అలంకారిక ఆనంద నందనం -1

అలంకారిక ఆనంద నందనం -1

సాహిత్య సాంస్కృతిక ప్రియులు  భాషాభిమాను లకు సరసభారతి నిర్వహిస్తున్న  ‘’అలంకారిక ఆనంద నందన0 ‘’ప్రత్యేక కార్యక్రమానికి సహృదయ స్వాగతం . ఇప్పటి దాకా ఎందరొ కవుల, రచయితలపై అనేక కార్యక్రయాలు నిర్వహించాం .ఎంతో అభిమానంగా విచ్చేసి జయప్రదం చేశారు .ఇంతవరకు మన ఆలంకారికులపై కార్యక్రమ0 నిర్వహించకపోవడం పెద్ద లోపమే నని పించి  ,ఇప్పుడు నడుం కట్టాం . ఈ కార్యక్రమం నాలుగు భాగాలుగా జరుగుతుంది .ప్రతికార్యక్రమం లో ప్రసిద్ధ భారతీయ ఆల0కా కరికులు పాల్గొని తమ జీవిత విశేషాలను ,తమ సిద్ధాంతాల పూర్వా పరాలను వారి తోనే చెప్పించాలని సంకల్పించాం .వారందారూ తమ హృదయావిష్కరణకు సరసభారతి చక్కని వేదికగా భావించి ఆనందంగా అంగీకరించటం మన తొలి  విజయం . ప్రతి కార్యక్రమం లో పాల్గొనే వారిలో ఒక ఆలంకారికుడు అధ్యక్షస్థానం వహించి నిర్వహిస్తారు .మనమంతా ప్రేక్షకులమై వారి హృదయావిష్కారాన్ని అనుభవిద్దాం . ఈ రోజు మొదటి కార్యక్రమం లో శ్రీ భరత ముని అధ్యక్షత వహి0చి తమ సిద్ధాంతాలను ఆవిష్కరిస్తారు  .శ్రీ భామహుడు శ్రీ దండి తమ సిద్ధాంత వివరణ చేస్తారు .ఆలంకారికులకు ఒకమనవి .తమ జనన మరణ కాలాల విషయాల గందర గోళం తో సభాసదులను ఇబ్బంది పెట్టక క్లుప్తంగా చెప్పి తమ కావ్యరచనలు ,తాము ప్రతిపాదించిన సిదాంతాలు ,అంతకు పూర్వమున్న వాటిపై తాము ఆలోచించి చెప్పిన నూతన విషయాలపైనే ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించి అలంకారిక ఆనంద నందనాన్ని సు సంపన్నం చేయమని ప్రార్ధిస్తూ ,త్రిమూర్తులైన ఆ ముగ్గురు ఆలంకారికులను వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తూ సభను నిర్వహించవలసినదిగా శ్రీ భరత ముని ని అభ్యర్థిస్తూ సెలవు తీసుకొంటున్నాను ..

భరత ముని -సరసభారతి సరసమైన కార్యక్రమం నిర్వహిస్తూ ,మమ్మల్ని పాత్ర దారులను చేయటం విలక్షణంగా ఉంది .నిజమే సాహిత్య సభలలో ఆలంకారికులకు స్థానం బహు అరుదుగా ఉంటోంది .సరసభారతి ని ఇందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ  వేదికపై నా సహచరులైన భామహా ,దండి లను ఆప్యాయంగా స్వాగతిస్తున్నాను . నన్ను భరత ముని గానే అందరూ సంబోధిస్తారు ..నేను ఋగ్వేద0లో ప్రస్తావించబడిన భరత వంశం వాడిని .స్వర్గం నుంచి రూపక కళను భూమికి తెచ్చాను .నేను రచించిన నాట్య శాస్త్రా న్ని నా నూరుగురు కుమారులు కో హల ,దత్తిల,అశ్మకుట్ట ,నఖ కుట్ట మొదలైనవారికి బోధించాను .వీరందరూ ప్రామాణికులే .వీరు కూడా యధా శక్తి గా  నాట్య కళ పై గ్రంధాలు రాశారు  .నేను ఋగ్వేదకాలం వాడినైనా చారిత్రిక పరిశోధకులు మాత్రం నేను క్రీపూ 200 కాలం వాడినంటున్నారు . ఇప్పుడు భామహమహానుభావుని  ఆతర్వాత దండి మహాశయుని తమ పుట్టు పూర్వోత్తరాలు తెలియ జేయవలసినదిగా కోరుతున్నాను ..

భామహుడు నా పుట్టు పూర్వోత్తరాలు  గురించి నేనెక్కడా చెప్పుకోలేదు .నాకు కౌటిల్య భరత  కాళిదాస మహాకవులు తెలుసు రామాయణ ,మహాభారత  బృహత్కథలు తెలుసు .సంస్కృత కావ్య తత్త్వం పై నేనే మొట్టమొదటి గ్రంధం రాశాను .ఉద్భటుడు దీనిపై ‘భామహా వివరణ ‘’అనే వ్యాఖ్యానం రాశాడు . అది కాలగర్భం లో కలిసిందని అంటున్నారు . అందులో కొన్ని భాగాలు ఇటీవలే రోమ్ నగరం లో గ్నోల్ అనే ఆయన ప్రచురించాడు అయితే అవి అర్ధం చేసుకోవటానికి వీలు లేనంతగా శిధిలమయ్యాయని సాహిత్య పిపాసకులు బాధ పడుతున్నారని తెలిసింది .చరిత్రకారులు నన్ను క్రీశ 600 వాడినని అంటున్నారు .

 దండి -సంస్కృత గద్య రచయితగా నన్ను అందరూ అభిమానిస్తారు .భట్ట బాణుడు నా సహచర కవి . నేనూ నా కాలాన్ని గురించి చెప్పలేదు .ఎందుకో మాకప్పుడు మమ్మల్ని గురించి ఎక్కువగా చెప్పుకోవటం ఇష్టం ఉండేదికాదు .కానీ పరిశోధకులు ఊరుకుంటారా .వారిలెక్కలప్రకారం నేను క్రీశ 710-720 మధ్యవాడినని తేల్చారు .నేను కావ్యాదర్శం అనే సిద్ధాంత గ్రంధాన్ని వచనం లో రాశాను  వచన రచన 1-కథ 2-ఆఖ్యాయిక అని రెండురకాలు  ఆఖ్యాయికలో కథా  నాయకుడే స్వయంగా కథ  చెబుతాడు  .కథ లో ఎవరైనా చెప్పవచ్చు ..నాకు ముందే ఇలాంటి సాహిత్యం కొంత ఉంది నేను మెరుగులు పెట్టి ఉంటాను

 భరతుడు -సోదరులు సంక్షిప్తంగా తమను పరిచయం చేసుకున్నందుకు ధన్యవాదాలు .ఇప్పుడు నా నాట్య శాస్త్ర విశేషాలు కొన్ని మీతో ముచ్చటిస్తాను ..నా  నాట్య శాస్త్రం 37 అధ్యాయాల బృహద్గ్రంథం ..దీన్ని విజ్ఞాన సర్వస్వము అన్నారు  సహృదయులు .దీనిలో అనేకరకాల నాట్య శాలల నిర్మాణం ,రంగస్థల దేవతలను నటీ నటులు ఆరాధించటం ,తాండవం మొదలైన నృత్య రీతులు ,కంటి చూపులు ,కరముద్రలువగైరా సూక్ష్మ వివరాలనూ తెలియ జేశాను . నటీ నటుల హావ భావాలు ,ప్రదర్శించే పద్ధతులు ,పాత్రోచిత భాష ,తగిన ఛందోరీతులు  వాద్య గానాలకు సంబంధించి శాస్త్ర విషయాలు ,పాత్రోచిత దుస్తులు ,తెరలు వాడే విధానం కూడా చెప్పాను .రూప కాలలో భేదాలు ,నాటకం లో సంధి ,పరిచ్చేదం నాయకీ నాయక భేదాలు ,వివిధరకాల పాత్రలు ,రసాలు భావాలు అలంకారాలు గుణ దోషాలు ఒకటేమిటి సమస్తం వివరించాను.  ఇందులో రస భావాదులు సాహిత్య విమర్శకు అలంకార శాస్త్రానికి సంబంధించిన విషయాలు .నాట్య లేక రంగస్థల ప్రదర్శన పరిధిలో కి రాణి కళ కానీ ,శాస్త్రం, శిల్పంకాని లేవు అని ఘంటాపధంగా చెప్పాను ..ఇప్పుడు భామహుడు పిమ్మట దండి మహాశయులు తమ రచనలలో విశేషాలను వివరిస్తారు .

 భామహుడు -కావ్యం లో అలంకారానికి సంబంధించిన నియమాలను నేను సూత్రీకరించాను .ఉత్తమ కావ్యం జీవితం లోను  కళ లోను విలువలను పెంచుతుంది .ఆనందాన్ని యశస్సును ఇస్తుంది . కావ్య రచనా  ప్రతిభ లేకుండా ఎన్ని శాస్త్రాలలో పాడిత్యం ఉన్నా వ్యర్ధమే . వెన్నెల లేని రాత్రి ,మంచిప్రవర్తన లేని మనిషి సంపద, లాగా  కావ్య నిర్మాణ సామర్ధ్యం లేని వాక్కులో ఎంతటి దాటి ఉన్నా వెలవెల బోతుంది .సంస్కృత ఆలంకార శాస్త్ర చరిత్రలో నేనే మొదటిసారిగా శాస్త్ర రచనకంటే కవితా ప్రతిభ యొక్క విశిష్టతను చెప్పాను .ఏ గురువువద్దనైనా చదివి శాస్త్ర పండితుడుకావచ్చు .కవిత్వం లో అది సాధ్యపడదు . కవిత్వం అనేది ఏ కొద్దిమంది ప్రతిభా వంతుల ముఖం నుండో  తనంతట తానుగా  అనర్గళంగా పొంగిప్రవహించే గంగా ప్రవాహం . కావ్యం అజరామరమైనది . అమృతత్వం కావ్య లక్షణం . కవి కీర్తి ఎంతకాలం ఉంటుందో అంతకాలం జీవిస్తాడు అని స్పష్టంగా చెప్పాను .

దండి-నేను కావ్యాదర్శం ,దశ కుమార చరిత్ర ,అవంతీ సుందరి కథ అనే మూడు ప్రసిద్ధ రచనలు చేశాను .మహా భారత కధలను చెప్పే ద్విసంధాన కావ్యము నా రచనే .కానీ ఇది అలభ్యమంటున్నారు .జాగ్రత్త లేకపోతె అంతే ..అలంకార శాస్త్రానికి ఒక కొత్త దృక్కోణాన్ని నూతనత్వాన్ని ఇచ్చాను .కావ్యానికి శబ్దము అర్ధము అనే రెండు ముఖాలున్నాయి .కావ్య శరీరం రమణీయార్ద భూషిత పద సంఘాతం అని నిర్వచించాను -’’శరీరం తావాదిష్టార్థ వ్యవ చిన్నా పదా వళీ ‘’అన్నాను ఈ పదావళి అనేక రీతులలో  వ్యక్తమౌతోంది .అలంకారాలతో దానికి శోభ వస్తుంది .కవికి ,పాఠకుడికి ఆనందాన్ని కలిగించి ,కవికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టటమే కావ్య ప్రయోజనం .వచనం కవిత్వానికి మరో రూపమే నని ఖచ్చితంగా చెప్పాను .కావ్యం లో ఉండాల్సిన గుణాలు పరిహరించాల్సిన దోషాలు చెప్పాను .మా అన్నగారు భామహుల కంటే మౌలికతను ప్రదర్శించాను . అన్నగారి వక్రోక్తీ నాకు ఇష్టమే .అసాధారణ విషయాన్నికానీ వస్తువును కానీ వర్ణించాలనే కోరికకలిగినపుడు అలంకారాలు తన్నుకొంటూ వస్తాయి .అతిశయోక్తిలో  వర్ణన పరా  కాష్ట కు చేరుతుంది  భౌతిక పరిమితులనన్నిటినీ అధిగమిస్తుంది .కావ్యానికి శోభాకూర్చేది అలంకారమే అని నా పూర్తి విశ్వాసం .రసం కావ్యానికి మాధుర్యాన్నిస్తుంది .నేను అందరికంటే భిన్నంగా కావ్య శైలికి ప్రాధాన్యమిచ్చాను ..

   సశేషం

    మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-7-17-కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in రచనలు | Tagged | Leave a comment

  గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 381- సంస్కృత ఋగ్వేద ప్రధమాష్టక భాష్య కర్త మహోన్నత వేద పండితుడు -కపాలి శాస్త్రి (1886-1953)

  గీర్వాణకవుల కవితా గీర్వాణం -3

381- సంస్కృత ఋగ్వేద ప్రధమాష్టక భాష్య కర్త మహోన్నత వేద పండితుడు -కపాలి శాస్త్రి (1886-1953)

  టి వి కపాలి శాస్త్రి తమిళనాడులోని మద్రాస్ లో మైలాపూర్ లో 1886 లో తంత్ర శాస్త్ర బ్రాహ్మణా కుటుంబం లో జన్మించాడు .తల్లి ఉగ్గుపాల తోనే సకల శాస్త్ర వేద సారం గ్రహించాడు

12 వ ఏటనే సంస్కృత రామాయణాన్ని 12 సార్లు  చదివేశాడు .అప్పటికే శ్రీ విద్యోపాసకుడై లలితా త్రిపుర సుందరి పరమ భక్తుడయ్యాడు . 1907లోఒక దేవాలయం లోమొదటి గురువు  శ్రీ కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని  దర్శనం కలిగి ,శిష్యుడై నాలుగేళ్లు ఆయన వద్ద విద్య నేర్చి ,ఆయనతో రెండవ గురువు రమణ మహర్షిని సందర్శించి  శిష్యుడయ్యాడు ..మహర్షి సందర్శనమే లేకుంటే నేను అరవిందుల దర్శనం చేసుకొనే వాడిని కాదు ‘’అన్నాడు శాస్త్రి .మూడవ గురువు అరవిందులు . 1914 లో అరవిందాశ్రమ పత్రిక ‘’ఆర్య ‘’ను చదివిన శాస్త్రి అరవిందులను దర్శించాలని కోరికకలిగి పాండి చేరి వెళ్లి 1917 లో మొదటి సారి దర్శించి సంస్కృత శ్లోకాలతో స్తుతించాడు .  .అరవిందులు శాస్త్రిని ‘’సంస్కృతం కాక వేరే భాష వచ్చునా ‘’?అని అడిగాడు . 1923 లో మళ్ళీ ఒకసారి దర్శించి ఆయన బంగారు ఛాయను చూసి అప్రతి భుడయ్యాడు శాస్త్రి . మాతారవిందులకోరికపై చేస్తున్న సంస్కృత ఉపాధ్యాయ పదవికి రాజీనామా చేసి ఆశ్రమంలో చేరి 1953 ఆగస్టు 15 అరవిందుని జన్మదినం నాడు చనిపోయే వరకు 15-8-1953 అక్కడే ఉన్నాడు . అంతరాత్మ ప్రబోధించినప్పుడు మాత్రమే ఏదైనా రాసేవాడు  .

టి వి కపాలి శాస్త్రి అంటే 20 వ శతాబ్దపు అరుదైన వేద వేత్త మహా సంస్కృత  విద్వా0సుడు  అని యీ కాలం వారికి పెద్దగా తెలియదు .ఋగ్వేద విషయం లో కపాలి  అపర పరమేశ్వరుడే అని అరవిందులే అన్నారు .అరవిందుల ప్రఖ్యాత ఆంగ్ల కవిత ‘’హు ‘’ను కపాలి శాస్త్రి సంస్కృతం లోకి అనువదించాడు.ఇదీ ఆ కవిత లో మొదటిపాదం – In the blue of the sky, in the green of the forWhose is the Hand that has painted the glow?.

శాస్త్రిని జ్ఞానాంబునిథి  అన్నాడు ఆయన శిష్యుడు చిన్మయి .అరవిందాశ్రమ మదర్ గురించి శాస్త్రి ఆంగ్లం లో ‘’ఫ్లేమ్ ఆ ప్ ది వైట్ లైట్ ‘’అనే అపూర్వ గ్రంధం రాశాడు  దీనిని శాస్త్రి కోరికపై చిన్మయి బెంగాలీ భాషలోకి ‘’సదా జ్యోతి శిఖా ‘’గా అనువదించాడు . 1997లో సాక్షి ట్రస్ట్ వారు ‘’అరవింద కపాలి శాస్త్రి ఇన్ స్టి ట్యూట్ ఆ ప్ వేదిక్  కల్చర్ ‘’స్థాపించి వేద ,,అరవిందుల సందేశాన్ని విశ్వ వ్యాప్తం చేశారు

. జీవితకాలమంతా రమణ మహర్షి ,అరవింద యోగి ల వేదాంతతత్వాన్ని వ్యాపింప జేయటానికే కృషి చేశాడు శాస్త్రి .ఉపాధ్యాయుడుగా అనువాదకునిగా ,విశ్లేషకునిగా ,వ్యాస రచయితగా కవిగా ,తంత్ర శాస్త్ర వేత్తగా శాస్త్రి లబ్ధ ప్రతిష్టుడు .అరవిందులవద్ద సాధన చేస్తున్నా ,శాస్త్రి రమణమహర్షి పై ఆరాధనా భావం వదలలేదు.ఏ   క్షేత్రం  లో పనిచేసినా శాస్త్రి దాని లోతులు తరిచాడు .ప్రాచీన భావధారకు అధునాతన విధానానికి గొప్ప సేతువు కపాలి శాస్త్రి .వేదాలలోని మహత్తర భావాలను అంతర్ దృష్టి  యోగసాధనలతో వెలికి దీసి లోకానికి అందించిన పూర్ణ పురుషుడు శాస్త్రి.ఋగ్వేద ప్రధమ అస్టకానికి  కపాలి శాస్త్రి సంస్కృతం లో రచించిన వ్యాఖ్యానం’’ఋగ్భాష్య భూమిక ‘’ అనితర సాధ్యమైనదిగా ప్రసిద్ధి చెందింది .సాయనా చార్యుల కర్మ సిద్ధాంతానికి అతీతంగా రాసిన వ్యాఖ్య ఇది . ఇది ఆంగ్లం లోనూ వెలువడింది అందుకనే 20 వశతాబ్దపు అత్యుత్తమ సంస్కృత వేద వేత్తగా కపాలి శాస్త్రిని గౌరవిస్తారు .వేదం లోని స్వర్ణమయ కాంతులను దర్శించి ,లోకానికి ఆదర్శన భాగ్యాన్ని ప్రసాదించినవాడు శాస్త్రి .వేద ,తంత్ర ,ఉపనిషత్తుల విజ్ఞాన బాండాగారాన్ని తెరచి ఆ దివ్య నిధిని లోకానికి అందించినఅనితర సాధ్య సాధకుడు శాస్త్రి .ఆయన మంత్రాలతో దేవతలను ఆహ్వానిస్తుంటే క్షణం ఆలస్యం చేయకుండా అక్కడ  ప్రత్యక్షమయ్యేవారు దేవతలు .ఉపనిషత్తులు ఆత్మావిద్యా సాధనకు కరదీపికలు అని అరవిందులు భావించినట్లే శాస్త్రీ జీ కూడా భావించాడు

 

24 సంవత్సరాలు పాండిచ్చేరిలో శ్రీ మాతారవిందుల అంతేవాసిగా ఉండి అరవిందుల పూర్ణయోగ సాధనలో పండిపోయి దాన్ని గొప్పగా ప్రచారం చేశాడు శాస్త్రి .శాస్త్రి రాసిన గ్రంధాల వివరాలు-

సంస్కృత గ్రంధాలు-1ఋగ్వేద భాష్య -సిద్ధాంజన -ఋగ్ భాష్య భూమిక 2-ఋగ్వేద సంహిత -మొదటి అష్టకం -సంస్కృతం లో పదం అర్ధం భాష్యం  వివరణ 3-వాసిష్టమునిరాసైనా -ఉమాసహస్ర కావ్యం -ఆయన జీవిత చరిత్ర వాసిష్ఠ వైభవం అనే కాపాలి శాస్త్రి రచన 4-సంస్కృత మంత్రాలు శ్లోకాలు -వ్యాఖ్యానం అనువాదం 5-షట్ దర్శన భాష్యం ,రమణగీతప్రకాశం ,సావిత్రి 6-కొన్ని తెలుగు సంస్కృత రచనలు .

 ఆంగ్లం లో -లైట్స్ ఆన్  ది వేదాస్ ,  ఉపనిషత్స్ ,లైట్స్ ఆన్ టీచింగ్స్  వేదిక్  సిక్రెట్స్ ఇన్ కాంపాక్ట్ ఫార్మ్ ,ఫర్దర్ లైట్స్ ఆన్ ది వేదాస్ ,ది మహర్షి మొదలైనవి

  కపాల శాస్త్రి పేరు 1953లో ఆయన చనిపోయిన తర్వాత లోకానికి బాగా తెలిసింది .

  సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-7-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

 

SASTRY, T.V. KAPALI
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

  ఇచ్ఛా మరణం ఇచ్ఛా  గమనం పొందిన యోగి 

ఇచ్ఛా మరణం ఇచ్ఛా  గమనం పొందిన యోగి

   స్వామి రామా 17 ఏళ్ళ ప్రాయం లో గురువు బెంగాలీ బాబా ‘’నువ్వు నిజమైన విద్య  నేర్వాలని ఉంటె గంగోత్రి వద్ద ఉన్న మహాయోగి వద్దకు వెళ్లి నేర్చుకో ‘’అని పంపాడు ..అక్కడికి వెళ్లి చూస్తే ఆయన మహా అందగాడుగా చక్కని దృఢమైన శరీర సౌష్టవం తో మిసమిసలాడుతూ కనిపించాడు ..ఉక్కు కండలు తిరిగిన శరీరం విశాలమైన ఛాతీ తో 85 ఏళ్ళ వృధుడు ఆయన ..రామా వెళ్ళగానే ఆకలిగా ఉందా ఏమి తింటావని అడిగి ఆయన ఉన్న గుహలోకి వెళ్లి అక్కడున్న దుంపలు తీసుకుని తినమన్నాడు .ఆయన చెప్పినట్లే రామా చేశాడు .అది పాలతో వండిన ఆహారపు రుచి గా ఉంది .. తినటం అవగానే తానేమీ మాటలతో బోధించను అని చెప్పాడు .ఆయన ప్రక్కనే స్వామిరామా మూడు రోజులు కూర్చున్నాడు .ఇద్దరిమధ్య మౌనమే ..మూడవ రోజు మనసులో తాను  ఇక్కడికి రావటం శుద్ధ దండగ అని ఈయన నేర్పేది ఏమీలేదని అనుకొన్నాడు వెంటనే ఆ యోగి ‘’నిన్ను ఇక్కడికి మీ గురువు పంపింది జ్ఞానాత్మక విద్య నేర్చుకోవటానికి కాదు అదికావాలంటే బోలెడు గ్రంధాలున్నాయి చదివి గ్రహించవచ్చు నిన్ను పంపింది ఇక్కడ కొంత అనుభవం పొందమని .నేను నా శరీరాన్ని  ఎల్లుండి విసర్జింప బోతున్నాను ,’’అన్నాడు ..ఎందుకు శరీరాన్ని త్యాగం చేసుకోవాలో రామాకు అర్ధంకాక అది ఆత్మహత్యగా భావించాడు .ఇది గ్రహించి ఆయన ‘’నేను ఆత్మహత్య చేసుకోవటం లేదు .సన్యాసులు ఆత్మహత్యకు పాల్పడరు .పుస్తకం అట్ట  నలిగిపోతే  ,పాడుకాకుండా కొత్తఅట్ట  వేసినట్లు ,దిండుగలేబు మాసిపోతేదాన్ని నాశనం చేయకుండా  కొత్తది తొడిగినట్లు స్వచ్చంద శరీర త్యాగం అలాంటిదే . రామా కుర్రాడుకనుక ‘’ స్వామీ !ఇంత అందమైన ,దృఢమైన శరీరాన్ని ఎందుకు విసర్జించాలని అనుకొంటున్నారో  నాకేమీ అర్ధం కావటం లేదు .వద్దు అది పాపం ‘’అన్నాడు వేడికోలుగా . ఆయన ప్రశాంతంగా వినిఊరుకోగా ,ఒక శిష్యుడు  ‘’నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు ?ఇక్కడికి రాకముందు నువ్వు ఎక్కడో నేనెక్కడో ‘’అని ప్రక్కకు తీసుకు వెళ్లి’’ఆయన ప్రశాంతతకు భంగం కలిగించవద్దు . పిచ్చిప్రశ్నలు అడుగుతున్నావు ఆయనను .యోగులు అంటే ఏమిటో నీకు తెలియదు .ఆయన ను ప్రశాంతంగా దేహ త్యాగం చేయనివ్వు ‘’అన్నాడు ..రామ ఆ శిష్యుడితో ‘’అందమైన ఆదేహాన్ని వదిలెయ్యటం ఎందుకు ?దగ్గరే పోలీస్ స్టేషన్ ఉంటె రిపోర్ట్ ఇచ్చేవాడిని .ఇది చట్ట వ్యతిరేక చర్య ‘’అన్నాడు ..శిష్యుడు యెంత చెప్పినా రామ సంతృప్తి చెందలేదు .అందమైన శరీరం వదలటమేమిటనే ఆయన ఆలోచన ..చివరికి శిష్యుడు ‘’ప్రశాంతంగా ఉండి అన్నీ గమనించు . అంతా నీకే అర్ధమవుతుంది ‘’అన్నాడు .ఆ స్వామి మరొక 24 గంటలు స్వామిరామాతో మాట్లాడనే  లేదు  .రామా మాత్రం  ‘’ఈయన ఇప్పటిదాకా నాకు చెప్పిందేమీలేదు .నేనిక్కడ ఉండటం దండగ నేను వెళ్ళిపోతాను ‘’అని శిష్యుడితో అన్నాడు .

  ‘’ఆయన ప్రాణ త్యాగం చేసే విధానాన్ని ఎందుకు చూడవు ?’’అన్నాడు శిష్యుడు రామా ‘’ఇది చాలా బుద్ధితక్కువపని నేనైతే హాస్పిటల్ లో చస్తా .ఈ  వెర్రి ఏమిటి ?’’అని తన ఆధునిక భావాలు ఆవిష్కరించాడు . .శిష్యుడు ‘’నీకు అర్ధం కాదు .నిన్ను ఇక్కడికి పంపించింది చూస్తూ తెలుసుకోమని .నీ మనసులో వితర్కించుకోవాలంటే నీ  ఇష్టం .కానీ ఇక్కడి ప్రశాంతతకు భంగం కలిగించవద్దు ‘’అన్నాడు .చివరికి ఆ స్వామి ‘’నిజంగా నేనేమీ చేయటం లేదు .మనకు శరీర త్యాగం చేసే సమయం వచ్చిందని తెలిసిపోతుంది.  ప్రకృతికి అడ్డుపడలేము . అది సహజ ధర్మం . మరణం ప్రకృతికి సాయం చేస్తుంది .చావుకు భయపడరాదు దానివలన ప్రయోజనం ఉండదు .అర్థమైందా ?’’అన్నాడు మౌనాన్ని ఛేదించి .’’నాకు చావాలని లేదు .కనుక అర్ధం చేకుకోవాల్సిన పని లేదు ‘’అన్నాడు మొండిగా .’’.నీ వైఖరి సరైనదికాదు మరణం అంటే ఏమిటో తెలుసుకో .మన0  అనేక భయాలమధ్య బతుకుతున్నాం .చావు అంటే నాశనం చేసేదికాదు అది శరీరాన్నుంచి వేరు చేసేది ‘’అనగా ‘’శరీరం లేకుండా నేనుండలేను ‘’అన్నాడు రామా అప్పుడు ఆయన ప్రశాంతంగా ‘’చావు శరీర ధర్మం .ఎవరూ  అంతకాలం  ఈ శరీఅరం తో బతికి  ఉండలేరు .అది మార్పు చెందాలి శిధిలమవ్వాల్సిందే . ఇది నీకు తెలియాలి.  జీవితానికిపట్టుకొని వ్రేలాడకుండా విముక్తిపొందేవారు   అతి కొద్దిమందే ఉంటారు  . ఆ టెక్నీక్ నే యోగా అంటారు .ఇది ఇప్పుడు అందరూ చేస్తున్న మామూలు యోగా కాదు ఉన్నతమైన యోగా అదిధ్యానం లో సరైన పధ్ధతి . నీకు తెలిస్తే శరీరం  మనసు బుద్ధి మొదలైన  అన్ని విషయాలపై నీకు నియంత్రణ వస్తుంది .అది ప్రాణ ,అనే ఉచ్వాస నిశ్వాసా ల వలన సాధ్యం.దానివలన మనసుకు శరీరానికి మంచి సంబంధం కలుగుతుంది .ఊపిరిపీల్చటం ఆగిపోతే లంకె తెగిపోతుంది . అదే మృత్యువు .అయినా నువ్వు ఇంకా జీవించే ఉంటావు ‘’అని చెప్పాడు

  ‘’శరీరం లేకుండా ఎలా ఉంటాం ?’’అడిగాడు రామా . ‘’చొక్కా లేకపోతే ఎలా ఉంటావో అలా ‘’అంతే .అంతకన్నా ఏమీ లేదు ‘’అన్నాడు స్వామిజీ . అయినా అసంతృప్తిగానే ఉన్నాడు రామా .   శరీర త్యాగం చేయటానికి ముందురోజు స్వామీజీ కొన్ని సూచనలు చేశాడు ఇద్దరికీ .  .తెల్లవారుజామున 5 గంటలకు ప్రాణ త్యాగం చేస్తాను .మీరు నా శరీరాన్ని గంగానదిలో ముంచేయండి .మీ ఇద్దరూ ఆపని చేయగలరా “‘అని అడుగగా ‘’నేనొక్కడినే చేయగలను ‘’అన్నాడు రామా ప్రగల్భ0 గా .ఆ గుహకు గంగ కొన్ని వందల గజాల దూరం లో ఉంది .తెల్లవార్లూ చావు గురించే ఆలోచించాడు మూడుగంటలకే లేద్దామనుకొన్నారు ఇ ద్దరూ. .కానీ నిద్రపట్టక ముందే లేచారు .స్వామీజీ ‘’మీకేమికావాలో కోరుకోండి ఇస్తాను ‘’అన్నాడు .రామా ‘’చచ్చిపోయేవారు మీరేమిస్తారు ?’అన్నాడు వ్యంగ్యంగా సిరివెన్నెల సీమలో లో సర్వదమన బెనర్జీ ‘’ఆది భిక్షువు వాని నేమి కోరేదీ ‘’అన్నటైపులో .అప్పుడు స్వామీజీ ;;యదార్ధ గురువు ను చావు ఏమీ చేయలేదు . మరణం తర్వాత కూడా గురువు శిష్యులకు మార్గ దర్శనం చేస్తాడు ‘’అని చెప్పి శిష్యుడివైపు తిరిగి ‘’ఈ’’ కొత్త పయ్యా ‘’   నీకు తలనెప్పిగా ఉన్నాడా ?’’అని అడిగాడు .అతడు నిర్మొహమాటంగా ‘’నిజమేస్వామీ కానీ నేనేం చేయగలను ‘’అన్నాడు .

  తెల్లవారుజామున అయిదు అయిదున్నర మధ్య ఈ ఇద్దర్నీ  స్వామీజీ దగ్గరకు పిలిచి ‘’ధ్యానం లో ఉండండి .అయిదు నిమిషాలలో దేహత్యాగం చేస్తాను .ఈ కట్టే పని అయిపొయింది ఇక భరించలేదు కనుక విసర్జించాల్సిందే ‘’అన్నాడు .అయిదు నిమిషాలతర్వాత స్వామీజీ ఓం ‘’అన్నాడు .ఆతరువాత అంతా నిశ్శబ్దమే ..రామా ఆయన నాడి  చూసి స్వామీజీ తన నాడిని  హృదయ స్పందనను శ్వాసను తాత్కాలికంగా నిలిపేశాడేమో అనుకొన్నాడు .తర్వాత శరీర ఉష్ణోగ్రత  కళ్ళు ,వగైరాలు పరీక్షించాడు .శిష్యుడు ఇక చాలు అని గురువు సిద్ధి చెందారని ఆలస్యం చేయకుండా సూర్యోదయానికి ముందే దేహాన్ని గంగలో నిమజ్జనం చేయాలని అన్నాడు .భయపడవద్దని తానే  మోసుకొని వెళ్లగలనని అనగా తానూ సహాయపడతానన్నాడుశిష్యుడు .ఇద్దరూ ప్రయత్నించినా ఆ దేహాన్ని కదల్చలేక పోయారు . ఒక పైన్  చెట్టు గట్టి కొమ్మ తెచ్చి తొడలమధ్య పెట్టి కదిల్చే ప్రయత్నం చేశారు ఫలితం కనిపించలేదు .ఒక గంట సేపుఅన్ని ప్రయత్నాలూ చేశారు . కానీ అంగుళం కూడా కదల్చలేక పోయారు .

  సూర్యోదయానికి కొన్ని నిమిషాలముందు ‘’ఇప్పుడు మనం శరీరాన్ని మోసుకు పోదాం ‘’అనే మాట వినిపించింది .అక్కడ వాళ్లిద్దరే  తప్ప మూడోపురుగు లేదు .బహుశా తాను మనసులో అనుకొంటున్నానేమో అని రామా భావించాడు . శిష్యుడిని అడిగితె తనకూ ఆమాట వినిపించింది అన్నాడు .ఇంతలో స్వామీజీ భారీ అందమైన శరీరం ఒక్కసారిగా దానంతటికి లేచి   గాలిలోకి ఎగిరిప్రయాణించి  గంగానదిని చేరి అందులో మునిగి అదృశ్యమైంది .ఈ ఇద్దరూ షాకయ్యారు జరిగిన సంఘటన చూసి .సిద్ధ పురుషులకు అసాధ్యమైనది లేదు అని మనం తెలుసుకోవాలి .

  సమాప్తం

 ఇప్పటిదాకా హిమాలయ యోగుల గురించి చాలా యదార్ధ గాధలు రాసి మీకు తెలియ జేశాను .దీనికి ఆధారం మొదట్లోనే చెప్పినట్లు స్వామిరామా ఆంగ్లం లో రాసిన ‘’లివింగ్ విత్ ది హిమాలయన్ మాస్టర్స్ ‘’అని మరొక్కసారి మనవి చేస్తూ ఈ ధారావాహికను సమాప్తి చేస్తున్నాను .ఎందరో ఆత్మజ్ఞానం పొంది విశ్వ శ్రేయస్సును కాంక్షించే మహా యోగులు .అందరికి శిరసువంచి పాదాభివందనాలు.

          మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-7-17-కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

చచ్చి బతికి బోధించి దేహత్యాగం చేసిన యోగి

చచ్చి బతికి బోధించి దేహత్యాగం చేసిన  యోగి

మహిమాన్విత యోగులు హిమాలయాలలోనే ఉంటారనే భ్రమలో ఉండేవాడు స్వామిరామా . కానీ ఒకనది  ఒడ్డున పట్టణానికి దగ్గరలో  ఒక యోగిఅనుభవం ఆయన్ను అప్రతిభుడిని చేసింది . ఆయన్ను చూడాలని బయల్దేరాడు . .ఇంకా అయన ఆశ్రయానికి నాలుగు మైళ్ళ దూరం లో ఉండగానే ఆయన రామాకు శిష్యులతో ఆహారం పంపాడు ..ఎవరైనా వస్తుంటే తానూ ఇలాగె చేస్తానుకదా ఇందులో వింతయేమున్నది అని పించింది . ఆశ్రమానికి వెళ్ళగానే ఆయన ‘’నాయనా !నువ్వు ఆలస్యంగా వచ్చావు .రేపు ఉదయం నేను శరీర త్యాగం చేయబోతున్నాను’’ .అన్నాడు రామా ఆదుర్దాగా ‘’స్వామీ తమరు మరొక పూట  ఉండి నాకు జ్ఞాన బోధ చేయలేరా ?’’అన్నాడు వినయంగా .’’లేదు కుదరదు.సమయం లేదు  ‘’అన్నాడు నిర్మొహమాటంగా .

  అక్కడ ఆయనవద్ద అనేక మార్గాలపై విశ్వాసం వున్న శిష్యులున్నారు . హిందువులకు ఆయన స్వామి .ముస్లిం లకు ఇస్లా0  ముల్లా  క్రిస్టియన్లకు యేసు అనుయాయి ..ఆయన చనిపోగానే ఆయన శరీరాన్ని క్రిస్టియన్ సెమిటేరికి  తీసుకు వెళ్లాలని క్రైస్తవులు ,ముస్లిం లు మసీదుకు ,హిందువులు ఆయన్ను అక్కడే సమాధిచేసి ఒక స్మారక చిహ్నం కట్టాలని తీవ్రంగా భావిస్తున్నారు ..

 మర్నాడు ఉదయం ఆయన ముందే చెప్పినట్లు దేహ త్యాగం చేసేశాడు .డాక్టర్ వచ్చి ఆయన చనిపోయాడని నిర్ధారించాడు .తర్వాత కొన్ని గంటలు శిష్యులమధ్య తర్జన భర్జనలు గందర గోళం ..అన్నిమతాలవారు ఆ పార్థివ శరీరం తమకే దక్కాలని పోట్లాడుకొంటున్నారు సమస్య జఠిలమై పోయింది . పరిష్కారం లభించటం లేదు . జిల్లా మాజిస్ట్రేట్ వచ్చాడు .స్వామి రామాతో ‘’మీరు ఇక్కడ ఉంటున్నారు కదా ఈ యోగి ఏ మతానికి చెందిన వాడో చెప్పండి ‘’అని అడిగాడు ..రామా ఆయనతో ‘’నాకేమీ తెలియదు ‘’అన్నాడు .మనసులో ‘’ఇదేమిటి ఈ యోగి చనిపోతూ భలే ఫిట్టింగ్ పెట్టాడే .నాకు ఈయనేం బోధ చేస్తాడు .నిజంగా మహా యోగి అయివుంటే ఇలాంటి సమస్యను సృష్టించేవాడు కాదుకదా ‘’అని మనసులో రామా వితర్కించుకొన్నాడు ..

ఆ యోగి ప్రాణం విడిచి   అప్పటికి నాలుగు గంటలయింది ..అప్పుడు అకస్మాత్తుగా ఆయన లేచి ‘’ఒరే మూర్ఖుల్లారా !మీరు నా దేహం కోసం కొట్టుకు చస్తున్నారు కనుక నేను చావ దలచుకోలేదు ‘’అన్నాడు అక్కడున్న మేజిస్ట్రేట్  ,జనమూ ముక్కు మీద వేలేసుకొని ఆశ్చర్యపోయారు ..ఆయోగి అక్కడి మూడుమతాల శిష్యులతో ‘’తెలివితక్కువ సన్నాసుల్లారా! నా కళ్ళ ముందు నుంచి మీరు తక్షణం వెళ్లిపోండి .నాకు కనిపిస్తే సహించను .నేను దేవునికి తప్ప ఎవరికీ చెందిన వాడినికాను .పొండి వెళ్లి పోండి ‘’అని గద్దించాడు . స్వామి రామాను దగ్గరకు పిలిచి ‘’నాయనా !కంగారు పడకు .నేను ఇక్కడే మూడు రోజులు ఉండి నీకు కావలసింది అంతా బోధిస్తాను .నాల్గవ రోజు శరీర త్యాగం చేస్తాను ‘’అని చెప్పాడు ..

  స్వామిరామా ఆయోగివద్ద మూడు రోజులు ఉండి  ఆత్మజ్ఞానం బోధనవలన సంతుష్టుడయ్యాడు .రామా జీవితం లో ఈ మూడు రోజులు చిరస్మరణీయమైనవని భావించాడు .ప్రతిరోజూ ఏదో ఒక కొత్త విషయం బోధించాడు .ప్రతి రోజు ఆయన నోటి నుంచి ‘’నువ్వు యదార్ధంగా ఎవరివో అది అవ్వాలి నువ్వు .నువ్వు కానిదానికోసం నటించవద్దు ‘’ఈ మహా వాక్యాన్ని రోజూ అనేక సార్లు ఉచ్ఛరించేవాడు ఆ యోగి పుంగవుడు ..మూడు రోజులు అయ్యాక ఆయన రామా తో ‘’నేను జల సమాధి ఆవాలను కొంటున్నాను ‘’అని చెప్పి నదికి నడిచి వెళ్లి అందులో అదృశ్యమయ్యాడు .జనం తర్వాత వచ్చి అడిగితె ఆయన నదిలో మునిగిపోయాడు మళ్ళీ కనిపించలేదు అని చెప్పాడు . వాళ్లంతా ఆ నదిని అంగుళం అంగుళం గాలించి వెతికారు . కానీ ఆయన దేహం వాళ్లకు దొరకలేదు .మహర్షులు మహాయోగులు ఏదో ఒక మతానికి చెందినవారు కాదు .ఈ అడ్డుగోడలకు  అతీతంగా ఉండేవారు .వారు సర్వమానవాళికి చెందినవారు ..  మీ– గబ్బిట దుర్గాప్రసాద్ -24-7-17 -కాంప్-షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గుగ్గురు దర్శనం -5(చివరిభాగ0 )

గుగ్గురు దర్శనం -5(చివరిభాగ0 )

సౌర శాస్త్రం (సోలార్ సైన్స్ )యోగ శాస్త్రాలలో అత్యాధునికమైనది .మానవ బాధానివారణకు ఉపయోగపడేది ..పరమగురువు చెప్పినప్రకారం అదొక ప్రత్యేక ధ్యాన విధానం.మానవుని లోని సౌరవలయం (సోలార్ ప్లెక్సెస్ ) పై ఆధార పడి  ఉంటుంది . భౌతిక మానసిక వ్యాధుల నివారణకు అత్యుత్తమ విధానం . మానవ శరీరం లో సౌర వలయం అతిపెద్ద జాలం దాని కేంద్రాన్ని మణిపూరకచక్రం  అంటారు . ఈ చక్రం పై ధ్యానం చేయటానికి అనేక పద్ధతులున్నాయి ,కానీ ఆధునిక ప్రాణాయామం సౌర శాస్త్రాన్ని ఉపయోగించి చేస్తే ప్రాణశక్తికంటే ఉన్నతమైన ఒక గొప్ప శక్తి స్థాయికి చేరుస్తుంది .ఈ స్థాయిలో శక్తి లయలను ఉదయ సూర్యుని పైగాని ,ఉదరాగ్ని పై కానీ ధ్యాస ఉంచి అధ్యయనం చేయాలి ..ఈ నివారక విధానం ఉపనిషత్తులలో వివరించబడినది ,. అతికొద్ది మంది పండితులకు వేత్తలకు మాత్రమే ఇది తెలుసు . ఈ శాస్త్రాన్ని తెలుసుకొంటే భౌతిక ,ప్రాణిక ,మానసిక స్థాయిలపై ఆధిపత్యం ,నియంత్రణ లభిస్తుంది .దీనీపై ప్రవీణుడైనవాడు  ఆశక్తిని ప్రసారం చేసి ఎవరి రోగాలనైనా,యెంత దూరం లో ఉన్నా  నివారించి  ఆరోగ్యం చేకూర్చగలడు .

  తనగురువు బెంగాలీ బాబా నుండి స్వామిరామా అన్నిశాస్త్రీయ  విద్యలలో గొప్పదైన ‘’శ్రీ విద్య ‘’ను పొందాడు .  ఇది టిబెట్ లోని అన్నిమండలాల లోను ,భారతీయ సాహిత్యం లోను తల్లి విద్య లాంటిది .ఆధునిక సాధనలో సాధకుడు శ్రీ యంత్రం లోని వివిధ భాగాలపై ద్రుష్టి కేంద్రీకరించే విధానాలు తెలుసుకొని అప్పుడు కేంద్రం పై దృష్టినిలిపే ప్రయత్నం చేస్తాడు .ఇది ఆధ్యాత్మిక శక్తికేంద్రమైన బిందువు ఇక్కడే శివుడు, శక్తి(శివా శివులు ) కలిసి ఐక్యమై ఉంటారు . మలబారు కొండలపై ఈ విద్యను తనకు గురువు నేర్పినా ‘’బిందు భేదనం ‘’సాధన మాత్రం బోధించలేదు .ఈ పర దేవత ఆరాధనా విధానం లో మహర్షులు చెప్పిన విజ్ఞానం అంతా ఉంటుంది . దీనికోసం గ్రంధాలు చదవాల్సిందే .కానీప్రజ్ఞానిధియైన  గురువే మార్గ దర్శకత్వం చేయాలి .అప్పుడే సార్ధకమవుతుంది .ఈ ఉన్నత విద్య తెలిసినవారు వేళ్ళమీద లెక్కింపతగినంత మందిమాత్రమే ఉన్నారు .మన సంప్రదాయం శ్రీ విద్యను బాగానే బోధిస్తుంది .పరమగురుదర్శనం ఆయన బోధించిన ఆధునిక యోగం వలన తాను  టిబెట్ కు వచ్చిన పని సార్ధకమైందని సంతృప్తి చెందాడు స్వామి రామా ..

  పరమగురువు వద్ద టిబెట్ లో నెలన్నర ఉండి అధ్యయనం చేసిన తర్వాత ఒక రోజు గుహ బయట కూర్చుని తన యాత్రానుభవాలను రాస్తున్న డైరీ జ్ఞాపకం వచ్చి అది ఇక్కడ తనదగ్గర ఉంటె ఎంతబాగుండును ఈ విషయాలన్నీ అందులో రాసుకొనే వాడినికాదా అని మనసులో అనుకొన్నాడు ..లోపలున్న పరమగురువు చిరునవ్వుతో లోపలి రమ్మని పిలిచి ‘’నీ డైరీ నీకోసం తెప్పించగలను .దాని అవసరం లేదా ?’’అని అడిగితె ఆశ్చర్యపోయినా  ఇలాంటి అద్భుతాలు మహాత్ములకు చాలా సునాయాసం అని గ్రహించి ,ఇలాంటివి తానూ చాలాచూశాడుకానుక అద్భుతం అనిపించలేదురామాకు …’’అవును స్వామీ కొన్ని పెన్సిళ్లు కూడా కావాలి ‘’అన్నాడు ..స్వామిరామా తాను రాస్తున్న డైరీని ఉత్తరభారతం లోని నైనిటాల్ కొండలలో ఉన్న భవాలీ శానిటోరియం లో వదిలేసి వచ్చాడు . అకస్మాత్తుగా 475 పేజీలతో ఉన్న పెద్ద డైరీ మూడు పెన్సిళ్ళతో అక్కడ ప్రత్యక్షమయ్యాయి .రామా సంతోషించాడుకాని ఆశ్చర్యపడలేదు .తనకు ఆధ్యాత్మికంగా ఏదైనా కొత్త విషయం బోధించమని అడిగాడు .

  నవ్విన పరమగురువు ‘’నీకు అది అంతా బోధించాను .దాన్ని పునశ్చరణ చేస్తూ మనసులో నిలుపుకోవాలి .నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి .నువ్వు ఇప్పుడు లాసాకు వెళ్లి అక్కడనుండి ఇండియా వెళ్ళు .అనగా ‘’నేను ఇండియా వెళ్ళటం కుదరదు వెడితే నన్ను అరెస్ట్ చేస్తారు ‘’అన్నాడు .వెంటనే గుగ్గురువు ‘’త్వరలో ఇండియాకు స్వతంత్రం రాబోతోంది .నువ్వు ఇంకా ఆలస్యం చేస్తే విపరీతమైన మంచు  హిమానీ నదాలు నిన్ను అడుగుకూడా ముందుకు వేయనియ్యవు ‘’అని హెచ్చరించి పంపాడు . మళ్ళీ ఆయన దర్శనం కాలేదు .కానీ కొద్దికాలం తర్వాత ఆయన శిష్యులకు వీడ్కోలు పలికి అదృశ్యమై పోయాడని విన్నాడు .కొందరు ఆయన తా నక్ పురా వద్ద ప్రవహించే కాళీ గంగానదిపై పుష్పహారాలతో తేలుతూ ఉండటం చూశామని చెప్పారు . తన గురువు బెంగాలీ బాబాను పరమగురువు బ్రతికి ఉన్నారా అని అడిగితె చిరునవ్వు నవ్వి ‘’అది నీ అంతట నువ్వే తెలుసుకోవాలి ‘’అని మాత్రమే అన్నాడు .

   ఏమి జరుగుతుందో అనే భయంతో లాసా చేరి పూర్వపు లామా కు అతిధిగా ఉండి జూన్ 1947 న ఇండియా కు బయల్దేరాడు ..రెండు కంచరగాడిదలు ఇద్దరుగైడ్ ల సాయం తో ఒక నెల ప్రయాణించి దట్టంగా మంచు తో నిండిన కనుమలకు దాటి సిక్కిం రాజధాని గాంగ్ కాక్ చేరాడు అక్కడికి చేరటానికి మూడురోజుల ముందే భారత దేశానికి స్వతంత్రం  వచ్చింది .గాంగ్ కాక్ లో ఈశాన్యాన ఇప్పటికీ ఉన్న ఒక మొనాస్టరీ లో ఉన్నాడు .అక్కడ బౌద్ధ యోగి బుద్ధగయ లో చాలాకాలం ఉండి  సంస్కృతం అభ్యసించిన ఒక ప్రసిద్ధ   లామాను దర్శించి .ఆయనతో ఉన్నాడు .సాధారణంగా బౌద్ధం శంకరాచార్యులవారిని విమర్శిస్తుంది .కానీ ఈ మహా పండితుడుమాత్రం భారతీయ గ్రంథాలనుండి అనేక ఉదాహరణలిస్తూ సంభాషిస్తాడు బౌద్ధం శంకరాద్వైతం లను సమన్వయ పరచి చక్కగా మాట్లాడతాడు .ఈ లామా ‘’పరమోన్నత సత్య0  విషయం లో ఈ రెండు సిద్ధాంతాలలో భేదం ఏమీలేదు  . ఉన్నభేదం శబ్దాలకు మాటలకు సంబంధించిమాత్రమే .. ఈయన ఇండియా టిబెట్ జపాన్ చైనా దక్షిణాసియా లోని బౌద్ధ అనుయాయుల గురించి బాధపడుతూ ‘’వీళ్ళు బౌద్ధ ధ్యాన పధ్ధతి ,ఆత్మజ్ఞాన సమ్పత్తిని పూర్తిగా వదిలేసి కర్మకాండలలో కూరుకు పోయారు .ఇదిగౌతమబుద్ధుడు బోధించిన  అసలైన బౌద్ధ విధానం కాదు. ఈ ఆధునిక పోకడల ను నివారించటానికి కల్తీ లేని అసలైన బౌద్ధం  అదృశ్యమై పోయింది .వేలాది బౌద్ధ దేవాలయాలు  బౌద్ధాలయమాలు పూజారులు  సన్యాసులు  కర్మ కాండలకే పరిమితమై పోవటం బాధ కలిగిస్తోంది .బుద్ధుడు చెప్పిన ‘’మీ దీపం మీరే వెలిగించుకోండి .ఎవరూ మీకు  విముక్తిని ఇవ్వలేరు .మిమ్మల్ని మీరు తెలుసుకోండి .నిర్వాణం పొందండి అప్పుడు మీరే బుద్ధులౌతారు ‘’అని బోధించినదానికి పరమ విరుద్ధంగా ఉంది ‘’అని ఆ లామా ఆవేదన చెందాడు .

   ఈ లామా ఆత్మజ్ఞానం మరచి కర్మకాండలలో కూరుకు పోయిన సరైన అద్వైతాన్ని బోధించని  శంకర అనుచరులైన అద్వైతులనుకూడా విమర్శించాడు .’’ఇలాంటి బోధనలు మనుషులను గందర గోళ  పరుస్తాయి ..శంకరుల వేదాంతం వేద  బౌద్ధ వేదాంత సమన్వయము .’’అసగ్రా ఇదం అగ్ర అసిత్ ‘’అంటే దృశ్య ప్రపంచం శూన్యం లో నుంచి ఉద్భవించింది ‘’మొదలైన సంస్కృత శ్లోకాను మాండూక్య ఉపనిషత్ ,బౌద్ధ  విద్వాన్సుడు   ఈశ్వర కృష్ణుని సాంఖ్య కారిక ల నుండి ఉదహరిస్తూ  తన భావాలను వ్యక్తం చేసి చెప్పాడు స్వామి రామాకు.అనేక రోజులు రామాకు వేదాంత బోధ చేసి స్వామిరామాను హిమాలయాలలో ఉన్న తన బెంగాలీ గురువు ను త్వరగా కలుసుకోమని చెప్పి వీడ్కోలు పలికి పంపించాడు .

           మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -24-7-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

56 వ శ్రీ సుందరకాండ పారాయణం 

56 వ శ్రీ సుందరకాండ పారాయణం

  శ్రావణమాస సందర్భంగా 27-7-2017 గురువారం నుండి 4-8-17 శుక్రవారం (వరలక్ష్మీ వ్రతం )వరకు 9 రోజులు నాచే 56 వ శ్రీ సుందరకాండ పారాయణ ,శ్రీ సువర్చలాన్జనేయ శతక పారాయణ   ఉదయం 7-30 నుండి 9-30 వరకు షార్లెట్ లోని మా అమ్మాయి వాళ్ళ స్వగృహం లో భగవదనుగ్రహం తో నిర్వహింపబడుతోందని తెలియ జేయటానికి సంతోషిస్తున్నాను -దుర్గాప్రసాద్
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

వీక్లీ అమెరికా -17(17-7-17 నుండి 23-7-17 వరకు ) వీక్లీ అమెరికా -17(17-7-17 నుండి 23-7-17 వరకు )

వీక్లీ అమెరికా -17(17-7-17 నుండి 23-7-17 వరకు )

వెంకయ్య నాయుడు వారం

17-7-17 సోమవారం -ఉపరాష్ట్రపతి పదవికి యెన్ డి ఏ అభ్యర్థిగా శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడిని ప్రధాని మోడీ ప్రకటించాడు .మోడీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర్నుంచీ ఈ పేరు వినిపిస్తూనే ఉంది .వెంకయ్యమాత్రం ‘’నేను ఉషాపతి ని మాత్రమే ఉప రాష్ట్ర పతి నికాను ‘’అని ప్రకటిస్తూనే ఉన్నాడు .ఇప్పుడు తప్పలేదు . ఒక ఆంధ్రుడికి ఒక క్రియాశీలక కార్యకర్తకు వక్తకు ముఖ్యంగా మన భాష సంస్కృతులపై విశేషమైన అభిమానమున్న వెంకయ్యకు ,అంటే ఆంధ్రులకు దక్కిన అరుదైన గౌరవం ఇది ..మెజారిటీ ఎలానూ ఉందికనుక ఎన్నిక లాంఛన ప్రాయమే .

   వెంకయ్య పై నాకున్న అజ్ఞాత పరిచయం .బహుశా 1967-70 మధ్యకాలం అనుకొంటా సరిగ్గా గుర్తు లేదు . బందరు హిందూకాలేజి లో లెక్కలమేస్టారుగా శ్రీ రాజనాల శివరామ కృష్ణ మూర్తి -ఆర్ ఎస్ కె మూర్తి అనే ఆయన తో పరిచయం కలిగింది .ఆయన లెక్కలు బాగా చెప్పేవారు ఇంటిదగ్గర ట్యూషన్ కు వందలాది విద్యార్థులు ఉండేవారు ఇంగ్లిష్ లో దిట్ట .ఆర్ ఎస్ ఎస్ కు సుశిక్షిత కార్యకర్త బి జెపి నాయకుడు .జాగృతి వారపత్రిక ఆయనే చూసేవారు అందులో సినిమా రివ్యూ చాలా గొప్పగా రాసేవారు మీదు మిక్కిలి మంచి కథా  రచయి.  హాస్యం అంతర్వాహినిగా ఉండేది ఆయన రచనలలో . మాకు ఫామిలీ ఫ్రెండ్ .ఇద్దరం కలిసి శ్రీ కొల్లూరి కోటేశ్వరరావు గారి అభ్యర్ధన మేరకు ఆయన శాసనమండలి ఎన్నికకు ప్రచారం కూడా చేసాం .మేస్టారూ అని ఆప్యాయంగా పిలిచేవాడిని .

 అప్పుడాయన ‘’సాందీపని ‘’అనే మాస పత్రిక నడిపేవారు . దానిలో నన్ను కవితలు రాయమని కోరేవారు .అప్పుడాయన నెల్లూరి కుర్రాడు వెంకయ్య నాయుడు అనే అబ్బాయి చాలా వినయ వివేక శీలి  బుద్ధిమంతుడు ,గొప్ప కార్యకర్త .సాందీపనిలో రాస్తూంటాడు .అని చెప్పేవారు ఇదే అజ్ఞాత పరిచయం .నేను ఇందిరా గాంధీ పై ‘’కొమ్మా బొమ్మా అమ్మ ‘’అనే వ్యంగ్య కవిత రాశాను అది చదివి ఆయన సాందీపనిలో ప్రచురించారు . కనుక వెంకయ్య రాసె పత్రికలో నేనూ రాయటం అజ్ఞాత పరిచయమే . తరచుగా వెంకయ్య మేష్టారి దగ్గరకు వచ్చి సలహాలు తీసుకొనే వాడు . ఆ తర్వాత ఆంధ్రా ఉద్యమం లో ఢిల్లీ నుంచి గల్లీ దాకా జరిపిన సభలలో వెంకయ్య ,యలమంచిలి శివాజీ ,వడ్డే  శోభనాద్రీశ్వరరావు   సుంకర సత్యనారాయణ కొమరగిరి కృష్ణమోహన్ లవంటి యువ రక్తం ఊరూ రా ఉపన్యాసాలతో హోరెత్తించేవారు .విశాఖ ఉక్కు ఉద్యమం లోనూ ముందే ఉన్నారు  వాటిఫలితం దక్కలేదు కానీ వీరి పాత్ర మరువలేనిది . వీరిలో శివాజీ ధీరిటీషియన్ .స్టాటిస్టిస్ తోమాట్లాడేవాడు .ఉపన్యాసం రాణించేదికాదు .  కొమరగిరి ,వెంకయ్య లు దారాళ పాత వక్తలు .బిజెపి ఆర్ ఎస్ ఎస్ ను నరనరానా జీర్ణించుకున్నవారు .సుంకర కూడా వంకర ప్రాస లతో జనానికి కిక్కెక్కించేవాడు . శివాజీ రాజ్య సభ సభ్యత్వ0 తో  చరణ్ సింగ్ అంతేవాసిత్వం తో ఆగిపోతే ,కొమరగిరి ఇక్కడే ఆగి ఒక ఆధ్యాత్మిక పత్రికా సంపాదకుడుగా బందర్ కె పరిమితమైతే లకు  ఎక్కడో లక్కలాపట్టి సుంకర కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యాడు .వద్దే లోక్ సభ సభ్యుడు రాష్ట్ర మంత్రీ అయ్యాడు . పార్టీని సిద్ధాంతాన్ని పూర్తిగానమ్మి జనసంఘ్ తో తర్వాత భారతీయ జనతాపార్టీ తో నిబద్ధంగా ఉంటూ సుశిక్షిత ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తగా అందరి అభిమానం పొంది గొప్పవక్తగా ప్రాస యమక చక్ర వర్తి గా అంచెలంచలు మీద ఎదిగి బిజెపి అత్యున్నత వ్యవస్థాగత స్థానం పొంది ,ఆంధ్రా విభజన సమయం లో కీలక పాత్ర పోషించి అన్యాయం జరగకుండా ప్రయత్నించి ,అటల్ బిహారీ వాజ్ పేయికి ,లాల్ కృష్ణ అద్వానీ కి అంతేవాసియై మోడీ ప్రధానికావటానికి అడ్డంకులు తొలగించి ,తానూ కేంద్ర మంత్రిపదవి పొంది ,ప్రతిపక్షాలతో చక్కని సంబంధం కలిగి సమస్యా పరిష్కారానికి తగిన వాడనిపించి ఇప్పుడు ఉపరాష్ట్ర పతి పదవి అందుకో బోతున్నాడు నిబద్ధతకు తగిన ప్రతిఫలం ఇది . ఏనాడూ జంపింగ్ ఫ్రాగ్ కాలేదు .ఇది ఆంధ్రులందరు గర్వించదగిన సమయం .అందుకే ఈవారం వెంకయ్య వారం అన్నాను .

    మంగళవారం     గీ -3 లో కొండవీటి వేంకటకవి పై రాశాను .ఆస్ట్రో ఫిజిక్స్ ఆధారం గా బ్లండరే  బ్లండర్ , మూలకాలు అంతరిక్ష మార్పులు రాశాను .ఇక్కడి వేసవి ఉష్ణోగ్రత 100 ఫారం హీట్ డిగ్రీలు ఉంటోంది .యెన్ కస్తూరి అనే ఆయన రాసిన ‘’లవింగ్ గాడ్ ‘’చదవటం ప్రారంభించి ఆపకుండా దాదాపు ఎనభై పేజీలు చదివాను చాలాబాగా ఉంది .కేరళలో పుట్టి మైసూర్ లో ఉద్యోగించి ,ఎన్నో సేవాకార్యక్రమాలు చేసి,శ్రీరామకృష్ణ పరమహంస ,వివేకానంద మార్గం లో ప్రయాణించి సత్యసాయికి దగ్గరై ఆయన జీవిత చరిత్రను తన జీవిత చరిత్రతో కలిపి చాలా బా గా రాశాడు .షిరిడీ సాయి జీవిత చరిత్రకు  దంబోల్కర్ అనే హేమాద్రిపంత్ రాసిన షిర్డీ బాబా సచ్చరిత్ర ఎంత సాధికారమైనదో ,శ్రీ కస్తూరి రాసిన ;;లవింగ్ గాడ్ ‘’సత్యసాయి జీవిత చరిత్రకు అంతటి ఆదేంటిక్ రచన అని అందరి అభిప్రాయం .

 గురువారం పెన్సిల్వేనియా నుంచి శ్రీమతి శ్రీదేవి గారు మెయిల్ రాస్తూ తాను  రెండు పుస్తకాలు పంపాననని అందాయా అని అడిగి మనబ్లాగ్ చాలా ఆసక్తికరంగా ఉందని మెచ్చుకొన్నారు .ధన్యవాదాలు తెలియ జేశాను .రాత్రి రాజేంద్ర ప్రసాద్ సినిమా ‘’గుండమ్మగారి మనవళ్ళు ‘’గొట్టం లో చూసాం . సరదా సినిమా ..

 శుక్రవారం శ్రీ మైనేనిగారు శ్రీ వాడ్రేవు చిన  వీరభద్రుడుగారు ‘’ముండకోపనిషత్ ‘’పై ప్రసంగం చూడమంటే చూశాను బాగుంది .దీనితోపాటు స్వామి రామా ఉపనిషత్తులపై ఆంగ్లప్రసంగం  అద్వైత వేదిక లో శ్రీ అరవిందరావు   ప్రసంగాలూ చూశాను . దేనికదే అనర్ఘ రత్నం .

22-7-17 శనివారం ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో ఉదయం అభిషేకం శాకాంబరీ పూజ ,సాయంత్రం శాకాంబరీ పూజా విశేషాలపై ప్రసంగం  బాగా జరిగాయి రమణ అన్నీ దగ్గరుండి నిర్వహింపజేశాడు .

  సెప్టెంబర్ 5 మంగళవారం ఉపాధ్యాయ దినోత్సవం నాడు  నాకూ మైనేనిగానికి గురువులైన కీశే శ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి గురు వరేణ్యుల గురుపూజోత్సవ కార్యక్రమాన్ని శ్రీ గోపాల కృష్ణగారు ,మా గురుపుత్రులు శ్రీ కోట సోదరులతో మా అబ్బాయి రమణ తో  సంప్రదించి నిర్ణయించాము . రాత్రి అన్నమయ్య సినిమా ట్యూబ్ లో చూసాం .

23-7-17 ఆదివారం ఉదయం అంతా తీవ్రమైన ఎండ సాయంత్రం మంచి వర్షం కురిసింది .వీక్లీ న్యూస్ సమాప్తం

మీ గబ్బిట దుర్గా ప్రసాద్ -23-7-17 -కాంప్-షార్లెట్-అమెరికా

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

శ్రావణ మాస శుభాకాంక్షలు 

        శ్రావణ మాస శుభాకాంక్షలు

అందరకు 24-7-17 సోమవారం తో ప్రారంభమయే  శుభ శ్రావణ మాస శుభాకాంక్షలు . 4-8-17 రెండవ శుక్రవారం శ్రీ వరలక్ష్మీ వ్రతం . 7-8-17 సోమవారం శ్రావణ పూర్ణిమ -జంధ్యాలపూర్ణిమ ,వైఖానస ,హయగ్రీవ జయంతి -రాఖీ పూర్ణిమ -రాత్రికి పాక్షిక చంద్ర గ్రహణం

 15-8-17 మంగళవారం -శ్రీ కృష్ణాష్టమి -భారత స్వాతంత్య్ర దినోత్సవం
  25-8-17 శుక్రవారం -శ్రీ వినాయక చవితి
                                               దుర్గాప్రసాద్ -23-7-17
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గుగ్గురు దర్శనం -3

గుగ్గురు దర్శనం -3

  స్వామి రామా విడిది చేసిన ఆశ్రమం లో సంస్కృత వ్రాత ప్రతి లామాలచేత పూజింపబడుతోంది .గట్టి గుడ్డ కవర్ తో ఉన్న ఆ ప్రతి  గంధం తో దుమ్ముకొట్టుకు పోయింది .ఆ ప్రతిని చదివినవాడికి వెంటనే కుష్ఠురోగం  వచ్చి చస్తాడని వాళ్ళ నమ్మకం లామాలు చాలామంది వచ్చి దాన్ని పూజిస్తారుకాని ఎవరూ తెరిచి చదివిన దాఖలా కనిపించలేదు .రామాకు దాన్ని చదవాలనే కోరిక బలీయమైంది .దాన్ని కనీసం చూపించటానికి కూడా ఎంతబ్రతిమిలాడినా అల్లామా ససేమిరా అన్నాడు .అప్పుడు రామాకు ‘’గ్రంధాలు వాటిని చదివే వారికే కానీ అందులో ఏముందో తెలుసుకోకుండా పూజించేవారికి కాదు ‘’అన్న పెద్దలమాట జ్ఞాపకమొచ్చింది  .తెల్లవారుజామున 3 గంటలకు ఆశ్రమాన్నికి వెళ్లి ,ఆసిల్కు గుడ్డ లో చుట్టబడి ఉన్న ఆ  గ్రంధం ఉన్న గదిలో చేరి దాన్ని తెరచి అక్కడిదీపపు  వెలుగు లో దాన్ని చదువుతుంటే అది ‘’లింగ పురాణం ‘’అని అర్ధమై ,అందులో వేలాది శ్లోకాలలో ఆధ్యాత్మిక కథలు  విధానాలు ,పద్ధతులు పురాతన భారతీయ వేద సాహిత్యాధారంగా రచింపబడిందని గ్రహించాడు . కంగారులో లోపలి కి చేరటం దీపాలు చెదరటం మళ్ళీ మూట సరిగ్గా కట్టలేక పోవటం వలన దాన్ని ఎవరో తప్పక తెరచి చదివి ఉంటారని అనుకొంటారు .స్వామి రామా పై అనుమానమొచ్చింది .లామా పిలిపించి గద్దించాడు .అప్పుడు రామా తెలివిగా ‘’హిమాలయ యోగులు నన్ను దీన్ని చదివి రమ్మని పంపారు .మీరు నన్నేమైనా అంటే నాకేమీ కాదు మీరే ఇబ్బందిపడతారు ‘’అన్నాడు హిందీలో ..ఇక ఏమీ మాట్లాడ లేక ఈ లామా ,లామాల పెద్దా విషయాన్ని అక్కడితో వదిలేశారు లేకపోతె స్వామి రామాను పిచ్చ కొట్టుడు కొట్టి ఉండేవాళ్ళు . దీనితో వాళ్లందరికీ బుద్ధ గయ నుండి ఒక గొప్ప పండితుడైన లామా వచ్చాడని మహా తెలివిగలవాడని  మహా మంత్ర తంత్ర వేత్త అని రామా గురించి ప్రచారం చేశారు  రామాతో వెంటవచ్చిన టిబెటన్ గైడ్ లు రామాను ఇక ఇక్కడినుంచి వెళ్ళిపోవటం మంచిదని చెప్పారు . ఇక్కడిలామాల గుడ్డినమ్మకానికి నవ్వుకున్నాడు రామా

               ఫలించిన    గుగ్గురు దర్శనం

ఎట్టకేలకు గుగ్గురు దర్శనం చేశాడు స్వామిరామా .రామాను చూడగానే ఆనందం తో ఆప్యాయంగా కౌగిలించుకొని ‘’నాయనా !చాలా దూరం నుంచి వచ్చావు .ఎన్నో ఇబ్బందులెదుర్కొన్నావు అలసినట్లున్నావు . విజ్ఞాన రహదారి చాలా కష్టమైనది విజ్ఞానం గ్ర హించటమూ కష్టతర మైనదే ‘’అంటూ రామా ప్రయాణం లో సర్వ విషయాలు తన కళ్ళతో చూసినట్లు రామాకే వర్ణించి చెబుతుంటే స్వామి రామా అవాక్కయ్యా డు ..దూరం కష్టప్రయాణం లో తపం ధ్యానం అన్నీ ఉట్టికెక్కాయనిపించింది .స్నానం చేసి విశ్రాంతి తీసుకోమని సలహా ఇస్తే అలానే చేశాడు .మార్గాయాసం శ్రమ ఇబ్బందులు గురువుగురువు గారి ఆత్మీయ ఆలింగనం తో మాయమైపోయాయి తన గురువు బెంగాలీ బాబా ఎలాతనపై కారుణ్యం చూపించేవాడో ఈయనా అలానే అపార కారుణ్య వర్షం కురిపించాడు .గొప్ప  యోగులు తమ శిష్యులను చూస్తే వారిపై  అనంత  అనుకంప వాత్సల్యం ప్రేమ కలుగుతాయి .

 రామాగురువు ఈ  టిబెట్ గురించి కొన్ని విషయాలు చెప్పాడు ఈయన ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు .బాల్యం లోనే ఇల్లువదిలి హిమాలయాల్లో పాద చారిగా సంచరించి ,అనేక గురువులవద్ద అన్నీ నేర్చాడు .ఇప్పుడు చాలా ముసలివాడుగా ఉన్నాడు .కానీ ఆరోగ్యంనే ఉన్నాడు .కూర్చున్న చోటు నుంచి ఉదయం  ఒకసారి ,,సాయంత్రం ఒకసారిమాత్రమే లేస్తాడు . ఐదడుగుల పది అంగుళా ల ఎత్తు ,సన్నగా శలాకలాగా మాంచి శక్తి సంపన్నం గా ఉన్నాడు .దట్టమైన కనుబొమలు  ,ముఖం లో చెరగని ప్రశాంతత ,వెలుగు ,కళ్ళల్లో కాంతి చెదరిని చిరునవ్వు తో ఆకర్షణీయంగా ఉన్నాడు …ఆయన ఆహారం ‘’యాక్ పాలు ‘’..ఒక్కోసారి సూప్ .అప్పుడప్పుడు కొందరులామాలు వచ్చి ఈయనవద్ద చదువుకొంటారు ..7 వేల అడుగుల ఎత్తున ఉన్న స్వాభావికమైన చిన్నగుహలో ఉంటాడు .నిప్పు రాజేసి లోపలి చీకటిని పోగొడతాడు .దానితోపాలు  నీళ్లు కాస్తాడు . గుహముందు కర్రలతో పోర్టికో ను శిష్యులు నిర్మించారు .ఈ గుహ నుంచి చూస్తే అద్భుతమైన ఎత్తైన  పర్వత శ్రేణి ,శిఖరాలు  అందమైన దిక్చక్రమ్ కనుల విందు చేస్తాయి .

            సశేషం

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-7-17-కాంప్-షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

భారతీయ కళా సంస్కృతులను విశ్వ వ్యాప్తం చేసిన -పుపుల్ జయకర్ – గబ్బిట దుర్గాప్రసాద్

భారతీయ కళా సంస్కృతులను విశ్వ వ్యాప్తం చేసిన -పుపుల్ జయకర్ – గబ్బిట దుర్గాప్రసాద్

పుపుల్ జయకర్ ఉత్తర ప్రదేశ్ ఇటావాలో 1915 లో జన్మించింది తండ్రి భారత సివిల్ సర్వీస్ ఆఫీసర్ .ఉదారవాది అయిన మేధావి . తల్లి గుజరాత్ లోని సూరత్ బ్రాహ్మణ కుటుంబస్త్రీ .ఇక్కడే జయకర్ చిన్నతనం కొంతకాలం గడిచింది .తండ్రి ఉద్యోగం వలన కుటుంబం చాలా ప్రదేశాలలో ఉండాల్సి వచ్చి అక్కడి కళా సంస్కృతుల అవగాహన ఆమెకు కలిగింది . 11వ ఏట బెనారస్ వెళ్లి అనిబిసెంట్ స్థాపించిన ధియసాఫికల్ స్కూల్ లో చేరింది .భారత స్వాతంత్రోద్యమం లో బీసెంట్ అనిర్వచనీయ పాత్ర పోషించిందని మనకు తెలుసు .ఆమె నడిపిన ‘’హోమ్ రూల్ లీగ్ ‘’చిరస్మరణీయం . .తండ్రికిఅలాహాబాద్ బదిలీ అయినందున అక్కడ ఆయనకు మోతీలాల్ నెహ్రు తో గాఢ పరిచయమేర్పడి ఆమెకు నెహ్రు కుటుంబం తో సన్నిహితమయి ఇందిరా గాంధీతికి మంచి స్నేహితురాలైంది . 1936 లో లండన్ వెళ్లి బెడ్ ఫోర్డ్ కాలేజీలో చేరి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో గ్రాడ్యుయేట్ అయి ఇండియా కు తిరిగి వచ్చి బారిస్టర్ మన్ మోహన్ జయకర్ ను వివాహమాడి బొంబాయిలో స్థిరపడింది .
బొంబాయి లో ‘’ట్రాయ్ కార్ట్ ‘’అనే ఇంగ్లిష్ మేగజైన్ నడిపింది .దీనిలో ప్రఖ్యాత చిత్రఙకారులు జెమిని రాయి ఎఫ్ ఏం హుసేన్ లు చిత్రాలు గీసేవారు .రాజకీయాలలో దిగి 1940 లో ‘’కస్తూరి బాయ్ ట్రస్ట్ ‘’నిర్వాహకురాలు మృదులా సారాభాయ్ కి అసిస్టెంట్ అయింది .తర్వాత ప్రధాని నెహ్రు ఆధ్వర్యం లో ఉన్న ప్లానింగ్ కమిషన్ లోని స్త్రీ సంక్షేమ శాఖ అసిస్టెంట్ సెక్రెటరీగా ఉద్యోగం పొందింది .అప్పుడే ప్రఖ్యాత దార్శనికుడు జిడ్డు .కృష్ణ మూర్తితో పరిచయమై ఆమె ఆలోచనా సరణినే మార్చేసింది . భారతీయ చేనేత పరిశ్రమ ను పూర్తిగా అవగాహన చేసుకొన్నది .జౌళి పరిశ్రమ మంత్రి ఆధ్వర్యం లో ఆమె మద్రాస్ బీసెంట్ నగర్ లో ‘’వీవర్స్ వె ల్ఫేర్ సెంటర్ ‘’ఏర్పాటు చేసింది .

ఇందిరా గాంధీ ప్రధాని అయ్యాక 1966 లో జయకర్ ను సంస్కృతికసలహారు గా నియమించింది .తర్వాత హాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్ లూమ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కు ఎక్సి క్యూటివ్ డైరెక్టర్ ,చైర్ పెర్సన్ కూడా అయింది .ఆ తర్వాత ఆలిండియా హ్యాండీ క్రాఫ్ట్స్ బోర్డు చార్ పర్సన్ గా మూడేళ్లు పని చేసింది .లండన్ ,పారిస్ ,అమెరికా లలో అనేక నెలల పాటు నిర్వచించబడిన ‘’ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా ‘’కు ఆమె సూత్రధారి పాత్రధారి అయి భారతీయ కళా సంస్క్రుతులకు విశ్వ వ్యాప్తి కలిగించింది .ప్రధాని రాజీవ్ గాంధీ కాలం లో ‘’అప్నా ఉత్సవ్ ‘’లకు కూడా ఆమె ప్రధానికి సాంస్కృతిక సలహాదారుగా గా కేబినెట్ మంత్రి హోదా లో ఉన్నది . 1982 లో జయకర్ ‘’ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ ‘’కు వైస్ ఛాన్సలర్ అయింది .ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ కు కూడా వైస్ చైర్మన్ గా ఉంది .ఈ పదవులు నిర్వహిస్తూనే ప్రధాని కి భారతీయ సంప్రదాయ ,సాంస్కృతిక వనరుల శాఖకు సలహాదారుగా ఉన్నది .ఇవన్నీ ఆమె సమర్ధతకు భారతీయ కళాసాంస్కృతుల పట్ల జయకర్ కున్న మక్కువ ఆరాధనలు ,వాటిని ప్రపంచ వ్యాప్తం చేయటం లో ఆమె చూపిన చొరవ కృషికి నిదర్శనం .తన స్నేహితురాలు ,ప్రధాని ఇందిరా గాంధీ సూచన మేరకు జయకర్ 1984 లో ‘’ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్స్ అండ్ హెరిటేజ్ ‘’స్థాపించింది .

బెంగాల్ లోని ‘’హంగ్రీ జెనరేషన్ ‘’అనే సాహిత్య ఉద్యమానికి పుపుల్ జయకర్ అన్ని విధాలా సహాయ సహకారాలు అందించి ,1961 లో ఆ సాహిత్యకారులు విచారణ విషయం లో గొప్ప సహకారమందించింది .ఇండియా ,అమెరికా ఇంగ్లాండ్ ,లాటిన్ అమెరికా వంటి పలుచోట్ల ఉన్న జిడ్డు కృష్ణ మూర్తి ఫౌండేషన్ ట్రస్ట్ కు జీవితకాల సేవలు అందించింది .ఆంద్ర ప్రదేశ్ లో చిత్తూరు జిల్లా మదనపల్లి లోని ‘’రిషీ వాలీ స్కూల్ ‘’స్థాపన నిర్వహణలో ఆమెది గణనీయ పాత్ర .ఆమె విద్య విజ్ఞాన కళా సాంస్కృతులఆరాధనకు అభినందనగా ఆమె పేర దేశం లో ఎన్నో విద్యాలయాలు వెలిశాయి .

1937 లో జయకర్ మన్మోహన్ జయకర్ అనే బారిస్టర్ ను వివాహమాడిందని ముందే చెప్పుకున్నాం ఆయన 1972 లో చనిపోయాడు వీరి ఏకైక కుమార్తె ‘’రాధికా హెర్ బెర్జెర్ ‘’ రిషీ వాలీ స్కూల్ అధ్యక్షురాలై నిర్వహణ బాధ్యతలు చేబట్టింది .విలువలతో కూడిన విద్య నందించుటయే ఈ విద్యాలయ లక్ష్యం .కృష్ణ మూర్తి ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యం లో పూనా దగ్గర రాజగురునగర్ లో సహ్యాద్రి స్కూల్ ,వారణాసిలో రాజఘాట్ బీసెంట్ స్కూల్ ,కథక్ డాన్స్ స్కూల్ మొదలైనవి నిర్వహిస్తున్నది

పుపుల్ జయకర్ ‘’జిడ్డు కృష్ణ మూర్తి జీవిత చరిత్ర ‘’ఇంగ్లిష్ లో రాసింది దీనికి మంచి పేరొచ్చింది .మరోపుస్తకం ‘’ఇందిరా గాంధీ -యాన్ ఇంటిమేట్ బయాగ్రఫీ ‘’ కూడా ప్రసిద్ధమైంది .ఇందిరా గాంధీ తనకు ఆపరేషన్ బ్లు స్టార్ వలన ప్రాణగండం ఉందని ముందుగానే ఊహించి చెప్పిందని జయకర్ తెలియ జేసింది .ఆమెరాసిన ఇతర పుస్తకాలు – గాడ్ ఈజ్ నాట్ ఎ ఫుల్ స్టాప్ -కథా సంపుటి ,టెక్స్టైల్స్ అండ్ ఎంబ్రాయిడరీస్ అఫ్ ఇండియా ,యాన్ ఎర్డ్రెన్ డ్రమ్ ,ది ఎర్త్ మదర్ ,ఫైర్ ఇన్ ది మైండ్ -డైలాగ్స్ విత్ జె.కృష్ణ మూర్తి మొదలైనవి .

పుపుల్ జయకర్ 29-3-1997 న 82 వ ఏట మరణించింది .

-గబ్బిట దుర్గా ప్రసాద్

Posted in రచనలు | Tagged | Leave a comment

గుగ్గురు దర్శనం -2  

గుగ్గురు దర్శనం -2

 లాసా లో ఒక లామాను కలిసి తాను  ఆధ్యాత్మిక మార్గదర్శనానికి టిబెట్ వచ్చానని ,తనకు రాజకీయ ఉద్దేశ్యాలేవీ లేవని , చెప్పి నమ్మక0 కలిగించి  ఆయనవద్ద  15 రోజులు గడిపాడురామా .ప్రభుత్వ ఉద్యోగులకు స్వామిరామాను పరిచయం చేస్తే  , వ చ్చీరానీ  టిబెటన్ భాషలో వారికి నచ్చ చెప్పగలిగాడు .ఈ లామా స్నేహితుడైన మరోలామా ఆశ్రమం  గుగ్గురువు ఆశ్రమానికి  సమీపం లోనే ఉన్నదని  చెప్పిలాసాకు ఈశాన్యం లో  75 మైళ్ళ దూరం  నాగరికతకు చాలా దూరం లో ఉన్నఅక్కడికి కొందరు గైడ్ లను తోడు ఇచ్చి పంపాడు .అక్కడినుంచి గుగ్గురువును తేలికగా చేరుకోవచ్చు .

  ఆ ఆశ్రమంలో 300 కు పైగా లామాలున్నారు . టిబెట్ లో  చాలా మొనాస్టరీస్ ఉన్నాయి .. వీటిలో వేలాది లామాలు వివిధ సంప్రదాయాలకు చెందినవారున్నారు . లామాయిజం అంటే బౌద్ధం లో వ్యక్తిగతమైనమతం  అనిపించిందిరామా కు  . ప్రతిలామా తనదైన ప్రత్యేక తరహాలో ఉత్సవాలు పూజా ధ్యానాదులు మంత్రోచ్చారణ ,ప్రార్ధనా చక్రాన్ని త్రిప్పటం  నిర్వహిస్తాడు .నలందాలోని  ప్రాచీన బౌద్ధ విశ్వ విద్యాలయంలో స్వామి రామా ఈ తంతు అంతా చూశాడు .బౌద్ధాన్ని క్షుణ్ణంగా ఇదివరకే చదివి ఉన్నాడు ..వెయ్యేళ్ళక్రితం టిబెటన్ విద్యావేత్త ఇండియా వచ్చి బౌద్ధాన్ని అధ్యయనం చేసి ఇక్కడి బౌద్ధ మత గ్రంధాలను టిబెట్ కు తీసుకు వెళ్లాడు అప్పటి నుంచి ఇండియానుంచి బౌద్ధపండితులు టిబెట్ వెళ్ళటం ప్రారంభి0చి అక్కడివారికి బౌద్ధ సాహిత్యాన్ని నేర్పారు .టిబెట్ లో బౌద్ధం లో ఉన్న అనేక శాఖలు స్వామి రామాకు తెలుసు ..వారిలో దేవుళ్ళు దేవతలను నమ్మేవారు బుద్ధుడు దేవుడని భావించేవారు ఉన్నారని గ్రహించాడు.

 టిబెట్ బౌద్ధం తంత్రం తో ముడిపెట్టబడి ఉంటుంది .గుగ్గురువును కలవటానికి ముందు ఒక చిన్న లామా ఆశ్రమం చూశాడు.  అక్కడిలామా టిబెట్ లోనే ప్రసిద్ధి చెందినలామా అని పేరు  టిబెట్లోని యోగ విధానం కొంతమారిన తంత్రశాస్త్ర0.దీనినే ‘’వామాచారం ‘’అంటారు ..ఈ మార్గం లోవారు మధిర మాంసం,చేప , మగువ   మంత్రా  లను నమ్ముతారు .రామా వెళ్లిన ఆశ్రమ లామా ఒక చెక్క గదిలో అనేకమందిమంత్రాలు చదివే  స్త్రీల మధ్య  కూర్చుని కనిపించాడు .కొన్ని మంత్రాలు చదివాక వారంతా అక్కడ ఉన్న పచ్చి మాంసపు ముక్కలను  కొన్ని సుగంధద్రవ్యాలు పచ్చిమిర్చి కలిపి తిని మళ్ళీ మంత్రాలు చదివారు . 15 నిమిషాల తర్వాత ఆ లామా రామాను చూసి పలకరించి వచ్చినపని అడిగాడు .ఈ లామాను చూడటానికే వచ్చానన్నాడు. ’’  అది అబద్ధం  నీపేరు స్వామిరామా  నువ్వు నీ గురువుగారి గురువును చూడటానికి మారు వేషం లో వచ్చావు  .సిక్కిం పోలీసులు  నీ  కోసం  వెతుకుతున్నారు ‘’అని చాలాకోపంగా తీవ్రం గా అన్నాడు బహుశా మగువలమధ్య మాంసం తింటుండగా చూశాడని ‘’ఎక్కడో ‘’కాలి  అలా అని ఉంటాడని గ్రహించాడు రామా ..ఈయన ఆలోచనలన్నీ ఆయన పసిగట్టేశాడు .రామా వణికిపోయాడు .తమాయించుకొని టిబెట్లో  కొంత తంత్ర విద్య నేర్వాలని వచ్చానని వినయంగా చెప్పాడు .చల్లబడిన లామా తనవద్ద ఉన్న ఒక తంత్ర పుస్తకాన్నిచ్చాడు దాన్ని తిరగేసినరామా  అది ఇదివరకే తాను  చదివేసిందే నని చెప్పగా మరొక తాంత్రిక లామా వద్దకు పంపాడు .ఈలామాకు బుద్ధగయ లో ఉండిచదవటం వలన హిందీ బాగా వచ్చు   .

 టిబెట్ సారస్వతం అంతా హిందూపురాణ అనువాదాలు కొన్నిటిలో టావోయిజం బౌద్ధం  కన్ఫ్యూషియన్ మతం కలిసికనిపిస్తాయి .వ్యవస్తీకృతంగా  సృజనాత్మకంగా ఏదీ లేదు .రామాకున్న టిబెటన్ భాషా పాండిత్యం  తక్కువేకాని ఈలామా హిందీలో మాట్లాడటం వలన ఇబ్బందికలుగలేదు .జనసామాన్యం తోమాట్లాడే టిబెటన్ మాటలు బాగానే వచ్చినాఅనేక మొనాస్టరీలలో భద్రపరచబడిన వ్రాత ప్రతులలోని  సారస్వతాన్ని చదివేంతగా రాదు .

  సశేషం

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-7-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గుగ్గురు దర్శనం

ఒకరోజు స్వామీ రామా ను గురువు బెంగాలీ బాబా టిబెట్ లో ఉన్న తన గురువు వద్ద కొంతకాలం ఉండి రమ్మని పంపాడు . గుగ్గురువు ను చూసి అనుభూతి పొందాలనే ఆత్రత తో రామా 1931లో బయల్దేరాడు .మానస పాస్ దగ్గర ఆపేశారు  మళ్ళీ 1946 లో టిబెట్ రాజధాని లాసా కు డార్జిలింగ్  కాళీపాంగ్ సిక్కిం ల ద్వారా వెళ్ళాడు .ముఖ్యోద్దేశం గుగ్గురు దర్శనమే .అక్కడ కొంత అడ్వాంస్డ్ ప్రాక్టీస్ పొందటమే ..డార్జిలింగ్ లో కొన్నిరోజులుండి  ఉపన్యాసాలిచ్చాడు .బ్రిటిష్ ఆఫీసర్లు రామాను విప్లవావాది గా  ఇండియాలోని బ్రిటిష్ ప్రభుత్వానికి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తాడనిభావించారు కాలిఫాన్గ్ కు వెళ్లి పదిరోజులుండి ‘’కుంగ్ ఫు ‘’నేర్చాడు .అక్కడి నుంచి సిక్కిం కు వెళ్ళాడు .అంతాకాలినడకనే అని మర్చిపోకండి .సిక్కిం లో దలైలామా దగ్గర బంధువు ఇంట్లో అతిధిగా ఉన్నాడు .సిక్కిం పొలిటికల్ ఆఫీసర్ రామా టిబెట్ లో శాంతికి  విఘాతం  కలిగిస్తాడేమోనని భయపడి ముందుకు పోవటానికి అనుమతించలేదు చాలా రోజులు ఆ ఆఫీసర్ తో తన గోడు చెప్పుకొన్నాడు ..కానీ రామా కాంగ్రెస్ పార్టీ గూఢచారి అని అనుకోని  ,అప్పుడాపార్టీ బ్రిటిష్ ప్రభుత్వం తో స్వాతంత్య్రం కోసం తీవ్రం గా పోరాడుతున్నందున అనుమతి నిరాకరించాడు . అప్పుడు కాంగ్రెస్ పార్టీలో అతివాద మితవాదులుండేవారు . గాంధీ  ఆయన అనుచరులు మితవాదులు .మిగిలినవారు అతివాదులు ..రామా ఈ రెండు గ్రూపుల వారితో సంబంధం ఏదీ లేదు .రామదగ్గర నెహ్రు రాసిన ,గాంధీరాసిన ఉత్తరాలను చూశాడు ఆఫీసర్ .అనుమానం మరింతబలీయమై రామానుప్రభుత్వ ఇన్స్పెక్షన్  బంగళా లో   హౌస్ అరెస్ట్ లో ఉంచాడు..అన్ని సౌకర్యాలు కలిగించారు కానీ రెండు నెలలు అక్కడే ఉండి పోవాల్సి వచ్చింది .ఎవరితోమాట్లాడటానికి ఎవరికీ ఉత్తరం రాయటానికి వీ లు లేదు . .ఒకరోజు ఆఫీసర్ ‘’నువ్వేమీ చేయలేదని నాకు తెలుసు ,కానీ నిన్ను రాజకీయ గూఢచారిగా అనుమానిస్తున్నాను .నాకు నీపై మంచి రిపోర్ట్ వచ్చేదాకా ఇక్కడినుంచి కదలటానికి వీల్లేదు ‘’అన్నాడు .ఒకగార్డ్ ఇరవైనాలుగు గంటల కాపలాఉన్నాడు .ఈ కాలం లోనే రామ టిబెటన్ భాష అధ్యయనం చేసి నేర్చుకొని వాళ్ళతో మాట్లాడే వీలు కలిపించుకొన్నాడు . .

 రెండు నెలలు హౌస్ అరెస్ట్ లో ఉన్నా ఎంతమందికి మొరపెట్టుకున్నా లాభం లేకపోయే సరికి రహస్యంగా పారిపోవాలని నిర్ణయించుకున్నాడు స్వామిరామా ..ఒక గార్డ్ ను మచ్చిక చేసుకొని పొడవైన తలా  ముఖం పైకూడా కప్పుకొనే  టిబెటన్ కోటు సంపాదించాడు .ఒక చలిరాత్రి గార్డ్ ఫుల్ గా మందుకొట్టి నిద్రపోతున్నసమయం లో రాత్రి 11 గంటలకు జులై 15 ఆకోటు తొడుక్కునితాను  ఢిల్లీ వె డుతున్నట్లు  ఒక ఉత్తరం రాసి టేబుల్ మీద ఉంచి చీకట్లో ఉడాయించాడు ..ఇదేమీ తప్పనిపించలేదు అంటాడురామ కారణం తనను అనవసరంగా ఏ కారణం లేకుండా నిర్బంధించటం న్యాయం కాదుకాబట్టి .మూడు రోజులు నడిచి చివరి చెక్ పోస్ట్ కు చేరాడు .అక్కడ సిక్కిం గూర్ఖా సైనికులు పహారా కాస్తున్నారు .రామాను ప్రశ్నించి ఆయన గురించి అడిగి తెలుసుకొన్నారు .తనకు నేపాలీ భాష వచ్చుకనుక ధారాళంగా ఆభాషలో మాట్లాడి ,వాళ్లకు తాను  నేపాలీ అనే అభిప్రాయం కలిగించటం తో వాళ్ళు సరిహద్దు దాటి టిబెట్ లోకి వెళ్ళటానికి  అనుమతించారు. గండం గడిచి పిండం బయట పడింది .

   టిబెట్ లో మరిన్ని  ఇక్కట్లు పడ్డాడు ..తానూ శాకాహారి .అక్కడ మాంసం తప్ప తినటానికి ఏమీ దొరకదు .టిబెట్ లో ఒక్క శాకాహారికూడా ఆయనకు కనిపించలేదు .టిబెట్ చాలా ఎత్తైన ప్రదేశంలో ఉండటం ఎప్పుడూ మంచు కురవటం తో అక్కడ జనం మాంసం చేపలు తింటేనే బతకగల పరిస్థితి .ఎక్కడో ఒకటీఆరా కాయగూరలు దొరికితే తినేవాడురామా . గుడ్లు కూడా తినాల్సి వచ్చేది .ఆహార మార్పువలన డయేరియాతో బాధపడ్డాడు .ఆరోగ్యం క్షీణించింది .కానీ ఇక్కడ కొన్ని సన్యాసా  శ్రమాలు  గుహలు దర్శించి తాను  వచ్చినపని నెరవేర్చుకొందామనుకొన్నాడు .

   రాత్రి వేళపడుకునేసమయం లో ప్రజలు రామా  దగ్గరున్న వస్తువులను దొంగిలించటానికి తనిఖీ చేసేవారు  . కానీ ఆయనదగ్గర కొన్ని పౌండ్ల బిస్కట్లు  కొద్దిగా పప్పు ,నీళ్ల సీసా  2 వేల  రూపాయలు మాత్రమే ఉండేవి .డబ్బును లోపలి దుస్తులలో జాగ్రత్తగా దాచేవాడు .కాళ్లబూట్లు ఎప్పుడూ ఎవరి ముందూ విప్పేవాడుకాదు . రోజుకు 15 మైళ్ళు నడిచి  లేకపోతె కంచరగాడిదపై ప్రయాణించేవాడు .తటస్థ పడిన మనుషులతోమనసుకు నచ్చక పోయినా  జ్యోతిషం ,జోస్యం చెబుతూ గడిపేవాడు . టిబెటన్లకు వీటిపై మహా గురి ..కనుక ఈయనపై నమ్మక గౌరవాలేర్పడి ఒక చోటునుంచి మరో చోటుకు వెళ్ళటానికి మ్యూల్స్ ను ఏర్పాటు చేసేవారు .దారిలో చాలాసార్లు అడవి ఎలుగు బంట్లు తారస పడేవి .టిబెటన్ గ్రామాలను కాపలాకాసే పెద్ద పెద్ద భూతియా కుక్కలు కనిపించేవి .ఈ సమస్యలు బాధిస్తున్నా రామాకు ప్రయాణం ఉత్సాహాన్ని ఇచ్చింది .హిమాలయ యోగుల మహత్యాలు తెలుసుకోవాలనే ఆరాటం పెరిగిందేకాని తగ్గలేదు ..వెనక్కి తిరిగి ఇండియాకు వెడితే బ్రిటిష్ ప్రభుత్వం తనను తప్పక అరెస్ట్ చేసి జైలు లో పెడుతుంది .కనుక పీచే మూడ్ కుదరదు ఆగే మూడ్ మాత్రమే తప్పనిసరి అనుకున్నాడు .

 ఎవరి సాయం గైడ్లు లేకుండా ఏ ప్రణాళికా లేకుండా హిమ పర్వత వాహినులు , హిమానీ నదాలు కనుమలు దాటుకొంటూ ముందుకు వెళ్ళాడు  దైవమే  తనకు రక్షా ఏడుగడ ..దారితప్పేవాడు దైవమె మళ్ళీ మార్గం చూపేవాడు .పగటి వేళా భయం అసలు ఉండేదే కాదు చావుభయం అసలే లేదు  .తన గుగ్గురువు ఆరోగ్యంగా ఉండాలనే కోరుకున్నాడు .ఆయన వద్ద కొంతకాలం తన గురువు చెప్పినట్లు ఉండాలన్నదే తపన .ఆయన ఇక్కడ ఒంటరి ప్రదేశం కనుక ఉన్నాడు .  యోగా  లో ఆధునిక పురోగమన పద్ధతులు నేర్చుకొనే ఆసక్తి ఉన్నవారికి నేర్పుతున్నాడు .హిమాలయ కుమయూన్ హిల్ యోగులైన హరికృష్ణ బాబా మొదలైన వారు ఆయనంటే విపరీతమైన ఆరాధన కలిగిఉన్నారని ఈయనను హిమాలయ శాశ్వత (ఎటర్నల్ )యోగి అని అందరూ భావిస్తారని తన గుగ్గురువు దగ్గరే యోగ శిక్షణ పొందాడని  తన గురువు బెంగాలీ బాబా ద్వారా  రామా తెలుసుకొన్నాడు  .ఈ కోరికే  రామాను ఇంతదూరం తెప్పించింది .

 విపరీతంమైన ప్రయాణం రెండునెలలు చేసి రామా లాసా చేరాడు అక్కడ ఒక కేథలిక్ ప్రీస్ట్ కలిశాడు .ఆయన తన చిన్న నివాసం లో రామాను ఉంచాడు .ఈఇద్దరుకాక మరో ఇద్దరు మిషనరీలు అందులో ఉన్నారు .ఈ ముగ్గురే లాసా లో ఉన్న కేథలిక్కులు .వీరికదలికలను టిబెటన్ ప్రభుత్వం జాగ్రత్తగా గమనిస్తుంది .అలసట తీరే దాకా వారితో పది రోజులున్నాడు .ఈలోగా సిక్కిం పొలిటికల్ ఆఫీసర్ కు రామా టిబెట్ లో ఉన్నట్లు తెలిసింది .రామా కేసును సి ఐ డి కి అప్పగించాడు ..

          సశేషం

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-7-17 -కాంప్-షార్లెట్ -అమెరికా


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

 భూమిపై మూలకాలకు అంతరిక్ష మార్పులకు సంబంధముందా !-3(చివరిభాగం )

 భూమిపై మూలకాలకు అంతరిక్ష మార్పులకు సంబంధముందా !-3(చివరిభాగం )

మొదటి హైడ్రోజెన్ బాంబ్ పరీక్షదక్షిణ ఫసిఫిక్ లోఎనీవేటోక్ లో 1-11-1952లో జరిగినప్పుడు  ఆల్బర్ట్ శాస్త్రవేత్త అక్కడి శిధిలాలను పరిశీలిస్తుంటే ఒక కొత్తమూలకం ను కనుక్కొని దానికి ‘’అయిన్ స్టీనియమ్ ‘’అని పేరుపెట్టారు ..ఫాస్ఫరస్ కు కాంతిమంట ఉండటం తో ఆ గ్రీక్ పేరు సార్ధకమైంది .ఇది వీనస్ గ్రహం అంటే శుక్రగ్రహానికి అనాదిగా ఉన్న పేరే .ఆ గ్రహం సూర్యోదయానికి ముందు ఆకాశం లో కనిపిస్తుంది . సెలీనియం మూలకం పేరు సెలెనా అనే గ్రీకు పదం నుండి వచ్చింది . గ్రీకు ల చంద్రునిపేరు సెలెనా ..దీనిఖనిజాలలో ఇది’’ టే ల్ల్యురియం ‘’అనే మరో మూలకం తో కలిసి లభిస్తుంది .లాటిన్ లో టెల్లస్ అంటే భూమి అని అర్ధం .

 1-1-1801 న ఇటాలియన్ ఆస్ట్రోనాట్ గిసెప్పె పియాజ్జి సూర్యుని చుట్టూ కుజ ,,గురు గ్రహాలమధ్య తిరుగుతున్న కొత్త గ్రహాన్ని కనిపెట్టి రోమన్ల సస్య దేవత ‘’సెరేస్    పేరుపెట్టారు ..సిరియల్ మూలం నుండి వచ్చిందే సేరేస్..ఈ సంఘటన తర్వాత కనిపెట్టబడిన మొదటి మూలకానికి ఈ ఉత్సాహం లో ‘’సెరియం ‘అని గౌరవంగా ఆ దేవత పేరే పెట్టారు ..రెండేళ్ల తర్వాత సూర్యుని చుట్టూ సె రెస్ లాగే తిరిగే మరో గ్రహాన్నికనిపెట్టి  విఙ్నానానికి అధిదేవత అయిన రోమన్ దేవత ‘’పొల్లాస్ ‘’పేరుమీదుగా పిలిచి దీనితర్వాత కనుగొనబడిన మూలకానికి ‘’పల్లాడియం  ‘’అని పిలిచారు ..ఆతర్వాత ఇలాంటివే అనేక బుల్లి బుల్లి గ్రహాలూకనిపెట్టారు .చివరికి తేలిందేమిటంటే సెరె స్    పొల్లాస్ లు గ్రహాలుకావు ఆస్టెరాయిడ్స్ అని ..ఇలాంటివన్నీ వందల వేల  సంఖ్యలో  ఆస్టెరాయిడ్ బెల్ట్ లో ఉన్నాయని గ్రహించారు .

  పాదరసం అంటే మెర్క్యురీ ద్రవ మూలకం పేరు గ్రహాలలో అత్యధిక వేగం గా తిరిగే మెర్క్యురీ అంటే బుధ గ్రాహం పేరుతో పిలిచారు .ఇది కూడా రోమన్ వార్తాహరుడైన దేవత పేరే .

 ధోరియం మూలకాన్ని గురుగ్రహం నుంచి మెరుపులు చిమ్మే స్కాండినేవియన్ మెరుపు దేవతపేరుతొ పిలిచారు.హబుల్ టెలిస్కోప్ జూపిటర్ యొక్క పోలార్ ప్రాంతం లో లెక్కలేనన్ని ఎలెక్ట్రిక్ చార్జెస్ ఉన్నట్లు గమనించింది . పాపం శనిదేవత పేర ఒక్క మూలకమూ లేదు .కానీ యురేనస్ ,నెప్ట్యూన్ ప్లూటో గ్రహాలపేర 1789 లో కనిపెట్టబడిన యురేనియం కు పెట్టారు యురేనియం ఐసోటోప్ లన్నీ అస్ధిరాలు .అవి యాదృచ్చికంగా (స్పాంటేనియస్ )శిధిలమై తేలిక మూలకాలుగా ఏర్పడతాయి .మొదటి పరమాణు బాంబులో యురేనియం నే ఉపయోగించి జపాన్ పట్టణాలైన హీరోషిమా ,నాగసాకిలపై అమెరికా6-8-1945 న  ప్రయోగించింది  .న్యూక్లియస్ లో 92 ప్రొటాన్లున్న యురేనియం ప్రకృతిలో విరివిగా లభించే రేడియో యాక్టివ్ మూలకం

 నెప్ట్యూన్ పేరిట1940 లోబెర్కెలీ సైక్లో ట్రాన్ లో  కనిపెట్టబడిన  నెప్త్యూనియం మూలకం పిలువబడింది  .జోసెఫ్ లీ వెర్రియర్ అనే ఫ్రెంచ్ గణిత వేత్త యురేనస్ వింత ప్రవృత్తిని అధ్యయనం చేస్తూ నెప్ట్యూన్ ను గుర్తించాడు .సౌర వ్యవస్థ (సోలార్ సిస్టమ్ )లో యురేనస్ తర్వాతే నెప్ట్యూన్ ఉంటుంది .భూమిపై పీరియాడిక్ టేబుల్ లో కూడా యురేనియం తర్వాత స్థానమే నెప్ట్యూనియం  ది .

  బెర్కిలీ సైక్లో ట్రాన్ చాలా మూలకాలను కనుక్కున్నది అందులో ప్లుటోనియం మూలకం నెప్త్యూనియం తర్వాత వస్తుంది . 1930 లో ఆరిజోనాలోని లోవెల్ అబ్సరేటరీ క్లైడ్ టామ్ బాగ్ ప్లూటో గ్రహాన్ని కనుక్కున్నాడు .దీనిపేరు ప్లుటోనియం కు పెట్టారు .ప్లూటో సైజ్ ను నిర్దుష్టంగా కొలవగలిగారు .ప్లూటో క్రమక్రమంగా తగ్గిపోతోంది .చల్లగా మంచుతో ఉండే ప్లూటో నవగ్రహాలలో అతి చిన్నది .ఇలా మూలకాలకూ ,అంతరిక్ష గ్రహాలకు సన్నిహిత సంబంధం ఉందని తెలుస్తోంది .

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -20-7-17 కాంప్-షార్లెట్-అమెరికా


Posted in సైన్స్ | Tagged | Leave a comment

(పరమ ) హంస ధామం

(పరమ ) హంస ధామం

 హిమాలయాలలో గంగోత్రిని మించిన మనోహరమైన ప్రదేశం కనిపించదు .అక్కడే హంసలు దర్శనమిస్తాయి అందుకే దానికి హంసధామం అనిపేరు . అక్కడే జితేంద్రియులైన మహా యోగులు దర్శనమిస్తారు .కనుక అది పరమహంస ధామం కూడా . మంచుతో కప్పబడిన హిమ శృంగాలు కను విందు చేస్తాయి .సుమారు 50 కి  పైగా యోగులు చిన్న చిన్న గుహలలో అక్కడ ఉంటారు .ప్రక్కనే గంగమ్మ తల్లి . అంతకంటే వారికి కావలసినదేముంది ఈ  యోగులు శీతాకాలం కూడా బట్టలు ధరించరు  కొందరైతే చలికాచుకోవటానికి అగ్ని కూడా రాజేయరు .స్వామిరామ ఇక్కడే మూడు శీతాకాలాలు ఒక చిన్నగుహలో గడిపాడు ..ఈగుహకు సుమారు అయిదువందల గజాల దూరం లో మరొక యోగి పుంగవుడు ఒక గుహలో ఉండేవాడు ..వీరిద్దరూ ఒకరికొకరు కనిపించినప్పుడు చూసుకోవటమే కానీ ఒకరికొకరు ఇబ్బందిపెట్టుకొనే వారు కాదు ఎవరి సాదన  ధ్యాన యోగాలు వారివే .ఇక్కడ ఉన్నకాలం తనజీవితం లో గొప్ప ఫలవంతమైనకాలంగా రామా భావించాడు .యోగాభ్యాసాలు చేస్తూ ఇంత గోధుమ ,పప్పు మాత్రమే ఆహారంగా జీవించాడు .ఈ రెంటినికలిపి  తడిపి ఉంచి రెండురోజులతర్వాత మొలకెత్తగానే కొద్దిగా ఉప్పుకలిపి వాటిని ఆహారంగా తినేవాడు..ఇంతకూ మించి వేరే ఏదీ తినేవాడుకాదు .

  రా మా గుహకు దగ్గరలోనే ‘’కృష్ణాశ్రమం ‘’అనే యోగి ఉండేవాడు .ఆయన పేరు భారత దేశమంతటా బాగా తెలుసు ..ఒక రోజు అర్ధరాత్రి 12 గంటలకు ఒక భయంకరమైన శబ్దం వినిపించింది .వందలాది బాంబులు పేలితే వచ్చే భయ0కర  శబ్దం అది ..అది ఆకస్మికంగా జారిపడిన  హిమ గండ శిలాపాతం (అవలాంచి).స్వామి రామా తనగుహలోంచి బయటికి వచ్చి ఏం జరిగిందోనని ఆతృతగా చూశాడు ..అది పౌర్ణమి రాత్రికావటం వలన  అవతలి ఒడ్డు న క్రష్ణా శ్రమ యోగి ఉండే గుహదగ్గరున్న గంగానది  మంచుతో కప్పబడి కనిపించింది. ఈ భారీ అవలాంచీ ని చూసి రామా మనసులో కృష్ణాశ్రమయోగి అందులో కప్పబడి ఉంటాడని అనుమానించాడు .పొడవైన టిబెటన్ కోటు ధరించి చేతి లో టార్చి లైట్ వెలుగుతో ఆయన గుహ వైపుకు వేగంగా అడుగులు వేశాడు .అక్కడ గంగ చిన్న ఇరుకు వాగులా ఉంటుంది ..దాన్ని దాటి ఆయన గుహవైపుకు వెడితే అది సురక్షితంగా ఉందని గ్రహించి  లోపల చిరునవ్వుతో కూర్చుని ఉన్న శ్రీ కృష్ణాశ్రమ యోగి కనిపించాడు .హమ్మయ్య అనుకొన్నాడు స్వామిరామా .

 ఆ గుహలోకి వెళ్లి ఆయనను పలకరించాడు .ఆయన మాట్లాడకండా చేతులు పైకెత్తి ‘’హం  హం  హం ‘’అన్నాడు .దగ్గరలో ఉన్న పలకపై ‘’ఏమీ కాలేదు ..నాకు ఏ అపకారము జరగదు .ఇక్కడ చాలా ఏళ్ళనుంచి ఉంటున్నాను .ఈ శబ్దాలు హిమ గండశిలలు  నన్ను భయ పెట్టలేవు ..నా గుహ సురక్షితం ‘’అని రాశాడు .ఆయనకే ప్రమాదం లేకుండా సురక్షితంగా ఉన్న సంగతి తెలుసుకొని భగవంతుని కృపకు అంజలి ఘటించి మళ్ళీ ఆ రాత్రివేళ తన గుహకు చేరుకొన్నాడురామా ..ఒక అతిపెద్ద దేవదారు వృక్షం పూర్తిగా కూలి మంచులో కప్పబడిపోయిందికాని అది ఆయనగుహనూ ఏమాత్రం తాకలేదని గ్రహించాడు .

  మధ్యాహ్న సమయాలలో తరచుగా కృష్ణాశ్రమ యోగి గుహకు వెళ్లి తనకున్న అనుమానాలను అడిగి ఆయననుండి సంతృప్తికరమైన సమాధానాలు పొందేవాడు రామ .. ఆయన మౌనంగా ఉండేవాడుకనుక సమాధానాలు పలకపై రాసేవాడు .ఆయన నేత్రాలు అగ్నిగోళాలుగా కాంతి నిచ్చేవి .ఆయన చర్మం ఏనుగు  చర్మ మంత దళసరిగా ఉండేది.  80 ఏళ్ళ వయసులోకూడా చాలా ఆరోగ్యంగా ఉన్నాడు   .గడ్డ కట్టే చలిలో ఊలు బట్టలు, నిప్పు లేకుండా ఎలా ఆయన జీవిస్తున్నాడో ఆశ్చర్యమేసింది .. గుహలో వస్తు సామగ్రికూడా ఏమీ లేదు  .గోముఖి దగ్గరుండే ఒక స్వామి రోజూ కొంత ఆహారం తెచ్చి ఇచ్చేవాడు .రోజుకు ఒకసారి మాత్రమే బంగాళాదుంపలు వేయించి తినేవాడు .కొద్దిగా రొట్టెముక్క తినేవాడు .ఈ ప్రాంత వాసులు ‘’గంగా తులసి ‘’అనే ఓషధి మొక్క ఆకులతో తయారు చేసే గ్రీన్ టీ నే తాగుతారు .స్వామిరామా కు ఇక్కడి యోగులు స్వాములు ఓషధులగురించి ప్రయోజనకర మొక్కల గురించి  వివరంగా తెలియజేశారు .వనౌషధ శాస్త్రంగురించీ రామా తో చర్చించారు .ఈ జితేంద్రియ యోగులు ఈ హంస ధామం వదిలి మైదానప్రాంతాలకు వెళ్ళటానికి అసలు ఇష్టపడరు .వీరిని దర్శించాలంటే  ఆసక్తి భక్తి ఉన్నవారు  అత్యున్నత ప్రాంతమైన ఈ ప్రదేశానికి రావాళిందే .బుద్ధి పై మనసు సాధించిన యోగులైన పరమహంసల దర్శనానికి ఈ హంస ధామమే శరణ్యం.

 మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -20-7-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

భూమిపై మూలకాలకు అంతరిక్ష మార్పులకు సంబంధముందా !-2

భూమిపై మూలకాలకు అంతరిక్ష మార్పులకు సంబంధముందా !-2

 భూమి క్రస్ట్ లో 10 శాతం అల్యూమిన0 ఉంది .కానీ మన పూర్వీకులకు దాని గురించి తెలియదు . 1827 లో దాన్ని కనిపెట్టేదాకామనకు తెలియదు ,1960 దాకా  అది మన ఇళ్లల్లోకి ప్రవేశించలేదు .అప్పటిదాకా టిన్ కాన్స్ ,టిన్ ఫాయిల్స్ వాడేవారు . ఇందులో అల్యూమినం  ఉంటుంది మెరుగు పెట్టబడిన అల్యూమినం  రిఫ్లెక్టర్ గా బాగా ఉపయోగపడుతుంది .ఇప్పుడు అన్ని టెలిస్కోప్ మిర్రర్ లకు దాన్ని కోటింగ్ కు వాడుతున్నారు . అల్యూమినమ్ కంటే 1. 7 రెట్లు సాంద్రత ఉన్న టైటానియం దానికంటే శక్తివంతమైనది భూ గర్భం లో ఎక్కువగా దొరికే తొమ్మిదవ మూలకం ..దీన్ని వాడటం గొప్ప ఫాషనయింది మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ లలో విరివిగా వాడుతున్నారు ..విశ్వం లో కార్బన్ కంటే ఆక్సిజన్ పరమాణువులు ఎక్కువ .కార్బన్ తోకలిసి కార్బన్ మోనాక్సయిడ్ కార్బన్ డయాక్సయిడ్ లను ఏర్పరచి ,మిగిలిన ఆక్సికన్ టైటానియం తో బంధాలు ఏర్పాటు చేసుకొంటుంది .రెడ్ స్టార్స్ ల స్పెక్ట్రమ్ లో టైటానియం ఆక్సయిడ్ కనిపిస్తుంది  మనం వాడే నీలం, కెంపు లలో టైటానియం ఆక్సయిడ్ ఉంది .టెలిస్కోప్ డోములకు వేసే వైట్ పెయింట్ లో టైటానిక్ ఆక్సయిడ్ ఉంటుంది  స్పెక్ట్రమ్ లోని ఇంఫ్రాఅర్ద్ భాగం లో ఎక్కువ పరావర్తనం చెందేది గా  కనిపిస్తుంది .టెలిస్కోప్ చుట్టూ ఉండే సూర్యకాంతిని తగ్గించటానికి ఉపయోగపడుతుంది .రాత్రి వేళలో టెలిస్కోప్ డోమ్ తెరచి ఉంటె టెలిస్కోప్ దగ్గరున్న గాలి ఉష్ణోగ్రత ,రాత్రి గాలి  ఉష్ణోగ్రతకు సమానమై ,నక్షత్రాలనుండి ,ఇతర గ్రహాంతర పదార్ధాలనుండి వచ్చే కాంతి స్పష్టంగా కనిపిస్తుంది . గ్రీక్ పురాణం లోని టైటాన్ అంటే శని గ్రహ0 చుట్టూ ఉండే పెద్ద చంద్రుడి   పేరే ఆమూలకానికి వచ్చింది ..

 విశ్వం లో ఇనుముకున్న గిరాకీ ఎక్కువే .పెద్ద నక్షత్రాలు తమ కొర్ లో హీలియం కార్బన్ ,ఆక్సిజన్ నైట్రోజెన్ మొదలైన వాటితోపాటు ఇనుము మూలకాన్నీ ఉత్పత్తి చేస్తాయి .న్యూక్లియస్ లో 26 ప్రోటాన్లు అన్నే న్యూట్రాన్లు కేంద్రం లో కలిగిఉన్న ఐరన్ ఎలిమెంట్ మిగిలినవాటికంటే ఒక విభిన్నమైన లక్షణం-ఏ న్యూక్లియర్ అణువు శక్తి మొత్తం కంటే   కనిష్ట శక్తి మొత్తం కలిగి ఉంటుంది .దీని భావం ఏమిటంటే -ఐరన్ పరమాణువును ఫుజన్  ద్వారా కలిపితే అవికూడా శక్తిని పీల్చేస్తాయి (అబ్సార్బ్ )..కానీ నక్షత్రాలు శక్తి నిర్మాణ0 చేస్తాయి .బృహత్తర తారలు ఇనుమును ఉత్పత్తి చేసికోర్ లో  కూడబెడితే వాటి చావు మూడిందన్నమాట . అధిక భారం వలన నక్షత్రం తనబరువుకు తానె కూలిపోతుంది .కానీ వెంటనే పుంజుకొని సూపర్ నోవా విస్ఫోట నానికి గురై ఒక బిలియన్ సూర్యుల కాంతితో ఒకవారం దివ్య జ్యోతిలా వెలుగుతుంది .

  తక్కువ  ద్రవీభవన  ఉష్ణోగ్రత  కల’’ గాలియం ‘’మూలకం ఆస్ట్రో ఫిజిస్ట్ లకు ఎందుకో రుచించలేదు కానీ సూర్యుని నుంచి న్యూట్రియాన్ లు గుర్తించే గాలియం క్లోరైడ్ బాగా ఉపయోగపడింది ..భూగర్భం లో చాలా ఎక్కువ మొత్తం లో లిక్విడ్ గాలియం క్లోరైడ్ ఉంది న్యూట్రియన్లు ,గాలియం న్యూక్లియస్ లు ఢీకొని ‘’జెర్మేనియం ‘’ను ఏర్పరుస్తాయి ..దీనివలన ఎక్స్ రే కాంతి మినుకు మంటుంది .

  టెక్నీషియ0 మూలకం రేడియో యాక్టివ్ ధర్మం కలది .ఇది భూమిమీద ఎక్కడా లభించదు .కావాలంటే పార్టికల్ ఆక్సిలరేటర్ లనుండి పొందవచ్చు .గ్రీకు మాట టెక్నీటోస్ అంటే కృత్రిమమైనది అనే అర్ధం తో దీనికి టెక్నీషియ0  అని పేరుపెట్టారు . ఇది రెడ్ స్టార్స్ ప్రాంతం లో ఎక్కడో కొద్దిగా ఉందని గమనించారు .దీని హాఫ్ లైఫ్ టైం కేవలం 2 మిలియన్ల సంవత్సరాలు .ఇది ఉన్న నక్షత్ర జీవితకాలం కంటే తక్కువ .మరోమాటగా చెప్పాలంటే ఇది లేకుండా ఏ నక్షత్రం పుట్టలేదు ,ఒక వేళా పుట్టివుంటే ఈపాటికి గిట్టి ఉండేది ..నక్షత్ర కొర్ నుంచి దీన్ని సంపాదించే సాధనం కనిపెట్టబడలేదు .

 ఆస్మియం ప్లాటినం ఇరీడియం మూలకాలు అతిభార మూలకాలు .ఇందులో ఇరీడియం చాలా ఎక్కువ ఉపయోగం లో ఉంది ఫాన్ ల తయారీలో  స్మోకింగ్ గన్  తయారీలో ఎక్కువ వాడకం లో ఉంది ..65 మిలియన్ సంవత్సరాలక్రిందటి  జియాలాజికల్ స్ట్రాటలోని క్రెటీషియస్ పాలజియన్ ప్రాంతం లో పలుచనిపొరగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నది .భూమిపై ఇరీడియం తక్కువగానే ఉన్నా ,ఆరుమైళ్ళ మెటాలిక్ ఆస్టెరాయిడ్స్ లో ఉండి ,భూమిని తాకి ఆవిరై ,దాని పరమాణువులను భూమిపై  అక్కడక్కడా వెదజల్లింది ..ఈ సమయం లోనేభూమిపై ఉన్న  డైనోజార్లు అంతరించిపోయాయి .అందుకే దీన్ని డైనోజార్ కిల్లర్ ఆస్టెరాయిడ్ అంటారు ..దీని ఎత్తు  ఎవరెస్టు శిఖరం అంత.

   సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -19-7-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

Inline image 1
Inline image 2
Posted in సైన్స్ | Tagged | Leave a comment

భూమిపై మూలకాలకు అంతరిక్ష మార్పులకు సంబంధముందా !

భూమిపై మూలకాలకు అంతరిక్ష మార్పులకు సంబంధముందా !

 ఉంది. ఇదేదో మోకాలికి బట్టతలకు ముడిపెట్టటం కాదు .. సహజ సిద్ధమైన మూడు మూలకాలుమాత్రమే బిగ్ బాంగ్ సమయం లో ఏర్పడ్డాయి .. న్యూక్లియస్ లో ఒకే ప్రోటాన్ ఉన్న హైడ్రోజెన్ అతితేలికైనా సాధారణ మూలకం ..ఇది బిగ్ బాంగ్ కాలం లో ఉత్పత్తి అయింది ..సహజ సిద్ధంగా లభించే 94 మూలకాలలో హైడ్రోజెన్ మానవ శరీరం లో ఉన్న మొత్తం పరమాణువులో  రెండు వంతులుంటుంది . విశ్వం ఉన్న పరమాణువుల(యాటమ్స్ )  సంఖ్యలో 90 శాతం కంటే ఎక్కువగా ఉంటుంది . .భారీదైన గురు గ్రహం (జూపిటర్ ) కు చెందిన హైడ్రోజెన్ అనేక ఒత్తిడిలకు లోనై ఒక వాయువుగా కాకుండా ,ఒక వాహక లోహం గా ప్రవర్తించి గ్రహాలమధ్య అతి శక్తివంతమైన అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరచింది . 1796 బ్రిటిష్ శాస్త్ర వేత్త హేన్రి కేవండిష్ నీటిపై పరిశోధన చేస్తూ హైడ్రోజెన్ ను కనుక్కొని దీనికి హైడ్రోజెన్ -అంటే ‘’నీటిని ఏర్పరచేది ‘’అని పేరుపెట్టారు ..ఆస్ట్రో ఫిజిస్ట్ లలో కేవండిష్ మొట్టమొదటిసారిగా న్యూటన్ చెప్పిన సమీకరణం లో బిగ్ జి (G)అంటే గురుత్వాకర్షణ విలువ ఖచ్చితంగా కనిపెట్టి దానితో  భూమి ద్రవ్యరాశి  యెంత ఉందో  లెక్కవేసి స్పష్టంగా చెప్పాడు . ప్రతి రోజులో ప్రతి సెకండ్ కాలం లో 4. 5బిలియన్ టన్నుల అతి వేగంగా చలించే హైడ్రోజెన్ కేంద్రాలు శక్తిగా పరివర్తన చెంది ,ఒకదానికొకటి బలం గా కొట్టుకోవటం వలన సూర్యుని కేంద్రం లో 15 మిలియన్ డిగ్రీల ఉష్ణోగ్రతలో’’ హీలియం ‘’గా మారుతుంది .

  హీలియం మూలకం తక్కువ సాంద్రత గల వాయువు .దాన్ని ఎక్కువగా పీలిస్తే గొంతులోని స్వర పేటికపై కంపనాలు కలిగించి మిక్కీ మౌస్ చేసే శబ్దాలను చేస్తుంది ..హైడ్రోజెన్ తర్వాత విశ్వం లోఎక్కువగా  కనిపించే రెండవసాధారణ మూలకం హీలియం .హైడ్రోజెన్ తర్వాత స్థానం లో ఉన్నా హీలియం ,విశ్వం లోని అన్ని మూలకాల మొత్తం లో హైడ్రోజెన్ కంటే నాలుగు రేట్లు ఉన్నమూలకం ..బిగ్ బాంగ్ అనుభవం వలన  విశ్వం లోని అన్నిటికంటే కనీసం 10 శాతమైనా హీలియం మూలకాలు .ఈ ఫైర్ బాల్ ఉత్పత్తి చేసిన దే మనవిశ్వం .నక్షత్రాలలో థర్మో  న్యూక్లియస్ ఫుజన్  వలన హీలియం ఏర్పడి విశ్వం లో కొన్ని భాగాల్లో 10 శాతంకంటే ఎక్కువగానే హీలియం కనిపిస్తుంది .ఏ గెలాక్సి ప్రాంతం లోను 10 శాతం కంటే హీలియం తక్కువగా ఉన్నట్లు గుర్తించలేదు ..భూమిపై దీనిని కనుగొనటానికి 30 ఏళ్ళ ముందు అంతరిక్ష యాత్రికులు సూర్యుని కరోనా  అంటే పై శిఖర భాగాన హీలియం ను 1868 సంపూర్ణ సూర్య గ్రహణం నాడు కనిపెట్టారు..గ్రీకు సూర్య దేవత హీలియోస్ పేరిట దీనికి హీలియం అని పేరుపెట్టారు .గాలిలో హైడ్రోజెన్  లో 92 శాతం తేలి ఉండే  గుణం ఉన్నహీలియం ,హైడ్రోజెన్ కున్న మండే స్వభావం లేకపోవటం విశేషం .అందుకే బెలూన్లు నింపటానికి హీలియం నే ఎక్కువగా వాడుతున్నారు .హీలియం ను ఎక్కువగా వాడేది వయోగించేదీ అమెరికా మిలిటరీ ఒక్కటే ..

విశ్వం లో  మూడవ సాధారణ మూలకం ’’ లిథియం ‘’  ..దీని న్యూక్లియస్ లో మూడు ప్రొటాన్లుంటాయి ..హైడ్రోజెన్ హీలియం వలెనే లిథియం కూడా బిగ్ బాంగ్ సృష్టి యే ..నక్షత్ర కొర్ బాగా రియాక్షన్లలో హీలియం ఉత్పత్తి అయితే దానికి విరుద్ధంగా ప్రతి న్యూక్లియర్ రియాక్షన్ లోనూ లిథియం నాశనమై పోతుంది విశ్వం లోని పరమాణువులో   లిథియం  ఏ ప్రాంతం లోనైనా 1 శాతం కంటే మించి ఉండదు .ఏ గెలాక్సిలో ఇంతకంటే ఎక్కువ శాతం లో లిథియం ఉన్నట్లు గుర్తించలేదు .బిగ్ బాంగ్ మాయా జాలం లో హీలియం పై స్థాయిలో ఉంటె లిథియం కింది స్థాయిలో ఉండటం ..

 నాల్గవ మూలకం కార్బన్ .అన్ని పదార్ధాల అణువుల(మాలిక్యూల్ ) మొత్తం కంటే కార్బన్ కనిపించే అణువుల సమాఖ్య ఎక్కువ .విశ్వం లో కార్బన్ చాలా ఎక్కువే .నక్షత్ర కొర్ భాగం లో అది మధించబడి గెలాక్సిలలోకి పంపబడుతుంది .కార్బన్ లేని ప్రపంచాన్ని ఊహించలేము .

 సిలికాన్ పీరియాడిక్ టేబుల్ లో కార్బన్ కిందే ఉంటుంది .అంటే కార్బన్ ఎలా అణువులను తయారు చేయగలుగుతుందో సిలికాన్ కూడా అలాగే చేయగలుగుతుంది అర్ధం ..అయితే విశ్వం లో సిలికాన్ కంటే కార్బన్ 10 రెట్లు ఎక్కువగా ఉండటమే దానికి కిరీటం పెట్టటానికి కారణం అయింది ..

ఆరవ మూలకం సోడియం .సోడియం లాంప్స్ బజారుకు వెలుగునిస్తాయి ఇప్పుడైతే L.E D హవా వచ్చిందికాని  ఇప్పుడు లో ప్రెజర్ సోడియం లాంప్ లో వచ్చాయి అంతకు ముందు అంతా సోడియం హవా నడిచింది  ఆహార పదార్ధాలలో రుచికోసం వాడే ఉప్పులో ఉన్నది సోడియయమేకదా .

      సశేషం

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-7-17-కాంప్-షార్లెట్-అమెరికా  .

Posted in సైన్స్ | Tagged | Leave a comment

 బ్లండరే బ్లండర్-4(చివరిభాగం ) 

బ్లండరే బ్లండర్-4(చివరిభాగం )

విశ్వ విస్తరణ గురించి హబుల్ తెలియజేశాక మరెవ్వరూ ఒమీగా విలువ 1 కి దగ్గరగా ఉండటం చూడలేదు . ఉన్న పరిశోధనా ఫలితాలలో వచ్చిన అత్యంత నిర్దుష్ట ఫలితం ఒమీగా విలువ 0. 3 కు అతి దగ్గరగా ఉంది . కనుక విశ్వం తెరచి అంటే ఓపెన్ గా ఉంది . 1979లో అమెరికా లో మాసా చుసెట్స్ ఇన్ ష్టి ట్యూట్ ఆఫ్ టెక్నలాజి ఫిజిసిస్ట్ అలాం హెచ్ గూత్ బృందం బిగ్ బాంగ్ ధీరీకి సవరణలు చేస్తూ సమస్యలను  అధిగమిస్తూ విశ్వం లో పదార్ధం ,శక్తి మనకున్నట్లుగానే సజావుగా ఉన్నట్లు గ్రహించారు దీనివలన ఒమీగా విలువ 1 కి దగ్గరాగా చేర్చబడింది కానీ అరకు కానీ 2 కు దగ్గరగాకాని లేక అంతకంటే పెద్ద సంఖ్య కు కానీ చేర్చలేదు  .  1దగ్గరకు మాత్రమే చేర్చింది . ఈ తర్జన భర్జనలు తర్వాత దృశ్యమాన పదార్ధం క్రిటికల్ డెన్సిటీకి 5 శాతం కంటే ఎక్కువ లేదు అని స్పష్టమైంది ..మరి డార్క్ మాటర్ మిస్టరీ ఏమిటి ?.ఎవరికీ అదేమిటో తెలియదు కానీ మొత్తం(టోటల్ ) లో మాత్రం దాని పాత్ర ఉంది దీనితర్వాత తేలిందేమిటంటే మనకు కనిపించే పదార్దానికి అయిదారు రెట్లు డార్క్ మాటర్ ఉంది .మళ్ళీ గందరగోళం అయినా ఓ లుక్కేసి ఉండాలి అన్నారు ధీరిస్ట్ లు .రెండు  శిబిరాలవారుడార్క్ ఎనర్జీ కనిపెట్టబడే దాకా  అవతలివారిదే తప్పు అనుకొంటున్నారు అన్నారుకూడా .ఈ ఒకే ఒక భాగం (కాంపోనెంట్ )ను సాధారణ పదార్దానికి  సాధారణ ఎనర్జీ కి కలిపితే విశ్వం యొక్క మాస్ ఎనర్జీ డెన్సిటీ క్రిటికల్ లెవెల్ దాకా పెరిగి0ది . ఇది పరిశీలకులకు ధీరీస్ట్ లకు సంతృప్తి నిచ్చింది . ఇద్దరూ కరెక్ట్ అనుకోని అభినందించుకున్నారు . ఎన్ని లెక్కలు వేసుకున్నా ఎన్ని కూడికలు చేసినా దేన్నీ కలిపినా అంతతరిక్షం లో అంతకంటే పదార్ధం ఏదీ అదనంగా లేదని తేల్చారు

  ఈ డార్క్ ఎనర్జీ అనేది క్వాంటం ప్రభావం  కావచ్చు  అంతరిక్ష శూన్యం ఒత్తి శూన్యంకాక కొన్ని కణాలు ,వాటి వ్యతిరేక కణాల సముదాయం .అవి నిరంతరం జతలుగా కలిసి విడిపోతూంటాయి కనుక వాటిని కొలిచే వీలు లేదు సూక్ష్మ విషయాలను చెప్పే క్వాంటం ఫిజిక్స్ దీన్ని తీవ్రంగానే అధ్యయనం చేయాలని భావించింది .వాస్తవిక కణాలు అంటే వర్చువల్ పార్టికల్స్ జంటలు కొంత అతితక్కువ బయటి పీడనాన్ని కలిగించి  మళ్ళీ అంతరిక్షం లోకి దూరిపోతాయి . దురదృష్ట వశాత్తు రిపల్సివ్ వాక్యూమ్ ప్రెజర్ మొత్తం 10 టు ది పవర్ ఆఫ్ 20 రెట్లు ప్రయోగశాలలో గుర్తించిన కాస్మ లాజికల్ కాన్ స్టెంట్ కంటే ఎక్కువ .ఇది దిమ్మతిరిగే ఫలితం కనుక మళ్లీ అనుమానం
    దీనిపై కీ లక సమాధానం ఏదీ కనిపించలేదు . అంతమాత్రాన నిరాశ కలగలేదు డార్క్ ఎనర్జీ ఒక చిన్న ముందడుగు . దీన్ని అయిన్ స్టీన్ సాధారణ సాపేక్ష సిద్ధాంత సమీకరణాలకు అను స0ధించాలి .అంటే ఆయన చెప్పిన కాస్మ లాజికల్ కాన్ స్టెంట్ లాంబ్డా మాత్రమే ఇప్పుడు శరణ్యమైంది . అంతరిక్షం లో గతం లో వర్తమానం లో భవిషత్తులో యెంత డార్క్ ఎనర్జీ వచ్చినా ,దాన్ని కొలవటానికి ,లెక్కించటానికి దాని ప్రభావం తెలుసుకోవటానికి అవకాశం దీనివలననేఅంటే లాంబ్డా వలననే  లభించింది
 కనుక నిస్సంకోచంగా మహా మేధావి చెప్పిన కాస్మ లాజికల్ కాన్ స్టెంట్ అంటే లాంబ్డా యే దిక్కైంది  పాపం ఆయన దీన్ని తన బ్లండర్ అని లెంపలేసుకొన్నాడు .కానీ ఆయన చెప్పిందే నూటికి వెయ్యిశాతం కరెక్ట్ .కనుక అప్పటి బ్లండరే ఇప్పుడు బ్లండర్ అయింది .అందరికి ఊపిరి తీసుకొనే అవకాశాన్నిచ్చింది .దార్శనికుడు అయిన్ స్టీన్ మేధస్సు బహు చురుకైనది అని మళ్ళీ రుజువైంది . ఏతావాతా తేలిందేమిటి అంటే డార్క్ ఎనర్జీ అనేది విశ్వ0 లో మూల లక్షణమైన ఆస్తి అన్నమాట.
  సమాప్తం
  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-7-17-కాంప్-షార్లెట్-అమెరికా


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

 బ్లండరే బ్లండర్ -3

బ్లండరే బ్లండర్ -3

పెల్మట్టర్ ,స్కి మిడిస్ట్ శాస్త్ర వేత్త ల సూపర్ నోవాలు న్యూక్లియై ఫ్యూజన్ లో విలువైనవి .. కొన్ని హద్దులలో ఆ నక్షత్రాల   విస్ఫోటనం ఒకే మాదిరిగా ఉంది .అంతే శక్తి జనకాలను వినియోగించుకొని ,,అంతే టైటానిక్ ఎనర్జీ ని ,అదే సమయం లో విడుదల  చేసి అంతే తీవ్ర ప్రకాశనం పొందాయి .. కనుక ఇవివిస్ఫోటనం చెంది దూరంగా వెళ్ళిపోయిన గెలాక్సిల  కాస్మిక్ దూరాలను కొలవటానికి  కొలబద్దలుగాలేక స్టాండర్డ్ కాండిల్స్ గా  ఉపయోగ పడ్డాయి  .సూపర్ నోవా అన్నిటిలో ఒకేరకమైన వాట్తెజి ఉండి  తక్కువ కాంతికలవి దూరం గా ఎక్కువ కాంతికలవి దగ్గరగా ఉంటాయి .వాటి కాంతిని గణన చేస్తే అవి మనకు యెంత దూరం లో ఉన్నాయో  ఒకదానికొకటి యెంత దూరం లో ఉన్నాయో ఖచ్చితం గా చెప్పచ్చు  సూపర్ నో వాల ప్రకాశం *ల్యూమినాసిటి )వేర్వేరుగా ఉండట మ్ వలన ఇదొక్కటే దూరాలను కొలవటానికి కొలమానంగా తీసుకో కూడదు .

 అంతాబాగానే ఉంది .గెలాక్సిల దూర గణనకు మరో విధానం ఉంది .అదే-మిల్కీ వే నుంచి వాటి తిరోగమనం లేక మాంద్యం (రిసెషన్ ).ఇదే కాస్మిక్ విస్తరణకు ప్రాతిపదిక .హుబుల్ శాస్త్ర వేత్త గమనించినదాన్ని బట్టి విస్తరిస్తున్న విశ్వం దూరపు వస్తువులు మన నుంచి దూరం జరిగే  పందెం (రేస్ )లో దగ్గరున్న వాటికంటే వేగంగా జరిగిపోతాయి . కనుక ఒక గెలాక్షీ మాంద్య వేగాన్ని లెక్కించేటప్పుడు గెలాక్షీ దూరం కూడా కొలిచే వీలుంటుంది ..
  ఈ రెండు ముఖ్య విధానాలలో ఒకే వస్తువు కు విభిన్న దూరాలు వస్తాయి కనుక ఇందులో ఏదో  తప్పు ఉందని గమనించాలి .సూపర్ నోవాలు నిర్దుష్ట కాండిల్స్ కాకపోవచ్చు .లేక కాస్మిక్ విస్తరణ రేటు ను గెలాక్షీ వేగం ఆధారం గా కొలవటం తప్పు కావచ్చు . దీనిని బట్టి విశ్వం మనం ఊహించిన దానికంటే వేగంగా విస్తరించి గెలాక్సిలను వాటి మాంద్య  వేగానికంటే దూరంగా వాటిని ఉంచింది అని తెలుస్తోంది .కనుక అదనపు విస్తరణ ను వ్యాఖ్యానించటానికి అయిన్ స్టీన్ చెప్పిన కాస్మ లాజికల్ కాన్ స్టెంట్ -లాంబ్డా ఉపయోగించకుండా చెప్పటం అసాధ్యం .
  ఇక్కడే ఒక ప్రత్యక్ష సాక్షం దొరికింది మాంద్య  శక్తి గురుత్వాకర్షణ ను ఎదిరించి సర్వ్తత్రా  వ్యాపించి0ది  (పేర్మియేట్ ) .అందుకే లాంబ్డా అవసరమైంది .ఇప్పుడు లాంబ్డా ఒక భౌతిక సత్యమైంది దీనికి ఒక పేరుపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది .కనుక విశ్వ నాట్యం లో కృష్ణ శక్తి అంటే డార్క్ ఎనర్జీ ఒక ముఖ్య కేంద్ర పాత్ర పోషించింది .శాస్త్ర వేత్తలు పారల్ మట్టర్ ,స్కిమిడ్స్ ,రీస్ లు ముగ్గురూ 2011 నోబెల్ ప్రయిజ్  ”డార్క్ మాటర్ ”కనుగొన్నందుకు   పొందారు.
  డార్క్ ఎనర్జీ గణనానికి ఖచ్చితమైన లెక్క దొరికింది విశ్వం లో ఉన్న 68 శాతం మాస్ ఎనర్జీ లో డార్క్ మాటర్ (కృష్ణ పదార్ధం )27 శాతం ఉంటె సాధారణ పదార్ధం కేవలం 5 శాతం మాత్రమే ఉంది .మన నాలుగు తరాల (ఫోర్ డైమెన్షనల్ )విశ్వం -విశ్వం లోనిపదార్ధం శక్తి మొత్తానికి , విశ్వం విస్తరిస్తున్న వేగానికి ,సంబంధం కలిగి ఉంది దీని గణనకు ఒక చక్కని గుర్తు” ఒమీ గాఅనే గ్రీకు అక్షరాన్ని  ”  రూపొందించారు. విశ్వ పదార్ధ శక్తి సాంద్రత  ను విశ్వ వ్యాప్తిని నిరోధించటానికి కావలసిన కనీస పదార్ధ శక్తి సాంద్రత(క్రిటికల్ డెన్సిటీ ) తో భాగిస్తే వచ్చే దే ” ఒమీగా ”
  ద్రవ్యరాశి ,శక్తి స్పీడ్ టైంవక్రత (కర్ప్ ) కు కారణమైతే ఒమీగా విశ్వం యొక్క ఆకారాన్ని  తెలియ జేస్తుంది .ఒమేగా విలువ 1 కంటే తక్కువైతే  ద్రవ్యరాశి శక్తి  క్రిటికల్ విలువకంటే తక్కువ గా ఉండి ,విశ్వం అనంతంగా అన్ని వైపులకు ,అన్నికాలాల్లో వ్యాప్తి చెంది ,ఒక గుర్రపు జీను ఆకారం పొంది ,అక్కడ సమాంతరరేఖలు వికేంద్రీకరణ చెందుతాయి ..ఒమీగా విలువ 1 అయితే విశ్వం నిరవధికంగా అరుదుగా వ్యాప్తి చెంది ,విశ్వం సమతలంగా మారి మనం సమాంతర రేఖల విషయం లో నార్చుకున్న  జామెట్రీ సూత్రాలన్నీ రుజువౌతాయి .  . ఒక వేళా ఒమీ గా విలువ 1 కంటే ఎక్కువైతే  సమాంతర రేఖలు కేంద్రీకరింపబడి ,విశ్వం మళ్లీ  తన పూర్వపు వక్రత పొంది ,ఏ అగ్ని గోళం నుండి తాను  ఆవిర్భవిచిందో ,మళ్ళీ దానిలోకి పతనం (కొలాప్స్ )చెందుతుంది .
   సశేషం
   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-7-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

Inline image 1
Inline image 2
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 380- సంస్కృత వీర బ్రహ్మేంద్ర సుప్రభాత కర్త -కొండవీటి వెంకటకవి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

–380- సంస్కృత వీర బ్రహ్మేంద్ర సుప్రభాత కర్త –కొండవీటి వెంకటకవి (1918 – 1991) ప్రసిద్ధ కవి, హేతువాది చలనచిత్ర సంభాషణ రచయిత. వీరి అసలు పేరు కొండవీటి వెంకటయ్య. వీరు గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా విప్పర్ల గ్రామంలో జన్మించారు. వీరు నారాయణ, శేషమ్మ దంపతులకు జనవరి 251918సంవత్సరంలో జన్మించారు. ఈయన ప్రాథమిక విద్యాభ్యాసము తండ్రివద్ద జరిగింది. ఆ తరువాత నరికొండ నమ్మాళరాజు వద్ద సంస్కృత కావ్య పఠనము, దువ్వూరి వేంకటరమణశాస్త్రి వద్ద ఉన్నత విద్య గడించాడు. 1936లో కిసాన్ కాంగ్రేసుకు సహాయకార్యదర్శిగా పనిచేశాడు. 1946 నుండి 1952 వరకు వెంకటకవి జిల్లా బోర్డు ఉన్నతపాఠశాలలో తెలుగు పండితునిగా పనిచేశాడు. బాబా లను విమర్శిస్తూ ఉపన్యాసాలిచ్చారు. ఈనాడు,లో అనేక వ్యాసాలు రాశారు.

1932లో కర్షకులమీద, 1946లో చెన్నకేశవ శతకం రచించారు. తరువాత కాలంలో త్రిశతి పేరుతో బుద్ధుడు, వేమన, గాంధీలను గురించి మూడు శతకాలు రచించారు. 1942లో హితబోధ, 1944లో ఉదయలక్ష్మీ నృసింహ తారావళి రచించారు. 1984 ప్రాంతంలో బ్రహ్మంగారి మఠానికి ఆస్థాన కవిగా ఉన్నారు. మఠాధ్యక్షుల ఆదేశానుసారం శ్రీవీరబ్రహ్మేంద్ర సుప్రభాతం సంస్కృతంలో రచించారు.

నందమూరి తారకరామారావు వీరిని 1977లో పిలిపించి దానవీరశూరకర్ణ చిత్రానికి సంభాషణలు రాయించారు. తరువాత శ్రీమద్విరాటపర్వంశ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర చిత్రాలకు కూడా సంభాషణలు సమకూర్చారు.
ఆంధ్ర విశ్వకళా పరిషత్తు వీరిని ‘కళా ప్రపూర్ణ‘ పురస్కారంతో గౌరవించింది. 1953 జనవరిలో కవిరాజు అనే బిరుదును కూడా పొందాడు. ప్రసిద్ధ కార్టూనిస్టు శ్రీధర్ ఈయన గురించి సోక్రటీసులాగా తన ప్రపంచంతప్ప మరోటి తెలియని వారు, అతి సామాన్యుడిగా కనిపించే అసాధారణ తాత్వికుడు, వేదాంతి అన్నారు. కవులైనవారు మానవులందర్నీ ఏకం చేసేలా, వారిని సంఘటితపరచి వారిలో సౌభ్రాతృత్వం పెరిగేలా చేయాలి. ప్రజల్ని విడదీసేలా రచనలు చేయకూడదు… అంటూ ఆయన విభజనతత్వాన్ని ఆనాడే ఖండించారు. 1944-45లో శరభయ్యగుప్త హైస్కూల్లో తెలుగు పండితునిగా ఉద్యోగం ప్రారంభించారు. 1946 నుంచి 1952 వరకు మాచర్లలో జిల్లా బోర్డు ఉన్నత పాఠశాలలో తెలుగు పండితులుగా ఉన్నారు. 1952 జులై నుంచి పొన్నూరు శ్రీ భావనారాయణస్వామి సంస్కృత కళాశాలలో ఆంధ్రోపన్యాసకులుగా పనిచేశారు.

వీరు ఏప్రిల్ 71991 సంవత్సరం పరమపదించారు.

పెళ్ళికాక పూర్వం అచల మతంలో దిగంబరిగా వూళ్ళు తిరిగాడు. 1945 ప్రాంతాల్లో కమ్యూనిస్టులు ఒక్కొక్క బాబాగురించి వివరాలు తెప్పించి, వాస్తవాలే సన్మాన పత్రంగా సమర్పించారట. ఏ బాబా ఎలాంటి వాడు, ఆయన పూర్వాపరాలు ఏమిటి లాంటివి. వసుచరిత్ర అవలీలగా పాడి వినిపించేవాడు. భట్టుమూర్తి అంటే ఆయనకు విపరీత ప్రేమాభిమానం. వెంకటకవికి ఇంగ్లీషు రాదు. అష్టావధానాలు చేశాడు. భువన విజయాలలో పాల్గొన్నాడు. లౌకిక వివాహాలు చేయించాడు; అంటే మంత్రాలు లేకుండా, త్రిపురనేని రామస్వామి రాసిన పెళ్ళి సూత్రాలు చదివించి, వివాహాలు జరిపించడం. ఇలా ఆవుల మంజులత గారి పెళ్ళి, హైదరాబాదు ఎగ్జిబిషన్ మైదానంలో జరిపించారు. ఆయన పురోహితుడు. ఇన్నయ్య తోటి పురోహితుడు.

కొండవీటి వెంకటకవి హాస్యప్రియుడు. తన షష్ఠి పూర్తి రాబోతున్నదనీ, తానేమంతగా ఆశించడం లేదనీ, ఎందుకైనా మంచిదని ముందుగా చెబుతున్నాననేవాడు. తనకు పెద్దగా కోరికలు లేవనీ, ఏనుగుపై వూరేగించి, కాలుకు గండ పెండేరం (రత్నాలు బంగారం అయితే సరేసరి, లేకుంటే చత్తతోడా (గడ్డితో చేసిన కడియం) అయినా సరే అనేవాడు.

వెంకటకవి కృతులు

  1. కర్షకా! (1932)
  2. హితబోధ (1942)
  3. భాగవతులవారి వంశావళి (1943)
  4. ఉదయలక్ష్మీ నృసింహతారావళి (1945)
  5. చెన్నకేశవా! (1946)
  6. భావనారాయణ చరిత్ర (గద్యకావ్యము) (1953)
  7. దివ్యస్మృతులు (1954)
  8. నెహ్రూ చరిత్ర – ప్రథమ భాగము (1956)
  9. త్రిశతి (1960)
  10. నెహ్రూ చరిత్ర – ద్వితీయ భాగము (1962)
  11. బలి (1963)

సశేషం

   మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -18-7-17 -కాంప్-షార్లెట్-అమెరికా
ఓ కవీ, వేదాంతీ, కొండవీటి వేంకటకవిమట్టినీ, మనిషినీ ప్రేమించినవారే గొప్ప సృజనాత్మక శక్తితో రాణించగలుగుతారు. సత్తెనపల్లి వీధుల్లో రెండు లక్షల అశేష జనవాహిని మధ్య కవితా బ్రహ్మోత్సవం జరిగిన సందర్భం ఒక్కటి చాలు ఆయన సాధించిన విజయమేమిటో తెలుసుకోవడానికి. అదే భారతం. అందరూ అవే మాటలు రాశారు. కానీ నిర్మాణపరంగా లోపాలున్నా ఆయన రాసిన ‘దాన వీర శూరకర్ణ’ చిత్ర సంభాషణలకు అశేష ఆంధ్రావని బ్రహ్మరథం పట్టింది. శ్రీమద్విరాట్‌పర్వం, శ్రీమద్విరాట్‌ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర, తాండ్ర పాపారాయుడు, ఏకలవ్య, విశ్వనాథనాయకుడు, వీరాంజనేయ తదితర సంభాషణల రచయితగా 1983 నుంచీ కీర్తిశేషులయ్యేంత వరకు ‘ఈనాడు’లో రాసిన ‘పరదేశి పాఠాలు’ రచయితగా, అనేక కావ్యాలందించిన కవిగా తెలుగు సాహిత్యాన్ని పరిపుష్ఠం చేశారు. తెలుగు సమాజాన్ని సంస్కరించే దిశగా ఎంతో దూరం నడిచారు. ఎంతోమందిని చైతన్యవంతం చేశారు. ఆ వైతాళికుడే కొండవీటి వేంకటకవి. ప్రసిద్ధ కార్టూనిస్టు శ్రీధర్‌ మాటల్లో చెప్పాలంటే సోక్రటీసులాగా తన ప్రపంచంతప్ప మరోటి తెలియని వారు, అతి సామాన్యుడిగా కనిపించే అసాధారణ తాత్వికుడు, వేదాంతి. ఎద్దులు బండియున్‌ గలిగి యెన్నియొ గేదెలు గాదెలుండినం జద్దికి జాలదయ్యె వ్యవసాయమొనర్చిన నొండు వృత్తి మీ వద్దకు జేరదయ్యె గనుపట్టును దీనికి ముఖ్య కారణం బెద్దియటన్న పాలకుల హీనపుబుద్ధియ సుమ్ముకర్షకా దశాబ్దాలనాడు కవిరాజు చెప్పినది నేటికీ వర్తిస్తుంది… పాలకులే ప్రజల నొసటి రాతలు రాస్తున్నారు. మిరపకు ధర పలుకుతోందని మిరప పైరువేస్తే పంట చేతికి రాగానే దాని ధర తగ్గిపోతుంది. ఒకటా రెండా… ఎన్నో దశాబ్దాలుగా అన్ని పంటల స్థితీ ఇలాగే ఉంది. కొండవీటి వేంకట కవి చెప్పిన మాట పొల్లుపోకుండా నేటికీ వర్తిస్తోంది… ఆయన కవుల బాధ్యతను కూడా స్పష్టం చేశారు. ”కవులై దేశహితమ్ముగోరుచు మహాగ్రంథంబులన్‌ సర్వ మానవ సౌభ్రాతృత బెంపునింపవలె దానంగల్గు మోక్షమ్ము మూర్ఖవిధిన్‌ ద్వేషపు బీజ సంతతుల గూర్పన్‌ లాభమే చెన్నకేశవ మాచెర్ల పురాంతరాలయ నివాసా పాహిమాం పాహిమాం…
కవులైనవారు మానవులందర్నీ ఏకం చేసేలా, వారిని సంఘటితపరచి వారిలో సౌభ్రాతృత్వం పెరిగేలా చేయాలి. ప్రజల్ని విడదీసేలా రచనలు చేయకూడదు… అంటూ ఆయన విభజనతత్వాన్ని ఆనాడే ఖండించారు. ఆచార్య తూమాటి దొణప్ప కొండవీటి వేంకటకవి గురించి ఇలా రాశారు- ”సహృదయాహ్లాదనముగా, సంస్కార ప్రతిపాదనముగా, సమాజ ప్రబోధ సాధనముగా నిర్దిష్టమైన లక్ష్యముతో నిర్దుష్టమయిన సాధన సామాగ్రితో సాహితీ సమారాధనమును సాగించిన సత్కవులు చాల అరుదు. ”ఉత్పాదకా నబహవః కవయః శరభా ఇవ” అన్న బాణోక్తి మేరకు సుకవులు అల్ప సంఖ్యాకులు. ప్రతిభావ్యుత్పత్యభ్యాసములు గల కవులు ద్వాతకులు. ఈ కోటిలో పరాంకోటికెక్కిన మేటి కవి మన కొండవీటి వేంకటకవి…” నిజమే… పద్యం రాసినా గద్యం రాసినా కొండవీటి వేంకటకవి శైలే వేరు. ఆశ్చర్యమేమిటంటే అంతటి ప్రౌఢకవి, కర్షక కవి గురించి తెలుగు సాహిత్యంలో అందుబాటులో ఉన్న జీవితచరిత్రల్లో ఆయనమీద ఒక్క వ్యాసమైనా అందుబాటులో లేకపోవడం. ”ప్రతిభామూర్తులు”, ”తెలుగు పెద్దలు”… ”మహనీయులు”, ”సారస్వతమూర్తులు”… ఇలా అందుబాటులో ఉన్న అనేక వ్యాస సంకలనాల్లో ఆయన గురించి ఒక్క వ్యాసమైనా లేకపోవడం ఈ రంగంలో కృషి చేసిన వారి పక్షపాత వైఖరికి నిదర్శనమనిపిస్తుంది.
నందమూరి తారకరామారావు అనుబంధంతో, ఈనాడు అనుబంధంతో కొండవీటి వేంకటకవి సృష్టించిన ఆలోచనలు, తార్కికత, ప్రాచీన కావ్యాల్ని కొత్తకోణం నుంచి వివేచన చేసే విమర్శనాత్మక దృష్టి ఆయన్ని నిత్య చైతన్య కవిగా మలచిందనడంలో అతిశయోక్తి లేదు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా విప్పర్ల గ్రామంలో శేషమ్మ, నారాయణయ్య దంపతులకు 1918 జనవరి 25న జన్మించారు కొండవీటి వేంకటకవి. తండ్రి వద్దే తెలుగు కావ్యాలు చదివారు. మరోవైపు స్వాతంత్య్ర పోరాటాల్లో పాల్గొంటున్న మహామహుల్ని చూశారు. వారి జీవన విధానంలో భాగమైన సామాజిక సేవను అవగతం చేసుకొన్నారు. సంస్కరణభావాల్ని ఒంట పట్టించుకొన్నారు. సరికొండ నమ్మాళరాజులు వద్ద సంస్కృతం నేర్చుకుని కావ్యాలు అభ్యసించారు. దువ్వూరి వెంకటరమణ శాస్త్రుల వద్ద ఉన్నత విద్య అభ్యసించారు. మహాత్మాగాంధీకి జై అంటూ స్వాతంత్య్రోద్యమంలో ఉరికారు. ప్రజల్లోకి వెళ్లారు. ప్రజల్ని సంఘటితం చేశారు. పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నారు. అందుకే 1936లో జిల్లా కిసాన్‌ కాంగ్రెస్‌ సహాయ కార్యదర్శి పదవి చేపట్టారు. ఒకవైపు రాజకీయాలు, మరోవైపు కావ్యరచన, వృత్తి ధర్మమైన విద్యా బోధన… మూడు రంగాల్లోనూ ఆయన రాణించారు.
1944-45లో శరభయ్యగుప్త హైస్కూల్లో తెలుగు పండితునిగా ఉద్యోగం ప్రారంభించారు. 1946 నుంచి 1952 వరకు మాచర్లలో జిల్లా బోర్డు ఉన్నత పాఠశాలలో తెలుగు పండితులుగా ఉన్నారు. 1952 జులై నుంచి పొన్నూరు శ్రీ భావనారాయణస్వామి సంస్కృత కళాశాలలో ఆంధ్రోపన్యాసకులుగా పనిచేశారు. అక్కడ ఆయన బోధించింది సంస్కృత వ్యాకరణం. పదవీ విరమణ తర్వాత హైదరాబాద్‌లో ‘ఈనాడు’ ప్రత్యేక అనుబంధంతో వెలలేని ఆణిముత్యాల వంటి అనేక వ్యాసాలనందించారు. 1953 జనవరిలోనే కవిరాజు బిరుదం పొందిన కొండవీటి వేంకటకవి పలు గ్రంథాల్ని రాశారు. ”పంచీకరణ భాష్యము” వంటి ఆదిశంకరుల రచనలు సైతం అందరికీ అర్థమయ్యేలా అనువదించారు. 1932లో ఆయన ”కర్షకా” అనే నూటొక్క పద్యాల కృతి అందించారు. అప్పుడు ఆయన వయస్సు పధ్నాలుగేళ్లు మాత్రమే. అయినా పండితుల ప్రశంసలందుకొనేలా ఆ కావ్యం రాశారు. ఆ తర్వాత పదేళ్లకి ”హితబోధ” అందించారు. ”భాగవతులవారి వంశావళి గ్రంథాన్ని 1943లో రాశారు. ”ఉదయలక్ష్మి నృసింహ తారావళి” గ్రంథాన్ని 1945లో రాశారు. వీటి తర్వాత కొండవీటి వేంకటకవికి గొప్ప పేరు తెచ్చిన కావ్యం ”చెన్న కేశవ శతకము”. ”చెన్నకేశవ మాచర్లె పురాంతరాలయ నివాసాపాహిమాం పాహిమాం” అన్న మకుటంతో సాగే ఈ కావ్యంలో వేంకట కవి భాషా పటిమ ప్రతి పద్యంలోనూ కనిపిస్తుంది. ఈ కావ్యం తర్వాత ”భావ నారాయణ చరిత్ర” అనే గద్య కావ్యం రాశారు. 1954లో రాసిన ”దివ్య స్మృతులు” ఆయనకు మళ్లీ గొప్ప పేరు తెచ్చింది. యుగకర్తలైన వేమన, వీర గురుడు సిద్ధప్ప, తరిగొండ వేంకమాంబ, అలరాజు కృష్ణదేవరాయలు, గుంటూరు మస్తానయ్య, మూర్తికవి నాగార్జునుడు, చిన్నయసూరి, వీరేశలింగం, గురజాడ అప్పారావు, త్రిపురనేని, కట్టమంచి, ఏటుకూరి వెంకట నరసయ్య, తిరుపతి వేంకటకవులు, పొట్టి శ్రీరాములు… వంటివారి మీద స్మృతి చిహ్నాలైన ఖండ కావ్యాలు రాశారు. తర్వాత ”త్రిశతి” పేరుతో వేమన శతకంలాంటి శతకం రాశారు. నెహ్రూ చరిత్రను ప్రథమ, ద్వితీయ, తృతీయ ఖండాలుగా మూడు సంపుటాల మనోహర కావ్యం రాశారు. దీన్ని పి.వి.నరసింహారావు హిందీలోకి అనువదించడం విశేషం. రాజర్షి, బలి, మేలుకొలుపు, శ్రీకృష్ణ వ్యాసావళి వంటి కావ్యాల తర్వాత ”పంచీకరణ భాష్యము” రాశారు. ఆయన పలికితే పద్యం, పిలిస్తే పద్యం… అంతగా ఆయనకి పద్యంపై పట్టు ఉండేది. ప్రాచీన సాహిత్యాన్ని మధించి రసాస్వాదన చేసిన కొండవీటి వేంకటకవి కవిరాజుగా, కళాప్రపూర్ణగా పండితుల, సామాన్య పాఠకుల మన్ననలు పొందారు. కొండవీడు అన్న పేరు వింటేనే కదలి ఆశువుగా గలగలా పద్యం చెప్పగల ఆయన…
”ప్రోలయ వేమన ప్రోదిచేసిన నేల
వామనభట్టు దైవాఱుతావు
కాటయ వేమన్న కత్తిపట్టిన చోటు
కొమర గిరీంద్రుండు కుదురు నెలవు
అనవేమసార్వభౌముని విహారస్థలి
శ్రీనాధుసు కవి కాలూను వసతి
శంభుదాసుడు పదాబ్జములు మోపిన యిక్క యోగి వేమన నిల్చు త్యాగభూమి
… ఇటువంటి కొండవీటి సీమ నుంచి ప్రభవించిన వేంకటకవి 1991 ఏప్రిల్‌ ఏడో తేదీ పరమపదించారు. గురుపీఠాన్ని అలంకరించి వేదాంతోపదేశికులయ్యారు. కవిగా, వ్యాఖ్యాతగా, దేశికునిగా భాష్యకారుడిగా, వేదాంతిగా ఆయన అఖండకీర్తిని పొందారు. అనంత భావదీప్తితో ప్రకాశించారు. సామాజిక న్యాయం కోసం పోరాడిన యోధుడాయన. ఒక సంస్కర్త… సాహితీ, సాంస్కృతిక, సామాజిక రంగాల్లో ఒక ఎవరెస్టు శిఖరం.

– చీకోలు సుందరయ్య

Kondaveeti Venkatakavi

కొండవీటి వెంకటకవి
(1918-1991)


Inline image 1

కొండవీటి వెంకటకవి
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

 బ్లండరే  బ్లండర్ -2

బ్లండరే  బ్లండర్ -2

అయిన్ స్టెయిన్ చెప్పిన సాధారణ సాపేక్ష సిద్ధాంతం అంతకు ముందున్న  గురుత్వాకర్షణ  సిద్ధాంతాన్ని దాటి చాలా ముందుకు దూసుకు వెళ్ళింది .న్యూటన్ ఆలోచనా పరిధిని దాటి సాధారణ సాపేక్ష సిద్ధాంతం, ఇతర ద్రవ్యరాశి లేక శక్తి క్షేత్ర గురుత్వాకర్షణ అంతరిక్ష కాల స్థానిక వక్రత ద్రవ్యరాశి కి సమాధానమై నిలిచింది ..ఇంకొంచెం అర్ధమయ్యేట్లు చెప్పాలంటే -ద్రవ్యరాశి కేంద్రీకరణ వక్రీకరణ కు దారి తీసి అంతరిక్ష- కాల నేత (ఫాబ్రిక్ )లో సొట్టలు -డింపుల్స్ ఏర్పడుతాయి  .ఈ వక్రీకరణలు కదిలే ద్రవ్యరాశులకు మార్గ దర్శనం చేసి సరళ రేఖా మార్గ ”జియో డెసిక్స్ ”కు అంటే వక్రత ఉన్న పథం అంటే కక్ష్యలుగా మారుస్తాయి .ఇక్కడ జియో డేసిక్స్ అంటే విస్తరించిన వక్రతాతలంపై రెండు బిందువులమధ్య ఉన్న అతి తక్కువ దూరం .ఇది నాలుగు తరాల స్పేస్  -టైం నేతలో ఉన్న రెండు బిందువులమధ్య ఉన్న కనిష్ట దూరం గా అర్ధం చేసుకోవాలి . .దీనిపై అమెరికా దేశ దీరిటికల్  ఫిజిసిస్ట్ జాన్ ఆర్చిబాల్డ్ వీలర్ ”పదార్ధం  స్పేస్ కు ఎలా వంగాలోచెబితే స్పెస్ ద్రవ్యరాశి  ,ఎలా కదలాలో చెబుతుందన్నమాట ”అని వివరించాడు .

  సాధారణ సాపేక్ష సిద్ధాంతం రెండురకాల గురుత్వాకర్షణలను చెప్పింది .ఒకటి మనందరకు  తెలిసిందే  -భూమ్యాకర్షణ శక్తి .రెండవది స్పేస్ -టైం కల్పించే   రహస్యమైన (మిస్టీరియస్ ) యాంటీ గ్రావిటీ ప్రెజర్   .ఐన్స్టీన్ కానీ ఇతర సైన్టిస్ట్ లు కానీ గట్టిగా నమ్మిన లాంబ్డా అనేది పూర్తి యదార్ధమే ..విశ్వం యొక్క మార్పు లేని స్థితి అంటే అస్థిర చలనం లేని విశ్వమే .కానీ ఒక భౌతిక వస్తువు అస్థిర స్థితిలో ఉండటం శాస్త్ర పద్ధతిని (క్రెడో ) ను ఉల్లంఘించటమే అవుతుంది . ఒక్క విశ్వం విషయం లోనే విశ్వమంతా ఎప్పటికప్పుడు సమతుల్యంలో  ఉంటుందని ప్రత్యేకించి చెప్పలేం ..ఇంతకు ముందుశాస్త్ర చరిత్రలో  యెవరూ చూడని కొలవని కనీసం ఊహించని కొత్త విషయం ఇది .ఇదే ఇప్పుడు ఉదాహరణ గా దృష్టాంతంగా మారి పోయి సవాలు విసిరింది ..
  13 ఏళ్ళ తర్వాత 1929 లో అమెరికన్ ఆస్ట్రో ఫిజిస్ట్ ఎడ్విన్ . పి . హబుల్ విశ్వం స్థిరంగా(స్టాటిక్ ) లేదని కనిపెట్టాడు. దీనికి తగిన  సాక్ష్యా ధారాలు చూపించాడు ..గెలాక్షీ దూరమైన కొద్దీ ,అది వేగవంతంగా  మిల్కీ వే(పాలపుంత )  నుంచి వెనక్కి తగ్గుతుంది (రిసీడ్స్ ) .మరోరకంగా చెప్పాలంటే విశ్వం వ్యాకోచిస్తోంది అన్నమాట ..మరిప్పుడు కాస్మ లాజికల్  కాన్ స్టెంట్ కలిగించిన ఇబ్బంది వలన ప్రకృతి శక్తులలో అప్పటివరకు కని పెట్టబడనిదేదీ విశ్వ విస్తరణను ఆపగలిగేది లేదని అర్ధమై మహా మేధావి అయిన్ స్టీన్ తన ”లాంబ్డా ”ను పూర్తిగా తొలగించేసి ”నా జీవితం లో చేసిన అతి గొప్ప బ్లండర్ ఇది ”అని లెంపలు వాయించుకొన్నాడు.   తాను చెప్పిన సమీకరణం లో మార్పు చేసి లాంబ్డా విలువ సున్నా -జీరో గా భావించాడు .ఉదాహరణకు a= b +c అనేది అన్ని విషయాలలోనూ సరిపోతుంది కానీ c కి సున్నా విలువ ఉంటె మాత్రం అందులో  c ఉండాల్సిన అవసరం లేదని ఏమాత్రం లెక్కలొచ్చినవాడికైనా తెలుసు అదే అయిన్ స్టీన్ చేసింది.  అందుకే కాశ్మలాజికల్ కాన్  స్టెంట్ కు జీరో విలువ ఇచ్చాడు . తాను పూర్తిగా పొరబాటు పడ్డానని తాను   చేసింది బ్లండర్ అని పశ్చాస్తాపపడ్డాడు  ఆ మేధావి శాస్త్ర వేత్త . ఇది ఇంతటితో ఆగిపోతే ,కథ కంచికి పొతే  ఆయన గొప్పతనం ఏముంది ?
   ఆతర్వాత దశాబ్దాల కాలాల లో  సైన్టిస్ట్ లు ఐన్స్టీన్ పాతర వేసి గోరీ కట్టిన లాంబ్డా ను బయటికి తీయి కాశ్మలాజికల్ కాన్ స్టెంట్ ఉంటె తమ భావాలు ఎలా ఉంటాయి అని ఆలోచించటం ప్రారంభించారు . 69 ఏళ్లతర్వాత 1998 లో సైన్స్ లాంబ్డాను చివరి సారిగా త్రవ్వి తీసి బయట పెట్టింది ఆ ఏడాది ప్రారంభం లో మూడు  ఆస్ట్రో ఫిజిస్ట్ ల బృందాలు ఒకటి కాలి  ఫోర్నియాలోని బెర్కిలీ లో ఉండే బెర్కిలీ నేషనల్ లేబొరేటరీ లోని సాల్ పెరల్ మట్టర్ ,మరొకటి ఆస్ట్రేలియాకలో కాన్ బెర్రా కు చెందిన మౌంట్ స్ట్రోమ్లో అండ్ స్దడింగ్ స్ప్రింగ్స్ అబ్జార్వేటరీకి  చెందిన బ్రియాన్ స్కిమిడ్స్  మేరీ లాండ్ లోని బాల్టిమోర్ జాన్ హాప్కిన్స్ యుని వర్సిటీ కి చెందిన ఆడం రైసెస్ బృందాలు డజన్ల కొద్దీ సూ పర్ నోవాలను  భావించినదానికంటే తక్కువ కాంతితో అంటే డిమ్  గా ఉన్నట్లు గుర్తించారు . నక్షత్ర విస్ఫోటనాలు చూశారు .ఈ సూపర్ నోవాలు తమ సమీప సోదర నోవాలకంటే భిన్నంగా ప్రవర్తించి పదిహేను శాతం ఎక్కువ దూరం లో ఉన్నట్లు గమనించారు .ఈ సహజ స్థితికి ముఖ్యకారణం ఐన్ స్టీన్ చెప్పిన లాంబ్డా అంటే కాశ్మలాజికల్ కాన్ స్టెంట్ మాత్రమే కారణం అని అర్ధం చేసుకొన్నారు .ఇప్పుడు సైన్టిస్ట్ లే లెంపలేసుకొని దుమ్ము కొట్టుకు పోయిన ఆ మేధావి చెప్పిన లాంబ్డా కు జీవ ప్రతిష్ఠ చేసి అయిన్ స్టీన్ చెప్పిన సాధారణ సాపేక్ష సమీకరణం  లో ఉంచి ఆ సమీకరణం అన్నిటికీ   సమాధాన0  చెప్పింది అని నిరూపించారు  . కథ ఇంతటితోనూ ఆగలేదు .ఇంకా ముందుకు జరిగింది ఆ విషయాలు తర్వాత తెలుసుకొందాం .
  సశేషం
   మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ -17-7-17-కాంప్-షార్లెట్ -అమెరికా
  Inline image 1


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బ్లండరే  బ్లండర్ 

బ్లండరే  బ్లండర్

ప్రఖ్యాత ఆస్ట్రో ఫిజిస్ట్ ఆల్బర్ట్ అయిన్ స్టీన్ 20 వ శతాబ్ది సైన్స్ గతి మార్చేశాడని అందరికి తెలిసిన విషయమే ఆయన ప్రయోగ శాలలో గడిపిన కాలం ప్రయోగాలు చేసిన కాలం చాలా చాలా తక్కువే .చెప్పిన సిద్ధాంతాన్ని రుజువు చేసిందీ లేదు  ఆయన ఒక థియరిస్ట్ మాత్రమే ఆయన మెదడే ఆయన ప్రయోగ శాల . ఆయనది ”థాట్  ఎక్స్పెరిమెంట్ ”పధ్ధతి .విషయాలను,ఊహలను  ఆలోచనబద్ధంగా విశ్లేషించి చెప్పటం అన్నమాట .జర్మనీలో రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు ప్రయోగ శాలా ప్రయోగాలకంటే బుద్ధి సూక్ష్మ ప్రయోగాలే ఎక్కువ ..జ్యు రిస్ట్  సైన్టిస్ట్ లు అరుదుగా ప్రయోగాలు చేసేవారు . అయిన్ స్టీన్ బుద్ధి బలం తో ఆలోచించి ఒక సిద్ధాంతం చెప్పేవాడు .అది నిజామాకాదా అని శాస్త్రజ్ఞులు పరిశోధన చేసి నిజమే అని రుజువు చేసేవారు .మన దార్శనికులైన మహర్షులు చెప్పినట్లు” విజ్ఞాన మహర్షి ”అయిన్ స్టీన్ చెప్పేవాడు అదీ ఆయన ప్రత్యేకత ..ఆయన చెప్పిన జనరల్ ధీరీ ఆఫ్ రిలేటివిటీ కూడా ఇలా వచ్చిందే ఆయన చెప్పాకే పరిశోధనలో ఆయన చెప్పింది సత్యమని రుజువు చేసి చెప్పారు . 1916 లో విశ్వం లో ప్రతిదీ గ్రావిటీ ఆధారంగా కదులుతుంది అని చెప్పాడు .సైన్టిస్ట్ లు బుర్రలు బద్దలుకొట్టుకొని లాబ్ లో మోడల్స్ తయారు చేసి రుజువు చేసి ఎస్ బాస్ అన్నారు .  ..ఇలాంటిదే మరో గొప్ప విషయం గురించి ఇప్పుడు తెలుసుకొందాం 1926 లో ఆయన ప్రవచించిన గ్రావిటేషనల్ తరంగాల నిర్ధారణ కోసం ఒక ప్రత్యేక అబ్జర్వేటరీ  తయారు చేశారు . ఈ తరంగాలు అలలలాగా కాంతి వేగం తో స్పీడ్ టైంఅనే వస్త్రం లో అత్య0త తీవ్ర గ్రావిటేషనల్ డిస్టర్బన్స్స్ అంటే కల్లోలాలవల్ల  అంటే రెండు బ్లాక్ హొల్స్ అంటే కృష్ణ బిలాల  ఘర్షణ వలన ఉత్పన్నమౌతాయని ఆయన ఊహించి చెప్పింది నిజమేనని రుజువు చేశారు

   మనకు 1. 3 బిలియన్ కాంతి సంవత్సరాల దూరం లో ఉన్న గెలాక్షీ లోని బ్లాక్ హొల్స్ ,భూమిపై అప్పటికి ఇంకా ఏకకణ జీవరాశిమాత్రమే వృద్ధి చెందుతున్నకాలం లో ఢీకొనటం  వలన గ్రావిటేషనల్ తరంగాలు ఏర్పడ్డాయి .ఆ అలలు అంతరిక్షం లో అన్ని వైపులకు కదులుతూ ,ఇంకా 8 మిలియన్ల సంవత్సరాలకు భూమి సంక్లిష్ట జీవాన్ని ఏర్పరచే కాలానికిఅంటే పుష్పాలు , డైనోసార్లు ,ఎగిరే పక్షులు క్షీరదాలు అంటే పాలిచ్చే జంతువులూ  ఏర్పడినప్పుడు ఈ తరంగాలు  ఏర్పడ్డాయి ఈ జీవరాశిని ప్రాధమిక జీవరాశి అంటాం ..వీటిలోంచి క్రమ పరిణామం జరిగి మాట్లాడే హోమో సేపియన్  లు వచ్చి వ్యవసాయం నాగరికత కల జీవులేర్పడ్డారు ..ఇదంతా చివరి 10 వేల  సంవత్సరాల క్రమ పరిణామ ఫలితమే. చివరికి 20 వ శతాబ్ది సైన్టిస్ట్ లు సాపేక్ష సిద్ధాంతాన్ని ఊహించి సిద్ధాంతపరచి గ్రావిటేషనల్ వేవ్స్ ఉన్నాయని చెప్పారు .వందేళ్ళతర్వాత టెక్నలాజి పెరిగి ఈ తరంగాలున్నాయని రుజువు చేసి ఆ ఊహకు నిజరూపం గా  తెలుసుకొన్నారు  .ఈ తరంగాలు గత 1. 3 బిలియన్ సంవత్సరాలనుండి భూమిని ఉతికి పారేస్తుంటే ఇప్పుడు మనం గుర్తించగలిగాం .అవును నిజంగాఅందరు అనుకున్నట్లు  అయిన్ స్టీన్ ఒక  చెడ్డ  గాడిదే -బాడ్ యాస్  .
   16 వ శతాబ్దపు వాడైన గణిత శాస్త్ర వేత్త  కోపర్నికస్ సూర్యు ని  చుట్టూ గ్రహాలూ క్రమ కక్ష్యా మార్గాలలో  తిరుగుతాయని మొదటి సారిగా చెప్పాడు  ..వర్తులాకార కక్ష్య కాదని దీర్ఘ వరుల అంటే ఎలిప్టికల్ ఆర్బిట్ అని తర్వాత తెలిసింది .ఇందులో కోపర్నికస్ చెప్పిన మూల విషయం పూర్తిగా సత్యమే అని రుజువైంది .ఇంతకంటే ఖచ్చితంగా చెప్పటానికి ఎక్కువ కాలం పట్టింది అంతే . అలాగే అయిన్ స్టీన్ సిద్ధాంతాలు కూడా కాలక్రమేణా రుజువై నిజమై ఆయన దార్ననికతకు జొహార్లుగా నిలిచాయి . 1931 లో వచ్చిన ”వన్ హండ్రెడ్ ఆధర్శ్ ఎగైనెస్ట్ అయిన్ స్టీన్ ”అనే పుస్తకం లో రచయిత ఒక గొప్ప సత్యాన్ని చెప్పాడు .-”నిజంగా అయిన్ స్టీన్ తప్పు చెప్పి ఉంటె వందమంది ఎందుకు ఒక్కడు చాలుకదా ”అన్నాడు .భావం ఐన్ స్టీన్ ను తప్పు పట్టె సాహసం వద్దు అని ..క్రమం గా సైన్స్ చరిత్రలో సరసమైన  బ్లండర్స్ ఎన్నో చోటు చేసుకొన్నాయి .
  గ్రావిటీ సిద్ధాంతాలలో ని సమీకరణాలలో అయిన్ స్టీన్ ”కాస్మ లాజికల్  కాన్ స్టెంట్”అనే పదాన్ని చెప్పి, దానికి గ్రీకు భాషలోని ”లాంబ్డా ”గుర్తును ఉపయోగించాడు .దీనివలన విశ్వ స్థిరత్వాన్ని తెలియ జెప్పాడన్నమాట .. అప్పటిదాకా మన విశ్వం క్రమంగా వ్యాప్తి చెందటం తప్ప ఇంకేపనీ  చేయదని  విశ్వ సించేవారు ..ఆ పైన ఊహించటం అసాధ్యం అనుకొనే వారు .కనుకలాంబ్డా ముఖ్యమైన పని అయిన్ స్టీన్ మోడల్ లో గ్రావిటీ ని వ్యతిరేకించటమే నని అందువలన విశ్వం సమతుల్యం లో ఉందని ,గ్రావిటీకి ఉన్న సహజమైన ఆకర్షణవలన విశ్వమంతా ఒక పెద్ద ద్రవ్యరాశిలోకి చేర్చబడింది అని భావించారు  .ఈ సందర్భం లోనే అయిన్ స్టీన్ ”విశ్వం వ్యాప్తి చెందదు ,సంకోచమూ చెందదు ”అని దార్శనికత  తో స్పష్టంగా చెప్పాడు
  దీనిపై రష్యా భౌతిక శాస్త్ర వేత్త అలెక్సాఅండర్ ఫ్రీడ్ మన్ కొంతపరిశోధన చేసి అయిన్ స్టీన్ చెప్పిన విశ్వం సమతుల్యం లో ఉన్నప్పటికీ అది అస్థిరంగా ఉంటుందని గణిత శాస్త్ర ఈక్వేషన్లద్వారా తెలియ జేశాడు ..ఒక శిఖరాగ్రాన కొనపైఉన్న బంతి ఏమాత్రం ఒడిదుడుకు వచ్చినా జారీ ఏదో ఒక ప్రక్కకు ఒరిగి పడిపోయినట్లులేక పెన్సిల్ ముక్కుమీద ఏ చిన్న పదార్ధం పెట్టినా అస్థిరంగా ఉన్నట్లు విశ్వం ఉంది అంటాడు . కనుక అయిన్ స్టీన్ విశ్వం వ్యాప్తికి ,పతనానికి మధ్య డోలాందో దోళనలో ఉందని  భావించాడు .  .అయిన్ స్టీన్ చెప్పింది కొత్తసిద్ధాంతం ,దానికేదో పేరు పెట్టినంత మాత్రాన అది సత్యం కానేరదు అనీ దబాయించాడు .కానీ  -లాంబ్డా అనేది ప్రకృతిలో ఉన్న నెగటివ్ గ్రావిటేషనల్ ఫోర్స్  అనీ  భౌతిక ప్రపంచం లో దీనికి సంబంధిన మరొక సమాన హోదాగల దేదీ(కౌంటర్ పార్ట్  ) లేదని  అయిన్ స్టీన్ కి బాగా తెలుసు .
   సశేషం
    మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -17-7-17- కాంప్-షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

“కెమోటాలజి పిత” కోలాచల సీతారామయ్య – రచన గబ్బిట దుర్గాప్రసాద్ -సమీక్ష -అరసి -విహంగ పత్రిక

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వీక్లీ అమెరికా-16 -2(10-7-17 నుండి 16-7-17 వరకు ) మరో రుద్రాభిషేకం వారం -2

వీక్లీ అమెరికా-16 -2(10-7-17 నుండి 16-7-17 వరకు )

మరో రుద్రాభిషేకం వారం -2
12-7-17 బుధవారం టివి 5 దర్శకుడు విశ్వనాధ్ కు గురుపౌర్ణమినాడు చేసిన  గురుపూజోత్సవం ”గురు బ్రహ్మ ”చూసాం దాని అధిపతి నాయుడుగారు చాలా భక్తి శ్రద్ధలతో కార్యక్రమ0 నిర్వహించారు అందరూ చెప్పులు ,బూట్లు బయటే వదిలి లోపలి వచ్చి కూర్చున్నారంటే ఎంత నిబద్ధత పాటించారో అర్ధమౌతుంది ప్రముఖగాయకుడు గంగాధర్” లంగరే”శాడు అంటే యాంకరింగ్ చేశాడు .సుస్పష్టమైన శబ్దోచ్చారణతో అపరఘంటసాల అని పించే గానమాధుర్యంతో నిర్వహించిన తీరు ముచ్చటగా ఉంది  కళాతపస్వి విశ్వనాధ్ తోపాటు శ్రీ కందాడై రామా చార్యులు ,సంగీత దర్శకుడు  ఆర్ పి పట్నాయక్ ,నటి నృత్య కళాకారిణి మంజు భార్గవి ,కవి సిరివెన్నెల   అన్నమయ్యపేమ్ భారవి ,సినీ పాటలరచయిత రామ జోగేశ్వరరావు వగైరాలు పాల్గొన్నారు మంజు, మంజుల నాట్యం కను విందు చేసింది . సిరివెన్నెల మాటల సిరి వెన్నెల కురిపిస్తే పట్నాయక్ పాట  కచేరీలా మాట్లాడితే కందాళై గురు పరమార్ధమ్ బోధిస్తే, భారవి విశ్వనాధుని కీర్తి స్తవం చేసి కార్యక్రమ రక్తి కట్టిస్తే విశ్వనాధ్ తనదైన వినమ్ర శైలిలో కృతజ్ఞతలు తెలిపారు సిరివెన్నెల చెప్పిన విషయం ఒకటి అందరు గుర్తించాలి .ఎందరెందరికో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు  లభించింది .ఆ సందర్భం గా ఒకటో రెండో అభినందన సభలు జరిగాయి కానీ విశ్వనాధ్ ను ఆ అవార్డు వరిస్తే ,2 నెలల నుంచి రోజూ ఎక్కడో అక్కడ సభ, సమావేశం, అభినందన చందనం జరుగుతూనే ఉన్నాయి భారత దేశ చలన చిత్ర చరిత్రలో ఇంతటి వేడుక ఎవ్వరికీ  జరగ లేదు ఒక్క విశ్వనాధ్ కే  ఆ అరుదైన గౌరవం దక్కింది కారణం ఆయన సినిమా ప్రతి ఇంటి సినిమా ఆయన ప్రతి ఇంటికీ చెందిన వాడవటం అందులో భారతీయ సంస్కృతీ ప్రతిఫలించటం ఆకధల్లో తెలుగుదనం ఉట్టిపడటం ,హృదయపు లోతుల్లోకి ఆయన పాట  మాట నృత్యం దూసుకుపోయి తిష్టవేయటమే ఇంత అభిమానాన్ని సంపాదించి ఆయనకు ఆంధ్రాజనులు గు0డె లో గుడి కట్టుకున్నారు .”విశ్వనాధ కళా కాశీ నాధుని ”ప్రతిష్టించి పూజ సలిపారు ”అన్నాడు .హృదయపు లోతుల్లోంచి వచ్చిన మాటలవి .గంగాధర శాస్త్రి విశ్వనాధ్ మరొక సినిమా తీయాలని ప్రొద్యూసార్లు రెడీ గా ఉన్నారని అన్నాడు కానీ నా ఉద్దేశ్యం లో విశ్వనాధ్ ఇక సినిమా తీయరాదు .ఉన్న కీర్తి అనుభవిస్తూ ఆనందించాలి క్రియేటివిటీ ఎప్పుడూ ఉండదు .ఒక్కోసారి ఒట్టిపోతుంది .దానిలో నుంచి ఎంతపిండినా సారం రాదు  ఆయన వయసూ ఇక సహకరించదుకనుక ఆయనపై ఒత్తిడి తేరాదు .
  టివి 5 వారు ;;హిందూ ధర్మం ”అనే కొత్త ఛానల్ ను ప్రారంభిస్తు న్నారట  దానికి పాట  సిరివెన్నెల రాయాలని ,పట్నాయక్ స్వర కల్పన  చేయాలని నాయుడుగారుకోరగా వేదిక మీదే  సిరివెన్నెల పల్లవి రాసి వినిపించి అందరి కరతాళ ధ్వనులు అందుకొన్నాడు  .నేత్రపర్వంగా జరిగిన ఈకార్యక్రమంలో విశ్వనాధ్  దట్టమైన తెల్ల గడ్డం,  మీసం తోకూచిపూడి సిద్ధేంద్ర యోగి ముఖవర్ఛస్సుతో వెలిగి పోయాడు  అని పించింది . టివి 5 కు అభినందన చందనం ..
   గురువారం రాత్రి యు ట్యూబ్ లో కేరక్టర్ నటి అన్నపూర్ణ ఇంటర్వ్యూ చూసాం ఆమె నవ్వులో మాటలో ఎంతో స్వచ్ఛత  గుబాళించింది . సినీ అమ్మ లుగా శాంతకుమారి ,నిర్మలమ్మ ,అంజలీదేవి సూర్యకాంతం లతర్వాత ఆతల్లి పాత్రకు మరింత వన్నె తెచ్చింది  అన్నపూర్ణ . తనను తానూ తీర్చి దిద్దుకొన్నది . తానూ ఏ వేషానికి పనికొస్తానో  అర్ధం చేసుకొని అందులోనే శిఖరాయమానంగా నిలిచింది .స్వర్గం నరకం సినిమాలో హీరోయిన్ గా ఉన్న ఆమె ఆతర్వాత హీరోయిన్ వేషాలకు వెంపరలాడ లేదు .. వేషాలకోసం ప్రాకులాలేదు ఆమెను వెతుక్కొని వచ్చాయి వేషాలు .సార్ధక నటి అన్నపూర్ణ  .
  14-శుక్రవారం మధ్యాహ్నం హాస్య నటుడు రావికొండలరావు ఇంటర్వ్యూ చూసాం .. క్రేన్స్ చలన చిత్రోత్సవం లో ప్రముఖ దర్శకుడు సత్యజిత్ రే ”ఏ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందో ఎవరూ ఊహించి చెప్పలేరు ”అని చెప్పినమాట పరమ ప్రామాణ్యం అంటాడు రావి .డబ్బు నిలువ చేసుకోలేక  హాస్య నటుడు కస్తూరి శివరావు   మహా నటుడు  నాగయ్య ,అత్యుత్తమ విలన్ రాజనాల వంటి వారు జీవితం చివరి దశలో అత్యంత దీన స్థితిలో గడిపిన వైనాన్ని గుర్తుకు తెచ్చాడు కస్తూరి రాజనాల వ్యసనాలకు బానిసలై ఉన్నదంతా పోగొట్ట్టుకొన్నారు .ఆనాడే ఏ హీరోకూడా తీసుకోనంత అత్యధిక పారితోషికం లక్ష రూపాయలు తీసుకొన్న నాగయ్యగారు డబ్బు అజమాయిషీలేక చివరికి ఆయన నటించిన ”బీదల పాట్లు ”లాగా గడిపారన్నాడు  .నాగయ్య గారి ఆనాటి లక్ష ఈ నాటి లెక్కల్లో 15 కోట్లు ఉంటుంది అని అక్కినేని ఎప్పుడూ చెప్పేవాడని అన్నాడు .
    ప్రముఖ హా స్యనటుడు పుణ్యమూర్తుల రాజ బాబు తమ్ముళ్లు చిట్టిబాబు ,అనంత్ లు తామూ అన్నకు తక్కువ ఏమీ కాదని నిరూపించారు .  .ఇండస్ట్రీ తమను బాగా ఆదరించిందని తమకేమీ లోపం లేదని ధీమాగాచెప్పారు .చిట్టిబాబు ఇంటర్వ్యూలో రాజబాబు ఎన్టీ రామారావు తో సమానంగా ఆయనకు 30 వెలిస్తే తానూ 30 వేలు ఆయనకు లక్ష ఇస్తే డిమాండ్ చేసి తానూ లక్షా పారితోషికం తీసుకొన్న దమ్మున్న హాస్య నటుడు అన్నాడు . ఆయన చేయని పుణ్యకార్యాలు లేవని ఏం జి రామ చంద్రన్ లాగా రిక్షావాలాకు చెప్పులు డ్రస్సులు కొనిపెట్టిన ఉదారహృదయయుడని ,ఆయన పుట్టిన రోజు మద్రాస్ లో మూడు రోజులు ఘనంగా జరుపుకొని దేశం లోని కళాకారులందర్నీ పిలిపించి ప్రయాణపు ఖర్చు లాడ్జింగ్ బోర్డింగ్ లన్నీ పెట్టుకొని నాటకాలు బుర్రకథలు వగైరా చెప్పించి తగిన పారితోషికం ఇచ్చి పంపేవాడని అన్నాడు ..అక్కినేని  నందమూరి  వగైరా  అగ్రనటులనేకాక అందర్నీ ”బాబాయ్ ”అని పిలిచే చొరవ ఉన్నవాడు అన్నాడు ..వాళ్ళు కూడా రాజబాబు లేకుండా వేషాలు ఒప్పుకొనేవారుకాదట
   రాజబాబు సినీ అరంగేట్రం పై ఒక కధ  చెప్పాడు  .మొదటిసారి వేషం దొరికి మొదటి షాట్ రేలంగితో రేలంగి నౌకరు వేషం వచ్చింది.  మేకప్ అయి రెడీ గా ఉన్నాడు.  వరుసగా అందరీమేకప్పులు అయి ఈయన యాక్టింగ్ కు టైం ఉండటం తో  ఆరుబయట స్నేహితులతో పిచ్చాపాటీ మాట్లాడుతూ వాళ్ళు చేయమన్న  మిమిక్రీ చేస్తూ రేలంగిని కూడా అనుకరించమంటే అనుకరిస్తుండగా షాట్ రెడీ వార్త వచ్చి షూటింగ్ కి వెళ్లి ఆ రేలంగి ఇమిటేషన్ లోంచి బయటపడకుండానే మొదటి డైలాగ్ రేలంగితో ఆయన అనుకరణ తో చెప్పాడట .ఇంకేముంది రేలంగి ఫైర్ అయి ”ఎవడీ దొంగ నాకొడుకు నన్నే ఇమిటేట్ చేస్తున్నాడు తీసిపారెయ్యండి ఈ రాస్కెల్ ని ”అని హుకమ్ జారీచేయగా యెంత బ్రతిమాలినా వేషం దక్కక వెళ్లి పోయాడట . 4నెలల తర్వాత అదే రేలంగి తానూ తీస్తున్న ”సమాజం ”సినిమాకు ”ఒరే .ఆ రోజు నన్ను ఇమిటేట్ చేసిన పంతుల్ని పిలిపించండి వేషం వేయిద్దాం ”అని పిలిచి వేషం ఇచ్చాడట . ఇదే రాజబాబు మొదటి సినిమా .
               రాజమండ్రి  గోదావరి తీరం లో రాజబాబు కాంశ్య విగ్రహాన్ని మద్రాస్ లోని హాస్య నటులందరూ కలిసి నిర్మించి ట్రెయిన్ లో నాలుగు బోగీలలో వారంతా రాజమండ్రి వచ్చి ఆవిష్కరణ మహోత్సవం లో పాల్గొన్నారని అంతటి అభిమానం ఏ హాస్య నటుడికీ దక్కలేదని అన్నాడు.మనకు తెలియని ఎన్నో రాజబాబు రహస్యాలు విప్పి చెప్పాడు చిట్టితమ్ముడు చిట్టిబాబు .
  15-7-17 శనివారం     మరో రుద్రాభిషేకం
జూన్ 3 న ఇక్కడ శ్రీ గ్రంధి హరి గారింట్లో ఆయన కోరికపై నేను రుద్రాభి షేకం జరిపించటం చూసిన కన్నడ దంపతులు శ్రీమతి మాలిని శ్రీ వాసుకి దంపతులలో మాలిని జూన్ 5 వతేదీ సోమవారం ఉదయం మా ఇంటికి వచ్చి ఇంగ్లిష్ లో హ రిగారింట్లో అభిషేకం బాగా చేయించానని మెచ్చి ,జులై నెలల15 వతేదీ సాయంత్రం  తమ ఇంట్లో రుద్రాభిషేకం నా ఆధ్వర్యం జరిపించాలని కోరితే సరే అన్నాను
  నిన్న అంటే శనివారం మధ్యాహ్నం 3 గంటలకు మా అమ్మాయి నన్ను కారులో వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళింది 3.-30 కి మాలిని దంపతులచేత విఘ్నేశ్వర పూజ ,శివ ఆవాహనం ,అష్టోత్తర శతనామ పూజ లలితా అష్టోత్తరం వారి ఇలవేల్పు సుబ్రహ్మణ్యేశ్వర  వల్లీ ,దేవ సేన పూజ చేయించి రుద్రం ప్రారంభించేసరికి సాయంత్రం 5-15 అయింది .ఇంతలోకి రుద్రం చదివే వాళ్ళు సుమారు 10 మంది వచ్చారు .లఘున్యాసం తో రుద్రాభిషేకం ప్రారంభించిఏకాదశ రుద్రం చేసి  వచ్చిన వారందరి చేత చేయించి ,మళ్ళీ అష్టోత్తరపూజ ,నైవేద్యం హారతి ఇప్పించి అందరం కలిసి మంత్రం పుష్ప0 ఏక కంఠం తో చెప్పి వేద హోరుతో పునీతం చేసాం . ఆ తర్వాత భోజనాలు .దాదాపు 80 మందికి పైగానే వచ్చారు .రాత్రి 9 అయింది .అంటే సుమారుఅయిదున్నర గంటల కార్యక్రమం.  మాలిని కోరిక పై నిర్విఘ్నంగా జరిగింది ..   తర్వాత భోజనాలు -టమేటా  బాత్, రెండు స్వీట్లు ,మజ్జిగపులుసు ,వగైరాలు .నాకేమీ తినాలని పించక కొద్దిగా మజ్జిగ పులుసు కొంచెం పెరుగన్నం ఒక స్వీట్  తో    సరి పెట్టుకొన్నాను
  కన్నడ సంప్రదాయం లో మా దంపతులకు మాలిని వాసుకి దంపతులు మంచి నూతన వస్త్రాలు ,4 కొబ్బరికాయలతో ” ఘనమైన నగదు” తాంబూలం తో సత్కరించి ఆశీర్వాదం అందుకొన్నారు .అప్పుడు ఆ దంపతులతో ”ఇవాళ ఉదయం షష్ఠి  సాయంత్రం సప్తమి తిధి . రేపు రాత్రి సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడుకనుక దక్షిణాయనం వస్తుంది .ఇవాళ ఉత్తరాయణ మహా పుణ్యకాలం లో సప్తమి తిధినాడు మీ ఇంట్లో రుద్రం చేసాం”అనగానే వాళ్ళు ”ఈజిట్ ఆ0కుల్  వి ఆర్ వెరీ ఫార్ట్యు నే ట్ యు డిడ్  వెరీ వెల్ అంకుల్ ”అని ఉప్పొంగిపోయారు .ఆతర్వాత శివలింగాన్ని ఎందుకు పూజించాలో కూడా క్లుప్తంగా చెప్పా . అలాగే -మాలిని అంటే మాలలు ధరించేది అని సరస్వతి దేవి అష్టోత్తరం లో మాలిన్యైనమః అని ఉందని వాసుకి శివుని కంఠాభరణమైన సర్పరాజని  మాలిని హారం గా అంటే భర్తగా వాసుకి ఉన్నాడు కనుక వారిద్దరూ అర్ధ నారీశ్వరులని మొత్తమంతా ఇంగ్లిష్ లో చెప్పా .ఎంతో సంతోషించి ఇలాంటి మంచిమాటలు ఒక సారి మా ఇంట్లో మళ్ళీ చెప్పాలి మీరు అంకుల్ అన్నది మాలిని సరే అన్నా .  ఆ దంపతులు ఇక్కడి సాయి సెంటర్ కు వెన్నెముక వంటివారు . మాలిని గొప్ప సహాయకారి అని మా అమ్మాయి ఎప్పుడూ చెబుతుంది ..కార్తీకమాసం లో మా వాళ్ళు నిర్వహించే అభిషేక కార్యక్రమానికి ఆమె ఎంతగానో తోడ్పడుతుంది .. మంచి మనసున్న మహిళ మాలిని . వాసుకి కూడా హిందూ సెంటర్లో జరిగే అన్నికార్యక్రమాలకు మైక్ లైటింగ్ వగైరాలు దగ్గరుండి చూస్తాడ్రు . అందుకే అంత  అభిమానంగా ఇంతమంది వచ్చారు.
  మా షార్లెట్   మనవరాలు రమ్య
  ఇక్కడ జరిగిన మొదటి సాయి కార్యక్రమం లో నాకు ఒక అమెరికా మనవరాలు దొరికింది మా ఉయ్యూరు మనవరాలు రమ్య పేరే ఆమెదీ .మొదటి సారే  చెప్పా .నువ్వు మామనవరాలవు అని ఆమె పొంగిపోయింది ఎప్పుడు కనిపించినా నేను మనవరాలు అనే పలకరిస్తాను .  చక్కని నవ్వు అణకువ సంప్రదాయమున్న తమిళ అమ్మాయి తెలుగు కొంతవరకు బాగానే మాట్లాడుతుంది . ఇవాళ రుద్రాభిషేకం భోజనం అయ్యాక నా దగ్గరకు వచ్చి ”అంకుల్ !మీరు పట్టు బట్టలు రుద్రాక్షలతో చాలా ”క్యూట్ ”గా కనిపించారు అంకుల్ ”అన్నది నాకు మహా ఆనందం కలిగింది . అందరి భోజనాలు అయి ఇంటికి వచ్చేసరికి రాత్రి 10-45 అయింది . నా కొడాక్ కెమెరా పని చేయటం లేదు .అందుకని సెల్ లో ఫోటోలు తీస్తున్నా వీటిని పెట్టాలంటే మా మనవడు చి పీయూష్ ఎక్స్ పర్ట్ వాడిపై ఆధార పడాల్సి వస్తోంది .ఇవాళ పొద్దున్న వాడితోనే పెట్టించా .
5 ఏళ్ళ క్రితం 2012లో షార్లెట్ వచ్చినప్పుడు అంతా ”సాయి ”హవా నడిచింది .ఇప్పుడు దాన్ని తిరగేస్తే ”ఈశా ”హవా” నడుస్తోంది . ఈ వారం కథ ఇంతటితో సమాప్తం .
  మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -16-7-17 -కాంప్-షార్లెట్-అమెరికా

 

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

వీక్లీ అమెరికా -16(10-7-17 నుండి 16-7-17 వరకు )

వీక్లీ అమెరికా -16(10-7-17 నుండి 16-7-17 వరకు )

 మరో రుద్రాభిషేకం వారం -1
10-7-17 సోమవారం -మా మనవళ్లు చి ఆశుతోష్ ,పీయూష్ లను ఒక నెలరోజుల కాంప్ లో చేర్చారు .ఉదయం 7 గంటలకు వెళ్లి సాయ0కాలం  4 కు వస్తారు పొద్దున్న దిగబెట్టి సాయంత్రం తీసుకొస్తున్నారు .పెద్దమనవడు చి శ్రీకేత్ ని కూడా ఇంగిలీషు స్పెషల్ కోచింగ్ లో చేర్చారు రోజుకు రెండుగంటలు .వాడినీ దింపి తీసుకు వస్తున్నారు .దీనితోనే వీళ్ళ టైం సరిపోతోంది . తప్పదు .  రాత్రి ”గొట్టం ”లో రాజేంద్ర ప్రసాద్ సినిమాలు వాలుజడ తోలు బెల్టు ,అప్పు చేసిపప్పుకూడు చూసాం సరదాగా ఉన్నాయి రేలంగి నరసింహారావు  డైరెక్టర్ .మనవడు ,మనవరాలు చరణ్ రమ్యలకు  ఫోన్ చేసిమా ట్లాడాం . రమణ ఉయ్యూరు విషయాలు ఎప్పటికప్పుడు తెలియ జేస్తున్నాడు వర్షాలు బాగానే పడుతున్నాయి కాలువలు నిండుగా ప్రవహిస్తున్నాయట .
   మంగళవారం -గీర్వాణం పని నిన్నా ఇవాళ . రాత్రి ప్రముఖ జర్నలిస్ట్ 83 ఏళ్ళ గుడిపూడి శ్రీహరితో తెలకపల్లి రవి ఇంటర్వ్యూ చూశా .ఈ నాడులో ”హరివిల్లు ”శీర్షిక 30 ఏళ్ళు నిర్వహించిన ఘనత ఆయనది .జర్నలిజం లో 60 ఏళ్ళ అనుభవం ఆయనది హిందూ కు కూడా ఆయన రాస్తాడు ఆయన ఆర్టికల్స్ చదవటం అదొక గొప్ప అనుభూతి హాస్య0  అంతర్వాహినిగా చక్కగా నిండుగా చురుకుగా కరుకుగా ప్రవహిస్తుంది .ఆయన సినిమాలమీద రాసిన వ్యాఖ్యానాలు సూపర్బ్ .నాకు చాలా ఇష్టమైన రచయిత.ఈ కామెంట్లు నాకు అత్యంత ఆప్తులు  భారతీయ సాహిత్య పరిషద్ అధ్యక్షులు బందరు హిందూ హై స్కూల్ లెక్కలమేస్టారు  గొప్ప కదా రచయితా  ఇంగ్లిష్ లో అమోఘ పాండిత్యం ఉన్న స్వర్గీయ ఆర్ ఎస్ కె మూర్తి గారి పోకడ కనిపిస్తుంది మూర్తిగారు వారం వార0 జాగృతి వారపత్రికలో సినిమా సమీక్ష చాలా ఏళ్ళు నిర్వహించారు
  గుడిపూడి వారు చెప్పిన విషయాలు మీతో చెప్పాలని పిస్తోంది ..ఒక సారి సురభి నాటక కంపెనీ గురించి హిందూ పత్రికలో రాయటానికి ఫోటోగ్రాఫర్ ను తీసుకొని వాళ్ళు ఉండే  పల్లెటూరువెళ్లి వారంతా ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకొనే వరకు వారి దైనందిన కార్యక్రమాలన్నీ ఫోటోలు తీశారని వీళ్ళ కోసం వాళ్ళు అప్పటికప్పుడు తెరలు కట్టి నాటకాలు ఆడి  చూపించారని ,మద్రాస్ వెళ్లి దీనినంతటిని హిందూ ఆదివారం స్పెషల్ లో 4 పేజీల వ్యాసం  రాశానని ఫోటోలన్నీ అందులో పెట్టానని హిందూ పేపర్ చరిత్రలో ఒక అంశం పై అన్ని పేజీల ఆర్టికల్ అంతవరకూ ఎన్నడూ రాలేదని ఈ ఎడిషన్ ప్రపంచం అంతా చదివే ఎడిషన్ అని దీనితో సురభి చరిత్ర ప్రపంచానికి అంతటికీ తెలియ జెప్పే అవకాశం తనకు దక్కిందని అన్నారు . ఆతర్వాత ఎప్పుడో సురభి వాళ్ళు ఆయన దగ్గర కొచ్చికేంద్ర అకాడెమీ ద్వారా తమకేదైనా ఆర్ధిక సాయం చేయించమని అభ్యర్ధించారని తానూ వాళ్లకు ఒక రికమండేషన్ లెటర్ ఇచ్చిఢిల్లీలో ఉన్న  శ్రీ గరిమెళ్ళ వెంకట రమణ ?  గారి వద్దకు పంపానని ,ఆయన వారిని అకాడెమీ అధ్యక్షుల దగ్గరు తీసుకు వెళ్లారని ,సురభి అధినేత ఆయనతో తమ  గోడు చెప్పుకోబోతుంటే ”మీరేమీ చెప్పక్కరలేదు మీ గురించి అంతా గుడిపూడి శ్రీహరిగారు హిందూ లో రాసిన ఆర్టికల్ చదివి పూర్తిగా తెలుసుకున్నామని చెప్పి క్షణం ఆలస్యం చేయకుండా 75 లక్షల చెక్ ఇచ్చి పంపారని చెప్పారు మహోపకారం జరిగింది శ్రీ హరిగారిద్వారా సురభికి .అకాడెమీ వదాన్యతనూ ప్రశంసించాలి .
   మరో విషయం గుడిపూడి చెప్పారు .ప్రముఖ గాయకుడు స్వర్గీయ ఏం ఎస్ రామారా వు గారు గొప్ప సంగీతజ్ఞులు ఆయన సినిమాలకు ఎన్నో పాటలు పాడారు చక్కని స్వరం ఆయనది .ఆయన పాడిన ”ఓహో జహాపనా ” అలాగే చివరికి మిగిలేది సినిమాలో మల్లాది రాసిన పాటలు ”చెంగున అలమీద మిడిసిపోతది మీను ”వంటి పాటలు అంటే నాకు మహా ఇష్టం . నా ఆరాధ్యగాయకులలో ఆయన ఒకరు . అలాంటి ఏం ఎస్ .రాజమండ్రి లో దిక్కూ మొక్కూ లేకుండా ఒక చిన్న గుడిసెలో భార్యతో ఉండేవారట తిండి తినే వారో లేదో తెలీదు . ఆయన ప్రక్కన ఉన్న ఒక ప్రయివేట్ స్కూల్ ప్రిన్సిపాల్  ,ఈయన కమ్మగా పాడుకొంటుంటే ”ఏమిటీ పొద్దున్నే ఈ దరిద్రపు పాటలు ఇక ఆపు ”.అని కేకలేయటం గుడిపూడి స్వయంగా చూసి కరిగిపోయి అంత  గొప్పగాయకుడికి ఇంతటి అవమానమా అని బాధపడి వెంటనే హైదరాబాద్ కు తనతో పాటు తీసుకొచ్చి తన ఇంట్లోనే 3 నెలలు ఆదంపతులను ఉంచుకొని ,అన్నిరకాల ఆదు కొంటూ తన స్కూటరు పై ఆయన్ను ఎక్కించుకొని ప్రముఖ సాహిత్య  సాంస్కృతిక  సంస్థలవారందరికి పరిచయం చేసి ,ఒక రోజు రవీంద్ర భారతి లో 6 సంస్థల ఆధ్వర్యం తో రామారావుగారి సంగీత విభావరి ,హనుఆం చాయీసా ఏర్పాటు  చేస్తే ,క్రిక్కిరిసి రసజ్ఞులతో హాలు నిండి ,ఆయన గాన వాహినిలో జనం తన్మయం చెందారట వారికి తగినంత ఆరాధిక సాయమూ చేకూరింది ఆతర్వాత ఆయనే సుందర కాండ తెలుగులో రాసి అనేక సభలో పాడి మంచి ప్రచారం పొంది ”సుందర దాసు ”అయ్యారు అమీర్పేట  లో సవంత గృహం నిర్మించుకొని బాగా పాప్యులర్ అయ్యారు ఏలోటూ లేకుండా గౌరవ గా జీవించారు .గడిపూడిచెయి అందించకపోతే ఆ మహా గాయకుడి అరిస్థితి ఎలా ఉండేదో సుందరదాసుగారి మనవడు ఇప్పుడు సుందరకాండ పారాయణలో ఛానళ్లన్నీ దున్నేస్తున్న సంగతి మనకు తెలుసు ..
  ఇంకో విషయమ -రామోజీ రావు తీసిన సినిమాను విక్టరీ మధుసూదనరావు డైరెక్ట్ చేశాడట ఆసినియా గురించి హరి తన సహజ ధోరణి లో తానూ ఈ నాడులో పనిచేస్తున్నా నిష్కర్షగా సమీక్ష రాశాడు .నిగ్రహించుకోలేని విక్టరీ రామోజీ దగ్గరకు వెళ్లి ”మన సినిమాపై కూడా ఇలా రాస్తే ఎలాగండి కాస్తపిలిచి చీవాట్లు పెట్టండి ”అన్నభావ తో కంప్లైంట్ చేస్తే ”అది ఆయన స్వభావ0  ఆయన  సినిమాను  సినిమాగా చూసి రాస్తాడు అది నేను తీసిందా ఇంకోరు తీసినదా కాదు అందులో పదార్ధం ఉందా లేదా అనేదే ఆయన వెతుకులాట .మనం దీనిలో వేలు దూర్చరాదు .సినిమా బాగుంటే చూస్తారు లేకపోతె లేదు మనకోసం ఆయన రాయడు అయన పధ్ధతి అంతే  ”అన్నాడట దిమ్మ తిరిగిందివిక్టరీకి .ఆసినిమా ఆడనే లేదట . గుడిపూడి సుమా రు 4 వేల తెలుగు సినిమాలు ఒక వెయ్యి ఇంగ్లిష్ హిందీ సినిమాలు మొత్తం 5 వేలకు పైగా సీనియాలు చూసిమాత్రమే సమీక్షలు రాశాడు .ఇంట్లో కూర్చుని చూడా కుండా రాసినవి కావు అన్నాడు ..ఒకసారి మద్రాస్ లో తెలుసుసినీ ప్రొద్యూసర్లు అందరూ సమావేశమై శ్రీహరి సమీక్షలపై విరుచుకు పడ్డారని ,రామోజీ తరపున కేస్  రామారావు వెళ్లి పాల్గొని గుడిపూడి ముక్కు సూటితనాన్ని తెలియ జెప్పారడని  .చివరికి ”కనీసం సమీక్ష హెడ్డింగ్ అయినా సౌమ్యంగా పెట్టమని కోరారని ”కానీ తానూ వీటిని వేటినీ లెక్క చేయక తన ధోరణిలో తానూ రాసుకు పోయాయానని చెప్పాడు
  పద్మశ్రీ పిక్చర్స్ అధినేత ,దర్శకుడు పి .పుల్లయ్య  దగ్గర ఏదైనా సినిమాలో ప్రయత్నిద్దామని వెడితే ”ఇదిగో అయ్యోరూ !ఇక్కడ సెట్ మీన నానో టికి బ0డ బూతులొస్తాయి .అందరూ విని భరించి పనిచేస్తారు .నువ్వు బాగా సడదు కున్నోడివి నీకిది వద్దులే అబ్బాయా ”అన్నాడని చెప్పారు .రామోజీ అన్ని విషయాలు తనతో చర్చించేవాడాని ,గొప్ప ఆలోచనా పరుడని ,వాళ్ళ సినీపత్రిక ”సితార ”లో కూడా తానూ సినీ సమీక్షలు రాశానని చెప్పారు . వెంగళరావు దాకా అందరు ముఖ్యమంత్రులతో తనకు మంచిపరిచయం ,చొరవ ఉండేదని తమా టకు విలువ ఉండేదని ,ఆతర్వాత వచ్చిన ముఖ్యమంత్రులెవ్వరూ తనకు తెలియరని అన్నారు .మరో ముఖ్యవిషయం చెప్పారు ,.ఎన్టీ  రామారావు గారు తానూ ఆ రోజు చేయబోయే సినిమాలో తన స్క్రిప్ట్ ను తెల్లవారు జాముననే భార్య బసవతారకం గారికి చదివి వినిపించేవాడని ఇది తానూ స్వయంగా చూసిన విషయమని గుడిపూడి చెప్పాడు . ఫిలిం సెన్సార్ బోర్డు లోనూ హరిపనిచేశాడు .
  తనకు అన్నమయ్య సినిమా నచ్చలేదని అందులో ఎన్నో అసందర్భాలున్నాయని తానూ సమీక్షలో రాశానని అన్నాడు . ఒక అభిమాన జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చూసిన ఆనందం కలిగింది .మిగిలిన విషయాలు పార్టీ -2 లో
   సశేషం
  మీ-గబ్బిట దుర్గాప్రసాద్-16-7-17 -కాంప్-షార్లెట్-అమెరికా 

Inline image 1
Posted in అమెరికా లో | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 380-వాసుదేవ  వాగ్వేణు కర్త -డా.ఉమాచంద్ర శేఖర్  వైద్య (1952)  

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3

380-వాసుదేవ  వాగ్వేణు కర్త -డా.ఉమాచంద్ర శేఖర్  వైద్య (1952)  

–19-9-1952 లో పంజాబ్ లో జన్మించిన డా ఉమావైద్య కవికులగురు కాళిదాస సంస్కృత యుని వర్సిటీ వైస్ ఛాన్సలర్  గా పని చేశాడు .సంస్కృత మరాఠీ హిందీ ఇంగ్లిష్ లవ్ అపార పాండిత్యం సంపాదించాడు అనర్గళ వక్త కూడా .సంస్కృత పాళీ వ్యాకరణం లో మొదటి రాంక్ లో ఏం ఏ ,,సంస్కృత వ్యాకరణం లో ఫై హెచ్ డి సాధించాడు వైస్ ఛాన్సలర్ కాకపూర్వం బొంబాయి భద్రకార్ సంస్కృత ఇన్ స్టిట్యూట్ సంస్కృత శాఖాధ్యక్షుడు గా ,ఠాగూర్ చైర్ ఆఫ్ కంపారేటివ్ లిటరేచర్ కు గైడ్ గా ఉన్నాడు .పాళీ భాషలో అధారిటీ ఉన్నవాడు .రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సంస్కృత నాటకపోటీలకు న్యాయ నిర్ణేతగా ఉన్నాడు .అనేక సాహిత్యప్రసంగాలు రేడియో ప్రసంగాలు చేసిన వక్త .సంస్కృత వాడుక భాష పై అనేక వర్క్ షాపులు నిర్వహించాడు  .ఈయనవద్ద 10 మంది రీసెర్చ్ చేసి పి  హెచ్ డి లయ్యారు

సంస్కృతం లో ”వాసుదేవ వాగవేణు ,తోపాటు అభిజాతా సంస్కృత సాహిత్య చల్తీహాసం ,అప్షనల్స్ ఇన్ సంస్కృత లాంగ్వేజ్ అండ్ పాణిని ,మిస్టిక్స్ ఇన్ వరల్డ్ రెలిజియన్స్ గ్రంధాలురాశాడు .వివిధ అంశాలపై 80 కి పైగా  రీసెర్చ్ పేపర్లు రాసి ప్రచురించాడు  . 
  బొంబాయి బ్రాహ్మణసభ ”ప్రజ్ఞావంత పురస్కారం ,ర్రాష్ట్రీయ గౌరవ పురస్కారం ,ఉత్తమ దేశిక ,ప్రబోధ పురస్కారం ,సంస్కృత సేవ ,సంస్కృత సాహిత్య పురస్కారం వంటివి ఎన్నో అందుకొన్నాడు 
  2001 నుంచి 2008 వరకు విజిటింగ్ ప్రొఫెసర్ గా జపాన్ ,అమెరికా ,ఇటలీ ,ఆస్ట్రేలియా ,మారిషస్ లు సందర్శించాడు . 
  సాహిత్య అకాడెమి ప్రచురించిన భారతీయ అలంకార శాస్త్ర విజ్ఞాన సర్వస్వ0 ప్రాజెక్ట్ లో తనవంతు కర్తవ్యమ్ నిర్వహించాడు .చైనా యుని వర్సిటీలలో ఒకదానిలో ప్రవేశపెట్టే సంస్కృత కోర్సు తయారు చేశాడు .సౌరాష్ట్ర బొంబాయి ఔరంగాబాద్ వగైరా యుని వర్సిటీలలో   రిఫ్రెషర్ కోర్స్ లు నిర్వహించాడు చాలా యుని వర్సిటీలకు కన్సల్టింగ్ఎక్సపర్ట్ గా ఉన్నాడు  ,
 
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 379-అన్వీక్షికి వ్యాఖ్యాత -కపిలామహర్షి (క్రీ.పూ. 650-575 )

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3

379-అన్వీక్షికి వ్యాఖ్యాత -కపిలామహర్షి (క్రీ.పూ. 650-575 )

-అన్వీక్షి కి సంప్రదాయ వ్యాఖ్యాత -కపిలమహర్షి . ఆత్మ విద్యకు మరోపేరు అన్వీక్షి కి మనువు తన ధర్మ శాస్త్రం లో ఆత్మ విద్య ను అన్వీక్షికి అని పేర్కొన్నాడు .తర్వాత ఇది ఉపనిషత్తులలో ఒక భాగమైంది .యదార్ధానికి అన్వీక్షికి ఉపనిషత్తులకు ఆత్మ విద్యకు భేదంగా కనిపిస్తుంది .క్రీపూ 327 వాడైన కౌటిల్యుడు”త్రయీ అంటే వేదాలు వార్తికాలు ,,దండనీతి కంటే భిన్నమైన విశేష విషయాలున్నది అన్వీక్షికి అన్నాడు ఆత్మ విద్య ఆత్మా స్వభావాన్ని గురించి వివరిస్తే  అలా భావించటానికి గల కారణాలను అన్వేషించి చెప్పింది అన్వీక్షికి అన్నాడు చాణక్యుడు .ఆత్మా.హేతువులను గురించి చెప్పిందే అన్వీక్షికి అన్నాడు వాత్సాయనుడు ఉపనిషత్తు చెప్పింది ఆత్మా విద్య లేక ఆధ్యాత్మ విద్య మాత్రమే .హేతువులను చర్చింది అన్వీక్షికి . కానీ క్రీ పూ 650 వరకు కపిలుడు దీనిపై సాంఖ్యం రాసేదాకా ఒక నిర్దిష్ట రూపం సం త రించుకోలేదు . అన్వీక్షికి సాటిలేని ఒక దర్శనశాస్త్రం  అయింది  తర్క శాస్త్రం లో ప్రాముఖ్యమైంది .హేతు విద్య లేక హేతు శాస్త్రం గా పిలువబడి చివరికి తర్క శాస్త్రం గా పేరు పొందింది .దీనినే వాద  విద్య అన్నారు – ఇప్పుడు న్యాయ శాస్త్రంగా గుర్తింపు పొందింది .చార్వాక ,జాబాలి మొదలైన వారు దీన్నిఅనుసరించగా కపిలుడు గొప్ప వ్యాఖ్యానం రాశాడు

  కపిల మహర్షి క్రీ పూ 650-575 కాలం వాడు .అజ్మీర్ దగ్గర పుష్కరం వద్ద జన్మించినట్లు పద్మపురాణం లో ఉంది .సాంఖ్య సూత్రాలు రాశాడు .దీని వివరణ అంతా సాంఖ్యకారికలో లభిస్తుంది .మహాభారతం లో కపిల మహర్షి అహింసా సిద్ధాంతాన్ని ప్రవచించినట్లు ఉంది . స్వేతాశ్వతర  ఉపనిషత్ లో కపిలునిపై విస్తృతంగా ఉన్నది .
  బ్రహ్మ పురాణం లో వేనుడు అనే రాజు వేదాలను వదా ధ్యయ నాన్ని క్రతువులను నిషేధి0చి వేద ధర్మానికి విఘాతం కలిగిస్తే ,అతనిని సంహరించి కపిలుడు మహర్షులను వేనుని తొడను మధించమంటే నిషాదుడు పుట్టాడు .కుడి చేతిని మధిస్తే పృధువు జన్మించి భూమిని సస్యశ్యామలం చేశాడు అందుకే భూమిపృథ్వి అని అతని పేరుతో పిలుస్తున్నాం .మహర్షులతో కలిసి కపిలుడు కపిల సంగమానికి వెళ్లి పుణ్యస్నానాలు ఆచరించారు .సాగరపుత్రులు 60 వేలమంది అశ్వమేధ అశ్వాన్ని రక్షిస్తూ వస్తే విష్ణుమూర్తి కపిలముని వేషం లో పడుకొని నిద్రిస్తుంటే నిద్రాభంగమై కళ్ళు తెరవగానే సాగర పుత్రులు  నలుగురైదుగురు తప్ప అందరూ  కంటి మంటకు భస్మమైపోయారు
  భాగవతం లో కర్దమ ప్రజాపతి,దేవ హోతి దంపతులకు కపిలుడు జన్మించినట్లున్నది .మత్శ్యపురాణం లో కశ్యప ప్రజాపతికి దక్షుని కూతురు దను  ల 100 మందిసంతానం లో కపిలుడు ఒకడు ;సాంఖ్య సూత్రాలు ఒకటి రెండు చూద్దాం –
1-కృపయా చివి దదుహ్ కాత్య0తాని వృత్తి రత్యంత పురుషార్ధహ్ ”భావం మనిషిలోని మూడుబాధలు అతని అంతానికి కారణం .
2-న దృష్టాంత చ్చిద్ధార్ణ వృత్తియే రప్యను వృత్తిదర్శనాత్ -భావం ఈ బాధ మందూమాకులవలన తగ్గేదికాదు
3-ప్రత్యాహి కక్షుత్మతీకర చేస్టనా త్పురుషార్థత్వం . భావం -మనసులోని కోరిక బాధకు కారణం .అది నిత్యం ఆకలిలాంటిది
    సశేషం
  మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -11-7-17- కాంప్-షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 377– సమన్వయ యోగ ప్రచారకులు -స్వామి శివానంద (1887-1963

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3

377– సమన్వయ యోగ ప్రచారకులు -స్వామి శివానంద (1887-1963

తమిళనాడులో తిరునల్వేలి వద్ద పత్తమదైలో స్వామి శివానంద సరస్వతి కుప్పుస్వామిగా 8-9-1887 న జన్మించారు .త0జావూరు మెడికల్ స్కూల్ లో చదివి ”ఆంబ్రోసియా ”అనే మెడికల్ జర్నల్ నడిపారు .మెడిసిన్ పూర్తి చేసి డాక్టర్ ప్రాక్టీస్  చేశారు .పేదలకు ఉచిత చికిత్స చేశారు .మనసులో ఆధ్యాత్మిక భావనలు పూర్తిగా చుట్టుముట్టి 1923 లో మలయా వెళ్లి ఇండియా తిరిగి వచ్చి కాశీ ప్రయాగ ఋషీకేశ్ చేరి స్వామి   విశ్వానంద సరస్వతి  ని దర్శించి కైలాస ఆశ్రమ మండలేశ్వర  ‘విష్ణుదేవానంద ‘తోకలిసి ”విరజా  హోమం;;నిర్వహించి సన్యాసాశ్రమం స్వీ కరించి  శివానంద ”ఆశ్రమనామం పొంది,రిషీకేశ్వర్ లో లక్షణ ఝాలా వద్ద 1927 లో స్థిరపడి  వైద్య కేంద్రం పెట్టి  రోగులకుఉచిత వైద్య సేవ చేస్తూ యాత్రికులకు సాయం చేస్తూ ,తపస్సు ధ్యానాలతో గడిపారు .
 పరివ్రాజకునిగా దేశమంతా పర్యటించి ఆధ్యాత్మ ప్రబోధం చేస్తూ  సంకీర్తన చేస్తూ ,అరవిందాశ్రమం దర్శించి స్వామి శుద్ధానంద భారతి దర్శనం చేసి ,వారికి  ”మహర్షి ”బిరుదుప్రదానం చేసి ,రమణ మహర్షి జన్మదినాన మహర్షిని దర్శించి  వారి సన్నిధిలో భజనలు కీర్తనలుతన్మయత్వం తో  పాడి  కేదారనాధ్ బద్రీనాధ్ మానస సరోవరాలు దర్శించి ఋషీకేశ్ కు తిరిగి వచ్చారు.  దేశమంతటా ఆయనకు వేలాది శిష్యులేర్పడ్డారు
  1936 లో ఋషీకేశ్ లో ”డివైన్ లైఫ్ సొసైటీ ”ని ఏర్పాటు చేసి తన ప్రవచనాలను పుస్తకాలుగా ప్రచురించి అందుబాటులోకి తెచ్చారు .సత్యానందం సరస్వతి వంటి శిష్యులేర్పడి ”సత్యానందం యోగం ”ప్రచారం చేశారు . 1945 లో శివానంద ఆయుర్వేద ఫార్మసీ ”స్థాపించి ప్రసిద్ధ ఆయుర్వేద మందులను తయారు చేయించారు ..ఆల్ వరల్డ్ రెలిజియన్స్ ఫెడరేషన్ ”ను”ఆల్ వరల్డ్ సాధుస ఫెడరేషన్ ”ను  1947 లో నిర్వహించారు . 1948లో  ” యోగ వేదాంత ఫారెస్ట్ అకాడెమి ”ఏర్పాటు చేశారు తన యోగా ను ”యోగా ఆఫ్ సింథసిస్ ”అంటే సమన్వయ యోగం అంటారు .
  భారత రాష్ట్రపతులందరికి స్వామి శివానంద ఆరాధ్యులు .వారి దర్శనం తో తరించామని చెప్పేవారు .స్వామి శివానంద 14-7-1963న మహా సమాధి చెందారు .ఋషీకేశ్ లో శివానందాశ్రమ0 తప్పక దర్శించి అనుభూతిపొందాలి .దాదాపు గా 19 60  నుండి వారి పేరు వింటూనే ఉన్నా  వారినీ ఆశ్రమాన్ని దర్శించాలన్న గాఢమైన కోరిక మనసులో ఉండిపోయింది ‘1998 లో మేము అంటే నేనూ మా శ్రీమతి ప్రభావతి , మా అక్కయ్య శ్రీమతి దుర్గ బావగారు శ్రీ వేలూరి వివేకానంద్ కలిసి కేదార్ నాధ్ బద్రీ నాధ్ యాత్ర చేసినప్పుడు ఋషీకేశ్ లో శివానందాశ్రమ సందర్శించి తరించాము వారి గ్రంధాలను అప్పటి ఆశ్రమాధికారి అయిన స్వామీజీ మాకు కానుకగా ప్రసాదించటం    మరువ లేని జ్ఞాపకం
378 గీతా జ్ఞాన యజ్ఞ సారధి – స్వామి చిన్మయానంద సరస్వతి (1916-1993)
కేరళ లోని ఎర్నాకులం లో 8-5-1916న స్వామి చిన్మయానంద బాలకృష్ణ మీనన్ గా జన్మించారు .తండ్రి కుప్పుస్వామి కొట్ట మీనన్  ప్రసిద్ధ జడ్జి ,ఈయన కొచ్చిన్ మహారాజుకు సమీప బంధువు .తల్లి పాఱుకుట్టి అమ్మ .చిన్మయ బాల్యం లోనే చనిపోయింది .కొచ్చి ,త్రిసూర్ ,ఎర్నాకులం లలో చదివి డిగ్రీపొంది లక్నో వెళ్లి లిటరేచర్ ,లా జర్నలిజం  లలో పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యారు .
  1936 లో రమణాశ్రమం లో రమణ మహర్షిని సందర్శించినప్పుడు వారి ద్రుష్టి ఈయనపై పడటం తోనే ఆధ్యాత్మిక భావ పరంపరలు మనసంతా నిండిపోయి జ్ఞాన ప్రకాశా నుభూతి పొందారు .క్విట్ ఇండియా ఉద్యమం లో బాలన్ తీవ్రంగా పాల్గొన్న దేశభక్తుడు .అరెస్ట్ చేస్తారని తెలిసి అండర్ గ్రౌండ్ లోకి  వెడుతూ సహచరులను స్ట్రైక్ లు చేయమని కరపత్రాలు పంచమని సలహా ఇచ్చారు తర్వాత అరెస్ట్ అయి జైలులో ఉన్నారు .జైల్లో పారిశుధ్యలోపం వలన టైఫాయిడ్ వచ్చి ,మిగతా రోగులతోపాటు రోడ్డుమీద పారేయబడ్డారు .ఒక క్రిస్టియన్ మహిళ జాలిపడి ఇంటికి తీసుకు వెళ్లి డాక్టర్ ను పిలిపించి చికిత్స చేయించి నయం చేసింది
  ఆరోగ్యం బాగుపడగానే ”నేషనల్ హెరాల్డ్ ”పత్రిక పిలిచి ఉద్యోగమిచ్చింది .అందులో ఎన్నెన్నో వ్యాసాలు సాంఘిక విషయాలపై రాశారు .అవి మంచిపేరు ,గుర్తింపు తెచ్చాయి  .సాధువుల జీవితాలపై  ధారావాహికంగా రాశారు ఋషీకేశ్ వెళ్లి స్వామి శివానందను దర్శించారుకాని ఆధ్యాత్మిక అనుభవం కోసం కాదు అని చెప్పుకున్నారు 1947 లో  శివానందా శ్రమానికి కొద్దీ దూరం లో ఉంటూ ఒకసారి కుతూహలంగా వెళ్లి స్వామిని దర్శించి ప్రభావితులై సన్యాసిగా మారిపోయారు .హిందూ గ్రంధాలు అధ్యయనం చేసి స్వామి ఈయనతో దాగిఉన్నజ్ఞానం గ్రహించి ”గీతా కమిటీ ”నిర్వహించామని కోరారు 25-2-1949 లో తిరిగివచ్చి మహా శివరాత్రినాడు సన్యాసం దీక్షపొంది బాలన్ స్వామి చిన్మయానంద ”దీక్షానామం పొందారు
  స్వామి శివానంద ఆజ్ఞతో ఉత్తరకాశీ లోని ఆ కాలపు వేదాంత దిగ్గజం ”తపోవనం మహారాజ్ ”వద్ద వేదాంత అధ్యయనం చేశారు .అత్యంత దీక్షతో భారతీయ ఆధ్యాత్మిక సాహిత్యాన్ని మధించి సారం గ్రహించారు . 1951 లో గురువు ఆదేశంతో సకలమానవాళికీ వేదాంత భావన కలిగించాలని విస్తృత పర్యటన చేస్తూ ప్రసంగిస్తూ ప్రజాభిమానం సంపాదించారు ఆంగ్లం లో స్వామి చిన్మయానంద ప్రసంగాలు గంగా ప్రవాహ సదృశాలు .వారి సభలకు వేలాది మంది అత్యంత శ్రద్దాశాక్తులతో వచ్చి విని తెలుసుకునేవారు విషయాలను విడమర్చి సూటిగా హృదయం లోకి చొచ్చుకొని పోయేట్లు చెప్పే నేర్పు అనితర సాధ్యమనిపిస్తుంది .తిరుమల లో 1970 లో జరిగిన విశ్వ హిందూపరిషత్ సమ్మేళనం లో స్వామి చిన్మయానంద ను చూసి వారి ప్రసంగాన్ని విన్న అదృష్టం నాకు దక్కింది .దీనికి నన్ను ప్రోత్సాహించి తీసుకు వెళ్లిన స్వర్గీయ మండా  వీరభద్ర రావు ను మర్చిపోలేను .వారి ”ఉపనిషద్ జ్ఞాన యజ్ఞం గీతా జ్ఞాన యజ్ఞాలు అత్యున్నత అత్యంత ఆధారణం పొందాయి మందార మకరద మే వారి వాగామృతం అందులో తడిసి తరించాల్సిందే
  చాలా సార్లు ప్రజలు ఆయన పేర ఒక మిషన్ ప్రారంభించామని కోరినా తిరస్కరిస్తూ వచ్చి చివరికి మద్రాస్ ప్రజలు మరీ  పట్టుబడితే ”చిన్మయ మిషన్ ”6-3-1965 లో స్థాపించారు . 18 దేశాలలో 39 ప్రముఖ నగరాలలో 28 ఏళ్ళు ఏక దీక్షగా పర్యటించి హిందూ ధర్మ ప్రచారం చేశారు .అమెరికాలో ప్రత్యేక చిన్మయా మిషన్ ఏర్పాటైంది .ప్రపంచ హిందువుల సమైక్యతకు ప్రత్యేక వ్యాసాలూ రాసేవారు చివరికి వారికోరిక తీరి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రచారక్  బాబా సాహెబ్  ఆప్టే తోకలిసి 1964ఆగస్టు లో పూనాలో ”సాందీపని ఆశ్రమం ”స్థాపించారు .ఇది విశ్వ హిందూపరిషత్ కు దారితీసి దానికి మొదటి అధ్యక్ష్యులుగా స్వామి చిన్మయానంద ఎంపికయ్యారు .
  హృదయ వ్యాధి తో చాలాకాలం బాధ పడుతూ 1969 లో మొదటిసారి హార్ట్ ఎటాక్ వచ్చింది .బెంగళూర్ లో ఏర్పడిన చిన్మయా నంద హాస్పిటల్లో లో ఆయనే మొదటి పేషేంట్ .ఆరోగ్యం కుదుటపడి 1980 లో అమెరికాలో చాలా  జ్ఞానయజ్ఞాలు చేశారు .టెక్సాస్ లో మల్టిపుల్ హార్ట్ బైపాస్ సర్జరీ చేయాల్సి వచ్చింది 26.-7-1993 లో సాన్ డియాగో లో శ్వాస సమస్య ఏర్పడి ఎమర్జెన్సీ హార్ట్ బైపాస్ సర్జరీ తప్పని సరైంది .పరిస్థితి విషమించగా లైఫ్ సపోర్ట్ సిస్టమ్ పై ఉంచారు .ఫలించక 3-8-1993 న స్వామి చిన్మయ శాశ్వత చిన్మయానంద  సమాధిలోకి వెళ్లిపోయారు .7-8-1993 న వారి పార్థివ శరీరం ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కు చేరగా వేలాది ప్రజలు కన్నీటితో చివరి దర్శనం చేసుకొన్నారు తరువాత హిమాచల్ ప్రదేశ్ లో సిద్ధ బారి లో వారి అంత్యక్రియలు పరమ వేదోక్తంగా నిర్వహించి మహా సమాధి లో ఉంచారు 24-12-1991 లో వారికి బొంబాయిలో ”స్వర్ణ తులాభారం ”జరిపారు .దీనిని చిన్మయామిషన్ వైద్య ,విద్యా కార్యక్రమ నిర్వహణకు స్వామి అందజేశారు .
  భగవద్గీత పై చిన్మయానంద వ్యాఖ్యానం శిరోభూషణంగా నిలిచింది . 34గ్రంధాలు రచించారు 2.-12-1992 న  ఐక్య రాజ్య సమితిలో స్వామి చిన్మయ ”ప్లానెట్ ఇన్  క్రైసిస్ ”అనే చారిత్రాత్మక ప్రసంగం చేశారు .అమెరికా మ్యాగజైన్ ”హిందూ యిజం టు డే ”ఆయనకు ”హిందూ రినైసెన్స్ అవార్డు ”తోపాటు ”హిందూ ఆఫ్ ది  ఇయర్ ”బిరుదు నిచ్చి సత్కరించింది . 1993 లోచికాగో లో జరిగిన ” ప్రపంచ మత సమ్మేళన;;శత జయంతి”హిందూమత అధ్యక్షునిగా ఎంపిక చేశారు
  8-5-2015 న ప్రధాని మోడీ స్వామి చిన్మయ జన్మ దినోత్సవ స్మారక నాణెం విడుదల చేసి గౌరవించారు
   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-7-17 -కాంప్-షార్లెట్-అమెరికా .

Inline image 1Inline image 2
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వీక్లీ అమెరికా–15 (3-7-17 నుండి-9-7-17 వరకు ) గురుపూర్ణిమ ,షార్లెట్ లో సరసభారతి 104 కార్యక్రమంగా వ్యాసజయన్తి వారం

వీక్లీ అమెరికా–15 (3-7-17 నుండి-9-7-17 వరకు )

గురుపూర్ణిమ ,షార్లెట్ లో సరసభారతి 104 కార్యక్రమంగా వ్యాసజయన్తి వారం

3-7-17 సోమవారం గీర్వాణం 3 లో 365 వరకు రాశా .

4-7-17 మంగళవారం -శయన ఏకాదశి అనే తోలి ఏకాదశి పేలపిండి ప్రత్యేకప్రసాదం గా నైవేద్యం పెట్టాం . సాయంత్రం శ్రీ సుంకర అప్పారావు గారొచ్చి సాయి సచ్చరిత్ర పారాయణ చేద్దామంటే రేపటి నుంచి చేద్దామని చెప్పా .రాత్రి 11-30 వరకు కూర్చుని గీ -3 లో 372 వరకు రాశా ఇప్పటికి మూడుభాగాలు కలిపి 1000 మంది సంస్కృత కవులను గురించే రాసే అదృష్టం దక్కింది

     శ్రీ  షిర్డీ సాయి సచ్చరిత్ర పారాయణ

5-7-17 బుధవారం 6-7-17 గురువారం లలో ఉదయం ,సాయంత్రం రోజుకు 5 గంటలు చదివి 51 అధ్యాయాల 400 పేజీల శ్రీ సచ్చరిత్ర పారాయణ పూర్తి చేసాం నేనూ అప్ప్పారావుగారూ .మా అమ్మాయి ప్రసాదం చేయగా గురువారం సాయంత్రం నైవేద్యం పెట్టాం . సాయి ని పూలతో అలంకరించాము .

అప్పారావుగారు  .ఆయన ఎంతో సంతృప్తీ ఆనందం పొందారు నాకు ఇదే మొదటిపారాయణ ,ఆయన చాలా సార్లు చేసి ఉంటారు రెండు రోజుల్లో ఆయన జీవితం లో ఎప్పుడూ జరగలేదట .భలే ఖుషీ అయ్యారు .భగవత్ కృప ఉంటె కార్యాక్రమాలు అలానే జరుగుతాయని నమ్మకం .గురు వారం తో పూర్తవటం మరీ సంతోషంగా ఉంది .

  బుధవారం సాయంత్రం కారీ నుంచి మా అన్నయ్యగారి మనవడు హరి ఫోన్ చేసి వాళ్ళబ్బాయిని హాస్పిటల్ నుండి 30 వతేదీ శుక్రవారమే ఇంటికి తీసుకొచ్చామని బాగా కోలుకున్నాడని చెప్పాడు . కనుక మా కారీ ప్రయాణం దగ్గర పడిందనుకొన్నాం ..రాత్రి యు ట్యూబ్ లో భానుప్రియ ఇంటర్వ్యూ చూసాం .ఎంత కమ్మగా ,సరళంగా స్వచ్చంగానే మాట్లాడింది ప్రఖ్యాత నర్తకి సుమతీ కౌశల్ ఆమె అత్తగారట .భర్త నేషనల్ జగ్రాఫికల్ ఛానెల్ లో పనిచేస్తే ప్రపంచ ప్రసిద్ధ ఫోటోగ్రాఫర్ అట మరిది పండిట్ రవి శంకర్  గ్రూప్ లో  తబలా కళా కారుడు . స్వర్ణకమలం సినిమాలో ఆమె చెప్పిన ‘’అర్ధం చేసుకోరూ ‘’అనే డైలాగు ను ఎన్ని రకాలుగా చెప్పి కనుబొమలు మూతి తో ఎంత గొప్పగా అన్నదో  వాటిని మళ్ళీ చేసి చూపించింది మా కుటుంబానికి భానుప్రియ చాలా బాగా నచ్చిన నటి .శివాజీ గణేశన్ ఒక సభలో సావిత్రి ,పద్మిని ల నటన అంతా భానుప్రియలో ఉందని అలాంటి నటి అరుదని అన్నాడట .

   గురువారం ‘’గొట్టం ‘’లో రాజేంద్రప్రసాద్ ‘’గడుగ్గాయి ‘’సినిమా చూసాం .మొదట్లో బాగున్నా తర్వాత బోర్ .

 శుక్రవారం గీర్వాణం 3 అంతా ఒక చోటుకు తెచ్చి డెస్క్ టాప్ పై  ఉంచా . మామనవాడు శ్రీకేత్ చాలా సహాయ పడ్డాడు దీనికి .

8-7-17  శనివారం ఆషాఢపౌర్ణమి గురు పూర్ణమి అనే వ్యాసపూర్ణమి .ఇంట్లో మా మూలు గా పూజ చేశా .షార్లెట్ లో కొత్తగా కట్ట బోయే షిరిడీ సాయిబాబా గుడి ప్రాంగణం లో గురుపౌర్ణమి  సుదర్శన హోమం నిర్వహించారు .మేము వెళ్ళలేదు . కానీ ఎందుకో మనసులో ఇక్కడ గురుపౌర్ణమిగా వ్యాస జయంతి జరిపితే బాగుండు ననిపించి మధ్యాహ్నం రాంకీ కి ఫోన్ చేశా .అతడు లిఫ్ట్ చేయలేదు .సాయంత్రం 6 గంటలకు అతనే ఫోన్ చేసి ఫోన్ చేసిన కారణం అడిగితె  ఇక్కడ గురుపౌర్ణమిగా వ్యాస జయంతి జరపాలని ఉంది మీ ఇంట్లో ఒక అరగంట సేపు నాలుగురైదుగురం కూర్చుని వ్యాస మహర్షి పూజ చేసి నాలుగు ముక్కలు మాట్లాడుకొందాం .నీకు వీలైతేనే ‘’అన్నాను క్షణం కూడా ఆలోచించకుండా తప్పని సరిగా రేపు ఉదయం 10 గంటలకు మా ఇంట్లో ఏర్పాటు చేద్దాం

ప్ర సాదం(భోజనం ) కూడామా ఇంట్లోనే .ఇది మాకు దక్కిన అదృష్టం అనుకొంటున్నాము అని భార్యా భర్తలిద్దరూ చెప్పటం చాలా సంతోషమేసింది .ఒక నాలుగు కుటుంబాలవాళ్ళకు చెబుతాను అన్నాడు సరే నన్నాను . అతనే మా అమ్మాయితో అల్లుడితో మాట్లాడి విషయం చెప్పాడు .

9-7-17 ఆదివారం వ్యాసజయంతిగా షార్లెట్ లో సరసభారతి 104 వ సమావేశం

            ఉదయం 10 గంటలకు నేనూ మా అల్లుడు కలిసి రాంకీ ఇంటికి  ఉదయం 10-30 కు చేరాం .దంపతులు అప్పటికే అన్నీ తయారు చేసి రెడీగా ఉన్నారు .నేను నిన్న సాయంత్రమే రాంకీకి వ్యాసుని ఫోటో నెట్ లోనుంచి డౌన్ లోడ్ చేసి ఒక అత్తకు అంటించి ఉంచమన్నాను కానీ అతడు50 డాలర్లకు  కలర్ ఫోటో డౌన్ లోడ్ చేయించి  దానికి చక్కని  ప్రేంకూడా కట్టించి ఉంచాడు శ్రద్ధ అంటే అలావుండాలి .అప్పుడు నేను చెప్పాను ఈ కార్యక్రమాన్ని సరసభారతి 104 వ సమావేశంగా జరుపుదామని అన్నాను మంచి ఆలోచన అన్నాడు . 11 గంటలకు పవన్ కుటుంబం ,ప్రభల రామకృష్ణ కుటుంబం పేరి చంద్ర శేఖర్ కుటుంబం మా అమ్మాయి మా శ్రీమతి మనవళ్లు వచ్చారు అప్పటికే ప్లాస్టిక్ బోర్డు మీద కార్యక్రమం నాతో రాయించి రాంకీ బయట డిస్ప్లే పెట్టాడు తానూ ఈ మధ్యే ఇండియా నుంచి తెప్పించిన మహా భారతం 18 పర్వాలు రామాయణం మూడు భాగాలు దేవుడి దగ్గర చక్కగా ఏర్పాటు చేశాడు . .అప్పుడు రాంకీ దంపతులు కూర్చునిముందు  విఘ్నేశ్వర పూజ,తర్వాత విష్ణు అష్టోత్తరం తర్వాత వ్యాస అష్టోత్తర పూజ చేసి ,నైవేద్యం హారతిఇచ్చారు అనుకోకుండా చాలా బాగా జరిగింది .రాంకీ ని ముందు మాట్లాడ మన్నాను ఒక అయిదు నిమిషాలు మాట్లాడి నన్ను మాట్లాడమన్నాడు .. నేను సరసభారతి గురించి కార్యక్రమాల గురించి ముందు చెప్పివ్యాసునిపై స్తోత్రాలు చదివి వ్యాసుని గురించి వివరించా .దాని సారాంశం –

            వ్యాస అష్టోత్తర స్తోత్రం

‘’1-వేద వ్యాసో విష్ణు రూపః పరాశరార్యాస్తపోనిదిహ్ -సత్య సందహ్ ప్రశాంతస్య సత్య వాదీ సుతః

2-కృష్ణ ద్వైపాయనో దాంతో బాదరాయణ  సంజ్ఞితః -బ్రహ్మ సూత్ర ప్రథితవాన్ భగవాన్ జ్ఞాన భాస్కరః

3-సర్వ వేదాంత తత్వజ్ఞహ్ సర్వేజనా వేద మూర్తిమాన్-వేదం శాఖావ్యసన కృత కృత్యో మహా మునిహ్

4-మహా బుద్ధిర్మహాసిద్ధిర్మహా శక్తి ర్మహా ధృతిః మహా కర్మా మహా ధర్మా మహా భారత కల్పకహ్

5-మహా పురాణ క్రుజ్ఞానీ జ్ఞాన విజ్ఞాన భాజనం -చిరంజీవీ చిదాకారీ శ్చిత్త దోష నివారకః

6-వాశిష్ఠహః శక్తి పౌత్రస్య శుకదేవర్గునుర్గురుహః -ఆషాఢ పూర్ణిమా పూజ్యా పూర్ణ చంద్ర నిభాననః

7-విశ్వనాథ స్తుతికరో విశ్వజనో జగద్గురుహ్  – జితేన్ద్రియో జితక్రోధో వైరాగ్య నిరతః శుచిహ్

8-జైమిన్యాది సదాచార్యహ్ సదాచార సదాస్థితః స్థితప్రజ్ఞహ్ స్థిరమతిః సమాధి సంస్ధితారతహః

9-ప్రశాంతిదః ప్రసన్నాత్మా శంకరార్యప్రసాద కృత్ -నారాయణాత్మకః స్తవ్యహ్ సర్వ లోక హితే  రతః

10-అఛత్రవదన బ్రహ్మ ద్విభుజబర కేశవః -అఫాల లోచనశ్శివః పరబ్రహ్మ స్వరూపకః

11- బ్రహ్మన్యో   బ్రహ్మణో బ్రాహ్మీ బ్రహ్మ విద్యా విశారదః -బ్రహ్మాత్మైకత విజ్ఞాతా బ్రహ్మ భూతః సుఖాత్మకః

12-వేదాంగ భాస్కరో విద్వాన్ వేద వేదాంత పారగః -ఉపాంతరతమో నామా వేదాచారో విచారవాన్.

 వ్యాసునిపై కొన్ని ప్రత్యేక శ్లోకాలు

1-వేద వ్యాసః  స్వాత్మ రూపం సత్య  సంధం పరాయణం –  శాంతం జితేంద్రియ క్రోధం సా శిష్యం ప్రణమామ్యహం

2-వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌరుష మకల్మషం -పరాశరాత్మజం వన్డే శుక తాతం తపోనిధిమ్

3-వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే -నమో వై బ్రహ్మ నిధ్యాయ వాసిష్టాయ నమోనమః

4-అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే -సదైక రూప రూపాయ విష్ణవే సర్వ జిష్ణవే

5-వ్యాస స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే -నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే

            పరాశర స్తుతి

6-కరుణాతీత చిద్రూపం పరి పూర్ణ పరాయణం – పరమానంద సంతుష్టం పరాశర మొహం శ్రయే

              శుక స్తుతి

7-త్రికాలాతీత చిన్మాత్ర ప్రశాంత స్వా0త సంయుతం -వికార ఘోర సంస్కృష్టం శుకం గురు మొహం శ్రయే

శంకరాచార్య  స్తుతి

8–శంకా   రూపేణ మచ్చిత్తం పంకీకృత మాభూద్యేయా -కింకరీ  యస్య సా మాయా శంకరాచార్య మాశ్రయే

భావం -మాయ అందర్నీ కప్పి ఆడిస్తుంది .మనసు బుద్ధిలలో కల్లోలాలు తుఫాన్లు సృష్టిస్తుంది .అలాంటి మాయను కింకరి అంటే సేవకురాలినిగా చేసుకొన్నశంకరాచార్యులు ప్రణామం .

           వేద వ్యాస చరిత్ర

నేపాల్ దేశం లో తానాహుజిల్లా ‘’దమౌళీ ‘’లో వ్యాసుడు తపస్సు చేసి బ్రహ్మ సూత్రాలు పురాణాలు  వేద విభజన చేసిన గుహ ఉంది అది గొప్ప యాత్రాస్థలం .విష్ణు మూర్తి యొక్క ‘’కాలావతారం ‘’వ్యాసుడు .చిరంజీవులలో ఒకడు .అద్వైత ఋషిపరంపరలో నాల్గవవాడు .ప్రతి యుగం లో ఒక వ్యాసుడు పుడతాడు .వ్యాసుడు అనేది ఒక అధికారం .ద్వాపరం లో కృష్ణ ద్వైపాయనుడు లేక బాదరాయణుడు వ్యాసుడయ్యాడు .వ్యాస పరంపరలో 28 వ వాడు .మొదటి ద్వాపరం లో స్వాయంభువు వ్యాసుడు అయ్యాడు .రెండవ ద్వాపరం లో ప్రజాపతి వ్యాసుడు .మూడవదానిలో శుక్రుడు వ్యాసుడు .ఆతర్వాత వసిష్ఠుడు ,త్రివర్షుడు ,సనద్వాజుడు వగైరా 27 మంది వ్యాసులు అయ్యాక ద్వాపరం లో కృష్ణ ద్వైపాయనుడు వ్యాసుడు అయ్యాడు .

 విష్ణు మూర్తి నాభికమలం నుంచి బ్రహ్మ పుట్టి నాలుగు ముఖాలనుండి నాలుగు వేదాలను ప్రసరింప జేయాలనుకొన్నప్పుడు విష్ణువు మనసులో తలచుకోగానే ‘’అపాంతర తముడు ‘’జన్మించాడు .పుత్రోత్సాహం తో నారాయణ మూర్తి ‘’వ్యాసా !రా నాయనా !నా మానస పుత్రుడివిగా పుట్టి  నాకు ఆనందాన్నిచ్చావు .అన్ని మన్వంతరాలలోనూ ఇలానే జన్మించు .తర్వాత పరాశర కుమారునిగా పుట్టి ,కురురాజుల అధర్మ క్రూర హింసా దౌర్జన్యాలను అదుపు చేసి ,వేదాన్ని వ్యాపకం చెయ్యి .నీకు రాగద్వేష రహితుడైన కొడుకు పుట్టి నిన్ను మించిపోతాడు ‘’అన్నాడు .రాబోయే సూర్య సావర్ణికాలం లో వ్యాసుడు సప్తర్షులలో ఒకడు అవుతాడు . .

కృష్ణ ద్వైపాయన వ్యాస జననం

లోకోద్ధరణకోసం నారాయణుడు కొన్ని ధర్మాలు ఏర్పాటు చేశాడు కాలక్రమంలో అవి లోపించాయి .బ్రహ్మ రుద్రా ఇంద్రాది దేవతలు విష్ణుమూర్తిని దర్శించి ధర్మ  పునరుద్ధరణ చేయమని ప్రార్ధించగా మూడవదైన ద్వాపర యుగం లో పరాశార సత్యవతి దంపతులకు ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడునారాయణుడు వ్యాసభగవానుడుగా అవతరించాడు ..ఒక రోజు వ్యాసుడు సరస్వతీ నదిలో స్నానం చేసి తపోధ్యానాలు పూర్తి చేసి ఏకాంతం లో ఆసీనుడై దివ్య దృష్టితో యుగ విశేషాలను తెలుసుకున్నాడు .కాల ప్రభావాన భౌతిక భావనలు అంటే శక్తులు తగ్గుతున్నాయని గ్రహించాడు .శ్రద్ధ బలం ఆయుస్సు తగ్గి దౌర్బల్యం పెరిగి నట్లు గుర్తించాడు అన్ని వర్ణాలవారికి ఉపయోగ పడేట్లు వైదిక కర్మలను పరీక్షించి యజ్ఞ విస్తరణకు ఒక్కటిగా ఉన్న వేదాన్ని నాలుగుగా విభజించాడు .పంచమ వేదంగా మహా భారతం రచించాడు .పైలుడికి ఋగ్వేదం ,వైశంపాయుడికి యజుర్వేదం జైమినికి సామం ,సుమంతునికి అదర్వణం ఉప దేశించాడు .ఇతిహాస పురాణం అనే పంచమ వేదం భారతాన్ని రోమ హర్షుడు అనే సూతమునికి  చెప్పాడు .వీరంతా తమ శిష్యులకు బోధిస్తే వారు వారి శిష్యులకు ఉపదేశించగా అనేకశాఖలయ్యాయి .

 కొంచెం బుద్ధి తక్కువ గా ఉన్నవారికి ఉపాఖ్యాన కదా రూపం గా మహా భారతం రాశాడు దీనిలో ధర్మం సంస్కృతీ మొదలైన విషయాలన్నీ చెప్పాడు వ్యాసుడు .ద్వాపరాంతం లో వచ్చే కలియుగం లోవచ్చేఅనర్దాలు,ఆపద గ్రహించటానికి భారత రచన చేశాడు .అన్ని వర్ణాలవారు జాతులవారు  లింగ వయో భేదం లేకుండా ఆచరించదగిన  ధర్మాలు  ధర్మ సూక్ష్మాలు చిన్న చిన్న కధలలో చెప్పాడు

  దీనితో తృప్తిపడక జ్ఞానులకు పరబ్రహ్మ స్వరూపం తెలుసుకోవటానికి 545 బ్రహ్మ సూత్రాలు రాశాడు దీనికి శంకరాచార్య భాష్యం రాశారు ..అష్టాదశ అంటే 18 పురాణాలు రచించాడు. వేదానికి అంతాలైన ఉపనిషత్తులు రాశాడువీటిలో దశోపనిషత్తులకు శంకర భాష్యం ఉంది . అంతా బాగానే ఉంది కానీ సర్వ వ్యాపకుడైన పరమేశ్వరుడి గురించి భక్తి తాత్పర్యాలతో రాయలేక పోయానని చింతి స్తుంటే నారద ముని హితోపదేశం తో శ్రీ విష్ణు లీలామృతమైన శ్రీ మద్ భాగవతం రాశాడు ..దీన్ని పోతనామాత్యుడు మందార మకరంద తుందిలంగా తెలుగులోకి అనువదించాడు .భారతాన్ని నన్నయ తిక్కన ఎర్రనలనే కవిత్రయం అనువదించారు ..ఇవన్నీ లోక శ్రేయస్సుకోసం రాయబడినవే .భారతం హరివంశం కలిపి 1 లక్షా 25 వేలు పురాణాల్లో 5 లక్షల శ్లోకాలు మొత్తం 6 లక్షల 25 వేళా శ్లోకాలు రాశాడు భగవాన్ వేదం వ్యాసుడు .. భారతం చివరలో వ్యాసుడు  -’’యదాహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి సతత్  క్వచిత్ ‘’ అని ఒక ప్రతిజ్ఞ చేశాడు-అంటే ‘’భరతం లో లేనిది ఎక్కడా ఉండదు -ఇందులో లేనిది ఇంకెక్కడా ఉండదు ‘’శాంతి ఆనుశాశానిక స్వర్గా రోహణ పర్వతాలలో 26 వేల  శ్లోకాలలో  రాజనీతి ,ఆపద్ధర్మాలు ,దాన0  ధర్మం ,మోక్షప్రాప్తి,స్త్రీ ధర్మాలు వివవిడి విడిగా చెప్పాడు .అంటే పాత్రలచేత చెప్పించాడు .భారతం లోని పాత్రలు మనమే మన ఇళ్లల్లో జరిగే కథయే భారత కధ ..

 ఇన్ని ఇన్ని రకాలుగా చెప్పినా పెడ  చెవిని పెట్టి వారిని చూసి జాలితో బాధతో వ్యధతో ‘’ఊర్ధ్వ బాహుహ్ విరోమ్యేష నహి కశ్చిత్ శృణోతిమే -పరోపకారాయ పుణ్యాయ ,పాపాయి పర పీడనం ‘’అని చేతు  లెత్తి మొక్కాడు -అంటే ‘’ఇతరులకు మేలు చేస్తే పుణ్యం -ఇతరులను బాధిస్తే పాపం  ‘’అని చేతులు పైకెత్తి నెత్తీ నోరూ మొత్తుకున్నా నా మాట ఎవరూ వినటం లేదే ‘’అని పరితపించాడు  ఆ విశాల దయార్ద్ర హృదయుడు వ్యాస భగవానుడు .

భారతం లో వ్యాస పాత్ర

 భారత రచన చేయటమేకాక అందులో తానూ పాత్రధారియే వ్యాసుడు .తల్లికిచ్చిన మాటకోసం కురు వంశాన్ని నిలపటానికి పాండవ ధృతరాష్ట్ర విదురులకు జన్మ నిచ్చాడు .అవసరమైనప్పుడు రంగ ప్రవేశం చేసి ధర్మ సూక్ష్మాలు  చెప్పాడు అర్జునుడు మత్శ్య యంత్రాన్ని భేదించి ద్రౌపదిని దక్కించుకొంటే ధర్మరాజు ఆమె సోదరులందరికి భార్య  అవ్వాలంటే ద్రుపదుడు వ్యాసుడిని తలచుకొంటే వచ్చి ఆమె సామాన్య మానవ స్త్రీ కాదు అయోనిజ యాజ్ఞ సేనీ  కనుక పంచ భర్త్రుక అవటం లో తప్పు లేదని తీర్పు చెప్పాడు .వనవాసం లో పాండవులు కస్టాలు పడుతూ ప్రార్ధిస్తే ‘’మీకే కాదు కస్టాలు మీ ముందు నలమహారాజు దమయంతి ఎన్నో కష్టాలుపడి చివరికి సుఖపడ్డారని ఆ కద చెప్పి ఊరట కలిగిచాడు .అర్జుడిని శివుని మెప్పించి పాశుపతాస్త్రం సాధించామని సలహా ఇచ్చాడు .కురుపాండ బలాలను బేరీజు వేసి చెప్పమని గుడ్డిరాజు కోరితే ధర్మ0  కృష్ణ రూపం లో పాండవుల వద్ద ఉంది ధర్మం ఉన్న చోట విజయం తప్పదు అని నిష్కర్షగా చెప్పాడు ..కురుక్షేత్ర సంగ్రామం ముందు వచ్చి ‘’నువ్వు తెచ్చిన యుద్ధం యెంత అనర్ధాన్ని తెస్తోందో చాడాలని ఉంటె కళ్ళు ఇస్తానంటాడు .చేసిన తప్పు తెలుసుకనుక తాను ఆ భీభత్సాన్ని చూసి తట్టుకోలేను అంటే సూతుడికి దివ్య ద్రుష్టి ప్రసాదించి యుద్ధాన్ని ప్రత్యక్ష ప్రసారం గా చూసి గుడ్డిరాజుకు  చెప్పించాడు  .

అశ్వత్ధామ కృష్ణార్జునులపై నారాయణాస్త్రం సాధించగా వారిద్దరో దానికి నంస్కరించగానే అది నిర్వీర్యమై పొతే ,కారణం తెలీక జుట్టు పీక్కొని వ్యాసుని స్మరిస్తే వచ్చి ‘’మీ మీ శివ పూజా ఫలితం ఇది .వాళ్లిద్దరూ పూర్వ జన్మలో శివుడిని మట్టి లింగంగా చేసి ఆరాధిస్తే నువ్వు విగ్రహ రూపం లో పూజించావు .  లింగా రాధన సర్వ శ్రేయస్కరం అది వారిని కాపాడింది ‘’అని ధర్మ సూక్షం చెప్పాడు .వ్యాసునికి ఆంద్ర దేశానికీ సంబంధం ఉంది .ఏడు రోజులు కాశీలో వ్యాసునికి శిష్యులకు భోజనం దొరక్కపోతే కోపం తో కాశీని శపించాలని సంకల్పించి భిక్షా పాత్రను నేలమీద శతధా భిన్నం ఎట్లు పగలకొడితే ముదుసలి సాధ్వీరూపం లో పార్వతీదేవి వచ్చి విందుకు ఆహ్వానించి కమ్మని భోజనం పెడితే అప్పుడు శివపార్వతులు వారి వద్ద ప్రత్యక్షమవగా శివుడు కోపం తో ‘’పుణ్యరాశి కాశీ పైశాపం పెడతావా పొమ్ము నిర్భాగ్య మా యూరి పొలము విడిచి ‘’అని కాశీనుంచి గెంటేస్తే బ్రతిమాలితే దక్షిణకాశి దాక్షారామం వెళ్లి భీమేశ్వర సేవలో తరించామని చెబితే విధవ లేక విధవ లేక ద్రాక్షారామ చేరగా అక్కడ అగస్త్య మహర్షి ఊరట కలిగిస్తాడు .బాసర సరస్వతీ ఆలయంమనకు తెలుసు.  వ్యాస బాసర అయింది

  అలాగే కాశ్మీర్లో ప్రవహించే బియాస్ నది అంటే వ్యాస నది అని అర్ధం . ఇలా ప్రకృతితో మమేక ఆమినవాడు వ్యాసుడు .

  రెండు చిలుకలు సంసార0 చేస్తుంటే ముచ్చటపడి తనకు ఒక కొడుకు కావాలనుకొని హిమాలయాలకు వెళ్లి’’శక్తిని గూర్చి  తీవ్ర ఆతపస్సు చెస్తే ,తపోభ0 గానికి వచ్చిన ఘృతాచి అనే అప్సరస చేసిన ప్రయత్నాలు ఫలించక చిలుక రూపం లో వస్తే రేతస్కలనం జరిగి పుట్టిన కుమారుడే శుకమహర్షి ఆయన మూతి చిలక మూతిలాగా ఉంటుందంటారు .పుట్టగానే సకలశాస్త్రాలు వచ్చేశాయి జనకమహా రాజు  వద్ద బ్రహ్మ విద్య నేర్చాడు . పరీక్షిత్తుకు ఏడు రోజులలో మహా భారత కదా అంతా  చెప్పాడు శుకమహర్షి . నిరీహుడు నిస్సంగుడు శుకుడు . తండ్రి పరాశరుని పేరా పరాశర సంహిత ఉంది .ఆంజనేయ చరిత్ర అంతా అందులో ఉంటుంది .

  ఇంతటి జ్ఞానాన్ని ధర్మాలను నీతులను అక్షరరూపం గా ప్రసాదించిన భారత జాతి వ్యాసభగవానునికి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలదు  కనీసం వ్యాస పూర్ణిమ నాడైనా ఆ గురుమహారాజు ను స్మరిద్దాం .ఇలాంటి అరుదైన అవకాశం అమెరికాలో షార్లెట్ లో సరసభారతి 104 వ సమావేశంగా వ్యాస జయంతిని తమ ఇంట్లో  జరిపించిన  రాంకీ  ఉషా ద0పతులకు ,ఆసక్తిగా వచ్చి పాల్గొన్న వారందరికీ సరసభారతి ధన్యవాదాలు తెలియ జేస్తోంది .ప్రతి సంవత్సరం మా అమ్మాయి శ్రీమతి  విజయ లక్ష్మి  అల్లుడు శ్రీ అవధాని శంకర జయంతి జరుపుతున్నట్లే వ్యాస జయంతి ని గురుపౌర్ణమిగా నిర్వహించాలని ఈ దంపతులను కోరుతున్నాను ‘’

 అని చెప్పి ఇక్కడ భారతీయ సంస్కృతిని ఆచరిస్తూ నిలబెడుతున్న చి అడుసుమిల్లి రామకృష్ణ(రాంకీ ) కు సరసభారతి ఆనందంగా ‘’సంస్కృతీ ప్రదీపక  ‘’బిరుదు ప్రదానం చేస్తున్నానని  అనగానే అందరు హర్ష ధ్వానాలతో చప్పట్లు మోగించారు .సరసభారతి గ్రంధం ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 (రెండవ భాగం ) రాంకీ దంపతులకు మా ద0పతులం కానుకగా అంద  జేశాము . మంత్ర పుష్పం తో కార్యక్రమం పూర్తయింది .

  ఆ తర్వాత పప్పు ,వంకాయ కూర చిక్కుడుకాయకూర కాబేజీ కూర టమేటా చట్నీ ,స్వీ టు ,పులిహోర ,బజ్జీలు అప్పడ0 , మజ్జిగ పులుసు ,చారు పెరుగు పల్లముక్కలతో   కమ్మని భోజనం ఏర్పాటు చేశారు అందరం తృప్తిగా తిని ఆనందించాం  .మా దంపతులకు రాంకీ దంపతులు నూతన వస్త్రాలు సమర్పించి ‘’ఘనమైన నగదు ‘’తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం పొందారు . ఇలా సుమారు 15 గంటల వ్యవధిలో సరసభారతి 104 వ కార్యక్రమంగా వ్యాస జయంతి ని అమెరికాలోని షార్లెట్ లో జరిపి అందరి సహకారం తో రికార్డ్ సృష్టించింది ..ఈవారం  వార్తలు ఇంతటితో సమాప్తం .

 మీ గబ్బిట దుర్గాప్రసాద్ -9-7-17-కాంప్-షార్లెట్-అమెరికా

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 376— చతుర్వర్గ చింతామణి  కర్త -హేమాద్రి పంత్ (1259-1274)

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3

376— చతుర్వర్గ చింతామణి  కర్త -హేమాద్రి పంత్ (1259-1274)

దేవగిరి యాదవ రాజ మంత్రి హేమాద్రి లేక హేమాద్రి పంత్ .కరణాధిపుడు అని పిలుస్తారు . 1263 లో పండరీపురం లోని పాండురంగ విఠల దేవాలయ నిర్మాణం లో హేమాద్రి భూరి విరాళమండించినట్లు శిలాఫలకం ఉంది .గొప్ప పరిపాలనా దక్షుడేకాక సంస్కృత కావ్యాలు కూడా రాశాడు .ఆయన సంస్కృత రచన ”చతుర్వర్గ చింతామణి ”లో అనేక వ్రతాలు నోములు వాటిని ఆచరించే విధానాలు అన్నీ సవివరంగా ఉన్నాయి .ఇదికాక ”మోడీ లిపి ”ని తయారు చేసి ప్రచారం లోకి తెచ్చాడు .1 272 వరకు దేవ గిరిరాజు రామచంద్ర దేవ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు .మరాఠీ భాషపైనా గొప్ప అభిమానం ఉన్నవాడు .ఆభాషలోనూ రచనలు చేశాడు .ఆయన మత సహనం మెచ్చదగినది జైనమతానికీ సహాయం చేశాడు అనేక దేవాలయాలు నిర్మించాడు .అయన శిల్ప శాస్త్రం లో ప్రావీణ్యుడు ఆయన తన ధై న శైలిలో నిర్మించిన ఆలయాలను ”హేమాద్రి దేవాలయాలు ”అంటారు .దక్షిణ భారత దేశం లో హేమాద్రి వందలాది ఆలయాలు కట్టించాడు .చతుర్వర్గ చింతామణి లో దేవాలయ రకాలు విగ్రహాల రకాల వివరాలన్నీ పొందు పరచాడు పంత్ .ఆయన గ్రంధాలు శిల్పాలు దేవాలయాలు ఆయన సంస్కృతీ మూర్తిమత్వానికి ప్రతీకలుగా నిలిచాయి 
  కర్ణాటకల దక్షిణ కన్నడ జిల్లా  హేమాద్రి గ్రామం లో బ్రాహ్మణ కుటుంబం లో హేమాద్రి జన్మించాడు .శుక్ల యజుర్వేదీ శ్రీ వత్సగోత్రీకుడు  పఞ్చార్షి ప్రవరుడు .. తండ్రి కామదేవుడు బాలుని బాల్యం లోనే మహారాష్ట్రకు చేరాడు .సంస్కృత మహా  విద్వా0సుడు  శిల్ప శాస్త్రవేత్త .యాదవ మహాదేవ రాజు ,రామ చంద్ర దేవా రాజుల ఆస్థాన మంత్రిగా గొప్ప చాకచక్యం సమర్ధత తో రాచకార్యాలు నిర్వహించాడు .అయన మంత్రిత్వ లో రాజ్యం సుభిక్షమే కాక అన్ని విధాలా అగ్రస్థానం లో నిలిచి చరిత్ర సృష్టించింది .హేమాద్రి పదవీ విరమణ తర్వాత ఢిల్లీ రాజు అల్లాఉద్దీన్ ఖిల్జీ  ఈ రాజ్యాన్ని ఆక్రమించి యాదవరాజ్య వినాశనం చేశాడు 
  హేమాద్రి పంత్ ”ఆయుర్వేద రసాయనం ”అష్టాంగ హృదయం ”అనే ఆయుర్వేద గ్రంధాలు రాసి అనేక వ్యాధులు వాటి చికిత్సావిధానాలు తెలిపాడు .ఆయన జీవిత చరిత్రపై ”హేమాద్రి పంత్ బఖార్ ”వ్రాయబడింది .రాజ్య పాలనా సౌకర్యం కోసం రాజ్యాన్ని ”మేస్ట కాలు  ”గా ఏర్పాటు చేశాడు 
  మరాఠీ భాషను సంస్కరించి పరిపాలనలో మోడీ లిపి ”ని ప్రవేశ పెట్టాడు
మహారాష్ట్రలో వర్షాధార పంటగా ”పెర్ల్ మిల్లెట్ ”సజ్జ పంట ను పండించే కృషి చేశాడు
మహా రాష్ట్రలో శ్రీ మహా లక్ష్మి అమ్మవారి ఆరాధనకు విశేషప్రాచుర్యం తెచ్చాడు .ఎందరో కవులకు కళాకారులకు ఆశ్రయం కల్పించి వారి సృజనకు ప్రోత్సాహమిచ్చి సత్కరించాడు .బోపదేవ కవిని సన్మానించి అయన రచనలపై చక్కని వ్యాఖ్యానం రాసి ప్రచారం కలిగించాడు . 
  హేమాద్రిపంత్ నే రఘునాధ దండో ల్కర్  అనీ అంటారు ఈయన షిరిడి సాయిబాబా భక్తుడు ఆయన జీవితం పై శ్రీ షిరిడీ బాబా సచ్చరిత్ర ”మరాఠీ భాషలో రాశాడు ఇది ఇవాళ చాలా సాధికార గ్రంధం .అన్నిభాషలలోకి అనువాదం పొంది సాయి సచ్చరిత్ర పారాయణ గ్రంథమైంది .ఇందులో సాయిబాబా జన్మ కాలాన్ని హేమాద్రి 1838 గా నిర్ణయించాడు .బాబా గురువు వద్ద 12 ఏళ్ళు ఉన్నాడని ఆగురువుపేరు  ”వేణూక్ష’లేక సెలుకు చెందిన సూఫీ  ఫకీర్ గోపాల్ రావు దేశ్ ముఖ్ కావచ్చు నని చెప్పాడు . 1854లో షిరిడీలో ఒక వేప  చెట్టు కింద కూర్చుని ఉండగా మొదటిసారిగా అందరూ బాబాను చూశారని తెలియజేశాడు .మిగిలినవన్నీ మనకు తెలిసిన విషయాలే

377-పంచ రత్న గీత కర్త -స్వామి సత్యానందం సరస్వతి (1923-2009 )
వేద శాస్త్రాలలో అఖండ పాండిత్యం సాధించిన స్వామి స త్యానంద సరస్వతి దేశం లో ప్రముఖ సంస్కృత  విద్వా0సులు ,60 కి పైగా సంస్కృతం తో సహా పలుభాషలలో రచనలు చేశారు .హిందూ ధర్మ రక్షణకు కంకణం కట్టుకొన్న మహానుభావులు .గురువు నుండి 1971లో దీక్ష పొంది వేదం విజ్ఞానాన్ని  సంస్కృతం చండీ పథం లను గురువుశివానంద సరస్వతి ”డివైన్ లైఫ్ సొసైటీ ”లో చేరి  శ్రీ అమృతానంద సరస్వతి నుండి పొందారు  . 
  హిమాలయాలలోని బాక్రేశ్వర్ వద్ద  మంచుకాలం లో  వేసవిలో దేన్నీ లెక్క చేయకుండా    చండీ పథం  కంఠస్థం చేశారు .హిమాలయ పర్వత శ్రేణువులలో 15 సంవత్సరాలు ఆ చివరనుంచి ఈ చివర వరకు ఆయన తిరగని ప్రదేశమే లేదు .సంస్కృతం పై ప్రత్యేక ఆరాధన ఏర్పడి దాన్ని ఆమూలాగ్రం నేర్చి బెంగాల్ ,హిందీలలో కూడా ప్రావీణ్యం సాధించారు .శ్రీ రామ కృష్ణ పరమహంస బోధలు అధ్యయనం చేసి ప్రచారం చేశారు .1 979 లో శారదా మాత ను సందర్శించారు .దేశ మంటా పర్యటిస్తూ పూజలు హోమాలు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తూ ప్రజలకు మార్గ దర్శి అయ్యారు 
  1984 లో అమెరికా వచ్చి ”మాతృ మందిర్ ”స్థాపించి నఫా ,కాలిఫోర్నియాలలో బాగా ప్రచారం చేశారు . పంచ రత్నాలు అంటే గీతా మహాత్మ్యం విష్ణు సహస్రనామ స్తోత్రం  భీష్మ స్తవం ,అనుస్మృతి ,గజేంద్ర మోక్షం .వీటిలోని భావార్ధాలను చక్కడా వివరించి చెప్పారు ;
   సశేషం 
   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-7-17 -కాంప్-షార్లెట్ -అమెరికా 
 
 
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో శాకాంబరీ పూజ 

శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో శాకాంబరీ పూజ

— 19-7-17 మంగళవారంఉదయం 9 గంటలకు  ఉయ్యూరు లో శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారి దేవాలయం లో స్వామివార్లకు శాకాంబరీ పూజ (కాయగూరలతోపూజ )నిర్వహిస్తున్నాము భక్తులు పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన .

                                                        గబ్బిట దుర్గా ప్రసాద్ -ధర్మకర్త

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 373-హర్యానా లోని ఇన్ ష్టి ట్యూట్ ఆఫ్ సాన్ స్క్రిట్  అండ్ మైథలాజికల్ స్టడీస్  వారి ఆధ్వర్యం లో వెలువడిన సంస్కృత గ్రంధాలు –

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3

373-హర్యానా లోని ఇన్ ష్టి ట్యూట్ ఆఫ్ సాన్ స్క్రిట్  అండ్ మైథలాజికల్ స్టడీస్  వారి ఆధ్వర్యం లో వెలువడిన సంస్కృత గ్రంధాలు –

1-శ్రీ దిగ్వే కర్ యాచించిన -కురుక్షేత్ర మాహాత్మ్యం 2-నాగేశభట్టు రాసిన -పరమ లఘుమంజరి 3-డా జి ఏం భట్టాచార్య రాసిన మేఘ దూత టీకా 4-నారాయణ తీర్థుల -కుసుమాంజలికారికా వ్యాఖ్య 5-రాజానక ఆనందకవి కృత-ష్తత్రి0శత్తత్వ సందోహ 6-డా కపిల్ దేవ శాస్త్రి రచన -గాణాపత్య 7-డా బల్దేవ్ సింగ్ కృత -పాదపదార్ధ సమీక్ష 8-ధర్మోత్తర వ్యాఖ్యతో న్యాయబిందు 9-డా ఎస్ యెన్ శాస్త్రి రాసిన -దయానంద దర్శన 10-డా ఎస్ యెన్ శాస్త్రి కృత -వేదం ప్రామాణ్య తదా ఋషి దయానంద

374-ఘెరండ  సంహిత కర్త -ఘెరండుడు (17 వ శతాబ్దం )

హఠ  యోగం పై ఉన్న మూడు ప్రసిద్ధ గ్రంధాలలో ‘’ఘెరండ సంహిత ‘’ఒకటి మిగిలిన రెండు హఠ యోగ ప్రదీపిక ,శివ  సంహితలు ,ఘెరండుడు చంద్ర కాపాలికి బోధించిన హఠ యోగం ఇది . 17 వశతాబ్దికి ఈ చెందిన ఈ గ్రంధం హఠయోగానికి విజ్ఞాన సర్వస్వము .దీనిలో సప్త విధ యోగాలు చెప్పబడినాయి 1-శతికర్మ -బాహ్యాభ్యంతర శుచికి 2-ఆసన -బలానికి 3-ముద్ర -నిశ్చలత్వానికి 4-ప్రత్యాహార -ప్రశాంతికి 5-ప్రాణాయామ -తేలిక కు 6-ధ్యాన దర్శనానికి 7-సమాధి -తాదాత్మ్యానికి చెప్పబడ్డాయి .ఇది ‘’ఘటస్థ యోగం ‘’కు చెందినదిగా కూడా భావిస్తారు .సమాధి ప్రకరణం లో పతంజలి చెప్పినదానికంటే అనేక పద్ధతులు దీనిలో చెప్పబడ్డాయి -ఒక శ్లోకం –

‘’అద్యశ్య సేతే పద యుగ్మ వ్యస్తం పృష్టే  నిధియాపి ధృతం కరాభ్యాం -ఆకుంచ  సంయ ద్యుదరాస్తు గాఢం ఉష్టం ఉచ్ఛం చ పీఠం యాతాయో వదంతి ‘’(ఉష్ట్రా సన వర్ణన  )భావం -ముఖం కిందకు వంచి రెండుకాళ్లు వెనక్కిమడిచి ,పాదాలను చేతులతోపట్టుకొని పొట్ట .మూతి అక్కలిస్తే ఉష్ట్రాసనం

375-శివ సంహిత -అజ్ఞాత కవి  (17 వశతాబ్దం )

హఠ యోగం పై మరోగ్రంధమే శివ సంహిత శివుడు పార్వతికి తంత్ర శాస్త్రాన్ని గురించి బోధించిన గ్రంధం .1 7 వశతాబ్దిలో దీన్ని వారణాసిలో  ఒక అజ్ఞాత కవి రాసినట్లు దీని పై డి ఫిల్  పరిశోధన రాసిన డా మాలిన్సన్ అభిప్రాయపడ్డాడు.దీన్ని తంత్ర శాస్త్రమని కవి చెప్పాడు .ఇందులో 84 ఆసనాలు చెప్పబడ్డాయి .కానీ అయిదింటినిమాత్రమే పూర్తిగా వివరించి చెప్పాడు .సామాన్య గృస్తహుకూడా దీన్ని అభ్యాసం చేయచ్చు అనికవి భరోసా ఇచ్చాడు  అనేక ఆంగ్లానువాదాలున్నాయికానీ 1884 లో లాహోర్ కు చెందిన శ్రీ చంద్ర వాసు అనువాదం పరిపుష్ఠిగా ఉందని విశ్లేషకులు భావిస్తారు .ఒక శ్లోకం చూద్దాం –

‘’ఏకం జ్ఞానం నిత్య  మాధ్యంత  శూన్యం  కిఞ్చిద్వత్తే తే వస్తు సత్యం -యద్దేవారి మన్నింద్రి యోపాధినా వై జ్ఞానస్యాయ భాసతే నాణ్య యైవ ‘’-భావం -జ్ఞానమొకటే శాశ్వత0 అది ఆద్యన్తరహితం .సత్యమైనది వేరొకటి లేదు ప్రపంచం లో మనం చేసే వైవిధ్యం ఇంద్రియ సంబంధమైనడది .ఈ భావం నశిస్తే ఉన్నదొక్కటే సత్యమనే  జ్ఞాన0

2-సత్యం కేచిత్ ప్రశంసంతి తపః శోచం తథాపరే -క్షమాం కేచిత్ప్రశంసంతితథైవ సమ్మార్జనం ‘’

భావం – కొందరు సత్యాన్ని కొంద రు స్వచ్ఛతను   మరికొందరు సన్యాసాన్ని పొగుడుతారు .కొందరు క్షమను కొందరు సమానత్వాన్ని రుజుత్వాన్ని పొగుడుతారు

375-హఠ  యోగ ప్రదీపిక కర్త –స్వామి స్వాత్మా రామ్ (15 శతాబ్దం)

స్వామి గోరఖ్ నాధ్(శ్రీనాధ్ ) శిష్యుడు స్వామి స్వాత్మారాం 15 వ శతాబ్దం లో హఠ  యోగ ప్రదీపిక రాశాడు .హఠ  యోగం పై ఇదే మొదటి గ్రంధం .దీనిలో భౌతిక ఆంతరిక శుద్ధి వివరించాడు .ఆసన ,ప్రాణాయామాలపై ఎక్కువ దృష్టిపెట్టాడు .దీనికి ఆంగ్లం లో పంచన్  సిన్హా చక్కని వ్యాఖ్య రాశాడు .

‘ఆసనాలపై చెప్పిన మొదటి శ్లోకం ‘’శ్రీ ఆదినాధాయ నమోస్తు తస్యై ఏనాపాదిస్టా హఠ యోగ క్రియా – విభ్రాజతే  పరే న్నత  రాజయోగం ఆరో ఆరో ధుమి చ చ్చోరాది రోహిణీవ ‘’

భావం -హఠ యోగ విజ్ఞానాన్ని వ్యాప్తి చేసిన ఆది దేవుడైన శివునికి ప్రణామం .ఇది రాజయోగాన్ని అధిరోహించటానికి మెట్టుగా తోడ్పడుతుంది

‘’ప్రణమ్య శ్రీ గురుం నాదం స్వాత్మా రామేణ యోగినా -కేవలం రాజ యోగాయ  హఠ విద్యో పాదిశ్యతే ‘’

 భావం –  స్వాత్మానంద యోగి గురువైన శ్రీనాధునికి నమస్కరించి రాజయోగ మార్గాన్ని దారి చూపే హఠ యోగాన్ని రాస్తున్నాడు ..

  సశేషం

 మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -6-7-17- కాంప్-షార్లెట్- అమెరికా


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవులకవితా గీర్వాణం -3 368-ధనుర్వేద కర్త -సారంగధర (15 వ శతాబ్దం )

గీర్వాణ కవులకవితా గీర్వాణం -3

368-ధనుర్వేద కర్త -సారంగధర (15 వ శతాబ్దం )

15 వ శతాబ్దం లో సారంగధరుడు రాసిన బృహత్ సారంగధర పధ్ధతి లో ధనుర్వేద విషయాలున్నాయి .దీన్ని ఇంగ్లిష్ లోకి పీటర్ పియర్సన్ అనువదించి 1888 లో బాంబే ప్రెస్ లో ప్రచురించాడు . దీన్ని గురించి కవి ఇలా చెప్పాడు -’’పరమ శివుడు వ్యాసమహర్షికి బోధించిన ధనుర్వేదం నుండి నేను సంగ్రహించి దీన్ని రాస్తున్నాను .సారంగధారుడనే నేను తప్ప ప్రపంచం లో ధనుర్వేదం లో  ప్రావీణ్యం ఉన్నవారులేరు .  కారణం నాకు శివుడు బోధించాడుకనుక .ఇందులోని విషయాలు శక్తి సమర్థులైన  దనుషుకుడైన చింతామణి చెప్పిన విషయాలను చూసి దీనిపై ఎవరికీ సందేహాలు ఉండాల్సిన పని లేదు .విలుకాండ్రు శ్రద్ధగా నేను చెప్పినట్లు సాధన చేసి మహా ధనుష్కులు కావాలి .సింహం గుహలో ఉంటేనే అరణ్యం లోని జంతువులు వణికి దగ్గరకు రానట్లు  మంచి విలువిద్యా వేత్త ఉన్న ఊరిలో కి శత్రువులెవరూ ప్రవేశించే సాహసం చేయరు .శిష్యుల గుణ పరీక్ష చేసి గురువు ఈ విద్య నేర్పాలి .బ్రాహ్మణ శిష్యుడికి ధనుస్సు క్షత్రియునికి ఖడ్గం ,వైశ్యునికి బల్లెం ,శూద్రునికి గదలలో గురువు శిక్షణ నివ్వాలి .బాహుయుద్ధం 7 రకాలు .వీటిని ధనస్సు ,చక్రం, బల్లెం గద,ఖడ్గం చురిక  చివరికి చేతులతో యుద్ధం చేయాలి .వీటన్నిటిలో ప్రావీణ్యం ఉన్నవాడిని ‘’సప్త యోధుడు ‘’అంటారు .నాల్గింటిలో శక్తిఉంటే ‘’భార్గవ ‘’అని రెండు మాత్రమే నేరిస్తే ‘’యోధ  ‘’ అని ఒక్కటే నేరిస్తే ‘’గణక ‘’అనీ అంటారు .హస్త ,పునర్వసు ,పుష్యమి ,రోహిణి ,ఉత్తర ,అనూరాధ అశ్విని రేవతి నక్షత్రాలలోను దశమినాడు  పుట్టినవారు విలువిద్య లో నేర్పరులౌతారు .ధనుర్విద్య నేర్చుకొనే ముందు గురువుకు బ్రాహ్మణులకు బ్రాహ్మణ స్త్రీలకూ సహ పాఠకులకు విందు నివ్వాలి అంతకు ముందు శివ పూజ చేయాలి .ధనుర్విద్య నేర్చే శిష్యుడు జింక చర్మం ధరించి వింటికి బాణాలకు పూజ చేసి ,రెండు చేతులతో నమస్కరించాలి .గురువు శివమంత్రాలు చదువుతూ శిష్యుని చేతులను శుభ్రపరచి వాటిపై తన చేతులుంచాలి .విఘ్న నివారణకు పూజలు చేయాలి .శిష్యుడి జుట్టుకు ముడివేసి దానిపై శివుని శిరసుపై  కేశవుని రెండుబాహువులలో ,బ్రాహ్ణను నాభిలో  ,వినాయకుని తొడలలో ఆవాహన చేయాలి .ఓం హోమ్ మంత్రం తో  ఈ దేవతలను స్థాపించిన చోట పూజించాలి -పూర్తి మంత్రం –

‘’ఓం హోమ్ శిఖా స్థానే శంకరాయనమః -ఓం హోమ్ బాహువో కేశవాయనమః -ఓం హోమ్ నాభి మధ్యే బ్రాహ్మణే నమః -ఓం హోమ్ జంఘాయోర్ గణపతయే  నమః ‘’

 ఇలా 226 శ్లోకాలతో ‘’శివ ధనుర్వేదం ‘’ను వ్యాస మహర్షి శివుడు బోధించగా రాశాడని సారంగ ధరుడు పేర్కొన్నాడు .

369-మల్ల యుద్ధ పురాణకర్త -జ్యేష్ఠ మల్లుడు (13 వ శతాబ్దం )

మల్లయుద్ధం రామాయణ భారత కాలం నుండే ఉంది .దీనికి సంబంధించిన నీతి నియమాలు ప్రచారం లో ఉన్నాయి .. సిద్దార్ధ గౌతముడు కూడా గొప్ప మల్ల యుద్ధ విశారదుడు . 1124-1138వరకు పాలించిన చాళుక్యరాజు మూడవ సోమేశశ్వరుడు పండుగ పబ్బాలలొ ఖాళీ సమయాలలో’’ మల్ల వినోదం ‘’ ఏర్పాటు చేసినట్లు ఆయనే రాసిన ‘’మానసోల్లాసం ‘’లో ఉంది .మల్లయోధులను వయసు బరువు ,బలం ఆధారంగా విభజిస్తారని ,వాళ్ళు ఎలా వ్యాయామం చేయాలో ఏవి తినాలో కూడా వర్ణించాడు .రాజులే మల్లయోధుల బాధ్యత వహించి వారికి కావలసిన ఆహారపదార్ధాలు పాలు మాంసం పప్పు ధాన్యాలు సమకూర్చాలి .వారిని ఆడవారికి దూరం గా ఉంచి శరీరం రాటు దేలేట్లు బాడీ బిల్డింగ్ కోసం శిక్షణ నిప్పించాలి . మల్ల పోరాటం లో కదలికలు దెబ్బలు వగైరా అన్నీ చర్చించాడు రాజు

 అసలు మల్ల యుద్ధం పై ప్రత్యేక పురాణమే రాశాడు 13 వ శతాబ్దానికి చెందిన గుజరాత్ బ్రాహ్మణ మల్లయోధకవి జ్యేష్ఠ మల్లుడు . ఇందులో మల్లురలో ఉండే తేడాలు వారి ఆహారం ,సాధన ,చేయాల్సిన వ్యాయామాలు ,పాటించాల్సిన టెక్నీక్ లు  కుస్తీ గోదా తయారు చేసేపద్ధతి  కుస్తీ పట్టేవారు ఏ కాలం లో ఏయే పదార్ధాలు తినాలి అన్న అన్ని విషయాలు ఇందులో జ్యేష్టమల్ల రాశాడు .ప్రథమాధ్యాయం లో ప్రారంభ శ్లోకం –

‘’ఏకస్మినన్ కమలాకటాక్ష వివరే సందగ్ధార్యతే – క్షీరాబ్దే రపరత్న దీర్ఘ ధవలైహ్ కల్లోలలోలాత్కరైహ్

వ్యగ్రస్యాపి సామార్దితప్రమ నవ్యాపరాలబ్దో దయా -శ్చత్వారో వితరంతు వాంఛిత ఫలం హరే ర్భగవః ‘’

ధర్మా ధర్మ విదిహ్ ప్రోక్తో బ్రాహ్మన్ సమ్యక్ శ్రుతో మయ -విద్యాశ్చ వివిదాహ్ స్వామిన్ వర్ణ భేదాసత్వనేకధా

మల్ల విద్యా త్వయా ప్రోక్తం మమ సంక్షేపతః పురో -విస్తరేణ  మమ బ్రూహి తస్యాం కౌతూహలం హి మే

 ఈ మల్లపురాణం లో నారద బ్రహ్మ కృష్ణ బలరామ ,సోమేశ్వరుడు అనే బ్రాహ్మణుడు ల మధ్య జరిగిన సంవాదం వీరు తప్ప ఇంకా ఎవరిపేరూ ఉండదు .చివరలో తాను  కాశ్యప గోత్రీక బ్రాహ్మణుడనని చెప్పుకొన్నాడుకవి .ఇది 18 అధ్యాలున్నగ్రంధం మొదటి అధ్యాయం లో కంసవధ తర్వాత కృష్ణాదులు ద్వారకకు ప్రయాణమవటం దారిలో శ్రీరాముడు తపస్సు చేసి బ్రాహ్మణులకు ఆవాసం కల్పించిన ధర్మారణ్యం లోని మయూరాంబలం  పట్టణానికి రావటం ,రెండవ అధ్యాయం లో గర్గ గోత్రీకుడు సోమేశ్వరుడు అడుగగా కృష్ణుడు మల్లయుద్ధాన్ని గురించి వివరించి అతనినికూడా మల్లయోధుడవమని ప్రోత్సహించటం ,ఆయన సందేహాలు అడగటం వాటిని కృష్ణుడు నివారించి మల్ల యుద్ధాన్ని గురించి బోధించటం ,చివరి అధ్యాయం లో మల్లశాస్త్ర వివరనతర్వాత బలభద్రుడు విసుగుతో అరణ్యానికి వెళ్లబోతుండగా ఆపటం మహేశ్వరి బ్రాహ్మి వైష్ణవి శక్తి లను సృష్టించటం సోమేశ్వరుడు మల్ల విద్యాభ్యాసం చేసి కృష్ణుడిని తనకు  రక్షగా  ఉండమనటం కృష్ణుడు రక్షణకోసం లంబాజా దేవి ‘’ని సృష్టించటం .మొత్తం కాదాంశం .

370- సంస్కృతాన్ని శిరో భూషణంగా శిరసావహిస్తున్న ఉత్తరాఖండ్

కర్ణాటకలో ఒకటి రెండుగ్రామాలలో ప్రజలందరూ సంస్కృతం లోనే మాట్లాడుకొంటారని మనం తెలుసుకున్నాం . దేవతా భూమి అయినా ఉత్తరాఖండ్ తానేమీ వెనకబడి లేదని నిరూపించింది అక్కడ సంస్కృతం రెండవ భాషగా చేసి ప్రోత్సహిస్తున్నారు .స్కూల్స్ లో సంస్కృతం తప్పని సరి చేశారు .పుణ్య స్థలి ఋషీకేశ్ ను సంస్కృత సిటీ ని చేసిందిప్రభుత్వం .అక్కడి ‘’భంటోలీ’’గ్రామ ప్రజలందరూ  ఏడాది న్నర కాలం నుంచి   సంస్కృతం లోనే మాట్లాడుకొంటున్నారు .ముఖ్యంగా మహిళలు  ఫోన్ పలకరింపుల్లో కూడా ‘’హరి ఓం నమస్తే ,భవాన్  కదం అస్థి ‘’అని అంరంటారు . వీళ్ళు కాషాయం కట్టుకున్నవాళ్ళు కాదు సాధారణ గ్రామజీవులు .ఉత్తరాఖండ్ లో భాంటోలి దేహరాడూన్ కు 450 కిలో మీటర్ల దూరం లో ఉన్న కుగ్రామం .వారి మాతృ భాష స్థానిక ‘’కుమోని ‘’కానీ ఇప్పుడు .శతాబ్దాలతరబడి వస్తున్న సంస్కృతం.  భాంటోలి లోని 500 గ్రామస్తులందరు  గీర్వాణమే మాట్లాడుతారు  .దీనికి కారణం సుమారు ఏడాదిన్నర క్రితం ఉత్తరాఖండ్ ప్రభుత్వం భా0టోలి గ్రామాన్ని ‘’భాంటోలి సంస్కృత గ్రామం ‘’గా ప్రకటించటమే . 30 ఏళ్ళ శ్రీ మనోజ్అధికారి మొదటి సంస్కృత ఆచార్యుడుగా ఇక్కడికి వచ్చి గ్రామస్తులకు సంస్కృతం నేర్పటం ప్రారంభించాడు .ఇప్పుడు దేశం లో 5 వ సంస్కృత గ్రామంగా భాంటోలి రికార్డ్ సృష్టించింది .మిగిలిననాలుగు కర్ణాటకలోని మత్తూర్ ,హోషనహళ్లి  ,మధ్యప్రదేశ్ లోని మొహద్ , ఝిరీ గ్రామాలు . ఈ అయిదు సంస్కృత భారతిఅనే స్వచ్చంద సంస్థ  ఆధ్వర్యం లో నడుస్తున్నాయి .

  బయటి గ్రామాలనుంచి భాంటోలి గ్రామానికి వచ్చిన వారికి గ్రామస్తులు అంతా సంస్కృతం లోనే మాట్లాడుతుంటే కలా  నిజమా ,తాము 5 వశతాబ్దం లో ఉన్నామా అనే అనుమానం కలుగుతుంది .సంస్కృతం దేవ భాష అని వీరందరూ విశ్వసించి అనుసరిస్తున్నారు .ఇప్పుడు హరిద్వార్ లో ఉన్న ఉత్తరాఖండ్ సంస్కృత విశ్వ విద్యాలయం సంస్కృతం లో బీఎడ్ క్లాసులు నిర్వహించాలని నిర్ణయించింది .రాష్ట్ర ప్రభుత్వం జనవరి నుంచి సంస్కృతాన్ని రెండవ భాషగా హిందీని మొదటిభాషగా  డిక్లేర్   చేసి ప్రోత్సహించింది .సంస్కృతం లో శాస్త్రి కోర్సు పూర్తి చేసినవారు డిగ్రీ ,పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్నవారికే సంస్కృత బీఎడ్ కు అర్హులు .ఆగస్టు 15నుంచి అడ్మిషన్లు ప్రారంభమై 175 మంది విద్యార్థులతో 12 మంది అధ్యాపకులతో కళకళ లాడుతోంది .హరిద్వార్ -రూర్కీ జాతీయ రహదారిలో సంస్కృత యుని వర్సిటీ నిర్మాణం శరవేగం గా జరుగుతోంది .యూనివర్సిటీ మొదట ఇద్దరు డిగ్రీ సంస్కృత విద్యార్థులతో ప్రారంభమై ఇప్పుడు  యోగా ,కంప్యూటర్  జరలిజం లైబ్రరీ సైన్స్  అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కు చెందిన 150 మంది విద్యార్థులతో నిండుగా ఉంది .

  భారత దేశం లో ఉత్తరాఖండ్ రాష్ట్రం ఒక్కటే సంస్కృతాన్నిమొట్టమొదటిసారిగా  రెండవ అధికార భాషగా ప్రకటించింది .ఈ బిల్లు 2009 లో పాస్యయింది .కాళిదాస మహాకవి ఉత్తరాఖండ్ లో జన్మించాడని ఇక్కడి ప్రజల పూర్తి విశ్వాసం .రాష్ట్రం లో అనేక సంస్కృత మీడియంపాఠశాలలు కాలేజీలు సంస్కృత విద్యా వ్యాప్తికి సహకరిస్తున్నాయి .ప్రభుత్వం కూడా వీటికి తగినంత సహాయ మందిస్తోంది  . నిత్యవాడకం లో సంస్కృతాన్ని ఉపయోగించటం ,పోటీ పరీక్షలలో పాల్గొనిబహు  మతులు సాధించటం కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రదమా ,ద్వితీయ  తృతీయ బహుమతుల కోసం ఒక లక్షా ,యాభై వేలు, 25 వేలు నగదు పారితోషికాన్నిస్తోంది .ప్రభుత్వం ఆధ్వర్యం లో 100 దాకా సంస్కృతపాఠశాలలు కాలేజీలు నడుస్తున్నాయి .వీటన్నిటికీ ప్రాభుత్వం పూర్తి గ్రాంట్ సమకూరుస్తోంది .సంస్కృత యూనివర్సిటీతోపాటు మరి 4 యూనివర్సిటీలలో సంస్కృతం బోధిస్తున్నారు .ఉచిత మధ్యాహ్నభోజనం తోపాటూ కంప్యూటర్లు స్కాలర్షిప్ లు ఇచ్చి మరింతగా ప్రోత్సహిస్తోంది .

 ఉత్తరాఖండ్ సంస్కృత అకాడెమీ కూడా తనదైన శైలిలో సంస్కృతభాషాభి వృద్ధి చేస్తోంది .సంస్కృతనాటకాలు నృత్యాలు సంగీతకచేరీలు ,ఆశుభాషణం  జనరల్ నాలెడ్జి బృందగానం  కార్యక్రమాలు జిల్లాస్థాయి రాష్ట్ర స్థాయిలో నిర్వహించి బహుమతులు అందిస్తోంది .సంస్కృత నాట్య యాత్రలు సంస్కృత కుటుంబ సమ్మేళనాలు ,సంస్కృత గ్రామానిర్మాణం నిర్వహిస్తోంది .

వీటికి మించిహరిద్వార్ లోని  ఉత్తరాఖండ్ సంస్కృత అకాడెమి   భారత దేశం లోనే మొట్టమొదటిసారిగా సంస్కృత టి వి . ఛానల్ ప్రారంభించి ఆదర్శ ప్రాయంగా నిలిచింది .వార్తలేకాక సంస్కృత సాహిత్య కార్యక్రమాలను నిర్వహిస్తోంది .ఇది మాత్రమేకాదు ఉత్తరాఖండ్ ప్రభుత్వం అంతర్జాతీయ సంస్కృత సమ్మేళనం ను సెప్టెంబర్ లో నిర్వహిస్తోంది .ఇలా గీర్వాణ భాషకు గొప్పతనం అన్ని కోణాలలో అన్ని రూపాలలో సంతరిస్తున్న ఉత్తరాఖండ్ ప్రభుత్వం అభినందనీయం ..

371-త్రిపురా రహస్య కర్త -హరితాయనుడు

దత్తాత్రేయమహర్షి పరశురాముని బోధించిన అద్వైత తత్వమే త్రిపురా రహస్యం .ఒకరకంగా ఏ రహస్యములేనిది అని అర్ధం .త్రిమూర్త్యాతీతమైన విషయం అని భావం .త్రిపురాలు అంటే మూడు పట్టణాలు మాత్రమేకాదు -జాగృతి ,స్వప్న సుషుప్తులు .వీటిలోని అంతశ్చేతన నే  ‘’శ్రీ త్రిపుర సుందరి  ‘’అంటారు  .ఆమెయే  మాతృమూర్తి చండిక.ఈ గ్రంధం అత్యున్నత ఆధ్యాత్మిక సత్యాన్ని బోధిస్తుంది . ఈ తత్వాన్ని పరమ శివుడు విష్ణుమూర్తికి బోధిస్తే ,ఆయన మానవ రూపం లో  దత్తాత్రేయ  అవధూతగా  జన్మించి  పరశురాముని బోధిస్తే ,ఆయన హరితయానుడికి చెప్పాడు .దత్తాత్రేయ ,పరశురాముల సంవాదమే త్రిపురారహస్యం .దీనికే ‘’హరితాయన సంహిత ‘’అనే పేరుంది .హరితాయనుడు హరితుని కుమారుడు . ఈ గ్రంధం 3  ఖండాలలో  12 ,000 శ్లోకాలలో ఉంటుంది .మొదటిఖండం మహాత్మ్య ఖండం రెండవది జ్ఞాన ఖండం మూడవది చర్య ఖండం . అత్రి ముని అనసూయ దంపతుల ప్రార్ధనమన్నించి త్రిమూర్తులలో బ్రహ్మ చంద్రుడుగా శివుడు దూర్వాసమహర్షిగా ,విష్ణువు నారాయణుడు అనే దత్తాత్రేయునిగా జన్మిస్తారు .జమదగ్ని రేణుకాదేవి దంపతుల కుమారుడు పరశురాముడు తండ్రి ఆజ్ఞతోతల్లిని చంపి దేశం లో క్షత్రియ వంశ నిర్మూలనకు దిగి ,శ్రీరాముని చేతిలో పరాభవం పొంది గర్వం ఖర్వమై హిమాలయాలకు వెడుతూ దారిలో బృహస్పతి తమ్ముడైన అవధూత సంవర్తుని దర్శించగా  దత్తాత్రేయుని శరణు వేడ మని హితవు చెబుతాడు .దత్తాత్రేయునికి పరశురాముని జరిగిన జ్ఞాన సంవాదం లో వెలువడింది త్రిపురా రహస్యం .దీనితో ఆత్మ జ్ఞానం పొందిన పరశురాముడు మలయ పర్వతాలలో తపస్సు లో కాలం గడిపాడు . దీనికి ఇంగ్లిష్ అనువాదాలు చాలా ఉన్నాయి .తెలుగు లో లోనూ అనువాదాలు వచ్చాయి . ఒకటి రెండు శ్లోకాలు చూద్దాం –

‘’ఏకైక భావ తుస్టై కర  సైకత జనప్రియ -ఏ దమానప్రభా వైదద్భక్త పాతకనాశినీ

ఏలామోద  ముఖై నౌద్రి శక్రాయుధ సమాస్థితః -ఈహాశూన్యే ప్సితే శాది సేవ్యే శానా వరాఙ్గతా ‘’

372-న్యాయ బిందు టీకా కర్త -ధర్మోత్తర (క్రీశ 800 )

బౌద్ధ ప్రమాణాలపై ప్రామాణిక గ్రంధాలురాసిన ధర్మోత్తర 8 వ శతాబ్దికి చెందినవాడు . ధర్మ కృతి పై అనేక వ్యాఖ్యానాలు రాశాడుకాని సంస్కృత న్యాయబిందు టీకా ఒక్కటే దక్కింది .ఇవికాక అపోహ నామ ప్రకారణ ,క్షణ భంగ సిద్ధి, పరలోక సిద్ధి ,ప్రమాణ పరీక్ష ,ప్రమాణ వినిశ్చయాటీకా కూడా రచించాడు .

  సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-7-17 -కాంప్-షార్లెట్ -అమెరికా


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 366-భారత జాతీయ గీతం కావాల్సిన ‘’జయజయ ప్రియభారత జనయిత్రి ‘’గీత కర్త -పద్మభూషణ్ -దేవులపల్లి కృష్ణ శాస్త్రి(1897- 1980)

            గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

366-భారత జాతీయ గీతం కావాల్సిన ‘’జయజయ ప్రియభారత జనయిత్రి ‘’గీత కర్త -పద్మభూషణ్ -దేవులపల్లి కృష్ణ శాస్త్రి(1897- 1980)

దేవులపల్లి కృష్ణశాస్త్రి తూర్పు గోదావరి జిల్లా, పిఠాపురం దగ్గరలోని రావు వారి చంద్రపాలెం అనే గ్రామంలో ఒక పండిత కుటుంబంలో 1897 నవంబరు 1న జన్మించాడు. అతని తండ్రి, పెదతండ్రి గొప్ప పండితులు. వారింట్లో నిరంతరం ఏదో సాహిత్యగోష్ఠి జరుగుతూ ఉండేది. కృష్ణశాస్త్రి చిన్న వయసునుండే రచనలు ఆరంభించాడు. పిఠాపురం హైస్కూలులో అతని విద్యాభ్యాసం సాగింది. పాఠశాలలో తన గురువులు కూచి నరసింహం, రఘుపతి వెంకటరత్నం ఆంగ్ల సాహిత్యంలో తనకు అభిరుచి కల్పించారని దేవులపల్లి చెప్పుకొన్నాడు. 1918లో విజయనగరం వెళ్ళి డిగ్రీ పూర్తి చేసి తిరిగి కాకినాడ పట్టణం చేరాడు. పెద్దాపురం మిషన్ హైస్కూలులో ఉపాధ్యాయవృత్తి చేపట్టాడు.

ఆ కాలంలో వ్యావహారిక భాషావాదం, బ్రహ్మసమాజం వంటి ఉద్యమాలు ప్రబలంగా ఉన్నాయి. కృష్ణశాస్త్రి తన అధ్యాపకవృత్తిని వదలి బ్రహ్మసమాజంలో చురుకుగా పాల్గొన్నాడు. అదే సమయంలో సాహితీ వ్యాసంగం కూడా కొనసాగించాడు. 1920లో వైద్యంకోసం రైలులో బళ్ళారి వెళుతూండగా ప్రకృతినుండి లభించిన ప్రేరణ కారణంగా “కృష్ణపక్షం కావ్యం” రూపు దిద్దుకొంది. 1922లో భార్యా వియోగానంతరం అతని రచనలలో విషాదం అధికమయ్యింది.

తరువాత మళ్ళీ వివాహం చేసుకొని, పిఠాపురం హైస్కూలులో అధ్యాపకునిగా చేరాడు. కాని పిఠాపురం రాజుగారికి కృష్ణశాస్త్రి భావాలు నచ్చలేదు. కృష్ణశాస్త్రి ఆ ఉద్యోగం వదలి బ్రహ్మసమాజంలోను, నవ్య సాహితీసమితిలోను సభ్యునిగా, భావ కవిత్వోద్యమ ప్రవర్తకునిగా దేశమంతటా ప్రచారంలో పాల్గొన్నాడు. ఈ సమయంలో ఎందరో కవులతోను, పండితులతోను పరిచయాలు కలిగాయి. ప్రాచ్య, పాశ్చాత్య సాహిత్యాన్ని అధ్యయనం చేశాడు. పిఠాపురంలోని హరిజన వసతి గృహంతో సంబంధం ఏర్పరచుకొని హరిజనోద్ధరణ కార్యక్రమాలలో పాల్గొన్నందున బంధువులు అతనిని వెలివేశారు. అయినా వెనుకాడని కృష్ణశాస్త్రి వేశ్యావివాహ సంస్థను ఏర్పాటు చేసి ఎందరో కళావంతులకు వివాహాలు నిర్వహించాడు. సంఘ సంస్కరణా కార్యక్రమాలు నిర్వహిస్తూనే “ఊర్వశి” అనే కావ్యం వ్రాశాడు.

1929లో విశ్వకవి రవీంద్రనాధ టాగూరుతో పరిచయం ఏర్పడింది. వారిద్దరి మధ్య సాహితీ సంబంధాలు ఏర్పడ్డాయి. 1933-41 మధ్య కాలంలో కాకినాడ కాలేజీలో తిరిగి అధ్యాపకవృత్తిని చేపట్టాడు. 1942లో బి.ఎన్.రెడ్డి ప్రోత్సాహంతో మల్లీశ్వరి చిత్రానికి పాటలు వ్రాశాడు. తరువాత అనేక చిత్రాలకు సాహిత్యం అందించాడు. 1957లో[] ఆకాశవాణిలో చేరి తెలుగు సాహిత్య ప్రయోక్తగా అనేక గేయాలు, నాటికలు, ప్రసంగాలు అందించాడు.

భావ కవిగా, ‘ఆంధ్రా షెల్లీ ’గా ప్రసిద్ధులైన దేవులపల్లి వేంకట కృష్ణశాస్ర్తి… బి.ఎన్.రెడ్డి ప్రోత్సాహంతో ‘మల్లీశ్వరి (1951)’తో చిత్రరంగంలో అడుగుపెట్టారు. సినిమా పాటకు కావ్య గౌరవం కలిగించారు. ఆపాత మధురమైన కృష్ణశాస్ర్తి సాహిత్యం ఇక్షురసార్ణవం వంటిదని శ్రీశ్రీ శ్లాఘించారు. లాలిత్యం, సారళ్యం, ప్రకృతి సౌందర్యం – కృష్ణశాస్ర్తి పాటల్లోని ప్రధాన లక్షణాలు. భావోద్వేగాలకు, హృదయ స్పందనలకు అక్షర రూపమిచ్చి భావ కవితలంత సుకుమారంగా ప్రణయ విరహ గీతాల్ని రాసిన కవి. ఆత్మ నివేదన, ఆరాధన గల భక్తిగీతాలు కూడా అనేకం. రాజమకుటం, సుఖదుఃఖాలు, కలిసిన మనసులు, అమెరికా అమ్మాయి, గోరింటాకు మొదలైన చిత్రాల్లో 170 పాటలు మాత్రమే రాసిన కృష్ణశాస్ర్తి, ఈ పన్నెండుగురు పద నిర్దేశకుల్లోనూ తక్కువ పాటలు రాసిన కవి.

‘భక్త ప్రహ్లాద (1931)’తో ప్రారంభమైన తెలుగు సినిమా పాట ఎనభయ్యో పడిలో అడుగుపెట్టింది. ఈ ఎనిమిది పదుల కాలంలో సుమారు 400 మంది కవులు దాదాపు 34 వేల పాటల్ని (అనువాద గీతాల్ని మినహాయించి) రాశారు. ముఖ్యమైన జాబితా లో ఎవరు ఎంపిక చేసినా మహా అయితే మరో ఏడెనిమిది మంది కవుల కంటే ఆ జాబితాలో చోటు చేసుకోరు. ఇలా గుర్తింపు పొందిన కవులను కూడా జల్లెడ పడితే, తమ ప్రత్యేకతలతో తెలుగు సినిమా పాటకు దిశానిర్దేశం చేసిన కవులు 12 మంది మాత్రమే అంటే కించిత్ ఆశ్చర్యం కలగక మానదు. అందులో ఒకరు …దేవులపల్లి కృష్ణశాస్త్రి.

గొప్ప వక్తగా, రచయితగా, భావకవుల ప్రతినిధిగా పేరుపొందిన కృష్ణశాస్త్రి గొంతు 1963లో అనారోగ్యకారణంగా మూగవోయింది. కాని అతని రచనా పరంపర కొనసాగింది. అతనికి అనేక సన్మానాలు ప్రశంసలు లభించాయి. 1980 ఫిబ్రవరి 24న కృష్ణశాస్త్రి మరణించాడు.

కృష్ణశాస్త్రి మేనగోడలే కర్ణాటక, లలిత, జానపద సంగీత కళానిధి, వింజమూరి సోదరీమణులలో ఒకరైన కళాప్రపూర్ణ అవసరాల (వింజమూరి) అనసూయాదేవి.

పురస్కారాలు

ప్రముఖుల అభిప్రాయాలు

  • మహాకవి శ్రీశ్రీ – నేను కృష్ణశాస్త్రి కవితాశైలినే అనుకరించేవాడిని. కానీ, మా నారాయణబాబు కృష్ణశాస్త్రి సింహం జూలునుకూడా అనుసరించి, దాన్ని రోజూ సంపెంగ నూనెతో సంరంక్షించుకునేవాడు. నాకెప్పుడూ పద్యం మీద ఉన్న శ్రద్ధ జుట్టు మీద ఉండేదికాదు.

  • విశ్వనాథ సత్యనారాయణ – మనకు కీట్సు, షెల్లీ, వర్ద్సు వర్తులవంటి కవులు లేరు. ఆ కవులు మన దేశములో కృష్ణశాస్త్రిగారుగా పుట్టినారని నా యభిప్రాయము.

రచనలు

  • కృష్ణ పక్షము : ఇది కృష్ణశాస్త్రి కవితా ప్రస్థానంలోనూ, తెలుగు సాహితీ చరిత్రలోనూ ఒక ముఖ్య ఘట్టం. ఒకసారి ఆయన బెజవాడ నుండి బళ్ళారికి రైలులో వెళుతుండగా చుట్టూ ఉన్న పొలాల సౌందర్యానికీ, రైలు లయకూ పరవశించి “ఆకులో ఆకునై, పూవులో పూవునై” అని పలవరించారట. అది తెలుగు భావకవితా యుగంలో ఒక ముఖ్య క్షణం. 1922లో సంభవించిన భార్యా వియోగం ఆయన కవితలను మరింత వేదనా భరితం చేసింది.ఊహా ప్రేయసి, ఆత్మాశ్రయత్వం, ప్రవాసము, ఊర్వశి వంటి కవితలు ఈ ఖండకావ్యసంపుటిలో ఉన్నాయి.

  • ఊర్వశి కావ్యము,

  • అమృతవీణ – 1992 – గేయమాలిక

  • అమూల్యాభిప్రాయాలు – వ్యాసావళి

  • బహుకాల దర్శనం – నాటికలు,కథలు

  • ధనుర్దాసు – నాలుగు భక్తీ నాటికలు,

  • కృష్ణశాస్త్రి వ్యాసావళి – 4 భాగాలు

  • మంగళకాహళి – దేశభక్తి గీతాలు

  • శర్మిష్ఠ – 6 శ్రవ్య (రేడియో) నాటికలు

  • శ్రీ ఆండాళ్ళు తిరుప్పావు కీర్తనలు, నాటిక 1993

  • మేఘమాల – సినిమా పాటల సంకలనం – 1996

  • శ్రీ విద్యావతి – శృంగార నాటికలు

  • యక్షగానాలు – అతిథిశాల – సంగీత రూపకాలు

  • మహాతి

  • వెండితెర పాటలు – 2008

దేశభక్తి గీతం—భారత మాత

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ, దివ్యధాత్రి!

జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయనేత్రి!

జయ జయ జయ…..

జయ జయ సశ్యామల సుశ్యామల చలచ్చేలాంచల!

జయ వసంత కుసుమలతా చలిత లలిత చూర్ణ కుంతల!

జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళా!

జయ జయ జయ…….

జయ దిశాంత గత శకుంత దివ్య గాన పరితోషణ!

జయ గాయక వైతాళిక గళవిశాల పథవిహరణ!

జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణ!

జయ జయ జయ…….

367-చిన్నలకు పెద్దలకు సంస్కృత0 బోధిస్తున్న టీనేజ్ కుర్రాళ్ళు –అశోక్, సిద్ధార్ధ ( 2000)

9 ఏళ్ళ అశోక్ ,11 ఏళ్ళ సిద్దార్ధ అమెరికాలో పెన్సిల్వేనియా కుర్రాళ్ళు .వాళ్ళ గురువుగారు భారతీయ భోజనం ఎలా చేయాలో  బోధించినందుకు సంస్కృత శ్లోకం లో —’’నమో నమః ఆవయోవ గురు భారతస్య  భోజనస్య పద్ధతిమ్ ఆవామ్ వర్ణిత వాన్ ‘’అంటూ గురు స్తుతి చేసిన వినయ సంపన్నులు .

యు ట్యూబ్ లో ‘’సాంస్క్రిట్  కార్నర్ ‘’ను ఈ చిచ్చర పిడుగులు యెర్ర కుర్తా లతో ఫాలభాగాన విభూతి రేఖలతో పంచామృత ప్రసాదం శ్లోకాలు చదువుతూ వీడియోలో కనిపిస్తారు .ఈ వీడియోని ఇప్పటికి 50 వేలకు పైగా జనం చూసి మెచ్చారు .సంస్కృత కార్నర్ కు 800 కు పైగా సబ్ స్క్రైబర్స్ ఉన్నారు . ఈ లెక్కలు ఇదివరకటి దాకా ఈసోదరులకు ఒక ఇన్స్పిరేషన్ గా  ఉండేది .ఇప్పుడు బాగా ప్రచారం లో ఉన్నారు కనుక వాటిపై దృష్టి లేదు అంటారు ..

 ఇప్పుడు టీనేజ్ లో ఉన్న ఈ సోదరద్వయం ధారాళంగా సంస్కృతం రాస్తారు ధారాళంగామాట్లాడాడుతారు .బి ఏ తో సమానమైన ‘’కోవిద ‘’కోర్సు చదివి డిస్టింక్షన్ లో సిద్దార్ధ ఉత్తీర్ణుడయ్యాడు .ఇప్పుడు సంస్కృత పంచకావ్యాలు అధ్యయనం చేస్తున్నాడు .ఒకప్పుడు హాబీ గా ప్రారంభమైన సంస్కృతం ఇప్పుడు ఈ సోదరుల నిత్య జీవిత వ్యాపకమే అయింది .2010లో సంస్కృతాన్ని తీవ్రంగా అధ్యయనం చేయాలన్న కోరికతో చెన్నై కి చేరుకున్న ఈ సోదరులలో 16 ఏళ్ళ సిద్దార్ధ చెన్నై రామకృష్ణా మఠం లో సంస్కృతాన్ని 10 ఏళ్ళ పిల్లలనుంచి సీనియర్ సిటిజెన్ల వరకు 10 రోజుల ఇంటెన్సివ్ వర్క షాప్ లో బోధిస్తున్నాడు .దీనిపై సిద్దార్ధ స్పందిస్తూ ‘’ఈ వర్క్ షాప్ లో నేను బాలుర నుంచి వృద్ధుల వరకు సంస్కృతం ను ఒక్క తమిళ మాటకాని ఒక్క ఇంగ్లిష్ మాటకాని వాడ కుండా అంతా సంస్కృతం లోనే బోధించటం గొప్ప అనుభూతిగా ఉంది .ఇది నాకు పెద్ద మానసిక శ్రమ కనుక నేను అనేక ఆధారాలు సాంకేతికాలు (ప్రాప్స్ అండ్ సైన్స్)లపై ఆధార పడాల్సి వచ్చింది’’  అని నిజాయితీగా చెప్పాడు .

 ఈ సోదరుల తల్లి శ్రీమతి విజయ విశ్వనాథన్  వీళ్లకోసమే చెన్నైకి వచ్చి వారికి  స్ఫూర్తిగా నిలిచింది .సుమారు 15 ఏళ్ళక్రితం స్వామి దయానంద సరస్వతి ప్రవచనాలతో స్ఫూర్తి పొంది భగవద్గీత ,ఉపనిషత్తులు బ్రహ్మ సూత్రాలు అధ్యయనం చేస్తూ సంస్కృతంలో గట్టిగా కృషి చేసింది .అమెరికాలో  ‘’సంస్కృత భారతి ‘’లో నేనూ నా పిల్లలతో పాటు సంస్కృతం నేర్చుకున్నాను .మేము ముగ్గురం కలిసి సంస్కృత పరీక్షలు రాశా0 .మా ఇంట్లో సంస్కృతం ఒక అఫీషియల్ సీక్రెట్ మాకు ‘’అంటూ చిరునవ్వుతో ఆమాతృమూర్తి’’ వార్టన్  బిజినెస్ స్కూల్ ‘’పూర్వ విద్యార్థిని , భర్తతో కలిసి ‘’ఫార్మా స్యూటికల్ కన్సల్టింగ్ ఫర్మ్ ‘’నిర్వహిస్తున్న   శ్రీమతి విజయ మాధవన్ చిరునవ్వుతో  చెప్పింది .

 పెన్సిల్వేనియా లో ఉన్నత వర్గాల వారు చదివే ప్రయివేట్ స్కూల్ లో చదువుతున్న తన ఇద్దరు పిల్లలను ఆ స్కూల్ మాన్పించి ఇంటి వద్దనే తానే  వారికి విద్య బోధించటం ప్రారంభించింది .దీనికి ఆమె చెప్పినకారణాలు ‘’మా వాళ్ళు చదివే స్కూల్ ఉన్నత వర్గాల పిల్లలు చదివేది పాప్ కల్చర్ బాగా ఒంటబట్టిన వారి మధ్య మా పిల్లలు ఉంటె మన విలువలు మృగ్యమై పోతాయనే వ్యధతో మాన్పించి నేనే మన విద్యను ఇంటివద్దే నేను ఫిజిక్స్ లెక్కలు నేర్పించాను .ఇంగ్లిష్  ,ఫైన్ ఆర్ట్ లను  ఆన్ లైన్ లో నేర్చుకొన్నారు  .రెగ్యులర్ గా ఆన్ లైన్ పరీక్షలు రాసి పాసవుతున్నారు .అని గర్వంగా చెప్పింది ఆ తల్లి .

 ఇండియాకు తిరిగి వచ్చాక స్కూల్ లో చేరారుకాని కొద్దికాలానికే మానేశారు .ప్రస్తుతం అశోక్ ,సిద్దార్ధ ఇద్దరు ‘’స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ ‘’ఆన్ లైన్ హై స్కూల్ కర్రిక్యులం చదువుతూ స్టాన్దర్డ్ పరీక్షలు రాస్తున్నారు . సాధారణ స్కూల్ విద్య చదవ లేదనే దుగ్ధ వారికి లేదని చెప్పారు .సమయం ఎక్కువగా ఉండటం వలన సంగీతం ,వయోలిన్ నేర్చుకొంటూ వేద క్లాసులకు వెడుతూ సంస్కృతం బోధిస్తున్నారు .కర్ణాటక సంగీతాన్ని శ్రీమతి జి సీతా లక్ష్మి అమ్మాళ్ వద్ద ,వయోలిన్ శ్రీమతి చారుమతి రఘురామన్ వద్ద అభ్యసిస్తున్నారు .అరుదైన సంగీత కాంపోజిషన్స్ ను పద్మశ్రీ ఎస్ ఆర్ జానకీరామన్   వద్ద నేర్చుకొంటున్నారు . వేదం పాఠాల తర్వాత తగినంత  సమయం ఉంటోందికనుక తమకిష్టమైనవాటిని కష్టపడకుండా ఇష్టపడి నేరుస్తున్నామని సంతృప్తి వ్యక్తపరిచారు ఈ టీనేజీ కుర్రాళ్ళు ..’’మా ఇంట్లో టి వి లేదు .ఒక సెల్ ఫోన్ ఒక కంప్యూటర్ మాత్రమే ఉన్నాయి వాటినికూడా విద్యా వ్యాసంగానికే వాడుతాము .మా ఇంట్లో వేరే ఏ పరికరము లేదు .అందువల్ల మా అబ్బాయిలు వాళ్లకు కావాల్సిన విషయాలమీద పూర్తిగా దృష్టి పెట్టి చదివి ఉన్నతి సాధిస్తున్నారు .అదే మా అందరికి పరమానందం గా ఉంది అదే మాకు సంతృప్తి ‘’అన్నది ఆ బంగారు బాబుల మహా తల్లి  శ్రీమతి విజయ మాధవన్ . ఈ ఆదర్శ కుటుంబం అందరికీ ఆదర్శం అని పించి వీరి గురించి గీర్వాణం లో రాశాను .

 (ఆధారం -దీపా వెంకట్రామన్ 20-12-16 న ది హిందు  పత్రికలో రాసిన ‘’ది  టీనేజ్ సాంస్క్రిట్  స్కాలర్స్ -’’)

  సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-7-17 కాంప్-షార్లెట్-అమెరికా

 Inline image 1Inline image 2

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ/ ఆషాఢ శుద్ధ ఏకాదశి శుభాకాంక్షలు

Inline image 1Inline image 2

 

ఆషాఢ శుద్ధ ఏకాదశి 4-7-17 మంగళవారం శయన ఏకాదశి అనే తోలి ఏకాదశి శుభాకాంక్షలు

 

Inline image 1Inline image 2

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 365-వేద గణిత గ్రంథ కర్త – డా . శ్రీ రేమెళ్ళ అవధానులు(1948)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

365-వేద గణిత గ్రంథ కర్త – డా . శ్రీ రేమెళ్ళ అవధానులు(1948)

భారతీయ భాషలను మొట్టమొదట కంప్యూటరీకించి,వేదాలనూ కంప్యుట రైజ్  చేసిన భారతీయ మేధావి డా  శ్రీ రేమెళ్ళ అవధానులు  ‘’.యజుర్వేద సంహితలో టు టు ది పవర్ ఆఫ్ 19 వరకు అంకెల ప్రస్తావన ఉంది .దీన్ని ‘’లోక ‘’అంటారు .వాల్మీకి రామాయణం లో’’ మహౌమ’’ఉంది అంటే పది టు ది పవర్ ఆఫ్ 62 .పైధాగరస్ కనిపెట్టాడని చెప్పుకొంటున్న లంబ కోణ  త్రిభుజ సూత్రం బోధాయన ‘’శుల్బ సూత్రాలలో ‘’ఉంది .’’ఇన్ఫినిటీ ‘’గురించి ‘’పూర్ణ మదః పూర్ణ మిదం పూర్ణాత్ పూర్ణ ముదచ్యతే ‘’శ్లోకం లో ఎప్పుడో మనవాళ్ళు చెప్పారు .హైడ్రోజెన్ ఐసోటోపుల ప్రస్తావన కృష్ణ యజుర్వేదం లో కనిపిస్తుంది .ఏకతాయ స్వాహా ద్వితాయా స్వాహా త్రితాయా స్వాహా ‘’లోని ద్వితా డ్యుటీరియం,త్రిథా త్ట్రిటీణీయంగా మార్చి నట్లు అనిపిస్తుంది  . ట్రిగనా  మెట్రీ ని  అందరికంటే ముందుకనుక్కోని ,ఆర్య భట్టు వరాహమిహిరుడు సైన్ ,కాస్ ల విలువలను ముందే చెప్పారు .  .స్టీమ్ ‘’అనే పదం పాణిని అష్టాధ్యాయి లో ఉంది .స్టీమ అర్జీ భావే ‘’అంటే ఆవిరి అవటం .న్యూటన్ కంటే ముందే గురుత్వాకర్షణ శక్తి ని భాస్కరాచార్యుడు 12 వ శతాబ్దం లో తన ‘’సిద్ధాంత శిరోమణి ‘’లో భూమ్యాకర్షణ శక్తిగా చెప్పాడు .ఆధునిక భౌతిక  రసాయన వైద్య వైమానిక శాస్త్రాలలో ఉన్న సమాచారం అంతా వేదాల్లో నిక్షిప్తమై ఉంది .అందుకే ‘’అన్నీ వేదాల్లోనే ఉన్నాయష ‘’అనే సామెత వచ్చింది .ఇది వెటకారం కాదు పచ్చినిజం ‘’అంటారు అవధానులుగారు .

  తనకు మంత్రాలపై మంచి అవగాహన ఉండేదని ,కానీ పరమాణు భౌతిక శాస్త్రం లో ఏం ఎస్ సి చేశానని చెప్పారు .అప్పుడే ఒక ప్రయివేట్ కంపెనీ మొదటిసారిగా కంప్యూటర్ కోర్సు ప్రకటన చేసిందని ,అందులో చేరి డిప్లొమా పొంది ,తర్వాత రాజోలు కాలేజీ ఫిజిక్స్ లెక్చరర్ గా పని చేస్తూ సాయంకాలలలో  ప్రక్కనే ఉన్న వేద పాఠ  శాలలో వేదం నేర్చుకొంటూ ,1971 లో హైదరాబాద్ లో యి.సి.ఐ.ఎల్. లో టెక్నీకల్ ఆఫీసర్ గా చేరి పని చేశారు .మన దేశం లో మొదట కంప్యూటర్ తయారు చేసింది ఈ కంపెనీయే .ఇక్కడ శిక్షణలో ఉన్నప్పుడు కొన్ని పుస్తకాలు చదువుతుంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ చరిత్ర కనిపించింది .దీన్ని 3 వేల  సంవత్సరాలక్రితమే  భారతీయులు కనుక్కొన్నట్లు తెలిసి ప్రాచీన గ్రంధాలపై ఆసక్తి పెరిగిందట .  ఇక్కడ పని చేస్తూకూడా వేదం నేర్చుకొంటూ ,అప్పటికి ఏ భారతీయ భాషా కంప్యూటరీకరించబడలేదని గ్రహించి మొదటగా తెలుగును కంప్యూటరీకించాలన్న ఆలోచనవచ్చి ఆయన స్నేహితులతోకలిసి 6 నెలలు శ్రమించి తెలుగు అక్షరాలను కంప్యూటర్ లోకి ఎక్కించారు .ఇలా 1976 లో భారతీయ భాషలలో తెలుగు భాష ఒక్కటే మొట్టమొదటిసారిగా కంప్యూటరైజ్ అయి అవధానులు బృందానికి ఘన కీర్తి నిచ్చింది.అప్పటి అధికార భాషా సంఘం అధ్యక్షులు శ్రీ వావిలాల గోపాల క్రష్ణయ్య గారు కంపెనీకి వచ్చి అభినందించారట .కానీ ఆఫీసువారి ప్రోత్సాహం కరువై ముందుకు సాగలేదన్నారు .

  తెలుగు కంప్యూటర్ లోకి ఎక్కిందన్న సంచలన వార్త పార్లమెంట్ ను కుదిపేసి ,హిందీ ని కూడా చేర్చమని  కంపెనీ అధికారులపై ఒత్తిడి వస్తే ,అవధానులు బృందం దాన్నీ ఎక్కించారు .పార్ల మెంటరీ కమిటీ వచ్చి చూసి స0తృప్తి చెంది అభినందించింది . 1978 లో ఢిల్లీ లో ‘’భారతీయ భాషల కంప్యూటీకరణ ‘’అనే అంశం పై సదస్సు నిర్వహించారు ,కానీ ప్రోత్సాహం కరువై ఆగిపోయింది . 1991లో నిమ్స్ లో పని చేస్తున్నప్పుడు గోదావరి పుష్కరాలలో తిరుమల దేవస్థానం గ్రంధాలు చదివి 1131 వేదం శాఖలకు కేవలం 7 శాఖలే మిగిలాయని చదివి అశ్రద్ధ చేస్తే ఇవి కూడా త్వరలోనే  అంతరించిపోతాయేమోననే భయమేసి ఎలా రక్షించుకోవాలన్నా ఆలోచనవచ్చి రికార్డ్ చేయిస్తే అంచిదనిపించి ,యజుర్వేదం నేర్చుకొంటూ ,మరీ ప్రమాద లో పడిపోయిన ఋగ్వేదం నేర్చిన వారెవరైనా ఉన్నారేమోనని అన్వేషణ చేస్తూ ,మహా రాష్ట్రలో ఒకాయన ఉన్నారని తెలిసి కుటుంబ సమేతంగా ఆహ్వానించి పోషణ బాధ్యత తీసుకొని వారితో ఋగ్వేదాన్ని 1992లో రికార్డ్ చేయించటం  ప్రారంభించారు .

 అదే సమయం లో తిరుపతి దేవస్థానం వారు ‘’అఖిల భారత వేద శాస్త్ర సమ్మేళనం ‘’నిర్వహిస్తున్నప్పుడు తనను వేదాలపై ఒక ప్రదర్శన ఇవ్వమని కోరగా ‘’నమక0 ‘’లోని మూడుమంత్రాలను వాటి అర్ధాలను సి లాంగ్వేజ్ సాయం తో కంప్యూటర్ లో పెట్టగా దాన్ని చూసిన ఉపరాష్ట్రపతి శ్రీ శంకర దయాళ్ శర్మ అవధానులుగారిని మనస్ఫూర్తిగా అభినందించి తనకు  10  నిమిషాల సమయాన్నిమాత్రమే ఇచ్చినా, శర్మగారు  45 నిమిషాలుదాకా  మాట్లాడి ప్రపంచం లోనే మొట్ట మొదటిసారిగా వేదాలను కంప్యూటర్ లో పెట్టిన ఈ విలువైన ప్రాజెక్ట్ ను పూర్తి చేయమని కోరారు .కంప్యూటర్ కొనాలంటే లక్షల మీద ఖర్చు .దీనికి అశ్విని హెయిర్ ఆయిల్  అధినేత సుబ్బారావు గారు వెంటనే ఒక లక్షా ఇరవై వేల  రూపాయలు ఉచితంగా ఉదారం గా అందజేయగా అవధానులుగారు అత్యాధునిక కంప్యూటర్ కొన్నారు .పని చేయటానికి కుర్రాళ్ళు కావాలి వాళ్లకు జీతాలు తనజీతంలోనుంచి ఇచ్చేవారు.  తానూ వారితో పంచేస్తూ ‘’వేద భారతి ట్రస్ట్ ‘’ఏర్పాటు చేయగా విరాళాలు అంది పని నిరాటంకంగా సాగింది . 1995 వేదానుక్రమణిక రాస్స్హారు . ఈ విషయాలు తెలుసుకొన్న రాష్ట్రపతి శ్రీ శంకర దయాళ్ శర్మ ఢిల్లీకి ఆహ్వానించారు .యజుర్వేదానికి చెందిన 7 అనుక్రమణికలు కంప్యూటరీకించి ,దేశం లోనే మొదటి సారి మల్టీ మీడియా లో ఆయనకు చూపించారు . ఆయన మహా గొప్పగా ఆనందించి అభినందించారు . 2000 నాటికి ఋగ్వేదాన్ని సి డి లలో పొందుపరచారు .వీటిని ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయీ ఆవిష్కరిస్తూ ‘’మా చిరకాల స్వప్నం సాకారమైంది ‘’అని మెచ్చుకొన్నారు .

 బెంగుళూరులో వైదిక సరస్సు జరుగుతుంటే పాల్గొనాలని వెడితే తనకు ఏ శాస్త్రం లోను ప్రవేశం లేదుకనుక అనుమతి లేదని చెబితే పట్టుబట్టి రాజమండ్రి ఓరియంటల్ కాలేజీ ప్రిన్సిపాల్ అయిన తనబాబాయి శ్రీ రేమెళ్ళ సూర్య ప్రకాశ శాస్త్రిగారి వద్ద మీమాంస శాస్త్రం నేర్చుకొన్నారు .తర్వాత సంస్కృతం జ్యోతిషం లలో ఏం ఏ చేసి ,’’వేదాలలో సైన్సు ,భూకంపాలు -జ్యోతిషం ‘’లపై పిహెచ్ డి చేసి ,వేదగణితం వేద విజ్ఞానా లపై చానళ్లలో కార్యక్రమాలు చేశారు .అవధానులుగారు చేసిన ‘’మల్టీ మీడియా వేదిక డేటా బేసిక్ డిజైన్ ‘’కు భారత ప్రభుత్వం పేటెంట్ హక్కునిచి ‘’సంస్కృత మిత్ర ‘’బిరుదుతో సత్కరించింది .

 వేద భారతి ట్రస్ట్ ద్వారా ఇప్పటికి 700 కు పైగా గంటల రికార్డ్ పూర్తయింది .ఇది 200 కుపైగా ఆడియో మల్టీమీడియా సిడి లుగా తెచ్చి ప్రజలకు అందుబాటులో ఉంచారు .మిగిలిన వేద శబ్దాన్ని రికార్డ్ చేయటానికి ఇంకా 2500 గంటలు కావాల్సి వస్తుందన్నారు .అంత ఆర్ధిక స్తొమత తమకు లేదని వదాన్యులు ముందుకు వచ్చి ప్రోత్సహించి వేద విజ్ఞానాన్ని సంరక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నారు .అవధానులుగారు  ‘’వేద గణితం ,రామాయణ భాగవత భారతాలలో జ్యోతిశ్శా స్త్ర  విశేషాలు ,ఉపనిషత్ రత్నావళి ,సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ వేదాస్ అండ్ శాస్త్రాస్ ‘’గ్రంధాలు రాశారు .ఇంట గొప్ప పరిశోధకులు క్రియాశీలి వేద గణితం పై అధారిటీ అయినా శ్రీ అవధానులు గారి గురించి ఇంతఆలస్యంగా గీర్వాణ కవుల కవితా గీర్వాణం లో రాయటం క్షమించరాని నేరమే.అయినా ఇప్పటికైనా రాయగలిగా నని ఒక ప్రక్క సంతోషిస్తున్నాను.

 అవధానులుగారు 25-9-1948న తూర్పుగోదావరి పొగడపల్లి లో జన్మించారు .తండ్రిశ్రీ  వి సూర్య నారాయణ తల్లి శ్రీమతి లక్ష్మీ  నరసమ్మ .

   సశేషం

     మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-7-17-కాంప్-షార్లెట్ -అమెరికా

— Inline image 1

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 362-సూర్య శతక కర్త -డా.దేవీ ప్రసాద్ మిశ్రా

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

362-సూర్య శతక కర్త -డా.దేవీ ప్రసాద్ మిశ్రా

పాండిచ్చేరి ఫ్రెంచ్ రీసెర్చ్ ఇన్ ష్టి ట్యూట్ లో ఇండాలజిస్ట్ డా దేవీ ప్రసాద్ మిశ్రా యువ సంస్కృత విద్యావేత్తగా ‘’మహర్షి బాదరాయణ వ్యాస సమ్మాన్ ‘’పురస్కారం 2015 లో అందుకున్నాడు .దీనికి ఒక లక్ష రూపాయల పారితో షికం ఇచ్చారు .ఈ పురస్కారాన్ని భారత రాష్ట్ర పతి శ్రీ ప్రణవ్ ముఖర్జీ చేతుల మీదుగా 2016 అందుకున్న అదృష్టవంతుడు మిశ్రా

ఒరిస్సాలో నయాగరా జిల్లాకు చెందిన మిశ్రా ,1999 లో పాండిచ్చేరి ఫ్రెంచ్ ఇన్ ష్టి ట్యూట్ లో సంస్కృత రీసెర్చ్ స్కాలర్ గా చేరాడు .సంస్కృతం లో ‘’సూర్య శతకం ‘’రాయటమే కాక ,శైవాగమాలపై విపరీతమైన కృషి చేశాడు .ఈ సంస్థలో మిశ్రా 3, 500 వ్రాత ప్రతులను క్రోడీకరించాడు .నేనుఈ  సంస్థలో చేరి పి .హెచ్ .డి.చేస్తుండగా ఈ కేటలాగింగ్ చేసే అదృష్టం నాకు కలిగింది ‘’అంటూ పొంగిపోయి చెప్పాడు మిశ్ర .ఈ సంస్థలో 8 400 కు పైగా తాళపత్ర గ్రంధాల కట్టలున్నాయని ,అందులో శైవాగమాలు కర్మకాండ గ్రంధాలే ఎక్కువని ,మిగిలినవి ఆలయ శిల్పకళా ,జ్యోతిషం ఖగోళ శాస్త్రామ్ ,తిరుక్కురళ్ దక్షిణ భారత దేశ వైద్యం ,సంస్కృత సాహిత్యం ,తమిళ ఆధ్యాత్మిక0 కు చెందినవని అన్నాడు .

 వీటిలో చాలా గ్రంధాలు ‘తమిళ బ్రాహ్మణుల ‘’’గ్రంథ లిపి ‘’లో రాయబడిన సంస్కృత గ్రంధాలని ,మిగిలినవి కాశ్మీరీ శారదా లిపి ,నందినాగర,నెవారి ,తీగలారి ,గ్రంథ ,తెలుగు ఒరియా ,తుళు  పుస్తకాలని ,ప్రతి తాటాకు కట్టలో చిన్న చిన్న అక్షరాలలో డజన్ల కొద్దీ గ్రంథాలుంటాయని  పరిశోధకుడు దేవీ ప్రసాద్ మిశ్రా తెలియ జేశాడు .

363-విదేశీ భాషా గ్రంధాలపై సంస్కృత ప్రభావం

ఫిలిప్ గ్లాస్ రాసిన ‘’సత్యాగ్రహ ఒపేరా ‘’లో భగవద్గీత శ్లోకాలను సంస్కృతం లో పాడటం జరిగింది .ది మార్క్సిస్ట్ రివల్యూషన్ ‘’లో ‘’బృహదారణ్యక ఉపనిషద్ ‘’ప్రార్ధన ఉంది .ప్రఖ్యాత మడోన్నా మ్యూజిక్ ఆల్బమ్ లోని ‘’సైబర్ రాగ ‘’లో సంస్కృత  మంత్రోచ్చారణ ఉంది . 1998 లో మడోన్నా  గ్రామీ అవార్డు అందుకున్న ఆల్బమ్ ‘’రే ఆఫ్ లైట్ ‘’లో ‘’అష్టాంగ విన్యాస యోగ ‘’మంత్రాలున్నాయి .అసలు లిరిక్కే ఓం శాంతిశాంతి తో ప్రారంభమవుతుంది .సంగీత కర్త జాన్ విలియమ్స్ ‘’ఇండియానా జోన్స్ అండ్ ది  టెంపుల్ ఆఫ్ డూమ్‘’లో ‘’స్టార్ వార్ ‘’ఎపిసోడ్ లో సంస్కృత శ్లోకాల కాయిర్ సింగింగ్ ఉంది . 2004 నాటి ‘’బాటిల్ స్టార్ గాలాక్టికా ‘’అంతా ఋగ్వేదం లోని గాయత్రీ మంత్రమే .ఎనిగ్మాతా రాసిన’’ లిరిక్స్ ఆఫ్ చైల్డ్ ఇన్ యు ఎస్ లో సంస్కృత శ్లోకాలు ఉన్నాయి ..(ఆధారం –సాంస్క్రిట్ -గీకీ పీడియా )

364-ఆరవ శతాబ్ది రామాయణం కనుగొన్న -కలకత్తా ఏషియాటిక్ సోయాసైటీ

కలకత్తాలోని ఏషియాటిక్ సొసైటీ లైబ్రరీ  రీసెర్చ్ స్కాలర్స్ వారు 6 వశాతాబ్దానికి చెందిన ‘’వహ్ని (అగ్ని )పురాణం పై పరిశోధిస్తుంటే అందులో ఒక అసంపూర్తి వ్రాతప్రతి గ్రంధం చూసి ఆశ్చర్య పడిపోయారు .అప్పుడు జర్మన్ స్కాలర్ Aufrecht గోబర్ రిపాజిటరీ గా సంస్కృత గ్రంధాలపై తయారు చేసిన ‘’కేటలాగో కేటలాగం ‘’ను పరీక్షగా చూడగా ఒకే రకమైన రెండు వ్రాత ప్రతులు ఉన్నట్లు గమనించారు .ఒకటి లండన్ లోని ఇండియా ఆఫీస్ లైబ్రరీ వారు భద్రపరచినది ,రెండవది శతాభి చరిత్రకలిగిన కలకత్తా సంస్కృత సాహిత్య పరిషత్ భద్ర పరచింది గా తెలుసుకొన్నారు .వారి ఉత్సాహం పెరిగి అగ్నిపురాణం వ్రాతప్రతి బూజు దులిపి దాని సంపూర్ణ ప్రతిని పట్టుకొన్నారు .దీన్ని విశ్లేషిస్తుండగా ‘’దశగ్రీవ రాక్షస వధ ‘’కు వహ్నిపురాణానికి ఏమీ సంబంధం ఉన్నట్లు కనబడ లేదు .ఈ పురాణం లో అకస్మాత్తుగా మరొక రకమైన కథా శ్లోకాలు ఎలా చేరాయో అర్ధం కాలేదువారికి  .నిదానం గా ద్రుష్టి సారిస్తే వారికి తాము చదువుతున్నది అనేక చేర్పులు మార్పులతో ఉన్న 6 వ శతాబ్దపు రామాయణ గ్రంధం అని అర్ధమైంది .ఆర్కిమిడీస్ లాగా ‘’యురేకా ‘’అని ఆనందం తో కేకలేసుకొన్నారు . అసలైన వాల్మీకి రామాయణం క్రీ పూ 4 వ శతాబ్దానికి చెందింది .

  ఈ 6 వ శతాబ్ది రామాయణం లో 7 కాండలకు బదులు 5 కాండలు మాత్రమే ఉన్నాయి .బాలకాండం ఉత్తర కాండలు లేవు .రావణ వధ  తర్వాత రామాదులు అయోధ్యచేరి పట్టాభి షేకం జరుపుకోవటం తో ఈ రామాయణం సమాప్తం .ప్రారంభం కూడా దశరధుని శాపం రాముడిని అరణ్యాలకు పంపటం లేదు .దీని బదులు శుక్రాచార్యుల భార్యను విష్ణుమూర్తి సంహరించినందుకు ఆయన లక్ష్మీ దేవిని శపించటం ,చనిపోయిన రాక్షసులను బ్రతికించటం తో కధ  ప్రారంభమౌతుంది .రెండవ శాపం నిరంతరంగా జరుగుతున్న దేవ దానవ యుద్ధానికి ధరిత్రి వ్యధ చెందగా లక్ష్మీ నారాయణులు  బాధ్యత తమపై వేసుకొని తామిద్దరం శాప ఫలంగా భూమిపై జన్మిస్తామని తెలియ జేయటం జరుగుతుంది .ఈ రామాయణం భార్యా భర్తల వియోగానికే ప్రాధాన్యం తప్ప తండ్రీ కొడుకుల వియోగాన్ని ప్రాధాన్యమివ్వలేదు .ఇందులో రాముడు దేవుడుగాకాక మానవత్వమున్న ఉన్నత మానవునిగా కనిపిస్తాడు

  (ఆధారం -న్యూ రామాయణ డిస్కవరీ అ స్టాండ్ స్కాలర్స్ ఇన్ కలకత్తా –ఝిమి ముఖర్జీ పాండే ) దీని ఫోటో జతచేశాను చూడండి

 సశేషం

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-7-17 -కాంప్-షార్లెట్-అమెరికా

— Inline image 1

డా .దేవీ ప్రసాద్ మిశ్ర  
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వీక్లీ అమెరికా-14 (26-6-17 నుండి 2-7-17 వరకు )

వీక్లీ అమెరికా-14 (26-6-17 నుండి 2-7-17 వరకు )

శ్రీ రుద్రాభిషేకం సత్యనారాయణ స్వామి వ్రత వారం

26-6-17 సోమవారం మధ్యాహ్నం శ్రీ మైనేని గారు శ్రీ ఎల్లాప్రగడ వారు ఫోన్ చేసి నా పుట్టిన రోజు 26 అనుకొని   ‘’ముందే కోయిలలు కూసినట్లు ‘’శుభాకాంక్షలు తెలియ జేశారు నిన్ననే మా అల్లుడు ,మనవళ్లు కాలిఫోర్నియా నుంచి తిరిగి వచ్చారు . …

           శ్రీ రుద్రాభిషేకం సత్యనారాయణ స్వామి వ్రతం

27 జూన్ తేదీలప్రకారం నా పుట్టిన రోజు .తిధులప్రకారం జ్యేష్ఠ బహుళ సప్తమి . .మా అమ్మ ఉన్నన్నాళ్ళు, ఆ తర్వాత కూడా చాలా ఏళ్ళు ఈ సప్తమి తిథినాడే పుట్టిన రోజు చేసుకునేవాడిని మా అమ్మ తప్పని సరిగా నాకు చాలా ఇస్టమని మైసూర్ పాక్ చేసేది .మా శ్రీమతీ ఎప్పుడూ చేస్తూనే ఉంది ..ఈ సారి అమెరికాలో ఉండటం మా పెద్ద మనవడు చి సంకల్ప్ (పెద్దబ్బాయి శాస్త్రి కొడుకు )ఏం ఎస్ పాసవటం ,చికాగోలో ఉద్యోగం వచ్చి చేరటం ,వాడితమ్ముడు చి భువన్ సెంట్రల్ సిలబస్ టెన్త్ క్లాస్ పాసై ,కాలేజీలో ఇంటర్ లో చేరటం ,మా రెండవ అబ్బాయి శర్మకొడుకు చి హర్ష టెన్త్ పాసై కాలేజీ లో చేరటం వాడి చెల్లెలు మా మనవరాలు చి హర్షిత టెన్త్ కు రావటం ,మా మూడోవాడు మూర్తికొడుకు చి చరణ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పాసవటం  వాడి చెల్లెలు మా మనవరాలు చి. రమ్య నైన్త్ క్లాస్ కు రావటం ,మా ఇక్కడి పెద్దమనవడు (మా అమ్మాయి పెద్దకొడుకు )చి శ్రీకేత్ టెన్త్ స్టాండర్డ్ కి రావటం వాడి తమ్ముళ్లు మా బుడ్డి మనవళ్ళు చి ఆశుతోష్ ,పీయూష్ లు సెవెంత్ స్టాండర్డ్ కు రావటం ,నాకు 77 వెళ్లి 78 ఏళ్ళు రావటం అన్నీ పురస్కరించుకొని 27-6-17  మంగళవారం మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉదయం 7-15 నుంచి 11 వరకు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి అష్టోత్తర సహస్ర నామ పూజ ,మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం ,శివా ష్టోత్తర సహస్రనామ పూజ ,బిల్వాష్టోత్తర పూజ చేశాను .ఉదయం 11 గం నుంచి మధ్యాహ్నం  1-15 వరకు శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం నవగ్రహాలకు అష్టోత్తర పూజ తో సహా చేసుకున్నాం .అంటే సుమారు 6 గంటలు ఈ రూపం గా భగవధ్యానం లో గడిపే అదృష్టం కలిగింది … వ్రతం కాగానే మా అమ్మాయి శ్రీ మైనేనిగారు పంపిన ‘’ఘన నగదు ‘’కానుక ,ప్రత్యేక గ్రీటింగ్ ,తాను  కొన్న ‘’ఘనవస్తు కానుక ‘’అంద  జేసింది .నేను మా ముగ్గురు మనవళ్లను ”యధాశక్తి ”నగదు కానుక అందించాను . భోజనం లోకి మామిడికాయ పప్పు ,బీన్స్ కూర కొబ్బరి పచ్చడి ,పులిహోర ,బొబ్బట్లు చేసింది .ఈ మధ్య చాలాసార్లు మైసూర్ పాక్ చేయటం వలన వెరైటీగా  బొబ్బట్లు చేసింది .శ్రీ మతి గోసుకొండ అరుణ  ,వాళ్ళబ్బాయిలను భోజనానికి పిలిచాము వాళ్ళు ఇక్కడికి వచ్చేదాకా విషయం చెప్పలేదు మేము .వచ్చి ఆశ్చర్య పోయి0ది అరుణ .. మైనేనిగారికి ఫోన్ చేసి ధన్యవాదాలు తెలిపాను …మా అబ్బాయిలు శాస్త్రి శర్మరమణ మనవళ్లు   మనవరాలు రమ్య .మా అన్నయ్యగారబ్బాయి రాంబాబు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియ జేశారు . ఇమెయిల్ ద్వారా సాహితీబంధువులు పంపిన శుభాకాంక్షలకు  ధన్యవాదాలు తెలిపాను ..శ్రీ సుంకర  అప్పారావు గారు ,అమ్మాయివచ్చి పళ్ళు ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు . సాయంత్రం మా ఇంటికి సుమారు 15 మైళ్ళ  దూరం లో ఉన్న శ్రీ త్రిమూర్తి దేవాలయానికి వెళ్లి అక్కడి బ్రహ్మా ,శ్రీనివాస ,శివులను ,సరస్వతీ పార్వతీ పద్మావతీ అమ్మవార్లను మా ఆంజనేయస్వామిని దర్శించి మంగళవారం వీరందరి దర్శన భాగ్యం కలిగినందుకు సంతృప్తి చెందాం . 5 ఏళ్ళ క్రితం ఈ ఆలయానికి శంకుస్థాపన జరిగినప్పుడు మేము ఇక్కడే ఉన్నాం .రెండు సార్లు వెళ్లి చూశామ్ .ఇప్పుడు నిర్మాణం పూర్తయి విగ్రహ ప్రతిష్ట జరిగి ఆలయం దర్శనానికి వీలుగా తయారయింది .

 బుధవారం  రాత్రి మైనేనిగారి బావగారు శ్రీ రాచకొండ శర్మగారికి ఫోన్ చేసి యోగ క్షేమాలు తెలుసుకున్నాను . ఆ డాక్టర్ దంపతులకు 93 ఏళ్ళు వచ్చిన సందర్భంగా విశాఖ సీనియర్ సిటిజెన్ అసోసియేషన్ వారు ఇంటికి వచ్చి ఇద్దరినీ పుష్పహారాలతో  సన్మానించారని శర్మ గారు చెప్పారు .వారిద్దరూ మరింత ఆరోగ్యంగా శతాధిక ఆయుస్సుతో ఆరోగ్యంగా వర్ధిల్లాలని భగవంతుని ప్రార్ధించా .మార్చి 15 న మేము విశాఖ వెళ్లి ఆ ద0పతులతో కొన్ని గంటలు గడిపిన మధురానుభూతి మరువ లేనిది . రాత్రి ‘’గొట్టం’’లో  సీతమ్మ అందాలు -రామయ్య చందాలు ‘’ సినిమా చూసాం నీట్ గా ఉంది .జగపతిబాబు ‘’కబడ్డీ కబడ్డీ ‘’ట్రాక్ కథ  .

  గురువారం   గీర్వాణం -3 లో శ్రీ హనుమద్రామాయణం తో పాటు అస్సామ్ గీర్వాణకవుల గురించి రాసి 330 కు చేర్చా .సాయంత్రం అప్పారావు గారింటికి వెళ్లి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పి ఫలాలు ఇచ్చివచ్చాము .మా మనవరాలు చి రమ్య కు హాపీ  బర్త్ డే చెప్పాం

  రాత్రి రాజేంద్ర ప్రసాద్ చలపతిరావు నటించి కోన వెంకట్ సంభాషణలు రాసిన ‘’ఓనమాలు ‘’సినిమా ట్యూబ్ లో చూసాం చాలా పర్పస్ ఫుల్ పిక్చర్ .అందరూ బాగా చేశారు .ఎవరు ఎంత కు ఎదిగినా జన్మభూమిని మూలలను మరచిపోరద నే చక్కని సందేశం ఉన్న సినిమా ..

 శుక్రవారం శ్రీ గుమ్మడి గోపాల కృష్ణ నటించిన  ఆకెళ్ళ నాటకం శ్రీనాధుడు చూసాం .చాలా బాగుంది .గుమ్మడి నటన బాగా నే ఉంది పద్యాలూ మైనేనిగారన్నట్లు కంచుగొంతు తో ఆలాపించాడుకాని బిగుసుకు పోయి నటించినట్లని పించిందినాకు .’’సినిమా గుమ్మడి ‘’రాజసం కొరవడింది .ఏమైనా పద్యనాటకం రాయటం ,దాన్ని ఆడటం ఆషామాషీ కాదు .దాన్ని మెప్పించారు రచయితా నటుడూ ..గీర్వాణం 340 కు చేరింది .

 శనివారం -గీ -3 లో 351 మంది కవుల గురించి రాయగలిగా . దాదాపు ఇరవై రోజులకు ఆస్ట్రో ఫిజిక్స్ చదివి పూర్తి చేశా …ది స్టోరీ ఆఫ్ మై లైఫ్ చదవటం నత్తనడక లో సాగుతోంది ..గొట్టం లో ఏవేవో సినిమాలు ట్రై చెశాముకాని అవీ ‘’గొట్టంలా’’ ఉండటం తో చూడలేదు .

2-7-17 ఆదివారం -ఉదయంమా అమ్మాయి  రమణ ఫోన్ చేసి రాత్రి చెప్పాడని మా శిష్యుడు చిలుకూరి కొడుకుకు ఎంసెట్ లో ఏం బి బి ఎస్ కు 1600 రాంక్ వచ్చిన శుభవార్త చెప్పింది వెంటనే మెయిల్ రాయటమేకాక కాకినాడకు ఫోన్ లో వాడికి కంగ్రాట్స్ చెప్పాను .నిరుడు ఎంట్రన్స్ లో ఈ కుర్రాడికి 26000 రాంక్ వచ్చింది . వాడిని బెజవాడ తీసుకొచ్చి ఏడాది ఇన్సెంటివ్ కోచింగ్ లో పెట్టాడు . దానికి తగ్గట్టే కుర్రాడూ కస్టపడి చదివి 1600 రాంక్ సాధించాడు అంటే గవర్నమెంట్ కాలేజీలలో సీట్ వస్తుంది . రూపాయి కూడా డబ్బు కట్టక్కర లేదు .చాలా మంచి వార్తమా అందరికి . మార్చిలోనే మా చిలుకూరి అంటే సి ఎల్ యెన్ శర్మ తల్లీ ,తమ్ముడు రెండు రోజుల  తేడాలో ఉయ్యూరులో చనిపోయారు . వారిద్దరి కార్యక్రమాలు వీడే దగ్గరుండి జరిపాడు .చిలుకూరి అంటే మా ఇంట్లో కుర్రాడనే భావన . వాడు వాళ్ళ నాన్నగారు మా కుటుంబానికి చేసిన సేవలు  తీర్చుకోలేనిది .అందుకే ఈ కుర్రాడి ఉపనయనానికి రెండేళ్ల క్రితం జోరున వర్షం లో కారులో కాకినాడ వెళ్లి ఆశీస్సులు అందజేశాము . అంతటి అభిమానం మాకు ఆ కుటుంబం అంటే .ఇంతకాలానికి చిలుకూరి దంపతుల కోరిక తీరింది .కొడుకు బాధ్యతగా చదివి వారి కోరిక తీర్చాడు .మంచికాలేజీ లో సీటు వచ్చి చదివి డాక్టరై అందరికి మరింత సంతోషం కలిగిస్తాడని ఆశిస్తున్నాము .

  మా కుటుంబం లో డాక్టర్ చదివిన వాళ్ళెవరూ లేరు .మా రేపల్లె బాబాయి శ్రీ  రాయ ప్రోలు శివ రామ దీక్షితులుగారి చివరి కొడుకు రామ కృష్ణ -నాకంటే ఐదారేళ్ళ చిన్నవాడు ఏం బి బి ఎస్ చదివి హైదరాబాద్ మల్కాజి గిరిలో ప్రాక్టీస్  చేస్తూ స్వ0త హాస్పిటల్ కట్టుకొని మంచి పేరు ప్రఖ్యాతులు పొందాడు ..వీడు తప్ప మాలో ఎవరూ డాక్టర్ కాలేదు . ఇప్పుడు చిలుకూరి కొడుకు చి సాయి డాక్టర్ సీట్ సాధించాడంటే మా కుటుంబలో వాడు సాధించినంత ఆనందంగా ఉంది .

 గీర్వాణం 356 కు చేరింది .  ఈ  వీక్లీ ఇంతటితో సమాప్తం .

 మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -2-7-17-కాంప్-షార్లెట్-అమెరికా

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 361- శైవాగమ గ్రంథ పరిశోధకుడు -ఎస్ సంబంధ శివాచార్య (1927

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3

  361- శైవాగమ గ్రంథ పరిశోధకుడు -ఎస్ సంబంధ శివాచార్య (1927

పాండిచ్చేరిలో ఫ్రెంచ్ ఇన్ స్టి ట్యూట్ లో రీసెర్చర్ గా ఉన్న 89 ఏళ్ళ జ్ఞాన వయో వృద్ధుడు ఎస్ సంబంధ శివాచార్య  సంస్కృత సేవకు శైవ మత సిద్ధాంత వ్యాప్తికి రాష్ట్రపతి ప్రశంసా పత్ర0 అందజేశారు .   .తాళగ్రంధ వ్రాత ప్రతులను చదవటం లో నిష్ణాతుడు .శైవాగమాలలో అనన్య సామాన్య ప్రతిభా సంపన్నుడు  శైవాగమనాలను క్షుణ్ణంగా పరిశీలించి పరిశోధించి ప్రచురించాడు .శైవ సిద్ధాంత పరిణామ చరిత్రను ఆమూలాగ్రంగా మధించి రాశాడు . పురాతన శైవ గ్రంధాలను 300 కు పైగా క్రోడీకరించి ,అనువదించిన మహా విద్వా0సుడు .రాష్ట్ర పతిపురస్కారం తోపాటు 5 లక్షల నగదు పారితోషికాన్ని స్వీ కరిస్తున్నప్పుడు ఆయన అతి వినయంగా ‘’నేను పూర్వ జన్మలో చేసుకొన్న పుణ్యఫలితమే ఈ సంస్కృత ప్రశంసా పత్ర0 పారితోషికం ‘’అన్నాడు .

 1969 లో ఈ రీసెర్చ్ ఇన్ ష్టి ట్యూట్ లో చేరిన ఈ ఆచార్య కు  ఫ్రెంచ్ ప్రభుత్వం  అత్యుత్తమ సివిల్ అవార్డు ను2008 లో  అందజేసింది  .ఆలిండియా ఆది శైవ శివాచార్య సేవాసంఘం 2011 లో ‘’ఆగమ భూషణ ‘’పురస్కారమిచ్చింది .అర్చక కుటుంబలో 6-1-1927న జన్మించిన శివాచార్య ఏడవ  ఏట నుంచి దేవాలయం లో అర్చనాదులు చేయటం లో సిద్ధ హస్తుడయ్యాడు .తండ్రి డి సుబ్రహ్మణ్య గురుక్కళ్ వద్ద వేదం శాస్త్రాలు వివిధ పండితులవద్ద నేర్చి మధురాంతకం లోని అహోబిల మఠ సంస్కృత పాఠశాలలో , తిరువయ్యారు ,మైలాపూర్ సంస్కృత కాలేజీ లలో చదివి  చెన్నైలోని థియ సాఫికల్ సొసైటీ వ్రాత ప్రతుల డిపార్ట్ మెంట్ లో ,ప్రభుత్వ మన్యు స్క్రిప్ట్ లైబ్రరీ లో పనిచేసి తంజావూర్ సరసవతిమహల్ లైబ్రరీ తో సంబంధంకలిగి ,మైసూర్ ఓరియంటల్ లైబ్రరీలో పని చేసి తరువాత పాండిచ్చేరిలో ఈ రీసెర్చ్ సంస్థలో చేరారు . 8400 తాటాకు గ్రంధాలు ఈ ఇంస్టి ట్యూట్ లో ఉన్నాయని .అందులో ఎక్కువగా శైవాగమాగ్రంధాలేనని  మిగిలినవి జ్యోతిష ,దక్షిణ భారత దేశ వైద్యగ్రంధాలు ,సంస్కృత సాహిత్య గ్రంధాలు ,తమిళ ఆధ్యాత్మిక గ్రంధాలు ఉన్నాయని చెప్పాడు

  ఈ వ్రాతప్రతులు తమిళలిపి  లో రాయబడిన  సంస్కృతమే  ఉందని   మిగిలినవి శారదా ,నందినగరి , నెవారి తిలగరి  గ్రంథ ,తమిళం తెలుగు ఒరియా ,తుళు గ్రంధాలు .ప్రతి తాళపత్ర కట్టలో అతి చిన్న అక్షరాలలో అనేక గ్రంధాలున్నాయని సంబంధ శివాచార్య చెప్పారు .దాదాపు 5 దశాబ్దాలుగా శివాచార్య రోజుకు 10 గంటలకు పైగా  పనిచేస్తున్నారు .దేశం లోని వివిధ ప్రదేశాలనుంచివివిధ భాషలలో ఉన్న  వ్రాత ప్రతులను తెప్పించి పరిశీలించి శుద్ధ ప్రతి తయారు చేసి ప్రచురిస్తున్నారు .ప్రస్తుతం ‘’సూక్ష్మా గమం ‘’పై కృషి చేస్తున్నారు .క్రిందటి శతాబ్దం లో సంస్కృతం గ్రంథ లిపి నుంచి దేవనాగరి లిపి లో రాయబడుతూ బాగా ప్రాచుర్యం లో ఉందని చెప్పారు స్వ0త ప్రింటింగ్ ప్రెస్ ను గ్రంథ ,దేవనాగరి లిపులతో ఏర్పాటు చేసుకొని ఎన్నెన్నో శైవాగమ గ్రంధాలు ప్రచురించారు .ప్రస్తుతం పంచాంగాలు ,తిరుకొయిల్ ,అనుష్టాన వాక్య పంచాంగం పై కృషి చేస్తున్నారు . స్యయ0 గా  15 ఏళ్ళనుంచి పబ్లిషింగ్ కంపెనీ నడుపుతున్నారు .

  సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-7-17-కాంప్-షార్లెట్-అమెరికా

Inline image 1


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 357-శౌనక శిక్ష కర్త -కె యెన్ ఏం దివాకరన్ నంబూద్రి (b. 1906)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

357-శౌనక శిక్ష కర్త -కె యెన్ ఏం దివాకరన్ నంబూద్రి (b. 1906)

కేరళలో కోతకార దగ్గర నంది కులం లో కె యెన్ ఏం దివాకరన్ నంబూద్రి1906 లో జన్మించాడు .త్రిపుంతూర్ సంస్కృత కాలేజీ లెక్చరర్ . శాస్త్ర దివాకర ,శాస్త్ర రత్న బిరుదులూ పొందాడు .శంకరాచార్య చరితం శౌనక శిక్ష ,వర్ణోచ్ఛరణ దీపికా  ,ఋగ్వేద జ్యోతిషం సంస్కృతం లోను  ఆది శంకరాచార్య అండ్ కాలడి   ఇంగ్లిష్ లోను రచించాడు

358-జాతకాదేశ కర్త -శంకరం నంబూద్రిపాద్ కానిప్పయ్యూర్(1891

శంకరం నంబూద్రిపాద్ కానిప్పయ్యూర్ గొప్ప వాస్తు శిల్ప శాస్త్ర వేత్త .జ్యోతిష పండితుడు ,సంస్కృత  విద్వామ్సుడు,సాంఘిక సంస్కర్త . 1891 లో త్రిచూర్ జిల్లా కున్నాంకులం లో జన్మించాడు .గురుకులం లో శాస్త్రాధ్యయనం చేశాడు .పంచాగమ  ప్రెస్ పెట్టాడు యోగక్షేమ సభ నిర్వహించాడు .కోచి మహారాజు ‘’పండిత రత్న ‘’బిరుదునిచ్చాడు .జాతకాదేశం ,పంచ బోధ0 ,మనుష్యాలయ భాష ,తంత్ర సముచ్చయం  సంస్కృత మళయాళ నిఘంటు ఔషధ నిఘంటు వంటి సంస్కృత గ్రంధాలు ,అనేక మళయాళ గ్రంధాలు రాశాడు  .

359-వాసుదేవ కర్ణామృత కర్త -వాసుదేవన్ నంబూద్రి (1891-1947 )

1891 లో జన్మించిన వాసుదేవన్ నంబూద్రి కవి ,వక్త .ఆయన భాగవత ప్రవచనం ఆపాత మధురం .వేదం సకలశాస్త్రాలు కావ్యాలు నేర్చాడు .హరివిలాసం లో సంస్కృత విద్యాలయం స్థాపించాడు .ఈయన భాగవత కథా ప్రశస్తికి మెచ్చిరెండు చేతులకు  కోచ్చిరాజు బంగారు వీర శృంఖలాలు బహుమానం ఇచ్చాడు.రవి వర్మ ‘’భక్త శిరోమణి ‘’బిరుదునిచ్చాడు .సంస్కృతం లో వాసుదేవ కర్ణామృతం ,భాగవత సంగ్రహం ,భాగవత సంగ్రహ గాధ ,శ్రీధరాచార్య భాగవత  మకరందం రాధా మొదలైనవి రచించాడు .సామాన్యుడిని భాగవతం వైపుకు ఆయన లాగా ఆకర్షించేట్లు చేయగలిగిన నేర్పున్న వారెవరూ లేరు .  ఆయనపై పి .హెచ్ డి చేశారు .మహా భాగవతోత్తముడు వాసుదేవన్ నంబూద్రి 1947 లో చనిపోయాడు .

360-భాష సౌందర్య లహరి స్తోత్ర కర్త -శ్రీధరన్ నంబూద్రి చ0ద్రమన (1917

1917 లో పుట్టిన శ్రీధరన్ నంబూద్రి చ0ద్రమన  అసమనూర్ వాసి .ఆయన ‘’మాస్టర్ ఆఫ్ ఆల్ ఆర్ట్స్ ‘’ జ్యోతిషం తో సహా ఆయనకు రాని శాస్త్రమే లేదు  .కధాకళీ నేర్చి ప్రదర్శనలిచ్చారు .సంస్కృతం లో భాషా సౌందర్య లహరి స్తోత్రం ,కిరాతావాసిష్ఠం ,విశ్వా మిత్ర మేనకా రాశాడు .కవన కౌతూహలం మేగ జైన్ లో ఎక్కువగా రచనలు చేశాడు  ..

     సశేషం

          మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-7-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 352-స్యేన సందేశకర్త -వయాస్కార ఆర్యన్ నారాయణన్ మూస్ (1841 – 1902)    

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

352-స్యేన సందేశకర్త -వయాస్కార ఆర్యన్ నారాయణన్ మూస్ (1841 – 1902)

 1841లో జన్మించి 1902 లో మరణించిన వయాస్కార ఆర్యన్ నారాయణన్ కేరళ నంబూద్రి కుటుంబానికి చెందినవాడు .అష్టవైద్యన్ బిరుదుపొందిన ఈకవి ‘’స్యేన  సందేశం ,నక్షత్ర వృత్తావలి ,చిత్ర ప్రబంధాలు రాశాడు

353-వ్రతారాధన మాల కర్త -వల్లాన సేరి  వాసున్ని మూసద్ (1855 – 1914)

1855 లో పుట్టి 1914 లో 59 వ ఏట మరణించిన వల్లాన సేరి  వాసున్ని మూసద్ కేరళ నంబూద్రి కుటుంబం వాడు .విజ్ఞాన చింతామణి ‘’సంస్కృత పత్రిక నడిపాడు .ఈయన రాసిన గ్రంధాలలో వ్రతారాధన మాల ,,సంస్కృత పాఠావలి ,శ్రీ పాదాది కేశ పఞ్చా0గి క ,మాయాస్తవం ,మాన విక్రమ సామూత్రి మహా రాజా చరితం మొదలైనవి ఉన్నాయి .

354-కుల శేఖరీయం కర్త -ఇంచూర్ కేశవన్ నంబూద్రి (1855 – 1932)

కేరళ నంబూద్రి బ్రాహ్మణుడైన ఇంచూర్ కేశవన్ నంబూద్రి1855 లో తిక్క వరూర్ దేశం లో పుట్టి 87 ఏళ్ళు జీవించి 1932 లో మరణించాడు .ఇతని కులశేఖరీయం వీదువంశ చంపు ప్రసిద్ధమైనవి .

355-నివాపాంజలి కర్త -అచ్యుత వాసుదేవ మూసద్  (1895 – 1959)

అచ్యుత వాసుదేవ మూసద్ 1895 లో జన్మించి 1959 లో 69 వ ఏటా చనిపోయాడు .పుఞ్ఞసిరి నంబి శిష్యుడు ,నివాపాంజలి ,మరక్కాధా నాలుక రాశాడు ..

356-ఆమ్నాయ మతానాం కర్త -యెర్కార రామన్ నంబూద్రి (1898 – 1983)

1898 లో జన్మించి 85 ఏళ్ళు జీవించి 1983 లో చనిపోయిన యెర్కార రామన్  నంబూద్రి వేద వేదాంగాలలో నిష్ణాతుడు . అనేక సోమయాగాలు అతిరాత్రాలు నిర్వహించిన ఘనుడు .ఆమ్నాయ మతానాం ,శ్రౌత కర్మ వివేకం గ్రంథ కర్త . 32రోజుల పౌండరీక యజ్ఞం లో సుప్రసిద్ధుడు . 1942-43 లో గురువాయూర్ లో  ‘’మురహోమం ‘’దగ్గరుండి జరిపించాడు .సంస్కృతం శాస్త్రాలలో ఆయన పాండిత్యం అపారం .ఒకసారి ‘’కౌశికీయత బ్రాహ్మణం ‘’గడగడా అప్పగించి అందర్నీ ఆశ్చర్య పరచాడు . 1970 లో తిరుపతి దేవస్థానం ఆహ్వానం పై వెళ్లి దీన్ని చదివి రికార్డ్ చేయించాడు .దీంతో జాతీయ ,అంతర్జాతీయ కీర్తి పొందాడు .శ్రౌత స్మార్తాలలో భారత దేశం లో ఆయనదే తుది తీర్పుగా ఉండేది . భారత రాష్ట్రపతి ప్రశంసా పత్రం తోపాటు ‘’వేదార్ధ రత్న ‘’వంటి బిరుదులెన్నో పొందాడు . 22ఏళ్ళ వయసులో శ్రీమతి పార్వతిని వివాహమాడి 4 గురుకుమారులు 5 గురు కుమార్తెలను  ఈ దంపతులు సంతానంగా పొందారు . జీవితకాలం లో 99 యాగాలు స్వయంగా చేసి అనేక యాగాలు ఇతరులతో కలిసి నిర్వహించిన యజ్ఞ నిర్వహణ దక్షుడు  రామన్  నంబూద్రి

 20-7-1983 న ఈ కర్మిష్ఠి  రామన్  నంబూద్రి   85 వ ఏట వైకుంఠ  మందిరం చేరాడు .

  సశేషం

    మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-7-17-కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 346-ఆది కావ్యం శ్రీమద్రామాయణ కర్త -ఆదికవి వాల్మీకి మహర్షి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

346-ఆది కావ్యం శ్రీమద్రామాయణ కర్త -ఆదికవి వాల్మీకి మహర్షి

వాల్మీకి సంస్కృత సాహిత్యంలో పేరెన్నికగల కవి[1]. రామాయణాన్ని వ్రాశాడు. ఈయన్ని సంస్కృతభాషకు ఆదికవిగా గుర్తిస్తారు. ఇతడే శ్లోకమనే ప్రక్రియను కనుగొన్నాడు.[2] ప్రచేతసుని పుత్రుడు కాబట్టి అతడు ప్రాచేతసుడు అని కూడా ప్రసిద్ధం

జీవిత విశేషాలు

మహర్షి వాల్మీకి ఎవరు?వల్మీకము నుండి వెలుపలికి వచ్చిన వారు కావున వాల్మీకి. మరామరా అని తపస్సుచేసిన వారు  కావున మహర్షి,రాముడి జీవితచరిత్రను రామాయణముగా మహాకావ్యరచన గావించి నవాడిగా ఆదికవి అయ్యాడు.అయితే వాల్మీకి జన్మము ఎట్టిది? ఆయన తల్లితండ్రులు ఎవరు? అనే విషయ ము పై అనేక తర్జనభర్జనలు, కట్టుకథలు ప్రాచుర్యములో ఉన్నాయి.ఏ రచయత అయినా తన గురించి ఉపో ధ్గాతము, పరిచయము తదితర అంశములలో తెలుపుకోవటము ఈ నాటి రచయతలు పాటిస్తున్న విధా నము. వేదవ్యాసుడు తాను మత్స్యగంధి, పరాశరుల కుమారుడనని తన రచనలలోనే చెప్పుకోవడముతో వ్యాసుడు ఎవరన్నది కచ్చితముగా తెలిసింది.అదేవిధముగా రచయతగా తాను ఎవరన్నది ప్రత్యేకముగా వాల్మీకి వ్రాయనప్పటికీ సందర్భానుసారముగా సీతను రాముడికి అప్పచెబుతున్న సమయములో ఉత్త రాకాండ -రామాయణములో వాల్మీకి ఇలా అన్నారు.   “రామా నేను ప్రాచేతసుడను ప్రచేతసుడి ఏడవ (దశమ) కుమారుడిని. వేలసంవత్సరాలు తపస్సు చేసిన, ఏ పాపము చేయని,అబద్దమాడని మహర్షిని.సీత నిన్ను తప్ప మనసా, వాచా పరపురుషుడిని ఎరగని మహాపతివ్రత.నా మాట నమ్ము,సీతను ఏలుకో.నా మా టలు తప్పు, అబద్దము అయితే ఇంతకాలము నేను చేసిన తపస్సు భగ్నము అవుగాక.” (వాల్మీకి రామా యణము-తెలుగు అనువాదము,క్రీ.శే.పురిపండా అప్పలస్వామి)

వాల్మీకిగా పిలవబడుతున్న మహర్షి పేరు ప్రాచేతసుడని ఇక్కడ మనము గుర్తించవచ్చును.ఇది వాల్మీకి తనకు తాను తన గురించి చెప్పుకున్న విషయము. ఆయన మాటలలో ఆర్ధత,నిజాయతీ ఉట్టి పడు తున్నాయి. అయితే ప్రచేతసుడు ఎవరు? ప్రచేతసుడు ఎవరి కుమారుడు?ఆయనది ఏ వంశము? ఈ విషయ ములను తెలుసుకోవటానికి అనేక పురాణములను, చరిత్రలను చదవాలి. ప్రచేతసుల గురించిన ప్రస్తావన “శ్రీ మత్భాగవతము”లో ఉంది.

శ్రీ మత్భాగవతము వేదవ్యాసవిరచితము. వ్యాసుడు రచించిన అష్టాదశ పురాణములలో శ్రీ మత్భాగవతము ఒక గొప్ప పురాణము.భారతదేశములోని మహాపురుషుల చరిత్రలు పురాణములుగా వ్రాయబడి ఉన్నాయి. భారతదేశము పై మొదటగా మహమ్మదీయులు దాడి చేయటముతో భారత చరిత్రను వ్రాసిన వారు చాలా తక్కువ.స్థిరత్వము లేని పరిస్తుతులలో ఏ రచయతా చరిత్రలను వ్రాసే స్థితిలో ఉండిఉండరు.ఆంగ్లేయుల పాలన మొదలైన తరువాత ప్రశాంత వాతావరణము ఏర్పడింది. (శ్రే వేమన పద్యసారామృతము-సి.పి.బ్రౌన్)  చరిత్ర అనగా హిస్=అతనియొక్క, స్టోరీ=కథ అని ఆంగ్లేయులు వచ్చిన తరువాతే చరిత్ర అనే పదము వాడు కలోకి వచ్చి చరిత్రలను వ్రాయటము మొదలు పెట్టారు. అంతకు ముందు భారతదేశ చరిత్రలను పురాణముల పేరుతో తెలుసుకునే వారు.భారతదేశములో పురాణములను అనగా జరిగిపోయిన వాస్తవాలను (చరిత్రలను) కాలక్షేపానికో, పుణ్యానికో చదవటము,వినటము అలవాటుగా వస్తోంది. పురాణములంటే భారతీయులకు అ త్యంత విశ్వాసము. పురాణములలోని వ్యక్తుల జీవితకథలను, అందులోని నీతి,నిజాయతీలను,సంఘటనలను నిజమనే నమ్ముతారు. వారిని ఆదర్శముగా తీసుకొంటారు.పురాణాలలోని ఆచార వ్యవహారా లను, వ్రతము లను,పూజాదికార్యక్రమములను, జన్మ నుండి మరణము వరకు సాగే బారసాల, అన్నప్రాశన, అక్షరాభ్యాసము నుండి పుంసవనము,శ్రీమంతము,వివాహము  తరువాత అప్పగింతలు,మరణము తరువాత  పార్థీవశరీరానికి చేసే క్రతువులు అన్నీపురాణాలలో వివరించిన విధముగానే పాటిస్తారు. పురాణ రచయతలను భగవత్ సమా నులుగా కొలుస్తారు.భగవంతుడే వాల్మీకిమహర్షిగాను (బ్రహ్మ),వేదవ్యాసుడు (శ్రీ మహావిష్ణువు)గాను జన్మించి పురాణములను రచించినారని, అవి విశ్వమానవ సౌభ్రాతత్వమును చాటుతాయని నమ్ముతారు. శ్రీ మత్ భాగ వతము,శ్రీ విష్ణు పురాణము అన్నవి భగవాన్ విష్ణువు,ఆయన భక్తుల కథలు.ఎవరైతే శ్రీ మహా విష్ణువును నమ్మి కొలుచుకున్నారో, ఆయన వారిని కష్టాలబారి నుండి ఎలా రక్షించాడో తెలిపే కథలు ఈ పురాణాలలో తె లుపబడ్డాయి.శ్రీ మథ్భాగవతము ద్వాదశస్కంధములుగా వ్రాయబడింది. శ్రీ మథ్భాగవతము చతుర్థ స్కంధ  ములో త్రయోదశోధ్యాయములో విదుర ఉవాచ:

కే తే ప్రచేతసోనామ కస్యాపత్యాని సువ్ర

కస్యా న్వవాయే ప్రఖ్యాతా: కుత్ర వా సత్రామాసత                               

అర్థము: గొప్ప భగవత్ భక్తిని గలిగిన ఆచార్యా    “ప్రచేతసులు చేయుచున్న సత్రయాగములో నారదులు గానము జేసితిరని చెప్పితిరి గదా. ఆ ప్రచేతసులు ఎవరు?వారెవరి కుమా రులు? ఎవరి వంశమందు ప్రసిద్ధిని పొందిరి.”అని విదురుడు  ప్రశ్నిస్తూ మైత్రేయునితో ఇంకా ఇలా అన్నాడు.

స్వధర్మశీ లై:పురుషైర్భగవాన్ పురుషోత్తమ:

ఇజ్యమానో భక్తిమతా నారాదేనేరిత:కి ల

అర్థము:క్షత్రియులైన ప్రచేతసులు తమతమ ధర్మముల మూలకముగా శ్రీ హరిని యజ్ఞ యాగాదులచే పూజించుచుండిరి. అచ్చటికి వచ్చిన నారదులు, యజ్ఞమయుడు, పురుషో త్తముడైన విష్ణువును గురించి ఉపదేశించిరని వినియున్నాము.

ఇక్కడ తెలిసిన విషయము ప్రచేతసులు విష్ణుభక్తులు.క్షత్రియులు.వీరికి విష్ణువు, యజ్ఞయాగాదుల గురించి నారదుల వారు ఉపదేశము చేశారు.

ఆ తరువాత కథా క్రమములో ధ్రువుడి తపస్సు, శ్రీ హరి ప్రత్యక్షమవటము, వరాల అను గ్రహము, ధ్రువ వంశవిస్తరణ, (చూడుము) సూర్యవంశస్థులు, బోయలవంశక్రమము) వత్సరుడు, పుష్పార్ణుడు, సాయంకాలుడు, చక్షుడు, ఉల్కకుడు, అంగుడు,వేనుడు, పృథ్వీరాజు, విజితాశ్వుడు,పావనుడు, హవిర్ధానుడు, ప్రచేతసుడు, ప్రాచేత సులు (10మంది) అని తెలియబడతారు. వీరి జన్మవృత్తా౦తములు, అంగుడి బాధ, వేనుడి దుశ్చర్యలు, పృథ్వీ రాజుఔన్నత్యము, నిషాదుడు అడవులలోకి పంపబడి కిరాతరాజవ్వటము, ప్రచేతసుడికి 10 మంది ప్రాచే తసులు జననము వివరించబడ్డాయి.ఆ 10మంది ప్రాచేతసులలో 7వ (పదవ) వాడు వాల్మీకి మహర్షి.

ప్రాచేతసుడు క్షత్రియవంశములో జన్మించాడు, నారదుల ఉపదేశము తోనూ,తండ్రి, తాతల, ముత్తాతల  సుకృతము, శ్రీ హరి పై తరతరాల భక్తి విశ్వాసాలు వాల్మీకిమహర్షిగా రూపొందింప చేశాయి. వాల్మీకిమహర్షి యొ క్క నిజ కథ ఇది. ఈ విషయములను కప్పిపుచ్చి అనేక కథలు తరతరాలుగా ప్రాచుర్యము పొందాయి.వాల్మీకి మహర్షిగురించి ఎవ్వరూ పరిశోధనలు గావించక పోవడముతో కట్టుకథలు ఇంత వరకు ప్రాచుర్యములో ఉన్నాయి.రాముడు అనే పాత్రను లోకానికి  ఆదర్శపురుషుడిగా చూపించాలనే  ఆదికవి  తపనే  గాని ఆ పాత్రకు   గుణగణాలు రూపొందిచటమే తన ధృష్టి తప్ప తన గురించి తానెవరో గొప్పలు కాదుకదా వాస్తవాన్ని కూడా చెప్పక పోవడముతో ఎవరికి తోచినది వారు ఊహాగానాలు చేశారు.మహానుభావులు ఎప్పుడూ ఇత రుల గురించి, వారి బాగు గురించి ఆలోచిస్తారే తప్ప వారి గురించి వారు తపించరు.శ్రీ షిర్డి సాయి విష యములో కూడా ఆయన ఎవరో, ఏ తండ్రి బిడ్డడో ఆయన చెప్పలేదు, తాను హిందూవో, ముసల్మానో కూడా తెలియ నీయక మశీదులో నివసిస్తూ, అక్కడే హిందువులకు ఆరాధ్యనీయమైన తులసిమొక్కలను, ధునిని ఏర్పరచి సర్వమానవ  సౌభ్రాతత్వమును కోరిన మహనీయుడి వలె, వాల్మీకిని పవిత్రమైన వారిగా మనము గుర్తించా లి.షిర్డిసాయి ఎంతటి మహనీయులైనా వారిని  తమ వాడంటే తమవాడనీ,హిందువులలో బ్రాహ్మ ణులు షిర్డిసాయిని భరద్వాజ గోత్రోత్భవుడని అంటూంటే,ముసల్మానులు తమవాడని ఇప్పటికీ ఆయన మంది రములో నమాజు చదువుతున్నారు. ఇవన్నీ ఎవరికి వారు ఏర్పరచుకొన్న భావనలే తప్ప నిజము ఆ భగవంతులకే ఎరుక.మహర్షివాల్మీకి ఎప్పుడూ, ఎక్కడా తాను తన జీవితచరిత్రను వెలి బుచ్చక పోవటముతో కొందరు వాల్మీకి పేరు రత్నాకరుడని ఆయన పూర్వాశ్రమములో దొంగ, దారిదోపిడీదారుడని వ్రాశారు.  మరి కొందరు ఆయన బ్రాహ్మణుడని,పేరు అగ్నిశర్మ అని  దొంగల ముటాలో పెరిగి దొంగ అయినాడని వ్రాశారు. ఈ కట్టు కథలకు ఎక్కడా ఆధారాలు  లేవు (ఇలపావులూరి  పాండురంగారావు,ఆచార్య సహదేవ, జస్టిస్ భల్లా).భగవత్ గీతలో కూడా అనేక మార్పులు, చేర్పులు జరిగాయని,మూల గీతలో లేని అనేక శ్లోక ములు చేర్చబడ్డాయని డాక్టర్ రాధాకృష్ణన్, రుడాల్ఫ్ ఓటో అభిప్రాయ బడ్డారు. (దర్శనములు-మతములు-విజ్ఞాన సర్వస్వము,నాలుగవ సంపుటము-ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి)  వాల్మీకిమహర్షి గురించి కొందరు ఓర్వలేక,అసూయతో లేదా దొంగ కూడా తపస్సు చేసి మహర్షి కావచ్చు అనేందుకు ఉదాహరణగా చూపేందు కో  అల్లిన కట్టు కథలు.

భారతీయ సాహిత్య నిర్మాతలు-వాల్మీకి అనే ఆంగ్లపుస్తకములో ఇలపావులూరి పాండురంగారావు గారు ఈ క్రింది విధముగా వాల్మీకిమహర్షి పై వ్యాఖ్యానించారు.

“వాల్మీకి తన జీవితారంభ దశలో కిరాతుడని,సప్తరుషులచే  ఋషిగా పరివర్తన పొందగలిగాడని  ప్రచారములో ఉన్న కథ వినడానికి ఉత్కంఠ భరితముగా  ఉండవచ్చుగాని దానికి తగిన చారిత్రాత్మక ఆధారాలు లేవు. జీవి తాన్ని గూర్చి సంపూర్ణ అవగాహన గలిగి,శాస్త్రీయ ధృక్పథముతో రసజ్ఞ సౌందర్యాన్ని కవితామయముగా  మేళవించిన వ్యక్తిని గూర్చి అలా చెప్పడము భావ్యము కాదు. వాల్మీకి కిరాతుడు అనే కథ బహుళ ప్రచా  రము లో ఉన్నందున ఆ ధృక్పథము తోనే చూస్తున్నారు.”

“ కిరాతుడు” అనే  పదానికి అర్థము తురాయి అనగా నెమలి పింఛము లేదా అటువంటి ఆకారములో ఉన్న పువ్వులు, ఆకులను, పక్షుల ఈకలను తల ముందు భాగములో కట్టుకొని, తల పాగ వలె ధరించి ఉన్నవాడు. ”కి” అనగా కలిగి అని, రాతుడు అనగా తురాయివాడు అని అర్థము.అంతే గాని ఈనాడు వాడుకలో ఉన్నట్లుగా కిరాతుడు అంటే కసాయి వాడు లేదా కోడి, జింక, గొర్రె, బర్రె, మేక, తదితర సాధు జీవుల తలను నిష్కర్షగా నరికే వాడు అని కాదు. ఆదిమానవకాలములో అడవులలో వేటకై వెళ్ళేప్పుడు ఇతర మాంసాహార జంతువుల బారి పడకుండా ఉండేందుకో,సరదాగా ఉంటుందనో,అలంకారానికో తురాయిని కట్టుకునే వారు. కిరాతుడు అంటే హింసాత్ముడు అనే అర్థము స్ఫురిస్తే ఈరోజులలో జీవాలను (కోళ్ళు, చేపలు, రొయ్యలు, గొర్రెలు,మేకలు) పెంచి, పోషించి మార్కెట్లో అమ్మకము చేసేవారు, కొనేవారు,తినేవారు అందరూ కిరాతులే.

వాల్మీకి శబ్దము చీమల పుట్ట అనే అర్థానికి, కఠోర ధ్యానానికి,నిశ్చల తపొముద్రకు ప్రతీక.అట్టి తపో ఫలితమే వాల్మీకి మహాకవి.వాల్మీకిని మహోన్నతముగా ఆరాధించే కాళిదాసు మేఘ సందేశములోని శ్లోకభాగములో ఇలా ప్రస్తుతించాడు. (ఇలపావులూరి పాండురంగారావు)

“వాల్మీకాగ్రాత్ ప్రభవతి ధను: ఖండమా ఖండాలస్య”   అర్థము:సుదూరములో కనిపిస్తున్న ఆ పుట్టను  చూడండి! అందులో నుండిఇంధ్రధనస్సు ప్రభవించింది. దీనికి భాష్యము చెబుతూ ఇలపావులూరి పాండు రంగారావు అంటారు-ఇంధ్రధనస్సు అనే ఉపమానము వాల్మీకి కవితాత్మకు,ప్రబంధౌచిత్యానికి ప్రతీక.వాల్మీకి రామాయణములోని 7 కాండలు ఇంధ్రధనస్సులోని సప్తవర్ణాలను గుర్తుకు తెస్తాయి.` కిరాతులు క్షత్రియులే, వీరిలో ఉపనయనాది కర్మలు లోపించాయి అంటాడు మనువు (మనుస్మృతి).

కిరాతుడు ఋషిగా పరివర్తన చెండాడని చెప్పడము నిజము కావచ్చు. అంతేగాని ఆయన గురించి మరొక్క మాట దురాలోచనే.తపస్సు ఆయన ప్రధానసద్గుణము,నిరంతరాధ్యయనము,సత్ప్రవర్తనల ఫలితమే మహా ఋషిగా ఆవిర్భవింప చేశాయి.

వాల్మీకి పేరు కలిగిన వారు నలుగురైదుగురు ఉన్నారని కొందరు విజ్ఞుల (వ్యాసుడు అనిపేరు కలిగిన వారు కూడా 10 మంది ఉన్నారని) అభిప్రాయము.వారిలో రత్నాకరుడు, అగ్నిశర్మ కూడా ఉండి ఉండ వచ్చు ను.  వీరు మహర్షి,ఆదికవి వాల్మీకి ఉత్ద్బోధనలకు ప్రేరితులై తమ పేర్లను వాల్మీకిగా మార్చుకొని ప్రాచుర్య ము లోనికి వచ్చి ఉంటారు.ఆకతాయి రచయతలు  ఎవరో వారిని మహర్షిని ఒక్కరే అని పొర బడి ఉండవచ్చు ను.ఈ విషయము నిజమే అని నమ్మటానికి పంజాబ్ మరియు హరియానా విశ్వవిద్యాలయము వారు ఆచార్య,డాక్టరు సహదేవ ఆధ్వర్యములో 3 సంవత్సరముల పాటు నిర్వహించిన పరిశోధనలు సహ కరిస్తున్నాయి. (మహర్షి వాల్మీకి వాస్ నెవర్ ఏ డేకోయిట్ నార్ ఏ రోడ్ సైడ్ రాబర్-జస్టిస్ భల్లా, ద టైమ్స్ ఆఫ్ ఇండియా,ఇంగ్లీష్ డైలీ, 2010 మే 22)పంజాబ్ మరియు హరియానా హై కోర్ట్ ఆదేశాల మేరకు పంజాబ్ మ రియు హరియానా,విశ్వవిధ్యాలయము వారు పరిశోధనలు గావించారు.డాక్టరు సహదేవ,చైర్ పర్సన్ గా, వాల్మీకి చైర్ అనే విభాగమును,ఏర్పాటు చేసి ఈ పరిశోధనలు,అధ్యాపకులచే నిర్వహింప బడ్డాయి. క్రీ.పూ. నుండి  అందుబాటులో ఉన్న వేదములు, శిలాశాసనాలు, ఉపనిషత్తులు,పురాణములు, ఇతిహాసములు, చరిత్రలు క్షుణ్ణముగా పరిశీలించగా మహర్షివాల్మీకిని ఎక్కడా, ఎప్పుడూ దొంగగా,దారిదోపిడీదారుడిగా వ్రాయ బడి లేదు. ఈ పరిశోధన ఫలితాల ఆధారముగా జడ్జిమెంట్ ను జస్టిస్ భల్లా ఇచ్చారు.ఈ జడ్జిమెంట్ ప్రకారము వాల్మీకి మహర్షిని ఎవ్వరూ దొంగ, దారి దోపిడీదారుడు అనకూడదు. ఆవిధముగా మాట్లాడ కూడదు, నాటి కలు,టి.వి.సీరియల్స్, సినిమాలు తీయరాదు, వాల్మీకిమహర్షిని దొంగ, దారిదోపిడీదారుడు అని బోయ లను, వాల్మీకులను కించ పరిచే విధముగా మాట్లాడితే నేరము,వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకో వచ్చును. మ హర్షి వాల్మీకి గురించి కొన్ని పురాణములలో ( ఆధ్యాత్మికరామాయణము, స్కాంధపురాణము,తదితర) వ్రాయ బడినట్లుగా చెబుతున్న వాటికి  వాస్తవాలకు పొంతన లేదని అవి మూలపురాణములో లేవని ఆ తరువాత చేర్చబడిన అవిశ్వాస కథలని ఇతిహాసికులు, చరిత్ర పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

వాల్మీకిమహర్షిని ఆదికవి, ఋక్షకుడు,భార్గవుడు,కవికోకిల, వాక్యావిశారదుడు, మహాజ్ఞాని, భగవాన్ అని కూడా పిలుస్తారు. వాల్మీకిమహర్షి “ఓం  ఐ౦ హ్రీం క్లీ౦ శ్రీ౦” అనే బీజాక్షరాలు సరస్వతీ, లక్ష్మి,మాయ కటాక్షాన్ని కలుగచేసే మంత్రాలను లోకానికి పరిచయము చేశారు. (దేవిభాగవతము, వేదవ్యాసవిరచితము, తెలుగు అనువాదము)

వాల్మీకిమహర్షి జీవించిన కాలముపై అనేక పరిశోధనలు జరిగాయి.వాల్మీకి రామాయణము క్రీ.పూ.1000 వ సంవత్సర ప్రారంభములో రచింపబడి వుంటుందని,వాల్మీకిపై విశేషపరిశోధనలు గావించిన జి.ఎస్. ఆల్టేకర్ (1895-1987) నిర్దారించారు (ఇలపావులూరి పాండురంగారావు). క్రీ.పూ.100 సంవత్సరములకు చెందిన బుద్ధచరిత్ర రచయత అశ్వఘోషుడు వాల్మీకి ఆదికావ్యాన్ని గూర్చి ప్రశంశిస్తూ ఇలా వ్రాశాడు.

”వాల్మీకి రాదే చ ససర్జపద్యం జగ్రంధన్నచ్యవనో మహర్షి”- ఈ శ్లోకం వాల్మీకి క్రీస్తు శకానికి ముందువాడని ధ్రువ  పరు స్తోంది (ఇలపావులూరి పాండురంగారావు). బుద్ధునికి పూర్వము అంటే క్రీ.పూ.800సం.ల నాటి వాడు వాల్మీకి అని డా.హెచ్.జాకోబి అభిప్రాయము.

వాల్మీకి మహర్షి వద్ద శిష్యరికము గావించిన భరద్వాజుడు, లవుడు, కుశుడు మహర్షిని భగవాన్ అని సంబోధించేవారు. బ్రహ్మ సమానుడని,బ్రహ్మ రామాయణమును వ్రాయటానికి తానే వాల్మీకి మహర్షిగా అవుతరించాడని నమ్మేవారున్నారు. ”విప్రో వాల్మీకిస్సు మహాశయా”అని బ్రహ్మ సరస్వతి దేవితో చెప్పా డని, అందువలన వాల్మీకిమహర్షి విప్రుడు అని పురాణ వ్యాఖ్యాతలు చెబుతున్నారు. స్వగుణధర్మముతో బోయ వాడిగా   పుట్టిన వాడు ఆదికవిగా,మహర్షిగా,బ్రాహ్మణుడిగా  గుర్తించ బడ్డారని ఆయన గణకీర్తిని కొని యా డారు.

ఆదికవి వాల్మీకి ఆ రోజులలోనే “అక్షరలక్ష” అనే  ఈనాటి “ఎన్ సైక్లోపెడియా బ్రిటానికా” వంటి విజ్ఞాన  సర్వస్వము, సర్వశాస్త్రసంగ్రహమును వెలువరించారు. (పెదబాలశిక్ష- గాజుల సత్యనారాయణ) ఈపుస్తకములో  భూగర్భశాస్త్రము, రసాయనశాస్త్రము, గణితశాస్త్రము, రేఖాగణితము, బీజ గణిత ము,త్రికోణమితి, 325 రకాల గణిత ప్రక్రియలు, గాలి, ఉష్ణము, విద్యుత్, జలయంత్ర శాస్త్రము,ఖనిజాలు తదితర అనేక అంశాలు వివరించబడి ఉన్నాయి. యోగవాశిష్టము అనే యోగా, ధ్యానముల గురించిన సంపూర్ణ విషయములు గల మరో పుస్తకము మహర్షి వాల్మీకి వ్రాశారు.ఈ పుస్తకము రామాయణములోని అంతర్భాగమే.రాముడు పది-పన్నెండు సంవత్సరాల వయసులో మానసిక అశాంతికి లోనై, మానసిక ధౌర్భల్యమునకు గురి అయిన ప్పుడు  వశిస్టుడి ద్వారాయోగా, ధ్యానములను శ్రీరాముడికి బోధించారు వ్రాసింది.  వాల్మీకిమహర్షి, పలికింది, బోధించింది వశిస్టుడు,అందు వలన “యోగవాశిష్టము” అనే పేరు వచ్చింది. ఆదిత్య హృదయము అనెడి సూర్యస్తుతిని వ్రాసినవారు వాల్మీకి మహర్షియే.కౌసల్యా సుప్రజా రామ అనెడి సుప్రభాతమును వ్రాసిన వారు  వాల్మీకియే. మహర్షివాల్మీకి  “వాల్మీకి మతము” అనే దానిని నెలకొల్పారు. తొమ్మిది లక్షణాలతో జీవితమును సంస్కరించుకోవాలని, ఈ తొమ్మిది గుణములు కలిగిన వారిని, పాటిస్తున్నవారిని  వాల్మీకి మత స్తులుగా గుర్తించారు. ఆటవికజీవితములో వ్యవసాయముతెలియదు.  అడవులలో దొరికిన ఆకులు,  అల ములు, దుంపలుకాయలు, పండ్లు, సాధుజీవుల (కుందేలు, కోడి, పంది, గొర్రె,   మేకలువంటివి)ను పట్టి, అవి పట్టుబడక పోతే వాటితో పోరాడి స్వంతము చేసుకోవటమే అలవాటు. తమ  వద్ద లేని ఇతరుల వద్ద ఉన్న వాటిని లాగుకోవటము, ఇవ్వకపోతే వారితో పొరాడి, చంపి అయినా సరే తమ స్వంతము చేసుకోవటము ఆటవికతనము, ఈ పోరాటము జరిపే, ధైర్యసాహసాలు గల వారినే “క్షత్రియులు” అని అంటారని భీష్ముడు మహాభారతములో క్షత్రియత్వము గురించి  వివరణ ఇచ్చాడు.ఈ ఆటవికతనమును పారద్రోలి సంస్క రించటానికే వాల్మీకి తొమ్మిది లక్షణాలతో జీవనమును సాగించాలని బోధించారు.ఆటవికులలో సంస్కారము ను కలుగ చేయటానికే వాల్మీకిమతము ప్రారంభించబడింది. క్రీ.పూ.600 సంవత్సరములోనే ఆటవికులు సంస్కరించబడటము మొదలైంది అని చెప్పటానికి వాల్మీకి వ్రాసిన మొదటి శ్లోకమే గొప్ప ఉదాహరణ.ఆటవిక బాష సంస్కృతముగా రూపొందింది వాల్మీకి వలననే. ”మా నిషాద” అనే పదముతో మొదలైన శ్లోకములోని మొదటి వ్యక్తి నిషాదుడే,అతనూ బోయవాడే.అజ్ఞానముతో బోయవాడు చేసిన ఆడ పక్షిని చంపటము అనే ప్రక్రియ వాల్మీకిమహర్షిలో బోయలను, ఆటవికులను సంస్కరించాలనే ఆలోచనను కలిగింప చేసి ఒక ఆదర్శ మానవుడిని  నాయకుడిగా చూపించాలని “రామాయణము” వ్రాసేలా చేశాయి.

మహర్షి వాల్మీకి గురించి అనేక పరిశోధనలు తరాతరాల నుండి విశ్వవిద్యాలయాలలో, పండితుల, పీఠాధిపతుల ఆధ్వర్యములో,మానవుడిమస్థిష్కములో కొనసాగుతూనే ఉన్నాయి.ఆ  మహాను భావుడి ఆశయసిద్ధి కోసము అనేక రూపకల్పనలు, నూతన ఆవిష్కరణములు జరుగుతూనే ఉన్నాయి. మానవులంతా ఆయన మతమును స్వీకరిద్దాము,శ్రీరాముడి వంటి ఆదర్శ పురుషులు అవుదాము.ప్రతి భారత మహనీయుడు-శ్రీ షిర్డీశాయీ,శ్రీరామకృష్ణపరమహంస,శ్రీవివేకానంద మహాత్మాగాంధీ శ్రీరాముడిని, వాల్మీకిమహర్షి నాయకుడిని ఆదరించారు,పూజించారు. పురాణములు,ఇతి హాసములు, రామాయణము, మహాభారతము తదితర కావ్య,నాటకాదులు మానవుడి బాల్యము నుండి మనసులో స్థిరముగా నాటుకొనేలా ధర్మబోధన గావించడానికే.సత్ప్రవర్తన సాధనకే.పురాణకాలక్షేపము కూడా సత్సంఘమును ఏర్పరుచుటకే.రచయత; డా.చిప్పగిరి జ్ఞానేశ్వర్

పేరు వ్యుత్పత్తి[మార్చు]

వల్మీకం అనగా పుట్ట అని అర్థం. వల్మీకం నుంచి ఉద్భవించిన వాడు కాబట్టి వాల్మీకి అయ్యాడు.

రామాయణకర్త వాల్మీకి[మార్చు]

వాల్మీక రామాయణంగా అందరికీ తెలిసిన వాల్మీకంలో 23వేల శ్లోకాలు 7 కాండాలుగా (ఉత్తరకాండ సహా)విభజించబడి ఉన్నాయి. రామాయణంలో 4 లక్షల ఎనభై వేల పదాలుఉన్నాయి. ఇది మహాభారత కావ్యంలో దాదాపుగా పావు వంతు భాగం. ప్రసిద్ధ ఆంగ్ల రచన ఇలియాడ్కు ఇది నాలుగు రెట్లు పెద్దది. రామాయణం దాదాపుగా క్రీపూ 500 లో రాయబడిందని పాశ్చాత్యులు నమ్ముతారు. రామాయణంలో తెలుపబడిన విషయాలననుసరించి కనీసం లక్ష సంవత్సరాల ప్రాచీనమవవచ్చని భారత దార్శనికుల నమ్మకం. ఇతర ఇతిహాసాల్లాగానే రామాయణం కూడా ఎన్నో మార్పులకు, కలుపుగోరులకు, తీసివేతలకు గురి అయింది.

వాల్మీకి రామాయణంలో తాను శ్రీరాముడికి సమకాలీనుడని పేర్కొన్నాడు. శ్రీరాముడు వాల్మీకిని అరణ్యవాసంలో కలిసినట్టు, సీతను వనవాసానికి పంపినపుడు వాల్మీకాశ్రమంలోనే ఆవిడ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఆశ్రమంలోనే సీత లవ-కుశలను కన్నట్టూ, వీరిద్దరి విద్యాభ్యాసం ఇక్కడే వాల్మీకికి శిష్యరికంలో జరిగినట్టు రామాయణం ద్వారా తెలుస్తుంది.

తొలి శ్లోకం[మార్చు]

క్రౌంచ పక్షి జంటలో ఒకటి చనిపోవుట

వాల్మీకి తపస్సంపన్నత తరువాత ఆశ్రమవాసం చేయసాగారు. ఆశ్రమ ధర్మాలలో భాగంగా గంగానదీ తీరానికి సంధ్యకు రాగా. భరద్వాజుడనే శిష్యుడు అతని వస్త్రాలను తెస్తాడు. మార్గంలో తామస నది వద్దకు చేరుకుంటారు. తామస నది నిర్మలత్వాన్ని చూసి ఆ నదిలోనే స్నానం చేయాలని నిర్ణయించుకుంటాడు. స్నానానికి నదిలో దిగుతూ ఒక క్రౌంచ పక్షి జంటను సంగమించడం చూస్తాడు. చూసి పరవశానికి గురి అవుతాడు. అదే సమయంలో మగ పక్షి బాణంతో ఛెదింపబడి చనిపోతుంది. భర్త చావును తట్టుకోలేక ఆడ క్రౌంచ పక్షి గట్టిగా అరుస్తూ చనిపోతుంది. ఈ సంఘటనను చూసి వాల్మీకి మనసు కరిగి శోకానికి లోనవుతాడు. ఈ సంఘటనకు కారణం ఎవరా అని చుట్టూ చూస్తాడు. దగ్గరలో ఒక బోయవాడు ధనుర్బాణాలతో కనిపిస్తాడు. వాల్మీకికి కోపం వస్తుంది. ఆ శోకంతో కూడుకున్న కోపంలో ఆ బోయవాడిని శపిస్తూ ఈ మాటలు అంటాడు:

మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీః సమాః॥

యత్క్రౌంచమిథునాదేకమవధీః కామమోహితం॥

ఓ కిరాతుడా! నీవు శాశ్వతముగా అపకీర్తి పాలగుదువు.

ఎందుకంటే క్రౌంచ పక్షులజంటలో కామ పరవశమైయున్న ఒక (మగ) పక్షిని చంపితివి[3]

ఈ విధంగా వాల్మీకి నోట అప్రయత్నంగా వచ్చినదే సంస్కృత సాహిత్యంలో వచ్చిన మొదటి శ్లోకం. అలా మొదలయినది రామాయణ కావ్యం సాంతం రాసేవరకూ సాగింది.

వాల్మీకి వలస[మార్చు]

అటవీ తెగకు చెందిన వాల్మీకి కరువుల వల్ల బ్రతుకు తెరువు కోసం ఉత్తర భారతదేశం నుండి వలస బాట పట్టాడు. ఆర్య తెగకు చెందిన సప్తబుషులచే జ్ఞానోదయమైన తర్వాత, మహర్షిగా మారి దండకార్యణం (నల్లమల అడవులు) గూండా దక్షిణ భారతదేశం, ఆ తర్వాత శ్రీలంకకు వలస వెళ్ళాడు. మార్గమధ్యంలో వివిధ ప్రదేశాల్లో బసచేస్తూ, అడవి ఆకులు, దుంపలు తింటూ విశ్రాంతి సమయంలో తన రామాయణం కావ్యాన్ని దేవనాగరి లిపిలో వ్రాస్తూ, తను వెళ్ళిన ప్రదేశాల్ని కావ్యంలో పేర్కొన్నాడు. ఆంధ్ర దేశంలో ఉన్న గోదావరి నదితీరంలో విశ్రమించి ఆ తర్వాత వృద్ధాప్య దశ వచ్చే సరికి తమిళనాడు రామేశ్వరం సముద్ర గట్టు వద్ద నున్న షోల్ మీదుగా శ్రీలంక ప్రవేశించాడు. శ్రీలంకలో తన రామాయణాన్ని యుద్ధకాండతో ముగించాడు. వాల్మీకి తన జీవిత కాలాన్ని శ్రీలంకలోనే ముంగిచాడని విష్లేషకుల భావవ.

347-వేద విభజన చేసి బ్రహ్మ సూత్రాలు పురాణాలు రాసిన -వేద వ్యాసమహర్షి

అపౌరుషాలైన వేదాలు అనంతంగా పెరిగిపోతే వాటిని చదవటం కష్టమని భావించి వ్యాసమహర్షి చతుర్వేద  విభజన చేసి వేదం వ్యాసుడయ్యాడు .మహా భారత రచన చేసి మన సంస్కృతికి వ్యాప్తి కల్గించాడు .ఇంతటి ఉద్గ్రంధం ప్రపంచం లో ఏ భాషలోనూ లేదు భారతం లో లేనిది లోకం లో లేదని లోకం లో ఉండండి భారతం లో ఉండదని ఒక లోకోక్తి .సజీవ పాత్రలతో ,రసమయ ఘట్టాలతో మనోహర వర్ణాలతో మానవ జీవితలోతులను తరచి  ధర్మా ధర్మాలను ,మంచి చెడ్డలను ,సంప్రదాయాలను మహోత్కృష్టంగా ఆవిష్కరించి చెప్పినది భారతం . భారతం లో వ్యాసుడూకూడా ఒక పాత్ర .దీనికే జయ  అనే పేరు కూడా ఉంది .ఇది 24 వేల  శ్లోకాలతో 18 పరువాలతో చెరకుగడలా మధురమైన రచన  ఉద్గ్రంధం . పంచమ వేదంగా గుర్తింపు పొందింది .ఇందులో అర్జునునికి కృష్ణుడు 18 అధ్యాయాలతో బోధించిన భగవద్గీత విశ్వవ్యాప్తమైంది .సంస్కృత మహాకావ్యం గా ఇతిహాసంగా పురాణంగా ప్రసిద్ధి చెందింది మహా భారత రచనకు లేఖకుడుగా విఘ్నేశ్వరుడు ఉన్నాడు .ఇద్దరూ ‘’బదరికాశ్రమం ‘’లో ఏకాంత గుహావాసం చేసి రెండున్నర ఏండ్లలో రచించారు .కృష్ణ ద్వైపాయనుడనే సార్ధక నామం ఉన్నవాడు .అంటే నల్లని రంగుతో ద్వీపం లో జన్మించినవాడు .తల్లి సత్యవతి దాశరాజు కుమార్తె తండ్రి పరాశరమహర్షి   18 పురాణాలు రాశాడు .అద్వితీయ మైన బ్రహ్మ సూత్ర రచన చేశాడు .అంబికా వలన ధృతరాష్ట్రుని అంబాలికవలన పాండురాజును దాసివలన విదురుని జన్మనిచ్చి కురు వంశాన్ని తల్లి సత్యవతి అభ్యర్థనపై నిలబెట్టినవాడు .పూ ర్వ జన్మలో విష్ణు మూర్తి ‘’భూ ‘’శబ్దాన్ని పలుకగా అపాంతర తామసుడు అనే ఋషి గా జన్మించినవాడు . వైశాఖ శుద్ధ పౌర్ణమి వ్యాస పూర్ణమిగా గురు పూర్ణమిగా భావించి వ్యాస మహర్షిని అర్చిస్తారు .

వ్యాసస్తుతి -ఆచతుర్వేదో బ్రహ్మా ద్విబాహు రాపారోహరిహ్ -అఫాల  లోచన శ్శం భుహ్  భగవాన్ బాదరాయణః

నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే -ఫుల్లారవిందాయత పాత్ర నేత్ర-యేన త్వయా భారత తైలపూర్ణహ్ -ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః

248-భారత మహిళ కర్త -మహామహోపాధ్యాయ హరప్రసాద శాస్త్రి (1853-1931

6-12-1853 న జన్మించి 17-11-1931 న మరణించిన మహా మహోపాధ్యాయ హర ప్రసాద శాస్త్రి బెంగాల్ సంస్కృత విద్వావంసుడు .బెంగాలీ ప్రాచీన కృతి ఛాయా పద ను కనుగొన్నవాడు .బెంగాల్ లో ఖులీనా జిల్లా కురుమ గ్రామం లో (ఇప్పటి బంగ్లాదేశ్ )జన్మించాడు .ఇంటిపేరు భట్టాచార్య .కలకత్తా ప్రెసిడెన్సికాలేజి లో సంస్కృతం చదివి ఈశ్వర చంద్ర విద్యా సాగర్ తో కలిసి 1877 లో శాస్త్రి పట్టా పొందాడు .ఏం ఏ లో ఫస్ట్ క్లాస్ వచ్చినవారికి శాస్త్రి డిగ్రీ ఇస్తారు ఆ బాచ్ లో ఈయన ఒక్కడే దాన్ని సాధించాడు . 1883 లో సంస్కృతకాలేజి ప్రొఫెసర్ గా ,అసిస్టెంట్ ట్రాన్స్ లేటర్ గా  బెంగాల్ లైబ్రేరియన్ గా ,సంస్కృత శాఖ అధ్యక్షుడుగా వివిధ హోదాలలో పని చేశాడు . 1900 -1908 వరకు ప్రిన్సిపాల్ చేసి గవర్నమెంట్ బ్యూరో ఆఫ్ ఇన్ఫర్మేషన్ లో చేరి ,డాకా యుని వర్సిటీలో సంస్కృత బెంగాలీ భాషా ప్రొఫెసర్ గా 1921-24 వరకు ఉన్నాడు .ఏసియాటిక్ సొసైటీ బంగా సాహిత్య పరిషత్ లకు ప్రెసిడెంట్ అయ్యాడు .రాయల్ ఏసియాటిక్ సొసైటీ గౌరవ సభ్యుడుకూడా

ఆయన రాసిన ‘’భారత మహిళ’’బాగా పేరు తెచ్చింది .బౌద్ధ పురాణాలను అనువదించాడు .క్రమంగా బెంగాలీ భాషపై దృష్టిపెట్టి ఆ భాషలో వ్రాతప్రతులు సేకరించి ముద్రించాడు .అందులో ముఖ్యమైనది ఛాయా గీత్ లేక ఛాయా పద .చాలా ప్రాచీన గ్రంధాలు సేకరించి ప్రచురించాడు .సంస్కృత కల్చర్ ఇన్ ఎండర్న్ ఇండియా ,డిస్కవరీ ఆఫ్ లివింగ్ బుద్ధిజం ఇన్ బెంగాల్ .మగధ లిటరేచర్ ఆయన ఆంగ్లరచనలు .వ్యాపారి కూతురు -బెనియెర్ మెయి అనే ఆయన రచన వాడుక భాషలో రాసినది .కాంచనమాల కూడా రాశాడు

349-మహా మానవ చంపు కర్త -జయంత మిశ్ర (1925-2010)

15-10-1925 జన్మించి 7-9-2010చనిపోయిన మహా మహోపాధ్యాయ జయంతి మిశ్ర సంస్కృత ,మారాటీ  భాషలో ఉత్కృష్ఠకవి  .మహామహోపాధ్యాయ ,కాళిదాస సమ్మాన్ ,వన భట్టా అవార్డు లు పొందినవాడు . 1995 లో సాహిత్యఅ కాడెమి పురస్కారం లభ

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 341-యతిరాజ వింశతి కర్త -మనవాల  మాముని(1370-1443 )

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3

341-యతిరాజ వింశతి కర్త -మనవాల  మాముని(1370-1443 )

1370 లో జన్మించి 1443 లో మరణించిన మనవాల  మాముని తమిళనాడు కేదారం లో జన్మించి ప్రబంధాలకు మొదటి వ్యాఖ్యాత అయ్యాడు . తండ్రి వద్దే వేద వేదాంగ శాస్త్రాలు  నేర్చాడు  .ద్రావిడ వేదాన్ని అభ్యసించాడు .ఎల్లలు లేని అనంత విజ్ఞానఘనుడయ్యాడు .వివాహం చేసుకొని వైష్ణవ సంప్రదాయాన్ని చక్కగా పాటించాడు .ఆళ్వార్ తిరునగరి చేరి తిరువాయ్ మోజేహి పిళ్ళై శిష్యుడయ్యాడు .రామానుజులపై విపరీత భక్తియున్న శిష్యుడిని చూసి గర్వపడిన గురువు ఆయనకు ఒక దేవాలయాన్ని తిరునగరి లో నిర్మించాలని భావించి బాధ్యత మామునిపై పెట్టాడు .ఈసమయం లోనే మాముని 20 సంస్కృత శ్లోకాలతో ‘’ యతి రాజ వింశతి ‘’రామానుజులు స్తుతిస్తూ రచించాడు .గురువు అబ్బురపడి ‘’యతీంద్ర ప్రవరనార్  ‘’బిరుదును ప్రదానం చేశాడు

  .గురు మరణం తర్వాత ముని కుటుంబం తో శ్రీరంగం చేరివానమామలై జియ్యర్ శిష్యుడై అందరి అభిమానం పొంది ఆలయ పూజాదికాలను  రామానుజ విధానం లో  సంస్కరించాడు .పూర్వపు ఆచార్యుల గ్రంధాలను సేకరించి నకళ్ళు రాయించి భద్రపరచాడు .కంచి శ్రీ పెరుంబుదూర్ తిరుపతి సందర్శించి కంచిలో కిలాంబి నాయనారు వద్ద శ్రీ భాష్యం చదివాడు .శ్రీరంగం తిరిగివచ్చి గృహస్థ జీవితానికి స్వస్తి చెప్పి సన్యాసం  స్వీకరించి ,ఆలయ విషయాలలో దృష్టిపెట్టాడు .రామానుజాశ్రమానికి మరమ్మతులు చేయించి ,పిళ్ళై లోకాచార్య విగ్రహం దేవాలయం లో నెలకొల్పాడు .

  1430 ప్రాంతం లో శ్రీ రంగ నాధస్వామి ఉత్సవాలను ఒక ఏడాదిపాటు ఆపేసి  నమ్మాళ్వార్ రచించిన తిరుమొఝి పై  దానికున్న 5 వ్యాఖ్యాలనాధారం గా మలవాల మాముని ప్రవచనం ఏర్పాటు చేశారు  .ప్రవచనం పూర్తయ్యాక చివరి రోజున శ్రీరంగ నాధుడే స్వయంగా బాలుని గా వచ్చి మాముని పాదాల చెంత ఒక కాగితం పెట్టాడు .అందులో ఉన్న శ్లోకమే ‘’మలవాల మాముని తనియన్ ‘’గా సుప్రసిద్ధమైంది -ఆశ్లోకం -’’శ్రీశైలేశ దయాపాత్రం ధి -భక్త్యాది గుణార్ణవం -యతీంద్ర ప్రవణమ్  వందే రమ్య -జా మంత్రం మునిమ్ ‘’భావం -శైలేంద్ర శిష్యుడు, రామానుజుని పై అవ్యాజమైన గౌరవమున్న బుద్ధి వివేకం భక్తి గుణ సముద్రుడు అయిన మనవాల మాముని ప్రవచనానికి శ్రీ రంగనాధుడు ప్రశంసించి ఇస్తున్న నమస్కారం .దీనితో శ్రీరంగనాథునికే ముని గురువైపోయాడని అర్ధం .ముని ‘’ఆచార్య హృదయం ‘’కు గొప్ప వ్యాఖ్యానం రాశాడు

342-భగవద్ గుణ దర్పణ కర్త -పరాశర భట్టార్ (1122-1174 )

కూరత్తాళ్వార్ కుమారుడైన పరాశర భట్టార్ గురువు ఎంబార్ వద్ద సకల శాస్త్రాలు నేర్చి ‘’నడిచే విశ్వ విద్యాలయం ‘’అని పించాడు .విష్ణు సహస్రనామాలపై ‘విష్ణు సహస్ర నామ  భాష్యం అనే ‘’భగవద్ గుణ దర్పణం ‘’రాశాడు .రంగ నాధ స్తోత్రం రంగనాధాష్టకం ,శ్రీ గుణ రత్న కోశం ,క్రియాదీపం ,అష్ట శ్లోకి ,చతుషలోకి ,ద్విశ్లోకి తని శ్లోకి కూడా రాశాడు .ఇతని బాల్యం లో అద్వైత పండితుడు కోలాహలుడు పల్లకీ లో ఊరేగుతూ రామానుజుని వాదం లో ఓడించాలని వెడుతున్నాడు .అప్పుడే ఈ బాలుడు గుప్పెడు నిండా ఇసుక తీసుకొని తనదగ్గర  యెంత ఇసుక ఉంది అని కొహలుడిని ప్రశ్నించగా సమాధానం చెప్పలేకపోగా ‘’గుప్పెడు ఇసుక ఉంది అని చెప్పలేని నువ్వు భగద్రామానుజులతో వాదానికి వెడుతున్నావా ?’’అని ఎద్దేవా చేశాడు .కొహలుడు పరాశర బాలుడిని తండ్రి కూరేశుని గురువు ఎంబార్ ను మెచ్చి ఆశీర్వదించాడు . తర్వాత పరాశరునిశిష్యుడయ్యాడు  ,

343-ప్రపన్న పారిజాత కర్త -వరద విష్ణు ఆచార్య (1165-1275)

1165 లో జన్మించిన వరద విష్ణు ఆచార్య 110 సంవత్సరాలు జీవించి 1275 లో మరణించాడు . సుదర్శనాచార్య నికూడా పిలుస్తారు .తండ్రి దేవ రాజా పెరుమాళ్ ,తాత నాదదూర్ ఆళ్వార్ .శ్రీ భాష్య సింహాసనాధిపతి అయి ,కంచిలో అర్చావిగ్రహ ప్రతిష్టాపన చేశాడు .ఈయన కుల దైవ విగ్రహం తిరువేళ్లూర్ లో ఉంది .వరద విష్ణు 19 గ్రంధాలు రాశాడు .అందులో ముఖ్యమైనది ప్రపన్న పారిజాతం .ఇదికాక శ్లోక ద్వయి ,పరత్వాది పంచక స్తుతి ,తత్వ నిర్ణయం తత్వ సారం ,సామాన్యఅ ధికారణ వాదం ,యతి లింగ సమర్ధనం ,హేతి రాజస్తవం ,ప్రమేయ మాల శ్రీ భాష్య సంగ్రహం ,ఆహ్నిక చూడామణి వంటి గ్రంధాలు రాశాడు .పిల్లాడికి తల్లి వేడిపాలు త్రాగించినట్లు ఈయన కంచి వరద రాజస్వామికి గోరు వెచ్చని వేడిపాలు నైవేద్యం  పెట్టే  వాడు.స్వామి సంతోషించి ‘’నువ్వు నా తల్లివా ?’’అన్నాడట అప్పటినుంచి ఈయనపేరు ‘’నాదదూ ర్ అమ్మాళ్ ‘’అయింది

344-విష్ణు పురాణ వ్యాఖ్యాత -విష్ణు  చిత్తుడు(1280

రోహిణీ నక్షత్రం లో చైత్రమాసం లో విష్ణు చిత్తుడు  జన్మించాడు .శ్రీభాష్యం భాగవత వైభవం ప్రవచనాలతో జీవితం గడిపాడు .విష్ణుపురాణం భాష్యం రాశాడు .ఇదికాక విష్ణు చిత్తీయం సారార్ధ  చతుష్టయం ,సంగతిమాసం రాశాడు .శ్రీ విల్లి పుత్తూరు లోని కోలాక్కొండ లో పరమపదం పొందాడు .

345- జ్ఞాన ,ప్రమేయ సారల కర్త -దేవ రాజముని(975)

  రామానుజుని పూర్వ అద్వైత గురువుయజ్ఞమూర్తి చివరికి శిష్యుడై  దేవరాజముని అయ్యాడు .జ్ఞాన సార ,ప్రమేయం సారగ్రంథాలు  రచించాడు .గురువు రామానుజుడు వీటిని తీక్షణంగా పరిశీలించి ఆమోదించాడు .వరద రాజస్వామి తిరుమర్దనం బాధ్యతను ను దేవ రాజమునికి అప్పగించాడు .

రామానుజుని అనుజుడు -గోవింద(1020

రామానుజా చార్యులవారి తమ్ముడు వరుసయిన గోవిందతమిళ తాయి నెల పునర్వసు నక్షతరం లో పుట్టాడు .రామానుజుని గురువు యాదవ ప్రకాశుడు రామానుజుడిని విషం తో చంపే ప్రయత్నం చెస్ట్ గోవిందుడే అన్నను  ప్రాణ గండం నుంచి బయట పడేశాడు .ఒకసారి ఒక నదిలో స్నానం చేస్తుంటే ముకుంద చేతుల్లోకి ఒక శివ లింగం చేరింది .అప్పటికప్పుడు వైష్ణవం వదిలి అద్వైతి అయిపోయాడు ముకుందా .ఆతర్వాత కొద్దికాలానికే తిరుమలనంబి ,రామానుజుల హిత వుతో మళ్ళీ విశిష్టాద్వైతి అయ్యాడు .రామానునుజునికి స్నానం చేయించటం ప్రక్క ఏర్పాటు చేయటం  నడకలో సాయం చేయటం ఆయన వస్త్రాల జాగ్రత్త ముకుంద యే శ్రద్ధగా చేసేవాడు .ముకుంద గొప్పతనాన్ని తెలియబరచే ఒక తనియన్ –

‘’రామానుజ పదశ్చాయా  గోవిందా ఆహ్వాన పాయినే -దధాధ్యతా స్వరూపాశ్చ జియాన్ మద్  విశ్రమస్థలే ‘’

 సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-7-17-కాంప్-షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 334–నిగమాగమ వేత్త -జగద్గురు సదానంద శివ యోగి)(800

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3

334–నిగమాగమ వేత్త -జగద్గురు సదానంద శివ యోగి)(800

ద్వాపర యుగానికి చెందిన స్కంద సంహిత లో సదానంద శివయోగి గురించి ఉందట .ఆయన నిగమాగమ వేత్త .శ్రీశైల క్షేత్రవాసి .వీర శైవ గురుపీఠాధ్యక్షుడు .శివునికై  తపస్సుచేసి సిద్ధులు సాధించాడు .భస్మధారణ రుద్రాక్షలు ధరించి చేతిలో శివ లింగం తో సంచరించేవాడు .హరిప్రియుడు అనే బ్రాహ్మణుడు తన కొడుకుతోపాటు కుష్ఠు వ్యాధి గ్రస్తుడైన స్వేతను శివ యోగి వద్దకు పంపితే అతని వ్యాధిని భస్మలేపనం తో నివారించి వీరశైవం బోధించి ఇద్దరినీ శిష్యులను చేసుకొన్నాడు .

335-ఆకాశ గామి -మల్లికార్జున శివాచార్య (900

విశ్వ ఆరాధ్య పీఠాధిపతి మల్లికార్జున శివాచార్య అతీంద్రియ శక్తులున్న మహాయోగి .ఆకాశ గమనంతో సంచారం చేసేవాడు .కారాధ్యసిపాలకుడు జయ నందన రాజు వీరి శక్తికి అబ్బురపడి కర్దమేశ్వర్ కు గంగ కు మధ్య ఉన్న 800 పరగణాలను రాసిచ్చాడు .  ఆ దాన న పత్రం ఇప్పటికీ లభ్యమే .ప్రయాగ ,నేపాల్ ఢిల్లీ లలో వీర శైవ  మఠాలు లు నిర్మించాడు .నేపాల్ వెళ్లి రాజు విశ్వ మల్ల కు వీరశైవం బోధించగా రాజు 300 మూరిభుల భూమిని దానం చేశాడు .ఆ భూమి ఇప్పటికీ భట్టగాఁ గ్రామం లో జగంబుహారీ శైవ మఠాధీనంలోనే ఉంది

336- బ్రహ్మ సూత్ర భాష్యకర్త -శ్రీపతి పండితారాధ్యుడు (1060 )

శ్రీపతి పండితారాధ్యుడు 1060 లో ఆంద్ర దేశం లో ఉన్నాడు .వేద వేదాంగ నిష్ణాతుడు  బ్రహ్మ సూత్రాలకు శ్రీక భాష్యం రాశాడు .దీనికి అందరు విపరీతంగా ఆయనను శ్లాఘించారు ఆయనకు అతిమానవ శక్తులెన్నో ఉండేవి .ఒక సారి శాస్త్రార్థ చర్చలో శివ ప్రసాదం అగ్నికంటే పవిత్రమైనది అని ప్రకటించాడు .దీనిపై పెద్ద గందర గోళమే రేగింది .ఆయనను ఎవరూ సమర్ధించలేదు .కోపావేశంతో పండితారాధ్యుడు అగ్నిని మూటకట్టి శమీ వృక్ష కొమ్మకు  వ్రేలాడ దీశాడు .దీనితో ఆ ప్రాంతం లోని అగ్ని హోత్రాలన్నీ ఆరిపోయి ఇళ్లల్లో వంటా వార్పూ లేకుండా పోయింది .ప్రజలందరూవచ్చి తమ తప్పును మన్నించమని  ప్రసాదమే అగ్నికంటే పవిత్రం అని నమ్ముతామని ప్రాధేయపడ్డారు .అప్పుడు కనికరించి అగ్నిని విడుదల చేశాడు .

337-వేదాంత పరమార్ధ గీత వ్యాఖ్యాత కర్త -నిజగుణ శివ యోగి

వీర శైవం లో నిజగుణ శివ యోగి గొప్ప  భక్తుడు .కర్ణాటకలో జన్మించినతమిళనాడు కోయంబత్తూర్ జిల్లా ,కొల్లెగల తాలూకా సమ్మెబాట లింగం గట్ట రాజు .శాస్త్రాలు చదివి అర్ధం చేసుకున్నవాడు .రాజ్యం పై కాంక్ష నశించి పర్వతాలకు వెళ్లి శివునికై తపస్సు చేశాడు.సంస్కృతం లో ఆరుగ్రంధాలు రాశాడు .అందులో వేదాంత వ్యాఖ్యానం ,పరమార్ధ గీత మాత్రమే లభించినా ఇవి  బహుళ  వ్యాప్తి చెందాయి

338-మహా మహిమాన్వితడు -మల్లికార్జున శివ యోగి (1600

కాశీ విశ్వారాధ్య జగదురువు మల్లికార్జున మహాయోగి ఔరంగ జేబు  పాలనలో ఉన్నాడు .ఎల్లప్పుడూ జగంబుహారీ మఠం ని శివలింగం పై దృష్టిపెట్టి   శివ ధ్యానం లో గడిపేవాడు .ఒకసారి మహా ధ్యాన సమాధిలో ఉండగా ఔరంగ జేబు వచ్చి సైన్యం తో  మఠాన్ని  కూల్చేశాడు .సమాధినుంచి బయటికొచ్చిన శివయోగి కి విషయం తెలిసి ద్వారం దాకా వచ్చి విపరీతమైన కోపం తో మంత్రోచ్చారణ చేయగా సైన్యం చెల్లాచెదురై పారిపోయింది ఔరంగజేబు చక్రవర్తి నేలపై మూర్ఛపోయి పడిపోయాడు .జేబు యోగిని విపరీతంగా ప్రాధేయపడి తప్పు కాయమని కోరగా క్షమించాడు .తన సైన్యం కూల్చేసిన ప్రదేశాన్ని అంతటినీ మఠానికి రాసిచ్చేశాడు జేబు .దానపత్రం కాశీలో జగంభారి మఠం లో భద్రంగా ఉంది .దానపత్రం లో ‘’మఠం దగ్గరకు చేరేసరికి అక్కడి నల్లటి శివలింగం కళ్ళ లో నుంచి కాలాగ్ని విజృంభించి  భూమ్యాకాశాలను కప్పేసింది .భయం తో కంపించి  నిలుచుండిపోయి నిశ్చేస్టు డనై     ఇక్కడికొచ్చి ఆశ్రయం పొందాను అందుకే ఈ భూమిని  భక్తితో  దానంగా రాసిస్తున్నాను ‘’అని ఉంది  .శివ యోగి భక్తి తత్పరతకు రేవా రాజు భావ సింగ్ దేవా ,అవధ్ సింగ్ దేవా లు మఠ నిర్వహణ కోసం ఒక గ్రామాన్ని దానం చేశారు .ఈ దాన పత్రమూ ఆ మఠం లో చూడవచ్చు .

339-తిరుమూల మంత్ర  రచయిత-తిరుమూలర్

భగవాన్ యోగీశ్వర్ ,పరమహంస స్వామి సిద్ధ ,మహాత్మా అని పిలువబడే తిరుమూలారు హిమాలయాలలో చాలాకాలం తపస్సు చేసి స్వగ్రామం తిరిగివచ్చాడు .హిమాలయాల నుండి యోగిపుంగవుడు వచ్చాడని బాగా ప్రచారమైంది .ఒకరోజు మూలన్ అనే పశువులకాపరి పశువులనుమేపి సాయంత్రం వాటిని ఇంటికి తోలుకొచ్చి కట్టేశాడు  భార్య కు  అతనిలో ఏదో వింత శక్తి కనిపించింది .తరువాత మూలన్ ఒక మఠం చేరి కళ్ళు మూసుకొని ధ్యానం లో గడిపాడు  .భార్య ఇంటికి వెళ్లి మర్నాడు ఉదయం వచ్చి చూసింది అదే ధ్యాన భంగిమలో ఉండిపోయినట్లు గమనించింది .ఆయన కళ్ళ నుంచి వింత కాంతి వెలువడుతున్నట్లు గుర్తించి అందరికి విషయం తెలియజేసింది అందరూ వచ్చి ఆశ్చర్యం గా చూశారు .కళ్ళు తెరిచాక స్వగ్రామం రమ్మని ప్రార్ధించారు ఒప్పుకోలేదు .సాతనూర్ నుంచి తిరువావా దూతురై  వెళ్ళాడు  .భార్య ఏడుస్తూ వెళ్ళింది అప్పుడు అసలు విషయం చెప్పాడు ఆమె భర్త మరణిస్తే తానూ ఆయన శరీరం లో ప్రవేశించాడు .ఆవులు తనను అతని ఇంటికి తీసుకు వెళ్లాయి .అక్కడ  ఆ శరీరాన్ని దాచాడు .మళ్ళీ వచ్చి చూస్తే ఆదికనపడలేదు .ఇది శివ లీలగా భావించి  తానూఅగస్త్య మహర్షిని కలవటానికి  హిమాలయాలనుంచి వచ్చానని ,దారిలో కాశి ,నేపాల్ తిరుకదారం కంచి  మొదలైన క్షేత్ర సందర్శనం చేసి ఇక్కడికి వచ్చానని చెప్పగా అతని వింత ప్రవర్తన అర్ధమైంది .తిరిగి వచ్చినందుకు వారంతా సంతోషించారు ఆయన సంస్కృత శైవ ఆగమాలు తమిళం లోకి అనువాదం చేశాడు .మళ్ళీ హిమా లయాలకు వెళ్ళాడు.అక్కడ మూడువేలనలభై ఏడు  తిరుమూల మంత్రాలు రచించాడు .

340-స్తోత్ర రత్న కర్త -యామునా చార్యులు (916-1024 )

శ్రీ నాథ ముని మనవడైన శ్రీ యామునాచార్యులు వైష్ణవ మాతా చార్యులలో పేరెన్నికగన్నవాడు . తమిళనాడు లో వీర నారాయణ పురం అంటే నేటి మదురై లో 916  లో  జన్మించాడు .చిన్నప్పుడే శాస్త్రాలన్నీ 12 ఏళ్లకే నేర్చిన బాలమేధావి .శ్రీమద్ భాష్యాచార్యుల శిష్యుడు .ఆ కాలం లో కోలాహలుడు అనే గర్విష్టి పండితుడుతుండేవాడు అతని చేతిలో వాదం లో ఓడిపోయినవారిచేత  పన్ను కట్టించే వాడు యామునుని గురువుకూ ఇది తప్పలేదు .కొన్నేళ్లు పన్ను కట్టలేక పోయాడు .ఒక రోజు కోలాహాలుని శిష్యుడు వచ్చి పన్ను చెల్లించమని ఒత్తిడి చేశాడు . 12 ఏళ్ళ యామయునాచార్యులు కొహలుడిని తనతో శాస్త్రార్థ చర్చ చేసి గెలవమని సవాలు విసిరి పంపించాడు . నిజమైన సవాలా ఉత్తుత్తి సవాలా అని మళ్ళీ పంపగా యామునుని గురువు శిష్యుని పక్షాన ఉండి  గట్టి సవాలే నని జవాబు పంపాడు .

  రాజాస్థానం లో చర్చ రసవత్తరంగా సాగింది.  రాణి మాత్రం ఈ బాలుడే గెలుస్తాడని చెప్పగా రాజు కోలాహలుడి హల్  చల్ చేసి గెలుస్తాడని చెప్పాడు .ఇద్దరూ పందెంకాశారు దర్బారులో .కుర్రాడు ఓడిపోతే తాను  రాణీ దాసికి దాసికి దాసిగా ఉంటానని అంటే రాజు కుర్రాడు గెలిస్తేతన అర్ధ రాజ్యాన్ని అతనికి బహుమతిగా ఇస్తానని చెప్పాడు .యమునుడు మూడు వింత ప్రశ్నలను కోహాలునిపై సంధించాడు. వాటిని కాదు అని తిరస్కరించామన్నాడు  1-మీ అమ్మ వంధ్య కాదు 2-పాండ్యరాజు మత నమ్మకం లేనివాడు 3-రాణి సతీ సావిత్రి వంటిది  .కొహలుడి నోట్లో పచ్చి వెలక్కాయ పడింది కక్కా లేక మింగా లేక నిశ్శబ్దంగా ఉన్నాడు . ఈ ప్రశ్నలకు యామునాచార్యులనే సమాధానం చెప్పమనగా అతి సునాయాసంగా చెప్పి అందరి మన్ననలు అందుకొని వాదం లో విజేత అయ్యాడు .రాణి ఈ బాలుడిని ‘’మహా బాగా మెప్పించావు ఆళ్వాన్దర్ ‘’అన్నది .అప్పటినుంచి యామునా చార్యులకు అలవందర్   అనే పేరు స్థిర పడింది .అన్నమాట ప్రకారం పాండ్యరాజు రాజ్యం లో సగ భాగాన్ని యమునా చార్యులకు రాసిచ్చాడు .ఆరాజ్యాన్ని చాలా సమర్ధవంతంగా పాలించి ప్రజలకు సకల సౌకర్యాలు కలిగించి ప్రజారంజక పాలన చేశాడు .రాజ్య పాలనలో ఇంటిని మర్చిపోతాడేమోనని తాత  నాదముని  మనవడిపై ఓ కన్నేసి ఉంచమని శిష్యుడు రామ మిశ్రాకు చెప్పాడు .

  యమునాచార్యులకు 35 ఏళ్ళు రాగా మిశ్రా ఆయనను శ్రీరంగం లోని శ్రీ రంగనాధ దేవాలయానికి తీసుకు వెళ్ళాడు .స్వామి దర్శనంతో మనో నేత్రం విచ్చుకొని . తన జీవిత పరమార్ధం గ్రహించి రాజ్యాన్ని వదిలేసి స్వామి సేవలో, గ్రంథ రచనలో జీవితం గడిపాడు .ఇక్కడే రామానుజా చార్యులు ఈయన శిష్యుడయ్యాడు .యామునాచార్యులవారు సంస్కృతం లో 1-స్తోత్ర రత్నం 2 ఆగమ ప్రామాణ్యం 3-సిద్ధిత్రయం 4-గీతార్ధ సంగ్రహం రాశారు .ఇందులో స్తోత్ర రత్నం చంపు కావ్యం .శ్లోకాలు వచనము ఉంటాయి .నాలుగింటిలో ఇది ఉత్కృష్టంగా భావిస్తారు వైష్ణవులు . యామునా చార్య కథను శ్రీ కృష్ణ దేవరాయలు తన ఆముక్త మాల్యద కావ్యం లో పరమాద్భుతంగా వర్ణించాడు .యామునుడు రాజుగా ఉన్నప్పుడు చేసిన సంస్కరణలను అమలు పాల్రాచిన రాజనీతిని గొప్పగా వివరించాడు .దీన్ని ఆధారంగా చేసుకొని ప్రాచార్య శ్రీ శలాక రఘునాధ శర్మగారు ‘’యామునుని రాజనీతి ‘’అనే పుస్తకం రాసి మాన్యశ్రీ మండలి బుద్ధప్రసాద్ గారికి అంకితమిచ్చారు . శర్మగారు ఆపుస్తకాన్ని నాకు  రాజమండ్రిలో తమను సందర్శించినప్పుడు నాకు  ఆత్మీయంగా అందజేశారు

  సశేషం

   మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -30-6-17- కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వా ణం -3 331-జానకీ రామ భాష్య కర్త -ఆనంద రామ బారువా (1850-1889 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

331-జానకీ రామ భాష్య కర్త -ఆనంద రామ బారువా (1850-1889 )

అస్సామ్ లో మొట్టమొదటి ఐ సి ఎస్ ,మొదటి గ్రాడ్యుయేట్ ,లాయ

ర్  సంస్కృతాంగ్లాల లో మహా విద్వా0శుడు  ఆనంద  రామ్ బారువా 1850 లో జన్మించి 39 ఏళ్లకే 1889 లో మరణించాడు .ఆయన 1-భవభూతి మహా విరచితం ,2-సరస్వతీ కంఠాభరణం 3-నామ లింగాను శాసనం 4-జానకీరామ భాష్యం సంస్కృతం లో రచించాడు .ఆంగ్లం లో భవ భూతి అండ్ హిస్ ప్లేస్ ఇన్ సంస్కృత లిటరేచర్ ,ఎ ప్రాక్టికల్ ఇంగ్లిష్ సంస్కృత డిక్షనరీ ,,హయ్యర్ సంస్కృత గ్రామర్ -జెండర్ అండ్ సింటాక్స్ , ఏన్షెన్ట్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా ,,ఎ కంపానియన్   టు ది  సాన్ స్క్రిట్  రీడింగ్ అండర్ గ్రాడ్యుయేటస్ ఆఫ్ ది కలకత్తా యూనివర్సిటీ ,కంపా రిసం ఆఫ్ ఎ కాంప్రెహెన్సివ్ డిక్షనరీ ఆఫ్ ఆల్ డ యాలెక్ట్స్  ఆఫ్ బెంగాల్ .

332-నైషధ తిలక కర్త -కృష్ణకాంత హాండీకి (1898-1982)

20-7-1898 న అషోమ్ కుటుంబం లో అస్సామ్ లో కృష్ణకాంత హాండీకి జన్మించాడు .జోర్హాట్ ప్రభుత్వ పాఠశాలలో  చదివి గౌహతికి వెళ్లి 1913 లో కాటన్ కాలేజీలో చేరి రెండేళ్లు చదివి కలకత్తా వెళ్లి కలకత్తా యుని వర్సిటీ లో 1920 నుండి 23 వరకు సంస్కృతం చదివి ,ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ నుంచి మోడర్న్ హిస్టరీలో ఏం ఏ పాసై ,పారిస్ జర్మన్ ఫ్రాన్స్ యుని వర్సిటీలలో విద్య నేర్చి ,గ్రీఎక్ స్పానిష్ జర్మన్ ఫ్రెంచ్ ,ఇటాలియన్ ,లాటిన్ ,రష్యన్ భాషలలో మహా ప్రావీణ్యం పొంది ,ఆ భాషా సాహిత్యాలకు చెందిన 2 వేలకు పైగా అరుదైన గ్రంధాలను తనతో అస్సామ్ కు తెచ్చుకున్నాడు

 టీ ప్లాంటర్స్ కుటుంబానికి చెందిన వాడవటం తో తండ్రికున్న టీ  ఎస్టేట్స్ నిర్వహణలో నూతన సాంకేతిక విధానాలను ప్రవేశపెట్టి అభి వృద్ధి చేశాడు .హేమలత ఐదియి ను వివాహమాడి ప్రభుత్వ ఉద్యోగం చేయటానికి ఇష్టపడక ,జోర్హాట్ లో జె బి కాలేజీ వ్యవస్థాపక ప్రిన్సిపాల్ అయ్యాడు .అస్సామ్ లో అదే మొట్టమొదటి ప్రయివేట్ కాలేజీ ఈనాటికీ సమర్ధవంతంగా వర్ధిల్లుతోంది .ఈ కాలేజీ ప్రిన్సిపాల్ గా 17 ఏళ్ళు పనిచేసి ప్రపంచ వ్యాప్తంగా గొప్ప ఇండాలజిస్ట్ గా  అస్సామ్ లో అత్యంత విశిష్ట విద్యా వేత్తగా గుర్తింపు పొందాడు.

 హాండీకి అనేక వ్యాసాలూ చాలా విషయాలపై పత్రికలకు రాశాడు -ఔబాదర్ కథ ,స్పానిష్ సాహిత్యత్ రోమియో జూ లియట్ ,జర్మన్ సాహిత్యత్  సపోన్  నాటక ,గ్రీక్ నాటకార్ గణ్ ,సోక్రటీసర్ మతే క్వీర్ ప్రకృతి మొదలైనవి .గ్రంథాలుగా వచ్చినవి నైషధ చరిత ,యశస్తిలక సంస్కృతం లో ,ఆంగ్లం లో సేతు బంధూస్  ప్రవర సేన  .ఈ మూడు ఆయన పరిణత మేధో వికాసనానికి తార్కాణాలు అంటారు వేత్తలు

 1948 లో హాండీక్ ను గౌహతి యూనివర్సిటీ వ్యవస్థాపక వైస్ ఛాన్సలర్ గా నియమించారు.  ఇందులో 9 ఏళ్ళు1957 వరకు  గొప్ప సేవలందించారు  . తన భార్య స్మ్రుతి చిహ్నంగా జోర్హాట్ లో ‘’హేమలత హాండీకి మెమోరియల్ ఇన్ స్టి ట్యూట్ ‘’నెలకొల్పాడు   గౌహతి యుని వర్సిటీ వైస్ ఛాన్సలర్  గా సేవలందించి తనకున్న అత్యంత విలువైన11 భాషలలోని    స్వంత లైబ్రరీ గ్రంధాలను గౌహతి యుని వర్సిటీకి సమర్పించి అందరికి ఉపయోగం లో ఉండేట్లు చేసిన త్యాగ మూర్తి హాండీకి . 1937 లో అసోం సాహిత్య సభకు ప్రెసిడెంట్ గా 39 ఏళ్ళ అతి తక్కువ వయసులో నియమింప  బడి చరిత్ర సృష్టించాడు .1951  లో లక్నో లో 1961 లో శ్రీనగర్ లో జరిగిన అఖిలభారత సంస్కృత పరిషత్ సభలకు కృష్ణ కాంత హాండీకి అధ్యక్షులుగా వ్యవహరించాడంటే ఆయన సమర్ధత ఏమిటో మనకు తెలుస్తుంది

 హాండీకి గొప్ప సంస్కృత విద్వావంసుడు  మేధావి మాత్రమే కాదు గొప్ప వితరణ శీలి ఇండాలజిస్ట్ లకు మార్గ దర్శి .అంకిత భావం తో అత్యున్నత విలువలతో  జీవించిన ఆదర్శ మూర్తి .అస్సామ్ లో విద్యా వ్యాప్తికి అవిరళ కృషి చేసినవాడు 7-.-6-1992 న94 ఏళ్ళ పరిపూర్ణ జీవితాన్ని గడిపిన మహా విద్యావేత్త కృష్ణకాంత హాండీకి అమరుడయ్యాడు .ఆయన గౌరవార్ధం 7-10-1983 న భారత ప్రభుత్వం ప్రత్యేక తపాలాబిళ్ళను విడుదల చేసింది .అస్సామ్ ప్రభుత్వం ‘’కృష్ణకాంత హాండీకి స్మారక పురస్కారం ఆయన సంస్కృత విద్యావ్యాప్తికి ‘’ గౌరవార్థంగా ఏర్పాటు చేసింది .ఎనిమిది విదేశీ భాషలో ,అయిదు స్వదేశీ భాషలో మహా పండితుడు ,కీర్తి, పదవి,అధికారం,ప్రచారాల కోసం తాపత్రయ0 పడని  అరుదైన వ్యక్తిత్వం దార్శనికత ,సాంఘిక నైతిక నిబద్ధత తో అస్సామ్ సర్వతోముఖాభి వృద్ధికి యెనలేని కృషి చేసిన చిరస్మరణీయుడు కృష్ణకాంత హాండీకి .

333-నాగాలాండ్  మిజోరాం  మేఘాలయ ,మణిపూర్ త్రిపుర,సిక్కిం  రాష్ట్రాలలో సంస్కృత వ్యాప్తి

నాగాలాండ్ ,మిజోరాం రాష్ట్రాల యుని వర్సిటీలలో సంస్కృత డిగ్రీ  కోర్సు లేదు కానీ సెంట్రల్ యుని వర్సిటీలో సంస్కృత బోధనఉంది .నార్త్ ఈస్ట్ యూనివర్సిటీలో భాగమైన వీటిలో సంస్కృతం లేదు .మేఘాలయ రాష్ట్రం లో షిల్లాంగ్ గొప్ప విద్యా కేంద్రం .ఇక్కడి నార్త్ ఈస్ట్ యూనివర్సిటీ అనే సెంట్రల్ యుని వర్సిటీలో సంస్కృతం లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ లేదు కానీ అనుబంధ కాలేజీలలో డిగ్రీ వరకు సంస్కృత బోధన ఉంది .పాళీ భాషకు పాళీ టోల్ మాత్రం ఉంది .అరుణాచల్ ప్రదేశ్ లో యూనివర్సిటీలో సంస్కృతం లేదు .త్రిపుర లో సంస్కృత సంప్రదాయం ఉంది .మణిపూర్ లో ఒకప్పడు సంస్కృతాన్ని రాజులు బాగా పోషించారు .మహా గ్రంధాలు వెలువడ్డాయి కూడా . వైష్ణవం బాగా వృద్ధిలో ఉండేది .కానీ ఇప్పుడు కొన్ని సంస్కృత పాఠశాలలు మాత్రమే సంప్రదాయ పద్ధతిలో నడుస్తున్నాయి .పరీక్షలను అస్సామ్ సంస్కృత బోర్డు ,ఎంగల్ సంస్కృత బోర్డు నిర్వహించి సర్టిఫికెట్లను జారీచేస్తాయి .పాణిని కౌముది బదులు కొత్తగా ముగ్ధ బోధ వ్యాకరణం బోధిస్తున్నారు .కొత్తగా హరినామామృత వ్యాకరణం ను ముగ్ధ  బోధ వ్యాకరణం బదులు వైష్ణవ పాఠశాలలో బోధిస్తున్నారు .ఇంఫాల్ లోని సంస్కృత టోల్  సంస్కృత విద్యా వ్యాప్తికి మొదటినుంచి గట్టి కృషి చేస్తోంది .ఇంఫాల్ యూనివర్సిటీలో సంస్కృతం లేదు .కానీ కొన్ని అనుబంధకాలేజీలలో డిగ్రీ వరకు సంస్కృతం ఉంది .

 సిక్కిం రాష్ట్రము లో నేపాలీల మెజారిటీ ఎక్కువ .కొన్ని సంస్కృత టోల్స్ లో సంస్కృత బోధన జరుగుతోంది .ప్రాధమిక విద్యలో సంస్కృతం సబ్జెక్ట్ గా ఉండదు విద్యార్థులకు అభిరుచి ఉంటె ప్రభుత్వం సంస్కృత ఉపాధ్యాయుని నియమించి నేర్పిస్తుంది .గాంగ్ టాక్ లో చాలా సంస్కృత పాఠశాలలున్నాయి .ఇవి సంప్రదాయ పద్ధతిలో సంస్కృతం నేర్పుతాయి ..కనుక ఈశాన్య రాష్ట్రాలలో పెద్దగా ఇప్పుడుసంస్కృత  సాహిత్య 0 రావటం లేదు .

   సశేషం

 మీ-గబ్బిట దుర్గ ప్రసాద్ -30-6-17 -కాంప్-షార్లెట్-అమెరికా

 Inline image 1

అనంతరాం బారువా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితాగీర్వాణం -3 322-ఆధునిక అస్సామ్ లో సంస్కృత రచనా వ్యాసంగం

గీర్వాణకవుల కవితాగీర్వాణం -3

322-ఆధునిక అస్సామ్ లో సంస్కృత రచనా వ్యాసంగం

అస్సాం సంస్కృత బోర్డు ముఖ్యమైన కొన్ని ప్రాచీన గ్రంధాలను పునర్ముద్రించింది కొత్తవాటిని ప్రచురించింది .ప్రయోగ రత్నమాల వ్యాకరణం ,దాని వ్యాఖ్యానంతో పునర్ముద్రించింది .కావ్యాదర్శను టీకా తాత్పర్యాలతో ముద్రించింది .ప్రాచ్య భారతి సంస్కృత పత్రికను ఆరునెలలకోసారి ప్రచురిస్తోంది .డా విశ్వనారాయణ శాస్త్రి  సంపాదకత్వం లో యోగినీ తంత్ర ,కామాఖ్యా తంత్ర ల ను ఇంగ్లిష్  ఉపోద్ఘాతం తో ,కాళికాపురాణం ను ఆంగ్లానువాదం ఉపోద్ఘాతం తోను వెలువడ్డాయి .గౌహతి యుని వర్సిటీ సంస్కృత శాఖ తరచుగా పురాణాలు తంత్రాలపై సెమినార్లు నిర్వహించి పరిశోధనా పత్రాలను ముద్రిస్తోంది .సంస్కృత సాహిత్యం ఫిలాసఫీ దర్శనాలపై చాలామంది పరిశోధనలు చేసి పిహెచ్  డి పొందుతున్నారు .డా ఏం ఏం శర్మ సంపాదకత్వం లో సంస్కృత -అస్సామీ నిఘంటు నిర్మాణం కొనసాగుతోంది . విశ్వవాణి  పరిషత్ లోనిరీసెర్చ్ విభాగం  ‘16-17   శతాబ్దపు    ‘’తీర్ధ కౌముది ‘’ని సమగ్రంగా ప్రచురించింది .అసోం వేదం విద్యాలయం యజుర్వేదాన్ని అస్సామీ అనువాదంతో ప్రచురించింది .సంస్కృత విద్యావేత్తలుగా గౌరవ పురస్కారాలు అందుకొన్నవారిలో ప్రొఫెసర్ రజినీకాంత దేవా శర్మ ,ఆచార్య మనోరంజన్ శాస్త్రి ,డా బిశ్వనారాయణ శాస్త్రి వంటి ప్రముఖులున్నారు .

 ఆధునికకాలం లో కూడా అస్సాం సంస్కృతకవులుకావ్యాలు , ఖండకావ్యాలు ,స్తోత్రాలు ,ప్రశస్తులు ,నాటకాలు కల్పనా సాహిత్యం సృష్టిస్తూనే ఉన్నారు .అస్సామీ భాషా గ్రంధాలను సంస్కృతం లోకి అనువదిస్తూనే ఉన్నారు

323-జయమతి  ఖండకావ్య కర్త -పండిత భావ దేవ భగవతి

పండిత భావ దేవ భగవతి జయమతి అనే ఖండ కావ్యం రాశాడు .పేరుకు ఇదిఖండకావ్యమేకాని చారిత్రాత్మక కావ్యం .భర్త ప్రాణాలను రక్షించటం కోసం భార్య  భగవతి నరరూప రాక్షసుడైన రాజు చేత చిత్ర హింసలుపడి ప్రాణాలు కోల్పోయిన చారిత్రిక కథ

 ఆశుకవిగా ప్రసిద్ధుడైన మహా మహోపాధ్యాయ ధీరేశ్శ్వరాచార్య తాను  రాసిన సంస్కృత శ్లోకాలను ‘’వృత్తమంజరి ‘’అనే  సంపుటిగా ప్రచురించాడు

324-భక్తి వివేకం పై వ్యాఖ్య రాసిన -పండిట్ జీవేశ్వర గోస్వామి

17 వ శతాబ్దం లో భక్తిపై వైకుంఠ నాథ  భట్టాచార్య సమగ్రంగా రాసిన ‘’భక్తి వివేకం ‘’పై సమగ్ర వ్యాఖ్యానాన్ని పండిత జీవేశ్వర గోస్వామి రాశాడు .

325-శాక్త దర్శన కర్త -పండిత  చక్నేశ్వర  భట్టాచార్య

పండిట్ చక్ణేశ్వర భట్టాచార్య ‘’శాక్త దర్శన0 ‘’రాశాడు .శక్తి ఆరాధనే సర్వ శ్రేష్టం అని ఇందులో తెలియజేశాడు

326-పతాకామ్నాయ కర్త -ఆచార్య మనోరంజన్ శాస్త్రి

ఆచార్య మనోరంజన్ శాస్త్రి పతాకామ్న్యాయం రచించాడు దీనితోపాటు భారత జాతీయ పతాకం పై సంస్కృతం లో వ్యాఖ్యానం రాశాడు .ప్రకామ కామ రూపం ‘’  అనే ఖండకావ్యాన్ని ప్రాచీన అస్సామ్ కు పేరైన కామరూప వైభవాన్ని రచించాడు .అకాలపు చారిత్రాత్మక సంఘటనలను కవితాత్మకంగా వర్ణించాడు .ఉత్తాంక భాష్యం ‘’అనే నాటిక కూడా రాశాడు

327-శ్రీకృష్ణ లీల కావ్య కర్త -పండిట్ వైకుంఠ నాథ  చక్రవర్తి

పండిత వైకుంఠ నాథ చక్రవర్తి శ్రీ కృష్ణునిపై శ్రీ కృష్ణలీలలు సంస్కృతం లో రాశాడు .

328-అవినాశి నవలాకారుడు-డా.విశ్వనారాయణ శాస్త్రి –

డా విశ్వనారాయణ శాస్త్రి ‘’అవినాశి  ‘’అనే చారిత్రాత్మక నవల రాశాడు .ఈ కథ 7 వశతాబ్దిలో భాస్కర వర్మ కు దేవదాశీ కి మధ్యజరిగిన ప్రేమకథ .చివరికి భాస్కర వర్మకు హర్ష వర్ధనునికి స్నేహం కుదురుతుంది ఈనవలకు సాహిత్య అకాడెమి భారతీయ భాషా పరిషత్ ,ఉత్తర ప్రదేశ్ సంస్కృత అకాడెమీలు పురస్కారాలను అందజేశాయి . ఈకవి రచించిన చిన్నకథలు ,కథలూ ‘’హృదయ సంవాద చయనం ‘’సంపుటిగా వచ్చింది

329-వ్యంజనా ప్రపంచ సమీక్ష కర్త -డా.ముకుంద మాధవ శర్మ

డా ముకుంద మాధవ శర్మఅనే ప్రముఖ సంస్కృత కవి విమర్శకుడు ,సంగీతకారుడు

‘’వ్యంజనా ప్రపంచ సమీక్ష ‘’ను డి లిట్ పరిశోధనా గ్రంథం గా వెలువరించాడు

330- బౌద్ధ వేదాంత పరిశోధనకర్త -డా కాళీ ప్రసాద్ సిన్హా

డా కాళీ ప్రసాద్ సిన్హా బౌద్ధ తత్త్వం పై గొప్ప పరిశోధన చేసి రచన చేశాడు

కొన్ని ప్రాంతీయ రచనలుకూడా సంస్కృతం లోకి తర్జుమా అయ్యాయి .రవీంద్రుని గీతాంజలి ని కామినీ కుమార అధికారి సంస్కృతం లోకి అనువదించాడు .ఆచార్య మనోరంజనశాస్త్రి కేతకీ కావ్యాన్ని రఘునాథ చౌదరి ,,నవమల్లిక ను పండిట్ బిపిన్ చంద్ర గోస్వామి సంస్కృతంలోకి అనువాదం చేశారు .

 సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-6-17 -కాంప్-షార్లెట్-అమెరికా ,


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment