63ఏళ్లతర్వాత స్నేహితుడు మళ్ళీ మాఇంట్లో 

63ఏళ్లతర్వాత స్నేహితుడు మళ్ళీ మాఇంట్లో

  1953-56లో ఉయ్యూరు హైస్కూల్ లో నా క్లాస్ మేట్ ,కనకవల్లి వాస్తవ్యుడు ,రిటైర్డ్ సెకండరీగ్రేడ్ టీచర్ .ప్రస్తుతం తెనాలి వాసి ,.వందలాది నాటకాల,నటుడు రేడియో నాటకనటుడు  శ్రీ శిష్ట్లా సాక్షి కామేశ్వర సోమయాజి 63ఏళ్ళ తర్వాత  అతని శ్రీమతితో ఈ రోజు 14-4-19 ఆదివారం సాయంత్రం మా ఇంట్లో -మా అమ్మానాన్నగారి ఫోటోలు చూడాలని అడిగి, చూసి ,పరవశించిన  సహృదయుడు
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

13-4-19శనివారం శ్రీరామనవమినాడు ఉదయం ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయంలో శ్రీసీతారామ కళ్యాణ చిత్రమాలిక -2″

13-4-19శనివారం శ్రీరామనవమినాడు ఉదయం ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయంలో శ్రీసీతారామ కళ్యాణ చిత్రమాలిక -2″

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

నాటి దుర్యోధనుడి చివరి మజిలి ‘’ మడుగు ‘’నేటి జగన్ ‘’లోటస్ పాండ్ ?’’

నాటి దుర్యోధనుడి చివరి మజిలి ‘’ మడుగు ‘’నేటి జగన్ ‘’లోటస్ పాండ్ ?’’

మహాభారతం లో ఎన్నెన్ని దుష్కార్యాలు కుయుక్తులు ,దస్టపన్నాగాలు పన్నినా చివరికి తనవంశం వారందర్నీ చంపుకొని ధర్మ క్షేత్రమైన కురు క్షేత్ర యుద్ధం లో నిలువనీడలేక భీముడికి భయపడి ‘’మడుగు ‘’లోని నీటిలో ప్రాణభీతితో బిక్కు బిక్కు మంటూ  చేసినపాపాలకు పరిహారం అనుభవించే దశలో జీవించాడు దుర్యోధనుడు అని మనకు తెలుసు .ఇవాళ ఆంద్ర దేశం పై అలాంటి దుర్మార్గ దుస్ట కుహనా రాచకీయం తో అసూయ ,అహంకారం కళ్లుగప్పి పగలంతా కాసేపు ఎన్నికల ప్రచారం రాత్రికి హైదరాబాద్ వెళ్లి ‘’లోటస్ పాండ్ ‘’లో హాయిగాసేద దీరుతున్న ఫాన్ ఆయన ను చూస్తే,చరిత్ర పునరావృత్త మౌతోందా అని పిస్తోంది .నాడు దుస్ట చతుస్టయం అయిన కర్ణ శకుని మొదలైనవారు దుర్యోధనుడి అంతానికి కారకులైతే ఇవాళ ,సాయి ,గద్దముక్కాయన ,వాచాలబాబు , కనుసన్నల్లో మెలిగే కమీషన్ ‘’పైనున్న’’ కరటక దమనకులు  మొదలైనవారు ఆయన రాజకీయ అంతానికి దోహదం చేస్తున్నట్లు కనిపిస్తోంది .

  మడుగులో దాక్కున్న రాజు  దుస్ట పన్నాగాలకు  ఫుల్ స్టాప్ పెట్టలేదు .అశ్వత్ధామ ను ప్రేరేపించి దారుణం జరిపించాడు .తగిన ప్రాయశ్చిత్తం పొంది శిరోమణి ని అర్జునుడు కత్తితో కోసేస్తే గబ్బు కంపుతో వాసనా భరిస్తూ అందరికీ దూరమై’’ పాపీ చిరాయువు’’ గా జీవించాడని మనకు తెలుసు .ఇక మిగిలిన ఒకే ఒక్కడు దుర్యోధనుడు భీముడికి భయపడి’’ మడుగు’’లో కంపు నీటివాసన భరిస్తూ అందులో ఉండిపోయాడు .విషయం తెలిసిన ధర్మరాజు భీముడు మొదలైనవారు ‘’ఆపాండ్ ‘’అంటే మడుగు దగ్గరకు వెళ్లి ,సూటీ పోటీ మాటలతో రెచ్చగొట్టి పౌరుషం రగిలిస్తే ఇక భయం వదిలి భీముడితో గదాయుద్ధానికి భూమిపైకి రావటం ,రెండు తొడలు విరగ గొట్టించుకొని చేసిన పాపాలను సమీక్షించుకొంటూ ,తనవల్లనే కురువంశం సర్వం నాశనమైందని ఒక్కడూ వారసుడుగా మిగలలేదని గ్రహించి పరితపించి పరితపించి ,తన చేష్టలకు కారకులైనవారు తనను ఎంత లోతు పాపం లో ముంచారో తెలుసుకొని ‘’యతో ధర్మః తతో జయః ‘’అని గ్రహించాడని భారతం చెప్పింది .ఇవాళ లోటస్ పాండ్ ఆయనపరిస్థితీ ఇంతేనా అని పిస్తోంది .శాంతం పాపం .’’కర్ణు డీల్గే ఏవురిచే ‘’అని భారతం చెప్పిన విషయం పునరా వృత్త మౌతోందా?అంటే ఔననే చెప్పాల్సి వస్తోంది .

  తన ‘’అన్న’’వద్దన్నా  పార్టీ పెట్టి 23సీట్లన్నా సాధించి తర్వాత చుట్టేసి హస్తినలో  హస్తం లో ఇమిడిపోయిన సంగతి తెలిసికూడా ,గడ్డం పెంచి భారీ డైలా—గు లతో పొడిచేస్తా, చి౦చేస్తా అంటూ ఎన్నికల అగ్నిగుండం లో దూకి ఒకటో రెండో సీట్లు మాత్రమె పొందబోతూ తాను మునగటం కాకుండా ,పాపం ‘’జెడి’’ ని కూడా మురికిలోకి దింపి ,ఇప్పుడు ఉసూరుమంటున్నాడు  తెచ్చిపెట్టుకొన్న జనం తో ఆనాయకుడు .కరటక దమనక ,జేవిఎల్ ,కన్నా ,రాం మాధవ్ వంటి శల్యుల సారధ్యం లో దిగిన కమలం  కిందా ,పైనా రేకులన్నీ ఊడిపోయి భీభత్సంగా శల్యావశిస్ట మై  కొన ఊపిరులతో ఉందిపాపం .చేసుకొన్నవారికి చేసుకోన్నంత కదా . నీతికీ నిజాయితీకి ఆర్ ఎస్ ఎస్ ,జనస౦ఘ్  బిజెపి లు చిరునామాగా ఉండేవి .ఇవాళ కుహనా రాచకీయం నరనరానా వ్యాపించి కలుషితమై  వాళ్ళు అంటేనే పేరు చెబితేనే కంపరం అసహ్యం ఏర్పడుతోంది .’’ఆబ్సల్యూట్ పవర్ కరప్త్స్ అబ్సల్యూట్లీ’’అని నిరూపించారు ఈకుహనా హిందూ వాదులు .పాపం పరిపూర్నస్వామినీ ముంచేశారు పీకల్లోతు బురదలో . హస్తం అయిదేళ్ళ  కితం ఎన్నికలలోనే చేతి, కాలి వేళ్ళు అన్నీ  ఊడగోట్టుకొని  విలవిలలాడింది .ఈ ఎలెక్షన్ లోనూ బోణీ అంటూ ఉండనే ఉండదని సర్వేలన్నీ చెప్పేశాయి .అంటే ఆంధ్రాజనం కాంగ్రెస్ చేసిన అన్యాయాలను ఇంకామరచి పోలేదన్నమాట .మళ్ళీ శృంగ భంగం ఖాయమే నన్నమాట .  ఫాను కాండి డేట్లు  ఇప్పటికే చాలాఖర్చుచేసి ని౦డా మునిగిపోయి  మధ్యదళారీలుకోట్లు నొక్కేస్తే కిక్కురుమనకుండా ,లోటస్ పాండ్ నుంచి ‘’తామర రేకులు ‘’కూడా రాలవు అని గ్రహించి ,ఇక ఖర్చుపెట్టే సత్తాలేక  చేతులెత్తేసి  సైకిల్ కే ఓటేసుకోమని,అదే మంచిపార్టీ అనీ   భూమన ,వంగవీటి గీత  మొదలైన 11మంది చెబుతున్నారని   వీటిలో సైకిల్కు ఏకపక్షమే అవుతుందని నిన్న కాటా సుబ్బారావు ‘’కుండ బద్దలు ‘’కొట్టేశాడు .ఇందులో నిజమెంతో తర్వాత తెలుస్తుంది .

 నీతీ నిజాయితీ కి మారుపెరయిన లోక్ సత్తా జయప్రకాష్ ,పార్టీ పెట్టి చేతులుకాల్చుకొని తానొక్కడే గెలిచి ,పార్టీ చాప చుట్టేసి చాలాకాలమైంది .ఈయన్ను చూసైనా పవన్ లాంటివాళ్ళు యదార్ధం గ్రహించకపోవటం వాళ్లఖర్మ  . ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది .’’అంభి’’ లాంటి  వారికి ఒకచాన్స్ ఇస్తే ఇక భస్మాసురహస్తమే. తస్మాత్ జాగ్రత జాగ్రత.

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -11-4-19-ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

”వ్యాస బృందం ”మార్చి సంచికలో నా ఉత్తరం

”వ్యాస బృందం ”మార్చి సంచికలో నా ఉత్తరం

Posted in రచనలు | Tagged | Leave a comment

మూసీ ”మార్చి సంచికలో వికారి ఉగాది పద్యాలు

మూసీ ”మార్చి సంచికలో వికారి ఉగాది పద్యాలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బ్లాక్ హోల్ తోలి చిత్రం

HERE: The First-Ever Close-Up of a Black Hole

image.png

You’re looking at the brand-new, first-ever close-up picture of a black hole. This image of the black hole M87 at the center of the Virgo A galaxy is the result of an international, 2-year-long effort to zoom in on the singularity. It reveals. for the first time, the contours of a black hole’s event horizon, the point beyond which no light or matter escapes.

M87 is 53 million light-years away, deep in the center of a distant galaxy, surrounded by clouds of dust and gas and other matter, so no visible light telescope could see the black hole through all that gunk. It’s not the nearest black hole, or even the nearest supermassive black hole. But it’s so huge that it’s one of the two biggest-appearing in Earth’s sky. (The other is Sagittarius A* at the center of the Milky Way.) To make this image, astronomers networked radio telescopes all over the world to magnify M87 to unprecedented resolution. They called the combined network the Event Horizon Telescope.

That name is appropriate because this image isn’t the black hole itself. Black holes emit no radiation, or at least nowhere near enough to be detected using existing telescopes. But at their edges, just before the singularity’s gravity becomes too intense for even light to escape, black holes accelerate matter to extreme speeds. That matter, just before falling past the horizon, rubs against itself at high speed, generating energy and glowing. The radio waves that the Event Horizon Telescope detected were part of that process. [9 Facts About Black Holes That Will Blow Your Mind]

“This image forms a clear link now between supermassive black holes and bright galaxies,” said Sheperd Doeleman, a Harvard astrophysicist and director of the Event Horizon Telescope.

It confirms that large galaxies like Virgo A (and the Milky Way) are held together by supermassive black holes, Doeleman said.

Astronomers knew that black holes were surrounded by glowing matter. But this image still answers a key question about black holes, and about the structure of our universe. We now know for certain that Einstein’s theory of relativity holds up even at the edge of a black hole, where some researchers suspected it would break down. The shape of the visible event horizon in the image is a circle, as predicted by relativity, so it confirms relativity still holds sway even in one of the most extreme environments in the universe.

This is good news and bad news for physics. It’s good news, because it means researchers don’t have to rewrite their textbooks. But it leaves a key question unresolved: General relativity (which governs very big things, like stars and gravity) works up to the edge of a black hole. Quantum mechanics (which describes very small things) is incompatible with general relativity in several key respects. But nothing in this image yet answers any questions about how the two intersect. If general relativity had broken down in this extreme place, scientists might have found some unifying answers.

Data will likely continue to roll in from the telescope network, which is also observing the much nearer (but smaller) supermassive black hole at the center of the Milky Way. And scientists will continue to make sense of the data the Event Horizons Telescope has already collected. But for now, just enjoy this first glimpse of the edge of a totally unknowable region of space.

Posted in సైన్స్ | Tagged | Leave a comment

శ్రీ బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మరణం తో ”చెమ్మగిల్లిన రంగ స్థలం ‘

శ నేను మోపిదేవి హైస్కూల్  లో సైన్స్ మాస్టారుగా 1963-65లో పనిచేసినప్పుడు  దానికి దగ్గరలోఉన్న పెదప్రోలు గ్రామం లో కాపురం ఉండేవాడిని .అప్పుడే మాపెళ్లి 1964లో అయింది .అప్పుడే ఒకరోజు రాత్రి మా ఇంటికి దగ్గరలో నాంచారమ్మగుడిదగ్గర చెరువుప్రక్కన బుర్రా వారి హరికథ ఏర్పాటు చేశారు .నాకు అప్పుడు వారి గురించి ఏమీ తెలీదు .నా శిష్యులు ఆగ్రామస్థులు చి అడివి శ్రీరామమూర్తి ,,కె మాధవరావు లు నాకు ఆయన గొప్పతనం  గురించి చెప్పి నన్ను తీసుకు వెళ్లారు  .రాత్రి 10గంటలకు హరికథ ప్రారంభించి రాత్రి ఒంటిగంటవరకు చెప్పారు .ఆయన అభినయం ఫెమినైన్  వాయిస్  చిందులు రక్తి భక్తీ కలగలుపుగా కదా విధానం నన్ను బాగా ఆకర్షించాయి .ఆయనపై ఒక రకమైన ఆరాధనా భావమేర్పడింది .ఆయన గురించి ఎప్పుడు పేపర్లో పడినా మా శ్రీమతికి పెదప్రోలులో ఆయన హరికథ సంగతి గుర్తు చేసేవాడిని

   1992 కృష్ణాపుష్కరాలలో బెజవాడలో ఉదయం చిట్టిబాబు గారి వీణకచేరీ చూసి సాయంత్రం బుర్రావారి హరికద మళ్ళీ చూసాం . ఇదే రెండవసారి చూడటం .తర్వాత కృష్ణా జిల్లా రచయితల సంఘం నిర్వహించిన కార్యక్రమాలలో ఆయన పాల్గొనగా చాలాసార్లు చూశాను పేపర్ ప్రెసెంటేషన్ కూడా చేసేవారు .అయితే ఎన్నడూ వారితో పరిచయం పెంచుకోలేదు వ ఏటా
  రంగస్థలం పై స్త్రీపాత్రలతో అలరిస్తూ హరికథలు చెబుతూ ,నాటకాలు ప్రదర్శిస్తూ దర్శకత్వం వహిస్తూ తమదైన ప్రత్యేకత సాధించిన కళా విజ్ఞానమూర్తి.అభినయ సరస్వతి ,నాటమయూర ,లలితకళాప్రపూర్ణ కళారత్న మొదలైన బిరుదులూ పొందారు శాస్త్రిగారు .   కృష్ణాజిల్లా దివితాలూకా కోడూరులో 1936 జులై 1 న జన్మించిన శాస్త్రిగారు 84వ ఏట  7-4-19.ఆదివారం తెల్లవారుఝామున మరణించి కళామతల్లికి తీవ్ర శోకం మిగిల్చారు . వారికుమారుడు బుర్రా సాయిమాధవ్ గొప్ప సినీ రచయిత  . గబ్బిట దుర్గాప్రసాద్ 

image.png
image.png
Posted in వార్తా పత్రికలో | Leave a comment

ఈ కిటుకేమిటి ?

ఈ కిటుకేమిటి ?

 కరటక దమనకులు ఆంధ్రా కు అన్నీ ఇచ్చేశాము . ఇంతఇ చ్చాము అంత ఇచ్చాము .మీ స్టిక్కర్ సీఎం మిమ్మల్ని మోసం చేస్తున్నాడు కేంద్రం నుంచి ఒక్కపైసాకూడా బాకీ లేదు అని చానల్స్ లో అక్కడక్కడా తెచ్చిపెట్టుకున్న జనాలమధ్య డబ్బాలు బాగానే కొట్టారు ఈమధ్య .పాపం పెద్దమనిషి రాజనాధ్ మాత్రం నిజాయితీగా ”అన్నీ ఇస్తాం .కనికరించండి ”అని కన్నీళ్లు పెట్టుకొన్నాడు అవనిగడ్డలో .ఇందులో ఎవరిమాట నిజం ?అన్నీ ఇచ్చేస్తే వాళ్ళ సభలకు జనం ఎందుకు ఎగబడటం లేదు ?ఖాళీ కుర్చీలే ఎందుకు కనిపిస్తున్నాయి ? జనం ఎందుకు నమ్మటం లేదు ?అన్ని  సర్వేల లో కూడా ఆపార్టీకి ఒక్క సీటు కూడా రాదనీ ఎందుకు చెబుతున్నాయి? .ద్వేషమా ?కళ్ళు మూసుకు పోతే వచ్చే అరిష్టం    .పూర్వం కాంగ్రెస్ చేసినతప్పులకు అనుభవించింది .ఇప్పుడు కాషాయం అనుభవిస్తోంది .మిజోరాం అస్సామ్ లలోపారిన  పాచికలు ఆంధ్రా లో పారవు అని పార్టీ వాళ్ళు గహించలేకపోయారా ?పవన్ కు  స్థానిక సపోర్ట్ లేకపోయినా చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు ఒకటో రెండో సీట్లు వస్తాయని సర్వేలు చెబుతుంటే ,ఒకవైపు ఆర్ ఎస్ ఎస్ కేడర్ ,బిజెపికి బలంగా ఉండికూడా ఆనాయకులెవరూ జండాలు పట్టుకొని తిరగకపోవటానికి కారణం కూడా తెలుసుకోలేకపోయారా ?పేలవంగా జరిగిన సభలపేరిట నాయకులు కోట్లు నొక్కేశారని చెవులు కొరుక్కోవడం తెలీదా ?దొంగలకు తాళం చెవులిచ్చి ఫలితం అనుభవిస్తున్నారు .ఇప్పుడు ఆంధ్రాలో కాంగ్రెస్ పనీ అదే పరిస్థితి .నయవంచన ఎక్కువకాలం సాగదు  హుందాతనం కర్తవ్యపాలన మాత్రమే ఆదుకొంటాయి .ఇవి ఒకప్పుడు కాషాయం పార్టీ ఆస్తి .ఈ నాలుగేళ్లలో అదంతా ఖాళీ అయి భోగాలాలస అధికార దాహం ,విచ్చలవిడి తనం  అహంభావం అహ్రంకారం  పెరిగి  కొంప కొల్లేరవుతోంది .ఇప్పటికైనా పార్టీకి జరిగిన అప్రతిష్ట నుంచి రక్షించటానికి అద్వానీ వెంకయ్య లాంటి వారు బయటికి వస్తే లాభపడుతుంది  .లేకుంటే మోడీ తెచ్చిన మట్టీ మశాన్నమే మిగులుతుంది . ప్రజలు, ఓటర్లు అత్యున్నత విఙ్ఞతకలవారు అని గ్రహించాలి . తస్మాత్ జాగ్రత  -దుర్గాప్రసాద్
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

నెల్లూరులో ఉన్న మూడుగంటల్లో సభలో ఉన్నది అరగంట మాత్రమే అనే నెల్లూరు ప్రహసనం

నెల్లూరులో ఉన్న మూడుగంటల్లో సభలో ఉన్నది అరగంట మాత్రమే

                  అనే నెల్లూరు ప్రహసనం

వారం క్రితమే నెల్లూరు నుంచి సర్వేపల్లి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు స్టేట్ లీడర్ పక్షపత్రిక సంపాదకులు శ్రీ సర్వేపల్లి రామూర్తిగారు ఫోన్ చేసి తమ ట్రస్ట్ తరఫున నాకు4-4-19గురువారం సాయంత్రం  ఉగాది పురస్కారం అందజేయ బోతున్నట్లు తెలిపి తప్పక రావలసిందిగా కోరారు .సరే అన్నాను .వెంటనే శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి  ద్వారా వట్సాప్ లోను ,నాకు   తర్వాత పోస్ట్ లో    కూడా  ఆహ్వానం పంపారు .శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారితో పాటు నాకూ పురస్కారం లభించటం సంతోషంగా ఉంది .వెంటనే మా అబ్బాయి శర్మకు మెయిల్ రాసి అనుకూలంగా రైల్  టికెట్స్ బుక్ చేయమంటే ,వెళ్ళేటప్పుడు బెజవాడలో మధ్యాహ్నం 1-10కి బయల్దేరే కృష్ణా కు ,వచ్చేటపుడు రాత్రి 8-55కు అక్కడ బయల్దేరే చార్మినార్ కు ఎ. సి. లో బుక్ చేశాడు . మార్చి 31సరసభారతి ఉగాదివేడుకలు,  ఏప్రిల్ 2శారదా స్రవంతి ఉగాది పురస్కారం హడావిడి అయిపొయింది .

సర్వేపల్లి చారిటబుల్ ట్రస్ట్ వారి ఉగాదిపురస్కారం

  ఏప్రిల్ 4గురువారం ఉదయం 10-30కే భోజనం చేసి 11కు ఉయ్యూరు సెంటర్ లో బస్ ఎక్కి విజయవాడ చేరి మధ్యాహ్నం 12-20కి రైల్వే స్టేషన్ చేరాను .దారిలో ‘’మెయ్యటానికి ‘’మా ఆవిడ పులిహోరకలిపి బాక్స్ ఇచ్చింది .నేను చక్రకేళీలు ,ద్రాక్ష ,కమలాలు హార్లిక్స్ బిస్కెట్లు సిద్ధం చేసుకొన్నాను .సరిగ్గా టైం కే కృష్ణా వచ్చింది .1-10కి బయల్దేరాల్సింది బెజవాడ కృష్ణానది చల్లగాలికి కాసేపు విశ్రాంతి తీసుకొన్నట్లు తాపీగా 1-35కు బయల్దేరటానికి ఇష్టం లేక బయల్దేరినట్లు   బయల్దేరింది .దాదాపు ప్రతి స్టేషన్ లోనూ ఆగుతూ ,తూగుతూ ఆగాల్సిన సమయం కంటే రెట్టిపు సమయం తీసుకొని ఆగుతూగర్భిణీ స్త్రీలా  ఆపసోపాలు పడుతూ మమ్మల్నీ పడేస్తూ ,ఆ ‘’తిరుపతి తెల్లారేలోపు చేరలేకపోతానా ‘’అనే ధీమాతో ఉసూరుమంటూ, అనిపిస్తూ గంటంబావు ఆలస్యంగా 6-45కు నెల్లూరు చేరి మమ్మల్ని హమ్మయ్యా అనిపించింది .మొత్తం మీద 5-45నిమిషాలు సా—గించి ప్రయాణం గమ్య స్థానం చేర్చింది .ఈలోపు సర్వేపల్లివారు   ప్రయాణం వాకబు చేస్తూ  నేను శివలక్ష్మితోబాటు మావాళ్ళకు తెలియజేస్తూ ఆరగా ఆరగా నేను తెచ్చుకోన్నబిస్కెట్లు మినహా మిగతావన్నీ  తిని ఖాళీ చేశాను  .రైలు కాఫీ ,టీ లు తాగటం అలవాటు లేదు .మధ్యలో రామయ్యగారి బంధువులు భీమవరం డాక్టర్ గారు శ్రీ గంగాధర్ గారు ఫోన్ చేసి నేను వారికి మార్చి 13న పోస్ట్ లో పంపిన ఆహ్వానం ఈ రోజే తాపీగా 21రోజులతర్వాత ‘’కానుపు’’ అయింది అంటే డెలివరీ అయిందని చెప్పారు . ఇదీ పోస్టల్ భాగోతం .ఉగాది వేడుకలు చాలాబాగా జరిగాయని తమవారినందర్నీ ఎంతో ఆప్యాయంగా చూసుకున్నామని సంబరపడి చెప్పారు అది మా ధర్మం అన్నాను .భీమవరం వచ్చి తమ ఆతిధ్యం తీసుకోమన్నారు డిసెంబర్ లోనే మా మనవడు సంకల్ప్అమెరికానుంచి వస్తే అందరం కలిసి భీమవరం మీదుగా అంతర్వేది వెళ్లి వచ్చామని చెప్పి అనుకూలమైనప్పుడు తప్పక భీమవరం వస్తామని చెప్పాను. ఫంక్షన్ జయప్రదం కావటానికి రామయ్యగారి బంధువులంతా రావటమే ముఖ్య కారణం అన్నాను .మనమంతా అంతటి గొప్ప శాస్త్ర   వేత్త కు సమకాలీనులవటం, మీరు బంధువులవటం మన అదృష్టం అన్నాను . తర్వాత శ్రీ గీతా సుబ్బారావు గారుకూడా ఫోన్ చేసి ఆంజనేయ దేవాలయాలు చదివానని చాలాబాగుందని  మొదటిభాగం పంపగలరా అని అడిగితె నెల్లూరు నుంచి రాగానే పంపుతానని చెప్పాను  .

  నెల్లూరు స్టేషన్ లో నన్ను ‘’తిక్కనసోమయాజి పీఠం’’అధ్యక్షులు ,మహాకవి  కావ్యకర్త శ్రీ ఆలూరు శిరోమణి శర్మగారు ,సర్వేపల్లి వారు ఆప్యాయంగా రిసీవ్ చేసుకొన్నారు .వీరిద్దరికీ సరసభారతి ఆరే డేళ్ళ క్రితం ఉయ్యూరు ఆహ్వానించి సత్కరించింది .శర్మగారికి నన్ను శ్రీ రంగనాధ స్వామి కోవెల దర్శనం చేయించమని చెప్పి మూర్తిగారు  సభకు వెళ్ళారు .దగ్గరే కనుక తెచ్చినకారులో నన్ను ‘’తల్పగిరి శ్రీ రంగనాధ స్వామి దేవాలయం ‘’కు తీసుకు వెళ్ళారు అప్పటికి 7అయింది .స్వామికి ‘’శాత్తు మొర ‘’చేసే సమయం .తెరవేసేశారు .పది నిమిషాలలో తీస్తారు అంటే ఉండిపోయి ఈ లోగా శ్రీ రంగనాయకి అమ్మవారు అండాల్ అనే గోదాదేవి అమ్మవారిని ,శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించి ‘’తెరతీయగరావా ‘’అంటూ స్వామి దర్శనం కోసం వెయిట్ చేశాం .స్వామి మొరలో మామొర ఆలకి౦ చేవారరే లేకపోయారు  .అంతా అయి తెర లేపేటప్పటికి -7-40అయింది .తర్వాత గోష్టి .మేము చీకట్లోనే రంగనాయక స్వామిని దర్శించి నెత్తిన ఉన్న కిరీటాన్నిబట్టి ఆయనేనా స్వామి అని శర్మగారిని అడిగితె అవుననంగానే నమస్కరించి  ‘’అసలే నల్లనాయన పైగా కటిక చీకటి .పెళ్లి రోజున అరుంధతీ నక్షత్రం కనిపించకపోయినా కనిపించింది అని చెప్పినట్లు  దర్శనం అయిందనీ మనసులో సం తృప్తిపడి ఇంతదూరంవచ్చినందుకు ఇదే పెన్నిధి అని అన్నమయ్య అనుకొన్నట్లు అనుకోని ఈ లోపు మూర్తిగారు ఫోన్ చేస్తే వచ్చేస్తున్నామని చెప్పి  కారెక్కి బయల్దేరాం .బయట శ్రీ వేదాంత దేశికాచారి గారి ఆలయం బయటనుంచే చూసి రామానుజ విగ్రహం వద్ద గుడి గోపురం వద్దా ఫోటోలు దిగి సభా స్థలికి చేరేసరికి 7-55అయింది .దేశికులపై డా శ్రీదేవి మురళీధర్ అద్భతమైన రిసెర్చ్ గ్రంధం రాసి 2012లో మేము  అమెరికానుంచి వచ్చేసరికి అందేట్లుపంపిన   విషయం గుర్తుకొచ్చింది

  సభ అప్పుడే షురూ చేశారు .శ్రీ గుత్తికొండ సుబ్బారావు ,నెల్లూరు ప్రముఖ రచయిత్రి శ్రీమతి పెళ్ళకూరి  జయప్రద  ,శ్రీమతి పాతూరి అన్న పూర్ణగార్లను కలిశాను .శర్మగారితో నాకు 8-45ట్రెయిన్ ఉందని 8-30కల్లా నన్ను పంపించేయాలని ముందే చెప్పాను కనుక నాకు సుబ్బారావు గారికి ఒకేసారి సర్వేపల్లి సోదరులు శాలువా ,జ్ఞాపిక ,పెద్ద తాటికాయంత శ్రీవారి లడ్డు లతో సత్కరించారు కవిపండిత సమక్షం లో ఒక పోలీసు ఆఫీసర్ గారు .బెజవాడనుండి రేడియో ఆర్టిస్ట్ ఎబి ఆనంద్ గారుకూడా వచ్చి అభినందించారు .ముందు సుబ్బారావు గారు మాట్లాడారు .తర్వాత నేను మాట్లాడాను .నేను సరసభారతి ఉగాది వేడుకలు శారదస్రవంతి నాకు పద్మశ్రీ తుర్లపాటితో ఇప్పించిన సాహితీ పురస్కారం ,డా. రామయ్య ,డా పుచ్చా గార్లపుస్తకాలగురించి నేనురాసిన కోనసీమ ఆహితాగ్నులు ,గీర్వాణ౦  మూడుభాగాలు ఆ౦జ నేయదేవాలయాలు రెండుభాగాలు  పూర్వా౦గ్ల   కవుల ముచ్చట్లు వగైరా చెప్పి విక్రమసి౦హ పురిలో  మనుమసిద్ధి తిక్కన నడయాడిన దివ్యసీమలో నాకు పురస్కారం అందజేయటం అందులో సుబ్బారాగారి సరసన అందుకోవటం చిరస్మరణీయాలని కృతజ్ఞతలు చెప్పి సరసభారతి పుస్తకాలు శర్మగారికి మూర్తిగారికి వేదిక మీదనే అందజేసి  కంగారు లో సుబ్బారావు గారి శాలువా జ్ఞాపికా ఆయన ప్లాస్టిక్ టిఫిన్ బాక్స్ నా సంచీలో ఉంటె చూసుకోకుండా తెచ్చాను  8-40 కి మళ్ళీ శర్మగారు నేను బయల్దేరి కారులో స్టేషన్ చేరేసరికి రాత్రి 8-50 అయింది .డ్రైవర్ గా  వచ్చినాయన  ఒక ఫోటో, వీడియో గ్రాఫర్ .శర్మగారు ఆయనతో స్టేషన్ కాంటీన్ నుంచి ఇడ్లి పార్సెల్ కట్టించి తెప్పించి వాటర్ బాటిల్ తో సహా ఇప్పించారు .వారిద్దరికీ ధన్యవాదాలు చెప్పాను సభలో కాఫీ కాని రిఫ్రెష్ మెంట్స్ కాని లేకపోవటం ఆశ్చర్యమేసింది .ఈ విషయం శర్మగారి దృష్టికీ తెచ్చాను. ఆయనా చాల బాధ పడ్డారు .ఎన్నో సార్లు చెప్పి చూసినా ప్రయోజనం కలగటం లేదని నిట్టూర్చారు .సందట్లో సడేమియా అన్నట్లు నన్ను ఒకటవ నంబర్ ప్లాట్ ఫాం పై ది౦పాల్సి౦ది పోయి రెండులో దింపారు .చార్మినార్ లేట్ అయి 9-10కి వస్తుందని అనౌన్స్ చేయటం తో ఉరుకులు పరుగులతో అండర్ వే ద్వారా ఒకటికి వచ్చి ,కాస్త ఊపిరి పీచుకొని ఇడ్లీ పొట్లం విప్పి తిందామని చూశాను .అసలే నాకు ఇడ్లీ ఎలర్జీ .ఎంతోబాగుంటేనే చట్నీ మరీ బాగా ఉంటేనే  రెండు తింటే గగనం .నాలుగు చూడగానే తినాలనే యావ సగం చచ్చింది .దానితో నంచుకోవటానికి సా౦బారేమోనని మూట విప్పితే అది నీళ్ళ చట్నీ .దీనితో అస్సలు తినాలనే ధ్యాస పూర్తిగా పోయి ఎట్లాగోఅట్లా ఒక ముప్పాతిక ఇడ్లీ నోట్లో ‘’కుక్కుకొని’’ నీళ్ళు తాగి బిపి మందేసుకోన్నాను .చార్మినార్’’ పొగ’’వదుల్తూ రాత్రి 9-30కు వచ్చి 9-45కు లో బయల్దేరింది . నా కంపార్ట్ మెంట్ లో నాబెర్త్ పై పడుకొని బిస్కెట్లు నాలుగు తిని మంచినీళ్ళు పట్టించి అందరికీ బయల్దేరానని ఫోన్ చేసి బెడ్ పై వాలాను .నిద్ర పడుతుందా చస్తుందా ?అలాగే పక్కమీద దొర్లుతూ రాత్రి 1-15కు బెజవాడ చేరి ,ఆటోకి 40ఇచ్చి 1-30కు బస్ స్టాండ్ చేరి ఒకకాఫీ త్రాగి  బస్సులకోసం ఎదురు చూపులతో కాలక్షేపం చేశా .ఇంతలో 2-30కి నెత్తిన పాలుపోసినట్లు పేపర్ వాన్ ఆయనవచ్చి అవనిగడ్డ వెడుతున్నాను వస్తారా అని అడిగితె ‘’వాయస్ ‘’అని యెంత అంటే’’ ఫిఫ్టీ ‘’ అంటే డబుల్ వాయస్ చెప్పి ఎక్కి ఉయ్యూరుకు ,ఇంటికి తెల్లవారుఝామున 3-30కు చేరి, విశ్రమించాను .కనుక ఉదయం 11గంటలకు ఉయ్యూరులో బయల్దేరినవాడిని సుమారు 16గంటలతర్వాత ఉయ్యూరు చేరానన్నమాట .నెల్లూరులో 6-45కి దిగి రాత్రి 9-30కు తిరుగు ప్రయాణం చేసినా సభలో ఉన్నది కేవలం అర్ధగంట మాత్రమే.మొదటిసారి నెల్లూరు గడ్డపై కాలుపెట్టి ఎంతో అనుభూతి పొందుదామనుకొంటే అంతా ఉరుకులూ పరుగులే అయింది .నాతోపాటు మీరూ ఆయాసపడే ఉంటారు కనుక ఆ శ్రమ పోగొట్టటానికి నెల్లూరు కబుర్లు  చెబుతాను .

  సింహపురి, విక్రమసింహ పురియే నెల్లూరు

1-‘’నెల్లూరు పట్టణానికి తూర్పు సుమషలారామ వీధుల సముద్రము మ్రోగు

దక్షిణమందు కేదార భూములు ,వనలక్ష్మితో ఖగ మృగ రాజి దనరు

పడమట వేదాద్రి భగవాను గుడులు ,సస్య శ్యామలములైన సారభూము

లోత్తరమున  ,ఈశ్వరోత్తమా౦గము పైని ,మిన్నేటి కెనయైన  పెన్నవాగు

అచట పుట్టిన శిశువైన ఆయుధమను –హయము పైనెక్కి స్వారి చేయంగ జూచు

పెన్న అలల గాలికి ప్రజా వీణ మ్రోగ –లలిత కళ లేచి దేశాంతరముల బ్రాకు ‘’

2-తల్లి చాటు బిడ్డల వోలె ఎల్లప్రజలు –ప్రణవ గాయత్రి గోమాత భక్తి గొలుతు

  రట్లె,ధర్మార్ధ కామమోక్షార్ధు లగుచు –హరిహర బ్రహ్మ సేవింతు రహరహంబు .

3-యాగమొనరించి తా సోమయాజి యయ్యె-భారతము పదునైదు పర్వములు వ్రాసి

 జ్ఞాన నేత్రమ్ముతో ,తిగకన్నులున్న-తిక్కనకవి బ్రహ్మయె ప్రజా దేవుడయ్యె’’

4-ఖడ్గతిక్కన తో పోరాడగలుగు వాడు –రుద్రమూర్తికి ఈడైన భద్రమూర్తి (బ్రహ్మరుద్రయ్య )

5-తెలుగుగడ్డ లోకానికే వెలుగుగడ్డ –పాడి పంటల సిరులకు పసిడిగడ్డ

మగసిరులు పొంగి పోటెత్తు మగలగడ్డ –తెలుగు తల్లికి ముద్దు బిడ్డలము మనము’’  అని

కవిరాజు ,సాహిత్య సరస్వతి 95ఏళ్ళ వేటపాలెం వాస్తవ్యులు శ్రీ  కడెము వెంకటసుబ్బారావు గారు తమ ‘’ఖడ్గ తిక్కన ‘’కావ్యం లో వర్ణించారు.

 నెల్లూరు అంటే కవిబ్రహ్మ తిక్కనసోమయాజి రాసిన హరిహరాద్వైత పద్యం స్పురిస్తుంది –

‘’శ్రీయన గౌరినాబరగు చెల్వకు చిత్తము పల్లవి౦ప ,భ

ద్రాయత మూర్తి యై ,హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూ

పాయ నమశ్శివాయ యని పల్కెడు భక్త జనంబు వైదిక

ధ్యాయిత కిచ్చమెచ్చు పరతత్వము గొల్చెద నిష్ట సిద్ధికిన్ ‘’  

మనుమసిద్ధి రాజుకు ,కాటమరాజు కు మధ్యజరిగిన పుల్లరి యుద్ధం లో శైవ వైష్ణవ తగాదాలు పెచ్చు పెరగటంతో తిక్కన హరిహరాద్వైతాన్ని ప్రచారం చేసి శాంతి చేకూర్చాడు అలాంటి సీమ నెల్లూరు .

  నెల్లూరును విక్రమసింహపురి అని సింహపురి అనీ అనేవారు. విక్రమసింహ రాజు పాలించటం వలన మొదటిపేరు, వన్యప్రాంతం కనుక సింహాలు ఎక్కువగా ఉండటం వలన రెండవ పేరు వచ్చింది  .నెల్లి అంటే తమిళం లో వరి అని అర్ధం .వరి బాగా పండేప్రాంతం కనుక నెల్లి ఊరు నెల్లూరయింది .నెక్కంటి రెడ్డి అనే భక్తుడికి నెక్కంటి అంటే త్రినేత్రుడైన శివుడు కలలో కనిపించి ‘’నెల్లి చెట్టు ‘’అంటే ఉసిరి చెట్టు కింద ఉన్న లింగాన్ని ప్రతిస్ట చేయమని చెప్పాడుకనుక నెల్లి ఊరు నెల్లూరు అయిందనీ అంటారు .నెల్లూరు ప్రాంతాన్ని మౌర్య ,చేది,శాతవాహన ,కాకతీయ ,పల్లవ ,చోళ ,కళింగ,పాండ్యరాజులు, నవాబులు ,బ్రిటిష్ వారు పాలించారు .క్రీ.పూ.3వ శతాబ్దం లోనే మౌర్యచక్రవర్తి అశోకుని కాలం లో నెల్లూరు భాగం గా ఉండేది .

  నెల్లూరులో తల్పగిరి లో శ్రీ తల్పగిరి రంగనాధ దేవాలయం 6వేల ఏళ్ళనాటి అతి ప్రాచీన దేవాలయం .ప్రపంచం లో ఉన్న మూడు రంగనాధ ఆలయాలలో ఇది ఒకటి .మిగిలినవి రెండూ శ్రీరంగం లో ,శ్రీరంగపట్టణం లో ఉన్నాయి .అమ్మవారు రంగనాయకి .నెల్లూరు దగ్గరున్న ఉదయగిరి కోట 3,079అడుగుల ఎత్తైన కోట .ఈ జిల్లాలో పులికాట్ సరస్సు టూరిస్ట్ సెంటర్ .బొగ్గూరు ,బీరపేరు ,పెన్నేరు నదుల సంగమం పవిత్రమైనది. ఇక్కడి చోళ దేవాలయం గొప్ప దర్శనీయ పుణ్య క్షేత్రం .ఎవరైనా స్త్రీ కాస్త నాజూగ్గా ఉంటె ‘’నెల్లూరి నెరజాణ’’అనటం మనకు తెలుసు .నెల్లూరు వంకసన్నాల బియ్యంచాలా ప్రసిద్ధి చెందినవి .వీటిని ‘’మొలగొలుకులు ‘’అంటారని జ్ఞాపకం .

  ఆధునికంగా శ్రీహరికోట రాకెట్ కేంద్రం జగత్ ప్రసిద్ధం .నెల్లూరు జిల్లా ప్రసిద్ధులు శ్రీ పొట్టి శ్రీరాములు  బెజవాడ గోపాలరెడ్డి పుచ్చలపల్లి సుందరయ్య  వెంకయ్యనాయుడు ,రమణారెడ్డి ,సింగీతం శ్రీనివాసరావు ,ఆచార్య ఆత్రేయ ,బాలు ,వాణిశ్రీ ,పి.పుల్లయ్య ,నేదురుమిల్లి జనార్దనరెడ్డి ,నారాయణ కాలేజీల పొంగులేటి నారాయణ మొదలైనవారు .పెంచలకోన నరసింహస్వామి ఆంజనేయ స్వామి  మూలస్థానేశ్వర దేవాలయాలు సుప్రసిద్ధమైనవి .ఆనాడేకాదు ఈనాడు కూడా నెల్లూరు గొప్ప విద్యా వైజ్ఞానిక ,సాంస్కృతిక కేంద్రమే .

   నెల్లూరు ను గూగుల్ ‘’ Nellore –an ancient indian breed of large steel –gray to almost white cattle used chiefly for heavy draft and introduced in many warm regions for cross breading with European cattle ‘’అని నిర్వచించింది .

 ఇంతటి ప్రసిద్ధ విశేషమైన కేంద్రం అయిన నెల్లూరు లో కేవలం మూడు గంటలు మాత్రమె ఉండటం ,అందునా సాహితీ కార్యక్రమం లో అరగంతమాత్రమే గడపటం అసంతృప్తిగా ఉన్నది .

  రేపు శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో

 మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-4-19-ఉయ్యూరు 

image.png

image.png
Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

గండిగుంట శ్రీ దత్త గుడిలో ఉగాది సాయంత్రం 6-30కు పంచాంగ శ్రవణం

గండిగుంట శ్రీ దత్త గుడిలో ఉగాది సాయంత్రం 6-30కు పంచాంగ శ్రవణం

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మంతెన గ్రామం శ్రీ వీరభద్రస్వామి ఆలయం లో మొదటిసారిగా లో శ్రీ వికారి ఉగాది పంచాంగ శ్రవణం

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

సర్వేపల్లి చారిటబుల్ ట్రస్ట్ వారి ఉగాదిపురస్కారం

సర్వేపల్లి చారిటబుల్ ట్రస్ట్ వారి ఉగాదిపురస్కారం

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

రేపు నెల్లూరులో సర్వేపల్లి చారిటబుల్ ట్రస్ట్ ఉగాది పురస్కారప్రదానం

రేపు నెల్లూరులో సర్వేపల్లి చారిటబుల్ ట్రస్ట్ ఉగాది పురస్కారప్రదానం

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

4-4-19 ఢిల్లీ లో రాష్ట్రపతి పురస్కారం అందుకో బోతున్న శ్రీ శలాక రఘునాధ శర్మ ,శ్రీ బూరగడ్డ నరసింహా చార్యులు

4-4-19 ఢిల్లీ లో రాష్ట్రపతి పురస్కారం అందుకో బోతున్న శ్రీ శలాక రఘునాధ శర్మ ,శ్రీ బూరగడ్డ నరసింహా చార్యులు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

13-భారత ధ్వని దర్శన పరిశోధకులు –ప్రాచార్యులు శ్రీ శలాక రఘునాధ శర్మగారు

    జనన విద్యాభ్యాసాలు

 సంస్కృతాంధ్రాలలో మహా విద్వత్తు  కలిగిన మహా పండితప్రకాండులు శ్రీ శలాక రఘునాధ శర్మ గారు కృష్ణా జిల్లా నూజివీడు తాలూకా గొల్లపల్లి లో 23-7-1941 న శ్రీ శలాక నరసయ్య శ్రీమతి దుర్గాంబ దంపతులకు జన్మించారు .గొల్లపల్లి హైస్కూల్ లో సెకండరీ విద్య పూర్తి చేశారు .ఆగిరిపల్లి లో ప్రసిద్ధ శ్రీ మార్కండేయ సంస్కృత కళాశాలలో 1955 -56  లో చేరి శ్రీ  పేరి వెంకటేశ్వర శాస్త్రి గారి వద్ద సంస్కృత వ్యాకరణం అభ్యసించారు .శ్రీ రామ చంద్రుల కోటేశ్వర శర్మగారి దగ్గర కావ్యాలు నేర్చారు .ప్రైవేట్ గా మెట్రిక్ చదివి ఉత్తీర్ణులై 1960 తెలుగు సంస్కృతాలలో భాషా ప్రవీణ ప్రధమ శ్రేణిలో పాసయ్యారు .,ప్రైవేట్ గానే చదివి బి .ఎ .డిగ్రీ కూడా1963 -64లో పొందారు .  1965-67 మధ్యకాలం లో ఉస్మానియా యూని వర్సిటి లో తెలుగు లోఎం ఏ .చదివి మొదటి తరగతి డిస్టింక్షన్ లో  కృతార్ధులై స్వర్ణ పతకం పొందారు . వీరి గురుపర౦పరలో డా దివాకర్ల వెంకటావధాని ,డా .పాటి బండ్ల మాధవ రామ శర్మ, ఆచార్య బిరుదురాజు రామ రాజు గారు ఉన్నారు .1975 లో శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం లో ‘’మహా భారతం లో ధ్వని సిద్ధాంత సమన్వయము ‘’పై పరిశోధన చేసి పి .హెచ్ .డి.పొందారు .ఇదే ‘’భారతం లో ధ్వని దర్శనం ‘’గా పుస్తక రూపం లో వెలువడింది .వీరి గైడ్ పరిశోధన పర బ్రహ్మ ఆచార్య కోరాడ మహాదేవ శాస్త్రి గారు .

                    ఉద్యోగ సోపానం

 1960 నుండి 65 వరకు అయిదేళ్ళు హైస్కూల్ ,హయ్యర్ సెకండరీ స్కూల్స్ లో తెలుగు పండితులుగా పని చేశారు . శ్రీ దేవుల పల్లి రామానుజరావు గారు నిర్వహిస్తున్నఆంద్ర సారస్వత పరిషత్ కు చెందిన హైదరాబాద్ తిలక్ రోడ్ లోని ఓరియెంటల్ కాలేజి లో1967-68 లో  ఒక ఏడాది ఆంద్ర  సంస్కృత లెక్చరర్ గా ఉద్యోగించారు . .1968.అనంతపురం శ్రీ కృష్ణ దేవరాయ విశ్వ విద్యాలయం లో గీర్వాణాంధ్ర లెక్చరర్ గా చేరి 17 ఏళ్ళు పని చేసి ,శాఖాధ్యక్షులుగా ,డాక్టోరియల్ ప్రొఫెసర్ గా ,డీన్ గా  క్రమంగా పదోన్నతి పొంది 16 ఏళ్ళు పనిచేసి మొత్తం 33 సంవత్సరాలు సర్వీస్ చేసిన ఘనత పొంది 2001 లో పదవీ విరమణ చేశారు .

  తెలుగు సంస్కృత వ్యాకరణాలపై శర్మగారికి అభిమానం జాస్తి .సంప్రదాయ సాహిత్యమన్నా ,సాహిత్య విమర్శనమన్నా కూడా విపరీతమైన ఆసక్తి ఉన్నది .రిసెర్చ్ పై మక్కువ ఎక్కువ .ఎన్నో విషయాలపై పరి శోధన చేసి దాదాపు 40  విలువైన గ్రంధాలను ప్రచురించారు .100 సెమినార్లలో పాల్గొని రిసెర్చ్ పేపర్లు రాసి సమర్పించారు .3 రిసెర్చ్ ప్రాజెక్ట్ లు నిర్వహించారు .80 దాకా ప్రత్యేక వ్యాసాలూ రాశారు . శర్మగారి వద్ద 24విద్యార్ధులు పరిశోధనలు చేసి పి .హెచ్. డి .పొందారు . .23మందికి  ఎం .ఫిల్. కు మార్గ దర్శనం చేశారు .

  శాస్త్రి గారి విద్యా విశేషాలకు తగిన గుర్తింపు లభించింది .ప్రశాంతి నిలయం లోని సత్య సాయి ఇన్ స్టి ట్యూట్ ఆఫ్  హయ్యర్ లెర్నింగ్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ లో  15 ఏళ్ళు మెంబర్ గా ఉన్నారు . శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం ,కాకతీయ విశ్వ విద్యాలయం ఉస్మానియా విశ్వ విద్యాలయం, తిరుపతి పద్మావతీ మహిళా కళాశాల, నాగార్జున విశ్వ విద్యాలయంలలో బోర్డ్ ఆఫ్ స్టడీస్ లో సభ్యులుగా గౌరవం పొందారు . ,పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం అకాడెమిక్ సెనేట్ ,హయ్యర్ పవర్ కమిటీలలోసభ్యులుగా పని చేశారు .  స్టేట్ లైబ్రరి కమిటీ ,అనంతపూర్ లోని చిన్మయా మిషన్ ఎక్సి క్యూ టివ్ కౌన్సిల్,  హైదరాబాద్ యూని వర్సిటి స్కూల్ బోర్డ్ ఆఫ్ హ్యుమానిటీస్  లో మెంబర్ .అనంతపూర్ శ్రీ రమణ సత్సంగ్ కు అధ్యక్షులు .

          వివాహం –సంతానం

నూజి వీడుకు చెందిన శ్రీ చెరుకుపల్లి  సుందర శివ శర్మ శ్రీమతి బుచ్చిరామ కృష్ణమ్మ దంపతుల కుమార్తె శ్రీమతి రాజ రాజేశ్వరి గారిని శ్రీ రఘునాధ శర్మగారు 26-5-1962లో వివాహమాడారు . ఈ దంపతులకు అయిదుగురు కుమార్తెలు. .  .వారందరి వివాహ బాధ్యతలు తీర్చి ,ప్రస్తుతం రాజ మండ్రి లో ఉంటున్నారు .

                   శ్రీ శలాక వాజ్మయ స్రవంతి

1-దండి ‘’దశకుమార చరిత్ర ‘’ను తెలుగులోకి అనువది౦చి  వ్యాఖ్యానం రాశారు .2-బాణుని ‘’హర్ష చరితాను వాదం వ్యాఖ్య 3-శ్రీ బ్రహ్మ దత్త జిజ్ఞాసువు హిందీ లో రాసిన ‘’సరలతమ విధి’’ ని  తెలుగులోకి తర్జుమా చేశారు .4-భారతధ్వని దర్శనం అనే పి హెచ్.డి ధీసిస్ –రెండు సార్లు ముద్రణ పొంది ఖ్యాతి చెందింది .5-సంస్కృత వ్యాకరణం ‘’లఘు సిద్ధాంత కౌముది ‘’ని అనువదించారు .6-నన్నయ భారతం పై ‘’భట్టారక భారత భారతి ‘’రాశారు 7-మహా భారత విరాట పర్వాన్ని తెనిగించారు 8-‘’షట్పది కనక దారలు’’ 2 స్తోత్రాలకు వ్యాఖ్యానం రచించారు .9-మహా భారతం లోని ఉద్యోగ పర్వం ,విదుర నీతి ,యక్ష ప్రశ్నలు అనువాదం చేశారు .10-అంతరంగ నివేదనం అనే కవితా సంపుటి 11-సహృదయ భావ లహరి అనే సాహిత్య వ్యాస సంకలనం 12-సనత్సుజాతీయం ,భాగవత నవనీతం ,మహా భారతం –శాంతి పర్వం-ఆర్ష భావ చంద్రికలు,అనుగీత కరదీపిక ,స్పురణ దీప కలికలు ,జగద్గురు శ్రీ పాదార్చన ,ఉత్తర గీత సౌరభ౦ వంటివి ఎన్నో రచనలు చేశారు .13-కవిత్రయ భారతం మొత్తం లో 120 రమణీయ పద్యాలను ఎంపిక చేసి విస్తృత వివరణ రచించారు .14-ప్రశ్నోపనిషత్ సౌరభవం రాశారు 15-పంచామృత రసవాహిని భాగవత నవనీతం ఉత్తర గీత సౌరభం  రచించి ఎన్నెన్నో విలువైన విషయాలను వెలుగులోకి తెచ్చారు .

  శ్రీ శర్మగారు ప్రస్తుతం శ్రీపమిడి ఘంటం కోదండ రామయ్య గారి ‘’ఆర్ష విజ్ఞాన ట్రస్ట్ ‘’ఆధ్వర్యంలో వేదవ్యాస మహా భారతాన్ని శ్లోక తాత్పర్యాలతో తెలుగులోకి అనువదించే బృహత్ కృషిలో మునిగి ఆర్ష సేవ చేస్తున్నారు .ఇప్పటికి 10 పర్వాలు పూర్తి చేశారు .త్వరలో మిగిలిన 8 పర్వాలు తెలుగులో వెలుగు చూడ నున్నాయి .ఇదొక వాజ్మయ దీక్షాతపస్సు .శర్మ గారు మాత్రమే చేయ గలిగిన ,చేయదగ్గ వాజ్మయ యజ్ఞం .

   ఎందుకోకాని శర్మ గారి దృష్టి వాల్మీకి రామాయణం పైనా,ఇతర రామాయణ రచనలపైనా  పడినట్లు లేదు.పడి ఉంటే వాటి లోని అనర్ఘ రత్న రాశులను కూడా త్ర్వవ్వి తలకెత్తే వారు అనిపించింది నాకు .

  శర్మ గారి కంఠం శ౦ఖ ధ్వనిని పోలి ఉంటుంది .ఏ విషయం పై ప్రసంగించినా  అమృత ధారా ప్రవాహం గా ,మూలాలను తరుస్తూ ,చేతిలో పుస్తక సాయం లేకు౦డానే   సంస్కృతా౦ధ్ర  వాజ్మయం లోని సకల విషయాలను సందర్భోచితంగా వివరిస్తూ తన్మయం చెందిస్తారు .దూర దర్శన్ లో ధర్మ సందేహాలు తీర్చారు మరో వ్యాసునిలా .రేడియోలో సాహిత్య ,ధార్మిక ఆధ్యాత్మిక ప్రసంగాలను లెక్కకు మించి చేశారు .ఏది చేసిన శ్రోతృ పర్వం గా ,రమణీయంగా ఉండటం శర్మగారి ప్రసంగ ప్రత్యేకత .

          బిరుదులూ –సత్కార సన్మానాలు

ఇంతటి విస్తృత పరిశోధన ,రచన ,ప్రవచనం చేస్తున్న శ్రీశలాక శర్మగారి విద్వద్వైభవానికి తగిన సత్కారా సన్మానాలు అందుకొన్నారు .ప్రభుత్వ, ప్రభుత్వేతి సంస్థలు పోటీ పడి ముందుకొచ్చి వారిని గౌరవించి వాజ్మయ సరస్వతీ సమార్చన చేశాయి .

  1986 లో బెస్ట్ టీచర్ అవార్డ్ ను ప్రభుత్వం నుంచి పొందటం తో ప్రారంభమైన ఈ పురస్కార వేడుక అప్రతి హతంగాసాగి   కవిత్వవేది నారాయణ రావు అవార్డ్ ,పేరాల భరత శర్మ మెమోరియల్ అవార్డ్ ,భూతపురి సుబ్రహ్మణ్య శర్మ మెమోరియలవార్డ్ ,సద్గురు శ్రీ శివానందఎమినెంట్ట్ సిటిజెన్ ప్రైజ్ ,ఏలూరు గుప్తా అవార్డ్ ,శ్రీకాకుళం మహతి విశిస్టసాహితి అవార్డ్,మంత్రాలయం రాఘ వేంద్ర స్పెషల్ అవార్డ్ , తణుకు శ్రీ నన్నయ భట్టారక పీఠం పురస్కారం ,శ్రీ పులికంటి కృష్ణా రెడ్డి సాహితీ సత్కీర్తి పురస్కారం ,మల్లాప్రగడ శ్రీ రంగరాయ స్మారక పురస్కారం ,శృంగేరి శారదా పీఠ పురస్కారం , ,రాజమహేంద్రవర కళా గౌతమి సన్మాన పురస్కారం ,రాజమండ్రి విరించి చారిటీస్ వారి నుండి ‘’సువర్ణ కంకణ ప్రదానం ‘’శ్రీ కంచికామ కోటి పీఠ పురస్కారం ,అజో –విభో –కందాళ౦ వారి విశిష్ట సాహితీ మూర్తి పురస్కారం వంటివి ఎన్నో అందుకుని పులకింప జేసేదాకా వచ్చి౦ది .  సాహితీ సరస్వతి స్వరూపులు శ్రీ శలాక రఘునాధ శర్మగారు అని నిశ్చయంగా చెప్పవచ్చు ..2015 ఉగాది వేడుకలలో సరసభారతి శ్రీశర్మ గారిని సగౌరవంగా ఆహ్వానించి  మా తలిదండ్రులు కీ .శే .లు గబ్బిట భావానమ్మ,మృత్యుంజయ శాస్త్రి గారల స్మారక పురస్కారాన్ని అందజేసి ,వారి సమక్షం లో నా రచన ‘’’గీర్వాణ కవుల కవితా గీర్వాణం ‘’ను హైదరాబద్ రేడియో స్టేషన్  రిటైర్డ్ డిప్యూటీ  డైరెక్టర్ జనరల్ మాన్య శ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ గారి చేతుల మీదుగా  ఆవిష్కరి౦ప జేసి ధన్యులమయ్యాం .

 ఒక్కమాటగా చెప్పాలంటే శ్రీ శర్మ గారితో మాట్లాడటమే ఒక ఎడ్యుకేషన్ .వారికి సరసభారతి రచనలు పంపినప్పుడల్లా ఫోన్ చేసి ,అందిందని చెప్పే సంస్కారం వారిది .  వారిని శృంగేరి జగద్గురువులు శ్రీ భారతీతీర్ధ స్వాముల వారు తరచూ పిలిపించి సంస్కృత కవిసమ్మేళణాలు,ధార్మిక ప్రసంగాలు వారి ఆధ్వర్యం లో జరిపిస్తూ సత్కరిస్తూ సమ్మానిస్తున్నారు .ఇంతటి మహనీయులు శర్మగారు సంస్కృతం లో కూడా యేవో రచనలు చేసి ఉంటారని అనిపించింది .వారి గురించి నెట్ లో వెదికితే నాకేమీ కనిపించలేదు .తప్పక శర్మ గారి గురించి రాయాలి అని పించి వారి ముఖత వారి వివరాలు తెలుసుకొందామని  నేను నాలుగు రోజుల క్రితం వారు విశాఖ లో ఉండగా ఫోన్ ద్వారా ఇంటర్వ్యు చేసినప్పుడు చాలా ఓపికగా నాకు కొన్ని వివరాలు చెప్పారు. అప్పటికప్పుడు నేను నోట్ చేసేసుకొన్నాను.  . తమ సంస్కృత  రచనలు, సంస్కృత కవి  సమ్మేళనాలలో పృచ్చకులుగా  సంధించిన ప్రశ్నలు ,పూరణల వివరాలు త్వరలోనే నాకు పోస్ట్ లో పంపిస్తామని చెప్పారు . ఈ ఉదయం హైదరాబాద్ నుండి వారి మనుమడిగారి ద్వారా ఇంగ్లీష్ లో ఉన్న వారి బయోడేటా అంతా మెయిల్ లో పంపారు .ఈ రచనకు నా ఫోన్ ఇంటర్వ్యు ,వారి బయోడేటా ఈ రెండూ ఆధారం .వారి  గీర్వాణ వాణీ వైభవాన్ని  రెండవ ఎపిసోడ్ లో వారు పంపిన వాటి ఆధారం గా రాసి తెలియ  జేస్తాను .

        సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-12-16 –ఉయ్యూరు .

2-గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

1-పూర్వ మీమాంస భాష్య వార్తిక మత భేదాలపై పరిశోధన చేసిన –ప్రొఫెసర్ శ్రీ బి నరసింహా చార్యులు

హైదరాబాద్ బాగ్ లింగం పల్లికి చెందిన శ్రీ బి నరసింహా చార్యులు 16-7-1944 న జన్మించారు .ఉస్మానియా యూని వర్సిటిలో విద్య నభ్యసించి న్యాయం లో బి ఓ ఎల్.1963 లోను ,సంస్కృతం లోఎం.ఏ 19 66 లోను ,సంస్కృతం లో పి హెచ్ డి .లు పొందారు .రష్యన్ భాషలో  అడ్వాన్సేడ్ డిప్లొమా 1985 లో ,గ్రాండ్ స్టెఫీన్స్ 1966 లోను అదే యూని వర్సిటి నుంచి సాధించారు .సంస్కృత సాహిత్యం ,కవిత్వాలలో తెలుగు సంస్కృత తులనాత్మక పరిశోధనలో ,ప్రాచీన న్యాయ శాస్త్రం లోను మిక్కిలి అభి రుచి ఉన్నవారు .

హైదరాబాద్ తాండూర్ ప్రభుత్వ  హై స్కూల్ లో,ఒయాసిస్ పబ్లిక్ స్కూల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో   తెలుగు సంస్కృత ఉపాధ్యాయులుగా ఉద్యోగం ప్రారంభించి,న్యు సైన్స్ కాలేజి ,సర్దార్ పటేల్ కాలేజి లోలెక్చరర్ గా ,30 ఏళ్ళు లెక్చరర్ ,రీడర్ ,ప్రొఫెసర్ గా సైఫాబాద్ పి జి కాలేజ్ ఆఫ్ సైన్స్ ,ఈవెనింగ్ కాలేజి ,ఉస్మానియా యూనివర్సిటి కాలేజ్ ఆఫ్ ఆర్త్సండ్ సైన్స్ లోను పని చేశారు .10-11-1993 నుండి 2-3-1996 వరకు జులై 9 9 నుండి జులై 20 01 వరకు ,జూన్ 2003  నుంచి జులై 2004 వరకు ,ఉస్మానియా సంస్కృత శాఖాధ్యక్షులుగా పని చేసి రిటైర్ అయ్యారు .

పూర్వపు ఆంధ్రప్రదేశ్ సంస్కృత అకాడెమి డైరెక్టర్ గా పని చేశారు .సంస్కృతం లో యు జి మరియు పి జి బోర్డ్ ఆఫ్ స్టడీస్ కు చైర్మన్ గా ,,1996 నుండి సురభారతి సమితి సేక్రేటరిగా ,నేషనల్ అసెస్మెంట్ ,అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ కమిటీ మెంబర్ గా ఉన్నారు .

ఆచార్యులవారు 19 మంది విద్యార్ధులకు ఎం ఫైల్ డిగ్రీకి  ,5 గురికి పి హెచ్ డి.కి గైడ్ గా వ్యవహరించారు .30 దాకా జాతీయ సెమినార్లకు హాజరయ్యారు .9 గ్రంధాలను 30 పరిశోధన పత్రాలను  రాసి ప్రచురించారు .సిలబస్ రివిజన్ కమిటీ మెంబర్ గా ,సెలెక్షన్ బోర్డ్ మెంబర్ గా ,ఉన్నారు రేడియోలో చాలా విషయాలపై ప్రసంగించారు .ఎన్నో సంస్థలకు గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు

రొడ్డం నరసింహఆంగ్లం లో  రాసిన ‘’యోగ వాసిస్టం ‘’ను తెలుగులోకి అనువదించారు.16 వ శతాబ్ది కి చెందిన యతీంద్ర మతదీపిక అనే శ్రీనివాసాచార్య సంస్కృత గ్రంధాన్ని తెలుగు చేశారు .వినోబా భావే హిందీలో రాసిన వేద చింతన ను తెలుగు లోకి అనువదించారు.మార్కండేయ పురాణం లోని హరిశ్చ౦ద్రో పాఖ్యానాన్ని తెలుగు చేశారు .సంస్కృత అకాడెమి ప్రచురించిన యోగ సూత్ర సార ,దాతు కారిక లకు సంపాదకత్వం వహించారు .

  1.   వీరిరిసేర్చ్ పేపర్లలో ముఖ్యమైనవి –ధర్మ సూరే మల్లినాధస్య ,అధమార్ణత్వం ,రాసకలిక ,సీతారామ విహార కావ్యధూర్త సమాగమం మొదలైనవి . ఈ క్రింది  12 గ్రంధాలకు పీఠికలు రాశారు .
  2. -Purvamimamsa Bhashyavartikayormatabhedanamadhyayanam, M.Phil. Thesis in Sanskrit, A. Yajnaramulu, 1993.
  3. Nirnaya Sindhu, Dr.K.Narasimhacharya, 1994.
  4. Sri Gayatri mantrakshara mala, Sri K.Suryanarayana, 1995.
  5. Sri Alavandar Strotram, Burgula Ranganatha Rao, 1995
  6. Telugu loni vinnapasahitya Samiksha, Ph.D. Thesis, K.Perumallacharya, 1996.
  7. Andhralankara Vangmaya Charita, Ph.D.Thesis, S.G. Ramanuja Charya, 1998.
  8. Vaidika Chandah Sastram, P.Koteswara Sharma, 2000.
  9. Ramanuja Sampradaya Saurabham, Sriman Samudrala Srinivasacharyulu, 2004.
  10. Kutova manusham, Dr.A.Prabhavati Devi, 2002.
  11. Nuti Manjari, Bhallamudi Radha Krishnamurthy, 2003.
  12. Surya Satakam, Ummadi Narasimha Reddy, 1999.

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -28-10-16 -ఉయ్యూరు

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శారదా స్రవంతి పురస్కారాలపై ఆంద్ర జ్యోతి వార్త-3-4-19

శారదా స్రవంతి పురస్కారాలపై ఆంద్ర జ్యోతి వార్త-3-4-19

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శారదా స్రవంతి ఉగాది పురస్కారం 02-04-2019

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

సరసభారతి శ్రీ వికారి ఉగాది వేడుకలపై ఆంధ్రజ్యోతి వార్త-2-4-19

సరసభారతి శ్రీ వికారి ఉగాది వేడుకలపై ఆంధ్రజ్యోతి వార్త-2-4-

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ప్రయోగాత్మక కాంతి శాస్త్ర పరిశోధనపిత డా పుచ్చా వెంకటేశ్వర్లు -కరదీపిక విశేషాలు

ప్రయోగాత్మక కాంతి శాస్త్ర పరిశోధనపిత డా పుచ్చా వెంకటేశ్వర్లు -కరదీపిక విశేషాలు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

మా పెరటిలో విరబూసిన యెర్ర నిత్యమల్లె పూలు

మా పెరటిలో విరబూసిన యెర్ర నిత్యమల్లె పూలు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2-రెండవభాగము  గ్రంథ కర్త పరిచయం

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2-రెండవభాగము

             గ్రంథ కర్త పరిచయం

పేరు-గబ్బిట దుర్గా ప్రసాద్

జననం -27-06-1940-ఉయ్యూరు

తల్లి దండ్రులు –గబ్బిట భవానమ్మ,,మృత్యుంజయ శాస్త్రి

విద్య –ఎం .ఏ .(తెలుగు ),బి.ఎస్.సి .,బి .ఇ.డి.

వివాహం –ప్రభావతి తో(21-02-1964)

ఉద్యోగం –ఉపాధ్యాయ వృత్తి (ఫిజికల్ సైన్స్),ప్రధానోపాధ్యాయుడు

           కృష్ణా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు(1963-1998)

సంతానం -1-గబ్బిట  మృత్యుంజయ శాస్త్రి ,సమత (హైదరాబాద్ )

                  (సంకల్ప్,భువన సాయి తేజ )

             2-లక్ష్మీ నరసింహ శర్మ ,ఇందిర(హైదరాబాద్ )

                    (శ్రీహర్ష సాయి ,హర్షితాంజని)

            3-నాగ గోపాల కృష్ణ మూర్తి ,రాణి (ఉయ్యూరు )

                   ( గౌతమ్ శ్రీ చరణ్ ,రమ్య )

            4-వెంకట రమణ ,మహేశ్వరి (ఉయ్యూరు )

            5-కోమలి  విజయ లక్ష్మి , సాంబావధాని(షార్లెట్-అమెరికా )

                    ( శ్రీకేత్ ,ఆశుతోష్ ,పీయూష్ )

సాహితీ వ్యాసంగం –రచనలు ,సరసభారతి అధ్యక్షులు

స్వీయరచనలు -1-ఆంధ్ర  వేద శాస్త్ర విద్యాలంకారులు 2-జనవేమన 3-దర్శనీయ దేవాలయాలు 4-శ్రీ హనుమత్ కథానిధి 5-శ్రీ ఆంజనేయ స్వామి మాహాత్మ్యం 6-సిద్ధ యోగి పుంగవులు 7-మహిళా మాణిక్యాలు 8-పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు 9-దర్శనీయ దైవ క్షేత్రాలు 10-గీర్వాణ కవుల కవితా గీర్వాణం-1 – 11-దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -1 12-కెమోటాలజి పిత  కొలచల సీతారామయ్య 13-దైవ చిత్తం 14-గీర్వాణకవుల కవితా గీర్వాణం-2 ,15-బ్రహ్మశ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారి శత జయంతి కరదీపిక 16-ఆధునిక ప్రపంచ నిర్మాతలు ,జీవితాలలో చీకటి వెలుగులు 17-గీర్వాణ కవుల  కవితా గీర్వాణం-3 ,18-షార్లెట్ సాహితీ మైత్రీ బంధం 19-అణుశాస్త్ర వేత్త డా.ఆకునూరి వెంకట రామయ్య 20-ప్రయోగాత్మక కాంతి శాస్త్ర పిత డా పుచ్చా వెంకటేశ్వర్లు 21-దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2.

స్వీయ సంపాదకత్వం లో సరసభారతి ప్రచురణలు -1-జ్యోతిస్సంశ్లేషణం 2-ఉయ్యూరు ఊసులు 3-నవకవితా వసంతం 4-మా అక్కయ్య 5-ఆదిత్య హృదయం 6-త్యాగి పే’’రెడీలు 7-శ్రీరామ వాణి 8-మా అన్నయ్య 9-శ్రీసువర్చలా వాయు నందన శతకం 10-శ్రీ సువర్చలా మారుతి శతకం 11-శ్రీ సువర్చలేశ్వర శతకం 12-వసుధైక కుటుంబం 13-సాహితీ స్రవంతి (సాహితీ మండలి తరఫున )

  సరసభారతి ,శ్రీ సువర్చలలాంజనేయ స్వామి  బ్లాగుల నిర్వహణ ,

   శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయ వంశ పారంపర్య ధర్మకర్త –స్వామి సేవలో ధన్యత ,అనునిత్య సాహితీ వ్యాసంగం .

———————————————————————————

                 శ్రీ హనుమతే నమః

              రెండవ భాగం రచనకు నేపధ్యం

  దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -1మొదటిభాగం  దేశ ,విదేశాలలోని 201 శ్రీ ఆంజనేయ దేవాలయాల  గురించి నేను  రాసి, సరసభారతి ప్రచురించి 18-5-2015  శ్రీ హనుమజ్జయంతి నాడు ఉయ్యూరు శ్రీ సువర్చలా౦జనేయ స్వామి దేవాలయం లో శ్రీ స్వామివార్ల శాంతి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఆవిష్కరణ జరిపాం .దీనిని  మా చిన్నక్కయ్య,  బావగార్లు శ్రీమతి వేలూరి దుర్గ శ్రీ వేలూరి వివేకానంద్ లకు వారి వివాహ వజ్రోత్సవ కానుకగా అ౦కిత మిచ్చాం  .దీని కి స్పాన్సర్ –మా మేనల్లుడు చి వేలూరి మృత్యుంజయ శాస్త్రి (జయ్ వేలూరి ) శ్రీమతి విజయలక్ష్మి దంపతులు. (అమెరికా ).

   అప్పటి కి కొద్దికాలం ముందు నుంచే రెండవభాగం దేవాలయాలను అంతర్జాలం లో రాయటం మొదలు పెట్టాను .మధ్యమధ్య రాస్తూ ఆపేస్తూ  మరి కొన్ని పుస్తకాలు రాస్తూ ప్రచురిస్తూ 2018 అక్టోబర్ కు  మూడేళ్ళలో 100 దేవాలయాల గురించి మాత్రమే రాసి ,ఇక ఉండవులే అనుకొన్నాను .

  కాని మా రెండవ అబ్బాయి శర్మ ఇంకా చాలాఉన్నాయని ,వాటి వివరాలు వీకీపీడియా ,యు ట్యూబ్ ,ఇతర చోట్ల నుండి లింక్ లు పుంఖాను పు౦ఖంగా పంపటం ప్రారంభించాడు .వెంట వెంటనే వాటిని అదే వేగంతో ఇంటర్ నెట్ లో రాసేసేవాడిని .నవంబర్ కు రెండవభాగం లో దేవాలయాల సంఖ్య 254 అయింది .ఇందులో ఒక్కటి మాత్రమే అమెరికా దేవాలయం .మిగిలినవన్నీ మన దేశం లో వివిధ రాష్ట్రాలకు చెందినవే .ఇందులో కొన్ని దేవాలయ చరిత్రలు హిందీ , కన్నడం ,మలయాళం ,తమిళం మొదలైన వివిధ భాషలలో ఉన్నాయి .ఏదో రకంగా తంటాలు పడి విషయ సేకరణ చేసి రాశాను .కొన్నిటిని యు ట్యూబ్ లో చూస్తూ ,వింటూ రాయల్సివచ్చేది . హనుమ దయ వలన అన్నీ సక్రమంగా సాధ్యమైన౦త వరకు పూర్తి వివరాలతోనే రాశాను .కొన్ని దేవాలయాల చరిత్ర  అసమగ్రంగా నే దొరికింది .దొరికింది దొరికినట్లు రాసి సంతృప్తి చెందాను .

  మరీ అసలేమీ వివరాలు లేని దేవాలయాలను ఆయా రాష్ట్రాలలో చివర ‘’దర్శించదగిన ఇతర ఆంజనేయ దేవాలయాలు ‘’అనే శీర్షిక లో పొందు పరచాను .ఇవి సుమారు 50 దాకా ఉంటాయి.అంటే రెండు భాగాల లో కలిపి 201+254+50=555ఆంజనేయ దేవాలయాలను స్పృశించిన  అదృష్టవంతుడనయ్యాను .ఇంకా మా  దృష్టి లోకి రాని ఆంజనేయ దేవాలయాలు ఎన్నో ఉండే ఉంటాయి . కనుక ఇదే పరిపూర్ణం అని మేము భావించటం లేదని సవినయంగా మనవి చేస్తున్నాము .వివరంగా రాసిన అన్ని దేవాలయాల ఆంజనేయ స్వామి వారల విగ్రహాల  ఫోటోలు  పెట్టాము .ఒక వేళ విగ్రహం ఫోటో దొరకక పోతే, దేవాలయం ఫోటో అయినా పెట్టాం  .ఈ ఫోటోల సేకరణ ,ఫైల్ గా పెట్టటం ,రాష్ట్రాలవారీగా వరుసక్రమంలో  లిస్టు తయారు చేయటం ,కవర్ పేజీలలో ఏయే ఫోటోలు ఉండాలో నేను చెబితే వాటిని అలా ఎంపిక చేసి ,తయారు చేసే పని  అంతా మా అబ్బాయి శర్మ   తన డ్యూటీ తానూ చేసుకొంటూ,ఈపనులు  చేసినందుకు  అభినందనలు .దీనివలన నా శ్రమ, కళాసాగర్,  ,ప్రకాష్ గార్ల శ్రమ చాలా తగ్గింది .

          ఎందరో మహానుభావులు

  సరసభారతికి ఆప్తుడు ,రమ్యభారతి సంపాదకుడు ,ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ప్రధాన కార్య దర్శి శ్రీ చలపాక ప్రకాష్ ఇదివరకు లాగానే ఈ పుస్తకం ,డి.టి.పి .నిర్దుష్టంగా చేసి ,ముద్రణ చేయించి , సకాలం లో అందజేసినందుకు , మేము ‘’సరసభారతి స్టాఫ్ కళాకారుడు’’గా భావించే  శ్రీ కళాసాగర్ కోరిన డిజైన్ లోఅందమైన  ముఖ చిత్ర రచన చేసి గ్రంథానికి అదనపు ఆకర్షణ కలిగించినందుకు ధన్యవాదాలు .

             సరసభారతి ప్రగతి

   ఇది సరసభారతి ప్రచురించిన 33వ గ్రంథం,నేను రాసిన 21వ పుస్తకం అని విన్న  విస్తున్నాను .సరసభారతి స్థాపించి(2009-నవంబర్ 24 )9సంవత్సరాలు దాటి 10వ సంవత్సరం లో ప్రవేశించిందని తెలియజేయటానికి ఆనందంగా, సంతృప్తిగా ఉన్నది . .2019 జనవరి 31 నాటికి సరసభారతి  136  వైవిధ్యభరిత  కార్యక్రమాలు నిర్వహింఛి’’అక్షరం లోక రక్షకం ‘’అన్న మా లక్ష్యానికి అనువుగా నడుస్తోంది   . సరసభారతి సాధించిన ,సాధిస్తున్నప్రగతి , విజయాలన్నిటికీ సరసభారతి గౌరవాధ్యక్షులు శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి , కార్యదర్శి శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి,  కోశాధికారి  గబ్బిట వెంకట రమణ కార్యవర్గ సభ్యులు,  మా కుటుంబ సభ్యులు ,ముఖ్యంగా మా శ్రీమతి ప్రభావతి అందిస్తున్న సహాయ , సహకారాలకు  ధన్యవాదాలు .సాహితీ బంధువుల ,వదాన్యులైన వితరణ శీలురైన దాతల ప్రోత్సాహక సహాయాలకు  కృతజ్ఞతలు .

                  హనుమలకు అంకితం 

  దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 రెండవభాగం ను కృష్ణాజిల్లా ఉయ్యూరు లోని మా శ్రీ సువర్చలా౦జనేయ స్వామి వారికీ ,పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒకప్పటి గబ్బిటవారి అగ్రహారమైన  రామారావు గూడెం లో వెలసిన  గబ్బిట, చందోలు వారి శ్రీ భక్తాంజనేయ స్వామివారికీ ,ఉయ్యూరు లో మా మేనమామ  శ్రీ గుండు గంగయ్యగారి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారితో సహా అన్ని దేవాలయాల శ్రీ ఆంజనేయ స్వామి వారలకు అంకితమిస్తూ ధన్యులమవుతున్నాము .ఏదో మన భ్రమ కాని హనుమ లేని చోటున్నదా?శ్రీ హనుమ కృపా కటాక్షా  వీక్షణాలే  ఇంతటి బృహత్  రచన,ప్రచురణ మాతో  చేయించాయి .

                   శ్రీ ఆంజనేయ వైభవం

ఇంతటి వైభవం గా దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 రెండవ భాగం  వస్తున్న సందర్భం గా, నామదిలో ఇందులో’’ శ్రీ ఆంజనేయ వైభవం’’ పై పద్యాలు రాయింఛి, చేర్చాలనే  కోరిక లీలగా మెదిలి ,సరసభారతి అభిమానకవులను కొందరికి చెప్పి, తలొక 11 వృత్త పద్యాలు రాసి పంపమని   తెలియ జేయగా ,వెంటనే స్పందించి , అది తమ అదృష్టంగా ,శ్రీ హనుమ ప్రసాదంగా, కర్తవ్యంగా భావిస్తున్నామని, సరసభారతి పై తమకున్నఆదరాభిమానాలను చాటి చెప్పి ,అతి తక్కువ వ్యవధిలోనే  రచించి పంపిన కవి మిత్రులు 1-డా.రామడుగు వేంకటేశ్వర శర్మ (గుంటూరు )2-శ్రీ మంకు శ్రీను (కొప్పర్రు )3-శ్రీ తుమ్మోజు రామలక్ష్మణాచార్యులు(విజయవాడ )  4-శ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్య(విజయవాడ )5-శ్రీ పంతుల వెంకటేశ్వరరావు (విజయవాడ )6-మధుర కవి శ్రీమతి ముదిగొండ  సీతారామమ్మ(విజయవాడ )7-శ్రీమతి లక్కరాజు వాణీ సరోజిని (విజయవాడ )8-శ్రీమతి వారణాసి సూర్యకుమారి (మచిలీ పట్నం )గార్లకు  కృతజ్ఞతలు తెలియ జేసుకొంటున్నాను. ఈ ‘’వైభవ పద్య రాశి ‘’ గ్రంథానికి అదనపు ఆకర్షణ కాగలదు .శ్రీ హనుమ బహుముఖీన ప్రతిభావైభావానికి దర్పణంగా భాసించ గలదని భావిస్తున్నాను ..

              సరసభారతి శ్రీ వికారి ఉగాది వేడుకలు

 సరసభారతి  శ్రీ వికారి నామ  సంవత్సర ఉగాది వేడుకలను నిర్వహిస్తున్న 31-3-19 ఆదివారం నాడు ప్రముఖులకు ఉగాది పురస్కారం ,స్వయం సిద్ధ పురస్కార ప్రదానం ,కవి సమ్మేళనం తో పాటు  నేను రచించినమూడు పుస్తకాలు (19,20,21 ) సరసభారతి ప్రచురణలు( 31,32,33) 1-అణుశాస్త్ర వేత్త డా.ఆకునూరి వెంకట రామయ్య(స్పాన్సర్ శ్రీ మైనేని గోపాలకృష్ణ  శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా ) 2-ప్రయోగాత్మక కాంతి శాస్త్ర  పరిశోధన పిత డా.పుచ్చా వెంకటేశ్వర్లు (అంకితం అణుశాస్త్ర వేత్త డా ఆకునూరి వెంకటరామయ్య గారికి(అమెరికా ) 3-దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 రెండవభాగం  ఆవిష్కరణ జరగటం  సరసభారతి ప్రగతికి నిదర్శనమని సవినయంగా మనవి చేస్తున్నాను . ఈ కార్యక్రమ౦లో పాల్గొంటున్నఅతిధులకు,పుస్తకావిష్కరణ చేస్తున్న ప్రముఖులకు, కవి  సమ్మేళనంలో పాల్గొంటున్న కవి మిత్రులకు ,ఉగాది ,స్వయం సిద్ధ పురస్కారాలు అందుకొంటున్న  ఆత్మీయులకు శ్రీ వికారి ఉగాది శుభా కాంక్షలతో ఆహ్వానం పలుకుతున్నాం .

‘’పూజ్యాయ వాయు పుత్రాయ వాగ్దోష వినాశన –సకల విద్యాం కురు మే దేవ రామ దూత నమోస్తుతే .

‘’ఆయుః ప్రజ్ఞా యశో లక్ష్మీ శ్రద్ధా పుత్రాస్శుశీలతా –ఆరోగ్యం దేహ సౌఖ్యం చ కపినాథ నమోస్తుతే ‘’

‘’సర్వ కళ్యాణ దాతరం  సర్వాపత్ నివారకం –అపార కరుణా మూర్తిం  ఆంజనేయం నమామ్యహం ‘’

‘’ఆంజనేయం మహా వీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం –తరుణార్క ప్రభం శాంతం రామదూతం భజే ‘’

                                                         గబ్బిట దుర్గా ప్రసాద్

—————————————————————————————————————-

శ్రీ సువర్చ లాంజ నేయ స్వామి సేవకు ,సరసభారతి పుస్తక ప్రచురణకు విరాళాలు అందజేసిన వదాన్యులకు కృతజ్ఞతలు

1-శ్రీ  .వేలూరి మృత్యుంజయ శాస్త్రి (జయ్ వేలూరి ),శ్రీమతి విజయలక్ష్మి దంపతులు –ఫ్రీమాంట్ (అమెరికా ) –రూ-25,000

2-శ్రీ వేలూరి వివేకానంద్ –హైదరాబాద్ –రూ-15,000

3-శ్రీ మద్దాల జగదీశ్ ,శ్రీమతి లక్ష్మిదంపతులు –షార్లెట్ (అమెరికా )రూ-10,240

4-శ్రీ సుంకర కోటేశ్వరరావు ,శ్రీమతి సరోజినీ దంపతులు –హైదరాబాద్- రూ-10,000

5-శ్రీ గబ్బిట రామనాథ బాబు శ్రీమతి జయలక్ష్మి దంపతులు –ఉయ్యూరు –రూ-10,000

6- డా .ఆకునూరి వెంకటరామయ్య శ్రీమతి కృష్ణమయి దంపతులు –నాష్ విల్-అమెరికా రూ -8,120

7-శ్రీ పువ్వుల సారధి ,శ్రీమతి రేణుక దంపతులు –హైదరాబాద్ రూ–5,120

8-శ్రీమతి చతుర్వేదుల జానకి –విజయవాడ –రూ-2,500

9-శ్రీ .టి.వి.ఎస్. బి .శాస్త్రి (ఆనంద్ ) శ్రీమతి రుక్మిణి దంపతులు-హైదరాబాద్  –రూ 1,116

10-చిరంజీవి ఆదిత్య సింగ్ –హైదరాబాద్                                               రూ.1,116

11-శ్రీ చతుర్వేదుల మధుసూదనమూర్తి శ్రీమతి రాజ్యలక్ష్మి దంపతులు –విజయవాడ –రూ-1,100

12--శ్రీ గబ్బిట లక్ష్మీ నరసింహ శర్మ ,శ్రీమతి ఇందిర దంపతులు –హైదరాబాద్-రూ-1,100

13-శ్రీ శంభుని శ్రీ రామ చంద్ర మూర్తి శ్రీమతి మహాలక్ష్మి దంపతులు –ఖమ్మం –రూ-1,000

14-శ్రీమతి కొల్లి భారతి –మచిలీపట్నం –రూ-1,000

15-శ్రీ కడవకొల్లు కృష్ణ దంపతులు –కడవకొల్లు -రూ-500

16– శ్రీ కూచిభొట్ల రాజ గోపాల కృష్ణ మూర్తి ,శ్రీమతి సీతారామమ్మ దంపతులు –ఉయ్యూరు –రూ-500  

                                  గబ్బిట దుర్గా ప్రసాద్  

Posted in పుస్తకాలు, సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరసభారతి 138 వ కార్యక్రమంగా శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది వేడుకలు స్థానిక రోటరీ క్లబ్  ఆడిటోరియం లో   31-3-19 ఆదివారం సాయంత్రం 4-30 గంటలకు దివ్యంగా జరిగింది .

ఆ ఒక్కటి తప్పా అంతా బాగానే జరిగింది
సరసభారతి 138 వ కార్యక్రమంగా శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది వేడుకలు స్థానిక రోటరీ క్లబ్  ఆడిటోరియం లో   31-3-19 ఆదివారం సాయంత్రం 4-30 గంటలకు దివ్యంగా జరిగింది  .
 మొదటగా ”స్త్రీ శక్తి ”పై కవి సమ్మేళనం శ్రీమతి గుడిపూడి రాధికారాణి ఆధ్వర్యం లో వైభవంగా ప్రారంభమైంది  . కృష్ణా జిల్లా నుంచేకాక ఇతర జిల్లాలనుంచి బెంగుళూరు నుంచికూడా కవులు మహా ఆసక్తిగా పాల్గొని తమ కవితా స్వరం వినిపించారు .ఇందులో లబ్ధ ప్రతిష్టులు వర్ధమానవులూ ,పురుషులతో సమానంగా మహిళా కవులు సుమారు 36మంది పాల్గొని జయప్రదం చేశారు అయితే కవి సమ్మేళనం లో కవిత చమక్కులతో ,హృదయాన్ని యిట్టె ఆకర్షించాలి అన్న ప్రాధమిక సూత్రం దాదాపు చాలామంది మర్చి పోయారు .కనుక రావలసినంత వాసిగలకవిత్వం రాలేధనిపించింది .ముగింపువాక్యాలు మనసులో నిల్చిపోవాలి చెరగని ముద్రవేయాలి . ఎన్నికల  హడావిడి, ఎన్నికల విధి నిర్వహణలో తలమునకలు అయినా కవి మిత్రులు ఇంత  విశేష సంఖ్యలో రావటం అరుదైన రికార్డ్ . అందరికి అభినందనలు
 కవి సమ్మేళనం తర్వాత పుల్వామా దాడిలో మరణించిన  వీర అవాన్లకు ,ఇటీవల కాలం లో మరణించిన ద్వా.నా  శాస్త్రి ,వింజమూరి అనసూయ ,కోడి రామకిష్ణ ,ఉప్పులూరి మల్లికార్జున శర్మగార్లకు సంతాపం ప్రకటించటం జరిగింది
  ఏప్రిల్ 4 న ఢిల్లీ లో రాష్ట్రపతి నుంచి సంస్కృత భాషా సేవకు పురస్కారాలు అందుకో బోతున్న ,శృంగేరీ శారదాపీఠ ఆస్థాన విద్వా0శులు  మహాభారతం లో ”ధ్వని దర్శనం ”పరిశోధకులు ,బహు గ్రంధకర్త ప్రాచార్యులు శ్రీ శలాక రఘునాధ శర్మగారికి ,ఉస్మానియా రిటైర్డ్ సంస్కృత ప్రొఫెసర్ ”పూర్వ మీమాంస భాష్య వార్తిక టీకా భేదాల ”పరిశోధకులు డా బూరగడ్డ నరసింహా చార్యులు గారికి కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియ జేశాము
  మూడు పుస్తకాల ఆవిష్కరణ ముచ్చటగా జరిగింది .డా రామయ్య గారి కుటుంబ సభ్యులు హైదరాబాద్  భీమవరం మచిలీపట్నం విజయవాడ లనుండి అత్యంత ఆసక్తిగా విచ్చేసి సభకు వేదికకు నిండుదనం చేకూర్చారు .”అణుశాస్త్ర వేత్త డా ఆకునూరి వెంకట రామయ్య ”పుస్తకం అంటే బుక్ లెట్ కరదీపిక  అమెరికాలో టేనస్సీ రాష్ట్రం లోని  రామయ్య  స్వగృహం లోనూ   అలబామా రాష్ట్రం లో శ్రీ మైనేని గోపాలకృష్ణ గారి హంట్స్  విల్ దగ్గరున్న మాడిసన్  కౌంటీ  లోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యులు శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ 2018అక్టోబర్ 16 17 తేదీలలో ఆవిష్కరించటం ,ఈ రోజు ఆయనే మూడవసారి ఈ వేడుకలలో రామయ్యగారి బంధు వర్గం సమక్షం లో సకల సాహితీ బంధుగణం సమక్షం లోనూ ఆవిష్కరించి ”హాట్రిక్ ”సాధించారు .
 ”ప్రయోగాత్మక కాంతి శాస్త్ర పరిశోధన పిత -డా పుచ్చా వెంకటేశ్వర్లు ”పుస్తకాన్ని డా ఉప్పల దడియం వెంకటేశ్వర  ఆవిష్కరించగా ,”దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 రెండవ భాగం ”పుస్తకాన్ని ఆధ్యాత్మిక వేత్తశ్రీనోరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు శ్రీ గీతా సుబ్బారావు గార్లు ఆవిష్కరించారు
  స్వర్గీయ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి ,శ్రీ మతి భవానమ్మ స్మారక శ్రీ వికారి ఉగాది పురస్కారాలు ”ను శ్రీ నోరి ,శ్రీ  గీతా , శ్రీ ఉప్పలదడియం గార్లు అందుకున్నారు స్వయం సిద్ధ అవార్డు లను శ్రీ మతి కమలాకర్ భారతి ,శ్రీ మతి కోనేరు లక్ష్మీ ప్రమీల ,కుమారి చలమల శెట్టి నిఖిల ,శ్రీ కొల్లూరి వెంకటరమణ ,శ్రీ కడలి వెంకటరమణా రావు శ్రీ ప్రకాష్ ,ప్రొఫెసర్ పి .ఆర్ కె.ప్రకాష్ గార్లు  స్వీ క కరించారు.  .
  సన్మానితులందరిని  సరసభారతి అధ్యక్షలు దుర్గాప్రసాద్ దంపతులు ,గబ్బిట శాస్త్రి  సమత దంపతులు   గబ్బిట శర్మ గబ్బిట రామనాధబాబు  గబ్బిట వెంకట రమణ  శ్రీమతి మహేశ్వరి దంపతులు ,గబ్బివారి కోడలు  శ్రీమతి రాణి ,మనవలు గబ్బిట హర్ష ,చరణ్ ,మనవరాలు గబ్బిట రమ్య  చందన తాంబూలాలు   నూతనవస్త్రాలు ,పన్నీరు జల్లులతో ,శాలువా ,జ్ఞాపిక  నగదుతో ఘనంగా సన్మానించారు
 రామయ్య గారి కుటుంబ సభ్యులనూ నూతన వస్త్రాలు జ్ఞాపికలతో ఉచిత రీతిగా పై విధం గానే ఆత్మీయంగా సత్కరించారు .
ఊహించని సన్ని  వేశం  ఒకటి చోటు చేసుకొన్నది . శ్రీ గీతా సుబ్బారావు గారు ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామికి సరసభారతి కార్యక్రమాలకు 10వేల  రూపాయల చెక్ ను దుర్గాప్రసాద్ కు అందజేసి అందరినీ ఆశ్చర్య పరచటమేకాకుండా తనకు కవర్ లో పెట్టి అందజేసిన నగదు నుకూడా సరసభారతి కార్యక్రమాలకు వినియోగించమని వెనక్కి తిప్పిఇచ్చేసి మరింత ఆశ్చర్యానికి గురి చేశారు .శ్రీ నోరి శాస్త్రి గారు తమకు అందజేసిన నగదును సరసభారతికే తిరిగి ఇచ్చేశారు .అలాగే శ్రీ పిఆర్కే ప్రసాద్ గారుశ్రీమతి కోనేరు లక్ష్మీ ప్రమీల ,శ్రీమతి కమలాకర్ భారతి  ,శ్రీ కడలి వెంకటరమణారావు శ్రీ ప్రకాష్ గార్లు కూడా తమ కు అందేసిన నగదును సరసభారతి కార్యక్రమాలకే విని యోగించమని ఇచ్చేసి తమకు సరసభారతిపై ఉన్న గౌరవాన్నీ ఆత్మీయతను తెలియ బరచుకొన్నారు . ఇలా జరగటం ఇదే మొదటి సారి అవటం తో మేమూ ”అవాక్కు ”అయ్యాము . వారి సౌజన్యానికి చలించాం . ఇది కొంత ”అంబరాసింగ్ ”విషయమే .
  కవులంరినీ శాలువాలతో జ్ఞాపికలతో సత్కరించి సరసభారతి  , సాహితీబంధువులైన కవి మిత్రులపై ఉన్న గౌరవాన్ని చాటుకొన్నది .ఇంతమందికి ఇలా చేయటము మాకు  ఒక అరుదైన రికార్డే .
  సభ ప్రారంభం ముందు అందరికి బలమైన అల్పాహారం ఏర్పాటు చేయటం సభ అనంతరం అందరికీ విందు భోజనం ఏర్పాటు చేసి సరసభారతి తన ఆత్మీయతను ఆచరణలో కనబరిచింది
సాయంత్రం  4-30కు ప్రారంభమైన కార్యక్రమం రాత్రి 8-30 వరకు నాన్ స్టాప్ గా జరగటం కూడా ఒక విశేషం .
  అయితే సన్మాన గ్రహీతలకు తమ స్పందన తెలియ జేసే అవకాశం కల్పించలేకపోవటం మా పెద్దలోపం గా భావిస్తూ అందరికి సవినయంగా క్షమాపణలు తెలియ జేస్తున్నాను . ఈవిషయం శ్రీ నోరి,శ్రీ  చలపాక ,శ్రీ ఉప్పలదడియం నా దృష్టికి తెచ్చినందుకు నేను బాధపడటం లేదు వారిని అభినందిస్తున్నాను . ఇకనుంచి ఇలాంటివి జరగకుండా చూస్తానని హామీ ఇస్తున్నాను .
  కడలి రమణారావు నా శిష్యుడు  ఆ దంపతులు .మా సువర్చలాన్జనేయ స్వామి పదభక్తులు .గురువుగారి పై ఉన్న గౌరవంతో మా దంపతులకు నూతన పట్టు వస్త్రాలు అందజేసి సత్కరించి గౌరవించటం ఈ సందర్భంగా మరువ లేని విషయం .
  కెమెరా మెన్ లు అక్కడి హోమ్ గార్డ్ ,కేటరింగ్ సిబ్బంది అందరికీ జ్ఞాపికలు అందజేసి అభినందించాం .
  వయసు మీద పడుతోంది ఇక కార్యక్రమాలకు కొంచెం దూరంగా ఉందామని నిర్ణయం ఈ సభలోనే ప్రకటిద్దామని అనుకొన్నాను.  .కానీ శ్రీ గీతా, శీ నోరి మొదలైన వారు నా నోరు కుట్టేసి  మేము అందజేసిన నగదు బహుమతులను తిరిగి మాకే ఇచ్చేసి  అదనంగా కూడా డబ్బు సరసభారతి అందజేసినందుకు కిక్కురు మనకుండా నోరు మూసుకోవాల్సి వచ్చింది .ఏ నాటి సాహితీ బంధమో ఇది అందర్నీ మాసువర్చలాన్జనేయ స్వామి ఇలా కలిపి ”నువ్వు ఎవడివిరా విరమించుకోవటానికి .ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ”అని హనుమ ఆజ్ఞాపించినట్లని పించింది .శిరో ధార్యంగా భావిస్తున్నాను .
  సభలో సుమారు 120మందిప్రేక్షకులు ఉగాది వేడుకలను కనులార్పకుండా వీక్షించారు .ప్రత్యక్ష ప్రసారం ద్వారా సుమారు రెండు వేలమంది వీక్షించినట్లు మా అబ్బాయి రమణ చెప్పాడు .మరచిపోలేని ఆనందానుభూతి  .
మధ్యాహ్నం  మా ఇంట్లోను రామయ్యగారి బావమరిది శ్రీ కృష్ణ ప్రసాద్ దంపతులు  ఉయ్యూరు ప్రభుత్వ పాలిటెక్నీక్ లో 1953 లో చదివి పాసై ,బి యి ,ఏం యి కూడా పాసైన ఇంజనీర్ ,ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త  నోరి వారు మళ్లీఇన్నాళ్ళకు ఇన్నేళ్లతర్వాత ఉయ్యూరువచ్చిమా ఇంట్లో అతిధిగా ఉండి తమ బిటెక్ శిష్యుడైన శ్రీ విద్యోపాసకుని తో పాటు ,శ్రీమతి కమలాకర్ భారతి  శివ లక్ష్మి కుటుంబం  మల్లికాంబగారు మా అబ్బాయిలు కోడళ్ళు మనవాళ్ళు మనవరాలు మొదలైనవారు   మా శ్రీమతి, కోడళ్ళు హాయిగా వండి వడ్డించిన మామిడికాయపప్పు వంకాయ కూర ,మెంతికాయ,బొబ్బట్లు పులిహోర ,రసం మజ్జిగపులుసు  గడ్డపెరుగు బాసుందీ   తో కమ్మని విందు ఆరగించిన0దుకు  మా మనసుకు ఎంతో తృప్తిగా ,సంతృప్తిగా ఉంది  ,నోరి వారి లాంటి ఆధ్యాత్మిక వేత్త మా ఇంటి అతిధి అయినందుకు ,మా ఇంట భోజనం చేసినందుకు మాకు గర్వంగా ఉంది ,.వచ్చినవారంతా మా ఆత్మీయ ఆతిధ్యాన్ని పొందటం మా అదృష్టం  .
  సరసభారతి కి ఇంతటి ఆత్మీయత ఆదరణ కలుగజేసి వెన్ను దన్నుగా నిలిచిన సాహితీ బంధువులకు సాహిత్యాభిమానులకు ఉగాది శుభాకాంక్షలు . నిజంగానే ఉయ్యూరు కు వసంతం ఆరు రోజులముందేవచ్చి కవితాకాలకూజితాలను వినిపించి పులకరింప జేసింది .
  మీ-గబ్బిట  దుర్గాప్రసాద్ -1-4-19 -ఉయ్యూరు
Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

విజయవాడ శారదా శ్రవంతి ఉగాది సాహితీ పురస్కారం -2-4-19 -మంగళవారం సా యంత్రం 6 గంటలు

విజయవాడ శారదా శ్రవంతి ఉగాది సాహితీ పురస్కారం -2-4-19 -మంగళవారం సా యంత్రం 6 గంటలు

విజయవాడ శారదా శ్రవంతి ఉగాది సాహితీ పురస్కారం -2-4-19 -మంగళవారం సా యంత్రం 6 గంటలు 


Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు శ్రీ ఉప్పులూరి మల్లికార్జునశర్మగారి మరణం 

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు శ్రీ ఉప్పులూరి మల్లికార్జునశర్మగారి మరణం

-ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు ,అసలైన గాంధేయవాది ,గ్రంధకర్త ,సాంఘిక సేవాతత్పరులు సాహిత్యాభిమాని  శ్రీ ఉప్పులూరి మల్లికార్జునశర్మగారు22-3-19 శుక్రవారం విజయవాడలో  మరణించినట్లు ఇవాళ జ్యోతి లో చూశాను .నిబద్ధతగల రాజకీయ నాయకులాయన ఖద్దరు పంచ లాలీచీ ఉత్తరీయంతో హుందాగా అతి సాధారణంగా ఉండేవారు .చలపాక ప్రకాశ్ గారు ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ఆధ్వర్యం లో విజయవాడలో శతాధిక కవులతో సుమారు మూడునెలల క్రితంలో   ఠాగూర్ లైబ్రరీ  లో నిర్వహించిన

కవి సమ్మేళనం లో చివరి సారిగా చూశాను .సరసభారతి పుస్తకాలు అందజేశాను .అంతకు మించి నేను పెద్దగా పరిచయం చేసుకోలేదు . ఆంధ్రప్రదేశ్ సత్వర అభి వృద్ధికి మనసారా ఆకాంక్షించిన వృద్ధ తరం నాయకులాయన .కృష్ణా జిల్లా రచయితల సంఘం నిర్వహించే అన్నికార్యక్రమాలకు  తప్పక హాజరయ్యే సాహితీ ప్రియులు శర్మగారు
   గుంటూరు జిల్లా దుగ్గిరాలమండలం పెదకొండూరులో 16-7-1939జన్మించారు తండ్రిగారు ఉప్పులూరి రామ శాస్త్రిగారు ఖద్దరు సంస్థాన్ కు అత్యంత విధేయులు . 1935 లో దీన్ని రామశాస్త్రిగారు ,ఉప్పులూరి వెంకట కృష్ణయ్యగారు కలిసి స్థాపించారు
  శర్మగారు 12 వ ఏటనే అఖిలభారత కాంగ్రెస్ సంస్థ  పై ఆకర్షణ పెంచుకొని క్రియా శీలంగా వ్యవహరించారు అఖిలభారత కాంగ్రెస్ కమిటీ  సభ్యులు .ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కార్యదర్శిగా ఉన్నారు హిందీ తెలుగు భాషలు ఆయనకు వాచోవిధేయాలు .రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయినప్పుడు 1985ఆగస్ట్  లో ఆయనతోపాటు రాష్ట్రం అంతా పర్యటించి  ఆయన ఉపన్యాసాలను చక్కని తెలుగులో అనర్గళముగా అనువదించి ఆయన అభిమానం పొందారు  2004 అసెంబ్లీ ఎన్నికలకు విజయవాడనుంచి స్వతంత్ర అభ్యర్ధీ గా పోటీ చేసి ఓడిపోయారు .
  జీవితాంతం సాంఘిక సేవలో ధన్యుడైన గాంధీజీ వారసులాయన బెజవాడలో గాంధీ హిల్స్ ఏర్పడటానికి ముఖ్యకారకులలో శర్మగారు ఒకరు .డా కె.ఎల్ రావు ,పాతూరు నాగభూషణం గార్లతో ఎన్నో సాంఘిక సేవాకార్యక్రమాలు శర్మగారు నిర్వహించారు . 2007 లో మద్యపాన విమోచన సమితి కి చైర్మగా ఉండి ,విస్తృతంగా పర్యటించి  ప్రజలను చైతన్యపరిచారు .
  హైదరాబాద్ లో రవీంద్రభారతి కి సెక్రెటరీ గా ఉండి   ఎన్నెన్నో అతి ముఖ్య మైన  సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు .శర్మగారి సేవా తత్పరతకు నాగార్జున విశ్వవిద్యాలయం గౌరవ డిగ్రీ ప్రదానం చేసి గౌరవించింది .నిజం చెప్పాలంటే శర్మగారు చేసిన సేవకు తగిన గుర్తింపు ప్రభుత్వం ఇవ్వలేదనే చెప్పాలి .మంచి రచయితకూడా అయిన శర్మగారు” వీరభారతప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి”పుస్తకం రచించారు .  . 80ఏళ్ళ  రాజకీయ వృద్ధులు శ్రీ ఉప్పలూరి మల్లికార్జునశర్మగారి మరణం ఆంద్ర ప్రదేశ్ కు తీరని లోటు వారికి ఆత్మకు శాంతికలగాలని భగవంతుని ప్రార్ధిస్తూ వారి కుటుంబానికి సానుభూతి తెలియ జేస్తున్నాను
 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-3-19-ఉయ్యూరు
image.png
శ్రీ ఉప్పులూరి మల్లికార్జున శర్మగారి కవితాప్రతిభ ,గాంధీ క్షేత్రం పై అంకితభావం
‘స్వాప్నిక మధు మాధవం’ గ్రంథావిష్కరణఆర్‌ఆర్‌పేట, ఏలూరు సాంస్కృతిక, న్యూస్‌టుడే: తేనెలొలుకు తెలుగు భాష మధురాతి మధురమని విజయవాడకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు ఉప్పులూరి మల్లికార్జునశర్మ అన్నారు. అగ్రహారంలోని రత్నకమలాంబిక పీఠంలో కవిసామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ సమకాలికుడు, సాహితీవేత్త దివంగత పల్ల సుబ్బారావు అప్పట్లో రచించిన ‘స్వాప్నిక మధు మాధవం’ గ్రంథావిష్కరణ సభను ఆదివారం నిర్వహించారు. రత్నకమలాంబిక పీఠం ఛైర్మన్‌ సుంకేసుల రత్నబాల సభకు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఉప్పులూరి మల్లికార్జున శర్మ గ్రంథాన్ని ఆవిష్కరించి మాట్లాడుతూ వందేమాతరం వరుస తప్పుతోందని, జనగణమన గణం తప్పుతోందని, తెలుగుభాష రక్షణకు సమన్వయ కార్యాచరణ ఆవశ్యమని అన్నారు. ఎమ్మెల్సీ రాము సూర్యారావు మాట్లాడుతూ తెలుగుభాష అభ్యున్నతికి కవి పండిత సాహితీవేత్తలు సమష్టిగా కృషిచేయాలన్నారు. పీఠం ఛైర్మన్‌ సుంకేశుల రత్నబాల మాట్లాడుతూ సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు విస్తృత కార్యాచరణ చేపట్టామన్నారు. నేత్రావధాని డాక్టరు నిడమర్తి లలితాకామేశ్వరి, సినీగేయ రచయిత రసరాజు, జ్యోతిష పండితుడు శ్రీహరి శ్రీనివాస శాస్త్రి, సాహితీవేత్త బుద్దరాజు సూర్యకుమారి, నాట్యాచార్య కేవీ సత్యనారాయణ, సాహితీవేత్త గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు, మైలవరపు గురుశర్మ తదితరులు మాట్లాడారు. ఈసందర్భంగా ఉప్పులూరి మల్లికార్జునశర్మ, అతిథులను కార్యనిర్వాహకులు పల్ల గంగాధర చయనులు దుశ్శాలువలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు

—  అమరావతిలో గాంధీ క్షేత్రం

కరెన్సీనగర్‌(విజయవాడ), న్యూస్‌టుడే: నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతాన్ని గాంధీ క్షేత్రంగా మార్చాలని గాంధీ దేవాలయ నిర్మాణ మండలి తీర్మానించిందని ఛైర్మన్‌ నరహరశెట్టి శ్రీహరి తెలిపారు. బుధవారం నగరంలోని భారతీనగర్‌లో నిర్మాణ మండలి వివరాలను ఆయన వెల్లడించారు. గాంధీ ఆలయాన్ని కంచికచర్ల ప్రాంతంలో చేపడతామని, నిర్మాణ మండలికి గౌరవ సలహాదారులుగా ప్రభుత్వ ఆస్పత్రి విశ్రాంత న్యూరో ఫిజీషియన్‌ ఆచార్య డాక్టర్‌ సీహెచ్‌ రామకృష్ణారావు, వి.బలరామయ్య, ఎం.రంగరాజులు వ్యవహరిస్తారని, స్వాతంత్య్ర సమరయోధులు ఉప్పులూరి మల్లికార్జునశర్మ, డీఎస్‌ఎన్‌ మూర్తిలతో పాటు సభ్యులుగా న్యాయవాదులు కోనపల్లి సూరిబాబు, కోట్ల జయరాజ్‌, మట్టా జయకర్‌, అబ్ధుల్‌ మథీన్‌, ఉత్తమ్‌ నాగరాజు, ఏవీ రమణ, సంఘసంస్కర్తలు మండలి రాజా, చెన్నుపాటి వజీర్‌లతో మండలి ఏర్పడిందన్నారు. గాంధీ ఆలయం నిర్మాణ ప్రధాన ఉద్దేశంలో భాగంగా ‘గాంధీ మాల’ ఏర్పాటు చేసి అష్టాదశ సూత్రాలను అవలంబించేలా చర్యలు తీసుకుంటూ మెరుగైన సమాజానికి నాంది పలుకుతామన్నారు. మూడు మతాల పెద్దల పర్యవేక్షణలో ఆలయ నిర్మాణం జరుగుతుందని, ఇప్పటికే దాతలు ముందుకొస్తున్నారన్నారు. గాంధీ ఆలయ నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళతామన్నారు.

అమరావతిలో గాంధీ క్షేత్రం

image.png
Posted in మహానుభావులు | Tagged | Leave a comment

ప్రముఖ జానపద కళాకారిణి వింజమూరి అనసూయాదేవి కన్నుమూత

ప్రముఖ జానపద కళాకారిణి వింజమూరి అనసూయాదేవి కన్నుమూత

9

హైదరాబాద్, మార్చి 24: ప్రముఖ జానపద కళాకారిణి, సంగీత దర్శకురాలు, రచయిత డాక్టర్ అవసరాల (వింజమూరి) అనసూయాదేవి (99) అమెరికా హ్యుస్టన్‌లో ఆదివారం నాడు వయోభారంతో కన్నుమూశారు. అనసూయాదేవికి ఐదుగురు సంతానం , చాలా కాలంగా ఆమె అమెరికాలో ఉంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో 1920 మే 12న జన్మించారు. ఆమె తండ్రి వింజమూరి వెంకట లక్ష్మీనరసింహరావు ప్రముఖ కవి. తల్లి వింజమూరి వెంకటరత్నమ్మ 1914లో అనసూయ అనే పత్రికకు సంపాదకత్వం వహించేవారు. ఆమె సోదరి వింజమూరి సీతాదేవి 2016లో మరణించారు. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనడంతో పాటు వివిధ సామాజిక కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించిన అనసూయాదేవి రేడియో వ్యాఖ్యాతగా సుపరిచితురాలు. హార్మోనియం వాయించడంలో దిట్ట. కళాప్రపూర్ణ బిరుదాంకితురాలు, ఎనిమిదేళ్ల వయస్సులోనే ఆమె పాట రికార్డు అయింది. ఆమె బాల మేధావి. స్వాతంత్య్రోద్యమంలో మహామహులైన గాంధీజీ, సుభాష్ చంద్రబోస్, జవహర్‌లాల్ నెహ్రూ, సర్వేపల్లి రాధాకృష్ణన్ లాంటి వారి సమక్షంలో పాడిన అనుభవం ఆమెకు ఉంది. ఆమె మామయ్య దేవులపల్లి కృష్ణశాస్ర్తీ రాసిన ప్రముఖ దేశభక్తి గీతం జయజయజయ ప్రియ భారత పాటకు బాణీ కట్టారు. ఆమె రాసిన భావ గీతాలు, జానపద గీతాలు అనే రెండు పుస్తకాలను ఆమె 90వ ఏట చెన్నైలో 2008 ఏప్రిల్ 12న జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. 1977లో ఆమెకు ఆంధ్రా యూనివర్శిటీ కళాప్రపూర్ణ అనే బిరుదునిచ్చి గౌరవ డాక్టరేట్‌తో సన్మానించింది. అమెరికాలో జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. ప్యారిస్‌లోనూ ఆమెకు క్వీన్ ఆఫ్ ఫోక్ అనే బిరుదును ప్రదానం చేశారు. ఇదిలావుండగా, వింజమూరి మృతిపట్ల కళాకారులు, పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబునాయుడు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దేశభక్తి గీతాలు, జానపద గీతాలాపనతో కళామతల్లికి ఆమె సేవలు చేశారని శ్లాఘించారు. సోదరి వింజమూరి సీతాదేవితో కలిసి వేలాది గీతాలను ఆలపించారని గుర్తుచేశారు. ఆమె కుటుంబ సభ్యులకు చంద్రబాబు సానుభూతి తెలిపారు.
వింజమూరి అనసూయాదేవి (ఫైల్‌ఫొటో)

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘునాధ శర్మగారికి రాష్ట్రపతి పురస్కారం 

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘునాధ శర్మగారికి రాష్ట్రపతి పురస్కారం

  గీర్వాణా౦ధ్ర సాహిత్య సరస్వతి ,ఆధ్యాత్మిక వేత్త ,శ్రీశృంగేరి పీఠ ఆస్థాన విద్వాంసులు ,మహా ప్రాసంగికులు, ”సాహితీ శలాక ”,ప్రాచార్య  బ్రహ్మశ్రీ శలాక రఘునాధ శర్మగారు రాజమండ్రి నుండి ఇప్పుడే ఫోన్ చేసి ,తమకు ఏప్రిల్ 4వ తేదీన ఢిల్లీలో రాష్ట్ర పతి పురస్కారం అందజేస్తున్న శుభ వార్త తెలియ జేశారు.  మనస్పూర్తిగా అభినందించాను . ఆ సాహితీ తేజో మూర్తికి సరసభారతి తరఫున శుభాభినందనలు తెలియజేస్తున్నాను . ఇది ఆంద్ర,  సంస్కృత  సారస్వత  లోకానికి అత్యంత ముదావహం . ఉగాది ముందే వచ్చినంత సంబరం .-దుర్గాప్రసాద్ -26-3-19-ఉయ్యూరు 

— image.png

image.png
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

విజయవాడ పోస్టల్ శాఖకు ,పోస్ట్ మాన్ గారికి  హాట్స్ ఆఫ్ 

విజయవాడ పోస్టల్ శాఖకు ,పోస్ట్ మాన్ గారికి  హాట్స్ ఆఫ్

సరసభారతి శ్రీ వికారి ఉగాది వేడుకల ఆహ్వానాన్ని డా .పి ఆర్ కె ప్రసాద్ ,27-20-24 మ్యూజియం రోడ్   బకింగ్  హాం  పెట్ ,విజయవాడ -2అని శ్రీ దాసు అచ్యుతరావు గారు నాకు ఇచ్చిన అడ్రస్ కు 

13-3-19న బుక్ పోస్ట్ లో పంపాను .  రెండు మూడు రోజుల్లో అందుతుందని ఆశించా .కానీ నిన్నటివరకు అందిందని ప్రసాద్ గారి నుంచి ఫోన్ కానీ మెయిల్ కానీ రాకపోయేసరికి అందలేదేమో అనుకొన్నాను   కానీ ఈరోజు 23వ తేదీ మధ్యాహ్నం విజయవాడ నుంచి ఆ ఏరియా పోస్ట్  మాన్ గారు 9848413698 నంబర్ సెల్ ఫోన్ నుంచి కవర్ పైన ఉన్న నా సెల్ నంబర్ బట్టి నాకు ఫోన్ చేసి ప్రసాద్ గారి అడ్రస్ దొరకలేదని ,కనుక్కోవటం కష్టంగా ఉందని చెప్పారు .నేను ప్రసాద్  గారి సెల్ నంబర్ ను పోస్ట్ మాన్ గారికి చెప్పి ప్రయత్నించమన్నాను .మళ్ళీ నాకు ఫోన్ రాలేదుకనుక అడ్రస్ తెలిసి ఉంటుందని బుక్ పోస్ట్ డెలివరీ చేసి ఉంటారని భావిస్తున్నాను .
   కొరియర్ లో పంపితేనే కొరియర్ వాళ్ళు ఫోన్ చేసి ఆడ్రస్వివరాలు తెలుసుకొని డెలివరీ చేస్తారు .అలాంటిది ఒక సాధారణ బుక్ పోస్ట్ ను  డెలివర్ చేయటానికి పంపిన వారికి ఫోన్ చేసి తెలుసుకోవటం నాకు అమితాశ్చర్యంగా ఉన్నది .ఈ పోస్ట్ మాన్ గారి లాగా అందరూ అంత డ్యూటీ మైండెడ్ గా ఉంటె కొరియర్లతో పనేముంది అనిపించింది .ఇంతటి నిబద్ధత కలిగిన ఆ పోస్ట్ మాన్ గారికి అభినందన ధన్యవాదాలు   విజయవాడ పోస్టల్ డిపార్ట్ మెంట్ కు  పోస్ట్ మాన్ గారికి కూడా హాట్స్ ఆఫ్  -గబ్బిట దుర్గాప్రసాద్ -ఉయ్యూరు -9989066375

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

బౌద్ధ ,టావోయిజం ,కన్ఫ్యూషియస్ మతాల ఉమ్మడి దేవాలయమే –హాంగింగ్ టెంపుల్ ఆఫ్ చైనా

బౌద్ధ ,టావోయిజం ,కన్ఫ్యూషియస్ మతాల ఉమ్మడి దేవాలయమే –హాంగింగ్ టెంపుల్ ఆఫ్ చైనా

  

గాలిలో వ్రేలాడే దేవాలయం గా ,మిస్టీరియస్ టెంపుల్ గా ప్రపంచమంతా ఆశ్చర్య పోయే దేవాలయం చైనా దేశం లో పర్వత శిఖరం పై భూమికి 246అడుగుల ఎత్తున మౌంట్ హీంగ్ పై డటాంగ్ సిటీ దగ్గర హన్యుయన్ కౌంటిలో షాంక్సి ప్రాంతం లో ఉంది .దీనికి దగ్గర సిటీ డటాంగ్ 64కిలోమీటర్ల దూరం లో ఉంది .సుమారు 1600 ఏళ్ళనాటి ఈ ఆలయం గొప్ప టూరిస్ట్ అట్రాక్షన్ గా నిలిచింది .దీని మరోప్రత్యేకత చైనాలోని మూడు ముఖ్యమతాలైన  బౌద్ధ ,టావో,కంఫ్యూషియన్ మతాల ఉమ్మడి దేవాలయం అవటం .

   పర్వతాగ్రం పై రంధ్రాలు చేసి ఓక్ చెట్టు కాండాలను దృఢం గా  పాతి వాటిపై ఆలయం నిర్మించారు .ముఖ్యమైన ఆధార నిర్మాణం భూభాగం లో దాగి ఉంటుంది .నిటారైన లోయ బేసిన్ లో ఉండటం వలన దేవాలయ శరీర నిర్మాణం పర్వతాగ్రం మధ్య  ఆలయ  శిఖరం క్రింద వ్రేలాడుతున్నట్లు అనుభూతి నిస్తూ వర్ష౦ వలన కోతను , సూర్య రశ్మి నుండి రక్షణను కల్పిస్తుంది .అనేక రాజవంశాల సేవలో శతాబ్దాలపాటు సంరక్షి౦ప బడుతూ .రంగు మారకుండా ఆలయం నిలవటం విశేషం .2010 డిసెంబర్ టైమ్స్ పత్రిక  ఈ ఆలయాన్ని ప్రపంచ ప్రసిద్ధ అసాధారణ  ప్రమాద భరిత పది నిర్మాణాలలోఒకటి గా  పేర్కొన్నది .

  ఈ వ్రేలాడే దేవాలయ నిర్మాణం’’ ఉత్తర వీ ‘’వంశరాజుల చివరి కాలం లోఒకే ఒక వ్యక్తి ‘’లియోరన్’’అనే సన్యాసి  ప్రారంభించాడు .తర్వాత 1400సంవత్సరాలలో అనేక మరమ్మత్తులు ,విస్తరణలు జరిగి ఇప్పుడున్న స్థితిలో కనిపిస్తోంది .మొత్తం 40 హాలులు ,మండపాలు భూమికి  98అడుగుల ఎత్తులో ఉన్న పర్వతగ్రాలపై (క్లిఫ్ఫ్స్ )నిర్మించబడ్డాయి .ఆలయ ఉత్తర దక్షిణాల  మధ్య దూరం ,తూర్పు పడమరల మధ్య దూరంకంటే ఎక్కువ .ఉత్తర ద్వారం నుంచి దక్షిణ ద్వారానికి వెళ్ళే కొద్దీ పర్వతం పై ఎత్తు క్రమంగా పెరుగుతూనే ఉంటుంది .ఇందులో క్వీలాన్ హాలు ,అనే సంఘారామ హాలు ,అధికారులకోసం సంగువాన్ హాలు ,చున్యాన్ హాలు ,శాక్యముని హాలు , మూడుమతాలహాలు ,  గుయానిన్ హాలు ఉన్నాయి .

  మూడు మతాల హాలులో బుద్ధ విగ్రహాలు తావోయిజం ,కన్ ఫ్యూషియనిజం మతాల ప్రముఖుల విగ్రహాలున్నాయి .మధ్యలో శాక్యమునివిగ్రహం  దానికి ఎడమవైపు టావోమతప్రవక్త లావోజే విగ్రహం, కుడివైపున కంఫ్యూ షియస్ విగ్రహాలుంటాయి .దీనివలన 1368 నుంచి 1911 వరకు పాలించిన మింగ్ ,క్వింగ్ వంశరాజులపాలనలో ఈ మూడు మతాల భావం ఒకటే అని  మత సమైక్యతకు నిదర్శనమని లోకానికి చాటి చెబుతున్నట్లు అనిపిస్తుంది.

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-3-19-ఉయ్యూరు  

image.png

image.png

image.png

image.png
Posted in రచనలు | Tagged | Leave a comment

మానవ భద్రతపై మహాత్ముని దృక్కోణం

’నాగరకత కు అసలు అర్ధం గుణకారం కాదు .స్వచ్చందంగా ఐచ్చికంగా కోరికలు తగ్గించుకొని అసలైన సంతృప్తి ,సంతోషం పొంది ,సేవాభావంతో ధన్యత చెందటమే ‘’

  మానవ భద్రత నూతన మైన భావం అన్నది ఒక నిజం . అదివ్యక్తి అనుభవించే సంక్లిష్ట ,ఒకదానితో ఒకటి సంబంధమున్న విషయాలను వివరించేది .దీన్ని ప్రతిపాదించేవారు సంప్రదాయ మామూలు భద్రత ను సవాలు చేస్తారు .వీరి దృష్టిలో భద్రత అంటే వ్యక్తిగతమైనదే కాని దేశానికి మాత్రమే చెందింది కాదు .దేశభద్రత లో మానవ భద్రత ఉన్నదని అనుకోరాదు .గత వందేళ్ళలో ఆయా ప్రభుత్వాలే తమ ప్రజలను  విదేశే పాలకులకంటే ఎక్కువగా చంపారు అన్నది పచ్చి నిజం .

   1994నాటి హ్యూమన్ డెవలప్ మెంట్ రిపోర్ట్ ప్రకారం కోరికలనుండి ,భయాలనుండి రక్షణ కల్పించటమే  విశ్వ వ్యాప్తంగా మానవాళికి భద్రత కలిగించటం .ఈ రిపోర్ట్ .1-ఆర్ధిక 2-ఆహార 3-ఆరోగ్య 4-పర్యావరణ 5- వ్యక్తిగత  6-సామాజిక 7-రాజకీయ   అంశాలను చర్చించింది ..ప్రస్తుతం వ్యక్తి ఆర్ధిక భద్రతను గాంధీ ఆలోచనా దృక్పధం లో పరిశీలిద్దాం .

  యునైటెడ్ నేషన్స్ అంచనా ప్రకారం 2009నాటికి ప్రపంచం లో అత్యంత బీదరికం లో ఉన్నవారికి ,ప్రపంచ మొత్తం జనాభాకు మధ్య ఉన్న నిష్పత్తి 21శాతం .బీదరికం యెంత ఉన్నదో, ఆకలీ అంతే ఉంది .అభివృద్ధి చెందుతున్న దేశాలలో 150 మిలియన్ల పిల్లలు పోషకాహార లోపం తో అలమటిస్తున్నారు .దీనికి పరిష్కారాన్ని మానవ భద్రతను ఆ పేపర్ గాంధీ ఆలోచనలు- ఆచరణలు  దృష్టి కోణం లో సమాధానాలు చెప్పింది .

  గాంధీ స్పష్టంగా ‘’మనిషి ఆకలి కోరలలో నలిగి బాధ పడటానికి ఏదో గొంతెమ్మ కోరికలు కోరటం కాదు, కేవలం తన కడుపు ని౦పు కోవటానికే అంటే ఆత్మారాముడిని సంతృప్తి పరచటానికే ‘’అని చెప్పాడు .మహాత్ముడు తన జీవితమంతా ఈ సమస్యా పరిష్కారానికే ,దీనికి సరైన ఆర్ధిక సాధనం కోసమే కృషి చేశాడు .ఈవిధానం పేదవాడి కడుపు ని౦పటమే కాక ,అనుసరణీయమైనదిగా ,నమ్మకమైనదిగా ,సాధ్యమైనదిగా  ఉండాలని తపన చెందాడు .

  మహాత్ముడు ‘’మానవారాధనతో ,బలహీనులను దోచి సంపాదించిన ఆర్ధిక సంపద  పనికి రానిది శాస్త్రీయ ఆర్ధిక విధానానికి వ్యతి రేకమైనది .నిజమైన ఆర్దికత సాంఘిక న్యాయాన్ని సమర్ధిస్తుంది .గాంధీ భావనలో ఆర్దికతకు ,నైతికతకు మధ్య పెద్దగా గణనీయమైన  భేదం లేదు .ఆయన భావనలో ‘’వ్యక్తి యొక్క నైతిక భావన ,వ్యక్తి సంక్షేమం,దేశ సంక్షేమాలను బాధించే ఆర్దికతలన్నీ అనైతికమైనవే ‘’.ఈ భావన ఒకప్పుడు ఆడం స్మిత్ చెప్పిన ‘’ఆర్ధిక విధానం విశ్వాసం ,నమ్మకం ,అవ్యక్త విలువల పై కూడా ఆధార పడిఉంటుంది ‘’అన్న భావానికి అతి దగ్గరగా ఉందికదా .

  బైబిల్ కూడా  దాతృత్వం ,అధిక సంపద ప్రశ్నలను ఎదుర్కొన్నది .ఇందులో మొదటి భాగమైన ఓల్డ్ టెస్టమెంట్ సంపద కూడబెట్టటాన్ని సమర్ధించింది  .రెండవభాగమైన న్యు టెస్టమెంట్ దాతృత్వాన్ని బాగా సమర్ధించింది .తన ‘’దీరీ ఆఫ్ మోరల్ సెంటి మెంట్స్’’ లో ఆడం స్మిత్ మానవుని నైతికత ,భావోద్వేగాలపై గట్టిగానే చెప్పాడు .’’వెల్త్ ఆఫ్ నేషన్స్ ‘’లో స్వయంగా విధి పూర్వకంగా బలి చేయటం (సెల్ఫ్ఇంటర్ మెంట్ )సరైన, నిర్దుష్టమైన చర్యకు దారి చూపుతుంది’’ అని ఉద్ఘాటించాడు .

   గాంధీ దాతృత్వాన్ని సమర్ధించాడు .సంపద ఎలా  కూడా బెట్టారన్న  విషయం జోలికి పోలేదు .ఆయన సంపన్నులను తమ సంపాదకు  ట్రస్టీ లుగా ఉండమని ,అందులో కొంతభాగం అవసరమైనవారికి దానం చేసి ఆదుకోమని చెప్పాడు ..’’ట్రస్టీ షిప్ విషయం లో నా సిద్ధాంతం వెంటనే అద్భుతాలు జరుగుతాయని కాదు ,అది మిగిలిన  సిద్ధాంతాలకంటే శ్రేష్టమైనదని నేను నమ్ముతాను .ఏ సిద్ధాంతమైనా అహింసా సిద్ధాంతం తో కలిసి పని చేయాల్సిందే ‘’అన్నాడు .

  అధిక సంపద తో,  అత్యున్నత అధికారాలలో ఉన్న వర్గాలవారు తమ దురాశ ను తగ్గించుకొని కిందికి దిగి, దిన కూలీ జీతం తో బతికే వారి సమ స్థానం లో ఉండాలి అని గాంధీ భావించాడు .ఆయన ఆలోచనకు ఆచరణకు మధ్య వ్యత్యాసం ఉండదు .అందుకే ఆయన ‘’పూర్తి ట్రస్టీ షిప్ అంటే యూక్లిడ్ నిర్వచనం లాగా నైరూప్యం కాదు .దానికోసం మనం గట్టిగా ప్రయత్నిస్తే  ఈ భూమిపై సమానత్వం సాధించటానికి ఇంతకంటే సరైన  శ్రేష్టమైన మార్గం లేదని నా దృఢ విశ్వాసం ‘’అన్నాడు .

  సంపద, అధికార వర్గాల ప్రభావం తగ్గించటానికి ప్రభుత్వం అతి తక్కువ హింసను ప్రయోగించటాన్ని గాంధీ సమర్ధించాడు .ఆయన దృష్టిలో ప్రైవేట్ ఓనర్షిప్ అంటే స్వంత యాజమాన్య౦ చేసే  హింసకంటే ,వారిపట్ల ప్రభుత్వం చూపే హింస అత్యల్పమైనది.కనుకనే సమర్ధించాడు .మనుషులలో మంచితనం ఉండాలని, అది ప్రతిఫలించాలని కోరాడు .శ్రమకు, పెట్టు బడికి మధ్య అనాదిగా ఉన్న ఘర్షణ తగ్గి ఆర్ధిక సమానత్వం సాధించాలనే కృషి చేశాడు . మృత సమానత్వం వ్యక్తిని తన శక్తి సామర్ధ్యాలను సమర్ధంగా పరిపూర్ణంగా వినియోగించుకోలేక పోతే అలాంటి సమాజనం నాశనమౌతుంది .కనుక ధనవంతుడు న్యాయంగా, గౌరవంగా కోట్లు ఆర్జించి ,వాటిని సర్వ జనుల సేవకు వినియోగించాలని గాంధీ కోరాడు.‘’తేన త్యక్తేన భు౦జీతా ‘’అనే ఆర్యోక్తి ‘’  అనేది సరైన సూటి మార్గమని ,దీనివలన నూతన జీవిత విదానమేర్పడుతుందని ,అప్పుడు ప్రతి వ్యక్తీ తన కోసమేకాక ,తన చుట్టూ ఉన్నవారికోసమూ కస్టపడతాడని విశ్వసించాడు .దీనినే ఆడమ్ స్మిత్ ‘’వ్యక్తి ఎంతటి స్వార్ధ పరుడైనా ,అతనిలో  తప్పకుండా కొన్ని మంచి సూత్రాలు కూడా ఉంటాయని ,అవి అతనికి స్పూర్తి నిస్తూ ఇతరుల సంతోషం తప్పనిసరిగా తన సంతోషమని భావిస్తాడు ‘’అని గాంధీ సిద్ధాంతాన్నే మారు పల్కాడు .

   గాంధీ ఆర్ధిక భావాలపై పరిశీలన చేసిన వి.పి. పాటిల్, ఐ .ఎ .లోక్ పూర్ కొన్ని ఆసక్తికర విషయాలను తెలియ జేశారు వీటిని తప్పక పరీక్షించాల్సిందే –‘’ప్రపంచం గాంధీ భావాలను అమలు చేయక పోవటానికి ఎకైక కారణం పారిశ్రామీకరణ అత్యున్నత స్థాయి లో ఉండటమే .కనుక గడియారాన్ని వెనక్కి తిప్పి, ఆదిమ సమాజ భావనలను  ఆహ్వాని౦చ గలమా ?’’అలాగే జి .యెన్ .ధవాన్ భావన ‘’కమ్యూనిస్ట్ భావ జాలం లో గాంధీగారి ట్రస్టీ షిప్ భావన అమలు పరచలేము ‘’.కాని గాంధీ భావనలు అమలు చేయటానికి ఆలస్యం అనే మాటకు తావే లేదు .పారిశ్రామీకరణ అయినా, ఇంకా ఏదో గొప్ప విధాన మైనా ప్రజలకోసం ,సమాజం కోసమే కాని దీనికి భిన్నం కాదు .ఇప్పడు గాంధీ విధానాలు యెంత అవసరమో తగినవో చూద్దాం  .గాంధీ చూడగలిగింది ఇతరులు చూడ లేకపోయింది ఏమిటి అంటే ‘’ఉక్కు విద్యుత్తూ వలన జీవితమిచ్చి ,అంతకు ముందు ప్రాధాన్యంగా ఉన్న రక్త మాంసాలను దూరం చేసింది .యంత్రం  చకచక కదులుతూ ,మనిషి జీవిత౦ తో ఆడుకొంటూమనిషిని  రోబోట్ -మరబొమ్మను చేసింది ‘’  .

  అందరూ గొప్పగా పొగిడే ఉత్కృష్ట పారిశ్రామీకరణలేక ‘’హై స్టేట్  ‘’మానవత్వాన్ని మంటగలుపుతోంది .అందుకే దార్శనికుడు గాంధి’’యంత్రం మానవ ప్రకృతికి,సంస్కృతికి  అనుసందాన మవ్వాలి  కాని ఇప్పుడున్నట్లు  మానవ ప్రకృతిని యంత్రం అవసరాలకు అనుసంధానించటం కాదు. ‘’ఆధునికత తెచ్చిన అనర్ధాన్ని విశ్లేషిస్తూ రాబర్ట్ నిస్బేట్ ‘’వ్యక్తియొక్క సాంఘిక ఆర్ధిక రాజకీయ సంస్కృతిక జీవితాన్ని తారు మారు చేసి, స్థానం భ్రంశం కలిగిస్తోంది .అందుకే గాంధీ భావాలే నేడు ఆచరణీయాలు ‘’అన్నాడు. హై స్టేట్  అంటే గ్లోబలైజేషన్ వలన వచ్చిన అభివృద్ధి. ఇది  యంత్రానికే,  భౌతికత కే అధిక ప్రాదాన్యమిస్తుంది కాని మనిషికి కాదు .దీనినే మాక్ ఫెర్సన్ ‘’కన్స్యూమర్ ఆఫ్ యుటిలిటీస్ యొక్క సృజనాత్మక శక్తులను పూర్తిగా తగ్గించటమే ‘’అన్నాడు .ఈ హైస్టేట్ ‘’పద్ధతికి ప్రత్యామ్నాయాన్ని  –‘’ఉత్పత్తి రంగం లో అత్యధిక ఉత్పత్తిని సామాన్య జనాలతో చేయించాలి ‘’ అని గాంధి చెప్పాడు .ఉత్పత్తి విధానం ,పంపిణీ పధ్ధతులను వికేంద్రీకరణ చేయాలి .ఈ కొత్త వికేంద్రీకరణ ఆర్ధిక విధానం చిన్న ,కుటీర పరిశ్రమల ఆధారంగా ఉండాలి ‘’అన్నాడు .

ఇప్పుడు జి .యెన్ .ధావన్ పరిశీలనలను గురించి తెలుసుకొందాం –‘’హెగెల్, మార్క్స్ ల లాగా గాంధీ, అభి వృద్ధిని మాండలికంగా  డయలెక్టిక్స్ గా వర్ణించాడు .అయితే మార్క్సియా న్ డయలెక్టిక్స్ చారిత్రాత్మకంగా  నిర్ణయి౦ప బడితే ,గాంధియన్ డయలెక్టిక్స్ చలన శీలంగా అంటే డైనమిక్ గా ,చర్యా విధానంగా ,సృజనాత్మకత ,అంతర్గత నిర్మాణ సంఘర్షణ గా నమ్మాడు .మార్క్స్ భావనలో భౌతిక శక్తి మార్పుకు పురుడుపోసే నర్సు .గాంధీకి అహింస అంటే నైతిక శక్తి .మన జీవుల అంతర్గత వారసత్వ  సిద్ధాంతం .హింస అనాగరక విధానం . 

  సాంఘిక ఆర్ధిక విధానం పై గాంధీ సిద్ధాంతం ధావన్ భావనకు పూర్తిగా విరుద్ధం .మార్క్స్  భౌతిక పరమైన విధానం పై ఆధారపడిన ధనస్వామిక  కాపిటలిస్టిక్ ఉత్పత్తి పై దాడి చేశాడు ..కానీ గాంధీ  సంపాదనే ముఖ్యమన్న భౌతిక నాగరకత పై ఎదురు తిరిగాడు .మార్క్స్ కొత్త రాజకీయ విధానం అంటే డిక్టేటర్ షిప్ ను కనిపెడితే , గాంధీ మాత్రం కొత్త సాంఘిక ఆర్ధిక విధాన సృజన జరగాలని భావించాడు .’

   గాంధీ దృష్టిలో నిజమైన ప్రగతి అంటే  భౌతిక అభి వృద్ధికి భిన్నమైన నైతికాభి వృద్ధి .రోమ్,ఈజిప్షియన్ నాగరకతలను,  భారత్ లోని ద్వాపరయుగాన్ని ఉదాహరించాడు  .ఇవి పతనం చెందటానికి భౌతిక సంపద పెరిగి ,నైతిక విలువలు పూర్తిగా క్షీణి౦చటమేఅని చెప్పాడు.ఈ సందర్భంగా ఇ.ఎఫ్ .షుమేకర్ ను గురించి కొంత తెలుసుకోవాలి .ఈయన  గాంధీ ప్రభావానికి లోనై’’ఆధునిక సాంకేతికత ,ఆర్ధికం అనే ఏక శిలా విధానం పూర్తిగా మార్చి  పునర్నిర్మించాలి ‘’అన్నాడు . ఆయన రచించిన గాంధీ ఫోటో కవర్ పేజీగా ఉన్న  పుస్తకం ‘’స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ ‘’లో గాంధీ జీ ఆర్ధిక సిద్ధాంతాలను  పాశ్చాత్య ఆర్ధిక వేత్తల ఆలోచనలను పరిచయం చేసి .గాంధియన్ విధానాలపై సీరియస్ గా అధ్యయనం జరగాల్సిన అవసరం ఉందని చెప్పాడు . ‘’షుమేకర్ మాని ఫెస్టో ‘’గా చెప్పబడుతున్న ఆయన విధానం ‘’ భూమి శక్తిని క్షీణి౦ప  జేస్తున్నవేగవంతమైన  మానవ జీవిత విధానం ,అనేక పరిష్కరి౦ప రాని సమస్యల వలయమై పోతోంది .రాబోయే  ప్రతి తరం, హింసాత్మకమై ,నైతికత మృగ్యమైపోతుంది .అతి తక్కువైన, వాస్తవమైన మానవ అవసరాలు తీర్చకుండా , అడ్డూ ఆపూ లేని విస్తరణ విధానం అనర్ధదాయకం ‘’.ఈయనే తర్వాత ఆర్దికత కు యుద్ధానికి మధ్య సంబంధాన్ని గాంధియన్ ఆలోచనలతో విశ్లేషించి చివరకు ‘’అహింసా విధాన ఆర్దికత అత్యంత అవసరం ‘’అని తేల్చి చెప్పాడు .

   యంత్రాలన్నీ నాశనం చేసి ,ఆదిమ యంత్రాను ప్రవేశపెట్టమని గాంధీ ఏనాడూ  చెప్పనే లేదు .కాని యాంత్రికం పై మోజు ను నియంత్రి౦చ మన్నాడు .1924 నవంబర్’’ య౦గ్ ఇండియా’’ పత్రికలో ‘’లేబర్ ఖర్చు తగ్గించే యాంత్రికత క్షంతవ్యం కాదు .లేబర్ ను పొదుపు చేస్తూ పొతే వేలాది స్త్రీ పురుష కూలీలు  ఆహారం లేక ఆకలితో అలమటించి మరణిస్తారు.కొద్దిమందికోసం కాలం ,లేబర్ పొదుపు చేయరాదు .జనులందరి కోసమే ఏ పనైనా చేయాలి .సంపద కొద్ది మంది చేతుల్లో మూలుగుతూ ఉండటం నేను ఒప్పుకోను.  సంపద అందరి చేతులలో ఉండాలన్నది నా దృఢమైన ఆలోచన . సంపద కూడబెట్టి  లేబర్ పొదుపు చేయటం అత్యాశ  ,దురాశ అవుతు౦దేకాని ,దాతృత్వం మాత్రం కాదు ‘’అని స్పష్టంగా చెప్పాడు .

   గాంధీ విధానం కేపిటల్ సేవింగ్ కాదు .లేబర్ సేవింగ్ టెక్నిక్ .ఇది అహింసకు దారి చూపుతుంది .కనుక ఆయన భావాలకు అనుగుణంగా సరైన టెక్నాలజీ లేక మధ్యేమార్గ సాంకేతికతను షుమేకర్ చెప్పినట్లు గా  ప్రవేశపెట్టాలి .ఈ భావన బీద మానవ వనరుల వినియోగంతో అతి సామాన్య సాధారణ పని ముట్లతో తక్కువ ఖరీదులో  పర్యావరణకు భంగం కలిగించని రీతిలో తయారు చేయించాలి .దీనివలన మానవ సృజన శక్తి సద్వినియోగపడి అందరికి మేలు కలుగుతుంది .

  ‘’సాంప్రదాయ ఎకనామిస్ట్  తక్కువ ఖర్చుతో ఎక్కువదూరం ఎక్కువ బరువు వెళ్ళటం గొప్పవరం గా ఇదే సరైన విధానంగా భావిస్తాడు .దీనివలన అధిక ఉత్పత్తి ని తక్కువ వనరులతో సాధించవచ్చు అని చెబుతాడు .కానీ గాంధీ ‘’స్థానిక ,తక్కువ దూర రవాణా ను పూర్తిగా అందరూ ప్రోత్సహించాలి. కాని ఎక్కువ సేపు ఆగటం ను నిరుత్సాహపరచాలి .దీనివలన మానవ  ప్రావీణ్యత పెరిగి ,,పట్టణీకరణ తగ్గి , మానవ సమగ్రత  పెంపొందుతుంది .లేకపోతే మూలాలు  లేని శ్రామిక వర్గం విపరీత౦  గా పెరిగి, వ్యవస్థ వినాశానికి దారి తీస్తుంది ‘’అని వాదించాడు .

   వారణాసి లో 1973లో  గాంధీ స్మారక ఉపన్యాసం చేస్తూ షు మేకర్ ‘’కొందరి చేతుల్లో మూలుగుతున్న సంపద మొత్తం ప్రపంచాన్ని 1-వనరులు 2-జీవావరణం 3-పరాయీకరణ అనే మూడు ఒకదానితో ఒకటి సంబంధమున్న  సంక్షోభాలకు గురి చేస్తోంది ‘’అని హెచ్చరించాడు .ఇందులోని దార్శనికత ఏమిటో చూద్దాం .2008లో వచ్చిన వనరుల సంక్షోభం వలన ఆర్ధిక మాంద్యం విపరీతంగా పెరిగింది .జీవావరణ సంక్షోభం మన ఆలోచన విధానం పై ప్రభావం చూపి రినో లో ,కోపెన్ హాం లో అంతర్జాతీయ సదస్సులు నిర్వహించి పరిష్కారాలను వెదుక్కోవాల్సి వచ్చింది .పరాయీకరణ సంక్షోభం పై రెండిటి యొక్క ఫలితమే .

  జీవితాంతం మహాత్మాగాంధీ వ్యక్తి వలన  మంచి సమాజం నిర్మి౦పబడుతుంది అనే సిద్ధాంతాన్నే ప్రచారం చేశాడు .ఆయన ఆర్దికత వ్యక్తి నిస్టమే కాని ,ఉత్పత్తి నిష్టం కాదు .ఇదే మానవ భద్రతకు అత్యంత శ్రేయోదాయకమైన విధానం (సమ్మన్ బోనం ).గాంధీజీ స్వదేశీ  ,ఆహార౦కోసం శ్రమ లలోని ప్రాముఖ్యత ను నొక్కి వాక్కా ణి౦చేవాడు .చరఖా తో గ్రామీణ భారతాన్ని నిర్మించటం గాంధీ ఆలోచన .ఇది కాలం చెల్లిన భావన అని చాలామంది అనుకొంటారు ,కాని ఇందులోని లాజిక్,  శక్తి, సామర్ధ్యం  ఆయన మరణం తర్వాతనే అందరికీ అర్ధమైంది . ,ఉదాహరణకు ఖాదీ పరిశ్రమ వికేంద్రీకరణ జరిగి ఉత్పత్తి ఎక్కడ జరుగుతుంటే దానికి  దగ్గరలో చేరింది .అలాగే చేతి వృత్తి తో తయారయ్యే వస్తువుల విషయం లో కూడా అంతేజరిగింది .ఇదీ గాంధీజీ ఆర్దికత .ధనికుల కబంధ హస్తాలనుండి పేదలకు విముక్తికలగాలని ఆయన చిరకాల వాంఛ .ఆర్ధిక చర్యకు నూలువడకటం ప్రత్యామ్నాయం కాదు అది ఒక అనుబంధ పోషక విధానం మాత్రమే అని మరువరాదు .

  స్వదేశీ అనేది ఎక్కడో దూరంగా ఉన్నవారికి కంటే  మన చుట్టూ ప్రక్కల వారికి సేవ చేయటమే .ఆయనే ఒకసారి ‘’స్వదేశీ ఒక బాయ్ కాట్ అంటే బహిష్కరించాల్సిన  ఉద్యమం కాదు .ఇది ప్రతీకారం కాదు .అందరూ పాటించాల్సిన, అదొక మతపరమైన నియమం .దీనికి చట్ట పరమైన జోక్యాన్ని నేను ఏవగిస్తాను .  విదేశీ వస్తువులు  రాకుండా గట్టి భద్రత కావాలని  నేను వాదించను ‘’అని స్పష్టంగా చెప్పాడు .

   ఆహారానికి శ్రమ అన్న గాంధీ సిద్ధాంతం నిర్మాణాత్మక అభి వృద్ధికి రాచమార్గం .1937అక్టోబర్ ‘’హరిజన ‘’ పత్రికలో ‘’అందరూ ఆహారం కోసం శ్రమిస్తే ,ఇక అందరికీ పుష్కల౦ గా ఆహారం, విశ్రాంతి లభిస్తాయి .బౌద్ధిక శ్రమ సాంఘిక సేవలో  ఉత్కృష్ట మైన సేవ .’’అని రాశాడు .అసలు తిండికోసం శ్రమ పడాల్సిన అవసరం  ,నూలు వడకాల్సిన  అవసరం లేని తన  గురించి చెబుతూ ఆయన ‘’ఎందుకంటె నాకు చెందనిది నేను తింటున్నాను కనుక ‘’అన్నాడు .

   గాంధీజీ  జీవించిన కాలం లోఆయనను వ్యతిరేకి౦చిన వారూ, ఆయనకు దూరమైనవారు కూడా ఆయన భావాలకూ చేతలకూ కలవర  పడ్డారు .వీళ్ళనే కాదు ఆయనను పూర్తిగా సంర్ది౦చే అనుయాయులు కూడా అంతే కలవరపాటుకు గురయ్యారు .అందులో గురుదేవ్ రవీంద్రనాధ టాగూర్కూడా ఉన్నాడు . ‘’స్వరాజ్ అంటే గందర గోళం .పక్షి ఉదయం నిద్రలేవగానే ఆహారం కోసం మాత్రమే ఆలోచించదు.దాని రెక్కలు ఆకాశం కేకకు స్పందిస్తాయి .’’అని వ్యాఖ్యానించాడు .దీనికి సరైన సమాధానంగా గాంధీజీ ‘’కవి రేపటి కోసం జీవిస్తాడు .వివేకంగా ప్రవర్తి౦చ మంటాడు .కాని నేను పక్షులను బాధతో గమనిస్తాను .అవి బలం కోసం పొగడ్తలకోసం రెక్కలు అల్లల్లాడించవు.భారత ఆకాశం లోని మానవ విహంగం విశ్రాంతి నటించే ముందు బలహీనపడుతుంది .బాధ పడుతున్న రోగిని కబీర్ పాట తో ఉపశమింప జేయటం   నాకు సాధ్యంకాని పని   ‘’ అని దిమ్మ తిరిగే సమాధానమిచ్చాడు తాను గురుదేవుడుగా భావించే టాగూర్ కు శిష్యుడైన మహాత్మా గాంధీజీ .

  హృదయ నేత్రం తో గమనించాల్సిన ఈ అంతర్ దృష్టి  గాంధీజీ ని మిగిలినవారందరికంటే వేరు చేసి ప్రత్యేకంగా చూపిస్తుంది .ఈ రోజు గాంధీజీ జీవించి ఉన్నట్లయితే  నిజమైన ఆర్ధిక అభి వృద్ధి ,మానవ భద్రతా సూచకంగా  ధాయ్ లాండ్ దేశం జి.డి.పి.స్థానం లో ఎన్.హెచ్.పి.అంటే ‘’నేషనల్ హాపినెస్ ప్రొడ్యూసేడ్’’ సూత్రాన్ని ప్రవేశ పెట్టటాన్ని బాధాకరంగా అంగీకరించి ఉండేవాడు .

  ఆధారం –ఆశుతోష్ పాండే సంకలనం చేసిన ‘’Relevence Of Gandhi in 21st.Century’’పుస్తకం లో రజనీకాంత్ పాండే ,చంద్రమోహన్ ఉపాధ్యాయ సంయుక్తంగా రాసిన ‘’Gandhian Perspective On Human Security ‘’వ్యాసం .

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-3-19-ఉయ్యూరు

 image.png

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

ఇంగ్లాండ్ కాల్పనికవాద కవయిత్రి –ఎలిజబెత్ బారెట్ బ్రౌనింగ్ -గబ్బిట దుర్గా ప్రసాద్-విహంగ మహిళా వెబ్ మాసపత్రిక -మార్చి

6-3-1806న జన్మించిన ఎలిజబెత్ బారెట్ బ్రౌనింగ్ ఇంగ్లాండ్ లోని డర్హా౦ లో తండ్రి కున్న పన్నెండుగురు సంతానం లో పెద్దది .ఆరో ఏటనుంచే కవిత్వం రాసింది

image.png

.ఆమె కవితలన్నిటిని తల్లి జాగ్రత్త చేసి ఉంచింది .ఈ కవితా సంపుటి ఇప్పటికీ సజీవంగా ఉంది .ఆంగ్లకవుల కవితా సంపుటాలలో ఇంతటి సజీవ కవితా సంపుటం లేనే లేదు .పదిహేనవ ఏటనే ఆమెకు తీవ్రమైన తలనొప్పి, వెన్ను నొప్పి వచ్చి జీవితాంతం బాధించాయి .తర్వాత కాలం లో ఊపిరి తిత్తుల సమస్యలేర్పడి క్షయ వ్యాధికి గురైంది .బాధ నివారణకుచిన్నప్పటి నుంచే ‘’లాడనం ‘’వాడటం మొదలెట్టింది .ఇది ఆమె ఆరోగ్యాన్ని మరింత కుంగదీసింది .1937-38లో తీవ్ర అనారోగ్యానికి గురైంది లండన్ వదిలి టార్క్వె లో ఉంది .1940లో ఆమె సోదరుడు సామ్యుల్ జమైకాలో జ్వరం తో చనిపోవటం ,మరో సోదరుడు ఎడ్వర్డ్ పడవ ప్రమాదం లో మరణించటం ఆమెను తీవ్రంగా కలచి వేసి ఆరోగ్యాన్ని మరింత దెబ్బ తీశాయి . వంటరిగా పై అంతస్తులో ఉంటూ నెమ్మదిగా కోలుకోన్నది

ఎలిజబెత్ యవ్వనం లో ఉండగా మొదటి కవితా సంపుటి ప్రచురించింది .1840లో ఆమె 36 వ ఏట సంపన్నుడైన ఆమె కజిన్ జాన్ కెన్యాన్ సాహిత్య సంస్థకు పరిచయం చేశాడు.ఆమె కు తోడుగా ఒక కుక్క ‘’ఫ్లష్ ‘’ను ఇచ్చాడు. దీన్ని అపురూపంగా ఆమె పెంచుకొన్నది .ఈ కుక్క చరిత్రను వర్జీనియా ఉల్ఫ్ ‘’ఫ్లష్,ఎ బయాగ్రఫి ‘’గా రాసింది .1841నుండి మూడేళ్ళు నిరంతరంగా కవిత్వం, వచనం ,రాస్తూ అనువాదాలూ చేసింది .1942లో ‘’ది క్రై ఆఫ్ ది చిల్డ్రన్ రాసి ప్రచురించింది .దీనిలో బానిసత్వాన్ని ఎదిరిస్తూ బాలకార్మిక వ్యతిరేక చట్ట సాధనకు తీవ్ర కృషి చేసింది .ఇదే సమయం లో ‘’ఎ న్యు స్పిరిట్ ఆఫ్ ది ఏజ్’’ అనే వచన సంపుటి రాసింది . ప్రకృతి కవి విలియం వర్డ్స్ వర్త్ మరణించగానే ,బ్రిటిష్ ఆస్థానకవి పదవికి టెన్నిసన్ కవితో పోటీపడింది .

1844లో ఆమె ప్రచురించిన రెండు కవితా సంపుటులు ‘’ఎడ్రామా ఆఫ్ ఎక్జైల్ ,’’ఎ విజన్ ఆఫ్ పోయెట్స్ ‘’ గొప్ప విజయం సాధించి ఆంగ్ల రచయిత రాబర్ట్ బ్రౌనింగ్ ప్రశంసలు పొందింది ‘ది ఏస్తేనీయం ‘’ విమర్శనాత్మక వ్యాస సంపుటిగొప్ప పేరు తెచ్చింది .బ్రౌనింగ్ ల ఇద్దరిమధ్యా ప్రేమాయణం ఉత్తరాలద్వారా సాగి, ఆమె తండ్రి ఒప్పుకోడేమోనని రహస్యంగా పెళ్లి చేసుకొన్నారు .ఈ పెళ్ళితో తండ్రి ఆమెను దూరం పెట్టి ఆమెకు ఆస్థిలో వారసత్వ హక్కు లేకుండా చేశాడు . బ్రౌనింగ్ దంపతులు ఇంగ్లాండ్ వదిలి 1946లో ఇటలీ వెళ్లి స్థిరపడ్డారు ఆమె దగ్గరున్న డబ్బు తోనే సంసారం గడిఅపారు , ఆమె మళ్ళీ తిరిగి రాలేదు .వీరి కొడుకు ఎలిజబెత్ బర్రేట్ బార్రేట్ .ఇతనిని ముద్దుగా ‘’పెన్ ‘’అని పిలుచుకోనేవారు .

భర్త బ్రౌనింగ్ ప్రోత్సాహం తోప్రేమకు సంబంధించిన ఆమె కిష్టమైన ‘’సాన్నేట్ ‘’లు రాసి విశేష కీర్తి గడించింది .కవిమండలిలో గొప్ప గుర్తింపు పొందింది .విలియం మాక్ పీస్ ,ధాకరే,శిల్పి హారిఎట్ హోస్మర్ ,జాన్ రస్కిన్, కార్లైల్ వంటి ప్రముఖులతో గొప్ప పరిచయాలేర్పడ్డాయి .పాత స్నేహితుడు హంటర్ ,తండ్రి మరణాలు ఆమె ఆరోగ్యం పై ప్రభావం చూఫై ఆరోగ్యం క్షీణించింది .ఫ్లారెన్స్ లో కొంతకాలమున్నారు .1860లో ‘’పోయెమ్స్ బిఫోర్ కాంగ్రెస్ ‘’రాసి భర్త బ్రౌనింగ్ కు అంకితమిచ్చినది ఈ కవితలలో 1859లో ఇటలీ పోరాటాలపై సానుభూతి చూపింది .ఇది ఇంగ్లాండ్ లో కల్లోలం రేపి సాటర్ డే రివ్యు, బ్లాక్ వుడ్ పత్రికలు ఆమెను ‘’మూఢురాలు’’గా ముద్ర వేశాయి .ఆమె చివరి రచన ‘’ఎ మ్యూజికల్ ఇన్ స్ట్రుమెంట్ ‘’ఆమె మరణానంతరం వెలువడింది .

బ్రౌనింగ్ సోదరి హెన్రి ఎట్టా 1860నవంబర్ లో చనిపోయింది .బ్రౌనింగ్ దంపతులు 1960-61లో రోమ్ లో గడిపారు .ఎలిజబెత్ ఆరోగ్యం బాగా క్షీణించగా ఫ్లారెన్స్ కు జూన్ మొదట్లో తిరిగి వచ్చారు.క్రమ౦గా బలహీనురాలౌతూ బాధ మర్చిపోవటానికి మార్ఫిన్ వాడుతూ నరకయాతన అనుభవిస్తూ29-6-1861న కాల్పనికవాద కవయిత్రి ఎలిజబెత్ బార్రెట్ బ్రౌనింగ్ 55వ ఏట భర్త బ్రౌనింగ్ చేతులలో హాయిగా సంతోషంగా చిన్నపిల్లలాగా చివరిమాటగా ‘’బ్యూటిఫుల్ ‘’అంటూ మరణించింది .ఫ్లారెన్స్ లోని’’ ప్రొటేస్టంట్ ఇంగ్లిష్ సెమిటరి ‘’ లో ఆమెను ఖననం చేశారు .

ఎలిజబెత్ కవితలు ఇంగ్లాండ్ అంతటా ,అమెరికాలోనూ బాగా ప్రచారమయ్యాయి .ఆమె ప్రభావం చాలామంది కవులపై ఉంది .అమెరికన్ కవి ఎడ్గార్ అల్లెన్ పో ఎలిజబెత్ రాసిన ‘’లేడి జేరాల్డైన్ కోర్ట్ షిప్ ‘’కవితకు ఆకర్షితుడై ,ఆమె ప్రయోగించిన ఛందస్సును తనకవిత’’ ది రావెన్ ‘’లో ‘ఉపయోగించుకొన్నాడు .ఆమె కవిత్వాన్ని పో1845జనవరి ‘’బ్రాడ్వే జర్నల్ ‘’లో సమీక్షచేస్తూ ‘’ఆమె ప్రభావం అత్యున్నతం ,అంతకంటే ఉత్తమ కవిత్వం మనకు ఎక్కడా లభించదు. ఆమె కవితాకళ అతి స్వచ్చం ‘’ ‘’అన్నాడు .ఆమె కూడా పో రాసిన రావెన్ కవితను శ్లాఘించింది .అతడు తన ‘’రావెన్ అండ్ ఆదర్ పోయెమ్స్ ‘’ను ఆమెకు అంకితమిచ్చి ఆమెను మహిళా లోకం లో మాణిక్యం లాంటి కవి అన్నాడు.మరొక అమెరికన్ కవయిత్రి ఎమిలీ డికెన్స్ పైనా ఎలిజబెత్ ప్రభావం అధికమే .

ఎలిజబెత్ బ్రౌనింగ్ జీవితకాలం లో 13రచనలు ప్రచురిస్తే ,మరణానంతరం 14రచనలు వెలువడ్డాయి .విక్టోరియా యుగం నాటి కాల్పనిక కవయిత్రి ఎలిజబెత్ బారెట్ బ్రౌనింగ్ ‘’హౌ డు ఐ లవ్ దీ’’అనే ప్రసిద్ధ సానెట్ ఇప్పటికీ ప్రపంచమంతా మార్మోగుతూనే ఉంది . ప్రముఖ డాక్టర్ ,ఆంగ్లా౦ధ్ర కవిత్వాలను ఔపోసన పట్టిన కవి అనువాదకులు,విశాఖ వాసి రావి శాస్త్రిగారి తమ్ముడు , డా .రాచకొండ నరసింహ శర్మ గారు ఎలిజబెత్ బ్రౌనింగ్ రాసిన పోస్ట్ చేయని ప్రేమ లేఖలు లాంటి 44సానెట్ లను చక్కగా తెలుగులోకి అనువాదం చేసి 2018ఆగస్ట్ లో తమ 95వ జన్మ దినోత్సవ కానుకగా ప్రచురించారు .అంటే ఇప్పటికీ ఎలిజబెత్ ప్రభావం యెంత గొప్పగా ఉందొ చూడండి .’’లాంగ్ లివ్ ఎలిజబెత్ బ్రౌనింగ్’’ .

-గబ్బిట దుర్గాప్రసాద్ 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

image.png
image.png
Posted in రచనలు | Tagged | Leave a comment

నెల్లూరు లో సర్వేపల్లి చారిటబుల్ ట్రస్ట్ వారి ఉగాది పురస్కార ప్రదానం -4-4-19 గురువారం సాయంత్రం

Posted in సభలు సమావేశాలు, సమీక్ష | Tagged | Leave a comment

బాలా త్రిపుర సుందరి మంత్ర మహాయోగి శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు

image.pngనేను రాసిన ”సిద్ధ యోగిపుంగవులు ”పుస్తకం లోని ”బాలాత్రిపురసుందరి మంత్ర మహాయోగి శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు ” వ్యాసం మార్చినెల ”గురు సాయి స్థాన్ ”లో పునర్మిద్రితమైంది -దుర్గాప్రసాద్ 
image.png
image.png
image.png
Posted in రచనలు | Tagged | Leave a comment

నా దారి తీరు -117   పదవ తరగతి పరీక్షల డిపార్ట్ మెంటల్ ఆఫీసర్ గా  

నా దారి తీరు -117

 పదవ తరగతి పరీక్షల డిపార్ట్ మెంటల్ ఆఫీసర్ గా

అడ్డాడ హైస్కూల్ లో హెడ్ మాస్టర్ గా చేరి ,1998 జూన్ లో రిటైరయ్యే దాకా ప్రతి సంవత్సరం ఏదో ఒక స్కూల్ లో పదవతరగతి మార్చి పబ్లిక్ పరీక్షలకు ,సెప్టెంబర్  సప్లిమెంటరి పరీక్షలకు డిపార్ట్మెంట్ ఆఫీసర్ గా డి.యి.వో. ఆఫీస్ నుంచి నియామక ఉత్తర్వులు రావటం , నేను పని చేయటం జరిగింది .ఎక్కువ సార్లు గుడివాడలోనే డ్యూటీ పడింది .అందులో టౌన్ హై స్కూల్ లో ఏలూరు  రోడ్ లో  ఉన్న మిషన్ హైస్కూల్ లో ,మాంటిస్సొరి ఇంగ్లిష్ మీడియం ,ఆంధ్రనలంద మునిసిపల్ హై స్కూల్స్ లో చాలా సార్లు ,పామర్రు అస్సిసి లో ఒకటి రెండుసార్లు ఉయ్యూరు విఆర్ కే ఎం హైస్కూల్ లో ఒకసారి  చేశాను .చివరిసారిగా 1998  మార్చి పరీక్షలకు ఎలమర్రు హైస్కూల్ లో చేశాను .ఎక్కడ చేసినా చాలా స్ట్రిక్ట్ గా పరీక్షలు నిర్వహించి డిపార్ట్ మెంట్ నాపై ఉంచిన నమ్మకానికి పూర్తి న్యాయం చేశాను .గుడివాడ విశ్వభారతి లో అస్సలు డ్యూటీ పడలేదు .బహుశా పడకుండా వాళ్ళు మెయింటైన్ చేసినా చేసి ఉండచ్చు .డియివో ఆఫీస్ చుట్టూ తిరగటం  డ్యూటీ వేయించుకోవటం కొందరి పనిగా ఉండేది .అక్కేడేవరో గుమాస్తాను మంచి చేసుకొంటే ‘’ఆమ్యాయ్మ్యా’’ ఇస్తే  కావాల్సిన చోట డ్యూటీ పడేది .నాకు అసలు ఆ ధోరణే లేదు .డ్యూటీ పడితే సంతోషం పడకపోతే మరీ సంతోషం టైపు నేను .కనుక దాన్ని గురించి బెంగ ఎప్పుడూ లేదు .పడినప్పుడు నిక్కచ్చిగా చేయటమే నాపని .కనుక స్కూల్ వాళ్ళు భయపడి నాకు పడకుండా జాగ్రత్త పడిన సందర్భాలుకూడా ఉన్నాయి .అన్నీ చూస్తూ లొంగకుండా సమర్ధంగా చేశాను .అందరినీ సమానంగా చూడటం ,ప్రలోభాలకు లొంగక పోవటం నేను నడిచినదారి .అదే నాకు రహదారి అనిపించింది .చివర సారిగా ఎలమర్రు లో డ్యూటీ కత్తి మీద సాము గానే ఉంది .అది కాపీలకు పెద్దపేరు .కన్ను కప్పి మాయ చేసే వారెక్కువ .హెడ్ మాస్టర్ కూడా మంచి రిజల్ట్ కోసం కక్కుర్తి పడటం అలవాటే నని చాలా కాలంగా వింటున్నాను .శ్రీ హనుమంతరావు హెడ్ మాస్టర్ అని గుర్తు .ఆయన ఎం.ఇ. వో .చేసి మళ్ళీ  హెచ్ ఎం .ఏం. గా వచ్చాడు .అక్కడే కాశీ విశ్వవిద్యాలయం లో సంస్కృత ప్రొఫెసర్ గా ఉన్నడా . శ్రీ గబ్బిత ఆంజనేయ శాస్త్రిగారిల్లు హెడ్మాస్టర్ ఒక రోజు చూపించిన జ్ఞాపకం అప్పటికి ఆయన గురించి నాకు అస్సలు తెలియదు .ఎక్కడ డ్యూటీ పడినా ఉయ్యూరు నుంచే వెళ్ళటం అలవాటు .పోలీస్ స్టేషన్ నుండి ప్రశ్న పత్రాలు హెడ్మాస్టర్ నేనూ జాయింట్ గా ఏ రోజు కా రోజు తీసుకోవాలి .దానికో రిజిస్టర్ దానిలో సంతకాలు హడావిడి ఉంటుంది .క్వస్చిన్ పేపర్లు రెండు దఫాలుగా డివివో ఆఫీస్ పంపిణీ చేస్తుంది .ఆ సమయానికి డిపార్ట్మెంట్ ఆఫీసర్ హెడ్ మాస్టర్ వెళ్లి రిసీవ్ చేసుకొని  వెరిఫై చేసుకొని పెద్ద పెద్ద రేకు పెట్టెలలో పెట్టి సీలు వేయాలి .ఏ రోజు పేపర్ ఆ రోజు ఒక గంటముందు అందులోంచి జాయింట్ గా తీసు పోలీస్ ఎస్కార్ట్ తో హై స్కూల్ కు తీసుకువెళ్ళి అక్కడ ఇనుపబీరువాలో భద్రం చేసి  పరీక్ష ప్రారంభానికి పావుగంట ముందు ఇన్విజిలేటర్ల సంతకాలు పాకెట్స్ పై పెట్టించి రిజిస్టర్ మెయిన్ టైన్ చేసి అప్పుడు ఓపెన్ చేయాలి .ఏ రూమ్ కు ఎన్ని పేపర్లు ఇవ్వాలో ముందే తెలుస్తు౦ది కనుక ఆప్రకారం పెట్టి  మిగిలిన పేపర్లు కవర్ లో పెట్టేసి అకౌంట్ రాసి ఇద్దరూ సంతకం చేసి మళ్ళీ బీరువాలో పెట్టాలి .బిట్ పేపర్ ఒక పావుగంట ము౦దుమాత్రమే ఓపెన్ చేసి రూమ్స్ కు డిస్ట్రిబ్యూట్ చేయాలి .వీటిపై స్కూల్ స్టాంప్ వేయించాలి .అలాగే ఆన్సర్ పేపర్స్ పై స్కూల్ స్టాంప్   ఇన్విజి లేటర్  సంతకం ఉండాలి .ఆ రోజు సబ్జెక్ట్ కు సంబంధించిన క్వస్చిన్ పేపర్ ఇచ్చామో లేదో ఇద్దరూ జాగ్రత్తగా చూడాలి .అంతపకడ్బందీ గా పరీక్షలనిర్వాహణ ఉండేది .దీనికి కారణం ఉయ్యూరు మొదలైన చోట్ల పేపర్లు లీక్ అయ్యాయని బాగా బిగి౦చేశారు .లేకపోతె హెడ్ మాస్టర్ కే పేపర్లు వచ్చేవి. ఆయన అధీనం లోనే పేపర్లు ఉండేవి .ఆనమ్మకం పోవటం తో ఇంత తిరకాసు వచ్చి పడింది .ఒకరినొకరు నమ్మలేని స్థితి ఏర్పడింది .రిజల్ట్ కక్కూర్తికోసం ఇదంతా మనం చేజేతులా చేసుకొన్న అనర్ధమే .

  ఎలమర్రు లో చాల స్ట్రిక్ట్ గా పరీక్షలు జరిపించాను .ఇంవిజిలేటర్స్ పై కూడా నిఘా ఉంచాలి .వారిలో కొందరు లోకల్  ఒత్తిళ్లకు లొంగిపోతారు .కనిపెట్టి జాగ్రత్తపడాలి .అందులోనూ చివరి రోజుల్లో అప్పర్ ప్రైమరీ ఉపాధ్యాయులను కూడా ఇంవిజిలేటర్స్ గా నియమించటం జరిగేది .వాళ్ళు చాలా ఈజీ గోయింగ్ గా ఉండేవారు .కనుక మరింత జాగ్రత్త పడాల్సి వచ్చేది .కాపీలు ఉన్నాయేమో నని అందర్నీ ముందే చెక్ చేసి ఆడపిల్లలను లేడీ టీచర్స్ చేత చెక్ చేయించి అప్పుడు రూమ్స్ లోకి పంపేవాళ్ళం .అంటే కాపీలు లేవని మా భావన .అయినా ‘’ఎక్కడెక్కడో ‘’దాచి కన్నుకప్పేవారు .శల్య పరీక్ష చేయాల్సి వచ్చేది .నేను యెంత స్ట్రిక్ట్ గా ఉన్నా  స్లిప్పులు లాగేసి బయట పారేసే వాడినేకాని పరీక్ష నుంచి బయటికి పంపటం చేయలేదు .డిపార్ట్మెంట్ వాళ్ళు స్క్వాడ్ లు ఏర్పాట్లు చేసి ,ఆకస్మిక తనిఖీలు నిర్వహించేవారు .అప్పుడు పట్టుబడితెతప్పక బుక్ చేసేవాళ్ళం .ఇక ఆపరీక్ష ఖతం అయ్యేది .చాలా సార్లు వార్నింగ్ లు ఇచ్చేవాళ్ళం . భయపెట్టే వాళ్ళం .కాని మనకంటే ముదుర్లు ఉంటారు .పాపం పట్టుబడితే  వాళ్ళగతి అంతే .

  ఒకసారి నన్ను పామర్రు అస్సిసి హైస్కూల్ లో డిపార్ట్మెంట్ ఆఫీసార్ గా వేశారు .అప్పుడు  అడ్డాడ పిల్లలు అదే సెంటర్ లో పరీక్ష రాస్తున్నారు .ఇలా మా పిల్లలు పరీక్ష రాసే కేంద్రం లో నేను డిపార్ట్మెంట్ ఆఫీసర్ గా పని చేయటం న్యాయం కాదని అనిపించి పైఅదికార్లకు లెటర్ పెట్టాను .వారు నా విషయం బాగా తెలుసునని ఎక్కడపని చేసినా నిర్దుష్టంగా డ్యూటీ చేస్తానని కనుక ఆవిషయమై ఆందోళన చెందకుండా డ్యూటీ చేయమని చెప్పారు .అలాగే చేసి అందరి అభిమానాన్ని పొందాను నిజంగా ఇదొక సవాల్ వంటిది ఆ సవాల్ ను అధిగామించాగలిగాను .చివరిపరీక్షకాగానే ఇంవిజిలేతర్స్ తో గెట్ టుగెదర్ ఉంటుంది .అందులో ఈ విషయాలన్నీ చెప్పాను అప్పడు హెడ్ మిస్ట్రెస్ శ్రీమతి మేరీ అనిజ్ఞాపకం. ఆమెకూడా నన్ను నా పని తీరును బాగా మెచ్చారు .

.   అడ్డాడ హై స్కూల్ కు పబ్లిక్ పరీక్ష కేంద్రం కోసం తంటాలు

  ఒకప్పుడు అడ్డాడ హయ్యర్ సెకండరి స్కూల్ గా పరీక్షా కేంద్రంగా ఉండేది .కానిదగ్గరే రెండు కిలో మీటర్ల దూరం లో పెంజెండ్ర లో హై స్కూల్ వచ్చింది . అడ్డాడ సెంటర్ లో పెంజెండ్ర  వాళ్ళు వచ్చి  పరీక్ష రాసేవారు .కొంతకాలానికి పెంజెండ్ర సెంటర్ తెప్పించుకొన్నారు .పాస్ పర్సంటేజ్ పెంచుకోవాలని రెండు స్కూల్స్ వాళ్ళు పోటీపడి  కాపీలు చేయించి ఆతర్వాత ఒకరిపై ఒకరు ఫిర్యాదులు పెట్టుకోవటం  డిపార్ట్ మెంట్  ఎంక్వైరీ జరగటం  చివరికి రెండు స్కూళ్ళకు సెంటర్లు లేకుండా జరిగిందని చెప్పుకొనేవారు .నేను అడ్డాడలో చెరేనాటికే సెంటర్ పోయి మూడునాలుగేళ్ళు అయింది .

  మా స్టాఫ్ అంతా స్కూల్ ఇప్పుడు గాడిలో పడింది జిల్లాలో మంచి పేరు తెచ్చుకోన్నదికదా మళ్ళీ సెంటర్ కోసం ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయానికి వచ్చారు ..స్టాఫ్ మీటింగ్ లోకూడా చర్చించి ప్రయత్నిద్దామనుకొన్నాం  డిపార్ట్ మెంట్ కు హయ్యర్ అఫీషియల్స్ కుఅఫీషియల్ గా   లెటర్స్ పెట్టాం .గుడివాడ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గారిని కలిసి విషయం చెప్పాం .ఆయన రికమెండ్ చేస్తేనే ఫైల్ కదుల్తుంది .ఆయన తనకేమీ అభ్యంతరం లేదని కాని సెంటర్ ఇవ్వాలంటే కనీస సంఖ్యలో విద్యార్ధులు ఉండాలికనుక  అడ్డాడ తోపాటు జమీ గొల్వేపల్లి, పెంజేండ్ర ,ఎలమర్రు స్కూల్స్  అడ్డాడ సెంటర్ తమకు అభ్యంతరం లేదని సర్టిఫికేట్ ఇస్తే తానూ రికమెండ్ చేస్తానని చెప్పారు. అప్పుడు అధికారిగారు శ్రీ రామ చంద్రరావు గారని జ్ఞాపకం .ముక్కు సూటి మనిషి ప్రలోభాలకు  లొంగేవారుకాదు .అయినా మన ప్రయత్నం మనం చేయాలి కదా అని ప్రయత్నాలు ప్రారంభించాం ..

 నేనూ ,స్టాఫ్ సెక్రెటరి శ్రీ  దుగ్గిరాల  వీరభద్రరావు అనే సెకండరి గ్రేడ్ టీచర్ ,శ్రీ డి .నాగేశ్వరరావు అనే డ్రిల్ మాస్టర్ బాధ్యత మీద వేసుకోన్నాం. వాళ్ళిద్దరికీ ఈ స్కూళ్ళు బాగా పరిచయం  .ముందు గా పెంజె౦ డ్ర హెడ్ మాస్టర్ శ్రీ    రామమోహనరావు  నుకలిసి విషయం చెప్పాం  .ఆయన తనకు అభ్యంతరం లేదని చెప్పి స్టాఫ్  అభిప్రాయాన్నీ కమిటీ అభిప్రాయాన్నీ తీస్కోని వారూ అంగీకరించారని వ్రాతపూర్వకం గా మాకూ డిపార్ట్ మెంట్ కు  అంగీకార పత్రం రాసిచ్చారు .గొల్వేపల్లి వాళ్ళుకూడా అంగీకార పత్రం బేషరతుగా ఇచ్చారు .ఇక మిగిలింది ఎలమర్రు .ఎలమర్రు హెడ్ మాస్టర్ ను సంప్రదించాం.మొదట్లో నానుడుగా మాట్లాడారు .తర్వాత స్టాఫ్ మీటింగ్ లో చర్చించి తెలియజేస్తామన్నారు .కొంతకాలం తర్వాత స్టాఫ్ కు అంగీకారం కాదని చెప్పారు .మరికొంతకాలం తర్వాత కమిటీవారికి అసలు ఇష్టం లేదని చెప్పేశారు . ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు గుడివాడ ఉపవిద్యాశాఖాదికారు శ్రీ రామ చంద్ర రావు గారికి తెలియ జేస్తూనే ఉన్నాం .యలమర్రు సెంటర్ లేకపోతె అక్కడ పర్సెంటేజ్ రాదనీ వాళ్ళ ప్రగాఢ విశ్వాసం అని అర్ధమైంది కనుక వాళ్ళు కలిసిరారు అని నిశ్చయానికి వచ్చాం .వాళ్ళూ ఆ విషయం అధికారిగారికి చెప్పారు. ఒకరోజు శ్రీ రామచంద్రరాగారు మమ్మల్ని పిలిపించారు .వారి ఆఫీస్ కు వెళ్లాం .ఆయన ఉన్నది ఉన్నట్లు చెప్పారు .ఒక వేళ ఎలమర్రు వారు అభ్యంతరం చెప్పినా తానూ దాన్నికాదని  అడ్డాడ సెంటర్ కు రికమెండ్ చేయగలనని కానీ తర్వాత ఏదో తానుకక్కూర్తి పడి రికమెండ్ చేశాననే అభియోగం వస్తు౦ది కనుక ఏం చేయమంటారో మేరే చెప్పండి అని బంతిని మాకోర్ట్ లోనే విసిరారు .అప్పుడు నేను ‘’సార్!మీ వ్యక్తిత్వం మాకు తెలుసు .మీ మీద ని౦దపడటానికి మేము ఒప్పుకోము .మీ ముక్కుసూటితనం అలాగే కొనసాగించండి .మాకోసం మీరు ఫేవర్ చేశామని పించుకోవద్దు .సెంటర్ మాకు రాకపోయినా ఫరవాలేదు మీకు అపఖ్యాతి రాకూడదు ‘’అన్నాను ఆయన ఎంతో సంతోషించి ‘’దుర్గాప్రసాద్ గారూ !నన్ను బాగా అర్ధం చేసుకొన్నారు .ఈ మేటర్ ఇక్కడితో వదిలేద్దాం ‘’అన్నారు .మేమూ ఇక సెంటర్ విషయం పై ఆశా వదిలేసుకొని స్టాఫ్ కు ,కమిటీకి తెలియజేశాం .ఇలా ఎలమర్రు వారు పాస్ పర్సెంటేజ్ కోసం మాకు చెయ్యిచ్చారు .కనుక నేను రిటైరయ్యేదాకా సెంటర్ రానేలేదు .ఆతర్వాత ఎవరూ అంతగాట్టిగా ప్రయత్నం చేసిన దాఖలా లేదు. అడ్డాడ పిల్లలు పామర్రు సెంటర్ లోనే పరీక్ష రాశారు ,రాస్తున్నారు .

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -13-3-19-ఉయ్యూరు


Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

‘’దండీ మార్చ్’’ అనే ఉప్పుసత్యాగ్రహం

image.png

భారత స్వాతంత్ర్య పోరాటం లో కొన్ని సంఘటనలు నాటకీయంగా ఉత్తేజపూరితంగా చారిత్రాత్మకంగా నిలిచిపోయాయి .అందులో ఒకటి మహాత్మా గాంధీ చేబట్టిన దండి మార్చ్ .బ్రిటిష్ ప్రభుత్వం ఉప్పు పై వేసిన పన్ను కు నిరసన తెలియ జేయటమే అసలు ముఖ్య కారణం .కాని ఇ౦తకంటే తీవ్రమైన లోతైన ప్రభావశీలమైన ప్రాముఖ్యత పొందింది .ఈమార్చ్ స్వాతంత్ర్య పోరాటాగ్నికి పవిత్ర సమిధగా మారింది .ఇదే  స్వాతంత్ర్య  సత్యాగ్రహానికి   శాసనోల్లంఘన  కీలలను రాజేసింది .

   1929  డిసెంబర్ లో  అఖిలభారత కాంగ్రెస్ కమిటీ ‘’సంపూర్ణ స్వరాజ్యం ‘’ అనేదే దేశప్రజల నినాదంగాప్రకటించి 1930 జనవరి 26 న భారత దేశమంతటా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా అశేష జన సమూహాలతో నిర్వహించింది .ఈ నేపధ్యం లో గాంధీజీ కాంగ్రెస్ నాయకుడిగా మొదటి దశ  శాసనోల్ల౦ఘన౦  అనే   ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించాడు .

  సత్యాగ్రహం గురించి వైస్ రాయ్ కి  1930 మార్చి 2న నోటీస్ పంపిస్తూ అందులో బ్రిటిష్ ప్రభుత్వ అణచి వేత విధానాలవల్ల భారత దేశం శిధిలమై పోయిందని ,పేదప్రజల జీవనానికి అత్యవసరమైన ఉప్పు పై కూడా పన్నులు వేసి జీవన విధానాన్ని దెబ్బ తీసినందుకు నిరసనగా ఉప్పు పన్నుకు ప్రతీకాత్మక నిరసన తెలియ జేస్తున్నానని ,భారత స్వాతంత్ర్యం యెంత ముఖ్యమో తెలియ జేయటానికి ఇది నాంది అని తెలియ జేశాడు .తర్వాత వైస్ రాయ్ ఇచ్చిన పెడసరి సమాధానికి ‘’నేను మోకాళ్లమీద నిలబడి అన్నం పెట్టమంటే రాళ్ళు వేశారు’’అని దులిపేశాడు .

  తన ఉద్యమానికి గుజరాత్ లోని సముద్ర తీర గ్రామం అయిన దండి సరైన స్థలం అని గాంధి నిర్ణయించాడు .అహమ్మదాబాద్ లోని ఆశ్రమం నుంచి 241మైళ్ళదూరం అంటే సుమారు 360 కిలోమీటర్లలో ఉన్న దండి కి కొద్దిమంది ముఖ్య అనుచరులతోకలిసి 1930మార్చి 12న బయల్దేరి దండి మార్చ్ ని  నడిచి వెళ్లాలని నిశ్చయించాడు  .అగ్నికి ఆజ్యం పోసినట్లు మార్చి మొదటి వారం లో చాలా ఉద్రిక్తమైన కాలం గడిచింది .సర్దార్ వల్లభ భాయ్ పటేల్ ‘’బోర్సాద్’’ లో   ప్రజలను సమాయత్తం చేసి ,గాంధీకి బాసటగా సత్యాగ్రహులను పంపటానికి  జిల్లా అంతటా ఘన స్వాగతం పలకటానికి ఏర్పాట్లు చేయటానికి వెళ్ళాడు .కాని పటేల్ ను మార్చి 7 న బ్రిటిష్ ప్రభుత్వం’’ రాస్ ‘’లో అరెస్ట్ చేసి౦ది .దీనితో ఆగ్రహజ్వాల మరింత రాజుకొన్నది .అనుకోకుండా మార్చి 9న సబర్మతి నది ఇసుకపై లో 75 వేలమంది ప్రజలు స్వచ్చందంగా సమావేశమై గాంధీజీ సమక్షం లో  తామంతా ‘’సర్దార్ పటేల్ బాటలోనే నడిచి, భారత స్వాతంత్ర్యం సాధించేదాకా విశ్రమించమని , రాక్షస తెల్ల దొరల ప్రభుత్వానికి శాంతి లేకుండా చేస్తాం’’  అని శపథం లాంటి ఒక తీర్మానం ఆమోదించారు .దీని ప్రతిధ్వని దేశమంతటా మారు మ్రోగి ఊపు తెచ్చి ఉర్రూత లూగించింది .దేశం లోనేకాదు  విదేశాలనుండి కూడా గొప్ప ప్రోత్సాహం లభించింది .

  ఈ స్పందన గాంధీకి మరింత ఉత్సాహం కలిగించి దేశ విదేశీ విలేఖరులకు ప్రముఖులకు ఇంటర్ వ్యూలు ఇస్తూ తన పోరాట స్పూర్తి వివరిస్తూ ప్రార్ధన సమావేశాలలో ప్రజలను ఉత్తేజితులను చేస్తూ స్వాతంత్ర్య దీక్షను నిలబెట్టాడు .ఆశ్రమంలో సందర్శకులకు ప్రార్ధన సమావేశాలకు ఉన్న  పరిమితి తీసేసి ఎక్కువమంది కి అవకాశం కల్పించారు .ఈకాలం లో గాంధీకి మద్దతు నిస్తూ వేలాది మెసేజ్ లు వచ్చాయి .రివల్యూషనరి పార్టీ గాంధీని ‘’కామ్రేడ్ గాంధి ‘’అని సంబోధించి ,ఆయన అహింసా ఉద్యమానికి మూడేళ్ళు గడువు ఇస్తున్నట్లు ప్రకటించింది .జర్మనీ నుంచి ఒక డాక్టర్  ‘’మీ సేవలకు అభినందనగా ఒక వినయపూర్వక మనిషి ఉదయం సాయంత్రం  మీ విజయం కాంక్షిస్తూ ప్రార్ధన చేస్తున్నాడు ‘’అని రాశాడు .న్యూయార్క్ నుంచి రివరెండ్ హోమ్స్‘’గాడ్ గార్డ్ యు ‘’అనే మెసేజ్ పంపాడు .ఇవన్నీ గాంధీకి మద్దతుగా ఉన్నప్పటికీ , గాంధీజీ ఈ పాప్యులారిటి  చూసి  అసూయ చెంది బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ను అరెస్ట్ చేసి ఇబ్బంది పాలు చేస్తుందేమోనని భారత ప్రజలు  సందేహించారు .

  దండి మార్చి కి ముందురోజు మార్చి 11సాయంత్రం 10వేలమంది హాజరైన ప్రార్ధన సమావేశం లో గాంధీజీ ‘’బహుశా ఇదే నా చివరి ప్రసంగం కావచ్చు .ఒకవేళ రేపు ఉదయం దండి మార్చ్ కి ప్రభుత్వం నన్ను అనుంతి౦చి నాకూడా పవిత్ర శబర్మతి నదీ తీరం లో ఇదే నా చివరి ఉపన్యాసం కావచ్చు .బహుశా నా జీవితం లోకూడా ఇవే చివరి మాటలుకూడా కావచ్చు ‘’అని ప్రసంగం ముగించాడు .

  అనుకొన్న రోజు మార్చి 12ఉదయం 6-30కి  దండి మార్చ్ ప్రారంభించాడు శబర్మతి ఆశ్రమమం నుంచి మహాత్ముడు .దీనిని ఆశ్రమ జర్నలిస్ట్ ‘’గౌతమ బుద్ధ దేవుని మహాభి నిష్క్రమణ ‘’ గా అభి  వర్ణించాడు .బక్కపలచటి మనిషి చేతికర్ర ఊతంగా 61ఏళ్ళ వయసులో 78మంది సత్యాగ్రహులతో మార్చ్ ప్రారంభించాడు .ఈ సత్యాగ్రహులలో ఆంధ్రా బెంగాల్ బీహార్ బాంబే గుజరాత్ కర్నాటక కేరళ కచ్ మహారాష్ట్ర పంజాబ్ రాజపుటానా సింద్ తమిళ్ నాడు ,ఉత్తరప్రదేశ్ ఉత్కల్  నేపాల్ వారున్నారు .హిందువులతోపాటు ఇద్దరుముస్లిం లు ఒక క్రిస్టియన్  ఇద్దరు హరిజనులు కూడా ఉన్నారు .అంటే మొత్తం భారత దేశమంతా రిప్రజెంట్ అయింది .సత్యాగ్రహులవెంట వేలాది ప్రజలుస్త్రీ పురుషులు  నడిచారు .దారి అంతా స్వాగత తోరణాలతోశోభాయమానంగా అలంకరించారు.

  బయలు దేరేముందు మహాత్ముడు మాట్లాడుతూ ‘’నా యాత్ర అమర నాథ్   బదరీ  కేదార నాథ యత్రలా అనిపిస్తోంది  .ఇది నా జీవితం లో నిజంగా పవిత్ర తీర్ధయాత్రయే’’అన్నాడు .మోతీలాల్ నెహ్రు ‘’శ్రీరాముడు లంకకు చేసిన యాత్ర లా చారిత్రాత్మకం గాంధీజీ దండి యాత్ర ‘’అన్నాడు .డా ప్రఫుల్ల చంద్ర రే (పిసి రే )’’మోజెస్ నాయకత్వం లో ఇస్రలైట్లు చేసిన దేశత్యాగం ‘’లా ఉందన్నాడు .మహాత్ముడు ఇంతకూ ముందు ఎన్నో ప్రదేశాలు కాలినడకన నడిచి వెళ్ళాడు .కాని ఈ యాత్ర అంతా దుమ్ము ధూళీ సరైన నడకదారి లేనిది .రాళ్ళు రప్పలతో ఇబ్బందికరమైనది .అయినా మొక్కవోని దీక్షతో స్వాతంత్ర్యజ్వాల హృదయం లో జ్వలిస్తుండగా కోట్లాది భారతీయులా ఆకాంక్ష  సంపూర్ణ స్వరాజ్యం కోసం నడిచిన చారిత్రాత్మకమైన యాత్ర దండి యాత్ర .అహ్మదాబాద్ నుండి 13మైళ్ళ దూరం లో ఉన్న ‘’అస్లాలి’’లో మొదటి రోజు యాత్ర పూర్తవగానే గాంధీజీ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ ‘’ప్రభుత్వం ఉప్పు పన్ను ఎత్తి వేసేదాకా ,భారత దేశానికిస్వాతంత్ర్యం వచ్చేదాకా నేను మళ్ళీ శబర్మతి ఆశ్రమం లోకి అడుగు పెట్టను ‘’అని హర్ష ద్వానాలమధ్య తన మనో నిశ్చయాన్ని మళ్ళీ ప్రకటించాడు .

  ఈ రోజు ‘’మార్చి 12దండియాత్ర రోజు’’ సందర్భంగా పురాజ్ఞాపకాలు

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-3-19-ఉయ్యూరు 

image.png

image.png
Posted in రచనలు | Tagged | Leave a comment

నా దారి తీరు -116 సమర్దురాలైన ఉపవిద్యా శాఖాదికారిణి శ్రీమతి ఇందీవరం గారు

  నా దారి తీరు -116

   సమర్దురాలైన ఉపవిద్యా శాఖాదికారిణి శ్రీమతి ఇందీవరం గారు

నాదారి తీరు -115 ఎపిసోడ్ బాలసాహిత్య చక్రవర్తి శ్రీ ముదునూరు వెంకటేశ్వరరావు గారి గురించి 2018 జూన్ 12 న రాశాను .సుమారు 9నెలలతర్వాత 116 తో మళ్ళీ కొనసాగిస్తున్నాను .

  శ్రీ మతి ఇందీవరం గారి సర్వ సమర్ధత విని నేను మేడూరు నుంచి కావాలని గుడివాడ డివిజన్ అడ్డాడ కు వచ్చానని ఇదివరకే రాశాను .ఆవిడ చాలా డైనమిక్ పర్సనాలిటి .ఆమె పని చేసిన కాలం గుడివాడ జోన్ జిల్లాలో అన్ని జోన్ లకంటే ముందు ఉండటమేకాదు ఆదర్శంగా ఉండేది .అక్కడి హెడ్ మాస్టర్లతో సన్నిహిత పరిచయం సబ్జెక్ట్ టీచర్ల సమర్ధత ఆమెకు బాగా తెలుసు .వారిసేవలు విద్యా వ్యాప్తికి ఎలా విని యోగించుకోవాలో బాగా తెలిసిన ఆఫీసర్ ఆమె .ఫ్రూట్ ఫుల్ డిస్కషన్స్ తో ఆమె విజయాలు సాధించారు .పరీక్షల నిర్వహణ ,స్కూళ్ళను సమర్ధవంతంగా పని చేయించటం ,గొప్ప పర్యవేక్షణ వార్షిక తనిఖీలు ,అకస్మాత్తు తనిఖీలతో డివిజన్ అంతా ఎప్పుడూ అప్రమత్తంగా ఉండేది .స్కూల్ కాంప్లెక్స్ ల నిర్వహణ బాగా ఉండేది .సబ్జెక్ట్ టీచర్స్ కు ఓరిఎంటేషన్ క్లాసుల నిర్వహణ అర్ధవంతంగా  ఉండేది .గుడివాడ కాలేజీ లెక్చరర్ల సహాయ సహకారాలతో సబ్జెక్ట్ టీచర్స్ కు మంచి నైపుణ్యం అందించేవారు .సమర్ధులైన  హెడ్ మాస్టర్లు శ్రీ జోశ్యుల సూర్యనారాయణ మూర్తి గారు వంటి వారి అనుభవాన్ని విద్యాభి వృద్ధికి చక్కగా వినియోగింఛి గౌరవించేవారు ,మూర్తిగారు ఇంగ్లిష్ లో మహా నిపుణులైన ఉపాధ్యాయులు హెడ్మాస్టర్ .ఆయన పని చేసిన అంగలూరు హై స్కూల్  సెంట్ పర్సెంట్ రిజల్ట్స్ తో జిల్లాలోనే ఆదర్శ పాఠశాలగా గుర్తింపబడింది .ఒక రకంగా ఆయనతో మాట్లాడటమే ఒక ఎడ్యుకేషన్ .ఎన్నో విషయాలు  మనం గ్రహి౦చి రిఫ్రెష్ అవుతాం .అందరిని ఆదరంగా చూసి మర్యాదగా మాట్లాడటం ఆయన సహజ స్వభావం .మూర్తీభవించిన సౌజన్య మూర్తి మూర్తిగారు .ఆయన తో నాకు మంచి పరిచయమేర్పడింది .వారు నాకు సన్నిహితులయ్యారు  .ఇది గుడివాడ డివిజన్ కు నేను రావటం వలన మాత్రమే జరిగింది .

   ఇందీవరం గారిని మా అడ్డాడ హై స్కూల్ వార్షిక తనిఖీకి ఆహ్వానించాం .పానెల్ టీచర్స్ ను నియమించి ఆమె ఇన్స్పెక్షన్ కు వచ్చారు .అంతా సవ్యంగా ఉందని సంతోషించి మెచ్చారు .అప్పటినుంచి ఆమె నాపై ప్రత్యేక అభిమానం కనపరచేవారు .నేను ఎప్పుడు ఎక్కడమాట్లాడినా ఇందీవరంగారి సమర్ధత చూసే అడ్డాడ వచ్చాను అని చెప్పేవాడిని.గుడివాడలో జరిగే డివిజన్ హెడ్  మాస్టర్ల సమావేశం లో  సైన్స్ ఇంగ్లీష్ టీచర్స్ సమావేశం లో నాతో మాట్లాడించేవారు .నేను ప్రతిదీ నోట్స్ రాసుకోనేవాడిని .దాన్ని ఆధారంగా మాట్లాడే వాడిని .కనుక సమావేశం లో ఎవరెవరు ఏమి మాట్లాడింది మొత్తం మీద సమావేశ ముఖ్యననిర్ణయాలేమిటి అన్నీ పూస గుచ్చినట్లు చెప్పేవాడిని .అప్పటినుంచి  నేను రిటైర్ అయేదాకా నాకే ఈ బాధ్యతఆమె ఆమెతర్వత వచ్చిన ఉప విద్యా శాఖాధికారులు కూడా అప్పగించేవారు .అలాగే జిల్లాపరిషత్ చైర్మన్ గారి   ఆధ్వర్య౦ లో నూ డియివో గారి ఆధ్వర్యం లో జరిగే ప్రధానోపాధ్యాయుల సమావేశం లోనూ నాతోనే  అన్ని విషయాలు చెప్పించేవారు .అదంతా నాకు చాలా ఆనందంగా హుషారుగా బాధ్యతగా ఉండేది. సాటి వారు నన్ను అభిమాని౦చ టానికి ,నాతో సన్నిహితులవటానికి కారణాలు కూడా అయ్యాయి .

  గుడివాడ డివిజన్ లో ఇందీవరం గారికి సన్నిహితులైన  హెడ్ మాస్టర్లు  బేతవోలు హెడ్మాస్టర్ శ్రీ ప్రభాకరరావు ,టౌన్ హై స్కూల్ హెడ్మాస్టర్ శ్రీ నర్రా వెంకటేశ్వరరావు ,శ్రీ పొట్టి శ్రీరాములు హై స్కూల్ హెడ్ మాస్టర్  జోశ్యులమూర్తిగారితో పాటు  ఉండేవారు .

    పప్పెట్ షో నిర్వహించే క్రాఫ్ట్ మాస్టర్ శ్రీ తాతా రమేష్ బాబు ను ప్రత్యేక శిక్షణ కోసం పంపించి అతని సేవలు అన్ని స్కూళ్ళకు అందించేట్లు షోలు ఏర్పాటు చేయించేవారు .ఇక్కడే అతనితో పరిచయమై  ఆతర్వాత ఉయ్యూరు సాహితీమండలికి, సరసభారతి  కార్య క్రమాలకు కవి  సమ్మేళణాలకుఆహ్వానిస్తే వచ్చేవాడు ,కృష్ణా జిల్లా రచయితల సంఘానికి కోశాధికారిగా ఉండేవాడు .జాతీయ సభ ,మొదటి ప్రపంచ తెలుగు రచయితలసభ లకు మేమిద్దరం కలిసిపని చేశాం కూడా .విజయవాడ రేడియో స్టేషన్ డైరెక్టర్ మాన్యశ్రీ మంగళ గిరి ఆదిత్యప్రసాద్ గారితో చాలా సాన్నిహిత్యం ఉండేది .ఆయన జీవిత చరిత్ర  అతడు రాస్తున్నట్లు ప్రసాద్ గారే నాకు చెప్పారు .ఉయ్యూరులో మా సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లోజరిగిన సరసభారతి కార్యక్రమం లో  ఆదిత్యప్రసాద్ గారు రెండుగంటలసేపు తెలుగుపాట పుట్టుక గురించి సోదాహరణంగా వీనుల విందైన సంగీత౦  తో మాట్లాడినప్పుడు కూడా అతడు వచ్చాడు .చాలా కవితా సంపుటులు రాసి ప్రచురించాడు .రేడియోలో చాలా ప్రసంగాలు చేశాడు .నేను రిటైరయ్యాక ఉయ్యూరు ఫ్లోరా స్కూల్ లో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ గా 2000 నుండి 2002వరకు పని చేసిన కాలం లో అతన్ని ఆహ్వానించి పప్పెట్ షో ఏర్పాటు చేయించాను .కుటుంబంతో వచ్చి చేసి మెప్పు పొందాడు . కేన్సర్ సోకి దానితో పోరాటం చేసి అందరికీ పత్రికాముఖంగా ధైర్యం చెప్పి సుమారు మూడేళ్లక్రితం మరణి౦చాడు .ఇలాంటి మెరికల్లాంటి వారి  నెందరినో ఇందీవరం గారు తయారు చేశారు .ఈ విధంగా గుడివాడ డివిజన్ ఇందీవరంగారి హయాం లో నిత్యకళ్యాణం పచ్చతోరణంగా  అభి వృద్ధి మూడు పూవులు ఆరుకాయలులాగా ఉండేది .

   శ్రీమతి ఇందీవరం గారు గుడివాడలోనే రిటైరయ్యారు .ఆమె వీడ్కోలు అభినందన సభ పొట్టి శ్రీరాములు హైస్కూల్ లోసాయం వేళ చాలా ఘనంగా నిర్వహించారు .అన్ని స్కూళ్ళ  హెడ్ మాస్టర్లు హాజరయ్యారు. పట్టు చీరెలు పుష్పహారాలు ఆత్మీయ బహుమతులతో నభూతో గా జరిగిన కార్యక్రమం లో జిల్లాపరి షత్ చైర్మన్  డియివో గార్లు వేదికనలంకరించి ఇందీవరంగారిని ఘనంగా సత్కరించి ఆమె విద్యా సేవను సమర్ధతను బహుధా ప్రశంసించారు .ఆమె కూడా తనకు గుడివాడ డివిజన్ అంటే ప్రత్యేకమైన అభిమానమని ఇక్కడివిద్యా కుటుంబం సర్వ సర్ధవంతమైనదని అందువలలననే ఏదైనా అద్భుతాలు సాధించాబడ్డాయి అంటే వారందరి సహాయ సహాకారాలవలననే ఇంతటి ప్రగతి లభించిందని చెప్పారు  .గుడివాడ డివిజన్ తన  ఆరవ ప్రాణంగా పని చేశానని  ఇక్కడ సాధించింది అంతా ఈ డివిజన్ కే అంకితం అనీ అన్నారు .తమలాంటి వారు ఎందరో వస్తూ ఉంటారు పోతూ ఉంటారు .కాని నిరంతరం విద్య మీద విద్యార్ధుల అభి వృద్ధిమీద దృష్టి ఉంచితే ఎవరైనా ఏదైనా సాధించవచ్చు అంటూ తనకు ఈ డివిజన్ లో అందించిన సహకారానికి  డిపార్ట్ మెంట్ కు  హెడ్ మాస్టర్లకు ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియ జేశారు .ఉత్తేజకరమైన ఆమె ప్రసంగం అందరినీ ఆకట్టుకొని ఆమె కృషికి ఆనంద బాష్పాలు రాల్పించింది  .

   శ్రీమతి ఇందీవరంగారి  గుడివాడ డివిజన్ లోని అడ్డాడ హై స్కూల్ లో హెడ్ మాస్టర్ గా పని చేస్తున్నందుకు గర్వ కారణం అయింది.ఆమె ప్రభావం నాపై చాలా ఉంది . .

   సశేషం

   మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-3-19-ఉయ్యూరు

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -34(చివరిభాగం )

  జనకుడు ‘’ఆతుర సన్యాసం ‘’విశేషాలు చెప్పండి మహాత్మా !’’అని అడిగాడు .’’మనసు వాక్కు చేత సన్య సి౦చాలి  .ఇది వేదమార్గం  దీనిననుసరిస్తే  బ్రహ్మవేత్త ఔతాడు.సంవర్తకాదులు ,పరమ హంసలు రహస్యమైన ఆచారాలు పాటిస్తూ ఇతరులకు ఉన్మత్తులుగా అనిపిస్తారు .పరమహంసలు త్రిదండం కమండలం ,శిక్యం , ,పవిత్ర జలపాత్ర,శిఖా ,యజ్ఞోపవీతాలను ‘’భూ స్వాహా ‘’అనే మంత్రం చేత జలం వదిలి ఆత్మ సాక్షాత్కారం పొందాలి .యదా జాత రూపజాతుడు అంటే దిగంబరుడు నిర్ద్వంద్వుడు ,నిష్పరిగ్రహుడు ,బ్రహ్మ సాక్షాత్కార వంతుడు ,పరిశుద్ధ హృదయుడు అయి ,ప్రాణ ధారణం కోసం నియమిత కాలాలలో కడుపు అనే పాత్రలో భిక్షాన్నం ఉంచాలి .లాభానస్టాలు సమానంగా భావించాలి  .శిధిల దేవాలయం, పుట్ట వృక్షమూలం ,కుమ్మరి ఇల్లు ,  అగ్ని హోత్ర శాల , ఇసుక దిబ్బ ,కొండగుహ ,చెట్టు తొర్ర సెలయేరు ఎడారి లలో ఎక్కడైనా నివసించాలి .నిర్మముడు ,అప్రయత్నుడు ,ప్రణవ ధ్యాన పరాయణుడు ,అంతర్ముఖుడు అయి, సన్యాసం తో దేహాన్ని త్యజించాలి ‘’అని చెప్పి భార్య మైత్రేయితో ‘’నేనూ ఊర్ధ్వాశ్రమానికి అంటే  సన్యాసాశ్రమానికి పోవాలను కొంటున్నాను.దీనికి నీ అనుమతి నాకు కావాలి .నీకు కాత్యాయినితో పాటు నా ధనాన్ని సమానంగా ఇచ్చేస్తాను ‘’ .అన్నాడు యాజ్ఞవల్క్యుడు.

   మైత్రేయి ‘’మీరు ఇచ్చే ధనమే కాదు  సమస్త ద్రవ్యాలతో కూడిన ఈ భూమి నంతా నాకు ఇస్తే మాత్రం నేను ముక్తురాలనౌతానా ?’’అని ప్రశ్నించింది .’’ముక్తికలుగదు కాని సుఖజీవనం లభిస్తుంది ‘’అన్నాడు .’’ముక్తినివ్వని ఆ ధనంనాకు వద్దు . మోక్షసాధన మే చెప్పండి ‘’అన్నది .’మైత్రేయిని దగ్గరకు రమ్మని కూర్చోబెట్టుకొని ఆప్యాయంగా ‘’నీకు ఇష్టమైన మోక్షసాధనం గురించి చెబుతాను .ఏకాగ్ర చిత్తం తో విను .భర్త తన ప్రయోజనం కోసం కాక ఆత్మ కోసమే ప్రియుడు ఔతాడు  .అలాగే భార్యాపుత్రులు డబ్బు అన్నీ తమ ప్రియానికై ప్రియం కాక ఆత్మ ప్రయోజనానికే ప్రియం ఔతాయి ..మనన నిధి ధ్యాసాదులవలన విజ్ఞానం చేతా సమస్తమూ తెలుస్తాయి .ఆత్మ స్వరూపాన్ని అతిక్రమించి ఏదీ ఉండదు .అప్పుడే సర్వం ఆత్మ స్వరూపమౌతుంది .నామ రూప వికారాలు కల జగత్తుకంటే పూర్వమే ప్రజ్ఞాన ఘన రూపమైన ఆత్మ ఉన్నది .వేదాలనుంచి వాదాలదాకా సకలానికి ముఖ్యస్థానం అదే .’’అన్నాడు . చర్మానికి సమస్త స్పర్శలు ,జిహ్వకు సకలరూపాలు ,నాసికకు అన్ని రకాలైన గంధాలు ,నేత్రానికి అన్ని రూపాలు ,చెవికి సకల శబ్దాలు మనసుకు సకల సంకల్పాలు  బుద్ధి సకల విద్యలకు ,చేతులు సకలకర్మలకు యోని సకలాన౦దానికి , గుదం సకల మల విసర్జనకు ,పాదాలు సకలగామనాలకు వాక్కు సకల వేదాలకు ముఖ్య స్థానాలౌతున్నాయి ‘’అని వివరించాడు.

  మైత్రేయి ‘’కనిపించేదంతా లయమైతే సర్వం బ్రహ్మం ఎలా ఔతుంది ?’’అని అడిగింది మైత్రేయి .’’బాహ్యాభ్యంతరం లేని ఆత్మ ప్రజ్ఞాన ఘనమైందే. అంటే విశేష జ్ఞానం యొక్క ఘన స్వరూపం ఔతోంది .ఈ ఆత్మ భూతాలనుండి పుట్టి ,వాటిని అనుసరించి మరణిస్తుంది .జ్ఞానోదయానికి ముందు విశేష జ్ఞానం కలిగి మరణం తర్వాత భేదమనేది లేని బ్రహ్మం ఔతుంది .’’అన్నాడు .’’తమరు పరబ్రహ్మం లో విరుద్ధ ధర్మాలున్నాయని చెప్పటం చేత నాకు భ్రాంతి కలుగుతోంది .ఇదివరకు జీవాత్మ విజ్ఞాన ఘన స్వరూపం అని చెప్పారు మీరు .చనిపోయాక జీవాత్మకు ‘’నేను వీడు ‘’అనే లక్షణాలు కల విశేష జ్ఞానం లేదని ఇప్పుడు అంటున్నారు ?’’అని అడిగింది .యాజ్ఞవల్క్యుడు ‘’నేనలా చెప్పలేదే .అజ్ఞానం చేత ఆత్మకు దేహే౦ద్రియ మైన జీవభావం కలిగింది .అది జ్ఞానం చేత నశి౦చగా ,శరీరాది సంబంధ మైన సంజ్ఞఅంటే నేను వీడు అనే భావం ఉపాధి లేకపోవటం వలన నీరు లేకపోతె చంద్రుని ప్రతిబింబం కనపడనట్లు లేకుండా పోతుంది . సర్వం ఆత్మ స్వరూపమైనప్పుడు దేనితో చూస్తాడు ఆఘ్రాణిస్తాడు రుచి చూస్తాడు పలుకుతాడు ?ఆత్మకంటే వేరే ఏదీ లేకపోవటం వలన ఇతరాలను తెలుసుకోవటానికి వీలే లేదు .నేతి నేతి నిశ్చయ భావనతో ఆత్మ ఆకారం లేనిదని తెలుసు కోవాలి .ఆత్మయే ఆత్మను తెలుసుకోవాలి .ఇదే అమృతత్వం ‘’అన్నాడు .’

   ఇలా యానవల్క్య మహర్షి బ్రహ్మవాదిని అయిన మైత్రేయికి అమృత తత్వాన్ని బోధించి సన్యసించి ,నిత్యాన౦దు డయ్యాడు .

 ఓం ఇతితత్సత్

  యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర సంపూర్ణం .

ఆధారం –ముందే చెప్పినట్లు శ్రీ భాగవతుల లక్ష్మీ పతి శాస్త్రి గారు రచించిన ‘’కణ్వ గురు వాజసనేయ యాజ్ఞ వల్క్య చరిత్రం ‘’.

 మనవి- దీనిని 10-9-2018లో అంతర్జాలం లో రాయటం మొదలుపెట్టి 25-9-18కి 7 ఎపి సోడ్ లు మాత్రమే రాసి ,మిగిలినదంతా ఆధ్యాత్మిక గందరగోళం మనకు అర్ధం కాదులే అనుకోని ఆపేశాను .తర్వాత మిగిలినవి ఎన్నో చాలారాశాను .సింగపూర్ నుంచి శ్రీధర్ ఫోన్ చేసి ఎందుకు ఆపేశారంటే సమాధానం చెప్పలేకపోయా .కొంత తీరిక దొరికాక మళ్ళీ 20-2-19న 8వ ఎపిసోడ్ ప్రారంభించి ,జాగ్రత్తగా పుస్తకం చదివి అర్ధం చేసుకొని మనసుకు పట్టించుకోని గహనమైన విషయాలను కూడా తేలికగా అర్ధమయ్యే ట్లు నాకు తెలిసిన౦త వరకు,అర్ధమైన౦త వరకు మీకు అందించే ప్రయత్నం చేసి పట్టు వదలని విక్రమార్కుడిలా ఇవాళ 11-3-19 న 34వ ఎపిసోడ్ తో పూర్తి చేశాను  .ఒక కారణజన్ముడైన మహాత్ముడు యాజ్ఞవల్క్య మహర్షి గురించి సంపూర్ణంగా రాసిన  అదృష్ట వంతుడనయ్యాను.

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -11-3-19-ఉయ్యూరు   

image.png

 

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -33

యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -33

             తురీయాశ్రమం

ఒకసారి మిధిలానగర వనం లో శిష్యులతో జనకమహారాజుతో ఉన్న యాజ్ఞవల్క్యునితో బృహస్పతి ‘’మహర్షీ !దేవుల అంటే ఇంద్రియాల ,దేవయజనాల అంటే ఇంద్రియ అధిష్టాన దేవతల,బ్రహ్మ సదనానికి కురుక్షేత్రం ఏది ?’’అని అడిగాడు .’’అవిముక్తమే కురుక్షేత్ర౦ .ఎక్కడికి పోయినా అదే కురుక్షేత్రం అనే భావన తో ఉండాలి .అందులోనే జీవకోటి ప్రాణాలు ఉత్క్రమణ చెందేటప్పుడు రుద్రుడు అంటే మనసు ,తారకము అంటే సంసార తరణకారణమైన బ్రహ్మం, ఆ కారణం వలన  అమృత వంతుడై మోక్షం పొందుతాడు కనుక అవిముక్తాన్ని సేవించాలి  ‘’అన్నాడు. మహర్షి.అత్రి ‘’అన౦త ,అవ్యక్తాత్మను ఎలా తెలుసుకోగలం ?’’ప్రశ్నకు ‘’ఉపాస్య మైన ఆత్మ అవ్యక్తం లోనే ప్రతిస్టింప బడి ఉంది. అది వరణలో, కాశి లో ప్రతిస్టింపబడి ఉంది. అన్ని ఇంద్రియాల పాపా లను నశి౦ప జేసేదే కాశి .అవిముక్తం యొక్క స్థానం లేక ధ్యాస భ్రువు  ఘ్రాణం ల యొక్క మధ్య ప్రదేశం .ఇదే ద్యౌర్లోకం అంటే మస్త ,కపాల రూప స్వర్గ లోకం.,పరలోకం అంటే చుబుకావ సానమైన భూలోకం  యొక్క సంధి అవుతుంది. అది అ౦తరిక్షలోకం తో సమానం .అన్నీ ఈ అవిముక్తం లోనే సంధానం చేయబడతాయి కనుక సంధి అని పిలుస్తారు బ్రహ్మవేత్తలు .దీనిలోనే ఉపాసిస్తారు ‘’అని వివరించగా శిష్యులు ‘’దేన్ని  జపిస్తే మోక్షం వస్తుంది?’’అని అడిగారు .’’శతరుద్రీయం జపిస్తే .అది అమృతం అనే పేరుకలది .వాటివలననే అమృతుడౌతాడు ‘’అని సెలవిచ్చాడు .

  జనకుడు ‘’సన్యాసం గురించి వివరించండి ?’’అని అడుగగా ‘’విరక్తి శూన్యుడు బ్రహ్మ చర్యం పూర్తి చేసి ,స్నాతకుడై మొదటి ఆశ్రమ౦ పై విరక్తుడుకావాలి. ఒకవేళ దానిమీదే ఆసక్తి ఉంటె ఒకటి నుంచి నాలుగు వేదాలు లేక షడంగాలు న్న స్వశాఖ కాని గురు శుశ్రూష పూర్వకంగా అధ్యయనం చేసి సమావర్తనం అనే కర్మ చే ముగించి యవ్వనం రాగానే గార్హస్త్యాశ్రమను  స్వీకరించాలి . దీనిపై ఇచ్చ లేకపోతే కందమూలాలు ఆహారంగా అగ్ని హోత్రం చేస్తూ  లేక అగ్ని హోత్రం లేకుండాకూడా అరణ్యం లో ఉండాలి. వనస్తాశ్రమ౦  తీసుకున్నాక దానిపై కోరిక లేకపోతే చతుర్దాశ్రమ౦ సన్యాసాశ్రమ౦  లేక ప్రవృజాశ్రమం తీసుకోవాలి .’’అని వివరించగా ‘’వైరాగ్యంకలిగితే సన్యాసం లో విశేషాలు వివరించండి ‘’?అని కోరగా ‘’బ్రహ్మ చర్య  గృహస్థాశ్రమం   వనాశ్రమం లలో దేనిలోను౦చైనా  సన్యసించ వచ్చు .వ్రతి కాని అవ్రతికాని స్నాతుడుకాని అస్నాతుడుకాని అగ్నిహోత్రుడుకాని అనగ్ని హోత్రుడుకానీ కూడా  సన్య సించ వచ్చు’’అనగా ‘’దీనికి కాలపరమైన నియమాలున్నాయా ?’’అడిగాడు జనకుడు ‘’ఎప్పుడు వైరాగ్యం పుడితే అప్పుడే సన్యాసిగా మారవచ్చు ‘’అన్నాడు మహర్షి .

  ‘’సాగ్నికుడికి సన్యాసం లో ఇష్టి విశేషాలేమిటి ?జనకుని ప్రశ్నకు ‘’కొందరు ప్రజాపతి దేవతా ఇష్టిని మాత్రమే చేస్తున్నారు .అది విధానం కాదు. అగ్ని దేవతాత్మక ఇష్టి నే చేయాలి .కారణం అగ్ని అంటే సాధనాత్మఅయిన ప్రాణం .తర్వాత దానికంటే గొప్పదైన’’ త్రైధాతవేయమైన ఇష్టి’’ చేయాలి. అంటే ఇంద్ర దేవతాకమైన ఇష్టి చేయాలి .ఇది సత్వం –శుక్ల రూపం ,రజము –లోహ రూపం ,కృష్ణము –కృష్ణ రూపం కలది కనుక ఆపేరొచ్చింది .దీన్ని యధావిధిగా పూర్తి చేసి  ‘’ఆయంతే’’అనే మంత్రం తో అగ్నిని ఆఘ్రాణి౦చాలి ‘’అని చెప్పగా  ‘’నిరగ్ని కులకు సన్యాస విధి ఏది ?అని ప్రశ్నించిన రాజుకు ‘’గ్రామం లేక శోత్రియ స్థానం నుంచి పవిత్రాగ్ని తెచ్చి విరజాహోమాన్ని పురుష సూక్తం తో యదా శాస్త్రంగా వ్రేల్చి పూర్ణాహుతి చివర ‘’అయంతే యోనిః’’అనే మంత్రం తో అగ్నిని ఆఘ్రాణి౦చాలి .ఒకవేళ అగ్నిహోత్రం లభించకపోతే జలాలలో హోమం చేయాలి కారణం జలాలే సర్వదేవతలు .ఉదకస్థలం లో పూర్ణాహుతి నిర్వహించి ‘’సర్వాభ్యోదేవతాభ్యో జుహోమి స్వాహా ‘’అనే మంత్రం తో హోమం చేసి హుత శేషాన్ని భుజించాలి .హుత శేషం రోగ నివారకం అమృతం  ప్రణవమే ఈ మూడురూపాల కు మోక్షం అని తెలుసుకోవాలి. అదేబ్రహ్మం దానినే జపించాలి ‘’అని స్పస్ట పరచాడు .’’

   ఆత్రిముని ‘’యజ్ఞోపవీతం లేనివాడు బ్రాహ్మణుడు ఎలా ఔతాడు “’అని అడుగగా ‘’స్వసాక్షికమే అంటే స్వయం ప్రకాశ రూపమే పరమహంసకు యజ్ఞోపవీతం .ప్రైషానంతరం శిఖా ,యజ్నోపవీతాలను ఉదకం లో పడవేసి  మూడు సార్లు ఆచమనం చేయాలి .ఇదే పరివ్రాజకులకు విధి .వీరాద్వం లో నడిచి కాని ,అనాశక వ్రతం ఆచరి౦చి కాని, నీటిలో పడికాని మహా ప్రస్థాన మెక్కి కాని శరీరాన్ని విడిచిపెట్టాలి .సన్యాసి కాషాయాంబర దారి  శిఖా కేశ మీసాలు లేనివాడు ,అపరిగ్రహుడు  శుచి  అద్రోహి ప్రాణం నిలవటానికి మాత్రమే  మాధుకరం భిక్ష చేసి  భుజించేవాడు అయితే బ్రహ్మ సాక్షాత్కారం పొందుతాడు ‘’అని విడమరచి వివరించాడు యాజ్ఞవల్క్యుడు .

   సశేషం

  మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -11-3-19-ఉయ్యూరు    

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -32

యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -32

ఉపాధుల గురించి చెబుతూ యాజ్ఞవల్యుడు ‘’జనన మరణ ప్రవాహరూపమైన సంసారం కల జీవుడు సంపూర్ణ పరబ్రహ్మమే .ఈ పరబ్రహ్మం దేహం లో బుద్ధితోకూడి విజ్ఞానమయమవుతుంది .మనసుతోకలిసి మనోమయమౌతుంది .ప్రాణం తోకలిసి ప్రాణమయమౌతుంది  .నేత్రాలతో నేత్రస్వరూపం  శ్రోత్రం తో శ్రోత్ర స్వరూపం అలాగే పృధ్వీ జల వాయు ఆకాశ తేజోమయ అజోమయ గ్రామమయ అకామమయం,క్రోధ అక్రోధమయం ,ధర్మ అధర్మమయ సర్వమయం అవుతోంది .కనుక మంచి చేస్తే మంచివాడు చెడు చేస్తే చెడ్డవాడు అవుతున్నాడు .కొందరు పురుషుని కామమయుడ౦టారు .కర్మఫలం అపేక్షించేవాడు కర్మఫలం పొందుతాడు .అతని మనసు దేనిమీద లగ్నమైతే అదే కర్మలి౦గ మవుతోంది .ఈలోకం లో చేసిన కర్మఫలం పరలోకం లో అనుభవించి ,కర్మఫలావసానం పొంది ,మళ్ళీ ఆలోకం నుంచి ఈలోకానికి కర్మలు చేయటానికే  వస్తాడు .  కర్మఫలం కోరక ,కోరికలు లేక ఆత్మకాముడు అవుతాడుఐన  వాడి ప్రాణాలు విడిచిపోవు .ఇక్కడే బ్రహ్మమై పరబ్రహ్మమౌతాడు .హృదయం లోఇహ పర కోరికలు లేనివాడు చావులేనివాడౌతాడు.ఈ శరీరం లోనే పరబ్రహ్మ అవుతాడు. ప్రాణమే బ్రహ్మము .ప్రాణమే జగత్తును ప్రకాశి౦ప జేసే  విజ్ఞాన స్వరూప తేజస్సు .’’అని చెప్పగా  ‘’మళ్ళీ వెయ్యి ఆవులనిస్తున్నాను.మోక్షం కలుగుతుంది అని చెప్పే మంత్రాల అర్ధం చెప్పండి  ‘’అన్నాడు జనకుడు .

   యాజ్ఞవల్క్యుడు ‘’పరమాత్మ స్వరూపమైన బ్రాహ్మణుడు బ్రహ్మ విద్యా రూపమైన మోక్షమార్గం తెలుసుకోవాలి .ఆత్మ తత్త్వం తెలిసి ,నేనే పరబ్రహ్మ అని అని ప్రత్యక్షం చేసుకోన్నవాడే సర్వానికి కర్త అవుతాడు .వాడే ఆత్మ. ఆత్మ వాడే .వాడికి సర్వం ఆత్మ. .సర్వానికి వాడే ఆత్మ .కనుక అద్వితీయం, ఏకం అయిన పరమాత్మ నేనే అని తెలుసుకోవాలి .పరబ్రహ్మాన్ని తెలుసుకొంటే ముక్తులౌతారు .తాను  నాశరహితమైన పరబ్రహ్మంను  తెలుసుకొని పరమాత్ముడనయ్యానని ఉపాసన చేస్తే, ఆ పరబ్రహ్మ తేజం ప్రాణానికి ప్రాణం నేత్రానికి నేత్రం ,మనసుకు మనసు అని తెలిస్తే పరబ్రహ్మాన్ని నిశ్చయంగా తెలుసుకోన్నవాడౌతాడు .సద్గురు ఉపదేశం, పరమార్ధ జ్ఞానం మనసును సంస్కరిస్తుంది .ఇలాంటి మనసు చేతనే పరబ్రహ్మం ను తెలుసుకోవాలి ‘’అన్నాడు మహర్షి .

  జనకుడు ‘’వాక్కు ,మనసులకు అతీతుడైన పరాబ్రహ్మాన్ని చూడటానికి మనసు ఎలా సాధనం అవుతుంది ?’’అని ప్రశ్నించాడు .మహర్షి ‘’మనసు పరబ్రహ్మాన్ని గోచరి౦ప నిది అయినా , శ్రవణ మనన నిధి ధ్యాసాదులచేత సంస్కరి౦ప బడి పరబ్రహ్మాకారం అవుతుంది .అలాంటి మనసు చేత పరబ్రహ్మను  అనుసరించి  చూడాలి .పరబ్రహ్మ దర్శన విషయం లో ఏకత్వం లేదు .ఇలా చూసినవాడు మరణం వలన చావు పొందుతాడు. ఈ పరబ్రహ్మ నిత్యం .అప్రమేయం. దీన్ని అనేక రకాలుగా అనుసరించి చూడాలి .ఈ ఆత్మ గొప్పది .ధృవమైంది ,జన్మలేనిది ధర్మాధర్మాలు లేనిది .ఆకాశం కంటే  సూక్ష్మమైనది .అలాంటి పరమాత్మను తెలుసుకొని ప్రజ్ఞ కలిగించుకోవాలి .ప్రాణం లో విజ్ఞానమయ స్వరూపుడు .గొప్పవాడు ,పుట్టులలేని ఆత్మ స్వరూపుడు .అతడు బుద్ధి యొక్క విజ్ఞానానికి ఆశ్రయమైన ఆకాశం లో ఉంటాడు. అన్నీస్వాధీనం లో ఉంటాయి.నియామకుడు .ప్రభువు .ఇతడిని వేదవాక్యాలతో,యజ్ఞం తపస్సు చేత  తెలుసుకొనే ప్రయత్నం చేస్తారు .పరమాత్మ లోకం కావాలనుకోనేవారు సన్యసిస్తారు .ఆత్మ సకల కార్య ధర్మాలను అతిక్రమించి ఉంటుంది .సర్వం తానే అయిఉంటుంది .దేనికీ అంటుకోదు .పాపాలను అతడే దహించి వేస్తాడు. ఇతడే విపాపుడు అంటే పాపరహితుడు. విరజుడు అంటే కామరహితుడు. అవిచికిత్సుడు అంటే సందేహ నివర్తకుడు .అతడే బ్రహ్మం .అదే బ్రహ్మలోకం ‘’అని బ్రహ్మోప దేశ ప్రసంగాన్ని ముగించాడు యాజ్ఞవల్క్యుడు .

  జనక చక్రవర్తి పరమాన౦ద భరితుడై ‘’మహాత్మా మహర్షీ యాజ్ఞవల్క్య అవతార పురుషా !నీకు నా విదేహ రాజ్యం అంతా ఇచ్చేస్తున్నాను .ఇకనుంచి నేను మీ సేవకుడను ఆజ్ఞాపించండి ‘’’అని వేడుకొన్నాడు .జనకపురం లో ఉండి  యాజ్ఞవల్క్యుడు ఋషులకు బ్రహ్మోపదేశం చేశాడు .యోగాభ్యాసం చేయించాడు .

  సశేషం

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -31

యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -31

జనకుడు మహా మేధావి అని గ్రహించి యాజ్ఞవల్క్యుడు ‘’పరమానంద  స్వరూపమైన ఆత్మ స్వప్నం లో రమి౦చి చరించి ,పుణ్య పాపాలు చూసి ,తిరిగి బుద్ధాంతం చేత ప్రతి స్థానం పొందుతుంది .స్వప్నాంతం అంటే స్వప్న స్థానం బుద్ధాంతం అంటే జాగ్రత స్థానం .శరీరం ఊర్ధ్వ శ్వాసం వలన శరీరమైన ఆత్మ ప్రాజ్ఞాత్మచే అధిస్టించ బడి ధ్వని చేస్తూ ,వేరే దేహాన్ని పొందుతుంది .ప్రాజ్ఞాత్మ అంటే  స్వయం జ్యోతి అయిన పరమాత్మ .ముసలితనం రోగాదుల చేత కృశించినపుడు  జీవుడు అవయవాలు వదిలి వేరే శరీరం లోకి చేరుతాడు  .కర్మఫలం తెలిసిన బ్రహ్మ స్వరూపుడైన జీవాత్మ కోసం పైలోకం లో ఎదురు చూస్తుంటారు .ఊర్ధ్వ శ్వాస లో మరణిస్తే సకల ప్రాణాలు ఆత్మను పొందుతాయి ‘’అనగానే జనకుడు ‘’ఏకాలం లో దేహాన్ని విడుస్తాడో చెప్పండి ‘’అని అడిగాడు .యాజ్ఞవల్క్యుడు ‘’మరణకాలం లో స్వయం ప్రకాశాత్మ మోహా మొహాలు లేనిదైనా, మోహం ఉన్నది అవుతుంది .వాగింద్రియాలు ఆత్మనుపొంది ,హృదయాకాశం లో ప్రవేశిస్తాయి .చాక్షుసు అంటే సూర్యాంశ స్వభావం కల పురుషుడు మరణకాలం లో అధిష్టాన దేవత అయిన అగ్ని మొదలైనవాటిని వాక్కు మొదలైనవి పొందగా విముఖుడై పరావర్తనం చెందినవాడు అవుతాడు .పురుషుడు ఇంద్రియ సముదాయం తో ఎకీ ఏకీభ వి౦చినపుడు చూడడు, వినడు, వాసన, రుచి కూడా చూడడు పలకడు స్పృశించడు అని ప్రాజ్ఞులు చెప్పారు ఇలా అన్ని ఇంద్రియాలు పరమపదం పొంది ,విజ్ఞానమయమైన  ఆత్మతో కలిస్తే ,హృదయ రంధ్రం యొక్క ,జీవన నిర్గమ స్థానమైన నాడీద్వారం ప్రకాశిస్తుంది .అప్పుడు ఆత్మ బయటికి కన్ను ,శిరస్సు వగైరా లనుండి బయటకు వెడుతుంది   .ఇలా విజ్ఞానమయ ఆత్మ లేచిపోయినపుడు ప్రాణాలు దాన్ని అనుసరిస్తాయి . ప్రాణాలు అంటే వాక్కు మొదలైన ఇంద్రియాలు .ఆత్మ కర్మా దీనం వలన స్వప్నం లో లాగా ,విశేషజ్ఞానం కలదై ప్రకాశించే దానినే పొందుతుంది .విద్యాకర్మలు పరలోకానికి వెళ్ళే ఆత్మను అనుసరిస్తాయి .విషయ ప్రజ్ఞ అంటే కర్మఫల రూపమైన వాసన కూడా అనుసరిస్తుంది .పూర్వ వాసనవలన మళ్ళీ పొందిన శరీరం లో  ఆత్మభావన పొందుతుంది .ఉన్నదేహాన్ని వదిలి దాన్ని అచేతనం చేసి ,పిత్రియ ,గాంధర్వ ,దైవ ,ప్రాజా పత్య  బ్రహ్మ లేక ఇంకేదైనా రూపం పొందుతుంది .ఇది పూర్వపు దానికంటే కొత్తగా శుభకరంగా ఉంటుంది ‘’అని చెప్పగా జనకుడు జీవుడికి బద్ధసంజ్ఞ కల ఉపాదులేవి ?అని అడిగాడు .

   సశేషం

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -10-3-19-ఉయ్యూరు  

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -30

యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -30

‘’స్వయం జ్యోతిస్వరూపుడైన ఆత్మ స్వప్నం నుంచి సుషుప్తి పొందగోరి స్వప్నం లోనే మిత్ర బంధులాదిగా దర్శనం చేత అనురాగం పొంది ,అనేక విధాలుగా సంచరిస్తూ , పుణ్యపాపఫలాలను చూస్తూ’’ సంప్రసాదం ‘’అంటే  జాగ్రతలో దేహెంద్రియాది వ్యాపార సమూహం వలన పుట్టిన కాలుష్యాన్ని వదిలేసి వాటి వాసనలైన స్వప్న వ్యాపారాలను విడిచేసి నిర్మలమైన గాఢ సుషుప్తి లో ఉండి,మళ్ళీ స్వప్నం కోసం పూర్వం పొందినట్లు ప్రతి స్థానం పొందు తుంది .కాని పుణ్యపాపాలచే బంధింప బడదు . కనుక ఆత్మ అసంగమం ఐనది. దేనితోనూ కలిసి ఉండదు. కనుక ఆత్మకు మరణం లేదు .’’అని మోక్ష సాధనం గురించి మొదలుపెట్టి చెప్పాడు యాజ్ఞవల్క్యుడు జనకంహారాజుకు .రాజు మళ్ళీ వెయ్యి గోవులను కానుక ఇస్తానని చెప్పి మిగిలిన విషయాలు వివరించమని కోరాడు .

  ‘’ఆత్మ జాగ్రదవస్థలో కూడా బంధుమిత్రాదులతో అనురాగం పొంది క్రీడిస్తూ పుణ్యపాపాలకు బద్ధం కాకుండా మళ్ళీ స్వప్న స్థానం లోనే ప్రతిస్థానం పొందుతుంది .నీటిలోని చేప ఈ ఒడ్డునుంచి ఆ ఒడ్డుకు తిరుగుతున్నట్లు ఆత్మ స్వప్న, జాగ్రత స్థానాలలో సంచరిస్తుంది .పక్షి ఆకాశం లో తిరిగి తిరిగి మళ్ళీ తన గూటికి చేరినట్లు ,ఆత్మకూడా దేనికీ అంటక,దేన్నీ ఆశించకుండా తనరూపాన్ని తాను  పొందుతుంది .శరీరం లో ‘’హితం ‘’అనే పేరుగల సూక్ష్మనాడులు వాతం ఎక్కువైతే నల్లగా ,పిత్తం ఎక్కువైతే పసుపుగా ,,శ్లేష్మం ఎక్కువైతే తెల్లగా ఈ మూడు సమాన౦గా ఉంటే ఎర్రగా అవుతాయి .అంతః కరణ ప్రవృత్తి ఆశ్రమం గా కలిగి ,మిధ్య ఐన జాగ్రత్ వాసనలవలన స్వప్న దృక్కులున్న ఆత్మను శత్రువులు    వెంబ డించినట్లు ,నూతిలోపడినట్లు భావనకలుగుతుంది .జాగృతం లో చూసిన భయానక విషయాలే స్వప్నం లోనూ కనిపిస్తాయి .అవిద్యవలన ఆ భయం కలుగుతుంది. అంటే స్వప్నం లో లేకపోయినా అజ్ఞానం చేత ఉన్నాయని అనుకొంటాడు ,. మళ్ళీ జాగృత స్థితికి వచ్చి తన్ను తాను  తెలుసుకొని ,సర్వం నేనే అనుకొంటాడు. అదే ఆత్మకు’’ పరలోకం ‘’అనగా ఆత్మ స్వప్నం లో మోక్షం పొందినట్లు పొందుతోంది .సుషుప్తి పొందక, కోరికలేక ,స్వప్నాన్ని చూడకుండా ఉండటమే ఆత్మకు రూపం .అది కోరికలను,  పాపాలను అతిక్రమించినది ,భయరహితమైనది పురుషుడు లేక ఆత్మ ప్రాజ్ఞాతతో ఉన్నా, లోపలా బయటా ఉన్నదాన్ని తెలుసుకోలేడు.ఇదే ఆత్మ స్వరూపం. లోకాలు లోకాలుకావు .దేవతలు దేవతలుకారు .ఆత్మ శుభ అశుభ కర్మలను అతిక్రమించి ఉంటుంది ‘’

  ‘’ద్రష్ట ఐన ఆత్మ దృష్టికి నాశనం లేనేలేదు .ద్రష్ట స్వరూపమైన ఆత్మకంటే భిన్నమైనది లేదు .దేన్నీ చూడకపోయినా ,చూసేదే అవుతుంది .దాని సర్వే౦ద్రియజ్ఞానానికి నాశనమే ఉండదు ‘’అన్నాడు .జనకుడు ‘’ఎందువలన ఆత్మ విశేష జ్ఞానాన్ని తెలుసుకో లేకపోతోంది ?’’ప్రశ్నించాడు .మహర్షి ‘’ఏకాకృతి ఐన ఆత్మకు స్వభావమైన అజ్ఞానం చే స్వప్నం లో తనలో లేని వేరొక వస్తువు ను కల్పించి పొందిస్తుంది .జాగ్రదవస్థలో అజ్ఞాన సంకల్పిత వస్తువులకు వేరుగా ఉంటూ అన్నీ చూస్తూ ఆఘ్రాణిస్తూ రుచి చూస్తూ భిన్నమైన జ్ఞానం కలిగి ఉంటుంది .చూడ దగిన రెండో వస్తువు లేని ద్రష్ట అవుతుంది .సుషుప్తిలో స్వకీయ తేజస్సుపొందుతుంది అదే బ్రహ్మ లోకం. అదే విజ్ఞానమయ ఆత్మకు ఉత్తమగతి సంపత్తు, పరమానందం అవుతుంది .ఇతర భూతాలూ ఈ ఆనంద అంశం యొక్క కళను అనుసరించి జీవిస్తాయి .మనుష్యులలో ‘’రాద్ధుడు’’ అనేవాడు ఉపభోగ కరణ సంపత్తి కలవాడై ప్రభువై ,సమస్త మానుష భోగాలచే సంపన్నతముడు ఔతాడు. అదే మనుషులకు పరమానందం .ఇలాంటి వంద మానుషానందాలు  పితరులకు ఒక ఆనందం తో సమానం .వంద పితృ దేవతానందాలు ఒక గంధర్వానందం .వంద గంధర్వానందాలు ఒక దేవతానందం .వంద దేవతానందాలు ‘’అజాన దేవుడి’’కి అంటే పుట్టగానే దేవత్వం పొందినవాడికి ఒక ఆనందమౌతుంది .ఇలాంటివి వందయితే ప్రజాపతి లోకానందమౌతుంది. శ్రోత్రియుడు ,అవృజినుడు ,అకామ హతుడు ఐనవాడు హిరణ్యగర్భ ఆనందం తో సమానమైన ఆనందం కలవాడౌతాడు .ఈ బ్రహ్మలోక ఆనందామే పరమానందం .ఇక ఆనందం ఎన్నటానికి సాధ్యమే కాదు .అదే బ్రహ్మలోకం లేక బ్రహ్మానందం .’’అని చెప్పగా జనకుడు మహదానందం పొంది మళ్ళీ వెయ్యి ఆవులనిస్తున్నట్లు చెప్పి  మోక్ష సాధనలో మరిన్ని విశేషాలు తెలియ జేయమని కోరాడు .

   సశేషం

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -10-3-19-ఉయ్యూరు 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -29

యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -29

‘’ప్రాణాలలో ఉన్న విజ్ఞానమయ ఆత్మ గురించి వివరించండి?’’అని జనకర్షి అడుగగా మహర్షి ‘’హృదయం లో, కంఠంలో ఉన్న తేజో రూప పురుషుడి నే ఆత్మ అంటారు .ఈ ఆత్మను బుద్ధి ధ్యాని౦చేప్పుడు ధ్యానించే దాని లాగా ,బుద్ధి ఇంద్రియాలు చలిస్తున్నప్పుడు చలించే దానిలాగా ఉండి,బుద్ధితో సమానమైన ఇహ ,పర లోకాలను రెండిటిని అనుసరించి తిరుగుతుంది .ఈ ఆత్మయే ఈ లోకం లో మృత్యురూపాలను అతిక్రమిస్తుంది .ఆత్మస్వరూప పురుషుడు శరీరం లో ఉన్నప్పుడు బుద్ధితో సమానుడై స్వప్నాది అవస్థలలో ప్రవర్తిస్తూ ,పాపరూప మైన దేహేంద్రియ సముదాయ మును విడుస్తూ ,గ్రహిస్తూ పుట్టి అవి తానే అనే అభిప్రాయం తో పాపరూప దేహే౦ద్రియాలతో కూడి ఉంటాడు .చనిపోయి వేరొక దేహాన్ని పొందినపుడు ,పాపరూప శరీరేద్రియాలను విడిచి పెడతాడు .ఇలా జనన మరణ పరిభ్రమణం లో సంసారం వడిలో మోక్షం పొందేదాకా ఉంటాడు .కనుక ఆత్మా జ్యోతిస్సు దేహెంద్రియాలకంటే వేరైనది అని గ్రహించాలి .ఆపురుషుడికి ఈలోకం, పరలోకమే కాకుండాఈ రెండిటికి మధ్య సంధిస్థానంగా ఉండే  మూడవలోకం స్వప్న స్థానం అవుతుంది .ఇక్కడి నుంచి ఇహ పర లోకాలని చూస్తాడు .ఈ పురుషుడు విజ్ఞాన లక్షణాలతో పరలోకం లో ఉండి,విద్యా కర్మలయొక్క విజ్ఞానాన్ని ఆశ్రయించి స్వప్నం లో పాపఫల దుఖాన్ని,  పుణ్యఫల సుఖాన్ని చూస్తాడు .స్వప్న౦ లో ఉన్నప్పుడు ఈ లోకం లోని కొంచెం మాత్రమే గ్రహించి ,తానే శరేరాన్ని పడేసి ,వాసనామయ స్వప్న దేహాన్ని మాయాస్వరూపంలాగా నిర్మించుకొని, తన తేజస్సుతో నిద్రిస్తాడు .ఈ అవస్థసలో స్వయం జ్యోతి ఔతాడు ‘’అని వివరించాడు యాజ్ఞవల్క్యుడు .

  ‘’స్వప్నం లో రధాలు గుర్రాలు మార్గాలు ఉండవు  .మరి ఎలావచ్చాయనే సందేహం కలుగుతుంది .పురుషుడే స్వప్నం లో వాటిని కల్పించుకొంటాడు .అక్కడ సంతానం సుఖం లేవు .వీటినీ ఆత్మ సృష్టించుకొంటు౦ది .చెరువులు బావులు ఉండవు .వాటినీ ఆత్మయే సృష్టించు కొంటుంది . అంటే స్వప్నం లో కనిపించేవన్నీ ఆత్మ సృష్టించినవే .కనుక ఆత్మయే కర్త .వీటిపై కొన్ని శ్లోకాలున్నాయి లున్నాయి ‘’అనగా వాటి తాత్పర్యం చెప్పమన్నాడు జనకుడు .యాజ్ఞవల్క్యుడు ‘’హిరణ్మయుడు లేక హంస స్వరూపుడు అయిన పురుషుడు స్వప్నం చేత దేహానికి నిశ్చేస్టత కలిగించి తాను  నిద్రించకుండా ,నిద్రించేవాడిని చూస్తాడు .తేజస్సుకల ఇంద్రియమాత్ర రూపాన్ని పొంది, మళ్ళీ జాగృత స్థానం చేరుతున్నాడు .అమృతుడు హిరణ్మయుడు ,ఏక హంసుడు ఐన ఆ పురుషుడు అంటే ఆత్మ ,ప్రాణవాయువు చేత ఈ గూడు లాంటి శరీరాన్ని కాపాడుకొంటూ దానికి బయట తిరుగుతూ మరణం లేక కామం ఉన్న చోటికి పోతాడు .స్వయం జ్యోతి అయిన ఆత్మ స్వప్నం తర్వాత అధికమైన దేహ భావాన్ని ,నీచమైన పశుపక్ష్యాది భావం పొంది అనేక రూపాలను సృష్టిస్తుంది .ఆనందం నవ్వు భయం ఉన్నట్లు ప్రవర్తిస్తుంది .లోకులు ఈ క్రీడా స్థానాలనే చూస్తారుకాని ఎవ్వరూ ఆత్మను చూడరు .గాఢ నిద్రలో ఉన్నవాడిని అకస్మాత్తుగా లేపద్దని అంటారు .అలా లేపితే ఆత్మ నేత్రాది రూపాలను పొందలేదు .అప్పుడు గుడ్డితనం ,చెవుడు మొదలైనవి ఏర్పడుతాయి .అప్పుడు అతడికి చికిత్స చేయటం చాలాకష్టం .కనుక ఆత్మ స్వరూపం మృత్యు రూపమైన దేహెంద్రియాలను అధిగమించి స్వయం జ్యోతి స్వరూపమౌతోంది .కొందరు విజ్ఞులు ఆత్మకు జాగృతస్థానమే  స్వప్న స్థానం అంటారు కానీ ఇది కుదరదు .జాగృతస్థానం లో దేన్ని  చూస్తాడో, నిద్రా స్థితిలోనూ దాన్నే చూస్తాడు .స్వప్నం లో నేత్రాది ఇంద్రియాలు లేకపోయినా స్వయం జ్యోతి రూపమైన జాగ్రత్ వాసనవలన తానే కల్పించుకున్నవన్నీ చూస్తుంది .కనుకజాగృత్, స్వప్నాలు వేరు వేరు .ఒకటికానేకాదు .స్వప్నం లో ఆత్మ స్వయం జ్యోతి అని గ్రహించాలి ‘’అన్నాడు .’’మహాత్మా !మీబోధనకు వెయ్యిఆవులు కానుకగా ఇస్తాను .ఇంకనాకు మోక్షసాధనాన్ని అనుగ్రహించండి ‘’అని కోరాడు జనకర్షి .

  సశేషం

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -10-3-19-ఉయ్యూరు  

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -28 బ్రహ్మోప దేశం

ఒక రోజు విదేహరాజు జనకుడు ఆసనం దిగి  యాజ్ఞవల్క్య   మహర్షి చెంతకు వచ్చి’’భగవాన్ !నమస్కార శతం. నాకు ఈ రోజు బ్రహ్మోపదేశం చేయమని మనవి చేసుకొంటున్నాను ‘’అన్నాడు అత్య౦త వినయ విధేయతలతో.దానికి మహర్షి యాజ్ఞవల్క్యుడు ‘’మహారాజా !నువ్వు ఉపనిషత్తులు సాకల్యంగా విని సమాహితాత్ముడవయ్యావు .నువ్వు పూజ్యుడవు సార్వ భౌముడవు వేదాధ్యయనం చేసి జ్ఞాన విజ్ఞాన సముపార్జన చేసిన ధీమతివి .ఈ దేహాన్ని విడిచాక ఎక్కడికి పోతావో తెలుసా ?’’అని అడిగాడు .తెలియదన్నాడు రాజు .తెలియకపోతే తానే చెబుతానని ‘’కుడికంటి లోని పురుషుడిని ఇంధుడు అంటారు .అంటే ప్రకాశించేవాడు అతడినే అప్రత్యక్షం గా ఇంద్రుడు అంటారు .కారణం దేవతలు పరోక్షప్రియులు ,ప్రత్యక్ష శత్రువులు కూడా .ఎడమకంటిలోని పురుష రూపం పత్ని ,అన్నం కూడా అవుతుంది .అంటే కుడికంట్లోప్రకాశించే పురుషుడు భోక్త , భర్త ఇంద్రుడు అనీ ,ఎడమకంటిపురుష రూపం భోజ్యమైన అన్నం, అతని భార్యఇంద్రాణి  అవుతున్నాయి.జాగ్రదావస్థలోకుడి ఎడమ నేత్రాలలోని పురుష రూపాన్ని ‘’విశ్వ’’ శబ్ద౦ చే తెలియ జెప్పారు .ఇది స్త్రీ పురుష ద్వంద్వం .ఈ స్త్రీ పురుషులకు హృదయాకాశమే  సంభోగ స్థానం .అందులోని రక్తపు ముద్దవారికి అన్నం .నాడీ తంతువులే  వస్త్రాలు .హృదయం నుండి పైకి వెళ్ళే నాడులే వారు సంచరించే మార్గం .ఒకవెంట్రుక ను వెయ్యి భాగాలుగా చీలిస్తే ఏర్పడే అతి  సూక్ష్మనాడులు హితములని పిలువబడి హృదయం మధ్యలో ఉంటాయి .తిన్న అన్నం ఈ నాడులద్వారా వ్యాపించి దేహాన్ని వృద్ధి చేస్తుంది .స్థూల దేహాన్ని వృద్ధి చెంది౦చే  ఆహారం కంటే ,దేవతా శరీరాన్ని వృద్ధి చెందించే అన్నం చాలా  సూక్ష్మమైనది .ఈ దేవతా శరీరాన్నే లింగ శరీరం అంటారు .స్థూల దేహ సంబంధమైన విశ్వాత్మకంటే , సూక్ష్మ దేహ సంబంధ తైజసాత్మ ఇంకా  సూక్ష్మ  అన్నం చేత వృద్ధి పొందుతుంది .తైజసుడు స్వప్నావస్థలో కంఠంలో ఉండి ప్రకాశిస్తాడు కనుక ఆ అవస్ద లో తైజసుడని పిలువబడతాడు .

‘’ విశ్వాత్మ నుండి తైజసాత్మ,తైజసాత్మనుండి ప్రాజ్ఞాత్మ పొందేవాడికి తూర్పు దిక్కు ను పొందినప్రాణాలు తూర్పు దిక్కు అవుతాయి .అలాగే దక్షిణ దిక్కువి దక్షిణ దిక్కు ,పడమరకు పోయేవాటికి పడమటి దిక్కు, ఉత్తరానికి పోయేవాటికి ఉత్తర దిక్కు,  పైకి పోయేవాటికి ఊర్ధ్వ దిక్కు క్రిందికి పోయేవాటికి అధో దిక్కు అవుతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే సకల ప్రాణాలు సకల దిక్కులౌతాయి .ఈ ఎరుక గలవాడు సర్వాత్మకమైన ప్రాణాన్ని ఆత్మ స్వరూపంగా మార్చుకొంటాడు .అనగా ప్రత్యగాత్మ లో సర్వాత్మకమైన ప్రాణాన్ని ఉపసంహరించి ‘’నేతి, నేతి అంటే ఇదికాదు ఇది కాదు అనుకొంటూ అన్నిటినీ నిషేధించి, చివరకు ఆత్మను పొందుతాడు .ఆత్మ గ్రహింప శక్యం కాదు కనుక గ్రహి౦ప బడదు .శరీర ధర్మం లేనిదికనుక శిధిలం కాదు .దేనితోనూ కలవదు కనుక ఒంటరిదై ఉంటుంది  .దేనిచేత గ్రహి౦పబడదు  ,పీడింపబడదు .గ్రహణం సంగమం శిధిలం అనే ధర్మాలు లేవుకనుక ఆత్మ హింస పొందదు. అంటే నశించదు .మహారాజా జనకర్షీ !నువ్వు ఇపుడు జననమరణ నిమిత్త భయం లేకుండా అభయం పొందావు కదా  ?’’అన్నాడు .

  జనకుడు ‘’మహాత్మా !మీరూ భయరహితులు అగుదురుగాక .భయరహితమైన బ్రహ్మాన్ని తెలియ జేసినందుకు కృతజ్ఞతలు నమోవాకములు .ఈ విదేహ దేశాన్ని హాయిగా అనుభవించండి .నేను మీ దాసుడను ‘’అన్నాడు చక్రవర్తి జనకుడు .రాజువద్ద సెలవు తీసుకొని ఆశ్రమానికి వెళ్ళాడు మహర్షి .కొంతకాలం తర్వాత  మళ్ళీ రాజు దగ్గరకు వచ్చాడుకానీ ఆయనకు ఏమీ చెప్పకూడదు అనుకొన్నాడు .కాని పూర్వం వీరిద్దరూ అగ్ని హోత్ర విషయమై చాలా చర్చించారు .అప్పుడు యాజ్ఞవల్క్యుడు ‘’నీ ఇష్టమొచ్చిన ప్రశ్నలు అడుగవచ్చు ‘’అన్నాడు .కనుక ఇప్పుడు జనకుడే ముందుగా ‘’మహర్షీ !కర చరణాదులైన అవయవాలున్న ఈ పురుషుడి గమన సాధనమైన తేజస్సు ఏది ?’’అని అడిగాడు .’’సూర్య తేజస్సుతోనే కూర్చుంటాడు అనేక చోట్లకు తిరుగుతాడు .లౌకిక వైదికకర్మలు చేస్తాడు ‘’అని బదులిచ్చాడు .సూర్యుడు అస్తమించగానే తేజస్సు లేని వాడౌతాడుకదా అని సందేహించిన రాజుకు ‘’చంద్ర తేజస్సుతో సకలం నిర్వహిస్తాడు ‘’అనగా సూర్య చంద్రులిద్దరూ అస్తమిస్తే ?’’అనగా ‘’అగ్ని తేజస్సుతో అన్నీ నిర్వహిస్తాడు .అగ్నికూడా ఆరిపోతే వాక్కు అతని తెజస్సై అన్నీ చేయిస్తుంది ‘’అన్నాడు .’’వాక్కు కు తేజస్సు ఉందని ఎలా తెలుస్తుంది ?’’జనకుని ప్రశ్న.’’చీకటిలో ఏదైనా కూసినా అరచినా మాట్లాడినా అది మనదగ్గరుందా దూరంగా ఉందా అనే  జ్ఞేత్రం ద్వారా తెలుసుకొంటాం .కనుక సూర్యచంద్ర అగ్నులు లేనప్పుడు వాక్కే తేజస్సు అవుతుంది .’’వాక్కు కూడా లేకపోతె ?’’అన్న ప్రశ్నకు  ‘’ఆత్మయే తేజస్సు అయి అన్నీ చేయిస్తుంది ‘’అని బదులిచ్చాడు యాజ్ఞవల్యుడు .

    సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -9-3-19-ఉయ్యూరు  

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -27

యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -27

శిష్యుడిని కృతార్దుడిని చేశాకే ఏదైనా గ్రహించాలి అని చెప్పి వేరే గురువేదైనా చెప్పాడా అని అడిగాడు .వృష్ణుని కొడుకు బర్కుడు నేత్రాలే బ్రహ్మ అన్నాడని చెప్పగా .మహర్షి నేత్రానికి నేత్రమే  శరీరం. ఆకాశమే ఆశ్రయం .నేత్ర స్వరూప బ్రహ్మాన్ని సత్యంగా ఉపాసన చేయాలి కన్ను చూసిందే సత్యం కనుక అదే పరబ్రహ్మ .నేత్రబ్రహ్మనుపాసిస్తే అతడిని వదలదు .అతనితో సకలభూతాలు స్నేహం చేస్తాయి .ఈలోకంలో దేవుడిగా పూజింపబడి చనిపోయాక దేవత లో కలిసిపోతాడు .రాజు మళ్ళీ వేయి వృషభాలిస్తానన్నాడు  .పాతమాటే మళ్ళీ చెప్పగా రాజు భరద్వాజ పుత్రుడు గర్ద భీతుడు శ్రోత్రమే బ్రహ్మమన్నాడని చెప్పగా మహర్షి ‘’శ్రోత్ర బ్రహ్మానికి శ్రోత్రమే శరీరం ,ఆకాశమే ఆశ్రయం .దీన్ని అనంతం అని ఉపాసించాలి .అనంతం అంటే దిక్కులే .శ్రోత్రం శ్రవణ బ్రహ్మోపాసకుడిని విడువదు .అందరి మైత్రి లభించి ఈ లోకం లోదేవుడిగా పూజ్యతపొంది మృతి చెందాక దేవతలో ఐక్యమౌతాడు .సంతృప్తి చెందినరాజు మళ్ళీ వెయ్యి ఎద్దులిస్తాననగా ,ఇంకెవరైనా ఏదైనా చెబితే వివారించమన్నాడు .జాబాలి అనే ఆమె పుత్రుడు సత్యకాముడు మనస్సు బ్రహ్మని చెప్పాడన్నాడు రాజు  .మహర్షి ‘’మనో బ్రహ్మకు శరీరమే స్థానం  .ఆకాశమే ఆశ్రయం. మనోబ్రహ్మాన్ని ఆనంద స్వరూపంగా భావించి ఉపాసి౦చాలి .ఆనందత అంటే మనస్సే.మనస్సు చేతనే స్త్రీని పొంది ప్రతి రూపమైన పుత్రుడిని పొందుతున్నాడు .ఆపుత్రుడే ఆనందానికి హేతువౌతున్నాడు .కనుక మనస్సు పరబ్రహ్మం .దీన్ని ఉపాసిస్తే మనసు విడిచిపోదు .ఈలోకంలో పూజ్యత దక్కి పరలోకం లో దేవత లో కలిసిపోతాడు .మళ్ళీ వెయ్యి వృషభాల కానుక రాజు ప్రకటించగా ,ఇదివరకటిమాటేచెప్పగా రాజు శాకల్యుడు హృదయమే బ్రహ్మ అని చెప్పాడనగా యాజ్ఞవల్క్యుడు ‘శరీరమే హృదయ౦ ఆకాశమే ఆశ్రయం .దాన్ని స్థితి అని భావి౦చి ఉపాసి౦చాలి .స్థితత అంటే హృదయమే .హృదయమే పరబ్రహ్మ హృదయోపాసకుని హృదయం విడిచి పెట్టదు .అతనితో సర్వభూతాలు మైత్రి తో ఉంటాయి ఈలోకం లో పూజనీయుడై మరణించాక దేవతలో ఐక్యమౌతాడు ‘’అని చెప్పగా మళ్ళీఏనుగుల్లాంటి వెయ్యి వృషభాలు కానుక గా ప్రకటించగా తనతండ్రి చెప్పిన మాట జ్ఞాపకం చేసి దానం గ్రహించలేదు యాజ్ఞవల్క్య మహర్షి ‘’.

   సశేషం

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -9-3-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సరసభారతి  ఉగాదివేడుకల ఆహ్వానం

 

 

సరసభారతి  ఉగాదివేడుకల ఆహ్వానం  ముద్రణకు వెళ్ళింది
సాహితీ బంధువులకు శుభకామనలు -సరసభారతి శ్రీ వికారి ఉగాది వేడుకల ఆహ్వానం నిన్నరాత్రి ప్రింట్ కు వెళ్ళింది .12వ తేదీ మంగళవారం మాకు అందుతాయి .అందగానేఅతిధులందరికి   పోస్ట్ లో పంపుతామని తెలియ జేస్తున్నాను -దుర్గాప్రసాద్ -9-3-19

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు -61 ఉత్తమ శిష్యుడు పారుపూడి గంగాధరరావు

ఊసుల్లో ఉయ్యూరు -61

ఉత్తమ శిష్యుడు పారుపూడి గంగాధరరావు

పారు పూడి గంగాధరరావు మార్చి 6వ తేదీ న చనిపోయాడని నిన్న మా బజారులో కరెంట్ స్తంభానికి వ్రేలాడతీసిన ఫ్లెక్సి వల్ల తెలిసి చాలా బాధ పడ్డాను .ఎర్రని రంగు ,వెడల్పైన నిరంతర నవ్వు ముఖం ,అందమైన నల్లని క్రాఫు ,స్పోర్ట్స్ మాన్ పర్సనాలిటి కుదుమట్టమైన  నాజూకు శరీరం తో  సన్నని మీసకట్టుతో ఉన్న అతడిని చూడాగానే ఆకర్షణ కలుగుతుంది .వీటికి మించి గొప్ప వినయ సంపన్నుడు .పారుపూడి ఇంటిపేరు .అంటే మా ఉయ్యూరు వీరమ్మ తల్లి ఇంటిపేరు .గొల్ల కుర్రాడైనా ఎంతో ఒదిగి ,ఏ దురలవాట్లు లేక తనను తానూ తీర్చి దిద్దుకున్న వాడు .అలాంటి వారు వారిలో చాలా అరుదు గా ఉంటారు  .

  నేను మోపిదేవి నుంచి ఉయ్యూరు హైస్కూల్ కు సైన్స్ మాస్టర్ గా 1965వచ్చాను .గంగాధరరావు అప్పుడు హైస్కూల్ లో నా విద్యార్ధి .అసలు ఆ కుటుంబాలలో గంగాధరరావు అనే పేరు ఉండటమే అరుదైన విషయం .అందువల్లనేమో నా మనసు లో స్థానం పొందటానికి ఒక కారణం అయి ఉండచ్చు .చాలా నియమబద్ధంగా ,క్రమశిక్షణ గా ఉండేవాడు .బాడ్ మింటన్  వాలీబాల్ ,కబాడీ ,సాఫ్ట్ బాల్ ఆటలలో బాగా రాణి౦చేవాడు .అతని ఆటతీరు ఇప్పటికీ కళ్ళలో నిలిచే ఉంది .తొణకని బెణకని స్వభావం అతనిది .అదే సమయం లో నేప్పల్లె గాంధీ కూడా ఉన్నాడు .అతడూ గొప్ప ప్లేయర్ .వాలీబాల్ బాడ్ మింటన్ లలో అద్వితీయుడు .ఈ ఇద్దరితో ఉన్న స్కూల్ టీం అన్నిట్లోనూ విజయాలు సాధించేవారు .

 సాయంకాలం స్కూల్ అయిపోగానే  వీళ్ళ బాచ్ తో కలిసి మా టీచర్స్ ఆ రెండు ఆటలు ఆడేవాళ్ళం .నిజం చెప్పాలంటే వారిద్దరే మాకు నేర్పారు అని చెప్పవచ్చు .మిగతావారి సంగతేమోకాని నాకు ఒక రకంగా వాళ్ళిద్దరూ గురువులే ఆటల్లో .కానీ ఎప్పుడూ ,ఎక్కడా అతిగా ప్రవర్తించేవారు కాదు .అత్యంత వినయంగా ఉండేవారు .చదువులో కూడా అబవ్ ఆవరేజ్ గా ఉండేవాళ్ళు .ఇందులో గాంధీ కొంత రఫ్ అండ్ టఫ్  మనిషి .కాని గంగాధరరావు అప్పటినుంచి ఇప్పటికీ అదే సౌజన్యం అదే వినయం అదే విధేయత అదే మర్యాద అదే మన్నన  కనబరచేవాడు .

   వీరమ్మతల్లి తిరునాళకు గుడికి వెడితే  గంగాధరరావు మా టీచర్లకు ప్రత్యేక దర్శనం చేయించి ,కొబ్బరి చిప్పలు విశేషంగా ఇప్పించేవాడు .అక్కడున్నవాళ్లకు ‘’మా టీచర్స్ .వీళ్ళు ఎప్పుడొచ్చినా మర్యాదగా ఉండండి ‘’అని చెప్పేవాడు .గంగాధరరావు కుటుంబానికీ  పూజలో వంతు ఉండేది .ఆతర్వాత అతడు స్కూల్ లో లేకపోయినా మేము వేరే చోట్ల పని చేసినా తిరునాళలో కనిపిస్తే  పూర్వంలాగానే మర్యాద చేసేవాడు .అంతటి గుణ సంపన్నుడు గంగాధరరావు ..

  చదువు ఎంతవరకు చదివాడో తెలియదుకాని అతను ఎస్. ఎస్. ఎల్ .సి .అవగానే ఉయ్యూరు కెసీపి స్టోర్స్ లో  ఉద్యోగం లో చేరాడు .అప్పుడు ఫాక్టరీ వాళ్ళు ఫాక్టరీకి బయట పెట్రోల్ బ౦క్ నడిపే  వారు .అప్పుడు నాకు’’ లూనా ‘’ఉండేది .దానికి పెట్రోల్ కోసం అక్కడికే వెళ్ళేవాడిని .అప్పుడు గంగాధరరావు అక్కడ డ్యూటీ చేస్తూ కనిపించాడు .బహుశా ఇది 1982 -90మధ్యకాలం అని గుర్తు .ఎన్ని బళ్ళు ఉన్నా నన్ను ముందుకు రమ్మని పెట్రోల్ కొట్టి పంపేవాడు ‘’మా మాస్టారండీ ‘’అని అందరితో చెప్పేవాడు నవ్వుతూ .ఎప్పుడు ఎక్కడ కనిపించినా నమస్కారం తో చిరునవ్వుతో పలకరించటం అతని అలవాటు .కుశలప్రశ్నలు వేయటం నాకు అలవాటు .తర్వాత ఫాక్టరీ పెట్రోల్ బంక్   లాస్ వస్తోందని ఎత్తేసింది .అప్పటికే పెళ్ళికూడా అయి ఉంటుంది .

  తర్వాత ఫాక్టరీ లో వర్కర్ లను కొందర్ని తీసేశారు .అందులో ఇతను కూడా ఉన్నాడని అనుకొంటా .ఎందుకంటె వీరమ్మ తల్లి అత్తారింటి గుడి దగ్గర ఒక చిల్లర దుకాణం నడుపుతూ కనిపించాడు .బహుశా అతడే మానేసి ఉండాలి లేకపోతె  ఫాక్టరీ వాళ్ళు తీసేసి ఉండాలి .ఇప్పుడుకూడా అదే చిరునవ్వు అదే సౌజన్యం .ఏమీ మార్పులేదు ఎవరిమీదా ఆరోపణలు చేయలేదు .తర్వాత మా అబ్బాయి రమణకు మంచి స్నేహితుడయ్యాడు . మన శ్రీ సువర్చలా౦జనేయ  స్వామి దేవాలయ కార్యక్రమాలలో, సరసభారతి కార్యక్రమాలలో కలిసేవాడు .మనిషి ఆరోగ్యం కొంత దెబ్బ తిన్నట్లు నాకు అనిపించేది .2017అక్టోబర్ లో అమెరికా నుంచి ఉయ్యూరు వచ్చినదగ్గర్నుంచీ మళ్ళీ గంగాధరరావు ను ఎక్కడా చూడలేదు నిన్న అతని మరణ వార్త చూసే దాకా  .అతనికి సుమారు 65 ఏళ్ళు పైగా ఉంటాయనుకొంటాను .అతని ఆత్మకు శాంతికలగాలని పరమేశ్వరుని ప్రార్ధిస్తూ ,అతని కుటుంబానికి సానుభూతి సంతాపం తెలియ జేస్తున్నాను .మంచి వాళ్ళను భగవంతుడు త్వరగా తనదగ్గరకు తీసుకు వెడతాడని అంటారు .

   ఉయ్యూరు హైస్కూల్ లో నాకు గురువుగారు ,తర్వాత నాతో అదే స్కూల్ లో సహ ఉపాధ్యాయులుగా పని చేసిన స్వర్గీయ శ్రీ మహంకాళి సుబ్బరామయ్య గారి పెద్దబ్బాయి,నా శిష్యుడు  ‘’కరెంట్ ప్రసాద్ ‘’అని అందరూ పిలిచే ప్రసాద్  శివరాత్రి మర్నాడు మార్ఛి 5న మరణించినట్లు తెలిసింది .అలాగే ఉయ్యూరు హైస్కూల్ లో నా శిష్యుడు ,నా దగ్గర ట్యూషన్ కూడా చదివిన ,మాఇంటికి దగ్గరలోనే కిరాణా దుకాణం పెట్టి మంచిపేరు పొందిన స్వర్గీయ తాడినాడ సుబ్రహ్మణ్యం కొడుకు ‘’నాని’’ నిన్న 8వ తేదీ చనిపోయాడు .వీరిద్దరి మరణానికి సానుభూతి .కుర్రాళ్ళు ఇలా రాలిపోవటం బాధాకరం .

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -9-3-19-ఉయ్యూరు 

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -26 ప్రబోధం

యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -26

             ప్రబోధం

ఒకరోజు యాజ్ఞవల్క్యుడు జనక మహారాజు ఆస్థానానికి వెళ్ళగా అత్యంత భక్తీ శ్రద్ధలతో పూజించి ‘’గోవులు కావాలనా లేక నా చేత  ఏదైనా అర్ధవంతమైన ప్రశ్న అడిగి౦చు కోవాలనా తమరు దయ చేశారు ?’’అని అడిగాడు గౌరవంగా .’’రెండిటికోసం వచ్చాను  బ్రహ్మం గురించి ఇదివరకుఎవరైనా  నీకు  చెప్పినదంతా నాకిప్పుడు చెప్పు జనకరాజా ‘’అన్నాడు మహర్షి .’’వాక్కే బ్రహ్మ ‘’అన్నాడు రాజు .’’వాగ్బ్రహ్మ శరీరం స్థితి చెప్పు ?”’అంటే తనకు ఆగురువు చెప్పలేదన్నాడు .మహర్షి ‘’వాగ్బ్రహ్మ ఒక పాదం అంటే అతడు పలకాల్సింది ఇంకా మూడు వంతులుంది .’’అనగా దాని శరీరం స్థితుల గురించి వివరించమని కోరాడు రాజు .’’వాక్కే శరీరం ఆకాశం అంటే పరమాత్మ .ఆశ్రమం పరబ్రహ్మ లో నాలుగవ భాగమైన ఈ బ్రహ్మం నే ప్రజ్ఞ అంటారు .దీనినే ఉపాసించాలి .అన్నాడు .’’ప్రజ్ఞత అంటే వాక్కును తెలుసుకో దగిన శాస్త్రం ఏది ‘’?అని అడిగాడు .’’వాక్కునే ప్రజ్ఞత అంటారు .ఎందుకంటె ఆవాక్కుతోనే వేద శాస్త్ర పురాణాలు యజ్ఞ యాగాలు ధర్మ శాస్త్రాలు మొదలైనవన్నీ తెలుసుకో బడతాయి .వాక్కును బ్రహ్మ అని ఉపాసిస్తే అది అతడిని విడిచి వెళ్ళదు అతడు సకల భూతాలను ప్రేమిస్తాడు .ఈలోకం లో ఉన్నంతకాలం దేవుడుగా ,చనిపోయాక దేవతలో కలిసిపోతాడు .’’అనగా ఆనందించి రాజు ఆయనకు ఏనుగుల్లాంటి నూరు ఎద్దులను ఇస్తానన్నాడు .మహర్షి ‘’రాజా !శిష్యుని  కృతార్దుడిని చేయకుండా అతడి నుంచి ధనం తీసుకో రాదని మా తండ్రి చెప్పారు .ఇంకెవరైనా ఆచార్యుడు ఏదైనా చెబితే నాకు వివరించు ‘’అన్నాడు .జనకుడు ‘’ఉదంకుడు ప్రాణం లేని వాడికి ఏమీ కలుగదు కనుక ప్రాణమే బ్రహ్మం అని చెప్పాడు ‘’అనగా ఆ ప్రాణానికి శరీరం ఏమిటో ఆశ్రమం ఏమిటో ఆ గురువు చెప్పాడా ?’’అని అడుగగా చెప్పలేదన్నాడు .ప్రాణం ఏకపాదం మాత్రమే అంటే ఇంకా మూడు వంతులు ఉన్నది .వివరించమని అడుగగా ‘’ప్రాణ రూపపరబ్రహ్మానికి ప్రాణమే  శరీరం .ఆకాశమే  ఉత్పత్తి స్థానం .అది ప్రేమ రూపమైనదని భావించి ఉపాసించాలి ‘’అన్నాడు

  ‘’ప్రియత ‘’అంటే ?’’ప్రాణమే ప్రియత .ఎందుకంటె ప్రాణం కాపాడుకోటానికి ధనం సంపాదిస్తారు .యాగార్హత లేకపోయినాయాగం చేయిస్తుంది .తీసుకో కూడనివి తీసుకొనేట్లు చేస్తుంది .భయ పెట్టె దిక్కుకే ప్రాణ రక్షణకోసం వెడతాడు .కనుక ప్రాణమే పరబ్రహ్మం .ప్రాణ రూప బ్రహ్మాన్ని ఉపాసిస్తే ప్రాణం అతడిని వదలదు .అతడితో భూత సంతతి అంతా స్నేహంగా ఉంటుంది .ఈ లోకంలో దేవుడుగా భావింపబడి చనిపోయాక దేవతలలో కలిసిపోతాడు .’’అని చెప్పగానే జనకుడు పరమ సంతోషం తో అతడికి వెయ్యి ఎడ్లు ఇస్తానన్నాడు .

   సశేషం

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-3-19-ఉయ్యూ

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment