స.సు .మ.(కాసేపు నవ్వు కోవటానికే అని మర్చి పోరుగా!)

స.సు .మ.(కాసేపు నవ్వు కోవటానికే అని మర్చి పోరుగా!)

ఏమీ తోచక టి వి పెట్టి సిటీ వార్తలేవైనా చూద్దామను కొని రిమోట్ నొక్కా .స.సు. మ .అని ఒక చానల్ ప్రత్యక్షమైంది .ఇదేదో కొత్తగా ఉందే ఇంతవరకూ ఎప్పుడూ విన ,కన లేదే అనుకొంటూ నొక్కా .ఒక లావుపాటి గుంత పొంగనం లాంటి వాడు పళ్ళికిలిస్తూ అరుస్తున్నాడు ఎవరికోసమో,ఎందుకో తెలీదుకాని ,అవతలి వైపునుండి వెంటనే సమాధానం రాలేదు మనిషీ కనిపించలేదు .వీడు ఇక్కడ గీ పెడుతూనే ఉన్నాడు .కాని నో రిప్లై .కాసేపు గింజు కున్నాక బుజం మీద కెమేరాతో ఒక కల్పనా రాయ్ లాంటి శాల్తీ కనిపించింది .కుర్చీలో వాడు తల ముందున్న బల్లకేసి బాదుకుంటూ ‘’అరగ౦టయింది చానల్ తెరిచి కూర్చుని .ఒక్క న్యూస్ ఐటం కూడా నీ నుంచి రాలేదు .ఎక్కడున్నావ్ మబ్బూ ‘ అని గాండ్రిం చాడు .ఇకిలి వెకిలి నవ్వు నవ్వుతూ ఆ భామ ‘’సుబ్బూ !న్యూస్ కవరేజ్ కని బయల్దేర బోతుంటే ఎవరో ఫోన్ చేసి’’ బంజారాహిల్స్ లో  అద్భుతం ఒకటి ఉంది అర్జెంట్ గా వచ్చి కవర్ చేయండి ‘’అన్నాడు  .ఇక ఆగలేక ఆగమేఘాలమీద వచ్చి వాలేశాను .జనం పిచ్చగా గుమి గూడారు .వాళ్ళని తప్పించుకు వెళ్ళటానికే పావు గంట పట్టింది ‘’అంటూ కార్చిన  చెమట కర్చీఫ్ తో  తుడుచు కొంది.’’ఈ  సిటీ ఓళ్లకు పనీ పాటాలేదు. పిల్లి సమర్తాడింది అంటే చాలు  వాలిపోతారు ‘’అని’’ఇంతకీ అక్కడి విశేషమేంటి మబ్బూ ‘’అన్నాడు . డబ్బాలో రాళ్ళేసి మోగించినట్లు రాయ్  ‘’సుబ్బూ !నీకు సిక్స్త్ సెన్స్ ఉందేమో ?ఎలా పసికట్టేశావ్ ‘’అంది సిగ్గులు చిందిస్తూ .’’సిక్స్త్ సెన్సా వంకాయా ఊరికే అన్నా ‘’అన్నాడు పళ్ళు మరింత ఇకిలిస్తూ .’’అబ్బ సుబ్బూ !నే చెప్పలేను బాబూ సిగ్గేస్తోంది ‘’అంది ఒంకర్లు పోతూ జంబ లకిడి పంబ లో స్కూల్ లో విద్యార్ధినిగా ఉన్న కల్పనా రాయ్ ఉప్పు కప్పురంబు పద్యం మేష్టారుబాబూ మోహన్ కు అప్ప జెబుతూ చెబుతూ ‘’పురు –అబ్బ సిగ్గేస్తోంది బాబూ పురుషు –అయ్యో నే చెప్పలేను మాస్టారండీ  అని చివరికి పురుషులందు ‘’అనటానికి అరగంట పట్టినట్లు అభినయించింది ఇక్కడ మబ్బు . ‘’ఓసి నీ సిగ్గు చిమడా కవరేజ్ గాళ్ళకు సిగ్గూ ఎగ్గూ ఏంటి ?అసలు సంగతేడు’’అన్నాడు మండిపోతూ .’’సుబ్బూ సుబ్బూ ఇక్కడొక పిల్లి పిల్ల స—‘’అబ్బా నవ్వుస్తోంది నే చెప్పలేను బాబూ ‘’అంది మళ్ళీ .’’ఆహే పిల్లికేమైందో చెప్పి చావక  ఆ కులుకు లేంటి  ?’’సుబ్బుగోల .’’మరేమో మరేమోనే  మరి మరి పిల్లిపిల్ల నువ్వూహించినట్లే సమ –‘’అబ్బా నాకు బోల్డు సిగ్గేస్తోంది బాబూ ‘’అంది మళ్ళీ .’’చానల్ కట్టేసి వస్తావా ,అసలు విషయం చెబుతావా ఇప్పటికే స్టూడియోకి వందలాదిఫోన్లోచ్చి గగ్గోలుగా ఉంది ..టెన్షన్ తట్టుకోలేక వాళ్ళు ,ఊపిరాడక నేనూ ఉన్నాం’’ అన్నాడు మరీ కోపంగా .’’సుబ్బూ ! ఇక్కడ ఒక పిల్లి పిల్ల నిజంగానే సమర్తాడింది అబ్బ బాబోయ్ ఇక నే చెప్పలేను బాబూ నాకు బోల్డు సిగ్గు ‘’అంది మెలికలు ,మెలికలు తిరుగుతూ ,

సుబ్బు ‘’సరే మా౦చి హాట్ హాట్ న్యూస్ మబ్బూ .థాంక్యూ వెరీమచ్ .కొత్త చానల్ కు సరి కొత్త న్యూస్ ఐటం .ఇంతకీ ఆ పిల్ల సారీ పిల్లి పిల్ల పేరేంటి  ఎన్నేళ్ళు ,వయసు వచ్చాకనే అయిందా ? ప్రిమెచూరా? ఎవరిదాపిల్ల  ‘’?అడిగాడు  ‘’సుబ్బూ !అది ఊరపిల్లి .దాన్ని చూస్తే వయసు వచ్చాకే అయినట్లు అనిపించింది .పేరు ఎవరడిగినా ఎవరూ చెప్పటం లేదు సుబ్బూ !దాన్ని అడుగుదామంటే తొలి సమర్త కదా  మరీ సిగ్గు పడుతుందేమోనని పిస్తోంది ’’అంది మబ్బు .’’సరే మబ్బూ !దానికి రక్షణ కలిపించారా ?తాటాకులు కాని తాటాకు చాపలు కాని ప్రొవైడ్ చేశారా?’’సుబ్బు సూటి ప్రశ్న .’’అలాంటి వేమీ చేసినట్లు కనిపించటం  లేదు సుబ్బూ .జీవకారుణ్యం వాళ్లకు ఫోన్ చేయనా ,లేక మన స్టూడియో ఏదైనా ఫండ్ ప్రొవైడ్ చేస్తుందంటే నేనే అవి కొనిపించి ఏర్పాటు చేసి బిల్లు సబ్మిట్ చేస్తా ‘’అంది మబ్బు .’’ చానల్ అంటే మన డబ్బు ఖర్చు పెట్టేది కాదని నీ కింకా తెలీదనుకొంటా .మంది ని బాదుకొని పబ్బం గడపాలి .ఇక్కడిచ్చే జీతం ఎంత ?దీనికి తోడూ చేతి చమురు కూడానా ‘’అన్నాడు సుబ్బు .’’జీవకారుణ్యం వాళ్ళ సంగతి ?’’ప్రశ్నించింది మబ్బు .’’అమలా నాగార్జున్ వింటే డామేజ్ సూటేస్తుంది .ఒళ్ళు జాగ్రత్త ‘’అన్నాడు హెచ్చరి౦పుగా .

‘’అక్కడ జనాలకు మైక్ ఇవ్వు నేను కొన్ని  ప్రశ్నలడుగుతాను’’ ‘’అనగానే ఇచ్చింది .ఒక కాలేజి పిల్లాడు పాంట్  జుట్టూ సర్దుకొంటూ ముందుకొచ్చాడు –‘’హలో సార్ !ఈ ఇన్సిడెంట్ పై మీ స్పందన ఏంటి?’’అడిగాడు సుబ్బు .’’సార్.ఇది చాలా పెక్యూలియర్ సార్  .నేనెప్పుడూ ఇలా ప్రత్యక్షంగా చూడలేదు సార్.మీ చానల్ గ్రేట్ సార్.పాపం వాటికీ మనసుంటుందని గ్రహించి గొప్ప కవరేజ్ ఇచ్చి సబ్బూ చానల్ ను ఎలివేట్ చేశారు సూపర్ సార్ ‘’అన్నాడు .మరో’’ బామ్మ’’ లాంటి అంటే బాపూ బొమ్మ లాంటి అమ్మాయికి మైకిచ్చింది మబ్బు ‘’అమ్మా మీరేమనుకొంటున్నారు ?’’అన్న సుబ్బు ప్రశ్నకు బా–మ్మ ముసి ముసి నవ్వులు నవ్వుతూ ‘’ఆకాశం లో సగమైన ఆడవాళ్లకే రక్షణ ,కవరేజ్ లేని ఈ కాలం లో మీ సబ్బూ చానల్ ,నోరు లేని మూగజీవాల రుతుధర్మాన్ని కూడా బహిరంగం గా చిత్రించి భలే మేలు చేశార్ సార్.ఈ సారి న్యూస్ ఐటం అవార్డ్ మీకే గారంటీ సార్ ‘’అంది .రెచ్చి పోయిన ఆనందం లో సుబ్బూ మబ్బూ లు గిలగిలలాడిపోయారు .’’మబ్బూ !ఫైనల్ గా మైక్ పెద్దావిడ ఆ బామ్మ గారికివ్వు ‘’అన్నాడు .ఇకిలి౦పులు సకిలింపు లతో మబ్బు బామ్మగారికి మైక్ ఇచ్చి ఆవిడ ఏం చెబుతుందో విని మైకం లో ఊగి పోవాలను కొన్నది .’’అమ్మా బామ్మ గారూ !ఈ న్యూస్ ఐటం మీకు బాగా నచ్చినట్లు మీ మొహమే చెబుతోంది నిస్సంకోచంగా మొహమాట పడకుండా  స్పందించండమ్మా మీ పేరు చెప్పుకుంటాం ‘’అన్నాడు సుబ్బు  . మైకందుకొన్న బామ్మగారు ‘’మహా సంతోషంగా ఉంది నాయనా నా జన్మ తరించింది  .చానళ్ళ పరమ ప్రయోజనం ఏమిటో ఇప్పుడే నాకు తెలిసింది .పూర్వం పని లేని మంగలి పిల్లి తల గొరిగాడు అని మా బామ్మ సామెత చెబితే అప్పుడు అర్ధమై చావలా నాకు .ఇప్పుడు పూర్తిగా అర్ధమైంది .ఆహా సబ్బూ సుబ్బూ మబ్బూ కలిసి జనాన్ని మబ్బులో పెట్టి చెత్త వార్తల సబ్బు రాసి గబ్బు పట్టిస్తున్నారు .పవిత్రమైన చానళ్ళను భ్రస్టు పట్టించి  అపవిత్రం చేసి పబ్బం గడుపుకొంటున్నారు .రెండు నిమిషాల టైమిస్తా .దుకాణం బంద్ చేసిపారి పోయారా సరి, లేకుంటే నేనే ఏదో ఒక చానల్లోమిమ్మల్ని దూదేకి నట్లు ఏకిపారేసి, చాకి రేవులో ఉతికి నట్లు ఉతికేసి  ఎండగడతా ‘’అని బామ్మగారు మైక్ కట్ చేయటం , మబ్బు మైకందుకొని పారిపోవటం, నా ఎదురుగా ఉన్న స.సు. మ.చానల్  అంటే సబ్బు సుబ్బూ మబ్బూ చానెల్ అదృశ్యమవ్వటం ఒక్క సారిగా జరిగి పోయాయి ..

వసంత పంచమి శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-2-17-

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

వసంత పంచమి శ్రీ సరస్వతీ పూజ శుభా కాంక్షలు

Inline image 1       Inline image 2   Inline image 3Inline image 4

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

స్వస్తినః

స్వస్తినః

‘’స్వస్తిన ఇంద్రో వృద్ధ శ్రవాః-స్వస్తినః పూషా విశ్వ వేదాః-స్వస్తిన స్తార్ష్యోరిస్ట నేమిః-స్వస్తి నో బృహస్పతి ర్దదాతు’’

అనే ఋగ్వేద మంత్రం మనల్ని రక్షిస్తుంది .మంత్రం అంటే మననం చేసే వాడిని రక్షించేది అని అర్ధం .పై స్వస్తి మంత్రాన్ని స్నానం చేసేటప్పుడు జలజంతు బాధ లేకుండా ఉండటానికి జపిస్తారు ,అప్పుడే కాదు సర్వ కాల సర్వా వస్థలలో జపించి రక్షణ పొందవచ్చు .ఇంద్ర ,సూర్య ,గరుత్మంత ,బృహస్పతులు మనకు స్వస్తి చేకూర్చాలని ఇందులో భావం .ఇందులోని విశేషార్ధాలను తెలుసుకొని జపిస్తే ఇంకా ఆనందం .

ఇంద్రుడిని వృద్ధ శ్రవుడు అంటారు .అంటే కీర్తి బాగా పెరిగిన వాడు .లేక అన్నం కలవాడు అనీ అర్ధం .ఇంద్రుడు అంటే దేవ లోకాధిపతి అని సామాన్యార్ధం .కాని విశేషార్ధం లో పరమాత్మ .’’ఇది –పరమైశ్వర్యే ‘’అనే ధాతువు నుండి ఇంద్ర శబ్దం పుట్టింది .పరమైశ్వర్యం ఉన్న వాడు పరమాత్మ ఒక్కడే .ఇంద్రుడు పరమాత్మ కనుక వృద్ధ శ్రవుడు అయ్యాడు .శృతి స్మృతి పురాణాలన్నీ ఇంద్రుడిని కీర్తించాయి .’’ప్రభూత హవిర్లక్షణాన్నయుక్తః ‘’అనే అర్థాన్నీ వేదార్ధ వేత్తలు చెప్పారు .అంటే పరమాత్మకు ఇచ్చే హవిస్సు మానవుడు నిలువ చేసుకొన్న ధనం వంటిది .అగ్ని ద్వారా హవిస్సు పంచ భూతాలలో నిండి ,వర్షం మొదలైన అనుకూల వాతావరణం ఏర్పడటానికి కారణం అవుతుంది .దాని వలన  పంటలు సమృద్ధిగా పండుతాయి .లోకాలు సుఖ శాంతులతో వర్దిల్లుతాయి .కనుక పరమేశ్వరార్పణం గా ఇచ్చే హవిస్సు అనే అన్నం జగత్తుకు శ్రేయస్సును కల్గి౦చటానికే .దీనినే భగవద్గీత –

‘’సహా యజ్ఞాః ప్రజాః సృష్ట్వాపురోవాచ ప్రజాపతిః-అనేన ప్రసవిష్యద్వ మేషవో స్త్విస్టకామధుక్ –దేవాన్ భావయతా నేన దేవా భావయంతువః-పరస్పరం భావ యంతః శ్రేయః పర మావాప్స్యధ’’అని చెప్పింది

దీనిభావం –సృష్టి మొదట్లో ప్రజాపతి ప్రజలను యజ్ఞాలతో పాటు సృష్టింఛి ప్రజలతో ‘’యజ్ఞాలతో  మీ జాతి  వృద్ధి చేసుకోండి .ఇది మీ  కోరికలు తీర్చే కామధేనువు అవుతుంది .యజ్ఞాలతో దేవతలకు తృప్తి కలిగించండి .వాళ్ళు మిమ్మల్ని సంతృప్తి చెందిస్తారు .ఇలా ఒకరినొకరు తృప్తి పరచుకొని మహా శ్రేయస్సును పొందండి ‘’అని చెప్పాడు .దీన్ని బట్టి ఇంద్రుడు హవిర్లక్షణ రూప అన్న యుక్తుడు అని తెలుస్తోంది .

తరువాత విశ్వవేదుడైన పూషుడు మనకు స్వస్తి చేకూర్చు గాక అని రెండవ ప్రార్ధన .పూషుడు అంటే సూర్యుడు –‘’పుష్ణా తీతి పూషా ‘’-పుస్టిని ఇచ్చేవాడు .సూర్యుడు తపన శక్తితో సస్య సమృద్ధికి ,చీకటి నాశనానికి కావలసిన శక్తి నిస్తాడు .దేహ పుష్టి తో పాటు విజ్ఞాన పుస్టీ కలిగిస్తాడు .’’వెలుగు మరొక్క పేరఖిల విద్యలకున్ ‘’అని ఉంది .హనుమ సూరుని వద్దనే నవ వ్యాకరణాలు నేర్చాడు .కనుక సమస్త మానవ కోటికి భౌతిక ,మానసిక పుష్టి నిచ్చేది సూర్యుడే .కనుక ‘’ప్రత్యక్ష దైవం ‘’అయ్యాడు .అందుకే పరమాత్మకు ప్రతిరూపం అన్నారు .దీనితో ‘’విశ్వ వేదుడు ‘’అయ్యాడు సూర్యుడు .అంటే సర్వజ్ఞుడు అని అర్ధం .పరమాత్మ తన మహిమాది శక్తులను సూర్యాదులలో నిక్షేపించి ,వారి ఆరాధనే తన ఆరాధన అని తెలియ జెప్పాడు .అందువల్ల సూర్య భగవానుడిని పరమేశ్వరునిగా భావిస్తాం .విశ్వ వేదుడుఅనే శబ్దానికి ఎక్కువ ధనం ఉన్నవాడు అనే అర్ధం కూడా ఉంది .నిఘంటువు జాత వేద శబ్దానికి అర్ధం చెబుతూ –‘’వేదో హిరణ్య మస్మాజ్జాత ఇతి జాత వేదాః ‘’అని చెప్పింది .వేదం అంటే హిరణ్యం అంటే బంగారం .దాని నుంచి పుట్టిన వాడు .అందుకని జాత వేదుడు అంటే సమస్తమైన ఐశ్వర్యమూ కలవాడు అని అర్ధం .ఇది కూడా పూషుని పరమేశ్వరతత్వాన్ని చాటుతున్నదే .మొత్తం మీద సమస్త ప్రాణికోటికీ పుష్టి తుష్టి ,దానికి కావలసిన ధనం అంటే శ్రేష్టమైన జ్ఞానధనం ప్రసాదించే ఆదిత్యుడు మనకు స్వస్తిని చేకూర్చుగాక అని అర్ధం .

మూడవ దానికొస్తే ‘’తార్ క్ష్యుడుఅంటే గరుత్మంతుడు .తృక్అనే మహర్షి కొడుకనుక అలా పిలువ బడ్డాడు .అతడు అరిస్టనేమి .దీనికి ‘’అనుప హింసిత ఆయుదః –‘’’’అప్రతి హత రదః’’అనే రెండు అర్ధాలున్నాయి .గరుత్మంతుని వద్ద ఉన్న ఆయుధం వంటివి ఇంకెవరి దగ్గరా లేవని భావం .అంటే సర్వ శక్తి మంతుడైన పరమాత్మ అని అర్ధం .నిజానికి గరుత్మ౦తుని  ఆయుధాలు ఆయన కాలిగోళ్ళే.అంతవాడి అయిన ఆయుధం ఇంకేదీ లేదు .ఈ గోళ్ళతోనే అమృతాన్ని హరి౦చేటప్పుడు సుర వీరుల౦దర్నీ తానొక్కడే ఓడించాడు .అమృత సాధన అంటే సర్వ దైవీ భావాన్ని అధిగమించటం .ఆయన అప్రతిహత రధుడు కూడా .అంటే ఆయన సంచరించలేని ప్రదేశం ఉండదని .అనగా సర్వాంతర్యామి అని అర్ధం .అన్నిటిలో చైతన్య రూపం గా ఉన్న పురుషుడు అనగా పరమాత్మ .కనుక అలాంటి గరుత్మంతుడు అందరకు స్వస్తి కలిగించాలని ప్రార్ధన .

 

చివరిది బృహస్పతి ప్రార్ధన  .దేవ గురువు బృహస్పతి .విశేషార్ధం లో దేవతలకంటే గురువు అంటే బ్రహ్మము .దేవా అంటే ద్యోతన శీలం కలది .పంచ భూతాలూ ,పంచేంద్రియాలు ఇంద్రాదులు దీని పరిధిలోకి వస్తారు .వీరందరికంటే గురువు అంటే శ్రేష్టుడు అని భావం అంటే పరతత్వ మైన పరబ్రహ్మమే నని అర్ధం .సామాన్యార్ధం లో –‘’బృహతానాం  దేవానాం పాలయితా ఇంద్ర పురోహితః ‘’అనగా గొప్ప వారైన దేవతలపాలకుడైన ఇంద్రుని పురోహితుడు బృహస్పతి .ఆయన స్వస్తి చేకూర్చు గాక అని ప్రార్ధన .

ఇంతకీ ఎలాంటి స్వస్తి కావాలి ?పరమాత్మ నుండి ఆశించే స్వస్తి ‘’పరమ స్వస్తి ‘’మాత్రమే అయి ఉండాలి .అంటే మోక్ష రూప బ్రహ్మానంద లబ్ది .దీనికి ఏం కావాలి ?ఏక సాధనమైన ఏకత్వ దర్శన రూప అద్వైత సిద్ధి .అలా అయితే ఇందులో ఎవరినో ఒకరినే ప్రార్ధించ వచ్చుగా –ఇందర్ని ఎందుకు ?ప్రపంచం లో నానాత్వాన్ని చూడటానికి అలవాటు పడిన మనకు నానాత్వం నుండి ఏకత్వాన్ని చూడాలని భావన .ఇది ఎలా సాధ్యం ?సర్వేశ్వరత్వ ,సర్వ పోషకత్వ ,సర్వ శక్తి మత్వ ,సర్వోత్క్రుస్ట లక్షణ సమాహార సమన్వయము వలన .అంతేకాదు మంత్రం లో ‘’నః’’,దదాతు పదాలు మహార్ధాన్ని వ్యంజనం చేస్తాయి ..’’నః ‘’అంటే సృష్టిలోని భూత జాలమంతా ఒక్కటే అనటాన్ని తెలియ జేస్తుంది .దదాతు అనేది ప్రార్ధనార్ధక క్రియ .దీనికి కాలావదులులేవు .అంటే సర్వ కాల సర్వావస్థలలో పర మేశ్వరుడు సర్వ ప్రాణి సముదాయాన్నీ ఒక్కటిగా ,తనతో అభిన్నంగా చేసి స్వస్తి సంధాయకుడు అవుతున్నాడు అనే మహార్ధం ఇక్కడ వ్యంగ్య రూపం లో ఉన్నది అని మహా గొప్ప వ్యాఖ్యానంగా స్వస్తి మంత్రాన్ని ప్రాచార్య శ్రీ శలాక రఘునాధ శర్మ గారు ‘’కదంబ వనం ‘’లో ‘’స్వస్తినః ‘’వ్యాసం లో తెలియ బరచి మన కళ్ళ పొరలను తొలగించారు .

వసంత పంచమి శ్రీ సరస్వతీ పూజ శుభాకాంక్షలతో

Inline image 1

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-2-17 –కాంప్ –మల్లాపూర్ –హైదరాబాద్

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

పచ్చ బొట్టేసి నా పిలగాడ నీతో(బాహుబలి)పాటకి పేరడీ

పచ్చ బొట్టేసి నా పిలగాడ నీతో(బాహుబలి)పాటకి  పేరడీ

పెద్ద నోట్లన్ని  నువ్వు రద్దు చేశాకనూ

చేదు నిజాలెన్నో నీతొ పంచు కున్నానులే

జంట కట్టేసినా నువ్వు తుంట రోడా నీతో

కొత్త కష్టాలెన్నొ నెత్తికెత్తు కొన్నానుగా

రెండున్నరేళ్ళ ఆరటమై

వేచి ఉన్నాను హోదాకు నే

చెయ్యిచ్చి నూ మాట యేమార్చినా

నీ వెంట నే తిరుగుతున్నానుగా  

హోదా లేద౦టు నూ పాటా కొట్టాకనూ

నీ పాకేజికే  నేను తల ఊపానుగా.

మాయ గా నీ మాటల్ల  గారడీ లతో  

నన్ను లాగింది నువ్వే గ డెల్హీ సారూ   

కబుర్లతో కరిగించే వ్రత మేలరా

ఒత్తిడితో ఊపిరాడక చస్తుంటే నే,  

ఈ హత్తుకోళ్ళు పొగడ్తలి౦కెందుకే

నీ బాహు బలి బంధాల పొత్తిళ్ళలో

విచ్చు కుందామనుకొంటే

గుచ్చు కుంటాది నీ గడ్డమ్మురా

కోడె కౌగిళ్ళ మోజేమో తీరి పోయేనురా  

పురి విప్పిచెలరేగె  నాలో  హోదా కోరికా

హస్తినలో మనిద్దరమొక మేనుకాగా  

ప్రతి ఊర  నిరసనల్లు పేట్రేగెరా

అప్పుడే ఎదురైన ఈ నిరసన

పదవి కొంప ము౦చేదాక  సాగునేమోమరి!   

పూర్తిగా రోట్లోతల నేను పెట్టాకనూ

మరణమూ  పరవశ మంటావని భయమేనురా  

చెమ్మ చేరింది నాకనుల చివరలలోన రా    

చి౦దులేసింది చిరు ఆశ నా కళ్ళలోనా  

ప్రేమ ఊరేటి నీ లొల్లి  చాలించరా   

కల కరిగిందిరా ఇల  తెలి మంచులా

నిలబడి పోయాను నేను నిస్సిగ్గుగా ..

నోట్ -నేనురాజ మౌళి తీసిన బాహుబలి కానీ ,మగధీర కానీ చూసే సాహసం ఇంతవరకు చేయలేదు .కానీ మర్యాద రామన్నచాలా ఇష్టంగా చూశా . మా పెద్దబ్బాయి శాస్త్రి ఈ మధ్య నేను హాస్యం రాయటం చూసి బాగానే ఉంది బాహు బలి లో ”పచ్చ బొట్టేసినా ”పాటకు ప్రస్తుత పరిస్థితులను జోడించి పేరడీ రాయమని చెప్పి నా దగ్గర ఆ పాట  లేదంటే నెట్ లో పంపాడు . అది చూసి చదివి చేసిన ప్రయత్నం ఇది .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -31-1-17 –కాంప్ –మల్లాపూర్ –హైదరాబాద్

Posted in కవితలు | Tagged | Leave a comment

భక్త రామదాసు జన్మ దినాన గ్రంధ భక్త రామప్ప సంస్మరణ

భక్త రామదాసు జన్మ దినాన గ్రంధ భక్త రామప్ప సంస్మరణ

Inline image 1

శ్రీ నారా రామప్ప వాజ్మయ తపస్వి అన్నారు శ్రీ శలాక రఘునాధ శర్మగారు .విశ్వనాధ వారి వేయి పడగలు నవల ఒక్క రాత్రిలో ఏక బిగిన చదివి పూర్తి  చేసిన పఠన దాహం కల వ్యక్తీ .మీసర గండ నారాయణ రాజు అనే గురువు  అనుగ్రహం తో భారత ,భాగవత రామాయణాలు ,మను ,వసు చరిత్ర కావ్యాల సారాన్ని అంతటినీ ఒంట పట్టించుకోన్నాడు .వయసు పైన పడినకొద్దీ యెంత గొప్ప పండితుడు ఎదురైనా తోడ గొట్టి సవాల్ చేసే ధీమా ఏర్పడేట్లుశిష్యుడు రామప్పను గురువు నారాయణ రాజు తీర్చి దిద్దాడు .దీనికి తోడూ అల్లు నారాయణప్పగురుత్వమూ అబ్బి రామప్ప సాహిత్య వ్యవసాయం మంచి ఫలసాయాన్నిచ్చింది .ఆంద్ర వాజ్మయం లో ఆయన చదవని గ్రంధం లేదు. అంతటి గ్రంధ భక్తుడు రామప్ప .

ఏ కావ్య ప్రస్తావన వచ్చినా అందులోని రసవత్తర పద్యాలు రామప్ప నాలుకపై నాట్యం చేస్తాయి .ఈ సాహిత్య పిపాస ఆయనకొక వ్యసనం గా మారి పోయింది .గొడ్లను కాయటానికి వెడుతున్నా, బస్ కోసం రోడ్డుమీద ఎదురు చూస్తున్నా చేతిలో గ్రంధం ఉండాల్సి౦దే.పొలం గట్ల మీద యే మార్కండేయ పురాణమో పరవశించి చదువుకొంటూ ఉంటే కాళ్ళమీద మహా సర్పాలు పాకుతూ పోయినా గుర్తించలేని రస తుందిల హృదయం రామప్పది అంటారు శలాక వారు . మహా విద్వాంసులు కూడా తొంగి చూడటానికి సాహసించని తిక్కన భారతం శాంతి ,ఆనుశాసనిక పర్వాల పద్యాలను ఆయనను కలలో లేపి అడిగినా చెప్పగల సత్తా ఉన్న మనిషి .వాటిలోని భావ పుస్టికీ ,శబ్ద సౌస్టవానికీ,కూర్పు ,నేర్పులకు అనుక్షణం ఆనంద తాండవం చేస్తుంది రామప్ప హృదయం .

1996 లో రామప్ప 85 వ ఏట కూడా ఉత్తమ కవిత్వం ఎక్కడ వాసన కొట్టినా పరుగెత్తుకొని పోయి ఆస్వాదించే పసితనం ఆయనది .తెలుగు వ్యాఖ్యానాల సహాయం తో ఆయన సంస్కృత మహా కావ్యాలను ,రామాయణ భారత భాగవతాలను నిరంతరం అధ్యయనం చేశాడు .వాటిలోని కొత్తదనాన్ని యిట్టె పట్టేసే నేర్పు ఆయనది .దాన్ని సహచరులతో పంచుకొని పరవశిస్తాడు .ఇవి కాక ఆంగ్ల సాహిత్యం అంద చందాలు చవి చూడాలన్న ఆరాటమూ పెరిగింది రామప్పకు .వేదాంత సౌరభాన్ని తనివి తీరా తనవి చేసుకోవాలన్న తపన ఉన్నవాడు .ఒక్క చదవటం తోనే రామప్ప ఆగి పోలేదు .పల్లె టూరు కనుక సంప్రదాయం గా పురాణ ప్రవచనం అక్కడ ఒక భాగం .ఒక పాఠకుడు పరిస్తూ ఉంటే ,మరో ప్రవక్త అందులోని రహస్యాలను విప్పి చెప్పి ఆనంద పరుస్తాడు .అలానే రామప్ప పురాణ ప్రవచనమూ చేశాడు .దానికి ప్రతిఫలం గా ఆయన ఏమీ ఆశించలేదు  తన కర్తవ్యంగా భావించి చేసిన ధర్మ యజ్ఞం ఆది.

నారా రామప్ప తలిదండ్రులు పెద్ద రామప్ప ,సుబ్బమ్మలు .అనంత పురం జిల్లాలో మన్నీలకు ఒక విశిష్టత ను చేకూర్చిన వాడు నారా రామప్ప .కులమతాలకు తావు లేకుండా మంచి విద్యార్ధులను స్వార్ధ రహితంగా తీర్చి దిద్దిన ఉత్సాహ శీలి రామప్ప .ఆయన శరీరానికే తప్ప  మనసుకు వార్ధక్యం లేదు .రామప్ప ప్రతిభ యెంత గొప్పది అంటే గంటకు 300 పద్యాలను అర్ధ స్పూర్తి చెడకుండా గొంతెత్తి చదవగల సామర్ధ్యం 85 ఏళ్ళ వయసులోనూ ఉన్నవాడు రామప్ప .మరో గొప్ప విషయం –ఆ వయసులోనూ పుస్తకాలు చదవటానికి ఆయనకు కళ్ళజోడు అక్కర లేదు .అపురూపమైన పద్యాలు ఎక్కడ దొరికినా అవి ఎన్ని వేలు అయినా ఎత్తి రాసుకొని భద్ర పరచుకొంటాడు రామప్ప .అయన గ్రంధాలయం లో స్వదస్తూరి తో రాసుకొన్న పుస్తకాలు అనేకం ఉన్నాయి .

రామప్ప ఎందరెందరికో అక్షర భిక్ష పెట్టాడు .ఎనిమిదేళ్ళ వయసున్న రామప్ప మనుమరాలు మహా ప్రబంధాలను అర్ధ స్పోరకం గా చక్కని పదబంధాలు చెడకుండా చదువుతుంది .సుమారు 70 ఏళ్ళ వయసున్న కొండప్ప భాగవత పద్యాలను కమ్మని కంఠంతో స్కాలిత్యం రాకుండా గానం చేసి శ్రోతలను అలరిస్తాడు .మూడక్షరాల పదాన్ని కూడా తప్పు లేకుండా చదవ లేని ఒక హరిజన బాలుడు ఆముక్త మాల్యద లోని ‘’ఖనటత్పయోబ్ద వీక్ష్య రసాతలా న్యోన్య సంపీడితాంగ భీతా౦డజములు’’ వంటి సుదీర్ఘ పరుషాక్షర  బహుళ సమాసాలను గ్రంధ సాహాయ్యం లేకుండా ఒప్ప జెప్ప గలడు.చల్లా కాటయ్యవంటి ఇలాంటి శిష్యుల నెందరి నో రామప్ప తీర్చి దిద్దాడు .కూలీ నాలీ చేసుకొనే ఎందరో హరిజనులు భారత ,భాగవత,రామాయణాది గ్రంధాలను యే మాత్రం పొరపాటు రాకుండా ,పండితులకు ఆహ్లాదం కలిగించే విధంగా పఠనం చేస్తారు .ఇదంతా రామప్ప ప్రభావమే .’’మేం రామప్ప గురువు శిష్యులం ‘’అని వీరాంతా గర్వం గా చెప్పుకొని ఆ గురువుకు గౌరవం కలిగిస్తారు .

ఇవన్నీ చూస్తుంటే రామప్ప ఒక ‘’సజీవ గ్రంధాలయం ‘’ తెలుగు సరస్వతి ముద్దు బిడ్డ’’అన్నారు శర్మగారు .ఆర్భాటం ప్రచారం పై ఆసక్తి లేని నిస్సంగా వాణీ సమార్చకుడు .పొద్దున్న ఇంత ‘’రాగి సంకటి’’ తింటే ఇక ఆరోజంతా రామప్పకు భోజనం తో పనేలేదు .ఆయనకు సాహిత్యాధ్యయనమే సర్వ సంపద .’’ఇలాంటి విద్యా తపస్విని చూసి తెలుగుతల్లి వెలుగు వెల్లువ నిరంతరం నింపు కొంటూ ఉంటుందని మా బోటి వారల నిండు నమ్మకం ‘’అన్నారు శ్రీ శలాక శర్మ గారు .శర్మగారికంటే  రామప్ప వయసులో 30 ఏళ్ళు పెద్ద వాడు .అయినా తానంటే ఆయనకు మహా గౌరవం అన్నారు శర్మగారు .ఒకరి నొకరు చూసుకోకుండా వారం రోజులు కూడా ఉండగలిగే వారు కాదట .శర్మ గారింటి ఇల్లాలు ,పిల్లలు రామప్ప వస్తే ‘’అదిగో మన్నీల తాత వచ్చాడు ‘’అని సంబర పడేవారట .వీరిద్దరూ ఎప్పుడు కలిసినా కనీసం వంద పద్యాలైనా స్మృతి పధం లో మేదిలేవి అంటారు శర్మగారు .

శర్మగారు బెజవాడ, బందరు, తిరుపతి, బెంగుళూరుమొదలైన చోట్ల  జరిగే సాహిత్య కార్యక్రమాలకు వెళ్ళే టప్పుడు రామప్ప ను వెంట తీసుకు వెళ్ళేవారు .ఎందరో మహానుభావులు శర్మగారి వలన రామప్ప వైభవాన్ని తెలుసుకొని హృదయం లో భద్రంగా నిలుపు కొన్నారు .ఒక సారి రామప్ప శర్మగారితో ‘’స్వామీ !నాది ఒక కోరిక .మీ ఇంటి ముందు వరండాలో మీ పటం ఒకటి పెట్టించండి .ఎందుకంటె నేను ఎన్నో సార్లు మీ ఇంటికి  వస్తూంటాను .మీరు ఇంట్లో లేకపోయినా అమ్మాయీ ,పిల్లలు నన్ను ఎంతో ఆదరం గా పలకరించి కాఫీ ఇస్తారు .అవి నాకు ఆనందాన్ని ఇచ్చినా ,నాకు కావలసింది అవి కాదు కదా .మీ పటాన్ని చూసి నమస్కారం పెట్టి ,మీతో ప్రసంగం చేసిన అనుభూతి పొందుతాను ‘’అని ఆనందంగా చెప్పుకొన్న వీరాభిమాని రామప్ప .’’రఘునాదు’’నికి’’ రామప్ప’’ రామ భక్త హనుమాన్ .

ఒక సారి తిరుపతిలో డా మేడసాని మోహన్ సహస్రావదానానికి శర్మగారు రామప్పను వెంట తీసుకు వెళ్ళారు .అక్కడ ఎందరెందరో మహా కవి పండితులకు రామప్పను పరిచయం చేసి ‘’ఈయన ఎప్పుడూ నా వేంటనే ఉంటాడు ‘’అన్నారు శర్మగారు .వెంటనే రామప్ప ‘’అవునవును ,ధర్మ రాజు వెంట కుక్క లాగా ‘’అన్నాడు.రామప్ప .శర్మగారు ఒక్కసారిగా అవాక్కయ్యారు .వెంటనే వారి మనసులో ఒక భావనా తరంగం కదిలి –మనసులోనే ‘’నా ధర్మరాజుతనం నిజమైనా కాక పోయినా ,ఆయన కుక్కతనం లో ధర్మ స్వరూపం పరమ సత్య మైనది ‘’అను కొన్నారట .అదీ శర్మ గారి సంస్కారం ‘        సాహిత్యమే అధ్యయన అధ్యాపన సర్వస్వం గా జీవించిన మనీషి శ్రీ నారా రామప్ప 90 సంవత్సరాల వయసులో 7-2-2,000 రధ సప్తమి పుణ్య దినాన జీవన రధ యాత్ర చాలించారు .ఆయన చేసిన అనంత సాహిత్య తపస్సు ఆయనకు అక్షయ పుణ్య లోకాలను ప్రసాదిస్తుంది ‘’అని ఆకాంక్షించారు శర్మగారు .

ఆధారం –ప్రాచార్య శ్రీ శలాక రఘునాధ శర్మగారి ‘’కదంబ వనం ‘’లో ‘’వాజ్మయ తపస్వి రామయ్య ‘’వ్యాసం

భక్త రామదాసు జన్మ దిన శుభాకాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -31-1-17 –కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

.

 

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కాళిదాస శ్లోక శతపత్రం

కాళిదాస శ్లోక శతపత్రం

‘’మహా కవి కాళిదాసు రఘు వంశకావ్యం లో మొదటి 9 సర్గలు పీఠిక .తరువాత 6 ప్రధానమైన రామకధ.చివరి 4 సర్గలు ఉపసంహారం ఉన్నాయి ..6 కదల రామ కధకు 9 సర్గల పీఠిక ఏమిటి అనే సందేహం వస్తుంది .దైవ విగ్రహ ప్రమాణం దేవాలయ ప్రమాణం లో యెంత ఉంటుంది ?ఇదీ అంతే.కాళిదాసమహాకవి ముందు 9 సర్గలలో వెనక 4 సర్గలలో ఒక దివ్య ధామం నిర్మించి అందులో రామ కదా రూప దైవ మూర్తిని ప్రతిష్టించారు ‘’ .అని ప్రాచార్య శ్రీ శలాక రఘునాధ శర్మగారు తమ ‘’కదంబ వనం ‘’పుస్తకం లో ‘’రఘు వంశ రసహేల ‘’లో వివరించారు .ఆ హేలా విలాసాన్నే నేను మీకు అందిస్తున్నాను .

షోడశ కళా పురుషోత్తముడైన పరమేశ్వరుడు శ్రీ రామునిగా అవతరించటానికి  ఆ 16 లక్షణాలనూ క్రోడీకరించాడు కవి .తన కావ్యం వేదసమ్మితమని ,వైవస్వత మనువు ప్రణవ సద్రుశుడైతే ,ఆ వంశ రాజులు వేద సదృశులై తే భగవంతుడు ఆ వంశం లో ఉద్భవి౦చటానికి గొప్ప యోగ్యతకలుగుతుంది .అందుకే కవి దిలీప మహా రాజును ప్రవేశ పెడుతూ –

‘’తదన్వాయే శుద్ధి మతి ప్రసూతః శుద్ధి మత్తరః  -దిలీప ఇతిరాజేందు రిన్దుః క్షీరనిధాఇవ ‘’అన్నాడు .చంద్రుడికి 16 కళలుంటాయి .అందుకే రాజును ‘’ఇందు’’ రూపమన్నాడు .ఈ షోడశ కళలు శ్రీరామునికి ముందున్న ఆ వంశ రాజు లందరికీ వర్తిస్తుంది .మరో మాట ‘’ప్రణవోపమ’’.ప్రణవం లాంటి వాడు .ఇదీ ఆ వంశం వారందరికీ వర్తించే ఉపమానమే .వివశ్వతుని కుమారుడు .వివస్వంతుడు అంటే అసమాన్యుడైన మకర కుండల కేయూర హారాలు ధరించి సరసిజాసన సన్నివిస్టుడై ,సర్వ జన ధ్యేయుడైన శ్రీమన్నారాయణ మూర్తికి తన మండలాన్ని గుడి గా చేసుకొన్నపుణ్య పురుషుడు .రఘు వంశం ఒక సూర్య మండలం అయితే దాని మధ్య శ్రీ రామ వృత్తాంతం నెలకొని ధ్యేయంగా ఉన్నది .క్షీర నిధి అనే మాటలో కల్ప వృక్షం కామ ధేనువు మొదలైన మహా పదార్ధాలు పాల సముద్ర మధనం లో ,అమృతంఉద్భ వి౦చటానికి ముందే పుట్టినట్లు , రఘు వంశం లో రాముడుద్భవి౦చ డానికి ముందే వీరు జన్మించారని సూచన . మహా గొప్ప ఉపమానాలు .దివ్యోపమలు ఇవి .’’కాళిదాసు భాషను కాని ,కధను కాని సృష్టించలేదు .ఉన్న భాషను ఉపయోగించి ,శబ్ద శక్తి తెలిసి సిద్ధమైన కధను స్నిగ్ధమైన రచనతో మనకు అందించాడు ‘’అన్నారు శలాక వారు .కాళిదాసు భారతీయత నిలువెల్లా జీర్ణించుకొన్న కవి .ప్రతి పలుకులో వేదనాదం ఉంటుంది .అర్ధ ,పురుషార్ధాలకే అధిక ప్రాధాన్య మిస్తాడు .’’దీనికి మించి అమృతాయమానమైన రస స్రోతస్సు భావుకుడిని అనుభూతిలో ముంచేస్తుంది .కాళిదాసు మూర్తీభవించిన ‘’భారతీయత ‘’అన్న శర్మ గారి పలుకులు ‘’ప్రాబలుకులే ‘’(వేద వాక్యాలే ) .

రఘు వంశ కావ్యం లో దిలీప ,రఘు ,అజ ,దశరధ కధలు మనోజ్ఞ శిల్పాభి రామాలైన ప్రాకారాలు .అందుకే అవి ధర్మార్ధ కామ మోక్ష పురుషార్ధ స్వరూప  వ్యాఖ్యాన రసవత్కావ్యాలు గా నిలిచాయి .దిలీప మహా రాజుకు శాపవశాన సంతాన౦ కలుగ లేదు .దీన్ని రూపుమాపుకొని సంతాన తంతువును అందుకొని వంశాన్ని నిలబెట్టు కోవాలని భార్య సుదక్షిణ తో సహా గురువు సందర్శించాలన్న కోరికతో ముందుగా సృష్టికర్తను అభ్యర్ధించాలనుకొని  గురువు ను దర్శించిఆయనలో బ్రహ్మను దర్శించాడు –

‘’తయా హీనం విదాతర్మాం కధం పశ్య న్నదూయసే –సిక్తం స్వయ మివ స్నేహా ద్వంధ్య మాశ్రమ వృక్షకం ‘’ అని ప్రార్ధించాడు .ఇందులో గురువును విధాత అని సంబోధించాడు .కనుక రాజు కోరికలో కొడుకు పుట్టాలన్న తపన జ్యోతకమైంది ఇలా చెప్పటం కావ్య పధ్ధతి అన్నారు శర్మగారు .దయాళువైన గురువు సంతానం కలగక పోవటానికి కారణం గ్రహించి దంపతులకు గోపూజ ను విధించాడు .ఆ విధి విధానాన్ని ఉపదేశించాడు-

‘’ప్రస్థితాయాంప్రతి స్టేథాః స్థితాయాం స్థితి మాచరేః-నిషణ్ణాయాం నిషీదాస్యాం పీతాంభసి పిబే రపః ‘’అని హెచ్చరికలు చెప్పాడు –గోవు నడిస్తే నడువు ,నిలబడితే నిలబడు ,కూర్చుంటే కూర్చో ,నీళ్ళు తాగితే తాగు .అన్నాడు .తు చ తప్పకుండా దిలీప సుదక్షిణ దంపతులు అలానే గో సేవ చేశారు .ఎలా చేశారో కవి చెప్పాడు –

‘’స్థితః స్థితా ముచ్చలితః ప్రయాతాం –నిషే దుషీ మాసన బంధ ధీరః –జలాభి లాషీ జలమాదదానాం-ఛాయేవతాం భూపతి రన్వ గచ్ఛత్ ‘’

గురువు ‘’నిశీధ ‘’అని చెబితే శిష్యుడు ‘’ఆసన బద్ధ ధీరుడు ‘’అయ్యాడు .ఆపః పిబే ‘’అని గురువు అంటే ‘’జలాభి లాషి ‘’అయ్యాడు .నీళ్ళు తాగాడో లేదో చెప్పలేదుకవి .అలా నిలువెల్లా నిస్టతో గోవును సేవించారు దంపతులు .చాయా అనే శబ్దానికి అర్ధం నీడ లాగా కాదని సర్వాత్మనా తనను పరిహరించుకొని గోవును అనుసరించాడని శర్మ గారు చెప్పిన అర్ధం చాలా సమంజసం గా ఉంది .

పరమ ఉదాత్త నిగ్రహం ప్రాణ వస్తువుగా ,ప్రత్యక్షర శిల్పాన్ని చేసిన వాడు కాళిదాస మహా కవి .ఆవేశం ఎక్కువై ,ఆకర్షణ అమితమై న వాడు భవ భూతి మహా కవి .గోసేవకు పరమానందం పొందిన గోవు దిలీపుని దీక్షకు మెచ్చి’’నాయనా !అని సంబోధించి  వరం కోరుకో మన్నది .అప్పుడు మహాకవి మహా రాజుతో అని పించిన శ్లోకం ప్రత్యక్షర శిల్ప శోభితం –ఇదే శ్లోక శతపత్రం .

‘’తతః సమానీయ స మానితార్దీ –హస్తౌ స్వహస్తార్జిత వీర శబ్దః –వంశస్య కర్తార మనంత కీర్తిం –సుదక్షిణాయాం తనయం యయాచే ‘’

ఎంత అదుపులో మనస్సు పెట్టుకొని దిలీపమహా రాజు గోవును అర్ధించాడో తెలియ జెప్పే మహా వాక్య ప్రమాణమైన శ్లోకం ఇది –మహా రాజు ‘’మానితార్ది ‘’అంటే ఎవరు యాచి౦చ టానికి వచ్చినా కోర్కెలు తీర్చే కల్ప వృక్షం వంటి వదాన్య వరేణ్యుడు.తాను  అడిగేది కామ దేనువుకు ప్రతిరూపమైన నందిని ధేనువును  .ఏ మాత్రం వివేకం కోల్పోయి అడిగిన వరం శాపం కావచ్చు .జీవితం లో ఎప్పుడూ ఇవ్వటమే కాని పుచ్చుకొన్నవాడు కాదు .అందుకే కవి ‘’హస్తౌ సమానీయ ‘’అన్నాడు .ఆ చేతులతో ఎన్నో యుద్ధాలు చేసి వీరుడు అని పించుకొన్నాడు ఇప్పుడు ఆచేతులు యాచకుని చేతులులా ఉన్నా వాటిలో  దాన ,యుద్ధ వీరాలున్నాయి .అంటే దానం తీసుకోవటానికి తగిన అన్ని యోగ్యతలు అర్హతలు ఉన్నాయని అర్ధం .మరి రాజు అడిగింది దేనిని ?తనయుడిని అంటే తన తనువునుండి పుట్టేవాడినే ఇవ్వమని అర్ధం .మరి ఆకొడుకు ఎలా ఉండాలి ?’’వంశస్య కర్తారం ‘’గా ఉండాలి వంశాన్ని వృద్ధి చేసేవాడుగా వర్ధిల్లాలి .మరి వాడి లక్షణాలు ఎలా ఉండాలి?’’అనంత కీర్తిం ‘’అనంతమైన కీర్తి ప్రతిష్టలు కలవాడై ఉండాలి .ఇక్కడ అనంత శబ్దం సాభిప్రాయంగా కవి ప్రయోగించాడని ,అనంత అంటే ఆదిశేషుని లాగా అలసట లేకుండా అనంతకాలం భూ భారం మోసే సమర్ధత కలవాడుగా ఉండాలన్న అర్ధమూ ఉందని శర్మగారి వ్యాఖ్యానానికి  జేజేలు .అంతాబాగానే ఉంది –తనకే సమర్ధుడైన కొడుకే ఇవ్వమని కోరాడు .ఆ కొడుకు ధర్మ పత్ని సుదక్షిణాదేవి సుక్తి ముక్తాఫలమై ఉండాలని ఒక ఝలక్ ఇచ్చాడు. అందుకే రాజు నోట ‘’సుదక్షిణాయాం ‘’అనే సాభిప్రాయమైన మాట వచ్చింది .రాజు పొందిన శాపం సుదక్షిణ కూ తగిలింది .కనుక శాప విముక్తి ఇద్దరికీ కలగాలి .ఇంత పకడ్బందీ గా కాళిదాస మహా కవి ఈ శ్లోకం రాసి దిలీప మహా రాజుతో అనిపించి సఫల మనో రధుడిని చేశాడు .

ఇందులో దిలీప సుదక్షిణా దంపతుల సంతానాభి లాష ,వ్రత దీక్ష ,గో రక్షణ కై ప్రాణ త్యాగానికైనా వెను దీయని ధర్మా భిరతి ,ఫలాభి సంధి కి తొణకనితనం ,గర్భ రక్షణ లో చూపిన శ్రద్ధ ,పుత్రుడికి సంస్కారాలు చేయటం లో చూపించిన నైపుణ్యం ,సరైన సమయం లో కుమారుడు రఘువుకు రాజ్య భారం అప్పగించటం ,వార్ధక్యం లో ముని వ్రుత్తి చేబట్టటం మొదలైన అంశాలను కాళిదాసు మహా ధార్మిక విధానం లో తీర్చి దిద్దాడని అందుకే ఇది ‘’ధర్మ పురుషార్ధ పరి పాక స్పోరక గాథ’’గా చిరస్మరణీయ మైనదని ప్రాచార్య శ్రీ శలాక రఘునాధ శర్మ గారు ప్రవచించారు .ఇలాంటి వ్యాఖ్యాన శిరోమణుల వలననే మహా కవుల కవితా శిల్పం అర్ధం చేసుకో గలం.ఈ జాతికి వారు ధర్మ భిక్ష అందజేసిన పుణ్యమూర్తులు .

Inline image 1

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -31-1-17  -కాంప్ –మల్లాపూర్ –హైదరాబాద్

 

 

 

 

.

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

దశరధ మహా రాజు నిస్సంగత్వం

దశరధ మహా రాజు నిస్సంగత్వం

ధర్మ నిర్వహణలో సంతాన తంతువు విచ్చేదం కాకుండా రక్షించు కోవటానికి దశరధ మహా రాజు  అశ్వ మేధ ,పుత్ర కామేష్టి యజ్ఞాలను పరమ శ్రద్ధాళువై ఆచరించాడు .చక్రవర్తి అశ్వ మేధం చేస్తే తన రాజ్యాన్ని అంతటినీ దక్షిణగా ఇవ్వటం శాస్త్ర విధి .దీనికి ప్రత్యామ్నాయాలు చాలా ఉంటాయి కనుక ఇచ్చి నట్లుగా ఒక తంతు గా దీన్ని జరుపుతారు .కానీ దశరధుని మనః ప్రవ్రుత్తి చాలా భిన్నంగా ఉన్నట్లు శ్రీ మద్రామాయణం లో మహర్షి వాల్మీకి ,రామాయణ కల్ప వృక్షం లో కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ గారూ గొప్పగా అభి వర్ణించారని ‘’కల్ప వృక్ష వాగ్వైభవం’’లో ‘’సార్వ భౌమ యజ్న దీక్ష ‘’వ్యాసం లో మహా వ్యాఖ్యాత,ప్రాచార్య  శ్రీ శలాక  రఘు నాద శర్మ గారు వ్యాఖ్యానించారు .ఇందులోని సారాన్ని ‘’దశరధ చక్రవర్తి నిస్సంగత్వం ‘’పేర మీకు అందిస్తున్నాను .

యజ్ఞం లో ప్రధాన ఋత్విక్కులైన  హోతకు తూర్పు దిక్కును , ,అధ్వర్యువుకు పడమటి దిక్కును , ,బ్రహ్మకు దక్షిణ దిక్కును , ,ఉద్గాతకు ఉత్తర దిక్కును దశరధ మహా రాజు యజ్ఞం పూర్తయ్యాక తనకున్న సర్వ భూమినీ దక్షిణగా ఇచ్చేశాడు .వాళ్ళందరూ గ్రహించి దీన్ని మేమేం చేసుకొంటాం అని బ్రతిమి లాడి ఆయనకే అప్పగించేసి ఆయన ప్రత్యామ్నాయంగా  ఇచ్చిన గో ,సువర్నాదుల్ని గ్రహించారు . ఇలా చేయటం లో మమకారాన్ని చంపుకోవటం అనే గొప్ప ప్రయత్నం ఉందని గ్రహించాలి .భౌతిక భాగ్య సంపదలతో మమకారం చంపుకున్నవాడు పరమార్ధ సంపదను తలకెత్తు కుంటాడని శర్మ గారు వ్యాఖ్యానించారు .ఈ ఘట్టాన్ని విశ్వనాధ తన ‘’సకలోహ వైభవ సనాధమైన’’ నాథ కథ’’లో అంటే కల్ప వృక్షం లో మహోన్నత రస బంధురంగా తీర్చి దిద్దారు .

‘’దక్షిణ గాగ సర్వ వసుధాతల మిచ్చెను  బర్వు దింపిన –ట్లక్షుల నప్పళించి భుజ మల్లన నూర్పున నెత్తి దించె స –ర్వక్షిత భార దూర్వహ భవ క్లమ బుద్ధి ధరా తలేశ్వరుం –డాక్షణ మందు సౌఖ్య నివహాత్త శరీర లఘుత్వ భావనన్ ‘’.

భావం వాల్మీకి దే అయినా విశ్వనాధ మహర్షిని తనలో ఆవాహన చేసుకొని రుషి వాక్కు ను వ్యాఖ్యానించాడు .దక్షిణగా సర్వ భూ మండలాన్నీ ఇచ్చేశాడు మహా రాజు –ఇదీ అసలు వార్త.ఈ వార్తను కవి కవిత్వం తో రసబంధురం చేశాడు .అలా దక్షిణగా ఇచ్చేసిన తర్వాత ఆయనకు పెద్ద బరువు చాలా కాలం మోయాగా మోయగా దింపేసి నప్పుడు కలిగిన గొప్ప అను భూతి అంటే రిలీఫ్ కలిగింది .కళ్ళు అప్పళించాడు.భుజం కొంచెం కదిలించి ,పెద్దగా ఊపిరి  తీసుకొని,పైకి ఎత్తి దించాడట .బరువులు మోసే వాళ్ళందరూ బరువు ది౦చినపుడు కలిగే ఊరట పొందాడన్న మాట  .ఇంతకాలం ఇంత బరువు మోసి నందుకు కలిగిన అలసమైన బుద్ధి ఇప్పుడు తేలిక పడింది .కొన్ని వందల సుఖాలు కట్ట కట్టుకొని వచ్చాయా అన్నట్లు శరీరం తేలిక పడింది .ఒక గొప్ప అందమైన భావ చిత్రాన్నిఅక్షరాలతో చిత్రించి విశ్వనాధ  కవి మన ముందుంచాడు రస రమ్యంగా .మనం దేశ కాలావధులు దాటి కథా కాలానికి వెళ్ళిన మహా విభూతి కల్పించారు కవి సామ్రాట్ .ఇంతటితో ఆగి పొతే ఆయన విశ్వనాధ ఎలా అవుతారు  ?మరో పద్యం వెలువరించారు –

‘’ఇన్నాళ్ళీధర మోసి మోసి ,బరువయ్యెన్ విశ్వ విజ్ఞాన సం-పన్నాళీక భవుల్ భవత్కరములన్ భద్రమ్ముగా నుంచి త-ర్కోన్నేయాచ్ఛ పథాధ్వనీనుడుగ నన్నో భూసుర గ్రామణుల్-మన్నింపం దగు నెప్పుడో తెణపి సంప్రాప్తించె నీ నాటికిన్ ‘’.

దీన్ని వ్యాఖ్యానిస్తూ శలాక శర్మగారు –‘’దశరధుని త్రికరణాలూ బరు వెక్కి పోయాయి .వయసూ పెరిగింది కనుక భారం ది౦చుకోవాల్సిందే .దాన్ని తేలిగ్గా కింద పారేసి చేతులు దులుపుకోవటం ధర్మ నిష్ట కల దశరధునికి సులభం కాదు .దాన్ని ‘’సుస్థాన పతితం ‘’చేయాలి అంటే మంచి సమర్ధుల చేతిలో పెట్టాలి .అందుకే ‘’విశ్వ విజ్ఞాన సంపన్నాళీక భవుల్ ‘’అంటే విశ్వ విజ్ఞాన సంపదలో మీరు పద్మ సంభవుడైన బ్రహ్మ దేవుని అంతటి వారు కనుక నిశ్చింతగా ఈ భారాన్నిమీకు అందిస్తున్నాను అనే పరి తృప్తి నా హృదయం లో పరవళ్ళు తొక్కు తోంది ‘’అని అతి వినమ్రంగా విన్న వించాడు  .ఇక్కడ ప్రయోగించిన ‘’నాళీకభవ ‘’ శబ్దం సాభి ప్రాయం గా ఉన్నది .నాళీకంఅంటే పద్మం –పంకజం అనీ అంటారు .అది బురదలో పుట్టి పెరిగినా దానికి ఆ బురద అంటుకోదు .అలాగే మహాత్ములైన మీరు ఈ రాజ్యాన్ని నిర్లిప్త భావం తో పరి పాలిస్తారు కనుక ఈ భూమికి సర్వతో భద్రత ఏర్పడుతుంది అనే గంభీరమైన అర్ధం ఇందులో కవి సామ్రాట్ నిక్షిప్తం చేశారు .’’భవత్కరములన్ భద్రమ్ము గా నుంచి ‘’అన్నాడు చక్రవర్తి –‘’మీ చేతుల్లో భద్రం గా పెట్టి నేను విశ్రాంతి తీసుకొంటాను ‘’అనే భావాన్ని ‘’విశ్వనాధ కవి చక్ర వర్తి ‘’ప్రాచీన భారతీయ మహా చక్ర వర్తి మహోన్నత భావ పరంపరను కుమ్మరించి చూపించారు ‘’అని శర్మ గారు పొంగిపోయారు .ఆ పులకింత మనకూ కల్పించారు .ఉత్తముడైన రాజు ప్రజల కోసమే బ్రతుకు తాడు .తాను  ఏలే రాజ్యానికి సర్వ సమర్ధుడైన ఉత్తరాధి కారి కావాలని ఆశిస్తాడు .అంతటి మహాత్ముడు దొరికితే ఆయన హృదయం ఆనంద అర్ణవమే అవుతుంది .బరువు ఎత్తుకొనేటప్పుడు,దించు కొనేటప్పుడు ఈ తత్త్వం’’ ఓతప్రోతం’’ గా ఉంటుంది అన్నారు శర్మ గారు .దశరధ మహా రాజు ఇంతటి మహోన్నతుడు కనుకనే  విష్ణు మూర్తి ‘’పితరం రోచయామాస తదా దశరధం నృపం ‘’అను కొన్నాడు అన్నాడు వాల్మీకి మహర్షి .అంటే తండ్రిగా దశరధ మహా రాజును శ్రీరామావతారానికి  ఎంచుకొన్నాడు విష్ణు మూర్తి అని అర్ధం .ఇక్కడ చక్రవర్తి సంసార బంధ వినిరక్తుడైన ఒక నిస్సంగునిలా దర్శనమిస్తాడు .అలాంటి వాని హృదయం ‘’ఆనంద సాంద్ర స్థితి ‘’లో విహరిస్తుంది ‘’అని శర్మ గారు మాత్రమే  చేయగల వ్యాఖ్యానం ఇది .

ఈ ఘట్టానికి ఫైనల్ టచ్ ఇస్తూ విశ్వనాధ –

‘’అని ఉత్తరీయమునుగ –ట్టిన దోవతి తోడ వడి వడిం జను ,నరపా

లుని త్రోవ కడ్డమై బ్రా-హ్మణు లిది ఏమయ్యభూమిపా !భూమ కృపా ‘’

ముందు పద్యం లో చెప్పిన మాటలు పలికి రాజు ఉత్తరీయం తో కట్టిన దోవతి తో వడివడి గా వెళ్లి పోతున్నాడు .అంతా దానం చేశాక కట్టు బట్టలు తప్ప మరేమీ తనతో తీసుకు పోరాదనే  దృఢ వైరాగ్య భావన గుండె లోతుల్లో నిక్షిప్తం చేసుకొని ,పరమ విరాగిగా ఉన్నాడు మహా రాజు .అప్పటి వరకు ‘’అసముద్ర క్షితీసుడు ‘’దక్షిణగా సర్వ భూమినీ ధార పోసిన మరు క్షణం లో ఐశ్వర్యం పై ఆవ గింజంత అధికారం కూడా తనకు లేదను కొన్న త్యాగ మూర్తి దశరధ మహా రాజు .కాళిదాస మహాకవి ‘’సంభ్రుతార్దానాం ‘’ అన్నాడు అంటే త్యాగం కోసమే అర్ధ సంపత్తిని కూర్చు కుంటారు అన్నాడు .త్యాగమే అమృతత్వానికి దారి .ఇంతటి త్యాగ శీలినే మహా విష్ణువు తండ్రిగా కోరుకున్నాడు .మనసు చాలా విచిత్రమైంది .ఒక్క క్షణం జాగు చేస్తే అది తనపై అధికారం చలా ఇంచే ప్రమాదం ఉంది కనుక ‘’వడి వడిం జని’’అని అతి వేగంగా అక్కడి నుంచి వెళ్లి పోతున్నాడు .అయితే ఎక్కడికి వెడుతున్నాడో కవి చెప్పలేదు . అది ‘’పరి వ్రజనం ‘’అన్నమాట .అంటే గమ్యం లేకుండా సాగటం .ఇదే పరమ వైరాగ్యానికి పరమ నిదర్శనం అంటారు శలాక శర్మ గారు .

తర్వాత యధా ప్రకారం దక్షిణ తీసుకొన్నవారు రాజుకు తిరిగీ భూభాగం అప్పగించి కానుకలతో సరిపెట్టుకోవటం మనకు తెలిసిందే .కాని వారు రాజుకు మహా సామ్రాజ్యం కంటే మహా ఫలాన్ని అనుగ్రహిం చారు .ఇక్కడ మహర్షి –

‘’తస్యా శిషోథ విధి వద్ బ్రాహ్మణైః సముదీరితాః-ఉదారస్య నృవీరస్య ధరణ్యాం ప్రణతస్య చ ‘’

బ్రహ్మ జ్ఞాన సంపన్ను లైన ఆ మహర్షులు ఉదారుడు ,రాజ వీరుడూ ,నేల పై సాష్టాంగ  దండ ప్రణామం చేసి ఉన్నవాడూ అయిన దశరధ మహా రాజు కు విధి ననుసరించి ఆశీస్సులు అనుగ్రహించారు .ఇక్కడ ఆశీస్సులు అంటే ‘’శాసనాత్మకమైన ఆదేశాలు ‘’అన్నమాట .వారి మాటలను కాదన లేక మహా రాజు రాజ్యాన్ని మళ్ళీ స్వీకరించాడు .అయినా ‘’విరక్తత ‘’అలాగే ఉండి పోయింది అంటారు శలాక వారు .మహర్షి పలికిన ఆశీస్సులను విశ్వనాధ కవి మహర్షి బహుధా ప్రవచించి ఇలా చెప్పారు –

‘’సాదు జనైక క౦టక నిశాచర క౦ఠ కరాళ మూర్తి ,మా-యాధవు డంజనాద్రి శిఖరా౦చల చిక్కణ కాంతి మత్తనూ –సాధు మనోజ్ఞ మూర్తి త్రిదశ ప్రభు బంధ విమోచనుడు భూ –మీ ధవ !త్వత్పురావన సమిద్ధ మహో నిధియై తలిర్చుతన్ ‘’అన్నారు

భావం –‘’భూమీధవా !భూదేవి పతీ !అని సాభిప్రాయంగా అని ‘నీకు పరి పాలించే భూమి అంతాసుఖంగా ఉండాలన్న తపన ఉంటే,ఇప్పటికీ నువ్వు భూమి ధవుడివే అయి శ్రీ మహా విష్ణువుకు తండ్రివై ,నిన్ను నువ్వు ఉద్ధరించు కొని ,ప్రజలందర్నీ ఉద్ధరించే పుణ్యం కట్టుకోవాలి .ఎలాగా అంటావా –సాదుజనాలకందరికీ ఒకే ఒక క౦టకుడిగా చెలరేగుతున్న నిశాచర కంఠాలకు కరాళ మూర్తి అయిన వాడూ ,మాయ అనే ప్రకృతికి భర్త అయినవాడూ ,కాటుక కొండ కొమ్మల చివర్లలో నిగ నిగ లాడే కాంతితో విరాజిల్లే దేహ సౌందర్యం తో అందరి మనస్సులనూ ఆకట్టుకొనే నీల మేఘ శ్యాముడు ,దేవేంద్రుని బంధనం నుంచి విడిపించేవాడూ అయిన కుమారుడు జాజ్వల్యమాన మైన కాంతితో నీ ముందు తిరుగాడుతూ ఉంటాడయ్యా ‘’అని శుభాశీస్సులు కురిపించారు .దీనితో రాజు కోరికా ,జన వేదనా ,రాక్ష సంహారం, ఇంద్ర సంతృప్తీ తీరే వర ప్రదానం మహా రాజుకు యజ్న ఫలంగా దక్కింది .

మహర్షులు ద్రష్టలు ,క్రాంత  దర్శులు కనుక పుట్టబోయే’’ బుల్లి బుజ్జాయి’’ శ్రీ రామ చంద్రుని దర్శించి మాట్లాడారు .ఆయన చేసే సర్వ రామాయణాన్ని మూడు ముక్కల్లో కుదించి కుప్ప బోశారు .ఆది శేషుని అంశతో లక్ష్మణుడు ,పాంచజన్య శంఖం వెలుగులతో భరతుడు ,సుదర్శన చక్ర స్వరూపం తో శత్రుఘ్నుడు అవతరించ బోతున్నారని కూడా ఆశీస్సులతో సూచించారు .దశరధ మహా రాజు వైరాగ్య గరిమతో అందుకో బోతున్న ‘’అమృత స్థితి ‘’ఇది .ప్రత్యామ్నాయంగా కోట్ల కొలది సువర్ణాన్ని ,గోవులను సమర్పించి నామమాత్రమైన రాజ్య పాలన స్వీకరించాడు దశరధ చక్రవర్తి .ఇదంతా మహర్షి వాల్మీకి వాక్యాలకు విశ్వనాధ చేసిన మహా భాష్యం .’’అన్న శ్రీ శలాక వారి వ్యాఖ్యానం  శిఖరాయ మానం .బహుశా భారత ,భాగవతాలలో అశ్వ మేధయాగాలు చేసిన యే చక్రవర్తీ దశరదునిలా ప్రవర్తించినట్లు యే కవీ రాయలేదుఅని నేను అనుకొంటాను . .ఆ పని ఒక్క విశ్వ నాద మహా కవి మాత్రమే చేసి  తన సకలోహసనాధం గా  కల్ప వృక్ష రామాయణానికీ పట్టాభి షేకం చేశారు .

Inline image 1

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-1-17 –కాంప్ –మల్లాపూర్ –హైదరాబాద్ .   .

 

 

 

 

.

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కంప్యూటర్ తిట్ల దండకం (సరదాకే )

కంప్యూటర్ తిట్ల దండకం (సరదాకే )

తీరికగా పేపర్ చదువుతున్నా .పక్కింటి పడుచు కుర్రాడు పరిగెత్తుకొచ్చి వగరుస్తూ కుర్చీలో కూల బడి ‘’అంకుల్ !నాకో హెల్ప్ చేయాలి ‘’అన్నాడు .వాడికి నేనంటే చనువు .తరుచూ వచ్చిపలకరిస్తాడు . నా మెయిల్స్ చదువుతాడు .ఫేస్ బుక్ లో కావలసినన్ని లైకులు పెట్టి కిక్కెక్కిస్తాడు .వాట్స్ అప్ లో ఓహ్ వాట్ యే బ్రిలియంట్ ఐడియా  వాట్ఎ పెర్సేప్షన్  !కంగ్రాట్స్ ‘’వంటివి బాగా దట్టిస్తాడు .కనుక నా అభిమాని అని వేరే చెప్పక్కర్లేదు .నా ప్రచార సారధి ఒక రకంగా అని గర్వం ఫీలౌతాను వాడిని చూసి .డప్పు కొట్టే వాడంటే ఎవరికి ఇష్టం ఉండదు?నేనేం ఎక్సెప్షన్ కాదు .సరే అసలు విషయం వదిలేసి శాఖా చంక్రమణం చాలా చేశాను ‘’ఇంతకీ నీకు నేనేం హెల్ప్ చేయాల్రా ?’’అడిగాను .’’ఏం లేదంకుల్ .వెరీ సింపుల్ . నాకు కొన్ని బూతుల్లాంటి తిట్లు  రాసి పెట్టాలి ‘’అన్నాడు జంకు లేకుండా .’’నేనేం ఆత్రేయనో ,వేటూరినో అను కొన్నావా ఇదే౦  తెంపరి తనం ?’’అన్నా .’’తప్పుగా అర్ధం చేసుకోకండి అంకుల్ .అవన్నీ పాత బడి పోయాయి .’’అన్నాడు ‘’అసెంబ్లీ లో మనవాళ్ళంతా పన్నెండో నంబర్ భాష రెచ్చి పోయి మాట్లాడుతున్నారు కదా ఇంకా ఏం నేర్చుకోవాలి ?’’అన్నా .’’వాటికి ఎక్స్పైరీ డేట్ అయి పోయింది అంకుల్ ‘’అన్నాడు సంకోచం లేకుండా .’’ఈ మధ్య ‘’ట్ర౦ప్ ట్రంపెట్ వాయించి నట్లు కంపు కొట్టేట్లు  అందర్నీ ఉప్పూ పత్రీ లేకుండా తిడుతున్నాడు కదా .రికార్డ్ చేసుకో లేక పోయావా ‘’అడిగా.’’లాభం లేదంకుల్ .అవి మరీ పచ్చిగా ఉన్నాయి ‘’అన్నాడు .’’అమెరికా స్కూల్ కుర్రాళ్ళు రెచ్చిపోయి తిట్టుకొంటారని విన్నా.ట్రై చేయలేక పోయావా ?’’అన్నా. ‘’అదీ అయింది అంకుల్ .నాకు లేటెస్ట్ గా ,సాంకేతికంగా, లైట్ గా కావాలి ‘’అన్నాడు .’’పోనీ యు ట్యూబ్ లో ఫన్  బకెట్ చూడక పోయావా ?అందులో కర్రోడు ,జుట్టు పోలిగాడు సరదాగా మంచి బూతులలాంటివే  తిట్టుకొంటారుగా .నేనూ సరదాకి చూస్తాను ‘’అన్నాను .’’అవన్నీ నిన్నటి తిట్లన్కుల్ .నాకు మీరైతే అతి లేటెస్ట్ తిట్లు రాయగలరని నమ్మకం .అంతే .నన్ను కన్విన్స్ చేసే ప్రయత్నం వద్దు ఇప్పటికే అరగంట వాయించారు ,ఇక మొదలు పెట్టి రాసి నాకు అర్జెంట్ గా మెయిల్ చేయండి ప్లీజ్ అంకుల్ ‘’అన్నాడు .’’అంత కొంపేం మునిగింది ?’’అన్నా .’’సాయంత్రం పోటీ ఉందన్కుల్ .మీ వన్నీ నావిగా చేసి పోటీ లో పార్టిసిపేట్ చేయాలి .గెలిస్తే ప్రైజ్ కూడా ఉంది .ఆ ప్రైజ్ మీకే ఇస్తా అంకుల్ నాకొస్తే ‘’అని ఊరించాడు .ములగ చెట్టు ఎక్కాక ,సుబాబుల్ చివరున్నాక ఇక తప్పించు కో లేనని తెలుసుకొని ,వాడిని కెలకటం బుద్ధి తక్కువని ఇక తప్పదని’’ పంచాంగ’’ రచనకు  ఉపక్రమించా .;

  1-ఒరే నీ కంప్యూటర్ లో కాకరకాయా

2-ఓరి నీ లాప్ టాప్ లో నా ఎర్ర టవలూ

 ౩-ఓసి నీ ఐ పాడ్ లో ఐస్ క్రీమూ

 4-ప్రోగ్రాం రాయమంటే ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపించినట్లు

 5-కంట్రోల్ సిస్టం రా అంటే కండోం సిస్టమా అని అడిగినట్లు

 6-సిస్టం ఉందా అని అడిగితే సిస్టర్ ఉందన్నాట్ట ఒకడు .

7-నీ రిమోట్ లో కమోడూ

8-డేటా పంపించారా బేటా అంటే బాటాషూ పంపినట్లు

 9-లూమ్స్ అంటే ఏమిట్రా అంటే హాండ్ లూమ్స్ బ్రదర్ అన్నట్లు

 10-అనలాగ్ అంటే అనంతనాగ్ తమ్ముడు అన్నట్లు

11-ఓరి నీ డిజిటల్ మెమరీలో డీజిలాయిలూ

12-ప్రాసెస్ చేయరా బాబూ అంటే ఫ్రాడ్ చేసిన౦త  ఫీలింగే౦ట్రా

13-ఓసి నీ కీబోర్డ్ లో నా జడ పిన్నూ

14-జాయ్ స్టిక్ అంటే అదేదో బూతనుకొని వంకర్లు తిరుగుతావేంటే

15- మానిటర్ తెమ్మంటే మానీటర్ ను తెచ్చినట్లు

16-ఓసి నీ స్క్రీన్ మీద నా  ఫేస్ పౌడరూ

 17-ప్రింటర్ ఉందా అంటే ప్రింట్ చేసేవాడ్ని పట్టుకొచ్చినట్లు

18-స్కాన్ చేసి పంపరా  అంటే స్కాంకాగితాలు పంపాట్ట ఒకడు

 19-ఇన్ పుట్ ఉందా అంటే మెలికలు తిరుగుతావేంటే

20-ఓరి ఎంకమ్మా ఔట్ పుట్ అంటే లాప్ టాప్ తీసి బయట పెట్టటం కాదహే .

21-లాగిన్ అవమంటే లాగు లోపల వేసు కోవటం కాదురా ఎర్రి పప్పా

 22-లాగవుట్ చేయమంటే బయటికెళ్ళి లాగూ విప్పాట్ట నీ బోటి చవట

 23-టచ్ స్క్రీన్ ఉందా అని అడిగితె స్కిన్ టచ్ చేసి చేబుతానన్నదిట ఒక ఎర్రి బాగుల్ది .

24-సోర్స్ ఉందా అని అడిగితె మచ్చలు పోవటానికి మందు రాసుకొన్నట్లు

25-నీనెట్ వర్క్ లో నా బాస్కెట్ బాలూ

26-ఓరి నీ మోడెమ్ లో కన్డోమూ

27-ఆర్టి ఫీషియల్ ఇంటలిజెన్స్ గురించి చెప్పరా అంటే  ఆర్టీసీ ఇంటలిజెన్స్ గురించి చెప్పినట్లు

28-నీ సిస్టం లో హార్డ్ వేర్ పోయిందిరా అంటే హార్డ్ వేర్ ఇనపకొట్టు కెళ్ళి  వేయించు కోస్తాను అన్నట్లు

29-వాడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అంటే మెత్తని బట్టలు కట్టే ఇంజనీర్ అనుకోని కులికిందట ఒక కలికి .

30-ఫర్మ్ వేర్  అంటే బట్టలు బిగుతుగా కట్టుకోవటం కదా మామా అన్నాట్ట

31-అబాకస్ అంటే అబార్షన్ చేయించు కోమన్నంత కంగారెందుకే

32- అనలాగ్ అంటే లాగూలు కూడా ఏమన్నాఅనగలుగుతాయా  అన్నా? అన్నట్టు

33-ఇప్పుడంతా డిజిటల్ రా అంటే నేను ఎప్పటినుంచో డిటర్జెంట్ వాడుతున్నానన్నాట్ట

34-వాక్యూం క్యూబ్ అంటే ఐస్ క్యూబ్ కి అన్నా? అని అడిగినట్లు

35-ఈ మెయిల్ పంపరా అంటే అదెందుకు ఆ మెయిల్ లో పంపుతాలే అన్నట్లు  

36-గిగా బైట్ అంటే –కుక్కలేకాక గిగాలు కూడా బైట్ చేస్తాయా అని అడిగినట్లు

37-పుస్తకాలు కొనటం దండగ ఈ బుక్ లో హాయిగా చదువుకో వచ్చు అంటే అవి బజార్లో ఎక్కడ దొరుకుతాయని అడిగినట్లు

38-పైతన్ లాంగ్వేజ్ అంటే పైతన్ పాము భాష అని భయపడినట్లు

 39-ఓసి నీ ఫేస్ బుక్ లో నా టెక్స్ట్ బుక్కూ

40-వాట్స్ అప్  చూడరా అంటే ‘’వాటీజ్ అప్పా ‘’అని పైకి చూసి’’ ఫాను మామా’’ అన్నట్టు.’

  ముళ్ళ మీద కూర్చున్నఫీలింగ్ తో  ఇవన్నీ రాసి పక్కింటి నా ఫాన్ కుర్రాడికి అర్జెంట్ గా మెయిల్ పంపి ఊపిరి పీల్చుకున్నా .మాఘమాసం లో ఈ తిట్ల పురాణం ఏమిటి అని, కీర్తి కక్కూర్తికి  చెంపలేసుకొని , ప్రాయశ్చిత్తంగా మళ్ళీ ఒకసారి  అరుణ పారాయణ చేసి స్థిమిత పడ్డా .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-1-17 –కాంప్ –మల్లాపూర్ –హైదరాబాద్



గబ్బిట దుర్గా ప్రసాద్

Posted in రచనలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -3 54-భారతీయ శిల్ప చిత్రకళాధ్యయనం చేసిన సంస్కృత విద్యావేత్త –కలంబూర్ శివరామ మూర్తి (1909-1983)

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦  -3

54-భారతీయ శిల్ప చిత్రకళాధ్యయనం చేసిన సంస్కృత విద్యావేత్త –కలంబూర్ శివరామ మూర్తి (1909-1983)

భారతీయ మ్యూజియాలజిస్ట్ ,కళా చరిత్రకారుడు,చెన్నై గవర్నమెంట్ మ్యూజియం క్యురేటర్,గొప్ప స౦స్కృత విద్వాంసుడు  సి .శివరామ మూర్తి .అనేక మోనోగ్రాఫుల ,గైడ్ పుస్తకాల రచయిత . సౌత్ ఇండియన్ ఎపిగ్రఫీపై సాధికారికత ఉన్నవాడు .ఎకడమిక్ విద్యానంతరం చెన్నై ప్రభుత్వ మ్యూజియం క్యురేటర్ గా ఉద్యోగం లో చేరి ,తర్వాత భారత పురాతత్వ శాఖ లో కలకత్తా ఆర్కియలాజికల్ సెక్షన్ సూపరిన్టెన్డెంట్ అయ్యాడు .తఱువాత జాతీయ మ్యూజియం కీపర్ అయి ,చివరకు డైరెక్టర్ అయ్యాడు .ఇంటర్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియమ్స్ లో ఎక్సి క్యూటివ్ మెంబర్ అయి, చైర్మన్ గా సేవలు అందించాడు .అనేక విషయాలను శోధించి ,పరిశోధించి విలువైన పత్రాలు రచించి సమర్పించి ప్రచురించాడు .ప్రముఖ ఆర్కియాలజిస్ట్ జువాలజిస్ట్ ఫ్రెడరిక్ హెన్రి గ్రేవ్లి తోకలిసి 1938లో ఘనంగా ‘’యా౦టి క్విటీస్ అండ్ ఇండస్ట్రియల్’’ ప్రదర్శన నిర్వహించాడు .శివ రామ మూర్తి ఫ్రెంచ్ భాషలో రాసినఉత్తమ గ్రంధమైన  ‘’ఎల్  ఆర్ట్ ఇండే ‘’కు దాదాభాయ్ నౌరోజీ పురస్కారం లభించింది .ఇది జర్మని ,ఇటలి ,ఇంగ్లీష్ మొదలైన భాషలలో నూ ముద్రణ పొందింది .జవహర్లాల్ నెహ్రు మెమోరియల్ ఫండ్ ఏర్పరచినపుడు ట్రస్టీలు మొదటి సారిగా మూర్తి ప్రతిభా విశేషాలు గుర్తించి సత్కరించారు .

భారతీయ సాహిత్యం లో నటరాజ మూర్తి గురించి రెండేళ్ళు విస్తృతమైన పరిశోధనలు చేసి శివ రామ మూర్తి ‘’నటరాజ ఇన్ ఆర్ట్ ధాట్ అండ్ లిటరేచర్ ‘’అనే అపూర్వ గ్రంధం రచించాడు .తన తలిదండ్రులకు అంకితం చేసిన ఈ మహత్తర గ్రంధం ఆయన ప్రతిభా సర్వస్వం గా ఉంది .412పేజీలతో వెలువడిన ఈ ఉద్గ్రంధం నట రాజ విశ్వ నృత్య హేల ‘’శివ తాండవం ‘’ను ,దానికి కరణాలుగా సహకరించిన బ్రహ్మ ,విష్ణువులను  సమగ్ర సర్వ స్వరూప౦ గా  ఆవిష్కరించి చిరస్మరణీయం చేసింది . ఈ శివ తాండవ నృత్యానికి మూలాధారం వేదాలలో ఉన్నది .నటరాజ తత్త్వం భారతీయ సరిహద్దులు దాటి విశ్వ వ్యాప్త మైంది .దీనికి ముఖ్య కారకుడు శివరామ మూర్తి .ప్రముఖ చిత్రకారుడు,చరిత్రకారుడు  ఆనంద కుమారిల స్వామి కూడా నటరాజ విగ్రహం పై పరిశోధన చేసినట్లు మనకు తెలుసు .

శివ తాండవ నటరాజ మూర్తి చిదంబరం లో ఉన్నాడు .ఆ మూర్తి వైభవం వర్ణించటానికి ఆది శేషుడు కూడా చాలడు అంటారు .శివ తాండవం లో సత్యం శివం సుందరం సమ్మిళితమై ఉంటాయని స్పష్టం చేశారు .కాలానికి ,కాల రాహిత్యానికీ ఈ శిల్పం మనోహరమైన ఉదాహరణ .సంప్రదాయం ఆధునికతల మేళ వింపు ఉన్న మూర్తి .శివ రామ మూర్తి బక్కపలుచగా నుదుట విభూతి ,కుంకుమ బొట్టుతో ఉండి మహా మహోపాధ్యాయ అప్పయ దీక్షితుల వంశానికి చెందిన వాడని పిస్తాడు .ఆయన తండ్రి గొప్ప సంస్కృత విద్వాంసుడు ,సివిల్ ఆఫీసర్ ,;;సుందర రామాయణం ‘’రచించిన కలంబూర్ సుందర శాస్త్రి .

1983 లో శివరామ శాస్త్రీ నటరాజ స్వామి విభూతిపై ప్రసంగిస్తూ అకస్మాత్తుగా  గుండెపోటుతో 74 వ ఏట మరణించి నటరాజ సాన్నిధ్యాన్ని చేరుకొన్న ధన్య జీవి .మూర్తి గ్రేట్ బ్రిటన్ ,ఐర్లాండ్ దేశాల రాయల్ ఏషియాటిక్ సొసైటీల గౌరవ ఫెలోషిప్ పొందినవాడు .కంచి పరమాచార్యులు శ్రీశ్రీ చంద్ర శేఖరేంద్ర స్వామివారు   మూర్తిని సన్మానించి ‘’విచిత్ర చిత్త’’అనే సార్ధక బిరుదు ప్రదానం చేశారు .8 వ శతాబ్దపు పల్లవ రాజు మహేంద్ర వర్మకు ఈ ‘’విచిత్ర చిత్త’’బిరుదు ఉండేదని,కుడుమియామలై లోని మహేంద్ర వర్మ చెక్కించిన బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్త్యాత్మక శిల్ప విగ్రహం వద్ద శిలా శాసనం పై ఉన్నదట .ఎన్నో అవార్డులు రివార్డులు అందుకొన్న మూర్తికి 1975 లో భారత ప్రభుత్వం పద్మ భూషణ పురస్కారం అందజేసి సన్మానించింది .దేశ విదేశాలలో అనేక యూని వర్సిటీలకువెళ్లి గెస్ట్ లెక్చర్లు ఇచ్చాడు .దాదాపు 35గ్రంధాలు రచించాడు .మూర్తి మరణానంతరం బాంబే ఏషియాటిక్ సొసైటీ ‘’కాంప్ బెల్ మెమోరియల్ గోల్డ్ మెడల్ ‘’ను అందజేసింది .

శివరామ మూర్తి రచనా సర్వస్వం

  •  Mahabalipuram (1952)
  • Early Eastern Chalukya Sculpture (1962)
  • Indian Epigraphy and South Indian Scripts (1966)
  • Nataraja in Art, Thought, and Literature (1974)
  • L’Art en Inde (1977)
  • Chitrasutra of the Vishnudharmottara (1978)
  • Kalugumalai and Early Pandyan Rock-cut Shrines
  • Sanskrit Literature and Art: Mirrors of Indian Culture
  • La stupa du Barabudur (in French)
  • An Album of Indian Sculpture
  • Rishis in Indian art and literature
  • Royal conquests and cultural migrations in South India and the Deccan
  • Vijayanagara paintings
  • Numismatic parallels of Kalidasa
  • Sculpture inspired by Kalidasa
  • Sri Lakshmi in Indian art and thought
  • Ramo Vigrahavan dharmah-Rama embodiment of righteousness
  • Birds and animals in Indian sculpture
  • Sanskrit literature and art
  • Mirrors of Indian culture
  • Satarudriya – Vibhuti of Siva’s Iconography
  • Panorama of Jain art
  • Shiva
  • Ethical fragrance in Indian art and literature
  • Indian Painting
  • Approach to nature in Indian art and thought
  • The art of India
  • Expressive Quality of Literary flavour in Art
  • Early Andhra Arts and Iconography
  • Indian Bronze
  • The Chola temples: Thanjavur, Gangaikondacholapuram & Darasuram
  • Early eastern Chalukya sculpture
  • Harappan Art
  • Indian epigraphy and South Indian scripts
  • Bhagavatpada-Sri Sankaracharya
  • Epigraphical echoes of Kalidasa
  • 5000 years of the art of India: with Mario Bussagli
  • An Introduction to South Indian Temple Architecture and Sculptures, co-authored with F. H. Gravely
  • Illustrations of Indian Sculptures, co-authored with F. H. Gravely
  • Guide to the Archaeological Galleries, co-authored with F.H.Gravely
  • Notes on Hindu Images, co-authored with F. H. Gravel

Inline image 1

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-1-17 –కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కోపం లో’’జమదగ్ని ‘’ఆప్యాయతలో ‘’హృదయ దఘ్ని

కోపం లో’’జమదగ్ని ‘’ఆప్యాయతలో  ‘’హృదయ దఘ్ని  ‘’

img_20170129_130832

శ్రీ చెరుకు పల్లి జమదగ్ని శర్మ గారి గురించి వారి వైదుష్యాన్ని గూర్చి చిన్నప్పటి నుంచీ  వింటూనే ఉన్నాను .మా ఉయ్యూరు వాడూ మాకు మేనమామ వరుసా అయిన సూరి శ్రీరామ మూర్తి అనే ఆయన సినిమా డిస్ట్రి బ్యూషన్ లో  పని చేసేవాడు  .వాళ్ళ అమ్మ మంగమ్మగారు మాకు చాలా ఆత్మీయురాలు .ఆయన అన్న సోమయాజి గారు నూజి వీడు లో ఉండేవాడు .ఆయన ఆకారం తమాషా గా అని పించేది .ఎప్పుడూ అన్నదమ్ములిద్దరూ ముక్కు పొడుం పీల్చేవారు .ఆ సోదరుల అను బంధం అద్వితీయం .మంగమ్మ మామ్మ,కొడుకు శ్రీరామ మూర్తి మామయ్య ఉయ్యూరులో పుల్లేరు కాలువ దగ్గర స్వంత పెంకు టింట్లో ఉండేవారు .వీళ్ళ అమ్మాయి కమల మా చిన్నక్కయ్య దుర్గ క్లాస్ మేట్.ఈ కమలను మా రేపల్లె బాబాయి అంటే మా మామ్మ అక్క గారు మహాలక్షమ్మగారి గారి కొడుకు  రాయప్రోలు శివ రామ దీక్షితులు పెద్దకొడుకు సుబ్బులు అని మేము ఆప్యాయంగా పిలిచే సుబ్రహ్మణ్యం అన్నాయ్ కిచ్చి ఉయ్యూరు లోనే పెళ్లి చేశారు .సూరి శ్రీరామ మూర్తి బావ గారింటి పేరు చెరుకుపల్లి వారు .ఆయన నూజి వీడు కాలేజి లో లెక్చరర్ అని జ్ఞాపకం .ఆయన పేరు జ్ఞాపకం లేదు .నూజి వీడు సూరి వారి కి అక్కడ రామ మందిరం ఉండేది దాని నిర్వహణ అందులో పెద్దాయన సీతారామాంజ నేయులు గారు చూసేవాడు .ఆయన చిన్న తమ్ముడు రఘు రామ చంద్ర మూర్తి కి ఉయ్యూరు లో మా మేనమామ గుండు గంగాధర శాస్త్రి గారి పెద్దమ్మాయి రాజ్య లక్ష్మినిచ్చి పెళ్లి చేశారు .పెద్ద తమ్ముడు రామ చంద్రమూర్తి బెజవాడ ఎస్ ఆర్ ఆర్ కాలేజి లో హెడ్ గుమాస్తా తర్వాత ఏం యి వో .ఇదే కాక మా అమ్మ కు తల్లి తరపు అంటే మా అమ్మమ్మ తరపు చుట్టరికం కూడా ఉండేది .దీనితో తరచూ నూజి వీడు వెళ్ళే వాళ్ళం .అప్పుడే శ్రీ చెరుకు పల్లి జమదగ్ని శర్మగారిని ఒక సారి చూసిన జ్ఞాపకం .తరువాత కాస్త సాహిత్య జ్ఞానం ఒంట బట్టాక జమదగ్ని గారి కధలు కవితలు వ్యాసాలూ చదవటం వలన ఆయన సాహిత్యోపజ్న కొంత తెలిసింది .విశ్వనాధ వారి వీర భక్తులని గొప్ప ఆతిధ్యాన్ని ఇస్తారని ,మహా నిస్టాగరిస్టులని ఆయన కధలు జాతీయ స్థాయిలో ఉండేవని   బ్రహ్మశ్రీ మల్లంపల్లి శరభయ్య గారి రచనల వలనతెలిసింది .జనవరి 11 న విహంగ మహిళా వెబ్ పత్రిక వారు నాకు రాజమండ్రి శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం లో వైస్ చాన్సలర్ శ్రీ ఎస్ వి సత్యనారాయణ గారితోసన్మానం చేసిన తర్వాత శ్రీ శలాక రఘు నాద శర్మ గారిని దర్శించటానికి వెళ్లాం . శర్మ గారు వారి శ్రీమతి మా పట్లచూపిన ఆదరం మరువలేనిది .నాకూ  మానవడు చరణ్ కు శర్మ గారు శాలువాలు కప్పి ,మా శ్రీమతి ప్రభావతికి భార్యగారి చేత చీరే సారే పెట్టించి ఆ దంపతులు చూపిన బంధు ప్రేమ విలువ లేనిది  అప్పుడు మా మధ్య జరిగిన సంభాషణలో వారి స్వగ్రామం గొల్లపల్లీ నూజి వీడు బంధుత్వం ,జమదగ్ని శర్మగారు శర్మగారు తన మేనత్త  కొడుకు అని చెప్పటం  సూరి శ్రీరామ చంద్ర మూర్తిభార్య శర్మగారి శ్రీమతికి దగ్గర బంధువని అన్నీ తెలిశాయి .శర్మగారిని 2015 ఉగాదికి సరసభారతి తరఫున ఆహ్వానించి మా తలిదండ్రుల స్మారక పురస్కారం అందజేశాం .శర్మగారు తమ రచనలను నాకు ఆప్యాయం గా బహూకరించారు .అందులో ఫిబ్రవరి 11 న కృష్ణా జిల్లా శ్రీకాకుళం లో శాసన సభ ఉప సభా పతి మాన్యశ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారికి అంకిత మివ్వ బోయేశ్రీ కృష్ణ దేవ రాయల ఆముక్త మాల్యద కావ్యం ఆధారంగా రాసిన   ‘’యామున ప్రభు రాజనీతి ,’’అనే  పుస్తకమూ కల్ప వృక్ష వాగ్వైభావమూ మొదలైన విలువైన పుస్తకాలున్నాయి . రాజనీతి ,భారత వైశిష్త్యమూ చదివేశాను .ఇప్పుడు కల్ప వృక్షం పైకి చేరుతుంటే అందులో జమదగ్ని దంపతులకు   ఈ పుస్తకం అంకిత మిచ్చినట్లు ,ఆయన సాహిత్య ఆధ్యాత్మిక కీర్తి వైభవాన్ని కళ్ళకు కట్టేట్లు వర్ణించిన రఘునాధ శర్మగారి వ్యాసం    బాగా ఆకర్షించింది .అందులోని విషయాలు చాలామందికి తెలిసి ఉండక పోవచ్చుననే భావనతో మీ ముందు ఉంచుతున్నాను .ఈ రచనకు ఇంతటి నేపధ్యం ఉంది .

శ్రీ జమదగ్ని శర్మ గారిని రఘు నాద శర్మగారు ‘’మానస గురువు ‘’గా భావించారు .జమదగ్ని గారు జీవిత చరమాంకం శ్రీకాళ హస్తి లో గడిపుతూ అను నిత్యం శ్రీ కాళ హస్తీశ్వర సందర్శనం తో పులకించి పోయేవారట .అక్కడే భౌతిక దేహాన్ని ఒక యోగిలాగా వదిలేశారట .ప్రతి  ఏడాది మాఘ పౌర్ణమినాడు సువర్ణ ముఖీ నదీ స్నానం చేసి , శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఆలయానికి వేంచేసి విశిష్ట పూజలు అందుకొంటారు .’’అపర ధూర్జటి ‘’అయిన శ్రీ జమదగ్ని శర్మగారు ఆ పవిత్ర దినాన ఉదయం 10 గంటలకు స్వామి వారి సన్నిధిలో అతి సమీపాన కూర్చుని నిశ్చల మనసుతో శివ పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ,సుమారు మూడు గంటలు సాగిన శ్రీవారి విశిష్ట ఆరాధన మానసికంగా దర్శిస్తూ ,తరువాత బాహ్య ప్రపంచం లోకి వచ్చారట ,.వారి ముఖం లో ఏదో గ్లాని కనిపించి డాక్టరు ను పిలవ మంటారా అని అడిగితె వద్దు రిక్షా పిలవమని చెప్పి ,గూడు రిక్షాలో కూర్చుని ఇంటికి వెడుతూ ,దారిలోనే వెనక్కి వాలిపోయి  తుది శ్వాస విడిచారట  .అంటే శివ ధ్యాన పరాయణులై శివైక్యం చెందారన్నమాట ఆయన నోటి నుండి ఎక్కువగా ‘’శివోహం శివోహం ‘’అనే మాటలే విని పించేవట.ఎవరితో ఎప్పుడు ఏది మాట్లాడినా ‘’మంచిది ,మంచిది ‘’అనే ఊత పదం వాడేవారట .మంచి మనిషికి మంచి మరణం అన్నమాట .

జమదగ్ని గారు తెలుగు పాఠం బోధిస్తుంటే తరగతి గదులూ ,పరిసరాలూ ని౦ డిపోయేవట.క్రమ శిక్షణకు ఆయన అత్యంత ప్రాదాన్యమిచ్చేవారు .అతిక్రమిస్తే సహించేవారు కాదు .విద్యార్ధులపై చేయి కూడా చేసుకొనే స్థితి కూడా ఉండేదట .కానీ దేనికీ జంకే వారు కాదట. విద్యార్ధి లోకానికి జమదగ్ని అంటే హడల్ –ఆయన పాఠంఅంటే మహా ఆదరం .కాళిదాసు అన్నట్లు ‘’అధ్యష్యుడూ ,అభి గమ్యుడూ’’ఆయన అన్నారు శలాక వారు .

జమదగ్ని గారికి పద్య కవితలో  విశ్వనాధ సత్యనారాయణ గారు ,కధలలో మునిమాణిక్యం నరసింహా రావు గారు ,కావ్య విమర్శలో ఆచార్య భూపతి లక్ష్మీ నారాయణ గారు ,వేదాంత విద్యలో బ్రహ్మశ్రీ లంక నరసింహ శాస్త్రి గారు గురువులు .రాజ మండ్రిలో వేదాంత విద్య నేర్చుకోవటానికి జమదగ్ని గారు మడి కట్టుకొని ,ఉద్ధరిణ ,పంచ పాత్ర తీసుకొని గురువు గారింటికి వెళ్ళేవారట .విధి నిర్వహణలో అలసతచూపించలేదు ,అధికారులచేత మాట పడని వ్యక్తిత్వం ఆయనది .

సాహిత్యం లో లబ్ధ ప్రతిష్టులైన శ్రీ పాద సుబ్రహ్మణ్య శాస్త్రి ,మధునా పంతుల సత్యనారాయణ ,మల్లంపల్లి శరభయ్య ,బాలగంగాధర తిలక్ గార్లతో సాన్నిహిత్యం బాగా ఉండేది .శరభయ్య గారు రాజమహేంద్ర పురవాసి అయినా జమదగ్ని గారింట నే అనేక పర్యాయాలు భోజనం చేసేవారట .అంతటి ఆత్మీయత వారిది .మానాప్రగడ శేషసాయి ,చామర్తి కనక ప్రవాసి వంటి మహా వ్యక్తులు ‘’జమదగ్ని గారు మా గురువుగారు ‘’అని జబ్బ చరఛి  చెప్పుకొని గర్వ పడే వారట .తన విద్యార్దీ ,తనకంటే చిన్నవాడూ అయిన భమిడి పాటి సదా నంద ను జమదగ్ని గారు ఆదరించిన తీరు అపూర్వంన్నారు శలాక వారు .

తలిదండ్రుల వార్ధక్యం లో   జమదగ్ని గారు చేసిన సేవ ‘’న భూతో న భవిష్యతి ‘’అన్నట్లు ఉండేది .తండ్రిగారికి నిత్యం స్నానం చేయించటం ,సంధ్యావందనం చేయించటం ,ఎక్కువ గంటలు వారి వద్ద గడపటం ,వైద్యం విషయం లో యెంత ఖర్చు అయినా లెక్క చేయకపోవటం ,యెంత శ్రమ అయినా పడటం జమదగ్ని గారి ప్రత్యేకత .కళాశాల డ్యూటీ ముగించి ఇంటికి రాగానే తలిదండ్రుల వద్ద చేరి ఆప్యాయంగా సంభాషించి వారి మనసులకు హాయి కలిగించటం అందరినీ అబ్బుర పరచేది .అబ్బాయి ఎప్పుడు వస్తాడా అని ఆ తలి దండ్రుల ఎదురు చూపు అంతకంటే విశేషమైనది .అప్పటికి జమదగ్ని గారి వయసు 50దాటింది అయినా అ పుత్ర ప్రేమ మాతా పితర ఆరాధనా అలానే కోన సాగింది .తన పిల్లలు ,అన్నగారి పిల్లలే కాక ఎందరో విద్యార్ధులకు అన్న వస్త్రాలు కలిపించి చదువులు చెప్పించి ఉద్దరించారు .ఎవరినీ ఏనాడూ మందలించటం జరగలేదట .తన జీవిత విధానం తో వారిని సంస్కరించేవారట .ఆయన నిబద్ధత అది .జీవితాంతం దాన్ని కాపాడుకొన్నారు .

పింగళి లక్ష్మీ కాంతం గారు తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం లో తెలుగు శాఖ అధ్యక్షులుగా ఉన్నప్పుడు జమదగ్ని గారు స్నాత కోత్తర విద్యకు ప్రవేశం కోసం కలిసి అడిగారు .జమదగ్ని గారి గురించి కాంతం గారికి బాగా తెలుసు. ఆయనకు సీటు ఇవ్వటం ఇష్టం కూడా .కాని ఆనాటి రాజకీయ పరిస్థితులను బట్టి ‘’జమదగ్నీ!నువ్వు ఖద్దరు కట్టటం మానేస్తే సీటిస్తా నోయ్’’అన్నారు .అప్పటికి జమదగ్ని గారి వయసు 20 .’’మాస్టారూ !మేము ఖద్దరు కట్టటానికీ  ,స్వాతంత్రోద్యమానికీ ఏమీ సంబంధం లేదు .మాకు ఖద్దరు చాలా పవిత్రం .అయినా మీరు చెప్పారుకనుక ఈ రోజు నుంచి ఖద్దరు కట్టే విషయం లో మరింత శ్రద్ధాసక్తులు   చూపిస్తాను ‘’అని చెప్పి బయటికి వచ్చేశారట .పింగళి సీటు ఇవ్వలేదని చెప్పక్కర లేదు అనుకొంటా .నమ్మిన సిద్ధాంతం పట్ల ఆయన నిబద్ధత అలాంటిది .

జమదగ్ని గారు మాంచి భోజన ప్రియులు .తింటారు బాగా తినిపిస్తారు .ఆయన ఆతిధ్యాన్ని గురించి మెచ్చుకోని వారు ఉ౦డేవారుకాదు .అనంత పురం లో పని చేసినప్పుడు సి. రామ కృష్ణా రెడ్డి అనే  యువ తెలుగు లెక్చరర్ ఉండేవాడు .ఆయన పాఠం బాగా బోధించాలి అనే తపన ఉన్నవాడు .జమదగ్ని గారింటికి వచ్చి రోజూ చెప్పబోయే పాఠాన్ని క్షుణ్ణంగా చెప్పించుకోనేవాడు .జమదగ్ని గారి ఆప్త కోటి లోని వాడు. రెడ్డి గారు పాఠం చెప్పించు  కోవటానికి వస్తే ముందు కడుపునిండా కాఫీ ఫలహారాలు పెట్టి ,అప్పుడు   ఆయన పాఠం చెప్పేవారు .అదీ జమదగ్ని గారి ప్రత్యేకత .

జమదగ్ని గారి తండ్రి శ్రీ చెరుకు పల్లి బుచ్చిరామయ్యగారు శ్రీశ్రీ కళ్యాణానంద భారతీ మహా స్వాములవారి శిష్యులు .తమ విజ్ఞాన పరంపరను ‘’శ్రీ కల్యాణి ‘’అనే భగవద్గీతా వ్యాఖ్యానం లో నిక్షిప్తం చేశారు శ్రీ విద్య ఉపదేశం పొంది జేవితాంతం శ్రీ చక్రోపాసన చేసిన ధన్యులు .వారి శ్రీమతి లక్ష్మీ నరసమ్మగారు శలాక వారి ఆడబడుచు.మాతృత్వం మూర్తీభవించిన పుణ్య మూర్తి  .జమదగ్ని గారి ధర్మపత్ని శ్రీమతి శేషమణి ఉత్తమ గృహిణి .శ్రీ శలాక రఘునాధ శర్మగారిని జమదగ్నిదంపతులు  పుత్రునిలా ఆదరించి అభి వృద్ధి లోకి తెచ్చారని ఆ ద౦పతులను తమ దంపతులు ‘’హృదయ పీఠం లో భద్ర పీఠం ఏర్పరచిపూజించు కొంటామని  ,’’కల్ప వృక్ష వాగ్వైభవం’’ను అంకిత మిస్తూ ‘ అత్యంత వినయం ,భక్తీ ప్రపత్తులతో ‘’మానస గురు సమర్చన  ‘’ లో శ్రీ శలాకవారు నివేది౦చారు.

శ్రీ జమదగ్ని దంపతుల ఫోటో జత చేశాను -చూడండి

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-1 -17-కాంప్ –మల్లాపూర్ –హైదరాబాద్

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 53-హనుమాన్ చాలీసాకు ఇంగ్లీష్ అనువాదం వ్యాఖ్య రాసిన –నిత్యానంద మిశ్రా

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3

53-హనుమాన్ చాలీసాకు ఇంగ్లీష్ అనువాదం వ్యాఖ్య రాసిన   –నిత్యానంద మిశ్రా

ఉత్తర ప్రదేశ్ లో లక్నో కు చెందిననిత్యానంద మిశ్ర సైంటిస్ట్ కుటుంబం లో 24-8- 1982 న జన్మించాడు .తండ్రి జే. డి.మిశ్ర కేమిస్త్రి లో పి హెచ్ డి.జునా గడ్ లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ లో గ్రౌండ్నట్ రిసెర్చ్ డైరెక్టర్ .నిత్యానంద గుజరాత్ యూని వర్సిటి నుండిఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో  ఇంజినీరింగ్ డిగ్రీ పొందాడు .ప్రస్తుతం ముంబాయ్ సిటీ గ్రూప్ లో ఉన్నాడు .

  సంస్కృతం లో డిగ్రీ లేక పోయినా ఆ భాషను అనర్గళం గా మాట్లాడేవాడు .చాలాపుస్తకాలకు సంపాదకత్వం వహించాడు ఎన్నో పుస్తకాలను అనువదించాడు .స్వామి రామభద్రా చార్య శిష్యుడు .నిత్యానంద మిశ్రా హనుమాన్ చాలీసా పై విపుల వ్యాఖ్యానం’’మహావీరీ   ‘’ ఇంగ్లీష్ లో రాసి ప్రసిద్ధి పొందాడు తెచ్చాడు .తులసీదాసు చాలీసాకు ఇంగ్లీష్ లో దీనికి మించినది లేదని ప్రపంచవ్యాప్తం గా భావిస్తారు .ప్రతిపదానికి అర్ధం భావం తాత్పర్యం విశేష వివరణ ,స్వర లిపి ,నోటేషన్లుతో మహాద్భుతం అని పిస్తుంది .

 నిత్యానంద మిశ్ర సంస్కృతం లో ‘’ప్రజ్ఞా చక్షు రామ భద్రా చర్య ‘’మరియు ‘’మహేశ్వర సూత్రేషు రామకధ’’,’’సంభాషణా సందేశ్ ‘’రాశాడు .

  ఇంగ్లీష్ లో ‘’ఆల్గారిదమ్స్ ఇన్ ఎమెర్జింగ్ ఏసియన్ మార్కెట్ ,’’ఆధ్యాత్మ రామాయణం లో పాణినీయం ,గోస్వామి నారాయణ దాస అండ్ రామ భద్రాచార్య ,రామభాద్రాచార్య రచించిన శ్రీ భార్గవ రాఘవీయం ‘’కు సంపాదకత్వం వహించి ముద్రించాడు .మిశ్రా ప్రస్తుతం ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకింగ్ ఇండస్ట్రికి స్టాటిస్టికల్ అనలిస్టు గా పని చేస్తున్నాడు .ఈతని తల్లి బయో కెమిస్ట్రీలో ఎం ఎస్ సి .చేసి కేంద్రీయ విద్యాలయం లో లెక్చరర్ .పెద్దక్క గాంధీ నగర్ ప్లాస్మా రిసెర్చ్ఇన్ స్టి ట్యూట్ లో సైంటిస్ట్ .

Inline image 1

                 సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-1-17 –ఉయ్యూరు

 

 

    .

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 51-మహా భారత౦పై విపుల వ్యాఖ్య రాసిన –అర్జున మిశ్ర

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3

51-మహా భారత౦పై విపుల  వ్యాఖ్య రాసిన –అర్జున మిశ్ర

మహా భారతం పై తిరుగు లేని వ్యాఖ్య రాసిన అర్జున మిశ్రా 15 వ శతాబ్ది సంస్కృత మహా విద్వాంసుడు .గోవర్ధన పాథక్ కు సమకాలికుడు .బెంగాల్ లోని  వరేంద్ర చంపాహేత్తియగ్రామం లో జన్మించాడు .బెంగాల్ ను గణేష్ రాజ్య వంశం పాలిస్తున్న కల్లోల పరిస్థితులలో అంటే 1450 -1500 కాలంనాటి వాడు   అన్నమాట .ఆయన మహా భారతం పై 1534 లో రాసిన వ్యాఖ్యాన వ్రాతప్రతి ఇప్పటికీ ఉన్నది .మిశ్రా  వ్యాఖ్యానం ను17 వ శతాబ్దం లో మహా భారతం పై మహా గొప్ప వ్యాఖ్యానం రచించిన వారణాసి మహా పండితుడైన నీలకంఠ విస్తృతంగా ఉదాహరించాడు .ఇంతకంటే అర్జున మిశ్రా వివరాలు మనకు తెలియటం లేదు .

52-మహాభారతానికి  అద్వైత వ్యాఖ్యాన౦ రాసిన  –నీల కంఠ చతుర్ధర

17 వ శతాబ్ది ఉత్తరార్ధం లో వారణాసి లో నివసించిన సంస్కృత మహా పండితుడు నీల కంఠ చతుర్ధర .ఈయన జీవిత విశేషాలూ మనకు దొరకకపోవటం మన దురదృష్టం .గోదావరీ తీరం పై నివసించిన మహారాష్ట్ర సంస్కృత విద్వాంసుడు ఈయన .ఇక్కడ నుంచి వారణాసి చేరి వేద వేదా౦గ ,మీమాంస ,శ్రౌత,యోగ  శైవ ,తర్క ,అద్వైత వేదాంత శాస్త్రాలను గొప్ప గొప్ప విద్వాంసుల వద్ద అధ్యయనం చేసి పారమెరిగాడు .అప్పుడు వారణాసి మహా విద్వాంసుల కు నిలయంగా సరస్వతీ దేవి కొలువు కూటంగా భాసించేది..తన గురువులు లోకమాన్య ,లక్ష్మీ నారాయణ,నారాయణ తీర్ధ అని తానే చెప్పుకున్నాడు .నీలకంఠుని అద్వైత రచనలు వ్యాఖ్యానాలు మధుసూదన సరస్వతి ,నృసి౦హాశ్రమ ,అప్పయ్య దీక్షితులవంటి మహా మహోపాధ్యాయులను ప్రభావితం చేశాయి .

   మహా భారతం పై ‘’భారత భావదీప ‘’అనే ఉద్గ్రంధం అనితర సాధ్యంగా ,పరమ ప్రామాణికంగా నీల కంఠ రచించాడు .అద్వైత వేదాంత భూమికగా రచించిన ఈ వ్యాఖ్యానాన్ని మించినది ఇంతవరకు లేదు అని పించు కొన్నది .ఇప్పటికీ దానినే అందరూ ఉదాహరిస్తూ సందేహాలు తీర్చుకొంటూ ,భారత ఆమ్నాయం లోని అనర్ఘ  రత్న మాణిక్యాలను  దర్శిస్తూ ఆ వెలుగులలో జీవితం ధన్యం చేసుకొంటున్నారు .

  ఈ వ్యాఖ్యానాన్ని మొదటిసారిగా కేసరీమోహన్ గంగూలీ  ఇంగ్లీష్ లోకి అనువదించి ప్రపంచ దృష్టికి తెచ్చాడు. దాని అనుభవం వర్ణనాతీతం . మహా భారతానికి మహా వ్యాఖ్యానం నీల కంఠ దీక్షితుని ‘’భారత భావ దీప౦  ‘’నిజంగానే వెలుగులు చిమ్మింది .

   సశేషం

       మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -27-1-17 –ఉయ్యూరు

 

    .

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఎందుకో అనుకొంటి గోంగూరకీ –‘’అందుకే ‘’అనుకొంటి గోంగూరకీ

ఎందుకో అనుకొంటి గోంగూరకీ –‘’అందుకే ‘’అనుకొంటి  గోంగూరకీ

జల్లికట్టు సమర్ధనంటే గొంగూరకీ –జనం మీద ప్రేమనుకొంటి గోంగూరకి

హోదా తో ముడిపెట్టుతుంటే  గొంగూరకీ –‘’అందుకే’’ అనుకొంటి గొంగూరకీ .

రాజభవనాలున్నవి ఎందుకంటె గొంగూరకీ –రంజకం గా పాలించటాని కనుకోంటి  గొంగూరకీ

రాసలీల కేంద్రమని తెలిసి గొంగూరకీ- ప్రజలలెట్లా సహి౦చేరు గొంగూరకీ 

గ్గ్లోబర్ నొటోరియల్ పోస్టు కోరేది  గొంగూరకీ  -‘’అందుకే ‘’నను కొంటి గొంగూరకీ .

పరా మర్శించటాని కొస్తే గోంగూరకీ-ప్రజలపై ప్రేమనుకొంటి గొంగూరకీ 

కావులింపు ముద్దు లేంటి గొంగూరకీ –‘’అందుకే ‘’అను కొంటి గోంగూరకీ .

వర్గ౦  మీద ప్రేమనుకొంటి గోంగూరకీ –తరిమి నిప్పుపెట్టట మేంటి  గోంగూరకీ

అసలు సమస్య నొదిలి పెట్టి గోంగూరకీ –చీటికీ మాటికాగ్రహ మేంటి గొంగూరకీ-

 పదవి లేకుంటేను మరి గోంగూరకీ -కుదురు గా కూర్చో నివ్వదు గో౦గూరకీ –

అంతా సవ్యంగ ఉంటె గో౦గూరకీ—కుంటిసాకు వెదికి గోంగూరకి

హల్ చల్ చేస్తారు  గోంగూరకీ- ‘’అందుకే ‘’ననుకొంటి గోంగూరకీ .

ఐదు రాష్ట్రాల ఎన్నికలూ గోంగూరకీ –అసలు సమస్య తేల్చలేదు గొంగూరకీ

రద్దు నోట్ల మాయ యేమో గొంగూరకీ –ఓటరోడి నాడి తెల్వదు గోంగూరకీ

జతలు కట్టి  దూకుతుంటే గోంగూరకీ—‘’అందుకే ‘’అనుకొంటి గోంగూరకీ .

‘’ముఖ్య మంత్రినే చేస్తార అరెస్ట్  గోంగూరకీ-అని గగ్గోలు పెట్టె నిన్న గోంగూరకీ

పగటి కలలబేహారి గోంగూరకీ-సంయమనం నేర్పెదెవ్వరు గోంగూరకీ

-కామెర్ల మాయ ఏమో గోంగూరకీ – అప్పుడే సీట్లో కూకున్నభ్రమ గో౦గూరకీ  

ఉచ్చ నీచాలొదిలి  వదురుతుంటేను గొంగూరకీ –‘’అందుకే ‘’అను కొంటి గోంగూరకీ .

అబ్బా అని పించాల్సిన సినీమాలు గోంగూరకీ-‘’గబ్బు ‘’కొట్టి కుదేలైతే గోంగూరకీ

 సమస్య నేదో కెలికి  గోంగూరకీ-భారీ డైలాగులతోను గోంగూరకీ

ప్రజా  ఉద్యమమంటూ గోంగూరకీ-పరి గెత్తుకోస్తుంటే గో౦గూరకీ

ఇదేమి నాయకులంటూ గోంగూరకీ-కుదేలై పోతుంటే జనం గోంగూరకీ

అసలు రంగు బయట పడితే గోంగూరకీ-‘’అందుకే ‘’అను కొంటి గోంగూరకీ

పనేమీ లేదా నీకు గోంగూరకీ- ఈ దురద పాముడేంది గోంగూరకీ

అని నన్ను నిలదీస్తే గోంగూరకీ-‘’అందుకే ‘’అనుకో౦డి మీరు గోంగూరకీ.

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-1-17 –ఉయ్యూరు

 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

చిలిపి’’ వరద ‘’

చిలిపి’’ వరద ‘’

శ్రీ అబ్బూరి వరద రాజేశ్వర రావు చిన్నతనం విశాఖ పట్నం లో గడిచింది .అప్పుడు ఆయన తండ్రి శ్రీ అబ్బూరి రామకృష్ణా రావు గారు ఆంధ్రా యూని వర్సిటిలో లైబ్రేరియన్ గా ఉండేవారు. ఆయనవల్లనే శ్రీ శ్రీ ,ఆరుద్రలు పాశ్చాత్య సాహిత్యపు పోకడలను గ్రహించారు .పుస్తకాలిచ్చి వారితో చదివి౦చేవారాయన .వరద బాల్యం విశాఖ లో రావి శాస్త్రి తో ‘’యేరా అంటే యేరా ‘’అను కొనే చిలిపి  స్నేహంగా గడిచింది .ఆచిలిపి చేష్టలను   రావి శాస్త్రి ‘’వరద స్మృతి’’లో ‘’అబ్బూరి నా ఆది గురువు ‘’వ్యాసం లో వివరంగా రాశాడు అందులోని కొన్ని ముఖ్య విషయాలు .

‘’అబ్బూరి వరద  ఆది గురువు ,నాచివరి గురువు కూడా ‘’అన్నాడు రావిశాస్త్రి .కొద్ది రోజులకు చనిపోతాడనగా వరద రావి కి ఫోన్ చేసి ‘’ఒరే శాస్త్రీ !బతికున్న వాళ్ళకంటే చచ్చిపోయిన వాళ్ళే అదృష్ట వంతులురా .కనుక నువ్వు ఏం దుఖించకు –విచారించకు ‘’అని చెప్పాడు .

19 32 లో విశాఖ ఏ వి యెన్ కాలేజీ లో శాస్త్రి సెకండ్ ఫాం ఒక సారి ఫెయిల్ అయి మళ్ళీ చదువుతుండగా అప్పుడొక ఎర్రటి కుర్రాడు స్పోటకపుమచ్చలతో వచ్చి చేరాడు .ఎక్కడినుంచి వచ్చావని శాస్త్రి అడిగితె ‘’బెజవాడ నుంచీ ‘’అని బెజవాడ విశాఖ కంటే గోప్పదనట్లు పోజిచ్చి చెప్పాడు .’’ఆడే వరద’’. .’’దేవుడు లేడు.నీకు తెలుసా ?’’అడిగాడు కుర్ర వరద కుర్ర శాస్త్రిని .ఆమాటకుతల్లీ తండ్రీ లేనివాడిలాగా  బెదిరిపోయాడు శాస్త్రి.అప్పుడు ప్రహ్లాదుని గురించి రహస్యంగా ఒక కద రాస్తున్నాడు శాస్త్రి .వరద మాటలకు భయపడి ఆ కద చి౦చేశాడు  ‘’దేవుడు ఉంటె మా చెల్లి ఎందుకు చచ్చిపోవాలి ?’’అన్నాడు బుడ్డి వరద .దీనిపై తానొక  ఒక గేయం రాశానని మర్నాడు తెచ్చి చూపించాడు బాలవరద .వరద రెండవ భాషగా  తెలుగు  తీసుకోవటం వలన ఏ డివిజన్ లో ,రావి సంస్కృతం తీసుకోవటం వలన బి డివిజన్ లో ఉన్నారు .ధర్డ్ ఫారానికి ఇద్దరూ బి డివిజన్ లో ఉన్నారు .

ఒకసారి తెలుగు మాస్టారు వరదను కొట్టాడు .అతని అన్న వాణీకుమార్ కు పిచ్చకోపం వచ్చి మేస్టార్ని ‘’మా తమ్ముడిని ఎందుకు కొట్టావు బయటికి రా చంపేస్తాను ‘’అన్నాడు .ఫోర్త్ ఫారం లో వక్తృత్వ పోటీల్లో వరద ఎక్కువగా పాల్గొనేవాడు .కన్యకాపరమేశ్వరి దేవాలయం పూజారి స్థానాపతి సత్యనారాయణ మూర్తి వద్ద వరద సంస్కృతం నేర్చాడు .సత్యనారాయణగారి భార్య రుక్మిణమ్మ దేవీ భాగవతం ను సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించి విదుషీమణి .

ఆరుద్ర పినతండ్రి భాగవతుల నారాయణ రావు సైకిల్ కు మున్సిపాలిటీ పన్ను ఏడాదికి రెండుమ్ముప్పావలా కట్టక పొతే సైకిల్ లాక్కెళ్ళారు. ఆయన వరదకు మంచి దోస్త్ .అందుకని వరద స్నేహితులందరి దగ్గరా అణా బేడా ఎంత ఇస్తే అంత వసూలు చేసి పన్నుకట్టి సైకిల్ విడిపించి ఇప్పించాడు .ఆ రోజుల్లో రూపాయకు 8 సేర్ల బియ్యం వచ్చేవిట .సైకిల్ పన్నుకు 22 సేర్ల బియ్యం వచ్చేవని రావి రాశాడు .దీనితో నారాయణ రావు అందరికీ  బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాదట .అంత డబ్బు ఆ రోజుల్లో పోగు చేయటం చాలెంజ్ .దాన్ని చేసి చూపించినవాడు వరద .మేస్టర్లకు వరద ప్రియ శిష్యుడు

శాస్త్రికీ వరదకూ లెక్కలు రావు  ఫిఫ్త్ ఫాం ఫైనల్ పరీక్షల్లో లక్ష్మణరావు అనే లేక్కలమేస్టారు నాలుగైదు లెక్కలు చెప్పేశాడు .శాస్త్రి కనిపెట్టి దణ్ణం పెట్టి’’ షేక్స్ పియర్ మొహం ‘’పెడితే అతనికీ చెప్పి ఇద్దరూపాస్ అయేట్లు చేశాడు .ఎస్ ఎస్ ఎల్ సి కి వచ్చేసరికి వరద వరదలా విజ్రు౦భించాడు .అప్పుడు జస్టిస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కి ఎన్నికలు జరిగితే వరద బాచ్ కాంగ్రెస్ కు సపోర్ట్ చేసింది .జస్టిస్ పార్టీమీద రోజుకొక బులెటిన్ రాసి వదిలేవాడు వరద .ఎవరికీ తెలిసేదికాదు .జయపురం రాజా విక్రమ దేవ వర్మ ఏ పార్టీనీ సపోర్ట్ చేయలేదు .వరద కు కోపం వరదలా వచ్చి ఆయన పై ‘’తొండం అప్పారావు ‘’అనే పేరు పెట్టి పెద్ద గేయం రాశాడు .అది అప్పట్లో పెద్ద పాప్యులర్ అయింది .బొబ్బిలి రాజా రామబ్రహ్మం అనే ఆయన్ను కాదని జస్టిస్ పార్టీ టికెట్టు అంకితం భానోజీ రావు ను సపోర్ట్ చేయమని ఆర్డర్ వేశాడు .దీనికీ మండింది వరదకి .

ఆ రోజుల్లో ‘’గోంగూర పాట’’అందరి నోట్లోనూ నానేది –అది –‘’నాను ఎల్లకెల్లకేల్లినాను గొంగూరకీ –తోటలన్నీ తిప్పినాడు గొంగూరకీ –దొడ్లన్ని తిప్పినాడు గొంగూరకీ –మాయ దారి నా కొడుకే గొంగూరకీ –చివరికి మంచమెక్కమన్నాడే గొంగూరకీ ‘’అనేది బాహా హిట్ సాంగ్ .అబ్బూరి వరద ఈ బాణీలో రామ బ్రహ్మం మీద పాటతో విరుచుకు పడ్డాడు –

‘’మేడలని కట్టావు రామ బ్రహ్మం –మిద్దేల్ని కట్టావు రామ బ్రహ్మం –స్టాండ్ స్టాండ్ అన్నావు రామబ్రహ్మం –స్టాండేను అన్నావు రామబ్రహ్మం –కానీ రాజా గారొచ్చారు రామబ్రహ్మం –సిట్టు సిట్టాన్నారు రామ బ్రహ్మం –సిట్టేను అన్నావు రామబ్రహ్మం –‘’ఈ పాట పిల్ల గాంగ్ అందరికీ నేర్పి రామబ్రహ్మం ఇంటి ఎదురుగా కూచుని పాడించేవాడు వరద .అప్పుడు తెన్నేటి విశ్వనాధం కాంగ్రెస్ కాండి డేట్ అంటే జస్టిస్ పార్టీకి వ్యతిరేకం కనుక భానోజీకీ వ్యతిరేకమే.పాట చివర్లో ‘’విశ్వనాధంకి  జై –రామ బ్రహ్మంకి తుస్ ‘’అని పించేవాడు .పాటపాడి గాంగ్ వెళ్ళిపోయేది రోజూ .వైశ్యులు కాంగ్రెస్ సపోర్ట్

వాళ్ళు ఒక పాట తయారు చేస్తే వరద బృందం వరద లీడర్షిప్  లో డాన్స్ చేస్తూ దాన్ని పాడేవాళ్ళు .-ఆపాట

‘’తెన్నేటి విశ్వ నాధమూ మన కాంగ్రేసు వారండీ –వారికి మన వోటు నిచ్చి ఖ్యాతి నిలపండి ‘’  .ఈ పాటను కోమట్లు వాళ్ళ ఆడవాళ్ళు చూడాలని వాళ్ళ ఇళ్ళముందు పాడించేవారు .ఇది గ్రహించి వరద శాస్త్రి తో ‘’ఒరేయ్ 1 వాళ్ళ కులం వాళ్ళు చూడాలని మన చేత గంతులేయి స్తున్నారు ‘’అని చెప్పి ఆతర్వాత ముఖ్య కేంద్రాలలోనే పాడి డాన్స్ చేశారు

తోటి  స్నేహితులందరూ ఒకరినొకరు ఒరేయ్ అనే పిల్చుకోనేవారు .అలా పిలవని వాళ్ళను వెలేసేవారు .ఇంటర్ ముందువరకు ఇలా నే సాగింది  పాత ముఠా అంతా మారి కొత్తజనం చేరారు ఏవండీ అని పిలవటం అప్పుడు గౌరవం .అది వరదకు నచ్చలేదు .అలా పిలిస్తే ‘’జెల్ల ‘’కొట్టే వారు .కనుక ఈ బాధ భరించలేక అందరూ ఒరేయ్ లోకి దిగారు .దీనితో వరద ‘’ఒరేయ్ ఒరేయ్ క్లబ్ ‘’ను ఏర్పాటు చేశాడు .ఇంటర్ లో ఒఏయ్ క్లబ్ ను ‘’యువజన సంఘం ‘’గా మార్చాడు .కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేసిన వారిని ఇంకా విడుదల చేయకపోతే విడుదల చేయాలని పెద్ద యాజిటే షన్ తెచ్చాడు  వరద .ఇంటర్ లో స్టూడెంట్ యూనియన్ కార్య వర్గ సభ్యుడయ్యాడు. శాస్త్రినీ ఎలెక్ట్ చేయించాడు ..భమిడిపాటి కామేశ్వర రావు మాస్టారు రాసిన నాటకాల్లో తానూ వేషం వేసి రావి శాస్త్రి చేతా స్టేజి ఎక్కించాడు .1938 లో జపాన్ –చైనాపై అప్రకటిత యుద్ధం మొదలు పెట్టింది .అప్పట్లో మార్కెట్ అంతా జపాను సరుకులతో నిండిపోయేది .ఏ వస్తువైనా బేడా అర్ధణా .కాంగ్రెస్ వాళ్ళే వీటిని అమ్మేవారు .వరద షాపుల ముందు పికెటింగ్ నిర్వహించి ‘’డౌన్ విత్ ది సర్వీసెస్ ఆఫ్ జపాన్ గూడ్స్ ‘’అని నినాదాలు చేయించి ఆపించే ప్రయత్నం చేశాడు .రెండవ ప్రపంచ యుద్ధం లో ఎం యెన్ రాయ్ అనుచరులయ్యారు అబ్బూరి తండ్రీ కొడుకులూ .కమ్యూనిస్ట్ లు తటస్థం .కాని వరద హిట్లర్ కు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య దేశాలకు సపోర్ట్ చేయాలన్న రాయ్ వాదం తో ఏకీభవించి సపోర్ట్ చేసి స్టూడెంట్ బలగాన్నీ సపోర్ట్ కు సన్నద్ధం చేశాడు .చిలిపి పనులలోనూ వరద కు ఒక ధ్యేయం ఆదర్శం దేశ భక్తీ ఉండేవి .అతన్నే అందరూ అనుసరించేవారు’’. దటీజ్ వరద’’.

గణతంత్ర దినోత్సవ శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -26-1-17 –ఉయ్యూరు



గబ్బిట దుర్గా ప్రసాద్                                

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

హాస్యపు’’ వరద ‘’

హాస్యపు’’ వరద ‘’

మా శ్రీ మైనేని గోపాలకృష్ణగారు (అమెరికా )నాకు ఆప్యాయంగా అబ్బూరి వరద రాజేశ్వర రావు గారి స్మృతిగ్రంధం ‘’వరద స్మృతి ని ‘’27-10-16 న పంపారు .ఆనాడే చదవటం మొదలు పెట్టాను కానీ వరుసగా చదవటం కుదరక అప్పుడప్పుడు చదువుతూ ఈ మధ్య పది రోజులు నుంచి రాత్రిళ్ళు ఎక్కువ సమయం కేటాయిస్తూ ఈ రోజు అంటే 25-1-17 కు అంటే సుమారు మూడు నెలలకు పూర్తి చేయగలిగాను .అందులో చాలా చాలా గొప్ప విషయాలు సాహిత్యం ,జర్నలిజం ,రాజకీయం పై ఉన్నాయి .ఆ విషయాలు ఈ కాలపు చాలా మందికి తెలియదని పించింది . ఇది నా అజ్ఞానం కావచ్చు .అందుకని అందులో కొన్ని విషయాలు కొన్ని ఆర్టికల్స్ గా రాయాలని అనుకొన్నాను .అందులో మొదటి సారిగా వరదలోని హాస్య ప్రియత్వాన్ని ఆయనభార్య శ్రీమతి అబ్బూరి చాయాదేవి తెలియ జెప్పిన  ,అందులోనూ ఆయన రిపబ్లిక్ డే పై  చెణికిన హాస్యపు తునకతో పాటు ‘’హాస్యపు ‘’వరద ‘’గా పారిస్తున్నాను . .

1-ఢిల్లీ లో రిపబ్లిక్ డే పెరేడ్ చూడటానికి అంత చలిలోనూ జనం వేలం వెర్రిగా వెళ్లి పేవ్ మెంట్ల మీద పడిగాపులు పడుతూ చూడటాన్ని ‘’ఇది వెర్రిపబ్లిక్ డే’’అన్నాడు వరద .

2-పుస్తకాల ఆవిష్కరణ  ను’’ఆవిష్కర్మ ‘’అని జోకాడు .

3-ఢిల్లీ లో వరద ఇల్లు మెయిన్ రోడ్డు పై ఉండటం తో వాహనాల రొద ఎక్కువగా ఉండేది. దాన్ని ‘’శబ్ద రత్నాకరం ‘’అన్నాడు ముద్దుగా .

4-‘’ఉదయం –సపరివార పత్రిక ‘’లో బాపు భాగవత చిత్రాలు కొన్ని వారాలపాటు వచ్చేవి .వాటిని చాయా దేవిగారు ఒక గుడ్డ మీద పొడుగ్గా వరుసగా అంటించి జాగ్రత్త చేసేవారు .చిత్రాలు ఒక దానిపై ఒకటి వచ్చేట్లు జాగ్రత్తగా మడతలు పెట్టి రిబ్బను తో  కట్టేవారు  .ఎవరికైనా చూపించాల్సి వచ్చినప్పుడు దాన్ని విప్పి పరిస్తే కృష్ణలీలలన్నీవరుసగా పరుచుకొని కనిపించేవి .దాన్ని వరద ‘’దేవుడి గోచి ‘’అని చమత్కరించేవాడు .

5-చాయా దేవిగారి అన్న కూతురు వారింటికి వచ్చింది .బయటనుంచి ఇంట్లో ప్రవేశిస్తున్న వరదకు ఆమె మాటలు వినిపింఛి  ‘’ఇంట్లో ఏదో’’ నీసు’’ వాసన వస్తోందే ‘’అన్నాడు .ఆ ఇద్దరూ వాసన చూసి మాకేమీ వాసన అనిపించటం లేదే అన్నారు అమాయకం గా .ఆయన నవ్వుతూ ఆ పిల్లతో ‘’నువ్వు’’ నీసు ‘’(niece ) వి కదే నువ్వు వస్తే నీసు వాసన వెయ్యదూ ?అందుకే నీసు వాసన అన్నానన్నాడు  .పగలబడి నవ్వుకున్నారు .

6-మేనకోడలు నృత్య ప్రదర్శన సావనీర్ ప్రచురణ ఆలస్యమైంది. ఆమె రోజూ గూటిస్తోంది ఎప్పుడేప్పుడని .విసిగిన వరద ‘’వీళ్ళు నన్ను సావనీరు బతకనీరు ‘’అన్నాడు .

7-ఏ గృహిణి అయినా చారు రుచిగా చేస్తే ‘’చారు శీల’’అవుతు౦దనేవాడు .

8-దూర దర్శన్ నేషనల్ నెట్ వర్క్ లో ‘’అప్నా ఉత్సవ్ ‘’చూస్తున్నరోజుల్లో ఎవరైనా బాత్ రూమ్ కు వెడితే ‘’అప్ నా’’ఉచ్చ’’వ్ కి వెళ్ళాడని చమత్కరించేవాడు .

9-పెళ్లి అయిన కొత్తలో జబ్బు చేసి బాగా చిక్కిపోయిన భార్య  చాయాదేవిని ‘సతీ డొక్కూ బాయ్ ‘’అని హేళన చేసేవాడు

10-. తిరుపతి వెంకన్న ‘’లార్డ్ వెంకటేశ్వర ‘’కాదు ‘’లడ్డూ వెంకటేశ్వర ‘’అనేవాడు .

11-ఇంటికి నేం ప్లేట్ తయారు చేయమని ఒకాయనకు ఆర్డర్ ఇస్తే అక్షరాలను సన్నగా పొడుగ్గా ఏదో రకంగా పూర్తీ చేసి తెచ్చాడు .ఆ అక్షరాలను చూసి ‘’ఇవి మామిడి పూడి వెంకట రంగయ్య గారి ‘’లా ఉన్నాయని గురువుగారైనా సంకోచం లేకుండా అనేశాడు .

12-కలర్ ప్రింటింగ్ వచ్చిన కొత్తలో రంగులు ముట్టుకొంటే అంటుకొనేట్లు’’ గాడీ ‘’గా చవుక బారుగా ఉండేవి .దీన్ని వరద ‘’పేపర్లు ముట్టుకొంటే ‘’కలరా ‘’ అంటుకొనేట్లుంది ‘’అన్నాడు .

13-దోమలకు ‘’ఓడో-మాస్ ‘’రాసుకోమని సలహా ఇస్తే ‘’ఓ దోమాస్ ‘’అని పిలుస్తుంటే కుట్టకుండా ఉంటాయా ?’’అన్నాడు

14-మార్క్సిస్ట్ లు ‘’దాస్ కాపిటల్ ‘’నుచీటికీ మాటికీ ఉదహరిస్తుంటే ‘’వీళ్ళు ‘’కేపిటల్’’ దాసులు ‘’ అని వ్యంగ్యబాణాలు సంది౦ చేవాడు వరద .

15-ఎప్పుడూ ఎవరో ఒకర్ని తిట్టేవాడిని ‘’పద్మ దూషణ్ ‘’అనేవాడు .

16-చాయా దేవి ఒక బొమ్మగీసి ‘’ఏమండీ’’ అగ్లీ ‘’గా ఉందా ?’’అని అడిగితే ‘’  అగ్లీగా ఉన్నవాళ్ళు మాత్రం లోకం లో లేరుటే! “’అని పరోక్షంగా ఆమెనే అన్నాడు .

17 –ఎప్పటికప్పుడు కొత్త చేతి కర్రలు కొనటం వరద సరదా .’’అప్పుడే కర్ర పట్టుకోన్నారేమిటి ?’’అని ఎవరో అడిగితే’’కట్టెలే మనకు చుట్టాలు కదా ‘’అని నగ్న సత్యాన్ని నర్మ గర్భంగా అన్నారు .

18-వరద చనిపోవటానికి సుమారు నెల ముందు ముఖ్యమంత్రి శ్రీ కోట్ల విజయ భాస్కర రెడ్డి వరద ను అధికార భాషా సంఘ అధ్యక్షుని చేశారు .ఒక మిత్రుడు అభినది౦చటానికి వస్తే అప్పటికే 70 వ పడిలో ఉన్న వరద ‘’ఈ వయసులో రంభనిస్తే ఏం చేసుకోను? అని చమత్కరించాడు .మరో మిత్రుడితో ఈ విషయాన్నే ‘’పాత చింతకాయ పచ్చడి జబ్బు పడ్డ వాళ్ళకే ఇస్తారు ‘’అన్నాడు .

19-తల్లి అంటే వల్లమాలిన ఆరాధన వరదకు .ఆమె ముసలితనం లో చీటికీ మాటికీ ‘’వంట్లో బాగుండలేదు డాక్టర్ని పిలవరా ‘’అని అని చెబితే ‘’పైన దేవుడు పిలుస్తుంటే మళ్ళీ ఈ డాక్ట రెందుకే బాబూ’’అంటూనే కారేసుకొని డాక్టర్ కోసం పరిగెత్తే వాడు .

20-‘’వైద్యో నారాయణో హరిః’’   అంటే –వైద్యుడు వచ్చి ‘’నారాయణా’’ అంటే ,రోగి ‘’హరీ ‘’అంటాడు అని తమాషా అర్ధం చెప్పాడు వరద .

రిపబ్లిక్ డే శుభాకాంక్షలతో

Inline image 1

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -25-1-17 –ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మీ సాహితీ సేవ నిరుపమానం

శ్రీ” పూర్ణ ”సుబ్బారావు”గార్లకునమస్తే –28 వ విజయవాడ పుస్తక మహోత్సవం లో రచయితల పుస్తకాల ప్రదర్శన ,అమ్మకాలకు ఒక స్టాల్ ను ఏర్పరచి రచయితల తరఫున అమ్మకాలకు బాధ్యత వహించి ,ఆ 11 రోజులూ కస్టపడి అమ్మకాలు చేబట్టి ,పాఠకులకు ,రచయితలకు సమ న్యాయం చేసి బహుశా దేశం లోనే మొదటి సారిగా ఆదర్శ వంతమైన ప్రణాలికను విజయవంతంగా అమలు చేసిన మీ ఇద్దరి సౌజన్యం మరువ లేనిది .

  మా సరస భారతి తరఫున 10 రకాల పుస్తకాలను మీరు ప్రదర్శనలో ఉంచి ,అమ్మగా వచ్చిన మా కు రావాల్సిన డబ్బు 17 20 రూపాయలను ఆంధ్రా బాంక్ చెక్ గాను ,మిగిలిన పుస్తకాలను మా కార్యదర్శి శ్రీమతి మాది రాజు శివలక్ష్మి ద్వారా అంద  జేసినందుకు ధన్యవాదాలు .  నాకు శ్రమ ఇవ్వకుండా శివ లక్ష్మి పుస్తకాలను ఉయ్యూరు నుండి ,మీకు చేర్చటం మిగిలినవి తానే  మళ్ళీ  అప్పగించటం లో ఆమె ,ఆమె భర్తగారి పాత్రా గణనీయం ..
   .ఇంతవరకు మేము అందరికి అన్ని  పుస్తకాలు ఉచితంగానే అందజేశాము . సరసభారతి మొట్ట మొదటి సారిగా పుస్తకాల ”అమ్మకం రుచి” ఇప్పుడే చూసింది .
  అలాగే” బుకుత్సవం ”లోరచయితలను ఆహ్వానించి ,ఖర్చులు  భరించి    ముఖా -ముఖి నిర్వహించి ,పారితోషికమూ అందించి ప్రోత్సహించించి ,దీనిలోనూ  దేశం లోనే మొట్ట మొదటి సారిగా అందరికి ఆదర్శ ప్రాయమయినందుకు , నిర్వహణ కమిటీ తోపాటు మిమ్మల్నీ అభినందిస్తున్నాను -దుర్గా ప్రసాద్ -సరసభారతి -ఉయ్యూరు
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 49-తత్వ చింతామణి ప్రతిభ కర్త –సచ్చిదానంద మిశ్ర (1971 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

49-తత్వ చింతామణి ప్రతిభ కర్త –సచ్చిదానంద మిశ్ర (1971 )

1-3-1971 న ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి లోబస్తీ గ్రామం లో  జన్మించిన వారణాసి సంస్కృత మహా విద్వాంసుడు సచ్చిదానంద మిశ్ర .ఆయన మాతృవిద్యాలయం సంపూర్ణానంద సంస్కృత విశ్వ విద్యాలయం .బెనారస్ హిందూ యూనివర్సిటిలో ఫిలాసఫీ, రెలిజియన్ ప్రొఫెసర్గా పని చేశాడు . .ఆయన సంస్కృత భాషా సేవను గుర్తించి ఆయనకు 2009 లో రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్ ‘’మహర్షి బాదరాయణ వ్యాస పురస్కారం ‘’ప్రదానం చేశారు .సంస్కృత వ్యాకరణం భారతీయ ఫిలాసఫీలపై గొప్ప అధ్యయనం చేసి గ్రంధాలు రచించాడు .అందులో ముఖ్యమైనవి ‘’తత్వ చింతామణి ప్రతిభ ‘’,మానసోల్లాసం – మానసోల్లాస వార్ధినిఅనే ఆనంద కుమార వ్యాఖ్యతో,ఆపదేవ వ్యాఖ్యతో సదానందుని వేదాంత సార ,న్యాయ దర్శన్ మే అనుమాన ,వ్యుత్పత్తి వాద హిందీలో విపుల వ్యాఖ్యతో రచించాడు

Inline image 2

50-సంస్కృతం –మానవ భాషా పరిణామం పై పరిశోధించిన –సంపదానందమిశ్ర (1971 ). 

ఒరిస్సాకు చెంది ,పాండిచ్చేరి సంస్కృత విద్వాంసుడైన సంపదానంద మిశ్రా 17-11-1971 న జన్మించాడు .కుటుంబం సంస్కృత విద్యలో పునీతమైంది .ఉత్కల్ యూని వర్సిటి నుండి సంస్కృతం లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పొంది ,పాండి చేరి యూని వర్సిటిలో డా వెంపటి కుటుంబ శాస్త్రి వద్ద సంస్కృతం లో ఎంఫిల్ చేసి ,స్వర్ణ పతకం అందుకున్నాడు .’’సంస్కృతం –మానవ భాషా పరిణామం ‘’పై ధీసిస్ రాసి ఉత్కల్ యూని వర్సిటి నుండి పి .హెచ్. డి.పొందాడు. పాండిచేరిలో అరవిందో సొసైటీ ఆధ్వర్యం లో నిర్వహింప బడుతున్న ‘’అరబిందో ఫౌండేషన్ ఫర్ ఇండియన్ కల్చర్ ‘’కు ప్రస్తుతం డైరెక్టర్ గా ఉన్నాడు .

  విద్యార్ధి ,అధ్యాపక బృందాలకు సంస్కృతం మంత్రం ,యోగ ,భగవద్గీత లపై నిత్యమూ మిశ్రా  వర్క్ షాపులు ,ట్రెయినింగ్ ప్రోగ్రాములు ,పునశ్చరణ తరగతులు నిర్వహిస్తూ ఉంటాడు .సంస్కృత, ఇంగ్లీష్, ఒడియా భాషలో పత్రికలకు వ్యాసాలూ  కవితలు పాటలూ రాస్తూ ఉంటాడు .సంగీతం కూరుస్తాడు .అరవింద సొసైటీ నిర్వహించే 24 గంటల సంస్కృత రేడియో ప్రోగ్రాం తోపాటు ,అనేక సంస్కృత ప్రాజెక్ట్ లను సమర్ధంగా మమేకమై నిర్వహిస్తాడు .

  మిశ్రా రాసినవి , సంపాదకత్వం లో వచ్చినవీ పుస్తకాలు –సాంస్క్రిట్ అండ్ ఇవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ స్పీచ్ ,ఏ బుక్ ఆఫ్ హిమ్స్ అండ్ ప్రేయర్స్,ది సెంచరి ఆఫ్ లైఫ్ ఆఫ్ శ్రీ అరబిందో విత్ ది ఒరిజినల్ వెర్సెస్ ఆఫ్ భర్త్రు హరి ,అరబిందో అండ్ సాంస్క్రిట్ ,ది వండర్ దట్ ఈజ్ సాంస్క్రిట్ ,హాస్య రంజని ,ఎ హాండ్ బుక్ ఆఫ్ సాంస్క్రిట్ ప్రోసడి.

  వందేమాతరం ట్రస్ట్ కు మిశ్రా ముగ్గురు సభ్యులలో ఒకడు .500  మత,మతాతీత సంస్కృత గ్రంధాలను అనువాదాలతో సహా ప్రచురించటం ఈ సంస్థ లక్ష్యం .మూర్తి క్లాసికల్ లైబ్రరి ఆఫ్ ఇండియా కు దీటుగా ,అంతకంటే నాణ్యంగా ,సాధికారికంగా ,సాంస్కృతిక నేపధ్యం తో భారతీయ ఆత్మ ప్రతిబి౦బి౦చేట్లుసంస్కృత గ్రంధ ముద్రణ  తేట సరళ అనువాదాలతో ప్రచురించటమే ‘’వందేమాతరం ట్రస్ట్ ‘’ముఖ్య ఉద్దేశ్యం  అని మిశ్రా వినమ్రంగా ప్రకటించాడు .ఈ బృహత్ ప్రచురణ లో రామాయణ భాగవత భారతాలు వేదాలు ఉపనిషత్తులూ ఉండటం మనమందరం గర్వించదగిన విషయం .

 2012 లో సంపదానంద  మిశ్ర సంస్కృత సేవా ధర్మానికి భారత రాష్ట్ర పతి శ్రీమతి ప్రతిభా పాటిల్ నుండి ‘’మహర్షి బాదరాయణ వ్యాస పురస్కారం’’ అందుకున్నాడు .సంస్కృత వ్యాకరణ అధ్యయన, అధ్యాపనం లో మిశ్రా జీవితం చరితార్ధక మౌతోంది .

Inline image 1

  మూడవ గీర్వాణం అర్ధ శతం (50 )అయిన సందర్భంగా శుభాకాంక్షలతో

   సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-1-17- ఉయ్యూరు

    .

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బాటసారి రచించిన మనసుపుస్తకం సిరీస్ లో మొదటి నిజ జీవిత నవలిక “ఊగిసలాడకే మనసా” మరియు రవీణ

బాటసారి రచించిన మనసుపుస్తకం సిరీస్ లో మొదటి నిజ జీవిత నవలిక “ఊగిసలాడకే మనసా” మరియు రవీణ 

చవాన్ రచించిన స్ఫూర్తి కవితా సంపుటి “స్వజయ సారధి” పుస్తకావిష్కరణ మహోత్సవం

తెలంగాణా రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జనవరి 20 సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్ లో బాటసారి రచించిన నిజ జీవిత నవలిక “ఊగిసలాడకె మనసా” మరియు పూణే వాస్తవ్యులు రవీణ చవాన్ రచించిన స్ఫూర్తి కవితా సంపుటి “స్వజయ సారథి” పుస్తకాల ఆవిష్కరణ తెలంగాణా భాషా సాంస్కృతిక సంచాలకులు మామిడి హరికృష్ణ గారి చేతుల మీదుగా ఘనంగా జరిగింది. సభాధ్యక్షులుగా ప్రముఖ కవి, సాహితీ విమర్శకులు నాళేశ్వరం శంకరం గారు వ్యవహరించగా, తెలుగురథం సాహితీ సంస్థ వ్యవస్థాపకులు  కొంపెల్ల శర్మ గారు స్వాగత పలుకులు, వందన సమర్పణలతో సభను  నిర్వహించారు.

ప్రగతి స్కూల్ చిన్నారులు అక్షర, సింధూర, వైష్ణవి మరియు మాయ గణపతి వందన సమర్పణ మరియు కూచిపూడి నృత్యంతో సభ కన్నులపండువుగా మొదలయ్యింది.

అనంతరం బాటసారి మరియు రవీణలు రచించిన వారి పుస్తకావిష్కరణ ముఖ్య అతిథిగా విచ్చేసిన మామిడి హరికృష్ణ చేతుల మీదుగా జరిగింది. బాటసారి రచించిన ‘ఊగిసలాడకె మనసా’ తొలి ప్రతిని శ్రీమతి రవీణ చవాన్ స్వీకరించగా, రవీనా చవాన్ రచించిన ‘స్వజయ సారథి’ వారి NRI తల్లిదండ్రులు శ్రీమతి లక్ష్మి తులసి మరియు శ్రీ సత్యనారాయణ స్వీకరించారు.

అనంతరం  మామిడి హరికృష్ణ మాట్లాడుతూ- సమాజానికి సందేశాన్నిచ్చే రచనలు రావాలని అన్నారు. దైనందిన జీవితంలో అందరికి ఎదురయ్యే అనుభవాలను సులువుగా అర్ధమయ్యేలా బాటసారి రచన ఉందన్నారు. చైతన్య పరిచే సూక్తులతో స్ఫూర్తిని రగిలించే కవితా సంపుటి ‘స్వజయ సారథి’ విశేషం అన్నారు.

అనంతరం విశిష్ట అతిథులైన అనంతపూర్ నుండి విచ్చేసిన ప్రముఖ కవి రాధేయ ఉమ్మిడిశెట్టి మాట్లాడుతూ- ఇవాళ వర్తమాన కవిత్వంలో వస్తున్న అస్తిత్వ వేదనలుగాని, ప్రాంతీయ రోదనలు గానీ ఎక్కడా ప్రతిధ్వనించవు. మానవతావాదం, సామాజిక చైతన్యం ప్రధాన భూమికగా మనతో స్వజాయ సారథి సంభాషిస్తుంది  అని అన్నారు. నెల్లూరు నుండి వచ్చిన అంతర్జాతీయ కవి శ్రీ పెరుగు రామకృష్ణ ఇరువురు రచయితలను, వారి రచనలను పొగిడారు.

ప్రముఖ రచయిత్రి శ్రీమతి స్వాతీ శ్రీపాద మాట్లాడుతూ ఇలాంటి సభల్లో యాభై శాతం మహిళలు కూడా ఉంటే బావుంటుందన్నారు.  స్వజయ సారథి పుస్తకాన్ని పరిచయం చేస్తూ ఆ సంపుటిలో ఒక కవితను తీసుకొని కవిత ఎలా చదవాలి అని ప్రేక్షకులకి తెలియజేసి ఆకట్టుకున్నారు.

వంద సినిమాలకు పైగా మాటలు అందించిన ప్రముఖ తెలుగు సినీ రచయితా దివాకరబాబు మాడభూషి మాట్లాడుతూ భమిడిపాటి వారు సినీరంగప్రవేశానికి గేట్లు తెరిచారని, ఇప్పుడు ఈ భమిడిపాటి వాడైనా బాటసారిని తానూ ప్రోత్సహిస్తున్నానని చెప్పారు.

ప్రముఖ కవయిత్రి శ్రీమతి మిరేజ్ ఫాతిమా మాట్లాడుతూ బాటసారి రచన ఆడవారి మనసుని అర్ధం చేసుకొని రాసే రచనలని, ఈరోజుల్లో అలా ఎవరూ రాయడం లేదని, ప్రముఖ రచయిత, బాటసారి తన గురువుగా భావంచే చలం గారి ఫోటో ఎక్కడ చూసినా బాటసారి గుర్తొస్తాడని, మరో మైదానంలా తన రచన ఉంటుందని బాటసారి రచనలని కొనియాడారు.

ప్రముఖ రచయిత, కవి  RVSS గారు ఊగిసలాడకె మనసా నవలికను ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఒక ప్రత్యేకమైన ఇతివృత్తాన్ని తీసుకుని నవలీకరించడంలో బాటసారి కృతకృత్యులైనారని, చేయి తిరిగిన రచయితలా కథనాన్ని నడిపించారని నవలలో ప్రతి పంక్తి చెపుతుందని అన్నారు. సన్నివేశాలన్నింటిని సహజంగా ఉండేలా రాయాలంటే ఎంతో కష్టమైన పని. స్త్రీ పాత్రలో పరకాయప్రవేశం చేసి మనోభావాలను చెప్పిన తీరు నిజంగా అద్భుతమనిపించింది అని కొనియాడారు. మౌనశ్రీ విశిష్ట అతిథిగా విచ్చేసిన సినీ గేయ రచయిత మౌనశ్రీ మల్లిక్ తన స్పందనను పాట ద్వారా పాడి వినిపించి ప్రేక్షకుల కరతాళ ధ్వనులను స్వీకరించారు.

కొంపెల్ల శర్మ మాట్లాడుతూ మనసు కి విలువలుండాలని, విలువల వలువలు లేని జీవితం వ్యర్థమని అన్నారు. వారు ప్రత్యేకంగా ఇద్దరు రచయితలని సన్మానించారు.

పిసిపాటి ప్రసాద్ గారు మాట్లాడుతూ నాళేశ్వరం శంకరం గారు సూరత్ సాహిత్యోత్సవంలో చెప్పినట్టుగా గ్రంథాలయానికి పుస్తకాలను రాష్ట్రేతర తెలుగు సమాఖ్యకు ఇవ్వవలసినదిగా కోరగా, ఆ గ్రంథాలయానికి ఉట్టికోట ఆళ్వారుస్వామి పేరుతో రాష్ట్రాల్లో గ్రంథాలయాన్ని మొదలు పెట్టవలసినదిగా కోరారు. వివిధ రాష్ట్రాల్లో కవులు రచయితలూ, కళాకారులు మరియు ఏ భాషలోకైనా తర్జుమా చెయ్యగల రచయితలను కూడా రాష్ట్రేతర తెలుగు సమాఖ్య కో ఆర్డినేటర్ అయినా రవీనా చవాన్ వద్ద పేర్లు నమోదు చేసుకోవాలని పిసిపట్టి ప్రసాద్ గారు కోరారు.

అనంతరం ఈ పుస్తకావిష్కరణకు గుజరాత్ నుండి వచ్చిన రాష్ట్రేతర తెలుగు సమాఖ్య చైర్మన్ పిసిపాటి ప్రసాద్ గారిని, ముంబై నుండి వచ్చిన ‘మాజ మహారాష్ట్ర తెలుగు మంచ్  ప్రధాన కార్యదర్శి అశోక్ కంటే గారిని మామిడి హరికృష్ణ సన్మానించారు. రచయితలు మామిడి హరికృష్ణ గారిని నాళేశ్వరం శంకరం గారిని సన్మానించగా విశిష్ట అతిథులని, ఆత్మీయ అతిథులైన డా. అశోక్ బాబు, మురళీధర్ అడ్ల మరియు  విజయ్ కుమార్లను, సీనియర్ జర్నలిస్ట్ GVLN మూర్తి, వాట్సాప్ గ్రూప్ కవిసమ్మేళనం వ్యవస్థాపకులు  మేకా రవీంద్ర గారిని కూడా మామిడి హరికృష్ణ సన్మానించారు. డా. అశోక్ బాబు, మేక రవీంద్ర, శ్రీమతి ఇందిరా, శ్రీ RVSS శ్రీనివాస్, మధుసూదన్ మరియు తాళపత్ర గ్రంథ పరిశోధకుడు కావూరి శ్రీనివాస్ ఆశీస్సులతో రచయితలిద్దరిని సన్మానించారు. రచయితలకు అభిమానులైన ముఖపుస్తక స్నేహితులు, ఆత్మీయులు తమ ఇష్టమైన రచయితలను సన్మానించుకొని అభినందనలు తెలియజేసారు. పసందైన విందు భోజనం రచయితలు ఏర్పాటు చేయగా పుస్తకావిష్కరణ సభ ఒక పండుగ వాతావరణాన్ని సంతరించుకుని ఆత్మీయుల నడుమ సంతోషంగా ఘనంగా ముగిసింది… @ మీ తెలుగువేదిక

*********************************

పుస్తకాలు కావాల్సిన వారు, డిస్ట్రిబ్యూటర్స్, పుస్తక విక్రేతలు సంప్రదించాల్సిన వివరాలు:

Email: teluguvedika.net

Phone number: 9922 927 527

“ఊగిసలాడకే మనసా” : వెల: 50 రూపాయలు

“స్వజయ సారథి” : వెల: 75 రూపాయలు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3- 48-లాల్ బహదూర్ శాస్త్రి సంస్కృత విద్యాపీఠ సంస్థాపకుడు –మండన మిశ్ర (1929 -2001)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3-

48-లాల్ బహదూర్ శాస్త్రి సంస్కృత విద్యాపీఠ సంస్థాపకుడు –మండన మిశ్ర (1929 -2001)  

మండన మిశ్ర అంటే ఆది శంకరాచార్యుల శిష్యుడు కాదు ఆధునిక భారతం లో  సంస్కృతానికి విశేష వ్యాప్తి తచ్చిన రాజస్థాన్ సంస్కృత మహా విద్వాంసుడు .7-6-1929 న రాజస్థాన్ లో జయపూర్ కు 50కి .మీ దూరం లో ఉన్న అనూతియా అనే చిన్న గ్రామం లో జన్మింఛి ,తన సంస్కృత భాషా సేవా వ్యాప్తితో దాన్ని ప్రపంచ ప్రసిద్ధం చేసిన మహనీయుడు.తండ్రి హిందూ పండితుడు .తల్లి సామాన్య గృహిణి . ఏడుగురు సంతానం లో మిశ్రాపెద్దవాడు .శ్రీమతి భారతి మిశ్ర ను వివాహమాడి,ఒక కుమార్తె ముగ్గురు కుమారులకు తండ్రి అయ్యాడు కుమార్తె ఈ  మధ్యనే చనిపోయింది .పెద్దకుమారుడు భాస్కర మిశ్ర  లాల్ బహదూర్ శాస్త్రి సంస్కృత విశ్వ విద్యాలయం లో సంస్కృత ప్రొఫెసర్ .

  ప్రాధమిక విద్య స్వగ్రామం లో చదివి ,ఉన్నత విద్య పట్టాభి రామశాస్త్రి  అనే గొప్ప విద్వాంసుని వద్ద అమర్సార్ లోనేర్చాడు .ఈ గురు శిష్య సంబంధం ఆదర్శమై ప్రాపంచ వ్యాప్తి ప్రసిద్ధి చెందింది .సంస్కృత భాషా వ్యాప్తికి అంకిత భావం తో   విశేష సేవ,కృషి  చేసిన ఏకైక వైస్ చాన్సలర్ గా దాదాపు అందరు భారత ప్రధానమంత్రులు ,రాష్ట్రపతులు మిశ్రాను గుర్తించి  అభినందించి ,అమిత గౌరవం చూపారు .మండన మిశ్ర నేతృత్వం లో ఒక బృందం అమెరికాకు వెళ్లి అక్కడ సంస్కృత విద్యావ్యాప్తికి బీజారోపణచేసి ,ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందింది .

  జైపూర్ లోని మహా రాజా సంస్కృత  కాలేజి లో లెక్చరర్ గా జీవితం ప్రారంభించిన మిశ్రా ,సంస్కృత ప్రొఫెసర్ అయ్యాడు .పండిత మదనమోహనా మాలవ్యా స్థాపించిన సంస్కృత అసోసియేషన్ కు అనుబంధంగా ఏర్పడిన ‘’అఖిలభారత సంస్కృత సాహిత్య సంస్థ ‘’కు డా మండన మిశ్ర 1956 లో మంత్రిగా ,1959 లో మినిస్టర్ –ఇన్ చీఫ్ గా ఎన్నుకోబడ్డాడు .అప్పుడే అఖిలభారతీయ సంస్కృత సాహిత్య సంస్థకు సరైన దీటైన నాయకుడు అవసరమయ్యాడు .తన శక్తి యుక్తులు ధారపోసి ,సంస్థ శాఖలను అన్ని రాష్ట్రాలలో ఏర్పాటు చేసి వ్యాప్తి చేశాడు .శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి మండన మిశ్ర లోని అకు౦ఠిత దీక్షను గుర్తించి  ,రాజస్థాన్ ప్రభుత్వం నుంచి ఆయన సేవలను తీసుకొని శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి సంస్కృత విద్యా పీఠం కు శాశ్వత డైరెక్టర్ ను చేశాడు .

  మిశ్రా ఆలోచనలతో ‘’ప్రపంచ సంస్కృతశతాబ్ది ఉత్సవాలు ‘’రూపు దిద్దుకొని ,భారతదేశం లో సంస్కృతానికి ఒక కొత్త యుగాన్ని సాధించాడు .ఇది ఫలవంతమై ,మిశ్రా చొరవ కృషి వలన 1961 లో కలకత్తా లోచారిత్రాత్మకంగా ‘’అఖిల భారతీయ సంస్కృత సాహిత్య సంస్థ ‘’ఏర్పడి భారత ప్రధమ రాష్ట్రపతి డా .రాజేంద్ర ప్రసాద్ అమృత హస్తాలమీదుగాప్రారంభోత్సవం జరుప బడింది .ఈ సభ దిగ్విజయంగా జరిగి ఢిల్లీ లో ‘’సంస్కృత విద్యా పీఠం ‘’ఏర్పాటు కు మరొక చారిత్రాత్మ తీర్మానం చేయబడింది.డా రాజేంద్ర ప్రసాద్ గారి పూనిక, సలహా ,అత్యున్నత విద్యావేత్తలైన పంజాబ్ గవర్నర్ శ్రీ నరహరి విష్ణు ,భారత ప్రభుత్వ హోం శాఖ స్టేట్ మినిస్టర్ శ్రీ బలవంత నాగేష్ దత్తా ,ప్రముఖ పారిశ్రామిక వేత్త శ్రీ శాంతి ప్రసాద్ మొదలైనవారు రాజస్థాన్ ప్రభుత్వం తో సంప్రదించి డా మండన మిశ్రా సేవలను ఢిల్లీ లో స్థాపించే సంస్కృత విద్యా పీఠానికి అవసరమని నొక్కి చెప్పి ఒప్పించి ,1962 లో ఢిల్లీ సంస్కృత విద్యా పీఠాన్ని మిశ్రా ఆధ్వర్యం ఏర్పాటు చేశారు .

   ఆ కాలం లో సంస్కృత విద్యా బోధనకు నిధులు పెద్దగా ఉండేవికావు .కేంద్ర ప్రభుత్వం సంస్కృత విద్యా సంస్థల కు ఏడాదికి కేవలం ఒక వెయ్యి రూపాయలు మాత్రమే అందజేసేది .అది ఏమూలకూ చాలేది కాదని గ్రహించిడా మిశ్రా,ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి ప్రభుత్వాన్ని ఒప్పించి 95శాత౦ ఆర్ధిక సహాయాన్ని అన్ని సంస్కృత విద్యా సంస్థలకు అందజేసేట్లు కృషి చేసి సంస్థలకు ఆర్ధిక పరి పుష్టి కలిగించాడు .దీని ఫలితం గా ఇప్పుడు ఆ సంస్థలకు లక్షలాది కేంద్ర ప్రభుత్వ నిధులు సమకూరుతున్నాయి .దేశం లోని అన్ని సంస్కృత సంస్థలను ఆర్ధికంగా బలోపేతం చేసి సంస్కృత విద్యా వ్యాప్తికి డా మిశ్రా చేసిన అనితర సాధ్య కృషి ఇది .

   అదృష్ట వశాత్తు ఆనాటి ప్రధాన మంత్రి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి  అఖిల భారతీయ  సంస్కృత సాహిత్య సంస్థకు చైర్మన్ గా ఉండటానికి అంగీకరింఛి డా మిశ్రా నుమినిస్టర్ –ఇన్ –చీఫ్ గా ఎన్నిక చేశారు .రాజస్థాన్ ప్రభుత్వం అనుమతి సుదీర్ఘ సంస్కృత సేవ దేశం లోని విద్యావేత్తలందరి సహకారం వలన ముఖ్యంగా ప్రధాని శాస్త్రి గారి ప్రేరణ వలన ఈ బాధ్యతను స్వీకరించి మిశ్రా సమర్ధంగా  అంకిత భావం తో జీవితకాలమంతా పని చేసి  గొప్ప విజయాలు సాధించి దేశమంతటా సంస్కృత విద్యా వ్యాప్తికి ఎనలేని కృషి చేసి అందరి మెప్పూ పొందాడు . లాల్ బహదూర్  ఆకస్మిక మరణం తో ప్రధాని అయిన ఇందిరాగాంధీ ,డా సంపూర్ణానంద్ సలహాతో డా .మిశ్రా ఈ  సంస్థపేరును శాస్త్రి గారి గౌరవార్ధం ’’ లాల్ బహదూర్ శాస్త్రి సంస్కృత విద్యా పీఠం ‘’గా మార్చి భారత ప్రభుత్వానికి అప్పగించాడు .ఈ సంస్థకు సంస్థాపక డైరెక్టర్ గా మిశ్రా ఉండిపోయాడు .మిశ్రా అవిశ్రాంత కృషి, దీక్షా, దక్షత వలన ఈసంస్థ 1989  లో డీమ్డ్ యూని వర్సిటి అయింది .23-6-1989న భారత ప్రభుత్వం డా మిశ్రా ను డీమ్డ్ యూని వర్సిటి మొట్టమొదటి వైస్ చాన్సలర్ పదవిలో నియమించి గౌరవించింది . అయిదేళ్ళుమొదటి వైస్ చాన్సలర్  పని చేసి మిశ్రా  1994 లో రిటైర్ అయ్యాడు ..ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం మిశ్రా అమోఘ వ్యక్తిత్వానికి తగినట్లు 1-1-1996 న  వారణాసిలోని  డా.సంపూర్ణానంద్ సంస్కృత యూని వర్సిటి వైస్ చాన్సలర్ పదవి నిచ్చి గౌరవించింది.ఇక్కడ పని చేసిన మూడేళ్ళ కాలం ఆ విశ్వ విద్యాలయానికి స్వర్ణ యుగమే అయింది .అన్ని పరీక్షలను  నిర్దుష్ట కాలం లో నిర్వహించటం,తరగతులను క్రమం తప్పకుండా జరపటం, 115 గ్రంధాలను ప్రచురించటం,సరస్వతి దేవి ఆలయాన్ని నిర్మించటం ,మహా వైభవోపేతంగా దానిని ప్రారంభించటం ,ఇద్దరు రాష్ట్ర పతులు డా.శ్రీ శంకర దయాళ్ శర్మ ,శ్రీ కె ఆర్ .నారాయణన్ లను ముఖ్య అతిధులుగా ఆహ్వానించి , రెండు  ప్రముఖ సభలను పెద్ద ఎత్తున నిర్వహించటం,  డా మురళీ మనోహర్ జోషీ పాల్గొనటం ఆవిశ్వ విద్యాలయ చరిత్రలో చిరస్మరణీయ ఘట్టాలుగా నిలిచి పోయేట్లు చేసి, డా మిశ్రా  చైతన్య స్పూర్తికి దర్పణంగానిలిచాయి .   

  డా.మిశ్రా వారణాసి లో’’ శ్రీ పట్టాభిరామ శాస్త్రి వేద మీమాంస రిసెర్చ్ సెంటర్ ‘’నుతన గురువు ,ప్రముఖ సంస్కృత మీమా౦సాచార్య శ్రీ పట్టాభిరామాచార్య గౌరవార్ధం  అధునాతన వసతి సౌకర్యాలతో నూతనంగా నిర్మించిన భవనం లో స్థాపించి అందరి ప్రశంసలను అందుకొన్నాడు . ఈ సెంటర్ కు డా .మిశ్రానుఫౌండర్ చైర్మన్ గా  శ్రీ కంచి శంకరాచార్య నియమించి గౌరవించారు.20 00 సంవత్సరం లో కేంద్ర ప్రభుత్వం డా.మిశ్రా కు  పద్మశ్రీ పురస్కారాన్ని అందజేసి సత్కరించింది  .  డా.మిశ్రా రాజస్థాన్ సంస్కృత విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ గా పని చేస్తూ 15-11-2001 న 72 వ ఏట మరణించాడు  .కేంద్ర ప్రభుత్వం కనీసం పద్మ విభూషణ్ అయినా అందజేసి ఉంటె ఆయన సేవలకు తగిన గౌరవం ఇచ్చినట్లుగా ఉండేది .

Inline image 1

  సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-1-17 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 46-మను స్మృతికి మహా భాష్యం రాసిన –మేదాతిధి(క్రీ .శ.1000)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

46-మను స్మృతికి మహా భాష్యం రాసిన –మేదాతిధి(క్రీ .శ.1000)

 మనువు రాసిన మను స్మృతి అనే న్యాయ శిక్షా శాస్త్రానికి మహా భాష్యం రాసిన తొలి రచయిత మేదాతిది .మనుధర్మ శాస్త్రం గా ప్రాచుర్యం పొందిన ఆ బృహద్గ్రంధ సారాన్ని లోకానికి మేదాతిది భాష్యం రాసి మహోపకారం చేశాడు .మేదాతిది ఎక్కడి వాడు ఏ ప్రాంతం లో భాష్యం రాశాడు అనేది చర్చ నీయా౦శ౦ గా ఉన్నది . కాశ్మీరు కు చెందినవాడు అని అందరూ భావిస్తుంటే కాదు దక్షిణ భారత దేశానికి చెందినవాడు అన్నాడు జూలియస్ జాలీ .గార్గ్ బూలర్ చెప్పగా మహా పండితుడు కాణే అంగీకరించింది మేదాతిది కాశ్మీర్ వాడని ,కాదంటే కనీసం ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వాడు అని .రాబర్ట్ లి౦గాత్ ఈ వాదాలు అనవసరమని మేధా తిది కాశ్మీర్ దేశ కవి అని నిశ్చితాభిప్రాయంగా చెప్పాడు .మేదాతిది తన వ్యాఖ్యానం లో తన ముందు రాసిన వ్యాఖ్యాన కర్తల పేర్లను పేర్కొన్నాడు అని కాణే పండితుడు చెప్పాడు .యాజ్ఞవల్క్య స్మ్రుతి వ్యాఖ్యానమైన ‘’మితాక్షర ‘’. లో ఉన్నదానిప్రకారం మేదాతిది మను స్మ్రుతి వ్యాఖ్యానాన్ని క్రీ.శ.820 -1050మధ్యకాలం లో రాసి ఉంటాడని నిర్ధారించవచ్చు  .లింగాత్ మాత్రం మేధాతిధి ది  9- 10 శతాబ్దం కాలం అన్నాడు .డేవిడ్ బ్రిక్ తన 2010వ సంవత్సర’’ సతీ సహగమనం ‘’ సమీక్షలో మేధాతిధి జీవితకాలం క్రీ శ.1000అని తేల్చాడు .ఇంతకంటే ఆయన గురించి మనకు తెలిసినది ఏమీ లేదు .

Inline image 1

47-శిలా ,తామ్రశాసన, నాణాల పరిశోధకుడు –వాసు దేవ విష్ణు మిరాసీ (1893 -1985 )

డా .వాసుదేవ విష్ణు మిరాసీ మహారాష్ట్ర లో మధ్యతరగతి కార్తేడ్ బ్రాహ్మణ కుటుంబం లోరత్న గిరి జిల్లా దియోగడ్ తాలూకా కావెల్ గ్రామం లో  1893మార్చి 13 న జన్మించాడు . 82 జీవించి 3-4-1985లో మరణించాడు  . శాసన పరిశోధకుడు సంస్కృత విద్వాంసుడు ,ఇండాలజిస్ట్ .20 వ శతాబ్దపు మహా విద్వాంసులలో పేరెన్నిక గన్నవాడు .ప్రాచీన భారత దేశపు నాణాలు ,శిలా తామ్ర శాసన పరిశోధకుడు .వీరి మహా విద్వత్తుకు బ్రిటిష్ ప్రభుత్వం 1941 లో మహా మహోపాధ్యాయ బిరుదునిచ్చి సత్కరిస్తే  భారత స్వాతంత్ర్యానంతరం భారత రాష్ట్ర పతి 1975 లో పద్మ భూషణ్ పురస్కారం తో సత్కరించారు .  కొల్హాపూర్ లో ప్రాధమిక విద్య పూర్తీ చేసి పూణే చేరి .డిగ్రీ పాసై ,పూనాలోని దక్కన్ కాలేజి   నుండి సంస్కృతం లో ఎం .ఏ .పొందాడు .బొంబాయి వెళ్లి ,ఎల్ఫిన్ స్టోన్ కాలేజి లో సంస్కృత ప్రొఫెసర్ గా పని చేశాడు .తర్వాత నాగ పూర్ లో సంస్కృత పీఠాది పతి పోస్ట్ కు ఆహ్వాని౦ప బడి చేరాడు .1942లో ప్రిన్సిపాల్ అయ్యాడు .1947నుంచి 1950 వరకు అమ్రోతిలోని విదర్భ మహా విద్యాలయం ప్రిన్సిపాల్ గా పని చేశాడు .1957 నుంచి 9 ఏళ్ళు 1966 వరకు నాగపూర్ యూని వర్సిటిలో ‘’ఆనరరి ప్రొఫెసర్ ఆఫ్ ఏన్షేంట్ ఇండియన్ కల్చర్ అండ్ హిస్టరీ మరియు హెడ్ ఆఫ్ డిపార్ట్ మెంట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచింగ్ ఇన్ హుమానిటీస్ గా సేవలు అందజేశాడు .

 మిరాశీ 30 కి పైగా ఇంగ్లీష్ హిందీ మరాటీ భాషలలో పరిశోధనా పత్రాలు రాశాడు .275 కు పైగా ఇండలాజికల్ జర్నల్స్ లో వ్యాసాలూ రాశాడు .ఆయన రాసిన ‘’ఇన్ స్క్రిప్షన్స్ఆఫ్ ది కాలచూరి –చేది ఎరా’’బాగా ప్రసిద్ధి పొందింది .;;ఇన్ స్క్రిప్షన్స్ఆఫ్ వాకాటాస్ ‘’,ఇన్ స్క్రి ప్షన్స్ ఆఫ్ సిలహరాస్ ‘’,శాతవాహన –క్షాత్రప శిలాశాసనాస్ ‘’అన్నీ అన్నే .విలువైన సమాచారం తో శోభిల్లేవే .ఇండాలజీ ,కాళిదాస ,భవభూతి మహాకవులపైనా గ్రంధాలూ వ్యాసాలూ రాశాడు .

  లార్డ్ లిన్ లిత్ గొ 1941 లో మిరాశీకి ‘’మహా మహోపాధ్యాయ ‘’బిరుదునిచ్చి సత్కరించాడు .1966 లోసంస్కృత భాషా సేవకు  . రాష్ట్రపతి రాధాకృష్ణన్ ప్రతిభా పురస్కారాన్ని అందజేశారు ’1977భారత రాష్ట్ర పతి శ్రీ ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ ‘’పద్మ భూషణ్ ‘’పురస్కారం ప్రదానం చేసి గౌరవించారు  .1970 లో భారత పురాతత్వ శాఖ  గౌరవ కరేస్పా౦ డెంట్ పదివినిచ్చి గౌరవించింది .నాగపూర్ సాగర్ మొదలైన యూని వర్సిటీలు డి.లిట్ ప్రదానం చేశాయి .ఆలిండియా హిస్తారికాన్గ్రేస్ అధ్యక్షునిగా ఉన్నాడు .నూమేస్మాటిక్సొసైటీ ఆఫ్ ఇండియా ఎపిగ్రాఫికల్ సొసైటీ ఆఫ్ ఇండియా  ఫెలోషిప్ అందజేసి సత్కరించాయి .

Inline image 2

   సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-23-1-17 –ఉయ్యూరు  

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 45-వనౌషధి నిఘంటు నిర్మాత –పరాశరం భావనారాయణాచార్యులు (1976 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

45-వనౌషధి నిఘంటు నిర్మాత –పరాశరం భావనారాయణాచార్యులు (1976 )

15-6-1976 న శ్రీమాన్ పరాశరం భరద్వాజ లక్ష్మణాచార్య శ్రీమతి జయలక్ష్మి  దంపతులకు శ్రీ భావనారాయణాచార్యులు జన్మించారు .’’శ్రీ వైఖానస నిగమాగమిక ప్రవర’’ ఉత్తీర్ణులై ,సంప్రదాయ జ్యోతిష వాస్తు లలో పాండిత్యం సాధించారు .

  కృష్ణా జిల్లా నిమ్మకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రధాన అర్చకులుగా 1992 –నుండి 2000వరకు పనిచేశారు .తరువాత గుంటూరు జిల్లా పొన్నూరు శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థాన ఆస్థాన పండితులుగా 2000-2009 వరకు ఉన్నారు .పిమ్మట తిరుపతి లోని శ్రీ వేంకటేశ్వర వేదవిశ్వ విద్యాలయ వైఖానస ఆగమ అసిస్టంట్ ప్రొఫెసర్ గా 2009 నుండి ఉద్యోగిస్తున్నారు .

ఆచార్యులవారి గురు పరంపర –మహా భాష్యా౦త వ్యాకరణ శిరోమణి ,విద్యా భూషణ ,శ్రీ నైమిశారణ్య ఆలయ నిర్మాత శ్రీ పరాశరం వెంకట రామాచార్యులు ,శ్రీ హయగ్రీవ పాదు కాంతానుస్టాన తత్పర ,ఆగమ ,శిల్ప జ్యోతిష వాస్తు  ఆయుర్వేద వైద్యాలంకార శ్రీ వేదాంతం అనంత పద్మనాభాచార్యులు ,శ్రీ వైఖానస ఆర్ష విద్యా వాచస్పతి ,దత్త పీఠ ఆస్థాన పండితులు ,వైద్య విద్వాన్ ,శ్రీ శాస్త్ర పురాణ శ్రీ అగ్ని హోత్రం శీనివాసాచార్యులు .

  తిరుపతి వేద విశ్వ విద్యాలయం ప్రచురించిన ‘’వైష్ణవార్చన సార సంగ్రహం ‘’కు సంపాదకులు గాఆచార్యులవారున్నారు  . .అదే యూని వర్సిటి  ప్రచురించిన ‘’వనౌషధి నిఘంటు ‘’నిర్మాణానికీ సంపాదకత్వం వహించారు .తిరుపతి వేదిక్ యూని వర్సిటి వారి ఆగమ సమన్వయ సదస్సుకు కన్వీనర్ ,ఎడిటర్ .తిరుపతి పరాశర పబ్లికేషన్స్ వారి ‘’రామ మహిమాన్వేషణం’’ తెలుగు రచనకు ముఖ్య సంపాదకులు.శ్రీ వేంకటేశ్వర వేద విశ్వ విద్యాలయ ‘’ద్రువార్చ యజ్న విధి ‘’కి సంపాదకులు .

  ఆచార్యులవారి బిరుదులు –సత్కారాలు -1993 లో ముఖ్యమంత్రి శ్రీ ఎన్. టి .రామారావునుంచి ‘’ఉత్తమ అర్చక ‘’చెన్నైలోని తిరువలిక్కేని నుండి ‘’శ్రీ వైఖానస ఆగమ వాచస్పతి ,’’మైసూర్ దత్త పీఠాదిపతి శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి నుంచి ‘’శ్రీ దత్త వెంకటేశ్వర దేవాలయ మహా సంప్రోక్షణ’’ పురస్కారం అందుకున్నారు .

 విద్యావారధి శ్రీ నిష్ఠల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు సంపాదకులుగా ,శ్రీ పరాశరం భావనారాయణా చార్యులుగారు ఉపసంపాదకులుగా    శివ పార్వతుల కల్యాణం గా ప్రముఖ శైవాగమ వేత్త ,వాసి రెడ్డి వెంకటాద్రి నాయుడి ఆస్థానకవి ,గురు వరేణ్యులు ,శ్రీ చక్రార్చన ధురీణులు,అభినవ కాళిదాస బిరుదాంకితులుశ్రీ ములుగు పాపయారాధ్య కవి శ్రేస్టులు రచించిన     ‘’కళ్యాణ చంపువు ‘’అనే అరుదైన సంస్కృత కావ్యాన్ని  విశేషమైన ఉపోద్ఘాతం ,పరామర్శతో వెలువరించారు .దీనిని జైపూర్ లోని  లిటరరీ సర్కిల్ ప్రచురించింది . ఈకావ్యం లో చంపూ లక్షణాలన్నీ సమగ్రంగా ఉండటమే కాక నవరస పోషణా జరిగింది .

  ప్రస్తుతం తిరుపతి లోని తిరుచానూర్ లో శ్రీ పరాశరం భావనారాయణా చార్యుల వారు ఉంటున్నారు .  

 ఈ రచనకు ఆధారం –విద్యా వారధి ‘’శ్రీ నిష్ఠల సుబ్రహ్మణ్య శాస్త్రిగారు ఆదరం తో ఈ రోజే నాకు పంపిన వారి రచనలు 1-పూజా కుసుమాలు 2-మీరూ సంస్కతం నేర్చుకోండి 3-నవగ్రహ స్తుతిః తో పుస్తకాలతోపాటు పంపిన అరుదైన సంస్కృత గ్రంధం శ్రీ ములుగు పాపయారాధ్య విరచితమై తమ సంపాదకత్వం లో వెలువరించిన ‘’కళ్యాణ చంపువు ‘’కావ్యం . శ్రీ శాస్త్రిగారికి కృతజ్ఞతలు అందజేస్తున్నాను .

శ్రీ ఆచార్యులవారి ఫోటో జతచేశాను చూడండి .

సశేషం

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -23-1-17- ఉయ్యూరు

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ సువర్చలా౦జ నేయ శతక త్రయం’’ ఆవిష్కరణ మహోత్సవం

’శ్రీ సువర్చలా౦జ నేయ శతక త్రయం’’ ఆవిష్కరణ మహోత్సవం

ఉయ్యూరు రావి చెట్టు బజారులో వేంచేసి యున్న శ్రీ సువర్చలాంజ నేయ స్వామి వారిపై 1-శ్రీ తుమ్మోజు రామలక్ష్మణాచార్యులు(విజయవాడ ) గారు రచించిన   ‘’శ్రీ సువర్చలా సుందర వాయునందన శతకము  ‘’2- మధురకవి శ్రీమతి ముదిగొండ సీతారావమ్మ గారు(విజయవాడ) రరచించిన  ‘’శ్రీ సువర్చలా వల్లభ శతకము ‘’3-శ్రీ మంకు శ్రీను గారు(కొప్పర్రు –ప.గో. జి .) రచించిన  ‘’శ్రీ సువర్చలేశ్వర శతకము  ‘’  అనే శతక త్రయాన్ని  ‘’సరసభారతి’’ ప్రచురించి,  మాఘ శుద్ధ నవమి 5-2-2017  ఆదివారం నాడు శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం లో ఉదయం 8 గం .లకు జరిగే’’సామూహిక పాల పొంగింపు’’కార్యక్రమం ,ఉదయం 9 గం .లకు జరిగే ‘’సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం’’  అనంతరం ఉదయం 11-30 గం లకు స్వామి వారల సమక్షం లో ఆవిష్కరింప  జేస్తున్నామని తెలియ జేయటానికి  సంతోషిస్తున్నాము  .

ఆవిష్కరణ అనతరం శతక కర్త  త్రయానికి  సత్కార ,సన్మానాలు నిర్వహింపబడును .భక్తులు ,ప్రచురణ పూర్వక  విరాళాలు అందజేసిన దాతలు ,వదాన్యులు సాహిత్యాభిమానులు విశేషంగా పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన .

1-శ్రీ సువర్చలా సుందర వాయు నందన శతకము –ఆవిష్కరణ –వై .వి .బి..శ్రీరాజేంద్ర ప్రసాద్ –శాసన మండలి సభ్యులు

2-శ్రీ సువర్చలా వల్లభ శతకము- –ఆవిష్కరణ –శ్రీ ఏ .యు.వి..సుబ్రహ్మణ్యం –ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ –ఉయ్యూరు

3-శ్రీ సువర్చలేశ్వర శతకము –ఆవిష్కరణ –శ్రీ పరుచూరి శ్రీనివాసరావు –శ్రీనివాస విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ –ఉయ్యూరు

 

గబ్బిట దుర్గాప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు మరియు

శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయ ధర్మకర్త

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సాహో సాయి ,చిరంతన ,బాల ,క్రిష్ శాతకర్ణి సామ్రాట్

సాహో సాయి ,చిరంతన ,బాల ,క్రిష్ శాతకర్ణి సామ్రాట్

‘’అమ్మ ‘’కు విలువనిచ్చి తల్లి పేర తనపేరు చలామణి చేసుకొని తల్లికే పట్టాభిషేకం జరిపి   శాలివాహన  శకానికి ఆద్యుడై ,బ్రిటిష్ వారి చరిత్రలో నాలుగు లైన్లు కూడా లేని పోరాట యోధుడు, భారత దేశం నాలుగు చెరగులా ఆంద్ర సామ్రాజ్యాన్ని విస్తరించి ,అఖండ భారతమే ధ్యేయంగా పరిపాలించినవాడు గౌతమి పుత్ర శాతకర్ణి  .ఇది తెలుగువాడి’’వాడి ‘’ కధ.తెలుగువాడి పౌరుష గాధ.చిరంతన చిరస్మరణీయ చరిత్ర .దీన్ని తీయటానికి సాహసం ఉండాలి .తపన ,దృఢ సంకల్పం ,అంకితభావ౦ ,అత్యున్నత ప్రమాణ శీలనం ఉండాలి .తగిన నటుడు దొరకాలి .రెండవ శతాబ్దపు నేపధ్యపు కధకు తగిన వాతావరణం ఏర్పరచుకోవాలి .భారీ బడ్జెట్,  దాన్ని సమకూర్చే నిర్మాత ,దమ్మున్న దర్శకుడు ,దర్శకుని మనోధర్మానికి ,ప్రస్తుతకాలానికి అనుసంధానంగా కదా నిర్మాణం ,దానికి తగిన సంభాషణా రచనా ,జీవితమంతా యుద్ధం లోనే గడిపిన ఆ యోధుని యుద్ధ విజ్రు౦భణను ప్రతిఫలి౦పజేసే సంగీతం ,నేపధ్య సంగీతం కుదరాలి .ఇన్నీ కుదిరినా సినిమా మొదలు పెట్టి ఏళ్ళూపూళ్ళూ తీస్తే నటులు ముసలివారై టెంపో తగ్గి దెబ్బతింటుంది .ఇన్ని విషయాలూ దర్శకుడు క్రిష్ ఆలోచించి కేవలం 65 రోజుల్లో చాలెంజ్ గా తీసుకొని  దేశ విదేశాలలోనూ షూటింగ్ చేసి ,’’సెభాష్ క్రిష్ ‘’అని పించాడు .దీనికి సంభాషణలు రాసిన బుర్రా సాయి మాధవ్ ,సంగీతం కూర్చిన చిరంతన భట్,నటించిన బాల కృష్ణ అందరూ అత్యంత అభినందనీయులే .ఈ విజయం పై వారందరిదీ మాత్రమే కాదు చూసి ఆనందిస్తున్న తెలుగు ప్రేక్షక మహాశయులదికూడా .తెలుగు జాతి మహత్తర వీరుని కి ,సామ్రాట్ కు పట్టాభి షేకమే  . ఇది సమష్టి కృషి విజయమూనూ .అందుకే దీన్ని ‘’సాహో సాయి ,చిరంతన ,బాల క్రిష్ శాతకర్ణి సామ్రాట్ ‘’అన్నాను .

అసలు ఈ సినిమా చూడాలని నాకు ఇవాళ పోద్దునదాకా లేదు .ఎందుకో ఉదయం ఈనాడు తిరగేస్తే దర్శకుడు రాజమౌళి ‘రాసిన ‘’విజయం నీదే మిత్రమా ‘’అనే బాలకృష్ణకు రాసిన ఉత్తరం కనిపించి చదివాను .రాజమౌళినే మెప్పించిన చిత్రం కదా చూడాలనుకొని మాటినీ కి వెళ్లాను .మార్నింగ్ షో చూసి బయటికి వచ్చిన జనాన్ని లెక్కేస్తే 60 కి మించి లేరు .’’అయ్యో అనవసరంగా వచ్చానే ‘’అనుకొన్నా .మాట్నీకి బాల్కనీ ఫుల్ .కింద ఒక యాభై మంది ఉంటారు .రిలీజ్ అయి 10 రోజులే అయింది .బెరుకు బెరుకుగానే సీట్లో కూచున్నా .సినిమా మొదలయ్యాక అన్నీ మర్చి పోయా .ఆలోకం ,ఆకధలో ,ఆ కాలం లో ,ఆనుభవం లో ,ఆ వీరత్వం లో,ఆదేశభక్తి లో, ఆ మాతృస్వామ్య ప్రేరణ లో ,ఆ కర్తవ్య బోధనలో ,తెలుగు సంభాషణా మాధుర్యం లో ,యుద్ధానికి తగిన నూటికి వెయ్యి రెట్లు న్యాయం చేకూర్చిన చిరంతనభట్ సంగీత విన్యాసం లో, బాలకృష్ణ అపూర్వ అత్యంత ప్రభావ శీల నటనలో ,ప్రేరణాత్మకం గా సాగిన కధాగమనం లో లీనమై చూసి ఆనందించాను .మనసారా అందుకే అభినందించాను .సినిమాలోని పాత్ర ,గాత్ర ,దారులు సాంకేతిక నిపుణులు అందరిపేర్లు తల్లి పేరు తో వేయటం చాలా యాప్ట్ గా ఉంది.ఈ సినిమా ఈ ఆదర్శానికీ మార్గ దర్శకమైంది .అభినందన శతం .

బుర్రా వారిబుర్ర చాలాపదునైనది  .మాటలు ఈటెల్లా బుర్ర లోకి  మనసులోకి సూటిగా దూరాయి .ఎక్కడా పలచబడలేదు .పరి పుష్టిగా ఉన్నాయి .స్పందన ,చేతనా చైతన్యం కలిగించి ప్రభావితం చేస్తాయి .అందరూ చాలా చక్కగా నిర్దుష్టంగా ,భావ గర్భితం గా పలికారు .(పలకలేని వారికి డబ్బింగ్ చెప్పినవాళ్ళూ బాగా పలికారు ) కనుక రచనా పరంగా స్క్రీన్ ప్లే పరంగా గొప్ప విజయమే . ఆదినుండి అంతం వరకు యుద్ధాలే కనుక నేపధ్య సంగీతమూ ఆ వాతావరణాన్ని గొప్పగా కల్పించింది .ఇది ముఖ్యంగా ఈ సినిమా విజయానికి మరో బలీయ మైన కారణమైంది .కనుక రచయితా ,సంగీత కర్తా మిక్కిలి అభినందనీయులయ్యారు  .కాని పాటలో తెలుగుదనమే లేదు .పాడినవారూ తెలుగు ఇంపు సొంపు లను  ఒలికించ లేక పోయారు .ఒక ఆరకంగా కంపు చేశారేమో అని పించింది .శ్రావ్యత లేదు .కర్ణ కఠోరంఅని పించింది .మారు వేషం లో బాలకృష్ణ ,శ్రేయ నగర సంచారం చేస్తూ పాడిన పాట ఒక రోజు ముఖ్యమంత్రి అయిన తమిళనటుడు అర్జున్ ,మనీషా కోయిరాలా నటించిన సినిమా ‘’ఒకే ఒక్కడు ‘’ అనిజ్ఞాపకం లో ‘’వాళ్ళిద్దరూ కూడా మారువేషం లో పాడిన ‘’ఉప్పు చేపకూర’’పాట గుర్తుకు తెచ్చింది .రాత్రి శృంగారం సీనులో బాలు తదితరులు పాడిన ‘’మృగనయనే ‘’పాటలో మద్దెల మోత పెట్టి ‘’అర్ధ రాత్రి మద్దెల దరువు ‘’అను కోనేట్లుంది .సంభాషణలు తెలుగుకు జీవం పోసి ఊర్జాన్ని కలిగిస్తే పాటలు తెలుగను నిర్జీవం చేసి స్వారస్యాన్ని మింగేశాయని పించింది .

నటులు ఎవరు ఏ పాత్రలో నటించారో తెలుసుకోక పోయినా ఫరవాలేదు అందరూ స్థాయిఅందుకొని , శక్తికి మించి సమర్ధతను చాటి నటించారు .మన దేశ రాజులైనా శత్రు దేశ పాలకులైనా అందరూ మెప్పించారు అని నిర్ద్వందంగా చెప్పవచ్చు  .గౌతమి పుత్రా శాతకర్ణి తల్లి ‘’ గౌతమి బాలశ్రీ ‘’పాత్ర హేమమాలిని ధరించింది .ఆమె వలన పాత్రకు నిండుదనం ఏమి చేకూరిందో నాకు తెలియదు .అందరినీ అభినందిస్తున్నాను .అంతా బాగానే ఉందా అంటే అలాని చెప్పలేను .శాతకర్ణి పరిపాలన విదానం మనకు చెప్పలేదు .ప్రతి రాష్ట్రం ధాన్య కటకమవ్వాలని ,అమరావతి అవ్వాలన్న ఒకటి రెండు డైలాగులలోతప్ప. బాలకృష్ణ మీసం కిందకి దింపటం సబబు అనిపించలేదు .కొంచెం మెలి తిప్పితే హుందా గా ఉండేది .ఇప్పుడు ‘’వట్టి వీర బద్రయ్య ‘’అని పించాడు .అలాగే అతని పర్సనాలిటీ నిటారుగా నిర్దుష్టంగా చూపలేదు .నాకుమాత్రం వీరపాండ్య కట్ట బొమ్మన గుర్తుకు వచ్చాడు .కుంచించుకొని పోయి నట్లు కనిపించాడు .ఇంటర్వల్ తర్వాత శత్రు రాజులను చంపటం లో బాల కృష్ణ నటనతో అబ్బా అనిపిస్తాడు . విషప్రయోగం జరిగి నప్పుడు అతన్ని బ్రతికి౦చు కోవటానికి భిషగ్ వరేణ్యు లు చేసిన ప్రయత్నం భారతీయ ఆయుర్వేద విధానానికి ఎత్తిన పతాక అని పించింది .వాసిష్ట పుత్ర పులమావి ముద్దుముద్దుగా బహు అందంగా ఉండటమే కాదు శత్రు రాజుతో ‘’తాతా!నువ్వు చంపు తావా నన్ను చంపమంటావా “”?అన్నడైలాగ్ కనులను చెమరి౦ప జేస్తుంది  .అలాగే మరొక రెండు సందర్భాలలోనూ అలాగే ఉంటుంది .

బ్రహ్మాండ పురాణం లో విష్ణు భాగవత పురాణాలలో శాతవాహన చరిత్ర ఉంది.మహారాష్ట్ర లో నాశిక్ లో  పండల్వేని గుహలలో ఉన్న  శిలా శాసనాలు శాతకర్ణి చరిత్రకు అద్దంపడతాయి .భారత దేశం లో పడమటి శాత్రపులను గోదావరీ పరివాహక రాజ్యాలను ,పల్లవ ,యవన రాజ్యాలపై దండయాత్ర చేసి జయించి ,మధ్యా ప్రదేశ్ లో మాల్వ సౌరాష్ట్ర ,కృష్ణా ,కొంకణ ,అవంతి ,రాజపుటాన ,తూర్పు పడమటికనుమలమధ్యరాజ్యాలు  విదర్భాది 32 రాజ్యాలను స్వాధీనం చేసుకొని అఖండ ఆంధ్ర శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించి తల్లి చేత రాజాధిరాజు, చక్రవర్తి అని పించుకున్నవాడు గౌతమి పుత్ర శాతకర్ణి .ఆ కధే వీనుల విందు మనకు .మన ఆరాధకుడైన తెలుగు మహా వీరుడిచరిత్ర .మనం చూడాలి ఆనందించాలి విజయం చేకూర్చాలి ,రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు వాణిజ్య పన్ను మినహాయింపు ఇవ్వటం అభినందనీయం .కాని రెండో వారానికే దియేటర్ చాలా ఖాళీ గా ఉండటం బాధించింది .విజయం చేకూర్చటం మన వంతు కర్తవ్యమ్ అని చెబుతూ మరో సారి అందరినీ అభినందిస్తున్నాను .

 

Inline image 1

నహ పాణ రాజ్యాన్ని జయించి విజయోత్సవం చేసుకొంటున్న శాతకర్ణి -ఊహా చిత్రం

మీ-భవాని పుత్ర దుర్గా ప్రసాద్ – 22-1-17 –కృష్ణా జిల్లాపుత్ర ఉయ్యూరు

 

Posted in సినిమా | Tagged | Leave a comment

విజయం నీదే మిత్రమా… రాజనందిని పుత్ర రాజమౌళి

 

 

0002 0003

 

 

 

 

 

 

Posted in సమయం - సందర్భం | Tagged | 3 Comments

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 42-కాళిదాస జన్మ స్థలం పై పరిశోధించిన –లక్ష్మీధర్ కల్లా(18 90 )

— గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

42-కాళిదాస జన్మ స్థలం పై పరిశోధించిన –లక్ష్మీధర్ కల్లా(18 90 )

కల్లా లక్ష్మీధర శాస్త్రి ఢిల్లీ యూని వర్సిటి సెయింట్  స్టీఫెన్స్ కాలేజి సంస్కృత రీడర్ సంస్కృత విభాగానికి అధ్యక్షునిగా 27 ఏళ్ళు 19 22ను౦చి  1947 వరకు పని చేశాడు .ఆయన రాసినగ్రందాలలో ‘’ది హోం ఆఫ్ ఆర్యాస్ ‘’,ది బర్త్ ప్లేస్ ఆఫ్ కాళిదాస, ఆల్ ఇండియా కాశ్మీరి పండిట్ –సోషల్ రిఫార్మ్ మూమెంట్ ,వేదిక్ పధ్ధతి యాజ్ కరెంట్ అమాంగ్ కాశ్మీరి పండిట్స్ మొదలైనవి ఉన్నాయి .

43-భారత పర్యటనం కర్త –కుట్టి కృష్ణ మారార్ (19 00-1973 )

కేరళలో పట్టా౦బి  లో 14-6-1900న జన్మించిన కుట్టి కృష్ణ మారార్ బారతీయ సాహిత్య వ్యాఖ్యాత ,వ్యాసరచయిత విమర్శకుడు .తప్పు అనిపించినది ఏదైనా ఎవరైనా లెక్క చేయకుండా విమర్శించే నిర్భీతి ఉన్నవాడు .సాహిత్య వ్యాప్తికి అవిరళ కృషి  చేసినవాడు .మహాభారతం పై భారత పర్యటనం అనే చాలా గొప్ప గ్రంధాన్ని రాశాడు ఇది చాలా ప్రాముఖ్యాన్ని తెచ్చి పెట్టింది .ఇది ఐ .సి .ఎస్. ఇ. సిలబస్ లో బోధనా గ్రంధం గా ఉన్నది .మహా భారతం లోని పాత్రలు ,పర్యటన  స్థలాలు వాటి ప్రత్యేకతలపై రచించిన గ్రంధం ఇది .

పట్టా౦బి  సంస్కృత కళాశాలలో సాహిత్య శిరోమణి పాసై ,కేరళ కళామండలం లో 15 ఏళ్ళు సాహిత్యాచార్య గా పని చేశాడు .ప్రముఖ మలయాళ మహా కవి వల్లతోల్ నారాయణమీనన్ తో కలిసి గ్రంధాలను ముద్రించాడు .మళయాళ ప్రముఖ పత్రిక మాతృభూమి లో ప్రూఫ్ రీడర్ గా పని చేశాడు .పట్టా౦బి శ్రీ నీల కంఠ సంస్కృత కాలేజి ‘’సాహిత్య రత్న ‘’పురస్కారం అందించింది .ఎం .పి.పాల్ అవార్డ్ కూడా లభించింది .

మళయాళ భాషా వాడకం పై ‘రాసిన ’మళయాళ శైలి ‘’గ్రంధం చాలా పేరు తెచ్చి కేరళ సాహిత్య అకాడెమి అవార్డ్ పొందింది .సాహిత్య సల్లాపం, దంతగోపురం ,కైవిలక్కు (సాహిత్య విమర్శ సంపుటి )మొదలైన 19 గ్రంధాలు రాశాడు .మారార్ రాసిన ;;కళాజీవితం దన్నె’’(జీవితమే ఒక కళ )ఉత్తమ సాహిత్య  స్థాయికి చెందినవి .6-4-1973న 73 వ ఏట మారార్ మరణించాడు .

44  -నవ్య న్యాయ పరిశోధకుడు  –బిమల్ కృష్ణ మాతీలాల్ (1935-1991)

1935 లో బెంగాల్ లో జన్మించి 56 ఏళ్ళు మాత్రమే జేవించి 1991లో మరణించిన బిమల్ కృష్ణ మాతీలాల్ భారతీయ తత్వశాస్త్రాన్ని, సంప్రదాయాన్ని  మదించి పాశ్చాత్య తత్వ శాస్త్ర ధోరణులపై వీటి ప్రభావాన్ని ప్రదర్శించినవాడు .1977 నుండి 1991 వరకు ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటిలో ‘’స్పాల్డింగ్ ప్రొఫెసర్ ఈస్టర్న్ రెలిజియన్ అండ్ ఎదిక్స్ ‘’గా ఉన్నాడు .

చిన్ననాటి నుంచే సంస్కృతం లో ధారాళం గా మాట్లాడే నేర్పు అబ్బింది .గణితం ,తర్క శాస్త్రాల పై దృష్టిపడి ,సంస్కృత కళాశాలలో చదివి ఉద్దండులైన పండితులవద్ద తత్వశాస్త్రాధ్యయనం చేసి అక్కడే 1957 నుంచి అయిదేళ్ళు సంస్కృత పండితునిగా ఉన్నాడు .ఆయన గురువులు మహా మహులైన తారాకాంత తర్క తీర్ధ ,కాలీపాద తర్కా చార్య  .పండిత అనంతకుమార్ న్యాయ తర్క తీర్ధ, మధుసూదన న్యాయా చార్య , విశ్వబందు తర్క తీర్ధ లకు  సన్నిహితుడయ్యాడు .1962 లో ‘’ఉపాధి ‘’అంటే ‘’మాస్టర్ ఆఫ్ లాజిక్’’ డిగ్రీ ప్రదానం చేశారు .

సంస్కృత కాలేజి లో పని చేస్తూ ఉండగానే హార్వర్డ్ యూని వర్సిటి ఇండాలజిస్ట్ డేనియల్ ఇంగాల్స్ తో పరిచయమై ,ఆయన కోరిక మేరకు పి హెచ్ డి కోసం అక్కడ చేరాడు .ఫుల్ బ్రైట్ స్కాలర్షిప్ లభించి ‘’నవ్య న్యాయం ‘’పై పి హెచ్ డి 1962-65 లో పూర్తీ చేశాడు .ఇక్కడ ఉన్నప్పుడే విల్లార్డ్ వాన్ ఒర్మాన్ క్వైన్ వద్దనూ విద్య నేర్చాడు .తర్వాత టొరంటో యూని వర్సిటి సంస్కృత ప్రొఫెసర్ గా చేరి ,1977 లో డా.సర్వేపల్లి రాధాకృష్ణ న్ ,రాబర్ట్ చార్లెస్ జేనర్ తర్వాత ఆక్స్ ఫర్డ్  స్పాల్డింగ్ ప్రొఫెసర్ అయ్యాడు .

న్యాయ –వైశేషిక ,మీమాంస ,బౌద్ధ వేదాంతం లపై సాధికారిక గ్రంధాలు నేటి తత్వ శాస్త్ర చర్చలకు ఉపయోగ పడేలా రాశాడు మాతీలాల్ . This was in contrast with the German approach to Indian studies, often called Indology, which prefers minute grammatical study as opposed to a concern for the development of the ideas as a whole in the general philosophical context. Thus, Matilal presented Indian Philosophical thought more as a synthesis rather than a mere exposition. This helped create a vibrant revival of interest in Indian philosophical tradition as a relevant source of ideas rather than a dead discipline.

మాతీలాల్ ‘’ఇండియన్ ఫిలసాఫికల్ జర్నల్ ‘’వ్యవస్థాపకుడుకూడా .19 90 లో భారత ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారం అందజేసి సత్కరించింది .ఆయన రాసిన ముఖ్య గ్రంధాలు -1-ఎపిస్టమాలజి,లాజిక్ అండ్ గ్రామర్ఇన్ ఇండియన్ ఫిలసాఫికల్ అనాలిసిస్ 2-లాజిక్ ,లాంగ్వేజ్ అండ్ రియాలిటి –యాన్ ఇంట్రడక్షన్ టు  ఇండియన్ ఫిలసాఫికల్ స్టడీస్ 3-పెర్సేప్షన్ –యాన్ ఎస్సే ఆన్ క్లాసికల్ ఇండియన్ దీరీ ఆఫ్ నాలెడ్జ్ 4-లాజికల్ అండ్ ఎదికల్ ఇస్స్యూస్ 5-నవ్య న్యాయ –డాక్త్రిన్ ఆఫ్ నెగెషన్ 6-ది వర్డ్ అండ్ ది వరల్డ్ –ఇండియాస్ కంట్రీబ్యూషన్ టు  ది స్టడి ఆఫ్ లాంగ్వేజ్ 7-ది కారక్టర్ ఆఫ్ లాజిక్ ఇన్ ఇండియా 8-నీతి ,యుక్తి ఓ ధర్మ (బెంగాలీభాషలో )

కేన్సర్ వ్యాధితో 8-6-19 91 న బిమల్ కృష్ణ మాతీలాల్ 56  వ ఏట మరణించాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-1-17 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 41- రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ వైస్ చాన్సెలర్ –వెంపటి కుటుంబ శాస్త్రి -2(చివరిభాగం )

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3

41- రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ వైస్ చాన్సెలర్ –వెంపటి కుటుంబ శాస్త్రి -2(చివరిభాగం )

ఇప్పుడే ఆప్తులు శ్రీ మైనేని గోపాలకృష్ణ (అమెరికా )గారుశ్రీ వెంపటి కుటుంబ శాస్త్రి గారు సంస్కృతం ఇంగ్లీష్ హిందీ ,తెలుగు నాలుగు భాషలో  రచించిన గ్రందాల లింక్ పంపారు .వారికి ధన్యవాదాలు చెబుతూ ,దానిని బట్టి వారి రచనా విశేషాలు మీ ముందు ఉంచుతున్నాను .

1-    ఏ కన్సైజ్ డిక్షనరీ ఆఫ్ ఫిలాసఫీ 2-సాంస్క్రిట్ అండ్ డెవలప్ మెంట్ ఆఫ్ వరల్డ్ ధాట్ 3-అద్వైత మణిః 4-సైన్స్ టెక్ష్ట్స్ ఇన్ సంస్కృత ఇన్ మాన్యు స్క్రిప్ట్స్ ఇన్ కేరళ అండ్ తమిళనాడు 5-ఆధునిక సంస్కృత సందర్భ సూచీ 6-సంస్కృత స్వాధ్యాయః 7-ఉపనిషదయః ఏక పరిచయః 8-శ్రీ గురు ప్రపత్తి –హిందీ –ఆంగ్లాను వాదోపేత 9-ప్రొఫెసర్ శ్రీ వి.వెంకటాచలం స్మ్రుతి గ్రంధ 10-డైరెక్టరి ఆఫ్ డాక్టరల్ డిసేర్టేషన్స్ ఆన్ సాంస్క్రిట్ ఇన్ ఇండియన్ యూని వర్సిటీస్ 11-వనమాలా.

మొత్తం మీద శాస్త్రిగారు 43 గ్రంధాలను నాలుగు భాషలో రచించారు .ఇందులో విమర్శ ,విశ్లేషణ ,విజ్ఞాన సర్వస్వం ,చరిత్ర ,నిఘంటువు ,చరిత్ర ,పరిశోధనా పత్రాల సంపుటి ,గ్రంధ సూచిక ,స్తుతులు ,స్తోత్రాలు మొదలైనవి ఉన్నాయి .

ఇంతటి మహా సంస్కృత విద్వా౦సు ని పూర్తి చరిత్ర తెలుగులోనూ ఇంగ్లీష్ లోనూలేకపోవటం దారుణం అని పిస్తుంది

..Inline image 1

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-1-17 –ఉయ్యూరు .

.

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3-

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3-

41-రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ వైస్ చాన్సెలర్ –వెంపటి కుటుంబ శాస్త్రి

1950 లో జన్మించిన వెంపటి కుటుంబ శాస్త్రి మహా భారతీయవిద్యా వేత్త .20 03నుంచి 20 08వరకు భారతీయ సంస్కృత సంస్థాన్ కు వైస్ చాన్సలర్ గా పని చేసిన సర్వ సమర్ధుడు .అంతర్జాతీయ సంస్కృత అధ్యయన సంస్థకు అధ్యక్షుడు .15 వ ప్రపంచ సంస్కృత మహా సభ నిర్వహణ కమిటీ సభ్యుడు .’’వైడర్  అసోసియేషన్ ఆఫ్ వేదిక్ స్టడీస్ ‘’గవర్నింగ్ బోర్డ్ మెంబర్ కూడా .టోరినో నుండి ప్రచురింపబడే ‘’ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాంస్క్రిట్ స్టడీస్  ‘’జర్నల్ కు ‘’ఇండో లాజికా టార్నీషియా’’సంపాదక వర్గం లో ఉన్నాడు .భారతీయ వేదాంతం పై విపరీతమైన అభిమానం .అందులో అద్వైత వేదాంతం అంటే మహా ఇష్టం .సంస్కృత మహాకావ్యాలపై మహా అభిమానం .లెక్కలేనన్ని మోనో గ్రాఫులు ,ఆ౦ధాలజీలు రాశాడు .అద్వైత వేదాంతం పై ఎన్నో పరిశోధన పత్రాలు రాసి సమర్పించాడు .భారత దేశం లోని అనేక రాష్ట్రాలు శ్రీ శాస్త్రి ని ఆహ్వానించి ప్రసంగాలు చేయించి బిరుదప్రదానం చేసి సత్కరించాయి .కెనడాలోని విండ్సర్ యూని వర్సిటి శాస్త్రి గారి సంస్కృత భాషా వ్యాప్తికి చేసిన కృషికి పురస్కారం అందజేసింది .

ఇంతకంటే ఈ మహానుభావుని గురించి వివరాలు తెలియ లేదు .బహుశా వీరు కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందినవారు అని నా అభిప్రాయం . వారు కాళిదాస మహాకావ్యాలపై సంస్కృతం లో చేసిన ప్రసంగాలు యు ట్యూబ్ లో చూసి ఆనందించవచ్చు . ప్రస్తుతం శాస్త్రి గారు గుజరాత్ రాష్ట్రం లో వేరావల్ లో ఉన్న శ్రీ సోమనాద్ సంస్కృత విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ గా ఉన్నారు .

మీకెవరికైనా శ్రీ వెంపటి కుటుంబ శాస్త్రి గారి గురించి ఇంకా ఏమైనా విశేషాలు తెలిస్తే నాకు తెలియ జేయండి .తరువాత చేరుస్తాను .

Inline image 1

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-1-17 –ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గొ .గో ,గో.గోవిందా రామ

గొ .గో ,గో.గోవిందా రామ

బందరులో పోర్టు కోసం గోవిందా రామ

బెజవాడ నుంఛి  బందరు దాకా గోవిందారామ

రోడ్లన్నీతెగ  వెడల్పు  చేస్తూ గోవి౦దారామ

వందల ఏళ్ళ వృక్షాలన్నీ గోవి౦దారామ

కూకటి వేళ్ళతోనూ  గోవిందా రామ

కూల్చి  పారేస్తున్నారంటూ  గోవి౦దారామ

పచ్చదనం ఏమైందని  గోవిందారామ?

నాడు అశోకుడు నాటితే చెట్లు గోవిందారామ

నేటి ఎన్జీవో నేత అశోక్  గోవిందారామ

కళ్ళ ఎదుటే కూలుస్తుంటే గోవిందారామ

చూస్తూ ఊరుకున్నాడని గోవిందారామ

అడ్డమొచ్చాయంటూ గోవి౦దారామ

పక్కా బిల్డింగు లెన్నోను గోవిందారామ

అడ్డంగా పడగొడుతూ గోవిందారామ

కన్నీళ్లు తెప్పిస్తున్నార౦టూ  గోవిందారామ

ప్రోక్లైన్లు, బుల్ డోజర్లు నేడు గోవిందారామ

హీరోలయి పోయాయంటూ  గోవిందారామ

చేతిలో చిల్లిగవ్వ లేకున్నా గోవిందా రామ

ఈ పన్లకు డబ్బెట్లా వస్తోందో గోవిందారామ

 బ్రహ్మ పదార్ధమై ఇదంతా గోవిందారామ

గగ్గోలు గగ్గోలుగా గా ఉందని  గోవిందారామ

ఒక వర్గానికే మేలు అంటూ గోవిందారామ

సన్నాయి నొక్కులు నొక్కేరు గోవిందారామ

గోతిలో అమరావతి కట్టేరు గోవి౦దా రామా

 అంటూ అ౦గలార్చేరు’’  గోవిందా రామా

ఫాను’’ ,’’చేతు’’లోళ్ళు గోవిందారామ  

కృష్ణ ఉవ్వెత్తున పొంగినా  గోవిందారామ

వరదొచ్చి పక్కయేరు పొంగినా గోవిందారామ

స్వర్గమంటీ అమరావతీ గోవిందారామ

మున్నీటిలో  మునిగి గోవిందారామ

నీళ్ళ పాలౌతుందని గోవిందారామ

మొసలి కన్నీరొలికిస్తూ  గోవిందారామ

నూజివీడవతల గోవిందారామ

రాజదానొస్తుందని గోవిందారామ

అప్పనంగా వేలాది ఎకరాలు గోవిందారామ

ముందే కొనుగోలు చేసి  గోవిందా రామ

భ౦గ పడ్దోరి గోవిందారామ  

కాకి గోలా యిది  గోవిందారామ

‘’ఇక్కడో పిచ్చోడు ‘’గోవిందా రామ

 పైన ‘’మరో వెర్రోడు’’ గోవిందారామ  

ఇద్దరికీ కేమిస్ట్రి కుదిరి గోవిందారామ  

బుల్ డోజర్లు లా గోవిందా రామ

తొక్కి పారేస్తున్నారంటూ గోవిందారామ  

మొన్ననే ప్రజలచేత గోవిందా రామ

ఛీ ఛీ కొట్టించుకొన్న గోవిందారామ

చీమలే ఈ పుకార్లు గోవిందారామ

పుట్టిస్తూ  గడిపేరు పబ్బం  గోవిందారామ .

పెద్ద నోట్ల రద్దు గోవిందా రామ

సద్దు మణగ లేదింకా గోవిందారామ

‘’ఊర్జిత పటేలు’’ గోవిందారామ

ఆర్జించి నింపుతాడు గోవిందారామ

బొక్కసం అనుకొంటే గోవిందారామ

ఉన్నదే ఊడ్చుకు గోవిందారామ  

పోయిందని గగ్గోలు  గోవిందారామ

ఈ మార్కెట్ మాయేమోగాని  గోవిందారామ

మనిషి బతుకు మాత్రం గోవిందా రామ

దుర్భరమంటూ గోవిందా రామ

దురపిల్లుతున్నారు గోవిందా రామ

కొను గోలు అమ్మకాలన్నీ గోవిందారామ

‘’గీకుడుతోనే ‘’(స్వైప్)నంట ఇక గోవిందారామ

ఈ సోకు కూడా  చూద్దాము గోవిందారామ .

ట్రంపెట్లు ఘనంగా మోగుతుండగా  గోవిందారామ

‘’ట్రంపు’’ఎక్కాడు నిన్న గద్దె గోవిందా రామ

మిన్ను విరిగి మీద గోవిందా రామ

పడుతుందనే కంగారుగోవి౦దరామ

పక్కనెట్టి మనం గోవిందారామ

మనపని  మనం  గోవిందారామ

చక్క బెట్టు కోవాలి గోవిందారామ

అది చేయకుంటేను మనం గోవిందారామ

మనపని అవుతుంది  గొ.గో.గో,గోవిందారామ .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-1-17 –ఉయ్యూరు

 

 

 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ శీలా వీర్రాజు గారి చిత్రకళా ప్రదర్శన

సాహితీ బంధువులకు కళాభినందనలు -ప్రముఖ చిత్రకారులు శ్రీ శీలా వీర్రాజు గారు ఫోన్ చేసి తమ చిత్రకళా ప్రదర్శన విజయవాడలో మొగల్రాజపురం లోని ”మధు మా లక్ష్మి కాంప్లెక్స్” లోనఉన్న  కల్చరల్ హాల్ లో 21-1-17 శనివారం 22-1-17 ఆదివారం రెండు రోజులు జరుగుటఁదని ,ఈ రోజుఉదయం 10 గంటలకు ప్రముఖ నైరూప్య చిత్రకారులు పద్మశ్రీ ఎస్వీ .రామారావు గారు ప్రదర్శన ప్రారంభిస్తారని,తెలియ జేశారు . కళాభిమానులందరూ సందర్శించి ప్రోత్సహించవలసినదిగా కోరుతున్నాను -దుర్గాప్రసాద్

 

Inline image 1Inline image 2

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-3 40-వెయ్యి శ్లోకాల ‘’చైతన్య నందనం ‘’కావ్య కర్త శ్రీ నిష్ఠల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3-

40-వెయ్యి శ్లోకాల ‘’చైతన్య నందనం ‘’కావ్య కర్త శ్రీ నిష్ఠల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు -2(చివరిభాగం )

శాస్త్రి గారి గీర్వాణ కవితా గీర్వాణం

శాస్త్రి గారి సంస్కృత రచనా పాటవం అనిర్వచనీయం .వారు రాసిన వాటిలో నాకు పంపిన శ్రీ బాలాత్రిపుర సుందరీ సుప్రభాతం ,రసానందం చైతన్య నందనం ,కావ్య మంజరి  లను సంక్షిప్తంగా పరిచయం చేస్తాను .

1-శ్రీ బాలా త్రిపుర సుందరీ సుప్రభాత౦

దీనిని తమ గురువరేణ్యు లు మహోపాసకులు శ్రీ శ్రీ త్రిపురానందనాధస్వామికి అంకితమిచ్చారు –

‘’త్రిపురానంద నాధస్య పాదపంకజ రేణుభిః-ప్రోత్ధితాకవితాధారా నిరంతర రసోదయా ‘’అంటూ వారి నిరంతర కవితా రసోదయాన్ని అభి వర్ణించారు .

‘’శ్రీ గురోః పదాముపేయుషో విదః –జిహ్వికా భారతి శారదాంబికా –దుర్జనావలి చపేటికా  -చంద్రికా శరది జా సచేతసాం ‘’గురువుగారి శిష్యునినాలుకపై శారదాదేవి కొలువై ఉంటుందని తెలియ జేశారు .

గురు చరిత్ర కర్త శ్రీ మేళ్ళచెర్వు  వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి  గారు  నిష్ఠల వారి ‘’చైతన్య నందన కావ్యం ‘’ను అభినందిస్తూ –‘’చైతన్య నందన వనీ చిర చార మత్తః –బృందావనస్య సదృశీం సుషమా మవేక్ష్య –రోమాంచ రమ్య వనదంతు రితాంగ యష్టిః –సారూప్య మాస్య వనికా జనకం స్తవీమి ‘’అని రోమా౦చనంగా కావ్య అర్చన ఉందన్నారు .మోక్షం అనిపిస్తోందని చెప్పారు .

‘’త్రయం స్త్రింశత్కోట్యో దధాతి వసతిం న౦దన వనే –మఘోనో దాసాస్తే ,తవ నవ నవే నందన వనే –మహా దేవా అసన్ శతమఖ కిరీటార్చిత పదాః-అతోహం గృహ్ణీయా మిద మది గుణం నీప విసినం ‘’

అని నందనవన నవ్య నవనీత నాధుని సోయగం ఇంద్రాది దేవతల ఆరాధన బహు సుందరం గా వర్ణించారని తెలియ జేశారు .

అవధాన చతురానన డా .పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ –‘’నిష్ఠలాన్వయ పాండిత్య నిష్ణాతత్వ నిరూపకాః-దృష్ట్వాగ్రంథాస్త్రయీ మూలాఃత్రయం క్షోదక్షమా ముదా ‘’అని కీర్తించి శ్రీ దేవిపూజా విధి ,  ,వీరభద్ర సత్కధమొదలైన రచనలు ఆబాల పండితులను ఆకర్షించాయని చెప్పారు .

తర్వాత కవిగారు కొద్దిగా ప్రస్తావన చేసి ఇందులో స్తుతి ,ప్రపత్తి ,మంగళాశాసనం ఉన్నాయని ‘’బాలే కృపాజలనిధే కురు సుప్రభాతఃమ్ ‘’అనే మకుటం తో త్రిపురసుందరీ దేవిని కీర్తి౦చానని,రుక్ సంహిత  భారతం ,యాజ్న్య వల్కీయం లను ప్రమాణాలుగా తీసుకొని రాశానని సంస్కృతం లో వివరించారు .

1-శ్రీ మాతర్మంగలే   బాలే పూర్వా సంధ్యా ప్రవర్తతే –ఉత్తిష్ట దేవతా పూజ్యే కర్తవ్యమ్ లోక పాలనం ‘’తో మేలుకొలుపు ప్రారంభం చేసి ,’’ఉత్తిస్తోత్తిస్టశ్రీ విద్యే ఉత్తిస్టాధార కుమ్డతః-ఉత్తిష్ట లలితా చేతః త్రిలోకీ మంగళం కురు ‘’అని మూడులోకాలకు మంగళం చేకూర్చమని వేడుకొని –

‘’నైశేన నీలతమసా వసనేన లోకః –విద్యోతమాన భగణా౦బక భాస మానః –త్వాం సేవితుం సముప సర్పతి సత్ప్రకాశః –బాలే కృపా జలనిధే కురు సుప్రభాతం ‘’అని సుప్రభాత గీతికమొదలు పెట్టారు .బాలా త్రిపుర సుందరీ పద భక్తుడైన శ్రీ పాపయారాధ్యుని స్మరిస్తూ –‘’శ్రీ పాపయార్య పరికల్పిత సన్నిధానా –కళ్యాణ యుక్త్రిపుర నాద సమాశ్రితా౦ఘ్రే- షట్ప౦కజేషు బహుధా పరి ద్రుష్యమానే –బాలే –‘’అంటూ

చివరగా –‘’ఆనంద సంధాయక సుప్రభాతం –సర్వార్తి పీడాహర సుప్రభాతం –దయాంబు రాశే కురు సుప్రభాతం –బాలే నమస్తే కురు సుప్రభాతం ‘’అని ఫలశ్రుతి తోమొత్తం 29 శ్లోకాలతో  ముగించారు  .

తరువాత 11 శ్లోకాల స్తుతి రాశారు –‘’నత దాపి భవత్పద కన్జరజో –మహిమాన మనంత ఫలం విదితుం –విధి విష్ణు గిరీశ,ముఖాః ద్యుసదః –ప్రభవః పరిపాహి దృశా జగతీం ‘’అని ప్రారంభించి

‘’జగదంబుజ మాంబ సుదేశ దళం –వికచం తవ పాద తలే పతతి-ప్రతిభాసిత జీవ మహా ప్రతిభే –పరిషించ సుధాం కరుణా తటినీ –‘’అని చక్కని లయాన్వితంగా ఊపు నిచ్చి –‘’పురుష ప్రకృతీ భవతీ జననీ –రవి మండల భాసిని విశ్వ మయి –బహు చిత్ర మయూఖ మయూఖ రుచిః –సకలాపద ఉద్దర దుర్గతి నుత్ ‘’అని దుర్గతి నాశిని గా కీర్తించి చివరికి –‘’బృహతీం బృ౦హణమయీం నౌమి బాలాం స్మితాననాం –బానిలాగ్ని జలపృద్వీహేతూనాం మూల కారణం ‘’అని అమ్మ సుస్మిత వదన సౌందర్యాన్ని వర్ణిస్తూ ముగించారు .

తరువాత 16 శ్లోకాలలో శ్రీబాలా ప్రతిపత్తి రాశారు –

‘’ఐం కాం త్రుకతా ముపేత్య విశదాహారోజ్వలా వాక్ప్రదా-క్లీ౦కారాకృతి రిక్షు దండ కలితా సౌందర్య సార ప్రదా

సౌ రూపం చ విధాయ భీమ రిపు సంక్షోభం సమాతన్వతీ-సా వేద త్రయి రూపిణీ విజయతే బాలా నతాస్తాం శివాం ‘’అని శ్రీదేవి దివ్య విభూతిని ఆవిష్కరించి –

‘’సౌభాగ్య భాగ్య గరిమాభి నవ ప్రకాశే –వాత్సల్య మార్దవ దయాపరమావకాశే –రాత్రిం దినం భజతు చిత్తమనాద నాదే –శాంత్యైసమస్త జగతస్తవ పాదపద్మం’’అని సమస్త జగత్తుకు శాంతి చేకూర్చమని ప్రార్ధిస్తూ  మంగళాశాసనం గా –బాలై పరతత్వైక రూపాయై సర్వ తేజసే –హంస మానస సంచారి హంస్యై మంగళ మస్తుతే’’తో ప్రారంభించి చివరి 14 వ శ్లోకం –‘’కల్హార పండరీకా౦బుజాతా భ చణద్వయే –మంగళం మంగళ తనో జగన్మంగళ హేతవే ‘’తో ముగించారు .

2- లౌకిక నృసింహ స్తుతి

‘’నృణాం గుణైర్యః శ్రుతి శాస్త్ర గీతైః-ప్రష్ఠోభవత్తేన సకీర్త్యతే ద్ధా –సైమ్హాస్తనో ర్దారణ తో హి నస్యాత్ –సోవ్యాన్రుసింహ సింహః ‘’అని మొదలు పెట్టి 15 వ శ్లోకం –‘’పశుతానరతాభి మేలనాత్ –అమరత్వం వరదత్వ మద్భుతం నమః –దివిషద్వర సంభవః కదా తే-మతి హీనాన్ సుమతీన్ కురుష్వ దేవ’’తో సమాప్తి చేసి నృసింహావతార గాధామృతాన్ని పంచి బుద్ధి హీనులను మతిమంతులను చేయమంటూ ప్రార్ధి౦చారు .

3-  రసానందం

రసానంద కావ్యాన్ని ‘’సంస్కృతాంధ్ర మనోజ్ఞ సాహితీ పరి పుష్టు-సత్కావ్య పరిణేత సరసహృదయులు ‘’’’సత్క్రియా శౌన్డు,ప్రౌడార్ధ సర్వ హృద్యు ‘’లైన ఆచార్య ఎస్వి  జోగారావు గారికి శాస్త్రిగారు అంకితమిస్తూ  –‘’శిష్టాన్వయ సుధా మూర్తే జోగారావ మహాశయ-రసానందాభిదాకావ్య కన్యేయం పరి గృహ్ణతాసు ‘’అని కోరారు .ఇది రెండు సర్గల ఖండకావ్యం .కవి గారే దీని విషయం చెబుతూ ఇది నాయిక ప్రధానమని ,విప్రలంభ శృంగారం దట్టించానని,రసమే నాయిక అని ,గణకుడు నాయకుడు .రసో వై సహః అన్న శ్రుతివాక్యానికి అర్ధం వివారించే కావ్యంఅని కల్పిత కద అని కవి కల్పనా  విహార భూమిగా రాసిన ఖండకావ్యమని చెప్పారు .కధ సూక్ష్మ౦ గా-పూర్వం రస గణకా అనే క్షత్రియుడు ఉండేవాడు యుద్ధం లో రాజుకు గణకుడు సాయం చేశాడు .విరహ బాధ .వగైరా కావ్య లక్షణాలు ఉన్నాయి    .ఇష్ట దేవతా స్తుతి చేశారు . ‘’కుమార హంతర్భువనస్య శం మే –కుమారతాం దేహి వివేక యుక్తాం-కుమారా ప్రవృద్ధిం సుకుమార గాత్రా –కుమారా భోశ్శంభుగుమాసుతః త్వం ‘’-తర్వాతగురు స్తుతి కుకవి నింద,సుకవి ప్రస్తుతి యధా ప్రకారం చేసి కావ్య ప్రారంభం చేశారు .

ఇది పూర్వ శృంగార కావ్యాలపై అధిక్షేపణ .వాటిల్లో  సభ్య శృంగారం తక్కువ గా ఒకే మూసలో  ఉండటం వలన జనాలకు శృంగార కావ్యాలపై అయిష్టత కలిగిందని,దానివలన కావ్య ప్రయోజనానికి నష్టం వాటిల్లినదని కనుక వాటికి భిన్నంగా తాము దీన్ని రాశామని నేను ఈ రోజు ఫోన్ చేసి అడుగగా వివరంగా తమ కావ్యాల గురించి తెలియ జేస్తూ చెప్పారు .ఇందులో నాయికా నాయకులు భార్యా భర్తలేనని,విప్రలంభ శృంగారం ప్రధానంగా రాశామని ,చివరకు ఇద్దరూకలవటం ధర్మ శృంగారానికి కులపాలికా ప్రణయానికి విలువ నిచ్చామని ,దంపతుల మధ్య స్నేహం వర్దిల్లాలన్నది ఆశయమని ,పూర్వపు కవులు నాయిక బాహ్య  సౌ౦దర్యాన్నితెగ వర్ణించి జుగుప్స కలిగించారని స్త్రీ అంతస్సౌన్దర్యం పై వారి దృష్టి పడలేదని ,తాము అంత స్సౌన్దర్యానికి అధిక ప్రాధాన్యమిచ్చి రాశామని ,దివ్యమైన ,ఆదర్శ శృంగారమే తమ ధ్యేయ మని తెలియ జేశారు .

‘’కాచిత్కాంతా చలిత వసనా లంబనా స్విన్నపాణిః  -లోలే నేత్రే ప్రియ విరహ జాన్ స్వేద బిందూన్ ధరంతీ-పుష్పాశ్రీకం రణభువి  జయశ్రీ సమేతస్య గంతుం –సేనాభర్త్రుశ్చలిత కరణా సద్య మత్యుఃప్రతస్తే ‘’అని మొదటి సర్గ ప్రారంభించారు .రెండవ సర్గ –‘’స్వల్పం కాల౦ బహుమివ తతో వైపరీత్యం విధాత్రీ –ఇచ్చాశక్తి ర్జయతి మహతస్సర్వ వేత్రుః స్మరారేః-శ్రుత్వా వాచం పతి నిగదితాం సా రసాసారసాక్షీ –మోహోచ్చిత్తే రాభవదివ సద్యోగినీభర్త్రు హృష్టిః’’అని ముగించారు .

ఇందులోనే మరొక చిన్న 51 శ్లోకాల ‘’మాయా మర్కరికం  ‘’కూడా ఖండకావ్యం ఉంది .దీనికధ సంగ్రహం గా తెలిపారు కవి .

 

4- చైతన్యానందనం

దీన్ని తమ పితృపాదులు శ్రీ సన్యాసి శర్మగారికి అంకితమిచ్చారు .ఇది విశ్వ చైతన్యానికి అనునాదం అని,కవి ప్రతిభ పలుపోకడలు పోయి అద్భుత ఆవిష్కారం చేశారని  ఆచార్య ఎస్వీ జోగారావు కీర్తించారు .ఇందులో ‘’స్వర్ణధారా స్తుతి ‘’,కుమార స్తుతి ,గణేశ పంచరత్నమాల ,తెలుగులో శ్రీరామ సీసమాలిక ,శ్రీకంఠశతకం శ్రీ శక్తి నుతి ,ఉపగ్రహనుతి ,శుకాలాపం, స్త్రీ విద్యా, నందనాశోకం మొదలైనవి ఉన్నాయి .

ఇందులో అమ్మవారి  శక్తి స్వరూప వర్ణన చేశారు.దీనికి ప్రేరణ శ్రీ కావ్య కంఠగణపతి ముని రచించిన ‘’ఉమా సహస్రం ‘’ శంకారాచార్యులవారి’’ సౌందర్య లహరి ‘’అని నాకు ఫోన్ లో చెప్పారు .ఇందులో దిక్పాలక స్తోత్రాలు కూడా ఉన్నాయి .యమ ధర్మ రాజును ధర్మ  ప్రభువుగా పక్షపాత రహిత ప్రవర్తకునిగా ,దయా స్వరూపునిగా   నచికేతుని కి ఆత్మ దర్శనం బోధించిన మహా యోగిగా తాము వర్ణించినట్లు తెలిపారు .ఎవరూ ఉపగ్రహాలపై రాయలేదని తాము రాశామని చెప్పారు .ఇందులోని హనుమ దండకం లో ఆయన నవ వ్యాకరణ పాండిత్యానికి అద్దంపట్టేట్లు వ్యాకరణ ప్రయోగాలతో స్వామి శక్తి భక్తీ అనుగ్రహ శక్తి వర్ణించామన్నారు .’’జయ జయ జయ సీతా హ్రుదంత రస్థ శోకాగ్ని నిర్వాపకా౦భోజ మిత్రా త్సమాదీన సౌ శబ్ద వాచా సమాకృస్ట మోమోద్యమా నౌ ర్మిలే యాగ్రజ!అని ప్రారంభించి ‘శ్రియం శేముషీ జ్ఞాన వైరాగ్యం ప్రదస్వ రామనామేన హ్రుస్దాత్మ జీవనం చిరం భాహి మచ్చేతసి శ్రీ హనూమాన్ నమస్తే నమస్తే నమస్తే నమః ‘’అని ముగించారు

నందనా శోకం లో అశోకుని ఆధ్యాత్మిక మార్గాన్ని వివరించామని అన్నారు .

 

5-కావ్య మంజరి

ఇందులో దత్తాత్రేయాస్టకం,వారాణసేయం(లఘుకావ్యం )చందన కృష్ణం ,శ్రీ దత్త మధు మతీయం ,శ్రీ రత్నావళీ ,ప్రేమామృత మహాకావ్యం ,సుందర సుందరం ,అధికారిక పురుష స్తుతి ,శ్రీ దశ విద్యా ధ్యానం ఉన్నాయి .ఉపోద్ఘాతం లో శాస్త్రిగారు శ్రీ హర్షాది మహాకవుల ప్రేరణ వలన తాముకావ్య మంజరి రాశామని ,హర్షుని వలెనె తామూ అక్కడక్కడ గూఢంగా మంత్రం శాస్త్రాన్ని నిక్షిప్తం చేశామని,నారాయణం లోని మంత్రం శాస్త్రాన్ని మధుమతీయం లో చూపానని ,దత్తాత్రేయ మాయ నూ ,సుందర సుందరం లో మంత్ర శాస్త్రార్ధాన్ని వివరించామని తెలియ జేసి తమ మంత్ర శాస్త్ర మహా పాండిత్యాన్ని మహాకావ్యాల గూఢ నిర్మాణ చాతుర్యాన్ని తమ కావ్యాలలో ప్రతిఫలింప జేసి తరించి మనలనూ తరి౦ప జేశారు .అన్నీ చక్కగా తాపీగా చదివి ఆనందించి అనుభవించాల్సిన కృతులే.వారి మేధో వికసనానికి ,పాండిత్య గరిమకు ,శాస్త్ర పాండిత్యానికి ఇవన్నీ మచ్చు తునకలే . కొన్ని శ్లోక రత్న కాంతుల్ని దర్శిద్దాం –

1-దత్తాత్రేయాస్టకం  లో –‘’జ్ఞానం స్వార్జిత మా దదాతిహి చతుర్వశాత్మకం సేవినాం

రమ్యం సాంకృత యే విధూత చరితం చక్రే కృతార్ధం దదత్ –భక్తంస్థాపయతి స్మయో హృజాగాకార స్థితౌ నిర్మలః

-స శ్రీ మన్నారసింహ సద్యతివరో దృష్ట్వా పిశాచాన్తకః –సోహం దత్త దిగ్భరో వసతుమే చిత్తే మహాన్ సున్దరః ‘’

2- శ్రీ వారాణసేయం-శ్రీశైల భూద్రే శ్రిత కల్ప కోటే ర్హార్తెర్హరస్యా ధ్వరసంగామేషు –నిత్యాన్న దానేన యశః ప్రకాశీగానస్య మాహూయ గురుప్రియం మాం .

‘’కురంగ నేత్రీ భువన ప్రసూః స్వయం విశాలనేత్రీ మభి వీక్ష్య ముగ్దా-వివాద మండోరుభయో ర్వివిస్యయా-కురంగి కాగత్య చాలా విలజ్జితా .

3- చందన కృష్ణం –శ్రీ కృష్ణో నవ మేఘః పాయాత్సహిత్యజలనిదీ రుచిరః –బాహ్యాభ్య౦తర శుచినం రసోద్రేకః’’

‘’కృష్ణస్య చందన మయస్య పరీమలోయ –ముజ్జ్ర్హు౦భతే హి కుసుమేషు వనేషు చంద్రే –ఆత్మాను భూతిరివ దివ్యకలాసు గోపీ-శ్రుత్య౦గనాస్తు కుసుమాయుధ బాణ పాతః ‘’అంటూ పరమ సుకుమారం గా కుసుమకోమలంగా చందన చర్చ లా రాశారు .

4-సుందర సుందరం లో సంగ్రహంగా సుందర కాండను చెప్పారు .

5-ప్రేమామృతం లో బుద్ధ భగవానుని అహింస దయ సానుభూతి ,అనుకంప గురించి చెప్పామని , బుద్ధుడు బౌద్ధ సిద్ధాంతం అనేదేమీ బోధించలేదని ,ఆయనకు ఆతీత ,అనాగత జ్ఞానం ఉన్నదని అందుకే రాబోయే కాలం లో వచ్చే శంకర ,రమణమహర్షి శ్రీ రామకృష్ణ లు చెప్పే సమన్వయ మార్గాన్ని ముందే చెప్పాడని ఆయన బోధించింది భారతీయ సంస్కృతీ ,సర్వ మత  సమానత్వమే నని తాను ఇందులో తెలియజేశానని శ్రీ శాస్త్రి గారు ఈ రోజు నాకు ఫోన్ లో తెలియ జేశారు .

భారవి మాఘ కావ్యాలోని ప్రకృతి ,జ్యోతిషం ,చంద్రునికి చుట్టూ గుడి కట్టటం ,మొదలైన వానిలో ఉన్న విజ్ఞాన విషయాలను ,విశేషాలను తాను మళ్ళీ తన భాషలో లోకానికి ఎరుక బరచానని అన్నారు .’’ఆధికారిక పురుష స్తుతి ‘’భాగవత౦లొ చెప్పబడిందని ,అందులో మహా యోగులు సర్వ కాల సర్వా వస్థలలో సూక్ష్మ రూపం లో ఉంటారన్న విషయాన్ని వివరించామని తెలియ జేశారు .’’దశ మహా విద్యా ధ్యానం ‘’లో ఒకే శ్లోకం లో దేవతలందరూ వచ్చేట్లు రాశానని చెప్పారు –

‘’యా దేవీ జీవ శక్తిః ప్రణవ ర్వినిహితా వాజ్మయీసత్య రూపా –జాగ్రత్స్వప్న ద్యవస్థాస్వపి లాసన పరా కాశారుణా శుభాంగీ

విద్యుత్పూ షాగ్నికా౦తి ర్వ్యపగతాని  నదోచ్చార్య మాణా సుభాగ్యా –స్వా౦తా౦తిక్రాంతి విద్ దావతమ సమాహితా పాతువిశ్వంభరా నః’’అనే శ్లోకం తో మంజరికి సమాప్తి పలికారు .

శ్రీ నిష్ఠల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి వైదుష్యం మహా దొడ్డది .వారి కావ్యాలూ మహోన్నత భావ పరంపరతో అలరారేవి .వాటిలోని అర్ధాన్ని ,పరమార్ధాన్ని గ్రహించటానికి ఎంతో విద్వత్తు, అవగాహన ఉండాలి .అవి ఉన్న వారు అందులో రసానందాన్ని బ్రహ్మానంద సహోదరత్వాన్ని తప్పక అనుభవిస్తారు .సామాన్యులు అర్ధం చేసుకోవటానికి వాటిని తెలుగు లిపిలో రాయటం ,భావాన్ని వివరించటం కావ్యాలలో విషయాన్ని సంక్షిప్తం గా తెలుగులో చెప్పటం  అవసరం .శాస్త్రిగారే ఆ పని చేసి లోకోపకారం చేయాలని నిండు మనసుతో వారిని ప్రార్ధిస్తూ ,వారి నుండి మరిన్ని అనర్ఘ రత్న రాశులు వెలువడాలని ఆశిస్తూ ,వారిని పరిచయం చేసే అవకాశం నాకు లబించినందుకు గర్విస్తూ ,వారు వాత్సల్యం ప్రేమ తో నాతో ఫోన్ లో మనస్పూర్తిగా మాట్లాడి ,నా అజ్ఞతను మన్నించి వారి హృదయాన్ని ఆవిష్కరించినందుకు కృతజ్ఞతలు తెలుపుకొంటూ ,వారిని గూర్చి రాయాల్సిన అవసరాన్ని నాకు ఫోన్ లో బోధించి ,వారి ఫోన్ నంబర్ నాకు ఇచ్చి వారితో మాట్లాడించిన సహృదయులు ,మార్గ దర్శి డా శ్రీ తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రిగారికి ధన్యవాదాలు తెలియ జేస్తున్నాను .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -20-1-17 –ఉయ్యూరు

 

 


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

విహంగ – సన్మానం

dsc_0034

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3- 40-వెయ్యి శ్లోకాల ‘’చైతన్య నందనం ‘’కావ్య కర్త శ్రీ నిష్ఠల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3-

40-వెయ్యి శ్లోకాల ‘’చైతన్య నందనం ‘’కావ్య కర్త శ్రీ నిష్ఠల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు

మాణిక్యం తాను వెలుగు లోకి రాదు .దానిని మనమే వెతికి వెలుగులను దర్శించాలి .అలాగే కొందరు మహానుభావులు తమ గురించి ప్రచారం చేసుకోరు .ఎవరో వారి ప్రతిభ గురించి చెబితే మనం వారిని కలిసికాని , వారితో పరిచయం ఉన్నవారి ద్వారా వారి ని తెలుసుకొని పరిచయం చేయాలి. వారు ఇలాంటి ఆరాటం ,ఆర్భాటంకోరుకోరు .వారిని గురించి తెలియ జెబితే ఎందరికో వారి చరిత్ర స్పూర్తి దాయకమై ప్రేరణ పొందుతారు .అందుకే నా తపన.నాఈ ఆరాటాన్ని అర్ధం చేసుకొన్నవారు డా.శ్రీ తూములూరు శ్రీ దక్షిణామూర్తి శాస్త్రిగారు . రెండవ గీర్వాణానికి ప్రోత్సాహక ,ప్రోద్బలాలు వారివే. .సంక్రాంతి ముందు వారికి శుభాకాంక్షలను ఫోన్ ద్వారా తెలియ జేస్తుంటే వారు ‘’ప్రసాద్ గారూ !మన రెండవ గీర్వాణ౦ లోనే చోటు చేసుకోవాల్సిన మహా సంస్కృత విద్వాంసులు ,30 ఏళ్ళు నాతో పొన్నూరు సంస్కృత కాలేజి లో సంస్కృత లెక్చరర్ గా పని చేసి రిటైర్ అయిన  వారు ,రోజూ ఉదయం కనీసం అయిదారు గంటలు తపోధ్యానాలతో  నిష్టగా గడిపేవారు  రసానందకావ్యం ,,,నవగ్రహ స్తుతి వంటి గొప్ప సంస్కృత రచనలు చేసిన నా మిత్రులు శ్రీ నిష్ఠల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి గురించి మీరు గీర్వాణం -3 లో తప్పకుండా రాయాలి ‘’అని చెప్పి వారి ఫోన్ నంబర్ ఇచ్చి మాట్లాడమన్నారు .నేను శాస్త్రిగారితో మాట్లాడి నా కృషి వివరించి ,వారిని గురించి రాసే అవకాశం నాకు కల్పించమని  వారి  పరిచయం, బయో డేటా ,పుస్తకాలు నాకు పంపమని , .లేదంటే మా పుస్తకాలు వారికి  పంపాక చూసి అప్పుడు పంపమని  ‘’అన్నాను .వారు ‘’సంతోషం .నేనే మీకు ముందు పంపిస్తాను ‘’అన్నారు. సంతోషం వేసింది .ఇవాళే వారి నుంచి 4 పుస్తకాలు వారి బయోడేటా కొరియర్ లో నాకు అందాయి .కనుక 40 వ కవిగా వారిని మూడవ గీర్వాణం లో పరిచయం చేస్తున్నాను .ఈ సందర్భంగా శ్రీ తూములూరు వారికీ ,శ్రీ సుబ్రహ్మణ్య  శాస్త్రి గారికీ కృతజ్ఞతలు అందజేస్తున్నాను .

వంశ చరిత్ర

శ్రీ నిష్ఠల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు 17-9-1953 న విజయ నామ సంవత్సర భాద్ర పద శుద్దనవమి నాడు శ్రీమతి కామేశ్వరమ్మ ,శ్రీ సన్యాసి శర్మ దంపతులకు జన్మించారు .విజయనగరం దగ్గర ‘’ఇంగిలాపల్లి ‘’అగ్రహారం వీరి ప్రాచీనుల నివాసం .వీరి మూల పురుషులు శ్రీ వేంకట భట్టు అరికాళ్ళలో శంఖ చక్రాలున్న మహా యోగులు .వీరి కుమారులు శ్రీ అప్పన్న శాస్త్రి గారు కొండా కోనలలో తపస్సు చేసేవారు .ఒక సారి గజపతి నగరం మహా రాజు ఏదో సమస్యతో బాధపడుతూ ఉన్నప్పుడు శ్రీ అప్పన్న యోగి కలలో కన్పించి పరిష్కారం సూచించారు .రాజు సమస్య తీరి ఆనందం తో యోగిగారికి ఒక అగ్రహారం బహూకరించారు .రెండవ కుమారులు శ్రీ కామ శాస్త్రి శ్రీ చక్రార్చనా నిష్ణాతులు.వీరు నిష్టగా అమ్మవారిని పూజించే సమయం లో అమ్మవారు ఘలు ఘల్లున  శబ్దం చేస్తూ అందేలా రవళి వినిపిస్తూ , నడిచి వచ్చేదట .వీరి పెద తాతగారు మహా వైయాకరణులు బ్రహ్మశ్రీ తాతా సుబ్బారాయ శాస్త్రి గారి శిష్యులు ..తాతగారు శ్రీ సింహాచల శాస్త్రి గారు .వీరు ‘’లక్షణాపరిణయం’’ భద్రాచల మహాత్మ్యం మొదలైన 6 గ్రంధాలు రాశారు .వీరు ప్రముఖ ఆయుర్వేద వైద్యులేకాక మహా పౌరాణికులు కూడా .లక్షణా పరిణయానికి శ్రీ కట్టమంచి రామలింగా రెడ్డి గారు పీఠిక వ్రాశారు .ఇది 1955-59 కాలం లో భాషా ప్రవీణ సిలబస్ లో ఉన్నది .

జనన విద్యా –వ్రుత్తి విశేషాలు

సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తండ్రి గారు శ్రీ సన్యాసి శర్మగారు .సాహిత్య వేదాంత పండితులు  .సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పొన్నూరు ,తెనాలి సంస్కృత కళాశాలలో గీర్వాణ ఆంద్ర సాహిత్యాలు అభ్యసించారు .వీరు తండ్రిగారి వద్దా ,బ్రహ్మశ్రీ సూరి రామ కోటి శాస్త్రి ,శ్రీ పోతుకూచ్చి సుబ్రహ్మణ్య శాస్త్రి ,శ్రీ ముళ్ళపూడి సుబ్రహ్మణ్య శాస్త్రి ,శ్రీమాన్ అప్పన్న ,శ్రీమాన్ వేదా౦తమ్ సీతారామాచార్యులు ,శ్రీమాన్ పరాశరం కృష్ణమాచార్యులు ,శ్రీ ఉప్పల కోటయ్య ,గార్ల వద్ద విద్య నేర్చారు.తెనాలి, పొన్నూరు సంస్కృత కలాశాలలో  సంస్కృతం తెలుగు బోధించారు .సాహిత్య విద్యా ప్రవీణ ,భాషా ప్రవీణ ,వ్యాకరణం లో ఎం. ఏ .దర్శనాలలో ఎం ఏ .అలంకార శాస్స్త్రం లో ఎం ఏ .తెలుగులో ఎం ఏ .,విద్యావారధి ,పి హెచ్ డి.పూనే యూని వర్సిటి ,తిరుపతి యూని వర్సిటీలలో శిక్షణ పొందారు .ఆకాశవాణిలో బహు ప్రసంగాలు చేసిన దిట్ట .

. పొన్నూరు శ్రీ భావనారాయణ స్వామి సంస్కృత పాఠశాలలో సంస్క్రుతపండితులుగా ,చిట్టి గూడూరు శ్రీ నారసింహ సంస్కృత కళాశాలలో సంస్కృత ఉపన్యాసకులుగా ,చెన్నై లో శ్రీ శంకర విద్యాలయం లో సంస్క్రు పండితులుగా పని చేశారు .30 ఏళ్ళు పొన్నూరు శ్రీ భావనారాయణ స్వామి సంస్కృత కళాశాలలో సంస్కృత అధ్యాపకులుగా పని చేశారు

ఉపాసన –జ్యోతిష్యం

శాస్త్రిగారు గొప్ప హనుమత్ ,సుబ్రహ్మణ్య ,దత్తాత్రేయ ,దుర్గా ఉపాసకులు .జాతక ముహూర్తాలు చెప్పటం ఆధ్యాత్మిక ఉపన్యాసాలు చేయటం తో వీరు కాలాన్ని సద్వినియోగం చేస్తున్నారు .శ్రీ ధర్మ స౦వర్దనీ పరిషత్ ను స్థాపించి ధర్మ ప్రచారం చేస్తున్నారు .శాస్త్రి గారు ‘’సాహిత్య శిరోమణి ‘’బిరుదాంకితులు .వాస్తు శాస్త్రం లో ఉద్దండ పండితులు .గుంటూరు ఓంకార క్షేత్రం ,తెనాలి బ్రాహ్మణ సంఘం సమ్మానాలు పొందారు .చెన్నై సంస్కృత కళాశాల అధ్యాపక నియామకం లో ఇంటర్వ్యు మెంబర్ గా ,రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్  గ్రంధ ప్రచురణ కు పరిశీలకులు ,రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ విద్యావారిది కి పంపబడే పరిశోధనా గ్రందాల పరిశీలకులుగా శాస్త్రి గారి సేవలను విని యోగించుకు౦టున్నారు .ఆసియన్ అమెరికా వారి ‘’ఎవరెవరు ‘’అనే గ్రంధం మూడవ సంపుటిలో శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారి పేరు చేర్చి వారి భాషా సేవకు గౌరవ స్థానం కల్పించారు .

రచనా శాస్త్రీయం

సుమారు 55 పత్రికలలో సాహిత్య ,ఆధ్యాత్మిక వ్యాసాలు  రాశారు శాస్త్రిగారు .ఆకాశవాణి విజయవాడ కేంద్రం లో సంస్కృత పాఠాలు ,ప్రసంగాలు సుమారు50 దాకా చేశారు .ఎన్నో దేవాలయాలలొఆధ్యాత్మిక ప్రసంగాలు చేశారు .ధర్మ జ్యోతి మాసపత్రికలో ఆధ్యాత్మిక వ్యాసాలూ జ్యోతిష ప్రశ్నావళి నిర్వాహిస్తున్నారు .

1985 లో ‘’సాహితీ మేఖల ‘’తరఫున ‘’రత్నకవి సాహిత్యాను శీలనం ‘’అనే 250పేజీల పరిశోధనా వ్యాసం రాసి ప్రధమ బహుమతి పొంది ,సత్కారం అందుకున్నారు .1986 లో ‘’భాగవతము –అద్వైతం ‘’అనే పరిశోధనా వ్యాసానికి బహుమతి నిచ్చి భీమవరం లో సన్మానం చేశారు .మేఘ సందేశం ,కళ్యాణ చంపువు మొదలైన కావ్యాలకు పీఠికలు చేకూర్చారు .సంస్కృత పత్రికలు  సంవిత్ ,సూర్యోదయః సప్తగిరి,బాలభారతి గైర్వాణిలలోను ,తెలుగు పత్రికలూ రామకృష్ణ ప్రభ ,భారతి ,ఆరాధన ,ముముక్షువు ,పాపయా రాధ్య ,శ్రీ శైల ప్రభ ,వేద పరిషత్ ద్యానమాలిక ,ఆత్మ జ్యోతి ,ధర్మ జ్యోతి ,బ్రహ్మ తేజం లలో లెక్కకు మించి వ్యాసాలూ రాశారు .బ్రహ్మ తేజం పత్రికలో ‘’ధర్మ శాస్త్రాలలో బ్రాహ్మణుడు ‘’సీరియల్ రచన  చేశారు .

శాస్త్రిగారి పరిశోధనా పత్రాలలో ముఖ్యమైనవి –కుజ దోష సర్వస్వం కుజ దోష చర్చ ,స్తానివద్భావం

సంస్కృత గ్రంధ రచన

1-నవ గ్రహ స్తుతి (సంస్కృత –తెలుగు వ్యాఖ్యానం తో )2-రసానందం (ఖండ కావ్యం )3-రత్నకవి సాహిత్యాను శీలనం (రత్న కవి రచనలపై విమర్శనాత్మక గ్రంధం )4- చైతన్య నందనం (1000 శ్లోకాల కావ్యం )5-వీరభద్ర విజయం 6-శ్రీ బాలా త్రిపుర సుందరీ సుప్రభాతం 7- శ్రీ వీరభద్ర కరావలంబ స్తోత్రం 8-శ్రీ త్రిపురాంతకేశ్వర స్తోత్రం 9- కావ్య మంజరి (దత్తాత్రేయ అష్టకం ,శ్రీ దత్త మధుమతీయం (3 సర్గలు )చందన కృష్ణం (15 0శ్లోకాలు )ప్రేమామృత మహా కావ్యం(19సర్గలు )సుందర సుందరం (సుందర కాండ )మొదలైనవి .

తెలుగు రచనలు

వీరభద్ర విజయం ,కవితా మకరందం ,మీరూ సంస్కృతం నేర్చుకోండి ,విజయబాల నాటిక ,జాతక రాజీయం తెలుగు అనువాదం ,పరశు రామాయణం ,శ్రీ కుమార నాగ దేవతా సర్వస్వం ,మంచి-చెడు మహా శక్తి  పూజా విధానం ,భారతీయ సంస్కృతీ మూడుభాగాలు ,మనకోటప్ప ,అయ్యప్పస్వామి వ్రత కల్పం ,దుర్గా సప్తతి తెలుగు అనువాదం భావ కేరళులు –జ్యోతిష గ్రంధం ,ధర్మ గంగ రెండుభాగాలు నవభారతం -300 పద్యాలు ,స్వయంవర కళా స్తోత్రం –శ్రీ దుర్వాసముని స్తోత్రానికి తెలుగు అనువాదం ,పూజాకుసుమాలు .

ఇంతటి విద్యున్మణిశ్రీ నిష్ఠల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి గీర్వాణ కవితా గీర్వాణం గురించి తరువాత తెలుసుకొందాం .

శాస్త్రిగారి ఫోటో జత చేశాను చూడండి .

సశేషం

మీ-గబ్బిట  దుర్గా ప్రసాద్ -19-1-17 –ఉయ్యూరు

 

 

nistala

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

డా.శ్రీ రంగ స్వామి గారితో 22 ఏళ్ళు గా సాగుతున్న సాహితీ అనుబంధం

డా.శ్రీ రంగ స్వామి గారితో 22 ఏళ్ళు గా సాగుతున్న సాహితీ అనుబంధం

1994 ఫిబ్రవరి లో అఖిలభారతీయ సాహిత్య పరిషత్ సభలు మూడు రోజులపాటు రాజమండ్రి లో జరిగాయి .ఆ సంస్థ అధ్యక్షులు  కదా రచయితా విమర్శక,విశ్లేషకులు నాకు పరమ ఆప్తులు కుటుంబ స్నేహితులు  స్వర్గీయ ఆర్ ఎస్.కె మూర్తి గారు రమ్మని ఆహ్వానిస్తే, నేనూ మా బావమరది ఆనంద్ కలిసి వెళ్లాం .మూడు రోజులు కవితా గోస్టులు సాహిత్య ప్రసంగాలు ,చర్చలు దిశానిర్దేశాలు ,కవి సమ్మేళనాలు పెండ్లి భోజనాలకు మించిన షడ్ర సోపేత భోజనాలూ జనాలను అలరించాయి.సు.ప్రసిద్ధ కధకులు శ్రీ కప్పగంతుల మల్లికార్జున రావు గారు చాలా సమర్ధంగా నిర్వహించారు .జీవితం లోమర్చి పోలేని మహానుభవం అది .అక్కడే మొదటిసారిగా శ్రీ జానకీ జాని పరిచయం అయ్యారు .ఆ మూడు రోజులూ వారి వెంటే మేమిద్దరం తిరిగాం .వారు విశ్వనాధ కల్పవృక్షాన్ని మాకు ఆవిష్కరి౦చి చెబుతూంటే మధ్యమధ్యలో చుట్టకాలుస్తూ ఆనందిస్తుంటే  మాకు సభలు పూర్తీ అయినాక అర్ధ రాత్రిదాకా జానకీ జాని తోనే కాలక్షేపం .ఆ మూడు రోజులు మాకు మూడు స్వర్ణ యుగాలు అనిపించాయి .అక్కడే ఆచార్య జి వి సుబ్రహ్మణ్యం ,మల్లంపల్లి శరభయ్య గారు ,సుప్రసన్న, సంపత్కుమారాచార్య గార్లు ,తనికెళ్ళ భరణి ,వాకాటి పాండురంగా రావు గారు మొదలైన హేమా హేమీలతో తోలిపరిచయమైంది .అప్పుడే డా టి రంగ స్వామి గారితోనూ పరిచయమైంది .

తొలి పరిచయం మలి పరిచయంగా వారు వరంగల్ లో శ్రీలేఖ సాహితీ ఆధ్వర్యం లో జరిపిన రెండు రోజుల సాహితీ కార్యక్రమానికి ఆహ్వానించగా నేను వెళ్లాను .నిండైన కార్య క్రమ రూప కల్పన చేసి  విజయవంతం చేశారు .ఇక్కడ తమిళ దేశం వాడు విశ్వనాధ వేయి పడగలలో సాంఘిక విషయాలపై అనేక వ్యాసాలూ పుస్తకాలు రాసిన నట రాజన్ ?గారితో పరిచయం అయింది .స్వామిగారితో పరిచయం తర్వాత లేఖలద్వారా గట్టిపడింది .ఫోన్ల సంభాషణ సాగింది సరసభారతి స్థాపించి పుస్తకాలు ముద్రించాక మన పుస్తకాలు వారికి పంపటం ,వారివి మనకు అందజేయటం తో సాహిత్య బంధం ద్రుఢతరమైంది .ఇలా 22 ఏళ్ళుగా ఈ బంధం ,సాహితీ అనుబంధం కొనసాగుతోంది .సాహితీ  లబ్ధ ప్రతిస్టులైన స్వామి ఆ రంగం లో నడక నేర్చుకొంటున్న నాతో   ఈ బంధాన్ని సాగించటం వారి హృదయ వైశద్యానికి తార్కాణ. విశ్వ నాద పై సమగ్ర గ్రంధం వెలువరిస్తున్నామని ,ప్రచురణ పూర్వ విరాళం  ౩౦౦ రూపాయలని ,నాకు సుమారు 20 ఏళ్ళ క్రితం జాబు రాశారాయన.విశ్వనాధపై నాకూ అమిత భక్తీ ఆసక్తీ ఉన్నా ‘’ఆ ! ఈయన పుస్తకం తెస్తాడో లేదో ఎందుకు చేతి చమురు ?’’అని డబ్బు పంపలేదు నేను .ఆయన పుస్తకం తేవటం ,అలాంటివి ఎన్నో గ్రంధాలు ప్రచురించటం జరిగింది. ఆ పుస్తకాన్ని నేను ఎక్కడా కొననూ లేదు సేకరించనూ లేదు.ఆ లోటు అలాగే మిగిలి పోయింది  .  ఇవాళే వారు నాకు ఆప్యాయంగా పంపిన వారి 2015 వ్యాసాల సంకలనం ‘’విష్ణు పద ‘’(గంగ )అందింది ఆబగా చదివేశాను .అందులోని ముఖ్య విషయాలు వివరించే ముందు మీకు వారి ని పరిచయం చేస్తాను .

డా.టి రంగ స్వామి

16-7-190న కరీం నగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పర్లపల్లి లో శ్రీ టి. రామానుజ స్వామి ,శ్రీమతి తాయమ్మ  దంపతులకు  జన్మించారు .బి కాం ,తర్వాత తెలుగు ఎం ఏ ఆచార్య కోవెల సంపత్కుమారాచార్య వారి పర్య వేక్షణలో ‘’విశ్వనాధ వారి కృష్ణ కావ్యాలు ‘’అంశం పై పరిశోధించి పి హెచ్ డి.పట్టా పట్టారు .మధుర ,శిఖర, మానస సంచరరే ,నిరంతరం ,నీల మోహనాస్టకం,సమజ్న,లఘు కావ్యాలు ’’శర వోయె నుండి ఏక శిలకు ‘’అనే అనుసృజన వెలువరించారు .వరంగల్లు జిల్లా రచయితల వాజ్మయ జీవిత సూచిక ,కోవెల సుప్రసన్నా చార్యుల వాజ్మయ ,జీవిత సూచిక ,దేవులపల్లి రామానుజ రావు ,విశ్వనాధ వారి కృష్ణ కావ్యాలు పై పరిశోధన చేసి గ్రంధాలుగా తెచ్చారు .

విపంచి ,సాహితీ గవాక్షం ,శ్రీవ్యాసం ,సమూహ,విశ్వనాధ రామ కృష్ణ ,పొనుక, భారత సవురు మొదలైన వ్యాస   సంపుటులను ,సజీవ చిత్రాలు ,  షుగర్ లెస్ కాఫీ ,కదా సంపుటాలు .70 పుస్తకాలకు ముందుమాటలు రాశారు .

శ్రీలేఖ సాహితీ సాహిత్య సంస్థ స్థాపించి 116 పుస్తకాలను స్వీయ సంపాదకత్వం లో 50 గ్రంధాలను ముద్రించారు .ఇంతటి సాహితీవిభవ సంపన్నునికి తగిన గౌరవ పురస్కారాలే లభించాయి .అందులో విజయనగరం విజయ భావన పురస్కారం ,పాలకుర్తి వరంగల్ సోమనాధ కళాపీఠపురస్కారం ,తేజ సాహిత్య పురస్కారం ,వానమామలై వరదాచార్య స్మారక పురస్కారం ,తెలుగు విశ్వ విద్యాలయ కీర్తి పురస్కారం వంటివి ఎన్నో అందుకున్నారు.

గోదావరి ఖని కళాజ్యోతి వారు ‘’దశాబ్ది ఉత్తమ విమర్శక ‘’బిరుదు ,ఎస్ ఇ టి ఒంగోలు  వారు ‘’సాహిత్య రత్న ‘’,వరంగల్ సాహితీ సమితి ‘’నవభారత సాహిత్య రత్న ‘’చీరాల సహజ సాహితీ ‘’సాహితీ వశిష్ట ‘’,బిరుదులను ప్రదానం చేశాయి .నాలుగు శతాబ్దాల సాహిత్య కృషికి అభినందన గా ‘’సుధా వర్షి ‘’ప్రత్యేక సంచికను వెలయించారు .

సాహితీ హిమోత్తుంగ రంగ స్వామిని గారిని ఈ కొంచెం ‘’పరిచయ అద్దం ‘’మీకు చూపించాను .

విష్ణుపద

కవిత్వం రాయటం కంటే విమర్శ రాయటం గొప్ప సాహిత్య సేవ అన్నారు శ్రీ స్వామి .కవిత కవికి పేరు తెస్తే విమర్శ కవితకు పేరు తెస్తుంది అన్నారాయన .ఇందులోని 12 వ్యాసాలూ 2015 లో రాసినవే .వాటిని ఇక్కడ కూర్చారు.ఉత్తర గోదావరీపరీవాహక సాహిత్యం ,కాళోజీ గారి అన్న కాళోజీ రామేశ్వర రావు గారి గురించి ,విశ్వనాధ ‘’కేదార గౌళ ‘’లోని మాధుర్యాన్ని ,విహారి పద చిత్ర రామాయణం లోనిరామ సుగ్రీవ మైత్రి ,దాశరధి రంగా చార్య నవల ‘’రానున్నది ఏదినిజం ‘’పైనా ఒద్దిరాజు సోదరుల సాహితీ సేవ మొదలైన వాటి గురించి రాస్తూ ఆ ప్రాంతం లోని కవులను సాధ్యమైనంతవరకు స్పృశిస్తూ వారి రచనలను పేర్కొంటూ ఒక రకంగా కైమోడ్పు ఘటించారు . ప్రతి విషయాన్నీ లోతుకు వెళ్లి శోధించి నిజాలు వెల్లడించటం స్వామిగారి ప్రత్యేకత .ఆ యా ప్రాంతం లో జనం నాలుకలపై నర్తిచే సామెతలు ,ఉర్దూ మిశ్రితపదాలు వాటి అర్ధాలు వాటి వాడుక ,తెలంగాణా మాండలిక పద సౌందర్యం,జాతీయాలు ,బాసర నుండి భద్రాచలం వరకు ఉన్న ఉత్తర గోదావరీ పరీవాహక సాహిత్యం కవులు,కావ్యాలు పుణ్య క్షేత్రాలు ప్రత్యేకతలు ,తెలంగాణా అస్తిత్వ వాదం లపై  సంక్షిప్తంగా  సమగ్రంగా రాశారు .ఆత్మ కధలను సామాజిక ప్రతీకలుగా చూపారు .చివరగా తన ఆరాధ్య ‘’సంపత్ సార్’’గారితో సాగిన సాహితీ మైత్రిని కనులు చెమర్చేలా రాసి నివాళి అర్పించారు . ‘’విష్ణు పద’’ఈ 15 ఘాట్లనుండి ప్రవహించి పవిత్రం చేసింది .అర్ధవంత మైనముఖ చిత్రం లోపలి అంశాలకు మరింత శోభ కూర్చింది .

ఈ వ్యాస సంకలనం నిజంగా ‘’విష్ణు పద ‘’అంటే సాహితీ గంగా లహరి .ఈ పవిత్ర’’ త్రిపధ’’ సాహితీ జలాన్ని ఒడ్డునే ఉండి తీర్ధంగా   పుచ్చుకొన్నా, మునిగి తనివి తీరా స్నాని౦చినా  జన్మ చరితార్ధ మవుతుంది .నాకంటే 10 ఏళ్ళు చిన్నవారైన శ్రీ స్వామి మరిన్ని రచనలు చేస్తూ ,చేయిస్తూ వన్నెకెక్కుతూ శ్రీలేఖకు వన్నె తెస్తూ వెలుగు లీనాలని కోరుతున్నాను .మా ఈ సాహితీ బంధం కలకాలం కొన సాగాలని కోరుకొంటాను .

పుస్తకం ముఖ చిత్రాలను జత చేశాను చూడండి

మీ

గబ్బిట దుర్గా ప్రసాద్ -19-1-17 –ఉయ్యూరు



గబ్బిట దుర్గా ప్రసాద్
vishnupada-2 vishnupada-1

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణం -2 పై విశాఖ నుండివెలువడే ”ప్రసన్నభారతి ”జనవరి సంచికలో ఆచార్య సార్వ భౌమ శ్రీ వేదులవారి సమీక్ష

గీర్వాణం -2 పై విశాఖ నుండివెలువడే ”ప్రసన్నభారతి ”జనవరి సంచికలో ఆచార్య సార్వ భౌమ శ్రీ వేదులవారి సమీక్షvedul-geervanm-2

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

విజయవాడలో 22-1-17 నుంచి 28-1-17 వరకు పౌండరీక యాగం

విజయవాడలో 22-1-17 నుంచి 28-1-17 వరకు పౌండరీక యాగంpounda3 poundarika-1 pounda2

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 39-శ్రీ లంక ఆగమ పండితుడు బహుభాషా వేత్త –కైలాసనాధ కురుక్కాల్

15-8-1921 న జన్మించి 15-8-2,000న 79 వ ఏట  చనిపోయిన కె.కైలాస నాద కురుక్కాల్ శ్రీలంకలో జాఫ్నా జిల్లా నల్లూర్ లో తమిళ బ్రాహ్మణ కుటుంబం లో జన్మించాడు .ప్రాధమిక విద్య నల్లూర్ లోని మంగయార్క రాసి విద్యాలయం లో పూర్తీ చేసి ,జాఫ్నాలోని తిరునల్వేలి కాలేజిలో చదివి ,లండన్ మెట్రిక్ ,ఇంటర్ మీడియెట్ పాసయ్యాడు .పెరడేనియాలోని సిలోన్ యూని వర్సిటిలో సంస్కృతం పాళీ లాటిన్ ఇంగ్లీష్  జర్మన్ ,ఫ్రెంచ్ భాషలు నేర్చి పండితుడయ్యాడు .ఆయన సంస్కృత గురువు ప్రొఫెసర్  బెట్టీ హేమన్ .గురువే స్నేహితుడు ,గైడ్ అయ్యాడు .1948 లో సంస్కృత ఎం ఏ .డిగ్రీ పొంది అదే యూని వర్సిటిలో సంస్కృత లెక్చరర్ గా చేరి పని చేశాడు .

భారతీయ ఇతిహాస ,పురాణ కాలాలపై పరిశోధన చేసి ‘’ఏ స్టడీ ఆఫ్ ఎపిక్ అండ్ పురాణిక్ పీరియడ్స్ ‘’ధీసిస్ రాసి 19 60 లో డాక్టరేట్ పొందాడు .యూనివెర్సిటి ఆఫ్ సిలోన్ రివ్యు లో చాలా పరిశోధనాత్మక వ్యాసాలు  రాశాడు .1974 లో జాఫ్నా యూని వర్సిటీలో మొట్టమొదటి సారిగా ‘’డిపార్ట్ మెంట్ ఆఫ్ హిందూ సివిలిజేషన్ ‘’ఏర్పడినపుడు దాని అధ్యక్షుడిగా పని చేశాడు .ఆర్ట్స్ ఫాకల్టి కి ‘’కో-డీన్ ‘’గా 1976-78 మధ్య ప్రొఫెసర్ ఎస్.గామ్లత్ తో కలిసి పని చేశాడు .ఫైన్ ఆర్ట్స్ అనే రామనాధన్ ఫైన్ ఆర్ట్స్ అకాడెమి కి హెడ్ అయ్యాడు .

శ్రీల౦క ,ఆస్ట్రేలియాలలో చేసిన ఎన్నో యజ్ఞాలకు ముఖ్య పురోహితుడుగా వ్యవహరించాడు .శ్రీలంకలోని పుట్లాం జిల్లాలోని మున్నేశ్వరం దేవాలయానికి ముఖ్య పూజారులలో ఒకరుగా ఉన్నాడు .శ్రీలంక లోని ‘’పంచ ఐశ్వర్య దేవాలయాలలో’’ ఇదొకటి .

సంస్కృత గ్రంధాలపై హిందూ సంస్కృతీ నాగరకత లపై  విస్తృత పరిశోధన చేశాడు కైలాసనాధ కురుక్కాల్ .శ్రీలంకలో ఇతర దేశాలలో జరిగిన చాలా సెమినార్లలో పాల్గొని వీటిపై పైశోధన వ్యాసాలూ రాసి సమర్పించాడు .1997 లో లండన్ లోని ‘’శ్రుతి లయ సంఘం ‘’పంచ ఐశ్వర్యం పై ఒక నృత్యనాటకాన్ని ప్రదర్శించాలని సంకల్పించి ,కైలాసనాధ కురుక్కాల్ ను సంప్రదిస్తే తానూ ఒక ఐశ్వర దేవాలయం తో సంబంధం ఉన్నవాడుకనుక ఆ  సబ్జక్ట్ పై  కూలంకషంగా రిసెర్చ్ చేసి  విషయాలను సమగ్రంగా అందజేసి వారికి సహకరించాడు  .లండన్ లోలండన్ యూని వర్సిటి  లోగాన్ హాల్ లో 16-10-1999 న ‘’పంచ ఐశ్వర్యం ‘’నృత్య నాటకం ప్రదర్శించారు .గొప్ప స్పందన లభించి కురుక్కాల్ వైదుష్యానికి బహుదా ప్రశంసలు లభించాయి .ప్రదర్శనకు కొద్దికాలం ముందే కురుక్కాల్ భార్య పరమపది౦చింది .అయినా లండన్ వెళ్లి ప్రదర్శనలో పాల్గొని అందరి అభిమానం పొందాడు

1988 లో జాఫ్నా యూని వర్సిటి కురుక్కాల్  కు డిలిట్ఇచ్చి గౌరవించింది .అసోసియేషన్ ఆఫ్ ఆర్ట్స్ వారు గౌరవించి సత్కరించారు .1993 లో శ్రీలంక ప్రభుత్వం ‘’వేదాగమ మామణి’’బిరుదునిచ్చి సన్మానించింది .1998 లో కురుక్కాల్ రిటైర్ అయ్యాక కూడా జాఫ్నా యూని వర్సిటి ఆయన్ను ‘’ప్రొఫెసర్ ఎమిరిటస్ ‘’గా గౌరవించింది .

శ్రీలంక లో హిందూ కర్మకాండ అధ్యయనం లో ,నిర్వహణలో కురుక్కాల్ అద్వితీయుడు .శ్రీలంకలో ఉన్న అతి కొద్దిమంది  బ్రాహ్మణ కుటుంబాలు అవసరం వచ్చినప్పుడు ఆయన సలహా సంప్రదింపులు తీసుకొంటూ హిందూ ధర్మ విధులను నెర వేరుస్తారు .

కురుక్కాల్ –సంస్కృత ఈజీ ట్యూటర్ ,హిస్టరీ ఆఫ్ సాంస్క్రిట్ లిటరేచర్ ,రిట్యువల్స్ ఇన్ శైవ టెంపుల్స్ ,హిందూ కల్చర్ -సమ్ దాట్స్ ‘’వంటి వి చాలా పుస్తకాలు రాశాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-1-17 –ఉయ్యూరు

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మహిళా మహిమ విహంగ -గబ్బిట దుర్గా ప్రసాద్

మహిళా మహిమ విహంగ -గబ్బిట దుర్గా ప్రసాద్

 (11-1-17 న విహంగ వార్షికోత్సవం సందర్భంగా)

సరైన వనరులు ,సాంకేతిక పరిజ్ఞానం లేని సమయం లో తెలుగులో ఒక వెబ్ మహిళా మాసపత్రికను స్థాపించి దిగ్విజయంగా ఆరేళ్ళు నడిపి విహంగ రెక్కలకు గట్టితనం చేకూర్చిన సంపాదకురాలు శ్రీ మతి పుట్ల హేమలత గారిని మనసారా అభినoదిస్తున్నాను .పత్రిక మహిళలకు ప్రత్యేకం కనుక వారి సమస్యలు, చిక్కుముడులు, బాధ్యతలు ,సంఘంలో స్థానం ఆకాశంలో సగం అయినా దక్కని హక్కులూ వంటి వాటిని అందరి దృష్టికి తెస్తూ సరైన న్యాయం కోసం పదం కలుపుతూ కదం తొక్కిస్తూ విహంగ అందరి దృష్టినీ ఆకర్షించింది .వినోదం విజ్ఞానం ,యాత్రా సాహిత్యం లేఖలూ ,సాహిత్య వ్యాసాలూ ,పుస్తక సమీక్షలూ అన్నిటికీ సమానమైన స్థానం కల్పిస్తూ  పత్రికా నిర్వహణ జరిగింది .

హేమలత గారితో నాకు పరిచయం విజయవాడలో సుమారు 5 ఏళ్ళ క్రితం జరిగింది . శ్రీ గంధం వేంకాస్వామి శర్మగారి కధా సంపుటి ‘’అమృత హస్తాలు ‘’పై శ్రీ అలిసేటి నాగరాజు పరిశోధన చేసి పుస్తకం ప్రచురి౦చి ఆవిష్కరణ జరిపినపుడు శ్రీ శర్మగారు నాకూ ఆహ్వానం పంపి తప్పక రమ్మని ఫోన్ చేస్తే వెళ్లాను .

అప్పుడు హేమలత గారు నన్ను పలకరించి నేను నడుపుతున్న సరసభారతి బ్లాగ్ బాగా ఉందని తాను రెగ్యులర్ గా చూస్తున్నానని అందులో నా ఫోటోను బట్టి గుర్తుపట్టానని చెప్పారు .తాను విహంగ అనే మహిళా వెబ్ మాసపత్రికను నిర్వహిస్తున్నానని ,వెబ్ సాహిత్యం పై పరిశోధనకూడా చేస్తున్నాని తెలియ జేసి విహంగను చూసి అభిప్రాయం చెప్పమని ,వీలైతే ఏదైనా రాస్తే మరీ సంతోషిస్తానని అన్నారు .సరే అన్నాను .20 12 ఏప్రిల్ లో అమెరికా వెళ్ళినప్పుడు ఒక వ్యాసం మెయిల్ చేశాను .బాగుందని విహంగలో వేసి ,ప్రతినెలా ఒక వ్యాసం వ్రాయమని కోరారు . సాంఘిక సేవలో తరించినవారు ,విలువైన సాహిత్యాన్ని  సృష్టిoచినవారు , మహిళాహక్కులకోసం  ఉద్యమాలు నిర్వహించిన వారు  జాతీయోద్యమ నాయకులు ,అధికారం లో ఉన్నవారు అయిన ప్రపంచ వ్యాప్త మహిళ గురించి  ప్రతినెల ఒక ఆర్టికల్ రాస్తూనే ఉన్నాను .విహంగ లో ప్రచురిస్తూనే ఉన్నారు .

వైవిధ్యానికి ప్రాధాన్యత నిస్తూ ,ఎవరి దృష్టి లోనూ పడని దాదాపు 60 మంది మహిళామతల్లుల గురించి  విహంగకు రాసి ఉంటాను .అందులో కొన్ని నేను రాసి సరసభారతి తరఫున ప్రచురించిన ‘’మహిళా మాణిక్యాలు ‘’పుస్తకంలో చోటు చేసుకొన్నాయి కూడా .నేను రాసిన పుస్తకాలపై సమీక్షలూ చేయిస్తూ హేమలత గారు నా రచనలు రిసెర్చ్ వర్క్ లాగా ఉన్నాయని అభినందిస్తూ ప్రోత్సహిస్తున్నారు..

క్రమంగా మాసపత్రిక వారపత్రిక గా మారి మరిన్ని అందాలు నింపుకొని ,అలరిస్తూ క్రమం తప్పకుండా సాహితీ విహంగం ఎగురుతూనే ఉంది.మనసులకు హాయి ,ఆనందాలను పంచుతూనే ఉంది. అందరి అభిమానాన్ని పొందుతూనే చేరువౌతూనే ఉంది. ఈ విజయ యాత్ర ఇలానే అనంతంగా కొనసాగాలని కోరుతూ నిర్వహణలో నైపుణ్యం ,వాసి , వన్నెచూపిస్తున్న శ్రీమతి హేమలత గారిని అభినందిస్తున్నాను .

         – గబ్బిట దుర్గా ప్రసాద్

————————————————————————————————



గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in రచనలు | Tagged | Leave a comment

సరసభారతి 101 వ సమావేశం సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజస్వామి ,ఆరాధనోత్సవం

https://plus.google.com/photos/115752370674452071762/album/6376806161454194209/6376806164444335762

సరసభారతి 101 వ సమావేశంగా సరసభారతి ,,ఉయ్యూరు రోటరీక్లబ్ సంయుక్త ఆధ్వర్యం లో సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజస్వామి ,ఆరాధనోత్సవం ,మరియు ,అపరత్యాగ బ్రహ్మ మహా వాగ్గేయకారులు ,గాన గంధర్వ స్వర్గీయ శ్రీ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారి సంస్మరణ సభ శ్రీ సువర్చలాంజ నేయస్వామి వారి దేవాలయం లో పుష్యబహుళ పంచమి మంగళవారం 17-1-17 సాయంత్రం 6-30 గం .లకుశ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ అధ్యక్షతన నిర్వ హించడం జరిగింది. . రోటరీ క్లబ్ అధ్యక్షులు శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి గారి ఆధ్వర్యం లో అయిదుగురు గాయనీమణులు త్యాగ రాజపంచరత్న కీర్తనలు ,,బాలమురళీ కృష్ణ కృతులు గానం చేసి స్వర నివాళి సమర్పించారు. .
శ్రీ బాల మురళి మరణించిన నెల రోజుల లోపుననే , దాదాపు ప్రపంచం లోనే మొట్ట మొదటి సారిగా ”స్వర్గీయ మంగళం పల్లి బాలమురళీ కృష్ణ స్మారక పురస్కారం ”ను సరసభారతి ఏర్పాటు చేసి,, మా అమ్మాయి శ్రీమతి కోమలి ,విజయ లక్ష్మి ,శ్రీ సాంబావదాని(అమెరికా ) దంపతుల సౌజన్యం తో ఈ కార్యక్రమం లో గానం చేసిన గాయనీమణులు ఒక్కొక్కరికి 1,11 6 రూపాయలు నగదు పారితోషికాన్ని అందజేయడం జరిగింది. గాత్ర కచేరి సభకు చొప్పరపు కొండలు, సంగీత , సాహిత్య అభిమానులు పాల్గొన్నారు.

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

త్యాగరాజ ఆరాధన -జ్యోతి వార్త-17-1-17

jyoti

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

నాద బ్రహ్మ ద్వయం – నాద బ్రహ్మ శ్రీ మంగళం పల్లి బాలమురళీ కృష్ణ

 

నాద బ్రహ్మ ద్వయం

నాద బ్రహ్మ ,సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాన్ని ,అపర త్యాగ బ్రహ్మ ,నాదోపాసకుడు ,మహా వాగ్గేయకారుడు స్వర్గీయ మంగళం పల్లి బాలమురళీ కృష్ణ గారి సంస్మరణ సభను స్వర  నివాళిగా సరసభారతి ,ఉయ్యూరు రోటరీ క్లబ్ సంయుక్తంగా పుష్య బహుళ పంచమి 17-1-17 మంగళవారం సాయంత్రం 6-30 గం.లకు ఉయ్యూరు లో శ్రీ సువర్చలా౦జనేయ స్వామి దేవాలయం లోనిర్వ హిస్తూ ,బాలమురళీ కృష్ణ  మరణించిన నెల రోజుల లోపునే బహుశా ప్రపంచం లోనే మొట్ట మొదటి సారిగా ఏ సాహితీ సంస్థ ఏర్పాటు చేయని ‘’స్వర్గీయ మంగళంపల్లి బాల మురళీ  కృష్ణ  స్మారక నగదు పురస్కారం ‘’ను సరసభారతి ఏర్పాటు చేసి  ,మా అమ్మాయి శ్రీమతి కోమలి విజయ లక్ష్మి ,శ్రీ సాంబావధాని (అమెరికా )దంపతుల సౌజన్యం తో ,రోటరీ క్లబ్ అధ్యక్షురాలు శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి గారి ఆధ్వర్యం లోగాన౦ చేస్తున్న గాయనీ మణులకు అందజేస్తున్న సందర్భంగా ,ఆ ‘’నాద బ్రహ్మ ద్వయం ‘’జీవిత విశేషాలను సంక్షిప్తం గా అంద జేస్తున్నాను .

నాద  బ్రహ్మ త్యాగ రాజ స్వామి

శ్రీ సర్వ జిత్ నామ సంవత్సర వైశాఖ శుద్ధ షష్టి సోమవారం ప్రకాశం జిల్లా కంభం తాలూకా కాకర్ల గ్రామం లో శ్రీ కాకర్ల  రామబ్రహ్మం ,శ్రీమతి సీతమ్మ దంపతులకు శ్రీ త్యాగరాజ స్వామి ఆ త్యాగరాజ శివుని అనుగ్రహం తో జన్మించారు .వీరిది వైదిక బ్రాహ్మణ కుటుంబం ,మురికి నాడు శాఖ .తండ్రి తంజావూర్ రాజు శరభోజి ఆస్థాన ఉద్యోగి .తాత గిరిరాజకవి .అందుకే త్యాగయ్య ‘’గిరిరాజ సుతా తనయా ‘’అనే కృతి బంగాళా రాగం లో రాశారు .కుటుంబం  ఆంధ్ర దేశం నుండి తమిళనాడుకు మొదట ఆరు పల్లెల కూడలి ‘’తిరువారూర్ ‘’కు తర్వాత పంచ నదీ సంగమం ‘’తిరువయ్యూర్ ‘’కు చేరింది .ఇక్కడే త్యాగయ్య సంస్కృతం వేద,వేదాంగాలు నేర్చారు .వీరి సంగీత గురువు శ్రీ శొంఠి వెంకట రమణయ్య .

త్యాగయ్యగారు 96కోట్ల శ్రీ రామనామం జపించి శ్రీ రామ దర్శనం పొందిన మహానుభావులు .త్యాగ బ్రహ్మ మహా వైణికులు కూడా .మొదటి భార్య శ్రీమతి పార్వతి చనిపోతే ,ఆమె చెల్లెలు శ్రీమతి  కమలను ద్వితీయం చేసుకొన్నారు .కూతురు సేతామహలక్ష్మి .ఆమెకు ఒక కుమారుడు జన్మించి చనిపోయాడు .త్యాగయ్య గారు 13 వ ఏటనే తోడి రాగం లో ‘’నమో రాఘవా ‘’కీర్తన రాశారు .నారద మహర్షి త్యాగయ్యగారికి ‘’స్వరార్ణవం ‘’అనే సంగీత గ్రంధం అనుగ్రహించాడు ఈ విషయాన్ని ‘’సాధించెనే మనసా ‘’ లోను ‘’స్వరరాగ సుధా రసము ‘’కృతిలోను చెప్పారు .జీవిత కాలం లో 24వేల  రచనలు చేసినట్లు తెలుస్తుంది .కాని వారివి తెలుగు కృతులు 711 కృతులు .సంస్కృతం లోనూ రచించారు  .ప్రహ్లాద భక్త విజయం ,నౌకా చరిత్ర అనే రెండు సంగీత నాటకాలు రాశారు . అందరు దేవుళ్ళను తన శ్రీరామునిలోనే దర్శించుకొన్న పుణ్యాత్ములు త్యాగయ్య .చివరి దశలో ‘’నాద బ్రహ్మానంద ‘’దీక్షానామం ధరించి రామగానం లోనే గడిపారు .శ్రీ పరాభవ నామ సంవత్సర పుష్య బహుళ పంచమి నాడు 80 వ ఏట త్యాగ బ్రహ్మ నాదైక్యమయ్యారు .కనుక ఆయన కు ఇది 250 వ జయంతి .170 వ వర్ధంతి . వర్ధ౦తి రోజునే  త్యాగ రాజ ఆరాధనోత్సవాలు తిరువయ్యూర్ లోను, దేశమంతటా ఘనం గా జరుగుతాయి .త్యాగబ్రహ్మ౦గారి శిష్యులలో మూడవ తరం వారు శ్రీ సుసర్ల దక్షిణా మూర్తి శాస్త్రి గారు ,నాల్గవ తరం  వారు శ్రీ పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారు.

శ్రీమతి బెంగుళూరు నాగరత్నమ్మ అనే సంగీత విద్వాంసురాలు, చెన్నపట్నం నివాసి త్యాగరాజ స్వామికి మహా భక్తురాలు .ఆమె ఒకసారి తిరువయ్యూర్ వచ్చి శిధిలమై పోతున్న త్యాగరాజస్వామి సమాధిని చూసి చలించి పోయి ,తంజావూర్ రాజుద్వారా ,రెవిన్యు అధికారుల ద్వారా స్థలాన్ని కొని ,శుభ్రం చేయించి మద్రాస్ లోని తన ఖరీదైన మేడను అమ్మి ఆ డబ్బుతో  త్యాగరాజస్వామికి గుడి, చుట్టూ గోడలుకట్టించింది .27-10-19 21 లో శంకుస్థాపన చేసి నాలుగేళ్ళలో నిర్మించి 7-1-19 25 న కుంభాభి షేకం చేయించింది .మండపం ,పాకశాల నిర్మించటానికి ధనంలేక తన నగలు,సంపద అన్నీ అమ్మేసింది.మహానటుడు చిత్తూరు నాగయ్యగారిని కలిసి సత్రం నిర్మించమని కోరగా ఆయన మహా వితరణ శీలికనుక వెంటనే సత్రం నిర్మించి అందజేశారు .

త్యాగ రాజ కీర్తనలు 1-తాత్వికం 2-కీర్తనం 3-నిత్యానుస్టానం అని మూడు రాకాలు అని విశ్లేషకులు భావించారు .నలిని కాంతి ,జయంతి శ్రీ వంటి 100 కొత్త రాగాలను త్యాగబ్రహ్మ సృష్టించారు .త్యాగరాజ పంచరత్న కీర్తనలను సామూహికంగా ఆరాధనోత్సవం నాడు గానం చేస్తారు .ఇవి అన్నమయ ,ప్రాణమయ ,మనోమయ ,విజ్ఞానమయ ,ఆనందమయ కోశాలను మెట్లుగా ఎక్కే భావ పరంపర గా భావిస్తారు .ఉత్సవ సంప్రదాయ కీర్తనలు  ఉత్సవాలనాడు గానం చేస్తారు.జీవన్ముక్తుడైన నాద బ్రహ్మ ,గానబ్రహ్మ ,కవిబ్రహ్మ ,జ్ఞాన బ్రహ్మ అయిన త్యాగ బ్రహ్మ గారు’’బ్రహ్మొహం ‘’ అంటూ పాడిన చివరి కృతి ధన్యాసి రాగం లోని ‘’శ్యామసు౦దరాంగ-సకల శక్తియు నీవేరా-  తామస రహిత ,గుణ సాంద్ర –ధరను వెలయు శ్రీరామ చంద్ర –దుస్ట దనుజ విహార ,శిష్టజన హృదయ విహార –ఇష్ట దైవము నీవేరా ,ఇలను త్యాగ రాజు వేరా ‘’.ఇదే ఆయన చరమగీతం –(శ్వాన్ సాంగ్) ‘’.త్యాగరాజహంస పరమహంసలో చేరిపోయింది .

తెలుగునాట పుట్టి ,తమిళదేశం చేరి అక్కడ శ్యామాశాస్త్రి ,ముత్తుస్వామి దీక్షితులవంటి సంగీత దిగ్గజాలతో కర్నాటక సంగీత త్రయం అనిపించి , వారిలో శిఖరాయమానం గా ప్రకాశించి తమిళనాట తెలుగు భాషా వైభవాన్ని చాటి, కీర్తి పతాకను ఎగరవేసిన నాద బ్రహ్మ త్యాగరాజ స్వామి .

మరో  నాద బ్రహ్మ శ్రీ మంగళం పల్లి బాలమురళీ కృష్ణ

 

 

మురళీ కృష్ణ బాలమురళి అవటం

తూర్పు గోదావరి జిల్లా రాజోలు తాలూకా శంకర గుప్తం గ్రామం లో శ్రీ మంగళం పల్లి పట్టాభి రామయ్య ,శ్రీ మతి సూర్య కాంతం దంపతులకు శ్రీ బాలమురళీ కృష్ణ 6-7-1930 న జన్మించారు .పుట్టిన 15 రోజులలోనే తల్లిని పోగొట్టుకొన్న దురదృస్టవంతులాయన ..తండ్రిగారు తల్లీ గురువు  సర్వమూ అయి కంటికి రెప్పలా పెంచారు .రాత్రిళ్ళు తండ్రి పక్కలో పడుకొని ఆయన దగ్గరే సరళస్వరాలు ,జ౦ట స్వరాలు ,వర్ణాలు కీర్తనలు నేర్చారు .1939 జులై 6 న  9 వ ఏట లోబెజవాడలో దుర్గా పురం లోని శరభయ్య గుడులలో మందిర ప్రారంభోత్సవ సందర్భం గాశ్రీ పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారి గురువు శ్రీ సుసర్ల దక్షిణామూర్తి గారి సద్గురు ఆరాధనోత్సవాలలో శ్రీ ముసునూరి సూర్యనారాయణ భాగవతార్ గారి హరికధ ఏర్పాటు చేశారు .ఆయన రాక ఆలస్యమైతే ఒక అరగంట కచేరి చేయమని తండ్రి గారు ఆశీర్వ దించి  వేదిక ఎక్కి౦చారు .కచేరీ సాగింది .భాగవతార్ వచ్చి మూడుగంటలపాటు ఈ మురళీ కృష్ణ గానం తన్మయంగా వింటూనే ఉండిపోయారు .శ్రోతలు తన్మయత్వం చెందారు. మంత్ర ముగ్ధులయ్యారు .దాసుగారు ‘’ఇంక నేను హరి కధలు చెప్పను .ఈ కుర్రాడిని  ఈ నాటినుంచి బాలమురళీ కృష్ణఅని పిలుద్దాం ‘’అని దీవించారు అప్పటినుంచి మురళీ కృష్ణ బాలమురళీ కృష్ణ అయ్యారు .  బహుశా ఇప్పుడేనేమోశ్రోతగా ఉన్న  శ్రీ చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రిగారు తటాలున వేదిక ఎక్కి బాలమురళి ని ప్రశంసిస్తూ మూడు పద్యాలు చెప్పి ఆశీర్వది౦చారట .అందులో ఒక పద్యం ‘’నా వలెనే వృద్దుడవై –నావలెనే కీర్తిగాంచి –నావలెనే శ్రీ దేవి పద భక్తుడవై –భూ వలయము తిరుగు మోయి ‘’  .

త్యాగరాజస్వామి ఆశీర్వాదం

11 వ ఏట తిరువయ్యూరు లో శ్రీ త్యాగ రాజ స్వామి ఆరాధనోత్సవాలకు గురువు పారుపల్లి వారితో బాలమురళి వెళ్ళారు .అక్కడ తాను పాడాల్సిన సమయాన్ని శిష్యుడికిచ్చారు గురువుపారుపల్లి .అంతే జంకూ గొంకూ లేకుండా అనాయాసంగా కచేరీ చేసి అందరి నుంచి అపూర్వ స్పందన అందుకొన్నారు .ఆ సభలో ఉన్న శ్రీమతి బెంగుళూరు నాగ రత్నమ్మగారు బాలమురళి చేయి పట్టుకొని అక్కడేఉన్న శ్రీ త్యాగరాజస్వామి  విగ్రహం పాదాల వద్దకు తీసుకొని వెళ్లి నమస్కారం చేయించి ‘’ఏ నర దృష్టీ సోకకుండా ,జనఘోష లేకుండా ఈ పిల్లవాడిని కాపాడు స్వామీ ‘’అని ప్రార్ధించారు.

కృతి రచనకు శ్రీకారం

14 వ ఏట బెజవాడ సత్యనారాయణ పురం లోని వీరింటి ఎదురుగా ఉన్న దూబ గుంట వారి సత్రం లో కుర్తాలం పీఠాధిపతి శ్రీ శ్రీ విమలానంద భారతీ స్వామి విడిది చేసి ఉన్నారు .బాలమురళి వారిని దర్శించి ఆశీస్సుల౦దు కొని 4 30 బాణీలలో 72 మేళకర్త రాగాలకుఒక్కొక్క కృతి చొప్పున కీర్తన రచనకు శ్రీకారం చుట్టి ,రచించి ‘’జనకరాజ కృతి ‘’అని ఆ గ్రంధానికి పేరు పెట్టారు .యతి ,ప్రాస ,కవితా లక్షణాలను కృతి కీర్తన ,పాట ,పదం జావళీ లలోని భేదాలను ,సృజన రహస్యాలను నేర్పిన తొలిగురువు శరభయ్య గుడుల లో దేవీ ఉపాసకులు పండితులు శ్రీ అప్పయ్య శాస్త్రిగారు .

ఆకాశవాణి ఆర్టిస్ట్

14 వ ఏటనే తమ అపూర్వ సంగీత వైదుష్యం తో ఆకాశవాణి ఏ గ్రేడ్ ఆర్టిస్ట్ అయ్యారు .1940  నుండి రేడియో ప్రస్థానం కొన సాగించారు . 22 వ ఏట విజయవాడ కేంద్రం లో సంగీత పర్య వేక్షణ శాఖ లో  చేరారు .శ్రీ బాలాంత్రపు రజనీకాంత రావు శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు శ్రీ బాలమురళి ఆనాటి రేడియో సంగీత త్రయం .ఉదయం పూట కార్యక్రమం లో భక్తికి సంబంధించిన ది ఉండాలని చెప్పి మొట్ట మొదటి సారిగా ‘’భక్తి రంజని ‘’ప్రవేశ పెట్టింది బాలమురళీయే .సంగీతం నాటకం,స్పోకెన్ వర్డ్ లాంటి వివిధ శాఖలు ప్రొడ్యూసర్ పోస్ట్ లు ఏర్పాటు చేయించి ,సమర్ధులను నియమింప జేసిన ఘనత బాలమురళి దే.ఎంకిపాటలు ,రామదాసు ,అన్నమయ్య ,త్యాగరాజు ,సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనలకు రాగాలు కూర్చి గానం చేసి చేయించి  శ్రోతలకు పరిచయం చేసి వినిపించారు .’’ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది ‘’అనే అన్నమయ్య కీర్తనకు మొదటి సారిగా స్వర పరచి గానం చేశారు .ఎన్నో తత్వాలకు స్వరకర్త బాలమురళి .’’ఏమీ సేతురా లింగా ‘’వంటివెన్నో ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు .ప్రయాగ రంగ దాసు కీర్తన-‘’రాముడుద్భవించినాడు రఘుకులమ్మున ‘’అనేది ఆయన నోట అపురూప గీతమైంది ‘’పిబరే రామ రసం రసనే ‘’,’’స్థిరసా నహి నహిరే ‘’వంటి సదాశివ బ్రాహ్మేంద్ర కీర్తనలకు స్వర రాగ స్పర్శ కల్పించి చిరస్మరణీయం చేశారు .జయ దేవుని అష్టపదులు స్వాతి తిరుణాల్ కీర్తనలు ,శ్యామ శాస్త్రి, ముత్తుస్వామి దీక్షితుల కృతులు ఆయన గానం లో అమృతమయమయ్యాయి .గాయత్రీ రామాయణం ,అమర నారాయణ కీర్తనలను స్వరపరచి ,పాడి, జీవం పోసిన నాదానంద మూర్తి బాలమురళి .ఆయన కాలం లో వచ్చిన యక్షగానాలు ,సంగీత రూపకాలు రసరమ్యాలు .కబీర్ గానటించి సమర్పించిన సంగీత రూపకం శ్రీ  బందా కనకలింగేశ్వర రావు గారి ప్రశంసలను పొందింది .ఆకాశ వాణిలో 9 విభాగాలలో అత్యుత్తమ శ్రేణి సాధించి పెట్టిన ఘనత బాలమురళి దే.అందుకే ఆయన ఆకాశవాణిలో పని చేసిన కాలం ‘’స్వర్ణ యుగం ‘’అన్నారు .

సంగీత కళాశాల స్థాపన –ప్రిన్సిపాల్

విజయవాడలో సంగీత కళాశాల  స్థాపించ వలసిన  అవసరాన్ని గుర్తించి  ప్రభుత్వాన్ని ఒప్పించి అన్ని విధాలా ప్రయత్నం చేసి శ్రీ అన్నవరపు రామస్వామి వంటి వారి సహకారం తో కళాశాల స్థాపనను చేయి౦చ గలిగారు బాలమురళి.  29 ఏళ్ళకే మొట్టమొదటి ప్రిన్సిపాల్ గా పదవీ బాధ్యతలు చేబట్టారు .విద్వత్తుకు తగిన ప్రతిఫలం ఇది .అయితే ఒక్క ఏడాది మాత్రమే పని చేసి 30 వ ఏట రాజీనామా చేసి మద్రాస్ వెళ్ళిపోయారు .విజయవాడలో సత్యనారాయణ పురం లో ‘’మంగళం పల్లి వారి వీధి ‘’ని పురపాలక సంఘం ఏర్పరచి గౌరవించింది .

తమిళనాట విరిసిన తెలుగు తేజం

సర్వశ్రీ సెమ్మంగుడి ,జి యెన్ బాలసుబ్రహ్మణ్యం ,ఎం ఎస్ సుబ్బు లక్ష్మి పట్టమ్మాళ్ వంటి తమిళ సంగీత దిగ్గజాలున్న మద్రాస్ మహా నగరం లో ప్రవేశించిన బాలమురళి అందరినీ మించి స్వీయ ప్రతిభా పాటవాలతో ,అసలు త్యాగరాజ కృతి ని ఎలా పాడి భావాన్ని వెలువరించాలో చూపి అందరి హృదయాలను గెలిచి నిలబడి జయ కేతనం ఎగర వేశారు .ఆనాటి త్యాగ రాజుగారిలా   ఈ నాటి అపర త్యాగబ్రహ్మ తెలుగుకు పట్టాభి షేకం చేశారు .దేశ విదేశాలలో 25 వేల కచేరీలు చేశారంటే మానవ మాత్రునికి సాధ్యమా అని పిస్తుంది .’’వేదిక ఎక్కే దాకా నేను బాల మురళీ నే ‘’కచేరీ ప్రారంభించగానే నేను నేనుకాను .అమ్మ వారు నన్ను నడిపిస్తుంది ‘’అన్నారు ఆయన  మాతో మూడేళ్లక్రితం మద్రాస్ లో వారింటికి వెళ్లి కలిసి మాట్లాడినప్పుడు .అది సత్యమే ..

రాగ సృష్టి

త్రిశక్తి ,ఓంకారి ,లవంగి ,రోహిణి ,కాళిదాస,తరణి ,సర్వశ్రీ ,మనోహర  సుముఖ ,వల్లభి ,ప్రతి మధ్యమావతి, మహతి వంటిఅపూర్వ రాగాల సృష్టికర్త బాలమురళి .అంతే కాదు అవతలివాడిలో ఉన్న ప్రతిభను గుర్తించి అతడిని పైకి తెచ్చే సృష్టికర్త కూడా .శ్రీ కొమరవోలు శివ ప్రసాద్ మాటలలో  ‘’ఈలపాటలో సిద్ధహస్తుడనని నన్ను గుర్తించి పిలిపించి ఇంట్లో ఉంచుకొని ,తనతో కచేరీలకుతీసుకు వెళ్లి అన్నీ నేర్చు కోనేట్లు  చేసి,కన్నకోడుకులా చూసి నాకు సంగీత భిక్ష పెట్టి నన్ను తీర్చిదిద్దినది బాలమురళీ కృష్ణ గారే ‘’అని పొంగిపోయి చెప్పారు .అందుకే బాలమురళి ని ‘’సృష్టి కర్త ‘’అన్నారాయన .   అలాగే శ్రీ డి .వి ,మోహన కృష్ణ ప్రతిభకూ తగిన ప్రతిఫలం కలిపించారు .

రచన

7 2 మేళ కర్త రాగాలకు 430 బాణీలలో ఒక్కొక్క కృతిని కూర్చి ‘’జనక రాజ కృతి మంజరి ‘’గ్గ్రంథంగా వెలువరించారు బాలమురళి .తన స్వీయ కృతులను ‘’సూర్య కాంతి ‘’పుస్తక౦ గా  తెచ్చారు .ఎన్నో తిల్లానాలకు ప్రాణం పోశారు బాలమురళి అంటే తిల్లానా అని ‘’అల్లానా ‘’అని ఆశ్చర్య పోతాం .

 

.       పురస్కారాలు

బాలమురళీకృష్ణకి ఎన్నో బిరుదులు మరియు పురస్కారాలు లభించాయి. వాటిలో కొన్ని:

సంగీత కళానిధి, గాన కౌస్తుభ, గాన కళాభూషణ, గాన గంధర్వ, గాయక శిఖామణి, జ్ఞాన శిఖామణి, జ్ఞాన చక్రవర్తి, గాన పద్మం, నాద జ్యోతి, సంగీత కళా సరస్వతి, నాద మహర్షి, గంధర్వ గాన సామ్రాట్, జ్ఞాన సాగర, మొదలైనవి.కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ,పద్మ భూషణ్ ,పద్మవిభూషణ్ పురస్కారాలు అందజేసింది .ఆయన 75 వ జన్మ దినోత్సవం లో   తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీమతి జయలలిత పాల్గొని బాలమురళి కి ‘’భారత రత్న ‘’ఇవ్వాలని కోరింది .ఆవిడ పేరుమీద ‘’జయజయలలితే ‘’అనే కొత్త రాగాన్ని సృష్టించి పాటరాసి పాడి ఆమెకు అంకితమిచ్చారు  బాలమురళి .ఉత్తమ శాస్త్రీయ ,ఉత్తమ నేపధ్యగాయక ,ఉత్తమ సంగీత దర్శక పురస్కారాలు అంటే మూడు జాతీయ పురస్కారాలు అందుకొన్న ఏకైక వ్యక్తి బాలమురళి  ‘.

సినీ వినీలాకాశం లో

1957 లో బాలమురళి ఎస్ వరలక్ష్మి నిర్మించిన సతీ సావిత్రి చిత్రానికి గాయకుడిగా, సంగీత దర్శకుడిగా పని చేశారు .భక్త ప్రహ్లాదలో నారద పాత్ర పోషించారు .నర్తన శాలలో ‘’సలలిత రాగ సుధారస సారం ‘’గుప్పెడు మనసులు లో ‘’మౌనమే నీ బాస ఓ మూగమనసా’మేఘ సందేశం లో ‘’పాడనా వాణికల్యాణి రాణిగా’’ ముత్యాలముగ్గు అందాలరాముడు ,రామాంజనేయ యుద్ధం  కర్ణ మొదలైన వాటిలో కమ్మని పాటలు పాడారు .కన్నడ చిత్రం ‘’మధ్వా చార్య  ‘’,కు సంగీత దర్శకత్వం వహింఛి ఉత్తమ సంగీత దర్శక అవార్డ్ పొందారు .హంసగీతే కన్నడ చిత్రం లో పాడిన పాటకు  ఉత్తమ నేపధ్యగాయక జాతీయ స్థాయి బహుమతి అందుకున్నారు .సంస్కృతం లో జి .వి. అయ్యర్ తీసిన శంకరాచార్య చిత్రానికి సంగీతం కూర్చారు .’’సందేని సిందూరం ‘’మళయాళ చిత్రం లో కూడా నటించారు . బాల మురళి పాడిన చివరి సినిమాపాట ‘’ప్రభ ‘’అనే తమిళ చిత్రం లో శ్రీదేవి అనే యువ రచయిత్రి రాసి,ఎస్ జే .జనని స్వరపరచిన ‘’పూవే పేసుం –పూవే పూవిన్ ,వాసం నాలం వీనుం వానం ,మరైత్తమేగం తూలియాగ కరైందు పోగుం’’అన్న పాట . ఇది ఆయన చనిపోయేనాటికి ఇంకా రిలీజ్ కాలేదు .,

ప్రత్యేకతలు

మృదంగం వీణ వయోలిన్ వయోలా కంజీర మొదలైన 9 వాయిద్యాలలో బాలమురళి టాప్.తనగాత్రానికి తానే ఏకకాలం లో వయోలిన్ ,మృదంగం వాయిస్తూ రికార్డ్ చేశారు .జి .యెన్. బి .కచేరి కి వయోలిన్ తో సహకారంఅందించారు బాలమురళి . భీమ సేన్ జోషి ,చోరాసియా ,కిశోరీ అమో౦కర్ వంటి ఉత్తరాది సంగీతదిగ్గజాలతో సమానంగా ధాటీగా జుగల్ బందీ నిర్వహించి రికార్డ్ సృష్టించారు .ప్రయోగాలు చేయటం లోనూ అగ్రేసరులే ఆయన . ఫ్రెంచి పాట విని రాసుకొని 10 నిమిషాల్లోపాడి ఆశ్చర్య పరచిన మేధావి .దాన్ని వయోలిన్ పై వాయించమంటే వాయించిన ప్రతిభాశాలి .కలకత్తా లో బెంగాలీ పాటపాడితే విని  75 ఏళ్ళ ఆవిడ వచ్చి ఆనందంగా కౌగిలించుకొని గంతులేస్తూ ‘’గురుదేవ్ టాగూర్ బ్రతికి వచ్చి పాడినట్లు ఉంది ‘’అని మెచ్చుకొన్నది .రవీంద్రుని వద్ద ఆ పాట నేర్చుకొన్న వారిలో బ్రతికి ఉన్నది ఆమె ఒక్కరే నట ,రవీంద్ర సంగీతం భద్రం చేసుకోవటానికి బాలమురళి చేత 30 పాటలు పాడించి రికార్డ్ చేసుకొన్నారు .టాగూర్ తానే సంగీతం కూర్చాడు .ఎవరూ మార్చటానికి వీలు లేదు .రవీంద్రుని శాంతి నికేతన్ బాల మురళి కి మొట్టమొదటిసారిగా ‘’డాక్ట రేట్ ‘’బిరుదు ఇచ్చి సత్కరించింది  .సంగీతం వ్యాధినివారకం అని అనేక ప్రయోగాలు చేసి మ్యూజిక్ ధేరపి కి మార్గ దర్శి అయ్యారు .తమిళనాడు ముఖ్యమంత్రి ఎం .జి .రామ చంద్రన్ జబ్బు పడి కోమాలో ఉంటె వైద్యులు ఇక లాభం లేదని పెదవి విరిస్తే, వెళ్లి చూసి 9 నిమిషాలు మ్యూజిక్ రికార్డ్ చేసి ఇచ్చి దాన్ని వినిపిస్తే హాయిగా ప్రాణం విడుస్తారని చెప్పి బాలమురళి వెళ్ళిపోయారు .మర్నాడు వచ్చి చూస్తే ఎం .జి. ఆర్. కొమాలోంచి బయటపడి హాయిగా కనిపించారట .అవాక్కయ్యారు మురళి .

డా నేడునూరిగంగాధారం గారికి అన్నమయ్య పదాల రాగి రేకులు దొరికితే తీసుకొని వచ్చి బాలమురళి కి ఇచ్చారు అప్పటికి అన్నమయ్య పదాలున్నాయికాని సంగీతం లేదు .బాలమురళి వాటికి సంగీతం కూర్చి మొదటిసారిగా ఆకాశవాణి భక్తీ రంజని కార్యక్రమం లో పాడి వినిపించారు .మద్రాస్ లో  హెచ్. ఏ. ఎల్ .మాజీ ఎలక్ట్రికల్ ఇంజనీర్ రూపొందించిన పోర్టబుల్ ఎలెక్ట్రానిక్ తంబురా ను కచేరీలో వాడిన మొదటి గాయకుడు బాలమురళీ యే .

ఒక సారితిరునల్వేలి లో కచేరీ చేసి కన్యాకుమారికి వెడుతూ ఉంటె దారిలో ఒక పవిత్ర నదికనిపిస్తే నెత్తిన జలం చల్లుకొందామని నీటిలో దిగితే షాక్ కొట్టినట్లు అయిందట. మరో సారి ప్రయత్నం చేసినా అలానే జరిగిందట .ఆయన తో వచ్చినవారికి ఎవరికీ ఏమీ కాలేదు .ఆ విషయం గ్రామస్తులకు తెలియ జేశారు. వారు అక్కడ త్రవ్వితే శ్రీ దుర్గా౦బిక విగ్రహం దొరికింది .దాన్ని ప్రతిష్టించి గుడి కట్టించటానికి బాలమురళి ఉచితంగా కచేరీలు చేసి ధనం సమకూర్చి ఇచ్చారు బాల మురళి పేర ఆడిటోరియం కట్టి ,రాజ గోపురం లో బాలమురళి విగ్రహం ప్రతిష్టించి కృతజ్ఞత తెలియ జేశారట .మద్రాస్ ఆకాశవాణి లో మ్యూజిక్ ప్రొడ్యూసర్ గా  ఉంటూనే సంగీతకచేరీలు చేశారు బాలమురళి .తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన సంగీత విద్వాంసులు, తమిళనాడు ప్రభుత్వ కలైమణి గౌరవం పొందారు .ఆయన జీవితం పై పుస్తకాలు వచ్చాయి .

బాలమురళీయం

శ్రీ బాలమురళి గాత్రం ,శ్రీ అన్నవరపు  రామస్వామి వయోలిన్ ,శ్రీ దండమూడి రామమోహనరావు మృదంగం త్రివేణీ సంగమమై శ్రోతలను రసగంగలో స్నానం చేయిస్తుంది .ముగ్గురూ ఎన్నో వేలకచేరీలు కలిసి చేసి రికార్డ్ సృష్టించారు .ఈ త్రయానికి సాటి లేదు అనిపించారు .’’త్యాగరాజ ఆరాధనోత్సవాలను ఎందుకు వ్యతిరేకిస్తారు మీరు’’ ?అని అడిగితే ‘’’’ఆరాధన అంటే మృతి చెందిన రోజు చేసేది .కొత్త చీరలతో సింగారించుకొని ,ఒంటినిండా నగలు దిగేసుకొని వెళ్లి పాడటం సబబుకాదు .కావాలంటే త్యాగయ్య గారు పుట్టిన రోజున ఇంత హడావిడిగా చేసుకోండి పాడండి .’’అన్నారు .అందుకేనేమో అమెరికాలో ఒహాయు రాష్ట్రం లో ప్రతి ఏడాది ఎప్రిల్ నెలలో దేశం లోని అన్ని రాష్ట్రాలనుండి గాయకులూ వచ్చి భక్తిగా త్యాగరాజ సభపెద్ద ఎత్తున నిర్వహించి  గానం చేసి తరిస్తారట .అందులో పాల్గొనటానికి మూడు ,నాలుగు రౌండ్ల ప్రిలిమినరీలు జరుగుతాయట. అందులో క్వాలిఫై అయిన వారే వెళ్లి పాడాట .

‘’  ‘’పంచ ప్రాణాలూ సప్తస్వరాలే ‘’అన్నట్లుగా జీవించారు బాలమురళి .పాట అనుకోవటం,రాగం కూర్చటం ,పాడటం అప్పటికప్పుడు చేసే ‘’సంగీత సర్వజ్ఞుడు ‘’బాలమురళి .ఆయన ‘’తిల్లాన ‘’ఒక తుళ్ళింత ఒక ద్రిల్లింత .ఊగిపోవాల్సిందే .సంగతులు ,సరిగమలు సహజంగా అమరిపోతాయి .సంగీతం పాడుతూ తాను ఆనందిస్తూ,రసజ్నులను ఆనందింప జేయటం, నవ్వుతూ పాడటం బాలమురళి ప్రత్యేకత .ఏ స్థాయిలోనైనా గీర రాకుండా పాడగలిగే దమ్ము ఆయనది. పర్వీన్ సుల్తాన్ తో సరిసాటి .’’అమ్మా !పుట్టగానే మురళీగానమిచ్చి ‘’అంటూ కన్నతల్లిని, పుట్టిన ఊరు శంకర గుప్తం ను గుర్తుఉండి పోయేట్లు ‘’సూర్య కాంతి ‘’రాగాన్ని సృష్టించి దాన్ని ‘’విడువ విడువ నింక ‘’అన్న అన్నమయ్య కీర్తనతో ప్రకాశింప జేసిన సంగీత భానుడు బాలమురళి .

‘’నా కీర్తనలో రాగం భోగం ,మొహం ,స్నేహం ,దోబూచులాడుతాయి .ఆర్తి ,ఆవేదన ,ఆరాటం ,ఆకాంక్ష ,తపన మిళితమై ఉంటాయి ‘’అన్న వాగ్గేయకారుడు బాలమురళి .నాదం లో ఆనందాన్ని పొంది ,పొందించిన నాద బ్రహ్మ. బ్రహ్మానందాన్ని అందించినవారు .అందుకే ఆయన్ను ‘’స్టార్ వాల్యు ఉన్న సంగీత విద్వాంసుడు ‘’అన్నారు ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య .సంకుచిత పరిధిలో ఉన్న సంగీత సరస్వతిని ‘’భారతీయ సంగీతం ‘’గా మార్చి కొత్తమార్గం తొక్కించిన మార్గ దర్శి బాలమురళి .’’సంగీతం నాకు రాదు ,తెలియదు .కాని సంగీతానికి నేను తెలుసు .అది నన్ను వెతుక్కుంటూ వచ్చినంతకాలం  నేను వాహిక గా ఉంటాను .పాట నా నోట పలుకు తుంది  .నేనొక సంగీత పరికరాన్ని (instrument ) ‘అన్నారాయన .

ఇంత గొప్ప వాగ్గేయకారుడు ,అపర త్యాగబ్రహ్మ, నాదోపాసకులు, గాన గాంధర్వ శ్రీ మంగళం పల్లి బాలమురళీ కృష్ణ 22-12-16-న 86 వ ఏట  ఏనాడూ ఇంటిదగ్గర కచేరీకి సాధన చేయనివారు మూడు రోజులుగా నెమ్మదిగా సంగీత సాధన చేస్తూ ,అందరినీ చూసుకొంటూ తనకిస్టులైనశ్రీ అన్నవరపు రామస్వామి గారి చేతులను తన చేతులతోపట్టుకొని తుది శ్వాస విడిచారు .హంస పరమహంసలో చేరింది .అందుకే  ఆంధ్ర జ్యోతి దినపత్రిక  ఆయన మరణం పై ‘’ఆధార షడ్జమం అంతర్ధానమైంది .తేనెలు కురిపించే తెలుగు పంచమం మూగ బోయింది . నిషాదం విషాదమైంది .సప్త స్వరాలూ అశ్రు సాగరాలయ్యాయి .మూడు స్వరాల మహతీ రాగం సృస్టికర్తనే కోల్పోయి ,విలపించింది త్రుళ్ళిపడేతిల్లానా ఊపిరి పోయింది .ప్రతిమధ్యమావతి తుది జోలపాడింది .వయోలిన్ ,వయోలా ,వీణ ,మృదంగం అనాధలైనాయి .కర్నాటక సంగీత సామ్రాజ్యం సామ్రాట్టు లేని రాజ్యమైంది .సరిగమలు నివ్వెర పోగా ,గమకాలు తడబడగా, మధుర మంజుల బాలమురళీ గానం మూగబోయింది ‘’అని గొప్పగా ఆయన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించింది .

Inline image 1Inline image 2

పుష్యబహుళపంచమి శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవం సందర్భంగా

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -17-1-17 –ఉయ్యూరు

 

 

Posted in మహానుభావులు, సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 38-పద్మ విభూషణ్ –గోపీనాధ కవిరాజ్ (1887 -1976 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

38-పద్మ విభూషణ్ –గోపీనాధ కవిరాజ్ (1887 -1976 )

బెంగాల్ తత్వ వేత్త వైకుంఠ నాద కుమారుడే గోపీనాధ కవి రాజ్ .ప్రస్తుత బంగ్లాదేశ్ లోని ఢాకా జిల్లా ధర్మరాయ్ గ్రామం లో  జన్మించాడు .అక్కడే ప్రాధమిక విద్య పూర్తీ చేసి ఢాకా లోని కె.ఎల్.జూబిలీ హై స్కూల్ లో 7 వ తరగతిలో చేరి 10 వ తరగతి పాసై నాడు .ఇంటిపేరు బాగ్చి .కవి రాజ్ ఆయన బిరుదు .

1906  లో జైపూర్ చేరి నాలుగేళ్ళుమహారాజా కాలేజి లో  చదివి డిగ్రీ పాసయ్యాడు .అలహాబాద్ యూని వర్సిటీనుండి ఎం .ఏ. పొందాడు గురువులు మధుసూదన ఓఝా ,షాశ్ధర్ తర్క చూడామణి .తరువాత వారణాసిలోని దేవనాధ పురం చేరి ఎం .ఏ.డిస్టింక్షన్ లో  పాసైనాడు .వారణాసి లో చివరి ఏడాది చదువు ఆర్ధర్ వెనిస్ వద్ద సాగింది . ఆయన ఈయన్ను వారణాసి సంస్క్రుతకాలేజి సరస్వతిభవన్ లైబ్రరీ కి లైబ్రేరియన్ గానియమించాడు  ఈ కాలం లో తంత్ర శాస్త్రం పై దృష్టి పెట్టాడు .వారణాసిలో అనేక తంత్ర శాస్త్రాలను అధ్యయనం చేశాడు .1918 లో శ్రీ విశుద్ధానంద భారతి స్వామిని దర్శించి ,ఆయన టిబెట్ దగ్గర జ్ఞాన్ గంజ్ లో చూపిన యోగ విన్యాసాలకు ఆశ్చర్యపడ్డాడు .

1924 లో సంస్కృత కాలేజి ప్రిన్సిపాల్ అయి,తర్వాత వారణాసిలోని సంపూర్ణానంద సంస్కృత యూని వర్సిటి ప్రిన్సిపాల్ అయ్యాడు .సరస్వతి భవన్ గ్రంధమాలకు ఎడిటర్ అయ్యాడు .రిసెర్చ్ మీద అమితాసక్తి ఉండటం ,స్వీయ ఆధ్యాత్మికానుభవ సాధనకోసం స్వచ్చందంగా 1937 లోగురువు విశుద్ధానంద మరణం తర్వాత  పదవీ విరమణ చేశాడు .తర్వాత పూర్తికాలాన్ని తంత్ర సాధన ,పరిశోధనలో గడిపాడు .వారణాసి లోని గురువుగారి ఆశ్రమ సంరక్షణ చేస్తూ ,కాశీ పై అమిత భక్తితో అక్కడే ఉండిపోయాడు .పద్మ విభూషణ్ స్వీకరించటానికి మాత్రమే కాశీని వదిలి వెళ్ళాడు అంతే .అనిర్వణ్అనే విద్వా౦సునితో కలిసి కాశ్మీర్ శైవ మతాన్ని అధ్యయనం చేయటానికే కాలం వెచ్చించాడు .జీవిత చరమాంకం లో1928 లో మొదటి సారి దర్శించిన   మాతా ఆనంద మాయికి  గాఢ  భక్తుడైపోయాడు .

సంస్కృత భాషా సేవకు 1934 లో మహా మహోపాధ్యాయ బిరుదును పొందాడు .తర్వాత వారణాసిలోని వారణాసీయసంస్కృత విశ్వ విద్యాలయం లో నూతనం గా ఏర్పాటు చేసిన ‘’యోగ –తంత్ర డిపార్ట్ మెంట్ కు అధిపతి గా 1964 నుండి 1969 వరకు పని చేశాడు .ఆరోగ్యం సహకరించక పదవికి రాజీనామా చేసి భాడైని ప్రాంతం లో ఉన్న మాతా ఆనంద మాయి ఆశ్రమం లో గడిపాడు . .

తూర్పు బెంగాల్ లో  విద్వద్ వంశానికి  చెందిన కుసుమ కుమారి ని 1900 లో వివాహమాడి ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు  .గోపీనాధ కవిరాజ్ 1-భారతీయ సంస్కృతీ ఔర్ సాధన 2-తాన్త్రిక్ వాజ్మి మే శాక్త దృష్టి 3-శ్రీ కృష్ణ ప్రసంగ 4-కాశీకీ సారస్వత్ సాధన 5-పత్రావళి 6-స్వ సంవేదన్ 7-అఖండ మహాయోగేర్ పదే 8-విశుద్ధానంద ప్రసంగ 9-తాన్త్రిక్ సాహిత్య 10-సాదు దర్శన్ ఏవం  సత్ ప్రసంగ .గోపీ నాద కవి రాజ్ పై నాలుగు గ్రంధాలు వెలువడినాయి .

మహా మహోపాధ్యాయ ,పద్మ విభూషణ్ లతోపాటు కవి రాజ్ డి.లిట్,.,సాహిత్య వాచస్పతి ,దేశికోత్తమ ,,సాహిత్య అకాడెమి పురస్కారం ,సాహిత్య అకాడెమి ఫెలోషిప్ అందుకున్నాడు .

12-6-1976 న కవిరాజ్ 89 వ ఏట పరమపదించాడు .కేంద్ర ప్రభుత్వం ఆయన గౌరవార్ధం ప్రత్యేక స్టాంప్ విడుదల చేసింది .

Inline image 1

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-1-17 –ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

స్వర్గీయ మంగళం పల్లి బాల మురళీ కృష్ణ స్మారక నగదు పురస్కార ప్రదానం

Inline image 1  Inline image 2

సరసభారతి 101 వ సమావేశంగా సరసభారతి ,,ఉయ్యూరు రోటరీక్లబ్ సంయుక్త ఆధ్వర్యం లో సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజస్వామి ,ఆరాధనోత్సవం ,మరియు ,అపరత్యాగ బ్రహ్మ మహా వాగ్గేయకారులు ,గాన గంధర్వ స్వర్గీయ శ్రీ  మంగళంపల్లి బాలమురళీ కృష్ణ  గారి సంస్మరణ సభ శ్రీ సువర్చలాంజ నేయస్వామి వారి దేవాలయం లో పుష్యబహుళ పంచమి మంగళవారం 17-1-17 సాయంత్రం 6-30 గం  .లకుశ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ అధ్యక్షతన  నిర్వ హింపబడుతోంది . రోటరీ క్లబ్ అధ్యక్షులు శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి గారి ఆధ్వర్యం లో అయిదుగురు గాయనీమణులు త్యాగ రాజపంచరత్న కీర్తనలు ,,బాలమురళీ  కృష్ణ కృతులు గానం చేసి స్వర నివాళి సమర్పిస్తారు .

  శ్రీ బాల మురళి మరణించిన నెల రోజుల లోపుననే , దాదాపు ప్రపంచం లోనే మొట్ట మొదటి సారిగా ”స్వర్గీయ మంగళం పల్లి బాలమురళీ కృష్ణ స్మారక పురస్కారం ”ను సరసభారతి ఏర్పాటు చేసి,, మా అమ్మాయి శ్రీమతి కోమలి ,విజయ లక్ష్మి ,శ్రీ సాంబావదాని(అమెరికా ) దంపతుల సౌజన్యం తో ఈ కార్యక్రమం లో గానం చేసిన గాయనీమణులు ఒక్కొక్కరికి 1,11 6 రూపాయలు నగదు పారితోషికాన్ని అంద  జేస్తోంది .ఈ తొలి  నగదు పురస్కారాన్ని స్పాన్సర్ చేసిన వారికి , తొలిపురస్కారాన్ని అందుకో బోతున్న  ,గాయనీమణులకు హార్దిక శుభాభినందనలు  .
  సంగీత ,సాహిత్యాభిమానులందరూ పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన
                                               గబ్బిట దుర్గా ప్రసాద్ -సరసభారతి అధ్యక్షులు
                                                జోశ్యుల శ్యామలాదేవి -రోటరీ క్లబ్ అధ్యక్షులు
Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 36-అడవి జయ తీర్దా చార్య(1756-1806 )

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3

36-అడవి జయ తీర్దా చార్య(1756-1806 )

విష్ణు తీర్ధ అనబడే అడవి జయ తీర్ధాచార్య  1756 లో జన్మించి 50 సంవత్సరాలుమాత్రమే జీవించి 1806 లో మరణించారు .మహా విద్వాంసుడు, ముని, కవి,మధ్వాచార్య మత గ్రంధ వ్యాఖ్యానకర్త .సావానూర్ దగ్గర సిద్దాపురం లో జన్మించాడు .గురువు సత్యవ్రత తీర్ధ వద్ద సన్యాస స్వీకారం చేశాడు .గురువుగారితో కలిసి బృందావనం సందర్శించి ,కొప్పల్ కు 6 మైళ్ళ దూరం లో ఉన్న మదునూర్ లో తన బృందావనం లో చేరాడు .19 ఉద్గ్రంధాలు రాశాడు అందులో ముఖ్యమైనవి –భాగవత సారోద్ధార ,ఆజ్ఞాపత్ర ,ఆత్మ సుఖ బోధిని ,షోడశి ,చతుర్దశి ,అధ్యాత్మామృత తరంగిణి.

 

37-జాతీయ పండిత పురస్కార గ్రహీత ,ఆధునిక పాణిని  –శివరామ దత్తాత్రేయ జోషి (1926 -2013 )

మహారాష్ట్రలోనికొంకన్ తీర రత్నగిరి కి  చెందిన సంస్కృత మహా విద్వాంసుడు మహా వ్యాకరణ వేత్త శివరామ దత్తాత్రేయ జోషి .కుటుంబం సంస్కృత పండిత కుటుంబం .చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన అభాగ్యుడు .1958 లో కళావతి భగవత్ అనే సహచర విద్యార్ధిని వివాహం చేసుకొన్నాడు .87 ఏళ్ళ వయసులో జోషి 29-7-2013 న మరణించాడు .

ప్రాధమిక విద్య పూనా లో  బాబాయి మహేశ్వర శాస్త్రి  జోషి వద్ద నేర్చాడు .20 ఏళ్ళకే సంస్కృత వ్యాకరణాన్నిమదధించి సారం గ్రోలాడు .బెంగాల్ ,బరోడా ,పూనా యూని వర్సిటీలనుండి అనేక డిగ్రీలు సాధించాడు.పూణే సంస్క్రుతకాలేజిలో లెక్చరర్ గా జీవితం ప్రారంభించి 1947-55 లో ప్రిన్సిపాల్ గా  సేవ చేశాడు .1950 లో డేనియల్ ఇంగాల్స్ వద్ద  టీచర్ గా చేరి ,తన విద్యా సంపత్తితో అభిమానం పొంది ,సంప్రదాయ పద్ధతిలో సంస్కృతం అభ్యసించటం వలన 19 55 లో బి ఏ .చదివి డిగ్రీ పొంది హార్వర్డ్ యూని వర్సిటీలో ఫెలోషిప్ సాధించాడు .1960లో హార్వర్డ్ నుంచి ఇంగాల్స్ గైడ్ గా ‘’సంస్కృత నిఘంటు అర్ధ విచారణ’’(సాంస్క్రిట్ లెక్సికల్ సెమాంటిక్స్ )పై పరిశోధన చేసి పి. హెచ్.డి . పొందాడు.

1960  లో ఇండియాకు తిరిగివచ్చి పూనా దక్కన్ కాలేజిలో సంస్కృత నిఘంటు విభాగం లో చేరాడు .1964 లో పూనా యూని వర్సిటి లో ‘’సెంటర్ ఆఫ్  అడ్వాన్సేడ్ స్టడీ ఇన్ సాంస్క్రిట్’’ లో రీడర్ గా పని చేశాడు .1970  లో సంస్కృత ,ప్రాకృత భాషాశాఖాధ్యక్షుడైనాడు  .1974 నుంచి 1987 వరకు  సెంటర్ ఫర్  అడ్వాన్సేడ్ స్టడీ ఇన్ సాంస్క్రిట్  కు డైరెక్టర్ గా ఉన్నాడు .1987 నుంచి దక్కన్ కాలేజి సంస్క్రుతనిఘంటు ప్రాజెక్ట్ లో పని చేశాడు .1971 నుంచి ఒక ఏడాది హార్వర్డ్ యూని వర్సిటి లోను ,1976-77 లో నాగోయా యూని వర్సిటి విజిటింగ్ ప్రొఫెసర్ గా ఉన్నాడు .

జోషి పతంజలి మహా భాష్యానికి 11 భాగాల వ్యాఖ్యానం రాశాడు .పాణిని వ్యాకరణానికి 15 భాగాల వ్యాఖ్యానమూ రచించాడు .1991లో భారత రాష్ట్ర పతి చేత జాతీయ పండిత పురస్కారాన్ని అందుకున్నాడు. ‘’ఆధునిక పాణిని’’ గా జోషీని భావిస్తారు .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -16-1-17 –ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 35-సంస్కృత చలన చిత్ర దర్శకుడు –జి.వి.అయ్యర్ (1917 -2003 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

Inline image 1   Inline image 1

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

35-సంస్కృత చలన చిత్ర  దర్శకుడు –జి.వి.అయ్యర్ (1917 -2003 )

సంస్కృతాన్ని రచనలద్వారా వ్యాప్తి చెందించిన వారినీ, నాటక ప్రదర్శనల ద్వారా వ్యాప్తి చెందించిన ఎందరి గురించో తెలుసుకొన్నాం .ఇప్పుడు మహానుభావుల చలన చిత్రాలను సంస్కృతం లో నిర్మించిన సంస్కృత భాషా వ్యాప్తి చేసిన డా.జి.వి.అయ్యర్ జీవిత విశేషాలను గురించి తెలుసుకొందాం .

గణపతి వెంకట రమణ అయ్యర్ అంటే ఎవరికీ తెలియదు .జి వి అయ్యర్ అంటే చాలామందికి తెలుసు .సంస్కృత చలన చిత్ర నటుడు దర్శకుడు అయిన అయ్యర్ 3-9-1917 న కర్ణాటకలోమైసూర్ జిల్లా నంజన్ గూడ లో జన్మించాడు .భారతీయ చలన చిత్ర దర్శకులలో సంస్కృత చలన చిత్రాలను నిర్మించి దర్శకత్వం చేసిన ఒకే ఒక్కడు అయ్యర్ .అందుకనే ఆయనను ‘’ ‘’కన్నడ భీష్మ’’ అంటారు .8 వ ఏటనే గుబ్బి వీరన్న దియేటర్ గ్రూప్ లో చేరి నటుడయ్యాడు.’’రాధారమణ’’ సినిమాలో మొదటి సారిగా నటించి సినీ నటుడయ్యాడు .తరువాత మహా కవి కాళిదాసు  ,సోదరి ,హేమావతి ,హరి భక్త ,బేదర కన్నప్ప మొదలైన సినిమాలలో నటించాడు .

అయ్యర్ ఆ తర్వాత స్వంతంగా సినిమాలకు దర్శకత్వం చేయాలని భావించి ‘’హంస గీతే ‘’అనే కన్నడ  సినిమాను డైరెక్ట్ చేశాడు .దీనికి డా మంగళం పల్లి బాల మురళీ కృష్ణ సంగీత దర్శకత్వం చేశారు. టి .జి .లింగప్ప ,బి .వి.కారంత్ మొదలైన వారు నటించారు .ఈసినిమా విపరీతం గా విజయం సాధించి అందరికి  మంచి పేరు తెచ్చింది అయ్యర్ కీర్తి దశ దిశలా వ్యాప్తి చెందింది .ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు .కదా ,స్క్రీన్ ప్లే ,డైలాగ్స్అన్నీ తానే సమకూర్చుకొని  అయ్యర్ .వరుసగా చాలా కన్నడ సినిమాలు తీశాడు,డైరెక్ట్ చేశాడు  .ఆయన గొప్ప చిత్రం ‘’రణధీర్ కంఠీరవ’’.1970  వరకు కమ్మర్షియల్ చిత్రాలే తీశాడు .

కన్నడ ,సంస్కృతాలలో గొప్ప పాండిత్యం ఉన్న అయ్యర్ దృష్టి సంస్కృత చిత్రాపై పడింది .1983 లో మొట్టమొదటి సారిగా ‘’ఆది శంకరాచార్య ‘’సంస్కృత సినిమా డైరెక్ట్ చేశాడు .ఈ సినిమా జాతీయ స్థాయి లో ఉత్తమ చిత్రం, ఉత్తమ స్క్రీన్ ప్లే,ఉత్తమ సినిమాటోగ్రఫీ,ఉత్తమ ఆడియోగ్రఫీ  లకు బహుమతులను అందుకున్నది .కళాఖండం గా ఈ సంస్కృత చిత్రం చిర స్థాయిగా నిలిచి పోయింది .అయ్యర్ ప్రతిభ అందర్నీ అప్రతిభులను చేసింది .ఈ సినిమా అయ్యర్ పై గొప్ప ప్రభావం చూపింది .ఈ సినిమా తీసిన తర్వాత అయ్యర్ జీవన విధానమే మారిపోయి చెప్పులు వేసుకోవటం కూడా మానేశాడు .

తర్వాత కన్నడం లో ‘’మాధవా చార్య ‘’తమిళం లో ‘’రామానుజాచార్య ‘’సినిమాలు తీశాడు అయ్యర్ .1933 లో సంస్కృతం లో రెండవ సినిమాగా ‘’భగవద్గీత ‘’తీశాడు .ఇది ఉత్తమ చిత్రం గా జాతీయ స్థాయిలో బహుమతి పొందింది .ఇది ‘’బగోటా ఫిలిం ఫెస్టివల్ ‘’లో ప్రదర్శింప బడింది .

అయ్యర్ కొన్ని టెలివిజన్ సీరియల్స్ తీశాడు అందులో ‘’నాట్య రాణి శాంతల ‘’అనేది హోయసల రాణి శాంతల పై నిర్మించిన చారిత్రాత్మక సీరియల్ .ఆమెను వైష్ణవ రాజు కిచ్చి వివాహం చేశారు .దీన్ని హిందీ,కన్నడ భాషలలో లోనూ తీశారు .

స్వామి వివేకానంద జీవితాన్నిహిందీ  చలన చిత్రంగా నిర్మించాలనినిశ్చ యించుకొన్న అయ్యర్ మిదున్ చక్రవర్తిని శ్రీ రామ కృష్ణ పరమ హంస  పాత్రకు ఎంపిక చేసి నటి౦ప చేశాడు .మిదున్ కు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా జాతీయ బహుమతి వచ్చింది .మిదున్ –పరమహంసగా తన నటనా విశ్వ రూపాన్ని ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకున్నాడు .సర్వదమన బెనర్జీ వివేకానండునిగా నటించాడు. హేమామాలినికూడా ఉంది . కాని ఈ సినిమా కమ్మర్షియల్ సక్సెస్   పొందలేదు.

సంజయ దత్తును రావణాసుర పాత్రగా రామాయణాన్ని తీయాలని సంకల్పించాడు అయ్యర్ .దురదృష్ట వశాత్తు అయ్యర్ 21-12- 2003 న 87వ ఏట అకస్మాత్తు గా మరణించాడు . బెంగళూర్ దగ్గర కేంగేరి లో దొడ్డ అలదమార దగ్గరున్న భరద్వాజ ఆశ్రమం లో అయ్యర్ అంత్యక్రియలు నిర్వహించారు .

అయ్యర్ మొత్తం  మీద  రెండు సంస్కృత ,ఒక హిందీ ,ఒక తమిళ చిత్రాలను ,23 కన్నడ చిత్రాలను నిర్మించి దర్శకత్వం వహించాడు .2001 లో కృష్ణ లీల తీయాలని ప్రయత్నించాడు .10 సినిమాలో అయ్యర్ నటుడుగా నటించి రాణించాడు .

Inline image 2

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -15-1-17-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 34- వ్యాకరణ ఘనా ఘనుడు –హరనామ దత్త శాస్త్రి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

34- వ్యాకరణ ఘనా ఘనుడు –హరనామ దత్త శాస్త్రి

హర్యానాలో జగద్రిఅంటే నేటి హర్యానాలో  1943 –లో జన్మించి 1915 లో 82 వ ఏట మరణించిన ‘’చులికీకృత పాణిని వ్యాకరణ పారావారాన్నిధి’’హరనామ దత్త శాస్త్రి .తండ్రి మురారి దత్తు .వారణాసిలో సంస్కృతం చదివి’’ భాష్యాచార్య ‘’అంటే సంస్కృత భాషా శాస్త్రం వ్యాకరణ శాస్త్రనియమాలను క్షుణ్ణంగా బోధించ గలిగే సామర్ధ్యం ఉన్న మహా పండితుడు అయ్యాడు .తరువాత రాజస్థాన్ లోని’’ చురు ‘’  లో పాణిని వ్యాకరణ బోధనలో మహా నిష్ణాతుడనే పేరు పొందాడు .చూరులో తానే తనతాత గారి పేరుమీద ‘’పండిట్ హరనామ దత్త శాస్త్రి సంస్కృత పాఠశాల’’  నిర్మించి పాణిని వ్యాకరణ బోధనకు ప్రాశస్త్యం తెచ్చాడు .ఆయన శిష్యులలో ప్రసిద్ధమైనవారు శ్రీ గిరిధర్ శర్మ చతుర్వేది ,విద్యావాచాస్పతి బాలచంద్ర జి ,పండిట్ రామానంద జీ మహా రాజ్ ,పండిట్ జైదేవ్ జి మిశ్ర ,పండిట్ విలాస రాయ్ జీ ఉన్నారు .

తాత  హరనాధ దత్త జీవిత విశేషాలపై  పై శిష్యుడు విద్యా వాచస్పతి విద్యాధర శాస్త్రి ‘’హరనామామృతం ‘’అనే సంస్కృత మహాకావ్యం రచించాడు . .ఆధునిక సంస్కృత కావ్యం ఎలా ఉండాలో కవి తన రచన ద్వారా తెలియజేశాడు .ఇందులో 16 కా౦డలున్నాయి . ఆయన జీవిత విశేషాలు,యాత్రలు ,పాఠశాల స్థాపన, విద్యా వ్యాప్తి ,సంస్కృతీ సంప్రదాయ పరిరక్షణం వగైరాలు చాలా కవితాత్మకంగా వర్ణించాడు కవి  .

Inline image 1

సశేషం

కనుమ పండుగ శుభాకాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -15-1-17 –ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment