గీర్వాణ కవుల కవితా గీర్వాణం -50

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -50

50-  విద్యారన్యుల శిష్యుడు,గద్య కవి  -వామన భట్ట బాణుడు

పెదకోమటి వేమా రెడ్డి ఆస్థాన కవి వామన భట్ట బాణుడు .విజయనగర సామ్రాజ్య నిర్మాత విద్యారణ్య స్వామి వారి శిష్యుడు .ఇతనికాలం 1350-1420. శృంగార భూషణం అనే’’ బాణం ‘’అనబడే రూపక భేదాన్ని రాశాడు .దీన్ని పంపా క్షేత్రం లో విరూపాక్ష స్వామి వసంతోత్సవాలలో ప్రదర్శించినట్లు తెలుస్తోంది .1380లో విజయ నగర రాజు మొదటి దేవరాయల శాసనాన్ని వామన భట్టు రచించాడు .అందులో తాను  కవీశ్వరుడనని వ్యాకరణ  మీమాంసా శాస్త్రాలలో  పండితుడనని చెప్పుకొన్నాడు .

భట్ట బాణ కవితా త్రివిక్రమం

వేమారెడ్డి ప్రభు జీవిత చరిత్రను ‘’వేమ భూపాల చరిత్ర ‘’గా వామన భట్టు రాశాడు .ఇదికాక ‘’హంస సందేశం ‘’అనే లఘుకావ్యం రాశాడు .ఇందులో రెండు భాగాలున్నాయి ,నూట ముప్ఫై ఒక్క శ్లోకాల గ్రంధం .కావ్యం అంతా మందా క్రాంత వృత్తం లోనే రాశాడు .కాళిదాసు మేఘ సందేశ చాయలు ఎక్కువగా ఇందులో గోచరిస్తాయి .ఇందులో వార్తాహరత్వం చేసింది హంస . –దక్షుడు అనే యక్షుడు ప్రియురాలిన కందర్ప లేఖ కు హంసద్వారా సందేశం పంపటమే కద.యక్షుడు నేరం చేయటం వలన కైలాసం నుండి పంపించి వేయ బడ్డాడు .మలయ పర్వతం మీద ఉంటున్నాడు .అతని ప్రవాస శిక్క్ష ఒక ఏడాదిమాత్రమే . అలకా నగరం లో ఉన్న తన ప్రియురాలికి ఇక్కడి నుండి సందేశం పంపుతాడు .యక్షుడు హంసకు అలకానగరం ఎలా వెళ్ళాలో రూట్ మాప్ తెలియ జేస్తాడు. తామ్రపర్ణి ,మధుర ,కావేరి ,శ్రీరంగం ,చిదంబరం ,కంచి ,కాళహస్తి కృష్ణా గోదావరి  తుంగభద్రానదులు దాటి  వింధ్య ను చుట్టి నర్మదా ,యమునా గంగా వారణాసి ,అయోధ్య ,సరయు గండకి నదులు చూసి కురుక్షేత్రం హిమాలయాలను క్రౌన్చాపర్వతాన్ని దర్శించి కైలాసం మీదుగా అలకా నగరం వెళ్ళమని చెబుతాడు .పర్వత నగర నదీ వర్ణనలను కాళిదాసు బాటలోనే చేశాడు .ఇదంతా మొదటి భాగం లో ఉన్నాయి రెండవ భాగం లో హంస అలకా నగరం చేరిన తర్వాత తన ఇంటి జాడలను గురించి చెబుతాడు .ప్రియురాలి వర్ణన, ఆమె విరహ వేదన, తర్వాత దక్ష యక్ష సందేశాన్ని హంస అతని ప్రియురాలు కందర్ప లేఖకు తెలియ జేయటం తో కావ్యం అయి పోతుంది .వర్ణనలు స్వారస్యం గా చేశాడు వామన భట్టు .భార్య విరహాన్ని వర్ణిస్తూ-

‘’చిత్రే కర్తుం వ్యవసితా మతిస్తూలికాయాం ద్రుతాయాం –భగ్నా రంభో .నాయన సలిలై స్చేతసి త్వాం లిఖామి

తత్రాపి ద్రాగరతి రదికోల్లాసినీ మే విహన్త్రీ –యత్ సత్యం నోవరతను విధిఃసంగామే సాభయ సూయః ‘’

వామనుడు ‘నలాభ్యుదయం ‘’,రఘు  వీర చరిత్ర ‘’అనే రెండు మహాకావ్యాలు రాశాడు .ఇవికాక పార్వతీ పరిణయం ,కనక లేఖా కల్యాణం ,బాణాసుర విజయం అనే నాటక రచనా చేశాడు .ఉషాపరిణయం అనే నాటకాన్ని వామనుడు రాశాడని మల్లంపల్లి వారు చెప్పారు .బహుశా బాణాసుర విజయం ఉషాపరిణయం ఒకటే కావచ్చు .

వామన భట్టు ముఖ్యం గా గద్య కవి .బాణుడులాగానే చక్కని గద్య రచనా చేశాడు .ఇతని శృంగార భూషణం అనే భాణం లో ఒకే ఒక్క అంకం ఉంటుంది .విలాస శేఖరుడు అనే విటుడు అనంగ మంజరి ఇంటికి వెడుతూ ఉంటె దారిలో అతడు చూసిన  వింతలు , విశేషాల వర్ణనే ఈ రూపకం .అందులో పేద ,ధనిక వర్గాల వారు ,విటులు వేశ్యలు  శ్రుంగార కార్యకలాపాలు ,గొర్రె పొట్టేళ్ల పోట్లాటలు ,కోడి పందాలు ,జూదం ,మల్లయుద్ధం ,ఖడ్గ యుద్ధం స్త్రీల బంతులాట ,ఉయ్యాల లూగటం మొదలైనవి అన్నిటిని వామన భట్ట బాణుడు వర్ణిస్తాడు .

పార్వతీ పరిణయము అయిదు అంకాల నాటకం .  .ఇందులో శివ పార్వతుల కల్యాణం వర్ణించాడు .కుమార సంభవ కధను చేర్చాడు .కవిత్వం గొప్పగామధురం గా సరసం గా  ఉంటుంది .కనక లేఖా పరిణయం  నాలుగు అంకాలున్న నాటకం .విజయ వర్మ అనే రాకుమారుడు వీరవర్మ కూతురు కనక లేఖను ప్ర్రేమించి పెళ్ళాడే కద.మధ్యలో అనేక చిక్కులు వాటిని అధిగమించటం చివరికి పెళ్ళితో తెర పడి సుఖాంతమవుతుంది .కొత్తదనం లేక పూర్వపు నాటకాల ధోరణిలోనే సాగింది .ఏనుగుల వేట ,ప్రియురాలి చిత్రపటం తో రాజు వినోదించటం నాయకురాలి ముగ్ధత్వం ఉంటాయి .శృంగారరస ప్రధాన నాటకం .హాస్యం అద్భుతరసాలు కూడా ఉండి కాలక్షేపానికి పని కొస్తాయి .

Inline image 1

మరో కవిని కలుద్దాం –

సశేషం

దీపావళి శుభాకాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -23-10-14-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ధన్వంతరి -శివ భక్తీ -ధర్మం

ధన్వంతరి జయంతి

ఆశ్వయుజ కృష్ణ ద్వాదశి ధన్వంతరి జయంతి. ఆరోగ్యానికి అధిదేవత ధన్వంతరి. దేవదానవులు కలసి పాలకడలిని మధించినపుడు చిట్టచివరగా శ్రీమ న్నారాయణుడే అమృతకలశంతో ఆవిర్భవించాడు. ఇతణ్ణే విష్ణుమూర్తి అబ్జుడని అన్నాడు. ఆ అబ్జుడే మహావిష్ణువును తనకు యజ్ఞ్భాగాన్నివ్వమని కోరగా ‘‘రెండవ ద్వాపరంలో నీవుశ్రేష్ఠుడిగా పిలువబడుతావు. అపుడే నిన్ను ఉద్దేశించి యజ్ఞకర్తలు చాతుర్మంత్రాలతో వేలుస్తారు.’’అనే వరాన్ని అనుగ్రహించాడు ఆ విష్ణుమూర్తి. ఈ అబ్జుడే – పుత్రార్థి అయ దీర్ఘతపుడు చేస్తున్న తపస్సుకు మెచ్చి కొడుకుగా జన్మనెత్తాడు. అతడే దివోదాసుగా కాశీరాజ్యానికి రాజు అయ్యాడు. ఈ దివోదాసు భరద్వాజునకు శిష్యునిగా ఆయుర్వేదాన్ని నేర్చుకొన్నాడని బ్రహ్మాండపురాణం ద్వారా మనకు తెలుస్తుంది.
ధన్వంతరి చేతినున్న అమృతకలశంలోని అమృతంతోనే దేవతలు మృత్యుం జయులు అయ్యారు. ఈ ధన్వంతరిని కొలిచిన వారికి సర్వరోగాలు దూరం అయ్య సంపూర్ణఆయురారోగ్యాలు లభిస్తాయ. ఆరోగ్యమే మహాభాగ్యము కనుక సర్వులూ ఈ ధన్వంతరి పూజచేయడం సనాతనంగా వస్తోంది. ఆయుర్వేదాన్ని వృత్తిగా గ్రహించిన వారు ధన్వంతరి జయంతిని వైభవంగా జరుపుతారు. ప్రపంచంలోని ప్రతి చెట్టులో ఔషధ గుణాలు ఉన్నాయని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. ధన్వంతరికి కేరళ రాష్ట్రంలో త్రిశూర్‌వద్ద ఓ ఆలయం ఉంది. అనారోగ్యంతో బాధపడేవారు ఈ ఆలయాన్ని సందర్శించి విష్ణు సహస్రనామార్చన చేస్తే అన్ని రోగాలు దూరమవుతాయని భక్తుల నమ్మకం.
ఈ ధన్వంతరినే ఒకచేత్తో అమృతకలశాన్ని, రెండవ చేతిలో జలగను పట్టుకొని ఉంటాడని ఓ కథనం ప్రచారంలో ఉంది.
ఆశ్వీయుజ బహుళ ద్వాదశిన ఆవిర్భవించిన ధన్వంతరిని స్మరిస్తూ ధన్వంతరి ప్రతిమనుగాని, లేకుంటే విష్ణుమూర్తి పటాన్ని లేక ప్రతిమను పువ్వులతో అలంకరించి తెల్లటి అక్షతలు, తెల్లని పూవులతో స్వామి సహస్రనామావళి, అష్టోత్తర శతనామాలతో పూజచేస్తారు. ఈ ధన్వంతరికి పాల పాయసాన్ని నివేదన చేసి దాన్ని ముందుగా ఇంట్లో వారు స్వీకరించి తదుపరి తమ చుట్టు పక్కల ఉన్న వారిలో కనీసం ఐదుగురికి పంచుతారు. ఇలా చేయడం వల్ల ధన్వంతరి ప్రీతి చెందుతాడనే ఐతిహ్యం. ధన్వంతరిని స్మరించుకొని హరినామస్మరణ చేసినా సకల రోగాలు పటాపంచలవుతాయి. ఈ ధన్వంతరిని పూజిస్తే ఆయురారోగ్యాలే లభించడమే కాక భవరోగాలు దూరం అవుతాయ. కనుక ఈ ధన్వంతరిని
నమామి ధన్వంతరి మాదిదైవం సురాసురైర్వందితపాదపద్మం
లోకేజరారుగ్భయమృత్యునాశనం దాతారమీశం వివిధౌషధానం
అని ప్రార్థించాలి. కలియుగంలోనూ పరిసరాల పరిశుభ్రతను పాటిస్తూ, వాతావరణాన్ని కలుషితం చేసే పనులను దూరం చేసుకొంటూ – ఈ ధన్వంతరిని పూజిస్తే అందరికి మంచి ఆరోగ్యం లభిస్తుంది.
ద్వాదశి తరువాత వచ్చే త్రయోదశి కూడా దీపావళి పండుగలో భాగమే. ఇది గుజరాతీలకు సంవత్సరాది. దీనే్న ధనత్రయోదశి గాను ధన్ తేరాస్‌గాను అంటుంటారు. ఈరోజు కూడా దీపాలను వెలిగించి లక్ష్మీదేవి పూజను చేస్తారు. 13 సంఖ్య పాశ్చాత్యులకు మంచిది కాదనే అభిప్రాయం ఉన్నా మనం మాత్రం త్రయోదశి తిథి శుభదినంగానే భావిస్తాం. అన్ని పుణ్యకార్యాలను చేస్తుంటాం. అలాంటి ఈ రోజున చేసే లక్ష్మీదేవి పూజ సకల శుభాలను కలిగిస్తుంది. మహారాష్ట్రులు కూడా ఈ ధనత్రయోదశిని ఘనంగా జరుపుకుంటారు. వర్తకులు ఈ త్రయోదశినాడు పద్దులు చూచుకొని కొత్త ఖాతా పుస్తకాలను ప్రారంభిస్తారు. ఇల్లంతా దీపతోరణాలతో అలంకరిస్తారు.

శివతత్వం

  • – వేదగిరి రామకృష్ణ
  • 19/10/2014
TAGS:

శివ సాయుజ్యం పొందుట అనేది మన కర్మ ఆచరణలపై ఆధారపడి ఉంటుంది అనేది సత్యం. ఎవరైతే శివుని తత్వం గ్రహించి అనుసరించి ఆచరిస్తారో వారు శివ సన్నిధిని సులువుగా చేరగలుగుతారు.
పంచవిశంతి తత్వంతో సకల చరాచరములు సృష్టిస్తాను అని విష్ణురూపుడినై పోషించి కాల స్వరూపుడినై లయ చేస్తున్నాను అని శివుడు తన తత్వమును తానే తెలుపుకున్నాడు. సాక్షాత్ అన్నపూర్ణను సతిగా కలిగియున్నప్పటికి తన సహజ శైలిలో యావార వృత్తిలో భిక్ష పాత్ర నుంచుకుని కాలం గడుపుతున్నాడు. దీని ద్వారా జీవి తన స్వంత సంపాదన ద్వారా జీవితం గడపాలి అని తెలియచేయుచున్నాడు. శివుడు స్వయంగా నాట్యం చేస్తూ నటరాజుగా పేరు గాంచినాడు. ఈ జీవితం అనేది నాటకం లాంటిది. ఇందులో ఒక పాత్ర మనది. నిర్జీవమే నాట్య విరమణకు ఆఖరు దశ లాంటిది అని చెప్పినాడు.
మహాదేవుడు సాధారణమైన పూలతో చేసిన మాలలు ధరించడు. ఎందుకంటే అవి నశ్వరమైనవి. కపాల మాలలు, రుద్రాక్ష మాలలు ధరించుచున్నాడు. దీని ద్వారా మనకు బోధపడే తత్త్వము ఏమిటంటే లౌకిక వాసనలు పూలు వంటివి. అవి పునరావృతములు. వాటిని నివారింపచేసుకోవాలని తన తత్వం ద్వారా ముక్కంటి సూచించుచున్నాడు.
మహాదేవుడు తాను భస్మధారణ చేయుట ద్వారా ఏమి తత్వం బోధిస్తున్నాడు అంటే మానవుడు ఈ భూమి మీదకు వస్తూ తెచ్చినది ఏమీ లేదు. మరణానంతరం తీసుకొనిపోయేది ఏమీ లేదు. పుట్టుక మరణం మధ్య జీవితం ఒక నాటకం. చివరకు మానవుడు రూపాంతరం చెందేది భస్మముగానే అనే తత్వం తెలుపుతున్నాడు. బతికినంతకాలం మంచిగా జీవిస్తూ అందరికి ఆదర్శప్రాయంగా యుండాలి.
శివుడు గరళం స్వీకరించుట ద్వారా మానవునికి ఏమి తత్వం ఉపదేశించినాడు అంటే జీవితం అంటే కష్టము నష్టముల భూయిష్టము. సుఖములను మాత్రమే ఆనందంగా అనుభవించుటగాదు. కష్టములు ఎదురైనప్పుడు తాను ఒక్కడే కష్టము ఎదుర్కొనుట ద్వారా పదిమందికి మేలు జరుగుతుంది అని భావిస్తే ఆ పనిని నిరాటంకంగా నిర్భయంగా ఆనందంగా చేయమనే తత్వమును బోధించుచున్నాడు.
శివుడిని శ్మశానవాసిగా చెప్పుకుంటాము. శివుడు శ్మశానవాసి ఎందుకైనాడో పరిశీలిద్దాం. శ్మశానమునకు రాజు-పేద అనే తరతమ భేదములేదు. ఎంతటివారు అయినా ఏదో ఒక రోజు అచటికి చేరవలసిదే. పార్థివ దేహంతో పాటు సూక్ష్మప్రాణి కూడా శ్మశానికి చేరుతుంది. తనతో వచ్చిన వారందరు వెళ్లగా బెరుగ్గాయుంటూ తన వారందరు వెనక్కి వెళ్లిపోయినారే అని దుఃఖిస్తూ యుంటుంది. అటువంటి సూక్ష్మప్రాణికి నీవారందరు వెనక్కి మరలినా ఒంటరి అయిన నీకు ఈ శ్మశానములో నేనున్నాను అని భరోసా ఇస్తాడు ఆ మహాదేవుడు. జీవన్మరణముల యందు తానే అయియున్నానని మనకు తన తత్వం తెలియచేయుచున్నాడు. అందుకే భూత గణములు ఆయన వెన్నంటే యుంటాయి. కామ, క్రోధ అరిషడ్వర్గాలు వాటి పరిధి దాటితే ఎలా యుంటుంది అనే అంశమును మన్మథుని భస్మీపటలం చేయుట ద్వారా మనకు తన తత్వమును తెలియజేసాడు. కామం, క్రోధం వంటివి అదుపు దాటితే మన్మథుని గతే ఎవరికైనా పడుతుంది అనే తత్వాన్ని మనం గ్రహించగలగాలి. శివుడు స్వయంగా ఢమరుకం మ్రోగిస్తున్నాడు అంటే మాయ అనబడే తిమిరం ఈ జగత్తు అంతా వ్యాపించి యుంది. దానిపట్ల నువ్వు అప్రమత్తంగా యుండు అని జీవిని హెచ్చరించుచున్నాడు.
వినాయకుడు- తండ్రీ ఈ జగమంతా నేను చుట్టిరాలేను అని విన్నవించుకుంటే ‘‘కుమారా తల్లి తండ్రికి ప్రదక్షిణ చేస్తే ఈ సమస్త జగత్తును చుట్టివచ్చినట్లేయని తెలుపుతాడు. దీని ద్వారా మానవుడికి తల్లిదండ్రిని తప్పక జీవితపర్యంతం ఆదరించాలి అనే తత్వం అంతర్నిగూఢంగా దాగియుంది. ఒక్కమాటలో మాతా పిత సేవలో తరించువాడు ముల్లోకముల యందు పూజనీయుడు అని అర్థం.

ధర్మము

  • -వంగూరి వెంకట్రామయ్య
  • 20/10/2014
TAGS:

ధర్మమనే పదమునకు అనేక అర్థములున్నవి. ఏ వస్తువుకు ఉన్న సహజ గుణములన ఆ వస్తువు ధర్మమంటారు. నీరు పల్లమునకు ప్రవహించును. ఇది దాని ధర్మము. నిప్పు పైకి ఎగిసిపడుట దాని ధర్మము. ఇదిగాకుండా మానవుల విషయములో మనిషి చేయవలసిన కర్తవ్యములను ధర్మమంటారు. వృత్తి ధర్మములు, ఆశ్రమ ధర్మములు వగైరా ప్రత్యేక ధర్మములుగాక, అందరి మానవులకు వర్తించే సామాన్య ధర్మములు కొన్ని ఉన్నాయి. ఇవి సత్యము, అహింస, బ్రహ్మచర్యము, ఆస్తేయము, అపరిగ్రహణము, విచక్షణారహిత జీవితము, పరమత సహనం- ఈ ధర్మములను అన్ని మతాలు అంగీకరించినవి.
హిందూ మతములోని యోగ సిద్ధాంతము, బౌద్ధ జైన మతములు, వీటిలో ముందు ఐదింటిని యమ నియమములన్నారు. ఇది పాటించకపోయినా, ఏ సాధకుడు యోగ ధ్యానములో ముందుకు వెళ్లలేడు. పై ధర్మములకు ఆ పేరు దృతి అను శబ్దమునుంచి వచ్చినది. దృతి అనగా నిలబెట్టునది. అనగా సృష్టి, మానవ సమాజమును నిలబెట్టునవి. ఈ ధర్మములు మానవ సమాజం ఆచరింపకపోయినా కలహములు, కొట్లాటలు పెరుగును. సమాజం అల్లకల్లోలమవును. వీటిని ఆచరించునపుడు అనేక దుష్కార్యములు చేయుట మానవుడు మానుకోవలెను. తద్వారా కోర్కెలు నిగ్రహింపబడి మానవుడు దైవానే్వషణలో ముందుకు వెళ్ళుటకు సులువు ఏర్పడును. పై ధర్మములాచరించుట వలన ఇతరులకు, సమాజమునకు ఉపకారములు సుఖశాంతులు ఏర్పడును. అందుచే ఇవి నైతిక సూత్రములు, పుణ్యకార్యములు కూడా అయివున్నవి. ఇవి పుణ్యకార్యములగుటచే ఆచరించేవారికి పుణ్యము లభించి వారి సుఖ సౌఖ్యములు, సంపదలు అంతిమ విజయములు వచ్చును. భగవంతుడు ధర్మము నిలబెట్టుటకు కృషి చేయును. అవతారములెత్తును. ఆయన కర్మ సిద్ధాంతము ఏర్పాటుచేసి ధర్మములు పాటించువారికి కష్టములు తొలగించి, సుఖములిచ్చును.
సత్యము అంటే అబద్ధమాడకపోవుటేగాక ఇచ్చిన వాగ్దానములను నెరవేర్చుటే. ఇది లేకపోయినా సమాజము విచ్ఛిన్నమగును. సత్యవాక్కును ఆచరించువాడు అవినీతి లంచగొండితనం, మోసము చేయలేడు. అప్పుడు సమాజము పవిత్రముగా ఉండి సుఖ శాంతులతో ఉండును. హరిశ్చంద్రుడు, ధర్మరాజు, శ్రీరాములవారు, సత్యవాక్కు పరిపాలకులు. శ్రీరాముడు తండ్రి యొక్క వాగ్దానములు నెరవేర్చుటకు చేతికి వచ్చిన రాజ్యము వదలి అడవికి వెళ్ళెను.
అహింసయంటే నాడీమండల వ్యవస్థ ఉన్న ఓ జీవిని అనగా మనుష్యులు, జంతువులను శారీరకంగాను, మానసికంగానూ హింసించకపోవుట. దీనిని ఆచరించే వారు శాఖాహారమునే తినవలెను. వృక్షములకు ప్రాణమయ కోశమే గాని మనోమయ కోశము అనగా నాడీ మండల వ్యవస్థ లేదు. అందుచే వాటికి బాధ సుఖము తెలియదు.
బ్రహ్మచర్యము అంటే వివాహము లేకుండా యుండుట అని అర్థమయినా, అందరూ బ్రహ్మచారులయితే సృష్టి ఆగిపోవును. పక్వము కానివాడు ఆచరించిన అది విఫలమగును. అందుచే వివాహేతర సంబంధములు పెట్టుకోకుండా ఏకపత్నీవ్రతము, పాతివ్రత్యము పాటించినా, వివాహము చేసుకొన్నా అది బ్రహ్మచర్యమునకు సమానమని ఋషులు చెప్పిరి. శ్రీరాముడు, సీతాదేవి ఈ విషయంలో ఆదర్శవంతులు. దీనివలన కుటుంబ వ్యవస్థ నిలబడును. ఆస్తేయమంటే ఇతరుల సొత్తును అపహరించకపోవుట. అది జరిగిన అవినీతి, దొంగతనము, దోపిడీ సమాజంలో యుండవు. అపరిగ్రహమంటే మన సొత్తును కూడా ఎదుటివారికి హాని లేకుండా మంచి కలిగించునట్లు వాడుకొనుట. అంటే మన సొత్తుకు మనము సమాజము తరఫున ధర్మకర్తలమన్నమాట.మనం ఆచరించే అనేక కర్తవ్యములు పై ధర్మములలో జేరిపోవును. ఏ పుణ్యకార్యమయినా ధర్మమే. అహింసతో కూడిన భగవతీ ఆరాధనలన్నీ ధర్మములే. అవి దైవచింతన పెంచునని, చిత్తశుద్ధిని కలిగించును. వాటిని ఎవ్వరూ మానకూడదని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పారు. ఇదియే ధర్మసూక్ష్మము.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నరకచతుర్దశి-చోడిశెట్టి శ్రీనివాసరావు

నరకచతుర్దశి

భారతీయులు జరుపుకునే పండుగలన్నింటికంటే విలక్షణమైన పండుగ దీపావళి. దీపాలు వెలిగించుకోవడం, టపాసులు కాల్చుకోవడం, కొత్త బట్టలు ధరించడం,పిండి వంటలు భుజించడం ఇవన్నీ ఈ పండుగనాడు మనకు పైకి కనిపించే ఆర్భాటాలైనా ఈ పండుగను అత్యంత వైభవంగా, ఆనందంగా జరుపుకోవడం వెనుక అజ్ఞానపు చీకటులు తొలగి విజ్ఞానపు వెలుగులు సర్వత్రా వ్యాపించడమనే గొప్ప అంతరార్థం ఇమిడి ఉంది.
వెలుగులేక జగతి లేదు అన్నారు. అంటే వెలుగులేని ప్రపంచం ఊహించలేం. ఆ వెలుగును కలిగి ఉన్న భగవంతుడే పరంజ్యోతి స్వరూపుడు. ఆయన అవిద్య, అజ్ఞానం, అవివేకం లాంటి అన్ని రకాల చీకట్లను పారద్రోలగల సమర్థుడు జ్ఞాన ప్రదాత. దీపం వల్లనే సమస్త కార్యాలు సాధ్యమవుతాయి.
ఇక ఈ పండుగ జరుపుకోవడానికి కారకుడైన నరకాసురుడు భూదేవి కుమారుడు. నరకుడు అంటే హింసించేవాడని అర్థం. బ్రహ్మ వరప్రసాద గర్వితుడైన ఇతడు ప్రాగ్జ్యోతిష పురమనే రాజ్యాన్ని పాలించేవాడు. రాజై ఉండి కూడా దేవతల తల్లి అదితి కర్ణకుండాలను, వరుణుడి ఛత్రాన్ని అపహరించాడు. మణిపర్వతమనబడే మేరు పర్వతాన్ని వశపరచుకున్నాడు. సదా మునులను హింసిస్తూ ఉండేవాడు. దేవతలమీదికి పదే పదే దండెత్తేవాడు.
నరకుడు పెట్టే హింసలు భరించలేక మునులు, దేవతలు అందరూ కలిసి శ్రీకృష్ణుని వద్దకొచ్చి మొరపెట్టుకున్నారు. నరకాసుర సంహారం లక్ష్యంగా శ్రీకృష్ణ భగవానుడు గరుడ వాహనారూఢుడయ్యాడు. సత్యభామ కూడా ఆయన వెంట బయలుదేరింది. నరకాసురుని ప్రాగ్జ్యోతిషపురం సమీపిస్తూ- మురాశురుని పాశాలచే చుట్టబడిన అయిదు దుర్గాలను చూసి ఆశ్చర్యచకితురాలైంది.
కృష్ణ్భగవానుడు మొదటి దుర్గాన్ని గదతో పగలగొట్టాడు. రెండవ దుర్గాన్ని బాణపరంపరలతో ఛేదించాడు. వాయు, జల, అగ్ని దుర్గాలను సుదర్శన చక్రాలతో నిర్మూలించాడు. అటుపిమ్మట తనతో తలపడిన మురాసురుని, అతని కుమారులను కొంతమంది సైన్యాన్ని సంహరించాడు. అలసిన కృష్ణుడు అలసట తీర్చుకుంటుండగా, నరకాసురుడు యుద్ధ రంగంలోకొచ్చాడు. వస్తూనే ఆదమరుపుగా ఉన్న కృష్ణుడిని చంపబోయాడు. అది గమనించిన సత్యభామ చటుక్కున లేచి నిలబడి చీర చెంగుతో నడుం బిగించింది. వాల్జడ ముడివేసింది. తానే స్వయంగా విల్లందుకొంది. ఆమెలో వీరావేశం పరవళ్ళు తొక్కింది. అమ్ముల పొదినుంచి బాణాలు ఎప్పుడు తీస్తుందో, ఎప్పుడు సంధిస్తుందో ఎలా వేస్తుందో తెలియకుండా మెరుపు వేగంతో వాటిని వర్షింపసాగింది. ఆ ఎడతెగని బాణవర్షానికి, యుద్ధ విన్యాసాలకి తట్టుకోలేక శక్తి నశించిన రాక్షస సైన్యం నరకాసురుని వెనక దాగాయి. అంతకంతకూ ఆవేశపడిపోతున్న ఆమె చేతినుండి వింటిని గ్రహించి, నరకాసురునితో తను యుద్ధానికి తలపడ్డాడు. కొంతసేపటి తర్వాత సుదర్శన చక్రాన్ని ప్రయోగించి నరకుణ్ణి సంహరించాడు.
లోకకంటకుడైన నరకాసురుడు చనిపోయినది ఆశ్వయుజ బహుళ చతుర్దశి కాగా మరుసటి రోజు అన్ని లోకాలవారూ పండగ జరుపుకున్నారు. ఆనాటినుంచి ప్రతి సంవత్సరం ఆశ్వయుజ బహుళ అమావాస్యనాడు దీపావళి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. దీపావళినాడు ఇంచుమించు అందరూ దీపాలను వెలిగిస్తారు. లోకంలోని కారు చీకట్లను పారద్రోలి కాంతిరేఖలతో నింపే పండుగ ఇది.
దీపాలను వెలిగించి చీకట్లను పారద్రోలే వేడుక స్ర్తిలదైతే, ఉన్నంతలో పేదసాదలకు దానధర్మాలు చేసి సాయపడే బాధ్యత స్ర్తిపురుషులిద్దరిది. బాణాసంచా కాల్చి పరిసరాలను వెలుగులతో నింపే ఉత్సాహం చిన్నపెద్దా తేడాలేకుండా అందరిది. అందుకే దీపావళి ఆనందోత్సాహాల పండుగగా ప్రసిద్ధి పొందింది. అంతేగాక ఈ పండుగ ఆరంభించిన తరువాత వచ్చే కార్తిక మార్గశిర మాసాలు రెండూ భగవత్ ప్రీతికరమైన మాసాలు. ఆధ్యాత్మిక సాధనకు అనువైన రోజులు కనుకనే దీపావళి పండుగకు ఎంతో వైశిష్ట్యం చేకూరింది.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దీపావళి కాంతులు.. ఇంటింటా సుఖశాంతులు .సి.శివశంకర శాస్ర్తీ

వేదభూమిగా వినుతికెక్కి ఎనె్నన్నో మతాలకు, పలు కులాలకు పుట్టినిల్లయిన మన భారతావనిలో ఏటా ఎనె్నన్నో పండుగలు వేడుకగా జరుపుకొంటున్నాం. ఇందులో కొన్ని మతాలకు మాత్రమే పరిమితమైనవి కాగా, మరికొన్ని కుల మత వర్గ భేదం లేకుండా అందరూ ఆనందమయంగా జరుపుకునే పండుగలూ ఉన్నాయి. అన్ని వర్గాలకు చెందినవారూ సంబరంగా జరుపుకునే పండుగల్లో దీపావళి అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నది. భారతీయులంతా ఒకే కుటుంబ పరివారమనే విధంగా అందరి మనసుల్లో కొలువైనది- దివ్వెల పండగ అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. చెడు నిర్మూలనం జరిగినపుడు జీవకోటికి కలిగే ఆనందానికి అవధులుండవన్న విషయం అందరికీ తెలిసిందే. పేరులోనే దీపాల వరుసను స్ఫురింపజేసే ఈ పండుగ మరే పండుగకూ లేని విశేషోత్సవాలు, సంబరాలను సొంతం చేసుకుంది. పురాణ కథనాల మేరకు దక్షిణ భారతీయులకిది మూడునాళ్ల ముచ్చటైన పండుగ. ఆశ్వయుజ బహుళ చతుర్దశి నరక చతర్దశిగాను, అమావాస్యను దీపావళి పండుగ గాను, కార్తీక శుద్ధ పాడ్యమిని బలి పాడ్యమిగా జరుపుకోవడం అనాదిగా వస్తోంది.
చీకటి విశ్వరూపాన్ని దర్శించిన మన జ్ఞానులు జ్యోతి స్వరూపాన్ని కూడా దర్శించి తద్వారా మనకు దిగ్దర్శనం గావించి ‘తమసోమా జ్యోతిర్గమయ’ అంటూ ప్రార్థన చేయించారు. నిజం చెప్పాలంటే ఏడాదికొకసారి ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడు అనగా- అమావాస్య నాడు మాత్రమే దీపం వెలిగించి నమస్కరించే మొక్కుబడి కాదు మనది. ప్రతి సాయంత్రం ఇల్లు తుడిచి ముఖం, కాళ్లు, చేతులు కడుక్కొని స్ర్తిలు దీపం వెలిగిస్తూ…
‘‘దీపం జ్యోతి పరబ్రహ్మం
దీపం సర్వ తమోపహం
దీపేన సాధ్యతే సర్వం
సంధ్యా దీపం నమోస్తుతే’’
– అంటూ శ్లోకం పఠించి, మెడలోని మంగళ సూత్రాన్ని కళ్ళకద్దుకొని ఆ వెంటనే దీప జ్యోతికి నమస్కరించుకొనే సత్ సాంప్రదాయం. ఇందుకు కారణం లేకపోలేదు. దీపం జ్ఞానానికి ప్రతీక. ఈ జ్ఞాన సమారాధన, జ్ఞాన ఉపాసనే ‘దీపారాధన’ అని పలు పురాణాలు చెబుతున్నాయి. దీనిని బట్టి ‘సర్వేజనా సుఖినోభవంతు’ అనే ప్రాచీన ఆర్ష వాక్యంలోని ఆత్మీయతతో పండుగలు గీటురాళ్ళని మన రుషులు నొక్కి పలికారు. దీపాన్ని మన జీవన గమనానికి పోల్చుకొంటే చీకటి వెలుగుల గురించి విశ్వమంత విషయంగా విపులంగా తెలుసుకునే వీలవుతుంది.
చెడు చీకటైతే, మంచి వెలుగై నిలుస్తుంది. అలాగే అజ్ఞానం చీకటి- జ్ఞానం వెలుగు. బతుకేమో వెలుగు- మృత్యువు చీకటి. అదేకోవలో బాధ-చీకటి, సంతోషం- వెలుగు. ఆకలి చీకటి- ఆహారం వెలుగు. స్వార్థం చీకటిగా ఉంటుంది, త్యాగం వెలుగవుతుంది. హింస చీకటి, అహింస వెలుగు. కామం చీకటి- ప్రేమ వెలుగు. ఈ విషయాన్ని శ్రీ రామకృష్ణ పరమహంస వంటి పరమయోగులు పలు సందర్భాల్లో ఉటంకించారు. అపకారం చీకటి, ఉపకారం వెలుగు. మోసం చీకటి, నిజాయితీ వెలుగు. ఇలా ఒకటొక్కటిగా పోల్చుకొంటూపోతే చీకటి, వెలుగుల విషయాలు ఎనె్నన్నో మనకు తెలుస్తాయి.
చీకటి విడిపోవాలంటే వెలుగు తప్పనిసరి. జగానికే జ్యోతి అయిన సూర్యభగవానుడు పగటి పూట తన వెలుగులతో జీవకోటిని ముందుకు నడిపిస్తూ ఆరోగ్య ప్రదాతగా ఉంటున్నాడు. సూర్యాస్తమయం కాగానే చీకటి కమ్ముకొస్తుంది. మన కార్యకలాపాలకు కొంతవరకు అవరోధం కలుగుతుంది. అలా కాకుండా ఉండేందుకై ఇంట దీపం వెలిగించుకొని పనులు చక్కబెట్టుకొంటున్నాము. చీకట్లోంచి వెలుగుబాటలో పయనించాలన్నది ప్రతి ఒక్కరి ఆకాంక్ష. ఇది సహజం. ధర్మసమ్మతం కూడా. మరింత లోతులకు వెళ్లి తరచి చూస్తే దీపం మానవాళికి ఐశ్వర్యం ప్రసాదించే శ్రీ మహాలక్ష్మి అని పలు పురాణాలు ప్రవచిస్తున్నాయి. నిలువెల్లా పవిత్రతను రంగరించుకున్న దీపాన్ని జ్ఞానచిహ్నంగా, ఐశ్వర్యమునకు సంకేతంగా, సంపద, ఆనందాలకు ప్రతీకగా భావించడంలో తప్పులేదంటూ జ్ఞానులు చెప్పిన మాటలతో మనం ఏకీభవించక తప్పదు.
నరక చతుర్దశి నాటి రాత్రి ఇంటిలో అష్టదిశలయందు అనగా నాల్గు దిక్కులు, నాల్గు మూలల్లో దీపాలను వెలిగించి చీకట్లను తరిమివేసే ఆచారం పలు ప్రాంతాల్లో ఉంది. దీపావళి నాటి ఉదయం తైలాభ్యంగనం చేసుకొని, తెల్లటి బట్టలు ధరించి లక్ష్మీదేవిని తెల్లటి పూవులతో పూజిస్తే ఆ తల్లి కృప మనపై తప్పక ప్రసరిస్తుందన్న జ్ఞాన జనవాక్యంలో నిజముందనక తప్పదు. క్షీర సముద్రరాజ తనయ అయిన లక్ష్మీదేవికి ఆ రోజున ధవళవర్ణం చాలా ఇష్టమని పురాణాల్లో అనేక ఆధారాలు న్నాయి.
దీపావళి అమావాస్య రోజున లక్ష్మీదేవిని తెల్లటి పూలతోనే ఎందుకు పూజించాలి? అనే ప్రశ్నకు లభించిన సమాధానం ఇలా ఉంది. రాక్షస రాజైన బలి చక్రవర్తి సమస్త భూమండలాన్ని స్వాధీనం చేసుకోడమే కాక మహాలక్ష్మిని సైతం బంధించేశాడు. ఇలా చేయడంతో చరాచర విశ్వమంతా జ్యేష్టాదేవి వశమైపోయింది. ఫలితంగా యజ్ఞయాగాదులు నిలచిపోయాయి. ఎటుచూసినా చీకటి, అయోమయం. అప్పుడు దేవతా గణమంతా విష్ణుమూర్తి వద్దకు వెళ్లి తమకు ప్రత్యామ్నాయ మార్గం చూపమని ప్రార్థించారు. కశ్యపుడు,అదితి దంపతులకు వామనమూర్తి అవతారంగా విష్ణుమూర్తి జన్మించాడు. బలి దురాగతాలను అణచివేసేందుకై అతని వద్దకు వెళ్లి తన నిత్యానుష్ఠాన కార్యకలాపాలు నిర్విఘ్నంగా నెరవేర్చుకొనేందుకు మూడడుగుల నేల దానమీయవలసిందిగా కోరాడు. అందుకు బలి అంగీకరించాడు. వామనమూర్తి త్రివిక్రమ రూపధారియై భూమ్యాకాశాలు రెండడుగుల్లో ఆక్రమించుకొని, బలి చెప్పిన మేరకు మూడవ అడుగు అతని నెత్తిన పెట్టి పాతాళానికి తొక్కివేసి దేవతలతోపాటు తన దేవేరిని కూడా బంధ విముక్తను గావించాడు. దాంతో అసుర రాజ్యం అంతరించింది. చీకటి తొలగిపోయి వెలుగు ప్రసరించింది. జనావళి ఆనందోత్సాహాలతో అమావాస్య నాడు పున్నమి వెనె్నలను చూశారు. అప్పటి నుండి పున్నమి వెనె్నలను పోలిన తెల్లటి పూవులతో శ్రీ మహాలక్ష్మిని దీపావళి నాడు పూజించడం ఆచారమైనట్లు పురాం కథనం.
మరో కథనం మేరకు పురాణాల్లో చెప్పిన వామనుని మూడడుగులే విష్ణువు త్రిపాదములని తెలుస్తోంది. విష్ణువు అంటే సూర్యభగవానుడే. అందుకే సూర్యుణ్ణి ‘సూర్యనారాయణ మూర్తి’ అని కీర్తిస్తారు. సూర్యుడి ఉదయం, మధ్యాహ్నం, అస్తమయాలే ఆయన మూడు పాదాలని పురాణాల ద్వారా తెలుస్తోంది. సూర్యాస్తమయం తర్వాత వచ్చేది చీకటి. ఉత్తర ధృవవాసులు తులా సంక్రమణంతో ఆరంభమైన ఆరు నెలలు దీర్ఘరాత్రిలో దీపోత్సవం చేసి, ‘నిశాచర రాజైన బలి చక్రవర్తి అనే శత్రువును పాతాళానికి అణగదొక్కి సూర్యుడు మాకు మళ్లీ కనబడుగాక’ అని ప్రార్థించడానికి ఏర్పాటుచేసిన వెలుగుల పండుగ దినమే దీపావళి అని కూడా బుధులు చెప్పినట్టు తెలుస్తోంది.
భారతీయులంతా ఆనందమయంగా జరుపుకునే ఈ పండుగ వేడుకలు, ఆచార వ్యవహారాలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటున్నాయి. కర్నాటకకు చెందిన కొన్ని పల్లె ప్రాంతాల్లో వివిధ పదార్థాలతో తయారు చేసిన ప్రమిదల్లో నువ్వుల నూనె నింపి దీపాలు వెలిగించి శ్రీమహాలక్ష్మికి హారతులిస్తూ పూజలు చేస్తారు. ఈ కార్యక్రమం ముచ్చటగా మూడు రోజులపాటు ఉదయం, సాయంకాలం సాగుతుంది. దీనిని ‘ఆరతిబాన’ అంటారు. కర్నాటకలోని పలు పల్లెటూళ్లల్లో పాటు రాయలసీమ సరిహద్దుల్లోని పల్లెల్లో కనె్నపిల్లలు తేలికపాటి చిన్న చిన్న అట్టముక్కల్ని తీసుకొని వాటిని గుండ్రంగా కత్తిరించి ఆ బిళ్ళలపై రంగుల ముగ్గులు దిద్ది బియ్యపుపిండితో ప్రమిదల్ని తయారుచేసి, అందులో నేయి వేసి దీపాలు వెలిగించి అమావాస్య నాటి సాయంవేళ గౌరీదేవిని స్తుతిస్తూ పాటలు పాడుకొంటూ వాటిని నదుల్లోగానీ లేదా చెరువులు, కుంటల్లోగానీ వదలిపెట్టుతారు. ఇలా వేడుకగా పూజించే ఆ దీప దేవతను ‘సీగెమ్మ’ అని పిలుచుకొంటారు. సీగెమ్మ అమ్మవారి పూజల ద్వారా గౌరీదేవి ఆ కనె్నపిల్లలకు మంచి భర్తతోపాటు సుసంతానం, దీర్ఘసౌభాగ్యత్వం ప్రసాదిస్తుందని పండు ముత్తయిదువలు చెబుతారు.
మొత్తంమీద ఈ పండుగ ఆశాకిరణాల తోరణం. దుర్భరమైన దైనందిన జీవితాన్ని తలచుకొంటూ, పండుగలు దండుగ అనుకునేవారు కూడా నేటి ఆధునిక కాలంలో ఎంతోమంది ఉన్నారు. ఎవరేమనుకున్నా, కనీసం పండుగ రోజైనా అన్నీ మరచిపోయి, భగవంతుడు మనకు ప్రసాదించినంతలో శుచిగా వండుకుని, తృప్తిగా తిని హాయిగా కాలక్షేపం చేయడం ఉత్తమం. అంధకార బంధురాన్ని పక్కకు తోసి, వెలుగు పుంజాలను చూపే దీపావళిని గూర్చి ‘జ్యోతిషాం జ్యోతి రుత్తమం’ అంటూ నిత్య సత్యమైన పలుకులు పలికిన మన జ్ఞాన యోగులకు కృతజ్ఞతలు తెలుపుకోవడం మన కనీస కర్తవ్యం.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పాశ్చాత్యుల ప్రమేయం!

పాశ్చాత్యుల ప్రమేయం!

జమ్మూకాశ్మీర్‌ను అంతర్జాతీయం చేయడానికి పాకిస్తాన్ ప్రభుత్వం యత్నిస్తుండడం ఆశ్చర్యకరం కాదు. కాశ్మీర్‌లోని భారత వ్యతిరేక విచ్ఛిన్న వాదులు పాకిస్తాన్‌తో కలిసికట్టుగా మనదేశంలోను, విదేశాలలోను విద్రోహకాండ కొనసాగిస్తుండడం కూడ దశాబ్దులుగా నడచిపోతున్న వైపరీత్యం. బ్రిటన్ రాజధాని లండన్‌లో ఈ నెల 26న కాశ్మీర్ యాత్ర నిర్వహించాలని విద్రోహులు భావిస్తుండడం ఈ అంతర్జాతీరుూకరణలో భాగం. కానీ బ్రిటన్ ప్రభుత్వం ఈ యాత్రను నిషేధించకపోవడమే ఆశ్చర్యకరం. తమ దేశాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న విచ్ఛిన్న వాదులను నిర్దాక్షిణ్యంగా అణచివేస్తున్న ఐరోపాదేశాలు, అమెరికా, చైనా తదితరులు ఇతర దేశాలకు వ్యతిరేకంగా తమ దేశాలలో జరిగిపోతున్న ఉగ్రవాద చర్యలను పట్టించుకొనకపోవడం వైపరీత్యం. ప్రపంచ ప్రజాస్వామ్య వ్యవస్థను కాంక్షిస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్న అమెరికా, ఐరోపా దేశాల ప్రభుత్వాలు, అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌కు వ్యతిరేకంగా జిహాదీ ఉగ్రవాదులు తమ దేశాలలో ప్రదర్శనలు నిర్వహించడానికి అనుమతించడం ఈ దేశాల ద్వంద్వ ప్రమాణాలకు చిహ్నం. చైనా ప్రభుత్వం తమ దేశంలో విచ్ఛిన్న కలాపాలను నిర్వర్తిస్తున్న జిహాదీ దుండగులను కఠినంగా అణచివేస్తుండడం నడుస్తున్న చరిత్ర. కానీ చైనా మన దేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న బీభత్సకాండను మాత్రం నిరసించడంలేదు. చైనా ప్రజాస్వామ్య దేశం కాదు. మనకు వ్యతిరేకంగా దురాక్రమణ సాగిస్తున్న నియంతృత్వ దేశం. పాకిస్తాన్‌కు మిత్ర దేశం. అందువల్ల చైనా ప్రభుత్వంవారు భారత వ్యతిరేక బీభత్స చర్యలకు ఇంటా బయటా ప్రత్యక్ష, ప్రచ్ఛన్న సమర్ధన కొనసాగించడంలో ఆశ్చర్యం లేదు. కానీ బ్రిటన్ అమెరికా వంటి ప్రజాస్వామ్య దేశాలు కాశ్మీర్‌ను అంతర్జాతీయం చేస్తున్న పాకిస్తాన్‌ను నిరసించడం లేదు. తాము స్వయంగా అంతర్జాతీయం చేస్తున్నాయి. బ్రిటన్ నుండి స్కాట్‌లాండ్‌ను విడగొట్టడానికి ప్రయత్నాలు జరుగుతుండిన సమయంలోనే మనదేశం నుండి జమ్మూ కాశ్మీర్‌ను విడగొట్టడానికి జరిగిన యత్నాలకు బ్రిటన్ పార్లమెంట్ పరోక్షంగా మద్దతు తెలిపింది. స్కాట్‌లాండ్‌లో ప్రజాభిప్రాయ సేకరణకు ముందుగా ప్రచారం జరుగుతుండిన సమయంలో బ్రిటన్ పార్లమెంటు గత సెప్టెంబర్‌లో కాశ్మీర్ గురించి చర్చించడం ఇందుకు నిదర్శనం. స్కాట్‌లాండ్ వ్యవహారాన్ని భారత పార్లమెంట్‌లో చర్చించినట్టయితే బ్రిటన్ ఏమంటుంది?
జమ్మూ కాశ్మీర్ భారత దేశపు అవిభాద్య అంతర్భాగం. ఈ చారిత్రక వాస్తవాన్ని గుర్తించని పాకిస్తాన్ కాశ్మీర్ వివాదాన్ని సృష్టించింది. ఇలా సృష్టించడం భారత వ్యతిరేక మతోన్మాద బీభత్సకాండలో భాగం. ఈ బీభత్సకాండ కాశ్మీర్‌తో మొదలు కాదు. పాకిస్తాన్ ఏర్పాటుతో మొదలు కాలేదు…క్రీస్తుశకం 712లో మహమ్మద్ బిన్ కాసిమ్ మన దేశంలోకి చొరబడినప్పటినుంచీ ఇప్పటి వరకూ కొనసాగుతూనే ఉంది. ఇటీవల జైష్ ఏ మహమ్మద్ సంస్థకు చెందిన ముగ్గురు జిహాదీ ఉగ్రవాదులు కాశ్మీర్‌లో భద్రతా దళాలతో తలపడి హతులు కావడం ఈ కొనసాగింపులో భాగం. బెంగాల్‌లో ఇటీవల బంగ్లాదేశీయ మతోన్మాదులు జరిపిన పేలుళ్లు ఈ కొనసాగింపులో భాగం. ఇలా కొనసాగడం వల్లనే 1947 అక్టోబర్‌లో పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత హంతకులు కాశ్మీర్‌లోకి చొరబడడం ఈ జిహాదీ ఉగ్రవాదంలో భాగం. అందువల్ల కథాకథిత జమ్మూ కాశ్మీర్ సమస్య నిజానికి జిహాదీ మతోన్మాదంలో భాగం మాత్రమే. జిహాదీ టెర్రరిజాన్ని నిర్మూలించినట్టయితే కాశ్మీర్‌లో ఎలాంటి సమస్య ఉండబోదు. ఈ వాస్తవాన్ని పాకిస్తాన్ ఒప్పుకోదు. కానీ పాశ్చాత్య ప్రజాస్వామ్య దేశాలు కూడ గుర్తించనట్టు నటిస్తున్నాయి. అందువల్ల జమ్మూకాశ్మీర్ వివాదం పరిష్కారం కాకపోవడం హింసాకాండ కొనసాగించడానికి కారణమన్న పాకిస్తాన్ వాదాన్ని ఐరోపా దేశాలు కూడ అప్పుడప్పుడు వినిపిస్తున్నాయి.
పాకిస్తాన్ ఏర్పడడానికి పూర్వం ‘పాకిస్తాన్ ఏర్పడినట్టయితే, ఖండిత భారత్‌లోను పాకిస్తాన్‌లోను కూడ మతోన్మాద జిహాదీ హింసాకాండ అంతరించి పోయి ప్రశాంత పరిస్థితులు ఏర్పడి పోతాయన్న ప్రచారం జరగడం చరిత్ర. కానీ పాకిస్తాన్ ఏర్పడిన తరువాత జిహాదీ హింసాకాండ మరింత పెరిగింది. పాకిస్తాన్‌లో అన్యమత విధ్వంసకమైన ఏకమత రాజ్యాంగ వ్యవస్థ ఏర్పడింది. పాకిస్తాన్ ఏర్పడక పూర్వం అదే భూభాగంలో అనాదిగా సర్వమత సమభావ వ్యవస్థ నెలకొడం చరిత్ర. పాకిస్తాన్ ఏర్పాటుతో మతోన్మాద ఉగ్రవాదం అణగిపోలేదు. కాశ్మీర్‌లోకి చొరబడింది. ఇదే కాశ్మీర్ సమస్య. ఈ మతోన్మాదం కారణంగానే 83వేల చదరపు కిలోమీటర్ల జమ్మూ కాశ్మీర్ భూభాగం పాకిస్తాన్ దురాక్రమణలో కొనసాగుతోంది. ఈ దురాక్రమణ వివాదం బ్రిటిష్ వారు నిర్దేశించిన నియమావళి ప్రకారం జమ్మూ కాశ్మీర్ సంస్థానం 1947 అక్టోబర్ 26న భారత్‌లోవిలీనమైంది. బ్రిటిష్ రాణి నియమించిన బ్రిటిష్ పౌరుడైన గవర్నర్ జనరల్ వౌంట్ బాటన్ ఇందుకు ప్రత్యక్ష సాక్షి. అందువల్ల జమ్మూ కాశ్మీర్ భారత్‌లో విలీనం కావ డం వాస్తవమని బ్రిటన్ అప్పుడే ధ్రువీకరించి ఉండాలి. అలా ధ్రువీకరించకపోవడం ఐక్యరాజ్య సమితిలో వాస్తవాన్ని వివరించకపోవడం బ్రిటన్ ద్వంద్వ ప్రమాణాలకు, చారిత్రక నిదర్శనం. 1972 నాటి సిమ్లా ఒప్పందం తరువాత కాశ్మీర్ వివాదం ఐక్యరాజ్య సమితి పరిధి నుండి విముక్తమైంది. భారత పాకిస్తాన్‌ల ద్వైపాక్షిక వ్యవహారంగా మారింది. ఈ సంగతి తెలిసినప్పటికీ కాశ్మీర్‌ను మళ్లీ మళ్లీ అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావిస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఐరోపా దేశాలుకాని, అమెరికా కాని నిరసించడం లేదు. మానవ అధికారాలను పరిరక్షించే నెపంతో ఐరోపా పార్లమెంటు వారు గత పదేళ్లలో రెండు సార్లు కాశ్మీర్ గురించి చర్చించారు. భారత దేశపు ఆంతరంగిక వ్యవహారమైన జమ్మూ కాశ్మీర్‌లో అలా అక్రమంగా జోక్యం చేసుకున్నారు. 1993-2003 సంవత్సరాల మధ్య అమెరికా అధ్యక్షుడుగా ఉండిన బిల్ క్లింటన్ కాశ్మీర్ భారత్‌లో విలీనం కావ డం నిర్ధారిత వాస్తవం కాదని ప్రకటించి సంచలనం సృష్టించాడు. ఆ తరువాత అమెరికా ప్రభుత్వం మాటమార్చినప్పటికీ ‘పాశ్చాత్య అంతరంగ ఆకాంక్షలు’ మాత్రం అలా ఆవిష్కృతమయ్యాయి. ఇస్లాం మత దేశాల సమా ఖ్య-ఓఐసీ-దాదాపు ప్రతి సమావేశంలోను కాశ్మీర్‌ను ప్రస్తావించి భారత్‌ను నిరసిస్తూనే ఉంటారు.
ఇలాంటి అంతర్జాతీరుూకరణ పట్ల మన ప్రభుత్వం నిరసనలు తెలుపుతూనే ఉంది. లండన్‌లో కాశ్మీర్ యాత్రకు అనుమతి ఇవ్వడం పట్ల బ్రిటన్‌కు సైతం ఇప్పుడు నిరసన తెలిపింది. కానీ ఈ నిరసనలను పాశ్చాత్య దేశాలు ఖాతరు చేయకపోవడం వాస్తవం. టిబెట్‌ను దురాక్రమించిన చైనాకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రదర్శనలను ఐరోపా దేశాలవారు అడ్డుకుంటూనే ఉన్నారు. కానీ మనదైన కాశ్మీర్ విషయంలో మన దేశానికి వ్యతిరేకంగా జరిగే ప్రదర్శనలకు ఆ దేశాల వారు అనుమతి ఇస్తున్నారు. ద్వంద్వ ప్రమాణాలు ఇవీ…

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -49-

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -49-

49- రస గంగాధర కర్త -జగన్నాధ పండిత రాయలు

జగన్నాధుడు తూర్పు గోదావరిజిల్ల అమలాపురం తాలూకా ముంగండ గ్రామం లో జన్మించాడు .వేగినాటి బ్రాహ్మణుడు .తండ్రి పేరం భట్టుగొప్ప విద్వాంసుడు . తల్లి లక్ష్మి .ఇంటి పేరు ఉపద్రష్ట వారు .తండ్రి దగ్గరే పండితుడు విద్య నేర్చాడు తండ్రి అద్వైతాన్ని జ్ఞానేంద్ర భిక్షువు వద్ద ,న్యాయ వైశేషికాలను మహేన్ద్రుని దగ్గర ,వ్యాకరణ శాస్త్రాన్ని వీరేశ్వరుని  వద్దా అభ్యసించి మహా పండితుడని పించుకొన్నాడు అలాంటి సర్వ సమర్ధుడైన తండ్రి వద్ద విద్య నేర్వటం జగన్నాధుని అదృష్టం అందుకే తండ్రిని కీర్తిస్తూ ‘’మహా గురుం ‘’అన్నాడు .పండితుడు రాసిన ‘’మనోరమా కుచమర్దనం లో తన గురువు శేష వీరేశ్వరుడనీ చెప్పుకొన్నాడు .అంటే తండ్రికి కుమారుడికి వీరేశ్వరుడు గురువు అన్నమాట .ఇతనికాలం1590-1667గా లెక్కిస్తున్నారు .రస గంగాధరం అనే ముఖ్య మైన అలంకార గ్రంధం రాశాడు .అందులో అతడు కావ్యానికి చెప్పిన ‘’ రామణీయార్ధ ప్రతిపాదక  శబ్దః  కావ్యం’’ అన్న నిర్వచనం ప్రతివారి నాలుకలపైనా నర్తించిన వాక్యం .

ఏదోకారణం వల్లకాని లేక అక్కడ తనను సమర్ధుడుగా సాటి వారు గుర్తించ నందు వల్లకాని జగన్నాధుడు స్వగ్రామం వదిలి యవ్వనం లో ఢిల్లీ  చేరాడు ..అక్కడ ఒక రోజున ఇద్దరి మధ్య తగాదా జరుగుతుంటే చూశాడు వారు రాజుగారి కొలువులో ఫిర్యాదు చేసుకొంటే సాక్షిగా వెళ్ళిన జగన్నాధుడుతనకు వారి భాష రాక పోయినా  తూ చా తప్పకుండా వారిద్దరి మధ్య జరిగిన సంభాషణలను చెప్పాడు .అంతటి ఏక సంతాగ్రాహి .చక్రవర్తి ఆశ్చర్య పడి  నిజానిజాలు నిర్ణయించి జగన్నాదునిని ప్రతిభకు మెచ్చి ఆస్థాన పండితుని చేశాడట .ఆయనే షాజహాన్ చక్రవర్తి .షాజహాన్ పాదుషా పండితుని సమాదరించాడు  .షాజహాన్ తండ్రి జహంగీర్ కొలువులోను జగన్నాధుడు పండితుడుగా చలామణి అవటం విశేషం .జహంగీర్ చనిపోయిన తర్వాత ఉదయపూర్ రాజు జగత్ సింగు ఆశ్రయం పొంది ఆయనపై ‘’జగదాభరణ ‘’కావ్యం చెప్పాడు .1628లో దిల్లీ సింహాసనాన్ని  షాజహాన్ అధిస్టించగానే జగన్నాధుడు వచ్చి చేరాడు అని ఆరవిందశర్మ రాసిన ‘’పండిత రాజ కావ్య సంగ్రహ పీఠిక ‘’లో ఉంది .జగన్నాధుడు ఇక్కడి కొలువులో చేరటానికి ప్రోత్సహించింది షాజహాన్ మామ ,ముంతాజమహల్ తండ్రి అయిన ఆసిఫ్ ఖాన్ .దానికి కృతజ్ఞతగా పండితుడు ఆయనపై ‘’ఆసిఫా విలాసం ‘’కావ్యం రాసి అంకితమిచ్చాడు .జగన్నాధుని పాండిత్యాన్ని కవిత్వ ప్రాభవాన్ని గుర్తించిన షాజహాన్ జగన్నాదుడిని గొప్పగా సన్మానించి ‘’పండిత రాజు ‘’బిరుద ప్రదానం చేశాడు .సువర్ణాభిషేకమూ చేశాడు .

షాజహాన్ కొడుకు  దారా కు బాల్య గురువు జగన్నాదుడే .అందుకే దారా సంస్కృతం లో పేరుపొందిన కవి అయ్యాడు .ఔరంగ జేబు షాజహాన్ ను కారాగారం లో బంధించి , దారా మొదలైన అన్నదమ్ములని క్రూరంగా చంపించి పాదుషా అయ్యాడు 1666లో .ఈ రాజకీయ సంక్షోభానికి క్షోభ పడి జగన్నాధుడు అక్కడ ఉండలేక ఈ నాడు అస్సాం అని పిలువ బడే కామరూప దేశం చేరి రాజు ప్రాణ నాధుని  ఆస్థానం లో చేరి ,అతని పై ‘’ప్రాణాభారణ కావ్యం ‘’రాసి ఉంటాడని భావిస్తారు .ముసలితనం లో కాశీ చేరి ,తర్వాత మధుర వచ్చి యమునా నదీ  తీరం లో కాలం గడిపాడని అంటారు .

ఢిల్లీ లో ఉండగా జగన్నాధుడు ‘’లవంగి ‘’అనే ముస్లిం కన్యను ప్రేమించి పెళ్లి చేసుకోన్నాడని ఆమె షాజహాన్ ఆస్థానం లో చెలికత్తె అని ,ఆమెను తనకు ఇవ్వమని పాదు షాను కోరాడని ఇస్లాం మతం తీసుకొంటే ఇస్తానని చెప్పి స్వీకారానంతరం లవంగిని కట్ట బెట్టాడని కద ప్రచారం లో ఉంది .కాని మతం మారాడని ఎవరూ నిర్ధారించలేదు .లవంగిపై’’ భామినీ విలాస ‘’కావ్యం రాశాడు .కాశీలో గంగా నది ఒడ్డున భార్య లవంగితో కూర్చుని ‘’గంగా లహరి ‘’రచించాడని యాభై రెండవ శ్లోకం పూర్తీ అయ్యేసరికి గంగ క్రమంగా పైకి వచ్చి వారిద్దరిని తనలో కలుపుకోందని అంటారు .వృద్ధాప్యం లో ఉండగా మధుర లోశ్రీ కృష్ణ సన్నిధి లో  జగన్నాధుడు జీవించాడని చెప్పటానికి అతడు రాసిన ఒక శ్లోకం ఆధారం గా కని  పిస్తోంది .

‘’శాస్త్రాణ్యా కలితాని నిత్య విధయః సర్వేపి సంభావితా –డిల్లీ వల్లభ పాణి పల్లవ తలే నీతనం నవీనం వయః

సంప్రత్యు జ్ఘిత వాసనమ్మదుపురీ మధ్యే హరిహ్ సేవ్యతే –సర్వం పండిత రాజ రాజి తలకే నాకారి లోకాధికం ‘’.

జగన్నాధ పాండి తీయం

జగన్నాధ పండిత రాయలు రస గంగాధరం అనే అలంకార శాస్త్రాన్ని రాశాడు .ధ్వన్యాలోకం కావ్య ప్రకాశం తర్వాత దీనికే ప్రసిద్ధి ఎక్కువ ఇందు లోని విభాగాలను ‘’ఆననాలు ‘’అన్నాడు ..దీన్ని ఒక ఉద్గ్రంధం గా రాయాలని ప్రణాళిక తయారు చేసుకోన్నాడుకాని రాయలేక పోయాడని అంటారు .ఇప్పుడున్న రసగంగాధారం లో రెండే రెండు ఆననాలు ఉన్నాయి .జగన్నాధుడు చెప్పిన ‘’రమణీయార్ధ ప్రతి పాదకః శబ్దం కావ్యం ‘’అన్న రమణీయ మైన నూతన నిర్వచనం చెప్పాడు .దీనికి విపరీతమైన వ్యాప్తి కలిగింది .దీనికి మించిన నిర్వచనం లేదని విశ్లేషకుల భావన .ముందుగా కావ్య లక్షణాలు చెప్పి తర్వాతే కావ్య భేదాలను చెప్పాడు .కావ్యాలను ఉత్తమోత్తమ ,ఉత్తమ ,మధ్యమ ,అధమ అని నాలుగు రకాలు గా పేర్కొన్నాడు ధ్వని తోకూడింది ఉత్తమోత్తమ కావ్యమని ,వ్యంగ్య ప్రధానమైంది ఉత్తమ కావ్యమని ,గుణీ భూత వ్యంగ్యం ఉన్నది మధ్యమం అని, చిత్ర కావ్యం అధమ కావ్యమని విభజించాడు .మొదటిది జగన్నాధుడు స్వంతం గా చెప్పిన మాట .

జగన్నాధుడు రస గంగాధరం లో రసం గూర్చి విపులంగా చర్చించాడు .రస చర్చ ఉత్క్రుస్టం గా ఉంటుంది .ఆనంద వర్ధనుడి ధ్వని సిద్ధాంతానికి గొప్ప వత్తాసు పలికాడు .ధ్వని సిద్ధాంతాన్ని భరతుడి రస సిద్ధాంతం లోకి లాక్కొచ్చాడు .ధ్వనిని మెచ్చినా జగన్నాధుడు రస వాది అనే అనిపించుకొన్నాడు .రుయ్యకుడి మార్గాన్ని కొంత వరకు అనుసరించాడు .అలంకారాలలో ‘’తిరస్కారం ‘’అనే కొత్త అలంకారాన్ని వివరించాడు జగన్నాధుడు .సూత్రాలలోనే రసగంగాధారం రాశాడు తానె స్వయం గా విపులమైన వ్యాఖ్యనూ రాసుకొన్నాడు పండితుడు .మౌలికమైన తన భావనలు ప్రకటించాడు .అవసరమైన చోట్ల  ఆనంద  వర్ధన, ముమ్మటు లను విమర్శించ టానికి వెనుకాడ లేదు .జగన్నాధుని పాండితీ గరిమ ప్రతి దశలోనూ ప్రస్పుటం గా దర్శనమిస్తుంది .ప్రాచీన పండితులలో చివరివాడుగా జగన్నాధుడు పరిగణింప బడుతున్నాడు .అతనిది ప్రవాహ శైలి .తన కవిత్వం గురించి గర్వం గా –‘

‘’కవయతి పండిత రాజే కావ్యం త్వంఎపి విద్వాంసః –నృత్యతి పినాక పాణౌ నృత్యంత్యన్యే పి భూత భేతాళాః’’దీని భావం –పండిత రాజు కవిత్వం రాశాడు ఇతరకవులూ రాశారు .శివుడు నృత్యం చేస్తున్నాడు .భూత భేతాళాలూ నాట్యం చేస్తున్నాయి ‘’అని తక్కిన కవులను ఈసడించాడు .

జగన్నాధుడు అనేక చిన్న కృతులను రచించాడు .అందులో గంగాలహరి ఒకటి దీనికి పీయూష లహరి అనే పేరూ ఉంది. యాభై మూడు శిఖరిణీ వృత్తాల తో కమనీయ మనోహరం గా రాశాడు .రెండవది అమ్రుతలహరి .యమునా లహరీ అని కూడా పిలుస్తారు శార్దూల శ్లోకాలతో రాసిన యమునా నదీ స్తుతి .గంభీరం గా సరసం గా ఉంటుంది .మూడవది కరుణాలహరి .ఇందులో విష్ణు మూర్తి  ను వంశస్త ,సుందరీ మాల భారిణి వృత్తాలలో స్తుతించాడు .విష్ణు లహరి అంటారు .నాలుగవది లక్ష్మీ లహరి –నలభై ఒక్క శిఖరిణీ వృత్తాల తో లక్ష్మీ స్తుతి చేశాడు .అయిదవది సుధాలహరి ముప్ఫై స్రగ్ధరా వృత్తాలతో ఉన్న సూర్య స్తుతి ఇది .వీటిని ‘’పంచ లహరి ‘’అంటారు ఆరవది యమునా వర్ణన –తన రసగంగాధరం లో చెప్పిన మధ్యమ కావ్యానికి ఉదాహరణ గా దీన్ని రాశాడు .మిగిలినవి ఆసఫ్ విలాసం ,ప్రాణాభరణం ,జగాదాభరణం గురించి ముందే చెప్పుకొన్నాం .

జగన్నాధుని రసగంగాధరం తర్వాత ఎక్కువ ప్రాచుర్యమైనది భార్య లవంగిపై చెప్పిన ‘’భామినీ విలాస కావ్యం ‘’.ఇది ముక్తక కావ్య విభాగానికి చెందింది.ఇందులో నాలుగు విలాసాలున్నాయి ప్రాస్తావిక విలాసం ,శృంగార విలాసం ,కరుణ విలాసం ,శాంత విలాసం .మొదటి విలాసం లో నూట ఇరవై  తొమ్మిది, రెండులో నూట ఎనభై నాలుగు, మూడులో పందొమ్మిది ,నాల్గవ విలాసం లో నలభై ఆరు శ్లోకాలున్నాయి .వివిధ వృత్తాలలో దీన్ని రచించాడు. కోపించిన స్త్స్త్రీని భామిని అంటారు .అన్యోక్తులతో కూడి ఉన్న ముక్తకాలు మొదటి విలాసం లో ,స్త్రీ వర్ణన ,ప్రణయం రెండవ విలాసం లో మూడవ దానిలో వియోగ దుఖం ,నాల్గవ విలాసం లో వైరాగ్య, శాంత భావాలతో బాటు జగన్నాధుని శ్రీకృష్ణ భక్తికూడా ఉంటుంది .

పండిత జగన్నాధ రాయలు ఏదిరాసినా హృదయానికి తాకేట్లు రాసే నేర్పున్న మహా కవి .చదివి ప్రేరణ పొందుతాం తన ప్రియురాలి అమృత విలాసమే కవిత్వం గా పరిణమించిందని చెప్పుకొన్నాడు

‘’కావ్యాత్మనా మనసి పర్యమణన్ పురామే –పీయూష సార సద్రుశాస్తవ ఏ విలాసాః

తానంత రేణ రమణీ రమణీయ శీలా –చేతో హరా సుకవితా కవితా కధన్నః ‘’

శబ్దాలంకారాలు వాడినా రస సౌందర్యం దెబ్బ తిన కుండా ఔచిత్యం పాటించాడు ‘’మధువు ,ద్రాక్ష ,అమృతం ఆధర సుధా అందరికీ ఆనందాన్ని ఇవ్వక పోవచ్చు కాని తన కవిత్వం మాత్రం అందరికి ఆనందాన్నిస్తుందని జబ్బ చరఛి  చెప్పాడు .అలా ఆనందం పొందని వాడు జీవచ్చవం అని శాపనార్ధాలూ పెట్టాడు మహాను భావుడు .

‘’మధు ద్రాక్షా సాక్షా దమృత మధ వామాధరసుధా –కదాచిత్ కేషాం చిన్న ఖలు విదదీరన్నపి ముదం

ధృవం తే జీవంతో ప్యాహహ మ్రుతకా మంద మతయో –నఎశా మానందం జనయతి జగన్నాధ భణితిః’’’

ఈ దర్పం ,అహంకారం శాస్త్ర రచనలలోనే చూపించాడు పండితుడు .కావ్యాలలో చాలా సౌమ్యం గానే ఉన్నాడు. అతని శాస్త్ర పాండిత్యం అంత  ధిషణాహంకారం తో  ఉండేదన్న మాట .కవిత్వం పాండిత్యం మౌలికత త్రివేణీ సంగమం గా వర్ధిల్లిన వాడు జగన్నాధ పండిత రాయలు .తెలుగు వారికి గర్వకారణమైన వాడు .మహోన్నత సంస్కృత సాహిత్యంయుగం జగన్నాధ పండితుని తో ముగిసింది .అలాంటి మౌలిక పాండిత్యం ఉన్న కవి శ్రేష్టుడు మళ్ళీ జన్మించనే లేదు .

Inline image 1  Inline image 2

మరో కవిని తర్వాత కలుద్దాం

సశేషం

దీపావళి శుభాకాంక్షలతో –

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-10-14-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -48

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -48

48-ప్రతాప రుద్ర యశోభూషణ కర్త –విద్యానాధుడు

విద్యా నాధుడు అసలు పేరు కాదని ,అది అతని విద్వత్తుకు పొందిన బిరుదని తెలుస్తోంది .విద్యా నాధుడు అనగానే గుర్తుకు వచ్చేది ఆయన రాసిన ప్రతాపరుద్ర యశోభూషణం అన బడే ”ప్రతాపరుద్రీయం ”అనే అలంకార శాస్త్రం .ఈయన అసలు పేరు ”అగస్త్యుడు ”గా భావిస్తున్నారు .విద్యానాధుడు కాకతీయ చక్ర వర్తి ప్రతాప రుద్రుని ఆస్థాన కవి .జీవిత కాలము  క్రీ.శ.1292 నుంచి 1323 వరకు గా తెలుస్తోంది  .ప్రతాప రుద్రీయం లో ”ఔన్నత్యం యది వర్ణ్యతే ,తత్వం వర్ణ ఇతుం -బిభేమి యదివా ,జాహాస్త్మ్య గస్త్య స్తితిస్త్వత్సా ,ర్మ్యే-గుణ రత్న రోహిణి గిరే శ్రీ వీర భద్ర ప్రభో ”అని తాను అగస్త్యుడనే భావాన్ని తెలియ జేశాడు విద్యా నాధుడు .ఈ అలంకార గ్రంధాన్ని ప్రతాప రుద్ర మహా రాజుకు అంకితం ఇచ్చాడు .అద్భుతమైన ,పాండిత్యం వల్లనే అగస్త్యుడికి విద్యా నాధుడు అనే పేరు వచ్చిందని చాలా మంది భావిస్తున్నారు .
అయితే ఆంద్ర దేశం లో విద్యా నాధుడు గానే చలా మణి అయాడు .”సౌగందికాపహరణం ”రాశాడు .ఇందులో అగస్త్యుడు తన మేన మామ అని చెప్పు కొన్నాడు .విద్యానాధుని శిష్యురాలు గంగా దేవి అనే కవయిత్రి .ఈమె ”మధురా విజయం ”అనే ”వీర కంప రాయల”చరిత్రను రాసింది .ఇందులో ఈమె ,అగస్త్యడు గొప్ప కవి అనీ ,74 గ్రంధాలు రాశాడని
తెలియ జేసింది .అందులో విద్యానాధుడు ”బాల భారతం ”అనే మహా కావ్యం రాశాడని చెప్పింది .దీన్ని ఆధారం గా చేసుకొని తమిళ కవి ”విల్లి పుత్తు రాన్ ”తమిళ భారతం రాశాడుతెలిపింది ..
విద్యా నాధుని రెండో రచన –”కృష్ణ చరిత్ర ”అనే గద్య కావ్యం .మూడవ రచన –”నల కీర్తి కౌముది ”అనే 24 సర్గల కావ్యం .ఇందులో రెండు సర్గలు మాత్రమే లభించటం దురదృష్టం .
విద్యా నాధుడు చాలా స్తోత్రాలు రాసి నట్లు తెలుస్తోంది .అందులో ముఖ్యమైనవి .దశావ తార స్తోత్రం ,లక్ష్మీ స్తోత్రం ,శివ స్తవం ,శివ సంహిత ,లలితా సహస్ర నామం ,మణి పరీక్ష.సకలాధి కారం విశ్వనాధ క్రుతులుగా ప్రచారం లో వుంది .ప్రతాప రుద్ర మహా రాజు మణి, మాణిక్య ,వజ్రాలను పరీక్షించటం లోగొప్ప  నేర్పున్న వాడు అని చరిత్ర చెబుతోంది.వేదం వెంకట రాయ శాస్త్రి గారు రాసిన ”ప్రతాప రుద్రీయ నాటకం ”లో ఈ విషయం వుంది .అంతే కాదు శాస్త్రి గారు ,ఆ నాటకం లో ”విద్యా నాదుడిని ”ఒక పాత్ర చేసి మంచి ప్రాముఖ్యాన్ని చ్చారు .రుద్రుడిని బందీ చేసి ధిల్లీ తీసుకొని పో తున్నప్పుడు ముందుగా బ్రాహ్మణ వేషం లో నది లో మునిగి పోతున్నట్లు నటించి ,ముస్లిం పాలకుల సాను భూతి చూర గొని ,వారి కోరిక మీద ప్రతాప రుద్రున్ని తీసుకు వెళ్తున్న ఓడ లో ఎక్కాడు .రాజు తో పరిచయం చేసు కొన్నాడు ..రాజు బందీ అయిన సమాచారాన్ని యుగంధర మంత్రికి,జనార్దన మంత్రికి తెలియ జేశాడు .చాకలి పేరి గాడికి సభా మర్యాద లను నేర్పి నట్లు వేదం వారు నాటకం లో చూపించారు .ఇతని పాత్రను చాలా ఉదాత్తం గా చూపించటమే కాదు ,అతనిలోని దేశ ,రాజ భక్తికి పట్టం కట్టారు వేదం వారు .
విద్యా నాధుడు ”అగస్త్య నిఘంటువు ”రాశాడని ”ఘనశ్యాముడు ”అనే కవి తన ”ఉత్తర రామ చరిత్ర వ్యాఖ్యానం ”లో చాలా సార్లు ఈ నిఘంటువు గురించిన ప్రస్తావన చేశాడు . .చాలా శబ్దాలను ఘన శ్యామ కవి ఇందులోనుంచి  ఉదహరించినట్లు తెలుస్తోంది .అయితే ఇది అలభ్యం అవటం ఆంద్ర సరస్వతి చేసు కొన్న దురదృష్టం .
అగస్త్యుడయితేనేమి ,విద్యా నాదుడయితే నేమి మహా ఆలన్కారికుడు ,ప్రతాప రుద్ర యశోభూషణ కర్త విద్యానాధుడు .అతని పూర్తి చరిత్ర కూడా లభ్యం కాక పోవటమూ,బాధ గానే వుంది .

ప్రతాప రుద్రా యశో భూషణం లో తొమ్మిది ప్రకరణాలున్నాయి .వీటిలో దృశ్య కావ్యాల గురించి శ్రవ్య కావ్యాల గురించి వివరించాడు .విద్యనాధుని అలంకర వివరాలను మల్లినాద సూరి చాలా చోట్ల ఉదాహరించాడు ..అప్పయ్య దీక్షితులు విద్యా నాధుదు చెప్పిన ఉపమాలంకార లక్షణాలతో ఏకీభ వించలేదు .మల్లినాధుడు విద్యాధరుడు అనే అలంకార శత్ర వేత్త రాసిన’’ ఏకావళి’’ కి వ్యాఖ్య రాస్తే ,అతనికుమారుడు ‘’ప్రతాప రుద్రీయం ‘కు ’’రాత్నాపనం ‘’అనే విపుల వ్యాఖ్యానం రాశాడు .విద్యాధరుడు కాని  విద్యానాదుడుకాని కొత్త కావ్య సిద్ధాంతాలను వేటినీ ప్రతిపాదించలేదు .ఉన్నవాటినే సులభం గా అర్ధమయ్యే రీతిలో రాశారు అంతే.

గంగా దేవి అనే  కవయిత్రి విద్యానాదుడిని తన మధురా విజయం లో గురువుగా చెప్పుకొన్నది .విద్యానాధుడు ‘’సౌగందికాపహరణం ‘’అనే వ్యాయోగం ను రచించాడు .ఇది ఒకే అంకం కలిగి ఉన్నది .భీముడు ద్రౌపదికోరిక తీర్చటానికి సౌగంధిక పుష్పాన్నిఅపహరించి  తీసుకు వచ్చే కద ఇందులో ఉంటుంది ,మహాభారత కద ఇది .ఇందులో భీముడు హనుమంతుని ఎదిరించటం ఉంది .ఇద్దరి మధ్య రసవత్తర సంభాషణలు నడుస్తాయి .వీర శౌర్య ప్రధానం .ఈ వ్యాయోగాన్ని ‘’ప్రేక్షణకం ‘’అన్నాడు విద్యానాధుడు .క్షేమేంద్రుడు ప్రేక్షణకం ను ఉపరూపకం లో ఒక భేదం గా చెప్పాడు .సహజం గా ప్రేక్షణకం లో ప్రాకృత భాషల ప్రయోగం ఉంటుంది .అందులోనూ శౌరసేనికి అధిక ప్రాధాన్యం ఉంటుంది .ముఖ సంధి,నిర్వహణ సంధి  రెండే ఉంటాయి .సూత్రదారుడితో పని ఉండదు. ప్రవేశిక ,విష్కంభాలు కూడా ఉండవు .నాయకుడు ఉత్తమ వంశ సంజాతుడుగా ఉండాలనే నియమం లేదని సాహిత్య దర్పణం లో ఉంది .ఇవన్నీ పరిశీలిస్తే విద్యానాధుడు రాసిన దానిలో ఇవేవీ లేవు .అంటే ప్రేక్షణక ధర్మాలేవీ లేవు .కనుక  సౌగందికాపహరణం వ్యాయోగ లక్షణాలు సంపూర్ణం గా ఉన్న’’ వ్యాయోగమే’’ సందేహం లేదు .

విద్యానాదుడే మొట్టమొదటి సారిగా ‘’త్రిలింగ ‘’శబ్దాన్ని వాడాడు .’’త్రికళింగ ‘’ నుంచి తెలుగు శబ్దం ఏర్పడిందని చిలుకూరి నారాయణ రావు గారన్నారు .తేనె +అగు =తెనుగు అయిందని గ్రియర్సన్ చెప్పాడు విద్యానాధుని అలంకర శాస్త్రం అయిన ప్రతాప రుద్రా యశో భూషణం ను తెలుగులోకి మహా మహోపాధ్యాయ శ్రీ జమ్మల మడక మాధవ రామ శర్మ గారు అనువదించారు ..

మరోకవితో కలుద్దాం

సశేషం

దీపావళి శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-10-14-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

భ.కారాయమ్ -కె బి లక్ష్మి తెలుగు విద్యార్ధి -సెప్టెంబర్

దీపావళి పై ఆలూరి బైరాగి కవిత -తెలుగు విద్యార్ధి -సెప్టెంబర్bairagi 0012bhakara 001 3bhakara 001 bhakara 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ షీలా వీర్రాజు గారికి బాపు -రమణ ల స్మారక పురస్కారం -తెల్గుగు విద్యార్ధి -సెప్టెంబర్

silavi- 001 D25711232

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మధురాంతకం ”ఎదురు గాలి ”కధలో లేఖన పధ్ధతి ”-పి శిరీష కుమారి -మూసి -అక్టోబర్

bharatmata 001kolhapur 001madhurantakam 1 001 madhurantakam 2 001 madhurantakam 3 001 kolhapur 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మా ఆత్మీయ మిత్రుడు శ్రీ పసుమర్తి ఆంజనేయ శాస్త్రి దంపతులు మా ఇంటికి రాక

మా ఆత్మీయ మిత్రుడు శ్రీ పసుమర్తి ఆంజనేయ శాస్త్రి దంపతులు మా ఇంటికి రాక

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

విశ్వనాధ’’ స్వగ్రామం లో నందమూరు లో వర్ధంతి సభ

విశ్వనాధ’’ స్వగ్రామం లో నందమూరు లో వర్ధంతి సభ

సరసభారతి 71వ సమావేశం గా కవిసామ్రాట్ ,తోలి తెలుగు జ్ఞాన పీఠపురస్కార గ్రహీత  ,కళాప్రపూర్ణ ,పద్మ భూషణ్ స్వర్గీయ శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారి 38వ వర్ధంతిని విశ్వనాధ వారి స్వగ్రామం  ఉంగుటూరు మండలం లోని నందమూరులో ,వారి తండ్రిగారు శోభనాద్రి గారు  నిర్మించిన శ్రీ గంగా అన్నపూర్ణా సమేత కాశీ విశ్వేశ్వరాలయం లో 19-10-14ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహించింది . అతిధులను వేదికపైకి సరసభారతి కార్యదర్శి శ్రీమతి మాది రాజు శివ లక్ష్మి ఆహ్వానించగా ఛి బిందు దత్తశ్రీ దైవ ప్రార్ధనతో సభ ప్రారంభ మైంది .విశ్వనాధ చిత్రపటానికి పూలమాల వేసి ,పుష్పాలను సమర్పింఛి ,ఇటీవల హుదు హుదూద్ తుఫాన్ లో అసువులు కోల్పోయిన వారికి ,ప్రఖ్యాత రచయిత్రి ,రేడియో అక్కయ్య శ్రీమతి తురగా జానకీ రాణి గారి మరణానికి అందరు లేచి నిలబడి మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించాము .

సభాధ్యక్ష స్థానం లో ఉన్న నేను ముందుగా ఈ సమావేశానికి నరసరావు పేటనుండి రావలసిన అతిదులలో లెక్చరర్ శ్రీమతి యడవల్లి మనోరమ గారికి నిన్న సాయంత్రం కాలేజి నుండి ఇంటికి ఆటో లో వస్తూండగా యాక్సిడెంట్ జరిగి తీవ్రగాయాలైనాయని ,ఆమె కదిలే స్తితిలో లేదని రాత్రి ఫోన్ వచ్చిందని ,ఆమెను అలా వదిలి తాము రాలేక పోతున్నామని నరసరావు పేట నుండి రావలసిన మరోఅతిధి శ్రీ ప్రసాద్ తెలియ జేశారని చెప్పి  అనుకోకుండా జరిగిన ఈ అవాంతరానికి బాధ పడుతున్నానని సభకు వచ్చిన వారికి తీవ్ర నిరాశ కల్గిన్చినందుకు మన్నించమని తెలియ జేశాను .

తరువాత విశ్వనాధ స్వగ్రామం లో వారి వర్ధంతి సభను ,వారిదైన ఆలయం లో నిర్వహించటం చాలా  ఆనందం గా  ఉందని  గ్రామస్తులిచ్చిన సహాయ సహకారాలకు అభినందనలు తెలియ జేశాను .పింగళి లక్ష్మీకాంతం గారి  జయంతిసభను జనవరిలో వారి స్వగ్రామం చల్ల పల్లి దగ్గర చిట్టూర్పు లోను,ప్రముఖ సినీ సంగీత దర్శకులు  శ్రీ పెండ్యాల నాగేశ్వర రావు గారి వర్ధన్తిసభను స్వగ్రామం కాటూరులోను ఇప్పుడు ఈ సభను ఇక్కడ , సరసభారతి నిర్వహించటం సరసభారతి అదృష్టమని మూడు చోట్లా స్పందన బాగా వచ్చిందని దీన్ని నిలబెట్టుకోవాలసిన బాధ్యత గ్రామస్తులదేనని చెప్పాను .విశ్వనాధ నేను బెజవాడ ఎస్ ఆర్ ఆర్ కాలేజిలో ఇంటర్ డిగ్రీ చదివినప్పుడు తెలుగు బోధించారని ,ఆయన కాలం లో నా లాంటి వారు ఉండటం మా లాంటివారికి గొప్ప అదృష్టం అన్నాను .విశ్వనాధ గొప్ప మార్గ దర్శకులని వారి మార్గం వేదమార్గమని ,వారి రచనలు హితోపదేశాలని అన్నాను .రామాయణ కల్ప వృక్షం ,వేయిపడగలు ఆధునిక ఇతిహాసాలని వాటికి విలువ పెరిగేదేఆని తరిగేది కాదని చెప్పాను .ఆయన ఊహలు వాటిని పోషించేతీరు అనన్య సదృశం అన్నాను . Sarasabharathi 71 141019_0001 Sarasabharathi 71 141019_0002

‘’ఆకృతి రామ చంద్రు విభవాకృతి –కన్బొమ తీరు స్వామి చాపాక్రుతి –కన్నులన్ ప్రభు క్రుపాక్రుతి ,కైశిక మందు రామ దేహాక్రుతి –సర్వ దేహమున యందున రాఘవ వంశ మౌళి ధర్మాక్రుతి –కూరుచున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞ మూర్తియై ‘’అన్న పద్యం లో రాముడికి సీతకు అభేదాన్ని గొప్పగా  సృస్టించారని అన్నాను .రాముడు దయామూర్తి .ఈ  విషయం  సీత కళ్ళు చెబుతున్నాయి. మించిపోతే ఏం జరుగుతుందో విల్లులాంటి కను బొమ్మలు చెబుతున్నాయి .రాముడు ధర్మ ప్రతిజ్ఞకలవాడు .ఆయన శృంగారం ధర్మ బద్ధం .ఇదంతా సీత కూర్చున్న తీరులో స్పష్టం చేశాడు విశ్వనాధ ..ఇంతటి గొప్ప భావం అద్ద్వైతభావం నిక్షిప్తం చేశాడు విశ్వనాధ .అందుకే ఈ భావనలను ఆపోసన పట్టిన శ్రీ కేతవరపు రామ కోటి శాస్త్రి అంటే కాకతీయ యూని వర్సిటి లో తెలుగు ప్రొఫెసర్ శ్రీమతి కాత్యాయినీ విద్మహే తండ్రి గారు తనకు ముక్తికంటే విశ్వనాధ సాహిత్య స్నానమే ముక్తి అన్నారు .

‘’పోరాపాటై జని యించితిని ప్రభూ !సరే  పోనీ మరీ జన్మకున్ –పరమోపజ్ఞాన నిధాన ,దివ్య దిషణాభ్రాజిష్ణువౌ ,విశ్వనాధ రాసోదంచిత -సాహితీ విమల తీర్ధ స్నాన పూతాత్మగా  కరుణిం పం దగు  ముక్తి మాట అటుపై –కాశ్మీర నేత్రచ్చవీ ‘’ .విశ్వనాధకు కల్ప వృక్షం లో అంతా యజ్నమయం గా దర్శన మిస్తుంది అదీ అయన గొప్పదనం .

చిన్ననవలలో విశ్వనాధ‘’విశ్వ నాదం ‘’వినిపించాడు .వీరవల్లడు నవలలో వల్లడు హరిజనుడు వల్లప్పా అని అందరూ పిలుస్తుంటే తల్లిని తన పేరు మార్చమని అడుగుతాడు .ఇది తండ్రివిని ఒక కద చెబుతాడు అదే నవల .వల్లడు పాలేరు తాత తండ్రి తాన తరం దాక హరిజనుడు .దొర చనిపోతే కుటుంబాన్ని ఆడుకొంటాడు మళ్ళీ దొర ఇంట్లో దీపం పెట్టె దాక విశ్రమించను అని ప్రతిజ్ఞ చేస్తాడు .అలా చేసి చూపించి తన్ను ప్రేమించిన వారితో సహా సర్వం కోల్పోతాడు .కులం కంటే మానవత్వం గొప్పదన్న సంస్కారం ఉన్నవాడు వల్లడు .ఇందులో ధార్మిక ప్రవ్రుత్తి ఔదార్యం కనిపించి వాటికి వల్లడు ప్రతీకగా చూపాడు విశ్వనాధ .

మా బాబు నవల హింసకు ,పరిహాసానికి గురైన బాబు లో కారుణ్యం ,జీవిత పరిమళం వికసింప జేయటం ఉంది .తనను చంపాలనుకొన్న పాముల వాడికి ప్రాణ భిక్ష పెట్టటం  పరాకాష్ట.కుశాలమ్మ గొప్ప పాత్రకూడా .కుణాలుని శాపం నవలలో స్నేహ మాధుర్యం గొప్పతనం వివరణ ఉంది. అధికారదుర్వినియోగం ,పదవీకాంక్ష పనికి రాదనీ చెప్పాడు వీటన్నిటికంటే స్నేహం ,ధర్మ రక్షణ ,మానవత ,మంచితనం అవసరం అని చెప్పెనవల .

హాహా హూ హూ నవలలో మానవుని అల్పత్వాన్ని తెలియ జేశాడు విశ్వనాధ .-లండన్ ట్రెఫాల్గర్ స్క్వేర్ వద్ద ఒక వింత జంతువు  పది ఉంటే చూడటానికి చాలా మందివస్తారు భాషా వేత్తలూ ,మతపెద్దలూ చేరతారు .ఆ జంతువూ మెడవరకు మనిషి. తల గుర్రం తల .జూలు ,నిక్కించిన చెవులు .చేతులకు కాళ్ళకు కడియాలు .ఒళ్ళంతా గాయాలు మూర్చలో ఉంటుంది .పది హీను రోజుల తర్వాత ‘’కిం గతోస్మి ‘’ అంటుంది  అంటే నాకు ఏమైంది ?అని .ఇదివిన్న భాషా పండితుడు  దానికి సంస్కృతం వచ్చు అని గంతులేస్తాడు .ఒక బిషప్ వచ్చి దాన్ని ఏ కులం అని అడిగితె ‘’ఆహా అల్పతామనుష్యాణాం’’అంటుంది అంటే యెంత అల్ప బుద్ధి మానవులది అని అర్ధం .భారతీయ సంస్కృతీ  భారతీయత ,భాష గోప్పతనాలను ఇందులో చెప్పాడు .

కడిమి చెట్టు చారిత్రాత్మక నవలలో కదంబం అనే వంశం కదా .ఆ చెట్టు తో బాటు శుక్ల పక్ష చంద్రుని గా పెరుగుతాడు మయూర శర్మ  అనే కుర్రాడు.శాత వాహన రాజ్యం లో స్తానా కోడూరు పల్లవుల వశమౌతుంది పల్లవులు పాశవికం గ మయూరుని తల్లి తండ్రి అక్క తాతలను చంపేస్తారు .వారిపై పగ తీర్చుకోవాలనుకొంటాడు శర్మ .అతన్ని రామ శర్మ పెంచుతాడు .నిద్రలో కూడా శత్రువును చంపుతున్నట్లే కలకనే వాడు.ఈ బాలుడిలో మహా పురుష లక్షణాలు గుండెలో శౌర్య రేఖ ఉన్నాయని వైద్యుడు గమనిస్తాడు .చివరికి పగ తీర్చుకొంటాడు మయూర శర్మ .ఇందులో జాతిని సంరక్షించుకోవటం ,తెగువ సాహసం సంస్కృతీ పరిరక్షణం ఉన్నాయి .

ఇప్పుడు మనం తెలుసుకొన్న నవలలో –వీరవల్లుడు లో మానవత్వం ,మా బాబులో కృతజ్ఞత ,కడిమి చెట్టులో పట్టుదల హాహా హూహూ లో భారతీయ సంసృతి విశిష్టత ప్రతిస్తితమైంది .ఇవే చిన్ననవలలో విశ్వనాధుని విశ్వ నాదం .ఏ యిజమూ గట్టేకించదు .వేదిజం ఒక్కటే శరణ్యం .భారతీయ మందిరానికి ఎన్నో దారులున్నాయి .అందులో తెలుగు దారిపేరు విశ్వనాధ ‘’అన్నారు ప్రముఖ  కధకులు శ్రీ వాకాటి పాండురంగా రావు .దేశ కాలాలకు అతీతం గా ఉన్న భారతీయ సంసృతి  క్షీణిస్తోందని ,తన రచన నిండా కన్నీరు కార్చిన మహానుభావుడు విశ్వనాధ –ఆ తపస్వి అన్నీటి ధారలోంచి ఘనీభవించిన మహోజ్వల రత్నమే రామాయణ  కల్ప వృక్షం  .కల్ప వృక్షం ,వేయి పడగలు రెండూ ఆధునిక ఇతిహాసాలే అన్నారు ఆచార్య కోవెల సుప్రసన్నా చార్య .వేయిపడగలలో విశ్వ లయఉంది  మూల చైతన్యం లో  అనంత చైతన్యాన్నిమానవీయ విలువలను నెలకొల్పాడని వాల్మీకి సుందర కాండలో సుందర హనుమంమంత్రం  నిక్షేపిస్తే  విశ్వనాధ కల్ప వృక్షం లో ‘’ఆపదుద్ధారక హనుమంమంత్రం ‘’ను నిక్షేపించాడని యుద్ధ కాండ  అంతా  రావణుడి ఈశ్వర అన్వేషణ మేనని  రాముడు నారాయణ స్వరూపం అని తెలిసుకోగానే రావణ వధ జరిగిందన్ దైత్య ప్రవ్రుత్తి  నశించి దివ్య ప్రక్రుతి అతనీలో విజ్రుమ్భించిందని ,భారతీయ సారస్వతం లో కైలాస శిఖరం కల్ప వృక్షమని మని ,వేయిపడగలులో కుండలినీ విద్య ఉందని ధర్మారావు మనీషి ,రామేశ్వర శాస్త్రి భూమిక  ,అరుంధతి ఆరోహణ చైతన్యం గిరిక  హృదయం అన్నారు సుప్రసన్న .విశ్వనాధ ది హరి హరాద్వైతం .ఆయనకు శివుడిలో విష్ణువు  విష్ణువు లో  శివుడు కనిపిస్తారు .తిరుమల శ్రీనివాసుడి  చేతిలో చక్రం  శివుడి చేతికి చుట్టుకొన్న చేతికి  వాసుకిగా ,శంఖం గజముఖు డైన వినాయకుడుగా ,నిలువు బొట్లు త్రిశూలం గా దర్శించాడు విశ్వనాధ .మున్నంగి వేణు గోపాల శతకం లో వేణుగోపాలుడి నెమలి పించం సురగంగ తరంగాలుగా ,పిల్లన గ్రోవి శివుడి ఆయుధం ఖట్వాంగం గా   ,రత్న హారాలు పాకే పాముల్లా కనిపించాయి విశ్వనాధకు  .వేయిపడగల పాము  సుబ్రహ్మన్యేశ్వరుడు  సృష్టికి మూల ద్రవ్యం కు ప్రతీక సకల ఊహల  సనాధుడు విశ్వనాధ .అయన కధల్లో మాక్లీ  దుర్గం లో కుక్క .ఏమి సంబంధం  రెండూ భారతీయ భాషల్లో మోగిన మాణిక్య వీణలు .

శ్రీ శ్రీ ,విశ్వనాధలవి భిన్నమార్గాలైనా ఒకరిపై  మరొకరికి గౌరవం ఉన్నవారు .ఒక సారి శ్రీ శ్రీ ‘’మదరాసు నగర వీధుల్లో ఆకలితో మాడుతూ తిరుగుతున్న రోజుల్లో నా ప్రాణాన్ని నిలబెట్టినవి రెండే –ఒకటి  కార్పోరేషన్ కుళాయి నీళ్ళు రెండవది ,విశ్వనాధ సత్యనారాయణ కవితా ‘’అని రాసుకు న్నాడు .అలాగే విశ్వనాధపై రాసిన ఒక గీతం సుప్రసిద్ధమైనది –

‘’మాటలాడే వెన్నెముక –పాట పాడే సుషుమ్న –నిన్నటి నన్నయ భట్టు –ఈ నాటి కవి సమ్రాట్టు –గోదావరి పలక రింత –కృష్ణా నది పులకరింత –కొండవీటి పొగమబ్బు –తెలుగు వాళ్ళ గోల్డు నిబ్బు –అకారాది క్షకారాంతం –ఆ సేతు మిహికావతంశం –అతగాడు తెలుగు వాడి ఆస్తి –అనవరత తెలుగునాటి ప్రకాస్తి –ఛందస్సులేని ఈ ద్విపద –సత్యానికి నా ఉపధ ‘’.

ఇంతటి విశిష్ట వ్యక్తిని ఇక్కడ వారి స్వగ్రామం లో స్మరించు కోవటం  మనందరి అదృష్టం .దీనికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు ‘’అని చెప్పాను

ఇక్కడ ఈ సభ జరుగుతుందని తెలిసి విని గన్నవరం శాసన సభ్యులు శ్రీ వల్లభనేని వంశీ గారి తండ్రి గారుశ్రీ రమేష్ చంద్ర  ఆత్మీయ అతిధులుగా విచ్చేసి తనకు విశ్వనాధపై ఉన్న ఆరాధనా భావాన్ని చాటుకొన్నారు .ఆయన రచనలన్నీ చదివానని సంస్కారం మూర్తీభవించిన వ్యక్తీ విశ్వనాధ అని మంచి హాస్య ప్రియులని ,ఆయన రచనలో జీవం ఉంటుందని అదే అందరికి ఆకర్షణ అని ,ఇంత వివిధ్యం తో ఇన్ని ప్రక్రియలలో అసమాన పాండిత్యం తో రచనలు చేసిఉన వారు అరుదని, వారు నందమూరులో జన్మించటం మనందరి అదృష్టమని ప్రముఖ సినీ దర్శక నిర్మాత గూడవల్లి రామ బ్రహ్మం గారిది కూడా నందమూరు అని చెప్పారు .

శ్రీ విశ్వనాధ సత్యనారాయణ మాటల్లో విశ్వనాధ మనుమలం అని చెప్పుకోవటం తమకు గర్వం గా ఉందని ,అయన పేరిట ట్రస్ట్ ఏర్పరచి ఆర్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్ని రచనలు రెడీగా ఉన్నాయని చెప్పారు వేయిపడగలలోని సుబ్బన్న పేట నందమూరు  అని గిరిక తిరగటం ,స్వామి ఉత్సవ వైభవాలు ,జమీందారు దేవిడీ ఈ గ్రామంలో ఉన్నట్లు  చదివితే గొప్ప అను భూతి కలుగుతుందని ,సరసభారతి ఇక్కడ ఈ కార్యక్రమం చేయటం  హర్షణీయమ న్నారు . సత్యనారాయణ తమ్ముడు కూడా తాతగారి పద్యాలుపాడి స్మరించాడు .విశ్వనాధ మునిమనవడు ,సత్యనారాయణ కుమారుడు చిరంజీవి  శ్రీ పావని చాలా బాగా  శ్రావ్యం గా విశ్వనాధ పద్యాలను గానం చేసి అందరిని అలరించి వారసత్వాన్ని నిలిపాడు .సరసభారతి ఈ చిన్నారికి అతని తండ్రిశ్రీ  సత్యనారాయణకు ,శ్రీ రమేష్ చంద్ర కు శాలువాలు కప్పి సత్కరించి శ్రీ సువర్చలాన్జనేయ స్వామి జ్ఞాపికలను ప్రదానం చేసింది .మిత్రులు శ్రీ ఆంజనేయ శాస్త్రి గారు నాకు పట్టు బట్టలు పెట్టి సత్కరించారు .

సభ ప్రారంభానికి ముందు శ్రీ గుడిసేవ భాస్కర దాసు గారు సుందరకాండ పారాయణ చేస్తే ,బిందు దత్తశ్రీ భగవద్ గీతా పారాయణ చేసింది .సుమారు యాభై మంది పాల్గొన్న ఈ సభ జయ ప్రదయమై అందరికి ఆనందాన్ని, సంతృప్తిని కలిగించింది .ఊహించని స్పందన ఇది .ఉయ్యూరు నుంచి మాతో పాటు కారులో ఇక్కడికి శ్రీ ఆంజనేయ శాస్త్రి ,శ్రీమతి మల్లికాంబ  ,శ్రీ వి బి జి రావు వచ్చారు. రావు గారు ఏంతో గొప్పగా సహకరించి ఫోటోలు ,వాయిస్ రికార్డ్  పనులను చూసి కార్యక్రమ నిర్వహణ కు  తోడ్పడ్డారు .శ్రీమతి శివలక్ష్మి వందన సమర్పణ ,జనగణ మణ  తో కార్యక్రమం సమాప్తమైంది .ఒక  గొప్ప అనుభవాన్ని, అనుభూతిని ఇచ్చిన కార్యక్రమగా నిలిచిపోయింది ఇది .అప్పటిదాకా వాన భయ పెట్టినా ,దోబూచులాడినా కార్యక్రమం మొదలవగానే మంచి ఎండ వచ్చి వరుణుడూ దీవించి సహకరించాడు .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-10-14-ఉయ్యూరు

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఉద్యమ స్ఫూర్తికి ప్రతీక ‘పులి’

ఉద్యమ స్ఫూర్తికి ప్రతీక ‘పులి’

……………..
ప్రముఖ హిందీ కవి కేదార్‌నాథ్‌సింగ్ వచ్చే నెల
జ్ఞానపీఠ అవార్డు స్వీకరిస్తున్నారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ కేంద్రీయ
విశ్వవిద్యాలయం హిందీ విభాగం ఆధ్వర్యంలో
ఈ నెల 20,21 తేదీల్లో రెండు రోజుల జాతీయ సదస్సు జరుగుతున్న సందర్భంగా…
……………….
2013వ సంవత్సరానికి గాను ప్రముఖ హిందీ కవి కేదార్‌నాథ్ సింగ్‌ను జ్ఞానపీఠ అవార్డు కోసం ఎంపిక చేయడం దేశంలోని అభ్యుదయ, ప్రగతిశీల, ప్రజాస్వామ్య శక్తులను గౌరవించడంగా భావించాలి. కేదార్‌నాథ్ సింగ్ ప్రతి రచనలో ఒక ఆత్మీయ ఆర్ద్రత కనబడుతుంది. ఆ ఆర్ద్రత ఈ దేశంలోని కోట్లాది గొంతులకు ఒక వేదికగా మారుతూ స్వతంత్ర భారత వైరుధ్యాలను ముందుకు తెస్తుంది. 1934లో ఉత్తర ప్రదేశ్‌లో జన్మించిన కేదార్‌నాథ్ సింగ్ చుట్టూ ఉన్న ప్రపంచానే్న తన కవిత్వానికి వస్తువుగా మలచుకుని అనేక కావ్యఖండాలను చెక్కారు. తన చుట్టూ ఉన్న పదజాలానే్న కవితా భాషగా స్వీకరించి ప్రజల భాషను సజీవంగా నిలబెట్టారు. నిజానికి వారి కవితాయాత్ర 1950 నుంచే మొదలవుతుంది. సమకాలీన హిందీ కవిత చరిత్ర రచనా రీతుల మీద చర్చకు తెరలేపిన కవి ఆజ్ఞేయ్ సంపాదకత్వంలో 1950లో వెలువడిన ‘తార్ సప్తక్’ లో స్థానం పొంది అప్పట్లోనే శక్తివంతమైన యువకవిగా పేరొందారు. స్వాతంత్య్రానంతరం వచ్చిన వివిధ ప్రజాస్వామ్య ఉద్యమాలను లోతుగా పరిశీలిస్తూ తమదైన శైలిలో గొంతు కలిపిన కవి కేదార్‌నాథ్ సింగ్. వారి కలం నుంచి వెలువడిన కవితా సంకలనాల శీర్షికలను చూడగానే కవి తృష్ణ అవగతమవుతుంది. ‘అభిబిల్కులే అభి’, ‘జమీన్ పక్ రహీ హౌ’, ‘అకల్ మే సారస్’ (కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన రచన) టాఘ్ (పులి) ల్లాంటి అత్యంత శక్తివంతమైన రచనలు ఈ రోజు జ్ఞానపీఠ అవార్డు రావడానికి పునాదులుగా పనిచేశాయి. మిగతా కవితా సంకలనాల కన్నా ‘పులి’ కవితా సంకలనం విశిష్ట రచనా ప్రక్రియను ప్రవేశపెడుతుంది. ‘పులి’ కవితా సంకలనం కొన్ని కావ్యఖండికల సమాహారం.
నిజానికి మానవ చరిత్రలో అత్యధిక ప్రయాణం చేసింది కవిత్వమొక్కటే. అత్యధిక విశ్వాసాన్ని ప్రకటించబడింది కూడా కవిత్వం పట్లనే. ‘నాగరికత దినదినాభివృద్ధితో పాటు కవిత్వం పతనమవుతుంది’ అని మిల్టన్ గురించి రాసిన ఒక వ్యాసంలో మెకాలే అన్నప్పటికీ కవిత్వ ప్రయాణం అజరామరంగా కొనసాగుతూనే ఉంది. దానిపట్ల విశ్వాసం సన్నగిల్లలేదు. అయితే ఈ సుదీర్ఘ ప్రయాణంలో కవిత్వం అనేక మలుపులను, ఒడిదుడుకులను చూసింది. తన రూపాన్ని, వ్యాకరణాన్ని మార్చుకుంది. అనేక ఉన్నత శిఖరాలను అధిరోహించింది. అధమం వైపు మళ్లిన సంఘటనలూ ఉన్నాయి. స్పష్టంగా చెప్పాలంటే కవిత్వం యొక్క ఈ సుదీర్ఘ చరిత్ర ఆత్మ సంఘర్షణల చరిత్రే. మానవ నాగరికత, సంస్కృతితో బాటు సమానాంతరంగా నడుస్తున్న చరిత్ర. అప్పుడప్పుడు ముందుగా నడుస్తూ మార్గాలను, మలుపులను అడ్డగిస్తున్న చరిత్ర కవిత్వానిది.
హిందీ కవిత్వం, ముఖ్యంగా నేటి హిందీ కవిత చరిత్ర ఆత్మ సంఘర్షణతో కూడుకున్నదని చెప్పక తప్పదు. ఈ ఆత్మ సంఘర్షణను గమనంలో ఉంచుకోకుండా ఇప్పుడు వస్తున్న కవిత్వాన్ని గాని, కవులను గాని అర్థం చేసుకోవడం సాధ్యపడదు. ఎందుకంటే కవిత్వంలో కనబడే ఆత్మసంఘర్షణ కవి యొక్క ఆత్మసంఘర్షణ కాబట్టి. ఈ సంఘర్షణని ప్రతిభావంతంగా, శక్తివంతంగా వ్యక్తం చేసిన కవులలో కేదార్‌నాథ్‌సింగ్ అగ్రగణ్యులు. సమకాలీన సంఘర్షణని, ఆత్మ ఘర్షణని అతని కవిత్వం ఆవిష్కరిస్తుంది.
‘నా వీపుమీద కాలపు పంజాల సంతకాలు ఎన్ని ఉన్నాయో నాకు మాత్రమే తెలుసు’ అంటూ ‘పులి’ కవిత్వం ఆరంభంలోనే నేడు విస్తరిస్తున్న ఉద్యమ స్ఫూర్తిని, ఆర్తిని, సంఘర్షణ లోతులను కేదార్‌నాథ్ సింగ్ ఆవిష్కరిస్తారు. ‘పులి’ కవిత్వం ‘మనిషి’ని కుదిపివేసే కవిత్వం. చుట్టూ జరుగుతున్న వివిధ సంఘటనల నడుమ నిలబడి అస్తిత్వం, అభివృద్ధి కోసం పరితపించే ‘మాయావి సమయం’లో మనిషి అంతరంగంలో నుంచి పుట్టుకువచ్చే అనేక రూపాల ఆకారం – ‘పులి’. పులి కవిత్వం అనేక దృశ్యాలు, చిత్రాలు, రూపకాలుండే ప్రతీకా? లేక ప్రతిబింబమా? అని అడిగితే చెప్పడం చాలా కష్టం. ‘మనిషి’ అంతర్గత పరిస్థితిని సృజనాత్మక దృష్టితో పరిశీలించే గొప్ప కావ్యం ‘పులి’. కాల ప్రవాహంలో, చీకటి మలుపులతో కొనసాగుతున్న మానవ విధ్వంసానికి పోరాట జీవన గాథ ‘పులి’. మనలోని చైతన్యాన్ని, ప్రేమను, అమాయకత్వాన్ని, నిరాశను అర్థం చేసుకునే విశ్వాసాన్ని, అవకాశాన్ని ‘పులి’ కల్పిస్తుంది. ‘పులి’ నగరమంతటిని తిరస్కారంగాను, అసహ్యంగాను చూస్తుంది. అంటే మానవ నైజంలో చోటుచేసుకున్న వికృతాన్ని అసహ్యించుకుంటుందన్నమాట. మానవ జీవితంలోని వికృతాన్ని, విపరీత పోకడలను తిరస్కరించడమంటే మనిషిలోని ప్రేమను బ్రతికించడమే.
అనారోగ్యం, అంధవిశ్వాసాలు, నిరక్షరాస్యత, దారిద్య్రం మీద పరిఢవిల్లుతున్న ప్రజాస్వామ్యంలో ప్రజలు భయంకరమైన వౌన సంస్కృతికి అలవాటుపడ్డారు. ప్రశ్నించే స్వభావాన్ని ఇంకా అలవరుచుకోలేదు. తమ గురించి ఆలోచించే వారున్నారని, వారే అన్నీ చేసి పెడతారని ఆలోచించే ‘మాట్లాడని సంస్కృతి’లోకి నెట్టివేయబడ్డారు. అందుకేనేమో ‘పులి’ ఓచోట ‘మనుషులు ఈమధ్య వౌనంగా ఎందుకుంటున్నారు’ అని ప్రశ్నిస్తుంది. కాని సంతృప్తికరమైన జవాబు దొరకదు. అయోమయంలో పడిపోతుంది. మన పల్లెసీమలు పట్నం వైపు కదులుతున్నాయి. ‘కోరికలతో నిండిన ఎద్దుల బండ్లు కదిలిపోతున్నాయి’ అంటాడు కవి. అయితే అవి ‘పల్లె నుంచి పట్నానికి ఏదో ఒకటి మోస్తూ తన వంతు భూమిని కోల్పోతూ సాగుతుంటాయి’ అంటాడు. ఎంత నిజం. ఇలాంటి అనేక వాస్తవాలతో సమకాలీన భౌతిక, భౌతికేతర పరిస్థితులను, సమస్యలను స్పర్శిస్తూ, సృజిస్తూ పాఠకుడిలో ఒక లోతైన ఆలోచనను నాటి అర్థవంతమైన ప్రయత్నం ‘పులి’.

హిందీ కవి కేదార్‌నాథ్‌సింగ్ కవితలు రెండు

  • 20/10/2014
TAGS:

కవిత – 1

ఏదో
ఓ రోజుకి
ఈ నేల మీద
పులులు ఉండవని
అవి పిల్లల పుస్తకాల్లోకి
చేరిపోతాయని
పులి భయం

పులికన్నా ఎక్కువగా
నాకూ భయమే
అప్పుడు
చేతులు ఎక్కడ ఉంటాయి
పుస్తకాల్ని చదివేందుకు
కళ్ళెక్కడుంటాయి
ప్రెస్‌లు ఉండవు
పట్టణాలూ ఉండవు
‘‘క’’ తర్వాత
‘‘ల’’ లేక ‘‘శ’’
గెంతుతూవచ్చి
పడే పుట ఉండదు
దానిని గాలి
తన జ్ఞాపకాల్లో
పాతుకుంటుంది

పూర్తి పదాన్ని ఆకులు నెమరువేస్తాయి
నేలమీది
కనపడని తారల గుండా
ఆసుపత్రి కిటికీ క్రింద
చనిపోయే మనిషి
పెదవుల్లో
బ్రతికే గీతం అవుతుంది

నాకు భయం
మామూలు సీదా సాదా భయం
భయం ఎక్కడ ఉంటుంది!

కవిత – 2

గోధూళి వేళ
నగరం గోపురం నుండి
ఓ మనిషి
అరుస్తున్నాడు

గాలిమరల రెక్కలు
నేత చేతులు
నడిచే కాళ్ళు
అన్నీ గతించిపోతున్నాయి
కానీ
మనం బ్రతకాలి
పులితోబాటు బ్రతకాలి
పులి లేకుండా బ్రతకాలి

నీళ్ళలాగా
రాళ్ళలాగా
బ్రతక గలగాలి
ఉరి కంబమెక్కి
తిరిగి లేవగలగాలి
సమయం లేకున్నా
స్థలం లేకున్నా
సైకిల్ ట్యూబులో ఉండేంత
గాలి నగరంలో మిగిలినా
బ్రతకాలి

బ్రతకాలి
ఈ నేలపైన బ్రతకాలి
ప్రతి మనిషి బ్రతకాలి
అంగుళం అంగుళం బ్రతకాలి

నిజానికి
నగరంలో ఆ మనిషి లేడు
ఆ గోపురం లేనే లేదు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మన హీరోలు మారుతున్నారా?!

మన హీరోలు మారుతున్నారా?!

ఇప్పటికే విడుదలై మంచి టాక్‌నీ, కమర్షియల్ విజయాన్నీ సొంతం చేసుకున్న ‘మనం’, ‘దృశ్యం’, ‘లెజెండ్’ సినిమాలు ఒక రకంగా తెలుగు ప్రేక్షకులను షాక్‌కు గురిచేసాయని చెప్పాలి. ఇదిలా ఉండగానే ‘గోపాల..గోపాల’ సినిమా అరుదైన కాంబినేషన్‌తో అనౌన్స్ అవడం ఒక ధోరణికి అలవాటుపడ్డ సగటు ప్రేక్షకులనేకాక, సినీ ప్రేమికులను, మేధావులను కూడా ఆశ్చర్యచకితులను చేసింది. ఈ పరిణామాలు ప్రామాణికం కాకపోయినా, మారిన, మారుతున్న మన హీరోల దృష్టికోణానికి అద్దంపడుతున్నాయా? ఇమేజ్ చట్రంలో బిగుసుకుపోయి, అదే ‘సింహాసనం’అనే భ్రమలో మునిగితేలుతున్న మన హీరోల వైఖరిలోని మార్పుకు ఇది ఏమైనా సంకేతాలుగా నిలుస్తున్నాయా? కొంపదీసి మన హీరోలు మారారా? అనే చర్చను లేవనెత్తుతున్నాయి. ======================== 1980 దశకం అనంతరం తెలుగు తెరపై దూసుకొచ్చిన హీరోల విషయంలో చాన్నాళ్ళుగా ఒక విమర్శ ఉంది. ‘ఈ హీరోలు బాలీవుడ్ హీరోలలా ఒకరితో ఒకరు కలవరు. ఎవరి ఈగో జోన్‌లలో వాళ్ళుంటారు. స్టార్‌డమ్ విషయంలోనూ, నెంబర్స్‌గేమ్ విషయంలోనూ ఒకరితో ఒకరికి సరిపడవు’అనేవే ఆ విమర్శలు. ఆ తరం హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ల విషయంలో గత కొంతకాలం వరకూ ఈ వ్యాఖ్యానాలు నిజం అని చెప్పడానికి తగిన ఉదాహరణలే ఉండేవి. కానీ ఇటీవలి కాలపు పరిణామాలను, సినిమాల పరంగా కాంబినేషన్‌ల పరంగా వస్తున్న మార్పులను గమనిస్తే, ఈ హీరోల వైఖరిలో మార్పు వచ్చిందేమో! అసలు ఈ హీరోలు మారారేమో! అనే ఆలోచనలు సాధారణ ప్రేక్షకుడి మనసులో చెలరేగుతున్నాయి. హీరోల మధ్య ఉండే అభిప్రాయ భేదాలు, వైరుధ్యాలను ఆసరాగా చేసుకుని ఇంతకాలం తమలో తాము శత్రువులుగా భావించుకున్న ఫ్యాన్స్‌ల మనసులలో కూడా ఇప్పుడు ఈ రకపు ఆలోచనలే పొడసూపుతూ, అందరిమధ్య సుహృద్భావ వాతావరణం నెలకొనే సానుకూల దృక్పథం రూపొందుతోంది. ఇది ఆహ్వానించదగిన అంశం అనడంలో సందేహం లేదు. ‘మనం-దృశ్యం-లెజెండ్’ త్రయం మన సీనియర్ తెలుగు హీరోల వైఖరి మారింది అనడానికి ఇటీవలి తాజా ఉదాహరణలుగా నిలుస్తున్న సినిమాలు- మనం, దృశ్యం, లెజెండ్ అని చెప్పాలి. ‘మనం’ సినిమాలో నాగార్జున చూపించిన చొరవ, చేసిన ప్రయోగం మూడుతరాల అక్కినేని నటులను ఒక్క కథలో ప్రత్యక్షమయ్యేలా చేసింది. కథ, కథనం, మానవ భావోద్వేగాలు, అనుబంధాల విషయంలో పరిణతిని ప్రదర్శించి నాగార్జునలోని నిజమైన నట నిర్మాతను వెలికి తీసింది. మరోవైపున ‘కేడి’, ‘రగడ’, ‘్భయ్’వంటి మాస్ ఇమేజ్ నుంచి రియలిస్టిక్ తరహాలో నాగార్జున సహజ నటనను ప్రదర్శించగలడని ప్రూవ్ చేసాయి. అలాగే ‘దృశ్యం’కూడా! మలయాళ రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాని మహిళా దర్శకురాలు శ్రీప్రియ దర్శకత్వంలో వెంకటేష్ నటించడానికి అంగీకరించడం ఒకవైపు, ఈ సినిమాలోని పాత్రపరంగా ఆయన ఇద్దరు టీనేజ్ ఆడ పిల్లలకు మధ్యవయసు తండ్రిగా నటించడం వెంకటేష్ దృష్టికోణంలోని మార్పుకు సంకేతాలే అని భావించాలి. బాడీగార్డ్, షాడో, మసాలా వంటి సినిమాలలోని యాక్షన్ హీరో ఇమేజ్‌నుంచి దృష్టి మరల్చి ఫ్యామిలీ పర్సన్‌గా మధ్యతరగతి కుటుంబీకుడి పాత్రని పోషించడం తన వాస్తవిక వయోరీతికి దగ్గరగా తన పాత్ర ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పకనే చెప్పినట్లయింది. ఇక, ‘లెజెండ్’లో జగపతిబాబు మొదటిసారిగా విలన్‌గా నటించి, ఇంతకాలంగా తనకు ఉన్న ఫ్యామిలీ హీరో ఇమేజ్‌నుంచి క్యారెక్టర్ పరంగా కొత్తగా ప్రయత్నం చేసినట్లు అర్థమవుతోంది. ఇదే ఊపులో వెంకటేష్- పవన్‌కళ్యాణ్ ఇద్దరూ కలిసి ‘గోపాల… గోపాల’ సినిమాలో నటిస్తుండటం మరింత ముచ్చటగా భావించడంలో తప్పులేదు. మొన్నామధ్య వెంకటేష్- మహేష్‌బాబు ఇద్దరూ ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు’ సినిమాలో నటించి, ఆ సినిమాని ఏ రేంజ్‌లో హిట్ చేసిందీ చూసాం. ఇప్పుడు ఈ ‘గోపాల… గోపాల…’కూడా ఆ దారిలోనే వెళ్తుందనే ఊహలు నిజం అవుతాయనే చెప్పొచ్చు. బాలీవుడ్ ‘ఓ మైగాడ్’ సినిమాకి రీమేక్‌గా వస్తున్న ఈ సినిమా రానున్న కాలంలో మరిన్ని అరుదైన కాంబినేషన్ సినిమాలకి తెర తీసే అవకాశం ఉంది. సీనియర్ హీరోల దృష్టి మారిందా? ప్రస్తుతం సీనియర్ హీరోలు అందరూ తమనితాము సరికొత్తగా తెరపై ఆవిష్కరించుకోవాలనే తాపత్రయంలో ఉన్నారనే విషయాన్ని, వారు ప్రస్తుతం నటించిన, నటిస్తున్న సినిమాలు తేటతెల్లం చేస్తున్నాయి. వీరు ఇప్పుడు చేస్తున్న సినిమాలు, ఎంపిక చేసుకుంటున్న కథలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఆ లెక్కన మన తెలుగు సీనియర్ హీరోలు మారారు అనడానికి ఈ సప్త సూత్రాలను కారణాలుగా చెప్పవచ్చు: 1.ఇదివరకటిలా కథను దాటేసి, కథాతీతంగా ప్రవర్తించే హీరోలా కాకుండా కథల్లో ఒదిగిపోయే కథానాయకుడిగా మారడం. 2. పాత్రోచితంగా, పాత్ర స్వభావం- పరిధుల మేరకు నటించడం, ఆ పాత్ర తరహాలోనే సహజంగా ప్రవర్తించే ప్రయత్నం చేయడం. 3. ఇమేజ్ పేరుతో కథని నేలమీద నడవకుండా చేసే ధోరణికి గుడ్‌బై చెప్పడం. 4. వయసుకు తగిన పాత్రలను, కథలను ఎంపిక చేస్కోవడం. 5. తమ శారీరక, వయోపరమైన పరిమితులను గమనించి, ఆ లోపాలను అధిగమించడానికి కంటెంట్‌ను ఆశ్రయించడం. 6. యంగ్ హీరోలతో పోటీపడటంకోసం కథలలో యంగ్ హీరోల కథలనే సెలెక్ట్‌చేసుకోవడానికి స్వస్తిపలకడం. 7. ఇప్పటి యంగ్ హీరోలతో రేస్‌లో పోటీపడటానికి పకడ్బందీ స్క్రిప్ట్‌లనే సాధనంగా గుర్తించడం. టాలీవుడ్‌లోని సీనియర్ హీరోలందరూ (ఒకరిద్దరు మినహా) ప్రస్తుతం ఈ ‘సప్తసూత్ర నియమాల’నే తమ ‘బాటమ్‌లైన్’గా మార్చుకున్నారని, ఇటీవలి వారి సినిమాలు- కథలను గమనిస్తే ఇట్టే అర్థమవుతుంది. ఆలెక్కన చూస్తే మన హీరోలు మారారనే విషయం కూడా సులభంగానే వెల్లడవుతుంది. ‘సైకాలజీ’ ఏం చెబుతోంది? సీనియర్ హీరోలలో పొడసూపుతున్న ఈ మార్పు సగటు సినీ ప్రేమికునికి కొత్త తరహా వినోదాల విందును, కొత్తతరం సినిమాలను అందిస్తున్నది కనుక ఈ మార్పును అందరూ ఆహ్వానిస్తున్నారు. అయితే ఈ ‘మార్పు’ విషయంలో సైకాలజీ ఏం చెపుతుందో ఒకసారి గమనిద్దాం. సైకాలజీలో వ్యక్తుల ప్రజ్ఞ (ఇంటెలిజెన్స్)ను కొలవడానికి ఆల్‌ఫ్రెడ్ బీనె వంటి మనోవైజ్ఞానిక శాస్తవ్రేత్తలు ఒక కొలమానాన్ని తయారుచేసారు. అదే 1) శారీరక వయస్సు 2) మానసిక వయస్సు. అంటే, పుట్టినప్పటినుంచీ వయస్సుపరంగా భౌతికంగా మనిషిలో వచ్చే శారీరక, జైవిక, దైహిక మార్పులను ‘శారీరక వయస్సు’ అంటారు. అలాగే ఉద్వేగాలు, మేధాశక్తి, జ్ఞానం, స్మృతి, అవధానం వంటి అంశాలపరంగా వయసుతోపాటు వచ్చే పరిణామాలను ‘మానసిక వయస్సు’ అంటారు. ఈ శారీరక-మానసిక వయస్సుల మధ్య పెరుగుదల సమాన స్థాయిలో ఉన్నస్థితినిబట్టి వ్యక్తి మేధాశక్తిని, ప్రజ్ఞాపాటవాలను అంచనా వేస్తారు. అయితే, సినీ రంగంలో ఈ సూత్రంలో చిన్న మార్పుచేసి, ఈ అంశాన్ని విశే్లషణ చేయాల్సి ఉంటుంది. అవేంటంటే, 1) శారీరక వయస్సు 2) తెరమీది పాత్ర వయస్సు (స్క్రీన్ ఏజ్). చాలా సందర్భాలలో తెలుగు సినిమా హీరో వాస్తవిక వయస్సుకు, తెరమీది వయస్సుకు మధ్య ఏమాత్రం పొంతన లేని వ్యవహారమే అనూచానంగా వస్తోంది. చిత్తూరు నాగయ్య కాలంనుండీ మొదలైన ఈ అపసవ్య ధోరణి, ఆ తర్వాత ఎన్టీఆర్-అక్కినేని-కృష్ణ- శోభన్‌బాబు- కృష్ణంరాజులతో పరాకాష్టను అందుకొంది. ఇదే తరహా వాస్తవిక స్థితిని అంగీకరించలేని స్థితి, ప్రస్తుత సీనియర్ హీరోలలో కూడా అంటువ్యాధిలా ఇంకా కొనసాగుతోంది. అందుకే ఐదు పదుల వయసున్న స్టార్ హీరో కూడా, తెరమీద కాలేజ్‌కెళ్ళే కుర్ర హీరో పాత్రలకే మొగ్గుచూపే స్థితి తెలుగు సినీ పరిశ్రమలో రాజ్యమేలుతోంది. హీరోలను ఆశ్రయించే, నడుస్తున్న పరిశ్రమ, అనివార్యంగా కథలని కూడా వారికి అనుగుణంగానే రూపొందించుకోవలసి వస్తోంది.. ఈ విధానాన్ని మనం, దృశ్యం సినిమాలు, రానున్న ‘గోపాల… గోపాల’ సినిమా ఒక రకంగా బ్రేక్ చేసాయ. దీనివల్ల హీరోల శారీరక వయస్సు, తెరమీద వారు పోషించే పాత్రల వయస్సు మధ్య సమన్వయం కుదిరి, వారి నటనలు, హావభావాలలో అసహజత స్థానంలో సహజత్వం, హీరో స్థానంలో వారి పాత్ర స్వభావం ప్రేక్షకులకు సాక్షాత్కారం అవుతుంది. సైకాలజీ సూత్రాలు చెప్పినట్లుగా సీనియర్ హీరోలు ఇలాగే తమ శారీరక- తెర వయసు పాత్రలను సమాంతరంగా నడిపించుకుంటూ వెళ్ళడం హీరోల మారిన తీరుకు సూచికగా మారుతుంది. ఈ మార్పుకు కారణాలేంటి? తెలుగు సీనియర్ హీరోలలో ఇపుడు కనిపిస్తున్న ఈ ‘మార్పు’వెనుక అసలు కారణాలేంటి? హీరోలలో జ్ఞానోదయం కావడమా? తెలుగు సినిమాని ఉద్ధరించే లక్ష్యమా? అని ఆలోచిస్తే, ఇవేవీ కావు అని కొంచెం లోతుగా ఆలోచిస్తే అవగతమవుతుంది. సీనియర్ హీరోలకు ప్రస్తుతం క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గతంలో ఉన్నంతగా లేదు. కొత్త తరం హీరోల వైపే యువ ప్రేక్షకులు మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల ఈ సీనియర్ హీరోల మార్కెట్ వాల్యూ, క్రేజ్ తగ్గిపోయాయి. ఈ వాస్తవాన్ని గమనించిన ఈ హీరోలు ఇంకా ‘కుప్పిగంతులు’ ఎందుకులే అని గుర్తించి, దానిని బాహాటంగా అంగీకరించడానికి మనసొప్పక, తమలోని మార్పుకు అందమైన కారణాలను చెపుతున్నారు. వారి మార్పుకు వారిలోని సంస్కరణవాదాన్ని, సంస్కారాన్ని కొత్తగా హైలైట్ చేసుకుంటున్నారు. అంతేతప్ప తెలుగు సినిమాని ఉద్ధరించాలని కాదు అనే విమర్శ వినిపిస్తోంది. ఒకవేళ, మన తెలుగు హీరోల ఆలోచనాధోరణి, వైఖరి మారింది నిజమే అయితే ‘దృశ్యం’లాంటి ప్రయోగాలు నవతరం హీరోలెవరైనా చేస్తే నమ్మొచ్చు. కానీ సీనియర్ హీరోలు చేస్తున్న ఈ సినిమాల ఆధారంగా మొత్తం తెలుగు హీరోల ఆలోచనలోనే మార్పు వచ్చిందనడం తప్పని, గత్యంతరం లేని స్థితిలోనే సీనియర్ హీరోలు ఈ ప్రయత్నాలను, ప్రయోగాల పేరుతో చేస్తున్నారని, ఇదంతా వారి అస్తిత్వం, ఉనికికోసం చేస్తున్నవే తప్ప, వాటికి ఎలాంటి లోక కళ్యాణపు ఆశయాలని అంటగట్టడం సరికాదని వాదనలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా, సీనియర్ హీరోలు తమ ‘సీనియారిటీ’ని గుర్తించి, దానికి తగినట్లుగా తెరమీద కనిపించాలని కోరుకోవడం వల్ల ప్రేక్షకులకు ఎంత మంచి సినిమాలను వారు అందించారో ‘మనం’, ‘దృశ్యం’సినిమాలు నిరూపించాయి. ఈ మార్పునుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళకుండా సీనియర్ హీరోలు తమని తాము కొత్తగా ఆవిష్కరించుకుంటే అటు పరిశ్రమ, ఇటు ప్రేక్షకులు ఇద్దరూ ఆనందపడతారనడంలో సందేహం లేదు. నవతరం హీరోలు కూడా మళ్ళీ సీనియర్ హీరోలు అయ్యేంతవరకూ కాలం వెళ్ళబుచ్చకుండా ఈ స్ఫూర్తిని కొనసాగించాల్సిన తరుణం కూడా ఇదే! *

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పిల్లల దేవుళ్లు — ఈవారం స్పెషల్

పిల్లల దేవుళ్లు — ఈవారం స్పెషల్

‘మీరు భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టినందుకు అభినందనలు. మీరు చిన్నతనంలో బాలకార్మికుడిగా టీ అమ్మారు. అయితే ఇప్పుడు మీరు చేయాల్సిన పనొకటుంది. బాల్యంలో చిన్నారులు పనిచేయాల్సిన దుస్థితిలో ఉండకూడదు. ఆ వయసులో వారికి చదువే ముఖ్యం. ఉచితంగా వారికి అది అందాలి.. మీరు ఈ విషయంపై దృష్టిపెట్టాలి.’ – పనె్నండేళ్ల వయసులో చిన్నారుల చదువు కోసం పరితపించి.. ఒక్కో అడుగేస్తూ వచ్చిన 60 ఏళ్ళ కైలాష్ సత్యార్థి నరేంద్రమోదీకి పంపిన ట్వీట్. ‘మా అమ్మ చేసిన టిఫిన్ పట్టుకుని స్కూలుకు బస్సులో బయలుదేరా.. దగ్గరగా వచ్చిన కొందరు నీ పేరేంటి? అని అడిగారు…మలాలా అన్నాను…అంతే బుల్లెట్లవర్షం కురిపించారు… రెండేళ్లుపట్టింది బతకిబయటపడటానికి…ఇప్పుడు తాలిబన్లు ఎదురై చంపేస్తామన్నా.. భయమేం లేదు. ఆడపిల్లలకు చదువెంత ముఖ్యమో వారికి చెబుతా… వారు చేస్తున్న పని తప్పని చెబుతా, బాలలు తమ హక్కుల కోసం పోరాడాలని చెబుతా…’ -ఇది 17 ఏళ్ల మలాలా మాట. పనె్నండేళ్ల వయసులో పలకరించిన మృత్యువుతో పోరాడి గెలిచిన చిన్నారి మాట… * * * ఆడపిల్లలకు చదువెంత అవసరమో వివరిస్తూ ప్రచారం చేస్తోంది మలాలా. చిన్నారులంతా పనిలోకి కాదు.. బడిలోకి వెళ్ళాలంటారు కైలాష్.. ఈ ఇద్దరూ కేవలం అలా చెప్పి ఊరుకోలేదు. ప్రాణాలకు తెగించి పోరాడారు. అందుకే వారు పిల్లల దేవుళ్లయ్యారు. అవిరళ కృషికి గుర్తింపుగా ఈ ఏడాది నోబెల్‌శాంతి బహుమతి వరించింది. ఎవరీ కైలాశ్ సత్యార్థి మధ్యప్రదేశ్‌లోని విదిషలో పుట్టిన కైలాస్ సత్యార్థి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో పట్ట్భద్రుడు. భోపాల్‌లో ప్రొఫెసర్‌గా పనిచేశారు. బాలకార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాలని, చిన్నారులకు చదువుకునే అవకాశాలు కల్పించాలని, అక్రమ రవాణా, వెట్టిచాకిరీ నుంచి పిల్లలను రక్షించాలని భావించారు. అందుకోసం ఒంటరిగా పోరాటం ప్రారంభించిన ఆయన ఇప్పిడు దాదాపు 140 దేశాల్లో ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. న్యూఢిల్లీలో భార్య, ఇద్దరు పిల్లలు, తాను విముక్తి కల్పించిన పిల్లలతో కలిసి ఉంటున్న ఆయన ప్రస్థానం ఇది. బుక్‌బ్యాంక్‌తో మొదలు పాఠశాల విద్య చదివేటప్పుడు తనతోసహా చాలామంది పిల్లలకు పుస్తకాలు కొనే స్థోమత లేకపోవడం పెద్దసమస్యగా మారింది. కొంతమంది స్నేహితులతో కలసి పుస్తకాల సేకరించాలనుకున్నారు. ఓ ఫుట్‌బాల్ క్లబ్‌ను ఏర్పాటు చేసిన కైలాష్‌సత్యార్థి అందులో సభ్యత్వం కావాలంటే ఒక విద్యార్థికి కావలసిన పుస్తకాలు కొనివ్వాలని షరతు పెటారు. కేవలం ఒక్కరోజులో వారు 2వేల పుస్తకాలు సమకూర్చారు. దానిని బుక్‌బ్యాంక్‌గా మార్చి పేద విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. ఇది అతడి చిన్ననాటి పని. ఉన్నత చదువు పూర్తయిన తరువాత 1980లో మరో అడుగువేశారు. బచ్‌పన్ బచావో ఆందోళన్ పిల్లలను చదివించాలని, పనిలోకి నిర్బంధంగా దించడం, బాండెడ్ లేబర్‌గా పనిచేయించడం తప్పని, దానిని అడ్డుకోవాలని భావించారు. దేశంలోని తివాచీలు, కంబళ్ల పరిశ్రమల్లో పిల్లలతో ఎక్కువగా పనిచేయిస్తున్నారని గమనించారు. దీనిని అడ్డుకునేందుకు కలసిరావాలంటూ పిలుపునిస్తూ బచపన్ బచావో ఆందోళన్ పేరిట ఓ సంస్థను 1980లో ప్రారంభించారు. స్నేహితులు, సంస్థ సభ్యులతో కలసి బాలలతో పనిచేయిస్తున్న పరిశ్రమలు, కార్యాలయాలపై దాడులు చేసి వారిని రక్షించేవారు. 2004లో ఓ సర్కస్ కంపెనీ, 2011లో ఓ బట్టల పరిశ్రమల్లో బాలకార్మికులను విడిపించినప్పుడు యాజమాన్యాలు దాడులు చేయించడంతో తీవ్రంగా గాయపడినా మొక్కవోని దీక్షతో అడుగుముందుకేశారు సత్యార్థి. తరువాత ఆయనతో పలు స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేయడం ప్రారంభించాయి. దక్షిణాసియాలో 750 ఎన్‌జీఓలు ఇప్పుడు చేదోడుగా ఉన్నాయి. గ్లోబల్‌మార్చ్‌తో విశ్వఖ్యాతి బాలబాలికల హక్కుల సంరక్షణ, ఉచితవిద్య కోసం ఉద్యమించిన ఆయనకు యునెస్కో బాసటగా నిలిచింది. అదే లక్ష్యంతో 1998లో ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్‌మార్చ్ పేరుతో ప్రచార కార్యక్రమం ప్రారంభించారు. 103 దేశాలు, 20 వేల పౌరసంస్థలు, 72 లక్షల మంది పౌరులు ఆయనతో నడిచాయి. జెనీవాలో జరిగిన సదస్సులో చిన్నారుల హక్కుల రక్షణకోసం ఓ తీర్మానం చేస్తే 140 దేశాలు సంతకం చేశాయ. బాలమిత్ర గ్రామ్ పిల్లలకు చదువుతోపాటు వారి హక్కుల రక్షణ, వారికి నచ్చిన వాతావరణం సృష్టించడం, పాఠశాలల్లో బాలబాలికలకు వౌలిక వసతులు ఏర్పడేలా చూడటం కోసం బాలమిత్ర గ్రామ్ కార్యక్రమాన్ని 2001లో ప్రారంభించారు. చురుకైన విద్యార్థులతో బాలపంచాయతీ పేరుతో ఓ కమిటీని వేయడం, ఆ గ్రామంలో, పాఠశాలల్లో మార్పులపై చర్చించి, ఉద్యమించి, సాధించడం వారి పని. ప్రజలూ వారికి అండగా నిలిచారు. ఇప్పటికి ఇలా 11 రాష్ట్రాల్లో 317 గ్రామాల్లో బాల పంచాయతీలు పనిచేస్తున్నాయి. మరో 8 గ్రామాలను ఇప్పుడు దత్తత తీసుకున్నారు. ఇక్కడ చిన్నపిల్లలు చదువుకోవడమే తప్ప పనుల్లోకి వెళ్లరు. వెళ్లనివ్వరు. ఆ ఇద్దరు.. ఇలా బాలమిత్ర పంచాయతీ సభ్యులుగా ఉన్న ఇద్దరు చిన్నారులకు దక్కిన గౌరవమేమిటో తెలుసా… జైపూర్‌కు చెందిన 14 సంవత్సరాల ఓం ప్రకాష్‌కు ఇంటర్నేషనల్ చైల్డ్ పీస్ ప్రైజ్ దక్కింది. ఈ అవార్డుకు ఎంపిక చేసే న్యాయనిర్ణేతల బృందంలో సభ్యుడిగా (జ్యూరీ) బాలమిత్ర గ్రామ్ విద్యార్థి, పనె్నండేళ్ల రాకేశ్‌కుమార్‌కు అవకాశం దక్కింది. * రగ్‌మార్క్-గుడ్‌వీవ్ కైలాష్ సత్యార్థికి ప్రపంచవ్యాప్తంగా పేరుతెచ్చిన ప్రయోగం ఇది. 1994లో ఇది ప్రారంభించారు. బాలకార్మికులతో పనిచేయించకుండా తయారు చేసిన కంబళ్లు, తివాచీలకు ఇచ్చే సర్ట్ఫికెట్ ఇది. ఆయా ఉత్పత్తులపై ఈ రగ్‌మార్క్ ఉంటే వాటికి విలువ ఎక్కువ. ఈ సర్ట్ఫికెట్ కోసం ఆయా సంస్థలు తగుమాత్రం ఫీజు చెల్లించాలి. ఎగుమతి చేసే రగ్గు లేదా కంబళి విలువలో 0.25 శాతం, దిగుమతి చేసుకున్నప్పుడు ఆయా వస్తువుల షిప్‌మెంట్ విలువలో 1.75 శాతం ఫీజు చెల్లించాలి. ఆ మొత్తాలను చిన్నారుల చదువు, శిక్షణ, సంస్థల నిర్వహణకు వెచ్చిస్తారు. మొదట ఆసియా దేశాలకే ఈ రగ్‌మార్క్ పరిచయం చేశారు. ఇప్పుడు దాదాపు 115 దేశాలు కావాలనడంతో దానిని గుడ్‌వీవ్‌గా మార్చారు. కేవలం రగ్గులు, కంబళ్ల పరిశ్రమలకే గాక ఫుట్‌బాల్, కోకోకోలా, గార్మెంట్ పరిశ్రమల్లోనూ పధ్నాలుగేళ్లలోపు పిల్లలతో పనిచేయించకూడదని ఇప్పుడు పోరాడుతున్నారు. 83525 కైలాష్ సత్యార్థికి నోబెల్ బహుమతి వ చ్చిందని తెలిసిన వెంటనే బచపన్ బచావో ఆందోళన్ కార్యాలయానికి మీడియా ప్రతినిధులు పోటెత్తారు. అభిమానులు పెద్దసంఖ్యలో చేరిపోయారు. హాస్పిటల్‌కు వెళుతూండగా సమాచారం అందుకున్న కైలాష్ సతీమణి సుమేధ శరవేగంగా భర్తకు అభినందనలు చెప్పేందుకు కార్యాలయానికి వచ్చారు. అయితే, లోపలికి వెళ్లేందుకు ఆమెకు గంటపైగానే పట్టింది. ఈలోగా నింపాదిగా బయటకు వచ్చిన కైలాష్ ప్రత్యర్థి, ఆయన సిబ్బంది ఓ కాగితం తీసుకొచ్చి నోటీస్ బోర్డుపై అతికించారు. ఆ కాగితంపై ఓ నెంబర్ రాసి ఉంది. అది 83525. ఆ క్షణం వరకు వెట్టిచాకిరీ, నిర్బంధం నుండి బిబిఎ రక్షించినవారి సంఖ్య అది. తొలిచూపులోనే…. కైలాష్ సత్యార్థి సుదీర్ఘపోరాటం వెనుక సతీమణి సుమేధ మద్దతు ఉంది. స్థానిక పత్రికలో సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్న ఆమెను కైలాష్ చూసి తొలిచూపులోనే ప్రేమలో పడ్డారు. ఆ మేగజైన్‌కు తరచూ ఆర్టికల్స్ రాస్తూండే సత్యార్థి ఓరోజు సుమేధ తండ్రితో అసలు విషయం చెప్పారు. ఆ తరువాత ఇద్దరి మధ్య అనుబంధం పెరిగింది. 36 ఏళ్లక్రితం అక్టోబర్ 8న వారికి వివాహం అయింది. ఆ తరువాత ఏడాదికి బచపన్ బచావో ఆందోళన్ సంస్థను ప్రారంభించారు. ఏడాది పిల్లాడికి పాలు కూడా కొనే పరిస్థితిలో లేం. అయినా ఆయన తన పోరాటాన్ని ఆపలేదు అంటారు సుమేధ. మేం తొలిసారిగా కలుసుకున్నది ఆక్టోబర్‌లోనే. మా పెళ్లి అయింది కూడా అదే నెలలోనే. మావారికి నోబెల్ వచ్చింది కూడా ఈ నెలలోనే అంటూ ఆనందం వ్యక్తం చేసిన సుమేధ ఆనందానికి ఎంతో అర్థం ఉంది. ఆయన సుమేధను దేవీజీ అని ప్రేమగా పిలుస్తారు. కైలాష్‌ను ఆమె సాబ్‌జీ అని పిలుస్తారు. అది వారిమధ్య అనురాగబంధాన్ని బలోపేతం చేసే సంబోధన. వారి కుమారుడు భువన్‌రిభు లాయర్. బచపన్ బచావో ఆందోళన్ సంస్థలోనే పనిచేస్తున్నారు. కైలాస్ తనయ అస్మిత. ఆమె ఎకనమిక్స్‌లో గ్రాడ్యుయేట్. ఆమె కూడా చిన్నారుల కోసం చేస్తున్న పోరాటంలో పాలుపంచుకుంటున్నారు. మా నాన్నకు నోబెల్ వస్తుందని ఐదేళ్లక్రితం అనుకున్నాం, అప్పుడు రాలేదు. ఇప్పుడు అనుకోకుండా వచ్చింది. ఇది పిల్లలకు దక్కిన గౌరవం అని అస్మిత అంటోంది. ఆర్యసమాజ్‌లో సభ్యుడైన తన మామగారి సూచనతో కైలాష్ పేరు మార్చుకున్నారు. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సత్యార్థి అసలు పేరు కైలాష్ శర్మ. అయితే కులమత బేధాలు ఉండకూడదన్న గాంధీజీ స్ఫూర్తితో ఆయన పేరును కైలాష్ సత్యార్థిగా మార్చుకున్నారు. ముక్తిఆశ్రమ్-బాల ఆశ్రమ్ బచ్‌పన్ బచావ్ ఆందోళన్ సభ్యులు, తాను, మీడియా ప్రతినిధులు, పోలీసులు కలసి బాలకార్మికులు ఉన్న వ్యవస్థలపై పక్కాప్లాన్‌తో దాడులు చేసి చిన్నారులను రక్షించేవారు. ఆ తరువాత వారిని ముక్తి ఆశ్రమ్‌కు చేర్చేవారు. ఇది ఢిల్లీలో ఉంది. బట్టలు, ఆహారం, మందులు అందించి వారికి ధైర్యం నూరిపోసేవారు. వారి బంధువుల ఆచూకీ తెలుసుకుని వారిదగ్గరకు చేర్చేవారు. అనాథ బాలకార్మికులుంటే వారిని రాజస్థాన్‌లోని విరాట్‌నగర్‌లో ఉన్న బాల ఆశ్రమ్‌కు తరలించేవారు. వారిని దీర్ఘకాలంగా అక్కడే ఉంచి చదువు చెబుతారు. వివిధ అంశాలలో శిక్షణ ఇస్తారు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కాశ్మీర్ లో నిశ్శబ్ద విస్ఫోటనం

నిశ్శబ్ద విస్ఫోటనం..

ఇరాక్, సిరియాలలో రక్తపాతం సృష్టిస్తున్న ‘ఐఎస్‌ఐఎస్’ జిహాదీ ముఠావారి జెండాలు జమ్మూకాశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో శ్రుకవారం మళ్లీ కనిపించాయట. అంతర్జాతీయ జిహాదీ ఉగ్రవాదులు మన దేశంలో విశ్రమించలేదన్న వాస్తవానికి ఇటీవల జరిగిపోతున్న ఇలాంటి ఘటనలు అద్దం పడుతున్నాయి. పెద్ద ఎత్తున బీభత్స ఘటనలు జరిపే దుస్సాహసానికి ఒడిగట్టకపోయినప్పటికీ చడీ చప్పుడూ లేకుండా జిహాదీ యంత్రాంగం కలాపాలు సాగిస్తూనే ఉంది. పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల జరిగిన పేలుళ్లు ఇప్పుడు బంగ్లాదేశీయ జిహాదీ హంతకుల డొంకను కదిలించాయి. జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా ప్రాంతంలో పాకిస్తాన్ వైపు నుండి చొరబడిన ముగ్గురు టెర్రరిస్టులను చొరబాటు వ్యతిరేక పోలీసు విభాగం వారు కాల్చివేశారు. అదే సమయంలో పశ్చిమ బెంగాల్ లోని వర్ధమాన్ జిల్లా ఖాగ్రాగఢ్‌లో జరిగిన బాంబు పేలుళ్లు జిహాదీల ఆక్రమ కార్యక్షేత్ర విస్తృతికి నిదర్శనం. వర్ధమాన్ జిల్లాలో జరిగిన పేలుడు ప్రమాదవశాత్తు జరిగిందన్న ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై రాజకీయ పక్షాలు పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. ఈ రాజకీయ ఆరోపణల సంగతి ఎలా ఉన్నప్పటికీ బంగ్లాదేశ్ నుంచి చడీ చప్పుడు లేకుండా చొరబడుతున్న బీభత్సకారులు గొప్ప క్రియాశీలకంగా ఉన్నారన్నది బయటపడిన నిజం. ఈ పేలుడు ఫలితంగా హతులైన ఇద్దరూ, బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేస్తున్న జమాత్ ఉత్ ముజాహిద్దీన్ బీభత్స సంస్థకు చెందిన వారని దర్యాప్తు చేస్తున్న భద్రతావిభాగాలవారు నిగ్గు తేల్చారు. అరెస్టయిన మరో నలుగురు అదే సంస్థకు చెందిన వారన్నది పోలీసుల నిర్ధారణ. వీరందరికీ బంగ్లాదేశ్‌కు చెందిన మరో జిహాదీ హంతక ముఠా హుజీతో కూడ చక్కటి సంబంధాలు ఉన్నట్టు భద్రతా దళాల వారు ధ్రువపరచారు. పాకిస్తాన్ ప్రభుత్వ నిఘా విభాగంగా చెలామణి అవుతున్న ఐఎస్‌ఐ సంస్థవారి భారత వ్యతిరేక బీభత్స కాలాపాలలో ఈ పేలుళ్లు భాగం. పేలుళ్లు ప్రమాదవశాత్తు జరిగాయా లేక కావాలని ఈ జమాత్ ఉత్ ముజాహిద్దీన్ హంతకులు పేలుళ్లు జరిపారా అన్నది అప్రధానమైన అంశం. అంతమంది హంతకులు అంతపెద్ద ఎత్తున పేలుడు పదార్ధాలను నిలువ చేసి నిర్భయంగా నిర్వహిస్తుండడం ప్రధాన సమస్య. ఈ పేలుళ్లు జరిగిన తరువాత ఘటనా స్థలంలో సంచుల కొద్దీ పేలుడు పదార్ధాలు, సామగ్రి పట్టుబడ్డాయి. ఆ తరువాత బెంగాల్‌లోని పురూలియా జిల్లా రఘునాథ్‌పూర్ సమీపంలో 11 వేల చిన్న పెద్ద బాంబులు, 27వేల జిలిటెన్ విస్ఫోటక పదార్ధాల ముక్కలు పట్టుబడ్డాయట. పశ్చిమ బెంగాల్ అంతటా టన్నుల కొద్దీ పేలుడు పదార్ధాలు నిక్షిప్తమై ఉండడానికి ఇలా ఇదంతా నిదర్శనం.
జమ్మూ కాశ్మీర్‌లో ఐఎస్‌ఐఎస్ అన్న జిహాదీ బీభత్స సంస్థవారి, ఆనవాళ్లు లభించడం శుక్రవారం మొదటిసారి కాదు. గతంలో కూడ ఐఎస్‌ఐఎస్ కదలికలు శ్రీనగర్‌లోను కాశ్మీలోయ ప్రాంతంలోను ధ్రువపడినాయి. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం మాత్రం తమ రాష్ట్రంలో ఐఎస్‌ఐఎస్ హంతకులు లేరని ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేసింది. రాజ్యాంగ బద్ధంగా పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా అబద్ధాలు చెప్పడం బీభత్సకారులకు బలం కలిగిస్తున్న దశాబ్దుల వైపరీత్యం. 2001లో సిమి వంటి జిహాదీ ముఠాలను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. తమ రాష్ట్రంలో సిమి ఉగ్రవాదులు ఎవరూ లేరని అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ధ్రువపరచడం చరిత్ర. తమ రాష్ట్రంలో ఫలానా జిహాదీ ముఠాకు చెందిన టెర్రరిస్టులు పట్టుబడలేదని ముఖ్యమంత్రులు చెప్పవచ్చు. కానీ తమ రాష్ట్రంలో హంతక ముఠాలు లేనేలేవని ముఖ్యమంత్రి ఎలా చెప్పగలడు? తెలియని విషయాన్ని తెలిసినట్టు అబద్ధాలు చెప్పడం ద్వారా వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు సమస్యను పరిష్కరించడానికి కాక కప్పిపుచ్చడానకి యత్నించడం జాతీయ భద్రతా కుడ్యాన్ని ఛిద్రం చేయడానికి పదే పదే దోహదం చేసింది. జమ్మూకాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడదే పని చేస్తోంది. తమ రాష్ట్రంలో ఐఎస్‌ఐఎస్ హంతకులెవ్వరూ లేరన్నది జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా 14వ తేదీన చేసిన నిర్ధారణ. కొంతమంది దుండగులు ఐఎస్‌ఐఎస్ జెండాలను ఊపుతూ ఊరేగిన ఘటన గురించి ముఖ్యమంత్రి చేసిన స్పష్టీరణ ఇది. ఆ జెండాలను ఊపినవారు కేవలం మూర్ఖులని వారు ఐఎస్‌ఐఎస్ ఏజెంట్లు కాదని ఉమర్ అబ్దుల్లా కనిపెట్టాడు. పైగా ఈ జెండాలు దురదృష్టవశాత్తు ప్రచార మాధ్యమాల వారి కళ్లలో పడ్డాయని కూడ అబ్దుల్లా వ్యాఖ్యానించాడు. దురదృష్టం ఎవరిది? ఎవరిదైనప్పటికీ ఆయన ఇలా స్పష్టీకరణ ఇచ్చిన తరువాత మూడు రోజులు గడవకముందే 17వ తేదీన శ్రీనగర్‌లో మరోసారి ఐఎస్‌ఐఎస్ వారి జెండాలు, చిహ్నాలు దర్శనమిచ్చాయట.
ముఠాలు వివిధ పేర్లతో చెలామణి అవుతున్నప్పటికీ వాటి లక్ష్యం మాత్రం ఒక్కటే. కార్యక్రమం ఒక్కటే, స్వభావం ఒక్కటే. బెంగాల్‌లో రెండవ తేదీన పేలుళ్లు జరిపిన జమాత్ ఉత్ ముజాహిద్దీన్ వారు హుజీతో అనుసంధానమై ఉన్నారు. ఈ హుజీ జమాత్ ముఠాలు కాశ్మీర్‌లోకి చొరబడిన జైష్ ఏ మహమ్మద్ ముఠాతోను, లష్కర్ ఏ తయ్యబాతోను, జమాత్ ఉద్ దావా తోను అనుసంధాన వ్యవస్థను ఏర్పరచుకున్నాయి. వీటన్నింటికీ ఇండియన్ ముజాహిద్దీన్, సిమి వంటి ముఠాలతో చక్కటి సంబంధాలున్నాయి. ఇప్పు డు ఇరాక్‌లోని, సిరియాలోని ఐఎస్‌ఐఎస్ కూడ మనదేశంలోకి భారీగా చొరబడింది. ఈ ముఠా కూడ మిగిలిన జిహాదీ ముఠాల అనుసంధానంలో చేరిపోయింది. అనుసంధాన సమన్వయ వ్యవస్థను పాకిస్తానీ ఐఎస్‌ఐఎస్ ఏర్పాటు చేసిందన్నది జగమెరిగిన రహ స్యం. అందువల్ల హైదరాబాద్‌లో లష్కర్‌లు పట్టుబడినా, నేపాల్ సరిహద్దులలో జమాత్ ఉద్ దావా హంతకులు సంచరించినా, బెంగాల్‌లో హుజీ మద్దతుదార్లు పేలుళ్లు జరిపినా, కాశ్మీర్‌లోకి జైష్ ఏ మహమ్మదీలు చొరబడినా..ఇదంతా పాకిస్తాన్ ప్రభుత్వ విభాగమైన ఐఎస్‌ఐఎస్ వారి విస్తృత పన్నాగంలో భాగం మాత్రమే. ముంబయికి చెందిన నలుగురు యువకులను ఐఎస్‌ఐఎస్ వారు ఇంటర్‌నెట్ వ్యవస్థ ద్వారా జిహాదీ హంతకులుగా తీర్చిదిద్దినట్టు గత జూలైలో బయటపడినప్పుడు మన నిఘా వ్యవస్థ ఉలిక్కిపడింది. ఈ నలుగురు హంతకులూ మనదేశం నుండి చల్లగా జారుకుని ఇరాక్‌లో తేలారు. ఐఎస్‌ఐఎస్‌లో చేరారు. ఇలా చేరడం మళ్లీ మనదేశానికి తిరిగి వచ్చి పెద్ద ఎత్తున బీభత్స చర్యలు జరపడానికై శిక్షణ పొందడంలో భాగం. వీరిలో ఒకడు ఇరాక్‌లో హతుడయ్యాడట. మిగిలిన ముగ్గురి జాడ లేదు. ఇరాక్‌లో ఐఎస్‌ఐఎస్ అపహరించిన 39 మంది భారతీయ కార్మికుల జాడ ఇంతవరకు తెలియరాలేదు. భారత్‌ను బద్దలు కొట్టే తాలిబన్, అల్-ఖైదా, జమాత్ ఉద్ దావా, లష్కర్ ఏ తయ్యబాల బీభత్స వ్యూహంలో ఐఎస్‌ఐఎస్ ఇప్పుడు ప్రధాన పాత్రధారి…
హైదరాబాద్‌కు చెంది యువకులు కొందరు ఐఎస్‌ఐఎస్‌లో చేరి బెంగాల్‌లో కలాపాలు నిర్వహిస్తూ పట్టుబడ్డారు. మరో 15 మంది హైదరాబాదీలు కూడ ఐఎస్‌ఐఎస్‌లో చరిపోయినట్టు నిఘా అధికారులు అనుమానించినట్టు సెప్టెంబర్‌లో ప్రచారమైంది. వీళ్లంతా ఇప్పుడెక్కడ ఉన్నారు? బెంగాల్‌లో జరిగిన పేలుళ్ల నిర్వాహకులతో వీరికి సంబంధాలు ఏర్పడి ఉండినట్టయితే ఆశ్చర్య పోనక్కరలేదు. బంగ్లాదేశ్ సరిహద్దులను మరింత కట్టుదిట్టం చేయడం ప్రభుత్వ తక్షణ కర్తవ్యం!

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సాహిత్య కళ గా జ్ఞాపకం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వెలిగించిన విద్యుల్లత

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కవితలు -పులి ,విశాఖ వెళ్లి రావాలి

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శతక ధారణ లో ప్రపంచ రికార్డ్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

స్స్వయంక్రుతాపరాధం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -44

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -44

44-కవి శిక్ష రాసిన -మొదటి వాగ్భటుడు

జైన  కవి వాగ్భటుడు1121-1156 కాలానికి చెందినా వాడు ,’’వాగ్భటాలంకారం ‘’ రాశాడు .ఇందులో అయిదు పరిచ్చేదాలుంటాయి .కావ్య లక్షణాలు ,హేతువులు ,ప్రయోజనాలు ,కవి శిక్ష ,కవిసమయాలు ,కావ్య భేదాలు ,దోషాలు గుణాలు ,భాష ,అలంకారం ,రీతులు ,చిత్రబంధ కవిత్వం నాయికా నాయక భేదాలు రసం మొదలైన వన్నీ  చర్చించాడు కావ్యాలను మూడు రకాలుగా చెప్పాడు ఛందస్సుతో ఉన్నవి ఛందస్సు లేనివి ,మిశ్రమాలు .రీతులలో గౌడీ .వైదర్భి లనే గ్రహించాడు .లక్షణాలకు ఉదాహరణలు తానె స్వయం గా రాయటం వాగ్భటుని ప్రత్యేకత .’’నేమి నిర్వాణం ‘’అనే మహాకావ్యాన్ని రాశాడు .ఇతని అలంకార గ్రంధానికి సింహ దేవ గని వ్యాఖ్య రాశాడు .ఇనో గమ్మత్తైన విషయం తన అలంకార గ్రంధానికి తానె వ్యాఖ్యానం రాసుకోవటం .

45-ఛందోశాస్త్రం రాసిన-  రెండవ వాగ్భటుడు

పద్నాలుగవ శతాబ్దికి చెందిన మరొక వాగ్భటుడు ఉన్నాడు .ఇతనిని రెండవ వాగ్భటుడు అంటారు .ఈయనా  ఆలంకారికుడే .’’కావ్యాను శాసనం ‘’రాశాడు .ఇది సూత్ర పద్ధతిలో సాగిన రచన .తానె స్వయం గా ‘’అలంకార తిలకం ‘’అనే వ్యాఖ్యానాన్ని రాసుకొన్నాడు .ఇది కాక చందోసాసనం అనే ఛందస్శాస్త్రాన్ని కూడా రాశాడు .ఋషభ దెవక చరిత్ర అనే మహాకవ్యాన్నీ రాశాడు .

అష్టాంగ సంగ్రహ  అష్టాంగా హృదయ అనే ఆయుర్వేద గ్రంధాలను  రాశాడు వాగ్భటుడు .యితడు బౌద్ధుడు .చరక ,శుశ్రుత సంహితలలో వాగ్భాటుని గురించి ఉంది .ఆనాటి సింధు ఈనాటి పాకిస్తాన్ లో ఉండేవాడు .సింహగుప్తుని కుమారుడు .అవలోకితుని శిష్యుడు .ప్రఖ్యాత ఆయుర్వేద శాస్త్ర కర్త ర్త చరకుని శిష్యుడు .మూడు వేల సూత్రాలను రాశాడు .ఎనభై అయిదు శాతం వ్యాధులు ఆయుర్వేద  సూత్రాలను పాటిస్తే డాక్టర్ తో పనిలేకుండా నయమవుతాయని మిగిలిన పది హీను శాతం వాటికే మందులు వాడాల్సి వస్తుందని తెలియ జేశాడు .శుశ్రుతుడు శస్త్ర వైద్యం లో దిట్ట .చరకుడు ఆయుర్వేద మేధావి .వాగ్భాటుడు ఆయుర్వేద సార సంగ్రహం చేసిన వాడు ఈ ముగ్గురిని ఆయుర్వేద త్రయం అంటారు .

అష్టాంగ హృదయ సంహితను వాగ్భాటుడు కమ్మని కవిత్వం లో రాశాడు .ఇందులో ఏడువేల నూట ఇరవై శ్లోకాలున్నాయి .ఎనిమిది విధాల వైద్యం గూర్చి చెప్పాడు .అష్టాంగా హృదయ సంహిత ఆయుర్వేదం లో వచ్చిన మాస్టర్ పీస్ గ్రంధం .ఇది అనేక దేశాలలో ఆయా భాషలలో అనువాదం పొందింది . అష్టాంగ  నిఘంటు ,అష్టాంగ సార ,భావ ప్రకాశ ,ద్వాదసార్ధ నిరూపణ ,కాల జ్ఞాన ,పదార్ధ చంద్రిక ,శాస్త్ర దర్పణ ,శత శ్లోకి ,వాగ్భటీయ ,వామన కల్ప ,మొదలైనవి రాసినట్లు తెలుస్తోంది .

46- రాజ తరంగిణి కర్త –కల్హణుడు

కాశ్మీర రాజుల చరిత్ర ‘’రాజ తరంగిణి ‘’రాసిన కల్హణుడు కాశ్మీర రాజు జయ చంద్రుని ఆస్థానకవి .కాలం 1127-1149.ఏంతో శ్రమించి రాజుల చరిత్రలను సేకరించి అధారితటేటివ్ గా రాజ తరంగిణి రాశాడు .ఇందులో ఎనిమిది తరంగాలున్నాయి .మదటి మూడు తరంగాలలో ఊహలు అపోహలు కలగా పులగం గా ఉంటాయి మిగిలినవి పూర్తీ చారిత్రిక సత్యాలే .తండ్రి అమాత్య చంపకుడు .1148-49మధ్య రాజ తరంగిణి రాశాడు ..తండ్రి కాశ్మీర రాజు హర్షుడి ఆస్థానం లో ద్వారపతి .తర్వాత మంత్రి అయ్యాడు .శైవమతావలంబ కుటుంబం .అయినా బౌద్ధం అంటే అభిమానం .హర్ష రాజు దుర్మార్గుడు .తిరుగుబాటు జరిగి దేశం అల్లా కల్లోలమైంది హర్ష వధ తర్వాత తండ్రి పదవి ఊడింది .కల్హణుడు ఎక్కడా రాజాస్థానం లో ఉన్న దాఖలాలు లేవు .

రాజతరంగణీయం

ఇందులో 7826 శ్లోకాలున్నాయి శాంత రస ప్రధానం గా కల్హణుడు రాశాడు .తానుకొత్తగా చెప్పింది ఏదీ లేదని పూర్వపు వాటినే గుర్తుకు తెస్తున్నానని చెప్పాడు .తనకు ముందున్న పదకొండు రచనలే రాజతరంగిణి కి ఆధారం అన్నాడు .ఇందులో నీలమత పురాణం ,క్షేమేంద్రుని నృపావలి ,హెల రాజు రాసిన పార్దివా వలి మొదలైనవి .ఎన్నో శాసనాలను పత్రాలను పరిశోధించి రాసిన ఉద్గ్రంధం ఇది .మొదటి నుంచి తన కాలం వరకు ఉన్న రాజుల చరిత్రలన్నీ సేకరించి రాశాడు .ఏది చెప్పినా నిష్పాక్ష పాతం గా చెప్పాడు .ఆ నాటి రాజకీయాలను ఉద్యోగులను వారి పాలన లో డొల్ల తానాన్ని బయటికి తీసి నిర్భయం గా చెప్పాడు .రాజకీయ ఆర్ధిక సామాజిక  నైతికక ధార్మిక న్యాయ విషయాలన్నీ చర్చించాడు .యూరపు దేశం లోని మధ్యయుగ చరిత్ర ఉన్నట్లే రాశాడని అభినందించారు .స్టెయిన్ అనే ఆంగ్లేయుడు 1900లో ఇంగ్లీష్ లోకి అనువదించి ప్రచురించాడు .1617లో జహంగీర్ కాలం లో హైదర్ మాలిక్ పర్షియన్ భాషలోకిపా శికం గా  అనువాదం చేశాడు  ఆధునిక  యుగం లో రంజిత సీతా రామ పండితుడు పూర్తిగా అనువాదం చేశాడు  పిరదౌసి రాసిన షానామా కంటే రాజ తరంగిణిలో వాస్తవం పాలు ఎక్కువ .

కల్హణుడు వ్యాకరణ పారంగతుడు .ఇతని గొప్పతనాన్ని’’ మంఖ పండితుడు’’మెచ్చాడు .అర్ధ ,రాజనీతి బౌద్ధ శాస్త్రాలను ఆకళింపు చేసుకొన్నాడు .చక్కని కధనాన్విత శైలి  లో రాశాడు .కధనాలను కావ్య పద్ధతిలో రాశాడు .రసాన్ని ప్రకటించేటప్పుడు నేల విడిచి సాము చేయలేదు .వైదర్భీ రీతిలో నూత్న శబ్ద భాండారం తో రసజ్నులను మెప్పించాడు .కాశ్మీర పదజాలం సంస్కృతం లో ఎక్కువగా చేరింది .

అశోకుడి ముందు యాభై రెండు రాజుల చరిత్ర గురించి వివరించాడు .ఒక్కో రాజు పాలనా కాలం సుమారు యాభై ఏళ్ళుగా గ్రహించాడు .అశోకుడిని వెయ్యేళ్ళు ముందుకు నేట్టాడుకాని మౌర్య వంశస్తుడే అన్నాడు .కుషాన రాజుల చరిత్రనూ సాధికారం గా రాశాడు. మిహిరకులుడు శివాలయం నిర్మించాడని బ్రాహ్మణులకు భూరి దానాలిచ్చాడని కనిష్కుడికాలం లో ఆచార్య నాగార్జుండు ఉన్నాడని ,మాత్రుగుప్త రాజు కళా పోషకుడు ,కవి అని అతని ఆస్థానం లో ‘’మేంఠకవి ‘’ఉండేవాడని ,ఆయన హయగ్రీవ వధ  రాశాడని చెప్పాడు .ఉత్పల వంశ రాజులలో అవంతి వర్మ మొదటి రాజు అని అతనికాలం లోనే కాశ్మీర దేశ చరిత్ర ఐతిహాసిక సత్య సమన్వితం గా రచించాడు .కాశ్మీర రాజు హర్షుడు నాలుగు వేల బుద్ధ దేవాలయాలను విగ్రహాలను ధ్వంసం చేసినట్లు చెప్పుకొన్నాడు .కాశ్మీర రాజుల చరిత్రను సాధికారం గా రాసిన మొదటి కవి కల్హణుడు .

మరో కవితో ఈ సారి

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -18-10-14-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -43

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -43

43- మహా రాజ కవి –భోజుడు

భోజరాజు వేదాంతి ,బహుశాత్రవేత్త .మధ్య భారతం లో మాల్వా సంస్థాన రాజు .పారమార్  వంశానికి  చెందిన వాడు .1055వరకు రాజ్యపాలన చేశాడు .’’రాజా భోజా ఆఫ్ దార్ ‘’అని ఆప్యాయం గా పిలుస్తారు .భోజ అంటే సంపూర్ణమైన సర్వ  సంపన్నమై సరళమైన వాడని అర్ధం .మహాభారత యుద్ధం లో భోజ వంశీయ రాజులు పాల్గొన్నారు .భోజుడు అనేక దేవాలయాలు నిర్మించాడు అందులో ముఖ్యమైనది భోపాల్ లో కట్టించిన ‘’భోజేశ్వర దేవాలయం ‘’.భోజేశ్వర పట్టణం ను భోపాల కు ముప్ఫై కిలో మీటర్ల దూరం లోబెట్వా నదీ తీరం లో  నిర్మించాడు .భోజ శాల నిర్మించి అందులో అతిపురాతన తాళ పత్రా గ్రంధాలను సేకరించి ఉంచాడు .ఇది గొప్ప విద్యాకేంద్రం గా విలసిల్లింది. ఈనాటి దార్ లో భోజుడు నిర్మించిన సరస్వతీ దేవాలయం ఉన్నది .

భోజ రాజీయం

భోజుడు ఘూర్జర రాజ వంశానికి చెందిన వాడు .వేదాంతం కవిత్వం జంతుశాస్త్రం ,యోగ శాస్త్రం భాషా శాస్త్రం యోగ శాస్త్రం ధనుర్ శాస్త్రాలలో గొప్ప గ్రంధాలు రచించాడు .భోజుడికాలం లో మధ్య భారతం సువర్ణ యుగం గా పేరుపొందింది గుజరాత్ రాజు సోలంకి తో కలిసి సోమనాదాలయాన్ని నిర్మించాడు .1026-1042కాలం లో ఈ బృహత్ నిర్మాణం జరిగింది .భోజపురం నిర్మించాడు ఈనాటి భోపాల్ కూడా ఆయన కట్టించినదే .భోజ పట్నం లో ధనపాలుడు అనే జైన  పరివ్రాజకుడు ఉండేవాడు .ఈయన బోధనలతో యజ్న యాగాదులలో పశు హింసను ఆపెయించాడు .అంతేకాదు భోజుడు వేటా డటానికీ ఫుల్ స్టాప్  పెట్టాడు .సైనిక బలాన్ని బాగా వృద్ధి చేసుకొని చాళక్య రాజుఅపై దండ యాత్ర చేసి ఓడించి రాజ్య వ్యాప్తి చేశాడు .సుల్తాన్ మహమ్మద్గజనీ తో సౌరాస్త్రలోని సోమనాధ దేవాలయం వద్ద భీకర పోరాటాలు చేశాడు .భోజ సైన్య ప్రతాపానికి గజని పలాయనం చిత్త గించాడు .శాకంబరి రాజు చః మానస్ ను ఓడించాడు .తర్వాత చండేలా రాజులు రాష్ట్రకూటులు మొదలైన వారంతా కలిసి భోజునిపై దండెత్తారు .సోలంకి రాజు భీమదేవుడి రాజ్యాన్ని ఆక్రమించాడు భోజుడు .భీముడు హయహయులతో చేతులుకలిపి భోజుని ఎదిరించాడు .హయహాయ రాజు కర్నాను సోలన్కిని ధైర్యం గా ఎదుర్కొని భోజుడు పోరాడాడు కాని ఒక బాణం వచ్చి తగిలి భోజుడు వీరమరణం పొందాడు .ఘజనీ ముఠాను సోమనాధ దేవాల సమీపానికి రానీకుండా తీవ్రం గ అడ్డుపడ్డాడు భోజమహా రాజు .భోజునిపై ఒక చాటువు ప్రచారం లో ఉంది –

‘’అద్య ధారా సదా ధారా సదాలంబ సరస్వతీ –పండితాః మండి తాః సర్వే భోజ భువనం గథెహ్ ‘’దీని అర్ధం ‘’ఇవాళ ధారా రాజ్యం ఎల్లప్పుడూ అండగా ఉంది సరస్వతీదేవి భూమిమీద కవులందరినీ సత్కరించే భోజునికోసం ఎదురు చూస్తోంది .

భోజుడు ఓడిపోయిన తర్వాత కవులు –

‘’అద్య ధారా నిరాధారా నిరాలంబ సరస్వతీ –పండితాః ఖండితాః భోజ రాజే దివం గతే ‘’దీనిభావం –‘’ఈ నాడు ధారా రాజ్యానికి రక్షకులే లేరు .సరస్వతీదేవికే సంరక్షణ లేదు .పండితులందరూ భోజుడు దివికి చేరగానే ఎక్కడివారు అక్కడే పారిపోయారు .భోజుడు మొత్తం 84 గ్రంధాలు రచించాడు .పరిపూర్ణమైన కవిత్వ గ్రంధాలు రాశాడు .భోజునిది గొప్ప కవిత్వం గా పేరు తెచ్చుకొన్నది .పతంజలి యోగ శాస్త్రానికి భాష్యం రాశాడు .సివిల్  ఇంజినీరింగ్ గురించి సమరాంగణ సూత్రధార రాశాడు .ఇందులో దేవాలయ ,నిర్మాణం కోటల నిర్మాణం  ,విగ్రహ నిర్మాణం ఇళ్ళ నిర్మాణం మొదలైన సమస్త విషయాలున్నాయి .తత్వ ప్రకాశ అనే తాంత్రిక గ్తంధం ,రస రాజ మ్రుగాంకం అనే లోహశాస్త్ర గ్రంధం ,యుక్తి కల్ప తరు అనే నౌకానిర్మాణ శాస్త్రం  ,న్యాయ శాస్త్రం పై ధర్మ శాస్త్ర వ్రుత్తి ,చంపూ రామాయణం మొదలైనవి భోజ రచనలు .అన్నీ సుప్రసిద్ధాలే బహు శాస్త్ర కోవిదుడు అయి నందు వల్లనే ఇలాంటి గ్రంధాలూ రాయగలిగాడు .

కవిపండిత పోషకుడై సాహిత్య ప్రేమికుడై నిరతాన్న దాత అయి ఆశ్రయించిన వారి కొంగుగుబంగారమై వర్ధిల్లిన రాజు భోజుడు .మన కృష్ణ దేవరాయల ఆస్థానం లో కవి పండితులున్నట్లే భోజాస్థానం లోను కాళిదాసాది కవులుండేవారు రాయలూ కవే . భోజుడూకవే .అందుకే రాయలను ఆంధ్రభోజుడు అన్నారు .భోజుని చంపూ రామాయణం వాల్మీకమే .దానిపై తన భక్తిని చాటుకొంటూ భోజుడు –‘’వాల్మీకి గీత రఘుపున్గవ కీర్తి లేశైః-తృప్తిం కరోమి కధమప్యాదునా బుదానాం ‘’-గంగా జలైర్భువిని భాగీరధ యత్న లబ్ధైహ్ –కిం తర్పణం నవిదధాతి నరః పిత్రూనాం’’అన్నాడు అంటే భగీరధుడు తన పితృదేవతలకు గంగాజలం తో తర్పణ లిచ్చి తరింప జేసినట్లు వాల్మీకి మహర్షి రాసిన రామ చరిత్రనే ఆధారం గా సజ్జనులకు తృప్తి కలిగించే ప్రయత్నం చేస్తున్నాను .’’

భోజునికవిత్వం రస రమ్యమైనది .వర్ణనలను అద్భుతం గా చేశాడు రుతువర్ణనలు  గొప్పగా ఉంటాయి అనుప్రాస యమకాలన్కారాలను బాగా ఉపయోగించుకొన్నాడు .ఆపాత మధురమైన కవిత్వం తో విందు చేస్తాడు .గద్యమూ హృదయం గా రాశాడు. లలితం గా కర్ణ పేయం గా కవిత్వం ఉంటుంది .అలాంటి శబ్దాలనే ఎన్నుకొంటాడు .వైదర్భీశైలికే ఎక్కువ విలువ నిచ్చాడు శ్లేషనూ సమాదరించాడు .అంత్య ప్రాసలతో అలరిస్తాడు –

‘’ఏనాం పురాణ నగరీం నగరీతి సాలాం-సాలాభి రామ భుజ నిర్జిత యక్ష రాజః –హేలాభి భూత జగతాం రజనీ చరా –ణాంరాజా చిరాదయితి రావణ నామ దేయః ‘’.వాలి వధ తర్వాత తార విలాపం లో శోకాన్ని బాగా ప్రదర్శింప జేశాడు –

‘’నాహం సుకేతు తనయా నచ సప్త పాళీ –వాలీ నచ త్రిభువన ప్రదిత ప్రభావః

తారాస్మి వజ్ర హృదయా విశిఖర భేద్యా –ధన్వీ కదం భవసి రాఘవ మామ విధ్వా’’రాముడితో తార అన్నమాటలివి –రామా నేను తాటకను కాను సప్త తాళ వ్రుక్షాలనూ అంతకంటే కాను  .త్రిభువన పరాక్రమ శీలి వాలినీ కాను .వజ్ర హృదయం ఉన్న తారను .నన్ను నువ్వు ఏమీ చెయ్యలేవు. నన్ను చంపే వరకు ధన్వి అనే పేరు నీకు సార్ధకం కాదు ‘’

రామాయణ చంపువు ను ‘’భోజ చంపు అంటారు’’. చంపు అంటే పద్యం వచనం కలిసిఉన్న కావ్యం అని తెలిసిందేకదా .ఆంద్ర దేశం లో పూర్వం గురుకుల విద్యలో రామాయణ చంపుతోనే విద్యార్ధి మొదలు పెట్టేవాడట .అంతటి ప్రశస్తి భోజుని చంపువుకున్నది  ద్రావిడ కర్నాటకాలలో కూడా  దీనికి వ్యాప్తి, ఆసక్తి ఎక్కువ .దేనీ నారాయణ ,రామ చంద్ర కామెశ్వర ఘనశ్యామ లు రాసిన టీకాలు ఉన్నాయి .

మరోకవితో కలుద్దాం

Inline image 1

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-10-14-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -42

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -42

42-వ్యంజనా వ్రుత్తి  కారుడు -ముమ్మటుడు

ముమ్మటుడు 1050-1100వాడు .అభినవ గుప్తుడి శిష్యుడనని  తానే  చెప్పుకున్నాడు .’’కావ్య ప్రకాశం ‘’అనే అలంకార గ్రంధం రాశాడు .సాహిత్య శాస్త్ర ములో ముమ్మటుడికావ్యానికి ప్రత్యెక స్థానం ఉంది .ఇతని జన్మ స్థలం తల్లిదండ్రుల గురించి తెలియదు .

ముమ్మట సమ్మత కావ్యత్వం

కావ్య ప్రకాశం లో ముమ్మటుడు పూర్వ అలంకార వాదుల మార్గాన్నే అనుసరించాడు .కాని ధ్వని సిద్ధాంతాన్ని బాగా సమర్దించాడు . ఈ సిద్ధాంతాన్ని ఎదిరించిన వారికి  దిమ్మ తిరిగే సమాధానాలు చెప్పి యుక్తులతో ధ్వని కి అశేష ప్రాచుర్యం సాధించాడు .ఆనంద వర్ధనుడి ధ్వని  సిద్ధాన్తానికి తిరుగు లేని ప్రచారం ముమ్మటుని వల్లనే సాధ్యమైంది .భామహుడు కూడా ధ్వని వాదియే అని నిరూపించాడు .కావ్య ప్రకాశం లోని భాగాలను ‘’ఉల్లాసాలు ‘’అన్నాడు ఇందులో నూట నలభై కారికలున్నాయి .మొదటి ఉల్లాసం లో మామూలుగానే కావ్య ప్రయోజనాలు ,కావ్య హేతువులు ,భేదాలు ,కావ్య భేదాలు చెప్పాడు .రెండులో శబ్ద వ్యంజనం గురించి చెప్పాడు . .మూడులో అర్దీ వ్యంజన గురించి చెప్పాడు . నాలుగులో రసాది ధ్వని చర్చ చేశాడు .అయిదులో వ్యంజన యొక్క శక్తిని వివరించాడు .ఆరవ ఉల్లాసం లో చిత్రకావ్య ప్రస్తావన చేశాడు .ఏడులో గుణ దోష చర్చ చేశాడు .ఎనిమిదిలో గుణం అంటే ఏమిటో తెలియ జేశాడు .తొమ్మిదో ఉల్లాసం లో శబ్దాలంకారాలను వివరించాడు .పదిలో అర్దాలంకార వివరణ ఉంది .’’తద దోషౌ శబ్దార్ధౌ సగుణా నవలం కృతీ పునః క్వాపి ‘’అని గుణాన్ని నిర్వచించాడు .దోషాలు లేకుండా గుణ సహితం గా కావ్యం ఉండాలని దండి చెప్పినదాన్ని దండిగా సమర్ధించాడు .దీనికి బలీయం గా దోష చర్చను చాలా విపులం గా చేసి ఆ దారి పట్టవద్దని హెచ్చరించాడు .ఎక్కువ  గా అలం కారం రం మీద ఆధారపడలేదు .అందుకే ‘’అనలం కృతీ పునః క్వాపి’’అని సమర్ధించుకొన్నాడు .కాని అలంకార భేదాలను మాత్రం విపులం గా చర్చించాడు .ముమ్మటుడి కావ్య ప్రయోజనాల ,కావ్య హేతువుల గురించి చేసిన చర్చ అందరినీ  ఆకర్షిం చింది .అతని శబ్ద శక్తుల వివరణ ప్రాచుర్యం పొందింది ..

ముమ్మటుడి కావ్య ప్రాకాశానికి మొట్ట మొదటి వ్యాఖ్యానం మాణిక్య చంద్రుడు అనే జైన మతాచార్యుడు 1159 లో రాశాడు .తర్వాత చాలా మంది రాశారు .దాదాపు యాభై టీకలు రాశారు .భగవద్గీతకు తప్ప ఇన్ని టీకాలు మరి ఏ ఇతర గ్రన్ధానికీ లేదని అంటారు .టీకలకు వివరణలు ,వివరణలకు మళ్ళీ టీకలు రాస్తూనే ఉన్నారు .ప్రతి ఇంటిలో ముమ్మటుడి ‘’కావ్య ప్రకాశం ‘’ ఆవరించి ఉంది అని ఒక శ్లోకం ప్రచారం లో ఉంది –‘’కావ్య ప్రకాశస్య  కృతాగృహే గృహే టీకా తదాప్యేష తధైవ దుర్గమః ‘’-

43-  అభివ్యక్తివాద వ్యాపకుడు- అభినవ గుప్తుడు

అభినవ గుప్తుడు మహా మేధావి ,గొప్ప దార్శ నికుడు గా ,ఆలంకారికుడు గా  ప్రసిద్ధుడు .కొత్త గ్రంధాన్ని రాయలేదుకాని ఇతర గ్రంధాలకు గొప్ప వ్యాఖ్యలు రాశాడు .భరతుని నాట్య శాస్త్రానికి ‘’అభినవ భారతి ‘’వ్యాఖ్యానాన్ని ,ఆనంద వర్ధనుడి ‘’ధ్వన్యా లోకం ‘’కు ‘’లోచన ‘’ వ్యాఖ్యను రాసిన మహా పండితుడు .స్వతంత్ర ఆలోచనలున్న వాడుగా సుప్రసిద్ధుడు

అభినవ గుప్తీయం

ధ్వన్యాలోకం లో అస్పష్టం గా ఉన్న సిద్ధాంతాలను స్పస్టపరచి  పుస్ష్టి కల్గించాడు .రస ధ్వనికి ఆతనుచేసిన వివరణ చిర స్థాయిగా నిలిచిపోయి  ఆనంద వర్ధనుడిని చిరంజీవి ని చేసింది .అభినవ గుప్తుడు ‘’అభి వ్యక్తి వాదం ‘’అనే దాన్ని సిద్ధాంతీకరించాడు .శైవ అద్వైతం లో ఉన్న ఆనంద వాదం  భూమికగా అభినవ గుప్తుడు  రసాన్ని చర్చించాడు .విభావ ,అనుభావ మొదలైన వాటిద్వారా సామాజికు లలో ఉన్న వాసనా రూపం లో రసం అభి వ్యక్తం అవుతుందని ,రసం వలన కలిగే ఆనందం బ్రహ్మానంద సహోదరమైనదని తిరుగు లేని తీర్పు నిచ్చాడు .యితడు రాసిన ‘’ధ్వన్యాలోకం ‘’ ‘’చాలా ప్రౌఢ రచన .ఈ వ్యాఖ్యానమే తర్వాతి ఆలం కారులకు  మార్గ దర్శనం చేసింది .

పందొమ్మిది మంది మహా పండితుల వద్ద అభినవ గుప్తుడు శాస్త్ర విద్యలను నేర్చాడు .భట్ట ఇందురాజు దగ్గర ధ్వని సిద్ధాంతాన్ని ,భట్ట తౌతుడివద్ద నాట్య శాస్త్రాన్ని ,అభ్యసించాడు .శైవ సంప్రదాయం లో ‘’ప్రత్య భిజ్న’  గ్రంధం  రాశాడు .గుప్తుడికి  తండ్రియే గురువు .తల్లి విమల ,తండ్రి నరసింహ గుప్తుడు .తాత వరాహ గుప్తుడు .ఈతని పూర్వులు పంజాబ్ లోని ‘’దో ఆబ్ ‘’ప్రాంతం వారు .తర్వాత కాశ్మీరం చేరుకున్నారు .గుప్తుడు శైవ ఆగమాలలో నిష్ణాతుడు .తంత్ర శాస్త్రం లోనూ దిట్టయే.శైవానికి చెందిన నలభై ఒక్క  గ్రంధాలను రాశాడు .ఇందులో పదకొండు మాత్రమె లభ్యం .శైవ ఆగమాలమీద, స్తోత్రాల మీద అనేక వ్యాహ్యలు రాశాడు .భట్ట తౌతుడు రాసిన ‘’కావ్య కౌతుకం ‘’కు ‘’వివరణ ‘’రాశాడు అభినవుడు .

అభినవ గుప్తుడికి పూర్వం   ధ్వన్యా లోకానికి ‘’చంద్రిక ‘’అనే వ్యాహ్యనం ఉండేదని ,దాన్ని అభినవ గుప్తుని అన్న రాశాడని వారి వంశం లో దాన్ని పారం పర్యం గా అధ్యయనం చేసేవారని ప్రచారం లో ఉంది. చంద్రిక చాలదని లోచన వ్యాఖ్య రాశానని అభి చెప్పాడు .ముమ్మటుడు అభినవ గుప్తుని ‘’ఆచార్య పాదుడు’’అని కీర్తించటాన్ని బట్టి శిష్యుడే అని నిర్ధారించారు .క్షేమేంద్రుడు కూడా అభినవుడు తన గురువు అన్నాడు .శిష్య బృందం తో  అభినవ గుప్తాచార్య పరంపర అభి వృద్ధి చెందింది

అభినవ గుప్తుడు తానూ ”యోగిని ”కుమారుడు అని చెప్పుకొన్నాడు వీరు భైరవారాధకులు ఇతని బావ  వరుస అయిన కర్ణుడు చిన్నప్పుడే శైవాన్ని ఆవ పోసన పట్టాడ ట పెద్దాక్క  అమ్బనిచ్చి వివాహం చేశారు వీరిద్దరికీ ”యోగీశ్వర దత్తు ”జన్మించాడు .ఇతదు యోగం లో పండి పోయాడు  కనుక యోగీశ్వరుడ నిపించుకొన్నాడు రామ మ దేవుడు, క్షేమ కూడా  అభి శిష్యులే .కర్నుడి  స్నేహితుడు మంద్ర రాజు బాగా ఆదుకొన్నాడు  మంద్రుని బంధువు  ”వాతాసిక ”రచనలకు ప్రేరణ నిచ్చింది .పరిసరాల పరి రక్షణ చేస్తూ అభినవ గుప్తుడు ఒంటరిగా జీవించాడు  నిశ్చల మనసుతో శైవ తాన్త్రికాలు రాశాడు మధ్య  భారత  నివాసి  అయిన అత్రి గుప్త అనే పూర్వీకురాలు మధ్య భరతం నుండి హిమాలయాల వరకు అంతా  గొప్ప పీఠ భూమి అని చెప్పిందట .వినాశన అనే నది ఉండేదట .శమ్భు నాధుడు అనే గురువు ప్రేరణతో తంత్రలోకం మొదలైన తాంత్రిక గ్రంధాలు రాశాడు

అభినవ గుప్తుడు ఆజన్మ బ్రహ్మ చారిగా ఉండిపోయాడు ముప్ఫై అయిదేళ్ళు సకల శాస్త్రాల అధ్యయనం చేసి దేశాటనం చేశాడు కాశ్మీర్ చేరాడు .”విరా సన ”లో శిష్యుల మధ్య కూర్చున్న చిత్రం ఒకటిఉంది .తన్త్రసార రాశాడు అతని శతకాలు చాలా ఉన్నాయి  అందులో  బోధ పంచ దశిక ,బోదార్ధ కారక ,అనుభవ నివేదన ,అనుభావస్టక  ,క్రమ స్తోత్ర భైరవఅష్టకం ,దేహ స్తిత దేవతా చక్ర స్తోత్ర ,పరమార్ద్ధ వాదాసిక ,మహోప దేశ వింశతిక ,శివ శక్త్యావినాస స్తోత్రాలు ఉన్నాయి

వేదాంత గ్రంధాలు కూడా రాశాడు ఽ అందులోఈశ్వర ప్రజ్ఞాభిజ్న విమర్శన, వ్రుత్తి విమర్శిని ,ఘత కార్పర కులాక వ్రుత్తి కావ్య కౌతుక వివరణ ,పరాత్రిక లఘు వ్రుత్తి ,పర్యంత పనికషణ  ,దేవీ స్తోత్ర వివరణ ఉన్నాయి

  Inline image 1

.Inline image 2

మరో కవిని చూద్దాం .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -17-10-14-  ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

చికాకోల్ లో ఎవర్ని పలకరించినా ఏడుపే -అట్టాడ అప్పల నాయు

ఎవుర్ని పలకరించూ, యేడుపే..
నాచిన్ననాటి నుంచి నాకు అక్టోబర్‌, నవంబర్‌ మాసాలంటే భయమేస్తాది! ఈ రెండు మాసాల గండం గడనీయి, దేముడా అని మొక్కేది మాయమ్మ! ఆకాశానికీ, భూమికీ దండం బెట్టీవోడు, మా బాపు! గుండెలరచేతిల పెట్టుకొని ఇంటికీ, పొలానికీ తిరుగాడేవోరు వొరదో, వొరుపో యిరుసుకుపడ్తాదని, అరవయ్యేళ్లనాటి భయం… ఇప్పటికీ పోలేదు. ఇంత పెద్దయ్యాను. నేనూ, నా పిల్లలూ పల్లెనీ, పంట భూముల్నీ వొదిలీసాం. నాగల్నీ, నాగేటి చాలునీ వొదిలీసాం. మట్టి, చేతికి మాత్రమే కాదు మరిదేనికీ అంటకుండా బతికేస్తన్నాం. మార్కెట్‌ చల్లగా వుంటే మా కడుపులో చల్లకి ఢోకా లేదన్నట్టగ, లోకంతోపాటు బతికీడం నేర్చుకున్నాం. లోకమా, యింత మారిపోయింది. కాదు కాదు ఎదిగిపోయింది. (మారడమే యెదగడమనుకుంటున్న మిత్రుల భావనలో కూడా), ఆధునికులమ్మాత్రమేకాదు అత్యాధునికులమయ్యాం. ఆటో ఛార్జీలకంటా తక్కువ ఛార్జీలకి అంతరిక్షంలోకి యెళ్లోస్తన్నాం. సృష్టికి సేస్తన్నాం. ప్రకృతిని యెలగ కావొలిస్తే అలాగ మలుసుకొని మార్కెట్లలోన పెట్టి యాపారం సెయ్యగలగతన్నాం… అయినా, అక్టోబర్‌, నవంబర్‌ మాసాలంటే భయం పోలేదు. ఇంకమరి పోదే టో?
మా తల్లిదండ్రులు పంటలు పోతాయేమోనని మాత్రమే భయపడేవారు, గానీ నేడు బతుకులు పోతాయేమోనని భయపడుతున్నం. హుద్‌హుద్‌ తుఫాను యీ భయాన్ని కలిగించడమేగాక, ప్రకృతికి యెంత దూరంగా బతుకుతున్నామో కూడా తెలయిజేసింది. మన పూర్వీకులు, విద్యుత్‌ లేకుండా, మోటార్లూ, బోర్లూ లేకుండా, చివరికి వేగవంతమైన రవాణా సౌకర్యం గూడా లేకుండా… ప్రకృతి ప్రసాదించిన దానితో జీవించేసేవారు. ప్రకృతిని స్వాధీనం చేసుకొని యేర్పాటు చేసుకున్న ఆధునిక సౌకర్యాలమీద యింతగా ఆధారపడేవారుగాదు. ఈ ఆధునిక సౌకర్యాలేవి అందుబాటవకపోయినా, జీవితమెంత దుర ్లభమో హుద్‌హుద్‌ విలయంతో అనుభవంలోకొచ్చి భయమేస్తాంది. విద్యుత్‌.. ఒక్క దీపాల వెలుగుకే తొలిసారిగా, నా చిన్నపుడు పరిచయమైంది. ఇవ్వాల జీవితంలోని అనేక అవసరాలకు విద్యుత్‌ తప్పనిసరయ్యింది. (ఈ కారణంగానే ధర్మల్‌, అణువిద్యుత్‌ కర్మాగారాలకు వ్యతిరేకంగా జరుగుతోన్న ప్రజా పోరాటాలకు సామాజిక మద్దతు కరవవుతోందేమో!) హుద్‌హుద్‌ దాడికి కూలినవి విద్యుత్‌ స్తంభాలే గానీ ఫలితంగా పల్లెలనుంచి నగరాల దాకా రోజువారీ జనజీవితం కుప్పకూలిపోయింది. వెలుగు కోసం మాత్రమే కాదు (కొవ్వొత్తితో సరిపెట్టుకోగల్రు), కర్మాగారాలూ కార్ఖానాలకే గాదు, నీళ్ళ కొరకు మేడలమెట్లు యెక్కి దిగేందుకు, వాహనాల రవాణా కొరకు, కొసకు చేతుల్లో మోగే సెల్‌ కొరకు విద్యుత్‌ కావాలి. కళింగాంధ్రా కవరేజీ యేరియాలో లేకుండా పోయిందిపుడు! ఈ ఆధునిక సదుపాయాల మీద ఆధారపడడమెంత తప్పనిసరో, యిటువంటి విపత్కాలంలో అంతకెక్కువ నిరాధారులమై విలపిస్తాము.. నీళ్ల కోసం, పాలకోసం, పెట్రోల్‌ కోసం, నిత్యావసర సరకుల కోసం… యెంత విలవిల లాడేం కళింగాంధ్రులు (ఒక్క విశాఖవాసులే కాదు) మీడియాసాక్షిగా అందరూ చూసి వుంటారు. ఈ ఆధునిక సదుపాయాలనేవి, యెంతగా మార్కెట్‌ సృష్టిస్తున్నవో, మార్కెట్‌ యెలా మనుషుల జేబుల్ని చిల్లులు పోడుస్తుందో గూడా, యీ నాల్రోజులూ మీడియా చూపించింది.
చట్టం ముందు అందరూ సమానమే గానీ, కొందరు యెక్కువ సమానమట! ప్రకృతి విలయం ముందు కూడా! హుద్‌ హుద్‌ విలయానికి కళింగాంధ్ర దుంపనాశనమై పోయింది. కాదు, విశాఖపట్టణం యెక్కువ నాశనమై పోయిందంటా! గాజు మేడలు, మేడలవారి కార్లూ, ఎత్తయిన షాపింమాల్లూ, ఎత్తయిన హోర్డింగులూ, అంతస్తు అపార్టుమెంట్లు, రోడ్లూ, రోడ్ల మీది చెట్టూ చేమలూ, విమానాశ్రయం, కైలాసగిరి కొండ, యారాడ కొండ (రాచకొండ లేదులెండి), కలెక్టేరు బంగ్లా కొసకి కళింగాన్ని దుంపనాశినం చేస్తాదేటో సుమా అని ముందుగా యెచ్చరించిన రాడార్‌ ఆఫీసూ.. ప్రకృతి విలయం ముందు – సాదాసీదా సజ్జుతో సమానంగా, కాదు కాదు యెక్కువ సమానంగా దుంపనాశనమైపోయింది.
కళ్ళముందర -పడవలూ, బోట్లూ, గుడిసెలూ, గుడిసెల్లోని గిన్నేముంతా, గుడ్డా పాతలూ సంద్రంలోకి కొట్టుకు పోతే కడపు (పోనీ గుండెలు) కొట్టుకొని కళ్లంట జాలారోళ్లు (మత్స్యకార్లు మర్యాదపదం); ఆపాటీపాటి చినుకులుకే సిటీలోని మురికినీటికాల్వలన్నీ ప్రవహించే మురికిపేటల ఇళ్లల్లోని సర్వమూ జగన్నాధమై పోగా కన్నీరు మున్నీరై యేడ్చే మురికివాడల పేదలూ; చిన్నా చితకా కోలనీలూ, కోలనీలలోని చిన్నా చితకా మనుషులూ; అటు పాయకరావుపేటవతల నుంచీ యిటూ భోగాపురమివతలదాకా గుడిసెలు, పెంకుటిల్లు, డాబాలు, దాబాలూ… అందలి ఆటోవాలాలు, తాపీ పనివాళ్ళు, కలాసీలు, చిన్న ఉద్యోగులు, కూలీలు, పనిమనుషులు, పనిదొరకని మునుషులు, పట్నానికి పాలూ, నీళ్లూ, పల్లూ, పూలూ, కాయగూరలూ, తిండిపదార్థాలు, అలంకారాలు, అవసరమైనవన్నీ అమ ర్చే యాపారుస్తులూ – వాళ్లేటి వీళ్లేటియెందరి బతుకులో హుద్‌హుద్‌ ధాటికి బదాబదలైపోయాయి! ఎవర్ని పలకరించూ, యేడుపే…! ఓలప్పా, యేటలగ యేడస్తావు? నీకేనేటే?? వందరికీ ఒకటే రేవు యెట్టీసింది తుఫాను తల్లి. నీకు తెల్దుగానీ సియ్యమ్మారోడి వద్దాల షాపయితే.. చిరిగిన చింకిచాప అయిపోనాది. ఓలప్పా, అల్లా సోనీ కంపినీవోడి బిల్డంగయితే అద్దాలతోటి, ఏసీల్తోటి తళతళ్లాడీదా, అలాపింటిది-అప్పడుకోడె రంకెలేసి కుమ్మేస్తే, కుమ్మరోడి కుండలు చిల్లి పెంకులయిపోతాయి సూడూ అలాగయి పోనాది. అల్లా జోయల్లూకాసూ, స్పెన్సారూ, రిలయిన్సూ, ఒకటేటి వందం వొలకబోసీ షాపులన్నీ వల్లకాడులయిపోనాయి. నీలాగ, ఆళ్లు గానీ యేడిస్తే, సెంద్రబాబుగానీ, మోడీ బాబుగానీ .. ఓదార్సగల్రా? అళ్ల వొసిమా?? నికిచ్చినట్టగ, కోటా బియ్యిమూ, కిరసనూనే, ఉప్పూపప్పూ ఆళ్లగ్గానీ యివ్వగల్డా, యిస్తే ఆళు తీసకుంతారా, ఆళ యేడుపు ఆపతారా? సెప్మీ, సేన, మరేడకు, అంతటోళికే ఆపదొచ్చింది. మనమేపాటి? యేడకని తప్పకా ఓదార్సేవోడు, మా రావిశాసి్త్ర గారి రాకెట్టప్పారావు (బతికిలేడుగానీ).
హుద్‌హుద్‌ దాడికి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు కూడా యెన్నడెరగని రీతిలో ధ్వంసమైనాయి. కళింగ ప్రాంతం – మూడు విభిన్నప్రాంతాల సమాహారం. సముద్రతీరం, అడవీ ఆడవినానుకొని ఉన్న ఆదివాసీ ప్రాంతం, మైదాన ప్రాంతం. ఈ మూడు ప్రాంతాలూ విలయానికి గురయినాయి. ఎన్నడెరగని రీతిలో వీచిన గాలికి అరణ్యం గూడా విధ్వంసమైంది. సాధారణ రోజుల్లోనే ఆదివాసీ ప్రాంతానికీ, యితర ప్రాంతానికీ అనుసంధానం అంతంత మాత్రమే, అటువంటిది, యీ విలయ సందర్భాన ఆదివాసీప్రాంతంలోని జీవుల కడగండ్లు ఊహించడానికి కూడా సాధ్యం కాదు. వాగులు పొంగిపోతాయి, వృక్షాలు కూలిపోతాయి, దారీతెన్నూ వుండదు. తాగే నీరు, తినేందుకు తిండి, వుండడానికి గుడిసె.. యేమీ వుండదూ, యెవరో వస్తారని, ఆదుకుంటారని ఆశ గూడా వుండదు. ఆదివాసీ ప్రాంతంలో యే నిధి నిక్షేపాలున్నవో తెలిపే, వెలికి తీసే శాస్త్ర, సాంకేతిక సామర్థ్యాలు వారి కనీస అవసరాలు తీర్చాల్సినపుడు మాత్రం అక్కరకు రావటం లేదు. (అన్నలీ అవసరాలను తీర్చతున్నారని పోలీసుల ఆగ్రహం).
ఇక కళింగ మైదాన ప్రాంతాన సారవంతమైన పల్లపు భూములున్నవి. వరి, చెరకు, జొన్న, పత్తి (ఒకప్పుడు చోడి, గంటెలు, చామలు వగైరా తిండిగింజల పంటలు) పంటలు పండుతాయి. పట్రాలు రారమ్మని పిలవగా, యెందరో వలసబోగా – కిట్టుబాటు ధరలు లేకపోయినా పంటలు పండించడమొక వ్యవసనమైన రైతులూ; వారినాధారం చేసుకు అర్థాకలితో, అరాకొరా ఉపాధితో బతికే వృత్తి జీవులూ, చేతివృత్తులవారూ, చాకలీ, మంగలీ వగైరా సేవక కులాల జనాలూ, మైదాన ప్రాంతాన నేడు మిగిలినవారు! ఇక్కడి అరటితోటలు యెవరో పగబట్టి తెగనరికినట్టయినాయి. వరిచేలు నీళ్లల్ల తలకిందులుగా మొలకెత్తుతున్నాయి. చెరకులు నడుములు విరిగినాయి. కొబ్బరి తలలు నేలకేసి కొట్టుకున్నాయి. మునగ చెట్ల ముప్పయి ముక్కలుగా విరిగినాయి. నట్టింట దీపమెలిగించ చమురు లేదు (కరెంటు మామూలు రోజుల్లోనే యే జాము రాతిరికో వుండేది) రైతు వెన్నుపూసలు ఫటా ఫటా తెగిపడినాయి! కళ్లంట నీళ్ళుగాదు, నెత్తురు గారుస్తున్నాడు మైదాన ప్రాంతీయుడు!
సముద్రతీరం సరే, మీడియా విశాఖను చూపినట్లే, సుమారు ఇచ్ఛాపురం దాకా తీరంలోని మత్స్యకారులంతా మునుపెన్నడూ లేనంతగా భయభ్రాంతులయినారు. తుఫానుతీరం తాకేదాకా కొట్టుకునే గుండెలు, తీరం తాకింతరాత ఆగి పోయాయి. సంద్రాన్ని చూస్తే భయపడిపోతున్నారు. వల లేదు, బోటు లేదు, గుడిసె లేదు, బతుకు భరోసా లేదు. తెర చాప చిరిగినా, తెడ్డు చేజారినా, గుండె జారనీకు.. ఓ జాలరన్నా… అని యెవరు ధైర్యం చెప్తారు వాళ్లకు?
ఈ తుపాను సందర్భాన రాజకీయ విభేదాలు పక్కన బెట్టి అన్ని రాజకీయ పార్టీలూ ఐక్యంగా విపత్తునుంచి ప్రజలు బయటపడే కార్యక్రమాలను చేపట్టాలి. సినిమా రంగం ముందుకు వచ్చి విరాళాలందించడం మనకు ఆనవాయితీయే, గానీ కళాకారుల మీదా, సాహిత్యవేత్తలూ, సామాజికవేత్తలూ, మేధావులమీదా.. యింకా ముఖ్యమైన బాధ్యతలుంటాయి. అవేమిటంటే, శాశ్వత ప్రాతిపదికన ప్రకృతి విలయాలను తట్టుకునే స్వావలంబనా శక్తీ, మానసిక ధైర్యం, సమష్టితత్వం, సహకార గుణం మనుషుల్లో కలిగించడం, సామూహిక కార్యాచరణ మార్గాలను ఎరుక పరచడం. సమాజాన్ని ఆ మేరకు చైతన్య పరచడం. నదులను మళ్లించడం, ఇళ్లను ముంపులకు గురికాని యెత్తయిన ప్రాంతాల్లో నిర్మించడం, రహదార్లను ఎప్పటికప్పుడు రిపేరు చేయించడం, సముద్రతీరం ప్రాంతంలో తుఫాను షెల్టర్లు నిర్మించడం వంటి ముందు జాగ్రత్త చర్యలను దీర్ఘకాల ప్రాతిపదికన ప్రభుత్వం చేపట్టాలి. అలా ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రాతిపదిన చర్యలు చేపడితే ఇటువంటి విపత్తులు వచ్చినపుడు ప్రజలు తమనాదుకోమని ప్రభుత్వాల వేపు చూడరు. ప్రభుత్వం కూడా ఆదుకోమని దాతలను వేడుకోనక్కరలేదు.
అట్టాడ అప్పల్నాయుడు
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సచిన్‌ సెలబ్రిటీ పల్లె

సచిన్‌ సెలబ్రిటీ పల్లె
ఇన్నాళ్లు బ్యాటు పట్టుకుని పరుగులు తీయడమే కాదు.. ఇప్పుడు పల్లెలను దత్తతకు తీసుకుని అభివృద్ధిలోను పరుగులు పెట్టిస్తానంటున్నాడు సచిన్‌ టెండుల్కర్‌. ఆయన చేతి చలవతో నెల్లూరు జిల్లాలోని పుట్టంరాజుకండ్రిగ రూపురేఖలే మారిపోనున్నాయి. మోడల్‌స్కూల్‌, నిరంతర మంచినీటి సరఫరా, పక్కాఇళ్లు, తళతళలాడే రోడ్లు, సౌరవిద్యుత్తు, క్రీడామైదానం, బ్యాంకు ఒక్కటేమిటి? ఇవన్నీ సమకూరితే ఇదొక సెలబ్రిటీ పల్లె కావడం ఖాయం..
‘‘మన ఊరికి సచిన్‌ వస్తున్నాడు తెలుసా?’’
పుట్టంరాజుకండ్రిగకు వెళితే ఎవరు ఎదురుపడ్డా ఇదే ముచ్చట. ఊరు ఊరంతా ఉత్సాహంతో ఈ తీపి కబురును పంచుకుంటోంది. నెల్లూరు జిల్లా గూడూరు మండల పరిధిలోని నెర్నూరు పంచాయతీ కిందికి వస్తుంది పుట్టంరాజుకండ్రిగ. ఇదొక చిన్న పల్లెటూరు. గూడూరు నుంచి వెంకటగిరికి వెళ్లే ప్రధాన మార్గం నుంచి పదహారు కిలోమీటర్లు మట్టిరోడ్డు మీద వెళితే – ఈ పల్లె వస్తుంది. పల్లెటూరంటే చెప్పేదేముంది? వీధుల్లో రోడ్లు లేవు. సగానికిపైగా ఇళ్లన్నీ శిథిలమై మొండిగోడలతో వెక్కిరిస్తున్నాయి. ఊరి ప్రజల్లో ఎక్కువమంది నిరుపేద కూలీలు. గేదెలు, గొర్రెల పెంపకం మీద ఆధారపడి జీవిస్తున్నవాళ్లు. ‘‘మా ఊరి మొత్తం జనాభా 443. ఇళ్ల సంఖ్య 120. బీసీలు, ఎస్సీ, ఎస్టీలు ఎక్కువ. ఇన్నేళ్లు మమ్మల్ని పట్టించుకున్న ప్రభుత్వం లేదు. అందుకే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోయాం. ఇప్పుడు అందరి దృష్టి మా ఊరి మీద పడటం సంతోషకరం’’ అంటున్నారు గ్రామీణులు.
ప్రధాని పిలుపుతో..
నరేంద్రమోడీ ప్రధానమంత్రి అయ్యాక – ఆయన దృష్టి పల్లెటూళ్ల మీద పడింది. దేశంలో వివిధ రంగాల్లో పేరుప్రఖ్యాతలు, డబ్బు సంపాదించుకున్న సెలబ్రిటీలు పల్లెల వైపు చూడాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఏదో ఒక తోచిన పల్లెను దత్తతకు తీసుకుని సకలసౌకర్యాలతో ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దాలన్నది ఆయన కోరిక. ప్రధాని ప్రకటనకు స్పందించాడు సచిన్‌టెండుల్కర్‌. నెల్లూరు జిల్లాలోని పుట్టంరాజుకండ్రిగను దత్తత తీసుకున్నాడాయన. దాంతో ఒక్కసారిగా ఈ పల్లెకు సెలబ్రిటీ ఇమేజ్‌ వచ్చింది. జిల్లా కలెక్టర్‌ శ్రీకాంత్‌ చొరవతో ఊరికి మహర్దశ పట్టింది. సచిన్‌ కూడా ఎంపీ నిధులు కేటాయించారు. ఇప్పటికే నాలుగు కోట్లతో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గ్రామంలోని 14 ఎకరాల్లో ఉన్న ప్రభుత్వ భూమిని అద్దంలా తీర్చిదిద్దారు. త్వరలో ఇక్కడొక క్రీడా మైదానం ఏర్పడనుంది. ‘‘క్రికెట్‌కు సచిన్‌ మా ఊరి పిలగాళ్లందరికీ ఆదర్శం. ఆయనే స్వయంగా మా ఊర్లో గ్రౌండ్‌ను ఏర్పాటు చేసి.. క్రీడల్లో మా పిల్లలను ప్రోత్సహించడం సంతోషకరం’’ అని చెప్పారు స్థానికులు.
ఊళ్లో ఇప్పటికే పడిపోయిన ఇళ్ల స్థానంలో కొత్త ఇళ్లను నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. గ్రామంలోకి వెళ్లే ప్రధాన రహదారి కూడా తారురోడ్డుగా మారనుంది. చదువుకునే విద్యార్థులకైతే కొత్త పాఠశాల భవనాలు రానున్నాయి. అదీ ఆధునాతన వసతులతో – కిచెన్‌, డైనింగ్‌హాల్‌, రన్నింగ్‌ వాటర్‌, క్రీడామైదానం, పరికరాలు, మరుగుదొడ్లు, కంప్యూటర్లతోపాటు విద్యార్థులకు సైకిళ్లు కూడా అందివ్వనున్నారు. గ్రామం మొత్తం వైపై సౌకర్యం కల్పించేందుకు ప్రణాళికలను పంపారు అధికారులు. ఇందుకు సంబంధించి వెంకటేశ్వర విశ్వవిద్యాలయం సివిల్‌ ఇంజనీర్లు నమూనాలను తయారు చేశారు.
మా గ్రామంలో మంచినీటి సమస్య ప్రధానమైనది. త్వరలో 24 గంటలు నీళ్లు వస్తాయని అధికారులు చెబుతున్నారు. అంతకంటే మాకు ఇంకేమి కావాలి? అంటున్నారు ప్రజలు. ఆర్థికలావాదేవీలకు బ్యాంకు, ఆరోగ్యకేంద్రం, పశువైద్యశాలలను సచిన్‌ నిధులతో ఏర్పాటు చేయనున్నారు. పూర్తిస్థాయిలో విద్యుత్‌ సరఫరాతోపాటు ప్రత్యామ్నాయంగా సౌరవిద్యుత్తు అందుబాటులోకి రానుంది. గ్రామంలో మహిళల ఆర్థిక అభివృద్ధి సాధించేందుకు – సాక్షరతాభారత్‌ కేంద్రం రానుంది. ‘‘ఇవన్నీ సమకూరితే మా ఊరు ఒక ఆదర్శ గ్రామంగా కావడం ఖాయం. ఆ రోజు కోసం వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నాం’’ అంటున్నారు జనం. వచ్చే నెల రెండో వారంలో ఈ గ్రామాన్ని సందర్శించేందుకు సచిన్‌ రానున్నారు.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శోభన్‌బాబు, మంజుల హిట్‌ కాంబినేషన్‌!

శోభన్‌బాబు, మంజుల హిట్‌ కాంబినేషన్‌!

జగపతి ఆర్ట్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించిన ఎనిమిదో చిత్రం ‘మంచిమనుషులు’. అంతవరకూ అక్కినేని నాగేశ్వరరావుతో మాత్రమే సినిమాలు నిర్మించిన ఈ సంస్థ తొలిసారిగా మరో హీరోతో నిర్మించిన చిత్రమిది. అత్యధిక భారీ వ్యయంతో రూపుదిద్దుకొని శోభన్‌బాబు కెరీర్‌లోనే కోటి రూపాయలు వసూలు చేసిన తొలి సాంఘిక చిత్రం ఇదే. అలాగే ఆయన నటజీవితంలో అత్యుత్తమ సంగీతభరిత చిత్రంగా ‘మంచిమనుషులు’ ప్రశంసలందుకొంది. ఈ సినిమా విడుదలై నేటికి సరిగ్గా నలభై ఏళ్లు. ఈ సందర్భంగా చిత్రవిశేషాలను ఒకసారి గుర్తు చేసుకుందాం.

జగపతి ఆర్ట్‌ పిక్చర్స్‌ సంస్థ అంటే అక్కినేని సొంత బేనరు అనే అభిప్రాయం అటు పరిశ్రమలోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ ఉండేది. ఈ సంస్థ నిర్మించిన తొలి చిత్రం ‘అన్నపూర్ణ’లో తప్ప మిగిలిన అన్ని సినిమాల్లోనూ అక్కినేనే హీరో. జగపతి సంస్థ నుంచి అక్కినేని చిత్రం వస్తుందంటే చాలు అభిమానుల కోలాహలం అంతా ఇంతాకాదు. మంచి కథ, పాటలు ఆ సినిమాలో ఉంటాయనేది వారి నమ్మకం. అటువంటి సంస్థ తొలిసారిగా శోభన్‌బాబుతో ‘మంచిమనుషులు’ చిత్రం నిర్మిస్తున్నట్లు ప్రకటించగానే అక్కినేని అభిమానుల ఆగ్రహాన్ని దర్శకనిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్‌ చవిచూడాల్సి వచ్చింది. అయితే అక్కినేనితో బదులు శోభన్‌బాబుతో ఆయన ఈ సినిమా చేయడానికి ఒక కారణం ఉంది. ఆ సమయంలో అక్కినేని అమెరికా వెళ్లడం, అక్కడ ఆపరేషన్‌ జరిగి కొంత కాలం సినిమాలకు దూరంగా ఉండాలని డాక్టర్లు సలహా ఇవ్వడం జరిగింది. అన్ని రోజులు సినిమా చేయకుండా ఖాళీగా కూర్చోవడం కష్టం. పైగా ఆఫీసుపై ఆర్థిక భారం పడుతుంది. అందుకే అక్కినేని అమెరికా నుంచి తిరిగి వచ్చేలోగా వేరే హీరోతో సినిమా చేస్తానని రాజేంద్రప్రసాద్‌ చెప్పగానే అక్కినేని కూడా సరేనన్నారు. అయితే ఈ విషయం తెలియని అభిమానులు మాత్రం
ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మాటని నిర్లక్ష్యం చేసి సినిమా తీసే విడుదల రోజున ప్రింట్లు తగలపెడతామనీ, ధియేటర్లో తెరలు చించేస్తామనీ బెదరించారు. కానీ రాజేంద్రప్రసాద్‌ ఆ బెదిరింపులకు వెరవలేదు. ధైర్యంగా సినిమా మొదలుపెట్టారు.
హిందీ రీమేక్‌
జీవన్‌ప్రభ దేశాయ్‌ రాసిన ఒక హిందీ కథ ఆధారంగా రూపుదిద్దుకున్న ‘ఆ గలే లగ్‌ జా’(1973) చిత్రం ఆధారంగా ‘మంచిమనుషులు’ చిత్రం తయారైంది. శశికపూర్‌, షర్మిలాఠాగూర్‌ హిందీలో పోషించిన పాత్రలను తెలుగులో శోభన్‌బాబు, మంజుల నటించారు. హిందీలో శత్రుఘ్న సిన్హా పోషించిన పాత్రను జగ్గయ్య ధరించారు. తెలుగులో ఈ చిత్రం హిట్‌ అవడంతో 1976లో శివాజీగణేశన్‌, మంజులతో తమిళంలో ‘ఉత్తమన్‌’ పేరుతో నిర్మించారు. కథలో కీలకమైన బాలనటుడి పాత్రను మూడు భాషల్లోనూ మాస్టర్‌ టిటు పోషించడం విశేషం.
శోభన్‌, మంజుల తొలి కాంబినేషన్‌
‘మంచిమనుషులు’ చిత్రంలోనే శోభన్‌బాబు, మంజుల కలసి తొలిసారిగా నటించారు. ప్రేక్షకుల అభిమానజంటగా కితాబునందుకొన్నారు. అక్కడి నుంచి నాలుగేళ్ల కాలంలో ఎనిమిది చిత్రాల్లో వీరిద్దరు నటించారు. ఈ సినిమాలో ‘పడకు పడకు వెంటపడకు’ పాటలో లైలా, మజ్ను, అనార్కలి, సలీంగా మంజుల, శోభన్‌బాబు నటించి అభిమానులకు కనువిందు చేశారు. అలాగే సినిమాలో స్కేటింగ్‌కు ఎంతో ప్రాధాన్యం ఉండటంతో శోభన్‌బాబు, మంజుల 45 రోజుల పాటు స్కేటింగ్‌ నేర్చుకోవడం విశేషం.
కశ్మీర్‌లో షూటింగ్‌
చిత్రంలోని కీలక సన్నివేశాలను కశ్మీర్‌లో పాకిస్థాన్‌ బోర్డర్‌లో చిత్రీకరించారు. దర్శకునిగా రాజేంద్రప్రసాద్‌కు ఇది మూడో చిత్రం. దర్శకునిగానే కాదు నిర్మాత కూడా ఆయన ఎక్కడా రాజీపడలేదు. తన గత చిత్రాలకంటే అత్యంత భారీ వ్యయంతో ఈ సినిమాని నిర్మించారు. భారీ సెట్స్‌, కొత్త లొకేషన్లు ప్రేక్షకులకు విశేషంగా ఆకట్టుకొన్నాయి.
మ్యూజికల్‌ హిట్‌
శోభన్‌బాబు నటజీవితంలోనే అత్యుత్తమ సంగీతభరిత చిత్రంగా ‘మంచిమనుషులు’ ప్రశంసలందుకొంది. అంతకుముందు అడపాదడపా శోభన్‌బాబుకు పాటలు పాడిన బాలసుబ్రహ్మణ్యం చిత్రంలోని అన్ని పాటలూ పాడటం గమనార్హం. ఈ సినిమా తర్వాత బాలు శోభన్‌బాబుకి పర్మనెంట్‌ సింగర్‌ అయ్యారు. ‘పడకు పడకు వెంట పడకు’, ‘నీవు లేని నేను లేను.. నేను లేక నీవు లేవు’, ‘విను నా మాట విన్నావంటే’, ‘నిన్ను మరచి పోవాలని అన్ని విడిచి వెళ్లాలని’, ‘పెళ్లయ్యింది ప్రేమ విందుకు వేళయింది’… ఇలా సినిమాలో ప్రతి పాటా హిట్టే. ఆత్రేయ, ఆరుద్ర రాసిన పాటలకు మామ మహదేవన్‌ మధురమైన బాణీలు సమకూర్చారు. అలాగే ప్రేక్షకుల్ని కలల తీరంలోకి తీసుకువెళ్లేలా దర్శకుడు రాజేంద్రప్రసాద్‌ ఈ పాటల్ని చిత్రీకరించారు.
పది కేంద్రాల్లో వంద రోజులు
1974 అక్టోబర్‌ 18న ‘మంచి మనుషులు’ చిత్రం 35 కేంద్రాల్లో విడుదలైంది. ఆంఽద్రప్రదేశ్‌ లో ఫుల్‌ రన్‌లో కోటి రూపాయలు వసూలు చేసిన శోభన్‌బాబు తొలి సాంఘిక చిత్రం ఇదే. పది కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శితమైంది.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నా కళ్లల్లో ‘హుద్‌హుద్‌’ – ఆర్‌. నారాయణమూర్తి

సమస్త శాఖలును నాయందే నిక్షిప్తమైనవి, సమస్త నిర్ణయాలు నానుండే వెలువడుచున్నవి, సమస్త సర్వేలు నాచే జరుపబడుచున్నవి, నేనే సత్యం, నేనే నిత్యం, నేనే కర్మ, నేనే ఫలితం…
నా కళ్లల్లో ‘హుద్‌హుద్‌’ – ఆర్‌. నారాయణమూర్తి
ఈ నెల 11వ తేదీ రాత్రి నుంచీ 12వ తేదీ రాత్రి వరకు విశాఖలో పెను తుపాను ‘హుద్‌హుద్‌’ సృష్టించిన బీభత్సానికి ప్రత్యక్షసాక్షిగా నిలిచారు నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్‌. నారాయణమూర్తి. ఓ కార్యక్రమానికి హాజరై మధ్యలో విశాఖలో చిక్కుకుపోయిన ఆయన తన జీవిత కాలంలో ఇలాంటి పెను తుపానునూ, ఇంతటి బీభత్సాన్నీ ఎన్నడూ చూడలేదని చెబుతున్నారు. ‘హుద్‌హుద్‌’ తుపాను రోజు విశాఖలో తను చూసిన, ఎదుర్కొన్న అనుభవాలను చిత్రజ్యోతితో ప్రత్యేకంగా పంచుకున్నారు నారాయణమూర్తి. ఆ విలయ విశేషాలు ఆయన మాటల్లోనే…
ఈ నెల 11న కుల నిర్మూలనా పోరాట సమితి ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో జరిగిన సభకు హాజరై, బస్సులో ఆ రాత్రికి విశాఖపట్నం చేరుకున్నాను. అక్కడ రైలు ఎక్కాలనేది నా ఆలోచన. అయితే టైమ్‌ దాటిపోయింది. రైలు అందే పరిస్థితి లేదు. వర్షం పడుతోంది. అప్పటికి ఐదు రోజుల ముందునుంచీ హుద్‌హుద్‌ తుపాను గురించి మీడియాలో వస్తున్న విస్తృత ప్రచారం చూసి, జనాన్ని ఇంతగా భయపెట్టాలా, వారికి మానసిక ప్రశాంతత లేకుండా చేయాలా అనుకున్నా. వర్షం రాను రాను పెరుగుతూ పోతోంది. ఆ రాత్రి విశాఖపట్నంలో ఉండి, మర్నాడు బయలుదేరదామని విశ్వభవన్‌ లాడ్జిలో దిగాను. గత ముప్పై ఐదేళ్ల నుండీ నెనెప్పుడు విశాఖపట్నం వెళ్లినా ఆ లాడ్జిలోనే నా మకాం. ఆ రాత్రి గాలి, వాన హోరు అంతకంతకూ ఉధృతమవుతున్నాయి. పెద్ద పెద్ద వృక్షాలు ఊగిపోతున్నాయి. అర్ధరాత్రికి భయం మొదలైంది. పక్కనే సముద్రం ఉన్నదాయె. ‘భగవంతుడా. ఇది మరో దివిసీమ ఉప్పెన కాకూడదు, మరో కోనసీమ ఉప్పెన కాకూడదు, మరో సునామీ కాకూడదు’ అని ప్రార్థించా. హోరుగాలి ఉధృతం పెరుగుతున్నదే కానీ తగ్గలేదు. అప్పటికే కరెంటు లేదు. చిమ్మచీకటి. ఆ రాత్రంతా కలత నిద్రే. పొద్దున లేస్తే.. ఏ వైపు చూసినా బీభత్సమే. భయానకమే. రాత్రి ఊగుతూ కనిపించిన పచ్చని చెట్లన్నీ ఽనేలమట్టమైపోయాయి. ఽపెద్ద పెద్ద బిల్డింగుల అద్దాలన్నీ పగిలిపోయి బీభత్సమైపోయాయి. కరెంటు స్తంభాలు విరిగి, ధ్వంసమయ్యాయి. రోడ్లు రోడ్లులా లేవు. లాడ్జిపైకెక్కి చూస్తే విశాఖ అంతా కల్లోలమైపోయి కనిపించింది. మనం వాస్తవాలు ఒప్పుకోవాలి. హుద్‌హుద్‌ తుపాను గురించి ముందే హెచ్చరించిన శాస్త్రవేత్తలకూ, ప్రజలనూ, యంత్రాంగాన్నీ అప్రమత్తం చేసిన కేంద్ర, రాష్ట ప్రభుత్వాలనూ ఈ సందర్భంగా ప్రశంసించి తీరాలి. అప్పట్లో ఈ సైంటిఫిక్‌ నాలెడ్జి లేకపోవడం వల్లే దివిసీమ ఉప్పెనలో చాలామంది చనిపోయారు. జనం సురక్షిత ప్రాంతాలకు తరలింపబడలేదు. జనాన్ని ఉప్పెన కబళించేసింది. దాని ప్రభావం సంగతి ప్రభుత్వానికీ తెలీదు. ఇప్పుడు టెక్నాలజీ పెరగడంతో, తుపానును ముందే అంచనా వేయగలిగారు. దానికి తగ్గట్లు ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకోగలిగింది. ఎవర్నీ బయట తిరగవద్దని హెచ్చరించింది. అందువల్లే ప్రాణనష్టం బాగా తగ్గింది. ఇది సాంకేతిక పురోగతి సాధించిన విజయం.
నలుగురితో పాటు నారాయణమూర్తి
ఇక నా విషయానికి వస్తే 13వ తేదీ ఉదయం ఆకలి వేస్తుంటే టిఫిన్‌ చేద్దామని లాడ్జి నుంచి బయటకు వచ్చాను. అంతే. ఏం గాలి! ఏం హోరు! ఎటు చూసినా కూలిన చెట్లు, కరెంటు స్తంభాలు. అడ్డదిడ్డంగా, వెల్లకిలా పడిపోయిన కార్లు, బైకులు. అక్కణ్ణించి రెండు ఫర్లాంగుల దూరంలో ఉంది గ్రీన్‌పార్క్‌ హోటల్‌. అక్కడకు వెళ్లాలి. ముందుకు అడుగులు వేశానో, లేదో తుపాను గాలికి నేనూ బ్యాలెన్స్‌ తప్పి ఎగిరాను. ఓ కాలికి భూమ్మీద పట్టుదొరికింది కాబట్టి సరిపోయింది. లేకపోతే కొట్టుకుపోయేవాణ్ణే. చివరకు దేవుడి మీద భారంవేసి, ఆ తుపాను ఉధృతిలోనే గ్రీన్‌పార్క్‌ హోటల్‌కి చేరుకున్నా. ఆ హోటల్‌ వాళ్లు తుడుచుకోవటానికి టవల్స్‌ ఇచ్చి, టిఫిన్‌ పెట్టారు. మీరు నమ్మాలి. ఉదయం తొమ్మిది గంటలకు ఆ హోటల్‌కు వెళ్లినవాణ్ణి, మళ్లీ విశ్వభవన్‌కు రావడానికి రాత్రి ఎనిమిదయ్యింది. ఓ మహానుభావుడు ప్రేమగా అక్కడ కారులో దింపారు. అప్పటికీ ఉధృతం తగ్గలేదు. ఎటుచూసినా గాఢాంధకారం. ఎక్కడకీ కమ్యూనికేషన్‌ లేదు. 61 సంవత్సరాల నా జీవితంలో ఊహతెలిశాక ఇలాంటి బీభత్సాన్ని కళ్లతో ఎప్పుడూ చూడలేదు. దివిసీమ, కోనసీమ ఉప్పెనలను మించి ఈ హుద్‌హుద్‌ తుపానులో గాలి చేసిన బీభత్సం ఎక్కువ. అయినప్పటికీ ఈ బీభత్సం నుంచి బయటపడేందుకు అహర్నిశలూ కృషిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుగారికీ, ప్రధాని నరేంద్రమోదీగారికీ, ప్రభుత్వ యంత్రాంగానికీ, స్పందించి విరాళాలు అందజేస్తున్న దాతలకూ, స్వచ్ఛందంగా బాధితులకు సాయపడుతున్నవారికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నేను కూడా నా కళ్లముందు పడిపోయిన చెట్లను నలుగురితో కలిసి అక్కణ్ణించి ఓ మూలకు జరిపాం. ఆ ప్రాంతాన్ని శుభ్రం చేశాం. అంటే ‘నలుగురితో పాటు నారాయణమూర్తి’నయ్యా.
బోడిగా మారిన విశాఖ
ఈ సందర్భంగా నేను చాలా బాధాపడిన విషయం.. ఇంత తుపాను బీభత్సం జరుగుతుంటే చాలామంది దొంగలు చీకట్లో ఇళ్లలోకి జొరబడి అందిన వస్తువునల్లా దోచుకుని పారిపోయారు. నా కళ్లారా ఓ సంఘటనను చూశాను. ఏడుపొచ్చింది. ఇంత కష్టకాలంలోనూ మానవత్వం లేకుండా ప్రవర్తించే అలాంటివాళ్లను ఏం చేసినా పాపంలేదు. ఇంకోవైపు ఇదే అదనుగా పెట్రోల్‌ ధరను పెంచేశారు. పాలు, కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచేశారు. విపత్కర పరిస్థితుల్లో ఎవరైతే జనానికి మేలు చేస్తారో వాళ్లే దేవుళ్లు. ఎవరైతే లూటీ చేస్తారో వాళ్లే దెయ్యాలు. ఆ దెయ్యాలను పట్టుకుని కాల్చిపారెయ్యాలన్నంత కోపం వచ్చింది. దేశానికి ముంబై ఎలానో ఆంధ్రప్రదేశ్‌కు విశాఖ అలాగా. చాలా అందమైన నగరం. ఓ వైపు సముద్రం, మరోవైపు పచ్చని ప్రకృతి. అలాంటి నగరంలో ఇప్పుడు మచ్చుకి కూడా పచ్చదనం లేకుండా అంతా ధ్వంసమైపోయింది. సుందర విశాఖ బోడిగా మారింది. ఏడుపొచ్చింది. ఒక ప్రాణం పోయినా పోయినట్లే. అయినప్పటికీ వీలైనంత తక్కువగా పాతికమందిలోపునే మరణించడం చాలా నయం. నాకు నిజంగా ఆనందమేసిన సందర్భం.. జనం ప్రభుత్వ సిబ్బంది కోసం ఎదురుచూడకుండా, తమ ఇళ్లముందు, రోడ్ల మీద చెల్లాచెదురుగా పడిపోయిన చెట్లనీ, చెత్తనీ, పగిలిపోయిన వస్తువుల్నీ తీసి, ఆ ప్రాంతాల్ని శుభ్రం చేసుకోవడం. ధనిక, పేద తేడాలేకుండా కలిసి పనిచేసిన వాళ్ల సమష్టితత్వానికి హ్యాట్సాఫ్‌. వాళ్లలో నేనూ ఒకడిని కావడం నాకు ఆనందదాయకం. తుపాను తగ్గిపోవడంతో జనమంతా రోడ్లమీదకు వచ్చేశారు. వీధుల్ని శుభ్రం చేసుకోవడం మొదలుపెట్టారు. వాహనాల రాకపోకలు మొదలయ్యాయి. ఒకాయన నన్ను కారులో కత్తిపూడిలో దింపారు. అక్కణ్ణించి సామర్లకోట వచ్చి, అక్కణ్ణించి 14వ తేదీ ఉదయం గుంటూరుకు చేరుకున్నా. నాగార్జున యూనివర్శిటీలో చల్లపల్లి స్వరూపరాణి ఆధ్వర్యంలో అక్కడి దళిత విద్యార్థి సంఘం ఏర్పాటుచేసిన కవి పైడి తెరేశ్‌బాబు సంస్మరణ సభలో పాల్గొన్నా.
సక్రమంగా అందాలి
ఇప్పుడు చేయాల్సింది ఒకర్నొకరు విమర్శించుకోడం కాదు. హుద్‌హుద్‌ బీభత్సానికి అతలాకుతలమైన ఉత్తరాంధ్రను మళ్లీ మామూలు స్థితికి తీసుకురావడానికి అహర్నిశమూ శ్రమిస్తున్న ప్రభుత్వ యంత్రాంగానికీ, ఇంతటి విపత్కర స్థితిలోనూ ఎంతో మనోనిబ్బరాన్ని ప్రదర్శించిన అక్కడి ప్రజానీకానికీ వందనాలు. అక్కడివాళ్లను ఆపద్బాంధవులుగా ఆదుకొంటున్న గుర్తుతెలియని స్వచ్ఛంద సేవకులకు హ్యాట్సాఫ్‌. అలాగే మన తెలుగువాళ్లు ఎప్పుడు ఏ కష్టాన్ని ఎదుర్కొన్నా ఆదినుంచీ సినీ పరిశ్రమ వాళ్లకు చేయూతనందిస్తూనే వచ్చింది. ఇప్పుడు కూడా మన సినిమావాళ్లు ప్రదర్శిస్తున్న దాతృత్వాన్ని ప్రశంసించి తీరాలి. పవన్‌కల్యాణ్‌ నుంచి సంపూర్ణేష్‌బాబు దాకా ఎవరికి తోచింది వాళ్లు దానం చేస్తున్నారు. అయితే ఈ విరాళాలు, ప్రభుత్వం అందిస్తున్న నష్టపరిహారాలు అర్హులైనవారికే చేరాలనీ, అవి దుర్వినియోగం కాకుండా చూడాలనీ ప్రభుత్వాన్ని కోరుతున్నా.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సాంకేతిక సంరంభం

సాంకేతిక సంరంభం
సాధారణంగా మన దేశంలో ప్రజలు క్రికెట్‌ సిరిస్‌ ప్రారంభం కోసమో, ఒక సినిమా రిలీజ్‌ కోసమో ఎదురుచూడటం సామాన్యమైన విషయమే. ఒక కొత్త జనరేషన్‌ మొబైల్‌ కోసం, ఒక ఆపరేటింగ్‌ సిస్టమ్‌ అప్‌డేట్‌ కోసం ప్రజలు ఎదురుచూడటం మాత్రం విశేషం. ఈ కోణం నుంచి చూస్తే నేడు దేశ మొబైల్‌ ఫోన్ల చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు. ప్రపంచంలోనే అత్యుత్తమమైన టెక్నాలజీ కంపెనీలుగా పేరు పొందిన గూగుల్‌, యాపిల్‌ కంపెనీలు భారత మొబైల్‌ మార్కెట్‌లో తమ స్థానాన్ని పదిలపరుచుకోవటానికి తమ ఉత్పత్తులను మార్కెట్‌లలోకి ప్రవేశపెడుతున్నాయి. అందరూ చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఐఫోన్‌ 6ను యాపిల్‌ విడుదల చేస్తుంటే, దానికి సవాలుగా ఆండ్రాయిడ్‌-ఎల్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో గూగుల్‌ నెక్సస్‌ 6ను మార్కెట్‌లోకి ప్రవేశపెడుతోంది. నెక్సస్‌ ఫోన్లను ఉపయోగించేవారందరికీ నేటి నుంచి ఆండ్రాయిడ్‌ ఎల్‌ అప్‌డేట్‌ అవుతుంది. దీని కోసం కూడా లక్షల మంది ఎదురుచూస్తున్నారు.
ఈ మధ్యకాలంలో రెండు అగ్రశ్రేణి కంపెనీలు నేరుగా తమ ఉత్పత్తులతో పోటీ పడటం ఇదే తొలిసారి. సామాన్యంగా మార్కెట్‌లోకి ప్రతి ఏడాది వందల మొబైల్‌ మోడల్స్‌ విడుదలవుతూ ఉంటాయి. వాటిలో కొన్నింటికి ఆదరణ లభిస్తుంది. మరికొన్ని మౌనంగా మార్కెట్‌ నుంచి మాయమయిపోతూ ఉంటాయి. కానీ రాబోయే మోడల్స్‌ కోసం ఆతృతగా ఎదురుచూడటం, వాటికి సంబంధించిన చిన్న విషయం బయటకు పొక్కినా పెద్ద వార్తగా మారటం కూడా ఇదే మొదటిసారి. మధ్యతరగతి ప్రజల మందహాసంతో మారిన పరిస్థితులకు దీని ఉదాహరణ. ఇక్కడ ఈ రెండు కంపెనీల ప్రస్థానం కూడా చెప్పుకోవాలి. అగ్రశ్రేణి డస్క్‌టాప్‌ కంప్యూటర్లను తయారుచేసే కంపెనీగా ప్రారంభమయిన యాపిల్‌ ఆ తర్వాత ఐపాడ్‌, ఐఫోన్‌ వంటి ఉత్పత్తులతో సంచలనాలకు తెర తీసింది. ఉన్నత వర్గాల ప్రజలు వాడే ఒక స్టైల్‌ స్టేట్‌మెంట్‌గా మారిన ఐఫోన్‌కు మన దేశంలో మొదటి నుంచి విపరీతమైన ఆదరణ లభిస్తూనే ఉంది. ఐఫోన్‌6లో ఫీచర్స్‌ ఎలా ఉంటాయో తెలియకముందే మన దేశంలో దాదాపు 25 వేల మంది వాటిని ప్రీబుక్‌ చేసుకోవటమే దీనికి ఉదాహరణ. తమకు లభిస్తున్న ఈ ఆదరణను ఆ కంపెనీ జాగ్రత్తగా పసిగట్టింది.
ఇప్పటి దాకా యాపిల్‌ ఎప్పుడూ తన ఉత్పత్తులను పాశ్చత్య మార్కెట్‌లను అనుసరించి డిసెంబర్‌లో విడుదల చేస్తూ వస్తోంది. కానీ ఈ సారి దీపావళి సీజన్‌ ప్రాముఖ్యం గుర్తించి ఐఫోన్‌ను రెండు నెలల ముందు విడుదల చేయటం భారత మార్కెట్‌పై ఆ కంపెనీ చూపిస్తున్న ఆసక్తికి నిదర్శనం. మొబైల్‌ విక్రయాలను అర్థరాత్రి నుంచే ప్రారంభించటం ద్వారా కొత్త సంప్రదాయానికి కూడా తెరతీసింది. ఒక సెర్చ్‌ ఇంజిన్‌ ద్వారా టెక్నాలజీ మార్కెట్‌లోకి ప్రవేశించిన గూగుల్‌ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా విస్తరిస్తూ వచ్చింది. సెర్చ్‌ఇంజిన్ల దగ్గర నుంచి మొబైల్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌ (ఓఎస్‌)ల దాకా ఎదిగిన గూగుల్‌ ప్రతి ఏడాది కొత్త అప్‌గ్రేడ్‌లను ప్రవేశపెడుతూ ఉంటుంది. మొబైల్‌ రంగంలో ఆండ్రాయిడ్‌ ఒక విప్లవం. అరచేతిలో ఇమిడిపోతూ డెస్క్‌టాప్‌కీ, లాప్‌టాప్‌కీ స్మార్ట్‌ఫోన్‌ ఒక ప్రత్యామ్నాయంగా అవతరించింది. డ్రైవర్‌ అవసరం లేకుండా నడిచే కార్ల దగ్గర నుంచి ఒక రక్తపు చుక్కతో 20 వ్యాధులను పసిగట్టే చిప్‌ల దాకా రకరకాల టెక్నాలజీలను గూగుల్‌ రూపొందిస్తూ వస్తోంది. మొబైల్‌ ఫోన్‌ డిజైన్‌ విషయంలో కాకపోయినా- తన అప్లికేషన్ల ద్వారా యాపిల్‌ మార్కెట్‌ను కొల్లగొట్టాలని గూగుల్‌ చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. దీనికి భారత్‌ మార్కెట్‌నే యుద్ధభూమిగా ఎంచుకుంది. మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉన్న భారత్‌లో మొబైల్‌ అప్లికేషన్లకు అధిక ఆదరణ ఉంది. ఈ కోణం నుంచి చూస్తే- మొబైల్‌ ఫోన్లలో ఉపయోగించే ఆపరేటింగ్‌ సిస్టమ్‌ (ఓఎస్‌)లకు ప్రత్యేక స్థానం ఉంది. అందుకే గూగుల్‌ సరికొత్త ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ లాలిపప్‌ కోసం లక్షల మంది లొట్టలేసుకుంటూ ఎదురుచూస్తున్నారు. మొబైల్‌ వినియోగదారుల అవసరాలను జాగ్రత్తగా గమనించటం, వాటికి అవసరమైన పరిష్కారాలు కనిపెట్టడం గూగుల్‌ ప్రత్యేకత. దీని కోసం ఆ కంపెనీ కొన్ని వేల కోట్ల రూపాయలను ప్రతి ఏడాది ఖర్చు పెడుతూ ఉంటుంది. అలాంటి పరిశోధనలను రహస్యంగా ఉంచుతుంది. అలాంటి ఒక రహస్య ప్రాజెక్టయిన వోల్గాలో రూపొందించినదే ఆండ్రాయిడ్‌ ఎల్‌. త్రీడీ మొబైల్‌ ఫోన్లకు గూగుల్‌ ఒక అడుగు దూరంలో మాత్రమే ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎల్‌ విడుదల ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను ప్రవేశపెట్టడం వల్ల వందల కొత్త అప్లికేషన్లను మొబైల్‌లో ప్రవేశపెట్టాలని గూగిల్‌ భావిస్తోంది. ఎక్కువ అప్లికేష్లన్లను ప్రవేశపెడితే బ్యాటరీ లైఫ్‌ తగ్గిపోతుంది కాబట్టి దానిపై కూడా గూగుల్‌ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఎక్కువ సమయం బ్యాటరీ పనిచేసే విధమైన టెక్నాలజీలను రూపొందించి వాటిని దీనిలో ప్రవేశపెట్టామని గూగుల్‌ ఇప్పటికే ప్రకటించింది. ఈ టెక్నాలజీ కోసం కూడా చాలా మంది ఎదురుచూస్తున్నారు.
కేవలం టెక్నాలజీల పరంగా మాత్రమే కాకుండా- మార్కెట్‌ విషయంలో చైనాతో మనం పోటీపడగలమా అనే విషయాన్ని కూడా అంచనా వేయటం కోసం అంతర్జాతీయ విశ్లేషకులు ఎదురుచూస్తున్నారు. ఐఫోన్‌ గత నెల 19న కొన్ని దేశాల్లో విడుదలయింది. మార్కెట్‌లోకి ప్రవేశించిన మూడు రోజులకే కోటి మొబైల్స్‌ను వినియోగదారులు కొనుగోలు చేశారు. చైనాలో దాదాపు లక్ష ఐఫోన్ల కోసం ఆర్డర్లు బుక్‌ చేసుకున్నారు. ఈ లెక్కలతో పోలిస్తే మన మొబైల్‌ మార్కెట్‌ తక్కువే అనిపించవచ్చు. కానీ మన వినియోగదారులు టెక్నాలజీ వాడకంలో ముందు ఉంటారు. అందుకే ప్రతి కంపెనీ తమ తాజా పరిజ్ఞానాన్ని మన మార్కెట్‌లో పరీక్షించి చూసుకోవాలనుకుంటుంది. ఈ కోణం నుంచి చూస్తే మనం మొబైల్‌ టెక్నాలజీల విషయంలో గెలిచినట్లే.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”స్మితాపాటి లీయం ”- జీతం లేని పని గీత చెబుతుందా?

జీతం లేని పని గీత చెబుతుందా?
భగవద్గీత మీద ఎంత ప్రేమ, భక్తి ఉన్నవాళ్లకైనా ‘నీవు కర్మ మాత్రమే చేయి, కర్మ ఫలాన్ని ఆశించకు’ అని శ్రీకృష్ణుడు చెప్పిన మాట గొంతులో వెలక్కాయ పడినట్లు అనిపిస్తుంది. మేము ఏ మైక్రోసాఫ్ట్‌లోనో, డెల్లాయిట్‌లోనో పొద్దుటినుంచి రాత్రివరకూ పనిచేసి జీతం తీసుకోవద్దా అని మిత్రులు అడుగుతూ ఉంటారు. ప్రపంచం పోటీతత్త్వంతో ముందుకు వెళుతుంటే మనం ఎలాంటి యాంబిషన్‌ లేకుండా, ఎలాంటి ప్రమోషన్‌ కోరకుండా, జీతం తీసుకోకుండా పనిచేయాలా? ఇది చాలా వింతబోధ అని ఆశ్చర్యపడుతూ ఉంటారు. ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే మనం కృష్ణుడు చెప్పిన మాటలకు మన సంప్రదాయం ప్రకారం ఎలాంటి అర్థం ఉందో చూడాలి.
కర్మ అంటే పని అని అర్థం. ఈ పనులు ఎన్ని విధాలో గమనిద్దాం. తినడం, తాగడం, నడవడం మొదలైనవి ఒకరకం పనులు. ఇవి అందరికీ సమానమే. వీటివల్ల శరీర నిర్వహణ తప్ప ప్రత్యేకమైన ఫలం ఏమీ లేదు. వీటిని ఎవరూ వదలలేరు. జీవనాధారం కోసం ఏదో ఒక పనిచేస్తూ డబ్బు సంపాదించి సంసారాన్ని నడపడం రెండోరకం పని. ఇది తప్పక చేసి తీరాల్సిందే. లేకుండా లోక వ్యవహారం నడవదు. కృష్ణుడే కాదు మరెవరూ దీన్ని కాదనలేరు. మన స్మృతులు కూడా ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటివి చేయకూడదు అని నిర్దేశించాయి. కాబట్టి కృష్ణుడు చెప్పిన కర్మ అంటే ఇది కూడా కాదు.
మరోరకం పనులు కూడా ఉన్నాయి. మనం తిరుపతికి వెళ్లి కోరికలు కోరుకుంటాం. లేదా పండితుల్ని పిలిచి యాగాలు, వ్రతాలు మొదలనైనవి చేస్తాం. లేదా దానధర్మాలు చేస్తాం. వీటివల్ల మనకు కంటికి కనపించని పుణ్యమనేది లభిస్తుందని మన విశ్వాసం. మనమే కాదు అన్ని మతాలూ ఇలాగే చెబుతాయి. మంచిపనులు చేస్తే పుణ్యం, దానివల్ల స్వర్గం లాంటి లోకాలు వస్తాయని, చెడ్డపనులు చేస్తే పాపం, దాని వల్ల నరకం లాంటి లోకాలు వస్తాయన్నది అన్ని మతాలూ చెప్పే విషయమే. పుణ్యం కోసం లేదా మరొక లాభం కోసం మనం చేసే పనులు మూడో రకానికి చెందినవి. కృష్ణుడు ఈ రకమైన కర్మ గురించే చె ప్పాడు. ఇవి చాలా ముఖ్యమైన విషయాలు కదా, వీటిని ఎలా వదిలేస్తామన్నది ప్రశ్న. మన సంప్రధాయం ప్రకారం ఎన్ని మంచి పనులు చేస్తే అంత పుణ్యం. ఇదొక బ్యాంక్‌ బ్యాలెన్స్‌ లాంటిది. దీన్ని బట్టే స్వర్గంలో ఎంతకాలం ఉండవచ్చు అనేది నిర్ధారణ అవుతుంది. ఆ కాలం ముగిసిన తర్వాత భూమ్మీదికి రావల్సిందే. మళ్లీ కర్మలు చేసి, మంచి లోకాలకో, చెడులోకాలకో వెళ్లాల్సిందే. ఇదంతా ఒక అంతులేని చక్రంలో తిరగడం లాంటిది. మతపరమైన విశ్వాసం.
వేదాంతం అన్ని విషయాల్నీ తర్కబద్దంగా ఆలోచిస్తుందని ఇదివరలో తెలియచేశాను. మరి కర్మగురించిన ఈ విశ్వాసం ఎలా వచ్చింది అంటే, సమాజమంతా ఒక మతసిద్ధాంతాన్ని నమ్ముతున్నప్పుడు వేదాంతి కూడా ఆ స్థాయి నుంచే ప్రారంభించాలి. ప్రజల్ని మంచి మార్గంలో ఉంచడానికి, చెడు నుంచి దూరంగా ఉంచడానికి ఈ విశ్వాసాలు అవసరం. అందుకే తత్త్వానికి విరుద్ధంలేని మతవిశ్వాసాల్ని కొంతవరకు అంగీకరరిస్తూ తత్త్వవిచారం బోధించాలి. ఈ కర్మల విషయంలో కూడా ఇలాంటిదే మనం చూడగలం.
వేదాంత సిద్ధాంతం ప్రకారం జీవుడు, అంటే ప్రతివ్యక్తీ మౌలికంగా బ్రహ్మ స్వరూపుడే. అయినా తనను తాను ఫలానా జాతికీ, కులానికీ, మతానికీ చెందిన వ్యక్తి అని అనుకుంటూ అనేక సామాజిక కట్టుబాట్లలో ఉంటాడు. వీటన్నిటికీ అతీతంగా ఎదిగి నేను కేవలం జ్ఞానస్వరూపుడిని అని గ్రహించడం మోక్షమని వేదం చెబుతుంది. ఈ స్థితిలో స్వర్గం, నరకం అనేవి అర్థంలేనివిగా మారుతాయి. ఉపనిషత్తులు ప్రతివ్యక్తికీ నేరుగా దీన్ని బోధిస్తే ఎవరూ అంగీకరించలేరు. అందువల్ల మతం స్థాయిలో స్వర్గం, నరకం అనే వాటిని అంగీకరిస్తూ వేదాంతస్థాయిలో వీటన్నింటినీ దాటి నీ స్వరూపాన్ని తెలుసుకోమని చెబుతాయి. అంటే రిలిజియన్‌ అనేది ఒక స్థాయి. వేదాంతం అనేది రెండోస్థాయి. వ్యక్తి యొక్క ప్రవర్తనను, పవిత్రమైన మనస్సు, ఆధ్యాత్మిక ఎదుగుదలను బట్టి ఉపనిషత్తులు ఈ రెండు స్థాయిల్లో చెబుతాయి.
ఈ నేపథ్యంలో కర్మఫలాన్ని గూర్చిన మన ప్రశ్నను గమనిద్దాం. జీవితం – కర్మ – దాని ఫలంగా స్వర్గం పొందడం – మళ్లీ జీవితం అనే చక్రం నుంచి బయటపడటం ఎలా? మనం ఒక పని చేసి దాని ఫలితాన్ని ఆశిస్తున్నంత కాలం ఈ చక్రంలో తిరుగుతూనే ఉంటాం. ఈ చక్రం నుండి బయటపడటమే ఆత్మజ్ఞానం పొందడానికి మొదటిమెట్టు. ఈ చక్రం నుండి బయటపడాలంటే ఫలితాన్ని ఆశించకూడదు. కానీ, ఈ పరిష్కారం అందరికీ నచ్చదు. అందుకే అతి కొద్ది మంది మాత్రమే జ్ఞానానికి ప్రయత్నిస్తూ ఉంటారని, ఆ కొద్ది మందిని ఉద్దేశించి చెప్పిన విషయమే నిష్కామకర్మ – అన గా కర్మచేస్తూ దాని ఫలితాన్ని కోరకపోవడం. ఫలితాన్ని కోరేవాడు సంతోషంగా కర్మఫలాన్ని ఆశిస్తూ మళ్లీ మళ్లీ పుడుతూ ఉండవచ్చని కూడా గీత చెబుతుంది. మరి ఈ కర్మల్ని వదిలేయవచ్చు కదా అనే ఆలోచన రావచ్చు. కానీ, అలా చేయకూడదని ఉపనిషత్తులు చెబుతాయి.
యజ్ఞం చేయడమంటే ఒక సమాజసేవ లాంటిది. అనేక వస్తువులను సమకూర్చుకోవాలి. చాలామందికి దానధర్మాలివ్వాలి. అన్నదానాలు చేయాలి. ఇదంతా సమాజానికి తోడ్పడేదే. ఇలాంటి పనులు మానేస్తే లోకంలో మంచిపనులనేవే లేని పరిస్థితి వస్తుంది. అందుకే కృష్ణుడు ‘నాకు ఎలాంటి అవసరం లేకున్నా అన్ని కర్మల్ని చేస్తున్నాను. నేను వదిలేస్తే అది ప్రజలకు సరియైున మార్గదర్శకం కాదు’ అని అంటాడు. అంటే ప్రతి వ్యక్తీ కర్మఫలాన్ని కోరేవాడైనా, కాకపోయినా కర్మల్ని చేస్తూనే ఉండాలి. ‘ శ్రేష్ఠుడైన వాడు ఏది ఆచరిస్తే ప్రజలందరూ దాన్నే ఆచరిస్తారు’ అంటాడు కృష్ణుడు. అతడు మిగతా వారికి ఆదర్శప్రాయుడు (టౌజ్ఛూ ఝౌఛ్ఛీజూ ) అవుతాడు అని అర్థం. ఇంట్లో ఆచారాలను వదిలేసి నేను రిలిజియస్‌ కాదండి, కేవలం స్పిరిచువల్‌ వ్యక్తిని అని చెప్పుకునేవాళ్లని చూస్తూ ఉంటాం. ఇలాంటి వారు తమ పిల్లలకు సరైన ఆదర్శం చూపించడం లేదు. ప్రజాహితం కోసం ఏమీ చేయకుండా ఉత్తుత్తిగా స్పిరిచువల్‌ అనుకోవడం సరియైునది కాదని శ్రీకృష్ణుడిలాంటివాడే చెప్పడం మనం గమనించాలి.
చివరికి తేలిన విషయం ఏమంటే, మనం ఆఫీసుకు వెళ్లి జీతం తీసుకోవడం అనే కర్మ గూర్చి కృష్ణుడు చెప్పడం లేదు. పుణ్యాన్నిచ్చే కర్మలు – శాస్త్రాల్లో చెప్పినవి – వ్రతాలూ, యాగాలూ, దానాలూ వీటిగూర్చే కృష్ణుడు చెప్పాడు. ఉపనిషత్తుల్లో ఉన్న మాటనే కృష్ణుడు చెప్పాడు. జ్ఞానమార్గంలో ఉండాలని అతికొద్దిమంది మాత్రమే ఆశిస్తారు. ఇలాంటివాళ్లు మాత్రమే నిష్కామకర్మ అనే మార్గాన్ని ఎంచుకుంటారు. మరికొందరు ఆయా యాగాలూ, దానాలూ చేస్తూ పుణ్యాన్ని కోరుకునే వాళ్లే. మిగతా చాలామంది ఆధునికులు ఏమీ చేయనివాళ్లు.
ఈ నిష్కామకర్మకే కర్మయోగం అని పేరు. దీన్ని గురించి మళ్లీ తెలుసుకుందాం.

డాక్టర్‌ కె. అరవిందరావు

అంతర్జ్యోతిని వెలిగించండి
సనాతన భారతీయ సంప్రదాయంలో, ఒకప్పుడు ప్రతిరోజూ ఒక పండగ జరుపుకునేవారు. అంటే సంవత్సరం మొతం్త 365 రోజులూ పండగలే. మన మొత్తం జీవితాన్నంతా ఒక వేడుకలా గడిపేయాలన్న ఉద్దేశంతోనే ఈ ఆచారాన్ని ఏర్పాటు చేశారు. దురదృష్టవశాత్తూ వీధిలో నడవడం, ఆఫీసుకు వెళ్లడం లాంటి మామూలు దినచర్యలను మనం ఒక సంబరంలా, వేడుకలా జరుపుకోవడం లేదు. అందుకే సంబరాలు, వేడుకలు చేసుకోవడానికి ఒక సాకుగా ఈ పండుగలు ఉండేవి. దీపావళి పండుగ ఉద్దేశం కూడా మీ జీవితంలో సంబారాన్ని నింపడమే. దానికి గుర్తుగానే టపాకాయలు పేల్చుతాం. అది మిమ్మల్ని ఎంతో కొంత ఉత్సాహంతో నింపడానికే. దీని ఉద్దేశం ఏదో ఆ ఒక్కరోజు సరదాగా గడిపేయాలని కాదు. మన లోపల ప్రతినిత్యం ఇలానే, అంటే ఒక పండగలానే ఉండాలి. కేవలం అలా ఊరికనే కూర్చున్నా, మన జీవశక్తి, మన హృదయం, మనసు, శరీరం అన్నీ కూడా ఒక సజీవ టపాకాయిలా అన్నివేళలా వెల్లివిరియాలి. అలా కాక మీరు తుస్సుమనే టపాకాయిలాంటి వారైతే, మిమ్మల్ని రగిలిస్తూ ఉంచడానికి రోజూ వెలుపలి నుంచి టపాకాయలు పేల్చాల్సి ఉంటుంది.
దీపాల పండుగే దీపావళి. ఈ దీపావళి రోజున పల్లె, పట్టణం, నగరం, అన్నీ వేలాది దీపాలతో వెలిగిపోతుంటాయి. కానీ, ఈ వేడుక కేవలం బాహ్యంగా దీపాలు వెలిగించడం గురించి కాదు. అంతర్జ్యోతి వెలగాలి. వెలుగంటే స్పష్టత. స్పష్టత లేనప్పుడు, మీలోని మిగతా సుగుణాలన్నీ కేవలం ప్రతిబంధకాలే అవుతాయి. వరాలు కావు. స్పష్టతలేని ఆత్మవిశ్వాసం ఘోర విపత్తులకు దారి తీస్తుంది. లోకంలో ప్రస్తుత పరిస్థితి గ మనిస్తే, ఎటువంటి స్పష్టతా లేకుండా ఎంతో విపరీతంగా పనిచేస్తున్నారు. ఇది మంచిది కాదు. ఉదాహరణకు ఓ సంఘటన చెబుతాను. కొత్తగా ఉద్యోగంలో చేరిన ఓ పోలీసు మొదటిసారిగా వాహనంలో తన సీనియర్‌ వెంట రాగా ఓ వీధివెంట వెళుతున్నాడు. కొంత సేపటికి వాళ్లకు వైర్‌లెస్‌లో ఓ వార్త వచ్చింది. ఫలానా చోట చాలా మంది గుమిగూడి ఉన్నారని, అదేదో చూడమని ఆ సందేశ సారాంశం. దాంతో వీళ్లు ఆ వీధిలోకి వెళ్లారు. నిజమే, ఆ వీధిలో ఓ పక్క చాలా మంది ఉన్నారు. ఇంకేముంది, మన కొత్త పోలీసు పరమోత్సాహంతో, తన కారు కిటికీ తలుపులు కిందికి దించి, వాళ్లను ఉద్దేశించి, ‘మర్యాదగా అందరూ అక్కడి నుంచి వెళ్లిపోండి’ అంటూ గట్టిగా అరిచాడు. ఆ జనమంతా అర్థంకాక, సందిగ్ధంగా అతడి వైపు చూశారు. అంతేగానీ అక్కడ్నించి కదలలేదు. దాంతో కొత్త పోలీసుకు కొంచెం కోపం వచ్చింది. స్వరం కాస్త పెంచి, ‘చెబుతున్నది మీకే కదా! వెళతారా వెళ్లరా?’ అని కసురుకున్నాడు. అప్పుడు వారంతా వెళ్లిపోయారు.
ఉద్యోగం తొలిరోజు చేసిన తొలి పనిలోనే తను జనంపై చూపించిన ప్రభావానికి ఆనందపడుతూ తన సీనియర్‌ వైపు తిరిగి, ‘మొదటి డ్యూటీ… బాగా చేశానా?’ అని అడిగాడు. దానికా సీనియర్‌, ‘ ఫరవాలేదు, బాగానే చేశావు. కానీ అది బస్‌స్టాప్‌’ అన్నాడు. తగినంత స్సష్టత లేకుండా ఏ పనిచేసినా సరే, అది విపత్కర పరిస్థితులకు దారి తీస్తుంది. వెలుగు మన దృష్టికి స్పష్టత తెస్తుంది. కేవలం భౌతిక విషయాలకే కాదు, అన్ని విషయాలకూ ఇది వర్తిస్తుంది. జీవితాన్ని మీరెంత స్పష్టంగా చూడగలుగుతున్నారు, అలాగే మీ చుట్టూ ఉన్న వాటిని ఎంత స్పష్టంగా గ్రహించగలుగుతున్నారు అన్న విషయాలే మీరు మీ జీవితాన్ని ఎంత అర్థవంతంగా నడిపిస్తారనే విషయాన్ని నిర్ణయిస్తాయి. దుష్టశక్తులు అంతం చేయబడి, వెలుగులు విరజిల్లబడిన రోజే దీపావళి. సూర్యకాంతిని తామే అడ్డుకుంటున్నామని గ్రహించకుండా, కారుమబ్బులు ఎలాగైతే అంధకారంలో సంచరిస్తాయో, అలాగే మనిషి కూడా తనలోకి తానే కారుమబ్బులను అనుమితించానని గ్రహించకుండా, చీకటిలో కొట్టుమిట్టాడుతున్నాడు. మనిషి ఎక్కడి నుంచో తనలోకి వెలుగుని తీసుకురావలసిన అవసరం లేదు. తనలో గూడుకట్టుకుని ఉన్న చీకటి మేఘాలను తాను చెదరగొడితే చాలు, వెలుగు దానంతట అదే వస్తుంది. ఈ వాస్తవాన్ని గుర్తుచేయడానికే ఈ దీపాల పండుగ.
 – సద్గురు
ఆమె పాత్రలు తెగని జ్ఞాపకాలు
ఆమె ఈ లోకాన్ని వదిలేసి ఇరవై ఏడేళ్లు దాటిపోయాయి. అయినా ఆమె స్థానాన్ని మరే తారా భర్తీచేయలేక పోయింది. ఓ వైపు ఆఫ్‌-బీట్‌ సినిమాల్లో, మరోవైపు కమర్షియల్‌ సినిమాల్లో రాణించి, విలక్షణ తారగా పేరుగాంచి, కేవలం 31 సంవత్సరాల వయసులోనే అర్ధంతరంగా మృతిచెందిన స్మితా పాటిల్‌ కళ్లు, గొంతు, నటన ఇప్పటికీ మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి. నటిగా స్మితను శిఖరాగ్ర స్థాయికి చేర్చిన కొన్ని సినిమాలను, ఆ సినిమాల్లో ఆమె పోషించిన పాత్రలను జ్ఞాపకం చేసుకుందాం.

కేవలం 22 సంవత్సరాల వయసులో స్మితను ప్రతిభావంతురాలైన నటిగా ప్రపంచానికి చాటిన పాత్ర ‘భూమిక’ (1977)లోని ఉష. ఆమె కెరీర్‌లోని గొప్ప ప్రదర్శనల్లో ప్రథమ స్థానం ఈ ఉష పాత్రదే. తొలిసారి ఆమెను జాతీయ ఉత్తమ నటిని చేసింది కూడా ఇదే. డైరెక్టర్‌గా శ్యామ్‌ బెనగల్‌ సృజనాత్మక సామర్థ్యానికి మెచ్చుతునక ఈ సినిమా. స్మిత అభినయం వెనుక ఆయన కృషి విస్మరించరానిది. 1940ల నాటి సినీ తార హంసా వడేకర్‌ ఆత్మకథ స్ఫూర్తితో ఈ చిత్రాన్ని రూపొందించారు బెనగల్‌. ‘భూమిక’లోని ఉష ఓ నటి. తనను తాను తెలుసుకోవడానికి ఆమె చేసిన జీవన యానమే ఈ చిత్రం. అనేక విచ్ఛిన్న అనుబంధాల మీదుగా ఆయన జీవితం సాగుతుంది. తనకు తారసిల్లిన పురుషులందరూ (నసీరుద్దీన్‌ షా, అమోల్‌ పాలేకర్‌, అమ్రిష్‌పురి, అనంత్‌ నాగ్‌) తనను ఓ ‘వస్తువు’గా, లేదంటే, తమ కాల్పనిక లోకంలో భాగమైన ఓ ‘పాత్ర’గానే చూశారని ఉష గ్రహిస్తుంది. స్మిత అందాల తారగా ఎన్నడూ మనకు కనిపించలేదు. అయితే పాత్ర ఆత్మను ఒడిసి పట్టుకొని, ఆ పాత్రలో ఒదిగిపోవడం తెలిసిన ‘నటీమణి’ ఆమె. ఉష పాత్రలో ఆమె ఒదిగిన తీరు అపూర్వం.
‘భూమిక’ తర్వాత స్మితకు జాతీయ ఉత్తమ నటి అవార్డును సాధించిపెట్టిన చిత్రం ‘చక్ర’ (1981). ముంబై మురికివాడల్లోని లక్షలాది మంది జీవితాలను కళ్లకు కట్టించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సాధించిన విజయం ఆశ్చర్యకరం. ఎన్నో ఆశలతో ముంబైకి వలసవచ్చి, చివరకు ఓ మురికివాడలో ఆవాసాన్ని ఏర్పరచుకున్న అమ్మ అనే యువతి పాత్రను చేసింది స్మిత. భర్త మరణించడంతో అక్కడి బతుకు కూడా క్లిష్టమైపోతుంది. కేవలం బతకడం కోసం ఆమె నసీరుద్దీన్‌ షాతో, కుల్‌భూషణ్‌ ఖర్బందాతో సంబంధాలు పెట్టుకుంటుంది. కలలు కుప్పకూలిన చోట, బతుకు భయపెడుతున్న చోట ఆశలన్నీ కొడుకు మీదే పెట్టుకున్న సీ్త్ర అంతకంటే ఏం చేయగలదని మనమూ ఆమెపై సానుభూతి ప్రకటించేస్తాం. జీవిత వాస్తవికతను ఎంతో గ్రిప్పింగ్‌గా మన కళ్లముందు పరుస్తుంది ‘చక్ర’. అమ్మ పాత్ర పోషణ కోసం ముంబై తులసీ పైప్‌ రోడ్‌లో ఉన్న జోపడ్‌పట్టీస్‌ (మురికివాడ)కు వెళ్లి అక్కడి సీ్త్రల జీవితాన్నీ, అక్కడి వాతావరణాన్నీ స్వయంగా పరిశీలించింది స్మిత. బాలీవుడ్‌ గ్లామర్‌కు దూరంగా, పాత్రలో ఇమిడిపోయి ఎంతటి డీగ్లామరస్‌గానైనా కనిపించేందుకు వెనుతీయని నిజమైన తారగా ఈ చిత్రంతో మరోసారి ఆమె నిరూపించుకుంది. ఆమెకు ఈ చిత్రంలో ఓ స్నాన సన్నివేశం ఉంది. శోచనీయమైన విషయం ‘చక్ర’ పోస్టర్ల మీద స్నానం చేస్తున్న స్మిత ప్రధానంగా దర్శనమివ్వడం. ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించేందుకు నిర్మాతలు వేసిన ఎత్తుగడ ఫలించింది. ఈ సినిమా విడుదలైన సంవత్సరమే దాని దర్శకుడు రబీంద్ర ధర్మరాజ్‌ మరణించడం విచారకరం.
స్మిత కెరీర్‌లోని గొప్ప పాత్రల్లో ‘నమక్‌ హలాల్‌’ (1981)లోని పూనమ్‌ కేరక్టర్‌ ఒకటి కాదు. అయినప్పటికీ, ఎక్కువ మంది ప్రేక్షకులు చూసిన స్మిత సినిమా ఇదే. ఆమె నాయికగా నటించినవాటిలో బిగ్గెస్ట్‌ హిట్‌ ఫిల్మ్‌ కూడా ఇదే. కారణం ఇందులో హీరో అమితాబ్‌ బచ్చన్‌. అంటే స్మిత మరపురాని చిత్రాల్లో ఈ చిత్రానికి తప్పకుండా చోటుంటుంది. ప్రకాశ్‌ మెహ్రా డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రం నటిగా స్మితలోని విలక్షణతను తెలియజేసింది. ఆమె కూడా కమర్షియల్‌ హీరోయిన్‌గా రాణించగలదనీ, పాటల్లో డాన్సులు చేయగలదనీ, రెయిన్‌ సాంగ్స్‌లో తడి తడి దుస్తుల్లో అలరించగలదనీ నిరూపించిన సినిమా ఇది. అమితాబ్‌ ప్రేయసి పాత్రకు తనకే సాధ్యమైన సున్నితత్వాన్ని జోడించి అందరి మెప్పూ పొందింది స్మిత.
నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న కేరక్టర్లు చెయ్యడానికి ఆమె ఎన్నడూ భయపడలేదు. ‘అర్థ్‌’ (1982)లో ఆమె కుల్‌భూషణ్‌ ఖర్బందా ప్రేయసిగా, సినీనటిగా నటించింది. ఆమె వల్లే భార్య షబానా అజ్మీని వదిలేస్తాడు కుల్‌భూషణ్‌. వివాహితుడైన తన ప్రియుడు ఎక్కడ తనకు దూరమవుతాడోనని భయపడే కవిత పాత్రను గొప్పగా పోషించింది స్మిత. అభద్రత, అపరాధ భావన మధ్య నలిగిపోయే పాత్రలో ఆమె నటనను చూసి తీరాల్సిందే. షబానాది సానుభూతి చూరగొనే పాత్ర. స్మితది ఎన్నో నాటకీయ సన్నివేశాలతో ప్రేక్షకులకు ఆగ్రహాన్ని తెప్పిందే పాత్ర. షబానా మాటలు వెన్నాడుతుంటే అద్దం ముందు నిల్చొని స్మిత ప్రదర్శించే హావభావాలు మనల్ని ఓ పట్టాన వదలవు. కూల్‌భూషణ్‌కు కొట్టి, ఆ వెంటనే తనను తానే కొట్టుకొనే సన్నివేశాన్ని మరచిపోలేం. నటిగా స్మిత విశ్వరూపాన్ని చూడాలనుకొనేవాళ్లు తప్పకుండా చూడాల్సిన చిత్రం ‘అర్థ్‌’.
ఎనిమిదో దశకం మధ్యలో ‘తరంగ్‌’, ‘గిద్ధ్‌ దేబ్‌శిశు’, ‘రావణ్‌’ వంటి ఆఫ్‌బీట్‌ సినిమాలు చేసినా, అవి థియేటర్లలో సరిగా విడుదల కాకపోవడంతో ఆమె నటన చాలామందికి చేరలేకపోయింది. ఆ టైమ్‌లోనే కమర్షియల్‌గా విజయవంతమైన కొన్ని సినిమాలు చేసింది స్మిత. వాటిలో జె. ఓంప్రకాశ్‌ రూపొందించిన ‘ఆఖిర్‌ క్యోం?’ చెప్పుకోదగ్గది. ఇందులో ఆమె రాకేశ్‌ రోషన్‌ భార్య పాత్ర చేసింది. తన కజిన్‌ టీనా మునిమ్‌తో రాకేశ్‌ సంబంధం పెట్టుకోవడంతో, ఇంట్లోంచి బయటకు వచ్చేసి రాజేశ్‌ ఖన్నా స్నేహంతో, సొంత అస్తిత్వంతో నవలా రచయిత్రిగా ఎదిగిన నిషా పాత్రలో స్మిత ప్రదర్శించిన హావభావాలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయని విమర్శకులు ప్రశంసలు కురిపించారు. అయితే నిషా పాత్రను మలచడంలో ఆఖరున దర్శకుడు తికమకపడి ఔచిత్య భంగం చేయకుండా ఉండినట్లయితే ఈ పాత్ర మరింత గొప్పగా వచ్చి ఉండేది.
చాలా మంది ‘మిర్చి మసాలా’ స్మిత చివరి చిత్రమని పొరబడుతూ ఉంటారు. నిజానికి 1986 డిసెంబర్‌లో స్మిత మరణిస్తే, ఆమె నటించిన పలు చిత్రాలు 1989 వరకు విడుదలవుతూ వచ్చాయి. అయితే ఆమె మరణించాక వచ్చిన మొదటి ప్రధాన చిత్రం మాత్రం ‘మిర్చి మసాలా’. కేతన్‌ మెహతా డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రంలో ఓ మిర్చి ఫ్యాక్టరీలో కార్మికురాలిగా పనిచేసే సోంబాయి పాత్ర చేసింది స్మిత. ఆ ప్రాంతాన్నంతా తన గుప్పెట్లో పెట్టుకొని సమాంతర రాజ్యం నడిపే నసీరుద్దీన్‌ షా తనను లొంగదీసుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా లొంగదు స్మిత. తోటి మహిళా కార్మికులను సమీకరించి, అతడిని ఎదుర్కొన్న ఆమె, ఆపత్కాలంలో సీ్త్రకి కారం ఎలా ఓ ఆయుధంగా ఉపయోగపడుతుందో చూపిస్తుంది.
కేవలం పన్నెండేళ్ల కెరీర్‌ (1974 – 1986)లో ఎన్నో అద్భుతమైన పాత్రలతో భారతీయ సినిమాకు గర్వకారణమైన తారగా పేరుపొందిన స్మితా పాటిల్‌ను కేంద్ర ప్రభుత్వం సైతం గుర్తించింది. భారతీయ సినిమాకు వందేళ్లు నిండిన సందర్భాన్ని పురస్కరించుకొని తపాలా శాఖ 2013 మే 3న ఆమె పేరిట ఓ పోస్టేజ్‌ స్టాంపును విడుదల చేయడం నటిగా ఆమెకు లభించిన గౌరవం.

(నేడు స్మితా పాటిల్‌ జయంతి)
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నవ్వించిన కథకుడికి కన్నీటి వీడ్కోలు – ఎలికట్టె శంకర్‌రావు

నవ్వించిన కథకుడికి కన్నీటి వీడ్కోలు – ఎలికట్టె శంకర్‌రావు
అందమైన కథకుడు ఎన్‌.కె. రామారావు తుది శ్వాస విడిచారు. హాస్యప్రియుడు శాశ్వత మౌనం దాల్చారు. ఆయన మిత్రులకు, కుటుంబ సభ్యులకు విషాదం మిగిల్చారు. ఎన్‌.కె. రామారావుగా ప్రాచుర్యం పొందిన నారపరాజు కోదండ రామారావు స్వగ్రామం నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్‌ సమీపంలోని కందిబండ. దేశానికి స్వాతంత్య్రం రావడానికి ఆరు మాసాల ముందు ఆయన జన్మించారు. హుజూర్‌ నగర్‌, తెనాలి, విజయవాడ, నల్లగొండలలో విద్యాభ్యాసం చేశారు. న్యాయశాఖలో ఉద్యోగం చేసి తొమ్మిది సంవత్సరాల క్రితం పదవీ విరమణ చేశారు. రామారావుకు సాహిత్యం, సంగీతమంటే మక్కువ. ఆయన మంచి పాఠకుడు. మంచి శ్రోత.
సుమారు నాలుగున్నర దశాబ్దాల క్రితం నల్లగొండలో కొంతమంది రచయితలు కలసి యువ రచయితల సమితిని ఏర్పాటు చేశారు. మేరెడ్డి యాదగిరి రెడ్డి, బోయ జంగయ్యతో పాటు రామారావు కూడా ఈ సంస్థ కార్యకలాపాల్లో చురుగ్గా పాలుపంచుకున్నారు. కాంచనపల్లి చిన వెంకటరామారావు ప్రోత్సాహంతో కథలు రాయటం ప్రారంభించారు. ముప్ఫయ్‌ ఐదు కథలు రాశారు. పన్నెండు కథలతో విద్యుల్లత కథా సంపుటిని అందించారు. ఆ తర్వాత నవ్య వీక్లీ అప్పటి సంపాదకుడు శ్రీరమణ ప్రోత్సాహంతో మరిన్ని కథలు రాశారు. మా మిలట్రీ బాబాయి పేరుతో ఈ కథా సంపుటిని అందించాలనుకున్నారు. కానీ మధ్యలోనే వెళ్ళిపోయి ఆయన అభిమానులకు నిరాశను మిగిల్చారు.

రామారావు తెలుగు సాహితీ పెద్దలతో మంచి సంబంధాలు ఉన్నాయి. శ్రీశ్రీ, రావిశాసి్త్రలతో ఆయన అనుబంధం ప్రత్యేకమైనది. జిల్లా రచయితల సమితి ఆధ్వర్యంలో నల్లగొండలో జరిగిన సభలకు శ్రీశ్రీని తీసుకురావడం ఆయన ఘనతే. రావిశాసి్త్ర నల్లగొండకు రావడానికి కూడా ఆయనే కారణం. ఎన్‌.కె. రామారావుకు పాత పాటల సేకరణకు ఎంతో ఆసక్తి చూపించేవారు. ఆయనకు వింటేజ్‌ మ్యూజిక్‌ అంటే చాలా ఇష్టం. తెలుగు హిందీ సినీ ప్రముఖుల మీద వ్యాసాలు కూడా రాశారు. అవన్నీ హాసం పత్రికలో అచ్చయ్యాయి. పెద్దలతోనూ ఆయన స్నేహాలు అద్భుతమైనవి. బాపు, రమణ, శ్రీరమణలకు ఆయన వీరాభిమాని. విఎకె రంగారావు మనసునూ ఆయన దోచుకున్నారు. బహుభాషావేత్త నోముల సత్యనారాయణ అన్నా ఆయనకు ప్రత్యేక గౌరవం. నల్లగొండలో ఆయన ఎక్కువగా సమయం వెచ్చించింది నోములతోనే. రామారావు మంచి చతురుడు. సాహితీ ప్రియులు ఆయన సాన్నిహిత్యాన్ని కోరుకుంటారు. రామారావు రూపంలోనే కాదు కథల్లో కూడా శిల్పం అంటే ఇష్టపడతారు. అలాంటి కథలనే రాసినారు. ఆయన కథలు గంభీరమైన విషయాలనూ చెప్పినాయి. గిలిగింతలు పెట్టే హాస్యాన్ని పంచినాయి. ఎన్‌.కె. రామారావు వెళ్ళిపోవడంతో తెలుగు కథ చిన్నబోయింది. సాహితీ మిత్రుల్లో విషాదం అలుముకుంది.
– ఎలికట్టె శంకర్‌రావు
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆకాశవాణి, ఆ నలుగురూ…

ఆకాశవాణి, ఆ నలుగురూ…
నిన్నగాక మొన్న రావూరి భరద్వాజ, అటు మొన్న కె.చిరంజీవి , నిన్న పైడి తెరేష్‌ బాబు, నేడు తురగా జానకీరాణి…. ఇలా ఒకరికొకరుగా రాలిన ఆకాశవాణి తారలు. వీరందరిలో సానురూప్యత ఉంది . ఎవరి పంథాలో వారు ధిక్కార స్వరాలు. ప్రజలకు సేవచేయాలనే లక్ష్యంతో వారిస్థాయిలో వారు నినదించిన కంఠాలు-కలాలు. రావూరి జ్ఞానపీఠపురస్కారమందుకున్నారు. జీవితమంతాకష్టాలకొలిమిలో కొనసాగిన నేపథ్యం . ఆ నేపథ్యమే వారిని జనం మనిషిగా మార్చింది. ఇక కె.చిరంజీవి రేడియో నాటక ప్రయోక్తగా, రచయితగా, మనసున్న మనిషిగా సమాజానికి తనదైన బాణీలో సేవలందించారు. నాటకరంగంలో ఎందరో ఆయనకు ప్రత్యక్ష పరోక్ష శిష్య గణం. తెరేష్‌ బాబు ‘దళితవాదం’తో హిందూ మహాసముద్రంలో అల్పపీడనం సృష్టించిన వాడు . తురగా జానకీరాణి ‘రేడియో అక్కయ్య’ గా ఆకాశవాణి ద్వారా అందరికీ సుపరిచితురాలు. అయితే సీ్త్రవాద రచయిత్రిగా, రాసిన దానిని ఆచరించిన వ్యక్తిగా సమాజశ్రేయస్సులో తాను ఎంచుకున్న బాటలో నడిచిన వ్యక్తి.
ఈ నలుగురూ …ఆకాశవాణి పొత్తిళ్ళ సాక్షిగా ఎదిగినవారు. ఆకాశవాణి తరతరాల సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగించిన వారు . తెలుగు సాహిత్యంలో దళితవాదం , సీ్త్రవాదాలకు పైడి తెరేష్‌ బాబు , జానకీరాణీలు ప్రతీకగా నిలిచారు. చిరంజీవి సామ్యవాద రచయితగా జనం మనిషిగా ఎదురొడ్డారు. ఇక భరద్వాజ గురించి అందరికీ తెలిసిందే . పాకుడురాళ్ళతో ఆకాశవాణికి అందనంత ఎత్తుకు ఎదిగారు.
సమాజంలో వస్తున్న మార్పులకు దీటుగా ‘ఆకాశవాణి’ ధ్వని నిరంతరం విన్పిస్తూనే ఉంటుందనడానికి 2014లో రాలిన ఈ నలుగురు ‘తారల’ చరిత్రే చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం. సృజనశీలురకు , ప్రగతికాముకులకు, పురోగతిని వీక్షించే వారికి ‘ ఆకాశవాణి’ ఎప్పుడూ వెన్నంటే ఉంది . వారిని అల్లారు ముద్దుగా పెంచింది. వారి వారి భావాలకు బూజుపట్టకుండా గుండెలకు హత్తుకుంది . ప్రయోక్తల మనో భావాలకు , స్వేచ్ఛలకు బంధనాలు వేయలేదు . అందుకే అందరూ తారలయ్యారు. ఆకాశవాణి సాంస్కృతిక వారసత్వం నిలబ్టెటడంలో ధ్రువతారలయ్యారు.
నియమనిబంధనలున్నా , ప్రభుత్వ విధానాలున్నా ‘ఆకాశవాణి’ఆకాశమే హద్దుగా తన ఒడిలో తన పిల్లలను ప్రగతి శీలురుగా తీర్చి దిద్దింది. ఒక సామాజిక దృక్పథాన్ని , తాత్విక చింతనను నేర్పింది. ఆకాశవాణి ప్రాంగణంలోని వృక్షాల సాక్షిగా అందరూ జ్ఞానోదయంపొందిన వారే . ఆ జ్ఞానాన్ని నలుగురికి పంచే క్రమంలో వికసించిన వారే . అందుకు ఈ నలుగురూ అతీతులు కారు . మినహాయింపులేదు. పరిణామక్రమంలో ఆకాశవాణి అందించిన సేవలు అజరామమైనవి. . ఆసేవలు సమాజంలో విస్తృత ప్రయోజనాల కోసం ఉపయోగపడాలని కోరుకుంటూ పరితపించిన ఈ నలుగురూధన్యజీవులు . వీరు ఎప్పటికీ చిరంజీవులే . ఆకాశవాణిని ప్రజల వాణిగా మార్చే ప్రస్థానంలో సేవలందించిన ‘నలుగురు’ ఆకాశవాణి ముద్దుబిడ్డలను స్మరించుకుంటూ..
– వలేటి గోపీచంద్‌
రాష్ట్ర కార్యదర్శి , ఆకాశవాణి,
దూరదర్శన్‌ల కార్యక్రమాల సిబ్బంది సంఘం
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలంగాణా పల్లె బతకు ల్లొమోగుతున్న ”చావు డప్పు ”-

పల్లె తెలంగాణలో చావురుతువు(సంధర్బం) – కె.శ్రీనివాస్
మెదక్‌ ఉప ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తూ కెసిఆర్‌, మెజారిటీ తగ్గకుండా ఓటు చేయాలని ప్రజలను కోరారు. ‘‘నవ్వేటోళ్ల ముందు జారిపడ్డట్టు చేయకండి’’ అని అభ్యర్థించారు. కెసిఆర్‌ ప్రతిష్ఠను కాపాడడం ప్రజల బాధ్యత అయింది. ఆ బాధ్యత వారు నెరవేర్చారు. నూతన రాష్ట్ర ఆశయాన్ని సార్థకం చేస్తూ, సత్పరిపాలన అందిస్తేనే తెలంగాణ ప్రతిష్ఠ నిలబడుతుంది. తెలంగాణ ప్రతిష్ఠను కాపాడడం ఇప్పుడు కెసిఆర్‌ వంతు. ఆలస్యం చేస్తే అమృతం కూడా విషం అవుతుంది.

నోరుతెరుచుకున్న నిర్లక్ష్యపు బోరుబావిలో నలభై అడుగుల లోతులోకి నాలుగేళ్ల గిరిజ పడిపోయినప్పుడు, ఆ పసితల్లిని ప్రాణాలతో వెలికి తేవడం సాధ్యమవుతుందని ఎవరూ గట్టిగా నమ్మి ఉండరు. కుటుంబసభ్యులంతా పత్తి ఏరడానికి వెళితే, పనిచేయలేని వయసు కాబట్టి ఆడుకోవడానికి కాసింత వెసులుబాటు దొరికితే, ఆ పిల్ల అట్లా చావుబొరియలోకి జారి పోయింది. ప్రాణం లేని బొమ్మ లాగా వెలికిరావడానికి నలభైఎనిమిది గంటలపైనే పట్టింది కానీ, గిరిజ ప్రాణం కొన్ని గంటల్లోనే పోయి ఉంటుంది. ఏం జరిగిందో తెలియని స్థితిలో భయంతోను, ఊపిరాడకుండాను ఆ పాప ఎంతటి నరకం అనుభవించిందో ఊహించలేము. అయినా, లోపల ఇంకా సజీవంగానే ఉంటుందని, ప్రయత్నించి బయటికి తెస్తే బతికించుకోవచ్చునని గిరిజ తల్లిదండ్రులే కాదు, ప్రభుత్వయంత్రాంగమూ చుట్టుపక్కల ప్రజలూ టీవీల్లో ఆ విషాదాన్ని చూస్తున్న ప్రేక్షకులూ అంతా ఆశించారు. లాభం లేదు లెమ్మని ఎవరూ ప్రయత్నించకుండా మానుకోలేదు. ఫలితంతో నిమిత్తం లేకుండా ఒక మరణాన్ని నివారించడానికి మానవీయమైన ప్రయత్నమంతా జరిగింది.
బోరుబావి పాతాళమెట్లా ఉంటుందో, శ్వాసదొరకని చీకటి నరకమెంత బీభత్సంగా ఉంటుందో గిరిజే కాదు, తెలంగాణ రైతాంగానికంతటికీ తెలుసు. అప్పుల ఊబి, నిరాశ చీకటి, కాసింత వెసులుబాటునివ్వని దుర్భిక్షం, కావలసినవేళ కనీసంగానైనా దొరకని కరెంటు- వీటన్నిటి మధ్య రైతులు పరిస్థితి కూడా బోరుబొరియల్లో పడ్డ పసిపాపల వలెనే ఉంటుంది. వారిని ఎవరో ఆ అగాధాల్లోంచి ఉద్ధరించాలి. వారికి ఊపిరాడడానికి ఎవరో కాసింత ప్రాణవాయువు అందించాలి. బతుకుతారో లేదో తెలియదు కానీ, బతికించే ప్రయత్నమేదో చేయాలి. అట్లా చేస్తున్నట్టు సమాజానికి తెలియాలి.
తెలంగాణ రైతుల దురదృష్టమేమిటోకానీ, సొంత రాష్ట్రంలో ఏర్పడిన తొలిప్రభుత్వంలోనే వారి వేదన అరణ్యరోదనగా మారుతున్నది. రాష్ట్రం ఏర్పడినప్పటినుంచి రెండువందల యాభై మందికి పైగా రైతులు ప్రాణం తీసుకున్నారు. ఒక్క రైతు ఆత్మహత్య చేసుకున్నాడంటే, అతను ఎదుర్కొంటున్నటువంటి సంక్షోభంలోనే దాదాపు కొన్ని వందల మంది ఉంటున్నారని లెక్క. పత్తి రైతులే కాదు. వరి రైతులు కూడా నిరాశలోకి కుంగిపోతున్నారు. గురువారం నాడు వరంగల్‌ జిల్లాలో వరిపొలాలను రైతే స్వయంగా తగులబెట్టుకున్నాడు. ప్రతిరోజూ అయిదుగురో ఆరుగురో పదిమందో ఉసురు తీసుకుంటున్నారు. పల్లెసీమలో చావు డేరా వేసిందని ప్రభుత్వం కనీసంగా గుర్తించడం లేదు. 1997-98 ప్రాంతాల్లో వరంగల్‌ తదితర జిల్లాల్లో పత్తిరైతులు వందలసంఖ్యలో మరణించినప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూపిన స్పందనకీ, ఇప్పుడు చంద్రశేఖరరావు ప్రభుత్వం చూపుతున్న స్పందనకూ తేడాయేలేదు. నాటి వ్యవసాయ సంక్షోభమే మలిదశ తెలంగాణ ఉద్యమానికి నేపథ్యంగా పనిచేసిందని గుర్తుచేసుకోవాలి. బుద్ధిజీవుల్లోను, ఉద్యోగుల్లోను ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం రాజకీయాల్లోకి కూడా ప్రవహించిన తరువాత ఎంతో కాలానికి గానీ గ్రామీణ ప్రాంతాల్లోకి, రైతాంగంలోకి ఇంకలేదు. పణికర మల్లయ్య చంద్రబాబు నాయుడును అడిగిన ప్రశ్న, రైతాంగం తెలంగాణ రాష్ట్రం మీద పెట్టుకున్న ఆశలకు ఒక సంకేతం. మరి ఆకుపచ్చని తెలంగాణ, మానవీయమైన తెలంగాణ, అసహజమరణాల్లేని తెలంగాణ- ఏమయింది?
రైతాంగంలో నెలకొన్న మనుగడ సంక్షోభం, దాని తీవ్రత కెసిఆర్‌కు తెలియనిది కాదు. తెలంగాణ వాదం ఒక్కటే తనను పూర్తిగా గెలిపించలేదని ఆయనకు అనుమానం ఉంది కనుకనే, రుణమాఫీ, పింఛన్లు వంటి సంక్షేమ హామీలను ఆయన గుప్పించారు. అక్కడ చంద్రబాబుకైనా, ఇక్కడ కెసిఆర్‌కైనా రుణమాఫీ తురుఫుముక్క వలె పనిచేసింది. తమను గెలుపునకు నడిపించిన ఆ అంశం గురించి ఈ ప్రభుత్వాలు చేస్తున్నదేమిటి? రుణమాఫీ పూర్తిగా అమలుచేసి ఉంటే, లేదా చేయగలిగి ఉంటే, ఈ ఆత్మహత్యలు నివారించగలిగేవారమా? కాకపోవచ్చు. ఉసురు తీసుకుంటున్న రైతుల మీద ఉన్న రుణభారం గురించి వింటుంటే, ప్రభుత్వ మాఫీ ఏ మూలకూ సరిపోయేది కాదు. కానీ, ప్రభుత్వాల సీరియస్‌నెస్‌కు మాఫీ అమలుపై వేసిన పిల్లిమొగ్గలు ఒక సూచిక. పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్లకు వేలాదికోట్ల వడ్డీలను, జరిమానాలను, రుణాలను మాఫీ చేయడానికి ఎటువంటి అభ్యంతరాలు పెట్టని బ్యాంకింగ్‌ నిబంధనలు లక్షలాది రైతుల జీవన్మరణాల సమస్య విషయంలో అడ్డుపుల్లలు వేయడం అమానుషం. ఎవరితోనైనా తగాదాపడడానికి వెనుకాడనన్నట్టు ఉండే కెసిఆర్‌, ఈ విషయంలో రాజకీయపోరాటం చేసి ఉండవలసింది, ప్రజలు ఆయన వెనుక ఉండేవారు. సరే, మాఫీ సంగతి పక్కనబెడదాం. ఆత్మహత్యల నివారణకు క్షేత్రస్థాయిలో ఈ ప్రభుత్వం చేయగలిగింది ఏమీ లేదా? హైదరాబాద్‌ను విశ్వనగరంగా, కరీంనగర్‌ను న్యూయార్క్‌గా, తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చడానికి సాధ్యపడుతున్నప్పుడు, కొన్ని విషాదమరణాలను, తెలంగాణకు అవమానకరమైన చావుజాతరను ఆపడానికి ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదా? నిజంగా ఏమీ చేయలేదా?
సమగ్ర సర్వే నిర్వహణలో పాల్గొన్న ఒక ఉపాధ్యాయమిత్రుడు అదే రోజు సాయంత్రం తామడిగిన ప్రశ్నల గురించి ఇట్లా వ్యాఖ్యానించాడు. ‘‘ ప్రతి ఇంటికి వెళ్లి వాళ్లకు ఉన్న ఆస్తుల గురించి అడిగాము కానీ, అప్పులనడగలేదు. అప్పుల గురించి చెప్పని సర్వేలో అర్థసత్యాలే తెలుస్తాయి’’. కానీ, మన గ్రామసమాజాల్లో సాటి మనిషి రుణభారం గురించి తెలియకుండా ఉండదు. అవసరమైనప్పుడు గ్రామసభలను నిర్వహిస్తే, నెలకొని ఉన్న సంక్షోభ వాస్తవికత వెల్లడి అవుతుంది. నిస్పృహ వ్యక్తం చేస్తున్న మనుషులకు తోటివారు ధైర్యం చెప్పడమో, ధైర్యం కలిగే మార్గాలను సూచించడమో చేస్తారు. లేదా, సహాయాన్ని పొందే మార్గం అన్వేషిస్తారు. తలచుకుంటే, ఎక్కడెక్కడ సంక్షోభం పొంచిఉన్నదో, ఎక్కడెక్కడ ఆత్మహత్యలకు ఆస్కారం ఉన్నదో ప్రభుత్వం తెలుసుకోలేదా? ధైర్యం చెప్పగలిగే మార్గాలను అనుసరించలేదా? తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర వహించిన పాటను, విద్యార్థుల ఆత్మహత్యలను నివారించడానికి ఉపయోగించిన పాటను, రైతు ఆత్మహత్యల విషయంలో ఒక సాధనంగా వాడుకోలేరా? పూర్తి స్థాయి కరెంటు ఇవ్వలేకపోతే మానె, కనీసంగా తడి చావకుండా విద్యుత్‌ను వంతులవారీగా అందించడానికి గల అవకాశాలను పరిశీలించారా? మరికొంత త్యాగం చేయమని పట్టణ పౌరులను, పారిశ్రామికవేత్తలను అభ్యర్థించారా? కరెంటు దొరకడం దుర్లభం అనుకుంటే, పరిశ్రమలకు మరోరోజు కత్తెరవేసి, అవసరమైతే వారికి అందుకు తగిన పరిహారం చెల్లించి, కనీసంగా పొలాలను తడిపి ఉంటే కొన్ని ప్రాణాలైనా దక్కేవి కాదా?
ఇవన్నీ ఎందుకు జరగలేదు అని ప్రశ్నించుకుంటే, అప్రియమైన సమాధానమే దొరుకుతుంది. రైతులను వాళ్ల చావుకు వాళ్లను వదిలేశారు. అంతే. ప్రభుత్వానికి సంకల్పం లేదు. ప్రభుత్వాధి నేతకు ప్రాధాన్యాలు తెలియడం లేదు. అధికారంలోకి వచ్చిన తరువాత అనేక కొత్త ఆలోచనలను ముఖ్యమంత్రి వ్యక్తం చేస్తూవచ్చారు. వాటిలో అనేకం తెలంగాణ సమాజానికి మేలు చేసేవి, సృజనాత్మకమైనవి ఉన్నాయి. తెలంగాణ సంస్కృతిని వ్యక్తం చేసే అనేక వేడుకలు కూడా జరిపారు, అవీ జనాన్ని ఉద్వేగానాందాలలో ముంచెత్తాయి. పాలనలో ఆచరణలో ఏమి జరిగింది? విద్యార్థులపై, రైతులపై లాఠీచార్జిలు, మీడియాపై నిషేధాలు, సభలపై ఆంక్షలు, సంక్షేమపథకాల సమీక్ష పేరుతో ప్రజలను ఆందోళనపరిచే చర్యలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన వర్గాలవారికి, రాష్ట్రం సిద్ధించిన కొన్ని రోజులకే చేదు అనుభవాలు ఎదురు కావడం ఏ సంకేతాలను పంపిస్తుంది? పింఛన్‌ దరఖాస్తులు ఇచ్చుకోవడానికి వృద్ధులు క్యూలో నిలబడి ప్రాణాలు కోల్పోవడం ప్రభుత్వానికి ఏమి ప్రతిష్ఠ? ఏ ప్రభుత్వాన్నైనా రాజకీయ ప్రత్యర్థులు విమర్శించడం సహజం. ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టడానికి విమర్శలు చేసేవారూ ఉండవచ్చు. అదీ రాజకీయాలలో సాధారణమే. కానీ, విమర్శలన్నీ శత్రుపూరితమైనవని, ప్రభుత్వాన్ని విమర్శించడమంటే తెలంగాణను వ్యతిరేకించడమే అనే ధోరణి చూపించడం వివేకం కాదు. తప్పులను కప్పిపుచ్చి, అంతా సజావుగా ఉన్నదని చెప్పేవారు ఎవరైనా కావచ్చును కానీ శ్రేయోభిలాషులు మాత్రం కాదు.
అంతా వైఫల్యమే అని చెప్పడానికి నాలుగు నెలల కాలం సరిపోదు. అందుకే, జనం ఇంకా సహనంతో ఉన్నారు. కానీ, రైతుల చావులెక్క పెరుగుతున్న కొద్దీ ఓపిక వేగంగా క్షీణిస్తున్నది. కొత్తగా ఏర్పడిన తెలంగాణకు, మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ఒక ముఖ్యమైన తేడా ఉన్నది. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన ప్రభుత్వం కొత్త రాజధానిని నిర్మించడంతో పాటు, యథావిధి పాలన సాగిస్తే సరిపోతుంది. తెలంగాణలో అట్లా కాదు. తెలంగాణ ప్రజలకు కొత్త రాష్ట్రం సాధించుకున్నందువల్ల కొన్ని, కొత్త ప్రభుత్వం నుంచి మరి కొన్ని ఆకాంక్షలు ఉన్నాయి. యథావిధి పాలన నిర్వహిస్తూనే, కొత్త రాష్ట్రం లక్ష్యాలను కూడా పరిపూర్తి చేయాలి. దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు పథక రచన చేస్తూ, తక్షణ పాలన కూడా కొన సాగించాలి. కొత్త ప్రభుత్వం విఫలమైతే, తెలంగాణ రాష్ట్ర ఆశయమే విఫలమయినట్టవుతుందని ప్రజలు భయపడు తున్నారు. ఆ భయం నిజం కాదని నిరూపించవలసిన బాధ్యత కెసిఆర్‌పైనే ఉన్నది.
మెదక్‌ ఉప ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తూ కెసిఆర్‌, మెజారిటీ తగ్గకుండా ఓటు చేయాలని ప్రజలను కోరారు. ‘‘నవ్వేటోళ్ల ముందు జారిపడ్డట్టు చేయకండి’’ అని అభ్యర్థించారు. కెసిఆర్‌ ప్రతిష్ఠను కాపాడడం ప్రజల బాధ్యత అయింది. ఆ బాధ్యత వారు నెరవేర్చారు. నూతన రాష్ట్ర ఆశయాన్ని సార్థకం చేస్తూ, సత్పరిపాలన అందిస్తేనే తెలంగాణ ప్రతిష్ఠ నిలబడుతుంది. తెలంగాణ ప్రతిష్ఠను కాపాడడం ఇప్పుడు కెసిఆర్‌ వంతు. ఆలస్యం చేస్తే అమృతం కూడా విషం అవుతుంది.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

హుధూదుదంతం

 

 

హుధూదుదంతం

హుత్ అంటే పారిపోతున్దనుకొన్న హుధూద్ తుఫాను అందమైన విశాఖను విశోక నూ ప్రకృతి రమణీయ అరకును చెరుకు ముక్కలుగా ,ప్రశాంత విజయనగారాన్ని విలయ నగరం గా ,ఉత్తరాంధ్ర కధకు ఆటపట్టు చికాకోల్ ను చిక్కుల వలయం గ మార్చింది .కనీ వినే ఎరుగని భీభత్సాన్ని సృష్టించి బతికిన వారికీ ఎందుకు బతకాలనే నిరాశనే మిగిల్చింది .చీలి కోలుకొంటున్న నవ్యాంధ్ర నడుం విరిచింది .కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకొన్నా ప్రక్రుతి ముందు మానవుడు ఓడిపోవాల్సోచ్చింది .ఇది ‘’ఎంత్ టైం’’..కాని వీటిని తట్టుకొని నిలబడి అసమాన ధైర్యాన్ని జీవి తేచ్చను ప్రదర్శించిన సామాన్యులను అ ముందుగా అభినందించాలి .ఆతర్వాత ప్రజా ముఖ్యమంత్రి చంద్ర బాబును ,ఆయనకు ప్రతిక్షణం తోడ్పడిన సహ మంత్రులను వారికీ తోడ్పడుతున్న ప్రభుత్వాధికారులను యెంత ప్రశంసించినా సరిపోదు .కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ముందు జాగ్రత్త చర్యలకు సహాయమందించి దేశీయ విపత్తుగా భావించి వెన్నంటి నిలచిన ప్రజా మోడీ అయన ప్రభుత్వమూ ఎన్ని అభిన్దనలకైనా అర్హమే .కునుకు లేకుండా చిమ్మ చీకటిలో ,ప్రళయ కాలపు చినుకుల మెరుపులా ఉరుముల కుండ పోత ధారల్లో ప్రజానీకం వణికే పోయారు .వారికి ఆపన్న హస్తం అందించటానికి విలయానంతరం అందరూ ముందుకు రావటం హర్షణీయం .ఇది మానవుడు సృష్టించుకొన్న విపత్తు కాదు .నెత్తిపై బలవంతాన పడిన తుఫాను పిడుగు .ఈల వేసి విజ్రుమ్భించి గోల చేసి నాశనం చేసి ,అన్నిటినీ ముంచి తేల్చి జన జీవితాన్ని పీల్చిపిప్పి చేసింది హుధూధు.ఇందులో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ కన్నీటి నివాళి .ఆస్తినష్టం అయినవారికి సానుభూతి .గుండె ధైర్యం తో బతుకు పోరాటం లో గెలిచి నిలబడ్డ వారందరికీ అభినందనలు .ఇలాంటి ప్రళయం మళ్ళీ రారాదని కోరుకొందాం .ఆపన్న హస్తాలు అందిస్తున్న సకల జనులకు ,ప్రభుత్వాలకు సంస్తలకు తీర రక్షణ దళాలకు ఎన్ని కృతజ్ఞతలు చెబితే ఈ ఋణం తీరుతుంది?వారి సద్య స్పందనకు ఏమిచ్చి ఋణం తీర్చుకోగలదు .ఆంద్ర జాతి ?కో త్తకాపురం కూర్చుకొనే వేల తట్టా బుట్టా సమకూర్చుకొనే సమయం లో కుండా చట్టీకూర్చుకొనే లోపే ఈ జల ఖడ్గ ప్రహారమా?ప్రకృతీ !ఇక నైనా శాంతించు .మా తప్పులేమైనా ఉంటె మన్నించు ఇంతకోపం, ప్రతీకారేచ్చ లకు తట్టుకోగలడా మానవుడు?ఆలోచించు .బిడ్డల తప్పులుంటే సరిదిద్దు .ఇంతటి క్రూర శిక్ష ఇక వద్దు వద్దు వద్దు .images (7) images (6) images (5) images (4) images (3) images (2) images (1) images download

ఎన్నెన్నో హుదుదూ కధనాలు

సాధారణ భూగోళ ఉష్ణోగ్రత ఇరవై  ,పాతిక డిగ్రీలు ఉండాల్సింది యాభై డిగ్రీలకు చేరినందు వల్ల వచ్చిన పెను ముప్పు అన్నది నాసా .’’పంచెకట్టాయన’’భార్య విజయమ్మ ను నెత్తికెత్తుకోక ఓడించిన దాని ఫలితమే అన్నాడొక ఉస్త్ర పక్షి .లేదు గురూ –ఇదంతా బాబు ఉదయం కాకుండా రాత్రి ముహూర్తం లో ప్రమాణ స్వీకారం చేసిన ఫలితం అన్నాడొక పరివ్రాజకుడు .అసలు అయిపోయి తీరం దాటి వెళ్ళిపోయి తోక ముడుస్తున్దనుకొన్న ధూధూద్ ‘’బూమేరాంగ్’’ లాగా వెనక్కి తిరిగొచ్చి పిచ్చకొట్టుడు కొట్టింది గాలీ వానాతో అన్నాడొక వాతావరణజ్నుడు .అసలు మా ‘’ఇటలీ యమ్మను’’ ,కొడుకు ‘’బుచ్చిని ‘’ కేంద్రం లో అధికారం లేకుండా ,రాష్ట్రం లో నామ రూపాలు లేకుండా చేస్తే ప్రక్రుతి సహిస్తుందా?పగ బట్టి మరీ ప్రతీకారం తీర్చుకోంది అన్నాడు ఖద్దరు లాల్చీ ఆయన .రాష్ట్రం లో యెర్ర ఖండువా లేకుండా చేసిన దానికి ప్త్రతిఫలమన్నాడొక యెర్ర చొక్కా మేధావి . ‘’ఓదారుస్తా ‘’నంటూ ‘’గాలిమరాయన ‘’ హావ భావాల తో వికృత చేష్టలతో మళ్ళీ జనం లోకి దూకుడు .మెగాలు   సూపర్లు ,లెజెండ్ లు మాటల వాళ్ళే అయ్యారు కాని క్షేత్రస్తాయిలో కనిపించలేదు .జనం పెరుపెట్టుకొన్న జన సేన నాయకుడు మాత్రం రంగం లోకి దిగి ముందుకొచ్చాడు సుభాష్ గబ్బర్ .

‘’అసలు తుఫాను కన్ను (ఐ) ఒంటికన్ను .అది శుక్రాచార్యుడికి సంకేతం .రాక్షస పగ .అందుకే అంత భీభత్సం  కన్నుకు వెలుపల గోడ (ఐవాల్)లో క్యుములో నింబస్ మేఘాలు నిండి కుంభ వృష్టి కురిపించి అనర్ధాన్ని కల్గిస్తాయి .ఐవాల్ తర్వాత ఉండే ‘’రెయిన్ బాండ్స్ ‘’మూడు వందల మైళ్ళ దాక వ్యాపించి గంటకు రెండు వందల కిలో మీటర్ల వేగం తో గాలులు వీస్తూ ,మేఘాలతో అల్లుకొని ఉండటం తో కుండపోత వర్షం పడుతుంది .తుఫాన్ కన్ను తీరం   చేరగానే  ఆ భాగం ప్రశాంతం గా ఉండి కాసేపు స్మశాన నిశ్శబ్దం ఏర్పడి ,వెంటనే ఐవాల్ తరుముకొచ్చి భీభత్సం సృష్టిస్తుంది .ఇదీ దాటి ,రెయిన్ బాండ్స్ కూడా దాటిపోతే తుఫాను బలహీనమై సమసి పోతుంది ‘’అని హుదూద్ సృష్టించిన విలయాన్ని తీరికగా తెలిపారు వాతావరణ శాస్త్ర వేత్తలూ మీడియా మనీషులు .అంటా అయిన తర్వాత .ఇది నాలుగవ కేటగిరీ తుఫాన్  అన్నారు తీరిగ్గా ఇప్పుడు .’’

రైలు బోగీలే తల దాచుకొనే రక్షణ భూములయ్యాయి చాలా మందికి .ముందు జాగ్రత్తగా రైలు విమాన బస్ సర్వీసుల్ని రద్దు చేయటం తో పెను విలయం ,ప్రాణ నష్టం తప్పింది.  .దీనికి ప్రభుత్వాన్ని మెచ్చాలి  విమాన స్థలం పంటలు రాడార్ కేంద్రం ,ఇల్లు ,అపార్ట్ మెంటులూ నష్టాన్ని అనుభవించాయి .అపార్ట్ మెంట్లు తాతాకుల్లా ఊగిపోయాయి అంటే యెంత ఉపద్రవం వచ్చి మీద పడిందో అర్ధమవుతోంది .ప్రతిక్షణం ‘’మానిటర్’’ చేస్తూ ప్రజలకు ధైర్యం చెబుతూ  సహాయ కార్యక్రమాలకు సూచన లిస్తూ  ,పర్య వేక్షిస్తూ యంత్రాంగాన్ని నడిపించటం లో బాబు చూపిన తీరు బహుదా ప్రశంసనీయం .అందుకే ఆయన్ను ఏరి కోరి పదేళ్ళ తర్వాత  ఆయన్ను  ప్రజలు తమకు రక్షకుడు కావాలని ఎన్నుకొని పట్టం కట్టారు .దానికి ఋణం తీర్చుకొన్నాడు .ఇక్కడ కావలసింది సమన్వయము .దాన్ని సంపూర్తిగా సాధించాడు .రాత్రి ఒంటి గంటకే లేచి రోడ్డున పడే ముఖ్య మంత్రి ఎవరినైనా ఇంతవరకు మనం చూశామా?నీటి సరఫరా ఆహార సరఫరా ,విద్యుత్  ట్రాన్స్ ఫార్మర్ల  మార్పిడి  విద్యుత్ స్తంభాలను నెలకొల్పటం కమ్యూనికేషన్లు సప్లైలను వేగవంతం గా రప్పించటం పంపిణీ పబాబు  ప్రాధమిక వైద్యం ,ముసలీ ముతకాకు ఆసరా ,ఇన్ని పనులు సమన్వయము తో సమయ స్పూర్తితో ,కునుకు లేకుండా ,అలసట ఎరుగకుండా చేయటం చంద్ర బాబుకే సాధ్యం .ఉక్కు మనిషి వజ్ర సంకల్పుడు ,ఏది ముందు ఏది వెనకా చేయాలో విజన్ ఉన్నవాడు  .ఈ విపత్ సమయం లో నిజం గా ఆపద్బాన్ధవుడే అయ్యాడు బాబు .విశాఖ నుంచే పరిపాలన చేస్తూ మార్గ దర్శి గా ,మానవత్వం మూర్తీభవించిన వ్యక్తిగా ,అనితర సాధ్యమైన కృషికి మారుపేరుగా నిలిచి అందరి చేతా మెప్పు పొందుతున్నాడు . బాబు చేతిలోనే నవ్యాన్ధ్రకు ఉజ్వల భవిష్యత్తు లభిస్తుంది .ఈ ఒడి దుడుకులు అధిగమించి జయ సంకేతం చూపించి భావి తరాలకు ఆదర్శం గా భవ్య దివ్య శుభ్ర ,స్వచ్చ ఆంద్ర ప్రదేశ్ నిర్మాణమవుతుందని భావిద్దాం .శుభం భూయాత్

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -16-10-14-ఉయ్యూరు  ,

 

http://telugusala.blogspot.in/2014/10/blog-post_15.html

 

హుధుద్ కి ధన్యవాదాలు..!

మాదొక అలల నగరం..
మాదొక కలల నగరం..
అలలూ కలలూ కలిసి..
ఎదిగిన మహా నగరం మాది..
నవ్వుతూ తుళ్లుతూ..
ఎంతో హాయిగా ఉండే నగరమిది..
అప్పటికీ రోజూ తీరానికొచ్చి పోయే..
అలల అనుమతి తీసుకునే ఇంత నగరాన్ని నిర్మించున్నాం..
మా అండా దండా నువ్వే సముద్రమా అంటూ కలలన్నీ ప్రోది చేసి..
మిద్దెలూ మేడలూ కట్టుకున్నాం..
మమ్మల్ని రక్షించినా నువ్వే..
శిక్షించినా నువ్వేనని ఒక్కో అడుగూ ముందుకేసుకుంటూ వచ్చాం..
ఇన్నేళ్లుగా మా అభ్యర్ధన మన్నిస్తూ వచ్చాడా సముద్రుడు కూడా..
పురాణకాలం నాటి మా మహా నగరానికి స్నేహహస్తం అందిస్తూనే వచ్చాడు..
ఎన్నో తుఫాన్లు మా పట్టణం మీదకు ఉరికొచ్చినా మా వాళ్లేలే వదిలెయ్ అన్నాడు..
అడుగడుగునా అడ్డుపడుతూనే వచ్చాడు..
కానీ హుధుద్ దూకుడు ముందు ఏం చెయ్యలేక పోయాడా సాగరుడు..
సాగరుడు చేతులెత్తేశాడని తెలిసిన హుధుద్
విశాఖ అణువణువూ  శోధించింది..
ప్రతి ఇసుకరేణువునూ కదిలించి వేసింది..
చెట్టూ చేమ పుట్టా గుట్టా పేరుపేరునా చెదిరిపోయాయి..
మా గూళ్లన్నీ చెదిరాయి.. గుప్పెడంత గుండె ధైర్యం మాత్రమే మిగిలింది..
ఇప్పుడు విశాఖ వాసి అండాదండా ఆ గుప్పెడు ధైర్యమే..
ఆనాడు హిరోషిమా నాగసాకి ప్రజలు పాటించిన ద్రుడ సంకల్పమే ప్రేరణగా..
మన నగరాన్ని మళ్లీ మొదటి నుంచి నిర్మించుకుందామన్న ఉక్కుసంకల్పమే పెట్టుబడిగా.. నిలబడతాం..
ప్రస్తుతం మా నగరంలో రాత్రి వేళైతే దీపాలు వెలగడం లేదు..
అయితేనేం ముందుచూపనే దీపాలున్నాయ్ ఏం భయం లేదు..
తాగడానికి నీళ్లులేవ్.. గుండెలో కావల్సినంత తడుంది మరేం ఆందోళనక్కర్లేదు..
కూడు, గుడ్డకు కష్టంగా ఉంది.. అయితేనేం కండలనిండా శక్తి యుక్తులున్నాయ్ దిగులేలేదు..
పాలకూ నీళ్లకూ కరువు.. అయితేనేం మా నరనరానా ఆశలూ ఆశయాలున్నాయ్..
కలిసినడవడానికి ఈ నాలుగు చాలు..
కదం తొక్కడానికి ఈ బలం చాలు..
మోడీ వచ్చినా.. బాబొచ్చినా.. పవర్ స్టార్ లాంటి సినిమా నటులొచ్చినా..
వాళ్లకు మేం చెప్పేదొక్కటే..
మా ఊరు కొట్టుకుపోయింది కానీ మాలోని ఉత్సాహాన్ని కాదు..
మాకిప్పుడు తిండితిప్పలు లేవేమోగానీ మొక్కవోని ఆత్మస్థైర్యానికి కొదవేలేదు..
మాకేం లోటు లేదు.. మాకెవరూ చెటు చెయ్యలేరు..
ఇది మా చరిత్రను మేమే తిరగరాసుకునే సమయమని తెలుసు..
ఆ అవకాశమిచ్చిన హుధుద్ కి ధన్యవాదాలు..
మీరందరూ తోడున్నందకు శతకోటి దండాలు..
ఈ మాత్రం అండదండ చాలు..
విశాఖపట్నం నుంచి తుఫాను తెచ్చిన శోకాన్ని తరిమికొట్టడానికి..
ఈ చిన్న స్నేహహస్తం చాలు..
వైజాగ్ ని పట్టిపీడిస్తున్న కష్టాలను గజగజలాడించడానికి..
మా నమ్మకం..
మా ధైర్యం..
మా బలం.. ముందు
హుధుద్ ఎంతో చిన్న..
చాలా చాలా చిన్న..
ఎంతో చిన్న.. ఎంతో ఎంతో ఎంతో చిన్న….
అందుకే హుధుద్ కి ధన్యవాదాలు..!
-తెలుగుశాల
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -41 41-ప్రేయో రస ప్రతిపాదకుడు –రుద్రటుడు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -41

41-ప్రేయో రస ప్రతిపాదకుడు –రుద్రటుడు

రుద్రటుడు తొమ్మిదవ శతాబ్దానికి చెందినా కాశ్మీర పండిత కవి అలంకార శాస్త్రవేత్త .తొమ్మిదవ శతాబ్ద మొదటిభాగం లో ‘’కావ్యాలంకార ‘’అనే  అలంకార గ్రంధాన్ని రాశాడు .అతని గురించి పెద్దగా వివరాలు  తెలియ రాలేదు .కాని అతని గ్రంధం లోని అయిదవ అధ్యాయం లోని పన్నెండునుండి  పద్నాలుగువరకు ఉన్న శ్లోకాలపై ‘’నమి సాధు ‘’రాసిన వ్యాఖ్యానం వలన రుద్రటుడికి’’ సదానంద ‘’అనే మరోపేరు ఉన్నట్లు,.తండ్రిపేరు భాముకుడు అన్నట్లు తెలుస్తోంది .రుద్రటుడు తనకు పూర్వం ఉన్న ఆలంకారికుల మార్గం లోనే కావ్యాలంకారం రాశాడు .అందులో పదహారు అధ్యాయాలు ,734శ్లోకాలున్నాయి .రుద్రటుడు తొమ్మిదో శతాబ్దానికి పూర్వార్ధం లో ఉండినట్లు భావిస్తారు .పద్నాలుగు ప్రక్షిప్త శ్లోకాలున్నాయి .

రుద్రట ప్రతిభా రౌద్రం

కావ్యాలంకారం లో అష్టవిధ నాయికల గురించి రుద్రటుడు పేర్కొన్నాడు .శ్లోకాలను ఎక్కువ భాగం ‘ఆర్యా వృత్తం ‘’లో రాశాడు . పదమూడవ అధ్యాయం లో కేవలం పదిహేడు శ్లోకాలు మాత్రమె ఉండి అతి చిన్న అధ్యాయం గా కనిపిస్తుంది .కాని ఎనిమిది తొమ్మిది అధ్యాయాలలో వరుసగా 111 ,మరియు110శ్లోకాలు ఉండి పెద్ద అధ్యాయాలుగా ఉంటాయి .మొదటి అధ్యాయం లో గణేశ ,గౌరీ స్తుతి చేసి కావ్యారంభం చేశాడు .చదరంగం ఆటగురించి దానిలో నిష్ణాతులైన వారి గురించి ,దాని చరిత్రను గురించి కూడా రుద్రటుడు రాయటం విశేషం .వీరుల పర్యటన (NIGHT;S TOUR) చిత్రాలంకారంఅంటే ‘’తురగ పద బంధం ‘’కూడా ఉండి  వాటి విశేషాలు తెలుస్తాయి .ఔచిత్య చర్చ విశేషం గా చేశాడు .రుద్రట కృతిపై మూడు వ్యాఖ్యానాలున్నాయి .అందులో ముఖ్యమైనది శ్వేతాంబర జైనుడైన నమిసాదురాసినది ,పదకొండవ శతాబ్దం వాడైన శైల భద్రుడు రాసినవి ముఖ్యమైనవి .గోపాల దేవుడు కూడా రాశాడు .గోపాల భట్టు ‘’రస తరంగిణి ‘’పేరిట వ్యాఖ్యానం రాశాడు .

రుద్రటుడు కావ్యాలంకారం లో 495 కారికలున్నాయి మిగిలినవి శ్లోకాలే .ప్రౌఢమైన అలంకార గ్రంధం గా పరిగణింప బడింది .రుద్రటుడు ఏ కొత్త సిద్ధాంత ప్రతిపాదనా చేయలేదు .చర్చ అంతా పరమ శాస్త్రీయ విధానం లో నిర్వహించి మెప్పుపొండాడు .అలంకారాలను శబ్దాలంకారాలు గా అర్దాలంకారలుగా విభజించి కొత్త దారి తొక్కి, తరువాతి వారికి మార్గ దర్శి అయ్యాడు .మొత్తం యాభై ఏడు అలంకారాల గురించి వివరించాడు .అలంకారాన్ని సమర్ధించినా రస నిష్పత్తికి విలువ నిచ్చాడు .అందరికంటే ఇంకొక అడుగు ముందుకు వేసి ‘’ప్రేయోరాసాన్ని ‘’పదవ రసం’’ గా ప్రతిపాదించాడు .దీనికి స్నేహం స్థాయీభావం గా చెప్పాడు .స్నేహాన్ని చక్కగా నిర్వచించాడు –‘’సహృదయ వ్యవహారం తో కూడిన నిశ్చలమైన ,నిర్వ్యాజమైన మనో వృత్తియే స్నేహం ‘’అని రుద్రటుడు నిర్వచించాడు .స్నేహం వలన ఏర్పడిన ప్రేమ ,విశ్వాసం తో సద్భావం తో కోమలం గా పరస్పర స్పందనలుగా ఉంటుంది .మనసు ఆర్ద్రం అవటం ,ఆహ్లాదం తో కళ్ళ వెంట అశ్రుజలాలు కారటం ,స్నిగ్ధ భావం తో ఒకరినొకరు ఆపేక్షగా చూసుకోవటం ఇందులో అనుభవానికి వచ్చే విషయాలు .స్నేహం లో కామం ,రతి ప్రస్తావన ఉండదు .మానసిక రతి ఉంటుంది .అందువలన పుత్రప్రేమ, దాస్య ప్రేమ , దాంపత్య  ప్రేమ (కులపాలికా ప్రేమ),ప్రక్రుతిప్రేమ ,దేశ భక్తీ ,గొప్ప వారియెడ గౌరవ భావం మొదలైన వన్నీ ప్రేయో రసానికి అంతర్గతం గా ఉంటాయి .తరువాత కాలం వారైన భోజుడు మొదలైన వారు ప్రేయోరసాన్ని బాగా ఆదరించారు .ప్రేయోరసం అంటే ‘’అమలిన శృంగారం ‘’మన రాయప్రోలు  సుబ్బారావు గారు దీనిపైనే ‘’తృణ కంకణం ‘’అనే ఖండ కావ్యం రాశారని మనకు తెలిసిన విషయమే .రుద్రటుడు పూర్వం ఉన్న వైదర్భి ,పాంచాలీ ,గౌడీ రీతుల తో బాటు కొత్తగా ‘’లాటి ‘’అనే రీతిని గుర్తించాడు . ఉపమ రూపక  ఉత్ప్రేక్షాలంకారాలను  చక్కగా వివరించాడు .సరిగ్గా నిర్వచనం లేని  వాటిని వాస్తవాలంకారాలన్నాడు .వాస్తవ అంటే వస్తు సంబంధమైనవి అనే అర్ధం లో చెప్పాడు .శ్లేషను అర్దాలంకారం గా ఒప్పుకోలేదు .అదొక విచిత్రాలంకారం అన్నాడు .

రుద్రటుడి తురగ పద బంధం

తురగ పద బంధం ను మొదటి సారిగా అలంకార శాస్త్రం లో చెప్పిన వాడు రుద్రకుడు .ఇది గుర్రపు నడకను పోలి ఉండటం చేత ఆపేరు వచ్చింది .ఇందులో ఒక్కొక్క పంక్తికి ఎనిమిదేసి అక్షరాల వంతున నాలుగు పంక్తులుంటాయి .వీటిని ఎడమ నుంచి కుడి కి చదవ వచ్చు .లేక అశ్వ పద మార్గం లోనూ చదవ వచ్చు అదీ ఇందులో విశేషం .ఇందులోని ప్రతి అక్షరం చెస్ బోర్డ్ లోని ఒక చదరానికి సంకేతం .రుద్రకుడు ఇచ్చిన ఒక ఉదాహరణ ను గమనిద్దాం’

‘’సే నా లీ లీ లీ నా నా నా లీ

లీ నా నా నా నా లీ లీ లీ లీ

న లీ నా లీ లీ లే నా లీ నా

లీ లీ లీ నా నా నా నా నా లీ’’

మొదటి పంక్తి ని ఎడమ నుండి కుడికి మామూలుగా చదవ వచ్చు .లేకపోతె మొదటి చదరం నుండి రెండవ పంక్తికి వెళ్లి మూడవ అక్షరాన్ని తురగ బంధం లో ఒకటికి చేరి చదవ వచ్చు .లెక్కల రూపం లో చెప్పాలంటే -5to2,7to4,8to3,6,to4,4,to3,2.

ఈ తురగ పదబంధాన్ని  చేదించిన  మొదటి గణిత శాస్త్రజ్ఞుడు ‘’లియోన్ హార్డ్ యూలర్ ‘’.దీనికి విధానాన్ని  ‘’వారంస్ డార్ఫ్ రూల్ ‘’గా వివరిం చిన వాడు 1803 కాలపు వాడైన H .C .Von Warns dorff .వీటినే ఆల్గారిదం ‘’అంటున్నారు .వీటికే ‘’Rudraka cycles’’అని పేరుపెట్టి అందులో ప్రవేశించటానికి చాలా ప్రయాసపడ్డారు .అంతటి మేధావి రుద్రకుడు .

Inline image 1Inline image 2

 

మరో కవితో పరిచయం అవుదాం

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -16-10-14-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

యెన్ టి అర్ పై ”మహా ఘనుడు ”సినిమా

యెన్ టి అర్ పై ”మహా ఘనుడు ”సినిమా

 

ఎన్టీఆర్‌ జీవిత కథ ‘మహాఘనుడు’
నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘మహాఘనుడు’. జె.కె.మూవీస్‌ పతాకంపై తెరకెక్కుతోంది. దావల కుమార్‌ రాజేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. డి.అనీల్‌సుధాకర్‌, డి.క్రిష్ణారావు నిర్మాతలు. ఈ సినిమా విశేషాలను దర్శకుడు చెబుతూ ‘‘నందమూరి తారక రామారావుగారి సినీ రంగ ప్రవేశానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను అన్నపూర్ణ స్టూడియోలో చిత్రీకరించాం. దీంతో తొలి షెడ్యూల్‌ పూర్తయింది. ఈ నెల 20 నుంచి రెండో షెడ్యూల్లో కొన్ని కీలక సన్నివేశాలను హైదరాబాద్‌ పరిసరాల్లో చిత్రీకరిస్తాం. అక్టోబర్‌ మూడో వారంలో ఆఖరి షెడ్యూల్‌ చేస్తాం. 2015జనవరిలో అన్నగారి వర్ధంతి సందర్భంగా సినిమాను విడుదలచేసి, ఆ రోజు అన్నగారి పేరున సేవా కార్యక్రమాలను నిర్వహిస్తాం’’ అని అన్నారు. ఎలాంటి విమర్శలు, వివాదాంశాలు లేకుండా కేవలం అన్నగారి గొప్పదనాన్ని నేటి తరానికి తెలియజేయడమే లక్ష్యంగా రూపొందిస్తున్నాం అని నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాకు కెమెరా: మురళీకృష్ణ మిరాకిల్‌, ఎడిటింగ్‌: బద్రి, సంగీతం: ఉదయ్‌ముద్గల, రాజు, పాటలు: అచ్చుల నాగేశ్వరరావు, జొన్నలగడ్డ కృష్ణ.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రేడియో అక్కయ్య తురగా జానకీ రాణి మృతి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -40

గీర్వాణకవుల కవితా గీర్వాణం -40

40-ధ్వన్యాలోక కర్త –ఆనంద వర్ధనుడు

ఆనంద వర్ధనుడు అనగానే ‘’ధ్వని సిద్ధాంతం ‘’జ్ఞాపకం వస్తుంది ధ్వని సిద్ధాంతంపై విపులమైన చర్చ చేసి ధ్వన్యాలోకం లేక ‘’కావ్యాలోకం ‘’అనే అలంకార శాస్త్రాన్ని రాసిన వాడు ఆనంద వర్ధనుడు .ఇది అలంకార శాస్త్రం లో ఒక కుదుపుకుదిపి కొత్తమలుపుకు తిప్పింది .శ.  855-883 వాడిన ఈ ఆలంకరికుడు కాశ్మీర రాజు అవంతి వర్మ ఆ స్థానపండితుడు .ఆనంద వర్ధనుడు ఒక యుగ కర్త అయ్యాడు .ధ్వని యొక్క ప్రకాశమే ధ్వన్యాలోకం .ధ్వని అనే కాంతి దర్శనమే ధ్వన్యాలోకం .సన్నిధానం సూర్య నారాయణ శాస్త్రిగారు దీనికి తెలుగులో విపులమైన వ్యాఖ్య రాశారు .ఆంగ్లం లో జెఫ్రీ మౌసఫ్ మాసన్  పట్వర్ధన్ లు అభినవ గుప్తుని లోచన వ్యాఖ్య ఆధారం గా  అనువదిస్తే హార్వర్డ్ యూని వర్సిటి ప్రెస్ 1990లో ప్రచురించింది .బిడ్యుత్ భరన్ ఘోష్ చేసిన వ్యాఖ్యానాన్ని సాంస్క్రిట్ పుస్తక భాండార్ వారు ముద్రించారు .

ఆనంద వర్ధనీయం

ధ్వన్యాలోకం లో నూట ఇరవై తోమ్మిదికారికలున్నాయి .వీటిని ధ్వనికారికలు అన్నాడు ఈ కారికలకు రాసిన వృత్తినే ధ్వన్యాలోకం అంటారు ధ్వనియోక్క ఆలోకనం అన్నమాట .దీనికి నూటయాభై ఏళ్ళ తర్వాత అభినవ గుప్తుడు ‘’లోచనం ‘’అనే మహా గొప్ప వ్యాఖ్య రాశాడు .కావ్య ప్రారంభం లో ఆనంద వర్ధనుడు ‘’పూర్వ ఆలంకారికులు కావ్యాత్మనే ధ్వని అన్నారు .కొందరు కాదన్నారు .కొందరు లక్షనాన్తర్గతం అన్నారు. కొందరు అది గోచరించదు అన్నారు .నేను ఇప్పుడు సహృదయుల సంతృప్తికోసం ధ్వని తత్వాన్ని వివరిస్తున్నాను ‘’అని చెప్పుకొన్నాడు .కాని కొందరు దేశీయ కొందరు విదేశీయ పండితులు ధ్వన్యాలోకం ఆనంద వర్ధనుడు రాయలేదన్నారు .అంతకు ముందే ధ్వని ఉందన్నారు

‘’ధ్వనినా గతి గభీరేణ  కావ్య తత్వ నివేశినా –ఆనంద వర్ధనః కస్య నాసీ దానంద వర్ధనః ‘’అన్నదాన్ని బట్టి సందేహ నివృత్తి కలుగుతోంది దీనిభావం –‘’అతి గంభీరమైన కావ్య తత్వ పరిపుష్టమైన ధ్వని యొక్క స్వరూప స్వభావాలను నిరూపించటం చేత ఆనంద వర్ధనుడు ఎవరికి ఆనంద వర్ధనుడు కాదు ?అలాగే ఇంకొక శ్లోకం లో ఉన్నదాన్ని బట్టి –

‘’సత్కావ్య తత్వ విషయం స్పురిత ప్రసుప్త –కల్పం మనస్సు పరిపక్వ దియాం యదాసీత్

తద్వ్యాకరో త్సహృదాయో దయ లాభ హేతో –రానండ వర్ధన ఇతి ప్రథితాభి దానః ‘’-అంటే ‘’పరిపక్వమైన బుదద్ధికల విపస్చిత్తుల మనస్సులలో స్పురించి ,,సుప్తావస్తలో ఉన్న కావ్య తత్వాన్ని సహృదయుల ఆనందానికి సహృదయుడు వ్యాఖ్యానించి చెప్పాడు ‘’.కనుక ఆనంద వర్ధనుడికి పూర్వమే ‘’కావ్యాత్మ ధ్వని’’అని ఉన్నాదని ,దాన్ని నిరూపించి పండితులను అంగీకరించేట్లు వ్యాఖ్యానించాడని భావం .కాణే,ఎస్ కే డే వింటర్ నిత్స్ పండితులు కారికలు రాసింది ‘’సహృదయ ‘’అనే పేరుగల వాడన్నారు ఈ కారికలు ఆనంద వర్ధనుడికి పూర్వమే నూట యాభై ఏళ్ళ కిందటనే ఉన్నాయన్నాడు డే .మొత్తం మీద మనకు తెలిసింది ఏమిటి అంటే అప్పటికే వ్యాప్తిలో ఉన్న ధ్వని ని సిద్ధాంతీకరించి వ్రుత్తి రాసి ప్రచారం లోకి తెచ్చిన వాడు ఆనంద వర్ధనుడు అనుకొంటే ఏ ఇబ్బందీ ఉండదు ఎవరితోనూ .

ధ్వన్యాలోక అవ్యక్త ధ్వని

ధ్వన్యాలోకం లో నాలుగు ఉద్యోతాలున్నాయి .మొదటిదానిలో ప్రాచీన అలంకారికులు ధ్వనిని గురించి ఏమేమి చెప్పారో వాటిని గురించి వాటిపై వచ్చిన ఖండనల గురిచి చెప్పి ధ్వని స్వరూపాన్ని ధ్వని భేదాలను ,గుణీ భూత వ్యంగ్యాన్ని తర్క భూమికపై వ్యాఖ్యానించాడు .తర్వాత ధ్వని నిరూపణ ప్రయోజనాన్ని వివరించాడు .అభినవ గుప్తుడు లోచన వ్యాఖ్యానం రాశాడని చెప్పుకొన్నాం .అతడు ‘’చంద్రిక అనే వ్యాఖ్యానాన్ని గురించి చెప్పి లోచనం లేక పొతే చంద్రిక ఉన్నా ‘’ఆలోకం ‘’కనపడదని చమత్కరించాడు .వర్ధనుడు తన రచనలైన దేవీశతకం, అర్జున చరిత్ర మహా కావ్యం ,విషమ బాణ లీల ,హరవిజయం నుంచే లక్షణాలకు ఉదాహరణలు ఇచ్చాడు .ఇందులో దేవీశతకం ఒక్కటే లభ్యం .విషమ బాణ లీల ,హరవిజయాలు ప్రాకృత భాషలో రాశాడు .

ఇంతకీ ధ్వని అంటే ఏమిటి?కావ్యం లో వాచ్య లక్ష్యార్దాలకంటే వేరైనది ఒకటి అంతరార్ధం గా భాసిస్తుంది .దాన్ని వ్యంగ్యార్ధం అని అంటారని అదే ధ్వని అని ఆనంద వర్ధనుడు నిర్వచించాడు .ధ్వని వాచ్య ,లక్షణార్దాలకంటే చమత్కార రంజకమై ఆనందాన్నిస్తుంది .ధ్వని రామణీయకత్వం సహృదయ వేద్యం .ఇది స్త్రీల అలంకారాల కంటే  భిన్నం గా ఉండే లావణ్యం లాంటిది .

‘’ప్రీతీయమాన  పునరన్య దేవా –వస్త్వ్యస్తి వాణీషుమహా కవీనాం

యత్తత్ ప్రసిద్దావయ వతి రిక్తం –విభాతి లావణ్య మివ అంగనాసు ‘’

‘’గంట కొడితే వచ్చే చెవులు భరించలేని టంకార ధ్వనికంటే దాని ఝంకార ప్రతిధ్వని ఆహ్లాదం కలిగించినట్లుగా ,గుణ , అలంకారాదులకంటే రమణీయమైన ప్రతీయమానమైన అర్ధం సహృదయ జనాలకు  ఆకర్షణీయం అవుతుంది ‘.అదే ధ్వని ‘’అని గంటకొట్టి ధ్వని సిద్ధాంతం లోని రహస్యాన్ని చెప్పాడు .ధ్వనియే కావ్యాత్మ అన్నాడు .ధ్వని లక్ష్య అర్ధాలలో దొరకదని ,దాన్ని వేరుగా చెప్పాల్సిన అవసరం లేదని వారి అభిప్రాయాలను ఖండించాడు .తర్క ,పాండిత్య ఆధారాలుగా ధ్వని సిద్ధాంతాన్ని స్తాపించాడు .ధ్వనిలో ఉన్న అతి సూక్షమైన భేదాలను వివరించటం లో ఆతను తీసుకొన్న మార్గం మహా విశిష్టమైంది .ఉదాహరణలు లేకుండా ఏదీ చెప్పలేదు .ధ్వనిలో అభిదా మూల ధ్వని ,లక్షణామూల ధ్వని అని ధ్వనిలో రెండు భేదాలనాను వివరించాడు .భరతుని రస సిద్ధాంతమే రసధ్వని శ్రవ్య కావ్యాలకు అన్వయించ బడింది .వ్యంగ్యార్ధం అనే ముసుగు వేసుకొన్న రస సిద్ధాంతమే ధ్వని సిద్ధాంతం అనిపిస్తుంది .రసభావ సమన్వితమైన కావ్యాన్నే ఉత్తమ కావ్యం అన్నాడు .అలంకార రచన ఉత్తమ కావ్యం అని పించుకోదు అని స్పష్టం గా చెప్పాడు ఆనంద వర్ధనుడు .

ఎంతటివాడికైనా సమకాలీనులు అడ్డు తగలటం సర్వ సామాన్యం.ఇది ఆనంద వర్ధనుడికీ తప్పలేదు  .మొదట్లో పండితులు ధ్వని సిద్ధాంతాన్ని చూసి పెదవి విరిచారు .కాని కాలం గడిచిన కొద్దీ కావ్య సిద్ధాంతాలలో ధ్వని సిద్ధాంతమే ఉత్తమోత్తమమిందని తెలుసుకొన్నారు. వ్యాప్తీ ,ప్రచారమూ చేసి నెత్తి కెత్తుకొన్నారు అందరూ .ఒక రకం గా అప్పటివరకు ఉన్న భామఃహ దండిల అలంకార వాదం ,వామనుడి రీతి వాదం వరకు అన్నిటి సమన్వయ పరచిన గొప్ప అలంకారికుడు ఆనంద వర్ధనుడు .మౌలిక తర్క సిద్ధాంత శైలిని  ఎన్నుకొని ఎదురు లేని మొనగాడు అనిపించుకొన్నాడు .’’ధ్వని ధ్వని అని లోకం చెవుల్లో మారుమోగేట్లు’’ చేసిన  ఆనంద వర్ధనాచార్యుడు ‘.

‘’కావ్యాత్మ స ఏవార్ధః తధాచాది కవే ఃపురా –క్రౌంచ ద్వంద్వ వియోగోత్తః శోక శ్లోకత్వ మాగతః ‘’అని మొదట్లోనే ఆనంద వర్ధనుడు అన్నాడు ..కావ్య సృష్టి ఎలాంటిదో కావ్యాన్ని అర్ధం చేసుకొని అభినందించటమూ అంత గొప్ప అన్నాడు ఆనంద వర్ధనుడు .’’The unexpressed is not is not understood by those who only know grammar and lexicon  but only by men of taste and literary instinct who know the essence of poetry .It is the province of the sahridaya ,the connosseur who is expert in discerning through the intricate meshes of veiled word and sense into the aesthetic relish of deeper significance .The aesthetic emotion istransfered only when there is  ideal reawakening of it in the reader .Ananda vardhana clearly states that appreciation of poetry is essentially the same as the creation of it ‘’Aesthetic  consciousness has no end out side of itself .Aesthetics experience charactarised by the immersion of the subject in the aesthetic object is akin to the beatitude of ecstacy or the Brahman or Self  .’’అని డా .కే సుబ్రహ్మణ్యం ధ్వని సిద్ధాంతం పై చక్కని వ్యాఖ్య చేశారు .

మరోకవితో కలుద్దాం

సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ -15-10-14-ఉయ్యూరు

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -39-

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -39-

39-నైషద కర్త -శ్రీ హర్షుడు

గీర్వాణ కవుల గురించి రాస్తున్న ఈ సీరియల్ లో మొదట కొంచెం అటూ ఇటూ గామొదలుపెట్టిన తర్వాత దాదాపుగా ‘’క్రానలాజికల్ ఆర్డర్ ‘’ననుసరించి కవుల జీవితాలను రాస్తూ హర్ష చక్రవర్తి దాక వచ్చాను .ఇప్పుడు హర్షునికాలం నుండి సుమారు అయిదు వందల ఏళ్ళు ముందుకు దూకి శ్రీ హర్షుడి గురించి రాస్తున్నాను .దీనికి కారణం ఇద్దరూ  ఒకే కాలానికి చెందిన వారుకాకపోయినా ఇద్దరూ వేరు వేరు వ్యక్తులని చాలా మందికి తెలియదు ఒక్కరే అని చాలామంది భ్రమ పడుతున్నారు ..చక్రవర్తి హర్షుడు నాగానందం  మొదలైన మూడు నాటకాలు రాస్తే , శ్రీ హర్షుడు సంస్కృత పంచకావ్యాలలో ముఖ్యమైన నైషద చరిత్ర అంటే మన శ్రీనాధుడు అనువాదం చేసిన శృంగార నైషధంరాశాడు .దీన్ని  రాస్తూ ‘’హర్ష నైషద కావ్యమాంధ్ర భాష’’అన్నాడు  . విద్వాంసులకే ఔషధం అనిపించుకొన్న మహా కావ్యం నైషధం .శ్రీహర్షుడు మహా మేధావి .కనిపించిన ప్రతి దానిపై అమోఘం గా కవితలల్లెవాడట .అవి అర్ధం చేసుకోవటం సామాన్యులకు అలవి అయ్యేది కాదట .పండితులే ముక్కున వేలేసుకొనే వారట .బుర్రలు బద్దలు కొట్టుకొన్నా మింగుడు పడేవికాదట .ఆ తెలివి తేటలు అనితర సాధ్యం గా ఉండేవట .తల్లికి భయం వేసేదట .అతని మేనమామను పిలిపించి గోడు వెళ్ళ బోసుకోనేదట .ఆయన దీనికి విరుగుడుగా అతని మేధస్సు తగ్గించటానికి రెండు కిటుకులు చెప్పి చేయిం చాడట .ఒకటి కాకర పాదు కింద రోజు వేడినీళ్ళతో స్నానం చేయించటం ,రెండవది బుద్దిమాంద్యం కలిగించే మినప పప్పుతో రోజూ కుడుములు లేక గారెలు వేసి తినిపించటం ఈ రెండూ ఆమె క్రమం తప్పకుండా చేసిందట .వీటి ప్రభావం వలన వెయ్యోవంతు మేధ మాత్రమె తగ్గిందట .’’మాష పూపాలపై ‘’(గారెలు )అలవోకగా అప్పుడు శ్లోకం చెప్పి వాళ్ళమ్మను మేనమామను సంభ్రమాశ్చర్యాలతో ముంచేశాడట .అతని మేధస్సును ఎవరూ తగ్గించలేరని నిర్ణయించుకోన్నారట .అలాంటి శ్రీ హర్షుని గురించి ఇప్పుడు మనం తెలుసుకో బోతున్నాం .శ్రీనాధ కవి సార్వ భౌముడు రాసిన అన్ని గ్రందాలకంటే  శృంగార నైషదానికే  గొప్ప పేరు వచ్చింది .హర్షుని హృదయాన్ని వెతికి పట్టుకొని రాసిన మహా కావ్యం అది .’’సీసాల’’తో ఉయ్యాల లూగించాడు .అంతేకాదు సంస్కృత నైషధం లో శ్రీహర్షుడు మంత్రం శాస్త్రాన్ని నిక్షిప్తం చేశాడని మహా పండితుడు కవి, శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ గారు గొప్ప వ్యాఖ్యానం రాశారు .

శ్రీహర్ష చరితం

కనోజు పాలకుడైన జయ చంద్రుని ఆస్థానకవి శ్రీహర్షుడు .కాలం 1130-1190.తల్లి మామల్లాదేవి తండ్రి శ్రీ హీరుడు .’’నైషద చరిత’’రాసి ప్రసిద్ధుడు అవటం వలన ‘’నర భారతి ‘’అనే బిరుదు పొందాడని రాజశేఖరుడు ‘’ప్రబంధ కోశం ‘’లో రాశాడు .జీవితం లో చివరికాలం గంగా నదీ తీరం లోతండ్రి ఉపదేశించిన ‘’చింతామణి మంత్రం ‘’జపిస్తూ ఒక ఏడాది  గడిపాడు అప్పుడు  త్రిపుర సుందరీదేవి ప్రత్యక్షమై అపూర్వ శేముషిని ,ప్రతిభను అనుగ్రహిం చిందని  ,ఆ ప్రభావం తో అలవోకగా నోటినుండి కొన్ని శ్లోకాలు బయటికి వచ్చాయి అవి పండితులకే అర్ధం కాలేదట .మళ్ళీ దేవి అనుగ్రహాన్నిపొంది అందరికి సులభం గా అర్ధమయ్యే రీతిలో కవిత్వం చెప్పే సామర్ధ్యాన్నిపొందాడట .పండిత సభలో ఉదయనాచార్య  అనే పెద్ద పండితుడిని ఓడించాదట .

.1174లో నైషద చరితను  గుజరాత్ కు వీర ధవళ రాజు వద్దకు శ్రీహరుడు తీసుకొచ్చాడని, చందూ పండితుడు ‘’దీపిక’’లో చెప్పాడట .దీనికి విద్యాధరుడు వ్యాఖ్యానం రాశాడట .శ్రీహర్షుడు ‘’ఖండన ఖండ ఖాద్య ‘’రాసిన దానికంటే ముందే నైషషదము  రాశాడట .శ్రీ హర్షుడు రాసినట్లుగా చెప్పబడుతున్న విజయ ప్రసస్తి ,చంద్ర ప్రశస్తి ,గౌడీర్వికాసకుల ప్రశస్తి ,సాహసాంక చరిత , ఆర్ణవవర్ణన ,అమర ఖండన అలభ్యాలు .న్యాయ శాస్త్ర విశేషాలపై హర్షుడు వ్యాఖ్యానం గా ‘’ఖండన ఖండ ఖాద్య ‘’రాశాడని అంటారు .ఇవికాక స్థైర్య విచారం ,చింది ప్రశస్తి ,శివ శక్తి సిద్ధి ,ఈశ్వర త్రిసంది రాశాడని అంటారు .

శ్రీహర్షుడు కనోజు రాజు జయ చంద్రుని ఆస్థానకవి .జయచంద్రుడు పృధ్వీరాజ్ చౌహాన్ కు మామ .కూతురు రాణి సంయుక్త ప్రుద్వీరాజును ప్రేమించింది .జయ చంద్రుడికి ఇష్టం లేదు .ఆమెను పృధ్వీరాజు వీరోచితం గా తీసుకొని వెళ్లి వివాహం చేసుకోన్నాడని చరిత్ర .నైషధకావ్యాన్ని రాసి కాశ్మీర్ కు తీసుకు వెళ్లి అక్కడ సర్వజన పీఠ అధినేత్రి సరస్వతీ దేవి హస్తాలలో ఉంచాడని ,ఆమె ఆదరం తో స్వీకరించిందని ,తన కావ్యానికి సరస్వతి ఆమోదం తెలిపిందని కాశ్మీర రాజు మాధవ దేవుని నుండి రాజ ముద్రిక ను వేయించుకొని లేఖను తెచ్చాడని ఒక కధనం ఉంది .పృధ్వీ సంయుక్తల అమరప్రేమనే నైషధం లో ప్రతిబింబింప జేశాడని అంటారు  .

నైషధం లో శ్రీహర్షణీయం

నైషద మహాకావ్యం ఇరవై రెండు సర్గలున్నది .నల దమయంతుల ప్రేమకధా పూర్ణం .కద మనకు తెలిసినదే .నలుడిని పరీక్షించటానికి ఇంద్ర వరుణ ,అగ్ని, యములు దమయంతి స్వయం వారానికి రావటం ,నలుడికి  తిరస్కరినణీ విద్య నిచ్చి తమ దూతగా దమయంతి దగ్గరకు రాయ బారిగా పంపటం ,నలుడి వేషం లోనే దిక్పలకులు కూర్చోవటం ,సరస్వతీ దేవి స్వయం గా వచ్చి స్వయంవర రాజులను చమత్కారం గా పరిచయం చేయటం ,దేవతల అనుగ్రంహం తో నలుని దమయంతి గుర్తించటం ,నల దమయంతుల వివాహం ,కలి వవిజ్రు0భణ ,మొదలైనవి ఉన్నాయి .ఇది మహా భారత కధయే .కొంత కదా సరిత్సాగరం లోనూ ఉంది .వివాహం వరకు శృంగారకావ్యం గానే రాశాడు .ఔచితీ యుతమైన రచన చేశాడు .

ఆలంకారిక శైలి  భారవి తో ప్రారంభమై ,మాఘునిలో పరిపక్వమై శ్రీహర్షునితో ఉత్కృష్ట స్థాయి పొందింది .తరువాత వచ్చినవన్నీ అంత గొప్పవికావు కనుక ‘’ఉదితే నైషధే కావ్యే క్వ మాఘః క్వచ భారవిః’’అన్న లోకోక్తి ప్రచారమైంది .విద్వాంసుల గర్వమనే రోగాన్ని పోగొట్టే ఔషధం నైషధం –అంటే ‘’నైషధం విద్యదౌషధం ‘’.అంతేకాదు ‘’అందమైన కన్య సౌందర్యం బాలుని మనస్సునుఎలా  ఆకర్షించ లేదో అదేవిధం గా సరసం లేని అరసులకు నా కావ్యం అర్ధం కాదు ‘’అని చెప్పాడు  హర్షుడు .గురువుదగ్గరైనా చదువుకోవాలి ,లేకపోతె వ్యాఖ్యానాలన్నా చదవాలి .అప్పుడే అర్ధమవుతుంది .

హర్షుని కవిత్వం లో ఒజో గుణం ఉంటుంది .నారికేళ పాకం .పగల గోట్టుకు తింటూ నమిలితేనే మాధుర్యం .శ్లేష తో చమక్కులు చేశాడు .దీర్ఘ సమాసాలతో ఊపిరి ఆడనీయడు .ఉక్తి వైచిత్రి కి అగ్రాసనం వేశాడు .ప్రతిశ్లోకం అలంకార శోభితం .భావ కల్పనా అనితర సాధ్యం ,అద్భుతం ఆశ్చర్యం .అంతమాత్రాన పదలాలిత్యం లేదనుకోరాదు .అదీ తగుమోతాదులో ఉంది .నైషదే పదలాలిత్యం అన్న పేరూ పొందింది .శైలి గాఢమైన బంధాలతో గౌడీ రీతిలో ఉంటుంది .ప్రతిశ్లోకం రామణీయమే .ప్రతిభావం అపూర్వమే .ప్రతి అలంకారం పరమ రామణీకమే .

ప్రబంధం లో ఉండే వర్ణనలన్నీ చేశాడు .ఒకే విషయాన్ని పలు చోట్ల పలురకాలుగా  వర్ణిస్తేనేకాని హర్షుడికి తృప్తి ఉండదు .’’ఎకామత్యజతో నవార్ధ ఘటనాం ‘’అన్నాడు .ప్రతిదానిలో కొత్తదనాన్ని కల్పిస్తాడు ,కన్పించేట్లు  చేస్తాడు .నైషదానికి 23వ్యాఖ్యానాలున్నా మల్లినాద సూరి రాసిన ‘’జీవాతువు ‘’ప్రముఖమైనది .తర్వాత నారాయణ భట్టు రాసిన ,,నైషద ప్రకాశం .హర్షుడు ,మహా పండితుడు ,మహాకవీ మహా వ్యాకరణ, వేత్త ,మహా దార్శనికుడు .షట్ దర్శన పాండిత్య విశేషుడు .అద్వైత సిద్ధాంతి .చార్వాకాది సిద్ధాంతాలనూ చదివాడు .ఇతర దర్శానాలు అవహేళన చేశాడు .అతని వ్యాకరణ పాండిత్యాన్ని తెలియ జేసే శ్లోకాలు అపరిమితం గా కనిపిస్తాయి .అతని కామ శాస్త్ర పారంగత్యమూజ్యోతకమవుతుంది .    ఇందులో కొన్ని ప్రతీకలు కనిపిస్తాయి .నల దమయంతుల ప్రేమకు హంస రాయ బారం జరుపుతుంది .ఈ హంసను జీవాత్మ ,పరమాత్మలను కప్పి ఉంచే అజ్ఞానాని తొలగించి వాటి ఇద్దరి కలయిక కు తోడ్పడే గురువు కు ప్రతీక అని భావించారు .ఇలాంటి అద్వైత భావనలెన్నో ఇందులో ఉన్నాయనే శేషేంద్ర శర్మ గొప్పగా నిరూపించారు .హర్షుడి మేనమామయే ‘’కావ్య ప్రకాశం’’ అనే అలంకార గ్రంధం రాసిన ముమ్మటుడు అని ఒక అభిప్రాయం ఉన్దిలోకం లో .మేనల్లుడు రాసిన నైషధాన్ని ముందే చూసి ఉండి నట్లయితే తాను తన అలంకార శాస్త్రం లో దోష ప్రకర ణానికి వేరే చోట్ల వెతుక్కొనే పని ఉండేదికాదు కదా అని అను కోన్నాడట .

మరోకవిని తర్వాత కలుద్దాం

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -15-10-14-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

”కదిలే బొమ్మలకు”ప్రాణం పోసిన రఘు పతి వెంకయ్య జయంతి

కదిలే బొమ్మకు ప్రాణం పోసిన బ్రహ్మయ్య
నేడు రఘుపతి వెంకయ్య జయంతి

వందేళ్ల భారతీయ సినిమా సంబరాలు జరుపుకున్నాం. మనదేశంలో సినిమా పుట్టుకకి కారణమైన వ్యక్తుల గురించి, వారు చేసిన కృషి గురించి స్మరించుకున్నాం. అయితే 1910లో ‘పుండలీక్‌’ సినిమా నిర్మించిన దాదాభాయి టోర్నీ కంటే , 1913లో ‘రాజా హరిశ్చంద్ర’ చిత్రం తీసిన దాదాసాహెబ్‌ ఫాల్కే కంటే ముందే ఒక తెలుగువాడు 1909లోనే భారతీయ సినిమా పరిశ్రమకు పునాది వేశాడన్నది చరిత్ర చెప్పే సత్యం. తెలుగు సినిమాకే కాదు దక్షిణాది సినిమాకే ఆద్యుడైన ఆ వ్యక్తి పేరు రఘుపతి వెంకయ్యనాయుడు. ఆయన వేసిన పునాది మీదే దక్షిణాదిన సినిమా వేళ్లూనుకుని దినదిన ప్రవర్థమానమైంది. మనదేశంలో తొలి ప్రదర్శకుడు, తొలి పంపిణీదారుడు ఆయనే. వెంకయ్య జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలను తెలుసుకుందాం.

ప్రభుత్వంలోని సైనిక శాఖలో సుబేదారుగా పనిచేసిన మచిలీపట్నం వాస్తవ్యుడు అప్పయ్యనాయుడు రెండో కొడుకు రఘుపతి వెంకయ్య. 1873 అక్టోబర్‌ 15న జన్మించారు. వెంకటేశ్వరుని భక్తుడైన అప్పయ్యనాయుడు తన పెద్దకొడుకుకి వెంకటరత్నం అనీ, చిన్నకొడుక్కి వెంకయ్య అని పేరు పెట్టారు. తండ్రి ఉద్యోగ బదిలీ మీద వెంకయ్య తన 18వ ఏట మద్రాసులో అడుగుపెట్టారు. చిన్నతనం నుంచి చిత్రలేఖనం మీద ఆసక్తి ఉండటంతో మౌంట్‌రోడ్‌లో ఒక ఇల్లు తీసుకుని దానిని ఒక కళాకేంద్రంగా తీర్చిదిద్దారు వెంకయ్య. ఆయన వేసే బొమ్మలు, చెక్కే రాతిబొమ్మలు చాలామంది దృష్టిని ఆకర్షించాయి. ఆ రోజుల్లో బొబ్బిలి, విజయనగరం, కళ్లికోట, చెట్టినాడ్‌ సంస్థానాలకు చెందిన మహారాజులు గిండిలో జరిగే గుర్రపు పందాలకోసం వస్తుండేవారు. వారి దృష్టిని వెంకయ్య ఆకర్షించారు. అలాగే బ్రిటీషు ప్రభుత్వ అధికారుల ప్రశంసలు కూడా ఆయన పొందారు.
పెయింటింగ్స్‌తో పాటు ఫొటోగ్రఫీలో కూడా ప్రవేశం ఉండటంతో కొత్త ప్రయోగాలు చేసేవారు. ఒకరోజు పేపరు తిరగేస్తుంటే ‘క్రోనోమెగాఫోన్‌’ నే సినిమాటోగ్రాఫ్‌ మెషీన్‌ను కనిపెట్టారనీ, దాని మీద పిక్చర్‌ ప్రొజెక్ట్‌ అయ్యేటప్పుడు రికార్డెడ్‌ డిస్క్‌ సాయంతో సంగీతాన్ని, ఇతర శబ్దాలను వినిపించవచ్చనే వార్త వెంకయ్యని ఆకర్షించింది. లండన్‌లోని గౌమాంట్‌ కంపెనీ అధినేతలు ఈ ఎక్విప్‌మెంట్‌ సృష్టికర్తలనీ, బకింగ్‌హామ్‌ భవనంలో ఐదో జార్జి, మేరీ రాణి సమక్షంలో ఇచ్చిన తొలి ప్రదర్శన విజయవంతమైందనీ ఆ వార్త సారాంశం. కొత్త ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ ముందుండే వెంకయ్య వెంటనే మద్రాసులోని జాన్‌ డికెన్‌సన్‌ కంపెనీవారిని కలుసుకొని ‘క్రోనోమెగాఫోన్‌’ ఎక్విప్‌మెంట్‌కు ఆర్డర్‌ ఇచ్చారు. దాని ఖరీదు రూ. 30 వేలు. తన భార్య నాంచారమ్మ సలహాతో తన ఫొటో స్టూడియోను తాకట్టు పెట్టి ఆ డబ్బుతో ‘క్రోనోమెగాఫోన్‌’ ఎక్విప్‌మెంట్‌ తెప్పించుకున్నారు వెంకయ్య. నాలుగువందల అడుగుల పొడువున్న 12 లఘు చిత్రాలను తయారు చేసి, వాటిని తొలిసారిగా విక్టోరియా పబ్లిక్‌ హాలులో ప్రదర్శించారు. ‘అండర్‌ ది పెనామా’, ‘స్వింగ్‌ సాంగ్‌’, ‘సీ సర్పెంట్‌’, ‘ఫైర్‌మర్‌ సాంగ్‌’, ‘మికాడో’… ఇటువంటి టైటిల్స్‌తో ఆ చిత్రాలను ప్రదర్శించేసరికి జనం ముగ్ధులయ్యారు. తొలి ప్రదర్శనకి ఆశించిన రీతిలో వసూళ్లు రాలేదు. అయినా వెంకయ్య నిరాశ పడలేదు. చిన్న చిన్న కరపత్రాల ద్వారా ఈ ప్రదర్శనకు సంబంధించిన విశేషాలను జనానికి తెలిసేట్టు చేశారు.
ప్రేక్షకుల నాడి పసికట్టిన వెంకయ్య 1910లో ఎస్‌ప్లనేడ్‌(ఇప్పటి రాజా అన్నామలై హాలు)లో టెంట్‌ సినిమా ఏర్పాటు చేసి ఎన్నో ప్రదర్శనలిచ్చారు. అవి విజయవంతమయ్యాయి. ఆ తర్వాత తన టెంట్‌ సినిమాతో బెంగుళూరు, ఆంధ్రదేశంలోని ముఖ్య పట్టణాలు తిరిగి ప్రదర్శనలిచ్చారు. దీని వల్ల లాభాలు రాకపోయినా నష్టం మాత్రం రాలేదు. నాటకాల ప్రభావం నుంచి కొంత బయట పడి సినిమాలు చూడటం కోసం జనం వస్తున్నందుకు ఆయన సంతోషించారు.
దేశంలోనే కాదు సింహళదేశానికీ తన టెంట్‌ సినిమాతో వెళ్లి అక్కడ ప్రదర్శనలిచ్చేవారు. తన తయారు చేసిన చిత్రాలే కాకుండా విదేశాల 500 అడుగుల పొడవు కలిగిన లఘు చిత్రాలను దిగుమతి చేసుకొని ప్రదర్శించేవారు. సింహళం నుంచి బర్మా వెళ్లి అక్కడ రంగూన్‌, పెరూ పట్టణాల్లో సినిమా ప్రదర్శనలు ఇచ్చారు. ఇవి జనంలో సినిమా చైతన్యాన్ని కలిగించాయి.
1911లో మద్రాసుకు తిరిగి వచ్చిన వెంకయ్య గెయిటీ టాకీస్‌ను నిర్మించారు. మద్రాసులోని తొలి సినిమా థియేటర్‌ ఇదే. ‘మిలియన్‌ డాలర్‌ మిస్టరీ’, ‘మిస్టరీస్‌ ఆఫ్‌ మీరా’, ‘క్లచింగ్‌ హాండ్‌’ వంటి లఘు చిత్రాల్ని ఇందులో ప్రదర్శించేవారు. ఆ తర్వాత మింట్‌ స్ర్టీట్‌లో క్రౌన్‌ థియేటర్‌ని, పరుశువాకంలో గ్లోబ్‌ థియేటర్‌ను వెంకయ్య నిర్మించారు. యూనివర్సల్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించిన లఘు చిత్రాలను ఇందులో ప్రదర్శించేవారు.
1913లో మౌంట్‌ సీ్ట్రట్‌లో క్రౌన్‌ థియేటర్‌ వెనుక ‘స్టార్‌ ఆఫ్‌ ఈస్ట్‌ ఫిలిం’ అనే సంస్థను నెలకొల్పి, తన చిత్రనిర్మాణకార్యక్రమాలను ప్రారంభించారు వెంకయ్య. ఆ రోజుల్లో కరెంట్‌ సమస్య తీవ్రంగా ఉండటంతో దానిని అధిగమించడం కోసం గ్లాస్‌ స్టూడియోను నిర్మించారు. ఎండ వచ్చి స్టూడియోల్లోని అద్దాల మీద పడుతుంటే ఆ వెలుగులో షూటింగ్‌ చేయవచ్చనే ఆలోచన ఆయనది. ఇటువంటి ప్రయోగం చేయడం భారతదేశంలోనే తొలిసారి. అంటే ఇప్పుడు సినిమా షూటింగ్స్‌లో ఉపయోగిస్తున్న రిఫ్లెక్టర్స్‌ విధానానికి ఆ రోజుల్లో అలా శ్రీకారం చుట్టారు వెంకయ్య.
వెంకయ్య పెద్ద కొడుకు సూర్యప్రకాశ్‌ ఇంగ్లాండ్‌ వెళ్లి సినిమా సాంకేతిక శాసా్త్రన్ని నేర్చుకుని విలియం సన్‌ సైలెంట్‌ కెమెరాతో స్వదేశానికి తిరిగివచ్చారు. తండ్రీకొడుకులు కలసి గ్లాస్‌ స్టూడియోలో ‘గజేంద్రమోక్షం’, ‘మత్స్యావతారం’, ‘భీష్మప్రతిజ్ఞ’ తదితర మూకీ చిత్రాలు నిర్మించారు.
ప్రారంభంలో కాలానికి ఎదురీది కొత్త ప్రయోగాలు చేసిన వెంకయ్య చివరి రోజుల్లో ఆర్ధిక ఇబ్బందులకు లోనయ్యారు. ఆస్తులన్నీ కోల్పోయారు. మూకీ యుగం అంతరించి టాకీల నిర్మాణం పెరగడం కూడా వెంకయ్య వెనకబడటానికి కారణం అయింది. 1941 మార్చి 15న ఆయన కన్నుమూశారు. కానీ ఆనాడు ఆయన సేవల్ని ప్రజలు, ప్రభుత్వం మరిచిపోలేదు. రాష్ట్రవిభజనకు పూర్వం ఆయన పేరిట ఒక అవార్డ్‌ ఏర్పాటు చేసి, చిత్ర పరిశ్రమకు విశిష్ట సేవలు అందించిన వ్యక్తులకు ఏటా అందించేవారు. ఇకపై కూడా రెండు రాష్ట్రప్రభుత్వాలు ఆ అవార్డ్‌ను కొనసాగించాలని సినీజనం కోరుకుంటోంది. అలాగే రఘుపతి వెంకయ్య జీవిత చరిత్రకు సినిమా రూపం ఏర్పరచి దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో సతీశ్‌ నిర్మించిన చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. నరేశ్‌ ఇందులో వెంకయ్య పాత్ర పోషించారు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అల్లూరి -అడ్డతీగెల బంధం -పదాల వీరభద్ర రావు-

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మోదీయే గత్యంతరం !!

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వా కవుల కవితా గీర్వాణం -38

గీర్వా కవుల కవితా గీర్వాణం -38

38-బౌద్ధ నాటక కర్త –హర్ష వర్ధనుడు

స్థానేశ్వరాన్ని రాజ దాని చేసుకొని వింధ్య నుండి హిమాలయాల వరకు రాజ్య పాలన చేసిన హర్ష చక్ర వర్తి మూడు  నాటకాలు రాశాడు.  హర్షుడు క్రీ .శ.606-648కాలానికి చెందినవాడు .తననాటకాలలో హర్ష వర్ధనుడు అని చెప్పకుండా హర్ష దేవుడు అని చెప్పుకొన్నాడు .తండ్రి ప్రభాకర వర్ధనుడు .చైనా యాత్రికులు హ్యూన్ సాంగ్ ,ఈత్సింగ్ లు ఇతని పాలన గురించిరాశారు .బాణుడు హర్ష చరిత్ర రాశాడు .శీలాదిత్యుడు అనే బిరుదు ఉంది .అంటే శీలం లో, సదాచారం లో సూర్యుని వంటి వాడని అర్ధం .హర్షుడికి ముందు అన్న రాజ్య వర్ధనుడు రాజరికం చేశాడు .సూర్యారాధక వంశం .తర్వాత బౌద్ధమతావలంబి అయ్యాడు .గౌడ రాజు శశాంకుడు రాజ వర్ధనుడిని ఓడి చనిపోతే హర్షుడు రాజ్యాభి షిక్తుడయ్యాడు.రెండవ పులకేశిని ఓడించి దక్షిణం లో నర్మదా నది వరకు హర్షుడు రాజ్య వ్యాప్తి చేశాడు ..అయిదేళ్లకోసారి ధనాగారం లోని డబ్బునంతా ప్రజలకు దానం చేసేవాడు .రాజ్యాధికారం కంటే సాహిత్యం పై మోజేక్కువ .మంచికవి .హర్షునికాలం లో నలందా విశ్వ విద్యాలయంపది వేల మంది దేశ విదేశీ విద్యార్ధులతో మహోన్నత దశలో ఉండేది .ధర్మ కీర్తి ఇక్కడ ఆచార్యుడు గా ఉండేవాడు .తన అన్నరాజ వర్ధనుడిని చంపిన శాశాంకుని ఓడించి సంహరించి ప్రతీకారం తీర్చుకొన్నాడు హర్షుడు . శశాంకు ని  చెరలో ఉన్న చెల్లెలు రాజ్యశ్రీ తప్పించుకొని బయట పడి బౌద్ధ భిక్షువు చేత రక్షింప బడి హర్షుని చేరుతుంది .ఆ భిక్షువు తత్వ బోధతో హర్షుడు బౌద్ధాన్ని స్వీకరించాడు .అంతకు ముందు హర్షుడు శివుడి అభిమాని .హర్షుని పట్టమహిషి  పారశీక కన్య .ఆమెనే మహాశ్వేతాగా బాణుడు చిత్రించాడని అంటారు .రెండవ భార్య సౌరాష్ట్ర రాజ వంశానికి చెందినదని ఆమెయే కాదంబరి అని పండితుల పిండితాభిప్రాయం .హర్ష సామ్రాజ్యం అస్సాం నుండి సౌరాష్ట్ర వరకు ,హిమాలయం నుండి వింధ్య వరకు వ్యాపించింది .

హర్షుని కవితా హర్ష వైభవం

హర్షుడు రాసిన మూడు నాటకాలలో ప్రియ దర్శిని మొదటిది .నాలుగు అన్కాలున్నాయి .బృహత్కధ నుండి తీసుకొన్న ప్రేమకధ ఇది .వత్సరాజు ఉదయనుడు నాయకుడు. కాలింగ రాజు దృఢ వర్మ శత్రువుల చేతిలో ఓడిపోగా కూతురు ప్రియ దర్శినిని ఉదయనుడి భార్య వాసవ దత్త దగ్గర పరిచారికగా చేరుస్తాడు .సేనాపతి విజయ సేనుడు .ప్రియ దర్శినిని ఉదయనుడు ఒక సారి ఉద్యానవనం లో చూడటం తో ఇద్దరి మధ్యా ప్రేమ చిగురిస్తుంది .వీరిద్దరి ప్రేమను నాటకం గా వేస్తారు .అందులో ఉదయనుడు వాసవ దత్తగా ప్రియ దర్శిని  నటిస్తారు .వీరిప్రేమ రాణి వాసవ దత్తకు తెలుస్తుంది .ప్రియ దర్శికను బంధిస్తుంది .దృఢ వర్మ శత్రువులను జయించి వాసవ దత్తకు అసలు విషయం చెబుతాడు .వాసవ దత్త ఉదయన ప్రియ దర్శనికల వివాహం జరిపిస్తుంది ..ఈ నాటకం పై మాళవికాగ్ని మిత్ర ప్రభావం ఉంది .

రత్నావళి నాటకం లో నాలుగు అన్కాలున్నాయి .రత్నావళి నాయిక సింహళ దేశానికి చెందింది .రత్నావళి పెళ్లి చేసుకొన్నా వాడు చక్ర వర్ర్తి అవుతాడనే జ్యోతిష్యం బయట పడుతుంది .వాసవ దత్త ,యౌగంద రాయణులు ఒక పన్నాగం పన్ని వాసవ దత్త చనిపోయినట్లు పుకారు పుట్టించగా, వార్త తెలిసిన మంత్రి వాసు భూపతి ఉదయునిదగ్గరకు  రత్నావళి ని పంపుతాడు .ప్రయాణం లో నౌక ప్రమాదానికి గురై రత్నావళి సముద్రం లో పడిఎల్లాగో బయట పడి వాసవ దత్తను చేరి సాగరిక పేరుతొ పనిమనిషిగా ఉంటుంది .రాజు కంటబడకుండా ఈమెను జాగ్రత్త గా చూసుకొంటున్నా ఒక సారి వారిద్దరూ ఉద్యానవనం లో కలుసుకొని హృదయాలను పారేసుకొంటారు .తరువాత కొన్ని మలుపులు తిరిగి ఉదయన సాగారికల వివాహం జరిగిపోతుంది .ప్రియ దర్శినిలోను ఇందులోనూ దాదాపుఒకే కద ఉంది. భాసుడి స్వప్న వాసవ దత్త ప్రభావం దీనిమీద ఎక్కువ .నాటకం మనసును ఆకర్షిస్తుంది .

మూడవ నాటకం నాగానందం .ప్రౌఢ రచన .అయిదు అంకాలు .ఇది జీమూత వాహనుడిత్యాగ కద .అహింసకు ప్రాధాన్యతనిచ్చాడు .ఈ కధకు ఆధారం జాతక కధలోని విద్యాధర చరిత్ర అని హర్షుడు చెప్పాడుకాని అది దొరకలేదు .నాటకారంభం లో బుద్ధుని స్తుతించాడు .అయినా హిందూ మతం పై కోపం లేదు కనకనే నాటకం లో నాయిక మలయా వతిని  గౌరీ దేవి భక్తురాలుగా చిత్రించాడు  .సన్నివేశాలను వేగవంతం గా నడిపిస్తాడు .విసుగుఉండదు ..మొదటి మూడు  అన్కాలలో  శృంగార రసం పోషింప బడింది .తరువాత శాంత రసం సాగింది .హాస్య అద్భుతరసాలకూ ఇందులో చోటు కల్పించాడు

కాళిదాస భవ భూతుల తర్వాతి స్థానం హర్ష దేవుడిదే .సరళ సుందర శైలితో కోమలమైన రచన చేశాడు .హర్షుడు నాట్య సంగీతాలలో నిష్ణాతుడు అని తెలుస్తుంది .లలితకళా ప్రియుడుగా కనిపిస్తాడు .హర్షుని రస హృదయం ప్రేక్షకాదరణ పొందింది .ప్రక్రుతి చిత్రణా సహజ సుందరం గా చేశాడు .పాత్రల స్వభావాలను సుస్పష్టం గా చిత్రించాడు ..కవిగా,నాటక కర్త గా హర్షుడు సవ్య సాచిత్వం చేశాడు .రచనా ప్రావీణ్యం అమోఘమని పిస్తుంది .హర్షుడు హృదయ హర్షుడనిపిస్తాడు .నాగానంద నాటకాన్ని 2008లో దేశం లో పలుచోట్ల ప్రదర్శించారు .అఖిల భారతీయ మరాఠీ  నాట్య పరిషద్ ఆధ్వర్యం లో చాలా చోట్ల ప్రదర్శించారు .

ఈ నాటి హర్యానా పంజాబ్ ప్రాంతం లో రాజధాని నేర్పరచుకొన్న హర్షుడి సైన్యం లో లక్ష మంది అశ్విక సైన్యం , అరవై వేలమంది ఏనుగులు ఉండేవి .ప్రజలకు విద్యా వైద్య సౌకర్యాలను ఉచితం గా కల్పించాడు మంచినీటి సరఫరా నాణ్యం గా ఉండేది . విశ్రాంతి గృహాలు ఉండేవి . ప్రజలను కంటికి రెప్పలాగా కాపాడడాని చరిత్రకారులు రాశారు .తక్కువ పన్నులు వేసేవారు ఆరోవంతు భూమి శిస్తు వసూలు చేసేవాడు .ఈ నాడు స్తానేశ్వరం లో ఒక కిలో మీటరు పొడవు ముప్పాతిక కిలోమీటరు వెడల్పు ఉన్న శిధిల ‘’హర్ష కా తిల ‘’కనిపిస్తుంది .అత్యాధునిక సౌకర్యాలున్న ప్రాంతంగా ఇది కనిపించి ఆశ్చర్య పరుస్తుంది .తాంగ్ వంశానికి చెందిన చైనా చక్రవర్తి తిజాంగ్ తో సత్సంబంధాలు నేరపాడు .సందర్శకులు ఇరుదేశాలనుంది వచ్చి వెడుతూ ఉండేవారు .చైనా యాత్రికుడు హ్యూన్ చాంగ్ హర్షుని రాజ్యం లో  ఎనిమిదేళ్ళు భారత దేశం లో గడిపాడు .ప్రయాగలో అయిదేళ్లకోసారి మహా కుంభ మేలను నిర్వహించేవాడు .నలభై ఒక్క ఏళ్ళు హర్షుడు రాజ్యాన్ని పాలించాడు .హర్షునికుమారులు వ్యాఘ్ర వర్ధనుడు ,కళ్యాణ వర్ధనుడు .హర్షుని ముఖ్యమంత్రి అరునణాశ్వుడు వీరిద్దరిని చంపి ,రాణి ప్రభావతిని చెరలో పెట్టాడు .

జయదేవుడు తన గీత గోవిందం లో హర్షుని కాళిదాసుతోపోల్చాడు .జయదేవునికాలానికే హర్షుని కీర్తి దేశావ్యాప్తమైందనిదని తెలుస్తోంది .ఆర్.సి మజుందార్ అనే పరిశోధకుడు హర్షుని గురించి రాస్తూ ‘’A great general and just administrator .Harsha was even greater than patron of religion and learning .He gathered around himself finest intellects holiest sages .Men like Bana ,Mayura ,Divakara and Huen tsang thronged round his throne .In this respect   he is more fortunate than Samudra Gupta for still we posses some gems of literature that proceedede according to tradition from his pen ‘’అని హర్షుని భహుముఖీన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించాడు .

 Inline image 1  

ఈ సారి నైషధాన్ని రాసిన హర్ష దేవుడి గురించి తెలుసుకొందాం

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-10-14-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -37

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -37

36- వసంత తిలక వృత్త -రత్నాకరుడు

హర విజయం అనే మహా కావ్యం  రాసిన రత్నాకరుడు కాశ్మీర దేశం కవి .బిప్పట జయాపీడుని ఆస్థానం లో ఉన్నాడు .తర్వాత అవంతి వర్మ రాజ్యం లోను ప్రసిద్ధిపొండాడు .కనుక కాలం క్రీ శ .ఎనిమిది వందలు గా నిర్ణయించారు 850-894అనుకోవచ్చు .హరవిజయం లో శివుడు అందకాసురుడిని సంహరించటం అనే కద ఉంది ఇది యాభై సర్గల బృహత్ కావ్యం .శ్లోకాల సంఖ్య 4320.

కవితా రత్నాకరుడు (కవి సముద్రుడు )

రాజానక ,వాగీశ్వర ,విద్యాధిపతి బిరుదులున్న రత్నాకరుడు వసంత తిలక వృత్తానికి సృష్టికర్త .దీనిని క్షేమేంద్రుడు రాజశేఖరుడూ పేర్కొని మెచ్చారు .హర విజయం లో శివ పార్వతులు కామ కళా కేళి లో ఉండగా అంధుడైన అంధకాసురుడు జన్మించాడు .శివుడిని స్తుతించి కను చూపు తెచ్చుకొన్నాడు వరగర్వం తో విర్రవీగి మూడు లోకాలను కల్లోల పరచాడు .దేవతలు అందకుని ఆగడాలు భరించ లేకఈశ్వరుని ప్రార్ధిస్తే వాడిని సంహరించటమే కద .యాభై సర్గ లున్న ఈ కావ్యం లో మొదటి పదమూడు సర్గలలో శివుడు అందకాసురుడిని సంహారం చేయటానికే చేసే   మంత్రాంగమే  వర్ణించాడుకవి .తర్వాత ఏడు సర్గలలో శివుడికి అందకాసురుడికి మధ్య సంవాదం ఉంటుంది సన్నివేశాలు సంవాదాలు బాగా పెంచి రాసిన కావ్యం ఇది .

రత్నాకరుడు సకల శాస్త్ర రత్నాకరుడు .అతనికి ప్రవేశం లేని విద్య లేదు .పురాణ ,ఇతిహాస ,నాట్య ,సంగీత ,నీతి,వేదాంత ,కామ శాస్త్ర ,అలమ్కారాది శాస్త్రాలలో నిష్ణాతుడు .దీనికి మించి చిత్రకావ్య రచనా సమర్ధుడు .మహా కావ్య లక్షణాలన్నీ హరవిజయం లో చొప్పించాడు .తన కావ్య మర్మాన్ని రాత్నాకురుడే –‘’లలిత మధురాఃసాలంకారాఃప్రసాద మనోహరాః –వికట యమక శ్లేషోద్గార ప్రబంధ నిరర్గలాః’’ఇన్ని కవితా లక్షణాలతో తన హర విజయం మనోహర విజయం సాధించిందని చెప్పాడన్నమాట .ప్రతి సర్గ చివర ‘’రత్న ‘’అనే శబ్దాన్ని వాడాడు .దీనికి స్పూర్తి భారవి వాడుకొన్న ‘’లక్ష్మి ,మాఘుడు ప్రయోగించిన శ్రీ  ‘’,శ్రీహర్షుడు ఉపయోగించిన ‘’ఆనంద ‘’శబ్దాలే .రత్నాకరుడి కావ్యం ‘’చంద్రార్ధ చూడ చరితాశ్రయ చారు ‘’సుందరం అని తానే చెప్పుకొన్నాడు .

డేవిడ్ స్మిత్ ఈ కావ్యం లో మతవిషయాలతో బాటు సింబాలిజం కూడా ఉందన్నాడు  భారతీయ సంస్కృతిని కావ్యం లో ప్రతిబింబింప జేశాడనీ చెప్పాడు .సంప్రదాయ  ఆలంకారికులను విమర్శిస్తూ చెప్పిన గ్రంధమనీ అన్నాడు .రాజాస్థాన విధానాలు ,సమాజ వ్యవహారాలూ ఇందులో పొండుపరచాడని తెలియ జేశాడు .హరవిజయాన్ని పండిట్ దుర్గా ప్రసాద్ ,కాశీనాద్ పాండురంగ పరబ్ లు ఆంగ్లం లోకి అనువదించి ప్రచురించారు .పుర ,నగర పర్వత సముద్ర వన సూర్యాస్తమయ ,అస్తమయ యుద్ధ ,ఋతు వర్ణాలతో కావ్యం సర్వాంగ సుందరం గా ఉంటుంది  కద కంటే కధన వర్ణన విధానం బాగా ఆకర్షిస్తుంది .భారవి కిరాతార్జునీయాన్ని మాఘుడి శిశుపాల వధ కావ్యాలను మించిన కవితా సౌందర్యం ఇందులో ఉన్నది .

37-  బాల కవి -రాజ శేఖరుడు

బాల్యం లోనే కవిత్వం లో అమోఘమైన ప్రతిభ చూపి’’ బాలకవి ‘’అనే బిరుదు పొందిన రాజ శేఖరుడు కనోజు పాలకుడు ఘూర్జర రాజు ప్రతీహార వంశస్తుడు  మహేన్ద్రపాల రాజు ఆస్థానం లో విద్యా గురువు .అతనికొడుకు మహీ పాలుని వద్ద ,కేయూర వర్షుని ఆస్థానం లోను గౌరవ పదవులలో రాణించాడు .కనుక కాలం క్రీ శ .860-940గా నిర్ణయించారు .పండిత వంశం లో జన్మించిన ఇతని తండ్రి దుర్దకుడు స్వీయ ప్రతిభతో  మంత్రి అయ్యాడు  తల్లి శీలవతి .ముత్తాత అకాల జలదుడు కూడా గొప్ప కవి .ఇతన్ని మాయవర కుల సంజాతుడని అంటారు ఈ కులం బ్రాహ్మణ క్షత్రియ రెండుకులాల్లోనూ ఉందట .క్షత్రియుడేనని అందుకే చౌహాన్ క్షత్రియ కులానికి చెందిన అవంతీ సుందరిని పెళ్లి చేసుకోన్నాడని వాదించేవారూ ఉన్నారు .ఇది నిజం కాదని బ్రాహ్మణ కుల సంజాతుడేనని మెజార్టీ నమ్మకం .అవన్తీసుందరి గొప్ప పండితురాలు ,విదుషీమణి కాబట్టే ,రాజశేఖరుడు కులాంతర వివాహం చేసుకోన్నాడని అది ఆనాటి సంఘం లో ఉన్న ఆచారమే నని సమర్ధిస్తారు .ఆమె ప్రేరణ అతనికి బహువిధాల తోడ్పడిందని  అనుకోవచ్చు .ఆనాటి చాలా రాజ్యాలతో రాజులతో అతనికి పరిచయాలున్నాయి .జీవిత చరమాంకాన్ని కాశీలో గడిపినట్లు తెలుస్తోంది .ప్రతీహార వంశం రాష్ట్ర కూట రాజు ఇంద్రుని చేతిలో నశించింది .అప్పుడు రాజశేఖరుడు త్రిపురకు  వెళ్లి అక్కడ కాలచూరి రాజు కేయూర వర్షుని ఆస్థానం చేరాడు .శేఖరుడు పండిత కవి .అనేక రచనలు చేశాడు

కవితా రాజశేఖరం .

త్రిపురలో ‘’విద్ధ సాల భంజిక ‘’నాటకాన్ని రాజశేఖరుడు రాశాడు .అక్కడే ‘’కావ్య మీమాంస ‘’అనే అలంకార గ్రందాన్నీ రచించాడు .పాండిత్యం కవిత్వాలతో రాజుల మెప్పుపొంది అనేక ఘన సన్మానాలు అందుకొన్నాడు అతని సమకాలీన కవుల కృష్ణ శంకర వర్మ ,అపరాజితుడు మొదలైన వారు శేఖరుని గొప్ప తనాన్ని గుర్తించి కొనియాడారు .సాహిత్య కళల తో బాటు సాంస్కృతిక ,ధార్మిక విషయాలూ బాగా తెలిసిన వాడు .ఆకాలం లో మహిళా కవులైన భట్టారిక ,సుభద్ర లను మెచ్చుకొన్నాడు .స్త్రీ వలన సాహిత్య ప్రాచుర్యం పొందిన మొదటికవి రాజశేఖరుడు .ఎంత పాండిత్యం ఉన్నా హద్దుల్లో ఉందడి సాటి వారి యెడ గౌరవాదరాలు కలిగి ఉన్న సంస్కారి .ఇతరుల అభిప్రాయాలకు విలువ నిచ్చిన ప్రజాస్వామ్య వాది.

రాజ శేఖరుడు ఆరు కృతులను రచించాడని ‘’నః షట్ ప్రబందాన్ ‘’అని తన రామాయణ నాటక ప్రస్తావనలో తెలిపినదాన్ని బట్టి తెలుస్తోంది .కాని అయిదు రచనలే లభ్యం .అందులో నాలుగు నాటకాలు –అవి బాల రామాయణం ,బాల మహా భారతం ,కర్పూర మంజరి ,విద్ధ సాల భంజిక .అయిదవది అలంకార గ్రంధం అయిన ‘’కావ్య మీమాంస ‘’.భువన కోశం కూడా రాశానని చెప్పాడుకాని దొరక లేదు .

బాల  రామాయణ నాటకం లో తాను  వాల్మీకి అవతారాన్ని అని రాజ శేఖరుడు చెప్పుకొన్నాడు .సీతా స్వయం వరం తో ప్రారంభమై రాముడు అయోధ్యకు తిరిగి వచ్చేదాకా కదనడుస్తుంది. పది అంకాలున్న నాటకం .కనుకనే మహా నాటకం అన్నారు .ప్రతి అంకానికి ప్రత్యేకమైన పేరు పెట్టి కొత్త దారి చూపాడు .అవే-ప్రతిజ్ఞా పౌలస్త్యం ,రామ రావణీయం ,విలక్ష లంకేశ్వరం భార్గవ భంగం ,ఉన్మత్త దశాననం ,నిర్దోష దశరధం ,అసమా పరాక్రమం ,వీర విలాసం ,రావణ వధ ,సానంద రాఘవం ‘’ఈపేర్లు చక్కగా ఆ అంకం లోని కధకు గొప్ప వివరణ గా ఉంది .నాటకానికి అవసరమైన మార్పులు చేశాడు. రావణ విరహానికి ప్రాముఖ్యం ఇచ్చాడు .మన యెన్ టి  రామా రావు లాగా రావనణుడిమీద సానుభూతి పెరిగేట్లు చేశాడు .కధలో గమనం లో సన్నివేశాలలో .నాటకం లో కళా ద్రుష్టి పూజ్యం .బాపు గారి శ్రీరామ రాజ్యం లాగా సర్వం  పూజ్యం అనిపిస్తుంది .కల్పనలకు ఎక్కువ విలువపొండాడు .

బాల భారత నాటకం కు ‘’ప్రచండ పాండవం ‘’అనే పేరుకూడా ఉంది .రెండు అన్కాలే లభించిన అసంపూర్తి నాటకం .ఇందులో  ద్రౌపదీ స్వయం వరం  ,జూదం వస్త్రాపహరణం ఉన్నాయి .కర్పూర మంజరి నాటకం ‘’సట్టకం ‘’అనే రూపక భేదానికి చెందింది .నృత్య ప్రధానమైంది .భార్య అవంతీ సుందరి ముద్దు కోరిక తీర్చ టానికే రాశాడు .మొదటి అంకం లో వసంతోత్సవ వేడుకలు ,చంద్రపాల రాజు రాణి విభ్రమ లేఖ ,విదూషక రంగ ప్రవేశం ఉంటాయి .విదూషకుడికి పరిచారిక విచక్షణ కు వసంత వర్ణన లో పోటీ ఏర్పడి కోపం వచ్చి భైరవానందుడు అనే సిద్ధుని తెస్తాడు విదూషకుడు .సిద్ధుడు మాయ జాలాన్ని చూపించి కర్పూర మంజరిని పరిచయం చేస్తాడు .రాజు ఆమె పై మరులు గొంటాడు .ఆమె రాణికి పిన్ని కూతురే .రెండవ రంగం లో మంజరి రాజు ను ప్రేమిస్తుంది .దూతిక ద్వారా తెలియ జేస్తుంది .రాజు మంజరిని చూస్తాడు .మూడవ అంకం లో మంజరి రాజుకు కలలో కన్పించిన విషయాన్ని విదూషకుడికి చెప్పటం విరహ వేదనతో మంజరి వచ్చి రాజును కలవటం ఈ వార్తా రాణి చెవిన పడటం .నాలుగులో-రాణి మంజరిని నిర్బంధం లో ఉంచటం సిద్ధుడికి కానుకగా ధన సార మంజరితో పెళ్లి చేయిస్తాననటం వార్త రాజుకు చేరవేయటం చివరికి ధనసారమంజరేకర్పూరమంజరి అని తేలటం ఇద్దరికీ వివాహం జరగటం తో సమాప్తం  ఈ నాటకం రాజశేఖరుని నాటకాలలో గొప్పదని అభిప్రాయం. నాటక కళకు కవితా శోభ అద్దాడు .రీతి భేదం చూపి రక్తి కట్టించాడు .విదూషకుడు హుందాగా మాట్లాడటం ప్రత్యేకత .శౌరసేని ప్రాక్రుతాన్ని వాడి కొత్త దారి తొక్కాడు .

విద్ధ సాల భంజిక కూడా పైనాటకం లాంటిదే .’’నాటిక ‘’ అనే రూపక  భేదానికి చెందింది .మొదటి అంకం లో రాజా చంద్ర వర్మ కూతురు’’ మృగాంక వతి’’ని  ‘’ మృగాంక వర్మ’’ అనే పేరుతొ’’ కొడుకుగా’’ ప్రకటించటం ,ఆ వేషం లో ఆమె విద్యాధర మల్లుని రాణి దగ్గరకు చేరటం అతని మంత్రికి  ఈ రహస్యం తెలిసిపోవటం ,ఆమెను పెళ్లి చేసుకొన్న వాడు చక్ర వర్తి అవుతాడని జ్యోతిష్కులు చెప్పటం ,రాజు దగ్గరే ఆమెను ఉంచటం .ఒకసారి విద్యాధర మల్లుడికి  ఆమె ముక్తాహారాన్ని విసిరిపోయినట్లుకల వచ్చి విదూషకుడికి చెబితే స్వప్నం లో చూసిన సుందరి బొమ్మను (విద్ధ సాల భంజిక )చిత్రశాలలో ప్రతిస్టిం చటం  అప్పుడు మృగాంక వర్మ రావటం ,రాజుకు ఆమె స్త్రీ అని తెలియక పోవటం తో మొదటి అంకం పూర్తీ .రెండవ అంకం లో కుంతల రాకుమారి కువలయ మాల తో మృగాంక వర్మ వివాహం జరిపించటానికి రాణి ఆలోచించటం .ఒక రోజు నిజరూపం లో ఉద్యాన వనం లో విహరిస్తున్న ఆమెను రాజు చూడటం ఉంటుంది .మూడులో రాజు  మృగాంకవతిని కలుసుకొంటాడు .ఇద్దరూ ప్రేమ బద్ధులౌతారు .నాలుగవ అంకం లో రాణికి  ఈర్ష్య ఏర్పడి   మృగాంక వర్మ పెళ్లి చేసేస్తుంది .ఇంతలో చంద్ర వర్మకు కొడుకు పుడతాడు. పుత్ర వేషం లో ఉన్న కూతురును రాజు కిచ్చి పెళ్లి చేయాలనుకొంటాడు .చివరికి రాణి ఏమీ చేయలేక మృగాంక వతి బాటు  కువలయ మాలను కూడా రాజు కిచ్చి పెళ్లి చేస్తుంది .

కదా సన్నివేశాలు బహు చమత్కారం గా తీర్చాడు. నాటకీయత లోపించి రక్తి కట్టలేదు .దీనిపై మాలవికాగ్నిమిత్ర ,రత్నావళి నాటక ప్రభావం బాగా ఉందనిపిస్తుంది .కవిత్వాపరం గా హిట్టే .నాటక కళ పరంగా ఫట్టే .ఇందులో సమకాలీన సామాజిక చరిత్ర ఉందని ఆనాటి ప్రజల మనోభావాలకు నిలువుటద్దమనీ భావిస్తారు .తన నాటకాలలో నాటక కళతక్కువే అని ఆయనే చెప్పుకొన్నాడు ..రస భావ అనుకూల భాషను ప్రయోగించటం లో రాజశేఖరుడి నేర్పు కన్పిస్తుంది .మాధుర్య గుణం తో ఉన్న సంగీత గుణం అతనికవిత్వం లో ఉంది .శబ్ద విన్యాస చతురుడు .పదలాలిత్యానికీ శేఖరుని ఉదహరిస్తారు .రాజ శేఖరుని రచనలు మునుల మనస్సుల్లాగా సమాధి గుణం కలవి ,ప్రసన్నం చేసేవి అని తిలక మంజరిలో ధనపాలుడు ప్రశంసించాడు –‘’సమాధి గుణ శాలిన్యః ప్రసన్న పరి పక్త్రియా –యాయా వర కవేర్వాచో మునీనామివ వృత్తయః ‘’

సంస్కృతం లోనే కాక ప్రాక్రుతభాషలైన శౌరసేని ,ప్రాకృత అపభ్రంసః భాషలమీదా ఆధారిటీఉన్నవాడు .బాల రామాయణం లో ‘’ప్రాకృతం సంస్కృతానికి జనని ‘’అని స్పష్టం గా చెప్పాడు .ప్రాకృత భాషలు చెవికి సోకితే ఇతర భాషలు రుచించవు అనీ చెప్పాడు .’’శుభస్య అపభ్రంశః ‘’అన్నాడు కావ్య రచనకు అపభ్రంశ భాషలు ఇతోధికం గా తోడ్పడతాయి అన్నాడు .భూత భాషను ‘’సరస రచనం భూత వచనం ‘’అని కీర్తించాడు .ఈ విధం గా అంతకు ముందు ఏ కవీ చేయని సాహసం చేసి ఆనాడు జన సామాన్యం లో వాడుకలో ఉన్న భాషలను సమాదరించి ,వాటికీ కావ్య గౌరవం ఉంది అని నిర్ద్వంద్వం గా తెలియ జెప్పిన వాడు రాజ శేఖరుడే .

కావ్య మీమాంస

రాజ శేఖరుడు రచించిన అలంకార శాస్త్రం ‘’కావ్య మీమాంస ‘’.ఇది క్షేమేంద్ర ,భోజ హేమచంద్రాదులకు ప్రేరణ గ్రంధం ఇందులో పద్దెనిమిది అద్యాయాలున్నాయి .కావ్య పురుషుడి ఉత్పత్తితో ప్రారంభించి ,అతడు అష్టాదశ శిష్యులకు కావ్య విద్యలు నేర్పటం శిష్యులు వాటిపై గ్రంధ రచన చేయటం, కావ్య భేదాలు ,సాహిత్య విద్యా కన్యను కావ్య పురుషుడు వివాహమాడటం,కవి భేదాలు ,భాష, శైలి వగైరాలు కవి సమయాలు ,కవిరహస్యాలు అలంకార సిద్ధాంత సమీక్ష మొదలైనవన్నీ శాస్త్రీయం గా రాశాడు .ఇలాంటివిషయ చర్చలు ఇంతకూ పూర్వం ఎవరూ చేయలేదు .అందుకే అపూర్వం అనిపిస్తాయి. కావ్యార్దాపహరణ లోముప్ఫై రెండు రకాలను తెలియ జేసి , చర్చించాడు .కవులకు అర్దాపహరణ తప్పదు అన్నాడు .గుణ రీతి ధ్వని సిద్ధాంతాలను స్పృశించాడు .కవుల దిన చర్యలు రాజ సభల్లో గోష్టి విధానం గొప్పగా చిత్రించాడు .రుద్రటుడి ప్రభావమ్ ఇతనిపై ఎక్కువ అంటారు .అలంకారాలు ,రీతులు కావ్యానికి ఉపయోగ సామగ్రి అన్నాడు .ఇవేవీ కావ్యాత్మకాదన్నాడు .ధ్వనిని గురించి ఎక్కడా స్పష్టం గా చెప్పలేదంటారు.అంటే అప్పటికి ధ్వని సిద్ధాంత వ్యాప్తి బాగా ఉండి  ఉండక పోవచ్చు  ఉక్తి వైచిత్రి అవసరం అన్నాడు .

భార్య అవంతీ సుందరికూడా సంస్కృత ప్రాకృత పండితురాలు .ఆమె అభిప్రాయాలకు విలువనిస్తూ చాలా సార్లు పేర్కొన్నాడు .’’రసోచిత శబ్దార్ధ సూక్తులను కావ్యం గా పరిగ్రహిం చాలి ‘’అని అవంతీ సుందరి చెప్పినదానితో తానూ ఏకీభవిస్తున్నట్లు రాజశేఖరుడు చెప్పాడు .’’రసకవి యేఉత్తమ కవి ‘’అన్నాడు .కనుక రస సంప్రదాయానికి చెందిన వాడుగా రాజ శేఖరుని గుర్తించారు  .కావ్య మీమాంసను ఆంగ్లం లో సి ఎస్ వెంకటేశ్వర న్ అనువదించి విపులమైన వివరణ చేశాడు .

Inline image 1  Inline image 2

మరో కవితో మళ్ళీ

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -14-10-14-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

జాషువా జాడ ప్రామానికమా అని ప్రశ్నించిన -బండి నారాయణ స్వామి

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment