15-1-17 ఆదివారం ఉదయం కనుమ నాడు మా ఇంట్లో శ్రీమతి మల్లికాంబ గారు కుమార్తె శ్రీమతి జయలక్ష్మి

15-1-17 ఆదివారం ఉదయం కనుమ నాడు మా ఇంట్లో శ్రీమతి మల్లికాంబ గారు కుమార్తె శ్రీమతి జయలక్ష్మి

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 33-త్రయోదశ భాషా వేత్త ,పద్మభూషణ్ –కృష్ణ కాంత హా౦డీక్(1898 -1982 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

33-త్రయోదశ భాషా వేత్త ,పద్మభూషణ్ –కృష్ణ కాంత హా౦డీక్(1898 -1982  )

కృష్ణ కాంత హా౦డీక్ అస్సాం రాష్ట్రం లో జోర్హాట్ నగరం లో ‘’టాల్ అహం ‘’వంశం లో20-7-1898 న  జన్మించాడు. తండ్రి రాజ బహదూర్ తారాకాంత హాండీక్.గౌహతిలోని కాటన్ కాలేజి , కలకత్తా సంస్కృత కాలేజి ,కలకత్తా ,ఆక్సఫర్డ్ బెర్లిన్  యూని వర్సిటీలలో 1913 నుంచి 1927 వరకు  లో చదివి గ్రీక్ ,లాటిన్ ,ఫ్రెంచ్, జెర్మని ,రష్యన్ ,ఇటాలియన్ ,స్పానిష్ మొదలైన 8 విదేశీ భాషలలోను ,సంస్కృత , ప్రాకృత ,పాళీ మొదలైన 5 స్వదేశీ భాషలలోనుమొత్తం 13 భాషలలో  భాషా వేత్త అయ్యాడు .

హా౦డీక్- గౌహతి యూని వర్సిటి వ్యవస్థాపక వైస్ చాన్సెలర్ గా 1948- నుండి 57 వరకు తొమ్మిదేళ్ళు పని చేశాడు .దీనికి ముందు జోర్హట్ లో జే. బి .కాలేజి వ్యవస్థాపక ప్రిన్సిపాల్ గా1930- నుండి 48 వరకు 8 ఏళ్ళు ఉన్నాడు .జోర్హాట్ లో హేమలత హా౦డీక్ మెమోరియల్ ఇన్ స్టి ట్యూట్ ను స్థాపించాడు . అనేక విద్యా సంస్థల స్థాపనకు చేయూత నిచ్చాడు. విద్యా వ్యాప్తికి హాండీక్ కృషి అద్వితీయం .తాను సేకరించిన 11 ప్రపంచ భాషలలోని అరుదైన గ్రంధాలను గౌహతి యూని వర్సిటికి ధారాదత్తం చేసి అందరికి అందుబాటులోకి తెచ్చాడు .వీటి కాపీ రైట్ హక్కులను పూనా లోని దక్కన్ కాలేజి పి. జి. అండ్ రిసెర్చ్ సెంటర్ కు ,మహారాష్ట్ర లోని జైన సంరక్షా సంఘ్ కు ,అహమ్మదాబాద్ లోని ప్రాకృత టెస్ట్ సొసైటీకి అందజేశాడు .

1937 లో గౌహతి లో జరిగిన అస్సాం సాహిత్య సభకు 39 ఏళ్ళ వయసులో హాండీక్ అధ్యక్షునిగా వ్యవహరించి తన దక్షతను నిరూపించుకొన్నాడు .1951 లో లక్నో లో జరిగిన 16 వ ఆల్ ఇండియా ఓరి యెంటల్ కాన్ఫ రెన్స్ లో క్లాసికల్ సాంస్క్రిట్ విభాగానికి ప్రెసిడెంట్ గా ఉన్నాడు .1961 లో శ్రీనగర్ లో జరిగిన ఈ సభకు జనరల్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడు .7-6-1982 న  94 వ ఏట మరణించాడు .ముఖ్యమైన మూడు  గ్రంధ రచనలను చేశాడు -1-శ్రీ హర్షుని నైషధ చరిత -2-యశస్టికా అండ్ ఇండియన్ కల్చర్ 3-ప్రవర సేనాస్ సేతు బంధ .

అస్సాం  కు చెందిన సంస్కృత విద్వాంసుడు ,ఇండాలజిస్ట్ ,బహుభాషా వేత్త ,వితరణ శీలి అయిన కృష్ణ కాంత హాండీక్ సేవలకు భారత ప్రభుత్వం 1955 లో పద్మశ్రీ ,1967 లో పద్మ భూషణ్ పురస్కారాలు అందజేసి, సత్కరించి, గౌరవించింది.

Inline image 1

సశేషం

కనుమ శుభా కాంక్షలతో

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్  -15-1-17 –ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అమృతం ,అలాంటిదే ఫన్ బకెట్

హాస్య సాహితీ బంధు వులకు కనుము శుభాకాంక్షలు -ప్రతిరోజురాత్రి 9-30కు ఈ టివి లో అమృతం మళ్ళీ సీరియల్ గా  వస్తోంది .హాస్యానికి అమాయకత్వాన్ని జోడించి కిచెప్పిన గొప్ప సీరియల్ అది .చాలా విజయవంతం అయింది .దాన్ని” విజయ గుర్రం” పై నడిపించిన” గుణ్ణం” గారికి, అద్భుత పాత్రపోషణ చేసిన నటులకు, డైలాగ్ రచయితకు అభినందన శతం .హాస్యాన్ని ఈ సీరియల్ చిరంజీవి ని చేసింది .కనుక  పడుకొనే ముందు  ఒక సారి అమృతం రోజూ చూసి మనసు హాయిగా నవ్వుకొని నిద్రపోండి .

 అలాగే తెలుగు వన్ లో వచ్చే ”ఫన్  బకెట్ ”కూడా కొత్త ఒరవడి సృష్టించింది .కంప్యూటర్ యుగానికి జోడించి ఇందులోనూ అమాయక చక్రవర్తులనూ పరిచయం చేసి సభ్య హాస్యాన్ని నటులు దర్శకుడు కురిపించారు . హాయైన హాస్యాన్ని అనుభవించి ప్రోత్సహించండి .దీన్ని ”యు ట్యూబ్ ”లోనూ చూడవచ్చు .
  ”మహాతల్లి ”అనే సీరియల్ కూడా ఒకే ఒక అమ్మాయి మిగిలిన వారిని పాత్రలు చేసి చక్కగా నటిస్తూ హాస్యపు జల్లు కురిపిస్తోంది .నటన యెంత తేలికో ఈ సీరియల్ చూస్తే తెలుస్తుంది .
 మరో నవ్వు సీరియల్ ”చికాగో సుబ్బారావు ”సరదాగా సమకాలీనంగా సాగే హాస్య కధనం .కొత్తవాళ్లలోని టేలెంట్ కు ఇది అద్ధం  పడుతోంది ”.తల్లి ”ని” సుబ్బారావు”ను యు ట్యూబ్ లో చూడచ్చు .
 ఈ సీరియళ్లు తీసినవారుకాని ,నటించి దర్శకత్వం చేసిన వారు కానీ, రాసిన వారుకాని, నాకు ఎవరూ తెలిసిన వారు కాదు, బంధువులూ కారు అని గుర్తించండి .ప్రతిభ ,ఆనందమే వీటిని చూడమని మీకు చెప్పటానికి నన్ను ప్రోత్సహించాయి  . హాస్యో రక్షతి రక్షితః -దుర్గా ప్రసాద్ .
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 32-కాశ్మీర్ సంస్కృత శైవ సాహిత్య మహా విద్వాంసుడు –నీలకంఠ గుర్తు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

32-కాశ్మీర్ సంస్కృత శైవ సాహిత్య మహా విద్వాంసుడు –నీలకంఠ గుర్తు

2-1-1925 న కాశ్మీర్ లోని శ్రీ నగర్ లో నీలకంఠ గుర్తు జన్మించాడు .సంస్కృత సాహిత్యం లో  అడ్వాన్సేడ్ సాంస్క్రిట్ వ్యాకరణం ,భాషా సాహిత్యాలలో పాండిత్యాన్ని పండిట్ లాల్ కాల్ లాంగూ ,,పండిట్ హరిభట్ట శాస్త్రి ,పండిట్ సర్వ దనద హాన్డూ,పండిట్ మహేశ్వర నాద నెహ్రు ,పండిట్ జానకి నాధ దార్ వంటి ప్రసిద్ధ గురువుల వద్ద అభ్యసించాడు .సంస్కృతం లో వరుసగా ప్రజ్న ,విశారద ,శాస్త్రి డిగ్రీలను శ్రీనగర్ సంస్కృత యూని వర్సిటి నుండి పొందాడు .ప్రభాకర్ డిగ్రీ సాధించాక ,సంస్కృతం లో బి. ఏ .కూడా అందుకొన్నాడు . సంస్కృత శైవ సాహిత్యాన్ని పండిట్ బాలాజీ నాధ ,పండిట్ స్వామి, లక్ష్మణ్ జు ల వద్ద అభ్యసించి ప్రావీణ్యం సాధించాడు .

కాశ్మీర్ లోని త్రాల్ లో  ఉన్న ప్రభుత్వ సంస్కృత విద్యాలయం లో సంస్కృత టీచర్ గా ఉద్యోగం ప్రారంభించి ఉద్యోగం చేస్తూనే సంస్కృత  హిందీలలో ఎం .ఏ .చదివి పాసైనాడు . జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ రిసెర్చ్ ,ప్రచురణ విభాగం లో సోయేర్ కాలేజి,అమర్ సింగ్ కాలేజి లలకు  పని చేశాడు . ‘’గుర్తు’’ 18-12-2008 న అల్జీమర్స్ వ్యాధి తో మరణించాడు అనేక తీపి’’ గుర్తు’’లను మిగిల్చి .

గుర్తు సాధించిన సాహితీ విజయాలు అద్భుతమైనవి .సంస్కృత సాహిత్యం లోని చాలా వాటిని హిందీలోకి అనువదించాడు .అందులో ముఖ్యమైనవి –పరాత్రిశక వివరణ ను హిందీ వ్యాఖ్యానంతో ప్రచురించాడు .స్పందకారికను కల్లట వ్రుత్తి తోను ,హరేశ్వర మహాత్మ్యం ను ఆంగ్లానువాదం తోను ,పరమార్ధ సారం ను హిందీ వ్యాఖ్యతో ,సాంబ పంచాశిక ను క్షేమరాజ వ్యాఖ్యతోను ,ఉత్పలదేవుని శివ స్తోత్రావలి ని క్షేమరాజ వ్యాఖ్యానం తో ,సంస్కృత హిందీ భాషలలో ,క్షేమరాజు రాసిన పర ప్రవేశిక కు కాశ్మీరీ భాషలో వివరణ ,కాశ్మీర శైవ దర్శన బృహత్ కోశం ను రెండుభాగాలుగా ‘’నీలకంఠ గుర్తు’’ గుర్తుండి పోయేలా వెలువరించాడు ,కీర్తి గుర్తు మిగిల్చాడు .

సశేషం

సంక్రాంతి శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-1-17 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 31-పద్మశ్రీ వేద కుమారి ఘాయ్

— గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

31-పద్మశ్రీ వేద కుమారి  ఘాయ్

16-12-19 31 న జమ్మూలో ప్రతాప్ మొహల్లా లో జన్మించిన వేద కుమారి ఘాయ్ పాఠ శాల విద్య జమ్మూలోనే పూర్తి చేసి ,పంజాబ్ యూని వర్సిటి నుంచి 1953  సంస్కృతం లో ఎం .ఏ .పాసై,భారతీయ ప్రాచీన చరిత్ర ,సంస్కృతీ లో కూడా 1958 లో ఎం. ఏ ,పాసై ,బెనారస్ హిందూ యూని వర్సిటి నుండి సంస్కృతం లో 1960 లో పి .హెచ్. డి.సాధించింది .సంస్కృత విద్వాంసుడైన రాం ప్రతాప్ ను వివాహమాడింది .

జమ్మూలోని పెరేడ్ లో ఉన్న మహిళా ప్రభుత్వ కళాశాలలో సంస్కృత లెక్చరర్ గా వ్రుత్తి లో ప్రవేశించి ,జమ్మూ యూని వర్సిటి లోని పోస్ట్ గ్రాడ్యు యేట్ స్థాయి సంస్కృత శాఖ హెడ్ గా 31-12-1991 న రిటైర్ అయ్యేవరకు పని చేసింది .1966 -67.లోను, 1978 -80కాలం లోను   డెన్మార్క్ లోని కోపెంహాగ్ యూని వర్సిటి ఇన్ స్టి ట్యూట్ లో లెక్చరర్ గా సంస్కృత పాణిని వ్యాకరణాన్ని ,సాహిత్యాన్ని బోధించింది .ఆమె డోగ్రి భాష లో మహా విద్వాంసురాలు .హిందీలోను పండితురాలు .సాంఘిక సేవలోను వేదకుమారి ముందున్నది .అమరనాధ దేవాలయం బోర్డ్ లో ఆమె సభ్యురాలు కూడా .

వేదకుమారి ఘాయ్  సంస్కృత విద్వత్తు కు కేంద్రప్రభుత్వం ‘’పద్మశ్రీ ‘’పురస్కారం అందజేసి సత్కరించింది .భారత రాష్ట్రపతి గౌరవ పురస్కారమూ అందుకున్నది .సామాజిక సేవకు గుర్తింపు లభించి జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం స్వర్ణ పతాకాన్ని అందజేసింది .1997 లో సంస్కృత సేవకు ప్రెసిడెంట్ అవార్డ్ లభించింది .2005 లో ‘’డోగ్రా రత్న ‘’,2009 లో జీవిత సాఫల్య పురస్కారం ,2010 లో ’’స్త్రీ శక్తి పురస్కారం ‘’అందుకున్న విదుషీమణి వేద కుమారి ఘాయ్ .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-1-17 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

త్యాగరాజ ,బాలమురళి లకు స్వర నివాళి -సరసభారతి -101 వ సమావేశం

సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజ స్వామి ఆరాధనోత్సవం ,అపరత్యాగరాజు స్వర్గీయ శ్రీ మంగళం పల్లి బాలమురళీ కృష్ణ గారి సంస్మరణ సభ –స్వర నివాళి

సరసభారతి ,సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు 101 వ సమావేశంగా సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజస్వామి ఆరాధనోత్సవం ,అపర త్యాగ రాజు స్వర్గీయ శ్రీ బాలమురళీ కృష్ణ గారి సంస్మరణ సభ 17-1-17 మంగళవారం సాయంత్రం 6-30 గం లకు శ్రీ సువర్చలా౦జనేయ స్వామి దేవాలయం లో నిర్వ హింపబడుతోంది .సరసభారతి  గౌరవాధ్యక్షురాలు ,రోటరీ క్లబ్ ప్రెసిడెంట్,సంగీత మర్మజ్ఞులు  శ్రీమతి జోశ్యుల శ్యామలా దేవి గారి ఆధ్వర్యంలో ప్రముఖ గాయకులు శ్రీమతి శాంతిశ్రీ ,శ్రీమతి విజయ ,మరియు ఔత్సాహిక గాయకులు  శ్రీమతి పద్మజ ,మొదలైన వారు  పంచరత్న కీర్తనలు గానం చేసి ,స్వర నివాళి సమర్పిస్తారు .సంగీత ,సాహిత్యాభిమాను లందరూ పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన .

సంక్రాంతి శుభాకాంక్షలతో

గబ్బిట దుర్గా ప్రసాద్ ,సరసభారతి అధ్యక్షులు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

బర్మాదేశంలో తెలుగుభోధన.

ఎర్ర నాయుడు గారికి ఈ group లో గల తెలుగు బాంధవులకు, మేధావులందరికి నమస్కారం. తెలుగు తీరైన భాష. పలకడం తేలిక. కేవలం పెదాలు, నాలుక ఉపయోగించి దాదాపుగ అన్ని పదాలు పలకొచ్చు. ముక్కు, చెవులు, నాభి నుండి ఊపిరి మొదలైన వాట్ని ఉపయోగించి అధిక శక్తి నుపయోగించ నవసరం లేకుండ పలకొచ్చు. ఉదాహరణకు “ష” అనే పలుకుకు ఇంగ్లీష్  special,ocean,patient, shall, shunt, shirt ,mission, machine లో ఎన్ని spellings ఉన్నాయో గమనించండి. అలాగే  “పంతులు” అనే పదం తమిళంలో రాస్తే “బంతులు” “పందులు” “బందులు” “పంతులు” అని 4 రకాలుగ చదవచ్చు. భాషే కాకుండ తెలుగు లిపి కూడ తెలివిగ రూపొందించబడిందని అనిపిస్తుంది.

ఉదాహరణకు అన్ని గుడి అక్షరాలకు వలె “యి”కి గుడి గుర్తు ఉండదు. ఒక వేళ గుడి గుర్తు ఉంటే  “య” లో ని సున్న పొరబాటున చిన్నదిగ రాస్తే  “మి” అని చది వే అవకాశం ఉంది. బహుశా అందుకని గుడి తీసి వేసి ఉంటారు. కన్నడ లో ఇప్పటికీ వారు “యి” కి వాడతారు. అలాగే “ద-ధ” “ప-ఫ” వంటి కొన్ని అల్ప, మహా ప్రాణులకు ఏక రూపాక్షరాలుంటాయి. ఐతే “బ-భ”  లలో “బ” తలకట్టుండదు.ఒక వేళ తలకట్టుంటే కొద్ది తేడాతో (రాతలో)”చ” గ పొరబడే అవకాశముంది. అలాగే “మనయవరలకత”లకు మాత్రమే ఒత్తు అక్షరాలు వేరుగ ఉంటాయి. మిగిలిన వాటికి తలకట్టు రహిత అక్షరాలనే ఒత్తు అక్షరాలుగ ఉన్నాయి.ఎందుకంటే వాడుకలో 80%—90% ద్విత్వ, సంయుక్తాక్షరాలు ఈ అక్షరాలలోనే ఉంటాయి. అంటే ఎక్కువగా పునరావృతమయ్యే ఒత్తక్షరాలకు అక్షరమంతా రాసి సమయంవృథా చేయకుండు నట్లు లిపి రూపకల్పన జరిగినట్లుగ మనం భావించవచ్చు. అలాగే మీరు జాగ్రత్తగ గమనించండి గుణింతాలకు ఉపయోగించే అచ్చుల గుర్తులన్నీ కూడ ఆ అచ్చులలోనే నిబిడీకృతమై ఉన్నాయి. ఈ మెయిల్ కింద పొందుపరిచిన చార్టును గమనించండి మీకే అర్థం ఔతుంది. ఈ ప్రక్రియ మనకు తెలిసిన( తమిళ, కన్నడ, మళయాళ, హిందీ) భాషలలో కనబడదు. మన తెలుగు లోనే కనబడుతుంది. కేవలం మనతెలుగే కాకుండ ఏ ఇతర భాషలనైన తేలికగ నేర్చుకొనే వెసులుబాటుతో లిపి రూపకల్పన జరిగిందని కొందరంటారు.  విశ్వభాషగ పరిగణింపబడే సంస్క ృతం కంప్యూటర్ భాష అనువైనదిగ చెబుతారు. మరి అలాంటి సంస్క ృత భాష అక్షరాలకంటే కూడ ఇంకా ఎక్కువ మన తెలుగులో ఉన్నాయంటారు. అందుకే గాబోలు తెలుగు వాడు ప్రపంచంలోని ఏ భాషనైనా సులభంగా నేర్చు కొని వారిలాగే పలకగలుగుతున్నాడనిపిస్తుంది.

ఇన్ని విశిష్ఠతలున్న మనతెలుగు భాషను మన చిన్నారులకు నేర్పలేక పోతున్నామంటే నిజంగా మనం సిగ్గుపడాల్సిన విషయం. ఇక్కడ మనం ఒక్క విషయం గమనించాలి. తప్పుల్లేకుండ ప్రశ్నపత్రాన్నే  రూపొందించుకోలేక పోతున్న మనం టెక్స్ట్ బుక్ప్ నెలా రూపొందించుకొంటాం. కాకపోతే ఉద్యోగార్థులు ప్రశ్నలకు సమాధానాలు రాస్తారు కాబట్టి తప్పులు దొరుకుతున్నాయి. మరి టెక్స్ట బుక్సో. మరి అదే పిల్లలు మూగజీవాల్లా బలైపోతున్నారు. అసలైన మేధావులు అడుగున ఉండి పోయి  సూడో మేధావులు అందలెక్కడం వలననే ఇలాంటి పాట్లు జరుగుతున్నాయి.ఒకటో తరగతి తెలుగు వాచకం మీకు అందుబాటులో ఉంటే ఒక సారి చూడండి. “ఇ”  వేరు దాని గుణింతపు గుర్తు గుడి(ం) వేరన్నట్లుగ  ముందు గుడి(ం)మీద తరువాత “ఇ”మీదపాఠాలు రూపొందించారు. రెండవ తరగతిలోనే గుణింత సహిత సంయుక్తాక్షర ప్రక్రియ ఒక తంతులా పూర్తి చేశారు. మూడో తరగతి చివరగాని ఆ ప్రక్రియ అర్థం కాదు.ఇవి కొన్ని ఉదాహరణలు  మాత్రమే. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. వయోజన శాఖ వారు రూపొందించిన “చదువుకొందాం-1 & 2” చూడండి. అచ్చుల గుర్తులు పరిచయం చేసేటప్పుడు ఔత్వం(ౌ) గుర్తే పరిచయబడలేదు. మరి వారికి చదువెలా అబ్బుతుంది. ఇక అద్యాపకుల ప్రతిభ పైనే విద్యార్థుల భవిత ఆధారపడుతుంది. ఐతే తుపాకే పుచ్చుదైతే సైనికుడేం చేయగల్గుతాడు.

అందుకనే నేను అన్నీ సమీక్ష చేసుకొని ఒక క్రమ పద్ధతిలో పాఠాలు తయారు చేశాను. అంటే  అచ్చుల క్రమంలో తలకట్టు, దీర్ఘం, గుడి, గుడిదీర్ఘం……… విధంగా రూపొందించాను
1.పాఠం- అచ్చులు హల్లుల పరిచయం+100 పైగా పదాలు
2.పాఠం-పై పాఠం అక్షరాలు+ దీర్ఘాక్షరాలు వాటి పదాలు
3.పాఠం-అచ్చులు+హల్లులు+దీర్ఘాక్షరాలు+గుడి అక్షరాలు పదాలు
ఇ లా 14 పాఠాలుంటాయి. నేనిప్పటికే పెద్దవారిపై అమలు పరచి చూశాను. రోజుకు 2 గం॥ చొ॥న  30 రోజులలో చదవ గల్గుతున్నారు. పిల్లలకైతే మరో 15 రోజులు పట్టవచ్చు. వారికి రాయడం కూడ అభ్యాసం చేయించాలి కాబట్టి. ఈ క్రింద 4 పట్టికలు పొందు పరుస్తున్నాను. చూడండి. 1వది సమగ్ర వర్ణ పట్టిక. జాగ్రత్తగ గమనించండి.అందులో అచ్చుల్లోనే గుణింత గుర్తులు నిబిడీకృతమై ఉండడం, సారూప్యత లేని గుణింతాక్షరాలు వేరే రంగులో చూపడం, తేడాగా ఉండే “మనయవరలకత” ల  ఒత్తక్షరాలు చూపడం జరిగింది.2,3 పాఠాలు దీర్ఘం, గుడి అక్షర పదాల పట్టికలు

భవదీయుడు
ఆనంద నాయుడు.వై
ఏలూరు.

Posted in సేకరణలు | Tagged | Leave a comment

నాకూ ఓ చాన్స్ ఇవ్వండి (సరదా కోసమే )

నాకూ ఓ చాన్స్ ఇవ్వండి (సరదా కోసమే )

మాంచి నిద్రలో ఉన్నా .సెల్ మోగింది .ఎవరో గ్రీటింగ్స్ చెబుతున్నారేమోనని ఎత్తా .’’సార్ నమస్తే ‘’అంది అవతలి ఆడ గొంతు .’’నమస్తే అమ్మా ఎవరు మీరు ఏంకావాలి ?’’అన్నా .’’రేపు మీరు సంక్రాంతి కవి సమ్మేళనం పెడుతున్నారని తెలిసింది .నాకూ ఒక చాన్స్ ఇవ్వండి ప్లీజ్ ‘’అన్నది ఆమె .’’అమ్మా మీ పేరు వగైరా చెప్పండి ‘’అన్నా .’’నా పేరు జాకీ రాణి .చాలా సభల్లో కవిత్వం వినిపించా .ఏ టాపిక్ అయినా దంచేస్స్తా .’’అంది .’’దంపుడూ ,రుబ్బుడూ వద్దుకాని ,నీతో నాకు ఇదివరకు పరిచయం లేదు కదా అందుకని అడిగా .దేనిమీదైనా రాస్తానన్నావు కనుక నాలుగు లైన్లు ‘’ఆటో ‘’మీద వినిపించు అన్నా .’’ఒకే సార్ –వినండి –‘’తోలుతుంటే వాడు ఆటో –చెప్పాలనిపిస్తుంది రైటో –వాడు చెప్పే రేటో –వింటే రక్త పోటో ‘’.అన్నది  ‘’ఎలా ఉంది  సార్’’అడిగింది .’’నీ కవిత వింటే గుండె పొటే’’అని ఫోన్ పెట్టేశా .కాసేపు మాగన్నుగా కునికా .మళ్ళీ రింగ్ రింగ్ .’’ఎవరు ?’’అడిగా .’’నేను త్రిజటా రావు సార్.మీ కవి సమ్మేళనం లో నాకు చాన్స్ ఇవ్వండి ‘’అన్నది అవతలి గొంతు .’’ఇంతకీ మీరు పురుషా స్త్రీయా ?’’సందేహం గా అడిగా ‘’మగోణ్ణే. సబ్జెక్ట్ మీరు చెబుతారా నన్ను చెప్పమంటారా ‘’అన్నాడు అదేదో సినిమాలో వేణుమాధవ్ ఇంటర్వ్యు లో ఎం ఎస్  నారాయణ ను అడిగినట్లు .’’నీ కెందుకు శ్రమకాని అబ్బాయా .’’నోట్ల రద్దు మీద కవిత గుద్దు ‘’అన్నా ‘’పెద్దనోట్లు రద్దు –మోదీకేమో బలే ముద్దు –మనకేమో నెత్తిన పిడి గుద్దు.’’అన్నాడు .’’బానేఉంది .’’అన్నా .’’మరి నా చాన్సో ‘’అన్నాడు ‘’ఇస్తే నీకు ముద్దు –నాకు మాత్రం సభికులనుంచి పిడి గుద్దు’’అన్నా ఠపీ మని ఫోన్ పెట్టేశాడు .ఇంతలో మరోకాల్ ‘’నేనండీ అరుణ తార .కవి సమ్మేళనాలెన్నిటిలోనో పార్టిసిపేట్ చేశా. చాన్సిస్తే రాస్తా .’’అన్నది .’’నీ భావ ధార వదులు తల్లీ ‘’అన్నా.’’నిఘంటువు లో  ఉండకూడదు పేరు మగ –అదంటే నాకు పరమ పగ -.మగోడు లేకుంటే ఏమిటి వగ –వాడ్ని ఎందుకు పొగుడుతారు తెగ ‘’అన్నది ‘’ఇక చాలు అమ్మా .’’ఇస్తే చాన్స్ నీకు మా వాళ్ళతో నాకు పొగ –ఇక కక్కకమ్మ నీ అక్కసు తెగ సెగ ‘’అని ఫోన్ పెట్టేశా .

లేచి కాఫీ తాగి సేద దీర్చుకొంటుంటే  మళ్ళీ సెల్ మోత .’’హలో ‘’అన్నా .’’నేను సార్ భావకవి బలాదూర్ ను.కవి సమ్మేళనం లో నాకు ఎల్లానూ చాన్స్ ఇస్తారనుకోండి .ఇంతకీ సబ్జెక్ట్ ఏమిటి సార్?అడిగాడు ‘’కోడి పందాలు ‘’అన్నా .’’అయితే పందెం కోడిలా రెచ్చిపోతా –వినండి –‘’మేపిన కోడిని కొక్కొరకో –పందెం వేస్తారు కొక్కొరకో –కత్తులు ఉండవంట కొక్కొరకో –ధ్రిల్ ఏముంటుంది కొక్కొరకో ‘’అన్నాడు ‘’నువ్వు ఆపక పోతే కొక్కొరకో –పోలీస్  కంప్లైంట్ ఇస్తా కోక్కోరకో ‘’అనగానే ఫోన్ బంద్. మరో నిమిషం లో ఫోన్ బాంగ్ ‘’అయ్యా నేను పద్య కవి పరమేశాన్ని .మీ సమ్మేళనం లోనాకూ చాన్స్ –‘’అన్నది అవతలి గొంతు ‘’సరే పరమేశం జీ .దేని మీద పద్య స్వారి చేస్తారు ?’’అడిగా .’’ఏదైనా నల్లేరు పై బండీ లా నడిపిస్తాను ‘’అన్నాడు .’’అయితే అమరావతి పై చెప్పండి సాంపిల్ గా ‘’అన్నా .’’దేవేంద్రుని రాజ దాని అమరావతి –దాని వగలు సోయగాలు చూస్తుంటే పోయేను మతి –అప్సరసల పొందు తీర్చేను జీవన గతి –ఆ ఆనందం చెరగని  స్మ్రుతి ‘’అని ‘’ఎలా ఉంది సార్?’’అన్నాడు ‘’అయ్యా! కళ్ళముందున్న నవ్యాంధ్ర రాజధాని ని వదిలేసి , సొల్లు కార్చుకొనే ఆ అమరావాతి పై చెప్పారు .సమకాలీనం లో జీవించండి .’’అన్నా .’’అరే సార్.ఇక్కడో అమరావతి ఉందా ?’’అన్నాడు ‘’’ఊహాలోకం లో సంచరిస్తే మతి –లేకుంటే ఇంటికాడ పెళ్ళాం పిల్లలు అధోగతి ‘’అన్నా .ఫోన్ పెట్టేశాడని చెప్పక్కరలేదను కొంటాను .

కాసేపు పేపర్ తిరగేశా .ఇంతలో రింగ్ రింగ్ ‘’ఎవరూ ‘’అన్నా’’నేను సార్ మినీ కవితల మీసాల్రావు ‘’అన్నాడు .’’మిమ్మల్ని గురించి వినలేదండీ .మీ పరిచయం .’’అన్నా .చెప్పి,సాంపిల్ గా ‘’ఆకాశం లో మేఘం –కిందనేమో దాహం –అది కురవదు –ఇట దాహం తీరదు ‘’అన్నాడు. ‘’ కవితలో కవిత్వం ఉండదు –చాన్సిస్తే నేను ఉండను’’అన్నా .మరికొంత సేపటికి మరో మోత ‘’నా పేరు  నానీల నాని .చాన్సిస్తారా ?’’డైరెక్ట్ క్వశ్చన్ .’’ఓకే .మాదిరి కవిత చెప్పండి ‘’ఒకే .’’నానీ-నేనీ-కానీ –పోనీ –అనీ  –‘’అని ఆపేశాడు .’’అబ్బో .’’వినీ వినీ –పైకి పోనీ ‘’అన్నా.అర్ధం చేసుకోన్నాడో ఏమో మారు మాట లేదు .కొంతసేపటికి మరో ఫోన్ ‘’హలో ఎవరూ ‘’అన్నా .’బ్రదర్ -’నేను వీరవిప్లవ కవి పరపర రావు ‘’అన్నది అవతలి గొంతు ‘’బ్రదరూ  !నాకు విప్లవసాహిత్యం తో పరిచయం లేదు ఆనాయకులేవరో తెలీదు నువ్వు  రాంగ్ నంబర్ కు ఫోన్ చేశావేమొ బ్రదర్  ?’’అన్నా .’’మేం అడవుల్లో తిరుగుతున్నామన్నా  జనజీవన స్రవంతి లో వార్తలన్నీ తెలుసుకొంటాం .అడవి రాముళ్ళం.మీ కవితా సమ్మేళనం లో అజ్ఞాతంగా పాల్గొంటాను .అవకాశాం ఇస్తారా ?’’దేని పై కవిత్వం చెబుతావు బ్రదర్  ?’’అడిగా .’’బుజాన బుల్లెట్టు –కాళ్ళకు జాకెట్టు –నెత్తి మీద పాకెట్టు –నన్ను చూస్తె షాక్కొట్టు’’అన్నాడు రొప్పుతూ .’’బ్రదర్ .’’ఒకమాట చెబుతాను విను బ్రదర్ .నీకు ఇంకా ఆసాహిత్యం వంట బట్టినట్లు లేదు .ఎదోకుతూహలపడి అడిగినట్లున్నావు .మీవాళ్ళు రాస్తే బుల్లెట్ల వర్షం కురిసేట్లు ఉంటు౦ది  నీ కవితలో పొంతన లేదు కవిత్వం ప్రాక్టీస్ చెయ్యి ‘’అన్నా .’’నిజమే బ్రదర్ .నువ్వు అన్నాక నా కవిత నాకే రోతగా ఉంది .ఏదో ఆత్రపడ్డాను ‘’అన్నాడు .’’బ్రదర్ ! కవిత్వం లో ప్రవేశించాలనుకొన్న నీ భావనకు సాల్యూట్ .బాగా రాస్తే నేనే ఆహ్వానం పంపిస్తా నువ్వు అడగకుండా ‘’అన్నాను ‘’ఒకే బ్రదర్ లాల్ సాల్యూట్ ‘’అంటూ బూట్ల శబ్దం తో ఫోన్ ఆగి పోయింది .

ఇంతలో మా బామ్మర్ది బ్రహ్మం ఆదరా బాదరా రోప్పుకుంటూ వచ్చాడు .’’బావా ! నేను లేకుండా కవి సమ్మేళనమా?ఎంత అవమానమెంత అవమానము ?అన్నాడు పాత ఎన్టీ ఆర్ స్టైల్ లో .’’నువ్వూ కవిత్వం కక్కుతావా ?అఘోరించు ’’అన్నా’’శుభం పలకరా మంకేన్నా అంటే అదేదో అన్నట్లు ఈ దీవనలేమిటి బా! .పండగ ముందు .’’అన్నాడు .’’బామ్మర్ది అంటే సొతంత్రం రా .నే ననాలి నువ్వు పడాలి అది రూలు ‘’అన్నాను  .’’కవిత్వ విషయం ఏంటి బా !’’అన్నాడు .’’ఇ౦కా ఆలొచి౦చలేదు .ఆలోచిస్తుంటే కురుపు సలపరింతలాగా ఫోన్లమీద ఫోన్లు .నువ్వు దేనిమీదైనా ప్రిపేర్ అయ్యావా ?’’’’మనం ఆల్రెడీ రెడీ .’’అన్నాడు .’’ఒక నమూనా వదులు’’అన్నా –సరే బావా !నవ్వ కూడదు .’’అన్నాడు ‘కానీ !’’అన్నా ‘’ స్వచ్చ భారత్ కోసం చీపురుతో రోడ్లన్నీ ఊడవ లేక అలసిమోడీ  -పెద్దనోట్లను ‘’రద్దు చీపురు’’తోఅర్ధ రాత్రి  ఊడ్చి పారేశాడు –డబ్బు తెలుపైందో లేదోకాని –నల్లకుబేరులు  బేర్ మన్నారో లేదో తెలీదుకాని –సామాన్యులు ‘’బావురు’’మన్నారు .పోపుల డబ్బా డబ్బులు బ్యాంక్ లో చేరాయి కాని –నల్లదనం మరింత నలుపెక్కిందని వింటున్నాం –ఫలితాలకోసం రెండు నెలలు ఆగినా –ఎదురు చూపేకాని ఆశల ముందు చూపు కనిపించట్లేదు –ఎవరికోసం ఈ రద్దు ?అమెరికా సలహాతోనా ?అంతు తెలియని అజ్ఞాత వ్యక్తుల ప్రేరణ తోనా ?ప్రజల జీవితాలతో ఆడుకో వద్దు –చూస్తూనే ఉన్నాంగా ఎన్నో దేశాల భవితవ్యం –మనదైన భావన ఉండాలి ప్రతి చర్య వెనకా –అప్పుడే వస్తుంది ఎంచక్కా ప్రగతి చక చకా ‘’అని గుక్క తిప్పుకోకుండా వదిలాడు .’’ఒరే !నీ లో ఇంత కవిత్వం అజ్ఞాతం గా దాగుందా –బాగుంది –నువ్వే ఈ కవిసమ్మేళనాన్ని నిర్వ హించు ‘’అన్నా .’’బావో ! నా నెత్తిన అంత భారం పెట్టకు .ఏదో నీ నీడ లో వాడిని ‘’అన్నాడు .’’ఎంత కాలం నీడ ?వెలుగులోకి రా ఈ సారైనా ‘’అన్నా .’’ముసిముసి నవ్వులతో వాళ్ళక్క దగ్గిరికి వంటి౦ట్లోకి పండగ సరుకు భక్షి౦చటానికి రంయి మని దౌడు తీశాడు బామ్మర్ది బ్రహ్మం .

Inline image 3

రేపటి  సంక్రాంతి శుభాకాంక్షలతో

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్-13-1-17 –ఉయ్యూరు

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

విహంగ సాహితీ పురస్కారం

15978039_1531116513583941_3146486525061878728_n

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

సంక్రాతి శుభాకాంక్షలు


Inline image 2Inline image 3
Inline image 4

Inline image 5
 
Inline image 6
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

నెల నెల వెన్నెల – ఓ అద్భుతం – 05.02.2017 ఆహ్వానం

2xray xray

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

వివేకానందుని తోలి ఆంగ్లప్రసంగం హైదరాబాద్ లోనే చికాగోలో కాదు

image-5

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విహంగ సాహితీ పురస్కార

శ్రీమతి పుట్ల హేమలనిర్వహిస్తున్న  మహిళా వెబ్ మాసపత్రిక ”విహంగ ”కు గత 5 ఏళ్లుగా ప్రతినెలా ప్రపంచప్రసిధ్ధ మహిళనొకరు గురించి రాస్తున్నందున 11-1-17 రాజమండ్రి శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయ ప్రాంగణం లో జరిపిన 6 వ వార్షికోత్సవ జాతీయ సెమినార్ లో వైస్ చాన్సెలర్ శ్రీ ఎస్వీ సత్యనారాయణ గారించే సత్కారం చేయించి అందజేసిన ”102_9751 ”పత్రం . నా అంతర్జాల రచనకు అందుకొన్న మొట్ట మొదటి పురస్కారం ఇది .ఈ ఆనందం అందరితో పంచుకొంటున్నాను -దుర్గా ప్రసాద్

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

11-1-17 బుధవారం సాయంత్రం రాజమండ్రిలో ప్రాచార్యులు శ్రీ శలాక రఘునాధ శర్మ గారింట్లో మేమిద్దరం ,మామనవడు చరణ్

11-1-17 బుధవారం సాయంత్రం రాజమండ్రిలో ప్రాచార్యులు శ్రీ శలాక రఘునాధ శర్మ గారింట్లో మేమిద్దరం ,మామనవడు చరణ్

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

11-1-17 బుధవారం 6వ వార్షికోత్సవ జాతీయ సెమినార్

మతి పుట్లహేమలత ఎడిటర్మ గా నిర్వహిస్తున్న వెబ్ మాస పత్రిక ”విహంగ ”కు అంతర్జాలంలో గత 5 ఏళ్ళనుండి ప్రతినెల ఒక ప్రముఖ మహిళా పై వ్యాసం రాస్తున్నందున

లో రాజమండ్రి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయ ఆవరణలో వైస్ చాన్సెలర్ శ్రీ ఎస్ .వి సత్యనారాయణ గారిచే సత్కారం అందజేసిన చిత్రాలు .

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

భారత తొలి ఆంగ్ల ,ఫ్రెంచ్ కవయిత్రి –తోరు దత్

భారత తొలి ఆంగ్ల ,ఫ్రెంచ్ కవయిత్రి –తోరు దత్

4-3-1956  న భారత దేశం లోని బెంగాల్ రాష్ట్రం లో జన్మించిన తోరు దత్ 30-8-1877 న అతి చిన్నవయసు 21 ఏళ్ళకే మరణించింది.’’ఇండో –ఇంగ్లీష్ సాహిత్య కీట్స్’’అని ఆమెను అందరూ భావిస్తారు .తోకచుక్క లాగా ఒక్కసారి కవిత్వం తో మిరుమిట్లు గొలిపి అదృశ్యమైంది .జాన్ కీట్స్ మహాకవి క్షయ వ్యాధి బారినపడినట్లే, ఈమెకూడా ఆ వ్యాధితోనే  చనిపోవటమూ యాదృచ్ఛి కమే .ఆమె పెద్దక్క ఆరు చనిపోయినప్పుడు  ఆమె నోటివెంట వచ్చిన మాటలు అత్యంత కవితాత్మకం గా ఉన్నాయి .సంస్కృతం ఇంగ్లీష్ ఫ్రెంచ్ మూడు భాషల్లో ఆమె సృజన వికసించింది .నిజంగా ఆమె ఇండో –ఆంగ్లికన్ సాహిత్యానికి మార్గ దర్శి .ఇంగ్లీష్ లో ఇండియన్లు రాసే కొత్త శకానికి తోరు దత్ తెర తీసింది   వికసించిన ఈ లేత పుష్పం అంత త్వరలో నే వాడి పోవటం దురదృష్టం .

భాషా శాస్త్ర పండితుడు ,కవి గోవిన్ చందర్ దత్ ,అత్యున్నత సంస్కారమున్న క్షేత్రమణి దంపతుల మేధో విలసిత కుటుంబం లో ,అపురూపమైన తోరు దత్  జన్మించింది .ఈ కుటుంబ నేపధ్యం తోరు దత్ సాహిత్యం పై అత్యంత ప్రభావాన్ని చూపింది .వారింటి ఉద్యానవనం గాలి లోనే కవిత్వపరిమళం విలసిల్లింది  .ఆమె బాబాయిలు ముగ్గురూ హరి చందర్ ,ఉమేష్ చందర్ ,గ్రీస్ చందర్ ‘’దత్ ఫామిలీ ఆల్బం ‘’లో కవిత్వం ఒలికి౦చినవారే .  సంతానం లో చిన్నపిల్ల తోరు అతి సుకుమారి ,మహా మేధో సంపన్నురాలు ..పైవాళ్ళి ద్దరూ అబ్జు ,ఆరు దత్ లు .తండ్రి తోరు పై చిన్నకవిత రాసి  ఆమె స్వభా వాన్ని  ఆవిష్కరించాడు –

 “Puny and elf-like, with disheveled tresses,

Self-willed and shy ne’er heeding that I call,

Intent to pay her tenderest addresses

To bird or cat, – but most intelligent…”

తండ్రి తన మానసిక బలం పై  చూపిన ప్రభావాన్ని తోరు గుర్తించింది .దానిని ఆమె జ్ఞాపకమూ చేసుకొన్నది –‘’నాన్న లేకపోతే నాకు మంచి కవిత్వానికి చెడు కవిత్వానికి మధ్య ఉన్న తేడా తెలిసేదికాదు .ఆయన అంత శ్రమపడి చిన్నప్పటి నుంచి మమ్మల్ని తీర్చి దిద్దాడు .ఆయన లేకపోతె మా భవిష్యత్తు ఎలా ఉండేదో ‘’అన్నది .ఆమె జీవితం లో సంతోషం, బాధ ,ఎడబాటు  ,సృజన వగైరా సంఘటనలు తన ప్రమేయం లేకుండానే త్వరత్వరగా జరిగిపోయాయి .తోరు 6 ఏళ్ళ వయసులో కుటుంబం 1862 లో క్రిస్టియన్ మతం తీసుకొన్నది .దీనితో తాత్కాలికంగా తలిదండ్రుల మధ్యపొర పొచ్చాలొచ్చాయి .ఆమె తల్లి మనసు మార్చుకొని తండ్రిని చేరి ,క్రిస్టియానిటీ స్వీకరించటమే కాక ‘’ది బ్లడ్ ఆఫ్ జీసెస్ ‘’ను బెంగాలి భాషలోకి అనువదించి రెండుభాషలలో తనకున్న సామర్ధ్యాన్ని తెలియ జేసింది .9 వ ఏట విధి బలీయమై ఆమె అన్న అబ్జు అకస్మాత్తుగా చనిపోయి మనసుపై తీవ్ర శరాఘాతం చేశాడు .ఇద్దరు ఆడపిల్లలు దీన్ని తట్టుకోలేక అల్లల్లాడి పోయారు. బాధఉపశామనానికి  ఆరు ,తోరు లిద్దరూ సాహిత్యం పై దృష్టి నిలిపి, మిల్టన్ మహాకవి రాసిన ‘’పేరడైజ్ లాస్ట్ ‘’పదేపదే చదివారు.

నాలుగేళ్లతర్వాత కుటుంబం కలకత్తా నుంచి యూరప్ వెళ్ళింది .అక్కడ సోదరి లిద్దరి మేధ బహు ముఖీనంగా వికసించి౦ది .మొదట్లో వాళ్ళు ఫ్రాన్స్ ఆగ్నేయభాగం నైస్ లో ఉన్నారు .అక్కడ స్కూల్ లో చేరి ఫ్రెంచ్ నేర్చి అందులో ప్రావీణ్యం సాధఛి సృజనకు ఉపయోగించుకొన్నారు .కొద్దికాలమే అక్కడ ఉండి ఇటలీకి,తర్వాత ఇంగ్లాండ్ కు  వెళ్ళారు .లండన్ లో సంగీతం నేరవటం తో  వారి లలిత కళాభిరుచి వేయి రెట్లు వికసించింది .ప్రపంచపు కొత్త భావోద్వేగాలు వారిని ఆకర్షింఛి కొత్తద్వారాలు తెరిచాయి .కేంబ్రిడ్జి లో ఉన్న రెండేళ్లలో వారి వ్యక్తిత్వాలు మరింతగా కుసుమింఛి వికసించాయి ..ఇక్కడే తోరు కు మేరీ మార్టిన్ అనే అమ్మాయి పరిచయమై స్నేహం జీవితాంతం కొనసాగింది .మేరీ తో కొనసాగిన ఉత్తర ప్రత్యుత్తరాలలో తోరు కవితా వికాస విలసనాలు స్పష్టంగా తెలుస్తాయి . చిన్నారి తోరు జీవితానందం తో ఆమె మేధ కూడా వికసించటం గమనిస్తాం .వాళ్ళమాటలలో, రాతలలో పూలు ,పక్షులు ,కళాదృష్టి అనారోగ్యం పాండిత్య ప్రకర్ష అన్నీ చూడచ్చు .

1873 లో వాళ్ళు ఇండియాకు తిరిగొచ్చాక ఇద్దరూ సాహిత్యాన్వేషణ లోనే గడిపారు .ఈకాలం లో తోరు ఫ్రెంచ్  కవితలను ఇంగ్లీష్ లోకిఅనువదింఛి ‘’ఎ షీఫ్ గ్లీనేడ్ ఫ్రం ఫ్రెంచ్ ఫీల్డ్స్ ‘’అని పేరు పెట్టి1876 మార్చి లో ప్రచురించింది ..ఇలాంటిదే సంస్కృతం లోనూ తేవాలనే అభిప్రాయం కలిగి తండ్రి దగ్గరే సంస్కృతం నేర్చింది  . .   .  .

సాహిత్య విజయాలు

వచనం లోకంటే కవిత్వం లో ఆమె ప్రతిభ బాగా రాణించింది .రాసిన కవిత్వం 1-‘’ఎ షీఫ్ గ్ల్లీనేడ్ ఇన్ ఫ్రెంచ్ ఫీల్డ్స్ ‘’,2-ఎన్శేంట్ బాలడ్స్ అండ్ లెజెండ్స్ ఆఫ్ హిందూస్థాన్’’రెండే అయినా అందరి దృష్టినీ ఆకర్షించాయి .ఆమె కవిత్వం లో సున్నితమైన వర్ణన, భావ గీతం ,పాటవం ఉంటాయ.ఆమె జీవితకాలం లో ప్రచురితమైన ఒకే ఒకటి ‘’ఎ షీఫ్ ‘’.అందులో అహంభావం లేని నిరాడంబర కవిత్వం తగిన గెటప్ ఉన్నాయి .1876 ఆగస్ట్ సంచిక ‘ది ఎక్సామినర్ ‘’లో ఈ పుస్తక సమీక్ష ప్రచురించారు .సమీక్షకుడు ఎడ్మండ్ గాస్ ‘’162 అనువాదకవితలున్న ఈ పుస్తకం తోరు దత్ లోని అభినివేశాన్ని ,అత్యద్భుత ప్రదర్శనను తెలియ జేస్తుంది .ఆశ్చర్యకరమైన ,అత్యద్భుతమైన విజయాన్ని సాధించింది ‘’అన్నాడు .ఫ్రెంచ్ కవితలను ఎన్నుకోవటానికి తోరు దత్ ఫ్రెంచ్ సాహిత్యం లోని కాల్పనిక కవిత్వానికి ప్రాధాన్య మిచ్చింది .సంధియుగపు కవులైన చీనియర్ ,కొరియర్ ,లార్టైన్ ,లానే లే కాక రోమా౦టిక్స్ కాని  ,మోరో, డూపాంట్  ,వాల్మోర్ ల కవిత్వాలనూ తీసుకొన్నది .ఫ్రాన్స్ లో రోమా౦టిజం ఇంగ్లాండ్ లో లాగానే 18 శతాబ్ది చివర 19 శతాబ్ది మొదట్లో వచ్చింది .ఏనిబందనలు లేని స్వతంత్ర సరళ సూటి వ్యక్తీకరణ ఊహ దీని లక్షణం .అందుకే హృదయాలను తాకి ,ఆనందం కలిగించి , దేశభక్తి ప్రబోధాత్మకమై ఏకాంతం ,ప్రక్షాళన ,నిరాశా ,భ్రమ ,ప్రవాసం ,నిర్బంధ భావాలున్న కవిత్వానికే  ఆమె ప్రాముఖ్యమిచ్చింది.మాతృకలోని నాడిని పట్టుకొని అర్ధం చేసుకొని దాన్ని చక్కగా అనువాదం చేయటం ఆమె ప్రత్యేకత .అందుకే విశ్లేషకుడు గాస్ ‘’ఆధునిక ఫ్రెంచ్ కవిత్వం అంతా పూర్తిగా కనుమరుగైనా,నశించినా ,అందులోని అనేకకవితలను పునర్నిర్మించలేక పోయినా ఏమీ ఫర్వాలేదు వాటిలో చాలాభాగం భారతీయ అనువాదం (ఇండియన్ వెర్షన్ )లో దొరుకుతుంది ‘’అన్నాడు .నిజానికి ఆమె గుడ్డిగా అనువాదం చేయలేదు .ఏ విధమైన సంకోచం లేకుండా ఆమె ఫ్రెంచ్ పదాలను ,పద బంధాలనుతీసేసి  వాటికి మరింత స్పష్టమైన తగిన వాటితో మార్పు చేసి స్వతంత్రం తో అనువాద౦ చేసి సొగసు చేకూర్చింది . మూలం లోని లయను చాలా జాగ్రత్తగా అనువాదం లోకి తెచ్చింది. అది ఆమె గొప్పతనం .

యూరప్ లో చదివి శిక్షణ పొందినా ,తోరు దత్ హృదయం మాత్రం భారతీయమే .చిన్నప్పుడు తల్లి  రామాయణ ,మహాభారత ,పురాణ కధలను చెప్పి మనసులో గాఢ ముద్ర వేసింది .స్వయం గా సంస్కృత కావ్యాలను చదవటం వలన ఆకధలలోని ఆంతర్యం,లోతు  ఆమెకు స్పష్టంగా అవగాహన కల్గించింది .అందుకే ఆమె ‘’ఎన్శేంట్ బాలడ్స్ అండ్ లెజెండ్స్ ఆఫ్ హిందూ స్థాన్’’రాయటానికి పూనుకొని విజయవంతంగా ర్తి చేసి 1882 లో ముద్రించి ము౦దు మాటలను ఎడ్మండ్ గాస్ తో రాయించింది  .’’ఇంగ్లీష్ లో గొప్ప రచన ‘’అని విమర్శకులు మెచ్చుకొన్నారు .’’భారతీయ ఆత్మను ఆంగ్ల కవితా మాధ్యమం లో  పడమటి దేశాల వారికి ఎరుక పరచిన మొట్టమొదటి పుస్తకం ఇది ‘’అని సాహిత్య విమర్శకుడు లోకితా బసు అన్నాడు .   చక్కని వైవిధ్యం కధనం సుందర కవిత్వం తో గొప్ప విందు అనిపించింది .ఇందులో  సావిత్రి ,లక్ష్మణుడు ,ప్రహ్లాదుడు ,,సింధు మొదలైన వారి కధలున్నాయి .మొత్తం 3 ముద్రణలు పొందింది ‘’షీఫ్ ‘’కాని తనసాహితీ విజయాలను చూసుకొనే అదృష్టం ఆమెకు దక్కలేదు .ఎనిమిది కవితలను పెద్దక్క అనువాదం చేసింది .

తోరు దత్ రెండునవలలు 1-బియాంకా( ది స్పానిష్ య౦గ్ వుమన్ )2-లె జర్నల్ డిమాడెమోడిల్లెడిఆర్వెస్’’రాసింది .మొదటిది అసంపూర్తి రోమాన్స్ ఇంగ్లీష్ నవల .రెండవదిమార్గరెట్ అనే ఆమె డైరీ రూపం లో ఫ్రెంచ్ భాషలో రాసినది .అంటే ఫ్రెంచ్ భాషలోనూ రాసిన మొట్టమొదటి భారతీయ రచయిత్రి తోరు దత్ అని తెలుస్తుంది .ఈ రెండూ ఆమెచనిపోయిన తరువాత ఆమె దగ్గరున్న పేపర్ల గుట్టలో దొరికాయి .భావ గర్భితంగా కవితాత్మక కధనం తో సరళంగా రాసిన రచనలు ఈ రెండు .తోరు కు భారతీయ సాంస్కృతికవారసత్వమ౦టేగర్వపడుతుంది .అందులోని  ,జానపద ,పురాణ ,,ఇతిహాస కధలన్నాచెప్పలేనంత ఇష్టం.ఆంగ్ల విద్య నేర్చినా,ఆమెజీవిత విధానమ౦తా భారతీయమే . ఇ.జె.ధాంసన్ఆమెను గురించి చెబుతూ , “Toru Dutt remains one of the most astonishing woman that ever lived …. Fiery and unconquerable of soul. These poems are sufficient to place Toru Dutt in the small class of women who have written English verse that can stand.’’అన్నాడు . ఆమె రాసిన ‘’కాసురీన ట్రీ’’(సరుగుడు చెట్టు )కవిత ఆధునిక భారతీయ సాహిత్యం లో బాగా ప్రసిద్ధి చెందింది .ఆచెట్టు జ్ఞాపకాలతో తన బాల్యాన్ని నెమరేసుకోవటం దీని ప్రత్యేకత .ఈకవిత మనదేశం లో ఇంగ్లీష్ పుస్తకాలో బోధనాంశంగా ఉండేది .

తోరు చనిపోయాక తండ్రికి 1887 లో ‘’బాలడ్స్ ‘’రచన దొరికి ముద్రించాడు .ఆమె నవల ‘’లె జర్నల్ ‘’ను పృధ్వీంద్ర ముఖర్జీ బెంగాలీ భాషలోని అనువాదం చేశాడు .ఇది ‘’బసుమతి ‘’అనే బెంగాల్ పత్రికలో సీరియల్ గా వచ్చింది .ఇంగ్లీష్ అనువాదమూ సీరియలైజ్ అయింది .తోరుకు జర్మన్ భాషలోనూ ప్రావీణ్యం ఉంది .బ్రిటిష్ వారు భారతీయులపై చూపిస్తున్న దాష్టీకం ,పెత్తనం పై తోరు తీవ్రంగా విమర్శించింది .నిత్యం దినపత్రికలు చదివి ఇండియాలో జరిగే విషయాలన్నీ తెలుసుకొని భారతీయులపై  బ్రిటిష్ ప్రభుత్వం అనుసరిస్తున్న దారుణ విధానాలవల్ల ఆ జాతిపై ఆమె కు  క్రోధం పెరిగింది .ఒక భారతీయునిపై ఇంగ్లీష్ వాడి కుక్కలు వెంటబడి బాధ పెడితే,ఆత్మ రక్షణ కోసం ప్రయత్నిస్తే, వాడు కేసుపెడితే, 3 వారాల జైలు శిక్ష విధిస్తే, ఆమె పేపర్ లో తీవ్రంగా తన అసమ్మతి తెలియ జేస్తూ ‘’ఇంగ్లీష్ వారి దృష్టిలో భారతీయులు ఎంత చులకనగా ఉన్నారో ఈ ఉదంతం తెలియ జేస్తుంది’’అన్నది మరో సారి 9 మంది బెంగాలీలను చంపి అనేకమందిని గాయపరచిన బ్రిటిష్ సైనికుల అరాచకాన్ని పేపర్ లో ఎండ గట్టింది .ఆడంబరాలు గిట్టని ఆమె ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ఇండియా వచ్చినప్పుడు కలకత్తా మైదానం లో పెద్ద ఎత్తున మందుగుండు సామాను కాల్చటాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది  .డ్యూక్ ఆఫ్ ఎడిన్ బర్గ్ కలకత్తా వచ్చినప్పుడు స్వాగత సత్కారాలకు 9 000రూపాయలు ఖర్చు చేయటాన్ని ప్రశ్నించింది  .అన్న ,అక్క క్షయ వ్యాధి సోకి మరణించారు .తోరుకూ అది సోకిఆమె 1887 లో మరణించింది .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -9-1-17 –ఉయ్యూరు .

 

.

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నల్లగుట్టలో ఆదిమానవుడి ఆనవాళ్లు: సహజసిద్ధమైన శివలింగం జయశంకర్‌ జిల్లా

నల్లగుట్టలో ఆదిమానవుడి ఆనవాళ్లు: సహజసిద్ధమైన శివలింగం జయశంకర్‌ జిల్లా గణపురం మండలంలోని మైలారం నల్గగుట్ట గుహల్లో ఆదివానవుడి ఆనవాళ్లు, సహజసిద్ధంగా ఏర్పడిన శివలింగం ఆకృతి వెలుగు చూశాయి. By: Garrapalli Rajashekhar Updated: Monday, January 9, 2017, 13:40 [IST] Subscribe to Oneindia Telugu జయశంకర్‌ భూపాలపల్లి: జయశంకర్‌ జిల్లా గణపురం మండలంలోని మైలారం నల్గగుట్ట గుహల్లో ఆదివానవుడి ఆనవాళ్లు, సహజసిద్ధంగా ఏర్పడిన శివలింగం ఆకృతి వెలుగు చూశాయి. పర్యాటక శాఖ నేతృత్వంలో హైదరాబాద్‌కు చెందిన నెటిజన్‌ బృందానికి చెందిన 40 మంది ఈ గుహల్లో ఆదివారం పరిశీలించారు. తాళ్ల సహాయంతో ఆక్సిజన్‌ సిలిండర్లు పెట్టుకొని సుమారు 20 మీటర్ల లోతుకు దిగారు. ఆదిమానవుల ఆవశేషాల, వారు వాడిన కుండపెంకులు, జంతువులకు సంబంధించిన ఎముకలు లభించాయి. గుహల్లో ఆదిమానవులు నిర్మించుకున్న రాతి గోడలు ఉన్నాయని బృందంలోని సభ్యులైన అరవింద్‌ ఆర్య, అంకిరెడ్డి, వెంక్‌గౌడ్‌ తెలిపారు. ఈ గుహలను అధ్యయంన చేయడానికి రాష్ట్ర పర్యాటక శాఖ ఎండీ క్రిస్టియానా తమను పంపిచారని తెలిపారు. సుమారు నాలుగు కిలోమీటర్ల మేర గుహలు విస్తరించి ఉన్నాయని చెప్పారు. తమ అధ్యయనాన్ని పర్యాటక శాఖకు నివేదికగా అందిస్తామన్నారు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 30- యదు వంశ మహాకావ్య రచయిత-గలగలి రామాచార్య

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

30- యదు వంశ మహాకావ్య రచయిత-గలగలి రామాచార్య

1893 లో కర్నాటక రాష్ట్రం లో బిజాపూర్ జిల్లా లో కృష్ణానదీ తీరాన ఉన్న గలగలి గ్రామం లో రామాచార్య జన్మించాడు .సంస్కృతం లో మహా పండితుడు . రెండు మహాకావ్యాలు రాసిన మహాకవి .1981 లో 88 వ ఏట మరణించాడు  .ఆయన గురుపరంపర –గలగలి కూర్మాచార్య, కృష్ణా కార్య ,సత్యధ్యానతీర్ధ స్వామీజీ .

రామాచార్య 1-యదు వంశ మహాకావ్యం 2-స్వరాజ్య రాత్నాకరః అనే రెండు మహాకావ్యాలను రచించాడు ఈ రెండూ కాక దేవీ వాసంతి ,కోహం అనే గద్య రచనలు చేశాడు .లఘుకావ్యాలుగా 1- దేవ మందిర క్రందనం 2-ముని-మేనక సంవాదః రచించాడు .పాహిమాం మురళీధర ,వెంకటేశశతకం గీతాలను ‘’సతి చింతామణి ‘’అనే సంస్కృత నవలను రాశాడు .కృష్ణకవి రాసిన అలంకార ముక్తావళి ,సత్యనాద తీర్ధ రచించిన రుగ్ భాష్య టీకా ప్రకాశ ,నరహరి తీర్ధ రచన యమక భారత టీకా ,పద్మనాభ తీర్ధుని శ్రీ గీతా తాత్పర్య నిర్ణయ ప్రకాశిక ,ఆనంద తీర్ధుని ఆహ్నిక కౌస్తుభ మొదలైన గ్రంధాలకు సంపాదకుడిగా పని చేశాడు .

ప్రయాగలోని భారతీయ సంస్కృత సంస్థాన పరిషత్ రామా చార్యకు ‘’మహా మహోపాధ్యాయ బిరుదునిచ్చి సత్కరిస్తే,ఎడిటోరియల్ బోర్డ్ ఆఫ్ సంస్కృతం ‘’సాహిత్య రత్న ‘’ను,సనాతన ధర్మ మండలి ‘’అభినవ బాణ ‘’ను,అఖిల భారత సాహిత్య సమ్మేళనం లో ‘’కవికుల తిలక’’బిరుదు నిచ్చి సన్మానించాయి .సంస్కృత సేవకు రామాచార్య  రాష్ట్రపతి పురస్కారాన్నీ అందుకొన్నాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-1-17 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ముక్కోటి ఏకాదశి

ముక్కోటి ఏకాదశి

ముక్కోటి ఏకాదశి నే వైకుంఠ ఏకాదశి అంటారు .ఏకాదశి అంటే ఒక తిదిమాత్రమేకాడు ,ఒక దేవత పేరు ,10 ఇంద్రియాలను అదుపులో పెట్టేది ,ఉపవాసాలకు ముఖ్యమైన రోజు ,విష్ణువుకు పరమ ప్రీతి కరమైన రోజు . ఏడాదికి  శుక్ల కృష్ణ పక్షాలలో వచ్చే ఏకాదశులు 24 .అధికమాసమైతే 26 వస్తాయి . ఆషాఢ శుద్ధ ఏకాదశి శయన ఏకాదశి.భాద్రపద శుద్ధ ఏకాదశి పరివర్తన ఏకాదశి ,కార్తీక శుద్ధ ఏకాదశి బోధన లేక ఉత్ధాన  ఏకాదశి .మాఘ శుద్ధ ఏకాదశి భీష్మ ఏకాదశి .సూర్యుడు ధనుర్మాసం లో ఉన్నకాలం లో మార్గశిర లేక పుష్యమాసం లో వచ్చేదే ముక్కోటి ఏకాదశి .3 కోట్ల దేవతలతో కలిసి శ్రీ మన్నారాయణుడు ఈ రోజునే దర్శన మిస్తాడు .అందుకే ఆ పేరు .ఈ రోజు ఉపవాసం ఉంటె 3 కోట్ల ఏకాదశులలో చేసే ఉపవాస ఫలితం ,పుణ్యం వైకుంఠ ఏకాదశి నాడు చేస్తే లభిస్తుంది .

మనదేవతల సంఖ్య 33 కోట్లు .కాని ‘’అసహస్రాత్ ‘’అనే వేద ప్రమాణాన్ని బట్టి అసంఖ్యాకం అని అర్ధం అంటే అంతా దేవతామయమే .విష్ణు మయమే .ఒక్కడే పరమాత్మ ఇన్ని రూపాలలో ఉన్నాడని భావం .ఇక్కడ 3  కధలు తెలుసు కొందాం .ఒక మన్వంతరం లో ‘’వికు౦ఠ’’అనే తల్లికి  విష్ణువు కుమారుడిగా పుట్టాడు .అందుకే’’ వైకుంఠుడు’’అంటారు .రెండోకద –కృత యుగం లో చంద్రావతి నగరాన్ని’’ మురుడు’’అనే రాక్షసుడు పాలిస్తూ దేవతలను క్షోభ పెట్టాడు .అప్పుడు వైకుంఠంనుంచి విష్ణువు దిగి వచ్చి వాడిని చంపటానికి ప్రత్యేక అస్త్రం కావాలని బదరికాశ్రమం లోహైమావతి అనే  ఒక గుహలో ప్రవేశించాడు .ముర ఇక్కడే విష్ణువు దాక్కున్నాడని తెలిసి గుహలోకి ప్రవేశించాడు .అప్పుడు విష్ణువు నుంచి ఒక శక్తి ఉద్భవించి కంటి చూపుతో మురాసురుని కాల్చేసింది .సంతోషించిన విష్ణువు ఆమె కు ‘’ఏకాదశి ‘’అని పేరు పెట్టి  వరం కోరుకోమంటే ,ఏకాదశినాడు ఉపవాసం ఉన్నవారి పాపాలను సంహరించాలని కోరింది తధాస్తు అంటూ వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నవారికి మోక్షం కలుగుతుందని  మురారి వరమిచ్చాడు .(వ్రత చూడామణి ).ఈ ఏకాదశినాడు మురాసురుడు బియ్యం లో దాక్కుంటాడని అందుకే బియ్యం తో చేసిన పదార్ధాలు తినరాదని ,తులసి నీరు తాగుతూ ఉపవాసం ఉండాలని అంటారు .ముర అంటే తామసిక రాజసిక గుణాలకు ,అరిషడ్వర్గాలకు ప్రతీక . ఉపవాసం చేస్తే సత్వ గుణం పెరిగి ముక్తికి మార్గం అవుతుంది .3 వ కధ-కు౦భుని కొడుకైన మద మన్యుడు అనే రాక్షసుడు శివునికై తపస్సు చేసి ‘’అయోనిజ ‘’వల్లనే తాను చనిపోయే వరం పొందాడు .లోక కంటకం గా వాడు ప్రవర్తిస్తుంటే  విష్ణువు వాడిని సంహరించటానికి ‘’సింహా వతి ‘’అనే గుహలో ప్రవేశించాడు .ఆ గుహ అంచుల స్వామి శరీరం రాపిడి చెంది ఏకాదశి అనే స్త్రీ గా మారి ఆమె శక్తితో మదమన్యుడిని సంహరించాడు .

మధ్యలో ఈ అ౦చు లేమిటి?అవే జాగ్రత్ స్వప్న సుషుప్తి లు .కుట నుంచి కోటి శబ్దం పుట్టింది కుట అంటే కౌటిల్యం లేక వంకర .అంచులకు కోటి అనే పేరుంది .బాలకృష్ణుడు కొన గోట గోవర్ధన పర్వతాన్ని ఎత్తి నిలబెట్టాడు  అని మనం విన్నాం .  కనుక పై మూడు అవస్థల అంచుల్ని తాకి మనల్ని పునీతుల్ని చేసేది అని ముక్కోటి ఏకాదశి పరమార్ధం .

ఒక సారి శ్రీరంగం వెడదాం

‘’శ్రీ రంగ ద్వారస్థ భగవదాలోకన మహోత్సవం –ముక్కోటి ఏకాదశి ‘’అని పంచాగ కర్తలు రాస్తారు . శ్రీరంగం లో రంగ నాద స్వామి దక్షిణాభి ముఖం గా శయనించి  ఉంటాడు .ముక్కోటి నాడు ఉత్తర ద్వారం దగ్గర దర్శనం కలుగ జేస్తారు .స్వామిని వజ్రాలు అలంకరించిన వస్త్రాలతో అలంకరించి వెయ్యి స్తంభాల ప్రాంగణం లో ఉత్తర ద్వారం దగ్గర దర్శన మిప్పిస్తారు .ఇక్కడ 21 రోజుల ఉత్సవం చేస్తారు .ఉదయం పూట చేసే పూజను ‘’పాగల్ పట్టు ‘’అని రాత్రి చేసే పూజను ‘’ఇర పట్టు ‘’అంటారు .

అసలు శ్రీరంగం లో రంగ నాధుడు ఎలా వెలిశాడు?

ప్రళయం తర్వాత బ్రహ్మకు విష్ణు మూర్తి ఆది శేషునిపై పవళించి దేవేరులతో సకల దేవతలతో దర్శన మిచ్చి ‘’జ్యోతిశ్శాస్త్రం’’బోధించాడు .తరువాత బ్రహ్మ కోరిక మేరకు ‘’విమానం ‘’లో వెలిశాడు .ఆ మూర్తి స్వరూపమే శ్రీ రంగ నాధుడు . ఆ మూర్తి ఇక్ష్వాకు రాజులకు లభించింది .ఇక్ష్వాకు వంశ రాజుల ఇలవేలుపు రంగనాధుడు .ఆ వంశం లో శ్రీరాముని వరకు రంగనాధుని పూజించారు .శ్రీరాముడు అవతార సమాప్తి చేసేటప్పుడు ఆ మూర్తి ని విభీషణుడికి ఇచ్చాడు .దాన్ని లంకకు తీసుకు వెడుతూ దారిలో సంధ్యావందన కాలం అయిందని ,ఒక బాలుడి రూపం లో ఉన్న వినాయకుడికి అప్పగించి దాన్ని కిందపెట్టావద్దని బతిమాలి చెప్పాడు .కాని బరువు మోయలేక వాడు కింద పెట్టేశాడు .విభీషణుడు వచ్చి నెత్తీ నోరు కొట్టుకొన్నాడు .అక్కడే ఆలయం కట్టి ప్రతిష్టించి పూజించి ప్రతి ముక్కోటికీ వచ్చి దర్శనం చేసుకొనేవాడు .

ఉత్తర ద్వార దర్శనం దేనికి?

ధనుర్మాసం ప్రారంభం  లో మూసి ఉన్న స్వర్గ ద్వారాలు తెరుచుకొంటాయి .దేవతలకు 6 నెలలు పగలు 6 నెలలు రాత్రి అని మనకు తెలుసు .దక్షిణాయణ౦  నుంచి ఉత్తరాయణ పుణ్య కాలానికి అంటే చీకటి లో నుంచి వెలుగులోకి అంటే పగలులోకి దేవతలు ప్రవేశిస్తారన్నమాట .స్వర్గ ద్వారాలు తెరవగానే ముందుగా ఈ కాంతి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశిస్తుంది .అందుకే ఉత్తర ద్వార దర్శనం .దేవతలు ఈ రోజు దివి నుండి భువికి దిగి వస్తారు .వైకుంఠ ద్వారమే సూర్యుని ఉత్తరాయణ ప్రవేశానికి సూచిక .ఈ  రోజు విష్ణు దర్శనం మోక్ష ప్రాప్తి .

ఇందులో శాస్త్రీయ భావన

ఉత్తర ద్వార దర్శనం అంటే ఆకాశం లో శ్రవణా నక్షత్ర మండలం లో 3 కోట్ల నక్షత్రాలు అంటే దేవతలు వెంట రాగా విశ్వ వ్యాపితుడైన శ్రీమన్నారాయుణుడిని దర్శించటం అన్నమాట .

మనిషి ముఖానికి ఎదురుగా ఉండేది తూర్పు (ఉదయం ) .వీపు వైపు పడమర .కాళ్ళ వైపు దక్షిణం .శిరసు వైపు ఉత్తరం .కనుక హృదయ కుహరం లో స్వామిని దర్శించాలని అర్ధం .-‘’నిహిత గుహా యాం విభ్రాజితే ‘’

ఉపవాసం ఎందుకు ?

శాస్త్రీయం గా దీనికి సమాధానం తెలుసుకొందాం –చంద్రుడు భూమి చుట్టూ తిరిగేటప్పుడు రోజుకు 12 డిగ్రీల చొప్పున తిరుగుతాడు .పాడ్యమి నుంచి పౌర్ణమికి 180డిగ్రీలు. పౌర్ణమి నుంచి అమావాస్య కు 180డిగ్రీలు .మొత్తం 360డిగ్రీలు .దీనితో ఒక ఆవర్తనం పూర్తి అవుతుంది .ఏకాదశి తిదినాటికి 120 నుంచి 132 డిగ్రీలు ఉంటుంది.దీన్ని ‘’త్రికోణ ‘’సమయం అంటారు .పౌర్ణమి ,అమావాస్యలలో చంద్రుని ప్రభావం సముద్రం మీద అంటే నీటి మీద ఎక్కువ అని తెలిసిన విషయమే .అప్పుడే సముద్రానికి ఆటూపోటూ వస్తాయి .  మనశరీరం లో 80 శాతం నీరే .కనుక ఏకాదశినాడు చంద్ర ప్రభావం మన పొట్ట మీద బాగా ఉంటుంది .పొట్టలో ఆహారం ఉంటే చంద్ర కిరణాలు పడి జీర్ణ శక్తిని దెబ్బ తీస్తాయి .అందుకే ఉపవాసం చేయాలి .

ఉపవాసం తో పాటు ఇంకా ఏమేం చేయాలి ?

ముక్కోటి ఏకాదశినాడు తెల్లవారు ఝాముననే ‘’ఉసిరిక ‘’ముద్దతో శరీరం అంతా పూసుకొని సూర్యోదయానికి ముందే తలారా స్నానం చేయాలి .ఉపవాసముండాలి .తులసి దళాలు వేసిన నీటిని మాత్రమే త్రాగాలి .మౌనంగా ఉండటం మేలు .విష్ణు సహస్ర పారాయణ ఉత్తమం .సాధ్యమైనంత వరకూ ఎవరినీ తాకకుండా ఉండటం మంచిది .రాత్రి హరినామ స్మరణ తో జాగరణ చేయాలి .

పుత్రద ఏకాదశి

ముక్కోటి ఏకాదశిని ‘’పుత్రద ఏకాదశి ‘’అనీ పిలుస్తారు .ఒకప్పుడు సుకేతుడు అనే మహా రాజు భాద్రావతి  నగరాన్ని పాలిస్తున్నాడు .భార్య చంపక .పుత్ర సంతానం కోసం దంపతులు ఎన్నో తీర్ధ యాత్రలు చేశారు .అప్పుడు కొందరు ఋషులు వారిని ఏకాదశీ వ్రతాన్ని చేస్తే పుత్ర సంతానం కలుగుతుందని చెప్పారు .వ్రత విధానం వారి వలన తెలుసుకొని ఏకాదశీ వ్రతం చేసి ,భగవానుని అనుగ్రహం వలన పుత్రసంతానం పొందారు .అందుకే పుత్రద ఏకాదశి అనే పేరొచ్చింది .

తిరుమల ,భద్రాచలం లలో ఉత్తర ద్వారా దర్శనాలకు ప్రత్యేకత ఉంది .మిగిలిన అన్ని వైష్ణవాలయాలలో  స్వాములకు ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేసి తరింప జేసి ,మోక్ష ప్రాప్తి కలిగిస్తారు .

Inline image 1Inline image 2Inline image 3

8-1-17 ఆదివారం   ముక్కోటి ఏకాదశి శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-1-17 –ఉయ్యూరు

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 29- 7వ శతాబ్ది సంస్కృత మహాకావ్యాలపై పరిశోధనం చేసిన –రహస్ బిహారీ ద్వివేది (1947 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

29- 7వ శతాబ్ది సంస్కృత మహాకావ్యాలపై పరిశోధనం చేసిన –రహస్ బిహారీ ద్వివేది (1947 )

2-1-1947 న ఉత్తర ప్రదేశ్ లోని అలహాబాద్  లో జన్మించిన రహస్ బిహారీ ద్వివేది సంస్కృతం లో ఆచార్య (ఎం.ఏ .)సాహిత్య రత్న ,ఎం .లిట్ డిగ్రీలు పొందాడు .1960లో వచ్చినసంస్కృత  ఇతిహాస పద్యాల (ఎపిక్ పోయెమ్స్ )పై పరిశోధన చేసి జబల్పూర్  రాణి దుర్గావతి యూని వర్సిటి నుండి 1977లో పి హెచ్ డి.అందుకొన్నాడు  .తరువాత జబల్ పూర్ యూని వర్సిటి లో సంస్కృత ఆచార్యునిగా చేరి ,తన సర్వీస్ కాలం లో 16 మందికి డాక్టోరల్ డిగ్రీ సాధించటానికి మార్గ దర్శకం వహించాడు .విద్యా తృష్ణ తీరక’’ విద్యా వాచస్పతి ‘’ డిగ్రీని కూడా అందుకొన్నాడు .

సంస్కృత ,హిందీ ,ఇంగ్లీష్ భాషలలో చాలా గ్రంధాలు రాశాడు .వివిధ అంశాలపై 50 కి పైగా పరిశోధనా పత్రాలను రచించాడు .ముఖ్యమైన రచనలు -1-సంస్కృత మహాకావ్యోం కా సమలోచానాత్మక్ అధ్యయన్(१९६१-१९७०)అంటే 7 వ శతాబ్ది సంస్కృత మహాకావ్యాలపై విశ్లేషణాత్మక పరిశోధన 2-పి హెచ్ డికోసం రాసిన దిసీస్ ‘’1947-1970 కాలం లోని సంస్కృత ఇతిహాసపద్యాలు’’లో 156 శ్లోకాలను ఉదాహరించాడు .3-అర్వాచీన సంస్కృత మహాకావ్యాను శీలనం .అంటే ఆధునిక సంస్కృత ఇతిహాసాల సమీక్ష అనే 134 పేజీల రచన 4-సాహిత్య విమర్శ (రిసెర్చ్ పత్రాల సంపుటి )5-స్వస్తి సందేశ్ 6-స్వరిత సందేశ్ 7-సంస్కృత వాణి మయే విజ్ఞాన్8-తీర్ధ భారతం (భారతీయ యాత్రా స్థలాలపై  కవిత్వం )

రహస బిహారీ ద్వివేది కి 2012 లోసంస్కృత సేవకు  భారత రాస్ట్రపతి గౌరవ పురస్కారం అందజేశారు .2016 లో ఉత్తర ప్రదేశ్ సంస్కృత సంస్థాన్ ‘’వాల్మీకి పురస్కారం ‘’అందజేసి సత్కరించింది .

సశేషం

రేపు 8-1-17 ఆదివారం ముక్కోటి (వైకుంఠ ఏకాదశి )ఏకాదశి శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-1-17 –ఉయ్యూరు

 

 

 

Inline image 1

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గ్రంథావిష్కరణల సభకు ఆహ్వానం (ఊగిసలాడకె మనసా & స్వజయ సారథి)

బాటసారి రచించిన ‘ఊగిసలాడకె మనసా’ (నిజ జీవిత నవలిక) మరియు

నేను రచించిన ‘స్వజయ సారథి’ (స్ఫూర్తి కవితలు) పుస్తకాల ఆవిష్కరణకు సాహితీ ప్రియులందరినీ ఆహ్వానిస్తున్నాము.

స్థలం: రవీంద్రభారతి, హైదరాబాద్
తేదీ: జనవరి 20,
సమయం: సాయంత్రం 5 గం నుండి 8 గంల వరకు

ఆహ్వాన పత్రిక జత చేసాను.

పెద్దల ఆశీస్సులు, చిన్నల అభిమానం కోరుకుంటూ

మీ,

రవీణ చవాన్

మొబైల్: 9922 927 527

పూణే

invitation

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

ముక్కోటి అంటే ఏమిటి

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఐర్లాండ్ సాంఘిక సంస్కర్త- అన్నా హస్లాం-గబ్బిట దుర్గా ప్రసాద్ 02/12/2016 గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ -జనవరి

ఐర్లాండ్ సాంఘిక సంస్కర్త- అన్నా హస్లాం-గబ్బిట దుర్గా ప్రసాద్

                                                          ఐర్లాండ్ దేశ క్వేకర్ స్త్రీవాద ఉద్యమాలలో అగ్రగామి అన్నాహస్లాం ఐర్లాండ్ లోని కౌంటి పార్క్ లోని యౌఘల్ లో 1829 లో జెన్ ,అబ్రహాం ఫిషర్ దంపతుల 17 గురు సంతానం లో 16 వది గా జన్మించి ,మహిళా ఓటు ఉద్యమ నాయకురాలైంది .తండ్రి ఫిషర్ క్వేకర్ కుటుంబానికి చెందిన వ్యాపారి .ఐర్లాండ్ మహా కరువు సమయం లో ఈ కుటుంబం ప్రజలను ఆదుకొన్న తీరు చిరస్మరణీయమైనది .ఎన్నో సేవా కార్యక్రమాలు ,దాన ధర్మాలు చేసిన కుటుంబం .పొటాటో ఉద్యమం లో సూప్ కిచెన్ లలో అన్నా ఎంతో సహాయపడింది .స్థానిక బాలికలకు స్వంత కాళ్ళ పై నిలబడి రాబడి పొందటానికి కుటీర పరిశ్రమలు స్థాపించారు .లేసుల తయారీ క్రోచేటింగ్ ,అల్లిక పనులలో శిక్షణ నిచ్చింది
.                                                                అరవై ఏళ్ళకు పైగా స్త్రీ విద్యా వ్యాప్తికి ,విముక్తికి కేథలిక్ మిషన్ తోకలిసి తీవ్ర పోరాటం చేసింది . .అమెరికాలోని ఆమె స్నేహితురాలు క్వేకర్ ఉద్యమ నాయకురాలైన సుసాన్ బి .ఆంధోని లా పురుషులతోపాటు స్త్రీకి సమాన హక్కు ,బానిసత్వ నిర్మూలన నియంతృత్వానికి వ్యతిరేక భావ వ్యాప్తితో పెరిగింది . క్వేకర్ బోర్డింగ్ స్కూల్ లలో చదివింది .యార్క్ షైర్లోని ఆక్వర్త్ స్కూల్ లో విద్యాబోధన చేసింది .అక్కడే ధామస్ అస్లాంతో పరిచయమైంది .ఇద్దరు ప్రేమించుకొని సంతానం కనకూడదు అనే ఒప్పందం పై వివాహం చేసుకొన్నారు .
భర్త కు కూడా స్త్రీ విద్యా వ్యాప్తి ,పురుషులతో సమానం గా స్త్రీ హక్కులు ఉండాలన్న భావాలు బలంగా ఉన్నాయి .హస్లాం కూడా క్వేకర్ కుటుంబం లోనే జన్మించటం వలన 1868 నుండి మహిళా సమస్యలపై ,స్త్రీ ఓటు  హక్కుపై ఎన్నో వ్యాసాలూ రాశాడు .1868 లో ‘’వివాహ సమస్య ‘’అనే కరపత్రం రాసి ముద్రించాడు .అందులో పరిమిత సంతానం అవసరాన్ని ,గర్భనిరోధానికి సూచనలను అపకారం చేయని మందుల గురించి రాశాడు .19 వ శతాబ్దపు ఐర్లాండ్ స్త్రీ ఉద్యమనాయకురాలిగా అగ్రస్థానం పొందింది అన్నా .1876 లో’’ డబ్లిన్ వుమెన్స్ సఫ్రేజ్అసోసియేషన్’’ ను ఈ దంపతులు స్థాపించారు ,దీనితో ఐర్లాండ్ లో స్త్రీ ఓటు హక్కు ఉద్యమం మంచి ఊపునందుకొన్నది .

                                                               1989 లో ఇస బెల్లా టాడ్ ను సెక్రెటరి చేసింది .ఐరిష్ హోం రూల్ ను సమర్ది౦చలేదుకాని ‘’వుమెన్స్ లిబరల్ యూనియనిస్ట్ అసోసియేషన్ ‘’కు డబ్లిన్ లో శాఖ ఏర్పాటు చేయటానికి సహకరించింది .ఈ పోరాటఫలితంగా 1896 లో ఐర్లాండ్ మహిళలు ‘’పూర్ లా గార్డియన్ ‘’గా పేదల న్యాయ అధికార సంస్థలలో మెంబర్లుగా ’ ఎన్నిక అవటానికి అధికారం లభించింది .1900 నాటికి ఈ లా సంస్థలు 100 అయ్యాయి .1898 లోనే అన్నాహస్లాం అర్హత గల మహిళలను వీటికై పోటీ చేయమని తీవ్రంగా ప్రచారం చేసింది .స్త్రీలకూ స్థానిక ప్రభుత్వ సంస్థలలో ,అర్బన్ రూరల్ జిల్లా కౌన్సిలర్ల ఓటింగ్ లో పాల్గొనే హక్కు లభించింది .1913 లో అన్నాసేక్రేటరిగా స్వచ్చందంగా పదవీ విరమణ చేసి గౌరవాధ్యక్షురాలుగా ఎన్నుకో బడింది .
1864 ‘’ అంటు వ్యాధుల చట్టం ‘’ను ఉపసంహరి౦చమని ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చింది అన్నా హస్లానా . ఈచట్టం సైన్యం విడిది చేసిన చోట వ్యభిచారులపై ప్రభుత్వ నియంత్రణకు అవకాశం కల్పించింది . ఈ నియంత్రణ మొదట మూడునెలలే ఉంటుందని చెప్పిన ప్రభుత్వం సంవత్సర కాలానికి పొడిగించింది .దీనివలన మిలిటరీ వలన సెక్స్ వ్యాధులు సమాజం లో విజ్రుంభించకుండా చేయాలన్నది ప్రభుత్వ సంకల్ప౦ . ఆడవారిపై మందులతో చికిత్స కూడా భాగమైంది .ఇది వ్యభిచారాన్ని చట్టబద్ధం చేయటంలో భాగమేనని,ఫ్యామిలీ లైఫ్ కు స్వస్తి చెప్పి వ్యభిచారాన్ని వ్యాపారంగా మార్చటమేనని అన్నా దీన్ని వ్యతిరేకించింది .చివరికి ప్రభుత్వంలొంగి 18 ఏళ్ళ ఆమె పోరాటం ఫలించి చట్టాన్ని ఉపసంహరించింది .
18 74 లో ‘’వుమెన్స్ ఆడ్వోకేట్ ‘’అనే మహిళా పత్రికను స్థాపించి నిర్వహించింది .డబ్లిన్ వుమెన్స్ సఫ్రేజ్ అసోసియేషన్ ఏర్పరచి చివరికి ఐరిష్ వుమెన్స్ సఫ్రేజ్ గా మార్చింది .కొందరు మిలిటెంట్ ఉద్యమంగా మార్చినా , ఆమె మాత్రం ఐరిష్ వుమెన్స్ ఫ్రాన్చేజ్ సెక్రటరిగానే ఉండి పోయింది .

                                                                             పురుషులతో సమానంగా స్త్రీలకు ఓటు హక్కు కోసం అన్నా 1866 లో 1499 మంది చేత సంతకాలు చేయించి సేకరించి ప్రభుత్వానికి అందజేసింది .1867 లో పురుషుల ఓటు అన్నివర్గాలకూ విస్తరించినా స్త్రీలకు హక్కు రాలేదు .1892 లో ఆమె పోరాటం ఫలించి స్త్రీలకూ ఓటు హక్కు కల్పించటమేకాక స్థానిక సంస్థలలో మహిళలు పోటీ చేయటానికి అవకాశం లభించింది .1916 లో భర్త ధామస్ అస్లాం తన ‘’ హంస గీతి’’ని ‘’సంలాస్ట్ వర్డ్స్ ఆన్ వుమెన్స్ ఫ్రాంచైజ్ ‘’ను చనిపోవటానికి ఒక ఏడాది ముందు ప్రదర్శించాడు . భర్త ఉద్యమాన్ని అన్నా కొనసాగించింది

                                                                                  1918డిసెంబర్ నాటికి అన్నా 90 ఏళ్ళ వయసులో తోటి స్త్రీలతో కలిసి మొదటి జనరల్ ఎన్నికలలో డబ్లిన్ లోని సెయింట్ స్టీఫెన్స్ గ్రీన్ పోలింగ్ కేంద్రం లో ఓటు వేయటానికి వెడితే ఆమె పై ఆనందం తో పుష్పవృష్టి కురిపించి తమ ఆత్మ గౌరవాన్ని ఉద్దీపనం చేసి ఐక్యతను సాధించిన ఆ మాతృ మూర్తికి హార్దిక స్వాగతం పలికారు .సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు అన్నా హస్లాం చేసిన స్త్రీ విముక్తి పోరాటాన్ని అభినందించి ఆదరించారు .1922 లో మొదటి ఐరిష్ స్వతంత్ర దేశం ఏర్పడగానే 21 ఏళ్ళు దాటిన స్త్రీ పురుషులందరికీ ఓటు హక్కు కల్పించింది .అదే ఏడాది ఈ విజయాన్ని కన్నులారా చూసి సంతోషించి సంతృప్తి చెందిన అన్నా హస్లాం మరణించింది .

-గబ్బిట దుర్గా ప్రసాద్

————————————————————————————————————————————

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 28-పద్మశ్రీ పురస్కార గ్రహీత –దేవీ ప్రసాద్ ద్వివేదీ (1956 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

28-పద్మశ్రీ పురస్కార గ్రహీత –దేవీ ప్రసాద్ ద్వివేదీ (1956 )

20-10-1956 న ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి లోజన్మించిన దేవీ ప్రసాద్ ద్వివేదీ ,బెనారస్ విశ్వ విద్యాలయం నుంఛి  సోషియాలజీ లో ఎం .ఏ .తోపాటు సాహిత్యాచార్య ,ఆచార్య డిగ్రీలను లింగ్విస్టిక్స్ లో సంపూర్ణానంద్ సంస్కృత కాలేజి నుంచి అందుకున్నాడు .అదేయూని వర్సిటి నుండి పి.హెచ్ .డి.,డి.లిట్ లూ పొందాడు .సంపూర్ణానంద యూని వర్సిటి లో ఆధునిక భాషా శాఖలో లింగ్విస్టిక్స్ ప్రొఫెసర్ గా చేరి ,అందులోని యోగ సాధనా కేంద్ర ,శంకరాచార్య మండప్ లకు డిప్యూటీ డైరెక్టర్ గా పని చేశాడు .ఎందరో విద్యార్ధులకు రిసెర్చ్ గైడ్ గా వ్యవహరించి పరిశోధనలకు సహకరించాడు .

బౌద్ధ దర్శన మీమాంస ,చిత్ర చంపూ కావ్యస్య ససమీక్షణం సంపాదనం ,సంస్కృత ధ్వని విజ్ఞానం ,కావ్య శాస్త్రీయ పారిభాషిక్ శబ్దో౦కి నిరుక్తి (హిందీ )మొదలైన గ్రంధాలు రచించాడు ద్వివేది .ఆకాశవాణికి వార్తా సంపాదకుడిగా ,రాష్ట్రీయ ,మీర్జాపూర్ శ్రీ వేణీమాధవ పూర్ ట్రస్ట్ కు ట్రస్టీ గా ,కాశీ విశ్వేశ్వర దేవాలయ ఆచార్యునిగా ఉన్నాడు . జనవార్త హిందీ దైనిక్ పత్రికకు వారణాసి విలేకరిగా,రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ క్రమ శిక్షణ కమిటీ మెంబర్ గా సేవ చేశాడు .ప్రధాని మోడీ ప్రవేశ పెట్టిన స్వచ్చభారత్ అభియాన్ కు ప్రచారకుడిగా కమిటీ మెంబర్ గా ఉన్నాడు .

విద్యా ప్రాభవానికి తగిన పురస్కారాలు బిరుదులూ ద్వివేదీ అందుకున్నాడు .కేరళ ప్రజ్హాస్సి రాజా చారిటబుల్ ట్రస్ట్ ‘’ఆచార్య రత్న ‘’బిరుదునిచ్చి సన్మానించింది .చత్రపతి శివాజీ సమ్మాన్ ‘’వేద పండిత పురస్కారం ‘’అంద జేసింది .20 11 లో ‘’కాశీ గౌరవ అలంకార్ ‘’లభించింది .అదే ఏడాది భారత ప్రభుత్వం శ్రీ దేవీ ప్రసాద్ ద్వివేదీ కి ‘’పద్మశ్రీ ‘’పురస్కారం అందజేసి గౌరవించి సత్కరించింది.

Inline image 1

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 27-సంస్కృత –సంస్కృత నిఘంటు కర్త –రాదా కాంత దేవ్(1784 -1867 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

27-సంస్కృత –సంస్కృత నిఘంటు కర్త –రాదా కాంత దేవ్(1784 -1867 )

కలకత్తా కన్జర్వేటివ్ హిందూ సంఘనాయకుడు ,మహా సంస్కృత విద్వాంసుడు రాదా కాంత దేవ్ మహా రాజా నవ కృష్ణ దేవ్ పెంపుడు కుమారుడూ ,రాజ్యానికి వారసుడు .సంస్కృత ,పర్షియన్ అరబిక్ భాషలో గొప్ప పాండిత్యం ఉన్నవాడు .’’శబ్ద కల్పద్రుమ ‘’అనే సంస్కృత-సంస్కృత నిఘంటువును కూర్చినవాడు రాధాకాంత దేవ్ .దీని టాగూర్ వంశానికి చెందిన హర కుమార్ టాగూర్ అనే మరో ప్రసద్ధ సంస్కృత విద్వాంసుడు సహాయకారిగా ఉన్నాడు .ఈశ్వర చంద్ర గుప్త గారి పత్రిక ‘’సంబద్ ప్రభాకర్ ‘’లో  దేవ్ చాలా ప్రయోజనాత్మకమైన వ్యాసాలు రాశాడు .హిందువులు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ,బాలికలకూ విద్య చాలావసరమని ప్రచారం చేశాడు .ఇన్ని మంచి భావాలున్నా దేవ్ సనాతన సంప్రదాయవాది .సతీ సహగమనం వాళ్ళ వంశం లో లేక పోయినా ప్రభుత్వం దాన్ని నిషేధించాలని ప్రయత్నించినపుడు వ్యతిరేకించాడు .లార్డ్ విలియం బెంటిక్ బెంగాల్ గవర్నర్ గా ఉన్నప్పుడు 1829 డిసెంబర్ లో ఒక రెగ్యులేషన్ యాక్ట్ ద్వారా సతీ సహగమనాన్ని రద్దు చేసినపుడు  దేవ్ తనతోటి ఇతర సనాతన హిందువులతోకలిసి తండ్రి గోపీ మోహన దేవ్ స్థాపించిన ‘’ధర్మ సభ సంస్థ ‘’ద్వారా వ్యతిరేక ప్రదర్శనలు చేసి గవర్నర్ జనరల్ కు నిషేధ అజ్ఞను రద్దు చేయమని విజ్ఞాపన పత్రం సమర్పించాడు .8 3 ఏళ్ళు జీవించిన రాధా కాంత  దేవ్ 1867 లో మరణించాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-1-17 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి 82 వ జన్మ దినోత్సవం

నమస్తే గోపాల కృష్ణ గారు -10-1-17 మంగళవారం మీ 82 వ జన్మ దినోత్సవం సందర్భంగా మా కుటుంబం ,సరసభారతి తరఫున హార్దిక శుభాకాంక్షలు . మంచి ఆరోగ్యం తో  ఆధ్యాత్మిక ,ధార్మిక సేవాకార్యక్రమాలతో వర్ధిల్లాలని, భగవంతుడు మీకు,,మీ కుటుంబానికి సదా రక్షగా ఉండాలని  మా ఆకాంక్ష . సంక్రాంతి శుభాకాంక్షలనూ ముందే అందజేస్తున్నాను -దుర్గా ప్రసాద్

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 26-విశ్వనాధ వారి వేయి పడగలను సంస్కృతీకరించిన విదుషీమణి- డా.అయ్యగారి ప్రభావతీ దేవి -3 (చివరిభాగం )

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3

26-విశ్వనాధ వారి వేయి పడగలను సంస్కృతీకరించిన విదుషీమణి- డా.అయ్యగారి ప్రభావతీ దేవి -3 (చివరిభాగం )

3-బాలికా పంచాశికా –

ఇది కూడా 53 ముక్తకాలవంటి శ్లోకాలున్న లఘుకావ్యం .సమాజ స్వరూప చిత్రణలో ఆమె విశ్వ రూపం చూడవచ్చు .చివరి పంక్తి ‘’యఏతజ్జానీహి బాలికే ‘’(బాలా ఇది తెలుసుకో )అనే మకుటం .ఉద్వేగం ఉత్సాహం అన్యాయాన్ని సహించలేని స్థితి ఇందులో ఉన్నాయి .దీనికీ నాగరలిపి ,తెలుగు లిపి లో శ్లోకాలు, ఆంగ్లం లో వారమ్మాయి శ్రీమతి లలితా సుభాషిణి చక్కనిఅనువాదం ,కృతీ స్వీకర్త డా .రామానుజా చార్యులవారే స్వయం గా చేసిన తెలుగు అనువాదం ఉన్నాయి .ఈ కావ్యాన్ని కేవలం 24 గంటల వ్యవధిలో రాసినట్లు ప్రభావతీ దేవి గారు చెప్పుకున్నారు .

ముందుగా తన గురు దేవులకు ‘’సుబ్రహ్మణ్య సమారంభాం శ్రీ రామ స్వామి మాధ్యమాం-భీమ సేన నృసి౦హా౦ తాం వందే గురు పరంపరం ‘’అంటూ భక్త్య౦జలి ఘటించారు .

మొదటి శ్లోకం లోనే పెద్ద బాంబే పేల్చేశారు –‘’నాస్తి మాతృ సమా దేవీ –నాస్తి భ ర్త్రుసమో యమః –నాస్తి సుహ్రుత్సమో బన్ధుః- ఏతజ్జానీ హి బాలికే ‘’

భావం –అమ్మకు సాటి దైవం లేదు భర్తకు సాటి యముడూ –‘’లేడు ,మిత్రుని వంటి బంధువూ లేడు.లోకంపోకడ తెలుసుకో  బాలికా .

6 వ శ్లోక౦ –‘’పుత్రక్షేమార్ధినీ మాతా –సుఖం త్యజతి సర్వదా –భ్రుశం స్నిహ్యత్య మూన్ దృష్ట్వా – ఏతజ్జానీ హి బాలికా

భావం –పిల్లల సుఖం కోసం తన సుఖాన్ని త్యాగం చేసి బిడ్డ  సంపూర్ణ -తుస్టి కి ఆనందించే అమ్మ సంగతి తెలుసుకో బాలికా

9-‘’యత యోపి భవా పేతాః-జననీం చానమన్-అకుర్వన్ మృత సంస్కారాన్ —‘’

భావం –బంధ విముక్తులైన సన్యాసులు కూడా అమ్మప్రేమకు దాసోహమై ,ఆమెకు మృత సంస్కారాలు చేశారు –అలాంటి అమ్మ స్థానం తెలుసుకో అంటూ శంకరా చార్య వృత్తాంతాన్ని పరోక్షంగా చెప్పారు .

16-‘’ జన్మ దత్వా పిత పుత్రాన్ –యది నా వేక్షతే తదా –మృత తుల్యోహి స జ్ఞేయః –‘’

భావం –పిల్లల్ని కనగానే కాదు ,ప్రేమగా పెంచినవాడే తండ్రి –కానప్పుడు చచ్చినవాడితో సమానం అని లోక ప్రవృత్తిని చూపారు .

20-అంగా దంగా త్సుతో జాత –ఇతీదం వచనం పితా –యది నాద్రియతే తంతు –‘’

భావం –పుత్రుని గాఢా శ్లేషణం తో పులకించని తండ్రిమృతప్రాయుడే అంటూ శాకుంతలం లో శకుంతల దుష్యంతుని తో అన్నమాటల భావాన్ని పొందు పరచారు (పుత్ర గాత్ర పరిష్వంగ సుఖమ్ము మేలు )

22-‘’చాతుర్వర్ణ్యం మయా సృస్ట –మితీదం తు హరేర్వచః –అదృశ్వోయుజ్యతే నైవ —‘’

భావం –నాలుగే కులాలనునాడు  కృష్ణుడు చెబితే నేడు నాలుగు వందలై నాయి .అందుకే కులం ఒక చీడపురుగు

25- ‘’ఉద్యోగ పాఠశాలాసు –సర్వత్రాసన రక్షణం –తేన విజ్నో విన స్టార్ధః—‘’

భావం –ఉద్యోగం విద్యార్జన లలో రిజర్వేషన్ల వలన తెలివి తేటలకు స్థానం లేదు .

30-‘’విరుద్ధ వచనైః క్రుత్యైః-యో హితం స హరిణా తుల్యః —

భావం –సమ్మెలు ,ధర్నాలు చేస్తూ సామాన్యుని చంపే వైద్యుడు శ్రీహరి తో యెట్లా సమానమౌతాడని ప్రశ్నించారు –వైద్యో నారాయణోహరిఃఅన్నదానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ‘’’’హరీ’’, ‘’మని’’ అనిపిస్తున్నారు ‘’అని భావం .

35 –కామ క్రోధ జనిశ్చాయం –ఈర్ష్యా దాస్య సహోదరీ –గూఢ హాని కరో హ్యేషః—‘’

భావం –‘’బాధ’’ గురువు తలిదండ్రులు కామక్రోధాలు .సోదరి ఈర్ష్య .గూఢ హాని వ్రుత్తి ‘’అని బోధగురువులకంటే బాధ గురువులెక్కువై చేటు తెస్తున్నారని జ్ఞానోదయం చేశారు .అలాగే ఉపదేశ ధర్మం వదిలేసి సమదృష్టి లేక పక్షపాత దృష్టి తో ఉన్న వాడే నేటి గురువుగా చలామణి లో ఉన్నాడని మరో శ్లోకం లో దెప్పారు .మరో దానిలో డబ్బూ’’ పొగడ్తల డప్పూ’’లతో శిష్యుడు గురువును కొనేస్తున్నాడు ,గురువూ శిష్య వశుడై పోతున్నాడని ఆవేదన చెందారు .

40-‘’పాశ్చాత్య వనితాః దృష్ట్వా –అస్మన్నాగరకాధమాః-లజ్జా హీనాశ్చ బాదంతే—‘’

భావం –పాశ్చాత్య  దేశాల నుండి వచ్చే స్త్రీ పురుష యాత్రికులను లజ్జా హీనులైన మన పౌరులు బాదిస్తున్నారని ‘’మూర్ఖాః’’అనే ఈకవితలో ఆవేదన చెందారు .అందుకే వారు మనదేశానికి రావటం తగ్గించేశారు అని మరో కవిత చెప్పారు .దీనికే కొనసాగింపుగా –

44 –శ్లోకం –విదేశీ యేష్విదం కృత్యం –విదిత్వా దోష సంయుతం –పరాభవాన త ముఖాః—‘’

భావం –విదేశీయులను ఈ విధంగా మన వారు అవమానిస్తుంటే  మన నాయకులు తల ది౦చు కొంటున్నారు అమ్మాయీ తెలుసుకో .

4 5 –‘’హిందూ ధర్మస్య రక్షార్ధం –యతనీయం వివేకిభిః-తద్వినాశే జగన్నాశః –‘’

భావం –హిందూ ధర్మాన్ని అందరూ కలిసి రక్షించాలి .అది నశిస్తే జగత్తే నశిస్తుంది అని తెలుసుకోవాలి .

అనైక మత్యం మన స్వంతం ,అమర్యాద మనరాజ్యం స్వమతా క్షేపం మన నైజం అయింది మన లక్షణమేమితో తెలుసుకో .అని మరో శ్లోకం లో ఎరుక కలిగించారు

4 9-శ్లోకం –‘’మంత్రేషు పరి వాదాశ్చ –వేదానామవమాననా –అస్మాకం తు స్వభావోహి –స్వభావో దురతిక్రమః ‘’

భావం –మంత్రాలను వెక్కిరించటం, వేదాలను అవమానించటం ,మనందరి స్వభావ మై పోయింది .దాన్ని దాటి రావాలి

53-చివరి శ్లోకం –‘’ప్రభుత్వంరక్షక భటః –న్యాయాదీ శ్చ భూమిపాః-ధర్మ౦ సర్వే పి రక్షంతు –నైకో పి స్యాదధర్మగః ‘’

భావం –అధర్మం నశించి ప్రభుత్వ రక్షక భటులు న్యాయాదీసులు ,అధికారులు అందరూ ధర్మాన్ని రక్షించాలని అంటూ ముగించారు .’’ధర్మో  రక్షతి  రక్షితః ‘’అన్న ఆర్యోక్తిని గుర్తుకు తెచ్చారు .

‘’ సంస్కృతం లో ఆదర్శ వాదం తో కూడిన స్త్రీ వాదసాహిత్యంలేని లోటును ప్రభావతీ దేవి పూరించి పురుషాధిక్య సమాజానికి సవాల్ విసిరారు’’అని శ్రీ బండారు దత్తాత్రేయ గారు రాసిన ముందు మాటలు నూటికి నూరు పాళ్ళు యదార్ధం .ఆధునిక భావాలకు నిలువెత్తు స్వరూపంగా దేవి భాసి౦చారు  .

4-  చివరి పుస్తకం-శశిరేఖా  పరిణయం అనే 3 అంకాల రూపకం –

దీని పై స్పందించిన డా శివనూరి విశ్వనాధ శర్మగారు సంస్కృతం లో దేవిగారికి ఆశీరభినందనలు రాసి చివరగా

‘’శశి రేఖా విజయాఖ్య౦ రూపకమేవ తత్ప్రభావతీ దేవ్యా –రచితం రమణీయ తయా ప్రహసనమిహ రాజతాం సతం ‘’ అని మెచ్చుకొన్నారు .దీన్ని ప్రహసనం అన్నారు .

ఆమె బోధ గురువు డా బి నరసింహా చార్య ఆంగ్లం లో ;;శ్రీ ‘’అనే పేరుతొ ముందుమాట రాశారు . సంస్కృత రూపకం సమాజాన్ని చిత్రిస్తుందని ,ఇది దశ రూపకాలలో నాటిక విభాగానికి చెందినదని ,నాయిక శశిరేఖకు ఇందులో ప్రాధాన్యం ఉండటమే ఈ పేరు కు తగినదని ,ఇది విడంబన తరహా రూపకమని ,ఇందులో శశి రేఖ తో  పాటు నారదుడు,విలేపన ,అజ్ఞానం అనే పాత్రలున్నాయని ,త్రిమూర్తులు సెల్ ఫోన్ లో సంభాషి౦చుకొంటారని ,ఈ రూపకం దేవి గారి సృజన అని ,ఇందులో వైదర్భి శైలి ఉందని ,హీరోయిన్ శశిరేఖా మూడులోకాలూ తిరిగి త్రిమూర్తులతో సహా అందరినీ  ప్రశ్నలతో వేధించి ,తన లక్ష్య సాధనకు ధర్నాలు సమ్మెలు చేస్తుందని కనుక ఈ రూపకం సంప్రదాయ బద్ధమై కొత్త విషయానికి ఆధారమైనదని ఇందులో సమాజ క్షేమమే ముఖ్యమని రుజువు చేసిందని ,రచన సరళ సుందరం గా పాత్రోచితంగా జరిగిందని ,కద ప్లాట్ రచయిత్రి స్వంతమని ,,ఇందులో అద్భుత రసం చిప్పిలిందని సెంటిమెంట్ కు ప్రాదాన్యముందని ,యూనిటీ ఆఫ్ యాక్షన్,ప్లేస్ ,టైం ఉందని ,కాని కృత్రిమంగా ఉందని పించిందని అయినా హాయిగా చూసి చదివి ఆనందించ దగ్గ లక్షణం ఉందని ప్రేక్షకుల హృదయాలలోకి సూటిగా దూసుకు పోయే లక్షణం దీనిలో ఉందని  ఫెమినిజం పై రచయిత్రి కున్న అభిమానం అంతస్రవంతిలా సాగటం గుర్తించాలని అణగ తొక్క  బడిన వారి పక్షాన నిలి వారికి సానుభూతి చూపించటం హర్షించదగినదని సుప్రభాతాలతో మొదలైన దేవి సంస్కృత సాహిత్య యాత్ర అనేక దశలలో విస్తరిల్లి మహాకావ్య నిర్మాతగా వర్ధిల్లిందని కీర్తించారు  .డా  ఎస్ జి రామానుజా చార్యులు ఆమెను ‘’చైతన్య స్పూర్తి ‘’అని ఆశీర్వ దించారు . పుస్తకం లో ఈ రూపకానికి తెలుగు అనువాదమూ ఉండటం తో అందులోని భావం అందరూ గ్రహించే వీలు కలిగింది .చివరగా ప్రభావతీ దేవిగారి మనోభావం 54 వ శ్లోకం లో చక్కగా వివరించారు .మొత్తం రూపకం లో సంభాషణలే కాక 5 4 శ్లోకాలున్నాయి .అవీ సందర్భోచితంగా అమరాయి .

‘’న భవతు మత యుద్దో మాస్తు శాఠ్య ప్రకోపకః –న భవతు నర మేధో శ్రున్మాతిర్మస్తునృపాం

భావతువిమాలి చిత్తః సర్వదా తోష దాయీ –సకల సుజన మిత్రం ధర్మ వ్రుత్తోస్తు రాజా ‘’

భావం –మత యుద్ధాలు జరుగ కూడదు తీవ్రవాదం ప్రకోపించరాదు .నరమేధం జరగ రాదు .ఆకలి చావులు ఉండకూడదు .పాలకులు నిర్మల మనసుతో ప్రజలకు సంతోషాన్ని కలిగిస్తూ అందరికి మిత్రులై ధర్మ చరితులై నడుచుకోవాలి .ఇదీ ఆమె ఈ రూపకం లో కోరుకొన్న ఉన్నత భావ లహరి .అలా జరగాలని జరుగుతుందని ఆశిద్దాం .

గొప్ప ప్రతిభా ,కవితా సామర్ధ్యం, ఊహ ,వర్ణన నైపుణ్యం .,సంస్కృతాంధ్ర సాహిత్యాలలో లోతైన అవగాహనా ,పురాణ వేద శాస్త్రాలలో నిష్ణాతృత్వం ఉన్న  శ్రీమతి ప్రభావతీ దేవిగారు  శాశ్వత కావ్యం ఆధునికభావాలతో సంప్రదాయంగా రచించి వాసి కెక్కాలని కోరుతున్నాను .వారిని ఈ తరానికి పరిచయం చేయటం నాధర్మగా అదృష్టంగా భావిస్తున్నాను .

‘’కవితా కన్యక గుణములు కవికన్న రసజ్నుడెరుగు కవి ఏమెరుగున్ –భువిలో కన్యక గుణములు ధవుడెరుగును కాక కన్న తండ్రే మెరుగున్’’అన్న పద్యాన్ని తన ‘’నామాట ‘’లో  కోట్ చేసి, రసజ్ఞులు తన కావ్యాలను చదివి ఆన౦దిస్తే తాను ఆనందంగా మరో కావ్యారంభం చేస్తానన్నారు ప్రభావతీ దేవి .శుభం భూయాత్ .

Inline image 1Inline image 2Inline image 3Inline image 4

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-1-17 –ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 26-విశ్వనాధ వారి వేయి పడగలను సంస్కృతీకరించిన విదుషీమణి- డా.అయ్యగారి ప్రభావతీ దేవి -2

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3

26-విశ్వనాధ వారి వేయి పడగలను సంస్కృతీకరించిన విదుషీమణి- డా.అయ్యగారి ప్రభావతీ దేవి -2

ప్రభావతీదేవి ప్రతిభా సర్వస్వం- ‘సహస్ర ఫణాః’’గా వేయిపడగలు సంస్కృతానువాదం ‘’.

విశ్వనాధ వేయిపడగలు అంటే  ఆయన ‘’మేగ్నం ఓపస్’’ గా భావింపబడే ఆధునిక నవలేతి హాసం .వెయ్యి పేజీల బృహత్ నవల .దీనిని సంస్కృతం లోకి తర్జుమా చేయమని గురుస్థానీయులు శ్రీ ఏలూరి పాటి అనంతరామయ్యగారు సూచించటం వెంటనే ఆకార్యక్రమాన్ని చేబట్టి దిగ్విజయంగా పూర్తి చేయటం శ్రీమతి ప్రభావతీదేవికే చెల్లింది .అది ప్రభావతీ మేధో సర్వస్వమే అయింది .డిసెంబర్ 28 వ తేదీన వారి అపార్ట్ మెంట్ కు మేము వెళ్ళినప్పుడు వేయిపడగలు వ్రాత ప్రతి ఆమె టేబుల్ పై దర్శన మిచ్చింది .ముత్యాలవంటి స్వదస్తూరితో చక్కని వరుసక్రమం లో ఆమె వెయ్యి పేజీలలో సంస్కృతం లోకి అనువాదం చేశారు .ముచ్చటవేసింది ఆ సంస్కృత ప్రతి చూడగానే .ఫోటోలు తీశాను .పుస్తకం ఆవిష్కరణ జరిగిందని విన్నానే ఎలా చేశారు అని అడిగితే డి. టి. పి. చేసిన సుమారు వంద పేజీల స్పైరల్ బైండింగ్ చూపించి దానినే ఆవిష్కరించామని చెప్పారు .దీని ఫోటో కూడా తీసుకొన్నాను .’’అనువాదం లో మీ స్త్రీవాద ప్రభావం పాత్రలపై పడిందా’’ ?అని అడిగాను’’లేదు .ఏపాత్రనూ నేను ముట్టుకోలేదు.విశ్వనాధ వారు ఏది ఎలాచేప్పారో దాన్ని తు చ తప్పకుండా సంస్కృతం లో రాశాను .కనుక పాత్రలపై నా ప్రభావం పడే అవకాశం లేదు, నేను తీసుకోనూ లేదు’’అని చెప్పారు .’’ఇంతటి బృహద్రచన అనువాదం చేయటానికి ఏంతో ఓపికా సమయం కావాలి కదా .ఎంతకాలం లో రాశారు ?అని అడిగితే’’ఏలూరి పాటి గురువు గారి ఆదేశం, ఆశీస్సు ,ప్రోత్సాహం ఉండటం వలన ఎక్కడా ఆగకుండా జయప్రదంగా 2001 లో ప్రారంభించి మూడేళ్ళలో 20 04 కు పూర్తి చేశాను ‘’అన్నారు ..’’ఆయన ఆదేశం పై రాశానని అన్నారు కదా అసలు ఆ నవలపై మీకు అంతకు ముందు ఎలాంటి అభిప్రాయం ఉంది ?’’అని అడిగితే ‘’ఆ నవల గురించి వినటమేకాని ,పూర్తిగా చదవలేదు కాని అనువాదం కోసం చదవటం మొదలు పెడితే అద్భుతం అని పించింది .రెట్టించిన ఉత్సాహం తో రాసుకుంటూ వెళ్ళిపోయాను ‘’అన్నారు .’’మరి ఈ కాలానికి సంస్క్రుతానువాదం పనికొస్తుందా ?’’అని అడిగా .’’అది కాలం నిర్ణయిస్తుంది .మన ప్రయత్నం మనం చేయాలి ‘’అని చెప్పారు ‘’.అందులోని ఏ పాత్రలు మీకు నచ్చాయి ?అని ప్రశ్నిస్తే ‘’మంగమ్మా ,భర్త లు బాగా నచ్చిన పాత్రలు.కారణం జవం జీవం ఉన్నపాత్రలు కనుక  ‘’అని ఠకీమని చెప్పారు .’’అందరికి ధర్మారావు అరుంధతి నచ్చుతారు కదా “’అన్నాను .’’వారివిషయం ఏమోకాని ధర్మా రావు విశ్వనాధ వారి ‘’టైలర్ మేడ్ షర్ట్ ‘’(ఈ మాట ఆమె అనలేదు కాని ఆమె భావానికి నేను పెట్టిన పేరు మాత్రమె )అని పిస్తాడు నాకు .మొదటి అరుంధతి అభిమాన పాత్ర .రెండో అరుంధతి నచ్చలేదు ‘’అన్నారు .’’అనువాదానికి న్యాయం చేశారని అనుకొంటారా’’ ?అనగానే ‘’నూటికి నూరు శాత౦ న్యాయం చేశాననే సంతృప్తి, సంతోషం నాకున్నాయి .’’అని ధీమాగా అన్నారు . ‘’నవల ముద్రణ ఎందుకు చేయలేకపోయారు “”?అని అడిగా ‘’నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవటం ,అమెరికాలో ఎక్కువ కాలం ఉంటూ ఉండటం డి .టి .పి. చేసిన కాగితాలలో తప్పులు సరి చేయటానికి సంస్కృతం తెలిసిన వారు దొరకక పోవటమే ముఖ్య కారణాలు .2010 లోముద్రణకు ఇస్తే ఇ౦తవరకుఅది పూర్తి కాలేదు ‘’అని కొంత నిర్వేదంగా అన్నారు .నేను ఆమెకు చెప్పలేదుకాని సద్గురు శివానంద చారిటబుల్ ట్రస్ట్ వారికి కాని వారణాసి లోని సంస్కృత విద్యా సంస్థాన్ వారికి కాని ఇచ్చి ఉంటె ఎప్పుడో సంస్కృత వేయిపడగలు వెలుగు చూసి ఉండేదేమో అని పించింది .ఏమైనా’’ స్త్రీ సాహసం ‘’గా ప్రభావతీ దేవి గారు తెలుగు వారంతా గర్వపడే గొప్పపని గా’’ సహస్ర ఫణాః’’నుతెలుగువారికి అందించి ధన్యులయ్యారు .

2-‘’కృతో వా మానుష్యం ‘’.(మానవత్వం  ఎక్కడ ?’’)

ప్రభావతీ దేవిగారి మరొక సృజన ‘’కృతోవా మానుష్యంఖండకావ్యం . ‘’52 శ్లోకాల ఈ కవిత్వాన్ని నాగర లిపి, తెలుగు లిపిలో నూ ఇచ్చి ఇంగ్లీష్ లోకి ఆమె కుమార్తె శ్రీమతి లలితా సుహాసిని అనువదిస్తే ,శ్రీ ఏలూరి పాటి అనంతరామయ్యగారు తెలుగు అనువాదమూ చేసి మరింత శోభ చేకూర్చారు .ఈ  చతుర్వేణీ సంగమ కవితా ధార మధురం,సుందరం ఆలోచనా స్పందనం .ఇందులో లోకం లోని అన్యాయాలను ఎత్తి చూపి మానుష్యం యెటు పోతోంది అని ప్రశ్నించారు ప్రభావతీ దేవి .ఈ అన్యాయాలలో బ్రిటిష్ వారు చేసినవే కాక సమకాలీన కాలం లో పాకిస్తాన్ ,నేటి క్రికెట్ చేసే అన్యాయాలనూ ఏకరువు పెట్టారు . ఆతంక వాదుల ఆకతాయి తనం బాలబలాత్కారాలు ,గురుకుల విద్యార్దుల వధలు ,జైళ్ళల్లో చావులు ,అయోగ్యుల పదవీ అందలం, మతోన్మాదం రక్తపాతం వంటి సమస్యలలెన్నిటినో  స్పృశించి  తన లోకజ్ఞాత అచాటుకొన్నారు .సోదరులు ఆడపడుచులను ఆదుకోవటం లేదని బాధ పడుతారు .శ్రీ శ్రీకి లోకబాదే తనబాద అయినట్లు దేవిగారికీ అంతే .ఈ కృతిని తమ స్నేహితులు బి .జే .పి .సీనియర్ నాయకులు కేంద్రమంత్రి శ్రీ బండారు దత్తాత్రేయ గారికి అంకిత మిచ్చారు .శిఖరిణీ వృత్తం లో రాసిన ఈ  శ్లోకాలు ఆమె చేతి పెంపుడు నెమలి లా నాట్యమాడాయి ..ఇందులోని కొన్ని సొగసులు చూద్దాం

మొదటి శ్లోకం-‘’ పవిత్రం త్వన్నామ ప్రధమ పదమాభాతి చ విధేః-ద్వితీయం సోపానం భవతి భవతాం దర్శన విధిః

భావద్విస్సల్లాపో నయతి నియతే రంతిమ పదం –క్రుతార్దాం త్వత్ స్నేహే తదియ భగవాన్ చిన్తయతుమాం ‘’

భావం – పవిత్రమైన నీపేరు పవిత్రతకు మొదటి మెట్టు గా  ఉండి,నిన్ను దర్శించటం రెండవ మెట్టు అయింది నీతో సంభాషణ భాగ్యానికి చివరి స్థానానికి చేరుస్తుంది .నన్ను నీ స్నేహం కృతార్దురాలిని చేస్తుంది .కనుక భగవాన్ !నన్ను గురించి ఎప్పడూ నువ్వు ఆలోచిస్తూ ఉండు .

19 వశ్లోకం –‘ఇమే ప్రౌఢా బాలాఃభ్రమర సరణాసక్త మతయః –సరోషాఃనిర్లజ్జాః స్వహిత పర నిస్టాః పరవశాః

అహంకారేణాంధాః స తు కర్తుం చ కుశలాః –పిత్రూన్ నిర్ భర్ త్సైతేసుఖమివ హి జీవంతి తనయాః .

భావం –తాడి చెట్లలాగా ఎదిగి వీదుల వెంట బలాదూర్ తిరుగుతూతమబాగే చూసుకొనే పరాన్నభుక్కులైన ఈ కుర్రాళ్ళకు ముక్కుమీద కోపం సిగ్గు లేనితనం పొగరుతో కళ్ళు మూసుకు పోయి కన్నవారిపై కస్సూ బుస్సు మంటూ సుఖంగానే బతుకు తున్నారు .

24-‘’వర్షేస్మిన్ వృషనామ్నిమూఢ మతయః కార్తీక మాసే చతు-ర్దశ్యా మధ్య తిదౌచ దక్షిణ మహా యానే గురౌ వాసరే

అస్మద్భారతదేశ ముఖ్య నగరే ,ధిల్ల్యాంసభాయాం ప్రగే-సార్ధైకాదశ వాదనేచ సమయే గ్న్యస్త్రాణ్య ముంచన్ శఠాః’’

భావం -13-12-20 01 గురువారం పగలు 11 -30 కి ధిల్లీ పార్లమెంట్ వద్ద మూఢ బుద్ధులైన ఆతంక వాదులు బాంబులు ప్రయోగించారు అని తిదివార నక్షత్రాలతో సహా తెలియ జేశారు  .

27- వ శ్లోకం లో నాటి ప్రధాని వాజ్ పాయ్ పాకిస్తాన్ కు గౌరవ ప్రదమైన మాటలతో యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేస్తే ,ఆ మోసగాళ్ళు భారత సైన్యం పై విరుచుకు పడి నరమేధం సృష్టించారు. మానవత్వం ఎక్కడుంది ఆపపేరైనా ఎక్కడుంది అని ప్రశ్నించారు .

47 వ శ్లోకం –‘’ప్రజా తంత్రే తదపి చ భవెత్సేక్యులరితో –న హిందూ నే సాయీ జిన యవన భేదో న తు పరం

మహాన్త స్సంక్షోభా మత విషయకా రక్త సరితః –కుతో వా మానుష్యం బత తదభిదానం  చ భవతి .

భావం –ప్రజా స్వామ్యమైన మన మతా తీత రాజ్యం లో హిందూ ముస్లిం క్రైస్తవ జైన భేదం లేదు .కానీ మత సంబంధ కొట్లాటలు కాట్లాలకు అంతు  లేదు .రక్తం ఏరులై ప్రవహిస్తోంది .మానవత్వమెక్కడ దాని అడ్రస్ ఎక్కడుంది ?

52-‘’అయం కాంగ్రెస్ నేతా లయగమన రక్తో మునివరః –అయం లంపాకానా౦ ప్రతినిధి రయం సాదు చరితః

హతో రాగ్యా దుస్టైరదివ సమయే లోక పురతః –కుతో వా మానుష్యం బత తదభిధానం చ భవతి

Inline image 1Inline image 2‘’

భావం –కాంగ్రెస్ పార్టీ నాయకుడు ,దైవ భక్తుడు ,లంబాడీ ప్రజల ప్రతినిధి ,ఉత్తమ నడవడిక గలవాడు అయిన రాగ్యా నాయక్ నుపట్టపగలే అంతా చూస్తుండగా దుర్మార్గుల చేతిలో బలై పోయాడు .ఇంకెక్కడి మానవత్వం ?దాని చిరునామా యేడ?

ఏ సమస్యనైనా హాయిగాసులభంగా సుందరం గాశిఖరిణి లో మలిచి వన్నె తెచ్చి ,ఇంత తేలికగా సంస్కృతం లో రాయవచ్చా అని ఆశ్చర్య పరచారు ప్రభావతీ దేవి .ఈ కావ్యం మానవత్వానికి ఎత్తిన విజయ పతాక అని పిస్తుంది .

Inline image 3Inline image 4Inline image 5

సశేషం

మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -4-1-17 –ఉయ్యూరు

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బాపు గారి తమ్ముడు శ్రీ శంకర నారాయణ గీసిన పోర్ట్రైట్ లు

narsapur-1 narsapur-2 balamurali-krishna-mangalampalli నరసాపురం లో ఆయనకు బాపు గారి పురస్కారం అందజేయటం ఆయన చిత్రించిన మంగళం పల్లి బాలమురళీ కృష్ణ చిత్రం మీకోసం

Posted in సమయం - సందర్భం | Tagged , | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 26-విశ్వనాధ వారి వేయి పడగలను సంస్కృతీకరించిన విదుషీమణి- డా.అయ్యగారి ప్రభావతీ దేవి

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3

26-విశ్వనాధ వారి వేయి పడగలను సంస్కృతీకరించిన విదుషీమణి- డా.అయ్యగారి ప్రభావతీ దేవి

ఆకాశం లో సగభాగం అయిన మహిళలు సాధించ రానిది ఏమీ ఉండదు అని నిరూపించిన  తెలుగింటి ఆడపడుచు డా అయ్యగారి ప్రభావతీ దేవి .చురుకైన మేధ,తలిదండ్రుల వారసత్వం ,తీర్చి దిద్దిన గురుదేవులు ,స్వయం కృషి ,పట్టుదల ,సాహసం తనను తానునిరూపించుకోవాలనే మనో నిశ్చయం వలన శ్రీమతి ప్రభావతీ దేవి గారు అనుకున్నవన్నీ సాధించారు . స్వయం సిద్ధ అయిన ఆమె జీవితం స్పూర్తి దాయకం .

దేవీ విలాసం –తాత తండ్రిల వారసత్వం

విద్వాత్కవులు ,పురాణ పరమేష్టి,ఆంద్ర వ్యాసులు ,సంస్క్రుతకళాశాల ప్రిన్సిపాల్ ,డీన్ శ్రీ  ఏలూరిపాటి అనంతరామయ్యగారు శ్రీమతి ప్రభావతీ దేవి గారి గురించి రాసిన ‘’దేవీ విలాసం ‘’వలన ఈమె  దేశభక్తుడు  ,స్వాతంత్రోద్యమం లో జైలుకు వెళ్లి,దానికి సంబంధించిన ఏ విధమైన ప్రతి ఫలం ప్రభుత్వం నుంచి ఆశించని త్యాగ శీలి అయిన శ్రీ  అయ్యగారి సుబ్బారావు గారి కుమార్తె అని , తల్లి శ్రీమతి శ్యామలంబ అని ,తండ్రి  ప్రయాగలో ఒక పుష్కర కాలం ఉండి సంస్కృతం ,హిందీ లలో ప్రావీణ్యం సాధించారని ,తాతగారు కుమార స్వామిగారు చతురాశ్రమ నిష్టా గరిస్టులని,వీరి సన్యాసాశ్రమ నామం ‘’కేశవానంద సరస్వతి ‘’అని స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లా కొత్త పేట తాలూకా బండారులంక అని ,తాత ,దండ్రుల సంస్కృత భాషాభిమానం, అభినివేశం ఈమెకు సంక్రమించిందని తెలుస్తోంది .తండ్రికి ఈ కుమార్తెపై ఆ శ్రీదేవి మీద  భక్తి ఉన్నంత వాత్సల్యం ఉండేది ‘.ప్రాణం కన్నా ఎక్కువగా పెంచారు .వారి వ్యక్తిత్వమే ఈదేవిగారికి అబ్బింది  .తండ్రి గొప్ప గణిత శాస్త్రాభిమాని .ఆయన స్వయంగా రూపొందించి గ్రంధస్థం చేసిన ‘’దీరమ్స్ ‘’చాలా ఉన్నాయి  ప్రభావతీ దేవిగారి అన్నగారు శ్రీ భుజంగరావు ఆల్విన్ సంస్థలో ఉద్యోగించి స్వచ్చంద పదవీ విరమణ చేసిన కమ్యూనిస్ట్ అభిమాని .తనకు పదవీ విరమణ సమయం లో కంపెనీ ఇచ్చిన ధనాన్నంతా పార్టీకే సమర్పించి ,సఫిల్ గూడా లో ఉంటున్నత్యాగి .

దేవి విద్యా సోపానం

ప్రభావతీ దేవి 29-6-1955 లో జన్మించారు .  1988 లో ఉస్మానియా విశ్వ విద్యాలయం నుంచి  చదివి తెలుగు ఎం.ఏ.పొందారు . 1991 లో  ఇంగ్లీష్ లో ఎం ఏ .ను ప్రైవేట్ గా చదివి సాధించి ,తర్వాత అదే యూని వర్సిటీ ఆర్ట్స్ కాలేజిలో చదివి సంస్కృతం లోనూ ఎం. ఏ .అందుకొన్నారు .’’సంస్కృతాంధ్ర భాగవతాస్టమ స్కంధాను శీలనం ‘’పై ఎం .ఫిల్ పట్టా పొందారు .విద్యాదాహం తీరని దేవి 1996 లో జర్నలిజం కోర్సు చేసి, హైదరాబాద్ తెలుగు విశ్వ విద్యాలయం లో ‘’జ్యోతిషం ‘’డిప్లొమా తరగతులకు హాజరై జ్యోతిషం నేర్చారు కాని జాతకాలు వేయరు చెప్పరు .హిందీ తమిళ ,ఉర్దూలను అభ్యసించిన వీరు సెంట్రల్ ఇన్ స్టి ట్యూట్ఆఫ్ ఫారిన్ లాంగ్వేజెస్ లో 1998 లోస్పానిష్ భాషలో ప్రిలిమినరి కోర్సు చేశారు .ఆచార్య బూరగడ్డ నరసింహా చార్య వద్ద ఉస్మానియాలో ‘’సంస్కృత వాజ్మాయే నీతి కావ్యాని ‘’అనే విషయం పై పరిశోధన చేసి 2004 లో పి .హెచ్ .డి.పొందారు .

ఉద్యోగ సోపానం

ప్రభావతీ దేవి గారికి నాట్యం వ్రుత్తి కాదు కాని పాఠ శాల వార్షికోత్సవాలలో నాట్యం చేసేవారు .శ్రీ కృష్ణుడు వీరి అభిమాన పాత్ర .కాళిదాసు శకుంతల సంస్కృత నాటక౦ లో శకుంతల పాత్ర ,మరికొన్ని సంస్కృత నాటకాలలో ముఖ్య పాత్రలనూ పోషించారు .ఉపాధ్యాయ వ్రుత్తి పై అభిమానం ఉండటం తో కొంతకాలం రంగా రెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్స్ లో తెలుగు పండితులుగా పని చేసి స్వచ్చందం గా విరమించి , సికందరాబాద్ మెహబూబ్ డిగ్రీ కాలేజి లో సంస్కృతం లెక్చరర్ గా1996 లో చేరి  పని చేస్తూ ,సంస్కృత పరి చర్య చేస్తూ 2007 లో స్వచ్చంద పదవీ విరమణ చేశారు .2010 నుంచి అమెరికాలో ఉంటున్నారు .1988 లో హైదరాబాద్ లో ఆంద్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యం లో నేషనల్ ఓరియెంటల్ కాన్ఫ రెన్స్ లో 1-శ్రీ రాయప్రోలు సుబ్బా రావు ‘’అమలిన శృంగార తత్త్వం లోని ఔచిత్యం 2-సంస్కృత వాజ్మాయే ప్రహేళిక ‘’అనే రెండు పరిశోధన పత్రాలను సమర్పించారు ..1988 లో తిరుపతి లో జరిగిన విశ్వ హిందూపరిషత్ ధర్మ సమ్మేళనం లో ‘’హిందూ ధర్మ ఇన్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ ‘’పేపర్ ను,2002మార్చి  లో వారణాసి లో జరిగిన అఖిల భారత సంస్కృత సమ్మేళనం లో ‘’వైదిక ,లౌకిక సాహిత్య కరణా దృస్టౌ నారి ‘’పేపర్ ను సమర్పించారు .

దేవి సామాజిక సేవ

బహుముఖ ప్రజ్ఞాశీలి శ్రీమతి ప్రభావతీదేవి కి విద్యా తృష్ణ తోపాటు సాంఘిక సేవాభిలాష కూడా ఎక్కువే .తండ్రినుంచి సంక్రమించిన స్వతంత్ర దృక్పధం ఆమెను అన్నిరంగాలలో అగ్రేసర స్థానం లో నిలబెట్టింది .తండ్రి కాంగ్రెస్, అన్న కమ్యూనిస్ట్ అయితే దేవి గారు భారతీయ జనతాపార్టీ లో చేరి 1990 నుండి రెండేళ్ళు రంగా రెడ్డి జిల్లా స్త్రీ విభాగం లో అవిరామం గా పనిచేశారు .1993 లో భా జ.పా .కార్య వర్గసభ్యురాలిగా సేవలందించారు .ఆ భావ ధారఉన్న సంస్థలకు తన సేవలను కొనసాగిస్తూనే ఉన్నారు .సఫిల్ గుడా లయన్స్ క్లబ్ చార్టర్ మెంబర్ గా ,ప్రెసిడెంట్ గా ఒక దశాబ్దం పైగాఉండి వివిధ సేవాకార్యక్రమాలను చేబట్టి నిర్వహించారు . బోలారం మహా కాళీ దేవాలయ ధర్మ కర్త్రుత్వసంఘ సభ్యురాలుగా చాలాకాలం ఉన్నారు .స్మార్తం క్షుణ్ణంగా అభ్యసించి కావాలనుకొనే వారికీ పౌరోహిత్యమూ నిర్వహిస్తున్నారు .

వివాహ బంధం

శ్రీ ఏలూరి పాటి వారి ‘’దేవీ విలాసం ‘’వలన ప్రభావతీ దేవిగారుసౌదీ అరేబియాలో ఇంజినీర్ గా పని చేసి ప్రస్తుత౦ అమెరికాలో సివిల్ ఇంజనీర్ గా ప్రముఖ పదవిలో ఉన్న పని  శ్రీ రాచపూడి హర గోపాల శర్మగారిని వివాహమాడి,సుగాత్రీ శర్మ ,లలితా సుహాసినీ అనేకుమార్తెలను ,కళ్యాణ చక్రవర్తి అనే కుమారుని ఆ దంపతులు సంతానంగా పొందారని.అందరకూ వివాహాలు చేసి బాధ్యతలు తీర్చుకున్నారని తెలుస్తోంది .

దేవి వ్యక్తిత్వ వికాసం

బహుముఖీన వ్యక్తిత్వ వైదుష్యాలు పెంచుకొంటూ పిల్లల విద్యాభి వృద్ధికి దోహదపడుతూ ,అన్ని రంగాలో అనుక్షణం ప్రశంసనీయకృషి చేస్తూ తన తన గురు పండితాదులకు   చేసే సేవనిరుపమానం అంటారు అనంత రామయ్యగారు  .ఒక చేతి తో చేసే దాతృత్వం రెండో చేతికి తెలియ కుండా చేసే గుణ సంపన్నురాలు .పాఠ శాల వ వార్షికోత్సవాలకు హాజరవుతూ వారి వికాసానికి దోహద పడుతూ ఆమె చేస్తున్న సేవ ఆమె నిరహంకార వ్యక్తిత్వానికి దర్పణం .ప్రాచీన పద్ధతిలో శాస్త్రాధ్యయనం చేసిన వారంటే ఆమెకు ప్రత్యేక గౌరవం .శ్రీ కేరళ సుబ్రహ్మణ్య శాస్త్రి సాహిత్య శాస్త్ర గురువుగా ,శ్రీ రామ స్వామి శాస్త్రి ఘన పాఠి గారు వ్యాకరణ శాస్త్ర గురువుగా ,ఆమె ప్రత్యేకంగా చెప్పుకొని గౌరవిస్తారు .అలాగే ఉస్మానియా లో తన గురువు, మార్గ దర్శి శ్రీ బి నరసింహాచార్య అంటే వల్లమాలిన భక్తీ వినయం ప్రదర్శిస్తారు .ఆమె ఆరాధ్యదైవం శ్రీ లలితా పరా భట్టారిక ను అనునిత్యం పూజింఛి సహస్రనామ పారాయణ చేయనిదే ప్రభావతీ దేవిగారు ఆహారం స్వీకరించరు .పారాయణ సమయం లో ఎవ్వరితోనూ మాట్లాడని దీక్ష ఆమెది దేవి ముందు చేసిన ప్రతిజ్ఞ అతిక్రమించదు .ప్రతి ఏడాది ఆమె నిర్వహించే చండీ హోమం రుద్రాభిషేకం చూసి తీరవలసి౦దేకాని మాటలతో  వర్ణించేది కాదంటారు ఏలూరి పాటి వారు .’’ఒకరు చెప్పింది చేయదు తనకు తోచింది చేయక మానదు .వట్టి ‘’చండిక ‘’‘’అంటారాయన .ఆపదలలో ఉన్న వారిని ఆడుకోవటానికి ఎంత దూరమైనా వెడుతుంది ఎంత ఖర్చైనా పెడుతుంది .సామాన్యులకు ఆమె మాట సుగ్రీవాజ్న .గుణ గ్రాహిణి,ఏక సంథ గ్రాహిణి .సంస్కృత సాహిత్య శాస్త్రం లో రసవంతాలైన శ్లోకాలెన్నో ఆమె జుహ్వాగ్రం పై నర్తిస్తాయి .ఆకాశవాణి కేంద్రం లో అమరవాణి కార్యక్రమాలలో ఆమె చేసిన ప్రసంగాలు ,స్వీయ కవితలు సమ్మోహనాలు, చిరస్మరణీయాలు అంటారు అనంతరామయ్యగారు .హైదరాబాద్ దూర దర్శిని లో ప్రసారమైన ‘’పద్యాల తో’’రణం’’కార్యక్రమం లో మూడు సార్లు ఆమె స్థాన నిర్ణేతగా వ్యవహరించి సమర్ధత చాటారు .అదే సంస్థ లో ఎర్రా ప్రగడ కవిత్వం పై ముఖా ముఖి కార్యక్రమం లోనూ పాల్గొన్నారు . ఒక ఓరియెంటల్ కార్యక్రమం లో ‘’అమలిన శృంగారం ‘’వాదాన్ని ఆక్షేపించి వచ్చిన ప్రతివాదాన్నీ ఎదుర్కొని సమాధానం చెప్పి నెగ్గిన తీరు మర్చి పోలేనిదంటారు శ్రీ  ఏలూరి పాటి .నల్లకుంట శంకర మఠం మొదలైన దేవతా స్థానాలలో ‘’దేవీ భాగవత సప్త శతి ‘’,మొదలైన ఆధ్యాత్మిక గ్రంధాలలోని పరమాద్భుత విశేషాలను వివరిస్తూ చేసిన ప్రసంగాలు స్తవనీయాలు ‘.పురుషాధిక్యాన్ని ధిక్కరించే తత్త్వం శ్రీ దేవిగారిది .శ్రీ మాడుగుల నాగ ఫణి శర్మ ,శ్రీ గరికపాటి నరసింహారావు శ్రీ రాళ్ళ బండి కవితా ప్రసాద్ లవంటి లబ్ధ ప్రతిష్టులైన అవధానుల  తెలుగు సంస్కృత కవి  సమ్మేళనాలలో  పృచ్చకులుగా వ్యవహరించారు .శ్రీమతి ప్రభావతీ దేవిగారికి శ్రీ పుష్పగిరి పీఠాదిపతుల అమోఘ ఆశీస్సులున్నాయి.

రచనా ప్రభావతీయం

అభిజ్ఞాన శాకుంతలం పై సమీక్ష రాశారు .ఆంద్ర భూమి దినపత్రికలో 2001 -2002 కాలం లో శ్రీకృష్ణ కర్ణామృతం ‘’ధారావాహిక గా ప్రభావతీదేవి గారు రచించారు.1987 లో ‘’శ్రీ బోలారం మహా కాళీ సుప్రభాతం 2-2001 లో ‘’కుతోవా మానుష్యం ‘’?(మానవత్వం ఎక్కడ )3-2004 లో శశిరేఖా విజయం అనే నాటకం  4-బాలికా పంచాశికా 5కవి సామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ గారి ‘’వేయి పడగలు ‘’నవల ను సంస్కృతం లోకి ‘’సహస్ర ఫణాః’’పేరుతొ అనువదించారు .దీని వ్రాత ప్రతి ఆవిష్కరి౦పబడింది .పుస్తక రూపం లో ఇంకా వెలువడలేదు .6 ‘గురు ధిక్కారం –శిష్య వాత్సల్యం’’ కూడా ముద్రణ పొందాలి .

దేవీ పురస్కార వైభవం

ప్రభావతీ దేవిగారి ప్రతిభకు తగిన పురస్కారాలు లభించాయి .1977 లో ‘’మధుర కవయిత్రి ‘’బిరుదును కంటోన్ మెంట్ టీచర్స్ యూనియన్ ప్రదానం చేసింది .1987 లో ‘’భారతీ ప్రభ ‘’బిరుదునిచ్చి ‘’సువర్ణ కంకణం ‘’బహూకరించి బోలారం మహా కాళి దేవాలయం సత్కరించింది .2003 లో ‘’గీర్వాణ భాషా సుభాషా ‘’నవ్య కళాసాగర్ సాహిత్య సంస్థ ప్రసిద్ధరచయిత శ్రీ పోతుకూచి సాంబశివరావు ,చేత సువర్ణ కంకణం ను రైల్వే మంత్రి శ్రీ బండారు దత్తాత్రేయ గారి చేతుల మీదుగా అంద జేసింది

ఆధారం –1-శ్రీమతి ప్రభావతీ దేవి గారి సంస్కృత రచన ‘’కుతోవా మానుష్యం ‘’లో శ్రీఏలూరి పాటి అనంత రామయ్య గారి వ్యాసం ‘’దేవీ విలాసం ‘’.

2-డా.బి నరసింహా చార్య గారిని నాకు ఫోన్ లో పరిచయం చేసిన వారు మా శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు(అమెరికా ) .ఆచార్యులగారు తమ పుస్తకాలను నాకు పంపారు .వారితో సంభాషించేటప్పుడు వారు శ్రీమతి అయ్యగారి ప్రభావతీ దేవి గారి వైదుష్యాన్ని ఆమె వేయి పడగలు ను సంస్కృతం లో కి అనువదించటాన్ని,ఆమెఅద్భత కవితా సామర్ధ్యాన్ని  తెలియజేసి ఆమె పై కూడా 3 వ గీర్వాణం లో నన్నుతప్పక  రాయమని ప్రోత్సహింఛి ఆమె ఫోన్ నంబర్ ఇచ్చారు .వారితో సంభాషించాను .ఆమె వ్యక్తిత్వం నచ్చింది .ఫోన్ లోనే ఇంటర్వ్యు చేశాను .కొన్ని వివరాలు చెప్పారు .శ్రీ ఏలూరి పాటివారు విపులంగా తనను గురించి రాశారని ఆ పుస్తకం తనవద్ద ప్రస్తుతం లేదని చెప్పారు .ఆమె మెయిల్ అడ్రస్ కు సరసభారతి టపాలు పంపుతున్నాను .రెండవ గీర్వాణం ,మాణిక్యాలు ,సీతారామయ్య, దైవ చిత్తం ,మా అన్నయ్య పుస్తకాలు పోస్ట్ లో పంపాను డిసెంబర్ 26  న హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆమె తనకు పుస్తకాలు అందాయని మెయిల్ రాశారు .సమాధానం గామేము హైదరాబాద్ లో నాచారం దగ్గర మల్లాపూర్ లో ఉన్నామని రాశాను .వెంటనే మమ్మల్ని మాకు దగ్గరలోనే ఉన్న మెట్టుగూడాలోని తమ అపార్ట్ మెంట్  కు రమ్మని ఆహ్వానించారు .సరేనని వెళ్లాం .గీర్వాణం మొదటిభాగం కూడా అప్పుడు వారికి అందజేశాను .అప్పుడు ఆమె రచనలు మూడు పుస్తకాలు ఇచ్చారు . నేను ఆమెను ఇంటర్వ్యు కూడా చేశాను. అన్నిటికీ చక్కని సంతృప్తికర సమాధానాలు చెప్పారు తమ పౌరోహిత్య పాటవాన్ని సెల్ ద్వారా రికార్డ్ చేసింది వినిపించారు . ఇవన్నీ కూడా ఈ రచనకు ఆధారాలే .దీనికి కంతటికీ కారణ భూతులైన  శ్రీ మైనేని శ్రీ నరసింహా చార్య శ్రీమతి ప్రభావతీ దేవి గార్లకు కృతజ్ఞతలు .

డా .శ్రీమతి అయ్యగారి ప్రభావతీ దేవి గారి గీర్వాణ కవితా వైదుష్యాన్ని తరువాత తెలుసుకొందాం .

Inline image 1

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -3-1-17 –ఆదివారం

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

2-1-17 సోమవారం సాయంత్రం విజయవాడ పుస్తక మహోత్సవం లో మంగళం పల్లి బాలమురళీ కృష్ణ సంస్మరణ సభ -అతిధులు సర్వశ్రీ అన్నవరపు రామస్వామి గొల్లపూడి మారుతీ రావు ,ఈల శివ ప్రసాద్ ,మల్లాది సూరిబాబు ,డి.వి మోహన కృష్ణ భూసారం వెంకటేశ్వర రావు

2-1-17 సోమవారం సాయంత్రం విజయవాడ పుస్తక మహోత్సవం లో మంగళం పల్లి బాలమురళీ కృష్ణ సంస్మరణ సభ -అతిధులు సర్వశ్రీ అన్నవరపు రామస్వామి గొల్లపూడి మారుతీ రావు ,ఈల శివ ప్రసాద్ ,మల్లాది సూరిబాబు ,డి.వి మోహన కృష్ణ భూసారం వెంకటేశ్వర రావు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

5 3 ఏళ్ళ క్రితం 1963 ల్లో నేను మోపిదేవి హైస్కూల్ లో సైన్స్ మాస్టర్ గా సర్వీస్ ప్రారంభించినపుడు నా మొదటి బాచ్ ఎస్ ఎస్ ఎల్ సి విద్యార్థిని,తర్వాత బందరులో హెడ్ మిస్ట్రెస్ గా చేసి రిటైర్ అయి ,కృష్ణా జిల్లా హెడ్ మ్మాస్టర్స్ అసోసియేషన్ కు మా ప్రోద్బలం తో ప్రెసిడెంట్ గాపని చేసిన శ్రీ మతి కొల్లి భారతి ఆత్మీయం గా తన కుమారుని వివాహంకానూరు ధనేకుల కళ్యాణ మండపం లో 21-12-16 బుధవారం రాత్రి జరుగుతుంది రమ్మని గౌరవంగా ఆహ్వానించగా వెళ్లి ,ఆమెకు సరసభారతి పుస్తకాలు జ్ఞాపిక అందజేసిన చిత్రాలు .ఇందులో శ్రీ ఆదినారాయణ ,విశ్వం సుగుణకుమారి ,శర్మ రాజు మొదలైన రిటైర్డ్ హెడ్ మాస్టర్లు కూడా ఉన్నారు -దుర్గా ప్రసాద్

5 3 ఏళ్ళ క్రితం 1963 ల్లో నేను మోపిదేవి హైస్కూల్ లో సైన్స్ మాస్టర్ గా సర్వీస్ ప్రారంభించినపుడు నా మొదటి బాచ్ ఎస్ ఎస్ ఎల్ సి విద్యార్థిని,తర్వాత బందరులో హెడ్ మిస్ట్రెస్ గా చేసి రిటైర్ అయి ,కృష్ణా జిల్లా హెడ్ మ్మాస్టర్స్ అసోసియేషన్ కు మా ప్రోద్బలం తో ప్రెసిడెంట్ గాపని చేసిన శ్రీ మతి కొల్లి భారతి ఆత్మీయం గా తన కుమారుని వివాహంకానూరు ధనేకుల కళ్యాణ మండపం లో 21-12-16 బుధవారం రాత్రి జరుగుతుంది రమ్మని గౌరవంగా ఆహ్వానించగా వెళ్లి ,ఆమెకు సరసభారతి పుస్తకాలు జ్ఞాపిక అందజేసిన చిత్రాలు .ఇందులో శ్రీ ఆదినారాయణ ,విశ్వం సుగుణకుమారి ,శర్మ రాజు మొదలైన రిటైర్డ్ హెడ్ మాస్టర్లు కూడా ఉన్నారు -దుర్గా ప్రసాద్

 

Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

1-1-2017ఆదివారం నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో లడ్డూలతో ప్రత్యేక ప్రభాతఃపూజ,గోదాశ్రీ రంగ నాయకులకు కు౦కుమ పూజ , -వీధుల్లో సంక్రాంతి ముగ్గులు ,నగర సంకీర్తన బృందం ,శ్రీ విష్ణ్వాలయం లో అమ్మవార్లు అయ్యవార్లు ,అర్చకస్వామి

1-1-2017ఆదివారం నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో లడ్డూలతో ప్రత్యేక ప్రభాతఃపూజ,గోదాశ్రీ రంగ నాయకులకు కు౦కుమ పూజ , -వీధుల్లో సంక్రాంతి ముగ్గులు ,నగర సంకీర్తన బృందం ,శ్రీ విష్ణ్వాలయం లో అమ్మవార్లు అయ్యవార్లు ,అర్చకస్వామి

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

విశ్వనాధ వారి ”వేయిపడగలు ”నవలను సంస్కృతం లో ”సహస్ర ఫణాః”గా అనువదించిన ఉస్మానియా యూని వర్సిటి రిటైర్డ్ సంస్కృత లెక్చరర్ డా.శ్రీమతి అయ్యగారి ప్రభావతీ దేవి గారి హైదరాబాద్ -మెట్టు గూడా లోని అపార్ట్ మెంట్ లో 28-12-16 బుధవారం సాయంత్రం మేమిద్దరం ,మా పెద్దకోడలు శ్రీమతి సమత,మా మనవ రాలు ఛి రమ్య Translate

విశ్వనాధ వారి ”వేయిపడగలు ”నవలను సంస్కృతం లో ”సహస్ర ఫణాః”గా అనువదించిన ఉస్మానియా యూని వర్సిటి రిటైర్డ్ సంస్కృత లెక్చరర్ డా.శ్రీమతి అయ్యగారి ప్రభావతీ దేవి గారి హైదరాబాద్ -మెట్టు గూడా లోని అపార్ట్ మెంట్ లో 28-12-16 బుధవారం సాయంత్రం మేమిద్దరం ,మా పెద్దకోడలు శ్రీమతి సమత,మా మనవ రాలు ఛి రమ్య
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

మాపెద్ద మేనల్లుడు ఛి వేలూరి అశోక్ షష్ఠి పూర్తి మహోత్సవం హైదరాబాద్ లోయర్ టాంక్ బండ్ ఫంక్షన్ హాల్ లో 30-12-16 శుక్రవారం ఉదయం జరిగిన సందర్భంగా చిత్రమాలిక

మాపెద్ద మేనల్లుడు ఛి వేలూరి అశోక్ షష్ఠి పూర్తి మహోత్సవం హైదరాబాద్ లోయర్ టాంక్ బండ్ ఫంక్షన్ హాల్ లో 30-12-16 శుక్రవారం ఉదయం జరిగిన సందర్భంగా చిత్రమాలిక

 

Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo:
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 24-యంత్ర చింతామణి రచయిత-దామోదర భట్ట (19 శతాబ్ది ఉత్తరార్ధం )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

24-యంత్ర చింతామణి రచయిత-దామోదర భట్ట (19 శతాబ్ది ఉత్తరార్ధం )

16 వ శతాబ్ది ఉత్తరార్ధం లో జీవించిన సంస్కృత విద్వాంసుడు దామోదర భట్టు ‘’యంత్ర చింతామణి ‘’లేక ‘’కల్ప చింతామణి ‘’అనే గ్రంధాన్ని రాశాడు ఇది పూర్తిగా ‘’అభిచార ‘’పద్ధతులను తెలియ జేస్తుంది ఈ గ్రంధం ఆధారంగానే ప్రాంతీయ భాషలలో దానికి సంబంధిన పుస్తకాలు ప్రచురితమయ్యాయి .ఈ గ్రంధాన్ని మొట్టమొదటి సారిగా అధ్యయనం చేసి ,1939లో ఫ్రెంచ్ భాష లోకి అనువదించినవాడు జీన్ మార్కేస్ రివేర్రీ ‘.ఇటీవలికాలం లో హన్స్ జార్జ్ టూర్స్టిగ్ దీనిపై విపులమైన వ్యాఖ్యానం రాశాడు .గుడున్ బూహేన్మాన్ ఈ గ్రంధాన్ని సంక్షిప్తం చేసి ‘’యంత్రాస్ అండ్ మండలాస్ ‘’పేరిట ప్రచురించింది .

25-స్వామి దయానంద సరస్వతి గురువు –విరజానంద  దండీశ (1777 -1868)

పంజాబ్ లోని జలంధర్ దగ్గరున్న కర్తార్ పూర్ లో 1778 లో మొహియాల్ వంశం లో విరజానంద జన్మించాడు .చిన్నప్పుడే 5 వ ఏట మసూచిక౦  వచ్చి కంటి చూపు పోయింది .ప్రాధమిక సంస్కృత పాఠాలు నేర్పిన తండ్రి చనిపోయాడు .ఆదుకోవాల్సిన అన్నా వదిన ల దాష్టీకం భరించలేక ఇంటి నుండి వెళ్లి పోయాడు .దేశాటనం చేస్తూ హృషీకేష్ చేరి అక్కడే తపస్సు ధ్యానం తో గడిపాడు .దైవ ఘటన వలన విరజానంద హరిద్వార్ చేరాడు .అక్కడ పూర్ణ నాద్ అనే యోగి,సంస్కృత పండితుడు  విరజానంద్ కు సన్యాసం ఇచ్చి ,సంస్కృత వ్యాకరణం బోధించి ,ఆర్ష సంప్రదాయాన్ని బాగా వంట పట్టించి ,హిందూత్వాన్ని బలంగా హృదయం లో నాటాడు .అన్ని సంస్కృత సాహిత్య  శాఖలలో ఆరి తేరి కొంతకాలం విద్యా బోధనా చేశాడు విరజానంద .

విద్యలకు కాణాచి అయిన కాశీ చేరి 10 ఏళ్ళు గడిపి మీమాంస ,ఆయుర్వేద ,వేదాలను క్షుణ్ణంగా అభ్యసింఛి గొప్ప విద్వాంసుడై కాశీ లోని విద్వాంసులలో ముఖ్యుడయ్యాడు . గయ కు వెళ్లి ఉపనిషత్తులపై సాధికారత సాధించి ,కలకత్తా వచ్చి దేశం లోనే ప్రముఖ సంస్కృత విద్వాంసుడనే ఖ్యాతి పొందాడు .తనకున్న సంస్కృత వ్యాకరణ సాహిత్య పాండిత్యం తో మంత్రముగ్ధమైన స్వర౦ తో    సమ్మోహపరచాడు . నగరం లో నుంచి బయటపడి గంగానది ఒడ్డున గడియా  ఘాట్ వద్ద నివాసమేర్పరచుకొని ఉండగా ఆల్వార్ మహా రాజు విరజానంద్ ను దర్శించి ,ప్రభావానికి లోనై ,ఆహ్వానించగా ఆల్వార్ వెళ్లి ఆస్థానం లో ఉండి ,రాజు కోరికపై ‘’శబ్ద బోధ ‘’రాశాడు దీని వ్రాత ప్రతి ఆల్వార్ లైబ్రరీలో భద్రపరచబడి ఇప్పటికీ అతి విలువైనది గా పరిగణింప బడుతోంది .ఆల్వార్ నుండి సోరోన్ ,అక్కడి నుంచి మధురకు విరజానంద చేరుకొన్నాడు.

మధుర లో ఒకపాఠ శాల స్థాపించి నడిపాడు .దేశం లోని పలు ప్రాంతాలనుండి విద్యార్ధులు వచ్చి చేరి చదువుకున్నారు .ఈ సంస్థ నిర్వహణ రాజుల విరాళాలతో నిర్వహించబడింది .అదే సమయం లో సరైన గురువుకోసం దయానంద సరస్వతి దేశమంతటా అన్వేషిస్తూ మధుర చేరాడు .అక్కడ పూర్ణ శర్మ  స్వామి అనే యోగి వలన తగిన గురువు విరజానంద ఒక్కడే అని తెలుసుకొన్నాడు 1860  లో మధురలో విరజానంద ను దర్శించాడు .విద్య పరమార్ధం ఏమిటి అని విరజానంద దయానందను అడిగి ,ఆయన ‘’కౌముది ‘’సారస్వత ‘’అనే రెండు ప్రముఖ వ్యాకరణ గ్రంధాలు ఆపోసన పట్టాడని తెలుసుకొని ఆరెండిటిని  యమునా నదిలో విసిరేసి తనదగ్గరకు రమ్మన్నాడు విరజానంద .

విరజానంద నే గురువుగా భావించి ఆయన చెప్పినట్లే చేసి కాళ్ళపై పడ్డాడు దయానంద .  అంధుడైనా విరజానంద విద్యా బోధన చాలా క్రమ శిక్షణతో నడిచేది .శిష్యుల అనుమానాలను పుస్తకం లేకుండానే తీర్చగల సర్వ సమర్ధుడు విరజానంద గురువు .దయానంద ను తీర్చి దిద్ది తనంతటి వాడిని చేశాడు .విరజానంద  దయానంద  ను హిందూమత పునరుద్ధరణ మే తన గురు దక్షిణగా కోరాడు .ఆర్ష ,వేద సాహిత్య వ్యాప్తికి  అంకిత మవమని శిష్యుని ఆదేశించాడు .గుర్వాజ్నను శిరసావహించి దయానంద మహర్షి వేద ఆర్ష సాహిత్య వ్యాప్తి చేస్తూ హిందూమతాన్ని పునరుద్ధరించటానికి జీవితం ధార పోశాడు .విరజానంద 90 వ ఏట 14-9-1868 న మహా సమాధి చెందాడు .గురువు మరణానికి  స్పందిస్తూ శిష్యుడు స్వామి దయానంద ‘’ఇవాళ వేద వ్యాకరణ తేజో భానుడు అస్తమించాడు ‘’అన్నాడు .కేంద్ర ప్రభుత్వం 14-9-1971 న విరజానంద స్మారక పోస్టల్ స్టాంప్  విడుదల చేసి గౌరవించింది .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-1-17 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 23-కవి కళానిధి దేవర్షి శ్రీ కృష్ణ భట్ (1675-1761 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

23-కవి కళానిధి దేవర్షి శ్రీ కృష్ణ భట్ (1675-1761 )

18 వ శతాబ్దపు జైపూర్ రాజు రెండవ సవాయ్ జైసింగ్ కు సమకాలికుడైన శ్రీ కృష్ణ భట్ కవి ,సంస్కృత పండితుడు చరిత్రకారుడు వ్యాకరణ వేత్త .బుండీ,జైపూర్ రాజాస్థానాలలో సంస్కృతం వ్రజ భాషలకు విశేష ప్రాచుర్యం కలిగించినవాడు .ఆంద్ర ప్రదేశ్ లో వెలనాటి కుటుంబం కు చెందిన వీరు 15 వశతాబ్దిలో ఉత్తరదేశాలకు వలస వెళ్లి అక్కడే రాజాస్థానాలలో  స్థిరపడ్డారు . తండ్రి లక్ష్మణ భట్టు .

తెలంగాణా నుంచి జైపూర్ కు

జైపూర్ రాజు రెండవ సవాయ్ జైసి౦గ్ (1688-1743 )సాహితీ సమరాంగణ సార్వ భౌముడు .ఆయన రాజ్య పాలనలో దేశం లోని సంస్కృత విద్వాంసులను కవి గాయక నర్తకులను శిల్ప చిత్రకారులకు తన ఆస్థానానికి సగౌరవంగా ఆహ్వానించి ఆస్థాన విద్వాంసులుగా నియమించాడు .అలా వచ్చినవారిలో మనకవి  దేవర్షి శ్రీ కృష్ణ  భట్టు ఉన్నాడు.మహారాజు 1716 లో చేసిన అశ్వమేధ యాగానికి ,1734 లో నిర్వహించిన వాజపేయానికి  జైపూర్ నగర నిర్మాణానికి మనకవి సాక్షీభూతుడు .కృష్ణ భట్టు రాసిన ‘’ఈశ్వర విలాసం ‘’మహాకావ్యం జైసి౦గ్ మహారాజు ఆతనికుమారుడు ఈశ్వర సింగ్ ల రాజ్యపాలనా చరిత్ర ను వర్ణించిన దే.

హరి హర భట్టు రాసిన ‘’కుల ప్రబంధం ‘’లో తెలంగాణాకు చెందిన భట్టు వంశీయుల మొదటి తరం వారు అక్కడినుంచి ఇక్కడికి వచ్చి చేరారో తెలియ జేస్తుంది .శ్రీ శంకరాచార్య ,శ్రీ వల్లభాచార్య లవంటి గురువుల శిష్యులై, వారి దేశాటనం లో భాగస్వాములై వీరు ఉత్తర భారతానికి  చేరారట .వీరి ప్రతిభా పాండిత్యాలకు రాజులు అబ్బురపడి తమ సంస్థానాలలో గౌరవ స్థానాలు అందజేశారట .వీరిలో రాజ గురువులైనవారు ఆస్థాన కవులు ఆస్థానపండితులు ఆస్థాన విద్వాంసులు  అయిన వారెందరో ఉన్నారట .కాశీ లాంటి పట్టణాలలో  విద్యాభ్యాసం  కోసం వచ్చిన వారి సామర్ధ్యాన్ని గుర్తించి  రాజాస్థానాలకు  ఆహ్వానించి ఉన్నత స్థానాలను రాజులు కల్పించారట .క్రమంగా వీరు తమ తెలుగును మర్చిపోయి హిందీ లేక తాము ఉన్న ప్రాంత భాషకు అలవాటు పడిపోయారని కుల ప్రబంధం తెలియ జేస్తోంది .

ఇలా వచ్చినవారిలో తెలంగాణాలోని దేవర కొండకు చెందిన బావాజీ దీక్షిత కుటుంబం వల్లభాచార్యుల వారి తో 15వశతాబ్దిలొ ఉత్తర భారత దేశానికి చేరింది .ఆనాటి విద్యా కేంద్రాలైన కాశీ  ,ప్రయాగలలో దీక్షితులు విద్య నేర్చి స్థిరపడ్డాడు .సంతానమూ ఇక్కడే ఉండి పోయింది ..అప్పుడు ఈ రెండుప్రాంతాలూ మధ్య ప్రదేశ్ కు చెందిన రేవా సంస్థానం లోనే ఉండేవి .దీనికి ప్రయాగ సరిహద్దు.బావాజీ దీక్షితుల మనవడు మండన దీక్షితుల ప్రతిభా వికాసాలను గుర్తించిన రాజు గోపాల్సింగ్ తన  రాజగురువు గా  రేవా సంస్థానానికి ఆహ్వానించి ‘’దివ్రికీయ ‘’ గ్రామాన్ని రాసిచ్చి గౌరవించాడు .ఈ గ్రామం పేరు ఆంద్ర ప్రదేశ్ లోని వారి గ్రామం పేరు దేవరకొండను జ్ఞాపకం చేసేదిగా పెట్టుకొనగా  క్రమంగా ఇంటిపేరు ‘’దేవర్షి ‘’అయింది .ఈ వంశం లోనే కవి కళానిధి దేవర్షి శ్రీ కృష్ణ భట్టుకవి జన్మించాడు 1755 -1809 వరకు రేవాను పాలించిన అజిత్ సింగ్ అనే బాంధవ్ నరేష్ పాలనలో ఈ కుటుంబం ఉన్నది .

బుండీ సంస్థానం లో గౌరవ స్థానం .

రేవా ,బుండీ రాజులు పరస్పరం వియ్యం అందుకోవటం వలన రెండు రాజ్యాలు మరింత సన్నిహితమయ్యాయి .భుండీ రాజులూ కవి పండితాభి మానులు అందువలన కవిపండితులు రేవా నుంచి బుండీ కి  ఆహ్వానించి తమ ఆస్థానం లో గౌరవ స్థానాలలో నియమించి గౌరవించారు .అలా కవికళానిది దేవర్షి శ్రీ కృష్ణ భట్టు1696-1735 కాలం లో బు౦డీని పాలించిన రాజా బుద్ సింగ్  ఆస్థాన పురోహితుడై రాజుకు  అత్యంత  సన్నిహితుడైనాడు ..

వేద వేదా౦గ పురాణ ,ఉపనిషత్ వ్యాకరణ సంగీతాలలో అసమాన ప్రాభావమున్న క్రష్ణభట్టు కు బుండీ రాజ్యం లో ప్రజలలకు అత్యంత గౌరవాభిమానాలు౦డేవి .వీటితోపాటు కవిత్వం లోనూ అపార ప్రతిభ ఉన్నందున సంస్కృత , ప్రాకృత, వ్రజ భాష లలో గొప్ప కావ్యాలు రచించాడు .మహా వక్త కూడా అయిన క్రష్ణభట్టు  వాక్ ప్రవాహానికి జనం ముగ్దులయ్యేవారు .ఆయన రచించిన ‘’అలంకార కళానిధి ‘’,’’శృంగార రసమాధురి ‘’,విదగ్ధ రస మంజరి ‘’,మంచి ఖ్యాతిని ఆర్జించాయి .

బుండీ నుండి జైపూర్ కు

కృష్ణ భట్ట కవి  అసాధారణ ప్రతిభకు ముగ్ధుడైన బు౦డీ రాజు బుద్ సింగ్ బావగారు అంబర్ అంటే జైపూర్ మహారాజు రెండవ జైసింగ్ బావగారిని ఒప్పించి  భట్టు అంగీకారం తో కవి కళానిధి దేవర్షి కృష్ణ భట్టు ను సర్వ లాంచనాలతో తన జైపూర్ సంస్థానానికి సగౌరవంగా  ‘’రాజ పురోహితుని’’గా  ఆహ్వానించి గురు గౌరవం కలిగించాడు .ఈ విషయాలన్నీ అనేక చారిత్రిక గ్రంధాలలో ఉల్లేఖించ బడి ఉన్నాయి -‘’బుండీ పతి బుధ సింహ సౌరి ల్యే ముఖ సౌరి యాచి ‘’అంటే జై సింగ్ బుండీ బుద్ సింగ్ నుస్వయంగా ముఖతా వేడుకొని శ్రీకృష్ణ భట్ ను అంబర్  పేట్ అంటే జైపూర్ కు తీసుకొని వెళ్ళాడు ‘’అని ఒక డాక్యుమెంట్ ఉన్నది .

కృష్ణ భట్టు ‘’ఉత్తర భారతీయ ఆంద్ర తెలగాణ్య  భట్టు వంశ వృక్షం ‘’ గ్రంధం లో తమ భట్టు వంశం వారు ఆంధ్రనుండి  ఉత్తరభారతానికి వలస వెళ్ళిన వివరాలు వర్ణించి చరిత్ర తెలియ జేశాడు .ఇందులోనే’’ వెలనాడు తెలంగాణా బ్రాహ్మణ వంశం ఉత్తర భారత౦ చేరిన వైనమూ ఉన్నాది .భట్టుకుటుంబం  లో ద్వారకానాద భట్టు ,జగదీశ్ భట్టు, వాసుదేవ భట్టు మండన భట్టు, దేవర్షి రమణయ్య శాస్త్రి ,భట్ట మధురానాద శాస్త్రి , ,దేవర్షికాలనాద శాస్త్రి వంటి సంస్కృత కవి దిగ్గజాలవంటి వారెందరో ఉన్నారు .

రామ రాస కావ్యం

క్రష్ణ భట్టు ప్రతిభా సామర్ధ్యాలకు మెచ్చిన జైసింగ్ మహా రాజు ‘’కవికళానిది ‘’రామ రాసా చార్య ‘’అనే ఉత్తమ బిరుదులూ ప్రదానం చేసి సన్మానించాడు .రామ రాసాచార్య బిరుదు నివ్వటం వెనుక ఆసక్తికరమైన ఒక చిన్న కద ఉంది .ఒక రోజు రాజా జైసింగ్ రాజదర్బారులో అకస్మాత్తుగా ‘’శ్రీ కృష్ణ రాస లీలలు ‘’లాగా ‘’శ్రీరామ రాస లీలలు ‘’గ్రంధం ఉందా ?అని అడిగాడు .సభ అవాక్కైంది.ఎవరూ చెప్పలేక పోయారు .సభలో కృష్ణ భట్టూ ఉన్నాడు .అప్పుడు భట్టు లేచి ‘’కాశీలో ‘’రామ రాసలీలలు ‘’పుస్తకం ఉందని చెప్పాడు .రెండు నెలలలోగా ఆపుస్తకాన్ని సంపాదించి తనకు చూపించమని రాజు ఆనతిచ్చాడు .కృష్ణ భట్టు ఇంటికి వచ్చి దానిపైనే ఆలోచించటం ప్రారంభించాడు .అలాంటి పుస్తకం లేదని తెలుసు .కాని సభలో ఉందని తానే చెప్పాడు ఎలా ?ఇక తానే రెండు నెలల గడువులోపల రాసి పూర్తి  చేసి ,రాజు కు చూపించాలనే నిర్ణయానికి వచ్చాడు .అంతే ‘’రామ రాస ‘’కావ్యాన్ని వ్రజభాషలో రామాయణం లాగా రాయటం ప్రారంభింఛి గడువులోపల పూర్తి చేసి సభలో జైసింగ్ మహా రాజుకు సమర్పించాడు .పరమానంద భరితుడైన మహా రాజు భట్టును విశేష ధనకనక వస్తువాహనాలతో సత్కరించి ‘’రామ రాసాచార్య ‘’అనే బిరుదు ప్రదానం చేశాడు .

కృష్ణ భట్ట కవితా గీర్వాణం

కవి కళానిధి కృష్ణ భట్టు –ఈశ్వర విలాస మహాకావ్యం ‘’,వ్రజభాషలో అలంకార కళానిధి ,సుందరీస్ట వరద ,పద్య ముక్తావళి ,వ్రుత్తి ముక్తావళి ,జాజౌ యుద్ధ ,రామ చంద్రోదయ ,వ్రజ భాష లో  శృంగార రరసమాధురి,వృత్త చంద్రిక ,వేదాంత పంచదశి ,సంభర యుద్ధ ,రామ రాస  ,జయసింహ గుణ సరిత  ,విదగ్ధ మాధురి ,టీకా ఉపనిషత్ ,నఖ శిఖ వర్ణన,బహుదుర విజయ , రామగీతం,దుర్గా భక్తి తరంగిణిమొదలైనవి రచించాడు .రామకృష్ణ భట్టు 1761 లో 86 వ ఏట శ్రీ రామ ,శ్రీ కృష్ణ విలాసానికి శాశ్వతంగా వెళ్లి పోయాడు .

సశేషం

2017   నూతన ఆంగ్ల సంవత్సర శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-1-20 17 –ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణం -2 పై డా.టి .రంగస్వామి గారి స్పందన

గీర్వాణం -2 పై డా.trటి .రంగస్వామి గారి స్పందన

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సాహితీ బంధువులకు 2017 నూతన ఆంగ్ల సాంవత్సర శుభా కాంక్షలు -దుర్గా ప్రసాద్

సాహితీ బంధువులకు 2017 నూతన ఆంగ్ల సాంవత్సర శుభా కాంక్షలు -దుర్గా ప్రసాద్

 

Inline image 1 Inline image 2

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 22-ప్రస్థాన త్రయం పై సంస్కృత భాష్యం రాసిన –భద్రేశ్ దాస్ స్వామి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3

22-ప్రస్థాన త్రయం పై సంస్కృత భాష్యం రాసిన –భద్రేశ్ దాస్ స్వామి

స్వామి మేధో సర్వస్వం (మాగ్నం ఓపస్ )

సంస్కృత మహా విద్వాంసుడు ,’’బోచసన్వాసి అక్షర పురుషోత్తమ స్వామి నారాయణ్ సంస్థ’’(B.A P.S)యోగిపుంగవుడు భద్రేశ్ దాస్ స్వామి .భగవద్గీత బ్ర,హ్మ సూత్రాలు ,ఉపనిష త్తులు  అనే ప్రస్థాన త్రయం పై 5 భాగాల స్వామి నారాయణ భాష్యాన్ని సంస్కృతం లో రచించిన మహాను భావుడు .అక్షర పురుషోత్తమ వేదాంతాన్ని వ్యాప్తి చేసినవాడు .అక్షర బ్రహ్మ ,పరబ్రహ్మ ,మోక్ష ,భక్తి,ఉపాసనా మార్గాలను విస్తృతంగా ఇందులో చర్చించి మార్గ దర్శనం చేశాడు .శంకర ,రామానుజ ,మధ్వాచార్య సంప్రదాయాలను అనుసరించి  విస్తృతంగా ‘’ప్రస్థాన త్రయం ‘’పై రాసిన మొట్టమొదటి సమగ్ర సంస్కృత వ్యాఖ్యానం ఇది .

విద్యా ఉద్యోగ ప్రస్థానం

సంస్కృతం ,షట్దర్శనాలలో ఎం.ఎ .డిగ్రీని బెనారస్ సంపూర్ణానంద్ సంస్కృత యూని వర్సిటి భారతీయ విద్యాభవన్ ల నుండి 1996 లో పొంది ,కర్నాటక యూని వర్సిటి నుండి భగవద్గీత పై దిసీస్ రాసి 2005లో పి .హెచ్ .డి.అందుకున్నాడు .ఉపనిషత్ ,భగవద్గీత  లపై విస్తృత పరిశోధన చేశాడు .మహర్షి సాందీపని వేద విద్యా ప్రతిస్టాన్ లో  సభ్యుడయ్యాడు .న్యు ఢిల్లీ లోని స్వామి నారాయణ ఇన్ స్టిట్యూట్ లో, గుజరాత్ లోని వేరావల్ సోమనాధ సంస్కృత విశ్వ విద్యాలయం లోను  సంస్కృత , భారతీయ వేదాంతం లపై విద్యార్ధులకు మార్గ దర్శనం చేశాడు .గుజరాత్ లో సారంగపూర్  యజ్న పురుష పాఠశాల లో సంస్కృత శాఖాధ్యక్షుడిగా పని చేసి తత్వ శాస్త్రం ,న్యాయ దర్శనం ,వేదవిజ్ఞానం ,పాణినీయం ,శాస్త్రీయ సంగీత శాస్త్రం లో తబలా ,ఫ్లూట్ వయోలిన్ లపై శిక్షణ నిచ్చాడు .ఢిల్లీ లోని రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్ మేనేజర్ గా సమర్దవంతం గా విధి నిర్వహణ చేశాడు .ప్రస్తుతం వేదాలకు భాష్య రచనలో తలమునకలై పని చేస్తున్నాడు .

శ్రేయాంసి బహు విఘ్నాని

పి .హెచ్. డి. పొందిన తర్వాత గురువు ప్రముఖ్ స్వామి మహారాజ్ భద్రేశ్ స్వామిని ‘’ప్రస్థాన త్రయం ‘’పై విపులమైన భాష్యం రాయవలసినదిగా ఆదేశించగా స్వామినారాయణ భాష్యం రాశాడు .2007జూన్ లో సారంగాపూర్ జిల్లాలోని ఒక పల్లె టూరులోఆశ్రమం లోని బేస్ మెంట్ లోని చిన్నగదిలో రచన  ప్రారంభించి  రాస్తుండగా విపరీతమైన వర్షాలు వరదలు వచ్చి రాసిన 25 ,00 పేజీల రచన , నోట్సు అంతా నీటిలో కొట్టుకు పోయింది .డిసెంబర్ 2007కు భాష్యం పూర్తికావాల్సి ఉంది .ఏమి చేయాలో పాలుపోకుండా ఉంటె గురుమహరాజ్ వచ్చి ఆశీర్వదించి పునః ప్రారంభించమన్నారు .రోజుకు 20 గంటలు అదే ధ్యానం గా రాసి స్వామినారాయణ భాష్యాన్ని20,150 పేజీలతో పూర్తీ చేసి 17-12-2017న సంస్థ శత వార్షికోత్సవం రోజున అహ్మదాబాద్ లో ఆవిష్కరింప జేశాడు . శంకరాచార్యుల వారు (780-820) రాసిన ప్రస్తాన త్రయ భాష్యం తరువాత భద్రేశ్ దాస్ స్వామి రచించిన ఈ భాష్యం 15 వ మహా భాష్యంగా జబల్ పూర్ యూని వర్సిటి ఫిలాసఫీ ప్రొఫెసర్ ఎస్ .పి దూబే అభి వర్ణించాడు .ఎన్నో యూని వర్సిటీలనుండి  మేధావులు ఫిలాసఫర్లు ఈ భాష్య ప్రత్యేకతను వేనోళ్ళ శ్లాఘించారు .

సన్మాన సత్కార ప్రస్థానం

భద్రేశ్ స్వామి భాష్యానికి గుర్తింపుగా నాగ పూర్ లోని కాళిదాస సంస్కృత యూని వర్సిటి డి.లిట్ ను, మహా మహోపాధ్యాయ బిరుదును ఇచ్చి గౌరవించి సత్కరించింది .మైసూర్ యూని వర్సిటి నుండి జి.ఏం .మెమోరియల్ అవార్డ్ ,’’దర్శన కేసరి పురస్కారం ‘’,అందుకొన్నాడు .2015 లో బాంకాక్ లో జరిగిన ప్రపంచ సంస్కృత సమ్మేళనం లోధాయ్ లాండ్ లోని సిల్పకారన్ యూనివర్సిటి   ‘’వేదాంత మార్తాండ సమ్మాన్ ‘’ప్రదానం చేసి భద్రేశ్ స్వామిని ఘనంగా సత్కరించింది .

.        భద్రేశ్ స్వామి భద్ర రచనా వైభవం

Inline image 1

1-ప్రస్థాన త్రయం పై స్వామినారాయణ భాష్యం 2-ఉపనిషత్ స్వామి  నారాయణ భాష్యం ౩-చాన్దోగ్యోపనిషత్ పై  స్వామి నారాయణ భాష్యం 4-ముక్తి మీమాంస 5-ఉపనిషత్ సారం మొదలైనవి .

సార్ధక జన్ములు  భద్రేశ్ స్వామీ మహారాజ్ .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-12-16-కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 20-జీవన సాఫల్య పురస్కారం పొందిన దేవర్షి –కాలనాధ శాస్త్రి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3

20-జీవన సాఫల్య పురస్కారం పొందిన దేవర్షి  –కాలనాధ శాస్త్రి

మార్గ దర్శి

.భాషా శాస్త్ర వేత్త అయిన శాస్త్రి సంస్కృతం ,ఇంగ్లేష్ హిందీ భాషలలో విస్తృతంగా రచనలు చేసిన  బహుభాషా వేత్త . భారతీయ భాషలకు సాంకేతిక పదాలను సంతరించి ,హిందీకి గౌరవ స్థానాన్ని తన రాష్ట్రం లోను ,భారతదేశమంతటా చేకూర్చి ,హిందీని అధికార భాషగా చేయటం లో సఫలీకృతుడైన వాడు .

ప్రాచీన భాష సంస్కృతానికి ఆధునిక సాహిత్య ప్రక్రియలు ,నూతన భావ వ్యక్తీకరణ విధానాలను సంతరించిన తండ్రి మధురా నాద శాస్త్రి భట్ ఆధునిక సంస్కృత సాహిత్యానికి మార్గ దర్శి .దాదాపు 25 సంస్కృత గ్రంధాలను రచించి ,దాదాపుగా అన్ని సంస్కృత ఇంగ్లీష్ హిందీ గ్రంధాలకు సంపాదకం వహించాడు కాలనాధ శాస్త్రి .తత్వ శాస్త్ర ,సాహిత్య ఉద్గ్రందాలను అనువదించిన పండితుడు .  ప్రాకృత ,వ్రజభాష , రాజస్థాని ,ఇతర భారతీయ భాషలలోని ఉత్తమసాహిత్యాన్నీ అనువదించిన భాషా ప్రియుడు .

 

కాలనాధ శాస్త్రి దాదాపు వెయ్యి వ్యాసాలను సంస్కృతం హిందీ భాషలోదేశ, విదేశ  ప్రముఖ పత్రికలకు రాసిన సాహితీ సంపన్నుడు .సంస్కృత హిందీ ఇంగ్లీష్ లలో సుమారు 200కు పైగా రేడియో, టెలివిజన్ ప్రసంగాలు చేశాడు .శాస్త్రి సాహిత్య చరిత్రకారుడు విమర్శకుడు విశ్లేషకుడు .ఆధునిక సంస్కృత సాహిత్యం లో ఫిక్షన్ రాసి దారి చూపి ,నవలలు కధలు ,స్వీయ అనుభూతులు రచించి 20వ శతాబ్దపు సంస్కృత సాహిత్యానికి తుస్టి,పుష్టి చేకూర్చాడు .

 

.రాజస్థాన్ సంస్కృత అకాడెమి కి 1995 నుంచి 98 వరకు చైర్మన్ గాను,సంస్కృత విద్యా భాషా విభాగాలకు డైరెక్టర్ గాను 1976 నుండి 1994 వరకు 18 ఏళ్ళు సేవ చేశాడు .

జనన విద్యాభ్యాసాలు

ఆధునిక సంస్కృతానికి జవ జీవాలు చేకూర్చిన కాలనాధ శాస్త్రి

15-7-1936న రాజస్థాన్ లోని జైపూర్ లో  రాష్ట్ర పతి పురస్కారాన్ని అందుకొన్న సంస్కృత మహా విద్వాంసుడు భట్ మధురా నాద శాస్త్రి ,గిరిధర్ శర్మ చతుర్వేది ,పండిట్ పట్టాభి రామ శాస్త్రి ,పండిట్ హరిశాస్త్రి పండిట్ జగదీశ్ శర్మ మొదలైన ఉద్దండ పండితుల శిష్యరికం లో కాలనాధ శాస్త్రి సంస్కృతం ,అలంకార శాస్త్రం ,వేదాలు సకల శాస్త్రాలు ,తులనాత్మక భాషా శాస్త్రాలు నేర్చాడు .సంస్కృత భాషా శాస్త్ర ,అలంకార శాస్త్రాలలో సాటిలేని మేటి అయ్యాడు .తరువాత హిందీ, ఇంగ్లీష్ సాహిత్యాలు చదివి దిట్ట అనిపించుకొన్నాడు .

ఉద్యోగ సోపానం

ఇంగ్లీష్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ప్రధమ శ్రేణి లో సాధించి ,రాజస్థాన్ యూని వర్సిటి  పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజిలో 8 ఏళ్ళు ఇంగ్లీష్ భాషా సాహిత్యాలను  బోధించాడు .తరువాతరాజస్థాన్ ప్రభుత్వ విద్యా   శాఖ లో డిప్యూటీ డైరెక్టర్ అయి ,భాషా విభాగానికి తరువాత డైరెక్టర్ గా పదోన్నతి పొంది 1994 లో రిటైర్ అయ్యాడు .రాజస్థాన్ ప్రభుత్వ సంస్కృత విద్యకు డైరెక్టర్ గా ,రాజస్థాన్ సంస్కృత అకాడేమికి చైర్మన్ గా , జైపూర్ లోని జగద్గురు రామచంద్రా చార్య సంస్కృత విశ్వ విద్యాలయం లో కవి శిరోమణి భట్ట మధురానాద్ శాస్త్రి సంస్కృత పీఠం సంస్థాపన చైర్మన్ గా  , రాజస్థాన్ ప్రభుత్వ  హిందీ లా కమిటీలో శాశ్వత సభ్యునిగా ,కేంద్రీయ సంస్కృత బోర్డ్ ,నేషనల్ బుక్ ట్రస్ట్ ,సాహిత్య అకాడెమి సభ్యునిగా సేవలు అందించాడు .అనేక ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థలలో సంస్కృత హిందీ భాషలకు చాలా  హోదాలలో పని చేశాడు .జైపూర్ లోని ‘’మంజునాద్ స్మృతిసంస్థాన్ ‘’కు సంస్థాపక అధ్యక్షుడుగా శాస్త్రి ఉన్నాడు . .2013  నుంచి ‘’దేవర్షి ‘’కాలనాధ శాస్త్రి భారత ప్రభుత్వసంస్కృత కమిషన్ సభ్యుడుగా ఉన్నాడు .

బిరుదులు  అవార్డులు రివార్డులు

దేశ విదేశాలలోని అనేక యూని వర్సిటీలు సాహిత్య విద్యా సంస్థలు కాలనాధ శాస్త్రి త్రిభాషా పాండిత్యాన్ని గుర్తించి గౌరవించి సత్కరించాయి .2008లో రాష్ట్రీయ సంస్కృత విద్యా పీఠం ‘’మహా మహోపాధ్యాయ ‘’బిరుదునిచ్చి సన్మానించింది .సాహిత్య మహోదధి ,సాహిత్య శిరోమణి ,లతోపాటు రాజస్థాన్ ప్రభుత్వం నుంచి , ఉత్తర ప్రదేశ్ సంస్కృత సంస్థాన్ నుంచి సంస్కృత భాషా సేవకుగాను ‘’జీవన సాఫల్య పురస్కారం’’ అందుకొన్నాడు .2004 లో కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డ్ ను ,కేంద్ర మానవ వనరుల శాఖ చే గౌరవ పురస్కారాన్ని ,1998 లో సంస్కృతం లో విశిష్ట సేవ కు రాష్ట్ర పతి పురస్కారాన్ని రాష్ట్రపతి శ్రీ కే ఆర్ నారాయణన్ గారి చేతులమీదుగా అందుకొన్నాడు.సంస్కృత భాషా సేవలో పండిన కాలనాధ శాస్త్రిని ‘’రాజర్షి ‘’అన్నారు .

కాలనాధీయ భాషా  శాస్త్రీయం

ఆఖ్యాన వల్లరి అనే సంస్కృత కవితల సంపుటి,జీవనస్య పృష్ట ద్వయం ,కవితావల్లరి ,కదానక వల్లరి ,విద్వజ్జన చరితామృతం ,భారతీయ సంస్కృతీ ,ఆధునిక సాంస్క్రిట్ సాహిత్య ,సంస్కృత నాట్య వల్లరి ,సుధీ జనావృత్తం ,సాంస్క్రిట్ కే యుగ పురుష్,మేకర్స్ ఆఫ్ ఇండియన్ లిటరేచర్ ,భారతీయ దర్శన్ కా ఇతిహాస్ ,వర్క్స్ ఆఫ్ పండిత జగన్నాధ పోయెట్రి, సాంస్క్రిట్ కే గౌరవ షికార్ ,ఆధునిక కాల్ కా సంస్కృత గద్య సాహిత్య ,వన్ హండ్రెడ్ యియర్స్ ఆఫ్ ఫిలాసఫీ –మొదలైనవి .’’భారతి ‘’  సంస్కృత పత్రికకు శాస్త్రి సంపాదకుడు .

Inline image 1

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -29-10-16-కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -3 19-లోక్ సభకు ఎన్నికైన సంస్కృత ,మైధిలీ భాషా కవి –సురేంద్ర ఝా’’సుమన్

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -3

19-లోక్ సభకు ఎన్నికైన సంస్కృత ,మైధిలీ భాషా కవి –సురేంద్ర ఝా’’సుమన్ ‘’

‘’సుమన్ జీ’’ అని అందరూ గౌరవం గా పిలిచే సురేంద్ర ఝా సుమన్ సుప్రసిద్ధ మైధిలీ కవి ,రచయిత ,పబ్లిషర్ ఎడిటర్ ,శాసన సభ్యుడు పార్లమెంట్ సభ్యుడు .మైధిలి సంస్కృతిని పరిరక్షించి వ్యాప్తి చేసిన వాడు .40దాకా మైధిలి భాషలో పుస్తకాలు రచించాడు .సంస్కృతం హిందీ ,మైధిలి పుస్తకాల కు సంపాదకత్వం వహించాడు .అనేక ప్రభుత్వపాలనా సంస్థల లో సభ్యుడై సేవలందించాడు .

సురేంద్ర ఝా 10-10-19 10 నబీహార్ రాష్ట్రం సమస్తిపూర్ జిల్లా బల్లిపూర్ గ్రామం లో జన్మించాడు .తండ్రి భువనేశ్వర్ ఝా ప్రసిద్ధ ఆయుర్వేద భిషక్ .కుటుంబం తరతరాలుగా సంస్కృత పండితులకు నిలయం .ముజఫర్ నగర్ లోని ధర్మరాజ సంస్కృత కళాశాల లో చేరి చదివి సాహిత్యాచార్య (డిగ్రీ ) బెంగాలీ భాషలో’’ కావ్య తీర్ధ ‘’ పాసైనాడు .25 వ ఏట బెగూ సరాయ్ కి  చెందిన గంగాదేవిని వివాహమాడి ఒకకుమారుడికి ఇద్దరు  కుమార్తెలకు తండ్రి అయ్యాడు .దర్భంగా ఎల్.యెన్ .ఎం.యు .యూని వర్సిటీ లో మైధిలీ భాష చార్యుడుగా రిటైర్ అయ్యాడు .6 వ లోక్ సభకు దర్భంగా నుంచి జనతా పార్టీ టికెట్ పై ఎన్నికయ్యాడు .

సుమన్ జీ గద్య పద్యాలలో సవ్య సాచి .బహుభాషా కోవిదుడు .అందువలననే ఆ నాటి రాష్ట్ర పతి డా. రాజేంద్ర ప్రసాద్ గారి చేత పురస్కారం అందుకొన్నాడు .1981 లో సాహిత్య అకాడెమీ అవార్డ్ ,పాట్నాలోని మైధిలీ అకాడెమి నుంచి ‘’విద్యాపతి ‘’పురస్కారం పొందాడు .

సాహిత్య అకాడెమీలో మైధిలీ భాష ప్రతినిధిగా ,మైధిలి సలహా సంఘ సభ్యుడిగా ఉన్నాడు .అఖిలభారత మైధిలీ సాహిత్య పరిషత్ కు అధ్యక్షుడై ఆ భాషకు విలువైన సేవలు అందించాడు .దర్భంగా లోని వైదేహి సమితి తో సన్నిహిత సంబంధాలున్నాయి .ఆధునిక మైధిలి భాషలో సర్వోత్కృష్ట స్థానం సుమన్ జీ కి ఉన్నది .వర్ణనలు అలంకారాలతో ఆధునిక మైధిలీ  సాహిత్యాన్ని  సు సంపన్నం చేసిన ఏకైక రచయితగా గుర్తింపు పొందాడు .

సుమన్ ప్రకృతి అందాలు ,అద్భుతమైన భావనా పటిమ  సరళత ,గ్రామీణ సౌందర్యవర్ణన లతో  రచించిన 25 కవితల సంపుటి ‘’పయస్విని ‘’1971 లో సాహిత్య అకాడెమి అవార్డ్ ను పొందింది .అందులో రూపకాలంకారం పై గొప్ప ప్రయోగాలు చేసి అద్భుతః అనిపించాడు .కవిత్వాన్ని పాడి ఆవుతో పోలుస్తూ అధర్వ వేదం లోని పృధ్వీ సూక్తం ,బృహదారణ్యక ఉపనిషత్ లోని ‘’వాగ్ధేనువు’’ను  ‘’పర బ్రహ్మం ‘’తో పోల్చినట్లు రచించాడు .ఇందులో వర్ష ఋతువు తామసి లాగా మంచిదని ,మృత్యుంజయ ,పాడి ఆవు ,నది లను రసవంతి అంటే అందమైన కృశించిన స్త్రీతో ను ,పర్వతాన్ని ముసలివాడు,యువకుడు ,చిన్నపిల్లవాడితోను పోల్చాడు  ,

1962 లో రాసిన ‘’దత్తావతి ‘’చైనా ఇండియా యుద్ధాన్నివర్ణిస్తే ,’’భారత్ వందన్’’అంతర్నాద్’’ ల లో దేశభక్తి కనిపిస్తుంది .మహా భారతం లోని ‘’ఉత్తర ‘’పై ఖండ కావ్యం రాశాడు .ఆయన కవిత్వం లో సంస్కృత పదాడంబరం ,ఉపమ,ఉత్ప్రేక్ష అలంకార వైభవం ప్రాచీన సంస్కృత కావ్యాల ఛందస్సు  ఉన్నట్లు దండిగా ఉండటం ప్రత్యేకత .వృక్షం పై మహాద్భుత భావ గీతం రాశాడు .ఇది ప్రపంచ సాహిత్యం లో ఉన్న గొప్ప కవితలతో సరి తూగు తుంది అని విశ్లేషకుల అభిప్రాయం . ఇస్మాయిల్ కవి ‘’చెట్టు నా ఆదర్శం ‘’కవిత ఇక్కడ మనకు గుర్తుకు రావటం సహజమే .

బెంగాలీ ,సంస్కృత భాషా రచనలను సుమన్ జీ అనువదించాడు .మైధిలి కవిత్వం పై సంస్కృత ప్రభావం అనే పుస్తకం రాశాడు .వైదేహి పత్రికకు సంపాదకుడై అస్సామీ మైధిలీ బెంగాలే మణిపూరీ ,నేపాల్ ఒరియా రచనలను ఆంగ్లీకరి౦చాడు .92ఏళ్ళ వయసులో 5-౩-2002 న దర్భంగా లో సుమంజీ మరణించాడు .ఆయన గౌరవార్ధం ఆచార్య సుమన్  చౌక్ ను దర్భంగా లో ఏర్పాటు చేశారు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-12-16 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -౩ 18-నైషధం లో ధర్మ శాస్త్రీయ ప్రతి ఫలనం రచించిన –హరే కృష్ణ మెహర్

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -౩

18-నైషధం లో ధర్మ శాస్త్రీయ ప్రతి ఫలనం రచించిన –హరే కృష్ణ మెహర్

జనన విద్యా విశేషాలు

సంస్కృత విద్వాంసుడు ,పరిశోధకుడు ,కవి రచయిత,విమర్శకుడు ,గీత రచయిత,స్వరకర్త ,వక్త ,అనువాదకుడు అయిన హరే కృష్ణ మెహర్ ఒరిస్సా లో న్యు పారా జిల్లా సినపాల లో 5-5-1956 న కవితా సంపన్న కుటుంబం లో జన్మించాడు .తండ్రి నారాయణ భారసా మెహర్ ప్రసిద్ధ కవి .తల్లి సుమతి మెహర్ .తాత మనోహర్ మెహర్ పశ్చిమ ఒరిస్సాలో గానకవి గా సుప్రసిద్ధుడు .హరే కృష్ణ విద్య లో ప్రతి స్థాయి లో ఉన్నత ప్రమాణాల తో పాసయ్యాడు .సంస్కృతం లో బి ఎ ఆనర్స్ ను ఉత్కల్ యూని వర్సిటి రవేన్ షా కాలేజి నుంచి ,సంస్కృతం లో ఏం ఎ ,పి హెచ్ డిలను బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం నుంచి సాధించాడు .

ఉద్యోగం

ఒరిస్సా విద్యా శాఖలో సంస్కృత లెక్చరర్ గా చేరిన మెహర్ బర్గాలోని ప్రభుత్వ పంచాయత్ కాలేజి ,బాలాసోర్ లోని ఫకీర్ మోహన్ కాలేజి లోను పని చేసి ఈమధ్యనే భవానీ పట్నం లోని ప్రభుత్వ అటానమస్ కాలేజి లో సీనియర్ రీడర్ గా సంస్కృత శాఖాధ్యక్షునిగా పదోన్నతి పొందాడు . ప్రస్తుతం సంబల్ పూర్ లోని గంగాధర్ మెహర్ అటానమస్ కాలేజి లో సంస్కృత పోస్ట్ గ్రాడ్యుయెట్ కాలేజిలో  లెక్చరర్ గా పని చేస్తున్నాడు .

రచనా మెహరీయం

సాహిత్యం సంగీతం లలో అనేక వ్యాసాలూ రాశాడు హరే కృష్ణ .ఆధునిక సంస్కృత సాహిత్యం లో ప్రసిద్ధ గీత రచయితగా ప్రసిద్ధి చెందాడు . సరళ సుందరం గా ఆధునిక భావ సంపద తో రాయటం మెహర్ ప్రత్యేకత .సుప్రసిద్ధ ఒరియా రచయిత గంగాధర్ మెహర్ రచించిన ‘’తపస్విని ‘’కావ్యాన్ని సంస్కృత ,హిందీ ,ఇంగ్లీష్  భాషలలో  అనువాదం చేసి హరే కృష్ణ మెహర్ తన త్రిభాషా వైదుష్యాన్ని,  ప్రతిభను ప్రదర్శించాడు .రాష్ట్రీయ ,జాతీయ అంతర్జాతీయ మైన అనేక వర్క్ షాప్ సెమినార్లలో పాల్గొని తన సాహిత్య సంపన్నత ను రుజువు చేసుకున్నాడు .ప్రపంచ సంస్కృత సమ్మేళనాల లోను పాల్గొన్న ఘనత మెహర్ ది .తన ప్రతిభా సర్వస్వాన్ని రుజువు చేసే అనేక గ్రంధాలను రచించి ప్రచురించాడు .

మెహర్ సృజన

1-పి .హెచ్ .డి.ధీసిస్ గా ‘’ఫిలసాఫికల్ రిఫ్లెక్షన్స్ ఇన్ నైషధీయ చరిత 2- నైషధీయ కావ్యే –ధర్మ శాస్త్రీయ ప్రతి ఫలనం ౩-సాహిత్య దర్పణ అనే అలంకార శాస్త్రం ను ఒరియా,సంస్కృత వ్యాఖ్యానాలతో రచించాడు .4-మనోహర్ మెహర్ రచించిన సంస్కృత శ్లోకాలను ‘’మనోహర్ పద్యావళి ‘’గా సంకలనం చేసి ప్రచురించాడు .5-శ్రీ కృష్ణ జన్మ 6-మాతృ గీతికాన్జలిః ‘’అనే ఆధునిక సంస్కృత గీతికావ్యం 7-గంగాధర్ మెహర్ కవి ఒరియా భాషలో రచించిన ‘’తపస్విని ‘’కావ్యానికి 8-హిందీ అనువాదం 9-ఇంగ్లీష్ అనువాదం, 10-సంస్కృతానువాదం  11-కాళిదాస మేఘ దూత కావ్యానికి ‘’కోసలీ భాష ‘’లో అనువాదం .

హరే కృష్ణ అనువాద ప్రతిభ

1-భర్తృహరి మహాకవి రచించిన  నీతి శృంగార, వైరాగ్య శతకత్రయ అనువాదం 2-శ్రీ హర్ష మహాకవి నైషధీయ చరిత -9 వ కాండ   అనువాదం ౩-కాళిదాస మహాకవి కుమార సంభవ కావ్యం లోని 1,2,5 7,8 సర్గల అనువాదం 4-రఘువంశం -2 వ సర్గ 5-శివ తాండవ స్తోత్రం 6 –రామ రక్షా స్తోత్రం ,శివ  రక్షా స్తోత్రం తో కలిపి 7-విష్ణు సహస్ర నామ 8-గాయత్రీ సహస్ర నామ

బిరుదులు ,పురస్కారాలు

ప్రతిభకు తగిన గుర్తింపు లభించి అనేక బిరుదులూ సత్కార సన్మానాలు ,పురస్కారాలు అందుకున్నాడు హరే కృష్ణ మెహర్ .అందులో ముఖ్యమైనవి –1-గంగాధర సమ్మాన్ 2-గంగాధర సారస్వత సమ్మాన్ ౩-జయ కృష్ణ మిశ్ర కావ్య సమ్మాన్ 4-విద్యా రత్న ప్రతిభా సమ్మాన్ 5-జయదేవ ఉత్సవ ప్రశంసా పురస్కారం 6-అశోక్ చందన స్మ్రుతి గంగాధర పురస్కారం 7-ఆచార్య ప్రఫుల్ల చంద్ర రే స్మారక పురస్కారం 8-హరిప్రియ ముండ మెమోరియల్ పురస్కారం 9-డా.నీల మాధవ పాణిగ్రాహి పురస్కారం 10-వాచస్పతి గణేశ్వర రధ్ వేదా౦తాలంకార పురస్కారం 11-విశ్వ సంస్కృత దివస్ సమ్మాన్ –

ఇంత ప్రతిభా ఉత్పత్తులున్న ఈ సంస్కృత కవికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ రకమైన పురస్కారం ఇంత వరకు లభించక పోవటం  ఆశ్చర్యమే కాదు ,మన ప్రభుత్వపు అలక్ష్యం కూడా .

Inline image 1Inline image 2

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-12-16-కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -3

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -3

17-బలదేవ చరిత్ర మహాకావ్య రచయిత-శ్రీనివాస రధ్

మధ్యభారతం లోని ఉజ్జయినికి చెందిన సంస్కృత కవి శ్రీనివాస రధ్ .కాళిదాస అకాడెమి సంరక్ష బాధ్యతలను సమర్ధ వంతంగా నిర్వహించాడు .1930లో ఒరిస్సాలోని పూరీలో జన్మించాడు .మధ్య ప్రదేశ్ లోని గ్వాలియర్ ,మారేనా లలోను ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి లోను విద్య నేర్చాడు .తండ్రి సంప్రదాయ సంస్కృత పండితుడు .తండ్రి వద్దనే వ్యాకరణాది శాస్త్రాలు నేర్చాడు .ఆయన అభిమాన ముఖ్య గురువు బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం లోని ప్రొఫెసర్ బలదేవ ఉపాధ్యాయ. రధ్ సాహెబ్ అని అందరి చేతా ఆప్యాయంగా పిలువబడే రధ్ ఉజ్జయిని లోని మాధవ కాలేజి లో సంస్కృత అధ్యాపకునిగా ఉద్యోగం లో చేరి  విక్రం యూని వర్సిటిలో సంస్కృత ప్రొఫెసర్ గా రిటైర్ అయ్యాడు . ఆయన  వద్ద చాలా యూని వర్సిటీ విద్యార్ధులు పరిశోధనలు చేసి  డాక్ట రేట్ లు పొందారు .అనేక జాతీయ ,అ౦తర్జాతీయ సెమినార్లు నిర్వహించాడు .ప్రతి ఏడాది ఉజ్జయినిలో జరిగే’’ కాళిదాస సమారోహ్ ‘’ను అత్యంత వైభవం గా నిర్వహించటం లో సమర్ధుడు అనిపించుకొన్నాడు .ఉజ్జయిని నాటక శాలను ఏర్పాటు చేయటం నాటక ప్రదర్శనలు నిర్వహించటం లో ప్రత్యేక శ్రద్ధ చూపించాడు .అనేక సంస్కృత నాటకాలను ప్రదర్శన యోగ్యంగా మలచి ప్రదర్శించి ప్రజారంజనం చేశాడు .

 

యవ్వనం లోనే కవిత్వ రచన ప్రారంభించాడు .తన కవితలను అన్నిటినీ కలిపి ’’తదేవ గగనం  సా ఏవ ధరా ‘’ (అదే ఆకాశం అదేభూమి )  కవితా సంపుటిని రాస్ట్రీయ  సంస్కృత సంస్థాన్ 1990లో ప్రచురించింది .ద్వితీయ ముద్రణ పొందిన దీనికి 1999లో సాహిత్య అకాడెమి పురస్కారం లభించింది . భారత రాష్ట్ర పతి ప్రత్యేక పురస్కారాన్ని అందుకున్నాడు .సంస్కృతం లో అసమాన  గీత రచయిత(లిరిసిస్ట్ )గా ప్రసిద్ధి చెందాడు .ఆయన పాటలలో సంస్కృత మహాకావ్యాల అనునాదం,నవీన భావనల నేపధ్యంగా ,మహా కళాత్మకం గా నూతన అనుభూతి ని కలిగిస్తుంది . ఆయన మధుర కంఠస్వరం తో సంస్కృత కావ్యాలను చదివి వినిపిస్తుంటే తన్మయులమై వినే మహా భాగ్యం కలుగుతుంది .కవి సామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ గారు తన కావ్యాలు చదువుతుంటే కలిగిన అనుభూతి గా ఉంటుంది . ఆయన ఒక  సంస్కృత కవి  దిగ్గజం .యువ తరం పై ,యువకవులపై ఆయన ప్రభావం ప్రబలంగా ఉన్నది .

రధ్ బృహద్రచన ‘’బలదేవ చరిత ‘’అనే మహా కావ్యం .

శ్రీనివాస రధ్ కవితలలో మన సంస్కృతీ వైభవం ,దేశ భక్తీ ,సాంఘిక సంస్కరణ ,మానవత్వ విలువలు ,దాతృత్వ విశేషాలు ఉన్నాయి .కవిత్వం సహజ సుందరంగా సరళం గా సూటిగా మనసుకు హత్తు కోనేట్లు రాయ గల నైపుణ్యం రధ్ ప్రత్యేకత .మాధుర్యం శ్రోతృ ప్రియత్వం ,మనోహర శైలి ,రధ్ కవిత్వానికి ముఖ్య లక్షణాలు .ఆధ్యాత్మిక అనుభూతికి విలువ నిచ్చాడు .సంఘం లో ఉన్న దురాచారాలు ,మూఢ విశ్వాసాలను ఖండించాడు.సాంఘిక రాజకీయ కాలుష్య నివారణే ధ్యేయంగా ఆయన కవిత్వం సాగుతుంది .

ఉజ్జయిని విక్రం యూని వర్సిటి నుండి సంస్కృత ప్రొఫెసర్ గా, కాళిదాస అకాడెమీ డైరెక్టర్ గా  రిటైర్ అయ్యారు .10 వ అంతర్జాతీయ సంస్కృత కవి సమ్మేళనం 7-1-1977 నబెంగుళూరు లోని తరలబాబు కేంద్రం లో జరిగినప్పుడు శ్రీనివాస రధ్ దానికి చైర్మన్ గా వ్యవహరించాడు . ఎడిన్ బర్గ్ లో  13 వ అంతర్జాతీయ సంస్కృత సభ జరిగినప్పుడు ‘’కవి సమవాయ ‘’కార్యక్రమం లో శ్రీనివాస రధ్ తన సంస్కృత  గేయాన్ని పాడి నందుకు తన్మయులై విని మురిసిపోయిన రసిక ప్రేక్షకజనం గౌరవంగా లేచి నిలబడి కరతాళ ధ్వనులతో అభి నందించటం చారిత్రాత్మక విషయమైంది . 2002డిసెంబర్ 14-16 తేదీలలో పూరీలోని జగన్నాధ సంస్కృత విశ్వ విద్యాలయం లో 41 వ అఖిల భారత ఓరి ఎంటల్ కాన్ఫ రెన్స్ లో శ్రీనివాస రధ్ కవిత్వం పై పరిశోధన పత్రం సమర్పించ బడింది .సంస్కృత మహా పండితులైన డా.హర్ష దేవ మాధవ్ ,డా హరే కృష్ణ మెహర్ లు రధ్ కవిత్వ౦ పై విశ్లేషణాత్మకమైన వ్యాసాలను ‘’దృక్’’అనే సంస్కృత సాహిత్య పత్రికలో రాశారు .రధ్ పై ఉన్న అపార గౌరవం తో ఆయన జీవిత సాహిత్యాలపై ముద్రించిన ప్రత్యేక అభినందన సంచికకు ఎస్.పి.నారంగ్ సంపాదకత్వం వహించాడు .

ఆధునిక సంస్కృత సాహిత్య వ్యాప్తికి అసమాన ,అమూల్య కృషి చేసిన శ్రీనివాస రధ్ సాహెబ్ ఉజ్జయినిలో 30-6-2014 న  84వ ఏట కవితా ‘’రద్’’ లో’’ శ్రీనివాస ‘’ధామం చేరుకొన్నాడు .

Inline image 1

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-12-16 –కాంప్ –మల్లాపూర్ –హైదరాబా


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-౩

 

16-తెలుగు వారి ప్రాతస్మరణీయుడు –చార్లెస్ ఫిలిప్స్ బ్రౌన్

బ్రౌన్ అనగానే మనకు ఆయన కూర్చిన  బ్రౌణ్య నిఘంటువు ,వేమన శతకం మాత్రమే ముందుగా గుర్తుకొస్తాయి .ఆయన సేకరించిన అనేక తాళపత్ర గ్రంధాలు ,వాటిప్రచురణ తరువాత జ్ఞాపకమొస్తాయి .కాని తెలుగు భాషా సేవకుడు బ్రౌన్ మహాశయుడు శంకర భగవత్పాదులు వ్రాసిన ‘’సౌందర్య లహరి ‘’పై ఒక విపుల వ్యాఖ్యానం రాశాడని ,మనలో చాలామందికి తెలియదు .అలాగే భారతీయ ఆధ్యాత్మిక విజ్ఞానం పై ఎన్నో పరిశోధనలు చేసిన జాన్ ఉడ్రాఫ్ భారత దేశమంతా పర్యటించాడని, సౌందర్యలహరి పై ఆంగ్లం లో వ్యాఖ్యానం రాశాడని కూడా మనకు తెలియదు .సర్ విలియం బ్రౌన్ సౌందర్య లహరి లోని ప్రతి శ్లోకానికి చిత్రపటం సేకరించి ప్రచురించాడనీ,శాక్తేయ వాదం పై గొప్ప ఉపోద్ఘాతం రాశాడని ,అమెరికాలోని ఫిలిప్పైన్స్ యూని వర్సిటీ లో సౌందర్య లహరిపై అధ్యయనం జరుగుతోందని కూడా అతి తక్కువలో తక్కువ మందికి మాత్రమే తెలిసిన విషయాలు .ఈ విషయాలన్నిటినీ డా సామవేదం షణ్ముఖ శర్మ గారు’’ భక్తి మాసపత్రిక’’ 2016 జూన్ సంచికలో ‘’సౌందర్య లహరి’’వ్యాసం లో తెలియ జేశారు .

బ్రౌన్ దొర కూడా గీర్వాణ సాహిత్యాన్ని ప్రోత్సహించాడని అర్ధమైంది కనుక ఆయన భాషా సేవను తెలియ జేస్తున్నాను సంక్షిప్తంగా .చార్లెస్ ఫిలిప్స్ బ్రౌన్ 10-11-1796న ఇండియాలోని కలకత్తా నగరం లో జన్మించాడు .తండ్రి డేవిడ్ బ్రౌన్ అనాధ శరణాలయ నిర్వాహకుడు ,సంస్కృత౦ తో సహా అనేక భాషలలో పండితుడైన మిషనరీ స్కాలర్ .తండ్రి మరణం తో ఇంగ్లాండ్ వెళ్ళిన బ్రౌన్ మళ్ళీ ఇండియాకు 18 17 చేరి మద్రాస్ లో ఇండియాలో సివిల్ సర్వీస్ ఉద్యోగానికి శిక్షణ పొందాడు .ఆనాటి గవర్నర్ ధామస్ మన్రో ఇండియాలో పని చేసే అధికారులందరూ విధిగా స్థానిక భాషను తప్పని సరిగా నేర్వాలని అప్పుడే పరిపాలన సవ్యంగా చేయగలుగుతారని ఆదేశామిచ్చాడు .దాని ప్రకారం బ్రౌన్ సివిల్ పరీక్ష ,తెలుగు పరీక్ష ఒకేసారి 1820లో పాసయ్యాడు .కృష్ణా జిల్లా మచిలీపట్నం ,గోదావరి జిల్లా రాజమండ్రి లలో పనిచేశాడు. గుంటూరు జిల్లాకు 18 24లో మహా కరువు వచ్చినప్పుడు  అడ్మిని స్ట్రేటర్ గా సమర్ధంగా వ్యవహరించాడు .1834లోమళ్ళీ లండన్ వెళ్లి ,నాలుగేళ్ళు  గడిపి 1838లో మద్రాస్ కు తిరిగొచ్చి పర్షియన్ భాషానువాదకుడుగా ఈస్ట్ ఇండియా కంపెనీకి పని చేసి ,మద్రాస్ కాలేజి బోర్డ్  మెంబరై ,అనారోగ్యం వలన 1854లో రిటైరై ,లండన్ కు తిరిగి వెళ్లి లండన్ కాలేజి లో తెలుగు ప్రొఫెసర్ గా పని చేస్తూ 12-12-1884న 88 వ ఏట లండన్ లో మరణించాడు .తండ్రిలాగానే బ్రౌన్ కూడా బహుభాషా కోవిదుడు .తెలుగు తో పాటు సంస్కృతం పర్షియన్ ,గ్రీకు లాటిన్ భాషలలో గొప్ప పాండిత్యం ఉన్నవాడు .

బ్రౌన్ భాషా సేవ

బ్రౌన్  కడపలో, మచిలీ పట్నం లో  మేజిస్ట్రేట్ గా పని చేసినప్పుడు రెండేసి స్కూళ్ళను ఆ రెండు పట్టణాలలో స్థాపించి విద్యార్ధులకు ఉచిత భోజన వసతులు కల్పించి ఉచితంగా తెలుగుతో సహా విద్య నేర్పించాడు .బ్రౌన్ భాషా సేవ మూడు దశలుగా జరిగింది .తాను  తెలుగులో రాశాడు ,పురాతన తెలుగు తాళపత్ర గ్రంధాలను సేకరించాడు .వాటిని ప్రచురించాడు .1824లో వేమన పై ద్రుష్టి పడి,ఆయన పద్యాల సేకరణ చేశాడు. తెలుగు ఛందస్సువ్యాకరణాలను శ్రీ తిప్పాభట్ల వెంకట శివ శాస్త్రి ,శ్రీ వఠ్యంఅద్వైత బ్రహ్మ శాస్త్రి అనే ఉద్దండ పండితుల వద్ద    అధ్యయనం చేశాడు .1825లో రాజమండ్రి కి బదిలీ అయి తెలుగు సాహిత్యాధ్యయనాన్ని తీవ్రంగా కొన సాగించాడు .శిధిలమై పోతున్న తెలుగు కావ్యాల వ్రాత ప్రతులను ను సేకరించి ,సమర్ధులైన వ్రాయస గాళ్ళను నియమించుకొని కొత్త కాపీలను రాయించాడు .ఆంద్ర మహా భారతం ,మహా భాగవతం లను పునర్ముద్రించాడు .

తెలుగు నేర్చుకోవాలనుకొన్న ఆంగ్లేయులకు తేలికగా భాష అలవడటం కోసం తెలుగు వ్యాకరణ ,ఛందస్సు పుస్తకాలు రాశాడు .తెలుగు –ఇంగ్లీష్ నిఘంటువు తయారు చేశాడు .సాహిత్య పత్రికలలో ఎన్నో మొనోగ్రాఫ్స్ రాశాడు  .చాలా కావ్యాలను అనువదించాడు .బ్రౌన్ రచనా సర్వస్వం అంతా మనకు మద్రాస్ ఓరియెంటల్ లైబ్రరీ లో దర్శనమిస్తుంది .

వ్రాత రూపం లో లేని జానపదుల నాలుకలపై నర్తించే లెక్కకు మించి వ్యాసాలూ, కవితలు ,కధలు సేకరించి ప్రచురించాడు .18 24 నుండి పోతన తిక్కన ,వేమన గ్రంధాలను సేకరించటం ప్రారంభించాడు .1835-నుండి 38వరకు లండన్ లో ఉన్నకాలం లో బ్రౌన్ దక్షిణ భారత భాషలలోని 2,106 వ్రాత ప్రతులను ఇండియన్ హౌస్ లైబ్రరీ నుండి సేకరించి ,ఇండియాలోని మద్రాస్ లైబ్రరీకి పంపాడు .

చాలా తెలుగు ,సంస్కృత గ్రంధాలను బ్రౌన్  సంపాదకత్వం  లో వెలువరించాడు .మద్రాస్ జర్నల్ ఆఫ్  లిటరేచర్ అండ్  సైన్స్ కు బ్రౌన్ సంపాదకుడుగా ఉన్నాడు .లండన్ లోని ఏషియాటిక్ జర్నల్ లో తాను  సేకరి౦చిన గ్రందాలపై  ఆసక్తికరమైన కధనాలు రాశాడు .దాదాపు ౩౦ వేల రూపాయల స్వంత ధనాన్ని ఆనాడే బ్రౌన్ ఖర్చు చేసి చీకటిలో మ్రగ్గిపోతున్న తెలుగు ,సంస్కృత గ్రంధ ముద్రణకు తోడ్పడి వాటిని వెలుగులోకి తెచ్చాడు అందుకే బ్రౌన్ ను తెలుగు భాషా  సూర్యుడు అంటారు .కనుకనే బ్రౌన్ మనకు డెల్టా శిల్పి సర్ ఆర్ధర్ కాటన్ లాగా  ప్రాతస్మరణీయుడు .కాటన్ ఆనకట్టలు నిర్మించి  పంటలకు సాయం చేసి సస్య శ్యామలం చేస్తే,  అముద్రిత గ్రందాలనెన్నిటినో  వెలికి తీసి బ్రౌన్ సాహిత్య పంట పండించాడు . ఒకరు కుక్షి నింపి సంతృప్తి పరిస్తే  ,మరొకరు మనసుకు ఆనందాన్నిచ్చి పరవశింప జేశారు .

అగణిత బ్రౌణ్య భాషా సేవ

1-బ్రౌణ్య నిఘంటువు అనే తెలుగు –ఇంగ్లీష్ డిక్షనరీ

2-గ్రామర్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్

౩-ఎ డిక్షనరీ ఆఫ్ మిక్సేడ్డయలెక్ట్స్ అండ్ ఫారిన్ వర్డ్స్ యూజేడ్ ఇన్ తెలుగు

4-దితెలుగురీడర్( తెలుగు వాచకం)

5-ఏ లిటిల్  లెక్సికన్

6డయలాగ్స్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్

7-ఆంద్ర గీర్వాణ చందము

8-వేమన శతకం

9-లోకం చేత వ్రాయబడిన శుభ వర్త మానములు (బైబిల్ కధలు )

10-రాజుల యుద్ధములు

11-తెలుగు-ఇంగ్లీష్ ,ఇంగ్లీష్ –తెలుగు నిఘంటువు

12-నల చరిత్ర

13-హరిశ్చంద్రుని కస్టాలు

14-నన్నయ ఆంద్ర మహా భారతం

15- రామ రాజ భూషణుని వసు చరిత్ర

16-పోతన భాగవతం

17-తిక్కన భారతం

18-శ్రీనాధుని పల్నాటి భారతం

ఇవి కాక బ్రౌన్ 1-బసవ పురాణం 2-పండితారాధ్య చరిత్ర ౩-రంగ నాద రామాయణం 4-ఉత్తర రామాయణం 5-విజయ విలాసం 6-సారంగ ధర చరిత్ర 7-హరివంశం 8-కాశీ ఖండం  9- అని రుద్ధ చరిత్ర 10-కుచేలోపాఖ్యానం 11-రాధికా సాంత్వనం 12-విక్రమార్క చరిత్ర గ్రంధాలకు ప్రెస్ కాపీలు రెడీ చేశాడు .వీటిని బ్రౌన్ మరణానంతరం తమిళనాడు ఆంద్ర  దేశం లలోని వివిధ సంస్థలు ప్రచురించాయి  ‘

బ్రౌన్ ప్రత్యేకతలు

ప్రజలు పరంపరగా చెప్పుకొనే కధలు గాధలు పాటలు చాటువులు సేకరించి ప్రచురించటం బ్రౌన్ ప్రత్యేకత .పాండిత్య ప్రకర్ష ప్రకటించే రచనలపై ఎక్కువ అభిరుచి లేకపోయినా బ్రౌన్ ,చాలా తెలుగు బృహద్గ్రందాలు సేకరించి ప్రచురించాడు .తాను చేసిన అనువాద గ్రంధాలను ఇతరులతోచేయి౦చి నవీ ముద్రించాడు .ప్రతిపుస్తకం లో  విషయ సూచిక ,పదాలకు అర్ధాలు ,వ్యాఖ్యానం ఉండేట్లు చేయటం బ్రౌన్ మరో ప్రత్యేకత .తాను వ్యాఖ్యానం రాయటానికి కారణం ఆ పద్యాలు ముఖతా వేరేవారితోఅర్ధాలు చెప్పించుకొని భావం తెలుసుకోవటం అనే  అవసరం కుండా చేయాలనే ఉద్దేశ్యం తోనే అని చెప్పాడు  .తన నిఘంటువులో చాలా వాడుక పదాలను చేర్చటం మరొక ప్రత్యేకత .

బ్రౌన్ కు సార్ధక బిరుదులు

‘’ఆంద్ర భాషోద్ధారకుడు’’ అనే సార్ధక బిరుదును తెలుగు ప్రజలే బ్రౌన్ మహాశయునికి ఇచ్చి  గౌరవించి గుండె గుడిలో ప్రతిష్టించు కొన్నారు .ఆంద్ర భాషా సంరక్షకుడు బ్రౌన్ .

హైదరాబాద్ లో టాంక్ బండ్ పై  ప్రభుత్వం బ్రౌన్ కాంశ్య విగ్రహాన్ని నెలకొల్పి గౌరవించింది .కడప లో బ్రౌన్ బంగాళా లో బ్రౌన్ కాలేజి ని  బ్రౌన్ లైబ్రరీ ని ,సేవా సంస్థను ఎకాడేమి  ఏర్పాటు చేసి ఆయన  సేవలకు నివాళులు అర్పించారు .

సశేషం

 

Inline image 1Inline image 2Inline image 3

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-12-16 –కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment