొని ‘’ఎనదు సెల్వ పిళ్ళయే’’అంటే’’ నా సంపత్కుమారా’’ అంటూ  అత్యంత ప్రేమతో కౌగలి౦చు కొన్నారు .పాదుషాకూడా అన౦దాతిరేకం తో రామానుజస్వామినీ బృందాన్ని అత్యంత గౌరవంగా సన్మానించి రామ ప్రియ విగ్రహాన్ని అందించి పంపాడు .అతని కూతురు వరనందిని  విరహం తాళలేక ఏడుస్తుంటే ,వారి వెంటనే ఆమెనూ పంపాడు పాదుషా .అప్పటినుంచి రామప్రియమూర్తికి ‘’శెల్వప్పిళ్ళ’’నామం స్థిర పడింది .పాదుషా కూతురు వరనందినికి ‘’బీబీ నాచ్చియార్ ‘’అనే పేరు కలిగి ,ప్రత్యేకమందిరం కట్టించారు .గర్భగుడిలో ఉన్న బిలద్వారంగుండా ఆమె  వచ్చిశెల్వ ప్పిళ్ళతిరునారాయణ  స్వామిపాదాలలో కూర్చుంటుంది  .ఆతర్వాత రామానుజులు ఉభయనాచ్చి యార్లు మొదలైన అర్చా విగ్రహాలు ఏర్పాటు చేశారు .సంపంగి వృక్షమూలం లో కనిపించిన తాయారు విగ్రహానికి ‘’యతుగిరి నాయకి ‘’అని పేరుపెట్టి నిత్యోత్సవ పక్ష మాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు ,వైరముడి బ్రహ్మోత్సవం ,రథోత్సవ, తెప్పోత్సవాలు వైభవంగా జరుపుతూ సేవించారు .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -9-10-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ తిరునారాయణ పుర క్షేత్ర మహాత్మ్యం -1  

శ్రీ తిరునారాయణ పుర క్షేత్ర మహాత్మ్యం -1

శ్రీ తిరునారాయణ పురక్షేత్రాన్నే ‘’మేల్కోటయాదగిరి  క్షేత్రం’’ అంటారు .ఈ క్షేత్ర  మహాత్మ్యం నారదీయ పురాణం లో ఉన్నది .నారదునికి బ్రహ్మ సవిస్తరంగా ఈక్షేత్ర మాహాత్మ్యాన్ని వివరిస్తాడు .సహ్యపర్వతాలకు తూర్పున ఉన్న కావేరీ ప్రక్కన ఉన్న క్షేత్రమే ఇది .కర్ణాటకలో మాండ్యా జిల్లాలో ఉన్నది . కృతయుగం లో సనత్కుమారుడు నారాయణాద్రి అనీ ,త్రేతాయుగం దత్తాత్రేయుడు వేదాద్రి అనీ ,ద్వాపరం లో కృష్ణ బలరాములు యాదవాద్రి అనీ , కలియుగం లో యతి శేష్తుడు యతిశైలం అనీ పిలిచారు .108 దివ్య తిరుపతులలో ముఖ్యమైనది ,దివ్య క్షేత్రాలలో నాలుగవదిగా ,జ్ఞానమంటపం గా  పేరుపొందింది .దీనికి రెండు క్రోసులదూరాన్ని అంతటినీ వైకుంఠ వర్ధన క్షేత్రం అంటారు .పర్వతం పై శ్రీ యోగ నృసింహస్వామిదేవాలయం దిగువన కళ్యాణీ తీర్ధం,దీని చుట్టూ శ్రీ వరాహ క్షేత్రం ,పంచభాగవత క్షేత్రం,ఉత్తర పశ్చిమం లో తార్ఖ్య, నయన క్షేత్రం ,చుట్టూ అష్ట తీర్ధాలున్నాయి .తిరు నారాయణ స్వామి స్వయంభు గా విమానం తో సహా ఆవిర్భవించి వేలాది సంవత్సరాలుగా ఆరాధింపబడుతున్నాడు .సనత్కుమారుని కోరికపై  బ్రహ్మ నారాయణుని ప్రార్ధించి ఆయన హృదయం నుంచి వేరొక మూర్తిని ఇవ్వమని కోరితే అర్చారూప మైన శ్రీ తిరునారాయణస్వామి అనే శ్రీరామప్రియ  విగ్రహం ఇస్తే ,ఆయన సనత్కుమారునికిస్తే విమాన సహితంగా తిరునారాయణపుర క్షేత్రం లో దేవతలందరి సమక్షం లో ప్రతిష్టించాడు .తర్వాత దేవతలు ఋషులు ,ఆతర్వాత దత్తాత్రేయుడు ,బలరామ కృష్ణులు ఆరాధించారు .

   యతిరాజులు శ్రీ రంగం నుండి దిగ్విజయ యాత్ర చేస్తూ ,మైసూర్ ప్రాంతంలో ద్వార సముద్రం లోని పోసలరాజు విఠల దేవారాజు కూతురికి దయ్యం పడితే వదిలించి ,అతడిని శిష్యుని చేసుకొని ,తొండనూరిలో జైనులను వాదం లో ఓడించి ,ఆరాజుకు విష్ణు వర్ధన రాయడు అనే పేరుపెట్టి ,స్వామి స్వప్నాదేశం తో తిరునారాయణపురం వచ్చి శిథిలమైన గోపుర విమానాలు పునర్నిర్మించారు .

   యాదగిరి సమీపం లో దర్భ తీర్ధం గట్టుమీద శాండిల్యమహర్షి శ్రీమన్నారాయణుడికై తపస్సు చేయగా ప్రత్యక్షమై, అతడు బదరికాశ్రమం వెళ్లి తపస్సు చేయాలనుకొన్నానని తెలిపితే ,అక్కడ ఉన్నదీ తానే అని చెప్పి ,తను కొద్దికాలం లో ఇక్కడికే వచ్చి ఇక్కడే ఉంటానని చెప్పి వెళ్ళవద్దన్నాడు  .సరే అని శాండిల్యమహర్షి ఇక్కడే ఉంటూ బద్రీనాధుని సేవించాడు .ఈ దేవుడే శెల్వప్పిళ్ళ దేవర గా పూజలు  అందుకొంటున్నాడు.

  త్రేతాయుగం లో శ్రీరాముడు వనవాసం చేస్తూ తిరునారాయణ క్షేత్రానికి వచ్చి,కళ్యాణీ తీరం లో ఉంటూ సీతా లక్ష్మణ సమేతంగా శ్రీతిరునారాయన మూర్తి పూజాదికాలు త్రికరణ శుద్ధిగా చేశాడు  .ఒకరోజు స్వామి స్వప్నం లో కనిపించి ,ఆయన రావణ సంహారం తర్వాత అయోధ్యలో పట్టాభి షేకం జరిగాక ,రామరాజ్యపాలన లో తాను వేరొక అంశతో అక్కడికి వస్తానని చెప్పాడు . శ్రీరామ పట్టాభి షేకం తర్వాత విభీషణుడు లంకకు తిరిగి వెడుతుంటే ,తరతరాలుగా ఇక్ష్వాకుల ఇలవేల్పు అయిన శ్రీ రంగనాథ స్వామి అర్చామూర్తిని అతడికిచ్చిపంపాడు రాముడు .దారిలో శ్రీరంగం దగ్గర ఆగగా ,అక్కడినుంచి కదలక పొతే అక్కడే ప్రతిష్టించాడు .ఇంట్లో అర్చామూర్తి లేదు కదా అని బాధపడుతుంటే బ్రహ్మ తాను అర్చించే తిరునారాయణ  హృదయోద్భవంబైన శ్రీ రామప్రియ మూర్తినిచ్చాడు .

   శ్రీరాముని కుమారుడు కుశుడి కూతురు కనకమాలికను చంద్ర వంశ యదు శేఖర మహారాజుకిచ్చి పెళ్లి చేసి ,స్త్రీధనం తో పాటు తన అర్చామూర్తి రామప్రియను కూడా ఇచ్చేశాడు .అప్పటినుంచి యాదవ వంశం వారంతా రామప్రియ అర్చారూపాన్నే పూజించారు .ఇలాసూర్యవంశ అర్చామూర్తి చంద్ర వంశ అర్చామూర్తిగా మారింది .తిరునారాయణ దివ్య క్షేత్రం లో ,దివ్య విమానానికి వాయవ్యం లో శ్రీ యతుగిరి నాచ్చి ఆలయం ఉంది.విష్ణు వర్ధన రాయలకాలం లో ఆ దేవి అనేక యుద్ధాలలో అతడికి విజయం చేకూర్చింది .ఆమె వీరావేశాన్ని ఉపశమించ జేయటానికి నారాయణ మూర్తి గజేంద్ర వరదుని రూపంలోతనభార్యకు  కనిపి౦చగా, శాంతించింది  .అప్పటినుంచి శౌర్యనాయకి గా పిలువబడి అర్చనలు  అందు కొంటోంది .తురుష్కులలనుంచి దేశాన్ని రక్షిస్తూ యుద్ధం చేస్తున్న  తిరుమలనాయక రాజు  కలలో దేవి కన్పించి అభయమిచ్చి గెలిపించింది .హిరణ్యకశిపుని కొడుకు భక్త ప్రహ్లాదునికి స్మృతితి సంతాన రూప ధ్యానానికి ప్రత్యక్షమై న ప్రహ్లాద వరదుడు ,తూర్పున నృసింహ గిరిశిఖరం పై యోగ నృసింహస్వామిగా  ఉంటూ భక్తుల కోరికలు తీరుస్తున్నాడు .

   పూర్వం ఒకసారి వ్యాస అంబరీష శుక పుండరీక ,రుక్మాంగద మొదలైన మహా భక్తులు ,రాక్షసుల బాధ లేకుండా తపస్సుకు భద్రమైన ప్రదేశం ఏది అని చర్చించి ,తిరునారాయణపురమే శ్రేష్టమైనదని నిశ్చయించారు ..అందరూ ఇక్కడే కొంతకాలం తపస్సు చేసి యోగ నరసింహస్వామిని సేవించారు .అది కలియుగ వైకుంఠం లాగా ఉందని భావించి ,ఇక్కడే స్వామిని శాశ్వతంగా ఉండిపొమ్మని ప్రార్ధించారు .కల్యాణి తీర్దానికి పడమట జ్ఞానాన్న అశ్వత్ధ వృక్షం క్రింద తపస్సు చేశారు .

  పూర్వం వరాహావతారం లో విష్ణు మూర్తి సముద్రం లో మునిగినన భూమిని పైకేత్తుటవలన హిరణ్యాక్షుడిని వధించటం వలన కలిగిన శ్రకు కారిన చెమట ఇక్కడ శ్రీ పుష్కరిణి అయింది .పూర్వం సనకాదులు ఇక్కడ స్నానాదులు చేసి ఆనంద పరవశం తో ‘’కళ్యాణ్ కళ్యాణ్’’అనటం చేత దీనికి కల్యాణి పుష్కరిణి పేరు వచ్చింది .గంగాది నదీ స్నాన ఫలితమే ఇందులో చేసినా లభిస్తుంది .ఈ తీర్దానికి తూర్పున వరాహ క్షేత్రం లో శ్రీ లక్ష్మీ వరాహస్వామి కొలువై ఉన్న దేవాలయం ఉన్నది .దక్షిణాన సీతారణ్య క్షేత్రం లో శ్రీరామాదులు ఇక్కడికి వచ్చినప్పుడు దప్పిక బాగా అయితే రాముడు చేసిన బాణ ప్రయోగం తో భూగర్భజలం పైకి వచ్చితీర్ధంగా మారి ధనుష్కోటి అనే పేరు పొంది,గిరికి దక్షిణంగా ప్రవహిస్తోంది .కల్యాణి తీర్దానికి పశ్చిమాన వ్యాసాంబరీషాదులు తపస్సు చేసిన భూమిని పంచ భాగవత క్షేత్రం అంటారు .దీనికి దగ్గరలో ఒకప్పుడు స్వేత ద్వీపం నుంచి ఇక్కడికి గరుత్మంతుడు వచ్చికొంతకాలమున్న ప్రదేశాన్ని తార్క్ష్యక్షేత్రం అంటారు .ఉత్తరాన ఉన్న నాయన క్షేత్రం లో శ్రీ కేశవ స్వామి దేవాలయం ఉన్నది .కల్యాణి పుష్కరిణి లో మూడు రోజులు స్నాన జపతపాలు చేసిన ,తిరునారాయణ,యోగ నరసింహస్వాములను  అర్చిస్తే ,12అశ్వ మేధయాగాల ఫలితం లభిస్తుంది .

 క్షీర సాగరం లో యోగ నిద్రలో ఉన్న మహావిష్ణువు కిరీటాన్ని ప్రహ్లాదుని కొడుకు విరోచనుడు ఎత్తుకు పోయి పాతాళం లో దాక్కున్నాడు .యోగనిద్ర నుంచి మేల్కొన్న విష్ణువు ఈ విషయన్ని గరుత్మంతుడికి తెలియజేయగా ,ఆయన పాతాళానికి వెళ్లి వాడిని జయించి కిరీటం తో సహా భూలోకానికి వచ్చి ,శ్రీ కృష్ణుని దర్శించి ,బృందావనం వెళ్లి ,గోపగోపికలతో వేణు వినోదలోలుడైన శిఖి పింఛఛమౌళిని దర్శించగా అతని చేతిలోని కిరీటం చూసి ఆశ్చర్యపోయి ,దాన్ని అడిగి తీసుకొని ధరిస్తే సరిగ్గా సరిపోయింది .తాను  అర్చించేఅనిరుద్ధుని ఇంట్లో ఉన్న  రామప్రియ అర్చామూర్తికి పెడితే సరిపోయింది .క్షీరాబ్ధి శయనుడైన మహా విష్ణువు శిరస్సు రెండున్నర లక్షల యోజనాల నిడివి అయినా కృష్ణుడి శిరస్సుకు ,అర్చామూర్తి శిరస్సుకుసరిపోవటం ఏమిటని ఆశ్చర్యపడ్డాడు వైనతేయుడు.వైకు౦ఠం చేరి స్వామికి జరిగినదంతా వివరించాడు .ఆయన సంతోషించి ఆకిరీటాన్ని శ్రీరామప్రియ అర్చామూర్తి కే అందజేయమని  గరుత్మంతునికిఆనతిచ్చి సమర్పింప జేశాడు .వైనతేయుడు తెచ్చింది కనుక ‘’వైరముడి ‘’అనిపేరు .వైరము అంటే వజ్రం కనుక వజ్రాలు పొదగిన కిరీటం అనీ అర్ధం

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -9-10-20-ఉయ్యూరు  ,

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుమారు 10ఏళ్ళక్రితం నేను శూద్రకుని ”పద్మ ప్రాద్భుతకం ”అనే బాణం పై రాసిన వ్యాసం ఈ అక్టోబరు మిసిమిలో ప్రచురితం

 

 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

నువ్వు కొండ మహాత్మ్యం

నువ్వు కొండ మహాత్మ్యం

నువ్వు కొండకు వ్యవహారిక నామం బెండి కొండ .విశాఖ జిల్లా టెక్కలి తాలూకా పాత టెక్కలి జమీన్ లో ఉన్నది .ఒకప్పుడు ఈ కొండ ఇద్దరు వర్తకుల నువ్వుల రాశి .వారు తిలాధిపతి శనీశ్వరుని తృప్తి కలిగించకపోవటం వలన ఆగ్రహం కలిగి వాళ్ళ నువ్వుల రాశిని పెద్ద కొండగా మార్చాడట .పశ్చాత్తాపం చెంది మళ్ళీ స్వామిని ప్రార్ధిస్తే ,మళ్ళీ నువ్వుల రాశిగా మార్చటానికి వీలు లేదని చెప్పి ,వాళ్లకు ప్రీతి కలిగించటానికి  తాను  ఆకొండపై నివాసం ఏర్పాటు చేసుకొని భక్తుల కోరికలు తీరుస్తూ ఉంటానని చెప్పి , శనీశ్వరుడు అంతర్ధానమయ్యాడు .

  రామయోగి అనే ఒక సాధువు పెరుగు మాత్రమె తింటూ ,మితభాషిగా ఉంటూ ఈ కొండపై తపస్సు చేసి ,40రోజులకు పైగా నిరాహారంగా ఉండి4-3-1938 న ఈశ్వరనామ సంవత్సర శుక్లపక్ష విదియ గురువారం అపరాహ్ణంలో సిద్ధి పొందాడు .అప్పటినుంచి ఈకొండ  నువ్వుకొండ శ్రీ రామ క్షేత్రంగా ,శ్రీరామయోగి క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది .ఈ రామయోగిపై టెక్కలి ఆంగ్ల ఉన్నత పాఠశాల సహోపాధ్యాయుడు శ్రీ మండలీక సీతారామయ్య ‘’నువ్వు కొండ యోగి రామ శతకం ‘’రాశాడు .1941లో రాజమండ్రి శ్రీ రామాప్రెస్ లో ప్రచురింపబడిన ఈ శతకం వెల కేవల౦ నాలుగు అణాలు అంటే పావలామాత్రమే .రాసినవాడు రాయిన్చుకోన్నవాడు ,ముద్రించిన ప్రెస్ అంతా రామమయ౦  అవటం యాదృచ్ఛికం కాదు సుకృతంగా భావించాలి .

  ఇందులో ప్రార్ధన ,శతకానికి ప్రేరణ ,సంక్షేపంగా నువ్వుకొండ చరిత్ర ,నువ్వు కొండ క్షేత్ర పాలక శనీశ్వర అష్టకం ,రామయోగి ద్వాదశ మంజరి స్తోత్రం ,శతక మాహాత్మ్యం ,శతక సంకల్పం ,రామయోగి శతకం ,టిప్పణి ఉన్నాయి .

  కవిగారి వియ్యంకుడు ఒక సారిటెక్కలి వచ్చి,పక్షవాతంతో బాధపడుతున్న కవిని చూసి పద్యాలతో రామయోగిని ప్రస్తుతిస్తే నయం అవుతుందని సలహా ఇవ్వగా ,శతకరచనకు ఉపక్రమించాడు కవి .ఈ కవిగారే చాలా విపులంగా ‘’నువ్వుకొండ మహాత్మ్యం ‘’కూడా రాశానని చెప్పుకొన్నాడు .

మత్తకోకిలం లో శని దేవ స్తుతి

‘’శ్రీకరంబగు నువ్వుకొండ విచిత్రమొప్పగ నీ కృపన్ –నీకు శాంతి నివాసమౌనని నిశ్చయంబుగ బల్కుటన్

మాకు సర్వ శుభంబు లిచ్చుచు మమ్ము రక్షణ సేయుమీ-నీకు దండముపెట్టి ఎక్కితి నీదు శైలము గొల్వగాన్ ‘’

రామయోగి ద్వాదశ మంజరి స్తోత్రం లో ఒకపద్యం –

‘’శ్రీరామ భక్తుడై చెలగుచు నువ్వు కొండ రాల సందున డాగురామయోగి –రాముడే కాని వేరేమి లేదని చాటు పూర్ణ వైరాగ్యుడౌ పుణ్యమూర్తి

పెరుగుమాత్రమె త్రాగి  పెను తపస్సును జేసి –పరమాత్ము నెరిగిన పరమహంస –పదునెనిమిది యగు వందలేబది తొమ్మిది శక మీశ్వర ఫాల్గుణ శుచి పక్ష

మందు విదియను   భ్రుగువాసరాపరాహ్నమందు –నలువదినాళ్ళనిశమున

బ్రహ్మ పద మొ౦ది తిలరాశి పర్వతమున –రాముడి వెలసెను జూడీరంజితంబుగ

ఏ శబ్దం  విన్న రామ శబ్డంగానే భావిస్తూ ,ఎవరు కనిపించినా రామునిగాతలుస్తూ,పంచేంద్రియాలకు ఏది సోకితే అది రాముడిదే అనుకొంటూ ,ఎవరుపిలిచినా రాముడే పిలుస్తున్నాడని బదులు పలుకుతూ ,అడుగో రాముడు ఇడిగో రాముడు అని పరిగెత్తుతూ,కనపడకపోతే నిరాశ చెందుతూ ‘’రాజిత విరాగి నువుకొండ రామయోగి ’’ భక్త  రామదాసులా అంతా రామమయం గా భావించాడు.అధ్వాన్న౦గా  ఉండే  ఆకొండ రామయోగి వలన అగ్రగణ్య మైంది.ఆయన కులం జాతిచదువు,అర్హత  ఎవరికీతెలీదు  .నిజమైన ‘’యోగి రాముడే రామయోగి’’ .కనుక తన శతకం పఠిస్తే,అన్నీ లభించి మోక్షం కూడా కలుగుతుందని హామీ ఇచ్చాడు కవి .తాను కొండ ఎక్కలేను ,కానుక లివ్వలెను కనుక శతకమే తన సర్వస్వం అని ,దాన్నే స్వీకరించి దయచూపమని కవి రామయోగిని వేడుకొన్నాడు  .

  రామయోగి శతకం మకుటంగా ‘’నువుకొండ యోగిరామ ‘’అనికాని శ్రీరామ యోగిరామ ‘’అనికాని ఎవరికి ఎలా ఇష్టం అయితే అలా చదువుకో వచ్చుననని కవి చెప్పాడు .మచ్చుకు కొన్ని పద్యాలు చూద్దాం –

‘’ఆదిత్య హృదయ నిన్నాహ్వానము జేతు –నధ్యాత్మ ఫలదాత యాసనమిదె-‘’

‘’వేయి కన్నుల దొరవీక్షి౦పగాలేని –నీ రూపమెప్పుడు నిరతి జూతు’’

‘’యెందుంటివో రామ ఇట కేలరావయ్య –యొక లిప్త దర్శన మొసగ రాదె’’

‘’శిడికీ నీకు భేదం లేదు .ఒకడు పందిని కొడితే ఇంకోడు కోతిని కొట్టాడు –‘’ఇద్దరు వ్యాథులె ఎంచి చూడ ‘’అని చమత్కరించాడు కవి .ఒక తమ్ముడికి పాడుకలిచ్చి బైరాగిని చేసి ఇంకో తమ్ముడికి ఆహార నిద్రలు లేకుండా చాకిరి చేయి౦చు కొన్నావని ,అన్నను గుహలో పెట్టి అతని భార్యను అపహరించినవాడి పక్షం చేరావు ,అన్నకు ప్రతిపక్షి ఐనవాడిని శరణాగతుని చేసి రాజ్యం అప్పగించావు అంటూ మన కాసులపురుషోత్తమకవి లాగా నిందా స్తుతి చేశాడు .దాన ధర్మాన్ని నిర్వర్తించే దాతను పాతాళం లోకి పంపి కూడా జగద్రక్షకుడవు అయ్యావని మేలమాడాడు .చివరి పద్యం –

‘’మంగళమో రామ ,మంగళమో శ్యామ –మంగళమరిభీమ మంగళంబు-మంగళము శివాత్మ మంగళమధ్యాత్మ-మంగళము మహాత్మమంగళము –మంగళమోశౌరి ,మంగళమో సూరి-మంగళము మురారి మంగళము

మంగళము బుధాయ ,మంగళము ధృవాయ –మంగళ మమలాయ మంగళంబు

హారతిం గొను మాది మధ్యంత రహిత –హారతిం గొను విశ్వేశ యఘ వినాశ –

హరతిం గొను మవ్యయాహ్లాద రూప –యోగ గణధామ నువుకొండ యోగి రామ ‘’

అని 108వ పద్యం తో శతకం పూర్తి చేశాడుకవి  .గ్రేడ్ వన్ తెలుగు పండితుడు అవటం వలన కవిత్వమూ గ్రేడ్ వన్ గానే సాగింది .ధారాపాతంగా ఈ పద్యాలన్నీ సీసపద్యాలుగా తేటగీతులు తో కూర్చాడు. చక్కని భావన ,ఊహ చమత్కారం గుండెనిండా భక్తిభావం మాధుర్య  విలసిత౦ గా శతక పద్యమాలకూర్చి ఆరామునికీ, రామయోగికీ  సమర్పించిన పరమభక్తాగ్ర గణ్య కవి మండలీక సీతారామ సుకవి .ఈ కవి గురించి ఎంతమదికి తెలుసో నాకు తెలియదు .సరసభారతి అలాంటి భక్తికవి ని పరిచయం చేసే భాగ్యం పొందిందని వినయంగా తెలుపుకొంటున్నాను .

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-10-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మర్రి గుంట శ్రీ పాండురంగ స్వామి దేవాలయం

మర్రి గుంట శ్రీ పాండురంగ స్వామి దేవాలయం

కలియుగం లో భక్త పుండరీకుని ఉద్ధరించాలని పు౦డరీకాక్షుడైన శ్రీ మహా విష్ణువు మహారాష్ట్ర చంద్ర భాగా నదీ తీరం లో పండరీపురం లో పాండురంగ నామం తో వెలిశాడు .జ్ఞాన దేవ నామదేవ ,ఘోరాకుభార్ ,తుకారాం ,తులసీదాస్ ,సక్కూబాయి, మీరాబాయ్, జ్ఞానాబాయ్ గోమాబాయ్ మొదలైన భక్తులను రక్షించాడు .చాలాకాలం అక్కడే ఉండి,విసుగుపుట్టి ,కలికాలంలో భక్తులు కస్టపడి తన దగ్గరకు రాకపోవటం తో కలత చెంది ,తానేభక్తులను వెతుక్కుంటూ అన్ని లోకాలు తిరుగుతూ చిత్తూరు జిల్లా ఏర్పేడు తాలూకా మర్రి గుంటపురం (వట గర్త పురి )చేరాడట.అక్కడి భక్తుల భక్తిశ్రద్ధాలకు ఆనంద పడిఅక్కడే ఉండిపోవాలని నిశ్చయించాడు .ఆ గ్రామవాసి అయిన శ్రీ అరి గొండ శ్రీనివాస కవి ఈ వృత్తాంతాన్ని ‘’మర్రి గుంట పాండు రంగ శతకం ‘’గా రాశారు  .

   ఈ శతకం రాయాలని అనుకొన్నప్పుడు ఒకరోజు మధ్యాహ్నం భోజనం చేసి నిద్ర పోతుంటే ఆగ్రామవాసి అయిన బ్ర వే.పత్తంగి రాఘవాచార్యులు కలలో కనిపించి మంచి ప్రయత్నమే అనీ ,కానీ  అందరికీ అర్ధమయేట్లు ‘’లీలా వృత్తం ‘’లో రాయమని హితవు చెప్పారు .నిద్ర లేచిన కవికి అది పాండురంగ స్వామి ప్రబోధమే అని పించి,వెంటనే అలవోకగా అయిదు ప్రార్ధన పద్యాలు స్పురించగా  కాగితం పై వ్రాసి శతక రచన శ్రీకారం చుట్టాడు కవి .దీనికి తప్పొప్పులను సవరించినవాడు కవి ,పౌరాణికుడు శ్రీ కన్నె గంటి చిన లింగా చార్యుడు .శతక ముద్రణ చేసినవారు పౌరాణిక పితామహులు కొత్త పేటకు చెందిన శ్రీ కాకుమాను సూర్య నారాయణ రావు .గుంటూరు చంద్రికా ముద్రాశాలలో 1944లో ముద్రింపబడిన దీని వెల అర్ధరూపాయి మాత్రమే.

   ప్రతి పద్యం చివర’’ పాండురంగా ‘’అని వస్తుంది .ఇస్ట దేవతా ప్రార్ధన చేసి ,పురవర్ణన చేశాడు కవి .ద్వాపరం లో ద్వారక గా ,గోపికలకు ఉనికి పట్టుగా ఉండేది మర్రిగుంట. కవి తాతపుల్లయ్య కాళహస్తి ప్రభువు మంత్రి .తల్లి పేరమ్మ తండ్రి కాళప్ప .భార్య కన్నమ్మ .కవి వంశంవారు ఈ ప్రాంత ప్రభువులు .అని చెప్పి దశావతారాలు వర్ణించి ,పాండురంగ స్వామి ఆపురం లో ఎలా  ప్రవేశించాడో చెప్పాడు .1936లో ఈ సంఘటన జరిగిందట .

‘’పదియు తొమ్మిది వందలున్ -గడిచి ముప్పది దాటి యటు మీదటన్ –గదియు నారవ యేటను –నీమహిమ గా౦చి తిమి పాండురంగా’’ గొల్ల ఇళ్ళల్లో చోటుదోరక్క మర్రి గుంటవచ్చావా అంటాడు  .స్వామి ఇక్కడికి రావటం ఇష్టం లేక ,ఓర్వలేక కొందరు పోరాటం చేసి ఓడిపోయారు .తిట్టిన వాళ్ళు, పూజ చెడగొట్టిన వాళ్ళూ మట్టిలోకలిసిపోయారట .న్యాయాన్యాలు తెలీకుండా పక్షపాతం చూపినవారు’’ పాడైరి పాండురంగా’’అన్నాడు .

  ‘’శృంగారదేవ రంగా నా నమస్కృతి నీకు పా౦డుర౦గా –  రంగత్కృపా౦తర౦గా –రుక్మిణీ రమణ జై పాండురంగా ‘’అని 62పద్యాలు రాశాడు కవి .తర్వాత రామాయణం ఆరు కాండలు ఇలాగే 90వ పద్యం వరకు రాశాడు .91నుంచి108వరకు  ‘’నీతిలీలావళి  ‘’రాసి ఫలశృతి చెప్పాడు .శతకం పఠిస్తే సంతానం కలుగుతుందని ,ముక్తి’’ తంగేటి జున్ను’’ ఔతుందని భరోసా ఇచ్చాడు  .శ్రీ స్వభాను నామసంవత్సర కార్తీక శుద్ధ దశమినాడు కావ్యం పూర్తి చేశానని కవి చెప్పుకొన్నాడు .చివర్లో మంగళం పాడాడు –

‘’మంగళము శ్రీనివాసా మంగళము మరిగుంట పురనివాసా –మంగళము చిద్విలాసా –నీకు జయ మంగళము పాండురంగా ‘’

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-10-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన సుకవి ఆత్రేయ -2

     మన సుకవి  ఆత్రేయ -2

శ్రీమతి పద్మావతి గారిని ఆత్రేయ 1940 ఫిబ్రవరి 10న పెళ్లి చేసుకొన్నాడు .కాని అంతకు ముందే పీకలలోతు ప్రేమలో పడ్డాడు వీణా పాణిని  ‘’బాణం ‘’గారితో .కాని పెళ్లి చేసుకోలేకపోయాడు .ఇప్పుడు పెళ్లి అయిందికాని ప్రియురాల్ని మర్చి పోలేక పోతున్నాడు .ఈప్రేమ గాయమే ఆయన ప్రేమ పాటలకు, వీణ పాటలకు ప్రేరణగా నిలిచాయి .పిలిస్తే అలవోకగా పలికి బహుశా ఆయన కళ్ళ ముందు ఆమె ప్రత్యక్షమై బాణం గాయం కలిగిస్తుందేమో .ఆత్రేయ రచన అంతా రాత్రిళ్ళే చేస్తూ ‘’రాత్రేయ ‘’అనీ అనిపించుకొన్నాడు .ఆత్రేయ ముఖ్య శిష్యుడు జేకే భారవి రోజూ ‘’తెల్లారింది ఇక పడు కొందాం గురూ గారూ ‘’అనేవాడట .రాత్రేయ తో పాటు బూత్రేయ అనీ అనిపించుకోన్నాడని ముందే చెప్పుకొన్నాం .’’అబ్బా దెబ్బ తగిలిందా ?’’అనే పాటలో ‘’తగలరాని చోట తగిలింది ‘’అని రాస్తే సెన్సార్ అభ్యంతరం చెబితే ఆత్రేయనే పంపిస్తే ,వాళ్ళని ‘’తగల వలసిన చోటు ఎక్కడో చెప్పండి ?అని ఎదురు ప్రశ్నవేస్తే తెల్ల మొహతో బిత్తర పోయారు ‘’కత్తెర గాళ్ళు ‘’.

  చత్వారం వచ్చినా ,కళ్ళజోడు వాడే వాడు కాదు ఆత్రేయ .రాత్రిళ్ళు చదవాల్సి వస్తే చిన్నక్షరాల్ని భూతద్దం లో చూసి చదివే వాడు .ఒకసారి ఒక నిర్మాత వచ్చి ‘’ఏమిటి భూతద్దం లో వెతుకుతున్నారు ?’’అని అడిగితె ‘’నా రచనలో బూతు ఎక్కడుందో వెతుకుతున్నాను ‘’అని జోక్ చేసిన జోడు, సరి జోడు లేని కవి ఆత్రేయ .ఆయన స్వయంగా చేత్తో ఏదీ రాయడు .చెబుతుంటే శిష్యులు రాయటమే .అ౦దుకే ఆత్రేయను సరదాగా ‘’డిక్టేటర్’’అనేవారు .విశ్వనాథ కూడా గొప్ప డిక్టేటర్ .ఆయన చెబుతుంటే తమ్ముడు వెంకటేశ్వర్లు గారు రాసేవారు .మోదుకూరి జాన్సన్ వచ్చి ‘’గురూజీ .నేను మీ దారిలోనే నడుస్తున్నాను. డబ్బిస్తే కాని రాయటం లేదు ‘’అన్నాడు ‘’పిచ్చోడా !నేను డబ్బిచ్చినా రాయను తెలీదా ‘’అన్నాడునవ్వు తూ .

  మొదట్లో ఆత్రేయ జీవితం వడ్డించిన విస్తరి కాదు .ఒక రోజు పావలా దొరికితే దానితో ఎక్సర్ సైజ్ పుస్తకం కొని ,వీధి దీపం కింద కూర్చుని ‘’గౌతమబుద్ధ ‘’నాటకం రాశాడు .దానికి పబ్లిషర్ 50 రూపాయలిస్తే ,అదే పది వేలుగా భావించాడు .ఒక జత బట్టలు మాత్రమే ఉండేవి .నాటకాల తెరలు కట్టుకొని దుర్భర దారిద్ర్యాన్ని అనుభవించాడు మహానుభావుడు .మద్రాస్ వచ్చిన కొత్తలో ఇంటింటికీ వెళ్లి సబ్బులు అమ్మేఉద్యోగం చేశాడు .హాస్యనటుడు రమణారెడ్డి పావలాయో బేడ నో ఇచ్చి టిఫిన్ చేయమనే వాడు .ఆతర్వాత సినిమా రచనలో లక్షలు సంపాదించాడు .ఐతే చివరి రోజుల్లో మళ్ళీ దరిద్రమే అనుభవించాల్సి వచ్చింది .మాటల రచయిత దివాకర బాబు తో ‘’నా కీర్తి ప్రతిస్టల్ని తాకట్టు పెట్టుకొనే వాడెవడైనా ఉంటే బాగుండు ‘’అని బాధ పడ్డాడు.ఈ విషయం తన ఆత్మకథలో రాసుకొన్నాడు కూడా . దీనిపై ఆయనే ‘’లక్షలార్జించి,ధనము నలక్ష్య పరచి ఖర్చు చేసితి స్వపర సుఖాల కొరకు –ప్రొద్దు గ్రు౦కెడు వయసున బొక్కసాన –లేదు చిల్లి గవ్వైన నన్నాదుకొనగ’’అని శ్రీనాథకవి సార్వ భౌము డిలాగా  చేసిన తప్పులు తెలుసుకొని  చెంప లేసుకొన్నాడు .అప్పటికే కాలం చాలా మించిపోయింది .

  మే7న పుట్టిన రోజు జరుపుకొనే అలవాటున్న ఆత్రేయ ,తిది వార నక్షత్రాదులు చూసి మే21 న జరుపుకొంటున్నట్లు ప్రకటించాడు .సంఖ్యాశాస్త్రం మీద ,నాడీ జ్యోతిష్యం పైనా నమ్మకం ఎక్కువగా ఉండేది .

   కే ఎస్ ప్రకాశరావు ఆత్రేయ ను తన దీక్ష సినిమాలో పాటల రచయితగా పరిచయం  చేయటమే కాదు ,మాటల రచయితగానూ ఆసినిమాతోనేపరిచయం  చేశాడు .ఈ సినిమాకు తాపీ ధర్మారావు గారితో కలిసి సంభాషణలు కూర్చాడు ఆత్రేయ .ఆత్రేయ సంభాషణలు రాసిన చివరి సినిమా ‘’లైలా –1989.డా చక్రవర్తి సినిమాలో ‘’మనసున మనసై బ్రతుకున బ్రతుకై ‘’పాట మనసు పాట కనుక ఆత్రేయ రాసిందని పొరబడుతుంటారు .ఆదిశ్రీ శ్రీ రాసిన పాట . మొత్తం మీద 2వేల సినిమా పాటలు ,200సినిమాలకు మాటలు రాసిన సవ్యసాచి ఆత్రేయ .

  1989మే 5న ఆంద్ర సారస్వత విద్యాలయం ఆత్రేయకు ‘’గౌరవ డాక్టరేట్ ‘’ప్రదానం చేసింది .సతీ సావిత్రి సినిమా టైటిల్స్ లో ఆత్రేయను ‘’కవితా సుధానిధి ‘’అని సినీ డైరెక్టర్ పరిచయం చేశాడు .ఆత్రేయలాంటి రచయిత తమిళ౦ లో ‘’ కణ్ణదాసన్’’.అందుకే ఆత్రేయ ను ‘’ఆంధ్రా కణ్ణ డాసన్’’ అంటారు  .ఇద్దరూ నాటకాలకు గొప్ప అవార్డులు పొందిన వాళ్ళే.ఆత్రేయను ‘’ఆంధ్రా ఇబ్సన్ ‘’అని కూడా అంటారు .

   తెలుగు సినిమా స్క్రిప్ట్ కు స్వరూప స్వభావాలు అందించిన మొదటి రచయిత ఆత్రేయ .డైలాగ్స్ రాసే ముందు తెల్లకాగితం పై ‘’శ్రీ విఘ్నేశ్వరాయన మః’’అని రాసి, పేపరును నిలువుగా మధ్యలో మడిచి ఎడమవైపు రెడ్ ఇంకు తో యాక్షన్ పార్ట్ ,కుడివైపు బ్లూ ఇంకు తో సంభాషణలు రాసేవాడు .తన స్వంత సినిమా వాగ్దానం కుకూడా అందరూ షూటింగ్ కువచ్చి రెడీ గా ఉంటె ,అప్పుడు డైలాగులు రాయటం మొదలు పెట్టాడు .అక్కినేని మేమంతా ఎదురు చూస్తుంటే మీరు ఇప్పుడు మొదలు పెట్టారెంటి ?’’అని అడిగితె ‘’నా సినిమాకు నేను ముందే రాస్తే , నాకు పక్షపాతం ఉందనుకుంటారు నిర్మాతలు ‘’అన్నాడట ఇద్దరూ పగలబడి నవ్వేశారు .’ఎలెవెంత్ అవర్ లో నే ఎందుకు రాస్తారు””? అని ఎవరో అడిగితే ,ముందే రాస్తే ,ప్రతివాడూ కరెక్షన్ అంటూ  షంటుతాడు అందుకు అన్నాడు..నిత్య జీవితం లో పుష్కలం గా హాస్యం పండించిన ఆత్రేయ ఏ సినిమాలోనూ హాస్య సన్నివేశాలలో హాస్య సంభాషణ లు రాయలేదు .ఆయన బదులు అప్పలాచార్య ,కొర్రపాటి గంగాధరరావు లాంటి వారితో నిర్మాతలు రాయించేవారు..’’కామెడీ మేకింగ్ లో కింగే కాని, డైలాగ్ లో డల్ ‘’అంటారు .జీవన తరంగాలు సినిమాలో బాగ్రౌండ్ సాంగ్ పెట్టాలని నిర్మాత ,డైరెక్టర్ అనుకోలేదు .అప్పుడు అక్కడికొచ్చిన ఆత్రేయ పెడితే బాగా పండుతుంది అని చెప్పి రాసి ,ఏ సన్నివేశం ఎక్కడ పెట్టాలో వివరంగా బోధించాడు .ఆసాంగ్ సూపర్ డూపర్ హిట్ సినిమాతోపాటు..’మనిషే మనిషికి బందిఖానా –భయపడి తెంచుకు పారిపొయినా-తెలియని పాశం వెంటబడీ ఋణం తీర్చుకోమంటుంది –నీ బుజం మార్చుకో మంటుంది ‘’దృశ్యాన్నీ ,సాహిత్యాన్ని గొప్పగా సమన్వయ౦  చేశాడు .దటీజ్ ఆత్రేయ .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-10-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుంకర కోటేశ్వరరావు గారికి ధన్యవాదాలు

సుంకర కోటేశ్వరరావు గారికి నమస్తే .సరసభారతి పై మీకున్న అభిమానం మాటలతో చెప్పలేనిది . సరసభారతి సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలను గమనిస్తున్న మీరు అడగకుండానే  ఎన్నో సార్లుసరసభారతి కి విలువైన విరాళాలు అందజేస్తున్నారు .మీ వదాన్యత ఆదర్శప్రాయం సాహిత్య సాంస్కృతికాల వ్యాప్తికి ఉద్దీపనాలుగా ,మాకు వెన్ను దన్నుగా నిలుస్తున్నారు మీరు .

  అనుకోకుండా నిన్న   సరసభారతి అభివృద్ధికి బాంకు ద్వారా  పంపిన 10 వేలరూపాయలు  ,నా అకౌంట్ లో జమ అయినట్లు ఇవాళ చూసి ఆశ్చర్యం పొంది , ,కృతజ్ఞతలు  తెలియ జేస్తున్నాను .ఉయ్యూరు దగ్గర ఉన్న మీ స్వగ్రామం గండిగుంటను వదిలి ,చాలా కాలం గా హైదరాబాద్ లో ఉంటున్నా ,ఇక్కడి విశేషాలను  సరసభారతి బ్లాగు ద్వారా తెలుసుకొంటూ ,ప్రోత్సహిస్తూ ,యూనివర్సిటీ గ్రంథాలయాధికారిగా మీరు పని చేసి  రిటైరయినా  సాహితీ ప్రియత్వం ,వ్యాసంగం  . ,సారస్వత ప్రియులందరి కి మార్గ దర్శనం  సరసభారతి పై మీకున్న అభిమానానికీ .,,మీ భారీ వితరణకు మరొక్క మారు ధన్యవాదాలు తెలియ జేస్తున్నాను -దుర్గాప్రసాద్
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మన సుకవి ఆత్రేయ -1

మన సుకవి ఆత్రేయ -1

రోడ్డున పడ్డ మనిషికి రోడ్డుపై గాంధీ బొమ్మే ధైర్యం చెప్పి ముందుకు సాగేట్లు చేసింది .అదే ప్రబోధ  గీతం  అయింది .దాన్ని అందరికీ నచ్చేట్లు మొదటి చిత్రం ‘’దీక్ష ‘’లో ‘’పోరా బాబూ పో ‘’అని వెన్ను తట్టాడు ఆత్రేయ .సంగీతం పెండ్యాల అందిస్తే ,ఘంటసాల అమరగానం కొండంత బలం చేకూర్చింది .’’ఈమువ్వల గానం  మన ప్రేమకు ప్రాణం ‘’అని 1990లో ‘’ప్రేమ యుద్ధం ‘’సినిమాలో చివరి పాట రాశాడు .నిజంగా నే అయన సినిమాలో రాసినవన్నీ ప్రేమయుద్ధానికి సంబంధించైనా పాటలే ఎక్కువ .వాటిలో ప్రేమ ,ఆరాధన ,శృంగారం ,లాలిత్యం ,విరహం, త్యాగం ,ఆత్మార్పణ ,బలిదానం ,ప్రేమ గెలుపు ఓటమి లపై తనదైన ముద్ర తో పాటలు రాశాడు .మనసు నిండా పలికాయి అవి మనసు లోతులు తరచాయి .మురిపెం చేశాయి ముద్దులొలికించాయి .ప్రేమ పాఠాలు నేర్పాయి .అంతర్వేదనను  అక్షరీకృతం చేశాయి  .అంతకంటే ఇంకెవ్వరూ రాయలేరు అన్న తీర్పునిచ్చాయి .అందుకే అందరి మనస్సులో నిలిచిపోయి మనసు కవి అయ్యాడు మన సుకవి ఆత్రేయ .మధ్యలో జానపద గీతాలు భక్తీ గీతాలు దేశభక్తి గీతాలు ,అభ్యుదయ గీతాలు ప్రబోధాత్మక గీతాలు ,హాస్యగీతాలు రాస్తూ ,లోకంతీరు విశ్లేషిస్తూ ,వీణ పాటలకు ముక్తాయింపు జోడించాడు .అంటే వైవిధ్యమైన సినీ గీతాలు సృష్టించాడు .అంతకు ముందు ఎందరో మహాకవులు సినీ రంగాన్ని ఏలారు .కాని ఒక విలక్షణమైన పదప్రయోగం ,గుండె లోతులు తడమటం ఆత్రేయకే చెల్లింది .అందుకే ముద్దుగా మనసుకవి అని కీర్తి కిరీటం పెట్టారు .ఇంతకీ ఎవరీ ఆత్రేయ ?

కిళాంబి వెంకట నరసి౦హా చార్యులు  అంటే ఆత్రేయ .7-5-1921 పుట్టి ,13-9-1989న 68ఏళ్ళు జీవించి మరణించాడు .ఆత్రేయ గా చెలామణి అయ్యాడు .ఆయన గోత్రం ఆత్రేయస అందులోని ఆత్రేయ కు ముందు తన పేరులోని ఆచార్యులు లోని ఆచార్య శబ్దం తగిలించి తానే తన కలం పేరును  ‘’ఆచార్య ఆత్రేయ ‘’అని పెట్టుకొన్నాననీ అంతేతప్ప  తాను  ప్రొఫెసర్ అనిపిలువబడే ఆచార్యను కాదనీ చెప్పుకొన్నాడు నెల్లూరు జిల్లా సూళ్ళూరు పేట మండలం మంగళం పాడు లో జననం .తల్లి సీతమ్మ ,తండ్రి కృష్ణమాచార్యులు .నాటకపద్యాలు రాగయుక్తంగా పాడే నేర్పు చిన్నప్పటి నుండీ ఉండేది .మధ్యతరగతి కుటుంబ సమస్యలను నేపధ్యంగా చేసుకొని నాటకాలు రాశాడు .వీటిలో పరివర్తన ఎన్జీవో నాటకాలు ఆంద్ర నాటక కళాపరిషత్ అవార్డుల౦దుకొన్నాయి  ఆత్రేయ అంటే ఎన్జీవో నాటకం అనే పేరు స్థిరపడి పోయింది .వందలాది ప్రదర్శనలు జరిగాయి .తర్వాత ‘’కప్పలు ‘’నాటకం రాసి విశేష కీర్తి సాధించాడు .రాయలసీమ కరువు పై ‘’మాయ ‘’నాటకం రాసి ప్రభుత్వాల కళ్ళు తెరిపించాడు .1942లో చిత్తూరు జిల్లాలో ఉపాధ్యాయ శిక్షణ పొందుతూ ,’’క్విట్ ఇండియా ‘’ఉద్యమం లో పాల్గొంటే ,పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడితే ,కొంతకాలం కారాగార వాస శిక్ష అనుభవించిన నిఖార్సైన దేశభక్తుడు ఆత్రేయ .ఉదర పోషణకోసం చాలా ఉద్యోగాలు చేశాడు .ఎక్కడా స్థిరంగా లేడు.నెల్లూరు జిల్లా మున్సిఫ్ కోర్ట్ లో కాపీయిస్ట్ గా కొంతకాలం ,తిరుత్తని సెటిల్ మెంట్ ఆఫీస్ లో గుమాస్తాగా ,నెల్లూరులోని ‘’జమీన్ రైతు ‘’పత్రికకు అసిస్టెంట్ ఎడిటర్ గా కొంతకాలం ,ఆంద్ర నాటక కళా పరిషత్ లో ‘’పెయిడ్  సెక్రెటరిగా కొంతకాలం ఉద్యోగాలు వెలగబెట్టాడు .

.స్వాతంత్రం సాధించాక దేశం లో జరిగిన హిందూ –ముస్లిం హింసా కాండకు ప్రతిబింబంగా ‘’ఈ నాడు ‘’అనే మూడు అంకాల నాటకం రాశాడు .రచయిత సమాజం లో ఉన్న కుళ్ళును కడిగిపారేయటమే కాదు పరిష్కార మార్గం కూడా సూచించాలి అని భావించి ,విశ్వశాంతి కోసం ‘’విశ్వ శాంతి ‘’నాటకం ,రాసి రాష్ట్ర స్థాయి అవార్డ్ పొందాడు .ప్రపంచం లో హింస పెరిగిపోవటం వలన అశాంతి ప్రబలటం గుర్తించి ‘’సామ్రాట్ అశోక ‘’,గౌతమ బుద్ధ’’ నాటకాలు ,దేశంలోని పరిస్థితికి సూచన గా ‘’భయం ‘’నాటకం రాశాడు .ఇంత నాటక రచనాను భవం ఉండటం తో ఆత్రేయ ను తెలుగు చిత్ర రంగం సగౌరవం గా ఆహ్వానించింది .మాటలరచయితగా పాటలరచయితగా,స్క్రీన్ ప్లే రచయితగా కూడా రాణించాడు .స్వయంగా శరత్ నవల ‘’వాగ్దానం ‘’ను తెరకెక్కించి దర్శకత్వమూ చేసి చేతులు కాల్చుకున్నాడు .

  మూడ్ ఉంటేనే రాసేవాడు ఆత్రేయ .లేకపోతే కారణాలు చెప్పి ఆలస్యం చేసేవాడు .రాయకుండా నిర్మాతలను ఏడిపిస్తే ,రాసి ప్రేక్షకులను ‘’మనసారా’’ ఏడ్పించేవాడుఅనే జోక్ ఆత్రేయకే చెల్లింది .అందుకే యెంతఆలస్యమైనా ఆయన రచన కోసం ఎదురు చూసేవారు నిర్మాత దర్శకుడు సంగీత దర్శకుడు .మనసు పెట్టాడా క్షణం లో బంగారం వంటి పాట రాసేసేవాడు .సగటు తెలుగు పలుకు బడులు ఆయన రాసిన మాటలలో, పాటలలో జీవం పోసుకోనేవి .మహదేవన్ సంగీతం, ఆత్రేయ, పాట ,ఆదుర్తి దర్శకత్వం త్రివేణీ సంగమం గా చాలాకాలం సాగి, కనకవర్షం కురిసింది .భక్తి పాటలలో పరవశం కలిగించాడు .హాస్యం తో గిలిగింతలు పెట్టాడు .విషాదం లో శిఖరాగ్రం చేరాడు .అందుకే ఆయన జీవితంలో కూడా విషాదం చోటు చేసుకొని ఉండవచ్చునని ఊహించారు కొందరు.  ద్వంద్వార్ధాల పదాలూ ప్రయోగించి ‘’బూత్రేయ ‘’అనే ముద్ర కూడా తగిలించుకున్నాడు .అది ఆ నాటి కాలమాన పరిస్థితి కూడా .అందుకు అందరూ బాధ్యులే .

  ఆత్రేయ భార్య  శ్రీమతి పద్మావతి గారు .’’సమాజం లోని అన్యాయాలు,అక్రమాల గురించి ఆత్రేయగారు  వ్యధ చెంది   ,వారిజీవితాలలో మార్పు రావాలని ఆయనపడిన వేదన  నాకు తెలుసు ‘’  . .ఆత్రేయ గొప్ప వేదాంతి .లోకాన్ని వాస్తవ దృష్టితో పరికిస్తాడు .అందుకే ఆయనమాటలు అంతప్రభావం కలిగిస్తాయి .పరస్పర ప్రేమానురాగాలు ఆత్మీయతా అనుబంధాలతో ఒకరినొకరు సంభాషించుకోవటమే ఎమోషనల్ దృశ్యాలన్నాడు .ఇలాంటి సెంటిమెంటల్ డైలాగ్స్ రాయటం లో ఆత్రేయ ఘనాపాటీ.’’వేదాంతం ,వైరాగ్యం జోలికి వెడితే మనిషిలోని కార్యదీక్షను ,విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి . శృంగారం మితి మించితే అశ్లీలం అవుతుంది .అలాంటి సందర్భం లో  నేను రాయను అని రచయిత అంటే పరిశ్రమలో ఎవరూ నిలబడ లేడు’’అన్నాడు .

‘’’’భాషను అదుపు చేయటం ,భావాన్ని అదుపు చేయటం లోనూ’’తిమ్మెర ‘’వంటి తేలిక మాటలతో తేనెలు ,తీయని తావులు వెదజల్లటం లోనూ ఆచార్యుడే ఆత్రేయ .తిక్కనకు వారసుడు ఆత్రేయ ‘’అన్నారు శ్రీ వేటూరి సుందరరామ మూర్తి ..’’తినని దేవుడికి బలవంతంగా తిండిపెడతావు ‘.తిండిలేక ఏడ్చే వాడిని తరిమి తరిమి కొడతావు’’ .,’’పని దొరకని పేదవాడిని సోమరి పోతంటారు .పని చేయని గొప్పవాణ్ణి పల్లకీ లో మోస్తారు ‘’ ఇంతకంటే ఏ కమ్యూనిస్ట్ పవర్ ఫుల్ గా చెప్పగలడు?అందుకే తోడికోడళ్ళు సినిమాలో ‘’కారులో షికారు కెళ్ళే పాలబుగ్గల పసిడీచానా –నీ బుగ్గమీద గులాబి రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా ?’’అనే పాట ఆత్రేయ రాశాడు అంటే  ఎవ్వరూ నమ్మలేదు శ్రీశ్రీ రాసి ఉంటాడని భ్రమపడ్డారు మన కమ్మీలు .’’కాటికెడితే అందరూ ఒకటే అనుకో బోకు .అక్కడ కూడా తేడాలున్నాయ్ కాలేవరకు’’,’’బతికుండగా నిన్ను ఏడిపింఛి నోళ్ళు –నువ్వు చస్తే ఏడుస్తారు దొంగ నాయాళ్ళు’’ఇలాంటి పకడ్బందీ మాటలబందీ ఆత్రేయది .

 కళా వాచస్పతి కొంగర జగ్గయ్య ఆత్రేయకు పరమ ఆప్త మిత్రుడు .ఆత్రేయ సాహిత్యాన్ని ‘’మనస్విని ‘’ట్రస్ట్ ద్వారా 7సంపుటాలుగా వెలువరించటానికి ప్రత్యేక శ్రద్ధ చూపింఛి ఆత్రేయకు ఘన నివాళి అర్పించి మిత్ర ఋణం తీర్చుకొన్నాడు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-10-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా త్యాగి మద్దూరి అన్నపూర్ణయ్య-4

మహా త్యాగి మద్దూరి  అన్నపూర్ణయ్య-4

22-3-1922న అన్నపూర్ణయ్య గారు ఆంధ్రయువజన స్వరాజ్య సభ తరఫున ‘’కాంగ్రెస్ ‘’అనే సైక్లో స్టైల్ వార పత్రిక ప్రారంభించారు .క్రొవ్విడి లింగరాజుగారు సహాయ సంపాదకులు .అందులోని ఒక వ్యాసం దేశ ద్రోహం నేరం కింద వస్తుందని సంపాదకులైన మద్దూరి వారికి 18నెలలు శిక్ష విధించింది బ్రిటిష్ ప్రభుత్వం 1923ఫిబ్రవరి నుంచి 1924జూన్ 13వరకు రాజమండ్రి ,వేలూరు జైళ్లలో మొదటి సారిగా శిక్ష అనుభవించారు .1924డిసెంబర్ లో రాజమండ్రికి 13మైళ్ళ దూరాన సీతానగరం లో డా సుబ్రహ్మణ్యంగారు ‘’గౌతమీ సత్యాగ్రహ ఆశ్రమం ‘’నిర్మించగా కాంగ్రెస్ పత్రిక అక్కడి నుంచే వెలువడేది .లింగరాజుగారితోపాటు రామ చంద్రుని వెంకటప్ప కూడా అందులో పని చేసేవారు .

  దేశోద్ధారక నాగేశ్వరరావు పంతులుగారు ఈ పత్రిక కోసం ‘’జర్మన్ క్రెడిల్ టిప్ టాప్’’కొనిచ్చారు దాదాపు మూడు వేల పౌన్ల టైప్ మెటీరియల్ కూడా అందించారు.మొదట్లో చందాదారులు 600మంది ఉండేవారు క్రమంగా పెరిగారు .తేలికైన వాడుక భాషలో ఉండటం వలన యువకులను బాగా ఆకర్షించింది 1857నాటి విప్లవ వీరుల గాథలను ధారావాహికంగా ప్రచురించేవారు .కాంగ్రెస్ సంపాదకీయాలు బ్రిటిష్ ప్రభుత్వం పై నిప్పులు కురిపి౦చేవి.హిందూ ముస్లిం తగాదాలకు కారణం ప్రభుత్వమేననీ ,కోర్టుల్లో జరిగే విచారణ కేవలం బొమ్మలాటనీ ,కాంగ్రెస్ బరువు బాధ్యతలు మోయాలనీ అవసరమైతే’’ ఇండిపెండెంట్ పార్టీ ‘’కూడా పెట్టాలనీ ,పోలీసు దుష్క్రుత్యాలు బ్రిటిష్ వారికి కాలం చెల్లిందని తెలియ తెలియ స్తున్నాయనీ ,ఖద్దరు దారుల బట్ట లూడ దీసిన పోలీసు అధికారులు ముస్తఫా  ఆలీ ఖాన్ , డప్పుల సుబ్బారావు లు అపర రాక్షసులు, దుశ్శాసనులు, నీ దేశం బతికి బట్టకడితే నువ్వు చస్తేమాత్రమేం ‘’వంటివి నిప్పుల్లో కొన్నిమాత్రమే .

  1926జులై 16 సంచిక అల్లూరి జయంతి ప్రత్యేక సంచికగా కాంగ్రెస్ వెలువడింది గాంధీ గారి అభిప్రాయం రాసి పంపమని కోరితే ,ఆయన జీవిత విశేషాలు తెలుపమని రాయగా రాసి పంపిస్తే ,1929జులై 18 యంగ్ ఇండియా లో బాపూ ‘’రామరాజు శీలవంతుడు నిరాడంబర త్యాగి .ధైర్యం ఉన్నతాశయాలున్నవాడు  .పితూరీ దారుడు కాదు .గొప్ప దేశభక్తుడు .ఆయన దేశ భక్తినీ చాతుర్యాన్నీ సాహసాలను యువకులు ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలి .నాకు సాయుధ విప్లవం పై సానుభూతీ అభిమానం లేవు .రాజు అహింసా పద్ధతిలో పోరాడి ఉంటె యెంత బాగుండేదో ‘’అని నిష్కర్షగా రాశాడు .1927నుంచి అల్లూరి జయంతి ఘనం గా నిర్వహించాలని , అన్నపూర్ణయ్యగారు అనుకొన్నా , పెద్దలు సహకరించలేదు .అధ్యక్షత వహించటానికి కూడా ఎవరూ ముందుకు వచ్చేవారు కాదు .మొదటి సభకు వేమవరపు రామదాసు అధ్యక్షత వహించారు .

  అల్లూరి రెండవ జయంతి రాజమండ్రి లో దండు నారాయణ రాజు అధ్యక్షతన జరిగింది .బెజవాడ మొదలిన చోట్లకూడా  జరిగాయి .మద్రాస్ రిపబ్లికన్ కాంగ్రెస్ లోనూ ,1928డిసెంబర్ కలకత్తా కాంగ్రెస్ యువజన సభలో అల్లూరి ని కీర్తించారు  .1929 మూడవ జయంతికి నేతాజీ సందేశం పంపారు .గుంటూరు ,బందర్ లలో కూడా అల్లూరి జయంతి జరిపారు .మచిలీపట్నం సభలో పట్టాభి సీతారామయ్య ఘన నివాళులు అర్పించారువిప్లవ వీరుడు  అల్లూరి సీతారామ రాజు కు .1936జూన్ 23న ఏలూరులో జరిగిన అల్లూరి వర్ధంతి సభకు వెళ్లాలని ప్రయత్నం చేసిన మద్దూరి ,గారపాటి సత్యనారాయణ ,బసవరాజు రంగశాయి లపై ప్రభుత్వం నిషేధాజ్ఞలు జారీ చేసింది .1929మే 9 న  గాంధీ ‘’కాంగ్రెస్ పత్రిక’’కార్యాలయాన్ని సందర్శించి ,అక్కడ సిబ్బంది అందరూ  ,చాపలపై కూర్చుని ముందున్న రాతబల్లపై కాగితాలు పెట్టుకొని రాయటం చూసి బాగా సంతోషించాడు .అన్నపూర్ణయ్య ,పందిరి మల్లికార్జునరావు లు గాంధీతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు .మే16 యంగ్ ఇండియా పత్రికలో ‘’కాంగ్రెస్ తెలుగు వారపత్రిక ఆశ్రమం నుంచే స్వయం పోషకం గా వెలువడుతోంది.సంపాదకుడు మద్దూరి అన్నపూర్ణయ్య రాజద్రోహం నేరం కింద నిర్బందితుడై గౌరవం పొందారు .ఆయన ఖైదులో ఉన్నా పత్రిక నడుస్తోంది ‘’అని రాశాడు .

  సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -5-10-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

తెలుగు వె;లుగు అక్టోబర్ 2020- ఉయ్యురు గ్రామా చరిత్ర — ఊసుల్లో ఉయ్యురు పుస్తక సమీక్ష

 

తెలుగు వె;లుగు అక్టోబర్ 2020- ఉయ్యురు గ్రామా చరిత్ర — ఊసుల్లో ఉయ్యురు పుస్తక సమీక్ష

https://teluguvelugu.eenadu.net/magazine/flipbook/2020_10#teluguvelugu/page97

 

 

 

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

మహా త్యాగి మద్దూరి అన్నపూర్ణయ్య-3

మహా త్యాగి మద్దూరి  అన్నపూర్ణయ్య-3

హోంరూల్ ఉద్యమం ఉవ్వెత్తుగా ఎగసి పడుతున్నకాలం లో అనిబిసెంట్ శిష్యుడు రాం కాకినాడ వచ్చి గంభీర ఉపన్యాసాలతో ప్రేరణ కల్గించాడు .ప్రిన్సిపాల్ నాయుడు గారు విద్యార్షులు ఆ సభలలో పూల్గొన కూడదని నిషేధం విధించారు .ఏం జరిగితే అది జరుగుతుందని మొండి ధైర్యంగా  పూర్ణయ్యగారు మీటింగ్ కు వెళ్లి ,మర్నాడు ప్రిన్సిపాల్ కు తాను  ఉత్తర్వు దిక్కరించాననీ ఏ శిక్షకైనా సిద్ధమే అని చెప్పారు .ఆయన వార్నింగ్ ఇచ్చి వదిలేశారు .బిసెంట్ తన ‘’న్యు ఇండియా ‘’పత్రికలో బ్రిటిష్ వారిపై నిప్పులు కక్కుతూ రాసేది .ఈయన వాటిని  భగవద్గీత లా  పవిత్రంగా భావించి చదివే వారు .కాలేజి ఎక్సెల్సియర్   సైటీకి రెండేళ్ళు కార్యదర్శి గా పని చేసి ,’’ఇండియా స్వరాజ్యానికి అన్ని విధాలా అర్హమైనది ‘’అని ప్రసంగించారు .

   రాజమండ్రి కాలేజీలో బి ఏ చదువుతూ పూర్ణయ్యగారు ‘’బ్రిటిష్ రాజరికమే మన దేశ దారిద్ర్యానికి కారణం ‘’అని ఎలుగెత్తి చాటారు.కోపం వచ్చిన ప్రిన్సిపాల్ ను ‘’అడుగో ఆ దొంగ మీ ముందే నిలబడ్డాడు ‘’అనగానే అందరూ ఫక్కుననవ్వారు . అప్పటికే  అన్నపూర్ణయ్య అంటే ‘’ఎదిరించే వాడు ‘’అనీ ‘’ఈ సీతయ్య ఎవరిమాటా వినడు ‘’అనే ముద్ర పడి పోయింది .’స్వాతంత్ర్య సమరం లో తాను  ఎలా ప్రవేశించిందీ అన్నపూర్ణయ్య గారు తన ‘’జయభారత్ ‘’పత్రికలో ధారావాహిక గా రాశారు .1920 సెప్టెంబర్ 1న కలకత్తాలో జరిగిన ‘’స్పెషల్ కాంగ్రెస్ ‘’లో విద్యార్ధులు చదువులు మానేయాలని తీర్మానం చేసింది అది. పూర్ణయ్య గారి పై గొప్ప ప్రభావం కలిగించినా ,ఆర్ధిక బలం లేదు .భార్య కాపురానికి ఇంకా రాలేదు .కుటుంబ పోషణ భారం కూడా ఉంది .భార్య ‘’తొందరపడి నాన్ కో ఆపరేషన్ ఉద్యమం లో చేరకండి ‘’అని ముందే రాసి హెచ్చరించింది కూడా .

   ఆ సమయం లో డా పట్టాభి రాజమండ్రి వస్తే విద్యార్ధులుగా ఆయనకు సహాయపడ్డారు .న్యాపతి సుబ్బారావు గారుకూడా వచ్చి 1907లో ఏం జరిగిందో గుర్తు చేసుకోమని హెచ్చరించారు .అంటే గాడి చర్ల మొదలైన విద్యార్ధులు విపరీతంగా నష్ట పోయారని అర్ధం . నవంబర్  30రాత్రి అంతా దీర్ఘం గా ఆలోచించారు పూర్ణయ్య.అల్లూరి జ్ఞాపకం వచ్చాడు .ఇక ఆలోచించలేదు దేశ సేవకు అ౦కిత మవ్వాలని నిర్ణయించుకొన్నారు .డిసెంబర్ 2న జాతీయ విద్యాలయ   లెక్చరర్ డా సుబ్రహ్మణ్యం గారి దగ్గరకు వెళ్లి,వెంటనే ‘’ఆంద్ర యువజన స్వరాజ్య సభ ‘’స్థాపించారు .1907లో బిపిన్ చంద్రపాల్ రాజమండ్రి వచ్చినప్పుడు ,ఆయన విజ్ఞప్తి మేరకు న్యాపతి సుబ్బారావు సత్యవోలు గున్నేశ్వరరావు ,డాక్టర్ శివరాజు వెంకట సుబ్బారావు మొదలైన వారు భూరి విరాళం అందించి జాతీయ కళాశాల స్థాపించారు .1920వరకు దీని నిర్వహణ భారం డా.బ్రహ్మాజోష్యుల సుబ్రహ్మణ్యం వహించారు .

 అన్నపూర్ణయ్య గారు కాలేజి మానేసిజాతీయ పాఠశాలలో లెక్చరర్ గా చేరారు  .1924లో ఆయనతోపాటు ‘’కాంగ్రెస్ ‘’పత్రిక కూడా సీతానగరానికి మారింది .విద్యాలయం ఆధ్వర్యం లో దీన్ని ముద్రించేవారు .1928 మార్చి 11న జనరల్ బాడీ మీటింగ్ లో తీర్మానం చేసి ప్రెస్ ను ఆశ్రమానికి ఉచితంగా అందించారు .పూర్ణయ్యగారు జైలులో ఉండగా ,పత్రిక  వారు బకాయి  ఉన్న డబ్బునూ రద్దు చేస్తూ తీర్మానించారు .విద్యాలయానికి సుబ్రహ్మణ్యం గారి సోదరుడు సీతారామయ్యగారు అధిపతిగా ఉండేవారు .ఈయన 1922లో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి ఇందులో చేరారు .

   1921జనవరి 23న రాజమండ్రి లో గోదావరి జిల్లా మహాసభలు వైభవం గా జరిగాయి .సుబ్రహ్మణ్యం గారు ఆహ్వాన సంఘాధ్యక్షులు .అయ్యదేవర కాళేశ్వరరావు వంటి ప్రముఖులు పాల్గొన్న ఈ సభకు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణగారు   అధ్యక్షత వహించి ‘’ఆత్మ గౌరవం పెంచని ,జీవన భ్రుతికి తోడ్పడని ఆంగ్ల విద్య వదిలేసి విద్యార్ధులు దేశ సేవకు నడుం కడితే ఏడాది లోపే స్వతంత్రం సిద్ధిస్తుంది ‘’అని ప్రకటించగానే ,అప్పటికప్పుడు పూర్ణయ్య గారు మొసలికంటి తిరుమలరావు ,కాండ్రేగుల రామచంద్రరావు ,సబ్నవీసు కృష్ణారావు ,క్రొవ్విడి లింగరాజు మొదలైన 55మంది విద్యార్ధులు దేశ సేవకు అ౦కిత మౌతామని ప్రతిజ్ఞ చేశారు .1921లో మద్దూరి, సబ్నవీసు ల ఆధ్వర్యం లో విద్యార్ధి మహాసభలు భారీగా నిర్వహించారు .అక్కడే ‘’ఆంధ్రయువజన స్వరాజ్య సభ ‘’ప్రారంభమైంది .

  1922లో అన్నపూర్ణయ్యగారు ‘’తిలక్ మహారాజు చరిత్ర ‘’30పేజీలలో రాసి ప్రచురించారు .తిలక్ ను పరశురామునిగా ,గాంధీని,ఆతర్వాత అవతారమమైన శ్రీ రామునిగా వర్ణించారు .’’తిలక్ అంటే స్వరాజ్యం అని అర్ధం.తిలక్ స్వరాజ్య నిధి కోటీ పది లక్షలు పోగు చేసి  ,నిత్యం ఆయన నామస్మరణ చేస్తున్నాం ‘’అని రాశారు .ఆంధ్రయువజన స్వరాజ్య సభ గత మార్చిలో ప్రారంభమైందనీ ,ఐకమత్యం తో భారత స్వాతంత్ర్యం సాధించటమే ధ్యేయమని ,16నుండి 30ఏళ్ళ వయసున్నవారంతా దీనిలో సభ్యులవటానికి అర్హులని ,సంవత్సర చందా కేవలం ఒక్క రూపాయి మాత్రమె ననీ ,కాంగ్రెస్ సంఘాలలో సభ్యులుగా చేర్చటం రాట్నాలు నెలకొల్పటం అప్పటికే చేశామని ,మద్యపాన నిషేధం మొదలైన జాతి ఉద్ధరణ కార్యక్రమాలు చేబట్టాలని ,దీనికి దేశభక్తులు శ్రీ టంగుటూరు ప్రకాశం పంతులుగారు అధ్యక్షులనీ .కేంద్రస్థానం రాజమండ్రి అనీ తెలియ జేశారు అన్నపూర్ణయ్యగారు.

   సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -4-10-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సమాజ సేవే ఉచ్చ్వాస నిశ్వాసాలైన డా .చర్ల సిస్టర్స్ డా. విధుల ,డా .మృదుల-100 – గబ్బిట దుర్గా ప్రసాద్

సమాజ సేవే ఉచ్చ్వాస నిశ్వాసాలైన డా .చర్ల సిస్టర్స్ డా. విధుల ,డా .మృదుల-100 – గబ్బిట దుర్గా ప్రసాద్

చర్ల సిస్టర్స్ అంటే కళాప్రపూర్ణ శ్రీ చర్ల గణపతి శాస్త్రి ,కరుణామయి శ్రీ మతి చర్ల సుశీల దంపతుల కుమార్తెలు .ఒకే నాణానికి ఇరు పార్శ్వాలు.చర్ల సిస్టర్స్ అంటే డా శ్రీమతి చర్ల విదుల ,డా శ్రీమతి చర్ల మృదల గార్లు .వివాహాలు చేసుకోకుండా తమ జీవితాలను సాంఘిక సేవారంగానికి ,తండ్రిగారి సాహితీ సేవా రంగానికి అంకిత భావంతో కృషి జేస్తున్న ఆదర్శ మహిళామణులు .తలిదండ్రుల ఆదర్శ జీవన విధానం వీరిని ప్రభావితులను చేసి ఆమార్గంలోనే పయని౦చేట్లు చేసింది .అకు౦ఠిత దీక్షతో ,మొక్కవోని ధైర్యం తో ముందుకు సాగుతున్నారు .తండ్రి గారికి ఆంగ్ల విద్యపై ఆసక్తి లేకపోవటంతో,ఈ ఇద్దరూ ఇంటి వద్దనే చదువుకొన్నారు .

క్రమంగా తల్లి సుశీల,సోదరుడు శ్రీ బుద్ధ నారాయణ శాస్త్రి గారల ప్రోత్సాహం తో ఉన్నత విద్య అభ్యసించారు .వీరిలో పెద్దవారైన శ్రీమతి విదుల13-3-1939న నిడదవోలు లో జన్మించారు .రాజమండ్రి ఆర్ట్స్ కాలేజిలో 1960లో బి. ఏ.,విశాఖ ఆంద్ర విశ్వ విద్యాలయం లో ఎం.ఏ. చదివారు .తర్వాత హైదరాబాద్ ఉస్మానియా యూని వర్సిటి లో హిందీలో పి.హెచ్ .డి .చేశారు .విశాఖ పట్నం సెయింట్ ఆన్స్ కాలేజిలో లెక్చరర్ గా 20ఏళ్ళు పని చేశారు .అదే సమయం లో ఎన్ .ఎస్. ఎస్ .ప్రోగ్రాం అధికారిగా 15సంవత్సరాలు సేవ చేశారు .ఎయిడ్స్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ గానూ సామాజిక సేవ చేశారు .విశాఖ లో ఉద్యోగం లో ఉన్నప్పుడే 1996లో అక్కడ ‘’విశ్రాంతి ‘’పేరున వృద్ధాశ్రమం ప్రారంభించి వృద్ధుల సేవకు నాంది పలికారు .తండ్రి గారి ‘’ఆర్ష విజ్ఞాన పరిషత్ ‘’కు విశాఖ చైర్మన్ గా వ్యవహరించారు .తల్లిగారి పేరిట నిడదవోలులో చర్ల సోదరీమణులు2000వ సంవత్సరం లో స్థాపించిన’’ చర్ల సుశీల వృద్ధాశ్రమ౦’’కు విదులగారు అధ్యక్షురాలు . ‘’చర్ల సుశీల –గణపతి శాస్త్రి ఫౌండేషన్’’కు ప్రెసిడెంట్,నిడదవోలు ‘’కస్తూరిబాయి మహిళా సమాజం ‘’కు కార్య దర్శి .నిడదవోలు లయన్స్ క్లబ్ అధ్యక్షురాలుగా పని చేశారు .విశాఖ ‘’విశ్రాంతి వృద్ధాశ్రమం ‘’కు సహాయ కార్య దర్శి. విశాఖ ‘’ బాలప్రగతి’’ సెంటర్ సభ్యురాలు .ఇలా వివిధ సంస్థలతో కార్యనిర్వాహక బాధ్యతలను 81ఏళ్ళ వయసులో 18ఏళ్ళ యువతిలాగా చలాకీగా సెల్ ఫోన్ లో అనుక్షణం ఎవరితోనో ఒకరితో మాట్లాడుతూ సలహాలిస్తూ గడిపే మానవ యంత్రం విదుల గారు .

శ్రీమతి చర్లమృదులగారు 26-7-1941న నిడదవోలు లో జన్మించారు .హిందీసాహిత్యం లో ఎం .ఏ.,బి.యి.డిచేసి ,తర్వాత డాక్టరేట్ పట్టా పొందారు ‘’సేక్రేడ్ హార్ట్స్ హైస్కూల్ లో హిందీ అధ్యాపకురాలుగా కొంతకాలం పని చేసి ,తర్వాత విశాఖ ఏ .ఎయెన్.రాజా జూనియర్ కాలేజిలో లెక్చరర్ గా పని చేస్తూ పదోన్నతి పొందారు .విశాఖ మునిసిపల్ కార్పోరేషన్ వారి ‘’విద్యా పీఠ్’’డిగ్రీ కాలేజి ప్రిన్సిపాల్ చేసి రిటైరయ్యారు .తండ్రిగారి ‘’ఆర్ష విజ్ఞాన పరిషత్ ‘’కు అధ్యక్షురాలు .నిడదవోలు లయన్స్ క్లబ్ సెక్రెటరి .’’ఆత్మ విద్య చారిటబుల్ ట్రస్ట్’’కు వైస్ ప్రెసిడెంట్ .‘’చర్ల శుశీల వృద్ధాశ్రమ౦ ‘’,చర్ల సుశీల గణపతి శాస్త్రి ఫౌండేషన్ ‘’లకు కోశాధికారి .బాలప్రగతి సెంటర్ మెంబర్ .వివిధ సంఘాలలో వివిధ హోదాలలో సమాజ సేవ చేస్తున్నారు .80వ పడిలోకూడా నిత్యోత్సాహంగా కృషి చేస్తూ 8ఏళ్ళ కన్యలా ఉండటం ముచ్చట గొలుపుతుంది .

చర్ల సిస్టర్స్ ‘’రెస్ట్ ఇన్ సర్వీస్ ‘’కు ఉదాత్త ఉదాహరణ .సేవా రంగం లో కలిసి పని చేస్తున్నఅరుదైన జంట ఈ చర్ల సిస్టర్స్ .మానవ సేవే మాధవ సేవ అన్నమహాత్ముని ఆదర్శాన్ని పాటిస్తూ, సమాజానికి మనం ఏం చేశామన్న స్పూర్తితో పని చేస్తూ ,స్వార్ధ సంకుచిత కుల,మత,జాతి,ప్రాంత , భాషాభేద భావాలకు అతీత౦గా కృషిచేస్తున్న ఆణిముత్యాలు వీరు .తల్లిదండ్రుల ఉద్బోధలను నిరంతరం పాటిస్తూ వారిని తాము చేస్తున్న సేవలలో ప్రతిఫలించేట్లు చేస్తున్న త్యాగ మూర్తులు .తండ్రిగారిలాగా గా౦ధీమార్గంలోనే నడుస్తూ సాధారణ జీవితాలు గడుపుతూ ఖద్దరు వస్త్రాలు మాత్రమే ధరిస్తూ అందరిలో కలిసిపోతూ ఉంటారు .స్త్రీ జనోద్దరణ ,మహిళా చైతన్యం ఈ సిస్టర్స్ కు రెండు కళ్ళు .వివాహం చేసుకొంటే తలిదండ్రుల, తమ ఆశయాలకు అడ్డం వస్తుందని భావించి అవివాహితలుగా ఉండిపోయిన చైతన్య స్రవంతులు .గుడిలో దీపాలకంటే జీవితాలలో సుఖ శాంతి దీపాలు వెలిగించాలన్న తపన వారిది .అన్నదానం ,విద్యాదానం వారి ఉచ్వాస నిశ్వాసాలు.ప్రతి రోజూఉదయం 11-12గంటల మధ్య నిడదవోలు రైల్వే స్టేషన్, బస్టాండ్ ,ఇతర ప్రధాన కూడళ్ళకు మొబైల్ వాన్ లో వారే స్వయంగా వెళ్లి యాచకులకు భోజనం పెడతారు .ఇదే ఉత్కృష్ట దైవ సేవగా భావిస్తారు .దరిద్ర నారాయణ సేవ దామోదర, శంకర దైవ సేవగా చేస్తారు .నిదదవోలె కాక మల్లవరం ,బొబ్బర్లంక,రామ చంద్రాపురం గ్రామాల్లోనూ సమర్ధవంతంగా వృద్ధాశ్రమాలు నడుపుతూ సమాజ సేవ చేస్తున్నారు.

సామాజిక సేవారంగం లో ఊపిరాడనంత పనులలో గడుపుతున్నా, ఈ చర్లద్వయ౦ సాహిత్య రంగం లోనూ రాణిస్తున్నారు .తండ్రి గణపతి శాస్త్రిగారి సాహితీ సంపదను అవిచ్చిన్నంగా తరతరాలకు అందించే కార్యక్రమం చేస్తున్నారు ..’’మీ పుస్తకాలను ఆజన్మాంతం ప్రచారం చేస్తాం ‘’అని తండ్రిగారికిచ్చిన వాగ్దానం నిబద్ధతతో నిలబెట్టు కొంటున్నారు ఈ సరస్వతీ మూర్తులు .తమకుమార్తెల సాహితీసేవకు ముచ్చటపడి తండ్రిగారు ఒకపద్యం రాసి వారుభయుల్నీ ఆశీర్వదించారు –

‘’మదమిడి సద్గుణముల చే-విధిగా కుడి భుజములవలె బ్రియులగు తనయుల్

విదుల,మృదులకృతి రథసా-రాధులయి కన దీర్చినాక రామాయణమునన్ ‘’

కనుక సేవ ,సాహిత్యం కూడారెండు కళ్ళుగా భావించింది చర్ల సోదరీమణులద్వయం .

తండ్రి గారి సాహిత్య వ్యాప్తి తో తృప్తి పడకుండా, తామూ రచనలు చేసి సరస్వతీ పుత్రికలనిపించారు .శ్రీమతి విదులగారు ‘’తీరం చేరిన నావ ‘’,మురళీ కృష్ణ ,సృజన స్మృతి,పునర్జన్మ ,బ్రహ్మ సూత్రాలు మొదలైనవి రచించారు .శ్రీమతిమృదులగారు ‘’మృదుభావ వీచికలు ‘’,గీతామృతం ,ప్రతిభకు పట్టాభి షేకం ,పరివర్తన ,అమృత గుళికలు,చర్ల గణపతి శాస్త్రి చరిత్ర ,సుశీలమ్మ చరిత్ర ,చర్ల గణపతి శాస్త్రి శత వసంత ప్రత్యేక సంచిక ,వామన పురాణం (ఆధునీకరణ )రచించారు .ఏమైనా ఇంగువకట్టిన గుడ్డలు కదా తండ్రిగారి సాహిత్య గుబాళింపు ఎక్కడికి పోతుంది ?అనువంశికంగా అబ్బి పరిమళించింది .

చర్ల సిస్టర్సను ఆహ్వానించి సన్మానించని సాహిత్య , సాంస్కృతిక సేవా సంస్థలు లేవు అంటే అతిశయోక్తికాదు .జూన్ 28ఆదివారం సరసభారతి నిడదవోలు వెళ్లి, వీరిని సత్కరించి,మా తలిదండ్రులు కీ శే గబ్బిట మృత్యుంజయ శాస్త్రి ,శ్రీమతి భవానమ్మగారల స్మారక శ్రీ శార్వరి ఉగాది పురస్కారం అందజేసి ధన్యమైంది .జిల్లా ,రాష్ట్ర స్థాయి అవార్డులెన్నో అందుకొన్నారు జాతీయ స్థాయిలో పద్మ పురస్కారం త్వరలో రావాలని ఆశిద్దాం.

డాక్టరేట్ లు అయినా ,ఎన్నో పదవులలో రాణిస్తున్నా ,శక్తికి మించి సేవాధర్మ౦ నిర్వహిస్తున్నా అలుపు సొలుపు ఎరుగని థీమూర్తులు వీరిద్దరూ .దైవీ శక్తి ఆవహించిన మానవీయ సేవా తత్పరులు .’’లీడ్ కైండ్లీ లైట్ ‘’కు ప్రత్యక్ష ఉదాహరణలు ‘’.సుగుణ సంపత్తికి ,వినయ సౌజన్యాలకు మారుపేరు .అందుకే వీరు ఏ బృహత్ కార్యక్రమం నిర్వహించినా స్వచ్చందంగా దాతలు ముందుకు వచ్చి అండగా నిలబడి విజయవంతం చేస్తారు .లయన్స్ క్లబ్ మిత్రుల చే స్థాపించబడిన’’డాక్టర్ చర్ల విదుల , డాక్టర్ చర్లమృదుల లయన్స్ క్లబ్ వృద్ధాశ్రమం ద్వారానూ సేవలందిస్తున్నారు ఈ సిస్టర్స్ . ‘’లాంగ్ లివ్ చర్ల సిస్టర్స్’’.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు కు సాదర ఆహ్వానం

సాహితీ మిత్రులందరికీ వందనాలు.

రాబోయే శని, ఆది వారాలలో ..అనగా అక్టోబర్ 10-11, 2020 లలో జరుగుతున్న 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుకి సర్వం సిధ్ధం అయింది. తొలి ప్రకటన కే దేశదేశాల వక్తల నుంచి వచ్చిన అనూహ్యమైన స్పందన  దృష్ట్యా ముందుగా అనుకున్న 24 గంటల నిర్విరామ సదస్సుని మరొక 8 గంటల సమానాంతర వేదిక ద్వారా పొడిగించి 15 ప్రసంగ వేదికలలొ సుమారు 175 మంది వక్తల ప్రసంగాలకి అవకాశాలు కల్పించాం. మరొక 30 మంది త్వరలోనే నిర్వహించే సదస్సు విజయోత్సవాలలో ప్రసంగించి ఈ చారిత్రాత్మక సాహితీ సదస్సు కి సముచితమైన ముగింపు పలుకుతారు.

ఈ సదస్సు లో చోటు చేసుకునే అత్యంత ఆసక్తికరమైన వివరాలు పొందుపరచబడిన సమగ్ర ప్రకటన ఇందుతో జతపరిచాం. వక్తలూ, ప్రసంగాంశాలూ, విజయోత్సవాలలో ప్రసంగించే వారి వివరాలూ త్వరలోనే ప్రకటిస్తాం.

అనేక దేశాలల లో నివశిస్తున్న 25 మంది సాంకేతిక నిపుణులు, 20 మంది వేదిక నిర్వాహకులు రూప కల్పన చేసిన ఈ 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు 32 గంటల నిర్విరామ ప్రత్యక్ష ప్రసారాన్ని ని మీకు ఉచితంగా, మీ ఇంట్లోనే హాయిగా కూర్చుని ఈ క్రింది లింకులలో చూసి ఆనందించమని కోరుతున్నాం.

సదస్సు ప్రారంభ సమయాలు

అక్టోబర్ 10, 2020, శనివారం (GMT: 8:00 AM- 12:00 Noon)

Houston, USA: 3:00 am CDT; London, U.K: 9:00 am BST

Johannesburg, South Africa: 10:00 am SAST; Hyderabad, India: 1:30 pm IST

Singapore: 4:00 pm SGT; Melbourne, Australia: 7:00 pm AEDT

24 గంటల సేపు నిర్విరామంగా, 8 గంటలు సమానాంతరంగా వెరసి 32 గంటల తెలుగు సాహిత్య పరిమళం.

Please copy and paste the links in your URL only during the above times, at any time.

YouTube Links: https://bit.ly/3is8lsyhttps://bit.ly/2EUJEHo

Facebook Links: https://bit.ly/3iyFUcEhttps://bit.ly/3itifu3https://bit.ly/2EWVL6R

భవదీయులు,

7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు కార్యనిర్వాహక వర్గం

వంగూరి చిట్టెన్ రాజు

E-mail: vangurifoundation@gmail.com;  వాట్సాప్: + 1 832 594 9054

కవుటూరు రత్న కుమార్ (సింగపూర్)రావు కొంచాడ (మెల్ బోర్న్, ఆస్ట్రేలియా), డా. జొన్నలగెడ్డ మూర్తి (లివర్ పూల్, ఇంగ్లండ్); రాపోలు సీతారామ రాజు (జొహానెస్ బర్గ్, దక్షిణ ఆఫ్రికా), వంశీ రామరాజు (భారత దేశం)శాయి రాచకొండ (హ్యూస్టన్, అమెరికా)

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

మహా త్యాగి మద్దూరి అన్నపూర్ణయ్య

 

మహా త్యాగి మద్దూరి  అన్నపూర్ణయ్య-2

ఆంధ్ర భీష్మన్యాపతి సుబ్బారావు ,యుగకర్త కందుకూరి వీరేశలింగం ,ఆంద్ర కేసరి ప్రకాశం ,ఆంద్ర బెర్నార్డ్ షా చిలక మర్తి ,గాంధేయవాది బ్రహ్మాజోస్యుల సుబ్రహ్మణ్యం,వందేమాతరం ఉద్యమనాయకుడు గ్రంథాలయోద్యమ సారధి గాడి చర్ల హరి సర్వోత్తమ రావు  గార్ల  కార్యక్షేత్రమైన రాజమండ్రి లో ,’’ఆఖరి శ్వాస వరకు రాజమండ్రిలోనే ఉంటూ దేశసేవ చేస్తాను’’అని భీష్మ ప్రతిజ్ఞ చేసి నిలుపుకొన్న  మద్దూరి అన్నపూర్ణయ్య గారి కార్యభూమి కూడా రాజమండ్రి యే.

  పిఠాపురానికి 8మైళ్ళ దూరం లో ఉన్నకొమరగిరి గ్రామం లో మద్దూరి కోదండ రామ దీక్షితులు  సంపన్న గృహస్తు, నిరతాన్న దాత  .ఒక బాపడు అన్నదానం తో ఇంతటి పేరురుతెచ్చుకోవటం ఏమిటని పిఠాపురం రాజా ఆశ్చర్యపోయి ,మారు వేషాలతో వందమందితో వేళకాని వేళ దీక్షితుల వారింటికి భోజనానికివచ్చాడు .అందర్నీ సాదరంగా ఆహ్వానించి ,అప్పటికప్పుడు నాలుగు బస్తాల బియ్యం తెప్పించి ,గాడిపొయ్యి మీద క్షణాలలో వంట చేయించి అందరికి తృప్తిగా భోజనాలు పెట్టించాడు .భోజనానంతరం  రాజు తనను తాను  పరిచయం చేసుకొని ,తక్షణం దీక్షితులుగారికి కొంత భూమి ఈనాము గా ఇచ్చినట్లు చెళ్ళపిళ్ళవారు తమ కథలు –గాథలు లో చెప్పారు .దీక్షితుల గారి పరమ యోగ్యతను గుర్తించి రాజు ఆయన్ను సాదరం గా ఆస్థానానికి పిలిపించి సత్కరించాలనుకొన్నారు .దీక్షితులు గారు వెళ్ళే సరికి రాజు స్నానం చేస్తున్నాడు .తడి బట్టలతోనే వచ్చి ఆహ్వానింఛి తర్వాత గౌరవించాడు .అలాంటి దీక్షితుల గారి స్వయానా మనవడే మన మద్దూరి అన్నపూర్ణయ్య గారు .

  మద్దూరి జయరామయ్య రాజమ్మ దంపతుల నలుగురు సంతానం లో పెద్దవాడు కోదండ రామ దీక్షితులు ,రెండవవాడు బుచ్చి వెంకయ్య ,మూడు అన్నపూర్ణయ్య ,నాలుగు కృష్ణమూర్తి .అన్నపూర్ణయ్య కొమరగిరిలో 20-3-1899 పుట్టారు .చదువు కొమరగిరి ,పెద్దాపురం లో జరిగింది .1911జూన్ లో కాకినాడ కాలేజి హైస్కూల్ లో ధర్డ్ ఫారం ఎ సెక్షన్ లో ,విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు సి సెక్షన్ లోనూ చేరి చదివారు .పూర్ణయ్యగారి పెద్దన్న ఈ కాలేజిలోనే ఇంటర్ చదివేవాడు .ఆ సంవత్సరం డిసెంబర్ 11న అయిదవజార్జి రాజు పట్టాభి షేక మహోత్సవం కాకినాడలో వైభవం గా జరుపుతున్నారు .విద్యార్ధులు ‘’శశిరేఖా పరిణయం ‘’నాటకం ప్రదర్శించాలనుకొన్నారు .పూర్ణయ్యగారి అన్న దీక్షితులు రఘుపతి వెంకట రత్నం గారి ప్రియ శిష్యుడు .ఆయన శశిరేఖగా తమ్ముడు,అల్లూరి  రామరాజు చెలికత్తెలుగా వేషాలు వేశారు .వీరిద్దరూ అద్భుతంగా నటించి ప్రశంసలు పొందారు. అల్లూరి నారద పాత్రకూడా గొప్పగా పోషించి మధుర కంఠంతో పద్యాలు శ్రావ్యంగా పాడి అందర్నీ మెప్పించాడు .ఈ వేడుకలలోనే నాయుడుగారికి ‘’రావు బహదూర్ ‘’బిరుద ప్రదానం జరిగింది .పూర్ణయ్య ఆబిరుదు తనకే వచ్చినంతగా సంతోషిస్తే ,అల్లూరి ముభావంగా ఉన్నాడు .విద్యార్ధులందరికీ జార్జి బొమ్మతోపాటు జర్మన్ సిల్వర్ పతకాలు కూడా ఇచ్చారు .ఏకంగా అయిదు మెడల్స్ సాధించిన అన్నపూర్ణయ్య అల్లూరికి ఇస్తే ,ఆగ్రహం తో విసిరి అవతలపారేసి ‘’పిచ్చోడా !ఈ పతకం మన బానిసత్వానికి చిహ్నం రా ‘’అని ,అక్కడి నుంచి వెళ్ళిపోయాడు .

   చాలా సేపటికి తేరుకొన్న అన్నపూర్ణయ్య సీతారామ రాజు సాహచర్యం తో దేశ భక్తి ప్రపూర్ణుడయ్యాడు .  దేశ సేవకు బి.ఎ .డిగ్రీ అవసరం లేదన్నాడు అల్లూరి .పూర్ణయ్యమాత్రం డిగ్రీపొంది లాయర్ కావాలనుకొన్నాడు .స్వేచ్చా జీవనానికి న్యాయవాద వృత్తి భేష్ అనుకొన్నాడు .తాను  త్వరలో సన్యాసిగా మారి దేశమాతకు అ౦కిత మౌతానని అల్లూరి చెబుతూ ఉండేవాడు .అర్ధాంతరంగా చదువుమానేసి అల్లూరి ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలీదు.

  ఒక రోజు అన్నపూర్ణయ్య రైలులో పిఠాపురం నుంచి కాకినాడకు బయల్దేరాడు .టికెట్ కౌంటర్ దగ్గర ‘’అన్నపూర్ణయ్యా ‘’అనే పిలుపు వినిపించి ,తననుకాదేమో అనుకొన్నాడు. మళ్ళీ ఆపిలుపు వినిపిస్తే ,అటుకేసి తిరిగి చూస్తే సన్యాసి వేషంలో చిన్ననాటి స్నేహితుడు అల్లూరి సీతారామ రాజు కనిపించి ఆశ్చర్యపోయాడు .ఏమిటీ వేషం ‘’?అని అడిగితె ‘’చిన్నప్పుడే చెప్పాకదా ‘’అని సమాధానం .తనదగ్గర ఒక మహాపురుషుడు ఉన్నట్లు మహా సంబరపడిపోయాడు పూర్ణయ్య .తనతో కాకినాడ రమ్మన్నాడు .ఆ అవకాశం లేదన్నాడు రాజు .ఎక్కడికి ప్రయాణం అని అడిగితె ‘’నా జీవితం ప్రజా సేవకే అంకితం అని ఆనాడే చెప్పానుకదా ‘’అన్నాడు అల్లూరి .’’అనిబిసెంట్ గై హోం రూల్ లో చేరతారా ?’’మద్దూరి ప్రశ్న .’’నా గురించి క్రమంగా వింటావులే ‘’అని చెప్పాడు రాజు .ఇద్దరూ ఎవరి ప్రయాణం వారు సాగించారు .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-10-20-ఉయ్యూరు




గబ్బిట దుర్గా ప్రసాద్

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా త్యాగి మద్దూరి అన్నపూర్ణయ్య -1

మహా త్యాగి మద్దూరి అన్నపూర్ణయ్య  -1

భార్యా పిల్లల్ని పోషించే బాధ్యతకూడా దేవుడిపై భారం వేసి ,దేశం కోసం 55ఏళ్ళు దీక్షగా శ్రమించి ,అందులో 11సంవత్సరాలు జైలులో గడిపిన మహా త్యాగి మద్దూరి అన్నపూర్ణయ్య ఈ తరం వారికి ఎవరికీ తెలియదు .కాంగ్రెస్ ,నవశక్తి , జయభారత్ ,వెలుగు పత్రికలు నడిపి ,స్వతంత్రం ముందూ ఆతర్వాత కూడా నిర్భయంగా ‘’కల౦  ఖడ్గాన్ని ‘’ విశ్రు౦ఖల౦గా   ప్రయోగి౦చిన నిస్వార్ధ పాత్రికేయ ప్రముఖుడు .స్వాతంత్ర్యం వస్తే కులం ,గిలం పోయి ,ఆస్తిపాస్తులన్నీ అందరివీ అవుతాయని ,అందరూ సమానంగా అనుభవి౦చ వచ్చువని నమ్మిన సామ్యవాద స్వప్నాలు కన్నస్వాతంత్ర్య సమర యోధుడు .అల్లూరి ,నేతాజీవంటి విప్లవ నాయకులతో ,గాంధీ ,జయప్రకాష్ వంటి అగ్రశ్రేణి జాతీయ నాయకులతో భుజం భుజం కలిపి సాగిన అగ్రశ్రేణి దేశీయ నాయకుడు .జర్నలిస్ట్ ,కవి, నవలాకారుడు .ప్రకాశం ,,పివిజి రాజు పుచ్చలపల్లి ,రంగాలకు అభిమానుడు .కానీ స్వాతంత్ర్యం వచ్చాక ఆయనకు ప్రాధాన్యమే లేకుండా పోయింది .అసెంబ్లీకి రాజమండ్రి నుంచి పోటీ చేసి ఓడిపోయాడు .స్వతంత్ర భారత దేశ రాజకీయాలకు పనికి రాని వాడు అనిపించుకొన్న లౌక్యమెరుగని పెద్దమనిషి .మొక్కు బడిగా ఆయన శతజయంతి ఉత్సవం జరిపారు .స్వాతంత్ర్య ఉద్యమకాలం లో అనేక అపూర్వ త్యాగాలు చేసి స్వతంత్రం రాగానే జాడ కనిపించకుండా పోయిన మహోన్నతనాయకులలో మద్దూరి వారుకూడా ఒకరు .

  అన్నపూర్ణయ్యగారు జైల్లో మగ్గుతుంటే ఇంటిదగ్గర కుటుంబం గర్భ దరిద్రం లో మగ్గిపోయేది .భార్య రమణమ్మ గారు మహా సాధ్వి .ఆయనకు కార్డు రాయటానికి కూడా ఆమెచేతుల్లో కాణీ ఉండేదికాదు .ఒక కార్డు మాత్రం ‘’ఏ దినం కార్డు కోసం ఎదురు చూస్తారో ,ఆ దిన౦ ఈకార్డు ను చూసి తృప్తి పడండి ‘’అని తేదీ కూడా వేయకుండా రాసింది ఆమహా ఇల్లాలు . . ఈడొచ్చిన ఆడపిల్లలకు చేతనైన రీతిలో పెళ్ళిళ్ళు జరిపి  బాధ్యత తీర్చుకొని ఆత్యాగమయి అసువులు బాసింది .భార్య మరణ వార్త విన్న అన్నపూర్ణయ్య తన బాధకు అక్షరాకృతి కల్పించి ‘’చేత కాసు లేదు ,చెరసాలలో భర్త –పిల్ల పెళ్లి కూడా పెనిమిటి లేకనే –నీవే చేయవలసి వచ్చె నీలవేణి-జనులసాయమైన ,ధనసాయమైన –లేకపోయేనే నీకు లేమి గల్గె-వలదు నా బాధ పరమ శత్రువునకైన –బ్రతికి యున్నాడ జీవచ్ఛవంబ నగుచు ‘’’

  గ్రంథాలయోద్యమనాయకులు గాడి చర్ల హరి సర్వోత్తమరావు గారి తర్వాత పత్రికలలో రాసి జైలు కెళ్ళి పుష్కరకాలం కారాగారం అనుభవించిన జర్నలిస్ట్ మద్దూరి అన్నపూర్ణయ్య గారు .ఈ గాంధీ జయంతి నాడు అలాంటి త్యాగ మయుని గురించి తెలుసుకొందాం .

ఆధారం –మహాత్యాగి మద్దూరి అన్నపూర్ణయ్య గారి జీవిత చరిత్ర –రచయిత-శ్రీరావినూతల శ్రీరాములు .

  సశేషం

గాంధీ జయంతి శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-10-20-ఉయ్యూరు   ,

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

డా. రామయ్య గారి పైరాసిన పుస్తకం ఇంగ్లీష్  అనువాదం-శుభవార్త  

డా. రామయ్య గారి పైరాసిన పుస్తకం ఇంగ్లీష్  అనువాదం-శుభవార్త  

–సాహితీ బంధువులకు శుభకామనలు  – ప్రముఖ అణుశాస్త్ర వేత్త ,117 వ మూలకం టెన్నిస్సిన్ ను ఆవిష్కరించిన  ఆంద్ర శాస్త్రజ్ఞులు డా ఆకునూరి వెంకటరామయ్య గారి జీవితం పై నేను రాసిన పుస్తకం సరసభారతి ఆత్మీయులు శ్రీ మైనేని గోపాలకృష్ణ గారు స్పాన్సర్ చేసి సరసభారతి ద్వారా ప్రచురించటం ,ఆపుస్తకం అమెరికాలో రెండుసార్లు ,ఉయ్యూరులో రామయ్యగారి బంధు మిత్రుల సమక్షం లో సరసభారతి ఉగాది వేడుకలలో మూడవ సారి , మన శాసనమండలి సభ్యులు శ్రీ వై విబి రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరించిన సంగతి మీకు తెలిసిన విషయమే . 

  డా రామయ్య గారి పుస్తకాన్ని ఇంగ్లీష్  లోకి అనువాదం చేయించామని ,దాన్ని రామయ్య గారు వయోభారాన్ని కూడా లెక్క చేయకుండా 5గంటలు నిశితంగా పరిశీలించి సవరించి ఆమోదించగా  హై క్వాలిటీ లో  ప్రింటింగ్ కు హైదరాబాద్ లో ఇచ్చినట్లు ,పది రోజులలో పుస్తకాలు రెడీ అవుతాయని మైనేనిగారు సెప్టెంబర్ 25 న నాకు మెయిల్ రాశారననే శుభ వార్త  మీకు తెలియ జేయటానికి సంతోషంగా ఉంది-దుర్గాప్రసాద్  -2-10-20
Posted in పుస్తకాలు | Leave a comment

అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -11 8-మళ్ళీ భూగర్భ లోకం లోకి -2

అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -11

8-మళ్ళీ భూగర్భ లోకం లోకి -2

టెలోస్ లో స్నేహవతావరణం ఉన్నా ,సాహసాలు కూడా ఎక్కువే .టౌన్ బయట అడవి అందులో అడవి జంతువులూ ఉంటాయి .ఇక్కడ చాలా జాతులవారున్నారు ,ఎవరి తరహాజీవితం వారిదే .వాళ్ళ ఆచార వ్యవహారాలూ వేరే అర్ధం చేసుకోవటం కష్టం కూడా .ఐతే మిగిలినవాళ్ళు పట్టించుకోరు .ఇక్కడ మానవ స్వాతంత్ర్యం ఉంటుంది .ఇదే అన్నిటికన్నాముఖ్యం అన్నాను అమ్మమ్మతో ..’స్వేచ్చ మంచిదే కాని ,ఇతరులు కూడా ఉన్నప్పుడు పూర్తి స్వేచ్చ ఇబ్బందికరం .నాయనా అనేక రకాల స్వేచ్చలున్నాయి టిం.ఇక్కడ మీకు కొన్ని నిబంధనలు ఉండి ఉంటాయి అవేమిటోతెలుసా నీకు ?’’అమ్మమ్మ ప్రశ్నించింది .’’అవి తరువాత తెలుస్తాయిలే .వాటి గురించి ఇప్పుడు చర్చ అనవసరం .భూమిపై ఉన్న లైబ్రరీలకంటే, ఇక్కడ మనకు ఊహించవీలుకాని అద్భుతమైన లైబ్రరీలున్నాయి.అవి ఒక ఆటగా అనిపిస్తాయి .వివరించి చెప్పటం కష్టం అమ్మమ్మా చూస్తేనే కాని నీకు తెలీదు .అవి నీకు బోర్ కొట్టి౦చవని నాదీ హామీ .టాక్సీలో లైబ్రరీకి వెళ్ళటానికి డబ్బు ఖర్చుకాదు  తేలికకూడా ‘’ అన్నాను ,

‘’అద్భుతంరా కన్నా .రేపు మనం టూర్ ప్లాన్ చేద్దాం .అప్పుడు నాకు ఇక్కడి విషయాలెన్నో  తెలుస్తాయి .ముందు నా ఇంటికి వెళ్లి అక్కడ గార్డెన్ చూడాలి ‘’ అన్నది .’’అబ్బో పెద్ద టూర్ ప్లాన్ లోనే ఉన్నావ్ ‘’అని నవ్వి ముందు నా ఇంటికి   వెడదాం .అక్కడ ఇళ్ళు దగ్గర దగ్గరగా ఉంటే ,ఇక్కడ ప్లాన్ ప్రకారం దూర దూరంగా పెద్దగా,విశాలంగా  ఉంటాయి.గార్డెన్ ఉంటుంది నీకు కావాల్సింది నువ్వు పండించుకో వచ్చు చేతకాకపోతే సహాయం చేస్తారు .నాన్సీ కి వంట ఎలా చేయాలో చెప్పాను .మన ఇంటికి వెళ్లి లంచ్ ,రాత్రికి డిన్నర్ కూడా చేద్దాం ‘’అన్నాను .ఇంటికి చేరి ఇద్దరం చాలా విషయాలు మాట్లాడుకొన్నాం ..

               9-టెలోస్ ,పరిసరాల టూరు

‘’అమ్మా టైమెంత’’అంటూ ఆవలిస్తూ నాన్సీ బెడ్ మీద నుంచి కూతురు మాట వినిపించింది ..’’మన వాచ్ లు ఇక్కడ పని చేయటం లేదు .రాత్రి మనం నిద్ర పోయే సరికి ఇంకా చీకటి పడలేదు .చాలాసేపు నిద్ర పోయి ఉంటాం .లేచే టైం అయింది .బయట చూసి తెలుసుకో వాల్సినవి చాలా ఉన్నాయి .నీ స్కూలు ఎక్కడో ఎప్పుడు మొదలు పెడతారో తెలియాలి .నీకు ఇక్కడ మంచి కిన్దర్ గార్టెన్ స్కూల్ ఉంటె బాగుంటుంది .అసలిక్కడ పగలు రాత్రికి తేడా తెలీటం లేదు .అందుకని ఎప్పుడు పడుకోవాలో ఎప్పుడు లేవాలో అర్ధం కావటం లేదు ‘’అంది నాన్సీ .’’అమ్మా బ్రేక్ ఫాస్ట్ విసుగ్గా ఉంది నాకు మామూలుపాలు సీరియల్ కావాలి .నువ్వు కాఫీ కాచి తాగావా ??’అన్నది పిల్ల .’’ఇక్కడ స్టవ్ లేదు .కాని లేచేసరికే లోకల్ ఫుడ్ ప్లేట్ లో రెడీ గా ఉంది .టిం చేశాడేమో .చూడటానికి బాగానే ఉంది .బ్రెడ్ కూడా ఉంది ‘’అన్నది .’’నాకు చీజ్ ఇష్టం కదా ఉందా ?’’’’అక్కడ ఉన్నది తినమ్మా ముందు .తర్వాత పూల్ లో స్నానం చేద్దాం ‘’అన్నది .

  నాన్సీ కాస్త నిట్టూర్చింది .అమెరికాలాగా లేదిక్కడ .సియాటిల్ కు ఇక్కడికి ఉన్న విప్లవాత్మకమైన  తేడా ఎల్లిస్ కు ఎప్పుడు తెలుస్తుందో ఏమో పిచ్చిపిల్ల .ముందు దానికి పాలు చీజ్ సీరియల్ చాకలేట్ డ్రింక్ కావాలి సియాటిల్ లో లాగా .నాన్సీకి రోజూ తాగే కాఫీ లేదు బ్రేక్ ఫాస్ట్ కూడా లేదు .నిన్న సాయంత్రం అమ్మమ్మ తనతో స్వీడెన్ నుంచిన తెచ్చుకున్నదాన్నే అందరు తిన్నాం. భలేగా ఉందది .’’మీరు భూమిపై చూసినవాటికంటే ఇక్కడి విషయాలు చాలా తేడా గాఉంటాయి  ‘’అంటూ నవ్వుతూ సంచీనిండా లోకల్ ఫుడ్ తో లోపలి వచ్చాను .’’సముద్రం లో షిప్ రెక్ అయితే ,మనదగ్గరున్నది తిని ఎలా ఉంటామో ఇక్కడా అంతే.అలవాటు పడాలి .ఇక్కడివి తింటే మీకు అక్కడివి ఇక గుర్తుకు రానే రావు .నా విషయం లో కూడా అలాగే జరిగింది .అక్కడ మనం తిన్న అన్నీ మర్చే పోయాను ఇక్కడ.’’తమరు నోరు మూస్తారా ? నేను అలవాటు పడతా .పిల్లా అలవాటు పడుతుంది .కానీ ఇక్కడికి వచ్చి తప్పు చేశానేమో అని నిన్ను కడిగి పారేస్తూనే ఉంటా. మన ఇష్టానిస్టాలు పిల్లమీద రుద్దు తున్నామేమో ఆలోచించావా ?అంది నాన్సీ .

 నాకు ఎక్కడో మండి,కోపం తన్నుకొచ్చి ‘’ఇది స్వర్గం నాన్సీ .ఇక్కడ ఏం తిన్నామనికాదు,నీలోపల ఏముందో అన్నది ముఖ్యం .అంటే నా ఉద్దేశ్యం  ప్రేమ సంతోషం అందం స్నేహం ,జాలికరుణ దయ ఇక్కడ ముఖ్యం .ఇవన్నీ నా కంటే బాగా తెలియ చెప్పటానికి ఇక్కడ మనుసులున్నారు .అమ్మమ్మ బయట కూర్చుని ఉంది మనం ఇప్పుడు త్వరగా టూర్ కి వెళ్ళాలి ‘’అన్నాను .

  నాన్సీ గొణుగుకున్నా,తయారై నేను ఏర్పాటు చేసిన హోవర్ క్రాఫ్ట్ ‘’లోకి ఎక్కింది .అందరం ఎక్కగానే అది కొద్దిఎత్తుకు  యెగిరి, గాల్లో తేలిపోయింది .కింద ఇళ్ళువిశాలం గా పెద్దగా అందంగా తీర్చి దిద్దినట్లు కనిపిస్తున్నాయి .ఎక్కడా రోడ్లు లేనేలేవు ,గడ్డిలో జాడలు మాత్రమున్నాయి .’’భూమ్మీద,ఎక్కడో ఎప్పుడో తయారు చేయబడిన పదార్ధాలు ప్రాసెస్ చేసినవిచాలా దూర తీరాలనుంచి వచ్చినవి  తినటం అలవాటయింది మనకు.వాటిని మనకు తెలియని వాళ్ళు తయారు చేస్తారు .అవి శక్తినిచ్చేవికావు వాళ్ళ ఇష్టప్రకారం వండినవి .తాజాతనం రుచి స్వచ్చత ఉండవు .కానీ ఇక్కడ మనకు దగ్గరగా పండినవేతినే మనం వండుకొని తింటాం .అక్కడ ఫ్రిజ్ లో దాచినవి మైక్రో వేవ్ లలో పెట్టి వేడి చేస్తాం అందువల్ల వాటి పోషక విలువలు నాశనమైపోతాయి .ఇక్కడ బీన్స్ లాంటివాటిని మనకు కావలసిన స్పైసేస్ కలిపి హాయిగా తాజాగా వండుకొని తింటాం  .’’అని దాదాపు క్లాస్ పీకినట్లు  చెప్పాను .అమ్మమ్మ ‘’అవి ఎక్కడ దొరుకుతాయిరా అబ్బీ సెంట్రల్ ఫుడ్ స్టోర్స్ ఉందా ఇక్కడ ?’’అనగా ,హోవర్ క్రాఫ్ట్ లో   వెళ్ళచ్చనీ దూరం కాదనీ చెప్పాను .’’ఒరే అబ్బాయీ !ఇక్కడ ఎవడూ పని చేస్తూ కనిపించటం లేదే .అజ్ఞాత బానిసలు  ఇక్కడ పని చేస్తారా ?”’అని జోకింది అమ్మమ్మ ‘’కాదమ్మమ్మా !  ఇక్కడ అందరూ రోజుకు నాలుగు గంటలే పని చేస్తారు .నాలుగుగంటలూ అ౦కిత భావంగా  నాన్ స్టాప్ గా పని చేస్తారు .ఇక్కడ అంతాపెర్ఫెక్ట్ గా పధ్ధతి ప్రకారం జరుగుతుంది .ఇక్కడ బానిస వ్యవస్థ లేనే లేదు .పని అవగానే  వెళ్లిపోవటమే .ఎవరి అనుమతీ అక్కర్లేదు .ప్రతివాడికీ జాబ్ శాటిస్ఫాక్షన్ ,ఆనందం ఉంటుంది సమస్యలుండవు’’అన్నాను .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-10-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం       203-అమెరికాదేశ సాహిత్యం -20

ప్రపంచ దేశాల సారస్వతం

203-అమెరికాదేశ సాహిత్యం -20

20వ శతాబ్ది సాహిత్యం -12

ఆఫ్రో అమెరికన్ సాహిత్యం

నల్లజాతి రచయితలు  రిచార్డ్ రైట్ సాంఘిక నిరసన కోప మార్గానికి భిన్నమైన దాన్ని అనుసరించారు. జేమ్స్ బాల్డ్విన్ ,రాల్ఫ్ ఎల్లిసన్ లురైట్ ప్రభావితులు .నల్లవారి జీవితాల సంక్లిష్టత పై వివాదాత్మక వ్యాసాలూ రాశారు .బాల్ద్ద్విన్ ‘’గో టెల్ ఇట్ ఆన్ ది మౌంటేన్ ‘’-1953 అనే గొప్ప నవల రాశాడు .హీర్లాం ప్రపంచం అందులో బ్లాక్ చర్చి లతో తన అనుభ వాలకు అద్దం పట్టాడు .అబ్సర్దిక్ హ్యూమర్, జానపద మిశ్రమం తో రియలిజం దట్టించి రాల్ఫ్ ఎల్లిసన్ ,పూర్తిగా నల్లవారి జీవితం వలసలు ,ఘెట్టో సంఘటనలు వర్ణిస్తూ జాతీయత కమ్యూనిజం బోధిస్తూ నవలలు రాశాడు .1952లోఇతడు రాసిన ‘’ఇన్విజిబుల్ మాన్ ‘’నవల పోస్ట్ వార్ సాహిత్యం లో ఉ త్కృష్టమైనదని చాలా మంది భావిస్తారు .

   తర్వాత ఇద్దరు ఆఫ్రికన్ అమెరికన్ మహిళలు గొప్ప సాహిత్యం పండించారు .అందులో టోరి మారిసన్ –ది బ్లుయేస్ట్ ఐ -1970,సులా -1973,సాంగ్ ఆఫ్ సాల్మన్ -1977,బిలవ్డ్-1987,జాజ్ -1992,పారడైజ్ -1998నవలలలో సృజనాత్మక ఫిక్షన్ ,మాజిక్ రియలిజం తో పద్యానుభూతి కలిగించింది .వైవిధ్య జానపద శైలులను ప్రయోగించి ప్రభావితం చేసింది .చాలా పదబంధాలు సృష్టించింది బ్లాక్ హిస్టరిలో .1933లో నోబెల్ ప్రైజ్ పొందింది కూడా .ఆలీస్ వాకర్ చాలా కవిత్వం రాసి ,సివిల్ రైట్స్ ఉద్యమం పై 1976లో మెరిడియన్ నవలరాసి ,బ్లాక్ ఫెమినిస్ట్ నవల ‘’ది కలర్ పర్పుల్ ‘’-1982లో రాసి పులిట్జర్ బహుమతి అందుకొన్నది .

    ఈ కాలపు పురుష ఆఫ్రికన్ అమెరికన్ రచయితలలో ఇస్మాయిల్ రీడ్ కామిక్  టెక్నిక్  లతో ,జేమ్స్ అల్లాన్ మెక్ ఫెర్సన్ కథలు ,చార్లెస్ జాన్సన్ –ఆక్స్ హీర్దింగ్ టేల్స్-1982 ది మిడిల్ పాసేజ్ -1990నవలల లో చారిత్రాత్మక ఊహాత్మక ఎల్లిసన్ బాల్డ్విన్ శైలిలో రాసి పేరుపొందారు .కాల్సన్ వైట్ హెడ్ –ప్రయోగాత్మక టెక్నిక్, జానపద రీతిలను ‘’ఇంట్యూషనిస్ట్’’-1999,జాన్ హెన్రి డేస్-2001లో ప్రయోగించాడు .

                    కొత్త ఫిక్షన్ విధానాలు

   రెండవ ప్రపంచయుద్ధ దురాగతాలు ,అమెరికన్ కోల్డ్ వార్,అటామిక్ బాంబ్ భీభత్సం ,విలక్షణమైన వినియోగ సంస్కృతీ ,1960లో జాతులమధ్య గొడవలు  చూసి రచయితలు వాస్తవికత ఫిక్షన్ కు ఉన్న సాంఘిక బాధ్యత నుండి తప్పించుకోరాదు అని గ్రహించారు  .కనుక రొటీన్ కు భిన్నంగానవల కథ ఫిక్షన్ ఉండాలని భావించారు .అందుకే పోస్ట్ మోడరన్ నవలలను విలియం గాడిస్,జాన్ బార్త్,జాన్ హాక్స్ ,డోనాల్డ్ బార్తేల్మి ,ధామస్ పించాన్ ,,రాబర్ట్ కూవర్ ,పాల్ఆస్టర్,జాన్ డెలిలో లు రియాలిటీ కే పెద్ద పీట వేసి చాలా శక్తివంతంగా ఫిక్షన్ రాశారు .దగా ,మానసిక అపసవ్యాలను వాడుకున్నారు .తమ నవలలనువాళ్ళు కళాకృతులుగా,ఐరానిక్ రియలిస్టిక్ టెక్నిక్ లుగా భావిచారు .దీనితో హింస పెంచారు .డాక్యుమెంటేషన్ లేక ఫాంటసి పెరిగింది .నార్మన్ మైలర్ ,జాయిస్ కరోల్ ఓట్స్ లు ఈ కొత్త దృక్పధాలకు పెర్ఫెక్ట్ ఉదాహరణలు .

  ‘’ది నెకేడ్ అండ్ ది డెడ్’’-1948 నవలలో మైలర్ డాస్ పాధోస్ సోషల్ ప్రొటెస్ట్ శైలిని అనుసరించాడు .రియలిజనికి ఉన్న పరిమితులను దాటి సర్రియలిజం ఫాంటసి ని ‘’ఆన్ అమెరికన్  డ్రీం -1965,వై ఆర్ వుయ్ ఇన్ వియత్నాం -1967లో దట్టించాడు .’’ నాన్ ఫిక్షన్ ఫిక్షన్ ‘’లేక ఫిక్షన్ ఆజ్ హిస్టరీ విధానం ‘’ది ఆర్మీస్ ఆఫ్ దినైట్ ,దిమయామి అండ్ ది సీజ్ ఆఫ్ చికాగో -1968నవలలలో మైలర్ తన కొత్త గొంతును ఆవిష్కరించాడు కామిక్ గాఉన్నా  పూర్తి బౌద్ధికమైనవి .ట్రూ లైఫ్ నవల పులిట్జర్ బహుమతి పొందిన ‘’ది ఎక్సి క్యూషనర్స్ సాంగ్’’-1979, అతడు ఫిక్షన్ లోకి మళ్ళాక చాలాప్రతిభావంత౦ గా ‘’హార్లోట్స్ ఘోస్ట్ ‘’-1991,నవల సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ  పై రాశాడు  ..ఇతని చివరి నవలలు –జీసెస్ క్రైస్ట్ –ది గాస్పెల్ అకార్డి౦గ్ టుసన్,-1997,అడాల్ఫ్ హిట్లర్—ది కాజిల్ ఇన్ ది ఫారెస్ట్ -2007లలో పైవిషయమే వర్ణితం .

  జాయిస్ కరోల్ ఓట్స్ –ఎ గార్డెన్ ఆఫ్ ఎర్త్లి డిలైట్స్1967,దెం-1969లలో సహజసిద్ధంగా హింసాత్మక నగర విషయాలు –అంటే డెట్రాయిట్ రయట్స్,లో ప్రతిబింబింప జేసింది .వీటిని పండించి ,సర్రియలిజం లోకి వెళ్లి ‘’వండర్ లాండ్ ‘’1971లో ,గోధిక్ ఫాంటసి ని –బెల్లీ ఫ్లూయర్ 1980 రాసింది .న్యూయార్క్ లో తన యవ్వన జీవితాన్ని అంతకు ముందే 1986లో ‘’మార్యా ‘’లో రాసింది .ఆమె తర్వాత రచనలలో -బ్లాండే నవల -2000,లో మేరిలిన్ మన్రో ఫిక్షనల్ బయోగ్రఫీ రాసింది .మైలర్ ,ఓట్స్ మాత్రం రియాలిటి ప్రతిఫలమైన నవలకు లొంగక .శక్తి వంతమైన కొత్త ఫిక్షన్ విధానాల వేటలో పడక తప్పలేదు .

   సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -1-10-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

నో నో నో నో—

నో నో నో నో—

          సీన్ -1

  • అర్చకసంఘం –అయ్యా !కరోనా వల్ల ఆలయానికి ఎవరూ రావటం లేదు .మా రాబడీ లేదు నిండుగా ఉండే హుండీ గుండు సున్నా అయింది .విఐపిలు, మంత్రులు వస్తున్నా ,వారు జాగ్రత్తలు తీసుకోకుండా ఆలయం లోకి రావటం తో , వాళ్ళ రోగం  అందరితో పాటూ మాకూ అంటుకొంటో౦ది.ఇప్పటికే మా  అర్చకులలో,సిబ్బందిలో  నాలుగోవంతు కరోనా పీడితులే మా ఆడాళ్ళు బెంబేలెత్తి పోతున్నారు .బ్రహ్మోత్సవాలూ తూనా బొడ్డు గానే చేశాం .వచ్చే నవరాత్రులూ అంతేగామరి  .కనుక మాదో విన్నపం .ఉద్యోగుల్లాగానే మేము కూడా శ్రీవారి సేవలు వర్క్ ఫ్రం హోమ్ గా  చేస్తాం .బాగానే ఉంది మరి నైవేద్యాల సంగతేమిటి అని అడుగుతారని తెలుసు .’’పోటుగాళ్ళ’’సారీ అంటే నైవేద్యాలు ప్రసాదాలు తయారు చేసే వారని మా అభిప్రాయం  వాళ్ళ పని కూడా ఉండదు .వాళ్ళనీ ఇంట్లోనే వాటిని తయారు చేసి ఆన్ లైన్ లోపంపిస్తే ,నైవేద్యాలు పెట్టేస్తాం .ఖర్చూ కలిసొస్తుంది .ఇకపోతే తిరుక్షవరం

అంటారా ,అదే స్వామీ ౧కళ్యాణ కట్ట వాళ్ళపని .వాళ్ళు కూడా తలగొరుగుతున్నట్లు జుట్టు తీస్తున్నట్లు యాక్ట్ చేస్తారు .ఎవరింట్లో వాళ్ళే తలనరుక్కోవాలి సారీ జుట్టు నరుక్కోవాలి .తలనీలాలు కావాలంటే పోస్ట్ లోనో  కొరియర్ లోనో అదీ దండగే ఆన్ లైన్ లో పంపేయచ్చు.వాళ్లకి డబ్బూ, శ్రమా మిగుల్తాయి  .కరోనా కల్లోలమూ ఉండదు. అది అ౦ టుకుంటు౦దన్నభయమే ఉండదు . దిగులూ ఉండదు .ఆల్ హాపీ .అలాగే కళ్యాణ మండపాలలో కూడా పెళ్ళిళ్ళు ఇలానే జరుపుకోవచ్చు .మంగళవాద్యాల హోరు అక్కర లేదు వాళ్ళూ వాయించినట్లు నటిస్తారు ఆన్ లైన్ లో .పుస్తెలు మాత్రం ఇంట్లో నే ఎవరికి వారు కట్టుకోవాలి .తప్పదు .ఉపనయనాలూ అంతే .గర్భాదానాలూ వర్క్ ఫ్రం హోం లో నే జరగాలి అవి ఎలాగూ అలానే జరుగుతున్నాయనుకోండి .గృహప్రవేశాలూ అంతే అంతా యాక్షన్ తో సరి .తద్దినాలు కూడా వర్క్ ఫ్రం .తద్దినం పెట్టించే బ్రాహ్మణుడు తన ఇంట్లోనుంచి తంతు జరిపిస్తాడు .భోక్తలూ అంతే.కానీ అన్నీ యధా విధిగా జరగాలి. లేకపోతె పితృ దేవతలు శపిస్తారు .ఇదో పితలాటకం .

అధికారులు –బానే ఉందయ్యా మీ ఆలోచన .మేం యాక్సెప్ట్ చేస్తున్నాం తీర్మానం కూడా వర్క్ ఫ్ర్రం హోంచేసి పంపిస్తాం .ఇంతమందికి ఇన్ని భాషల్లో కంప్యూటర్లు ఎలా సప్ప్లై చేయాలి ?  .దీనికి మీ సొల్యూషన్ ఏంటి?పోనీ ఆర్ధిక మంత్రి ని అడుగుదామా ?

సంఘం –ఆవిడ దగ్గరేముంది శివాలయం .బడ్జెట్ ప్రెజెంటేషన్ అంకెల గారడీ .రైతులకు ఇచ్చిందీ లేదూ .వలసకార్మికులకు అందించిందీ లేదు .వాళ్ళాయనే ఆమె బడ్జెట్ పై పెదవి విరుస్తుంటే ఆమెనడిగి లాభం ఉండదు సార్.

అధికారి –అన్నీ మీరే చెబుతున్నారు. మీకందరికీ వర్క్ ఫ్రం హోం కావాలని డిమాండ్ చేస్తున్నారు. మాకూ మీపై సానుభూతి ఉంది .దీనికీ మీరే పరిష్కారం చెప్పండి సాములూ

సంగం –వెరీ సింపుల్ .మోడీ గారికి ట్రంప్ జగిని దోస్త్ కదా .అందుకని అమెరికాలోని భారతీయ వోటర్లను ఆయనకే’’ గుద్దేస్తామని ‘’అదే సార్ ఓట్లు వేస్తామని ప్రకటన చేయమనండి .కావాల్సినన్ని  క౦పులు అవే నండీ కంప్యూటర్లు క్షణాలలో వచ్చి వాలేట్లు ట్ర౦ప్ చేస్తాడు.ఫికర్ నై .మోడీ హూనా.

అధికారి –ఇప్పుడే ఆన్ లైన్ లోఆయనకు ఈవిషయం పంపించి అర్జెంట్ గా ట్రంపు నుంచి క౦పులు వచ్చేట్లు చేయమని తీరమానం చేసి యాక్షన్ తీసుకో మంటాం.

సంఘం –ధన్యవాదాలు సార్ మా అందరి దీవెన, స్వామి వారి ఆశీర్వచనం మీ కెల్లప్పుడూ లభిస్తాయి .కావాలంటే  మీ ఇంట్లో ఏకార్యక్రమమైనా మేమే వచ్చి నిర్వహిస్తాం .

              సీన్ -2

లచ్చి నుంచి ఫోన్ –అమ్మగోరో !నాను రేపటి నుంచీ ఇంటికొచ్చి పనిసేయనండి .మా సంగం అలా తీర్మానం సేసినాదమ్మా .అయ్యగోరు అదేదీ వక్క ప్రం హాంఫట్ చేస్తున్నట్లే మేమూ మీ పనులన్నీ ఇంటి నుంచే చేత్తామమ్మా .ఆరునెలలైనా కరోనా కోవిడ్ పెరిగిందే కానీ తగ్గింది లేదు .మా వర్కర్లు శానా మంది దాని బారినపడి సనిపోనారండీ .మీకైతే పెన్షన్లు వగైరా ఉంటాయికాదండీ. మాకేటి ఉంటాది ,చేస్తే జీతం లేకుంటే పస్తులు .మా మావ కూడా పని కెల్లద్దని రాత్రి తాగొచ్చిఇరగ్గొట్టి   మరీ  సెప్పాడమ్మా .

సీత ఫోన్ లో  –ఇదేం చోద్యమే .అంట్లు ,పాచి వర్క్ ఫ్రం హోం చేస్తావా ?ఎలా కుదుర్తుందే అది .కోరిక గొంతెమ్మ కోరిక కాకూడదే.

లచ్చి-గొంతెమ్మో చితమ్మో నాకేటి తెల్సు .వా వోళ్ళు అన్నారు. నాను సెప్పాను .ఆళ్ళ మాట ఇనకపోతే ఎలేస్తారమ్మా.ఫైన్ కూడా కట్టాలంట .

సీత –సరే నే .నీ ఇంటినుంచి  మా ఇంటి పని ఎలా చేస్తావే ?వివరంగా చెప్పు ?

లచ్చి- ఏటీ లేదమ్మ గోరో.తమరు నాకు కంప్యూటర్ ఇచ్చి నేర్పిస్తే నాను ఇంట్లో నుంచి చేత్తానన్నమాట,

సీత –ఎలా? హౌ ?

లచ్చి –చిమ్పుల్ అమ్మగారో .నేను మా ఇంట్లో కంప్యూటర్ లో ఇల్లు ఊడుస్తున్నట్లు అంట్లు తోముతున్నట్లు బట్టలు ఉతుకు తున్నాట్లు యాక్ట్  చేత్తానన్నమాట .మీరు హాయిగా ఆ పనులన్నీ మీ ఇంట్లో చేసుకోవాలన్నమాట .నెలజీతం ఖచ్చితం గా ఒకటో తారీకు నా అకౌంట్ లో పడితీరాలి .లేకపోతె రోజుకు పది రూపాయలు ఫైన్ కూడా మీరే   కట్టాలని మా సంగం తీర్మానం .

సీత –నోనో నో

మా ఆవిడ –ఏమిటండీ నోనో నో అని నిద్రలో అరుస్తున్నారు ?పీడ కలేమైనా వచ్చిందా .చీపురుతో దిష్టి తీయనా ?

  అనగానే మెలకువ వచ్చి ఇదంతా కల అని తెలిసి౦ది .

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-9-20-ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం                         203-అమెరికాదేశ సాహిత్యం -19

ప్రపంచ దేశాల సారస్వతం

203-అమెరికాదేశ సాహిత్యం -19

20వ శతాబ్ది సాహిత్యం -11

దక్షిణ దేశ ఫిక్షన్

రెండవ ప్రపంచ యుద్ధానంతరం దక్షిణాది రచయితలు ఫాక్నర్ వారసత్వాన్ని ప్రేరణగా పొందారు .ముగ్గురు మహిళలు ఇడోరావెల్టి , ఫ్లానరి ఓకాన్నోర్ ,కార్సన్ మెకల్లస్ లు అసహజ వికృత అంటే గ్రోటోస్క్ విధానం లో దక్షిణాదిసాహిత్యాన్ని సుసంపన్నం చేశారు .కానర్ మాత్రం దక్షిణాది ప్రొటెస్టెంట్ లో రోమన్ కేధలిక్ గా గొప్ప కామెడీని నైతికసంబద్ధత (మోరల్ ఇ౦కా గ్రుటి)శైలిలో చిన్న కథలను ప్రతిభా వంతంగా రాసింది .గోప్పస్టైలిస్ట్ అయిన వెల్టి తన మొట్ట మొదటి కథాసంపుటులు ‘’ఎ కర్టెన్ ఆఫ్ గ్రీన్ -1941,ది వైడ్ నెట్ అండ్ ది స్టోరీస్ -1943 లతో మహా కీర్తి పొందింది .లూజింగ్ బాటిల్ అనే నవల 1970,పులిట్జర్ ప్రైజ్ పొందిన నావేల్లా –దిఆప్టిమిస్ట్ స్ డాటర్ 1972,కూడా రాసింది .మెక్ కల్లర్ ‘’ది హార్ట్ ఈజ్ ఎ లోన్లీ హంటర్ ‘’-1940 నవల సుదూర సౌత్ లో జరిగిన యదార్ధ సంఘటన ఆధారం గారాసి చదువరుల హృదయాలు కొల్లగొట్టింది .రిఫ్లెక్షన్స్ ఇన్ ది గోల్డెన్ ఐ -1941,ది మెంబర్ ఆఫ్ ది వెడ్డింగ్ -1946,ది బాలడ్ఆఫ్ ది శాడ్ కేఫ్-1951,నవలలు రాసింది .ఈమూడూ సినిమాలుగా వచ్చాయి .ఎలిజబెత్ స్పెన్సర్ –దిసదరన్ వుమన్ -2001.రేనాల్డ్స్ ప్రైస్-ఎలాంగ్ అండ్ హాపీ లైఫ్-1961 కైటే వైడేన్ నవల -1986కూడా ఈకాలపు రచయితలే .దక్షిణాది గొంతుకు ప్రాధాన్యం పొందిన ట్రూమన్ కపోటే-అదర్ వాయిసెస్ అండ్ అదర్ రూమ్స్ -1948,లో దికోల్డ్ బ్లడ్1965లో నూ రాసి పబ్లిష్ చేసింది .టాం ఉల్ఫ్ ,నార్మన్ మైలర్ లు డాక్యుమెంటరి రియలిజం అనే కొత్త జర్నలిజం సృష్టించారు .ఫిక్షన్ లో వాడే టెక్నిక్ లన్నీ దీనిలో వాడటం ప్రత్యేకత .

  విలియం స్టిరాన్-మొదటి నవల లై డౌన్ ఇన్ డార్క్ నెస్-1951లో ఫాక్నర్ ప్రభావం బాగా పండి పోయినట్లు కనిపిస్తుంది .తర్వాత రాసిన రెండు వివాదాస్పద నవలలు సమాజం లో చీకటి కోణాలను  చిత్రించాయి-అవే- ది కన్ఫెషన్స్ ఆఫ్ నాట్ టర్నర్ – 1967,లో పూర్తిగా బానిసల తిరుగుబాటు ఉంది ,సోఫీస్ చాయిస్ నవల -1979లో హాలోలోకాస్ట్ హారర్ చిత్రీకరణ ఉంటుంది .ఫాక్నర్, మార్క్ ట్వేన్ ల ప్రభావం తో విలియం హంఫ్రి రెండు శక్తివంతమైన నవలలు టెక్సాస్  ఆధారంగా రాశాడు-అవే-హోం ఫ్రం ది హిల్స్-1958,ది ఆర్డ్ వేస్-1965.వాకర్ పెర్సి –దిమూవీ గోయర్-1961,దిలాస్ట్ జెంటిల్మన్-1966 లతోసదర్న్ ఫిక్షన్ కు గొప్ప ఊపు తెచ్చాడు .వీటిలోని మ్యూజింగ్ ఫిలసాఫికల్ స్టైల్ గోధిక్ శైలికి భిన్నంగా తర్వాత రచయితలను ప్రభావితం చేసింది .ఈ ప్రభావం తో రిచర్డ్ ఫోర్డ్ –దిస్పోర్ట్స్ రైటర్ 1986లో ,సీక్వెల్ గా ఇండి పెండేన్స్ డే-1995లో కదిలించేట్లు రాశాడు .అదే ధోరణిలో పీటర్ టైలర్అనే సోషల్ రియలిస్ట్ గొప్ప కథా కథన విధానం లో అభివృద్ధికి దోహదపడేట్లు గతకాల వైభవ ప్రస్తుతిగా –ది ఓల్డ్ ఫారెస్ట్-1985 ఎ సమాన్స్ టు మెంఫిస్-1986లో రాశాడు .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-9-20-ఉయ్యూరు ,

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అరె ఏమైందీ –

అరె ఏమైందీ —– /// శర్మాజీ ///
😌😌🙏🙏🙏🙏💐💐💐💐🙏🙏🙏🙏

ఆగస్టు 5 : “అందరి లాగా నాకూ కొరోనా వచ్చింది ఇప్పుడే సోషల్ మీడియా ద్వారా వీడియొ పెట్టాను. “ఇంటికి వేళ్ళ లేదు. ఎంజీఎం ఆసుపత్రిలో ఫ్రెండ్స్ మధ్య లో ఉన్నాను. ” మేనేజర్ కి అన్నీ ప్రోగ్రామ్స్ కాన్సిల్ చెయ్యమని చెప్పా. ఫ్రెండ్స్ అందరితో కాల్స్ చేసాను.

అన్ని టెస్ట్స్ తీసుకొన్నారు. అన్ని జాగర్తలు చెప్పారు. బచ్చన్ గారికి వచ్చింది పోయింది. అమిత్ షాకు వచ్చింది పోయింది పెద్ద బెంగ లేదు అదీ ఆశ

ఆగస్టు 6 : హాయ్ గా ఉంది , చాల రోజుల తర్వాత చక్కగా నిద్ర పోయాను. సావిత్రి, చరణ్ , పల్లవి తో మాట్లాడాను. ప్రశాంతం గా ఉంది నా మెడికల్ రిపోర్ట్స్ అన్ని తెప్పించారు. చక్కగా పాటలు పాడుకొంటూ. కొంచెం దగ్గు, ఇన్ఫెక్షన్ అని పిస్తోందని చెప్పాను. టెస్టులు చేస్తున్నారు. నోట్లో ,గొంతులో…… ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. అటు ఇటు మంచం మీద నుంచి. నా కోసం పాటలు పెట్టారు లో వాల్యూమ్ లో … ఇప్పటి దాకా పాటలు , రికార్డింగ్స్ , యాక్టర్స్ , సింగెర్స్ , ఆర్చెస్ట్రా… సడన్ గా డాక్టర్స్ ,నర్సుస్ , మందులు సూదులు , మన పక్కన మన వాళ్ళు ఎవరూ లెకపోవటం.. చప్పట్లు కొట్టా , గంట కొట్టా , దీపాలు వెలిగించా అయినా కరోనా కరుణించింది.కొరోనా మీద “భారత భూమి” పాట పాడిన నాకు కొరోనా.

ఆగస్టు 7: : అనీజీ గా ఉంది డాక్టర్స్ కి చెప్పాను. కొరోనా లో నార్మల్ అని చెప్పారు. ఇంజెక్షన్స్ ఇచ్చారు. సెలైన్ ఎక్కించారు అన్ని లిక్విడ్స్ ఇస్తున్నారు. పాటలు వింటూ … చరణ్ వచ్చాడు. ఫోన్ మాట్లాడ వద్దు అన్నారు. ఆక్సిజెన్ పెట్టారు. పెడుతున్నారు మళ్లీ తెస్తున్నారు. కొరోనా లో అలాగే ఉంటుంది మందు లేనప్పుడు ఇదే ట్రీట్మెంట్ అన్నారు. కృష్ణ గారితో మాట్లాడలనిపించింది మెసేజ్ పెట్టాను.

ఆగస్టు 8 : ఇవ్వాళ అలాగే ఉంది… ఒక్కసారి జీవితం గిర్రని తిరిగింది.. సంవత్సరం క్రింద చనిపోయిన అమ్మ , నాన్న కళ్ళ ముందే ఉన్నాడు. ఇద్దరు అన్నలు ఐదుగురు అక్క చెల్లెల్లు వసంత, శైలజ అన్న అన్నా అని చేయి పట్టుకొని స్కూల్ కి తీసుకెళుతున్న దృశ్యం. ఏమైంది నాకు మళ్ళి టెస్టులు రిపోర్ట్స్. డాక్టర్స్ ఫ్రెండ్స్ వస్తున్నారు, వెడుతున్నారు… ఇప్పటి దాకా సలహా అడిగిన డాక్టర్స్ నాతొ ఏమి మాట్లాడటం లేదు. ఫోన్లో చరణ్ తో సంప్రదిస్తున్నారు.

నిద్ర లేదు మత్తు, ఆహరం లేదు. అంతా ఒక మాయ లాగా ఉంది. స్పృహ వస్తోంది పోతోంది..

ఆగస్టు 9 : రూమ్ షిఫ్ట్ చేసినటున్నారు… నేను లేవలేను. నర్సులు వస్తున్నారు వెడుతున్నారు. పలకరిస్తున్నారు. చెప్పలేను. కదలలేను , మెదలలేను పెదవి విప్పి పలకలేను .. మాస్టారి పాట మనసులోనే అందరికి ధన్యవాదాలు.. మనసులో నే పాటలు. ” చరణ కింకిణులు ఘల్లు ఘల్లు మన …. ఆడవే మయూరి… ”

“శివరంజని నవ రాగిణి. వినినంత నా మనసు..”

నాకు తెలిసి పోయింది ఎదో అయిపొయింది అని.

ముక్కులో పైప్స్. గొంతులో పైప్స్ , వెంటిలేటర్ మీదకి వెళ్ళాను. కానీ నేను గాలి పీల్చుకోలేక పోతున్నాను. నాకేమి జరుగుతోందో నాకే తెలియదు

ఆగస్టు 13 : పరిస్థితి విషమంగా ఉన్నటుంది అవును ఆంటీవిటల్స్ , స్టెరాయిడ్స్ , ప్లాస్మా థెరపీ స్టార్ట్ చేశారు ఇవి అన్ని కొరోనా లో కామన్ అని ముందు చదివాను. అందరు కళ్ళకు కనబడుతున్నారు. అంతే .. మనసు మాత్రం నా జీవితం మొత్తం తెగ తిరిగి తిరిగి వస్తోంది. నా గురువులు , నా శిష్యులు , నా కుటుంబం , మనుషులు. ప్రపంచం , దేశం రాష్ట్రము , నేను చూసిన ప్రదేశాలు. పిల్లలు. సావిత్రి ..

ఏమి చెయ్యగలను లెవలేను.

ఆగష్టు 14 : ఫామిలీ డాక్టర్స్, రెగ్యులర్ డాక్టర్స్, వచ్చారు లేపారు. అతి కష్టమీద కూర్చోపెట్టారు.

ఆక్సిజెన్ ఎక్కువ తాగేస్తున్నావు. ఆక్సిజన్ సపోర్ట్ చాలడం లేదు అన్నారు. నాకు చెప్పడానికి భయపడుతున్నట్లు అన్నారు. మనకి వెంటిలేటర్ ఆప్షన్ మీరు ఓకే అంటే పెడతాము. నాకు తెలుసు ఏంటో మందిని చూసాను. వెంటిలేటర్ అంటే ఇక అంతే అని. ఇప్పటికే వారం రోజులు అయ్యింది ఇక్కడకు వచ్చి ..నాకు నరకమే కనబడుతోంది. అది పెడితే బ్రతికినా పాడలేను. నాలోని సింగర్ కి ఆగస్టు 14 లాస్ట్ డే … కామ్ గా “మీకు ఏది మంచిది అని పిస్తే అదీ చెయ్యండి ” మెల్లగా స్పర్శ కోల్పుతున్నాను.

ఆగస్టు 15 : రూమ్ మార్పు, డాక్టర్స్ మార్పు. వెంటిలేటర్ . బాడీ లో ఏ అంగము పనిచేటం లేదు అనిపిస్తోంది. మెదడు మొద్దుబారి పోయింది. అన్ని ట్యూబ్స్ , కంప్లీట్ కొరోనా ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యింది. EKMO గుండె కి, కృత్రిమ ఊపిరి ఆడటానికి . సావిత్రి కి కూడా కొరోనా , ఇదే హాస్పిటల్ లో వేరే వార్డ్ లో ఉంది

ఆగస్టు 17 : . ఏ శ్వాసలో మ్రోగితే గాలి గాంధర్వ అవుతున్నదో.. ….

అర్ధమయ్యింది 45 వేలకు పైగా పాటలు పాడి 1000 పైగా స్టేజి ఫై మిమ్మల్ని పాటల తో ఊదిన ఊపిరి తిత్తులు అలసి పోయాయి అని. ఆగిపోతున్నాయి అని. బహుశా అవి కోలుకోలేవని

ఆగస్టు 20 : అంతటా యాంత్రికం గా జరుగుతున్నాయి. పగలూ లేదు రాత్రి లేదు. ఆహరం లేదు, గాలి లేదు , వెలుతురూ లేదు సూర్యుడు లేడు చంద్రుడు లేడు మెల్ల మెల్లగా అన్ని మర్చిపోతున్నాను ఆత్మ కథ పుస్తం గా రాలేదే అనిపించింది. మాస్టారి విగ్రహం రవీంద్ర భారతి నేను పెట్టించాను . రాష్ట్రాలు విడిపోయింతరువాత అది ఎక్కడుందో ….

చాలా క్రిటికల్ పరిస్థితి. ఏమి తెలియటం లేదు , అన్నీ బందించి ప్రాణాలు ఆపినట్లున్నారు.. కన్ను తెరచినా , మూసినా ఒకటే … గాలి లో తేలినట్లు. ఎగిరి పోయే ప్రాణం వెనక్కి లాగుతున్నట్లు.

హాస్పిటల్ ముందు నేను బ్రతకాలని కాండిల్ లైట్స్ , కొందరు విజిల్స్ వేస్తున్నారని నర్స్ చెబుతోంది ….

ఆగస్టు 29 సెకండ్లు, నిముషాలు గంటలు, రోజులు, వారాలు గడిచిపోతున్నాయి. ఏ మార్పు లేదు అనుకొంటాను అచేతనం గా ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. నాకు తెలియకుండా. అంపశయ్య మీద గాయాలతో ఉన్న భీష్మునికి నాకు పెద్దగా తేడాలేదు … అయన గాయాలతో… నేను గాలి కూడా పేల్చక్కర్లేదు. అన్ని అవే పనిచేస్తున్నాయి. ఆయనకు ఇచ్చా మరణం మరి నాకు ….

సెప్టెంబర్ 6 : వివాహ దినోత్సవం ఇద్దరికీ కొరోనా ఇద్దరం ఒకే హాస్పిటల్ .. కేక్ తెచ్చారు , కట్ చేశారు. చూడట మే కానీ స్పందించటం లేదు. కాళ్లు , చేతులు వ్యాయమ ప్రక్రియ చేస్తున్నారు. చరణ్, .. సావిత్రి గుర్తు పట్టాను. డాక్టర్స్ , నర్సులు ఎంకరేజ్ చేస్తున్నారు. పాటలు ఆస్వాదించే పరిస్థితి లేదు . నా నిమిత్తం లేకుండా అన్నీ జరుగుతున్నాయి.

సెప్టెంబర్ 7 : కొరోనా నెగటివ్ అని డాక్టర్స్ నర్సులు జయించావు అంటూ . అని బాగా పాటలు పాడారు . చప్పట్లు కొట్టారు. ఇంకేముంది పది రోజులలో ఇంటికి అన్నారు. మెదడు పెద్దగా పనిచేసున్నట్లు లేదు.. పాటలు పోయాయి. కన్ఫ్యూషన్ కోమా … నీళ్ళు తాగించారు మెల్లగా అన్ని తినవచ్చు అనుకొన్నాను. అటు ఇటు బెడ్ మీద తిప్పారు.

సెప్టెంబర్ 15 : పూర్తి రొటీన్ ,, టెస్టులు, సెలైన్ ఇంజెక్షన్స్, బ్లడ్ ఎక్కించటం. ఇంకా ఉండాలనిపించటం లేదు. ఇంటికి పద అని చరణ్ కి చెప్పాను . చెప్పటం కాదు అన్ని సంజ్ఞలే … ఎవరైనా 5 మీటర్ల దూరమే …

సెప్టెంబర్ 22 : ఇప్పటి దాకా బాడీ మీద పనిచేసిన డాక్టర్స్ నా మెదడుకి పని పెట్టారు. CT స్కాన్, MRI స్కాన్. బహుశా MGM అన్ని డిపార్ట్మెంట్స్ కి నేను అతిధిని కొరోనా శరీరం లోంచి మెదడుకి పాకినట్లున్నది. ఒకటే హడావుడి. ఇప్పుడు చూడక్కర్లేదు . వినక్కర్లేదు బహుశా కొరోనా శరీరం కి వస్తే నివారించవచ్చు మెదడుకి మండే లేదు

సెప్టెంబర్ 23 : ఇంక అంతా అయిపొయింది. మాక్సిమం లైఫ్ సపోర్ట్ మీద ఉంది నా బాడీ . అది తీసేస్తే పూర్తిగా స్వస్తి అంటా మర్చిపోయాను. ఏటో ఎగిరిపోతున్నట్లు. …. బహుశా ఆకాశంలో నన్ను పిలుస్తున్నారు. నాకు ఎవరు లేరు భవబంధాలు తెంచుకొంటున్నాను.

సెప్టెంబర్ 24 : ఆకాశం లో అందరూ ఇప్పుడు స్పష్టం గా కనబడుతున్నారు. ఇంకా నన్ను చూడంలేదు మనిషి లాగా , కమల్ వచ్చాడు . భారతీ రాజా చూశాడు . వార్తలు వేసేసారు. జీవిత చరిత్ర చెప్పేసారు. ఇక లేరా ? అని నన్నే ప్రశ్నిస్తున్నారు . మెదడులో రక్త స్రావం దాని మందు లేదు. ఇప్పటి దాకా పనిచేసినవి మళ్ళి ఆగిపోయాయి… చరణ్ ముహూర్తం పెట్టించినట్లున్నాడు రేపు బాగుంది అని

సెప్టెంబర్ 25 : హమ్మయ్య విముక్తి … 1:00 కి సీసా మూత తీసేసారు. కస్టపడి 3 నిమిషాలు గాలి పీల్చాను. , సాగర సంగమం లో బాలు చివరి శ్వాస లాగా నాది ఆగిపోయింది. 1:04 అని ఫైల్ మూసేసారు.

ప్రణబ్ గారిని మించి , అమ్మ జయ లలితను తలపిస్తూ నా ఆసుపత్రి కథ ముగిసింది ఇంక ట్విట్లు పెట్టండి , వాట్సాప్ మోత ముగించండి , FB దుమ్ము దులపండి శకం ముగిసింది. ఎవరు అప్పుడే వికీపీడియా అప్డేట్ చేసారు. 1:5 కే

నా పాట నాతో పాటే ఇప్పటి దాకా నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేశాను . ఇప్పుడు మీవంతు. నా పాటలు నాకే పెట్టెయ్యండి

సెప్టెంబర్ 26 : అప్పుడే స్వర్గం లో తుంబురుడు, నారదుడు వచ్చి తీసుకెళ్తున్నట్లు పేపర్స్ లో వేసేసారు. బహుశా ముందే రెడీ చేసినట్లున్నారు ఆగస్టు లోనే రెడీ అనుకొంటాను హెడ్ లైన్స్ అన్నీ, స్వర్గం లో మాస్టారు, బాపు, రమణల తో , వేటూరి గారితో ఏకంగా ఫొటోస్ పెట్టేసారు. సాయంత్రం స్వరాభిషేకం ఉందని ఆహ్వాన పత్రిక డిజైన్ చేసేసారు. అప్పుడే తెలిసింది నేను ఎవర్ని అని. అప్పటి దాకా మా వాడే అనుకొన్న వాళ్ళు కొంచెం తగ్గారు. భారత రత్న ఇచ్చేసారు . కనీసం నేను అప్లై చెయ్యాలి లేదా రాష్ట్ర ప్రభుత్వం అప్లై చెయ్యాలి అని తెలియకుండా. నన్ను మా రాష్ట్రంలో పుట్టు, అని ఆర్డర్స్ వేసేసారు. ఆ పని దేవుడికి వదిలెయ్యండి

51 రోజులు రోజూ పాపం చరణ్ ఇబ్బంది పడుతూ పైన విశేషాలు మీకు చెప్పలేక, మాట్లాడలేక , ఇంగ్లీష్ లో చెబుతూ . చరణ్ ఫోన్ లో ఒకటి చెబితే మీకు ఇంకోటి అర్ధమయ్యి … నన్ను స్మరించి. అందరికి 11 రోజులు సంతాప దినాలు. నాకు 41 రోజులు చేశారు. ఇంత కంటే అదృష్టం ఏమి ఉంది.

చివరగా ఎప్పుడూ  చెబుతున్నట్లే ” శుభం భూయాత్ ” /// శర్మాజీ ///

Posted in సభలు సమావేశాలు | Leave a comment

బాలు తో మాట -మంతీ

బాలు తో మాట -మంతీ

 

అవి  ఘంటసాల మాస్టారి పాటల స్వరాభి షేకం ఆంద్ర దేశం లో ఊరూరా జరుగుతున్నా సువ ర్ణ మయ కాలం .అంటే సుమారు పాతిక సంవత్సరాలకు ముందు .ఆయన శిష్యుడు శ్రీ గంగాధర శాస్త్రి మొదలైన వారు వీర విజ్రు౦భ ణ గా  బాద్య భుజాలపై వేసుకొని ,ఏకాహాలు మూడు రోజుల ముచ్చట్లుగా నిర్వహిస్తున్నారు .మాస్టారి శ్రీమతి సావిత్రిగారు కుమారుడు శ్రీ రత్నకుమార్ ,ప్రముఖగాయకుడు శ్రీ జి .ఆనంద్ మొదలు ఎందరెందరో వర్ధమాన గాయనీ గాయకులు ఘంట సాల వారి స్వరలహరిని తమ గాత్రాలలో  నింపుకొని ఉర్రూత లూగిస్తున్న పరమ పవిత్రకాలం .అందులో పాల్గొనటమే ,మాస్టారి అర్చనగా ,పరమ అదృష్టంగా వీక్షకులూ భావి౦చేకాలం  .అలా ఒక సారి మాస్టారి పాటల పల్లకీ ఊరేగింపు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం లో రెండు రోజులో ,మూడు రోజులో జరిగింది .ఒక రోజు శ్రీ శ్రీపతి ప౦డితారాధ్యుల బాల  సుబ్రహ్మణ్యం అనే బాలు గారు కూడా పాల్గొంటునట్లు పేపర్ లో చదివి ,ఆ రోజు సాయంకాల౦  ఆపండుగలోపాల్గొని తరిద్దామని నేను ఉయ్యూరు నుండి సాయంకాలం వెళ్లాను. బహుశా అది సమాపన ఉత్సవం అని గుర్తు .ఆరోజు శ్రీ గంగాధర్ ,శ్రీ ఆనంద్ మొదలైనసుప్రసిద్ధులతో పాటు శ్రీ బాలు కూడా ఇతర వర్ధమాన గాయకీ గాయకులతో పాటు ఘంటసాల వారి పాటలు పాడి ఘన నివాళు లర్పించి ,తన్మయం కలిగించారు .నేనూ మహదానంద పడ్డాను .నా మనసులో ఎన్నాళ్ళ నుండో ఒక విషయం సుళ్ళు తిరుగుతూ ,ఎవరికి చెప్పాలో అసలు చెప్పాలో చెప్పకూడదో అనే సందేశం పీడిస్తోంది .ఏమైనా అందరూ ఇక్కడ ఉన్నారు కనుక  నా దగ్గర ఉన్న నోట్ బుక్ లో ఒక కాగితం చింపి ,అందులో నా మనో భావం స్పష్టంగా రాసి ,బాలుకు అందివ్వమని ఒక కార్య కర్తకు ఇచ్చి కూర్చున్నాను .కార్యక్రమం దాదాపు పూర్తయ్యే సమయం అది .బాలు నేను రాసిన కాగితం చదివి ‘’ఉయ్యూరు నుంచి ఒక మేష్టారు దుర్గా ప్రసాద్ గారు వచ్చి ,కార్యక్రమ లో పాల్గొని ఆనందించి ,ఒకకాగితం లో ఒక ముఖ్య విషయం రాసి నాకు పంపారు .అది వారి నోటి మీదుగా అందరికీ తెలియ జేయాల్సింది గా  ఆయన్ను వేదికపైకి ఆహ్వానిస్తున్నాను ‘’అన్నాడు .సరే ధైర్యం తెచ్చుకొని వేదికపైకి చేరి బాలు కు అభివాదం చేసి నేను రాసి పంపిన కాగితం లోని విషయాన్ని ఇలా చెప్పాను ‘’అందరికీ నమస్కారం . ఘంటసాల  మాస్టారి  పై ఉన్న అత్యంత గౌరవం తో ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నవారికీ, పాల్గొన్న వారికి హృదయ పూర్వక అభినందనలు .హిందీ వివిధ భారతి లో ప్రతి రోజు ఉదయం కార్యక్రమం ప్రారంభమయ్యే ముందు హిందీ సినిమా పాటలకు అమరత్వం కలిగించిన సైగల్ గారి పాట రికార్డ్ వేసి స్మృత్యంజలి ఘటించి కార్యక్రమ౦ మొదలు పెడుతున్నారు .అలాగే మన తెలుగు సినిమా పాటలకు అజరామరమైన కీర్తి ప్రతిష్టలు తన అమరగానం తో చేకూర్చిన ఘంటసాల వారి పాటలకు సైగల్ కు చేసినట్లు మనం అలా న్యాయం చేయటం లేదు .ఇది చాలా బాధాకరమైన విషయం .ఎవరికీ ఈ ఆలోచన రాకపోవటం దురదృష్టం .కనుక ఈ వేదిక మీదుగా ప్రభుత్వానికి ,రేడియో వారికీ ,అందరికీ కూడా  చెప్పేదేమిటి అంటే ‘’తెలుగు వివిధ భారతి ప్రోగ్రాం ప్రతి రోజూ  ఘంట సాల వారి పాటతో ప్రారంభించి ఆ అమరగాయకునికి సైగల్ కు లాగా గౌరవ ప్రతి పత్తి కలిగించాలి .బాలుగారు ఈవిషయం లో చొరవ తీసుకొని సంబంధితమైన వారికి చెప్పి ఈ పని జరిగేట్లు చేయాలి ‘’అన్నాను .హాలంతా చప్పట్ల మోత మోగింది .బాలు ‘’నిజమే మనం ఎవరం ఇంత వరకు దీనిపై దృష్టి పెట్ట కపోవటం మనలోపమే .మీడియా వారు రేడియో వారు ఈ విషయం గమనించి తెలుగు వివిధభారతి  ఘంట సాల వారి పాటతో నే ప్రారంభించాలి. నేనూ నావంతు కృషి చేసి, అలా జరిగేట్లు చూస్తాను ‘’అనగా మళ్ళీ హోరున చప్పట్లు ప్రతిధ్వనించాయి .   అ తర్వాత అది వేదిక వాగ్దాన౦ గానే ఉన్నది కాని కార్యరూపం దాల్చినట్లు కనిపించలేదు .

  రెండవ సారి బాలుగారిని 1997 అక్టోబర్ 7 న హైదరాబాద్ మారుతి  స్టూడియో ‘’పాడుతా తీయగా ‘’ప్రోగ్రాం నిర్వహిస్తున్నప్పుడు చూశాం .అప్పుడు మా అబ్బాయి శర్మ అక్కినేని కి చెందిన ‘’రాజ్య లక్ష్మి టెక్స్ టైల్స్ ‘’లో కంప్యూటర్ విభాగం లో పని చేస్తున్నాడు .వాళ్లకు  కాంప్లి మెంటరీ పాస్ లు ఇస్తారట .మేము. వస్తామంటే తీసుకొని ఉంచుతాను అంటే  సరే నని వెళ్లి  వాళ్ళింట్లో ఉండి ఆ పాస్ లతో నేనూ మా శ్రీమతి వెళ్లి ప్రేక్షకస్థానం లో కూర్చుని చూసి ఆనందించి ,అయిపోగానే ,ఆయన దగ్గరకు మేమిద్దరం వెళ్లి పరిచయం చేసుకోగా ఎంతో సంతోషించి నమస్కరించగా మేము ‘’మేము ఉయ్యూరు నుండి వచ్చాం .మీ బంధువు శ్రీమతి సీతం రాజు మల్లికగారు మాకు కుటుంబ స్నేహితురాలు .ఆమె తండ్రి బెజవాడలో ప్రసిద్ధ హోమియో డాక్టర్ తాడినాడ భోగ  మల్లికార్జునరావు గారు  వాస్తు జ్యోతిష్యులు ‘’అనగానే ‘’చాలా సంతోషం మాస్టారు .మల్లిక మాకు చాలా దగ్గర బంధువు .వారి నాన్నగారు మాకు దైవ సమానులు .తరచుగా వారితో మాట్లాడుతూ ఉంటాం ‘మల్లిక కూడా ఫోన్ చేస్తూ ఉంటుంది .అడిగానని చెప్పండి ‘’అన్నారు .ఈ విధంగా రెండు సార్లు మాత్రమే  చూసి మాట్లాడే అవకాశం కలిగింది .

మూడో సారి శ్రీ వేటూరి వారు తమ స్వగ్రామం పెదకళ్ళేపల్లిలో రెండు రోజులు అన్ని ఖర్చులు తానె భరించి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు1999ఫిబ్రవరి లో  ఆయన స్వంత ఇంట్లో .దానికి మేమిద్దరం వెళ్లాం .కళాస్రష్ట శ్రీ విశ్వనాథ్ ,శ్రీదేవదాస్ కనకాల దంపతులు ,సప్తపది హీరోయిన్ సబిత మొదలైన వారంతా  వచ్చారు .అందరికీ  కాఫీ టిఫిన్లు మధ్యాహ్న భోజనాలువేటూరి గారి పెంకు టింట్లో నే .వంటబ్రాహ్మణులతో  రుచిగా కమ్మని వంటలు చేయించారు నవకాయ పిండివంటలతో .కడుపు నిండా అందరం తిన్నాంఅందరం . ప్రతివారినీ వేటూరి పలకరించారు .ప్రక్కనే ఉన్న ఆడిటోరియం లో ఉదయం మీటింగ్ .బాలు కూడా రావాలి కాని ఉదయం రాలేదు .సాయంత్రం వస్తారన్నారు .ఆయన  ఆ రోజో మర్నాడో  ప్రక్కనే ఉన్న ఘంటసాలవారు పుట్టిన టేకుపల్లి లో విగ్రహా విష్కరణ  చేయాలి .సాయంత్రం దాకా చూసి మేము ఉయ్యూరు వచ్చేశాం .కనుక మూడోసారి బాలును మిస్ అయ్యాం.

   మాట అయింది ఇక మంతి-బాలు 40వేలపాటలు 16భాషలలో పాడటం ,డబ్బింగ్ చెప్పటం  నటించటం సంగీత దర్శకత్వం ,సినిమాలు నిర్మించట మొదలైన వాటిలో ఆరితేరినవాడు .బహుశా ఈ రికార్డ్ అధిగమించే అవకాశం ఇంక ఎవరికీ దక్కక పోవచ్చు .అది ఆయనదీ, మన  అదృష్టం కూడా .అంటే ‘’ఆల్ రౌండర్ ‘’ఆయన భారీ శరీరం లాగానే .శంకరాభరణం సినిమా పాటలు ఆయనకు చిరకీర్తి  నార్జించి పెట్టాయి .ఇవేం పాటలు అని బాలమురళి లాంటి వాళ్ళు అన్నా ,ఎవరూ పట్టించుకోకుండా బ్రహ్మ రథం పట్టారు జనం .సంగీతలో నిష్ణాతుడై పాడటం వేరు అందులో ప్రవేశం లేకుండా కేవలం శ్రుత పాండిత్యం తో పాడి భేష్ అనిపించుకోవటం పూర్వ జన్మ సంస్కారం ,తండ్రిగారి వారసత్వం ,దీవన . ఆపాటలను నేను కేసెట్లలో  వినని రోజు ఉండేదికాదు .అంత తన్మయత కలిగించేవి .తర్వాత బాపుగారి ‘’త్యాగయ్య ‘’మరో గొప్ప మలుపు .ఇప్పుడు కొద్దో గోప్పోసాధన చేసి పాడాడు .త్యాగయ్యగారి జీవితం లో ప్రతిఘట్టానికీ సంబంధిన కృతి పెట్టి పాడించి బాపు త్యాగయ్యగారిని చిరస్మరణీయులను చేశాడు .అవి ఫీలింగ్ లకు సంబంధిన పాటలు .అవి అనుభవిస్తూ పాడాలి అలా పాడి తనకు సాటి లేరని పించాడు బాలు .ఈ కేసెట్లు కూడా నేను రోజూ వినేవాడిని .కారణం అందులో లైఫ్ ఉంది .జీవితగమనం  ఒడి దుడుకులు రామునిపైఅచంచల భక్తీ విశ్వాసాలు ఉన్నాయి .సోమయాజులు పాత్రలో జీవిస్తే బాలు పాటలలో జీవించాడు .కాని సినిమా కొందరికి డాక్యు మెంటరి లా అనిపించి ఆదరించలేదు .నాకు మాత్రం బాపు బాలు యాజుల త్రివేణీ సంగమం అని పిస్తుంది .ఇక్కడ కూడా నామార్కులు బాలు కు సెంట్ పర్సెంట్ .

  ఆతర్వాత సిరివెన్నెల సినిమాలో బాలు పాడిన మొదటి పాట అదోలోకం లోకి తీసుకు వెడుతుంది .సీతారామ శాస్త్రి గీతం ,మామ మహదేవన్ సంగీతం బాలు గాత్రం  ఇక్కడకూడా  త్రివేణిగా ప్రవహించింది .ఎన్నెన్నో  వెరైటీ సినిమాలలో చాలా వెరైటీగా పాడుతూ సోపానాలు అధిరోహించాడు బాలు .సాంఘిక సినిమాలలో మొదట్లో కౌ బాయ్ గా పాడిన పాటలునటుడు  కృష్ణ కు బాగా నప్పాయి .అప్పుడే మొనాటనివచ్చి కొంత ఈస డింపు కూడా కలిగింది .’’మంచి మనుషులు ‘’సినిమాలో శోభన్ బాబు కు పాడిన పాటలలో స్థాయి పెరిగింది .ఘంటసాలగారికి ఒక ఆల్టర్నేట్ గాత్రం వచ్చింది అని నాకు అనిపించింది .దాన్ని చక్కగా కాపాడుకొని దున్నేశాడు. రామారావు నాగేశ్వరరావు వంటిదిగ్గజాలకు కూడా గొంతు సవరించుకొని దీటుగా భేఫర్వాగా పాడి సెభాష్ బాలు అనిపించాడు .బహుశా కృష్ణకు రావి సీతారాం గొంతు కూడా సింహాసనం మొదలైన సినిమాల్లో గొప్పగా నే ఉండేది .కనుక తనగొంతు తానే సవరించుకొని  మంచి మనుషులు సినిమాతో పునర్జీవి అయ్యాడు బాలు. అక్కడి నుంచి ఆయనను పట్టుకోవటం ఎవరి తరం కాలేదు .వామనుడు విరాట్ రూపం పొందినట్లు ఎదిగి పోయాడు .కోదండరామి రెడ్డి ,రాఘ వేంద్రరావు ,ఇళయరాజా,చిత్ర ,చక్రవర్తి  కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు హిట్లే హిట్లే చప్పట్లే చప్పట్లు .

  అన్నమయ్య లో చివరి పాట విని స్పందించని హృదయం లేదు. అక్కడ సుమన్ కు శ్రీవారి మాటలు  పాటలు ,సంగీతం మళ్ళీస్వర త్రివేణి అయింది మరోలోకం లోకి చేర్చింది కళ్ళు చెమరించని వారు ఉండనే ఉండరు  .ఈ అదృష్టం ఎందరికి దక్కింది ?బాలు అదృష్టవంతుడు .రామదాసులో అంతారామమయం పాటలో రామదాసుగారు చూసిన రామమయ లోకాన్ని ప్రత్యక్షంగా చూస్తూ వీనుల విందుగా వింటూ ఆనందపు హరి విల్లు అనుభవించాం .ఇంతటి అనుభూతి అందించాడు బాలు ,మామ ,రాఘవేంద్రుడు .విశ్వనాథ్ సినిమాలలో ఒకరకమైన పునర్జీవనం కలిగితే ,కమ్మర్షియల్ హిట్ సినిమాలలో మరో విశ్వరూపం ప్రదర్శించి మరో రకమైన ఆనందం అందించాడు .అంతటా స్వయం కృషి ,స్వయం శిక్షణ కనిపిస్తుంది .

  ఆదిత్య ,శుభసంకల్పం లాంటి సినిమాలు తీసినా చేతి చమురు భాగోతమే అయి౦దంటారు .డబ్బింగ్ లో కింగ్ మాత్రమె కాదు,  ఎంపరర్ అయ్యాడు .జంధ్యాల మల్లె పందిరి సినిమా నుంచి పక్కింటి అమ్మాయి ,మిథునం దాకా వెరైటీ సినిమాలలో నటించాడు .కానీ పాత్రలు కాక అన్నిట్లో బాలు మాత్రమే కనిపిస్తాడు .అందుకని అతని నటన నాకు నచ్చదు.మిథునం లో ‘’అరవ పయ్యా’’లాగా ఉన్నాడని సినిమా చూసిన మొదట్లోనే రాశాను .భరణి అయితే బాగా ఉండేది. ఎల్బీ శ్రీరాం ఐతే పెర్ఫెక్ట్ అని నా నమ్మకం .సరే గతం గతః .అరవ దేశం లో ఉంటున్నందున వాళ్లకు సహజమైన అతి నటనలోపొంగి ప్రవహించి వెగటు పుట్టిస్తుంది .అంటే ఓవర్ యాక్షన్ స్పష్టంగా కనిపిస్తుంది .

  ఎవరూ చేయని చేయలేని పని బాలు చేశాడు ‘’పాడుతా తీయగా ‘’తో .తెలుగు పాటకు విశ్వ కీర్తి సాధించిపెట్టాడు .మొదట్లో జెమిని వారు చేబట్టినా, తర్వాత రామోజీ సహకారం తో సెంచరీలు దాటించాడు .యువ గాయకులకు ఊపిరులు అందించాడు .పాటకు ఇంటర్నేషనల్ మార్కెట్ క్రియేట్ చేశాడు శాశ్వతం చేశాడు .పాటతోపాటు పద్యానికీ స్వరాభి షేకం చేశాడు జరిపించుకొన్నాడు .బహుశా ఏ భాషలోనూ ఇంతటి ఘన చరిత్ర ఎవరూ సృస్టించ లేదను  కొంటాను .అది చాలు. ఆయన కీర్తి ఎవరేస్ట్ శిఖరారోహణ చేసింది .

  తనకు నచ్చిన గాయకుడు ‘’రఫీ ‘’అనటం తెలుగు వారి హృదయాలకు కారం రాసి నట్లయింది .ఘంటసాల సంగీత దర్శకుడు రఫీ కి అది లేదు .మాస్టారిని కాదని రఫీ అంటే ఒకసారికాదు చాలా సార్లు అంటే భరించలేని వేదన కలిగింది .రఫీ యే స్వయంగా తనక౦టే ఘంటసాల గారే చాలా బాగా పాడారని పలు సందర్భాలలో చెప్పాడు .ఇది మర్చిపోతే ఎలా .రఫీ పాడిన ‘’చల్ఉజ్ జారే పంచీ ‘’కంటే ఘంటసాల పాడిన ‘’పయనించే ఓ చిలుకా ‘’పాట వెయ్యి రెట్లు అనుభూతిని  కురిపించిందని  రఫీ చెప్పాడు .

  ఘంటసాల బాలు ఇంటికి స్వయంగా వెళ్లి తనసినిమాలో ఒక పాటపాడమని అడిగినట్లు మొన్నజ్యోతిలో బాలు చెప్పినట్లు చదివా .మరి ఇలా వర్ధమానగాయకులుఎ౦దరికి బాలు అవకాశం ఇచ్చాడో నాకు తెలీదు .ఏకవీర లో మాస్టారితో కలిసి పాడిన పాట ఎవరైనా మెచ్చారా ?మణి శర్మ హేమ చంద్ర ,కారుణ్య వంటి వారికి అద్భుత మైన అవకాశాలు కల్పించాడు .పాడుతా తీయగా లో గాయకులను అందర్నీ సమదృష్టి తో చూసినట్లు గా కొన్ని ఎపిసోడ్ లు అనిపించవు .మనస్పూర్తిగా గాయక ,గాయని ప్రతిభను మెచ్చటం కూడా తక్కువే అని పిస్తుంది నాకు .అతని మాట హృదయం లోంచి రాదేమో అనే అభిప్రాయం కల్గిస్తుంది .అక్కడ కూడా నటన చోటు చేసుకొంటుంది .మనో చాలా భావ యుక్తంగా పాడుతాడు .కానీ అతడికి సరైన న్యాయం జరగలేదు ,జరగట్లేదు.ఎంత లేదన్నా డామినేషన్ ప్రభావం ఇండస్ట్రీని శాసిస్తూనే ఉంది ఎప్పుడూ .

  బాలు తన శరీరం లావు అయిందని బరువు తగ్గించుకొన్నట్లు  తెలుస్తోంది .అలా చేయించుకొన్న ఆర్తీ అగర్వాల్ ,దాసరి లు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొని  చేయించుకొన్న అతి తక్కువ కాలం లోనే చనిపోయినట్లు మనకు తెలుసు .ఈ అనుభవం చూసి, తెలిసికూడా బాలు ఎందుకు ఆ సాహసం చేశాడో అంతు చిక్క లేదు నాకు . ఎవరూ అతనికి నచ్చ చెప్పలేక పోయారా ?చెప్పినా విని పించుకోలేదా .తోసుకు వస్తే ఎవరూ ఏమీ చేయలేరను కోండి .పైగా కరోనా సోకటం పరిస్థితి తీవ్రతరం చేసింది .హాస్పిటల్ లో చేరిన రోజు ఫోటో పేపర్ లో చూశాక నాకు బాలులో ‘’జీవ కళ ‘’తప్పినట్లు కనిపించింది .మా ఇంట్లో ఆమాట అనుకొన్నాం కూడా అందరం . . ఏమైనా సంగీతం లో లెజెండ్ అనిపించుకొన్న గాన గ౦ధర్వ బాలు  ఇక లేరు అన్నమాట  జీర్ణించు కోలేని, కలత కలిగించే విషాద విషయం .ఆయన ఆత్మకు శాంతి కలగాలని పరమేశ్వరుని ప్రార్ధిస్తూ   ఆ కుటుంబానికి సానుభూతి తెలియ జేస్తున్నాను .

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -28-9-20-ఉయ్యూరు

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

   ధర్మవరం

   ధర్మవరం

ఒకప్పుడు పసపు లేటి నాయుడు అనే రాజు ,మైసూరు నుండి ఉత్తరంగా పరివారం తో వస్తూ  పెన్నా మాగాణి దగ్గర ఒకగుట్ట మీద బస చేశాడు .కొన్ని రోజులు అక్కడే ఉండాల్సి వచ్చింది .దానిదగ్గరే చిత్రావతి నదిలో ఒక ఉదయం స్నానం చేస్తుంటే ,ప్రవాహం బాగా ఎక్కువై ,వెంటనే గట్టు మీదకు వచ్చి నెమ్మదిగా నడుస్తుంటే ప్రవాహం పెరుగుతూనే ఉంది .అతనికి ఈ నీటికి అడ్డుకట్ట వేసి నిలవ చేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన స్పురించింది .అప్పుడే ఒక ఆజానుబాహువైన సన్యాసిఅటు వస్తుంటే ఆయనకీ చెప్పగా ఆలోచన చాలామంచిదని వెంటనే పని ప్రారంభించమని ,మళ్ళీ వస్తానని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు .

  నది వరద తగ్గగా ,గ్రామ కరణాన్ని పిలిపించి ,తన ఉద్దేశ్యం చెప్పి కావలసిన డబ్బు తాను  సమకూరుస్తానని చెప్పి పని మొదలుపెట్టమని ఆజ్ఞ జారీచేశాడు .మర్నాడే తొండ మాలలు ,హరికారులు (అరకాల వాళ్ళు) నేమర్సు జాతులలో త్రావాకం పనిలో నైపుణ్యం ఉన్న వారిని నియమించి పని మొదలు పెట్టించాడుకరణం .పని క్రమంగా పెరిగి పోతుండటం తో ,రాజు దగ్గర ఉన్న డబ్బు అంతా ఖర్చైపోయింది .అప్పటికి సుమారు మూదు వంతుల పని  మాత్రమె జరిగింది.నాయడు విచారం లో మునిగిపోయాడు. అకస్మాత్తుగా ఆయన్ను ఆశీర్వదించిన  సన్యాసి ప్రత్యక్షమై ,తన ఉత్తమ క్రియా శక్తితో పూర్తి చేశాడు .ఆయనే’’ శ్రీ క్రియా శక్తి ఒడయరు’’.కనుక ఈ చెరువు నిర్మాణానికి ముఖ్య ప్రోద్బలం ఒడయరు గారే .

  నీటి వసతి ఏర్పాటైంది కనుక గ్రామ నిర్మాణం జరగాలని భావించారు అంతకు ముందు ఇక్కడ ‘’చిలుముత్తూరు ‘’అనే పల్లె ఉండేది .దీనికి 1133-34లో తుమ్మల మల్లరుసు కరణం గా ఉండేవాడు .ఇతని తాత మాదయ .తండ్రి నాగరుసు .క్రియా శక్తి ఒడయారు ఒకరోజు వచ్చి అక్కడ గ్రామం నిర్మించాలను కొంటున్నానని మల్లరుసు తో చెప్పాడు .సంతోషించి 1153-54 శ్రీ ముఖ నామ సంవత్సర వైశాఖ శుద్ధ పౌర్ణమి సోమవారం ముహూర్త౦ నిర్ణయించారు .పని ప్రారంభం కాగా నే జనం తండోపతండాలుగా వచ్చి సాయం చేశారు .క్రియా శక్తి ఒడయరు కీర్తి దశదిశలా వ్యాపించింది .కూలీలు సాయంత్రం దాక పని చేసి ,ఒక్కొక్కడు తన ఎదుట చిన్న మట్టి కుప్ప చేయటం ,స్వామి వచ్చి వెండి బెత్తం తో వాటిని తాకుతూ ‘’మాడిదవనిగే మాడి దస్టుమహరాయా ‘’అంటూ వెళ్ళిపోయేవాడు. కూలీలు  తర్వాత వచ్చికుప్పలో వెదికితే ఆ రోజు కూలి ఖచ్చితంగా అందులో దొరికేదట .గ్రామ నిర్మాణం చేసి దానికి తనతల్లిపేరు  మీదుగా ‘’ధర్మవరం ‘’అని పేరు పెట్టాడు .ఇక్కడ పని అంతాపూర్తయ్యాక ఒడయారు స్వామి ఆనే గొంది కి వెళ్లి అక్కడి నుంచి చెన్న కేశవ స్వామి విగ్రహం తెచ్చి ధర్మవరం లో ప్రతిష్టించి ,ఆలయం కట్టించి పంచ విగ్రహ ప్రతిష్టలు కూడా చేశాడు .700ఏళ్ళక్రితం చిత్రావతీ నదీ తీరం లో ఒడయా-రు స్వామి నిర్మించిన ధర్మవర గ్రామం క్రమంగా వృద్ధి చెందింది .

  గ్రామ నిర్మాణం పూలన్నీ విజయవంతంగా అయ్యాక కరణం మల్లరుసు క్రియా శక్తిఒడయరు స్వామిని తన ఇంటికి సాదరంగా ఆహ్వానించి ,ఆతిధ్యమిచ్చి సన్మానించి గౌరవించాడు .తాను  కడుపేదననీ కుటుంబ పోషణకు కరణం వృత్తిచాలటం లేదనీ స్వామికి విన్నవించగా ,ఆయన తనతో వస్తే విజయనగరరాజు ప్రౌఢ దేవరాయలకు మనవి చేయవచ్చునని సలహా ఇవ్వగా ,వెళ్లి రాజును కలిసి,స్వామి విషయం  తన విషయం చెప్పుకొన్నాడు మల్లరుసు .చాలా సంతోషించి స్వామి ఆజ్ఞగా భావించి ,తుమ్మల సీమలోని ధర్మవరానికి చెందిన 32గ్రామాలు ,పండపేటి స్థలం లో కనగానిపల్లెలకు చెందినా 20గ్రామాలు ,పినాకినీ గడ్డకు పప్పూరికి చెందినా 37గ్రామాలు యాడికి వణితానికి 34గ్రామాలు మొత్తం 123గ్రామాలను శ్రీముఖ ఆశ్వయుజ పౌర్ణమి నాడు తామ్రాశాసనంగా రాయించి అందజేశాడు .ఈ విజయనగరం హంపీ విజయనగరం కాదనీ 1156-57లో తుంగభద్రా తీరం లో విజయధ్వజరాజు నిర్మించి పాలించిన చిన్న విజయనగర పట్టణం అనీ విజయధ్వజుడే ప్రౌఢ దేవరాయలు కావచ్చునని అంటారు.

  మల్లరుసు మరొకసారి విజయనగరం వెళ్లి ప్రౌఢరాయలకు కార్యనిర్వాహకుడైన సోమదేవ రాయని ఆశ్రయం పొందాడు .

  విజయనగర రాజుల తర్వాత హండే దొరలూ ,తర్వాత రాయదుర్గం దొరలూ తర్వాత అనేకమంది పాలించాక శ్రీరంగాపట్టణ పాలకుడు హైదరాలీకి,తర్వాతకొడుకు టిప్పు సుల్తాన్ కు  ధర్మవరం చేరింది ,తర్వాత ఇంగ్లీష్ వారు పాలించారు. కాలక్రంగా బాగా అభివృద్ధి చెంది విద్యా వైద్య సదుపాయాలూ రోడ్లు దేఆలయాలు మసీదులు మొదలైన ప్రార్ధనామందిరాలు అన్నీ విస్తరించాయ.కళలకుకాణాచి అయింది .క్రియా శక్తి ఒడయరు సమాజం ఏర్పడి సా౦ఘికాది సేవలు నిర్వహిస్తోంది .అనేక క్షామాలను ,ఉపద్రవాలను ఆటు పోట్లను తట్టుకొని ఎదుర్కొని నిలిచింది .

  ధర్మవరానికి చెందిన ప్రముఖులలో సంస్కృత నిధి కోడేకొండ్ల పెద్దయాచార్యులు ,ఆయుర్వేద సంస్కృత విద్వాంసులు వైద్యం కృష్ణమాచార్యులు ,ఆంధ్రనాటక పితామహ ధర్మవరం రామకృష్ణమాచార్యులు ,సంస్కృతపండితుడు దుద్దాల నారాయణ శాస్త్రి,బంధకావ్యాలను కంఠస్థం  చేసిన ఉచితంగా బోధించిన అంధులు పంచకావ్యం రామాచార్యులు ,హఠయోగిగోపాలం చిన్నప్ప ,పోలీస్ ఇన్స్పెక్టర్ మద్దిపి హనుమంతనాయుడు  గార్లు ధర్మవరాని కి యెనలేని కీర్తి నార్జి౦చి పెట్టారు .

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-9-20-ఉయ్యూరు

Posted in సమీక్ష | Tagged , | Leave a comment

సర్పవర క్షేత్ర

అభినవ వాగనుశాసనుడు ,కవి సార్వభౌముడు కూచిమంచి తిమ్మకవి ‘’సర్పవర క్షేత్రాన్ని

← Back

Thank you for your response. ✨

‘’గురించి లీలాసు౦దరీ పరిణయం ‘’అనే కావ్యం రాశాడు .కవి నియోగి కౌన్డిన్యస గోత్రం  బయ్యనామాత్యుని ముని మనవడు .తిమ్మయ మనవడు .గంగనామాత్యుని కొడుకు .తల్లి లక్ష్మమ .జగ్గన సింగన నరసన పెద తండ్రులు .వీరమ ,పాపమ మేనత్తలు .రాజన,సింగన ,పెద్దన పెత్తండ్రి కొడుకులు . రాజన్న  జగ్గన సూరన సోదరులు .భార్య బుచ్చమ .నివాసం పిఠాపుర సంస్థానం లోని కందరాడ గ్రామం .ఆవూరి కరణం మనకవి .పుట్టి పెరిగింది చంద్రమపాలెం . దెందులూరి లింగారాధ్య దత్త ఉమా మహేశ్వరాచార్య౦ వాడైనా ,అద్వైతమతమే అవలంబించాడు .ఒకరోజు భావనారాయణ స్వామి కలలో కనిపించి ‘’శివుడికి నాకు భేదం లేదు .శివుడికి చాలకృతులు రాసి సమర్పించి పేరు పొందావు .నాకూ ఒకటి అంకితం చేయి ‘’అని అడిగాడు .దానిప్రకారమే పై కావ్యం రాసి ఆయనకు సమర్పించాడు కూచిమంచి తిమ్మనకవి .

  పీఠికాపుర సంస్థాన ప్రభువు రావు మాధవరావు కాలం లో ఉండేవాడు .కావ్యాలురాసి కవి సార్వభౌముడు మొదలైన బిరుదులు పొందాడు .రెండవ కావ్యం రుక్మిణీ పరిణయం1715లో, చివరిది శివలీలా విలాసం 1756లో రాసినట్లు భావిస్తారు .తిమ్మకవి 18వ శతాబ్ది ప్రారంభం లో పుట్టి ,ఆ శతాబ్ది మధ్యవరకూ జీవించాడు .పైన చెప్పినవే కాక రాజశేఖర విలాసం లేక భళ్ళాల చరిత్ర ,సింహాచల మహాత్మ్యం ,అచ్చ తెనుగు రామాయణం ,సారంగధర చరిత్ర,సాగర సంగ మహాత్మ్యం ,,లక్షణ సార సంగ్రహం ,రసిక జన మనోభిరామం తో పాటు చాలా శతకాలు దండకాలు కూడా రాశాడు .’’ప్రబంధ రాజ వెంకటేశ్వర విజయ విలాసం’’ రాసిన గణపవరం వెంకట కవి తర్వాత ఇన్ని రచనలు చేసినవారు లేరు .ఇతని కవితా ప్రతిభ అమోఘం కనుకనే బంధువైన ఏనుగు లక్షణ కవి ‘’హాటక గర్భ  వదూలీ లాటన చలితా౦ఘ్రినూపురా రావ శ్రీ పాటచ్చరములు ,తేనియ తేటలు మా కూచిమంచి తిమ్మయమాటల్’’అని అందరికీ తెలిపాడు .               కథ

     ఈ క్షేత్రానికి సంబంధించిన పురాణ సంబంధమైన కథ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వం ఇంద్రాది దేవతలు బ్రహ్మదేవుడితో సమావేశమైనప్పుడు విష్ణు మాయ గురించిన ప్రస్తావన వచ్చింది. అందరూ కూడా విష్ణుమాయను కనుగొనడం ఎవరివల్లాకాదనే నిర్ధారణకి వచ్చారు. అయితే అక్కడే ఉన్న నారదుడు వారితో ఏకీభవించకుండా, అనుక్షణం విష్ణు నామాన్ని జపించే తనకి ఆయన మాయను తెలుసుకోవడం సులభమే అని అన్నాడు. ఈ సంగతి కాస్తా విష్ణుమూర్తికి తెలిసింది. ఆ తరువాత కొంతకాలానికి నారదుడు భూలోక విహారానికి వెళ్లాడు. సంధ్యావందన సమయం కావడంతో ఓ కొలనులోకి దిగాడు. ఆ నీటిలో మునిగి లేచిన నారదుడు తాను స్త్రీగా మారిపోయినట్టు తెలుసుకుని ఆశ్చర్య పోయాడు. గట్టున పెట్టిన మహాతి (వీణ) కానీ, కమండలం కానీ కనిపించకపోవడంతో అయోమయానికి లోనయ్యాడు. నారదుడిగా సర్వ శక్తులను కోల్పోయి గతం మరిచిపోయి ఇష్టానుసారంగా తిరగసాగాడు. స్త్రీ రూపంలో ఉన్న నారదుని చూసి మోహించిన పీఠికాపురం (పిఠాపురం) పాలకుడైన నికుంఠ మహారాజు ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత ఆ రాజు శత్రు రాజుల చేతిలో హతుడయ్యాడు. స్త్రీ రూపంలో ఉన్న నారదుడు పారిపోయి అడవుల్లో తిరుగుతూ ఆకలితో ఓ చెట్టు నుంచి పండును కోయడానికి ప్రయత్నిస్తూ, అది అందక ఇబ్బంది పడసాగాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మారువేషంలో అక్కడికి వచ్చి అక్కడికి దగ్గరలోని కొలనులో స్నానం చేసి వస్తేనే గాని ఆ పండు అందదని చెప్పాడు. దానితో నారద స్త్రీ కొలనులోకి వంగిన ఓ చెట్టుకొమ్మ పట్టుకుని నీళ్ళలోకి దిగి ఓ మునకవేయగానే స్త్రీ రూపం పోయి నారద రూపం వచ్చినప్పటికీ, కొమ్మని పట్టుకోవడం వలన తడవని చేతి గాజులు మాత్రం అలాగే ఉన్నాయి. వాటిని చూసి ఆశ్చర్య పోతూ ఒడ్డుకువచ్చిన నారదుడికి అదంతా విష్ణుమాయ అని అర్థమైంది. దానితో శ్రీ మహా విష్ణువు అనుగ్రహం కోసం ఈ ప్రదేశంలో పాతాళ భావనారాయణ స్వామిని ప్రతిష్ఠించి, వేల సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు, ఆయన మాయకు ప్రత్యక్ష సాక్ష్యంగా ఆ ప్రదేశంలో కొలువుదీర వలసిందిగా నారదుడు కోరడం వలన భావనారాయణ స్వామిగా ఆయన అక్కడ వెలిశాడు. ఆ తరువాత రాజ్య లక్ష్మీ అమ్మవారిని స్వామివారికి ఎదురుగా ప్రతిష్ఠించారు.

పంచభావనారాయణ క్షేత్రాలలో ఒకటైన పాతాళభైరవాలయం ఇక్కడ ఉంది. ఈ ఆలయానికి ఒక విశిష్టత ఉంది. నారదుడు ముందుగా స్నానం చేసి స్త్రీ రూపాన్ని పొందిన కొలను . ఆ తరువాత స్నానం చేసి స్త్రీ రూపాన్ని వదిలించుకున్న కొలను నేటికీ ఇక్కడ పక్కపక్కనే దర్శనమిస్తాయి. విశాలమైన ప్రాంగణం. శిల్ప కళా శోభితమైన గాలి గోపురం ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఈ క్షేత్ర మహిమ గురించి శ్రీ నాథుడు తన కావ్యాల్లో ప్రస్తావించాడు. ‘వైశాఖ శుద్ధ ఏకాదశి’ రోజున స్వామివారికి అంగరంగ వైభవంగా కల్యాణోత్సవం జరుపబడుతుంది. శేష, గజ, అశ్వ వాహనాలపై ఊరేగే లక్ష్మీ నారాయణులను చూడటానికి భక్తులు ఈ ఉత్సవంలో విశేష సంఖ్యలో పాల్గొంటారు.

 సర్పవరం కాకినాడకు 5కిలో మీటర్ల దూరం లోనే ఉంటుంది .

    మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-9-20-ఉయ్యూరు

Posted in సమీక్ష | Tagged | Leave a comment

మనకు తెలియని మహా యోగులు -22(చివరి భాగం )

మనకు తెలియని మహా యోగులు -22(చివరి భాగం )

66-నెమళ్ళ దిన్నె హుస్సేన్ గురు -1850-1929

కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ తాలూకా  చాగలమర్రి వ్యవసాయ ముస్లిం కుటుంబం లో వనల చిన్న హుంసూర్ ,హుసేన్ బూ దంపతులకు 1850లో  హుసేన్ పుట్టాడు .అయిదవ ఏటనే ఏకాంతంగా ధ్యానం చేసేవాడు .వయసుతో పాటు ధ్యానం గ్రంథ పఠనం సాధు సంతతిసేవ పెరిగాయి .పెళ్లిఅయినా మార్పు రాలేదు .అక్కడి శివనాగమయ్య బోధనలతో భక్తీ వైరాగ్యాలు పెరిగాయి .విరాగిలా పిచ్చి వాడిగా తిరిగేవాడు .ఒక రోజు కలలో ఒక పురుషుడు కనిపించి మర్నాడే మార్గదర్శనం జరుగుతుందని చెప్పాడు .అనుకొన్నట్లే మర్నాడు చంద్రోదయకాలం లో ఒక దిగంబర అవధూత వచ్చి హుసేన్ కు సౌఖ్య సూత్రం ,నాదానందం ,పంచ ముద్రలు సాకార నిరాకారాలు పరిపూర్ణం అమనస్కత వగైరా బోధించి ,శిరసుపై చేయి ఉంచి ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు .

  వెంటనే అడవిలో ఒక చెట్టెక్కి కొమ్మపై వెల్లకిలా పడుకొని ధ్యానమగ్నడయ్యాడు.తర్వాత సంసార బంధాలన్నీ తెంచుకొని ,అడవులలో తిరుగుతూ ,ఒక దేవాలయం లో బస చేయగా ఎందరో శిష్యులేర్పడ్డారు .అద్భుతాలు చూపేవాడు 27-10-1929శుక్ల ఆశ్వయుజ బహుళదశమీ ఆదివారం 79వ ఏట హుసేన్ గురుడు దేహం చాలించాడు .మర్నాటి ఉదయం సమాధి చేశారు .తర్వాత మందిరం కట్టి ఉరుసు ఉత్సవం చేశారు .ప్రతి చైత్ర పౌర్ణమి ,ఆశ్వయుజ బహుళ ఏకాదశి నాడు ఆరాధనోత్సవాలు జరుపుతారు .

67-ఫిరోజీ మహర్షి -1829-1889

సత్తెనపల్లి మరాఠా వీధిలో నర్సోబీ నర్సూ బాయి దంపతులకు చిదంబర యోగి ఉపదేశించిన ఆదిత్య మంత్రోపాసన ఫలితంగా మొదటికొడుకుగా ఫిరోజీ పుట్టాడు .పెద్దయ్యాక సత్తెనపల్లిలో చిదానంద యోగిని సేవించి తారకమంత్రోప దేశం పొంది యోగరహస్యాలు గ్రహించాడు .తారకమంత్రం దీక్షగా జపిస్తూ , సద్గ్రంథాలు చదువుతూ ,సాధువులను సేవిస్తూ ,పద్యాలు కీర్తనలు రచించాడు  .నూజి వీడుకు చెందినఘటకాల వెంకోజీ కుమార్తె వీరాబాయితో వివాహమై ,ఆత్మ దర్శనాభి లాష పెరిగి ,పంచదశి సీతారామాన్జనేయం రామస్తవరాజం ,వాసుదేవ మననం ,ఉపనిషత్తులజ్ఞాన సారం వంటబట్టి౦చు కొన్నాడు .బాలుడిగా ఉండగానే యోగసిద్ధులు పొందాడు

  వేదాంత ప్రవచనాలను అత్యంత సులభంగా సుబోధకం గా ఫిరోజీ బోధించేవాడు .దీనితో సుదూర ప్రాంతాలనుంచి జనం వచ్చి వినేవారు . అద్వైతి అయినా అన్ని భావాళ వారినీ మతాలవారినీ ఆదరించేవారు .సంచారం చేస్తూ జ్ఞానబోధ చేసేవారు. 9-7-1889 విరోధి ఆషాఢ శుద్ధ ఏకాదశి మంగళవారం 60 ఏళ్ళవయసులో పెద్దకొడుకు లక్ష్మాజీ రావు కు హితోపదేశం చేసి ,గురు పీఠం నెలకొల్పమని చెప్పి ,బ్రహ్మ రంధ్రం ద్వారా ప్రాణత్యాగం చేశారు .తోటలో సమాధి చేశారు .పూర్వం ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు ఆరాధన చేసేవారు .అది వర్షాకాలం కావటం తో ఇప్పుడు లఘు పూజ  మాత్రమె ,చేసి మాఘ శుద్ధ ఏకాదశినాడు పెద్ద ఎత్తున ఆరాధనోత్సవాలు జరుపుతున్నారు .

68-రామ యోగి కవి -1825-1895

మార్కాపురంతాలూకా సుంకేసుల లో కాశ్యప గోత్రీకులైన విశ్వబ్రాహ్మణ దంపతులు పున్నోజు శేషయ్య వీరమ్మ లకు రామయ్య పుట్టాడు .అక్కడే చదివి ,పండితులవద్దసాహిత్య ఛందో వ్యాకరణాలు జ్యోతిష గృహవాస్తు  జలవాస్తు ,శల్యవాస్తు విద్యలు నేర్చాడు .స్వర్ణ దారు శిల్ప కళలలో ఆరితేరాడు ,.మంచి కవిత్వం రాసేవాడు .సజ్జన సాంగత్యం లో వేదాంత వాసనా అలవాటైంది .సుబ్రహ్మణ్య బ్రాహ్మణ గురువు వద్ద బ్రహ్మోపదేశం పొంది,మహానందిలో మూడు నెలలు కఠోర సాధన చేశాడు .

  తడకనపల్లి స్థిరపడి ,నిస్సంగం గా సంసారం ఈదుతూ  అష్టాంగ యోగం లో నిష్ణాతుడై ,బ్రహ్మ సాక్షాత్కారం పొంది ,రాజయోగి అయి ,వాక్సుద్ధి దూరదృష్టి,దూర శ్రవణం అలవడిసాహిత్య వేదాంత రాజయోగాలు శిష్యులకు బోధించాడు .మహా నందీశ్వరుడికి అంకితమిస్తూ చాలా గ్రంథాలు రాశాడు .వాటిలో శంకర శతకం ,మహానంది లింగ శతకం ,వేదాంత సూత్రాలు ,షట్ స్థల దర్పణం,పంచరత్నాలు ,నవరత్నమాలిక ,శంభు శతకం ,లింగ మూర్తి పాట,భ్రమరాంబా దండకం ,రామతారక బ్రహ్మ శతకం ,మహావాక్య ప్రకరణం ,శుద్ధ రాజయోగం ఉన్నాయి .ముందుగానే శిష్యులకు చెప్పి 5-12-1895 మన్మథ మార్గశిర బహుళ తదియ గురువారం 70వ ఏట రామయోగి శివైక్యం చెందారు .తడకన పల్లి లో సమాధి చేసి లింగప్రతిష్ట మందిర నిర్మాణం చేశారు .మార్గశిర బహుళ తదియనాడు ఆరాధన రధోత్సవం వైభవం గా చేస్తారు .

69-సయ్యద్ ఆహ్మదలీ ఖాదర్ వలీ -1868-1948

నల్గొండ జిల్లా గొల్లపల్లి జాగీర్దార్ వంశం లో సయ్యద్ అహ్మదలీ ఖాదర్ వలీ 1868 లో జన్మించి తూగోజి అమలాపురం తాలూకా ముమ్మడి వరం మండలం కొత్తలంకలో 1948 సిద్ధి పొంది కొత్తలంక యోగి గా ప్రసిద్ధుడయ్యాడు .1921 జనాభా లెక్కలప్రకారం ఆయన వయసు 125ఏళ్ళు .కనుక పుట్టింది 1796 గా భావిస్తారు .1850 కుండలేశ్వర గ్రామం గౌతమీ నది ఒడ్డున మిథాయి దుకాణం వద్ద మొదటిసారి గోచీతో కనిపించాడు .శరీరం తడవ కుండా గౌతమీ నదిని రెండు సార్లు దాటటం చూసి సిద్ధ పురుషుడుగా భావించారు .

   రాజమండ్రి కోటి లింగాలవద్ద ఉండే కృష్ణావదూతే వలీ గారి అనుగ్రహం కోసం పరితపించి సేవించి తరించారు .తన పరీక్షలో నెగ్గిన వారినే శిష్యులుగా తీసుకొనేవారు .శుభాశుభ  ప్రశ్నలకు తేలికగా సమాధానాలు చెప్పేవారు .బ్రాహ్మణులతో సహా అన్ని వర్ణాలవారూ శిష్యులయ్యారు .ఖండయోగం ప్రదర్శించేవారు .రంగూన్ సైనికాధికారి ఆదేశం తో బ్రిటిష్ వారు దాడిచేస్తారని కాలజ్ఞానం చెప్పారు .కొబ్బరికాయలకు కొమ్ములు మొలిపించి ఆశ్చర్యపరచారు .22-1-1948 మిలాది నబి మహమ్మద్ ప్రవక్త జన్మ దినం రోజున సర్వజిత్ పుష్య శుద్ధ ఏకాదశి గురువారం జీవ సమాధి చెందారు .ఆయన సమాధి వద్ద వరుసగా మూడు రోజులు నిద్ర చేస్తే సాక్షాత్కరించిన సంఘటనలు చాలా ఉన్నాయి .1947 రాష్ట్రనాయకులు కళావెంకటరావు ,బులుసు సాంబమూర్తి గార్లు వలీ గారిని దర్శించే నాటికి ఆయనవయసు 175ఏళ్ళు అని అంచనా .1953లో సమాధిపై దర్గానిర్మించారు .దేశం నాలుగు మూలలను౦ చేకాక కువైట్ ,పాకిస్తాన్ దుబాయ్ వంటి దేశాలను౦చి కూడా భక్తులు వచ్చి దర్గా సందర్శిస్తారు .

70-కవి యోగి ధేనువ కొండ వెంకయ్య -1851-1936

ప్రకాశం జిల్లా అద్దంకి  మండలం గార్లపాడులో ధేనువకొండ పిచ్చయ్య కనకమ్మలకు వెంకయ్య 1851లోపుట్టాడు .ధేనువకొండ వేణుగోపాలస్వామి భక్తుడు .వారసత్వంగా సంగీత సాహిత్యాలు అలవడినాయి . తండ్రి అసంపూర్ణంగా రాసివదలిన ‘’వామన పురాణం ‘’యక్షగానం సమర్ధంగా పూర్తి చేసి తండ్రి మెప్పు పొందాడు .మేనత్తకూతురు కనకమ్మ ను పెళ్ళాడాడు.సంతానం కలగలేదు .నిరతాన్నదానం వలన ఆర్ధిక ఇబ్బండులేర్పడ్డాయి .సిరి సంపదలు సాధించాలని కాశీవెళ్లి మంత్రసిద్ధులను సాధించి పదేళ్ళ తర్వాత తిరిగి వచ్చాడు .

 మంత్రోపాసన ధ్యానధారణ తోపాటు హరికథలు యక్షగానాలు రాశాడు .మొదటి రచన ‘’విరాట పర్వం ‘’జంగం కథ ను తన ఇష్టదైవం ధేనువకొండ వేణుగోపాలస్వామికి అంకితమిచ్చాడు .ఎరి నైనా సద్గురువు ను దీక్షితుడై యోగాధ్యయనం చేసి సేవించి ,సన్యాసం స్వీకరించాలనే సంకల్పం తో కుర్తాళ0 వెళ్లి సిద్దేశ్వర  పీఠ౦ స్థాపించిన పీఠాధిపతి మౌనస్వామిని దర్శించి ,శివ చిదానంద భారతీ స్వామిశిష్యుడై సన్యాస దీక్షను ‘’శ్రీరామతారక బ్రహ్మానంద అవధూతేంద్ర సరస్వతి ‘’దీక్షానామం పొందారు .తర్వాత తీర్ధయాత్రలు చేస్తూ అనంతపురం తాడిపత్రి చేరి ,కరణం గారి తోటలో విడిది చేసి,లీలలు అద్భుతాలు ప్రదర్శిస్తూ ,ఆదివ్యాధులను నయం చేస్తూ ,జ్ఞానబోధ చేస్తూ జనాలను  సన్మార్గం లో పెట్టారు .12-3-1936యువనామ సంవత్సర ఫాల్గుణ బహుళ చవితి గురువారం 85వ ఏట కపాల చేదనం చేసుకొని కవియోగి,అవదూతేంద్ర సరస్వతి విశ్వ చైతన్యం లో కలిసిపోయారు .ఘనంగా ఆరాధనోత్సవాలు చేస్తారు .

మనకు తెలియని మహాయోగులు సమాప్తం

ఆధారం –మొదటి ఎపిసోడ్ లోనే తెలియజేసినట్లు ‘’మనకు తెలియని మహాయోగులు ‘’ధారావాహికకు ఆధారం –శ్రీకొత్తపల్లి హుమంతరావు గారి రచన ‘’మహా యోగులు’’.

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-9-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనకు తెలియని మహా యోగులు -21 61-పూదోట లింగావదూత -17వ శతాబ్దం

మనకు తెలియని మహా యోగులు -21

61-పూదోట లింగావదూత -17వ శతాబ్దం

కర్నూలు జిల్లా పాలేరు నదీ తీరాన అవుకు గ్రామం లో సోమమ్మ సోమిరెడ్డి దంపతులకు లింగమూర్తి పుట్టాడు .ఐదవ ఏటనే చెట్టు కింద శివనామం జపిస్తూ గడిపేవాడు .తలిదండ్రులు చనిపోగా ఏగంటి శివరామ యోగి మంత్రోపదేశం చేసి,శివ లింగగుహకు తీసుకు వెళ్లి,సమస్త విద్యలు నేర్పాడు .దృశ్య భేదన యోగం ,చైతన్య జడ సంధాన చిన్మయయోగం వంటి అనేక యోగాలు నేర్పి తీర్చి దిద్దాడు .

   శివరామ గురుడు ‘’పూదోట గురు పీఠం’’స్థాపించి ,లింగమూర్తిని మొదటి పీఠాధిపతి ని చేసి ,’’పూదోట లింగావదూత ‘’  నామకరణం చేసి ,విశ్వమతాన్ని స్థాపించి వేద వేదాంగాలు అందరికీ అందుబాటులోకి తీసుకు రమ్మని ఆదేశించాడు .రవ్వలకొండ గుహలో గోచీ మాత్రమే ధరించి మహిమలు చూపుతూ ఆశువుగా వేదా౦తతత్వాలు రాసి పాడుతూ పండిత పామరులను ఆకర్షించాడు .ఈ గీతాలను ఆశ్రమ వారసుడు 13దళాలుగా ,715పాటలను తాటాకులపై రాస్తే ,10వ పీఠాధిపతి’’పూదోట తత్వ గీతామృతం ‘’పేరిట శ్రీ ఆనందన స్వామి 1962లో ప్రచురించారు .తాను  తనువు చాలించే విషయం ము౦దేచెప్పిచ జ్యేష్ట పూర్ణిమనాడు దాసావదూతను పీఠాదిపతిని ,చేసి ,జ్యేష్ట బహుళ ఏకాదశి నాడు సంగమేశ్వర తీరాన చిన్న వనం చేరి భక్తుల జయజయ ధ్వానాల మధ్య లింగమూర్తి  అవధూత స్వామి కృష్ణా నదిలో మోకాలి లోతు నీటిలో ,చివరగా ఒక తత్వాన్ని ఆశువుగా పాడి ,కృష్ణాజినంపై పద్మాసనం లో కూర్చుని ,ప్రవాహం మధ్యలోకి వెళ్ళగా ,ఆయన దేహం చుట్టూ మంటలు లేచి అవి ప్రకాశంగా మారి సూర్యమండలం వైపు సాగి పోయాయి .ఏటా జ్యేష్ట బహుళ ద్వాదశినాడు ఆరాధనోత్సవాలు పరమవైభవంగా చేస్తారు .శివ కేశవ భేదం లేదని చాటిన శివా౦శ  సంభూతుడుస్వామి .‘

62-త్రికాలజ్ఞాని ధరణి సీతారామ యోగీంద్ర స్వామి -1714-1796

కాశీ నుంచి ఆంధ్రదేశానికి వచ్చి స్థిరపడిన తర్కశాస్త్ర మాధవభట్టు వంశం లోని వశిష్ట గోత్రీకుడు ధరణిసుబ్బయ్య ,తిమ్మాంబ దంపతులకు కడపజిల్లా పొద్దుటూరు తాలూకా కోర్రపారు లో 4-1-1714 జయ పుష్యబహుళచవితి సోమవారం సీతారామ స్వామి మూడవ సంతానం గా పుట్టాడు .నాలుగేళ్ళకే తండ్రి చనిపోగా ,ఆవులను కాస్తూ వాగు గడ్డ పై ఉన్న గుడి దగ్గర ఆడుకొంటు౦టే ,ఒక యోగి వచ్చి అతనిలోని వర్చస్సు గుర్తించి నాలుకపై బీజాక్షరాలు రాసి దత్తాత్రేయ మంత్రోప దేశం చేశాడు  .అప్పటినుంచీ ఆమంత్రాన్ని జపిస్తూ ,మహిమలు చూపుతూ తల్లి అనుమతితో బ్రహ్మ చర్యం పాటించి సన్యాసం తీసుకొన్నాడు .పుణ్యక్షేత్ర దర్శనం చేసి శ్రీశైలం ,అహోబిలం లలో తపస్సు చేసి భగవత్ సాక్షాత్కారం పొంది ,అష్ట సిద్ధులు వశం చేసుకొని దేశ సంచారం చేస్తూ ,ధర్మ ప్రబోధం చేస్తూ అరిష్టాలు వ్యాధులు తొలగిస్తూ ,కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ దగ్గర లింగాలదిన్నె చేరి ,ఆశ్రమమ శివాలయం తటాకం ఏర్పరచుకొని తపస్సు చేస్తూ లింగాలదిన్నె సీతారామ యోగీ౦ద్రస్వామిగా ప్రసిద్ధి చెందారు .

  చాలా చోట్ల నందీశ్వర ఆలయాలు దత్తాత్రేయ మఠాలుతోటలు ఆలయాలు నిర్మిస్తూ జీర్ణ దేవాలయాలను పునరుద్ధరించారు .శిష్యులను గ్రంధ రచనకు ప్రోత్సహించి సాహిత్య సేవచేశారు 17-12-1796 నల మార్గశిర బహుళ  తదియ శనివారం 82వ ఏట సమాధిలో ప్రవేశించి ,700 ఏళ్ళు సజీవ చైతన్యంలో ఉంటాయని శిష్యులకు అభయమిచ్చి సమాధి గతులయ్యారు మైసూరు దత్తగురువు శ్రీ గణపతి సచ్చిదానందస్వామి తమకు సీతారామ యతీంద్రుల సాక్షాత్కారం కలిగిందని చెప్పారట .మార్గశిర పౌర్ణమి నుంచి మూడు రోజులు వైభవంగా ఆరాధనోత్సవాలు చేస్తారు .

63-సొరకాయల స్వామి -1700-1902

తిరుపతి దగ్గర నిరుపేద గొల్ల కుటుంబం లో 1700లో రామ స్వామి పుట్టి , కొండ కోనలలో మేకలు గోర్రేలుకాస్తుండగా ఒకయోగి మంత్రోపదేశం చేయగా ఇహలోక బంధాలన్నీ తెంచుకొని ,నాలు గిళ్ల భిక్షం ఎత్తి ఆకలి తీర్చుకొంటూ ఉండేవాడు .బుజాన గుడ్డలమూట, నెత్తిన ముతక గుడ్డ తలపాగా, మోకాళ్ళవరకు చిరుగుల పంచె ,ఒక చేతిలో పేలికలతో అల్లిన తాడు కు కట్టిన రెండుకుక్కలు ,బుజం పై కావడి ,దానికి ఒకవైపు మలమూత్రాలకుండ ,మరో వైపు తినటానికీ తాగటానికీ పనికి వచ్చే సొరకాయ బుర్రలు ఆయన అవతారం .అందుకే సొరకాయల స్వామి అనే ఏరు వచ్చింది .

 రోగగ్రస్తులకు తాను  తినే ఆకులు భోజనం  నీళ్ళు ఇచ్చి  నయం చేసేవాడు .వచ్చే ప్రమాదాలను ముందే హెచ్చరించేవాడు .పశుపక్షాదులనన్నిటినీ ప్రేమిస్తూ పిచ్చివాడుగా కనిపించేవాడు .ఆయన అగ్ని హోత్రం వెలిగిస్తే దత్తాత్రేయ స్వామిగా కనిపించేవాడు .ఎక్కడికైనా ఎంతదూరమైనా కాలినడకే .ప్రకృతి శక్తులైన పంచభూతాలు ఆయన అధీనం లో ఉండేవి .1902ఆగస్ట్ లో మద్రాస్ చేరి ,నారాయణవనం ఆరణి నది ఒడ్డున ,ఒక గులకరాయి విసిరి అది పడిన చోటే తనసమాది అని ము౦దేచేప్పి,తనవయసు యెంత అని ఎవరో అడిగితె 500ఏళ్ళు అని తెలిపి , 2-8-1902 శుభకృత్ శ్రావణ శుద్ధ పంచమి శనివారం మధ్యాహ్నం 12గంటలకు 202 ఏళ్ళ వయసులో శరీరం వదిలారు .ఆయన కోరిన చోటనే సమాధి చేశారు.మొదటి ఆరాధన’’కైంకర్య సమాజం ‘’అధ్యక్షుడు  రత్న సభాపతి పిళ్లే అనే భక్తుడి ఆధ్వర్యంలో జరిగాయి.ఈ సమాజం వసతి గృహాలు కళ్యాణ మండపాలు భోజన శాలలు కట్టిస్తూ ఘన౦గాఆరాధనొత్సవాలు చేస్తున్నారు

64-ఆర్తత్రాణ పారాయణ  మహాకవిజ్ఞాని భక్త శిరోమణి -శ్రీధర వేంకటేశ అయ్యావళ్-1635-1720

సదాశివ బ్రహ్మేంద్ర స్వామి సహాధ్యాయి ,గురువు ,పండితుడు ,కవి శ్రీధర వేంకటేశ అయ్యావళ్,వైదిక బ్రాహ్మణ కుటుంబం లో ,కౌశిక గోత్రీకుడు శ్రీధర లింగార్యుని కుమారుడుగా 1635లోపుట్టాడు. గొప్ప శివ భక్తుడు. గృహస్థ రాజయోగి .తంజావూరు మహారాజు షహాజీ కావేరీ తీరం లో తిరువశ నల్లూరు గ్రామాన్ని శాహరాజవు అనే పేరుగా మార్చి,1693లో 46గురు వేదపండితులకు దానమిచ్చాడు .అందులో మన శ్రీధర వెంకటేశకూడాఉన్నాడు .

  మధ్యార్జునం అనే పేరున్న తిరువిడ మరుదూరు లోని మహాలింగస్వామి శ్రీధరుని ఇలవేలుపు .ఆ భజన సంప్రదాయానికి ఆద్యుడుకూడా .సంస్కృత గ్రంథాలు చాలారాశాడు .శాలేంద్ర విలాసం అనే ఎనిమిది సర్గల మహాకావ్యాన్ని, భక్తీ వేదా౦త పరంగా ఆఖ్యా షష్ఠి,దయాశతకం , ఆర్తిహర స్తోత్రం,కుళీరాష్టకం ,  అచ్యుత శతకం ,శివ భక్త లక్షణం ,శివభక్తి కల్ప లతికా మాతృ భూతాష్టకం, తారావళీ స్తుతి,స్తుతిపద్దతి ,డోలా నవరత్నమాల ,దోష పరిహరాష్టకం, భగవన్నామ భూషణం మొదలైనవి ముఖ్యమైనవి . షాజీ మహారాజు కోరికపై నల్లాధ్వరి, వేంకటేశ శాస్త్రి అనే ఇద్దరు పండితులతో కలిసి ‘’పదమణి మంజరి ‘’అనే నిఘంటు నిర్మాణం చేశాడు .శ్రీధరునికి ఉన్న శివకేశవ భేదాతీతమైన భక్తీ ,శమదమాదుల షట్క  సంపత్తి,సర్వభూత దయాగుణం చూసి సమకాలీనులు ‘’అయ్యావాళ్’’అని గౌరవంగా సంబోధించేవారు .

  ఆర్తత్రాణ పరాయణుడు ,నిరంతదైవ సాక్షాత్కారం పొందినవాడు శ్రీధరపండితుడు .తిరువిశనల్లూరులో అనావృష్టి సంభవిస్తే ‘’కుళీరాష్టకం ‘’స్తోత్రం రాసి గానం చేసి వానలు కరిపించాడు .మృత్యువుతో పోరాడుతున్న శిశువుని తారావళి స్తోత్రం తో కాపాడాడు .భగవన్నామ సంకీర్తనకు ఉచ్చనీచాలు ఉండరాదని బోధించేవాడు .ఒకసారి కావేరీ నది దాటి  తిరువిడ మరుదూర్  లోని తన ఇష్ట దైవమైన  దేవాలయానికి వెళ్లి గర్భాలయం ప్రవేశించి అదృశ్యమై పరమ శివునిలో ఐక్యంచెందారు శ్రీధరులు .,మానవీయ విలువలను పాటించిన మహా సంస్కర్త శ్రీధరులు 85ఏళ్ళు సార్ధక జీవితం గడిపారు .

65-సనారీ విశ్వనాథ అవధూత -1856-1914

కాశీ విశ్వనాథుని అవతారంగా భావింపబడే సనారీ విశ్వనాథ అవధూత 3-11-1856 నల కార్తీక శుద్ధపంచమి సోమవారం శ్రీకాకుళం జిల్లా నాగావళీ నదీ తీరాన పాలకొండకు చెందిన సింహాద్రి వీరాచారి ,గౌరీ దేవి భక్త దంపతులకు విశ్వనాథాచార్యులుగా జన్మించాడు  .ఏక సంథాగ్రాహి .,అయిదేళ్ళకే వేదం ,శాస్త్రాలు కావ్యాలు ఇతిహాసాలలో నిష్ణాతుడయ్యాడు .రసవాద విద్యలో ఉద్దండుడు .తలిదండ్రులు చనిపోతే పెదతండ్రికొడుకు  నీలయ్యాచార్యుని దగ్గర పెరిగి ,ఏటి ఒడ్డున శివాలయం లో రోజూ ఏదో ఒకటి రాస్తూ ఉండేవాడు .అతని వైరాగ్యభావన గ్రహించి అన్నగారు  పంచబాణ విద్యలు నేర్పాడు .రాగి బంగారం పనుల్లో శిల్పాలు చెక్కటం లో కుస్తాగిరి మాలామా పనుల్లో గొప్ప నేర్పు సాధించాడు .పెళ్లి ప్రయత్నాలు చేస్తుంటే తనకోసం పుట్టిన అమ్మాయి పాలకొండలో ఉందని చెప్పి వెళ్ళగా ,అక్కడ అన్నపూర్ణ అనే కన్య అతడే తన భర్త అని నిశ్చయించింది .1873వైశాఖ శుద్ధ ఏకాదశి శుక్రవారం ఇద్దరికీ వివాహం చేశారు .

  భార్యకు అజపాగాయత్రి బోధించి తాను  రాజయోగిగా గృహస్థాశ్రమ  ధర్మం పాటించాడు .శిష్యులకు ఎన్నో విషయాలు శాస్త్రాలు బోధించాడు .సనాతన ధర్మ ప్రచారం కోసం దేశ సంచారం ప్రారంభి౦చి ,రాజమండ్రి కోటి లింగాల రేవు దగ్గర పర్ణశాల నిర్మించుకొని చాలాకాలం తపస్సు చేశాడు .’’సనారీ విశ్వేశ్వర సంవాదం ‘’అనే గ్రంథంరాశాడు .12ఏళ్ళ తర్వాత ముద్రణకోసం మద్రాస్ బయల్దేరుతూ ,శ్రీశైలం చేరి 23-10-1914ఆనంద కార్తీకశుద్ధ పంచమి శుక్రవారం 58వ ఏట బదరికావన గుహలోఅంతతర్ధాన మయ్యారు .ఇప్పటికీ సజీవంగా ఉంటూ శుక్రవారం దర్శనమిస్తూ భక్తులకోరిక తీరుస్తున్నారు  .పాలకొండ దుర్గామందిరం లో ఇప్పటికీ అలా జరుగుతూనే ఉందని భక్తుల నమ్మకం ,విశ్వాసం .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25-9-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -10 8-మళ్ళీ భూగర్భ లోకం లోకి -1

 

అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -10

8-మళ్ళీ భూగర్భ లోకం లోకి -1

 మౌంట్ శాస్తా నుంచి మేము అక్కడికి చేరగానే ‘’ఇక్కడి పూలు ఎంతబాగా ఉన్నాయో చూడు ‘’అంది నాన్సీ .అన్నిరంగులపూలు కనువిందు చేశాయి .మాన్యుల్ వచ్చి పిల్లలతోకూడా వచ్చినదుకు సంతోషం స్వాగతం అన్నాడు .అమ్మమ్మ కూడా చుట్టూ చూసి పరవశించింది ‘’నాకు కలలో కనిపించిన లోకం ఇప్పుడు చూస్తున్నందుకు ఆనందంగా ఉంది ‘’అన్నది అమ్మమ్మ ఎమిలీ .టన్నెల్ లో నుంచి మా లగేజ్ అంతా ప్రత్యేక ట్రక్ లో వచ్చేసింది .అక్కడ వెహికల్స్ తేలుతూ ఉన్నాయి .ఒకదానిలో మమ్మల్ని ఎక్కమన్నాడు మాన్యుల్ .మేము ఎక్కింది కారు కాదు బోటుకాదు ఫ్లైట్ కూడా కాదు దాన్ని ‘’హోవర్ క్రాఫ్ట్ ‘’అన్నారు ..ఆ హో చూడు గోష్ ‘’అనగానే మేము మా కొత్త ఇంటి దగ్గర ఉన్నాం .అమ్మమ్మ సంతోషం తో చప్పట్లే కొట్టింది .మాన్యుల్ ను పాతస్నేహితుడిలాగా గ్రీట్ చేసింది .ఈలోకాన్ని గురించి నేను అమ్మమ్మ కు  వాళ్ళింట్లో చెప్పిఅనప్పుడు ఆమె ఏమాత్రం ఆశ్చర్యపోలేదు .

   అమ్మమ్మ మాంచి హుషారుగా ఇంటి తలుపు తట్టింది .పైకప్పు మామూలు గోడలు లేకపోవటం ఇక్కడి ఇళ్ళ ప్రత్యేకత అని ముందే చెప్పుకొన్నాం .మధ్యలో లివింగ్ రూమ్ ఉంది .ఇప్పుడు బెడ్ రూమ్ కావాలి .’’డిష్ వాష్ ఓవెన్ లేవే ‘’అంది నాన్సీ .నవ్వు వచ్చిందికాని నవ్వలేదు నేను .’’మహామంచిది వంట చెయ్యక్కర్లేదు ‘’అని అమ్మమ్మ .బాత్ రూమ్ కోసం చూస్తోంది ఆమె .ప్రక్కడోర్ చూపించా .అక్కడ మంచి బాత్ రూమ్ ఉంది .అక్కడి టాయ్ లెట్ ప్రత్యేకమైంది .శరీరమలం అంతా అదృశ్యమై వెంటనే కరిగిపోతుంది .కిచెన్ మెషిన్ కి ఆర్డర్ చెబితే కావాల్సిన వండిన భోజనపదార్ధాలన్నీ వచ్చేస్తాయి .దీనికి ‘’పవర్ ఆఫ్ ధాట్’’కావాలి .గార్డెన్ లో తిరుగుతుంటే ‘’ఇక్కడ పని చేసే వాళ్ళు ఉంటారా ‘’అని అడిగింది అమ్మమ్మ ‘’నువ్వు ఎక్కడ ఉంటావురా ‘’అన్నది అమ్మమ్మ .’’ఇక్కడికి దగ్గరలో నాకు ప్రత్యేక ఇల్లు ఉంది .ఇక్కడ అందరూ పని చేస్తారు అమ్మమ్మా ‘’అన్నాను .నువ్వు ఏంచేస్తావిక్కడ ‘’అమ్మమ్మ ‘’నేను హీలర్ గా ఉన్నాను .ప్రజలకు సాయ పడతాను .ఇక్కడ హాస్పిటల్ ఉంది .ఐతే మనకున్నలాంటిదికాదు.పరస్పరసాయం ఎలా చేసుకోవాలో నేర్పిస్తాం ‘’అన్నాను .’’అమ్మమ్మ కాలు విరిగితే ‘’అంది నాన్సీ .’’నిమిషాల్లో నేను నయం చేస్తాను .ప్రతిదాన్నీ మా పద్ధతిలో మేము నయం చేస్తాం ‘’అన్నాను ‘’అక్కడికీ ఇక్కడికీ అంత తేడా ఎలా వచ్చిందో .అక్కడి మట్టీ ఇక్కడి మట్టీ ఒకటేగా ‘’‘’అంది నాన్సీ . ‘’ఒకటేకాని కాలం లో తేడా ఉంది .ఇక్కడి వారు చాలా ప్రాచీనులు అఫ్ కోర్స్ మనలో కొందరు కూడా. ఇక్కడ ప్రాచీన విజ్ఞానం స్థాపించబడింది .’’అన్నాను అమ్మమ్మ బయటికి వెళ్లి కంగారూ జంతువూ ను చూసి ఆశ్చర్యపడి ముచ్చట పడింది . ‘’ఇక్కడ అడవి జంతువులన్నీ ఫ్రీగా తిరుగుతాయి. అపాయం చేయవు .మనుషులు జ౦తువులు స్నేహంగా ఉంటారిక్కడ.క్రూర జంతువులను తలమీద తట్టరాదు.మెడమీద తట్టాలి ఆప్యాయంగా .అవి చాలా ప్రశాంతంగా ఉంటాయి మనమూ అలానే ఉండాలి ‘’అన్నాను .మా కుక్క టిచ్ జాగ్రత్తగా కాపలా కాస్తోంది .అందరం లోపలి వెళ్లాం అమ్మమ్మ కూర్చుని ఉంది .అక్కడ మూల సీటు దొరుకుతుందా అని అడిగింది .’’లేదు నీకు ప్రత్యేకంగా ప్రక్కిల్లు ఏర్పాటు చేశారు దానిలో ఉంటుంది ‘’అనగానే పట్టరాని సంతోష పడింది .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-9-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గురూ -మనగురు ఢిల్లీ కి వెళ్లి స్వయం ప్రతి పత్తి ,పోలవరం నిధులను అడుగుతానని చెప్పి వెళ్ళాడు ఏమైంది బ్రూ 

గురూ -మనగురు ఢిల్లీ కి వెళ్లి స్వయం ప్రతి పత్తి ,పోలవరం నిధులను అడుగుతానని చెప్పి వెళ్ళాడు ఏమైంది బ్రూ

బ్రూ-చెప్పింది అదే కానీ అక్కడ వాళ్ళు పిలిపించారని ఎవరూ ప్రచారం చేయలేదు బ్రూ . ఇంతకీ అక్కడ ఏమైంది బ్రూ
గురు -అక్కడ షా క్లాసు పీకాడని ప్రచారం బాగా జరిగింది బ్రూ రెండ్రోజులూ కూడా
బ్రూ  క్లాసేనా ఇంకా ఏమైనా ఉందా ?
గురు -అంతఃపుర రహస్యాలు బయట పడవు . క్లాస్ తో పాటు కాష్ కూడా పీకి ఉండవచ్చునని గిట్టని వాళ్ళ గోల బ్రూ .
బ్రూ -అవున్లే చాలా నెలలైంది కప్పం కట్టి అని చెవులు కొరుక్కుంటున్నారు
గురు -అదే అన్నీ కలిసొస్తాయనే యాత్ర .ఐతే ఏదీ సాధించకుండా తలకు నవరత్న తైలమర్దన షామ్ పూ తో తలంటి పంపారని మీడియా గగ్గోలు .అయినా ఇవన్నీ మామూలే బ్రూ .అందుకే మంగళవారం రాత్రి అంతా అసహనం తో ఊగిపోయినట్లు పత్రికాకథనం బ్రూ .
బ్రూ -అందుకే శ్రీవారి దర్శనం తో సకల దోష నివారణ కూడా జరిగి ఉంటుందని కమలీయుల ప్రచారం
ఇంతకీ డిక్లరేషన్ విషయం లో మీసాలు గడ్డాలూ దువ్విన సాములోర్లు ,కాషాయం వాళ్ళు ఏమీ చేయలేక పోయారేంటి బ్రూ
గురు -మొండివాడు రాజుకంటే బలవంతుడు అన్నారు కదా బ్రూ .ఎవరిపాపాన వాళ్ళు పోతారనే వైరాగ్యం అందర్నీ ఆవహించింది బ్రూ
  మీ-గబ్బిట  దుర్గాప్రసాద్ -24-9-20 -ఉయ్యూరు
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment