గాంధీజీ –ఆధునికత -6(చివరిభాగం ) కాపిటలిజం పై విమర్శ

గాంధీ కోరాడు .మొదటిది దోపిడీకి  సంబంది౦చి౦ది..అధిక వస్తూత్పత్తి పై నాలుగు వాదాలున్నాయి .1-అధిక వస్తూత్పత్తి శ్రామికులను నిర్లక్ష్యం చేస్తుంది 2-మార్కెట్ మీద ఆధారపడుతు౦ది కనుక .మార్కెట్ లేనిదే అస్తిత్వం ఉండదు .అవసరమైనవారికి సరఫరా జరగదు 3-అధికోత్పత్తి అంటేమెషిన్ పై,అధికోత్పత్తిపై   గుత్తాధిపత్యం .ఉత్పత్తి పరిశ్రమల యాజమాన్యం చేతిలోనే బందీ అవటం 4-అధికోత్పత్తి వినియోగదారులను ,ఉత్పత్తి ధోరణి లకు అలవాటు పడేట్లు చేస్తుంది .దీనితో తప్పుడు అవసరాలకు ఉత్పత్తి జరగుతుంది . .ఈనాలుగు విషయాలు ఆయన 1934లోనే చెప్పాడు .వీటిని జాగ్రత్తగా గమనిస్తే అదంతా కాపిటలిజం పై విమర్శ ఆనే అనిపిస్తుంది .1930కాలం లో ఆయన ఎప్పుడూ నిరుద్యోగం ,,ఈ సమస్యను తీర్చటానికి పటిష్టమైన ఎకానమీ అవసరం పైనే మాట్లాడాడు .నిరుద్యోగతవల్ల ,అనుత్పత్తి వల్లా వచ్చే సాంఘికపరిణామాలు  ఆయన ఊహించాడు .కనుక ప్రతి వ్యక్తీ తనను తాను  పోషించుకొనే పని చేయటానికి తగిన అవకాశాలు కలిపించాలని గట్టిగా కోరాడు .

image.png

 కనుక ఆయన ఆధునికతను వ్యతిరేకించాడు అంటే కాపిటలిజం ను వ్యతిరేకి౦చాడనే భావం .దీనిపై స్పందించాల్సిన అవసరం అత్యాధునిక సమాజం పై ఉందని అర్ధం .కాపిటలిజం పై వ్యతిరేకత అంటే సమాజాన్ని రెచ్చగొట్టటం కాని ,అంతకుముందున్న స్థితికి తీసుకు వెళ్ళటం కానీ కాదు .నిజాన్నిఅంటే వాస్తవాన్ని  ఎప్పటికప్పుడు ఆయన గుర్తించాడు  .కనుక పరిస్థితిని మార్చాలని కోరాడు .దీనికోసం ఆయన ఆడర్శదామం అంటే ‘’యుటోపియ’’మనము౦౦దు౦ చాడు .అదే స్వయం పాలన అనే ఆదర్శం .దీని ఉద్దేశ్యాన్ని తరచుగా ఆయన చెప్పేవాడు .ఆదర్శం ఒక దారి చూపే వెలుగు( బీకాన్ )  ,వేలుపెట్టి పొడిచి నడిపిస్తూ  పరిపూర్ణ స్థితికి చేరుస్తుంది  .ఈ మార్గంలో ఆధునికత ఆకారం మారుస్తూ ,కాపిటలిజాన్ని మచ్చిక చేస్తూ సాగాలి .ఈ సూత్రాలు ఆధునికతకు లోపల బయటా అమలుజరగాలి .ఒకసారి ఆయన భావాలను పునశ్చరణ చేస్తే –1యంత్రం మానవ శ్రమ కు ప్రత్యామ్నాయం కారాదు 2-యంత్రాలు అవసరమే కాని దేశం అధీనం లో ఉండాలి 3-సంపద ట్రస్టీ షిప్ అధీనం లో  ఉంటె వ్యక్తిగత ఆస్థి ఉండక దోపిడీనివారింపబడుతుంది .దేశం అధీనం లో ఉండటం అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వాధీనం లో అని.ప్రైవేట్ ట్రస్టీ షిప్ అంటే నాగరక   సమాజం అని ఆయన అభిప్రాయం .4-మరొక ముఖ్యసూత్రం సాధారణ జీవితం గడపటం .సాధారణ జీవితంలో రెండు విధానాలున్నాయి .ఒకటి దురాశ మన జీవితాలను శాసి౦చ రాదు., మనకు అవసరమైన సదుపాయాలతో బతకటం .కాని దీనికి విధి విదానంకాని బ్లూ ప్రింట్ కాని ఉండదు అన్నాడు.రెండవది సరళీకృత ఉత్పత్తి ,మార్పిడి ,వినిమయం అనేవి స్థానికంగా జరగాలి .స్థానికత అంటే అధికోత్పత్తికాదు . అవసరాలకు తగినంత ఉత్పత్తి .వినియోగం ఆ గ్రామం లోనే జరగాలి .స్థానికత అంటే ఒకప్రదేశం అంటే అన్నీ ఉన్న ఇంగ్లాండ్ లాంటి  చిన్న దేశం అని అర్ధం .

  ఇప్పటిదాకా ఆధునికత కాపిటలిజం లగురించి విస్తృతంగా చర్చించాం .ఇప్పుడు మరో రెండు ముఖ్య విషయాలు అహింస ,సత్యాగ్రహం ఉన్నాయి .ఈ రెండిటిద్వారా సమకాలీన పరిస్థితులకు అనుగుణమైన పౌర సమాజం ఏర్పడాలి .ఆధునికతను అవసరం మేరకు ఉపయోగించుకోవచ్చు .అది పడమటిదేశాలదే, కాలనీయులదే అయి ఉండాల్సిన పని లేదు .అది ‘’మనది’’గా మన ప్రత్యేకతలను కాపాడుతూ విశ్వ జనీనంగా ఉండాలి .శ్రామికులతో కూడిన పరిశ్రమ లు ఉండటమే ‘’మనది’’ అవుతుంది .సాధారణ జీవితం అంటే మన తప్పుల్ని ఒప్పుల్ని  బేరీజు వేసుకొ౦టూ జీవించటమే  .మన లౌకికవాదం అంటే మత సామరస్యమే కాని రాజ్య మతం కాదు ..యూని వర్సలైజేషన్(సార్వ జనీకరణం ) అంటే సమాజాల విచ్చిత్తికాదు .వాటి అస్తిత్వాలనుకాపాడుతూ కలిపి ఉంచేది .ఏదో ఒకటి పెత్తనం చేస్తే అది యూనివర్సలైజేషన్ కాదు.అసలైనది కాపిటలిజాన్ని తుడిచిపెట్టేదిగా ఉండాలి  .ఈ దృక్పధం తో చూస్తే ముసుగులో ఉన్న పెత్తందారీ తనాన్ని మనం ఎదిరించి చేసే  పోరాటాలకు కావలసినంత శక్తి చేకూరుతుంది .

సమాప్తం

 ఆధారం –సుహాస్ పైషికర్ రాసిన వ్యాసం –‘’గాంధి అండ్ మోడర్నిటి’’

 మీ-గబ్బిటదుర్గాప్రసాద్ 23-10-19-ఉయ్యూరు    , ,

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గాంధీజీ –ఆధునికత -5

గాంధీజీ –ఆధునికత -5

రీజన్ ,సైన్స్ లలో దాగి ఉన్న  అవకాశాలను ,యూరప్ దేశాలలో యదార్ధంగా ఈ రెండిటి అమలు ల మధ్య విలక్షణత నుగాంధీజీ  గమనించాడు .ఆధునికులు అని చెప్పుకోనేవాళ్ళు గాంధీని సంప్రదాయ౦ లోకి తోసేస్తే ,,నయా ఆధునికత వ్యతిరేకులు ఆయనను ఆధునికతను మొత్తం అపహాస్యం చేస్తున్నాడని ముద్ర వేయటానికి ఉవ్విళ్ళూ రారు . ఇటీవలి విశ్లేషకుడు జావేద్ ఆలం ‘’ఒకే ఒక పాతుకు పోయిన ఆధునికత తప్ప మిగిలిన ఆధునికతలు పూర్తిగా అన్వేషణ చేయబడలేదు ‘’అని చెప్పాడు .కనుక పాశ్చాత్య ఆధునికత పై విమర్శ ఆధునికత కు పూర్తిగా లేక ప్రత్యేకంగా చెప్పబడింది కాదని గ్రహించాలి .ఆధునిక రీజన్ ,సైన్స్ ల  కార్యక్రమాలు  గట్టిగా నియంత్రణలో ఉండే సిద్ధాంతాలపై పని చేయాలని చెప్పాడుగాంధి .ఇవి సంప్రదాయం నుంచి పుట్టినవికావు .అవి మానవులమంచి   కోసం  యేర్పడినవిమాత్రమే .ఒక సిద్ధాంతం ,లేక కార్యం మంచిది అంటే అది మానవుల మంచితో సంబంధం కలిగి ఉండాలి .అదే హ్యూమన్ గుడ్ అన్నాడు .ఆమంచి సకలమానవాళికి మంచిది   కావాలని ఆరాట పడ్డాడు మహాత్ముడు .ఈమానవీయ కోణమే గాంధీ సైన్స్, రీజన్ లకు తప్పక ఉండాలని కోరాడు .

  ఆధునికత పై ఈవిమర్శ సంప్రదాయం –ఆధునికత లపై ఉన్న దురభిప్రాయాన్ని బైపాస్ చేస్తుంది అంటే తొలగిస్తుంది  .ఇది మానవ అస్తిత్వ హక్కుకు వేదిక అవుతుంది .గాంధీజీ సంప్రదాయం ,సంప్రదాయ సమాజం లను గట్టిగా సమర్ది౦చాడని,నమ్మాడని  అంటారు వీళ్ళు .అయన ఈ హక్కు అనే మోడెమ్ తోనే పని చేశాడు .సామూహిక క్షేమం ,అందరి సహకారం తో సాధించే ఆధునికత లో జీవించాలనే ఆయన కోరాడు .మితిమీరిన కోరికలు ఉంటెఅనర్ధ౦  అన్నాడు .పూర్తిగా ఆధునికతతో ,ఆధునికతను ఆధునికత కానిదానితో జతకలిపే ప్రయత్నం చేస్తూ గాంధి జీవించాడు .కనుక ఆయన సంప్రదాయాన్ని చరిత్ర చెత్తలో పారేయకుండా,ఆధునికమానవునికి సంప్రదాయం లో ఉన్న పరిమితి ప్రభావం శ్రేష్టత లను తెలియ జెప్పాడు .అప్పటికే అనుస్యూతంగా వస్తున్నా ,సంప్రదాయం లో ఆధునికత ను  దర్శింప జేసి విజయం సాధించాడు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-10-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బందరు గురుమహారాజ్ –శ్రీపేర్నేటిగంగాధరరావుగారు

బందరు గురుమహారాజ్ –శ్రీపేర్నేటిగంగాధరరావుగారు

నేనుఅడ్డాడహెడ్మాస్టర్గాఉన్నప్పుడుశ్రీపేర్నేటిగంగాధరరావుగారుపామర్రుకునాలుగుకిలోమీటర్లదూరంఅవనిగడ్డదారిలో  మెయిన్రోడ్డుకుఎడంవైపుకొంచెందూరంలోఉన్నజమీదగ్గుమిల్లిహెడ్మాస్టర్గాఉన్నారు .ఆయనకుముందుఅక్కడశ్రీఅ౦జయ్యగారుహెచ్.ఎం  .ఇద్దరూనాకుఆత్మీయమిత్రులే .గంగాధరరావుగారిదిబందరు ,అ౦జయ్యగారిదిచినముత్తేవిదగ్గర  కారకంపాడుగ్రామంమోతుబరిరైతుకూడా . .అ౦జయ్యగారులెక్కలమేష్టారు .రావుగారుసోషల్ .

గంగాధరరావుగారుబహుసౌమ్యులు .అతిసాధారణంగాఉంటారు .మొహమాటస్తులు .విధినిర్వహణలోఅత్యంతచురుకు .గ్రామస్తులసాయంతోదగ్గుమిల్లిహైస్కూల్అభివృద్ధికిచాలాకృషిచేశారు .ఆయనంటేగ్రామస్తులకువిపరీతమైనఅభిమానం .అంజయ్య ,రావుగార్లకుముందుఅక్కడపనిచేస్సినహెడ్లందరూకాలందొర్లించుకువెళ్ళినవారేకానివిద్యార్ధులవిషయంలోస్కూల్అభివృద్ధివిషయంలోఅస్సలుపట్టించుకోలేదు .కనుకఆస్కూల్ఒకపనిష్మెంట్స్కూలనేఅభిప్రాయంఉండేది .అ౦జయ్యగారుకొంతచక్కబరిస్తేరావుగారు  దాన్నికొనసాగించిదగ్గుమిల్లిస్కూల్ను  ఆదర్శవంతంగాతీర్చిదిద్దారు .వనరులసదుపాయంకలిగించారు .ఆస్కూల్లోపనిచేయాలనేకాంక్షఉపాధ్యాయులలోతెచ్చారు .వీరిద్దరివలనఆస్కూల్సర్వతోముఖాభివృద్ధి  చెందింది .అడ్డాడహైస్కూల్లోజరిగేప్రతికార్యక్రమానికి  వారువారిస్టాఫ్వస్తే ,అక్కడజరిగేవాటికినేనూనాస్టాఫ్తప్పకవెళ్ళేవాళ్ళం .కనుకమాస్కూళ్ళకుఆత్మీయబంధుత్వంఏర్పడింది .అ౦జయ్యగారిరిటైర్మెంట్ను ,ఉపాధ్యాయవిద్యార్ధిబృందంగ్రామస్తులుఘనంగానిర్వహించారు. అలాగేరావుగారిపదవీవిరమణనూచిరస్మరణీయంగాచేసిఋణంతీర్చుకున్నారు .అ౦జయ్యగారుసరదామనిషిజోకులుపేలుస్తూమాట్లాడితేరావుగారుగారుపరమప్రశా౦తమూర్తిగాఉండేవారు .

గంగాధరరావుగారికిసాహిత్యప్రవేశంబాగాఉంది .ఎప్పుడూఏదోఒకఉపయుక్తగ్రంథంరాసిప్రచురించేవారు .రిటైరయ్యాకఈవ్యాపకంబాగాహెచ్చిజీవితాన్నిసార్ధకంచేసుకొంటున్నారు .వారిపుస్తకాలునాకుపంపిస్తేమనసరసభారతిపుస్తకాలువారికిపంపటంఆ  నాటినుంచిఅలవాటు .వారుచేతలమనిషేతప్పమాటలవారుకాదు .పనియేదైవంఅనిభావించేవారు .దగ్గుమిల్లికిరాకపూర్వంనుంచిపరిచయమున్నా ,అక్కడికివచ్చాకమరీదగ్గరయ్యాం .నాకునచ్చినస్నేహితులాయన .ఆయసద్గుణాలపోగు .నెమ్మదిగాసూటిగామాట్లాడటంఆయననైజం .బ్రహ్మకుమారీసమాజంపైవారికిమక్కువఎక్కువ .రాజస్థాన్లోనిమౌంట్యాబుపైజరిగేకార్యక్రమాలకుక్రమ౦తప్పకుండావెళ్ళేవారు .కనిపించినప్పుడుఆవిశేషాలుతెలిపెవారు .నాకూవెళ్ళాలనేఉ౦డేదికానిఎప్పుడూసాహసించలేదు .ఆసమాజంపైనాకుఅవగాహనాలేకపోవటంఒకకారణం .రిటైరయ్యాకబందరులోసెటిల్అయిస్వగృహంఏర్పరచుకొనితమఆధ్యాత్మిక ,సాహితీవ్యాసంగాన్నికొనసాగిస్తున్నారు  . పుంఖానుపుంఖాలుగాపుస్తకాలురాసిప్రచురిస్తున్నారు. అవిసమాజానికి ,వ్యక్తివికాసానికి  ఆధ్యాత్మికవికసనానికి  దోహదపడేవి .

ఈనెల 10 వతేదీశుక్రవారంగంగాధరరావుగారుతాజాగాపంపిన 1-వజ్రకాయం (మూలకణ౦ )అనేయోగరహస్యాలపుస్తకం 2-శ్రీలలితాసహస్రనామాలకుస్వర్గీయశ్రీమల్లాప్రగడశ్రీరంగారావుగారివ్యాఖ్యానానికిరావుగారురాసినసులభవ్యాఖ్యానంఅందాయి .ఈపుస్తకాలపేర్లువింటేనేవారిలోనిదివ్యత్వం ,ఆధ్యాత్మికమార్గదర్శకత్వంగోచరమౌతాయి .బందరుఆధ్యాత్మికగురుమహారాజ్గానాకువారుకనిపిస్తారు .ఎప్పుడూతెల్లనిపైజమాలాల్చీతో, పైనశాలువాతోస్వచ్చతకుస్వచ్చంగాఉంటారు .వాల్మీకి, వ్యాసులలాగాపొడవైనగుబురుతెల్లగడ్డంతోదర్శనమిస్తారు .కనుకవారినిగురుమహరాజ్అన్నాను .

ఒక్కసారివారురాసినగ్రందాలవివరాలు  తెలుసుకొనివారివిద్వత్ఎట్టిదోగ్రహిద్దాం .1-ఆత్మదర్శనం  3భాగాలుగారాశారు. రెండవదానికిఆత్మికవిజ్ఞానశాస్త్రంఅనిమూడవభాగానికిమృత్యుంజయుడుఅనిసార్ధకనామకరణంచేశారు .అత్యంతగహనమైనవిషయాలనుఅరటిపండువొలిచిచేతిలోపెట్టినట్లుసరళసులభంగాసాగినఆధ్యాత్మికత్రివేణిఇది .4 క్షీరసాగరమధనం 5  కామవేదం  ముక్తికిమార్గం 6-ఆధ్యాత్మికరత్నాలు 7-మోడల్పార్లమెంట్ 8-Think it over HOW to become Success ful in Life 9-అష్టోత్తరశతసుందరకాండ 10-యోగవాసిస్టసారం –వచనం 11-ఆరోగ్యసూత్రాలు –యోగమార్గాలు 12-సర్వయోగసమన్వయముమరియుసీక్రెట్డాక్ట్రిన్13-బ్రహ్మజ్ఞానము (దృక్కుదృశ్యమువివేకము )14-వివేకచూడామణి 15-ఫేస్బుక్ (యోగసారం ).పైనచెప్పినరెండిటితోకలిపి 17 అపూర్వగ్రంథాలురాశారన్నమాట .

ఇలాంటిగ్రంథాలురాయాలంటేయెంతఆలోచన ,పరిశీలనపరిశోధన ,అనుసరణ ,అభిరుచిఅనుభవం, కావాలోమనకుఅర్ధమౌతుంది .ఇదంతా ఆగంగాధరునిజ్ఞాన ‘’గంగ’’ అనిపిస్తుందినాకు .అలాంటి ‘’మనీషి’’ బందరులోఉన్నారంటేఆపురజనులభాగ్యమేభాగ్యం .ఆయనతనపనేదోతానుచేసుకొంటూపోయేమనీషి .డాబు ,దర్ప౦ ,పటాటోపంఎక్స్పోజింగ్ లేని వారు . సాహిత్యసభలకుతప్పకహాజరౌతారు.శ్రద్ధగావింటారు .స్టేజిపైకిఎప్పుడూరాగానేనుచూడలేదు .వారివిద్వత్తుఅక్కడివారుగ్రహించారోలేదోనాకుతెలియదు .వారినిపిలిచిఎక్కడాసన్మానించినదాఖలాలునాకుపేపర్ ద్వా రాతెలియదు .చేసిఉంటెసంతోషం .చేయకపోతేప్రయత్నించమనికోరిక .ఇంతటిసౌజన్యసహృదయమూర్తినాకుపరమఆత్మీయమిత్రులైనారంటేఅదినాఅదృష్టంగాభావిస్తూ ,వారుమంచిఆరోగ్యంతో  మరిన్నిగ్రంథరచనలుచేయమనికోరుతున్నాను .వారినిపరిచయంచేసేభాగ్యంకలిగినందుకుగర్విస్తున్నాను .

శ్రావణమాసశుభాకాంక్షలతో

మీ –గబ్బిటదుర్గాప్రసాద్ -12-8-18 –ఉయ్యూరు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

గాంధీజీ –ఆధునికత -4

గాంధీజీ –ఆధునికత -4

గాంధీ హేతువు ,సైన్స్ లపై ఆధారమైన వాటిని నమ్మలేదు .అవి కొంతవరకే దారి చూపిస్తాయికాని పూర్తిగా కాదు అన్నాడు  .ఈ రెండిటి వలన నైతికత ,మానవీయ గుణాలు  దెబ్బతింటాయనిభావించాడు .ఆయుధాలన్నీ హేతువు, సైన్స్ జన్యాలే ,ఫలితాలే .సామూహిక హననం చేసే ఆయుధాలు అనైతికం .ఆయన దృష్టిలో నైతికత ఆధి భౌతికం(మెటాఫిజికల్ )కాదు.అది మానవ శ్రేయస్సుతో ముడి పడి ఉంటుం..కనుక ఈ రెండు బలసంపంన్నుడి,దోపిడీ దారుకు చెందినవి .కాలనీ ప్రభుత్వ అణచి వేత విదాన్నాలపై ఆయన ప్రతి స్పందనా వీటి చెడ్డాను గురించే ఉండేది .పరిమితి లేని వీటి ఉపయోగం వినాశహేతువే  అవుతుంది .భౌతిక, బౌద్ధిక ఆలోచన,ఆయుధం అణచి వేతకు దారి చూపిస్తాయి.అప్పుడు మనిషి బానిస ఔతాడు .అంటే ఆయన ఉద్దేశ్యం లో ఎవరి కో లాభం చేకూర్చే వాటిలో తనప్రమేయంలేకుండా బందీ అయి బానిసలా జీవిస్తాడు .అమానవీయత సైన్స్ హేతువు లచేతిలో ఆయుధమౌతుంది .కనుక ఈ రెండిటి విషయం లో ఆయన పాశ్చాత్య సైన్స్ ,రీజన్ ల దుష్ప్రభావం పైనే గురిపెట్టి మాట్లాడాడు .అంతమాత్రాన ఆయన మానవ ఉన్నతి అభి వృద్ధికి సైన్స్,  ,హేతుబద్ధత ల పాత్ర లను  తిరస్కరించలేదు . తరచుగా ఆయన ప్రయోగం ,అనుభవాలను గురించే చెప్పాడు .ఆరోగ్యం ,మందులు విషయం లో సైన్స్ ప్రయోగాలను ఆహ్వానించాడు .అలాగే రాజకీయ విధానం లో చర్చలకు ప్రాదాన్యమిచ్చాడు .ప్రతి విషయం మీద ఆయన రెండు విధానాలు అవలంబించాడు .ఒకటి బహిరంగంగా చర్చించటం ,రెండు అవతలి వారితో సంభాషణ ..ఈ డిబేట్ ,డైలాగ్ లు తార్కికత ,ఆలోచనలనే ,నిర్దుష్ట ఛట్రంలో జరగాలని కోరాడు.ప్రత్యక్షైక వాద౦ (పాజిటి విస్ట్  రీజనింగ్ ) కు దీనిపై పెత్తనాన్ని నిరసించాడు .సైన్స్ పరిశ్రమలను ఆయన పూర్తిగా వ్యతిరేకించలేదు .సహజ విషయాలు (నేచురల్ ఫి  నామినా )కు హడ్డులు౦టాయని ఆయనకు తెలుసు .కాని మానవ వనరులను వీటికి ఉపయోగించాలన్నది ఆయన అభిప్రాయం .లేకపోతే ఆయన సత్యాన్వేషణకు అర్ధం ఏమిటి ?క్రమబద్దీకరణమైన జ్ఞానమైన సైన్స్ ను ఆయన అంగీకరించాడు .సైంటిఫిక్ డిస్కవరీ విముక్తి హేతువు అవుతుంది .సింగర్ కుట్టు మిషన్ వచ్చిన కొత్తలో అది గృహిణి  చాకిరీనిఎంతబాగా తగ్గించిందో స్పష్టంగా చెప్పి ,స్త్రీలకు అదొక  వరమైంది అన్నాడు 1924లో .కనుక యంత్రం అనవసర శ్రమను తగ్గిస్తుంది .ప్రేమ ఆధారంగా సైన్స్ పని చేస్తే మానవాళికి ముక్తిహేతువే అవుతుంది .ప్రేమ ,కరుణ కలిసి సైన్స్ కు విముక్తికలిగించవచ్చు అంటాడు .ఆధునిక సైన్స్ లాభార్జనే  ధ్యేయంగా నడుస్తోందికనుక అసహ్యి౦చు కొన్నాడు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-9-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బాల ధారణా ధురీణ చి విష్ణు భట్ల కార్తీక్ చే ”గద్య పద్య ధారణా విధానం ;;25-10-19 మచిలీపట్నం

బాల ధారణా ధురీణ చి విష్ణు భట్ల కార్తీక్ చే ”గద్య పద్య ధారణా విధానం ;;25-10-19 మచిలీపట్నం

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

గాంధీజీ –ఆధునికత -3

గాంధీజీ –ఆధునికత -3

వీటికి మించి ఆధునికత అంతమవటం లేక దాన్ని అధిగమించటం పై గాంధీజీ ఎలా చూశాడు ?ఇప్పుడున్న ఆధునికతను వెనక్కి మరల్చగలమా ?యా౦త్రికతపై ఆయన భావాలు సువిదితమే కాని ఒకసారి పునశ్చరణ చేసుకోవటం అవసరం .యంత్రానికి వ్యతిరేకత ,పరిశ్రమలకు వ్యతిరేకత ,యాంత్రికత పై విముఖత ,ఆధునికతపై వ్యతిరేకత మధ్య ఆయనభావాలున్నాయి .వీటిలో ఆయన స్థానం 1-దోపిడీ చేసే యంత్రానని బహిష్కరించటం 2-యంత్రం కోసమే యంత్రం అనవసరం .చాకిరీని రూపు మాపే,మానవాళి అవసరాలకు ఉత్పత్తి చేసే  యంత్రం  అభిలషణీయమే .ఆయన పారిశ్రామికత ,యాంత్రికత లలో కొన్ని తర్కాలను తిరస్కరించాడు .కనుక అన్ని యంత్రాలపై  ,అన్ని యా౦త్రి కతలపై విముఖత ఉన్నట్లుకాదు .ఆధునికతను వెనక్కు మర్చలటం అసాధ్యం అని ఆయనకు తెలుసు .’’మిల్లులు మూసెయ్యాలని మీ ఉద్దేశమా ?’’అని అడిగిన ప్రశ్నకు ఆయన ‘’సువ్యవస్థితమైనది దేనినీ కాదనటం తేలికైన పనికాదు .రైల్వే, హాస్పిటల్స్ వంటి యాంత్రికత ను నాశనం చేయమని నేను కోరను .’’అని స్పష్టంగా చెప్పాడు .నిజానికి ఈ ప్రశ్నలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు .’’అత్య౦త ప్రాధాన్యమైన,పట్టించుకోవాల్సిన  విషయం మనిషి ‘’అని నమ్మాడు  మహాత్ముడు . ఆధునికత తిరోగమనం కంటే,కాలనీ ప్రభుత్వం అందించిన పారిశ్రామీకరణ కంటే దాని రూపాన్నిఅనేక విలువల ఆధారిత చట్ర౦ తో   మార్చటానికి ఆయన కృషి చేశాడు .

   నైతిక విమర్శ

ఇప్పటిదాకా మన వాదం గాంధీ సంప్రదాయవాది కాని ,ప్రమాదకరమైన సంప్రదాయవాది కానికాడు .ఆయనభావాలు అత్యాధునిక వాడది భావాలను సమర్ధిస్తాయా ?ఆయన ఆధునికతలో కొన్ని విషయాలను ,ఆధునికసమాజం అనుసరిస్తున్న కొన్నిటిని వ్యతిరేకించాడు .. ఆధినికతపై  విమర్శకుడు భిక్షూ పరేఖ్.సివిల్ సొసైటీ పై విమర్శకుడు పార్ధ చటర్జీ చెప్పిన విషయాలే ఇవన్నీ . గాంధీ ఆధునికతపై విమర్శ సంప్రదాయం ఆధునికతల మధ్య ఉన్న వైరుధ్యాన్నిభగ్నం చేసింది అని’’  పంధం’’అనే విమర్శకుడు చెప్పాడు .

  సంప్రదాయంతో గాంధీ బాంధవ్యం విచిత్రమైనది, అసాదారణమైనది .సంప్రదాయాన్ని ఆవాహన చేస్తాడు కాని ఆధునికత ను సంప్రదాయవాదిదృష్ట్యా తిరస్కరించడు .ఆధునికతను విమర్శిస్తే ఆయన ఏ విషయాలను కాదంటాడు ?ఆధునికతను ఆయన బయట ఉండిమాత్రమె విమర్శించాడు .ఐతే ఆయన వాదానికి ఆధారమేమిటి ?దీని సమాధానం విమర్శలోనే ఉంటుంది .అత్యాధునిక జ్ఞానోదయ భావనను కారణం,సైన్స్ దృష్ట్యా విపులంగా చర్చించాడు .ఆయన వ్రాతలలో ఈ రెండింటి పరిమితులేమిటో కూడా తెలియ జేశాడు .మొదటగా అవి పూర్తి సత్యాన్ని ఆవిష్కరి౦చ లేవు  .సత్యం అనేది కారణానికి ,సైన్స్  కు అందని రూరంలో ఉంటుంది  .ఈ భావన అనుభవవాదవిమర్శ ,ప్రత్యక్షైక వాద విమర్శకిందకు వస్తుంది .దీనికిసత్యం ఆధారం .సత్ అంటే నిత్యమైనది అనే పదం నుండి సత్యం పదం ఏర్పడింది .ఇంకొంచెం ముందుకు వెళ్లి గాంధీ నైతికత యేసత్యం అన్నాడు .కనుక ఆయన సిద్ధాంతంఅన్నిటినీ కలుపుకొన్న  సంపూర్ణ మైనసిద్ధాంతం   (ఆబ్సల్యూట్ ).ఈ భావన సత్యాన్వేషకుని నిరంతర సాధన అయి ,ఎప్పటికీ పూర్తికానిది అవుతుంది .సంపూర్ణ సత్యం ఆవిష్కారమైతే ,సాపేక్ష సత్యం మన కర్తవ్యానికి మార్గ దర్శనం చేస్తుంది .కానిసాపేక్ష సత్యం బహురూపాలు గా ఒక్కొక్కరికి ఒక్కో రకంగా వేరు వేరుగా అనిపిస్తుంది .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -18-10-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గాంధీజీ –ఆధునికత -2

గాంధీజీ –ఆధునికత -2

సంప్రదాయేతరుడికి ,లేక ఆధునిక వ్యతిరేకికి ఒకదానితో ఒకటి సమంధమున్న రెండు వ్యూహాలు సంప్రదాయ౦పాటించటానికి లేక ఆధునికతలో ఉండటానికి కనిపిస్తాయి .1-మేధోస్థాయిలో ఆధునిక భావజాలం ,విధానాల సంప్రదాయాదిక్యాన్ని గొప్పగా చెప్పుకోవటానికి పనికొస్తుంది .ఆధునికత చట్టబద్ధమైనదని  ,సంప్రదాయం అలాకాదని కనుక అందులోని లోపాలను లక్ష్యపెట్టక గుడ్డిగా అనుకరించటం ,సంప్రదాయం అనుస్యూతంగా వచ్చిందని ,దీనికి సాక్ష్యాలు వగైరాలు అక్కర్లేదని చెప్పచ్చు  ,2-ఆచరణ స్థాయిలో గాంధి  సంప్రదాయం లోని సతీ సహగమనం వంటి మూఢ విశ్వాసాలను వ్యతిరేకించి కొత్త అర్ధాలు చెప్పాడు .ఇవి తాత్కాల వర్తమానానికి ,రెండోది సుదూర భవిష్యత్తుకు చెందినది .మొదటి దానిలో సంప్రదాయ వర్గాలు సంప్రదాయానికి దూరమై ,చట్టబద్ధం కాని ఆధునికతను కోరేవారు .కనుక వీరు దాని స్వయం ప్రతిపత్తిని అడ్డుకొంటారు .కాలం గడిచినకొలది సంప్రదాయ పునాదులపై కొత్తసమాజం నిర్మింప బడాలి ,తప్పక  నిర్మి౦పబడుతుంది అని భావిస్తారు .కాని గాంధి ఈ రెండు వ్యూహాలను ఆచరించలేదు .ఆయనకు కులం ,మతం ,మతవర్గాల పై   ఆసక్తిలేదు . సమాజాన్ని నైతికతగల స్థానిక విభాగాలుగా (యూనిట్స్ ) ఆయనభావించాడు .కనుక ఆదర్శ గ్రామీణ జీవన సౌందర్యాన్ని ఎంచుకొని ‘’ఆశ్రమాలు ‘’నిర్మించి ,సమాజం లో కులం ప్రాధాన్యత తగ్గించాడు .మొదట్లో ఆయన హిందూ సమాజం, కుల వ్యవస్థపై  పై పెద్దగా విమర్శలు చేయలేదు .కాలక్రమం లో దీనికి దూరమై నాడు .కులం పై విమర్శ చేయని దశలో దక్షిణాఫ్రికాలో ఆశ్రమం నిర్మించి అభి వృద్ధి చేశాడు .కనుక సమాజానికి కులం ఆధార భూతం కాదని చెప్పకనే చెప్పాడు .ఇక్కడే గాంధీజీ సంప్రదాయ వాదులకంటే భిన్నంగా గోచరిస్తాడు .

   సంప్రదాయం –అత్యాధునిక నాగరకత

ఇప్పటి ప్రస్తుత సమకాలీన ఆసక్తికర ప్రపంచం లో సంప్రదాయ౦ అత్యధిక వేగంగా ఆత్యాదునికం గా పరివర్తనం చెందింది .అత్యాధునిక ఆలోచన సంప్రదాయం ,సంప్రదాయ విధానాలను గౌరవిస్తుంది .అత్యాదునిక  విధానం  ఆధునికత అంతమైనట్లు భావించటమే కారణం .మరి ఇప్పుడు ఆధునికతను తిరస్కరించాలంటే ,అత్యాదునికతా  తర్వాత తిరస్కరింప బడేదే అవుతుందికదా .ఈ విధానం లో ఆధునిక సంప్రదాయ వాది, దీనికి కజిన్ అయిన  అత్యంత ప్రీతికరమైన అత్యాదునికత  సిద్దా౦త  రీత్యా తప్పక బంధుత్వం  నెరపాల్సిందే  .ఈరెండూ  గాంధీ నుంచే బలం ,శక్తి పొందాయని తెలుసుకోవాల్సిందే .గాంధి ఆ అభిప్రాయవాది అని నమ్మాల్సిందే .కాని గాంధి ఎప్పుడూ అత్యాధునిక ప్రపంచ భావన కలిగి లేడు.కాని ఆయన విశ్వ ప్రేమ ,విశ్వ మానవ సౌభాగ్యం ,విశ్వ సంస్కృతీ, విశాల విదానాలను ఉత్తమ విలువలను  నమ్మినవాడు .ఆయన సూచనలు ప్రత్యేక సంస్కృతికి చెందినవికాని భారతీయ  లేక పాశ్చాత్య సంస్కృతికి చెందినవి కానీ కానే కావు  .వీటికి అతీతమైనవి .ఆయన దృష్టిలో మానవ ప్రకృతి సాపేక్షమైనదికాదు.అందుకే ఆయన భావాలు సత్యాహింసల విలువలపై ఏర్పడి విశ్వభావనలనిపించాయి .బ్రిటిష్ ఇండియాలోకూడా ఇండియాలో పేదలు ,మాస్ అనే సామాన్య ప్రజానీకం ,ప్రజలు అనే వర్గాలు ఉండాల్సిందే అన్నాడు .కాని భిన్న సమాజాలను ఒప్పుకోలేదు .ప్రాతినిధ్య హక్కు కావాలని కోరటమూ ఆయన  విశ్వభావనలో భాగమే .ప్రజల జాతీయ భావన దేశీయ ఉద్యమలో ప్రాతినిధ్యం వహిస్తు౦దన్నాడు .

  అందుకే భారత జాతీయ కాంగ్రెస్ జాతీయ వాదులకు ప్రాతినిధ్యం వహించి ప్రజాభిమానం పొందింది .గాంధీ ప్రాతినిధ్య భావనలను ఆయన వ్యతిరేకులైన జిన్నా ,అంబేద్కర్ లు మాత్రమేకాక స్వాతంత్ర్యానంతర చరిత్రకారులు విద్యావేత్తలు లు కూడా  వ్యతిరేకించారు .ఆయన భావన వలన ఇండియాలోని వివిధ బృందాల, సంఘాల ఆశలపై నీళ్ళు  చల్లిందని విమర్శించారు .ఇలా అన్నవారు అత్యాధునిక భావాలున్నవారే అని వేరుగా చెప్పక్కరలేదు .దక్షిణాఫ్రికాలో ఉండగా ఆయన అక్కడి మొత్తం ఇండియన్ల హక్కులకై పోరాటం చేశాడు .ఇండియాకు తిరిగి వచ్చాక చాంపరాన్ కూలీలకోసం,ఖిలాఫత్ సమస్యపైనా పోరాడాడు .జాతీయోద్యమ నాయకుడిగా గాంధీ పేదల ,ఉద్యోగుల తో కూడిన , ప్రజలందరి స్వాతంత్ర్యం కోసం పోరాటం చేశాడు .ఆయనకు   సామూహిక కార్యక్రమంపై నమ్మకం జాస్తి .మానవాళి జీవన విధానం ,భౌతిక ,ఆధ్యాత్మిక సుఖం లో నాణ్యత ,విలువ ఆశించాడు .అన్యాయం ,అసమానత్వం లను సామూహిక శక్తితోనే ఎదిరించి తొలగించాలని భావించాడు .కను సమర్ధవంతమైన పటిష్టమైన వ్యూహాత్మకమైన సామూహిక శక్తివంతమైన వ్యవస్థ ఉండాలని చెప్పాడు .విధి విధానాలు నిర్వాహకులే ఏర్పాటు చేసుకోవాలన్నాడు .ఈ అంశం లో గాంధీ ఆలోచనలు అత్యాధునిక భావలహరి ను౦చి దూరం చేశాయి .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -17-10-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గాంధీజీ –ఆధునికత

గాంధీజీ –ఆధునికత

పాశ్చాత్య నాగరకతపై తరచుగా గాంధీజీ తీవ్రమైన విమర్శ చేసేవాడని అవి బాగా ప్రాచుర్యం చెందాయని మనకు తెలుసు .ఒకసారి వాటిని గుర్తు చేసుకొందాం .వాటిలోంచి సారభూతమైన విషయాన్ని తెలుసుకోవాలి .కాలనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన   జీవిత కాలం చేసిన పోరాటం లో పాశ్చాత్య తపై, వారిపెత్తనం పై   ఆయన చేసిన విమర్శలన్నీ ఒక  మేధావి ఉటంకించిన భావాలుగా,సమాధానాలుగా  ఉండేవి .ఇలాంటి అవగాహన తూర్పు –పశ్చిమ వైరుధ్యాన్ని తగ్గించి ,భౌతిక లాలసత కంటే గాంధీ కి గతకాలపు ఆధ్యాత్మికత పై  గొప్ప గౌరవం ఉండేదని అర్ధమౌతుంది .సమకాలీనులు  మరింత లోతుగా అత్యాధునిక విశ్లేషణ చేశారు  .ఇందులో కొన్ని అతివ్యాప్తి అనిపించాయి .వీటిలో 1-గాంధి పారిశ్రామీకరణను ,ఆధునిక విజ్ఞానాన్నీ పూర్తిగా తిరస్కరించాడని 2- పడమటి దేశాల ఆధునికత తిరస్కరించాడని 3-సంప్రదాయానికిచ్చిన విలువ ఆధునికతకు ఇవ్వలేదని 4-గాంధీ ఆలోచన ఆధునికోత్తరమైనదని (పోస్ట్ మోడరన్ )సిద్ధాంతాలు చేశారు .వీటిని నేపధ్యంగా చేసుకొని 1-ఆధునికతపై గాంధి ఎలా స్పందించాడు 2-ఆధునికత పై ఆయన సమన్వయము ఏమిటి అన్నప్రశ్నలకు సమాధానాలు తెలుసుకొందాం .

స౦ప్రప్రదాయానికి స౦ప్రదాయేతర విధానం

ఈవిశ్లేషణలో మనం ముందుగా స౦ప్రదాయం లో  గాంధికి ఉన్నస్థానం ఏమిటో చూద్దాం .గాంధి సంప్రదాయాన్ని ఉన్నదున్నట్లుగా సమర్ధించలేదు .సంప్రదాయంఅతిముఖ్యమని కాని ,సంప్రదాయంలో శృంగారం వాస్తవమని కాని  అనుకోలేదు .సంప్రదాయ బద్ధుడు గాంధి అని 1987 పరేఖ్ ముద్ర వేశాడు .భారతీయ సంప్రదాయం ఆయనకు చాలా సంక్లిష్టమైనది కాని స౦ప్రదాయేతరమైనదికూడా .  కొన్ని సందర్భాలలో ఆయన కు స౦ప్రదాయం ఆధునికతకు మరో పార్శ్వం .ఇలాంటి విరుద్ధ భావాలు అప్పుడప్పుడుసరదాకి  ఆయన చెప్పినా ఆయన మొత్తంగా చెప్పిందదానిలోని సారాంశం తీసుకోవాలి .మొదటిప్రశ్న .మనం వెనక్కి వెళ్లగలమా ? వెళ్ళలేము అని ఆయన స్పష్టమైన సమాధానం .ఇష్టమున్నా లేకున్నా ఆధునికత లో  బతకాలి .ఇది అనివార్యం అనిఆయనే అన్నాడు .రెండవ విషయం సంప్రదాయం అనేది ఎప్పుడూ పూర్తి స్వచ్చంగా లేదు .సంప్రదాయం అన్నీ కలిపినవిధానం .అది ఆలోచన ,ఆచరణ లపై  నిర్మింపబడింది .అది ఆధునికత ఇచ్చిన ఉత్పత్తి .మూడవది –మానవాళికి తమకు ఏదికావాలో దాన్ని తీసుకోవటం ,నచ్చిన సంప్రదాయాన్ని అనుసరించటం ,వాటిలో తమ అర్ధాలు నింపుకోవటం  వాళ్ళకున్న  అధికారాలు.  కొన్ని సంప్రదాయాలను తిరస్కరించే హక్కు కూడా ఉంది .సంప్రదాయ అనుసరణ ,ప్రాచుర్యం లోఉన్న అవగాహన జనజీవన విధానం లో కలిసి పోయి ఉంటాయి .సంప్రదాయం అనేది విడిగా  ఉండేది కాదు. రాజకీయాలు ,ప్రవేశించి ఘర్షణలు ,రాజీ పడటాలు ఉంటాయి .కనుక గాంధి దృష్టిలో  సంప్రదాయం అంటే1-ప్రాచుర్యం పొందింది 2-ఆచరణలపై  సంపూర్ణ నియంత్రణ ఉన్న విధానాల చట్రం .మొదటి దానిపై రెండవది అనుగుణ్యంగా మెలగటానికి గాంధి తనబుద్ధిని మనసును మేధస్సును ఉయోగించి అవి  ఒకదానిలో ఒకటి పూర్తిగా కలిసిపోయేట్లు వ్యూహాత్మకంగా వివరణలిచ్చాడు .ఇవి అన్నీ గాంధి స్వంత తాత్విక సిద్ధాంతాలుగా గుర్తింపు పొందాయి .ఇవి సంప్రదాయానికి వెలుపల అంటే సంప్రదాయేతర భావనా సిద్ధాంతాలే అని మరువ రాదు .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -17-10-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -14(చివరిభాగం ) 14-నండూరు గుండమంత్రి

          అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -14(చివరిభాగం )

14-నండూరు గుండమంత్రి

13వ శతాబ్ది వెలనాటి బ్రాహ్మణుడు నండూరు గుండమంత్రి వెలనాటి రాజేంద్ర చోడుడి మంత్రి .బాపట్లతాలూకా నండూరు వాసి .ఇతనికి శివలెంక మంచన కవి తన కేయూరబాహు చరిత్ర కావ్యం అంకితమిచ్చాడు .ఇతని తాత కు దాత గోవిందన వెలనాటి గొంక భూపతి మంత్రి .గొంక రాజు చివరిరోజుల్లో పాకనాటిపై దండెత్టినట్లు బాపట్ల భావనారాయణస్వామి ఆలయ శాసనం లో ఉంది .గొంకన నెల్లూరుదాక పాలించాడు .కులోత్తుంగ  చోళుడికాలం లోవేంగిపై కల్యాణి, కటకం సామంతులు దండెత్తివచ్చినా, కొమ్మనమంత్రి కొత్తచర్లదగ్గర వారిని ఓడించి రాజుకు విజయం చేకూర్చాడు .మూడవ గొంక రాజు తర్వాత 1186లో  ధనదుప్రోలు సింహాసనమెక్కిన వెలనాటి చివరి రాజు  .శ్రీకూర్మం దాకా రాజ్య విస్తరణ చేశాడు .ఇతన్ని చంపిన తిక్కరాజు రాజేంద్ర చోడుడి కొడుకు .తిక్కరాజుమంత్రి కేతన .కేతన మనవడే గుండన మనుమసిద్ధి రాజు మహా సచివుడు .మన్మసిద్ధి తండ్రి తిక్కరాజు పృధ్వీశుడిని చంపాడు .తిక్కరాజు 1250వరకు రాజ్యం చేశాడు .కేతన మనవడు గుండనకు కేయూరబాహు చరిత్ర అ౦కిత మివ్వటం చేత ఇతనికాలం 13వ శతాబ్ది .’’ధరణిం దాన గుణు౦డ వీవని ,కవీంద్ర శ్రేణి వర్ణింప గా బిరుడదుల్నిండిన గుండ యే౦ద్రునకు  ‘’అనే పద్యాన్ని బట్టి యితడు దాతలకే గురువు కవుల పొగడ్తలు అందుకొన్నవాడు, అనేక బిరుదులున్నవాడని  తెలుస్తుంది .మంచన నన్నయ తిక్కనాదులను స్తుతించలేదు .

  గుండనమంత్రి ‘’ప్రజ్ఞ సంభావిత కావ్య దక్షుడవు  భావ్యమతిన్ ద్విజదేవ ‘’అని సంబోధించి ఒకకావ్యం రాసి అంకితమివ్వమని కోరాడు .అందులో ‘’స్థాయి రసము శృంగారంబై యలవడ గథలు నీతులైయెడనెడరా’’గేయూరబాహు చరితము ‘’సేయుము –నీ వ౦ధ్రభాష శిల్పము మెరయన్ ‘’అని చెప్పాడు. ‘’సుగుణుని నినుబొంది మదీయ కవిత నెగడుం బుడమిన్’’అని తృప్తితో గుండనమంత్రికి అంకితమిచ్చాడు మంచనకవి  .ప్రతియేటా జరిగే కాకుళేశ్వరుని ఉత్సవాలలలో గుండన మంత్రి మాడలు, రాత్నాలు,సువర్ణం అర్ధులకు, అర్హులకు యిచ్చి సంతృప్తి పరచేవాడని వర్ణించి చెప్పాడు .అదీ గుండన ఔదార్యం .అందుకే స్తుతిపాత్రుడయ్యాడు

 .’’ అపూర్వాంధ్ర పూర్వామాత్యులు ‘’సమాప్తం .

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -16-10-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

నడయాడే దైవం నేను రాసిన ”సిద్ధ యోగిపుంగవులు ”పుస్తకం లోని ”నడయాడే దైవం ,పరమాచార్య జగద్గురువులు శ్రీ శ్రీ చంద్రశేఖర యతీంద్రులు ”వ్యాసం అక్టోబర్ ”గురు సాయి స్థాన్ ”లో ప్రచురితమైంది

Posted in రచనలు | Tagged | Leave a comment

అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -13 13-గోపాలుని నన్ని(న్న)య భట్టు  

అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -13

13-గోపాలుని నన్ని(న్న)య భట్టు

11వశతాబ్దికి చెందిన గోపాలుని నన్ని(న్న)య భట్టు రాజరాజేంద్ర నరేంద్రుని ముఖ్యామాత్యుడు ,ఆస్థానకవి .రాజేంద్ర చోళుడు కన్యాకుమారి వరకు దక్షిణ దేశం జయించి ,గొప్ప నౌకాబలంతో సింహళాన్ని వశపరచుకొని ,పశ్చిమ సముద్రం లోని 12వేల దీవులను ఆక్రమించి ,తూర్పునున్న’’ పెగు ‘’రాజ్యాన్ని ,నికోబార్ ,అండమాన్ దీవులతో సహా’’ శ్రీ విషయం ‘’ను సామంత రాజ్యం గా చేసుకొన్నాడు .దీనితో ఆగక బీహారు, ఉత్కళ, వంగ దేశాలు జయించి ‘’గంగైకొండ చోళుడు ‘’బిరుదు పొందాడు .అప్పటికే ఉత్తర భారతం గజనీ దండయాత్రలకు గురై దిక్కు తోచక ఉన్నది .చోళచక్రవర్తులు హిమాలయం నుంచి రామేశ్వరం దాకాఏకచ్చత్రంగా పాలించాలనే సంకల్పం తోఉండగా రాజరాజు రాజేంద్ర చోళుడికి అల్లుడయ్యాడు .రాజరాజు కొడుకు రాజేంద్ర చోళుడిమనవరాలి మొగుడే .

ఈ సమయంలో వేంగీ రాజ్యం తమ వశం కావాలనే కోరికకూడా కలిగింది .1070 లో రాజరాజు కొడుకుచోళచక్రవర్తి అయి  ‘’కులోత్తుంగ చోళుడై ‘’తాతగారిలాగా ప్రతిభా వ్యుత్పత్తులతో 49ఏళ్ళు రామేశ్వరం నుంచి కళింగ దాకా పరిపాలించి కీర్తిపొందాడు .వైదిక ,వర్ణాశ్రమ ధర్మాలతో వైదికమతాన్ని పునరుద్ధరించాలన్న తలంపుతో ,అందులో నిష్ణాతుడైన నన్నియభట్టు ను సమాదరింఛి –‘’జననుత కృష్ణ ద్వైపా-యన  ముని వృషభాభి హిత మహాభారత బ-ద్ధ నిరూపితార్ద మేర్పడ -దెనుగున రచియింపు మధిక ధీయుక్తి  మెయిన్ ‘’అని నన్నయను కోరాడు రాజరాజు .తెలుగు చేయటమే కాదు భంగ్య౦తరంగంగా కూడా చెప్పమన్నాడు .ఇలాంటి సదాశయాన్ని మెచ్చిన కవినన్నాయ’’సమస్త వర్ణాశ్రమ వర్ణ ధర్మ రక్షణ మహా మహిమన్మహి నొప్పు సర్వ లోకాశ్రయుడు ‘’అని రాజును పొగిడాడు .అగస్త్య మహర్షి ‘’సుహ్రుత్సమితాత్ కాంతా సమ్మతయా యయా సరసతయా  మాపాద్య కావ్య శ్రియా కర్తవ్యే ‘’అని చెప్పింది శిరో దార్యంగా భావించి ,కర్తవ్యమ్ లో ఆసక్తి అకర్తవ్యం లో అనాసక్తి కలిగించటం ముఖ్య లక్షణం గా భావించాడు .అందుకే ‘’ధర్మ తత్వజ్ఞులు  ధర్మ శాస్త్రంబని ,ఆధ్యాత్మ విదులు వేదా౦తమని  నీతికోవిడదులకు నీతిశాస్త్ర  మని ,కవులకు మహాకావ్యమనీ లాక్షిణులకు లక్షణ శాస్త్ర మని  ,ఐతిహాసకులకు ఇతిహాసమని ,పౌరాణికులకు పురాణ సముచ్చయమనిభావి౦ చేట్లు వేదవ్యాసమహర్షి మహా భారతం రాశాడని  భారతం ధర్మమూలం,పంచమవేదం అనీ నన్నయ చెప్పాడు .

ఇంతకూ నన్నియభట్టు ఎలా ఉండేవాడు ?’’స్వస్థాన వేష భాషాభిమతా స్సంతో రస ప్రలుబ్ధ ధియః ‘’.అవిరళ జపహోమతత్పరుడు ,సంహితాభ్యాసుడు ,తెలుగులోమహాభాత సంహితా రచన బంధుడు ,సమస్త పురాణ వేత్త ,లోకజ్ఞుడు .ఈయన నిష్ట’’రమణీయార్ధ ప్రతిపాదిత శబ్దాలపైనా ,ఉచ్చారణ మీదా .దీనినే అక్షర రమ్యత అన్నాడు .ఉచ్చారణవలన నాదోత్పత్తి చేసిన నాదబ్రహ్మ .విపుల శబ్ద శాసనుడు .శిలాశాసనాలలోనూ, అవ్యవస్తంగానూ ఉన్న శబ్దాలను తీర్చిదిద్ది నియతికల్పించి తెలుగు సంస్కృతపదాలకు ఛందస్సులకు తీయదనం తీర్చిదిద్దిన అక్షర శిల్పి .

నన్నియభట్టు రాజరాజుకు  కులబ్రాహ్మణుడు  .అంటే పురోహితుడుకాదు.వీరమంత్రి అన్నమాట .చాళుక్య శాసనాలలో ,కర్నాటక రాజ శాసనాలలో కుల బ్రాహ్మణ శబ్దానికి పురోహితుడు అనే పర్యాయ పదం ఎక్కడా లేదు .శాసనాలు రాసే అధికారం మహా మంత్రులకే ఉండేది పురోహితులకు లేదు .’’కులీనా శ్చాను రక్తాశ్చ కృతాస్తే వీరమంత్రిణః’’అనే దాన్నిబట్టి నన్నయ రాజరాజుకు వీరమంత్రి .లౌకిక కార్య సాధకుడు మంత్రి .అలౌకిక కార్యసాధకుడు పురోహితుడు అని అర్ధం చేసుకోవాలి .

తూర్పు చాళుక్యులలో ఐదవవాడు సర్వ లోకాశ్రయుడిని ‘’మంగి యువరాజు ‘’అంటారు .ఇతని తండ్రి రెండవ విష్ణు వర్ధనుడు ,తాత ఇంద్రభట్టారకుడు ,ముత్తాత కుబ్జ విష్ణు వర్ధనుడు .సర్వ లోకాశ్రయుడు క్రీశ 672నుండి 696వరకు 27ఏళ్ళు పాలించాడు .చందలూరు శాసనం లో ‘’పరమ బ్రహ్మణ్యః మహారాజానుభావ శ్రీ సర్వ లోకాశ్రయ మహారాజః కమ్మరాస్ట్రేచెందలూరు గ్రామేయకాన్ అత్రగత సర్వ గత ‘’సర్వ నైయోగిక ‘’వల్లభా౦శ్చజ్ఞాపయతి ‘’అని ఉన్నదానిలో ‘’సర్వ నైయోగిక వల్లభాన్ ‘’అనే మాట ‘’రాత్నాలమూట’’అన్నారు కొమర్రాజు లక్ష్మణరావుగారు.738లో జాయకదేవ మహారాజు ఆస్థానం లో ‘’భట్ట నారాయణుడు ‘’అనే మహామాత్యుడు  మౌద్గల్య గోత్రీకుడు ఈశ్వరభాట్టుకు అగ్రహారం ప్రదానం చేశాడు  .రారాజు తండ్రి విమలాదిత్యుని మ౦త్రి రావుల వజ్జియ ప్రగ్గేడ  కౌ౦డిన్యగోత్రుడు ,కారం చేడు వాడు  .కనుక నన్నయకు చాలాకాలం పూర్వమే శాఖా భేదాలు ఏర్పడి ఉన్నాయి .

లోకజ్ఞుడు నన్నియ ‘’సత్ప్రతిభాభి యోగ్యుడు,నిత్య సత్యవచనుడు కనుక తనరాజుకు రాజ్యం చేకూర్చాలనుకొన్నాడు .అప్పటికి భారత రచన చేయలేదు .రాజరాజే నిలకడ లేకుండా ,దేశం వదిలి తిరుగుతుంటే నన్నయకు రాసేఅనురక్తి ఓపికా అప్పటికి లేవు .నన్నయ సుకృతమో లేక రాజరాజు అదృష్టమో వాణస  వంశ రత్నాకరుడైన నారాయణభట్టు సహాధ్యాయి అవటం,అతని సాయంతో త్రైలోక్యమల్లుని మంత్రి మధుసూదనయ్యను దర్శించి,మళ్ళీ  రాజరాజుకు 1051లో వేంగీ సామ్రాజ్యం ఇప్పించాడు .1050లో తిరువయ్యార్ లో ఉన్న రాజరాజ నరేంద్రుడు 1051లోనారాయణభట్టుకు రెండు ఏరులమధ్యలో ఉన్న’’నందమపూడి ‘’గ్రామాన్ని దానంగా ఇచ్చినట్లు ,అతడు ప్రాకృత పైశాచీ ,కర్నాటక ఆంద్ర  సంస్కృతాది భాషలలో నిష్ణాతుడైనట్లు నన్నియ రాసిన శాసనం లో ఉంది .

తన కులబ్రాహ్మణుడైన నన్నియభట్టురాజనీతి వలన రాజరాజనరేంద్రునికి మళ్ళీ రాజ్యం సంక్రమించటం కాక విజయాదిత్యునివలన కష్టాలూ తప్పాయి .ఒలంబవాడికి విజయాదిత్యుని సామంత రాజును చేయటం తో సమస్యలు తీరాయి .యుద్ధాలుఆగిపోయాయి .రాజరాజు పాలన చివరి పదేళ్ళలో 1051నుంచి ,1061వరకు శాంతి సౌఖ్యాలతో రాజ్యపాలన చేయగలిగాడు .రాజరాజు వెంటనే తన రాజధానిని వేంగి నుంచి రాజమహే౦ద్రానికి మార్చాడు .సుస్థిర శాంతి చేకూరటం తో తనుకు ఇంత మహోపకారం చేసిన నన్నియను మహాభారతానువాదానికి ప్రోత్సహించాడు .1051-55మధ్యలో నిండు పేరోలగం లో  రాజు నన్నియనుసంస్కృత భారతాన్ని తెలుగు సేయమని ఆనతిచ్చాడు .ఆతర్వాత జరిగిన విషయమంతా ముందే చెప్పుకొన్నాం .

ఆధారం – –ప్రాచీన హిందూ దేశ రాజ్యాంగ చరిత్ర ,కన్నడ దేశ చరిత్ర ,ప్రాచీన గ్రామసభల న్యాయ పరిపాలన ,దండనాథులు, దుర్గాధిపతులు వంటి అమూల్యగ్రంథాలు రచించిన విమర్శక శిరోమణి ,సాహిత్య విశారద బ్రహ్మశ్రీ కోన వేంకటరాయ శర్మగారు1950లో రచించిన  ‘’సచివోత్తములు ‘’ పుస్తకం

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -16-10-19-ఉయ్యూరు

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రేమమూర్తి చివటం అమ్మ -శ్రీరామకృష్ణప్రభ –

Posted in రచనలు | Tagged | Leave a comment

మలి సంధ్యలో డా.రాచకొండ శర్మగారు పూయించిన ‘’మైదానంలో సూర్యోదయం ‘’

మలి సంధ్యలో డా.రాచకొండ శర్మగారు పూయించిన ‘’మైదానంలో సూర్యోదయం ‘’

‘’పంచనవతి వర్ష’’(95) యౌవనులు డా రాచకొండ నరసింహ శర్మగారు తమకున్న ఆంగ్లకవితాభిరుచికి దర్పణంగా తాను  చదువుతున్నకాలంలో తనకు అత్యంత ప్రీతికరమైనఅ ఆంగ్ల  కవితలను ఎంచుకొని , మరో ఆంగ్లకవితానువాద సంపుటిని సప్తతి(70) కవితల అనువాదంతో ఈ సెప్టెంబర్ లో ‘’మైదానం లో సూర్యోదయం ‘’గా వెలువరించారు  .ఆంగ్ల కవిత్వం చదివితే ‘’చిత్తము నిలవదు సుంత యైన ‘’అన్నట్లు ఆయన అనుభవించి ఆ ఆన౦దానుభూతిని మనకూ పంచిపెట్టే హృదయమున్న భిషగ్వరులాయన .ఇప్పటికే ‘’పడమటి సంధ్యారాగం ‘’లో 41,’’అయితే ‘’లో 46ఆంగ్లకవితల్ని అనువదించి ,స్మైల్స్ ,టియర్స్ అండ్ మోర్’’ ఆంగ్లకవితల ను ,’’సానెట్స్ ఫ్రం పోర్చుగీస్’’ అందించిన అనుభవం వారిది .తెలుగు కవితలను ఆంగ్లంలోకీ అనువాదం చేసిన నేర్పు వారిది .అంటే ద్విభాషా కవి .ఈ పుస్తకాన్ని తమప్రియతమ అర్ధాంగి డా .అన్నపూర్ణా దేవికి ,ఆమె మైదానం లోకి రాలేనందున ఆమెగదిలోకే ‘’మైదానం లో సూర్యోదయం ‘’తెచ్చి పరమానంద భరితురాలిని చేసి ,తమ సతీ ప్రేమను వర్షించారు .పుస్తక శీర్షికకు తగిన మైదానం ,సూర్యోదయం ,పశువులు, నీటి చెలమ ,పచ్చ గడ్డిలతో ముఖ చిత్రం ముద్దులొలికింది .ఆంగ్లకవితలు పేజీకి ఎడమవైపు ,తెలుగు సేత కుడివైపు ,అనుబంధంగా ఆకవుల చరిత్ర సంక్షిప్తంగా అందించారు .దాదాపు స్కాలిత్యం లేని పెద్ద  అక్షరాలతో.పుస్తకం చూడగానే మైదానం అంటే ‘’ఫ్లాటై ‘’పోతాం .శర్మగారు ఆత్మీయంగా పంపిన ఈపుస్తకం నిన్న మధ్యాహ్నం నాకు అందింది .రాత్రి 20,ఈ రోజు ఉదయం మిగిలిన 50 ఆబగా జుర్రేశాను .నిన్న పుస్తకం ఒక సారి తిరగేసి ‘’టైటిల్ ‘’విషయం లో ముందుమాటలు రాసినవారు ఎవరైనా మార్గ దర్శనం చేశారేమో అని వెతికితే దొరకలేదు .శార్మగారికే ఫోన్ చేసి పుస్తకం అందిన సంగతిచెప్పి  ,శీర్షిక ఔచిత్యాన్ని గురించి అడిగాను .వారు చెప్పిన సమాధానం సంతృప్తి కలిగించింది .ఈ కవుల జననకాలం 1554నుంచి 1896వరకు .అంటే దాదాపు 350సంవత్సరాల కాలవ్యవధిలోని  కవులు, వారికవిత్వ దర్శనం అన్నమాట .కనుక అద్భుతమైన వైవిధ్యం ,ఆలోచనలలో పరిపక్వత ,అనుభవసారం ఉన్నకవితలు .ఈ కవులు రాజకవులు ,కవిరాజులు ,రాజాస్థాననకవులు అనే పొయెట్ లారియట్స్ , జన హృదయసామ్రాజ్యాన్ని గెలిచినవారు.భగవదన్వేషకులు ,మాటలతోకాక చేతలతో మంచి చేయమని బోధించే తత్వ వేత్తలు ,జర్నలిస్ట్ లు ,సైంటిస్ట్ లు ,నవలా, కథా రచనలలోఅరితేరినవారు,వివిధ దేశాలకు చెందినవారు,’’ఆకాశంలో సగభాగమైన ‘’స్త్రీలు కూడా ఉన్నారు .ఒకరకంగా’’ డెబ్భై మనో ప్రపంచ దర్శనం ‘’చేయించారు శర్మగారు ఈపొత్తం లో .ఈ కవుల్లో కొందరు పులిట్జర్ ప్రైజ్ వంటి ప్రఖ్యాత బహుమతులు అందుకొన్నవారే . వివరాలు తెలీని ఒకకవి ,మరో అజ్ఞాతకవి ఇందులో చోటు చేసుకోన్నారుకూడా . ఇక కవితా మైదానంలో సూర్యోదయ దర్శనం చేసి పులకిద్దాం .

   విల్లా కేథర్’’అనే కవయిత్రి రాసిన ‘’ప్రయరీ డాన్’’కవిత శర్మగారి చేతిలో ‘’మైదానం లో సూర్యోదయం ‘’గా, ఈ పుస్తకం శీర్షికగా మారి దర్శన మిచ్చింది .ఈమెఅమెరికాలో చాలాకాలం కొండలు గుట్టలు ఉన్నప్రాంతం లో ఉండి,ఒక్కసారిగా మైదాన ప్రాంతాన్ని చూసి అక్కడి ప్రకృతి సోయగం , సూర్యోదయాలకు పులకించి రాసిన కవిత అది .పులిట్జర్ ప్రైజ్ పొందినకవి .ఈ మైదానం లో ఆమె ‘’తారలు తరలించిన రక్తారుణజ్వలనం ,ధూళి నిండిన ‘’సేజాకు’’ ఘాటుపరిమళం ఆలమందల హఠాత్ చలనం, దూర పీఠభూముల క్రమ దర్శనం వెలుగులో వెండి మడుగుల  భాసురం ,కాంతి శూలం ఒకటి అతివేగంగా వచ్చి అవనిని గుచ్చటం చూసి తనవూరి పర్వత శ్రేణి కై తృటిలోనే ,కన్నీరు చిమ్మింది .ఆమె మధురానుభూతి మనమనసులను సేద తేరుస్తుంది .’’వాటర్ డిచేస్ సిల్వర్ ఇన్ దిలైట్ ‘’అన్న ఆమె మాటలను శర్మగారు ‘’వెలుగులో వెండి మాడుగుల భాసురం ‘’అని చక్కగా అనువదించారు .’’ఎ సడన్ సిక్ నెస్ ఫర్ ది హిల్స్ ఆఫ్ హోమ్’’ను ‘’తనూరి పర్వత శ్రేణికై తృటిలోనే కన్నీరు చిమ్ము ‘’అన్న అనువాదం  భేషు గ్గా ఉండి,పుస్తక శీర్షికకు గొప్ప న్యాయం చేకూర్చింది .ప్రభాత సూర్యోదయ కాంతికిరణాల నులి వెచ్చని ఆహ్లాదం భాసించింది .

 ఈ కవితా కదంబం సర్ ఫిలిప్ సిడ్నీ కవిత ‘’టు స్లీప్ ‘’ తోప్రారంభమై అజ్ఞాతకవి ‘’మినిట్స్ ఆఫ్ గోల్డ్ ‘’తో పూర్తవుతుంది .సిడ్నీకవి నిద్రను ‘’శాంతినిచ్చే ముడి ,దుఖానికి ఉపశమనం ,నిరుపేదకు భాగ్యం పక్షపాతం లేని న్యాయ నిర్ణేత (తగవరి ) అంటాడు .ఈకవి ఎలిజబెత్ కా  లం లో 108సానెట్ ల ‘’ఆస్టోఫెల్ అండ్ స్టెల్లా’’కావ్యం రాసి ఆదర్శ పురుషుడుగా గుర్తి౦పు పొందాడు .అందుకే చివరగా ‘’లైవ్ లియర్ డాన్ఎల్స్ వేర్   స్టెల్లాస్ఇమేజెస్ సీ’’అని ఫినిషింగ్ టచ్ ఇవ్వగా శర్మగారు ‘’ఉల్లాస౦గా చూడగలవు –నాలో స్టెల్లా ప్రతిబింబమును ‘’అని ముగించారు అందంగా .70వ కవిత అజ్ఞాతకవి రాసిన ‘’మినిట్స్ ఆఫ్ గోల్డ్ ‘’ను శర్మగారు ‘’నిజంగా బంగారు నిమిషాలు ‘’గా అనువదించారు .నిమిషాలు గంటలు కాలపరిమాణ౦ లో అర్ధం లేనివి –కానీ అవే బంగారు నిమిషాలు మహత్తర ఘడియలు .ఒకరికి సంతోషం కలిగించటం లో ,చిర్నగవు తెప్పించటం లో  కన్నీరు తుడవటం లో  నైరాశ్యాన్ని అంతం చేయటం లో స్నేహాన్నివ్వటం లో  వాటిని ఉపయోగిస్తే సార్ధకం .అనికాలం మహత్తరమైన విలువకలదన్న బోధ చేశాడుకవి  .

  శర్మగారికి ఉన్న కవితాభిమానం కవులపై ఆరాధన నిరుపమానం .అందుకే ఆ అభిమానాన్ని చాటుతూ ,షేక్స్ పియర్ వి 3,ఎమిలి డికిన్సన్ వి 10,ఎల్లావీలర్ విల్కాక్స్ వి 3,సారా టెసల్డేల్ వి అత్యధికంగా 18,ఎడ్నాసెయింట్ విన్సెంట్ మిల్లేవి 2 కవితలను ఎంచుకొని అనువదించారు .ఎమిలీ ,తారా ఇద్దరూ కవయిత్రులే అవటం విశేషం.’’తలపు నీపైనమరల  సంతోషంకలిగి ,మృదుమధురమైన ప్రేమ స్మృతి ని మెదలి నృపతి పదవినైనా తృణీకరిస్తాను-‘’అని ,’’గులాబీ స్థితి వేరే అని ,అది మరణించినా మధుర పరిమళాలనిస్తుందని ,అందుకే అడవిపూలకంటే భిన్నమైనదని ,సత్కవిత వడబోతు నీ సత్యమహిమ ‘’అని ,సుఖాన్ని కోరితే దుఖం ,సంతోషంకోరితే మిగిలేది స్వప్నమే –నరకానికి బాట ఐన నాకసుఖం రాయటం ఎవరికీ వీలుకావటం లేదని షేక్స్ పియర్ తన మూడు  సానెట్ లలో చెప్పాడు .’’ఏ లిలీ ఆఫ్ ఏ డే –ఈజ్ ఫైరర్ ఫార్ ఇన్ మే’’అన్న బెంజాన్సన్ కవిత అందరికీ తెలుసు .’’ఇన్ స్మాల్ ప్రోపోర్షన్స్  వుయ్ జస్ట్  బ్యూటీస్  సీ –అండ్ ఇన్ షార్ట్ మెజర్స్ లైఫ్ మే పెర్ఫెక్ట్ బి ‘’అన్న గొప్ప జీవితసత్యాన్ని ‘’సూక్ష్మ పరిమితి లోనే –చూడగలము సౌందర్యమును –తక్కువ పరిమాణం లోనే లోపరహితంగా ఉండవచ్చు మనిషిజీవితం ‘’అని అదే జీవితానికి నిజమైన కొలత అని అర్ధవంతమైన  అనువాదం చేశారు శర్మాజీ.అదే మనతెలుగుకవి  ‘’కాకి చిరకాలమున్న నేకార్య మగును ?’’ అన్నాడెప్పుడో.’’వసుధలో వస్తువులన్నీ కడతేరాల్సిందే –గతవైభవప్రదర్శన తర్వాత గోరీలోకి జారాల్సిందే ‘’అంటూ పువ్వుల్ని అంత తొందరగా రాలిపోవటం ఎందుకు –మేము చదివే అందమైన పత్రాలు మీరు ‘’అని ‘’టు బ్లాసమ్స్ ‘’కవిత లో   రాబర్ట్ హార్రిక్ అన్నదాన్ని శర్మగారు ‘’విరులకు ‘’విన్నపంగా చెప్పారు .’’ఈలోకం సుందరమైనది ,ప్రేమ మహత్తరమైనది ,జీవితం సంక్లిష్టమైనది ‘’అనే సందేశం ఇచ్చాడు హార్రిక్ కవి .మనపదవీ ,వంశగౌరవాలన్నీ ముందో వెనకో విధికి వశమవ్వాల్సిందే .సన్మార్గుల కృత్యములే సౌరభాలు వెదజల్లి ,మట్టిలో వికసిస్తాయి ‘’అని తాత్విక సందేశమిచ్చాడు జేమ్స్ షిర్లి.

  మూడు దేశాల చక్రవర్తి మూడు సార్లు పార్లమెంట్ ను రద్దు చేసి ఇంగ్లాండ్ లో    అంతర్యుద్దానికి కారకుడై, చివరికి పార్లమెంట్ కు లొంగిపోయి , ఆలివర్ క్రామ్వేల్ తో ఓడిపోయి ఉరితీయబడ్డ   మొదటి చార్లెస్ ‘’క్వయట్ స్లీప్ ‘’కవితలో ‘’నెమ్మదికల అంతరాత్మకు  శాంతి విశ్రా౦తులు౦ టాయని ,భద్రంగా నిద్రపొమ్మని –నిద్రకంటే మధురమైనది లేదని ‘’తన అనుభవ సారంగా చెప్పాడు .మొదటి చార్లెస్ రాజు తరఫుకవి అంటే ‘’కావిలియర్ పొయెట్ ‘’ రిచార్డ్ లవ్ లేస్ సైన్యంలో కెప్టెన్ .’’విమల పవిత్ర వక్షస్థలతపస్వినీ గృహాన్ని వదిలి యుద్ధానికి వెడుతూ ,తాను  దయావిహీనడనుకానని,రణరంగం లో మొదటి శత్రువు ఖడ్గ, కవచాన్ని, అశ్వాన్ని  అధికతర విశ్వాసంతో కౌగలి౦చుకొంటానని,అప్పుడు ఆమెకూడా తనను పొగడాల్సిందే నని తన నిలకడ లేనితనం పేరు ,ప్రతిష్ట లను తాను  ప్రేమించకపోతే ఆమెనుకూడా అంతగా ప్రేమించి ఉండలేనని సందేశమిచ్చాడు .హెన్రి వాన్ కు పొదపొదలో పూలహారాలు ఫలహారాలుగా కనిపించి మహీతలం నీరవ నిశ్శబ్దంగా భాషా యోష అశ్రుగీతం వినిపించింది ‘’విశాలాకాశం లో ‘’.’’డి చైల్డ్ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ మాన్ ‘’అని ప్రకృతి,కవి వర్డ్స్ వర్త్ అన్నమాట వర్దీ మాట .రైన్బో కవితలో ఆమాట చెప్పి మరణమే మేలు –పిల్లలే పెద్దలకు తండ్రులు .నా రోజులన్నీ ఒకదానితో ఒకటి ముడి పడి ఉండాలని ఆశించాడు .

  వాల్టర్ సావేజ్ లాండర్ కవి ‘’ఆన౦ద  క్షణాలు రాలిపోతున్నాయని చి౦తఎందుకు ? మళ్ళీ రమ్మనటానికి నేను ఉండను అవి ఎక్కడో మళ్ళీ వెలుగుతాయి ‘’అని భరోసా ఇస్తాడు .’’ఆబూ బెన్ ఆడం ‘’కవిత చదవని, వినని, విని మురిసిపోని వారుండరు .లీహంట్ రాసిన ఈకవిత ‘’తోటిమానవులను ప్రేమించినవారినే దైవం తనవాడిగా భావిస్తాడు’’అన్న గొప్ప సత్యాన్ని చాటిన కవిత .నేను తొమ్మిదో తరగతిలోనే చదువుకొన్న దానినే విద్యార్ధులకు పాఠంగా చెప్పినకవిత కవిత .టెన్నిసన్ మహాకవికి ‘’ప్రథమ ప్రేమ మధురం ,ప్రగాఢం.వెళ్ళిపోయిన రోజులు శోకభరితం విషాదం  వినూతనం .మాయమైన రోజులు సజీవమరణమే అనిపించాయి కవికి .రాబర్ట్ బ్రౌనింగ్ కు ‘’నేనుఎవర్ని ?’’అనే ప్రశ్న వచ్చి ‘’వెనుతిరిగి చూడని వాడిని –మంచి ఓటమి పొందినా చెడు గెలుస్తుందని కలలో కూడా అనుకోని వాడిని –నిద్రించటం మేల్కొవటానికే అని నమ్మినవాడిని –కస్టేసుఖీ  అని నమ్మి చివరిదాకా పోరాడేవాడిని –ఇక్కడిలాగానే ‘’అక్కడా ‘’అలాగే జీవితం సాగించమని కోరేవాడు .ఆర్ధర్ హఘ్ క్లో కు ‘’ఆశలు నిరాశాలైతే భయాలు భ్రా౦తు లౌతాయి .ప్రభాకరుడు నెమ్మదిగా పైకి వస్తున్నా ,పడమట నేల౦తా శాంతి మయంగా కనిపించింది .

  ఎమిలి డికిన్సన్ అమెరికాలోని మాసాచూసెట్స్ లోని  ఆంహెర్స్ట్  కవయిత్రి.1800కవితలురాసింది  .ఒంటరిజీవితమే గడిపింది .ఎమెర్సన్ సరసన నిలువగలిగిన కవి .ఆమె మరణం తర్వాత నే కవితలు, లేఖలు చెల్లెలు లవినియాకు దక్కి ప్రచురించింది .దాదాపు మిస్టిక్ పోయెట్.ఆమెవి’’ గాస్పెల్ పోయెమ్స్’’ గాగుర్తి౦పుపొందాయి . శర్మగారు ఎంచుకొన్న 10కవితలలో కొన్ని ముఖ్యభావనలు –‘’చిన్న యెదలో ప్రశాంతంగా   పారే సెలయేరు ఉందా ?అందులోని ప్రాణజలం తాగు .ఈ సెలయేరు ఎండకుండా జాగ్రత్త పడు .గుండెల్లో బాధ దాచుకోటానికి మనస్తైర్యం కావాలి .ఈ ప్రపంచం పరిసమాప్తికాదు .అవతల ఏదో ఉంది .ఆత్మనుకొరికే దంతాన్ని మతబోధకుల అభినయాలు’’ హలలూయాలు ‘’నిద్రమందులు అంతం చేయలేవు .ఆకాశం కన్నా విశాలమైంది,మహోదధికన్నా లోతైనది  భగవంతునితో సరితూగేది  మానవ మస్తిష్కం .ఒకపెద్ద బాధతర్వాత ఒకవిధమైన అనుభవం కలుగుతుంది .ఏటవాలుగా పడేకాంతి ని చూసి నీడలుకూడా ఊపిరితీయటం మానేస్తాయి .హృదయం మొదటకోరేది ఆనందం.తర్వాత నిద్ర .చివరికి చనిపోయే స్వేచ్చ .ఆత్మీయులను తానె ఎంచుకొని  ఆత్మ తలుపు వెంటనే మూసేస్తుంది .అందరికీ ఒకమర్యాద ఏదోరోజువస్తుంది .ఆ వైభవం చెప్పనలవికానిది .అదే చావు సంబడం అన్నమాట .జయం ఎప్పుడూ పొందనివారికి విజయం లో మాధుర్యం అతిఎక్కువగా గా అనిపిస్తుంది .విజయకేతనాన్ని ఎగరేసిన సైనికుడు కూడా విజయం నిర్వచనం చెప్పలేడు.

 సారా టేస్ డేల్కవితలను    శర్మగారు 18ఎంచుకొని తర్జుమా చేశారు .అమెరికా సెయింట్ లూయీ కి చెందిన ఈమే 14వ ఏడువచ్చేదాకా బడిలో చదవలేదు కాని 19ఏట పట్టభాద్రురాలైంది .తీవ్రభావోద్వేగంతో ,సంప్రదాయబద్ధంగా ,సరళంగా కవితలురాసింది .ఈమె రాసిన ‘’లైక్ బార్లీ ‘’కవితను హో లింగ అనే చైనా అమ్మాయి చిన్నతనం లోనే అనువాదం చేసింది .సహజత్వం కవితలలో స్పష్టం .కొన్ని భావనలు –‘’కంచల అ౦చు లపైనా ,గడ్డికట్టల   పైనా ,వైఢూర్యాలను వెదజల్లుతూ ,దార౦లొ తారలను ధరించిన సాలె గూళ్ళను మంచు వీడింది .గి౦జగింజలో హరివిల్లు ధరించిన కలుపు మొక్కలను తళతళలాడిస్తోంది .నీప్రేమ వేకువలాగా నవనూతనం .నాపూర్వీకులు నాకు ఆత్మజ్యోతి నిచ్చారు .కానీ నా ప్రేమికులే వివిధవర్ణ శోభామయ చంచలజ్వాల ప్రసాదించారు .గడియ సేపు స్వర్గాన్నిచ్చిన కవితను ప్రేమించాను .వజ్రోదయం తెల్లని ఎండలో భాసించింది .నగలుమార్చినట్లు నీనుండి చూపులు మార్చుకొంటాను.కాలం అనే నేస్తం ముదిమినొసగి మరపిస్తుంది .బార్లీ వెన్నులు కిందకి వంగి తిరిగి మీదకు లేచినట్లు వేదన –లోతులనుంచి పైకొచ్చింది .ప్రకృతి పరిశీలన ఇది . విశ్వనాథగుర్తుకొస్తాడు .గాలి రెండంచులకత్తిలా ఉంది .ఇల్లులేని బాలుడిలాగా నాయెద రోదిస్తోంది .నువ్వుగాలిఅయితే నేను కడలిని .తుఫానులో నీటి గుంట క్షేమంగా ఉన్నా ,సంద్రంకంటే ఎక్కువ చేదుగా అవుతుంది .’’ప్రేముడి’’ గట్టిగా అరచి౦ది నాలో .నాకు శక్తి ఉంది స్వేచ్చనియ్యకపోతే నీ ఎదను విదలించగలను.కాఠిన్యం  కంటే కమనీయతే హృదయ విచారకరం .ఈ విశ్వం లో ఒకే గొంతుమాత్రమే నాకు విశ్రాంతి నివ్వగలదు .ప్రేమించు ప్రేమించు .ప్రేమతోనే జీవితం సార్ధకం .ప్రేమవల్లనే స్వర్గం చేరగలవు .చెరువుమీద మంచు నీటమునిగిన కత్తుల వలేమెరుస్తున్నాది .సౌందర్యం శకలం జ్వలించే టప్పుడు సౌందర్యమా నువ్వు చాలునాకు .గానం నన్ను వీడితే మరచిన గీతంలో మృత్యువే కోరుకొంటా .నేనుగతి౦చినా  నా గాన౦  నాప్రాణం లో జీవిస్తుంది .నా హృదయ చషకం అందమైనదే .నిర్జీవమైన నిర్వేదమద్యాన్ని సజీవంగా సవర్ణంగా మార్చుట ఎలాగోనాకు తెలుసు .ఇలాతలం పై రాత్రి రెక్కలు పరుచుకొ౦టో౦ది .నాహృదయం చెట్టులోని పక్షిలాగా .పిలుస్తూనే ఉంది .అని హృదయావేదన ,ప్రేమ తపన వ్యక్తం చేసింది సారా .

  విశ్వాసం కోసం ప్రార్ధన చేసింది  మార్గరెట్ సాంగ్ స్టర్.ఎదలో ప్రార్ధన సమసిపోతే ఏకాకి నైపోతాననని వాపోయింది .ఏదో ఒక శుభప్రదమైన ఆశ రాత్రిగీతం లో వినిపిస్తుందని ఆశ ధామస్ హార్డీకి .జేమ్స్ విట్కాంబ్ రిలే కి యెంత లోతుగా దిగజారినవారినైనా ప్రేమ ఉద్ధరిస్తుందనే నమ్మకం .ఎల్లా వీలర్ విల్కాక్స్ కు కోరికలు జయించేమనోబలమున్నవారు ,చిరునవ్వులో దుఖాన్ని దాచగలిగేవారు గౌరవపాత్రులుగా కనిపించారు .అవనిలో ని ఆన౦ద౦  శోభా,సౌందర్యాలు సర్వం తిరిగిరాని కథ, శేషజీవితం కేవలం ఒక విధిమాత్రమెఅనిపించింది .నిన్నటి దినాలనుపాతిపెట్టి ఈరోజు గురించి ఆలోచించి ,ఇద్దర్నీకలిపేది దైవమని అన్నది.ఈమె కవితలో అంద౦ ఆశాభావం కనిపిస్తాయి  .రుడ్యార్డ్ కిప్లింగ్ కు   తాను ఉరితీయబడ్డప్పుడు తల్లిప్రేమ తనను అనుసరిస్తుందని ,లోతు సముద్రంలో మునిగినప్పుడు ఆమె కన్నీరు తన చెంతకు చేరుతుందని ,శరీరం ఆత్మ పాపభూయిస్టమైనపుడు ఆమె ప్రార్ధనలు తన్ను ఉద్ధరిస్తాయని ఎరుగును .లయోనేల్ జాన్సన్ మొదటి చార్లెస్ విగ్రహం దగ్గర కూర్చుని  రాసిన దీర్ఘకవితలో జీవితం లో పరాజితుడైనా చనిపోయి సౌందర్యం సాధించాడని ,అతని ఆత్మకళలలో  ఆనందం పొందుతుందని ,జనమంతా ఆయనకృపకు’’ ఆకొని’’ఉన్నారని ఆవేదన చెందాడు .

  జోసెఫ్ బి స్ట్రాస్ ఆశావాది .దెబ్బపై దెబ్బతిన్నా కస్టాలకడలిలో ఈదుతున్నా బాధతప్ప ఏదీ లేదు అనుకోడు .వసంత స్పర్శ ,ఎగిరే పక్షి,చల్లని చిరునవ్వు ,ఒకరిద్దరు నమ్మిన నేస్తాలు జీవితానికి విలువ నిస్తాయనినమ్మాడు  .రాబర్ట్ ఫ్రాస్ట్ కుదూరటానికి కూడా వీలులేని చీకటి వనం లో పక్షిగానం చీకటిలోకి శోకం లోకి రారమ్మని  వినిపించి౦ది. కాని నక్షత్రాలకోసం బయటే ఉండిపోయాడు .మన ల క్ష్యాన్ని అతిదూరం గా ఉంచమని కోరాడు ఫిలిప్ ఏం రాస్కిన్ రష్యన్,జ్యూయిష్ అమెరికన్ కవి . మార్గరెట్ యి బ్రూనేర్ కు కుక్క మానవ హృదయాన్నే అర్ధం చేసుకోగలది అనిపించింది .దానికి కావలసింది అర్ధం చేసుకోగలమిత్రుడే అని నమ్మింది ఆమె. .మన చెట్టు కవి ఇస్మాయిల్ లాగా జాయిస్ కిల్మార్ కు చెట్టంత అందమైన కవిత కనిపించలేదు. అది రోజంతా ఆకులవంటి చేతులు పైకెత్తి దైవ ప్రార్ధన చేస్తుంది .తనలాంటి మూర్ఖులే కవితలు రాస్తారని కాని దేవుడుమాత్రమే చెట్టును చేయగలడని నమ్మాడు .సున్నిత శ్రావ్యత సౌందర్య౦  ఎలినార్ మార్టాన్ వైలీ కవితలలో ఉంటుంది-ఏదో ఒక చోటుకి మఖమల్ పావులు వేసుకొని నీరవ నిశ్శబ్ద నీహారం లోకి నడుద్దాం రమ్మంటుంది.పడకగది గోడమీద తనపొడవును సగర్వంగా కొలిచిన తల్లి కొలిచిన వైనం గుర్తొచ్చింది రోజా జగ్ నోనిమరియాని కి .జోసెఫ్ మార్రిస్ కు యెద కు౦గినపుడు చిరునవ్వే పలకరిస్తుందని నమ్మకం .కారుణ్యం ఎక్కడ అంతం అవుతుందో చూడలేకపోయినా అది శాశ్వతకాలాన్ని చేరుతుంది అంటాడు .అందుకే విలువైన తన 400ఎకరాల భూమిని మయామీ యూని వర్సిటీకి దానంగా ఇచ్చాడు.

 విలియం యి హేన్లి అజేయమైన ఆత్మను తనకిచ్చినదుకు దేవతలకు కృతజ్ఞతలు చెప్పాడు .భయాలకు ప్రమాదాలకు వెరువనివాడు. తన ఆత్మకు తానె అధిపతిని ,తానె నాయకుడిని అని నమ్మాడు’’ ఇన్విక్టస్ ‘’అంటే అజేయత కవితలో .ఈకవితను దక్షిణాఫ్రికా నేత నెల్సన్ మండేలా తనతోపాటుజైల్ లో ఉన్నవాళ్ళకు ఈకవిత వినిపించి ధైర్యం, పోరాటపటిమ కలిగించాడు .తనతల్లికి ఉన్న ధైర్యం ఆమెతో వెళ్ళిపోయిందని ,ఆమె ధైర్యమే తనకు ఉంటె యెంత బాగుండును అని బాధపడింది ఎడ్నావిన్సెంట్ మిల్లె .కాలం బాధను పోగొడుతుంది అన్నది నిజంకాదు అంటుంది .ఈమెధైర్యసాహసాలకు మేధా శక్తికి ‘’అమెరికన్ మహిళా బైరన్ ‘’ గా కీర్తిపొందింది  .కార్రీ మే నికొలాస్  కు ధుమ ధుమలను చిరునవ్వు మాయం చేస్తుందని తీయని చూపు కోపాన్ని చల్లారుస్తుందని అనిపించింది .డోరోతి క్విక్ కు పాతదేవుళ్ల పాలన అంతమైందని గుడిలో’’ కొత్తా దేవుళ్ళు’’ఉండరని ,జీవితసారాన్నీ గ్రహించిన నిమ్నోన్నతాలకు తాను  బంధువునని అనిపించింది .ఈమె 11ఏళ్ళ వయసులో మహా నవలారచయిత మార్క్ ట్వేన్ ను పడవ లో కలిసి స్పూర్తి పొందింది .నార్మన్ వి పియర్స్ కవి కి గులాబీ తోటలు కనిపించకపోయినా వాసన ఇష్టం .పర్వత శిఖరాలు కనిపించకపోయినా  వాటి నుంచివచ్చే చల్లనిగాలి సౌఖ్యం అనుభవించగలడు .పక్షుల్ని చూడలేకపోయినా వానకోయిల గాన సుఖం అనుభవిస్తాడు .దారిలో పిల్లల్ని చూడలేకున్నా వారి హాసాన్ని ఆస్వాది౦చ గలడు .సముద్రంపై చంద్రకాంతి చూడలేకపోయినా కెరటాల సంగీతం వినగలడు.ప్రకృతి సమర్పించే శ్రావ్య ధ్వనులన్నీ వీనులవిందు అతనికి .అందుకే దైవానికి వందనాలు సమర్పించి ఇంతకంటే ఎక్కువఏదీ కోరను అని సంతృప్తి పడ్డాడు ‘’బ్లైండ్ ‘’అంటే అందుడుకవితలో .

  ఇన్ని అద్భుతఆంగ్ల  కవితలను తెలుగులో బంగారపు పోత పోసి అందించిన రాచకొండ శర్మగారికి ఆంద్ర సాహితీ లోకం ఎంతో రుణపడి ఉంది .ప్రతికవిత ఆకవి హృదయాన్ని ఆవిష్కరించే తీరులో అనువాదం సాగి అనుభూతి నిచ్చింది .ఇన్ని హృదయాలలో పరకాయ ప్రవేశం చేయటం మాటలుకాదు .చేసి చూపించి తమ సమర్ధత చాటారు డా.శర్మగారు .మిక్కిలి అభిన౦దనీయులు .వారి పూనిక ధైర్యం దీక్ష ,నిరంతర సాహితీ సేవ అందరికీ ఆదర్శం .భగవంతుడు వారికి, వారి శ్రీమతిగారికీ శతాధిక ఆయుస్సు ,ఆరోగ్యం కలిగించాలని ,మరిన్ని అందమైన ఆంగ్లకవితల అనువాదాలు వారి లేఖిని నుండి వెలువడాలని కోరుతున్నాను .

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -10-10-19-ఉయ్యూరు   .

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సాహితీ దిగ్గజాలకు అక్షర నీరాజనం -గబ్బిట దుర్గాప్రసాద్ -రమ్యభారతి-అక్టోబర్

సాహితీ దిగ్గజాలకు అక్షర నీరాజనం -గబ్బిట దుర్గాప్రసాద్ -రమ్యభారతి-అక్టోబర్

Posted in రచనలు | Tagged | Leave a comment

అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -12 12-పింగళి మాదన్న మంత్రి

  అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -12

12-పింగళి మాదన్న మంత్రి

నియోగిబ్రాహ్మణుడు భారద్వాజ గోత్రీకుడు పింగళి మాదన్న మంత్రి 17వ శతాబ్ది వాడు .తండ్రి భానోజి ,తల్లి భాగ్యమ్మ .చిన్నప్పుడే చదువు బాగా నేర్చి గోల్కొండకు వెళ్లి మీర్ జుమ్లా అనే ఉద్యోగి వద్ద నెలకు 10’’గిల్డరు’’ల జీతం తో గుమాస్తాగా చేరాడు.అన్న అక్కన్న కొంచెం తొందరపాటువాడు,కాని పండితుడు .మాదన్న ఉపాయా శాలి .వీరిద్దరి తెలివి తేటలు తానీషాకు తెలిసి ,ఇద్దర్నీ ఆహ్వానించి ‘’వసాఉత్’’ఉద్యోగులుగా చేర్చుకొని ఆ౦తరంగికులుగా చేసుకొన్నాడు .తానీషా అసలు పేరు అబుల్ హసన్ .ఉన్నతకులం లో పుట్టినా బాల్యం లోనే ఆస్తిపాస్తులు హరించుకుపోయి దరిద్రం అనుభవించి ఐహిక సుఖాపేక్షతోపాటు మోక్షాపేక్షకూడా పెంచుకొన్నాడు  .అప్పుడు గోల్కొండలో సయ్యద్ రాజ్ కొత్తాల్అనే పైగంబర్ మహాతపస్వి ఉండేవాడు .ఈయనను గురువుగాభావించి 14ఏళ్ళు యోగాభ్యాసం ,భక్తీ నేర్చాడు .

  అప్పటి రాజకీయ పరిస్టితులుఅస్తవ్యస్తంగా ఉన్నాయి .సుల్తాన్ అబ్దుల్లాకు మగసంతానం లేదు .ముగ్గురుకూతుళ్ళు.పెద్దకూతురు ను సయ్యద్ అహమ్మద్ కు ఇచ్చి పెళ్లి చేయగా ,మామగార్ని కీలుబొమ్మ ను చేసి తానే అధికారం చెలాయించాడు .రెండవ కూతుర్ని ఔరంగజేబు కొడుకు మహమ్మద్ సుల్తాన్ కిచ్చి పెళ్లి చేశాడు .మూడవ కూతుర్ని పెద్దల్లుడి ఆశ్రితుడైన సయ్యద్ సుల్తాన్ కిచ్చి పెళ్లి చేస్తానని వాగ్దానం చేసి రేపు పెళ్లి అనగా వాడు తనను వెక్కి రించాడని ఈర్షాసూయలతో మాట నిలబెట్టుకోకుండా ,తనకు అణగిమణగి ఉంటాడని తానీషాకిచ్చి పెళ్లి చేశాడు .మామగారు మరణించగానే పెద్దల్లుడు సయ్యద్ అహమ్మద్ సుల్తాన్ అవటానికి ఉబలాట పడ్డాడు .ఐతే వీడి అహంకారం వెకిలితనం వలన అనేకులు శత్రువులై సేనాని సయ్యద్ ముజఫర్ ,మహాల్దారు మూసాఖాన్ లు పెద్దల్లుడిని జైలు లోపెట్టి మూడవ అల్లుడు అబుల్ హసన్  ను ‘’తానీషా’’ అనే పేరుతొ సుల్తాన్ చేసి తాము మంత్రులయ్యారు వీరిద్దరి కపటనాటకాలు గమనిస్తున్న తానీషా వీళ్ళని తప్పించే ఉపాయమాలోచిస్తూ అమాయకుడిగా నటించాడు .,

  అక్కన్నమాదన్నల ప్రభుభక్తి తెలివి తేటలు బుద్ధి సూక్ష్మత ,సామ్రాజ్య రక్షాబాధ్యతలు గుర్తించి ముజఫర్ ,మూసాలను ఖైదు చేసి మాదన్న కు ‘’సూర్యప్రకాశరావు ‘’అనే బిరుదు ఇచ్చి మహామాత్యుని చేసి రాజ్యభారం అప్పగింఛి వేదాంత గోష్టిలో కాలంగడిపాడు  తానీషా.అక్కన్న మహా సేనాని గా ,మాదన్న మహామంత్రిగా ,మరోతమ్ముడు వెంకన్న ‘’రుస్తుం రావు ‘’అనే బిరుదుతో ఫౌజు దారు అయ్యారు .మాదన్నమంత్రి మః నేర్పుతో సామ్రాజ్య రక్షణభారం అంతా నిర్వహించి జనరంజకపాలన చేశాడు .ఉత్తరాన కళింగ, దక్షిణాన పుదుచ్చేరి వరకు గోల్కొండ సామ్రాజ్యాన్ని అభి వృద్ధి చేశాడు .విదేశా౦గనీతిలో దిట్ట మాదన్న.ధిల్లీ సుల్తాన్ ఔరంగజేబు కు కప్పం కడుతూ విధేయంగా మెలిగారు   గోల్కొండ నవాబులు .

  మహారాష్ట్ర లో శివాజీ ఉద్ధృతంగా బల శౌర్యాలతో రాజ్యాలు జయిస్తూ సామ్రాజ్యం దక్షిణా పధం అంతావిస్తరిస్తున్నాడు  .ఔరంగ జేబుతో స్నేహం పాముతో స్నేహం అని గ్రహించి ,దగ్గరశత్రువు శివాజీతో తానీషాకు స్నేహం చేకూర్చాడుమాదన్నమంత్రి .గోల్కొండకు శివాజీ అండగా ఉండి,తాను స్వాధీనం చేసుకొంటున్న దక్షిణాపధం లోని కొంతరాజ్యం ధనం గోల్కొండకు ఇచ్చేట్లు,దీనికి బదులుగా తానీషా శివాజీకి కొన్ని లక్షల వరుమానం ఇచ్చేట్లు  మాదన్నమంత్రి ఒడంబడిక కుదిర్చాడు .ఇది ఔరంగ జేబు కు ఎక్కడోకాలి తానీషాను అదుపులోపెట్టటానికి  ప్రత్యేకరాయబారిని నియమించాడు .బిజాపూర్ నవాబు ఎప్పటికప్పుడు యుద్ధానికి సిద్ధమవుతూనే ఉన్నాడు .

  రాజకీయ చతురత ,శక్తియుక్తులున్న మాదన్నమంత్రి ఇదంతా వెయ్యికళ్ళతో గమనిస్తూ ,విదేశీ వర్తకులకు సకల సౌకర్యాలు సమకూరుస్తూ ఉన్నాడు .కాని కొందరు దర్బారీయులకు అంతఃపుర స్త్రీలకూ మాదన్న పై అసూయ ఏర్పడి తానీషాకు ఆయనపై పితూరీలు చేస్తున్నారు .వీటిని పడచెవినిపెట్టాడు తానీషా.శివాజీపై మాదన్న పెట్టుకొన్న ఆశలు శివాజీ మరణంతో నిరాశలయ్యాయి  .ఈలోగా బీజాపూర్ పై ఔరంగజేబు దాడి చేస్తూ ,వాళ్లకు సాయం చేస్తే తానీషాకు తగిన శాస్తి జరుగుతుందని హెచ్చరించాడు .కాని రహస్యంగా బిజాపూర్ నవాబుకు సాయం అందించాడు .

  ఎలాగైనా గోల్కొండను స్వాధీనం చేసుకోవాలని ఔరంగజేబు ఆత్రం .తానీషా’’ కాఫర్’’ అయిన అక్కన్నమంత్రి చెప్పుచేతల్లో ఉన్నాడని  వ్యసనాలకు బానిసయ్యాడని ఆగ్రహంతో దుష్ప్రచారం   చేయించాడు  .తానీషాతో యుద్ధానికి సర్వదా సిద్ధంగా ఉండమని రాయబారికి వర్తమానం పంపాడు .దర్బారీయుడైన ‘’అత్తేమత్తయ రాయని ‘’మహాసేనాని అగౌరవపరచాడని తెలుసుకొని ,అతడిని బుజ్జగించే ప్రయత్నం చేసినా అతడు అవమానం మర్చిపోలేకపోతున్నాడు .ధిల్లీ సుల్తానుకు గోల్కొండ నవాబుకు మధ్య పరస్పర కుట్రలు కుతంత్రాలు పెరిగి ,గోల్కొండపై మొగలాయి దండయాత్ర ప్రారంభంకాగా’అత్తేమత్తయ రాయడు మాదన్న ,తానీషా ,సేనానులపై ద్వేషం పెరిగేట్లు చేశాడు .

 పాదుషాకొడుకు షా ఆలం  గోల్కొండ పైకి  దండెత్తివచ్చాడు.కప్పం చెల్లిస్తూనే తానీషా రాయబారం నడిపాడు .అక్కన్న మాదన్నలను పదవులనుంచి తొలగించమని సుల్తాన్ ఫర్మానా జారీచేశాడు .గ్రహించిన అక్కన్నమాదన్నలు తామే పదవికి వీడ్కోలు పలికారు .ఒకరోజు వీరిద్దరూ బంగారుపల్లకిలో వస్తుంటే అత్తెమత్తయ రాయడి సైనికులు అకస్మాత్తుగా వారిపై పడి తలలు నరికేసి ,శరీరాలను మట్టిలో ఈడుస్తూ ,వారి బంధువులను హిందువులు ఎక్కువగా ఉన్న చోట్ల భీభత్సం సృష్టించి వారినీ చంపేశారు .మాదన్నకు సంతానం లేదు .అక్కన్న కొడుకు మల్లన్నను ఒక తురక అతనుజాగ్రత్తగా కాపాడి పెంచాడు .అక్కన్నమాదన్న మరణ వార్త తానీషా విని చాలా దుఃఖించాడు  .

  తానీషా పాదుషాకు లొంగిపోయి ,ఒక లేఖ రాశాడు .గోల్కొ౦ డ మొగలాయీలు స్వాధీనం చేసుకొని తానీషాను దౌలతాబాద్ కోటలో బంధించారు.14ఏళ్ళు బందీగా మగ్గిపోయి క్రీశ 1602లో తానీషా చనిపోయాడు .

ఆధారం – –ప్రాచీన హిందూ దేశ రాజ్యాంగ చరిత్ర ,కన్నడ దేశ చరిత్ర ,ప్రాచీన గ్రామసభల న్యాయ పరిపాలన ,దండనాథులు, దుర్గాధిపతులు వంటి అమూల్యగ్రంథాలు రచించిన విమర్శక శిరోమణి ,సాహిత్య విశారద బ్రహ్మశ్రీ కోన వేంకటరాయ శర్మగారు1950లో రచించిన  ‘’సచివోత్తములు ‘’ పుస్తకం

  సశేషం

విజయదశమి శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-10-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ శార్వరి సరసభారతి ఉగాది వేడుకలలో 3పుస్తకాల ఆవిష్కరణ 

శ్రీ శార్వరి సరసభారతి ఉగాది వేడుకలలో 3పుస్తకాల ఆవిష్కరణ

సాహితీ బంధువులకు విజయదశమి దసరా శుభాకాంక్షలు –
సరసభారతి నిర్వహించే శ్రీ శార్వరి ఉగాది వేడుకలలో నేను అంతర్జాలం లో రాసిన, సరసభారతి ప్రచురిస్తున్న  ఈ క్రింది 3 పుస్తకాలు ఆవిష్కరించాలని భావిస్తున్నాము
1-ఊసుల్లో ఉయ్యూరు -75ఎపిసోడ్ లలో ఉయ్యూరుకు సంబంధించిన సుమారు నా 75 సంవత్సరాల లోని అనుభవాలు జ్ఞాపకాలు ,పండుగలు వేడుకలు ,పెద్దలు పిన్నలు ,గురువులు స్నేహితులు ,మా కుటుంబానికి సేవచేసినవారు ,అంతరించిన సాహితీ సంస్థలు ,అసామాన్య ప్రతిభతో రాణించినవారి జీవిత విశేషాలు ,శ్రీ మైనేని గోపాలకృష్ణ (అమెరికా )గారి అనుభవాలతోసహా వెలువడువడుతున్న గొప్ప” నాస్టాల్జియా ”. .దీనిని మా గురువరేణ్యులు బ్రహ్మశ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి ,శ్రీమతి సీతమ్మగార్ల  దంపతులకు అంకితమివ్వటానికి గురుపుత్రులైన శ్రీకోట సోదరులు అనుమతించారు . .
2-గుజరాత్ లోని   సోమనాథ్ ,,ద్వారక ,అక్షరథాం అనే స్వామి నారాయణ దేవాలయం ,2కర్నాటక రాష్ట్రం లోని లోని మైసూర్ బెంగుళూర్ ,హలీబేడు ,శ్రావణ బెల్గోడా హిందూపూర్ మొదలైనవి  ,3-తమిళనాడు లోని చిదంబరం ,శ్రీ రంగం వైదీశ్వర జంబుకేశ్వర ,పళని బృహదీశ్వరాలయం ,అరుణాచలం 4-కేరళరాస్త్రం లోని ఆదిశంకరాచార్య జన్మస్థలం కాలడి ,అనంతపద్మనాభస్వామి  దేవాలయం మొదలైనవి 5-మధ్య ప్రదేశ్ లోని ఉజ్జయిని ,ఓంకారేశ్వర్ ,ఖజురహో మొదలైనవి 6-ఉత్తర ప్రదేశ్ లోని కాశీ ,ప్రయాగ ,మొదలైన మా క్షేత్ర యాత్రా సందర్శన విశేషాలతో వెలువడుతున్న”ట్రావెలోగ్” పుస్తకం”
 దీనికి సరసభారతి కార్యవర్గ సభ్యురాలు ,లోగడ వెలువరించిన ”మా అన్నయ్య ”కవితా స౦కలనం కు ప్రాయోజకురాలు ,మాతో కేరళ యాత్ర చేసిన శ్రీమతిసీతంరాజు మల్లికగారు ”స్పాన్సర్ ”
3-వివిధ రంగాలలో అరుదైన పరిశోధనలతో వన్నెకెక్కిన ,పెద్దగా ఎవరికీ తెలియని సుమారు 50మంది తెలుగు శాస్త్ర వేత్తల జీవిత విశేషాలతో వెలువరిస్తున్న ”ఆధునిక ఆంద్ర శాస్త్ర వేత్తలు ”
  ఈ మూడు పుస్తకాలను ఆత్మీయులు రమ్యభారతి సంపాదకులు శ్రీ చలపాక ప్రకాష్ గారు సరసభారతి తరఫున ముద్రించి అందజేస్తున్నందుకు ధన్యవాదాలు .
 సరసభారతికి మీరు అందిస్తున్న సహకారానికి ,ప్రోత్సాహానికి సర్వదా కృతజ్ఞతలతో –
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -విజయదశమి -8-10-19-ఉయ్యూరు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఆటవెలదుల తోట – ఆవిష్కరణ సభ

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -11

అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -11

11-రాయూరు యల్లన మంత్రి

12వ శతాబ్ది రాయూరి యల్లన మంత్రి కమ్మనాడు రాయూరు వాస్తవ్యుడు .ఆ పురం అపర అమరావతిగా వైభాగంలో ఉండేదని 1158అమరావతి శాసనం లో ఉన్నది –‘’శ్రీకాంతా నిలయంబు శిష్టజనతాసేవ్యంబు ,శాలీవనానీక ప్రాంత జలాశాయోద్గత లసన్నీరేజ శోభాన్వితం ‘’యల్లన మంత్రి ధిషణ బహుదొడ్డది అవటం వలన 13వ ఏటనే మంత్రిపదవి పొంది ,సత్కవి బంధుమిత్ర జన సంపత్కారి అయ్యాడు .శుద్ధ ప్రతిభా ప్రపంచిత లసన్మార్గ స్థితి తో అభ్యుదయ పరంపరగా ఎదిగాడు –‘’పదమూదేడులనాడు అమాత్యపదవి౦ బ్రాపించి తత్సంపదాస్పడుడై –సత్కవిబందుమిత్ర జనసంపత్కారి అనిపించాడు .ఈమంత్రి పాలిత ధర్మ మార్గుడు ,అనుపాలిత సత్య విలాసుడు ,ఉమ్లేలిత సర్వ శాస్త్రమతి ,మిత్రజనా౦బుజమిత్రమూర్తి  అంటే స్నేహితులనే పద్మాలకు సూర్యుడు ,అగ్లాలిత కీర్తి ,నిశ్చలితలక్ష్మీ సమన్వితుడు .

  తెలుగు చోడుడులకు ‘’కొణిదెన ‘’రాజధాని .వీళ్ళు అనేకదేవాలయాలు కట్టించారు కవులను ఆదరింఛి భాషాభిమానం పెంచారు .యెల్లన మంత్రి తండ్రికూడా చోడులమంత్రిగా ఉండేవాడు –‘’త్రిభువన  గీతకీర్తి ,నరదేవ శిఖామణి ,కామధారుణీ ప్రభు తనయుండు ,మా౦డలికభర్గుడు ,భర్గ పదాబ్జ షట్పదుడు అంటే మహా శివభక్తుడు ,అభి నవరాముడు,అర్యమకులాగ్రణి’’గుండియ పూండి ‘’భక్తితో త్రిభువన మల్ల దేవుడుప్రతీతిగా శంభునకిచ్చె బ్రీతితోన్ ‘’ .నన్ని చోడమహారాజు మంత్రి శంభుడు .ఈ శంభుమంత్రికి త్రిభువనమల్లుడు ‘’గుండియ పూండి ‘’అగ్రహారం ఇచ్చాడు .శంభునికొడుకు అన్నమంత్రి తాను  సంపాదించింది దీనులకు బంధువులకు ,దేవాలయ నిర్మాణాలకు ఖర్చు చేశాడు .ఇలాంటి శుద్ధమనస్కుని కొడుకే మన యల్లనమంత్రి .భారద్వాజ గోత్రీకుడు ఆపస్తంభ సూత్రుడు .13ఏళ్ళకు మంత్రిపదవి పొంది ,వాజ్మయ సారస్వత ,మతవిషయాలను చక్కగా అభివృద్ధి చేశాడు .

  క్రీశ.6వ శాతాబ్దినుంచే శాసనాలలో గద్య పద్యాలు వచ్చాయి .1145కు పూర్వం ఉన్న పద్యకవితలో అద్భుత ధారాశుద్ధి కనిపించి పక్వ దశకు వచ్చిందని పిస్తుంది .యల్లనమంత్రి వైదుష్యాన్ని ,అతనిరాజు  రాజు వైభోగాన్ని తెలిపే శాసన పద్యాలన్నీ అందుకే రసగుళికలుగా మనకు ఇందులో కనిపిస్తాయి .

ఆధారం – –ప్రాచీన హిందూ దేశ రాజ్యాంగ చరిత్ర ,కన్నడ దేశ చరిత్ర ,ప్రాచీన గ్రామసభల న్యాయ పరిపాలన ,దండనాథులు, దుర్గాధిపతులు వంటి అమూల్యగ్రంథాలు రచించిన విమర్శక శిరోమణి ,సాహిత్య విశారద బ్రహ్మశ్రీ కోన వేంకటరాయ శర్మగారు1950లో రచించిన  ‘’సచివోత్తములు ‘’ పుస్తకం

సశేషం

దుర్గాష్టమి శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-10-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -10 10-నండూరు కొమ్మనమంత్రి

      అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -10

10-నండూరు కొమ్మనమంత్రి

తూర్పు చాళుక్యులతర్వాట వేంగి దేశాన్ని వెలనాటి చోడులు 1016నుంచి 1161వరకుపాలించారు .వీరిశాసనాలలో పిఠాపుర శాసనం ముఖ్యమైనది .వీళ్ళను  ధర్మరాజు సేవకుడైన ఇంద్ర  సేనుడు దగ్గరనుంచి అందర్నీ శూద్రరాజులుగా భావించారు .వీరిది మధ్య ప్రదేశ్ లోని కీర్తిపురం .మల్లవర్మ   తెగలో  5వ వాడు మొదటిమల్లవర్మ ‘’షట్సహస్ర దేశాన్ని జయింఛి ధనదపురం రాజధానిగా పాలించాడు .ఇతడు త్రిలోచనపల్లవుని సాయంతో దేశం పై హక్కు పొందాడు .తూర్పు చాళుక్యులను అనుసరించే వీరిలోఇతడే  చివరివాడు అని డా.హల్ష్ చెప్పాడు .యితడు త్రినేత్ర పల్లవుడితో యుద్ధం చేస్సినట్లు శాసనాలున్నాయి .ఇతనిపూర్వులు 9వ శతాబ్దిలో వెలనాడును స్వతంత్రంగా పాలించారు .ఈ రెండుతెగలవారు వెలనాటిపల్లవుల అభిమానం పొందారు .కేయూరబాహు చరిత్రలో ఈ విషయముంది .

  వెలనాటి మహా మండలేశ్వరుడు కొంక భూపతి 1139నుంచి 1191వరకు సనదుప్రోలు రాజధానిగా రాజ్యమేలాడు .సుమారు 195ఏళ్ళు  ఈ వంశజులు పాలించారు .గుంటూరుజిల్లా చందవోలు లేక చందోలు కే ధనదపురం అని పేరు .’’నిఖిల విభ వనములకు నెలవగుచు వెలయు –ధనదుపురము న కెనయు ధనదుపురం ‘’అని కీర్తి పొందింది .వెలనాటి దుర్జయ ఆస్థానం లో ‘’కార్యఖడ్గప్రవీణుడు ,అసమాన తేజస్సంపన్నుడు కొమ్మన మంత్రిగా ఉన్నాడు .కొంకరాజు పాలనలో చివర రోజులలో పాకనాడు జయించి స్వాధీనం చేసుకొన్నాడని బాపట్ల భావనారాయ స్వామి దేవాలయం లో 1190-91శాసనం లో ఉన్నది –‘’రమణీయ ధనదుపుర వర –మమరనిజరాజదానియై యుండ ,గనక –రము నెల్లూరు లోపుగ-గ్రమమొనరగ నేలె బాహుగర్వమువెలయన్ ‘’.కొ౦కభూపతి ఈ చందోలు రాజధానిగా ముఖలింగం నుంచి సింహపురి అంటే నెల్లూరు వరకు ఏలుబడి చేశాడు .’’ఏక వింశతి సహస్ర గ్రామ సంఖ్యాకమై –ధరనణి న్బేర్చిన ‘’పాకనాడు ‘’నిజ దోర్దండైకలగ్నంబుగా –ధర బాలించె ‘’నమాత్యకొమ్మన ‘’జగ –త్ప్రఖ్యాత చారిత్రుడై ‘’.ఇతడి కొడుకు రాజేంద్ర చోడుడి ఆజ్ఞతో కొమ్మనమంత్రి పాకనాడు ఏక వింశతి సహస్ర గ్రామాలు జయించాడు .కులోత్తుంగ చోళుని పాలనలోకూడా వేంగి పై కల్యాణి ,కటకం సామంతరాజులు దండెత్తారుకాని సనదుప్రోలు కటక దండ నాధుల  సహాయంతో పెద్ద సైన్యంతో కొమ్మన మంత్రి మన్నేరు ,కొత్త చెరల ప్రాంతాలలో పోరాడి రాజుకు జయం చేకూర్చినట్లు మంచన రాసిన ‘’కేయూరబాహు చరిత్ర ‘’లో కనిపిస్తుంది –‘’మావతుల తలలు తలపుడికి వేసి మావంతు తలలు ,శత్రురాజశిరములు ద్రోక్కించు రాగే దిరుగవాగే నుబ్బేడు తన వారువంబు చేత  -మహిత శౌర్యుండుకొమ్మనా మాత్య వరుడు ‘’అని అతని గుర్రం  ,ఆయన చేసిన సాహసం వర్ణించాడు .కొత్త చర్లయుద్ధం లో కొమ్మనమంత్రి వీర విక్రమ పరాక్రమ దీశక్తులు అనుపమానం అని అర్ధం .,యుద్ధమే వృత్తిగా,శస్త్ర విద్యా గర్వితులైనవారు  చేసే యుద్ధాన్ని ‘’విద్యా౦క౦ ‘’అంటారని’’అభిలషి  తార్ద చింతామణి ‘’లో సర్వజ్ఞ సోమేశ్వరుడు చెప్పాడు.కనుక కొమ్మన మంత్రి ‘’విద్యాంక బిరుదుకు సర్వవిధాలా అర్హుడే .పాకనాటికి వాయవ్యంలో ఉన్నడుర్గమే కొత్త చర్ల .

  11వ శతాబ్దం నాటికి తెలుగు దేశంలో దేశ భాగాలకు ‘’విషయం’’ అనీ’’ నాడు’’ అనీ ‘’రాష్ట్రం’’ అనీ సమానార్ధాలుగా వాడేవారు .14,15శతాబ్దాలకు రాష్ట్రం అంటే నాడు ,విషయం లకంటే పెద్ద భూభాగం అనే అర్ధం ఏర్పడింది ..’’తుంగభద్రా తరంగిణ్యాః ప్రాగ్దేశం వెలనాడితి’’అంటే తుంగభద్రానదికి తూర్పున ఉన్నది వెలనాడు అని అర్ధం .దీనికే ‘’ఆరువేల దేశం ‘’ అనే పేరు .నాల్గవ విష్ణువర్ధన మహారాజుకాలంలో 12వేలగ్రామాలుగా వేగినాడు ఉన్నది .తర్వాత ఆరువేల మూడువందల దేశంగా ఉండేది  .మొదటి కులోత్తు౦గుని కాలం లో 16వేలగ్రామాల దేశంగా ఉండేదని పిఠాపురం శాసనం ఉవాచ .కొండపడమటి దేశం లో 13గ్రామాలున్నాయని –‘’ఆంధ్రా త్పతః  పశ్చిమతో క్షితిః’’అన్నారు.దీనినే  ‘’ఆంద్ర పథం’’ అన్నారు .గుండ్లకమ్మకు దక్షిణాన వెలికొండలు నుంచి సముద్రం వరకు ఉన్నది ‘’పాకనాడు ‘’.అంటే ఇప్పటి నెల్లూరు మండలం ఒంగోలుతాలూకా,  కడప మండలం తూర్పుభాగం కలిస్తే పాకనాడు .

  వెలనాటి దుర్జయులలో చివరిరాజు పృద్వీశ్వరుడి రాజ్యం శ్రీకూర్మందాకా ఉండేది .కళింగరాజులు ఇతనికి కప్పం చెల్లించేవారు .ఇతన్ని చంపినవాడు తిక్కరాజు  రాజేంద్ర చోడుడి కొడుకు .ఇతనిమంత్రి కేతన  .తిక్కనగారి నిర్వచనోత్తర రామాయణం లో దీన్ని చెప్పాడు –‘’ఆకాశ మరుచ్చ శివకాశ సురాశన ,తార కేశ,నీకాశత రాభి రోచి రవకాశ వికాస యశో విలాసుడై ‘’ .ఇతడితండ్రి కొమ్మన –‘’ఆ కొమ్మనప్రగడ సుతు –డై కేతన చోడ భూవరాత్మజుడై –ధైర్యాకరుడగు ప్రుద్వీశ –మహాకాన్తుని మంత్రియయ్యే నెంతయు బెర్మిన్ ‘’

పృధ్వీశుని ఆప్తమిత్రుడు కేతన .కొమ్మన ప్రగడ –‘’వాగ్దేవీ స్తన హార నిర్మల యశో వాల్లభ్యం ఉన్నవాడు .యశో భూషితుడు ,కౌశిక గోత్రీకుడు .’’కొంక విభు రాజ్యాధిస్టుది ఉండగా ,సంధి విగ్రహ ముఖ్య ‘’కార్యాలు నిర్వర్తించాడు .రిపు క్షితీశ బహు సైన్య ధ్వంస నా టోపం ఉన్నవాడు .తండ్రి గోవిందుడు .ప్రతిఏడాది 75పుట్లధాన్యం పండే భూములు ,తోమ్మిదికోట్ల రొఖం వందలాది  ఏనుగులు,40వేల గుర్రాలు ఉన్న మహా విభవ సంపన్నుడైన కులోత్తుంగ రాజేంద్ర చోళునికి ఇష్టసచివుడు ,తంత్ర ముఖ్యుడు కొమ్మన ప్రధాని .కొమ్మన నిర్మించిన తటాకాలు దేవతా విగ్రహాలు గుడులు గోపురాలు లెక్కకు అందవు .దండనాదాగ్రణి గోవింద ప్రగ్గడ వెలనాటి కొమ్కరాజు వద్దమంత్రి .కొడుకు కొమ్మన దండనాధుని కొడుకు కేతన తిక్కమహీపాలుడిఆత్మ సచివుడు   .కేతనకొడుకు భీమన రణవీర రణరంగడు  .మునిమనవడు గుండన మనుమసిద్దిరాజు కార్యా చారుడు .ఏటా జరిగే కాకుళేశ్వరుని తిరునాళ్ళకు వచ్చే తీర్ధ ప్రజలకు గుండనమంత్రి రత్నాలు ,మాడలు విరివిగా ఇచ్చేవాడు .అంటే కొమ్మన మంత్రి తండ్రి గోవిందా మాత్యుడు, గుండనమంత్రివరకు అందరూ రాచకార్యాలలో ఖడ్గ పరాక్రమం లో సాటిలేనివారే .ఆపస్తంభ సూత్రుడు ,కౌశిక గోత్రుడు ,ఆర్వేల నియోగిబ్రాహ్మణుడు కొమ్మనమంత్రి కృష్ణా గోదావరి మండలంలోని నండూరు గ్రామస్తుడు .

సరస్వతీపూజ శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-10-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సరసభారతి పుస్తక ప్రసాద వినియోగం 

సరసభారతి పుస్తక ప్రసాద వినియోగం

సెప్టెంబర్ 29 ఆదివారం ఆశ్వయుజమాస శుద్ధ పాడ్యమి నవరాత్రి ప్రారంభం రోజు ఉదయం మా ఇంటికి వచ్చిన కడప జిల్లా ఒంటిమిట్ట డాక్టర్లైన సాహితీ బంధువులసాహిత్యాభిమానానికి ,భగవద్భక్తి  కి సంతోషపడి , మూడుకార్లలో వచ్చిన వారందరికీ శ్రీ సువర్చలాన్జనేయ ,శ్రీ సరస్వతీ దేవి ప్రసాదంగా సరసభారతి ప్రచురించిన పుస్తకాలలో 13రకాల  సుమారు 350 పుస్తకాలు వీరికీ ,  అక్కడి దేవాలయాలకు , సాహితీ బంధువులకు అందించమని  వారికి అంద  జేశాను . వారు మహా ప్రసాదంగా కళ్ళకు  అద్దుకొని  వెంట తీసుకు వెళ్లారు .వారి సౌజన్యం మరువ లేను .వారికి దసరా నవరాత్రి శుభాకాంక్షలు -దుర్గాప్రసాద్ 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

  అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -9 9-ఓరూరు అనంతయ్యమంత్రి

  అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -9

9-ఓరూరు అనంతయ్యమంత్రి

14వ శతాబ్దికి చెందినా ఓరూరు అనంతయ్యమంత్రిదక్షిణ దేశం లోని దండకారణ్యం దగ్గర దేవరకొండకు సమీపం లో ఓరూరుఅనే పల్లెలో నందవరీక నియోగి బ్రాహ్మణ కుటుంబం లో పుట్టాడు .తండ్రి  ‘’ఢాకరాజు’’.భార్య మేళాంబ.చౌదేశ్వారీ దేవి అనుగ్రహంతో వీరికి చిక్కప్ప పుట్టాడు .పుట్టిన కొద్దికాలానినే తండ్రి మరణం .అయిదేళ్ళ కొడుకును తీసుకొని తల్లి ఊరూరూ తిరుగుతూ చివరికి  బుక్కరాయలు పాలించే విజయనగరం చేరింది .వేపుపైఉన్న కొడుకున్ చక్రతెర్ధందగ్గరున్న కోదండ రామాలయం దగ్గర దింపి భిక్ష కోసం ఊళ్లోకి వెళ్ళింది.నిద్ర పోతున్న ఆకుర్రాడికి ఒక ఘటసర్పం పిల్లాడికి ఎండ సోకకుండా పడగా విప్పిగొడుగులా నిలిచింది .అటుగావచ్చిన ఒకపాములాడికి ఇది గొప్ప వి౦తనిపించి ఈ బాలుడు దశ ఉన్నవాడైతే నేనిప్పుడు నాగస్వరం ఊడితే అనాగుపాము మళ్ళీ రావాలి అనుకొనిఊదగా,ప్రక్కనే ఉన్న పుట్టలోని ఆనాగం మళ్ళీ వచ్చి బాలుడి శిరసుపై పాడగా నీడ పట్టి రెండు గంటలు ఆడి. వెళ్ళిపోయింది.మళ్ళీ అవాక్కైన ఆ ‘’నాగాభోగి ‘’అంటే పాములాడు ఆపిల్లాడిని లేపి  హత్తుకొని విషయం చెప్పి  ,’’నీకు అదృష్టం కలిసివస్తే  నాకేమిస్తావు ?’’అనిఅడిగితే’నాకే మహర్దశ ప్రాప్తిస్తే కొన్ని చెరువులు నగరాలు నీపేర నిర్మిస్తాను ‘’అని చెప్పాడు .మళ్ళీ కుర్రాడిని ముద్దాడి వాడు వెళ్ళిపోయాడు భిక్షాటనకు వెళ్ళిన తల్లి మేళమ్మతిరిగివచ్చింది .కొదుకువ్అలన అంతాతెలుసుకొని అబ్బురపడిందితల్లి  .

   రోజూ తానూ అతడిని వదిలి వేడుతున్నదుకు బాధపడుతూ అన్చిమాటలు చెప్పి వెళ్ళేది అతడుకూడా తల్లికి తలవంపు వచ్చే పనులు చేయనని తల్లికి తప్పక సంతోషం కలిగిస్తానని తమక్స్తాలు కలకాలం ఉండవని చెప్పేవాడు .బుక్కరయలమంత్రి నారాయణ దగ్గరకు ఒకరోజు ఆమె వెళ్లి తన దీనగాద విన్నవించగా అతడు దయాళువై వారిద్దర్నీ తనింట్లో ఉంచుకున్నాడు .చిక్కన్నకు ఉపనయనం చేసి చదువు చెప్పించి ,తీర్చిదిద్ది రాజసభకు తనతో తీసుకెళ్ళేవాడు .ఒకరోజు అర్ధరాత్రి ధిల్లీపాదుషా నుంచి ఒకఫర్మానావస్తే ,దాన్ని చదివి చెప్పటానికి  సమాధానం రాయటానికి లేఖకుడేవరూ దొరక్కపోతే భటులు వెతుకుతుంటే చావడి అరుగే తలగాడా గా నిన్ద్రపోతున్న చిక్కన్న కనిపించగా ,లేపి రాజ భవనం లోకి తీసుకెళ్ళారు .చిక్కన్న దాని చక్కగా చదివి వివరింఛి సంతోషం కలిగించి ,ఇంటికి వెళ్ళాడు .

  మార్నాడు బుక్కరాయల సభలో పాదుషా లేఖకు సమాధానం రాయమని వ్రాయస గాండ్లకు చెబితే అందులోని పదబంధం తమకు అర్ధంకావటం లేదుకనుక సమాధానం రాయటానికి అశక్తులం అన్నారు .లేఖ కనబడక పోవటంతో చిక్కన్నను మళ్ళీ పిలిపింఛి ఆలేఖకు కాపీ రాయమని కోరాడు . రాత్రి తాను  చదివిన విషయాలన్నీ గుర్తు ఉండటంతో అలాగే లేఖ కాపీరాసి ఇచ్చి వెళ్ళిపోయాడు .రాజు అంతఃపురం వెళ్ళే దూలం నేర్రెలో ఉన్న పాదుషాఉత్తరం చూసి ,చిక్కన్న రాసిన దానితో పోల్చి చూసి ,అతడి బుద్ధి విశేషాలకు ఆశ్చర్యపడి ,తానూ కొలువున్న సభకు సగౌరవంగా ఆహ్వానించి ,మెచ్చుకొని ‘’అమాత్యపదవి ‘’తోపాటు ‘’ఒడయరు ‘’బిరుదు ప్రదానం చేశాడు .

  మరొక సారి మంత్రులందరూ కొలువులో ఉండగా తానూ రాజకీయ కార్య మగ్నుదవటం వలన చిక్కన్నకు  పూర్తీ అధికారం తోపాటు ధనాగారమూ రాజముద్రిక  అప్పగించి వెళ్ళాడు.రాజాజ్ఞను ఔదలదాల్చి నిత్యం సభకు వెడుతూ వ్యవహారాలూ చూస్తూ ,రాజులేని కొరత కనపడకుండా చేస్తున్నాడు .అతని రూపయవ్వన శేముషీ వైభవానికి ముచ్చటపడిన రాణి మోహపడి  అతడిని తన మందిరానికి తీసుకురమ్మని చెలికత్తెను పంపింది   .కొంచెం తటపటాయియి౦చి రాణి ఆజ్ఞ కాదంటే ఏం ప్రమాదమో అనుకోని వెళ్ళాడు .ఆమె అకస్మాత్తుగా వచ్చి అతడిని గాధంగా హత్తుకొని ప్రేమ కురిపిస్తే ‘’అమ్మా !నువ్వు తల్లిలా౦టి దానివి.కామం పనికి రాదు .నేను బ్రహ్మ చారిణి .ఇక ఇప్పటినుంచి ఏ స్త్రీముఖమూ చూడను .బ్రహ్మ చర్యం పాటిస్తా ‘’అని చెప్పి పాదాలకు నమస్కరించి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు .

 మర్నాటినుంచి రాజాస్థానానికి వెళ్ళలేదు .బుక్కరాయలకు ఒక లేఖ రాసి అందులో ఆయన తనపై మోపిన కార్యభారాన్ని అ రోజు వరకు సంతృప్తిగా నేరవేర్చగాలిగానని కాని ఒక అవాంతర పరిస్థితి ఎదురై తన స్వాస్త్యం దెబ్బతిన్నదని ,ధర్మజ్ఞుడైన రాజు వెంటనే వచ్చి ,తనభారాన్ని తీసేయ్యమని ప్రాధేయపడ్డాడు   .రాజు వెంటనే వచ్చి విషయం అంతా తెలుసుకొని  తానూ అతడికి తగిన కన్యతో పెళ్లి చేయాలని యోచిస్తుండగా తొందరపడి చిక్కన్న బ్రహ్మ చర్య వ్రతం తీసుకున్నందుకు బాధపడి మరేదైనా వరం కోరుకోమన్నాడు చిక్కన్న ‘’ప్రభూ !మీ ధనాగారం లోని ధనం అంతా నాకు ఇచ్చెయ్యండి ‘’అనికోరగా అంతా ఇచ్చేసి పంపించాడు .

చిక్కప్ప సంతోషం తో పెనుగొండవైపు ఉత్తర దిశలో  ప్రవహించే ఏటి ఒడ్డున ఒక తటాకం నిర్మించి ,దీనికి ఉత్తరాన ఒకగ్రామం ఏర్పాటు చేసి పాములవాడికి తానిచ్చిన మాట నిలబెట్టుకొని దానికి ‘’నాగ సముద్రం ‘’పేరుపెట్టాడు .దీనితో ఆగకుండా అగస్త్యాశ్రమం దగ్గర గాట్లను చీల్చుకొని ప్రావహించే పెన్నేటి కి అడ్డకట్ట కట్టించి ,ఒక చెరువు త్రవ్వించే పనిలో పొద్దునా సాయంత్రం వచ్చి చూస్తూన్న అతని కార్య దీక్షకు ముచ్చటపడి ఒక జవ్వని  అక్కడ ప్రవాహ వేగామాపటం ఎవరి తరం కాదని కనుక వ్యర్ధ ప్రయత్నం మానుకోమని చిత్రావతి నది ఒడ్డున తటాకం నిర్మిస్తే భేషుగ్గా ఉంటుందని చెప్పి అదృశ్యమైంది .మర్నాడు అతనికి ఆమె చెప్పినమాటలు యదార్ధమే అనిపించి అక్కడవదిలేసి ,గార్గాశ్రమ భూమిగా పేరొందిన చోట దేవరకొండదగ్గర చదునైన ప్రదేశం లో మహావేగంగా ప్రవహించే ‘పా౦డునది’’ని చూసి ,తగిన ప్రదేశం అని నిర్న్నయించి అక్కడ ఒక చెరువు నిర్మించి ,దానికి తూర్పు పడమరలలో రెండు తూములు అంటే అలుగులు ఏర్పరచి ,రెండు వైపులా గ్రామాలు ఏర్పాటు చేసి తూర్పువైపు దానికి రాజుపేర ‘’బుక్కరాయ సముద్రం ‘’అనీ ,పడమటి వైపుదానికి రాణి అనంతాంబ పేర ‘’అనంత సాగరం ‘’అనీ పేర్లు పెట్టాడు .

  చిక్కనామాత్యుడు అనంత సాగరం దగ్గర కృష్ణగిరిలో దేవాలయం కట్టించి ప్రాణలింగాన్ని ప్రతిస్టింఛి 1364లో ఒక శిలాశాసనం వేయించాడు  .మరొక సారి నల్లగుట్ట  లమధ్య ప్రవహించే చిత్రావతి నదిని చూసి దానిదగ్గర  కరకట్ట పోయించి ఆ నీరు నిలవ ఉంచితే సాగుకు త్రాగటానికి పుష్కలంగా నీరు లభిస్తుందని భావించి  వేలాది మంది  కూలివాళ్ళను, వడ్డెర వాళ్ళను పిలిపించి తటాకం నిర్మించి ఒడ్డ్డున శ్రీ చౌడేశ్వరి దేవాలయం ,వినాయక దేవాలయం కట్టించి ,అక్కడే కొన్నేళ్ళు ఉండి సంతృప్తిగా ప్రాణాలు వదిలేశాడు .స్వార్ధం ,స్వాభిమానం లేని ,శుద్ధమనస్కుడు ,పరోపకారి ,ఔదార్య ఘనుడు చిక్కనామాత్యుడు ధన్యజీవి .

ఆధారం – –ప్రాచీన హిందూ దేశ రాజ్యాంగ చరిత్ర ,కన్నడ దేశ చరిత్ర ,ప్రాచీన గ్రామసభల న్యాయ పరిపాలన ,దండనాథులు, దుర్గాధిపతులు వంటి అమూల్యగ్రంథాలు రచించిన విమర్శక శిరోమణి ,సాహిత్య విశారద బ్రహ్మశ్రీ కోన వేంకటరాయ శర్మగారు1950లో రచించిన  ‘’సచివోత్తములు ‘’ పుస్తకం

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -3-10-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గాంధీజీ మహాత్ముడైన విధం -7(చివరిభాగం )

ఈ పోరాటాలలో గాంధి తన నిజాయితీని,వ్యక్తిత్వాన్ని ,సూటి మార్గాన్ని  పారదర్శకంగా ప్రదర్శించి మెప్పు పొందాడు .ఆయన పోరాటం బాధితుల,  అణగద్రొక్క బడిన వారి కన్నీరు, బాధలు దూరం చేయటానికే .ఇదే ఆయన ముఖ్య సూత్రం గా మారింది .అణగ ద్రొక్కేవారు అణగ ద్రొక్క బడే వారు సహకరించుకోకపోతే అణగద్రొక్కబడంటం అంత౦ కాదు అని  విశ్వసి౦చాడు  .ఇందులో అందరూ విజేతలే .ఆయన సిద్ధాంతం ‘’విన్ –విన్ ‘’సిద్ధాంతం .అంటే ఇరువైపులా విజయం ఉండాలి .అణచ బడే వారికి అణచేవారు శత్రువులుగా కనిపించకూడదు .వాళ్ళ దుర్దశ కష్టాలను ఆయన అడ్వా౦టేజిగా అంటే అనుకూలంగా ఎన్నడూ తీసుకోలేదు .వాళ్ళ దయనీయ స్థితి చూసి,వారికి సాయం కోసం  పోరాటం ఆపేసేవాడు .ఆంగ్లో –బోయర్ యుద్ధం ,,రైల్వే సమ్మెలలో పోరాట౦  నిలిపేశాడు .ఆయన వ్యూహం సాంకేతికంగా ‘’జీరో మొత్తాన్ని ,నాన్ జీరో మొత్తం ‘’గా మార్చే ఆట .గెలుపుకంటే ఇరువైపులా సామరస్య పరిష్కారానికే మొగ్గు చూపేవాడు .దీనికి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే గాంధీ –జనరల్ స్మట్స్ మధ్య జరిగిన విలువైన ఒప్పందమే  గొప్ప ఉదాహరణ .

  ఇండియాకు తిరిగి వెళ్ళే సమయం వచ్చిందని గాంధి భావించాడు .ఆయన రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే కూడా త్వరగా రమ్మని కబురు చేశాడు .దీనితో గాంధీ సౌతాఫ్రికాను 1914జులై లో చివరి సారిగా వదిలేసి ఇండియా బయల్దేరాడు .ఆయన అభిమానులు అనుచరులు  తండోపతండాలు గా వచ్చి దర్శనం చేసుకొని విలువైన కానుకలు బహుమతులు జ్ఞాపికలు అందించి  ‘’దేశభక్త మహాత్మా గాంధీ ‘’నినాదాలతో వీడ్కోలు పలికారు .నిరంకుశ జనరల్ స్మట్స్ కూడా చలించిపోయి ‘’మహర్షి మన తీరాలను దాటి వెడుతున్నాడు .బహుశా ఇక తిరిగిరారు ‘’అని శ్లాఘించి స్పందించటం విలువైన మాటగా చరిత్ర పేర్కొన్నది .

  దక్షిణాఫ్రికాలో గాంధీ పోరాట౦ సంక్షిప్తం గా చెప్పుకొంటే ,మొదట్లో మనం వేసుకొన్న ప్రశ్నలకు సరైన సమాధానాలు లభిస్తాయి .గాంధి దక్షిణాఫ్రికా అనుభవం’’ అభద్రతాభావం తో పిరికిగా ,విజయాలే లేని లాయర్ గా ఉన్న గాంధీని యదార్ధమైన ,సృష్టిలో అద్భుతమైన వింత వ్యక్తిగా పరివర్తన చెందించింది .ఒక వేళ గాంధీ దక్షిణాఫ్రికాకు రాకుండా ఉండి ఉంటే?  సమాధానం దొరకని ప్రశ్నగా మిగిలిపోతుంది .

 దక్షిణాఫ్రికాకు గాంధి ఏం రుణ పడి ఉన్నాడు ?ఇది వింత ప్రశ్న .దీనికి సమాధానం చెప్పటానికి ముందు ఇండియాలో ఆయన బాల్యం ,యవ్వనం ,తలిదండ్రులనుంచి సంక్రమించిన నైతిక విలువలు ,సాంప్రదాయం ఆయనలో గుప్తంగా ఉన్నాయి .ఇవన్నీ సౌతాఫ్రికా చేరగానే తగిన అవకాశాలు రాగానే బయటకు వ్యక్తమయ్యాయి .ఇండియాలోకాని ఇంగ్లాండ్ లోకాని జాతి వివక్ష ,పక్షపాతం  ఆయన  ఎదుర్కోలేదు .దక్షిణాఫ్రికా అనుభవం ఆయనను   దిగ్భ్రాంతి కి గురి చేసి,ఆయనను తట్టుకోనేట్లు గా ,తన గౌరవం ,వ్యక్తిత్వం కాపాడుకోనేట్లుగా చేసింది .నటాల్ లోని మిట్జ్ బర్గ్ స్టేషన్ లో రాత్రి ఉదంతం ఆయన జీవితంలో సృజనాత్మక మైన మార్పు తెచ్చింది  .ఇక్కడే మొదటిసారి ‘’రంగు పక్షపాతం’’అంటే వర్ణ వివక్షత జబ్బును అన్ని కోణాలనుంచి ఎదుర్కొన్నాడు .అది లజ్జాకరమైన హేయ సంఘటన .అది ఒక పాఠం గా నేర్చుకొని ఆయన మనసులో నిరసన బీజాలు మొలకెత్తి ,కనిపించిన ప్రతి పక్షపాతాన్నిఎదుర్కొనే స్థితికి వచ్చాడు .ఇలాంటిపక్షపాతం ప్రిజుడిస్  మానవ గౌరవానికే భంగకరమని భావించి దాన్ని అంతమోది౦చటమే ధ్యేయంగా ఎంచుకొన్నాడు .

   దక్షిణాఫ్రికాలో భారతీయులు  అప్పటికి నాయకత్వ శూన్యం లో ఉన్నారు.ఇండియా వలసవాదులు ‘’కుంటి ,నిరక్షరాశ్యులు ‘’.వారంతా ఎవరో వచ్చి తమను సమీకరించి నాయకత్వం వహించి మార్గదర్శకత్వం చేసి నడిపించాలని ఎదురు చూస్తున్నారు .ఆ సమయంలో యువ సున్నితమైన బారిస్టర్ రంగ ప్రవేశం చేశాడు .అక్కడి పరిస్థితులు ఆకళింపు చేసుకొని ,వర్ణ పక్షపాతం వంటి సాంఘిక  అసమానత లవంటి సమస్యలపై పోరాటానికి ఒక శక్తివంతమైన ఆయుధం కావాలని భావించాడు  .అదే సత్యగ్రహ దివ్యాయుధం .అది విశ్వవ్యాప్త తారకమంత్రమై ,అన్ని వ్యాధుల నివారణ ఔషధమై పని చేసింది .తన మాతృ భూమి ప్రవచించిన ఉపనిషత్సారం ‘’సత్యమేవ జయతే ‘’ను సత్యాగ్రహం అనే మహా గొప్ప ఆయుధంగా మార్చి ప్రయోగించాడు .ఇదే టెక్నిక్ ను ఇండియాలో 1913దండి ఉప్పు సత్యాగ్రహ యాత్రలోనూ ప్రయోగించాడు .దక్షిణాఫ్రికా  లో 2037మంది పురుషులు ,127మంది స్త్రీలు ,57మంది పిల్లల ఒక దళంతో   నటాల్ నుంచి ట్రాన్స్ వాల్ లో ప్రవేశించాడు .ఈ నడక ఇండియన్ లేబర్ ల సమ్మెలో ఒకభాగమై అయిదు రోజులు నవంబర్ 6నుంచి 10 వరకు జరిగింది .

   దక్షిణాఫ్రికాలోనే గాంధీ మొదటి సారిగా ‘’స్వయం సేవ (సెల్ఫ్ హెల్ప్ )లోని సౌందర్యాన్ని ఆస్వాది౦చాడు .భగవద్గీతలో చెప్పబడిన ‘’ వస్తువుపై వ్యామోహం లేకపోవటం  ‘’(నాన్ పోసేషన్) ను ప్రచారం చేసి ,అనుసరించాడు .ఇక్కడే స్నేహితుడు పొలాక్ ఆయనకు రస్కిన్ పుస్తకం ‘’అన్ టు ది లాస్ట్ ‘’1903లో అందజేశాడు .దీన్ని చదివి అర్ధం చేసుకొని మనసుకు పట్టించుకోని అది భగవద్గీత ను ప్రతిధ్వనిస్తోందని గ్రహించి దాన్ని ఆధారంగా భవిషత్ ప్రణాళిక రచించుకొన్నాడు .అమెరికా తత్వవేత్త, వేదాంతి, రుషి తుల్యుడు’’ హెన్రి డేవిడ్ థోరో’’రాసిన ‘’సివిల్ డిస్ ఒబీడిఎన్స్’’వ్యాసం చదివి  ‘’పాండిత్య నైపుణ్యంతో రాసిన అద్భుత గ్రంథం’’.నా జీవితం పై గొప్ప ప్రభావం చూపింది ‘’అని గాంధీ మెచ్చుకొన్నాడు .దీన్ని ఆయనను దక్షిణాఫ్రికాలో వోక్ ట్రస్ట్ జైలు లో అరెస్ట్ చేసి ఉంచినపుడు చదివాడు .అందులోని ‘’చర్యరాహిత్యాన్ని’’ మెచ్చుకొన్నాడు .రష్యన్ రచయిత లియో టాల్ స్టాయ్ పుస్తకం ‘’దికింగ్డం ఆఫ్ గాడ్ ఈజ్ వితిన్ యు ‘’చదివి అభిమానిగా మారి ఆయనతో స్నేహాన్ని ఉత్తర ప్రత్యుత్తరాలను జీవితాంతం కొనసాగించాడు .ఈ సంఘటనలన్నీ దక్షినణాఫ్రికాలోనే జరిగాయి .వాటిలోని విలువైన విషయాలను ,విలువలను స్పూర్తిగా తీసుకొని  తనలో నిక్షిప్తమై గుప్తంగా ఉన్న భావాలను జోడించి ప్రయోగాలు చేశాడు .దీనినుంచే గాంధీ మహా నాయకుడుగా ,మహా తత్వ వేత్తగా పరిణామం చెందాడు .

  ముఖ్యంగా దక్షిణాఫ్రికా అనుభవాలు భారత్ లో హింద్ స్వరాజ్ లేక హోమ్ రూల్ లు నేపధ్యమైనాయి .పాశ్చాత్య యాంత్రిక నాగరకత తెచ్చిన అనర్ధాలను గాంధి 76పేజీల కరపత్రం గా ఇంగ్లాండ్ నుంచి సౌతాఫ్రికాకు 1909లో తిరుగు ప్రయాణం లో రాశాడు .గాంధిజీవిత చరిత్ర   రాసిన పాశ్చాత్య చరిత్రకారులలో ప్రసిద్ధుడైన లూయీ ఫిషర్ ‘’దక్షిణాఫ్రికాలోనే గాంధీ కర్మ  యోగి గా మారే ప్రయత్నం చేశాడు .గీతలో చెప్పినట్లు అనాసక్తత ను జీవితాంతం పాటించాడు ‘’అన్నాడు. బికు ఫరేఖ్ గాంధీని క్షుణ్ణంగా పరిశీలించి రాసిన దానిలో ‘’గాంధీ లోని తాత్విక భావనలలో ఎక్కువభాగం , అంతర్ దృష్టి ఏర్పడటానికి దాక్షిణాఫ్రికా గొప్ప భూమిక అయింది .గాంధీ మహాత్ముడుగా పరిణామం చెందటానికి ,ఆ దేశం  దోహదపడి గర్వకారణంగా మారింది ‘’అంటాడు .

   ఈ విధంగా గాంధీలో దేనికీ లొంగని మొండిపట్టుదల ,నాశనం చేయటానికి వీలులేని మనస్తత్వం  మొట్టమొదటగా దక్షిణాఫ్రికాలోనే ఏర్పడ్డాయి .గాంధీని మహాత్ముని చేయటానికి కావలసిన ఆయన భావనలు ,చర్యలలో చాలాభాగం ఏర్పడటానికి ఆదేశమే ముఖ్యకారణం అనటానికి ఎలాంటి సందేహం లేదు .దక్షిణాఫ్రికాలో జరిగింది అంతా గాంధీ జీవితాన్ని గొప్ప మలుపు తిప్పి,ఆయన మహాత్ముడుగా పరిణామం చెందటానికి కీలక పాత్ర పోషించింది .

  ఆధారం –  అంకుష్ బి.సామంత్  వ్యాసం –‘’మేకింగ్ ఆఫ్ మహాత్మా గాంధి ఇన్ సౌత్ ఆఫ్రికా

ఫ్రికా’’

మహాత్మాగాందీజీ 150వ జయంతి కానుక –

గాంధీ150 వ  జయంతి శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-10-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గాంధీజీ మహాత్ముడైన విధం -6

గాంధీ పై ఇండియాలో ప్రజాభిప్రాయం బాగా అనుకూలం గానే ఉంది. 1911 ఏప్రిల్ లో బోతా ప్రభుత్వ ఇంటీరియర్ మినిస్టర్ జనరల్ జాన్ స్మట్స్ చివరికి గాంధీ సూత్రాలకు (ఫార్ములా ) ఉత్తరాలద్వారా  సూత్రప్రాయంగా అంగీకరింఛగా ఇద్దరిమధ్యా తాత్కాలిక ఒప్పందం కూడా ఉత్తరాలద్వారానే కుదిరింది .28-4-1911న జోహాన్స్ బర్గ్ లో గాంధీ పబ్లిక్ మీటింగ్ లో తెలియ జేసి ,ప్రజామోదం పొందగా పోరాటానికి  తెరపడింది .జూన్ 1న ఖైదీల నందర్నీ విడిచిపెట్టారు .ఒప్పందం కుదిరినట్లే ఉంది కాని వాతావరణం ఇంకా పూర్తి అనుకూలం గా లేదనిపించింది .ఇది అయిదవ జార్జి పట్టాభి షేకాన్ని ధృవీకరించటం లో ప్రతిబింబించింది . సామ్రాజ్యానికి విధేయత ప్రకటించినా ,పట్టాభి షేక మహోత్సవం లో పాల్గొనటానికి సుముఖంగా లేరు .

  ఇలాంటి అసందిగ్ధ వాతావరణం లో భారత జాతీయ నాయకుడు ,గౌరవనీయుడు గోపాలకృష్ణ గోఖలే  దక్షిణాఫ్రికా పర్యటనకు గాంధీజీ ఆహ్వానం పై వచ్చాడు  .గాంధీతో అత్యంత చనువు గా ఉంటూ  గాంధీని ,దక్షిణాఫ్రికా భారతీయులను ,అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా గమనించాడు .దక్షిణాఫ్రికాకు ఆయన బ్రిటిష్ ,ఇండియా  ప్రభుత్వాల ఆశీస్సులతోనే వచ్చాడు .బ్రిటిష్ ప్రభుత్వం యూని యాన్ ప్రభుత్వానికి సామ్రాజ్యం లో గోఖలే హోదాను తెలియ జేసి అదే గౌరవమర్యాదలు కలుగ జేయమని కోరగా సౌతాఫ్రికా గవర్నమెంట్ ఏ లోపం రాకు౦డా అత్యంత  గౌరవమర్యాదలతో చూసింది .ప్రముఖులందరితో ఆయన మాట్లాడి ,భారతీయులను ,యూనియన్ ప్రభుత్వాన్నీ మళ్ళీ చర్చలు జరిపెట్లు చేశాడు .ఒప్పందంలోని నటాల్ లోని ఇండియన్ లపై ఏడాదికి విధించిన 3పౌండ్ల టాక్స్ ను వెనక్కి తీసుకోవటానికి ప్రభుత్వాన్ని ఒప్పించాలని  అది తాను  దక్షిణాఫ్రికాలో సాధించిన విజయం కావాలని నిర్ణయించాడు .తాను    వెళ్ళేటప్పుడు ప్రభుత్వం తనమాట కాదనదనే విశ్వాసం తో ఉన్నాడు .కాని యూనియన్ ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేదు .అదేకాక  కేప్ ప్రావిషియల్ సుప్రీం   కోర్ట్’’ క్రిస్టియన్ సంప్రదాయంలో జరిగిన వివాహాలే చట్టబద్ధమైనవని’’ తీర్పు ఇవ్వటం అగ్నిలో ఆజ్యమైంది .ఆ తీర్పు ప్రకారం దక్షిణాఫ్రికాలో ని హిందూ ముస్లిం ,పార్సీ భార్యలు ఉ౦పుడు గత్తెల లేక వ్యభిచారిణుల స్థాయికి దిగజార్చటం అన్నమాట అని గాంధీ అభిప్రాయపడ్డాడు .దీనితో భారతీయ మహిళలంతా సత్యాగ్రహినులుగా మారిపోయారు .అందులో కొందర్ని గాంధి తన దళ సభ్యులను  చేశాడు .

  ఏదో మసిపూసిమారేడుకాయ చేసే తాత్కాలిక ఒప్పందాలకంటే బహిరంగ పోరాటమే మంచిదని గాంధి భావించాడు .’’ఇండియన్ ఒపీనియన్ ‘’పత్రికలో ‘’ఒప్పందం,అసలైన స్పూర్తితో జరగనప్పుడు అది ఒప్పందమే కాదు ‘’అని రాశాడు .కనుక ప్రభుత్వ౦ ను దక్షిణాఫ్రికాలోని యూరోపియన్ జనాభాను కదిలించే పోరాటమే చేయాలని నిశ్చయించాడు .దీనికి మందు సామ్రాజ్యం లో అంతటా సహాయ నిరాకరణ ఉద్యమం  చేబట్టాడు . సౌతాఫ్రికాలో కొందరు తెల్లవారు నల్లవారికి మద్దతుపలికారు .భారత జాతీయ నాయకులు దీటుగా స్పందించారు .ఊహించని పరిణామం వైస్ రాయ్ లార్డ్ హార్డింజ్ దక్షిణాఫ్రికా ప్రభుత్వ విధానాలను పబ్లిక్  గా ఘాటు మాటలతో విమర్శింఛి నిష్పక్షపాత విచారణకు ఆదేశించాడు విచారణ సంఘాన్ని నియమించటం తప్ప జెనరల్ స్మట్స్ కు గత్యంతరం లేకపోయి,గాంధీని ఆయన అనుచరులు కలలెన్ బాష్ ,పొలాక్ లను విడుదల చేశాడు .ఎంక్వైరికమిషన్ ఇండియన్ లకు స్థానం లేనందుకు గాంధీ వ్యతిరేకించాడు .దీనికోసం డర్బాన్ లో పెద్ద ప్రదర్శన 1914జనవరి 1 న నిర్వహిస్తానని ప్రకటించాడు .కాని దక్షిణాఫ్రికా రైల్వే లోని తెల్లజాతి ఉద్యోగులు అదే సమయం లో సమ్మె చేసే ప్రయత్నంలో ఉండగా ,ఘర్షణ పనికి రాదనీ గాంధీ ప్రదర్శన వాయిదా వేశాడు .దీనిప్రభావం ఇండియా,ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా ల లోకూడా బాగా  కనిపించింది .దక్షిణాఫ్రికాలోని నల్లవారిని వ్యతిరేకించే తెల్లవారు కూడా గాంధీ నిర్ణయాన్ని శ్లాఘించారు .

  గోఖలే సి ఎఫ్ ఆండ్రూస్ ను దక్షిణాఫ్రికా కు పంపగా వచ్చి  ,ఇరువైపులవారితో చర్చించి కలిపే ప్రయత్నం చేశాడు .గాంధీ ,స్మట్స్ మధ్య అనేక దఫాల చర్చలు జరిగాయి .చివరకు ఒక ఒప్పందం సాధించారు .దీని ప్రకారం ఇండియన్ రిలీఫ్ యాక్ట్ పాసయింది .3పౌండ్ల టాక్స్ రద్దయింది .హిందూ ,ముస్లిం పార్సీ వివాహాలు గుర్తింపబడ్డాయి . చట్టం అమలు న్యాయంగానిష్పక్షపాతంగా జరుగుతుందని ,హక్కులను కాపాడుతుందని   జనరల్ స్మట్స్ ప్రజలకు హామీ ఇచ్చాడు .గాంధీ కూడా 1920నుంచి ఒప్పందం లేని కూలీలు దక్షిణాఫ్రికాలో ప్రవేశించరని ఒప్పుకున్నాడు .దక్షిణాఫ్రికాలో ఉంటున్న ఇండియన్ల ,మళ్ళీ అక్కడికి చేరబోయే వలస భారతీయుల హక్కులను కాపాడటం అసాధ్యం అని గాంధీ భావించి ,అలా ప్రకటించి ఉంటాడు .ఈ ఒప్పందం సత్యాగ్రహానికి వాస్తవమైనదిగా కనిపించి చట్టబద్ధమైనదని పించింది .అంతే కాదు దక్షిణాఫ్రికాలోని భారతీయులకు చట్టబద్ధత కలిగిందికూడా .ఇంకా పూర్తిగా  పౌరహక్కులు రాకపోయినా ,దక్షిణాఫ్రికా భారతీయులు సత్యాగ్రహం వలన ఉనికికి న్యాయ అనుమతి పొందగలిగి దక్షిణాఫ్రికా నుండి గెట్టి వెయ బడ జాలని బలమైన జాతివారుగా ,భాగస్వామ్యులుగా అయ్యారు .ఇది గాంధీ సాధించిన అపూర్వ విజయం దక్షిణాఫ్రికాలో .

మహాత్మాగాందీజీ 150వ జయంతి కానుక –

image.png

సశేషం

 గాంధీ జయంతి శుభాకాంక్షలతో

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -2-10-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గాంధీజీ  మహాత్ముడైన విధం -5

గాంధీజీ  మహాత్ముడైన విధం -5

ఫోనిక్స్ పరిష్కారం

ఈ సమయం  లోనే గాంధీ స్నేహితుడు  హెచ్ ఎస్ ఎల్ పొలాక్ వీడ్కోలు చెప్పటానికి వచ్చి జాన్ రస్కిన్ రాసిన ‘’అన్ టు ది లాస్ట్ ‘’పుస్తకం ఇచ్చి డర్బాన్ కు జరపబోయే 24 గంటల రైలు ప్రయాణం లో చదవమన్నాడు .అది చదివి విపరీతంగా ప్రభావితుడైనాడు .అందులోని మూడు సిద్ధాంతాలు ఆయనమనసును పట్టేశాయి .అవి

1-మనిషిలోని మంచితనం అందరి మంచి తనంలో నే ఉంటుంది .

2-లాయర్ పని ఎంతగొప్పదో మంగలి పనికూడా అంతగొప్పదే ..ప్రతి వృత్తి జీవికకోసమే కనుక అన్నీ సమానమైనవే .

3-కూలీ జీవితం ,రైతు జీవితం ,చేతి వృత్తిపని వారి జీవితం జీవనాకికి అర్హమైనవే

  ఈ మూడు సిద్ధాంతాల ప్రభావతో గాంధీ తన భవిష్యత్ జీవితాన్ని తీర్చి దిద్దుకున్నాడు .ఈ భావనలతోనే 1904లో డర్బాన్ కు 12మైళ్ళ దూరం లో ఒక సెటిల్ మెంట్ ను ఏర్పాటు చేశాడు .మొదట్లో ఇరవై ,తర్వాత మరో ఎనిమిది ఎకరాలు కొని ,దానిని ఒక ప్రయోగ క్షేత్రంగా మార్చాడు .ఇందులో ఉన్నప్రతి ఒక్కరు కాయకష్టం చేయాల్సిందే .ఫలితాలు లాభాలను  అందరూ సమానంగా పంచుకోవాల్సిందే .దీనినే గాంధీజీ ‘’ఫోనిక్స్ సెటిల్మెంట్ ‘’అన్నాడు .

   మారిన యుద్ధభూమి

కొత్తపోరాటం ప్రారంభించిన గాంధి ,తన యుద్ద క్షేత్రాన్ని నటాల్ నుంచి , ట్రాన్స్ వాల్ కు మార్చాడు .కారణం ఇక్కడ  నల్లవారిపై  బ్రిటిష్ వాళ్ళ పాలన ,దౌష్ట్యం ఎక్కువవటమే.ఈ అన్యాయాన్నిఎదిరించటానికే కార్య స్థానం మార్చాడు .ఇక్కడే మొదటిసారి సత్యాగ్రహ అస్త్ర ప్రయోగం చేశాడు .కాని సమస్య పరిష్కారానికి చాలా ఏళ్ళు పట్టింది .ఏది ఏమైనా ఇక్కడి ఇండియన్ ల గౌరవం, ఆత్మ గౌరవాలను పరి రక్షించాలని సంకల్పించాడు  .

  1906లో నటాల్ లోని జులూస్ వారు నటాల్ ప్రభుత్వంపై తిరగబడ్డారు .దీనితో సత్యాగ్రహ ఉద్యమం ఆగిపోయింది .బాధితుల సేవకోసం తన ఇండియన్ అంబులెన్స్ కార్ప్స్ ను గాంధీ రంగం లోకి దించే ప్రయత్నం చేయగా  ప్రభుత్వం ఆమోదించింది .క్షతగాత్రులకోసం ఒక హాస్పిటల్ ,24మంది వాలంటీర్ల దళం ఏర్పాటు చేశాడు .ఇక్కడి ఇండియన్ లకు గాంధీ ‘’సార్జంట్ మేజర్ ‘’అనిపించాడు .ఎవరికి వారు తమవంతు సేవలందించి ఆదుకొన్నారు .

  రాజకీయ ఉద్రేకాలు తగ్గిపోగానే గాంధీ మళ్ళీ ఉద్యమామం మొదలెట్టాడు .సత్యాగ్రహుల సంఖ్యపెరిగింది .ప్రభుత్వం వీరిని అరెస్ట్ చేసి చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని కేసుపెట్టి తీవ్ర శిక్షలు విధించింది .వీటికి సత్యాగ్రహులు భయపడలేదు .తమపోరాతానికి ఇవేమీ  అడ్డంకి కాదని భావించారు .గాంధీని కూడా అరెస్ట్ చేసి కఠిన కూలీ పని చేయించారు .గాంధీ మిత్రుడు పొలాక్ ,దక్షిణాఫ్రికాలో ఉన్న జర్మన్ ఆర్కిటెక్ట్ కలాన్ బాష్ లను కూడా అరెస్ట్ చేసి౦ది ప్రభుత్వం .సత్యాగ్రహమే ఒక యుద్ధంతో సమానం  అనిపించింది ఇండియన్ లకు .ఈ ధోరణి నాలుగేళ్ళు సాగింది .సత్యాగ్రహ కుటుంబాలను ‘’సత్యాగ్రహ అసోసియేషన్ ‘’కొంతవరకు ఆదుకోన్నది..జోహాన్స్ బర్గ్ లండన్ లో ఉన్న  ఆఫీస్ ల నిర్వహణకు కావాల్సిన డబ్బుకావాలి .భారతీయ అభిప్రాయం ప్రతిఫలించి సాయం అందింది .

 1906 నుంచి  ఫండ్ నిధులు ఖాళీ అవటం మొదలైంది .రాజకీయ పోరాటం లో ని౦డా మునిగిన గాంధీ లా ప్రాక్టీస్ కూడా తగ్గి డబ్బుకు కటకట అయింది .రతన్ టాటాలాంటి వారి ఆర్ధక సాయం ఏమూలకూ చాలటం లేదు .నిత్య ప్రభుత్వ ఘర్షణ .కాలమూ  కలిసి రావటం లేదు .కనుక అందరు భారీగా ఖర్చులు తగ్గించుకోవటమే తరుణోపాయం అని గాంధి భావించాడు .అందుకోసం సత్యాగ్రహ కుటుంబాలను సహకార క్షేత్రం లోకి మార్చటం ఉత్తమమని అనిపించింది .కానే ఫోనిక్స్ సెటిల్ మెంట్ డర్బాన్ దగ్గర జోహాన్స్ బర్గ్ నుంచి  30గంటల రైలు ప్రయాణ దూరం లో  మరొక ప్రాంతం లో ఉంది .

   టాల్ స్టాయ్ ఫారం

 ఈ సంక్లిస్ట పరిస్థితు లలో హేల్లాన్ కల్లెం బాష్ ఆపద్బా౦ధవుడిగా ఆదుకొన్నాడు .జోహాన్స్ బర్గ్ కు 20మైళ్ళ దూరం లో 1100ఎకరాల భూమికొని ,సత్యాగ్రహులు ఉచితంగా ఉండటానికి గాంధీకి ఇచ్చాడు .అందులో చిన్న ఇల్లు  వెయ్యి ఫల వృక్షాలున్నాయి .ఈ క్షేత్రానికి గాంధీజీ ‘’టాల్ స్టాయ్ క్షేత్రం ‘’అని తన ఆదర్శ రష్యన్ రచయిత ఫిలాసఫర్ ,అలేక్జాండర్  లియో టాల్ స్టాయ్ కి గౌరవ చిహ్నంగా నామకరణం చేశాడు .క్రమక్రమంగా ఈ క్షేత్రాన్ని గాంధీ పౌర నివాస భూమిగా మార్చాడు .దీనితో సత్యాగ్రహ కుటుంబాలు ఒకే చోట పరస్పర సహకారం తో జీవించటానికి వీలుకలిగి, ఖర్చులు విపరీతంగా తగ్గిపోయాయి .ఇదే పోరాట క్షేత్రంగా మారి బ్రిటిష్ నిరంకుశత్వాన్ని ఎదిరించి పోరాడటానికి ఫలితాలు సాధించటానికి  బాగా ఉపయోగపడింది .వీటిలో గాంధీలో ఉన్న ప్రయోగ శీలత అభి వ్యక్తమౌతోంది .ఆరోగ్యం విద్య ,గౌరవ జీవితం సాదించటానికి ఆవాస భూమి అయింది .చివరికి ఈ క్షేత్రం ఆధ్యాత్మిక ఆత్మ పరిశుద్ధి కేంద్రంగా,తపోభూమిగా అభి వృద్ధి చెందింది .

మహాత్మాగాందీజీ 150వ జయంతి కానుక –

సశేషం

2-10-19 గాంధీ జయ౦తిశుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-10-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

వేటపాలెం గ్రంథాలయ శతాబ్ది ఉత్సవ ఆహ్వానం

వేటపాలెం గ్రంథాలయ శతాబ్ది ఉత్సవ ఆహ్వానం

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

29-9-19ఆదివారంఉదయం మా ఇంట్లోకడపజిల్లా ఒంటిమిట్ట డాక్టర్లైన సాహితీ బంధువులు

29-9-19ఆదివారంఉదయం మా ఇంట్లోకడపజిల్లా ఒంటిమిట్ట డాక్టర్లైన సాహితీ బంధువులు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గాంధీజీ  మహాత్ముడైన విధం -4

గాంధీజీ  మహాత్ముడైన విధం -4

ప్రభుత్వాధికారులు నౌక ప్రయాణీకులను నిర్బంధించటం లో వచ్చే కష్టనష్టాలు ఆలోచించలేదు .పోర్ట్ కు చేరిన వేలాది తెల్లవారు తమ ఆందోళన సక్సెస్ అని సంబర పడ్డారు .ఇలా నౌకా నిర్బంధంలో భారతీయులను  23 రోజులుంచారు . వలస వాదులను భయపెట్టి దక్షణాఫ్రికాలో ప్రవేశించకుండా చేయవచ్చుననే వ్యూహమూ వాళ్ళ మనసులో ఉంది .తెల్లమూక తోకముడవగానే ఇండియన్ లు నౌకదిగి డడర్బాన్ లో కాలుమోపారు .

గాంధీని మరో రోజు షిప్ లోనే  ఉండిపొమ్మని ,లేకపోతె తెల్లవారి ఆగ్రహజ్వాలను ఎదుర్కోవాల్సి వస్తుందని  ఆదేశించారు  .మిగిలిన పాసెంజర్ లతోపాటు గాంధీ కుటుంబం కూడావెళ్ళిపోయింది .గాంధీ ఒక్కడే ఓడలో ఉన్నాడు .గాంధీ లాయర్ స్నేహితుడు మిస్టర్ లాటన్  వచ్చి,రాత్రిదాకా షిప్ లో ఉండకుండా తనతో కాలినడకన రుస్తు౦ భాయి ఇంటికి రమ్మని కోరాడు .అలాగే అని వెడుతుండగా గాంధీ టర్బన్ గుర్తించిన తెల్లమూక ఆగ్రహం తో వొంగోపెట్టి దెబ్బలతో చంపే ప్రయత్నం చేసింది .మీదకు చేపలు విసిరి అవమాన పరచి ,దాడి చేశారు .స్పృహ కోల్పోయి అచేతనంగా రోడ్డుపై పడిపోయాడు గాంధీ .కసి తీరక మళ్ళీ కొట్టి చంపే  వాళ్ళేకానిపోలీస్ సూపరిం టే౦ డెంట్  అలేక్సాండర్ భార్య అడ్డుపడి,గాంధీకి, తెల్లమూకకు మధ్య రక్షణ కవచంలా నిలబడి పోయింది .ఇంతలో పోలీసులు వచ్చి గాంధీని రుస్తుంజీ పాలెస్ కు  చేర్చారు .కానీ కోపోద్రేకాలతో ఊగిపోయిన తెల్లమూక రుస్తుమ్జీ ఇంటిని చుట్టు ముట్టారు .అక్కడి నుంచి గాంధి మారువేషం లో ఒక పోలీస్ సాయంతో తప్పించుకొన్నాడు .

ఈ దౌర్జన్య కాండ వార్త ఇంపీరియల్ గవర్నమెంట్ ను రెచ్చగొట్టింది .గాంధీపై దాడి జరిపిన వారిని గుర్తించి శిక్షించి అరెస్ట్ చేయమని  నటాల్ ప్రభుత్వాన్ని  ఆదేశించింది .ఇలా  చేస్తే  నటాల్ తెల్లజాతి వారి నుంచి తీవ్ర ఇబ్బందులేర్పడి ,యూరోపియన్ వోటర్లపై ప్రభావం చూపిస్తుందని భయపడ్డారు కానీ గాంధీ తనపై దాడి చేసిన వారిపై కేసు పెట్టదలచుకోలేదని నిర్ణ ఇంచు కొన్నాక  అటార్నీ జనరల్ హారీ ఎస్కామ్బే ,భావి నటాల్ ప్రధాని ఊపిరి పీల్చుకొన్నారు .కనీసం కాగితం పైన అయినా ఫిర్యాదు చేయమని కోరగా గాంధీ ‘’నేను ఇక్కడ కాలుపెట్టగానే నన్ను గాయపరచినవారిపై  బాధపెట్టే పని ఏదీ చేయకూడదని మనసులో నిర్ణయించుకొన్నాను .కనుక దాడి చేసిన వారిని ప్రాసిక్యూట్ చేయటం అనేది జరగనిపని ‘’అని రాశాడు .దీనితో మొదటి సారిగా సౌతాఫ్రికా, గాంధీ గారి సంస్కృతీ ,మానవత్వం ,హుందాతనం అర్ధం చేసుకొన్నది ..

బోయర్ యుద్ధం

అప్పుడే ట్రాన్స్ వాల్  ,ఆరంజ్ ఫ్రీ రాష్ట్రాలు ఖనిజ సంపదకు నిలయాలుగా రూపొందాయి . .కనుకసహజం గా బ్రిటిష్ వారికళ్ళు  వీటిపై పడ్డాయి .ఇది క్రమ౦గా ఆంగ్లో – డచ్ శత్రుత్వానికి దారి తీసి,చివరకు 1899-1901మధ్య యుద్ధం ఆర౦భమైంది   బోయర్ ల  చాలెంజి  వలన యూరోపియన్ సామ్రాజ్యం ఉనికికే ప్రమాదం వాటిల్ల బోతోందని గాంధీ గ్రహింఛి బ్రిటిష్  పక్షాన నిలిచాడు .ఇందులోని తర్కాన్ని ‘’నేను బ్రిటిష్ పౌరుడిగా హక్కులకోసం పోరాడు తున్నాను కనుక బ్రిటిష్ ప్రభుత్వ రక్షణకోసం సాయం చేస్తున్నాను ‘’అని చెప్పాడు 11వేలమంది సుశిక్షితులైన  వాలంటీర్ల తో’’అంబులెన్స్ కార్ప్స్’’ తయారు చేశాడు .దీనితో దక్షిణాఫ్రికా భారతీయులకు    కొద్దిగా గౌరవం, గుర్తింపు లభించాయి .

బోయర్ యుద్ధం పూర్తయ్యాక  బ్రిటిష్  వారిలో ఇండియన్లపట్ల సుహృద్భావం ,ఏర్పడి నిత్య సంఘర్షణ వాతావరణం ఉండదని భావింఛి మళ్ళీ ఇండియా వెళ్లాలని నిర్ణయించాడు .ఏడాది లోపల  తన అవసరం ఉందని తెలియ జేస్తే వచ్చి వాలుతానని  ఇండియన్స్ కు అభయమిచ్ఛి ఇ౦డియాకు బయల్దేరాడు .ఇండియాలో స్థిరపడ్డాక ఇండియన్ కమ్యూనిటి నుంచి   చా౦బర్లేన్  పర్యటనకు వస్తున్నాడని ,  అర్జెంట్ గా దక్షిణాఫ్రికా బయల్దేరి రమ్మనే కేబుల్ అకస్మాత్తుగా అందుకొన్నాడు.  .ఆగ మేఘాలమీద సౌతాఫ్రికాలో వాలిపోయాడు .కాని అతను ఇండియన్ ప్రతినిది వర్గానికి పుర్ర చెయ్యి చూపింఛి ,కాలనీ ప్రభుత్వాలపై ఇంపీరియల్ ప్రభుత్వానికి నామమాత్రపు  నియంత్రణ మాత్రమే ఉందని చేతు లేత్తేశాడు  .దీని భావం గ్రహించిన గాంధీ ,సహ చరులు మళ్ళీ కొత్తగా తమ పని ప్రాంభించాల్సిందే నని భావింఛి దీనికోసం జోహేన్స్ బర్గ్ లో గాంధీ తన  ఆఫీసు ప్రారంభించాడు .

మహాత్మాగాందీజీ 150వ జయంతి కానుక –

సశేషం

రేపు 29-9-19ఆదివారంనుంచి ప్రారంభమయే శరన్నవరాత్రి -దసరా శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -28-9-19-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గాంధీజీ మహాత్ముడైన విధం -3

గాంధీజీ మహాత్ముడైన విధం -3

అబ్దుల్లాతో సహా అందరు గాంధీని ఇండియా పర్యటన వాయిదావేసుకోనమని కోరటం ఆయన మనసు మార్చి ఉండటానికి, వారికి  రాబోయే బిల్లును వ్యతిరేకించే పోరాటం లో నాయకత్వం వహించటానికి అంగీకరించాడు .ఆ రోజు రాత్రే ప్రభుత్వానికి టెలిగ్రాం ఇచ్చి తన పర్యటన వాయిదాకుఏర్పాట్లు చేయమని  కోరి ,శాసన సభ్యులకు బహిరంగ లేఖ ద్వారాకూడా తెలియ బర్చాడు .ఇండియన్ల వోటు హక్కు రద్దుబిల్లుకు వ్యతిరేకంగా పోరాటం చేయటానికి ప్రచార సంఘం హాజీ ఆడం చైర్మన్ గా ,,గాంధి సెక్రేటగాఏర్పాటైంది .నెలరోజులలోపే పది వేలమంది భారతీయులు అంటే అక్కడున్న వారిలో నాలుగో వంతు వారు ఒక పిటిషన్ పై సంతకాలు చేసి,లండన్ లో కాలనీల  సెక్రెటరి ఆఫ్ స్టేట్ లార్డ్ రిప్పన్ కు పంపారు  ..నటాల్ శాసన సభ దీన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు .   గాంధీ ఆయన తరఫువారు చేసిన ప్రయత్నం పలుబడి ప్రభావాల వలన  ఇంపీరియల్ ప్రభుత్వం ఆ బిల్లును అంగీకరించకుండా నిలుపుదల చేసింది ,ఇది గాంధీ సాధించిన తొలివిజయం .

1894మే లో ఈ పోరాట సమితి ‘’నటాల్ ఇండియన్ కాంగ్రెస్ ‘’గా రూపొంది ,ప్రతి భారతీయుడిని సభ్యుడిగా చేరటానికి బాగాతోడ్పడింది .ఈ లోగా గాంధీ ఇండియన్ లలో ఆ౦త రింగిక అభి వృద్ధి కోసం ప్రయత్నించాడు .తమ తప్పులు తాము తెలుసుకోనేట్లు చేయటానికి గాంధీ మిత్రబృందం అనేక ప్రదర్శనలు నిర్వహించి వాటిపై సంగాలు చేసి,వారితో చర్చలు జరిపి పరిశుభ్రత ,ఆరోగ్యాలపై అవగాహన కలిపించారు .నివాసాలకు ,షాపులకు వేర్వేరు బిల్డింగ్ లు ఉండాల్సిన అవసరాన్ని,తమ స్థాయిని బట్టి తగినట్లుగా బాగా ఉండాలని   తెలియ జెప్పారు  .ఈరకమైన స్వాతంత్రం ఒక ఏడాదిన్నర గడిచింది .కాని నక్కజిత్తుల ప్రభుత్వం అతి తెలివిగా కోరలు ఇండియన్ లలో బాగా లోతుకు దిగేట్లు బిల్లును మార్చి ,మసిపూసి మారేడుకాయ చేసి అది వాళ్ళను ఉద్దేశించి కాదనే  అభి ప్రాయం కలిగించింది .అందులో ఇలా ఉంది –‘’ఈ చట్టం  ,అత్యున్నత ప్రత్యెక హక్కు, పౌరసత్వంవోటు  ,హక్కు లేని అనుభవం లేనివారి వోటుహక్కును మాత్రమె తొలగిస్తుంది ‘’  .అంటే మరో విధంగా చెప్పాలంటే ,అప్పటికి  తమ మాతృదేశాలలో వోటుహక్కు లేని అన్ని జాతులవారికీ వర్తిస్తుంది .ఈవిధంగా భారతీయ సంతతిఇంగ్లీష్ వారితో  సమానత్వం ,వోటుహక్కులను ఈ బిల్లు హరి౦చేసి, గొప్ప అన్యాయం చేసింది .

భారత్ కు మళ్ళీ

,మూడేళ్ళు దక్షిణాఫ్రికాలో గడపిన గాంధి , 1896 వేసవిలో కుటుంబంతో సహా తిరిగివచ్చి ,భారత దేశ జాతీయ నాయకులకు దక్షిణాఫ్రికా  భారతీయుల దీన హీన నికృష్ట జీవితాన్ని నివేదించాడు .వెంటనే ‘’గ్రీన్ పాంఫ్లెట్ ‘’పేరుతో సౌతాఫ్రికా భారతీయల గురించి రాసి ప్రచురించాడు .చాలా మంది  నాయకులను కలిసి ,పబ్లిక్ మీటింగ్ లలోనూ ,నటాల్ ఇండియన్ల దీనగాధను వివరిస్తూ ,ఏ ఒక్క అవకాశమూ వదిలిపెట్టలేదు .  గాంధీ కార్యక్రమాలగురించి నటాల్ కు ,ఇంగ్లాండ్ కు తప్పుడు సమాచారాలు అందాయి .ఆయన వెలువరించిన గ్రీన్ పాంఫ్లెట్ ను తప్పుగా వక్రీకరించి ,రెచ్చ గొట్టే విధానం గా మసాలా దట్టించి లండన్ లోని ప్రెస్ ఏజెన్సీ కి, రాయిటర్  వార్తా సంస్థకు కేబుల్ చేశారు .అక్కడినుంచి దక్షిణాఫ్రికాకు పంపారు .దీనివలన గాంధీగారు సౌతాఫ్రికా తెల్లజాతి వారిని ,న్యాయస్థానాలను దారుణంగా ద్వేషిస్తున్నాడని ,అక్కడి తెల్లవారికి తనదైన అచ్చమైన  నల్లముఖం తో  కనిపిస్తున్నాడని బాగా ప్రచారం చేశారు .ఈ కేబుల్   దక్షిణాఫ్రికా వార్తా సంస్థలకు , , నటాల్ లోని కాలనీప్రభుత్వానికి  విపరీతమైన ఆగ్రహం తెప్పించింది  .అసలే కోతి ,ఆపై తాగి నిప్పులమీద నడిచినట్లైంది .

నటాల్ ఇండియన్ కమ్యూనిటి జనవరిలో పార్లమెంట్ మొదలయ్యే లోపు దాక్షిణాఫ్రికాకు తిరిగి రమ్మని టెలిగ్రాం పంపింది .వెంటనే బాక్ టు పెవిలియన్ లాగా కుటుంబంతో బయల్దేరి డర్బాన్ చేరాడు .1897మొదట్లో డర్బాన్ హార్బర్ లో కోర్ట్ లాండ్ ,నటేరి అని రెండు షిప్పులు 800మంది భారతీయులతో చేరాయి .వారందరినీ ‘’క్వారెంటైన్ఆర్డర్ ‘’ద్వారా అక్కడే ఉండేట్లు చేశారు .ఈ ఆర్డర్ ప్రవేశ  నిషేధం తోపాటు  ఆరోగ్య సమస్యలను బాగా పెంచుతుందని వాదించాడు .కాలనీ వాసులకు గాంధి రాక తెలిసి ,అప్పటికప్పుడు ఒక సభ జరిపి ఇండియన్ బలగాలు ప్రభుత్వ వ్యతిరేకతతో ప్రభుత్వాన్ని కూల దోసెప్రయత్నాలు చేస్తున్నారని , ప్రసంగాలు చేసి కాల నిస్ట్  లను రెచ్చగొట్టి  ,   షిప్పులలోని  ఇండియన్స్ ను దిగనిస్తే మహా ప్రమాదమని ,కల్లోలం సృష్టిస్తారని కనుక ప్రభుత్వం వాళ్ళ రాక ను నిషేధించే చట్టం చేయాలని తీర్మానాలు చేసి ,అలా కాకపొతే తెల్లవాళ్ళు తమకు తోచిన విధం గా చేయాల్సి వస్తుందని ,ఘాటుగా స్పందింఛి ఇండియన్ లపై వ్యతిరేకతను పుండుకు కారం రాసినట్లు తీవ్రతరం చేశారు .

మహాత్మాగాందీజీ 150వ జయంతి కానుక

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -28-9-19-ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గాంధీజీ మహాత్ముడైన విధం -2 దక్షిణాఫ్రికా అనుభవాలు

గాంధీజీ మహాత్ముడైన విధం -2

దక్షిణాఫ్రికా అనుభవాలు

దక్షిణాఫ్రికా డర్బాన్ లోని నటాల్ పోర్ట్ లో గాంధీ 1893మే లో ఒక వాణిజ్య సంస్థకు జూనియర్ కౌన్సెల్ గా వచ్చాడు .40వేల పౌ౦డ్ల సివిల్ కేసు కు టర్మ్ కాంటాక్ట్ పై వాదించటానికి వచ్చాడు .ఈ కేసు నటాల్ కు చెందిన అబ్దుల్లాకు, మ్త్రాన్స్ వాల్ కు చెందిన త్యేబ్  సేట్ల మధ్య జరిగింది .గాంధీకి రానూ పోనూ  ఫస్ట్ క్లాస్   టికెట్లు, ఏడాదికి 105పౌండ్ల  జీతం ,ఈ కాలం లో ఆయన ఆ వ్యాపార సంస్థలో లో గెస్ట్ గా  ఉండే ఏర్పాటు .అక్కడ అమలులో ఉన్న నియమ నిబంధనలు ఆయనకుతెలియనే తెలీదు .అక్కడ దిగేటప్పటికి తన వేషం ,వైఖరి ఎలా ఉండేదో ఆయనే గుర్తుకు తెచ్చుకొన్నాడు .’’బారిస్టర్ ను  కనుక తగిన ,నచ్చిన వేష ధారణతో ,నా ప్రత్యేకత ,ప్రాముఖ్యం చాటుతూ  డర్బాన్ లో దిగాను ‘’కానీ నటాల్ లో మొదటి రోజునే అక్కడి యూరోపియన్లు  ఇండియన్ లను యెంత  అమానకరంగా చూస్తున్నారో  గ్రహించాడు .గాంధీని ఇక్కడిక్ రప్పించిన వ్యాపారవేత్త దాదా అబ్దుల్లా  స్వాగతం పలకటానికి షిప్ పైకి వచ్చాడు .అక్కడివారు  అబ్దుల్లాతో పరిచయమున్నాకూడా  తమకంటే సామాజికంగా హీనంగా ఉన్న చులకన భావ౦తో  చూడటం ,అక్కడి ఇండియన్లు దీనికి అలవాటుపడి  ‘’లైట్ ‘’తీసుకోవటం గమనించాడు .కానీ 23ఏళ్ళసున్నిత౦గా  ,గర్వంగా ఉన్న  ఈ కుర్ర బారిస్టర్ సహించలేకపోయాడు .రెండు మూడు రోజుల్లో అబ్దుల్లా గాంధీని డర్బాన్ లోని మేజిస్ట్రేట్ కోర్ట్ కు దక్షణాఫ్రికాలో న్యాయ వ్యవస్థ ఎలా ఉందో అనుభవం లోకి తేవటానికి  తీసికెళ్ళాడు .వెళ్ళగానే మేజిస్ట్రేట్ గాంధీని నెత్తిమీద ఉన్న టర్బన్ తీసేయ్యమన్నాడు. అది అవమానంగా భావించి తిరస్కరించిన  గాంధీ  వెంటనే కోర్ట్ నుంచి బయటికి వచ్చేశాడు . ‘’ఆహా ఇక్కడ కూడా నేను  పోరాటం చెయ్యాలన్నమాట ‘’అని రాసుకొన్నాడు జీవిత చరిత్రలో .

   ఆయన ఎదుర్కొన్న అనేక అవమానకర  దారుణ సంఘటనలముందు కోర్ట్ ఉదంతం లెక్కలోకి రాదు .వ్యాజ్య విషయంలో  అబ్దుల్లాకు సాయం కోసం ప్రిటోరియాకు  సుదీర్ఘ సంక్లిష్ట ప్రయాణం  చేయాల్సి వచ్చింది .చార్లెస్ టౌన్ కు రైలు లో ,స్టాండర్ టన్ కు కోచిలో ,మరోకోచిలో జోహాన్స్ బర్గ్ ,అక్కడనుంచి ట్రెయిన్ లో ప్రిటోరియా వెళ్ళాడు .ఈ ప్రయాణం లోనే ఆయన్ను ఫస్ట్ క్లాస్ కంపార్ట్ మెంట్ నుంచి మాట్జ్ బర్గ్ లో  అవమానించి దెబ్బలుకొట్టి ,చివరగా బయటికి తోసేశారు .చావుతప్పి , కన్ను లొట్టపోయినట్లు ఎట్లాగో ప్రిటోరియా చేరాడు .అక్కడ స్టేషన్ లో ఒక నల్లజాతి అమెరికన్ , అమెరికన్ వాళ్ళ చిన్న హోటల్ కు తీసుకు వెళ్ళాడు .అక్కడే ఆరాత్రి గడిపి  మర్నాడు అబ్దుల్లా ఏర్పాటుచేసిన లాడ్జికి  మారాడు .

  తాను , విన్న ,కన్నా అనుభవించిన జాతి వ్యతిరేకత ,వివక్ష,  పక్షపాతాలు సున్నితమనస్కుడైన గాంధీని కలచివేసి ,తక్షణమే తిరుగుటపాలో ఇండియా వెళ్లి పోవాలని పించింది .కాని వాణిజ్య కేసు కాంట్రాక్ట్ ఆయన్ను ఉండిపోవాల్సిన పరిస్థితి కల్పించి ఒక ఏడాది ఎలాగో అలా గడుపుదాం లే అని నిర్ణయించాడు .తిరిగి వెళ్ళటం పిరితనం అవుతు౦దనుకొన్నాడు  .కనుక దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచి౦చాలనిపించి ,మొదటగా దక్షిణాఫ్రికా భారతీయుల ను ఉత్తేజ పరచి వారిని సంఘటిత పరచే పనిలో పడ్డాడు . అక్కడికి చేరిన కొద్ది రోజులకే దక్షిణాఫ్రికాలో మొదటి ఉపన్యాసం లో  భారతీయులు  మత ,ప్రదేశ ,పుట్టుకలకు అతీతంగా ఏకం కావాలని,సంఘటిత శక్తినిఎదిరించేదేదీ  ఉండదని ఉత్తేజకరంగా ప్రబోధాత్మకంగాప్రసంగించాడు .అక్కడి వర్తక వాణిజ్య వర్గాలవారిని నీతి నిజాయితీ తో ప్రవర్తించమని ,ఆరోగ్య విషయం లో అందరూ సుచి శుభ్రత పాటించమని కోరాడు .

  ఒక ఏడాది గడిచాక ఇండియాకు తిరిగి వెళ్లబోయే గాంధీకి డర్బాన్ లో వీడ్కోలు విందు ఏర్పాటు చేశారు .అందులో గాంధి ‘’నటాల్  మెర్క్యురి ‘’పత్రికలో వచ్చిన వార్త చదివి వినిపించాడు .అందులో నటాల్ ప్రభుత్వం 43వేలమంది ఇండియన్స్ లో  వోటు హక్కు ఉన్న 250మంది ఇండియన్ వోటుహక్కు రద్దు చేస్తున్నట్లు ఒక బిల్లు ప్రవేశ పెట్టబోతోందని  ఉంది .వెంటనే గాంధీ అక్కడి ఇండియన్ లను దానికి వ్యతిరేకగా పోరాటం చేయమని పిలుపునిచ్చాడు .దీనికి  స్పందించి వారంతా గాంధీని ఇండియా పర్యటన వాయిదా వేసుకోమని ,తమను దగ్గరుండి నడిపించి మార్గ దర్శనం  చేయమని అభ్యర్ధించారు .అబ్దుల్లా సేఠ్ కూడా ఒకడుగు ముందుకు వేసి  తగినట్లు స్పందించి ‘’మేమంతా నడకరానివాళ్ళం ,అక్షరం ముక్క లేని  వాళ్ళం .రోజువారీ మార్కెట్ రేట్లు తెలుసుకోవటానికే మేము రోజూ పేపర్లు చూస్తాం .మాకు చట్టాల సంగతి ఏం తెల్సు .ఇక్కడ మా కళ్ళూ చెవులూ అన్నీ యూరోపియన్ అటార్నీ లే .’’అని ప్రసంగించి గాంధీ మనసు మార్చుకోనేట్లు , పర్యటన వాయిదా వేసుకోనేట్లు చేశాడు .

మహాత్మాగాందీజీ 150వ జయంతి కానుక

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-9-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గాంధీజీ మహాత్ముడైన విధం

గాంధీజీ మహాత్ముడైన విధం

’’ప్రజలతో నా ప్రత్యక్ష సంబంధం 1893లో దక్షిణాఫ్రికాలో కల్లోల పరిస్థితులలో  ఏర్పడింది . .మానవుడిగా  భారతీయునిగా నాకు హక్కులు లేవు అని మొదట గ్రహించాను .నేను భారతీయుడై న౦దు వలన నాకు కనీస మానవ హక్కులు కూడా లేవని బాగా అర్ధమైంది ‘’అన్నాడు గాంధీజీ .

మహాత్ముడికి పబ్లిక్ తో సంబంధం రెండు దశలలో జరిగినట్లు మనం గ్రహించాలి .దక్షిణాఫ్రికా లో 1893మే నెలనుంచి మొదటి దశ 21ఏళ్ళు  .రెండవ దశ1915జనవరిలో భారతదేశం వచ్చినప్పటినుంచి 33ఏళ్ళు 1948జనవరి వరకు .అంటే ప్రజాజీవితం లో 54ఏళ్ళ సుదీర్ఘ అనుబంధం మహాత్మునిది .సౌత్ ఆఫ్రికాకు మొదట వెళ్ళినప్పుడు ,,ఇండియాకు తిరిగి వచ్చినప్పుడు ,బ్రిటన్ లో ఉన్నప్పుడు ఆయన వ్యక్తిత్వం లో చెప్పుకోదగిన విశేషాలేమీ లేవు .20ఏళ్ళ అప్పటి పిరికి ,సాదు వినయ విధేయతల కుర్రాడు ఇరవైల మధ్యకాలం లో ఎలా తిరుగు బాటు దారుడు అయ్యాడు ?స్వంత దేశం ఇండియాలో లో న్యాయవాద వృత్తిలో  అసలు విజయాలే లేని అనామక బారిస్టర్ ,దక్షిణాఫ్రికాలో లాయర్ గా అద్భుత విజయాలు ఎలా సాధించాడు ?105  పౌండ్ల వార్షిక వేతనం తో సౌతాఫ్రికా వెళ్ళిన లాయర్ ,కొన్నేళ్లలోనే ఏడాదికి 5,000 పౌడ్ల లాయర్ ఫీజు  ఎలా సంపాదించాడు ?భారత తీరాలను తమాషా ఇంగ్లీస్ దొరలాగా వదిలి పెట్టి వెళ్ళినవాడు ,మళ్ళీ మాతృదేశం  చేరగానే ‘’స్వదేశీ  దుస్తులు ఎలా ధరించాడు ? ఇండియాలో ఉన్నప్పుడు రచయితగా, సృజన శీలిగా గుర్తింపు పొందేది ఏదీ చేయనివాడు  ఏదేదో చేస్తానని , వాగ్దానం కూడా చేయని వాడు అకస్మాత్తుగా దక్షిణాఫ్రికాలో   గొప్ప జర్నలిస్ట్ అవతారం ఎలా ఎత్తగలిగాడు ? ఇంగ్లాండ్ లో ఉన్నప్పుడు నోరు మెదపని వాడు, ఇరవైల మధ్యలో ఎలా మహా వక్తగా మారాడు ?జీవిత ప్రారంభ దశలో ఏమాత్రమూ ప్రత్యేక ప్రతిభ చూపనివాడు గణనీయ అపూర్వ వ్యక్తిగా ,ప్రజల భవితవ్యం తీర్చిదిద్దగలిగే అవతార పురుషుడుగా  ఎలా రూపొందాడు ?ఇలా ప్రశ్నించుకొని  సమాధానాలు తెలుసుకొంటేనే క  గాంధీజీ  వ్యక్తిత్వ వికాసం , మహాత్ముడుగా గాంధీజీ రూపొందిన తీరు  మనకు అర్ధమౌతుంది.

  ‘’సత్యాహింస’’ అనే గాంధీ సిద్ధాంతం అందులోని విలువలు దక్షిణాఫ్రికా లో గడిపిన కాలం లో రూపుదిద్దుకొన్నాయి .బ్రహ్మ చర్యం ,సత్యాగ్రహం ,అహింస ,ఆశ్రమ జీవితం అన్నీ అక్కడ చేసిన ప్రయోగ విధానాలే .అక్కడే ప్రజలతో మాట్లాడటం ,జర్నలిజం  నేర్చాడు .మొత్తం మీద ఒక సాధారణ బారిస్టర్ ను ఈ లక్షణాలన్నీ మహాత్మునిగా మార్చాయి అని తెలుసుకోవాలి .మానసిక పరిపక్వత కూడా దక్షిణాఫ్రికాలోనే సాధించాడు .

  ఈ క్రమ వికసనం తెలియాలంటే దక్షిణాఫ్రికాలో ఆయన ఎదుర్కొన్న సంఘటనలను మనం తెలుసుకోవాలి .వీటిలో కొత్త విషయాలేవీ ఉండకపోయినా ఆ సంఘటనలను మనం హైలైట్ చేసి చూస్తె ఆయనలోని లోని గుణ మాణిక్య దీధితులు ప్రకాశమానమై గాంధీజీ ‘’దేశభక్త మహాత్మ’’గా ఎదిగిన తీరు అర్ధమై ,ఇండియాలో ఆయన జీవన విధానం యెంత ఉన్నతంగా ఆదర్శవంతంగా ,మార్గ దర్శకంగా అభివృద్ధి సాధించిందో అవగతమౌతుంది .మరపురాని ఆ మధుర  ఘట్టాలు,  జీవిక ఇంత ఉన్నతంగా ఎదగటానికి దక్షిణాఫ్రికా నేపధ్యమే అయింది .

మహాత్మాగాందీజీ 150వ జయంతి కానుక

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -27-9-19

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

 అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -8 8-చుండి కాళయా మాత్యుడు

         అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -8

8-చుండి కాళయా మాత్యుడు

16వ శతాబ్దికి చెందిన చుండి కాళయామాత్యుడుఆర్వేల నియోగి   ఆపస్తంభ సూత్రుడు ,కౌశిక గోత్రీకుడు చుండి రాజ్య ప్రధానమంత్రి .శివపూజా రతుడు .తల్లి సోమాంబ .తండ్రి రామమంత్రి .

      కాళయామాత్యుడు అదీంద్ర ధైర్యుడు ,స్వామి ద్రోహర గండ నవ సమీరబలుడు ,రుద్రాక్ష భూతిభూషణ ముద్రా౦కు డు. దుస్సహగ దూరుడు,నభ స్సిందు సమాన కీర్తి భరితాంకుడు,నిస్సీమ భూప్రదాత,అఖిల విద్యాపతి ,విస్సాంబాపతి,శౌర్య ధనుడు  ,రాదేయ సమాన దానపరుడు ,బందుప్రియుడు ఇతని ఆజ్ఞాప్తి సామంత సీమంతినుల కొప్పువిరులకు వేసవి గాలి అని ఇతని బంధువు పెదపాటి ఎర్రన రాసిన ‘’మల్హణ చరిత్ర ‘’లో వర్ణింపబడింది .ఇతడు నేపాల, కురు, నిషధ ,అంగ, వంగ, గౌళ, గాంధార ,మగధ,కొంకణ, విదేహ నృప మహాస్థాన కవి .మల్హణ చరిత్ర అంకితం పుచ్చుకున్నవాడు  .ఇతనికీర్తి శైలేంద్ర కన్యాదీశ కంఠ హాలహలా౦క౦బు కప్పేస్తుంది .ఇతని కీర్తి దిగంతాలకు వ్యాపించగా ,తనమనోహర మూర్తి మానినీ జనములను మరులు గొల్పింది.ఇతడు సుకవి ఫణిత వర గుణమణి గణాభరణ శాలి .విస్సా౦బను ఉద్వాహం చేసుకొన్నాడు .అతనిది విభీషణుడి పట్టు .రాష్ట్రాలకు శ్రీరామ రక్ష.ఆజ్ఞ సుగ్రీవాజ్ఞ.’’రామయ కాళుడు అనంత యశుడు’’.

 పండితా రాధ్య  చరిత్ర నుండి విషయంతీసుకొని ,మల్హణ కథ ప్రధానంగా ,శ్వేతుని వృత్తాంతం ప్రాసంగికం గా పెదపాటి ఎర్రనకవి ‘’మల్హణ చరిత్రను ‘’శృంగార రసాభ్యుదయంగా రచించి మనకు కాళయ మంత్రి ప్రతిభా విశేషాలు అందించాడు .

ఆధారం – –ప్రాచీన హిందూ దేశ రాజ్యాంగ చరిత్ర ,కన్నడ దేశ చరిత్ర ,ప్రాచీన గ్రామసభల న్యాయ పరిపాలన ,దండనాథులు, దుర్గాధిపతులు వంటి అమూల్యగ్రంథాలు రచించిన విమర్శక శిరోమణి ,సాహిత్య విశారద బ్రహ్మశ్రీ కోన వేంకటరాయ శర్మగారు1950లో రచించిన  ‘’సచివోత్తములు ‘’ పుస్తకం

 సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25-9-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

’ బాబు ‘’నిన్న౦తా బాగా బిజీ

’ బాబు ‘’నిన్న౦తా బాగా బిజీ

మూడు రోజులక్రితం పామర్రు పాత విద్యార్ధి సాయి బాబు ఫోన్ చేసి 22ఆదివారం ఉదయం పాత విద్యార్ధుల సమ్మేళనం ఉందని రమ్మని చెప్పాడు. అప్పటికి వార౦ క్రిందనే  గోదావరి రచయితల సంఘం అద్యక్షుడు శ్రీ శిస్టు సత్యరాజేష్  ఫోన్ చేసి అదే రాజు సాయంత్రం బందరులో ‘కవితాసంకల౦ ఆవిష్కరణకు ఆత్మీయ అతిధిగా రమ్మని ఆహ్వానించాడు .వీటి విషయాలనే ,పై శీర్షికతో రాస్తున్నాను .

  పామర్రుజడ్పి హైస్కూల్ 1984-85 పదవతరగతి విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం

  22ఆదివారం ఉదయం స్నాన సంధ్య పూజాదికాలు పూర్తి చేసి ,ఇవి మహాలయ పక్షాలుకనుక ,నిన్నమధ్యాస్టమి  మానాయనమ్మగారి తిధికనుక  శ్రీ వెంకటప్పగారిని పిలిపించి దక్షిణ తాంబూలం ఇచ్చి, టిఫిన్ చేసి పామర్రు ఆటోలో బయల్దేరి ఉదయం 10-30కు శ్రీ కన్యకాపరమేశ్వర సత్రానికి వెళ్లాను .అప్పటికే ఆబాచ్ ‘’అప్పటి విద్యార్ధినీ విద్యార్ధులు,’’నేటికి సుమారు 50ఏళ్ళవాళ్ళు అందరూ చేరి సరదాగా మాట్లాడుకొంటూ ,నన్ను చూసి సాయిబాబు స్వాగత వచనాలు పలికాడు చప్పట్లు మోగించి ఆహ్వానించారు.అలాగే మిగిలిన మేస్టార్లు వచ్చినప్పుడుకూడా శ్రీమతి శ్యామల, సాయి  ఆహ్వానించి తమ గురుభక్తి చాటారు .అందరికి ఇడ్లి పునుగు కాఫీ ఇచ్చారు .నేను ఒక్క ఇడ్లిమాత్రం తిని కాఫీ తాగాను .తర్వాత హాజరైన అప్పటి టీచర్లనుఅంటే నన్ను ,క్రాఫ్ట్ మేస్టార్ శ్రీ ప్రకాశరావు  ,సెకండరి గ్రేడ్ టీచర్ శ్రీ జాలయ్య , యెన్ ఎస్ టీచర్ శ్రీ మతి కస్తూరి ,తెలుగుపండిట్ శ్రీమతి సుబ్బాయమ్మ ,శ్రీమతి లక్ష్మి ,హిందీపండిట్ శ్రీమతి సీతామహాలక్ష్మి  గార్లను వేదికపైకిఆహ్వాని౦చి  ఉత్తరీయాలుకప్పి ప్రార్ధనతో సభ ప్రారంభించారు  .పాత విద్యార్ధులు వచ్చి తమపరిచయాలు, సాధించిన ప్రగతి ,సంసార విశేషాలు అత్యంత క్లుప్తంగా చెప్పారు .ఆతర్వాత ఉపాధ్యాయులకు ఆత్మీయ సత్కారం చేశారు .ప్రతిఒక్కరికి శాలువా, పుష్పహారం , ఒక బాగ్ అందజేశారు. టీచర్లు తమ అనుభవాలను చక్కగా తక్కువ మాటలతోనేచెప్పారు  .ఆడపిల్లలు ఒక్కొక్కరుగా మా దగ్గరకొచ్చి పరిచయం చేసుకొని ఏ సెక్షన్ లో తామున్నదీ వివరించారు .ఫాతీమా మెహజబీన్ అనే అమ్మాయి నాతో తాను దుబాయిలో ఉంటున్నానని ,నేను చెప్పినపాఠాలు,స్పూర్తి దాయకం గా ఉండేవని అంటే ,జుబేదా బేగం అనే అమ్మాయి తన సోదరితోవచ్చి ‘’సార్  మీరు  మమ్మల్ని’’ట్విన్స్ ‘’అని పిలిచేవారు ‘’అని చెబితే ,మరొక అమ్మాయి ‘’సార్!మీరు చెప్పిన సైన్స్ పాఠంవింటే ఇక మళ్ళీ చదవాల్సిన పని ఉండేదికాదు అలామనసులో నిలిచిపోయేది ’’అని సంబర పడిచెబితే మహాదాన౦ద౦  వేసింది .వాళ్ళంతా నాతో ఫోటోలు తీసుకొన్నారు .వీరంతా స్కూలు వదిలి సుమారు 35లేక 36ఏళ్ళు అవుతోంది  వాళ్ళమనసుల్లో అంతగా గుర్తుండిపోవటం నా అదృష్టం .సినిమాలలో ‘’గుండు సుదర్శనం’’లాగా ఉండే తెనాలి కుర్రాడు చాలా ఆత్మీయత మర్యాద చూపాడు .అలాగే సాయిబాబు  శ్యామలా ,ఒక ఆర్కిటెక్ట్ కుర్రాడు పొందిన ఆనందం వర్ణనాతీతం .శరీరాలు పెరిగి  వంగలేక పోయినా ప్రతివారు ఆడామగా వంగి మరీ పాదాలకు నమస్కరించిన తీరు జన్మలో మర్చిపొలేని అనుభూతి .వారందరి ఆదరణ ఆత్మీయత ,ప్రేమ గౌరవం ఆదరణ ,భక్తి ప్రపత్తులు చూస్తే ఉపాధ్యాయుడికి ఉన్న గౌరవం ఏమిటో స్పష్టంగా తెలుస్తుంది .ఒళ్ళు పులకరించింది .ఆడవారు అందరు సంప్రదాయ బద్ధంగా చీరలు కట్టుకురావటం మహా ముచ్చటగా ఉంది .ముస్లిం లు క్రిస్టియన్ లు అంతా సోదర సోదరీ భావంతో కలిసి మెలిసి ఈ పండుగ చేశారు .పామర్రు హైస్కూల్ కు అభి వృద్ధికి వనరుల పెంపుకు పదివేలు నుంచి వెయ్యి రూపాయలవరకు వీరు యధాశక్తి విరాళాలు అందించి  ‘’ఆల్మామేటర్’’ పై ఉన్న తరగనిప్రేమను చాటారు ,హాట్స్ ఆఫ్ .

  నేను మాట్లాడుతూ ‘’పామర్రు చరిత్ర క్లుప్తం గా చెబుతాను .సుమారు అయిదు లేక ఆరువందల ఏళ్ళక్రితం పామర్రు లో నాగులేరు అనే నది ఉండేది .దాని ఒడ్డున నాగదేవతలు శివలింగం ప్రతిష్టించి పూజించేవారు .అభిషేకజలానినదినికూడా ఏర్పాటు చేయటం వల అది నాగు లేరు గా పిలువబడింది  .నీటికిపైన శివలింగం కనిపించేది .లింగం యెంత లోతుందో ఎవరికీ తెలీదు .ఈ లింగానికి ప్రభావం ఎక్కువగా ఉండేదని చెప్పుకొనేవారు  .నాగులేరుమధ్యలో తామరకొలను ఉండేది .అందులో ఒకపద్మం నిత్యం శివలింగం పై ఉండేది .దాని సువాసనకు దారిన పోయే వారు ఆశ్చర్యపోయేవారు .కొలనుగట్టు మీద పెద్ద మర్రి చెట్టు ఉండేది .దాని తొర్రలో ఉన్న నాగుపాము ,రోజూ దిగివచ్చి శివలింగానికి చుట్టుకొని కొంతసేపు ఉండి వెళ్ళేది .కొన్నేళ్ళకు చెరువు పూడిపోయింది .దాని చుట్టూ చిన్నగ్రామ౦ ఏర్పడింది  .నిజాం నవాబులకాలం లో ఒక గురపు దళం ఇక్కడికి వచ్చి శివలింగ మహిమ విని దాన్ని త్రవ్వితీస్తే అడుగున వజ్రాలు రత్నాలు బంగారం దొరకవచ్చునని దిగి పీకటానికి ప్రయత్నించారు .అది ఊడి రాలేదు .తర్వాత ఒక బలమైన ఏనుగును నీటిలోకి దింపి తొండం తో లింగాన్ని పెకలించే ప్రయత్నం చేశారు .ఏనుగు శివలింగం పై ఉన్న పద్మం యెక్క కాడకు ఆశపడి, లాగగానే లింగం పై ఒక రంధ్రం ఏర్పడి ,రక్తం కారటం ప్రారంభమై కొలను రక్తపు మడుగు అవగా సైనికులు భయపడి పారిపోయారు .విషయం గ్రామస్తులకు తెలిసి ఆలింగాన్ని అక్కడే ప్రతిష్టించి పూజలు చేయటం ప్రారంభించి ఆలయం ప్రాకారం కట్టించి ‘’సోమేశ్వరాలయం ‘’గా పిలిచారు .ఇప్పటికీ ఆ లింగం పై రంధ్రం చూడవచ్చు .ఈ  ప్రదేశంలో పాము, మర్రి ఉండటం చేత దీన్ని ‘’పాముమర్రి ‘’అనేవారు. క్రమ౦గా పామర్తి అయి ఇప్పుడు పామర్రు ‘’అయింది అని చెప్పగానే చప్పట్లు మారుమోగాయి .అలాగే 12-12-1911లో ధిల్లీలో నాటి అయిదవ జార్జి చక్రవర్తి ,రాణి మేరీల పట్టాభి షేక మహోత్సవం జరిగింది .ఆఉత్సవాలు దేశమంతా నిర్వహించారు  .పామర్రులోకూడా పంచాయితీ వారు అందరివద్దా చందాలు పోగేసి పేదలకు వస్త్రదానం చేసి, తృప్తిగా  భోజనాలు పెట్టారు .దీని తీపి గుర్తుగా 20అడుగుల ఎత్తు ,నాలుగు అడుగుల వెడల్పు, ఆరు ముఖాలతో  ఒక జయ స్త౦భం ఏర్పాటు చేసి దానిపై పట్టాభి షేకవార్తను ఇంగ్లీష్ లో రాయించి ,పుల్లేరు కాలువ ఒడ్డున ప్రతిస్టించగా కలెక్టర్ హెచ్ .ఎల్ .బ్రైడ్ దీన్ని14-12-1911న ఆవిష్కరించాడు .ఇప్పుడు దీని సంగతి ఎవరికీ తెలీదు .అని అనగానే మళ్ళీ ఒకసారి చప్పట్లు మోగాయి .ఇవి కట్టుకథలుకావు .’’శివ –వెంకట కవులు’’ అనే జంటకవులు శ్రీ అడవి సాంబశివరావు శ్రీమాన్ నందగిరి వెంకట అప్పారావు లు ‘’పామర్రుస్థూప  జయ ధ్వజ చరిత్ర ‘’లో పద్యాలతో విపులంగా వర్ణించి చెప్పారు . ‘’అని ముగించాను .’’మాకు ఎవరికీ తెలీని ఎన్నో విషయాలు చెప్పారు  చాలాబాగా చెప్పారు ‘’అని అందరూ అన్నారు .సంతోషపడ్డాను .

   సభ అవగానే అందరికీ మంచి విందుభోజనం చాలారకాలతో  ఏర్పాటు చేశారు .అన్నీ మసాలావాసనతో ఉండటం తో నేనుమాత్రం ఇంత స్వీటు ,సాంబారు, పెరుగు అన్నం తిని తృప్తి చెందాను .అందరి భోజనాలు అవగానే మళ్ళీ మమ్మల్ని వేదికపైకి పిలిచి గ్రూపు ఫోటో తీశారు .ఇదంతా అయ్యేసరికి మధ్యాహ్నం 2-30దాటింది .అందరికీ వీడ్కోలు చెప్పి కార్యక్రమం బాగా నిర్వహి౦చి న౦దుకుఅభిన౦దదనలు తెలిపి ఎవరి దారివారు పట్టాం .

   శ్రీ సోమంచి రామంగారి సందర్శనం

మధ్యాహ్నం 3గంటలకు బందరు బస్సు ఎక్కి నాలిగింటికి దిగాను .అప్పటినుంచీ సాయంత్రం 5-30వరకు ఏమి చేయాలా అని ఆలోచించగా  పామర్రు వాళ్ళు కప్పిన రెండు శాలువాలు ఒక దండ ఉన్నాయి .కనుక సోమంచిరామగారినిచూసి కనీసం ఆరేళ్ళు అయి౦ది కనుక  వెళ్లికలుద్దమ నిపించి యాపిల్ పళ్ళు కొని ఫోర్ట్ రోడ్ లో ఉన్న వారింటికి వెళ్ళా .అక్కడే ‘’పురాణం వారి భవనం ‘’అనే మల్లాది రామకృష్ణ శాస్త్రిగారి మామగారుశ్రీ పురాణం సూరి శాస్త్రులుగారి  పెద్దభవనముంది .అది ప్రఖ్యాత కథకులు తండ్రికి తగ్గ ప్రఖ్యాత కథకులు మల్లాది సూరిబాబుగారిల్లు .వారిభార్యరుక్మిణి గారున్నారేమో ఒకసారి పలకరిద్దాం అని అడిగితె హైదరాబాద్ లో ఉన్నారన్నారు .

   రామం గారి అర్ధాంగి నన్ను సాదరంగా లోనికి ఆహ్వానించారు .రామంగారు వచ్చి సౌ౦జ్ఞాలతో పలకరించారు .నేనెవరో ఆమె ఆయనకు చెప్పారు ‘’ఉయ్యారాయన .మీలాగే రాస్తారు ‘’అన్నారు .ఆయనకు జ్ఞాపకం తక్కువైందని ,అన్నీ మర్చిపోతున్నారని బయటికి వెడితే ఇల్లుకూడా గుర్తు ఉండటం లేదని ఆమె అన్నారు. మా  యిద్దరికీ జ్యూస్ ఇచ్చారామే .రామ౦ గారికి శాలువాకప్పి దండవేసి ఆపిల్ పళ్ళు చేతిలోపెట్టి  ,ఆమెనునా మొబైల్ తో ఫోటో తీయించాను .తర్వాత దంపతులిద్దర్నీ కలిపి నేను ఫోటో తీసి కాళ్ళకు నమస్కరించి  ఉదయం పామర్రు విద్యార్ధులు మాకు గురుభక్తి చూపిస్తే, ఇప్పుడు నేను మాస్టారి యడల నా గురుభక్తి చాటుకున్నాను .ఆయన చెప్పాలనుకొన్నదానిలో ‘’ఎందుకు ఈహడావిడి.శాలువా దండా’’అన్నముఖ కవళిక లో భావన నాకు అర్ధమైంది .అయ్యొయ్యో అని నొచ్చుకొన్నారుకూడా . ఆయన స్పస్టా స్పస్టం  గా మాట్లాడుతున్నారు .83నడుస్తున్నాయి .జాతీయ అవార్డ్ ,రాష్ట్రపతి అవార్డ్ గ్రహీత .కృష్ణాజిల్లా  ప్రధానోపాధ్యాయ సంఘానికి మాజీ  అధ్యక్షులు. రాష్ట్ర సంఘానికి కార్య దర్శి .ఆయనకు తెలియని జివో లేదు .అర్ధంకాని విషయం లేదు .ఆయన సాయం పొందని టీచర్ లేరు అంటే అతిశయోక్తికాదు .ప్రతిదీ ఫింగర్ టిప్స్ పై ఉండేవి .జిల్లా అధికారులకు తలలో నాలుక .నాకూ  ఆంజనేయ శాస్త్రి ఆదినారాయణరావు  శ్రీమతిభారతి శ్రీమతి కస్తూరి మొదలైనవారికి రామంగారు ఫిలాసఫర్, గైడ్  సారధి సచివులు మార్గదర్శి ..అందుకే మాకు ఆ గురుభక్తి .తనకొచ్చిన నేషనల్ అవార్డ్ గురించి ఆయన నాతో వినపడీ వినపడనట్లు రెండుమూడు సార్లు చెప్పారు .ఆయన ధ్యాస అంతా  టీచర్లు బాగా చెప్పటం లేదని ,విద్యార్ధులు సరిగ్గా చదవటం లేదనేవాటిపైనే ఉంటోంది అని ఆమె నాతో అన్నారు .ఆయనకు బిపి,సుగర్, కీళ్ళ  నెప్పులు లాంటివి ఏవీ లేని అదృష్టవంతులు . ఏమైనా చాలాకాలం గా మనసులో ఉన్న కోరిక ఇలా తీరింది రామంగారిని చూడటం తో .

      ఆటవెలదుల తోట ఆవిష్కరణ

 రామంగారింటినుంచి హిందూ కాలేజి ఎదురుగా  శ్రీ ఆ౦జనేయ స్వామి దేవాలయం లో ఉన్న మహతి ఆడిటోరియం కు సాయంత్రం 5-15కు ఆటోలో చేరాను .వెలగలేరునుంచి వచ్చిన ఒకామె, నేనే ఉన్నాం .తర్వాత శిస్టు రాజేష్ , వడ్డేప్రసాద్ లు వచ్చారు పావుగంటకు. శ్రీ గుత్తికొండసుబ్బారావు గారు శ్రీమతి రాదికాణి వచ్చారు .ఆరువరకు సందడే లేదు. ఆరున్నరకు జనం వచ్చారు .సభ ప్రారంభమైంది .సుబ్బారావు గారు అధ్యక్షులు శ్రీ ధన్వన్తరిఆచార్య ,కృష్ణా యూనివర్సిటి వైస్ చాన్సలర్,  శ్రీమతి వారణాసి సూర్య కుమారి, శ్రీభావిష్య,నేను  వగైరాలు అతిధులు.పట్టు ఉత్తరీయాలతో ఆహ్వానించారు .పుస్తకావిష్కరణ గుత్తికొండ చేశారు .అందరూ తమ మనోభావాలు చెప్పారు .అందరికి బిస్కెట్లు ఫాంటా ,బ్రెడ్ కేక్ చాక్లెట్ ,ఉడికించిన మొక్కజొన్నల కప్పు, చివరికి ,ఉప్మాలాంటి ఉలిహారపెట్టారు .ఆకలేసి వేదికమీదే ఆబగా తినేశా సిగ్గులేకుండా .నేను వచ్చినదగ్గర్నుంచి రాధిక ‘’సార్!టిఫిన్ తెప్పించమంటారా డ్రింక్ తెప్పించమంటారా’’అని రెండుమూడు సార్లు అడిగితే వద్దన్నాను . .రాదిక పుస్తక సమీక్ష బాగా చేసింది . పూసిన ఎర్రగులాబి ఉన్న గులాబిమొక్కను ప్లాస్టిక్ సంచీలో పెట్టి అతిధులకు ఇచ్చారు ..ఇదంతా రాజేష్ స్పెషల్ అనిపించింది .నేను వస్తున్నానని తెలిసి శ్రీ కోసూరు ఆదినారాయణ దంపతులు , మా శిష్యురాలు శ్రీమతి భారతి ఆమె స్నేహితురాలు ,కనకదుర్గ ,మేరీ కృపాబాయి మునిసిపల్ మాజీ హెడ్మాస్టర్ శ్రీమూర్తి  వచ్చారు .హైదరాబాద్ నుంచి శ్రీకంచి వాసుదేవరావు వచ్చారు. చాలాకాలమైంది . ఇద్దరం మాట్లాడుకొన్నాం ఆప్యాయం గా .

  నేనుమాట్లాడుతూ ‘’ వచ్చే ఆదివారం నుంచి ప్రారంభమయే శరన్నవరాత్రి దసరా కు వారం ముందే శుభాకాంక్షలు .గోదావరి  కృష్ణా నదుల అనుసంధానం జరిగి నాలుగేళ్ళు దాటింది .దానివలన కృష్ణా జిల్లా సస్యశ్యామలంగా ఉంది .ఇప్పుడు గోదావరి –కృష్ణా కవిత్వ అనుసంధానం కను విందుగా ఉంది .ఇదీ కవితాఫల సాయం ఇబ్బడి ముబ్బడిగా ఇవ్వాలని కోరుకొందాం .మధ్యమధ్యలో కమ్మని పాటలు పాడించటం తో సంగీత సరస్వతికూడా  అంతర్వాహిని అయి పవిత్ర ‘’త్రివేణీ సంగం ‘’అయింది .’’గోరసం’’ అంటే గోదావరి రచయితల సంఘం పూనిక అక్కా చెల్లెలు అయిన  రాజేష్ ,రాదికలవలన ఇక్కడి సాహితీ మిత్రుల సహకారం తో బాగా నెరవేరింది .ఆంధ్రకేసరి సినిమాలో టైటిల్ సాంగ్ గా ఆరుద్ర ‘’వేదం లా ప్రవహించే గోదావరీ అమర ధామంలా భాసిల్లె రాజ మహే౦ద్రి –తరతరాల చరిత్రకిది మహానగరము -శతాబ్దాల చరిత్రకిది గొప్ప గోపురం .ఆదికవి నన్నయ్య పుట్టే నిచ్చటా-వీరేశలింగ చరిత్ర అదో ముచ్చట ‘’అని పొంగిపోయి రాశాడు .మనం అత్యంత పవిత్రంగా భావించే గంగానదినికూడా ఏ సంస్కృత కవులు తెలుగు కవులు ‘’వేదం లా ‘’ప్రవహి-చినట్లు  భావనచేసి రాయలేదు నాకు తెలిసినంతవరకూ .ఆరుద్ర రాసి పరమపవిత్రత తెచ్చాడు .ఆరో రుద్రుడుకదా!కవి సామ్రాట్ విశ్వనాథ ‘’కృష్ణా తరంగ నిర్నిద్ర గానము తోడ కవులగానమ్ము కలయునాడు ‘’అని పొంగిపోయాడు .ఇలా ఈరెండు సీమల సౌభాగ్యం మనకు వారసత్వ సంపద .నలభై ఎనిమిది మంది వివిధ ప్రాంతాల కవులతో ఆటవెలదులు ‘’పూయించి ‘’ కను,మనసు  విందుగా తోట పెంచి ఆహ్లాదం చేకూర్చారు .అదేదో సినిమాలో ఆహుతిప్రసాద్ ఇంట్లో ఆతిధ్య మర్యాదలు అనుభవించలేక ఇబ్బంది పడ్డట్లు ,ఇప్పుడు రాజేష్  రాజమండ్రి దగ్గర లోని ప్రసిద్ధమైన కడియం నర్సరినుంచి గులాబి అంట్లు తీసుకొచ్చి అతిధులకు అందజేయటం శిస్టు రాజేష్  విశిష్ట అభిరుచికి తార్కాణ.వేదిక ఎక్కిన దగ్గర్నుంచీ ఏదో ఒకటి తెచ్చిచ్చి నోట్లో కుక్కుతూ మాట రాకుండా చేశాడు.అతని సౌజన్యం  ,అతని ఆతిధ్యమర్యాద కే ఆదర్శం .ఒక్కడే ‘’ఆసులో గొట్టం ‘’లాగా అటూ ఇటూ తిరుగుతూ అక్కను వీసమెత్తు పని కూడా చేయనీయకుండా  గౌరవం చూపా’డు  .మిక్కిలి అభినదనీయం .విశాఖలో కొప్పరపుకవుల దౌహిత్రుడు శ్రీ ప్రసాద్’’కొప్పరపు కళాపీఠం’’ఏర్పాటు చేసి మంచికార్యక్రమాలు చేస్తున్నారు .రాజమండ్రి దగ్గరి కడియం సమీపం లో జన్మించిన శ్రీ చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి  ఆయన జంట కవి తిరుపతి శాస్త్రిగారి పేరిట ‘’తిరుపతికవుల సాహితీ పీఠం ‘’రాజమండ్రిలో ఉన్నట్లు లేదు .’’గోరసం’’ వారు దాని ఏర్పాటుకు పూనుకొని ఆమహామహులకు దివ్య నీరాజనాలు ప్రతిఏడాది చేస్తే బాగుంటుంది .ఒడ్డున ఉండి చెప్పటం తేలిక .ఆచరణ కష్టం .ప్రయత్నించమని అభ్యర్ధన .ఎనభై దగ్గర పడుతున్న నన్ను ‘’ఆటవెలదులతో ‘’ఆడుకో రమ్మ’’ని రాజేష్ పిలిచాడు .కాదనలేకపోయాను .అతడు మా ఉగాది వేడుకలలో మొదటి సారి చూశాను .మంచి టెస్ట్ ,దమ్ము ,నిబద్ధత ఉన్న కవి ,రచయిత,నాయకుడు  అనిపించాడు .మరిన్ని మంచి కార్యక్రమాలతో గోరసం ‘’పీయూష లహరి ‘’ప్రవహి౦పజేయాలని కోరుతున్నాను ‘’అని ముగించగా అందరూ హర్షధ్వానాలు చేశారు .అప్పటికే సమయం రాత్రి 8-30.బందరునుంచి బెజవాడకు తొమ్మిది దాటితే బస్సులు దొరకటం కష్టం.అందరికీ బైచేప్పి ,బయల్దేరగా, మూర్తిగారు తన స్కూటర్ పై నన్ను బస్ స్టాండ్ లో దింపారు .తొమ్మిదన్నరకు బస్సు వస్తే ఎక్కాను .ఉయ్యూరు చేరే సరికి రాత్రి 10-55.మామనవడు తెచ్చిఉంచిన సోమ్ పాపిడి   లో సగం తిని ,మజ్జిగ తాగి  ,మంచమెక్కి యుట్యూబ్ లో చంద్రగిరిసుబ్బు సీరియల్’’ నేనూ తను ‘’చూసి 11-45కు నిద్రలోకి జారుకున్నా .ఉదయం9నుంచి రాత్రి 11-45వరకు సుమారు 15గంటలు బిజీ బిజీగా గడపటం ‘’మిర్చి ఎఫ్ ఏం లో ‘మధ్యమధ్యలో వచ్చే ‘’బాబు బాగా బిజీ ‘’అనే మాట తరచూ వినటం ,అంతకు ముందురోజు మా అమ్మాయి విజ్జి అమెరికా ను౦చి ఫోన్ లో మాట్లాడినప్పుడు వాళ్ళమ్మ ‘’అమ్మడూ ! రేపు మీబాబు బాగా బిజీ ‘’అనటం వినటం వలన ఈ  ఎపిసోడ్ కు ‘’బాబు నిన్నంతా బాగా బిజీ’’   అని పేరుపెట్టి రాసి ,నామనోభావాలు తెలియ జేశాను ఈరోజు .

  మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -23-9-19-ఉయ్యూరు

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

“22-9-19ఆదివారం ఉదయం పామర్రు కన్యకాపరమేశ్వరి సత్రంలో 1984-85టెన్త్ క్లాస్ విద్యార్ధుల అపూర్వ సమ్మేళనం ,

“22-9-19ఆదివారం ఉదయం పామర్రు కన్యకాపరమేశ్వరి సత్రంలో 1984-85టెన్త్ క్లాస్ విద్యార్ధుల అపూర్వ సమ్మేళనం ,అనంతరం సాయంత్రం మచిలీపట్నం లో 83ఏళ్ళ జ్ఞాన వయో వృద్ధురాష్ట్రపతి పురస్కారగ్రహీత మాకు ఫిలాసఫర్ గైడ్ మాజీ ప్రధానోపాధ్యాయులు శ్రీ సోమంచి రామం గారింట వారికి చిరుసత్కారం ,తర్వాత మహతీ ఆడిటోరియం లో 6-30కు గోదావరి రచయితల సంఘం, బందరు సాహితీమిత్రు లు కలిసి తెచ్చిన ”ఆటవెలదుల తోట

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -7 వాణస కందన మంత్రి

-అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -7

7-వాణస కందన మంత్రి

ఓరుగల్లు దగ్గర రామగిరి దుర్గాదీశుడు ముప్ప ధరణీపతి మహామాత్యుడు వాణస కందన మంత్రి .ఈయనకు ఆశ్రితుడు మడికి సి౦గన బహు గ్రంథ కర్త .సింగన కందనమంత్రిపేర’’నీతి తారావళి ‘’రాసినట్లు ఉందికాని అలభ్యం .సింగన పద్మపురాణం లో ‘’మంత్రం రక్షణ కళాచాతుర్య ,సాహిత్య గీత రసాస్వాదన లోకమానస సదా ధర్మజ్ఞ శ్రీ ముప్పిడీశ్వర కారుణ్య కటాక్ష వర్ధిత మహా సౌభాగ్య భాగ్యోదయా ‘’అన్నాడు కందనమంత్రి తాతలు కాకతి గణపతి సామంతులుగా గణపేశ్వరం మొదలైన చోట్ల దేవాలయ ప్రతిష్ట చేసినట్లున్నది .మడికి సింగన తిక్కనగారి కొడుకు కొమ్మనకు దౌహిత్రుడైన అయ్యలమంత్రికొడుకు .ఇతడు అనపోత రెడ్డికిమంత్రి .అందుకే సి౦గనకు రాజనీతిబాగా అలవడింది .విద్యానగర కంప తాజు సి౦గన కాలం వాడు .మనుమంచి భట్టు ఏలిక కంపరాజు .భట్టు ‘’శాలిహోత్ర ‘’అనే   అశ్వ శాస్త్రం ను ‘’హయలక్షణ సారం ‘’గా  ఇతడు తెలుగు చేశాడు .ఇది చాళుక్య కంపభూపతికి అంకితం .

  గోదావరి నది దక్షిణ తీరం లోని ‘’పబ్బినాటి రాష్ట్రాన్ని రామగిరి రాజధానిగా ముప్పభూపాలుడు పాలించాడు .ఈయనకు ‘’సకల సామ్రాజ్యభార  ధురంధరుడు ,ధర్మ చరితుడు ,నీతి చాతుర్య వివేక విశేష సర్వ లక్షణ లక్షితుడు ,చత్ర చామర ఆందోళికాదిరాజ చిహ్నాలతో అలరారే కాశ్యపగోత్రుడైన కందన మహామాత్యుడై వర్దిల్లాడు ఇతని ముత్తాత తండ్రి ‘’నన్నయ ‘’గణపతి దేవుని మంత్రి .ఈనన్నయ దాన రాధేయుడు ,మాన్యుడు .ఇతనికొడుకు మల్లన ‘’మొలగూరు ‘’లో రామేశ్వరాయ మొదలైన విగ్రహ ప్రతిష్ట చేశాడు .’’చంద్ర చంద్రికాకాశసమాన మూర్తియగు గౌరమ మల్లన మంత్రి –దిక్కులన్ వాసికి నెక్కి భక్తిని నవావారణమై గుడికట్ట రామేశు బ్రతిస్ట జేసి నుతికెక్కెననన్మోలగూరి వాకిటన్ ‘’

  కందనమంత్రి పెద్దన్నకేసన మంత్రి ముప్పభూపాలుని మంత్రిగా ఉండి ధర్మకార్యాలతో ప్రసిద్ధి పొందాడు .1430లో రాసిన’’ సకలనీతిసారం ‘’దైవా౦కితమే అయినా సింగన -అయ్యలమంత్రి సి౦గ మా౦బకు పుత్రుడని తెలుస్తోంది .ఇంతకీ అయ్యలమంత్రి ఎవరు ?ఆత్రేయ గోత్రుడు పవిత్ర చరిత్రుడు పేరయమంత్రి కూతురు సి౦గ మాంబ ను పెళ్ళాడి ,రాజమహే౦ ద్రపురాదినేత అయిన తొయ్యేటి అనపోతన మంత్రి యై ,గౌతమికి ఉత్తరాన ‘’పెద్దమణికి అగ్రహారం ‘’లో ఆరామ క్షేత్రాదులు కట్టించి అన్నదాత బిరుదుపొందిన అల్లాడ మంత్రి కొడుకు .ఈ అయ్యలమంత్రికోడుకులు సింగన ,అనంతయ్య, అబ్బయ, నారయ్యలు .ఇందులో సి౦గన కు ముప్పభూపాలుడు రామగిరి సీమలో అనేక గ్రామాలను దానం చేశాడు .సి౦గనకు సంగీతనాచార్యుడు తాళ్ళపాక తిరుమలయ్య గురువు  అద్దంకి సీమవాడు ‘’పరవాడి భద్రవారణ ‘’బిరుదున్నవాడు .

   ముప్పరాజు తెలుగురాయడు రాజ్యం చేసేకాలం లో  కందన మంత్రిగా ఉన్నాడు .ముప్పడు మంత్రక్షణ కళా చాతుర్యుడు సాహిత్య గీత రసాస్వాదన పరుడు అని సింగన పద్మపురాణం లో రాశాడు .కృష్ణానది దక్షిణ తీరం లోగుంటూరు జిల్లా  మంగళగిరి దగ్గర ‘’రావెల ‘’అగ్రహారం ఏలుతూ అక్కడ గొపీనాథ ఆలయం నిర్మించిన అల్లాడ మంత్రి ముని మనవడే  మన కందన మంత్రి. కనుక రావెల వాస్తవ్యుడు .

ఆధారం – ఆధారం –ప్రాచీన హిందూ దేశ రాజ్యాంగ చరిత్ర ,కన్నడ దేశ చరిత్ర ,ప్రాచీన గ్రామసభల న్యాయ పరిపాలన ,దండనాథులు, దుర్గాధిపతులు వంటి అమూల్యగ్రంథాలు రచించిన విమర్శక శిరోమణి ,సాహిత్య విశారద బ్రహ్మశ్రీ కోన వేంకటరాయ శర్మగారు1950లో రచించిన  ‘’సచివోత్తములు ‘’ పుస్తకం

 సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-9-19-ఉయ్యూరు . –

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -6 6-పసుదోవ పంపన భట్టు

అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -6

6-పసుదోవ పంపన భట్టు  

క్రీ శ 902లో వేంగిగిరాజ్యం లో పరాశర గోత్రుడు ,ఆర్వేల నియోగి ,వేద,వేదంగ ,మీమాంస శాస్త్ర పారంగతుడు పసుదోవ గ్రామంలో పంపనభట్టు జన్మించాడు .వాజ్మయ మహోదధిలో ఈదులాడినవాడు .షట్కర్మ నిరతుడు .తండ్రి కేశవ శర్మ సర్వ శాస్త్ర తత్వ విదుడు.తాత పంపన బ్రహ్మ తుల్యుడు   .లక్ష్మీశ్వరం అనే పేరున్న ‘’పులిగెరే’’పట్నం రాజధానిగా పాలించిన చాళుక్యరాజు ‘అరి కేసరి ‘’కి ప్రధానామత్యుడుగా ఉన్నాడు ..తండ్రి వైదికమతం వదిలి జైనమతం తీసుకొన్నాడు .

  భువనైకమల్లుడు అనే పేరుతొవీర విజయాదిత్యుని సమకాలికుడు  ఇమ్మడి సోమేశ్వరుడు , కర్నాటక రాజ్యాన్ని ఎనిమిదేళ్ళు పాలించాడు .తమ్ముడు విక్రమాదిత్యునితో వచ్చిన వైరం వలన పదవి కోల్పోయి కారాగారం లో బందీ అయ్యాడు .ఇతని చివరిరోజులూ దీన౦ గానే గడిచాయి .కానీ ముసలితనం లో  అంటేరాజ్యానికి వచ్చిన 12ఏళ్ళకు కొడుకుపుట్టాడు .యితడు బతకడు అని కార్తా౦తికులు  చెప్పగా ,ఆరోగ్యంగా జీవించాలని ‘’మావిం డేరు’’,’’కృందిడి’’అనే రెండు అగ్రహారాలను పసుదోవ వాస్తవ్యుడు పంపన భట్ట మహామంత్రికి దానంగా ఇచ్చాడు .కాని విదివైపరీత్యం వలన ఆకుర్రాడు బతికి బట్టకట్టలేదు .చివరికి హతాసుడై సంతాన రహితుడుగా 1076లో చనిపోయాడు .ఇతనితో వేంగీ రాజ్యం లో చాళుక్యరాజ వంశం అంతమైంది .నిజానికి విజయాదిత్యుడే చివరి సత్యాశ్రయ కులజుడు .ఇతడు మరణించిన సమయం లోనే కర్నాటకం లో భువనైకమల్ల సోమేశ్వరుడు పదవిపోగోట్టుకొని దుర్మరణం చెందాడు .ఈవిషయాలను ‘’ర్యాలి ‘’శాసన కర్త ‘’ముత్తయభట్టు ‘’ విపులంగా వివరించాడు .

  క్రీశ 941లో పంపనభట్టు మొదటి జైన తీర్ధంకరుల చరిత్ర ‘’ఆదిపురాణం ‘’రాయటమే కాక ‘’విక్రమార్క విజయం ‘’అనే’’ పంప భారత౦ ‘’రాశాడు .తండ్రికేశవ శర్మ వేంగిని వదలి కర్నాటక చేరాడు .వేముల వాడ చాళుక్యులలో గొప్పయోదుడైన ఇమ్మడి నరసింహుని ఆధిపత్యం లోనే ముమ్మడి ఇంద్ర వల్లభుడి యుద్ధాలన్నీ జరిగాయి .లాట ,మాళవ, ఘూర్జర, ప్రతీహారులను ఓడించి విజయాలు సాధించటం ఇమ్మడి నరసింహుని సైన్య వ్యూహ౦ వలననే .ఇంతగొప్ప చమూపతి ఆ శతాబ్దం లోభారత దేశం లో లేడు అంటారు .ఇతడి కొడుకే ఇమ్మడి అరికేసరి 930లో మండలానికి అధిపతి అయ్యాడు .ఇతడు  రాష్ట్ర కూట రాజు  ముమ్మడి ఇంద్రవల్లభునికి మేనల్లుడు .ఇంద్ర భూపతి తనకుమార్తె’’రేవక ‘’నుమేనల్లుడు అరికేసరి కిచ్చి పెళ్లి చేసి మామగారుకూడా అయ్యాడు .బద్దగని ముమ్మనుమడైన అరికేసరి నాల్గవ గోవింద రాజు సమకాలికుడు .

  అరికేసరి ముఖ్యమంత్రి మన పంపన భట్టు .వేంగిగిమండలం లోని కమ్మనాడులో ఉన్న వేంగిపర్రు గ్రామస్తుడు .మహామంత్రి పంపకవి కంటే పెద్దవాడు ,  సమకాలికుడు పొన్నకవి   శాంతిపురాణ, ,భువనైక రామాభ్యుదయ కావ్య కర్త . కమ్మనాడులోని పు౦గనూరులో నాగమయ్య అనే బ్రాహ్మణుడికి మల్లపయ్య ,పొన్నమయ్య కొడుకులు .శాంతిపురాణ౦  రాశాడు .ముమ్మడి కృష్ణభూపతికి ‘’భువనైక రామాభ్యుదయం ‘’అంకితమిచ్చిన  పోన్నకవి’’ఉభయకవి చక్రవర్తి’’బిరుదాంకితుడు .ఉత్తర ఆర్కాడులో వాణియంబాడి వాస్తవ్యుడు .మల్లపయ్య , పొన్నమయ్య మొదలైనవారు పొన్నకవివంటి వారికి ఆశ్రయమిచ్చి కన్నడ కావ్యరచనకు ప్రోత్సహించారు .అప్పుడు మన తెలుగు రచనలకు ప్రోత్సహించినవారు లేరు .చాళుక్యులే తెలుగు దేశికవితను ప్రోత్సహించారని నన్ని చోడుని కమార సంభవ పద్యం –‘’మును మార్గ కవిత లోకం-బున వెలయగ ,దేశికవిత బుట్టించి తెనుం –గు నిలిపి ర౦ధ్రవిషయం –బున జన చాళుక్యరాజు మొదలగు బలువుర్ ‘’వలన తెలుస్తోంది. గుణగుని పూర్వీకులైన పూర్వ చాళుక్యులలో ఒకరు తెలుగు దేశికవిత్వం పుట్టించాడని భావించాలి .

  ఇమ్మడి నరసింహుడు 914నుంచి 930వరకురాస్ట్రకూటరాజు ముమ్మడి ఇంద్రునికి సామ౦తుడు .ఇతడికొడుకు  అరికేసరి .అరికేసరి ప్రధానమంత్రి పంపన భట్టు . ఇదీ వరస .

ఆధారం – ఆధారం –ప్రాచీన హిందూ దేశ రాజ్యాంగ చరిత్ర ,కన్నడ దేశ చరిత్ర ,ప్రాచీన గ్రామసభల న్యాయ పరిపాలన ,దండనాథులు, దుర్గాధిపతులు వంటి అమూల్యగ్రంథాలు రచించిన విమర్శక శిరోమణి ,సాహిత్య విశారద బ్రహ్మశ్రీ కోన వేంకటరాయ శర్మగారు1950లో రచించిన  ‘’సచివోత్తములు ‘’ పుస్తకం

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-9-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -5 రాయసము గోవింద దీక్షితులు

 అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -5

5-రాయసము గోవింద దీక్షితులు

చెవ్వప్ప నాయకుడు తంజావూరు పాలించేటప్పుడు 1521లో తనకొడుకు అచ్యుతప్ప నాయకునికి యౌవరాజ్య పట్టాభిషేకం చేశాడు .వ్యవహార కుశాలుడవటం వలన పాలన తండ్రిదైనా అచ్యుతప్ప రాజకీయవ్యవహారాలన్నీ చూసి ‘’మహామండలేశ్వర ‘’బిరుదుపొందాడు.ఇతనికాలం ను౦చే,తంజావూరు రాజులు విజయనగర రాజులకు సామంతులుగా ఉండటం ప్రారంభమైంది .ఏడాదికి 40లక్షలకప్పం చెల్లిస్తూ ,యుద్ధం వస్తే తోడ్పడేవారు .ఇతనికాలం లోనే విజయనగరాన్ని తిరుమల ,శ్రీరంగ ,వేంకటపతి రాయలు పాలించారు .తుళువ సదాశివరాయలతర్వాత పాలన ఆరవీటి వారిదే  .అచ్యుతప్ప పేరుకు సామంతుడేకాని యదార్ధానికి చాలా స్వతంత్రంగా ఉండేవాడు .కానీ 1584లో మళ్ళీసాంతుడిగాఉంటూ విధేయడయ్యాడు  .’’సంగీత సుధ’’ పీఠికలో ,’’అప్రతీపః కౌమార ఏవాభ్రుత రాజ్యభారః –నిర్జిత్య సామంత నృపవర్గం –మహీ మహేంద్రః –లక్ష్మాశ్చసర్వాన్యపి మండపాని –దివ్యాని రత్నాభరణాని  ‘’అనీ ,రామేశ్వరాది తీర్ధాలలో కొత్త రాజగోపురనిర్మాణ౦ చేశాడని ,రామసేతువు లో లక్షలద్విజులకు అన్న సంతర్పణ చేశాడని ఉంది .రాజచూడామణి దీక్షితులురాసిన ‘’రుక్మిణీ పరిణయ ‘’కావ్యం లో ‘’మాయూర .మధ్యార్జున కుంభ ఘోణ-శ్రీ చంపకారణ్య ముఖ స్థలేషు-మహత్తరం’’ మండప ‘’ మాతతాన భక్త్యా మహత్యాపర మచ్యుతే౦ద్రః ‘’అని అచ్యుతప్పనాకకుని యశో విశేషాలు ఉన్నాయి .

  అచ్యుతనాయకుని సచివుడు గోవింద దీక్షితుడుమహామంత్రజ్ఞుడు ,మహాకవి ,గాయకాగ్రేసరుడు ,మహాయజ్వ .అప్పయ దీక్షితులతో మీమాంస చర్చచేసిన పండితాఖండలుడు .మీమాంస శాస్త్రం పై స్వతంత్ర గ్రంథాలు రాసిన విద్వద్ వరేణ్యుడు .’’సార్వ చిత్య ,సర్వతోముఖా తిరాత్ర,సాగ్ని చిత్యాప్త  ,వాజపేయాది యజ్ఞాలు చేసిన  కర్మిస్టి.’’పదవాక్యప్రమాణ పారావార పారీణ ,అద్వైత విద్యాచార్య ‘’బిరుదులుపొందినవాడు .ఈ మహామంత్రి ఆజ్ఞను శిరసావహించి రఘునాథ రాయలు సంగీత సుధ’’రాస్తే ,గోవింద దీక్షితులు పీఠిక రాశాడు .కనుక చెవ్వప్ప నాయకుడు బ్రతికి ఉండగానే అచ్యుతప్పకు రఘునాధరాయలు పుట్టాడని అర్ధమౌతోంది .అచ్యుతప్ప ,గోవింద దీక్షితులు రఘునాథునికి విద్యాబుద్ధులు, రాజనీతి నేర్పించి వివేక శీలుని చేశారు .గోవింద దీక్షితులు చేసిన యజ్ఞాలకు కొడుకు యజ్ఞనారాయణ దీక్షితుడే అధ్వర్యుడు .ఆయజ్ఞాలలో రఘునాథ నాయకుడు గోవింద దీక్షితులకు తండ్రి ఆనతిప్రకారం ముత్యాలగొడుగు పట్టేవాడట

  అచ్యుతప్పగోవింద దీక్షితుల అన్యోన్యాన్ని వర్ణించే ఒక శ్లోకం –‘త్రినామాద్యంత నామానౌ –మహీక్షిద్దీక్షితా ఉభౌ –శస్త్ర శాస్త్రే చ కుశలా –వాహ వేషు హవేషు చ ‘’అచ్యుతుడు ‘’ఆ రభ్య బాలా దతి భక్తి శాలి ‘’ముసలి ఆ వరకు బ్రతికి ,రాజ్యాన్ని రఘునాథునికి అప్పగించి శ్రీరంగానికి వెళ్లి ‘’ముకుంద చింతనము ‘’తో గడిపి 1615లో మరణించాడు . –‘శ్రీరంగ స్థల సంగతో బుధకులం –శీతాంశు రుర్వీమివ ప్రాప్త స్సైష పుపోష శేష శయనే భక్తః పరే ధామని  ‘’అని సాహిత్యరత్నాకరం లో ఉంది .అచ్యుతప్ప  జీ వించి ఉండగానే అతన్ని ఒప్పించి రఘునాథ రాయలను రాజ్యానికి అభిషిక్తుడిని చేశాడు గోవింద దీక్షితులు అని ‘’సాహిత్యరత్నాకరం ‘’లో ఉన్నది –‘’భాద్రాసన స్థిత విధి ప్రథితం  విభూత్యా –నిత్యాగ్ని హోత్ర భావయా నిటలేమహీన్ద్రో –ఆ చంద్ర తారక అధీశ్వరతా నిధానం – గోవింద దీక్షిత గురుః కురుతేస్మ పట్టం  ‘’

   రఘునాథ రాయల పట్టాభి షేకం అయినప్పతినుంచి ,  గోవింద దీక్షితులను అర్ధ సింహాసనం ఇచ్చి గౌరవించాడు .కొంతకాలానికి గోవింద దీక్షితులు  చనిపోయాడు .తన సంగీత సుధలో రఘునాధుడు గోవింద దీక్షితులను ‘’జయంతి సేనా దిమరాగ,రామానందాది తాళాన్ రచయాన్ నవీనాన్ –సంగీత విద్వాంస ముపాది శస్త్వం-విపంచికావావిచాక్షణానాం’’అని దీక్షితుల సంగీత ప్రతిభను కొత్తగా కనిపెట్టినరాగాలను తాళాలను  స్తుతించాడు  .గోవి౦ద దీక్షితులు  స్వయంగా ‘’సంగీత శాస్త్ర నిక్షేపం ‘’గ్రంథం రాశాడు.ఇందులో 72ప్రస్తార మేళాలను చెప్పాడు  .వేంకటమఖి రాసిన’’చతుర్దండి’’ గ్రంథంకంటే ఇది ప్రాచీనమైనది .కనకాంగి రత్నాంగి ఖరహర ప్రియ రాగాలు దీక్షితులదానిలో ఉన్నాయి .ఇవే  వేంకటమఖికి ఆధారం .రఘునాథుని వీణ మెట్లక్రమాన్ని కాదని సప్తస్వరాలకు సర్వకాలాబాధితమైన మెట్లు ఉన్న ‘’సరస్వతీ వీణ ‘’తయారు చేసి,72మేళకర్తలను ఏర్పరచిన ప్రజ్ఞాశాలి వెంకటమఖి .జయదేవుని గీత గోవిందాన్ని అనుసరించి సంగీత సద్గురు త్యాగరాజ స్వామిపై 24అష్టపదులు రాశాడు .

  చెవ్వప్ప నాయకుని కాలం నుంచే నేపాలనే జాఫ్నా త౦జావూరికి కప్పం కట్టే సామంత  రాజ్యంగా ఉండేది .అచ్యుతరాయల హితవుప్రకారం చెవ్వప్పనాయకుడు కార్యవాది యై రాజధాని తంజావూర్ చేసుకొని అది తమిళప్రాంతం లో ఉండటం చేత ,ఆంద్ర ప్రాంతం నుండి మంత్రులు దండనాథులు ,పండితులు ,కవిశేఖర గాయకులను నాట్యకత్తే లను తంజావూరుకు తీసుకుపోయాడు .అలా  వెళ్లినవారే గోవింద దీక్షితుల వంశం కూడా .

  గోవింద దీక్షితులు వశిష్ట గోత్రుడు ‘’రాయసాన్వయ పయః పారావార రాకా సుధాకరుడు ‘’.భార్య నాగా౦బిక.ఈయన పేరుతొ తంజావూరు జిల్లాలో లో గోవిందాపురం  , దీక్షిత సముద్రం గ్రామాలేర్పడ్డాయి .గుంటూరు ప్రాంతం నుంచే ఈయనవంశం వారు అక్కడికి వెళ్ళారు .అచ్యుతప్ప కావేరి నదికి ఆనకట్ట కట్టి ఎన్నో ధర్మకార్యాలు చేసి ,1577లో మధ్వ స్వామి విజయేంద్ర తీర్ధులకు ఒకగ్రామం దానం చేశాడు .కోటలోని ‘’లక్ష్మీ విలాస భవనం ‘’లో మంత్రా౦గ౦  నిర్వహించేవాడు .ఈ సభలో రఘునాథునికి దీక్షితమంత్రి శత్రు సంహారం కోసం ఒక్కొక్కరిని తాకమని అంటే ఒక్కొక్కరినే  ఎదుర్కొని  చంపమని సలహా ఇచ్చేవాడని సాహిత్య రత్నాకరం లో ఉంది . ఇలా చేస్స్తేశాత్రువుల ఐక్యతకు అవకాశం ఉండదని భావం .

  రఘునాథరాయలు దిగ్విజయ యాత్రలకు వెళ్ళే టప్పుడు రాజ్యభారం అంతా దీక్షితుల పైన వేసి వెళ్ళేవాడని  అంతటినమ్మకం ఉండేదని సాహిత్యరత్నాకర౦ లో ఉంది –‘’’’ధరాధురం నిజ సచివే  నివేశ్యచ –సరోహితా త్సదసి సరోష మీక్షణా –దనీకినీమథసమనీ నహత్ క్షణాత్ ‘’గోవింద దీక్షితులకొడుకులు యజ్ఞనారాయణ దీక్షితులు, వెంకటేశ్వర దీక్షితులు ,లింగాధ్వరి .లింగాధ్వరి వేదార్ధ తత్వ నిర్ణయం ,శివసహస్రనామ భాష్యం  రాశాడు .నారాయణ దీక్షితులు ‘’సాగ్నిచిత్సర్వ క్రతుయాజి .రఘునాధరాయల చరితం ,సాహిత్యరత్నాకరం రఘునాథ భూప విజయం రఘునాథ విలాస నాటకం రాశాడు .ఇతడు రఘునాథుని శిష్యుడే .కావ్యనాటకాలంకార సాహిత్యాలను ప్రభువు వద్దే నేర్చాడు .వెంకటేశ్వర దీక్షితులు వాజిపేయయాజి .సాహిత్య మీమాంస ,కర్మాంత వార్తిక ,వార్తికాభారణ చతుర్దండి ప్రకాశిక మొదలైనవి రాశాడు .మహాకవి వల్లభుడైన నీలకంఠ దీక్షితునికి గురువుకూడా .ఇలా గోవింద ,దీక్షితుల వంశంవారు ఆంధ్రదేశం గుంటూరు సీమనుంది తమిళదేశం తజావూరు సీమకు తరలివెళ్లి అక్కడ సాహిత్య సంగీత ,వేదవేదా౦గ,  క్రతువిదులలోనూ మంత్రాంగం లోను కీర్తి ప్రతి స్టులై ,అందరూ మహానుభావులే అనిపించుకొన్నారు .

ఆధారం – ఆధారం –ప్రాచీన హిందూ దేశ రాజ్యాంగ చరిత్ర ,కన్నడ దేశ చరిత్ర ,ప్రాచీన గ్రామసభల న్యాయ పరిపాలన ,దండనాథులు, దుర్గాధిపతులు వంటి అమూల్యగ్రంథాలు రచించిన విమర్శక శిరోమణి ,సాహిత్య విశారద బ్రహ్మశ్రీ కోన వేంకటరాయ శర్మగారు1950లో రచించిన  ‘’సచివోత్తములు ‘’ పుస్తకం

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -18-9-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారి నుంచి ఫోన్

నిన్న సాయంత్రం బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రిగారు చీరాల నుంచి ఫోన్ చేసి ,తాను ఈమధ్య విజయవాడ వెళ్ళినప్పుడు శ్రీ తుమ్మోజు రామలక్ష్మణాచార్యులు ,ఆయనరాసి సరసభారతి ప్రచురించిన ”శ్రీ సువర్చలా వాయు నందన శతకం ”తనకు ఇచ్చారని ,ఇంకా రెండు శతకాలు కూడా రాయించి సరసభారతి ప్రచురించినట్లు దానిని బట్టి తమకు తెలిసిందనీ ,ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం సుమారు 300ఏళ్ళనాటిదని  తెలిసి ఆనందించానని ,కృష్ణాజిల్లాలో ”పాశ్చాపురం ”లోనూ సువర్చలాన్జనేయ దేవాలయం ఉందని స్వామివార్ల ఫోటో వాట్సాప్ లో పంపిస్తానని చెప్పారు అప్పుడు నేను దర్శనీయ ఆన్జనేయదేవాలయాలురెండుభాగాలుగా 355దేవాలయాల గురించి రాసి ప్రచురించామని చెప్పాను . వారు భద్రాద్రిలోశ్రీరామనవమికి సీతారామకల్యాణం జరగటం లేదని రామనారాయణ కల్యాణం చేస్తున్నారని దానిపై తానూ పుస్తకం రాశాననీ చెప్పారు వారి వ్యాసాలూ బెజవాడ నుంచి శ్రీ లక్ష్మణరావు గారు ప్రచురించిన ”హనుమత్ప్రభ ”పత్రికలో చదివేవాడినని ఆయన ఒంగోలులో నిర్మించిన నవావతార హనుమాన్ దేవాలయం గురించి కూడా రాశానని ,శ్రీ మంగళగిరి ఆదిత్యప్రసాద్ గారు ఆయనగురించి చాలా గొప్పగా నాతో చెప్పేవారని అన్నాను వాట్సాప్  లోఅడ్రస్ పంపిస్తే పుస్తకాలు పంపుతానన్నాను వారు పంపటం నేను వారికి  శ్రీమతి ముదిగొండ సీతారామమ్మ శ్రీ మంకు శ్రీను గార్లు రాసిన శతకాలు ఆ౦జనేయ వైభవం హనుమత్ కదానిది ,దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు రెండుభాగాలు ,గీర్వాణ౦ -3 సిద్ధ యోగిపు౦గవులు మహిళామాణిక్యాలు, దైవ చిత్తం ,కొలచల సీతారామయ్య ,పుచ్చా వెంకటేశ్వర్లు  -మొత్తం 13పుస్తకాలు నిన్న సాయంత్రమే కొరియర్ లో పంపగానే  రోజు సాయంత్రమే అందినట్లు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు అన్నదానం వారు పరాశర సంహిత .,ఆంజనేయ చరిత్రలపై సాధికారత ఉన్నవారు ఆంజనేయస్వామికి కల్యాణం ఎందుకు చేస్తారో పుస్తకం రాశారు ఎన్నో ఆధ్యాత్మిక గ్రంధాలు వెలువరించి రేడియో టివి లలో ప్రసంగాలు చేసిన విద్వద్ వరేణ్యులు. అలాంటివారు  నాకు ఫోన్ చేసి మాట్లాడటం మహదానందంగా ఉంది -దుర్గాప్రసాద్ -17-9-19

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -4 తరిగొప్పుల దత్తన మంత్రి  

అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -4

4-తరిగొప్పుల దత్తన మంత్రి

విజయనగర చక్రవర్తి వీరనరసింహరాయల ప్రధానమంత్రి తరిగొప్పుల దత్తన అని ‘’చంద్రభాను చరిత్ర ‘’లో ఉంది

‘’దత్తనమంత్రి మహా విపక్ష దుర్మద బల మర్మదాభరణ –దురంధర సంగర చాతురీ విశారాదుడగు వెంకట క్షితి పురందరునప్రతిమాన రాజ్య సంపదలు భరి౦పనాకు లిడు భ  వ్యగతి  శ్రితపారిజాతమై  ‘’.వీరనరసింహుడు 1586నుంచి 1614వరకు పాలించాడు .కనుకదత్తన 16వ శతాబ్దివాడు .వసుచరిత్ర అంకితం తీసుకొన్న తిరుమలరాయల నాలుగవ కుమారుడే వేంకటపతి రాయలు .అలియ రామరాయల సోదరుడు తిరుమలరాయుడు .తళ్ళికోట యుద్ధం లో రామరాయలు చనిపోయాక ,తిరుమలరాయడు సదాశివరాయలకు ముఖ్యమ౦త్రి గా ఉండి,1570లో సదాశివరాయలమరణం తర్వాత రాజ్యం ఆక్రమించి మూడేళ్ళు పాలించగా రెండవకొడుకు శ్రీరంగరాయలు 1574నుంచిరాజ్యానికి వచ్చాడు .

  తళ్ళికోట యుద్ధం తర్వాత తురుష్కదండయాత్ర వలనవిజయనగరం భస్మంకాగా  తిరుమలరాయలు రాజధానిని పెనుగొండకు మార్చాడు .ఇతనితర్వాత శ్రీరంగరాయలు ఆతర్వాత వేంకటపతిరాయలు రాజ్యం చేశారు .రంగరాయల కాలం లో బిజాపూర్ నవాబులు పెనుగొండను లాక్కోటం వలన చంద్రగిరి  రాజధాని చేసుకొన్నాడు .వెంకటపతిరాజ్యానికి వచ్చేనాటికి  చంద్రగిరి రాజధాని .’’రామరాజీయ గద్యం ‘’లో –‘’తనకు వేలూరు వరరాజధాని గాగ –వీర వెంకటరాయ విభుడు మిగుల ధరణి బాలించే ధర్మతత్పరత జెలగి ‘’అని ఉండటం వలన రాజధాని వేలూరుకు మారి ‘’రాయల వేలూరు ‘’అయింది.

  తిరుమల రాయడు తాను  బ్రతికి ఉండగానే కొడుకులతో కొన్ని ప్రదేశాలలో పాలన చేయించినట్లు ,తానూ విద్యా వినోదగోస్టితోకాలక్షేపం చేసినట్లు ‘’శృతి రంజని ‘’పద్య చరణం –‘’నమదరి నృపమౌళిస్తోమ నీరాజితాన్ఘ్రి ‘’వలన తెలుస్తోంది .’’బుధు లెన్నవలయు రాజాధిరాజ –రాజపరమేశ సకల కర్ణాటకాంధ్ర –రాజ ధౌరేయ  తిరుమలరాయ తనయ –చంద్రుడగు వేంకటపతి క్షితీంద్ర మణికి ’’

ఇంతటి ప్రతాప శౌర్య ధైర్యశాలి వేంకటపతి రాయలు ముఖ్య సచివుడై తరిగొప్పుల వంశం నాగమ్మ మల్లన దంపతులకు   నరసయామాత్యుడు పుట్టాడు .అసామాన్య యశో విభూషితుడై,ఆశ్రిత బాంధవుడై ,అనంత పద భక్తుడుగా విరాజిల్లాడు .భార్య తిప్పాంబ మహాపతివ్రత .అన్నదానం ,పరిచార్యలలలో పేరు పొందింది .వారిది అన్యోన్య దాంపత్యం .వీరికి అప్పన దత్తన మల్లన కొడుకులు అని చంద్రభాను చరిత్ర చెబుతోంది .అప్పన నిరతాన్న దాననిది .లోకబంధుడు .ఇతని తమ్ముడే దత్తనామాత్యుడు

‘’పటు కార్యదక్షుడు ‘’.రాజు ఈ క్రిందివిధంగా అతడినిపోగడినట్లు ‘’చారు చంద్రోదయం ‘’లో ఉన్నది

  దత్తన మంత్రి మధ్వమతాను చరుడు .స్వతంత్ర కౌశిక గోత్రుడు .సత్తెనపల్లి తాలూకా ‘’రాజనాపుర ‘’వాస్తవ్యుడు .ఆర్వేల నియోగి మధ్వుడు.ఈ వంశీకులు విజయనగర సామ్రాజ్యం లో తిరువనతపురం మైసూర్ లలో కూడా ఉన్నారట .టిప్పుసుల్తాన్ తండ్రి హైదరాలీకి టిప్పుసుల్తాన్ కు మంత్రి పూర్ణ య్యమంత్రి ఈ శాఖవాడే  .

ఆధారం –ప్రాచీన హిందూ దేశ రాజ్యాంగ చరిత్ర ,కన్నడ దేశ చరిత్ర ,ప్రాచీన గ్రామసభల న్యాయ పరిపాలన ,దండనాథులు, దుర్గాధిపతులు వంటి అమూల్యగ్రంథాలు రచించిన విమర్శక శిరోమణి ,సాహిత్య విశారద బ్రహ్మశ్రీ కోన వేంకటరాయ శర్మగారు1950లో రచించిన  ‘’సచివోత్తములు ‘’ పుస్తకం

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -16-9-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఇవేమి బర్త్ డే ల్రా బాబోయ్ 

ఇవేమి బర్త్ డే ల్రా బాబోయ్

బావా -”నా హేపీ బర్త్ డే అని  పేస్  బుక్ లో వాట్సాప్ లో పెట్టాను  నీ నుంచి స్పందనే లేదు -బామ్మర్ది నన్న కనికరమూ నీకు లేదు”అన్నాడు బామ్మర్ది బ్రహ్మ0

నేను -అది సరేరా . మీరు పంపే  బర్త్ డే లలో ”యు ఆర్ థింకింగ్ ఆఫ్ మై బర్త్ డే ”అని పెడుతున్నారు .నువ్వైతే నాకు తెలుసుకనక బానేఉంది .ప్రతి అడ్డమైన వాడు ఇలా పెడుతుంటే ,వాళ్ళందరి బర్త్ డే లు గుర్తుంచుకోటానికి ,వాళ్ళ బర్త్ డే గురించి ఆలోచించటానికి నాకేంట్రా పని ?”అన్నాను
వాడు-అదొక పధ్ధతి బావా .అది అంతే  నువ్వేమీ వర్రీ కాకు
నేను -అలాకాక ఇవాళ నా బర్త్ డే .ఆశీర్వదించండి అనో ,శుభాకాంక్షలు తెలియజేయమనో ఏడవ్వచ్చుగా ?
వాడు -ఇది దొరలపద్ధతేమో బావా ?మక్కీకిమక్కీ మనోళ్లు ఫాలో ఐపోతున్నారు .నాకూ అదే జబ్బు అంటుకుంది
నేను -ఏడిశావు .మంచి వాటిని అనుకరించాలికానీ ఈ బానిస బుద్దు లేంట్రా ?
వాడు -బావోయ్ క్షమించి వదిలేయి . ఇక  పంపిస్తే చెప్పుచ్చుకు కొట్టు -అన్నాడు
నేను -అది సరే బర్త్ డే తెలియ జేసేటప్పుడు ప్లీజ్ హెల్ప్  సేలిబ్రేటింగ్ బర్త్ డే అని అఘోరిస్తున్నారెందుకురా? వెళ్లి వాళ్ళ ఇంటికి ఏర్పాట్లు చూడమనా ?డబ్బు ఖర్చుపెట్టమనా ?కేకు కొని తెచ్చి కట్ చేసి నోట్లో కూరమనా ?బుగ్గలు వాచేట్లు బెలూన్లూది కట్టమనా ?
వాడు -ఓరినాయనోయ్ !వేలికేస్తే కాలికి ,కాలికేస్తే వేలికి లాగే ఈలాజిక్ ఎక్కడ పట్టావ్ బావోయ్  ?
నేను -లేకపోతె ఆ హెల్ప్ మాటకి కి పరమార్ధం ఏంట్రా ?
వాడు బాబూ ! అదీ పైనిన్చిదిగుమతైన సరుకే . ఇన్ని అర్దాలు౦టాయని ,నీలాంటోడు కోడిగుడ్డుపై  ఈకలు  లాగుతాడనీ  ఊహించి ఉండరుబావోయ్అన్నాడు బుద్ధి వచ్చింది ఇక ఇలాంటివి నీకు చస్తే పంపించను క్షమించుబా అన్నాడు ..
నేను -ఇదెక్కడి దరిద్రపు కల్చర్ రా తలిదంద్రులకూ ఇలానే పెట్టి పంపిస్తున్నారు ?శుబ్రంగా ఫోన్ చేసి ఇవాళతన బర్త్ డే అనో తనభార్య భర్త్డే అనో ,పిల్లల బర్త్ డే అనో చెప్పి  ఆశీర్వదించమని  కోరచ్చుగా ?
వాడు -ఇంత చాదస్తం పనికిరాదు ఆదైనాపంపిస్తున్నందుకు సంతోషించాలి
నేను ఈ ధింకింగ్ ,ఈ హెల్ప్ పదాలు లేకుండా ఈ సారి పంపించు లేకపోతె మళ్ళీ తల౦టు తా ” పాపం యెంతో ఆశపడి గ్రీటింగ్స్నికోసం వచ్చావు  ”అన్నాను
వాడు – ఇంకేం గ్రీటింగ్స్ బావోయ్  తలవాచిపోయింది అక్క ఇచ్చే కాఫీ తాగకపోతే తల పగిలిపోతుంది అంటూ లోపలి జారుకున్నాడు బామ్మర్ది  బ్రహ్మం
 మీ -గబ్బిట దుర్గాప్రసాద్-16-9-19-ఉయ్యూరు 
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

దేవుని బుట్ట నిండా మా చెట్టు పారిజాత పుష్పాలు

Posted in సమయం - సందర్భం | Leave a comment

అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -3 3-గోపరాజు రామయమంత్రి

అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -3

3-గోపరాజు రామయమంత్రి

కాకతీయ గణపతి దేవుని మంత్రి గోపరాజు రామయమంత్రి .1166నుంచి 1290వరకు గణపతి దేవునికాలం కనుక 13వ శతాబ్దివాడు .ధరణికోట రాజధానిగా రాజుపాలించాడు .1193లో అధికారం లోకి వచ్చినట్లు చిలుకూరి వీరభద్రరావు గారన్నారు .త్రిపురాంతక శాసనం బట్టి 62ఏళ్ళు పాలించాడు .రాజధానిని ధరణికోటనుంచి ఓరుగల్లుకు మార్చి ,శివాలయాలు చెరువులు  భవనాలు కట్టించాడు .గ్రామాలు ఏర్పాటు చేశాడు .’’కొండవీటి దండకవిలె ‘’లో ‘’శ్రీమాన్గణపతిర్భూపో  గజపత్యాన్వయోద్భావః –ఆస్తి భూ మండలే తస్య బహవస్సంతి మంత్రిణః-తేషాం శ్రేష్టతమమాత్యో-యాజ్ఞవల్క్యోత్తమా ద్విజః –గోపరాజాన్వయోత్పన్నో –రామాఖ్యో గణికాగ్రణీః-రక్తాస్యబ్దే మాసి భాద్రపదే బహుళ పక్షకే –దర్శేర్క గ్రహణే-పుణ్య కాలేన్గారక వాసరే’’అనేదానిలో ఉన్నప్రకారం గోపయమంత్రి రక్తాక్షి సంవత్సర భాద్రపద బహుళామావాస్య మంగళవారం కృష్ణాతీరం లో సూర్యగ్రహణకాలం లో ,రాజు అనుగ్రహం తో కరణీక బ్రాహ్మణులకు ఇచ్చాడని తెలుస్తోంది .

రామయమంత్రి తిరుపతికి వెళ్లి తిరిగివస్తూ 1066లో సత్తెనపల్లి దగ్గర మాదల గ్రామం లో ఒక  బ్రాహ్మణుడి ఇంట ఉండి ,తాను  పెట్టాల్సిన ఆబ్దికాన్ని సంతృప్తిగా పెట్టటానికి మొదటిరోజునే బ్రాహ్మణులను ఏర్పాటు చేసుకొని ,అందులో ఒకాయన కట్టాల్సిన పన్ను  చెల్లించనికారణంగా,ఆ వూరికంసాలి ,కారణాలు  పిలిపించి ‘’బండకొయ్య ‘’వేయింఛి నందున భోక్తగా రావలసినవాడు ఎంతకీ రాకపోతే ,మనుషులనుపంపి వాళ్ళిద్దరికీ నచ్చచెప్పే ప్రయత్నం చేసినా, తానె వెళ్లి చెప్పినా, వినకపోతే ,పితృకార్యం ఎలాగో అలా అయిందనిపించి ,రాజధానికి వెళ్ళిపోయాడు. రామయమంత్రి ప్రతీకారం తీర్చాలి అని మనస్సులో సంకల్పం చేసుకొని .

ఆతర్వాత సూర్యగ్రహణం రోజున సంకల్పం చెప్పటానికి బ్రాహ్మణులేవ్వరూ రాకూడదని శాసనం చేసి ,గణపతి ప్రభువుతోకలిసి కృష్ణా స్నానానికి వెళ్ళాడు .తాను  సంకల్పం చెప్పుకొని స్నానం చేసి ప్రభువుకు సంకల్పం  చెప్పటానికి బ్రాహ్మణుడు ఎవరూ లేనందున రాజు ను అడిగి రామయ మంత్రి తానే  ఆయనకు సంకల్పం చెప్పి పుణ్య గ్రహణ స్నానం చేయింఛి ,ఆయన అనుమతితో 7గడియలు ముద్రాధికారం పొంది ,చేతిలో నీళ్ళు విడిపించుకొన్నాడు .రికార్డ్ లన్నీ పరిశీలించి బ్రాహ్మణుడికి అన్యాయం చేసిన కంసాలిని పదవినుంచి తప్పించి ,ఆపదవులకు 434మంది బ్రాహ్మణులను గ్రామాలలో నియమించాడని ‘’కొండవీటి దండకవిలె ‘’తెలియ జేస్తోంది   .అందుకే రామయమంత్రికి ‘’కరణీకోద్దారకుడు ‘’అనే బిరుదు వచ్చింది .కొండవీటి చరిత్రను జయనాగ దేవ భట్టర్ , బోలమరాజు కోనప్ప , అన్నమరాజు అనే ముగ్గురు ‘’దండ కవిలె ‘’గా శాలివాహన శకం 1250నలనామ సంవత్సరం లో  రాశారు,అదే దాని చరిత్రకు ఆధారం.

కృష్ణవేణీ తీరం లో  ఆ నాడు గణపతి చక్రవర్తికి ,మహామాత్యుడు గోపరాజు రామయ మంత్రికి జరిగిన సంభాషణకు సంబంధించిన మూడు  చాటువు ప్రచారం లో ఉన్నాయి  –

‘’అవగత శబ్ద శాస్త్ర చయులైన ,మహాత్ములు ,పండితోత్తముల్ –భువనతలంబు నందధిక పూజ్యులు వారటులుండ  గూటికై –నవనవ కల్పనావిది చణత్వముతోడినబద్ధమాడు నీ –కవులట,దానపాత్రులట –గౌరవమందుట జూవె చిత్రముల్ ‘’అని చక్రవర్తి అంటే –అమాత్యుడు

‘’మానఘనుండు ,బ్రహ్మకుల మండనమూర్తి ,పరోపకారి దు-ర్దానదురాన్నముల్ గొనడు-తప్పడు స్వామి హితైక కార్యముల్ –దీనులబ్రోచు ,బాంధవ విధేయుడు ,డస్సియు,వేట బూనడింపూనిన భక్తితోడుత’’నియోగి కోసంగిన దానమల్పమే ?’’అని ఝాడించి ,మళ్ళీ తగుల్కొని-

‘’వ్రాయుట దోషమా? ,వికృతి వైదికమా?సుతదార రక్షణోపాయముకై ‘’నియోగి ‘’నయి ,పార్థివ సేవనొనర్చునంతనే –పాయునె వంశశీలములు,బాగుగ మున్నల చిత్రగుప్తు లున్ –వ్రాయరె యెల్లలోకముల  వారలు సేసిన  పుణ్య పాపముల్ ‘’అంటూ కడిగిపారేసి  మూడోపద్యం లో –

‘’కవి కమలాసనుండు ,త్రిజగత్పతియైన పినాకపాణి  యుం –గవియె,తలంపగా గవులుకారె,పరాశర ,బాదరాయణుల్ ,కవికృత పుస్తక గ్రహణ గర్వితులల్పులు పూజనొందగా-గవులట!  దానపాత్రముల్ గారట !యిట్టివిపో విచిత్రముల్ ‘’అని మళ్ళీ మాట్లాడకుండా రామయ మంత్రి చేశాడని ‘’ద్వావి౦శ న్మంత్రిచరిత్ర ‘’లో ఉన్నదట .

‘’గణక నిర్వాహంబు గల్పించె నూరూర మహి గోపరాజు రామ ప్రధాని ‘’అనీ ,’

‘’ధరగోపరాజు రామన కరణీకము లుద్ధరించు కాలము దలపన్ –గిరి ఋతు గగన శశా౦కులు -గరమొప్పెడు శకము నాటి కాలంబయ్యెన్ ‘’అనీ చాటువులు చేటలతో రామయమంత్రి  గొప్పతనాన్ని చాటి చెబుతున్నాయి .

రామయమంత్రి చెక్కించిన ఒక శాసనం లో

రామయమంత్రి గుంటూరుతాలూకా ‘’తంగెళ్ల మూడి ‘’గ్రామస్తుడు .యాజ్ఞవల్క్యనియోగి .కాశ్యప గోత్రీకుడు .ఆపస్తంభ సూత్రుడు

ఆధారం –ప్రాచీన హిందూ దేశ రాజ్యాంగ చరిత్ర ,కన్నడ దేశ చరిత్ర ,ప్రాచీన గ్రామసభల న్యాయ పరిపాలన ,దండనాథులు, దుర్గాధిపతులు వంటి అమూల్యగ్రంథాలు రచించిన విమర్శక శిరోమణి ,సాహిత్య విశారద బ్రహ్మశ్రీ కోన వేంకటరాయ శర్మగారు1950లో రచించిన  ‘’సచివోత్తములు ‘’ పుస్తకం

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -15-9-19-ఉయ్యూరు .

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | 3 Comments

గోదావరివారి కృష్ణాతీర సభ

గోదావరివారి కృష్ణాతీర సభ

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

అపూర్వాంధ్ర పూర్వామాత్యులు  -2

అపూర్వాంధ్ర పూర్వామాత్యులు  -2

2-చెల్లకి గంగాధర మంత్రి

వేంగి దేశం లో చెల్లకి పురానికి చెందిన చెల్లకి గంగాధర మంత్రి మహామండలేశ్వరుడు రెండవ ప్రోలరాజు మహామాత్యుడు .12వ శతాబ్దివాడు .ఆరువేల నియోగి బ్రాహ్మణుడు .ప్రోలరాజు ఇతనిని మహామంత్రి ని చేసి ,’’యనుకొండ ‘’లో నివాసం ఏర్పాటు చేశాడు .కరీం నగర శాసనం లో ఇతని గురించి వివరంగా ఉంది –‘’చనువు మెయి నగరి లో దగు –పనులెల్లను బెంపు మెరసి పరికి౦చుచునే-ర్పును భక్తియుక్తి నతిముద –మున జేయుచు దత్పరోక్షమున మతియుబ్రభన్ ‘’

‘’ఘోరతరాజి లోలుడత్యకుటిల  చిత్తు దీతడని’’ఆదరం తో గంగాధర మంత్రిని పిలిపించాడు ‘’అప్రకటిత కీర్తి ప్రోలజనపాలుడు ‘’. ఇతని వంశ మూల పురుషుడు కొమ్మనమంత్రి .ఆయన ప్రతిభతో కీర్తిపొంది చెల్లకిలో ఉండగా అతనికి బంధు చింతామణి ,శ్రీయుతుడు ఐన  నారాయణుడు కొడుకుగా పుట్టాడు .భార్య ఐతమాంబ .వీరికొడుకు గోవిందుడు .ఇతని భార్య తురకమాంబ .వీరి పుత్రుడే మన గంగాధరుడు .

‘’వ్యోజ దండనాథు డనేవాడు యుద్ధం లో చనిపోగా ,ఆ అమాత్యపదవి గంగాధరుని వరించింది .ప్రోలరాజుకాలం లో కాకతి రుద్ర దేవుడికాలం లోకూడా మంత్రిపదవిలో రాణించాడు .అందరి అభిమాన గౌరవాలు అందుకొన్నాడు .అమాత్యపదవి ,నియోగ వృత్తి సక్రమంగా నిర్వర్తిస్తూ బ్రాహ్మణులనుకాపాడుతూ  ,అనేక దేవాలయాలు కట్టించి ,పూజా పునస్కారాలకు అవకాశం కల్పించినట్లు కరీం నగర శాసనం లో ఉన్నది .’’శ్వేతాతపత్రం ‘’అంటే తెల్లగొడుగు గౌరవ చిహ్నంగా ధరించేవాడు .అన్ని నియోగ  వృత్తులపైనా ,సర్వాధికారాలు ఉన్న మహామాత్యునిగా కాకతి ప్రతాప రుద్రుడు కూర్చోబెట్టాడని తెలుస్తోంది .

   తరువాత కాకతీయ భేతా భూపాలుడి కాలం లోనూ సమర్ధంగా మంత్రిపదని నిర్వహించాడు గంగాధరమంత్రి .మహత్తర యశో విరాజితుడై ,అగణిత శౌర్య సంపన్నుడు అయి ,బేతరాజు గౌరవాదరాలు పొంది ‘’సబ్బి సాయిర మండలం ‘’ను సర్వజన మనోరంజకం గా పరిపాలి౦ప జేసింది వైజనాథ మహా మంత్రి .ఈ మంత్రికి ,యాకమా౦బికకు జన్మించినవాడు బేతన ప్రగడ రెండవ ప్రోలరాజు మంత్రి .ఈ భార్యాభర్తలు జైనమతావలంబులు .రెండవ ప్రోలరాజు 1107నుంచి 1157వరకు యాభై ఏళ్ళు అవిచ్చిన్నంగా పాలించాడు .

  ఓరుగల్లు పురనిర్మాణ౦  ఈప్రోలరాజుతో ప్రారంభమైందని  అంటారు .తాను గెలిచిన దేశ ప్రజలు హాయిగా జీవించటానికి ఈ పుర నిర్మాణం చేశాడట.ఒకసారి ఇక్కడ అమ్మకానికని సరుకులతో వచ్చిన బండి ఇక్కడ ఒక రాతికి తగిలి తలక్రిందులైతే  ,ఆ బండీ పట్టా ఆశ్చర్యంగా బంగారం అయిందట .ఈ విషయం ప్రోలరాజుకు తెలిసి ఆ రాయి స్పర్శవేది అయిన శివలింగం గా భావించి ,స్వయంభు గా దానిని అక్కడే ప్రతిష్టించి ,ఆలయం కట్టించి ,పూజాదికాలు ఏర్పాటు చేసి క్రమంగా ఓరుగల్లు పట్టణ నిర్మాణం సాగింఛి క్రమాభి వృద్ధి చేశాడు .ఇతని తర్వాత వచ్చిన రాజులు అక్కడ బలవత్తరమైన ,శత్రు దుర్ణిరీక్షణమైన వప్రము అంటే కోట కట్టారు .అదే వరంగల్లుకోట.

  గంగాధర మంత్రి మహామాత్యుడైన తర్వాత హనుమకొండ ను నగరంగా నిర్మించాడు .ఎటుచూసినా కోనేరులు దేవాలయాలు ,ఆరామాలు చెరువులతో అంటే సప్త సంతానాల ప్రతిస్టలతో హనుమకొండ శోభించేట్లు చేశాడు  .ప్రభువు అనుమతితో విద్వజ్జనాలను పిలిపించి గొప్ప క్రతువు చేయించి,వారికి ‘’డొండొండు’’అనే అగ్రహారాన్ని యిచ్చి వారికి పౌరసత్వం అంటే సిటిజన్ షిప్ ఇప్పించాడు –

‘’పురుషనిధి ,పురుషరత్నము –పురుషోత్తమ మూర్తి యనుచు బొగడగ జనులు –త్కరుషమతి వెలయంగం ద్రైపురుషుల జేసితి బ్రతిస్ట పూజర్హముగాన్ ‘’అని చెప్పుకోవటం వలన ఆ అగ్రహారం లో త్రిమూర్తి ప్రతిస్ట చేశాడు గంగాధరమంత్రి అని తెలుస్తోంది –

‘’పరమేశుడు ,హరి ,బుద్ధ-స్వరూపుడై  యప్పురవరుల వచించు జినో –హరి యనెడుపట్టశాలం-జిరముగ బుద్ధ ప్రతిస్ట జేసితి భక్తిన్ ‘’అని ఉన్నదాన్ని బట్టి బుద్ధాలయం కూడా నిర్మించాడు .ఈ విధంగా ప్రజలకు అవసరమైన అన్ని పనులను చేస్తూ ,రాజుకు విధేయుడుగా ఉంటూ ,కాకతీయ ఆంద్ర సామ్రాజ్య అభ్యుదయానికి గంగాధర మంత్రి యెనలేని సేవలు చేశాడు .

  ప్రోలరాజు తర్వాత అతడికొడుకు రుద్ర దేవుడు రాజై,హనుమకొండ రాజధానిగా ఉండటం ఉచితం కాదనుకొని ,ఓరుగల్లుకు రాజధాని మార్చినట్లు ‘’శివయోగ  సారం ‘’లో ఉన్నది .గంగాధరమంత్రి ప్రోలరాజు దగ్గర మంత్రిగా ఉన్నప్పుడు రాజధాని హనుమకొండ ,రుద్రదేవుని మంత్రిగా ఉన్నప్పుడు రాజధాని ఓరుగల్లు అని తెలుస్తోంది .1170’’నగు నూరు’’ శాసనంలో కవిబ్రహ్మ తిక్కన చెక్కించిన పద్యాలున్నాయి –చివరిది

‘’సుర కరిపతి  మృగపతి హరి-సురసతి ధవళ సరసి రుహ  ,శక్తిరుహ సద్రుక్-సురు చిర విశద యశో భా-సుర నిధిచే సుకవి తరణి సురనిధి చేతన్’’.నాలుగు దిక్కులావిజయ స్తంభాలు నాటించి ,మిక్కిలి ప్రతాపశాలియై ,అనేక తెలుగు గ్రంథాలను అంకితం పొంది ,సప్త సంతానాలను పొందిన ధన్యుడు చెవికి గంగాధర మంత్రి .తానూ చేసిన సుహృత్ కార్యాల వివరాలను శాసనం పై చెక్కించాడు .

  రుద్ర దేవుని అనుమకొండ  వేయిస్తంభాలగుడిలోని 1162శాసనం

 అనుసరించి కాకతీయ రుద్ర దేవుని సామ్రాజ్యం తూర్పున బంగాళాఖాతం ,దక్షిణాన శ్రీశైలం ,పడమర కటకం ,ఉత్తరాన మాల్యవంతం వరకు విస్తరించి ఉన్నది .ఇంతటి విశాలసామ్రాజ్యాన్ని రుద్ర దేవ చక్రవర్తి పాలిస్తుంటే ,దానికి సర్వవిదాలా తోడ్పడినవాడు గంగాధరమంత్రి .హిడంబాశ్రమ౦ ,నగనూరు ,అనుమకొండ మొదలైన చోట్ల దేవాలయాలు పుష్పారామాలు నిర్మించాడు .ఈయన ప్రోత్సాహంతో రుద్రదేవుడు సకల శాస్త్ర పరాయణుడై ,రామేశ్వర దీక్షితుని వద్ద విద్యలు నేర్చి ,రాజనీతి పెంపు చేసుకొని ,కవిత్వం చెబుతూ ఆస్వాదిస్తూ గురువుగారికి విన్నకొండ సీమలో శివపురం అనే గ్రామాన్ని మొదటగా దానం చేసి ఖాజీపేటలో దాన స్తంభాన్ని వేయించాడు .

  అనుమకొండను మాధవవర్మ మొదలైన వారు పాలించినా ప్రోలరాజువంటి స్వాతంత్ర్య దీక్ష ఉన్నవారుకాలేకపోయారు .చాలుక్యరాజ్య ప్రాభవం  సన్నగిలుగిలు తుండగానే ఆంద్ర సామ్రాజ్యం నెలకొల్పి ఆంధ్రుల వ్యక్తిత్వాన్ని కాపాడినవాడు ప్రోలరాజు .తనలో దాగి ఉన్న రాజనీతి ,సమయజ్ఞత శోర్య ధైర్య సాహసాలు ,ఔదార్య గాంభీర్యాలు పురి విప్పిన నెమలిలా విజ్రుమ్భించి ఉపయోగపడినాయి .ఈ సామ్రాజ్యానికి శ్రీరామ రక్ష చెల్లకి గంగాధర మంత్రి ;’

ఆధారం –ప్రాచీన హిందూ దేశ రాజ్యాంగ చరిత్ర ,కన్నడ దేశ చరిత్ర ,ప్రాచీన గ్రామసభల న్యాయ పరిపాలన ,దండనాథులు, దుర్గాధిపతులు వంటి అమూల్యగ్రంథాలు రచించిన విమర్శక శిరోమణి ,సాహిత్య విశారద బ్రహ్మశ్రీ కోన వేంకటరాయ శర్మగారు1950లో రచించిన  ‘’సచివోత్తములు ‘’ పుస్తకం

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -14-9-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అపూర్వాంధ్ర పూర్వామాత్యులు  -1

అపూర్వాంధ్ర పూర్వామాత్యులు

శీర్షిక చూసి గాబరా పడకండి .రాజరిక వ్యవస్ధలో పేరుపొందిన  గొప్ప తెలుగు మంత్రులు అనిభావం .మంత్రి, అమాత్య, ప్రెగ్గడ పర్యాయపదాలు .సరదాకోసం పై హెడ్డింగ్ పెట్టాను .తమ శేముషితో ,రాజుకు, రాజ్యానికి ,ప్రజలకు విశేష సేవలు అందించిన నాటి మంత్రి పుంగవులలో కొందరిని గురించి తెలియ జెప్పే ప్రయత్నమే ఇది .

1-రావుల వజ్జియప్రెగ్గడ

క్రీశ 10వ శతాబ్దికి చెందినవాడు  రావుల వజ్జియప్రెగ్గడ.ఈయన గురించి తెలుసుకోవటానికి ముందుగా కొన్ని విషయాలు తెలియాలి .64కళలో ప్రజ్ఞావంతుడైన దానార్నవుడికి ,ఆర్యామహాదేవికి శక్తివర్మ ,విమలాదిత్యుడు కొడుకులు .శక్తివర్మను చాళుక్య నారాయణుడు ,చాళుక్య చంద్రుడని పిలుస్తారు .తండ్రిలాగానే ‘’సర్వలోకాశ్రయ శ్రీ విష్ణు వర్ధన మహారాజాది రాజు ‘’పేరుతో శక్తివర్మ పట్టాభిషేకం చేసుకొని 12ఏళ్ళు పాలించాడు . ద్రవిడులైన చోళులకు సాయం చేయాలని చిన్నప్పటి నుండి ఇతనికి ఉండేది .చేజారి పోయిన తండ్రి సామ్రాజ్యాన్నిమళ్ళీ పట్టుకోవాలనే ప్రయత్నం లో ఉండగా జటా చోడ భీముడు విషయం తెలుసుకొని విఫలుడిని చేశాడు .బలపడిన శక్తివర్మ మళ్ళీ  జటా చోడు నిపైకి యుద్ధానికి రాగా శక్తివర్మకు చేయూతగా చోళ చక్రవర్తి రాజకేసరివర్మ తన సైన్యాన్ని బాసటగా పంపగా జటా చోడు ని ఓడింఛి వేగీ రాజ్యాన్ని కైవశం చేసుకొన్నాడు .దానార్నవుడి సంతతి మళ్ళీ అధికారం లోకి వచ్చిందని కంటిలో నిప్పులుపోసుకొన్న చోళ ,పాశ్చాత్య ,చాలుక్యరాజ్యాలు సహి౦చ లేకపోయాయి .చోళ చక్రవర్తి శక్తివర్మకు సాయం చేయటం లో, వేంగీ సామ్రాజ్యాన్ని ఆక్రమించాలనే బలమైన కోరిక ఉంది   .రాజనీతి ఉపయోగించి తన కూతురు కుందవ మహాదేవి ని శక్తివర్మ తమ్ముడు విమలాదిత్యునికిచ్చి పెళ్లి చేసి తనదగ్గరే పెట్టుకొని వేంగీ రాజ్యాన్ని చోళులు హస్తగతం చేసుకొన్నారు .

  ఇది కల్యాణి చాళుక్యులకు ఇష్టం లేదు .కాని అప్పుడు వాళ్ళు రాష్ట్ర కూటులను ఓడించి కర్నాటక సామ్రాజ్యాన్ని కైవశం చేసుకోవటం తో  వేంగీ రాజ్యంపై దృష్టిపెట్టలేక పోయారు .దానార్నవుడు యుద్ధంలో చనిపోయేనాటికి శక్తివర్మకు ఆరేళ్ళు విమలాదిత్యుడికి నాలుగేళ్ళు వయసు .మంత్రులుకాని ఆప్తవర్గం కాని అతనిపెద్ద కొడుకు శక్తి వర్మను రాజును చేసే సమర్ధులు కాలేకపోయారు .అప్పటికి జటా చోడుడే శక్తి యుక్తి సామర్ధ్యాలున్నవాడు .ఇతని వీరోచిత కార్యాలన్నీ కంచి లో విజయస్తంభంపై చెక్కబడి ఉన్నాయి .ఇతనిపూర్వులు రాజ చాళుక్య వంశానికి బంధువులు సామంతులు, రేనాటి ప్రభువులు .ప్రజోపకారమైనన తటాకాలు నిర్మించటం దేవాలయాలు కట్టించటం చేశారు .అనితర సాధ్య బలపరాక్రమ విక్రమాలున్న జటాచోడుడు ‘’సంగ్రామ విజయ ,అరసరాభరణ ,సమరైక వీర,రణరంగమల్ల,విక్రమ ధనంజయ ‘’బిరుద విరాజితుడు .ఇతని సోదరి వేంగీ చాలుక్యులలో చిన్నకోవకు చెందిన యుద్ధమల్లుని కొడుకైన బాదవుని భార్య . కనుక బాదవుని కి వేంగీ సామ్రాజ్యాధిపతి కావాలనే  సంకల్పం ఉండటం వలన ఇమ్మడి రాజు ను ఓడించి ‘’సమస్త భువనాశ్రయ శ్రీ విజయాదిత్య ‘’పేరుతొ వేంగీ సామ్రాజ్యానికి చక్రవరి అయ్యాడు .

  బాదవునికి సంతానం లేకపోవటంతో ,భార్యకు రాజ్యాధికారం సంక్రమించి న వేంగీ సామ్రాజ్యాన్ని ‘’స్వభగినీ  పదమంధ్ర మండల౦ ‘’పేరుతొ జటాచోడుడు పాలన సాగించాడు .ఈ సమయం లోనే దానార్ణవ ,నృపకాములను యుద్ధం లో చంపేసి మొత్తం ఆస్తి హరించి ఇష్టారాజ్యంగా పాలించాడు .అతని శక్తియుక్తులను ఎదిరించగల మొనగాడే వరూ లేకపోవటం తో కీర్తి దిలీపుడై ,సమర ధనున్జయుడై చెలరేగాడు.తండ్రి రాజ్యాన్ని మళ్ళీ హస్తగతం చేసుకొనే శక్తివర్మ ప్రయత్నాలన్నిటిని చోడుడు భగ్నం చేశాడు .అయినా ప్రయత్నాలు మానని అతనిని ‘’మృగాధివ సతిం మాయాం హరేఃపౌరుషం ‘’అని కవి కీర్తించాడు .పట్టువదలని విక్రమార్కుడి లాగా 27ఏళ్ళు జటా చోడుడు తో యుద్ధం చేసి చివరికి ఓడించి తన రాజ్యాన్ని తిరిగిపొండాడు శక్తివర్మ .

  ఇమ్మడి తైలపుడు చనిపోయాక చోడుడు ఏకాకియై ,విసుగు చెంది ,వృద్ధాప్యం మీదపడి కర్నాటక రాజ్యానికి వెళ్ళిపోయేప్రయత్నం లో ఉండగా ,శక్తివర్మ ప్రయత్నాలు తెలిసి  వెనక్కివచ్చి ,అతనితో యుద్ధం చేసి ఓడిపోయాడు .27ఏళ్ళ పగ చల్లారటానికి చోడుడి బంధు మిత్రులనదర్నీ చంపేయించి అతని వంశాన్ని నిర్వంశం చేశాడు శక్తి వర్మ .కళింగం పైకి దండెత్తి చోడభీముని ప్రతినిధి ని ఓడించి చంపి రాజ్యాన్ని ఇమ్మడి వజ్రహస్తుడికిచ్ఛి పూర్వపు మైత్రి కొనసాగించాడు .ఇదంతా వికారి సంవత్సరం లో క్రీ శ 999-1000కాలం లో జరిగింది .

   ఈవిధంగా తండ్రి రాజ్యాన్ని తిరిగి సంపాదించుకొన్న విక్రమాదిత్యుడే శక్తివర్మ .అనాధ ఐన వెంగీసామ్రాజ్యానికి సనాదుడై చాళుక్య నారాయణుడయ్యాడు.అప్పుడే ఇతని తమ్ముడు యువరాజైన విమలాదిత్యునికి చోళరాజు తన కూతురును క్రీశ.1002 లో ఇచ్చి వివాహం చేశాడు .శక్తివర్మరాకతో వేంగీ సామ్రాజ్యం లో శాంతిభద్రతలు  సుస్థిరమయ్యాయి .వరాహ చిహ్నమున్న బంగారు నాణాలు ముద్రించాడు శక్తివర్మ .

  1011లోశక్తివర్మ మరణం తర్వాత తమ్ముడు విమలాదిత్యుడు వేంగీ సామ్రాజ్యాధిపతి అయ్యాడని ‘’కోరుమిల్లి ‘’శాసనం తెలియ జేస్తోంది .రణస్థపూ౦డిశాసనం లో జ్యేష్ట శుక్ల పంచమి గురువారం పుష్యమి నక్షత్ర సింహలగ్నం లో పట్టాభి షిక్తుడైనట్లున్నది .’’ముమ్మడి భీముడు ,బిరుదా౦క భీముడు ,  త్రిభువనా౦ కుశుడు ‘’అనే సార్ధకబిరుదులుపొందాడు.1014లో తమిళనాడు తిరువయ్యార్ లో పంచనాథేశ్వరస్వామికి ద్రవ్యం అందజేసిన శాసనం ఉన్నది .జైనమతావలంబి అయినా పరమతసహనం కలవాడు .ఇతనికికి ఇద్దరుభార్యలు కుందమాదేవి ,మేడమాదేవి  .కుందమకు రాజరాజు ,మేడమ కు విజయాదిత్యుడు కొడుకులు .రాజరాజును తండ్రివైపువారు విష్ణు వర్ధనుడు అనీ ,తల్లివైపువారు రాజరాజు అనీ పిలుస్తారు .వజ్జియప్రెగ్గడ తో మొదలెట్టి,శాఖా చంక్రమణం చేశా౦ కదూ .ఇప్పుడు ఆయన అవసరం వచ్చింది .

  విమలాదిత్యమహారాజు పరిపాలన కు మహామాత్యుడు వజ్జియప్రెగ్గడ విశేషమైన కృషి చేశాడు .ఆయన రాజనీతి అపూర్వం .వేంగీ సామ్రాజ్యాధిపతి కుబ్జ విష్ణువు అయినప్పటినుంచి వేంగీ సామ్రాజ్యానికి చక్రవర్తి పరమ మహేశ్వరుడైన సుక్షత్రియుడే అధిస్టించాలి అనే సంప్రదాయం ఏర్పరచి నిలబెట్టాడు  .ఇది చాలుక్యవంశ మర్యాదగా వేంగీ చాళుక్యుల రాజనీతిగా పేరుపొందింది .వేంగీగీచాలుక్యుల ఇలవేలుపు దాక్షారామ భీమేశ్వరస్వామి .

   ఆకాలం లో ‘’త్రికాలయోగి సిద్ధాంత దేవముని ‘’అనే ఒక జైనముని ‘’కొండ కుందాన్వయానికి చెందిన నంది గణంవాడు ,దిగంబర జైనుడు ,గోల్లాచారి శిష్యుడు ఆంద్ర దేశానికి వచ్చాడు ప్రచారంబాగా చేసి జనాన్ని జైనంలోకి మార్చాడు .ఈయన సమకాలికుడు ప్రభాచంద్రుడు దారానగరరాజు  భోజరాజు చేత సత్కారం పొందాడు .విమలాదిత్యుడు భోజుని మిత్రుడే .విమలాదిత్యుడికి హిందూ ధర్మం పై విరక్తికలిగి జైనాన్ని స్వీకరించినా రణస్థిపూండిశాసనం నాటికి ఇంకా పరమమాహేశ్వరుడే .కలిదిండి శాసనం ప్రకారం ఇంకా అభిషిక్తుడు కాని రాజరాజు రాజప్రతినిధి మాత్రమె .రాజరాజు మంత్రి వజ్రాదిత్యుడు ,త్యాగి విమలాదిత్యుడు కలిసి మనుధర్మ ప్రవర్తకులైన రాజప్రతినిధి వర్గాన్ని ఏర్పరచి   సామ్రాజ్య రక్షణ బాధ్యత అప్పగించటంలో విమలాదితుని సర్వసంగ పరిత్యాగం మహామాత్యుడు వజ్జియప్రెగ్గడపై ఉన్న అపారమైన నమ్మక విశ్వాసాలు ఆయన శేముషీ సంపన్నత కారణాలు .ఈ ఏర్పాటు జరిగిన ఒక ఏడాదికే విమలాదిత్యుడు మరణించాడు .

  రాజరాజు వేంగీ చక్రవర్తి అవగానే సవతి తమ్ముడు వీర విజయాదిత్యుని యౌవరాజ్య పట్టాభి షిక్తుని చేశాడు .సందట్లో సడేమియా అన్నట్లు ఇదే సమయంలోకళింగరాజు మధుకామార్ణవుడు రాజరాజు కు శత్రువుకాగా ,దాయాదులను విరోధులను ఓడించాకమాత్రమే రాజ రాజు అభిషిక్తుడయి,మధురాంతక దేవుడు అనిపిలువబడే రాజేంద్ర చోళుని కుమార్తె  అమ్మంగ దేవిని 1023లో పెళ్ళాడాడు .ఇదంతా వజ్జియప్రెగ్గడ ప్రతిభావిశేషాలవలననే జరిగిందని 1023రణస్ధిపూ౦డి  శాసనం తెలియజేస్తోంది .ఇందులోనే ప్రెగ్గడవంశ గోత్రాది విశేషాలున్నాయి –

‘’మద్భక్తాయ కృత క్లేశాయ’’కారమ చేడు ‘’వాస్తవ్యాయ  కౌండిన్య గొత్రాయామాత్య శిఖా మణ్యే బుధ వజ్ర ప్రాకారాయ ,సౌజన్య రత్నాకరాయ  వజ్జియప్రెగ్గడఇతిప్రసిద్ధాభిధానాయ భవద్విషయో ‘’పారువటి’’నామ గ్రా మేణసార్ధం రణస్థిపూ౦డి నామగ్రామోగ్రహారీ కృత్య మత్సంవర్దిత్వా నిమిత్తే,మాయాదత్తఇతి విదిత మస్తునః ‘’.వజ్జియకౌండిన్య గోత్రుడు .ద్రోణమంత్రి పౌత్రుడు ,హరిదత్త వరప్రసాదుడైనదత్తామాత్యుని కుమారుడు .ప్రభు మంత్రోత్సాహ శక్తిమంతుడు .తల్లి పతివ్రత చీడమాంబ .వజ్జియ బుద్ధిలో బృహస్పతి .సుహృద్వతంసుడు.  అవిరళ జపహోమ తత్పరుడు ,సకల వేదార్ధ నిష్ణాతుడు .శుచి ,దాని .చతురసత్య వచో నిరతుడు .బుధ వజ్ర ప్రాకారుడు ,శ్రీకంఠ పాదార వి౦ద షట్పదుడు,సౌజన్య రత్నాకరుడు ,స్వామికార్యనిర్వహణ దక్షుడు .త్రికరణాల చేత పవిత్ర చరిత్రకల కౌండిన్య మహర్షి వంటివాడు ,మిక్కిలి శివభక్తుడు .యజ్ఞయాగాది క్రతువులెన్నో చేసినకర్మిస్టి,విప్రకుల భాస్కరుడు ,అగ్నిస్టోమ, అతిరాత్రాది  క్రతుకర్త ,అతిధి అభ్యాగతులకు కొంగుబంగారం .పురోడాశ పవిత్ర వక్త్రుడు .విద్వాంసుల ,వేదవిధిజ్ఞుల ,సోమయాజుల ను సత్కరించటం లో సాటిలేనివాడు ,శ్రమణులు ,దిగంబర జైనులు  వీరు వారు అనే భేదం లేక ఆదరించేవాడు .

  మన ప్రెగ్గడ రాజకార్యాలను తన భవ్య హర్మ్యం నుంచే సాగించేవాడు .ఈ భవనానికికి ఒకప్రక్క ఉద్యానవనం దానిమధ్యలో నుయ్యి ,రెండవవైపు గోస్టాలు,అందులో ముచ్చటైన కపిలదేనువు .దాని క్షీరాన్నే త్రాగే అలవాటున్నవాడు .భార్యాభర్తలు  ప్రత్యూషకాలం లో లేచి కపిల ధేనువు సందర్శనం చేసి పూజించేవారు .అన్నికులాలవారికీ ఆవుపాలు పంచి పెట్టేవారు ఆ దంపతులు .ఆపాలుత్రాగి ఎవరికీ ఏజబ్బులూ  రాకుండా ప్రజలు ఆనాడు ఉత్సాహాలతో ఉండేవారు .వేదాధ్యయనం కూడా ఉండటం తో ఇల్లు ఒక గురుకులంగా భాసిల్లేది .విమలాదిత్య మహారాజు కు ముఖ్య సచివుడై యుద్ధంలో ధర్మం లో  మంత్రాంగం లో సాయపడుతూ సామ్రాజ్యాభి వృద్ధి ప్రజాసంక్షేమం రెండుకళ్ళుగా భావించి  సేవచేసిన చిరస్మరణీయుడు వజ్జియ ప్రెగ్గడ .ఈయన గురించి ఇదే మొదటిసారి నేను తెలుసుకోవటం .నా అన౦దాన్ని మీతో పంచుకోవటమే నేను చేసినపని

  మరో మహామాత్యుని గూర్చిమరో సారి తెలుసుకొందాం .

ఆధారం –ప్రాచీన హిందూ దేశ రాజ్యాంగ చరిత్ర ,కన్నడ దేశ చరిత్ర ,ప్రాచీన గ్రామసభల న్యాయ పరిపాలన ,దండనాథులు, దుర్గాధిపతులు వంటి అమూల్యగ్రంథాలు రచించిన విమర్శక శిరోమణి ,సాహిత్య విశారద బ్రహ్మశ్రీ కోన వేంకటరాయ శర్మగారు1950లో రచించిన  ‘’సచివోత్తములు ‘’ పుస్తకం

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -13-9-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

నేనురాసిన సిద్ధయోగిపుంగవులు పుస్తకం లోని ”నడయాడే దైవం

నేనురాసిన సిద్ధయోగిపుంగవులు పుస్తకం లోని ”నడయాడే దైవం పరమాచార్య జగద్గురువులు శ్రీ శ్రీ చంద్ర శేఖర యతీంద్రులు ” వ్యాసం సెప్టెంబర్ గురు సాయిస్థాన్  లోపునర్ముద్రితం .ఇందులో ఇంటర్వ్యూ చేసినవాడు పాల్ బ్ర0టన్ అనే బ్రిటిష్ రచయిత-దుర్గాప్రసాద్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment