వీక్లీ  అమెరికా -26 (18-9-17 నుండి 24-9-17 వరకు )-1

   వీక్లీ  అమెరికా -26 (18-9-17 నుండి 24-9-17 వరకు )-1

57 వ సుందరకాండ ,3 రుద్రాభిషేకాలు 4 భోజనాల వారం -1

18-9-17 మా శ్రీమతి ప్రభావతి 72 వ పుట్టిన రోజు . మా అమ్మాయి కొత్త చీర జాకెట్ కొని పెట్టింది .మా అమ్మాయి అల్లుడు లకు, మనవలు ముగ్గురికి దసరా కానుకగా నగదు ఇచ్చి కావలసినవి కొనుక్కోమన్నాం ..ఆధునిక ప్రపంచానిర్మాతలు  డిటిపి చేసి ప్రకాష్ గారు పంపిన 151-200 పేజీలలో తప్పులు దిద్ది వెంటనే పంపేశాను .

మంగళవారం -.రమణ ఫోన్ చేసి ప్రక్కనున్న మల్లికాంబగారబ్బాయి మోహన్ తో కూడా మాట్లాడించాడు . .

21-9-17 -గురువారం -శరన్నవరాత్రులు దసరా ప్రారంభం . ఉదయం మామూలు పూజతోబాటు మహాన్యాసం తో  దశశాంతి సామ్రాజ్య పట్టాభిషేకంలతో రుద్రాభిషేకం  శివ అష్టోత్తర శతనామ ,బిల్వాష్టోత్తరం తో పూజ చేశాను . మైనేనిగారు సూచించిన దానిప్రకారం గీర్వాణం -3 అంకితం స్పాన్సర్ ఆర్టికల్స్ రాసి మా శర్మకు పంపి మొత్తం ఫైల్ తయారు చేయమని రాశాను

     52 ఏళ్ళ క్రిందటి శిష్యురాలి పరిచయం

  గురువారం సాయంత్రం డా ఫణిమోహన్   డా శ్రావ్య దంపతుల ఇంట్లో నవరాత్రి సందర్భంగా శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణకు మమ్మల్ని ఆహ్వానించగా  సాయంత్రం  6 గం కు, డా ఫణిమోహన్ గారు మమ్మల్నిద్దర్నీ కారులో వాళ్ళ ఇంటికి తీసుకు వెళ్లారు .ఫణిగారిది ఖమ్మం .మా పెద్ద తోడల్లుడు మూర్తిగారి పెద్దబ్బాయి రవికి అక్కడ క్లాస్ మేట్ .వాడు ఇక్కడికొచ్చినప్పుడు తప్పక వీళ్ళింటికి వెడతాడు . వారం క్రితం వచ్చినప్పుడు రవి దంపతులు వెళ్లి చూసొచ్చారు . రాత్రి 7 గం లకు డా శ్రావ్యగారి స్నేహితురాండ్రు అయిదు కుటుంబాలవారు వచ్చి ముందుగా పాటలుపాడి తర్వాత పారాయణ చేశారు మళ్ళీ కొన్ని కీర్తనలు పాడారు .నేను 10 నిమిషాలు లలితా నామ విశిష్టత పై మాట్లాడాను . మాటల సందర్భంగా అమ్మవారి ‘’లావణ్యం ‘’గురించి చెబుతూ లవణం అంటే ఉప్పు అనీ అది స్పటికంగా ఉన్నప్పటి మెరుపు ను లావణ్యం అంటారనీ చెప్పాను ఇంతలో పాటలు పాడిన అమ్మాయి నాపేరు లావణ్య అన్నది .పైన నాలాగే ‘’పీఠాధిపతి’’ అంటే కింద కూర్చోలేక కుర్చీలో కూర్చున్నావిడ ‘’మా అమ్మాయే నండీ ‘’అన్నది .అప్పుడు ఎవరు ఏమిటి ఎక్కడి వారు అనే ప్రశ్నోపనిషత్ ప్రారంభమై ఆతల్లి కృష్ణాజిల్లా పెదప్రోలు ఆవిడని పసుమర్తి వారి ఆడబడుచుని కూ చిభోట్ల వారి కోడలని విషయం బయట పడింది.  అప్పుడు నేను 1963లో మోపిదేవి హై స్కూల్ లో నా ఉద్యోగం ప్రారంభించి 65 వరకు పని చేశానని పెద ప్రోలులో కాపురం ఉండేవాడినని అనగానే ఆవిడ ‘’మాస్టారూ !మీరు సైన్స్ మా స్టర్ దుర్గా ప్రసాద్ గారేనా ?“‘అని  ఆశ్చర్యం గా అడిగితె ఔనన్నాను .అప్పుడు అక్కడి పసుమర్తి సీతారామ శర్మగారు సోషల్ మాష్టారని  నన్ను ,లెక్కలమేస్టర్  స్వర్గీయ జె వి రమణా రాప్ గారిని శర్మగారింట్లో ‘’నెలరోజులు పెళ్లి కొడుకులను మేపి నట్లు మేపారని’’అనగానే  ,ఆవిడ ‘’మేష్టారు !నేను పసుమర్తి లక్ష్మిని అందరూ పి .లక్ష్మి అనిపి ల్చేవారు .మీ దగ్గర ట్యూషన్  కూడా చదివాను శర్మగారి చెల్లెలు దుర్గతోపాటులాంతర్లు తీసుకొని రాత్రి ట్యూషన్ కు వచ్చేవాళ్ళం  ‘’అని పాత జ్ఞాపకాల తేగల పాదు  తవ్వింది . కావలసినన్ని కబుర్ల రుచికరం విషయాల తేగలన్నీ బయట పడ్డాయి .నాకు లెక్కలమేష్టారికీ వీపులు రుద్ది తలంట్లు పోశామని  తానూ నా సైకిల్ వెనక ఎక్కి పెదప్రోలు  నుంచి మోపిదేవి స్కూల్ కు వచ్చేదాన్నని  లెక్కలమాస్టారి బైక్ మీద దుర్గ ఎక్కి వచ్చేదని గుర్తు చేసింది ఎందుకో నాకు లక్ష్మి అసలు జ్ఞాపకం రాలేదు . పెదప్రోలు లో శర్మగారి బాబాయి గారమ్మాయట  ఈమె  సుబ్రహ్మణ్యం చెల్లెలట .మణ్యమూ జ్ఞాపకం రాలేదు .శర్మగారి తమ్ముడు భగవంతం  మోపిదేవి పూజారి కొడుకు సుబ్బయ్య ,లొల్లా వారు కరణంగారు సాయి నళినీ జయంత్ మండవ వెంకటేశ్వరరావు అనే మార్క్సిస్టు పార్ట్ నాయకుడి కూతురు  ,అడివి శ్రీరారమ మూర్తి కృత్తివెంటి మాధవ అందరూ గుర్తున్నారు ఈ లక్ష్మి మాత్రం  గుర్తులో లేనే లేదు . మాధవ తమ్ముడు శ్రీనివాస్ ఇప్పుడు కేంద్ర సాహిత్య అకాడెమీ సెక్రెటరీ అని జ్ఞాపకం చేసుకున్నాం   అప్పుడు లక్ష్మి 6 ,7 తరగతులు చదివి ఉంటుంది మా క్లాసులు 8 . 9, 10  తరగతుల బోధన.అందుకే గుర్తు లేక పోయిఉండచ్చు .సాధారణం గా నాకు నాదగ్గర చదివిన పిల్లలెవరైనా గుర్తే వుంటారు ఒకవేళ మర్చిపోయినా వాళ్ళు జ్ఞాపకం చేస్తే వెంటనే ‘’బల్బు వెలుగుతుంది ‘’ లక్ష్మి విషయం లో ఎన్ని సార్లు స్విచ్ వేసినా బల్బ్ వెలగలేదు  .ఆ అమ్మాయికి అన్నీ జ్ఞాపకం ఉన్నాయి .నాకే లేవు ఇది తమాషా .

 ఇది అవగానే అక్కడ  భోజనం ఏర్పాటు .ఆవడ, గారే పులిహోర రవ్వకేసరి వంకాయ కూర,ఆలూ ఫ్రయ్  , అల్లం చట్నీ దోసావకాయ ,పాయసం ,ముక్కలపులుసు ,అప్పడం పెరుగు తో చాలా కమ్మటి భోజనం కడుపు నిండా తిన్నాను ముక్కలపులుసు అదరహా అంత బాగుంది . శ్రావ్యగారు కొసరి కొసరి వడ్డించి తినిపించారు . తర్వాత మళ్ళీ పాట  కచేరి  .శ్రీమతి పద్మజ  ఆమె ఆడబడుచు ,లావణ్య ,శ్రావ్య అమ్మవారిపై చక్కగా శ్రావ్యంగా పాటలు పాడారు .అందరం గ్రూపు ఫోటోలు తీసుకొన్నాం . నేను ఒకఫోల్డర్ ‘’పసుమర్తి లక్ష్మి ‘’అని పెట్టి తీసిన ఫోటోలన్నీ అందులో పెట్టాను . శ్రావ్య గారింట్లోనే మొదటిసారి వాళ్ళ అమ్మ నాన్నల షష్ఠి పూర్తికి వెళ్ళినప్పుడు శ్రావ్య అమ్మమ్మ గారు పరిచయమైనారు ఆమె మా గురువుగారు స్వర్గీయ మహంకాళి సుబ్బరామయ్య గారి తమ్ముడి భార్య .ఆ ఉదంతం అంతా ఇదివరకె వీక్లీ లో కుక్కేశాను .ఆ ఉత్సవం లో లక్ష్మీ పిల్లా జిల్లా వచ్చారట .కానీ అప్పుడు పరిచయం కాలేదు ఆడో తమాషా .

  శుక్రవారం -ఈ రోజు నుంచి విజయదశమి వరకు 57 వ షార్లెట్ లో 3 వ శ్రీ సుందరకాండ  9 రోజుల పారాయణ ప్రారంభించాను .. ‘’ కర్ణాటక సంగీత పితామహ పురందరదాసు ‘’ఆర్టికల్ రాశా

ఉదయం పారాయణ తర్వాత చల్లపల్లి -పెదప్రోలు మధ్య ఉన్న కప్తాను పాలెం లో ఉంటున్న నా 52 ఏళ్ళ పూర్వపు శిష్యుడు అడవి శ్రీరామమూర్తికి ఫోన్ చేసి పసుమర్తి లక్ష్మి పరిచయమైన సంగతి చెప్పా వాడు చాలా సంతోషించాను వాళ్ళమ్మగారితోనూ మాట్లాడా ఆవిడ నాకు కొన్ని నెలలు అన్నం వండి పెట్టారు వాళ్ళింటికే వెళ్లి రెండు పూట్లా తినేవాడిని ఆ మహా తల్లిని నేను జీవితాంతం మరువ లేను  . వాళ్ళు వండిపెట్టిన దానికి నేను వాళ్ళకేమైనా ధనరూపం లో ఇచ్చిన దానికీ సరిపోల్చలేను .సిగ్గుతో నేనే తలవంచు కోవాలేమో . అంతటి ఉన్నత హృదయం ఆమెదీ  భర్త గారిదీ .కొడుకుకు గురువు నేనుగనక నే భక్తి తో చేసిన సేవ  ఎంత నేను వారికిచ్చినా ఆకుటుంబం ఋణం తీర్చుకోలేను శ్రీరామ మూర్తి తరచూ కనిపిస్తూనే ఉంటాడు ఉయ్యూరుకు సరసభారతి కార్యక్రమాలకూ వస్తోనే ఉంటాడు . మాధవతండ్రి చనిపోగానే  బొంబాయి వెళ్లి ఉద్యోగం చేస్తూ తమ్ముళ్లను చెల్లెళ్లను పెంచి పోషిస్తూ తల్లిని ఆప్యాయంగా చూశాడు వాడూ ఒకటి రెండుసార్లు ఉయ్యూరు వచ్చాడు .మాధవ తమ్ముడే ఇప్పుడు అకాడెమి సెక్రెటరీ .ఒక తెలుగువాడు పొందిన అత్యున్నత గౌరవ0 న  అది అందునా నా శిష్యుడి తమ్ముడవటం అతని చిన్న తనం నాకు తెలియటం ఈపదవిలో ఉంటూ తెలుగు రచయితల సభలో ఆతను పాల్గొనటం కిందటి సారి అంటే 2012 లో మేము అమెరికాలో ఇక్కడే ఉండగా ఆతను ఉయ్యూరు మాకోసం రావటం  మా అబ్బాయి రమణ అతనికి ఆత్మీయ ఆతిధ్యం ఇచ్చి సరసభారతి పుస్తకాలు అందజేయటం వరుసగా గుర్తుకొచ్చాయి ఎక్కడ తీగో  లాగితే ఎక్కడి డొంకో కదిలింది తీపి గుర్తుల పరిమళాలను వెదజల్లింది .

          నేను చేయించిన 4 వ రుద్రం

23-9-17 శనివారం –  కిందటినెల శ్రీ రఘు గారింట్లో రుద్రం చేయించినప్పుడే శ్రీమతి రంజని ‘’అంకుల్ !మీ రుండగానే మా ఇంట్లో రుద్రం మీతో   చేయించుకోవాలని ఉంది తప్పకుండా చేయించాలి ‘’అని అడిగిందిసరే అన్నా . శనివారం మధ్యాహ్నం 3-30 కి మా అమ్మాయి మా ఇద్దర్నీ శ్రీ నాగరాజు శ్రీమతి రంజని దంపతుల ఇంటికి తీసుకెళ్లి దింపింది .అప్పటికే వాళ్ళు అంతా  రెడీ గా ఉన్నారు . సాయిరాం సాయిరాం అంటూ అందరూ ఆహ్వానించారు . నాలుగున్నరకుప్రారంభించి గణపతిపూజ రుద్రవాహానా  అష్టోత్తర సహస్రనామ లలితా అష్టోత్తర పూజ చేయించాను .రుద్రం చదివేవారు రాగానే లఘున్యాసం తో రుద్రం 5-30కి ప్రారంభించి ఏకాదశ రుద్రాభిషేకం సామూహికంగా చేయటం జరిగింది .రుద్రుడు ఎవరు అనే విషయం పై నేను కాసేపు ఆట్లాడాను -తర్వాత అక్కడ ఒకమ్మాయి పుస్తకం చూడకుండా రుద్రం జమాజెట్టీ లాగా మాతోపాటు చదువుతుంటే ఆశ్చర్యంపోయి ముచ్చట పడి  ఆమెకు సరసభారతి తరఫున రఘుగారింట్లో కాకాని లక్ష్మికి ఇచ్చినట్లే 1 116 రూపాయలు సరసభారతి పుస్తకం ఇవ్వాలనిపించి మా అమ్మాయికి ఫోన్ చేసి డబ్బూ పుస్తకం తెమ్మని చెబితే తెచ్చింది .రుద్రం అవగానే శ్రీ కందుల రవీంద్ర గారిని ఆమె పేరు అడిగితె ఆమె కాకాని లక్ష్మి అని చెప్పారు అవాక్కయ్యాను .అప్పుడామె చీర కట్టుకొని పెనుగంచి ప్రోలు తిరుపతమ్మ తల్లిలాగా కనిపించింది ఇప్పుడు చిన్న పిల్ల లాగా డ్రెస్ లో ఉంది .నేను అసలు గుర్తు పట్ట లెకపొయాను . కనుక నేను ఇవ్వాలనుకున్న దాన్ని ఇంత కష్టపడి  ఆడవారికి  మగవారికి అత్యంత శ్రద్ధతో రుద్రం నేర్పుతున్న శ్రీ కందుల రవీంద్ర గారికే ఇవ్వాలని కొని ఆమాట చెప్పగానే అందరూ హర్షధ్వానాలతో హాలు మారు మ్రోగించారు ఒక సర్వ సమరదుడికి ఇస్తున్నామన్న సంతృప్తి కలిగి వెయ్యిన్నూట  పదహారు రూపాయలుశ్రీ  సువర్చలేశ్వర శతకం అందజేశాను చాలా వినమ్రంగా ఆయన అందుకున్నారు .ఇదేకార్యక్రమం  మొదట్లో నాగరాజుగారికి ‘’మహిళా మాణిక్యాలు ,రవీంద్ర గారికి ‘’సిద్ధ యోగి పుంగవులు  ‘’పుస్తకాలు అందజేశాను . మాకు కాకానిలక్ష్మి స్వీట్   పాకేట్ ఇచ్చి తాము డిసెంబర్ లో ఇండియా వస్తామని అప్పుడు ఉయ్యూరువచ్చి శ్రీ సువర్చలేశ్వర స్వామిని తప్పకుండా దర్శించుకొంటామని చెప్పింది .తర్వాత భోజనాలు -పూర్ణం బూరెలు పులిహోర ,పూరీలు కాస్టికం కూర ,చానామసాలా  చట్నీ ,పులుసు ,పెరుగు వంటకాలు .నేను రెండు పూరీలు  పులిహోరలో పెరుగు కలుపుకొని అయిందనిపించాను .ఈ కార్యక్రమానికి మా శిష్యురాలు పసు మర్తి లక్ష్మి కూడా వచ్చింది  రెండో సారి చూశాను ఆమెతో ‘’మీ అమ్మాయికి మోపిదేవి సకలేశ్వరస్వామి గురించి మిగిలిన ఆర్టికల్స్ గురువారం శుక్రవారం మెయిల్ లో పంపాను చూశావా ‘’అని అడిగితె బంధువులారాకతో చూడలేదని చెప్పింది .డా ఫణి గారికీ  పంపాను అప్పుడే .నేను రుద్రుని పై చెప్పిన విషయాలు చాలా బాగున్నాయని శ్రీ చక్రవర్తి గారు నా దగ్గరకొచ్చి తెలుగులోనే అభినందించారు భార్య నిండుగా నవ్వుతూ రెండు చేతులతో నమస్కరించారు అభినందనగా . రుద్రం బాగా చేయించానని అందరూ వచ్చి అభినందించారు నేను సభా ముఖంగానే ‘’నేను ఇందులో ప్రొఫెషనల్ కాదు .ఎవరి వద్దా  నేను నేర్చుకోలేదు నాది శ్రుత పాండిత్యం .పుస్తకాలు చదివి నేర్చుకొన్నది మాత్రమే .నాకు గురువులెవరూలేరు .నేను మా ఇంటి దగ్గర ఎలా చేసుకొంటానో  మా జిల్లాలో మా శివాలయం లో ఎలా చేస్తారో అలా చేయిస్తున్నాను ఇక్కడ ‘’అని చెప్పాను .నాగరాజు దంపతులు చాలాఆనందం పొంది దక్షిణ తాంబూలం ఇచ్చి ఆశీస్సులు మా ఇద్దరి వద్దా పొందారు ‘

                            రుద్రుడు ఎవరు

‘’ 2012 లో 5 ఏళ్ళ క్రితం మేము షార్లెట్ వచ్చినప్పుడు ఇక్కడ అంతా’’సత్యసాయి హవా ‘’బాగా ఉండేది .దాదాపు ప్రతివార0 ఎవరింట్లోనో ఒకరింట్లో భజన భోజనాలు చాలా వైభవంగా జరిగేవి .ఇప్పుడు సాయిని తిరగేస్తే వచ్చే ‘’ఈశ ‘’అంటే రుద్రాభిషేకం హోరు బాగా ఉన్నది దానితోపాటు వేద మంత్రం తరంగాలు షార్లెట్ ను పవిత్రీకరించటం ఆహ్వానింపదగిన విషయం ఇలాగే కొనసాగాలని కోరుతున్నాను .రుద్రం నేర్పేవాళ్ళు నేర్చుకొనే వారూ క్షుద్రమైన ఆలోచనలకు దూరంగా ఉండాలి .అప్పుడే భద్రత కలిగి అభద్రత తొలగిపోతుంది నిర్ణిద్ర స్థితి కలుగు తుంది .  రుద్రుడు ఘోర రూపం లో నూ అఘోర రూపం లోనూ ఉంటాడు .

  దేవతలే ఒక సారి రుద్రుని దర్శించి ‘’కో భవానీతి ?’’అంటే నువ్వు ఎవరవు”?అని అడిగితె రుద్రుడు ‘’నేను నిత్య అనిత్య ,పరబ్రహ్మను తూర్పు పడమర ,ఉత్తరం దక్షిణం ,ఆకాశం ,పాతాళం,ఉపదిశలూ నేనే .నేనే బ్రహ్మా0డం .నేనే స్త్రీ నేనే పురుషుడను నేనే సావిత్రి ,గాయత్రి ,సరస్వతి ,నేనే త్రిష్టుప్ ,అనుష్టుప్ ,జగతీ మొదలైన ఛందస్సులు నేనే గార్హపత్య ,దక్షిణాగ్ని  ఆహవనీయఅగ్ని నేనే సత్యాన్ని నేను .జ్యేష్ఠుడిని శ్రేష్ఠుడిని,వరిష్ఠుడను  నేనే  నేనే జలం ,అగ్నీ కూడా రుక్ ,యజుస్ సామ అధర్వ వేదాలు నేనే .నాశనం కానీ సత్యాన్ని ,నాశనమయ్యే సృష్టి కూడా నేనే గూఢత్వ గోపనీయమూ నేనే .అరణ్యాలు పుష్కారాలూ నేనే పవిత్రమైనది అంతానేనే సృష్టికి మూలం మధ్యా అంతమూ నేనే ఉన్నదీ నేనే ,లేనిదీ నేనే .నేనే స్వయం ప్రకాశకుడిని .సర్వత్రా వ్యాపించి ఉండేది నేనే .అని చెప్పాడు కనుక ఒక్కమాటలో చెప్పాలంటే సర్వం శర్వుడే అంటే రుద్రుడే ..

 మహర్షులు దేవతలను ‘’రుద్రుడు ఎలా ఉంటాడు ?’’అని ప్రశ్నిస్తే వాళ్ళు ‘’ఎవని శిరసు ఉత్తరాన ,పాదాలు దక్షిణాన నిలిచి ఉంటాయో ,ఎవరు ప్రణవం అయిన ఓంకార స్వరూపుడో ,సర్వం వ్యాపించినవాడో ,ఎవరు అంతమో, ఏది తారేమో ,ఏది సూక్ష్మమో  ఏది వైద్యుతమో ,ఏది శుక్లమో అదే పరబ్రహ్మ అదే ఏకం అదే ఏక రుద్రం .ఆయనే ఈశానుడు  భగవానుడు ,మహేశ్వరుడు ,మహాదేవుడు ఆయనే రుద్రుడు ‘’అని తెలియ జెప్పారు శివ లింగం అంటే నిర్గుణ పరబ్రహ్మ స్వరూపం అయినాఅగ్ని అగ్ని నుంచి వచ్చేదే విభూతి అదే భస్మం .భస్మం అంటే జ్యోతిర్లింగం . ప్రకాశించే స్వరూపం కలది అని అర్ధం .భస్మం 5 రకాలు .శివుడి ముఖాలు అయిదు .సద్యోజాతాహం నుండి విభూతి ,వామదేవం నుండి భసిత ,అఘోరం నుండి భస్మం ,తత్పురుష రూపం నుండి క్షారం ,ఈశానం  నుంచి రక్ష పుట్టాయి

                        రుద్రుడు ఎలా పుట్టాడు

బ్రహ్మ దేవుడు సృష్టి చేయాలని సంకల్పించి ముందుగా సనకస సనంద మొదలగు ఋషులను సృష్టించి వాళ్ళను సృష్టి చేయమని కోరాడు దానికి వారు తాము సర్వ స0గ పరిత్యాగులమని ముక్కుమూసుకొని తపస్సు చేయటంతప్ప తాము ఏపనీ చేయలేమని చెప్పేశారు.దీనితో బ్రహ్మకు చిరాకు కోపం వచ్చి నుదుటిమీద చెమట బిందువులేర్పడి అందులో నుంచి ఒక పిల్లాడు పుట్టి ఏడుపు లంకించుకొన్నాడు రోదనం చేస్తున్న ఆబాలుడికి బ్రహ్మ ‘’రుద్ర’’అని పేరుపెట్టారు .రుదం అంటే ఏడుపు అది చేసేవాడు కనుక రుద్రుడు .కాసేపాగి మళ్ళీ ఏడిస్తే భవుడు మళ్ళీ ఏడిస్తే శర్వుడు అంటూ వరుసగా 11 పేర్లు పెట్టాడు రుద్రుడికి వారే ఏకాదశ రుద్రులు

 ‘’రుత్ దుఃఖం దుఃఖ హేతుహః ద్రావ యత్యేషణః ప్రభుహ్ -రుద్రా ఇత్యుచ్యతే  తస్మాత్ శివమ్ పరమ కారణం ‘’-అంటే దుఃఖాన్నికానీ ,దుఃఖ కారణాన్నికానీ రుత్ త్ అంటారు ఆ రుదం అంటే దుఃఖాన్ని దూరం చేసేవాడు అయిన శివుడిని రుద్రుడు అంటారు అని అర్ధం

‘’నమశ్శం భవేచ  మయోభవేచ ,నమశ్శ0 కారాయచ ,మయస్కరాయచ ,నమశ్శవివాయ శివ తరాయచ ‘అని రుద్రుని పూజిస్తాం -మంగళ స్వరూపుడు సుఖాన్నిచ్చేవాడూ ,మోక్ష ప్రదాత భక్తులకు కళ్యాణ కారకుడు అయిన రుద్రునికి నమస్కారం .వేదం నాదం తో ధర్మాన్ని బోధిస్తాడుకనుక ‘’ఈశానస్సర్వ విద్యానాం ‘’అంటారు .’’రు త్యాప్రణవ రూపాయా స్వా త్మాన0 ప్రాపయతీతి వా రుద్రహ్ ‘’-ఓంకారం తో జీవులను తనదగ్గరకు చేర్చుకొని వాడు రుద్రుడు .బ్రహ్మ దేవుడికి వేదాన్ని నేర్పినవాడు రుద్రుడే ‘’రోదనం యత్  దుఃఖం ద్రావయతీతి రుద్రహ్ ‘’ -దుఃఖాన్ని నాశనం చేసేవాడు రుద్రుడు .శ్రీకృష్ణుడు ఒక ఏడాది పాశుపతం అనే దీక్ష పొంది రుద్రాధ్యాయాన్ని అధ్యయనం చేసినట్లు కూర్మ పురాణం చెప్పింది ..మహాన్యాసం మూడవ న్యాసం లో ‘’రౌద్రీకరణం ‘’జపిస్తే పాపాలు నశిస్తాయి ,నాల్గవ న్యాసం ‘’ఆత్మా రక్షా ‘’చదివితే మన ఆత్మా పరమాత్మలో కలుస్తుంది 5వ న్యాసాంశివ సంకల్పం ‘’పఠిస్తే మోక్షం లభిస్తుంది ,దేహం వజ్ర కవచం అవుతుంది ,శత్రుబాధ నశిస్తుంది   .

  శివ అంటే నిత్యమైన ఆనంద సుఖాలనిచ్చేవాడని అర్ధం .అమృత శక్తి అనిభావం ఆయన నిత్య,శుద్ధ అమృత శక్తి ప్రదాత .శివుడు ‘’త్రిపురాసుర సంహారం ‘’చేశాడు ఆపురాలు ఎక్కడో లేవు .ఏవ్ మన శరీరం లో ఉన్న స్థూల సూక్ష్మ కారణం శరీరాలు  వీటిని సంహరించి మోక్షమిస్తాడు ఈ మూడూ అజ్ఞానానికి చిహ్నాలు .శివునిరెండు  కళ్ళు సూర్య చంద్ర లైతే  మూడవది అగ్ని అది ఆత్మజ్ఞానాన్నిస్తుంది .జీవులందరూ పశువులే అనీ ఆయన పశుపతి అని ఉపనిషత్ కధనం .శివుడు కపాల దారి .ఎవరి మనస్సులో సర్వకాల సర్వావస్థలలో శివుని ధ్యానిస్తారో ,అలాంటి వారి కాపాలాలు మాత్రమే అయన ధరించి కపాల మాలాధారి అవుతాడు వాళ్ళ అందరి ఆలోచనలో శివుడు మగ్నమై ఉంటాడు  కాలుడు శివుడు ఉజ్జయినిలో మహా కాళేశ్వరాలయం ఉంది బ్రహ్మ రాజా గుణం తో సృష్టి చేస్తే విష్ణువు తమోగుణంతో సృష్టినికాపాడుతాడు సత్వ గుణం తో శివుడు లయం చేస్తాడు ‘’సర్వాన శిరోగ్రీవః సర్వ భూత గృహాశ్రయః -సర్వవ్యాపీ స భగవాన్ -తస్మాసర్వగతః శివః ‘’అందరికంటే గొప్పవాడు ,అందరిలో ఉండేవాడూ ,అంతటావ్యాపించి ఉండేవాడు శివుడు అని అర్ధం ‘’ఆద్యంత రహితం దివ్యం సత్యం జ్ఞాన మనంతం ,జ్ఞాన విజ్ఞానదం మహత్ ‘’అని శివపురాణం -.శివుడు కాలాగ్ని రుద్రుడే కాదు జ్ఞానాగ్ని రుద్రుడుకూడా

  కామ దహనం అంటే శివుడు మన్మధుడిని సంహరించటం మాత్రమే కాదు -మన ఇంద్రియాల ఉన్మాదాన్ని నాశనం చేసుకోవటమే మనలో జ్ఞానం అనే మూడవ కన్ను తెరుచుకొంటే ,కామం నశించి ఇంద్రియ నిగ్రహం కలగటమే కామదహనం అని గ్రహించాలి శివుని మూడవ కన్ను మన్మధ దహనం చేస్తే  మన మనో నేత్రం తెరుచుకొంటె కోర్కెలు బూడిదైపోతాయి అప్పుడు శివుడూ మనమూ ఒకటే -శివోహం అంటే ఇదే .శివుడు ‘’రసవిరాట్ ‘’అందుకే తనలీల కోసం ఎడమ వైపు పార్వతీ దేవితో అర్ధనారీశ్వరుడై కనిపిస్తాడు .శివ పార్వతులు ఆదిదంపతులు .అందుకే కాళిదాసమహాకవి కుమారసంభవ కావ్యం లో మొదటి శ్లోకం లోనే వారిని ‘’వాగర్దా వివ సంపృక్తౌ   వాగర్థ ప్రతి పత్తయే  జగతః పితర0 వన్డే పార్వతీ పరమేశ్వరౌ ‘’అని స్తుతించాడు .రసమయ జీవ సృష్టికి ఆదిదంపతులు కారణమయ్యారు ‘’ఏ నద్యోహ్ పృథివీ చాంతరిక్షం  చ యే పర్వతాః ప్రదిశో దిశశ్చ -ఏ నేదం జగద్వ్యాప్త0 ప్రజానా0 తన్మే శివ సంకల్పమస్తు ‘’అని రుద్రం లో చెబుతాం -సర్వ జీవ సమాధారణ అనేది శివ తత్త్వం అని గ్రహించాలి .శివుని శిరస్సుపైఉండేది జ్ఞాన గంగ.శివుని  ఆయుధం త్రిశూలం -సృష్టి స్థితి లయాలకు అది ప్రతీక ఆయన వాహనం వృషభం అయిన నంది అది ధర్మానికి ప్రతీక . దాని నాలుగు కాళ్ళు -శాతం దయ ,దానం ,శౌచాలకు ప్రతీకలు .అదృష్ట ,అనాహార్య అగ్రాహ్య ,అలక్షణ ,అచింత్య ,అవ్యప్రదేశశ్యా ,ఏకాత్మ ప్రత్యయుసారం ,ప్రపంచ ఉపశమనం ,శాంతం ,శివమ్ అద్వైతం చతుర్ధం  ఘన్యంతే   -స ఆత్మా స విజ్ఞానం ‘’అని మాండూక్య ఉపనిషత్ వాక్యం ఇంద్రియాలకు కనిపించని ,దేనితోనూ సంబంధం లేని ,ఏదీ చేయని  తెలిసికోలేని ,ఊహించటానికి వీలులేని అవాజ్మానస గోచరుడు  భావనలో మాత్రమే పొందగలిగేవాడు పరమాత్మ ..

        సశేషం

    మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25-9-12- కాంప్-షార్లెట్-అమెరికా

 

 

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

భక్త పురందర దాసు

భక్త పురందర దాసు

‘’దాసరేంద్రే పురందర  దాసరాయ ‘’-దాస  భక్తులలో పురందరదాసు శ్రేష్ఠుడు’’అని గురువు వ్యాసతీర్థులవారి ప్రశంస అందుకున్న భక్త శిఖామణి పురందర దాసు  .సంగీత కర్త ,కవి అయిన వాగ్గేయకారుడు  .కర్ణాటక సంగీతానికి  ఆద్యుడు అందుకే ‘’కర్ణాటక సంగీత పితామహ ‘’అని పురందరదాసు ను గౌరవంగా సంబోధిస్తారు .నారద మహర్షి అపర అవతారమనీ అంటారు దాసు ను .

          ‘’ నవకోటి నారాయణ

 క్రీశ. 1484 లో కర్ణాటకలోశివమొగ్గ జిల్లా తీర్ధ హళ్లి లో  సంపన్న వర్తక కుటుంబం లోవరదప్ప నాయక ,లీలావతుల  ఏకైక  కుమారుడుగా  పురందరదాసు జన్మించాడు .తిరుమల శ్రీనివాసుని దయ వలన జన్మించినందున శ్రీనివాస నాయక్ అని పేరుపెట్టారు  ఆయన స్వగ్రామం ‘’పురందర ఘట్ట ‘’.అంటారు . సంప్రదాయ విధానం లో కన్నడ ,సంస్కృతాలతోపాటు సంగీతమూ అభ్యసించాడు 16 ఏళ్లకే సరస్వతీ బాయి తో వివాహమైంది 20 వ ఏట తలిదండ్రులు చనిపోయారు   ఆస్తి సంపదకు ఏకైక వారసుడయ్యాడు  పురందరదాసు .సంప్రదాయంగా వచ్చిన రత్న మాణిక్య వడ్డీ వ్యాపారం లో ఇబ్బడి ముబ్బడిగా సంపాదించి కోట్లకుపడగలెత్తి  ‘’నవకోటి నారాయణ ‘’అని ప్రసిద్ధి చెందాడు

                       సర్వస్వము త్యాగం చేసిన దాసు .

క్రమంగా సంపాదన ఆస్తి డబ్బు లపై వ్యామోహం తగ్గింది .భౌతిక సుఖాలు శాశ్వతం కాదు అని తోచింది . ఈ భావాన్ని మరింత బలపరచాడు శ్రీనివాసుడు పేద బ్రాహ్మణ రూపం లో రూపం లో కనిపించితన కుమారుని ఉపనయనానికి ధన సహాయం చేయమని కోరాడు.  ఎవరికీ చిల్లి గవ్వ కూడా ఇవ్వటానికి ఒప్పుకొని ఆ పిసినారి నవకోటి నాయకుడు ఎంతబ్రతిమిలాడినా కనికరించలేదు .గత్యంతరం లేక బాపడు  అతని భార్యకు తన డబ్బు అవసరాన్ని చెప్పాడు .దయామయి అయిన భార్య సరస్వతి తన ముక్కు కున్న ముక్కు పుడకను   తీసి భర్తకు తెలియకుండా బ్రాహ్మణుడికి ఇచ్చిపంపింది . తాను  ఇచ్చింది సాక్షాత్తు శ్రీనివాసుడి కే  అని ఆమెకు తెలియదు    ఆ ముక్కుపుడకను  పురందరదాసు నగల దుకాణం లో నే  అమ్మాడు  బ్రాహ్మణుడు . అది  తన భార్య నగ అని గ్రహించిన దాసు  .హడావిడిగా ఇంటికి వచ్చి భార్యను గద్దించాడు .తనకు భర్త చేతిలో అవమానం తప్పదని పాలలో విషం కలిపి తాగ టానికి నోటిదగ్గర పెట్టుకోగానే అందులో తన ముక్కుపుడక కనిపించింది.  భర్తకూడా ఆశ్చర్యపోయాడు ఆ పేద బ్రాహ్మణుడికోసం  వెతి కారుకాని జాడ లేడు ఇదంతా భగవల్లీల అం తన భార్యను కాపాడినవాడు సాక్షాత్తు తిరుమల శ్రీనివాసుడే నని గ్రహించి  తప్పు తెలుసుకొని సంపదమీద ఎక్కువ దృష్టిపెట్టటం వలన జరిగిన అనర్ధం అని గ్రహించి 30 వ ఏటనే తన సంపదనంతా త్యాగం చేసి పరమ భక్తుడై  హరిదాసుడై భాగవతోత్తముడైనాడుపుణ్యపురుషుడు  పురందరదాసు

                     వ్యాస తీర్థుల శిష్యరికం

కృష్ణదేవరాయల రాజగురువు వ్యాస తీర్థులవారి దర్శనం వలన మార్గం సుగమం అయి శిష్యుడై పురందరదాసు నామం తో40 వ ఏట  ప్రసిద్ధుడయ్యాడు  విజయనగర ఆస్థానం లో తన భక్తికీర్తనలు గానం చేసి రాజుతో సహా అందరి మెప్పూ పొందాడు .

                     4 లక్షల 75 వేల  కీర్తనలు

హంపీ చేరి ఒక మండపం లో ఉంటూ చివరి జీవితాన్ని గడిపాడు దాదాపు 4 ,లక్షల 75వేల  కీర్తనలు  రాసిన పరమభక్తుడుపురంధరదాసు  మిగిలిన 25 వేల కీర్తనలూ రాసి తాను  అనుకొన్న 5 లక్షల కీర్తనలు పూర్తి చేయమని చిన్న  కొడుకు’’మధ్వ పతి’’ ని  కోరాడు. తాను  ఈ జన్మలో అంతటి పని చేయలేనని మరోజన్మలో రాసి తండ్రి కోరిక తీరుస్తామని అన్నాడు .అతడే తర్వాత కర్ణాటకలో రాయపూర్ జిల్లా చీకలపర్వి లో ‘’విజయదాసు ‘’గా జన్మించి తండ్రికి వాగ్దానం చేసినదానిప్రకారం 25 వేల  కీర్తనలు శ్రీ లక్ష్మీ నారాయణస్వామిపై రచించి తండ్రికిచ్చిన మాట నిలబెట్టుకున్నాడు .అందుకే ఆయనను నారదావతారం అన్నారు .త్యాగరాజ స్వామి త’’ ప్రహ్లాద భక్త విజయం’’ గేయ నాటకం లో పురందర దాసును ప్రస్తుతించారు   ఆయన నివసించిన మండపాన్ని పురందర మండపం అంటారు

       మాయామాళవ రాగ సృష్టికర్త

.. .

.ఆధ్యాత్మిక వేత్తలైన వారికి మాత్రమే బోధపడే శ్రీ  మద్ భాగవతాన్ని సుందర సరళతరమైన శ్రావ్యమైన పాటలు గా రాసి సామాన్యులకు కూడా భాగవత పరమార్ధాన్ని తెలియ జేశాడు .కర్ణాటక సంగీతం లో వ్రేళ్లమీద లెక్కింపదగిన వాగ్గేయకారుడిగా గుర్తింపుపొందాడు .స్వరావళి ,అలంకారాలతో సంగీతానికి శోభ సమకూర్చాడు .’’మాయా మాళవ’’ రాగాన్ని సృష్టించి సంగీతం నేర్చుకొనే వారికిమొట్టమొదట పాడుకోవటానికి సులభంగా  ఉత్సాహ జనకంగా  వరప్రసాదంగా అందుబాటులోకి తెచ్చాడు .ఇప్పటికీ  ప్రారంభదశ లో సంగీతం నేర్చుకొనేవారికి వారికి ఈ రాగ0 లోనే సంగీతం బోధించే సంప్రదాయం కొనసాగుతోంది స్వరావాలి ,జంటస్వరాలు ,అలంకారాలు ,లక్షణ గీత ,ప్రబంధాలు యుగభోగాలు ,దాటువరస గీతాలు ,సూలాది మొదలైనవి రాశాడు .ఏదిరాసినా భావ రాగ లయ సమ్మేళనం తో విరిసిన పుష్పంగా కీర్తన శోభిల్లుతోంది .లక్షలాది కీర్తనలు రాసినా లభించి ప్రాచుర్యం లో ఉన్నవి 700 మాత్రమే .

            కర్ణాటక సంగీత పితామహ

  పురందర దాసు భక్తి ఉద్యమం లో దాస సాహిత్యాన్ని పారిపోషించి వ్యాప్తి చెందించాడు .తనకన్నా చిన్న వాడైనభక్త కనక దాసుకుపురందర దాసు  సమకాలికుడు .. కన్నడం లో చాలా క్ర్తనలు రాసినా సంస్కృతం లోనూ పురందరదాసు కృతులు  రాసి కీర్తి గడించాడు .ఆయన కృతులలో ‘’పురందర విఠల ‘’అనేది అంకిత  ముద్ర గా ఉండటం విశేషం  హిందూస్తానీ సంగీతం పై తీవ్రప్రభావం కలిగించాడు పురందరదాసు  ఉత్తరాది మహా సంగీత విద్వా0సుడు తాన్సేన్ గురువు స్వామి హరిదాసు పురందరదాసు శిష్యుడే .ఈ భక్త కవి శేఖరుడు 2-1-1564న 80 ఏళ్ళవయసులో పురందర విఠలుని చేరుకొన్నాడు

  ఆధునికకాలం లో బిడారం కృష్ణప్ప పురన్దరదాసు కీ ర్తనలను గానం చేస్తూ బహుళ వ్యాప్తిలోకి తెచ్చాడు  .ఏం ఎల్ వసంతకుమారి భీం సేన్ జోషీ లు కూడా పురందరదాసు కీర్తనలను పాడి పట్టాభిషేకం చేశారు .తిరుమలలో పుర0దరదాస విగ్రహం ప్రతిష్టించి గౌరవించారు .బెంగళూర్ లో పురందర దాస ట్రస్ట్ ఏర్పడి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తోంది .పుష్య బహుళ అమావాస్య నాడు పురందరదాసు ఆరాధనోత్సవం ఘనం గా నిర్వహిస్తున్నారు . కర్ణాటక సంగీత పితామహుడు పురందరదాసు అందరికి ఆరాధనీయుడే .

      మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -22-9-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

Inline image 1

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

భక్త కనకదాసు   

భక్త కనకదాసు

‘’మీలో మోక్షానికి ఎవరు అర్హులు ?“‘అని శిష్యులను గురువు వ్యాసరాయలవారు ప్రశ్నిస్తే ‘’నేనే అర్హుడిని  ‘’   ‘’అని ధైర్యంగా చెప్పిన కురుబ గౌడ దాస కుటుంబం లో పుట్టిన మహా భక్తుడు కనకదాసు .కర్ణాటకలో హవేరీ జిల్లా బాద గ్రామంలో యుద్ధ సైనికాధ్యక్ష కుటుంబం లో  బీర్ గౌడ ,బీచమ్మ దంపతులకు కనకదాసు 1509 లో జన్మించాడు .తనకీర్తనలు ,ఉపభోగాల వలనకర్ణాటక సాహిత్యాన్ని సుసంపన్నం చేసి  బాగాప్రసిద్ధమయ్యాడు.

                         తిమ్మప్ప కనకదాసైన  విధం

అసలు పేరు తిమ్మప్ప నాయకుడు బాగా చదువుకొని సమాజాన్ని అన్ని కోణాలలో సూక్ష్మ పరిశిలన చేశాడు కనకదాసు .అతని కీర్తనలో ఒకదాని ప్రకారం కనకదాసు’’ కనక నాయకుడు’’అనేసైన్యాధ్యక్షుడు .    ఒక యుద్ధంలో తీవ్రం గా గాయపడ్డాడు కానీ అదృష్టవశాత్తు ప్రాణాపాయం తప్పింది .దీనితో సైన్యానికి గుడ్ బై చెప్పివ్యాసరాయల శిష్యుడై  ‘’కనకదాసు ‘’అని గురువు పెట్టిన పేరుకు సార్ధకత  తెచ్చి  సామాన్యులకు అర్ధమయ్యే కన్నడ భాషలో కీర్తనలు రాస్తూ రచనలు చేస్తూ వేదాంతాన్ని అభ్యసించి  మహా కృష్ణ భక్తుడయ్యాడు

                 నేనే మోక్షానికి అర్హుడిని

  యవ్వనం లోనే కనకదాసు నృసింహ స్తోత్రం ,రామధ్యాన మంత్రం ,మోహన తరంగిణి రచించాడు  ఆయన ముఖ్య బోధన’’నేను అనేది పోతే అంతా పోతుంది ‘’ఒక రోజు గురువు వ్యాసరాయలు కనకదాసుతో సహా తన శిష్యులను ‘’మీలో మోక్షానికి ఎవరు అర్హులు ?’’అని ప్రశ్నించగా క్షణం ఆలోచించకుండా ‘’నేనే కాదు వీళ్ళెవ్వరూ  అర్హులు  కాదు  ‘’అన్నాడు .గురువు రెట్టించి అడిగినా అదే సమాధానం చెప్పటమేకాదు ‘’నేను మోక్షానికి వెడతానా ?’’అనిగురువు  అడిగితె ‘’మీరూ వెళ్ళలేరు ‘’అని ఖచ్చితంగా చెప్పాడు  .దీనికి శిష్యులతో సహా గురువుకు కూడా విపరీతమైన కోపం వచ్చింది దాసుమీద.   చివరికి గురువు దాసును ‘’నీకు  మోక్షానికి  వెళ్లాలని లేదా “అని అడగగా ‘’నేను అనేది పోతే అంతాపోతుంది-మోక్షం వస్తుంది  ‘’అన్నాడు .శిష్యుడి పరమ వేదాంత భావనకు గురువు పరమానందం పొందాడు .ఆతర్వాత రమణ మహర్షి కూడా ‘’నే నెవరు అని తెలుసుకొంటే అంతా తెలుస్తుంది ‘’అని చెప్పిన సంగతి మనకు తెలుసు .

    కనకదాసుకోసం తూర్పు నుంచి పడమరకు తిరిగినఉడిపి శ్రీకృష్ణ విగ్రహం

    వ్యాసరాయలు శ్రీ కృష్ణ దేవరాయల గురువు .ఉడిపి లో ఉండేవాడు కనకదాస్సుకూడా గురువుతో అక్కడే ఉన్నాడు .ఉడిపి శ్రీ కృష్ణ దర్శనానికి కనకదాసును బ్రాహ్మణ పూజారులు వ్యాసరాయలు చెప్పినా అనుమతి నిరాకరించారు .కనకదాసు గుడిబయటపడమర వైపు   కూర్చుని శ్రీకృష్ణ కీర్తనలుకొన్ని రోజులపాటు భక్తితో   పారవశ్యంతో గానం చేశాడు .కానీ కర్కశ హృదయులైన పూజారులకు కనికరం కలగలేదు లోనికి అనుమతించలేదు .ఒక రోజు తూర్పున ఉన్న కృష్ణ విగ్రహం తన భక్తుడికి దర్శనం ఇవ్వాలని ఒక్కసారిగా పడమర వైపుకు తిరగటం,  ఆలయం గోడ కూలిపోయి కనకదాసుకు కనకమహాలక్ష్మీ విభుడైన శ్రీ కృష్ణస్వామిదివ్య  దర్శనం లభించింది .పూజారులు అప్రతిభులయ్యారు కనకదాసు మహా భక్తికి నీరాజనాలు పలికి సగౌరవంగా ఆలయ ప్రవేశం చేయించారు ..ఉడిపి కృష్ణాలయం ముఖద్వారం తూర్పు వైపున ఉంటుంది .మొదట్లో కృష్ణ విగ్రహమూ తూర్పుకె ఉండేది . కనక దాసుకు దర్శనం ఇవ్వటానికి కృష్ణుడే దిశను మార్చుకున్నాడు .అప్పటి నుంచి ముఖద్వారం తూర్పుకు ఉన్నా ,కృష్ణ విగ్రహం పడమటి వైపే ఉంటోంది .భక్తవరదుడు అంటే ఇదే .ఇప్పుడు ఇక్కడ ఉన్న కిటికీ ని ‘’కనకదాస కిటికీ ‘’అంటారు .ఈ కిటికీ లోంచే ఉడిపి కృష్ణుని దర్శిస్తారు .అంతటి చరిత్ర సృష్టించాడు

                   కనక మందిరం

మహాభక్తుడైన కనక దాసు . ఆలయ గోపురం ముందు  చిన్న గుడిసెలో  ఉండేవాడు .తర్వాత దాన్ని ఒకమందిరం లాగా కట్టి ‘’కనక మందిరం ‘’అని పిలుస్తున్నారు మహా భక్తుడైన పురందర దాసు వ్యాసరాయలూ కృష్ణ భక్తులే అయినా కనక దాసుకూ కృష్ణ స్వామికి ఉన్న అనుబంధం అన్నిటికన్నా మించినది .

                 సామాన్యుల మాన్యకవి ,సంస్కర్త

  కనకదాసు ఏది రాసినా సామాన్యులకు అర్ధమయేటట్లు  వారికి అందుబాటులో ఉండేటట్లే రాశాడు .ఆయన రాసిన ‘’రామ ధ్యాన చరిత ‘’లో రాగి ధాన్యానికి బియ్యానికి ఉన్న స్పర్థను చక్కగా అభి వర్ణించాడు . రాగి పేద వాళ్ళ ఆహారం.  బియ్యం ధనవంతుల ఆహారం .బియ్యం గొప్పదే అయినా రాగిలో పోషకాహార విలువ ఎక్కువ .దీన్నే ఆయన అందులో నిరూపించాడు బీద ,ధనిక భేదాన్ని  పేదయైనా వ్యక్తిత్వం లో మిన్న గా ఉండే విధానాన్ని ఇందులో సింబాలిక్ గా చెప్పాడు . .ఆ నాటి సమాజం లో హరిదాసు ఉద్యమం బాగా ఉండేది.  దాస సంప్రదాయానికి చెందిన కనకదాసు విస్తృతంగా పర్యటించి ఆ సంప్రదాయ వ్యాప్తి చేస్తూ ప్రజలలో భక్తి ,సామాజిక బాధ్యతా ,సమత్వం పెంపొందించాడు .సామాజిక అంశాలను నీతిని  భక్తితో జోడించి చెప్పాడు .తనకీర్తనలలో వర్ణ వ్యవస్థను ఏకిపారేశారు .అందరూ సమానమే అన్నాడు .’’కులకుల వేందు హోడె దాదరి ‘’అన్న కీర్తనలో కులం కులం  అని ఎందుకు మొత్తుకొంటారురా అని చివాట్లు పెట్టాడు

          కినేగెలే ఆదికేశవ కృతి ముద్ర

 ఇవాళ కర్ణాటక హవేరి జిల్లా లోని కాగినేలి లో కొలువై ఉన్న ఆదికేశవ స్వామి కి అత్యంత భక్తుడు కనకదాసు .కనకదాస విరచిత 240 కృతులు సజీవంగా ఉండి కర్ణాటక సంగీత గాయకుల నోటప్రచారమవుతున్నాయి .ఈ కీర్తనలో ముద్ర ‘’కిగినెలే ఆదికేశవ ‘’అని ఉంటుంది . కీర్తనలు రచించటమే కాదు అదో జగత్ సహోదరుల ను ఉన్నతస్థితికి తీసుకు రావటానికి సంఘ  సంస్కరణ ఉద్యమాలు చేశాడు .

                             నిర్యాణం

కనకదాసు జీవిత చరమాంకం లో తిరుపతి లో బాలాజీ  సన్నిధి లో  గడిపి ,నూరేళ్లు నిండు జీవితాన్ని అనుభవించి 1609 లో శ్రీ కృష్ణ సన్నిధానం చేరుకొన్నాడు  .

  కనకదాసు 1-నలచరిత్ర 2-నృసింహ స్తోత్రం 3-హరిభక్తిసార 4-రామధ్యాన చరిత్రే 5-మోహన తరంగి కన్నడం లో  రచించాడు

               విజయనగరమే ద్వారకా నగరం

.కనకదాసు కవిత్వం చక్కని ఉపమానాలతో సహజ సుందరం గా సరళంగా ఉంటుంది .శ్రీ కృష్ణుని ద్వారకా నగరాన్ని విజయనగరం గా పోల్చి  విదేశీ రాయబారులు విజయనగరాన్ని వర్ణించిన తీరును దృష్టిలో పెట్టుకొని గొప్పగా వర్ణించాడు .

కనకదాస జయంతి నిర్వహిస్తున్న కర్ణాటక ప్రభుత్వం

కనక దాస జయంతిని కర్ణాటక ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించి ప్రభుత్వ కార్యక్రమంగా ప్రతి ఏడాదీ నిర్వహించి ఆమహా  భక్త   కవిని చిరస్మరణీయుని చేస్తోంది . తీర్ధ యాత్రలు చేసేవారువెయ్యేళ్లనాటి  ఉడిపిశ్రీ కృష్ణ దేవాలయానికి  వెళ్లి   ‘’కనక దాస కిండే(కిటికీ )  ద్వారా ఉడిపి కృష్ణుని సందర్శించి ధన్యులవమని కోరిక.

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -20-9-17-కాంప్ -షార్లెట్-అమెరికా

Inline image 1Inline image 2Inline image 3

Inline image 4Inline image 5
Posted in మహానుభావులు | Tagged | Leave a comment

01-10- 2017 విజయ” దుర్గ” భారతీ అలంకారములో షార్లెట్ తెలుగు అభిమానులను దీవించుగాక.

01-10- 2017  విజయ” దుర్గ” భారతీ  అలంకారములో  షార్లెట్ తెలుగు అభిమానులను  దీవించుగాక.

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | 1 Comment

వీక్లీ అమెరికా-25(11-9-17 నుండి-17-9-17 )వరకు  ఇర్మా తుఫాన్  ఉయ్యూరు పెన్షన్ స్కామ్ వారం 

వీక్లీ అమెరికా-25(11-9-17 నుండి-17-9-17 )వరకు

ఇర్మా తుఫాన్  ఉయ్యూరు పెన్షన్ స్కామ్ వారం
11-9-17 సోమవారం -ఇర్మా హరికేన్ క్యూబా ,ఫ్లారిడాలో విలయం సృష్టించి జనాలకు నిలువ నీడ లేకుండా చేసింది . దీనివలన పెట్రోల్ తో సహా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి . షార్లెట్ స్కూళ్లు మామూలుగానే పని చేశాయి ..నిన్నరాత్రి ఫ్లోరిడా నుంచి మా తోడల్లుడు మూర్తిగారి మనవడు రవి ,భార్య శారదా ,కొడుకు అద్రీశ్ లు వచ్చారు . సోమవారం సాయంత్రం ఇక్కడే ఉన్న  రవి డాక్టర్ ఫ్రెండ్ భార్య  శ్రావ్య దంపతుల ఇంటికి వెళ్లి వచ్చారు అప్పటికి వర్షం భీభత్సం గా ఉంది ..రవి ఫోన్ తో మేమూ మూర్తి గారి దంపతులతో మాట్లాడాం .రవి కొడుకు చాలా ముచ్చటగా ,కలుపు కోలుగా నన్ను  తాతగారు అని మా శ్రీమతిని అమ్మమ్మా అని, శారద కూడా  నన్ను తాతయ్య అంటూ ఆమెను అమ్మమ్మా అంటూ చాలా సరదాగా ఉన్నారు
.గీర్వాణం -3 కవుల కేటగిరి ప్రారంభించాను .
12-9-17 మంగళవారం -ఇక్కడ స్కూళ్లు ఇవాళ రెండు గంటలు  ఆలస్యంగా మొదలయ్యాయి . రమణ ఫోన్ చేసి ఉయ్యూరులో మా ఇంట్లో అద్దెకుంటున్న మాస్టారు కుటుంబం అంతా 15 రోజుల రామేశ్వరం మొదలైన తీర్ధ యాత్రకు వెళ్లినట్లు చెప్పాడు .”బడ్డీ  బుడ్డి ”కి ఆపరేషన్ అయి ఇంటికి వచ్చాడట .కాల విభజనలో తల మునకలుగా ఉన్నాను . పవన్ కు వాగ్దానం చేసినట్లు 2012 లో రాసిన వేలూరి వారి డిప్రెషన్ చెంబు కథ నెట్ లో మళ్ళీ అందరికోసం పెట్టాను మంచి రెస్పాన్స్ వచ్చింది ..
  శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ అవధాని గారు హూస్టన్ లో శ్రీ వంగూరి చిట్టెన్  రాజు గారింట ఆతిధ్యం లో ఉన్నానని ,తోటలో గోంగూర బాగుందని కవిత్వం రాశారు నేనూ తగిన సమాధానం ఇస్తూ అమెరికాలో హూస్టన్ లో తొలి  తెలుగు సంస్థ ఏర్పాటు చేసిన వారిలో  చిట్టెం రాజు ,శ్రీ వావిలాల కృష్ణ ముఖ్యులని కృష్ణ గారిభార్య శ్రీమతి లక్ష్మి గారు ఉయ్యూరు లోని మా అప్పన్నకొండ మామయ్య కూతురే నని ,2002 లో మొదటిసారి మేము అమెరికా హూస్టన్ కు వచ్చినప్పుడు వారితో బాగా కాలక్షేపం చేశామని ,కృష్ణగారు రాజమండ్రికవిత్రయం లో ఒకరైన వావిలాల వాసుదేవ శాస్త్రి గారి మనవడని  తెలియజేశాను.      

  రవి ఫోన్ చేస్తుంటే వాళ్ళమ్మానాన్న సూర్యం స్వర్ణ దంపతులతో మాట్లాడాం నా ”ముఖ బుక్ ”ను స్వర్ణ బాగా ఫాలో అవుతున్నానని చెప్పింది ”ఇదో ”తుత్తి ”.
 శ్రీమతి మల్లికాంబ గారికి ఫోన్ చేస్తే తాను  ఏజవాడ లో ఉన్నానని 15 రోజులుగా జ్వరం తో బాధ పడుతున్నానని ,ఎస్పీ బాలు పెద్ద చెల్లెలు శ్రీమతి గిరిజ మరణించారని ఆ షాక్ తో అందరం ఉన్నామని చెప్పారు .
 బుధవారం -రవి వాళ్ళు తెల్లవారుజామున 5 గంటలకే  ఫ్లారిడాబయల్దేరి మధ్యాహ్నం 3 కు చేరారు .వాళ్ళతో ఉన్న ఈ రెండు రోజుల్లో వాళ్ళతో ఫోటోలు తీసుకోలేక పోయాం  వెళ్ళాక గుర్తొచ్చింది .పిల్లాడు చాలా సరదాగా గా గడిపాడు . ”కేరీ ”లో హరికోడుకు ”దర్శి ”లాగా మంచిమాటకారి
 గురువారం  రమణ ఫోన్ చేసి ఉయ్యూరు పెన్షనర్ అసోసియేషన్  అధ్యక్షుడు రంగ రామానుజం సుమారు 5 కోట్లప్రభుత్వ డబ్బుకు కు పంగనామం పెట్టాడని  ,తన భార్య చెల్లెలు కూతురు  వగైరా 11 మందికి ,వాళ్ళు ఏ రకమైన ఉద్యోగం చేయకపోయినా సర్వీస్ రిజిస్టర్లు సృష్టించి రిటైరుమెంట్ ఇప్పించి అన్నిరకాల పెన్షన్ సదుపాయాలూ వాళ్లకు కట్టబెట్టి0చి ,  ప్రభుత్వ ఖజానాకు పెద్ద బొక్క పెట్టాడు   దీనిలో ఆయా స్కూళ్ల  హెడ్ మాస్టర్లు ,ఏం యి ఓ లు ,మండల అధ్యక్షులు ,ట్రెజరీ సిబ్బంది ,బాంక్ ఆఫిసర్లు ,విద్యాశాఖాధికారి మొదలైన వారిని ఎలా మాయం చేశాడో ఎలా సాంక్షన్ చేయించాడో ఆశ్చర్య0. జూనియర్ ఏంటి ఆర్ సినిమాలో”అదుర్స్ ”లో  బ్రహ్మానందం డబ్బును రమాప్రభాదులు  ”నాకేశారు’ ‘  అన్నట్లు జుర్రేశాను . అసలు ఈ మిస్టరీ ని బయట పెట్టిందెవరో ,ఎలా తీగ లాగితే డొంకంతా కదిలిందో తమాషాగా ఉంది . పేపర్లలో ఈ వార్తలు బాగా వచ్చాయి . నాకూ పేపర్ కటింగ్ లు రావటం తో కొంత తెలిసింది .అమెరికాలో ”ఇర్మా ”జనాన్ని నాకేస్తే ఉయ్యూరు లో రంగ రామానుజం ”స్కామ్ ఇర్మా తో ”సర్వం నాకేశాడనిపిస్తుంది .
  రాత్రి ”గొట్టం” లో ‘సంసారం లో సంగీతం ”చంద్రమోహన్ విజయశాంతి సినిమా చూసాం సరదాగా ఉంది ”సరదా చిత్రాల ‘రేలంగి ”దర్శకుడు .
 గురువారం -గీర్వాణం 3 కవులను 18 వ శతాబ్ది వరకు  యుగ విభజన చేసిశర్మకు పంపాను  .రేలంగి నరసింహారావు డైరెక్ట్ చేసిన రాజేంద్ర ,యమున నటించిన ”బ్రహ్మచారి మొగుడు ”ఇదివరకు చాలాసార్లు చూసినా మళ్ళీ చూశా .రాఘవులు సంగీతం చాలా బాగుంది అందులో నా నోట్లో ఎప్పుడూ నానే ఇష్టమైన  పాట ”ముత్యాల ముగ్గేయరే -ముగ్గుల్లో ”
15-9-17 శుక్రవారం -ఈ శరన్నవరాత్రులలో మా అమ్మాయి గారింట్లో భగవదనుగ్రహం తో 21-9-17 గురువారం ,25-9-17సోమవారం రుద్రాభి షేకం  22-9-17 శుక్రవారం నుండి 30-9-17 శనివారం వరకు నా 57 వ (షార్లెట్ లో 3 వ ) శ్రీ సుందరకాండ పారాయణ చేయాలని  అనుకొంటున్నాను
  డా శ్రీ ఎల్లాప్రగడ రామ మోహన రావు గారు కేరీ నుంచి ఫోన్ చేసి నేను వారికి పోస్ట్ లో పంపిన 5 పుస్తకాలు అందాయని చెప్పారు  గీర్వాణం -3 ని1 9 శతాబ్దం వరకు కాలక్రమంలో కవులను పెట్టాను .
  రాత్రి ”నలుపు -తెలుపు ”మాయాబజార్ సినిమా ట్యూబ్ లో చూశాను .ఎన్నిసార్లు చూసినా ఆ పరవశం తగ్గదు .ఇంత  గొప్ప సినిమా లేదేమోనని పిస్తుంది .కలర్ లో చూడటం ప్రారంభించి నచ్చక బ్లాక్  అండ్ వైట్ కి షిఫ్టయ్యాను .అల్లుడు రాత్రికి ఇండియానుంచి వచ్చాడు
16-9-17 శనివారం రాత్రి8-30కు  ”Sears”కు వెళ్లి మనవరాళ్లకు ఫాషన్  ఇయర్ రింగ్స్ కొన్నాం .
  17-9-17 -ఆదివారం -గీర్వాణం -3లో 20 వ శతాబ్ది 21 శతాబ్ది కవుల ను తయారు చేసి శర్మకు పంపి ఆప్రకారం కవులను వరుసలో పెట్టి ఫైల్ తయారు చేయమని చెప్పాను . ఇవాళ మాఅమ్మాయి తెలుగు క్లాస్ జరిపింది .
                     తెలుగు తరగతి  .
  వేసవి సెలవుల ముందు తర్వాత  ఇక్కడ మా ఇంట్లో తెలుగు తరగతులు జరిగినా ,నేను ఫోటో తీయటం తప్ప ,క్లాస్ ఎలా జరుగుతోందో చూడలేదు వినటం మాత్రం వింటున్నాను .దాన్ని బట్టి నాకు అర్ధమైంది ఏమిటి అంటే ఇక్కడి తెలుగు తలిదండ్రులు తమ పిల్లలు తెలుగు మర్చిపోకుండా ఉండటానికి చాలా శ్రమ పడుతున్నారు .వాళ్ళే టీచర్స్ గా పేరెంట్స్ గా ఉంటూ సహకరిస్తున్నారు .తెలుగు ఉచ్చారణ,సంభాషణ కోసం చాలా తాపత్రయ పడుతున్నారు . వీళ్లందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను .ఇది ఒక రకంగా పేరెంట్స్ తెలుగు మర్చి పోకుండా చేయటానికి బాగా ఉపయోగ పడుతోందని నా విశ్వాసం . పిల్లలు కూడా చాలా హుషారుగా ఉత్సాహంగా నేర్వటానికి వచ్చి నేర్చి అభి వృద్ధి పొందుతున్నారు ఆ చిన్నారులకు మనస్పూర్తి ఆశీస్సులు .ఈ జాగృతి ఇలానే నిలబడాలి .. మనం తెలుగు వారమైనందుకు గర్వపడేట్లు చేయాలి.  తెలుగు సంస్కృతి  ని కూడా పండుగలద్వారా జరిపించి వారిలో పండగల పరమార్ధం ఏమిటో తెలియ జెప్పాలి .అన్ని పండగలు కాకపోయినా సంక్రాంతి ఉగాది సామూహికంగా సాయంత్రాలలో నిర్వహిస్తే బాగుంటుంది .కృష్ణరాయల పద్యం ”తెలుగదేల యన్న దేశంబు తెలుగు -ఏను తెనుగు వల్లభుండ తెలుగొ  కండ -యెల్ల  నృపులు కొలువ యెరుగవే బాసాడి -దేశ భాష లందు తెలుగు లెస్స ”  అందరికి నోటికి వచ్చేట్లు నేర్పాలి .అందరితో అనిపిస్తే అదే వచ్చేస్తుంది కష్ట పడక్కరలేదు
    ఇదికాక మరో ముఖ్య విషయం -పిల్లలు తెలుగు క్లాస్ లో తెలుగు లోనే మాట్లాడటం హర్షించదగిన విషయమే .కానీ మనం మరచి పోతున్న తెలుగు బంధుత్వాలను ఇక్కడ వారికి పరిచయం చేయాలి .పెద్ద వాళ్ళను అంకుల్ ఆంటీ అనకుండా బాబాయ్  పిన్నీ  మామయ్యా, అత్తయ్య అని పిలవమని చెప్పాలి . ఆడపిల్లలు తమ తోటి ఆడపిల్లలను అక్కా, చెల్లీ  అని ,మగ పిల్లలను అన్నా ,తమ్ముడు అని ముసలివారిని తాతగారు ,బామ్మగారు అమ్మమ్మ గారూ పిలిపిస్తే తెలుగుదనం ఉట్టిపడుతుంది . ఇండియాలో స్కూళ్ల లో ఆడ పిల్లలు మగ పిల్లలు అన్నా అక్కా అని చక్కగా పిలుచుకొంటారు. వినటానికి ఎంతో మధురంగా ఉంటుంది . ఆ  సంస్కృతి ఇక్కడి తెలుగు తరగతులలో కూడా ప్రతిబింబించాలి .అమెరికా తెలుగుపిల్లలను  చూసి ఇండియాలోని తెలుగుపిల్లలు గర్వ పడాలి . వీటికి ఇక్కడి తెలుగు తరగతుల ఉపాధ్యాయ ఉపాధ్యాయినులు  వీరి పైన  ఉండి పర్య వేక్షించేవారూ తగిన విధంగా సహకరించి స్పందించాలి  . ఇవన్నీ బయట ఉండి నా బోటి వాళ్ళు చెప్పటం బాగానే ఉంటుంది .ఒడ్డున నిలబడి రాయి విసరటం తేలికే . కానీ దీనిలోని సాధక బాధకాలు  బోధించేవారికి  తలిదండ్రులకుమాత్రమే  తెలుస్తుంది అని నేను నమ్ముతున్నాను
 చివరగా మా ఇంట్లో తెలుగు క్లాసులలో మా అమ్మాయి ,టీచర్లు ,పేరెంట్స్ పడే శ్రమ చూడలేదుకాని వింటున్నాను .పిల్లలు కొందరు ”సుందరకాండ ”సినిమాలో వెంకీ క్లాస్ మేట్  ,విద్యార్థి అయిన బ్రహానందం లాగా  నవ్విస్తున్నారు .సరదా పుట్టిస్తున్నారు .వాళ్ళ వచ్చి  రాని తెలుగుతో వినోదమూ కలిగిస్తున్నారు . బోల్డు హాస్యం సృష్టిస్తున్నారు .ఇవన్నీ ఉంటె నే ,క్లాస్ సరదాగా ఉంటుంది .”కీప్ ఇట్ అప్ తెలుగు విద్యార్థులూ ఉపాధ్యాయులూ తలిదండ్రులూ ;”
  ఈ వీక్లీ ఇంతటి తో సమాప్తం
   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -17-9-17-కాంప్-షార్లెట్-అమెరికా
Posted in అమెరికా లో | Tagged | Leave a comment

దసరా నవరాత్రి సందర్భంగా 57 వ శ్రీ సుందరకాండ పారాయణ

దసరా నవరాత్రి సందర్భంగా 57 వ శ్రీ సుందరకాండ పారాయణ

 21-9-17గురు వారంఆశ్వయుజ శుద్ధ పాడ్యమి  నుండి 30-9-17 శనివారంఆశ్వయుజ శుద్ధ దశమి వరకు  దసరా నవరాత్రి సందర్భంగా షార్లెట్ లో మా అమ్మాయి గారింట్లో  ప్రతి రోజు ఉదయం -6-30 గం నుండి  నా 57 వ సుందరకాండ (షార్లెట్ లో 3 వ పారాయణ )తొమ్మిది రోజుల పారాయణ ,21-9-17 గురువారం ,25-9-17 సోమవారం మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం మా దంపతులచే నిర్వహింప బడుతోందని తెలియ జేస్తున్నాము .

             కార్య క్రమ వివరం

21-9-17 గురువారం -ఉదయం 6-30 గం నుండి శ్రీ సువర్చలాన్జనేయ స్వామి అష్టోత్తర సహస్ర నామ పూజ ,శ్రీ లలితా అష్టోత్తర ,శ్రీ దుర్గ అష్టోత్తర ,శ్రీ సరస్వతీ అష్టోత్తర ,శ్రీ గాయత్రీ అష్టోత్తర ,శ్రీ అన్నపూర్ణా అష్టోత్తర పూజ  ,తరువాత  మహాన్యాస పూర్వక నమక చమకాలతో ,దశశాంతి ,సామ్రాజ్య పట్టాభిషేకం తో అభిషేకం ,శివ అష్టోత్తర సహస్ర నామ పూజ ,బిల్వాస్టోత్తర పూజ జరుగు తుంది .

22-9-17 శుక్రవారం -నుండి-30-9-17 శనివారం వరకు ఉదయం 6-30 నుండి  పై విధంగానే నిత్యం అయ్యవార్లకు అమ్మవార్లకు పూజ -అనంతరం 9 రోజుల  శ్రీ సుందర కాండ పారాయణ  ,శ్రీ సువర్చలాన్జనేయ శతక పారాయణ జరుగుతుంది .

24-9-17 ఆదివారం మాత్రం శ్రీ రాంకీ తమ్ముడు పవన్ ఇంట్లో ఉదయం 7-30 కు శ్రీ రుద్రాభిషేకం ఉందని చెప్పటం వలన -మా ఇంట్లో పూజ, ,పారాయణ ఉదయం 4-గం నుండి 6-30 వరకు జరుగు తుంది .

25-9-17 సోమవారం -పై విధంగానే నిత్యపూజ తోపాటు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం పై విధంగానే జరుగుతుంది తర్వాత యధాప్రకారం శ్రీ సుందర కాండ పారాయణం ,శతక పఠనం స్వామి వార్ల అనుగ్రహం తో జరుగుతుందని తెలియ జేస్తున్నాను .   దుర్గాప్రసాద్

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

  వీక్లీ అమెరికా -24 (4-9-17 నుండి 10-9-17 వరకు ) పిక్నిక్ ,ఫెసివల్ ఆఫ్ ఇండియా వారం

  వీక్లీ అమెరికా -24 (4-9-17 నుండి 10-9-17 వరకు )

   పిక్నిక్ ,ఫెసివల్ ఆఫ్ ఇండియా వారం

4-9-17 సోమవారం -వేసవి సెలవులతర్వాత మా అమ్మాయి మళ్ళీ ఇంట్లో ఆగస్టు 27 ఆదివారం నుండి తెలుగు క్లాసులు ప్రారంభించింది .మా అల్లుడు 28 ఆగస్టు ఇండియా కు కాకినాడలోభాద్రపద శుద్ధ ద్వాదశి నాడు  ఆయన తండ్రిగారి  ఆబ్దీకం   పెట్టటానికి బయల్దేరి వెళ్ళాడు .  తర్వాత  తిరుపతి ,తిరువన్నామలై సందర్శించి 15 వ తేదీకి తిరిగి షార్లెట్ చేరతాడు

5-9-17 మంగళవారం ఉపాధ్యాయ దినోత్సవం నాడు మా కోట గురువరేణ్యుల గురుపూజోత్సవాన్ని ఉయ్యూరులో నిర్వహించటం గురుపుత్రులు శ్రీ కోట సీతారామాంజనేయులుగారు వారి కజిన్ శ్రీ కోట సీతారామ శాస్త్రిగారూ హాజరవడం పేద ప్రతిభగల విద్యార్థులకు శ్రీ మైనేని గారు గురు భక్తితో ఏర్పాటు చేసిన రెండు 10 వేల రూపాయల నగదు బహుమతులను ,గురుపుత్రులు తాముఏర్పరచిన  తమ తలిదండ్రుల స్మారక నగదు బహుమతి 10 వేల రూపాయలు ,శ్రీ వేమూరి సదాశివ తమతల్లి గారు కీశే శ్రీమతి దుర్గ గారి జ్ఞాపకార్ధం అందజేసిన 5 వేల రూపాయలు అర్హులకు అందజేయించి  ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా 10 మంది ఉపాధ్యాయులకు సన్మానం చేసిన సంగతి మీ కు తెలిసిన ,తెలిపిన విషయమే .

  ఇవాళ శ్రీ అనంత పద్మనాభ చతుర్దశి సందర్భంగా శ్రీ రాంకీ భార్య శ్రీమతి ఉష ఇంటి వద్ద నోము నోచుకోని ,అట్లు వాయనం తెచ్చి మా శ్రీమతికి ఇచ్చి చీరె జాకెట్ ,;;ఘ నగదుతాంబూలం ‘’ఇచ్చి నాకూ బట్టలు పెట్టి ఆశీర్వాదం పొంది వెళ్ళింది .ఇక్కడున్నా  సంప్రదాయాన్ని ఆమె అంత శ్రద్ధగా పాటిస్తోంది . అభినందనలు .పట్టుబట్టను ‘కాశా  బోసి’’గా మన ఇళ్లవద్ద పెద్ద ముత్తైదువులు కట్టుకొనే తీరులో కట్టుకొని ముఖాన పెద్ద కుంకుమ బొట్టు తలలో పూలు చేతులనిండా గాజులు ,చేతులకు గోరింటాకు తో  వాయనం ఇవ్వటం చూస్తే సాక్షాత్తు అమ్మవారిని చూసినట్లు అనిపించింది మా ఇద్దరికీ .మనసులో ఎంతో అభినందించాముశ్రీమతి  ఉషను  .

  బుధవారం -విహంగ మహిళా వెబ్ మాసపత్రిక సెప్టెంబర్ సంచికకు వ్యాసం రాసి పంపాను ..రాత్రి మా మనవడు చి సంకల్ప్ చికాగో నుంచి ఫోన్ చేసి కొత్తకారు కొన్నానని మంచి రోజు చెబితే ఇంటికి తెచ్చుకొంటానని అంటే గురువారం బాగుందని చెప్పాను .

 గురువారం ఫ్లారిడా  లో ఇర్మా తుఫాను భీభత్సం సృష్టించింది .ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు .దానితో పెట్రోల్ డీజల్ ధరలు పెరిగాయి . బంకుల వద్ద కార్ల క్యూలు అంతులేకుండా ఉంది భయం తో అవసరమైన వస్తువులను కొని దాచుకొంటున్నారు  .

  శుక్రవారం -మౌంట్ సోమా నుండి అక్కడి శివాలయ పురోహితులు శ్రీ ప్రసాదావధాని గారి భార్య శ్రీమతి అనసూయ గారు ఫోన్ చేసి ‘’బాబాయ్ గారూ !మీరు షార్లెట్ వచ్చి 5 నెలలు దాటింది ఒక్కసారికూడా మౌంట్ సోమాకు రాలేదు .మావారు ‘’గబ్బిట వారు ఇంతవరకూ రాలేదే ‘’అని అంటున్నారు వీలు చూసుకొని తప్పకరండి  ;;అన్నారు .సరే అన్నా

 కిందటి శనివారం శ్రీ రఘు గారింట్లో రుద్రాభిషేకం నాడు రుద్రం బాగా చదివింది అని నేను మెచ్చుకొని బహుమతి పంపిన శ్రీమతి కాకాని లక్ష్మి ఫోన్ చేసి త్వరలో ఇంటికి వచ్చి కలుస్తాను ‘’అన్నది .సంతోషం అన్నాను

               సాయి సెంటర్ వారి పిక్నిక్

   ఇక్కడి సాయి సెంటర్ వాళ్ళు అందరికి మంచి లొకేషన్ లో పిక్నిక్ ను 9-9-17 శనివారం మధ్యాహ్నం నుంచి ఏర్పాటు చేశారు . అందరం ఉదయం 11-45 కు బయల్దేరి  రమణ కోచింగ్ సెంటర్ నుంచిమా మనవడు  శ్రీకేత్ ను పికప్ చేసుకొని వాడిని డౌన్ టౌన్ లో ఉన్న ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వద్ద దింపి పిక్నిక్కు చేరేసరికి మధ్యాహ్నం ఒంటి గంట అయింది .అప్పుడే అందరూ భోజనాలు ప్రారంభించ బోతున్నారు  .పులిహోర ,రవ్వలడ్డు పెరుగన్నం ,అరటి,ద్రాక్ష  పళ్ళు,చిప్స్ ,పళ్ల ముక్కలు తో భోజనం .

  తర్వాత పిల్లలకు సర్టిఫికెట్స్ ఇచ్చారు . తర్వాత పిల్లలకు ఆటలపోటీలు ,పెద్దలకు నడక . నేనూ పవన్ కలిసి కాసేపు తిరిగాం . ఆతనిని అంపైర్ గాపెట్టుకొని పిల్లలు క్రికెట్ ఆడారు .మా మనవడు చి పీయూష్ టీమ్ 30 పరుగులు చేసి గెలిచింది . మావాడుఅందులో  18 పరుగులు చేసి మాన్ ఆఫ్ ది మ్యాచ్ అయ్యాడు .మెచ్చిన నేను వాడికి ఇంటివద్ద 10 డాలర్లుబహుమానంగా ఇచ్చాను .  పురాతత్వ సంస్థలో పని చేసిన మా రెండవ బావగారి చెల్లెలు శాంతగారబ్బాయి రాంబాబు చిరివాడ వెళ్లాడని ,అక్కడ వేలూరాయన చేసిన విగ్రహాలుపాడు పడి  ఉంటె ,చూడలేక హైదరాబాద్ లో తన ఇంటికి తీసుకు వెళ్లి భద్రపరచాడపవన్  చెప్పాడు .ఈయన అన్నగారు శ్రీ వేలూరి రాధాకృష్ణ ప్రపంచ ప్రసిద్ధ చిత్రకారులు .భోపాల్ లో ఉండేవారు . మా కాలిఫోర్నియా మేనల్లుడు శాస్త్రికి ఈ విషయం రాసి ఆ శిల్పి చరిత్ర తెలుసుకొంటే ఆయన గురించి ఒక ఆర్టికల్ రాస్తానని చెప్పా . వెంటనే స్పందించి ఆ ప్రయత్నం లో ఉంటానని సమాధానమిచ్చాడు .  సాయంత్రం అందరికి టీ ఏర్పాటు చేశారు . ఇక్కడి ఐటెమ్స్ సాయి భక్తులు ఇళ్లవద్ద తయారు చేసి తెచ్చినవే . ఎవరి వద్దా డబ్బు తీసుకోవటం ఈ సెంటర్ కు అలవాటు లేదు అందరూ వాలంటీర్ గా సేవలు అందించటమే .

   వనవిహారం నుండి సాయంత్రం 4 కు బయల్దేరి రాంకీ తమ్ముడు పవన్ భార్య శ్రీమతి పద్మజ వద్ద మా మనవాళ్ళు అశుతోష్ ,పీయూష్ లు సంగీతం క్లాస్ కు తీసుకొచ్చాము .పవన్ మాటల సందర్భంగా మోపిదేవి శ్రీ సకలేశ్వర స్వామి ఆలయం వారి అడుసుమిల్లి వంశం వారిదేనని చెప్పాడు .ఆతను తీసిన శిలా ఫలకం ఫోటో నాకు పంపాడు .. ఇంటికి వచ్చేసరికి రాత్రి 7 అయింది .ఉయ్యూరులో మా గురు పుత్రుడు నా సహాధ్యాయి వేమూరి దుర్గయ్య అన్నకామేశ్వరరావు కుమార్తె శ్రీమతి లక్ష్మి మా అమ్మాయి కి మంచి స్నేహితురాలు .వాళ్లబ్బాయిని తండ్రిశ్రీమోహన్  పిక్నిక్ వద్ద దింపి మాకు అప్పగించి వెళ్ళాడు  . రాత్రి 8 కి వచ్చి కాసేపు కబుర్లు మాట్లాడి కుర్రాడిని తీసుకు వెళ్ళాడు .

                         భారత మహోత్సవం

 షార్లెట్ లో నిన్నా ఇవాళ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా -భారత మహోత్సవం జరిగింది .ఒక సంతలాగా తిరునాళ్ళు లాగా జరుగుతుంది .అయిదేళ్లక్రితం చూసాం . అప్పుడు మా బావమరిది పెయింటింగ్ లు ప్రదర్శనకు పెట్టాం నేనూ మా అమ్మాయి మా అమ్మాయి స్నేహితురాలు నాగలక్ష్మి భర్త కలిసి .అంతా చూసి బాగున్నాయని మెచ్చినవారేకాని ఒక్కరూ కొనే సాహసం చేయలేదు .’’శ్రమ మెప్పు  ఫుల్  ఆదాయం మాత్రం నిల్’’ .

  10 వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు అందరం బయల్దేరి ఈ సంతకు వెళ్లాం మనిషికి 7 డాలర్లు టికెట్ . పదేళ్ల లోపు పిల్లలకు ఫ్రీ . అక్కడే ఉన్న బెల్క్  ధియేటర్ లో నృత్య ప్రదర్శనలు నాన్ స్టాప్ గా జరుగుతాయి భారత దేశం లోని అన్ని రకాల నృత్య రీతులను పిల్లలు ,పెద్దలు ఇక్కడ ఉత్సాహంగా ప్రదర్శించారు .ఒకరకంగా సాంస్కృతిక భారత దేశ దర్శనం చూడగలుగుతాం -మినీ ఇండియా చూసిన అనుభూతి ఉంటుంది .బయట మాత్రం గుడారాలకింద బడ్డీకొట్లు లాంటి హోటళ్లు అన్నిరకాల చిరు తిళ్ళు ,ఇడ్లీ దోసె  పునుగు గారే బజ్జీ ,పూరీ  చపాతి , సహా అన్నీ అక్కడికక్కడే తయారు చేస్తారు. జనం ఆబగా కొని ఇదివరకు ఎప్పుడూ ఎక్కడా తినలేదేమో అన్నంత గా తినటం ఆశ్చర్య మేస్తుంది . ఈ బయటి’’ కొట్లు ‘’  సంత లాగా తిరునాళ్ల లాగా అని పిస్తుంది . అనేక రకాల చీరెలు చుడీదార్లు  డ్రెస్ మెటీరియల్స్ ,నగలు కూడా అమ్ముతారు .

  ఆరుబయట కూడా ఒక వేదిక ఉంటుంది .దానిపైనా ఉదయ  సాయంకాలాలలో మధ్యాహ్నం కూడా రాజస్థానీ మరాఠీ ,పంజాబీ ,గుజరాతీ నృత్యాలు పెద్దలూ పిన్నలు చక్కగా చేస్తారు . ధియేటర్ లో జనం ఎప్పుడూ నిండుగా ఉంటారు . పవన్ పెద్దకూతురు ,ధియేటర్ లో డాన్స్ బృందంతో  డాన్స్ చేస్తే  రాంకీ తమ్ముడికూతురు బయట డాన్స్ చేసింది .పెద్దలకు ఇదొక పెద్ద పండగ .. పిల్లల్ని హుషారుగా తీసుకు వెళ్ళటం తరిఫీదు ఇప్పంచటం ,చేయించటం ,పిల్లలు అంత ఉత్సాహం గా డ్రెస్ తో చేయటం గొప్ప విషయం . వాళ్ళ ఎనర్జీ ప్రవాహానికి హాట్స్ ఆఫ్ అని పిస్తుంది . దీనికి భారత ప్రధాని రాజీవ్ గాంధీ గొప్ప ప్రోత్సాహమిచ్చాడు .శ్రీమతి పుపుల్ జయకర్ ఆయనకు సలహాదారుగా ఉంటూ అన్నిదేశాలలో ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఘనంగా జరగటానికి బాగా తోడ్పడింది

  ఈ రోజు ఉదయం దర్శనీయ శివాలయాలు లో 72 వ ఆలయంగా మోపి దేవి’’శ్రీ గంగా పార్వతీ సమేత స్వయంభుశ్రీ సకలేశ్వర దేవస్థానం ‘’గురించి రాశాను .

    మా పెద్ద తోడల్లుడు శ్రీ శంభుని శ్రీ రామ చంద్ర మూర్తిగారి పెద్దబ్బాయి ఫ్లారిడాలో ఉద్యోగం  చేస్తున్న  రవి  భార్య ,పిల్లాడితో ఫ్లారిడానుండి మూడు రోజుల క్రితం అట్లాఅన్టా వచ్చి ,ఇవాళ మౌంట్ సోమా వెళ్లి స్వామిని దర్శించి రాత్రి7 గంటలకు మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చాడు  .   ఈ వీక్లీ  ఇంతటితో సమాప్తం .

   మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -10-9-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

ఆఫ్ఘనిస్తాన్ లో చివురిస్తున్న మహిళాభ్యుదయం-గబ్బిట దుర్గాప్రసాద్

ఆఫ్ఘనిస్తాన్ లో చివురిస్తున్న మహిళాభ్యుదయం-గబ్బిట దుర్గాప్రసాద్

23 మిలియన్ల జనాభా తో 23 ఏళ్ళ యుద్ధం తో , , ఏడేళ్ల కరువుకాటకాలతో ,అయిదేళ్ల తాలిబన్ నిరంకుశ పాలనలో అణగదొక్కబడిన ఆఫ్ఘనిస్తాన్ ప్రపంచంలో అతి నిరుపేద దేశమైపోయింది . ఇక్కడ స్త్రీ జీవితకాల రేటు చాలా ఎక్కువ కానీ విద్యలోమాత్రం వీరు అతి తక్కువ స్థాయిలో ఉన్నారు. ఆర్ధిక ,సాంఘిక రాజకీయాలలో మాత్రం తమపాత్ర బాగానే పోషించారు 1964లో రాజ్యాంగ రచనకు తోడ్పడ్డారు . 1970నాటికి పార్లమెంట్ లో ముగ్గురు మహిళలు స్థానం సాధించారు 1990కి మహిళలు టీచర్స్ డాక్టర్లు ,ప్రొఫెసర్లు ,ప్రభుత్వోద్యోగులు లాయర్లు జర్నలిస్ట్ లు కవులు రచయిత్రులు అయ్యారు.
తాలిబన్ ల పాలన లో మహిళాహక్కులను అణగదొక్కేశారు.విద్యా వైద్య స్త్రీ శిశు సంక్షేమ సేవా కేంద్రాలలో వారికి ప్రవేశం కల్గించలేదు .ఈకాలం లో మూడుశాతం మంది బాలికలు మాత్రమే ప్రాధమిక విద్య నేర్చినట్లు గణాంకాలు తెలియ జేశాయి స్త్రీలకూ ఉద్యోగ హక్కు కూడా నిరాకరించటం తో అప్పటిదాకా ఎక్కువ శాతం మహిళా టీచర్లే ఉండటం వలన బాలుర విద్యకూ విఘాతం కలిగింది . అతి తక్కువస్థాయి ఆరోగ్యం, పోషకాహారం లేకపోవటం తో గర్భిణీ స్త్రీలు నరకాన్ని అనుభవించారు తాలిబన్ ల సిద్ధాంతాలు కూడా స్త్రీ స్వాతoత్ర్యంకి విఘాతం కలిగించాయి .ఆడవాళ్లు ప్రయాణం చేయాలంటే మగ తోడు ఉండాలనే నియమం ఉండేది . 2001లో తాలిబన్లు మహిళలు కార్లు నడుపరాదనిచట్టం తెచ్చారు .దీనితో కొద్దోగొప్పో ఉన్న స్త్రీ స్వాతంత్రం పూర్తిగా హరించుకు పోయి వంటింటికే పరిమితమవ్వాల్సిన దుస్థితి పట్టింది .సమాజం లో తోటి స్త్రీతో మాట్లాడే అవకాశమే లేకుండా పోయింది .మహిళ బయట కనిపిస్తే క్రూర రాక్షసులులాగా తాలిబన్ లు వారిపై విరుచుకుపడి లాఠీలతోబాది చిత్ర హింసలు పెట్టేవాళ్ళు .దీనితో మహిళకు రాజకీయ సాంఘిక సేవలో అవకాశమే లేకుండాపోయింది .
2001 కి ముందు ఐక్యరాజ్య సమితి హ్యూమానిటేరియన్ కో ఆర్డినేటర్ తరచుగా ఆఫ్ఘనిస్తాన్ లో పర్యటించి మహిళాసమస్యలను అధ్యయనం చేసి తగిన సాయం అందించేవారు . 2001 లో ఆఫ్ఘనిస్తాన్ తమ దేశపు స్త్రీల అభ్యుదయం కోసం ముందుకు వచ్చి అంతర్జాతీయ సమితి తో చర్చలు జరిపింది .ఇన్ని రకాల ఒత్తిడులు ,అణచివేత ,దాడులు దమనకాండలతో ఛిద్రమైన మహిళల బతుకులలో ఇప్పుడిప్పుడే అభ్యుదయ పచ్చదనం చిగురించి వారివదానాలలో చిరునవ్వు హసిస్తోంది
యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ఘనిస్తాన్ లోని ప్రభుత్వ ,ప్రభుత్వేతర సంస్థలలో మహిళకు పురుషులతో సమానంగా స్థానం కల్పించటానికి చర్యలు చేబట్టే దిశలో కృషి చేయవలసిందిగా అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేసింది . 52 ఏళ్ళక్రితం యూనిసెఫ్ ఇక్కడ మొదటి సారిగా ఆఫీస్ ఏర్పరచింది .. ఆఫ్ఘనిస్తాన్ ప్రజల ముఖ్యంగా మహిళల అభ్యుదయం మొదలైన వన్నీ ఆ సంస్థ కున్న అనుబంధ వ్యవస్థల పర్య వేక్షణలో ఉన్నాయి . జెండర్ ఇస్స్యూస్ ,అడ్వాంస్ మెంట్ ఆఫ్ వుమెన్ కు చెందిన జనరల్ సెక్రెటరీ ఆఫ్ఘనిస్తాన్ లో పర్యటించి మహిళల బాలికల వివక్షత సమస్యలను చర్చించి మహిళా సాధికార ప్రతినిధినిఇక్కడ ఏర్పాటు చేయాలనీ సూచించాడు. .దీనితర్వాత యు యెన్ హెడ్ క్వార్ట్రర్స్ లో మొదటిసారిగా ఇంటిగ్రేటెడ్ మిషన్ టాస్క్ ఫోర్స్ ఏర్పడింది .మూడు ఎక్సిక్యూటివ్ కమిటీలు ఏర్పడి తరచూ సంప్రదింపులు జరుపుతూ రాజకీయ పునర్వ్యవస్తీకరణ ,మానవ హక్కులపరిరక్షణ ,ఆఫ్ఘనిస్తాన్ పునరుద్ధరణ కోసం చర్యలు చేబట్టింది “The participation of Afghan women as full and equal partners with men is essential for the reconstruction and development of their country.” అని అభిప్రాయపడింది
తాలిబన్ల పాలన కాలం లోనే బేకరీలు నడపటం లో స్త్రీలకూ అవకాశం ఇప్పించింది .యూనిసెఫ్ పిల్లకు సామూహిక పోలియో చుక్కల ప్రోగ్రామ్ చేబట్టింది .పిల్లలకు పొంగు మసూచికం రాకుండా వాక్సిన్ ను పెద్ద ఎత్తున వేయించింది .ప్రపంచ ఆరోగ్య సంస్థ వేలాది మెడికల్ కిట్ లను అందించింది .ఆఫ్ఘన్ శరణార్ధుల రక్షణకూడా చేబట్టింది .ప్రపంచ బాంక్ ద్వారా కావలసిన ఆర్ధిక సాయాన్ని అందిస్తోంది .
ఆఫ్ఘనిస్తాన్ మహిళా సమాజాలు ముందుకు వచ్చి క్రియాశీలకంగా పని చేస్తున్నాయి .మహిళలకు దేశీయంగా అంతర్జాతీయంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు .చర్చా వేదికలు సెమినార్లు జరుపుటపు వారిలో చైతన్యం కలిగిస్తున్నారు .ఎన్నో ఏళ్ళ తర్వాత మహిళలకు ప్రభుత్వ ,ప్రభుత్వేతర సంస్థలలో ఉద్యోగాలు లభిస్తున్నాయి .యుని వర్సిటీ విద్య అందుబాటులోకి వచ్చింది టీచర్లు లెక్చరర్లు ప్రొఫెసర్లుగా రేడియో ,టెలివిజన్ లలో మహిళలు రాణిస్తున్నారు .
సమైక్య ఆఫ్ఘన్ మహిళా సంఘాల సంస్థ కోరికమేరకు బ్రస్సెల్స్ లో ఆఫ్ఘన్ ఉమెన్ సమ్మిట్ ఫర్ డెమోక్రసీ నిర్వహించింది .అనేక మతాల ,కులాల కు చెందిన 40 మంది మహిలళా ప్రతినిధులు పాల్గొని విజయవంతం చేశారు .ఈ సమ్మిట్ ”Brussels Proclamation, which included concrete demands for the recovery of Afghan society in the areas of education, media and culture; health; human rights and the constitution; and refugees and internally displaced women. Participants of the Summit met with members of the European Parliament, members of the U.S. Congress, members of the Securit”అనే ఒక తీర్మానాన్ని ఆమోదించింది .అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ”ఈ నాటి ఆఫ్ఘన్ మహిళ-వాస్తవాలు అవకాశాలు ”అంశంపై మహిళా సదస్సు నిర్వహించారు
ఇలా మహిళాభ్యుదయం ఆఫ్ఘనిస్తాన్ లో చివురులు వేస్తోంది .అది మొక్కై మానై ఎదిగి పుష్ప ఫలభరితమై మహిళా సాధికారతకు చిహ్నమవ్వాలని ఆశిద్దాం .

– గబ్బిట దుర్గా ప్రసాద్

Posted in రచనలు | Tagged | 1 Comment

నా దారి తీరు-108 అడ్డాడ హెడ్ మాస్టర్ గిరీ

నా దారి తీరు-108

అడ్డాడ హెడ్ మాస్టర్ గిరీ

నేను మేడూరు  లో విధి నిర్వహణ నుండి విడుదలై 1991  ఆగస్టు 14 సాయంత్రం అడ్డాడ హై స్కూల్  హెడ్ మాస్టర్ గా చేరాను .అక్కడ నాకు గుమాస్తా అంజిరెడ్డి తెలుసు .ఇద్దరం పామర్రులో ఇదివరకుకలిసి  పని చేయటం ,వాళ్ళ  అమ్మాయిలిద్దరూ ,అబ్బాయి అక్కడ చదవటం  అతని పెద్దమ్మాయిని ఉయ్యూరు దగ్గర యాకమూరు లో ఉంటున్న నా శిష్యుడికి చ్చి వివాహం చేయటం జ్ఞాపకం వచ్చాయి . లాబ్ అసిస్టెంట్ శ్రీ బాలకృష్ణ ఎర్రగా తెల్ల గ్లాస్కో పంచెకట్టు చొక్కాతో  నవ్వుతూ పలకరించాడు . స్కూల్ లో కరెంట్ పోయి చాలాకాలమైంది .పాత హెడ్ మాస్టర్ మనం వెళ్లి పోతున్నాం కదా అని పట్టించుకోలేదు . మరి రేపు ఆగస్టు 15 జండావందనం  స్వాతంత్ర దినోత్సవం జరిపే ఏర్పాట్లు చేశారా అని అడిగితె బెల్లం కొట్టిన రాయి లాగా ఎవరూ మాట్లాడలేదు .నోటీస్ పంపారా అంటే ఇంచార్జి హెచ్ ఏం, సైన్స్ మాస్టర్ కె వెంకటేశ్వరరావు పంపించారని అన్నారు . అసలు జెండా ఉందా అని అడిగితె చినిగి పోయింది అన్నాడు రెడ్డి . నా తపన గుర్తించిన బాలకృష్ణ ‘’సార్ !ఈ రాత్రికి ఎలక్ట్రీషియన్ ను పట్టుకొని రేపు పొద్దున్న కల్లా కరెంట్ వచ్చేట్లు చేస్తాను ఖర్చు నేనే పెడతాను జండా రెడ్డి తో తెప్పించటం మిగిలిన ఏర్పాట్లు నేనే బాధ్యతగా చేస్తాను ‘’అన్నాడు .హమ్మయ్య అనుకొన్నా .అంటే ఇక్కడ అన్నీ మొదటి నుంచి ప్రారంభించాలన్నమాట . కమిటీ ప్రెసిడెంట్ శ్రీ అడుసుమిల్లి రామ బ్రహ్మం గారిని ఊరిలోని పెద్దలనూ కూడా ఆహ్వానించామని చెప్పాను . సరే దిగితేకాని లోతు లోటు తెలియనట్లు ఇక కార్యక్రమం ,ప్రక్షాళన ప్రారంభించాలని సంకల్పించా .ఏ శుభ ముహూర్తం లో ఈ సంకల్పం వచ్చిందో తెలియదు కానీ ,నేను1998 జూన్ 31 అంటే సుమారు 7 ఏళ్ళు ఇక్కడ పని చేసిన కాలం లో నాకు ఎలాంటి ఇబ్బందులూ ఎదురవ్వలేదు . నేను అనుకొన్న అన్ని పనులు చేసి గుడివాడ డివిజన్ లో అడ్డాడ మోడల్ హై స్కూల్ అనే పేరు తే గలిగాను .విద్యాశాఖ ,జిల్లాపరిషత్తు ,అందరూ ఏదైనా నేర్చుకోవాలంటే అడ్డాడ హై స్కూల్ కు వెళ్లి నేర్చుకోండి .అని చెప్పేవారు .కావాలని ఇక్కడికి వచ్చినందుకు నాకూ ,పాఠశాలకు గొప్ప గుర్తింపు వచ్చింది .

                 అడ్డాడలో మొదటి స్వాతంత్ర దినోత్సవం

  15-8-1991 జండా పండుగనాడు ఉదయం ఉయ్యూరులో బయల్దేరి రెండు బస్సులు మారి 9 గంటలకే అడ్డాడ చేరాను . స్టాఫ్ అందరూ వచ్చారు .రామ బ్రహ్మం గారు వచ్చి పలకరించారు .కరెంట్ వచ్చింది కొత్త జెండా వచ్చింది .పతాకావిష్కరణ చేశాను . విద్యార్థులు వందేమాతరం  జాతీయగీతాలు పాడారు .పిల్లలందరికీ బాలకృష్ణ కొన్న బిస్కట్లు చాకోలెట్లు పంచిపెట్టాం .తర్వాత స్టాఫ్ మీటింగ్ పెట్టి అందరికి టీ  బిస్కెట్స్ ఇప్పించాను .ఇక్కడ నాకు పామర్రులో నాతోపాటు పనిచేసిన సెకండరీగ్రేడ్ మాస్టర్ శ్రీ డి వీరభద్రరావు ఉండటం కొంత బలాన్నిచ్చింది మంచివాడు సమర్ధుడు ,విలువలు కోరేవాడు . నన్ను నేను అందరికి పరిచయం చేసుకొని స్టాఫ్  మెంబర్లను ఒక్కొక్కరినీ ఎవరి పరిచయం వారు చెప్పమని వారి గురించి తెలుసుకున్నాను . నేచురల్ సైన్స్ బోధించే డి ఏం విజయలక్ష్మి ఇంగ్లిష్ ఏం ఏ కూడా . వెంకటేశ్వరరావు ఫిజికల్ సైన్స్ టీచర్ . యెన్ .సీతారామరాజు లెక్కల మే స్టర్ . శ్రీ టి .ఎల్ .కాంతారావు గ్రేడ్ వన్ తెలుగుపండిట్ . గ్రేడ్ 2 తెలుగుపండిట్ లేడీ శ్రీమతి పార్వతీదేవి  .  సమర్ధురాలైన టీచర్ .ప్రశాంతత ,పవిత్రత ముఖం లో స్పష్టంగా కనిపించేవి .  సోషల్ మాస్టారు శ్రీ సి హెచ్ వెంకటేశ్వరరావు మంచి దైవ భక్తి ఉన్నవారు ,ఆదర్శప్రాయుడైన టీచర్ ఆరోగ్యం తక్కువే అయినా చాలా కష్ట పడి పని చేసే తత్త్వం అరవింద శిష్యులు .  క్రాఫ్ట్ మాస్టర్ కె మల్లికార్జునరావు  క్రాఫ్ట్ పని ఏమీలేక గార్డెన్ పని చూసేవాడు .ఎస్ సుజాతః మరొక సెకండరీ  గ్రేడ్ టీచర్ .బి ఏ బి ఎడ్ .  లైబ్రేరియన్ కూడా అప్పటికి బాలకృష్ణయే .తర్వాత రాజా రావు వచ్చి చేరాడు  .ఘంటసాలలాగా పాడగలడు . తర్వాత డ్రిల్ మాస్టర్ గా శ్రీ తుర్లపాటి  జగన్మోహనరావు గారు .’’అంతా భగవదనుగ్రహం ‘’అంటూ నవ్వు ముఖం తో పలకరించేవారు . అటెండర్ గురవయ్య  నైట్ వాచ్ మన్ ప్రసాద్ .ఈ ఇద్దరూ కుర్రాళ్లే .వినయంగా ఉండేవారు . అంజిరెడ్డి గుమాస్తా . ప్రస్తుతం వీరే స్టాఫ్ మెంబర్లు .స్టాఫ్ సెక్రెటరీ లేడు .

    నేను అడ్డాడరావాలంటే ఉయ్యూరు నుంచి పామర్రు వచ్చి ,అక్కడ గుడివాడ వెళ్లే బస్ ఎక్కి అడ్డాడ లో దిగాలి.  రోడ్డుకు బడి చాలాదగ్గరే . ఫెన్సింగ్ లేదు .అందరూ స్కూల్ నుంచే రాకపోకలు . రిటైర్డ్ నైట్ వాచ్ మన్  అబ్రహాం బడికి దగ్గరలో ఉండేవాడు .ఎప్పుడూ ‘’ఫుల్ డోస్’’ లో ఉండేవాడు .అప్పుడప్పుడు వచ్చి పలకరించేవారు .అతని భార్యా కూతురు కూడా వస్తూ ఉండేవారు  . మొదటి స్టాఫ్ మీటింగ్ పెట్టి ,స్టాఫ్ సెక్రెటరీని ఏర్పాటు చేసుకోమని చెప్పాను అందరూ ఏకగ్రీవంగా ఫిజిలా సైన్స్ మాస్టర్ వెంకటేశ్వరరావు పేరే చెప్పారు ఆయన్నే చేసాం ,అసిస్టెంట్ గా వీరభద్రరావు ఉంటె బాగుంటుంది అన్నారు ఒకే చేశా . ‘’నేను పొడిచేస్తా చింపేస్తా  అని చెప్పను .మనం అందరం కష్ట పడి పని చేద్దాం బడికి మంచి గుర్తింపు సాధిద్దామ్ . పదవతరగతి సెంటర్ ఒకప్పుడు ఇక్కడ ఉండేది .తర్వాత తీసేశారు .మనం అందరం తీవ్ర ప్రయత్నం చేసి సెంటర్ తెప్పిద్దాం .క్రమశిక్షణ చాలాముఖ్యం .టెస్ట్ పరీక్షలతో సహా అన్ని పరీక్షలూ స్టిక్స్ గా నిర్వహిద్దాం . కాపీలను అనుమతించవద్దు .అన్ని జాతీయ పండగలు చేద్దాం .పిల్లలతో సృజన శక్తిని పెంచటానికి ప్రతి 15 రోజులకొకసారి డిబేట్ ,వ్యాసరచన క్విజ్ ప్రోగ్రామ్స్ నిర్వహిద్దాం . బహుమతులు ఇద్దాం .అప్పుడు వాళ్లలో కొంత కదలిక వస్తుంది ‘స్కూల్ అసెంబ్లీయే సమాయానికి అందరం హాజరవుదాం క్లాస్ టీచర్లు క్లాస్ వెనకాల ఉండాలి జాతీయ గీతాలు బాగా ప్రాక్టీ స్  చేయించాలి  . అటెండెన్స్ బాగా ఉండేట్లు చూడండి .పరీక్ష పెట్టిన నాలుగైదు రోజుల్లో పేపర్లు దిద్ది మార్కులు ఇవ్వండి .పిల్లలకు రాసిన ఆన్సర్ షీట్లు ఇచ్చి తప్పొప్పులు తెలియ జేయండి . మార్కుల రిజిస్టర్ లో క్లాస్ టీచర్ మార్కులు పోస్టింగ్ చేయండి .కన్సాలిడేటెడ్ ఆటేండెన్స్ రిజిస్టర్ లో పేర్లు రాసి ప్రతినెలా హాజరు నమోదు చేయండి .ప్రోగ్రెస్ రిపోర్ట్ లు తయారు చేసి మార్కులు తగ్గిన చోట్ల రెడ్ ఇన్క్ తో సున్నా చుట్టి ,నాకు చూపి నా సంతకం అయ్యాక పేరెంట్ సంతకాలు పెట్టించి కలెక్ట్ చేయండి  . లైబ్రరీ పుస్తకాలు చదివించండి . ఆటలు ఆడించండి డ్రిల్ క్లాస్ విధిగా జరగాలి వారానికొకసారి మాస్ డ్రిల్ ఉండాలి .టైం టేబుల్ కూడా ఈ ప్రకారం ఉండాలి ‘’అని చెప్పి వెంకటేశ్వరరావు రాజు గార్లకు టైం టేబుల్ బాధ్యత అప్పగించి నేను ఇంగ్లిష్ ప్రోజ్ అండ్ పొయిట్రీ ,నాండీటైల్డ్ తో సహా తీసుకొన్నాను .

 ఇది ఆర్ధికంగా బాగా వెనకపడిన ఊరు .ఎక్కువమంది ఎస్ సి,  బి సి విద్యార్థులు .హాస్టల్ లో ఉంటారు .కనుక చదువు చాలాతక్కువ .ఎంతో రుద్దితే  ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటే తప్ప చదువు రాదు .పదవతరగతి ఉత్తీర్ణతా శాతం 25 మాత్రమే .కనుక నాకు ఒక సవాల్ గా మారింది .క్రమంగా నరుక్కు రావాలి .

   సశేషం

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-9-17-కాంప్-షార్లెట్-అమెరికా

 

Posted in నా దారి తీరు | Tagged | 1 Comment

నా దారి తీరు -107 అడ్డాడ  హెడ్ మాస్టర్ గిరీ

నా దారి తీరు -107

అడ్డాడ  హెడ్ మాస్టర్ గిరీ

అడ్డాడలో నా పని గురించి చెప్పే ముందు గెలాక్షీ ఆఫ్ హెడ్ మాస్టర్స్ లో నాకు ప్రాతస్మరణీయులైన ఇద్దరి గురించి తెలియ జేస్తాను .

  1 -కీశే .శ్రీ జె వి ఎస్ .ప్రసాద శర్మగారు

                        గురుత్వం

 నేను ఉయ్యూరు హై స్కూల్ లో 1956 లో ఎస్.  ఎస్ . ఎల్.  సి . చదువుతుండగా సైన్స్ టీచర్ శ్రీమతి పుష్పావతమ్మగారు బదిలీ అయి శ్రీ జె వి ఎస్ ప్రసాద శర్మగారు వచ్చారు .అసలు పేరు జంధ్యాల వెంకట శివ ప్రసాద శర్మగారు .ఒకరకం గా నన్ను తీర్చి దిద్దిన వారు వీరే . తెల్లని పంచె  తెల్లని పొడవైన షర్ట్  పైన ఉత్తరీయం తో స్వచ్ఛతకు పరాకాష్టగా ఉండేవారు . కొంచెం ముందుకు వచ్చిన పలువరుస  మాట్లాడుతుంటే ఆనందం ఆత్మీయత మూర్తీభవించినట్లు ఉండేది ..మా నాన్నగారు తెలుగు పండిట్ గా చేసి రిటైర్ అవటం శర్మగారు మా ఇంటి ఎదురుగా శ్రీ వంగల దత్తుగారింట్లో కాపురం ఉండటం తో కుటుంబ పరిచయము ఎక్కువగానే ఉండేది . మా గురుపత్ని శ్రీమతి అన్నపూర్ణమ్మగారు .నేను అంటే విపరీతమైన వాత్సల్యం .చామన ఛాయ అయినా, ముఖం లో అమ్మవారి కున్నా  పవిత్రత స్పష్టంగా కనిపించేది . ఇద్దరూ మా ఇంటికి తరచూ వచ్చేవారు . శర్మగారిది మచిలీ పట్నం .తండ్రిగారు హిందూ కాలేజీ హై స్కూల్    లో తెలుగు పండిట్ అని గుర్తు . శర్మగారి తమ్ముళ్లలో ఒకతను నాకు క్లాస్ మేట్ కానీ సీనియర్ కానీ అని జ్ఞాపకం .

  మాస్టారు సైన్స్ బోధిస్తే మళ్ళీ పుస్తకం చదవక్కర్లేదు .చక్కని నోట్స్ ఇచ్చేవారు . లాభ రే టరీ  కి తీసుకు వెళ్లి ప్రయోగాలు చేసి చూపించేవారు .ఇవి నాకు తర్వాత సైన్స్ బోధనలో మార్గ దర్శకాలయ్యాయి .నా ఎస్ ఎస్ ఎల్ సి బుక్ ను వారే ఓపెన్ చేశారు . మా హెడ్ మాస్టారు శ్రీ  కామినేని రాధాకృష్ణారావుగారు . .మా క్లాస్ టీచర్ శ్రీ వి పూర్ణ చంద్రరావు గారు .ఇంగ్లిష్ ప్రోజ్ చెప్పేవారు  హెచ్ ఏం గారు పొయిట్రీ ,ఆల్జీబ్రా చెప్పేవారు .ఆ రెండూ మాకు’’ గ్రీక్ అండ్ లాటిన్’’ .అందులో నాకు ఏమీ వచ్చేదికాదు . ఏదో’’అత్తెసరు’’మార్కులు పొంది 356 మార్కులతో స్కూల్  సెకండ్ గా పాసయ్యాను .

                        నా ఉద్యోగ నియామక పత్ర ప్రదాత –కుటుంబ మిత్రులు

 

నేను సైన్స్ డిగ్రీ పొంది బీఎడ్ చేసి మోపిదేవిజిల్లాపరిషత్ హై  స్కూల్   లో సైన్స్ మాస్టర్ గా 1963 లో చేరి ,రెండేళ్లు పనిచేసి  ఉయ్యూరు కు వచ్చాను  . నా అపాయింట్ మెంట్ ఆర్డర్ బందరు  జిల్లా పరిషత్ ఆఫీస్ నుంచి   తెచ్చి నాకు ఇచ్చి 19-8-1963న అమావాస్య అయినా చేరమని లేక పొతే సీనియారిటీ దెబ్బతింటుందని హితవు చెప్పింది మా సైన్స్ మాస్టారు శర్మగారే .అలాగే చేరి కొన్ని అడ్డంకులెదుర్కొన్నా విజయవంతంగా సైన్స్ మాస్టర్ గా ,హెడ్ మాస్టర్ గా వారి చలువ ,దీవెనల వలెనే నా సర్వీస్ పూర్తి చేశాను . నేను డిగ్రీ మొదటి సంవత్సరం లో ఉండగా ,మా అన్నగారు లక్ష్మీ నరసింహ శర్మ హాస్పెట రైల్వే స్టేషన్ మాస్టర్ గా పని చేస్తూ హఠాత్తుగా హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయారు . రైల్వే వారికి అప్లికేషన్లు పెట్టించటం వారివ్వాల్సిన బకాయిలన్నీ తెప్పించటం లో మా నాన్నగారికి శర్మ గారు చేసిన సాయం మరువ లేనిది . అందుకనే వారు మా కుటుంబ మిత్రులయ్యారు .

 బందరు హిందూ కాలేజీ లో నేను ఫిజిక్స్ డిమాన్ స్ట్రేటర్ గా పని చేస్తూ, నేనూ ,డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉన్న  మా అతమ్ముడు మోహన్ ఒక అద్దె ఇంట్లో ఉంటె మేము పగలు కాలేజీకి వెళ్ళినప్పుడు దొంగలు పడి  మా ట్రంక్ పెట్టె దోచుకు వెడితే అందులో ఉన్న నా ఎస్ ఎస్ ఎల్సీ బుక్ పోయింది .మాస్టారుగారికి చెబితే వెంటనే డూప్లికేట్ సర్టిఫికెట్ కు నాతో అప్ప్లై చేయించి మూడు నెలలలో హైదరాబాద్ లోని బోర్డు ఆఫీస్ నుంచి తెప్పించి నాకు అంద జేశారు .వారి ఋణం మరువ లేనిది .

                     చదువుకొన్న చోటే   మాస్టారితో కలిసి పని చేసే అదృష్టం

మోపిదేవి నుండి ఉయ్యూరు హై స్కూల్ కు 1965 లో బదిలీ అయి వచ్చాను . గురు శిష్యులం ఇప్పుడు సహ ఉద్యోగులమయ్యాము . నాకు లెక్కలు ,సైన్స్ క్లాసులు వచ్చేట్లు టైం టేబిల్ వారే తయారు చేశారు నామీద ఉన్న అభిమానం తో .సమర్ధంగా బోధించి అందరి అభిమానం పొందటానికి ఇదే కారణమయ్యింది  .మాస్టారు చేసిన మరొక మహోపకారం ఉంది ..నేను బి ఎస్ సి ఫిజిక్స్ మెయిన్ వాడిని  మాథ్స్  కెమిస్ట్రీ సబ్సిడియరి . డిగ్రీలో మాకు మొదటి ఏడాది ఇంగ్లిష్ ఉండేది .ఒక్కటే పేపర్ . కనుక బి ఎస్ డిగ్రీ ఉన్నవాళ్లు హై స్కూల్ లో పై తరగతులకు ఇంగ్లిష్ బోధనకు అనర్హులు .అందుకని మాస్టారుగారు నన్ను బి ఏ ఇంగ్లిష్  చేయమన్నారు.అంటే ఇంగ్లిష్ సబ్జెక్ట్ మాత్రం రెండు ప్రోజులు  రెండు నాండీటైల్స్ ,రెండు డ్రామాలు చదివి రెండేళ్లు వరుసగా పరీక్ష రాసి పాసైతే బిఎ లిటరేచర్ డిగ్రీ వస్తుంది అని హితవు చెప్పి నన్ను పరీక్ష రాయించారు .నాతోపాటు మానికొండ హై స్కూల్ లో సెకండరీ గ్రేడ్ టీచర్ గా పని చేసిన శ్రీ అల్లూరి సీతా రామ రాజుగారికి నేను  చెప్పి ఆయన కడతాను అంటే పరీక్షకు కట్తాం .బెజవాడ లయోలా కాలేజీ సెంటర్ . బెజవాడ ఆర్ ఎస్ ఎస్ ఆఫీస్ లో పరీక్షల సమయం లో మేమిద్దరం ఒక రూమ్ లో ఉండి పరీక్ష రాసాం . నేను పాసయి బిఎ డిగ్రీ పొంది ఇంగ్లిష్ టీచింగ్ కు అర్హత పొందగలిగాను మాస్టారి సలహా దయ ఆశీస్సువలన .రాజు గారు మాత్రం పాస్ కాలేకపోయారు . ఆతర్వాత వైరెండు మూడు సార్లు రాసినా పాస్ కాలేదాయన.  కానీ ఆయన చనిపోయే దాకా మా ఇద్దరి మధ్య మంచి మిత్రత్వం నడిచింది మేము మానికొండకు వెళ్ళటం వారు ఉయ్యురు వచ్చి మా ఇంట్లో మా చిన్ననాటి గురువుగారు స్వర్గీయ వణుకూరు గరుడా చలం మేష్టారిఇంటికీ రావటం చాలాకాలం జరిగింది .ఇప్పుడు వారిద్దరూ స్వర్గస్తులు మానికొండలోనే అటెండర్ రాఘవరావు మాకు ముగ్గురికి అత్యంత సన్నిహితుడు .ఆతను కూడా రాజుగారితో పాటు వచ్చేవాడు  . ఇప్పుడు రాఘవరావూ స్వర్గస్తుడే .

               ఉయ్యూరు హైస్కూల్ లో సైన్స్ ఫేర్ అండ్ ఎక్సి బిషన్

   నేనూ  మాస్టారూ కలిసి ఉయ్యూరు హై స్కూల్ లో సైన్స్ అండ్ మాథ్స్ ఫేర్ ఎక్సిబిషన్ నిర్వహించాలని నిర్ణయించాం . మాస్టారు నన్ను’’ప్రసాదూ ‘’ అని పిలిచేవారు ‘’ప్రసాదూ ఇందులో నాకేమీ తెలియదు .నువ్వే దగ్గరుండి అన్ని చూడు నీకు ఏ రకమైన సహాయం కావాలన్నా నేనున్నాను ‘’అని బాధ్యత అంతా నామీదే పెట్టేశారు . హెడ్ మాస్టారు శ్రీ కె విఎస్ ఎల్ నరసింహారావుగారు నేను 8 చదువుతున్నప్పుడు ఆయనే హెడ్మాస్టర్ .నాకు బాగా చనువు .నా దగ్గర తెలివైన ట్యూషన్ పిల్లలు యద్దనపూడి సాంబశివరావు ,వెంట్రప్రగడ ఉమామహేశ్వరరావు మొదలైన వాళ్ళు ఉండేవారు .సాంబ బెజవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో కంటి డాక్టరై మంచి పేరు పొందాడు .ఉమా మా ఇంటిముందువాడు .వాళ్ళనాన్న సాంబయ్యగారు చనిపోయాక కుటుంబ బాధ్యత తీసుకొని ఐదారేళ్లక్రితం చనిపోయాడు. వీళ్లకు ఇన్నోవేషన్ బాగా ఉండేది . నాకు  ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండటం తో వీరందరి సహకారం తో మేష్టారి ఆధ్వర్యం లో సైన్స్ మ్యాథ్స్  సోషల్ ఎక్సిబిషన్ పెద్ద ఎత్తున రెండు పెద్ద పాకలలో విద్యార్థులకు వివరించి చెప్పటానికి ట్రెయినింగ్ ఇచ్చి పెట్టాం .అప్పుడు శ్రీ కాకాని వెంకటరత్నం గారు వ్యవసాయ శాఖా మాత్యులు .వారిని ఆహ్వానించి వారితో ప్రదర్శన ప్రారంభింప జేశాము .ఊళ్ళో  వాళ్ళు చుట్టుప్రక్కల స్కూల్ వాళ్ళు ,పెద్దలూ పిన్నలూ అత్యుత్సాహంగా వచ్చి చూసి మమ్మల్ని మెచ్చు కొన్నారు .ఎస్కిమో జీవితం అని సోషల్ విభాగం లో దూదితో ఇగ్లు ఇల్లు స్లెడ్జ్ బండి కుక్కలు ఏర్పాటు చేసాం  సైన్స్ లో పిపెట్ ల ఆధారం గా ఫౌంటెన్ దానిపై పింగ్ పాంగ్ బాల్స్ ఎగరటం ఏర్పాటు చేస్తే అందరూ ఆశ్చర్యపోయారు  . అప్పటికి ఏ జిల్లాపరిషత్ హై స్కూల్ లో ఇలాంటి ప్రదర్శన ఎవ్వరూ నిర్వహించలేదని అనేవారు . ఈ స్కూల్ లో మళ్ళీ ఎప్పుడూ ఏ సైన్స్ మాస్టారూ ఇలాంటి ప్రదర్శనకు నడుం కట్టలేదు . ఆ రోజులు వేరు ఆ ఆలోచనలు వేరు .నేనూ ఇక్కడ ఆతర్వాత రెండు సార్లు పనిచేశా కానీ మళ్ళీ అప్రయత్నం నేనూ చేయలేదు .ఇది నా జీవితం లో ఒక హై లైట్ గా నిలిచింది . మాస్టారి ప్రోత్సాహం వల్లనే ఇది విజయవంతం అయింది

                        నా గైడ్ అండ్ ఫిలాసఫర్

శర్మ మాస్టారు నా గైడ్ అండ్ ఫిలాసఫర్ .నాకు ఎప్పుడు ట్రాన్స్ ఫర్ వచ్చినా ఆయన పని చేస్తున్న కంకిపాడుదగ్గరున్న గొడవర్రుకో లేక కాజ కో ,లేక బందరు కో వెళ్లి సలహా తీసుకొనే వాడిని . 1987 లో నేను హెడ్ మాస్టార్ అయ్యాక కూడా మా గురు శిష్య సంబంధం అవిచ్చిన్నంగా కొనసాగింది .మాస్టారు ఉయ్యూరు వస్తే మా ఇంటికి రాకుండా వెళ్లేవారు కాదు ఎన్నో సంగతులు గుర్తు చేసుకొనే వాళ్ళం హైదరాబాద్ లో వారున్నప్పుడూ మా దంపతులం వెళ్లి చూసాం . వారిమేనకోడలు ఉయ్యూరులో ఆ మధ్య మా ఇంటి లో అద్దెకున్నారు ఆమె భర్త టెలిఫోన్ ఎక్స్ చెంజి ఉద్యోగి .ఇలా మళ్ళీ మేష్టారితో అనుబంధమేర్పడింది .ఆవిడా మా ఆవిడా కైలాస గౌరీ నోము చేసుకొన్నారు .చాలా సహాయకారిగా ఉండేవారు ఆవిడ తలిదండ్రులు -అంటే మాస్టారి చెల్లెలు, భర్త గారు .ఈ చెల్లెలును చూస్తే అచ్చంగా మాష్టారు గుర్తుకోచేవారు . వారి సహకారం వలననే నోము  చాలా బ్రహాండంగా జరిగింది . మాస్టారి తమ్ముడు కూడా వచ్చాడు .. జ్ఞాపకాల తేగలపాతర త్రవ్వుకొన్నాం . మాస్టారు కూచిపూడి దగ్గర చినముత్తేవి లో పని చేశారు .

  ఈ విధంగా నన్ను తీర్చి దిగిన మా గురు వరేణ్యులు శ్రీ జె వి ఎస్ ప్రసాద శర్మగారు సుమారు పదేళ్లక్రితం అకస్మాత్తుగా చనిపోయారు .మాస్టారు గొప్ప హోమియో పతి వైద్యులు .ఎందరికో ఎన్నో వ్యాధులు నయం చేసిన భిషగ్వరేణ్యులు . ఈ నాడు ఉపాధ్యాయ దినోత్సవం నాడు మా గురువరేణ్యులను ఈ రకంగా సంస్మరించగలగటం నా అదృష్టం .

  ఇవాళే నాకూ మా మైనేనిగారికి సుమారు 70 ఏళ్ళ క్రితం ప్రాధమిక విద్య నేర్పిన మా గురు వరేణ్యులు   కీశే కోట సూర్యనారాయణ శాస్త్రి గారి గురుపూజోత్సవం కూడాఉయ్యూరులో  సరసభారతి తరఫున స్థానిక అమరవాణీ విద్యాలయం తో సంయుక్తంగా నిర్వహించి  శ్రీ మైనేని గోపాలకృష్ణయ్య  శ్రీమతి సత్యవతి (అమెరికా )దంపతులు ఏర్పాటు చేసిన స్వర్గీయశ్రీ  కోట సూర్యనారాయణ శాస్త్రి  శ్రీమతి  కోట సీతమ్మ దంపతుల స్మారక నగదు బహుమతి 10 వేల  రూపాయలు పదవ తరగతి చదువుతున్న పేద ప్రతిభగలవిద్యార్థికి ,మరొక 10 వేల రూపాయల నగదు బహుమతిని ఒక విద్యార్థినికి సరసభారతి తరఫున అంద  జేశాము .మా గురుపుత్రులు శ్రీ కోట చంద్ర శేఖర శాస్త్రి ,శ్రీ కోట గాయత్రి ప్రసాద్ ,శ్రీ కోట సీతారామాంజనేయులు గార్లు తమ  తలిదండ్రుల  స్మారక నగదు బహుమతిగా ఏర్పాటు చేసిన 10 వేల  రూపాయలు డిగ్రీ చదువుతున్న పేద ప్రతిభగల విద్యార్థికి వారి చేతులమీదుగా ఇప్పించాం .శ్రీ వారణాసి సదాశివరావు తమ తల్లిగారు స్వర్గీయ  శ్రీమతి దుర్గగారి స్మృత్యర్థం అందజేసిన 5 వేల  రూపాయలు మరొక పేద ప్రతిభ ఉన్న విద్యార్థికి అందించాము .

  ఉపాధ్యాయ దినోత్సవ సందర్భం గా ఏర్పాటు చేసిన శ్రీ కోట మాస్టారి గురు పూజోత్సవ0 నాడు  10 మంది ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు సరసభారతి తరఫున సన్మానం చేసాం .నేను ఉయ్యూరులో లేకపోయినా ఈ కార్యక్రమాన్నిమా అబ్బాయి, సరసభారతి కోశాధికారి గబ్బిట వెంకట రమణ ,అమరవాణి  ప్రిన్సిపాల్ శ్రీ పి  వి నాగరాజు  సమర్ధ వంతంగా నిర్వహించగా  సరసభారతి గౌరవాధ్యక్షులు శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి ,కార్యదర్శి శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి గార్లు సభానిర్వహణ సమర్ధ వంతం గా చేశారు .

                        మరొక మార్గ దర్శి

 నేను 1987 లో గండ్రాయి జిల్లాపరిషత్ హై స్కూల్  సైన్స్ మాస్టర్ పోస్ట్ నుంచి వత్సవాయి హెడ్ మాస్టర్ పోస్ట్ కు ప్రమోట్ అయ్యాను  .అప్పుడు మా హెడ్మాస్టారు శ్రీ పివి  సుబ్రహ్మణ్యంగారు .మంచికి ,సిన్సియారిటీకి ,చదువు క్రమశిక్షణలకు మారుపేరు .కొంచెం స్పటకం   మచ్చలతో  దాదాపుగా కాఖీ పాంట్ తెల్ల ఖద్దరు షర్ట్ తో ఉండేవారు . నేను ఎన్నో విషయాలు ఆయన వద్ద నేర్చుకున్నాను .నాకు ప్రమోషన్ ఆర్డర్ రాగానే ఆయన ‘’ప్రసాద్ గారూ -హెడ్ మాస్టర్ అంటే Early to come ,late to go ‘’అనే ‘’తిరుమంత్రం ‘’ తెలుసుకొంటే సక్సెస్ అవుతారు అని బోధించారు.నేను అక్షరాలా ఆయన లా నడిచాను . ఒక రకంగా నాకు మెంటార్ వారు . ఆఫీస్ వర్క్ అంతా కరతలామలకం వారికి .జగ్గయ్యపేట లో ఉండి  గండ్రాయి కి బస్ లో వచ్చేవారు .ఏనాడూ ఒక్క నిమిషం కూడా ఆలస్యం గా వచ్చేవారుకాదు . ఏ పనీ పెండింగ్ ఉండేదికాదు . ఇంక్రిమెంట్ వంటివి అడగాల్సిన అవసరం ఉండేదికాదు .లెక్కలు ఇంగ్లిష్  బాగా  బోధించేవారు  .జగ్గయ్యపేట చుట్టూ ప్రక్కల అలాంటి హెడ్ మాస్టర్ లేరు అని చెప్పేవారు .నేను హెడ్ మాస్టారుగా వత్సవాయి లో చేరాక పి ఆర్ సి అమలు జరిగింది .బిల్స్ ఎరియర్ బిల్స్ చేయటానికి మా గుమాస్తా శ్రీ లగడపాటి వెంకటరత్నం తాను  బాగా నిష్ణాతుడే అయినా ‘’సుబ్రహ్మణ్యం గారి దగ్గరకు మనం వెడితే మీకూ విషయాలు తెలుస్తాయని’’ చెబితే వెళ్లి సలహాలు పొందాం. మంచి గైడ్ సుబ్రహ్మణ్యం గారు  . ఉపాధ్యాయ దినోత్సవం నాడు శ్రీ పివి సుబ్రహ్మణ్యంగారిని జ్ఞాపకం చేసుకోవటం నా పూర్వజన్మ సుకృతం .వీరు జగ్గయ్యపేట లో ఆరోగ్యంగా నే ఉన్నారు .

 కొసమెరుపు -.నేనేదో మా మాస్టర్లను గుర్తు చేసుకొన్నానాని కాలర్ ఎగ రేస్తుంటే -’’తగ్గు బాలయ్యా తగ్గు తగ్గు ‘’అన్నట్లుగా 19 96-97 లో నేను కృష్ణాజిల్లా పామర్రు దగ్గరున్న అడ్డాడహై స్కూల్ హెడ్ మాస్టర్ గా పని చేసినప్పుడు 9 ,10 తరగతులు చదివి ఫస్ట్ క్లాస్ లో పాసై అన్ని సాంస్కృతిక కార్యక్రమాలలో ముందు ఉంటూ  విద్యార్థి నేతగా సమర్ధతను చూపుతూ నా అభిమానం పొందిన విద్యార్థిని శ్రీమతి కోడూరు పావని చదువులు పూర్తి చేసి 12 ఏళ్ళనుండి అమెరికాలో భర్తా  పిల్లలతో ఉంటూ అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ , ఆగస్టు 21 న  ఒహాయో రాష్ట్రానికి కుటుంబం తో మారి ఇవాళ సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం నాడు ఇప్పుడే ఫోన్ చేసిఅభినందనలు తెలిపి  తన గురు భక్తిని చాటింది . పావని మన బ్లాగ్ కు వీరాభిమాని అన్నీ చదువుతానని చెబుతుంది .  శుభాశీసులమ్మా  పావని నీకూ నీ కుటుంబానికీ !-

    ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలతో

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-9-17 కాంప్ షార్లెట్-అమెరికా

 

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

వీక్లీ  అమెరికా -23-2 (28-8-17 నుండి 3-9-17 వరకు ) శ్రీ సత్యనారాయణ వ్రతం ,కారీ ప్రయాణ వారం-2

వీక్లీ  అమెరికా -23-2 (28-8-17 నుండి 3-9-17 వరకు )

శ్రీ సత్యనారాయణ వ్రతం ,కారీ ప్రయాణ వారం-2

పవన్ ఇంట్లో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

2-9-17 శనివారం -ఉదయమే లేచి ఇంట్లో సంధ్య ,పూజాదికాలు ముగించి 9-30 కు మా అమ్మాయి కారులో మేమిద్దరం పవన్ వాళ్ళ ఇంటికి వెళ్లాం . అప్పటికే కొంత ఏర్పాటు చేశారు .మేము వెళ్ళాక స్పీడ్ పెంచి  అన్ని ఏర్పాట్లు చేసేసరికి 11 అయింది .. పవన్ ,రాధా దంపతులు ముఖ్య తారాగణం గా  రాంకీ ,ఉష దంపతులు ,పవన్ సాయి పద్మజ దంపతులు ,పవన్ బంధువులు శ్రీనాధ్ దంపతులు ,బులుసు సాంబమూర్తి పద్మజా దంపతులు అతిథి నటులుగా వ్రతం లో కూర్చున్నారు . ముందుగా విఘ్నేశ్వర పూజ చేయించి తర్వాత శ్రీ రామా సహిత సత్యనారాయణ స్వామి ప్రాణ ప్రతిష్ట చేయించి ,నవగ్రహాల ఆవాహనం ప్రతి గ్రహానికి అష్టోత్తర పూజ అక్కడ వాడవలసిన రంగుపుష్పాలతో చేయించి అష్ట దిక్పాల పూజ మొదలైన వాటి తర్వాత ,లక్ష్మీ  సమేత శ్రీ సత్యనారాయణ ప్రతిమలకు రూపులకుపురుషసూక్త ,స్త్రీ సూక్త భూసూక్తాలతో  అభిషేకం చేయించి ,పిమ్మట సత్యనారాయణ అస్టోత్తర  విష్ణు సహస్ర నామ ,లక్ష్మీ అష్టోత్తర పూజ చేయించి సత్యనారాయణ స్వామి ప్రసాదం నైవేద్యం పెట్టించి వ్రతకధలు అయిదు చెప్పి  మళ్ళీ అష్టోత్తరపూజ ,చేయించి  ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర దీపారాధన అష్టోత్తర పూజ చేయించి మహా నైవేద్యం పెట్టించాను .మంగళహారతి ఇప్పించి  తర్వాత అందరం లేచి ఏకకంఠంగా మంత్రపుష్పం ఉచ్చై స్వరం  తో పఠించి పూజ పూర్తి చేయించాను . తర్వాత ఉద్వాసన మంత్రమూ చెప్పించి చేయించాను .దంపతులందరికి మా శ్రీమతి రాధ బంధువులావిడ మొదలైన ముత్తైదువులు మంగళ హారతి  పట్టారు .నేను ఆశీర్వాద మంత్రాలు క్రమ జట  ఘనం తో ఒక వేదపనస చదివి ఆశీర్వ దించాను . తర్వాత తీర్ధ ప్రసాద 0 అందరికి ఇచ్చాను . ఈ రోజు ప్రాముఖ్యతను ,అన్నవరం క్షేత్రాన్ని గురించి చెప్పాను . అంతా  అయ్యేసరికి మధ్యాహ్నం 3 దాటింది .అంటే సుమారు మూడున్నర గంటలపూజ

ఈ రోజు ప్రత్యేకత –    అన్నవరం క్షేత్రం

ఇవాళ అంటేభాద్ర పద శుద్ధ ఏకాదశి ద్వాదశి కలిసిన పుణ్య ఘడియలలో శ్రీ సత్యనారాయణ వ్రతం చేయటం అనంత పుణ్య ప్రదం .

‘’సంస్పృశ్య ఏకాదశీ రాజన్ ,ద్వాదశీ మపి సంస్పృశేత్ -శ్రవణం ,జ్యోతిషామ్ శ్రేష్టం బ్రహ్మ హత్యాది వ్యపోహతి -’’

‘’ద్వాదశీ శ్రవణం పృష్ఠ స్పృశేత్ ఏకాదశీమ్ యది -స ఏవ వైష్ణవో యోగః -విష్ణు శృంఖల సౌజ్ఞితః ‘’అని నారద పురాణం చెప్పింది .దీని భావం ఏమిటి అంటే – భాద్రపద మాసం లో శుక్లపక్షం లో ఏకాదశి ద్వాదశీ తిధులు కలసిఉన్నరోజు న శ్రవణా నక్షత్రం ఉంటె చేసే వ్రతం బ్రహ్మ హత్యా దోషాన్ని పోగొట్టి మోక్షాన్నిస్తుంది .దీనికే విష్ణు శృంఖలా యోగం అంటారు .ఈ రోజు బుధవారం కూడా అయితే మరింత ఫలప్రదం .దీన్ని అప్పుడు ‘’మహాద్వాదశి ‘’అంటారు ఉపవాసం ఉండి  వ్రతం చేసి దానా లిస్తే వచ్చే జన్మలో చక్రవర్తిగా పుడతారని మార్కండేయ పురాణమూ  మత్శ్య పురాణమూ చెప్పాయి  . ఇందులో మనకు తిధులు మాత్రమే కలిశాయి కనుక సగం పుణ్యం సాధించినట్లే .ఇవాళ పూర్వాషాఢ వెళ్లి ఉత్తరాషాడ లో ఈ వ్రతం చేస్తున్నాం తర్వాత వచ్చేదే శ్రవణా నక్షత్రం .

 ఇవాళ్టి భాద్ర పద శుద్ధ ఏకాదశిని ‘’పరివర్తన ఏకాదశి ‘’అంటారు వామన ఏకాదశి అనే పేరుకూడా ఉంది . బలి చక్రవర్తిని విష్ణువు వామనమూర్తిగా అవతరించి మూడు అడుగులు దానం అడిగి ఒకడుగు భూమిపై రెండవది ఆకాశం లో పెట్టి మూడో దానికి చోటులేక బలి నెత్తిన పెట్టి పాతాళలోకానికి అదిమి పంపి  తాను ద్వారపాలకునిగా  కావలిగా ఉన్న రోజు ఇది .

                             అన్నవరం

పూర్వం మేరు పర్వతం భార్య మేనక పుత్ర సంతానం కోసం శ్రీ మహా విష్ణువు పై ధ్యాన తపస్సులు చేయగా ,వారు కోరుకున్న పుత్ర సంతానాన్ని వరంగా ఇచ్చాడు . భద్రుడు ,రత్నాకరుడు అనే ఇద్దరు కొడుకులు పుట్టారు . భద్రుడు శ్రీరాముని కోసం తపస్సు చేసి ప్రత్యక్షంకాగా తనకొండపైనే కొలువుండమని కోరటం ఆయన భద్ర గిరిపై సీతా  సమేతంగా  వామాంక స్థితుడై ఉండటం అదే భద్రాచల పుణ్య క్షేత్రం గా ప్రసిద్ధ మవటం మనకు తెలిసిందే .రత్నాకరుడు విష్ణువు కోసం తపస్సు చేసి ప్రత్యక్షమవగానే తనకొండ రత్నగిరి పై శాశ్వతం గా ఉండిపొమ్మనటం తో శ్రీ సత్యనారాయణ స్వామిగా ఉండిపోవటం వలన ఇది అన్నవరం క్షేత్రంగా ప్రసిద్ధమైంది .ఈ  విధం గా  సోదరులిద్దరూ విష్ణు అనుగ్రహ పాత్రులై ఆయననే తమ గిరులపై వెలసేట్లు చేసుకొన్న పుణ్యమూర్తులు . రత్నాచలమే అన్నవరం .రత్నాచల్ ఎక్స్ప్రెస్ అందువలననే ఆ పేరుతొ వచ్చింది .

                       స్వామి ఆవిర్భావం

తూర్పు గోదావరిజిల్లా పిఠాపురం దగ్గర ‘’గోరస ‘’అనే గ్రామానికి ప్రభువు శ్రీ రాజా ఇనగంటి వేంకట  రామాయణిం బహదూర్ .దీనికి దగ్గరలో అరికంపూడి వద్ద ‘’అన్నవరం ‘’గ్రామం ఉంది .అన్నవరం లో శ్రీ ఈరంకి ప్రకాశం రావు అనే బ్రాహ్మణుడు చాలా నిష్ఠగా వేదం వేదాంగాలు నేర్చి మహా భక్తుడుగా ప్రసిద్ధి చెందాడు రాజుగారికి ప్రీతి పాత్రుడు కూడా .ఒక రోజు రాత్రి కలలో ఈ ఇద్దరికీ విష్ణు మూర్తి కనిపించి తానూ వచ్చే ఖర నామ సంవత్సర శ్రావణమాసం శుక్ల విదియ మఖా నక్షత్రం లో ఉన్న గురువారం నాడు రత్న గిరిపై వెలుస్తాననని ,తనను తెచ్చి అన్నవరం కొండపై ప్రతిష్ట చేసి గుడి కట్టించమని చెప్పాడు .

  మర్నాడు ఈ ఇద్దరు కలుసుకొని తమకు వచ్చిన కల గురించి చెప్పుకొని ఆశ్చర్యపోయి ఖర నామ సంవత్సర శ్రావణ శుద్ధ పాడ్యమి నాటికే అన్నవరం చేరి స్వామి కోసం వెదికారు .అక్కడ ఒక ‘’అంకుడు చెట్టు ‘’(కృష్ణ కుటజము )- Nerium Anty dysentirium ‘’కింద సూర్యకిరణాలు పడగా పొదలను తొలగించి చూస్తే సత్యనారాయణ స్వామి విగ్రహం లభించింది .దీన్ని రత్నాచలం పైకి తీసుకు వెళ్లారు .కాశీ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన ‘’శ్రీ మత్రిపాద్విభూతి మహా వైకుంఠ నారాయణ యంత్రం ‘’విష్ణు పంచాయతనపూర్వంగా తెప్పించి 1891 ఆగస్టు 6 న ప్రతిష్టించారు .

                ఆలయ నిర్మాణం -ప్రత్యేకతలు

శ్రీ అనంత లక్ష్మీ సత్యదేవీ సమేత  శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయాన్ని 1934లో నిర్మించారు .పంచాయతనం ఉండటం వలన ,దానికి ప్రతీక గ ముందు గణపతి ,శంకరుని చిహ్నాలు ,శూల శిఖరాళల తో  రెండు చిన్న విమాన ,గోపురాలు ,మధ్యగా ప్రధాన విమాన గోపురం ,వెనక ఆదిత్య దేవత ,అంబికా దేవి ప్రతీకలైన శ్రీ చక్రాలున్న మరో రెండు విమాన గోపురాలతో ఆలయాన్ని కట్టారు .ఒకే చోట ఇంతమంది దేవతలు కొలువై ఉండటం ఒక ప్రత్యేకత .గిరిపై శ్రీ కోదండ రామాలయం ,వనదుర్గాలయం కింద గ్రామదేవత ఆలయాలు కూడా ఉన్నాయి ..

 శ్రీ సత్యనారాయణస్వామి త్రిముర్త్యా త్మక విష్ణు స్వరూపుడు .అందుకే ‘’మూలతో బ్రహ్మ రూపాయ ,మధ్యతశ్చ మహేశ్వరం -ఆదతో విష్ణు రూపాయ త్రైక్య రూపాయతే నమః ‘’అని భక్తితో అర్చిస్తారు

   ఆలయ ప్రత్యేకతలు

ఈ ఆలయం రుద్రాకృతిలో ఉండటం ఒక ప్రత్యేకత . ఆలయ నైరుతిభాగం లో సూర్యుడు ,ఆగ్నేయం లో గణపతి ,వాయవ్యం లో అంబికా ,ఈశాన్యం లో ఈశ్వరుడు ,మధ్యలో ప్రత్యేక యంత్ర వేదిక  పై లింగాకార0 లో బిందు స్థానం  లో పంచాయతన స్వామిగా సత్య దేవుడు ప్రతిష్ఠితమై ఉన్నాడు .ఆలయం రెండు అంతస్తులతో ఉండటం మరో విశేషం ..పై అంతస్తులో దివ్య మంగళ విగ్రహ స్వరూపుడుగా శ్రీ అనంత లక్ష్మీ సత్యదేవీ  సమేత  శ్రీ వీర వెంకట సత్యనారాయణ మూర్తి విరాజిల్లుతూ దివ్య దర్శనమిస్తాడు .ఈరెండిటి మధ్య పానవట్టం లాంటి నిర్మాణం ఉండటం వింతలలో వింత .దీనిలో బీజాక్షర సంపుటి ఉన్న యంత్రం ఉండటం వింతలకే  వింత .

 క్రింద ఉన్న వృత్తాకార శిలాయంత్రం బ్రహ్మ స్వరూపం ,మధ్యలో శివ స్వరూపం ,పై విగ్రహం శ్రీమన్నారాయణ మూర్తి అవటంఅత్యంత  విశేషం..సత్యదేవుడిని ‘’త్రిపాద్విభూతమహా నాయకుడు ‘’అంటారు .అమ్మవారు అనంత లక్ష్మీ సత్యదేవి ‘’

 ఈ ఆలయం లో నిత్యం సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరుగుతాయి .ఇక్కడి సత్యనారాయణ స్వామి ప్రసాదం మహా రుచికరమేకాదు అత్యంత పవిత్రం కూడా ‘’

  ఈ మొత్తాన్ని  నేను ఈ రోజు వ్రతం లో 5 కధలు అయ్యాక 6 వ కద చెబుతాను అని ఊరించి సరదాగా  విశేషంగా ఈ కథ చెప్పి సస్పెన్స్ కు తెరదించాను .

   పవన్ ఇంట్లో వ్రతం అయ్యాక పవన్ రాధా దంపతులు  మా దంపతులకు నూతన వస్త్రాలు  ‘’ఘనమైన తాంబూలం’’ తో అందజేసి ఆశీసులు అందుకొన్నారు . రాంకీ ,ఉషా దంపతులు పవన్ సాయి పద్మజా దంపతులు ‘’యధాశక్తి తాంబూలాలు ‘’ఇచ్చి ఆశీస్సులు పొందారు .

 తర్వాత భోజనాలు . పప్పు వంకాయ కూర బీన్స్ కూర ,దోసావకాయ ,చట్నీ ,పునుగులు ,పరవాన్నం పులిహోర ,మామిడిపండు ముక్కలతో సుస్టైన భోజనం చేసాం . నా బోటి ‘’పీఠాధిపతులం ‘’కుర్చీలలో కూర్చుని భోజనం చేస్తే మిగిలిన వారందరూ కింద కూర్చుని పవన్ స్పెషాలిటీ అయినఅరటి ఆకులలో చక్కగా ఆంద్ర బ్రాహ్మణ లోగిళ్ళు లో చేసే విధానం లో భుజించి తెలుగు విందు భోజన వైభవాన్ని  ఇక్కడ ప్రదర్శించి కను విందు చేశారు .

   ఈ రోజు రాంకీ పుట్టిన రోజు అవటం తో కేకు తెప్పించి పవన్ రాంకీ తో కోయించి జన్మ దిన శుభాకాంక్షలు అందరి చేత ఇప్పించి  బర్త్ డే పాటలు పిల్లలల్తో పాడించి శోభతెచ్చాడు .పవన్ కూతురు పెద్దమనిషి  అయినప్పుడు  బంతి భోజనాలనాడు రాంకీ భార్య ఉష పుట్టిన రోజు నాడూ పవన్ ఇదే మాదిరిగా ఏర్పాటు చేసిన  విషయం గుర్తు చేసుకున్నాం . నేను రాంకీ ఉషా దంపతులను ‘’షార్లెట్ వసిష్ఠ అరుంధతులు ‘’అని పవన్ రాధ దంపతులను ‘’షార్లెట్ అత్రి అనసూయ దంపతులు ‘’అని ,పవన్ సాయి పద్మజ దంపతులను ‘’షార్లెట్ ఋష్యశృంగ శాంత దంపతులు ‘’అని చమత్కరించా .చమత్కరించటం కాదు నిజంగానే వాళ్ళు అలా సన్మార్గం లో ప్రవర్తిస్తారు . ఇదంతా అయ్యేసరికి  సాయంత్రం 5-45 అయింది .వెంటనే అందరికీ కాఫీలిచ్చారు .

శ్రీ రఘు సుచిత్ర దంపతుల ఇంట్లో కిందటి శనివారం రుద్రాభిషేకం నాడు రుద్రం బాగా చెప్పిందని నేను మెచ్చిన శ్రీమతి కాకాని లక్ష్మికి ఆ నాడు వాగ్దానం చేసిన రూ 1 ,116 రూపాయలు సరసభారతి పుస్తకాలు ఉన్న పాకెట్ ఇచ్చి శ్రీ రవీంద్ర గారిద్వారా అందజేయించమని పవన్ కు ఇచ్చాను

తర్వాత మేమిద్దరం మా అమ్మాయి విజ్జి ,పిల్లలు ముగ్గురం కారులో  సాయంత్రం  6 కు కారీ  బయల్దేరాం .

    కారీ లో ఇరవై మూడున్నర గంటలు

2-9-17 శనివారం సాయంత్రం 6 గంటలకు కారులో కారీ కి బయల్దేరి రాత్రి 9 గంటలకు మా అన్నయ్యగారి మానవుడు చి వేలూరి హరికిషన్ సారిక దంపతుల ఇంటికి చేరాం . మేమిద్దరం ఏమీ తినలేదు .పిల్లలు ఇడ్లీలు తిన్నారు .మజ్జిగ తాగి పడుకున్నాం .ఎల్లాప్రగడ రామమోహనరావుగారికి ఇక్కడికి వచ్చినట్లు ఫోన్ చేసి చెప్పి ,రేపు మధ్యాహ్నం భోజనం వారింట్లోనే నని చెప్పాను సంతోషించారు . 5 నెలలనుంచీ వేసుకొన్న ప్లాన్   ఇది ఇవాళ కుదిరింది .

3-9-17 ఆదివారం -ఉదయమే లేచి కాలకృత్యాలు తర్వాత  సంధ్యపూజ కానిచ్చి టిఫిన్ చేసి చి సౌ సారికకు ఒడిలో మా శ్రీమతి చలవ చలిమిడి పెట్టి ,రెండో పిల్లాడితో ముద్ద కుడుములు ఇప్పించి వేడుక చేసింది .సారిక తల్లిగారు కూడా ఇక్కడే ఉన్నారు . పెద్ద పిల్లాడు చి దర్శి మంచి మాటగాడు కలుపుకోలు తనం ఉన్నవాడు . చనువుగా దగ్గరకొచ్చాడు .చిన్నవాడికి మూడు నెలలు . అచ్చం వాళ్ళ నాయనమ్మ అంటే మా అన్నగారి అమ్మాయి వేదవల్లి లాగా ఉన్నాడు . ఈ వేడుక తర్వాత మా ఇద్దర్నీ 6 మైళ్ళ దూరం లో ఉన్న ఎల్లాప్రగడ వారి చెల్లెలు బావగారు హార్ట్ డాక్టర్దంపతులు నందిగామకు చెందిన శ్రీ బండారు రాధాకృష్ణ మూర్తి శ్రీమతి సులోచన దంపతుల ఇంటికి  మధ్యాహ్నం 12 గంటలకు  తీసుకు వెళ్లి దింపి0ది .అక్కడే ఎల్లాప్రగడ వారు వాళ్ళమ్మాయి  శ్రీలక్ష్మి ఉన్నారు మమ్మల్ని అందరూ ఆత్మీయంగా ఆహ్వానించారు . ఒక గంట సేపు సరదాగా మాట్లాడుకొంటూ శ్రీ మైనేని గోపాలకృష్ణ గారితో ఫోన్ లో సంభాషిస్తూ కాలక్షేపం చేసాం . మైనేనిగారి ఈ సమావేశానికి రూపకర్త సంధానకర్త . మధ్యాహ్నం ఒంటిగంటకు భోజనాలు చేసాం .భోజనం లో పప్పు ,చిక్కుడుకాయ కూర పూరీలు బంగాళా  దుంపకూర  ఎల్లాప్రగడ స్వయం గా చేసిన గుంటూరు గోంగూర పచ్చడి, పండు మిరపకాయ పచ్చడి ,అల్లం పచ్చడి  గులాబీ జామ్ ,గారెలు రావుగారి స్పెషల్ ఘుమఘుమల సాంబారు ,రెండురకాల అప్పడాలు ఊరు మిరపకాయలు పెరుగు ,మామిడి పండు ముక్కలతో కమ్మటి తెలుగు భోజనం చేసాం.  కొసరి కొసరి అన్నా చెల్లెలు వడ్డించి మరీ మరీ తినిపించారు . తర్వాత రావుగారు మా అందరికి స్వహస్తాలతో కస్తూరి జాజికాయ జాపత్రి ,ఏలక్కాయ ,లవంగం త్రివేణీ వక్కపొడితో కట్టిన కమ్మని కిళ్లీ తిన్నాం . నేను రెండు తిన్నా . చాలా బాగున్నాయి ఆయన టెస్ట్ కు జేజేలు .రావు గారుసరాదా మనిషి . గుంటూరు జిల్లా రేపల్లేదగ్గర వారికి ఒకప్పుడు వేలాది ఎకరాల సుక్షేత్రమైన మాగాణి మామిడితోటలు ఉండేవి . 400 ఆవులు ఉండేవి .తండ్రిగారి హయాం వరకు పాడీ  పంటా వ్యవసాయం తో ఉండేది . రావు గారు 18 ఏళ్ళు వ్యవసాయం చేశారు ట్రాక్టర్ తో దుక్కి దున్నారు . అన్నదమ్ముల పంపకాలలో అన్నీ అవగా ఇప్పటికీ వీరికి అక్కడ 25 ఎకరాల భూమి ఉంది ప్రతి వేసవిలో ఇండియా వెళ్లి వ్యవసాయం చూసుకొంటారు .తోటలోని  మామిడికాయ ,మిర్చి గోంగూర నిమ్మకాయ వగైరాలతో ఊరగాయలు పెట్టిస్తారు .అమెరికావచ్చి అకౌంటింగ్ ప్రొఫెసర్ గా స్థిరపడి రెండేళ్లక్రితం రిటైరయ్యారు . ఒక అన్నగారు ఎయిర్ ఇండియా పైలట్ చేశారు .రావుగారు కూడా పైలట్ లైసెన్స్ పొంది హాబీగా విమానాలు నడిపేవారు . మంచి సహృదయులు ,స్నేహశీలి మైనేనిగారి క్లాస్ మేట్ .ఏరా అంటే యేరా అనుకొనే చనువున్నవారు .

  బండారు డాక్టర్ డంపట్ల హార్ట్ స్పెషలిస్ట్ లుగా ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైరయి ఇక్కడే ఉంటున్నారు   ఇద్దరీళ్లూ ప్రక్క ప్రక్కనే . మూర్తిగారిది కృష్ణా జిల్లా నందిగామ దగ్గర వేములపల్లి అగ్రహారం .ఒకప్పుడువీరికీ అమరావతి ప్రభువు ఇనాంగా ఇచ్చిన గ్రామం .మూర్తి గారు రజాకార్లకు వ్యతిరేకంగానూ స్వాతంత్ర సమరం లోనూ పాల్గొని జైలుకెళ్లినా దేశ భక్తులు తర్వాత బూర్గుల రామ కృష్ణారావు  కె ఎల్ రావు గారు ల హితవుపై చదువు కొనసాగించి అంచెలంచెలుగా ఎదిగి డాక్టర్ పాసై ఉస్మానియా లో పని చేసి ఇక్కడికి వచ్చారు . సులోచనగారు రావు గారి చెల్లెలు . మూర్తిగారి మొదటిభార్య చనిపోతే వీరినిచ్చి వివాహం చేశారు . పిల్లలుఅమెరికాలోనే ఉన్నారు . మూర్తిగారి సహస్ర  చంద్ర మాసోత్సవాన్ని పిల్లలు ఘనం గా ఇక్కడే నిర్వహించారు . అంటే వారికి ఇప్పుడు 85 ఏళ్ళు .భగవద్ ధ్యానం పూజలతో సత్కార్యాలతో కాలక్షేపం చేస్తున్నారు .

   రావుగారు తమల పాకు తీగలను కర్వేపాకు చెట్లను బాగా పోషిస్తున్నారు . మూర్తిగారి పెరడులో రుద్రాక్ష చెట్టు ఇద్దరి పెరడులలో బిల్వ వృక్షాలు ఉండటం విశేషం . అనీ త్రిప్పి మాకు చూపించారు .మధ్యాహ్నం 2 గంటలకు మా అమ్మాయి పిల్లలు హరి కుటుంబం వచారు భోజనాలు చేశారు .తర్వాత రావు గారి కిళ్ళీలు ఆరగాఆరగా తిన్నారు .

  సాయంత్రం నేను శ్రీ మంకు శీను గారు రాసిన శ్రీ సువర్చలేశ్వర శతక0 ఒక పావుగంట లో చదివి రావు గారి హనుమద్ భక్తికి  దోహదం చేశాను ఆయన హనుమ ఉపాసకులు సద్గురు శివానందమూర్తి గారి సామవేదం షణ్ముఖ శర్మగారి శిష్యులు .డాక్టర్ మూర్తిగారింటికి శ్రీ ప్రతాపరాయకులపతి గారైన శ్రీ కుర్తాళం పీఠాధిపతులు వచ్చి మూడు రోజులు అనుగ్రహ భాషణం చేసి ఆశీస్సులందించారు .

  నేను రాస్తున్న గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3గ్రంధాన్ని శ్రీ బండారు డాక్టర్ దంపతులకు అంకితమిస్తున్నాం . దీనికి ముద్రణ ఖర్చుకు స్పాన్సర్ శ్రీ ఎల్లాప్రగడ రామ మోహన రావు గారు . ఈ విషయాలు ముచ్చటించుకొని సరసభారతి కార్యక్రమాలు తెలియ జేశాను . మా దంపతులం  డాక్టర్ దంపతులకు నూతన వస్త్రాలు సరసభారతి జ్ఞాపిక ,శివానందలహరి శ్రీ సువర్చలాన్జనేయ స్వామి చిన్న ఫోటో బహూక రించాము .మూర్తి దంపతులు మా దంపతులకు నూతన వస్త్రాలతో సత్కరించి ‘’ఘనమైన నగదు తాంబూలం’’అందజేశారు .రావు గారికి వారమ్మాయి శ్రీ లక్ష్మికి నూతన వస్త్రాలు మేము అందజేశాము సరస భారతిజ్ఞాపిక ,సువర్చలా మారుతి శతకం సువర్చలేశ్వర శతకం శ్రీ హనుమత్ కధానిధి శ్రీ ఆంజనేయ మహాత్మ్యం ,శివానంద లహరి చిన్న శ్రీ సువర్చలాన్జనేయ స్వామి ఫోటో కానుకగా అందజేశాము . రావు గారు మా దంపతులకు నూతనవస్త్రాలు తాము తమ కూతురు కలిసి అందించారు .చాలా ఆత్మీయంగా మానసికానందంగా ఈ కార్యక్రమం జరిగింది .రావు గారు పెంచిన మొక్కలు మా వాళ్లకు ఆప్యాయంగా ఇచ్చారు .అందరి వద్దా సెలవు తీసుకొని బయల్దేరాం .

   దారిలో బాలాజీ ,దేవాలయం, శివాలయం దర్శించి ,మా అల్లుడి మేనత్తగారు శ్రీమతి లక్ష్మి, భర్త శ్రీ చీమలకొండ దుర్గాప్రసాద్ రావు దంపతుల ఇంటికి వెళ్లి చూసి పావు గంట ఉండి మా హరి ఇంటికి వెళ్లి అక్కడ వాళ్ళు చేసిన పూరీలలో ఒక్కటి మాత్రమే నేను తిని ఐస్ క్రీమ్ లాగించి మజ్జిగ తాగి ,అందరి టిఫిన్లు అయ్యాక  వాళ్ళు మాకు బట్టలు పెట్టి ఆశీర్వాదం తీసుకొన్న తర్వాత రాత్రి 8-30 లకు కారులో షార్లెట్ బయల్దేరాం అంటే కారీ  లో మేమున్నది కేవలం 23న్నర  గంటలు మాత్రమే .అయినా సత్కాలక్షేపం .ఇదంతా మా మైనేని గారి మహాత్మ్యమే .

   రాత్రి సరిగ్గా 11 గంటలకు షార్ల్లెట్ లో మా ఇంటికి చేరాం .రాగానే రావుగారికి ఫోన్ చేసి చెప్పి మైనేనిగారికి మా అబ్బాయి రమణకు మెయిల్ రాశాను .

 డా మాదిరాజు రామలింగేశ్వరరావుగారు మచిలీపట్నం నుండి మెయిల్ రాస్తూ అందులో తమ బంధువు ఒకరు ఒక భక్తి మాస  పత్రిక  నడుపు పుతున్నారని అందులో నేను రాసిన’’ సిద్ధ యోగిపుంగవు’’లను సీరియల్ గా ప్రచురించాలని భావిస్తున్నారని అనుమతిస్తే అక్టోబర్ సంచిక నుంచి అవి ధారావాహికంగా ప్రచురిస్తారని చెప్పారు . సంతోషంగా అంగీకరిస్తున్నానని  జవాబు రాయగా వెంటనే వారు ధన్యవాదాలు తెలియ జేశారు .

  మరొక ముఖ్య విషయం కేంద్ర మంత్రి వర్గ పునర్వ్యవస్తీకరణలోశ్రీ పరకాల ప్రభాకర్ భార్య కేంద్ర మంత్రి  శ్రీమతి నిర్మలా సీతారామన్   గారిని రక్షణ మంత్రిగా ప్రధాని మోడీ నియమించటం  ఊహించని పరిణామమే కాదు సమర్ధతకు పట్టాభిషేకం .70 ఏళ్ళ స్వాతంత్ర ఆనంతర భారత దేశం లో మొట్టమొదటి సారిగా మహిళకు డిఫెన్స్ పదవి ఇవ్వటం  అపూర్వ మైన గర్వించదగ్గ విషయం . నిర్మల గారు తెలుగు తమిళ రాష్ట్రాల కోడలు కూతురు .ఈ పదవిలో సమర్ధత చూపి రాణించాలని అభినందిస్తున్నాను .

  ఈ  వీక్లీ  ఇంతటితో సమాప్తం

  మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -4-9-17 -కాంప్ -షార్లెట్-అమెరికా

  .

 

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

వీక్లీ అమెరికా -23-1 (28-8-17 నుండి 3-9-17 వరకు ) శ్రీ సత్యనారాయణ వ్రతం ,కారీ ప్రయాణ వారం -1

 

28-8-17 సోమవారం నంద్యాల ఉప ఎన్నిక ఫలితాలు భూమా నాగి రెడ్డి కుమారుడు 28 వేల భారీ మెజార్టీతో గెలుపు .. సోమవారం  సాయంత్రం పవన్ ,రాధా వచ్చి శనివారం వాళ్ళ ఇంట్లో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించమని కోరారు .సరే అన్నాను వ్రతం అయ్యాక దాదాపు 5 నెలలనుండి వాయిదా వేస్తున్న కారీ ప్రయాణం చేద్దామనుకొన్నాం మా అమ్మాయి మేము .రాత్రి నాటక నటుడు రచయిత సినీ హాస్య నటుడు లంకా భద్రాద్రి శ్రీరామ్ అనే ఎల్ బి శ్రీరామ్ తీస్తున్న షార్ట్ ఫిలిం సీరీస్ ‘’he ’art “‘films ‘’మళ్ళీ చూశా . అందులో గంగిరెద్దు అద్భుత . దేవాలయం లో  ప్రసాదం గా  మంచి పాతపుస్తకాలుపంచి పెట్టె కాన్సెప్ట్ తో ఉన్న ‘’ప్రసాదం ‘’ ‘’రాళ్లు’’ ఫిలిం లో శిల్పి అందరికి నయనానందం  కల్గిస్తాడుకాని అతని ఇంట్లోపొయ్యిలో  పిల్లిలేవటానికి యెంత కష్టపడతాడో తెలిపే సినిమా గొప్పగా ఉంది . దేవుడు గుడిలో మాత్రమే లేడు  సర్వత్రా ఉన్నాడు చూసే కళ్ళు ఉంటె అని తెలియజెప్పే ‘’దేవుడు ‘’తండ్రి ఇంటికి వస్తున్నాడంటే డబ్బు అడుగుతాడేమోనని కొడుకు కోడలు భావించి వెంటనే పంపించేద్దామని అనుకొంటున్న వారిద్దరికీ షాకింగ్ గా తండ్రి 20 వేల  రూపాయలు కొడుకు చేతిలో పోసి ,కోడలి జబ్బు నయం చేయించమని చెప్పగా  వాళ్ళిద్దర్నీ అవాక్కు చేసిన ‘’నాన్న ‘’లఘు చిత్రం  ,కూతురు తండ్రి అనుమతి లేకుండా ఎవర్నో పెళ్లి చేసుకొంటే భరించలేక పోయిన తండ్రి మరణ శయ్యమీద కూతురు ఫోన్ నంబర్ నర్సుకు ఇస్తే ,మానవత్వమున్న నర్స్ ఆఅమ్మాయికి ఫోన్ చేసి పిలిపించి ఆమె బాధ పడకూడదని తండ్రి ఆఅమ్మాయిని క్షమించినట్లు తానె ఉత్తరం రాసి ,చనిపోయిన తండ్రిని చూడటానికి వచ్చిన కూతురుకు మనశాంతిని ,చనిపోయిన తండ్రికి ఆత్మ శాంతిని కలిగించిన నర్స్ ఔదార్యం తెలియ జేసే ‘’నర్స్ ‘’చిత్రం హృదయాలను కదిలించాయి .

 గొల్లపూడి మారుతీరావు తనికెళ్ళ భరణి ,బలభద్ర పాత్రుని రమణి వంటి లబ్ధ ప్రతిష్టులతో తీసిన సెంటిమెంట్ చిత్రం ‘’పల్లకి ‘’గుండెలను కదిలిచేస్తుంది .అందరూ జీవించారు ఇందులో .దీన్ని అపర అన్నపూర్ణ నిరతాన్న ప్రదాత కీశే శ్రీమతి డొక్కా సీతమ్మగారి మనవడి కొడుకు అంటే ఇన్ని మనవడు శ్రీ డొక్కా ఫణి డైరెక్ట్ చేశారు ఫణిగారు అట్లా0టాలో ఉంటూ తమ ఇంట సాహిత్యకార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తూ ఉంటె తమ్ముడు శ్రీ డొక్కా రామభద్ర ఆస్టిన్ లో ఉంటూ సాహిత్య సామాజిక సేవ చేస్తూ ,పుస్తకాలు రాసి ప్రచురిస్తున్నారు ..ఈ లఘు చిత్రాలలో శ్రీరామ్ నటన పారాకాష్ట కు చేరింది . ఎక్కడా కృత్రిమత కనిపించదు సహజత్వం ఉట్టి పడుతుంది తప్పని సరిగా ‘’హార్ట్ ఫిలిం  ‘’  లను అందరూ చూసి ఆన0 దించమనీ ,ఎల్బీ ఇందులోనూ శిరాగ్రాన నిలవాలని కోరుతున్నాను . మానవీయ కోణాల ఆవిష్కరణ జేజేలు పలుకుతున్నాను .

మంగళవారం –   గీర్వాణం -3 లో 443 వరకు రాశాను

30-8-17 బుధవారం మంచి మనిషి శ్రీ ఆదిత్యారామ్ ఆకస్మిక మరణం

 27 వ తేదీ ఆదివారం మధ్యాహ్నం ఇక్కడ మా కమ్యూనిటీ లోనే మా ఇంటికి మూడవ ఇంట్లో ఉంటున్న దంత వైద్యురాలు శ్రీమతి భావన గారి భర్త ,బాంక్ లో పనిచేస్తున్న అందరికి ఆప్తులు శ్రీ ఆదిత్యారామ్ అకస్మాత్తుగా హార్ట్ ఎటాక్ వచ్చి ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయారు . వయసు 48 మాత్రమే . మా అమ్మాయికి తెలిసి వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చి మా ఇంట్లో ఉంచి మామనవాళ్లతో ఆమెతో మాట్లాడిస్తూ ఆ అమ్మాయికి షాక్ కలగకుండా జాగ్రత్త పరచింది అబ్బాయి పెద్దవాడు . అతడూ తరచుగా మామనవడు శ్రీకేత్ కోసం వస్తూంటాడు .ఆదిత్యారామ్ ను ఆంబులెన్స్ లో హాస్పిటల్ కు తీసుకు వెళ్లి అన్ని ప్రయత్నాలు చేయించినా  ఫలితం దక్కక సాయంత్రం 5-30 కు డాక్టర్లు  చనిపోయినట్లు  ప్రకటించారు .అక్కడే ఐ సి లో ఉంచి 30 వ తేదీ బుధవారం మధ్యాహ్నం శవ దహన వాటిక కు చేర్చారు .మా అమ్మాయి స్నేహితురాలు  సురేఖ ఆమె భర్త  మరో మిత్రురాలు సునీతతో నన్ను అక్కడికి తీసుకు వెళ్లారుకారులో . అరగంటకు పైగా ప్రయాణం మధ్యాహ్నం 1-15 కు చేరాం . అందరూ ఆదిత్యారామ్ పార్థివ దేహాన్ని చూసే వీలు కల్పించి అంతిమ దర్శనం కలిగించారు వాళ్ళ కుటుంబం తోపాటు సుమారు 100 మంది హాజరయ్యారు . రామ్ వాళ్ళు బెంగుళూరు కు తెలుగు కుటుంబం .ఇక్కడ ఈ ఇంట్లోకి వచ్చి మూడేళ్లే అయింది . మంచి స్థితిపరులు .దంపతులిద్దరికీ మంచి పేరు ప్రతిష్టలున్నాయి ఆయనతో దాదాపు 30 ఏళ్ళ అనుబంధం ఉన్న ఒక మిత్రుడు ,15 ఏళ్ళ మిత్రత్వం ఉన్న మరో మిత్రుడు ఇక్కడి అమెరికన్ మిత్రులు స్నేహితులు ఆదిత్య గురించి మనసువిప్పి చెప్పారు భార్య కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ,చెప్పలేక చెప్పలేక నాలుగు మాటలు చెప్పింది.  కొడుకు చిన్నవాడే అయినా సందర్భాలని బట్టి పెద్ద వాడై హుందాగా ప్రవర్తించాడు .అయిదుసార్లు అమెరికా వచ్చిన నాకు ఇదే మొదటి సారి ఇలాంటి దానిలో పాల్గొనటం .ఇదంతా అయ్యేసరికి మధ్యాహ్నం 3-15 అయింది .సాయంత్రం 4-30 కు అక్కడే ఉన్న విద్యుత్ శ్మశాన వాటికలో దహనం .నన్ను సురేఖను సునీత భర్త మధ్యాహ్నం 3-30 కు మా ఇళ్లకుకారులో తీసుకొచ్చాడు .రాగానే బట్టలు తడిపి ష్ణానం చేసి విభూతి పెట్టుకొన్నాను .

  ఆదివారం నుండి ఈకమ్యూనిటీలోని ఆడవాళ్లు మగవాళ్ళుఅందరూ ద్యూటీలు వేసుకొని ఇంటిదగ్గరా హాస్పిటల్ లోనూ ఆకుటుంబానికి అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు .మా అమ్మాయి అందరికి కో ఆర్డినేట్ చేసింది . ఆఫీస్ నుంచి రాగానే కాఫీ టీ పెట్టి ఫ్లాస్క్ లలో వాళ్ళ ఇంటికి తీసుకు వెళ్లి ఇచ్చి వచ్చేది . మానవత్వం పరిమళించటం అంటే ఇదే .

 గురువారం పవన్ రాధా వచ్చి వ్రతానికి ,భోజనానికి పిలిచారు మర్యాద పూర్వకంగా . మా మనవడు  అశుతోష్ కు కాలి  బొటనవ్రేలు కు దెబ్బతగిలితే .మా అమ్మాయి ఆఫీస్ నుంచి రాగానే దగ్గరలో ఉన్న పీడియాట్రిక్స్ కు తీసుకు వెళ్లాం . ఎక్స్ రే తీశారుకాని రేడియాలజిస్ట్ లేకపోవటం తో మర్నాడు రమ్మన్నారు . నేను హోమియో అందు ఆర్నికా, రూస్టక్స్ వేశాను రాత్రికి ఉపశమనం కలిగి నిద్ర బాగానే పోయాడు శుక్రవారం బడికి వెళ్ళాడు కూడా .

 శుక్రవారం అన్నదమ్ములిద్దరూ స్కూల్ కు వెళ్లారు . శ్రీ ఎల్లాప్రగడ రామ మోహనరావు గారికి ఫోన్ చేసి శనివారం సాయంత్రం బయల్దేరి కారీ వస్తున్నట్లు తెలియ జేశాను . చాలా ఆనంద పడ్డారు . మైనేనిగారికీ మామనవాడు హరికీ కూడా చెప్పాం .గీర్వాణం -3 లో 450 వరకు రాశా . శ్రీ చలపాక ప్రకాష్ ఆన్ లైన్ లో పంపిన1-100 పేజీల  ఆధుని ప్రపంచ నిర్మాతలు డిటిపి లో  తప్పులు దిద్ది వెంటనే ఆ లిస్ట్ ప్రకాష్ గారికి పంపాను .మైనేని గారినీ దిద్దమని చెప్పి ఆ లిస్ట్ కూడా ప్రకాష్ కు పంపి సరి చేయమని ఫోన్ చేసి చెప్పా .

   సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-9-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

 


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 446-మధ్య ప్రదేశ్ రాష్ట్ర   గీర్వాణ భాషాసేవ (20 వ శతాబ్దం )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

446-మధ్య ప్రదేశ్ రాష్ట్ర   గీర్వాణ భాషాసేవ (20 వ శతాబ్దం )

మధ్యప్రదేశ్ లో డా కైలాష్ నాధ్ కట్జూ తర్వాత1957 లో  ముఖ్యమంత్రి అయినపండిట్ రవి శంకర్ శుక్లా హయ్యర్ సెకండరీ స్కూల్స్  లో సంస్కృతభాషను కంపల్సరీ చేశాడు  .డిగ్రీ ,పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలలో సంస్కృతం అభ్యసించేవారికి సదుపాయాలూ ప్రోత్సాహకాలు రెట్టింపు చేశాడు .ముఖ్యమంత్రి అధ్యక్షతన ఒక బోర్డు ను ఏర్పరచి సంస్కృత వ్యాప్తికి కృషి చేశాడు .ఆర్ధికమంత్రి విద్యామంత్రి నాలుగు యూనివర్సిటీ ల వైస్ చాన్సలర్లు  సంస్కృతకాలేజి ప్రిన్సిపాల్, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ ,విద్యా సెక్రెటరీ ,ప్రభుత్వ సెక్రెటరీ దీనిలో సభ్యులు .ఈ బోర్డు సూచనలను తక్షణమే అమలు జరిపాడు . 87 శాతం హయ్యర్ సెకండరీ పాఠశాలలో సంస్కృత ఉపాధ్యాయులను నియమించాడు .అదనంగా డిగ్రీ ,పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజీలలో సంస్కృతాన్ని ప్రవేశపెట్టాడు .ఆకర్ష వంతమైన జీత భత్యాలు ఏర్పాటు చేశాడు .సంస్కృత విద్యార్థులకు స్కాలర్షిప్ లు ,ప్రోత్సాహకాలు కల్పించాడు .సంస్కృత నాటకాలను విద్యార్థులతో ఆడించాలని ఉత్తర్వులు జారీ చేశాడు ముఖ్యమంత్రి రవి శంకర్ శుక్లా .

                 కాళిదాస్ సమారోహ్

1958 నవంబర్ 20 న  మధ్యప్రదేశ్ ప్రభుత్వం ‘’కాళిదాస్ సమారోహ్ ‘’ను ఉజ్జయిని లో ఏర్పరచి భారత ప్రధమ రాష్ట్రపతి డా రాజేంద్ర ప్రసాద్ చేత ఆవిష్కరింపజేసి వారం రోజులపాటు ఉత్సవాలు నిర్వహించారు .భారత దేశం లో ఇది మొట్టమొదటి అత్యంత ప్రధాన సాంస్కృతిక ఉత్సవంగా పరిగణింప బడింది .భారత దేశం లోని అనేక ప్రముఖులు ,రష్యా జపాన్ చైనా ఇరాన్ ,జర్మన్ విద్యా బృందాలు అత్యుత్సాహంగా పాల్గొని దిగ్విజయం చేకూర్చాయి  .విక్రమ్ విశ్వ విద్యాలయసంస్కృత ప్రొఫెసర్  ఆధ్వర్యం లో  సెమినార్   నిర్వహిస్తే ,ఇటలీ లోని ట్యూరిన్ సంస్కృత విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ డా మేరియో వల్లూరి ,పశ్చిమ జర్మనీ మ్యూనిచ్ విశ్వవిద్యాలయ సంస్కృత ప్రొఫెసర్ డా. గుస్టేవ్  రోత్ ముఖ్యఅతిథులుగా పాల్గొని కాళిదాసు పై సెమినార్ పత్రాలు రాసి చదివారు .నాట్య సమారోహం ,శిల్ప చిత్ర ప్రదర్శన బాగా ఆకట్టుకొన్నాయి .మద్రాస్ యూనివర్సిటీ సంస్కృత ప్రొఫెసర్ వ్.రాఘవన్ ,కలకత్తా యుని వర్సిటీ ప్రభుత్వ సంస్కృతకాలే జ్ ప్రిన్సిపాల్ డా.గౌరీ నాథ శాస్త్రి ‘’మాళవికాగ్నిమిత్రం’’అభిజ్ఞాన శాకుంతలం తాము నటిస్తూ దర్శకత్వం చేస్తూ  ‘’నాటకాలు  ప్రదర్శించారు . 1957 లో చైనాలోని పెకింగ్ లో శకుంతల నాటకం ను డైరెక్ట్ చేసి ప్రదర్శించిన డబ్ల్యు .షుజ్ కూడా పాల్గొన్నాడు . ఈ కార్యక్రమమం అంతర్జాతీయంగా బ్రిటిష్ ఓరియెంటలిస్ట్ డా ఏ ఎల్ భాషం,జపాన్ కోట్యో బుద్ధిష్ట్ యూనివర్సిటీప్రొఫెసర్ హీమో కుమరా,వెస్ట్ జర్మనీ కి చెందిన పాల్ ధీమ్ ,వాల్టర్ లీఫెల్ వంటి ప్రముఖులతో పాటు      అందర్నీ ఆకర్షించి సంస్కృతం పై అభిమానం పెంచింది . .అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ ఉత్సవం నిర్వహిస్తున్నారు .

     కాళిదాస్ అకాడెమి

ఉజ్జయినిలో 1977 లో కాళిదాస అకాడెమీ ఏర్పాటు చేశారు .ఏదో కంటి తుడుపుగా ఆ మహాకవి పేరు మీద ఏర్పాటు చేయటం కాదు సంస్కృత భాషను  సంస్కృతీ సంప్రదాయాలను సజీవంగా నిలబెట్టటానికి పూర్వ వైభవం సంతరించటానికి ఏర్పడిన సంస్థ .విక్రమ్ కీర్తిమందిరం పురాతన వస్తు ప్రదర్శన శాల ఏర్పాటైంది  .ఈ రెండు సంస్థలు ,విక్రమ్ యుని వర్సిటీ కలిసి ప్రభుత్వ ఆధ్వర్యం లో ఎన్నో కార్యక్రమాలు రూపొందించి నిర్వహిస్తున్నాయి .ఇతర దేశ నాటక సమాజాలను ఆహ్వానించి ప్రదర్శనలిపీస్తున్నారు ప్రతి సంవత్సరం దేశం లోని సంస్కృత విద్యావేత్తలు ఆహ్వానించి ప్రసంగాలు ఏర్పాటు చేసి వారి సృజనకు ‘’కాళిదాస సమ్మాన్ ‘’ పురస్కారం అందిస్తున్నారు .మన కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు ఈ పురస్కారం అందుకొన్నారు . .

      మధ్య ప్రదేశ్ సంస్కృత అకాడెమి

1985 లో మధ్యప్రదేశ్ సంస్కృత అకాడెమి ఏర్పడింది . సామాన్యప్రజలకు సంస్కృతాన్ని దగ్గరకు తెచ్చింది .సృజనాత్మక రచనలను ప్రోత్సహించి ఘనమైన నగదు బహుమతులను ఇస్తోంది .యువతకు అవసరమైన సంస్కృత జ్ఞానాన్ని అందిస్తోంది

   సంస్కృత సాహిత్య సృజన

 సాగర్ యుని వర్సిటీ సంస్కృత ప్రొఫెసర్ డా రాధావల్లభత్రిపాఠీ గొప్ప సంస్కృతకవి విద్యావేత్త .ఇరవయ్యవ శతాబ్ది ఆధునిక సంస్కృతం లో మంచి ప్రవేశం ఉన్నవాడు .ఆధునిక విధానం లో సంస్కృతం నేర్పే అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాడు .పండిత ఉర్వీ దత్త శాస్త్రి ‘’సుల్తాన్ జహాన్ వినోద  మహాకావ్యం ను 2 వేల శ్లోకాలతో 1935 లో భోపాల్ లో రాశాడు .జబల్ పూర్ కు చెందిన డా రహస విహార్ ద్వివేదీ,ఇండోర్ వాసి శ్రీపాద శాస్త్రి హసుర్ఖ ర్   (1888-1974 ) ఉజ్జయిని విక్రమ్ యుని వర్సిటీ సంస్కృత శాఖాధ్యక్షుడు డా కె యెన్ జోషి ,వంటివారెందరో సృజన రచనలతో సంస్కృత సాహిత్యాన్ని రసప్లాఅవితం చేశారు .

447-త్రిపుర కాంగ్రెస్ స్వాగతానంద కల్లోలహ్కావ్య కర్త -పండిట్ లోకనాథ శాస్త్రి (20 వ శతాబ్దం )

 మధ్యప్రదేశ్ జబల్పూర్ కు చెందిన పండిత లోకనాథ శాస్త్రి భారత దేశ సమకాలీన రాజకీయాలపై ‘’త్రిపుర కాంగ్రెస్ స్వాగతానంద కల్లోలహ్ ‘’అనే సంస్కృత కావ్యం రాశాడు . ఇదికాక అనేక భక్తి అష్టకాలు రచించాడు

  ఇండోర్ కు చెందిన పండిట్ గజానన రామచంద్ర కల్మార్కర్  100 కు పైగా సంస్కృత రచనలు చేశాడు .ఆయన కవిత్వం జాతీయభావాలకు ఆటపట్టు .మధుర మంజుల కవిత్వం ఆయన సొత్తు

  సాగర్ వాసి ,ప్రస్తుత వారణాసి నివాసి డా.రామాజీ ఉపాధ్యాయ వచన సంస్కృతం బాగా రాశాడు .’’ద్వా సుపర్ణ ‘’రచనలో శ్రీ కృష్ణ సుదాముల మైత్రిని గొప్పగా వర్ణించాడు .ఇందులో గాంధీ గారి జీన జనోద్ధరణ  గ్రామ వికాసం ,చేతిపనుల పునర్వైభవం రంగరించాడు.

448-గాంధీ శత శ్లోకి కర్త -పండిత గణపతి శుక్ల (20 వ శతాబ్దం )

మధ్య ప్రదేశ్ ఉత్తర నిర్మార్ జిల్లా ఖర్గాన్ కు చెందిన పండిత గణపతి శుక్లా ‘’కధామృతం ‘’అనే చిన్నకధలను ,చిన్నపిల్లలకు సరళమైన కవిత్వాన్నీ సంస్కృతం లో రాశాడు  స్వాతంత్య్ర ఉద్యమప్రభావం తో గాంధీ మహాత్మునిపై ‘’గాంధీ శత శ్లోకి ‘’రాశాడు .’’భూదాన యజ్ఞ గాధ ‘’కూడా రచించాడు .

449-రామ వన గమనం నాటక కర్త -శ్రీమతి డా వనమాలా భావల్కర్ (20 వ శతాబ్దం )

మధ్యప్రదేశ్ లోని సాగర్ ,ఉజ్జయిని ,నాగపూర్ యుని వర్సిటీలలో సంస్కృత ప్రొఫెసర్ శ్రీమతి వనమాలా భావల్కర్ సంస్కృత నాటకాలు కవితలు రాసింది .అందులో ‘’రామ వన గమనం ‘’నాటకం ప్రసిద్ధమైనది .ఇదికాక ‘’పార్వతీ పరమేశ్వరీయం ,‘’పాద దంద’’లలో ఆమె కవిత్వం పరవళ్లు తొక్కింది .సంగీతానికి అనువుగా ఉండటం తో శ్రవణ సుభగంగా ఉంటాయి ఆమె కవితలు .

449-అజాత శత్రు నవలాకారుడు -డా శ్రీనాథ శాస్త్రి (20 వ శతాబ్దం )

మధ్యప్రదేశ్ ఇండోర్ కు చెందిన డా శ్రీపాద శాస్త్రి హాసూర్ఖార్ కుమారుడే శ్రీనాథ  శాస్త్రి .ఉద్యోగ విరమణ తర్వాత ఆయనలోని సంస్కృత సాహిత్యం కట్టలు తెంచుకొని ప్రవహించింది .జాతీయ భావాలతో గొప్పనవలలు రాశాడు అందులో ‘’అజాత శత్రు ‘’,ప్రతిజ్ఞాపూర్తి ‘’,సింధుకన్య ‘’,దావానలః ,చెన్నమ్మ నవలలు విశేష ప్రాచుర్యం పొందాయి .సింధుకన్య నవలకు సాహిత్య అకాడెమి పురస్కారం లభించింది .దీనికే మధ్యప్రదేశ్ సాహిత్య అకాడెమి  భోపాల్ ఉత్తరప్రదేశ్ సంస్కృత సంస్థాన్ లు శాస్త్రి సృజనాత్మక సంస్కృత ప్రతిభను మెచ్చి అవార్డు లను అందించి గౌరవించాయి .

450-అనేక సంస్కృత రచనలు చేసిన పండిట్ సుధాకర శుక్ల (1913 -1985)

పండిట్ సుధాకర్ శుక్లా మధ్య ప్రదేశ్ లో 1913 లో జన్మించి 19 85 లో మరణించాడు.ధైతీ య లో స్థిరపడ్డాడు . అనేక కాండల సంస్కృత మహా కావ్యాలు, దీర్ఘ కవితలు రాశాడు . నాటకాలు కవితలూ కూడా రచించాడు .రాష్ట్రం లోను దేశమంతటా పేరు ప్రఖ్యాతులు పొందాడు అనేక బిరుదులూ ,పురస్కారాలు గౌరవ డాక్టరేట్ లు లభించాయి .గ్వాలియర్ జివ్వాజి యుని వర్సిటీ ఆయనంకు గౌరవ డాక్టరేట్ ఇచ్చి ఘనంగా సన్మానించింది . ఇంత ప్రసిద్ధుడైన ఈ కవి గురించి పూర్తి సమాచారం లభించకపోవటం దురదృష్టం .

  సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-9-17 -కాంప్-షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

తెనాలివారి ‘’బాపు రస రేఖ ‘’ 31-8-17 బాపు వర్ధంతి

తెనాలివారి ‘’బాపు రస రేఖ   ‘’

గుంటూరు జిల్లా తెనాలిలోని బాపు అభిమానులుశ్రీ రవి కృష్ణ గారి ఆధ్వర్యం లో బాపు రమణలను  తెనాలిలో సన్మానించాలనుకొని ఆహ్వానించటం మొహమాటంగా ఇద్దరూ ఒప్పుకోవటం , బాపుగారి పై ప్రత్యేక  పుస్తకం తేవాలనే సంకల్పం ,శ్రీ గిరిధర్ గారిచే బాపు చిత్రం వేయి౦చాలనుకోవటం ,అయన ఒప్పుకొని వేసివ్వటం ,ఆయన తన అభిమాన చిత్రకారులని ,మంచి స్టడీ చేస్తారని బాపు చెప్పటం 2013లో చకచకా జరిగిపోయాయి ..కానికార్యక్రమం కార్య రూపం పొందకుండా ముందు రమణ ఆ వెంటనే రెండేళ్లకు బాపు మనల్ని వీడి వెళ్ళిపోయారు .కాని పట్టువదలని విక్రమార్కులైన తెనాలివారు ఆ ఇద్దరూ లేకుండానే పుస్తకాన్ని తేవాల్సి వచ్చి  తెచ్చి 2015 జూన్ లో మనసులోని కోరిక ‘’ బాపు ‘’అనేపేరుతో ఆయన ముఖ చిత్రం తో  తీర్చుకొన్నారు ..శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు అష్టవిధ నాయికలపై రాసిన పద్యాలకు బాపు వేసిన బొమ్మలూ చేర్చి ప్రచురించారు .దీనికి పూర్తీ సహకారం శ్రీ రమణ అంద జేశారు .బాపు శిష్యులైన చిత్రకారులు మోహన్, చంద్ర మొదలైనవారు ,భరణి వంటి రాయసగాళ్ళు బాపుపై తమ అభిప్రాయాలను పొందుపరచారు .శ్రీరమణ తానదైన శైలిలో ఎన్నో విషయాలు గుది గుచ్చి తెలియ జేశారు .పుస్తకం అందంగా సర్వాంగ సుందరం గా వెలువడింది .బాపు కి ఉన్న అభిరుచులు ,ఇష్టాలు ,అయిస్టాలు ,అభిప్రాయాలు అన్నీ ఇందులో పొందు పరచారు .ఒక రకంగా ఇది ‘’బాపు గీతోపనిషత్ ‘’.అయింది .అందులోని మేలిమి సారాంశాన్ని అంటే ఎసెన్స్ ను అనగా సారాన్ని  నేను మీకు ‘’తెనాలివారి  బాపు రస రేఖ ” ‘’గా అందజేస్తున్నాను .పుస్తకం చదవనివారికి ఇది ఉపశమనం కలిగిస్తు౦దని ఆశ .ఇందులో తెలిసినవిషయాలు, తెలియనివి, తెలుసుకో దగ్గవి, తెలియాల్సినవి ఎన్నో ఉన్నాయి .ఈ ‘’బాపు ‘’ను నాకు పంపించమని  మా ఆత్మీయులు అమెరికాలో ఉంటున్న శ్రీ మైనేని గోపాల కృష్ణగారు తెనాలి లో ఉన్న తమ గురువు, స్నేహితులు, మార్గ దర్శి, మెంటార్ అయిన శ్రీ కోగంటి సుబ్బారావు గారి అబ్బాయి శ్రీ శివ ప్రసాద్ గారికి ఫోన్ చేసి చెప్పగా ఆయన పంపితే నాకు సుమారు నెలక్రితం చేరింది..దీనికి పైవారందరికి కృతజ్ఞతలు .దీనిని ఇవాళే చదివాను.

బాపుగారి భార్యతెనాలికి చెందిన  ప్రఖ్యాత నాటక సినిమా నటులు ,డాక్టర్ స్వర్గీయ గోవిందరాజుల సుబ్బారాగారి కుమార్తె .అంటే బాపు తెనాలి వారి అల్లుడన్నమాట శ్రీ .సి నా రే ‘’సుదర్శనం ‘’పేరుతొ రాసిన కవిత లో ‘’పాపలాంటి పసినవ్వు చిలికే బాపు వెనక –ఓ కొంటె మేధావి ఉన్నాడని కొందరికే తెలుసు ‘’అంటూ మొదలుపెట్టి ‘’బాపు బొమ్మలునిరాడంబరంగా ఉన్నా  గుండెల వెనక ఉన్న స్వాభిమానా లకు చురకలు పెడతాయి.’’అన్నారు .’’బాపులో ఒక దార్శనికుడు, దర్శకుడు  ఉన్నాడు .ఒక్కొక్కబోమ్మా ఓ రంగుల మినీ కవిత ‘’అని శ్లాఘించారు .’’అన్ని అంచులున్న సుదర్శనం బాపు .బాపును  వరించిన’’ డాక్టరేట్ ‘’తరించింది ‘’అని కొత్తకోణం లో చెప్పారు .

బాపు రమణనలను నాలుగు దశాబ్దాలుగా సునిశితంగా తరచి చూసిన అంతేవాసి శ్రీరమణ ‘బాపు నిగర్వి కాని బాపు గర్వం రమణ ‘’అని రాశాడు .ఆంద్ర జ్యోతిలో శ్రీ రమణ పని చేస్తున్నప్పుడు విజయవాడవచ్చిన బాపు ఆఫీసుకు వెళ్లి శ్రీరమణ తో ‘’నన్ను బాపు అంటారండి .నా కార్టూన్లు ఒక సంపుటిగా రా బోతోంది .మీరు ముందుమాట రాస్తే సంతోషిస్తాను .అది అడగటానికే వచ్చాను ‘’అని మాడెస్ట్ గా అంటే కుంచించుకు పోయాడు శ్రీ రమణ .నాలుగు రోజుల్లో ‘’నానృషి’.కృతే కార్టూన్ ‘’అని రాశాడు .ఒక ఏడాదికే మద్రాస్ చేరి బాపు రమణ కుటుంబ సభ్యుడైపోయాడు .’

’సీతాకల్యాణం ‘’చికాగో ఫిలిం ఫెస్టివల్ కి ఎంపికై అక్కడ వారి ఆహ్వానం పై మొదటి సారి విదేశీ ప్రయాణానికి మద్రాస్ ఎయిర్ పోర్ట్ కు వెళ్ళాడు బాపు .అందరు వీడ్కోలు చెప్పటం పూర్తీ అయింది .ఇక బాపు లోపలి వెళ్లిపోవాలి .ముందుకు వెళ్ళబోయి బాపు వెనక్కి నాలుగు అడుగులు వేసి నోటి దగ్గర కర్చీఫ్ పెట్టుకొని నిలబడ్డ రమణ దగ్గరకు వెళ్లి అమాంతం పాదాభి వందనం చేసి తల వంచుకొని వెళ్ళిపోయాడు .దీనిపై శ్రీరమణ’’వారిద్దరి మధ్యా ఉన్నది చనువుకాదు .గౌరవం ఉన్నప్పుడే స్నేహమైనా ,బంధమైనా పదిలంగా ఉంటుంది అని రమణ అనేవాడు అని చెప్పాడు .’’బాపు –పైపు వీరుడు ‘’అని అందరికి తెలుసు .ఆయన దగ్గర వెయ్యిదాకా రకరకాల పైపులు ఉండేవి .’’ఈజన్ బర్గ్ అనే ఆయన కు బాపు  బొమ్మలన్నా బాపు-రమణలు  అన్నా చాలా ఇష్టం . ఫోర్డ్ ఫౌండేషన్ తరఫున దక్షిణ భారతం లో పుస్తక ప్రచురణ ని, చదివే అలవాటునీ పెంపొందించటానికి ఆయన వచ్చాడు .ఆ రోజుల్లో ఎమెస్కో వారి ‘’ఇంటింటా గ్రంధాలయపధకం ‘’ఇలా వచ్చిందే .అప్పటికే బాపు గొప్ప డైరెక్టర్ .. .బాపు’’ తీసే సినిమాలలో ఎక్కడైనా ఒక చోట ఫ్రేములో కనిపించేట్లు నాలుగు పుస్తకాలు పెట్టు ‘’అని సలహా ఇచ్చాడు దాన్ని పాటించి సలహాకు విలువనిచ్చాడు బాపు .బాపు మౌత్ ఆర్గాన్ ఘనాపాఠీ.ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఆర్కెస్ట్రాలో వాయించేవాడు .అయితే ఒక రోజు ఒక పాట రికార్డ్ చేస్తుంటే ‘’అచ్చు ఇదే ట్యూన్ రాత్రి రేడియో లో విన్నానండీ ‘’అన్నాడు మ్యూ జిక్ డైరెక్టర్ తో .అంతే మళ్ళీ అవకాశం రాలేదట .

‘’బాపు త్రాచుపాము . నేను వానపాము ‘’అని రమణ చెప్పేవాడట .తనకేమీరాదు నేర్చుకోవాలి అని రోజుకి ఇరవై గంటలు పనిచేసేవాడు బాపు .తానెక్కడా ఎవరిదగ్గరా చిత్రకళను నేర్చు కోలేక పోయాననే దుగ్ధ ఉండేది .అందుకే తగిన స్థాయికి రాలేక పోయానని అనుకొనేవాడు .అందుకే’’ బాపు స్కూల్ ‘’అవతరించిన్దిసార్ అని శ్రీ రమణ అంటే చిరాకు పడేవాడు బాపు .’’నాలోలోపం నాకు తెలుసు .మీకు తెలుసా ?’’అని గద్దించేవాడు .ప్రసిద్ధ చిత్రకారుల చిత్రాల్ని విశ్లేషణాత్మకంగా వివరి౦చే వాడు .బాపుకు పిలకా నరసింహ మూర్తి చిత్రించే రంగులు ,రూపాలు అంటే ఇష్టం .అందుకే సీతాకల్యాణం సినిమా లో  పిలకా వారి చేత బాల సీత చూసే దశావతారాలు వేయించాడు .బులెట్ సినిమాలో ‘మా తెలుగు తల్లికి ‘’పాటచిత్రీకరణ కోసం తెలుగు దనాలను ఆయనతోనే వేయించిన కళాభిమాని .మొక్కపాటి కృష్ణమూర్తి చిత్రాలు దర్పంగా ఉంటాయని మెచ్చేవాడు .బాపు హిందుస్తానీ, రమణ కర్నాటక సంగీతానికి చెవులు కోసుకొనేవారు .  .చాలా ఏళ్ళ క్రితం డాక్టర్ సమరం మానవ మనస్తత్వాలపై ఒక పత్రికలో వ్యాసం రాస్తూ ‘’ప్రాణానికి ప్రాణం గా ఉన్న బాపు –రమణ లలో ఒకరు చనిపోతే మరొకరు ఎలా జీవిస్తారు ?’’అనే అంశాన్ని ప్రస్తావించాడు .చాలామంది అభిమానులు సమరం పై సమార భేరి మోగించారు .

బాపు –చాలా సంగతులు రమణ కళ్ళతో చూస్తాడు ఆయన చెవులతో వింటాడు .బాపుని అర్ధం చేసుకోవటం అందరివల్లా కాదు .రమణ ఒక్కడే బాపుకు వెయ్యిమందిపెట్టు .ఫెయిల్యూర్ తో పేచీ పెట్టుకొని దాన్ని ఓడించే శక్తి రమణ కు ఉంది .ఆ గెలుపు లో మూడు వంతులవాటా బాపు కిస్తాడు .పొరుగు రాష్ట్రాలలో ఉంటె ‘’వెంకట్రావ్ ఎలా ఉన్నావ్ ?’’అని రమణకు ఫోన్ చేసే అలవాటు బాపుది..రమణ అసలుపేరు వెంకట్రావ్.’’రమణ బావుంటే అందరూ బావున్నట్టే ‘’అనేవాడు బాపు .ఒక అక్షరం కాని గీతకాని రమణ కు చూపించకుండా బయటికి పంపేవాడు కాదు .రమణ పోయిన తర్వాత’’ గీతాధ్యానం’’ లో ఉంటూ కూడా తెరచి ఉన్న తలుపు వైపుకు మధ్య మధ్యరమణ వస్తున్నాడే మో నని చూసేవాడు  . ‘’రమణ ఇక రాడు కదా అనే నిష్టుర సత్యం బాపు మనస్సులో కలుక్కు మంటుంది’’.ముందే చెప్పినట్లు’’ బాపు నిగర్వి .కాని బాపు గర్వం రమణ .రమణ నిగర్వి కాని ఆయన గర్వం బాపు ‘’.బాపుకు డబ్బు ఖర్చు చేయటం తెలియదు .రమణ మనసుతో రమణ చేతులతో ఉదారంగా ఖర్చు చేస్తాడు బాపు .రమణ దివ్య స్మృతికి ఒక పుస్తకం అంకితమిస్తూ ‘’నను గోడలేని చిత్తరువును చేసి వెళ్లి పోయిన నా వెంకట్రావు కోటి కోట్ల జ్ఞాపకాలకు ‘’అని మనసు పొరల్లోంచి వచ్చిన మాట రాశాడు బాపు అని శ్రీ రమణ చెప్పాడు .

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -7-10-15 -ఉయ్యూరు

Inline image 1Inline image 2Inline image 3

Inline image 4Inline image 5

31-8-17 బాపు వర్ధంతి సందర్భోచితంగా పై వ్యాసం మీకోసం -దుర్గాప్రసాద్ -షార్లెట్-అమెరికా -31-8-17

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 445-సంస్కృతం లో క్రైస్తవ సాహిత్యం -(1808-1978)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

445-సంస్కృతం లో క్రైస్తవ సాహిత్యం -(1808-1978)

1808 లోనే  బైబిల్ కు  సంస్కృత అనువాదం ప్రారంభమైంది .1843లో కలకత్తా బాప్టిస్ట్ మిషన్ హీబ్రూ భాషలోని బైబిల్ ను సంస్కృతం లోకి అనువదించి ముద్రించింది . కలకత్తాలోని సేరమ్ పూర్ లో విలియం కారీ  మూల గ్రీకు భాషలోని న్యూ టెస్టమెంట్ ,లార్డ్ అండ్ సేవియర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ లనుమూడు భాగాలుగా  సంస్కృతం లోకి అనువదించాడు . వీటి ముద్రణకు మూడేళ్లు పట్టి మూడవది 1811లో విడుదలైంది . 1821 లో మళ్ళీ న్యూ అండ్ ఓల్డ్ టెస్టమెంట్ లు సంస్కృతానువాదం పొందాయి .1843లో హీబ్రూ భాషలోని ‘’బుక్ ఆఫ్ జెనెసిస్ ‘’ను సంస్కృతం లోకిఅనువాదం చేసి  బాప్టిస్ట్ మిషన్ ముద్రించింది .కలకత్తా స్కూల్ బుక్ సొసైటీ ,బాప్టిస్ట్ మిషన్ ‘’సాల్మన్ సామెతలు ‘’ను సంస్కృతీకరించి1842,1846 లలో తెచ్చింది     1845 లో కలకత్తా బాప్టిస్ట్ మిషన్  ప్రెస్’’ప్రాఫిట్ ఐసయ్య ‘’ను సంస్కృతం లో తర్జుమా చేసి ప్రచురించింది . 1860 లో లండన్ లోని జె ఆర్ బాలన్ టైన్ సంస్కృతం ,ఇంగ్లిష్ లలో బైబిల్ వ్యాఖ్యానం రాశాడు  .ఆ తర్వాత నుంచి వరుసగా సంస్కృత అనువాదాలు వస్తూనే ఉన్నాయి .బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా1962లో  న్యూ టెస్టమెంట్ ను ‘’’’ప్రభున యేసు క్రీస్తేన నిరూపితస్య నియమస్య  గ్రంథ స0గ్రహః ‘’గా సంస్కృతాను వాదం తెచ్చింది . 1878లో న లుగురు క్రిస్టియన్ ఎవాంజలిస్ట్ ల ‘’గాస్పెల్స్ ‘’ను ఒకే పుస్తకంగా ‘’క్రైస్త చరితం -అర్హతో మతి -మార్క -లూకా -యోహానైర్  విరచితం సు సంవాద చతుష్టయం ‘’గా కలకత్తా బాప్టిస్ట్ మిషన్ ముద్రించింది .తరువాత ఒక్కొక్కరి గాస్పెల్స్ కు సంస్కృతానువాదం విడివిడిగా తెచ్చింది . అవే ‘’మార్క లిఖిత సు సంవాదం ‘’,’’సత్య ధర్మ శాస్త్రం ‘’,యేసు క్రీస్టియ చరిత దర్పణం 1878 ,1884లలో వచ్చాయి .1878 లో ‘’లూకా లిఖిత సు సంవాదః ‘’వస్తే  బెంగళూర్ నుంచి ‘’యోహాను లిఖిత సంవాదః ‘’వచ్చింది .

  1928 లో ఢిల్లీ లోని లక్ష్మీధర శాస్త్రి’’సె ర్మన్ ఆన్ ది మౌంట్ ‘’ను సంస్కృతీకరించి ప్ర చురించాడు .దీనికి మళ్ళీ మూడు స్వేచ్చా సంస్కృతానువాదాలు వచ్చాయి .అనువాదా లేకాకుండా సృజనాత్మక క్రైస్తవ సంస్కృత సాహిత్యం కూడా 19 ,20 శతాబ్దాలలో విస్తృతంగా వచ్చింది .ఈశ్వరోక్త శాస్త్ర ధార’’,పరమ స్తవ ‘’క్రీస్తు ధర్మ కౌముది ‘’,’’క్రీస్తు ధర్మ కౌముది సమాలోచనం ‘’వంటివి సంస్కృతం లో డజనుకు పైగా రచింపబడ్డాయి .

  1977 లో  కేరళకు చెందిన సంస్కృత విద్యావేత్త మహాకవి పి. సి  దేవాస్సియా ‘’క్రీస్తుభాగవత మహాకావ్యం ‘’33 కాండలలో ,1600 శ్లోకాలతో 433పేజీలలో రాసి అకాడెమీ బహుమతిని అందుకున్నాడు . ఈవిధం గా క్రైస్తవ సాహిత్యమూ గీర్వాణ గౌరవాన్ని పొంది సముచిత స్థానం సంపాదించుకున్నది .

   సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -31-8-17 -కాంప్-షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 444-క్రీస్తు భాగవత మహాకావ్య కర్త -పి. సి . దేవాస్సియా -(1906-2006 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

444-క్రీస్తు భాగవత మహాకావ్య కర్త -పి. సి . దేవాస్సియా -(1906-2006 )

కేరళకు చెందిన సంస్కృత కవి ,మహా విద్వా0సుడు పి. సి . దేవాస్సియా 1906 లో జన్మించి నూరేళ్ళ నిండుజీవితం గడిపి2006 లో మరణించాడు .ఆయన రచించిన క్రీస్తు భాగవత మహాకావ్యం బహు ప్రశస్తి చెంది ఎన్నో పురస్కారాలను అందించింది .ఇది 1976 లో రాస్తే 1977 లో ప్రచురితమైంది . 33 కాండలలో 1600 శ్లోకాలతో 433 పేజీల  కావ్యం ఇది .సంస్కృత మహాకావ్య లక్షణాలన్నీ ఉన్నకావ్యం . 33 కాండాలు యేసు క్రీస్తు జీవించిన 33 ఏళ్లకు ప్రతీక కావచ్చు .ప్రతి సంస్కృత శ్లోకం తర్వాత ఇంగ్లిష్ అనువాదం కూడా ఉండటం ప్రత్యేకత . మూడు పేజీల ఉపోద్ఘాతం లో కవి ఈ రచనకు ఐదేళ్లు పట్టిందని తెలిపాడు .బైబిల్ ను ఏదో ఆషామాషీగా సంస్కృతం లోకి మార్చటం తనఉద్దేశ్యంకాదని మహా కావ్యంగా దాన్ని మలచటమేధ్యేయమని కవి చెప్పుకొన్నాడు . దీనికి వి రాఘవన్ ముందుమాటలు వ్యాఖ్యానం రాస్తే ,కుంజున్నిరాజా ప్రశంసా వాక్యాలు రాసి కావ్య గౌరవం కల్గించారు K. R. Srinivasa Iyengar wrote that “The Gospel-story is retained in essentials, but…

…the sonority of Sanskrit gives a fresh morning splendour and resonance to Jesus’ divine ministry. Mary held Joseph’s hand as Arundhati did Vasishtha‘s; Just as Vasudeva hid his son Krishna in Nanda‘s house, so did Joseph take Jesus to Egypt for his safety; Lazarus‘ sisters embraced him as he emerged out of his tomb, even as Devayani embraced Kacha as he revived after death…. in betraying Jesus with a kiss, wasn’t Judas anticipating Godse who was to kill the Mahatma after first saluting him? The similes come naturally, and rather bring out the basic unity of texture that binds all human history.[3]:xvii

అని మెచ్చాడు

ఈ కావ్యానికి 1979 లో మహారాణి సేతు పార్వతీబాయి అవార్డువచ్చింది  ,. 1980 లో సంస్కృత రచనకు దేవాస్సియా కు సాహిత్య అకాడెమి పురస్కారం ఇచ్చింది .

 ఈ కావ్య శ్లోక శోభచూద్దాం

‘’భిక్షా త్వయ దక్షి జహాస్ట దత్తా నా జీవియాత్రాహ్ వామకరైజ తేస -ధన్యస్య చైవం నిభృతాం కృతస్య పితా ఫలం దాశ్యతి గుప్తా దర్శి’’-

‘’యువ0 మా సై కి నూత  నిధిమ్ ఆత్మార్థం ఉర్వ్యం హి యస్మాత్ -కిటిద్యాస్ తం కాయం ఉపనయన్తి   అత్ర మూల్జంతి చౌరాసి స్వర్గ తన్ – సైల్చింయుత విభవిం యేహి తైర్ న హ్రి యంతే  విత్తం యస్మిన్ భవతి భువనే తత్ర చిత్తం చ వైల్సితే . ‘’

‘’క్వ మే నిర్వియాతి బుద్ధిహ్ క్వ శ్రియే సుమహి  కది -మోహిద్ భువి మై రురుక్తి జుర్ లిమాయివి మహి గిరిమ్ ‘’

‘’కిరు ఫ్జతి  ద్రమతే క్రమస్వ భో అపరిధమ్ కృతం ఏ భిర్  ఇద్రసం -యద్  ఇమే  నా విదుహ్ స్వకర్మ వినా చ వీ త్వ త్కరు ప్జిమ్ అపి ప్రభో ‘’

  సశేషం

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-8-17-కాంప్-షార్లెట్-అమెరికా

Inline image 1

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 443-నడయాడే సంస్కృత సర్వస్వము -పండిట్ ముఫ్తి మొహమ్మద్ సర్వార్ ఫరూకీ (1968)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

443-నడయాడే సంస్కృత సర్వస్వము -పండిట్ ముఫ్తి మొహమ్మద్ సర్వార్ ఫరూకీ (1968)

వేదాలనూ ,ఖురాన్ నూ ,హిందూ మతాచార్యుల సిద్ధాంతాలను ,మహమ్మద్ ప్రవక్త సూక్తులను అనర్గళంగా ,సభా రంజకంగా చెప్పగలిగే సమర్ధుడు ,సంస్కృత పండితుడు ,లక్నో లోని నద్వతుల్ ఉలేమా లేక నద్వా మదరసా పండితుడు .1968 లో జన్మించాడు . వారణాసి లోని ‘’విశ్వ సంస్కృత ప్రతిష్టాన్ ‘’ జనరల్ సెక్రెటరీ .మహా రాష్ట్ర ప్రభుత్వ సంస్కృత ష్టాండింగ్ కమిటీ సభ్యుడు కూడా .భారత దేశం లో ముస్లిం సంస్కృత పండితులలో దస్తగిరి ,ఫరూకీ ,బిరాజ్ దార్ వంటి ఉద్దండులు వ్రేళ్లమీద లెక్కింప దగిన సంఖ్యలో మాత్రమే ఉన్నారు .

 ఫత్వా లలో ప్రసిద్ధుడైన ఫరూకీ సంపూర్ణానంద్ యుని వర్సిటీ నుండి సంస్కృతం లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పొందాడు .అన్ని భాషలూ నేర్వాలన్న ఖురాన్ వాక్యాన్ని ఆయన తరచూ చెబుతాడు . ఈ మధ్యనే ఘాజీపూర్ లో అతిపెద్ద హిందూ సమ్మేళనం లో ఫరూకీ ప్రసంగించి ప్రేరణ కలిగించాడు .మొదట్లో శ్రోతలు ‘’ఈయన్ని పిలిచారేమిటి ?ఏమి మాట్లాడగలడు ?’’అనుకొన్నారు కానీ ఉపన్యాసం అయ్యాక ‘’అసలైన సమర్ధుడైన వక్త వచ్చి మనకు మార్గ దర్శనం చేశాడు ‘’అని ఎంతో సంతృప్తి చెందారు .ఖురాన్ పైనా ,మరెన్నో విషయాలపైనా ఫరూకీ చాలా పుస్తకాలు హిందీలో రాశాడు . ఫరూకీ ని ‘’నడయాడే సంస్కృత సర్వస్వము ‘’అని గౌరవిస్తారు . ”నమాజ్ అంటే నమోనమః ”అని గొప్ప అర్ధం చెప్పాడు .

 ఫరూకీ లాగానే మిరాజ్ దార్  అనే ఆయననూ ‘’నడిచే సంస్కృత సర్వస్వము ‘’అంటారు .ఈయన మహారాష్ట్రలోని షోలాపూర్ కు చెందినవాడు .1934 లో పుట్టాడు . పగటిపూట పొలాలలో పని చేసి రాత్రివేళ రాత్రిపాఠశాలలో చదువుకున్నాడు .తన చుట్టూ ఉన్న పిల్లలు సంస్కృత మంత్రాలు వల్లే వేస్తుంటే ముచ్చటపడి శ్రర్ధగా విని కంఠస్తం చేసేవాడు .బ్రాహ్మణ పిల్లలకు మాత్రమే పరిమితమైన ఆ పాఠశాల ఉపాధ్యాయుడు మిరాజ్ కోసం రూల్స్ ను ప్రక్కకు పెట్టి చేర్పించి నేర్పించాడని గర్వంగా కృతఙ్ఞతటా తో చెప్పుకొన్నాడు మిరాజ్ .హిందువులు ఆయనతో వివాహాది శుభకార్యాలు ,పూజా పునస్కారాలు అంత్యక్రియలు చేయించమని కోరుతారు కానీ అవి పూర్తిగా మత సంబంధమైనవి కనుక తాను  అందులో వేలుపెట్టనని వినయంగా తిరస్కరిస్తాడు . కానీ ఆసక్తి ఉన్నవారికి ఆ విధానాలు నేర్పిస్తాడు  . 75 ఏళ్ళ మిరాజ్ దార్ ఇంట్లో బీరువాలన్నీ వేద  ఉపనిషత్తులు శాస్త్ర  ఇతిహాస పురాణ  గ్రంధాలు ,ఖురాన్ దానిపై వ్యాఖ్యానాలతో నిండి ఉంటాయి .

  ఢిల్లీ లోని జవహర్ లాల్ నెహ్రు యూనివర్సిటీ సంస్కృత శాఖ అధ్యక్షుడు రామనాధ్ ఝా ‘’భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చాక చాలామంది ముస్లిం నాయకులు, పెద్దలు సంస్కృతం అధికార భాషగా ఉండాలని సమర్ధించారని ,కానీ హిందీ గెలిచిందని తెలియ జేశాడు .ఆలీఘర్ ముస్లిం యూనివర్సిటీ నుండి 20 మంది సంస్కృతం లో పి హెచ్ డి ,12 మంది ఏం ఫీల్ పొందారు అని దాని సంస్కృత హెడ్ డా. ఖలీద్ బిన్ యూసఫ్అన్నాడు  .మొహమ్మద్ ఖాన్ దురాని భారత దేశం లో సంస్కృతం లో మొట్టమొదట డాక్టరేట్ పొందిన ముస్లిం సంస్కృత విద్యావేత్త .

  ఉత్తర ప్రదేశ్ లోని మహారాజ్ గంజ్ ముస్లిం సంస్కృత విద్యావేత్త ఆశబ్  ఆలీ వేదాలను,రామాయణ ,భారతాలను  క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఇప్పుడు వేదాలను ఖురాన్ ను తులనాత్మకం గా పరిశోధిస్తున్నాడు .ఇస్లా0 కు వేదం హిందూమతానికి మధ్య చాలా సన్నిహిత సంబంధం ఉంది .రెండిటిలో ఏకేశ్వరోపాసనే ఉన్నదని  ఇస్లా0  లో లాగానే వేదాలలో కూడా పునర్జన్మ లేదని ఇలాంటి భావాలే తనను  బాగా ఆకర్షించాయి ‘’అన్నాడు 61 ఏళ్ళ గోరఖ్ పూర్ యూనివర్సిటీ సంస్కృత శాఖాధ్యక్షుడు ఆశబ్ ఆలీ .

      సశేషం

  మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -30-8-17-కాంప్-షార్లెట్-అమెరికా

Inline image 1Inline image 2

  ఫరూకీ                                                           బీరజ్ దార్
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 442-స్థానాంగ సూత్ర కర్త -దేవర్ధిగని క్షమా శ్రమణ  (3 వ శతాబ్దం )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

442-స్థానాంగ సూత్ర కర్త -దేవర్ధిగని క్షమా శ్రమణ  (3 వ శతాబ్దం )

జైన సంప్రదాయం లో మొదటి పదకొండు అంగాలు అంగ వాసర్పిణి కాలం లో బాగా శిధిలమైనా సంరక్షింప బడ్డాయని స్వే తాంబరు విశ్వాసం .ఆ కారణం వలననే మూడవ శతాబ్దికి చెందిన దేవర్ధిగని క్షమా శ్రమణ ఆధ్వర్యం లో వాటిని కుదించి స్వేతాంబర జైనానికి ఉపయుక్తం గా  గ్రందీకరణం చేశాడు.ఈపని అంటే సంక్షిప్తీకరణ కార్యాన్ని మహా వీర నిర్యాణం తర్వాత 993 ఏళ్లకు  గుజరాత్ లోని వల్లభి లో చేసి అర్ధమాగధి ప్రాకృతం లో రాశారు  అసలు స్థానాంగ సూత్రం సంస్కృతంలోనే ఉంది . మూల సంస్కృత గ్రంధం టీకా ,తాత్పర్యాలు లేకుండా అర్ధం చేసుకోవటం మిక్కిలి కష్టం కనుక శ్రమణ అందరికి అందుబాటులోకో తేవాలని ఈ పని చేశాడు . 11 వ శతాబ్దం లో అభయ దేవ సూరి  స్థానాంగ సూత్రకు పూర్తిగా సంస్కృతం లో టీకా తాత్పర్య వ్యాఖ్యానం రచించాడు

 ఈ గ్రంధాన్ని ప్రాకృతం లో స్థానం అంటారు అంటే క్వాంటం అంటే కొంత భాగం అని భావం. దీని శైలి చాలా ప్రత్యేకమైనది .ఇందులో 11 అధ్యాయాలు ,ప్రతి అధ్యాయం కొన్ని స్థానాలతో ఉంటుంది .జైనుల మెటాఫిజిక్స్ అంతా ఇందులో దర్శనమిస్తుంది .ధర్మ కథానుయోగ  ,కరణానుయోగ ,ద్రవ్యాను యోగ మొదలైన విషయాల చర్చ ఉంది .ఇందులోని పదజాలం ,విషయాలు సరైన స్థానాలలో ఉండటం వలన చాలా తేలికగా కంఠతా చేసి గుర్తుంచుకోవచ్చు .ఇదొక మెమరీ ఎయిడ్ గా ఉపయోగ పడుతుంది .కనీసం 8 ఏళ్ళు జైన పథం  లో తీవ్రంగా కృషి చేసినవారికే  దీని అంతరార్ధం పూర్తిగా తెలుస్తుంది అని ‘’వ్యవహార ఛేద  సూత్ర ‘’చెబుతోంది .ఇందులోని మొదటి సూత్రం -’’సూయం మే  ఔశం  తేన0 భగవయా  ఏవం ఆఖ్యాయా0’’అంటే ‘’ఓ చిరంజీవీ ! పూజ్యనీయులైన మహావీరులు ఇలా చెప్పారని నేను విన్నాను ‘’

ఇందులో గణిత శాస్త్రమూ 747 సూత్రం లో ఉన్నది . 1- పరిశ్రమ అంటే చతుర్గణనం 2-వ్యవహార 3-రజ్జు -జామెట్రీ 4-రాశి -ఘన వస్తువుల గణనం 5-కాలసవర్ణ -భిన్నాలు 6-యావత్త్తావత్  -సరళ సమీకరణాలు 7-వర్గ -ద్వివర్ణ సమీకరణాలు 8-ఘన -క్యూబిక్స్ 9-వర్గ -వర్గ -బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ 10- వికల్ప -పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ల గణితం పై వివరాలున్నాయి

 ఈ గ్రంధానికి ఇంగ్లిష్ ,హిందీ ,ప్రాకృత అనువాదాలు వచ్చాయి .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-8-17-కాంప్-షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 440- షట్కా0డాగమ కర్త -ఆచార్య భూతబలి (క్రీశ 66-90 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

440- షట్కా0డాగమ కర్త -ఆచార్య భూతబలి (క్రీశ 66-90 )

క్రీశ 66 లో జన్మించి 90 లో సిద్ధి చెందిన స్వేతాంబర  దిగంబర జైనా చార్యుడు భూతబలి . ఈయన ‘’షట్కా0డ  ఆగమ0 ‘’ను పుష్పదంతా చార్యునితో కలిసి ప్రాకృత భాషలో రచించాడు .మధుర ప్రాంతం లో జైన మత వ్యాప్తికి గొప్ప కృషి చేశాడు .జైనుల అయిదవ గ్రంథ మైన ‘’శృతి పంచమి ‘’లో భూతబలి పుష్పదంతాచార్యులకు ప్రతి ఏడాది సంస్మరణ ఉత్సవాలు చేస్తున్నట్లు ఉంది .ఈ జంట ఆచార్యులు ‘’కాశయ పహూద ‘’అనే గ్రంథం కూడా రాశారు ..దీన్ని వాంఛా గ్రంథం (ట్రిటైజ్ ఆన్  పాషన్  ) అన్నారు.

 క్రీశ మొదటి శతాబ్ది వాడైన దిగంబర పుష్పదంతాచార్య భూతబలితో కలిసి షట్కా0డ ఆగమం ‘’రాశాడు .

4 వ శతాబ్ది గుణ భద్రుడు జైన సేనునితోకలిసి ‘’మహా పురాణం ‘’రాశాడు

8 వ శతాబ్ది దిగంబర జైనాచార్యుడు అపరాజిత దిగంబర జైనులు దిగంబరంగా ఉండటాన్ని పూర్తిగా సమర్ధించాడు .దిగంబరంగా ఉండటం అంటే బట్టలు లేకుండా ఉండటం మాత్రమేకాదని ,కోరికలను ,వస్తువులను పూర్తిగా విసర్జించటమే నని బోధించాడు

   441-సంస్కృత వ్యాప్తి చేస్తున్న ముస్లిం సంస్కృత పండితుడు -పండిట్ దస్తగిరి (1935 )

 మహారాష్ట్ర షోలాపూర్ జిల్లా శిఖాల్ గ్రామం లో పండిట్ దస్తగిరి జన్మించాడు .అక్కడే సెకండరీ విద్య పూర్తి చేసి ప్రభుత్వ సంస్కృత కళాశాలో చేరాడు . 50 మంది బ్రాహ్మణ విద్యార్థులమధ్య తానొక్కడే ముస్లిం విద్యార్థిని అని చెప్పుకొన్నాడు .కానీ సంస్కృత గురువు తనపై ప్రత్యేక అభిమానం తో శ్రద్ధతో చక్కగా బోధించి తీర్చిదిద్దాడని కృతజ్ఞతతో  చెప్పాడు  .అక్కడే ఆయనే వేదాలు శాస్త్రాలు వగైరా క్షుణ్ణంగా నేర్పాడని పొంగిపోయాడు దస్తగిరి .  ‘’1950 లోబొంబాయి చేరి మరాఠా సంస్థాన్ నిర్వహణలో ఉన్న ‘’మరాఠీ మీడియం ఓర్లి హై  స్కూల్’’లో సంస్కృత ఉపాధ్యాయుడిగా చేరి అన్ని తరగతులకు సంస్కృతం బోధించాడు

 ఇండియాలో ఎమెర్జెన్సీ పూర్తయి ,జనతా ప్రభుత్వం ఏర్పడ్డాక  తాను జనసంఘ్ ఆర్ ఎస్ ఎస్ లను ఏదో నెపం తో సమర్ధిస్తున్నాని అనుమానించి విచారణ జరిపి అది శుద్ధ అబద్ధమని తేల్చారని తన నిజాయితీని ప్రశంసించారని తెలియ జేశాడు  దస్తగిరి .

  1980 లో ఇందిరా గాంధీ మళ్ళీ ప్రధాని అయ్యాక దస్తగిరిని పిలిపించి ఆయన మహమ్మద్ ప్రవక్త వంశీకుడైన సదవంశస్తుడు అని గ్రహించి ,1982 లో ఆయనను ‘’రాష్ట్రీయ సంస్కృత ప్రచారకునిగా నియమించేట్లు విద్యా శాఖను ఆదేశించిందని ,వాళ్ళు కక్కా లేక మింగా లేక నీళ్లు నములుతుంటే ,ముందు ఉద్యోగంపూర్తి స్వతంత్రం తో ఇచ్చి తర్వాత ఆయన పని తీరును చూడమని హెచ్చరించింది .ఆమె తనను కలవటానికి చాలాసార్లు వచ్చిందని తానుకూడా తరచుగా కలిసేవాడినని అన్నాడు .  50 వ ఏటా1987 లో సంస్కృతం లో ఏం ఏ డిగ్రీ పొందాడు .రిటైర్ అయ్యేదాకా సంస్కృతం బోధిస్తూ హిందుత్వానికి ఇస్లా0 కు ఉన్న పోలికలను వివరిస్తూ ప్రపంచం లో అతిప్రాచీన భాషఅయిన సంస్కృతం యొక్క ఉత్కృష్టతను వివరిస్తూ బోధన సాగించాడు పండిట్ దస్తగిరి .రాష్ట్రీయ స్వయం సేవక సంఘం  అన్ని పీఠాల శంకరాచార్యులు తనకు అత్యంత గౌరవం ఇస్తున్నారని తమలో ఒకనిగా భావిస్తూ ఆదరిస్తున్నారని గర్వంగా చెప్పుకొన్నాడు పండిట్ దస్తగిరి .సంస్కృతం పైన ఉన్నమక్కువ ఆయనను ఇస్లా0  కుదూరం చేయలేదు ‘.తనలాగా చాలామంది ముస్లిం  సంస్కృత పండితులు దేశం లో ఉన్నారని కానీ వారు ఆర్ధికంగా  వెనకబడి ఉండటం తో ముందుకు రాలేక పోతున్నారని విచారం వ్యక్తం చేశాడు దస్తగిరి .భార్య వహీదా గొప్ప సహకారాన్నిస్తోంది .కొడుకు బడీ ఉజ్జమా సంస్కృత స్కాలర్ .కూతురు గ్యాసున్నీసా షోలాపూర్ లో సంస్కృత రీసెర్చ్ సెంటర్ నిర్వహిస్తోంది . ధన్యమైన కుటుంబం పండిట్ దస్తగిరిది .

   సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-8-17- కాంప్-షార్లెట్-అమెరికా

Inline image 1

పండిట్ దస్తగిరి


Inline image 2Inline image 3

గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వా ణం -3 439-తిలోయ పన్నతి కర్త -యతి వృషభ (క్రీ శ . 551)     

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

439-తిలోయ పన్నతి కర్త -యతి వృషభ (క్రీ శ . 551)

జైన మతాచార్యుడు ,గణిత శాస్త్ర వేత్త ,ఆర్య మంఖ,నాగహాస్తి ల శిష్యుడు యతి వృషభ .తనగురించి పెద్దగా చెప్పుకోలేదు కానీ గుప్త యుగం పాలించిన 231 ఏళ్ళ తర్వాత  అని  చెప్పాడు .కనుక ఈయన కాలం క్రీశ. 551 కావచ్చు అని తేల్చారు .క్రీశ. 609 లో జైన భద్ర  యతి వృషభ ప్రస్తావన తెచ్చాడు .క్రీశ 458 వాడైనశర్వానంది గురించి యతి వృషభుడు పేర్కొనటం వలన పైకాలాన్ని ధృవీకరించవచ్చు

 యతి వృషభ రచించిన ‘’తిలోయ పన్నతి ‘’లో చాలా పెద్ద దూరాలను కొలిచే  అనేక ప్రమాణాలను ,అనంత కాల గణన విధానాలను వివరించాడు .ఇది జైన మత విశ్వోద్భవ  వర్ణన ను  తెలియ జేసే  గ్రంథం .దీనితో జైనుల గణిత ,శాస్త్ర విజ్ఞాన గరిమను గురించి తెలుసుకొనే వీలు కలిగింది . అనంత అంతరిక్షం ,అనంత కాలం లో అనంత ప్రపంచం ఉన్నదని జైన మత విశ్వాసం .దీ ని ఆధారంగా సుదూర ప్రాంతాల మధ్య దూరాన్ని ,ఎక్కువ నిడివిగల కాల విరామాలు గణించగలిగారు .దీనితో అనంతాన్ని గురించిన అనేక విధాల గణనం వారికి వీలయింది .పాశ్చ్యా త్య గణిత వేత్త ‘’కాన్ టార్ ‘ ధీరీ ఆఫ్ ఇన్ఫినిట్ కార్డినల్స్ ‘’కనిపెట్టే దాకా ఈ జైన గణితం ఒక్కటే అందరికీ ఆధారం గా ఉండేది .

 ఈ పుస్తకం లో 1-గణన విధానాలు 2-సంఖ్యా విధానం 3-ప్రతీకవాదం (సింబాలిజం )3-రేఖా గణితం 4-ఘాన జ్యామితి (సాలిడ్ జామెట్రీ )5-శ్రేణులు (సిరీస్ )6-సంవర్గమానం (లాగరిథమ్స్ )ఉన్నాయి

యతి వృషభ తిలోయ పన్నతి తో పాటు కాశయ ప్రదూత చూర్ణి  ,శతక చూర్ణి ,సిత్తారి చూర్ణి కర్మ సూత్ర కూడా రాశాడు కానీ అలభ్యాలు .ఆయన 8 కర్మ ప్రవాదాలలో నిపుణుడు ,కర్మ ప్రకృతిపై ఆధిపత్యం ఉన్నవాడని నంది సూత్రం తెలియ జేస్తోంది .జైనాచార్యుడేకాక గొప్ప శాస్త్ర పండితుడు .భూత బలి తోపాటు సమాన ప్రతిభ కలవాడు వీరిద్దరి అభిప్రాయాలకు జైన మతం లో విలువ ఉంది .చూర్ణి లలో గొప్ప పధ్ధతి శైలి ని వాడాడు . ఆగమ విధానాలలో కూడా మంచి ప్రవేశం ఉన్నవాడని భావిస్తారు .అన్ని రకాల సంప్రదాయాలను విశేషమైన అనుభవ0 తో సులభ విధానం లో బోధించే నేర్పున్న ఆచార్యుడు యతి వృషభ

Yativṛṣabha was a Jain monk who studied under ārya Maṅkṣu and Nāgahastin. He composed, along with other traditional Jain works, the Tiloyapaṇṇattī (in Sanskrit, Trilokaprajñapti or Knowledge on the three worlds), a work on Jain cosmography. This work describes the construction of the Universe expressed in specific numbers; for example, the diameter of the circular Jambu continent, upon which India is located, is 100,000 yojanas and its circumference is 316,227 yojanas, 3 krośas, 128 daṇḍas, 13 aṅgulas, 5 yavas, 1 yūkā, 1 ṛikṣā, 6 karmabhūmivālagras, 7 madhyabhogabhūmivālagras, 5 uttamabhogabhūmivālagras, 1 rathareṇu, 3 trasareṇus, 2 sannāsannas, and 3 avasannāsannas, plus a remainder of 23213/105409. Yativṛṣabha also gives formulas for computing the circumference (C) and the area (A) of a circle having a diameter of d:

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -28-8-17 -కాంప్-షార్లెట్-అమెరికా

Inline image 1

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 438-పంచసంధి వ్యాకరణ కర్త -బనార్సి దాస్(1587-1643)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

438-పంచసంధి వ్యాకరణ కర్త  -బనార్సి దాస్(1587-1643)

1587 లో జన్మించి 1643 లో మరణించిన బనారసీ దాస్ తన జీవిత చరిత్ర ‘’అర్ధ కథానక ‘’గ్రంధం  రాశాడు .అందులో జైన దేవాలయాలలో జరిగే పూజలు ,ఉత్సవాల గురించి వర్ణించాడు . 1635 లో జైన గురువు పండిట్ రూప్ చ0ద్ ఆధ్వర్యం లో జరిగిన జైన సెమినార్ గురించి కూడా పేర్కొన్నాడు .ఆగ్రా జైన సంస్కృతికి పట్టుగొమ్మగా ఉండేదని ,1594 లో పండిట్ భగవాన్ దాస్ తన రామ్ నగర్ నుండి ఆగ్రాకు యాత్రగా వచ్చాడని ,ఈ మహానగరం లోని ‘’జిన వన్దన0 ‘’ను చక్కగా వర్ణించాడు .అప్పుడు ఆగ్రాలో 48 దిగంబర జైన దేవాలయాలున్నట్లు తెలిపాడు .వీటిలో రెండు భట్టారక పీఠాలు .భట్టారక సుఖ కీర్తి తిహునా సాహు జైన దేవాలయం లో ఉండేవాడని ,భట్టారక జగత్ భూషణ్ సాహు నారాయణి దేవాలయం లో నివసించేవాడని చెప్పాడు .నగరం లోని జైన దేవాలయాలు వీరిద్దరిలో ఎవరో ఒకరి ఆధీనం లో ఉండేవి .భట్టారకులు పండితులనుఎంపిక చేసి నియమించి దేవాలయాలలో పూజాదికాలు నిర్వహింప జేసేవారు .ఈ పూజారులుతాంత్రిక పూజలూ నిర్వహించేవారు .ఈ దేవాలయాలు ఆధ్యాత్మిక జ్ఞాన కేంద్రాలుగా ఉండేవి .ఉత్తర భారతం లోని ప్రతి దిగంబర దేవాలయం లో లోపలా బయటా ఖాళీ స్థలం ఎక్కువగా ఉండి ,సామూహిక పూజా కార్యక్రమాలకు ప్రసంగాలకు అనువుగా ఉండేవి .బలభద్ర జైన్ ఆగ్రా గురించి ‘’ప్రతి జైన దేవాలయం లో ఉదయ , సాయం సమయాలలో జైన మత గ్రంధాలపఠనం ఆరాధనజరిగేవి .తరచుగా తత్వ గోష్ఠి నిర్వహించేవారు ‘’అని రాశాడు .

  బనారసీ దాస్ తనగ్రంధం లో ‘’పండిట్ రూప్ చంద్ జైన గ్రంథ నిష్ణాతుడు ఆగ్రాకు వచ్చి తిహున్ సాహు నిర్మించిన దిగంబర దేవాలయం లో ఉన్నాడు .ఈయన ఆధ్వర్యం లో గొప్ప దిగంబర జైన సభ జరిగింది . అందులో ఆయన ‘’గొమ్మట సార’’పై గొప్పగా ప్రసంగించి స్ఫూర్తి కలిగించాడు .ఇది భట్టారక పీఠం . ‘’ఆధ్యాత్మిక గోష్ఠులను ‘’విచార ‘’లేక విచార గోష్ఠి అనేవారు.దీనినే మనం ఇప్పుడు సింపోజియం అంటున్నాం .కుంద కుందా చార్య రాసిన ‘’సమ్మత సార’’పై కూడా గోష్ఠి జరిగేది .ఆరాత్ మల్ ధోర్ అనే ప్రముఖ జైన ఆచార్యుడు తనకు హితోపదేశం చేసినట్లు బనారసీ దాస్ రాసుకున్నాడు .బనారసీ దాస్ ‘’భాషా అర్ధ బొచరై చిత్త ‘’అనే గ్రంథాన్ని తానె స్వయం గా చదివాడు .కానీ పూర్తిగా  అర్ధం చేసుకోలేక పోయానని ,గోమ్మట  సారను రూప్ చాంద్ మార్గ దర్శకత్వం లో చదివి న తర్వాత సమయసారం పూర్తిగా అర్ధమయింది రాశాడు .తన అర్ధ కథానకలో బనారసీ దాస్ ‘’ఇప్పటికి సన్మార్గం లో పడ్డాను .దేవుని స్వభావం ఏమిటో తెలిసింది .ఈ ఆనందం ,తపన తో ‘’సమయచార నాటకం ‘’రాశాను’’అని చెప్పుకొన్నాడు దాస్ .నాటకం చివర విపులమైన వివరణ ఇచ్చాడు

 జైన మత గ్రంధాలపై అవగాహన బాగా ఉన్న పంచ మహానుభావుల సంభాషణలు గోష్ఠులను గురించి సవివరంగా రాశాడు .సమయ సారకు వ్రజభాష అనువాదం కూడా బనారసీదాస్ రాశాడు .దీనికి ఆధారంగా అమృత చంద్రుని సంస్కృత వ్యాఖ్యను ఎంచుకున్నాడు బనారసీ దాస్ రాసిన సమయ చార నాటకం ఆగ్రా జైన పీఠాలలో గ్రంధమై పోయింది .బనారసీ దాస్ మిగిలిన రచనలను ఆయన మరణానంతరం సేకరించి మొఘల్ సామ్రాజ్య దివాన్ జగ్జీవన్ పంచ మహానుభావుల నే జ్ఞాన మండలికి  అందజేశాడు .ఇందులో పీతాంబరుడు అనేకవి 1630 లో బనారసీ దాస్ పై స్తుతిగా చెప్పిన కవిత్వం బనారసీ విలాస్ అనే జ్ఞాన్భా వని  అనే ది ఉంది దీనిలో దాసు గొప్ప వాణిజ్య వర్తక వేత్త మాత్రమేకాక భక్తిగా గానం చేయగల సత్తా ఉన్నవాడిని మంచికవి అని వర్ణించబడింది .సుమారు 15 మంది ఆసక్తి ఉన్నవారు బనారసీ దాస్ ఇంటికి వచ్చి ఆయన ఆలపించే కుట్ బాన్ రచించిన ‘’మృగావతి ‘’ని ,మం జాన్ రాసిన మధుమాలతి ని  ఆసక్తిగా వినేవారట  .ఈ రెండూ సూఫీకవుల కవిత్వాలు .

  దాస్ -జాన్ పూర్ లో  పండిట్ దేవ దత్తు వద్ద జ్యోతిష ,గణిత ,ఖాండ స్పూట  విద్యలు  నేర్చాడు  .నానార్ధాల ‘’నామ మాల ‘’ను ‘’అనేకార్థ కోశం ‘’ను అధ్యయనం చేశాడు .అలంకార శాస్త్రం లఘుకోశం పై ఒక ఏడాది దీక్షగా కృషి చేసి సారం గ్రహించాడు .స్వే తాంబర గ్రంధాలు శ్రుత బోధ ,చంద్ర కోశ లను ప్రసిద్ధ బౌద్ధా చార్యులు బాం చంద్ ,రామ్ చంద్ ల వద్ద నేర్చాడు .తాను  సంస్కృత ప్రాకృతాలను నిర్దుష్టంగా పలకగలనని మాట్లాడగలనని వాటిలో రాయగలనని చెప్పుకొన్నాడు .స్వయంగా తీర్చి దిద్దుకోబడిన కవి దాస్ .వెయ్యి పద్యాలున్న హిందీ అలంకార శాస్త్ర గ్రంథం రాశాడు .నవ రసాలను చర్చించాడు .జాన్ పూర్ గవర్నర్ చిన్ని కిలిక్ బనారసీ దాస్ శిష్యరికం చేసి ఎన్నో గ్రంధాలు అభ్యసించాడు .సంస్కృత వ్యాకరణం ‘’పంచ సంధి ‘’రాశాడు .జిన సహస్రనామం  సూక్తి ముక్తావళి రాశాడు.

  సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-8-17- కాంప్ -షార్లెట్-అమెరికా


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

తెలుగు భాషా దినోత్సవంగా గిడుగు రామమూర్తి జయంతి

Inline image 1

—  సరసభారతి, రోటరీక్లబ్ సంయుక్త ఆధ్వర్యం లో ఉయ్యూరు కెసిపి దగ్గరున్న రోటరీ క్లబ్ ఆడిటోరియం లో 29-8-17 మంగళవారం సాయంత్రం4 గం లకు   తెలుగు  భాషా దినోత్సవ  కార్యక్రమం నిర్వహింపబడుతోంది .తెలుగు భాషా ప్రియులు విచ్చేసి జయప్రదం చేయప్రార్ధన

                         కార్యక్రమం
 1-అతిధు లకు ఆహ్వానం
  2- వందేమాతరం ప్రార్ధన
  3-మా తెలుగుతల్లికి ప్రార్ధన గీతం
  4- దీప ప్రదీపనం
  5 గిడుగువారి చిత్రపటానికి పుష్పమాలాలంకరణ
   6 అధ్యక్షుని తొలి పలుకులు-శ్రీ జి వెంకటేశ్వరావు -సి ఓ ఓ -కెసిపి
    7- గిడుగు వారి వ్యావహారిక భాషోద్యమం పై ప్రసంగం
        1-లయన్ శ్రీ బందా  వెంకట కటరామారావు -కవి ,రచయిత విమర్శకులు
         2-డా .శ్రీ గుంటక వేణుగోపాల రెడ్డి-తెలుగు ఉపన్యాసకులు
          3- శ్రీ చలపాక ప్రకాష్ -ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘ కార్య దర్శి, కవి రచయిత ,రమ్యభారతి పత్రిక సంపాదకులు
           4- శ్రీమతి మాది రాజు శివలక్ష్మి – సరసభారతి కార్య దర్శి
8 – అతిధులకు భాషోద్యమ సత్కారం
9- వందన సమర్పణ
10  – జనగణ మన
                                              గబ్బిట దుర్గాప్రసాద్ సరసభారతి అధ్యక్షులు
                                                   మరియు రోటరీ ప్రెసిడెంట్ -ఉయ్యూరు
Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

వీక్లీ  అమెరికా -22 -2  (21-8-17 నుంచి 27-8-17 వరకు )

వీక్లీ  అమెరికా -22 -2  (21-8-17 నుంచి 27-8-17 వరకు )

వినాయక చవితి ,మూడవ రుద్రం వారం

                  మూడవ రుద్రాభిషేకం

శ్రీ కృష్ణాష్టమి నాడు మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో సాయంత్రం జరిగిన భజనకు వచ్చిన శ్రీ గౌడు రఘు గారి భార్య శ్రీమతి సుచిత్ర 26-8-17 శనివారం సాయంత్రం  తమ ఇంట్లో రుద్రాభిషేకం ఉందని నన్ను చేయించమని మా అమ్మాయికి మాకు చెప్పారు .సరే అన్నాను .ఇది ఇక్కడ నేను చేయించిన మూడవ రుద్రాభిషేకం . వీరి అమ్మాయే కుమారి రచిత కిందటినెలలో కూచిపూడి రంగప్రవేశం చేస్తే వెళ్లి చూసాం

నిన్న మధ్యాహ్నం 2-45 కు వాళ్ళు పంపిన శ్రీ వెంకట్ అనే అనంతపురం జిల్లా ఆయన కారులో మా ఇంటికి వచ్చి నన్ను ఎక్కించుకొని ,దారిలో వాళ్ళ ఇంటికి తీసుకు వెళ్లి భార్యను పిల్లలలను ఎక్కించుకొని సుమారు 45 మైళ్ళదూరం అంటే దాదాపు 70 కిలోమీటర్లదూరం లో ఉన్న రఘు గారింటిలో దింపారు .వెంకట్ గారిభార్య కృష్ణా జిల్లా ఘంటసాల వాసి .అక్కడి హై స్కూల్ సైన్స్ మేష్టారు ,తర్వాత హెడ్మా స్టర్ అయినా శ్రీ మూల్పూరి  చిన్నారావు గారు నాకు మంచి స్నేహితులుడు .ఆయనదగ్గర ఈమె చదివింది అవి గుర్తు చేసుకున్నాం దారిలో . .చెన్నారావుగారబ్బాయిశ్రీ వెంకటేశ్వరరావు  అమెరికాలో  ఉంటారు .ఘంట శాల గ్రామం ఆ పాఠశాల అభిరుద్దికి తండ్రీ కుమారులు చేసిన సేవ నిరుపమానం . చెన్నారావుగారు మరణించి సుమారు ఆరునెలలు పైనే అయింది .

 రఘు గారింటికి వెళ్లేసరికి అంతా  రెడీ గానే ఉన్నారు . రఘు దంపతులకు ‘’దర్శనీయ దైవ క్షేత్రాలు ‘’అంద  జేశాను . సాయ0త్రం 4-30 కు గణపతి పూజ చేయించి ,శివుని ప్రతిష్టించి అష్టోత్తర శతనామ పూజ ,లలితా అష్టోత్తరం చేయించేసరికి 5-30 అయింది అప్పుడే రుద్రం చదివేవారు సుమారు 10 మందిదాకా వచ్చారు . మా శ్రీమతిని శ్రీ గ్రంధి హరి కుటుంబం వారు ఇంటికి వచ్చి సాయంత్రం 4-30 కు పికప్ చేసుకొని రఘుగారింటికి తీసుకు వచ్చారు . అభిషేకం ప్రారంభించే ముందు నన్ను రుద్రం గురించి చెప్పమని అక్కడి రవీంద్ర గారు అడిగితే  చెప్పాను .ఈయన రఘుగారింట్లో ప్రతి ఆదివారం రుద్రం నేర్పుతున్నారు తర్వాత  లఘున్యాసం ,నమక చమకాలతో  ఏకాదశ రుద్రాభిషేకం పాలు ఫలరసం తేనే పంచదార పెరుగు నెయ్యి  నీరు లతో చేయించి వచ్చినవారందరితో (సుమారు 70 మంది)చేయించి లింగాలను కడిగించి తర్వాత మళ్ళీ షోడశోపచార పూజ అష్టోత్తరం చేయించి నైవేద్యం పెట్టించి హారతి ఇప్పించి ,మళ్ళీ నేను లింగం అంటే ఏమిటి అభిషేకం ఎందుకు చేయాలనే విషయాలతోపాటు సరసభారతి విషయాలూ చెప్పి ,ఏకాదశ రుద్రాలను పుస్తకం చేతిలో లేకుండానే చక్కగా మాతో స్వరం కలిపి చదివిన కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు  అమ్మాయి శ్రీమతి  కాకాని లక్ష్మి భక్తికి ,స్పష్టమైన ఉచ్చారణ ను మెచ్చి ఆమెకు సరసభారతి తరఫున 1 116 రూపాయలు (వెయ్యిన్నూట పదహారు రూపాయలు )నగదు కానుక ప్రకటించి ,వీలయినప్పుడు మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చిసరసభారతి పుస్తకాలతో సహా  తీసుకోమని సభా ముఖంగా తెలియజేసి ,ఆతరవాత మంగళహారతి ,మంత్రం పుష్పం అందరు  లేచి నిలబడి ఏక కంఠంగా చెప్పించి  ఉద్వాసన చెప్పించాను .రఘుదంపతులకు నా చేతులమీదుగా తీర్ధ ప్రసాదాలు అంద  జేశాను . దంపతులు  వారితోపాటు అందరూ ఎంతో బాగా చేయించానని నన్ను అభినందించారు . నాకు కూడా ఇప్పటికి చేయించిన మూడు రుద్రాలలో ఇది చాలా సంతృప్తి నిచ్చింది .రుద్రం గురించి విపులంగా చెప్పే అవకాశమూ వచ్చి అందరికిఆనందాన్ని ,సంతృప్తి ని కలిగించగలిగాను . తర్వాత  -కర్ణాటక స్పెషల్ అయిన హోళిగలు  బేడల చారు, గారే పప్పు కూర సాంబారు పెరుగులతో మంచి భోజనం అందరికి . అయ్యాక నాకు ‘’ఘనమైన నగదు కానుక ‘’నిచ్చి రఘుదంపతులు మా దంపతుల కాళ్లకు మొక్కి పిల్లలతో కూడా మొక్కించి ఆశీర్వాదాలుపొందారు . గ్రూప్ ఫోటో తీసుకున్నారు అలాగే వెంకట్ కుటుంబం హరి కుటుంబం మొదలైనవారు కూడా .అంతా అయేసరికి రాత్రి 11 అయింది .రాత్రి 11-30 కు ఇంటికి చేరుకున్నాం . నేను రుద్రం గురించి చెప్పిన విషయాలు తెలియ జేస్తాను .

                          శ్రీ రుద్రం

‘’నమకం లో 11 అనువాకాలు ,చమకం లో 11 అనువాకాలు కలిస్తే రుద్రం లేక రుద్రాధ్యాయం లేక శత రుద్రీయం అంటారు . శాత అంటే వంద అనికాదు చాలా అని అర్ధం .  అంటే అనంతమైన రుద్రుల గురించి చెప్పేది అని  .రుద్రుడు రోదసి లేక అంతరిక్షం కు అధిపతి . 11 రూపాలతో వ్యక్తమవుతాడు .ఇవే  ఏకాదశ రుద్ర రూపాలు .వీరిని ‘’Gods of vibration ‘’అంటారు . దివి లేక ఆకాశానికి సంబంధించిన 12 మందిని ద్వాదశాదిత్యులు అంటారు  .వీరు  ‘’Gods of radiation ‘’.భూమికి సంబంధించిన 8 మంది దేవతలను అష్ట వశువులు అంటారు వీరికి ‘’Gods of materialization ‘’అని పేరు . సృష్టికి కారణభూతమైనవారు భీష్ముడు ఒక వసువు రూపమే . వీరిని బట్టే సంస్కృత ఛందస్సులు ఏర్పడ్డాయి 12 అక్షరాల ఛందస్సును త్రిష్టుప్ అని,11 అక్షరాలా జగతి ,8 అక్షరాలా గాయత్రి  16 అక్షరాల  అనుష్టుప్ ఛందస్సులు ఏర్పడ్డాయి.

  శత రుద్రీయం అమృతత్వ సార్ధకం .శివ అంటే అవాజ్మానస గోచర సత్య ,జ్ఞాన ఆనంద లక్షణ పరబ్రహ్మం . అంటే అమృతత్వ భావన -మోక్షానికి మార్గం .ఇదే శ్రీ విద్యా రూపం కూడా .నమకమ్ మొదటి అనువాకం -’’నమస్తే రుద్రమన్యవ ఉతోషత ఇశవే నమః ‘’మంత్రం తో ప్రారంభమవుతుంది .ఇందులో అన్ని వ్యసనాలకు మూలకారణం అయినక్రోధానికి నమస్కారం చెప్పబడింది . తర్వాత బాధను కలిగించే శివ ధనుస్సుకు బాణానికి దాన్ని చేబట్టే చేతులకు నమస్కారం చెప్పారు . అంటే ఈ జగత్తును లయం చేసే రుద్రుడు అయిన శివుని యొక్క ‘’ఘోర రూపం ‘’వర్ణించబడింది .శివుడు ‘’అఘోర రూపం ‘’లో కూడా ఉంటాడు -’’అఘోర ఘోర తరే భ్యహ ‘’రెండవ అనువాకం లో సుఖాన్ని కలిగించే శాంత  స్వభావం వర్ణించబడింది    8 వ అనువాకం లో శివ పంచాక్షరీ ఉంది . ఇది బంధ విచ్చేదనం చేసి జ్ఞానాన్నిచ్చి ముక్తినిస్తుంది . అందుకనే రుద్రాధ్యాయంలో  దీన్ని మణిపూస అంటారు .క్రోధం నశిస్తే శాంతికలుగుతుంది అని భావం.  శాంతి ఉంటె సకల సౌఖ్యాలు కలుగుతాయి .విష్ణువును ‘’శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం ‘’అనే శ్లోకం తో, శివుడిని ‘’శాంతం పద్మాసనస్థం శశిధర నయనం పంచ వక్త్రం త్రినేత్రం ‘’అనే శ్లోకం తో ప్రార్థిస్తాం రెండింటిలోనూ శాంతమే మొదటి పదం .నమకం అంతా అనేక రూపాల రుద్రునికి నమస్కారాలను తెలియ జేస్తుంది .

చమకం ‘’ఆజ్ఞా  విష్ణూ సజో ష  సేమా  వర్ధంతు వాంగిరః -ద్యుమ్నై ర్వాజే భి రాగతం ‘’అనే మంత్రం తో ప్రారంభమవుతుంది .చమకం లో శివుడికి మన కోరికల చిట్టా విప్పుతాం . నాకు అదివ్వు  ఇదివ్వు  అని వేడుకొంటాం .దీన్ని ‘’చమే ‘’పదం సూచిస్తుంది . దీని అర్ధం అదికూడా అని .మనకోరికలలిస్ట్ చాలా  ఉంటుందికనుక ‘’చమే ‘’చాలా సార్లు వస్తుంది ..ఇందులోనే ;;కల్పతాం ‘’అనే మాటకు అర్ధం కలుగుగాక ..రుద్రం లో రెండు వాక్యాలమంత్రాన్ని ఋక్కులని ఒకే వాక్యం ఉంటె యజుస్సు అని అంటారు .శివ తమా అంటే శివ తత్త్వం -అంటే మోక్షమే .రుద్రుడు ధరించే ధనుస్సు మొదటి సగం మన శిరసులోని బ్రహ్మ రంధ్రం నుంచి ముందువైపుకు భ్రూమధ్యం వరకు ఉంటుంది .ఇక్కడే ‘’మన్యువు ‘’అనే శక్తి ఉంటుంది రెండవ సగం భ్రూమధ్యం నుంచి మెడవరకు ఉంటుంది . .కనుబొమలనుండి మెడ వరకు అడ్డంగా పుర్రెపై  వ్యాపించి ఉన్న రేఖయే  శివధనుస్సు .అందుకే శివుడు ‘’కపాలం ‘’చేతిలో ధరిస్తాడు ఇది సాంకేతికం ..ఆకాశం లో సూర్యుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు పయనించేదారి ఒక ఆర్క్ లాగా ఉండే శివ ధనుస్సే  .దీనివలన పగలు రాత్రి ఏర్పడుతాయి .శివుడు కాలస్వరూపం .మహా కాలుడు అంటారు ఉజ్జయిలో ఉన్న శివుడు మహా కాళేశ్వరుడు .మన ఇంద్రియ శక్తులు కపాలం నుంచి రుద్ర గ్రందివరకు అంటే మెడుల్లా మీదుగా పని చేస్తాయి అందుకే మెడుల్లా చాలా ముఖ్యమైనది . అది పని చేయకపోతే  జీవితం వ్యర్థం . 5జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు మనసు ను ఆశ్రయించి ఉన్న రుద్రుని 11 రూపాలే శివుని 11 బాణాలు .

‘’నా రుద్రో రుద్ర మర్చయేత్ ‘’  అంటే రుద్రుడు కానివాడు రుద్రుని అర్చించటానికి అర్హుడు కాదు .అందుకే రుద్రుని యొక్క విభూతిని అంటే బూడిదకాదు ఐశ్వర్యాన్ని మన శరీరం లో ఒక్కొక్క అవయవం లో ఉంచుకొని అంటే న్యాసం చేసి మనం రుద్రులం అయి అప్పుడు రుద్రాభి షేకం చేస్తాం . దీన్నే మహాన్యాసం అంటారు . గొప్పగా ఉంచుకోవటం .. ‘’దేహో దేవాలయ ప్రో క్తో జీవో దేవ స్సనాతనః ‘’అంటే దేహమే దేవాలయం జీవుడే సనాతను డైన పరమేశ్వరుడు . శివుడు  వ్యోమ కేశుడు అంటే ఆకాశమే జుట్టుగా కలవాడని భావం  .దిక్కులే ఆయన వస్త్రాలు కనుక దిగంబరుడు అంతేకాని  బట్టలు విప్పుకొని తిరిగే వాడు అని అర్ధం కాదు .ఆయన జటాజూటి -అన్ని రహస్యాలు తెలిసినవాడు ..

 ఇప్పటిదాకా రుద్రార్చనా విధిని తెలుసుకున్నాం ,ఇప్పుడు శివలింగం గూర్చి దానికి ఎందుకు అభిషేకం చేయాలి అనే దాన్ని  తెలుసుకొందాం  .

          శివ లింగం

శివుడే లింగం  ,శివుడైన లింగం శివ లింగం.  లింగాన్ని పూజించాలి అని శివ పురాణం లో ఉంది .శివ లింగం లో ప్రజ్ఞానం లో బ్రహ్మ ,పాదం లో విష్ణువు ,హస్తం లో హరుడు ,బాహువుల్లో ఇంద్రుడు ,జఠరం లో అగ్ని ,హృదయం లో శివుడు ,కంఠం లో వనవాసి ,నాలుకతో సరస్వతి ,ముక్కులో వాయువు ,కళ్ళల్లో సూర్య ,చంద్రులు ,చెవులలో అశ్వినీ దేవతలు  లలాటం లో రుద్రుడు ,మూర్ధ భాగం లో ఆదిత్యుడు ,శిరసులో మహాదేవుడు ,పృష్టం లో పినాకిని ,ముందు శూలి ,ప్రక్కల శివుడు ,శంకరుడు , అన్నిటా వాయువు ,దాని బయట అగ్ని జ్వాలా ,సర్వాంగాలలో సర్వ దేవతలు యధా స్థానం లో ఉండి  నన్ను రక్షించుగాక యజమానులు రక్షించుగాక ‘’అని ఆవాహన చేసి ప్రార్థిస్తాం  . ‘’లిం  గమయతే ఇతి లింగహ్ ‘’అంటే దేనిలో నుంచి విశ్వం ఆవిర్భవించి దేనిలోకి లయం అవుతుందో అదే లింగం .ఆది మధ్యాంత రహితమై అవాజ్మానస గోచరమైనది లింగం

 లింగాన్ని ఎందుకు పూజించాలి ? దీనికి మహా భారతం ద్రోణ పర్వం లో ఒక విషయం ఉంది .ద్రోణుడు మరణించాక కొడుకు అశ్వత్ధామ తీవ్ర కోపావేశ0  తో  పాండవ సైన్యం పై విరుచుకుపడి ఒక అక్షౌహిణి సైన్యాన్ని సంహరించి ప్రళయకాల రుద్రుడుగా చెలరేగి పోయాడు అతన్ని ఎదిరించే సాహసం ఎవరూ చేయలేక పోయారు .ఆగ్నేయ బ్రహ్మాస్త్రాలతో భీభత్సం సృష్టించాడు . చివరికి నరనారాయణులైన కృష్ణార్జునపై యుద్ధం ప్రారంభించాడు .చాలా సేపు యుద్ధం చేశాడు . కానీ దీటుగా అర్జునుడు సమాధానం చెబుతున్నాడు .ఇక ఆగలేక చివరి అస్త్రంగా నారాయణాస్త్రం ప్రయోగించాడు ఇద్దరిపైనా .కృష్ణార్జునులు రథం దిగి ఆయుధాలు వదిలేసి దానికి భక్తితోనమస్కరించారు .అది వారిని ఏమీ చేయకుండా నిసఫలమై వెనక్కి వెళ్లి పోయింది .నారాయణాస్త్రం తో ఇదివరకు ఎందరినో జయించిన అశ్వత్ధామకు ఎందుకు ఇలా జరిగిందో తెలీక బుర్ర గోక్కొని వ్యాసమహ ర్షిని ప్రార్ధించాడు ఆయన ప్రత్యక్షం అవగానే కారణం అడిగాడు దానికి ఆయన పూర్వ జన్మలో మీరు చేసిన శివ పూజా ఫలితమే ఇది .కృష్ణార్జునులు మట్టితో శివలింగం చేసి పూజించి అభిషేకాలు చేశారు ..నువ్వు శివుని బొమ్మ తయారు చేసి పూజించావు .లింగ పూజ ప్రతిమ పూజ కన్నా శ్రేష్టం .అందుకే వారిని శివుని వరం వలన నారాయణాస్త్రం ఏమీ చేయలేక పోయింది -’’వారలు లింగాధిష్టా-నారూడుం గా నొనర్చి యర్చించిరి -భవ్యారాధన వరులై మును -గౌరీపతిని అతుల నియామకల్పన వెలయన్ ‘’

‘’శుభ్రమగు నుర్వి మృత్తిక సురు  చిరంపు -బ్రతిమగావించుకొని ,యందు బరము నావహించి -పూజలు  విశేషంబులెల్ల జేసి – దీవు దొలు మేన  గొలిచితి నిష్ఠ తో డ ‘’

‘’లింగంబు నందు బూజించుట -యర్చయందారాధించుట కంటే -ననేక గుణంబు లెక్కువ ‘’అని తిక్కనగారు వ్యాసునితో చెప్పించారు .అందుకే లింగ పూజ సర్వ శ్రేష్టం .

  లింగానికి అభిషేకం పుణ్యఫలం .బ్రహ్మా0డం  అండా కారం లో ఉంటుంది .శివునిశిరసు పై గంగ ,చంద్రవంక ఆయనకు చల్లదనాన్ని కల్గిస్తాయి . శివుడు కృత్తికా నక్షత్రం లో పుట్టాడు అది అగ్ని నక్షతరం . ఆయన మూడవ కన్ను కూడా అగ్ని గోళమే .అందుకని ఆవేడిని చల్లబరచటానికి ఎప్పుడూ నెత్తిన నీళ్లు పోస్తూండాలి అంటే అభిషేకం చేయాలి .ఆయన చల్లగా ఉంటె లోకాలు చల్లగా ఉంటాయి .కనుల్లనే శివలింగం పై ఎప్పుడూ నీటిధారపడే ఏర్పాటు ఉంటుంది .శివాలయం లో శివలింగానికి ఎదురుగా కూర్చున్న నంది విగ్రహం ఉంటుంది . దీని ఉచ్చ్వాస నిశ్వాసాలు శివలింగాన్ని చల్లబరుస్తాయి . మన మనసులోని కోరికలవలన మనసులు కూడా వేడెక్కుతాయి వీటిని చల్లబరచటానికి అంటే కోరికలు తీర్చుకోవటానికి అభిషేకం చేస్త్తామ్ లేక చేయిస్తాం .పంచామృతాభిషేకం అంతరాత్మ శుద్ధినిస్తుంది .ఇందులోని ఆవుపాలు జ్ఞానానికి గుర్తు .జ్ఞానప్రదాత .తేనే ఆపాత మధురం ఎక్కువ వాడితే మత్తు ఎక్కుతుంది అది విషయం వాంఛలకు ప్రతి రూపం .విషయం వైరాగ్యం కలగాలని ప్రార్ధించాలి .పంచదార అహ0కారానికి ప్రతిరూపం దాన్ని తొలగించమని ,వినయం ఇవ్వమని ప్రార్ధించాలి .ఆవునెయ్యి పాప హరణం .పాపాలను తొలగించమని కోరుకోవాలి .ఇదీ అభిషేకం లో ఉన్న అంతరార్ధం ‘’

 పుష్పదంతుడు అనే  గంధర్వరాజు  మహా శివ భక్తుడు .కామ రూపం ధరించే సిద్ధి ఉన్నవాడు .మహా సంగీత విద్వా 0సుడు .అందుకే ఇంద్రుడు ఆస్థాన గాయకుని చేశాడు .ఒక సారి భూలోకం లో కామ రూపం లో సంచరిస్తూ ఒక రాజు గారి పూలతోటలో శివ పూజకు పెంచుతున్న పుష్పాల సుగంధానికి పరవశుడై రాత్రివేళ వాటికి కోసుకు పోతున్నాడు .రాజుకు శివపూజకు పూలు చాలక నిఘా పెట్టించి పూల ల్లమొక్కల వద్ద నేలపై మారేడు దళాలను పరపించాడు .పుష్పదంతుడు రాత్రివేళ పూలు కోయటానికి మొక్కలవద్దకు వెడుతూ మారేడు దళాలను తొక్కాడు ,కైలాసం లో శివుని తపస్సుకు భంగం కలిగి అతని శక్తులన్నీ లాగేశాడు .దీనితో కాపలా వాళ్లకు పట్టుబడగా రాజు కారాగారం లో బంధించాడు .జరిగిన దానికి చింతిస్తూ శివమహిమలపై స్తోత్రం రాశాడు . అదే ‘’శివ మహిమ్న స్తోత్రం ‘’.  స్తోత్రం పూర్తికాగానే మెచ్చిన శివుడు అతని  శక్తులను మళ్ళీ ఇచ్చివేశాడు.  రాజుకు క్క్షమాపణలు చెప్పి మళ్ళీ గాంధర్వ లోకానికి వెళ్ళాడు . ఆ స్తోత్రం లో ఒక శ్లోకం చాలా తమాషాగా బాగా ఉంటుంది

‘’యత్కృత్యమ్ తన్నకృత్యం యదకృత్యం కృత్య వదాచరితం -ఉభయో ప్రాయశ్చిత్తం శివ ,తవనామాక్షర ద్వయోచ్చరితం ‘’

 భావం -శంకరా !జీవితం లో తప్పకుండా చేయాల్సిన పనులు చేయ లేకపొయాను . ఆచరించ కూడనివి తప్పనిసరిగా ఆచరించాను .ఈ రెండూ దోషాలే ,పాపాలే శిక్షార్హాలే .వాటికి పరిహారం నీ పేరులోని రెండు అక్షరాలైన ‘’శివ ‘’అనే నామం భక్తితో పలకటమే’’ అదీ శివ మహిమ అంటే .

  ఈ  వీక్లీ  ఇంతటితో సమాప్తం .

  మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -27-8-17-కాంప్-షార్లెట్-అమెరికా  ..

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వీక్లీ  అమెరికా -22 -1  (21-8-17 నుంచి 27-8-17 వరకు )

వీక్లీ  అమెరికా -22 -1  (21-8-17 నుంచి 27-8-17 వరకు )

వినాయక చవితి ,మూడవ రుద్రం వారం

21-8-17 సోమవారం -ఈ రోజు సంపూర్ణ సూర్యగ్రహణం -ఉదయం 11 గంటలకే భోజనాలు పూర్తి చేసాం .సాయంత్రం గ్రహణం వదిలినతర్వాత విడుపు స్నానం చేసాం .

‘’నాహం కర్తా -హరి కర్తా ‘’అని తిరుపతి దేవుని నమ్మిన ఆలయ పరిపాలనా దక్షునిగా భక్తులకు ఎన్నెన్నో సేవలు అందించి ముఖ్యమంత్రుల సెక్రెటరీగా ఎన్నో ప్రజాహితకార్యక్రమాలు నిర్వహించి ,ప్రధాని నరసింహారావు కార్య దర్శిగా సాహసోపేత నిర్ణయాలకు సూత్రధారి అయిన శ్రీ పత్రి  రామకృష్ణ ప్రసాద్ అంటే పి .ఆర్.కె .ప్రసాద్ మరణించారు .ఆయన సేవలగురించి మూడు నాలుగు వ్యాసాలూ నిరుడే నేను నెట్ లో రాశాను .సర్వ సమర్ధుడు అయిన ఒక మహా భక్త  శిఖామణిని  సేవకుని మరణం తీవ్రమైన లోటు.  ఆ మహామహుని ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిద్దాం .

 మా అబ్బాయి రమణ ఫోన్ చేసి సోమవారం ఉదయం లాయర్ గోవింద రాజు శ్రీనివాస్ గుడివాడలో హఠాత్తుగా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడని చెప్పాడు హై స్కూల్ లో నా శిష్యుడు మా అబ్బాయి క్లాస్ మేట్ , మా లాయర్ కూడా శ్రీనివాస్ . శ్రీనివాస్ తండ్రి అబ్బి అనే శర్మ నాకు క్లాస్ మేట్  . శీను తమ్ముడు వేణు కూడా శిష్యుడే .ఈ సోదరులు తమ తండ్రి శర్మగారి స్మారక0గా శ్రీ సువర్చలా మారుతి శతకానికి స్పాన్సర్ లు గా ఉన్న సంగతి మీకు తెలుసు .శ్రీనివాస్ఆత్మకు శాంతి కలగాలని ఆకుటుంబ0 ఈ విషాదాన్ని తట్టుకొని ధైర్యం గా ముందుకు సాగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం .

  గీర్వాణం -3 లో 427 వరకు రాశాను .

మంగళవారం -సుమారు 30 ఏళ్ళ క్రితం రామ గుండం  నుంచి మంచి చదువుకోసం ఉయ్యూరు వచ్చి హైస్కూల్ లో చేరి  నాదగ్గర ట్యూషన్ చదివిన  నా శిష్యుడు ,నా క్లాస్ మేట్ స్వర్గీయ చేవూరి సుదర్శన రావు మేనల్లుడు   వజ్రాల జస్వంత రావు ఉయ్యూరులో కనపడ్డాడని మా అబ్బాయి రమణ ఫోన్ చేసి అతని నంబర్ నాకు ఇస్తే రాత్రి  ఫోన్ చేసి మాట్లాడాను  ఆతను అంటే నాకు మంచి అభిమానం .చాలా వినయంగా ఉండేవాడు .హెవీ మెషిన్ లపై ట్రెయింగ్ ఇచ్చే ఆఫీసర్ గా రామ గుండం లో ఉన్నాడట .కాసేపు ఆ నాటి సంగతులు మాట్లాడుకున్నాం .

 గీర్వాణం -3 లో 433 వరకు రాశా . సుప్రీం కోర్ట్ మూడు సార్లు తలాక్ రాజ్యాంగ విరుద్ధమని చారిత్రాత్మక తీర్పు ఇచ్చి ముస్లిం మహిళలకు ఊరట కలిగించింది . మా బావమరిది ఆనంద్ తో మాట్లాడాం .

బుధవారం -దేవుళ్లను ‘’పులిగాపు ‘’చేసి వినాయక చవితికి సిద్ధం చేసాం ..ఫన్ బకెట్ ను అభినందిస్తూ రాస్తే వాళ్ళు ఏవైనా జోక్స్ పంపమని రాస్తే వెంటనే నేను’’ కుట్టిన’’6 జోక్స్ రాసిపంపాను . రాత్రి 2-30 వరకు ఎందుకో నిద్రపట్టలేదు శ్రీ కృష్ణ కర్ణామృతం వింటూ తర్వాత నిద్రపోయాను .

21 సోమవారం జరిగిన నంద్యాల ఉపఎన్నిక లో 80 శాతం ఓట్లు పోలయ్యాయి తెలుగు దేశమే 10 వేలనుంచి 20 వెలవరకు మెజార్టీ తో గెలుస్తుందని లగడపాటి సర్వె చేయించి ప్రకటించాడు .రాత్రి వర్షం బాగానే పడింది ..

 గురువారం -గీర్వాణం -3 లో 435 వరకు కవుల గురించి రాశా . కస్తూరి రాసిన462పేజీల  ‘’లవింగ్ గాడ్ ‘’పుస్తకం పూర్తి చేశాను . ఉయ్యూరులో కూడా వర్షాలు బాగా పడుతున్నాయని రమణ ఫోన్ చేసి చెప్పాడు .

  శ్రీ వినాయక చవితి

25-8-17 శుక్రవారం శ్రీ వినాయక చవితి -ఉదయమే లేచి మామూలు పూజ తోపాటు శ్రీ  వినాయక చవితి వ్రతం చేశాను .మా అమ్మాయి తెల్ల వారుఝామునే లేచి ఉండ్రాళ్ళు పరవాన్నం పులిహోర వంకాయ కూర ,కొబ్బరి చట్నీ ,మైసూర్ పాక్ చేసి ఉదయం 8 గంటలకు ఆఫీస్ కు వెళ్ళింది .మా అల్లుడు నిన్నరాత్రి ఇవాళ పొద్దున పిల్లలతో గణేష్ పూజ చేయించి సంస్కృత శ్లోకాలు నేర్పాడు .

  ఇక్కడ కమ్యూనిటీ సెంటర్ లలో గణేష్ విగ్రహం పెట్టుకొని సామూహిక పూజ నిర్వహిస్తున్నారు .అలాంటి ఒక పూజ’’ టాం  షార్ట్ ‘’సెంటర్ లో జరుగుతుంటే అందరం వెళ్లి నమస్కారాలు చేసి కాసేపు కూర్చుని అటునుంచి జగదీశ్, లక్ష్మి దంపతుల ఇంట్లో సాయి భజనకు వెళ్లాం . 7 గంటలకు మొదలు పెట్టి 8 కి పూర్తి చేశారు . 60 మందికి పైనే వచ్చారు నన్ను కాసేపు మాట్లాడమంటే గణేశుని ప్రశస్తి గురించి చెప్పాను ..ఆతర్వాత భోజనాలు -లడ్డూ మైసూర్ పాక్, గారే ,ఆవడ కొబ్బరన్నం పూరి  వంకాయ కూర ,కొబ్బరి చట్నీ ,పరవాన్నం వగైరా .అంతా అయి  ఇంటికి వచ్చేసరికి రాత్రి 10 30 అయింది .జగదీశ్ దంపతుల కూతురు ‘’డోలా ‘’కు ఐర్లాండ్ లో మెడికల్ కాలేజీ  సీట్ వచ్చింది .సోమవారం చేరటానికి వెడుతున్న సందర్భంగా ఈ భజన భోజనాలు . ఆడవాళ్లందరి కొబ్బరికాయ జాకెట్ స్టీల్ ప్లేట్ పళ్ళు ఇచ్చారు మా దంపతులకు ఆ దంపతులు అమ్మాయి అబ్బాయి కూడా కాళ్లకు నమస్కారాలు చేసిఆశీస్సులు అందుకొన్నారు . ఇప్పుడు నేను మాట్లాడిన విషయాల సారాంశం రాస్తున్నాను –

                        వినాయకుడు

‘’మనం ఏ కార్యక్రమాన్ని అయినాచేసేముందు ముందుగా గణపతి పూజ చేసి ప్రారంభిస్తాం ఆయన విఘ్నాలను నివారిస్తాడని  మనం అనుకొన్న పనులు నిర్విఘ్నంగా కొనసాగిస్తాడని విశ్వాసం …కానీ ఆయన వికృత మైన రూపం కలవాడు .అట్రాక్షన్ లేనివాడు. కానీ అగ్ర పూజ ఆయనకే .ఇందులో పరమార్ధం ఉంది . బాహ్య సౌందర్యం ముఖ్యంకాదు ఆ0తరంగిక సౌందర్యం ముఖ్యం అనే గొప్ప సత్యాన్ని ఆయన చాటి చెబుతున్నాడన్నమాట .పెద్ద బాన లాంటి గణేశుని పొట్ట పరిపూర్ణమైన ఈ విశ్వానికి ప్రతీక .ఏనుగుతల ,సన్ననికళ్ళు సునిశిత పరిశీలనకు  ,మేధస్సుకు సంకేతాలు .వక్ర తుండం ప్రణవం అయిన ఓం కారానికి ప్రతీక .ఏనుగు లాంటి ఆ శరీరాన్ని మోసేది అనింద్యుడు అనే చిట్టెలుక .ఇది విడ్డూరం అదే ఆత్మ .ఇంతపెద్ద మనశరీరానికి కదలిక నిచ్చేది హృదయం ఆత్మ .శరీర పరిమాణం లో దాని స్థానం ఎంతో  అత్యల్పం .అది లేనిది ఇంతటి శరీరం ఏపనీ చేయలేదు అంతటి ప్రాముఖ్యం దానిది అదే ఎలుక . అదే ఎలుక లేక మౌస్ మన కంప్యూటర్ ను ఆడిస్తుంది నడిపిస్తుంది ఇప్పుడు టచ్ స్క్రీన్ వచ్చాక మన వేలే మౌస్ గా మారింది అంతే తేడా ..

 గణపతి పొట్ట చుట్టూ నాగుపాము బెల్ట్ లాగా చుట్టు కొని ఉంటుంది . నాగుపాము శక్తికి చిహ్నం .భారత దేశం లో నాగుపాము పూజ అనాదిగా ఉంది . జంట పాముల విగ్రహాలను పూజిస్తాం నాగుల చవితికి పాలు పోస్తాం నాగ పంచమి జరుపుతాం . ఆ జంట పాములు ఇడా  ,పింగళా నాడులకు  సాంకేతికాలు ..జగత్తు అంతా  వ్యాపించిన మాయాశక్తి కూడా నాగుపాము గుర్తు ..అయన చేతిలోని పాశం అంకుశం బుద్ధిని మనసును సన్మార్గం లో నడిపించే సాధనాలు .మరో చేతిలో ఉన్నదంతం ఆయనదే .మహా భారతం రాసేటప్పుడు వ్యాసభగవానుని వ్రాయసకాడుగా గణపతి ఉండి ,తన దంతవిరిచి దానితో  తో రాశాడు . మరొక చేతిలో ఉండ్రాయి లేక వెలక్కాయ (కపిత్ధం )ఉంటుంది . ఉండ్రాయిని ‘’మోదకం’’ అంటారు -ఆనంద హేతువు. పైన గట్టిదనం ఉన్నా లోపల గుజ్జు మహా మెత్తగా తియ్యగా రుచికరం గా ఉండటం వెలగ పండు ప్రత్యేకత .గణేశుని మూడవ కన్ను జ్ఞాన నేత్రం .చేట లలాంటి చెవులు ప్రత్యేకమైనవి .భక్తుల కోరికలు ఎన్ని ఉన్నా వినటానికి అవి ఉపయోగిస్తాయి అంతే కాదు చేట తో పొల్లు తప్పా తాళి చెరిగేసి నికార్సైనమంచి దాన్ని తీయటానికి ఉపయోగపడుతుంది .అలాగే మనకోరికలలో స్వార్ధ పూరితమైనవి హానికలిగించేవాటిని వీచెరిగేసి మంచి వాటినే స్వీ కరిస్తాడని భావం మొత్తం మీద వినాయకుని ఆకారం మనం విజ్ఞానం కోసం ,త్యాగం కోసం చేయాల్సిన కృషిని బోధించే రూపం అని గ్రహించాలి

 ఆయన సౌందర్యం వినోదం ఇస్తుందేకాని సుందర రూపం కాదు .కనుక మనసు సౌందర్యమే ముఖ్యం బయటి ఆకారం కాదు అని మనకు గట్టిగా తెలియ జేస్తుంది .బాహ్య సౌందర్యానికి ,అంతరంగ సౌందర్యానికి సంబంధం లేదు అనే జ్ఞానాన్ని కలిగించటమే .అంటే జ్ఞాన బోధ చేయటమే ఆయన శరీరం లో ఈ వికృతత్వానికి గుర్తు ..సాధారణం గా మనం ఏవైనా తప్పులు చేస్తేదేవుడి ముందు  చెంపలు వేసుకొంటాం .కానీ వినాయకుని ముందు మన తప్పును ఒప్పుకొంటూ గుంజీలు తీస్తాం అంటే మనకు మనమే శిక్ష వేసుకొంటాం అని అర్ధం ఈ ఆచారం తమిళనాడులో ఎక్కువ అక్కడ గణేష్ ,మురుగన్ ఆరాధన బాగా జాస్తి .

  గణపతికి కృత యుగం లో 10 చేతులు ,సింహవాహనుడు గా ఆరాధింపబడితే ,త్రేతాయుగం 6 చేతులతో నెమలి వాహన 0తో  పూజింపబడ్డాడు.  ద్వాపరం నుంచి నాలుగు చేతులు ఏనుగు ముఖం ఎలుక రౌతు అంటే గుర్ర0 గా ఆవాహన చేయబడినాడు .పరశురాముడి ,గణపతికి జరిగిన యుద్ధం లో ఆయన గండ గొడ్డలితో ఈయన దంతాన్ని నరికేసినట్లు పురాణకథనం .చంద్రుడు అవమానిస్తే దంతం పీకి చంద్రుని పై విసిరాడనీ ఉంది .ఏక  దంతం అంటే -’’ఏక శబ్దాత్మి కా మయా తస్యం -సర్వం సముద్భవం  భ్రాతి మోహదం పూర్ణం -నానా ఖేలాత్మికమ్ కిలః ‘’ఏక అంటే మాయ -దంత అంటే నిజంగా ఉండేది .అంటే సత్తా మాత్రుడుగా  చాలాకుడు -అంటే నడిపించేవాడుగా ఆయన ప్రపంచాన్ని నడిపిస్తాడు .మాయతో ప్రపంచాన్ని నడిపించే చాలకుడు అంటే ‘’మూవర్ ‘’గణేశుడు  .

  వైష్ణవ ఆలయాలలో గణేశుని విష్ణు మూర్తిగా ,మధ్యప్రదేశ్ లో ‘’మండేసేరు ‘’ప్రాంతం లో ,కన్యాకుమారిదగ్గరున్న శుచీన్ద్రం లో ,మధుర సుందరేశ్వరాలయం లో గణపతిని స్త్రీ మూర్తిగా పూజిస్తారు .చైనా బర్మా  కాంబోడియా  మెక్సికో  అమెరికాలలో కూడా గణపతి ఆలయాలున్నాయి .’’ గాణాపత్యం ‘’అనే ఆరాధనా విధానం ఉంది . షణ్మతాలలో ఇదొక్కటి

  గణ+ఈశ -గణేశ గ అంటే జ్ఞానం ఈశ  అంటే అధిపతి అంటే జ్ఞానానికి  అధిపతి గణ అంటే ఇంద్రియాలు అని కూడా అర్ధం అంటే ఇంద్రియాధిపతి అని కూడా అర్ధం శ్రీ కృష్ణుని పరిపూర్ణ అవతారం గణేశుడు . హేరంబా -అంటే ఓ రక్షకుడా దీన రక్షకా అని అర్ధం .ఏక ద0తాః అంటే సర్వ ఉత్కృష్ట బలశాలి -శూర్పకర్ణా -చేట లంత చెవులవాడా -చెడును చెరిగేసి మంచిని ఉంచేవాడా .మనకు నాలుక బయట ఉంటుంది చెడుమాటలకు మూలమై అవతలివారి గురించి  చెడు గా మాట్లాడటం దాని లక్షణం .మనసు అనే నాలుక చివరను మనవైపే త్రిప్పి ఉంచితే ,అంటే మన దోషాలను మనమే తెలుసుకొంటే ముక్తి లభిస్తుంది. యోగులు నాలుకను ఈ విధంగా ఉంచుకొని అందులో స్రవించే అమృతాన్ని త్రాగుతూ ఏ ఆహారం లేకుండా ఎంతకాలమైనా జీవించగలుగుతున్నారు .గణపతి జిహ్వాగ్రము కంఠం వైపుకు ఉండటం ప్రత్యేకత.  అలా ఉండమని మనకు మార్గ దర్శకం చేస్తున్నాడన్నమాట .

పరశురాముడిని తన తొండం తో బంధించి సర్వ బ్రహ్మా0డ  దర్శనం చివరికి గోలోక0 లో శ్రీ కృష్ణ  దర్శనం చేయించాడు గణపతి అని బ్రహ్మ వైవర్త పురాణం ‘’గణేశ  ఖండం ‘’లో ఉంది .

శ్రీ కృష్ణ గణేశులు అభిన్నులు .అంటే వేరు వేరుకాదు ఒక్కరే .నిర్గుణ సగుణ బ్రాహ్మలు ఆయన అధిపతి . ‘’ఓం నమస్తే గణపతయే త్వమేవ కేవలం కర్తాసి ,త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి ‘’అని గణపతి అధర్వ శీర్ష కృతి చెబుతోంది .

 శ్రీ కృష్ణ దర్శనం చేసి వస్తున్న గణేశుని ధర్మధ్వజుని కూతురు తులసి చూసి తాను  నారాయణుని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకొని గణపతి కృష్ణునికి అభిన్నుడ కనుక తనను పెళ్లి చేసుకోమని కోరుతుంది .ఆ కోరిక తీరదు అన్నాడు.  అప్పుడు ‘’నీకు పెళ్లి అవుతుంది ‘’అని శపించింది ఈయన వెంటనే ప్రతిగా ‘’నువ్వు రాక్షసివై పుడతావు ‘’అని శపించాడు .బ్రతిమిలాడితే వృక్ష రూపం పొంది అందరి చేతా ఆరాధింపబడుతావు అని  విమోచనం కలిగించాడు . తర్వాత జన్మలో శంఖ చూడుడు అనే రాక్షసుని భార్య  గా పుట్టింది. రాక్షసుని ఆగడాలు మితిమీరుతుంటే శివుడు త్రిశూలంతో సంహరించాడు .తన  కళా0శం తో తులసి వృక్ష రూపం పొందింది .ముక్తికి కారకురాలైంది.  అందుకే తులసి దళాలు  గణపతి పూజకు నిషిద్ధాలు . వినాయక చవితికి మాత్రం తులసి  దళాలతో తో పూజ చేయవచ్చు . మిగిలినప్పుడు పనికిరావు . విష్ణు పూజకు తప్పని సరి  . కృష్ణ తులసి సర్వ శ్రేష్టం .

‘’గణాలలో గణపతివి  కవులకు కవి ,అన్నాన్ని సమృద్ధిగా కలవాడు   ఇచ్చేవాడు   ,అందరికంటే ముందే ప్రకటితమైనవాడు ,వేద మంత్రాలలో ప్రకాశించేవాడు అయిన గణపతికి మా నమస్కారం .మా ప్రార్ధనలు విని అన్ని శక్తులతో మా ఇంటిలోకి రావయ్యా ‘’అని గణపతిని ఆహ్వానించే మంత్రానికి అర్ధం ..

 మహారాష్ట్రలో ‘’గణపతి బప్పా మోరియా ‘’అని పాటలు పాడతారు . బప్పా అంటే తండ్రీ దేవుడా అని అర్ధం .మోరియా అంటే ఏమిటి ?దీనికి ఒక యదార్ధ కథ ఉంది 14 వ శతాబ్దం లో మహారాష్ట్ర పూనా లోని చించివాడ లో మొర్యా గోసావి ‘’అనే గణపతి భక్తుడు ఉండేవాడు ఆయనవలన సిద్ధులు పొందాడు ఆయన. ఈతని భక్తికి మెచ్చి వరం కోరుకోమంటే గణపతి పేరుతోపాటు తనపేరు కూడా శాశ్వతం చేయమని కోరాడు . అలాగే అన్నాడు.  అప్పటినుంచి గణపతిని పిలిచినప్పుడల్లా మోరియా పేరు దానికి కలపి పలకమని గణపతి శాసించాడు .అందుకనే గణపతి బప్పా మోరియా ‘అయింది .

  చిత్తూరు జిల్లాలో తిరుపతికి సుమారు వంద కిలో మీటర్ల దూరంలో కాణి పాకం లోనూతిలో వెలసిన  వరసిద్ధి వినాయకస్వయం భూ విగ్రహం ఉంది . చాలా పవర్ఫుల్ దేవుడు .ఎవరైనా అబద్ధ సాక్ష్యం ఆయన ముందు చెబితే వాళ్లకు ఏదో కీడు తప్పక జరుగుతుంది .అందుకని ఆయన ఎదుట నిలబడి నిజాన్నే చెబుతారు అబద్ధం చెప్పరు కోర్టులు కూడా ఈ సాక్షాన్ని పరిగణలోకి  తీసుకొనేవి .  ,అంటే ఇక్కడ వరసిద్ధి వినాయకుడే సుప్రీం జడ్జి అన్నమాట .ఈ గుడి ప్రక్కన ఉన్న నదికి ‘’బహుదా నది ‘’అనిపేరు .దీనికి ఒక కథ ఉంది .పూర్వం శంఖుడు ,లిఖితుడు అనే అన్నదమ్ములు కాణి  పాకం కి నడుచుకొంటూ వస్తుంటే దారిలో తమ్ముడికి ఆకలి బాగా ఎక్కువై అక్కడ కనిపించిన మామిడి తోటలో పండుకోసుకు తింటానని అన్నకు చెబితే  అడగ కుండా కోయరాదు అని అన్న చెప్పినా వినక కోసి తింటే దాన్ని రాజుగారికి  అన్న తెలియ జేస్తే రాజు అతని తమ్ముడు లిఖితుడి  రెండు చేతులు నరికించాడు చిన్నతప్పుకు ఇంతపెద్ద శిక్షా అని బాధ పడుతూ అన్న తమ్ముడిని ఓ దారుస్తూ కాణి పాకం చే రి అక్కడి నదిలో స్నానం చేయగానే తమ్ముడి చేతులు వచ్చేశాయి .బాహువులను దా  అంటే ఇచ్చిన నది కానుక బాహుదా అయింది ,కాలక్రమాన బహుదా నది అయింది’’ .

  రెండవ భాగం లో శ్రీ గౌడ రఘు దంపతుల ఇంట్లో శనివారం సాయంత్రం జరిగిన  రుద్రాభిషేకం విశేషాలు తెలియ జేస్తాను .

   సశేషం

   మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-8-17-కాంప్-షార్లెట్-అమెరికా


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 437-సమయ సార గ్రంథ కర్త -ఆచార్య కుందకుంద  (క్రీపూ 8 -క్రీశ 44 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

 437-సమయ సార గ్రంథ కర్త -ఆచార్య కుందకుంద  (క్రీపూ 8 -క్రీశ 44 )

కుంద కుందాచార్యుల అసలు పేరు పద్మనంది  .ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా కుంద కుందే  గ్రామవాసిగా భావిస్తారు . కృష్ణా నదీ తీర వాసి కృష్ణాజిల్లా వాసి అనే ప్రచారమూ ఉంది . . కనుక గ్రామనామమే ఆయన పేరు అయి ఉంటుంది .క్రీ పూ 8 లో పుట్టి 33 వ ఏట జైన మతాచార్యుడై 52 ఏళ్ళు ఆచార్యత్వం లో ఉండి  85 ఏళ్ళు జీవించి క్రీశ 44 లో నిర్యాణం చెందాడు  .రెండవ భద్రబాహు ,అర్ధబలి ,జినసేనుల సమకాలికుడు అంటారు ..బోధ ప్రహుదా లో తాను భద్ర బాహు శిష్యుడనని చెప్పుకొన్నాడు .  ఈ భద్రబాహు క్రీపూ 37-14 వరకు జీవించాడు .  జైనం లో స్వేతాంబర దిగంబర మూల సంఘానికి  నాయకుడు .  . ఆయన రాసిన గ్రంథాలు బాగా ప్రాచుర్యం పొందాయి .జైన మతాచార్యులలో మహావీరుడు ,గౌతమగంగాధరుని తరవాత స్థానం కుంద కుంద  దే . స్వయం కృషితో దిగంబర జైన దర్శనాలను సృజించిన మేధావిగా వినుతికెక్కాడు . దిగంబర జైనులు మహావీర , గౌతమగంగాధర లతోపాటు కుంద కుంద ను స్మరించి ధన్యులౌతారు . ‘’మంగళం భగవాన్ వీరో  మంగళం గౌతమమ్ గని -మంగళం కుంద కందాయ జైన ధర్మో స్తు  మంగళం ‘’ అని జైనులు స్మరిస్తారు . భద్రబాహు ,విశాఖ లకంటే ఉన్నతస్థానాన్ని కుంద కుంద కు కల్పించారు .అంతటి ప్రతిభా సంపన్నుడు . ఆయన రాసిన’’ ప్రవచన సార’’లో సత్యానికున్న రెండు పార్శ్వాలను చెప్పాడు 1-వ్యావహారన య -అంటే మొహం 2-నిశ్చయాయన అంటే పారమార్ధం లేక శుద్ధ సత్యం .

 ప్రాకృత భాషలో కుంద కుంద  రాసిన గ్రంధాలు మూడు రకాలు  -మొదటి వర్గం లోనివి -సారం కలవి -1-నియమసార -ఇందులో 187 శ్లోకాలున్నాయి 2-పంచస్తికయ సార లో 153 శ్లోకాలున్నాయి . 3-సమయసార -లో 439 శ్లోకాలున్నాయి 4-ప్రవచనసార -లో 275 శ్లోకాలున్నాయి .

రెండవ రకం లో -జైన ఆచార్యులపై భక్తిపూర్వకం గా రాసిన శ్లోకాలు ,జైన గ్రంధాలపై రాసినవి సాధకులు పాటించాల్సిన నియమాలు ఉంటాయి  -వీటినే చరిత భక్తి ఉన్న శ్లోక కదంబంఅంటారు .   .వీటిని స్వే తాంబర దిగంబర జైనులు నిత్యపూజా విధానం లో విధిగా పఠిస్తారు ,పాటిస్తారుకూడా .

మూడవ రకానికి చెందిన వాటిని ‘’ప్రభ్రత’’అంటారు -ఇందులో 8 చిన్న చిన్న గ్రంధాలున్నాయి .ఇవి  పూర్వీకులు రాసిన వాటి నుండి సేకరింపబడినవి – వీటిలో దర్శన ప్రభృతలో 26 శ్లోకాలు చరిత ప్రభృతలో 44 ,సూత్ర ప్రభృత లో 27 శ్లోకాలు అలాగే మిగిలినవాటిలోనూ ఉన్నాయి .అనేక జైన గ్రంధాలలో కుంద కుందా చార్య 84 ‘’పాహుర్ ‘’లు రాసినట్లు ఉంది .కానీ అన్నీ లభ్యం కాలేదు .

  సశేషం

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-8-17- కాంప్-షార్లెట్-అమెరికా

Inline image 1– Inline image 2

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 436-ఖేట కౌతుకం కర్త -అబ్దుల్ రహీం ఖాన్ ఎ -ఖానా (`1556-1627)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

436-ఖేట కౌతుకం కర్త -అబ్దుల్ రహీం ఖాన్ ఎ -ఖానా (`1556-1627)

అక్బర్  నవరత్న మంత్రులలో ఒకడైన  కవి అబ్దుల్ రహీం ఎ -ఖానా 1556 లో జన్మించి 1627 లో మరణించాడు .ఉర్దూ  ద్విపదలకు ఖగోళ శాస్త్ర గ్రంధానికి ఆయన మారుపేరు సంస్కృతం లో రెండుగ్రంధాలు రాసిన వైదుష్యం కూడా ఆయనది .ఆయన పుట్టిన ఊరు ఖాన్ ఖానా గా ప్రసిద్ధమైంది .ఇది పంజాబ్ రాష్ట్రం లో నవాన్  షాహి జిల్లాలో ఉంది . అక్బర్ కు నమ్మకస్తుడు ,మార్గదర్శి అయిన బైరం ఖాన్ కు రహీం కొడుకు .ప్రవాసం నుండి బయట పడి  ఇండియా వచ్చిన హుమాయూన్ తన రాజోద్యోగులను జమీందార్ల కూతుళ్లను పెళ్లి చేసుకోమని హుకుం ఇచ్చాడు .తానూ హర్యానాలోని మేవత్ జమీందార్ జమాల్ ఖాన్ పెద్ద కూతుర్ని పెళ్ళాడి తే ,బైరం ఖాన్  చిన్నకూతురును పెళ్లి చేసుకొన్నాడు .బైరం ఖాన్ కు ,జమాల్ ఖాన్ కూతురైన భార్యకు పుట్టిన వాడే రహీం . .గుజరాత్ లోని పాఠన్ యుద్ధం లో భైరం ఖాన్ చనిపోయాక ,ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ కు తీసుకొని రాబడ్డాడు .తర్వాత అక్బర్ కొలువులో రహీం మంత్రి అయ్యాడు .మీర్జాఖాన్ అని పేరుపెట్టారు .రహీం మారుటి తల్లి సలీమా సుల్తాన్ బేగం, కజిన్ అయిన అక్బర్ ను పెళ్లాడింది .అక్బర్ కు  రహీం  ఈ విధంగా కొడుకు వరుస అయ్యాడు  .తన నవరత్న మంత్రులలో ఒకనిగా అక్బర్ రహీం ను చేశాడు .

 రాణా ప్రతాప్ ముస్లిం మహిళలకు రక్షణ కల్పించటం రహీం పై ప్రభావం కలిగించి  ముస్లిం అయినా రహీంఖాన్శ్ కృష్ణ భక్తుడు అయి ఒక కావ్యం రాసి అంకితమిచ్చాడు.దాతృత్వం లో రహీం చేతికి ఎముక ఉండేదికాదు .దీన్ని తులసీదాసు గమనించి కవిత్వం లో బంధించాడు .రహీం ఇద్దరు కొడుకులను అక్బర్ కొడుకు జహంగీర్ అక్బర్ మరణం తర్వాత తాను  చక్రవర్తి అవటానికి అడ్డు వస్తున్నారని భావించి చంపేశాడు .

  రహీంఖాన్ సంస్కృతం లో 1-ఖేట కౌతుకం 2-ద్వాత్రి0శద్యోగావళి కావ్యాలు రాశాడు .ఉర్దూలో లెక్కలేనన్ని దోహాలురాశాడు . బాబర్ జ్ఞాపకాలైన బాబర్ నామా ను పర్షియన్ భాష లోకి అనువదించాడు .రహీం సమాధి మధుర వెళ్లే దారిలో నిజాముద్దీన్ కు తూర్పున హుమాయూన్ సమాధిప్రక్కన ఢిల్లీలో ఉంది .దీన్ని 1598 లో రహీం తన భార్య కోసం  కట్టిస్తే ,1627 లో అందులో రహీం పార్థివ దేహాన్ని పెట్టారు .జహంగీర్ చక్రవర్తిగా సలీం సింహాసనం ఎక్కినప్పుడు అతనివద్దకూడా రహీం మంత్రిపదవి నిర్వహించాడు

 సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-8-17 -కాంప్ -షార్లెట్-అమెరికా

Young Abdul Rahim Khan-I-Khana being received by Akbar, Akbarnama.jpg

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

దేవులపల్లి రామానుజరావు

clip

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 435-’’దేవాలయస్య దీప’’ కర్త -పద్మశ్రీ నహీద్ అబీది (1961)

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3

435-’’దేవాలయస్య దీప’’ కర్త -పద్మశ్రీ నహీద్  అబీది  (1961)

1961 ఉత్తర ప్రదేశ్ మీర్జాపూర్ లో ముస్లిం జమీందారీ కుటుంబం లో నహీద్ ఆబిదీ జన్మించింది . సంస్కృతం  అభిమాన విషయంగా గా తీసుకొని కమలామహేశ్వరి కాలేజీ నుండి డిగ్రీని ,మీర్జాపూర్ కె వి డిగ్రీ కాలేజీ నుంచి ఏం ఏ డిగ్రీ సాధించింది .అడ్వొకేట్  ఇహ్తేషామ్ ఆబిదీ ని వివాహం చేసుకున్నాక దంపతులు వారణాసి లో కాపురం పెట్టారు .. మహాత్మా గాంధీ కాశీ విద్యా పీఠ్ నుంచి పి హెచ్ డి  పొందింది .ఆమె ధీసిస్ ‘’వేద సాహిత్యం లో అశ్వినుల రూపం ‘’రాసి ప్రచురించింది

 2005 లో బనారస్ హిందూ విశ్వ విద్యాలయం లో చేరి ,జీతం లేకుండా లెక్చరర్ గా పని చేసింది .తర్వాత మహాత్మా గాంధీ కాశీ విద్యా పీఠ్ లో రోజు వారీ వేతనం పై పార్ట్ టైం లెక్చరర్  చేసింది .సంస్కృత లెక్చరర్ గా పని చేసిన మొట్టమొదటి ముస్లిం సంస్కృత విద్యా వేత్తగా   రికార్డ్ పొందినా ,ఉద్యోగం లో వివక్షతకు గురై ఇబ్బందిపడింది   2008 లో మొదటిపుస్తకం ‘’సాంస్క్రిట్ సాహిత్యమే రహీం ‘’ సంస్కృత సాహిత్యం లో లోతులు తరచిన అబ్దుల్ రహీం ఖాన్ -ఏ ఖానా పై రాసింది .తర్వాత పుస్తకం మీర్జా గాలిబ్ రాసిన ‘’చైరాగ్ ఏ ధైర్ ‘’ను సంస్కృతం లో ‘’దేవాలయస్య దీప ‘’గా అనువాదం చేసింది . మూడవ పుస్తకం 50 ఉపనిషత్తుల ను మొగల్ యువరాజు దారా షికొ పర్షియా భాషలోరాసినదానికి    హిందీ అనువాదం ‘’సిర్ర్  ఏ అక్బర్ ‘’. దారా  పెర్షియన్ భాషలో అనువదించిన వేదాంత గ్రంధానికి , దారా రాసిన సూఫీ గ్రంధాలకు హిందీ అనువాదం చేసింది . నహీద్  అబీదీ  భర్త , పిల్లలతో కాశీలోని శివపురిలో కాపురం ఉంటోంది .

  నహీద్ సంస్కృత సేవను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆమెకు 2014లో పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసి సన్మానించింది .లక్నో యూనివర్సిటీ ‘’డి .లిట్ .ఇచ్చి గౌరవించింది .సంపూర్ణానంద సంస్కృత విశ్వ విద్యాలయం ఆమెను ఎక్సి క్యూటివ్ కౌన్సిలర్ ను చేసి0ది .ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం డా నహీద్ అబీదీ  కి ‘’యష్ భారత్ ‘’పురస్కారమిచ్చి 11 లక్షల నగదు  అంద  జేసింది . 2007లో రాష్ట్రపతి డా అబ్దుల్ కలాం ఆమెను రాష్ట్ర పతి భవనానికి ఆహ్వానించి సత్కరించారు .

 సశేషం

  వినాయక చవితి శుభా కాంక్షలతో

  మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -24-8-17 -కాంప్-షార్లెట్-అమెరికా

Image result for dr nayeed abidi
Image result for dr nayeed abidiImage result for dr nayeed abidi


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 434 -విషాద లహరి కర్త -కవి చక్రవర్తి ద్విభాష్యం విజయ సారధి (1936

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

434 -విషాద లహరి కర్త -కవి చక్రవర్తి ద్విభాష్యం విజయ సారధి (1936

10-3-1936 న శ్రీ భాష్యం నరసింహాచార్య ,గోపమాంబ దంపతులకు శ్రీ విజయ సారధి వరంగల్లు లో జన్మించారు .తల్లి ,అమ్మమ్మ గానం చేసే జయదేవుని అష్టపదులు సంస్కృత శ్లోకాలను వింటూ ఆభాషపై అభి రుచి  సంగీతం పై మమకారం పెంచుకొన్నారు .వరంగల్ శ్రీ  విశ్వేశ్వర సంస్కృతాంధ్ర కళాశాలలో చదివి ఉత్తీర్ణులై అక్కడే ఉపన్యాసకులుగా చేరి విద్యా బోధనచేశారు .వీరి ముఖ్య శిష్యులు శ్రీ అష్టకాల నరసింహ శర్మ ,డా శ్రీ కె. కోదండ రామాచార్యులు .విద్యార్థిగా ఉన్నప్పుడే ‘’మనోరమ ‘’నవల రాసి తోటి విద్యార్థులకు చదివి వినిపిస్తూ విశ్లేషణ చేసి చెబుతూ బెనారస్ లోని ముకుంద భట్టాచార్య ,మల్లావఝల సుబ్బరామశాస్త్రి  కారపాత్ర స్వామి ,పశుపతినాథ శాస్త్రి వేదాల తిరువెంగళా చార్య వంటి సంస్కృత ప్రకాండుల మన్ననలు అందుకొన్న ప్రజ్ఞానిది .కాశీ ,కాశ్మీర్ విద్యా పీఠ పండిత ప్రశంసలూ పొందారు .వాగ్వాదినీ సరస్వతి వీరికి సుప్రసన్నురాలు

  1980 లో కలకత్తా సంస్కృత విద్వత్సభలో విజయసారధి గారు ‘’ఆకతి  మందాకినీ ,చకతి మందాకినీ-తకతి మందాకినీ మధురేణ  పూరేణ -చలతి మందాకినీ ,జలతి  మందాకినీ

సలతి మందాకినీ  విమలేన సలిలేన’’అంటూ కావ్యగానం చేసి దాతు ప్రయోగవైచిత్రికి భావజాలానికి పండితప్రకాండులను మంత్ర ముగ్ధులను చేసి మందాకినీ నదిసోయగాలను  కనుల  ముందు నిలబెట్టారు .దీనికి పరవశించి మహా మహోపాధ్యాయ తర్క వాగీశ భట్టా చార్య –

‘’యుగ కర్తా -యుగో ద్ధర్తా -చక్రవర్తీ యుగస్యచ -సరస్వతీ సుతోత్తంసః -జీయాత్ విజయ సారథిహ్ ‘’అని మనః పూర్వకంగా ఆశీర్వదించి  విజయ సారధిగారు రాసే ప్రతి రచనలోనూ ఈ ఆశీర్వాద శ్లోకాన్ని ముద్రించమని అనునయ శాసనం చేశారు .సభలోని పండిత వరేణ్యులు కరతాళ ధ్వనులతో ఆ ఇద్దరినీ అభినందించారు .

శ్రీ భాష్యం వారు జ్యోతిష ,వాస్తు అలంకార ,వైదిక మంత్రార్ధ వివరణ లపై గొప్ప  గ్రంథాలు రాశారు .రాజకీయ నాయకులపై ‘’విషాద లహరి ‘’రాశారు .అందులో

‘’సాధూన్ దీన దరిద్ర భారత జవాన్ మాయావినో నాయకాః -సమ్మే ళేషు మృషాదయోక్తి  కుశలాస్తాన్ పఞ్చయిత్వా పరం ‘’

‘’సంచిస్వంతి లోక రాజ్య పరిషత్ స్థానాన్య నూనాని భోహ్ -కష్టం ప్రాప్త మనన్యవార్య మధునా శంభాలాయైనాన్ ప్రభో ‘’

భారత్ సైనికుల త్యాగనిరతిని -’’యస్య శక్తి ర్మహా కాళరాత్రి -విభీత భారత పాలన దీక్షితౌ బభూవ

పరమ భారత స్వాతంత్య్ర  సమరవీర -వివిధ సైనిక  నికురంబ మానతోస్మి ‘’అని శ్లోకం తో వారి త్యాగానికి జేజేలు పలికారు

‘’రూప సూక్తం ‘’లో రూపాయ మహిమ వర్ణిస్తూ -’’అక్షరాన జ్నోపి ,సేవ్యాయతే కోపి -అక్షరాభి జ్నోపి సేవకీయతి  కోపి ‘’అని చమత్కరించారు -అంటే అక్షరజ్ఞానం లేకపోయినా డబ్బూ ,పదవీ ఉంటె మనిషి పూజింపబడుతున్నాడు /అక్షరజ్ఞాని ఉద్యోగం లో సేవాకా వృత్తి చేస్తున్నాడని వ్యంగ్యం .

 భగద్రామానుజా చార్యుల   సుందర రూపం మధురమానసం ,మాట వైదగ్ధ్యాలను వర్ణిస్తూ –

‘’జయతి భువన దీప సంహృతార్తాను తాపాహ్  -నియమ ధృత వికారో నిశ్చి ఠామ్నాయ సారః –

ప్రియా వచన వితానః   ప్రీత సూరి ప్రతాపః -స్మయహర  యతి వర్యస్వామి యతి రామానుజార్యహః  ‘’అని శ్లోకం చెప్పారు . భావ జాలం తరుముకొస్తూ ఉంటె కొన్ని వేల  శ్లోకాలు రాసి సరస్వతీ కంఠాభరణం చేశారు శ్రీ భాష్యం విజయ సారధిగారు .

మనోరమ తోపాటు సుశీల నవల ,దంభ  యుగం ప్రహసనం ,ఆర్ష భారతి ఏకాంకిక ,అమర సందేశహ్  నాటకం ,రామ ,రామానుజ ,రఘునాధ దేశిక ఉదాహరణ కావ్యాలు ,11 సుప్రభాతాలు ,ప్రహేళికలు వంటివి ఎన్నో రాశారు .అముద్రిత గ్రంధాలూ చాలా నే ఉన్నాయి .

   శ్రీ బొమ్మ వెంకటేశ్వర్ ఇచ్చిన స్థలం లో ‘’సర్వ వైదిక సంస్థానం ‘’అనే సంస్థను స్థాపించి యజ్ఞ వరాహ స్వామి ,రత్నగర్భ గణపతి ,రమాసహిత సత్యనారాయణ స్వామి,అనంత నాగేంద్ర స్వామి ,వసుధా లక్ష్మి  నవ దుర్గ ,వాగ్వాదిని సరస్వతి ,అభయ ఆంజనేయస్వామి లతో ఒక గొప్ప దేవాలయాన్ని నిర్మించి ‘’సంగచ్చ్ధధ్వగమ్ ,సంవద ధ్వగమ్ ‘’అంటూ సర్వమత సామరస్యాన్ని ప్రబోధించారు శ్రీ భాష్యంవారు . ఈ పుణ్య ప్రాంగణం లో శ్రీరామాయణ మహా క్రతువు ,చతుర్వేద హవనం ,ప్రజాపత్య విజయం ,సారస్వత ,రక్షోఘ్న వంటి ఇష్టులు ,క్రతువులు ఎన్నెన్నో నిర్వహించి ఆస్తిక జనములకు మార్గ దర్శనం చేస్తున్నారు

 వీరి సాహిత్య ధార్మిక సేవకు సాహిత్య అకాడెమీ ,తెలుగు విశ్వ విద్యాలయం బిర్లా ఫౌండేషన్ వంటి ప్రసిద్ధ సంస్థలు పురస్కారాలు అందజేసి సన్మానించాయి .తమ విద్వత్తుకు నీరాజనంగా ‘’కవి చక్రవర్తి ‘’,మహాకవి ,వాచస్పతి ,వైదిక కర్మానుష్టాపనా చార్య మొదలైన బిరుదులూ అందుకున్నారు . ఈ ఏడాది ఆగస్టు 15 న భారత స్వాతంత్ర దినోత్సవం నాడు సరస్వతీ సమార్చనా తత్పరులు  జ్ఞా వయో వృద్ధులు శ్రీ భాష్యం విజయ సారధి మాన్య మహోదయులను తెలంగాణా ప్రభుత్వం ఘనంగా సత్కరించి గౌరవించింది .

‘’కవి మూర్ధన్యుడు పండిత ప్రముఖుడై కావ్యాశు సంక్రీడ ,వాగ్భవ కూలంకష గీష్పతి ప్రతిభుడున్  గైర్వాణ వాణీ ప్రభా –

ప్రవరుండవ్యయ భావుడున్ విజయ సారధ్యాహ్వయు డున్నేడు తా-స్టవ నీయు0 డయె ముఖ్య మంత్రి కర కంజ స్నాతుడై   వెల్గెడున్ ‘’(అష్టకాల నరసింహ శర్మ )

 సశేషం

  ఆధారం -20 17 సెప్టెంబర్ దర్శనం -మాసపత్రికలోడా.  శ్రీ కె .కోదండ రామాచార్యుల ‘’సంస్కృత విజయ కేతనం శ్రీ భాష్యం ‘’వ్యాసం

   వినాయక చవితి శుభా కాంక్షలతో

 మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -24-8-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వినాయక చవితి శుభాకాంక్షలు

సాహితీ బంధువులకు 25-8-17 శుక్రవారం శ్రీ వినాయక చవితి శుభాకాంక్షలు -దుర్గాప్రసాద్

Inline image 1– Image result for ganesh chaturthi greetings in telugu

Image result for ganesh chaturthi greetings in teluguInline image 2
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

విప్లవ విజ్ఞుడు వేద విదుడు -దాశరధి రంగా చార్య

clip

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

హాస్యపు ఉండ్రాళ్ళు

హాస్యపు ఉండ్రాళ్ళు

              పొద్దున్నే వినాయక చవితి పూజ ఏర్పాట్లు చేసుకొ0టు ఉండగా మా బావ మరిది ”బ్రహ్మం ”ఏదో కొంప మునిగి పోయినట్లు హడావిడి పడుతూ వచ్చాడు .ఏరా ఏమిటి కధ అన్నాను .కదేమిటి బావా నువ్వు సహకరించాలి కాని అందరికి హాస్యపు  సుధ పంచాలని వచ్చాను అన్నాడు .సుధ  ఏమో కాని వ్యధ పంచిపెడ తావేమోనని బాధ అన్నా .మూతి బిగించి వాడు” అదే నీతో వున్న చిక్కు .బావమరిదిని కదా నన్ను ఎంకరేజ్ చెయ్యవ్ .ఎప్పుడూ ,నీ పేరు ,ప్రఖ్యాతులేనా మేమూ వున్నాం బాబూ .మమ్మల్నీ కనిపెట్టాలి” అన్నాడు నిష్టూరం గా .సరేరా అసలు విషయం ఏమిటి అడిగాను .వాడు”.ఇవాళ వినాయక చవితి కదా సాయంత్రం ఒక సాహితీ సభ జరుగు తోంది.  అందులో నన్నూ పాల్గొనమని కబురు చేశారు .నీకు వేరే ప్రోగ్రాం ఉందటగా .నీ బదులు నేనట” .”ఇంతకీ ఏమిటి ప్రోగ్రాం ?అన్నాను .”హాస్యం వండి వడ్డించాలి  .మనకు ఎప్పుడు అలవాటు లేదాయే .నువ్వున్నావనే ధైర్యం తో ఒప్పుకొన్నాను బావా నీవే తప్ప  ఇతః  పరంబెరుగ ”ఆన్నాడు  బేలగా ,పీలగా .”సరేరా .నువ్వెంతవరకు రాశావు ?” అని అడిగా .వెంటనే ఒక చిట్టా జేబులోంచి తీసి చేత్తో పట్టుకొన్నాడు .”బావా -ఈ మధ్య కొన్ని కంపెనీలు యాడ్  ల   కోసం రాయమనే పేపర్ ప్రకటన చూసి కొంత రాశా” .”పంపావా” అని అడిగాను .”పంపాను తిరుగుటపా   లో వచ్చేశాయి”అన్నాడు కూల్ గా .అర్ధమైంది వాడి పరిస్థితి . రోట్లో తలపెట్టేశాగా . ఇంక రోకటి పోట్లకు వెరవటం ఎందుకు ?.సరే చిట్టా విప్పమన్నాను .”బావా నవ్వద్దు .ఎంకరేజ్ చెయ్యి బావా .మర్రి చెట్టుకింద మొక్కను చేసి నన్ను పెరగకుండా  ఎదగనీయకుండా చేస్తున్నావు  ” అని మళ్ళీ  గగ్గ్గోలు .సరే కానిమ్మన్నాను

     పోటాష్ తయారు చేసే కంపనీ కి ఒక స్లోగన్ రాశా .విను అన్నాడు .ఒదులు అన్నా.”వాడండి మీ చేలకు పోటాష్ -లేకుంటే మీరు అవుతారు మటాష్ ”అని చదివాడు .నోర్ముయ్యి ”కామోష్” అన్నా భరించలేక .ఇంకోటి చూడు .”అవతలి వాడి ప్రతిభ అంటే నీకు ఈర్ష బావా మొదట్నించీ” .అని, రెండోది చెప్పాడు ”వినాయక చవితికి ఉండ్రాళ్ళు -తింటే బిడ్డలను కంటారు  గొడ్రాళ్ళు  ”అన్నాడు .”రాళ్ళతో ఊడగోడ్తారు నీ ముప్ఫయి రెండు పళ్ళు ” అన్నాను.  .కొంచెం చిన్న బుచ్చుకొని మూడోది లంకించుకొన్నాడు .”పెరిగింది పెరిగింది అవినీతి –నీతి అతిగా  పెరిగితే వచ్చేదే అవినీతి ”అని చల్లగా వినిపించాడు ”.నీ మతి మండితే వచ్చేదే ఈ కపి నీతి ”అని అడ్డకట్ట వేశాను .సరే ఇంకోటి విడుస్తా విను అన్నాడు .”నీకున్న సిగ్గు లజ్జా వదులు చాలు అదే పెద్ద హాస్యం”  అన్నా.వాడు ఊరుకోంటాడా ?
”అన్నా హజారే –అరె అరె -దేశం బేజారే-ఆయన మాట అంటే జీ హుజూరే –దేశానికి ఆయన ఒక కొత్త వజీరే ” అన్నాడు .కొంచెం దగ్గిరికి వచ్చావురా అన్నా .బావా నువ్వు అండ గా వుంటే చెలరేగుతాచూడు   అన్నాడు .”అంత చెలగాటం వద్దు నాయనా” అని సర్ది చెప్పా .”నాగం గురించి ఒకటి రాశా” అన్నాడు . ”సరే విడు” అన్నా ”అన్నా నాగం -నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆగం –నీతో కష్టం వేగటం -మీ ఆవిడ యెట్లా భరిస్తోందో నీ  ఆగడం ”పర్లేదు కానీ ”అని ఉత్చాహ పరిచాను .”అందరి మీదా కాలు దువ్వె కే.సి ఆర్.–కిక్కురు మనకుండా వున్నావేమిటి యార్ ”ఒరే దవడ పగలగోడతారు  టేక్ కేర్”   అని వారించాను .సరే .”ఉద్యోగుల సమ్మె మళ్ళీ వాయిదా –వాళ్ల కేమి పోయింది ఫాయిదా ”అన్నాడు ”అర్ధం ఏమిటీ ”అన్నాను .”ఏదో ప్రాస కలిసింది కదానని వాయించా ”అన్నాడు .”నిన్ను వాయించేస్తారు ఖాయలా పడతావు ”అన్నాను .”పాలైతే నువ్వు జైలు –ఎవడో ఇప్పించక పోడు  బెయిలు ”- వహ్వా వహ్వా అన్నా.వాడు యెగిరి గంతేశాడు .”పావలాకే పంట ఋణం –అదీ పండితే గా తీర్చేది ఋణం ”భేష్ అన్నాను ..మా వాడు రెచ్చిపోయాడు .”మన్యాన్ని ఒణి కిస్తున్న డెంగ్యు –చెయ్యాలి దానితో కుస్తీ  కుంగ్ ఫ్యూ ”సెహబాష్ అన్నాను .”అవినీతి లో ఆఫీసర్ బీల –దొరికి పొతే అయాడు  బేల .”ఇంకా వుంది నీ కడుపు లోకక్కెయ్యి అన్నా ..”అవినీతి వర్గం పై  ఉమ్మేయ్యి  అన్నాడొకడు –తీరా ఉమ్మేస్తే పడేది వాడిమీదే  కదా అన్నాడు ఇంకోడు  ” —
”తెలుగును ఉద్ధరించాలి మనం – కానీ రోజూ పెడుతున్నారు ”దినం -తద్దినం -ఇదే మన ఖర్మ -ఎవడో రావాలి శర్మ ”. దారిలో పడ్డాడు మా వాడు అని లోపల కొంత సంతోషం .బయటికి అంటే మరీ రెచ్చిపోతాడని వూరుకొన్నాను .”గణపతి విగ్రహాలకు వాడండి మట్టి –లేకుంటే పర్యావరణం  నోట్లో మట్టి ”అని చదివాడు .ఇంక ఆపక పొతే చంపేస్తాను నీ నోరు కుట్టి  మరీ  నిన్ను కొట్టి కొట్టీ ” .అని వాడి హాస్య ప్రయత్నానికి పెట్టించాను ఫుల్ స్టాప్ .పాపం బిక్క మొహం తో వెళ్లి పోయాడు వాడు . కనీసం వెళ్తానని చెప్పకుండా వాళ్ల అక్కతో కూడా మాట్లాడకుండా .
రాత్రి లోకల్  ఛానల్ లో మా బావ మరిది ”హాసపు ఉండ్రాళ్ల ”కు  ప్రధమ బహుమతి వచ్చింది అని చూశాను , విన్నాను .అంటే తెలుగు హాస్యం ”యెంతబాగా” వృద్ధి చెందిందో నని   బాధ పడ్డాను .
ఇది చదివి నవ్వు రాక పొతే తప్పు  నాది కాదు  –.నవ్వక పొతే తప్పు మీదే   .
             వినాయక చవితి   శుభా కాంక్షలతో –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –01 -09 -11 .
  దీన్ని ఈ వినాయక చవితికి” దుమ్ము దులిపి” మీకు పంపిస్తున్నాను . దుమ్ముకు తుమ్ములు వస్తే బాధ్యత నాదికాదు -దుర్గాప్రసాద్ -23-8-17 -కాంప్-షార్లెట్-అమెరికా

:–Inline image 1

Posted in రచనలు | Tagged | Leave a comment

ముస్లిం మహిళల విజయం-భూమి

ముస్లిం మహిళల విజయం

ముమ్మారు ‘తలాఖ్’ చెప్పడం ద్వారా భర్త భార్యకు విడాకులిచ్చే సంప్రదాయం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పు చెప్పడం చారిత్రక శుభ పరిణామం. పురుషాధిక్య దుష్ప్రభావగ్రస్తులైన ముస్లిం మహిళలకు విముక్తి కలిగించగల సామాజిక విప్లవం! ఇస్లాం మత రాజ్యాంగ వ్యవస్థలున్న అనేక ఇతర దేశాల్లో సైతం మత విరుద్ధమైన ఈ ‘ముమ్మారు తలాఖ్’- ట్రిపుల్ తలాఖ్- సంప్రదాయం సర్వమత సమభావ వ్యవస్థ కల మనదేశంలో ఇంతకాలం కొనసాగడం సామాజిక, జాతీయ వైపరీత్యం. ఈ వైపరీత్యాన్ని మంగళవారం నాడు తొలగించడం ద్వారా సర్వోన్నత న్యాయస్థానం రాజ్యాంగ ధర్మాసనం సభ్యులు సామాజిక సమానత్వాన్ని మరోసారి ధ్రువీకరించారు. ఈ సామాజిక సమానత్వం ఇస్లాం మతస్థులలో స్ర్తి, పురుష వివక్షను దూరం చేయడానికి దోహదం చేయగలదు, సామాజిక న్యాయసాధనకు మార్గం కాగలదు. ధర్మాసన స్థితులైన న్యాయమూర్తులు కురియన్ జోసెఫ్, ఆర్‌ఎఫ్ నారీమన్, యుయు లలిత్ ‘ట్రిపుల్ తలాఖ్’ పద్ధతి తక్షణం రద్దు కావాలని చెప్పిన తీర్పుతో ధర్మాసన అధ్యక్షుడైన ప్రధాన న్యాయమూర్తి జెఎస్ కేహర్, ఎస్ అబ్దుల్ లతీఫ్ కొద్దిగా విభేదించడం దురదృష్టకరం. ఆరునెలల వరకూ యథాతథస్థితి కొనసాగాలని ఈలోగా కేంద్ర ప్రభుత్వం ఈ విషయమై సమగ్రమైన చట్టం చేయాలన్నది ‘విభేదించిన’ న్యాయమూర్తుల అభిప్రాయం. కానీ అల్పసంఖ్యాక మతవర్గాలకు రాజ్యాంగం కల్పిస్తున్న ప్రత్యేక అధికారాల దృష్ట్యా ఇన్నాళ్లుగా ప్ర భుత్వాలు ఇలాంటి చ ట్టాలను చేయలేకపోవడం ముస్లిం మహిళలకు శాపంగా మా రిందనడం నిరాకరింపజాలని నిజం. రాజ్యాంగం ని ర్దేశిస్తున్న ‘ఉమ్మడి పౌరస్మృతి’ని ఇంతకా లం రూపొందించలేక పోవడానికి కారణం ప్ర భుత్వ రాజకీయ నిర్వాహకుల ఘోరమైన నిర్లక్ష్యం. ‘ఉమ్మడి పౌర స్మృతి’నే రూపొందించలేని వారు ముస్లిం వ్యక్తిగత, మత సంప్రదాయాలలోని లోపాలను సవరించే సాహసం చేయలేరన్నది బహిరంగ రహస్యం! అందువల్ల న్యాయ ప్రమేయం ద్వారా తప్ప ప్రభుత్వాల చొరవ వల్ల ఇస్లాం మహిళలకు న్యాయం జరగదన్నది ధ్రువపడిన వాస్తవం. దశాబ్దుల తరబడి వేలాది ముస్లిం మహిళలు ఈ ఘోరమైన ‘ట్రిపుల్ తలాఖ్’ అన్యాయానికి బలైపోయారు. ప్రభుత్వాలు వౌన ప్రేక్షకపాత్ర వహించడం తప్ప చేసింది లేదు. మహిళల హక్కుల ఉద్యమ నేతలు, మహిళా సాధికార సాధన సంస్థలు, సామాజిక దురాచార వ్యతిరేక సంఘర్షణలు- వీరందరికీ కూడా ముస్లిం మహిళలకు జరిగిన అన్యాయం గురించి పట్టకపోవడం ‘నకిలీ సర్వమత సమభావాని’కి సాక్ష్యం, ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం. ఇస్లాం మత వౌలిక సూత్రాలకే విరుద్ధమని పలువురు విద్వాంసులు ప్రచారం చేసిన ‘ట్రిపుల్ తలాఖ్’ స్వతంత్ర భారత్‌లో ఏడు దశాబ్దుల పాటు ఇస్లాం మహిళలను ఏడిపించడం మానవీయతకే కళంకం! ఈ కళంకం ఇప్పుడు గతం, ముగిసిన పీడకల..
‘ట్రిపుల్ తలాఖ్’ ద్వారా ఇస్లాం మతస్థురాలైన మహిళకు ఆమె భర్త విడాకులివ్వడం ఆ మహిళల ప్రాథమిక రాజ్యాంగ అధికారాల- ఫండమెంటల్ రైట్స్-కు భంగకరమన్నది సర్వోన్నత న్యాయ నిర్ణయం. ఈ హక్కులకు డెబ్బయి ఏళ్లుగా భంగం కలగడం ప్రజాస్వామ్య వ్యవస్థకు సిగ్గుచేటైన కఠోర వాస్తవం. స్ర్తి, పురుష సమానత్వం గురించి మహిళల సాధికారత గురించి ఉద్యమకారులు, ఉద్యమకారిణులు చేసిన దశాబ్దుల పోరాటాల ఆర్భాటాల పరిధిలో ఇస్లాం మహిళలు లేరు. సర్వోన్నత న్యాయస్థానం 2015 అక్టోబర్ 16న ఈ ‘ఇస్లాం మత వ్యతిరేక’ ట్రిపుల్ తలాఖ్‌లోని ఔచిత్యం పట్ల అనుమానాలు వ్యక్తం చేసే వరకూ సమాజంలో కదలిక రాలేదు! ‘ట్రిపుల్ తలాఖ్’ పద్ధతిని సమీక్షించడానికై సర్వోన్నత న్యాయస్థానం తనంతట తానుగా- సూయోమోటో- ప్రజాహిత వ్యాజ్యాన్ని నమోదు చేసింది, విచారణ చేపట్టింది. దీని తరువాత మాత్రమే ఉద్యమకారులకు ధైర్యం వచ్చింది, ‘టిపుల్ తలాఖ్’ను వ్యతిరేకించాలన్న ధ్యాస కలిగింది. ‘ట్రిపుల్ తలాఖ్’కు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో వాదించడం కూడ రాజకీయాల్లో వచ్చిన విప్లవ పరివర్తన- రెవల్యూషనరీ ఛేంజ్-కు నిదర్శనం. కేంద్ర ప్రభుత్వ విధానం మంగళవారం నాటి సుప్రీం కోర్టు తీర్పు వల్ల న్యాయమైనదని, సమంజసమైనదని ధ్రువపడింది. తీర్పు వెలువడిన తర్వాత సుప్రీం కోర్టుకు మాత్రమే కాక, కోర్టులో ‘ట్రిపుల్ తలాఖ్’ను వ్యతిరేకించిన ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి ముస్లిం మహిళా సంఘాల ప్రతినిధులు కృతజ్ఞతలు చెప్పడం పరివర్తన క్రమంలో వర్తమాన ఘట్టం..
సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం చెప్పిన తీర్పు ఇంతకాలం ‘అక్రమ సంతుష్టీకరణ రాజకీయాల’ను నిర్వహించిన అనేక జాతీయ, ప్రాంతీయ రాజకీయ పక్షాలకు కనువిప్పు! షాబానో అనే ముస్లిం మహిళకు విడాకులిచ్చిన ఆమె భర్త ఆమెకు జీవనభృతి చెల్లించాలని 1980వ దశకంలో సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఈ తీర్పును వమ్ము చేయడానికి అ ప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ నాయకత్వంలో ని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కృషి ఇస్లాం మతస్థులను అక్రమంగా సంతృప్తి పరిచే రాజకీయాలలో భా గం! ఇలా ‘అక్రమ సంతుష్టీకరణ’కు పా ల్పడిన, పాల్పడుతున్న రాజకీయ వే త్తలు, రాజకీయ పక్షాలు ఇస్లాం మతం జనాభాలో సగమైన మహిళలకు ఘోరమైన అన్యాయం చేశారనడానికి చరిత్ర ప్రత్యక్ష సాక్షి! ‘ట్రిపుల్ తలాఖ్’ ఇన్నాళ్లపాటు కొనసాగడానికి అధికార రాజకీయ పక్షాల అన్యాయం ప్రధాన కారణం. ఈ అన్యాయ విధానాన్ని విడనాడి ‘ట్రిపుల్ తలాఖ్’ను వ్యతిరేకించిన భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం అభినందనీయం. తీర్పు చెప్పిన సుప్రీం ధర్మాసనం వందనీయం!
పురుషాధిక్యపు పంజరంలో బందీలుగా అలమటించిన ఇస్లాం మహిళలకు ఈ తీర్పు నైతిక విజయం, సమానత్వదాయకమైన సామాజిక విజయం. ధైర్యంగా అన్యాయాన్ని ఎదిరించగలిగిన, సుప్రీం కోర్టులో వినతిపత్రాలను, న్యాయ యాచికలను దాఖలు చేయగలిగిన ముస్లిం మహిళలు సాధికార పథంలో దారిచూపుతున్న కరదీపికలు. షయారా బానో అనే ముప్పయి ఐదేళ్ల మహిళ ఈ న్యాయ సంఘర్షణలో అగ్రగామి, అన్యాయంగా ‘ట్రిపుల్ తలాఖ్’కు గురైన మరో నలుగురు మహిళలు ఆఫ్రీన్ రెహమాన్, గుల్షన్ ఫర్‌వీన్, ఇస్రాత్ జహా, అతియా సబ్రీ కూడ ఈ దుష్ట సంప్రదాయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టుకెక్కడం మహిళా చైతన్యానికి నిదర్శనం. ‘స్పీడ్‌పోస్ట్’ ద్వారా ‘తలాఖ్.. తలాఖ్.. తలాఖ్’ అని పత్రం పంపడం, దూరవాణి సంభాషణల ద్వారా ముమ్మారు తలాఖ్ చెప్పడం వంటి దుశ్చర్యలకు పాల్పడి భార్యను కడగండ్ల పాలుచేసే ధూర్తులకు సర్వోన్నత న్యాయ నిర్ణయం చెంపపెట్టు! ‘ఉమ్మడి పౌరస్మృతి’ని రూపొందించడం అనివార్యం అన్న దానికి ఇది తొలిమెట్టు..

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 431-లయకు ప్రాధాన్యమిచ్చిన -జి యెన్ బాల సుబ్రహ్మణ్యం (1910-1965)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

431-లయకు ప్రాధాన్యమిచ్చిన -జి యెన్ బాల సుబ్రహ్మణ్యం (1910-1965)

జి యెన్ బి గా లబ్ధ ప్రతిష్ఠుడైన జి యెన్ బాల సుబ్రహ్మణ్యం తమిళనాడు మాయవరం లోని గుడలూర్ లో 6-1-1910జన్మించాడు తండ్రి నారాయణ స్వామి అయ్యర్ సంగీతజ్ఞుడు .అరియకపూడి రామానుజ అయ్యర్ మానసిక గురువు .లా పాసై మద్రాస్ లజ్ కార్నర్ లో లాయర్ గా బాగా ప్రసిద్ధి చెందిన సంగీతకారుడు .ఇంగ్లిష్ లో బి ఏ ఆనర్స్ పాసై ,అన్నామలై యూనివర్సిటీలో సంగీతాన్ని టీఎస్ సబేష అయ్యర్ వద్ద అభ్యసించాడు .అనారోగ్యం వల్లా మానేసి మద్రాస్ యూనివర్సిటీలో డిప్లమా కోర్స్ చేసి ప్రిన్సిపాల్ టైగర్ వరదా చారి అభిమానం పొంది కచేరీ చేయ టానికి తగిన విద్వత్తు సాధించి  1928  లో మొదటి కచేరి చేశాడు .భామావిజయం  సినిమాలోనూ ,శకుంతల సినిమాలో ఏం ఎస్ సుబ్బు లక్ష్మి తోను నటించాడు .జి యెన్ బి శైలికి ఏం ఎస్ ఆకర్షితురాలై మొదట్లో అదే బాణీలో పాడేది . తర్వాత సంగీతానికి అంకితమయ్యారు బాలు .సంస్కృత తెలుగు తమిళాలలో 250 కి పైగా కృతులు రాశాడు .కొత్తరాగాలు కనిపెట్టాడు వందలాదిమందికి సంగీతం బోధించి లెక్కలేనన్ని కచేరీలు చేశాడు .మద్రాస్ రేడియోలో కర్ణాటక సంగీత డెప్యూటీ చీఫ్ ప్రొడ్యూసర్ గా పని చేశాడు .అప్పుడు లలిత సంగీత ప్రొడ్యూసర్ గా  మంగళంపల్లి బాలమురళీకృష్ణ , సెమ్మంగుడి శ్రీనివాసయ్యర్ కర్ణాటక సంగీత ప్రొడ్యూసర్ గా ఉండేవారు . 1964లో కేరళ తిరువనంతపురం లోని స్వాతి  తిరుణాల్ సంగీత కళాశాల ప్రిన్సిపాల్ అయ్యాడు . 55 ఏళ్ళ వయసులో 1-5-1965న మరణించాడు . గమకాలను తగ్గించి లయకు అత్యంత ప్రాధాన్యమివ్వడం తో జి యెన్ బి సంగీతం కర్ణ పేయంగా ఉండేది .

సంస్కృతం లో ఆయన రాసిన -మోహనరాగం లోని -’’భువనత్రయ’’,నాట రాగం లో -’’కరిముఖ వరద ‘’,పూర్వి కల్యాణిలో -’’మధురాపురి కల్యాణి ‘’,మోహన లో ‘’సదా పాలయ సారసాక్షి ‘’సరస్వతిరాగం లో -సరస్వతి నమోస్తుతే ‘’,శివ శక్తిరాగం లో -’’చక్రరాజ నిలయే ‘’,కామ వర్ధనిలో -’’శివానంద కామవర్ధని ‘’,హంసధ్వనిలో -’’వరవల్లభ రామ ‘’కృతులకు సంగీత సాహిత్యాలతో ప్రాణ ప్రతిష్ట చేశాడు .

432-  భావ ,లయలకు ప్రాణం పోసిన -ఏం డి బి రామనాధన్ (1923-1984)

ఏం డి బి గా ప్రసిద్ధుడైన మంజప్ర దేవేశ భాగవతార్ రామనాథన్ 20-5-1923 న తమిళ నాడు లోని పాలకాడు  జిల్లామంజప్ర  గ్రామం లో జన్మించి ,భావ లయాలకు ప్రాధాన్యమిచ్చిన వాగ్గేయకారుడిగా పేరుపొందారు .తండ్రి దేవేశ భాగవతార్ సంగీత ఉపాధ్యాయుడు .పాలక్కాడు విక్టోరియాకాలేజిలో చదివి ఫిజిక్స్ లో   డిగ్రీ పొంది ,మద్రాస్ వచ్చి తండ్రివద్దనే సంగీత మర్మాలు గ్రహించాడు .అదే సమయం లో రుక్మిణి అరండేల్ కళాక్షేత్రం లో సంగీత శిరోమణి కోర్స్ 1944 లో ప్రారంభిస్తే  మొదటి బాచ్ కి ఎన్నికైన ఏకైక విద్యార్థి మన ఏం డి బి ఒక్కడే .అక్కడి గురువు టైగర్ వరదాచారి ముఖ్య ఏకైక శిష్యుడై సంగీత0 తో మరీ దగ్గరయ్యాడు .అక్కడే అసిస్టెంట్ గా చేరి సంగీత ప్రొఫెసర్ అయి కళాక్షేత్ర ఫైన్  ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ అయ్యాడు . నెమ్మదిగా పాడటం ప్రారంభించి శ్రోతలను తనతోపాటు తీసుకువెడుతూ సాహిత్యం లోని అందాలను అనుభవించేట్లు చేయటం ఈయన ప్రత్యేకత .కధాకళీ లోని విలంబిత కాలగానం తనను బాగా తీర్చి దిద్దిందని చెప్పేవాడు ..ప్రముఖుల కృతులు పాడేటప్పుడు సాహిత్యాన్ని మార్చిపాడి విమర్శకు గుయారయ్యేవాడు .మరో ప్రత్యేకత అనుపల్లవితో ప్రారంభించి తర్వాత పల్లవి పాడటం .ఇది బాగా నచ్చేది అందరికి ..మూడుభాషలలో 300 కుపైగా కృతులురాశాడు . 1984 ఏప్రిల్ 27 న 61 ఏళ్ళవయసులో చనిపోయాడు .

ఏం డి బి రచించిన సంస్కృత కృతులు -బేహాగ్ రాగం లో -’’భజభజ మనుజ ‘’,ఆరభిలో -భారతేశ నుతే ‘’,శ్రీ రాగం లో -’’దుర్గాదేవి ‘’,హంసధ్వనిలో -’’గజవదన ‘’కానడ లో -’’గురు చరణం ‘’,ధన్యాసి లో ‘’గురువారం భజ మనసా ‘’,ధీర శంకరాభరణం లో -’’జనని నతజనపాలి ని ‘’-బాగేశ్వరిలో -’’సాగర శయన విభో ‘’,కాపీరాగం లో తిల్లాన ,కేదారం లో-’’త్యాగరాజ గురుం ‘’,

1974లో పద్మశ్రీ ని కేంద్ర సంగీత అకాడెమీ పురస్కారాన్ని ,1976 లో సంగీత శిఖామణి ,1983 లో సంగీత కళానిధి బిరుదు పొందాడు .

433- సంగీత దర్పణ కర్త -వి . రామ నాథం (1917 -2008 )

సంగీత కళాకారుడు రచయితా టీచర్ ప్రిన్సిపాల్ వి రామనాధం 1917 లో జన్మించి 70 ఏళ్ళు సంగీత 0లో మునిగి తేలి 2008 లో చనిపోయాడు .మైసూర్ సంగీతరత్న శిష్యుడై ,మైసూర్ యూనివర్సిటీ మ్యూజిక్ డాన్స్ కాలేజీ మొదటిప్రిన్సిపాల్ అయి  1987 లో రిటైరయ్యాడు .సుమారు 25 కృతులు సంస్కృత తెలుగు కన్నడాలలో రాశాడు . 3 గ్రంధాలు స్వయంగా కానీ ఇతరులతోకలిసి కాని రాశాడు .కర్ణాటక సంగీత శాస్త్రం పై విలువైన గ్రంధాలు రాశాడు .అందులో ముఖ్యమైనవి -సంగీత దర్పణం ,కర్ణాటక సంగీత సుధ,సంగీత శాస్త్ర పరిచయం ,కర్ణాటక సంగీత లక్ష్య లక్షణ సంగ్రహం ,అపూర్వ వాగ్గేయ కృతిమంజరి మొదలైనవి ..

  సశేషం

 మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -22-8-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

Image result for g n balasubrahmanyam– Image result for m d b ramanadhan


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 428-తంజావూర్ సంగీత చతుష్టయం (1801-1856)

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3

428-తంజావూర్ సంగీత చతుష్టయం (1801-1856)

తంజావూర్ కు చెందిన చిన్నయ్య ,పొన్నయ్య ,శివానందం వడివేలు అనే నలుగురు సోదరులను తంజావూర్ సంగీత చతుష్టయ0 అంటారు .భరతనాట్యం కర్ణాటక సంగీత వ్యాప్తికి వారి కృషి మరువలేనిది .తంజావూర్ మహారాజు షెర్ఫోజి ఆస్థాన సంగీత విద్వా0సులుగా ఉండేవారు . తరువాత తిరువాన్కూర్ మహారాజు స్వాతి తిరుణాల్ కొలువులో చేరారు .దీక్షితార్ వంటి మహా విద్వా 0సుల వద్ద సంగీత శిక్షణపొంది లోతులను తరచారు . వీరిలో వడివేలు పిళ్ళై ఏక సంధాగ్రాహి అని ముత్తుస్వామి దీక్షితార్ ప్రశంసించాడు .గురువుగారికి కానుకగా ‘’నవరత్న మేళ’’కూర్చారు సోదరులు .వడివేలును ఆస్థాన గాయకునిగా స్వాతి తిరుణాల్ నియమించాడు .వడివేలు మహాజ్ఞాని . వయోలిన్ కూడా నేర్చి స0స్థానం లో వాయించి రాజు మెప్పుపొందాడు .కల్పిత సంగీతాన్ని మనోధర్మ సంగీతాన్ని వయోలిన్ పై పలికించవచ్చునని రుజువు చేశాడు వడివేలు .ముత్తుస్వామి దీక్షితులు సోదరుడు బాలు స్వామి ఒక పాశ్చాత్యు నివద్ద వయోలిన్ నేర్చి రాజు కొలువులో వాయించగా వడివేలు  ‘’మోహిని అట్టం ‘’ను సృష్టించి ఆడించాడు అప్పటివరకు కేరళలో కథాకళి మాత్రమే ఉండేది అదీ మగవారికి మాత్రమే పరిమితం .రాజు స్వాతి తిరుణాల్ తోకలిసి వడివేలు మోహినీ అట్టం ను సమగ్రంగా తీర్చి దిద్దాడు .దీనితో ఆడవారికి కూడా నాట్యం చేసే అవకాశం కలిగింది .

 ఈ తంజావూర్ సంగీత చతుష్టయం సంస్కృత ,తెలుగు భాషలలో కృతులు ,వర్ణాలు అనేకం రాశారు .అందులో ముఖ్యమైనవి -నీలాంబరి లో అంబ సౌరాంబ, అంబ నీలాంబ ,పూర్వీకళ్యాణిలో -’’సాటిలేని  ‘’.

429-72 మేళ కర్త రాగాలతో రాగమాలిక అల్లిన-మహా వైద్యనాధ శివన్  (1844-1893)

అలవోకగా మహా సంగీతం పాడే గొప్ప సంగీతకర్త మహా వైద్య నాధశివన్  1844 లో తంజావూర్ జిల్లా వియచేరి గ్రామం లో పుట్టాడు .తండ్రి దొరైస్వామి అయ్యర్ గొప్ప సంగీతజ్ఞుడు .ఆనై అయ్యా బ్రదర్స్ వద్ద సంగీత శిక్షణ పొందాడు .తర్వాత త్యాగరాజస్వామి శిష్యుడు మానాంబు  చావడి వెంకట సుబ్బయ్యర్ వద్ద మెళకువలు గ్రహించాడు .రాగాలాపనలో శివన్  శివమెత్తి స్తాడు .తమ్ముడు రామస్వామి శివన్ తో కలిసి కచేరీలు చేసి కర్ణాటక సంగీత తొలి  జంటగా రికార్డ్ సృష్టించాడు .’’గుహదాస ‘’అనే ముద్ర తో రాశాడు . సంస్కృతం తెలుగు తమిళం లో చాలా కృతులురాశాడు .సంస్కృతం లో జన రంజని రాగం లో -’’పాహిమాం రాజ రాజేశ్వరి ‘’రాగమాలికలో -’’ప్రణతార్తి హర ప్రభో పురారే ‘’,నాగ స్వరాలిలో -’’శ్రీ శంకర గురువరం ‘’శివన్ సంగీత పాండిత్యానికి  మచ్చు  తునకలు . సారాంగిరాగతెలుగు  కృతి -’’నీ కేల దయరాదు ‘’సుప్రసిద్ధమైనది .

430-’’జయతి జయతి భారత మాత ‘’దేశభక్తి గీతకర్త – మయూరం విశ్వనాధ శాస్త్రి (1893-1958)

తమిళనాడులోని మయూరం గ్రామం లో 1893 లో పుట్టినవిశ్వనాధ శాస్త్రి రచించిన దేశభక్తి గీతం ‘’జయతి జయతి భారత మాత ‘’తో సుప్రసిద్ధుడయ్యాడు .ఆనాడు  పాడని కర్ణాటక సంగీత గాయకులు  ఉండేవారుకాదు .నామక్కల్ నరసింహ అయ్యంగార్ ,కాసవాద్యం వెంకట రామ అయ్యంగార్ వంటి వద్ద సంగీతం అభ్యసించాడు .తెలుగు సంస్కృతాలలో 160 దాకా కృతులురాశాడు . 65 ఏళ్ళు జీవించి మరణించాడు .

  సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-8-17 -కాంప్-షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పిఆర్కే ప్రసాద్ ఇకలేరు

clip

clip

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 426- నరహరి యతి చరిత్ర కర్త -నరహరి తీర్ధ (1324-1333)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

426- నరహరి యతి చరిత్ర కర్త -నరహరి తీర్ధ (1324-1333)

మధ్వాచార్య శిష్యుడు ,దాస సంప్రదాయ కర్త నరహరి తీర్ధ విజయనగర సామ్రాజ్య రాజగురువు ,యతీంద్రుడు 1323 లో జన్మించాడు .ఈయనది ఆంద్ర దేశమే నని భావిస్తారు .పుర్వాశ్రమ నామం శ్యామ శాస్త్రి .కళింగ రాజుల మంత్రి గా 12 ఏళ్ళు ఉన్నానని  ‘’నరహరి యతి చరిత్ర ‘’లో చెప్పుకున్నాడు. శ్రీకూర్మం ,సింహాచలం దేవాలయ శాసనాలు ఆయన మంత్రిత్వాన్ని రుజువు చేస్తున్నాయి .కన్నడం వాడుకాకపోయినా ఆయన రచనలు కన్నడం లోనే ఎక్కువగా ఉన్నాయి .కళింగ ఆంద్ర లలో చాలామందిని మధ్వ మతం లోకి మార్చినట్లు ఆధారాలున్నాయి .ఆయన వారసులు ఇప్పటికీ సాగరాంధ్రలో ఉన్నారు .హరిదాసు ఉద్యమానికి ఈయనే ఆద్యుడు అంటారుకాని శ్రీపాద రాయలే ఆద్యుడని ఎక్కువమంది భావిస్తారు . కానీ యక్షగానాలు సృష్టికర్త నరహరి తీర్ధ మాత్రమే అలాగే బాయలత నృత్యానికి ఆద్యుడు ఆయనే .ఈ సంప్రదాయం ఇప్పటికి కర్ణాటక లో కేరళలోని కాసర్ గోడ్ ప్రాంతం లో ఉన్నాయి .ఈయన కృష్ణాజిల్లా శ్రీకాకుళం లో ఆంద్ర మహా విష్ణువు వెలసిన చోట మఠాధిపతి గా ఉన్నాడని కూచిపూడి నృత్య ప్రదాత అని ప్రచారం లో ఉంది .సంస్కృతం లో ‘’దసరాపదాలు ‘’  రాశాడు .

427-గురు కృతి కర్త -ఊత్తుక్కాడు వేంకటకవి (1700-1765 )

ఊత్తుకాడు  వెంకటసుబ్బయ్య అయ్యర్ 1700లో తమిళనాడులో జన్మించి గర్వించదగ్గ గొప్ప వాగ్గేయకారుడయ్యాడు .వెంకట కవిగా ప్రసిద్ధుడు . సంస్కృత ,తమిళ మరాఠీ భాషలలో 500 కు పైగా కృతులు రచించాడు . ఇవి ఆయన సంగీత శాస్త్ర పాండిత్యానికి ఉదాహరలుగా నిలిచాయి .కావడి చిందు ,తిల్లానా ,కృతులు ఆయన ప్రత్యేకం . పురన్దరదాసుకు కర్ణాటక సంగీత త్రయానికి వారధిగా వేంకటకవి ని భావిస్తారు .సంగీతం లో సరైన గురువును అన్వేషిస్తూ చాలాకాలం గడిపి చివరికి ఊత్తుక్కాడు కళింగ నర్తన ఆ లయం లో శ్రీకృష్ణుడిని గురువుగా భావించాడు . కృష్ణ భగవానునుని ప్రేరణ చెంది ఆరభి రాగం లో ‘’గురుపాదారవిందం కోమలం ‘’కృతి రాశాడు .తన గురుదేవుడైన కృష్ణుడిపై కనీసం 15 గురు  కృతులు రాసి అంకితమిచ్చాడు .ఆయన ఫిలాసఫీ ‘’భక్తియోగ సంగీతమార్గమే పరమపావన మహునే ‘’. అనేక రాగాలను ఉపయోగించాడు .అరుదైన బాలహంస, రసమంజరి రాగాలను ఆలపించి కృతులురాశాడు .మధ్యమావతిలో ‘’శ0కరి రాజరాజేశ్వరి’’సుందర నంద కుమారకృతులు మాధుర్యానికి పరాకాష్ట .ఖండ ధ్రువ ,సంకీర్ణ మధ్యమ వంటి అనేక తాళా ల పై గొప్ప ప్రయోగాలు చేశాడు .సాహిత్య వైవిధ్యాన్ని చాలా అద్భుతంగా పోషించాడు .ఉదాహరణకు అభోగి  రాగ పల్లవి ‘’మహశ్యాయ హృదయ ‘’మాధ్యమకాల విధానం లో 1-మధుకర చంపక వన విహార మనమోహన మధుసూదన నవభూషణ 2-మధుకర చంపక వనవిహార నవపల్లవ పదకర  మదన గంభీర 3-మధుకర చంపక వనవిహార గోవర్ధనధర భుజగ నర్తన చరణ ‘’

ఇదేకాక గౌళరాగం లో ‘’అగణిత మహిమ ‘’లో కూడా ఇలాంటి వైవిధ్యాన్ని ప్రదర్శించాడు .ధన్యాసిరాగం లో కూర్చిన ‘’భువనమోహన’’లో ఆరుసార్లు పునరావృత్తమై 11 సార్లు వినిపించి అలౌకిక ఆనందాన్ని సృష్టించాడు .సంస్కృతం లోని ఈరచన కర్ణామృతమే -’’అతినూతన కుసుమాకర ,వ్రజమోహన సరసీరుహ దళ లోచన మమమానస పటు చోరసు -స్వరగీతసు -మురళీధర సుర మోదిత  భవమోచన ‘’/ఆయన సంస్కృత పాండిత్యం అమోఘం .దానిలోని సొగసులన్నీ కృతులలో దింపేశాడు .ఆయన ప్రసిద్ధ తమిళకృతి తోడిరాగం లోని ‘’తాయి యశోద’’సంగీతకచేరీలలో తప్పని సరి అయి శ్రీ కృష్ణలీలకు  పరమ భాష్యమై నిలిచింది .ఇందులో 8 చరణాలున్నాయి .ఒక్కో చరణం  లో ఒక్కో లీల దర్శనమౌతుంది .రాధా కృష్ణకల్యాణాన్ని కృతి మాధ్యమంగా రాశాడు .మహాభారతం దక్షయజ్ఞం ప్రహ్లాద చరితం లకూ కృతి గౌరవం కల్పించి శాశ్వతత్వం చే కూర్చాడు .సామూహిక కృతులైన సప్త రత్న ,కామాక్షి నవ రత్నం ,ఆంజనేయ రత్నం వంటివీ రాశాడు .మాధవ పంచకం ,నృసింహ పంచకం ,రంగనాధ పంచకం వంటి స్తోత్రాలుకూడా రాశాడు .’’త్యాగ రాజ పంచరత్నాలు’’వంటి ‘’సప్త రత్న కృతులు ‘’రాశాడు -1 నాట రాగం లో ‘’భజనామృత 2-గౌళ రాగం లో ‘’అగణిత మహిమ ‘’,3-కళ్యాణిరాగం లో ‘’మాధవ హృది కేళిని ‘’4-కీరవాణిరాగం లో ‘’బాలసరస మురళి ‘’5-తోడి రాగం లో ‘’జటధార  6-పరాస్ రాగం లో ‘’అలవ0దె న్నెలో  7-మాధ్యమావతి రాగం లో ‘’సుందర నంద కుమార’’.

  ఆంజనేయ సప్తవర్ణ సంస్కృత కృతులలో హనుమ వైభవ విశేషాలన్నీ చూపించాడు-

1-వసంత రాగం లో -’’పవన కుమార 2-కేదార గౌళ లో -’’వీక్షితోహం 3- తోడిరాగం లో -’’అంజనానందన అమ్బోధి చంద్ర 4-సురటి రాగం లో -శ్రీరాఘవ దూతం 5-మాధ్యమావతి రాగం లో -’’భక్త భాగ ధేయ  ‘’6-రసమంజరి రాగం లో -’’సత్వ గుణ విరచితాంగ 7-మలయ మారుత రాగం లో ‘’వాహిని తట  ‘’.

 దసరాలలో శ్రీ విద్య పై పాడే నవ వర్ణకృతులు  వినాయక స్తుతి ,ధ్యాన స్తుతి ఫలస్తుతి కూడా రాశాడు .కూచిపూడి భరతనాట్య ,కథక్ ,ఒడిశా నృత్యకళాకారులు ఆయన కృతులకు నాట్య ఆకృతులను కూర్చి బహుళ వ్యాప్తి చేశారు. అందులో  వైజయంతిమాల ,కమలా లక్ష్మణ్   బిర్జు మహారాజ్ పద్మా సుబ్రహ్మణ్యం వెంపటి చినసత్యం వంటి వారెందరో ఉన్నారు .ఆయన రాసిన హరికథలను శ్రీ కృష్ణ ప్రేమి అన్న ,గురు హరిదాసు గిరి వంటి హరికథా కళాకారులు వీనుల విందుగా వినిపించి ప్రచారం చేశారు .ఆయనకే ప్రత్యేకమైన -’’కళింగ  నర్తన నటంగం,కృష్ణ పాదాది కేశాంతవర్ణనం ‘’నభూతో అనిపిస్తాయి .భజన సంప్రదాయం లోకూడా వేంకటకవి రచనలు స్థానం పొందాయి .  ,శివ తాండవం ఆయన సంస్కృత భాషా పటిమకు  పరమ భక్తికి తార్కాణంగా నిలీచింది .  .నిత్య జీవితం లో పారాయణకు తోడ్పడి ప్రతి ఇంటా  మార్మోగుతూ వినిపిస్తాయి . 65 సంవత్సరాలు జీవించి శ్రీ కృష్ణ శిష్యుడైన వేంకటకవి 1765లో శ్రీ కృష్ణ ధామం చేరాడు

  సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-8-17- కాంప్-షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 419-కర్ణాటక జాతీయ గీతకర్త -బసవప్ప శాస్త్రి (1843-1891)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

419-కర్ణాటక జాతీయ గీతకర్త -బసవప్ప శాస్త్రి (1843-1891)

 కర్ణాట రాష్ట్ర జాతీయ గీతం ‘’కాయో శ్రీ గౌరీ ‘’రాసిన బసవప్ప శాస్త్రి 1843 లో మైసూర్ జిల్లా నరసా0ద్ర  గ్రామం లో జన్మించాడు . సంస్కృతాంధ్రాలలో మహా పండితుడు . కాళిదాసుని శాకుంతల మాళవికాగ్నిమిత్ర మొదలైన సంస్కృత నాటకాలను  షేక్స్పియర్ ఓదెల్లో నాటకాన్నీ కన్నడీకరించాడు .’’కర్ణాటక నాటక పితామహ ‘’బిరుదాంకితుడు . తన రత్నావళి ,ఉత్తరరామ చరిత నాటకాలకు చాలాపాటలు కూర్చాడు . 1891 లో చనిపోయాడు .

  తంజావూర్ చిన్నయ్య (1803-1856 )తంజావూర్ జిల్లాలో పుట్టి మైసూర్ రాజాస్థాన సంగీత విద్వా0సు డయ్యాడు .సంస్కృతం తెలుగులలో  లో వర్ణాలు కృతులు జావళీలు విశేషంగా రాశాడు .ఆయన ఆరభిరాగం లో రాసిన ‘’అంబాసౌరంబ ‘’నీలాంబరితో రాసిన ‘’అంబా నీలాంబరి ‘’కృతులు చిత్త స్వరాలతో విశేష ప్రాభవాన్ని తెచ్చాయి .

420-సంస్కృత కృతి కర్త  -వీణ పద్మనాభయ్య   (1842-1900 )

కర్ణాటక చిత్తనాయక హళ్ళికి చెందిన వీణ పద్మనాభయ్య 1842లో జన్మించి 58 వ ఏట  1900 లో మరణించాడు .సంస్కృతం ఆంధ్రం లలో అనేక స్వరాలు కృతులు  జావళీలు వర్ణాలు  ,తోడిరాగం లో సప్త తాళేశ్వరం రచించాడు .నాట కురంజి రాగం లో ‘’శ్రీ హేరంబ మీడే ‘’,నాగేశ్వరావళి  రాగం లో   ‘’భావయామి తవపాదం ‘’బాగా ప్రసిద్ధమైనవి .కన్నడం లో ఒకేఒక్క జావళి రాశాడు .మిగిలినవి సంస్కృతం ,తెలుగు లలో రాశాడు .

421-సంగీత సుబోధిని కర్త -మైసూర్ కరగిరిరావు (1853 -1927 )

1853లో కర్ణాటక తుంకూర్ లో పుట్టిన కరగిరి రావు సంగీత నిధి . 200 ల దేవర నామాలకు సంగీత స్వరాలు కూర్చాడు ఆయన కృతులన్నీ చిత్త స్వరాలతో చిత్తాన్ని ఆకర్షిస్తాయి .సంగీత సుబోధిని ,గాన వాద్య రహస్య ప్రకాశిని అనే గొప్ప సంగీత  గ్రంథాలు రాశాడు .మోహనరాగం లో ‘’నెనరుంచిర ‘’,సరస్వతి రాగం లో ‘’సరస్వతి భగవతి ‘’కృతులు మంచి పేరు తెచ్చాయి . 74 వ ఏట మరణించాడు .

422-108 చాముండీ అష్టోత్తర కృతులురాసిన -ముత్తయ్య భాగవతార్ (1877-1945 )

సంస్కృత కన్నడ తెలుగులలో అనేక కృతులురాసి హరికథ గానం తో ప్రేక్షకులను పరవశం కలిగించిన హరికేశ నల్లూరు ముత్తయ్యభాగవతార్ 1877 లో తిరునల్వేలిలో పుట్టి 20 వ శతాబ్దపు ఉత్తమ సంగీత స్వరకర్తగా పేరుపొందారు .వర్ణాలు కృతులు రాగమాలికలు తిల్లానాలతో వైవిద్యరచన చేసి మెప్పుపొందాడు .నిరుపనం ,పాదం లకు ఆయన పెట్టిందిపేరు . 108 చాముండేశ్వరి అష్టోత్తర కృతులురాసిన మహా భక్తుడు .ఖామాస్ రాగం లో ‘’మాతే మలయధ్వజ ‘’ కర్ణ రంజనిలో ‘’వాంఛతోను నా ‘’బాగా పేరు తెచ్చాయి .నిరోష్ట ‘’వంటి అనేక కొత్తరాగాలు సృష్టించాడు . 68 వ ఏట చాముండేశ్వరి సన్నిధానం చేరుకొన్నాడు .

423-వీణ శివ రామయ్య (1886-1946)

వీణ పద్మనాభయ్య కుమారుడు శివరామయ్య . మైసూర్ రాజ్య ఆస్థాన

సంగీత విద్వా0సుడు .సంస్కృత తెలుగు కన్నడాలలోచాలా కృతులు జావళీలు స్వరాలు కూర్చాడు 72 మళ రాగ కృతులురాశా డు. శ్రీరాగం లో ‘’వాణీ వీణాపాణి ‘’,ధర్మావతి రాగం లో ‘’శ్రీరాజ రాజేశ్వరి ‘’సుప్రసిద్దాలు . ,

424-కొత్త సంగీత రూపం ‘’నగ్మ’’సృష్టికర్త -వీణ వెంకట గిరియప్ప (1887-1952 )

కర్ణాటకలో హెగ్గేడ  దేవకోటలో పుట్టి మైసూర్  పాలస్ ఆర్కెస్ట్రా డైరెక్టర్ అయిన వీణ వెంకట గిరియప్ప 1887 లో పుట్టాడు .వీణ లో అసాధారణ ప్రతిభ సాధించి భారత దేశమంతా పర్యటించి తన వీణాగానమాధుర్యాన్ని పంచాడు .సంస్కృత ,తెలుగు ,కన్నడాలలో చాలా కృతులు రాశాడు .కొత్త సంగీత రూపం ‘’నగ్మా ‘’ను సృష్టించాడు .ఇది హిందూస్థానీ గతులను కలిగి ఉండటం విశేషం .ఈయన కృతులలో భువన గాంధారి రాగం లోని ‘’లలితాంబికే శ్రీ మాతే ‘’బేహాగ్ రాగం లో ‘’శ్రీ జయలలితే ‘’ప్రత్యేకంగా పేర్కొనదగినవి .

425-సంస్కృత తిల్లానాలు రాసిన -టి .చౌడయ్య (1894-1967 )

చోడయ్యావయోలిన్ అంటే చెవులు కోసుకోవటం అందరికి తెలిసిందే .మైసూర్లోని కావేరీ తీరం లో తిరుముక్కడాల్ నర్సిపురం లో 1894 లో జన్మించి వయోలిన్ కు విశ్వ విఖ్యాతికలిగించి ఎన్నో పురస్కారాలు బిరుదులూ సన్మానాలు అందుకొన్న టి చౌడయ్య 73 వ ఏట మరణించాడు .బెంగుళూర్ లో ఆయన పేరఒక వీధి ఉంది .మైసూర్ రాజాస్థాన సంగీత విద్వా0సుడు ,గాన విశారద బిడారం కృష్ణప్ప శిష్యుడు .వయోలిన్ మాధుర్యం పెంచటానికి తార షడ్జమ ,మంద్ర షడ్జమ మొదలైన కొత్త తీగలను ఏర్పాటు చేసి సప్త తంత్రులతో వయోలిన్ వాయించేవాడు .దీన్ని గురువు బిడారం అంగీకరించక ఎందుకుఈ ప్రయోగం అనిఅడిగితే బాగా వెనక ఉన్నవాళ్లకూ  స్పష్టంగా వినబడటానికే అన్నాడు .వీణ శేషన్న దీన్ని అంగీకరించగా చివరికి గురువుకూడా సంతోషం తో ఒప్పుకున్నాడు .లెక్కలేనంతమంది శిష్యులను చౌడయ్య తయారు చేశాడు .సంగీత కళానిధి సంగీత శిఖామణి బిరుదులు పొందాడు 19-1-1967 నమహా వాయులీన విద్వా0సుడు   చౌడయ్య మరణించాడు . చౌడయ్య సంస్కృత తెలుగు కన్నడాలలో కృతులు రచించాడు అందులో ప్రసిద్ధమైనవి-కాంభోజి రాగం లో ‘’శ్రీ వేణుగోపాల ,’’   ధన్యాసి రాగం లో ‘’దేవి పూర్ణ మంగళ ‘’చెప్పుకోదగ్గ కృతులు .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-8-17 -కాంప్-షార్లెట్-అమెరికా

T Chowdiah.jpg

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

  నైరూప్య చిత్రకారులు పద్మశ్రీ ఎస్.వి .రామారావు

నైరూప్య చిత్రకారులు పద్మశ్రీ ఎస్.వి .రామారావు

రచన –గబ్బిట దుర్గా ప్రసాద్ –ఉయ్యూరు -9989066375

ఇంతింతై ఎదిగిన యశస్వి ఎస్వి

కృష్ణా జిల్లా గుడివాడ లో వడ్రంగం లో అద్భుతాలు సృష్టించిన శ్రీ శిరందాసు గంగయ్య ,శ్రీమతి లక్ష్మమ్మ దంపతుల కు 1936 లో శ్రీ రామారావు.జన్మించారు .చిన్నతనం నుండే బొమ్మలు వేస్తూ ,తొలిగురువు   శ్రీ.కే వేణుగోపాల్ గారి  గురుత్వం లో13 వ ఏడు వరకు  బాగా రాణించారు  .  గుడివాడ ఎ.యెన్ ఆర్ కాలేజీ లో ఇంగ్లీష్ బోధించిన వైస్ ప్రిన్సిపాల్ శ్రీ యడవల్లి సన్యాసి రావు గార౦టే ఎస్వి గారికి వీరాభిమానం .ఎకనామిక్స్ ,కామర్స్ లలో డబుల్ గ్రాడ్యుయేట్ అయి ,1955 నాటికే  ఆర్ట్ లో 4 డిప్లమాలు సాధించారు .తండ్రిగారే ఆయన కు స్పూర్తి ప్రదాత .మద్రాస్ వెళ్లి ప్రముఖ చిత్రదర్శకుడు, కదా రచయితా, స్నేహితుడు మాధవ పెద్ది గోఖలే సలహా పై మద్రాస్ ఆర్ట్ కాలేజ్ లో చేరారు . ప్రిన్సిపాల్ శ్రీ దేవీ ప్రసాద్ రాయ్ చౌదరిని తన కళా ప్రదర్శనతో మెప్పించి 6ఏళ్ళ కోర్సు గా ఉన్నదానిలో సరాసరి 3 సంవత్సరం కోర్స్ లో  చేరారు ..ఫణిక్కర్ ,ధనపాల్, రాం గోపాల్ సంతాన రాజ్ ,మునిస్వామి వంటి ప్రముఖుల చిత్రాలు పరిశీలిస్తూ ఎంతో నేర్చారు. 1960 లో డ్రాయింగ్ లో డిప్లొమా పొందారు. భారత ప్రభుత్వ స్కాలర్ షిప్ వరుసగా మూడేళ్ళు  పొందారు  .కామన్వెల్త్ ఫెలోషిప్ కు భారత దేశం మొత్తం మీద 315మంది పోటీ పడితే ,రామారావు ఒక్కరే ఎంపికైన ఏకైక వ్యక్తిగారికార్డ్ సృష్టించారు .అప్పుడు ఆయన  వయసు కేవలం 23 మాత్రమే.

కళా నిష్ణాత  -శైలీ నిర్మాత

1962 లో  లండన్ వెళ్లి అత్యున్నత ప్రమాణాలకు నిలయమైన’’  స్స్లేడ్ స్కూల్ ఆఫ్ ఆర్ట్’’ లో చేరి, సర్ విలియం కోల్డ్ స్ట్రీం ,విలియం రోజర్స్ ,బెర్నార్డ్ కోహెన్ వంటి లబ్ధ  ప్రతిష్టులవద్ద కళా విద్యా రహస్యాలు గ్రహించారు.ఆయన చిత్రాలు ప్రచురించని ప్రసిద్ధ పత్రిక ఉండేదికాదు .తన చిత్రాలపై ‘’ఆర్య దేవ’’అని సంతకం చేసేవారు .‘’అక్కడ ఈయన గీసినచిత్రాన్ని ప్రిన్సిపాల్ ఇండియాలో గొప్ప ఆర్ట్ క్రిటిక్ శ్రీ రామన్ కు ఎస్వి పేరుకనిపించకుండా చేసి ‘’ఇది ఎవరు గీసింది ?’’అని అడిగితే‘’పికాసో ‘.అని చెబితే ‘’కాదు –మీ దేశ చిత్రకారుడు ఎస్వి రామారావు చిత్రించినది ‘’అని చెప్పగానే  ఆశ్చర్య పోయాడు రామన్.సమకాలీనుడైన పికాసో తో పోటీపడాలని భావించి  బోర్డ్ మీదనే ఆసియా కళ ఆధారంగా బొమ్మలు వేస్తూ ,తనదైన స్వంత శైలికోసం తపిస్తూ ,మ్యూజియం లో బొమ్మల్ని చూస్తూ లైబ్రరీలలో అధ్యయనం చేస్తూ, ప్రపంచ చిత్ర కళా రీతులను అవగాహన చేసుకొన్నారు .వివిధ దేశాల చిత్రకళా రీతులనుండి తనకు కావలసిన అంశాలు ఎన్నుకొని తనదైన చిత్ర ప్రవాహాన్ని సృష్టించుకొన్నారు .ఆఫ్రికా జానపదుల మాస్క్ లనుండి పికాసో ముడి సరుకు తీసుకొన్నట్లు ,రామారావు గారు మొఘల్ ,రాజపుట్  కళ నుంచి అలంకరణ రీతిని ,జపాన్ చిత్రకళ నుండి రేఖలను తీసుకొని వాటి మేళ వింపు తో  చిత్రాలు గీశారు. రామారావు గారి చిత్రకళపై వ్యాఖ్యానిస్తూ’ ఇలస్ట్రే టెడ్ వీక్లీఆఫ్ ఇండియా ‘’ ‘’సంపాదకుడు శ్రీ ఏ.ఎస్.రామన్’’For as artist ,in his style ,idiom and technique Rama Rao is as Western as any of his Western counterparts ,in spite of his passion for basic Indian values ‘’అన్నాడు .

 

1966 లో’’ మోస్ట్ అవుట్ స్టాండింగ్  లితోగ్రాఫర్ ‘’’’గా గుర్తింపు పొందారు.  1965 కు కోర్సు పూర్తి చేసి ‘’వర్ణ చిత్ర రచనలో నూతన  శైలీనిర్మాత  ‘’ ఇన్వెంటర్  ఆఫ్ స్టైల్ ఇన్ ఆయిల్ పెయింటింగ్ ‘’అని కీర్తి పొందారు .’1965లోవిఖ్యాతమైన ‘’ లార్డ్ క్రాఫ్ట్స్ అవార్డ్ ‘’అందుకొన్నారు  .

పికాసో  సరసన

కామన్ వెల్త్ ఆర్ట్ ఎక్సి బిషన్ లో చిత్ర ప్రదర్శన నిర్వహిస్తూ ,లండన్ కౌంటి కౌన్సిల్ లో పెయింటింగ్ డ్రాయింగ్ లను 1965నుండి  -69 వరకు బోధించారు  .

లండన్ లోని ‘’న్యు విజన్ సెంటర్ గాలరీ వారు ‘’ఆల్ఫబెట్ ఆఫ్ మోడరన్ ఆర్ట్ ‘’పై నిర్వహించిన ఎక్సి బిషన్ లో శ్రీ రామారావు పాల్గొన్నారు.  ఆనాటి ప్రముఖ ఆర్టిస్ట్ లైన పాబ్లో పికాసో,బ్రాక్ ,మీరో, డాలి, మాక్స్ ఎర్నెస్ట్ జాక్సన్ పొలాక్ వంటి హేమా హేమీ ఆర్టిస్ట్ లచిత్రాల సరసన రామారావు గారి చిత్రాలు చోటు చేసుకొన్నాయి అంటే అద్భుతః అనిపిస్తుంది . . . ఆసియా మొత్తం మీద ఎస్వి ఒక్కరికే ఈ అరుదైన అవకాశ౦ లభించటం ఆయన ప్రతిభకు తగిన పురస్కారం . లండన్ లో జరిగిన .ప్రతిష్టాత్మకమైన ‘’బ్రిటిష్ ఇంటర్నేషనల్ ప్రింట్ బైన్నియల్ ‘’ప్రదర్శనకు పికాసో చిత్రాలతో పాటు ఇండియన్ పికాసో ఎస్వి గారి చిత్రాలు కూడా ఎంపికయ్యాయి .ఇది తన అదృష్టం అని వినయంగా చెప్పారు ఎస్వి .ఈ  ఎంపిక ను చిత్రకారులు నోబెల్ బహుమతి తో సమానంగా భావిస్తారని రామారావు గారు అన్నారు  .ఎన్నో దేశాలలో తన చిత్రాలను ప్రదర్శించారు .అధిక ధరలకు అవి అమ్ముడయ్యాయి .

కళా బోధన- పద్మశ్రీ పురస్కార౦

 

శ్రీ ఎస్వి 1969 లో అమెరికా వెళ్లి టఫ్త్స్ ,బోస్టన్ ,సిన్సినాటి, వెస్ట్ కెంటకి  యూని వర్సిటీలలో1978  వరకు బోధించారు   డాక్టర్ శ్రీమతి  సుగుణ  గారిని వివాహమాడి  చికాగోలో ఉంటున్నారు  .వీరి కుమార్తె శ్రీమతి పద్మావతి  భరత నాట్యం లో గొప్ప నర్తకీమణి   అల్లుడు డా హర్షవారధి  .

రామారావు గారికి 2001 లో బారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని  నాటి రాష్ట్ర పతి శ్రీ కె ఆర్ నారాయణగారి చేతులమీదుగా  ప్రదానం చేసింది .పొట్టి శ్రీరాములు తెలుగు యూని వర్సిటి ,గౌరవ డాక్టరేట్ అంద జేసింది.

.   తిరుపతి లో జరిగిన ప్రపంచ తెలుగు మహా సభల లో రాష్ట్రపతి శ్రీప్రణబ్ ముఖర్జీ గారి చేత సత్కార సన్మానాలు అందుకొన్నారు. అమెరికాలోని నార్త్ టెక్సాస్ తెలుగు సంస్థ మొదలైన ప్రసిధ సంస్థలచేత సత్కారం పొందారు  . శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ అవనిగడ్డలో ఏర్పాటు చేసిన నేతాజీ శత జయంతికి ,కృష్ణా జిల్లా రచయితల సంఘం నిర్వహించిన ప్రపంచ సభలకు హాజరై సన్మానాలు అందుకొన్నారు .

రామారావు గారి కి తెలుగు సాహిత్య  కళా రంగాలలో  లబ్ధ ప్రతిస్టుల౦దరి తోను గాఢమైన పరిచయం ఉంది ..ఆయన ఏనాడూ మూలాలను విస్మరించలేదు. శ్రీ ఆచంట జానకిరాం ,శ్రీ కొడవటి గంటి కుటుంబరావు ,శ్రీమతి కె రామ లక్ష్మి ,శ్రీ సొంఠి సదాపూర్ణ ,శ్రీ శివలెంక శంభు ప్రసాద్  శ్రీ వాకాటి పాండురంగారావు వంటి దిగ్గజాలతో ఆయనకున్నఆత్మీయత మరువ లేనిది .వీరంతాఎస్విగారి  సృజనశీలతను బహుధాప్రశంసించినవారే .ఆంద్రపత్రిక, భారతి,లసంపాదకులు శ్రీశివలెంకశంభుప్రసాద్ గారికోరికపైశ్రీరామారావుకళారహస్యాలపైప్రత్యేకమైనవిశ్లేషణాత్మకవ్యాసాలు భారతికి ,రాసి,తెలియనిఎన్నోవిషయాలను లోకానికిఎరుకపరచారు .వీటినిచదివిఅబ్బురపడినఅమెరికాలోబెర్కిలీలోని కాలి ఫోర్నియా యూనివర్సిటిఇంగ్లీష్ ప్రొఫెసర్ వీటిలో ముఖ్యమైన వాటినిఇంగ్లీష్ లోకి అనువాదంచేసిరామారాగారి భావాలకువిశ్వవ్యాప్తికలిగించారు.

మూర్తీభవించిన మానవీయత

ప్రపంచ ప్రఖ్యాతచిత్రకారులైన శ్రీ రామారావుగారు వ్యక్తిగాఅతిసున్నిత మనస్కులు .ఎవరికి యే బాధా,ఆపదా కలిగినా తనది గానే భావించి, వెంటనే స్పందించి,స్నేహహస్తంచాఛి,ఆదుకొనే సహృదయత ఉన్నసంస్కారంవారి విశిష్టలక్షణం .మానవతమూర్తీభవించిన ఉత్తమ కళాకారులాయన .1977 కృష్ణా జిల్లా దివిసీమనుఅల్లకల్లోలంచేసిన ఉప్పెన విషయం తెలిసి,ఇక్కడిబాధితులనుఆదుకోవటానికి అమెరికాలోతెలిసినవారందరివద్దస్వచ్చందంగావిరాళాలుసేకరించి పంపించినమానవతామూర్తిశ్రీ రామా రావు  ‘ఆనేక కవితలుఆంగ్లం లోను తెలుగు లోను  రాసి పుస్తకాలుగా తెచ్చారు ఎస్వి .

నైరూప్య చిత్రకళా యశస్వి

రామారావు గారి నైరూప్య చిత్రాల ప్రత్యేకత గురించి తెలుసుకొనే ముందు అసలు నైరూప్య చిత్రాలు అంటే ఏమిటో తెలియాలి .’’ఆకారాలలో కనిపించేది అబద్ధం, అశాశ్వతం కనుక వస్తు రూపమే మిధ్య ‘’అనే భావన కిందటి శతాబ్దం మధ్యలో పుట్టి అదే ఒక రూపం గా ఎదిగింది .ఈ భావన మొదట చిత్రకళలో ,తర్వాత శిల్పం,సంగీత ,సాహిత్యాలలో ప్రవేశించి  విలక్షణమైన భావోద్రేకాలను ప్రకటించే విధానంగా రూపొందింది .సహజ రూపాన్ని వదిలేసి ,అందులోని ప్రాధమిక రూపాన్ని విశ్లేషించే బొమ్మలు గీసే విధానమే నైరూప్య చిత్రకళ.అంటే చిత్రకళలో ఒక విలక్షణ ప్రక్రియ నైరూప్య చిత్రకళ.వాస్తవాన్ని వదిలిపెట్టి కళ లోని ఊహల వర్ణనలను సూచిస్తు౦దన్నమాట .మనకు వచ్చే కలలలో నైరూప్య చిత్రాలు అంటే ఆబ్స్ట్రాక్ట్ ఇమేజెస్ ఉంటాయి .ఆ కలల స్వభావాన్నీ ,వాటికీ నిజ జీవితానికీ ఉన్న సంబంధాన్ని మనం అన్వయించుకొంటాం . ఈ చిత్రాల్లో మనకు పరిచయమున్న రూపాలేవీ కనిపించవు .అంతా రేఖల ,రంగుల ఇంద్రజాలంగా అనిపిస్తుంది .ఇందులో ప్రసిద్ధుడైన వాడు ఫ్రెంచ్ చిత్రకారుడు పాబ్లో పికాసో .ఎస్వి రామారావు గారు ఈ నైరూప్య చిత్ర కళలో కొత్త శైలిని అలవరుచుకొని ‘’ఇండియన్ పికాసో ‘’గా విఖ్యాతులయ్యారు .

. డాక్టర్ రామారావు చిత్ర లేఖన ప్రతిభ క్రమంగా స్వీయ వ్యక్తిత్వాన్నిఏర్పరచుకొని ,ఎన్నో దశల ప్రయోగాలు దాటి నైరూప్య –ఆబ్స్ట్రాక్ట్ చిత్రకళా రూపం లో పతాక సదృశ౦ గా నిలిచింది .కవి ,రచయిత విమర్శకులు అయిన రామారావు బహుముఖ ప్రజ్న అనితర సాధ్యమని పిస్తుంది ‘’అన్నారు డా సి నారాయణ రెడ్డి గారు .ఆధునిక చిత్రకళా ప్రపంచం లో  ఫ్రెంచ్ చిత్రకారుడు పాబ్లో పికాసో ధ్రువతార .ఇవాళ ఎస్వి గారిచిత్రకళా విశ్వరూపాన్ని దర్శించిన వారు ఆయనను  ‘’ఇండియన్  పికాసో ‘’ అంటారు .కాని ఆయనమాత్రం ‘’నేనుపికాసో కు వీర అభిమానిని .ఆయనే నాకు మార్గ దర్శి ’అని సగర్వంగా చెప్పుకున్నారు .అది ఆయన సంస్కారానికి  నిదర్శనం .’

నేటి నవ్య కళ ఎన్నో యుగాలకిందటి నీగ్రో మూర్తి కళలో కన్పిస్తుంది .ఈనీగ్రో మూర్తికళ నుంచే ‘’ఫాదర్ ఆఫ్ మోడరన్ ఆర్ట్ ‘’అనిపిలువబడే పికాసో స్పూర్తి పొందాడు.సహజ రూప చిత్రణ కంటే అసహజ రూప చిత్రణకు ప్రతిభను పదునుపెట్టి నవ్య చిత్రకళా నిష్ణాతు డైనారుశ్రీ రామా రావు . నవ్య చిత్రకళ విశ్వజనీనమై తైల వర్ణ చిత్రాలలో ఒదిగి పోయింది .ఇందులో రూపం కంటే రంగుకే ప్రాధాన్యం ఎక్కువ .రంగుల ఇంద్రజాలందీని విలక్షణత్వం అన్నారు సంజీవ దేవ్ ..

క్యూబిజం ఇంప్రెషనిజం ఎక్స్ప్రెష నిజం సర్రియలిజం లోనూ అనేక ప్రయోగాలు చేసి ఎస్వి ,చిత్రాలలో మంచి టెక్చర్ అంటే స్పర్శి౦చదగిన పైభాగం సృష్టించటం లో మహా నిష్ణాతులయ్యారు .తాను మనో చక్షువులతో చూసే రూపాన్ని చర్మ చక్షువులకు అందించే నేర్పు అద్వితీయం .స్వయంగా చిత్రకళా మర్మజ్ఞులు  కూడా  అయినందున , కళావిమర్శకులకు అందని లోతులు ఆయన అందుకోగలిగారు  . ’సామాన్యంగా నైరూప్య చిత్రాలు ఏదో ఒక వ్యక్తికో వస్తువుకో, స్థలానికో చెంది ఉండవు .కాని ఎస్విగారి నైరూప్య చిత్రాలు విషయాలకు సంబంధించినవిగా ఉంటాయి . ‘’లండన్ లో మొదటి చిత్ర ప్రదర్శనకు’’ కృష్ణానది’’ని వస్తువుగా తీసుకొని ‘’ఆప్టికల్ ఇల్యూజన్ తో ధారావాహిక చిత్రాలు గీసి అద్భుతం అనిపించారు . కృష్ణానది మనకు తెలిసినా ఆయన చిత్రించిన కృష్ణానది మనకు తెలియదు .అంటే ఆనదీ ప్రవాహం ,ఒడ్డు, కెరటాలు ,వేగం వంటి స్థూల రూపాలు కాకుండా, సూక్ష్మ రూపం,  దాని నైరూప్య రూపాన్ని చిత్రిస్తారన్నమాట.ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటి వారు దీనిపై కవిత్వం రాశారు . ‘’లేపాక్షి, ఉషోదయం చిత్రాలూ పెద్ద పేరు తెచ్చుకోన్నాయి .

’   తర్వాత పూర్తిగా అమెరికాలో స్థిరపడి ప్రయోగ శీలతతో తైల, నీటి రంగుల చిత్రాలలో కోమలత్వ,మార్దవత్వాలేకాకవిశిష్టమైన వర్ణ సంగీతాన్ని సృష్టించారు .నీటి రంగుల్లో మాత్రచే కనిపించే పార దర్శక వాష్ పద్ధతిని ,ఆయిల్ పెయింటిం గ్  లో తెచ్చి అబ్బురపరచారు .పేలట్ నైఫ్ కాని ,  కుంచె కాని వాడకపోవటం  ఎస్విగారి మరో ప్రత్యేకత .వీటిబదులు గుడ్డ పీలికలతో రంగులు పట్టిస్తారాయాన .దీనివలన  పాలరాతి నునుపుదనం రావటమేకాక మేఘాల తెరలలాంటి  వాయు నీయత ప్రత్యక్ష మౌతుంది అన్నారు సంజీవ దేవ్ .‘’భారతీయ దృశ్య కవితా సారాన్ని 20 వశతాబ్దపు నైరూప్య చిత్రాలలో చూపటం పై దృష్టిపెట్టారు .ఇది విలక్షణ కృషి . .ప్రాక్ పశ్చిమాలకు ఒక దృఢమైన సేతువు అయ్యారు రామారావు . ఆయన చిత్రం ‘’వసంత ఋతువు ‘’లో అమెరికాలోని ప్రాణస్పందన ,ఉల్లాసం ,మధుర రసానందం, నైసర్గిక శోభ అన్నీ కూడా ఆధునిక నైరూప్య వాయునీయ వర్ణాలలో ప్రదర్శితమౌతుంది. ‘’ఉషోదయం ‘’చిత్రం లో ఉష్ణ వర్ణాలతో చిత్రింప బడి ,వెచ్చని పశ్చిమ పవనాలతో మృదువర్ణ లయతో తాండవించే చెట్లూ కొండలు పూత పూస్తున్నట్లు ఉంటాయి.

 

శ్రీ ఎ .కృష్ణా రెడ్డి, శ్రీ  ఎస్వి రామారావు లు ఇద్దరే ఇద్దరు తెలుగు  చిత్రకారులు ఇతర దేశాలలో స్థిరపడ్డ వారు . .ఇండియాలో ఉండగానే ఎస్వి చిత్రకళ వాస్తవంనుండి కల్పనకు ఎదిగి పాశ్చాత్య దేశాలలో నైరూప్యానికి విస్త రించింది. వర్ణ చిత్రకారు లైన శ్రీ రామారావు వర్ణ వ్యతిరేకతలనూ వర్ణాల ఐక్యతనూ సమతూకంగా చిత్రించారు . ఆయనది అమెరికన్ నైరూప్యాకలకు అనుకరణకాదు’’ప్రాచ్య రీతులున్న నైరూప్య కళ ‘’అన్నారు విశ్లేషకులు. తెలిసిన రూపాన్ని తెలియని రూపాల లో చిత్రి౦చటమే రామారావు గారి కళాసృస్టి’’అన్నారు చిత్రకళలో పండిపోయినశ్రీ సంజీవ దేవ్ .

 

.శ్రీ రామారావు గారిని ‘’ An important color-based non-figurative artist.అంటారు

’కుండలిని మేలు కొలుపు ,సాగర మధనం, ఎర్ర మట్టిలో నదీ ప్రవాహం, వెన్నెలలో నది ,నల్లడవిలో నీలి నది వంటి చిత్రాలలో రంగులు మహావేగం గా ప్రవహించేట్లు చేశారు .ఆయన చిత్రాలను ‘’పొయేమ్స్ ఇన్ పిగ్ మెంట్స్ అంటే వర్ణ ద్రవ్య కవిత్వం ‘’అంటారు. పంచ భూతాలలో నీరు, గాలి ,అగ్ని అనే మూడింటిని చక్కగా ఉపయోగించుకొన్నారు శ్రీ రామారావు.నీరు  ఆవిరై మేఘాలను చేరి కుంభ వృష్టి కి కారణ మౌతుందని ,తానెప్పుడూ తెలుపు రంగును ఉపయో గించ నేలేదని, అదే తన పేపర్ నియంత్రణకు కారణమయిందని నలుపు రంగు ఉపయోగించటమూ చాలా కష్టమే నని, కాని మిగిలినరంగులకు డెప్త్ ను ఇవ్వటానికే వాడతానని, పెర్షియన్ బ్లూ  ,క్రి౦సన్  లేక్ రంగులు వాడి సూర్యాస్తమయ సమయం లో బంగారు మేఘాల ను సృష్టిస్తానని వివరించారు. రెండవదైన గాలిని గూర్చి చెబుతూ మనచుట్టూ ఉండి ఉచ్చ్వాస నిశ్వాసాలకు కారణమైన గాలి , అదే ప్రళయ  జంఝ గా ,ప్రశాంతమలయానిలం గా ఉండే  రీతిని వర్ణిం చానని చెప్పారు మూడవదైన అగ్ని హిందూ పురాణాలకు సంబంధించినదని ,పృద్విని రక్షించే ఎనిమిది మూలకాలలో అతి ముఖ్యమైనదని ,అది శాశ్వతత్వానికి, తాత్కాలికానికి చిహ్నంగా తన చిత్రాలలో జ్వాలలుగా కనిపిస్తుందన్నారు.

భారతీయతకై ఆరాటం

ఇంతగా ప్రపంచ ప్రసిద్ధి పొందినా, తనను భారతీయులు మనస్పూర్తిగా ఆదరించ లేదని భావించి గత కొన్నేళ్లుగా ఢిల్లీ లో ఉంటూ, స్వదేశీయులకోసం 80 చిత్రాలు గీశానని ,మరో 20 పెయి౦టింగ్ లు వేస్తానని ఎస్వి అన్నారు .ఇప్పుడు తన చిత్రాలు భారతీయ స్పిరిట్ ప్రకారం కొత్త రూపాన్ని దాల్చాయని అంటారు .ఆర్ట్ లోని ప్రక్రియలు తెలియని వాళ్ళనూ ఆకర్షించేలా ప్రతిదీ వైవిధ్యంగా రూపొందించారు . ‘’నేచర్స్ ఆబ్ స్ట్రాక్ట్ గ్లోరీ ‘’పేరిట ఢిల్లీ లో దూమిమల్ ఆర్ట్ గాలరీలో చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేసి ఆకట్టు కొన్నారు .   భారతమాజీ  రాష్ట్ర పతి,  భారత రత్న డా ఎ.పి.జె ‘అబ్దుల్  కలాం గారు ఎస్వి గారి ‘’సోలో ఎక్సిబిషన్ ప్రారంభించారు .ఈసందర్భంగా డా కలాం తమ తదుపరి రచన ముఖ చిత్రం పై శ్రీ ఎస్వి రామారావు గారి పెయింటింగ్ ను ముద్రి౦చుకొంటానని సగర్వంగా తెలియజేశారు.నిరంతర ప్రయోగ శీలి అన్వేషకులు పద్మశ్రీ ఎస్ వి.రామారావు గారి కళ  .భారతీయులకు ,భారతీయతకు  దగ్గరవ్వాలన్న వారి ఆకాంక్ష నెర వేరు తున్నందుకు అందరం సంతోషం తో అభినందిద్దాం .

గబ్బిట దుర్గా ప్రసాద్ -15-9-16 –ఉయ్యూరు –9989066375

2-405  శివాలయం వీధి –ఉయ్యూరు -5 21165

విశ్వ విఖ్యాత నైరుప్య చిత్ర కళాయశస్వీ పద్మశ్రీ రామారావుకు -2-9-16 న ఉయ్యూరులో ఘన సత్కారం

-నేటి విద్యార్ధులు చదువుతోపాటు కళలపట్ల మక్కువ చూపాలని, నైరుప్యంగా ఎదగాలని విశ్వ విఖ్యాత చిత్ర కళాయశస్వీ పద్మశ్రీ ఎస్వీ రామారావు అన్నారు. గురువారం నాడు సరసభారతి మరియు శ్రీశ్రీనివాస విద్యాసంస్థల సంయుక్త అధ్వర్యంలో నిర్వహించిన సత్కర సభలో రామారావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. నాటి భారతీయులైన రవీంద్రనాథ్, హరగోవింద్ ఖురానా , రాధాకృష్ణ, చంద్రశేఖర్లకు నోబుల్ అందినాయని నేటి యువత దానిని అందిపుచ్చుకోవడంలో వెనుకంజలో ఉన్నారని తెలిపారు. విద్యార్ధులు తమ సమయాన్ని గ్రంధలయలల్లో ఎక్కవ సేపు గడిపితే జీవితం తెలుస్తుందని, కానీ యువత ఉద్యోగాలకోసం ఉపయోగపడే విద్యనే అభ్యసిస్తున్నరన్నారు.

సభలో శాసన మండలి సభ్యులు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రామారావు లాంటి పెద్దలను చూసి

 

యువత కళల పట్ల అధ్యయనం చేయాలనీ, చదువుతో పాటు విద్యార్ధులకు కళలను విద్యాసంస్థలు ప్రోత్సాహం అందించాలని సూచించారు.

రియో ఒలింపిక్స్ లో  రజిత,కా0 స్య పతకాలు సాధించిన సింధు, సాక్షిలను ఆదర్శంగా తీసుకోవాలని, అలాంటి  క్రీడలు, కళలు జోలికి నేటి విద్యార్ధులు ఆసక్తి కనబరచడం లేదని అన్నారు. సభకు అధ్యక్షత వహించిన సరసభారతి అధ్యక్షులు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ రామారావు లాంటి చిత్రకారులు మన కృష్ణాజిల్లా, రాష్ట్రానికి దేశానికి తమ చిత్రలేఖనం ద్వారా పేరు ప్రఖ్యాతలు సంపాదించడం గొప్ప విషయమని అన్నారు. అనతరం పద్మశ్రీ రామరావుని శాసనమండలి సభ్యులు రాజేంద్రప్రసాద్, సరసభారతి అధ్యక్షులు గబ్బిట దుర్గాప్రసాద్, శ్రీ శ్రీనివాస విద్యాసంస్థల చైర్మన్ పరుచూరి శ్రీనివాస్ కళాశాల ప్రిన్సిపాల్ గోవర్ధన రావు. ఎం పి టి సి ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కాసరనేని మురళి ఘనంగా సత్కరించారు

DSCN1891DSCN1892DSCN1852

DSCN1855
DSCN1866
DSCN1869
DSCN1877
 DSCN1879
DSCN1880
DSCN1881DSCN1890
DSCN1889

అమెరికాలో ఉంటూ ఉయ్యూరు ,సరసభారతి పట్ల విశేష అభిమానం కల శ్రీ మైనేని గోపాలకృష్ణగారు నగదు కానుక గా పంపిన 11 ,116 రూపాయలు సరసభారతి అధ్యక్షులు దుర్గాప్రసాద్ పద్మశ్రీ శ్రీ ఎస్వీ రామారావు గారికి సభా ముఖంగా అందజేశారు .

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

వీక్లీ అమెరికా -21(14-8-17 నుండి 20-8-17 వరకు )

వీక్లీ అమెరికా -21(14-8-17 నుండి 20-8-17 వరకు )

           భజనవారం 

14-8-17 -సోమవారం -”-సంసారం లో రిగమనిస”సరదా హాస్య ఆర్టికల్ రాశా .నాని నటించి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం తో వచ్చిన ”జెంటిల్మన్ ”సినిమా ”గొట్టం ”లో చూశా .మంచి సస్పెన్స్ తో నాని నటనా వైదుష్యంతో చక్కని హమ్మింగ్ పాటలతో కొడైకెనాల్ బాక్ డ్రాప్ గా సినిమా కనుల పండువుగా ఉంది ..
15-8-17   మంగళవారం -శ్రీ కృష్ణాష్టమి –
ఉదయమే మా శ్రీమతి ముగ్గుతో వాకిలి నుంచి ఇంట్లోకి బాల కృష్ణుని పాదాలు వేసి కన్నయ్యకు ఆహ్వానం పలికింది .నేను మా మూలు సంధ్యావందనం చేసి తర్వాత మంగళవారం కనుక శ్రీ సువర్చలా సహిత ఆంజనేయ స్వామి అష్టోత్తర సహస్ర నామ పూజ ,కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణా అష్టోత్తర ,విష్ణు సహస్ర నామ పూజ చేశా .కృష్ణాష్టమి సందర్భంగా వైష్ణవాలయాలలో ప్రసాదంగా పెట్టె ”కట్టెకారం ”మా ఆవిడ చేయగా దానితోపాటు అటుకులు బెల్లం పాలు పెరుగు నెయ్యి వెన్న పండ్లతో సహా నైవేద్యం పెట్టాము .  తర్వాత కృష్ణలీలలు శ్రీకృష్ణ కర్ణామృతం జయదేవుని అష్టపదులు  జానకి పాడిన కస్తూరిరంగా పాటలూ  సుబ్బులక్ష్మి విష్ణు సహస్రనామ స్తోత్రం సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనలు మాడుగులచదివిన పోతన  భాగవత0   వగైరా వింటూ సాయంకాలం దాకా కాలక్షేపం చేశాను
           సాయం భజన
 సాయంకాలం7 గంటలకు  మా అమ్మాయి ఇంట్లో సాయి సెంటర్ వాళ్ళను ఆహ్వానించి భజన ఏర్పాటు చేసింది .శ్రీమతి గోసుకోండ అరుణ ఇంట్లోని పెద్ద శ్రీ కృష్ణ విగ్రహాన్ని వాళ్ళఅబ్బాయి తెచ్చాడు .దాన్నీ అలంకరించి సిద్ధం గా ఉన్నాం .దేవుళ్ళ అలంకారం మా అమ్మాయి బాగా చేసింది . ఇంట్లో ఉన్న డబుల్ స్పీఎకర్ లతో నాలుగు మైకుల ఏర్పాటు మా మనవళ్లు శ్రీకేత్ అశుతోష్ పీయూష్ లు సిద్ధం చేశారు .   అకస్మాత్తుగా సాయ0కాలం  6-30 నుంచి  పెద్ద వర్షం పడింది .అప్పటికే సాయి సెంటర్ హెడ్  సుబ్బు వచ్చేశారు . మిగిలినవాళ్లు వస్తారా రాగలరా అను కొంటుంటే ఉరుములు మెరుపులు వచ్చి వర్షం అంతే  సడన్ గా 6-50 కి ఆగిపోయింది . హమ్మయ్య అనుకొన్నాం .సరిగ్గా 6-55 కు  సాయి సెంటర్ నిర్వాహకురాలు శ్రీమతి జయ రాగా ఖచ్చితంగా 7 గంటలకు సుబ్బు జయ మా అమ్మాయి విజ్జి భజన ప్రారంభించారు .. ఆ తర్వాత అందరూ వచ్చేశారు దాదాపు 75 మంది .అందరూ ఏకకంఠంగా భజనలు చేశారు శ్రీ కృష్ణ భజనలు ఎక్కువగా చేశారు చిన్నపిల్లలూ చాలా శ్రావ్యంగా పాడారు మంచి నిండుదనం వచ్చింది .ఖచ్చితంగా రాత్రి 8 గంటలకు భజన ఆపేశారు . తర్వాత జయ రెండు నిమిషాలు మాట్లాడాక  మా అమ్మాయి నన్ను మాట్లాడమంటే కృష్ణాష్టమి ,భారత స్వాతంత్య్ర దినోత్సవ ప్రాధాన్యం పై 9 నిమిషాలు మాట్లాడాను .అందరూ తెలుగు తెలియని తమిళ కన్నడిగులు కూడా బాగుందని అన్నారు . ఇంకా ఒకఅరగంట మాట్లాడితే బాగుండు నన్నారు.  అది సమయం కాదు అంతా” ఫుడ్ కోర్ట్ లో చేతికీ  మూతికీ బాటింగ్ హడావిడి ”లో ఉన్నారన్నాను .కాదు భోజనాలయ్యాక మాట్లాడాలి అన్నారు సరే అన్నా.  భోజనం లో  పూరీ ,బంగాళాదుంపకూర ,మామూలు ఇడ్లీ రాగి రవ్వ ఇడ్లీ ,సాంబారు గోంగూర పచ్చడి ,అటుకులపులిహోర ,చట్నీ  జున్ను ,ఫ్రూట్ సలాడ్ ,ఫ్రూట్ జ్యుస్ ,అన్నం ,పెరుగు ,పెరుగన్నం  పుచ్చకాయ ముక్కలు చక్రపొంగలి   , వగైరాలతో కమ్మని భోజనం .
  భోజనాలు అయ్యాక ఒక పది మంది నేను మాట్లాడాలని కోరగా హాలులో కూర్చునిరాత్రి 9-30కు మొదలుపెట్టి  సుమారు 20 నిమిషాలు బ్రహ్మ వైవర్త పురాణం లోని  గోలోకం విశేషాల ,మరికొన్ని విషయాలు మాట్లాడాను చాలా శ్రద్ధగా విన్నారు మా అమ్మాయి రాధ లక్ష్మి ,ఉషా ,సురేఖా  నీలిమ , పవన్ ,,రాంకీ అవధాని  జగదీశ్ మొదలైనవారు . అభి రుచి ఉన్నవారికి నాకు  తెలిసినవి  నాలుగు ముక్కలు చెప్పటం లో నాకు ఆనందం అలాగే అందరూ ఆనందాన్ని సంతృప్తిని   పొందారు .రాంకీ  ఉషా విజ్జి వీడియో తీసి లైవ్ గా మా వాళ్లకు పంపారు  .అంతా  అయ్యేసరికి రాత్రి 10 అయింది .అప్పుడు ఇళ్లకు బయల్దేరి వెళ్లారు . మంచికార్యక్రమం అనుకోకుండా జరిగింది . వర్షం హర్షం ఆనందం పంచింది .
  బుధవారం -నిన్నటి విశేషాలన్నీ ”కృష్ణం  వందే  జగద్గురుమ్”గా రాశాను  . రాజ్ తరుణ్ సినిమా ”ఉయ్యాల ;జంపాల ”యు ట్యూబ్ లో చూశా .కొత్తకుర్రాడు  చాలా  ఫ్రెష్  గా ఈజీగా చేశాడు అనిపించింది చక్కని గోదావరి పల్లెటూరు కూనవరం బాక్ గ్రౌండ్ గా తీసిన చిత్రం ప్రకృతి అందాలన్నీ ఒడిసిపట్టి చూపించాడు . దర్శకుడు .సంగీతం వీనులవిందు ఫోటోగ్రఫీ నయనానందకరం ..
17-8-17 గురువారం -మా అన్నయ్యగారి మనవడు చి కళ్యాణ్ ఛిసౌ మీనా ల  వివాహం ఈ రోజు ఉయ్యూరులో  ఉదయం 9 గంటలకు జరిగింది . మా బంధువులందరూ వచ్చారట .గ్రాండ్ గా జరిగిందని రమణ ఫోన్ చేసి చెప్పాడు . .మా మేనల్లుడు అశోక్ ,మేనకోడలు  పద్మ మా అబ్బాయి శాస్త్రి ,మనవడు భువన్  తమ్ముడు మోహన్ భార్య సునీత  మా అన్నయ్య మనవడు రవి ,హైదరాబాద్ నుంచి ,మా పెద్ద మేనకోడలు కళ , భర్త చంద్రశేఖర్ ,కొడుకు బాలాజీ ,మేనల్లుడు శ్రీనివాస్ ద0పతులు చెన్నై నుంచి,  గరివిడినుంచి మా అన్నయ్య కూతురు వేదవల్లి భర్త రామకృష్ణ మొదలైన బంధుగణం హాజరై దగ్గరుండి వివాహం జరిపించారు .
శుక్రవారం -”ట్యూబ్ లో శాతకర్ణి హిందీ సినిమా చూసి ఆనందించా .
శనివారం -త్రిపురనేని గోపీ చ0ద్ దర్శకత్వం లో ఘంటసాల సంగీతం తో ,కృష్ణవేణీ నారాయణరావు నాయికా నాయకులుగా శోభనాచల వారి  శ్రీ లక్ష్మమ్మ చూశాము గోపీచంద్ డైరెక్షన్ స్క్రీన్ ప్లే నీట్ గా ఉన్నాయి .   . తర్వాత కృష్ణవేణి గారి ఇంటర్వ్యూ కూడా చూశాను . ఎందరెందరినో చిత్రసీమకు పరిచయం చేసిన ఘనత కృష్ణవేణీ భర్త మీర్జాపురం రాజా వారిది .నూజివీడు రైల్వే స్టేషన్ పేరు మీర్జాపురంఅని ఉండేది చాలాకాలం .
గీర్వాణం -3 లో 415 వరకు రాశా .
 మా అమ్మాయి తో సహా ఇక్కడి  సాయి సెంటర్ వాళ్ళు గ్రీన్స్ బరో లో నిర్వహించిన ఒక రోజు వాలంటరి  టీచర్స్ ప్రోగ్రామ్ కు  ఉదయం 5-30 కి బయల్దేరివెళ్లి రా త్రి 7-30 కు వచ్చారు .
  మా మనవళ్ళు  ఆశుతోష్ ,పీయూష్ లు నెల రోజుల టెన్నిస్ కోచింగ్ పూర్తి అయిన సందర్భంగా వాళ్ళు ఏర్పాటు చేసిన కాంప్ కు ఉదయం వెళ్లి సాయంత్రం వచ్చారు మా పెద్దమనవడు శ్రీకేత్ శని ,ఆదివారాలలో ఉదయం మాథ్స్ ఇంటెన్సివ్ కోచింగ్ కు వెళ్లి ,ఆ తర్వాత వై ఏం సి లో ఆడుకొని వస్తున్నాడు .ఇక్కడి స్కూళ్ళు  ఈ నెల 28 నుంచి ప్రారంభం   మళ్ళీ హడావిడి . .
 20-8-17 ఆదివారం -గీర్వాణం -3 లో 418 వరకు కవులగురించి ఇవాళరాశాను
  ఈ వీక్లీ ఇంతటితో సమాప్తం .
  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -20-8-17 -కాంప్-షార్లెట్-అమెరికా
Posted in అమెరికా లో | Tagged | Leave a comment

మట్టిబండి కన్యాశుల్కం -రామతీర్థ

clip

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 416-స్వర జతులు రాసిన -మైసూర్ వాసుదేవ రావు-(1799-1879 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

416-స్వర జతులు రాసిన -మైసూర్ వాసుదేవ రావు-(1799-1879 )

కర్ణాటక లో 1799 లో జన్మించిన సంగీత వేత్త మైసూర్ వాసుదేవరావు త్రాగరాజస్వామి శిష్యుడు వాలాజపేట వెంకటరామణ  భాగవతార్ శిష్యుడు .గురువు ఈయనను మైసూర్ మహారాజు మూడవ కృష్ణ రాజ ఒడియార్ కు పరిచయం చేయగా ఆసంగీత ప్రతిభకు మెచ్చి ఆస్థాన విద్వా 0సుని చేశాడు . .క్షేత్ర సందర్శనం చేసి ప్రతి దేవునిపైనా కృతులు చాలాభాగం తెలుగులో కొన్ని సంస్కృతం లో రాశాడు .స్వరజతులు వర్ణాలు కృతులు తిల్లానా లు సంస్కృత తెలుగు భాషలలో రాశాడు .ఆయన కృతులన్నీ రాగభావం తో సాహిత్య సౌందర్యం తో అలరిస్తాయి .హరికాంభోజి రాగం లో రాసిన సంస్కృత కీర్తన -’’సాకేత నగరనాధ ‘’శ్రీమతి ఏం ఎస్ .సుబ్బులక్ష్మి గాత్రం తో బహుళ ప్రచారం పొందింది .తెలుగులో మాయామాళవ గౌళరాగం లోని ‘’దేవాది దేవ ననుకావ సమయమురా ‘’,ఆఠణా రాగం లో -’’వాచామ గోచరుండని ‘’,కమాస్ రాగం లో -’’పరమాధ్బుతమైన నీ సేవ ‘’హంసధ్వనిలోని స్వరజతి -’’రామాభిరామా ‘’   మొదలైనవి ఆయన ప్రతిభకు స్వరగోపురాలు   . 1879 80 ఏళ్ళ వయసులో  మరణించాడు .

417-సప్త తాళేశ్వర కర్త -వీణ వెంకట సుబ్బయ్య (1750-1838)

మైసూర్ లోని ప్రసిద్ధ వైణిక కుటుంబం లో 1750 లో తంజావూర్ జిల్లా కపిస్తలం లో  జన్మించిన వీణ వెంకటసుబ్బయ్య మైసూర్ ను పాలించిన హైదరాలి కాలం వాడు తర్వాత మూడవ కృష్ణరాజ ఒడియార్ కు సంగీతగురువై ,ఆస్థాన సంగీత విద్వా0సు డయ్యాడు .దివాన్ పూర్ణయ్యపంతులు మైసూర్ రాజ్యాన్ని విజయనగర సామ్రాజ్యంలాగా సాంస్కృతిక కేంద్రం చేయాలని చాలా కృషి చేశాడు . వెంకటసుబ్బయ్య రీతి గౌళరాగం లో  ఎనిమిది సులాది తాళాలతో రచించిన ‘’సప్త తాళేశ్వర గీతం ‘’ సుప్రసిద్ధమైనది . 88 ఏళ్ళు జీవించిన వీణ వెంకటసుబ్బయ్య జీవిత వీణ 1838 లో   ఆగిపోయింది .

418-లింగ రాజ అర్స్ (1823-1874 )

 మైసూర్ మహారాజా మూడవ కృష్ణరాజ ఒడియార్ అల్లుడు అలియ లింగ రాజ అర్స్ కన్నడ సంస్కృతాలలో అందెవేసిన చేయి .సంగీతకర్త .హెగ్గద  దేవనకోట వాస్తవ్యుడు .లలితకళాభిజ్ఞుడు .అనేక నాటకాలు ,యక్షగానాలు  ,50 కి పైగా కృతులు రచించాడు . లింగ ,లింగేంద్ర ,లింగరాజ అనే కలం పేరుతొ రాసేవాడు .సంస్కృతం లో పంచ వింశతి లీల ‘’అంబకీర్తన   బాగా ప్రసిద్ధం . అతని నీలాంబరి రాగం చిత్త స్వరం లో ‘’ శృంగార లహరి’’ సంస్కృత కృతి అత్యద్భుతం . 51 ఏళ్ళు మాత్రమే జీవించి అర్స్ 1874 లో అసువులు బాశాడు ..

 సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -20-7-17- కాంప్-షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 412-సంస్కృత కీర్తనలు రాసిన -పాలఘాట్ పరమేశ్వర  భాగవతార్ (1815-1892 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

412-సంస్కృత కీర్తనలు రాసిన -పాలఘాట్ పరమేశ్వర  భాగవతార్  (1815-1892 )

 

కేరళలో నూరానిలో 1815 లో జన్మించి 1892 లో మరణించిన పాలఘాట్ పరమేశ్వర భాగవతార్  కర్ణాటక సంగీత వాగ్గేయకారుడు . తిరువాన్కూర్ రాజు ,ప్రముఖ వాగ్గేయ కారుడు స్వాతి తిరుణాల్ కు చాలా సన్నిహితుడు అభిమానమైనవాడుకూడా .స్వాతి తిరుణాల్ రాసిన వాటికి  పరమేశ్వర్ నకలు   రాసేవాడు .గొప్ప వీణ విద్వా 0సుడు .స్వరబత్ వాయిద్యం లోను దిట్ట . హరికథాగానం తో జనాలను ఉర్రూత లూగించేవాడు . స్వాతి రాజాస్థాన సంగీత విద్వా0 సుడు  గురువు  వడివేలు మరణించాక భాగవతార్ ను ఆస్థాన విద్వా0సుని చేశాడు రాజు పరమేశ్వర భాగవతార్  సంస్కృతం లో కీర్తనలు రాశాడు . అవి అచ్చు స్వాతి తిరుణాల్ ,ముత్తుస్వామి దీక్షితార్ కీర్తనలాగానే ఉంటాయి .అనేక వర్ణాలూ రాశాడు .ఆయన రాసిన కీర్తనలలోనాటరాగం లోని  ‘’సరసిజనాభ’’,శ్రీ మహా గణపతిం భజే ‘’కీర్తనలు మంచి గుర్తింపు తెచ్చి కచేరీలు వరమయ్యాయి . 87 వ ఏట 1892 లో భాగవతార్ మరణించాడు . మలయాళం లో కూడా కీర్తనలు రాశాడు .

413-తిరువనంత స్థల పురాణకర్త -కుట్టికుంజన్  తంగాచి (1820-1904 )

కుట్టికుంజన్  తంగాచి ఇరై మాన్ తంబీ ఏకైక కుమార్తె .కేరళలో 1820 లో పుట్టి 1904 లో చనిపోయింది . తండ్రి స్వాతి తిరుణాల్ ఆస్థాన సంగీత విద్వా0సుడు .తండ్రి వద్దే సంగీతం నేర్చింది .హరిప్పద  కోచిప్పిల్ల వారియర్ వద్ద సంస్కృతం అభ్యసించి సంస్కృత ,మళయాళ భాషలో గొప్ప విదుషీమణి అయింది . నృత్యం కూడా తండ్రివద్దే నేర్చి దాని లోనూ ప్రతిభ చాటింది . .పార్వతీపరిణయం శ్రీమతి స్వయంవరం  అనే అట్టకాలు రాసింది  .సంస్కృతం లో తిరువనంతపురం స్థలపురాణం ,గజేంద్ర మోక్షం ,నలచరిత్రం రాసింది .అనేక కృతులు ,వర్ణాలు రచించింది అందులో కాంభోజిరాగం లో ‘’కాత్యాయని మాం ‘’కళ్యాణిరాగం లో ‘’సామజహరే ‘’మంచి గుర్తింపుపొందాయి  .సంస్కృత తిల్లానా కూడా రాసింది . కేరళలో కీర్తనలు రాసిన ప్రధమ మహిళావాగ్గేయకారిణిగా   ఆమె గుర్తిపు పొందింది.  84 వ ఏట1904 లో మరణించింది .

414-108 రాగాలలో 108 కీర్తనలు రాసిన -ఎన్నపాదం  వెంకటరామ భాగవతార్ (1880-1961)

కేరళలో కొచ్చిన్ లోని ఎన్నపాదం లో వెంకటరామ భాగవతార్ 1880 లో జన్మించి 1961 లో 81 వ ఏట మరణించాడు . హరికథాగానం లో సాటిలేనిమిటి .సంస్కృత తెలుగు కన్నడ మిళ మళయాళ భాషలో హరికథలు రాసి  చెప్పి ఒప్పించినహరికథా సరస్వతి .తిరువనంతపురం కొచ్చిన్ మైసూర్ ,బరోడా మొదలైన సంస్థానాలలో హరికథా గానం చేసి మెప్పుపొంది సత్కారాలు అందుకొన్నాడు .అనేక కొత్తరాగాలు సృష్టించాడు . కృష్ణ అష్టోత్తర శతనామ కీర్తనలు ‘’108 రాగాలలో 108 కీర్తనలు అంటే నామానికి ఒక్క కీర్తనగా రచించిన భక్త శిఖామణి . ప్రకాశిని రాగం లో ‘’గుహం ఆశ్రయామి ‘’,సుముఖిరాగం లో ‘’మాతంగ ముఖం ‘’కీర్త నలు  ప్రసిద్ధి చెందాయి .

415-మణిప్రవాళ శైలి కృతి కర్త -తమస్సేరి కృష్ణన్  భట్టాత్రి (1890-1963 )

1890 లో పుట్టి 1963 లో చనిపోయిన తమస్సేరి  కృష్ణన్  భట్టాత్రి కేరళలో జన్మించాడు .సంస్కృత మళయాళభాషలలో గొప్ప ప్రజ్ఞావంతుడు . ఈ రెండు భాషలు కలిపి మణిప్రవాళ శైలిలో కృతులు  రాశాడు .బేగడ  రాగం లో ‘’శ్రీరాఘవ పరిపాలయ ‘’,ఆనంద భైరవిలో ‘’ఆనంద నంద నందనం నమామి ‘’మొదలైనవి ప్రసిద్ధ కీర్తనలు .

416-దేవయాని చరిత నాటక కర్త -కుట్టు ముత్తు కుంజు కురుప్ (1880-1943)

కేరళలో కనియూర్ లో 1880 లో పుట్టి 63 ఏళ్లకు  1943లో చనిపోయిన కుట్టుముట్టు కుంజు కురుప్ సాహిత్య సంగీతాలలో మహా విద్వా 0సుడు . సంస్కృతం లో దేవయాని చరిత నాటకం ,విద్యా శ0ఖ ధ్వని ,బాలగోపాలం  వంటివి ఆయన ప్రతిభా ప్రదర్శనాలు .తననాటకాలలో 300 కు పైగా కృతులు రాసి స్వరపరచిన  మేధావి .

 సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -19-8-17 -కాంప్–షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

చిత్ర కళా విశ్వనాధుని కీర్తి కిరీటం లో అముల్యాభరణం “శంకరాభరణం“

చిత్ర కళా విశ్వనాధుని కీర్తి కిరీటం లో
అముల్యాభరణం
“శంకరాభరణం“
నేపధ్య సంగీతం  :

శంకరాభరణం చిత్రం ప్రారంభం లాంచ్ ప్రయాణం.  నది  తీరు తెన్నులు వన్నె చిన్నెలు ప్రయాణం లో లాంచీ గొట్టం లోంచి వచ్చ్చే నాదం వీనుల విందైన ధ్వని దానితో శ్రుతి కలిపే గాలి  తులసీరాం  హమ్మింగ్ అద్భుతం. నీటి సవ్వడి వేగం అద్భుతం గా విన్పిస్తుంది.  బాల మేధావి లయబద్ధంగా సంగీతాన్ని బిందెల మీద కర్రముక్కల తోనూ విన్పిస్తాడు .ఇదంతా వాచ్యం కానీ, నేత్రానంద రస స్ఫోరక కళా భిజ్నత . ఇది ఈ చిత్రానికి నేపధ్య సంగీతం .

శంకర శాస్త్రి   ని పరిచయం చేస్తూ ఆయన పాదాల ల సవ్వడిలో మంద్రగానం ధ్వని0ప జేయటం  అతని లోని కళాభిజ్ఞతకు ,నిశ్చల మయిన మనస్సుకు ప్రతిబింబం అని పిస్తుంది . తులసిని ఇంట్లోకి ఆహ్వానించినపుడు ”కొలువీయ వయ్య రామా ”అనే నేపధ్య సంగీత ధ్వని అపూర్వం .అలాగే రైల్ దిగుతున్నప్పుడు ”యెంత వార లైనకాంత దాసులే ” అన్న  నేపధ్య గీత ధ్వని ప్రేక్షకులకు కలిగించే సస్పెన్సు కు పరాకాష్ట .రేప్ సీన్ లో శంకరాభరణ రాగాన్ని ,చివరి సరిగమలను వాడుకున్న విధం అనిర్వచనీయం ,అద్భుతం ,అమోఘం, అనితర సాధ్యం .ఆ ఊహ కు జోహర్లె .అసలు శాస్త్రి నిద్రపోతుండగా బాల శాస్త్రి తో ”మానస సంచరరే ”పాట  ఎన్నుకోవటం సామాన్య దర్శకునికి అందే విషయం కాదు అది విశ్వనాధుని  దృష్టి .  ”శ్రీ రమణీ కుఛ దుర్గ విహారే ”అని నిద్రలోనే అనిపించటం ఔచిత్యానికి పరాకాష్ట.  మళ్ళీ కుర్రాడితో ”పరమహంస ముఖ చంద్ర చకోరే ”అనిపించటం శంకర శాస్త్రి లోని పరమహంసత్వాన్ని వ్యంగ్య వైభవం గా ఎరుక పరచటమే .ఇక్కడే కావ్య ధ్వని చిత్ర ధ్వని గా మారింది .ఇలా నేపధ్య సంగీతానికి ఈ చిత్రం పట్టాభిషేకం జరిపించింది . ఇది మహ దేవన్  విశ్వనాధ్  ల అపూర్వ భావ సంయోగ ముక్తా ఫలం .
సోమయాజుల నటన:
ఒక తరానికి చెందిన కళా సరస్వతి గా ఠీవి గాం భీర్యం లో నడకలో,నడతలో మాటలో హావ భావాలలో అతి లేని ఔచిత్యపు హద్దు లో నడయాడే సంగీత సర్వస్వం గా సంగీత రాయంచల పరమహంస లాంటి వేషం శంకర శాస్త్రిది .దాన్ని అన్ని రకాలుగా ,అన్ని విధాలుగా సరిపోయేటట్లు జీవి0 చేట్లు  నటించాడు” కలెక్టర్” సోమయాజులు . అంతకు ముందున్న ఎన్నో ఏళ్ళ నాటకానుభవం, నేపధ్యం గా సాయ పడింది . అది అతని పుణ్యఫలం,యోగబలం ,దీక్ష దక్షత ,పరిపక్వత.  సోమయాజులు నిజంగానే నట సోమయాజి అయాడు .ఆ హుందా తనం అనితర సాధ్య మనిపించాడు . అదో తపస్సు గా ,యోగ సమాధి గా నిర్వహించాడు.”నట సోమయాజి ”అనిపించాడు .
అసలు ఆ పాత్ర ఏమి  చెప్పదు  .అ0తా  మనం ఊహించు కోవలసిందే .ఊహా  సామ్రాజ్యమే. అంతా  . వ్యంగ్య వైభవమే .”లోకేశ్వరుడికి  తప్ప లోకానికి భయపడను  .  నాకు తులసికి వున్న సంబంధం నాకు తెలుసు ఆ పరమేశ్వరుడికి  తెలుసు .”ఇవి మాత్రమే ఆయన ఉచ్చరించే మాటలు .ఇందులోని నిగూఢ భావం ఆ  charector  ను విశ్లేషిస్తుంది . తులసి రైల్ ఎక్కేటప్పుడు, మైసూర్ లో పరాభవం   జరిగినప్పుడు, ఎక్కడా   తొణకడు , బెణకడు ఎవర్ని ఏమీ అనడు  ,తులసి తాను హత్య చేసి వచ్చి ,ఆ రక్తం తో పాదాభిషేకం చేసినపుడు  తొట్రుపడడు .  .
తనకుతురి పెళ్లి కూడా ”అపస్వర’తో ఆగిపోయనా  విచారించడు .అంత పరమేశ్వర సంకల్పం అన్నది అతని భావం గా అనిపిస్తుంది .అయితే  ఆ గంభీరం  వెనుక ఒక మహత్తర మానవత్వం అంతర్వాహినిగా  ప్రవహిస్తుంటుంది .అది సంస్కార  చేతన .  అది కట్టు బాట్లకు ఆచార వ్యవహారాలకు  అందనిది   అంత ఉత్తమమైనది .  .హృదయ గత మైనది .ప్రవర్తన లో రావాల్సిన దైవత్వం అది .అదే ఆ పాత్ర శి ష్టాచార  పరాయణు డైన ,సంగీతపు లో’తులు తరచిన సంగీత సాహిత్య మూర్తి అందించే సారాంశం . .సంగీతానికి భాష, భేదం లేదని  ,అది ఆ నాద బ్రహ్మను చేరే ఉత్తమ మార్గమని చెప్పిస్తాడు .మాట్లాడిన నాలుగు మాటలు majestic  గా ఒక కలెక్టర్ హుందా  తనం తో చెప్పినట్లుంటుంది .ఒక అద్వైతం ,ఒక నిర్లిప్తత ,జ్యోతకం అవుతాయి .అంతే కాదు హారతి కర్పూరం వెలిగించిన అరచేతికి  కూతురు వెన్న రాస్తుంటే  సుజల నయనాలతో కూతురు స్వరాలు అంటుంటే కరిగి పోయిన హృదయం ,తేలిక పడిన మనస్సు ఆనంద బాష్పాలు రాలుస్తుంటే అక్కడ సోమయాజులు మహోన్నత నటన  శిఖరారోహణం  చేసినట్లుంటుంది .గుండెలు పిండే సన్నివేశం  .అక్కడ ఆర్ద్రత వర్షించింది అనురాగం జల్లుగా కురిసింది మానవత మేల్కొంది గుండె చెరువే అయింది .అదీ నటన ,అదే నటన అనిపించింది . సోమయాజులు నట యజ్ఞం చేసి ధన్యడయాడు
చివరి సీన్ లో ”దొరకునా  ఇటువంటి సేవ ”పాటకు ముందు ”పాశ్చాత్య సంగీతపు పెను తుఫానుకు రెపరెప లాడు తున్న సత్ సాంప్రదాయ భారతీయ సంగీతానికి ఒకింత ఆదుకునేందుకు ముందుకు వచ్చ్చిన ఆ అజ్ఞాత దాత కు ,నా నమోవాకాలు ఆ ళాభిజ్ఞతకు శిరసు వంచి పాదాభి వందనం చేస్తున్నాను .”అనటం లో మన గుండె కరగి కన్నీరు మున్నీరై రసప్లావితమౌతుంది .  బ్రహ్మానంద సహోదరత్వానికి సామీప్య మవుతుంది మనసులో .ఆనంద జ్యోతి వెలుగు తుంది .ఆరాధనకు అద్వైత సిద్ధి కల్గుతుంది .ఈ మాటలన్నీ తెలిసే అన్నాడు . అన్న భావన కలుగుతుంది .”క్షుద్రులెరుగని నిర్నిద్ర గానమిది అవదరించరా ,,విని తరించరా  ”అని అనిపించిన పాత్ర అది . తెలుగు చిత్ర రంగం లో ఇంతవరకు ఇంతటి ఉదాత్త వున్నత పాత్ర సృష్టి జరగలేదు .అంత గొప్ప పాత్రను మలచి తీర్చి దిద్దిన దర్శకుడు  విశ్వనాధ్  కళా  విశ్వ నాధ్  అనిపిస్తాడు .సోమయాజులు పాత్ర కర్తగా   విశ్వనాధ్  సృష్టికర్తగా ,కళా నరాజనాలు అందుకొన్నారు .  ఆ జంట ధన్యమై ,సార్ధకత చెందింది
మంజు భార్గవి :
నటన తపస్సు .ఏ పాత్ర ఎవరికోసం ఎందుకు ఎప్పుడు సృసింప బడుతుందో  తెలియదు .వాంప్ వేషాలలో.సెక్సీ గా కనిపించి న మంజు లో మంజుల గానానికి మనోహర నాట్య విలసంచేసే కళా మూర్తి వుందని  ఎవరూ ఊహించలేక పోయారు  ఊహించలేదుకూడా .  .ప్రెసిడెంట్ పేరమ్మ సినిమాలో  కాసేపే నాట్యం చేసినా  బాగా చేసిందనిపించింది .అలాంటి భార్గవి  విశ్వనాధ్  చేతిలో మనోజ్ఞ మనోహర  శిల్ప మూర్తిగా  గా మలచ బడింది .అసలు ఆ పాత్రకు డైలాగులు లేవు .ఉన్నా చాల పొదుపు .అంతా సాత్విక అభినయమే  .ఊహాలోక  సంచారమీ .  .ఏదో తెలీని పిచ్చి ఆరాధన తత్త్వం .ఒక devotion  dedication ..సర్వాత్మన సర్వ సమర్పణ భావం .ఒక పూజారిగా ,వేదాంతిగా కనిపించే పిచ్చి  రూపం అలంకరణలో ఆహార్యం లో దుస్తుల్లో భాషలో స్వచ్చత .  అంత నిసర్గ రమణీయం .ఆ పాత్రలో మంజు మంజులం గా జీవించి తరించింది
జమీందార్ రేప్ చేసేప్పుడు సంగీత గమకా లకు అనుగుణంగా చేసిన నటన అద్భుతం .బెంగుళూరు లో తనకు, శంకర శాస్త్రి కి సంబంధాన్ని తల్లి అంట  గట్టి నపుడు, ,తిట్టినపుడు, ఏదో చెప్పాలనుకొని ,చెప్పలేక మనసు లో దాచుకున్న బాధ నివారించుకోవటం చాలా కష్టమే   .అదంతా అనుభవైక వేద్యం గా చూపించింది .శం కర శాస్త్రి రాగానికి తాను భావించిన, ఊహించిన రీతిలో నాట్యం చేసే సందర్భాలు రవి వర్మ  చిత్రాలుగా  దర్సన మిస్తాయి .బాపు బొమ్మలోని స్వచ్చ్హత సాక్షాత్కరించింది .ఆ హావ భావలు పరమ మనోహరాలు. శంకర   శాస్త్రికి సన్మానం జరిగేటప్పుడు ఆమె కళ్ళు కృతజ్ఞతా   భారం తో నిండి హృదయం ఆనంద ప్లావిత మవుతున్నట్లు చూపిన ఘట్టం బాగా ఆకర్షించింది.మనసులో చెరగని ముద్ర వేసింది . .
”బ్రోచే వారెవరురా ”పట పాడేటప్పుడు ఇంటి దగ్గర కొడుకు తో మిగిలిన పాదాలకు స్వయం గా భంగిమలో చూపినపుడు, సంతృప్తి సాధించాలనుకున్న గమ్యం చేరా ననుకున్న తృప్తి ఫలించిన దీక్ష ,తన కొడుకు గొప్ప తనం గురించిన ఆనందం  తన జీవిత ధ్యేయం నేరవేరిందన్న  సంతృప్తి  వ్యక్తమవుతాయి .అసలు సినిమా మొదట్లోనే శంకర శాస్త్రిని చూపిస్తూ చిరిగిన పంచె లోంచి flashback  లాగినపుడు అతని గత జీవిత వైభవం యెంత గొప్పదో ఆమె చూపిన  చూపుతో అర్ధమవుతుంది .  అది నటనకు పరాకాష్ట .పడవ లో తనకొడుకు లయ బద్ధం గా పాడుతున్నపుడు,అందరు మెచ్చు  కుంటుంటే చూపించే ఆనంద మందహాసం ఆమె  ఆత్మానందాన్ని  ప్రతీక .
జమీన్  దారును  హత్య చేసేందుకు నడచిన నడక లో కూడా ఒక లయ బద్ధత కన్పిస్తుంది .”రాగం తానం ”పాటకు అనుగుణం గా చేసిన నాట్యం మనోహరం .జీవితం లో ఆధనాకృతి  ఆకృతి  గా నిలబడాలన్న తపన అది .తనమూలం గా శంకరశాస్త్రికి   మరింకే కళంకం రాకూడదనే ఆరాటం . ఒక మూగమనసుగా  మనసున్న  వ్యక్తిగా భాషకు అందని భావానికి జీవం పోసింది మంజు భార్గవి .ఆమె లోని నటనను గొప్పగా explore expose  చేసిన కళా తపస్వి  విశ్వనాధ్  పరిశీనా  దృష్టికిహట్స్ ఆఫ్.
అల్లు రామ లింగయ్య :
శి వునిహృదయం మాధవునికి మాధవుని మనసు శంకరుడికి తెలుసు . సృష్టి లో తీయనిది స్నేహం . అది యెంత విషమ పరిస్థితులలో అయినా  పరిక్షలకు తట్టు కొని నిలబడుతుంది .   .ఆ స్నేహ బంధం  వీడదు .వాడదు  శంకర మాధవులు దేవతా స్వరూపులుగా  స్నేహితులు కూడా .ఈ సినిమా లో కూడా శంకర శాస్త్రి కి నిజమయిన స్నేహితుడు మాధవం .ను ఎంపిక చేయటం ఆ పేరుకు మాత్రమే కాదు పాత్రధారికి   కూడా గర్వ కారణం .అల్లు  రామలింగయ్య లోని కళా జీవి ధన్యుడయాడు ”వాడెంత ?నేను  గట్టిగా  కన్నెర్ర  జేస్తే గడగడ లాడ్తాడు ” అంటాడు శాస్త్రి ఎదురుగా లేనప్పుడు . అలా  డంబాలు కొట్టినవాడే ఆయన ఎదురు పడగానే చెప్పాల్సిన రెండు ముక్కలు కళ్ళు నేలకు తిప్పి తలవంచి చెప్పేసి అతను ఏమి చెప్పేది వినకుండా చక్కా  పోతాడు .
ఇలా యెంత చెప్పినా  తరగనిగని , ఘని  శంకరాభరణం . చూసి  పులకి0చా ల్సిందేకాని , చెప్పి ,మెప్పించలేము.అయినా ఇదొక చిన్న ప్రయత్నం .
మనవి : ఈ రాసిన దాన్ని అంతా దర్శకుడు విశ్వనాధ గారికి 24 -03- 99  న స్వర్గీయ శ్రీ వేటూరిసుందరరామ మూర్తి  కృష్ణా  జిల్లా లోని ఆయన స్వగ్రామం పెదకళ్ళే  పల్లి లో నిర్వహించిన్ రెండు రోజుల సదస్సు లో మొదటి రోజు నే  చూపించాను.  చదివి బాగుంది అని నా పుస్తకం లో ఆ కళాతపస్వి సంతకం . చేయటం నా అదృష్టం.
          కళాతపస్వి రాజర్షి శ్రీ కాశీనాధుని విశ్వనాధ్ కు కేంద్ర ప్రభుత్వం ”దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం ”అంద  జేసి చాలా నెలలు అయినా ,ఆ వ్యాసాన్ని దుమ్ముదులిపి మళ్ళీ మీ ముందు ఉంచుతున్నాను .
  మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -18-8-17 -కాంప్ -షార్లెట్ -అమెరికా ,

Inline image 1Image result for sankarabharanam of visvanadh
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న గోవా మహిళా మూర్తులు (వ్యాసం )- గబ్బిట దుర్గా ప్రసాద్

భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న గోవా మహిళా మూర్తులు (వ్యాసం )- గబ్బిట దుర్గా ప్రసాద్

గోవాలో 1926 మే నెల 26 న ఆంటోనియో ఆలివర్ డీ సెల్వజార్ పోర్చుగల్ లో అధికారం లోకి రావటం తో రిపబ్లిక్ పాలనఅంతమైంది ..వాస్కోడి గామా ,ఆల్బు కెర్క్ లతర్వాత ఇతనితో క్రూరపాలన అంతమైంది పోర్చుగీసు అధికారం తో పెత్తనం చెలాయిస్తున్న సాలాజార్ కబంధ హస్తాలనుండి విడుదలై భారత దేశ విముక్తి కోసం పోరాడుతున్న యావద్భారత దేశం తోపాటు గోవా కూడా కలిసి అడుగులు వేయాలని నిశ్చయించింది .సాలాజార్ ప్రజల నోరు నొక్కి బహిరంగ సమావేశాలకుకాని ,భావప్రకటనకు కానీ అవకాశం ఇవ్వకుండా పౌరహక్కులకు తీవ్ర విఘాతం కలిగించాడు .అన్ని హక్కులను నిషేధించి తన క్రూర పైశాచిక నియంతృత్వాన్ని చెలాయించాడు .రాజకీయ సమావేశం జరపాలంటే గవర్నర్ దగ్గర ముందు అనుమతి పొందాల్సి వచ్చేది . 1933 కలోనియల్ యాక్ట్ ద్వారా ప్రజల సర్వ హక్కులు నిషేధానికి గురయ్యాయి . స్వేచ్చాప్రియులైన గోవన్లు దీన్ని జీర్ణించుకోలేక తిరుగుబాటు చేయాల్సి వచ్చింది’ అంతకంటే వారికి గత్యంతరం కనిపించలేదు .
క్రమంగా సంస్థలు ఏర్పడి ,జాతీయ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్య పరుస్తున్నారు .ఈ ఉద్యమం లో మహిళలు తామేమీ పురుషుల కు వెనుకబడిలేమని తెలియజేస్తూ ముందుకు దూకి స్వాతంత్రేచ్ఛతో రగిలిపోయారు .గోవా ,డయ్యు డామన్ ల విముక్తికి సంఘటిత0గా నడుం కట్టి కదిలారు .
.అందులో పౌరహక్కుల ఉద్యమ ప్రధమమహిళా నాయకురాలుగా ప్రమీలా కాంత్ జంబోలికర్ అగ్ర శ్రేణిలో నిలిచింది .గోవా సేవా సంఘం ఆధ్వర్యం లో ఆమె అనేక కార్యక్రమాలు నిర్వహించి మహిళా చైతన్యాన్ని ద్విగుణీకృతం చేసింది . 1946లో ఆమె గోవా జాతీయ కాంగ్రెస్ సభ్యురాళ్ళలో ప్రధమ స్థానం పొందింది . 21.-7-1946 న ఆమె మడగావ్ లో ”ప్రభాత భేరి ”ఉద్యమానికి నాయకత్వం వహించింది .పోర్చుగీస్ ప్రభుత్వం ఆమెను అరెస్ట్ చేసి తీవ్రంగా కొట్టి హింసించింది .కస్టడీ లో ఉండగా పోలీస్ కమాండెంట్ అడిగిన ప్రశ్నలకు అత్యంత ధై ర్యం గా సమాధానాలు చెప్పి దిమ్మ తిరిగేట్లు చేసింది .మళ్ళీ ఉద్యమాలు చేస్తే బాలిక అనికాని మహిళఅనికాని చూడకుండా బట్టలు విప్పించి బాదేస్తానని భయపెట్టాడువాడు . వదిలేశాక ఆమె రెట్టించిన ఉత్సాహం తో మళ్ళీ ఉద్యమం చేసి అరెస్ట్ అయి ఏడాదిపాటు జైల్లో ఉంది
మహిళా కార్య కర్తల ఉద్యమపోరాట0 18-6-1946 న రామ మనోహర్ లోహియా మార్మగోవాలో ప్రసంగించిన సభతో తీవ్ర రూపం దాల్చింది .గోవన్ల పౌరహక్కుల కోసం ప్రభుత్వం తో పోరాటం చేయాలని లోహియా తీవ్ర స్వరం తో ఉద్రేకంగా మాట్లాడి గొప్ప ప్రేరణ కలిగించాడు .అప్పటిదాకా గోవాలోనియంతృత్వసాలజార్ పోర్చుగీసు పాలనలో ఎవరూ ఏ మార్పును తేలేరు అనుకొన్న నమ్మకాన్ని బద్దలు చేశాడు లోహియా . ఆయన కాలు పెట్టటం తో అంతా ఒక్క సారిగా మారిపోయింది .అంత గొప్ప ప్రేరణ కలిగించాడాయన .స్వాతంత్ర పిపాస విజృంభించింది .అన్ని నిషేధాలను ఉల్లంఘించి గోవా నాలుగు చెరగులా ఉన్న గోవన్లు వెల్లువగా ఉద్ధృతప్రవాహంలా దూసుకొచ్చి సభలో పాల్గొని ఆత్మ విశ్వాసాన్ని చాటి చెప్పారు .చేసేదేమీలేక ప్రభుత్వం లోహియాను అరెస్టుచేసింది .ఆయనతోపాటు వత్సలా పాండురంగ కీర్తనీ అనే యువతి కూడా ఉపన్యాసం ఇవ్వటానికి ముందుకు రాగా అరెస్ట్ అయింది .పోలీస్ కమాండెంట్ ఫిగారేడో ఆమెను ”ఎందుకు జై హింద్ అని అరిచావు ?”అని అడిగితే ఆమె ”జై హింద్ నినాదం మాలో స్వాతంత్రేచ్ఛ ,దేశభక్తి కలిగించి ధైర్యాన్నిస్తుంది ”అని భయపడకుండా చెప్పింది .ఈమె అరెస్ట్ అయ్యాక 40 మంది మహిళలు ఊరేగింపుగా వెళ్లి జై హింద్ నినాదాలు చేస్తూ పోలీస్ స్టేషన్ ను చుట్టు ముట్టి వత్సలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు లేకపోతె తమనుకూడా అరెస్ట్ చేయమని డిమాండ్ చేశారు . అత్యంత నాటకీయంగా జరిగిన దీనికి కమాండెంట్ గుక్క తిప్పుకోలేక ఆమెను విడుదల చేశాడు . కానీ ఆమె మాత్రం లాకప్ నుంచి బయటకు రానని భీష్మించింది .అప్పుడు ఆఫీసర్ ఆమెను పోలీస్ స్టేషన్ నుంచి బలవంతంగా బయటికి నేట్టేసి ఊపిరి పీల్చుకున్నాడు .
గోవా జాతీయ కాంగ్రెస్ ,గోవా సేవా సంఘం ,గోమంతకీయ తరుణ సంఘం మొదలైన రాజకీయ సంస్థలు గోవాలోని బాలికలను స్త్రీలను పౌరహక్కుల కోసం బా గా ప్రభావితం చేశాయి .వీరందరూకలిసి ఎన్నో ప్రభాత భేరీలు సత్యాగ్రహాలు ,మూడురంగుల జండా ఎగరేయటాలు ,కరపత్రాలు పంచటాలు తో ఉద్యమానికి గొప్ప ఊపు తెచ్చారు . జూన్ 18 ఉద్యమంలో లలితా కాంటక్ ,(లలితామాధవ్ ,వెలింగకార్ )కూడా ముఖ్యపాత్ర పోషించింది . ఆమె మార్ గోవాలో మీటింగులపై నిషేధాన్ని ఎత్తేయాలని రోజూ ప్రభాతభేరి నిర్వహించేది . 1946 జులై 21 న ప్రమీలాబాయ్ జమ్బోల్కర్ ,లలితా కాంటక్ ల ఆధ్వర్యం లో భారత జాతీయ జెండాను ఎగర వేసే ప్రయత్నం చేస్తూండగా పోలీసులు అడ్డుకొని వాళ్ళ చేతుల్లోని జెండాను బలవంతంగా లాగేసి వాళ్ళనుచితకబాదారు .
పౌరహక్కుల ఉద్యమం లో వీరితో పాటు చేతులు కలిపినమహిళలలో కృష్ణ హెగ్డే ,వితా హెగ్డే ,,కృష్ణ లోతిల్కర్ ,ముక్తా ఖరాపుర్కర్ ,ఉమాబాయి శ్రీరాలి ,ఇందిరా భైసే ,జీవన్ కరపుర్కర్ వంటి త్యాగ-శీల మహిళా మాణిక్యాలెందరో నిరంకుశ సాలాజార్ పోర్చుగీస్ పాలననుండి విముక్తికై అవిశ్రాంతంగా ఉద్యమించి చరితార్ధులయ్యారు .ఈ స్వాతంత్య్ర దినోత్సవం నాడు వారిని ఒకసారి స్మరించి ప్రేరణ పొంది ధన్యులమవుదాం .

-గబ్బిట దుర్గా ప్రసాద్

Posted in రచనలు | Tagged | Leave a comment