గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 311-శ్రీ హనుమద్రామాయణ కర్త -శ్రీ ఆంజనేయ స్వామి (త్రేతాయుగం )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

311-శ్రీ హనుమద్రామాయణ కర్త -శ్రీ ఆంజనేయ స్వామి (త్రేతాయుగం )

శ్రీరాముడు రావణాసుర సంహారం చేసి ,అయోధ్యలో పట్టాభి షిక్తుడైనతర్వాత శ్రీ ఆంజనేయ స్వామి తపోధ్యానాలకోసం హిమాలయాలకు వెళ్ళాడు . అక్కడ ఆయనకు శ్రీ రామ గాధ  అంతా జ్ఞప్తికి వచ్చి దానిని బహు సుందరమైన శైలి లో అక్కడి హిమాలయ పర్వతాలలోని రాళ్లమీద  భక్తి భావ బంధురంగా తన చేతి గోళ్ళతో రామాయణ కథ నంతా శ్రీరామ పరాక్రమ ,క్షమాది గుణ సహితంగా రాశాడు .ఒక రోజు వాల్మీకి మహర్షి హనుమ రాయాణం రాస్తున్న సమయం లో అక్కడికి వచ్చాడు .మహర్షికి ఘనస్వాగతం పలికి హనుమ ఆయన్ను గాఢంగా కౌగిలించుకొన్నాడు .హనుమ రాసిన హనుమద్రామాయణం అంతా చదవాలని మహర్షి భావించగా హనుమ తాను శ్లోకాలను అందంగా రాసిన రాళ్లను చూపించాడు  . ఒక్కొక్క రాయిని పరిశీలనగా చూస్తూ వాల్మీకి మహర్షి భక్తహనుమాన రాసిన రామాయణ శ్లోకాలు  చదవటం ప్రారంభించాడు . శిలలపై  హనుమ రాసిన రామాయణ శ్లోకాలన్నీ చదవటానికి వాల్మీకి మహర్షికి వెయ్యి ఏళ్ళు పట్టింది .మహర్షి హనుమ రచనా పాటవానికి భక్తి తత్వానికి చలించిపోయాడు .ఇంతటి ఉత్కృష్ట రచన అంతకు ముందు ఎవరూ చేయలేదని ఆ తర్వాత కూడా చేయలేరని భావించాడు మహర్షి .హనుమద్రామాయణం పూర్తిగా చదివాక వాల్మీకి చాలా నిరాశ చెందాడు . హనుమ మహర్షి బాధకు కారణం అడిగాడు దానికి వాల్మీకి తానూ ఎంతో కస్టపడి శ్రమించి రాసిన శ్రీమద్రామాయణం హనుమద్రామాయణం ముందు ఏ మాత్రం నిలవలేదని తన రామాయణాన్ని లోకం లో ఇక అందరూ మర్చేపోతారని బాధగా ఉందన్నాడు మహర్షి .

 హనుమ  తాను  రాసిన లక్షలాది రాళ్లను, వాటిని కలిగి ఉన్న ఆ పర్వతాన్ని తన భక్తి తాత్పర్య  సర్వస్వాన్ని ఒక్క సారి కలయ తిరిగి చూసి  వెంటనే ఒక నిర్ణయానికి వచ్చి ,ఆ పర్వతాన్ని దానిపై తానూ శ్లోకాలలో రచించిన రామాయణమున్న లక్షలాది రాళ్లతో  సహా క్షణం లో పెకలించి  మారుత వేగం తో మారుతి దగ్గరలో ఉన్న సముద్రం లో ముంచేశాడు . అక్కడ ఏం జరుగుతోందో అని వాల్మీకి గ్రహించేలోపు ఈ పని అంటా పూరైంది మహర్షి తీవ్ర దిగ్భ్రాంతి చెందాడు .హనుమతో తాను మరొక జన్మ దాల్చి హనుమద్రామాయణం అంతా మళ్ళీ తిరగ రాసి హనుమ కవితా శక్తిని భక్తి గరిమను ,ధైర్య సాహసాలను లోకానికి తెలియ జేస్తానన్నాడు .

 కాలం గడిచిపోయింది .మహాకవి కాళిదాసుకాలం లో హనుమద్రామాయణం రాయబడిన ఒకే ఒక్క రాయి సముద్ర తీరానికి కొట్టుకు వచ్చింది .దాన్ని ఒడ్డుకు చేర్చి  అందులోని శ్లోక భావాన్ని విద్యావేత్తలెవరైనా చదివి అర్ధం చెప్పటానికి వీలుగా దాన్ని ఒక బహిరంగ ప్రదేశం లో నెలకొల్పారు .కాళిదాస మహాకవి హనుమద్రామాయణ0 గురించి  అంతకు ముందే విని ఉన్నాడుకానుక అది తన దృష్టంగా భావించి కాలం లో కలిసిపోయిన ఆ లిపిని జాగ్రత్తగా పరిశీలించి ఆది పూర్తి  శ్లోక0 కాదని అందులో ఒక్క పాదమేనని గ్రహించి అందులోని  భావాన్ని అందరకు ఇలా తెలియ జేశాడు -’’ఓ రావణా !శివుని కైలాసాన్ని ఎత్తిన నీ పది తలలు ఇప్పుడు యుద్ధభూమిలో కాకులు గద్దలకు ఆహారంగా భూమి పై పడివున్నాయి .నీ దశగ్రీవాల పొగరు ,గర్వాలు ఒక సత్ప్రవర్తకుని చేతిలో నేలరాలాయని గ్రహించు .’’

మహా పోరాణికులు బ్రహ్మశ్రీ మల్లాది చంద్ర శేఖర శాస్త్రి గారు తమ రామాయణ ,సుందర కాండ ప్రవచనాలతో హనుమద్రామాయణాన్ని ఉదహరిస్తూ చెబుతూ ‘’ఇది హనుమరాసుకున్న రామాయణం ‘’అనటం నేను చాలా సార్లు విన్నాను .కానీ దానిప్రతికోసం నెట్ లో వెతికాను తెలుగు లిపిలో ఉన్నట్లు తెలిసింది కానీ లభ్యం కాలేదు .

 సంస్కృతం లో వాల్మీకి మహర్షి రచించిన శ్రీ మద్రామాయణం ‘’కాక ‘’ఆధ్యాత్మ రామాయణం ‘’కూడా ఉంది .ఇది వ్యాసమహర్షి రచించిన బ్రహ్మాండ పురాణం లో ఉంది .ఇవికాక వశిష్ఠ రామాయణం లేక యోగ వాశిష్టం ,ఆనందరామాయణం,అద్భుత రామాయణం  ఉన్నాయి వీటికర్త వాల్మీకి మహర్షి .అగస్త్యుడు రాసినట్లు చెప్పబడుతున్న అగస్త్య రామాయణం కూడా ఉంది .కాశ్మీరకవి అభినందన -యోగవాశిష్టాన్ని సంక్షిప్తీకరించి ‘’లఘు యోగ వాశిష్ఠ ‘’కూర్చాడు .

312-అస్సామ్ లో సంస్కృత వ్యాప్తి

వేద పురాణ కాలం లో అస్సామ్ ను  కామరూప లేక ప్రాగ్జోతిషపురం అనేవారు . భారత దేశం లోని మిగిలిన రాష్ట్రాలలో లాగానే  మేఘాలయ ,మిజోరాం ,నాగా ల్యాండ్ లతో కూడిన ప్రాచీన అస్సామ్ లో సంస్కృతంతో బాటు   ,అన్ని శాస్త్రాలు అధ్యయనం చేశారు . 7 వ శతాబ్ద ప్రాగ్జ్యోతిష రాజుల కాలం లో లభించిన తామ్ర  శాశనాలను బట్టి అప్పుడు సంస్కృతం ఎన్నో శతాబ్దాలనుండి ప్రజల వాడుక భాషగా ఉన్నట్లు తెలుస్తోంది .మధ్యయుగం లో అంటే 9 వ శతాబ్దం లో ఇక్కడ ‘’కాళికా పురాణం ‘’వంటి సంస్కృత గ్రంధాలు అస్సామ్ లో రాయబడినాయి .అప్పటినుంచే తంత్ర ,ధర్మ ,జ్యోతిష వ్యాకరణ గ్రంధాలుకూడా ఇక్కడ రాయబడినాయి .వీటికి సంస్కృత వ్యాఖ్యానాలు వాటితోపాటు సంస్కృత సాహిత్య రచనలు వచ్చాయి .

 ధర్మ శాస్త్రాలలో కామరూప సిద్ధాంతాన్ని ‘’కౌముది ‘’లు రచించి  మహా మహోపాధ్యాయ పీతాంబర సిద్ధాంత వాగీశుడు సుసంపన్నం చేశాడు .పశ్చిమ అస్సామ్ ను పాలించిన కామాట ,కొచ్చి వంశ రాజులు ,మధ్య అస్సామ్ పాలకులు మహామాణిక్య అతని వారసులు ,ఉత్తర అస్సామ్ రాజులు సంస్కృత భాషను బాగా పోషించారు .ఉత్తర భారతం లోనే  వాల్మీకి రామాయణాన్ని మొదటిసారిగా ప్రాంతీయ భాషలోకి అంటే అస్సామీ భాషలోకి అనువదించి రికార్డ్ సృష్టించాడు మహేంద్ర క0దాలి కవి .సంస్కృత వ్యాకరణ0 లో మాత్రం పెద్దగా గ్రంధాలు రాలేదు కానీ వచ్చినవిమాత్రం బాగా గుర్తింపు పొందాయి .

313-కాతంత్ర కౌముది కర్త -పుండరీకాక్ష విద్యాసాగర (1450-1500 )

శ్రీకంఠ పండితునికుమారుడు ,వాసుదేవ సార్వ భౌముని మారుటి  సోదరుడు పుండరీకాక్ష విద్యాసాగరుడు నవద్వీప0 లో జన్మించాడు అతడు శ్రీపతి దత్త రాసిన ‘’కా తంత్ర పరిశిష్ట ‘’కు ‘’వాక్తవ్య వివేక’’వ్యాఖ్యానం రాశాడు .అలాగే కాతంత్ర వ్యాకరణానికి దుర్గా రాసిన వ్యాఖ్యానానికి ఉప వ్యాఖ్యానం ‘’కాతంత్ర ప్రదీప ‘’రచించాడు . కాతంత్ర కౌముది ఇతని సుప్రసిద్ధ వ్యాకరణ గ్రంధం

314-కౌముది వ్యాఖ్య రచయిత -అభిరామవిద్యా లంకార

వంద్య ఘటీయ కుటుంబానికి చెందిన గాయాఘర శాఖలో అభిరామ విద్యాలంకార జన్మించాడు .సంక్షిప్త సార లేక సార పదీయ కు గోయిచంద్ర రాసిన కారకపద  వ్యాఖ్యానానికి విద్యాలంకార కౌముది వ్యాఖ్యానం రాశాడు .

315-సారార్ధ దీపిక కర్త -గోపాల చక్ర వర్తి (17 వ శతాబ్దం )

వంద్య ఘటీయా గయాఘరా శాఖలో 17 వ  శతాబ్దిలో  జన్మించిన గోపాల చక్రవర్తి కవి చంద్ర శిష్యుడు .క్రమాదీశ్వరుని  సంక్షిప్త  సారకు ‘’సారార్ధ దీపిక’’వ్యాఖ్య రాశాడు .

316-ప్రయోగ రత్నమాల వ్యాకరణ కర్త –మహా మహోపాధ్యాయ పురుషోత్తమ విద్యా వాగీశ  (16 వ శతాబ్దం)

16 వ శతాబ్దం నుండి అస్సామ్ లో సంస్కృత వ్యాకరణం లో కొత్త వ్యాకరణ సిద్ధాంత బోధన మొదలైంది .దీనికి ప్రాతిపదికగా మహా మహోపాధ్యాయ పురుషోత్తమ వాగీశ ‘’ప్రయోగ రత్నమాల వ్యాకరణం ‘’1568 లో రాశాడు .దీనితో అస్సామ్ లోయ ప్రాంతం లో పాణినీయ వ్యాకరణ బోధ మానేసి ఈ వ్యాకరణాన్ని బోధించటం ప్రారంభించారు .బెంగాలీ భాష మాట్లాడే బారక్ లోయలో మాత్రం ‘’కలాపా ‘’ముగ్ధ బోధ ‘’వ్యాకరణాలు బోధిస్తున్నారు .వీటిలోని అక్షరమాల తంత్ర సిద్ధాంతం పై ఆధారపడి ఉంటాయి .ఈ వ్యాకరణమేకాక పురుషోత్తమ వాగీశుడు 1- షడ బేధ ప్రకాశం 2-ఊష్మ భేద 3 ‘’వకార’’ నిర్ణయం 4-అంకురావలి కోశ 5-హారావలి కూడా రాశాడు .

317-లఘురత్నమాల కర్త -పండిత శివ నాధభుజ ర్బారువా (1880-1964 )

1880-1964 కాలపు పండిత శివనాధ భుజ ర్బారువా ‘’లఘురత్నమాల ‘’వ్యాకరణ గ్రంధం రాశాడు ఇదికాక పీతాంబర సిద్ధాంత వాగీశుని ‘’దయాకౌముది ‘’పై ‘’ప్రబోధిని ‘’వ్యాఖ్య రాశాడు .ఆచార విజ్ఞాన ,హిందూక్రిస్టి మొదలైనవి రచించాడు

318-శబ్ద మంజరి కర్త -చంద్ర కాంత విద్యా లంకార (1870 )

1870 కి చెందిన చంద్ర కాంత విద్యాలంకార 1-శబ్ద మంజరి 2-పదమంజరి 3-ధాతు మంజరి 4-మండలాధ్యాయం రాశాడు .

319-ఆశుభోద వ్యాకరణ కర్త -నారాయణ చంద్ర విద్యాభూషణ (

నారాయణ చంద్ర విద్యా భూషణ -ఆశుభోద వ్యాకరణం రచించాడు .శౌరి దత్త భట్టా చార్య -రత్నమాల వ్యాకరణస్య టీకా తోపాటు ‘’గీతాయాహ్ తత్వ సారాహ్ ‘’రాశాడు .

320-వరరుచి వ్యాకరణ కర్త -మహా మహోపాధ్యాయ వేదాంత వాగీశ భట్టాచార్య (1765)

విద్యా వాగీశ చక్రవర్తి అని పిలువబడే మహా మహోపాధ్యాయ వేదాంత వాగీశ భట్టాచార్య  1765 లో ‘’వరరుచి వ్యాకరణం ‘’రాశాడు

 రామ భద్ర సర్వ భూషణ భట్టాచార్య  ‘’సమాస వివేచనం ‘’రాసి సమాసాలను నవ్య న్యాయం ఆధారంగా విస్తృతంగా చర్చించాడు .

321-విదగ్ధ ముఖ మండన కర్త -ధర్మ దాసు (1748)

 1748 లో ధర్మదాసు ‘’విదగ్ధ ముఖ మండనం ‘’శబ్దం, దాని శక్తి పై గ్రంధాన్ని దానికి వ్యాఖ్యానాన్ని కూడా రచించాడు .ఇందులో సంఖ్య ,లింగం సమ్మేళనం మొదలైనవి చర్చించాడు .

ధాత్వార్థ సాధన ,ప్రయోగ మంజరీలను గంగానాధ దేవ శర్మ రాశాడు .ఆఖ్యాత ప్రకరణం పై ’’ధాతు పాఠం ‘’ను ఒక అజ్ఞాత కవి రాశాడు .

ఈ  విధంగా  అస్సామ్ లో వ్యాకరణ గ్రంధాలు వెలువడి తానూ ఏ రాష్ట్రానికీ తీసిపోనని ప్రాగ్జ్యోతిషం తన వ్యాకరణ జ్యోతిని వెలిగించింది ..

 సశేషం –

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-6-17-కాంప్-షార్లెట్-అమెరికా

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

జూన్ 27 మంగళవారం నా పుట్టిన రోజు .77 వెళ్లి 78 వచ్చిన సందర్భంగా సాహితీ బంధువులకు శుభ కామనలు

జూన్ 27 మంగళవారం నా పుట్టిన రోజు .77 వెళ్లి 78 వచ్చిన సందర్భంగా సాహితీ బంధువులకు శుభ కామనలు -దుర్గాప్రసాద్

   ఈ సందర్భంగా

మహాన్యాస పూర్వక శ్రీ రుద్రాబిషేకం ,శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

27-6-17 మంగళవారం షార్లెట్ లో మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో మా దంపతులచేత ఉదయం 7-30 నుండి 10 గంటలవరకు శ్రీ సువర్చలాంజ నేయ స్వామి వార్లకు అష్టోత్తర సహస్రనామార్చన అనంతరం  ‘’పంచాగ రుద్ర పంచముఖ ధ్యాన ,న్యాస పూర్వక  సంపుటీ కరణ ,దశాంగ రౌద్రీకరణ షోడశాంగ రౌద్రీకరణ,ఆత్మరక్షాయుక్త  శివసంకల్ప ,పురుషసూక్త అష్టాంగ ప్రణమ్య రుద్రార్చన స్నానాది ప్రయోగ ,దశశాంతి ,సామ్రాజ్య పట్టాభిషేక సమేత మహన్యాస పూర్వక శ్రీ రుద్రాభిషేకం ,అనంతరం శివ అష్టోత్తర ,సహస్ర నామ అర్చన  ,బిల్వాష్టోత్తర పూజ నిర్వహింపబడును ..

   ఉదయం  10 గం  నుండి 12 -30 వరకు నవగ్ర అష్టోత్తర పూజలతో శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతం, స్వామివార్లకు   అశోత్తర సహస్ర నామ పూజ జరుప బడును .

                                                                                      గబ్బిట దుర్గా ప్రసాద్ -షార్లెట్ -అమెరికా

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 306-భక్తి వైభవ మహా కావ్య కర్త -కవి డిండిమ జీవ దేవాచార్య (!475

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

306-భక్తి వైభవ మహా కావ్య కర్త -కవి డిండిమ జీవ దేవాచార్య (!475

1475 కు చెందిన కవి డిండిమ దేవాచార్య రాజగురు త్రిలోచన రత్నావళి కుమారుడు .ఒరిస్సా గజపతి ప్రతాప రుద్ర దేవ చక్రవర్తి సైన్యాధ్యక్షుడే కాక ,రాజగురువు ,సంస్కృత విద్యావేత్త మహాకవి .భాగవత దశమస్కంధం ఆధారంగా ‘’భక్తి భాగవత మహా కావ్యం ‘’రాశాడు .ఇది 32 కాండల లో 3 వేల శ్లో కాల కావ్యం . ఛందో వైవిధ్యం పాటించాడు .తన కృష్ణ భక్తి కి నిదర్శనం గ 9 అంకాల ‘’భక్తి వైభవ నాటకం ‘’రాశాడు .దీన్ని జగన్నాధ స్వామి డోలా యాత్ర సందర్భంగా రాశాడు .మహా భారత కథ ఆధారంగా ఉత్సాహ వతి అనే చిన్ననాటకాన్ని రాశాడు . ఈ రూపకాన్ని  జగన్నాధ స్వామి శిలాస్తంభ మందిరం లో వసంతకాలోత్సవాలలో ప్రదర్శించేవారు .తన విద్వత్తుకు గుర్తుగా కవి డిండిమ ,కవిరాజ ,శ్రీమద్భాగవత ,పరమాచార్య వంటి సార్ధక బిరుదులూ పొందాడు .

 ఈ కవి రాసిన భక్తి వైభవ నాటక కవిత్వ వైభవాన్ని  మెచ్చుకొన్న ప్రతాపరుద్ర గజపతి కవికి 8 బంగారు వింజామరలతో ,ఒక బంగారు గొడుగు తో ఘనమైన సత్కారం చేసి నభూతో అనిపించాడు . 307- భారతామృత మహా కావ్యకర్త -కవి చంద్రాచార్య దివాకర మిశ్ర (1464

 కవి చంద్రాచార్య దివాకర మిశ్ర వైద్యేశ్వర ,ముక్తాదేవి కుమారుడు .భారత దేశం లోనే వ్రేళ్ళ మీద లెక్కింపదగిన సంస్కృత  విద్వా0సు లలో ఒకడు గా గుర్తింపు పొందాడు .షట్ దర్శనాలపై షట్ శాస్త్రాలపై సాధికారమున్న మహా మేధావి పండిత విద్వాంసుడైన కవి .అనాది మిశ్ర రాసిన ‘’మణిమాల ‘’నాటిక ను చదివితే ఈ కవి వారసులు ముకుంద మిశ్ర ,శత0జీవ  మిశ్ర  అనాది మిశ్ర అందరూ మహా కవులే శాస్త్ర వేత్తలే నని తెలుస్తుంది .దివాకర మిశ్ర 9 అద్భుత రచనలు చేశాడు .

మహా భారతం ఆధారంగా ‘’భారతామృత మహా కావ్యం ‘’రాశాడు కానీ అందులో 40 వ కాండం లోని 93 శ్లోకాల వరకే  దక్కాయి .శల్యవధ అసంపూర్తిగా ఆగిపోయింది . కనుక కావ్యం 48 లేక 50 కాండాల గ్రంధం అని పిస్తుంది .దొరికిన వ్రాతప్రతిలో 3338 శ్లోకాలు వివిధ ఛందస్సులలో కనిపిస్తాయి .శ్రీహర్షుడు నైషధ చరిత్రలో తన వంశావళి గురించి చెప్పుకున్నట్లు ఈ కవి కూడా తన చరిత్రను పొందు పరచాడు . ఇతని రెండవ రచన ‘’లక్షణాదర్శ మహాకావ్యం ‘’భట్టికవి రచనపోలి ఉంటుంది . 4 కాండాలు మాత్రమే లభించాయి .భారతం లోని పాండవ చరిత్ర ఇది .అభినవ గెట గోవిందం కూడా ఈకవి రచనే కానీ గజపతి పురుషోత్తమ దేవుని పేరా చెలామణి లో ఉంది .ఈకవి శ్రీ కృష్ణ దేవరాయల ఆస్థానం లో కూడా ఉన్నాడు.

308-శ్రీ కృష్ణ భక్తి కల్పలత ఫల కర్త -జగన్నాధ దాసు  (1491-1550 .),

భగ  బంధ దాస ,పద్మావతిలా కుమారుడు జగన్నాధ దాసు సంస్కృత ఒరియా భాషలలో మహా పాండిత్యమున్నవాడు ఆయన ఒ రియాలో రాసిన ‘’భాగవతం ;ఒరిస్సా ప్రజలందరి ఇంటి పారాయణ గ్రంథమైంది .సంస్కృతం లో 8 ,ఒరియాలో 12 రచనలు చేశాడు . అందులో సంస్కృతం లో రాసిన నీలాద్రి శతకం ,ఉపాసన శతకం శ్రీకృష్ణ భక్తికల్ప లతా ఫలం ,నిత్యా గుప్త చూడామణి బాగా ప్రసిద్ధమైనాయి

309-ప్రాయశ్చిత్త మనోహర కర్త -మురారి మిశ్ర (1550 )

 కహ్ను మిశ్ర కుమారుడు మురారి మిశ్ర గొప్ప సంస్కృత ,శాస్త్ర నిధి .ధర్మ శాస్త్రం గా ‘’ప్రాయశ్చిత్త మనోహరం ‘’రాశాడు .ఇది బాగా ప్రచారం లో ఉంది .

310-దశగ్రీవ వద్ద మహా కావ్య కర్త -కవీంద్ర మార్కండేయ మిశ్ర ( (1497-1535 .

మంగళ దేవ కుమారుడు మార్కండేయ మిశ్ర ప్రతాపరుద్రుని సమకాలికుడు .20 కాండల దశగ్రీవ వధ మహాకావ్యం 1500 లో రాశాడు .ప్రాకృత సర్వస్వము 1565 లో రాశాడు .మహాకావ్యం ఉపోద్ఘాతం లో తనను కవి రాజా చక్రవర్తి అంటారని చెప్పుకొన్నాడు .సర్వస్వము లో మాత్రం  కవీంద్రునిగా  మాత్రమే చెప్పుకొన్నాడు .

  సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -26-6-17- కాంప్-షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 301-ఒరిస్సాలో గజపతుల కాలం లో వర్ధిల్లిన గీర్వాణం (1435-1568)

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3

301-ఒరిస్సాలో గజపతుల కాలం లో వర్ధిల్లిన గీర్వాణం (1435-1568)

ఒరిస్సాలో సూర్య వంశ గజపతి చక్రవర్తుల కాలం1435-1466 వరకు పాలించిన  కపిలేంద్ర దేవ చక్రవర్తి తో ప్రారంభమై 1497-1535 వరకు పాలన చేసిన గజపతి ప్రతాపరుద్ర దేవ వరకు ఉన్నా ,1559-1568వారివరకు పాలన చేసిన మొదటి ముకుంద దేవ్ వరకు కొనసాగింది .ఈ కాలం లోనే దేశం లోను ఒరిస్సా లో కూడా సాంస్కృతిక జాతీయ ఉద్యమం నడిచింది .సంస్కృత ఒరియా భాషలలో సాంఘిక ,మత సంబంధ గ్రంథాలెన్నో వెలువడ్డాయి .పుణ్య క్షేత్రాల  ,అందులోని దేవీ దేవతల మహాత్మ్యాలతో ,పౌరాణిక  సాహిత్యం తో గ్రంధాలు వచ్చాయి .అలంటి వాటిలో పురుషోత్తమ మహాత్మ్యం ,కపిల సంహిత ,నీలాద్రి మహోదయం ,ఏకామ్ర పురాణం ,ఏకామ్ర చంద్రిక ,ప్రాచీ మహాత్మ్యం ,విరాజ మహాత్మ్యం ముఖ్యమైనవి .ఈ కాలపు చక్రవర్తులు కేవలం పాలకులేకాక మహా కవులు కూడా.  కవి పోషణ చేసినవారే .కావ్యాలు రాశారు రాయించి కృతికర్తలు భర్తలూ అయ్యారు .

 గజపతి కపిలేంద్ర దేవ చక్రవర్తి గొప్ప నాయకుడేకాదు మంచి కవిపోషకుడుకూడా . స్వయం గా ‘’పరశురామ వ్యాయోగం ‘’అనే ఉప రూపకం రాశాడు .మొదటి అయిదు శ్లోకాలలో విష్ణు జగన్నాధ రుక్మిణి శ్రీకృష్ణ శివులను స్తుతించాడు .తరువాత శ్లోకాలలో తాను  పరశురాముని అవతారంగా చెప్పుకున్నాడు .దీన్ని 1458 కి పూర్వం జగన్నాధ స్వామి ఉత్సవాలలో ప్రదర్శించేవారు .ఇందులో చక్రవర్తికి ఉన్న పరమత సహనం కూడా దృశ్యమానమవుతుంది .

 కపిలేంద్రుని ఆస్థాన న్యాయాధిపతి నరసింగ మిశ్ర వాజ్ పేయి శంకరాచార్యుల అద్వైతమతానికి పునర్వైభవం తెచ్చి జగద్గురు శంకరాచార్యుల ‘’సంక్షేప శరీర ‘’గ్రంధానికి సంక్షేప శారీరిక వార్తిక ‘’రచించాడు . ఈ కవి కాశీ లో కొంతకాలముండి ‘’కాశీ మీమాంస ‘’రాశాడు కానీ అలభ్యం ఈయన మనవడు మృత్యుంజయ  రాసిన శాస్త్ర గ్రంధం ‘’శుద్ధి ముక్తావళి ‘’దొరికింది  .ఇతని తండ్రి జలేశ్వరుడు వేదం లో చెప్పబడిన హోమాది క్రియలపై ‘’జలేశ్వర పధ్ధతి ‘’రాశాడు .

1450 వాడైనకాళిదాస చయని  కవి ప్రసిద్ధమైన శాస్త్ర గ్రంధం ‘’శుద్ధి చంద్రిక ‘’రాశాడు .ఇందులో శార్దూల విక్రీడితం లో రాసిన 25 శ్లోకాలు మాత్రమే ఉన్నాయి .మృతుని శరీర శుద్ధి కోసం చేయాల్సిన విధులు చెప్పబడ్డాయి ‘

302-ముక్తి చింతామణి కర్త -గజపతి పురుషోత్తమ దేవ చక్రవర్తి (1466

 గజపతి కపిలేంద్ర దేవుని కుమారుడు గజపతి పురుషోత్తమ దేవ చక్రవర్తి గొప్ప పోరాట యోధుడేకాక మహా కవి కూడా .ముక్తి చింతామణి ,గోపాలార్చన,విధి ,నామమాలిక ,దుర్గోత్సవ ,భువనేశ్వరి పూజా పల్లవ రాశాడు .ఇందులో ముక్తి చింతామణి 6 ప్రకారణాలున్న స్మృతి గ్రంధం దీనికి ఆధారం పురాణ ,తంత్ర శాస్త్రాలలో విషయాలే .రచనాకాలం 22-2-1767 .ఇందులో 15 వ శతాబ్దికి ముందున్న పూర్వపు పురాణ తాంత్రిక గ్రంధాలనన్నిటినీ పేర్కొన్నాడు .గోపాలాచార్చన విధిని నీలాద్రి  మహోదయం అని అంటారు .పూజా విధి గోపాల పూజా విధి లలో జగన్నాధ స్వామి పూజా విధానాన్ని వివరించాడు .జగన్నాధుడు గోపాలకృష్ణుడే అని నిర్ధారించాడు .ఇవి ఒరిస్సా చరిత్రలో మైలు  రాళ్లుగా నిలిచాయి .దుర్గోత్సవం అనేది ఇంకా అలభ్యమే .భువనేశ్వరి పూజా పల్లవం మాత్రం శాక్తేయం లోని తంత్ర శాస్త్రం .ఇందులో ఉన్నదాని ప్రకారం పురుషోత్తమదేవుడు తండ్రి కపిలేశ్వర దేవ కృష్ణా జిల్లా కొండపల్లి లో 1466 లో చనిపోయాక రాజ్యానికి చక్రవర్తి అయినట్లు తెలుస్తోంది .అప్పటికి ఇతను మైనర్ ,పెద్దకొడుకు కూడా కాదు .దురదృష్టవశాత్తు ఈ గ్రంధం అనేక కారణాలవలన ప్రచురితం కాలేదు .పురుషోత్తముడే రాసిన ‘’అభినవ వేణీ సంహారనాటకం ;;కూడా ముద్రణ పొందలేదు .

303-బలభద్ర సంగ్రహ కర్త -రాజగురు బలభద్ర మిశ్ర (1466

గజపతి పురుషోత్తమ దేవ చక్రవర్తి ఆస్థాన రాజగురువు బలభద్ర మిశ్ర  నరసింగ మిశ్ర కుమారుడు .భట్ట తంత్రాలలో నిధి .అద్భుతమైన 3 స్మృతులు రాశాడు .ఇవే  అద్వైత చింతామణి ,శారీరక సార-పురుషోత్తమ స్మ్రుతి ,బలభద్ర సంగ్రహం .బలభద్ర సంగ్రహం తరువాత కవుల చేత విస్తృతంగా పేర్కొన బడింది

304-ప్రౌఢ ప్రతాప మార్తాండ కర్త -గజపతి ప్రతాప రుద్రదేవ1497-1535)

గజపతి పురుషోత్తమ దేవుని కుమారుడు గజపతి ప్రతాప రుద్ర దేవ్  కళా సంస్కృతులను బహువిధాల వర్ధిల్ల జేసినవాడు .ఎందరో సంస్కృత కవులకు విద్యా వేత్తలకు  ఆశ్రయమిచ్చి కావ్య రచన చేయించినవాడేకాక తానూ గొప్పకవే .సరస్వతి విలాసం ‘’అనే గ్రంధాన్ని రాశాడు ఇదికాక ప్రతాప మార్తాండ లేక ప్రౌఢ ప్రతాప  మార్తాండ ,నిర్ణయం సంగ్రహం ,కౌతుక చింతామణి కర్త కూడా .వీటిలో రెండవది కాశీకి చెందిన రామ కృష్ణ భట్టు సమకూర్చిన గ్రంధం ఈకవి ఈ రాజు ఆస్థానకవి -పండిత శిరోమణి బిరుదాంకితుడు కూడా . ఈ బిరుదును ప్రతాప మార్తాండం ను పరిశీలించి మెచ్చి రాజగురువు బలభద్ర మిశ్ర అందజేశాడు . 5ఉల్లాసాల సరస్వతి విలాసాన్ని ఆంధ్ర దేశ పండితకవి  ప్రతాపరుద్రుని ఆస్థానకవి లక్ష్మీధర పండితుడు సేకరించిన గ్రంధం . ప్రకాశాలతో ఉన్న ప్రౌఢ ప్రతాప మార్తాండం ధర్మ శాస్త్ర రచన .మాధవ భట్టు కుమారుడు రామకృష్ణ భట్టు సేకరణ ఇది రాజుగారిపేర చలామణి చేశాడు .కౌతుక చింతామణి 5 దీప్తులతో ఉన్న చిత్ర బంధ ,చేతబడులు కావ్యం 1520 రచన .నిర్ణయం సంగ్రహం ఇంకా దొరకలేదు .

305-హరి హర చతురంగ యుద్ధ తంత్ర కర్త -రాజగురు గోదావరశర్మ (1515

బలభద్ర మిశ్ర కుమారుడు రాజగురు గోదావర శర్మ ,గజపతి ప్రతాప రుద్రా దేవ చక్రవర్తి ఆస్థాన గురువు , మంత్రి . మిశ్ర తండ్రిలాగానే గొప్ప తంత్ర శాస్త్ర పండితకవి .గోదావర వర్ధన,కవి పుంగవ ,పండిత రాజ బిరుదులున్నవాడు  ,జయ చింతామణి ,ఆచార చింతామణి కర్త .యుద్ధ తంత్రం పై ‘’హరిహర చతురంగ ‘’గ్రంధం రాశాడు .దీని ఆధారంగా ఈ కవి ‘’అద్వైత దర్పణం ,అధికార దర్పణం ,నీతి చింతామణి ,ఆచార చింతామణి ,నీతి కల్పలత మొదలైన గ్రంధాలు కూడా రాసినట్లు తెలుస్తోంది  .

   సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -26-6-17-కాంప్-షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వీక్లీ  అమెరికా -13 (19-6-17 నుంచి 25-6-17 వరకు )

వీక్లీ  అమెరికా -13 (19-6-17 నుంచి 25-6-17 వరకు )

పూరీ జగన్నాధ రధోత్సవ  ,దువ్వాడ జగన్నాధ వారం

19-6-17 సోమవారం -మా మనవడు చి సంకల్ప్ చికాగోలో  ఉద్యోగం లో చేరాడు రూమ్ మేట్లు కూడా తెలుగు వాళ్ళే దొరికారని చెప్పాడు  సంతోషం . భారత రాష్ట్ర పతి అభ్యర్థిగా మోడీ ఒక దళిత మేధావి ,మాజీ బీహార్ గవర్నర్ ,ఉత్తరప్రదేశ్ కు చెందిన శ్రీ రామ్ నాధ్ కోవింద్ ను యెన్ డి ఏ బలపరచిన  బిజెపి అభ్యర్థిగా , అందరి అంచనాలను తలక్రిందు చేసి నిలబెట్టాడు .  కాంగ్రెస్ కూడా బీహార్ కే  చెందిన జగజ్జీవన్ రామ్ కుమార్తె మాజీ లోక్ సభ స్పీకర్ శ్రీమతిమీరా కుమార్ నుపోటీ గా నిలబెట్టింది  . గీర్వాణం 3 లో 250 దాకా కవుల గురించి రాశాను  .మంగళవారం గీ  -3 అంకిత ,స్పాన్సర్ ఆర్టికల్స్ రాశాను ..శ్రీ చలపాక ప్రకాష్ కు ఫోన్ చేసి ఆధునిక ప్రపంచ నిర్మాతలు డిటిపి ఎంతవరకు వచ్చిందో తెలుసుకొన్నా.  రాష్ట్ర కార్య దర్శి అవటం తో ప్రతి ఆదివారం గుంటూరు వెళ్లాల్సి వస్తోందని తన రమ్యభారతి కూడా సమయానికి వెలువరించలేక పోతున్నామని తెలిపి మన పుస్తకాన్ని మరో రెండు వారాల్లో పూర్తి చేస్తానన్నారు . అది అవగానే శివ లక్ష్మికి పంపి తప్పులు దిద్దించి సరి చేశాక స్క్రిప్ట్ లోమార్చి నెట్ లో నాకు పంపితే నేను రెండవసారి చూసినట్లవుతుందని ఇండియా రాగానే మూడవ సారి చూసి ప్రింట్ కు ఇవ్వవచ్చునని అన్నాను సరేనన్నారు .  ఇది అవగానే గీర్వాణం -3 కూడా అంతా రెడీ చేసి ఫైల్ పంపిస్తానని అప్పుడు మొదలు పెట్టమని చెప్పాను .అలాగే అన్నారు .

 ఇక్కడికి వచ్చాక రెండు సార్లు వసుధ గారికి మెయిల్ చేసి ‘’వసుధైకం ‘’యెంత వరకు వచ్చిందని అడిగితె సమాధానం రాలేదు .ఆయనకూ తీరిక లేకపోవటం, వేసవి తీవ్రత వలన అడుగులు ముందుకు సాగలేదని పిస్తోంది .. రాత్రి అల్లరినరేష్ ‘’సీమ ఆటపాకాయ్ ‘’గొట్టం ‘’లో చూసాం బాగానే ఉంది .బుధవారం చరణ్ ,రమ్య లతో ఫోన్ లో మాట్లాడాము . ఈ రోజు సాయంత్రం అడ్డాడ శిష్యురాలు అమెరికాలో ఉంటున్న శ్రీమతి కోడూరి పావని ఫోన్ చేసి మాట్లాడింది తాము ఆగస్టు రెండవవారం లో కొలంబస్ కు ఉద్యోగం లో చేరటానికి వెడుతున్నామని చెప్పింది .రాత్రి ‘’ఇదేం  పెళ్ళాం రా బాబోయ్ ‘’రాధికా ,రాజేంద్ర ప్రసాద్ సినిమా ట్యూబ్ లో చూసాం సరదాగా ఉంది .మూడు రోజుల నుంచి వర్షాలు బాగానే పడుతున్నాయి .

 గురు వారం  శైవ  వీరశైవ సంస్కృత కవుల వివరాలు దొరికితే రాసి 260 కి చేర్చా .

               దువ్వాడ  జగన్నాధం

23-6-17 శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల మాటినీ షోలో  ‘’దువ్వాడ జగన్నాధం ;;చూసాం .మాముగ్గురుకాక మరొక 7 గురు మాత్రమే ఉన్నారు మొత్తం 10 .ఉదయం ఆట వేయలేదట గురువారం రాత్రి ఆట ఆడా రట  .వర్కింగ్ డే కనుక జనం ఉండరు అంది మా అమ్మాయి . మా మనవడు శ్రీకేత్ మాతో రాకపోతే మా అమ్మాయి రాత్రి ఆటకు వాడిని తీసుకొని వెళ్లి రెండో సారి చూసింది .ఆర్భాటం పెద్దగా బడ్జెట్ లేని సాధారణ ఆంద్ర బ్రాహ్మణ కుటుంబం కథ .వాడే దువ్వాడ జగన్నాధం .వాడు పరిత్రాణాయ సాధూనాం గా మారితే మెడలోని రుద్రాక్ష తీసేసి డి .జే .గా మారి ఫైట్లు చేసి  విలన్లను  చావబాది  అగ్రి గోల్డ్ ఖాతాదారుల డబ్బు 9 వేలకోట్లు దోచుకొన్న వాళ్ళ భరతం పట్టి ఆడబ్బు బాధితులకు అందేట్లు చేస్తాడు డి జె అల్లు అర్జున్ .అతని పెర్ఫార్మన్స్ కు తగిన కథ .మాటలు రాసి డైరెక్ట్ చేసిన హారీస్ శంకర్ ప్రతిభ ప్రతిభ అంగుళం లోనూ కనిపిస్తుంది .మాటలు అదుర్స్ అంటే మామూలు మాట అవుతుంది అల్లు భాషలో ‘’ఉత్కృష్టహ్  ,ఉత్కృష్ఠస్య ,ఉత్కృష్టే భ్యహ్ ‘’. అర్జున్ బ్రాహ్మణ వాచకం కూడా సూపర్బ్ .ఈ పాత్ర అతనికి కొత్తదే కానీ కొట్టిన పిండి ని చేసేశాడు . అతని ఎనర్జీ అంతా ఖర్చు చేసి పోరాటాలు డాన్స్ లు చేశాడు . డాన్సుల్లో ఒంగిన చువ్వ అని పించి ;;ఇరగ ‘’దీ శాడు .అన్నిటికంటే గొప్ప విషయం రావు గోపాలరావు లాగా మట్టలాగు , బారు చొక్కా  రొయ్య మీసం వేసుకున్న ఆయన కొడుకు రావు రమేష్ అదే యాసలో తండ్రికి తగిన కొడుకు కాక మించిన తనయుడు అనిపించాడు నటనలో .  ఇది బాగా ప్లస్ పాయింట్ . జొన్నవిత్తుల పాటలు సుశబ్ద సరళ సుందరం గా ఉంటె దేవిశ్రీ సంగీతం అర్జున్ డాన్స్ లకు తగ్గ భంగిమ లో నాట్యం చేసింది .. హీరోయిన్ వలన ఒరిగిందేమీ కనిపించలేదు . చూసినవాళ్లకు అల్లుకు సెక్షీ గా కనిపించిందేమో తెలీదు . మిగిలిన పాత్ర దారులందరు యధా శక్తి నటించి ‘’అన్నపూర్ణా కేటరింగ్ ‘’లో రుచికరమైన శుచికరమైన హాయైన హాస్య సాహస , ,ఉద్రేక, శోకాది  భావోద్రేక పిండివంటలతో సహా వంటలు వండి వడ్డించి  ,తినిపించి  ‘’ బ్రేవ్  ‘’మని’’త్రేనుపు ‘’ తెప్పించారు . ‘’ఇంగువ వేసిన పులిహోర’’  లాగా ఘుమ ఘుమ లాడించి ‘’ఎక్సలెంట్ ,ఎక్స్ట్రార్డినరీ , మైండ్  బ్లోయింగ్ ‘’అనిపించాడు దువ్వాడ  . ఒక రకంగా ‘’సభ్య సమాజానికి మంచి సందేశమే ‘’ఇచ్చాడు డి జె.

   శనివారం శ్రీయల్లాప్రగడ వారు ఫోన్ చేసి మళ్ళీ మాకు ఎప్పుడు వీలయితే అప్పుడు వాళ్ళ ఊరు కారీ కి రమ్మని కోరారు తప్పక వస్తామన్నాం .

        విశ్వ నాదామృతం                               

                                                                                                                                                                                    

..రాత్రి యు ట్యూబ్ లో ‘’విశ్వనాధామృతం ‘’చూసాం .ఇండియాలో ఉండగా మొట్ట మొదటి ఎపిసోడ్ మాత్రమే చూసాం ఇవాళ సాగర సంగమం ,స్వర్ణకమలం సప్తపది ఎపిసోడ్ లు చూసాం . రచయితా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కళాతపస్వి విశ్వనాధ్ దర్శకత్వ ప్రతిభను అన్నికోణాలలో ఆవిష్కరించాడు . సాగర సంగమం తన కు బాగా నచ్చిన సినిమా అని అది శంకరాభరణం తర్వాత మరొక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింద ని  అందులో 12 పీక్ పాయింట్లున్నాయని .ప్రతి పాయింట్ దగ్గరా సినిమా అయిపొతుందే మోననిపించి మళ్ళీ సాగటం విశ్వనాధ ప్రతిభకు నిదర్శనమని నెగటివ్ కేరక్టర్, జీవితం లో ఫెయిల్యూర్ అయిన వాడి కథను అంత  అద్భుతంగా తీయటం ఆషామాషీకాదని ,ఆయన మనతోపాటు ఉంటూ మనకు మార్గ దర్శకత్వం చేస్తూ ,మన హృదయాలను కదిలిస్తూ ద్రవీభూతం చేస్తూ భారతీయ కళా   సంస్కృతి విలువల  పట్ల అభిమాన్నాన్ని వెయ్యి రెట్లు పెంచిన దార్శనికుడు విశ్వనాధ్ ను కళాతపస్వి అని ఏ అరణ్యం లోనో ముక్కు మూసుకుని కూర్చున్నవాడిగా భావించరాదని ఆయన జనక చక్రవర్తిలాగా జ్ఞాన బోధకుడుకనుక ఆయనను అన్నట్లే ‘’కళా రాజర్షి ‘’అనటం సముచితమని అన్నాడు.   నాకు బాగా నచ్చిన మాట .ఇలాంటి సినిమాలు ఏ దర్శకుడైనా జీవితం అంతా కస్టపడి ఒక్క సినిమా మాత్రమే తీయగలడ ని కానీ విశ్వనాధ్ ఇలాంటివి 10  కళాఖండాలు  తీసి నభూతో  న భవిష్యతి  అనిపించారని చెప్పాడు  నా దృష్టిలో ‘’కళాఖండాల కళా విశ్వం -విశ్వనాధ్ ‘’. స్వర్ణకమలం అద్భుత కళాఖండం .భానుప్రియ అభినయ నృత్య వేదమే అది . పాపం చర్చలో పాల్గొన్న అందులోని హీరో వెంకటేష్ మనసులో ఉన్న భావాలను ఇంగ్లిష్ తెలుగు మిక్సింగ్ లో సరిగ్గా చెప్పలేక పోయాడు . ఇక ‘’సప్తపది ‘’హీరోయిన్ సబితను 1998 లో పెదకళ్లేపల్లి లో వేటూరి గారు రెండు రోజులపాటు తమ ఇంట్లో కాఫీ టిఫిన్ భోజనాలతో నిర్వహించిన కళాసదస్సు లో విశ్వనాధ్ బాలు  ,దేవదాస్ కనకాల దంపతులతో పాటు చూసాం . భరణి  దీని చర్చలో ఉన్నాడు .అసలే మాట కంగారు దానికి తోడు మహా గొప్ప సినిమా గురించి చెప్పేటప్పుడు మరింత కంగారుపడి తొందరగా మాట్లాడి పాపం ఇబ్బందిపడి ,ఇబ్బంది పెట్టాడు   .ఈ మూడిట్లో విశ్వనాధ్ ఉన్నా చెదరని చిరునవ్వుతో తనకేమీ తెలియదన్న భావం తో ఆసమయానికి అలా తోచింది కనుక అలా చేశాననే నిర్లిప్తతతో కళా యోగిగా కనిపించాడు సప్తపది ఒక విప్లవాత్మక భావ వ్యాప్తి .దీన్ని సమాజం   స్వీకరించటానికి  కతగిన ఉపపత్తులన్నీ దట్టంగా దట్టించుకుని తీశాడు .నమ్మించాడు .దీనిపై విమర్శ లేమీ రాలేదా అని ఈ ఎపిసోడ్ లు తీసిన పార్ధ సారధి అడిగితె ఒకే ఒక్క బ్రాహ్మణ సంఘం వారు మాత్రమే తిరస్కరించారని ‘’మీ అమ్మాయికి ఇలాగే పెళ్లి చేస్తారా ?’’అని సూటిగానే ప్రశ్నించారని చెప్పాడు సప్తపదిలో ‘జానకీ పాడిన త్యాగరాజకీర్తన ‘’మరుగేలరా  ఓ రాఘవ ‘’’’ హృదయాలను  కదిలించే పాట  నాకెంతో ఇష్టమైంది .త్యాగరాజుకు వేయి రె ట్ల గౌరవం ఆపాదించే ట్లుగా   ఈ కీర్తనను మహదేవన్ జానకి విశ్వనాధ్ లు  తీర్చిదిద్దారు .  . దీనికి విరుద్ధంగా సెంటిమెంట్ లకు గౌరవం కలిపిస్తూ బాపుగారు ‘’రాధా కళ్యాణం ‘’తీసి అభిమానం పొందారు .తానూ ఇలాంటి చిత్రాలు తీయటానికి కారణం అభిరుచి ఉన్న నిర్మాతలు ముందుకు రావటమే నన్నారు కళాతపస్వి . .పార్ధ సారధి ‘’విశ్వనాధ్ గారు తన చిత్రాలలో ఎన్నోపాటలకు పల్లవులు సూచించారని అవి ఒక గ్రంధంగా వస్తే బాగుంటుందని’’ అన్నాడు .నాకేమనిపిస్తుంది అంటే ‘’విశ్వనాధ్ కళా సర్వస్వము ‘’ అనే గ్రంధం రావాలి .

                               పూరీ జగన్నాధ రధోత్సవం

 25-6-17 ఆదివారం -ఆషాఢ శుద్ధ విదియ పూరీ లో జగన్నాధ రధోత్సవం కన్నుల పండువుగా జరిగింది .ఇక్కడ షార్లెట్ లో కూడా హిందూ సెంటర్ లో మినీ రధ యాత్ర పిల్లలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వ హించారని తెలిసింది .చికాగో కూడా ఇస్కాన్ వారు బ్రహ్మానందంగా రధ యాత్ర నిర్వహిస్తారని చదివాను .

 ఇండియాలో ఉండగా గీర్వాణం -3 లో 138 కవుల గురించి రాశాను .ఇక్కడికి వచ్చాక సుమారు 15 రోజులనుంచి అన్ని చోట్ల సేకరించి ఇవాళ్టి కి 300 మంది గీర్వాణకవుల గురించి రాయగలిగాను .  ముఖ్యంగా మనకు తెలియని ఎందరో కాశ్మీర సంస్కృతకవులు కాశ్మీర పండిట్ లు రాసిన రచనలు ,శైవ శాక్తేయ వీరశైవ కవులు మరీ ముఖ్యంగా ఒరిస్సా కవులు చాలాకొద్దిమందిమాత్రమే మనకు తెలుసు .వారిలో అన్నియుగాలలోని కవుల విషయాలు తెలుసుకొని వారి గురించి కూడా సమ గ్రంగానే రాశాను .వీరుకాక మన సమకాలీన కవులు ఏ యుని వర్సిటీలలో ఉన్నా వారి గురించి వివరాలు సేకరించమని పాపం మైనేనిగారిపై  ఈ ముసలి వయసులో పెద్ద బాధ్యత పెట్టాను వారు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు . శైవ పీఠం కు చెందిన కొందరు ప్రసిద్ధ కవుల గురించి వివరాలు అడిగి తెలుసుకోమని కీ శే సద్గురు సదానంద మూర్తి గారి కుమారులు శ్రీ బసవ రాజుగారిని సంప్రదించమని కోరగా వారితో సంప్రదించారు ఒకటి రెండు రోజుల్లో  ఆ వివరాలూ లభ్యమవచ్చు .

  ఇంత రాసినా ఈ రాత వ్యగ్రత తో దాదాపు రెండు వారాలనుండి పుస్తకాలు  చదవటం కుదరటం లేదనే బాధ ఎక్కువగా ఉంది . .అందరికి’’ శు, శుభస్య ,శుభస్యేభ్యహ్’’అని డి జె మాటతో వీక్లీ కి సమాప్తి పలుకుతున్నాను  .

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-6-17-కాంప్-షార్లెట్-అమెరికా



గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in అమెరికా లో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 291-గోవింద భాష్య కర్త -బలదేవ్ విద్యాభూషణ (1764

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

291-గోవింద భాష్య కర్త -బలదేవ్ విద్యాభూషణ (1764

బలదేవ్ విద్యాభూషణ్ ఆనాటి సంస్కృత మహా పండితులలో శ్రేష్ఠుడు . 18 వ శతాబ్దికి చెందినవాడు .రూప గోస్వామి స్తవమాలకు ‘’టీకా రాశాడు వ్యాకరణ  అలంకార శాస్త్ర నిధి .చిలక సరసు అవతలి తీరపు ప్రసిద్ధ పండిత శిష్యరికం చేసి ఎన్నో శాస్త్రాలలో పట్టు సాధించాడు ,వేదం న్యాయం నేర్చి మైసూర్ వెళ్లి వేదాంతం అధ్యయనం చేసి తత్వవాది అయి అనేక పండిత ప్రకాండులను వాదం లో ఓడించాడు .పూరి కి తిరిగి వచ్చి , తత్వ వాద మఠ0 లో చేరాడు .రసికానంద గోస్వామి శిష్యుడు రాధా దామోదర్ చేత  దీక్ష పొంది ‘’సత్ సందర్భం ‘’అధ్యయనం చేసి  సన్యాసం దీక్ష తీసుకొని ‘’ఏకాంతి దాస్ ‘’గా ప్రసిద్ధి పొందాడు .’’గోవింద భాష్యం  ‘’రాసి బలదేవ్ విద్యా భూషణ్ ప్రఖ్యాతి చెందాడు .

292-కళానిర్ణయ ,శ్రద్ధానిర్ణయ ధర్మ శాస్త్ర కర్త -రఘునాధ దాస్ ( 1750

18 వ శతాబ్ది ఒరిస్సా కవి రఘునాధ దాస్ వాసుదేవ దాసు కుమారుడు శ్రీనివాసుని మనవడు .సంస్కృత ధర్మ శాస్త్ర గ్రంధాలైన కళా నిర్ణయ ,శ్రద్ధా నిర్ణయ గ్రంధాలు రచించాడు.తత్వ శాస్త్రంగా ‘’న్యాయ రత్నావళి ‘’రాశాడు .తన మనవళ్లు నారాయణ ,సదాశివ ల  కోసం ‘’అమర కోశం ‘’కు టీకా రాశాడు .ఇవికాక వ్యాకరణం పై వర్ధమాన ప్రకాశం అనే టీకా ను వర్ధమాన మిశ్ర వ్యాకరణమైన వర్ధమాన ప్రకాశం వ్యాకరణానికి రాస్శాడు తారక  నిర్ణయం ఇతని మరొక గ్రంధం .దుశ్శకునాలపై ‘’ఉత్పాత తరంగిణి ‘’రాశాడు ఇతని సాహిత్య  భూషణం విశ్వనాధ కవిరాజు సాహిత్య దర్పణానికి పూర్తిగా అనుకరణ

 శాస్త్రాలలోనే కాక సాహిత్యం లో కూడా రఘునాథుడు గొప్ప కృషి చేసి మెప్పు పొందాడు .ఇతని ‘’వనదుర్గ పూజ ,కాటన త్రావిస్టారాక్షేపం ,ఛందస్సుపై ‘’భుట్టావళి  ‘’,ఆయుర్వేదం పై ‘’వైద్య కల్ప ద్రుమ0 లకు కూడా కర్త .ఇవికాక ఇంకా వ్రాత ప్రతులుగా ఉన్న ఈకవి రచనలు -నిగ్గు ధాత ప్రకాశనం ,సోనీయ దశకారం  ‘’, ‘’విలాప కుసుమాంజలి ‘’సంస్కృత మంజరి వంటివి ఎన్నో ఉన్నాయి .ఇవి మాత్రమే ననుకొంటే పొరబడ్డట్టే  నీలో దయ టీకా ,రఘు వంశ టీకా ,శిశుపాల వద్ద టీకా భట్టికావ్య టీకా ,వంటి అనేక టీకాలు రాసిన అత్యంత సమర్ధుడైన కవి .ఇవన్నీ చూస్తే రఘునాధ దాస్ కావ్య నాటక అలంకార శాస్త్ర వ్యాకరణ నిఘంటు ,ఛ0దస్  దర్శన ,ఆయుర్వేదాది  విద్యా గరిష్ఠుడు అనిపిస్తుంది .ఒక రకంగా’’ ఒరిస్సా మల్లినాథ సూరి ‘’రఘునాధ దాస్ .ఇవన్నీ 18 వ శతాబ్ది పూర్వార్ధం లోనే రచించాడు .

293-అబ్ద దూత కర్త -కృష్ణ శ్రీ చందన (1760

 ఒరిస్సా కవులలో దూత కావ్యాలు ప్రారంభించి రాసిన తొలికవి కృష్ణ శ్రీ చందన 18 వ శతాబ్ద తొలికాలపు కవి .కాళిదాసుని మేఘ దూతానికి సమానంగా ఒరిస్సాలో సంస్కృతం లో ఈకవి ‘’అబ్ద దూతం ‘’రాశాడు .ఇది 36 ఫోలియోలలో 149 శ్లోకాల కావ్యం .కధ శ్రీరాముడు దండకారణ్యం నుండి లంక లోని సీతకు మేఘం ద్వారా సందేశం పంపటం .రాముడు సీతా విరహం తో సహజజ్ఞానం కోల్పోయి  మాల్యవంత పర్వతం  పై సంచరిస్తున్న మేఘానికి బ్రతిమాలి తన సందేశాన్ని అర్ధాంగి సీతకు తెలియజేయమని ప్రార్ధిస్తాడు . మందా క్రాంత శ్లోకాలలో కావ్యం రామ ణీ యకంగా ఉంటుంది .దీనికి ‘’మనోరమ ‘’అనే వ్యాఖ్యానాన్ని కవి ప్రభువైన భీమ ధర్మ దేవ ప్రభువు రాశాడు

294-విద్యా హృదయ నందన కావ్య కర్త -ప్రహరాజ మహా పాత్ర (18 శతాబ్ది మధ్యభాగం )

యోగి ప్రహారాజ్ మహా పాత్ర అని పిలువబడే ఈ కవి సంగీత వైద్య కళా జ్యోతిష శాస్త్రాలలో అపార జ్ఞాన సమున్నతుడు .ఇతనిరచన  ‘’విద్యా హృదయ నందన ‘’కావ్యం .దీనివలన రాజా విక్రమ దేవుని రాజధాని ఒరిస్సాలోని కోరాపుట్ జిల్లాలోని నందపూర్ అని తెలుస్తోంది .ఇతనిది మరోకటి స్మృతికావ్యమైన ‘’ సంక్షిప్త స్మ్రుతి దర్పణం ‘’.ఈకవి 18 వశతాబ్ది మధ్యకాలం వాడు . ఈకవి వంశం అంతా తరతరాలుగా ఒరిస్సా ప్రభువుల ఆస్థాన  విద్వావంశులే  కవులే .

295-త్రికాండ శేష నిఘంటుకర్త -పురుషోత్తమ దేవ

త్రికాండ శేష హారావాలి ఏకాక్షర కోశ  ద్విరూప కోశ అనే నాలుగు నిఘంటువల కర్త పురుషోత్తమ దేవుడు .మహా సంస్కృత పండితుడుకనుకనే ఇన్ని కోశాలకు కర్త కాగలిగాడు .వీటిలో అతను ఉపయోగించిన పదజాలాన్ని చూస్తే ఒరిస్సా సముద్ర తీరదక్షిణ ప్రాంత కవి అనిపిస్తాడు .మహేంద్ర పర్వత సమీపం లో రుషికుల్య లోయలో వైతరణి ప్రాంతపు కవి

296-దుర్గా యజ్ఞ దీపిక కర్త -జగన్నాధ ఆచార్య (17 వ శతాబ్దం )

17 వశతాబ్దం లో ఒరిస్సాలో తంత్ర ,శాక్తే యా లు మిగిలిన రాష్ట్రాలలో లాగానే వ్యాప్తి చెంది వాటి గ్రంథ  రచన కూడా సాగింది . జగన్నాధ ఆచార్య ‘’దుర్గా యజ్ఞ దీపిక’’సంస్కృతం లో రాశాడు .యితడు గొప్ప తంత్ర శాస్త్ర వేత్త . దీనికి  1695 రాజు గజపతి దివ్య సింగ్ దేవునికాలం లో రంగుని మహాపాత్ర కాపీ రాశాడు .ఈ వ్రాతప్రతివలన ఈకవికాలం 17 వ శతాబ్దంగా భావించారు

297-తంత్ర కళాసుధ కర్త -రామ చంద్ర ఉద్గాత (18 శతాబ్ది

18 శతాబ్దికవి రామ్ చంద్ర ఉద్గాత  ‘’తంత్ర కళాసుధ ‘’రాశాడు 8 ఫోలియోల గ్రంధం .ఒరియా అక్షరాలలో సంస్కృతంలో రాయబడింది .మంగళాచరణ శ్లోకాలలో కవి ఏకామ్ర లింగ రాజ.శివ స్తుతి చేశాడు .ఇందులో ‘’రుద్ర యమా  కాళికా స్తుతి ,కూళ చూడామణి ,కుమారి తంత్ర ,కాళికాపురాణ ,తంత్ర చూడామణి ఉత్తర తంత్ర ,దక్షిణామూర్తి సంహిత మొదలైన తాత్రిక గ్రంధాలను పేర్కొన్నాడు .దీని నకలు 18-10-1779 నవమి సోమవారం నాడు తీయ బడింది

298-ధర్మ శాస్త్ర గ్రంథ కర్త -శంభుకార వాజపేయి (1260-1330 )

ఒరిస్సాలో 12 ,13 శతాబ్దాలలో గంగ రాజులకాలం లో  స్మృతికావ్యాలు బాగా వచ్చాయి .ఇక్కడే కాదు దేశమంతా గాంగేయరాజ్యకాలం లో శాస్త్ర గ్రంధాలు విరబూశాయి .ఒరిస్సాను  1279-1303 కాలం లో పాలించిన గాంగేయరాజు రెండవ నరసింహ దేవా శంభుకార వాజ్ పేయి కవి సమకాలికుడు .రాజు నుంచి ఏ రకమైన పారితోషికాన్ని ఆశించని కవి వాజ్ పేయి .అయితే అమర మైన శాస్త్ర రచనతో చిరస్ధాయి కీర్తి పొందాడు .శ్రద్ధా పద్ధతిలాగా సంస్కృత ధర్మ శాస్త్రం రాశాడు .ఇదికాక విశ్వ పధ్ధతి శంభుకార పధ్ధతి ,శ్రోతద్గ్జ్ఞాన పధ్ధతి ,వివాహపద్ధతి ,అగ్ని హోత్ర పధ్ధతి ,దశ పురాణం శేష్టి ,దుర్వాల కర్మ పధ్ధతి ,స్మార్త రత్నావళి కూడా ఈయన రచనలే .ప్రత్యేక పరిస్థితులలో యోగధ్యానం తో 70 వ ఏట 1330 లో స్వచ్చందంగా శరీర త్యాగం చేశాడు .

299-విద్యాచారపధ్ధతి ధర్మ శాస్త్ర కర్త -విద్యాకార వాజ్ పేయి (1330

 శంభుకార వాజ్ పేయి కుమారుడు విద్యాకార వాజ్ పేయి తండ్రిని మించిన శాస్త్ర జ్ఞాన  సంపన్నుడు .నిత్యాచార పధ్ధతి అనే శాస్త్ర గ్రంధం రాశాడు తరువాత ఇదే ‘’విద్యాచారపధ్ధతి ‘’గా బహుళ ప్రచారం పొందింది .ఒరిస్సా ధర్మ శాస్త్రాలలో ఇది ఎవరెస్టు శిఖరాయమానం . 1360 కవి విశ్వర  భట్టు  తన ‘’మదన పారిజాతం ‘’లో దీనిని అపూర్వంగా శ్లాఘించాడు

300-సిద్ధాంత  దర్పణం కర్త -మహా మహోపాధ్యాయ సమంత చంద్ర శేఖర్(18 శతాబ్దం )

ఖగోళ శాస్త్రాన్ని అవపోశనపట్టిన మహా మహోపాధ్యాయ సమంత చంద్ర శేఖర’’సిద్ధాంత దర్పణం ‘’అనే గొప్ప ఖగోళ శాస్త్రమ్ రాశాడు .పూరీ జగన్నాధస్వామి మహా భక్తుడైన ఈకవి స్వామిపై ఎన్నో శ్లోకాలు భక్తి పురస్సరంగా రాశాడు .ఇవికాక దర్పణం సార దర్పణం దీపికా కూడా రాశాడు .దర్పణం సారం లో గ్రహాల గమనం పర్వతాల ఎత్తు కొలిచేవిధానం ,అమావాశ్య ,సంక్రాంతి తిధులను గణించే విధానం ఉన్నాయి .

 ఒరిస్సా రధోత్సవం గురించి ఆలయ చరిత్ర గురించి తెలియ జేసే గ్రంధం ‘’జగన్నాధ స్థల వృత్తాన్తమ్ ‘’, శిల్ప శాస్త్రం ‘’శిల్ప ప్రకాశం ‘’శిల్ప విద్య కామబంధం ,విశ్వనాధ మహా పాత్రుని ‘’కంచి విజయ మహా కావ్యం ‘’(-ఇందులో పురుషోత్తమ దేవ మహారాజు కంచి రాణిని వివాహమాడటం )గ్రంధాలున్నాయి ..

  ఆధునిక కాలం లోకూడా ఒరిస్సాకవులు పండిట్ ప్రబోధ కుమార్ మిశ్ర ,పండిట్ సుదర్శనచర్య ,పండిట్ చంద్ర శేఖర సారంగి ,డా ప్రఫుల్లకుమార్ మిశ్ర ,డా హరేకృష్ణ శత పధి ,పండిట్ గోపాల కృష్ణ దాస్ వంటి వారెందరో సంస్కృతంలో అద్భుత రచనలు చేస్తూ ప్రసిద్ధి చెందారు .

  సశేషం

 శ్రీ పూరీ జగన్నాధ రధోత్సవ శుభా కాంక్షలతో

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-6-17- కాంప్-షార్లెట్-అమెరికా


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణ -3 281-వసంతోత్సవం మహా కావ్య కర్త -హాలాధర మిశ్ర (1623-1647)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

 281-వసంతోత్సవం మహా కావ్య కర్త -హాలాధర మిశ్ర (1623-1647)

ఒరిస్సా ఖుర్దా సంస్థాన రాజు గజపతి నరసింహ దేవకాలం లో హలధర మిశ్ర  గొప్ప సంస్కృత కవి గా గుర్తింపబడ్డాడు ఈయన ‘’వసంతోత్సవ మహాకావ్యం ‘’’’సంగీత కల్పలత ‘’గ్రంధాలు రాశాడు .వసంతోత్సవకావ్యం 22 కాండాలతో  వైశాఖ శుద్ధ విదియ నాడు రాజు నరసింహ దేవప్రారంభించిన పూరీ జగన్నాధ రధోత్సవ వర్ణన ఉన్నకావ్యం . కావ్య ప్రారంభం లో గజపతి వంశ సంస్థాపక రాజు గజపతి రామ చంద్ర దేవుని నుంచి ప్రస్తుత రాజు నరసింహ దేవ వరకు వంశ చరిత్ర చెప్పాడూకవి .ఇదికాక ‘’హలధర కారిక ‘’వ్యాకరణ గ్రంధం రాశాడు ,సద్బ్రాహ్మణ వంశం లో శంభుకార మిశ్రాకు కొడుకు , కృష్ణదాసు కవితో పోటీగా సంగీత కల్ప లత  సంగీత గ్రంధం కూడా రాశాడు .దీనిలో 17 స్తభకాలున్నాయి ,ఈయన రాసిన మరొక గ్రంధం ‘’హలధర ప్రకాశం ‘’లో వాననగర హరిచందన ,,హీనంగ భీమా,మదుపుర నరేంద్ర , అనంగ భ్రమర్దర్ ,గజపతి ముకుంద ,గజపతి రామ చంద్ర దేవ్ గజపతి ప్రతాపరుద్ర దేవ,మేనకాదీ  కానల పఠమహాదీ అనే  కొందరు కొత్తకవులను పేర్కొన్నాడు .

282-హరినాయక రత్నమాల కర్త -హరినాయక

హరినాయక రత్నమాల ,విషన్  ప్రకాశ ప్రబంధ కర్త హరినాయక ఒరిస్సా సంస్కృతకవులలో మేలైనవాడు .గజపతి నారాయణ దేవుని సంగీత నారాయణ లో 17 సార్లు ఈ కవిని ఉటంకించాడు కనుక హరినాయక ఆ నాటి ఒరిస్సా ప్రముఖ సంగీత కర్తలలో ఒకడని  భావించాలి .

283-సంగీత నారాయణ కర్త -గజపతి నారాయణ దేవ(1650)

17 వ శతాబ్ది ఒరిస్సా నేలిన పార్ల క్షేముండి రాజ వంశానికి చెందిన ప్రఖ్యాత మహారాజు గజపతి నారాయణ దేవ చిరస్మరణీయమైన సంగీత గ్రంధం ‘’సంగీత నారాయణ ‘’రచించాడు దీనికి ఒరిస్సాలోని కాక ఆంద్ర ,బెంగాల్ కర్నాటకాది రాష్ట్రాలలో కూడా బాగా ప్రాచుర్యం ఉంది .ఈ రాజు ‘’అలంకార చంద్రిక ‘’కూడా రాశాడు  .సంగీత నారాయణ లో భారతీయ సంగీత నాటక పిత ప్రసిద్ధ ఆలంకారికులైన భరత ముని ని ప్రస్తుతించి మిగిలిన అలంకారికులనూ మెచ్చుకున్నాడు .ఇతని తండ్రి పద్మనాభ దేవ.

284-యానక భాగవత మహాకావ్య కర్త -కవితారత్న పురుషోత్తమ మిశ్రా (1606-1680 )

నారాయణ గజపతి గురువు కవితారత్న పురుషోత్తమ మిశ్రా శాండిల్య గోత్రీకుడు ‘’యానక భాగవత మహా కావ్యం రచించాడు . నీలాద్రి శతకం ,సుబంత, ప్రదీపిక,అనర్ఘ రాఘవ నాటక టీకా  ,రామచంద్ర ప్రబంధం ,తాళ శనిగ్రహం వంటి రచనలెన్నో చేశాడు . 1606 జన్మించి 1680 లో చనిపోయాడు .

 285-మనోహారిణి టీక  కర్త – కవిరత్న నారాయణ మిశ్ర

మహా మేధావి .కావ్యనాటక అలంకార సంగీత నిధి కవితారత్ననారాయణ మిశ్ర  కవితారత్న పురుషోత్తమ మిశ్ర కుమారుడే .హరీశ దూతకు మనోహారిణి టీకారాశాడు .ఇదే ఆగ్రంధానికి మొట్టమొదటి టీకా .దీనికి ఒరిస్సా  బెంగాల్ లలో  మంచి గిరాకీ ఉంది .సంగీత నారాయణ కర్త నారాయణ మిశ్ర అని ,కానీ రాజు గజపతి నారాయణ దేవుని పేరు పెట్టాడని లోకం లో ప్రచారం ఉంది

286-గంగ వంశాను చరిత కర్త -వాసుదేవ రధ్ సోమజతి (1761-1770

వాసుదేవ రధ్ సోమజతి గంగ వంశాను చరితం కావ్యాన్ని 1771-1770 మధ్య రాశాడు .దీనికి చారిత్రిక ,సాహిత్య ప్రశస్తి లభించింది .ఇది కళింగ గంగుల రాజుల చరిత్ర

287 -లీలా కావ్యాల విజృంభణ (17 వ శతాబ్దం )

17 వ శతాబ్దం లో ఒరిస్సాలో లీలాకావ్యాలు మూడు పూలు ఆరుకాయలు లాగా వర్ధిల్లాయి .అన్నీ మృదుమధుర రసబంధురాలే . దాదాపు అన్నీ రాధా కృష్ణ లీలా విలాసాలే .అగ్నిచ్చిద పండితుడు శ్రీకృష్ణ లీలామృతం ,నిత్యానంద ముకుంద విలాస ,రఘోత్తమ తీర్ధ ,హరే కృష్ణ కవిరాజ్ రాధా విలాసం రాశారు .కౌండిన్య గోత్రీకుడైన నిత్యానందుడు శివ పార్వతి లీలావిలాసం కూడా రాశాడు .నవ దుర్గ రాజ్య పాలకుడు గదాధర మాంధాత ప్రాపు ఉన్నకవి .ఈ రాజు లాడుకేశ్వర శివ భక్తుడు .ఇతని శ్రీ కృష్ణ లీలామృతం గీత గోవిందానికి అనుకరణ 8 సర్గలున్నకావ్యం .ఖండవల్లి రాజు వనమాలి జగదేవ్ ఆస్థానం లో ఉండగా రాశాడు  .గదాధర ,వనమాలీ రాజులిద్దరూ 18 శతాబ్ది ప్రారంభకాలం వారు .

288- మణి మాల నాటక కర్త – ఆదికవి  (1713

 .గొప్ప నాటకకర్తగా వనమాలి  కి పేరుంది . ‘’హరి భక్తి సుధాకర రూపకం ‘’కర్త ,దీన బంధు మిశ్ర ,, రసగోష్ఠి రూపకకర్త  అనాదికవి  ఒరిస్సాలోని ఖండవల్లి రాజు వనమాలి  ఆస్థాన కవులే .వనమాలి రాసిన మణిమాల నాటకం లో ని 51 వ అంకం లో బోయి వంశరాజు ఖుర్దా  పాలకుడు గజపతి వీరకేసరి దేవగురించి ఉంది .అనాదికవి 18 శతాబ్ది పూర్వార్ధం వాడు .యితడు భారద్వాజ గోత్రీకుడని తండ్రి ముదిత మాధవ గీతికావ్యకర్త శతంజీవ అని మణిమాల నాటక ఉపోద్ఘాతం లో ఉంది .

289-సమృద్ధ మాధవ నాటక కర్త -కవి భూషణ గోవిందసమంతరాయ్ (1750

ఒరిస్సాలోని బంకిరాష్ట్ర ఖుర్దా రాజ్య పాలకుడు వీర కిషోర్ దేవ్ ఆస్థానకవి కవిభూషణ గోవిందాసమంతరాయ్ 18 శతాబ్దం వాడు .గౌడీయ వైష్ణవ మత అనుయాయి .’’సమృద్ధ మాధవ నాటకం ‘’గీత గోవిందం మాదిరిగా ,రూప గోస్వామి నాటకం విదగ్ధా మాధవానికి అనుకరణగా రాశాడు .గొప్ప సంస్కృత  విద్వా0సు డైన  ఈకవి మరెన్నో రచనలు చేసి ఉంటాడు .కానీ సూరి సర్వస్వము వీర సర్వస్వము అనే మరి రెండుగ్రంధాలు మాత్రమే లభ్యమైనాయి

290-వ్రజ విలాస కర్త -కవి చంద్ర కమల లోచన ఖడ్గ రాయ్ (19 శతాబ్దం

వ్రజ విలాస కర్త -కవి చంద్ర కమల లోచన ఖడ్గ రాయ్ ,కవి భూషణ గోవింద సమంతరాయ్ మనవడు .సంగీత చింతామణి రాశాడు . గీత ముకుందం ను  గీత  గోవిందానికి అనుకరణగా రాశాడు .ఇవికాక వ్రజ యువ విలాస ,భగవత్ లీలా విలాసం రాశాడు .వ్రజ విలాసం 17 సర్గల కావ్యం .రాధా గోపిక కృష్ణుల లీలా విలాసమే ఇది .ఖుర్దా రోడ్  సంస్థానకవి  .నాగపూర్ రాజు భోంస్లే ఆశ్రితుడుకూడా .లీలా చింతామణి వ్రాతప్రతిని మహా మహోపాధ్యాయ సదాశివ మిశ్ర అనే ప్రముఖ సంస్కృత పండితుడు పూరీ లో గుర్తించి వెలికి తీసి ముద్రించాడు . 1500 శ్లోకాల గ్రంధం . భాగవతానికి  వ్యాఖ్యానమే .కవి భారద్వాజ గోత్రీకుడైన ఒరియా బ్రాహ్మణుడు .

  సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-6-17-కాంప్-షార్లెట్ -అమెరికా


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 274-ఛందో మంజరి కర్త -గంగ దాస (1500 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

274-ఛందో మంజరి కర్త -గంగ దాస (1500 )

ఒరిస్సా కవి గంగదాస తండ్రి సంతస దాస . ఈ కవి ఛందో మంజరి రాశాడు తనకు ముందున్న చింతామణి మిశ్రా రచన ‘’వాజ్మయ వివేక’’ను పలుచోట్ల ఉదహరించారు .అచ్యుత శతకం  కంసారి  శతకం ,దినేశ శతకాలు కూడా రాశాడు .

275-రామానంద సంగీత నాటక కర్త -రాయ రామ చంద్ర పట్నాయక్ (1509)

రామానంద సంగీత నాటకం అనే శ్రీ జగన్నాధ వల్లభ వాటకం రాసిన ఒరిస్సా కవి రాయ రామ చంద్ర పట్నాయక్ 1509 కాలం కవి .వైష్ణవ తత్వ నిధి అయిన భావానంద రాయి కుమారుడు .చైతన్య మహా ప్రభువు ఒరిస్సాకు రాక మునుపే ఇక్కడ రాధా కృష్ణ మధుర భక్తిని వ్యాపింప జేసినవాడు . 5అంకాలున్న ఇతని నాటకం 21 గీతాలు ,68 శ్లోకాలతో వివిధ రాగాలతో వైవిధ్య మైన ఛందస్సులతో రాయబడింది .ఇందులో జయదేవుని గీత గోవింద శైలి కనిపిస్తుంది .ఈ కవి ‘’టీకా పంచకం ‘’రాశాడని అంటారుకాని వ్రాతప్రతి అలభ్యం .

276-దుర్గోత్సవ చంద్రిక కర్త -భారతీ భూషణ వర్ధన మహాపాత్ర (1568-1600 )

 కవి డిండిమ జీవ దేవ ఆచార్య కుమారుడు ,జయదేవ ఆచార్య చిన్నతమ్ముడు భారతీ భూషణ మహా పాత్ర మహా సంస్కృత  విద్వా0శుడు  .దుర్గోత్సవ చంద్రిక అనే శరత్కాలం లో 16 రోజులుఒరిస్సాలో జరిగే శ్రీ దుర్గా మాత ఉత్సవ వైభవాన్ని గురించిరాశాడు .ఇది గోదావరి మిశ్రా ప్రవచించి ఒరిస్సా అంతా ప్రచారం చేసి అనుసరిస్తున్న ‘’శరత్ శారదార్చన పధ్ధతి’’ . కానీ దీని కర్త్రుత్వం పోషక రాజైన మొదటి రామ చంద్రుని దని ప్రచారం లో ఉంది .

277-చైతన్య చంద్రోదయ నాటక కర్త -పరమానంద దాస కవికర్ణ పూర

బెంగాల్ కు చెందిన శివానంద సేన కుమారుడు పరమానంద దాస ఒరిస్సా లో స్థిరపడ్డాడు .గజపతి ప్రతాప రుద్ర దేవ ఆస్థాన కవి .చైతన్య చంద్రోదయ నాటకం  అనే 8 అంకాల నాటకం రాశాడు .దీనిని పూరీ జగన్నాధ స్వామి రధోత్సవాలలో ప్రదర్శించేవారు .

278-గౌర కృష్ణోదయ మహాకావ్య కర్త-మహా మహోపాధ్యాయ గోవింద

మహా మహోపాధ్యాయ గోవింద ను కవి శేఖర గోవిందఅంటారు .చైతన్య మహా ప్రభువు జీవిత చరిత్రను ఒరిస్సాలో ఆయన కార్యక్రమాలను తెలియజేసే  18 కాండాల ‘’గౌర కృష్ణోదయ మహాకావ్యం ‘’గా రాశాడు .ఇది చారిత్రిక కావ్యం .ఒరిస్సాలో ప్రచారం లో ఉన్న చారిత్రిక కావ్యాలైన భక్తి భాగవతం కోసలానందం ,గంగ వంశాను చరిత చంపు సరసన నిలిచిన కావ్యం ఇదికాక ప్రద్యుమ్న సంభవం అనే 19 కాండల కావ్య0  రాశాడు .ఇది బాగా ప్రసిద్ధిచెందింది .

278- వాజ్మయ వివేక కర్త -చింతామణి మిశ్ర (1574)

గోవింద విద్యాధర రాజు ఆస్థాన కవి గోవింద మిశ్ర వాజ్ పాయి మనవడు చింతామణి మిశ్ర .తలిదండ్రులు మృత్యుంజయ మిశ్ర ,శ్రీదేవి .నీలాచలం అని పిలువబడే పూరీ క్షేత్ర వాసి .తండ్రి కూడా గొప్పకవిగా సుప్రసిద్ధుడు . చింతామణి ‘’వాజ్మయ వివేక చంద్రిక ‘’అనే అలంకార ఛందో గ్రంధాన్ని 6 అధ్యాయాలలో 3200 శ్లోకాలలో 1574 లో రాశాడు .ఇతడు శంబరారి చరిత్ర ,త్రిశిరో వధ వ్యాయోగం ,కాదంబరి సారం ,సభా ప్రమోద ,పక్షావలి ,కంసవధ ,కృత్య పుష్పావళి ,సమితి వర్ణన కావ్యాలు రాశాడు .కానీ వివేకం వ్యాయోగం తప్ప మిగిలినవి అలభ్యాలు .

279- సింహ వాజపేయి వంశావళి కర్త -నరసింగ మిశ్ర వాజపేయి -(1520-1580 AD)

మురారి   మిశ్రా కొడుకు ధరాధర మిశ్ర మనవడు నరసింగ మిశ్ర ఒరిస్సాలో గొప్ప స్మ్రుతి శాస్త్ర కర్త .యితడు రాసిన ‘’సింహ వాజపేయి వంశావళి ‘’ని చూస్తే అతని మేధో వికాసం తెలుస్తుంది .సిద్ధేశ్వరీమాత అనుగ్రహం తో షట్  శాస్త్ర పండితుడయ్యాడు .బెంగాల్ తర్క పులి’’ గండ ‘’ను వాదం లో ఓడించిన ‘’గ0డర గండడు ‘’. 1565-1568 అక్బర్ ఆస్థానాన్ని సంగీతకర్త కృష్ణదాసు మహాపాత్ర ,ముకున్దదేవుని రాప్రతినిధి లతోకలిసి సందర్శించాడు. నరసింగ 18 ప్రదీపాలు రాశాడు .ఇందులో మొదటిది ‘’నిత్యాచారప్రదీప ‘’ను బెంగాల్ ఏసియాటిక్ సొసైటీ 1907 లో ,రెండవదానిని 1908 లో ప్రచురించింది .ఈకవి ఇతర రచనలు -సమయ వర్ష ,భక్తి ,ప్రాయశ్చిత్త ,శ్రద్ధ ప్రతిష్ట , శంకర  భాష్య ,ఛయాన ,వ్యవస్థ ప్రదీప .నిత్యాచారప్రదీపలో 16 వ శతాబ్దపు చారిత్రిక రాజకీయ మత విషయాల గురించి రాశాడు .

280-ఆయుర్వేద సార సంగ్రహ కర్త -విశ్వనాధ సేన (1530

గజపతి ముకుంద దేవ రాజు ఆస్థాన ప్రముఖ ఆయుర్వేద వైద్య శిఖామణి విశ్వనాధ సేనుడు ‘’ఆయుర్వేద సార సంగ్రహం ‘’గ్రంధాన్ని రాశాడు .దీనితోపాటు విశ్వనాధ చికిత్స ,పత్స్య పత్స్య వినిశ్చియ ‘’గ్రంధాలు ఒరిస్సా అంతా బహుళ ప్రచారం లో ఉన్నాయి .

 1550 లో విష్ణుశర్మ 8 అధ్యాయాల ‘’స్మ్రుతి సరోజ కలిక ‘’రాశాడు . 1525 లో బౌద్ రాజు నారాయణ భంజ దేవ్ ఆరుకాండల ‘’గీత కావ్య రుక్మిణీ పరిణయం ‘’ను జయదేవుని గీత గోవింద శైలిలో రచించాడు .ఇందులో 12 గీతాలు 40 శ్లోకాలున్నాయి .

 సశేషం

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-6-17-కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వా ణం -3 265-భాస్వతి కర్త -శతానంద (1099

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

265-భాస్వతి కర్త -శతానంద (1099

భాస్వతి అనే ఖగోళ శాస్త్ర గ్రంధాన్ని సంస్కృతం లో రాసిన ఒరిస్సా రచయిత  శతానంద 1099 కాలం వాడు ,ఆయన ఖగోళ ళశాస్త్ర నిధిగా గుర్తింపుపొందారు .భాస్వతి పై అనేక వ్యాఖ్యానాలు రాయబడ్డాయి అంటే అతని గొప్పతనం ఏమిటో తెలుస్తుంది .గ్రంధం చివరి శ్లోకం లో తన గురించి చెప్పుకొన్నాడు .తాను  పూరి వాసినని ,తండ్రి శంకర ,తల్లి సరస్వతి అని చెప్పాడు .తన రచన 1099 లో పూర్తయిందన్నాడు .గ్రంధం మొదటి శ్లోకం లో తాను  మురారి అంటే విష్ణు పదభక్తుడనని ,ఈ గ్రంధం విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటుందని రాస్తున్నానని తెల్పాడు . శతానంద భాస్వతి తోపాటు శతానంద రత్నమాల ,శతానంద శని గ్రహ కూడా రాశాడు .శనిగ్రహ అనేది స్మృతికావ్యం

266-భాగవత భావార్థ దీపిక కర్త -శ్రీధర స్వామి (1400 )

ఒరిస్సా లోని పూరీ జగన్నాధ క్షేత్ర గోవర్ధన మఠ మహంతు శ్రీ శ్రీధర స్వామి క్రీశ 1400 కాలంవారు భాగవత పురాణానికి ‘’భాగవత భావార్థ దీపిక’’అనే సంస్కృత వ్యాఖ్యానం రాశారు . అది దేశమంతా బహుళ ప్రచారం లో ఉంది .ఇందులో అద్వైతాన్ని భాగవత భావోద్రేకాలు అనుసంధానం చేస్తూ రాశారు .వీరు మూడవ లేక నాల్గవ నరసింహ దేవరాజు కాలం లో ఉ0డిఉంటారు(1307-1414 )

267-అభినవ గీత గోవింద కర్తలు -కవి చంద్ర రాయి దివాకర మిశ్ర ముక్తాదేవి దంపతులు (1409

ఒరిస్సాకు చెందిన కవి చంద్రరాయ్ అతని అర్ధాంగి ముక్తాబాయి సంయుక్తం గా ‘’అభినవ గీత గోవిందం ‘’రచించారు .దివాకరుని తండ్రి వైదీశ్వర . ఈ కావ్యాన్ని గజపతి పురుషోత్తముడికి అంకితమిచ్చాడని అంటారుకాని నిజం కాదన్నారు ఇతని మరోరచన ‘’భరతమాత మహాకావ్యం ‘’.ఇందులో ఉన్నదాన్ని బట్టి ఈకవి కృష్ణదేవరాయల(1409-1530 ) ఆస్థానకవి అని తండ్రి ,సోదరులు కూడా గొప్పకవులని తెలుస్తోంది ..

268-భక్తి భాగవత మహాకావ్య కర్త -కవి డిండిమ జీవ దేవాచార్య  (1478-1550 )

 1478 లో ఒరిస్సాలో జన్మించి 1550 లో మరణించిన కవి డిండిమ దేవాచార్య ‘’భక్తి భాగవత మహాకావ్యం ‘’రాశాడు .ఇతనిది వత్స గోత్రం. ఉపోద్ఘాతం లో ఒరిస్సా చక్రవర్తుల విషయాలను  సంక్షిప్తంగా చోడ  గంగ దేవ నుంచి పురుషోత్తమ దేవ వరకు  రాశాడు .ఇతని భక్తి వైవన్ కావ్యం ప్రబోధ చంద్రోదయం లాంటి అన్యార్థ రచన .ఉషావతి నాటకం కూడా రాశాడు .యుధిష్టురుని యాగాశ్వం ను కట్టేసి  వెంట వెళ్లిన అర్జునునికి తో యుద్ధం చేసి శ్రీకృష్ణ ,నారదుల సమక్షం లో పెళ్లి చేసుకొన్నఉషావతి కథ  .జీవ దేవాచార్య రాజగురు త్రిలోచనాచార్య రత్నావళి లకుమారుడు .

ఈ ఇద్దరుకవులు గజపతి పురుషోత్తమ గజపతి ప్రతాప రుద్రుల ఆస్థాన కవులు .ఈకాలం లో ఒరిస్సాలో సంస్కృతం విరగ  బూసింది  .

 జీవ దేవుని కుమారుడు జయదేవాచార్య పీయూష లహరి వైష్ణవ మతము అనే రెండు సంస్కృత నాటకాలు మధురంగా రాశాడు .ఈకాలం లోనే ధర్మ శాస్త్రాలపై రెండు అద్భుత గ్రంధాలు ‘’సరస్వతీ విలాసం ‘’ప్రతిపా అల0తం ‘’లను లాలా లక్ష్మీధర భట్టు ,రామకృష్ణ భట్టు రాశారు

269- జగన్నాధ వల్లభ నాటక కర్త -రాయ రామానంద

రాయ రామానంద గజపతి ప్రతాపరుద్ర దేవుని ఆస్థాన ఉన్నతాధికారి ఈయన  జగన్నాధ వల్లభ అనే 5 అంకాల నాటకాన్ని అద్భుతంగా రాశాడు ..ఈకవి కృష్ణ లీలల పై ‘గోవింద వల్లభ ‘’నాటకమూ రాశాడు

 రాయరామానంద  మేనకోడలు మాధవి దాసీ చైతన్యమహా ప్రభు శిష్యురాలు ‘’పురుషోత్తమ దేవ’’సంస్కృత నాటకం రాసింది .ప్రతాపరుద్రుని కుమార్తె తుక్కాదేవి శ్రీ కృష్ణ దేవరాయలు పెళ్లాడింది .ఈమె ఎన్నో శ్లోకాలు రాసినట్లు జగన్నాధ మిశ్రుని ‘’రస కల్ప ద్రుమమ్ ‘’లో కనిపిస్తుంది .

270-కో సలానంద మహా కావ్య కర్త -గంగాధర మిశ్ర (1620)

17 వశతాబ్ది పూర్వార్ధ కవి గంగాధర మిశ్ర కోసలానంద మహాకావ్యం రాశాడు ఇందులో 21 కాండలు ,1200 శ్లోకాలున్నాయి . బలంగీర్ సోనేపట్ ,సంబల్పూర్ పాలకులైన చౌహాన్ రాజుల సంక్షిప్త చరిత్ర ఈ కావ్యం

271-ప్రబోధ చంద్రిక కర్త -వైజాల దేవ రాజు (18 వ శతాబ్దం )

చౌహాన్ రాజు వైజాల దేవుడు ప్రబోధ చంద్రిక అనే వ్యాకరణ గ్రంధం రాశాడు .కావ్య విశేషాలనుబట్టి వైజాల దేవుడు విక్రమాదిత్య మహా రాజు  ,దేవేరి చంద్రావతిలకుమారుడు .ఇతనికొడుకు హీరాధరుడు .ఇతనికోసమే దీన్ని రాశాడు.

272-గీత ప్రకాశ సంగీత శాస్త్ర  కర్త -కృష్ణదాస బోధ జేన  మహాపాత్ర ( 1559

 ఒరిస్సా కవి కృష్ణదాస బోధజేన మహాపాత్ర సంగీతంశాస్త్రం లో లోతులు ముట్టినవాడు ఒరిస్సా సంగీత  విద్వాంసులకు  ఆయన ఎంతగానో పరిచయమున్నవాడు .తన సంగీత జ్ఞానాన్ని ‘’గీత ప్రకాశం ‘’లో నింపి గొప్ప సంగీత శాస్త్రాన్ని రచించాడు .యితడు గజపతి ముకుంద దేవుని ఆస్థాన కవి . గజపతి ఈకవిని అక్బర్ దర్బార్ కు సంధి ప్రయత్నం కోసం పంపాడు  .కవి మంచి స్నేహాన్ని కుదిర్చాడు .ఈకవి గురించి అక్బర్ ఆస్థానకవి అబుల్ ఫజల్ గొప్పగా పొగిడాడు ..మహా పాత్ర భారత దేశం లోని కవులలో సంగీతజ్ఞులలో సాటిలేనివాడు .అతని గీత ప్రకాశం లో అనేక రాగాల గురించి చాలా సోదాహరణంగా సంస్కృత కావ్యాలనుంచిసంస్కృత హిందీ ఒరియా భాషలలోని అనేక  సంగీత గ్రంధాల నుంచి  తానూ రాసిన వాటి నుంచి ఉదాహరించి వివరించాడు .అంటే ఆయన బహుభాషా పాండిత్యం తెలుస్తోంది ..

273- దశ గ్రీవ వధ మహాకావ్య కర్త -మార్కండేయ కవి చక్రవర్తి

మార్కండేయ కవి చక్రవర్తి ముకుంద దేవుని సమకాలికుడు .యితడు దశగ్రీవ వధ  మహాకావ్యం ,ప్రాకృత సర్వస్వము రాశాడు .వీనిలో తన రాజు ముకున్దదేవుని ఘనంగా పొగిడాడు .ప్రకృత సర్వస్వము ను సాకల్య ,భరత,కొహల వరరుచి మొదలైన వారి గ్రంధాలను పరిశీలించి రాశానని చెప్పాడు .ఈ గ్రంధం పూరీలోని వీర ప్రతాపపురిలో రాయబడిందని  తెలుస్తోంది .కవి కాశ్యపగోత్రికుడు తండ్రి మంగళ దేవుడని ఆనాటికవులలో మార్కండేయ కవి చక్రవర్తిగా గుర్తింపు పొందాడని ,రామాయణ కథనంతటిని దశగ్రీవ  వధ  మహాకావ్యం లో ని 20 సర్గలలో నిక్షిప్తం చేశాడని సరళ సుందరమైన రచన అని ,‘’విలాస వతి ‘’అనే శతకాన్ని కూడా రాశాడని తెలుస్తోంది  . సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-6-17-కాంప్-షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

D.J.ఎక్సెలెంట్ ,ఫన్టాస్టిక్ మైండ్ ,బ్లోయింగ్ 

D.J.ఎక్సెలెంట్ ,ఫన్టాస్టిక్ మైండ్ ,బ్లోయింగ్

మధ్యాహ్నం 2 గంటలాటకు డి.జె అనే దువ్వాడ జగన్నాధం సినిమా చూసాం అల్లు మాటల్లో చెప్పాలంటే ”ఎక్సెలెంట్ ఫన్టాస్టిక్ మైండ్ బ్లోయింగ్” . అర్జున్ నట విశ్వరూపానికి  నిదర్శనం . సంగీతం ట్యూన్స్  ,పాటలరచన గాత్రాలు  వెరీ కాచింగ్ మెలోడియస్ .దర్శకుడు ప్రతి విషయం లో అత్యంత జాగ్రత్త పడ్డాడు రావు రమేష్ తండ్రినటించిన  ”ఆ ఒక్కటి అడక్కు ”గెటప్ అంటే మట్ట లాగు, యాస తో తండ్రిని మించిన కొడుకనిపించాడు .. బ్రాహ్మణ భాష అర్జున్ అద్భుతంగా మాట్లాడాడు జూ ఎన్టీఆర్ ”అదుర్స్ ”లోలాగా . అతని ఎనర్జీ అంతా పిండేశాడు డైరెక్టర్ . గాయత్రీ మం త్రానికి కున్న ప్రాధాన్యత ,రుద్రాక్షను పవిత్రం గా కాపాడుకోవాల్సిన విషయం ,అగ్రి గోల్డ్ బాధితుల డబ్బు దోచుకున్నవారి నుండి కక్కించి వాళ్లకు అందజేయటం కథ ఒక ఫామిలీ ఎంటర్ టైన్ మెంట్ గా బ్రహ్మాండంగా ఉంది . బాహుబలికి 10 వేలరెట్లు బాగుండటమేకాక ఆ బడ్జెలో పది శాతం కూడా లేని బడ్జెట్ తో అంతటి ఎఫెక్ట్ తెప్పించాడు డైరీక్టర్ హరీష్ శంకర్ . దేవిశ్రీ సంగీతం ప్లస్ పాయింట్ .డై”లాగులు” బాగా అందంగా అర్ధవంతంగా కుట్టాడు రచయిత .  నటనలో ”అర్జున చక్ర” సాధించాడు ”అల్లు”.మంచి సినిమా చూసిన ఆనందం తో ఇంటికి వచ్చాము -దుర్గాప్రసాద్   -23-6-17- సాయంత్రం 5-30

Posted in సినిమా | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 261-అశ్వ శాస్త్ర కర్త -శైల హోత్రుడు (బీసీ 2350 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

క్రీ.పూ. 2350 కాలం వాడైన శైలహోత్రుడు ‘’శైల హోత్ర  సంహిత ‘’అనే అశ్వ శాస్త్రాన్ని రాశాడు .తండ్రి హయఘోషుడు పశు వైద్యానికి ఆద్యుడు.  ఉత్తరప్రదేశ్ లోని గొండా  బహ్రాచ్  సరిహద్దులలోఉన్న శ్రావస్తి నగర వాసి .భరద్వాజ ఆయుర్వేదం ప్రకారం శైల హోత్ర  అగ్ని వేశులు ఇద్దరు ఒకే గురువు శిష్యులు .ఆయుర్వేదం పై ‘’అగ్ని వేశ తంత్రం ‘’రాసిన మొదటివాడు అగ్నివేశుడు .తరవాతే చరకుడు రాశాడు .ఆతర్వాత శుశ్రుతుడు రాశారు .

 యుద్ధాలలో గుర్రాలు చాలా ఎక్కువగా తోడ్పడుతాయి కనుక మేలు జాతి గుర్రాలను పుట్టించి పోషించటం అవసరమైంది .దానికోసం శైలాహోత్రుడు ‘’అశ్వ శాస్త్రము ‘’రాశాడు అది ఆయన పేరుమీద ‘’శైల హోత్ర  సంహిత ‘’గా పిలువ బడుతోంది .ఇది 12 ,000 సంస్కృత శ్లోకాల గ్రంధం .ఇది పర్షియన్ ,అరేబిక్ ఇంగ్లిష్ మొదలైన భాషలలోకి అనువాదం పొంది అందరకు మార్గ దర్శకమైంది .ఇందులో అశ్వ ,గజ శరీర నిర్మాణం ,వాటి వైద్య శాస్త్రం శస్త్ర చికిత్స విధానం ,వాటికి వచ్చే రోగాలు వాటి నివారణ జబ్బులు రాకుండా కాపాడే విధానాలు అన్నీ సమగ్రంగా ఉన్నాయి .అనేక జాతుల గుర్రాలు వాటి శరీర నిర్మాణం ,వాటి వయసు తెలుసుకొనే విధానం ,ఉన్నాయి శైల హోత్రుడే మరొక రెండు గ్రంధాలు 1-అశ్వ లక్షణ శాస్త్రం 2-అశ్వ ప్రశంస రాశాడని అంటారు .అశ్వాలపై వెలువాడిన అనేక గ్రంధాలకు ముఖ్య ఆధారం  శైల హోత్ర  సంహిత .దీన్ని పెంచి లేక మార్చి రాయబడినవే . అయితే క్రీపూ 1800 లో ముని పల్కాప్య ‘’హస్తి ఆయుర్వేదం ‘’రాశాడు .ఇందులో 4 భాగాలు ,152 అధ్యాయాలున్నాయి .క్రీ.పూ 1000-900 కాల మహాభారత పాండవ సోదరులలో నకులుడు అశ్వ శాస్త్రం లో నిపుణుడని ‘’అశ్వ చికిత్స ‘’గ్రంధం రాశాడని ,అతని తమ్ముడు సహదేవుడు గొప్ప పశు పాలకుడని పశువైద్య0 లో దిట్ట అని అంటారు ‘. 262-రత్న శాస్త్ర కర్త -వరాహ మిహిరుడు (505-587 )

వేదకాలానికి పూర్వమే అంటే 5 వేల  ఏళ్ళక్రితమే మహర్షులు  అంతర్  దృష్టి తో ఆకాశ గ్రహాలకు ,మానవ శరీరానికి మధ్య ఉన్న సంబంధాన్ని కనిపెట్టారు .విశ్వం లోని గ్రహ ,నక్షత్రాలకు కొన్ని రకాల శక్తులున్నాయి .అందుకనే ‘’యత్ పిండే తత్ బ్రహ్మాండే ‘’అనే సామెత వచ్చింది .భూమిపైప్రతి  మనిషి జీవితాన్ని గ్రహ నక్షత్రాలు ప్రభావితం చేస్తాయి .నవగ్రహాలకు నవ రత్నాలకు సంబంధం ఉంది  . సూర్యుడు కెంపు చంద్రుడు ముత్యం .కుజుడు పగడం .బుధుడు పచ్చ . గురుడు నీలం .. శుక్రుడు వజ్రం .శని నీలం .రాహువు గోమేధికం .కేతువు కనక పుష్యరాగం .

  ఈ నవరత్నాలగురించి చెప్పే శాస్త్రమే రత్నశాస్త్రం ‘’జెమ్మాలజీ ‘’.రత్న శాస్త్రం సృష్టితో పాటు ఏర్పడిందే నని నమ్మకం .దీని గురించి ఒక ప్రత్యేక మంత్రం ఉంది -’’స శ0ఖ చక్రం స కిరీట కుండలం స పీత వస్త్రం సరసీ  రుణేక్షణం -సహ్రర్వ క్షస్థల కౌస్తుభాశ్రియమ్ నమామి విష్ణుం శిరసా చతుర్భుజం ‘’

 విష్ణు మూర్తి అనేక ఆయుధాలు ధరించినా అయన  మెడలో కౌస్తుభహారం ఉంటుంది .శివుడు పాములు పులి చర్మం పుర్రెలహారం  ధరించినా  జపమాలలో దేవతలు భక్తితో సమర్పించిన ‘’రుద్రమణి ‘’ధరిస్తాడు .మధ్యయుగ కాలం లో కూడా రత్న శాస్త్రం పై చాలామంది దృష్టిపెట్టారు ఆచార్య వరాహమిహిరుడు రచించిన ‘’బృహత్ సంహిత ‘’లో రత్న శాస్త్ర విషయాలు అనేకమున్నాయి .అందులో ఒక అధ్యాయాన్ని పూర్తిగా  రత్న విషయాలకు కేటాయించి ‘’రత్నా ధ్యాయం ‘’అని పేరుపెట్టాడు .అందుకే వరాహ మిహిరుడిని రత్న శాస్త్ర  వేత్తలలో అగ్రగణ్యునిగా భావిస్తారు .అగ్ని పురాణం లో కూడా రత్నశాస్త్ర విషయాలున్నాయి . జాతకుని జన్మ నక్షత్రాన్ని అనుసరించి ఏరకమైన రత్నాన్ని ఉంగరానికి ధరించాలో సంపూర్ణంగా అధ్యయనంచేసి చెప్పిన గ్రంథమిది

263-వాస్తు శాస్త్ర కర్తలు -తక్కుర పెరు ,రామచంద్ర భట్టారక ,నర్మద శంకర  వరాహ మిహిర (క్రీశ 6-10 శతాబ్దికాలం )

నిర్మాణ శాస్త్రాన్ని వాస్తు శాస్త్రం అంటారు .ఇది అనాదిగా ఉన్న శాస్త్రమే .వాస్తు విద్యలో భాగమే  వాస్తు శాస్త్రం .సంస్కృతం లో వాస్తు అంటే నివాసం ఉండే ఇల్లు .వాస్తు శాస్త్రం అంటే ఇంటినిర్మాణం అభివృద్ధి మొదలైనవి తెలిపేది .తక్కూర ఫెరు అనేఆయన మొదట ‘’వాస్తు శాస్త్రం ‘’రాసి ఆలయానిర్మాణాలు ఎలా చేయాలో సూచించాడు . 6వ శతాబ్దికి ఆలయ నిర్మాణం బాగా ఇండియాలో విస్తృతమైంది  .దీనికికారణం సంస్కృతం లో  వాస్తు గ్రంధాలు రావటమే . 10 వ శతాబ్దికి చెందిన ఒరిస్సా రచయితరామ చంద్ర భట్టారక కౌలాచార’’శిల్ప ప్రకాశం ;; సంస్కృతం లో రాశాడు .ఇందులో ఆలయనిర్మాణం లో ఉన్న రేఖీయ వివరణాలన్నీ ఉన్నాయి .మానవునిలో 16 భావోద్రేకాలకు సరి సమానమైన 16 స్త్రీ మూర్తుల నిర్మాణం ఎలా నిర్మించాలో తెలిపాడు . 32రకాల నాటక స్త్రీలనుశిల్ప ప్రకాశం లోని  16 స్త్రీలతో పోల్చి సౌరాష్ట్ర నిర్మాణం లో చెప్పారు.నర్మదశంకరుడు ‘’శిల్ప రత్నాకరం ‘’రాశాడు .రాజస్థాన్ లోని పురాతన గ్రంధాలను పరిశీలిస్తే సూత్ర ధర మందనుడు రాసిన ‘’ప్రకాశం ధర మండనం ‘’ అనే దేవాలయ ,పట్టణ  నిర్మాణ విషయాలున్న గ్రంధం లభించింది .దక్షిణ భారతం లోని ‘’మనసారా శిల్పం ,మాయమత గ్రంధాలు క్రీశ 5-7 శతాబ్దాల వాస్తు గ్రంధాలు .’’ఇషనాశివ గురు దేవ పధ్ధతి ‘’అనే మరొక సంస్కృత వాస్తు గ్రంధం 9 వ శతాబ్దానికి చెందింది . 6వ శతాబ్దపు వరాహమిహిరుని ‘’బృహత్ సంహిత ‘’లో పట్టణ  నిర్మాణ విషయాలు చెప్పాడు .ఈ వాస్తు శాస్త్రాలన్నీ దేవాలయ గృహ పట్టణ నిర్మాణ విషయాలనే కాక వాటి పవిత్రతను కాపాడే విషయాలనూ చెప్పాయి ‘

264-స్వర్ణ పుష్ప కర్త -మహామహోపాధ్యాయ పద్మశ్రీ వి వెంకటాచలం (1925-2002 )

శ్రీ విశ్వనాధం వెంకటాచలం తమిళనాడు తిరునల్వేలి జిల్లా కోయిలపట్టి లో జన్మించాడు .మద్రాస్ ,శ్రీపెరుంబుదూర్ సంస్కృతకాలేజీలలో చదివి గోల్డ్ మెడల్ సాధించాడు .సంస్కృత ఇంగ్లిష్  వ్యాసరచన డిబేటింగ్ మొదలైనవాటిలో ఎన్నో బహుమతులు పొందాడు .మద్రాస్ యూనివర్సిటీ నుండి సంస్కృత గణితాలలో డబుల్ డిగ్రీ సాధించి గొడవయ్యారి ప్రయిజ్ ను సంస్కృతం లో అందుకొన్నాడు .అద్వైత వేదాంతం తో శిరోమణి పరీక్షలో మొదటి రాంక్ పొందినందుకు పుట్టి మునుస్వామి చెట్టి బంగారు పతకం పొందాడు .నాగపూర్ వెళ్లి సంస్కృత అలంకార ,క్లాసికల్ సంస్కృతం లో ఏం ఏ డిగ్రీ అందుకొని దాజి హరి గోండ్వానాన్కర్ గోల్డ్ మెడల్ అందుకొన్నాడు .తరవాత ప్రొఫెసర్ అయి తమిళ హిందీ మలయాళ ఇంగ్లిష్ సంస్కృతాది బహుభాషలలో నిష్ణాతుడయ్యాడు .విక్రమ్ యూనివర్సిటీనుంచి జర్మన్ భాషలో సర్టిఫికెట్ పొందాడు.

  1945 లో మద్రాస్ వివేకానంద కాలేజీ సంస్కృత లెక్చరర్ గా చేరి  ఉజ్జయిని మాధవ్ కాలేజీ లో సంస్కృత ప్రొఫెసర్ అయ్యాడు .మధ్యప్రదేశ్ బర్వాణి  ప్రభుత్వ కాలేజీ ప్రిన్సిపాల్ అయి విక్రమ్ యూనివర్సిటీ ఉజ్జయిని సంస్కృత రీడర్ హెడ్ గా మారి ,1972 లో షాజాపూర్ యూనివర్సిటీ గవర్నమెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజీ ప్రిన్సిపాల్ అయ్యాడు .మళ్ళీ విక్రమ్ యుని వర్సిటీకి వెళ్లి సంస్కృతాచార్యుడై ,సింధియాఓరియెంటల్ ఇంస్టి ట్యూట్ డైరెక్టరయ్యాడు . 1986-89 లో వారణాసి సంపూర్ణానంద యుని వర్సిటీ వైస్ ఛాన్సెలర్ చేసి ,1992 లో ఢిల్లీలోని భోగీలాల్ లెహెర్ చాంద్ ఇంస్టి ట్యూట్ ఆఫ్ ఇండాలజీ డైరెక్టరయి ,రెండవ సారి సంపూర్ణానంద యుని వర్సిటీ వైస్ ఛాన్సలర్ గా ఆహ్వానింపబడి .లాల్ బహదూర్ శాస్త్రి సంస్కృత విద్యా పీఠ్ గౌరవ వైస్ ఛాన్సలర్ అయి ,కామేశ్వరాసింగ్ దర్భాంగా యుని వర్సిటీ వైస్ ఛాన్సలర్ అయి ,1997 నుంచి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫిలసాఫికల్ రీసెర్చ్ చైర్మన్ గా ఉన్నాడు . ఎంసైక్లోపీడియా ఆఫ్ హిందూయిజం బోర్డు ఆఫ్ ఎడిటర్స్ లో ఉన్నాడు  .  మలయా సింగపూర్ ఇటలీ ఫ్రాన్స్ జర్మనీ అమెరికా ఇంగ్లాండ్ బాలి నేపాల్ సౌత్ ఆఫ్రికా  కెనడా  మొదలైన దేశాలలో పర్యటించి విలువైన ప్రసంగాలు చేశాడు

 వెంకటాచలం అద్వైత సిద్ధాంతం పై ఎక్కువ కృషి చేశాడు .సంస్కృత సాహిత్యం భోజ కాళిదాసులపై ప్రత్యేక పరిశీలన చేశాడు .100 పైగా రీసెర్చ్ పేపర్లు రాసి ప్రచురించాడు . 1962 లో ‘’న్యూ అప్రోచ్ టు కాళిదాస ‘’అనే నూత్న ప్రాజెక్ట్ చేబట్టాడు పారమార రాజు భోజునిపై ప్రత్యేక కృషి చేశాడు .మధ్యప్రదేశ్ హయ్యర్ సెకండరీ సంస్కృత పాఠ్యగ్రంధం ‘’స్వర్ణ పుష్ప ‘’రాశాడు .వివిధ విద్యా విచార చతుర ప్రచురించాడు .భోజ అండ్ ఇండియన్ లె ర్ణింగ్  ,కాళిదాస రిఫ్లెక్షన్స్ ,విశ్వ ద్రుష్టి అనే సంపూర్ణాన0ద  శతజయంతి సంచిక ,శంకరాచార్య -షిప్ ఆఫ్ ఎన్లైటెన్మెంట్ ‘’వంటి 12 గ్రంధాలురాశాడు .   ఆయన సంస్కృత విద్వత్తుకు 1986 లో రాష్ట్రపతి సర్టిఫికెట్ ,1989 లో పద్మశ్రీ పురస్కారం ,1997 లో మహామహోపాధ్యాయ బిరుదు అందుకొన్నాడు 7.-6-2002 న 77 వ ఏటవెంకటాచలం వెంకటేశ్వర సాన్నిధ్యం చేరాడు .

      సశేషం

        మీ–గబ్బిట దుర్గాప్రసాద్ -23-6-17- కాంప్ -షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవులకవితా గీర్వాణం -3 257-సిద్ధాంత  శిక్షా మణి గ్రంథ కర్త – జగద్గురువులు -శ్రీ రేణుకాచార్యులు (క్రీ.శ . 800 )

గీర్వాణ కవులకవితా గీర్వాణం -3

   257-సిద్ధాంత  శిక్షా మణి గ్రంథ కర్త – జగద్గురువులు -శ్రీ రేణుకాచార్యులు (క్రీ.శ . 800  )

భారత దేశం లో వీరశైవ ధర్మం అతి ప్రాచీనమైనది .ప్రతియుగం లోనూ ఈ ధర్మం వర్ధిల్లుతుందని వారి నమ్మకం .శివ మహాదేవుని ఆదేశం ప్రకారం జగద్గురువులైన  పంచా చార్యులుప్రతి యుగం లోను లింగాలనుండి  జన్మించి వీరశైవ ధర్మ ప్రతిష్టాపన చేశారు .ఈ అయిదు పీఠాలు 1-కర్ణాటకలోని రంభాపురి లో 2ఉజ్జయిని 3-కేదారనాధ్ 4-శ్రీశైలం 5 కాశీ లో ఉన్నాయి . ఈ పీఠాలు ఆధ్యాత్మిక ప్రబోధం తోపాటు మానవ సంక్షేమానికి కూడా సేవలందిస్తున్నాయి .ఈ అయిదు వీరశైవ జాతీయ పీఠాలు .

  రంభాపురి పీఠాధిపతి జగద్గురు రేణుకాచార్యులు పదివిడి సూత్రాన్ని అగస్త్య మహర్షికి ,అందజేశారు ఉజ్జయిని పీఠ  జగద్గురువులు శ్రీ దారుకాచార్యులు ‘’వృష్టి సూత్రాన్ని ‘’దధీచి మహర్షికి ఇచ్చారు .కేదార పీఠ  జగద్గురు లు శ్రీ ఘంట కర్ణాచార్యులు ‘’లంబన సూత్రాన్ని ‘’వ్యాసమహర్షికి ప్రదానం చేశారు .శ్రీశైల పీఠ జగద్గురువులు  శ్రీ ధేనుకా చార్యులు ‘’ముక్తాగుచ్ఛ సూత్రాన్ని ‘’మహర్షి సనందునికి అందించారు .కాశీపీఠ  జగద్గురువులు శ్రీ విశ్వ కర్ణాచార్యులు ‘’పంచ వర్ణ సూత్రాన్ని ‘’దూర్వాస మహర్షికి అందించారు . ఈ అయిదు సూత్రాలు వీరశైవ మత మూల సూత్రాలు .వీరశైవాన్ని శివాద్వైతం అంటారు .శైవాగమ చక్రవర్తి శ్రీ శివ యోగి శివాచార్య వేద వేదాంగాలలో నిష్ణాతులు ఆయనకు అగస్త్య మహర్షికి జరిగిన సంవాద సారమే వీర శైవ సిద్ధాంత సారం .ఇది వేదం ఉపనిషత్తులు 28 శైవాగమాల సారాంశం .ఈ విషయాలన్నీ నిక్షిప్తం చేయబడిన గ్రంధం ‘’సిద్ధాంత శిక్షామణి ‘’.ఇదే వీర శై వానికి మూల గ్రంధం .ఇది 101 స్థలాలుగా ఉన్న  అష్టావర్ణ ,పంచాచారాలను వివరించే ‘’శతస్థల సిద్ధాంతం ‘’గా రేణుకా చార్యుల అమృత వాణి  నుండి వెలువడి ‘’ప్రసాద వాణి ‘’గా పిలువ బడుతోంది .దీనికే’’ ప్రసాదిక ‘’అని మరోపేరుంది దీన్ని కంఠస్తం చేసినవారికి,అధ్యయనం చేసినవారికి  ధనకనక వస్తువాహనాలతోపాటు మోక్షాన్ని కూడా పొందుతారని విశ్వాసం.ఇది పలుభాషలలోకి అనువాదం పొందింది  . ఇందులో మొదటి శ్లోకం –

‘’త్రైలోక్య సంపదాలేఖ్యా సముల్లేఖన భిత్తయే -సచ్చిదానంద రూపాయ శివాయ గురవే నమః ‘’

258-వీర శైవ ఉద్గ్రంధ ప్రచురణ కర్త -ఉజ్జయిని వీరశైవ జగద్గురు శ్రీ సిద్ధేశ్వర శివాచార్య (1890

ఉజ్జయిని వీరశైవ పీఠ జగద్గురువులుగా ఉన్న సిద్దేశ్వర శివా చార్య కాలం లో అత్యంత వైభవం గా వర్ధిల్లింది .1890  లో  కర్ణాటక చిత్ర దుర్గ జిల్లా జగలూరు తాలూకా బంగానహళ్లి గ్రామం లో జన్మించారు .తలిదండ్రులు చిన్న బసవాచార్య ,గురు సిద్దాంబే .సిద్ధలింగ పేరుతొ అందరూ పిలిచేవారు 13 వ ఏటఉజ్జయినిలో మరుల సిద్దేశ్వర స్వామిని మొదటిసారిగా దర్శించారు .అక్కడి రధోత్సవం కన్నులపండువు అనిపించింది .తలిదండ్రులు తమకుమారుడు జగద్గురువు అవుతాడని ఊహించనేలేదు .ఉజ్జయినిలోశివ పీఠం లో  ఆయనకు శివ దీక్ష నిచ్చారు .మారుల సిద్దేశ్వర స్వామి దర్శనం చేసి తలిదండ్రులతో స్వగ్రామం కు తిరిగివచ్చారు

 జగద్గురువులు మరుల సిద్ధ శివా చార్యులు చిన్నారి సిద్ధ లింగనిలో అనేక మహిమలు విభూతి చూశారు .ఈ పిల్లవాడిని పిలిపించి 1906 లో 16 వ ఏటనే ఉజ్జయిని ‘’సద్ధర్మ పీఠా నికి  పీఠాధిపతి ని చేసి శ్రీ జగద్గురు సిద్ధలింగ శివాచార్య దీక్షానామ  ధేయమిచ్చారు  ఈ యువ జగద్గురువు  సంస్కృత ,శాస్త్ర ,తర్క వేదాంత వ్యాకరణాలను శ్రీ వేద బసవప్ప శాస్త్రి మొదలైనవారు వద్ద  నేర్చుకొన్నారు .వీరశైవ వేదాగమాలతో సహా సర్వ శాస్త్ర పారంగతులయ్యారు . అన్నిమతాలవారు ఈస్వామికి ఆప్తులయ్యారు అందరిపై అనుగ్రహం ప్రసరింపజేసి  అందరికి అందుబాటులోకి పీఠాన్ని తెచ్చారు .నుదుట ధరించే విభూ తికి పరమ వైభవాన్ని తెచ్చారు.  పాఠశాల గోశాల ,భోజనశాల గ్రంధాలయం

నిర్మించారు . న0దే భద్రే సురభి,సుశీల సుమన  వంటి గోవులను ప్రత్యేకంగా పెంచారు .ఆవుపేడతోనే విభూతి తయారు చేయించేవారు  .

 తాము సంస్కృతం లో మహా నిష్ణాతులైనందున వీరశైవ ధరానుష్టానికి సంస్కృతం యొక్క ఆవశ్యకత గుర్తించి ఆభాషకు విశేష సేవలు చేశారు . 1920 లో పీఠం లోనే సంస్కృత వైదిక పాఠశాల ఏర్పాటు చేశారు .మద్రాస్ లోని వీరశైవ విద్యార్ధక ఫండ్ కు 5 వేల  రూపాయలు విరాళమిచ్చారు అనేక పాఠశాలలు స్థాపించారు .శ్రీవారికి మహా రాష్ట్ర భక్తులు మంచి ఆత్మీయులైనారు.  1922 లో సద్ధర్మ జ్ఞానగురు విద్యాపీఠం నెలకొల్పి శివాగమాలపై శిక్షణ నిస్తూ వేదం, శాస్త్ర, శైవ గ్రంథ ప్రచురణ చేశారు .శ్రీపీఠం లోను శాఖామఠ ము లలోను వేదం ,సంగీత పాఠశాలలు ఏర్పాటు చేశారు .ఇదంతా ఒక అద్భుత గురుకులం అనుభూతిని కలిగిస్తుంది .పండితులను కళాకారులను విద్యావేత్తలు ఆహ్వానించి సత్కరించి నగదు పారితోషికమిచ్చేవారు . 27ఏళ్ళు  అత్యంత సమర్ధవంతంగా సంప్రదాయ బద్ధంగా  పీఠాధిపత్యం నిర్వహించి సమాజానికి బహువిధ సేవలు అందించారు .వారి ముఖ్యోద్దేశ్యం భక్త రక్షణ,వారి  బాగోగులు .తమ పీఠమేకాక మిగిలిన నాలుగు పీఠాలసర్వతోముఖాభి వృద్ధికి కృషి చేసిన మహానుభావులు శ్రీ సిద్ధ లింగ శివాచార్య జగద్గురువులు .ఉత్తరాధిపతిగా శ్రీ శివానంద శివ చార్యులను ప్రతిటించి 1936 లో శివైక్యమయ్యారు

259-రక్ష రుద్రాక్ష చంద్ర మార్తాండ కర్త -శ్రీ ముదిగొండ నాగ లింగ శాస్త్రి (1876-1948 )

శ్రౌత శివాద్వైత వేదాంత నిష్ణాతులు శ్రీ ముదిగొండ నాగ లింగ శాస్త్రిగారు 1876 లో గుంటూరు జిల్లా తిక్కన కొండ గ్రామం లో జన్మించారు .అగోరనాధ్యాయ జ్వాలాంబికల కుమారుడు .కుటుంబమంతా వేద వేదాంగ తర్క వ్యాకరణ ఆయుర్వేద జ్యోతిష  శాస్త్ర శిరోమణులే .అనేక శివాలయాలలో శివలింగ ప్రతిష్టాపన చేసిన సమర్దులే .కృష్ణాజిల్లా పమిడిముక్కలలోని మల్లంపల్లి వీరేశలింగారాధ్యులవద్ద కొంతకాలం చదివి శ్రీకాళహస్తి చేరి 15 వ ఏట అపరపతంజలి  శ్రీనివాస శాస్త్రి వద్ద పాణినీయం నేర్చి సంస్కృతం లో విద్వావంసుడై ,19 వ ఏట తమిళనాడు లోని నదుక్ఖావేరి వెళ్లి తర్క మీమాంస నీలకంఠ ,శంకర రామానుజ మధ్వా చార్య భాష్యాలు గ్రహించి ,అప్పయ్య దీక్షిత నీలకంఠ దీక్షితుల శైవాగమాలన్నీ అవలోడనం చేసి, శంకర పద వాక్యప్రమాణ సాధికారత సాధించారు .సంస్కృత తమిళాలలో వీరశైవ గ్రంథాలెన్నో రాశారు ‘’.శైవ విద్యాపత్రిక’’కు సంపాదకులైనారు .గురువుతో 28 శైవ ఆగమనాలను క్షుణ్ణంగా చర్చించారు .ఆ లేత వయసులోనే సంస్కృతం లో ‘’రక్షా రుద్రాక్ష చంద్ర మార్తాండం ‘’ఉద్గ్రంధం రాశారు .దీనిని తమిళం లోను రాసి గురుదేవునికి అంకితమిచ్చారు .గురువు శ్రీ శ్రీనివాస శాస్త్రి అనుగ్రహం తో నాగ లింగ శాస్త్రిగారికి శైవ సిద్ధాంత గ్రంధం ‘’నీలకంఠ భాష్య ‘’తాటాకుల ప్రతిని బహుకరించారు

 నాగ లింగ శాస్త్రిగారు ప్రింటింగ్ ప్రెస్ స్థాపించి ‘’శ్రౌత శైవ ప్రకాశిక ‘’పత్రికను నడుపుతూ అనేక సంస్కృత తెలుగు గ్రంధాలు ముద్రించారు .అప్పయ్య దీక్షితుల ‘’బ్రహ్మ తర్క స్తవం ,భారత ,రామాయణాలు ,చతుర్వేద తాత్పర్య సంగ్రహం ,శివ కర్ణామృతం ,పంచ రత్న స్తుతి లను విస్తృత సంస్కృత వ్యాఖ్యానాలతో ప్రచురించారు .ఇవికాక అయిదు సంస్కృత రచనలు చేసి వాటికి సంస్కృత ఆంధ్రాలలో వ్యాఖ్యానం రాసి ప్రచురించారు -అవే 1-శైవ సిద్ధాంత సంగ్రహం 2-శివ ఏవ కారణం 3- శ్రౌతమేవాహి శైవ చిహ్నవి 4-శ్రౌతమేవాహి ధరణం -లింగస్య 5-శిష్ట సర్వే శివమ్ ప్రపంన్నాహ్ .ఇవన్నీ 1900-3 లో మూడేళ్ళలో ప్రచురితాలు .ఇవి శివజ్ఞానలహరి పేరిట ఆంగ్లాను వాదం పొందాయి పవిత్ర శైవ క్షేత్ర సందర్శనం చేసి శైవ మత ప్రచారమూ చేశారు శాస్త్రిగారు .మొత్తం 100 కుపైగా శైవ సిద్ధాంత గ్రంధాలు రాశారు నాగ లింగ శాస్త్రిగారు నీలకంఠ భాష్యానికి ‘’శివ చింతామణి ప్రభ ‘’వ్యాఖ్య రాశారు . 1930 లో అప్పయ్య దీక్షితుల ‘’శివార్క మణి  దీపిక’’ను వేద వ్యాసమహర్షి చెప్పిన 545 బ్రహ్మ సూత్రాలతో సంస్కృతం లో రాస్తే దీన్ని వీరి మరణానంతరం శిష్యుడు శ్రీ ముదిగొండ వీరేశలింగ శాస్త్రి 1950 లో ప్రచురించారు  .ఈ సంస్కృత భాష్యం తెలుగు మళయాళ తమిళ,కన్నడ  భాషలలో లభ్యంగా ఉంది .ఈ భాష్యం ఇంగ్లిష్ అనువాదం పొంది ‘’తత్వ త్రయం ‘’అయిన జీవ, జగత్, ఈశ్వర తత్త్వం ప్రపంచమంతా వ్యాపించాలని శాస్త్రిగారు భావించారు

  1937 లో నాగ లింగ శాస్త్రి గారికి విజయవాడలో దుర్గా కళా కళామందిరం  ఎదురుగా ఉన్న శైవ మహా పీఠం లో షష్ట్యబ్దిపూర్తి  ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు .శాస్త్రిగారు 1930 నుంచి 1948 మరణ పర్యంతం ఎన్నో వ్యాసాలూ వ్యాఖ్యాన గ్రంధాలుశైవ  సిద్ధాంతం పై రాశారు .ఈకాలం లోనే 545 బ్రహ్మ సూత్రాలపై విపులమైన వ్యాఖ్యానం రాశారు వీటినన్నిటిని శ్రీ ముదిగొండ వీరేశలింగ శాస్త్రిగారు ఆ తర్వాత ప్రచురించారు .మచిలీపట్నం లోని శ్రీ కాశీనాధుని వీరేశలింగం అయ్యవారు శాస్త్రిగారి మరణానికి సంతాప సందేశం పంపుతూ  He was a learned man with whom, one can discuss the sastras, to one’s satisfaction, imbibed with all good qualities, a great poet, one who understood the essence of the vedas, one who worshipped Siva with great Devotion, a great commentator of the Veda Vagmayam without compromise or contradiction. May he alone bear this Bharatiya samskruti like the thousand hooded serpent king Sesha, bearing the weight of this entire universe and inspire the younger generations, on Indian values for years to come”అని చంపకమాల శ్లోకాలలో ప్రస్తుతించారు

260-నృసింహ స్తుతి కర్త -శ్రీ శ్రీ విశ్వపతి తీర్ధ

ఉడిపి లోని పెజావర్ మఠ స్థాపకులు శ్రీ అధోక్షజ తీర్ధ శ్రీ మధ్వాచార్యుల శిష్యులలో ఒకరు .ఇక్కడి దైవం శ్రీ విఠలుడు .ఆచార్య పరంపరలో 18 వ ఆచార్యులు శ్రీ విజయధ్వజ తీర్ధ . వీరు భాగవత పురాణానికి వ్యాఖ్య రాశారు అది ‘’విజయధ్వజ  తీర్దీయం ‘’గా ప్రసిద్ధి చెందింది . 18వ ఆచార్య శ్రీ విశ్వపతి తీర్ధ నృసింహ స్తుతి కాక మధ్వ విజయం పై వ్యాఖ్యానం రాశారు .

  ప్రస్తుత పీఠాధిపతి 32 వ వారైన శ్రీ విశ్వేశ  తీర్థులు 1931 లో జన్మించి 1938 లో సన్యాసదీక్షపొందారు . 1953లో అఖిల భారత మధ్వ సమ్మేళనాన్ని ఉడిపిలో భారీఎత్తున నిర్వహించారు .కృష్ణ దేవాలయ గోడ ,రాజంగానే గ్రామం లో విశాలమైన ఆడిటోరియం నిర్మించారు  .శ్రీ విశ్వ ప్రసన్న తీర్ధను ఉత్తరాధికారిగా నియమించారు  . అన్ని ధార్మిక  సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు .ప్రాధాని మోడీ వీరిని సందర్శించారు

  సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-6-17 కాంప్-షార్లెట్ -అమెరికా

Inline image 1Inline image 2

శ్రీ రేణుకాచార్య                               సిద్ధ లింగ శివాచార్య


Inline image 3    Inline image 4
నాగలింగ శాస్త్రి                               శ్రీ విశ్వేశ  తీర్ధ
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

 గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 255-శాసన లిపి పరిశోధకుడు -పద్మ భూషణ్ -వాసుదేవ విష్ణు మిరాశి(1893-1985 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

255-శాసన లిపి పరిశోధకుడు -పద్మ భూషణ్ -వాసుదేవ విష్ణు మిరాశి(1893-1985 )

 వాసుదేవ విష్ణు మిరాశీ 3-3-1893 న మహారాష్ట్ర రత్నగిరిజిల్లా దియోగఢ్ తాలూకా కువెల్ గ్రామం లో జన్మించాడు కొల్హాపూర్ లో ప్రాధమిక విద్య నేర్చి ,పూనా వెళ్లి డిగ్రీ తర్వాత సంస్కృతం లో 1917 లో డెక్కన్ కాలేజీ నుంచి మాస్టర్ డిగ్రీ అందుకొన్నాడు .బొంబాయి వెళ్లి ఎల్ఫీన్స్టన్ కాలేజీలో సంస్కృత ప్రొఫెసర్ అయ్యాడు . 1919 లో నాగపూర్ మారిస్ కాలేజీ లో సంస్కృత పీఠాధ్యక్షుడై 1942 లో ప్రిన్సిపాల్ గా ఎదిగి ,1947-50 కాలం లో అంరోతి లోని విదర్భ మహా విద్యాలయ ప్రిన్సిపాల్ చేశాడు . 1957 నుంచి 1966 వరకు నాగపూర్ యుని వర్సిటీలో ఆనరరీ ప్రొఫెసర్ ఫర్ యేన్షెన్ట్  కల్చర్ గా ,పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచింగ్ ఇన్ హ్యుమానిటీస్  శాక్షాధ్యక్షుడుగా సేవలందించారు .

   30 కి పైగా రీసెర్చ్ పేపర్లు ,275 కు పైగా ఇండాలజీ పేపర్లు వివిధ పత్రికలకు రాశాడు ;శాసన లిపి పరిశోధనలో తీవ్ర కృషి చేసి 1955 లో కాల్చురీ చేది  వంశ రాజ్య పాలన ,1963 లో వాకాట రాజచరిత్ర ,1977 లో స్లి0హార శాసన విషయం ,శాతవాహన ,క్షాత్రప రాజుల చరిత్ర శాసనాలనాధారంగా వివరించాడు .ఇతర రచనలు ;;లిటరరీ అండ్ హిస్టారిక్ స్టడీస్ ఇన్ ఇండాలజీ ,కాళిదాస ,భవభూతి లపై గ్రంధాలు రాశాడు

 శాసన పరిశోధనకు మిరాశీ వందలాది బహుమతులు పురస్కారాలు అందుకున్నాడు . 941 లో వైస్రాయ్ లార్డ్ లైన్ లిత్ గో ‘’మహా మహోపాధ్యాయ ‘’బిరుదు ప్రదానం చేశాడు . 966 లో భారత రాష్ట్ర పతి శ్రీ రాధా కృష్ణన్ సంస్కృత సేవకు సర్టిఫికెట్ అందజేశారు . 1970 లో   భారత ప్రభుత్వ ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ ఆనరరీ కరెస్పాండెంట్ అయ్యాడు .సాగర్ నాగపూర్ యూనివర్సిటీలు డిలిట్ ఇచ్చాయి . 951 లో న్యూయిస్కాటిక్ సొసైటీ కి జనరల్ ప్రెసిడెంట్ అయి ,ఫెలో షిప్ పొంది ,ఆలిండియా ఓరియంటల్ కాంగ్రెస్ ,ఇండియన్ హిస్టారికాంగ్రెస్ ప్రెసిడెంట్ అయి ,1973 లో కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు అందుకొన్నాడు . 975 లో భారత ప్రభుత్వం మిరాశీ సేవలకు ‘’పద్మ భూషణ్ ‘’పురస్కారమందించి గౌరవించింది 3.-4-1985 న వాసుదేవ విష్ణు మిరాశీ 92 వ ఏట విష్ణు సాయుజ్యం పొందాడు ..

256-భారతీయ సౌందర్య శాస్త్రానికి వన్నెలు తీర్చిన –కాంతి  చంద్ర పాండే (1920

అభినవ గుప్తుని రచనానువాదం చేసిన కాంతి చంద్ర పాండే భారతీయ సౌందర్య శాస్త్రానికి వన్నె చిన్నెలు తీర్చిదిద్దాడు .మూల అలంకార శాస్త్రాలపై కొత్త వెలుగులు కుమ్మరించాడు .వాటిలోని సారాంశాలను మజ్జిగ  చిలికి వెన్న తీసిచేతిలోపెట్టినట్లు  గా ఆంగ్లం లో రాశాడు .ఇవి పాస్చాత్య సౌందర్య శాస్త్రాలను ,భారతీయ సౌందర్య శాస్త్రాలను తులనాత్మకంగా పరిశీలించటానికి విస్తృతంగా తోడ్పడ్డాయి . ఈయన రచనలు -హిస్టారికల్ అండ్ ఫిలసాఫికల్ స్టడీ ఆఫ్ అభినవ గుప్త ,అవుట్ లైన్ హిస్టరీ ఆఫ్ శైవ ఫిలాసఫీ ,కంపా రేటివ్ ఏస్థెటిక్స్

మీ గబ్బిట దుర్గా ప్రసాద్ -21-6-17 -కాంప్-షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 244-ఉపనిషత్తులు –యాజ్ఞ వల్క్య ,ఉద్దాలకాది మహర్షులు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

244-ఉపనిషత్తులు –యాజ్ఞ వల్క్య ,ఉద్దాలకాది మహర్షులు

  • ఉప +ని + షత్

  • ఉప అంటే సమీపంగా, ని అంటే కింద, షత అంటే కూర్చునుట

  • ఉపనిషత్తులు జ్ఞానం ప్రధానంగా ఉన్నాయి. గురువు ముందు శిష్యుడు కూర్చొని జ్ఞానాన్ని ఆర్జించాడు. వీటిలో ప్రధానంగా విశ్వాంతరాళంలో మనిషికి ఉండే స్థానం గురించి చర్చ జరిగింది. ఉపనిషత్తులు తాత్త్విక గ్రంధాలు. ఆత్మ-అంతరాత్మ ప్రపంచానికి మూలం. ప్రకృతి రహస్యాలు మొదలైన వాటి గురించి ఇవి చర్చించాయి. వేదకాలం నాటి ఆలోచన ధోరణికి ఉపనిషత్తులు పరిపూర్ణతను కలిగించాయి. సరైన జ్ఞానానికి, సన్మార్గానికి ఇవి ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చాయి. ఉపనిషత్తులు 108 వరకు ఉన్నా అందులో 12 అతి ముఖ్యమైనవి. వేద సాహిత్యం అంతిమ దశలో ఆవర్భవించాయి కాబట్టి వీటిని ‘వేదాంతాలు ‘ అని కూడా అంటారు. ఋగ్వేదయుగాన్ని తొలివేదయుగమని పిలుస్తారు. మిగిలిన సాహిత్యం-వేదాలు, బ్రహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు వెలువడిన యుగాన్ని మలివేద యుగమని అంటారు. తొలి వేదాయుగానికి, మలివేదయుగానికి మధ్య ఎన్నో మార్పులు సంభవించాయి.

  • ఉపనిషత్తుల అనేక మంది రచయితలకు ఆపాదించబడ్డాయి మరియు వారి పేరు మీద చేయబడ్డాయి: అవి యాజ్ఞవల్క, ఉద్దాలక మరియు అరుణి అనేవి ప్రారంభ ఉపనిషత్తులు ప్రముఖంగా కనిపిస్తాయి. ఇతర ముఖ్యమైన రచయితలు శ్వేతకేతు, శాండిల్య, ఐతరేయ, పిప్పలాద మరియు సనత్కుమార పేరు మీద ఉన్నాయి. ఇంకనూ చర్చించు, తర్కించు, విచారించు, వివేచించు వారు అయిన గార్గి, మరియు యాజ్ఞవల్క భార్య మైత్రేయి ముఖ్యమైన మహిళలు పేరు మీద కూడా ఉన్నాయి.

  • మొఘల్ చక్రవర్తి షాజహాన్ కుమారుడు, దారా షిఖ్, 1657 లో. పెర్షియన్ భాష లోకి 50 ఉపనిషత్తులు అనువాదం చేయడము జరిగింది.

  • ఉపనిషత్తులులో ఎక్కువగా బ్రాహ్మణాలు మరియు అరణ్యకములు యొక్క ముగింపు భాగం లోనివి.

  • భగవద్గీత, ఉపనిషత్తులు మరియు బ్రహ్మసూత్రములును ప్రస్థానత్రయం అంటారు.

అర్థము[మార్చు]

  • వేదాల చివరి బాగాలు. గ్రంథ ప్రతిపాద్యమగు విద్య అని శ్రుతి వచనం. బ్రహ్మవిద్య అని కూడా ఉపనిషత్తులకు మరో పేరు. ఇది ద్వివిధం. 1. పరావిద్య, 2. అపరా విద్య.

ఉపనిషత్తుల విభాగాలు[మార్చు]

  • ఉపనిషత్తులు వేదసారమనీ, వేదరహస్యమనీ వర్ణనలు ఉన్నాయి. ఒకప్పుడు వెయ్యిన్నీ ఎనిమిది ఉపనిషత్తులు ఉండేవనీ, ఇప్పుడు నూట ఎనిమిది మాత్రం లభ్యమవుతున్నాయనీ అంటారు. అందులోనూ పది మాత్రం ముఖ్యమైనవనీ, వాటికి మాత్రమే శంకరులు భాష్యం వ్రాశారనీ అంటారు. అవి: 1. ఈశోపనిషత్తు, 2. కేనోపనిషత్తు, 3. కఠోపనిషత్తు, 4. ప్రశ్నో పనిషత్తు, 5. ముండకోపనిషత్తు, 6. మాండూ క్యోపనిషత్తు, 7. తైత్తిరీయోపనిషత్తు, 8. ఐతరేయోపనిషత్తు, 9. ఛాందోగ్యోప నిషత్తు, 10. బృహదారణ్యకోపనిషత్తు.

  • శైవ, వైష్ణవ వర్గాల వారు తమవిగా భావించే ఉపనిషత్‌ వర్గీకరణ ఒకటి ఉంది.

  • శైవులు తమవని భావించే ఉపనిషత్తులు పదిహేను ఉన్నాయి: 1. అక్షమాలికోపనిషత్తు, 2. అథర్వ శిరోపనిషత్తు, 3. అథర్వ శిఖోపనిషత్తు, 4. కాలాగ్ని రుద్రోపనిషత్తు, 5. కైవల్యోపనిషత్తు, 6. గణపతి ఉపనిషత్తు, 7. జాబాలోపనిషత్తు, 8. దక్షిణామూర్తి ఉపనిషత్తు, 9. పంచబ్రహ్మోపనిషత్తు, 10. బృహజ్జాబాలోపనిషత్తు 11. భస్మజా బాలోపనిషత్తు, 12. రుద్రహృదయో పనిషత్తు, 13. రుద్రాక్ష జాబాలోపనిషత్తు, 14. శరభోప నిషత్తు, 15. శ్వేతాశ్వతరో పనిషత్తు.

  • వైష్ణవులు తమవిగా చెప్పే పదునాలుగు ఉపనిషత్తులు: 1. అవ్యక్తోప నిషత్తు, 2. కలిసంతరణోపనిషత్తు, 3. కృష్ణోప నిషత్తు, 4. గారుడోపనిషత్తు, 5. గోపాలతాప సోపనిషత్తు, 6. తారసోపనిషత్తు, 7. త్రిపాద్వి భూతి ఉపనిషత్తు, 8. దత్తాత్రేయో పనిషత్తు, 9. నారాయణోపనిషత్తు, 10. నృసింహ తాపసీయోపనిషత్తు, 11. రామ తాపస ఉపనిషత్తు, 12. రామరహస్యో పనిషత్తు, 13. వాసుదేవ ఉపనిషత్తు, 14. హయగ్రీవ ఉపనిషత్తు.

  • సన్యాసానికి సంబంధించిన లక్షణాలను, విధి విధానాలను తెలియజేసే 17 ఉపనిషత్తులను సన్యాసోపనిషత్తులని వర్గీకరించారు. అవి: 1. అరుణికోపనిషత్తు, 2. అవధూతోపనిషత్తు, 3. కఠశ్రుత్యుపనిషత్తు, 4. కుండినోపనిషత్తు, 5. జాబాలోపనిషత్తు, 6. తురీయాతీత అవధూతోపనిషత్తు, 7. నారద పరివ్రాజకో పనిషత్తు, 8. నిర్వాణోపనిషత్తు, 9. పరబ్రహ్మోపనిషత్తు, 10. పరమహంస పరివ్రాజకోపనిషత్తు, 11. పరమహంసో పనిషత్తు, 12. బ్రహ్మోపనిషత్తు, 13. భిక్షుక ఉపనిషత్తు, 14. మైత్రేయ ఉపనిషత్తు, 15. యాజ్ఞవల్క్య ఉపనిషత్తు, 16. శాట్యాయన ఉపనిషత్తు, 17. సన్యాసో పనిషత్

ఉపనిషత్తుల సంఖ్య

ఉపనిషత్తులు ఎన్ని అనే ప్రశ్నకు అందరినీ సంతృప్తిపరచే సమాధానం లేదు. శంకరుడు వ్యాఖ్యానించిన ఈశకేనాది పది ఉపనిషత్తులే బహుళ ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ తరచు మరికొన్ని ఉపనిషత్తుల ప్రస్తావన విన వస్తుంటుంది. ముక్తికోపనిషత్తు 108 ఉపనిషత్తులను ప్రస్తావిస్తున్నది. ఒక్కొక విశ్వాసం వారు ఒక్కొక్క విధంగా ఉప నిషత్తులను తమకు అనుకూలంగా ఉదహరిస్తున్నారు. ప్రామాణికంగా చెప్పడానికి ఆస్కారం లేదు. ఉదాహరణకు జాబాలి పేరు అనేక విధాలుగా ఉపనిషత్తుల పట్టికలో దర్శనమిస్తుంది. ఏమైనప్పటికీ, వైదిక వాఙ్మయంలో ఉపనిషత్తుల స్థానం విశిష్టమైనది. ఉపనిషత్తు అనే పదానికి సవిూపానికి తీసుకునిపోవడం అనే అర్థం ఉన్నదనీ, మనిషి తన పరిమితమైన చైతన్యాన్ని, ప్రజ్ఞను బ్రహ్మ చైతన్యంతో, ప్రజ్ఞతో అనుసంధానం చేసి పరిమితత్వాన్ని దాటి శాశ్వత స్థితిని పొందడానికి ఉపయోగపడే మోక్షవిద్య ఉపనిషత్తులలో ఉన్నదని కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్య అంటారు. ఒక్కోవేదానికి ఉపనిషత్తుల సంఖ్య ఇలా ఉంది

  • ఋగ్వేదానికి సంబంధించినవి – 10

  • కృష్ణ యజుర్వేదానికి సంబంధించినవి – 32

  • శుక్ల యజుర్వేదానికి సంబంధించినవి – 19

  • సామవేదానికి సంబంధించినవి – 16

  • అధర్వణ వేదానికి సంబంధించినవి – 31 (మొత్తం – 108)

  • మొత్తం 108 ఉపనిషత్తులలో ప్రధానంగా 10 ఉపనిషత్తులను దశోపనిషత్తులుగా ముఖ్య ఉపనిషత్తులు[మార్చు]

  • మొత్తం 108 ఉపనిషత్తులలో ప్రధానంగా 10 ఉపనిషత్తులను దశోపనిషత్తులుగా వ్యవహరిస్తున్నారు. అవి:

1. ఈశావాస్య ఉపనిషత్తు (ఈశావాస్యోపనిషత్తు)

2. కేనోపనిషత్తు

3. కఠోపనిషత్తు

4. ప్రశ్నోపనిషత్తు

5. ముండకోపనిషత్తు

6. మాండూక్యోపనిషత్తు

7. తైత్తిరీయోపనిషత్తు

8. ఐతరేయోపనిషత్తు

9. ఛాందోగ్యోపనిషత్తు

10. బృహదారణ్యకోపనిషత్తు

11. శ్వేతాశ్వతరోపనిషత్తు

12. కౌశీతకి ఉపనిషత్తు

13. మైత్రాయణి ఉపనిషత్తు

14. బ్రహ్మోపనిషత్తు

15. కైవల్యోపనిషత్తు

16. జాబలోపనిషత్తు

17. హంసోపనిషత్తు

18. ఆరుణికోపనిషత్తు

19. గర్భోపనిషత్తు

20. నారాయణోపనిషత్తు

21. పరమహంస ఉపనిషత్తు

22. అమృతబిందు ఉపనిషత్తు

23. అమృతనాదోపనిషత్తు

24. అథర్వశిరోపనిషత్తు

25. అథర్వాశిఖోపనిషత్తు

26. బృహజ్జాబాలోపనిషత్తు

27. నృసింహతాపిన్యుపనిషత్తు

28. కళాగ్నిరుద్రోపనిషత్తు

29. మైత్రేయోపనిషత్తు

30. సుబాలోపనిషత్తు

31. క్షురికోపనిషత్తు

32. మంత్రికోపనిషత్తు

33. సర్వసారోపనిషత్తు

34. నిరలాంబోపనిషత్తు

35. శుకరహాస్యోపనిషత్తు

36. వజ్రసూచ్యుపనిషత్తు

37. తేజోబిందూపనిషత్తు

38. నృసిందబిందూపనిషత్తు

39. ధ్యానబిందూపనిషత్తు

40. బ్రహ్మవిద్యోపనిషత్తు

41. యోగతత్వోపనిషత్తు

42. ఆత్మబోధోపనిషత్తు

43. నారదపరివ్రాజకోపనిషత్తు

44. త్రిశిఖిబ్రాహ్మణోపనిషత్తు

45. సీతోపనిషత్తు

46. యోగచూడామణ్యుపనిషత్తు

47. నిర్వాణోపనిషత్తు

48. మండల బ్రాహ్మణోపనిషత్తు

49. దక్షిణామూర్త్యుపనిషత్తు

50. శరభోపనిషత్తు

51. స్కందోపనిషత్తు

52 మహానారాయణోపనిషత్తు

53. అద్వయతారకోపనిషత్తు

54. రామరహస్యోపనిషత్తు

55. రామతాపిన్యుపనిషత్తు

56. వాసుదేవోపనిషత్తు

57. ముద్గలోపనిషత్తు

58. శాండిల్యోపనిషత్తు

59. పైంగలోపనిషత్తు

60. భిక్షుకోపనిషత్తు

61. మహోపనిషత్తు

62. శారీరకోపనిషత్తు

63. యోగశిఖోపనిషత్తు

64. తురియాతీతోపనిషత్తు

65. సన్యాసోపనిషత్తు

66. పరమహంస పరివ్రాజకోపనిషత్తు

67. అక్షమాలికోపనిషత్తు

68. అవ్యక్తోపనిషత్తు

69. ఏకాక్షరోపనిషత్తు

70. అన్నపూర్ణోపనిషత్తు

71. సూర్యోపనిషత్తు

72. అక్ష్యుపనిషత్తు

73. అధ్యాత్మోపనిషత్తు

74. కుండికోపనిషత్తు

75. సావిత్ర్యుపనిషత్తు

76. ఆత్మోపనిషత్తు

77. పశుపతబ్రహ్మోపనిషత్తు

78. పరబ్రహ్మోపనిషత్తు

79. అవధూతోపనిషత్తు

80. త్రిపురతాపిన్యుపనిషత్తు

81. శ్రీదేవ్యుపనిషత్తు

82. త్రిపురోపనిషత్తు

83. కఠరుద్రోపనిషత్తు

84. భావనోపనిషత్తు

85. రుద్రహృదయోపనిషత్తు

86. యోగకుండల్యుపనిషత్తు

87. భస్మజాబలోపనిషత్తు

88. రుద్రాక్షజాబలోపనిషత్తు

89. గణపత్యుపనిషత్తు

90. దర్శనోపనిషత్తు

91. తారాసారోపనిషత్తు

92. మహావాక్యోపనిషత్తు

93. పంచబ్రహ్మోపనిషత్తు

94. ప్రాణాగ్నిహోత్రోపనిషత్తు

95. గోపాలతాపిన్యుపనిషత్తు

96. కృష్ణోపనిషత్తు

97. యాజ్ఞవల్క్యోపనిషత్తు

98. వరాహోపనిషత్తు

99. శాట్యానీయోపనిషత్తు

100. హయగ్రీవోపనిషత్తు

101. దత్తాత్రేయోపనిషత్తు

102. గరుడోపనిషత్తు

103. కలిసంతారణోపనిషత్తు

104. బాల్యుపనిషత్తు

105. సౌభాగ్యలక్ష్మ్యుపనిషత్తు

106. సరస్వతీ రహస్యోపనిషత్తు

107. భహ్వృచోపనిషత్తు

108. ముక్తికోపనిషత్తు

:దశోపనిషత్తులను చెప్పే ప్రామాణిక శ్లోకం:

ఈశ కేన కఠ ప్రశ్న ముండ మాండూక్య తిత్తిరిః

ఐతరేయం చ ఛాందోగ్యం బృహదారణ్యకం తథా

  • సిద్ధాంతకర్తలే స్వయంగా మరో ఉపనిషత్తును రచించడం జరిగింది. అలాంటి కొన్ని ఉపనిషత్తులను 1908 వ సంవత్సరములో డా. ఫ్రెడ్రిక్ ష్రేడర్ అనే జర్మన్ భాషా శాస్త్రవేత్త కనుగొన్నాడు. అవి: బష్కళ, ఛాగలేయ, ఆర్షేయ మరియు శౌనక ఉపనిషత్తులు.

  • కొత్త ఉపనిషత్తులు ముఖ్య ఉపనిషత్తుల్లోని అనుకరణలు అయి ఉండాలి అని వాదన ఉంది.

245-శాసన లిపి పరిశోధకుడు -పద్మ భూషణ్ -వాసుదేవ విష్ణు మిరాశి(1893-1985 )

 వాసుదేవ విష్ణు మిరాశీ 3-3-1893 న మహారాష్ట్ర రత్నగిరిజిల్లా దియోగఢ్ తాలూకా కువెల్ గ్రామం లో జన్మించాడు కొల్హాపూర్ లో ప్రాధమిక విద్య నేర్చి ,పూనా వెళ్లి డిగ్రీ తర్వాత సంస్కృతం లో 1917 లో డెక్కన్ కాలేజీ నుంచి మాస్టర్ డిగ్రీ అందుకొన్నాడు .బొంబాయి వెళ్లి ఎల్ఫీన్స్టన్ కాలేజీలో సంస్కృత ప్రొఫెసర్ అయ్యాడు . 1919 లో నాగపూర్ మారిస్ కాలేజీ లో సంస్కృత పీఠాధ్యక్షుడై 1942 లో ప్రిన్సిపాల్ గా ఎదిగి ,1947-50 కాలం లో అంరోతి లోని విదర్భ మహా విద్యాలయ ప్రిన్సిపాల్ చేశాడు . 1957 నుంచి 1966 వరకు నాగపూర్ యుని వర్సిటీలో ఆనరరీ ప్రొఫెసర్ ఫర్ యేన్షెన్ట్  కల్చర్ గా ,పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచింగ్ ఇన్ హ్యుమానిటీస్  శాక్షాధ్యక్షుడుగా సేవలందించారు .

   30 కి పైగా రీసెర్చ్ పేపర్లు ,275 కు పైగా ఇండాలజీ పేపర్లు వివిధ పత్రికలకు రాశాడు ;శాసన లిపి పరిశోధనలో తీవ్ర కృషి చేసి 1955 లో కాల్చురీ చేది  వంశ రాజ్య పాలన ,1963 లో వాకాట రాజచరిత్ర ,1977 లో స్లి0హార శాసన విషయం ,శాతవాహన ,క్షాత్రప రాజుల చరిత్ర శాసనాలనాధారంగా వివరించాడు .ఇతర రచనలు ;;లిటరరీ అండ్ హిస్టారిక్ స్టడీస్ ఇన్ ఇండాలజీ ,కాళిదాస ,భవభూతి లపై గ్రంధాలు రాశాడు

 శాసన పరిశోధనకు మిరాశీ వందలాది బహుమతులు పురస్కారాలు అందుకున్నాడు . 941 లో వైస్రాయ్ లార్డ్ లైన్ లిత్ గో ‘’మహా మహోపాధ్యాయ ‘’బిరుదు ప్రదానం చేశాడు . 966 లో భారత రాష్ట్ర పతి శ్రీ రాధా కృష్ణన్ సంస్కృత సేవకు సర్టిఫికెట్ అందజేశారు . 1970 లో   భారత ప్రభుత్వ ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ ఆనరరీ కరెస్పాండెంట్ అయ్యాడు .సాగర్ నాగపూర్ యూనివర్సిటీలు డిలిట్ ఇచ్చాయి . 951 లో న్యూయిస్కాటిక్ సొసైటీ కి జనరల్ ప్రెసిడెంట్ అయి ,ఫెలో షిప్ పొంది ,ఆలిండియా ఓరియంటల్ కాంగ్రెస్ ,ఇండియన్ హిస్టారికాంగ్రెస్ ప్రెసిడెంట్ అయి ,1973 లో కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు అందుకొన్నాడు . 975 లో భారత ప్రభుత్వం మిరాశీ సేవలకు ‘’పద్మ భూషణ్ ‘’పురస్కారమందించి గౌరవించింది 3.-4-1985 న వాసుదేవ విష్ణు మిరాశీ 92 వ ఏట విష్ణు సాయుజ్యం పొందాడు ..

246-భారతీయ సౌందర్య శాస్త్రానికి వన్నెలు తీర్చిన –కాంతి  చంద్ర పాండే (1920

అభినవ గుప్తుని రచనానువాదం చేసిన కాంతి చంద్ర పాండే భారతీయ సౌందర్య శాస్త్రానికి వన్నె చిన్నెలు తీర్చిదిద్దాడు .మూల అలంకార శాస్త్రాలపై కొత్త వెలుగులు కుమ్మరించాడు .వాటిలోని సారాంశాలను మజ్జిగ  చిలికి వెన్న తీసిచేతిలోపెట్టినట్లు  గా ఆంగ్లం లో రాశాడు .ఇవి పాస్చాత్య సౌందర్య శాస్త్రాలను ,భారతీయ సౌందర్య శాస్త్రాలను తులనాత్మకంగా పరిశీలించటానికి విస్తృతంగా తోడ్పడ్డాయి  కాంతి చంద్ర ఆంగ్ల రచనలు -అభినవ గుప్త -హిస్టారికల్ అండ్ ఫిలసాఫికల్ స్టడీ ,అవుట్ లైన్ హిస్టరీ ఆఫ్ శైవ ఫిలాసఫీ ,కంపరేటివ్ ఎస్తెటిక్స్ ఇండియన్ అండ్ వెస్ట్ర న్   ,భాస్కరి  మూడుభాగాలు

సశేషం

మీ-గబ్బిట దుర్గ ప్రసాద్ -21-6-17-కాంప్-షార్లెట్-అమెరికా .

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 251-మహా మృత్యుంజయ మంత్ర భాష్య కర్త-స్వామి స్వరూపానంద (1960

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

251-మహా మృత్యుంజయ మంత్ర భాష్య కర్త-స్వామి స్వరూపానంద (1960

స్వామి స్వరూపానంద దక్షిణ భారత దేశ చిన్మయ విశ్వ విద్యాలయ పీఠం ట్రస్ట్ అంటే యూనివర్సిటీ ఫార్  సాంస్క్రిట్ అండ్ ఇండిక్ ట్రెడిషన్  కు చైర్మన్ .దీనికి పూర్వం స్వామి -ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ ,మిడిలీస్ట్ ,ఫారీస్ట్,ఆఫ్రికాలలోని చిన్మయ మిషన్ కు రీజినల్ హెడ్ గా ఉండేవారు ..ప్రస్తుతం కోయంబత్తూర్ లోని చిన్మయ ఇంటర్ నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ డైరెక్టర్ ..స్వామి తేజోమయానంద ఆశీస్సులతో ఇప్పుడు వరల్డ్ వైడ్ చిన్మయ మిషన్ అధిపతిగా కూడా వ్యవహరిస్తున్నారు  .

 ఇండియాలో బాగా వాణిజ్య వ్యాపార కేంద్రమైన బొంబాయి నగరం లో జన్మించిన స్వరూపానంద చిన్నప్పటినుండి భౌతిక జీవితంపై కంటే ఆధ్యాత్మిక జీవితం పై ఆసక్తి పెంచుకొన్నారు.  నాయనమ్మ బోధించే భారత రామాయణ కధలు మహర్షుల జీవితాలు ఆయనపై బాగా ప్రేరణ కలిగించాయి  .స్వామి చిన్మయానంద బోధలు ఆకర్షించాయి .  .జీవిత పరమార్ధం అర్ధమై 1984 లో  హాంగ్ కాంగ్ లోని స్వ0త వ్యాపార  సంస్థ ను ,ఇంటిని వదిలేసి స్వామి చిన్మయానంద  స్వామి తేజోమయానంద ల వద్ద  బొంబాయిలో సాందీపని ఆశ్రమం లో శిక్షణ పొందారు .. 1992 లో సన్యాసం దీక్ష పొంది వేలాది ప్రజల హృదయం లో స్థానం పొందారు  .అన్నిమతాల సారాన్ని గ్రహించి మత ఐక్యత కోసం కృషి చేశారు . స్వీయ వ్యక్తిత్వ వికాస సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు.

  మహా మృత్యుంజయ మంత్రానికి అద్భుత భాష్యం రాశారు  .సంకట మోచన్ ,ఇక్  ఓంకార్లకు రాసిన వ్యాఖ్య బాగా పేరు తెచ్చింది .సమకాలీన జీవిత శైలిపై ‘’సింప్లిసిటీ ఇన్ మెడిటేషన్ ,స్టార్మ్ టు పెర్ఫార్మ్ ,అవతార్, మేనేజింగ్ ది మేనేజర్ జర్నీ ఇంటు  హెల్త్ ఆంగ్లగ్రంధాలు రాశారు .సీనియర్ కార్పొరేట్ ఎక్సి క్యూటివ్ లకు ‘’హోలిస్టిక్ మేనేజ్ మెంట్ ‘’సెమినార్ లు నిర్వహించటం లో స్వామి మంచి సమర్ధత చాటారు .లండన్ బిజినెస్ స్కూల్ ఫోర్డ్ మొదలైన సంస్థలలోఆహ్వానం పై  ధార్మికప్రసంగాలెన్నో చేశారు .సెల్ఫ్ డెవలప్ మెంట్ కోర్స్ అంటే మహా ఇష్టం .దీనిని భారత దేశం లోనే కాక అనేక విదేశాలలో నిర్వహించి ప్రజల ఆలోచనా శైలి విధానాలలో గణనీయమైన మార్పులు తెచ్చారు .

242- ‘’అనుగీత ‘’  ను విని చెప్పిన -వైశంపాయనుడు (బిసి 400-200 )

మహా భారతం లో అశ్వమేధ పర్వం లో ‘’అనుగీత ‘’ఉంది అను అంటే అనుసరించినది అనిఅర్ధం  అంటే కురుక్షేత్ర సంగ్రామం లో అర్జునునికి శ్రీ  కృష్ణుడు  చెప్పినది భగవద్గీత .యుద్ధం అయ్యాక కొంతకాలానికి అర్జునుడు తాను  కృష్ణుడు చెప్పిన భగవద్గీతను మర్చిపోయానని ,మళ్ళీ ఒక సారి చెప్పమని కోరగా అది అసాధ్యమని కానీ దానికి అనుసంధానంగా కొన్ని విషయాలు చెబుతానని చెప్పిందే అనుగీత .దీనిని వైశంపాయనుడు విని లోకం లో ప్రచారం చేశాడు . ధర్మ నీతి మొదలైనవాటి గురించి అనుగీత లో పరమాత్మ  తెలియ జేస్తాడు   ఉపనిషత్తులలో ముఖ్య విషయాలన్నీ ఇందులో ఉంటాయి .భార్యా భర్తల  మధ్య ఉన్న చర్చలో మానవ శరీర నిర్మాణం జనన మరణాలు ,దేహం లోని దేవతల వివరాలున్నాయి .అధ్వర్యునికి సన్యాసికి మధ్య సంభాషణలో జంతుబలి దానిపూర్వాపరాల విశేషాలున్నాయి .గురుశిష్య స0వాదం లో అత్యున్నత మైన సత్యం గురించి వివరణ ఉంది .తర్వాత ధర్మ యుద్ధం యుద్ధనీతి అహింస మొదలైన వివరాలుంటాయి .ఉత్తమ వ్యక్తి అనుసరించాల్సిన విధానాలన్నీ అనుగీత లో పొందుపరచ  బడినాయి .ఇవికాక ఆనందం సుఖం అణకువ .జ్ఞానోదయం ,భయరాహిత్యం ,సంతృప్తి నమ్మకం ,క్షమా ధైర్యం అపకారం చేయకపోవటం ,సమానత్వం అహింస ,అక్రోధనం ,పగ ఈర్ష ,ప్రతీకారేచ్ఛ ,అసూయ మున్నగు విషయాల వివరణ ఉంది

 అనుగీత 36 భాగాలలో ఉంది .శంకరాచార్య ,విజ్ఞాన భిక్షుల దృష్టిని అనుగీత ఆకర్షన్చింది

   243-శ్రీరామ గీత చెప్పిన –శ్రీరాముడు

ఒకసారిశ్రీ  రాముని  దగ్గరకు తమ్ముడు చేరి అత్యంత వినయంగా తనకు జ్ఞాన విజ్ఞాన పూర్వక ఆత్మ విద్యను బోధించామని ప్రార్ధించాడు .వారిద్దరి సంవాదమే శ్రీరామ గీత.ఇది అద్వైత వేదాంతమే  దీనిని స్వామి శివానంద బాగా ప్రచారం చేశారు  .ఇందులోని సారాంశం తెలుసుకొందాం .

 ‘శ్రుతులు వినటం  ఉద్గ్రంధాలు చదవటం వలన  వచ్చేది జ్ఞానం.నిధిధ్యాసాదు ల వలన కలిగేది విజ్ఞానం.బ్రహ్మ విద్యను ఎవరికి పడితే వారికి చెప్పకూడదు .గురు శుశ్రూష చేసి గురు ముఖతా నేర్వాలి .ఉన్న జ్ఞానానం అంతా తెలుసుకోవాలని ఇంద్రుడు 101 సంవత్సరాలు తపస్సు చేశాడు .యముడు నాచికేతుని అనేక విధాలా పరీక్ష చేసి ఆత్మ విద్య నేర్పాడు .గురువుకు శిష్యునిపై పూర్తి నమ్మకం కుదిరితేనే బ్రహ్మ విద్య నేర్పుతాడు .శరీరమే ఆత్మ అనుకోవటం మాయ .మాయవలన ప్రపంచ సృష్టి జరుగుతుంది .శరీరం ఆత్మకాదు .ఇంద్రియజ్ఞానం ద్వారా ఆత్మ తెలియదు .మాయ విక్షేప ,ఆవరణ అని రెండురకాలు . సర్వకాల సర్వావస్థలలో ఉండేది సత్యం అదే ఆత్మ .అహంకారాదులను విసర్జించి ఇంద్రియాలను నియంత్రించి తదేక సాధన చేస్తే ఆత్మజ్ఞానం లభిస్తుంది .దానికి మించిన ఆనందమే లేదు .ఆత్మజ్ఞానమే బ్రహ్మజ్ఞానం ‘’అని రాముడు రామగీత ను తమ్ముడికి బోధించాడు .రామ గీత రెండుభాగాలలో ఉంది .శ్రీరామ హనుమల మధ్య సంభాషణే రెండవ రామ గీత .దీనిని ‘’అనుభావాద్వైతం ‘’అంటారు .తత్వ సారాయణం ‘’లో దీనిని సంపూర్ణంగా ఆవిష్కరించి చెప్పబడింది . ఇవికాక చాలా గీతాలు ఉన్నాయి మచ్చుకి కొన్ని –

సిద్ధ గీత- జనక సభ లో యోగుల జ్ఞానగానం —

మిథిలాధీశుడు రాజర్షి జనకమహా రాజు ఆస్థానం లో యోగులతోఆయన చర్చల సారాంశమే  ‘’సిద్ధ గీత ‘’  .దీని సారాంశం -చైతన్యం  అనంతంగా వ్యాప్తి చెందటం ,దీని అనుభవం స్వయం నియంత్రణ .కర్త కర్మల సంబంధ  నిషేధత్వం వలన కలుగుతుంది .యోగ వాశిష్టం ;;ఉపశాంతి ప్రకరణం ‘’లో ఉంది

– బక  గీత– ఇంద్ర -బక సంవాదం

దేవేంద్రునికి బక మహర్షికి మధ్య జరిగిన సంవాదమే ‘’బక గీత ‘’.ప్రపంచం లోని దుఃఖం లో మానవుడు అంతకాలం పడి ఉండి బాధలు అనుభవించటం దీని సారాంశం .ఇది మహాభారతం లో ఉంది .యమ గీత లో విష్ణుభక్తులు పాటించాల్సిన నియమాలుంటాయి .ఇది విష్ణుపురాణం లో ఉంది .ఉద్ధవుడికి కృష్ణుడు చెప్పింది ‘’భిక్షుగీత ;;భాగవతం లో ఉంది .దత్తాత్రేయుడు చెప్పింది జీవన్ముక్తి గీత ,వగైరా . గీతలు అనంతం మన తలరాత మార్చటానికి .

 సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-21-6-17-కాంప్ షార్లెట్-అమెరికా


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 248-కాతంత్ర ,చంద్ర ,కలాప వ్యాకరణ విధాన నిధి -పండిత  దీనా నాధ్ యక్ష (1921

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

248-కాతంత్ర ,చంద్ర ,కలాప వ్యాకరణ విధాన నిధి -పండిత  దీనా నాధ్ యక్ష (1921

పండిత దీనానాధ యక్ష12-6-1921న కాశ్మీర్ లో పండిత కుటుంబం లో జన్మించి పంజాబ్ యుని వర్సిటీ నుంచి సంస్కృత శాస్త్రి డిగ్రీ పొంది  ,ఆకాలపు మహోన్నత సంస్కృత విద్యా వేత్తలతో గాఢ సాన్నిహి త్యం సాధించి  స్థానిక పాఠశాలలో కర్మ కాండ నేర్చి ,పండిట్ రామ్ జూ కోకిలూ , పండిట్ రఘునాధ కోకిలూ  ల వద్ద  వ్యాకరణం అభ్యసించి పండిత కేశవ భట్  జ్యోతిష దగ్గర జ్యోతిషం నేర్చి ,పండిట్ పరశురామ్ శాస్త్రి పండిట్ కాకారాంశాస్త్రిల  దగ్గర అడ్వాంస్డ్ సంస్కృతం వ్యాకరణాలలో నిష్ణాతుడై ,పండిట్ ఆనంద కాక్ , ,పండిట్ నాధ్ రామ్ శాస్త్రిల సమక్షం లో న్యాయ శాస్త్రం కావ్య శాస్త్రం  నేర్చి శాస్త్రి డిగ్రీ అందుకున్నాడు .సంస్కృత భాషా సాహిత్యాలపై అమేయ మైన పట్టు సాధించి కాశ్మీర్ రాజ్య శాస్త్ర శిరో భూషణుడయ్యాడు

1945 లో సంస్కృత రీసెర్చ్ ఇన్ స్టి ట్యూట్ లో  కాపీయిస్ట్ గా చేరి ,1976 లో హెడ్ పండిట్ గా రిటైరయ్యాడు .తాను  చేరినప్పుడు 213 మాత్రమే ఉన్న సంస్కృత గ్రంథ వ్రాత ప్రతులను 5000  వరకు తన నిత్య పరిశోధనా కృషివలన చేర్చి కీర్తి పొందాడు .ఇక్కడే తన సంపాదకత్వం లో రామ చంద్ర సూరి రచన ప్రభావతి ప్రద్యుమ్న సంస్కృత నాటకం,సుఖానంద జాదూ కృతి శివ సూత్ర వివరణ  ,వాసుదేవకవి రాసిన శివ సూత్రవివరణ మంసారాం మోంగా కృతి స్వతంత్ర దీపికా ,నీలకంఠుని భవ చూడామణి  ,క్షేమరాజకృతి శివ సూత్ర విమర్శిని ,విద్యాకంఠుని తంత్ర గ్రంధం భావ చూడామణి ,ఈశ్వర కౌల్ కాశ్మీర్ దుర్భిక్షం పై రాసిన ‘’దుర్భిక్షితా దరుదయ  మొదలైన అమూల్య గ్రంధాలను లోకానికి అందించాడు  .లెక్కకు మించి విమర్శనా వ్యాసాలను సంస్కృత హిందీ ,ఇంగ్లిష్ లలో రాసి ప్రచురించిన నిత్య పరిశీలనా శీలి .రీసెర్చ్ సెంటర్ ప్రచురించి లైబ్రరీకి అందజేసిన  వ్రాత ప్రతుల కేటలాగ్ కు సహ సంపాదకత్వం వహించాడు

తర్వాత స్ట్రాల్ ఏషియన్ స్టడీస్ కేంద్రానికి రీసెర్చ్ అసోసియేట్ గా ఐదేళ్లు సేవ లందించాడు .పిమ్మట ఆర్కీలాజికల్ డిపార్ట్ మెంట్ లో ఒక ఏడాది పనిచేశాడు .భారత ప్రభుత్వ సంస్కృత సంస్థాన్ లో ఐదేళ్లు పనిచేసి తన విద్వత్ కు తగిన ‘’శాస్త్ర చూడామణి ‘’ఫెలోషిప్ పొందాడు .ఇంతటి సాహిత్య పిపాసి తనఇంటి లైబ్రరీలో  సేకరించి భద్ర పరచుకున్న  9 వేల ప్రచురణ గ్రంధాలను ,500 ల అపూర్వ అత్యంత విలువైన సంస్కృత గ్రంథ వ్రాత ప్రతులను వదిలేసి 1990 లో ఉగ్రవాదుల దాడులకు భయపడి ప్రవాసానికి పారిపోవాల్సిన దుస్థితి కలిగింది . ఆ   కాశ్మీర  శారదా మాత  ఎంత గా   దుఖిచిందో  ఊహ కు అందరాని విషయం.

 కాశ్మీరు పండితులు పాణిని నుంచి అందరూ గొప్ప వ్యాకరణ వేత్తలు ,ఆ సంప్రదాయాన్ని అవిచ్చిన్నంగా కొనసాగించిన అపార పాణినీ మూర్తులు .పండిత దీనా నాధా యక్ష అపూర్వ వ్యాకరణ సంప్రదాయాలైన కాతంత్ర ,చంద్ర, కల్ప విధానాలపై సాధికారత సాధించాడు .కాశ్మీర్ సంస్కృతీ వేదాంతం హిస్టరీ జాగ్రఫీ లంటే ఆయనకు మహా ప్రాణం .ఆయన ప్రసంగాలలో ,వ్రాతలలో తరచుగా రాజతరంగిణి, నీల కంఠ మత శ్లోకాలను ఉల్లేఖించేవాడు .పతంజలి మహా భాష్యాన్ని చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు .ఆయన సంస్కృత రచన భవభూతి  బాణ ,శ్రీ హర్షుల శైలి ఉంటుంది .వ్యాకరణ మంటే కీకారణ్యమే .అందులోకి ప్రవేశం దుర్లభమనిపిస్తుంది .దాన్ని బోధించటమూ కష్టమైన పనే .దాన్ని అత్యంత సులభంగా కరతలామలకం గా బోధించే నేర్పుఉన్నవాడు పండిట్  దీనానాధా యక్ష .తాను  ఈ బోధనా శైలిని ప్రముఖ  కాశ్మీర్ కవి సాహిబ్ కౌలా నుంచి నేర్చుకున్నానని కృతజ్ఞతగా చెప్పుకున్నాడు .

 లైబ్రరీలోని మేక్ బెత్ నాటకం చదివి ఆంగ్లం పై దృష్టిపడి ,ఆంగ్ల సాహిత్యాధ్యయనం చేసి షేక్స్పియర్ సాహిత్యాన్ని అంతటినీ సంస్కృతీకరించిన విద్యా వేత్త .ఆంగ్లాన్ని సంస్కృతం ద్వారా నేర్చిన మహాజ్ఞాని .సాంప్రదాయ  పండితుడైన భావాలలో ఆధునికత ,శాస్త్రీయత ఉన్నవాడు .కాశ్మీర్ శైవం లోని క్రమ సిద్ధాంతాన్ని ఎందరో విద్యార్థులకు బోధించి రీసెర్చ్ కు గైడ్ గా ఉన్నాడు ‘’.ఇండియన్ కావ్య లిటరేచర్ ‘’రచయితఏ కె వార్డ ర్ తో కలిసి పనిచేశాడు .ఆయన కాశ్మీర్ శారదామాత దివ్య కంఠా  భరణం  .

249- ప్రౌఢ లేఖక్ –పండిట్ దామోదర్ (1870)

కాశ్మీర్ మహారాజా’’ మదర్సా ‘’ ముఖ్య ఉపాధ్యాయుడైన సాహెబ్ రామ్ కుమారుడు దామోదర్ సంస్కృతం లో .మహా మేధావి సూక్ష్మగ్రాహి మహా వక్త వ్రాయసగాడు గా ప్రసిద్ధి చెందాడు  .వ్యాకరణ న్యాయ శైవాలలో అఖండ పాండిత్యమున్నవాడు  .సంస్కృత కావ్యాలను ఆయన శ్రావ్యమైన కంఠం తో గానం చేస్తూ వ్యాఖ్యానిస్తుంటే శ్రోతలకు పరవశం కలిగేది .మంచికవి అయిన దామోదర్ రాజతరంగిణిని కొనసాగించి పూర్తి చేయలేకపోయాడు . ‘’లేఖా సాహిత్యాన్ని ‘’సుసంపన్నం చేసి ‘’ప్రౌఢ లేఖక్ ;;గా గుర్తింపు పొందాడు .శ్రీహర్ష ,బాణ ,సుబంధు కావ్య మాధుర్యాన్ని జుర్రి అందరకు జున్నులాగా పంచిపెట్టిన వాడు .కాశ్మీర పండిత విద్యావేత్తగా గుర్తింపుపొందారు  .ఈయన సోదరుడు దయారామ్ హిస్టరీ జాగ్రఫీలలో నిధి .బూలర్  దామోదర్ ప్రజ్ఞను ప్రశంసిస్తూ  “produce Sanskrit prose or verse alike from the sleeve of his garment.”అన్నాడు .నీలమాత పురాణం ఆహటాయసం రాజా తరంగిణి లలోని చారిత్రిక భౌగోళిక విషయాలను అతి సునాయాసంగా అందరకు అర్ధమయ్యే రీతిలో రాశాడు .పండిట్ దామోదర్ చాలాకాలం  బ్రతికి ఉంటెకల్హణుడు రాసిన  రాజతరంగిణి ఇతని రచనతో పూర్తి  అయి ఉండేదని అరుల్  స్టెయిన్ అభిప్రాయం పడుతూ ‘’”Had Pandit Damodar been spared to complete it, his work would have shown that Kalhana could have found generations past no worthier successor.”అన్నాడు .

250-పాదేయ శతక కర్త -డా. రామ్ కరణ్  శర్మ(1927

ప్రఖ్యాత సంస్కృత విద్యావేత్త ,కవి డా రామ్ కరణ్  శర్మ 20-3-1927లో బీహార్ లోని శరన్ జిల్లా శివపురిలో జన్మించాడు .పాట్నా యూనివర్సిటీనుంచి సంస్కృత ఏం ఏ డిగ్రీ బీహార్ సంస్కృత సంస్థనుంచి సాహిత్యాచార్య వేదాంత శాస్త్రి  న్యాయ వ్యాకరణ శాస్త్రి బిరుదుల0దు కొన్నాడు .అమెరికాలోని కాలిఫోర్నియా యుని వర్సిటీనుండి పిహెడి పొంది ప్రొఫెసర్ ఏం బి ఎమెన్యు తో కలిసిపనిచేశాడు .చికాగో కొలంబియా కాలిఫోర్నియా వర్సిటీలకు విజిటింగ్ ప్రొఫెసర్ .2006 లో ఢిల్లీ లో  స్థిరపడ్డాడు

 శర్మ సంస్కృతాంధ్రాలలో చాలా రచనలు చేశాడు .సంస్కృతం లో ‘’సంధ్య ‘’కవితా సంపుటి ,పాధేయ శతకం ,వీణ  నవలలుగా  రాయిసా ,సీమ లు రాశాడు  భారతీయ కావ్యాలు వైద్య గ్రంధాలు ,పురాణాలను అనువదించాడు వందలాది రీసెర్చ్ పేపర్లు రాసి ప్రచురించాడు . ఆంగ్లం లో ‘’ఎలిమెంట్స్ ఆఫ్ పోయెట్రీ ఇన్ మహా భారత ‘’అనే గ్రంధం రాసి భారతం  ఉపమా రూపకాలంకారాలను విశ్లేషించాడు .పణిక్కర్ రాసిన ‘’యాంథాలజి  ఆఫ్ మిడీవల్  ఇండియన్ లిటరేచర్,శివ సహస్రనామ శతకం శివ సుకీయం  గగనావని, చరక సంహిత మొదలైన వాటికి సంపాదకత్వం వహించి వెలువరించాడు   .సంస్కృతం పై అనేక అంతజాతీయ సెమినార్లు నిర్వహించాడు . 1889 లో  సాహిత్య అకాడెమీ అవార్డు ,భారతీయ భాషా పరిషత్ అవార్డు ,ఢిల్లీ సంస్కృత అకాడెమీ అవార్డు , 2005 లో కృష్ణకాంత  హాండీకి  అవార్డును ప్రధాని మన్మోహన్ సింగ్ నుండి పొందాడు .ఈ అవార్డు అందుకున్న రెండవ అరుదైన వ్యక్తి రామ్ కరణ్ శర్మ .రాయల్ ఏషియన్ సొసైటీ ఫెలో .అమెరికన్  ఓరియంటల్ సొసైటీ మెంబర్ .బీహార్ ప్రభుత్వ సివిల్  సర్వీస్  లో ఉద్యోగించి అనేక ప్రభుత్వ  ప్రభుత్వేతర  సంస్థలనుండి లెక్కలేనన్ని పురస్కారాలందుకొన్న సాహితీమూర్తి శర్మ

  సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -19-6-17 -కాంప్-షార్లెట్-అమెరికా

 Inline image 1Inline image 2

 dr.  ramkaran sharma పండిట్ దీనానాధా యక్ష

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవిత గీర్వా ణం -3 243-సంస్కృత -కాశ్మీరి నిఘంటు నిర్మాత -కాశీర్ పాణిని -పండిత ఈశ్వర కౌల్ (1833 -1893 )

గీర్వాణకవుల కవిత గీర్వాణం -3

243-సంస్కృత -కాశ్మీరి నిఘంటు నిర్మాత -కాశీర్ పాణిని -పండిత ఈశ్వర కౌల్ (1833 -1893 )

సంప్రదాయ సంస్కృత భాషా కుటుంబం లో 4-7-1833 లో పుట్టిన పండిట్ ఈశ్వర కౌల్ మూడేళ్ళ చిన్నతనం లోనే తండ్రిపండిట్  గణేష్ కౌల్ ను కోల్పోయాడు .పండిట్ తిక్కారాం రజ్డా  మొదలైన సంస్కృత  ఉద్దండుల వద్ద  బెనారస్ నుండి మహారాజా రన్బీర్ సింగ్ వద్ద పని చేయటానికి వచ్చిన పండిట్ దయాకృష్ణ జోషీ వద్ద సంస్కృతం నేర్చి,పర్షియన్ భాషా లోతులూ తరచి ,అరబిక్ భాష అంతు చూశాడు . 1861 లో మహారాజా ఈయనకు పర్షియన్ అరేబిక్ గ్రంధాలను సంస్కృతం లోకి హిందీలోకి అనువదించే పని అప్పగించాడు .ఈపని పూర్తి చేశాక 1871 లో రాజు మహారాజా సంస్కృత పాఠశాలలో సంస్కృత హెడ్ టీచర్  గా నియమించాడు .

  కాశ్మీర్ పండిట్ లు అంటే వ్యాకరణ నిష్ణాతులు .టిబెటన్ గుజరాతీ  వ్యాకరణాలను  మొదట రాసింది కాశ్మీర్ పండిట్ లే  . అలాగే మొదటి కాశ్మీర వ్యాకరణాన్ని కౌల్ గ్రియర్సన్ తో కలిసి తయారు చేశాడు .పాణిని అష్టాధ్యాయి ఆధారంగా హేమచంద్ర తన వ్యాకరణం రాశాడు ఇప్పుడు కౌల్ ‘’కాశ్మీర్ శబ్దమిత్ర ‘’అనే వ్యాకరణం రచించాడు .ఇదికాక’’ కాశ్మీరీ -సంస్కృత కోశం ‘’నిఘంటు నిర్మాణం ప్రారంభించి సగం లో ఉండగా మరణిస్తే గ్రియర్సన్ దాన్నిపండిట్ ముకుంద రామ్ శాస్త్రి పండిట్ నిత్యానంద శాస్త్రి సహకారం తో  1932 లో పూర్తి చేశాడు.కాశ్మీరు పదాలను మొట్ట మొదటిసారిగా దేవ నాగర లిపి లో  తన వ్యాకరణం నిఘంటువు లలో రాసిన ఘన చరిత్ర ఈశ్వర కౌల్ ది .క్లిష్టమైన కాశ్మీర హల్లులను ఉచ్ఛరించటానికి మాండలిక గుర్తులను హారిజా0టల్ బార్ ,హాలంతా లను   ఉపయోగించిన భాషావేత్త కౌల్ . 1881 లోకాశ్మీర్ రాజ్య అనువాద శాఖలో డైరెక్టర్ గా నియమించబడ్డాడు మహారాజా రన్బీర్ సింగ్ మరణించేదాకా 1884 వరకు పనిచేశాడు తరువాత ప్రభువు ప్రతాప సింగ్ కౌల్ ను తన ఆస్థానం లో ముఖ్య జ్యోతిష్య పండితునిగా నియమించి గౌరవించాడు .ఈ పదవిలో 28-8-1893 లో మరణించేదాకా ఉన్నాడు  ..పండిత ఈశ్వర కౌల్ వ్యాకరణ సేవను శ్లాఘించిన సర్ అరుల్ స్టెయిన్ ఆయనను ‘’కాశ్మీర్ పాణిని ‘’అని గౌరవనామం తో కీర్తించాడు . 244-ద్వితీయ రాజతరంగిణికర్త -జోన రాజు (1420-1485)

పుట్టిన రోజు సరిగ్గా తెలియపోయినా ‘’ద్వితీయ రాజతరంగిణి’’ రాసిన జోనరాజు 1485 లో మరణించినట్లు తెలుస్తోంది .ఇతను కల్హణ రాజతరంగిణి ని కొనసాగిస్తూ తన రాజు జైన్ ఉల్ అబిదీన్ వరకు(1418-1470 ) ఉన్న కాశ్మీర్ రాజుల చరిత్ర రాశాడు .పూర్తిగా రాయాల్సినవాడు  మరణం వలన పూర్తి చేయలేక పోయాడు .  ఇందులో క్రమముగా తగ్గిపోతున్న హిందూరాజుల గురించి క్రమంగా బలపడుతున్న ముస్లిం రాజుల ప్రాబల్యాన్ని గూర్చి జోనరాజు తెలియ జేశాడు

सिद्धे यत्र सति त्रपाकुलमिव स्पर्धाभिलाषाहतेरन्तर्धि वहति त्रिलोकमहितं शेषं निजार्धद्वयम्।

स्नेहैकीभवदाशयद्बयजयाकाङ्क्षीव गाढं मिलद्देहार्धद्वयमस्तु तद्भगवतोरद्व्यैतसम्पत्तये ।।1।।

రెండు సగభాగాలైన అర్ధ నారీశ్వరులైన శివపార్వతులు ఒకరితో ఒకరుపోటీపడి ముల్లోకాలలో కలిసిపోయి లోకుల చేత ఆరాధింపబడ్డారు .మిగిలిన మిధునం స్నేహం గాఢమైన కోరికలతో కలిసిపోయి మరల మనలను ఆశీర్వ దిస్తున్నారు అనిభావం .

 జోనరాజు సుల్తాన్ సికందర్ చేసిన దేవాలయ నిర్మూలనాలు ,యాత్రాస్ధలా ల పై దాడులు గురించి రాశాడు .23 రాజుల చరిత్ర రాశాడుజోన రాజు .ఇందులో 13 మంది హిందూ ఒక భూటియా ,9 మంది ముస్లిం రాజులున్నారు .  490 సంవత్సరాలు పాలించిన రాజుల చరిత్ర ఉంది .కవి సికందర్ ,జైనములబ్దీ న్ రాజుల సమకాలికుడు .రచన సాధికారికమైనదే .కల్హణుడు ఎక్కడ ఆపేశాడో అక్కడనుంచి  ప్రారంభించాడు  జోనరాజు .రెంచాన్ నుంచి ఇస్లా0 లోకి మారిన ‘’బుల్ బుల్ షా’’ గురించి రాయలేదు  ముస్లిం రాజులకు ముందే కాశ్మీర్ పై 3 సార్లు దాడి చేసిన వారిగురించికూడా రాశాడు.మొదటిసారిగా  దుల్చా రెండవసారి రెంచాన్  మూడోసారి అచల లు దాడిచేశారు .తురుష్కుడైన  దుల్చా  60 వేల  సైన్యం తో దాడి చేశాడు  .అతనిదాడి ‘’లేడి జాతిపై సింహం దూ కుడు ‘’గా ఉందన్నాడు జోన్ రాజు .రెండవ దాడి చేసిన బౌద్ధుడు రెంచాన్ కేవలం కాశ్మీర్ సిరి సంపదలనుదోచుకోవటానికే వచ్చాడు .కాశ్మీర్ గద్దెనెక్కి కోట రాణీ తో లాలూచీపడ్డాడు .మూడవ దాడి చేసిన అచల కోటరాణి ని చంపి ఖాళీగా ఉన్న సింహాసనాన్ని ఎక్కాడు .ఇతని తర్వాత రాజైన షా మీర్ కాశ్మీర్ ముఖ చిత్రాన్ని మార్చేశాడు అన్నాడు జోనరాజు .ముస్లిం లు ఇతనిని ‘’కుల నాధుడు ‘’అని ఆరాధించారుఅన్నాడు . .లల్లేశ్వరి ,షా అందాన్ యోగుల గురించి జోనరాజు ఒక్కమాట కూడా రాయలేదు .అల్లాఉద్దీన్  కాలం లో కాశ్మీర్ లో వచ్చిన ఘోర కరువుగురించిరాశాడు .రాజధానిని అందర్కోట నుంచి అల్లాఉద్దీన్ పురకు మార్చి ,మళ్ళీ బాక్ టు పెవిలియన్ లాగా అందర్ కోట్ అనే జయాపీడా పురానికి  అక్కడినుంచి శ్రీనగర్ కు మార్చాడట .సుల్తాన్ షాబుద్దీన్ ను లలితాదిత్య మహారాజుతో పోల్చాడు

245-తృతీయ రాజ తరంగిణి కర్త -శ్రీవరుడు (1459

జోన రాజు శిష్యుడు ‘’శ్రీవరుడు ‘’గురువు పనిని కొనసాగించి ‘’తృతీయ రాజ తరంగిణి ‘’పేరుతొ 1459-1486వరకు ఉన్న రాజుల చరిత్ర రాశాడు प्रेम्णार्धं वपुषो विलोक्य मिलितं देव्या समं स्वामिनो मौलौ यस्य निशापतिनगसुतावेणीनिशामिश्रितः ।आस्ते स्वाम्यनुवर्तनार्थमिव तत्कृत्वा वपुः खण्डितं देयाद्द्वयभावनां स भगवान्देवोर्धनारीश्वरः

।భావం -శివుని ఫాలం పై  ఉన్న చంద్రుడు పార్వతి నల్లని జడలో సగ భాగం పై కలిసి పోయి తన యజమాని శివునికి ఆనందం కల్గించాడు .ఈ అర్ధనారీశ్వర0 మమ్మల్ని కాపాడుగాక

 కల్హణుడు ప్రారంభించిన అర్ధనారీశ్వర స్తోత్రాన్ని జోనరాజు ఆతర్వాత శ్రీవరుడు కూడా తమ రాజ తరంగిణి భాగాలలో కొన  సాగించారు వారి వారి ధోరణిలో .శ్రీవరుడు 15 వ శతాబ్ది కాశ్మీర్ రాజులు జనాలుబ్దీ న్  ,కొడుకు   హైదర్ షా ,మనవడు హాసన్ షా ల ఆస్థానం లో ఉన్నాడు .సంగీతం లో కూడా ప్రవీణుడు .కేదార గౌళ , గాంధార ,కర్ణాటక రాగాలకు ప్రచారం కల్పించాడు .కాశ్మీర దేశం లోని కరువుకాటకాలు ఉత్సవాలు ,వరదలు వగైరాలగురించికూడా తన రచనలో తెలియ జేశాడు .ఈ కవి కధాకౌతుక ,శుభాషితా వళి  కూడా రాశాడు .కదా కౌతుకం 15 కాండల కావ్యం .కథా  వస్తువు పర్షియన్  శృంగర  కథ .శుభాషితావళి 400 మంది కవుల చరిత్రవంటి కేటలాగ్ మాత్రమే కాక అజ్ఞాత కవుల గురించి తెలియజేసే రిఫరెన్స్ పుస్తకం

246- అరేబిక్ సంస్కృతాలలో అనర్గళ వక్త -పండిట్ సహజ భట్ (1862 -1935 )

కాశ్మీరీ  పండిత కుటుంబం లో 1862 లో జన్మించిన సహజ భట్ సహజంగానే జన్మతహా వచ్చిన సంస్కృతం లో అరేబిక్ భాషల లో నిష్ణాతుడై ,ఒక్క పొరబాటు శబ్దం లేకుండా ఆ రెండుభాషలలో అనర్గళంగా మాట్లాడేవాడు .తండ్రి చిన్నప్పుడే చనిపోతే రాజాస్థానం లో వైద్యుడుగా ఉన్న పెద్దన్న సత్ కాక్ పెంచి పోషించాడు .సీబీఐ ఏం స్కూల్ లో ఆంగ్లం చదవమని చేర్పిస్తే అందులో’’ నో ‘’   ముందు వచ్చి ‘’ఎస్ ‘’తర్వాత వస్తుంది కనుక దాన్ని చదవమని చెప్పి సంస్కృత అరేబిక్ పర్షియన్ భాషాలు చదివి నిష్ణాతుడయ్యాడు .వీటిని ఇంటివద్దే గురువుల వద్ద నేర్చాడు .యునానీ వైద్యమూ నేర్చి గొప్ప భిషగ్వరుడిగా పేరు పొందాడు .మూర్తీభవించిన సంప్రదాయి అయినా భావాలలో చాలా ఉదారుడు .జీవితకాలం లో కాశ్మీర్ దేశం లో మహా గొప్ప  యునానీ  వైద్యుడని ప్రసిద్ధిపొందాడు .పొడవుగా మూర్తీభవించిన కాశ్మీరీ పండిత వస్త్ర ధారణతో ఆయన మహా దర్జాగా కనిపించేవాడు .భట్ బహుభాషా పాండిత్యాన్ని గుర్తించిన మహారాజు అనువాదం శాఖలో ఉద్యోగిగా నియమించాడు .ఈయనసంస్కృతం లో ఉన్న  ఎన్నో వేదాంత ,న్యాయ ,వైద్యగ్రంధాలను పరిశీలించి ముద్రించి అనువాదాలు చేశాడు . 1890  లో డిపార్ట్ మెంట్ హెడ్ అయ్యాడు .సర్ అరుల్ స్టెయిన్ పండిట్ ముకుంద శాస్త్రి లాతోకలిసి భట్ 6 వేల  గ్రంధాల వ్రాతప్రతులు కేటలాగ్ తయారు చేశాడు .దీన్ని 1894 లో బొంబాయి ప్రెస్ లో ముద్రించారు “For the most conscientious and scholarly manner in which Sahaz Bhat discharged it, I feel all the more obliged as I can well realize how irksome a great portion of the work e.g. the careful reproduction of innumerable classical errors and apashabdas of the manuscripts must have been to his Pandit instinct. His learning and thorough acquaintance with the methods of Indian scholarship especially in the shastras traditionally cultivated in Kashmir have on many occasions most usefully supplemented my printed source of references”.అంటూ స్టెయిన్ పండిత సహజ భట్ సాహిత్య ఔన్నత్యాన్ని భాషా పాండిత్యాన్ని తనకు అందజేసిన సహకారాన్ని వేనోళ్ళ పొగిడాడు

 ఇదేకాక కాశ్మీర్ లో ఉన్న సంస్కృత కథనాలను చరిత్రలను హిందీలోకి స్టెయిన్ గోవింద కౌల్ సహాయం తో రాజు అభ్యర్థనపైతర్జుమాచేశాడు . 1899 లో కౌల్ మరణంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది .1935 లో73 వ ఏట పండిట్ సహజ భట్ సహజ మరణం చెందాడు  1905 లో వియన్నా లో ఉన్న అరుల్ స్టెయిన్ తన పూర్వ సహచరుడు భట్ విద్యా వైదుష్యాన్ని గురించి రాసిన ఉత్తరం చిరస్మరణీయం -“I gathered my old entourage. It was pleasure to talk the language of gods and though my interests have now moved far northward, I shall try to keep my old friend Pandit Sahaz Bhat by me when I occupy winter quarters at Gupkar where he had been with me and Govind Kaul in the old days.”

247-డాన్ క్విక్సోట్ ను సంస్కృతం లోకి అనువదించిన -ప్రొఫెసర్ జగద్ధార్ జాదూ (1890 -1975 )

 ప్రొఫెసర్ జగద్ధార్ జాదూ కాశ్మీర్ లో బ్రిజేహరాలోని జాదీపూర్ లో జన్మించి తర్వాత శ్రీనగర్ కు వలస  వెళ్లిన  జాదూ కుటుంబానికిచెందినవాడు  .తాత కేశవ భట్టు మహా రాజు ఆస్థాన జ్యోతిష్యుడు ,అధర్వ వేదం లోని పిప్పలాది  శాఖ పరిశోధనలో బ్రూలర్ కు సాయపడిన వాడు

జగద్ధార్ పంజాబ్ యూనివర్సిటీ నుంచి సంస్కృతం లో 14 వ ఏటా 1904 లో ప్రజ్ఞా పరీక్ష పాసై 1920 లో అదే యుని వర్సిటీ నుంచి సంస్కృతం లో శాస్త్రి డిగ్రీ సాధించి ,1920 లో మాస్టర్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజస్ అయ్యాడు . 1921లో ప్రభుత్వ రీసెర్చ్ డిపార్ట్ మెంట్ లోహెడ్ పండిట్ గా  చేరి 1924 వరకు పనిచేసి 1924 నుండి 27 వరకు జమ్మూలోని ప్రిన్స్ ఆఫ్ వేల్స్ కాలేజీ లో సంస్కృత బోధిస్తూ ,1931 లో శ్రీనగర్ ప్రతాపకాలేజి సంస్కృత ప్రొఫెసర్ అయి మళ్ళీ రీసెర్చ్ డిపార్ట్మెంట్ హెడ్ అయి 1946 వరకు ఉన్నాడు .తర్వాత ప్రభుత్వ మహిళా కాలేజీలో సంస్కృతం బోధిస్తూ 1951-53 వరకు గద్దెపై  ప్రిన్సిపాల్ అయి 1975 వరకు సేవ చేసి రిటైర్ అయ్యాడు

1924 లో ప్రొఫెసర్ ఆర్ కె కాంజిలాల్ తో కలసి ‘’నీలమత పురాణం  మతం ‘’క్రిటికల్ గ్రంధాన్ని మొట్టమొదటిసారిగా తన సంపాదకత్వం లో ప్రచురించి లోకానికి వెల్లడించి సాహిత్య లోకం నుంచి ప్రశ0సలు అందుకొన్నాడు .కాశ్మీర  దేశానికి చెందిన ఆధ్యాత్మిక మత ఆచార నమ్మకాల  సాంఘిక  సాంస్కృతిక సర్వస్వాన్ని లోకానికి మొట్ట మొదటి సారిగా ప్రజలు తెలుసుజానే అవకాశం కల్పించాడు .ఇదికాక బౌద్ధ పంచ దశకం ,పరమార్ధ చర్చ అనే బౌద్ధ వేదాంత గ్రంధాలతోబాటు ,పంచస్తవి టీకా ,పరాత్రి0శిక లఘు వృత్తి ,పరాత్రి0 శిక వివృత్తి ,పరాత్రి0శిక తాత్పర్య దీపిక మొదలైన అతి విలువైన 16 గ్రంధాలను తన సంపాదకత్వం లో వెలువరించి గొప్ప సాహితీ సేవ చేశాడు .భారతీయ వాస్తు శిల్పకళలపై ‘’ప్రసాద మండపం ‘’,ప్రభావతీ ప్రద్యుమ్న నాటకం ,చిత్త ప్రదీప ,అలంకార కుతూహల ,సోమా శంభుని ‘’కర్మ కాండ క్రమావళి ‘’లకు కూడా సంపాదకత్వం వహించాడు .

  జగద్ధార్ కీర్తి కిరీటం లో మరో కలికితురాయి -జాపనీస్ ,రష్యన్ సంస్కృత విద్యావేత్తలతోకలిసి 1913  లో 20 ఏళ్ళ వయసులో కాశ్మీర్ శైవ గ్రంధాలపై పరిశోధన చేయటం .భాసమహాకవి స్వప్న వాసవి దత్త నాటకాని రష్యన్ భాషలో అనువదించటానికి తోడ్పడ్డాడు .ఇదేకాక ప్రముఖ స్పానిష్ రచయిత సెర్వాంటిస్ రాసిన ‘’డాన్ క్విక్సోట్ ‘’నవలను పండిట్ నిత్యానంద శాస్త్రి తోకలిసి సంస్కృతం లోకి 1936 లో అనువాదం చేశాడు .ఒక యూరోపియన్ భాషా గ్రంధాన్ని సంస్కృతం లోకి  కాశ్మీరీ భాషలోకి  అనువదింపబడిన మొట్ట మొదటి గ్రంధమై రికార్డ్ సృష్టించింది .కాశ్మీర కవి పరమానంద రాసిన రాధా స్వయం వరం ,సుధామ చరిత్ర లను హిందీలోకి అనువదించాడు .ప్రొఫెసర్ జగద్ధార్ జాదూ సంస్కృత పాండిత్య గరిమను మెచ్చి ద్వారకా పీఠాధిపతి 1955 లో ‘’విద్యా మార్తా0డ ‘’బిరుదు ప్రదానం చేసి సత్కరించారు .ప్రయాగ విద్వత్ పరిషత్ ‘’మహా మహోపాధ్యాయ ‘’బిరుదు నిస్తే శ్రీనగర్ శారదా పీఠ రీసెర్చ్ సంస్థ ‘’గౌరవ డాక్టర్ ఆఫ్ ఇండాలజీ ‘’అందజేసింది 1976 లో జమ్మూ కాశ్మీర్ ప్రాదేశిక సంస్కృత పరిషత్ జాదూ గీర్వాణ గరిమకు గౌరవ సత్కారాలు అందించింది 5 వ ఏటా జ్ఞాన వయో వృద్ధు పండిత జగద్ధార్ జాదూ జగదాధారుని లో  కలిసిపోయాడు .

సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -19-6-17-కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 241- పంచాంగం రాసిన -పండిత ఆనంద శాస్త్రి (1940

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

241- పంచాంగం రాసిన -పండిత ఆనంద శాస్త్రి (1940

కాశ్మీర దేశం లో పంచాంగం రాసి కాశ్మీర్ పండుగలను ఉత్సవాలను జన నుండి అంత్యేష్ఠివరకు జరపాల్సిన కర్మకాండలు రచించటమేకాక ఆడియో కేస్ట్స్ గా తెచ్చిన ఘనత పండిత ఆనంద శాస్త్రి ది .ఆయన రాసిన పంచాంగం అత్యంత నిర్దుష్టమైనదిగా ప్రశస్తి పొందింది .ఆయన రచించిన ‘’విజయేశ్వర జంత్రి ‘’బాగా ప్రచారమైంది .కాశ్మీర్ పండిట్లను అక్కడినుంచి తరిమేసే ప్రయత్నం విస్తృతంగా జరుగుతున్నప్పుడు ఆయన వారు ఎక్కడ ఉన్నా అవలంభించాల్సిన విధులన్నీ ఇందులో పొందు పరచాడు .అదే ఇప్పుడు వారికి కరదీపికగా నిలిచింది . 1989లో పండితులను కాశ్మీర్ నుంచి బయటికి నెట్టి వేస్తున్న సందర్భం లో ఆయన తీవ్రంగా ఆలోచించి పండితులు ప్రవాసం లోకూడా అను సారించాల్సిన విధి విధానాలు ఇందులో రాశాడు  .ఆడియో కేస్ట్లు కరపత్రాలు అందుబాటులోకి తెచ్చాడు సంప్రదాయం అవిచ్చిన్నంగా కొనసాగాలన్న ఆయన తపన అత్యంత శ్లాఘనీయం .కర్మకాండ దీపికా ,శివరాత్రిపూజ ,శాండీయ ,అంతిమ సంస్కారం జన్మదిన పూజ లు కాశ్మీర్ పండితులకు ప్రవాసం లో గొప్ప మార్గ దర్శకాలైనాయి  .శాస్త్రి  పంచస్తవి భవాని సహస్ర నామం ,మహిమాపార్ ,భగవద్గీత లల్లేశ్వరి వాక్యాలపై తన స్వరం తో తెచ్చిన ఆడియో  కేసెట్లు ప్రతి పండిత కుటుంబం లోనూ మారు మోగుతాయి .కాశ్మీరీ భాష ను నేర్వటం మాట్లాడటం రాయటం మరిస్తే జరిగే అనర్ధాన్ని ఎలుగెత్తి చాటి భాషను కాపాడుకోవాల్సిన అవసరాన్ని చెప్పాడు  శారదా లిపి ని సంస్కరించి  ఆధునికతర పండిట్లకోసం ‘’శారదా ప్రయిమర్ ‘రాసిన భాషా సంస్కృతీ అభిమాని

 కాశ్మీర పండిత సంప్రదాయానికి నిలువెత్తు దర్పణంపండిత ఆనంద శాస్త్రి .వేషధారణలో భాషలో కాశ్మీర పండితుని లక్షణాలన్నీ కొటొచ్చినట్లు కనిపిస్తాయి .పండిత వస్త్ర ధారణను ‘’ఫెరేన్ ‘’అంటారు ’.తలపై టర్బన్ ఉంటుంది .ఆయన ఇంట్లో చదువుకొనే ,రాసుకొనే గదికూడా సంప్రదాయానికి మచ్చు తునకగా ఉంటుంది .బీరువాలు షెల్ఫ్లులు కుర్చీలు సోఫాలు  ఉండవు .కింద కూర్చుని రాసుకొనే వ్రాత బల్ల మాత్రమే ఉంటుంది .ఆయన దిన చర్య అత్యంత క్రమ బద్ధంగా ఉంటుంది .అయన ముఖం లో వేద విజ్ఞాన జ్యోతి దర్శన మిస్తుంది .కనులలో కాంతి మిరుమిట్లు గొలుపుతుంది .ఆయనతో మాట్లాడటమే గొప్ప ఎడ్యుకేషన్ . ఇంత గొప్ప పండితుని జీవిత వివరాలు తెలియకపోవటం విచారకరమే

242- భవానీ నామ సహస్ర స్తుతి కర్త -జానకీనాధ కౌల్ (కమల్ )(1914

కమల్ కలం పేరుగా రచనలు చేసిన జానకీనాధ కౌల్ శ్రీనగర్ లో 1914 లో జన్మించాడు .సంస్కృత కాశ్మీరీ ఆంగ్లలలో అనేక సుప్రసిద్ధ రచనలు చేశాడు .చిన్నప్పుడే తలిదండ్రులను కోల్పోయి అనాథఅయి ,బడికి వెళ్లి చదువుకొనే స్థితిలేక స్త్రీ సంక్షేమ శాఖలో కొద్దికాలం పని చేసి పొట్టపోసుకొని ,30 వాత టీచర్ గా డి .ఎ .వి .ఇన్స్టి ట్యూట్ లో పనిచేసి ,జూనియర్ లెక్చరర్ అయి ,క్రమంగా సంస్కృతం లో బి ఏ, ఏం ఏ ప్రభాకర డిగ్రీలు పొంది ,శ్రీనగర్ లో పరమానంద రీసెర్చ్ ఇన్ స్టి ట్యూట్ లో రీసెర్చ్ ఆఫీసర్ గా చేరి శ్రీరామ కృష్ణ ఆశ్రమ పత్రికకు సంపాదకుడై విశిష్ట సేవలు అందించాడు

  ఆధ్యాత్మిక విషయాలలో ఆరితేరి ,తనకున్న విశిష్ట సంస్కృత విజ్ఞానంతో శైవ శాక్తేయాలను  తంత్ర విద్యా   శాస్త్రాన్ని  అధ్యయనం చేసి అసలైన జిజ్ఞాసువు భక్తుడై స్వామి రామ తీర్ధ రాసిన గ్రంధాలు చదివి కవి గా తన సత్తా చాటాడు .నీల కంఠ పండితుని ఆశ్రయం లో భగవద్ గీతాధ్యయనం చేసి శంకర ,శంకరానంద భాష్యాలు జీర్ణం చేసుకొని  నీలకంఠ ప్రభుత్వ సర్వీస్ నుంచి రిటరయి ఋషీకేశ్ చేరి స్వామి శివానంద గా సన్యాసం దీక్ష పొంది అక్కడ శివానందాశ్రమమం నెలకొల్పాడు .వెళ్లేముందు శాస్త్రిని మరొక గొప్పపండితుడు స్వామి లక్ష్మణ జూ కు అప్పగించివెళ్ళాడు .స్వామి మహాసమాధి చెందాక ఆయన జీవితం పై అనేక వ్యాసాలూ  భ క్తి గీతాలు చాలా పత్రికలకు రాశాడు

లక్ష్మణ జూ తో ఉన్న గాఢ అనుబంధం వలన ఆధ్యాత్మికత మరింతగా పెరిగి సంస్కృత ఆంగ్లాలో భక్తి కవిత్వం పారించాడు .అవి వివిధ జర్నల్స్ లో పరుచురితమైనాయి .తర్వాత కాశ్మీర శైవం పా అభిరుచి కలిగి దాని ఆవిర్భావం గురించి పరిశోధన చేసి రాయటమేకాక అనేక శైవ గ్రంధాలకు వ్యాఖ్యానాలు రాశాడు .ప్రాణాయామ ,ధ్యానాలపై పుస్తకాలు రాశాడు ..ఆశ్రమానికి దగ్గర లో ఉన్న ఈషాబీర్ నుండి ‘’విద్యారణ్య పంచదశి ‘’అభ్యసించాడు .సృజనకర్త గా వ్యాఖ్యానకర్తగా అనువాదకునిగా కౌల్ ప్రజ్ఞ అసాధారణమై భాసించింది .జీవితం మొదట్లో పొందిన కస్టాలు మరచిపోయి జీవితాలకు ఉపయోగపడే అద్భుత రచనలు చేశాడు .ఆయన కవిత ‘’శివ శంకర సాంబు ‘’బాగా ప్రసిద్ధమైంది

 జానకీ నాధా కౌల్ ప్రతిభాసర్వస్వ0 గా ఆయన రాసిన ‘’భవానీ నామ సహస్ర స్తుతి ‘’,ని భావిస్తారు ఇది ఇంగ్లిష్ ,హిందీలలోకి అనువాదం పొందింది .దీనికి వ్యాఖ్యానమూ రాశాడు ..రెండవది ‘’శివ సూత్రం విమర్శ ‘’అనే హిందిగ్రంధం 3 పంచస్తవి కి ఆంగ్లానువాదం వ్యాఖ్యానం రాశాడు .కౌల్ గ్రంథ రచనకు రామకృష్ణ మతం అధిపతి స్వామి రంగనాథానంద ప్రశంసించారు

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -18-6-17 కాంప్-షార్లెట్ -అమెరికా

 Inline image 1   Inline image 2

   పండిట్ కౌల్ పండిట్ ఆనంద శాస్త్రి

Inline image 3

                  కాశ్మీర పండిత వేషధారణ
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వీక్లీ అమెరికా -11 (12-6-17 నుం డి 18-6-17 )వరకు షష్టి పూర్తి మహోత్సవ వారం

వీక్లీ అమెరికా -11 (12-6-17 నుండి 18-6-17 )వరకు

షష్టి పూర్తి మహోత్సవ  వారం

 12-6-17 సోమవారం -జ్ఞానపీఠ పురస్కార గ్రహీత ,నిత్య కవితా కృషీవలుడు డా సి నారాయణ రెడ్డిగారు 86 వ ఏటమరణించటం సాహిత్య సంగీతాభిమానులను అశనిపాతం లాంటి వార్త..జీవితం లో అన్ని సోపానాలు అధిరోహించిన సార్ధక జీవి .

మంగళవారం  యు ట్యూబ్ లో తెలుగు పాప్యులర్  టి విలో బుల్లితెర నటుడు దాన్ని తీర్చి దిద్దిన ఘనుడు ,ముద్దమందారం సినిమాతో చలన చిత్ర అరంగేట్రం చేసిన ప్రసిద్ధ నాటక రేడియ సినీ నటుడు స్వర్గీయ విన్నకోట రామన్న పంతులుగారి మనవడు ప్రదీప్ ,భార్య సరస్వతి ల ఇంటర్వ్యూ  చూసాం   .వారిద్దరూ చేస్తున్న కృషి అద్వితీయమని పించింది ..ఆస్ట్రో ఫిజిక్స్ చదవటం నత్త నడక లా ఉంది .సాయంత్రం మైనేనిగారు ఫోన్ చేసి డా ఎల్లాప్రగడ రామ మోహనరావు గారి బావగారు డా భండారు రాధాకృష్ణ మూర్తి గారి ఫోన్ నంబర్ ఇస్తే మూర్తిగారితో మాట్లాడాను వారు ఎంతో అభిమానంగా మాట్లాడారు . నా రచనలన్నీ రావుగారి ద్వారా చదివానని సంతోషం తెలియ బరచారు బుధవారం గీర్వాణం 3 ను 225 వరకు రాశాను .రాత్రి’’ గొట్టం’’ లో హాస్య నటుడు శివారెడ్డి ,ఇమిటేషన్ రాజుల ఇంటర్వ్యూ లు చూసాం బాగున్నాయి

         పవన్ ఇంట్లో ‘’అలనాటి గ్రామీణ వైభవం ‘’

పవన్ పెద్ద కుమార్తె పెద్దమనిషయినందున  శుద్ధి రోజు గురువారం నన్ను విఘ్నేశ్వర పూజ ,పుణ్యాహవాచనం చేయాలని కోరాడు .ఉదయం 11 గంటలకు మొదలు పెట్టి 12 30 కు పవన్ దంపతులతో పూర్తి చేయించాను  .మా అందరికి వాళ్లింట్లోనే భోజనం ..దోసకాయ పప్పు వంకాయ కూర బెండకాయ కూర , అట్లు ,టమేటా  పచ్చడి పపూర్ణం  బూరెలు ,పులిహోర ,సాంబారు పెరుగు మామిడిపండు ముక్కలు కమ్మని భోజనం చేశాము . మా ఇద్దరికీ నూతన వస్త్రాలు అందజేసి ‘’ఘనమైన తాంబూల’’మిచ్చారు ..సాయంత్రం గీర్వాణం 230 వరకు రాశాను .రాత్రి వర్షం వచ్చే హడావిడేకాని రాలేద్దు

  శనివారం  మధ్యాహ్నం పవన్ వాళ్ళ ఇంట్లో’’ బంతి భోజనం ‘’ మా కుటుంబం ,ఉషా -రాంకీ ,బులుసు కుటుంబాలు ,పవన్ తమ్ముడు భార్య పిల్లలు ,పవన్ భార్య రాధ మేనమామ కొడుకు కుటుంబం భోజనాలలో పాల్గొన్నాం చి ప్రణీతకు హారతి ఇచ్చి ,అందరి చేత ఆశీస్సులు అందజేయించి  మా అల్లుడిచేత వేదాశీస్సులు ఇప్పించాడు పవన్ . ఉదయం రాంకీ తో అభిషేకం చేయించాడు . మంగళహారతి ఆడ వాళ్ళ పాటలు చాలా సందడిగా హడావిడిగాఅమెరికాలో  తెలుగింటి లోగిలి లా పవన్ ఇల్లు కళకళ లాడింది .

   దీనికి మించి  పవన్ తీసుకున్న శ్రద్ధ ,సంప్రదాయం ఆచరణ మరింత వన్నెకు తెచ్చింది మరొకటి ఉంది .50 ఏళ్లకు  పూర్వం తెలుగు గ్రామసీమలలో చక్కగా అందరూ కింద కూర్చుని అరి టాకులలో హాయిగా భోజనం చేసే’’పంక్తి భోజనం’’ పద్ధతిని ‘’బంతి నాడు ;; పవన్ ఏర్పాటు చేశాడు .అందరిని హాయిగా కింద కూర్చునే సౌకర్యం కలిగించి కస్టపడి అరటిఆకులు కొని వాటిలో భోజనం చేయించే ఏర్పాటు చేశాడు దీనికి అతనిని  మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను .భార్య రాధ కూడా అతనికి సరైన చేదోడు .ఇద్దరికీ కృషి దీని విజయం వెనుక ఉంది .ఒక మినీ’’ అగ్రహారపు’’ వేడుకలా జరిగింది .నేను దీన్ని అందరికి ‘’పవన్ చిరివాడ అగ్రహారాన్ని తన అమెరికా ఇంట్లో చూపించాడు ‘’అన్నాను అందరు చాలా ఉప్పొంగిపోయారు . అందరి కి  అభినందనలు .కేరింతలు నవ్వులు ,ముచ్చట్లు కొసరి కొసరి వడ్డించటాలు పదార్ధాలపై చక్కని కామెంట్లు తో వాతావరం పరామ రామణీ యకం గా జరిగింది . మా శ్రీమతి ప్రణీత కోసం కుట్టిన పూల జడ ఆఅమ్మాయి కి అలంకరించి ఆడపిల్లలు ముత్తైదువులు  ఆనంద  పరవశులయ్యారు .దీనికి మించి వడ్డించిన పదార్ధాలు మరీ రుచికరం గా ఉన్నాయి .

 మామిడికాయ పప్పు ,వంకాయ కూర ,దొండకాయ కూర ,ఆలూ వేపుడు ,కొబ్బరి చట్నీ ,మైసూర్ పాకం ,పరవాన్నం అట్లు ,పులిహోర,అప్పడాల పిండి ,ఊరమిరపకాయ అప్పడాలు సాంబారు పెరుగు మామిడిపండు ముక్కలు ,ఐస్క్రీమ్ లతో అందరం కడుపునిండా తిన్నాం . అన్నీ రుచికరంగా ఉన్నాయి . ఏ ఒక్క దానికీ వంక పెట్టె వీలులేదు ..   పవన్ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు పిలిచినా చక్కని ఆతిధ్యం మర్యాదా ,మన్నన లభిస్తాయి  ఆ దంపతుల ’’ రూటే సెపరేటు’’ .ఈ రోజు రాధ  ఉషా ల పుట్టిన రోజు కూడా కావటం విశేషం అన్నాలదగ్గరే బర్త్ డే కేక్ కట్ చేయించి పాట పాడి వేడుక నిర్వహించటం మరింత శోభనిచ్చింది ..ఇంత  సరదాగా ఇంతమంది వచ్చి నిండుమనసుతో ప్రవర్తించటం చాలా గొప్ప విషయం అందరూ అభినంద నీయులే . పవన్ ఇంట్లో పెళ్లి వేడుక ముందే వచ్చినంత శోభ కనిపించింది  ; ఈ ఫోటోలన్నీ పవన్ గూగుల్ ఫోటోలు లో పంపాడు కావాల్సివస్తే చూడచ్చు .

 శనివారం సాయంత్రం మా అల్లుడు ,మనవళ్లు అశుతోష్ ,పీయూష్ లు ఫ్లయిట్ లో కాలిఫోర్నియా వెళ్లారు ఒక వారం గడిపి వస్తారు ..

               కొలంబియాలో 15 నిమిషాలు

మా అల్లుడి మేనమామ కొడుకు చైతు అనే చైతన్య హైదరాబాద్ నుంచి ,మా మనవడు సంకల్ప్ తోపాటు షార్లెట్ వచ్చి కొలంబియా యుని వర్సిటీ లో ఏం ఎస్ చదివి  పాసై అట్లా0టా లో  ఉద్యోగం పొందాడు .అక్కడ చేరే లోపు ఇక్కడి మావాళ్లను చూడటానికి గురువారం వచ్చాడు . అతను సోమవారం ఉదయం ఫ్లయిట్ లో కొలంబియా నుంచి అట్లా0టా  వెళ్లిఆఫీస్ లో   చేరాలి  అందుకని మా అమ్మాయి అతన్ని అట్లా0టా లో కారులో దిగ బెట్టి రావటానికి వెడుతూ ఉంటె మేమిద్దరం కూడా సరదాగా మరో కొత్తప్రదేశం చూడచ్చునని మేమూ వెళ్లాం .కొలంబియా సౌత్ కరోలినా రాజధాని ఇక్కడినుంచి కారులో వెళ్ళటానికి గంటన్నర పడుతుంది .కొలంబియాలోని బిజినెస్ స్కూల్ అమెరికాలోనే చాలా ప్రసిద్ధి చెందింది . మేము శనివారం రాత్రి 7-30 కు  బయల్దేరి 9 గంటలకు కొలంబియా చేరి యూనివర్సిటీకి దగ్గరలో   చైతు ఉంటున్న అపార్ట్ మెంట్ లో  దింపి ఒక పావు గంటమాత్రమే ఉండి రాత్రి 9-15 కు మళ్ళీ బయల్దేరి రాత్రి 10-45 కు షార్లెట్ చేరాం .ఇదో సరదా అనుభవం

           మా గురు వరేణ్యులు శ్రీ మహంకాళి సుబ్బరామయ్య గారి కుటుంబ సభ్యులతో పరిచయం

ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా కలుస్తారో తెలియదు . మా అమ్మాయికి పరిచయం ఉన్న డాక్టర్ ఉపాధ్యాయుల శ్రావ్య గారింట్లో వాళ్ళ అమ్మా నాన్నలకు షష్టి పూర్తి మహోత్సవం 18-6-17 ఆదివారం ‘’ఫాదర్స్ డే ‘’నాడు జరుపుతున్నామని  శనివారం దంపతులకు పూజ ఉంటుందని ,మా ద0పతులను తీసుకొని తప్పనిసరిగా రావాలని కోరారు ,ఆమె భర్త కూడా డాక్టర్ .ఆయన మా పెద్ద తోడల్లుడు ఖమ్మం లో ఉంటున్న శ్రీ శంభుని శ్రీరామ చంద్ర మూర్తిగారిపెద్దబ్బాయి రవి కి క్లాస్ మేట్ . అందుకని కొలంబియా వెళ్లేముందు వాళ్ళ ఇంటికి వెళ్లాం .దంపతుల పూజ ఆదివారం ఉదయం 11 గంటలకు మార్చామని లక్ష వత్తుల నోము శ్రావ్య అమ్మా నాన్న గార్లు చేసుకొంటున్నారని చూచసి ,భోజనం చేసి వెళ్ళమాన్నారు .అక్కడ డా శ్రావ్య గారి అమ్మమ్మగారు మా అమ్మాయికి పరిచయమై  ఉయ్యూరు వాళ్లమని తెలిసి ఆప్యాయంగా మమ్మల్ని పలకరించటానికి వచ్చారు .మాటలలో ఆవిడ ఉయ్యూరు హైస్కూల్ లో నాకు 8 వతరగతిలో తెలుగుచెప్పిన సెకండరీగ్రేడ్ టీచర్  ,ఆతర్వాత 1967 లో నేను సైన్స్ టీచర్ గా అక్కడ పని చేస్తున్నప్పుడు నా సహా ఉపాధ్యాయులు ,వారి అమ్మాయిలూ అబ్బాయిలు నా దగ్గర చదువుకొన్న గురువుగారు స్వర్గీయ మహంకాళి సుబ్బరామయ్య గారి తమ్ముడి భార్య  . ఆయన తణుకు  పాలిటెక్నీక్  లో లెక్చరర్ గా  చేసి చనిపోయారు .ఆయన్ను ఉయ్యూరులో మా గురువుగారింట్లో చూశానుఒకసారి .అంతేకాదు ఆవిడ మరొక కూతురు ఉయ్యూరులో ఫ్యాక్టరీ లో పనిచేసిన స్వర్గీయ దంటు  శర్మగారి పెద్ద కోడలు అని విషయాలు తెలిసి చాలా సంతోషమేసింది మళ్ళీ మా గురువుగారిని చూసినంత ఆనందం కలిగింది ఆవిడతో మాట్లాడుతుంటే .రేపు వస్తామని చెప్పి కొలంబియా వెళ్లాం

 డా  శ్రావ్య గారి తలిదండ్రులు శుక్రవారం సత్యనారాయణ వ్రతం శనివారం లక్ష వత్తులనోము మూడురోజులూ యధాప్రకారం  హోమాలు దానాలు స్నానాలు తో ఆదివారం అవబృధస్నానం పూర్ణాహుతి తర్వాత ద0పతులకు పూజ నిర్వహించారు . అన్నీ శ్రావ్యగారే  దగ్గరుండి చూస్తున్నారు  మా ఇద్దరు తోపాటు మరో దంపతులకు పూజచేసి నూతన వస్త్రాలు ఇచ్చి ఆశీర్వచనంపొందారు .వారిద్దరికీ మేమిద్దరం కొత్త బట్టలు పెట్టాము .వారు ‘’మీరు రావటమే మా అదృష్టం మళ్ళీ బట్టలు కూడానా ?’’అంటే’’ అమెరికాలో  శాస్త్రోక్తంగా షష్ఠి పూర్తి జరుపుకొంటున్నందుకుఅభినందనగా అంద  జేస్తున్నాము ‘’అన్నాను ఆయన చాలా సరదాగా మాట్లాడారు . వారిది తణుకు .మా బావమరిది ఆనంద్ వియ్యంకుడు విజయబాంక్ ఆఫీసర్ జి.ఎల్.మూర్తి గారు తెలుసా అని అడిగితే    చాలా బాగా తెలుసు ‘’అన్నారు .. ఈయన భార్య చెల్లెలే దంటు  శర్మగారి పెద్దకోడలు .దంటు  వారి బంధుత్వం పరిచయాలు గుర్తు చేసుకున్నాం వాళ్ళతో . దంటు  వారబ్బాయి సుబ్రహ్మణ్యం మా పిల్లలకు క్లాస్ మేట్. /డా శ్రావ్య గారి అమ్మమ్మగారికి అంటే మా గురువుగారు సుబ్బరామయ్య గారి మారద లుగారికి సరసభారతి పుస్తకం ‘’దైవ చిత్తం ‘’  ఇచ్చాను ఆవిడ చాలా సంతోషించారు . దంటువారికోడలు తమ అత్తగారికి ఫోన్ చేసి మేము వచ్చిన సంగతి చెబుతామని సంతోషంగా చెప్పారు .ఇలా తీగ లాగ కుండానే డొంకంతా కదిలింది . ఉదయం 11 గంటలకు మమ్మల్ని ఇక్కడ దించి మా అమ్మాయి వేరే ఫన్ క్షన్ కు వెళ్ళింది .

 ఈ విధంగా మన ఆంధ్రులు అమెరికాలో తమ దేశ సంస్కృతీ సంప్రదాయాలను ఘనంగా పాటించి ఆదర్శంగా నిలిచారు అభినందనలు .

     కీ. శే.    .వెంట్ర ప్రగడ  బ్రహ్మానందం కూతురు రజని తో పరిచయం

డా శ్రావ్య గారింట్లో ఉండగానే ఒకమ్మాయి నా దగ్గరకొచ్చి ‘’అంకుల్ మీరు దుర్గా ప్రసాద్ గారుకదా ‘’అన్నది నేనెప్పుడూ చూడని ముఖమని పించి ఆశ్చర్యంగా ఉంటె తాను ఉయ్యూరులో మా ఇంటికి ముందు ఉండే  బ్రహ్మానంద0 కూతురు  రజని అని చెప్పింది . మరింత ఆశ్చర్యమేసింది ఆ అమ్మాయివాళ్లూ షార్లెట్ లోనే మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెనక వైపు ఉంటారట ..భోజనాలు అయ్యాక మా అమ్మాయికి ఫోన్ చేసి తాను రావటం ఆలస్యమౌతుందని చెబితే రజని  భర్త  పిల్లాడు మమ్మల్ని వాళ్ళ కారులో మా ఇంటి దగ్గర దించారు ..ఇదొక అనుభవం .

 భోజనాలలో బొబ్బట్లు పులిహోర  వడ ,ఆవడ ,మామిడికాయ పప్పు గుత్తివంకాయ కూరా కంద బచ్చలి కూర పనసపొట్టు కూర  చట్నీ ,సాంబారు పెరుగు కిళ్లీ . పెద్దగా తినాలనిపించక బొబ్బట్లు మాత్రమే తిని మిగిలినవి తిన్నానని పించాను .ఇలా ఈ వారం మూడు భోజనాలు రెండు ఫంక్షన్లు గా గడిచింది

 గీర్వాణం 3 ను 242 వరకు రాశాను   ఆధునిక కాశ్మీర్ పండిట్ల సంస్కృత సేవ లోకానికి పెద్దగా తెలియదు .వారి గురించి రాస్తుంటే ఒళ్ళు పులకి స్తోంది   క్రికెట్ ఫైనల్ లో ఇండియా ను పాకిస్తాన్ ఓడించటం మన వాళ్లకు కొరుకుడు పడటం లేదు ..మైనేనిగారు వాళ్ళ పెరడులో కాసిన కాయగూరలఫోటోలు  పెట్టి నోరూరించారు

         మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -18-6-17 -కాంప్-షార్లెట్-అమెరికా

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

యథా —-తథా 

యథా —-తథా

-ఆధునికకాలం లో 

పెనం అట్లకాడ ఇడ్లీ పాత్ర 
 కుక్కర్ కంటైనర్ 
వంటి గృహోపకరణాలు 
అన్నీ అయిపోయాయి ”నాన్ స్టిక్” 
అలాగే జీవితం లో కూడా 
ప్రేమలు ,పెళ్లిళ్లు ,దాంపపత్యాలు  
స్నేహాలూ బాంధవ్యాలూ 
మానాలు ,అభిమానాలూ
ఆప్యాయతలు ,ఆధరణలు  
అన్నీ కూడా అయిపోయాయి” నాన్ స్టిక్ ”

గబ్బిట దుర్గాప్రసాద్ -18-6-17 -కాంప్-షార్లెట్ -అమెరికా
Posted in రచనలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 238-కాశ్మీర్ శైవ దర్శన బృహత్ కోశ కర్త -నీలకంఠ గర్తు (1925-2008 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

238-కాశ్మీర్ శైవ దర్శన బృహత్ కోశ కర్త -నీలకంఠ గర్తు (1925-2008 )

శ్రీనగర్ పండిత కుటుంబం లో 2-1-1925 న జన్మించిన నీలకంఠ గర్తు ,పండిట్ లైకాక్ లాంగు పండిట్ ,పండిట్ హరభట్ట శాస్త్రి పండిట్ మహేశ్వరనాధ్ నెహ్రవంటి ఉద్దండులవద్ద     అడ్వాంస్ డ్  సంస్కృత వ్యాకరణం లింగ్విస్టిక్స్ నేర్చి ప్రజ్ఞా విశారద శాస్త్రి డిగ్రీలను పొందాడు .ప్రభాకర్ డిగ్రీ కూడా అందుకొని సంస్కృత బి ఏ సాధించాడు .ప్రొఫెసర్ బాలాజీ నాధ్ పండిట్ ,స్వామి లక్ష్మణ్ జూ వద్ద శైవ మాత గ్రంధాలు అధ్యయనం చేశాడు .కాశ్మీర్ లోని ‘’త్రాల్ ‘’లో ఉన్న ప్రభుత్వ సంస్కృత పాఠశాలలో సంస్కృత పండిట్ గా  ఉద్యోగం లో చేరి ,సంస్కృతం హిందీలలో  లో ఏం ఏ అందుకొన్నాడు .జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ రీసెర్చ్ అండ్ పబ్లికేషన్ డిపార్ట్ మెంట్ లో అసోసియేట్ గా చేరాడు . 8-12-2008 న చనిపోయాడు .కాశ్మీర శైవ దర్శన బృహత్ కోశం తోపాటు చాలా గ్రంధాలు హిందీలో రాశాడు హర్షేశ్వర మహాత్మ్యం ను ఆంగ్లం లోకి అనువదించాడు

239-కాశ్మీర్ సంస్కర్త -పండిట్ నిత్యానంద శాస్త్రి (1871-

కాశ్మీర పండిత కుటుంబం లో 1874 లో జన్మించి జమ్మూ కాశ్మీర్ లోవిద్యా వ్యవస్థ లేకపోయినా ప్రయివేట్ గా చదివి  అప్పటివరకు ,మెట్రిక్ పాసయిన ఇద్దరిలో ఒకరుగా రికార్డ్ సృష్టించి,సంస్కృతంలో గాఢ పాండిత్యాన్ని సాధించి ఆంగ్లం చదవాలన్న కోరికతో ,సంప్రదాయ జీవి అయినా తండ్రికి ఇష్టం లేనందున రహస్యంగా శ్రీకాంత్ ఖాజాన్సీ వద్ద చదివి మాస్టరీ సాధించి ,లాహోర్ లో అరుల్ స్టెయిన్ అనే ఓరియెంటలిస్ట్ పరిచయమై ఆయన ఆధ్వర్యం లో నిర్వహింప బడే పంజాబ్ యూనివర్సిటీలోసంస్కృత   ప్రజ్ఞ పరీక్ష రాసి పాసయ్యాడు .స్టెయిన్ తో ఈపరిచయం జీవితాంతం కొనసాగింది .స్టెయిన్ కు కాశ్మీర్ సంస్కృత గ్రంధాలను ఆంగ్లం లోకి అనువదించటానికి శాస్త్రి ఎంతో  తోడ్పడ్డాడు .శాస్త్రీవలన గీయర్సన్ ,వోగెల్ వింటర్నిటీజ్ ,వేరీజ్ మొదలైన పాస్చాత్య పండితులు సంస్కృతం విషయం లో ఎంతగానో సాయం పొందారు

 16 వ ఏట నే నిత్యానంద శాస్త్రి ప్రభుత్వ పాఠశాలలో సంస్కృత ఉపాధ్యాయుడై సంస్కృత బోధ చేశాడు .తర్వాత సంస్కృతం లో శాస్త్రి డిగ్రీ పొంది ,1916 లో శ్రీనగర్ ప్రతాప్ కాలేజీ సంస్కృత ప్రొఫెసర్ అయ్యాడు .ఆంగ్లం చదివి మేధావి అయినా కాలేజీకి సంప్రదాయ కాశ్మీర్ పండిత వస్త్ర ధారణతోనే వెళ్ళేవాడు . 1897 లో స్వామి వివేకానంద కాశ్మీర్ సందర్శించినప్పుడు ఆయనను దర్శించిన నలుగురైదుగురు కాశ్మీర్ పండితులలో నిత్యానంద ఒకరు .ఆయనతో గ్రూప్ ఫోటో దిగాడు .1906 లో వైస్ రాయ్ లార్డ్ కర్జన్ శ్రీనగర్వచ్చినప్పుడు సంస్కృతం లో ఆయనకు సన్మాన పత్రం రాసి చదివాడు శాస్త్రి  .ఆనాటి కాశ్మీర్ పండితులు విద్యా వ్యాసంగం లోనే కాక అనేక సాంఘిక ఆర్ధిక రాజకీయ కార్యక్రమాలలో ముందు ఉండేవారు అలాంటివారిలో శాస్త్రి కూడా ఒకరు .ఆయన శిష్యులలో రాయబారి టి యెన్ కౌల్ ,చరిత్రకారిని పుపుల్ జయకర్ .1930 లో నిత్యానంద ప్రొఫెసర్ గా రిటైర్ అయినపుడు కౌల్ వీడ్కోలు ప్రసంగం చేశాడు .

  పండిత మదన మోహన మాలవ్యాకు కాశ్మీర్ పండితులంటే విపరీత మైన ఆరాధన ఉండేది ఆయన 1929 అఖిలభారత  హిందూ మహా ధర్మ సమ్మేళన  సభకు రావల్ పిండి వచ్చినప్పుడు  నిత్యానంద ఆయనను కలిశాడు మాలవ్యా శాస్త్రిని బెనారస్ విశ్వ విద్యాలయ ఫాకల్టీ లో చేరవలసిందిగా ఆహ్వానించగా కుటుంబ పరిస్థితులవలన రాలేనని చెప్పగా ‘’మా యుని వర్సిటీ తెలుపులు మీకోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయి ఎప్పుడొచ్చినా సంతోషమే ‘’అన్నాడు మాలవ్యా .స్టెయిన్ కూడా ఎక్స్ ఫర్డ్ కు ఆహ్వానించినా తిరస్కరించాడు .నిత్యానంద శాస్త్రి విజ్ఞాన సర్వస్వము వంటివాడు .కాశ్మీర్ వాడాలి వెళ్లాలని ఉండేదికాదుకాని శీతాకాలం లో విద్యాలయాలు మూసి వేసినప్పుడు మాత్రం దేశం లోని సంస్కృత విద్యాలయాలను సందర్శించేవాడు .సంస్కృత విడవాసులను కలుసుకొనేవాడు .తన కార్య క్షేత్రానికి విద్య కు మాత్రమే పరిమితం చేయకుండా శాస్త్రి సాంఘిక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వ హించాడు .1930 లో ఏర్పడిన సంస్కృత సాహిత్య పరిషత్ కు మొదటి అధ్యక్షుడయ్యాడు .విధవలకు అనాధలకు ఆశ్శ్రయం కోసం ‘’వనితా ఆశ్రమం ‘’స్థాపించాడు .ప్రతినెలా తనజీతం లో పదిశాతాన్ని అనేక దాన ధర్మాలకు ఖర్చు చేసిన వితరణం శీలి శాస్త్రి .హార్వర్డ్  యూనివర్సిటీలోసంస్కృతం ప్రారంభించినపుడు స్పూనర్ కోరికపై 1913 లో ‘’తై తరీయ ఉపనిషత్ ‘’కు నాలుగు భాగాల సంస్కృత వ్యాఖ్యానం రాసి పంపాడు అది ఆ యుని వర్సిటీ లైబ్రరీలో భద్రం గా ఉంది

240 అభినవ కల్హణుడు -పండిత గోవింద కౌల్ (1846 -1899 )

1846 లోఆనాటి ప్రపంచ ప్రసిద్ధ సంస్కృత విద్వా0సు డైనపండిత బల భద్ర కౌల్ పెద్దకుమారునిగా జన్మించిన గోవిందకౌల్ తండ్రితాత అందరూ మహా విద్వాంసులలే .ఈయన పూర్వీకుడు కాశ్మీర్ రాజు రంజిత్ సింగ్ ను కాశ్మీర్ ను ఆఫ్ఘన్ కబంధ హస్తాలనుంచి విముక్తి చేయమని ప్రేరేపించినవాడు .సంస్కృత పారసీలతో పాటు ఆంగ్లాన్నీకూడా కౌల్ నేర్చాడు .కాశ్మీర్ లో ఇంగ్లిష్ నేర్చిన మొదటితరం వారిలో ఈయన ఉన్నాడు .ప్రపంచ విషయాలన్నీ కూడా బాగా అవగాహన చేసుకోగలిగారు అలంకార వ్యాకరణ న్యాయ శాస్త్రాలలో శైవ సూత్రాలలో అఖండుడు అనిపించాడు 28 ఏళ్లకే గొప్ప విద్యా వేత్తగా ప్రసిద్ధి చెందాడు . 1874 ప్రభుత్వ అనువాద శాఖలో ఉద్యోగం లో చేరి కాశ్మీర్ సంస్కృత సాహిత్యాన్ని హిందీలోకి అనువదించాడు.పదేళ్ల తర్వాత ప్రాజెక్ట్ మూతపడి ఉద్యోగం లేక శ్రీనగర్ ప్రభుత్వ పాఠశాల సంస్కృత టీచర్ గా  చేరాడు .అదీ ఊడగా ,యూరోపియన్ ఇండా లజిస్ట్  జార్జ్ బూలర్  కౌల్ ప్రజ్ఞను గుర్తించి స్టెయిన్ కు పరిచయం చేయగా ఆయన చేస్తున్న కల్హణు ని రాజతరంగిణి అనువాదానికి 1888 నుంచి 1896వరకు సహకరించాడు  .దీనితర్వాత మహారాజా రన్బీర్ సింగ్ కోరికపై స్టెయిన్ తోకలిసి జమ్మూలోని రఘునాధ ఆలయం లోని రణబీర్ సింగ్ లైబ్రరీలో 6 వేళా సంస్కృత వ్రాత ప్రతులకు కేటలాగ్ తయారు  చేశాడు .ఇదికాక స్టెయిన్ తోకలిసి కాశ్మీర్ జానపద కథలను  సేకరించి 1917 లో కౌల్ వివరణలతో ‘’హాతిమ్ కధలు ‘’గా ప్రచురించాడు .గ్రియర్సన్ కు కాశ్మీర్ నిఘంటు నిర్మాణం లో తోడ్పడ్డాడు .

 1899 జూన్ లో పండిత గోవింద కౌల్ మరణించినప్పుడు దుఃఖాన్ని తట్టుకోలేని స్టెయిన్  ”like another Kalhana departed as my best Indian friend beyond all hope of reunion in this Janma”. Paying fulsome tributes to him, Stein wrote: “Whenever Govind Kaul was by my side, whether in the dusty exile of Lahore or alpine coolness of Mohand Marg in Kashmir, I was in continuity with the past as the historical student of India. His personality embodied all that change of ages indicated and showed as the mind and psyche of India.”

అని ఆధునిక కల్హణుడు గా కౌల్ ను ప్రస్తుతించి నివాళులర్పించాడు

   సశేషం

   మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -17-6-17 కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 236-కాశ్మీర్ శైవ వాగ్మయ దీధితి –పండిట్ హరభట్ట శాస్త్రి జాదూ ( 1874-1951 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

236-కాశ్మీర్ శైవ వాగ్మయ దీధితి –పండిట్ హరభట్ట శాస్త్రి జాదూ ( 1874-1951 )

కాశ్మీర్ పండిత కుటుంబాలు సంస్కృతానికి  కళా సంస్కృతులకు  చేసిన సేవ నిరుపమానం . 1874 లో కాశ్మీర్ లో జన్మించిన అనేక శైవ గ్రంధాలు రచించిన పండిత హరిభట్ట శాస్త్రి జాదూ  వ్రేళ్ళపై లెక్కింపదగిన ఆధునిక సంస్కృతమహా  పండితుడు .కానీ ఆయన గురించి ఆ కుటుంబంలోని కాశ్మీర పండితులకే చాలామందికి తెలియక పోవటం ఆశ్చర్యం .ఈయనపై అధ్యయనం చేయాలని అమెరికా హార్వర్డ్ యుని వర్సిటీ నుంచి కాశ్మీర్ వచ్చిన ప్రొఫెసర్ డేవిడ్ బ్రేనార్డ్ స్పూనర్ హరిభట్ట శాస్త్రి వంటి ఉద్దండులవద్ద సంస్కృతాధ్యయనం చేయాలని వచ్చి ఆయన గురించి తెలిసిన కొన్ని విశేషాలకే ఉబ్బి తబ్బిబ్బై అంతటి శైవ వాజ్మయ నిర్మాత  ను గురించి లోకానికి పూర్తిగా తెలియక పోవటం బాధకలిగించింది .కాశ్మీర్ రీసెర్చ్ స్కాలర్ల వలన ఆయన జీవితం గురించి తెలిసిన విషయాలు ఇప్పుడు తెలుసుకొందాం .

  హారభట్ట జాదూగా కాశ్మీర్ సంస్కృటానికి విశేష సేవలందించిన పండిత కుటుంబం లో 1874 జన్మించి,శరీరం లోని ప్రత్యణువు  సంస్కృతమ్ పొర్లి పొరలుతుండగా సునాయాసంగా సంస్కృతం అధ్యయనం చేశాడు .తండ్రి పండిట్ కేశవ భట్ట జాదూ కాశ్మీర్ రాజు మహారాజా రన్బీర్ సింగ్ ఆస్థాన జ్యోతిష్కుడు .మహారాజు ఎందరెందరో కవి పండితులకు ఆశ్రయమిచ్చి పోషించి పెంచాడు .ఈయన అన్న కొడుకు జగద్ధార్ జాదూ ‘’నీల మత  పురాణం ‘’మొదటి ప్రతికి ప్రొఫెసర్ కాంజిలాల్ తో కలిసి సంపాదకత్వం వహించాడు .దక్షిణ కాశ్మీర్ లో బ్రిజే హ ర దగ్గరున్న  జాదీపూర్ అనేగ్రామం జాదూ కుటుంబ ఆవాసగ్రామం .తర్వాత  శ్రీనగర్  కు వల్లస వెళ్లి ఇంటిపేరును జాదూగా ఉంచుకొన్నారు . హారభట్టు కాశ్మీర్ లోని రాజకీయ పాఠశాల లో చేరి  1895 లోసంస్కృతం లో  డిగ్రీపొంది హరభట్ట శాస్త్రి అయ్యాడు .ఈతని సునిశిత మేధావితనానికి మెచ్చి మహారాజా జమ్మూ-కాశ్మీర్ ఓరియంటల్ రీసెర్చ్ సెంటర్ లో మొదట పండిట్ గా నియమించగా   క్రమంగా ఎదిగి  హెడ్ పండిట్ గా 1931లో రిటైర్ అయ్యాడు. విద్యావంతులైన పండితులంటే మహా రాజుకున్న ప్రత్యేక శ్రద్ధకు ఇది గొప్ప ఉదాహరణ .

 శైవ వాజ్మయం లో హారభట్ట శాస్త్రి కున్న సునిశిత మేధాశక్తి కాశ్మీర్ లోనే కాదు లక్నో యూనివర్సిటీ మహా స0స్కృత   విద్వా0సుడైన కె సి పాండే ,  బాంబే  కాలేజ్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజెస్ అండ్ ఫిలాసఫీ  ప్రొఫెసర్ జేమ్స్ హెడ్ వుడ్ వంటి ఉద్దండులు కూడా అబ్భుర పడ్డారు .అందుకనే ప్రముఖ  భాషా శాస్త్ర వేత్త ప్రొఫెసర్ సునీల్ కుమార్ ఛటర్జీ భట్టు జాదూ పాండిత్యానికి ఆకర్షితుడై శ్రీనగర్ వచ్చి ఆయన వద్ద  కాశ్మీ రశైవ గ్రందాధ్యయనం చేశాడు.పైన చెప్పిన డేవిడ్ స్పూనర్ కాశ్మీర్ కు వచ్చి ఇక్కడి విషయాలన్నీ పూర్తిగా అవగాహన చేసుకున్నాక అమెరికా వెళ్లి హార్వర్డ్ యూనివర్సిటీలో మొట్ట మొదటిసారిగా సంస్కృతాన్నిఒక సబ్జెక్ట్ గా1905 నుంచి  బోధించటం ప్రారంభించాడు .ఒకరకంగా ఇది హరభట్ట  శాస్త్రి ప్రభావమహిమే .అప్పుడున్న 5 వేల  మంది విద్యార్థులలో సంస్కృత విద్యార్థులు కేవలం 9 మంది మాత్రమే .

 హారభట్ట శాస్త్రి తన విద్వత్తును వృధా కానీకుండా విస్తృత గ్రంథ  రచన ప్రారంభించాడు .కాశ్మీర్ లోని సంస్కృత భాషా గ్రంధాలపై విస్తృతమైన వ్యాఖ్యానాలు రాశాడు అందులో మొదటిది అమ్మవారిపై ఉన్న ‘’పంచ స్తవి    ‘’కి వ్యాఖ్యానం .తనకున్న అపూర్వ శైవ శాక్తేయ విజ్ఞానమంతా ఈ వ్యాఖ్యానం లోముఖ్యంగా లఘుస్తవం ,చార స్తవం లలో  పొందుపరిచాడు  .వీటినే  ఆయన పేరు మీదు గా ‘హారభట్టి ‘’అని  గౌరవం గా పిలుస్తారు . ఈ మంత్రాలన్నీ అతి ప్రాచీనకాలం నుండి కాశ్మీర్ లో ప్రతి ఇంటా మారు మోగుతూ ఉన్నాయి .ఈయన వ్యాఖ్యలు ‘’త్రిక ‘’సిద్ధాంతానికి వెలుగులనిచ్చాయి .వీటిని రాసింది శంకరాచార్యులా  కాళిదాసా ,అభినవ గుప్తుడా అనే చర్చ చాలాకాలం నడిచింది చివరకు హరభట్ట వీటిని ‘’ధర్మాచార్య ‘’మాత్రమే రాశాడని సాక్ష్యాధారాలతో రుజువు చేశాడు .దీన్ని స్వామి లక్ష్మణ జూ కూడా సమర్ధించాడు .హారభట్ట మొత్తం 9 శైవ గ్రంధాలను వాటి  అర్ధ తాత్పర్యాలతో సహా రాశాడు .ఇదికాక ఉత్పలుడు రాసిన ‘’ఆపద్ ప్రమత్త సిద్ధి ‘’వ్యాఖ్యానాన్ని ,బోధ పంచదశిక ,పరమార్ధ చర్చ ‘’లపై వివరణలు రాశాడు .ఇంతటి శైవ మహా పండిత  విద్వా0సుడు  1951 లో 77 వ ఏట శివ సాన్నిధ్యానికి చేరాడు .ఈయన అమెరికా శిష్యుడు స్పూనర్  తరచుగా హారభట్ట ,ప్రొఫెసర్ నిత్యానంద శాస్త్రి ,పండిత మధుసూదన శాస్త్రి లకు    రాస్తూ తన గురుభక్తిని వ్యక్తపరచేవాడు దురదృష్ట వశాత్తు ఆ లేఖలు కాలగర్భం లో కలిసిపోయాయి .

237- శివ సూత్రం విమర్శిని వంటి 29 గ్రంధాల సంపాదకుడు -మహా మహోపాధ్యాయ పండిత ముకుంద రామ  శాస్త్రి (1880-1921 )

మహా మహోపాధ్యాయ పండిత ముకుందరామ శాస్త్రి గొప్ప కాశ్మీరీ సంస్కృత మహా పండితుడు .తన అసమాన ప్రతిభ చేత దేశం లోను విదేశాలలోనిఅత్యంత ప్రాముఖ్యత పొందాడు .జీవితకాలం లో’’ లెజెండ్ ‘’అని పించుకొన్నాడు .గణేష్ భట్ గంగో పాధ్యాయ ,అమరావతి ద0పతుల   కుమారుడు .స్థానిక ప్రభుత్వ సంస్కృత పాఠశాలలో  పండిత దయా రామ్ కౌల్ వద్ద చదివి శాస్త్రి డిగ్రీ సాధించి పంజాబ్ ,లాహోర్ ల నుండి ఇక్కడకు వచ్చి చేరి చదివిన వారిని తీర్చిదిద్ది తన ఖ్యాతిని దేశమంతా చాటుకున్నాడు .యవ్వనం లోనే పర్షియన్ గ్రంధాలను సంస్కృతం లోకి పండిట్ రామ్ జూ ధర్ పర్య వేక్షణలో అనువదించాడు .దీన్ని గమనించిన జమ్మూకాశ్మీర్ రాజు రణబీర్ సింగ్ ముకుంద శాస్త్రిని టిబెటన్ బౌద్ధ గ్రంధాలైన ‘’క0గూర్ ‘’తంగుర్  ‘’లను సంస్కృతం లోకి అనువదించమని కోరాడు .థామస్ టాంసెల్ వద్ద టిబెటన్ భాష అభ్యసించి 1 లక్షా 50 వేల  శ్లోకాలలో వాటిని అనువదించి తన సామర్ధ్యాన్ని నిరూపించాడు .దీనితో ఆయన ప్రతిభ ద్విగుణీకృతమై  మహారాజు నుండి 500 రూపాయల అత్యధిక నగదు పారితోషికం పొందాడు ఆనాడు అదే చాలా గొప్ప బహుమానం

 ఈ ప్రయత్నాన్ని మెచ్చిన మహారాజు కాశ్మీర్ లోని ఖట్వార్ లో ఉన్న పొద్దార్ లో లామా గురే ను అనుసరించమని కోరాడు .అక్కడ నీలం రాళ్లు బాగా లభిస్తాయి దానిపై పరిశోధన చేయాలని రాజు ఆదేశం .ఇక్కడే యూరోపియన్ ఓరియెంటలిస్ట్ పోప్  వేద్ తో పరిచయమైంది .అప్పుడు కాశ్మీర్ వ్యాకారణం పై వేద్ గ్రంధం రాస్తున్నాడు దానికి శాస్త్రి పూర్తిగా సహకరించాడు .కొద్దికాలం తర్వాత శ్రీనగర్  లోక్రిస్టియన్ మిషనరీలు నడిపే  సి ఏం ఎస్  స్కూల్ లో సంస్కృత పండితునిగా నియామకం పొందాడు .ఒక ఏడాదిమాత్రమే పని చేసి కాశ్మీర్ కు వచ్చిన అరుల్ స్టెయిన్ అనే ఆయనకు రాజతరంగిణి అనువాదం లో 1899 లో సహకరించాడు. తర్వాత ఆయన సలహాపై గ్రియర్సన్ కు లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా కు 20 ఏళ్ళు తోడ్పడ్డాడు /ఈ సమయం లోనే కాశ్మీర్ భాషా నిఘంటువు ,కృష్ణ జూ  రజ్డా న్  రచన  ‘’శివ పరిణయ ‘’లను తనసంపాదకత్వం లో వెలువరించాడు 1900 లో పంజాబ్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఎ .డబ్ల్యు .స్ట్రాటన్ అభ్యర్థనపై ‘’కటక్ భాషా సూత్ర ‘’అనే  అత్యంత విలువైనగ్రంధం రెండేళ్లు శ్రమించి రాశాడు .

   1912లో మహారాజా రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసి శాస్త్రిని హెడ్ గా నియమించాడు .రీసెర్చ్ అండ్ అర్కీలాజికల్ డిపార్ట్ మెంట్ ఆఫీసర్ ఇన్ ఛార్జ్ గా 1919 వరకు ఉన్నాడు . 1908  లో భారత ప్తభుత్వ పురావస్తు శాఖ సర్వేకు కాశ్మీర్ లోని శారదా ,దేవనాగర లిపులపై  శాసనాలు శిధిలమవుతుంటే వాటి అర్ధ భావాలను విశ్లేషించి భద్రపరచాడు .జైన రాజు రాసిన ‘’జైన రాజ తరంగిణి ‘’   పై పరిశోధిస్తున్న స్పూనర్ కు సాయమందించాడు .రీసెర్చ్ డిపార్ట్ మెంట్ లో ఉండగా కాశ్మీర శైవానికి  చెందిన 23  శైవ గ్రంధాలను తన సంపాదకత్వం లో వెలువరించిన ఘన కీర్తి   పొందాడు .ఇవన్నీ ;;కాశ్మీర్ సిరీస్ ‘’గా వెలువడ్డాయి . ఇవికాకశివ సూత్రం తర0గిణి  స్పందన కారిక  ,తంత్రలోక తంత్ర సారా ,ఈశ్వర ప్రతిభిజ్ఞా ,పరాత్రిమాశిక ,పరార్ధ సార లను కూడా ప్రచురించి అద్వితీయ సాహితీ సేవ చేశాడు ముకుంద శాస్త్రి .అతిప్రాచీన కాశ్మీర్ సంస్కృత గ్రంధం ‘’మహా నయా ప్రకాష్ ‘’కు కూడా సంపాదకుడు .జార్జి గీయర్సన్ లల్లాదేవి రచనలను ‘’లల్లవాక్యాని ‘’గా తీసుకురావటం లో శాస్త్రి తోడ్పాటు మరువ లేనిది .ఇదే కాక ఈశ్వర కౌల్ రచన ‘’సదమృత ‘’ను గీయర్సన్ ప్రచురించటలో యెనలేని సాయమందించాడు

ముకుంద శాస్త్రి అపార శాస్త్ర జ్ఞానానికి తగిన ‘’మహా మహోపాధ్యాయ ‘’బిరుదు గౌరవం లార్డ్ హార్డింజ్ చేతులమీదుగా  లభించింది . 1921 లో ఈ మహా మేధావి అసామాన్య సంస్కృత పాండితీ గరిమ ఉన్నపండిత ముకుంద శాస్త్రి 1921 లో ముకుంద ధామం చేరుకొన్నాడు

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -16-6-17 కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 231-పుష్పదంత భూత బలి ఆచార్యుల -శతఖండాగమం(క్రీ. శ 160 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

231-పుష్పదంత భూత బలి ఆచార్యుల -శతఖండాగమం(క్రీ. శ 160 )

క్రీశ160 లో దిగంబర జైనమతానికి చెందిన ఆచార్యులు పుష్పదంతుడు  భూతబలి ‘’శతఖండాగమం ‘’రాశారు .దీన్ని మహాకర్మ ప్రభూత  అంటారు .రెండవదైన ‘’పూర్వాగమం ‘’ను ఆగ్రయ నియ అంటారు .ఇది 6 భాగాల ఉద్గ్రంధం దీనికి ఆచార్య వీరసేనుడు780 లోరెండు వ్యాఖ్యలు -మొదటిదానిపై దావ టీకా రెండవదానిపై మహాధావ  టీకా రాశాడు .అయిదవ పూర్వాగ మంలేక జ్ఞాన ప్రవాదం  పై గుణధరా చార్య ‘’కశ్య పహుద్ ‘’రాశాడు .వీరసేనుడు ,శిష్యుడు జైన సేనుడు దీనికి వ్యాఖ్యను 780 లో రాశారు

232- సమయ సార కర్త – ఆచార్య కుంద కుంద (క్రీశ. 100 )

క్రీశ  1 వ శతాబ్దిలో  ఆచార్య కుంద కుంద ఆత్మ తత్త్వం పై ‘’సమయ సార’’గ్రంధాన్ని ,సుశిక్షిత  న్యాయం పై ‘’నియమసార ‘’పంచాస్తికా సార గ్రంధాలు రచించాడు.

233-గొమ్మట సారకర్త -నేమి చంద్ర (క్రీశ.1000 )

క్రీ శ 10 వ శతాబ్దం లో ఆచార్య నేమి చంద్ర 1 ద్రవ్య సంగ్రహ 2 గొమ్మట  సార అనే జీవ కాండ ,కర్మకాండ లకు సంబంధించిన గ్రంధాలు రాశాడు .ఇవికాక త్రిలోక సార ,లబ్ధిసార క్షిపణ సార గ్రంధాలూ రాశాడు .జైనాచార్యులలోనేమిసార కు అగ్రాసనాధిపత్యం ఉన్నది .ఈయనకే ‘’సిద్ధాంత చక్రవర్తి ‘’అనే పేరుంది .చాముండరాయ కు గురువు . నేమి ఆచార్యకు కర్ణాటకలో షిమోగా లో నగర్ తాలూకా పద్మావతి దేవాలయం లో  ఒక శాసనం విగ్రహం ఉన్నాయి .చాముండ రాయ కోరికపై నేమిచంద్రాచార్య జైనమత ముఖ్య ఆచార్యుల జీవిత చరిత్రలను ‘’గొమ్మట సార’’గా రాశాడు . 3-3-980 లో జరిగిన గోమఠేశ్వర విగ్రహ అభిషేక కార్యక్రమం లో నేమి ఆచార్య పాల్గొన్నాడు .ఈయన రచన ద్రవ్య సంగ్రహం జైనులకు అతి పవిత్ర గ్రంధం .తిలోయ ప్రణతి ఆధారంగా త్రిలోక సారం రాశాడు .పైన చెప్పినవే కాక ‘’ప్రతిష్ఠిత పదం ‘’,ప్రతిష్ఠిత తిలకం ‘’కూడా నేమి ఆచార్య రచించాడు.

234-జైన నియుక్తి  గ్రంథ రచయిత -భద్ర బాహు (బిసి 300 )

జైనాచార్యులలో చిట్టచివరి ‘’సూత్ర కేవలి ‘’అంటే జైన గ్రంధాలనన్నిటిని కంఠతా బట్టినవాడు గా భద్ర బాహు ఆచార్యకు పేరుంది .ఈ గ్రంధాలపై ఆయన రాసిన వ్యాఖ్యానాలు ‘’నియుక్తి ‘’పేరుతొ పిలువబడుతున్నాయి .న్యాయసంబంధ కేసుల విషయాలపై ‘’సంహిత ‘’రాశాడు .మొదటి శతాబ్దం లో ఉమాస్వాతిరాసిన  ‘’తత్వార్ధఆగమ సూత్రం’’, లో జైనానికి సంబంధించిన ప్రాధమిక విషయాలున్నాయి  8 వశతాబ్దికి  చెందిన హరిభద్రుడు ‘’యోగ ద్రుష్టి సముచ్చయం ‘’రచించాడు.

235-12 జైన ఆగమాలు రచించిన’’జైన చిరంజీవి ‘’ -సుధర్మ స్వామి (బిసి 607-507 )

జైన మహావీరునికి 5 వ గణదారుడు క్రీపూ 607-507 కు చెందిన సుధర్మ స్వామి .క్రీపూ 615 లో ఆత్మజ్ఞానం పొంది 507 లో నూరవ ఏట నిర్వాణం చెందాడు . జైన చిరంజీవులలో సుధర్మ స్వామి చివరివాడుగా భావిస్తారు  .ఈయనతర్వాత జంబుస్వామి ఉత్తరాధికారి అయ్యాడు .సుధర్మ స్వామి మహా వీరుని బోధలను 12 భాగాలైన జైన ఆగమాలుగా రచించాడు .శిష్యుడు జంబుస్వామి అడిగిన ప్రశ్నలకు సుధర్మస్వామి చెప్పిన సమాధానాల ‘’ప్రశ్నోత్తరావళి ‘’అన్నమాట .ఇవి ఆద్యంతాలు లేని సత్యం యొక్క విషయం విచారణ ఇది .మహావీరుని చివరి  శిష్యుడే  సుధర్మ స్వామి .

  సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-6-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

Inline image 1

సుధర్మ స్వామి

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మహాన్యాస పూర్వక శ్రీ రుద్రాబిషేకం ,శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

మహాన్యాస పూర్వక శ్రీ రుద్రాబిషేకం ,శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

27-6-17 మంగళవారం షార్లెట్ లో మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో మా దంపతులచేత ఉదయం 7-30 నుండి 10 గంటలవరకు శ్రీ సువర్చలాంజ నేయ స్వామి వార్లకు అష్టోత్తర సహస్రనామార్చన అనంతరం  ‘’పంచాగ రుద్ర పంచముఖ ధ్యాన ,న్యాస పూర్వక  సంపుటీ కరణ ,దశాంగ రౌద్రీకరణ షోడశాంగ రౌద్రీకరణ,ఆత్మరక్షాయుక్త  శివసంకల్ప ,పురుషసూక్త అష్టాంగ ప్రణమ్య రుద్రార్చన స్నానాది ప్రయోగ ,దశశాంతి ,సామ్రాజ్య పట్టాభిషేక సమేత మహన్యాస పూర్వక శ్రీ రుద్రాభిషేకం ,అనంతరం శివ అష్టోత్తర ,సహస్ర నామ అర్చన  ,బిల్వాష్టోత్తర పూజ నిర్వహింపబడును ..

   ఉదయం  10 గం  నుండి 12 -30 వరకు నవగ్ర అష్టోత్తర పూజలతో శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతం, స్వామివార్లకు   అశోత్తర సహస్ర నామ పూజ జరుప బడును .

                                               గబ్బిట దుర్గా ప్రసాద్ -షార్లెట్ -అమెరికా

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవిత గీర్వా ణం -3 226-వివిధ ఋషుల పేర్లతో వర్ధిల్లిన –బ్రాహ్మణాలు  (బీసీ 900-600 )

గీర్వాణకవుల కవిత గీర్వాణం -3

226-వివిధ ఋషుల పేర్లతో వర్ధిల్లిన –బ్రాహ్మణాలు  (బీసీ 900-600 )

శృతి వాగ్మయం లో భాగమైన  బ్రాహ్మణాలు  మంత్రాలు తంత్రాలు కర్మకాండలు  వాతావరణ మార్పుల గురించి తెలియజేసే తాత్విక విషయాలను తెలియజేసేవి .వేదం భాష్యాలు వంటివి బ్రాహ్మణాలు   .ఇవి ఒక్కొక్క వేదానికి వేరువేరుగా వివిధ ఋషుల పేర్లతో పిలువబడ్డాయి .వీటిలో ఏక సూత్ర నిర్మాణం కనిపించదు .ఆరణ్యకాల లేక ఉపనిషత్తుల సూత్రాలు కలిసి ఉంటాయి  .ఇందులో అతిప్రాచీనమైనదానికాలం క్రీపూ 900 అతి ఆధునికమైనది క్రీ పూ 600 వరకు గా భావిస్తారు ప్రతి వేదం శాఖకు దానికి సంబంధించిన బ్రాహ్మణ ఉంటుంది .పూర్వం బ్రాహ్మణాలు సమాఖ్య చాలా ఉన్నా ఇప్పుడు మిగిలినవి కేవలం 19 మాత్రమే .అగ్నిహోత్ర విధానం వివాహం దంపతులు అనుసరించాల్సిన విధానాలు  గర్భిణీ స్త్రీలుమంచి సంతానం కోసం పాటించాల్సిన నియమాలు .మంత్రోచ్చారణ ,దోషాలతో మంత్రాలు చదివితే కలిగే దుష్పరిణామాలు ,స్వాధ్యాయం తో వేదాలను కాపాడుకోవాల్సిన పద్ధతులు అన్నీ వీటిలో ఉంటాయి .వేద సంస్కృతం కంటే బ్రాహ్మణాలు సంస్కృతం వాటికి తరువాత వచ్చాయికనుక భిన్నంగా ఉంటుంది  .ఇప్పుడు బ్రాహ్మణాలలో రకాలను తెలుసుకొందాం –

1-ఋగ్వేదం -సకల శాఖ -ఆత్రేయ బ్రాహ్మణం -దీనినే అశ్వలాయన బ్రాహ్మణం అనీ అంటారు .ఇందులో 40 అధ్యాయాలు సోమా హోమం గురించి వివరణ ఉంటుంది -2 భాస్కల లేక ఇక్ష్వాకు శాఖ -కౌశతకి బ్రాహ్మణం లేక సాంఖ్యాయన బ్రాహ్మణం అంటారు . అధ్యయాలు మొదటి అధ్యాయాలలో అన్నహోమం గురించి ,తర్వాత సోమా హోమం గూర్చి ఉంటుంది

2-సామవేదం -ఇందులో 1-కౌతుమా 2-రణయానీయ శాఖలున్నాయి -తాండ్య మహా బ్రాహ్మణ0 లేక పంచ వింశ బ్రాహ్మణం అతి ప్రాచీనమైనది  -25 అధ్యాయాలు -కథలు ,వ్రాత్య స్తోమాలు ఉంటాయి. సద్వి0శ బ్రాహ్మణం లో  లో 26 ప్రపాఠ కాలున్నాయి  .స0వి విధాన బ్రాహ్మణం లో 3 ప్రపాఠకాలు సూత్రం శైలిలో ఉంటాయి .ఆర్షేయ బ్రాహ్మణం సామ వేదానికి సూచిక .దేవతాధ్యాయ బ్రాహ్మణం లో 3 ఖండాలలో 26 ,11 ,25 ఖండికలున్నాయి .చాందోగ్య బ్రాహ్మణం 10 ప్రపంచకాలు .ఒక్కొక్కదానిలో 8 ఖండాలు . నుంచి 10 ప్రపాతకాలు చాందోగ్య ఉపనిషత్ లోనివి .సంహితోపనిషత్ బ్రాహ్మణం లో ఒకే ప్రపథకం 5 ఖండాలుగా ఉంది .వంశ బ్రాహ్మణం చిన్నదే .ఒక్క అధ్యాయంలోనే గురుశిష్య సంబంధ చర్చ ఉంటుంది

  జైమినీయ శాఖ -జైమినీయ బ్రాహ్మణం 3 కాండాలు .తాండ్య  బ్రాహ్మణం కంటే ప్రాచీనమైనది .మహాబ్రాహ్మణం అంటారు కొద్దిభాగమే లభ్యం .జైమినీయ -ఆర్షేయ బ్రాహ్మణం -ఇదికూడా సామవేద సూచికయే .జైమినీయ ఉపనిషత్ బ్రాహ్మణం -దీనినే  తల్వకార ఉపనిషత్ బ్రాహ్మణం అంటారు  .ఛాన్దో గ్యానికి సమాంతరంగా ఉంటుంది

2-యజుర్వేదం

 1- కృష్ణ యజుర్వేదం లో మైత్రాయని సంహిత ,చరక లేక కథా సంహిత ,కపిస్థల కథా సంహిత ,తైత్తిరీయ సంహితలున్నాయి .

 2- శుక్ల యజుర్వేదం -మాధ్యందిన శాఖ లో శతపధ బ్రాహ్మణం ,కాన్వ శాఖలో కూడా అవే ఉంటాయి

3-అధర్వ వేదం లో శౌనక పిప్పలాద శాఖలున్నాయి .పిప్పలాద బ్రాహ్మణం అలభ్యం .కానీ గోపథ బ్రాహ్మణం మాత్రమే ఉంది .దీనిని పిప్పలాద ఆరణ్యకం గా భావిస్తారు

227- అరణ్యాలలో మహర్షులు దర్శించిన -ఆరణ్యకాలు

ఏకాంత వాసం లో దీర్ఘ ఆతపస్సులో అరణ్యవాసం లో మహర్షులు దర్శించినవి లేక ఆరాటంలో పుట్టినవి ఆరణ్యకాలు .ఇవి కర్మకాండలగురించి వ్రతాలు ప్రవర్గ్యలు గురించి తెలియ జేస్తాయి .ఆరణ్యకాలు కర్మకాండ కు సంబంధించినవైతే ఉపనిషత్ లు జ్ఞానకాండకు సంబంధినవి .వేదం మంత్రం భాగాలను సంహితాలని వాటి వ్యాఖ్యానాలను బ్రాహ్మణాలని ,,వాటిలోకి కర్మకాండను తెలియజేసేవి ఆరణ్యకాలని వేదాలలోని జ్ఞానభాగాన్ని చెప్పేవి ఉపనిషత్ లు వేదాంగాలని అంటారు

  ఆరణ్యకాలు కూడా వివిధ ఋషుల పేర్లతో పిలువ బడుతున్నాయి .ఋగ్వేదానికి ఐతరేయ ఆరణ్యకం కౌశిక ఆరణ్యకాలు -యజుర్వేదానికి తైత్తిరీయ ఆరణ్యకం మైత్రాయణీయ ఆరణ్యకం,కేదారణ్యకం ,బృహదారణ్యకం  సామవేదానికి తలవకార ఆరణ్యకం ,ఆరణ్యక సంహిత ,అధర్వ వేదానికి ఆరణ్యకం ఆలభ్యం

ఐతరేయాఅరణ్యకం 5 అధ్యాయాలు మొదటి రెండిటిలోప్రాణ విద్య ఉంటుంది 3 లో సంహితోపనిషత్ లో స్వర చర్చ  4 ,5 ల లో మంత్రాల సాంకేతిక వివరణ ఉంటుంది దీన్ని మహానామ్ని  అంటారు

 తైత్తిరీయ ఆరణ్యకం లో 10 భాగాలు .మొదటి దానిని  కథాకాని అంటారు .అగ్ని ఛయన కాండ ఉంటుంది  2వది మహాయజ్ఞాన నిర్వహణ విధానం మిగిలినవి మంత్రం తంత్ర సాంకేతిక వివరాలు

కథారణ్యకం -తైత్తిరీయమే .సాంఖ్యాయన ఆరణ్యకం లో 15 అధ్యాయాలు . ,2 అధ్యాయాలు మహా వ్రతాన్ని 3నుంచి 6 కౌశిక ఉపనిషత్ ను ,7,8 సంహితోపనిషత్ ,9 ప్రాణ విశిష్టత ,10 అగ్నిహోత్ర విధి 11 అంత్య సంస్కారం 12 ప్రార్ధన ఫలితాలు 13 శ్రావణ మనన నిధి ధ్యాస వివరణ 14 అహం బ్రహ్మాస్మి వివరణ 15 బ్రహ్మ నుంచి గుణ సాంఖ్యాన వరకు గురు స్తుతి ఉంటాయి .బృహదారణ్యకం బృహదారణ్యక ఉపనిషత్ ను ,ముఖ్యంగా ‘’పర్వాగ్య ‘’కర్మ కాండను గురించి వివరిస్తుంది .ఆరణ్యకాలను ‘’రహస్య బ్రాహ్మణాలు ‘’అన్నారని నిరుక్తానికి వ్యాఖ్యానం రాసిన దుర్గా చార్య అన్నాడు

228-చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్ అనువదించిన యోగాచార్య భూమి శాస్త్రం -(క్రీశ 300-350)

బౌద్ధ ధర్మ యోగుల యోగ విధానాన్ని సంపూర్ణంగా తెలియ జేసే విజ్ఞాన సర్వస్వమే ‘’యోగా చార్య భూమి శాస్త్రం ‘’సంస్కృతం లో చాచింపండిన ఈ ఉద్గ్రంధం క్రీ శ 300-350 కాలపు రచన .ఇందులో 5 ముఖ్య విభాగాలున్నాయి .అందులో మొదటిదైన ‘’విస్తృత భూమిక ‘’అతి పెద్దది ఇందులో బౌద్ధజ్ఞానాన్ని పొందటానికి ఉన్న వివిధ భూమికలు వివరణ ,స్థాయిలు ధ్యాన స్థాయిలు ,వినటం ఆలోచించటం అభ్యాసం చేయటం శ్రావక భూమి ప్రత్యేకబుద్ధభూమి బోధిసత్వ భూమి ఉన్నాయి .రెండవ భాగాన్ని వినిశ్చయా సంగ్రహం అంటారు బహుభుమిలో చెప్పబడిన అనేక విషయాల నిర్వచనం వ్యాఖ్యానాలుంటాయి మొదవదైన వివరణ సంగ్రహం లో విధి విధానాల వివరణాలున్నాయి .నాల్గవది పరన్యా య సంగ్రహం  లో   ఆగమాలలో చెప్పబడినవాటి వివర్ణన విశ్లేషణ ఉంటాయి చివరిదైన అయిదవది వాస్తు సంగ్రహం -లో సంయుక్తాఆగమా సూత్ర వివరణ ఉంది ఇందులో వినయ సంగ్రహం కూడా కలిసి ఉంటుంది

దీని చైనా ప్రతిలో అభిధర్మ ఉంటె టిబెటన్ ప్రతిలో అది లుప్తమైంది బహుభుమిలోని సంస్కృత భాగాలైన బోధిసత్వ భూమి శ్రావక భూమి ఇప్పటికీ కనిపిస్తాయి .చైనా బౌద్ధం లో అనేక విభేదాలకు కారణం సరైన వ్యాఖ్యానాలు లేకపోవటమేకాక అసలు గ్రంధం లోని భాగాలు లేకపోవటం కూడా కారణమని హుయాన్ సాంగ్ రాశాడు

 హుయాన్ సాంగ్ భారత దేశ సందర్శనానికి వచ్చినప్పుడు నలంద విశ్వ విద్యాలయ బౌద్ధాచార్యుడు షీలా భద్రాచార్య హుయాంసాంగ్ కు ‘’యోగా చార్య భూమి శాస్త్రాన్ని ‘’సుమారు 9 నుంచి 15 నెలలో బోధించాడు .దీన్నిహుయాన్ సాంగ్  చైనా భాషలోకి హొంగ్ ఫు మొనాస్టరీ లో 646-648కాలం లో అనువదించాడు అందులో 100భాగాలు లేక’’ జువాన్ ‘’ లున్నాయి .హుయాన్ సాంగ్ కు ముందే 394-468 కాలం లో ధర్మ క్షేత్ర , గుణ భద్ర ,పరమార్ధ లు కొంతభాగం చైనా భాషలోకి అనువదించారు

229-ప్రమాణ వార్తిక కర్త -ధర్మ కృతి (క్రీశ . 600-700 )

నలంద విశ్వ విద్యాలయ బౌద్ధాచార్యుడు ధర్మ కృతి క్రీశ 600-700 కాలం వాడు .యోగాచార్య సూత్రాన్తిక విధానాలలో నిష్ణాతుడు .గొప్ప అణుశాస్త్ర వేత్త .ఆయన రచనలు మీమాంస న్యాయ శైవ హిందూ  జైన తత్వశాస్త్రజ్ఞులను బాగా ఆకర్షించాయి .ఆయన రచన ‘’ప్రమాణ వార్తిక’’ బృహద్గ్రంథం .ఇది భారత టిబెట్ దేశాలలో విస్తృత సంచలనం కలిగించింది

 ధర్మకృతి దక్షిణ భారత దేశం లో పుట్టిన బ్రాహ్మణుడని ,మహా మీమాంసకారుడు కుమారిలభట్టు మేనల్లుడని అంటారు.ఇతని వస్త్ర ధారణచూసి  మేనమామ కుమారుల భట్టు ఒక రోజు తీవ్రం గా  ఆక్షేపించి టిఇట్టిపోశాడని అప్పతిల్లప్పుడే ఇల్లువదిలి బౌద్ధం లో చేరాడని ఈశ్వర సేన వద్ద కొంత చదివి నలందా వెళ్లి 6 వ శతాబ్ది ధర్మపాలతో సన్నిహితంగా మెలఁగి  బౌద్ధ తర్క వేత్త దిజ్ఞాగుని ప్రభావం తో బౌద్ధ ధర్మావలంబనానికి మార్గదర్శక సూత్రాలు రాశాడని వీటినే టిబెట్ లో కూడా అనుసరించారని  నలందలో సామాన్య బౌద్ధుడుగానే ఉన్నాడు  ,ఎవరూ ఆయన జ్ఞానాన్ని అర్ధం చేసుకోలేకపోయారని అనుకొన్నాడు

 ధర్మ కీర్తి ఏదైనా కార్య కారణం సంబంధంగా హేతు బద్ధంగా తర్క విధానం లో ఉండాలని భావించాడు .పరమార్ధసత్  సంవృత సత్తుతో విభేదిస్తుంది .ప్రత్యభీజ్ఞానంనిశ్చయం లు వాసనలతో ఉద్బుద్ధమై ,ప్రత్యక్షాభాసమౌతాయని అసలు సత్యమైన సంవిత్ ను మరుగుపరుస్తామని,సహజ ప్రభాసమానమైన ప్రభాస్వరను  అవిద్య కప్పేస్తుందని అంతర్జ్వాలగా ఉన్న చింతామణి ప్రజ్ఞను మేల్కొల్పితే పూర్ణ ప్రజ్ఞ లభిస్తుందని చెప్పాడు .ఇతనిభావాలు మాధ్యమకా భావాలు .దిజ్ఞాగు ధర్మాకృతి  లో బౌద్ధం లో ఒక నూతన ఆలోచనా విధానానికి మార్గ దర్శకులయ్యారు .టిబెట్ లో వీరిద్దర్నీ కారణకారులు అంటారు .ఇప్పటికాలపు ప్రమాణవాదులన్నమాట

 ధర్మ కృతి రచనలు -సంబంధ ప్రతీక్ష వృత్తి ,ప్రమాణ వినిశ్చయా ,ప్రమాణ వార్తిక ,ప్రమాణ వార్తికస్వ వృత్తి ,న్యాయ బి0దు ప్రకాశన , హెక్టా బిందూనామ ప్రకారణ ,సంతానాన్తర సిద్ధినినామ ప్రకారణ ,వాడ న్యాయ నామ ప్రకారణ

230-అవధూత గీత కర్త -దత్తా త్త్రేయ  స్వామి  (900-1000)-

స్వేచ్చాగానం అని పిలువబడే ‘’అవధూత గీత ‘’కర్త క్రీశ 900 -1000 కాలపు దత్తాత్రేయ మహర్షి .ఇది ఎనిమిది అధ్యాయాలతో 298 శ్లోకాల’’నాధ యోగ’’  గ్రంధం .దత్తాత్రేయుడు యోగీశ్వరేశ్వరుడు .ఆత్మజ్ఞాని ఆత్మజ్ఞాన సోపానాలు ఈగ్రంధం వివరిస్తుంది .సహజామ్రుతాన్ని పంచే  గ్రంధం .ఇందులో ఒక శ్లోకభావం గ్రహిద్దాం -’’నేనే పరమ శివుడను -అనుమానం వలదు .మిత్రుడా నాకు నేను ఎలా నమస్కారించుకో గలను -ఈశ్వరానుగ్రహ దేవా పుంసా మద్వైతవాసనా -మహాభయ పరిత్రాణ విప్రాణాముపజాయతే

 2-   ఏనే దం పూరితం సర్వమాత్మనైవా ఆత్మానాత్మని

‘’నిరాకారం కదం  వందేహ్యభిన్నం

3-పంచ భూతాత్మకం విశ్వం మరీచిజలసన్నిభం -కశ్యాప్యహో నమస్కృత్యఅనాహమేకోనిరంజనః

-శివ మవ్యయం

-సశేషం

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్-15-6-17-కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

విశ్వంభర నారాయణీయం

విశ్వంభర నారాయణీయం

తెలుగు’’ గజళ్లకు’’ జలదరింపు తెచ్చి

‘’నాగార్జున సాగర్ ‘’ను తేనెల వాకల  తెలుగుతో నింపి

‘’కర్పూర వసంత రాయల ఘనతకు

‘’మేలిమి కప్పుర  తెలుగు పలుకుల నీరాజనమెత్తి

‘’నవ్వని పువ్వు ‘’లోని వసివాడని అందాలు మెచ్చి

‘’వెన్నెల వాడ ‘’లో వసంత విహారం చేసి .

తెలుగు జాతీయ ‘’జలపాతం ‘’సృష్టించి

‘’దివ్వెల మువ్వల ‘’దివ్యనాదాన్ని పంచి

ఆధునిక ‘’రుతు చక్రానికి ‘’గిరగిరలు నేర్పి

‘’మధ్య తరగతి మందహాసం ‘’పై

మంచి ముత్యాల జల్లు కురిపించి  

‘’మంటలు లోని మానవుడు ‘’కు

సాంత్వనంతో ఉపశమనం కలిగించి

‘’విశ్వంభర ‘’కు వెన్నెల వాకలు కూర్చి

‘’ప్రపంచ పదుల ‘’తో విశ్వాన్ని చుట్టి

కళాస్రష్ట ‘’రామప్ప’’కు

‘’సంగీత రూపక ‘’గోపురం కట్టి

‘’సినారె నాటిక ‘’లతో నూత్నఆవిష్కారం చేసి

ఆధునికాంధ్ర సాహిత్య సాంప్రదాయం ‘’కు

జోహార్లుపలికి ,’’ప్రయోగాల ‘’కు

నిండుమనసుతో

ప్రశంసల తెల్ల గొడుగు పట్టి ,

తెలంగాణా’’ మట్టి నుంచి’’

ప్రపంచ సాహిత్య’’ఆకాశానికి’’ఎదిగి

‘’యాత్రా సాహిత్యా’’నికి ,మాత్రా  సాహిత్య

గౌరవం కల్పించి మెరిపించి మురిపించి

చలన  చిత్రసీమకు ‘’గులే బకావళి ‘’తో

పాటల గులాబీ పూలు పూయించి

త్రిసహస్ర గీతాల హరి విల్లు అమర్చి

‘’ఏక వీర ‘’కు ప్రశంసల వీరతాళ్లను

మాటల ,పాటల పసందు తో వేసి

‘’జ్ఞాన పీఠం ‘’   పై కూర్చున్నా

నిత్య కవిత్వ సరస్వతీ సమార్చన చేస్తూ

ప్రసంగానికి మాధుర్య సుగంధాలు పూయిస్తూ

నాగేశ్వర రావు నారాయణ రెడ్డిలేని సభ

 భాగ్యనగరం లో ఉండదనిపించి   

నిండు జీవితం గడిపి దివికేగిన

పుంభావ తెలుగు సరస్వతి

సింగి రెడ్డి నారాయణ రెడ్డి

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -15-6-17-కాంప్-షార్లెట్-అమెరికా

 Inline image 1

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 219-సన్మతి తర్క  గ్రంథ కర్త -సిద్ధసేన దివాకరుడు (500-600 )

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3

219-సన్మతి తర్క  గ్రంథ కర్త -సిద్ధసేన దివాకరుడు (500-600 )

క్రీశ .-600 మధ్య బ్రాహ్మణకుటుంబం లో జన్మించినజైన సంస్కృత పండితుడు  సిద్ధ సేన దివాకరుని గురువు వృద్దవాది .ఒక సారి గురువుతో తనకు ప్రాకృత భాషలో ఉన్న జైన గ్రంథాలన్నీ సంస్కృతం లోకి  మార్చాలని ఉందని చెప్పగా ప్రాయశ్చిత్తంగా దేశం లోని జైన దేవాలయాలనన్నిటిని 12 ఏళ్లపాటు సందర్శించి రమ్మని ఆజ్ఞాపించాడు .అలా  తిరుగుతూ ఉజ్జయిని లోని లింగ దేవాలయం చేరి కాళ్ళు లింగం పైన పెట్టి గుడిలో పడుకున్నాడు .భక్తులు ఫిర్యాదు చేయగా విక్రమాదిత్య మహా రాజు సిద్ధసేనుడినిచేసిన పాపానికి జైలులోపెట్టి  కొరడాలతో కొట్టించాడు .గొప్ప మంత్రకారుడైన దివాకరుడు ఆ దెబ్బలు తనకు తగలకుండా రాణి కి తగిలేట్లు చేశాడు .దీనికి ఆశ్చర్యపడిన రాజు వదిలేయగా ఆగదిలో లింగాన్ని చేతులతో పీకేసి పార్శ్వ నాధ విగ్రహాన్ని దాని స్థానం లో ప్రతిష్టించాడు

 జైనం లోని ‘’అనేకత్వ వాదం ‘’కు విశ్లేషణగా సిద్ధసేన దివాకర ‘’సన్మతి తర్కప్రకారణ  ‘’రాశాడు .ఏడు గా ఉన్న జైన న్యాయాలను 1-ద్రవ్య శిక్షా న్యాయం 2-పర్యాయ శిక్షా న్యాయం అనే రెండుగా కుదించాడు .అసిత్వాన్ని నమ్మేవారు మొదటివిభాగానికి అది అశాశ్వతం అని నమ్మేవారు రెండవ దానికి చెందుతారు .తర్వాత ఈ రెండిటిని భారతీయ తత్వ శాస్త్రాలకు అనుసంధించాడు .సిద్ధ సేనుడు ఇదేకాక న్యాయావతారం కళ్యాణ మందిర స్తోత్రం కూడా రాశాడు  ,

 సన్మతి తర్కానికి స్వే తాంబర జైనా చార్య ‘’అభయ దేవుడు ‘’తత్వ బోధ విధాయిని ‘’వ్యాఖ్యానం రాశాడు .యితడు ప్రద్యుమ్న సూరి శిష్యుడు .సిద్ధసేనుని గ్రంధం అసలు పేరు ‘’సమ్మతి తర్క .ఇది ప్రాకృత భాషాపదం అందుకని ‘’సన్మతి తర్క ప్రకరణం ‘’అని తర్వాత సన్మతి తర్క ‘’అని వ్రాశాడు .ఆర్యా వృత్తం లో సంస్కృత శ్లోకాలలో ఈ గ్రంధం ఉన్నది .కొన్ని అనుష్టుప్ ,ఉపజాతి లను కూడా వాడాడు .ఉపోద్ఘాతం లో 166 శ్లోకాలున్నాయి .ప్రపంచసార లాగా మూడు భాగాల గ్రంధం .మూడు అధ్యాయాలను కాండాలు అన్నాడు వాటిలోని విషయం వివరణ ముందు చెప్పలేదు .రెండవది న్యాయకాండ మూడవది జీవ కాండ .సన్మతిలోని ప్రతిదానిని సుత్త అని గాధలను కూడా అదేపేరుతో చెప్పాడు .అనేకాంత ,ఏకాంత వాదాలపై విస్తృత చర్చ చేశాడు .ఆయన రాసిన ద్వా త్రి0సి కాలను ‘’ద్వా ‘’అనే పేర్కొనితన జీవిత వివరాలు  వివరాలు రాశాడు

 సిద్ధసేనుడు జైన బ్రాహ్మణుడు  వేదం శాస్త్రాలను మహా యాన బౌద్దాన్నిముఖ్యంగా ఆజీవక సిద్ధాంతాన్ని  బాగా అధ్యయనం చేశాడు .దయా దాక్షిణ్యాలున్నవాడు .ప్రతిదానిని నిశిత పరిశీలనం తో చూసే దృష్టి ఉన్నవాడు .తర్కం తో దేనినైనా అర్ధం చేసుకునేవాడు కుదరకపోతే విశ్వాసాన్ని అనుసరించాడు .అనేకమందిరాజులతో తత్వ వేత్తలతో గాఢమైన అనుబంధం ఉన్నవాడు .మహా జ్ఞాని -జీనియస్ గా గుర్తింపు పొందాడు .గొప్ప సృజన శీలి .మహా వీరుని అనుసరించటానికి కారణం విశ్వాసమేకాక అందులోని తర్క విధానం అని చెప్పాడు

 ఈ ద్వాత్రి0శిక లు సంస్కృతం లో ఉన్నా అత్యున్నత తత్వ సారంగా ఉంటాయి .అలంకారాలతో పరిపుష్టమైన శైలీ విన్యాసం తో భాసిస్తాయి .కాళిదాసుని వైదర్భీ రీతి ఉంది .వీటిలో 17 రకాల ఛందస్సులను వాడాడు ఇందులోని 1 నుంచి 5 ,11 ,21 ఉన్న 7 కూడా స్తుతులు 6,8 విశ్లేషణాత్మకమైనవి .మిగిలినవి వేదాంత త త్వ బోదకాలు  సమంత భద్రుని స్వ యం  భూ స్తోత్రం లో ముందుమాట స్వయం భూ చివరిమాట సమంత భద్ర ఉన్నట్లే ఈ ద్వా లలో కూడా మొదట స్వయంభు చివర సిద్ధ సేన ఉంటుంది .మూడవ దానిలో  లో మహావీరుని ‘’పురుషోత్తమ ‘’అన్నాడు 4 వ ద్వా ను ‘’వైతాళీయ ఛందస్సులో రాశాడు .ఇది కుమారసంభవం 4 రఘువంశం 8 సర్గలను గుర్తుకు తెస్తుంది .మొత్తం మీద ఈ అన్ని ద్వాలలో మహావీర స్తోత్రమే దర్శనమిస్తుంది .ఈ విషయాలన్నీ ‘’సన్మతి తర్క ‘’ ఉపోద్ఘాతం లో శ్రీ సుఖ లాల్ శ్రీ బేచార్  దాస్ లు విస్తృత పరిశోధన చేసి ఆంగ్లంలో  రాసిన విషయాలు .సిద్ధ సేన దివాకరుని సన్మతి తర్కం లో ఒక శ్లోకం  చూద్దాం –

1-సిద్ధం సిద్ధాత్సాగం థాసా  భగవోపమఅవగయాసాం-కుసుమయావి సాసగం జినాసం భావ జిఘాంసః ‘’ భావం -జనులు బోధించిన ద్వేష అనురాగాలను జయించాలన్న భావాలు ఉత్కృష్టమైనవి .ఏవ్ ఆ మాటేగాం లో నడిచేవారికి రక్షకాలు అనతత్వాన్ని కాదన్నవారికి ఇవే సమాధానాలు .

220-పార్శ్వ నాధ చరిత్ర రాసిన -సాగర చంద్ర (1252-1276 )

నేమి చంద్ర శిష్యుడు మాణిక్య చంద్ర గురువు అయిన సాగర చంద్ర పార్శ్వనాధ చరిత్ర ,కావ్య ప్రకాశం సంకేతం రాశాడు ఇతనిని సాగరేందు  అని గుణసాగరుని గురువని  అంటారు

221-యతి జీ తక వ్రుత్తి కర్త -సాధురత్న సూరి-(1456 )

1456 లో యతి జీ తక వృత్తి రాసిన సాధురత్న సూరి దేవ సుందర సూరి శిష్యుడు.ఉపోద్ఘాతం లో ‘’జినరత్న గుణి  క్షమా  శ్రమనుడు ‘’సంక్షిప్త జీతకల్ప రచయిత అని చెప్పాడు .సోమప్రభ  దీన్ని పెంచి రాస్తే  సోమతిలకుఁడు వ్యాఖ్య రాశాడు .దేవ సుభద్రుని శిష్యుడని యతి జీత కల్ప వృత్తి కర్త అని రాశాడు

222-సాంబ పంచాశిక కర్త -సాంబ

సూర్య స్తోత్రం అనే సాంబ పంచాశిక రాసిన సాంబ సూర్య ద్వాదశార్య ,సూర్య సప్తార్యలకూ కర్త

223-సింహ తిలక సూరి (1345-1395 )

ధర్మ ప్రభ సూరి శిష్యుడు ,మహేంద్ర ప్రభ గురువు అయిన సింహ తిలక సూరి అంచలగచ్ఛ ఆశ్రమవాసి .అంచల గచ్ఛ పత్రావళి ఉన్నదానిప్రకారం 1345లో పుట్టి ,1352లో దీక్ష పొంది 1371లో ఆచార్యుడై 1393 లో గచ్ఛ నాయకుడై 1395 లో చనిపోయాడు .

224-ఉపమితాభవ ప్రపంచ కర్త-సిద్ధ ఋషి (950

962 లో ఉపమితాభవ ప్రపంచ రాసిన  సిద్ధ ఋషి తన గురుపరంపరను -సురాచార్య దెల్లమహా త్తార ,దుర్గాస్వామి ముసద్దర్శి శిద్దర్శి గా పేర్కొన్నాడు .దీక్షా గురువు గర్గుడు

225-వ్రి హాతి క్షేత్ర సమాస వృత్తి కర్త -సిద్ధ సూరి (1170)

యూకేశ గచ్ఛకు చెందిన ఈకవి 1192 లో వ్రిహాతి క్షేత్ర సమాస వృత్తి రాశాడు .యూకేశాపురీయా గచ్చలోని గురువులు కక్క సూరి ,సిద్ధ సూరి ,దేవ గుప్త సూరి.గురువు సోదరుడుయశోదేవ  ఈగ్రంధానికి విషయం వివరణ అందించాడు .సిద్ధ సూరి కక్క సూరి శిష్యుడు దేవ గుప్త సూరికి గురువు

  సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-14-6-17-కాంప్-షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 217-అలభ్య నాటక రచయిత -మహా కవి చంద్ర (క్రీశ . 319 )

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3

217-అలభ్య నాటక రచయిత -మహా కవి చంద్ర (క్రీశ . 319 )

క్షేమేంద్రుడు కల్హణుడు మంఖ  కవుల చేత గుర్తింపబడిన కవి మహాకవి చంద్ర క్రీ శ 319 లో కాశ్మీర్ పాలకుడు తుంజీర   అని పిలువబడే రణాదిత్యుని కాలం వాడు .ఆయన రాసిన నాటకం అన్నితరగతుల ప్రజలనువిపరీతంగా  ఆకర్షించిందని  అభినవ గుప్తుడే  చెప్పాడు కానీ అది అలభ్యం .ఆయన రాసినట్లు చెప్పబడే కొన్ని కవితలు కనిపిస్తాయి అందులో ఒకటి -ప్రేయసీ కాలం దుప్పిలాంటిది ఎగిరిపారిపోతే మళ్ళీ తిరిగిరాదు . ‘’కాశ్మీరం లో కుంకుమపువ్వు యెంత బాగా ఎక్కువగా పండుతుందో కవిత్వమూ అంత విస్తృతంగా అందంగా పండుతుంది ‘’అన్న బిల్హణకవి మాట పై కవితను చదివితే అర్ధమవుతుంది

218-కాశ్మీర్ లో సంస్కృత కావ్య రచన (650 -884 )

  కాశ్మీర్ లో లభించిన మొట్టమొదటిరచన  ‘’నీలకంఠ పురాణం ‘’.ఇదికావ్యం కాదు .క్రీశ 650 లో  భూమాకుడు రాసిన  ‘’అర్జున రావణీయం ‘’మొదటికావ్యం .ఇది భట్టికావ్యానికి అనుసరణం .ఉపోద్ఘాతం లో కవి దీన్ని మహాకావ్యం అని చెప్పుకొన్నా  ఇందులో పాణినీయ వ్యాకరణ సూత్ర వివరణమే ఎక్కువ .ఇందులోని 18 సర్గలు పాణిని అష్టాధ్యాయిలోని 18  గాన కుటాది పాదం ,భూవాది పాదాలకు   సరిసమానం కథ -రావణ కార్త వీర్యార్జున మే . 500 శ్లోకాలు భారవి కిరాతార్జునీయం  శ్రీ తో మొదలైనట్లే ఈ కవీ  అలానే చేశాడు . 8 వ శతాబ్దం దాకా కాశ్మీర సంస్కృత కవులు సృజన కంటే విమర్శనాత్మక రచనలకు ప్రాధాన్య మిచ్చారు .ఉద్భటకవి తో కాశ్మీర్ లో సంస్కృత సృజన రచన ప్రారంభమైందని అంటారు

 జయాపీడని ఆస్థానకవి దామోదర గుప్త రచన ‘’కుట్టినీమతం ‘’అశ్లీల సాహిత్యం గా ముద్రపడింది . 1058 శ్లోకాల ఈ కావ్యం వారణాసికి చెందిన మాలతి  సలహా సంప్రదింపులకు వికరల ను చేరటం అనేక ప్రేమ కిటుకులు ,మన్మధోత్సవం శృంగారం దట్టించిన   ప్రేమకథ .కొన్ని శ్లోకాల భావాలు చూద్దాం -1-పుష్పహారం ధరించిన ఆమె స్రగ్ధర అంటే అందమైనాముఖం కలది .ఆమె సువదన,ప్రహర్షిణి  ,తనుమధ్యమా ,రుచిరా ,సుభాషిణీ .ఈ పేర్లు అందానికి ఛందస్స్సు వైవిధ్యానికి సరిపోతోంది

 8 వ శతాబ్దం లో సర్వజ్ఞ మిత్ర కవి ‘’స్రగ్ధరా స్తోత్రం ‘’లో 37 స్రగ్ధరా వృత్త శ్లోకాలున్నాయి .  ప్రసన్నం చేసుకొనే  దీనాక్ర0 దన శైలి లో  పాపాలను క్షమించమనటం  తన బలహీనతలను చెప్పుకోవటం కనిపిస్తుంది .ఒకశ్లోకం లో ‘’నా తప్పులు బలహీనతలు మోసం ద్రోహం నన్ను వెంటాడుతున్నాయి .రెండవ శ్లోకం లో -చావుకు దగ్గరైన వాడినీ మంచి వైద్యం తెలిసిన డా వైద్యుడు నిర్లక్ష్యంగా వదిలేసినట్లుంది నా పరిస్థితి

కవి సర్వజ్ఞ మిత్రుడు కాశ్మీరం లోపుట్టినా మగధలోని నలంద విశ్వ విద్యాలయం లో చదివి గొప్ప పండితుడు విజ్ఞానశాస్త్ర వేత్త అయి ‘’విక్రమ శీల మహా విహారాని’’కి  ‘’రాజగురు ,పండిత భిక్షు ,జిన రక్షిత అయ్యాను ‘’అని చెప్పుకున్నాడని ‘’పాగ్సాన్ జాన్ స0గ్  ‘’అనే టిబెటన్ మత గురువు చెప్పాడు .సర్వజ్ఞ మిత్రుని భుజంగ స్తోత్రం కాశ్మీర్ లోనే కాక టిబెట్ లోని టాంగ్యూర్ లో కూడా ప్రార్ధనలో ప్రాచుర్యం లో ఉంది’

 కాశ్మీర్ పండిత గురువు రవి గుప్తుని శ్లోకాలు ,శాక్య శ్రీ భద్రుని 21 అధ్యాయాలలో శ్లోకాలు టిబెట్ లోనూ బాగా ప్రచారమైనాయి

దేశం లో చాలా ప్రాంతాలలో మహా కావ్యాలహవా తగ్గిపోతున్నప్పుడు కాశ్మీర్ లో 9 వ శతాబ్దం లో అంటే 855-884 కాలపు రాజైన అవంతీ వర్మకాలం లో మహాకావ్య విజృంభణ సాగింది  .జయాపీడని ఆస్థానకవి రత్నాకరుడు ‘’హరవిజయం ‘’మహాకావ్యం రాసి తనను ‘’శ్రీ బాల బృహస్పతి అనుజీవిని ‘’గా చెప్పుకున్నాడు  .అవంతివర్మ రాజ్యానికి రాక ముందు శంకుక కవి ‘’భువనాభ్యుదయం ‘’తో మహాకావ్యాలు కొంత వెనక్కు తగ్గాయి .ఇందులో850 లో  మమ్మ ,ఉత్పల మధ్య తీవ్ర పోరాట చరిత్ర ఉంది ఒక శ్లోక భావం -’’వితస్త ప్రవాహం యుద్ధభూమిలో చనిపోయిన వీర సైనికుల కళేబరాల భీభత్సానికి ఆగిపోయింది .ఇది చాలా విచార సంఘటన .

  సశేషం

   మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-6-17-కాంప్-షార్లెట్-అమెరికా


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కాశ్మీర్ సర్వజ్ఞ శారదా శక్తిపీఠ0  

కాశ్మీర్ సర్వజ్ఞ శారదా శక్తిపీఠ0

ఆజాద్ కాశ్మీర్ లో నీలం నది ఒడ్డున శారదా గ్రామంలో శారదా దేవి శక్తిపీఠ ఆలయం ఉంది ..కాశ్మీర్ వేద వేదాంత శాస్త్ర విద్యలకు ప్రముఖ స్థానం అందుకే కాశ్మీర్ కు’’ శారదా దేశ0 అని  పేరు  అక్కడ కొలువైయున్న సరస్వతీ మాత యే శారదాంబ .ఆమెను ‘’కాశ్మీర పూర్వ వాసిని ‘’అంటారు .కాశ్మీర ప్రజలు నిత్యం ఈ శక్తి పీఠాన్ని సందర్శించి ‘’నమస్తే శారదా దేవీ కాశ్మీర పురవాసినీ -త్వం హం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహిమే ‘’అని భక్తితో స్తోత్రం చేస్తారు

 14 వ శతాబ్దానికి ఈ ఆలయం చాలా సార్లు శిధిలమైంది . 19 వ శతాబ్దం లో కాశ్మీర్ రాజు మహారాజా గులాబీ సింగ్ ఈ ఆలయాన్ని చివరిసారిగా మరమ్మత్తులు చేశాడు .1 948 లో ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఈ ప్రాంతం లో జరిగి ఈ ప్రాంతం  ఫస్తూ న్ ‘’తె గల ఆక్రమణకు  గురై వాళ్ళ అధీనం లో ఉండి పోయింది .తర్వాత ఇది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ వశం లో ఉన్నది .దీనికి తోడు 2005 లో జరిగిన అతిపెద్ద భూకంపం లో ఈ ప్రాంతం దేవాలయం చాలా శిధిలమైపోయింది అప్పటి నుంచి ఇది మరమ్మత్తులకు నోచుకోలేదు .పాకిస్తానీ హిందువులు అరుదుగా ఈ  దేవాలయాన్ని సందర్శిస్తారు .దీనికంటే వాళ్ళు సింధు బలూచిస్తాన్ పంజాబ్ ప్రాంతాలను సందర్శించటానికి ఇష్టపడతారు .అందుకే ‘’కటాస్ రాజ్ ‘’దేవాలయానికిచ్చిన ప్రాధాన్యాన్ని పాక్ ప్రభుత్వం దీని పై చూపటం లేదు

 సతీదేవి శరీర భాగాలు 51 ఎక్కడ పడ్డాయో అక్కడ శక్తి పీఠాలు కాలభైరవ దేవాలయాలు వెలసిన సంగతి మనకు తెలుసు ఇక్కడ అమ్మవారి కుడి చేయిపడి శారదా శక్తి పీఠ మైంది . 18 మహా శక్తిపీఠాలలో ఇదిఒకటి .ఇక్కడ విద్యా  దేవతగా శక్తిని ఆరాధిస్తారు అందుకే శారదా పీఠం అయింది .ఈ దేవాలయం బారాముల్లాకు 60 మైళ్ళు ,ముజఫర్ బాద్ కు 40 మైళ్ళ దూరం లో నీలం లోయలో శారదా అనే కుగ్రామం లో ఉంది .ఇది ‘’లైన్ ఆఫ్ కంట్రోల్ ‘’కు వాయవ్య భాగం లో 16 మైళ్ళ దూరం లో ఉంది .ఒకప్పుడు ఈ ప్రాంతం సంస్కృత విద్య కు  కాశ్మీరీ పండితులకు గొప్ప ఆవాసభూమి .హిందూ బౌద్ధాలు చక్కగా విలసిల్లిన భూమి .1277-78 కాలపు జైనుల చారిత్రక గ్రంథం ‘’ప్రభావక చరిత్ర ‘’ప్రకారం ఇక్కడ భద్రపరచబడిన వ్యాకరణ గ్రంధాలను చదివి శ్వే తాంబర జైనుడైన హేమచంద్రా చార్య తన ‘’సిద్ధాంత హేమ ‘’వ్యాకరణ గ్రంధం రాశాడు .భగవద్రామా నుజా చార్యులు శ్రీరంగం నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడున్న  బ్రహ్మ సూత్రాలపై బోధాయనుడు రాసిన వృత్తిని పరిశీలించి తాము’’ బ్రహ్మ సూత్ర భాష్యం’’అనే ‘’శ్రీ భాష్యం ‘’రాశారు . శారదా దేవాలయం ప్రక్కన సంస్కృత విశ్వ విద్యాలయం ఉండేది   క్రీశ 632 లో చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్ దీన్ని సందర్శించి రెండేళ్లు అధ్యయనం లో గడిపి దీనికున్న చారిత్రిక సాంస్కృతిక వైభవాన్ని ప్రస్తుతించారు

 కాశ్మీర్ శారదా పీఠాన్ని సర్వజ్ఞ పీఠం అంటారు .ఎన్నో అర్హతలున్నవారు మాత్రమే దీనిని అధిరోహిచగలరు భగవాన్ శంకర భగవత్పాదులు ఇక్కడికి వచ్చి అన్ని మతాల వాదాల వారినీ వాదం లో జయించి సర్వజ్ఞ పీఠం అధిరోహించారు  . ఇది అతిప్రాచీన ఆలయము, పీఠమూ .సముద్ర మట్టానికి 11000 అడుగుల ఎత్తున ఉన్నది .భారత ప్రభుత్వాధీన కాశ్మీర్ కు ఇది వేసవి విడిది .శారదాలయం 142 అడుగులపొడవు 95 అడుగుల వెడల్పు లో వెలుపలి గోడలు 6 అడుగుల వెడల్పు 11 అడుగుల పొడవు గా ఉంటాయి  . 8 అడుగుల ఎత్తులో   ఆర్చీ లుంటాయి .శృంగేరిలో శ్రీ శంకరాచార్య స్వామి ప్రతిష్టించిన గంధపు చెక్కతో చేయబడిన శారదా దేవి విగ్రాహాన్ని ఇక్కడి నుండే తీసుకు వెళ్లారని అంటారు

 1148 కి చెందిన కల్హణ మహాకవి శారదా దేవాలయం గురించి వర్ణించాడు 8 వ శతాబ్దం లో కాశ్మీర్ రాజు లలితాదిత్యునికాలం లో బెంగాల్ ప్రభువు గౌడరాజుఅనుయాయులు శారదాదేవిని దర్శించారని ,శంకరాచార్యులవారి ‘’ ప్రపంచసారం ‘’లో శారదా దేవి స్తుతి ఉందని ఇక్కడే రాసి ఉంటారని అంటారు . 1030 లో లో ఈ దేవాలయాన్ని సందర్శించిన ‘’అల్ బరూని ’’అనే చరిత్రకారుడు శారదా దేవి విగ్రహం గంధపు చెక్క-చంద న చెక్క తో చేయబడి ఉందని,చెప్పి ఈ ఆలయాన్ని ముల్తాన్ సూర్య దేవాలయం ,దానేశ్వర్ లోని విష్ణు చక్రస్వామి దేవాలయం ,గుజరాత్ లోని సోమనాధ దేవాలయం తోను పోల్చి చెప్పాడు . 16 వ శతాబ్దం లో అక్బర్ చక్రవర్తి ఆస్థాన నవరత్నాలలో ఒకరైన అబుల్ ఫజల్ కవి ఈ దేవాలయాన్ని వర్ణిస్తూ ఇది మధుమతి నది అంటే నేటి నీలం నది ఒడ్డున ఉందని ,ఆలయం బంగార0తో ధగధగా మెరుస్తూ ఉంటుందని ప్రతి శుక్లపక్షం  అష్టమినాడు ఇక్కడ అద్భుతాలు జరుగుతాయని రాశాడు

 ఇంత  గొప్పగా చరిత్రలో వెలిగిపోయిన  శారదాలయం 14 వ శతాబ్దం లోమొ దటిసారిగా ముస్లిం ల దాడికి   గురైనది .ఆతర్వాత ఈ ఆలయం ఈ ప్రాంతం ,కృష్ణ గంగ తో సంబంధం పూర్తిగా భారత దేశపు అధీనం నుంచి తప్పి పోయింది . 19 వశతాబ్దపు డోగ్రారాజు శారదాలయాన్ని పునరుద్ధరించారు .తర్వాతమళ్ళీ మామూలే .

.ఈ ఆలయాన్ని,  అమ్మవారిని ప్రముఖ కర్ణాటక వాగ్గేయ కారుడు ముత్తుస్వామి దీక్షితులు   కళావతీ కమలాసనా ,యువతీ ‘’కీర్తనలో ఘ్ఘనంగా కీర్తించారు  ‘’శాండిల్య మహర్షి ఈ దేవాలయం ప్రక్కన శారదా వనం లో తపస్సు చేశాడు .ఆలయం ప్రక్కనే అమర కుండ్ సరస్సు ఉండే.  శాండిల్య మహర్షి తపస్సుకు శారదా దేవి ప్రత్యక్షమైంది .కాశ్మీర్ ప్రజల స్థానిక లిపిని అమ్మవారిపేరుతోనే ‘’శారదా లిపి’’ ‘’అని భక్తిగా చెప్పుకొంటారు .ఉగ్రవాదుల దాడులలో అట్టుడికి పోయిన కాశ్మీర్ నుండి కాశ్మీర్ పండితులు వలస పోయారు .  2007 లో కొందరు పండితులు ఆజాద్ కాశ్మీర్ లోని శారదా దేవాలయాన్ని చూడటానికి వెడితే అనుమతించలేదు . అదీ మనచదువులతల్లి  శారదా మాతకు పట్టిన దుర్భర పరిస్థితి . మాటల గారడీ చేసే మోడీ కూడా దీనిపై శ్రద్ధ పట్టకపోవడం ,ఇదేకాదు తన గుజరాత్ రాష్ట్రం లోని సముద్ర గర్భం లో ఉన్న  ద్వారక పట్టణం పై కూడా ద్రుష్టి సారించకపోవడం బాధ గా ఉంది  . ఒకప్పుడు వైభవం గా ఉన్న శారదా దేవాలయ సర్వజ్ఞ శక్తి పీఠం నేడు శిధిలాలుగా చూస్తుంటే కడుపు తరుక్కు పోతుంది ..

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -13-6-17-కాంప్-షార్లెట్ -అమెరికా

 Inline image 4

Inline image 1

Inline image 2Inline image 3

Posted in రచనలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 216-లల్ల వాక్యాని  కర్త –లల్లాదేవి (1320-1392 ) )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

216-లల్ల వాక్యాని  కర్త –లల్లాదేవి (1320-1392 ) )

లల్లేశ్వరి, లల్లాదేవి, లాల్ దీదీ  లల్ల  యోగీశ్వరీ అని పిలువబడే 14 వ శతాబ్ది సంస్కృత కవయిత్రి కాశ్మీర్ దేశానికి చెందినది . కాశ్మీర్ ప్రజల ప్రేమాభిమానాలు పొందిన యోగిని .’’.త్వమేవాహం’’మంత్రం తో అందర్నీ మంత్రం ముగ్ధులను చేసింది . కులమతాలకు అతీతంగా వ్యవహరించి అందరి హృదయాలలో స్థానం సాధించింది . .ఒక రకం గా కాలజ్ఞాని . ఆమె చెప్పిన కవితా ఖండికలను ‘’లల్ల వాక్యాని ‘’అంటారు . 14 వ శతాబ్దపు సూఫీ పర్షియన్ యోగి సయ్యద్ ఆలీ హమ్మదానీ కి లల్లాదేవి సమకాలీకురాలు .

 లల్లాదేవి కాశ్మీర పండిత కుటుంబం లో’ శ్రీనగర్ కు నాలుగు మైళ్ళ దూరం లో ఆగ్నేయభాగాన ఉన్న పండ్రే  న్దన్ లో 1320 లో జన్మించింది .ఆమె  పూర్వ జన్మలో కూడా ఇక్కడే జన్మించి అక్కడి కాశ్మీర పండితుని వివాహమాడినట్లు కథ  ప్రచారం లో ఉంది ఆ జన్మ లో ఒక కుమారునికన్నప్పుడు 11 వ రోజు బాలసార జరిపించటానికి వచ్చిన పురోహితుడు సిద్ధ శ్రీ కంఠునితో ‘ఈ  పిల్లాడికి నాకు సంబంధం ఏమిటి ?అని ప్రశ్నించింది .ఆయన ‘’వీడు నీ కొడుకు ‘’అన్నాడు ఆమె ‘’కాదు ‘’వీడు మళ్ళీ కొన్ని గుర్తులతో మరొక చోట నేను చెప్పిన తేదీనాడు  నేను చెప్పిన గంటలకు పుట్టినప్పుడు అప్పుడు నేను ఈ ప్రశ్నకు సమాధానం చెబుతానని చెప్పి వెంటనే చనిపోయింది  .పండితుడు వాడి పుట్టుక కోసం ఎదురు చూసి సరిగ్గా ఆమె చెప్పిన సమయానికి చెప్పిన చోట పుట్టిన  గుర్రపు పిల్లను  గుర్తించి  మళ్ళీ ప్రశ్నిస్తే ,తాను  కుక్కపిల్లగా పుట్టినప్పుడు అడగమంటే అడిగితె ,అదీ అదే సమాధానం చెబితే ఇక ఓపిక నశించి పండితుడు విచారించటం మానేశాడు .ఇలా ఆరు సార్లు జంతుజన్మ అనుభవించి ఏడవ  జన్మ లో లల్లాదేవిగా పుట్టి పూర్వ జన్మ లో తాను కన్న వాడినే వివాహం చేసుకొన్నది .ఆ పురోహితుడే వివాహ తంతు జరిపించాడు  ..పెళ్లి రోజున తన జన్మ రహస్యాన్ని ఆయనకు తెలియ జేసింది ..ఆమెకప్పుడు 12 ఏళ్ళు ,పెళ్లికొడుకుకు యుక్త వయసు వచ్చింది ..ఈ  గాథ  ప్రకారం లల్లాదేవికి పూర్వ జన్మ స్మ్రుతి గొప్పగా ఉందని అర్ధమవుతోంది ..బాల్యం నుంచే జీవితం వేడి పెనంమీద నీటి బిందువు అనే భావన ఏర్పడింది ..పూర్వ జన్మలో ఆమె భర్త ఇప్పుడు మామగారయ్యాడు .లల్లాదేవి దాంపత్యం సవ్యంగా సాగలేదు . కష్టాల కడలి లో అంతూ  దరీ లేకుండా గడిపింది  .

 దీనితో ఆమె మనసు దైవ ధ్యానం పై కేంద్రీకరించింది . అత్తగారు తిండికూడా సరిగ్గా పెట్టేదికాదు ఈ విషయం స్వయంగా చూసిన మామగారు ఆమె తినటానికి కంచంలో ఒక పెద్ద రాయి ముక్క తప్ప ఏమీ లేక పోవటం గ్రహించి మండి పడ్డాడు ..కలిపించుకొందామంటే ఆమె గద్దరితనానికి ఝడిశాడు .ఇలా 12 ఏళ్ళు లల్లాదేవి ఆ కొంపలో ఉండి  తన జీవిత గమ్యానికి దారి వెతుక్కుంటూ ఇల్లు వదిలి వెళ్లి ‘’సెడ్ బాయు ‘’అనే శైవ గురువును చేరి ఉపదేశం పొందింది ..ఈయన ప్రముఖ శివా చార్యుడైన సిద్ధ శ్రీ కంఠుడు  అని గత జన్మలలో పరిచయమున్న వాడని కధనం. ఈయన పంపూర్ గ్రామవాసి అని ప్రసిద్ధ  శైవా చార్యుడు వసుగుప్తుని శిష్యుడని అంటారు .గురువు కంటే పరిపూర్ణ జ్ఞాన0  కలదని వాద  చర్చలలో గురువునే ఓడించి దెబ్బలు కొట్టేదని అంటారు .

   చివరికి లల్లాదేవి శైవ యోగిని ,బ్రహ్మ వాదిని అయింది . ,కాశ్మీర్ దేశపు వస్త్ర ధారణ వదిలేసి అర్ధ నగ్నం గా పర్యటిస్తూ  ,ఎవరేమన్నా పట్టించుకోక నిశ్చలమనసుతో దైవ ధ్యానం తో తిరిగింది .ఒక రోజు ఒక వస్త్ర వ్యాపారి ఆమెకు ఒక చీర ఇస్తే దాన్ని రెండుగా చింపి రెండు భుజాలమీద వేసుకొని వాటికి ముడులు వేసి మర్నాడు అదే కొట్టుకు వెళ్లి దాని బరువును చూడమంది .చీర అదే బరువు ఉంది .అప్పుడామె వాడితో ‘’భూషణ దూషణలు సరి తూకం లో ఉన్నాయి ‘’అని చెప్పింది .ఇదే వేదాంత ధోరణిలో ప్రశాంత జీవితం గడిపింది .

 భక్తి తన్మయత్వం లో పాడుతూ నాట్యం చేస్తూ  తిరిగేది .కాశ్మీర్ ప్రజలు ఆమెను తమగుండెల్లో పెట్టుకొన్నారు ..శ్రీనగర్ కు 25 మైళ్ళ దూరం లో బ్రీజ్ బీహార్ అనే చోట ముసలితనం లో72 వ ఏటా1392లో   లల్లాదేవి తనువు  చాలించింది .ఆమె చెప్పిన ‘’లల్ల వాక్యాని ‘’అతిప్రాచీన కాశ్మీర సంస్కృత భాషలో ఉంటుంది .ఆమె కవిత్వం లో అనేక సామెతలు  నుడులు  దొర్లి ప్రవహించాయి ..ఆ కవిత్వం లోని భావాన్ని కొంత తెలుసుకొందాం –

‘’నువ్వే స్వర్గం నువ్వే భూమి నువ్వే పగలు రేయి గాలి పుట్టిన ప్రతిదానిలో నువ్వున్నావు .నాలోని నువ్వు నేనూ ఒకటే నేనే నువ్వు నువ్వే నేను మనఇద్దరకు మృత్యువే లేదు .నరుడా అంతా ఆయనే .నువ్వే ఆయన ఆయనే నువ్వు ఎందుకీ భేదాలు వాదాలు?

‘’ఇయి కరు మ్  సూయే -ఇయి రాసిన విచారోమ్ థి  మంత్ర-యిహాయి లగామోద హస్ పార్ట్సుణ్ -సూయే పరశివామ్ తన్తార్ ‘భావం -నేనేమి చేసినా అది దైవ కైంకర్యమే అవుతుంది ప్రభూ !నేనేది పలికినా అది నీప్రార్హనే అవుతుంది .ఈ శరీరం అనుభవించింది అంతా శైవ తంత్రమే  అయి పరమ శివ మార్గాన్ని తేజోమయం చేస్తుంది  .

1900 సంవత్సరానికి ముందు ‘’త్రిక ‘’అని పిలువబడిన కాశ్మీర్ మార్మిక  శైవ సంప్రదాయం లల్లాదేవిది  .

   సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -13-6-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

 Inline image 1Inline image 2


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 213-న్యాయ సూత్ర కర్త -గౌతమ మహర్షి (క్రీపూ. 600 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

213-న్యాయ సూత్ర కర్త -గౌతమ మహర్షి (క్రీపూ. 600 )

అక్షపాద గౌతముడు అని పిలువబడే గౌతమమహర్షి ‘’న్యాయ సూత్రాలు ‘’రచించాడు .అందువల్ల వీటిని ‘’గౌతమ న్యాయ సూత్రాలు ‘’అంటారు .ఇందులో 5 విభాగాలలో 528 సూత్రాలున్నాయి .జ్ఞాన మీమాంస ,ఆథి  భౌతిక ,కారణం నిబంధనలు మొదలైన వాటిపై చెప్పిన సుత్రాలివి .వీటిలో వేద సంబంధ క్రతుక్రమాలేవీ లేవు .మొదటి భాగం లో ఉపోద్ఘాతం ,16 రకాల జ్ఞాన వివరాలు రెండవ భాగం లో ప్రమాణ ,మూడవదానిలో ప్రమేయం ,మిగతా రెండిటిలో వీటి గురించి తెలుసుకొనే విపులమైన వివరాలు ఉంటాయి .న్యాయ సంప్రదాయానికి ఇదే ఆధార భూతమైన గ్రంధం .న్యాయ సూత్రాలతో తర్క విద్య ,వాద  విద్య లపై విస్తృత చర్చ ఉంది .వైశేషిక జ్ఞనమీమాంస ,ఆధి భౌతిక విషయాలపై సమగ్ర వివరాలున్నాయి .. ఈ న్యాయ సూత్రాలపై తరువాతకాలం లో అనేక వ్యాఖ్యానాలు వచ్చాయి అందులో వాత్సాయనుడు క్రీశ  450-500 లోను ,6  7 -శతాబ్దాలలో ఉద్యోతడు రాసిన న్యాయ వార్తిక ,9 వ శతాబ్దం లో వాచస్పతి రాసిన తాత్పర్య టీకా ,10 వ శతాబ్దం లో ఉదయు ని’’తాత్పర్య పరిశుద్ధి ,జయంతుని న్యాయ మంజరి ప్రసిద్ధమైనవి

ఈ న్యాయ సూత్రాలలో ప్రత్యక్ష అనుమాన ఉపమాన శబ్ద ప్రమాణాలపై విస్తృత చర్చ ఉంది .మొదటి భాగం లో సరైన చర్చా విధానానికి -ప్రతిజ్ఞ (ప్రతిపాదన ),హేతు (కారణం )ఉదాహరణ,ఉపనయ (అనువర్తనం -అప్లికేషన్ ),నిగమన(నిర్ధారణ )  ఉండాలని చెప్పాడు .ఇవికాక అనుమానం, దోషాలు ,హేత్వాభాస  సూత్రాలు  కారణ సూత్రాలు,వ్యతిరేక సూత్రాల వివరణ ఉంది

 పూర్వపు న్యా సూత్రాలతో ఈశ్వరుడు సృష్టికర్త అని ఆయన వరాలు ఆశీస్సులు అందిస్తాడని చెప్పాయి

సిద్ధాంతం -ఈశ్వరః కారణం పురుషకర్మ  ఫల్య  దర్శనాత్

పూర్వ పక్షం -న ,పురుష కర్మ భావే ఫేలా నిష్ఫ0 తే

సిద్ధాంత సూత్రహ్ -తత్కారితత్వా దహేతుహు

గౌతమ న్యాయ సూత్రాలు వేదాంత తత్వ శాస్త్రానికి దారి చూపాయి

 గౌతమ న్యాయ సూత్రాల అంతిమ ధ్యేయం మోక్షం పొందటమే -దానికి అనుసరించాల్సిన సోపానాలు -ప్రమాణ ,ప్రమేయ,సంశయ ,ప్రయోజన దృష్టాంత ,సిద్ధాంత ,అవయవ ,తర్క ,నిర్ణయం వాద ,జల్ప, వితండ , హేత్వాభాస ,చల ,జాతి ,  నిగ్రహస్థానాలు

214- హనుమంతుని ద్వారా వెలువడిన  -హనుమద్ గీత

శ్రీరామ పట్టాభి షేకం అయినతరువాత ఒక మంచిరోజున అందరు కొలువై ఉండగా రాముడు సీతాదేవిని తన అవతార రహస్యం హనుమంతునికి బోధించామని కోరాడు ఆమె చెప్పినదే హానుమద్ గీత .హనుమ ద్వారా అది లోకం లో ప్రచారమైనది .సీతాదేవి హనుమంతుని చూసి ఆత ను శివ స్వరూపుడని  ఆయన తమ దంపతులకు చేసిన మహోపకారం మరువ లేనిదని మెచ్చుకొంటూ రాముని అనుమతితో శ్రీరామ తత్వాన్ని బోధించింది ‘’శ్రీరాముడు సర్వకాల సర్వావస్థలలో ఉండేవాడు ,అవినాశి  నేను యోగమాయ ను.  ఆయనను వదిలి ఎప్పుడూ ఉండను .నా ఉనికి ఆయనను  ఎల్లప్పుడూ సేవించటానికే .మా ఇద్దరి ప్రేమ సార్వకాలికం ‘’అని చెప్పగానే హనుమ ఆనంద  బాష్పాలు రాలుస్తూ గద్గద స్వరం తో లంకలో సీతకు జరిగిన అవమానాన్ని ఆమె అగ్ని ప్రవేశం చేసిన సంగతి గుర్తుచేసుకొని   ఉద్వేగం తో ‘తల్లీ !ఈ సా రి నువ్వు అగ్ని ప్రవేశం చేయాల్సివస్తే నేను తట్టుకోలేను నీ తోపాటు నేను కూడా నిప్పుల్లో దూకుతా ‘’అన్నాడు .హనుమ ను ఓదారుస్తూ రాముడు ‘’సీతాదేవి ప్రకృ తి .ఆమె మూర్తీభవించిన పవిత్రత .నిన్ను వదిలి ఎప్పుడూ ఎక్కడికీ వెళ్లదు .నువ్వు ఎప్పటికీ మా కుటుంబ సభ్యుడవే ‘’అని అనునయించి జీవిత చక్ర భ్రమణం పుట్టుక చావు ,గుణాలు బంధాలు ,మిధ్యా ప్రపంచం ,మాయ కమ్మి మనుషులు తాము పరమేశ్వర స్వరూపులని మరచి పోవటం ఆత్మ జ్ఞాని కి ఇవన్నీ తెలుస్తాయని ,రామాయణం మానవులను ఉత్తమ మార్గాలలో నడవటానికి తోడ్పడుతుందని హనుమ చిరంజీవి అని  ప్రతిదీ బ్రహ్మమని గ్రహించాలని ఎక్కడ రామనామ స్మరణ వినిపిస్తే అక్కడ హనుమ ప్రత్యక్ష మై ఆన0దం  తో పులకిస్తాడని తెలియ జేశాడు .సితారాములు చెప్పిన ఈ మహోన్నత విషయాలను విన్న హనుమ అంతరంగం ప్రేమ మయమైంది .

 మర్నాటి సభలో హనుమ ‘’నా జీవితం ధన్యమైంది. శ్రీసీతా  రామ సేవలో నేను తరిస్తాను .చిత్త  చాంచల్యమే అన్ని దుఃఖాలకు మూలం . సత్య జ్ఞానమనంతం బ్రహ్మ .సర్వం బ్రహ్మమయమని భావించినవానికి లభించేది మోక్షమే ‘’అన్నాడు .ఈ మాటలు అంటూ ఉండగానే హనుమ శిరసుపై అపూర్వ దివ్య తేజస్సు అవతరించింది కళ్ళు ఒళ్ళు పులకించి ఆనంద బాష్పవాలు రాలుతున్నాయి .హృదయమంతా సీతారాములు నిండి పోయారు .హనుమంతుని ఆత్మ జ్ఞానానికి దివ్యానుభూతికి కొలువు కూటం లోని ప్రతి ఒక్కరూ పులకించి ఆయన దివ్య తేజస్సుకు మురిసి పుష్ప వృష్టి కురిపించి అభినందించారు .హనుమంతుడు ప్రేమ, భక్తి ,ఆరాధన నిండిన  నిస్వార్ధ  సేవకుడు    .ప్రేమ సత్య ధర్మాలను మనసా వాచా కర్మ ణా  అనుష్టించిన పవిత్ర మూర్తి .సదా అప్రమత్తుడై స్వామికార్యాని తననుఁ నమ్మినవారిని కాపాడటానికి   సంసిద్ధమై ఉంటాడు .హనుమ.  సీతారాముల పవిత్ర ప్రేమను ,వానరుడైనా హనుమకు మోక్షమార్గాన్ని ఉపదేశించి చిరంజీకిని చేసిన ఘన చరిత్రను తెలియ జేస్తుంది

215-ఋగ్భాష్య  మనుసూత్రాది గ్రంథ కర్త -దేవలుడు

దేవలుడు దేవతలకు మనుష్యులకు   చక్కని వస్త్రాలు నేసేవాడే కాక దీనికోసం అనేక అవతారాలెత్తినవాడు .అంతేకాదు ఆమోదనగరం రాజధానిగా రాజ్యపాలన చేసిన మహా రాజు .వేదాంతాన్ని ధర్మాన్ని బోధించినవాడు .అనేక గ్రంధాలు రచించినవాడు దేవలుడు .దేవల అవతారమే కాక విద్యాధరమొదలైన  అవతారములు  దాల్చినవాడు .

 దేవలుని  విద్యాధర అవతారం లో రచించిన  గ్రంథ పరంపర -ఋగ్వేద భాష్య ,మనుసుత్ర సంధ్యాభాష్య ,మనుస్మృతి ,దేవలోపనిధి దేవరాజ  ఛందస్  ,దేవల -జెమినివద ,వర్ణాశ్రమ మహోదధి ,బ్రహ్మ సూత్రం నిఘంటు ,మనుజ్ఞాన శిక్షా మణి

మూడవది అయినపుష్పదంతుని అవతారం లో -శివ మహిమ్న స్తోత్రం ,మేరు చరిత్ర వేదాంత కుష్ ,బ్రహ్మోపదేశ సిద్ధాంత ,దేవీ భాగవత దేవ రత్నాకర ,  దేవ రాజా శేఖర ,ఉత్తర మీమాంస ,సుజన దీపికా  రాశాడు

నాలుగవది అయిన భేతాళ అవతారం లో-చతుస్సాశాస్త్ర సూత్రం ,ధనుష్ శాస్త్ర ,భేతాళ పంచతంత్ర ,భేతాళాఖ్యాన ,భూ సూక్త ,స్మర శాస్త్ర మల్లసాధన నిర్ణయం ,మల్ల భైరవ నిర్ణయం ,మహా భైరవ సూక్త ,మంత్రం శాస్త్రం .

అయిదవదైన  వరరుచి అవతారం లో -ప్రక్తిర  ప్రత్యక్ష సూత్రం తత్వ నిఘంటు ,కథా గణిత శాస్త్ర ,చంద్ర సిద్ధాంత సూర్య సిద్ధాంత ,త్రిలింగ దత్తమీమాంస ,శృతి షట్  సూత్రం నిర్ణయం ,కౌముది శబ్ద శాస్త్ర ,వాస్తవ్యు నిర్ణయం ,భగ  శాస్త్ర ,,యోని తంత్ర ,ఛంధోజ్ఞానం ,సంధి సూత్రం ,కారణ న్యాయ బోధిని  ,నర పింగళిశాస్త్ర ,లక్షణ శాస్త్ర ,స్వర శాస్త్ర ,వేదాగమలాయుర్వేద,ఏతద్వింశతి శాస్త్ర0

ఆరవదైన దేవ శాలి అవతారం లో – పరమాన్య వధ  ,సుజ్ఞాన దీపికా ,జ్ఞాన మంజరి ,సుజ్ఞాన రత్నమాల ,సద్వాద జ్ఞాన మంజరి ,పంచ శిఖా నిర్ణయం ,దేవా కల్ప తి మదర్పణ ,ఊర్వాపరా ప్రయోగ ,దేవ రహస్య ,సత్కర్మ జ్ఞాన ప్రబోధక0

ఏడవదైన దేవ దాస అవతారం లో  వచనాలు రాశాడు

 సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -13-6-17-కాంప్-షార్లెట్- అమెరికా

 Inline image 1

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సినారే -తాత్కాలిక తన్మయత్వం

సినారే -తాత్కాలిక తన్మయత్వంInline image 1

Inline image 1Inline image 1

Inline image 1

Inline image 2

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 211-భుజంగ తాండవ స్తోత్రం రచించిన –రావణ బ్రహ్మ

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

211-భుజంగ తాండవ స్తోత్రం రచించిన –రావణ బ్రహ్మ

లోక రావణుడని ,దశకంఠు డని,,రాక్షస నాయకుడని లంకా సామ్రాజ్యాధిపతిఅని శివుని భక్తితో మెప్పించి ఆత్మ లింగాన్ని పొందిన షట్కాల  శివ పూజా దురంధుడని ,,సప్త సముద్రాలలో స్నానించిన ఆతరువాతే శివ పూజ  చేసేవాడని సీతాపహరణం చేసి లోక నింద  మూటగట్టుకొని  శ్రీరామునికి యుద్ధం లో సరిజోదు అనిపించుకుని ఆయన చేతిలో మరణించి న  రావణ బ్రహ్మ  విశ్వశ్రవస   బ్రహ్మ  కైకసి ల కుమారుడు -దూరం లో ఉన్న శబ్దాన్నికూడా అతి స్పష్టంగా వినగలిగినవాడైన     వైశ్రవణుడనే బిరుదున్నవాడురావణ బ్రహ్మ . శివుని మెప్పించటానికి ఘోర తపస్సు చేసి తన తొమ్మిది తలలను ‘’చంద్ర హాసం ‘’అనే ఖడ్గం తో  కోసుకొని శివుని కర్పించి    తన పద వ తలతో  ప్రేగులనే వీణా తంత్రులుగా చేసి వాయించి అమోఘ వరాలుపొందాడు .ఆ వీణ నే ‘’రుద్ర వీణ’’ అంటారు ..అతడు అన్నగారైన కుబేరుని జయించి లంకా సామ్రాజ్యాన్ని వశపరుచుకొని అన్నను బయటికి నెట్టి  అపూ ర్వ మైన ‘’పుష్పక విమానం ‘’లాక్కున్న ఘనుడు .లోక రావణుడు  . నవగ్రహాలను అష్ట దిక్పాలకులను తన వశం చేసుకున్నవాడు . తమ్ముళ్లు కుంభకర్ణుడు విభీషణుడు చెల్లెలు శూర్పణఖ .భార్య మండోదరి .కుమారుడు దేవతలని గడగడ లాడించిన ఇంద్ర జిత్ అనే మేఘనాధుడు .రావణుడు  ‘’సిద్ధ యోగం ‘’,రాజకీయ నీతి శాస్త్రం ‘’లలో అపార పాండిత్యం ఉన్నవాడని ‘’అ ర్క ప్రకాశిక ‘’గ్రంధం లో ఉన్నది  రావణుడు1- ‘’రావణ సంహిత ‘’అనే జ్యోతిశాస్త్ర గ్రంధాన్ని ,2-అర్క ప్రకాశం .అనే ఆయుర్వేద గ్రంధం రాశాడు .

  బ్రహ్మ వరం వలన పొందిన  అమృత బాండాన్నికడుపులో  దాచుకొన్న సమర్ధుడు .ఉత్తర ప్రదేశ్ లోని ‘’భిష్టకి ‘’గ్రామం లో రావణుడు జన్మించాడని ఆ గ్రామస్తుల నమ్మకం

 బౌద్ధుల ‘’లంకావతార సూత్రం లో టిబెటన్ బుద్ధిజం లోని ;;ని0గ్యం ‘’లలో రావణుడు ప్రధాన పాత్ర దారి .శ్రీలంకలో దక్షిణ కైలాసం అని పిలువబడే రావణ దేవాలయం ట్రిన్కోమలికి  తూర్పున ఉంది .తల్లి కైకసి అంత్య క్రియలు నిర్వర్తించటానికి రావణుడు 7 చోట్ల భూమిని కత్తి తో పొడిచాడు ఆ ఏడు ప్రదేశాలనుండి వేడి నీరు భూమిపైకి ఎగతన్నింది ఆ ప్రదేశాన్ని ‘’కన్నియ  హాట్ వాటర్ స్ప్రింగ్స్ ‘’అంటారు ఇది గొప్ప టూరిస్ట్ స్పాట్ .

 గుజరాతులో ‘’ఖచోరబ్రాహ్మణులు ‘’తాము రావణ వంశానికి చెందినవారమని గొప్పగా చెప్పుకోవటమేకాక కొందరి ఇంటిపేరు ‘’రావణ’’గా  ఉండటం మరీ ఆశ్చర్యం కలిగిస్తుంది .గౌతమ గోత్రానికి చెందిన రెండవ ఉపాధ్యాయ యశస్తరుడు తాము ‘’రావణి ‘’వంశనానికి చెందినవారమని చెప్పుకున్నాడు . బర్మా  రామాయణం లో రావణునిపేరు ‘’యవ్వన లేక దాత గిరి ‘’.థాయ్ రామాయణం లో రావణుని యక్షునిగా అసురునిగా చెప్పబడి ,తోత్సపక్ ,అని రాపనాసూర్ అని చెప్పబడింది .జైనమతం లో రామ  ,రావణు లిద్దరు జైన్లు .మంత్రగాడైన విద్యాధరునికొడుకు రావణుడని  రావణుడు రామునిచే కాక లక్ష్మణునిచేత చంపబడ్డాడని ఉంది .

  ఇంతటితో ఈ చావు గోల వదిలేసి రావణ ప్రోక్త’’భుజంగ తాండవ స్తోత్రం ‘’చేస్తూ ఆ తాండవ శివుణ్ణి మెప్పిద్దాం . ఇది  పంచ చామరం  వృత్తం లో ఉన్న 15శ్లోకాల స్తోత్రం .  .పంక్తికి  16 అక్షరాలున్న నాలుగు పంక్తులు ఒక శ్లోకం అయన పరమ శివ భక్తికి ప్రత్యక్ష నిదర్శనం .ఆ తాండవ శివుడిని మన కళ్ళ ముందు ప్రత్యక్షం చేసి చూపించిన కవితా వైభవం రావణునిలో  ఉంది  భావం తెలియకపోయినా భాష మనల్నే తాండవం చేయిస్తుంది .భావం తెలిస్తే అలౌకికానందమే ,అఖండ సచ్చిదానందమే . అహో రావణ బ్రహ్మా అని పిస్తుంది .

జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే

గలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికామ్ |

డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం

చకార చండతాండవం తనోతు నః శివః శివమ్ || 1 |

జటాభుజంగపింగళస్ఫురత్ఫణామణిప్రభా

కదంబకుంకుమద్రవప్రలిప్తదిగ్వధూముఖే |

మదాంధసింధురస్ఫురత్త్వగుత్తరీయమేదురే

మనో వినోదమద్భుతం బిభర్తు భూతభర్తరి || 4 ||

అగర్వసర్వమంగళాకళాకదంబమంజరీ

రసప్రవాహమాధురీ విజృంభణామధువ్రతమ్ |

స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం

గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే || 10 ||

జయత్వదభ్రవిభ్రమభ్రమద్భుజంగమశ్వస-

-ద్వినిర్గమత్క్రమస్ఫురత్కరాలఫాలహవ్యవాట్ |

ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్మృదంగతుంగమంగళ

ధ్వనిక్రమప్రవర్తిత ప్రచండతాండవః శివః || 11 ||

కదా నిలింపనిర్ఝరీనికుంజకోటరే వసన్

విముక్తదుర్మతిః సదా శిరఃస్థమంజలిం వహన్ |

విముక్తలోలలోచనో లలాటఫాలలగ్నకః

శివేతి మంత్రముచ్చరన్ సదా సుఖీ భవామ్యహమ్ || 13 ||

పూజావసానసమయే దశవక్త్రగీతం యః

శంభుపూజనపరం పఠతి ప్రదోషే |

తస్య స్థిరాం రథగజేంద్రతురంగయుక్తాం

లక్ష్మీం సదైవ సుముఖిం ప్రదదాతి శంభుః || 15 ||

212-న్యాయ మంజరి రచయిత -జయంత భట్ట (క్రీశ. 900 )

తొమ్మిదవ శతాబ్దికి చెందిన న్యాయ సిద్ధాంత కారుడు జయంత భట్ట’’న్యాయ మంజరి ‘’ తోపాటు ‘’ఆగమాడంబర ‘’అనే నాటకం సంస్కృతం లో రాశాడు882-902 కాలం లో పాలించిన రాజు శంకరవర్మ తన సమకాలికుడని పేర్కొన్నాడు ఇతని కొడుకు అభినందన కవి తన ‘’కాదంబరి కదా సారం ‘’లో జయంతి భట్ట తాత 8 వ శతాబ్దపు కర్కోటక రాజు లలితా దిత్య ముక్త పీడుని  ఆస్థానం లో మంత్రి అని చెప్పాడు .కనుక జయంతి భట్టు 9 వ శతాబ్దపు ఉత్తరార్ధం లో ఉన్నాడని భావిస్తారు

కధాసారం ప్రకారం వీరిది గౌడ దేశానికి చెందిన బ్రాహ్మణ కుటుంబమని భారద్వాజ గోత్రమని ,పూర్వీకుడు శక్తి అని కాశ్మీర్ రాజ్య సరిహద్దులో దర్వాభిసార లో స్థిరపడ్డారని తెలుస్తోంది  . జయంతుని తాత  కు  రాజు ఉత్తర రాజౌలి లో ఉన్న ‘’గౌర ములక ‘’గ్రామాన్ని దత్తం చేశాడు జయంతుని తండ్రి చంద్ర

చిన్నతనం లోనే జయంతుడు బాలమేధావిగా గుర్తింపబడి యవ్వనం లోనే పాణిని అష్టాధ్యాయి ని  అధ్యయనం చేసి గొప్ప వ్యాకరణ పారీణు డై ‘’నవ వృత్తికారుడు ‘’అనే బిరుదు పొందడాని తెలుస్తోంది .న్యాయ శాస్త్రం పై మూడు వ్యాఖ్యానాలు రాశాడు కానీ న్యాయ మంజరి ఒక్కటే మిగిలింది .మిగతా  రెండు ‘’న్యాయ కలిక,’’న్యాయ పల్లవ’’ .ఈ రెండు ‘’శాద్వద రత్నాకరం ‘’లో పేర్కొనబడ్డాయి కానీ అలభ్యాలు .న్యాయ మంజరి ని  తాను  రాజు చేత అరణ్యం లో నిర్బంధించబడినప్పుడు రాశానని జయంతుడు చె ప్పుకొన్నాడు .న్యాయ  మంజరి  సర్వ స్వతంత్ర గ్రంధమే అనిపిస్తుందికాని అదొక వ్యాఖ్యాన గ్రంధం అనిపించదు   ఆంతటి   న్యాయ శాస్త్ర విద్వత్తు జయంత భట్టుది  దీనిని రాయటానికి ముఖ్య కారణం వేద వాగ్మయ సాధికారత ను  సంరక్షించటం కోసమే నని చెప్పాడు. పూర్వ  న్యాయ శాస్త్ర కారులు న్యాయాన్ని’’ అన్వీక్షికమ్’’ అంటే శాస్త్రీయ విజ్ఞానం అన్నారని తెలిపాడు .

 జయంతుడు రాసిన ‘’ఆగమాడంబరం ‘’నాటకంలో నాలుగు అంకాలున్నాయి .ఇది పాక్షిక వేదాంత సంబంధ నాటకం . ఇందులోని నాయకుడు  వేద విరుద్ధులను వాదం లో ఓడించి వేద ప్రామాణ్యతను కాపాడటమే  ముఖ్య కాదాంశం .దీని ఆంగ్లానువాదాన్ని ‘’క్లే సాంస్క్రిట్ లైబ్రరీ ‘’ప్రచురించింది .

  సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -12-6-17 -కాంప్-షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

 గీర్వాణకవుల కవితా గీర్వాణం -3  205- వేదకాలం రుషులైన అంగీరస మహర్షి i

 గీర్వాణకవుల కవితా గీర్వాణం -3

205- వేదకాలం రుషులైన అంగీరస మహర్షి i

ఋగ్వేద మంత్ర ద్రష్ట -అధర్వ వేదాన్ని అధర్వ అంగీరసం అంటారు సప్తర్షులలో స్థానమున్నవాడు .ఋగ్వేదం లో అగ్ని ,ఇంద్ర ,రుబుష  ,అశ్వినీ దేవతలు ,ఉష ,రుద్ర సూర్యులను  స్తుతించే 1 మండలం లోని 101- నుంచి 115 మంత్రాలు ,2-1,5-35,36 ,8-2 ,9-9710 మండల మంత్రాల ద్రష్ట అంగీరసుడే ఋగ్వేదం లో 3-31 మంత్రం లో అంగీరసుడు అగ్ని హోత్రుని ఆరాధకునిగా చెప్పబడ్డాడు .ఆత్మ జ్ఞానం తో పరబ్రహ్మను గూర్చి తీవ్ర తపస్సుచేసి అనంత  శక్తులు అనంతమైన విజ్ఞానం సాధించాడని పురాణ కధనం బ్రహ్మమానసపుత్రుడు ప్రజాపతులలో ఒకరు .

206-అధర్వ వేద ద్రష్ట -అధర్వ మహర్షి

అంగీరస మహర్షితో పాటు అధర్వ మహర్షి అధర్వ వేదాన్ని దర్శించాడు ..సప్తర్షులలో ఒకడు వేదకాలం లో మొట్టమొదటిసారిగా యిజం చేసినవాడు అధర్వ మహర్షి అంటారు .కర్దమ మహర్షి కుమార్తె శాంతి ని వివాహం చేసుకొని దధీచి మహర్షికి తండ్రి అయ్యాడు .వీరిది భృగు వంశం బ్రహ్మ మానస పుత్రులలో  అధర్వ మహర్షి  పెద్దవాడు

207-భృగు సంహిత జ్యోతిశ్శాస్త్ర కర్త –భృగు మహర్షి

సప్తర్షులలో ఒకరైన ప్రజాపతి భృగు మహర్షి బ్రహ్మ మానస పుత్రుడు .భృగు సంహిత అనే మొట్టమొదటి  జ్యోతిష శాస్త్రాన్ని రచించాడు .జాతక చక్రాలు వేయటం దాన్నిబట్టి బిడ్డ గుణగణాలు వృత్తి వ్యాపారాలు తెలియజేయటం వంటివి అన్నీ అందులో ఉన్నాయి మనువుకు సమకాలీనుడు .దక్షుని కుమార్తె ఖ్యాతి ని పెళ్ళాడి దాత ,విధాత అనే కుమారులను శ్రీ అంటే లక్ష్మేదేవి అనే కుమార్తెకు తండ్రి అయ్యాడు .శుక్రాచార్యుడు ,చ్యవన మహర్షి కూడా భృగుమహర్షి కుమారులే

208-సంజీవని విద్యా వేత్త -శుక్రాచార్యుడు

రాక్షస గురువైన శుక్రాచార్యుడు మృత  సంజీవనీ  విద్యా వేత్త  .దేవగురువు బృహస్పతి కుమారుడు ,అంగీరసుని మనుమడు అయిన కచుని దేవతలు ప్రేరేపించి శుక్రునివద్ద మృతసంజీవినీ విద్య నేర్చుకొని రమ్మని పంపటం ,అతడు వచ్చి గురువు కుమార్తె దేవయాని ప్రేమలో పడటం  శుక్రుడు బాగా మద్యం  తాగి కచునిచితా  భస్మాన్ని అందులో కలుపుకొని తాగటం ,అప్పుడతనికి మృతసంజీవనీ విద్య నేర్పి బయటికి వచ్చేట్లు చేసి దానితో తానూ మళ్ళీ బ్రతకటం ,అప్పటి నుంచి సురాపానం నిషిద్ధం చేయటం మనకు తెలిసిన కథ  యే  .కనుక మొట్టమొదటి మద్య  నిషేధ శాసన కర్త శుక్రాచార్యుడే  .

 శుక్రుడు నవగ్రహాలలో ఒకడు వివాహ కారకుడు .శుక్ర అంటే ప్రకాశం ,స్వచ్ఛత అని అర్ధం .బలి చక్రవరి వామనుడికి మూడడుగులు దానం చేస్తున్నప్పుడు వద్దని శుక్రుడు వారించినా ఒప్పుకోకపోతే రాజును రక్షించే నెపం తో కమండలం లోని నీటిలో దాగి ధార పడకుండా ఆపితే ,దర్భ పుల్లతో పొడిచి కన్ను పోగొట్టాడు వామనుడు అప్పటినుంచి శుక్రుడు ఒంటి కంటి వాడు -’’ఏకా కన్నయ్య ‘’అయ్యాడని మనకు తెలుసు

 శుక్రాచార్యులు మానవ జీవితానికి కావాల్సిన పాటించాల్సిన  నియమాలను చెప్పాడు దానినే ‘’శుక్ర నీతి శాస్త్రం ‘’అంటారు .అందులో కొన్ని -1-అమ్మాయి పేరు చెబితేనే వంకర్లు తిరిగిపోతారు అలాంటిది అందమైన అమ్మాయి కదిలించే కనురెప్పల సొగసు ఎందుకు చూడరు 2-తెలివైన మహిళ చక్కగా వంట చేసి హాయిగా తిని  బాగా మాట్లాడి మగవాడి మనసు ఎందుకు దోచుకోదు ?3-పరస్త్రీ వ్యామోహం వినాశహేతువుకనుకనే ఇంద్ర ,నహుష రావణాదులు నశించారు . 4-రాజుకు పర స్త్రీ  వ్యామోహం, పరధనాపేక్ష ,కోపం తో శిక్షించటం పనికిరావు .వ్యామోహం ,అపేక్ష క్రోదాలు పతన హేతువులు వగైరా

209-భక్తి సూత్ర కర్త -నారద మహర్షి

దేవఋషి నారదు విష్ణు మూర్తి కి మహా భక్తుడు త్రిలోక సంచారి మహతి ఆయన వీణ పేరు .భక్తిలో తరించటానికి ‘’నారద భక్తి సూత్రాలు ‘’చెప్పాడు .అవి అందరికి ఆచరణీయాలే .అజ్ఞానం లో ఉన్నవారికళ్ళు తెరిపించి జ్ఞానమార్గం లో పెట్టటమే ఆయన చేసేపని . ఆయన లేని పురాణం ఇతిహాసాలు లేవు .దివి భువి సంధానకర్త నారదుడు నారం దదాతి నారదః అంటే జ్ఞానాన్ని ఇచ్చేవాడు .నారం అంటే నీరు అనే అర్ధమూ ఉంది విష్ణువుకు నారదునికి అభేదం

 భక్తి ఉద్యమకారుడు నారదుడు .భక్తియోగం ఆయన చెప్పిన సిద్ధాంతం అందుకే భక్తి సూత్రాలు రాశాడు .ఇందులో నవవిధ భక్తిమార్గాలను తొమ్మిది అధ్యాయాలలో 84 శ్లోకాలలో తెలియ బరచాడు .కొన్ని శ్లోకాలు చూద్దాం –

1- ఆదాతో భక్తి వ్యాఖ్యాస్యామః -2-సా త్వస్మిన్ పరమ  ప్రేమ రూపా 3-అమృతస్వ రూపాచ 4-యల్లబ్ధ్వా పుమాన్ సిద్ధో భవతి అమృతో భవతి తృప్తో భవతి 5-యత్ప్రాప్యకించి ద్వా0ఛతి  న శ్రోచ చతి ,న ద్వేష్టి న రమతే   నొసమాహి భవతి ‘’

వీటన్నిటిభావం -భక్తి గురించి ఇప్పుడు తెలియజేస్తా.అది పరమపురుషుని తెలిపే గొప్ప ప్రేమ మార్గం.  అలౌకికమైనది అది తెలిస్తే సంపుర్ణమై న సంతృప్తితో మోక్షం .ప్రేమను పొందినవాడు దేనినీ కోరడు ,,దీనిగురించి బాధపడడు  దేనినీ ద్వేషించడు ,దేనితోనూ తృప్తి ఆనందం పొందడు .

 భక్తి మార్గాన్వేషకులకు నారద భక్తి సూత్రాలు’’ భక్తి వేదమే ‘’.

210- -ఋభుగీత  చెప్పిన -ఋభుడు

పరమ  శివుడు తన అంతే  వాసి ‘’ఋభు ‘’మహర్షికి ‘’శివరహస్యం’’చెప్పాడు దీనినే ‘’ఋభు  గీత ‘’అంటారు  .ఋభు గీతను ఋభుడు  తన శిష్యుడు ‘’నిదాఘ మహర్షి ‘’కి బోధించాడు ఆయన శిష్యులకు బోధించగా అది లోకం లో వ్యాప్తి చెందింది . ఋభు గీత ను  భగవాన్ రమణ మహర్షి తన ప్రవచనాలతో తరచుగా ప్రస్తావించేవారు . అదంటే ఆయనకు ప్రాణం . 122 శ్లోకాలున్న ఋభు గీత తమిళం లో ముందు తర్వాత హిందీ ఇంగ్లీష్  తెలుగు భాషల్లోకి వ్యాఖ్యానాలతో వెలువడింది .అందులోని సారాంశం కొంత తెలుసుకొందాం -విశ్వం సృజింపబడింది ,అభి వ్యక్తమైంది నశించేది కాదు .పరిశుద్ధ చైతన్యం నిశ్చల మైనది . రూపాలు పేర్లూ అన్నీ ఛాయా మాత్రాలు విశ్వం లో ద్వంద్వాలున్నాయని కొందరు అంటారు .మనసుకు ఇంద్రియాలకు భేదం ఉన్నదా ?మనసు లేకుండా అవి పని చేయగలవా ?మనసు అంటే అనేక ఆలోచనల కట్ట యే  కదా .అవి నిశ్చల సముద్ర తరంగాలులాగా నిశ్చల అద్వితీయచైతన్యం లో స్పందనలే అని తెలుసుకొంటే మనసు స్థిరంగా ఉంటుంది

 సశేషం

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-6-17-కాంప్-షార్లెట్ -అమెరికా


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అమెరికా జానపద సాహిత్య పోషకురాలు జోరా నీలే హర్ స్టన్ -గబ్బిట దుర్గా ప్రసాద్

అమెరికా జానపద సాహిత్య పోషకురాలు జోరా నీలే హర్ స్టన్ -గబ్బిట దుర్గా ప్రసాద్

నవల ,కదా జానపద సాహిత్యం ,ఆంత్రోపాలజీ రాసిన ఆఫ్రికన్ అమెరికన్ రచయిత్రి జోరా నీలే హర్ స్టన్ తల్లి లూసీ తండ్రి జాన్ హర్ స్టన్ .ఎనిమిదిమంది సంతానంలో అయిదవది తండ్రికార్పెంటర్ క్రైస్తవ ప్రీచర్ .తల్లి స్కూల్ టీచర్. అమెరికాలోని అలబామా రాష్ట్రం లో నోటా సల్గా లో 7-1-1891 జన్మించింది ఆమె మూడో ఏట కుటుంబం ఫ్లారిడాలోని ఈటోన్ విల్ కు మారింది ఇక్కడే పెరగటం వలన ఇదే తన పుట్టిన ఊరుగా గర్వంగా చెప్పుకొనేది .తండ్రి మేయర్ గా ఎన్నికై అతిపెద్ద మాసిడోనియా మిషనరీ బాప్టిస్ట్ కు ప్రీచరయ్యాడు

ఈటన్ విల్ నే తనకదలకు నేపధ్యంగా ఎన్నుకున్నది జోరా .కారణం ఇక్కడ ఆఫ్రికన్ అమెరికన్లు స్వేచ్ఛగా విడిగా ఉండటానికి వీలుగా ఉండేది ఎందరో ఉత్తరాదిస్కూల్ టీచర్లు ఇక్కడికి వచ్చి ఆమెకు ఎన్నో విలువైన సాహిత్య గ్రందాలిచ్చేవారు ఆమె మనో నేత్రం విప్పారి తనకు నూతనజన్మ లభించిందని చెప్పుకునేది ఈ నేపధ్యంగా మొదటికథ ”హౌ ఇట్ ఫీల్స్ టు బి కలర్డ్ మి ”రాసింది 13 వ ఏట తల్లి చనిపోతే తండ్రి మరోపెల్లి చేసుకొని జారాను జాక్సన్ విల్ బాప్టిస్ట్ బోర్డింగ్ స్కూల్ .లో చేర్పించాడు తర్వాత ఆమె ఖర్చులకు చదువుకు డబ్బుపంపటం మానేశారు .ఆమె గిల్బర్ట్ అండ్ సల్లివాన్ ధియేటర్ కంపెనీ లో ప్రముఖ గాయని వద్ద సర్వెంట్ మెయిడ్ గా పని చేసింది మేరీలాండ్ లోని బాల్టి మోర్ లో ఉన్న మోర్గాన్ స్టేట్ యూని వర్సిటీ లోని మోర్గాన్ కాలేజీకి చెందిన హై స్కూల్ లో చేరింది 26 వ ఏట ప్రీ హైస్కూల్ విద్యార్హతకు తగిన విద్య సాధించటంవలన ఇదే తన పునర్జన్మ అన్నది అక్కడే హై స్కూల్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది

19 18 లో హోవార్డ్ యూని వర్సిటీ లో చేరి యూనివర్సిటీ స్థూడెంట్ న్యూస్ పేపర్ ”హిల్టాప్” స్థాపనకు సహకరించింది .అక్కడే స్పానిష్ ,ఇంగ్లిష్ గ్రీక్ పబ్లిక్ స్పీకింగ్ లలో శిక్షణ పొందింది .రెండేళ్ల తర్వాత అసోసియేట్ డిగ్రీ పొందింది .జాన్ రెడ్డింగ్ గోస్ టు సి ”అనే రెండవ కద రాసింది .ఇది అలైన్ లాకర్లు లిటరరీ క్లబ్ సభ్యత్వానికి దోహద పడింది తర్వాత కొలంబియా యూని వర్సిటీలోస్కాలర్ షిప్ సాధించిన మొట్టమొదటి నల్లజాతిఅమ్మాయిగా రికార్డ్ సృష్టించింది ఆంత్రోపాలజీలో బి ఏ డిగ్రీ పొంది ప్రముఖ ఆంత్రోపాలజిస్ట్ ఫ్రాంజ్ బోస్ తోకలిసి ఎత్నో.లాంగ్ గ్రాఫిక్ రీసెర్చ్ చేసింది లాంగ్ స్టన్ హగ్స్ ,కౌంటీ కాలిం లతో స్నేహంగా ఉండేది .ఆమె ఉన్న అపార్ట్ మెంట్ సాంఘిక సమావేశాలకు వేదికగా ఉండేది ఆఫర్ ట్యునిటి మేగజైన్ నిర్వహించిన కదల నాటిక రచన పోటీలో గెలుపొంది పేరు తెచ్చుకున్నది.

1927 లో జాజ్ గాయకుడు హెర్బర్ట్ షీన్ అనే తన పూర్వపు సహాధ్యాయి ఫిజీషియన్ ను పెళ్లి చేసుకుని ,నాలుగేళ్లకే విడిపోయి డబ్ల్యు పి ఎ లో పని చేస్తూ ఆల్బర్ట్ ప్రయ్స్ ను పెళ్ళాడి 7 నెలలకే విడిపోయింది .ఫ్లారిడా లోని యుగల్లీ లో చిన్న గుడిసెలో రెండు దఫాలు గడిపింది 1930 లో న్యూ జెర్సీ లోని వెస్ట్ ఫీల్డ్ లో గడిపింది ,అప్పుడు ఆమె నైబర్ గా హగ్స్ ఉండేవాడు ఆమె కుక్మన్ యూనివర్సిటీ బెతూన్ లో పూర్తి నీగ్రోభావాలతో స్కూల్ ఆఫ్ డ్రమాటిక్ ఆర్ట్స్ ఏర్పరచింది ఇదే ఫ్లారిడాలో డేటాను బీచ్ లో ఉన్న ఏకైక నల్లజాతి వారికాలేజి .తరవాత నార్త్ కరోలినా కాలేజ్ ఫర్ నీగ్రోస్ లోను దర్హం కాలేజీ లోను పని చేసింది

సాహిత్యం లోను ,మానవ సంబంధాలలోను ఆమె సాధించినదానికి గుర్తింపుగా బితున్ కుక్మన్ కాలేజీ అవార్డుపొందింది బెతూన్ కాలేజీ ఇంగ్లీష్ డిపార్ట్ మెంట్ ఆమె సాంస్కృతిక సేవకుప్రతిఫలంగా ఆమె జ్ఞాపకాల మందిరం గా మార్చింది 1935 లో జోరా ”మూల్స్ అండ్ మెన్ ”అనే పుస్తకం రాసి నల్లజాతి పురుషుల మానసిక స్థితిని వివరించింది ఇది జానపద ధోరణిలో సాగిననవల. 1936-37 లలో జోరా జమైకా హైతీ లకు వెళ్లి ఆంత్రోపలాజికల్ రీసెర్చ్ చేసి”టెల్ మై హార్స్ ”పేరిట రాసి ప్రచురించింది 1947 నుండి హొండూరస్ లో ఉత్తరతీర పట్టణం పోర్టో కార్టిస్ లో ఉ0డి మాయం శిధిలాలపై పరిశోధన చేసింది .మళ్ళీ ఫ్లారిడా చేరి అక్కడి బహుజాతులైన మిస్కు టో, జ0బు గారిఫీనా ల సహజీవనాన్ని గురించి పరిశోధించి వీరంతా ఆఫ్రికాకు చెందిన వారని వీరిది ”క్రియోల్ సంస్కృతి ”అని చెప్పింది .చివరి రోజులలో ‘సామ్ నన్ ”పత్రికలో పనిచేసింది నార్త్ ఫ్లారిడాలో లంబర్ కాంప్ లలో తెల్లవారి పురుష శృంగార ప్రకోపాన్ని వివరించింది అక్కడా జరిగిన ఒక హత్య కేసులో ఆమె రాసిన వార్తాకథనాలు ఆధారంగా జడ్జి తీర్పు చెప్పి కారణమైన తెల్లజాతి వాడికి మరణ శిక్ష విధించాడు .ఎక్కడ ఉద్యోగం దొరికితే అక్కడ పని చేస్తూ పాన్ అమెరికన్ ఎయిర్ వేస్ లో కూడా పనిచేసి ఫోర్ట్ పియర్స్ లో అసోసియేట్ టీచర్గా కూడా చేసి చివరికి తిండి దొరకక జనం సాయం పై బతికింది 60 వ ఏట.చివరికి మయామి బీచ్ ఆఫ్ రై వో ఆల్టో ఐలాండ్ లో మెయిడ్ గా గడిపింది .

ఆర్ధిక బాధలు భరించలేక పొట్టగడవక చివరికి సెయింట్ లూసీ వెల్ఫ్ఫెర్ హోమ్ లో చేరింది .అధిక రక్త పోటుతో 28-1-1960 న జోరా మరణించింది .అక్కడే ఒక అనామక సమాధి కట్టారు తర్వాత ఎప్పుడో నవలా రచయిత ఆలిస్ వాకర్ ,,సాహిత్యవేత్త షార్లెట్ డి హంట్ లు ఆమె సమాధిని గుర్తించి దాన్ని లోకానికి తెలియ జేశారు .ఆమె చనిపోయాక ఆమెఇంట్లో ఉన్న పుస్తకాలు , రాసిన పేపర్లన్నీ తగలబెట్టమని ఆర్డర్ వేశారు న్యాయాధికారి ఆమె స్నేహితుడు పాట్రిక్ దువాల్ అటు వెడుతూ చూసి ఆగి మంటలను ఆర్పేయించి ఆమె అమూల్య సాహిత్యం అగ్నికి ఆహుతికాకుండా కాపాడాడు దీన్ని అంతటినీ ఫ్లారిడా యూని వర్సిటీ లైబ్రరీలకు ఇప్పించాడు

జోరా రచనలో ఆఫ్రికన్ అమెరికన్ మాండలిక భాష వాడటం ఆ రోజుల్లో చాలామందికి నచ్చలేదు ఆమె సంభాషణలన్నీ అనుభవాలనుంచి వచ్చినవే. తనను జానపద వ్యక్తిగా భావించి రాసినవే ఇప్పుడు ఆమె శైలికి నీరాజనం పడుతున్నారు ఆమె మరణానంతరం ఆమెకు బ్రహ్మ రధం పడుతున్నారు ఆమె పేరిట మ్యూజియంలు ఉత్సవాలు సాహిత్య బహుమతిప్రదానాలు చేస్తున్నారు ఆమె నివసించిన ఫోర్ట్ పియర్స్ లోని ఇంటిని ”నేషనల్ హిస్టారికల్ ల్యాండ్ మార్క్ ”ను చేసి గౌరవించారు , 100 మంది గ్రేటెస్ట్ ఆఫ్రికన్ అమెరికన్ లలో ఆమెకు స్థానం లభించింది ఆమె పుట్టిన జనవరి 7 ను జోరా హర్ స్టన్ బర్త్ డే గా వైభవంగా జరుపుతున్నారు .

-గబ్బిట దుర్గా ప్రసాద్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

సినారె మరణానికి సంతాపం

Inline image 1
        సినారె మరణానికి సంతాపం

సాహితీ తపస్వి ,జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత ,”ఆధునిక కవిత్వం -సంప్రదాయం -ప్రయోగం ”రాసిన మహా విమర్శకులు ,మంచి ముత్యాల పలుకుల చిలక ”,ఏకవీర” కు అమరత్వం చేకూర్చి,తెలుగు పాటకు పట్టాభిషేకం చేసిన జ్ఞాన వయో వృద్ధులు  ప అప్పుడెప్పుడో ”ప్రవీణ్ ”అన్నట్లు” సినీ కినారే”- ”సినారె” మరణం సాహితీ  సంగీత లోకానినికి శోకం .వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను -దుర్గా ప్రసాద్

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

వీక్లీ అమెరికా-10(5-6-17 నుండి 11-6-17 వరకు )

వీక్లీ అమెరికా-10(5-6-17 నుండి 11-6-17 వరకు )

మనవడి ఉద్యోగ వారం

5-6-17 సోమవారం -దాదాపు 7 నెలల క్రితం నెట్ లో రాయటం మొదలు పెట్టిన ‘’వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి ‘’ని ఇవాళ  54 వ ఎపిసోడ్ తో పూర్తి చేసి హాయిగా ఊపిరి పీల్చుకున్నాను .. మైనేనిగారు ఆదరం తో  పంపిన ‘’తానా ‘’ప్రత్యేక సంచిక అందింది చాలా’’ రిచ్ ‘’గా ఉందని పించింది . తీరికగా చదవాలి ..రాత్రి ‘’గొట్టం ‘’లో ‘’మళ్లీ  మళ్ళీ ఇది రాని  రోజు ‘’సినిమా చూసాం .శర్వానంద్ ,నిత్యామీనన్ నటించారు .’’ బుర్రా ‘’కుర్రాడి బుర్ర బాగా పని చేసి మంచి డైలాగులు రాశాడు నీట్ గా ఆదర్శంగా ఉంది ..

 మంగళవారం ‘’కారీ ‘’లో ఉంటున్న మా అన్నయ్యగారి మనవడు హరి ఫోన్ చేసి సోమవారం వాళ్ళావిడకు సిజేరియన్ జరిగి రెండవ మగపిల్లాడు పుట్టాడని చెప్పాడు .మూడువారాల ముందే పిల్లాడు పుట్టాడు . .తల్లీ పిల్లాడు కులాసాగా ఉన్నారు ..’’ గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3’’లో 100 మంది కంటే ఎక్కువ మంది దొరకరేమో అనుకున్నాను .కానీ ఇవాళ్టి కి 148 మంది గురించి రాయగలిగాను  అంటే కొంత ధైర్యమొచ్చింది  .’’వుమెన్ సెయింట్స్ ఆఫ్ ఈస్ట్ అండ్ వెస్ట్ ‘’సగం చదివాను .. ట్యూబ్ లో ‘’గుండె జారి  గల్లంతైంది ‘’సినిమా ఫన్  బకెట్ చూసాం ..

బుధవారం -పది రోజులుగా ఫోన్ లో ఇంటర్వ్యూ లు చేస్తున్న మా మనవడు చి సంకల్ప్ కు  చికాగో కంపెనీ వాళ్ళు ఫోన్ చేసి సెలెక్ట్ చేసినట్లు చెప్పి ఒక అరగంటలోనే అపాయింట్మెంట్ ఆర్డర్ మెయిల్ చేశారు అందరం చాలా ఆనందించాం . .రాత్రి శ్రీకాంత్ నటించిన ‘’మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో ‘’యు ట్యూబ్ లో చూసాం సరదాగా ఉంది .

 గురువారం గీర్వాణం -3 లో 169 వరకు రాశా .సాయంత్రం శ్రీమతి వీటూరి పద్మజ  శ్రీమతి గోసుకోండ అరుణలు వచ్చారు పద్మజ వాళ్ళు పై శుక్రవారం మద్రాస్ వెళ్లి పోతున్నారట .మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి పూజాదికాలు కొంత డబ్బు ఇచ్చింది . ఇద్దరికి ‘’మా అన్నయ్య ‘’పుస్తకాలు ఇచ్చాము అందరం కలిసి ఫోటోలు తీసుకొన్నాం .. శుక్రవారం- సంకల్ప్ ఆదివారం ఉదయం చికాగో ప్రయాణానికి ఫ్లయిట్ టికెట్  , కావా ల్సిన సామాను కొని రెడీ అయ్యాడు . గీర్వాణం 188 వరకు రాశాను . శనివారం గీర్వాణం-3 లో  200 కవుల గురించి రాసి చాలా ఆనందించా . తవ్విన కొద్దీ దొరుకు తున్నారు .ఎప్పటికప్పుడు ఖాళీ అనుకొంటుంటే ఇంకా ఊరుతూ నన్నూ ఊరిస్తున్నారు నా అదృష్టం . నాలుగు ఆమ్నాయ పీఠాల జగద్గురువులలో గీర్వాణ రచనలు చేసిన వారందరి గురించీ రాసి ,వేద కాల స్త్రీలు ,మహర్షుల గురించి ,వారి రచనల గురించి రాశాను .కొంత వరకు ఆత్మ సంతృప్తి కలిగింది ..ఆస్ట్రో ఫిజిక్స్ కొన్ని చాఫ్టర్లు చదివాను చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది దీనిపై కొన్ని ఆరికల్స్ రాయాలనిపిస్తోంది .. 52 ఏళ్ళక్రిందటి శిష్యురాలు శ్రీమతి కరుణానిధికి ఫోన్ చేశాను .తాము ఉయ్యూరులో ఉన్నామని తన తల్లిగారు చనిపోయి 9 రోజులయింది చెప్పింది ..సానుభూతి తెలియ జేశాను ..

11-6-17 ఆదివారం -ఉదయం 9 గంటలకు కారులో సంకల్ప్ ను నేనూ, విజ్జి, పీయూష్ ఎయిర్ పోర్ట్ కు తీసుకు వెళ్లి చికాగో ఫ్లయిట్ ఎక్కించి వచ్చాము . మధ్యాహ్నం 2 గంటలకు చికాగో చేరినట్లు తెలియ జేశాడు  గీర్వాణం -3 లో 204 వరకు రాశా ..

       మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-6-17-కాంప్-షార్లెట్-అమెరికా

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 201-పరాశర స్మ్రుతి ,పరాశర హోర గ్రంథ రచయిత -పరాశర మహర్షి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

201-పరాశర స్మ్రుతి ,పరాశర హోర గ్రంథ రచయిత -పరాశర మహర్షి

శక్తి మహర్షికుమారుడు ,వసిష్ఠర్షి మనవడు  వ్యాసమహర్షికి తండ్రి పరాశర మహర్షి భార్య సత్యవతి .అద్వైత గురుపరంపరకు ఆద్యుడు . తండ్రి చిన్నప్పుడే చనిపోవటం తో పరాశరుడు తాత వశిష్ఠుని వద్ద పెరిగాడు ..పరాశర ఆశ్రమం పై జరిగిన దాడిలో ఆయన కాలు దెబ్బతిని కుంటివాడయ్యాడు .ఒకసారి దట్టమైన అడవిలో కుంటుకుంటూ నడుస్తుంటే అడవినక్కలు ఆయనపై పడి  చంపేశాయని ఐతిహ్యం

 ఋగ్వేదం లోఅగ్ని దేవుని స్తుతించే  1-65-73  మంత్రం  .సోముని స్తుతించే 9-97  మంత్రం ద్రష్ట పరాశరామునియే -’’దేవో  నా యహ సవితా సత్య మన్మా  క్రత్వా  నిపాతి విజనాని  విశ్వా – పురు ప్రశస్తో అమతిర్న సత్యా  ఆత్మేవ  సేవో  దిది షయ్యో భూత్ ‘’భావం -ఎవరు సూర్య దేవునిలా ,సత్యం తెలిసి చేతలు దాచి ప్రకృతిలాగా ఉంటాడో వాడు మార్పు చెందని మనసుతో ఆనంద సుఖాలను నిత్యం అనుభవిస్తాడు

పరాశర మహర్షి రుగ్వేద మంత్రం ద్రష్ట మాత్రమేకాదు ‘’పరాశర స్మ్రుతి ‘’,పరాశర సంహిత ‘’,జ్యోతిస్శాస్త్రమైన ‘’బృహత్ పరాశర హోరా ‘’,వృక్షాయుర్వేదం మొదలైన గ్రంధాలు రచించాడు .పరాశరుడు అంటే ‘’పరాశయణా తి పాపా తీత  పరాశరః ‘’అంటే పరాశర ముని దర్శనం ,నామ స్మరణం సమస్త పాప క్షయకరం .పరాశర మహర్షికి దేవాలయాలు హిమాచలప్రదేశ్ లో మండి జిల్లా లో ,మిగిలిన చాలా చోట్ల ఉన్నాయి .

202-త్రిమూర్తుల తండ్రి -అత్రి మహర్షి

సప్త ర్షులలో అత్రి మహర్షి మొదటివాడు పతివ్రత   అనసూయా దేవికి భర్త ..ఈ దంపతుల కుమారులే దత్తాత్రేయ దుర్వాస ,సోమా లు .అత్రిమహర్షి తపస్సుకు మెచ్చిన త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా వారు తమకు సంతానంగా జన్మించాలని కోరాడు

 ఋగ్వేదం లోని 5 వ మండల0 ఉన్న 87 మంత్రాల  ద్రష్ట అత్రిముని .ఇవి అగ్ని ,ఇంద్ర ,విశ్వ దేవ,మిత్ర-వరుణ ,మరుత్తుల అశ్వినీ దేవతల  స్తుతి మంత్రాలు . రెండేసి మంత్రాలు ఉషా ,సావిత్రి లనుద్దేశించినవి .వీటినన్నిటిని ‘’ఆత్రేయసం ‘’ అంటారు .రామాయణం లో సీతారామ లక్ష్మణులు అత్రిమహర్షి ఆశ్రమం సందర్శించి ఆశీస్సులు అందుకున్నారని తెలుసు .పురాణాలలో అత్రిపేరు సుప్రసిద్ధం వైఖానస ఆగమాలలో  అత్రి  ప్రాధాన్యం ఉంది ‘’.అత్రి సంహిత ‘’లో యోగ, నీతి  ధర్మవిషయాలున్నాయి .ఇతరులకు అపకారం చేయకపోవటం బాధించకపోవటం దమము .ఉన్నదానితో కొంత ఇతరులకు సహాయం చేయటం దానము .అవతలివాడి దుఃఖాన్ని బాధను అర్ధం చేసుకొని సానుభూతి సహకారం అందించటం దయ

203-ఋగ్వేద మంత్రం ద్రష్ట -కశ్యప మహర్షి

సప్తర్హులలో ఒకరైన కశ్యప మహర్షి ఋగ్వేదం 8, 9, 10 మండలాల్లో చాలా మంత్రాలకు ద్రష్ట .బృహదారణ్యకోపనిషత్ లో 2-2-4 లో వశిష్ఠ ,విశ్వామిత్ర ,జమదగ్ని ,భరద్వాజ ,గౌతమ మునులతోపాటు  కశ్యప ముని ప్రస్తావన ఉంది

204-అష్టా వక్ర గీత కర్త -అష్టావక్రమహర్షి  -(బిసి 500-400 )

‘’అష్టావక్ర గీత ‘’జనక మహారాజు ఆస్థానం లో అష్టావక్ర మహర్షికి .జనక మహారాజు కు మధ్య జరిగిన అద్వైత విషయం చర్చ .ఇందులో 20 అధ్యాయాలున్నాయి .అవి సాక్షి ,ఆశ్చర్యం ,ఆత్మా ద్వైత ,సర్వమాత్మా ,లయ ,ప్రకృతేహ్ పరా ,శాంటా ,మోక్ష ,నిర్వేద ,వైరాగ్య ,చిద్రూప ,స్వభావ ,యథాసుఖం ,ఈశ్వర ,తత్త్వం ,స్వాస్థ్యము ,కైవల్య ,జీవన్ముక్తి ,స్వమహిమ ,ఆకి0చభావం.

  8 రకాల అంగ వైకల్యం ఉన్నవాడు అష్టావక్రుడు .మాతామహుడు   అరుణి  .తాతవద్దే అతని తల్లి సుజాత  తండ్రి కహోదలు   కొడుకు కూడా వేద విద్య నేర్చారు  అష్టావక్రుడు తల్లిగర్భం లో ఉండగానే తాత గారు చదివే వేద మంత్రాలు విని స్వరం తో సహా చక్కగా పలకటం నేర్చుకున్నాడు .ఒక రోజు తండ్రి కహోదుడు వేద మంత్రాన్ని అపస్వరం తో పలుకుతూ ఉంటె గర్భస్థ శిశువైన అష్టావక్రుడు దాన్ని సరిచేసి సరైన స్వరం తో పలికాడు ఆగ్రహోదగ్రుడైన తండ్రి పుట్టే కొడుకుని అష్ట వంకరలతో పుట్టాలని శపించాడు .అలా పుట్టినవాడే అష్టా వక్రుడు  .మహాజ్ఞాన సంపన్నుడైన అష్టావక్రుడు గొప్ప మహర్షి అయ్యాడు .అద్వైత భావజాలాన్నిఅష్టావక్ర సంహిత లేక అష్టావక్ర గీతలో పొందుపరిచాడు .అష్టావక్ర గీతలో ఒకటి రెండు శ్లోకాలు చూద్దాం –

కధం  జ్ఞాన మవాప్నోతి కధం  ముక్తిర్భవిష్య తి -వైరాగ్యం చ కధం ప్రాప్త మేతత్ బ్రూహి మామ ప్రభో ‘’

2-ముక్తి మిచ్ఛన్తి కేతత్ విషయాన్ వివశ్వరన్ క్షమా ర్జవర  – యశో సస్త్వం పోష్యమావజ ‘’

అష్టావక్రుడు తండ్రితో ఒకసారి జనక సభకు వెళ్లి అక్కడ అద్వైత చర్చలను చూసి వారిమీ రాదనీ చెప్పాడు నువ్వు చెప్పగలవా అంటే చెప్పగలనని ,అయితే తాను  ఉండే చోటుకు వస్తే చెబుతానన్నారు .అలాగేనని అరణ్యం లో ఆయన ఉండే చోటును వెతుక్కుంటూ వెళ్ళాడు జనకుడు .దూరంగా ఆయన్ను చూడగానే గుర్రం కాలు పైకెత్తిఆగి పోయింది .అప్పుడు అదే భంగిమలో ఉన్న జనకునికి ఆత్మ బోధ చేశాడని ఒక కథ  ఉంది .

  సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-6-17-కాంప్-షార్లెట్-అమెరికా

 Inline image 1

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 194-అగస్త్య గీత కర్త -అగస్త్య మహర్షి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

194-అగస్త్య గీత కర్త -అగస్త్య మహర్షి

అగస్త్యుడు అనగానే సప్తసాగరాలను పుడిసిలి పట్టిన మహానుభావుడు ‘’ఛుకులీకృత సకల పాదోది పయస్కుడైన ముని ‘’గా ,వాతాపి ఇల్వల మర్దనుడిగా ,వింధ్యాద్రి గర్వమడచిన లోకోద్ధారకునిగా  రావణ సంహారానికి శ్రీరామునికి ‘’ఆదిత్య హృదయం ‘’బోధించిన మంత్ర వేత్తగా ,ఇంద్రుని భార్య శచీదేవిని పొందటానికి పల్లకీలో కూర్చుని సప్తర్షులను బోయీలుగా చేసుకొని వెళ్లిన గర్విష్టి నహుషుని కాలితో తన్ని త్రిశంకు స్వర్గం లో పడేసి గర్వమణచిన వానినిగా మహా పతివ్రతలోపాముద్రా వల్లభునిగా అందరికి తెలుసు .వేదకాలపు మహర్షి అగస్త్యుడు .ఆయన ఋగ్వేదంలో 1-65-నుండి 1-191మంత్ర ద్రష్ట .తమిళ వాజ్మయ పిత .తమిళ వ్యాకరణాన్ని ‘’అగస్త్యం ‘’అంటారు  అష్ట మహర్షులలో అగస్త్యుడున్నాడు .రామాయణ ,మహా భారతాలలో అగస్త్యుని పాత్ర విశిష్టం .తమిళ శివమ్ లో అగస్త్యుని మొట్టమొదటి సిద్ధుడు గా భావిస్తారు శాక్తేయ ,వైశ్వాలలో ఆయన పేరు తరచుగా వినిపిస్తుంది .అన్ని భారతీయ ప్రాచీన గ్రంధాలలో ,దక్షిణాసియా ఆగ్నేయాసియా హిందూ దేవాలయాలలో ఆయన శిల్పాలు దర్శనమిస్తాయి .11 వ శతాబ్దికి చెందిన జావా భాషా సాహిత్యం లో ఆయన్ను ప్రాచీన గురు ఋషిగా పూజించినట్లు’’అగస్త్య పర్వం ‘’లో  ఉంది

    అగస్త్య మహర్షి వరాహ పురాణం లోని ‘’అగస్త్య గీత ‘’కర్త .స్కాందపురాణం లో ‘’అగస్త్య సంహిత ‘’ఉన్నది .’’ద్వై ధ నిర్ణయం తంత్ర ‘’లో ఆయన ప్రశస్తి ఉన్నది .ఆగస్త్యునికి ‘’మన ,కుంభజ ,కుమ్భయోని, కలశజ  మైత్రావరుణి’’ అనే పేర్లు కూడా ఉన్నాయి .అయన అయోనిజుడైన మహర్షి .వరుణ ,మిత్ర దేవతలు గొప్ప యజ్ఞం చేస్తే ఊర్వశి కనిపిస్తే చాంచల్యం తో ఇంద్రియాన్ని కారిస్తే అది ఒక మట్టి కుండలో పడి అగస్త్య మహర్షి గా ఆవిర్భవించాడని పురాణకధనం .అగస్త్య అంటే అవిసె అనే పేరుంది .అగస్త్య నక్షత్రం ఆకాశం లో దర్శనమిచ్చినప్పుడు అవిసె పువ్వులు తింటే మంచి ఆరోగ్యం కలుగుతుంది .చీకటిలో కాంతి నిచ్చేదే అగస్త్యం

 మహారాష్ట్ర లో నాసిక్ వద్ద గోదావరీ తీరాన అగస్త్యాశ్రమ0 ఉంది .అక్కడే అగస్త్యపురి అక్షోలా పట్టణాలున్నాయి .ఉత్తరాఖండ్ లో రుద్ర ప్రయాగ వద్ద అగస్త్యముని తపస్సు చేసిన ప్రదేశం ఆయన అర్చించిన శివలింగం, గుడి ఉన్నాయి .తమిళ్ నాడులో తిరునవేలి తంజావూర్ మొదలైన చోట్ల ఆయన ఆశ్రమాలు కనిపిస్తాయి .క్రీశ బౌద్ధ గ్రంధాలలో అగస్త్యుని పేరు కనిపిస్తుంది .1 0 వ శతాబ్ది హిందూ గ్రంథం  ‘’ అగస్తి మతం ‘’అగస్త్యుడు రాసినట్లు అందులో ముత్యాలు పగడాలు వజ్రాలు మొదలైన విలువైన వాటి లక్షణాలు చెప్పబడినట్లు ఉన్నది .

195-గృహ్య సూత్రాలు రాసిన -అశ్వలాయనుడు

శౌనక మహర్షి శిష్యుడు అశ్వలాయనుడు మానవ జన్మ సంస్కారాలకు కొన్ని సూత్రాలు చెప్పాడు .ఇది నాలుగుభాగాల గ్రంధం .మొదటిభాగం లో గృహకృత్యాలు అగ్నిప్రతిష్టాపన ,వివాహం అగ్నిహోత్రం ,పురుష సంతానం కలగటానికి చేయవలసిన విధులు ,జన్మ సంస్కారాలైన నామకరణం చెవులు కుట్టటం,అన్నప్రాసన విధానాలున్నాయి . రెండవభాగం లో-10 విభాగాలున్నాయి అందులో శ్రావణ ఆశ్వయుజ మార్గశిర ,మాసాలలో పౌర్ణమి నాటి విధులు హేమంత ,శిశిరాలలో నాలుగు కృష్ణపక్షణాలలో చేయాల్సిన    అష్టక విధానం ఉంటాయి

 మూడవదానిలో -అగ్ని హోత్రం లో వ్రేల్చాల్సిన పదార్ధ వివరణ విధానం ,వేదమంత్ర ఉచ్చారణ పధ్ధతి ,అష్టక విధానం రధప్రయాణం ఇంటి నిర్మాణం వగైరా వివరాలున్నాయి .  నాలుగవదానిలో -9 విభాగాలలో అంత్యక్రియల విధానం చెప్ప బడింది

196-శ్రౌత  సూత్రాలు రాసిన -బోధాయన(బీసీ 800-500 ) ,కాత్యాయనులు (బీసీ 300)

వేద మంత్రాలను నిత్య విధులలో అంటే’’ కల్పం ‘’లో ప్రయోగించే సూత్రాలు అన్నమాట .ఇవి బ్రాహ్మణాల   కాలం లో వచ్చాయి .వేద లో చెప్పిన యజ్ఞ విధులు నిర్వహించటానికి నిర్మించే అగ్ని హోత్ర వేదిక నిర్మాణాలకొలతలను చెప్పే వాటిని సులభ సూత్రాలు అంటారు సులభ అంటే కొలిచేతాడు అన్నమాట .సులభ సూత్రం గ్రంధాలు 5 మాత్రమే మిగిలాయి బోధాయనుడు రాసిన బోధాయన సులభ సూత్రాలు ,కాత్యాయనుడు చెప్పిన కాత్యాయని సులభ సూత్రాలు

197-ధర్మ సూత్రాలు చెప్పిన -ఆపస్తంభ గౌతమ బోధాయన వసిష్ఠ మహర్షులు (బిసి 500-300 )

ఆచారాలు పండుగలు  విధులు చట్టం న్యాయం ధర్మ మొదలైనవాటిపై విస్తృతంగా చర్చించి రాసిన వారిలో మొట్టమొదటివారు ఆపస్తంభ మహర్షి తరువాత గౌతమ ,బోధాయన ,వసిష్ఠ మహర్షులు చెప్పారు .ఇవే అతిప్రాచీన ధర్మ సూత్రాలు .

198-ఋగ్వేద ఏడవ  మండల  ద్రష్ట యోగ వాశిష్టకర్త  -వసిష్ఠ మహర్షి (వేదకాలం )

అరుంధతీ దేవి భర్త వశిష్ఠమహర్షి రామాయణం లో రఘువంశ పురోహితుడు ,సప్త  ఋషులలో ఒకరు. ఋగ్వేదం లో 7 వ మండల  ద్రష్ట  వసిష్ఠ మహర్షి  ఋగ్వేదం 10-167 -4  లో వశిష్ఠ ప్రస్తుతి ఉంది .ఋగ్వేదం 7-33-9 లో వశిశుడు మహా  వేదం వేదాంత పురాణ శాస్త్రాలలో నిష్ణాతుడని  సింధు నాదీ ప్రాంతం లో ఒక సాశ్రమం లో ఉండి వేదాంత బోధ చేశాడని ఉంది  .వేదాంతానికి మొట్టమొదటి గురువు ఆయనే ,యోగ వాశిష్టం వాశిష్ఠ సంహిత ,అగ్నిపురాణం లో కొంతభాగం విష్ణుపురాణం వశిష్ఠ ధర్మ సూత్రాలు  ఆయన రాశాడని నమ్ముతారు  .పాఈ భాషలోని బౌద్ధ రచన ‘’దీఘా నికాయ ‘’లో బుద్ధుడు ప్రాచీన హిందూ మహర్షులను స్మరించేవాడని అందులో వశిష్ఠమహర్షి పేరు కూడా స్మరించేవాడని ఉన్నది .

199- –గాయత్రీ  మంత్రద్రస్ట -విశ్వా మిత్ర మహర్షి

ఋగ్వేదం లో 3 వ మండలం ద్రష్ట విశ్వా మిత్రుడు . అందులో 3-62- 4వాడైన గాయత్రీ  మంత్ర ద్రష్ట స్రష్ట విశ్వామిత్ర మహర్షి ,గాయత్రి మంత్రాన్ని పూర్తిగా అర్ధం చేసుకవారిలో ప్రథముడు విశ్వామిత్రుడు చివరివాడు యాజ్ఞ వల్క్యుడు .రాజర్షి బ్రహ్మర్షిగా మారినవాడు మేనకా విశ్వామిత్రుల కుమార్తె శకుంతలకు జన్మించిన భరతుని పేరే మన భారత దేశం  చంద్ర వంశానికిచెందిన  కన్యాకుబ్జరాజు విశ్వా మిత్రుడు .  కుశుని  కుమారుడు కనుక కౌశికుడు .విశ్వానికి మిత్రుడు కనుక విశ్వామిత్రుడయ్యాడు .హరిశ్చంద్రుని కి పరీక్ష పెట్టి ఆయన సత్య ధర్మాన్నిలోకానికి చాటిన వాడు    త్రిశంకు స్వర్గం నిర్మించినవాడు . మిరపకాయ వంటి పదార్ధ సృష్టికర్త విశ్వామిత్రుడే .  రామాయణంలో  తన యాగ సంరక్షణకు రామ లక్ష్మణులను తన వెంట తీసుకు వెళ్లిబల అతిబలాది శస్త్రాస్త్రాలను  బోధించినవాడు

200-. ఋగ్వేద ప్రాతిశాఖ్య కర్త -.  శౌనక మహర్షి

అధర్వ వేదం లో శౌనక శాఖకు ఆద్యుడు శౌనక మహర్షి .సంస్కృత వ్యాకరణానికి ఆద్యుడు .ఋగ్వేద ప్రాతిశాఖ్యకు కర్త . దీనికే బృహద్దేవత లేక చరణ వ్యూహం అనిపేరు .ఇదిగాక ఋగ్వేదం లో  6అనుక్రమణికలు ఆయనవే. అశ్వలాయన ,కాత్యాయనుల . గురువు ఈయనే . ఋగ్వేదం లోని భాస్కల శకల శాఖలను ఏకీకృతం చేసినవాడు . ఈయనకే  వేదకాలపు గృత్స్నమద .కు సమానుడు అంటారు .ఈయన కుమారుడే శౌనకుడు .. మానవ జీవి తం లోని నాలుగు స్థాయిలున్నాయని చెప్పినవాడు .సూత మహర్షి వద్ద శౌనక మొదలైన మహర్షులు నైమిశారణ్యం లో ఎన్నో పురాణాలు విన్న సంగతి మనకు తెలుసు  .

  12 రోజులు జరిపే సత్రయాగం లో శౌనకుడు ఋగ్వేద ప్రాతిశాఖ్య ను నైమిశారణ్యం లో తానె కర్తకనుక దానిని మహర్షులకు బోధించాడు .ఈ విషయాన్ని ఋగ్వేద ప్రాతిశాఖ్యకు ఊవటుడు రాసినవ్యాఖ్యానం లో ఉన్నది . మహాభారతం కథలను శౌనకునికి   ఉగ్రశ్రవ సౌతి నైమిశారణ్యం లో బోధించినట్లు భారతం లో ఉంది .

   సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-6-17-కాంప్-షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవులకవితా గీర్వాణం -3 189-అశ్వినీ దేవతలపై స్త్రోత్రం రచించిన –ఘోష ( బి సి 1500-1200 )

గీర్వాణ కవులకవితా గీర్వాణం -3

189-అశ్వినీ దేవతలపై స్త్రోత్రం రచించిన –ఘోష ( బి సి 1500-1200  )

కక్ష వంతుని కుమార్తె ,దీర్ఘ త ముని మనుమరాలుఘోష   తండ్రి ,తాతా  ఋగ్వేదం లో రెండు మంత్రాలను దర్శించినట్లు ఉన్నది .ఘోషకు చర్మ వ్యాధి సోకి శరీరం రంగు మారిపోవటం వలన వివాహం చేసుకోకుండా తండ్రి ఇంటనే ఉండి  పోయింది . తాను  కూడా తన ఆరోగ్యం కోసం ఆరోగ్య ప్రదాతలైన అశ్వినీ దేవతలను స్థిర చిత్తం తో ప్రార్ధించింది .వారు ఆమెకు ‘’మధు విద్య ‘’బోధించారు .దీన్ని రహస్యంగా అనుష్టించి అశ్వినీ దేవతల అనుగ్రహం తో శరీరారోగ్యం సౌందర్యము గొప్ప జ్ఞానము  పొందింది .అప్పుడు వివాహం చేసుకొని ,’’శుష్ట్య ’’ అనే కుమారుని కన్నది .ఇతను కూడా ఋగ్వేదం లో ఒక మంత్రాన్ని దర్శించాడు .

   ఋగ్వేదం లోని 10 వ మండలం లో  ఒక్కొక్క దానిలో 14 మంత్రాలున్న39 ,40 అనే రెండు సూక్తాలను చెప్పింది  . .మొదటి అనువాకం అశ్వినీ దేవతలను స్తుతిస్తూ చెప్పింది రెండవదానిలో తనకు ఆరోగ్యం కలగాలని శరీరం కాంతివంతమై అందం రావాలని వివాహం చేసుకోవాలనే కోరికలను తెలియ జేసింది .ఆమెకున్న మంత్ర శాస్త్ర ప్రావీణ్యతను గుర్తించి ఘోష ను ‘’మంత్ర వాదిని’’అన్నారు ఆమెకు బ్రహ్మవాదిని అనే పేరు కూడా ఉన్నది .

190-పంచ దశి కర్త -లోపాముద్ర (బిసి 2600-1950)

కౌషితకి అని వరప్రద అని లోపాముద్రకు పేర్లున్నాయి అగస్త్యమహర్షి భార్య లోపాముద్ర .ఋగ్వేదం లో చాలామంత్రాలు ఆమె దర్శించినట్లు ఉన్నది .ఆమెను ‘’ఋషికి ‘’అంటారు శాక్త సంప్రదాయం లో ‘’వేదాంత పంచ దశి ‘’ రచించింది .ఆమె గురించి మహాభారతం లోను గిరిధర రామాయణం లోనూ ఉంది .అగస్త్యమహర్షి ఒక కుమార్తెను సృష్టించి విదర్భ రాజుకు ఇచ్చాడు .ఆమెకు మంచి విద్య నేర్పించి పెంచిపెద్దదాన్ని చేశారు .ఆమెకు యుక్త వయసురాగానే మహర్షి ఆమెను తనకిచ్చి పెళ్లి చేయమని రాజును కోరాడు .వివాహం తర్వాత రాజ ప్రాసాదం వదిలి దంపతులు దూరంగా వెళ్లి ఆమె సహాయం తో ఆయన చాలాకాలం తీవ్ర తపస్సు చేశాడు .తనను పట్టించుకోకుండా ఆయన తపస్సులో మునిగిపోవటం తో ఆమె వ్యధ చెంది రెండుమంత్రాల అనువాకం చెప్పింది ఆమె మనసు గ్రహించిన మహర్షి తన సర్వ శక్తి యుక్తులతో ఆమెకు సర్వ విధాలా సౌకర్యం సంతృప్తి కలిగించాడు .ఈ దంపతులకు ‘’ద్రి దశ్యు ‘’అనే కుమారుడు జన్మించాడు ఇతనుఁ  గొప్ప కవిగా ప్రసిద్ధుడయ్యాడు  .ప్రసిద్ధ  పతివ్రతలలో లోపాముద్ర కూడా ఒకరు  . జంతువులూ వృక్షాలు తమ అందాలను అంటే’’ ముద్ర’’లను ఇతరులకు త్యాగం చేసి తమకు ఏమీ మిగలకుండా చేసుకొని’’ లోపా ‘’  గా మిగలాటమే లోపాముద్ర తత్త్వం .విష్ణు మూర్తి అవతారమైన హయగ్రీవుని నుండిఅగస్త్య మహర్షి  గ్రహించిన  లలితా సహస్ర నామాలను లోపాముద్ర భర్త తో కలిసి  విస్తృతంగా ప్రచారం చేసింది

 లోపాముద్ర దర్శించిన ఋగ్వేద మంత్రాలు -1-’’పరు వీరహం పురదః  శాస్త్ర మణాదేష  వస్తో ఋషస్లో జరయన్తి -మీనాతి శరియం  జరీనా తనూనమష్యు ను పత్నీ ర్వుషణో జగమ్యుహః ‘’ భావం -ఎన్నో షరతులు గడిచిపోతున్నాయి శరీరం ముసలిదైపోతోంది .అందం మందగిస్తోంది .తెలివిగలవాళ్ళు పెళ్లాలను చేరాలి .

2-’’ఏ చిదధి పూర్వం రత  సాప  అసన్  సాకం దేవీబీ రవద న్నతాని -చే చిదవస్తు ర్నహ్యాన్త   మాషు హ్  సమూ ను పత్నీ ర్వర్షాభి ర్జగమ్యుహ్ ‘’ భావం -సత్యారాధన చేసిన పూర్వీకులు దేవునితో సత్యాన్ని చర్చించారు కానీ వారు చివరికి చేరలేకపోయారు .భార్యలు ఇప్పుడు భర్తలతో సమాగమించాల్సిన సమయ మేర్పడింది

191-27 గురు ఋషికలు( బిసి 2600-1950)

,గోధా   గోషా  విశ్వవరాపలోపనిషత్ -బ్రహ్మజయా , జుహు ఉర్నామ ,అగస్త్యస్య స్వసాదితిహ్ -ఇంద్రాణి ఇంద్ర మతా చ సరమా రోమా షోర్వషి  -లోపాముద్రా చ నాద్యశ్చ ,యామి ,నారీచ శాశ్వతి -శ్రీ ర్లక్షా సర్పరాజ్  జి   వాక్ శ్రద్ధా మేధా చ దక్షిణా -రతి సూర్య చ సావిత్రి బ్రహ్మవాదిన్య యిరితః ‘’

అనే 27 గురు మహిళలు వేద కాలపు విద్యాధికులు . విద్యా వేత్తలు వీరంతా పురుషులతో సరిసమానంగా అన్ని చర్చలలోనూ ,విద్యా సంగీత నాట్య  కార్యక్రమాలలోను పాల్గొన్నారని  లాత్యాయనుడు  తెలియ జేశాడు .వీరందరిని’’ఋషికలు’’అని వేదకాలం లో గౌరవంగా సంబోధించేవారు ..

192- పాణిని  చెప్పిన స్త్రీ విద్యా వేత్తలు -(_బిసి 400 )

వేదం లో కథా  శాఖకు చెందిన మహిళా విద్యార్థినులను పాణిని ‘’కథి  ‘’అన్నాడు.ఋగ్వేద మంత్రాధ్యయనం లో నిష్ణాతులైన మహిళా విద్యార్థులను పాణిని ‘’భహ్వి  రుచి ‘’అన్నాడు .మీమాంస శాస్త్ర ఉపాధ్యాయినులను ‘’ఉపాధ్యాయి ‘’అని విద్యార్థినులను ‘’ఛాత్రి ‘’అనీ అన్నాడు .పాణిని అష్టాధ్యాయికి భట్టోజీ దీక్షితులు రాసిన ‘’సిద్ధాంత కౌముది ‘’వ్యాఖ్యానం లో గృహిణులుగా మాత్రమే కాకుండా సంస్కృత విద్యను బోధించిన వారిని’’ ఉపాధ్యాయి ‘’ అన్నాడు ‘ వీరందరూ వేదవిద్య నేర్చి ఇతరులకు బోధించినవారే

193-ఋషికలు  ఋగ్వేదం  లో దర్శించిన మంత్రాలు (బిసి 2600-1950)

1-అదితి -4,18

2-అదితి ర్దా క్షాయణి -10,72

3-ఆపాలాత్రే యి  -8,91

4 -ఇంద్రాణి -10,86

5-ఊర్వశి -10,85

6-గోదా -10,134

7-ఘోషా కక్షవతి -10,39,10,40

8-జుహుర్బ్రహ్మ జయ -10 109

9-త్వష్ట ,గర్భ కర్త -10 ,184

10-దక్షిణా ప్రజాపత్యా  – 10,107

11-యామీ -10 ,154

12-యామీ వైవస్వతి -10,10

13-రాత్రి భారద్వాజి -10,27

14-లోపాముద్ర -1,171\

15 -వసుక్రపత్ని -10,28

16-వాగామ్భర్ని -10,125

17-విశ్వవర ఆత్రేయి -5,28

18-శాశ్వత్యాంగీరసీ -8,1

19-శ్రద్ధా కామాయని -10,151

20-శచీ పౌలోమి -10,159

21-సర్ప రాజ్ఞి -10 189

22-శిఖాతానివవారి -9,86

23-సూర్య సావిత్రి -10,85

24-రోమాషా -1,126

25-సరమా దేవ షూనీ -10,108

26-శిఖండిన్యప్సరశు -9,104

27-కాశ్యపన జాన్త శర్నఘా -10,142

28-సుదీతీరా0గీరస -8,71

29-ఇంద్ర మాతరో -10 153

  సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-6-17 -కాంప్-షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కష్టాల కడగళ్ల నుంచి విశ్వ చైతన్య పరవళ్లవరకు

కష్టాల కడగళ్ల నుంచి విశ్వ చైతన్య పరవళ్లవరకు

శ్రావస్తి నగరం లో  వైశ్య కుటుంబం లో ‘’పాటా చార్య ‘’జన్మించింది ..యుక్త వయసురాగానే తలిదండ్రులు వారి అంతస్తుకు తగిన అదే కుల0 కుర్రాడికి ఆమె నిచ్చి వివాహం చేయటానికి నిశ్చయించారు ..అతడిని వివాహమాడటానికి నిరాకరించి తనకు నచ్చిన యువకుడిని పెళ్లాడింది ..ఇది తలిదండ్రులకు నచ్చలేదు .ఆమె ఇల్లు వదిలి భరతో  వేరొక కొత్త ప్రదేశానికి వెళ్లి కాపురం పెట్టింది ..కొన్నేళ్లు గడిచాక ఈ దంపతులకు ఇద్దరు మగపిల్లలు పుట్టారు .. తన తలిదండ్రులను ఒకసారి చూసి రావాలని కోరిక కలిగి భర్త, ఇ ద్దరు పిల్లలతో సహా శ్రావస్తికి బయల్దేరింది .. అరణ్య మార్గం లో ప్రయాణం చేయాలి .. ధైర్యం గా అందరూ కలిసి నడుస్తున్నారు ,ఇంతలో అకస్మాత్తుగా ఒక విషనాగు ఆమె భర్తను కరవటం ఏ వైద్య సహాయం అందకపోవటం తో అతడు అక్కడికక్కడే మరణించాడు..ఈ ఆకస్మిక దుర్ఘటనకు ఆమె మనసు కలత చెందింది .మౌనంగా రోదిస్తూ అలాగే ముందుకు పిల్లలతో కలిసి వెళ్ళింది .. అడవిలో ఒక చెట్టునీడన విశ్ర మిస్తుండగా ,చిన్నపిల్లాడిని ఒక వింత పెద్ద పక్షి కాళ్లతో తన్నుకొని ఆకాశానికి యెగిరి పోయి మళ్ళీ కనిపించలేదు .హతాశురాలైంది .మూలిగే నక్కపై తాటిపండు పడినట్లయింది .. తలిదండ్రులను చూడాలనే బలమైన కోరికతో మిగిలిన పెద్ద కొడుకుతో ముందుకు నడిచింది .ఇద్దరు కలిసి ఉధృతంగా ప్రవహిస్తున్న కొండ వాగును దాటుతుండగా మహా ప్రవాహం ఈ ఒక్క కొడుకునూ మింగేసి ఆమెకు కన్నీళ్లే మిగిల్చింది ..ఆమె దుఃఖానికి దరి ,దాపు లేకుండాపోయింది.  విధి వ0ఛితయింది  .

   బరువెక్కిన గుండెతో ఆమె ఎటు పోతోందో తెలియక అటూ ఇటూ తిరుగుతూ చివరికి తలిదండ్రులను చూస్తే తనకు దుఃఖం ఉపశమిస్తుందన్న ఆశతో పుట్టింటికి  చేరాలని భావించింది . కాని ఆ ఇల్లు గుర్తు పట్ట లేక పోయింది.చుట్టు ప్రాక్కల వారిని అడిగితె ఆమె ఇంటిని వదిలిన కొన్ని రోజులకే ఇల్లు కూలి పోయి తలిదండ్రులిద్దరూ చనిపోయారని తెలిసింది .పాపం పాటా చార్యకు దారులన్నీ మూసుకు పోయాయి .ఆమె అనంత శోక సాగరం లో మునిగి తేలుతోంది .దారీ తెన్నూ తోచటం లేదు ..శ్రావస్తిలో వీధి వీధీ తిరుగుతూ తన దయనీయ గాధను వెల్లడిస్తూ దుఃఖిస్తూ గడిపింది .దిక్కు లేని వారికి దేవుడే దిక్కు .

 ఆ సమయం లో బుద్ధ భగవానుడు శ్రావస్తి లో ఉన్నారు .ఆయన సన్నిధానానికి చేరి తన గోడు వె ళ్ళ బోసుకొన్నది పాటా చార్య .తథాగతుడు ఆమెకు ‘’జీవితం అశాశ్వతమైనది ‘’అని బోధించగా ఆ మె  శోకం ఉపశమించింది .మనసు కుదుట బడింది . ఆమెను సంఘం లో ఉండమని భగవాన్ కోరారు .అక్కడే ఆమె బౌద్ధ సన్యాసిని అయి మానవ సేవలో తరించింది .బుద్ధ భగవానుని కొత్తమతాన్ని అందరికి బోధిస్తూ ,ఆయన ప్రవచించిన ధర్మ మార్గాన్ని తెలియజేస్తూ ,ఆత్మ జ్ఞానం పొందిన తథాగతుని మార్గం లో నడిచి జీవితాలను ధన్యం చేసుకోమని  బోధించేది . ఆమె జీవితాంతం సాధన చేస్తూ  ఆత్మ బలాన్ని పొందుతూ ,వేలాది స్త్రీ పురుషుల హృదయాలకు శాంతిని చేకూర్చింది .ఒక సారి ఆమె 500 మంది స్త్రీలకూ బౌద్ధ ధర్మ బోధన చేయగానే వారందరి మనసులు మారి బౌద్ధ సన్యాసినులయ్యారని బుద్ధ దేవునితో దీక్ష పొందిన అదృష్ట వ0తులయ్యారని  ‘’పిటకం ‘’లో ఉంది   .అప్పటివరకు బౌద్ధ మత  చరిత్రలో ఇంతమంది ఒకే సారి బౌద్ధ సన్యాసినులుగా మారటం జరగ లేదు ..ఆమె కస్టాలు కడగళ్ళు ,ఆమె పవిత్ర ధర్మా చరణ   వారందరిలో పరివర్తన కలిగించి ,ప్రభావితం చేసింది ..సాధారణ లౌకిక జీవితం నుండి  ఆధ్యాత్మిక ఆనందానికి ,విశ్వ చైతన్యానికి ఎదిగి తోటి వారికి  దుఃఖోపశమనం కలిగించి  నిండైన సంతృప్తికర ఆనందమయ జీవితాన్ని గడపటానికి ప్రేరణ కలిగించిన ,ఆదర్శ  మహిళా మూర్తి పాటా చార్య .

 మీ- గబ్బిట దుర్గా ప్రసాద్-9-6-17- కాంప్ -షార్లెట్ -అమెరికా


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

181-రుద్ర భాష్య కర్త -శ్రీ ఆత్మ బోదేంద్ర సరస్వతి  (1586-1638 )

తమిళనాడులోని వృద్ధాచలం లో 1586 లో ఈశ్వరగా జన్మించి 58 వ కంచికామకోటి జగద్గురువులయ్యారు .దేశమంతా విస్తృతంగా పర్యటించి అద్వైత భావ దీప్తి కలిగించారు .శ్రీ రుద్రం ‘’పై వ్యాఖ్యానం రాశారు .అవధూత సదాశివ బ్రహ్మేంద్రనుకంచి మఠ గురువులపై  ‘’గురు రత్నమాలిక ‘’ వ్రాయమని కోరారు వీరిద్దరికి పరమ గురువులు 57 వ పీఠాధిపతి  తిరువేంగాడు లో సిద్ధిపొందిన శ్రీ పరమ శివేంద్ర సరస్వతి . దక్షిణ పినాకిని నదీ  తీరం లో వీరు 1638 న సిద్ధిపొందారు

182-లక్ష భగవన్నామ శ్లోకాలు రచించిన -శ్రీ బో దేంద్ర సరస్వతి(1638-1692)

కంచిలో కేశవ పాండురంగ సుగుణలకుమారుడుగా 1610 లో జన్మించి శృతి స్మృతులలో అశేష పాండిత్యం సాధించి ,రామ నమ నామ సంకీర్తనలో తరించి ,రోజుకు లక్షసార్లు రామనామము చేస్తూ శ్రీ ఆత్మ బో దేంద్ర సరస్వతి దృష్టిలో పడి లక్ష్మీధరుడు రాసిన భగవన్నామ కౌముదిని ,పూరీలో ఆయనవద్దనే అభ్యసించి ,దానినాధారం గా ఒక లక్ష భగవన్నామాలు వ్రాయమని ఆదేశించి తర్వాత కంచికి రమ్మని కోరారు అలాచేయగానే 59 వ జగద్గురువుగా అభిషేకించారు .దేశ పర్యటన చేస్తూ వీరు కావేరీ డెల్టా ప్రాంతం లో పర్యటిస్తూ అక్కడి ప్రకృతి అందాలకు మురిసి అక్కడే మహా సిద్ధిని 1638 లో పొందారు .

183-శివాష్టపది  కర్త శ్రీ 4 వ శ్రీ చంద్ర శేఖరేంద్ర సరస్వతి (1746-1783 )-

కంచి మఠం కంచి నుంచి కుంభకోణం కు కర్ణాటక యుద్ధాల సమయం లో మారటం వలన వీరి వివరాలు తెలియలేదు .వీరు 62 వ జగద్గురువులు .జయదేవుని అష్టపదులు మాదిరిగా వీరు’’ శివాష్ట పది’’ రాశారు . 1783 లో కుంభకోణం లో సిద్ధిపొందారు  .

184-ముస్లిం ల అభిమానం పొందిన -శ్రీ మహా దేవేంద్ర సరస్వతి -6(1783-1813 )

63 వ కామకోటి జగద్గురువులు శ్రీ మహా దేవేంద్ర సరస్వతి కుంభకోణం లో జన్మించి 31 వ ఏటపీఠాధిపతి అయ్యారు .ధర్మ శాస్త్రాలలో మహా నిధి .అందుకని ముస్లిం రాజులు కూడా  ధర్మ విషయం లో  వీరి తీర్పును అభిప్రాయాన్ని శిరసా వహించేవారు . యుద్ధాలు జరుగుతున్నా వీరికీ భక్తులకు పుణ్య క్షేత్ర సందర్శనాలకు ఆటంకాలు కలిపించేవారుకాదు .కుంభకోణంలోఆది కుంభేశ్వర దేవాలయం లో వీరు సోమ స్కంద మండపం కట్టించారు .కుంభకోణంలో 1813 లో సిద్ధి పొందారు

185-కనకాభి షేకం పొందిన -శ్రీ చంద్ర శేఖరేంద్ర సరస్వతి -6 (1746-1783)

64 వ కామకోటి జగద్గురువులైన 6 వ చంద్ర శేఖరేంద్ర సరస్వతి కుంభకోణం లో కంచిమఠానికి ప్రక్కనే ఉన్న ఇంట్లో వెంకట సుబ్రహ్మణ్య నామధేయం తో జన్మించి 37 వ ఏట కంచి కామకోటి పీఠాధిపతి అయ్యారు .మహా శ్రీ విద్యోపాసకులుగా గొప్ప పేరు పొందారు .కంచికామాక్షి అమ్మవారి ఆలయానికి మహా కుంభాభిషేకం చేయాలన్న తలంపుతో వీరు మద్రాస్ లో కొంతకాలం విరాళాల సేకరణ కోసం ఉన్నారు .ఒక రోజు అమ్మవారు కలలో కనిపించి కంచికి తిరిగి వచ్చెయ్యమని చెప్పగా వెళ్లి పోయి మహా కుంభాభిషేకాన్ని అనన్య సాధారణం గా నిర్వహించారు .  విరాళాల వెల్లువ కొనసాగి అద్భుతంగా కార్యక్రమం జరిగింది .తిరువనైక్కాల్ లో అఖిలాండేశ్వరి అమ్మవారికి తాటంక ప్రతిష్ట ను రాజకీయ పార్టీల వారు అడ్డుపడినా దిగ్విజయంగా నిర్వహించారు .తంజావూర్ మహారాజుకలలో శివుడు ప్రత్యక్షమై ఆదేశించగా శ్రీ చంద్ర శేఖరేంద్ర సరస్వతికి కి కనకాభి షేకం చేశాడు .ఇది కంచికామ కోటి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖియింపబడిన అద్భుత ఘట్టం .తాటంక ప్రతిష్టకు జరిగిన ఖర్చు అంతా  మహారాజే  భరించాడు 1850 లో సిద్ధిపొందారు . మళ్ళీ కంచి పరమాచార్యులు శ్రీ చంద్ర శేఖర యతీంద్రులకు సువర్ణాభిషేకం జరిగిందని మనకు తెలుసు. కంచి చరిత్రలో ఇది రెండవ కనకాభిషేకం

186-అద్వైత సభ నిర్వహించిన -శ్రీ చంద్ర శేఖరేంద్ర సరస్వతి -6 (1891-1907)

66 వ కామకోటి జగద్గురువులు ఆరవ శ్రీ చంద్ర శేఖరేంద్ర సరస్వతి చెంగల్పట్టుజిల్లా ఉదయం బాక్కం లో స్వామినాధ గా జన్మించారు .జననీజనకులు మల్లికాంబిక, సీతారామ పండిత . 7 వ ఏటనే పీఠాధిపతి అయ్యారు .మహా వక్తగా సుప్రసిద్ధులు . అద్వైత వేదాంతాన్ని వ్యాప్తి చెందించటానికి మొదటిసారిగా ‘’అద్వైత సభ ‘’ను ఏర్పాటు చేసి ఘనంగా నిర్వహించారు . 1907 లో వెల్లూర్ జిల్లా కలవై లో సిద్ధి పొందారు

187-క్రియా సూత్రాలు రాసిన -స్వామి అత్యేశ్వరానంద విద్యారత్న బాబాజీ (  1920)

8 వ ఏటనే క్రియా యోగాశ్ర మంలో చేరి చదివి ,వేదాంతం లో ఏం ఏ చేసి ‘’,లా ‘’కలకత్తా యుని వర్సిటీలో చదివి ,పి హెచ్ డి చేసి ,పూరి గోవర్ధనమఠ శంకరాచార్యుల వద్ద సన్యాసం  తీసుకొని  12 ఏళ్ళు హిమాలయాలలో ఏకాంతంలో తపస్సులో గడిపిగురువు మహాముని బాబాజీ వద్ద ‘’క్రియా సూత్రాలు పూర్ణ క్రియ పొంది ,యోగిగా మారి సంస్కృతం లో విద్యా రత్న పొంది ,అమెరికా సందర్శించి 55 గ్రంధాలు రచించారు .

క్రియాసూత్రాలు -1

తత్త్వం -అత  ఆత్మా జిజ్ఞాసా -స్వరూపేవస్థానం ఆత్మా దర్శనం -సర్వజ్ఞహ్ నిత్యం పూర్ణ మిదానమ0తమాత్మా -తస్య ప్రకాశహ్ ప్రణవః -ప్రణవ శబ్ద ఏవ పంధా -జగత్ సృష్టిమయా  ఈశ్వరస్య తస్య హేతురవిద్యా -చిత్త వృత్తిహ్ హేయ హేతుహ్  .

188- అంకపదీయ కర్త  –శ్రీ నిశ్చలానంద సరస్వతి(1943)

ఋగ్వేద భూమికపై ఏర్పడిన పూరీ గోవర్ధన పశ్చిమ ఆమ్నాయ  పీఠాధిపతి శ్రీ  భారతి కృష్ణ తీర్ధ మహారాజ్   పూర్వాశ్రమంలో ‘’ఫాదర్ ఆఫ్ వేదిక్  మాధేమాటిక్స్ ‘’గా పేరు పొందారు . 1925 లో పూరీ పీఠాధిపతి అయ్యారు .అప్పటినుంచి ఈ పీఠం వేద గణితానికి ప్రాముఖ్యం పొందింది .

 వీరి తరువాత పీఠాధిపత్యం వహించిన శ్రీ నిశ్చలానంద సరస్వతి కూడా గొప్ప గణిత శాస్త్ర వేత్త .వేదగణితం పై 7 ఉద్గ్రంధాలు 1-అంకపదీయం 2-స్వస్తిక గణితం 3-గణిత దర్పణం మొదలైనవి రాశారు .వేదిక మాథ్స్ ఫోరమ్ ఆఫ్ ఇండియా ‘’కు వీరి ఆశీస్సులున్నాయి .

 1943 లో ఉత్తర భారతం లో హరిపూర్ భిక్షాటల్ లో’’నీలాంబర్’’  గా  జన్మించి ,లెక్కలు సైన్స్ సంస్కృతాలు చదివి ,16 వ ఏట ఆధ్యాత్మిక మార్గాన్ని పట్టి ,ఢిల్లీ వెళ్లి జ్యోతిర్మఠ శంకరాచార్యులవారివద్ద దీక్షపొంది ‘’ధ్రువ చైతన్య ‘’దీక్షానామం పొందారు .1970 లో దేశ సంచారం చేస్తూ అనేక క్షేత్ర సందర్శనం చేసి ,ఆత్మ జ్ఞానం పొంది,1974 లో నిశ్చ లానంద స్వామి నామధారులయ్యారు .వేదోపనిషత్తులను గణిత శాస్త్రాలను లోతుగా అధ్యయనం చేశారు .వీరి జ్ఞాన పరాకాష్టకు వీరిని 19 94 లో పూరీ గోవర్ధన పీఠ  145 వ శంకరాచార్యులుగా ప్రతిస్థాపనం చేశారు .అప్పటినుంచి దేశ సంచారం చేస్తూ వేద ప్రాశస్తాన్ని భారతదేశ సమైక్యతను బోధిస్తున్నారు.

  సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -9-6-17 -కాంప్ -షార్లెట్ -అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితాగీర్వాణం -3

గీర్వాణ కవుల కవితాగీర్వాణం -3

170-సంక్షేప శారీరక కర్త -శ్రీ సర్వఙ్ఞత్మానేంద్ర సరస్వతి (407 బీసీ -367 బీసీ )

కంచికామ కోటి పీఠాధిపతి 3 వ జగద్గురువు శ్రీ సర్వజ్ఞాత్మేంద్ర సరస్వతి   శంకర భాష్యం పై వ్యాఖ్య రాశారు .దీనినే’’ సంక్షిప్త  శారీరకం’’ అంటారు . 1267 సరళ భావ గర్భిత శ్లోకాలల్తో ఇది విరాజిల్లింది వీరు పీఠాధిపతి అవటం తమాషాగా జరిగింది .శ్రీ శంకర భగవత్పా దులు దేశం లోని అనేక పండితులతోఅద్వైత  వాదం చేసి ఓడించి ఆ విజయం తో  దక్షిణ మోక్షభూమి కంచికి   వచ్చారు .వారి విజయాన్ని విన్న తమిళనాడు వారంతా చూడాలని కంచికి వచ్చారు .బ్రహ్మదేశం నుంచి చాలామంది వేద శాస్త్ర వేత్తలు వారితో దేవ భేద మూర్తి భేద మొదలైన విషయాలపై వారితో వాదించటానికి వచ్చారు  వారిని అద్వైత భావ పరంపరతతో నిరుత్తరులను చేశారు .సర్వజ్ఞ పీఠం అధిరోహించారు అక్కడకు వచ్చినవారిలో  7 ఏళ్ళ బాలుడు వారిని ఆకర్షించాడు .అతనిలోని బ్రహ్మ తేజస్సును గుర్తించి అతనిని సురేశ్వరాచార్యుల తర్వాత ఉత్తర పీఠాధిపతి చేయ సంకల్పించి తలిదండ్రులకు వర్తమానం పంపారు.  వాళ్ళు వచ్చి విషయం తెలుసుకొని పరమానందం తో తమ అంగీకారం తెలిపారు .శ్రీ శంకరులు ఆబాలునికి సన్యాసం దీక్ష నిచ్చి సర్వజ్ఞాత్మ అనే దీక్షానామమిచ్చి సురేశ్వరాచార్యులకు తీర్చి దిద్దామని బాధ్యత అప్పగించారు .సురేశ్వరుల తర్వాత కామకోటి పీఠాధిపత్యం వహించి చాలాకాలం ఉన్నారు .వీరు ‘’సర్వజ్ఞ విలాస ‘’అనే కావ్య పరిశోధన గ్రంధం కూడా రాశారు

171-పాదుకా శతక కర్త -శ్రీ సత్య  బోదేంద్ర  సరస్వతి(బిసి 367-268 )

కంచికామ కోటి పీఠ 4 వ జగద్గురువులు శ్రీ సత్య బోదేంద్ర సరస్వతి చేర దేశం లో ఫలినీశఅనే పూర్వాశ్రమ నామ దారి .’’తల్లినేశ శర్మ ‘’తనయుడు సాంఖ్య  బౌద్ధ జైనులలను వాదం లో ఓడించి అద్వైత మత  వ్యాప్తి చేశారు .వీరు శంకర భాష్యంపై ‘’పాదక శత ‘’రాశారు .

172-చంద్రిక కర్త -శ్రీ జ్ఞానానందేంద్ర సరస్వతి (బిసి 268-205 )

కామకోటి అయిదవ జగద్గురువులు శ్రీ జ్ఞానా నందేంద్ర సరస్వతి పూర్వనామం జ్ఞానోత్తమ .ద్రావిడ బ్రాహ్మణుడైన నాగేశ కుమారుడు .సురేశ్వరాచార్యుల ‘’నైష్కర్మ సిద్ధి ‘’కి ‘’చంద్రిక ‘’వ్యాఖ్యానం రాశారు .ఇందులో సత్యబోధ సర్వజ్ఞాత్మ గురువుల ప్రస్తుతి ఉంది ప్రొఫెసర్ హిరణయ్య సంపాదకత్వం లో దీన్ని మైసూర్ యూనివర్సిటీ ప్రచురించింది . కంచి సర్వజ్ఞాశ్రమానికి వీరు వెలుగులద్దారని భావిస్తారు .

173-సురేశ్వర వార్తికా  వ్యాఖ్యాన కర్త -శ్రీ ఆనంద జ్ఞానేంద్ర సరస్వతి (బీసీ 124-55 )

చేర దేశానికి చెందిన సూర్యనారాయణ మఖి కుమారుడు చిన్నయ్య పూర్వాశ్రమనామం .గౌరీదేవి పరమ భక్తులు అమ్మ కరుణాకటాక్షాలతో అద్భుత పాండిత్యం అబ్బింది .శంకర భాష్యం సురేశ్వర వార్తికలపై భాష్యాలు రాశారు .శ్రీశైలం లో ముక్తి పొందారు

174-భక్తి మార్గ ప్రబోధకులు -శ్రీ కృపాశంకరేంద్ర సరస్వతి (క్రీశ 28-69)

గాంగేశో పాధ్యాయ పూర్వనామం.ఆంద్ర బ్రాహ్మణులు .మనసా వాచా కర్మణా అతిపవిత్ర జీవితం గడిపి 9 వ   కామకోటి జగద్గురువులయ్యారు .శంకరాచార్యుల మార్గం లో అడుగులు వేస్తూ షణ్మత పూజా విధానాన్ని వ్యాప్తి చెందించారు .గణపతి స్కంద శివ విష్ణు అంబికా సూర్య దేవతా పూజా విధానాలు రచించి భవిష్యత్ శైవ నయనార్లకు మార్గ దర్శి అయ్యారు .శైవ ,వైష్ణవ మతాలు శ్రీ శంకర ,శ్రీ కృపా చార్యులకు సదా కృతజనులై ఉండాలి .వింధ్య ప్రాంతం లో ముక్తి పొందారు .

175-అభినవ శంకరులు -శ్రీ అభినవ శంకరేంద్ర సరస్వతి (క్రీశ 788-840 )

ఆదిశంకరాచార్యుల తర్వాత అంతటి కీర్తి పొందినవారు శ్రీ అభినవ శంకరేంద్ర సరస్వతి .వీరి జీవిత చరిత్రను ‘’శం కర విజయం ‘’లో వాక్పతి భట్టు వివరించాడు .తండ్రి చిదంబరానికి చెందిన విశ్వజిత్ . 5వ ఏటనే ఉపనయనం జరిగి,వేదాధ్యయనం ప్రారంభించి సర్వశాస్త్రాలలో అద్వితీయుడనిపించారు .వేదాంత చర్చలంటే మహా ఇష్టం .తర్కం లో వాక్పతి భట్టును ఓడించారు .38 వ కామకోటి జగద్గురువయ్యారు కాశ్మీర్ సర్వజ్ఞ పీఠం అధిరోహించారు .హిమాలయాలలోని ఆత్రేయ పర్వతాలలో ఉన్న దత్తాత్రేయ గుహలో తపస్సు చేసి అక్కడే జీవన్ముక్తులయ్యారు .

176-కధా  సరిత్సాగర కర్త -శ్రీ సాంద్రా నంద బోదేంద్ర సరస్వతి  1061-1098 )

46 వ కామకోటి జగద్గురువులు శ్రీ సాంద్రా నంద బోదేంద్ర సరస్వతి పూర్వనామ0 సోమేంద్ర.  తండ్రి సూర్య .గురువుపరమశివేంద్ర సరస్వతి తో విస్తుతంగా దేశాటనం చేశారు ‘’కదా సరిత్సాగరం ‘’రచించారు .దీనికి కానుకగా ధారానగర రాజు భోజుడు ముత్యాలపల్లకి కానుకగా అందజేశాడు .అరుణాచల క్షేత్రం లో మోక్షం పొందారు .

177-హేమ చంద్రాచార్యను ఓడించిన -శ్రీ చంద్ర శేఖరేంద్ర సరస్వతి -4(1098-1166 )

 4 వ శ్రీ చంద్ర శేఖరేంద్ర సరస్వతి 47 వ కామకోటి జగద్గురువు .మరొక పేరు చంద్ర చూడ .కుండీని నది తీర ప్రాంతవాసి.తండ్రి సుఖ దేవుడు .ద్రావిడ బ్రాహ్మణుడు పూర్వాశ్రమనామం శ్రీ కంఠుడు  వాద  దిగ్విజయ యాత్ర చేస్తూ విద్యాలోల కుమారపాల ఆస్థానకవి హేమచంద్రా చార్య అనే కుమారపాల చరిత్ర రాసిన కవి , జైన పండితుని వాదం లో ఓడించారు. కృష్ణ మిశ్రకవి శ్రీక0ఠ  చరిత్ర రాస్తే మంఖకవి ఆరాధించాడు  హేమ చంద్రునిపై వాద  విజయాన్ని జయదేవుడు ‘’భక్తకల్ప లతిక’’లో గొప్పగా వర్ణించాడు .కాశ్మీర్ రాజు జయసింహుడు తానూ ఈ జగద్గురువు శిష్యుడనని వినయంగా చెప్పుకున్నాడు

178-బ్రహ్మ విద్యాభరణం  కర్త -శ్రీ అద్వైతానంద బో దేంద్ర సరస్వతి(1166-1200 )

48 వ కామకోటి జగద్గురువులు శ్రీ అద్వైతానంద బో దేంద్ర సరస్వతి బ్రహ్మ విద్యాభరణం,శాంతి వివరణ ,గురు ప్రదీపం గ్రంధాలు రాశారు .నైషధం ఖండనఖండ కావ్య రచయిత హర్షుని ,అభినవ గుప్తుని వాదం లో జయించారు .చిదంబరం లో ముక్తిపొందారు .

179-ఉపనిషత్తులపై ‘’దీపిక’’లు రచించిన – శ్రీ శంకరానందేశ్వర సరస్వతి -(1385-14 17 )

కామకోటి 52 వ పీఠాధిపతి శ్రీ శంకరానందేశ్వర సరస్వతి మధ్యార్జున లేక తీరు విడై మరుదూర్ లో బాలచంద్ర కుమారునిగా మహేశ నామ ధేయం తో జన్మించారు .పీఠాధిపతి కాకముందు గురువు భారతీ తీర్ధతో హిమాలయ పర్యటన చేశారు .కర్ణాటకలో 8 కొత్త అద్వైత మఠాలను  స్థాపించిన ఘనకీర్తి వారిది ..ఈశ  ,కేన ,ప్రశ్న ,బృహదారణ్యక ఉపనిషత్తులకు ‘’దీపిక’’ వ్యాఖ్యానం రచించారు ..ఆత్మ పూర్ణ ‘’ను ,భగవద్గీత వ్యాఖ్యానాన్ని రచించారు .వైష్ణవ ,మాద్వులు అద్వైతం పై చేసిన వ్యతిరేక ప్రచారాన్ని తీవ్రంగా ఖండించి ఎదురు నిలిచారు .కంచిలో ముక్తి పొందారు .

180-శివ గీతకు వ్యాఖ్యానం రాసిన -శ్రీ పరమ శివేంద్ర సరస్వతి -(1040-1061 )

పంపాతీరగ్రామంలో పరమశివ కుమారుడు పూర్వాశ్రమంలో శివరామకృష్ణ శ్రీ పరమ శివేంద్ర సరస్వతిగా 57 వ కామకోటి జగద్గురువయ్యారు .గురురత్నమాలిక రాసిన మహా బ్రహ్మజ్ఞాని సదాశివ బ్రహ్మేంద్రునికి గురువు  .ఈ గురువు ఘనత త ఎలాంటిది అంటే సదాశివ బ్రహ్మేంద్రులు వీరి పాదుకలను ఎప్పుడూ శిరస్సుపై పెట్టుకొని తిరిగేవాడు .బ్రహ్మజ్ఞానం తో అవధూతగా మారిన సదాశివేంద్రుని చూసి కొందరు ఆయన కు పిచ్చిపట్టిందని ప్రచారం చేసి గురువు శ్రీ పరమ శివేంద్ర కు తెలిపారు .ఆయన ‘’నాకు కూడా అలా అవ్వాలని ఉంది .ఆయనను తాకితే చాలు అది లభిస్తుంది ‘’అన్నారట .అంతటి గొప్ప అవధూత సదాశివ బ్రహ్మేంద్రులు .అంతగొప్ప సంస్కారి వీరు . వీరి గొప్పతనాన్ని సదాశివ బ్రహ్మేంద్రులు ‘’ఆత్మ విద్యా విలాసం ‘’లో అభి వర్ణించాడు .వీరు శివగీతకు చక్కని వ్యాఖ్యానం రాశారు . తంజావూర్ వద్ద స్వే తారణ్యం  లో మోక్షం పొందారు .

   సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-6-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితగీర్వాణం -3

గీర్వాణకవుల కవితగీర్వాణం -3

161-తత్వ శుద్ధి రచించిన శృంగేరి జగద్గురువు -శ్రీ శ్రీ జ్ఞానఘన (848-910)

అప్పయ్య దీక్షితులు మెచ్చిన ‘’త త్వ శుద్ధి ‘’ సంస్కృత గ్రంధం రాసిన 4 వ శృంగేరి జగద్గురుసులు శ్రీ శ్రీ జ్ఞానఘన .గురువంశ కావ్యం ప్రకారం వారు పినాక పాణి భక్తులు .శృంగేరిలో శ్రీ జనార్దనా దేవాలయం వీరి ఆధ్వర్యం లోనే జరిగింది .వీరి గురించిన శ్లోకం -సత్తా ధనాది తీస్టం తే -ప్రజ్ఞాన్ ఘానా ఏవేతి తం జ్ఞానఘన మాశ్రయే ‘’ .

162-శ్రీ జ్ఞానోత్తమ (910-954 )

శృంగేరి జగద్గురువులలో 5 వ వారు శ్రీ జ్ఞానోత్తమ .పూర్వాశ్రమ లో దక్షిణా భారతదేశం లో స్థిరపడ్డ గౌడులు .శ్రీ జ్ఞానఘన తర్వాత పీఠాధిపత్యం వహించారు .వీరు వ్రాసిన ‘’విద్యా శ్రీ ‘’శ్రీ శంకర భగవత్పాదుల సూత్ర భాష్యానికి ఉప భాష్యం .వీరి ముఖ్య శిష్యులు విజ్ఞానాత్మ ‘’నారాయణోపనిషత్ ‘’కు ‘’తాత్పర్య ద్యోతిని ‘’వ్యాఖ్య రాశాడు .మరొక ముఖ్య శిష్యుడు చిత్సుఖ ‘’తత్వ ప్రదీపిక ‘’అనే అద్వైత గ్రంధం రాశాడు .ఇది గురు ప్రజ్ఞాభారతి . దక్షిణా మూర్తి ,వ్యాస ,శంకర తేజస్సు శ్రీ జ్ఞానోత్తమలో ఉందని భావిస్తారు -’’జ్ఞానాముత్తమం జ్ఞానం జ్ఞానముత్తమో యతః -జ్ఞానోత్తమ ఇతి ఖ్యాతం గురుం తామహమాశ్రయే ‘’

163-ఇష్ట సిద్ధి ,అద్వైత సిద్ధి రచించిన -శ్రీ నృసింహ తీర్ధ జగద్గురు (1146-1229 )

శ్రీ జ్ఞానోత్తమ తర్వాత శ్రీ జ్ఞాన గిరి శ్రీ సింహగిరి వరుసగా జగద్గురువులయ్యారు .వీరితర్వాత శ్రీ ఈశ్వర తీర్ధ పిమ్మట శ్రీ నృసింహ తీర్ధ పీఠం అధిరోహించారు .వీరంతా గొప్ప విశ్లేషణకారులు శంకర భాష్యాన్ని సురేశ్వరాచార్య వార్తికాలకు భామతి ,వివరణలు అయిన సిద్ధి గ్రంధాలు రాశారు  .అందులో ఇష్టసిద్ధి ,అద్వైత సిద్ధి ఉన్నాయి .ఇవి భవిష్యత్ తరానికి కరదీపికలు -’’శృతి మస్తక కూటస్థ మజ్ఞాన ద్విప భోధినాం -శ్రీ మంత్రం రాజా మూర్తిం తం నృసింహ గురుమాశ్రయే ‘’

164-సాయన  భాష్యం రాసిన -శ్రీ విద్యా తీర్ధ (1229-1333)

‘’అవిద్యాచ్చన్న భావానాం నృపేణ విద్యోపదేశతః ప్రకాశం యతి యస్తత్వం తమ్ విద్యా తీర్ధ మాశ్రయే ‘’

 శృంగేరి పీఠ 10 వ  జగద్గురువులు శ్రీ విద్యాతీర్థ .వీరి  శిష్యులే విద్యారణ్య శంకరానందాదులు .సకల వేదోపనిషత్ శాస్త్రాలలో మహా ఘనులు .వేదమే ఊపిరిగా గల ‘’మహేశ్వరులు ‘’గా భావిస్తారు .మంత్రం తంత్ర యోగాలలో నిష్ణాతులు .సింహగిరిలో చాలాకాలం తపధ్యానాలలో గడిపారు .విజయనగర రాజ్య స్థాకులైన హరిహర బుక్కరాయలు వీరిని సగౌరవంగా శృంగేరికి తీసుకు వెళ్లారు .ఏకశిలానగరానికి (వరంగల్ )కు చెందిన ఈ బ్రాహ్మణ బాలుడు ముముక్షు స్థానానికి అన్ని విధాలా అర్హుడని జగద్గురువు సన్యాసదీక్షను 1328 లో ఇప్పించి భారతీ తీర్ధ నామాన్ని ప్రసాదించారు మూడేళ్ళ తర్వాత ఈయన పెద్దన్నగారు కూడా ఇక్కడికి వస్తే సన్యాసం దీక్ష నిచ్చి ‘’విద్యారణ్య ‘’పేరు పెట్టారు .భారతీ తీర్ధ ,విద్యారణ్యులు దక్షిణభారత దేశ సంచారం చేసి అద్వైత బోధ తో ప్రజలను చైతన్య పరచారు  .సింహగిరిలో ఇప్పటికి ఒక శిల్పం ఉంది దాని నాలుగు వైపులా ఒకవైపు విద్యా తీర్ధ వారి శిష్యులు భారతీ తీర్ధ  విద్యారణ్య ,  మిగిలిన మూడు వైపులా బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపాలుచెక్కబడిఉంటాయి .దీనిపై లక్ష్మీ నృసింహ ,ఆపైన శివలింగం ఉంటాయి

  ఈ చతుర్మూర్తి విద్యేశ్వర శిల్పాన్ని చూసిన ఆచార్యులు భారతీ తీర్ధతో  తానూ మరొక 12 ఏళ్లలోయోగం వలన ఆ రూపాన్ని పొందుతుందని చెప్పారు .అలాగే తుంగా నదికి ఉత్తర తీరాన ఒక లోతైన సమాధి త్రవ్వి ఆచార్యులవారు అందులో సమాధిస్థితులవ్వగానే పైన మూత  వేసేశారు  మూడేళ్లు గడిచాక భారతీతీర్థ పర్యటనలో ఉన్నప్పుడు ఆచార్య స్వామి ఏమైపోయారోననే కుతూహలం తో శిష్యులు సమాధి ని తవ్వి చూశారు .ఆచార్యుల శరీరం బదులు అక్కడ సింహగిరిలో ఉన్నట్లున్న ఒక శివలింగం కనిపించింది .భారతీ తీర్ధ స్వామి తిరిగిరాగానే విషయ0  గ్రహించి అక్కడున్నవారి పై కోపం ప్రకటించి అది విద్యాశంకర లింగంగా భావించి అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించి ఆలింగాన్ని ప్రతిష్టించారు .అప్పటినుంచి అది విద్యాశంకర మఠం గా పిలువబడుతోంది శ్రీ విద్యాశంకరుల ఆధ్యాత్మిక తరఁగాలు ఆప్రాంతమంతా వ్యాపించి జ్ఞాన బోధ చేస్తున్నాయని విశ్వ సిస్తారు

165-శ్రీ భారతీ తీర్ధ  (1333-1380)

‘’అజ్ఞానం జాహ్నవీ తీర్ధం విద్యాతీర్ధం వివేకినం -సర్వేషామ్ సుఖదం తీర్ధం భారతీ తీర్ధ మాశ్రయే ‘’

 వరంగల్ కు చెందిన శ్రీ భారతీ తీర్థ స్వామి శ్రీ  విద్యారణ్యస్వామికి తమ్ముడు .శ్రీ విద్యా తీర్ధ తర్వాత 11 వ శృంగేరి జగద్గురువులయ్యారు . 47ఏళ్ళు అంటే 1380 వరకు పీఠాధిపత్యం వహించారు .ఈకాలం అత్యంత చిరస్మరణీయమైనదిగా భావిస్తారు వీరితర్వాత జగ్దగ్రూవ్రువులైన శ్రీ విద్యారణ్యులకాలం లోనే విజయనగరరాజ్య స్థాపన 1336లో జరిగింది  ..ఆది శంకరాచార్యులు శృంగేరి మఠం లో ప్రతిష్టించిన గంధపు చెక్క శారదా విగ్రహాన్ని మార్చి స్వర్ణ శారదా విగ్రహాన్ని ప్రతిష్టించినది శ్రీ భారతీ తీర్ధ స్వామియే .ఈకాలం లోనే విద్యా శంకర దేవాలయ నిర్మాణము జరిగింది . 1336 లో హరిహరరాయల తమ్ముడు మారెప్ప అల్లుడు బాలప్ప లు శృంగేరినీ దర్శించి జగద్గురు వుల తపధ్యానాలకోసం 9 గ్రామాలను రాసిచ్చారు   .40  మంది బ్రాహ్మణులను  సేవకులుగా ఏర్పాటు చేశారు .ఈ భూమిని శ్రీ విద్యాశంకర దేవాలయ ప్రతిష్ఠనాడు శ్రీ భారతీ తీర్ధ 120 బ్రాహ్మణకుటుంబాలకు అందజేసి వారక్కడ స్థిరపడేట్లు చేశారు .దీనితోనే శృంగేరి పట్టణ  నిర్మాణం ప్రారంభమైంది    120 మంది వేద శాస్త్ర విద్యావేత్తలకు కూడా ఆవాసభూమిని శ్రీ భారతీ తీర్ధ అందజేశారు

166- వైదిక నిర్ణయం రాసిన శ్రీ నృసింహభారతి-5 (1576-1600)

‘’నృసింహతాం ప్రాధాన్యాశు యమాశ్రిత్య జనా భువి – నృసింహ భారతి0 వందే   ద్విగునోపపదం  సదా ‘’

శృంగేరి 23 వ జగద్గు రువులు శ్రీ ఐదవ నృసింహ భారతి స్వామి ‘’వైదిక నిర్ణయం ‘’గ్రంధంరాసి అద్వైతమే సర్వ శ్రేష్ఠమని వివరించి చెప్పారు

167-శివ గీతవ్యాఖ్యాన  కర్త శ్రీ అభినవ నృసింహ భారతి (1600-1623)

తమ్ సర్వ భూత భయదం విభావరరై  రన్వితం పరం -నరసింహ0 గురుం చాపి నావం జ్ఞానార్పణం భజే ‘’

మంత్రం శాస్త్రం లో అద్వితీయులైన శ్రీ అభినవ నృసింహ భారతీ స్వామి 24 వ శృంగేరి జగద్గురు  వులు శివగీతాపై వ్యాఖ్యానం రచించారు 1602 లో రుద్రపాద లో రామేశ్వర లింగాన్ని ప్రతిష్టించారు .పశ్చిమ వాహిని లో ఉన్న అగ్రహారాన్ని గురువుపెరిట నర్సింహా పురంగా నామకరణం చేశారు .మహలానికేశ్వర దేవాలయం లో గణపతి విగ్రహం లేకపోవటం గ్రహించి దేవాలయ స్థంభం పైనున్న పశుపు గణపతిని పూజించారు అప్పటి నుంచి అందరూ దానినే పూజిస్తూ’’  స్తంభ  గణపతి ‘’గా పిలుస్తున్నారు .శివగంగ లో ఒక మఠాన్ని స్థాపించి దానికి శ్రీ శంకర భారతి స్వామిని నియమించారు

168-రామ చంద్ర మహోదయ  కర్త -శ్రీ సచ్చిదానంద భారతి (1623-1663)

25 వ శృంగేరి జగద్గురువులు శ్రీ సచ్చిదానంద భారతి రామ చంద్ర మహోదయం ,గురుస్తుతి శతకం ,రామ భుజంగ స్తోత్రం మీనాక్షి అష్టకం మీనాక్షి శతకం రాశారు .మదురై జిల్లాలో జన్మించిన వీరు బాల్యం లోనే వేదం అంతా నేర్చిన ప్రజ్ఞాని వెంకటప్ప నాయకుని ఆహ్వానం పై కిక్కిరి దర్శించి అక్కడనుండి కొల్లూరులో మూకాంబికా దేవి సందర్శనం చేశారు వెంకటప్ప కొడుకు వీరభద్ర నాయక్ కిక్కిరి సింహాసనం అధిష్టించినకొద్దీకాలానికే భైరవుడు అనే కళాశా ముఖ్యుడు దాడిచేసి రాజ్యం లో శృంగేరి కూడా ఉన్న ఒక చిన్న భాగాన్ని ఆక్రమించాడు  ,మూర్ఖత్వం తలకెక్కి భైరవుడు శృంగేరి గురువుకు తమ మఠ ఆస్తులన్నీ స్వాధీనం చేయమని తాఖీదు పంపాగా స్వామీజీ తిరస్కరించారు .వాడు మూర్ఖంగా శృంగేరిపై పడి ,మఠ సమ్పాదను దోచుకొని మఠాన్ని రక్షించటానికి  నాయక రాజుసైన్యాన్ని  ఓడించి రెండో సారీ వచ్చి దోచుకొని మూడవసారీ రాగా ,సహాయానికి నాయక సైన్యం వచ్చినా మఠాన్ని రక్షించాలంటే తన తపస్సు తప్ప వేరే మార్గం లేదని గ్రహించి తీవ్ర తపస్సమాధిలో ఉండిపోయారు .అప్పుడు ఆయనకు శృంగేరిలో సకల దేవతలు శత్రువును ఎదిరించి పోరాడినట్లు గ్రహించారు .సమాధినుండి బయటకు రాగానే భైరవ సైన్యం ఓడిపోయిందన్న వార్త విన్నారు శ్రీ సచ్చిదానంద భారతీస్వామి .ఈ ఆనంద సమయం లోనే వారు రామచంద్ర మహోదయం రాశారు వీరభద్ర శివప్ప భద్రప్ప హనుమప్ప నాయకులు శృంగేరి శారదా పీఠానికి అనేక అమూల్య సంపదను కానుకలుగా పంపారు .బెద్నూర్ ను సందర్శించి వచ్చాక స్వామీజీ మహానికారేశ్వరదేవాలయం లో భవానీ దేవిని ప్రతిష్టించి ,అనేక ఉత్సవాలు రధోత్సవం నిర్వహింప జేశారు -’’సత్య స్వరూపం సదా జ్ఞాన నిష్టం సాక్షాచ్చివం పరం -సదా దానరతం దా0తం  సచ్చిదానంద మాశ్రయే ‘’

169- మూకాంబికా స్తోత్ర రచన చేసిన రెండవ  సచ్చిదానంద భారతీ స్వామి -(1706-1741 )

‘’సచ్చితా0బుజ మిత్రాయ సచ్చరిత్ర యుజే  నమః -సచ్చిదానంద భారత్యై సచ్చిదానంద మూర్తయే ‘’

  ఈ స్వామీజీకి గోకర్ణ మహా బలేశ్వరస్వామి ,కొల్లూరు మూకాంబికా దేవి లకు పరమ భక్తులు . వీరు రాసిన శృంగేరి శారదా స్తోత్రం మూకాంబికా స్తత్రాలు నవ రాత్రి ఉత్సవాలలో భక్తులు పరవశం తో గానం చేస్తారు .శృంగేరిలో ఘనంగా ఉత్సవాలు నిర్వహించేవారు దీనికి రామనాథపురం జమీందార్ సేతుపతి విధిగా హాజరయ్యేవారు . విద్యాశంకర లింగాన్ని రామేశ్వరం లో ప్రతిష్టించారు .శృంగేరిమఠానికి వచ్చే వందలాది  వేద విధులను ఘనంగా సత్కరించి పంపేవారు .ఎన్నెనో దేవాలయాలకు యతులకు కానుకలు పంపేవారు .

  సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-8-6-17-కాంప్-షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రాణి మృగావతి రాకుమారి మల్లినాథ

రాణి మృగావతి   రాకుమారి మల్లినాథ

రాజ్యాలేలే మహారాణులు జీవితాలు అశాశ్వతమనుకొని ధర్మానికి సంఘానికి కట్టుబడి మానవ సేవే  మాధవ సేవగా భావించి సర్వం త్యజించి జైన సన్యాసినులై కీర్తి కెక్కినవారిలో రాణి  మృగావతి , రాకుమారి  మల్లినాథ చిరస్మరణీయలు .

              రాణి  మృగావతి

శతానిక రాజు భార్య అపురూప సౌందర్యవతి అయిన రాణి  మృగావతి  .ఆమె జీవితం పవిత్రతకు , వీరత్వానికి ప్రతీకగా చరిత్రలో నిలిచింది ..ఆమె ముగ్ధ మోహన సౌందార్యానికి ఆకర్షితుడైన ఉజ్జయిని రాజు ప్రద్యోతుడు ఆమెను పొందటం కోసం శతానికుడు రాజ్యమేలుతున్న కౌశా0బి   పై దాడి చేశాడు . యుద్ధం ప్రారంభమైన కొద్దీ కాలానికే రాజు శతానికుడు జబ్బుపడి మరణించాడు ..మేధావి అయిన రాణి మృగావతి తెలివిగా రాజుకు తీవ్రమైన జబ్బు చేసిందని  ప్రజలకు తెలియ జెసి తానే  సైన్యాన్ని నడిపి యుద్ధం చేసి శత్రు సైన్యాన్ని తరిమేసింది .అప్పుడు మాత్రమే తనభర్త శతానిక మహా రాజు మరణించాడని ప్రజలకు ప్రకటించింది ..సైన్యం అలసిపోయి నందున ,శత్రుసైన్యం అపరిమితంగా ఉన్నందున తాను ప్రద్యోయుడుతో వెళ్లి పోవటానికి సిద్ధమేనని ,కానీ తన రాజ్యం చుట్టూ రక్షణ కోసం పటిష్టమైన గోడ నిర్మించి ,తమకుమారుడు ఉదయనుని రాజు ను చేయాలని షరతు పెట్టింది . వీటికి ప్రద్యోతుడు అంగీకరించగానే రాణి మృగావతి జైన తీర్ధంకరుడైన మహా వీరుని సన్ని  ధానం చేరి,,తానుప్రద్యోతుడు అంగీకరిస్తే  జైన సన్యాసిని గా ఉంటానని తెలియ జేసింది  ..ప్రద్యోతుడు మహావీరుని అసామాన్య కారుణ్య ప్రబోధానికి లొంగిపోయి ,తాను  చేసిన తప్పులకు  పశ్చా త్తాప పడి తాను కూడా జైన భిక్షువుగా మారిపోతానని నిర్ణయం ప్రకటించాడు ..మృగావతి సన్యాసిని అవటానికి తనకు అభ్యంతరం లేదని తెలిపాడు .అంతేకాక తన రాణులలో చాలామందిని జైనసన్యాసినులుగా మారటానికి అంగీకరించాడు ..వీరందరూ మహా వీరుని చేత సన్యాసం దీక్ష ఇప్పించబడి చరితార్ధులయ్యారు .

            రాణి మల్లినాథ

రాకుమారి మల్లినాథ 19 వ జైన తీర్ధంకరురాలయ్యింది ..స్వే తాంబర జైన సంప్రదాయానికి చెందిన మిథిల రాజు’’ కుంభ’’ కుమార్తె మల్లినాథ .. బహు అందగత్తె కావటం వలన రాజులందరూ ఆమెనే వివాహం చేసుకోవాలని ఉవ్విళ్ళూరేవారు ..తండ్రి వారందరిని తిరస్కరించాడు .వారందరికీ అది కోపకారణమై మిధిలపై సామూహక దండ  యాత్ర చేశారు.  మిథిల రాజు ఓటమికి దగ్గరౌతున్న సమయం లో రాకుమారి మల్లినాథ   తెలివిగా ,ఆ రాజులనందరిని తన మందిరానికి రమ్మని ఆహ్వానించవలసినదిగా తండ్రికి చెప్పింది .వారందరూ అక్కడికి చేరారు …అక్కడ అపురూప సౌందర్య రాశి అయిన మల్లినాథ రాకుమారి నిలుచుని ఉండటం  చూసి , అప్రతిభులైపోయారు .మరి కొంత సేపటికి మరొక ద్వారం ద్వారా అంతటి లావణ్య రాశి మరొకరు కనిపించింది ..అవాక్కయిన వారి భ్రమన్తి తొలగించటానికి మల్లినాథ  వాళ్ళు మొదట చూసింది తన రూపం లో ఉన్న బంగారు విగ్రహమేనని చెప్పి దాని పైనున్న మూత  తీసింది.వెంటనే గబ్బు కంపు ఆహాలంతా వ్యాపించి అందరూ భరించలేక ముక్కులు మూసుకున్నారు ..ఆ విగ్రహం బోలుగా ఉండి  అనేక రకాల ఆహార పదార్ధాలతో నింపబడి చాలాకాలం గా మూత పెట్ట బడింది ..అప్పుడు రాకుమారి మల్లినాథ వారితో ‘’నా బాహ్య సౌందర్యం లోపల అంతే  కుళ్ళు ,చెత్త నింపబడి ఉందని ,తానూ సర్వాన్నీ త్యజించి జైన సన్యాసినిగా మార బోతున్నానని తెలియ జెప్పింది ..ఈ విషయం విన్న రాజులందరూ పశ్చా త్తాపం ప్రకటించి ,క్షమించమని కోరి ,భౌతిక సుఖాలు తుచ్చమైనవని గ్రహించి ,ధ్యానం తపస్సులో శాశ్వత సుఖం ఆనందం మోక్షం ఉన్నాయని గ్రహించి ,రాజ్యాలకు వెళ్లి వారసులను నియమించి రాకుమారి మల్లినాథ అడుగుజాడలలో నడిచి జైన సన్యాసులై జీవితం గడిపారు

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-6-17-కాంప్-షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment