ప్రపంచ దేశాల సారస్వతం 19-హిబ్రూ సాహిత్యం -2

                   ప్రపంచ దేశాల సారస్వతం

              19-హిబ్రూ సాహిత్యం -2

అరబ్బులప్రభావంతో హిబ్రు సాహిత్యానికి స్వర్ణయుగం  సాడియా వెన్ జొసెఫ్-892-942  కవిత్వం తో ప్రారంభమైంది ..21వయసులో బహుముఖీన ప్రతిభతో మొదటి కోశం రాశాడు .అదే ప్రార్ధనలతో ఉన్న’’సిడ్డూర్’’ ప్రధాన గ్రంథం.హిబ్రు వ్యాకర్తలలో కూడా ఇతడే ప్రధానుడు .ఇతడు  రాసిన విశ్వాసాలు ,సిద్ధాంతాల గ్రంథం’’ఎమినోథ్ లేడే ఓథ్’’.దీనితో పేరు ప్రశస్తులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి .ఈ గ్రంథంతో యూదుల దార్శికత మీమాంస  విదేశీ ప్రభావం నుంచి ముక్తి పొందింది .

  అరబ్బుల అధీనం లోని యూదులు 10 వ శతాబ్దం నుంచి మాతృభాషలో కావ్యాలు ,వైజ్ఞానిక రాచనలు చేశారు .వివిధ దేశాలకు వలసపోయిన యూదులు ఆయా భాషలలో నిమగ్నమైనా ,మత గ్రందాల పై వ్యాఖ్యానాలు రాస్తూనే ఉన్నారు .వీరిలో 10వ శతాబ్దికి చెందిన రబేనూ జేర్షో,11వ శతాబ్ది వాడైన రబ్బీ షేలోమోయిషాకే ముఖ్యులు .స్పెయిన్ లో హిబ్రూ సాహిత్యానికి స్వర్ణయుగం వచ్చింది .సాడియా శిష్యుడు డునాష్ బెన్ లబరాట్-920-970 మొదటి సారి మాత్రాచందస్సు ఉపయోగించి నా,ఈయుగానికి ఆదికవి మాత్రం ఇబన్ నగ్డి లాహ్-1033-1055.సుందరంగా ధారావాహిక శైలిలో భక్తీ గీతాలు ‘’బెన్ధిలిం’’రాశాడు ఇతని ఇతర రచనలు –బెన్ మిష్లె,బెన్ కో హెలెథ్ .సాల్మన్ ఇబన్ గాబి రొల్-1020-1052 నిరాశావాదం తో మధురకవిత్వం రాశాడు .కవిత్వం లో వేదన, గంభీరత ,కరుణ త్రివేణీ సంగమ౦గా ప్రవహిస్తాయి .మిబ్బహార్ హాపేనీ మరో ప్రముఖ కవి మాధుర్య ప్రసాద గుణాలతో కవిత్వం రాశాడు .ప్రేమ,పెండ్లి, పుట్టుక చావు ,ప్రార్ధనలను మనోహర శైలిలో రాసి మంత్ర ముగ్ధులను చేశాడు .పహారోమి విత్రమైన జియన్ గిరి పై రాయటం వలన ‘’జియాన్ గిరి గాయకుడు ‘’అని పేరు పొందాడు .

   అబ్రహాం ఇబన్ ఎజ్రా -1092-1167 స్వాధీనమైన భాషతో పాండిత్య

ప్రకర్ష తో కవిత్వం చెప్పాడు .స్పెయిన్ యూదులలో హిబ్రూ భాషలో ప్రథమకవి. మహా మేధావి తార్కిక శిరోమణి గొప్ప విద్వాంసుడు మోజెస్ బెన్   మైమోన్ మైమొనైజ్ద్ తాల్ముద్ కు చోటు కల్పించి ,యూదుల దార్శనిక మీమాంసకు ,అరిస్టాటిల్ దర్శనానికి భేదం లేదని నిరూపించాడు .ఇతని రచన ‘’పధ ప్రదర్శకం ‘’ఈయనకాలం లోనే హిబ్రు లోకి అనువాదమైంది .స్వర్ణయుగం లో చివరికవి యుదా బెన్ సాల్మన్ అల్ హఠీజీ-1155-1225వ్యంగ్యంతో ‘’మక్బరత్ తహకీ మోనీ ‘’లో మాధుర్య విలసిత కవిత్వం చెప్పాడు .ఆనందం పై సేఫెర్ శ ఆశు ఇం అనే గద్య రచన చేశాడుజోసెఫ్  ఇబన్ జబారా -1150.

  ఇటలీకి చేరిన యూదులలో ఇమాన్యుయాల్ బెన్ సాల్మన్  హారోమి -1265-1330 స్వర్గ నరకాల గురించి ‘’హాథో ఫెట్ బేహా ఎడెన్’’అనే మహాకావ్యం డాంటే కవికి మార్గదర్శి అయింది .అశ్లీలం ఉన్నా తత్వ దర్శనం చేశాడు .రహస్యవాద కవులు ఎక్కువగా వచ్చారు .వీరిలో మోజెస్ డెలియోన్,పుట్టు  గుడ్డి ఐజేక్ లు ముఖ్యులు .ఎక్కువమంది మధుపానం పై మధుర కవితలు రాశారు .

   14 వశతాబ్దం తర్వాత యూదులపై ఐరోపా వాసులు దాడులు చేసి వెంటబడితే ఆపత్కాలం వచ్చింది యూదులకు .మోజెస్ జా కూటో-1625-1697హిబ్రూ భాషలో మొదటినాటకం రాశాడు .మోజెస్  హాయింటుజ్జాట్టో-1707- 47 కవిత్వం తో ఆధునిక యుగం ఆవిర్భవించింది .అప్పటి వరకు ఉన్న కృత్రిమశైలి వదిలేసి 17యేటనే అలంకార గ్రంథం తోపాటు మరో 30 గ్రంధాలు రాసిన మేధావి .మఅశేసి శోన్,మిగ్డాల్ ఏజ్,లఏశరిం దేహిల్లాహ్ నాటకాలలో గొప్ప భావుకత కనిపిస్తుంది .ఇతని శిష్యుడు డేవిడ్ ఫ్రాంకో మెండిజ్ రాసిన నాటకం ‘’జేముల్ అధాలి యాహ్’’.18వ శతాబ్దిలో మెన్డేల్స్ సొన్ మొదలైనవారు ‘’మీ ఆస్ఫిం ‘’అనే పత్రిక నడిపి,యూదుల లౌకిక సాంస్కృతిక దృక్పధానికి దారి చూపారు .దీనితో ఇతరదేశ యూదులలోకూడా కొత్త చైతన్యం వచ్చింది .

   19 వశతాబ్ది ప్రభావశీలకవి జుడాహ్ లోయెబ్ గార్డ న్-1830-1892.ఈకాలం లోనే అబ్రహాంమాపూ-1808-67నవలా రచనకు నాంది పలికాడు .కథా కథానిక ఇప్పుడే విపరీతంగా వచ్చాయి .యూదులను రాష్ట్రీయ భావన ,ఆశయాలను కలవర పరచినపుడు హిబ్రు వాజ్మయం అనేక రకాలుగా వృద్ధి చెందింది .1896లో’హాయో౦’’అనే దైనిక పత్రిక ప్రారంభమైంది .ఐజాక్ లో ఎబ్ పెరెజ్-ఈ1851-191 కథాకారుడు కూడా .సంమోహనమైన శైలితో పాఠకులను ఉర్రూత లూగించాడు .సౌందర్యం ,భావుకత ,అనుభూతి ప్రధాన రచనలు చేశాడు .కథానికులలో  రూబెన్ బ్రెయ్నిన్-1862-1939 ప్రముఖుడు .ఆధునిక కవులలో హాయిం నమ్మాన్ బియాలిక్ -1873-1934 జాతీయ గీతాలురాసి ప్రసిద్ధి చెందాడు .

   20వశతాబ్దిలో ప్రాచీన మార్గాన్నికొత్త దృక్పధంతో సమన్వయ౦  చేసే కవులు వచ్చారు .జోసెఫ్ క్లౌన్నెర్,జోషూ వాదాన్ , బెర్డి చేస్కి ఈమార్గ రచయితలు .భావుక కవి సాల్  చేర్ని హోవ్స్కీ -1873-1944ప్రకృతిని ,జాతీయతను కవితా శక్తితోకలిపి మాధుర్య సౌకుమార్య రచనలు చేసి అత్యంత ప్రభావశీలి అయ్యాడు .అబిగ్డోర్ హామైరే సమకాలీన జీవితాన్ని కవితలలో కథలలో నింపాడు .ఇజ్రాయిల్ దేశం లో నేడు హిబ్రూ సాహిత్యం మూడు పూలు ఆరుకాయలుగా వికసిస్తోంది ,జోల్కిం హీ ,ఎబర్ హడని,జాడా యూరీమొదలైన వారు నూతనోత్సాహంతో హిబ్రూ సాహిత్య సేవ చేస్తున్నారు .

   సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -8-2-20-ఉయ్యూరు 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-14

కిరాతార్జునీయం-14

ద్రౌపది అర్జునుని సాగనంపుతూ ఇలా అంటోంది –‘’వేద వ్యాస హితవు ననుసరించి తపస్సు చేసి ఫలసిద్ధిపొంది ,శత్రు సంహారం చేసి మమ్మల్ని సంతోష పెట్టు .ఇదే నాకోరిక .నువ్వు కృత కృత్యుడవై వచ్చాక సంతోషం తో నిన్ను గాఢాలింగనం చేసుకొంటాను .కృత కృత్యుడు కాని వారిని కౌగిలించుకోవటానికి నా మనస్సు అంగీకరించదు.ఇలా యాజ్ఞ సేని పలికినమాటలు అర్జునుని తేజస్సు పెంచాయి .

  పాండవ పురోహితుడు ధౌమ్యుడు  మంత్రాలతో అభి మంత్రించి ఇచ్చిన ఆయుధాలను ధరించిన గాండీవి.సౌమ్యాకారుడైనా ,అభిచార కర్మ ప్రయుక్త మంత్రం లాగా ,తనకు ముందు శత్రువులను చూస్తున్నట్లు దుర్నిరీక్షుడయ్యాడు.అమోఘమైన ఆకర్షణ కలిగి ,ప్రసిద్ధ గుణ ధ్వని,బాణ విమోచన కలిగిన ధనువును ధరించి ,శత్రువులకు కనిపించని ,నిశిత ఖడ్గ యుక్తాలైన పెద్ద అమ్ముల పొదులను కట్టుకొని ,ఖాండవ దహనం చేసే దేవేంద్రుని వజ్ర ప్రహారాలకు ఆచ్చాదనకలిగించే కాంతి కలిగి ,దీప్తి వంతమై నభో మధ్యమం లో  వెలిగే కవచాన్ని ధరించి ,కుబేర అనుచరుడైన యక్షుడు చూపించే మార్గాన్ని బట్టి ,ఇంద్రకీలాద్రికి బయల్దేరుతున్న అర్జునుని చూసి అక్కడి మహర్షులు అతని ఎడబాటు తట్టుకోలేక దుఖిస్తున్నారు .

  ‘’అనుజగురు రథ దివ్యం దుందుభి ద్వానమాశా –స్సుర కుసుమ నిపాతైర్వ్యోమ్ని లక్ష్మీర్వితేనే

ప్రియమివ కథ యిష్య న్నాలింగ స్ఫురంతీం-భువన మనిభ్రుత వేలా వీచి బాహుః పయోధి ‘’

ఇతి భారవి కృతౌ కిరాతార్జునీయే మహాకావ్యే లక్ష్మీ పడలాంఛనే తృతీయ సర్గః ‘’

  ఈ విధంగా దేవ కార్యార్దమై అర్జునుడు బయలు దేరి వెళ్ళే సమయం లో దిక్కులలో దివ్య దుందుభులు మ్రోగాయి .ఆకాశం నుంచి దేవతలు పుష్పవర్షం కురిపించారు .సముద్రుడు ఉప్పొంగి కెరటాలతో ఒడ్డును ఒరుస్తూ ‘’అర్జునుడు కొద్దికాలం లోనే నీ భారాన్ని పోగొడతాడు ‘’అని తనప్రియురాలు భూమితో ఊరడింపుగా  చెబుతున్నాడా అన్నట్లుగా గర్జించించాడు.

   సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ – 7-2-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 18-సింహళీ(శ్రీలంక ) సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం

18-సింహళీ(శ్రీలంక ) సాహిత్యం

భాష –సింహలీ భాష ఇండో –యూరోపియన్ భాషా కుటుంబానికి  చెందిన పాళీ భాషనుంచి పుట్టింది .సింహలి లిపి కూడా బ్రాహ్మీ లిపి నుంచే వచ్చింది.

   సాహిత్యం –క్రీ పూ .3వ శతాబ్దం నాటికే సాహిత్య రచన ఉన్నా మొదటి రచనమాత్రం సీగిరియా దుర్గం లోని ఒక ‘’మిర్రర్ ‘’ పై చెక్కబడిన ‘’సీగిరియా గ్రస్ఫితి’’అనే గీత సముదాయమే ..ఇందులో మొదటి గీతం క్రీశ 5వ శతాబ్దిలో రచించింది  .10వ శతాబ్దిలో లభించిన ‘’సియబస్లాకర ‘’,శిఖవళ౦డ’’గ్రంథాలు ప్రాచీనమైనవి .మొదటిది అలంకార గ్రంథం.రెండవది బౌద్ధ సన్యాసుల జీవిత నియమాలు వివరించేది .

   12వ శాతాబ్దిచివరలో ‘’గరళు గోమి ‘’రాసిన ‘’అమవతుర’’,ధర్మ ప్రదీపికావ’’గద్య రచనలు వచ్చాయి .13వ శతాబ్దిలో వీటిని అనుసరిస్తూ చాల వచనగ్రంథాలు వెలువడినాయి ..వీటిలో వలియ ,తూపవంశ ముఖ్యమైనవి .మొదటి కథా కావ్యాలు 12,13శాతాబ్దులలోనే వచ్చాయి .మువ దేవతావత ,సనదావత ,ససదావత ,కవ్ శిళు మినవీటిలో ముఖ్యమైనవి .తర్వాత వచ్చినవి ఎక్కువగా బౌద్ధ చారిత్రిక విషయకావ్యాలు  . రాహులుడు రాసిన కావ్య శేఖరం ,వాత్తానె రాసిన గుట్టిల కావ్యాలు 15వ శతాబ్దం లో సందేశ కావ్యాలుగా వచ్చాయి .

   తర్వాత 300 ఏళ్ళ కాలం లో సింహళం పై పాశ్చాత్య దండ యాత్రలవలన ,తర్వాత వచ్చిన అంతర్గత కలహాలవలన సాహిత్యం బాగా వెనకబడి పోయింది .ఇది ఆ దేశ సాహిత్యానికి అంధకారయుగం .అయినా చిన్న చిన్న మినుకులలాగా అలగివయన్న ,మొహోత్తాల ,వాళవిత,సరణా౦కర అనే బౌద్ధ రచయితలు కొంత సాహిత్య సృష్టి చేశారు .

  19వ శతాబ్దం లో ఈ సాహిత్యం పై పాశ్చాత్య ప్రభావం బాగా పడింది .నవలా రచన పెరిగింది పద్యకావ్యాల రూప స్వభావాలలో గణనీయమైన మార్పులొచ్చాయి ఇతిహాస ప్రధానాలు వదిలేసి భావగేయ రచన చేశారు కవులు .అనాదినుంచి జానపద రూపకాలు గేయాలు సమాజంపై ప్రభావం కలిగిస్తూనే ఉన్నాయి .సాహిత్య ప్రక్రియలలో నూ విదేశీయత చోటు చేసుకొన్నది .

  13వ వరకు శ్రీలంక సాహిత్యం పై భారతీయ రాజాస్థాన భాషా ప్రభావం ఎక్కువగా ఉంది .ఈకాలం లో ‘’ముఖదేవావత ‘’అనే బోధిసత్వుడు  ముఖదేవతగా జన్మించిన కథా వృత్తంతో వచ్చింది .ఆయనే’’ హరే’’ రూపం లో జన్మించిన కథా విశేషంతో ‘’ససాదవాత ‘’కావ్యం ,రెండవ పరాక్రమబాహు రాజు పై ‘’కవి సిలు మిన’’(ది క్రౌన్ జ్యుయేల్ ఆఫ్ పోయెట్రి)వచ్చాయి. ఇవి  బోధిసత్వుని జీవిత సంబంధమైన క్లాసికల్ రచనలు .

 ఒకటవరాజసేన(832-851)కాలం లో సియాబస్లకార( భాషా లంకార ) అనే అలంకార గ్రంథం రాయబడింది .పాళీ ధమ్మపద పై ‘’ధాం పియాతువ గాతపదాయ ‘’అనే వ్యాఖ్యానగ్రంధం 10వ శతాబ్దం లోనే వచ్చింది.శిఖావలనంద ,శిఖావలంద వినిషా అనే బౌద్ధ  సన్యాసుల నియమగ్రంథాలు వెలువడినాయి  .ధర్మసేన బౌద్ధాచార్యుడు రాసిన ‘’శ్రద్ధామరత్నావళి  ‘’ గురులుగోమి రాసిన అమవాతురా (అమృతధార )ధర్మప్రదీపికాయ ,విద్యా చక్రవర్తి రాసిన ‘’బూత్సరణ్య’’(బుద్ధ రక్షణ )సింహళ తూపవంశ ,,దాలదాశరిత (బుద్ధుని దంత విశేషం )పూజావలీయ ,పంశీయ పనస్ జాతకపోత (బోధి సత్వుని 550 జన్మ కథలు) ,మైత్రేయుని ‘’బుదుగుణాలంకార ‘’(బుద్ధుని గుణ విశేషాలు )’’లోవాద సంగ్రహాయ ‘’(ప్రపంచోద్ధరణకు మార్గాలు )మొదలైనవన్నీ విశిష్ట బౌద్ధ ఆచార్యులచే రాయబడిన బౌద్ధ రచనలు .

  వ్యాకరణ అంశాల సంకలనం ‘’సిదాత్ సంగారవ ‘’,సియాబస్ లకూన (భాష పై శ్రద్ధ ),దండ్యాలంకార సన్నా అనే దండి అలంకార రచనపై వ్యాఖ్యానం , ‘’ఏలు సందస్ లకూన’’(అసలు సింహళ విశేషాలు )ఈ కాలం లో వచ్చిన విశేష రచనలే .13వ శతాబ్దిలో సందేశ కావ్యాల హవా నడిచింది .సాలలిహిని సందేశం (సాలలిహిని పక్షి సందేశం )పారేవి సందేశ (పావుర సందేశం )లను రాహుల సన్యాసి రాశాడు.ఈయనే కావ్యశేఖర అనే అల౦కారాగ్రంథంకూడా రాశాడు  .ఈకాలపు మరో ఇద్దరు గొప్ప రచయితలు-విదాగమ మైత్రేయ ‘’బుధుగుణాలంకార’’,బౌద్ధాచార్య వెత్తేవే’’గుత్తిల కావ్యం ‘’రాశారు .మూడు శతాబ్దాల పాశ్చాత్య పాలన చీకటి యుగం లోకూడా ‘’ అలగియవన్న మహోత్తాల’’ రచించిన ‘’కూస జాతక ‘’(కూస రాజుగా బోధిసత్వుని అవతారం ),దాహం సొందకావ్యం ,సుభాషిత మాత్రమె  రచి౦ప  బడినాయి..

   శ్రీలంక రచయితలలో ముఖ్యులు –ఆర్ధర్ సి క్లార్క్ –సైన్స్ ఫిక్షన్ ,స్పేస్ సైన్స్ లపై గోప్పరచనలు చేసి కలింగ అవార్డ్ పొందాడు

ఆన౦ద కుమార స్వామి – సింహళ శిల్ప శాస్త్ర రచయిత ,చిదంబర నటరాజస్వామి పై అద్భుత విశ్లేషణచేసిన రచయిత    

శ్యాం సెల్వ దొరై –గొప్పనవలాకారుడు –ఫన్నీ బాయ్ నవలతో ప్రసిద్ధుడు

స్టాన్లీ జయరాజ తంబియ –యాన్త్రోపాలజిస్ట్ –బైజాన్ ప్రైజ్ విన్నర్

రాజీవ విజే సింహా –రాజకీయ విశ్లేషకుడు

సిరిల్ పొన్నం పెరుమ – కెమికల్ ఇవల్యూషన్ ,పర్యావరణ రచయిత

జే.ఆర్ జయవర్దనే -11ఏళ్ళు శ్రీలంక ప్రధానమంత్రి గా రెండవ దేశాధ్యక్షుడుగా  ఉన్న రచయిత  .ఆరేళ్ళ ప్రణాళిక రచయిత

కార్ల్ ముల్లర్ –కవి ,జర్నలిస్ట్

జాన్ కోటేల్ వాలా –స్టేట్స్ మన్, మూడవ ప్రధాని

సిరి గుణ సింఘే –సంస్కృత ,కళా ,చరిత్ర రచయిత, ఫిల్మ్ మేకర్

ఎడిర్ వీర శరచ్చంద్ర –ప్రముఖ నాటకరచయిత,రాజకీయ విశ్లేషకుడు

ఎర్నెస్ట్ మాక్లింత్రేయ-ప్రముఖ ఆంగ్లభాషా పండితుడు, రచయిత.

మార్టిన్ విక్రమ సింఘే –ప్రసిద్ధ నవలాకారుడు .అనేకభాషలలోకి ఇతని నవలలు అనువాదం పొందాయి .

శ్రీలంక ప్రముఖ రచనలు -కోలపెట్టి పీపుల్ , ది గుడ్ లిటిల్ సిలనీస్ గర్ల్ ,దిజామ్ ఫ్రూట్ ట్రీ,రీఫ్,ఆన్ సాల్ మాల్ లేన్,ది రోడ్ ఫ్రం ఎలిఫెంట్ పాత్,ఫన్నీ బాయ్ , ఐలాండ్ ఆఫ్ ఎ థౌజండ్ మిర్రర్స్,చినమాన్ ,బిహైండ్ ది ఎక్లిప్స్ .

   సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -6-2-20-ఉయ్యూరు  

image.png

image.png
image.png
image.png
image.png
Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-13

కిరాతార్జునీయం-13

అర్జునుడు ఇంద్రకీలాద్రిపై  తపస్సు చేయటానికి వెళ్ళబోగా దుఖం భరించలేని ద్రౌపదీ దేవి కన్నీరు నిండగా  ,నల్లకలవలపై మంచు బిందువుల సమూహం ఉన్నట్లు ,నేత్రాలు విప్పటానికి ప్రతిబంధకమై ,మూసుకొంటే కన్నీరు రాలి అమంగళకరం అవుతుందనే సందేహంతో మూసుకోలేకపోయింది .నిర్మామైన సహజప్రేమకల ఆమె చూపు ను దారిబత్తెంగా అర్జునుడు గ్రహించాడు .అర్జునుని చేరి  గద్గద కంఠం తో ‘’అగాధమైన బురదలో కూరుకు పోయిన ధనాన్నిఉద్ధరి౦చి నట్లు,శత్రువుల కపటోపాయాలచేత మునిగి పోయిన మన గౌరవాన్ని ఉద్ధరించటానికి తీవ్ర తపస్సు చేయబోతున్నావు .ఫలసిద్ధికలిగే దాకా సంయమనం తో ఉండాలి .తపస్సిద్ధికోసం సోదరులకోసం నాకోసం కష్టాలను ఓర్చుకొని ,నా వియోగానికి  కృంగిపోకుండా తపస్సిద్ధిపొంది మా అందరి గౌరవం కాపాడు .సుఖం కీర్తి మహిమలకోసం తపస్సు చేస్తే బందువియోగం గుర్తుకురాకుండా అంకితభావం తో తపస్సు చేస్తే ,అనురాగవతి ఐన స్త్రీలాగా తపస్సిద్ధి దాన౦తట అదే వస్తుంది . శత్రు సంహారం కోసం క్షత్రియులకు బ్రహ్మ ఓజస్సును తీసేశాడు .అపకారాలవలన విజయైక జీవులతేజశ్శాలుర మానం నశి౦ప జేయబడింది .అపకారాలు ఘోర కృత్యాలవలన ,జుగుప్సిత వృత్తాంతాలను తలవంచుకొని  బంధువులు ఇతరరాజులు నమ్మాల్సి వచ్చింది .ఇలాంటి ఘోరం జరుగుతుందా అని ఆశ్చర్యపోయారుకూడా .నికారం అంటే అపకారం దిగంతవ్యాప్త యశస్సును కృంగదీసి,పూర్వ పరాక్రమ కార్యాలను మరిచేట్లుచేసింది .ఆ అపకారం మనసును దహించి వేస్తూ నిద్ర పట్ట కుండాచేస్తోంది .నువ్వు దంతం కోల్పోయిన ఏనుగు లాగా ,అభిమాన ధ్వంసం కలిగి ఆనవాలు పట్టకుండా ఉన్నావు .కీర్తి క్షయం వలన ఎండిపోయిన సముద్రంలా ఉన్నావు .సమర్ధులైన వీరులైన భర్తలఎదుట  కులస్త్రీ శిరోజాలను శత్రువు లాగితే నీ బలపరాక్రామాలు కాల్చానా  అని లోకులు ఆడిపోసుకొంటు౦టే  పూర్వపు ధను౦జయుయుడవేనా అనిపించి  అలా ఐతే నీకు వైరూప్యం, నాకు పరాభవం  జరిగేదికాదు.ఇప్పటికైనా నీ బలపరాక్రమాలు,శత్రువులు చేసిన పరాభవాలు  స్మరించుకొని ,నీపేరును సార్ధకం చేసుకో .లేకపోతె ఇక్కడ సన్యాసిగా సిగ్గులేనివాడివిగా భిక్షా వృత్తి తో బతుకు .ఇంతకంటే చెప్పాల్సింది ఏదీ లేదు . సాదుజనాన్ని రక్షించలేని క్షత్రియుడు  ,శత్రు సంహారం చేయలేని ధనుస్సు సార్ధక౦కాదు .కనుక సార్ధక క్షత్రియుడవు కావలసింది .నీజాతిని నీ ధనుస్సు సార్ధకం చేయుగాక .మాలాగానే నీ ధనుర్బాణాలు నిష్ప్రభావాలై నామావ  శిష్టం గా కొన ఊపిరులతో దిక్కులు చూస్తూ ఉన్నాయి  వాటిని ప్రయోగించి సార్ధకత కలిగించి మమ్మల్ని ఉద్ధరించు

 ‘’బలపరాక్రమాలున్నా ప్రజ్ఞను చూపని సింహాన్ని చూసి ఏనుగులు లెక్కచేయకుండా దాని కేసరాలను ఊడ బెరికినట్లు ,నీ తేజస్సు చూపకపోతే శత్రువులు నిన్ను  లక్ష్యపెట్టరు.నీ ప్రజ్ఞ చూపించే సమయం వచ్చింది .దినలక్ష్మి సూర్యుని పొందినట్లు గొప్పకార్యభారం నిన్ను వరించింది .ఉత్సాహంగా కార్యభారం నెరవేర్చి లోకం లో శ్రేష్ట యోగ్య పురుషుడవు గా కీర్తి పొందు .ఇంద్రకీలాద్రికి వెళ్లి నిశ్చింతగా తపస్సు చేసి కార్యసిద్ధి సాధించు మేమూ నీకు ఏరకమైన ఇబ్బందులు రాకూడదని దేవేంద్రుని ఉపాసిస్తాం .జయలక్ష్మి తో తిరిగిరా .ఏమరు పాటులేకుండా ఉండు.వేదవ్యాసమహర్షి అనుగ్రహించినట్లు తపస్సిద్ధి పొంది విజయుడవై శత్రుసంహారం చేసి మమ్మల్ని సంతోషపెట్టు ‘’అని ద్రౌపది బహు నిపుణ౦ గా చెప్పినమాటలు విని అర్జునుడు గ్రీష్మాదిత్యుని లాగా వెలిగాడు .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-2-20-ఉయ్యూరు     

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

5-2-20 బుధవారం ఉదయం మా ఇంట్లో మా కజిన్ సూరి రాధాకృష్ణమూర్తి కోడలు శ్రీమతి లీల ,వంగలసుబ్బయ్యగారి కూతురు శ్రీమతి మనోహరి

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ప్రవచన ప్రభావం

ప్రవచన ప్రభావం

 భీమేశం -ఒరే  కాముడూ .నెలక్రితం మీ అబ్బాయి పిలక ,పంచెకట్టు ఉత్తరీయం ,బొట్టు తో కనిపించాడు .ఆతర్వార వారంలో పాంట్ షర్ట్ నల్లద్దాలుమెడలో మోకాళ్ళదాకా ఖండువా ,మా0చి  హెయిర్ స్టైల్ లో బే ర్వాగా  కనిపించాడు .మళ్ళీ  ఆ తర్వాత కనబడలేదు ఏమిట్రా విశేషం !కామేశం)

-అవునురా భీముడూ .నువ్వు చెప్పింది రెండూ నిజాలే .మొదట ఒకవారం చాగంటి వారి ప్రవచనాలు విని అలాగే ఆహార్యం ,ఆలోచన  నడక సాగించాడు 

.ఆతర్వాత ఎవరు చెప్పారో ఏమోకానీ ఆయన్ను వదిలేసి గరికపాటి వారి పల్లీ బటాణీ ప్రవచనాలు విని అదుగో నువ్వు చెప్పా వే  ఆ రెండో గెటప్  లో తిరిగాడు . భీ

-బాగుందిరా .కొంపదీసి హైదరాబాద్ లో ఒక స్వామీజీ యోగి వేమన ప్రసంగాలు చేస్తున్నారట అవేమన్నా విన్నాడా !కా….

-అదే చెప్పబోతున్నా . అవునురా .ఏం చెప్పమంటావ్ నా బాధ ఎవడికి చెప్పుకొను అడిగావుకనుక చెబుతున్నా కడుపు చించుకొంటే” కొడుకు మీద” పడుతోంది భీ –

ఇంతకీఅసలు విషయం చెప్పనే లేదు నువ్వు కా -ఆ హైదరాబాద్ స్వామీజీ వేమన ప్రవచనాలు కూడా ఆ తర్వాత వారం విని యోగి వేమన గెటప్ లో గోచీ పెట్టుకొని ఇంకేమీ లేకుండా వీధిలోకి వస్తే ,చూసినవాళ్లు మదపిచ్చ ఏమోనని తన్ని పంపించారు అంతే  అప్పటినుంచి ఇంట్లోనే ఉంటూ యేవో పుస్తకాలు చదువుకొంటూ హాయిగా ఉన్నాడు

బయటికి వెళ్ళటం లేదు అందుకే నీకు కనిపించలేదు భీ-ఐతే ఇదంతా ప్రవచనాల ప్రభావమ మన్నమాట కా -అవునురా .అన్నమాటే కాదు ఉన్నమాట కూడా   మీ-గబ్బిట  దుర్గాప్రసాద్ -5-2-20 -ఉయ్యూరు  

Posted in రచనలు | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సాహిత్యం 15-బర్మీస్ సాహిత్యం

ప్రపంచ దేశాల సాహిత్యం

15-బర్మీస్ సాహిత్యం

భాష –చీనో-టిబెట్ భాషాకుటుంబానికి చెందింది .పదాలు దాదాపు ఏకాక్షరాలే. స్వరాన్ని బట్టి ఒకే పదానికి వేర్వేరు అర్ధాలు వస్తాయి .దీనిలోని మాండలీకాలు –అరకానీజ్ ,దాను ,ఇంథా,అ త్సి,లాషి ,మారు మొదలైనవి .భారతీయ పాళీబాష బర్మీయులకు పరమ పవిత్రభాషకనుక లిపిగా దానినేఉపయొగిస్తారు.

  సాహిత్యం –ప్రాచీన సాహిత్యం శిలాఫలకాలలో దొరుకుతుంది .ఇందులో మొదటి శాసనం మయిజెయి లేక మయిన్క బాకు క్రీశ .1113 నాటిది .ఈశాసనాలు వ్యక్తులకు అంకితమైనవి .భావనాత్మక బర్మా సాహిత్యం 15వ శతాబ్ది మధ్య నుండి  కనబడుతుంది .అప్పటినుంచి 19వ శతాబ్దం వరకు బౌద్ధ చక్రవర్తుల పోషణలో వచ్చిందే .గ్రంథ కర్తలు కూడా బౌద్ధ సన్యాసులే.సుశిక్షితులైన ఆస్థాన పండితులతోపాటు మహిళలుకూడా రచనలు చేశారు .పద్యాలలో ఉన్న బౌద్ధ జాతక కథలు(ప్యో ),పద్య నీతి కథలు ,కొన్ని స్తుతి పద్యాలు (మాగన్ ).కొన్ని చారిత్రిక పదాలు ,-ఎగియిన్ ,కొన్ని ప్రకృతి ప్రేమ గేయాలు (యదు )కొన్ని టేదత్ ,దాన్-చో,లే-చో,ద్వే-చో,బా –లే అనేవి చిన్న గేయాలు మియాట్జన్జా అనే లేఖలు ,కొన్ని  ఆస్థాన రూపకాలు ,కొన్ని ప్రాచీన రంగస్థల నాటకాలు (ప్యా-జన్).ఇందులో 50కి పైగా పద్యరచనలున్నాయి .వీటిలో బౌద్ధ ధర్మాసక్తి ,భాషా మాధుర్యం ఉంటాయి .

  గద్య రచనకూడా కొంత జరిగింది .ఇవి ఎక్కువగా పాళీజాతక కథలు ,బర్మాపూర్వ చరిత్రాధారాలు (క్రానికల్స్ )కు అనువాదాలే .చిన్న చిన్న వాక్యాలతో ఇష్టం వచ్చినట్లు ఉన్న విరమణ చిహ్నాలతో ఉంటాయి ..1870లో బర్మాలో ముద్రణశాలలు ఏర్పాటవటంతో సాహిత్యం లో గొప్పమార్పులు వచ్చాయి .1875నుంచి ఫ్యాజన్ ,నవలలు ,కథానికలు విస్తృతంగా వచ్చాయి .1920లో రంగూన్ లో యూనివర్సిటి ఏర్పడిన దగ్గరనుంచి ,కొత్తతర రచయితలు  వ్యాసాలు కథలు మొదలైన వివిధ ప్రక్రియలలో సాహిత్య సృజన చేశారు .అనుకరణ ,అనువాదాలవల్ల దేశీయ సాహిత్యం వృద్ధి చెందింది .1947లో బర్మా యూనియన్ ఏర్పడగా జాతీయ సంస్కృతిపై అభిమానం పెరిగింది .ఉత్తమ నవలలకు బర్మా ప్రభుత్వం బహుమానాలు అందించి ప్రోత్సహించింది .

  బాగాన్ వంశ పాలనలో అనవ్రహ్త రాజు తేరవాద బౌద్ధాన్ని అవలంబించి రాజ్యమతంగా ప్రకటించి సిలోన్ నుంచి చాలా పాళీ గ్రంథాలు తెప్పించాడు,.ఇవి  అనువాదం  పొందినా పాళీ రాజ్యభాష గా ఉంది .వీటి అనువాదాలకు ‘’నిస్సాయ ‘’అనిపేరు .సియాం ను టౌంగూ వంశరాజులు ఆక్రమించాక ధాయ్లాండ్ బర్మా కాలనీ ఐపోయింది ,ధాయ్ సంస్కృతీ ,భాష చాలాభాగం బర్మీ లో చేరాయి .యదులేక యతుఅనే భావాత్మక యగాన్ సాహిత్యం వచ్చింది 13వ శతాబ్దికి ముందు ‘ధమ్మతత్’’,షౌక్ హ్టోనే అనే న్యాయ శాస్త్ర రచనలు వచ్చాయి .18వ శతాబ్దిలో ‘’కొనబంగ్ ‘’వంశసామ్రాజ్య స్థాపన జరిగాక ఆ యుగాన్నిసాహిత్యానికి  స్వర్ణయుగం అన్నారు .లేట్వే తొందారా వంటిమహాకవులు సాహిత్య సృజన చేశారు .ధాయ్ పై రెండో దాడి జరిగాక అనేకా శిధిలాలు బర్మాకు చేరాయి .రామాయణం వచ్చి బర్మీస్ భాషలోకి అనువాదమై ,ఎందరో శృంగారకవులకు ప్రేరణ నిచ్చింది .రాజాస్థానాలలో నాటకాలు ఆడేవారు .  1829లో రాజు బగ్విదా మహా పండితులను నియమించి ‘’హిమాన్నం యజావిన్ డాగ్యి ‘’అంటే గ్లాస్ పాలస్ క్రానికల్  అనే బర్మా దేశ చరిత్రను 1821వరకు రచియి౦ప జేశాడు .తర్వాత రాజు మిండాన్ మిన్ 1867-1869కాలపు రెండవ క్రానికల్ తయారు చేయటానికి స్కాలర్స్ ను నియమించి రాయించాడు .1824-1948 బ్రిటిష్ కాలం లో 1910లో ఫర్నివల్లి బర్మీస్ రిసెర్చ్ సొసైటీ ఏర్పాటు చేసి బర్మా దేశపు సాహిత్య సంస్కృతుల వారసత్వాన్నికాపాడాడు .బర్మాలో ‘’హికిత్ సన్’’ అంటే పరీక్షా సమయం అనే ఉద్యమం వచ్చి రచనా శైలిలో మార్పు తెచ్చింది .సృజనాత్మక రచయితలలో మాంగ్ వా ,దియాన్ పే మింట్ లు ముఖ్యులు .మహిలారచయిత –డాగన్ ఖిన్  ఖిన్ లే కాలనీ ప్రభుత్వం లో రైతుల కస్టాలు కన్నీళ్లు బాధలను వర్ణించి రాసి జాతీయతా స్పూర్తికి మార్గదర్శి అయింది .బ్రిటిష్ రచయిత జార్జి ఆర్వెల్ బ్రిటిష్ కాలనీ ప్రభుత్వ దౌస్ట్యాలను  ఖండిస్తూ వారికి అండగా  ‘’బర్మీస్ డేస్’’పుస్తకం రాసి 1935లో ప్రచురి౦చాడు  .ఈకాలం లో సాహిత్య సంస్కృతీ జనసామాన్యానికికూడా చేరింది .1920-30కాలం లో డాగన్,గండా లాకా (క్లాసిక్ ప్రపంచం )అనే మేగజైన్లు వచ్చాయి .

 1948తర్వాత స్వాతంత్ర్యానంతరం పాశ్చాత్య భావ శైలి బర్మాలో బాగా ప్రవేశించింది .ప్రభుత్వం బర్మీస్ ట్రాన్స్ లేషన్ సొసైటీ ఏర్పాటు చేసి సైన్స్ టెక్నాలజీ తో సహా అనేక విదేశీ పుస్తకాలకు అనువాదం చేయించింది  బాగాన్ ప్రెస్ మార్క్సీయ సాహిత్యాన్ని బర్మీస్ లోకి అనువాదం చేసి ప్రచురించింది .1976 బర్మీస్ మొదటి ‘’విజ్ఞానసర్వస్వం ‘’ప్రచురణ జరిగింది .సోషలిస్ట్ ప్రభుత్వం కూడా సాహిత్యానికి సహకరించింది .పర్యావరణ స్పృహతో రచనలు వచ్చాయి .1960 నెవిన్ ప్రభుత్వం లో సెన్సార్ షిప్ ఎక్కువై రచనల వేగం తగ్గింది .కాలనీ ప్రభుత్వం తర్వాత స్త్రీ రచయితలూ జర్నల్ క్యా మామా లే,ఖిన్ మియో చిట్ మొదలైనవారు ‘’దితర్టీన్ కారట్ డైమాండ్ ‘’వంటి  నవల లు రాశారు .ఇది చాలాభాషలలో అనువాదం పొందింది .జర్నలిస్ట్ లుడు ఉ హ్లా ఎన్నో నవలలు  ఎత్నిక్ మైనారిటి జీవితాలపై యు ను కాలపు జైలు  జీవితాలపై .ఎందరో వ్యక్తుల జీవిత చరిత్రలు  రాసింది .ప్రధానమంత్రి’’ ఉ ను’’ స్వయంగా గొప్ప రచయిత.అనేక రాజకీయ సాంఘిక నాటకాలు రాశాడు .’’ఓషన్ ట్రావెల్ ‘’,పెరల్ క్వీన్ ‘’వంటి బ్లాక్ బస్టర్ ,బర్మీస్ క్లాసిక్స్ అనబడే నవలలు రాసిన  ధియన్ పే మింట్,వార్ అండ్ పీస్ వంటి నవలానువాదం చేసిన మ్యా ధాన్ టింట్.ధావ్డా స్వే,మియట్  హుత్సున్.క్యి ఆయే , ఖిన్ హ్యిన్ హ్యు మొదలైనవారు ఆధునిక బర్మీస్ సాహిత్యానికి వన్నెలూ చిన్నెలూ తెచ్చి తీర్చి దిద్దారు .

15మంది సమకాలీన బర్మీస్ కవులు పేరిట బోన్స్ విల్ క్రో2012లో పుస్తకం రాసి ప్రచురించాడు .

  బర్మా దేశం పేరును 1989లో మిలిటరీ జుంటా పాలనలో  మయన్మార్ గా మార్చారు .వీరికి వ్యతిరేకంగా దేశ  స్వతంత్రం కోసం  శాంతియుత సత్యాగ్రహం ,పోరాటం చేసి ఎన్నో ఏళ్ళు జైలు శిక్ష అనుభవించిన ‘’ఆన్ సాన్ సుకి ‘’  అంతర్జాతీయ ఒత్తిడికి ప్రజా పోరాటానికి  తలొగ్గి ప్రభుత్వం విడుదల చేస్తే 1990ఎన్నికలలో అపూర్వ మెజారిటీ తో గెలిచినా, హౌస్ అరెస్ట్ లో ఉంచింది మిలిటరీ జుంటా .1989 నుంచి 2010 నవంబర్ 13 వరకు 11ఏళ్ళు క్రూర కిరాత పాలనలో జైలులో మగ్గి విడుదలై ,మళ్ళీ తనరాజకీయ పగ్గాలు చేబట్టి దేశాన్ని ప్రజాస్వామ్య దేశంగా తీర్చిదిద్దే ప్రయత్నం అహరహం చేస్తోంది .ఆమె అవలంబించిన మహాత్మాగాంధీ శాంత్యహి౦సా మార్గానికి 2011లో నోబెల్ శాంతి పురస్కారం అందించారు .ఆ దేశంలో సాహిత్య నోబెల్ లారియట్స్ ఎవరూ లేరు .

 రంగూన్ ను౦చి మనదేశం కలప దిగుమతి చేసుకొనేది రంగూన్  కలప నాణ్యమైనది గా ప్రసిద్ధి .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -4-2-20-ఉయ్యూరు

image.png
image.png
Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-11

కిరాతార్జునీయం-11

ఈ విధంగా శత్రువులచే పొందిన అపకారం, అవమానాలకు క్షుభితుడైన భీమసేనుడిని పరమ శాంత, రాజనీతి విషయాలతో యుధిష్టిరుడు ఊరడిస్తున్న సమయంలో కోరిన మనోరధం మూర్తీభవించి తనంత తానె వచ్చినట్లు  వేదవ్యాసమహర్షి అరుదెంచాడు .పరస్పర విరోధం కల పశు పక్ష్యాదులను తన శాంత దృష్టితో విరోధం పోగొట్టి ,ప్రేమకలిగిస్తూ ,సమస్త పాపక్షయ కర తేజస్సు వెదజల్లుతూ ,మహా తపశ్శాలి ,ఆపన్నివారకుడు మూర్తీభవించిన పుణ్యరాశి నయనాన౦ద కారుడు వేదవ్యాసర్షి రాగా ,ధర్మరాజు ఆశ్చర్యచకితుడయ్యాడు –

‘’మదురై రవశాని లంభయ-న్నపి తిర్య౦చి శమం నిరీక్షితైః

పరితః పటు బిభ్ర దేనసాం –దహనం ధామ విలోకన క్షమం ‘’

సహసోపగత స్సవిస్మయం –తపసాం సూతి రసూతి రాపదాం

దదృశే జగతీ భుజా ముని –సస వపుష్మా నివ పుణ్య సంచయః ‘’

మహర్షిని చూడగానే లేచినిలబడి ,మేరుపర్వతం పై సూర్యునిలా ప్రకాశింఛి ,యధోచిత అర్ఘ్య పాద్యాలతో సత్కరించి ,శా౦తం తో  ఉచితాసనం పై కూర్చుండ జేసి నమస్కరించి ,బ్రహ్మ తేజస్సు తో దర్శనమిచ్చిన ఆ మహర్షికి ,చిరునగవుతో నిర్మల కిరణ భాసమానుడై ,దేవ గురునికి ఎదురుగా ఉన్న సంపూర్ణ చంద్రునిలాగా ప్రకాశించాడు .

ఇతి శ్రీ పదవాక్య ప్రమాణ పారీణ శ్రీ మహా మహోపాధ్యాయ కోలాచల మల్లి నాథ సూరి విరచితాయాం కిరాతార్జు నీయ వ్యాఖ్యాయాం ఘంటా పథ సమాఖ్యాయాం ద్వితీయ సర్గః ‘’

                          తృతీయ సర్గ

శరత్కాల చంద్ర కిరణాలులాగా,మనోహ్లాదకిరణ సమూహంతో ఉన్నత శరీరుడు ,నల్లని శరీరం ,పచ్చని జడలు కలిగి మెరుపులతో ఉన్నమేఘంలాగా ,ప్రసన్నతా సంపదకలిగి ,లోకాతి శయమైన  ఆకార సంపదతో ,తెలియని వారికి కూడా స్నేహభావంకలిగించే వాడు ,పవిత్ర అంతఃకరణుడు అని తన ఆకారం తో అందరికీ తెలియజేసేవాడు ,అతిమధుర, అత్యంత విశ్వాస మైన చూపులతో మాట్లాడేట్లు కనిపించే వాడు ,అగ్నిహోత్రం మొదలైన ధర్మ ప్రతిపాదిత మైన పాపనాశాలైన శత్రువులకు కారణమైనవాడు ,సుఖాశీనుడు ఐన వేదవ్యాసుని,తనరాకకు కారణం ఏమిటో తెలుసుకోవాలని  ధర్మరాజు ‘’మహర్షీ !మా పుణ్యఫలం వలన మీ దర్శనభాగ్యమైంది.సకల శుభాలను,సుగుణాలను కలిగిస్తుంది .మేఘం లేకుండా వచ్చే ఆకస్మిక వర్షం లాగా మీ దర్శనం కలిగింది .ఏదో శుభం జరగబోతోంది అనిపిస్తోంది .మీ రాక మాకు మాన్యత కలిగించింది .మా యజ్ఞాలు సఫలీ కృతమయ్యాయి  .నా శ్రేయస్సుకోరి నన్ను  ఆదరించే  విప్రుల ఆశీస్సులు సత్యాలయ్యాయి .బ్రహ్మ దర్శనం తో కొన్ని కోరికలు సిద్ధి౦చినట్లు,మీ దర్శనం తో మాకు ఐశ్వర్యం కలిగి దుఖం నశించి ,పురుషార్ధాలు సిద్ధించి ,కీర్తి విస్తరించి సకలమనోరదాలు ఈడేరుతాయి .అమృతమయుడైన చంద్రుని చూసినా,  సుఖం పొందని నా నేత్రాలు ,మీ సన్నిధిలో ఆనందాన్ని పొందుతున్నాయి .బంధు వియోగ దుఖం అనుభవిస్తున్ననా హృదయం క్లేశం దూరమై మిక్కిలి సుఖంగా ఉన్నది .మహర్షులు నిస్ప్రుహులు .మా వంటివారివద్ద కోరదగింది ఏదీ ఉండదు కనుక ఎందుకు వచ్చారు అని అడగటానికి ఆధారమే లేదు .మీవంటి పెద్దలవచనాలు సకల శ్రేయస్కరాలు కనుక ప్రశ్నించకుండా ఉండలేకపోతున్నాను మహాత్మా !’’అని ధర్మరాజు వాక్ వైభవంతో మనోహరంగా పలుకగా అతని వినయాదులకు ప్రీతి చెంది ,అతనికి జయం కలిగించే తలంపుతో మహర్షి సమాధానం చెప్పటం ప్రారంభించాడు .

  ‘’ధర్మ రాజా !  బంధువులమధ్య తీవ్ర విరోధం వస్తే పరిష్కరించి మైత్రి చేకూర్చినవారికి ఇహం లో కీర్తి ,పరం లో సుగతి కలుగుతుంది .నిస్ప్రుహులమై ,అడవులలో తపస్సు చేసుకొనే మా లాంటి ఋషులకు ఉభయ పక్షాలమీదా సమాన బుద్ధి ఉంటుంది అని వేరే చెప్పక్కరలేదు .ముముక్షువులకు కూడా సాధుజన పక్షపాతం ఉండటం సహజం .మీ ఉభయులపైనా సమాన ప్రేమ ఉండాల్సి వచ్చినా ,నీ సుగుణ సంపత్తి కి నా  హృదయ౦ స్వాదీన మై ,నీకు జయం కలగాలని కోరుతోంది .నీలా౦టిసాదువుపై ఇలాంటి పక్షపాతం కలగినా ,నా మధ్యవర్తిత్వానికి ఏమీ భంగం రాదు .మీపెదనాన్న మోహపరవశంతో,సుగుణ శీలురైన  ,సత్ప్రవర్తకులైన మిమ్మల్నిఅకారణంగా   కొడుకులు అనే కనికరం కూడా లేకుండా విడిచి పెట్టేశాడు.అలా౦టి  అవివేకి లోకంలో ఉండడు  .దుర్జన సావాసం వలన జయం కలుగకపోగా ,మూల చ్ఛేదమైన  ఆపదలూ వస్తాయి .మీపెదతండ్రి  దుష్ట చతుస్టయమైన కర్ణాదుల మంత్రాంగం ప్రకారం నడుస్తున్నాడు .కార్యసిద్ధి కలగకపోగా ,సమూలనాశక విపత్తులు సంభవిస్తాయి వారికి .ఇది ముమ్మాటికీ నిజం .

   ‘’ ఆనాడు నిండు సభలో ధర్మం వదిలేసి ,ద్రౌపదీ వస్త్రాపహరణం చేస్తున్నా ,లోపల పగ రగిలిపోతున్నా శాంతమూర్తిగా ఎవరినీ దూషించకుండా  ధర్మమార్గగామి వై ,నీ ధర్మం కాపాడుకొన్నావు .నువ్వు రక్షించిన ధర్మం నిన్ను  రక్షిస్తుంది   .కనుక శత్రువులను జయించి సమస్తభోగాలు పొండుతావని నమ్ము .-

‘’పథశ్చుతాయాంసమితౌ రిపూణా౦- ధర్మ్యాందధానేన దురం చిరాయుః

త్వయా విపత్స్వ ప్యవిపత్తి రమ్య-మా విష్క్రుతం ప్రేమ పరం గుణేషు’’

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-2-20-ఉయ్యూరు

image.png
Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-10

కిరాతార్జునీయం10

ధర్మరాజు’’ శాంతరసం’’ తో భీముని ‘’తలంటుతున్నాడు ‘’-‘’మనం శాంతంగా ఉంటె దుర్యోధనుడు రాజులందర్నీ తనవైపు త్రిప్పుకో కుండా ఉంటాడని అనుకో రాదు .యాదవులకు మనపై ఆదరం ఎక్కువ .మనకూ వారిపై ప్రేముంది .వాళ్ళు మానవంతులలో అగ్రేసరులు .వాళ్ళు మనల్ని వదలి దుర్యోధనుడిని ఆశ్రయించరు.వాళ్ళు ఖచ్చితంగా మన పక్షమే సందేహం లేదు .వారివలన మనకు అసాధ్యం ఏదీ ఉండదని నమ్ము .అంతేకాదు యాదవులు మాతృ ,పితృ బంధువులు మిత్రపక్షం వారు వారిని వదలి వెళ్లరు .సమయం వచ్చేదాకా దుర్యోధనునివైపే ఉంటూ వారంతా సమయం రాగానే యాదవపక్షం వైపే చేరటంఖాయం –

‘’అభి యోగ ఇమాన్మహీ భుజో –భావతా తస్య కృతః కృతావదేః

ప్రవిఘాటయితా సముత్పతన్ –హరిదశ్వః కమలాకరానివ ‘’

భీమా !12ఏళ్ళు అడవుల్లో 1ఏడు అజ్ఞాతం లో ఉంటామని మనం మాట ఇచ్చాం .ఆగడువుకు ముందే మనం వారిపైకి వెడితే, ప్రతిజ్ఞను విస్మరించిన వారమౌతాం .గడువు పూర్తయ్యాక యుద్ధానికి వెడితే సూర్యోదయం చేత తటాక పద్మాలన్నీ వికశించినట్లు యాదవాది రాజులంతా దుర్యోధనుడిని వదిలి మనవైపు చేరుతారు .కనుక ఇది మనకు యుద్ధ సమయం కాదు .మిగిలిన రాజులను కూడా వాడు మనల్ని అవమాని౦చినట్లే అవమానించక మానడు.అప్పుడు వారు  పరాభవం భరిస్తూ  పరాక్రమ శౌర్యాలను పణంగా పెడుతూ ఊర్కోలేరు .వారే వచ్చి మనవైపు చేరతారు .ముందుగా యుద్ధానికి వెళ్ళకపోతే వచ్చే లాభం ఇది.కనుక ఇదియుద్ధసమయ౦ కాదు  మనకు  .దుర్యోదనుడికి సమస్తరాజన్యం వీర విధేయంగా ఉందని మన చారుడు చెప్పాడుకదా నువ్వు ఇలా అంటావేమిటి అని సందేహం నీకు రావచ్చు .మదహంకారులు ఎప్పుడూ తమపనులను నిశ్శేషంగా చేసుకోలేరు .మదవికారం పెరిగి ,వాళ్ళను ఇష్టారాజ్యం గా ఆడిస్తాడు .మదం పెరిగితే గర్వం పెరిగి అవమానం చేయటానికి వెనకాడడు.దానితో వారికి అసంతృప్తి ,అసహ్యం కలిగి ,వారంతటికి వారే విడిపోయి మనదగ్గరకు వస్తారు .మదం వలన కలిగే అనర్ధాలను చెబుతా విను .దర్పాహంకారలున్నరాజు ఎప్పుడు ఎవరితో ,దేనిమీద .ఏది చేయకూడదో ఆ జ్ఞానం ఆశిస్తుంది .అప్పుడు మూఢుడై నీతిని వదిలేస్తాడు .అప్పుడు లోకానికి వాడిపై ద్వేషం పుడుతుంది .అది క్రమంగా పెరిగి రాజకార్య వైముఖ్యం ప్రదర్శిస్తారు .అప్పుడు ఎంతగొప్పరాజైనా ,పెను గాలి వీస్తున్నప్పుడు బాగా నేలలోకి ప్రాకిన  వ్రేళ్ళుగల వృక్షమైనా కూకటి వ్రేళ్ళతో కూలిపోయినట్లు కూలిపోకతప్పదు.కనుక మదహంకారాలు వదిలేయాలి .వాడిని  ఈ రెండూ పూర్తిగా  ఆవహించాయి .కనుక రాజులను అవమానిస్తాడు .అదే వాడికి అపకారమౌతుంది .మదహంకారాలున్న రాజు చేత అవమాని౦పబడిన మంత్రులు మొదలైనవారు దూరమైనంతమాత్రాన ఆ రాజుకు వచ్చే నష్టం ఏమిటి అని అను కొంటున్నావా .బాగా బలిసిన చెట్టుకొమ్మలు ఒకదానితో ఒకటి ఘర్షణకు లోనై అగ్ని పుట్టి ఆ  పర్వత  భాగమంతా భస్మీపటలం చేసినట్లు ,అమాత్యాదులకు జరిగిన అవమానం వలన కలిగిన ద్వేషం పెరిగి ,రాజును సర్వ నాశనం చేస్తుంది .శత్రువు దుర్మార్గుడైతే ,బుద్ధిమంతుడు వాడి అభి వృద్ధికి ప్రతి క్రియ చేయకుండా ఉపేక్షి౦చాలి  .వాడు ఈ అవమాన పరంపర కొనసాగిస్తూ తననాశనం తానె తెచ్చుకొంటాడు .అప్పుడు వాడిని జయించటం చాలాతేలిక కనుక ప్రతిక్రియ అక్కర్లేదు .దుర్మార్గుడైన రాజుకు మిత్రులే శత్రువులై వాడి ఆహ౦కారం ,అహంకారం వలన వాళ్ళు ద్వేషం పెంచుకొని రాజును నిర్వీర్యం చేస్తారు .అప్పుడు విజిగీషువు నది వేగంతో గట్లను చీల్చినట్లు శత్రువును సునాయాసంగా జయించవచ్చు ‘’అని తన మనసులోని ఆలోచనలన్నీ జిలేబీ చుట్టల్లాగా,ఒక్కొక్కటి బయటపెడుతూ ,తాను  నిస్తేజంగా ప్రతిక్రియ ఆలోచించకుండా ఎందుకు ఉంటున్నాడో మహా మేధావి గా యుధిష్టిరుడు ఇంకా చెబుతున్నాడు .

  సశేషం

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-2-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వత౦ 14-పారశీక సాహిత్యం 3

ప్రపంచ దేశాల సారస్వత౦

14-పారశీక సాహిత్యం 3

సెల్జూకులు –వీరికాలం లో సుప్రసిద్ధ సాహిత్యోపాసకుడు వజీర్ అబుల్ హసన్ అనే నిజాముల్ ముల్క్ .ఈయన పాలనా కళా వైభవాన్ని ‘’సత్ నామా ‘’గ్రంథం లో వివరించాడు .పారశీ సాహిత్యమంతా సూఫీ సిద్ధాంతం పైనే ఆధార పడి ఉంది .ఈ ఉద్యమ మొదటికవి అబూ సయీద్ ఖైర్ ‘’క్వాట్రైన్ ‘’అనే పద్య రూపాన్ని పునరుద్ధరించి ప్రచారం చేశాడు .ఖాజా అబ్దుల్లా అన్సారి క్వాట్రై న్ లకు ,మొనాజా కట్అనే ప్రార్ధనలకు ప్రసిద్ధి .సూఫీకవులలో సనాయీ ‘’మున్నవీ ‘’రూపాన్ని వాడిన మొదటివాడు ‘’హదీ కత్ -,ఉల్ –హకిక అనేది అతని ప్రముఖ మన్నవీ .

   ఈకాలం లో సూఫీతో పాటు ఉమర్ ఖయ్యాం నాస్తిక సిద్ధాంతం కూడా బాగాప్రచారం పొందింది .ఈయన జ్యోతిష్యుడు ,గణకుడు ,తత్వవేత్త కూడా .ఇతని రుబాయీలు ప్రపంచమంతా వ్యాపించాయి .పారసీ సాహిత్యం లో గద్య రచన తక్కువే .ప్రాచీన గద్య రచనలలో’’ జిజీర –ఏ-ఖవా –రజం షాహి’’ముఖ్యమైంది .ఆల్ గజాలి అనే నీతి తత్వ వేత్త తో ఇస్లామిక్ సూఫీ తత్త్వం లో గొప్ప పరిణామం కలిగింది .ఎక్కువభాగం ఆరబీలో రాసినా అతని ప్రసిద్ధ ‘’ఎహ్యా ఉల్-ఉతాంఫిద్దీ౦ ‘’ను ‘’కిమియా పసాజత్ ‘’పేరుతొ పారసీలోనూ రాశాడు .అరూజి సమర్ ఖండి రాసిన ‘’చహార్ మకాలా ‘’అనే తత్వ గ్రంథం ఆయన ఈవిత చరిత్ర కూడా.

 కథలనుంచి ప్రేయసీప్రియుల వృత్తాంతాలతో శృంగార కవిత్వం రచి౦ప బడింది .ఇలాంటి రచనకు నిజామీ ప్రసిద్ధుడు .’’ఖంస ‘’అనే ఇతని అయిదు మన్నవీలు (idylls)తర్వాతవారికి ప్రేరణకలిగించాయి   .సూఫీ సంప్రదాయాన్ని సనాయీ తర్వాత ఫరీద్ ఉద్దీన్ అత్తార్ కొనసాగించాడు .ఇతని ప్రసిద్ధ రచన ‘’మంతిఖ్ –ఉత్ –తైర్’’.ముస్లిం సన్యాసుల వేదాంతుల జీవిత చరిత్రలను సేకరించి ‘’తజ్ కిరత్ అల్ ఔలియా ‘’అనే గద్య రచన రాశాడు .

   మౌలానా ఎ రూమీ అనే పేరున్న జలాలుద్దీన్ సకల శాస్త్రవేత్త .జ్ఞానోదయం పొంది ,సాహిత్య జీవితం ప్రారంభించాడు .మంగోలు దండయాత్రలు జరుగుతున్నా రచనకు ఆటంకం కలగలేదు .ఇతని రచన ‘’మస్ నవీకి ‘’ఖురాన్ అంతటి ప్రసిద్ధి పొందింది .సాదీఅనే మహాకవి గద్యపద్య రచనలు చాలా చేశాడు .బోస్తాన్ ,గులిస్తాన్ అనే రచనలు అన్నిభాషలలోకి అనువాదం పొందాయి .

 మంగోలులు కూడా శాస్త్ర ,చరిత్ర విలువలు గుర్తించారు .వారి రాకముందు నజీరుద్దీన్ తత్వవేత్త గొప్ప పేరు పొందాడు .ఇతని ప్రసిద్ధ రచన ‘’అఖ్ లాకె-ఎ-వాసిరి ‘’దేశీయ పారశీక భాషలో రాశాడు .దీనికంటే ఆ సాహిత్యం లో ఉత్తమ నీతి గ్రంథం లేదని ప్రతీతి.హలాగు కార్యదర్శి అతామలిక్ మంగోలుల చరిత్రను సమగ్రంగా రాశాడు .దీనికి తర్వాత కాలం లో ‘’తారీఖ్ ఎ-జహాన్ –గుషా ‘’అనే పేరువచ్చింది .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-2-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-9


కిరాతార్జునీయం-9

భీముడు ధర్మరాజుతో ఇంకా ఇలా చెబుతున్నాడు ‘’ఈ పాటికి నువ్వు ప్రయత్నం చేసి ఉ౦ టే శత్రువు ఆపదలపాలై ఉండే వాడు .నువ్వుకదిలితే నాలుగు దిక్కులా నాలుగు మహాసుద్రాలులాగా నీ సోదరులం సిద్ధంగా ఉన్నాం .నిన్నూ , మమ్మల్ని ఎదిరించేవాడులేడు.చివరగా ఒక్కమాట –బహుకాలం గా బాధలు భరించి విసిగి వేసారి  ఉండటం వలన నీలో క్రోధాగ్ని రగిలే ఉంది .దానితో శత్రువులను దహించి వారి భార్యలకు వైధవ్యం కలిగింఛి ప్రతిస్టపొందు ‘’అని కోపోద్రేకాలను ఆపుకోలేక పలికినపలుకులను విని ధర్మరాజు మదగజాన్ని వశపరచుకొనే మావటీడు లాగా శాంతవచనాలతో  శాంతపరచే ప్రయత్నం చేస్తూ ఇలా అన్నాడు –‘’రాజకీయం అంతా దట్టించి మంచి ఉపన్యాసమే ఇచ్చావు నీవాక్ ప్రపంచంలో నిర్మలమైన నీ బుద్ధి నిర్మలమైన అద్దంలో లాగా ప్రతిఫలిస్తోంది .ఇంతటి వాక్ వైశద్యం నీకు ఉందని నాకిప్పటిదాకా తెలీదు .నాకు గర్వ౦ గా కూడా ఉంది  నిన్ను చూస్తె .పునరుక్తి లేకుండా మహాబాగా సూటిగా స్పష్టంగా చెప్పావు .నీ వాక్ నైపుణ్యం మెచ్చదగిందే .శాస్త్రానికి అనుకూలంగా చెప్పేటప్పుడు యుక్తి చూపించటం ,యుక్తికి అనుకూలంగా శాస్త్రాన్ని చూపించటం దుస్సాధ్యం .అప్పటికప్పుడు శాస్త్రం యుక్తిలకు విరోధం లేకుండా మాట్లాడటం చాలాకష్టం .మహా క్షాత్రవంతుడవుకనుక నీకే ఇది తగింది .ఇంతబాగా చెప్పినా నీ మాటలలో సిద్ధాంతం లేదని పిస్తోంది .చాలా సూక్ష్మ బుద్ధితో ఆలోచి౦ చేవరకు నీవాదన సమంజసం కాదనే అని పిస్తోంది .

‘’సహసా విదదీత న క్రియా –మావి వేకః పరమాపదాం పదం

వృ ణ తేహి విమృశ్య కారిణ౦ –గుణ లుబ్ధాస్స్వయమేవ సంపదః ‘’

ఆలోచించకుండా ఏ పనీ తొందరపడి చేయకూడదు .అలాచేస్తే లాభం లేకపోగా ఆపదలు వస్తాయి .బాగా ఆలోచించి చేస్తే కార్యసాఫాల్యం కలిగి ధనవ్యయం శరీరాయాసం తగ్గుతాయి .కనుక బాగా ఆలోచించే నిర్ణయం తీసుకొందాం .(ఈశ్లోకం లోకం లో బాగా వ్యాప్తి చెంది సూక్తిముక్తా వళి అయింది ).సాహసం తో కార్యం చేస్తే సాఫల్యం కావచ్చు విఫలమవ్వచ్చు .వివేకంతో ఆలోచించి చేయాలి .సకాలం లో చల్లిన విత్తనాలు మొలకెత్తి ఫలితం ఇస్తాయి .సంప్రదాయ విద్య శరీరానికి శోభనిస్తుంది .దానికి శాంతం వన్నె తెస్తుంది .ఎప్పుడూ శాంతంగా ఉంటె లోకం నిర్లక్ష్యంగా చూస్తుంది. సమయం వచ్చినప్పుడే శౌర్యం చూపితే పరాక్రమం శాంతానికి వన్నె తెస్తుంది .రాజనీతి పాటించి ప్రయత్నం చేస్తే కార్య సిద్ధి,గౌరవం కలుగుతాయి .సాహసిస్తే పరాజయం, అగౌరవంకూడా కలగవచ్చు .శాస్త్ర దృష్టితో ఆలోచించి నిర్ణయాలు చేయాలి .ఇలా చేసినా ఒకవేళ దైవికంగా అనర్ధం వచ్చినా వారి దోషం కాదుకనుక ని౦ది౦చ రాదు .జిగగీ షువులగు రాజులు క్రోధ వేగాన్ని అణచుకొని ,కార్య సిద్ధులను బాగా ఆలోచించి తప్పక తమకు విజయం కలుగుతుంది అని నమ్మినపుడు పౌరుషం చూపాలికాని ,ఫలని  శ్చయం కాకుండా కార్యం చేయకూడదు .ఇక్కడే బుద్ధి సూక్ష్మతకావాలి .రాత్రి చీకట్లను పోగొట్టి ఉదయింఛి వృద్ధి పొందే  సూర్యుడు  లాగా పురుషుడు క్రోధజనిత అజ్ఞానాన్ని వివేకంతో తరిమేసి అన్ని పనులు ప్రారంభించాలి .మహా శూరుడైనా, కోపావేశంతో పని ప్రారంభిస్తే కృష్ణపక్ష౦ లోచంద్రకళలు  నశి౦చినట్లు రాజు ఉత్సాహ,శక్తి ,సంపదలు నశిస్తాయి .బలవంతుడను నాకేమి అని క్రోధావేశం తో పని మొదలు పెట్టరాదు .క్రోధంతో కనులు మూసుకుపోయేవాడికి యుక్తాయుక్త విచక్షణ ఉండదు .దీనివలన లోకోత్తర సామర్ధ్యం వ్యర్ధమై ,కార్యం నెరవేరదు .అవసరాన్నిబట్టి కోపం శాంతం ప్రదర్శించాలి .సంరంభం పనికిరాదు .సంపదలు శరత్కాల మేఘాలలాగా చంచలాలు .ఇంద్రియ వసులకు సంపదలు చిరకాలం నిలిచి ఉండవు .జితే౦న్ద్రియునికే ఆ అదృష్టం దక్కుతుంది .వచ్చినకోపాన్ని అంతా పైకి ప్రదర్శిస్తే కార్యహాని తప్పదు.భీమా !పూర్వపు ఖ్యాతి ,ధైర్యం పోగొట్టుకొన్నావు .ఇది నీకు తగదు .క్రోధావేశం వదిలి శాంతంగా ఆలోచించు .సంపదలకు స్వతస్సిద్ధంగా చంచలత్వం లేదు కాని ఇంద్రియ నిగ్రహం లేని రాజుకు సంపదలు నిలవవు.యుక్తాయుక్త ,సమయా  సమయ ,కార్యాకార్య జ్ఞానం దురాగ్రహమున్నవానికి నశిస్తుంది .అసమయ కోపం అనర్ధదాయకం ‘’అంటూ ఇంకా చెబుతున్నాడు ధర్మరాజు భీమసేనుడికి .

  సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -2-2-20-ఉయ్యూరు —

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా మనీషి సాహితీ సేవా దురంధరుడు శ్రీ బి హనుమా రెడ్డి గారి వ్యక్తిత్వం ,ఒంగోలు సభలు -రమ్యభారతి జనవరి

మహా మనీషి సాహితీ సేవా దురంధరుడు శ్రీ బి హనుమా రెడ్డి గారి వ్యక్తిత్వం ,ఒంగోలు సభలు -రమ్యభారతి జనవరి

Posted in సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-8

కిరాతార్జునీయం-8

పౌరుషహీనుడికి అనర్ధాలు ఒకదానిపై ఒకటి దాపరిస్తాయి .నిరుద్యోగికి పౌరుషహీనుకి సంపదలు నిలవవు .సమయం కోసం ఎదురు చూడటం నిరర్ధకం .కపటబుద్ధి కి రుజుమార్గ ప్రవర్తన ఉండదు .13ఏళ్ళుగా అనుభవిస్తున్న ఐశ్వర్యాన్ని వదులుకొనే బుద్ధిహీనుడుకాడు మనశత్రువు .యుద్ధం చేయకపోతే మన రాజ్యం మనకు ఇవ్వడు ,ఎప్పుడో చేయటం కంటే ఇప్పుడే యుద్ధం చేసి మనరాజ్యం దక్కించుకోవాలి .ఒక వేళ తనే  దుర్యోధనుడు మనకు రాజ్యమిస్తే  అప్పుడు మహాపరాక్రమవంతులైన నీ సోదరులకు పని ఉండదు .పోనీ దానికీ ఒప్పుకు౦దా మంటే ,క్షత్రియులు క్షాత్రం చేతనే రాజ్యం సాధించాలి కాని దయా ధర్మ భిక్షతో కాదుకనుక యుద్ధప్రయట్నం చేయి .మృగరాజు స్వయంగా మదపు టేనుగును చంపి తింటు౦ది కాని ,ఇతరజ౦తు వులు చంపిందాన్ని తినదు .అలాగే మహాపురుషుడు తనపురుశకార్యంతోనే దేనినైనా సాధించి అనుభవించాలి .కాని సామం పనికి రాదు .మనం శూరులం అని మరువ రాదు .యుద్ధం లో జయం మనదేఅని చెప్పలేముకూడా .యుద్ధంవలన అనేక నష్టాలు కలుగుతాయి .తేజస్వికి మానరక్షణప్రదానంకాని ,రాజ్య సంపదకాదు .రాజ్యం రావచ్చు ,పోవచ్చు కాని శత్రువును బ్రతిమాలితే మానం పోతుంది .లక్ష్మి చంచలం యశస్సు స్థిరం .స్థిరకీర్తికి ప్రాణాలను కూడా లక్ష్యపెట్ట రాదు .కనుక యుద్దంచేసి మాన సంరక్షణ చేసుకోవాలిమన౦ .కాలని బూడిదను కాలితో తొక్కినట్లు మండే నిప్పును తొక్కలేం ,అలాగే మానహీనుడిని తేజస్సు లేనివాడిని లోకం గౌరవించదు .ప్రాణ, మానాలలో మానం ముఖ్యం .కనుక శూరోచితమార్గం ఎన్నుకొని ప్రయత్నించు. ప్రయోజనం ఆశించకూడదు .ప్రయోజనం లేకపోయినా సింహం ఉరిమే మేఘం పై ఉరుకుతుంది .అదిగొప్పవారిస్వభావం .శత్రుసంహారం పరమ పురుషార్ధం. ప్రాకృత మార్గం లో నడవటం వివేకి విధానం కాదు ‘’అని ఇంకా చెబుతున్నాడు అపర మనుధర్మ శాస్త్రవేత్తలాగా అపర చాణక్యుడిలా భీముడు .

   సశేషం

రథసప్తమి శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-2-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

విజయవాడలో డిసెంబర్ లో జరిగిన 4వ ప్రాపంచ తెలుగు సభలపై నా సమీక్ష -రమ్యభారతి -జనవరి

విజయవాడలో డిసెంబర్ లో జరిగిన 4వ ప్రాపంచ తెలుగు సభలపై నా సమీక్ష -రమ్యభారతి -జనవరి

Posted in సమీక్ష | Tagged | Leave a comment

ఈ రోజు 1-2-20శనివారం ఉదయం మా ఇంట్లో మా శ్రీమతి రథసప్తమి పూజ, పొంగలి వండి, నైవేద్యం పెట్టే, నా అరుణ పారాయణ

ఈ రోజు 1-2-20శనివారం ఉదయం మా ఇంట్లో మా శ్రీమతి రథసప్తమి పూజ, పొంగలి వండి, నైవేద్యం పెట్టే, నా అరుణ పారాయణ ,

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

పోరంకి కల్యాణ మండపం లోఇవాళ నేనూ డ్రిల్ మాస్టర్ సుబ్బారావు గారూ

\

 

పోరంకి కల్యాణ మండపం లోఇవాళ నేనూ డ్రిల్ మాస్టర్ సుబ్బారావు గారూ

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వత౦ 14-పారశీక సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వత౦

14-పారశీక సాహిత్యం

భాష –క్రీ.పూ 6వ శతాబ్ది నుంచి పారశీక భాష ఉన్నట్లు తెలుస్తోంది .ఇప్పుడు ఇరాను దేశం లో వాడుక భాష ,శాసనసభ విశ్వవిద్యాలయ బోధనకు,అధికార ప్రకటనలకు ,పత్రికలకు సామాన్య సాహిత్యానికీ  అదే భాష .అభయ మెనిడ్ రాజులచేత వాళ్ళ స్మారక చిహ్నాలలో రాయబడిన పాత పారశీకమే ఇది .బెహిస్తూన్ పర్వతం పై ఎత్తుగా ఉంచబడిన డేరియస్ ప్రకటన చాలా ప్రసిద్ధమైంది ,ఇక్కడి శాసన వ్యాకరణ భాషకు అవెస్తా సంస్కృతలో ఉన్న భాషకు సన్నిహిత సంబంధం ఉన్నది .

మధ్య పారశీ లేక పహ్లవి –అలక్జాండర్ సామ్రాజ్య పతనం తర్వాత పర్షియాను పార్దియన్లు పాలించారు .వీరిని బట్టే పహ్లవి అనే మాండలీకానికి ఆ పేరు వచ్చింది .కొన్ని శాసనాల్లో ,మత గ్రంథాలలో,నాణాలపైనా కనబడే భాష అదే అంటారు .ఫార్సు రాష్ట్రం లో ఏర్పడిన పాత పారసీ పరిణామ దశలో ఇది ఒకటి .

ఇస్లామిక్ పారసీ -7వ శతాబ్దిలో ఇస్లాం మతం అవలంబించటం పర్షియా దేశం కాలి ఫేట్ కు వశమవటం జరిగాక ,అరబ్బీ భాష తప్పని సరి అయింది .పారసీ రచయితలూ అరబ్బీ నుండి విరివిగాపదాలు వాడే అవకాశం కలిగింది .నిత్యవ్యవహారాలు పార్సీలోనే జరిగేవి .ఇప్పుడు సామాన్యజనం పాడుకొనే పాటలుకూడా ఆభాషలో రాసినవే .పద్యం లో అరబ్బీ పదాలు తక్కువే .గద్యంలో విపరీతం .పరదేశీయులు పాలించినా పార్సీ వారి భాషలలో లీనంకాకపోవటం ప్రత్యేకత .అరబ్బీ పదాలను అరువు తెచ్చుకొన్నా వ్యాకరణమర్యాద నిలుపుకున్నది .వాక్యంలో పదాలన్నీ అరబ్బీ అయినా ,క్రియలు ,పదాలక్రమం మాత్రం పారసీ లక్షణాలతో ఉంటుంది .

   వర్తమానకాలం లో పత్రికలలో ,ఉత్తరప్రత్యుత్తరాలలో ,నవలలో వాడే భాష ప్రాచీన పార్సీ ,వ్యావహారిక భాష ,ఫ్రెంచ్ జర్మన్ ,ఇంగ్లిష్ మొదలైన పాశ్చాత్యపదాల కలగా పులగం .దీనికీ ,11 వ శతాబ్ది భాషకు పెద్దగ తేడా లేదు .కొత్తపదాలు చాలా చేరాయి .పదాలా అర్ధాలు కూడా మారాయి .

   ఆసియాలో పారసీ –మహమ్మద్ గజని సామ్రాజ్యం లో బుఖారా ,సమర్ఖండ్అనే పెద్ద పట్టణాలున్నాయి .ఇక్కడి నుంచే ఇస్లాం లోని పారశీక సంస్కృతి ఇండియాకు ,టర్కీకి వ్యాపించింది .క్రీశ 1000లో టర్కోమాన్ ప్రాంతాలన్నీ ముస్లిం ప్రభావం లో ఉన్నాయి .స్థానిక భాషలలో చేరిన అపరిచిత పదాల అర్ధాలు పారశీ ద్వారా వివరించాల్సి వచ్చేది .మతపరివర్తన ప్రయోజకులు పారశీనే వాడేవారు .ఆసియా మైనర్ లోని ‘’ఆటోమన్’’నాయకులు ఉత్తరప్రత్యుత్తరాలకు పారశీ నే వాడేవారు .టర్కీలో వచ్చిన మొదటి సాహిత్యం పారశీలోనే వచ్చింది .టర్కీకవులు పార్శీ మూలం లోని ప్రసిద్ధ ఛందస్సులు ,ప్రక్రియలనుమాత్రమేకాక ,విశేష పద సంపదకూడా తీసుకొన్నారు .ఇప్పటికీ గ్రాంధిక టర్కీలో పారశీ ఎక్కువే .

  పారశీ సాహిత్యం – డేరియస్ తోనే పారశీ సాహిత్యం మొదలైంది  .అతడు బెహేస్తూన్ కొండలమీదా ,నాణాలమీదా,కిర్మాన్ షామతగ్రంధం  లో తన ఆజ్ఞలనుపారషీ భాషలో చెక్కించాడు .జోరాస్టర్ మత గ్రంథం కూడా ఈ భాష లోనే ఉంది .అవెస్తా అనేది గ్రంథంమాత్రమేకాదు ,మా౦డలికంకూడా .దీనికీ, సంస్కృతానికి సంబంధం ఉన్నది .ఇప్పుడు లభించింది 21గ్రంథాలతో కూడిన మూలగ్రంథం   ఒక భాగం మాత్రమె .ఇంకో భాగం ఉన్నది .అవెస్తా మూలం ,అవేస్తాఖర్డు అనే ప్రార్ధనలు .పహ్లవి వాజ్మయం లో మూలం మాత్రమె నిల్చి ఉంది .దీనిలో దీన్ కార్డ్ ,మైన్యో ఐ ఖిరాద్ అనేవి ప్రసిద్ధాలు .వీటి ప్రాముఖ్యం తర్వాత రచనల పరిణామం గురించి చదివేటప్పుడు తెలుస్తుంది .యత్కాలే జరిరాన్ ,ఇందార్స్ ఏ –ఖుస్రని ,గవటాన్,కార్నమక్ఎ-అర్దీ షెర్ అనేవికూడా ముఖ్యమైనవే. ఫిరదౌసి కవి రాసిన ఇతిహాసానికి మూలమైనవి సెసెనియన్ కవిత్వం లో ఏమీ మిగలలేదు .

  సశేషం

రేపు- రథ సప్తమి శుబాకా౦క్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -31-1-20-ఉయ్యూరు

image.png
image.png
Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

కిరాతార్జునీయం-7


కిరాతార్జునీయం-7

             ద్వితీయ సర్గ

ద్రౌపది ధర్మారాజుతో చెప్పినమాటలలో సారం ఉన్నదని గ్రహించి భీముడు అన్నగారితో ‘’ప్రభూ !క్షత్రియ సంజాత ద్రౌపది మనపై ఉన్న అభిమానంతో బాగా ఆలోచించి మన అభి వృద్ధి కోరి బృహస్పతి అయినా ఇలా పలకగలడా అన్నట్లు యుక్తి యుక్తంగా ,సశాస్త్రీయంగా చెప్పింది.అవి ఆశ్చర్యజనకాలు కనుక ఆమె మాటలు గ్రాహ్యాలు .అగాధమైన దిగటానికి వీలున్న తీర్ధము లున్నా దాని సంగతి దిగేదాకా తెలియదు .దానిలో దిగి స్నానాదులు చేసుకోవచ్చు అని తెలిసినవారు చెప్పాక కష్టం ఉండదు.అలాగే రాజనీతి కూడా గాంభీర్యం తో ప్రకాశిస్తు౦ది కనుక దాని విశేషాలు తెలుసుకోవటం కష్టం గానే ఉంటుంది .విషయాన్ని స్పష్టంగా చెప్పే సమర్ధులైన గురువులద్వారా తెలుసుకొంటే తేలికగా ఉంటుంది .కాని అలాంటి గురువు దొరకటం కష్టం .ఆమె దేశకాలాలకు అవిరుద్ధంగా మాట్లాడినట్లనిపించినా అలాపలకటం ఆశ్చర్యమే .మొదట్లో కష్టంగా ఉన్నా,విన్నకొద్దీ ఫలం ఖాయం అనిపిస్తుంది .తేజశ్శాలురకు ఉత్సాహజనకంగా మాట్లాడింది ద్రౌపది .క్షీణ శక్తులకు బాధా కరంగా ఉన్నా ,ఆలోచిస్తే గుణ గరిష్ట వాక్యాలుగా ఉన్నాయి .కించిత్ దోషం కూడా ఆమె పలుకులలో లేదు కనుక ఆమె మాటలనే అనుసరించటం మంచిదని నా అభిప్రాయం .స్త్రీ బాల వృద్ధులలో ఎవరు చెప్పినా అందులో మంచి ఉంటె గ్రహించాలి లేకపోతె వదిలేయాలని పండితవాక్యం .నువ్వు గుణగ్రాహివైన పండితుడవు కనుక వింటే మంచిది ..నువ్వు సదసద్వివేకివి .అన్వీక్షికి ,త్రయి ,,వార్త,దండనీతి అనే నాలుగిటిలో గొప్ప పాండిత్యమున్నవాడివి .అలాంటి నువ్వు అవివేకివై బురదలో పడి,బయటికి రాలేని ఆడ ఏనుగు లాగా వ్యర్ధంగా పాడై పోతున్నావు .ఇది తగదు నీ పాండిత్యం వివేకం వ్యర్ధమైనాయా .వివేకం తో శత్రు సంహారాన్ని ఆలోచించు . సహాయ సంపత్తి ,బల పౌరుషాలు లేనివారికి రావాల్సిన దురవస్థ ,ముల్లోకాలను జయించే మహాపరాక్రమవంతులు ,శత్రుసంహారంచేసే బంధుగణం ఉన్న నీకు నికృష్ట శత్రువులమూలం గా కలిగింది .అలాంటి శత్రువులను ఉపేక్షించి ,పౌరుషం చూపాల్సిన సమయంలో శాంతి ప్రవచనాలు పలుకుతూ చేతులు ముడిచి కూర్చోటం దేవతలు కూడా సహించరు.ఇప్పటికైనా మాంద్యం వదిలి పౌరుషంతో శత్రు సంహార క్రియ ప్రారంభించి మమ్మల్ని ఉద్ధరించు .

   బుద్ధిమంతుడు ముందుగా శత్రువు పెరుగుతున్నాడా తరుగు తున్నాడా అని ఆలోచిస్తాడు .పెరుగుతుంటే తగిన ప్రతిక్రియతో విరగదీస్తాడు .క్షీణిస్తుంటే ఏప్రయత్నమూ చేయక తటస్థం గా ఉంటాడు .క్షయం నుంచి వృద్ధిలో ఉంటె ,ప్రతిక్రియతో శత్రుసంహారం చేయాలి .క్షయం ఇంకా పెరుగుతుంటే ఉదాశీనుడై ఉండాలి .అంతేకాని అభివృద్ధి చెండుతున్నాడని ప్రతిక్రియ చేయటం క్షీణిస్తున్నాడని చేయకపోవటం బుద్ధిమంతుల లక్షణం కాదు .ఇప్పుడు మన శత్రువు వృద్ధిలో ఉన్నాడుకనుక తక్షణం ప్రతిక్రియ చేసి సంహారం చేయాలి .ఒకవేళ తానూ, శత్రువు క్షయం లో ఉంటె ,విజిగీషువు  దాన్ని బేరీజు వేసి ప్రయత్నం చేయాలి .తనపని వెంటనే తగ్గుతూ అవతలివాడి పని ఆలస్యంగా  వృద్ధికి అనుకూ లంగా అవుతుంటే వెంటనే ప్రతిక్రియ చేయాలి .ప్రస్తుతం మనం క్షీణదశలో శత్రువు వృద్ధిదశలో ఉన్నాం .ఇలాంటి స్థితిలో ఏమీ తెలియని బాలుడుకూడా  ప్రతిక్రియ ఆలోచిస్తాడు .మనం ఇది సమయం కాదని కూర్చుంటే మూర్ఖులు అంటారు కనుక త్వరగా నిర్ణయం తీసుకో .

‘’అనుపాల యతా ముదేష్యతీం-ప్రభు శక్తిం ద్విషతా మనీహయా

అపయా౦త్య చిరా న్మహీభుజాం –జన నిర్వాదభయాదివశ్రియః ‘’

  శత్రువు పెరుగుతున్నా ఉపేక్షిస్తూ ఉంటె వాడి సంపదలు ,లక్ష్మి వాడిని వదిలి ఉత్తముని చేరుతాయి .కనుక బుద్ధిమంతుడు శత్రు వృద్ధి సాగనీయక ఔరుషంతో నిర్మూలి౦చాల్సిందే కాని ఉపేక్షించి ఊరుకోరాదు .ప్రస్తుతం క్షీణ దశలో ఉన్నా ,సర్వలోక కల్యాణదాయకమైన శత్రు సంహారం క్రమ అభి వృద్ధికోసం చేసే రాజు ను పాడ్యమినాటి చంద్రునిలాగా ప్రజలు నమస్కరిస్తారు .క్షీణం లో ఉన్నాం కదా ఎలా చేస్తాం అని ఆలోచి౦చ రాదు .క్షాత్రము,ఉత్సాహ శక్తి ఉంటె ,పౌరుషం పొంగి శత్రువులు మనవైపు చూడటానికి కూడా భయపడుతారు .అంగబలం ,అర్ధబలం ,సంపద ,దేశకాల విభాగం,వినిపాత ప్రతీకారం, కార్య సిద్ధి అనే అయిదు అంగాలను బాగా ఆలోచించి మంత్రాంగం నడిపితే విజయ సిద్ధి తప్పదు .దీనికి దైవ శక్తి తోడవుతుంది .పౌరుషం తో ఉత్సాహ శక్తి తో ముందుకు నడిస్తే విజయలక్ష్మి తానె వరించి వస్తుంది .కనుక మహారాజా నిరుత్సాహం వదిలి ఉత్సాహం తో పౌరుషాన్ని రగుల్కొలిపి  కార్యోన్ముఖుడవు కావలసినదని మనవి ‘’అని ఇంకా చెప్పబోతున్నాడు భీముడు .

  సశేషం

రేపు 1-2-20 శనివారం మాఘ శుద్ధ సప్తమి –రథ సప్తమి  శుభాకాంక్షలతో

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -31-1-20-ఉయ్యూరు

image.png
Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కవి సమ్రాట్ నోరి నరసింహశాస్త్రిగారి 121వ అజయంతి -ఫిబ్రవరి 6-సాయంత్రం త్యాగరాజగానసభ -హైదరాబాద్

కవి సమ్రాట్ నోరి నరసింహశాస్త్రిగారి 121వ అజయంతి -ఫిబ్రవరి 6-సాయంత్రం త్యాగరాజగానసభ హైదరాబాద్

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వత౦ 13-టర్కిష్ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వత౦

13-టర్కిష్ సాహిత్యం

టర్కీభాష –టర్కీ బాష ను తుర్కి ,తర్కీష్ ,టర్క్ అనీ అంటారు .క్రీశ 6వ శతాబ్దానికే మధ్య ఆసియాలో ఈభాష వాడుకలో ఉందని శాసనాలు చైనా చరిత్ర చెబుతున్నాయి .అక్కడినుంచి ఇతరప్రాంతాలకు వెళ్లి వాటిని యించి స్థిరవాసం ఏర్పరచుకొని భాషావ్యాప్తి చేశారు  .ఇందియావంటి దేశాల్లో కాలక్రమలో అంతరించింది సోవియెట్ యూనియన్ ,అజర్ బైఆన్ మొదలు ఆల్టాయ్ పర్వత పరిసరాలవరకు ,చైనీష్ తుర్కి స్తాన్ లలో కొన్ని మాండలికాలు ఉన్నాయి సాహిత్యభాషగా టర్కీ దేశం లోనే వికాసం పొందింది .ఈ భాష ఫిన్నో-ఉగ్రియన్ (ఊరాల్ –అల్టాయిక్)భాషా కుటుంబానికి చెందింది .ద్రావిడ  భాషలులాగా సంయుక్త దాటు రూప పద భాష .సంయుక్తాక్షరాలు తక్కువ .కఠినధ్వనులు లేకుండా ,అచ్చులతో సామరస్యంకలిగి వీనులకు ఇంపుగా ఉంటుంది .ద్రావిదభాశాలలో కొన్నిటికి దీనికి వాక్య నిర్మాణం లో పోలిక ఉన్నది .చివరి క్రియాపదం లుప్తం అవుతుంది దాటు రూపమే విధ్యర్ధకం గా ఉంటుంది ..వ్యాపించిన చోట్ల స్థానిక లిపినే ఆశ్రయించింది .మొదట్లో ఆరబిక్ లిపిలో రాయబడేది .ఐతే ముద్రణకు అనుకూలం కాకపోవటం వలన 1928నుండి శాసనాలలో రోమన్ లిపి వాడారు

   టర్కిష్ సాహిత్యం –ఉత్తర మంగోలియాలోని ఒర్హాన్ శాసనాలు ,చైనా టర్కీ లో కనబడిన ఉయ్ గూర్ గ్రంథాలలోఉన్నది ఇస్లాం పూర్వ యుగానికి చెందిన ప్రాచీన సాహిత్యం .మాహమూద్ కాష్గరి 1073లో కూర్చిన నిఘంటువు  లో టర్కీ జానపద కవిత్వం లోని కొన్ని భాగాలు ఉదహరింప బడినాయి .1069లో రాజైన కతత్కులిక్అను పరిపాలనకు చెందినా రచన ఇస్లామిక్ యుగం లో మొదటి ఉదాత్త గ్రంథం.ఇది ఆరబో –ఫారసీ ఛందస్సులో రాయబడింది .

   తర్వాత టర్కిష్ సాహిత్యం చాగటే,అజెరి,అనటోలియన్అనే మూడు మాండలికాలలో వృద్ధి చెందింది .తూర్పు టర్కీల సాహిత్యభాష చగటే మధ్య ఆసియా ,గోల్డెన్ హార్డ్(కివ్ చక్కుల)చేత వ్యవహరి౦పబడింది .15వ శతాబ్ది పెజరి తుర్క్ ,16శతాబ్ది బాబరు నామా అనేవి  ఈమా౦ డలికం లో రెండు ఉత్తమ రచనలు .ఆధునిక ఉజ్ బెక్ దీనిలోంచి పుట్టినదే తూర్పు ఓగజ్-పడమటి పర్షియా ,ఇరాక్ ,తూర్పు అనటోలియాలలో ఉన్న టర్కుల భాష అజెరెకి,అనటోలియన్ భాషలకు పెద్దగా తేడా ఉండదు .మర్మకవి నేసిమి ,హటై మారుపెరుగాకల సఫావిద్ వంశ స్థాపకుడు షా ఇస్మెయిల్,16శతాబ్ది గేయకవి ఫుజూలి అనే వారు ఈకవులలో ముఖ్యులు

  అటో మాన్ లేకదక్షిణ అని కాని పిలువబడే అనటోలియన్ 13వ శతాబ్దం నుంచి ఆతోమాన్ సామ్రాజ్యం లో వృద్ధి చెందింది .14,15శతాబ్దాలలో ఆశిక్ పాషా ,అహమేది సేహి ,అహమేద్ పాషా  నెకటి మొదలైన కవులు ఆరబో –పర్షియన్ విధానం లో టర్కీ భాషను ఇమడ్చాతానికి ప్రయత్నించి పార్శీ ప్రాచీన రచనల ప్రేరణ చేత గేయాలు ,ప్రేమ వృత్తాంతాలు రాశారు .వీరిలో ప్రసిద్ధులు యూసస్ ఎమ్రే,సులేమాన్ చెలెబి .ఎమ్రే మర్మకవిగా ప్రసిద్ధుడు అక్షరాత్మక ఛందస్సు అంటే సిలబిక్ మీటర్ పాటించాడు .చేలేబికవి మొదటి మహమ్మద్ గురించి పద్య స్తుతి రాశాడు .

   16 వ శతాబ్దం నుంచి కవులు పారశీక కవిత్వాన్ని జీర్ణం చేసుకొని సహజ లక్షనాలుకల స్వంత పద్య రచన చేశారు .వీరిలో బాకీ ,తస్లికలీ యాహ్యా ,రూహీ ,నెఫీ,సేయ్హులిస్లాం యాహ్యా ,నాబీ ,నేవీ ,నెడీం షెహ్ గాలిబ్ ముఖ్యులు .పారశీక ప్రభావంతో టర్కీ భాషా స్వాతంత్ర్యం పోయి కొద్దిమందికిమాత్రమే అంటే విద్యావన్తుఅలకు మాత్రమె దక్కింది సాహిత్యం .గద్య రచయితలలో హుకా సాడుద్దీన్ ,కాతిబ్ చేలేబి ,(హాజీ ఖలీఫా )పెశేని,నయీమా అనే చరిత్రకారులు ,ఆలీ చేలిబి అనే యాత్రికుడు ముఖ్యులు సాడుద్దీన్ చెవులకు ఇంపైన పదాలతో లలితసున్దరంగా కవిత్వం రాశాడు .మిగిలినవారి శైలి కరేస్పాన్దేన్స్ శైలి .జానపద వాజ్మయమూ బాగా వచ్చింది .ఈ కవులలో 17వ శతాబ్ది కరక వోగ్లాన్ ముఖ్యుడు .

   19వ శతాబ్దం నుంచి అనేక సంస్కరనలతోపాటు కొత్త సాహిత్యం వచ్చింది శినాసి అతని శిష్యులు నమిక్ కేమాల్ ,జియా పాషా  దీనిలో దిట్టలు .అబ్దుల్ హక్ హమీద్ ,అతని సమకాలికులు దీన్ని సంపన్నం చేశారు .నవల నాటకం వ్యాసం మొదలైన ప్రక్రియలలోనూ సాహిత్యం వచ్చింది .19వశతాబ్దిచివార్లో హవిడ్ జియా ఉసక్లిగల్ అనే నవలా రచయితా ,తెవ్ఫిక్ ఫిక్రేట్ అనే కవి మిత్రులుకలిసి ‘’సెర్వేటి ఉసన్ ‘’అనే పత్రిక అండతో కొత్తసాహిత్యశాఖ ఏర్పరచారు .వీరిది సర్వజన సమన్వయ విధానం .హుసేన్ ,అహ్మద్ లు దీన్ని వదిలేసి శక్తివంతమైన  వాస్తవిక శైలిలో ‘’ఇస్తాంబుల్ ‘’జీవితాన్ని వర్ణించారు .మిగిలినవారూ మారి సరళ టర్కీ భాషలో అక్షరాచందస్సులో రచనలు చేశారు .1908విప్లవం తర్వాత యువ రచయితలూ ‘’ఫెక్రి- అటి’’అనే సాహిత్య శాఖ కు చేరారు .వీరిలో సాన్కేతికకవి అహమద్ అసిం ..ఈకాలం లో యాహ్యా కమాల్ ప్రభావం వలన అందరూ ఆ దారిలో నడిస్తే ,మహమద్ అఖిఫ్ మాత్రం స్వతంత్రుడుగా ఉండి పోయాడు .

 ‘’ టర్కిక్ హార్త్ ‘’స్థాపించాక ,జెనెక్కలేమ్లర్లో భాషను సరళతరం చేసిన తర్వాత ,వచ్చిన జాతీయ సాహిత్యం కు జియా గోక్ఆల్ప్ నాయకత్వం వహించాడు .జాతీయ ఆశయాలను తెలిపి ,ప్రాచీన సంస్క్రతి చరిత్రల పరిశోధనలకు సూచనలు చేశాడు .ఫూ అద్ కోఫ్రూలూ  టర్కుల చరిత్ర సంస్కృతిలపై రాసి ప్రచురించాడు .నవరచయితలు సమకాలీన సమస్యలు ప్రస్తావిస్తూ రచనలు చేశారు .ఈ యుగ గొప్ప గద్యరచయితలు –ఒమర్సెయ్ ఫుద్దీన్ ,యాకుబ్ కద్రి,ఖలిదే ఎడిబ్,రేఫిక్ హవిడ్,ఫలిఫ్ రిఫ్కి ,రేసేద్ సూరి .ఫరుఖ్ సఫిజ్ ,నెసిబ్ ఫజిల్ మొదలైన వారు అక్షర ఛందస్సులో కవిత్వం రాశారు .నజీం హిక్మేట్ ఛందో రహితపద్యం ఫీవేర్స్ ప్రవేశపెడితే చాలామంది అనుసరించారు

  1930నుంచి టర్కిష్ సాహిత్యం లో మనస్తత్వం ,ఆత్మాశ్రయం స్వీయ చరిత్ర ,సాంఘిక సమస్యల చిత్రణ లతో రచనలు విరివిగా వచ్చాయి .కవులలో అహ్మద్ హండిటన్పినార్ ,ఒర్హన్ వెలి,కహిడ్సిడ్కి,ఫజిల్ హుస్నూ  ,కహిడ్ కూలెబి,నెకటి కుమలి అనే వారు ,గద్యం లో సబహద్దిన్ ఆలి ,సయీద్ ఫెయిక్,సమెద్అగావోగ్లు ,ఒర్హాన్ కేమాల్ ముఖ్యులు. అబ్దుల్ హక్ సినసి హిసార్ 1940లోనే ఉత్తమ రచనలు చేశాడు .

  ఫెరిట్ ఒర్హాన్ పామక్ కు నవలా రచనలో 2006లో నోబెల్ పురస్కారం లభించింది .ఈయన రచనలు 63భాషలలో 13 మిలియన్ లపుస్తకాలు అమ్ముడయ్యాయి .

The 10 Best Books by Turkish Authors

Madonna in a Fur Coat’ (1943) by Sabahattin Ali

The Time Regulation Institute’ (1954) by Ahmet Hamdi Tanpınar

Memed, My Hawk’ (1955) by Yaşar Kemal

Poems of Nâzım Hikmet’ (1986)

Istanbul Boy: The Autobiography of Aziz Nesin’ (1991)

‘The Museum of Innocence’ (2008) by Orhan Pamuk

Istanbul Istanbul’ (2015) by Burhan Sönmez

‘Three Daughters of Eve’ (2016) by Elif Shafak

New Selected Poems’ (2016) by İlhan Berk

The poems of Orhan Veli Kanik, Oktay Rıfat and Melih Cevdet Anday

The 10 Best Writers From Modern Turkey

Nazım Hikmet (1902-1963)

Ahmet H Tanpınar (1901-1962)

Yasar Kemal (born in 1923)

Bilge Karasu (1930-1995)

Orhan Pamuk (born in 1952)

Sabahattin Ali (1907-1948)

Sait Faik (1906-1954)

Melih Cevdet Anday (1915-2002)

Elif Shafak (born in 1971)

Selçuk Altun (born in 1950)

సశేషం

శ్రీపంచమి శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-1-20-ఉయ్యూరు

image.png
image.png
Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

కిరాతార్జునీయం-6

కిరాతార్జునీయం-6

ద్రౌపది పలికినపలుకులు ములుకుల్లా తాకినా నిబ్బరంగా తన సహజశాంత స్వభావంతో యుధిష్టిరుడు ఇలా బదులు పలికాడు –‘’ద్రౌపదీ !నువ్వు ఇంతగా విచారి౦చటానికి  కారణం కనబడటం లేదు .నాకు ఏ ఆపదా లేదు .వ్యర్ధంగా విచారిస్తే నీకొచ్చే ఆపద ఏమిటో చెబుతావిను .నువ్వు ఇదివరకు  అంతః పురం లో   హంసతూలికాతల్పం పై శయనించి ఉంటె వైతాళికులు స్తుతి గీతాలు పాడుతూ ,మంగళధ్వనులు వినిపిస్తుంటే మహా రాజ ఠీవి తో నిద్ర లేచే నువ్వు ,ఘోరారణ్య౦ లో  కటిక నేలలపైనిద్రిస్తూ ,అమంగళకారకాలైన నక్కకూతలే మేలుకోలుపులుగా నిద్రలేస్తున్నావు .ఇంతకంటే ఆపద వేరేదైనా ఉందా .ఆలోచించు .’’అనగా ఆమె ‘’పూర్వం వేలాది బ్రాహ్మణులకు ఇష్టమృస్టాన్నాలు పెడుతూ దానధర్మాలు చేస్తూ ,నీకంటే నిరతాన్నప్రదాత వేరొకరు లేరన్నఖ్యాతిపొందిన నీవు అడవుల్లో ఆకులు అలములు తింటున్నావు  ,పూర్వం బ్రాహ్మణ భుక్త అవశిస్టాన్నం భుజించి శరీరం వన్నెలతో ఉండేది .ఇప్పుడు నీ కీర్తిలాగానే శరీరం శుష్కింఛి పోయింది .కనుక నీ శరీరం నీ యశస్సులపై అభిమానంతో మళ్ళీ ఆ వైభవం పొందే ప్రయత్నం చేయి.లేకపోతే రెండూ క్షీణిస్తాయి .అపకీర్తి మరణం కంటే ఎక్కువ కాబట్టి కోపం తెచ్చుకొని శత్రు సంహారం చేసి పూర్వపు ఔన్నత్యం పొందు .పూర్వం ఎందరో రాజులు అనేక కానుకలు తెచ్చి నీ అనుగ్రహం పొందటానికి పాదాలపై వ్రాలినప్పుడు వారిహారలలోని పుష్పఆపరాగం చేత రంజి౦పబడే నీపాదాలు ఇప్పుడు ఘోరాటవుల్లో   బ్రాహ్మణులు మృగాలు  తెంపిన దర్భల  కర్కశ  చివళ్ళపై ఉంచాల్సి వస్తోంది .ఇంతకంటే గొప్ప ఆపద ఎవరికైనా వచ్చిందా . మనుషులకు ఇలా౦టిఆపదలు సహజం .దైవికంగా ఏదో ఆపద వస్తుంది దానికి బాధ పడకూడదు .ఈ ఆపదలలో శత్రు పరాభవం ఉండడుకనుక సంతోషంగానే ఉంటాయి. కాని మనకొచ్చిన ఆపద మానభ్నగమై శత్రువులవలన కలిగాయి .యుద్ధం లో ఓడితే వచ్చినవికావు .పౌరుష ప్రసక్తి లేకుండానే వచ్చాయి కనుక దుస్సహంగా ఉన్నాయి మానహాని దుస్సహం కాని ఆపదలుకాదు .కనుక ఊరుకోకుండా ప్రతిక్రియ చేయాల్సిందే  .నాదా!నువ్వు చెప్పింది నిజమేకాని ఏమి చేయాలో చెబుతావిను .పౌరుషమున్నమహారాజులు శాంతిమార్గం వదిలి ,ఉత్తేజకర మైన క్షాత్ర తేజస్సుతో  శత్రు సంహార ప్రయత్నం చేయి. బ్రతిమాలుతున్నాను మా యందు దయతో మా కోరిక నెరవేర్చు .శాంతంగా సాదిస్తానంటే కుదరదు మహర్షుల మోక్షమార్గానికి శాంతికాని రాజకార్య సాధనకు కాదు .క్షత్రియోచిన పౌరుషంతో  ప్రతిక్రియ చేయి .-

‘’విహాయ శాంతిం నృప ధామ తత్పునః –ప్రసీద సందేహి వధాయ విద్విషాం

వ్రజంతి శత్రూ నవదూయ నిః స్పృహా-శ్శమేన సిద్ధిం మునయో న భూ భ్రుతః’’

  ‘’క్షత్రియోచిత తేజం మాకు లేదని అనటానికి వీల్లేదు .మీరు మహా తేజ శ్శాలురలో అగ్రేసరులు.యశోధనులైన మీ బోంట్లు క్షత్రియ పౌరుషం చూపాలేకాని శాంతంకాదు.శత్రుసంహారం తో సర్వాదిపత్యం సాధించు  .ఉదాశీనత వదిలేయి .నేను చెప్పింది ఇష్టం లేక నీ శాంతిమార్గమే మేలు అనుకొంటే ,రాజచిహ్నాలైన ధనుర్బాణాలు వదిలేసి జటా వల్కల ధారివై ఉదయం సాయంత్రం అగ్నిహోత్రం చేసుకొంటూ ఉండు.ఉభయభ్రస్టుత్వం ఉపరి సన్యాసం ఎందుకు .12ఏళ్ళు వనవాసం ఒక  ఏడుఅజ్ఞాతవాసమ్ చేస్తామని ప్రతిజ్ఞచేశాం ప్రతిజ్ఞా భంగం అవుతు౦దే మో అనే సందేహం వదిలేయి .ఇప్పటికే మన శత్రువులు సమయభంగం చేసి అపకారం చేయటానికి పూనుకొన్నారు .కనుక సమయభంగ భయం అక్కర్లేదు .పౌరుషశాలి, వివేకి ,విజిగీషుడు ఏదైనా ఒకనెపం తో సంధిని భగ్నం చేసి శత్రువును ఉపెక్షించడు .మా ఆపదలు పోగొట్టి కీర్తి పొందు .

‘’విధి సమయ నియోగా ద్దీప్తి సంహార జిహ్మం –శిధిల వాసు మగాదే మాగన మావత్పయోదౌ-

రిపు తిమిర ముదస్యోదీయ మానం దినాదౌ –దినకృత మివ లక్ష్మీస్త్వాం సమభ్యేతు భూయః ‘’

ఇతి శ్రీ భారవి కృతౌ కిరాతార్జునీయే  మహాకావ్యే లక్ష్మీ పద లాంఛనే ప్రథమ సర్గః

కాలవశంలో ఆపదలు కలిగి ప్రతాపం లేక ,ధనం లేక నామరూపాలు లేకున్నా ఉన్నావు .చీకటి అనే శత్రువును సంహరించి ఉదయాభి ముఖంగా ,సముద్రం లో అస్తమించి కిరణ ప్రసారం లేకుండా ఉన్న సూర్యుడు ప్రభాత సమయంలో చీకట్లను చీల్చుకొని  ప్రకాశించే విధంగా నిన్ను లక్ష్మీ దేవి వరిస్తుంది .ఇప్పుడు దైవం, కాలం అను కూలమై బలపౌరుష దనాలతో శత్రువులను చీల్చి చెండాడే బలప్రతాపాలు చూపించే సమయం వచ్చింది .కనుక శత్రు సంహారంతో దినదినాభి వృద్ధి పొంది మా అందరికీ ఆన౦దం, శాంతి, సుఖాలు కలిగించు ధర్మరాజా “’అని విన్నవించింది ద్రౌపది .

  సశేషం

శ్రీపంచమి శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-1-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వత౦ 12-ధాయ్ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వత౦

12-ధాయ్ సాహిత్యం

              ధాయ్ భాష

ధాయ్ భాషనే సయమీస్ భాష అని అంటారు .చీనో –టిబెటన్ భాషా కుటుంబానికి చెందిన భాష .ఆ కుటుంబంలోని మిగాతాభాషల లాగానే  విశ్లేషిత పదరూపం లో ఉంటుంది .ఇందులో పదాలన్నీ ఏకాక్షరాలే .చైనా పదాల్లాగా వాక్యం లో పదాలు తమకున్న స్థానాన్ని బట్టి ,ఏ భాషా విభాగం గా నైనా మారుతాయి .కొత్త అర్ధం ఇచ్చే పదాన్ని  నిర్మించాలంటే,అందులో భావం వివరించే పదాలను కలిపి సంయుక్తపదం లేక సమాసంగా నిర్మిస్తారు .వాక్యం లో కర్త ,క్రియ ,కర్మ అనే వరుసలో ఉంటుంది .ఆర్యభాషా వ్యాకరణం లాంటిది ఈభాషకు లేదు .

  చైనీయ భాషలాగా ఇందులో కొన్ని పదాలకు స్వరాన్ని బట్టి అర్ధం మారుతుంది .స్వరం తో సంబంధం లేకుండా నానార్ధాలు కలిగిన పదాలు కొన్ని ఉన్నాయి .నామవాచకానికి లింగ వచన భేదం లేదు .అవసరాన్ని బట్టి కొన్ని ప్రత్యేకపదాలు చేర్చి ఆ అర్ధం వచ్చేట్లు చేస్తారు .కాలాన్ని బట్టి క్రియ మారదు .భూత, భవిష్యత్తులను సూచించే నిన్న ,రేపు వంటి పదాలను క్రియతో చేర్చి ఆ అర్ధాన్ని స్పురి౦ప జేస్తారు .సంస్కృత ,పాళీ భాషాపదాలు యెక్కువగా ఈ భాషలో చేరాయి .వైజ్ఞానిక ,తాత్విక పారిభాషా పదాలు సంస్కృతాన్ని ఆశ్రయించే ఉంటాయి .

   బ్రాతదేశ బ్రాహ్మీ లిపి ని బట్టి ధాయ్ లిపి 13వ శతాబ్దం లో ఏర్పడింది .భారతీయ లిపులలో లేని ,రోమన్ లిపిలో మాత్రమె కనిపించే ఒక ప్రత్యేక విశిష్టత ఈ లిపికి ఉంది .రోమన్ లిపిలోలాగా హల్లులు,అచ్చులు వేరువేరుగా రాస్తారు .ఈ లిపి సృష్టికర్త ధాయ్ ప్రభువు రామ కం హాంగ్ ..అయినా అచ్చులతో కలిపి హల్లులను రాసే విధానం కూడా కొన్ని ప్రాంతాలలో ఉన్నది .స్వరాలను సూచించటానికి అక్షరాలపై ప్రత్యేక సంజ్ఞలు ఉపయోగిస్తారు.

  ధాయ్ సాహిత్య౦

 సంస్కృత ,పాళీ సాహిత్యాలపైననే ఆధారపడి ధాయ్ సాహిత్యం పెరిగింది .పూర్వ యుగాల కావ్య సంపద కొంతవరకు లభించింది .కానీ వారికాలాదులు పేర్లు లేవు .1914లో ప్రభుత్వం ఈ సాహిత్యంలో అత్యుత్తమ మైన రచనలను నిర్ణయించటానికి 1914లో ఒక సంస్థను ఏర్పరచింది .దీని సూచనలప్రకారం 1-ఫ్రలా2-ఫ్రసమత్థ, ఖేత్ ,3-మహా చాత్ ఖంథట్ 4-ఖన్ ఛంగ్ ఖన్ ఫెన్ 5-ఇనావ్ 6-హ్వా చాయ్ నాక్ రోవ్ 7-సామో౦క 8-ఫ్ర రాజ విధి శింగ్ సంగ్ ద్వాన్ లు ఉత్తమోత్తమాలుగా నిర్ణయించింది .

  ఫ్రలా ఒక గద్యకావ్యం .ధాయ్ దేశ రాజకుమారుని ప్రేమ ,పర్యవసానంగా మరణం లలిత శైలిలో వర్ణింపబడింది .సముత్థఖేత్ అంటే సముద్ర ఘోష .ఇది ఒక ధర్మ వీరుని గాథ.సంస్కృత ఛందో వృత్త రీతి లో  రాయబడింది .బౌద్ధ జాతక కథలలోని ‘’అన్నప జాతక గాథ’’దీనికి ఆధారం .ధాయ్ రాజు నారయ్ ఆస్థానకవి దీన్ని రచించినట్లు భావిస్తారు .అసంపూర్ణ రచన .19శతాబ్ది కవి దీన్ని పూర్తి చేశాడు .శబ్దాలంకారాల సౌందర్యం ఎక్కువ .మహా చాత్ ఖందేట్ అనేది ధాయ్ మహాజాతి గురించి  వివరించే రచన .ఆ దేశ సాహిత్యం లో దీనికి విశిష్ట స్థానం ఉన్నది .’’వెన్సంతర జాతకం ‘’లో ఉన్న గౌతమబుద్ధుని పూర్వ జన్మ చరిత్ర కథా వస్తువు .13కాండల కావ్యం .చాలామంది కవులు అనేక కాలాలవారు ఈ రచనలో భాగస్వాములయ్యారు .ఒక్కొక్కరు రాసిన దానిలో అత్యుత్తమ భాగాలను ఎంపిక చేసి తయారు చేయబడింది .ఇది వృత్త గ్రంది అనే పద్యకావ్యం .తరతమ భేదాలు లేకుండా ధాయ్ ప్రజలు దీన్ని ఆరాధించారు .ఇందులోని కథలు -చిత్రాలు గీయటానికి చిత్రకారులకు గొప్ప విషయాలయ్యాయి .

  ఖన్ చంగ్,ఖాన్ ఫేన్ అనే ఇద్దరు యువకులు వాన్ థాంగ్ అనే యువతిని ప్రేమించిన కథ కల మహా కావ్యమే ‘’ఖన్ చంగ్ ఖన్ ఫేన్’’.వాన్ చాంగ్ విషాద గాథను కరుణ రసస్పోరకంగా రాయబడింది. తాళగతికి బాగా కుదిరి ఇద్దరు చెరొక పదం పాడటానికిఅనువుగా ఉంటుంది .జావా దేశ వీరుడు ఫంజి గురించి వ్యాప్తిలో ఉన్న కథను తీసుకొని రాయబదిందే ‘’ఇవాన్’’.అయోధ్యరాజకుమారికి చెలికత్తేలిద్దరు ఇలాంటి రెండుకథలు చెప్పి,గ్రంథస్తం చేశారని ప్రతీతి .ఇందులో ఒకటి ఖిలంకాగా రెండవదాన్ని 1809-24కాలం లో పాలించిన ధాయ్ రాజు రెండవ రామరాజు నాటకానికి అనుగుణంగా మార్చి రాసిన దే ఇప్పటి ఇవాన్ అని నమ్మకం .

  ధాయ్ ప్రభువు వజ్ర వ్యూఢ(1910-25)రాసినదే ‘’హ్వా చాయ్  నాక్ రోవ్ ‘’అనే నాటక౦ .వీరాత్మ అని దీని అర్ధం .ఆ రాజు బహు భాషా కోవిదుడు . ఫ్రెంచ్, ఇంగ్లీష్  నాటకాలను అనుసరించి చాలా ధాయ్ నాటకాలు రాశాడు .వీటిలో పైనాటకమే ఉత్తమోత్తమం  .దేశం కోసం సర్వస్వాన్నీ ఒడ్డిన ఒక వీరుని ఊహా చిత్ర మైన రచన మధుర మనోహరంగా సాగుతుంది .

  చూలాలం కర్ణ (1868-1910) అనే  రాజు రచించిన’’ ప్రరాజవిధి సిప్సంగ్ ద్వాన్(రాజాస్థాన విధి )ఏడాది పొడవునా రాజాస్థానం లో జరిగే ఉత్సవకార్యక్రమాల వివరణ .గ్రంథకర్త అకాలమరణం వలన అసమగ్రంగా ఉంది .సామాన్యులకుకూడా తేలిగ అర్ధమయేట్లు రాజు రాయటం హర్షించదగిన విషయం .ఈ రచనలతోపాటు ఫ్ర అభయమణి,స్వస్తి రక్షా ,రామకియన్ కూడా చెప్పుకోదగినవే .సుందరన్ భూ అనే కవి రచించినదే ఫ్ర అభయమణి.ప్రేమ,సాహాసం ,కుటిలతంత్రం లతో రాయబడిన కల్పిత కథ.సుందరాన్ భూ రాసిందే స్వస్తి రక్షా .మానవ శ్రేయస్సుకోసం అవలంబించాల్సిన నీతి విధానాలను బోధించే లఘు కావ్యం .ఇద్దరు రాజులకు ధర్మోప దేశం చేయటానికి రాసింది .

 రామకియన్ అనేది ధాయ్ భాషలో రామాయణం .వాల్మీకానికి దీనికి పోలిక చాలా తక్కువ .తమిళ ,కాశ్మీరీ ,బెంగాలీ ,మలయ్,జాపనీస్ భాషలరామాయణాలతో పోలికలు ఎక్కువ .  ఆధునిక కాలం లో అక్కడి సాహిత్యం రాజులవలన విస్తృతంగా అభి వృద్ధి చెందింది .విజ్ఞానశాస్త్ర రచనకూడా జోరుగా వచ్చింది .ప్రపంచ సాహిత్యం లోని ఉత్తమరచనలన్నీ ధాయ్ భాషలోకి అనువాదం అయ్యాయి .

  అయుద్ధాయ (అనిరుద్ధ )కాలం లో -1653-1688 ఫ్రా మహారాజ కృ,ప్రిన్స్ తమ్మత్తిబేట్ శ్రీపత్ లు ‘’అనిరుద్ధ ఖం చాన్ అంటే అనిరుద్ధ చరిత్రం కావ్యం అనే అత్యుత్తమ రచనచేశారు .

  ఆధునిక కాలం లో కుక్రిత్ ప్రమోజ్ ,కులాప్ సాయ్ ప్రదీప్ ,సువిర్తీయ శ్రీ సింగ్ ,చార్ట్ కొర్ బిజిటి,ప్రబ్దా యూన్ , పిచ్చయ సుద్బందా లు లైట్ ఫిక్షన్ రాయగా అవన్నీ  ఆంగ్ల అనువాదం పొందాయి .20వ శతాబ్దిలో కూడా మహాగొప్పరచయితలున్నారు .’’బాంగ్ కాక్ రైటర్స్ గ్రూప్’’  భారతీయ రచయిత జి. వై .గోపీనాథ్ రాసిన ఫిక్షన్ ను ప్రింట్ చేసింది .ధాయ్ సాహిత్యం బర్మా ,కంబోడియా సాహిత్యాలపై బాగా ప్రభావం చూపింది .ఖ్మేర్ సాహిత్యం పై పెద్దప్రభావం ఉంది .ఆదేశ కథలన్నీ ఖ్మెర్ లోకి అనువాదం పొందాయి .కంబోడియా రామాయణం ధాయ్ రామాయణానికి మక్కీకి  మక్కీ యే.

  సశేషం

రేపు 30-1-20 గురువారం సరసవతీ దేవి జన్మదినం శ్రీ పంచమి శుభాకాంక్షలతో 

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-1-20-ఉయ్యూరు

image.png
image.png
Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

కిరాతార్జునీయం-5

కిరాతార్జునీయం-5

ద్రౌపది ధర్మరాజుతో ఇంకా ఇలా చెబుతోంది ‘’దేవేంద్ర విభవ సమానులైన మీవంశంలో భరతుడు మొదలైన రాజుల చే చిరకాలం అవిచ్చిన్నంగా పాలింపబడిన భూమండలం నేడు నువ్వు మదపు టేనుగు పూలదండ ను పీకేసినట్లు నువ్వే నిష్కారణంగా కోల్పోయావు నీ ఔదాసీన్యం వలననే ఇన్ని కస్టాలుకలిగాయి .ఈ అనర్దాలన్నిటినీ పరిహరించటానికి ,శత్రు సంహారం చేసి ,మమ్మల్ని రక్షింఛి మీ పూర్వుల ఔన్నత్యం కాపాడమని మనవి .ఇందులో నా తప్పేముంది అని అనుకొంటున్నావా .మాయావులైన శత్రువులు మాయోపాయాలు పన్నుతుంటే ,ప్రతి మాయలు పన్నకుండా రుజుమార్గం లో వెళ్ళే అవివేకుల్ని శత్రువులు పరాభవి౦చరా .కవచం లేకుండా యుద్ధానికి వెళ్ళే వీరభటుడికి వాడి బాణాలు తగిలినట్లు ,మాయావులు అమాయకులను చేరి చంపుతున్నారు .కనుక వారికి మాయతోనే సమాధానం చెప్పాలి .ఉపేక్ష నీ దోషం .అనుకూలుర సాయం ,క్షత్రియత్వాభిమానం ఉన్న మహారాజులలో నువ్వు ఒక్కడివే వంశపారంపర్యంగా వచ్చిన రాజ్యలక్ష్మిని పవిత్ర వంశం లో పుట్టిన సౌందర్యవతి ఐన భార్యను స్వయంగా శత్రువులపాలు చేశావు .మాన ధనులకు రాజ్యలక్ష్మి అపహరణ కళత్ర అపహరణ లాగా అవమానం కనుక ఉపెక్షించక ప్రతిక్రియ ఆలోచించు ..ఇలాంటి ఆపత్కాలం లో కూడా శూరులు పొగిడే పౌరుషమార్గం వదిలి ,పిరికి వాళ్ళు ఆశ్రయించే దైన్య పధ్ధతి పాటిస్తూ క్షాత్రతేజం విస్మరించి దుర్దశ పాలై ,నువ్వుకస్ట పడుతూ ,మమ్మల్నీ కష్టాలపాలు చేస్తున్నావు .శత్రువుల అభి వృద్ధి వినీ  ,మా కస్టాలు చూసికూడా నీకు కోపం చెలరేగి ఎండిన జమ్మి చెట్టును నాలుగు వైపులనుంచి అగ్నిజ్వాలలు కమ్మి దహించినట్లు నిన్ను భస్మం చేయాల్సి౦దేకాని ,మా దురదృష్టం వలన నీకుకనీసం  కోపం కూడా రావటం లేదు .

  ‘’అవంధ్య కోపస్య నిహంతురాపదాం-భవంతి వశ్యాస్స్వయమేవదేహినః

అమర్ష శూన్యేన జనస్య జంతునా –న జాత హార్దేన చ విద్విషాదరః’’

సఫలమైన కోరికకలిగి నిగ్రహానుగ్రహ  సమర్థు డైన పురుషునికి ప్రజలు తామంతట తామే స్వాదీనమౌతారు .కోపం లేని వాడితో స్నేహమైనా విరోధమైనా ప్రీతికాని భయంకాని కలగదు .అవసరాన్నిబట్టి కోపం, శాంతి ప్రదర్శించటం శూరలక్షణం .శూరోచితమార్గంలో మమ్మల్ని ఉద్ధరించు .కాని క్రోధం అంతశ్శత్రువు కనుక విడువ దగినది అని సందేహించ వద్దు.

  నువ్వు రాజ్యం చేస్తుంటే వీరగంధం పూసుకొని రథాలెక్కి మహాపట్టణాలలోసంచారం చేసే భీమసేనుడు ఇప్పుడు పాదచారియై ,ధూళి ధూసర శరీరం తో పర్వతాలమధ్య దైన్యంతో తిరుగుతున్నాడు .అతన్ని చూసి అయినా పరితాపం కలగటం లేదా ఇంకాసత్యపాలనమేనా .కనీసం తమ్ముల నైనా రక్షించు .పరాక్రమాదులలోదేవే౦ద్రునితో సమానుడు ,మనుష్యులు ప్రవేశించలేని ఉత్తర కురు దేశ౦లొ ప్రవేశించి, రాజులను  జయించి ,సువర్ణ, మణి,ముక్తాదులను కప్పంగా తెచ్చి  నీపాదలవద్ద ఉంచి భక్తితో పూజిం  చిన అర్జునుడు ఇవాళ రూప విహీనుడై అడవులలో తిరుగుతూ ,నీకు నారచీరలు తీసుకొచ్చే దుర్దశలో ఉన్నాడు .అతన్ని చూస్తుంటే నాకు కలిగే జాలి, నీకు కలగటం లేదా .మగాడివైపుట్టి దిక్కులు చూస్తూ ఉన్న నిన్నుఏమనాలో తెలియటం లేదు .హంసతూలికా తల్పాలపై హాయిగా నిద్రించాల్సిన సుకుమార శరీరులు నకుల సహదేవులు ,అడవులలో నేలమీద పడుకొనటం వలన మార్దవం పోయి వారి శరీరాలు కఠినమై,మట్టికొట్టుకుపోయి ,శరీర సంస్కారంలేక అడవిఏనుగుల్లాగా కృశించిపోయారు .వాళ్ళను చూస్తూ కూడా నీ సత్యవాక్పరిపాలన ,సంతోషం నశించకుండా ఎలాఉన్నాయో నాకు ఆశ్చర్యంగా ఉంది.అహో ఏమి ధైర్యం మహారాజా నీది !నీలాంటి అన్నగారు ఏ కాలంలోనూ ఉండి ఉండరు .

‘’ఇమామహం వేదన తావకీంధియం –విచిత్ర రూపాఃఖాలు చిత్త వృత్తయః

విచి౦త యంత్యాభావదాపదం పరా –రుజంతి  చేతః ప్రసభం మమాధయః ‘’

వీళ్ళందర్నీ వదిలేయ్.నీ సంగతి చూడు .ఇలాంటిపరిస్థితి లోనూ నీ బుద్ధిమారటం లేదు .అసలు నీ మనసులో ఏముందో బ్రహ్మ దేవుడికే తెలియాలి .పోనీ నా బుద్ధితో నీ చిత్త వృత్తి ని ఆలోచిడ్డాము అంటే ,పరుల బుద్ధులు అప్రత్యక్షాలుకనుక ,ధీరత్వ అధీరత్వాదులు అనేక రకాలుగా ఉండటం వలన అనుమాని౦చటానికికూడా శక్యం కాక ఊహించటం దుర్లభమౌతోంది .శత్రువుల చే నీకు కలిగిన పరాభవం, ఆపద లను ఎలాదాటాలి ,శత్రువుల్ని ఎలా చంపాలి అనిఆలోచించే నాకే తీరని దుఖం కలుగుతుంటే ,నువ్వు యెట్లా ఈబాధల్ని భరిస్తున్నావో అర్ధం కావటం లేదు .నీది గుండే నా , రాతిబండా అని అనుమానం వస్తోంది ‘’అని నిర్మొహమాటంగా సూటిగా పాండవులందరి వేదనా బాధా తానే ధర్మరాజుకు చెప్పి కర్తవ్యమ్ బోధించింది భావి పాండవ పట్టమహిషి ద్రౌపదీదేవి .దీనికి అయ్యగారిసమాధానం ఏమిటో తర్వాత తెల్సుకొందాం .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-1-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం11-  జపనీస్ సాహిత్యం -6(చివరిభాగం )

11-  జపనీస్ సాహిత్యం -6(చివరిభాగం )

పైషో-షోవా యుగం (1912నుంచి )

మొదటిప్రపంచ యుద్ధం మొదలైన  దగ్గర్నుంచి జపాన్ లో  మత సంబంధ సాహిత్యం  ప్రచారం లో ఉంటూ ‘’కాగవాటో గొహికో’’అనే  క్రైస్తవవమంత్రి సాహిత్యం ద్వారా మానవ సేవ బోధించాడు .షిపెన్నోకోఎపే-1920,పై యావోఇరు మోనో -1921అనే ప్రసిద్ధ నవలలు రాశాడు .నాటకకర్త మొనోజో షుక్కెటుసోనో డేషి ప్రముఖ రచన 1717లో చేశాడు.1866లో పుట్టిన టనిజక్  చిరో,1878వాడిన నగి కఫూలు కొత్త  కాల్పనికోద్యమ నిర్మాతలు సహజవాదాన్ని పూర్తిగా ఖండించారు .తనిజకి రాసిన చిజిన్ నొఅయ్ ఆయన సాహిత్య తత్వానికి ప్రతిరూపం .యోషి ఇసము-1886,నగటామికిహికో-1870,టమురా టోషికో కూడా ఈరకమైన రచనలే చేశారు .

 నవాదర్శవాదులు కూడా సహజవాదాన్ని ప్రతిఘటించి న వారే .వారిలో ముసుకోజి సనియట్సు 1885లో పుట్టి 1918లో కోప్సుకు మోనో,1920లోయూజో ,1926లో యాసో అనే ప్రసిద్ధ రచనలు చేశాడు .ప్రపంచం లోని అన్నిప్రాంతాలలోని పాత్రలను తీసుకొన్నాడు .చాలా రూపకాలూ రాశాడు .అరిసి మాట కేయో (1878-1923)  మరోగొప్ప రచయిత. తక్కువ రచనలే చేసినా నవ వాస్తవ వాదానికి అద్దంపట్టాయి .కకుచి ,కన్అకుటగావా ర్యూనోనుకే,కుమేమసావో ,సటో మిటాన్,షిగా వోయూ లు ఇదే ధోరణిలో రాశారు .వీరిలోజనాదరం పొందిన కికుచి,రాసిన కిసెకి,చిచిక ఎదుటోజురోనో కోయ్  అనే ఏకాంకికలు బాగా ఆదరణ పొందాయి .1920తర్వాత పత్రికలలో సులభ శైలిలో నవలలు రాశాడు  .షింజు ఫుజిన్-1920,సాన్ కటేయ్-1934,షోహై-1933అనే అతని నవలలు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి .1923తర్వాత ‘’బున్ గేషింజూ’’అనే స్వంత మాసపత్రిక ప్రారంభించి నడిపాడు .దీనికున్న ప్రసిద్ధి మాటలతో చెప్పనలవికానిది .

   గొప్ప కథలు రాసినవాడు అకుట గవమ్యానో సుకె(1892-1927),రషోమన్-1915,హన(ముక్కు )1916కధలు జగత్ప్రసిద్ధాలు .టైషో యుగం చివర్లో సామాన్య ప్రజా సాహిత్యం వచ్చింది .దీని ముఖ్యోద్దేశం ప్రచారం .శైలి లేదు వస్తువు వికృతం .ఆధునిక జపాన్ ఆలోచనా విధానం ఇందులో కనిపిస్తుంది .కొబయాషి-1903-33,హయాషి పుసో -1906,కిషి సన్జీ-1899,టకెడారి౦టారొ -1904,టోకునాగ నవోషి-1899,హయామా యోషికి-1894,మెయిడకో కోయి చిరో -1888ఈరకమైన కవులో సుప్రసిద్ధులు .

 టైషోయుగం చివర్లో ‘’షిన్కంకమహా ‘’అనే మరో కొత్త ఉద్యమం బయల్దేరి యొకో మిట్స్ రీచియూమొదలైన వారు నాయకులయ్యారు .హృదయభావాలను స్పస్టగా వ్యక్తీకరించటమే వీరి ఉద్దేశ్యం .యోకో మిట్సు రాసిన కకై(యంత్రం ),గ్రంథం ముఖ్యమైనది .టంకా,హైకూ ,షిన్టైషి,సేన్ర్యు ,డోమో(బాలకవిత )అనే ప్రక్రియలన్నీ ఈకాలం లో వచ్చాయి .మెయిజి చక్రవర్తి 1852-1912,యోసనోహిరోసి-1873-1935,కుజోటకేకో మొదలైనవారు టంకా కవిత్వం లో ,మనవో కాశికి -1866-1902,నట్సు మెసోసెకి-1867-1916,తకనామా కోషి 1874,ఓనో బుషి మొదలైనవారు హైకూ కవిత్వం లో ,కునికిటడోస్పో1871-1908,షిమజకి టోసన్-1872,కిట హరా హకు షూ,మాగుచి యోనెజిరో’’ షిన్టైషి’’ కవిత్వం లో ,ఇనయా నజనమి -1870,బాలకవిత్వంలో ప్రసిద్ధులు ,కవటకేమోకు అమీ ,ఫుకుచి ఓచి-1841-1906,ఒక మోటో కిడో-1873,యమమోటో యూజో -1887,కుకట మొమోజో-1891లు ఆధునిక జపాన్ నాటకాన్ని తీర్చి దిద్దారు .సాంఘిక జీవితాన్ని చిత్రించే ‘’నోతోపాటుషిమ్పో,శిన్గెకి,కబుకి అనే నాటక విధానాలు .కాలక్రమ౦లో కబుకి ప్రక్రియ చాలా మార్పులు చెందింది .

  జపాన్ కథా సాహిత్య రీతులు టైషుబుమ్గకు ,ట్సాజోకు బున్గకు   సామాన్యులను బాగా ఆకర్షించాయి  .   అపరాధ పరిశోధన ,హాస్యం ,ఫామిలి లైఫ్ ,వీటిలో విషయాలు .మొదట్లో వాటికి స్థాయి లేకపోయినా ,కాని కికుచి కాన్ వగైరాలు ఉత్కర్ష కలిగించేట్లు రాశారు .ఫ్రెంచి జర్మన్ ఇంగ్లిష్ అమెరికన్ రచనలు చాలా జపాన్ భాషలోకి అనువదించటంతో పాఠకుల సంఖ్యగణనీయంగా పెరిగింది .1937లో చైనాతో యుద్ధం తోయుద్ధ సాహిత్యం బాగా వచ్చింది .హినోఆషి హె రాసిన’’ట్సుచి టు హీటై -1938(బురద, సైనికులు ),ముగి టు హీటై(గోధుమ ,సైనికులు )మొదలైనవి అసాధారణ ప్రచారం పొందాయి ..

  1930లో జాతీయ భావం పెరిగి ,షింక్యోషో సెట్స్ అనే కొత్తతరహా నవల వృద్ధి చెందింది.ఆత్మీయభావనలు, ఆలోచనలు చిత్రీకరించటం దీని ఉద్దేశ్యం .నిత్య జీవిత  సన్నివేశాలే కథా వస్తువులు .హైకూ కు దీనికి కొంత పోలిక కనిపిస్తుంది .1868నుంచి అనేక పాశ్చాత్య ప్రక్రియలు జపాన్ సాహిత్యం లోకి చేరి కలిసిపోయాయి .ఆధునిక సాహిత్యం లో ప్రతిభాసంపద కల రచయితలు తక్కువే అనే అభిప్రాయం ఉన్నది .

  జపనీస్ సాహిత్యంలో నోబెల్ పురస్కారం పొందినవారు –కవబాటయసునారికి 1968లో ,ఓ కెంజబూరో కు 1994లో ,కజువోఇషిగురో కు 2017లో నోబెల్ ప్రైజులు వచ్చాయి  ‘.

 జపనీస్  సాహిత్యంపై ఇంత విస్తృత వ్యాస పరంపర రాయటానికి ఆధారం -ఆచార్య దివాకర్ల వెంకటావధాని గారి సుదీర్ఘ వ్యాసం  .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -28-1-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-4

కిరాతార్జునీయం-4

ధర్మరాజుకు వనచరుడుఇంకా ఇలా చెప్పాడు ‘’రాజా !దుర్యోధనుని ఆజ్ఞను రాజులంతా పూలదండ లాగా శిరసావహిస్తూ ,అతడు ధనుస్సు ఎక్కు పెట్టటంకాని  ,కోపం తో ముఖం  చిట్లించటం కానీ చేయకుండా ప్రశాంతత కలిగిస్తున్నారు .రాజు మనసులో అనుకొన్న పని అతిశీఘ్రంగా నెరవేరుస్తున్నారు .

‘’స యౌవ రాజయ్ నవ యవ్వనోద్ధతం –నిధాయ దుశ్శాసన  మిద్ద శాసనం

మఖేష్వఖిన్నోనుమతః పురోధసా –ధినోతి హవ్యేన హిరణ్య రేతసం ‘’

నవయవ్వన గర్వితుడైన తమ్ముడు దుశ్శాసననుడినకి యౌవ రాజ్యపట్టాభి షేకం చేసి , ,రాజకీయాలన్నీ అప్పగించి తనకు ఎలాంటి తొందరలు లేకుండా  పురోహితుని అనుమతితో అగ్నిని, దేవతలను సంతృప్తి పరుస్తూ ,బ్రాహ్మణులకు మృష్టాన్న భోజనం , సమృద్ధిగా దక్షిణలతో  మానసిక సంతృప్తి కలిగిస్తూ ,ఉభయ తారకంగా చాలా క్రతువులు నిర్వహిస్తూ బ్రాహ్మణ, పురోహిత,పండితులనూ తనవైపుకు త్రిప్పుకొని పూజి౦ప బడుతున్నాడు .’’అని చెప్పి ఇవన్నీ ధర్మరాజు మనసుకు సందేహం కలిగిస్తాయేమోనని భావించి దాన్ని పోగొట్టే ప్రయత్నంలో మళ్ళీ చెప్పటం ప్రారంభించాడు –‘’ప్రభూ !హాయిగా  రాజ్యం చేస్తున్నా  అనుక్షణం  కలవరపడుతూ ,ఎప్పుడు మీరు వచ్చి మీదపడుతారో అనే భయంతో  గుండెమీదచేయ్యేసుకొని నిద్రపోకుండా ఉంటున్నాడు దుర్యోధనుడు .బలవద్విరోధం ఎంతటివాడికైనా దుఃఖ హేతువే కదా మారాజా !కనుక మీరు ఏమాత్రం సందేహించకుండా మీ ప్రయత్నాలు మీరు చేయాలి .

   ‘’కధా ప్రసంగేనజనై రుదాహృతా-దనుస్మృతాఖండల సూను విక్రమః

   తవాభిదానా ద్వ్యథతే  నతానన- సుదుస్సహాన్మంత్రపదాదివోరగః’’

సభలో ఉన్నా ఇస్టాగోస్టిలో ఉన్నా మీపేరు వినిపించినా ,మహా పరాక్రమశాలి అర్జునుని పరాక్రమం గుర్తుకు వచ్చినా ,విష వైద్యుడు గారుడ మంత్రోచ్చాటనం చేసినప్పుడు నాగుపాము తలవంచి కదలక మెదలక కట్టు బడి ఉన్నట్లు ,పాల్పోయిన ముఖంతో గజగజలాడుతూ తలవంచుకొని దుఖపడటం ప్రత్యక్షంగా చాలా సార్లు చూశాను .కనుక మీ ప్రయత్నం మీది .మరో ముఖ్యవిషయం మారాజా !మీవిషయం లో అనేక  దుస్తంత్రాలు పన్నే కపట డుర్యోధనుడి విషయం లో మీ ప్రతిక్రియ అత్యంత శీఘ్రంగా జరగాలి .జనం నోటిమాటలు విని మీకు చెప్పటమే మా పని .ప్రతిక్రియతీరు తెన్నులు మీరు ఆలోచించాలి ‘’అని చెప్పగా యుదిస్టిరుడు తగిన పారితోషికమిచ్చి పంపించి ,ఇంటికి చేరి తనకోసం  ఎదురు చూస్తున్న భీమాదుల పక్షాన వనచరుడు చెప్పిన సమస్త విషయాలు ద్రౌపదికి వివరించి చెప్పాడు –

‘’ఇతీరయిత్వా గిరమాత్తసత్క్రియే – గథే దపత్యౌ వనసన్ని వాసినం

ప్రవిశ్య ‘’కృష్ణా ‘’సదనం  మహీభుజౌ –తడాచ చక్షే నుజసన్నిదౌ వచః ‘’

  ధర్మరాజు చెప్పిన విషయాలు విన్న ద్రౌపదికి జుట్టు ముడి  వేసుకో కుండా ఉండటం మొదలైన విషయాలు జ్ఞప్తికి రాగా ,అణచుకోలేక  ,ధర్మజుడికి కోపం తెప్పిస్తే కాని శత్రు సంహార కార్యక్రమం మొదలు పెట్టడు అని  భావించి,దానికి తగినవిధంగా పలకటం ప్రారంభించింది .

‘’భావాదృశేషు ప్రమాదా జనోదితం –భావత్య్దిక్షేపఇవాను శాసనం

తథాపి వక్తుం  వ్యవసాయయ౦తీమాం-నిరస్త నారీ సమయా దురాధయః ‘’

‘’మీలాంటి పండితులను వినియోగించటానికి స్త్రీలు తగరు.ఒకవేళ వినియోగిస్తే అది తిరస్కరి౦పబడుతుంది. వ్యవహారాలలో స్త్రీలు జోక్యం చేసుకోవటం ధర్మ విరుద్ధమే అయినా ,స్త్రీల ఆచారాలను ఉల్లంఘింప జేసే దుష్ట మనోవ్యధలు నన్ను ఊరుకోనీ కుండా నాకు తోచినమాటలు చెప్పమని ప్రేరేపిస్తున్నాయి .కనుక నే చెప్పేది సావధానంగా వినమని మనవి .దుఃఖంలో ఉన్నవారికి ఉచితానుచితాలు కనిపించవు .కనుక నేను చెప్పేమాటలు దోషాలైనా శాంతంగా ,సావధాన చిత్తం తో ఆలకించండి ‘’అని చెప్పటం ప్రారంభించింది .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -28-1-20 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 11-  జపనీస్ సాహిత్యం -5

11-  జపనీస్ సాహిత్యం -5

1885 నుండి జపానీయులు పాశ్చాత్య వ్యామోహాన్ని తగ్గించుకొని స్వీయ సంస్కృతిని అవలంబించటం ప్రారంభించారు .ఎర్నెస్ట్ ఫెనోల్లాసా అనే పాశ్చాత్యుడు దేశీయ లలితకళల పునః పరిశీలనకు దారి చూపాడు .దేశీయ రచనలకు రచయితలూ ఆసక్తి చూపారు .ఒకరకంగా రాబోయే నవోదయానికి ఈ యుగం ఉషస్సు వంటిది .

  మొయిజిసారస్వత చరిత్రలో ట్సుబెచి షోయో రాసిన ‘’షోసెట్స్ షింజు ఇ’’అనే విమర్శ గ్రంథంచాలా ప్రముఖమైనది .దీనిలో నవలా రచనా విధానం ,వ్యక్తీకరణ కళారహస్యాలు వివరించాడు సాహిత్యంలో కళముఖ్యం కాని నీతి కాదు అని తెగేసి చెప్పాడు .1890కి ఈయన నవలలు రాయటం మానేసి నాటక రచన ప్రారంభించాడు ..కిరి హిటాహో(1896),హిటోటో గిను కొజో రకు గెట్సు(1898),మకి నోకటాఅనే ప్రఖ్యాత నాటకాలు రాశాడు .నాటకరంగం పై అనేక సంస్కరణలు చేయటమే కాకుండా కొబుకి నాటకం లోని లోపాలు ప్రదర్శిస్తూ ,వస్తువు ,పాత్ర పోషణ లలో ప్రాధాన్యమిచ్చే కొత్త చారిత్రక నాటక రచనలకు దారి చూపాడు .ఇతనిపై షేక్స్ పియర్ ప్రభావం ఎక్కువ .ఈయన్ను అనుసరించి,వాస్తవికతకు ప్రాధాన్యమిచ్చిన నవారు-పుట బటుయ్-షి మెయ్ (1864-1908,)యమడబిమ్యో(1868-1910),ఒజో కీకోయో .మొదటి ఇద్దరు వ్యావహారిక భాషలో రాశారు .టజో టకన్,కొంజికి యషఅనేవి ఒజకి రాసిన శృంగార రస నాటకాలు .

   ఈ యుగరచయిత్రులలో హిగుచి ఇచియో( 1872-96)24ఏళ్ళు మాత్రమె బ్రతికినా ‘’టలె కురబె’’అనే ప్రఖ్యాత నవల రాసింది .టోకు టోమి రోకా (1868-1927) షి జెన్టుజిన్ సెయ్ అనే స్వేయ చరిత్రను ,హోటో టో గిను (1898)నవల రాసింది . ఈయుగం లో ఆదర్శ వాదం ప్రముఖంగా వచ్చింది .దీనిలో గొజూనోటో(1892)రాసిన కోడ రోహన్ మోరి ఒగై(1862-1922)కిటమురా టోకోకు(1868-94)1873లో పుట్టిన ఇజుమి ట్యోకాలు కాల్పనిక ఉద్యమానికి పట్టుగొమ్మలుగా నిలిచారు .

   ఈ యుగం చివర్లో సహజవాదం బాగా వ్యాపించి టాల్స్టాయ్,ఇబ్సెన్ ఎమిలిజోల ,మొపాసా ల ప్రభావం ఎక్కువైంది .ఇక్కడి నేచురలిజం మానవ జీవితానికి సంబంధించింది .కళకళ కోసమే అన్న దాన్ని వదిలి సహజ జీవిత వర్ణన చేశారు .ఇందులో షిమముర హోగేట్స్,(1871-1919)హసే గవటేనకి (1876)లవిమర్శలకు మంచి బలం చేకూరింది .కొసుకి టెన్ గై(1865),కునికిటడోస్సో(1871-1908),షిమజికి టోసన్(1872),టయమేకో టై(18711930)నేచురలిస్ట్ లలో ప్రముఖులు ..షిమజికిచాలా రచనలు చేసి జపాన్ సాహిత్యానికి వన్నె తెచ్చాడు .హకై1906,హరు-1908,లె-1911అనే ముఖ్య నవలలు రాశాడు .’’యోకే మెయ్(ఉషస్సుకు ముందు )అనే ఇతని రెండుభాగాల నవల జపనీస్  సాహిత్యం లో మకుటాయమానం .పరిణత శిల్పం తో సమకాలీన జపాన్ చరిత్ర తెలియ జేసే నవల .షిమజికిషిన్టైషి అనే పాశ్చాత్య కవితాపద్ధతిని జపాన్ లో ప్రవేశ పెట్టాడు .ఈయుగం చివర్లో సహజవాదం బలహీనమై క్రొత్త ఉద్యమాలు ఊపిరి పోసుకొన్నాయి  .జీవితంలోని కొత్తదనానికివి బలం చేకూర్చాయి .సహజవాదాన్నిప్రతిఘటించిన ప్రముఖుడు –నట్సుమేసోసెకి(1867-1916)అనే ఆయన ‘’యయూహా లేక జైకై హా ‘’(లీజర్ స్కూల్ )అనే కొత్త ఉద్యమాన్ని ప్రారంభించాడు .వాగహై వనకోడే ఆరు(నేనొక పిల్లి)1905,బొట్చన్-1906,కుసుమకుర-1906,గుబి జిన్సో-1907,సస్షిరో-1908,మన్-1910అనే ముఖ్యనవలు రాశాడు .ఆధునిక రచయితలపై ఇతని ప్రభావం జాస్తి .

 సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-1-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-3

కిరాతార్జునీయం-3

వనచరుడు ధర్మరాజుతో ‘’రాజా !ప్రజలను దండించటం ,క్రోధంగా చూడటం చేయకుండా విజ్ఞులకు తెలియ జేసి  వారికి నేరవిషయాలు తెలిపి న్యాయశాస్త్రపరంగా విమర్శ చేయించి శత్రు ,మిత్ర భేదం లేకుండా ఇంద్రియాలను వశంలో ఉంచుకొని తగినశిక్ష విధిస్తున్నాడు .దీనితో ప్రజలకు మరీదగ్గరై వారు మిక్కిలి భక్తి ప్రకటిస్తున్నారు .(అంటే ఈకాలం నాటి కౌన్సెలింగ్ చేయి౦చా డన్నమాట).తనరాజ్యం లో, శత్రు రాజ్యాలలో సమర్ధులైన చారులను నియమించి విషయాలను కూపీ లాగిస్తూ ,ఎవ్వర్నీ నమ్మకుండా అందరి వాడు గా కనిపిస్తూ శత్రువులలో పరస్పర భేదాలేర్పడేట్లు చేసి ,చారులు అప్పగించిన కార్యం విజయవంతంగా నిర్వహిస్తే ఊహించని రీతిలో బహుమానిస్తూ,వారికి అపరిమిత సంతోషం కలిగిస్తూ తన యడల ఇంకా ఎక్కువ  విశ్వాసం తో ప్రవర్తి౦చేట్లు చేస్తూ చాలా నిశ్చింతగా ఉన్నాడు .ఒకదానిబదులు మరోటి చేయకుండా చాలా జాగ్రత్తగా ,సామదానాదులు ప్రయోగిస్తూ ఏ పనీ బీరుపోకు౦డా సఫలమయేట్లు చేయటం వలన కుప్పలు తెప్పలుగా ధనం వచ్చి చేరుతోంది .ఎక్కడా వివాదాలు లేకపోవటం తో రాజులందరూ అత్యంత భక్తి, విశ్వాస, విధేయతలు చూపిస్తున్నందున తనకు ఇక ఎదురు లేదని విజయం ఎప్పుడూ తనదే అని గొప్ప విశ్వాసం లో ఉన్నాడు .అడగకపోయినా రాజులు  మదపు టేనుగులు,  గుర్రాలను భారీ సంఖ్యలో కానుకలుగా సమర్పిస్తున్నారు .ఏనుగుల మద జలస్రావం  తో కొలువు కూటం తడిసిపోయి బురదగామారి ,రాకపోకలకు ఇబ్బంది అవుతోంది .ఇలా సమస్త రాజన్యసమూహం  అతని అడుగులకు మడుగులొత్తుతూ,  వీర విధేయత ప్రకటిస్తు౦డటంతో దుర్యోధనుడు ఏకచ్చత్రాదిపత్యం గా,నిరాఘాటంగా పాలన సాగిస్తున్నాడు .

‘’ప్రభూ! దుర్యోధనుడు చెరువులు త్రవ్వించి నదులకు ఆనకట్టలు కట్టించి కాలువలద్వారా భూములకు నీరు సరఫరా చేయిస్తూ రైతులకు కూడా ఆనందం పంచి పంటలు ఎక్కువగా పండేట్లు చేయటం తో అనావృస్టి ,దుర్భిక్ష బాధ లేదు .పాడికూడా సమృద్ధిగా వృద్ధి చేసి రైతన్నల హృదయాలనూ దోచుకొన్నాడు  .పాడిపంటలతో కర్షకులు ఎంతో తృప్తి చెంది, రాజుకు మరింత విధేయులుగా ఉన్నారు .

 ’’ఉదార కీర్తే రుదయం దయావతః –ప్రశాంత బాధం దిశతో భిరక్షయా

స్వయం ప్రడుగ్దేస్య గుణై రుపస్నుతా –వసూపమానస్య వసూని మేదినీ ‘’

భూత దయతో ,ఈతి బాధలు లేకుండా దేశాన్ని సంరక్షిస్తూ ,అభివృద్ధి చేస్తూ, మహా యశస్సుతో కుబేర సమానంగా అలరారే దుర్యోధనుని దయా దాక్షిణ్య గుణాలచేత భూమి వాత్సల్యం తో స్వాదీనయై ప్రతి ఏడూ అనంత ధన రాసులనిస్తోంది .ఈ ధనాన్ని ప్రజోపకార కార్యాలపై భారీగా ఖర్చు పెడుతున్నా,అతని సంపద తరగటం లేదు .మహదైశ్వర్యం తో పాలించే అతన్ని చూసి ప్రజలు చెప్పిన పనులు చేస్తూ ఇంకా ఎక్కువ విధేయంగా,దాసాను దాసులుగా  ఉంటున్నారు

  మహాబలపరాక్రమశాలురు జయలక్ష్మిని తెచ్చేవారు ,ప్రభుకార్యనిమగ్నులైనవీరభటులను సంపాదించి వారికేలోపం రానీకుండా పుష్కలంగా డబ్బు ఇస్తూ పోషించటం వలన వారు తమప్రాణాలనుసైతం పణంగా పెట్టి ప్రభుకార్యం నిర్విఘ్నంగా జరగటానికి బద్ధ కంకణు లై ఉండటం చూసి వారి బలం వలన తనకు రాబోయే యుద్ధం లో తప్పక విజయం  సిద్ధిస్తుందని దండి మనసుతో ఉన్నాడు .శత్రు రాజులు ఎప్పుడుఏపని ఎందుకు చేస్తున్నారో, ఆ విషయాలన్నీ నయవంచకులైన చారులద్వారా తెలుసుకొంటూ ,ప్రతి క్రియ ఆలోచిస్తూ ,తాను చేయతలబెట్టిన పని సృష్టికర్త బ్రహ్మ లాగా ఇతరులకు తెలియకుండా,తెలుసుకొనే వీలుకూడా లేకుండా బహు గుంభనగా ,లౌక్యంగా, నిపుణ౦గా  చేస్తున్నాడు .ఆయన అనుకొన్నది చేశాక మాత్రమే  ఆయన ఏమి చేసింది లోకానికి తెలుస్తోంది  .

   సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -27-1-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సరసభారతి 150 వ కార్యక్రమంగా శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది వేడుకలు (మాదిరి ఆహ్వానం)

సరసభారతి 150 వ కార్యక్రమంగా శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది వేడుకలు (మాదిరి ఆహ్వానం)

 సరసభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ  మరియు ఉయ్యూరు రోటరీక్లబ్ సంయుక్త ఆధ్వర్యం లో కెసీపి దగ్గరున్న రోటరీ క్లబ్ ఆడిటోరియం లో సరసభారతి 150వ కార్యక్రమంగా శ్రీ శార్వరినామ ఉగాది వేడుకలను ఉగాది(25-3-20)కి మూడు రోజులముందు 22-3 -2020 ఆదివారం మధ్యాహ్నం 3గంటలనుండి నిర్వహిస్తున్నాము .సంగీత విభావరి ,మూడు పుస్తకాల ఆవిష్కరణ ,కవి సమ్మేళనం ,ప్రముఖులకు ఉగాది పురస్కారాలు స్వయం సిద్ధ పురస్కారాలు ,శ్రమ శక్తి పురస్కారాలు ప్రదానం జరుగుతాయి  .అతిధులు కవి మిత్రులు ,పురస్కార గ్రహీతలు సంగీత సాహిత్యాభిమానులందరూ పాల్గొని జయప్రదం చేయమని  ప్రార్ధన .

 1- ఈ కార్యక్రమలో పాల్గొను సాహితీ ప్రముఖులు

–1-డా.కట్టా నరసింహులు –కడప బ్రౌన్ స్మారక లైబ్రరి ట్రస్ట్ పూర్వ కార్యదర్శి ,శ్రీ తిరుమల తిరుపతి దేవస్థాన పోతన భాగవత ప్రాజెక్ట్ సభ్యులు –తిరుపతి

2-ఆచార్య వంగపల్లి విశ్వనాథం-యువభారతి  కన్వీనర్ –హైదరాబాద్

3-డాశ్రీమతి చిల్లర భవానీదేవి –బహుప్రక్రియల రచయిత్రి –హైదరాబాద్

4-డా.వెలుదండ నిత్యానందరావు –తెలుగు శాఖ –ఉస్మానియా విశ్వ విద్యాలయం –హైదరాబాద్

5-శ్రీ బెల్లం కొండ నాగేశ్వరరావు –తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ విజేత –చెన్నై

5-శ్రీ చలపాక ప్రకాష్ –ఆంధ్ర ప్రదేశ్ తెలుగు రచయితల సంఘ ప్రధాన కార్యదర్శి ,రమ్యభారతి సంపాదకులు

మొదలైనవారు

11-   ఆత్మీయ అతిధులు

1-శ్రీ జి.వి.ఎల్ .నరసింహారావు –రాజ్యసభ సభ్యులు

2-శ్రీ వై.వి.బి .రాజేంద్ర ప్రసాద్ –శాసనమండలి సభ్యులు

3-శ్రీ జి.వెంకటేశ్వరావు –సియివో-కె.సీ.పి.-ఉయ్యూరు

4-శ్రీ ఇ.కోటిరెడ్డి – రోటరీ క్లబ్ అధ్యక్షులు

5-శ్రీ కోట సోదరులు –శ్రీ కోట చంద్ర శేఖర శాస్త్రి ,శ్రీ కోట రామకృష్ణ ,శ్రీ కోట సీతారామాంజనేయులు ,శ్రీ కోట గాయత్రి ప్రసాద్

6-డా .జి.శివకుమార్ ,శ్రీమతి పద్మజ దంపతులు –ప్రముఖవైద్యులు సామాజికసేవకులు –ఒంటిమిట్ట

7-శ్రీమతి చర్ల మృదుల –ఆర్ష విజ్ఞాన పరిషత్ –చర్ల సుశీల వృద్ధాశ్రమ నిర్వాహకులు –నిడదవోలు

8-శ్రీమతి నారుమంచి వాణీ ప్రభాకరి –వరల్డ్ రికార్డ్ విన్నర్ ,వీణ వోకల్ ఆర్టిస్ట్ –నిడదవోలు

9-శ్రీమతి నోముల నర్మదా రెడ్డి –ప్రముఖ ప్రపంచ పర్యాటకురాలు ,గాయని ,బాడ్మింటన్,రన్నింగ్ చాంపియన్ –హైదరాబాద్

10-శ్రీ శిస్టుసత్య రాజేష్ –గోదావరి రచయితల సంఘం అధ్యక్షులు –అమలాపురం

11-శ్రీ చిలుకూరి లక్ష్మీనరసింహ శర్మ –విశాఖ పట్టణం

  మొదలైనవారు

111–ఆవిష్కరి౦పబడు  గ్రంథాలు –శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ రచించి సరసభారతి వెలువరిస్తున్న -1-ఊసులలో ఉయ్యూరు 2-సోమనాథ్ నుంచి    కాశీ విశ్వ నాథ్ వరకు -6 రాష్ట్రాలల లో క్షేత్ర సందర్శన -యాత్రాసాహిత్యం 3-ఆధునిక ఆంద్ర విజ్ఞాన వేత్తలు –వివిధ రంగాలకు చెందిన62మంది ప్రముఖ సైంటిస్ట్ ల జీవిత చిత్రణ ‘

1V–ఉగాది పురస్కార ప్రదానం ,స్వయం సిద్ధ పురస్కారం శ్రమశక్తి పురస్కార ప్రదానం

V-కవి సమ్మేళనం –‘’మా వూరు –మా వాళ్ళు ‘’అంశం పై జిల్లాలోని ప్రముఖ కవుల చేత కవి సమ్మేళనం

జోశ్యుల  శ్యామలాదేవి     మాదిరాజు శివ లక్ష్మి      గబ్బిట వెంకట రమణ          గబ్బిట దుర్గాప్రసాద్

గౌరవాధ్యక్షు రాలు                  కార్య దర్శి               కోశాధికారి         అధ్యక్షులు –సరసభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ

                                                                                           మరియు ఉయ్యూరు రోటరీ క్లబ్

  మరిన్ని వివరాలతో ఫిబ్రవరి రెండవ వారంలో మరో మాదిరి ఆహ్వానం ,మార్చి మొదటి వారం లో పూర్తి వివరాలతో ఫైనల్ ఆహ్వానం అందజేస్తాము

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఉయ్యూరు మా ఇంట్లో 25-1-20 శనివారం సాయంత్రం మా మేనకోడలు శ్రీమతి పద్మ ,శ్రీ రామకృష్ణ దంపతులు ,కూతరు శ్రీమతి రవళి దంపతులు

ఉయ్యూరు మా ఇంట్లో 25-1-20 శనివారం సాయంత్రం మా మేనకోడలు శ్రీమతి పద్మ ,శ్రీ రామకృష్ణ దంపతులు ,కూతరు శ్రీమతి రవళి దంపతులు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 11- జపనీస్ సాహిత్యం

ఈడో యుగం లో 31అక్షరాల టంకా పద్యం కంటే చిన్నదైన ‘’హైకూ ‘’లేక హొక్కుపద్యం బాగా ప్రచారం లో ఉంది .టంకా లోని చివరి 14 అక్షరాలూ తీసేస్తే హైకూ ఏర్పడుతుంది .ఒక రుతువునుకాని ,పరాశ్రయభావాన్నికాని వర్ణించటానికి దీన్ని వాడుతారు .జపాన్ సారస్వత గుణ సంపన్నత టంకా ,హైకూ లలో గోచరిస్తుంది .ప్రకృతి బాహ్య సౌందర్యాన్ని వర్ణించటానికి అత్యత్తమ కవితా రీతి హైకూ .మట్సు ఓ బషో (1644-94),అతని శిష్యులు హైకూ కు గొప్ప ప్రచారం తెచ్చారు .ఎనోమోటోకొకకు,కగనోచియో(1703-1775),టని గుచి బుసన్ , కొబయషి ఇస్సా(1763-1828)ఉత్తమహైకూ రచయితలు  .

  18 వ శతాబ్ది లో కరైసేన్ ర్యు(1718-90)అనే హైకూ కవి కొత్తకవితామార్గాన్ని రూపొందించాడు .ఇదులొ17అక్షరాలే ఉండి,’’సేన్ ర్యూ’’గా పిలువబడింది .ఇందులోరుతు వర్ణనకు ప్రాధాన్యం ఉండదు .మానవుని ,మానవ జీవిత నిశిత పరిశీలనానికి ఉపయోగిస్తారు .ఈ యుగం లో నవలకూడాకొత్త దారి లో నడిచింది .ఇబారా సైకకు(1642-93)సమకాలీన జీవితం పై నవల రాశాడు .విషయ సుఖ విషయాలు ఉండటం చేత నీతిబాహ్యాలనిపింఛి ని౦ద్యాలయ్యాయి . ఇటీవలికాలం లో వాటిలోని వాస్తవికత అందర్నీ ఆకర్షిస్తోంది ఫుడోకొరొనొసుజురి ,కోషాకు ఇచ్చిదై ఒటోకో,కోషాకుఇచ్చిడైఒమ్న,కోషాకుగొనిన్ఒమ్నఅనే నవలలు కూడా ఆయనే రాశాడు .

  టోకోడై మార్గం లోనే యిజిరోబే,కిటహచిఅనే వారిద్దరూ హాస్య పాత్రలు చేసిన యాత్రలను వర్ణిస్తూ జిప్పెంషా ఇక్కు(1766-1831)’’హిజు కురిగె’’అనే మనోహర గ్రంథం రాశాడు . షికి టేయ్ షన్బా(1766-1832)సామాన్య జన వాస్తవిక జీవితాన్ని వర్ణిస్తూ ‘’ఉకియో బురో ,ఉకియో డొకో ,షుజూహచి కుశే,కోకోన్ హ్యకునిన్ బకా అనే రచనలు చేశాడు. కోకు పెయ్ జకిన్ చైనా ప్రాచీన నవలల లాంటి శృంగారం దట్టించిన నవలలు రాశాడు. వీటిలో యుమిబరిచికి ,సటోమి హక్కెండం,సు ఇకో డెన్అనే చాలా ముఖ్యమైనవి .ఇతని ‘’చు అన్’’అనే చైనాభాషలోని రచనకు అనువాదం కూడా చేశాడు .

ఆధునిక యుగం (1868నుంచి నేటి వరకు )-దీనిలో1-మెయిజి యుగం (1868-1912),2-టైషోషోవా అనే రెండుభాగాలున్నాయి .

మెయిజి యుగం –ఈయుగం లో 1868లో రాజ ధాని క్యోటో నుంచి ఈడో కు మారి విద్య ,పరిశ్రమ రాజకీయాలలో చాలామార్పులొచ్చాయి .యువత ప్రయోగ విజ్ఞానం ,స్వాతంత్ర్య సమత్వం ,ప్రేమ,మానవత్వ విషయాలపై మక్కువ పెంచుకొన్నారు .సాహిత్యంలో పాశ్చాత్యవాసన  వెంటనే  అంటలేదు  .కొంతకాలం పూర్వగ్రంథాలపై ఆపేక్ష నిలిచింది .జిప్పెంషారాసిన హిజు కురిగే కు అనుకరణగా భావించే సీయో హిజకురిగె అనే 15 భాగాల గ్రంథం కనజవా రోబాన్ (1829-94)రాశాడు .19వ శతాబ్ది చివర్లో పరభాషా వ్యామోహం హెచ్చి , ఆ రచనల  అనువాదాలు బాగా వచ్చాయి.రూసో వోల్టైర్ ,మాన్ టేస్క్యు,  మిల్ మొదలైనవారి రచనలు ఆకర్షించాయి .దేశీయ రచయితలూ ఈ ప్రభావంతో సామాన్యులకోసం రాజకీయ నవలలు రాశారు .యానో ఫ్యుమియో(1850-1931)రాసిన కైకోకు బిడన్ (1883)నవల మంచి పేరు తెచ్చుకొన్నది .ఫుకు జావా యుకిఛి(1834-1901)పాశ్చాత్య నాగరకత, సంస్కృతుల వివరాలతో చాలా రచనలు చేశాడు .

  సశేషం

  రిపబ్లిక్ డే శుభాకాంక్షలతో

image.png

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-1-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-2

కిరాతార్జునీయం-2

ధర్మరాజు రహస్య ప్రదేశం లో కూర్చుని శత్రు సంహార విధానం పై ఆలోచిస్తుండగా  ఆ వనచరుడు దగ్గరకు వెళ్లి నమస్కరించి ‘’ప్రభూ !మీ అనుజ్ఞ ఐతే నాకు తెలిసిన విషయాలు విన్నవిస్తాను ‘’అనగానే అలాగే చెప్పమని ధర్మరాజనగానే వాడు ‘’రాజకార్యం కోసం నియమిప బడినవాడు ,ప్రభువుకు ఆగ్రహం కలిగితే తమకు ముప్పు జరుగుతుందని భయంతో ,ప్రభువు అనుగ్రహం కోసం అసలు విషయం దాచిపెట్టి అబద్ధాలు చెప్పి రాజును మోసం చేయరాదు .దూతలు చెప్పింది ప్రియం అయినా అప్రియం అయినా చారులను ప్రభువు మన్నించాలి .లోకం లో హితం ప్రియం ఐనవాక్యం దుర్లభం .నామాటలు అప్రియాలైనా హితవాక్యాలుగా భావించి క్షమించి ,నాపై దయతో ఉండమని వేడుతున్నాను .అప్రియాలు చెప్పి రాజుకు కోపం తెప్పించటం కంటే చెప్పకుండా ఉండటం మేలు .ప్రభుకార్య ధ్వంసం ఉత్తమ మిత్ర లక్షణం కాదు .కనుక మంత్రులు మొదలైనవారు రాజుకు హితోపదేశం చేయాల్సిందే .అలా చేయకపోతే కుత్సిత మిత్రుడౌతాడుకాని సన్మిత్రుడు కాలేడు.రాజుకూడా ఆప్తులైన  అమాత్యాదుల హితవాక్యాలు వినాల్సిందే .పెడ చెవిని పెట్టరాదు .వినని రాజు కుత్సితుడు ఔతాడేకాని  మంచి ప్రభువుకాలేడు.రాజు మంత్రులు మొదలైనవారు పరస్పరాను రక్తులైతే రాజు సంపద చక్కగా నిలుస్తుంది .ఒకరికొకరు విరోధులైతే సంపద నిలవదు .కనుక హితవాక్య౦ అప్రియం అయినా ప్రభువుకు చెప్పాల్సిందే .అప్రియాలైనా వాటిని రాజు విని తీరాల్సిందే .రాజకీయ వ్యవహారం మావంటి అజ్ఞానులకు తెలుసుకోవటం కష్టం .శత్రువుల రాజనీతి విధానాన్ని రాజు తన సామర్ధ్యం వల్లనే తెలుసుకోవాలి కాని నా ప్రజ్ఞా విశేషం తోకాదు.గుణదోషాలను తెలుసుకొంటారనే చెబుతున్నానుకాని వ్యర్ధంగా కర్ణ కఠోరాలను చెప్పటం లేదు కనుక శ్రద్ధగా ఆలకించండి .

   ‘’దుర్యోధనుడు భూమినంతా పాలిస్తున్నా ,సోదరులతో అడవులలో ఉన్న మీ వలన ఎప్పటికైనా యుద్ధం వస్తుందని ,మీకు సకల విధాల సాయం అంది ,తనకు పరాజయం తప్పదని ఆలోచిస్తూ ,ప్రజలను తనపై గాఢభక్తీ విశ్వాసాలతో సహాయంగా ఉండటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ ‘నాకేం భయం ?‘’అని నిశ్చింతగా మాత్రం లేడు.అంతేకాదు కుటిలమార్గగామి దుర్యోధనుడు మీవలన పరాభవం కలుగుతుందని అనుమానిస్తూనే ,ప్రజల అవసరాలు స్వయంగా తెలుసుకొంటూ ,కోర్కెలు తీరుస్తూ ,వారిలో వారికి కలహాలు వస్తే శాంతియుతంగా రాజీ చేస్తూ ,గుణ సంపద లతో  ధర్మమార్గాన రాజ్య పాలన చేసస్తూ విశేష ఖ్యాతి పొందాడు .దుర్జన సావాసం కంటే తన ఐశ్వర్యాదులకు నష్టం కలిగి౦పని సజ్జన విరోధం కొంత నయమని పండితులు అంటారు కదా .కనుక దుస్ట దుర్యోధనుడు సజ్జనాగ్రేసరుడైన మీతో విరోధం తెచ్చుకొన్నా ,మీకంటే గొప్పవాడి నని పించుకోవటానికి దానధర్మాలు విరివిగా చేస్తూ, సజ్జనుడు అనిపించుకొంటున్నాడు .

‘’అంతశ్శత్రువులైన కామక్రోధాదులను జయించుట చేత దుర్యోధనుడు ,మనువుచేప్పినట్లు ప్రజారంజకం గా పాలన చేయాలనుకొని అలసత్వం లేకుండా ఎప్పటికేది ప్రస్తుతమో అప్పటికి అది చేస్తూ ,రాజకార్యాలను క్రమం తప్పకుండా చేస్తూ పురుష ప్రయత్నాన్ని రాజనీత్యుక్త ప్రకారంగా విస్తరిస్తున్నాడు .గర్వం మొదలైన దుష్ట గుణాలను దూరం చేసుకొని  భ్రుత్యులకు విశేషంగా బహుమానాలిస్తూ బంధు మిత్రులను అధికంగా సమ్మానిస్తూ ఆదర్శ ప్రభువు అనిపించుకొంటున్నాడు .అందుచే సేవకులు రాజే తమ దైవమని భావిస్తూ తమమాన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తమపనులను తాము అత్యంత వినయ విధేయతలతో అంకిత భావం తో చేస్తున్నారు .దుర్యోధనుడు ధర్మార్ధకామాలకు భంగం కలుగకుండా కాలవిభజన చేసి ,సమాన ప్రతిపత్తితోసేవించటం చేత మంత్రివర్గం కూడా ఆయన గుణాలకు ఆకర్షితమై అనురాగం తో పరస్పర మైత్రి తో వృద్ధి పొందింది ‘’అంటూ ఇంకా చెప్పసాగాడు .

       సశేషం

 71వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -26-1-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 11-  జపనీస్ సాహిత్యం -3

ప్రపంచ దేశాల సారస్వతం

11-  జపనీస్ సాహిత్యం -3

ఈడో యుగం (1603-1868)-16వ శతాబ్ది చివరికి అంతర్యుద్ధాలు పూర్త యి ,శక్తి వంతమైన ప్రభుత్వమేర్పడి రాజాధాని రాజకీయ ,సాంస్కృతిక కేంద్రమైన ‘’ఈడో’’అంటే క్యోటో కు మారింది .ఈకాలపు సాహిత్యమే ఈడో యుగ సాహిత్యం .16వ శతాబ్ది ప్రారంభం లో జపాన్  పాశ్చాత్య దేశాలతో సంబంధాలు ఏర్పరచు కొనటం  వల్ల క్రైస్తవం వ్యాపించింది కాని తర్వాత అణగార్చబడటం వల్ల సాహిత్యంపై పాశ్చాత్య ప్రభావం పెద్దగా పడలేదు .ఈ కాలం లో విద్యాప్రచారం బాగా జరిగి ,చైనా జపాన్ గ్రంథ ప్రతులు తయారీకి సన్యాసులు నియమి౦ప బడ్డారు .విద్యాలయాలు చాలా నెలకొల్పారు .గ్రంథ ముద్రణ ఏర్పాట్లు కూడా జరిగాయి .జపాన్ భాషలో మార్పుకూడా వచ్చింది .చైనాపదాలు ఎక్కువగా చేరి భాష సంపన్నమైంది .వ్యాకరణం సరళమై గ్రాంధిక రచనకు ప్రోత్సాహం లభించింది .

    చైనా భాషా ,పాండిత్య ప్రభావం జపాన్ భాషా సాహిత్యాలపై బాగా పడింది .చైనా ప్రాచీన రచనలపై ఆదరం తో ‘’చూహ్సి శాఖకు చెందినకొత్త కన్ఫ్యూషియస్ ‘సిద్ధాంతాన్ని ’’’ఫుజి వారా నీకా (1561-1619) ప్రచారం చేశాడు .చరిత్ర భావనా గరిమ ,హాస్యరస రసాలతో వాజ్మయం వృద్ధి చెందింది .ట్రాజడీలు ,విషయలాలసా పుస్తకాలు విజ్రు౦భి౦చాయి .ఈ కాల చైనా పండితులలో అగ్రేసరుడు ‘’అరై హుకు సేక్ ‘’(1657-1725)1701లో భూస్వాముల చరిత్ర వివరించే ‘’హాన్ కంపు ‘’ అనే బృహద్గ్రంధం రాశాడు.కైబరా ఎక్కెన్(1630-1714)వందకు పైగా రచనలు చేశాడు .ఇతర విద్వాంసులలో హయషి గాజన్ (1583-1657)కినో షిటాజువాన్ ,కుమజావా బంజన్,యమగాసోకో ,ఇటో జిన్సై,ఒగ్యూ సొరై ముఖ్యులు .చైనా సాహిత్యానికి పోటీగా జపనీస్ సాహిత్యమూ బాగానే వచ్చింది .’’టోకుగావామిట్సు’’,ప్రారంభించిన ‘’డైని హాన్ షె’’అనే చైనా భాషలో రాయబడిన జపాన్ దేశ చరిత్ర చాలా ప్రాముఖ్యత వహించింది .భాష సరళ సుందరం .రచన ప్రామాణికం.,కవి ,చారిత్రకుడు ,భాషా తత్వ వేత్త ‘’మోటూరి నొగి నాగా’’ (1730-1801) 49 సంపుటాలలో ‘’కోజి కోడేన్ ‘’అనే కోజికి వ్యాఖ్యానం రాశాడు ..రాయ్ సన్యో(1780-1832)’’నిహాన్ గైషీ ‘’అనే అనే జపాన్ దేశ చరిత్ర రచించాడు .కమోనో మబుచి ,హిరటా అట్సు టానె అనే వారు ఈ శాఖ ఇతర పండితులు .ఇదే జాతీయతను జపాను లో రేకెత్తించి,’’మెయిజియుగం ‘’లోని పునరుద్ధరణకు దారి తీసింది .

  జపాన్ లో బాగా ప్రసిద్ధి చెందినా నాటకం ‘’కిబుకి’’16వ శతాబ్దిలో రాయబడింది .దీని చారిత్రకపరిణామంలో మూడు దశలున్నాయి 1-ఒంనా కబుకి –మహిళానాటకం 2-వకషూ కబుకి –యువక రూపకం 3-యరో కబుకి –పురుష నాటకం .ఐతే ఈనాటకానికి సాహిత్యంలో పెద్దగా గౌరవం లేదు .ఈ యుగ గొప్పచారిత్రిక గృహ సంబంధ నాటకాల కర్త’’చికమట్సుమొ౦జే యెమన్(1653-1724).ఇవి.ఐదేసి అ౦కాలున్నఆనంద ప్రధాన నాటకాలు .ఇతని నాటకాలలో ముఖ్యమైనవి –కోకు  సెన్యకస్సెన్,సోనొజికిషింజు,మెయి డోనాహిక్యకు ,హకటకొజోరోనమి మాకుర.ఇతర నాటకకర్తలలో ప్రసిద్ధులు-టకెడ ఇజుమొ(1691-1756),నమికి షోజో(1630-93) కవటకమొకు అమి(1816-93).,

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25-1-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం

కిరాతార్జునీయం

సాహితీ బంధువులకు పవిత్ర మాఘమాసం ప్రారంభ శుభ కామనలు.ఈ మాఘమాసంలో సంస్కృతంలో భారవి మహాకవి రచించిన ‘’కిరాతార్జునీయం ‘’కావ్యాన్ని ధారావాహికంగా రాయాలని ప్రయత్నిస్తున్నాను .పెద్దగా సంస్కృత శ్లోకాల జోలికి పోకుండా శ్లోక భావాలను తెలుపుతూ సరళంగా అందరికి చేరువ చేసే విధంగా రాయాలని ప్రయత్నం .అద్భుతశ్లోకాలకు అవసరమైన చోట్ల వివరణ ఇస్తాను . దీనికి తెలుగు లో వ్యాఖ్యానం రాసినవారు శ్రీ శ్రీపాద వేంకట రమణ దైవజ్న శర్మగారు .దీని ఆధారంగానే నేను ఈ ధారావాహిక రాస్తున్నాను .నేను రాసిన ‘’గీర్వాణకవుల కవితాగీర్వాణ0’’ మొదటి భాగం లో లో భారవికవి గురించిన 17-9-2014న రాసిన  అంతర్జాల వ్యాసాన్ని  ఇక్కడ ఉటంకించి, భారవి కవిని పరిచయం చేస్తాను .

  అర్ధ గౌరవాన్ని అందలం ఎక్కించిన కవి-భారవి

  అసలు భారవి పేరే విచిత్రం గా ఉంది .దీని అర్ధం ‘’సూర్య దీప్తి ‘’(ప్రకాశం).అందరికవుల్లాగానే భారవి జీవితకాలమూ అసందిగ్ధం గానే ఉండిపోయింది .పద్దెనిమిది  సర్గ ల  మహా కావ్యం ‘’కిరాతార్జునీయం ‘’రాసిన మహాకవి భారవి .కిరాత అంటే మారు వేషం లో వచ్చిన శివుడికి పాండవ సోదరుడు అర్జునిడికి మధ్య జరిగిన పోరాటం ,మెచ్చిన శివుడు కిరీటికి పాశుపతాస్త్ర ప్రదానం చేయటం కద.ఈ కద బెజవాడ ఇంద్ర కీలాద్రిపైన జరిగిందని అందరి నమ్మకం .క్రీ.శ .ఆరవ శతాబ్దం వాడు భారవి అని ఎక్కువ మంది చెప్పారు .634చాళుక్య ‘’ఐహోళశాసనం ‘’లో భారవి కాళిదాసు ల పేర్లున్నాయి .పశ్చిమ గంగ వంశ పాలకుడైన దుర్వినీత కిరాతార్జునీయం లోని పదిహేనవ అధ్యాయం పై వ్యాఖ్యానం చేసినట్లు తెలుస్తోంది .ఈ రాజులు నాలుగవ శతాబ్దం మధ్య భాగం నుండి పరిపాలన చేశారు .దుర్వినీత మహా రాజు ఆరవ శతాబ్ది చివరలో రాజ్య పాలన చేసినట్లు చరిత్ర చెబుతోంది . ఏడవ శతాబ్దికి చెందిన దండి కవి రచనల్లో భారవి తన ముత్తాత  గారి  స్నేహితుడు అని పేర్కొన్నాడు .భారవి యే తన తాతగారికి విష్ణు వర్ధన మహా రాజు ఆస్థానం లో చోటుకల్పించాడని చెప్పాడు .ఆ తర్వాతే తాత గారు పల్లవ రాజైన  దుర్వినీత ,సింహ విష్ణుల కొలువులో చేరాడట .ఈ విష్ణు వర్ధనుడు మనం అనుకొనే కుబ్జ విష్ణు వర్ధనుడు కాదని యశోధర్మ విష్ణు వర్ధనుడు అని పరిశోధకులు అంటున్నారు .కనుక భారవి కాలం .530-550అని అందరూ ఊహించారు .భారవి దాక్షణాత్యుడని ,పల్లవ రాజులతో సంబంధం ఉన్న వాడని చరిత్రకారుడు  ‘’కాలే ‘’అన్నాడు .

  భావ  ప్రకటన  భారవితోనే ప్రారంభమైనదని విశ్లేషకాభిప్రాయం .’’భారవే రర్ధ గౌరవం ‘’అన్న టాగ్ కలిగి ఉన్నవాడు .కిరాతార్జునీయ కద మహా భారతం లోనిదే అయినా దాన్ని సుందర కావ్యం గా తీర్చిదిద్దాడు .కాళిదాసు రాసిన కుమార సంభవ రఘువంశా కావ్యాలు భారవికి ప్రేరణ గా నిలిచాయి .కాని సర్వ స్వతంత్ర మైన కొత్త శైలికి నాందిపలికి తన ప్రత్యేకతను చాటుకొన్నాడు .’’అవంతి సుందరి ‘’కద ప్రాకారం భారవి విష్ణువర్ధనుడి ఆస్థానకవి .వామనుడు‘’కావ్యాలంకార సూత్ర ప్రవ్రుత్తి ‘’లో భారవి శ్లోకాన్ని ఉదాహరించాడు .అసలు పేరు ‘’దామోదరుడు ‘’అని అవంతి సుందరి కద వలన తెలుస్తోంది .

  కిరాతార్జునీయ కద

 జూదం లో ఓడిపోయిన పాండవులు ద్వైత వనం లో ఉంటారు .దుర్యోధనుడి పరిపాలన ఎలా ఉందొ తెలుసుకొని రమ్మని ధర్మ రాజు ఒక  అడవి మనిషిని గూఢ చారిగా పంపిస్తాడు .వాడు తిరిగి వచ్చి సుస్థిర రాజ్య పాలన చేస్తున్నాడు గాంధారీ తనయుడు అని వివరిస్తాడు .భీముడు, ద్రౌపది యుదిస్ష్టిరుడినియుద్దానికి ప్రేరేపిస్తారు .చేసిన ప్రతిజ్ఞ ప్రకారం దానికి ఆయన అంగీకరించడు .వ్యాసమహర్షి అక్కడికి వచ్చి అర్జునుడు శక్తి పరాక్రమ వంతుడు కావాలని  అందుకోసం ఇంద్ర కీలాద్రి పై ఇంద్రునికోసం తపస్సు చేయమని ఉపదేశిస్తాడు .ఆ ఆదేశం ప్రకారం బెజవాడ వచ్చి ఇంద్ర కీలాద్రి పర్వతం పై తీవ్ర తపస్సు చేస్తాడు .తపో భంగం చేయటానికి దేవతా స్త్రీలు ప్రయత్నం చేసి విఫలురౌతారు .ఇంద్రుడు ప్రత్యక్షమై శివుడి ని గూర్చి తపస్సు చేయమని సలహా ఇస్తాడు .శివుడు అర్జున తపోదీక్షను పరీక్షించటానికి కిరాత వేషం లో మాయ రూపం లో ఉండే పందిని అతనిపైకి ఉసి గోల్పుతాడు .స్వీయ రక్షణలో కిరీటి మాయా సూకరాన్ని బాణం తో చంపేస్తాడు ,అదే సమయం లో మాయా కిరీటి శివుడు  వేసిన బాణం దానికి గుచ్చ కుం.టుంది .పందిని కొట్టిన వాడు నేను అంటే నేను అని వారిద్దరిమధ్య తీవ్ర వాదోపవాదాలు జరుగుతాయి .ఇద్దరూ ద్వంద్వ యుద్ధానికి తల పడుతారు .శివుడు అర్జున బల పరాక్రమాలకు సంతోషించి పాశుపతాస్త్రాన్ని ప్రదానం చేస్తాడు .కద చిన్నదే కాని భారవి సకల  వర్ణ నాత్మకం గా  గా పద్దెనిమిది సర్గల మహా కావ్యం గా విస్తరింప జేశాడు

                 కవితా గీర్వాణం

   కాళిదాసు కంటే ఒక అడుగు ముందుకు వేసి జలక్రీడ ,వన విహారాలు మధుపానం ,ప్రయాణం (ట్రావేలోగ్ )వర్ణనలు  కూడా చేశాడు .కావ్యం లో ఇవి చోటు దక్కి౦ చు కున్నాయి  మొదటి సారిగా ఈ కావ్యం లోనే .వర్ణనలకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన మొదటికవి భారవి అనిపిస్తాడు .చాలా ప్రౌఢమైన భాషలో కావ్యం రచించాడు .ఉక్తి చమత్కారం ఈ కావ్యానికి భారవి పెట్టిన అదనపు సొమ్ము .నాలుగు నుంచి పది సర్గలు అంటే ఆరు సర్గలను  వర్ణనలతో గుప్పించేశాడు .భారవి కవిత్వాన్ని వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి దీనికి ‘’ఘంటా పథ‘’ వ్యాఖ్యానం రాస్తూ ‘’నారికేళ పాకం ‘’అన్నాడు .

‘’నారికేళఫల సన్నిభం వచో భారవేః సపది తద్విభజ్యతే – స్వాదయంతు రస గర్భ నిర్భరం సామరస్య  రసికా యధేప్సితం ‘’అంటే రసగర్భితమైన పదాలను విడ గొట్టి ఆస్వాదిస్తే పరమ రుచికరం గా ఉంటుంది .ఆ ఓపికే మనకు కావాలి .రుచి మరిగితే కొబ్బరి నమిలి నట్లు నములుతూ రసానందాన్ని పొంద వచ్చు .భాష భారవి చేతిలో ఒదిగిపోయింది .శబ్దం అర్ధం కలిసి నాట్యమే చేశాయి .అయిదవ సర్గ లో చిత్రకవిత్వమూ రాసి షోకులు తెచ్చాడు .సర్వతో భద్ర ,యమక ,విలోమం మొదలైన చిత్ర కావ్య శై లుల్ని ప్రయోగించాడు .ఇంకో గమ్మత్తైన విశేషం ఏమిటంటే ‘’ఏకాక్షర శ్లోకం ‘’కూడా రాసి తన ప్రతిభా ప్రదర్శనం చేశాడు .అంటే ఒకే అక్షరం తో శ్లోకం అంతా చెప్పాడన్న మాట .-‘’న నోనా నున్నో నున్నోనో నానా నాన నాను –నన్నో నున్నో ననున్నేనో నానేనా నున్న ననున్నాత్ ‘’ –నఅనే ఒకే అక్షరం తో రాసిన శ్లోకం ఇది .బాగా ప్రచారమైంది కూడా .దీని అర్ధం –‘’అనేక ముఖాల వాళ్ళల్లారా !ఆయన మనిషి కాదు .తనకంటే తక్కువ బల వంతుని చేతిలో ఓడిపోయాడు .ఆయన బలహీనుడి చేతిలో ఓడిపోయే వాడేమీ కాదు .నిజానికి అతని అధినాయకుడు ఓడిపోలేదు .పైచేయి ఆయనంత మాత్రాన అయిపోలేదు .పీడించే వాడు అదృశ్యమైనాడు .అది పాప కార్యం కాదు .’’ఆ తర్వాత ఇదే ధోరణిలో నారాయణ పండితుడు తన ‘’మధ్వా చార్య చరిత్ర’’లో’’న ‘’తోనే ప్రయోగం చేశాడు .వడిరాజు ,రూప గోస్వామి ఇదే దారి పట్టి ఏకాక్షర శ్లో కాలకు పట్టాభి షేకం చేశారు సంస్కృతం లో ..

      భారవి ఛందో వైవిధ్యం తో ఎన్నో శ్లోకాలు రాశాడు కాని ఆయను ఇష్టమైనది ‘’వంశస్థ’’ అనే ఛందస్సు మాత్రమే .ఈ ఛందస్సు భారవి ప్రతిభను ద్విగుణీ కృతం చేసిందని క్షేమేంద్రుడు ‘’సువృత్తి  తిలకం ‘’లో అన్నాడు –‘

‘’వృత్త చత్రస్య సా కాపి ‘’వంశస్థస్య ‘’ విచిత్రతా –ప్రతిభా భారవేర్యేన సచ్చాయే నాధికీ కృతా’’’’

 శక్తి వంతమైన శబ్ద ప్రయోగం చేశాడు భారవి .ఏ పాత్ర ఎలా మాట్లాడాలో అలానే మాట్లాదించటం భారవి గొప్ప తనం .లోకోక్తులు,  నీతులు సందర్భాన్ననుసరించి వాడాడు .వీరరస కావ్యం కనుక దాన్ని బాగా పోషించాడు .అది భారవి అభిమాన రసం కూడా .అర్ధాంతర న్యాసాలం కారాలతో లోక జ్ఞానాన్ని కలిగిస్తాడు .1050శ్లోకాలున్న ఈ కావ్యం లో 115 లో అర్దాంతారా లంకారాలే ఉన్నాయి .

                      అర్ధ గౌరవం

  భారవి అంటే ‘’అర్ధ గౌరవం ‘’అన ముందే చెప్పుకొన్నాం .తక్కువ మాటలలో ఎక్కువ అర్ధాన్ని చెప్పటమే అర్ధ గౌరవం ..ఇంగ్లీష్ లో ‘’బ్రివిటి ‘’అంటారు .దర్శనాలలో ,ధర్మ శాస్త్రాలలో సూత్రాలలో తక్కువ శబ్దాలలో ఎక్కువ భావం ఉండేట్లు చెప్పారు .అదే భారవి పాటించాడు కావ్యం లో .అంటే కావ్యానికి శాస్త్ర గౌరవ స్థాయి కల్పించాడు .ఈ లక్షణం మన తిక్కన గారిలో కనిపిస్తుంది .’’అల్పాక్షరాల్లో అనంతార్ధం ‘’అంటే ఇదే .భారవి ఇలా శబ్దార్ధాల్ని సమతూకం లో వాడటం వలన కావ్య సౌందర్యం హెచ్చింది .శబ్దానికి ఓజో గుణాన్ని చేర్చాడు .మనుష్యుల కావ్య రుచిని గురించి చెబుతూ –

‘’స్తువంతి గుర్వీ మభి దేయ సంపదం విశుద్ధి ముక్తేరపరే విపశ్చితః –ఇతి స్స్థితాయాం ప్రతి పూరుషంరుచౌ సుదుర్లభాఃసర్వ మనోరమా గిరః ‘’అన్నాడు –అంటే ‘’కొదరికి అర్ధ సంపత్తి ఇష్టం .కొందరు శబ్ద సంయోజనం కోరుకొంటారు .ఇలా మనుష్యులు భిన్న రుచులను కోరుతారు .అందరి మనస్సులనే ఆకర్షించే కవిత్వం రాయటం సులభం కాదు ‘’.ఓజస్సు, ప్రసాద గుణాలతో కవిత్వాన్ని రంజింప జేశాడు ..’’వికట కవి ‘’శబ్దం లో ఎటునుంచి అయినా అదే మాట వచ్చినట్లు ఒక తమాషా శ్లోకమే రాశాడు .’’దేవాకాని నికావా దే-వాహికస్వ స్వకా హి వా .-కాకా రే భాభా రేకాకా –ని స్వభ వ్యవ్య భ స్వ ని ‘’పాదాలను మార్చినా వెనక్కి నడిపించినా అలాగే రావటం గొప్ప ప్రక్రియ .దీని అర్ధం –మానవా !యుద్ధం ఎవరికి కావాలి?ఈ యుద్ధ భూమి దేవతలకూ ఉత్సాహమిస్తుంది .ఇక్కడ పోరాటాలు జరుగుతాయి .త్యాగాలు ఇతరులకోసం చేసుకొంటారు .ఈ భూమి మదించిన ఏనుగులతో ,జంతువులతో నిండి ఉంది .యుద్ధం అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ యుద్ధ క్షేత్రం లో పారాదక తప్పదు .మన తెలుగు కవులూ ఈ ప్రయోగాలు బాగానే చేశారు .మరొక గొప్ప శ్లోకాన్ని గమనిద్దాం –‘’వికాస మీ యుర్ జగదీశ మార్గణా వికాస మీ యుర్ జగతీశ మార్గణః-వికాస మీ యుర్ జగదీశ మార్గణా వికాస మీయుర్ జగతీశ మార్గణః ‘’-దీని అర్ధాన్ని అవలోకిద్దాం –జగదీశుడైన అంటే రాజు అయిన అర్జునుని బాణాలు విస్తరిస్తున్నాయి .అలాగే జగతీశ్వరుడైన అంటే లోకేశ్వరుడైన శివుని బాణాలూ వ్యాపిస్తున్నాయి .ప్రమాద గణాలు అండ కోలాహలం చేస్తున్నారు .శివార్జున యుద్ధాన్ని ఆసక్తిగా తిలకించటానికి ఆకాశం లో దేవతలు ,మహర్షులు పరివేష్టించి శోభ కలిగిస్తున్నారు .’’

   ఇంకొక శ్లోకం లో ‘’స్థల నళినుల నుంచి రేగిన పుప్పొడి గాలి చేత ఎగర గొట్టబడి ఆకాశం లో ఒక వలయాకారం గ వ్యాపించిందిట .అది బంగారు దారాలతో అల్లబడిన’’ ఆతపత్రం’’ అంటే గొడుగు లాగా శోభాయ మానం గా ఉందట .పరమ రమణీయ భావన ఇది .దీన్ని మెచ్చిన వారు భారవిని ‘’ఆతపత్ర భారవి కవి ‘’అని పిలిచారట .

   కిరాతార్జునీయం ప్రతి సర్గ లోని చివరి శ్లోకం లో భారవి కవి ‘’లక్ష్మి ‘’శబ్దాన్ని ప్రయోగించాడు అందుకే దీనికి ‘’లక్ష్మంత కావ్యం ‘’అనే పేరొచ్చింది .ఇలాగే హర్షుడు సర్గ చివరి శ్లోకం లో ,ఆనంద శబ్దాన్ని  ప్రయోగించాడు మాఘుడు శిశు  పాల వధను ‘’శ్ర్యంత ‘’అంటే శ్రీ అంతం గా ఉన్న కావ్యం అన్నారు .నైషధాన్ని ‘’ఆనందాంత’’కావ్యమన్నారు .భారవి కిరాతార్జునీయం లోని కవితా సౌందర్యాన్ని తెలియ జేయటానికి అనేక మంది ప్రయత్నించారు .మల్లినాధుని వ్యాఖ్యానం తో బాటు 36వ్యాఖ్యానాలున్నాయి దీనికి. ‘’ప్రకృతి మధురా భారవి గిరిః’’అని ఒకకవి ప్రశంసించాడు .

           ఈ కావ్యం లో రాజనీతి ఎక్కువ. ఇలా ఉన్న కావ్యాలలో ఇదే మొదటిది .రాజాస్థానం లో మంత్రి గా ఉండబట్టే దీన్ని ఇలా రాయగాలిగడని ఊహిస్తారు .ద్రౌపది తో చెప్పించిన సంభాషణలు చాలా అర్ధ గౌరవం తో కర్తవ్య నిర్దేశకం గా ఉంటాయి. స్త్రీ ఆబల కాదు సబల అని నిరూపిస్తాడు కవి .సకల సద్గుణ సమేతుడిగా కదానాయకుడైన ఆర్జునుడిని భారవి చిత్రీకరించి కావ్య గౌరవాన్ని పెంచాడు .’ భారవి బాటలో నడిచిన మాఘ మహా కవి శిశుపాల వధ కావ్యం లో ఇంకొంచెం విజ్రుమ్భించి ఇరవై మూడు రకాల ఛందస్సులు వాడాడు .భారవి శివుడిని ఆరాధిస్తే మాఘుడు విష్ణు ఆరాధకుడు .భారవికావ్యాన్ని జర్మని భాషలోకి మొదట అనువాదం చేసిన వాడు కారల్ కాపెల్లర్ .హార్వర్డ్ ఓరిఎంటల్ సిరీస్ ద్వారా ముద్రింప బడింది .ఆరడజను  రకాల ఆంగ్ల అనువాదాలు వచ్చాయి .’శ్రీనాధ మహాకవి కిరాతార్జునీయ సంస్కృత కావ్యాన్ని తెలుగులోకి అనువదించి గొప్ప ప్రచారం తెచ్చాడు అందులో ప్రతి పద్యం రస  గుళికయే….  జయన్తితే సుక్రుతినో  రస సిద్దాః కవీశ్వరా’’.

    మొదటి శ్లోకం –‘’శ్రియః కురూణామదిపస్య పాలం –ప్రజాసు వృత్తింయమయంక్త్య వేదితుం

                      స వర్ణి లింగీ విదితస్సమాయయౌ –యుదిస్టిరంద్వైతవనే వనేచరః ‘’

మాయాజూదం లో కౌరవుల చేత ఓడిం ప బడిన ధర్మరాజు ద్వైతవనం నుంచి ,దుర్యోధనుడి పాలనా విధానం ఎలా ఉందొ తెలుసుకొని రమ్మని ఒక వనచరుడిని పంపగా అతడు బ్రహ్మచారి వేషం లో తిరిగి దుర్యోధన పాలనా విధానం అంతా ఆకళింపు చేసుకొని  యుదిస్టిరు నికి వివరించటానికి వచ్చాడు .

  ధర్మరాజుకు నమస్కరించి ‘’ప్రభూ !మీ శత్రువు దుర్యోధనుడు భూమి అంతా ఆక్రమించి ,ప్రజాను రంజకంగా పాలన చేస్తున్నాడు .ప్రజలుకూడా చాలా ఆనందంగా ఉన్నారు .మీ సోదరుల ఊసు కూడా ఎత్తనీయకుండా రాజు వారికి కావాల్సినవన్నీ సమకూరుస్తున్నాడు .కనుక ప్రజలలో దుర్యోధనభక్తి పెరిగిపోయింది .ఇవన్నీ మీకు అప్రియాలే అయినా స్వామి మంచికోరి నేను ఏ మాత్రం సంకోచించకుండా నివేదించాను .ముఖప్రీతికోసం అసత్యం చెప్పరాదు .అలాచేస్తే కార్య విఘాతం జరుగుతుంది కనుక కింకరులు ప్రభువు సమక్షంలో ఎప్పుడూ సత్యమే చెబుతారు ‘’అన్నాడు

   సశేషం

 మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -25-1-20-ఉయ్యూరు

  image.png

      మరో కవితో మళ్ళీ కలుద్దాం

       మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-9-14-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సరస భారతి 149వ కార్యక్రమంగా సామూహిక సత్యనారాయణ వ్రతం

సరస భారతి 149వ కార్యక్రమంగా సామూహిక సత్యనారాయణ వ్రతం సరసభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ 149 వ కార్యక్రమము గా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో పవిత్ర మాఘమాసం లో రెండవ మాఘ ఆదివారం మాఘ శుద్ధ అష్టమి 2-2-20 నాడు ఉదయం 9 గంటలకు ఆవుపిడకలపై ఆవుపాలు పొంగించి ,పొంగలి వండి శ్రీ సూర్యనారాయణ స్వామికి నైవేద్యం పెట్టటం అనంతరం 9-30కు సామూహికంగా శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం నిర్వహించబడుతుంది .ఎలాంటి రుసుము లేదు .ఎవరి పూజా ద్రవ్యాలు,వివిధరంగులపుష్పాలుతో సహా  వారే భక్తులు తీసుకొని రావాలి .ఆలయం తరఫున శ్రీ సత్యనారాయణ ప్రసాదం తయారుచేయించి వ్రతం లో పాల్గొనేవారికి అందజేయ బడుతుంది .ముందుగా పూజారిగారిని సంప్రదించి పేర్లను నమోదు చేయించుకోవలసినదిగా కోరుతున్నాము .                                   గబ్బిట దుర్గాప్రసాద్ -సరసభారతి అధ్యక్షులు ,ఆలయ ధర్మకర్త                             25-1-20 -ఉయ్యూరు 

image.png
image.png

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 11- జపనీస్ సాహిత్యం -2

ప్రపంచ దేశాల సారస్వతం 11- జపనీస్ సాహిత్యం -2

కామకూరా యుగం (1192-1332)12వ శతాబ్దిలో జపాన్ లో జరిగిన అంతర్యుద్ధం లో ‘’మినమోటోస్’’వర్గం జయించి రాజధానిని కామకూరాకు మార్చారు కనుకనే ఆపేరు ఈయుగానికి వచ్చింది .ఒకరకంగా సైనికయుగం ఇది .మతం మీద ఆసక్తిపెరిగి మతగ్రందాలే ఎక్కువగా వచ్చాయి .చైనా నుంచి దిగుమతి అయిన ‘’జెన్ మతం ‘’బాగా ప్రాపకానికి వచ్చి ,వ్యక్తిగత ధ్యానమే మనోవికాసానికి దారి అనే వారిసూక్తి జనానికి బాగా పట్టి ,జెన్ మతం కళలలో లో నూ ప్రతిఫలించింది ,ఈయుగ కావ్యాలు –కథాకావ్యాలు, టంకాపద్య కావ్యాలు ,’’జుహిట్స్ ‘’అనే వ్యాసాలూ ,బౌద్ధవ్యాసాలు ,చైనా రచనలు .దేశీయ విదేశీయ పద్ధతుల కలయిక వలన ఒక కొత్త జాతీయ వ్రాత విదానంవచ్చింది .దీనిఫలితంగా జాతీయ గ్రంథాలు ,పూర్వ యుగ కథలపై ఆసక్తి పెరిగి వాటికి ప్రతులు తయారు చేయటం, వ్యాఖ్యానాలు రాయటం జరిగింది .దీనితో ‘’షింటో’’ల అధ్యయనమూ పెరిగింది .నీతి అనుకరణ వాజ్మయం ఎక్కువగా వచ్చినా ఉపజ్ఞ తక్కువే .ఆకాలం లో జరిగిన అనేక దుఃఖ సంఘటనలపై కరుణ రసాత్మక రచనలు వచ్చాయి .బౌద్ధుల దృష్టిలో ఇది క్షీణ యుగం –‘’మప్పో’’.

హేకేమోనోగటారి,జేనేసి సీసు ఇకి అనే ప్రత్యేక గ్రంథాలుఈకాలం లో వచ్చాయి రెండిటికి మూలం ఒకటే .రెండవది మొదటిదాని రూపాంతరమే .మొదటిది యుద్ధ కథానకం .కర్త ఎవరో తెలీదు .జపాన్ సారస్వతం లో ఈ రెండిటికి అత్యన్తప్రాముఖ్యం ఉంది .’’బివా ‘’అనే జంత్ర వాద్యం పై పాడే తరువాత వచ్చిన నాటకాలకు ఇది ప్రేరణ గా ఉన్నది .హమురో టోకి నాగా రాసిన ‘’హె ఇచిమోనోగటారి’’,’’హాజెన్ మో నోగటారి ‘’మిజు కగామి ‘’అంటే నీటి అద్దం అనే చారిత్రిక రచనలుగా వచ్చాయి .

క్యోటో రాజాస్థానం లో టంకాపద్యాల రచన నిరాఘాటంగా సాగుతూనే ఉంది .వందమంది కవుల గీతాలైన ‘’హ్యాకునిన్ ఇస్షు ‘’ ఈకాలాన్ని ప్రతిబింబించే1235లో తెచ్చిన  కావ్య సంకలనం .కామో అనే బౌద్ధ సన్యాసి ,హోజోకి (1212)ముమ్యూషో,షికిమొనగటూరి’’కాల చతుస్టయం ‘’ గ్రంధాలు రాశారు .హోజోకి అంటే రచయిత స్వీయ అనుభూతుల వచన సంపుటి .టన్నిషో గ్రంథాన్ని షిన్ రాన్ సోకిన్ (1073-1262)శిష్యుడైన యూ ఏంబో రాశాడు .ఇందులో ఒకభాగం లో గురువుగారి సిద్ధాంతాలు ,రెండవభాగం లో వాటికి ప్రచారం లో ఉన్న వ్యతిరేక సిద్ధాంతాలపై యుఎన్ చేసిన విమర్శ ఉంటుంది .నిచెరిన్ షోనిన్ 1260లలో రాసిన ‘’రిష్షో అన్ కోకురాన్ అనేది జాతీయ కల్యాణం గూర్చి వివరించే  వ్యాసం ..ఈకాలపు చైనా భాషా గ్రంథాలు ఎక్కువగా జెన్ శాఖ బౌద్ధులు రాసినవే .వాటికి స్థాయి లేదు .వీటిలో ఈశై డోజెన్ లు రాసినవి ప్రసిద్ధాలు .

నంబో కుచో ,మురోమాచి యుగాలు (1332-1603)-ఈ కాలం లో రాజ కుటుంబం లో రెండు  వర్గాలేర్పడి ,ఇరువైపులా సమర్ధకులున్నారు .60ఏళ్ళు వీరిద్దరి ద్వంద్వ ప్రభుత్వం నడిచింది .వీటినే ఉత్తర ,దక్షిణ ప్రభుత్వాలు అన్నారు .దీనికి ‘’నమ్బోకుచో’’ యుగమని పేరు .చివరికి ఒకేచక్రవర్తి ఏర్పడి క్యోటో లో రాజధాని స్థాపించటం జరిగి అక్కడి వీధి ‘’మురో మాచి ‘’పేరును ఆయుగానికి వచ్చింది ఈయుగాన్ని ‘’ఆశషికగా యుగం ‘’అంటారు  .1573వరకు దేశం అంతర్యుద్ధాలతో సతమతమైంది .పురుష ప్రాధాన్యం పెరిగి స్త్రీల ప్రాధాన్యత,గౌరవాలు  తగ్గాయి  .ఈయుగం లోని ఉత్తర దేశ కాలాన్ని ‘’అంధకారయుగం ‘’అంటారు .పూర్వభాగం లో కొంతవరకు కళలు చిత్రలేఖనం పరాకాష్ట పొందింది .1392-1465కాలం లో ‘’నో ‘’అనే గేయనాటిక సమగ్రంగా వచ్చింది .ఇది తప్ప మిగిలింది హీనస్థితి  వాజ్మయం అంటారు .కాని అంతర్గతంగా అభ్యుదయ భావాలు ఏర్పడి తర్వాతకాలం లో శాంతికి దారి తీసింది .ఇరుపక్షాల రాజుల యుద్ధాలపై వచ్చిన రచనలే అన్నీ .ఇవి కవిలెలు, కైఫీయత్తులను పరిశీలించటానికి తోడ్పడ్డాయి .

జిన్నో షోటోకి అనే గ్రంథం’’కిట బటకచివా ఉజా ,చేజో మురకమి(1329-54)రాజ్యకాలం లో రాయబడింది .ఇది దక్షిణ రాజ్య పక్షాన్ని సమర్ధించేది ,రాజకీయ నైతిక భావాలతో కూడినది .సాహిత్య గుణం లేకపోయినా ,తర్వాత చారిత్ర గ్రంథాలకు మార్గ దర్శి అయింది .’’టైహి కి అంటే శాంతి వృత్తాంతం అనే దాన్ని కోజిమా సన్యాసి రాశాడు .చైనా జపాన్ భా షలకలయికతో సుందర సరళతర కొత్త శైలికి మార్గం చూపాడు .ఇది 17,18శతాబ్దాలలో సమగ్ర రూపం దాల్చింది .ఆధునిక శైలికిది మార్గదర్శనం చేసింది .కేన్కో సన్యాసి రాసిన ‘’ట్సురేజురెగుసా ‘’అనే గ్రంథం జీవిత విలువలను తెలియజేస్తూ 240భాగాలలో ‘’జూయి హిట్స్ ‘’వ్యాసాలతో వివరించబడింది .చాల పేరు ప్రఖ్యాతులు పొందింది .

14 వశతాబ్దిలో ‘’నొ’’గేయ నాటిక సమగ్ర రూపం,సౌష్టవం  దాల్చింది.కగరు, బుగకు,డెంగకు,సరుగకు అనే నృత్యాలతో కూడిన జపాను నాటకాలు మతసంబంధమైనవిగా వచ్చాయి .వీటన్నిటి సమన్వయ రూపమే ‘’నో నాటిక ‘’..దీనిలో స్వగతాలు ,సంభాషణలు ఉంటాయి .మొదట్లో మతసంబంధంగా ఉన్నా కాలక్రమంలో లౌకికంగా మారింది .కనామా (1333-1384),కొడుకు సియమి(1363-1443)లు దీన్ని ఉచ్చస్థితికి తీసుకు వెళ్ళారు .కొందరు దీనిలో ‘’సరుకు తక్కువ ‘’అంటే ,కొందరు ‘’అత్యుత్తమ వాజ్మయం  ‘’అన్నారు వీటిలోని గేయాలు ,పదాలను ‘’యోక్యోకు ‘’అంటారు .గద్య పద్యాత్మికాలు .మధ్యలో టంకా పద్యాలు దూరి చోటు చేసుకొంటాయి .ఈ నాటక ప్రదర్శనలో అనేక భావోద్వేగాలను వ్యక్తం చేయటానికి  15రకాల మాస్కులు ఉపయోగించేవారు .’’ఈనో ‘’అనేది ప్రపంచ సాహిత్యం లో ఒక క్రొత్త ప్రక్రియ .ఇందులో టకా సగో,దోనోజి,టోసేన్అనే రచనలు ఉ త్తమ శ్రేణి కి చెందినవి .ఉదాత్త ,గంభీరాలైన ఈ నో నాటకాల మధ్యలో ‘’క్యోజెన్’’అనే హాస్య రచన కూడా ఉంటుంది .దీన్ని వాడుకభాషలో రాసే చిన్న ప్రహసనం .ఇవన్నీ తర్వాత వచ్చే నాటక ప్రక్రియకు మూలాలు .

సశేషం

ఉత్తర దేశంలో’ఈ నాడు జరిపే ’ పవిత్ర మౌని అమావాస్య’’శుభాకాంక్షలు

మీ-గబ్బిటదుర్గాప్రసాద్ -24-1-20-ఉయ్యూరు

 

 

 

 

— 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆ”పాత”మధురాలు 11 

ఆ”పాత”మధురాలు 11

మా అమ్మాయి చి సౌ విజయలక్ష్మి కి డెట్రాయిట్ దగ్గర ట్రాయ్ లో 2005 డిసెంబర్ 9న ఒక నిమిషం తేడాతో జన్మించిన ”ట్విన్స్ ”చి ఆశుతోష్ ,చి  పీయూష్  ల బాల్యచిత్రాలు

1-హాస్పిటల్ లో అప్పుడే పుట్టిన ట్విన్స్ తో  మా అమ్మాయి విజ్జి
   తర్వాత ఇంట్లో వాళ్ళిద్దరితో ,
2-చిన్నారి ఆశుతోష్ ,పీయూష్ ల హావభావాలు
3-ట్విన్స్ పోజులు
4-పైన పీయూష్ ,కింద నోటిలో వేళ్ళతో కవల సోదరులు ,ఉత్సాహంగా దేన్నో చూస్తూ ట్విన్స్
5-అమెరికా పార్క్ లో ఆటలాడుతున్న ట్విన్స్ ,పోజుల రాయుళ్లయిన సోదరులు
6-అమెరికాలో ఆటలలో ,నవ్వుల్లో చిన్నారి సోదరులు
7-తలిదండ్రులతో ట్విన్స్
  ముగ్గురన్నదమ్ములు శ్రీకేత్ ఆశుతోష్ ,పీయూష్
  మురిపెంగా ట్విన్స్
8-శిశువు ఆశుతోష్
  స్టెర్లింగ్ హైట్స్  లో పీయూష్ ను  ఆడిస్తున్న మా అమ్మాయి స్నేహితురాలు శ్రీ మతి అనూరాధ కుమార్తె
సీరియస్ గా పీయూ ,హాపీ గా ఆశు

అమెరికాలో మన శిశిర ఋతువు (ఆకు రాలేకాలం )ను ”ఫాల్ ”అంటారు ఆ సౌందర్యం చూడండి

  మీ-గబ్బిట  దుర్గాప్రసాద్ -24-1-20 -ఉయ్యూరు
Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆ”పాత” మధురాలు -10

ఆ”పాత” మధురాలు -10

ఆ”పాత” మధురాలు -10

1-2002 మొదటి అమెరికాప్రయాణం లో మాకు సెండాఫ్ ఇచ్చి బాన్ వాయేజ్ చెప్పిన మాతమ్ముడు మోహన్ ,కొడుకు రాజు వగైరా ,అమెరికాలో శిశిర రుతు అనే ”ఫాల్ ”సౌందర్యం
హూస్టన్ స్పెస్  సెంటర్లో మేమిద్దరం ,మనవడు శ్రీకేత్

-మిచిగాన్ లోని ట్రాయ్ లో మా అమ్మాయి స్నేహితురాలు శ్రీమతి బిందు ,కూతురు –

2-హూస్టన్ లో శ్రీకేత్ కు అన్నప్రాసన పూజా వగైరా
  పుట్టిన రోజు పండుగ
 నా ఒడిలో శ్రీకేత్
3-హూస్టన్ లో మేమిద్దరం మా అమ్మాయి, అల్లుడు ,మనవడు
  వేలూరి పవన్ ,కూతురు ,వాళ్ళమ్మగారు లతో శ్రీకేత్ మిచిగాన్ లోని స్టెర్లింగ్ హైట్స్ లో
  పోజులరాయుడు శ్రీకేత్
4-ఉయ్యూరులో ఆడపిల్లవేషం  లో శ్రీకేత్
  బర్త్ డే హడావిడి ,చప్పట్లు కేరింతలతో శ్రీకేత్
5-పుట్టిన రోజు పండుగ వాళ్ళమామ్మగారు ,కేక్ కటింగ్ హడావిడి
6-విన్యాసాల మనవడు శ్రీకేత్ ,స్ కూల్ బస్ లో శ్రీకేత్
7-మిచిగాన్ లో రంగులపూల చెట్లకింద శ్రీకేత్
  మా అమ్మాయి స్నేహితురాలు శ్రీమతి అనూరాధ కూతురు తో ,తమ్ముళ్లు ఆశుతోష్ ,పీయూష్ లతో అన్న శ్రీకేత్
2002 హోస్టెల్ వాల్ మార్ట్ లో మా అమ్మాయి తీయించిన మా ఫోటో

Posted in ఆ''పాత''మధురాలు | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 10- ఐరిష్ సాహిత్యం -2(చివరిభాగం )

ప్రపంచ దేశాల సారస్వతం

10-  ఐరిష్ సాహిత్యం -2(చివరిభాగం )

ఆలివర్ గోల్డ్ స్మిత్ వికార్ ఆఫ్ వెక్ ఫీల్డ్ నవలతో ప్రసిద్ధుడయ్యాడు.గోప్పకవికూడా . రాబర్ట్ బర్న్స్ స్థానిక రచయితగా ప్రసిద్ధుడు. డబ్లిన్ లో పుట్టిన ఎడ్మండ్ బర్క్ హౌస్ ఆఫ్ కామన్స్ కు విగ్ పార్టీ ప్రతినిధి,గొప్ప ఆరేటర్ ఫిలసాఫికల్ రచనలు చాలా చేశాడు .1730-50కాలం లో రైమింగ్ వీవర్స్ పోయెట్రి ని జేమ్స్ కాంప్ బెల్ ,జేమ్స్ ఒర్,ధామస్ బగ్స్ రాశారు .మేరియా ఎడ్జి వర్త్ వాస్తవ నవలాకారిణిగా రాణించింది.జాన్ బానిన్ ,జేరాల్ద్ గ్రిఫిన్ విలియంకార్లేటాన్ లు  మంచి నవలారచయితలు .డ్రాకులానవల రాసిన  బ్రాం స్ట్రోకర్,ఘోస్ట్ స్టోరి రైటర్ అంకుల్ సిలాస్ కార్మిల్లా నవలా రచయిత  షెరిడాన్ లి ఫాను చెప్పుకోదగినవారు .జార్జి మూర్ చాలాకాలంపారిస్ లో గడిపినా ఫ్రెంచ్ టెక్నిక్ లను ఇంగ్లిష్ లో రాసిన తొలి రచయిత .ఐర్లాండ్లో పుట్టి పెరిగిన ఆస్కార్ వైల్డ్ (1854-1900)జీవితం చివర్లో ఇంగ్లాండ్ లో గడిపి గొప్ప రచనలు విమర్శ కవిత్వం రాశాడు  .

   ఐర్లాండ్ అస్తిత్వవాదమైన గేలిక్ రివైవల్ ఐరిష్ సాహిత్యంపై పెద్ద ప్రభావం చూపింది .జే.ఏం సింజి నాటకాలలో ,విలియం బట్లర్ యేట్స్ కవిత్వం లో ప్రతిఫలించింది .పాట్రిక్ పియర్స్ ఐరిష్ ఆధునిక సాహిత్యానికి ఆద్యుడు .పెడ్రిక్ ఓ కనైర్ ,సియోమామాక్ లు గొప్ప రచయితలు  .స్వీయ జీవిత చరిత్రలు రాసుకొన్న ధామస్ ఓ గ్రియన్నా ,ఐరిక్ ప్రాఫెట్ గా గుర్తి౦పు పొందాడు  .కార్దిన్ లాంగ్వేజ్ యాక్టివిస్ట్ .నువాలాని దాంనహాల్, మైకేల్ హార్నేట్ లు ఆధునిక దృక్పధంతో రాశారు .ఫ్రాన్స్ లో  ఎక్కువ ఏళ్ళు గడిపిన సామ్యుల్ బెకెట్ ‘’వైటింగ్ ఫర్ గొడాట్’’నాటకంతో ప్రపంచ ప్రసిద్ధిపొంది నోబెల్ పొందాడు  .బెహాన్ రాసిన నాటకం డక్వేర్ఫెలో డబ్లిన్ దియేటర్లో ప్రదర్శింపబడింది .లియోనార్డ్స్ నాటకాలు బ్రాడ్వేలో ఆడేవారు  వీటికి ఎన్నో పురస్కారాలు వచ్చాయి .ధియేటర్ రైటర్ టాం మర్ఫీ ఫామిన్ మొదలైన నాటకాలతో హోరెత్తించగా , ‘’అవార్డ్ ఆఫ్ మోస్ట్ ప్రామిసింగ్ ప్లే రైటర్ ‘’అందుకున్నాడు మెక్ గిన్నిస్ .20వ శతాబ్దికి ముందు ఐరిష్ నాటకశాల లేనేలేదు .గేలిక్ రివైవల్ తర్వాత వచ్చాయి .1957లో బెహాన్ రాసిన ఆన్ గియాల్ నాటకం డబ్లిన్ దియేటర్ లో ప్రదర్శించారు .ఎయిస్లింగ్ ఘేయిర్ వంటి అత్యాదునికనాటకకర్తలు కొత్తరచనలతో ముందుకు వెడుతున్నారు .

  విలియం బట్లర్ యేట్స్ ,జార్జి బెర్నార్డ్ షా ,సామ్యుల్ బెకెట్ ,సీమాస్ హీర్ని లు ఐరిష్ సాహిత్యంలో నోబెల్ బహుమతి అందుకొన్నారు.

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -22-1-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 11- జపనీస్ సాహిత్యం -1

ప్రపంచ దేశాల సారస్వతం

11-  జపనీస్ సాహిత్యం -1

జపనీస్ భాష జపనీస్-కొరియన్ భాషా కుటుంబానికి చెందింది అని కొందరు కాదు ఆ రెండిటికి  సంబంధమే లేదని కొందరు భావించారు .ఈ భాష సంయుక్త పద రూపం లో ఉండటం విశేషం .క్రీశ 1వ శతాబ్దికే ఈ భాష రూపొందింది .5వశతాబ్దం నాటికి చైనా భాషతో సంబంధమేర్పడి ,ఆభాషాపదాలు చాలా ఇందులోకి చేరాయి .ఈభాష నామవాచకాలలో వచనం అనుసరించి మార్పు రాదు .ప్రత్యయాలు చివర్లో ఉండటం చేత విభక్తి సూచకంగా ఉంటాయి .తర తమ విభేదాల పదాలు లేవు .వాక్య నిర్మాణం లో కర్మణి ప్రయోగం కనిపించదు. స౦బ౦ద వాచక ,సర్వనామాలు ఉపయోగి౦ప బడవు. సంఖ్యాగణనం లో జపనీస్ సంఖ్యా వాచాకాలున్నా ,చైనీయ సంఖ్యావాచకాల వ్యాప్తికూడా ఉంటుంది  .వాక్యాలలో విశేషణం విశేష్యానికి ముందు ఉండటం ,క్రియాపదానికి ముందు కర్మ ఉండటం వాక్యం చివర్లో క్రియం ఉండటం జపనీస్ భాష ముఖ్య లక్షణాలు .

  5వ శతాబ్దం నుండి రాత చైనీస్ లిపిలోనే రాయబడింది .కాని ఆభాషకంటే జపనీస్ భాషప్రత్యయాత్మకం అవటం వలన ,ప్రత్యయాలను వెల్ల డించటానికి చైనీయ లిపి వీలుకానందున ,48ధ్వనులతో కూడిన ఒక కొత్త వర్ణమాలను జపనీస్ పండితులు నిర్మించారు .’’కట,కణ ‘’అనే రెండు పద్ధతులలో ఈ ధ్వనులు లిఖించారు .దీనిలో హిరగణ పధ్ధతి కి వ్యాప్తి ఎక్కువ .చైనీయ చిత్రలిపి కి ప్రక్క ప్రత్యయాలను సూచించటానికి ,ప్రత్యేక ధ్వనులను సూచించటానికి వీటిని వాడుతారు .

   క్రీ శ 7వ శతాబ్దికి పూర్వమున్న దాన్ని ఆదిమ యుగం అంటారు .5వ శతాబ్దిలో చైనాలిపి ప్రవేశించే దాకాలిఖితపూర్వక జపనీస్ సాహిత్యం లేదు .కాని కొన్ని కధలు ,గేయాలు ,ప్రార్ధనలు మౌఖికంగా తరతరాలనుంచి ప్రచారమై ఉంటాయని భావిస్తారు .ఇవిగాథల్లా  ,పద్యాల్లో వృత్తాలలో వచనరూపంగానే రచి౦ప బడినవే  .5,6శతాబ్దాలలో చైనానాగరకత ,బౌద్ధమతం  జపాన్ కు చేరి ,జపనీస్ సాహిత్యం లో అభ్యుదయం కనపడింది .

  నారా యుగం (700-794).710లో జపాన్ రాజధాని నారా లో ఏర్పాటై 794లో క్యోటో కు మార్చబడింది .ఈకాలం లో బౌద్ధం బాగా వ్యాపించి ,కళాకారుల ప్రోత్సాహం తో వాస్తు శిల్పం మొదలైన వాటిలో పెద్ద మార్పులొచ్చాయి .రాసే విధానమూ మారింది .దీని ఫలితంగా ‘’క’’విధానం అమలైంది .నారాయుగం అంతా పద్య విధానమే లలితమైన పదాలతో ,సూక్ష్మ పరిశీలనతో శక్తి వంతమైన కవిత్వ రచన జరిగింది .ఇలాంటి ఉన్నత శ్రేణికవిత్వం ఆతర్వాత యుగాలలలో రానే లేదని దేశీయవిమర్శకులు అంటారు .ఈ కవిత్వం అంతా ‘’టంకా’’పద్ధతిలో వ్రాయ బడేది .దీనిలో 31అక్షరాలూ ,12నుంచి 20వరకు పదాలు ఉంటాయి .ఇవి ఆవేశపూరిత గీతాలు .మానవుడు ,ప్రకృతి ,ప్రేమ విషయాలుగా వెలువడిన కవిత్వం .కొన్ని కరుణ ,తత్వ మయ గీతాలుకూడా ఉన్నాయి .

‘’మన్యోషూ’’అనేది జపనీయ సాహిత్యం లో 8వ శతాబ్దిలో వచ్చిన అత్యంత ప్రాచీన సంకలిత గ్రంథం.పరిమితి గుణాలలో ఇది ఘనమైన గ్రంథం.ఇందులో కకినమొటో,నో హిటో మరో,యమబే నో ,అకాహి టోమొదలైన 450కవులు రాసిన 4,500పద్యాలున్నాయి .చైనాలో ఉన్న ఈపద్ధతిని చూసి జపాన్ వారు అలా సంకలితం చేసి ఉంటారు .ఇందులో నూటికి 90 ‘’టంకా’’ పద్యాలే .మిగిలినవి ‘’చోకా ‘’అనే దీర్ఘ కావ్యాలు .చోకా రచన తర్వాత కాలం లో వెనకబడి పోయింది .ఈకాలంలో వచ్చిన వచనగ్రంథాలలో8వ శతాబ్దికి ము౦దేవచ్చిన కోజికో ,నిహాన్ షోకి అనే జపాన్ చరిత్రలు ముఖ్యమైంవి .సారస్వతంగా వీటికి ప్రాధాన్యం లేకపోయినా ,ఆదేశ పౌరాణిక గాథలు తెలుసుకోవటానికి వీలుకలిగించాయి .

   హెయియాన్ యుగం (794-1192)-ఈ యుగం లో ఉదాత్తమైన జపనీస్ సాహిత్యం వచ్చింది .నారాయుగం లో జపాన్ లో అధికారం చక్రవర్తి చేతుల్లోంచి మారి ‘’ఫుజి వారా ‘’కుటుంబం వారికి దక్కింది .ఈ కుటుంబ పెద్ద యేదేశ రాజు .ఆస్థానం లో ఉన్నతోద్యోగాలు ఇతర సభ్యులు పొందారు .ఈయుగ సాహిత్యమంతా ఈకుటుంబంవారు  సృస్టి౦చి౦దే .వీరిలో మహిళలపాత్ర కూడా ఎక్కువే ..ఆకాలపు స్త్రీలు రాజకీయ చక్రం బాగానే త్రిప్పారు .ఈకాల వాజ్మయంలో ఉన్నత వ్యక్తుల గుణాలన్నీ ప్రతిఫలించాయి .లాలిత్యం తక్కువే .భోగ వైభవం  నీతి ధర్మాలపై ఉపేక్ష ఈ యుగకవిత్వ లక్షణం .

  11వ శతాబ్దిలో మురసకి షికులు అనే రచయిత్రి ‘’గెంజిమోనో గతరి’’అనే గ్రంథం రాసింది .ఇది గెంజి రాకుమారుడు ,అతనికొడుకులు .మనవళ్ళ ప్రణయ జీవితాలను వర్ణించే నవల .ఇదే జపనీస్ సాహిత్యం లో మొట్టమొదటి నవల .హెయియాన్ రాజాస్థాన జీవితం అంతా కళ్ళకు కట్టినట్లు చేసింది .ప్రపంచ వాజ్మయంలో ఈనవలకు అత్యున్నత స్థానమే  లభించింది .ఇది తర్వాత తరానికి చెందిన రచయితలను బాగా ప్రభావితం చేసింది  .ఈ కాలపు ఇతర రచనలలో ముఖ్యమైనవి-టకెటారి మొనోగతరి ,ఇసే మెనోగతరి లు .నీషో నాగాన్ అనే ఆమె మురసకి  కి సంకాలికురాలు .ఈమె గ్రంథం  ‘’ముకుర నోసోషి ‘’అంటే’’ తలగడ తలపులు ‘’.రాజాస్థాన దర్బారు జీవితం ,వ్యాసాలూ లేఖా వృత్తాంతాలు ఉంటాయి .జపాన్ భాషలో వచ్చిన ‘’జహి యిట్సు’’అనే వ్యాసానికి ఇదే ప్రేరణ .

  ప్రాచీన –ఆధునిక కావ్యాలతో కూడిన ‘’కాకన్స్షు’’అనే సంకలనగ్రంథంఈ యుగంలోని కినోట్సు రయుకి ,కినోటో మొనారి,ఒచికోచివో మిట్సునె,మిలునొతడ మినే అనే నలుగురు రచయితలు  సంకలనం చేశారు .దీని ప్రధాన సంపాదకుడు ‘’డైనట్సు రయుకి’’రాసిన పీఠిక-కావ్య విమర్శనాత్మక వ్యాసాలకు ఒజ్జబ౦తి గా విశ్లేషకులు భావించారు .దీనిలో వెయ్యి కావ్యాలున్నాయి .అందులో అయిదు దీర్ఘ కావ్యాలు .మిగిలినవన్నీ టంకా పద్యాలతో రాసినవే .’’ట్సురయుకి టోసానిక్కి’’935లో దినచర్యాగ్రంధం అంటే డైరీ రాశాడు .హాస్యం తో యాత్రికుని జీవితాన్ని వర్ణించే రచన ఇది .’’యెంగి షికి’’అనే గ్రంథం రాజ కొలువులో ఉండే నియమాలు ,కార్యకలాపాలు తెలియ జేసే చైనాభాషలో 905-27మధ్య రాయబడిన పుస్తకం .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ 23-1-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆ”పాత ”మధురాలు -8

1-అమెరికాలో ని హ్యూస్టన్ లో నా పూజ మా శ్రీమతి పుట్టినరోజు హడావిడి ,నా చేతిలో మనవడు శ్రీకేత్ ,హ్యూస్టన్  స్పెస్ ,సెంటర్ లో మేమిద్దరం మనవుడు శ్రీకేత్
2-కాలిఫోర్నియా లో ఉయ్యూరు శిష్యుడు చోడవరపు మృత్యుంజయ మూర్తి దంపతల ఇంట్లో మేమిద్దరం
మిచిగాన్ యూ ని వర్సిటీ లో మేమిద్దరం మనవడు శ్రీకేత్ ,ఒకప్పుడు అక్కడ చదివిన మా బావగారి అన్నగారబ్బాయి వేలూరి పవన్ ,రాధ దంపతులు ,వాళ్ళమ్మాయి, అమ్మగారు
 డెట్రాయిట్ దగ్గర మా అమ్మాయి వాళ్ళున్న ట్రాయ్ లో మంచు సొగసు
3-ఫ్లోరిడా లో డాల్ఫీన్ షో లో మేమిద్దరం
  ఉయ్యూరులో మా మనవడు చరణ్ ,మనవరాలు రమ్య లతో మేమిద్దరం ,బోసినవ్వుల చిన్నారి చరణ్
4-మా అత్త(అక్క )గారు శ్రీమతి పద్మావతి ,మనవడు
  మా పెద్దక్కయ్య శ్రీమతి లోపాముద్ర ,చిన్నక్కయ్య శ్రీమతి దుర్గ ,మా శ్రీమతి ప్రభావతి
  మద్రాస్ లో మా అక్కయ్య గారింట్లో మా పెద్దక్కయ్య శ్రీమతి లోపాముద్ర ,ఒడిలో మనవుడు శ్రీకేత్ ,పెద్ద మేనకోడలు శ్రీమతి కళ ,భర్త శ్రీ చంద్ర శేఖర్ ,వాళ్ళబ్బాయి అరుణ్ బాలాజీ ,మా మేనళ్లుడుశ్రీనివాస్ లతో నేను
5-మాఅమ్మాయి శ్రీమతి విజయలక్ష్మి ,అల్లుడు శ్రీ అవధాని ,మనవళ్ళు శ్రీకేత్ ,ఆశుతోష్ ,పీయూష్
  తండ్రితో పిల్లలు ముగ్గురూ
  మా అమ్మాయి,అల్లుడు మా పెద్దకోడలు శ్రీమతి సమత,,పిల్లలు
6-మా ఇంట్లో మా పెద్దమేనల్లుడు అశోక్
  మా అమ్మాయి ,అల్లుడు
  మా అమ్మాయికి ఒడిలో చలిమిడి .
  మా శ్రీమతి స్నేహితురాలు శ్రీమతి భవానిగారు మాఇంట్లో
 మీ -గబ్బిట  దుర్గాప్రసాద్ -22-1-20-ఉయ్యూరు
Posted in ఆ''పాత''మధురాలు | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 10-  ఐరిష్ సాహిత్యం -1

ప్రపంచ దేశాల సారస్వతం

10-  ఐరిష్ సాహిత్యం -1

ఐర్లాండ్ దేశం లో ఐరిష్ ,లాటిన్ ఇంగ్లిష్ భాషలలో వచ్చిన సాహిత్యమే ఐరిష్ సాహిత్యం .పశ్చిమ యూరప్ లో గ్రీకు లాటిన్ లతర్వాత  చాలాప్రాచీనభాష ఐరిష్ భాష .5వ శతాబ్దిలో క్రైస్తవం వచ్చాక బాగా వ్యాప్తి చెందింది .అంతకు ముందు చాలాసరళమైన ‘’ఒఘన్ ‘’భాష శాసనాలలో ఉండేది .లాటిన్ భాషప్రవేశించాక లాటిన్ వర్ణక్రమం అమలులోకి వచ్చి కొంత సాహిత్యం వచ్చింది .ఐరిష్ సాహిత్యం లో మొదటి రచనలు  వచన గాధలకు గేయాలుగా వచ్చాయి .6వ శతాబ్దం లో ప్రకృతిపైకవిత్వ రచన ప్రారంభమై ఒక్కోసారి ‘’ఇల్ల్యూమినేటేడ్ వ్రాతప్రతుల మార్జిన్ లలో రాయబడేవి .9వ శతాబ్దిలో ప్రారంభమైన .’’డి బ్లాక్ బర్డ్ ఆఫ్ బెల్ఫాస్ట్ లో’’ను చూసి ప్రభావితమై జాన్ మాంటేగ్,జాన్ హివిట్ ,సీమాస్ హార్నే,క్లారాన్ కార్సన్ ,ధామస్ కిన్సేల్లా మొదలైనవారు కవిత్వం రాయగా,ఆధునిక ఐరిష్ భాషలో టోమాస్ఓ ఫ్లాయిన్ కవిత్వం రాశాడు .

  9వ శతాబ్దిలో లాటిన్ భాషలో వచ్చిన ‘’బుక్ ఆఫ్ ఆర్మఘ్ ‘’అనే సచిత్ర వ్రాతప్రతి సెయింట్ పాట్రిక్ ,మొదలైన పాతతరం రచయితలు  పాత ఐరిష్ భాషలో రాసిన దానికి పూర్తి మేలు ప్రతిగా వచ్చింది .ఇదే అతిప్రాచీన వ్రాతప్రతిగా గుర్తింపుపొందిన న్యు టేస్టమేంట్ .దీన్ని845లో చనిపోయిన ఫెర్దోమ్నాక్ ఆర్మఘ్ రాసినట్లు చెబుతారు.ఇందులోని మొదటిభాగాన్ని ఆయన 807-08లో రాశాడని ,తర్వాత వారసులు పూర్తి చేశారని ఇదే ఆర్చిబిషప్ ఆఫ్ ఆర్మాఘ్ ఆఫీసు లో ఉన్నదని తెలుస్తోంది .

   431-1540కాలం లో ‘’యాన్నల్స్ ఆఫ్ అల్స్తర్స్’’ ఇప్పటి ఉత్తర ఐర్లాండ్ గా పిలువబడే ప్రాంతంలో వచ్చిందని ,15వ శతాబ్దిలో రువాల్ద్రి ఓలూనిన్ తనరాజు కాధాయ్ఒఘ్మాఘ్ మాగ్నూసా ప్రాపకంలో  రాశాడని ఇది బెల్లి ఐల్ ఆన్ లో యెర్నే లో రచి౦ప  బడిందని అంటారు 12వ శతాబ్దిలో వచ్చిన ‘’ఉస్టర్ సైకిల్ ‘’రచన లో మధ్యయుగ ఐరిష్ హీరోల వీరోచిత గాధలున్నాయని ,తూర్పు ఉల్ల స్టర్లోని ఆర్మాఘ్ ,దౌన్ ,లౌత్ ప్రాంతాల సంఘటనలు చరిత్ర కధలు గా ఉన్నాయని ఇవి ఓల్డ్ మిడిల్ ,మిడిల్ ఐరిష్ భాషలలో రాయబడినాయని అంటారు .ఇవి వచనంలో ఎనిమిదేసి లైన్ల రూపం లో ఉంటాయి .ఇది 8వ శతాబ్దిభాష .వీటిలోని కధలు కవిత్వ విషయాలు 7వ శతాబ్దికి చెందినవి .

  ఓల్డ్ ఐరిష్ పీరియడ్ తర్వాత రినైసన్స్ కాలంలో ఐరిష్ కవులుతమస్వంత భాషలో క్లాసిక్ రచనలు విస్తృతంగా చేశారు  12వ శతాబ్దికి శైలి లో గొప్ప మార్పు వచ్చి,17వ శతాబ్దిదాకా పెద్దగా మార్పు లేకుండా రచనలు వచ్చాయి .మధ్యయుగ ఐరిష్ రచయితలూ లాటిన్ భాషలో రాశారు .దీన్ని హిబర్నో లాటిన్ అంటారు .గ్రీకు ,హీబ్రూ అన్యభాషాపదాలు బాగా వచ్చి చేరాయి.ఇదే భాష మధ్యయు గాలలో యూరప్ అంతటా ఉండేది .

  క్లాసికల్ ఐరిష్ గా ఇంగ్లిష్ వచ్చాక ,వైవిధ్యమైన కవిత్వభాష ఏర్పడి బోధనాభాషగా ఐర్లాండ్ స్కాట్లాండ్ లలో అమలైంది .దీని ఫలితంగా చరిత్ర ,న్యాయం ,సాహిత్యం లో రచనలు జరిగి పోషకుల చేత ఆదరణపొందటం  జరిగింది  .ఇప్పుడు వచ్చినాదంతా  పాట్రన్స్ ను వాళ్ళ కుటుంబాలను పొగిడే సాహిత్యమే వచ్చింది .కాని దీనికి విరుద్ధంగా  గోఫ్రేడ్ఫలాన్ ఓ డలాఘ్  ,తేదింగ్ ఓగ్ ఓహుగినా యూనోక్లైద్ ఓ హింగూసాలు  14,15,16శతాబ్దాలలో తమ ప్రత్యేకత చాటుకొని అద్భుత కవితా సృష్టి చేశారు .ప్రతి ఉన్నతకుటుంబానికివారి మూలాలు వంశ కర్తల చరిత్రలు మహాకవులతో రాయించి భద్రపరచారు. కవులతో బొర్దిక్  స్కూళ్ళల్లో పాఠాలు చెప్పించారు .ఈఅనువంశ రాజరిక వ్యవస్థలో ప్రత్యేక నైపుణ్యం మేధస్సు ఉన్న కవులు హెచ్చుగా పోషి౦పబడ్డారు .వీరికి ప్రాచీన మాజిక్ పవర్స్ కూడా ఉండేవని నమ్మకం .

   సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -21-1-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

పీఠికాపుర పీఠాధి పతి -ఉమర్ ఆలీషా కవి

పీఠికాపుర పీఠాధి పతి -ఉమర్ ఆలీషా కవి నేను రాసిన ”సిద్ధయోగిపుంగవులు ”పుస్తకం లోని ” పీఠికాపుర పీఠాధి పతి -ఉమర్ ఆలీషా కవి ”ఆర్టికల్ ను జనవరి గురు సాయి స్థాన్ లో ప్రచురితమైంది   

Posted in సేకరణలు | Tagged | Leave a comment

ఆ”పాత”మధురాలు -7 2001 జూన్ 19 ,20,21 తేదీల నా డైరీ ముఖ్యవిషయాలు-జంధ్యాల మరణం ,జానకిజాని గారి ఉత్తరం,వారితో ఫోటో

ఆ”పాత”మధురాలు -7

2001 జూన్ 19 ,20,21 తేదీల నా డైరీ ముఖ్యవిషయాలు-జంధ్యాల మరణం

 ,జానకిజాని గారి ఉత్తరం,వారితో ఫోటో

Posted in ఆ''పాత''మధురాలు | Tagged | Leave a comment

ఆ ”పాత ”మధురాలు 06

ఆ ”పాత ”మధురాలు -61-మా పెద్దబ్బాయి శాస్త్రి కోడలు సమత,సమంత చేతిలో మా మనవడు చరణ్    మా పాత పెంకుటిల్లు ఎక్కిన మా పెద్దమనవడు (శాస్త్రి కొడుకు )సంకల్ప్  
   అన్నదమ్ములు సంకల్ప్ భువన్ 2-శాస్త్రి సమత,సంకల్ప్   భువన్ పుట్టినరోజు పండుగవేడుక 3-మా రెండవ అబ్బాయి శర్మ కోడలు ఇందిర,మనవడు హర్ష ,మనవరాలు హర్షిత    శర్మ ఇంట్లో కోడాలుపూజ     కేరింతలభువన్ 4-మా మూడవ అబ్బాయి మూర్తి కోడలు రాణి ,మనవడు చరణ్ ,మనవరాలు రమ్య   నా ఒడిలో మనవడు చరణ్ 5-మాఇంట్లో మా అమ్మాయి విజ్జి అల్లుడు అవధాని వియ్యంకుడు శ్రీ కేఎస్ శాస్త్రి గారు వియ్యపురాలు శ్రీమతి సూర్యకుమారి గారు   మద్రాస్ లో మా అక్క శ్రీమతి లోపాముద్ర గారింట్లో నేను మా అమ్మాయి విజ్జి మనవడు శ్రీకేత్ అక్కయ్య లోపాముద్ర ,మేనకోడలు కళ ,కళభర్త చంద్రశేఖర్  మొదటి అమెరికా ప్రయాణం హూస్టన్ లో నా సంధ్య పూజా వగైరా 

Posted in రచనలు | Tagged | Leave a comment

9-స్కాటిష్ సాహిత్యం

9-స్కాటిష్ సాహిత్యం

స్కాట్ లాండ్ దేశం లో స్కాటిష్ ప్రజల చేత రచి౦ప బడినదేదే స్కాటిష్ సాహిత్యం .ఇది ఇంగ్లిష్ ,స్కాతిక్ గేతిక్,స్కాట్స్ ,బ్రితోనిక్,ఫ్రెంచ్ ,లాటిన్ ,నార్మ్ మొదలైన స్కాట్ లాండ్ సరిహద్దులలో ఉన్న భాషలలో రాయబడిన సాహిత్యం .ఇవాళ స్కాట్ లాండ్ గా పిలువబడుతున్న దేశం లో మొట్టమొదట బ్రితోనిక్ భాషలో 6 వ శతాబ్దం లో వేల్శిష్ సాహిత్యం గా పుట్టింది .తర్వాతి శతాబ్దాలలో కేధలిక్ చర్చి ప్రభావంతో లాటిన్ భాషలో తర్వాత ఆంగ్లియన్  సెటిలర్స్ తెచ్చిన ఓల్డ్ ఇంగ్లిష్ లో సాహిత్యం వర్ధిల్లింది .స్కాట్ లాండ్ లో ఆల్బా రాష్ట్రం అభి వృద్ధి అయ్యాక 8వ శతాబ్ది నుంచి గేతిక్,లాటిన్ భాషలలో సాహిత్యంపుస్తకాలుగా విపరీతంగా ఐర్లాండ్ మొదలైన చోట్లలాగా  ఏర్పడింది .13వ శతాబ్దిలో డేవిడియన్ విప్లవం తర్వాత ,ఫ్రెంచ్ భాష సంస్కృతీ ప్రభావం హెచ్చింది .అదే కాలం లో స్కాండి నేవియన్ సెటిల్ మెంట్ లో నార్సే సాహిత్యం వ్యాప్తి చెందింది .స్కాట్లాండ్ దేశం లో మొదటి గ్రంథంగా గుర్తింపబడింది 14వ శతాబ్దిలో జాన్ బార్బర్ రాసిన ‘’బ్రస్’’అనే ఎపిక్ .దీనితర్వాత వ్యావహారిక భాషలలో వరుసగా చాలా వచ్చాయి .వీటి తర్వాత 15వ శతాబ్దిలో వచన రచనలు ఎక్కువ వచ్చాయి .

   ఆధునికకాల ప్రారంభం లో రాజ కుటుంబాల పోషణలో కవిత్వం ,డ్రామా బాగా వ్యాప్తి చెందాయి .ఐదవ జేమ్స్ రాజు ఆస్థానం లో మౌ౦ ట్స్ కు చెందిన సర్ డేవిడ్ లిండ్సే’’ది త్రీ  ఎస్టసిస్  ‘’వచ్చింది .16వ శతాబ్ది చివరలో ఆరవ జేమ్స్ రాజు స్కాటిష్ కవుల సంగీతకారుల పాలిటి కల్ప వృక్షం అయ్యాడు .ఈ బృందాన్ని ‘’కాస్టాలియన్ బాండ్ ‘’అంటారు .1603లో సింహాసనం ఎక్కాక చాలామంది ఆస్థాన గౌరవం పొందారు కాని కవిత్వం సన్నబడింది .17వ శతాబ్దిలో 1707లో ఇంగ్లాండ్ తో యూనియన్ అయ్యాక అల్లాన్ రామ్సే ,జేమ్స్ మాక్ ఫెర్సన్ లు ప్రముఖులయ్యారు .మాక్ ఫెర్సన్ ‘’ఒస్సియన్ సైకిల్ ‘’మొదటి స్కాటిష్  కవిగా అంతర్జాతీయ గుర్తింపు పొందాడు .ఇతని ప్రభావం రాబర్ట్ బర్న్స్ పై తీవ్రంగా పడి,జాతీయ కవి అయ్యాడు .వేవర్లి, నవలలు రాసిన సర్ వాల్టర్ స్కాట్ 19వ శతాబ్దిలో స్కాటిష్ అస్తిత్వానికి పట్టాభి షేకం చేశాడు తన రచనలద్వారా .ఇతని టాలిస్మన్ రాబ్ రాయ్ ,దిపైరేట్,ఇవాన్ హో,దిబ్లాక్ డ్వార్ఫ్ మొదలైన నవలలు సుప్రసిద్ధమైనవి  .విక్టోరియా శకం చివర్లో రాబర్ట్ లూయీ స్టీవెన్సన్ ,ఆర్ధర్ కోనాన్ డోయేల్ ,జే.ఏం బారిస్ ,జార్జి మాక్ డోనాల్డ్ వంటి చాలామంది స్కాట్ లాండ్ రచయితలు  ప్రపంచప్రసిద్ది పొందారు  .

   20వ శతాబ్దిలో రినైసేన్స్ ఇక్కడా వచ్చి స్కాటిష్ రినైసేన్స్ గా ప్రచారమైంది .హాగ్ మాక్ డయార్మిడ్ స్కాటిష్ భాషను స్కాటిష్ సాహిత్యానికి తీవ్రమైనదిగా భావించి రాశాడు .యుద్ధానంతర కవులలో ఎడ్విన్ మోర్గాన్ ,మొదటి స్కాట్ మకార్ ను 2004లో స్కాటిష్ ప్రభుత్వాన్ని ఏర్పరచి నెలకొల్పాడు .1980తర్వాత సాహిత్యం లో రెండవ రివైవల్ వచ్చి ,జేమ్స్ కేల్మాన్ ,ఇర్వీన్ వెల్ష్ ,కరోల్ ఆన్ డుఫీవంటి స్కాటిష్ కవులు ప్రధాన పాత్ర పోషించారు .

  ఇంగ్లాండ్ లోని స్కాటిష్ నాటకకర్తలు  కేధరీన్ ట్రాటర్ ‘’ఫాటల్ ఫ్రెండ్ షిప్’’ ,ది కామెడి లవ్ ఎట్ లాస్ ‘’హిస్టరీ ఆఫ్ రివల్యూషన్ ఇన్ స్వీడెన్ నాటకాలు ,డేవిడ్ క్రాఫోర్డ్ రాసిన ‘’  రెస్టోరేషన్   కామెడీస్ ‘’లవ్ ఆఫ్ ఫస్ట్ సైట్ మొదలైనవి బాగాఆదరం పొందాయి .జోనాన్న బెయిలీ మహిళా నాటకకర్త .క్లోసేట్ డ్రామాలు కూడా అభి వృద్ధి చెందాయి .నాటకశాలలు 1760లో వచ్చి నాటకాలకు మంచి ఊపు వచ్చింది .అమెత్యూర్ కంపెనీలు వచ్చినా నిలబడ లేకపోయాయి .గ్లాస్గోలో పుట్టిన కరోల్ ఆన్ డుఫీ 2009లో మొదటి మహిళా ఆస్థాన కవయిత్రిగా’’ గే పోయెట్ ‘’గా  రికార్డ్ సృష్టించింది ‘

 స్కాటిష్ సాహిత్యం లో మొదటి నోబెల్ బహుమానం -1901లో సల్లీ ప్రూధోమ్ కు కవిత్వం లో వచ్చింది .తర్వాత ఎవరికీ వచ్చినట్లు లేదు .

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -20-1-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment