గీర్వాణ కవుల కవితా గీర్వాణం -95 – 140 –గురువులకు గురువు ,సర్వ శాస్త్ర వేత్త –శ్రీ తాతా సుబ్బరాయ శాస్త్రి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -95

 

140 –గురువులకు గురువు ,సర్వ శాస్త్ర వేత్త –శ్రీ తాతా సుబ్బరాయ శాస్త్రి

గురువులకు గురువులు

దాదాపు అరవై డెబ్భై ఏళ్ళ క్రితం ఏ సంస్కృత పండితుడిని అడిగినా తాను  తాతా సుబ్బరాయ శాస్త్రి గారి శిష్యుడి నని కాలర్ –సారీ ఖండువా ఎగరేసి చెప్పేవారు .అంతటి విఖ్యాతి వారిది .విజయనగరానికి సమీపం లో ఒంటి తాడి అగ్రహారం లో 25-1-1867 న తాతా సూర్య నారాయణావధాని ,సోమి దేవమ్మ దంపతులకు సుబ్బరాయ శాస్త్రి గారు జన్మించారు .కొడుకును శాస్త్ర పండితుడిని చేయాలనే బలీయమైన కోరిక ఉన్న వీరి తల్లిగారు కొడుకును చంకన ఎత్తుకొని దాదాపు రెండుకిలో మీటర్లు నడిచి విజయనగరం లో గురువుగారి వద్ద దింపి వచ్చేది .అంత పట్టుదల చూపింది ఆ మహా ఇల్లాలు కుమారుని విద్యకోసం .ఆ శ్రమ ఊరికే పోలేదు ఫలించింది .తల్లి ఋణం తీర్చుకొన్నారు శాస్త్రి గారు .పెరిగి పెద్ద వారైన శాస్త్రి గారు విజయ నగరం లో బులుసు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి వద్ద చేరి సంస్కృత సాహిత్యం అభ్యసింఛి ప్రావీణ్యం సాధించారు .శాస్త్రి గారిది పాదరసం లాంటి చురుకైన బుద్ధి .మేధావిగా పరిగణన చెందారు .వీరి శ్రద్ధాసక్తులు ,వినయం, మేధావి తనం కర్ణాకర్ణీగా విన్న రుద్రా భట్ల రామ శాస్త్రి లక్ష్మణ శాస్త్రి సోదరులు సుబ్బరాయ శాస్త్రిగారిని ఆహ్వానించి ,చేర దీసి, వ్యాకరణ అలంకార శాస్త్రాలు నేర్పి అసామాన్య పండితునిగా తీర్చి దిద్దారు .గొప్ప శిష్యునికోసం వెదికిన ఆ గురు సోదరులు ధన్యులు .వారు నేర్పిన విద్యనేర్చి ఈశిష్యుడూ గురూణంతీర్చుకొన్నారు .

బహు శాస్త్ర పరిజ్ఞానం

ధర్మ శాస్త్రం నేర్వాలన్న కోరిక కలిగి గుమ్మలూరు సంగమేశ్వర శాస్త్రి గారి శిష్యులై ఆసాంతం అభ్యసించారు .కొల్లూరు కామ శాస్త్రి గారిని చేరి వేదాంతం అంతం చూశారు .సంగీతం మీద మోజు కలిగి కట్టు సూర్య నారాయణ గారి వద్ద సంగీత గుట్టు మట్టులన్నీ గ్రహించారు .ఇలా శాస్త్రి గారి బహుశాస్త్ర పరిజ్ఞానం దేశమంతా వ్యాపించి గొప్ప గుర్తింపు నిచ్చింది .ఆంధ్రా దేశం లో ఏ శాస్త్రం లో ఏ రకమైన సందేహాలు వచ్చినా చివరికి వీరి దగ్గరకు రావాలి సిందే. వీరి తీర్పే తుది తీర్పు ,శిరోదార్యమూ అయింది. అంతటి నిష్పాక్ష పాతం గా శాస్త్ర బద్ధం గా ధర్మ,  న్యాయ బద్ధం గా వ్యవహరించేవారు .గంభీర హృదయులు .తొట్రు పాటు లేని ప్రశాంత మూర్తి శాస్త్రి గారు .

సుదీర్ఘ విద్యాదానం –అరుదైన రికార్డు

ఆ నాటి మేటి పండితులలో సుబ్బా రాయ శాస్త్రి గారు నాగరికులు అనిపించుకొన్నారు .లౌకిక జ్ఞానం లోనూ అసాధారణ ప్రజ్ఞ ఉండేది .వీటి వలననే విజయ నగర పురపాలక సంఘం లోను, సహకార సంఘం లోను సభ్యులై స్థానిక సంస్థలలో ప్రధాన సభ్యులుగా అనేక మార్లు ఎన్నుకో బడ్డారు .అంతటి విశేష మైన మూర్తిమత్వం వారిది .విజయనగరం రాజా వారి సంస్కృత కళాశాలలో శాస్త్రిగారు నలభై ఏళ్ళు సుదీర్ఘ కాలం ప్రధానాచార్యులుగా పని చేసి శాస్త్రాధ్యాపనం చేశారు .ఒక రకం గా ఇదొక రికార్డే .

గ్రంధ రచన లో మేటి

 

భారత దేశం లో ఉత్తమ వ్యాకరణ గ్రంధం గా పరిగణింప బడుతున్న నాగశ భట్టు రచించిన ‘’శబ్దెందు శేఖరం ‘’ను ఉత్తరదేశ పండితులు ఖండించటం మొదలు పెట్టి గ్రందాలుకూడా రాశారు .శాస్త్రి గారు వారి వాదాలనన్నిటిని గడ్డిపోచల్లాగా తేలిగ్గా తీసి పారేసి ,ఖండనలకు ప్రతిఖందనలు చేసి నాగశ భట్ట హృదయాన్ని ఆవిష్కరిస్తూ ‘’గురు ప్రసాదం ‘’అనే మహా ఉద్గ్రంధం రాసి ,నోరు మూయించారు .ఈ గ్రంధాన్ని  ఆంద్ర  విశ్వా విద్యాయం గౌరవం గా ముద్రించించి లోకానికి అందించింది .దీనితో మారుమూల ప్రాంతాల వారికి కూడా శాస్త్రి గారి పాండితీ గరిమ తెలిసి శిష్యులై విద్య నేర్చుకొన్నారు .అంతటి ప్రభావం చూపింది. ఆ గురుప్రసాద శిష్యుల పాలిటి వరమే అయింది .శాస్త్రిగారు ఈ గ్రంధాన్ని ‘’స్వర సంధి ‘’వరకు రాశారు .శిష్యులు పేరి వెంకటేశ్వర శాస్త్రి ‘’గురు ప్రసాద శేషం ‘’పేరిట ‘’కారకాంతం ‘’వరకు రాసి పూర్తీ చేశారు .అంతటి గొప్ప శిష్యులను తయారు చేశారు తాతా వారు .శాస్త్రి గారి అమోఘ పాండిత్యానికి వారసులుగా వీరు ఉన్నారు అనటానికి ఇది  ఒక ప్రత్యక్ష సాక్షం .దీనినీ ఆంధ్రా యూని వర్సిటీ యే ముద్రించింది . సుబ్బరాయ శాస్త్రి గారు హరి శాస్త్రి రాసిన ‘’శ్శబ్ద రత్న ‘’వ్యాఖ్యను పరిశీలించి టీకా రాసి పరిష్కరిస్తే ఆంద్ర విశ్వ కళా పరిషత్ ప్రచురించింది .

పురస్కార గౌరవ రికార్డ్

1912లో ‘’మహా మహోపాధ్యాయ ‘’బిరుదం శాస్త్రి గారిని వరించింది .ఆ బిరుదు పొందిన మొట్ట మొదటి వ్యక్తీ తాతా సుబ్బరాయ శాస్త్రి గారే ఇదీ ఒక  రికార్డే  .ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ఇండియా వచ్చినప్పుడు శాస్త్రిగారిని సగౌరవం గా మద్రాస్ కు ఆహ్వానించి ,తనపేరు చెక్కబడిన ‘’సువర్ణ కంకణాన్ని ‘’స్వయం గా శాస్త్రిగారి చేతికి తొడిగి అలంకరించాడు .ఇది ఒక భారతీయ అందునా ఆంద్ర దేశానికి చెందినా శాస్త్ర పండితునికి లభించిన అరుదైన గౌరవం .ఇది మూడవ రికార్డు .వి జయనగరం లోనే కాక ఉర్లాం ,పిఠాపురం సంస్థాన పండిత పరీక్షలకు శాస్త్రి గారు ఎప్పుడూ ప్రధాన  పరీక్షకులుగా ఉండేవారు .ఇంతటి శాస్త్ర పండితునికి సంఘ సంస్కరణ పై మిక్కిలి అభిమానం ఉండటం ఆ రోజుల్లో ఆశ్చర్య పడే విషయం .దురాచారాలను కాలాన్ని బట్టి మార్చుకొని సంస్కరించుకొని శాస్త్ర సమ్మతాలైన వానిని అనుసరించాలని ఎప్పుడూ ప్రబోధించేవారు .మహాత్ముని ఖద్దరు వస్త్ర ధారణా ,వీరిపై ప్రభావం చూపింది .నిత్యం సన్నని పొందూరు ఖద్దరు వస్త్రాలే జీవితాంతం ధరించేవారు .

శాస్త్ర వాద తీర్పరి

ఆంద్ర సాహిత్య పరిషత్తు సమావేశానికి ఒక సారి అధ్యక్ష స్థానం లో ఉండి ఆంద్ర భాష ఔన్నత్యం కోసం మార్గ నిర్దేశం చేస్తూ చేసిన ప్రసంగం మహోపన్యాసం అనిపించింది .రాజ మండ్రి శ్రోత్రియ మహాసభ ,విశాఖ జ్యోతిశ్శాస్త్ర సభలలో పండితులు చేసిన చర్చోప చర్చలకు శాస్త్రి గారినే ఉభయ పక్షాల వారు’’ తీర్పరిగా’’ఉండమని వేడుకోవటం ,శాస్త్రిగారి సర్వతోముఖ ప్రతిభకు ,నిష్పాక్షికతకు నిలు వెత్తు నిదర్శనం .శాస్త్రిగారు కాశీ ,దర్భంగా ,పుదుక్కొట వగైరా సంస్థానాలను దర్శించి శాస్త్ర చర్చలు జరిపి పండితులను ఓడించి గెలిచి’’ జయ పత్రాలు ‘’అందుకొన్నారు .శాస్త్ర వాదాలలో అగ్ర గణ్యులని గుర్తింపు పొందిన కాశీ పండితుడైన ‘’జయ దేవ మిశ్ర ‘’పండితుడు –సుబ్బరాయ శాస్త్రి గారి ‘’పేరు విన్నంతనే ,’’అమాంతం ‘’రెండు చేతులు జోడించి’’ నమస్కరించే వారట .అంతటి మహోన్నత పండితులు మన సుబ్బా రాయ శాస్త్రి గారు .సుబ్రహ్మణ్యం పేరులోనే ఉంది ఆ ధిషణ.శాస్త్రి గారి 63 వ జన్మ దినోత్సవం నాడు శిష్య ,ప్రశిష్య బ్రందం  ఆత్మయ పండిత సాహితీ బృందం అందరూ కలిసి మహా వైభవం గా గురు పూజోత్సవం  జరిపి కృతజ్ఞతలు తెలియ జేసుకొని ఘంగా సన్మానించి గౌరవించి చిరకీర్తి ని  ఆర్జించారు .

మహా మహోపాధ్యాయ ,గుగ్గురువులు శ్రీ తాతా సుబ్బరాయ శాస్త్రిగారు 77 సంవత్సరాలు శాస్త్ర సింహులుగా ,ఓటమి ఎరుగని పండితులుగా ,బహు గ్రంధ కర్త గా జీవించి1944లో కీర్తి  శేషులయ్యారు .

రెండవ విరామం

 

మనవి-    సాహితీ బంధువులకు శుభ కామనలు-‘’పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు ‘’గా ఇంగ్లాండ్ ,అమెరికా దేశపు 125 మంది పూర్వకవుల పై రాసి ప్రచురించిన తర్వాత ,నా మనసులో ఒక బాధ పీడిస్తూనే ఉంది .మన దేశ పూర్వ కవులపై ఇంతవరకు రాయలేక పోయానే అనేది మనసులో తొలుస్తూనే ఉంది .ముఖ్యం గా మన సాహిత్యానికి మూలం సంస్కృతం కనుక పూర్వ సంస్కృత కవులపై రాసి ఆ లోటు భర్తీ చేయాలని పించింది .శీర్షిక కోసం రెండు మూడు రోజులు ఆలోచిస్తే ఫ్లాష్ గా ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం ‘’పేరు స్పురించింది .వెంటనే రాయటం మొదలు పెట్టాను .అది పెరిగి పెరిగి విస్తృత రూపం దాల్చింది .మధ్యలో కొద్ది రోజులు విరామం తర్వాత కొన సాగించి ఈ రోజుకు 95 ఎపి సోడ్ లలో ,140మంది సంస్కృత కవుల గురించి రాశాను .నా అంతర్జాల రాత ప్రయత్నాలలో ఇది చాలా బృహత్తరమైనదే .నేను రాసినవి చాలా ప్రాధమిక విషయాలే .వారిగురించి తెలుసుకోవాల్సింది చాలా ఉండి ఉంటుంది నాకు లభించిన సోర్సు ల నుండి గ్రహించి మీ కు తెలియ జేశాను అంతే .ఇంకా ఎందరో నా దృష్టికి రాని వారు ఉండవచ్చు .

ఇంత మంది సంస్కృత  మహా కవులు, రచయితలను సంస్మరించగలిగాను .వారి గురు పరంపరను స్పృశించి ధన్యమయ్యాను .ఇది నా అదృష్టం గా భావిస్తున్నాను .ఇంకా నా దృష్టికి రాని వారిగురించి తెలుసుకొని వారినీ చేర్చే ప్రయత్నం చేస్తాను .అంత వరకు ఈ శీర్షిక కు ‘’మరొక కామా లేక మరో విరామం ‘’గా భావించండి .ఆదరించిన వారందరికీ ధన్యవాదాతో కూడిన కృతజ్ఞతలు .

మరొక ముఖ్య విషయం –నేను ఎప్పటికప్పుడు తనకు అంకితం ఇద్దామను కొన్న నాలుగు పుస్తకాలను ఒకటి తమ తల్లి కీ శే .సౌభాగ్యమ్మగారికి ,రెండవది అర్ధాంగి శ్రీమతి సత్య వతి గారికి ,మూడవది తన బావ గారు డాక్టర్  శ్రీ రాచకొండ నరసింహ శర్మ గారికి కి  నాల్గవది తన జీవితానికి మార్గ దర్శి అయిన ‘’కపటమెరుగని సౌజన్య సౌశీల్య మూర్తి’’ శ్రీ కోగంటి సుబ్బారావు గారికి అంకితం ఇవ్వమని చెప్పి ,ఇప్పించిన  స్పాన్సర్ గా ఉన్న ఉదార హృదయులు నాకు బహు ఆత్మీయులు ,సరసభారతి కి అత్యంత శ్రేయోభిలాషులు ,,మార్గ దర్శి శ్రీ మైనేని  గోపాల కృష్ణ –(అమెరికా )గారికి ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం ‘’అనే ఈ అంతర్జాల గ్రంధం ,అంతర్జాల సాక్షిగా –రూపాయి కూడా వారికీ నాకు ఖర్చు లేని విధం గా  వారి సాహిత్యాభి లాషకు ,సరస హృదయానికి ,సౌశీల్యతకు  స్నేహ ధర్మానికి మాతృ దేశాభిమానానికి మాతృభాషా భిమానానికి ,భారతీయ అధ్యాత్మకత పై ఉన్న గౌరవానికి ,  గుర్తింపు గా   10-1-2015న శ్రీ గోపాల కృష్ణ గారి 80 వ జన్మ దినోత్సవం సందర్భం గా ఇప్పుడే కృతజ్ఞతా పూర్వకం గా , చిరుకానుక గా ఈ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం ‘’అంతర్జాల గ్రంధాన్ని  అంకితమిస్తున్నాను  .

ఇదేదో వారిని మభ్య పెట్టి గ్రంధ రూపం లో దీనిని తీసుకు రావానే ఆలోచన తో మాత్రం కాదని ,వారు ‘’ఎప్పటికప్పుడు వాయిదా వేస్తున్న అంకిత విషయం ‘’పై నా  నిర్ణయమే నని సవినయం గా మనవి చేస్తున్నాను .వారికి తెలియ బరచ కుండా నే  నేను చేసిన ఈ సాహసానికి గోపాల కృష్ణ గారు సహృదయం తో అర్ధం చేసుకొంటారని భావిస్తున్నాను .

పూర్వం పెట్టిన కామా తర్వాత – ఈ రచనకు తోడ్పడిన  గ్రంధాలు

1-తెలుగు విజ్ఞాన సర్వస్వం

2-20 వ శతాబ్ది తెలుగు వెలుగులు (1,2 భాగాలు )-పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ప్రచురణ

3-వీకీ పీడియా

మొదలైనవి

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -16-12-14-ఉయ్యూరు

 

 

.

 

 

 

.

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఏటా బాపు ఉత్సవాలు ,విశ్వనాధ్ కు బాపు రామణ లపురస్కారం పుస్తకాలు సమాజ నిర్మాణాలు ,వగైరా

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సంగీత” చక్రి ”వర్తి

న్నాడు అలా వెళ్ళిపోయాడు..!

‘చక్రి .. హృదయమున్న మనిషి. ఒక్క ట్యూన్‌ ఇచ్చాడంటే చాలు.. అది గుండెల్ని తాకాల్సిందే..’ అంటున్నారు దర్శకుడు వంశీ. చక్రి సంగీత సారథ్యంలో వచ్చిన తన చిత్రం ‘గోపి గోపిక గోదావరి’లో ‘నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల’ పాటను గుర్తు చేసుకున్నారాయన. చక్రి గురించి వంశీ చెప్పిన మరిన్ని విషయాలే ఇవి…
‘‘ఈ మధ్యనే చక్రి ఆఫీసుకు వెళ్లాను నేను. వాణ్ణి అదే ఆఖరుసారి కలవడం. మాటల్లో ‘‘మనమిద్దరం త్వరలో ఒక అద్భుతం చేయబోతున్నాం’’ అన్నాడు. ఆ అద్భుతం చేయకుండానే అలా వెళ్లిపోయాడు. చక్రికి నాకు ఉన్న బంధం ఈనాటిది కాదు. డేటు సరిగా గుర్తు లేదు కాని.. కొన్నేళ్ల కిందట సిరివెన్నెల సీతారామశాసి్త్ర మిత్రుడు సాయి అనే వ్యక్తి నాకు చక్రిని పరిచయం చేశాడు. మేమిద్దరం కలవడం అదే తొలిసారి. అప్పటి వరకు నా సినిమాలకు ఇళయరాజా గారు సంగీతం అందించారు. అయితే తక్కువ బడ్జెట్‌లో ఒక సినిమాను తీయాలనుకున్నాం. అలా తీసిన సినిమానే ‘ఔను… వాళ్లిద్దరు ఇష్టపడ్డారు’. ఇళయరాజాతో మ్యూజిక్‌ చేయిస్తే బడ్జెట్‌ ఎక్కువ అవుతుంది కాబట్టి.. చక్రీని అప్రోచ్‌ అయ్యాను. మా సినిమా బడ్జెట్‌ను చూసి.. అతను సరే అన్నాడు. చక్రితో నా మొదటి చిత్రం అదే అయ్యింది! అతనితో ఉన్న సౌలభ్యం ఏమిటంటే – మనకు ఏ ట్యూన్స్‌ కావాలంటే ఆ ట్యూన్స్‌ను అందించడం. మళ్లీ మళ్లీ మార్చమని అడిగినా సరే.. కించిత్తు విసుక్కోడు. అయితే అతనితో సమస్యల్లా ఆలస్యంగా రావడం. అడిగింది ఇచ్చేవాడు కాబట్టి.. అదేమంత పెద్ద సమస్య అనిపించలేదు నాకు. కొత్తపాత ఏమీ లేదు. భేషజాలైతే మచ్చుకు ఉండవు. చక్రితో ఒకసారి పరిచయం అయితే ఇక ఆ వ్యక్తి ఫ్రెండ్‌ అయిపోయినట్లే! అతని వ్యక్తిత్వాన్ని ఒక్కమాటలో చెప్పాలంటే ‘హెవీఫ్రెండ్లీ మనిషి’.
హౌస్‌బోట్‌లో కంపోజింగ్‌..
నా సినిమాల్లో ఏడింటికి చక్రి మ్యూజిక్‌ అందించాడు. ‘కొంచెం టచ్‌లో ఉంటే చెబుతా’ చిత్రం కోసం ఇద్దరం ఆసి్ట్రయా వెళ్లాము. కేవలం మ్యూజిక్‌ను కంపోజ్‌ చేసేందుకే అక్కడికి చేరుకున్నాం. చక్రి ఒక కీబోర్డుతో వచ్చాడు. ఆ చిత్రంలోని పాటలన్నీ అద్భుతం. ‘సరేలే సరేలే..’ అనే పాట నాకు బాగా ఇష్టం. ఆ పాట ట్యూన్‌ పండింది. చక్రిలో ఉన్న నైపుణ్యం ఏంటంటే.. అతను కంపోజ్‌ చేసే ట్యూన్‌లోనే పల్లవి పలుకుతుంది. ‘గోపి గోపిక గోదావరి’ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చేందుకు కేరళకు వెళ్లడం కూడా అద్భుతమైన అనుభవం. అప్పుడు నేను, చక్రి ఒక హౌస్‌బోట్‌ తీసుకున్నాం. బ్యాక్‌వాటర్‌లోనే పదిరోజులు ప్రయాణిస్తూ.. రకరకాల ట్యూన్స్‌ను సెట్‌ చేసుకున్నాం. ఆ బోట్‌ సకల సౌకర్యాల విడిది. ‘గోపి గోపిక..’ చిత్రంలో ఇప్పటికీ వినిపిస్తూ ఉండే పాట‘‘నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిలా..’’. ఆ పాటకు ట్యూన్‌ చెప్పినప్పుడే లిరిక్‌ పాడాడు చక్రి.
పల్లవి చెబితే హిట్‌..
నేను నిత్య చదువరిని. సాహిత్యాన్ని బాగా చదువుకున్న వాణ్ణి. అయితే చక్రి పెద్దగా సాహిత్యాన్ని చదువుకోలేదు. అయితే అతను పల్లవి చెప్పాడంటే ఆ పాట సూపర్‌హిట్‌ అయ్యేది. అదే అతని ప్రత్యేకం. ఆ సృజనాత్మక నైపుణ్యం అతనికి.. తండ్రి నుంచి అబ్బింది అనుకుంటా. వాళ్ల నాన్న కూడా మంచి కళాకారుడు కదా! మ్యూజిక్‌ కంపోజింగ్‌లో మా ఇద్దరి మధ్య ఏనాడు విపరీతమైన భేదాభిప్రాయాలు వచ్చిన సందర్భాలు లేవు. నేనే కోపం వచ్చినప్పుడు గట్టిగా మాట్లాడినా.. తిరిగి పల్లెత్తు మాట అనేవాడు కాదు. చాలా నిగ్రహశీలి. సహృదయుడు. ఎంత చిన్నోళ్లయినా పెద్దోళ్లయినా హర్ట్‌ చేసేవాడే కాదు. ఏదైనా ఓపిగ్గా కన్విన్స్‌ చేసేవాడు.
ఇక, ఫ్యామిలీ విషయానికొస్తే – పని ఒత్తిడిలో ఉన్నాసరే కుటుంబానికి ఏ కొరత రానిచ్చేవాడు కాదు. తల్లిని, భార్యను, ఇద్దరు చెల్లెళ్లను ఆప్యాయంగా చూసుకునేవాడు. ఎవరికీ ఏ లోటు రానివ్వడు. చనిపోయేముందు ‘మీరు టీనేజ్‌ లవ్‌ స్టోరీ చేస్తే బావుంటుందేమో ఆలోచించండి’ అన్నాడు. ఈ లోపు వాడు వెళ్లిపోయాడు. చక్రిని మాత్రమే నేను ‘ఒరే బిడ్డా’ అనేవాణ్ణి. వాడంటే నాకు అంత ప్రేమ.
చక్రిలోని మరో కోణం..
యాదృచ్చికమో ఏమో కాని.. సరిగ్గా ఇదే డిసెంబరులో (2009) వంశీ, చక్రిలను ఒక చోట కలిపింది ‘నవ్య’. వారిద్దరి మధ్య అల్లుకున్న స్నేహబంధాన్ని ‘జుగల్‌బందీ’ శీర్షికన పాఠకులకు అందించింది. అప్పట్లో చక్రి గురించి వంశీ పంచుకున్న అనుభవాలలో కొన్ని ఇవి..
‘‘మాది తూర్పుగోదావరి. అంటే కోస్తా. వీడిది వరంగల్‌. అంటే తెలంగాణ. వీడితో స్నేహం చేసిన తర్వాత తెలంగాణ అంటే అపారమైన ప్రేమ ఏర్పడింది. వీడితో పరిచయం అయ్యే వరకు తెలంగాణ ప్రజలు ఇంత గొప్పగా ఉంటారని తెలియదు. ఎక్కడ చక్రీ. ఎక్కడ నేను’’
‘‘సినిమా వాళ్లకు అభిమానుల నుంచి ఫోన్లు రావడం సహజం. అలా ఒక రోజున – ఒక వ్యక్తి చక్రీకి ఫోన్‌ చేసి ‘‘మా రెండేళ్ల పాపకు హార్ట్‌ ప్రాబ్లమండీ. వైద్యం కోసం డబ్బులు సరిపోవడం లేదు. మీరు సహాయం చేస్తారా?’’ అని అడిగాడతను. సమయం మించిపోతే పాప బతకదు. అందుకని చక్రీ ఒక మనిషికి డబ్బులు ఇచ్చి ఆ వ్యక్తి వద్దకు పంపించాడు. ‘‘ఆపరేషన్‌ అయిన తర్వాత ఆ బిడ్డ యోగక్షేమాలు నాకు తెలియజేయండి’’ అని చెప్పి మరీ పంపించాడు. సినిమా వాళ్లలో ఎంతమందికి ఇంత ఉదారత ఉంటుంది? మనుషులకు ఆపదొస్తే ఆదుకునే కోణం చక్రిలో నేను చూశాను’’
‘‘అన్నం, ఆవకాయ ఎప్పుడూ టేస్టే కదా! అలా వాడు నేను కలిస్తే బావుంటుంది. అన్నం, ఆవకాయే కాదు.. అన్నం, మెంతి మాగాయ కూడా. అలాంటిదే మా మధ్య అల్లుకున్న బంధం’’
ఆరు రూపాయల అన్నంతో కడుపునింపుకున్నా..
చక్రివి సినిమా కష్టాలు కాదు. బతుకుపోరాటంలో ఎదురైన ఆటుపోట్లు. సినిమాల మీద మమకారంతో.. ఎవరి అండదండలు లేకపోయినా.. ధైర్యంగా సంగీత ప్రపంచంలోకి వచ్చి.. తనకంటూ ప్రత్యేకముద్రను సాధించుకున్నారు. చిన్న వయసులోనే కెరీర్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు. కొన్నేళ్ల కిందట ‘నవ్య’కు ఈ ఇంటర్వ్యూ ఇచ్చారాయన. ‘అనుభవం’ శీర్షిక కింద ప్రచురితమైన ఆ ఇంటర్వ్యూను మళ్లీ సంక్షిప్తంగా ఇస్తున్నాం..
‘‘మాది మహబూబాబాద్‌ మండలంలో కంబాలపల్లి గ్రామం. సినిమాల మీద పిచ్చితో హైదరాబాద్‌కు వచ్చి కృష్ణానగర్‌లో రూమ్‌ తీసుకుని ఉండేవాణ్ణి. ఒక్కణ్ణే అద్దె కట్టలేక ముగ్గురితో షేర్‌ చేసుకున్నాను. మొదట్లో డబ్బులకు ఇబ్బందులొచ్చి.. చిన్న ఉద్యోగం చేశా. అయితే మ్యూజిక్‌ నేర్చుకోవడానికి కష్టమని దాన్ని మానేశాను. కొన్నాళ్లు ఆర్కెసా్ట్ర నడిపా. సొంతంగా ఆల్బమ్స్‌ చేశా. ఆ అనుభవంతో కోఠిలోని ఆడియో సంస్థల వాళ్ల నుంచి పిలుపు వస్తుందని ఎదురుచూసేవాణ్ణి. కొన్నిసార్లు రమ్మని కబురుపెట్టేవాళ్లు. తీరా వెళితే గంటలు గంటలు ఎదురుచూడ్డం నా వంతు అయ్యేది. జేబులో అయితే పది, ఇరవై రూపాయలకంటే ఎక్కువ ఉండేదే కాదు. ‘‘ఇప్పుడే పిలుస్తాం. కాసేపు వెయిట్‌ చేయండి’’ అనేవాళ్లు. ఎదురుచూసి చూసి మధ్యాహ్నం అయ్యేది. మంచి భోజనం చేయడానికి పైసలు లేవు కాబట్టి.. ఆరు రూపాయలు ఇస్తే దాల్‌-రైస్‌ వచ్చేది. అదే నా భోజనం. సాయంత్రం రెండు మిరపకాయ బజ్జీలు. అంతే! పూట గడిచేది. రాత్రి తొమ్మిదింటికి ఆడియో కంపెనీల వాళ్లు నా వద్దకు వచ్చి ‘‘ప్రస్తుతం ఆడియో బిజినెస్‌ టైట్‌గా ఉంది. మీ కాన్‌సెప్ట్‌తో వర్కవుట్‌ కావు. అనుకూలించినప్పుడు కబురు పెడతాం రండి’’ అని చావుకబురు చల్లగా చెప్పేటోళ్లు.
రిజెక్ట్‌ చేసేవాణ్ణి..
సినీరంగం వైపు అడుగులు వేశాను. ఆ సినిమా తీస్తున్నాం. ఈ సినిమా తీస్తున్నాం.. అంటూ నా జేబులోని డబ్బునే ఖర్చు పెట్టించేవారు తప్పిస్తే.. ఆఖరికి అవకాశం వచ్చేది కాదు. ఓ పది సినిమా ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాను. అప్పట్లో ‘చిరునవ్వు’ అనే నా ఆల్బమ్‌తో నాక్కొంచెం గుర్తింపు వచ్చింది. ‘వందేమాతరం’ ఆల్బమ్‌తో సినిమా వాళ్లతో పరిచయాలు ఏర్పడ్డాయి. అలా కొన్ని చిత్రాలకు సంగీతం సమకూర్చే ఛాన్స్‌ వచ్చింది. పాటలు రికార్డ్‌ అయ్యేవి కాని సినిమా షూటింగ్‌ జరిగేది కాదు. ‘లిటిల్‌హార్ట్స్‌’ అనే చిత్రానికి పనిచేస్తున్నప్పుడు పూరిజగన్నాథ్‌ ‘బాచి’కి అవకాశం ఇచ్చారు. అప్పటికి నాకు అంత అనుభవం లేదు. సింగర్స్‌ విషయంలో పూరిజగన్నాథ్‌ తీసుకున్న నిర్ణయాలను నేను కాదన్నాను. నేను రిజెక్ట్‌ చేసిన వారిలో అందరు సీనియర్‌ సింగర్సే! నా దృష్టిలో ఉన్నికృష్ణన్‌, మనోహర్‌, హరిహరన్‌, ఉదిత్‌ నారాయణ్‌, సిక్విందర్‌ల పేర్లు ఉన్నాయి. ఆ పేర్లనే అందరికీ చెబుతున్నాను. ఈ ధోరణి వల్ల అవతలి వాళ్ల మనసు నొచ్చుకుంటుందని గ్రహించలేకపోయాను. పూరి వద్దకు వెళ్లి ‘‘సారీ సార్‌, ఇప్పటి వరకు మీరు చెప్పింది వినిపించుకోలేదు’’ అన్నాను. ఆయన చిరునవ్వుతో భుజం మీద చేయివేసి ‘సరేసరే’ అన్నారు. ‘బాచి’ యావరేజ్‌గా ఆడినా పాటలు మాత్రం నాకు పేరుతెచ్చాయి. ఆ తర్వాత సినిమాల్లో వెంటవెంటనే అవకాశాలు వచ్చాయి..’’
జగనన్నను చూడాలని ఉంది : చక్రి ఆఖరి మాట
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మ్యూజిక్‌ డైరెక్టర్‌గా తనకంటూ ఒక ఇమేజ్‌ ఏర్పాటు చేసుకున్న సంగీత దర్శకుడు చక్రి చనిపోక ముందు మాట్లాడిన మాటలు….
ఎందుకో జగనన్న ( పూరిజగన్నాథ్‌ )ను చూడాలని ఉందిరా అంటూ ఆదివారం అర్థరాత్రి తన ఆఫీసు బాయ్‌తో అన్నారు. తన రికార్డింగ్‌ స్టూడియోలో పని ముగించుకుని ఇంటికి వచ్చేటప్పుడు
కారులో ఆఫీసు బాయ్‌కు చక్రికి మధ్య జరిగిన సంభాషణ.

పూరిజగన్‌, చక్రికి మధ్య ఉన్న సంబంధం వేరే చెప్పనక్కర్లేదు. వీరి కాంబినేషన్‌లో ఎన్నో హిట్‌ సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా ‘బాచి, ఇట్టు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్‌, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, శివమణి, 143, నేనింతే, గోలిమార్‌, ఆంధ్రావాలా’ వంటి మ్యూజికల్‌ హిట్స్‌ వీరి కాంబినేషన్‌లో వచ్చాయి. ఒకేసారి కెరీర్‌ మొదలుపెట్టిన వీరి మధ్య అన్నదమ్ముల సంబంధం కొనసాగేది అంటే అతిశయోక్తి కాదు. చక్రి మృతిపట్ల పూరి స్పందిస్తూ ‘ నా సోదరుడు (చక్రి)ని నేను చాలా మిస్‌ అవుతున్నానంటూ ట్వీట్‌ చేస్తూ చక్రికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు’.
ప్రముఖ సంగీత దర్శకుడు చక్రికి చిత్ర పరిశ్రమ సంతాపం..

ప్రముఖ సంగీత దర్శకుడు చక్రికి మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. చక్రి మృతి పట్ల మెగాస్టార్‌ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, నిర్మాత రామానాయుడు, దర్శక రత్న దాసరి నారాయణరావు, నటులు రవితేజ, అల్లు అర్జున్‌, సాయి ధరమ్‌ తేజ్‌, దర్శకుడు మారుతి, సంగీత దర్శకురాలు శ్రీలేఖతో సహా పలువురు చిత్ర పరిశ్రమ సంతాపం వ్యక్తం చేశారు. చక్రి మరణ వార్త విని నమ్మలేకపోయానని చిరంజీవి అన్నారు. చక్రి చాలా మంచి వ్యక్తి, అలాంటి వ్యక్తి దూరం కావడం బాధకరమని నిర్మాత రామానాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
చక్రి నాకు తమ్ముడు లాంటివాడని, చక్రికి నేను పెద్ద అభిమానిని, తను లేని లోటు తీర్చలేనిది అని బాలకృష్ణ సంతాపం వ్యక్తం చేశారు. చక్రి లేడనే వార్తను నేను నమ్మలేక పోతున్నానని సంగీత దర్శకురాలు శ్రీలేఖ అన్నారు. చక్రి మన మధ్య లేకపోయినా..ఆయన అందించిన పాటల్లో బతికే ఉన్నారు. ‘జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది’ అంటూ ఆయన ఎందుకు కంపోజ్‌ చేశారో తెలియదు కానీ అది సరిగ్గా ఆయనకే వర్తిస్తుందనుకుంటున్నానని శ్రీలేఖ సంతాపం తెలిపారు.
చక్రి మృతి పట్ల పూరి తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ – ”నా సోదరుడు (చక్రి)ని చాలా మిస్ అవుతున్నాను. మా ఇద్దరి కెరియర్ ఒకేసారి ఆరంభమయ్యింది, ఎన్నో అనుభూతులు పంచుకున్నాం. నా సినిమాలకు ఎన్నో మంచి పాటలిచ్చారు” అని పేర్కొన్నారు.
జగమంత కుటుంబాన్ని వదిలి… ఏకాకిగా వెళ్లిపోయాడు
పొద్దున్నే న్యూస్‌ చానళ్లలో ‘సంగీత దర్శకుడు చక్రి హఠాన్మరణం’ అనే వార్త చూసినవాళ్లు ఓ పట్టాన నమ్మలేకపోయారు. సినీ వర్గాలు, ముఖ్యంగా సంగీత ప్రపంచం అసలు నమ్మలేకపోయాయి. చక్రి అనగానే ముఖాన చిరునవ్వులు చిందించే అతని స్థూలకాయమే కళ్లముందు కదులుతుంది.
‘అతను ఒళ్లు తగ్గించుకుంటే బాగుంటుంది కదా’ అనే అభిప్రాయం కలుగుతుంది. అంటే చక్రిని తెలుగువాళ్లంతా తమ ఇంటి సభ్యుడిలా సొంతం చేసుకున్నారన్న మాట. అతి కొద్దిమందే తమ మంచితనంతో ఇలా తమ ప్రభావాన్ని చూపగలుగుతారు. వరంగల్‌ జిల్లా మహబూబాబాద్‌లోని కంభాలపల్లిలో పుట్టి పెరిగిన జిల్లా చక్రధర్‌ హైస్కూల్‌ రోజుల నుంచే సంగీతంలో తొలి అడుగులు వేసి, స్టేజ్‌ మీద పాటలు పాడటం మొదలుపెట్టాడు. డిగ్రీ ఫస్టియర్‌లో ‘ఒకే జాతి మనదిరా, ఒకే బాట మనదిరా, కులభేదం లేదురా, ఒకే కులం మనదిరా’ అంటూ ఓ దేశభక్తి గీతం రాసి, దానికి బాణీలు కూడా కట్టి, ఆ పాటను పాడి బహుమతి సంపాదించేశాడు. సెకండియర్‌లో ‘సాహితి కళాభారతి’ అనే సాంస్కృతిక సంస్థను స్థాపించి, ప్రోగ్రామ్స్‌ చేస్తూ వచ్చాడు. సినిమాల్లో ప్రయత్నిస్తే రాణిస్తావంటూ స్నేహితులు పోరుపెడుతుంటే, పదివేల రూపాయలు అప్పుచేసి మరీ హైదరాబాద్‌ వచ్చి వాలాడు. ఇక్కడి వాతావరణం చూసి, హైదరాబాద్‌పై పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయాడు. ‘హైదరాబాద్‌ నాదే’ అనుకున్నాడు. అప్పుచేసిన డబ్బు ఖర్చుపెట్టి ‘పండు వెన్నెల’ అనే ఆల్బమ్‌ తయారు చేయించాడు. కానీ కొనేవాళ్లు కనిపించక పోవడంతో దాన్ని పక్కనపెట్టేశాడు. జీవిక కోసం ఓ హాస్పిటల్‌లో డిమాన్‌సే్ట్రటర్‌గా చేరి, మూడేళ్లు పనిచేశాడు. ఆ టైమ్‌లోనే ‘పండు వెన్నెల’ను బయటకు తెచ్చాడు. అది డబ్బు తేకపోయినా, పేరుతెచ్చింది. ఆడియో కంపెనీలతో పరిచయాలు కలిగేలా చేసింది. మరో మూడేళ్లలో 30 ఆల్బమ్స్‌ విడుదల చేశాడు. చక్రధర్‌ను ‘చక్రి’గా మార్చుకున్నాడు. తన ఆల్బమ్స్‌లో ఎక్కువ పాటలను ‘చల్లగాలి’ అనే కలంపేరుతో రాశాడు. మొత్తం పాటలు తనే రాసిన ‘చిరుగాలి’ ఆల్బమ్‌ను చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేశాడు. అప్పటివరకూ చేసిన ఆల్బమ్స్‌ అన్నింటికంటే ‘చిరుగాలి’ సూపర్‌హిట్‌. చిత్రమేమంటే అతడికి మ్యూజిక్‌ డైరెక్టర్‌గా కాక గేయ రచయితగా సినీ పరిశ్రమ నుంచి ఆఫర్లు వచ్చాయి. వాటిలో ఓ చిరంజీవి సినిమా కూడా ఉంది. కానీ గీత రచయితగా కాకుండా సంగీత దర్శకుడిగా కెరీర్‌ కొనసాగించాలనే అభిప్రాయంతో ఉన్న చక్రి ఆ ఆఫర్లను సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చాడు. ఆ తర్వాత చిన్న చిన్న సినిమాలకు సంగీత దర్శకుడి ఆఫర్లు వచ్చాయి. వాటినీ వద్దనుకున్నాడు చక్రి. ఎందుకంటే అతని లక్ష్యం పెద్ద సినిమా. కానీ ‘మరో చరిత్ర’ సృష్టిస్తుందని చెప్పడంతో ‘మరో ప్రేమకథ’ అనే సినిమాకు ఎంతో ఇష్టంగా ఐదు పాటలు కంపోజ్‌ చేశాడు. కానీ ఆ సినిమా వెలుగు చూడలేదు. కానీ వాటిలో ఒక పాటను ఆ తర్వాత నాగార్జున నటించిన ‘శివమణి’ సినిమాకు వాడుకున్నాడు. ఆ పాట ‘మోనా మోనా మోనా’. ఈసారి ఏ తప్పూ చేయకూడదనుకుంటూనే ‘లైఫ్‌’ అనే సినిమాని ఒప్పేసుకున్నాడు. అదీ ఆగిపోయింది. ఆ తర్వాత ఆ సినిమాలు ఆగిపోవడంలో తన బాధ్యత ఏమీ లేదని సర్దిచెప్పుకున్నాడు. ‘లిటిల్‌ హార్ట్స్‌’కు ట్యూన్స్‌ ఇచ్చాడు. ఆ సినిమా రిలీజయ్యింది, కాకపోతే కాస్త ఆలస్యంగా. ఆ టైమ్‌లో పవన్‌కల్యాణ్‌తో తొలి సినిమా ‘బద్రి’ చేసి, సూపర్‌హిట్‌నిచ్చిన దర్శకుడు పూరి జగన్నాథ్‌తో పరిచయం కలిగింది. అప్పుడు జగన్నాథ్‌, తన రెండో సినిమా ‘బాచి’ని తీసే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఆల్బమ్స్‌కు చక్రి కట్టిన బాణీలు విన్న ఆయన ‘బాచి’కి బాణీలు కట్టే బాధ్యతను చక్రికి అప్పగించాడు. ఎంతో శ్రద్ధతో, ఇష్టంతో బాణీలు కట్టాడు. పెద్ద చిత్రం కదా, తన దశ తిరుగుతుందనుకున్నాడు. కానీ ‘బాచి’ బాక్సాఫీస్‌ వద్ద పల్టీకొట్టడంతో, చక్రికి ఎవరూ ఆఫర్లు ఇవ్వడానికి ముందుకు రాలేదు. కానీ జగన్నాథ్‌ తన తదుపరి చిత్రం ‘ఇట్లు.. శ్రావణి సుబ్రహ్మణ్యం’కు కూడా చక్రినే తీసుకున్నాడు. ప్రొడ్యూసర్లు ఒప్పుకోకపోవడంతో, చక్రి కోసం వాళ్లనే మార్చేశాడు జగన్నాథ్‌. ‘‘పైసలు పెట్టే ప్రొడ్యూసర్‌ వద్దంటే డైరెక్టర్‌ ఏం చేస్తాడు? కానీ జగన్‌ అన్నయ్య అలా చెయ్యలేదు.
నాకిచ్చిన మాట కోసం వేరే నిర్మాతను వెతుక్కున్నాడు తప్ప, మాట తప్పలేదు. అందుకే మా అమ్మానాన్నల తర్వాత నేను ఆజన్మాంతం రుణపడి ఉండాల్సింది జగన్‌ అన్నయ్యకే’’ అని ఓసారి చెప్పాడు చక్రి. ‘ఇట్లు.. శ్రావణి సుబ్రహ్మణ్యం’ విడుదలైంది. సినిమా హిట్‌. మ్యూజిక్‌ సూపర్‌ హిట్‌. ఆ సినిమాతో సంగీత దర్శకునిగా చక్రికీ, హీరోగా రవితేజకూ బ్రేక్‌ లభించింది. ఆ సినిమా తర్వాత చక్రి వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరమే కలుగలేదు. జగన్నాథ్‌ డైరెక్షన్‌లోనే మరో ఎనిమిది సినిమాలకు బాణీలు కూర్చాడు. వాటిలో ‘ఇడియట్‌’, ‘అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి’, ‘శివమణి’, ‘దేశముదురు’ వంటి హిట్లున్నాయి. ‘నేనింతే’లో అతను బాణీలు కూర్చగా, భాస్కరభట్ల రాసిన ‘కృష్ణానగరే మామా..’ పాట తెలుగు సినిమా పరిశ్రమకు జాతీయగీతం లాంటిదని కితాబిచ్చాడు జగన్నాథ్‌. చివరిగా వారి కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘గోలీమార్‌’. అలాగే వంశీ సినిమాలు ‘ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’, ‘గోపి గోపిక గోదావరి’లతో పాటు, ‘సత్యం’, ‘చక్రం’, ‘దేవదాస్‌’, ‘కృష్ణ’, ‘ఢీ’, ‘సింహా’, ‘జై బోలో తెలంగాణ’, ‘దేనికైనా రెడీ’ వంటి సినిమాలు సంగీత దర్శకునిగా అతనికి పాపులారిటీని తెచ్చాయి. వీటిలో ‘సింహా’ సినిమా అతనికి ఉత్తమ సంగీత దర్శకునిగా నంది అవార్డును అందించగా, అంతకంటే ముందు ‘సత్యం’ సినిమా సంగీతం ఫిల్మ్‌ఫేర్‌ను తెచ్చింది. ఇప్పటివరకూ అతను వందకు మించిన చిత్రాలకు సంగీతం సమకూర్చగా, 97 చిత్రాల వరకూ విడుదలయ్యాయి. ‘ఢీ అంటే ఢీ’, ‘టామీ’ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. చక్రి సంగీతంలోని ఆకర్షణ ఏమంటే, అవి మాస్‌, క్లాస్‌ తేడా లేకుండా అందరినీ అలరించగలగడం. ఈ మధ్యే అతను ఓ గట్టి నిర్ణయం తీసుకున్నాడు – ‘పనిని మరో పది రెట్లు ఎక్కువగా ప్రేమించాలి. సంగీతంతోనే ఎక్కువ సమయం స్నేహం చేస్తూ సంగీత జీవన సౌందర్యాన్ని ఆస్వాదించాలి’ అని. కానీ ఆ కోరికను తీర్చుకోకుండానే నాలుగు పదుల చిన్న వయసులోనే, సంగీత ప్రియులనందరినీ విషాదంలో ముంచేసి వెళ్లిపోయాడు.
స్థూలకాయమే శాపం
కేవలం నలభై ఏళ్ల వయసులోనే గుండెపోటుతో చక్రి మరణించడానికి స్థూలకాయమే ప్రధాన కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కెరీర్‌ కొత్తలో ముద్దుగా, బొద్దుగా ఉన్న చక్రి తర్వాత స్థూలకాయునిగా మారిపోయారు. అందుకే ఆయనను టాలీవుడ్‌ బప్పీలహిరి అని సరదాగా అనేవారు. చక్రి భోజనప్రియుడనే సంగతి ఆయన సన్నిహితులందరికీ తెలిసిన విషయమే. అయితే అది మామూలు భోజనప్రియత్వం కాదు. అపరిమితమైన భోజనప్రియత్వం. సంగీత దర్శకునిగా బాగా బిజీగా ఉన్న కాలంలో రాత్రి వేళల్లోనూ పనిచేస్తూ రావడంతో ఆయన ఆహారపుటలవాట్లు, తద్వారా ఆయన జీవన విధానం మారిపోయాయి. రాత్రంతా పనిచేసి, తెల్లవారుఝామున నాలుగింటికి ఆయన ఆహారం తీసుకున్న సందర్భాలు చాలా ఎక్కువనేది ఆయన సన్నిహితులు చెబుతున్న మాట. ఇలా ఎప్పుడుపడితే అప్పుడు ఆహారం ఎక్కువగా భుజిస్తూ రావడం వల్ల ఆయన స్థూలకాయునిగా మారిపోయారు. దానితో పాటు ముఖం కూడా నలుపు తిరిగిపోయింది. ‘‘నేను కూడా ఒకానొక సమయంలో 148 కిలోల బరువు వరకూ పెరిగాను. అప్పుడు బరువుతగ్గమని చక్రి నాకు పలుసార్లు సలహా ఇచ్చాడు. నేనేమో అతన్ని తగ్గమని చెప్పేవాణ్ణి. అతని సలహాను నేను పాటించాను. ఇప్పుడు నా బరువు 75 కిలోలు. కానీ తను మాత్రం మరింత బరువు పెరిగిపోయాడు’’ అని కన్నీళ్ల పర్యంతమయ్యారు దర్శకుడు సూర్యకిరణ్‌. ఆయన డైరెక్ట్‌ చేసిన ‘సత్యం’ సినిమాకు సమకూర్చిన సంగీతంతో చక్రి మొదటిసారిగా ఉత్తమ సంగీత దర్శకునిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డును అందుకున్నారు. ఒక్క సూర్యకిరణే కాదు, సన్నిహితులు చాలామంది బరువు తగ్గించుకొమ్మని చక్రికి చెబుతూనే ఉండేవాళ్లు. లైపోసెక్షన్‌ చేయించుకుంటే, దాని వల్ల తర్వాత దుష్ఫరిణామాలు ఎదురవుతాయేమోననే సందేహాన్ని ఆయన వ్యక్తం చేస్తూ వచ్చారు. అలాగే ఆయన తన ఆహార అలవాట్లనూ మార్చుకోలేక పోయారు. ఆ బలహీనతే చివరకు గుండెపోటు రూపంలో ఆయన ప్రాణాన్ని కబళించిందని చెప్పాలి.
 
ఆంధ్రా బప్పీలహరి – చక్రి
బప్పీలహరిని ఎప్పుడూ కావాలని అనుకరించలేదని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు చక్రి. ఆయన ఒకప్పుడు బంగారు గొలుసులను ఇష్టంగా ధరించేవారు. వాటి గురించి గతంలో ఓ సారి చక్రి చెబుతూ ‘‘నేను కాలేజీ రోజుల్లో ఉన్నప్పుడు చెయిన్‌ వేసుకోవాలని ఉండేది. కానీ అప్పుడు కుదరలేదు. పైగా నా ఫ్రెండ్‌ చెయిన్‌ ఒకటి తీసుకొచ్చి తాకట్టు పెట్టేశాను. దాన్ని విడిపించడానికి నానా తంటాలు పడాల్సి వచ్చింది. సంగీత దర్శకుడిగా స్థిరపడ్డాక ఓ సారి మా అమ్మతో కలిసి నగల దుకాణానికి వెళ్లా. అక్కడ సన్నటి చెయిన్‌ తీసుకున్నా. అది ఎప్పుడూ మెడలో ఉండేది. ఆ తర్వాత ఓ సారి దుబాయ్‌కి వెళ్లినప్పుడు లావు గొలుసులు వేసుకున్నవారిని చూశా. అప్పట్లో మన పరిశ్రమలో ఫైట్‌ మాస్టర్లు కూడా అంత పెద్ద గొలుసులు వేసుకునేవారు. దాంతో మోజుపడి నేను కొనుక్కున్నా. మ్యూజిక్‌ డైరక్టర్‌ అలా ధరించడం అందరికీ కొత్తగా అనిపించిందేమో.. అందరి దృష్టి నామీదే పడింది. దాంతో అందరూ నన్ను ఆంధ్రా బప్పీలహరి అని పిలవడం మొదలుపెట్టారు. ఆయన్ని నేనెప్పుడూ కావాలని అనుకరించలేదు. విదేశాలకు వెళ్లి ముంబైలో ఫ్లైట్‌ దిగి వస్తుంటే ‘హలో బప్పీజీ’ అని పలకరించేవారు. నేను కూడా హాయ్‌ అని చెప్పేవాడిని. అంతా బాగానే ఉందనుకున్న సమయంలో మా ఇంటికి మా కజిన్‌ ఓ అమ్మాయి వచ్చింది. తన కాలేజీలో నాకు ఓ పేరు ఉందని చెప్పుకొచ్చింది. ‘ఆంధ్రా బప్పీలహరి అని అంటారా’ అని అడిగా. కాదని చెప్పింది. ఇంకేంటని ఉత్సాహంతో ఆరాతీస్తే ‘గొలుసుల రామన్న’ అని పిలుస్తారని చెప్పింది. ఆ రోజు నుంచి నా మెడలో గొలుసులు వేసుకోవడం మానేశాను. ఎక్కడికైనా ఫంక్షన్లకి వెళ్తుంటే మాత్రం అమ్మ గొలుసు వేస్తుంది. చేతికి మాత్రం ఎనిమిదేళ్ల క్రితం మా సోదరి తొడిగిన కడియం ఉంటుంది. అలాగే నా భార్య శ్రావణి చేయించిన బ్రేస్‌లెట్‌ ఎప్పుడూ ఉంటుంది’’ అని అన్నారు.
జీవితగమకాలు..
పలు సందర్భాల్లో చక్రి తన గురించి పలు అంశాలను స్నేహపూర్వకంగా చెప్పుకొచ్చేవారు. ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆ వివరాలు…
జూ వరంగల్‌లో విజయలక్ష్మి దగ్గర వయొలిన్‌ నేర్చుకున్నారు. తిరుపతయ్య దగ్గర కర్ణాటక సంగీతం (గాత్రం) మూడేళ్లు అభ్యసించారు. చక్రి విద్యార్హత ఎం.కాం.
మెహబూబాబాద్‌లో వినాయకచవితి, శ్రీరామనవమి పర్వదినాల్లో తన ఆర్కెసా్ట్రతో స్టేజ్‌షోలు చేసేవారు.
కంబాలపల్లిలో ఉండగా కబడ్డీ, కోకో బాగా ఆడేవారు. ఇంటర్‌ స్థాయిలో క్రికెట్‌, డిగ్రీలో ఉండగా టేబుల్‌ టెన్నిస్‌ ఆడటం అలవాటయ్యాయి. తన కుటుంబసభ్యులతో ఇంట్లో ఉన్నప్పుడు చక్రి చెస్‌ ఆడటానికి మొగ్గుచూపేవారు. ఎప్పుడూ ఆయనదే పైచేయి.
చక్రి తన నివాసానికి పెట్టుకున్న పేరు ‘పూజ కుటీర్‌’. తనకు సినీ పరిశ్రమలో ‘బాచి’తో తొలి అవకాశాన్నిచ్చిన దర్శకుడు పూరి జగన్నాథ్‌ పేరును కుదించి పూజ కుటీర్‌ అని పెట్టుకున్నారు.
జూ పూరి జగన్నాథ్‌ను అన్నయ్య అని పిలిచేవారు. దర్శకుడు వం శీని అంకుల్‌ అనేవారు. చక్రిని వంశీ బిడ్డ అని పిలిచేవారు.
ఏ మాత్రం ఖాళీ దొరికినా కేరళకు వెళ్లి సేదతీరడానికి ఇష్టపడేవారు చక్రి. మున్నార్‌ అంటే ప్రత్యేకమైన ప్రీతి.
స్టూడియోలో సరిగమలు కూర్చడం మాత్రమే కాదు. గరిట పట్టి చికెన్‌ వండటంలోనూ దిట్ట చక్రి. పెన్ను పట్టి పాటలు రాయడంలోనూ సిద్ధహస్తుడు. కెరీర్‌ ప్రారంభంలో సంగీత దర్శకత్వం కోసం వెతుకుతున్నప్పుడు ఆయన చేసిన ‘పండు వెన్నెల’ ఆల్బమ్‌ విన్నవారు ‘పాటలు రాస్తావా’ అని అడిగేవారట. చిరంజీవి సినిమాకు పాటలు రాసే అవకాశం వచ్చినా నిక్కచ్చినా కాదనుకున్నారు చక్రి.
చక్రి జాతకాలను నమ్మేవారు. ఎప్పుడూ పగడపుటుంగరాన్ని కుడిచేతికి ధరించేవారు.
ప్రతి పుట్టినరోజుకు తన స్నేహితులు, అభిమానులు, బంధుమిత్రులతో రక్తదానం, నేత్రదానం చేయించేవారు.
ఫ్రెండ్‌షిప్‌ డే రోజు ప్రత్యేకంగా తన చిన్ననాటి స్నేహితులను, పరిశ్రమలోని మిత్రులను పిలిచి షడ్‌రుచులతో భోజనాలు పెట్టించేవారు.
సినిమా పరిశ్రమకి వచ్చిన కొత్తల్లో చక్రి ఫిట్‌గా కనిపించేవారు. ‘ఏమయ్యా.. నువ్వు మ్యూజిక్‌ డైరక్టర్‌వా? ఫైట్‌ మాస్టర్‌వా?’ అని తమ్మారెడ్డి భరద్వాజ ఓ సారి చమత్కరించారట. 2007 తర్వాతే తనకి భారీకాయం వచ్చిందని, సమయానికి భోజనం, నిద్ర లేకపోవడమే తన ఊబకాయానికి కారణమని, పరిశ్రమకి రాకముందు తప్పనిసరిగా వ్యాయామం చేసేవాడినని చెప్పేవారు చక్రి.
చక్రికి జేసుదాస్‌ గాత్రం అంటే ప్రాణం. జేసుదాస్‌ పాటలను చక్రి పాడగా విన్నవారు ఆయన వారసుడేనని అనుకున్న సందర్భాలూ ఉన్నాయట.
చక్రి దగ్గర రెండు సెల్‌ఫోన్‌లుంటాయి. ఓ సెల్‌ఫోన్‌లో కేవలం తన భార్య శ్రావణి నెంబర్‌ మాత్రమే ఉంటుంది. ఆమెకి తప్ప ఆ నెంబర్‌ ఇంకెవరికీ తెలియదు. ఆ ఫోన్‌ని ఇప్పటిదాకా స్విచ్ఛాఫ్‌ కూడా చేయలేదట.
తండ్రి జిల్లా వెంకటనారాయణ, సోదరి ఆదర్శిని చేత తన సినిమాల్లో పలు పాటలు పాడించారు చక్రి. ఆయన బలవంతం మీదే శ్రావణి ‘శ్రీమన్నారాయణ’లో కోరస్‌ పాడారు. చక్రి తమ్ముడు మహిత్‌ నారాయణ సంగీత దర్శకుడిగా కొనసాగుతున్నారు.
‘జై బోలో తెలంగాణ’ కోసం కేసీఆర్‌ రాసిన పాటను స్వరపరచిన ఘనత తనదేనని అంటుండేవారు. ఆ చిత్రంలోనే ‘పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న గానమా..’ పాటను గద్దర్‌ ఆలపించారు.
Related News

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -94- 139- అవధూత –శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర యతి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం  -94

139- అవధూత  –శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర యతి

ఆతుర సన్యాసం

ఎన్నో సంస్కృత గ్రంధాలు రచించిన సదా శివ బ్రహ్మేంద్ర యతి తమిళ దేశం లో జన్మించారు .కాలం పద్దెనిమిదవ శతాబ్దం గా భావిస్తున్నారు .జన్మ నామం శివ రామ కృష్ణుడు .కావేరీ తీరం లో ‘’తిరు విశవల్లూరు’’అనే షాహాజీ పురం లో జన్మించారు .తండ్రి మోక్షం సోమ సుందరం అవధాని , గురుకుల విద్యాభ్యాసం లో విద్య నేర్చారు .అప్పటికే వివాహమైంది .భార్య పుష్ప వతి అయిందన్న వార్తా గురుకులం లో ఉండగా మామ గారు  వార్త పంపారు .గుర్వాజ్న తో ఆఘ మేఘాల మీద మామగారింటికి చేరుకొన్నారు .కాని అక్కడ ఆయనను ఎవరూ పట్టించుకో లేదు .నడిచి అంత దూరం వెళ్ళటం తో విపరీత మైన బడలిక కలిగి ఆకలి కూడా విజ్రుమ్భించింది  ఎవరికీ అల్లుదిగారి అతీ గతీ పట్ట లేదు ఎవరి పనుల్లో వారు ఉండిపోయారు .ఇది అవమానం గా ,బాధగా అని పించింది .అంతే- శివరామ కృష్ణ కు ఆ క్షణం లో సంసారం పై తీవ్ర విరక్తి కలిగింది .వెంటనే సన్య సించాడు .తురీయాశ్రమ నామమే   ‘’సదాశివ బ్ర హ్మేంద్రుడు .’’ .ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అంటారు కాని ఒక సంఘటనే ఆయన జీవితాన్ని మలుపు తిప్పేసింది .సంసార  జంఝాటం నుంచి తప్పించింది .

కంచి వారి శిష్యరికం –యోగ సిద్ధి సాధన

ఆ నాటి కంచి కామ కోటి పీఠాదిపతిశ్రీశ్రీ పరమ శివేంద్ర సరస్వతి  సన్నిధిని చేరి శిష్యులై పోయారు సదాశివ బ్రహ్మేన్ద్రులు .వారి వద్దనే విజ్ఞాన గ్రంధాలన్నీ క్షుణ్ణంగా అభ్యసించారు .నిత్యాభ్యాసం పూర్వ జన్మ సంస్కారం ,స్వంత మేధస్సు లతో అనేక యోగ శక్తులను స్వాధీనం చేసుకొన్నారు .పరిపూర్ణ సిద్ధులు అనిపించు కొన్నారు .భాగవత జడ భరతుని లాగ అవధూత గా మారిపోయారు .గురువు గారి దగ్గరకు వచ్చిన శాస్త్ర వాదులను ఎదుర్కొని గురువుగారి తరఫున తానే వాదించి గురు విజయం చేకూర్చేవారు .ఈ విషయాన్ని అసూయా గ్రస్త శిష్యులు గురువు గారికి ‘’మోశారు .’’.  గురువు గారు తెలుసుకొని శిష్యుడినే మందలించి అలాంటి పని చేయవద్దన్నారు .ఆ రోజు నుండి నిరంతర మౌన మే  వ్రతం గా గడిపారు .

మహిమా విభూతి

సదాశివుని మహత్తులు చాలా ప్రచారం లో ఉన్నాయి .ఒక సారి ఒక పొలం లో చేయి తలకింద దిడుగా పెట్టుకొని పడుకొంటే ఒక రైతు  వచ్చి సర్వ సంగ పరిత్యాగికి దిండు కావాల్సి వచ్చిందా అని ఎద్దేవా చేశాడట .తన యోగ శక్తి రైతుకు చూపించాలన్న తపన తో చెయ్యి లేకుండానే గాలిలో తేలి పడుకొన్నారు .అదే రైతు మళ్ళీ వచ్చి ఒక్కొక్కడికి యోగి అయినా అహంకారం వదలదు అన్నాడట .అప్పుడు అర్ధమయింది తన అహంకారానికి అంతం చేయటానికి రైతు వేషం లో లో వచ్చినవాడు సాక్షాత్తు  భగవంతుడే అని గ్రహిం చారు .ఏది దొరికితే అది తింటూ ఎక్కడ చోటు దొరికితే అక్కడే ఉంటూ పరమ హంస లా  అవధూత లాగా సంచరించారు .శిష్యుడు పొందిన ఉన్నత యోగ స్థితిని గుర్తించి తాను  ఆ ఉన్నతదశను  అందుకోలేక పోయానని బాధ పడే వారట .పుదుక్కొట రాజు తొండర మాన్ కు దక్షిణా మూర్తి మంత్రోపదేశం చేసినట్లు కనపడుతోంది .తంజావూర్ లో పున్ననల్లూర్ మరియమ్మ ,దేవ దాన పట్టిలో కామాక్షీ దేవాలయం ,తంజావూరులో నాలుకాల్ మండపం లో వెంకటేశ్వర దేవాలయం లో హనుమాన్ విగ్రహం ప్రతిస్టించ  టానికి ప్రోత్సహించారు .కుంభ కోణం లో తిరు రాఘ వెండ్ర రాహు స్థలం లో వెంకటేశ్వర  దేవాలయం లో మహా మహిమాన్విత గణపతి యంత్రాన్ని ప్రతిష్టించి అక్కడ గణపతిని ప్రతిష్టచేసి  దేవాలయం కట్టించారు .

బ్రహ్మేంద్ర యతి సాహిత్య వైభవం

జీవిత చరమాకం లో అవధూత గారు ‘’నేరూరు ‘’లో ఉండిపోయారు .తాను  మిధున మాసం లో శుద్ధ దశమి రోజున ముక్తి పొందుతానని ,ఆ రోజే కాశీ నుండి ఒక బ్రాహ్మణుడు ‘’బాణ లింగాన్ని ‘’తెస్తాడని ,దాన్ని తమ సమాధిపై ప్రతిస్టించమని శిష్యులకు ముందే చెప్పారు .వారు అన్నట్లే ఖచ్చితం గా జరిగింది. ప్రతి ఏడాది ఆ తిది నాడు  బ్రహ్మాండమైన  ఉత్సవం నిర్వ హిస్తారు .

సదాశివేంద్ర యతి రచించిన పుస్తకాలు అనేకం ఉన్నాయి .బ్రహ్మ సూత్రాలపై ‘’బ్రహ్మ తత్వ ప్రకాశిక ‘’,వ్యాఖ్యానం ,’’యోగ సుధాకరం ‘’,అని పతంజలి సూత్రాలకు వ్యాఖ్యానం ,’’సిద్ధాంత వల్లి ,’’కేసర వల్లి ,అనే రెండు గ్రంధాలను అప్పయ్య దీక్షితుల సిద్ధాంతాలకు సంగ్రహ రూపాలుగా రాశారు .’’నవ మణి మాల ‘’,ఆత్మాను సంధానం ,స్వప్నోదితం ,స్వాను భూతి ప్రకాశిక, ఆత్మ విద్యా విలాసం ,రాశారు ఇవి కాక ద్వాదశోప షత్తులపై వ్యాఖ్యానాలు రచించారు .పురాణాలలో ఉన్నఅపూర్వ  అద్వైత వేదాంత  విశేషాలను సేకరించి గ్రంధస్తం చేశారు .హాయిగా తేలికగా భజనరూపం లోఅద్వైత వేదాంతాన్ని  పాడుకొనే పాటలుగానూ రాశారు .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -15-12-14-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -92 – 138-తెనాలి రాముని కధలను సంస్కృతీకరించిన ఆ జన్మ సిద్ధ కవి –సన్నిధానం సూర్య నారాయణ శాస్త్రి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -92

138-తెనాలి రాముని కధలను సంస్కృతీకరించిన ఆ జన్మ సిద్ధ కవి –సన్నిధానం సూర్య నారాయణ శాస్త్రి

గోదావరి జిల్లా కండ్రిక అగ్రహారం లో సన్నిధానం సూర్య నారాయణ శాస్త్రి గారు సుబ్బయ్య ,బుచ్చి నరసమ్మ దంపతులకు 10-12-1897 న జన్మించారు .కృష్ణా జిల్లా చిరివాడ వాస్తవ్యులు శతావధాని వేలూరి శివ రామ శాస్త్రి గారి వద్ద కావ్య ,నాటక అలంకార  వ్యాకరణ శాస్త్రాలు అధ్యయనం చేశారు .తిరుపతి ,మద్రాస్ ప్రాచ్య కళాశాలలలో చదివి శిరోమణి ,విద్వాన్, పి.ఒ.ఎల్.మొదలైన పరీక్షలు రాసి ఉత్తీర్ణులయ్యారు .సికందరాబాద్ మహబూబ్ కాలేజి హైస్కూల్ లో ఉపాధ్యాయులుగా చేరి ముప్ఫై అయిదేళ్ళు పనిచేశారు .తర్వాత రావు బహద్దర్ వెంకట రామ రెడ్డి కాలేజిలో సంస్క్రుతోపన్యాసకులుగా 1954 నుండి ఎనిమిదేళ్ళు ఉన్నారు .

శాస్త్రి గారి భార్య అకాల మరణం చెందారు .ఈ బాధను మర్చిపోవటానికి సాహిత్య రచన ప్రారంభిం చారు .రచన అంటే వీరికి నిద్రా హారాలు గుర్తుకు రావు .అలా పని చేసి రామ రాజ భూషణుని ‘’కావ్యాలంకార సంగ్రహం ‘’కావ్యానికి సమగ్ర మైన వ్యాఖ్య రాసి సమర్ధత ను రుజూవు  చేసుకొన్నారు .ఈ అపూర్వ గ్రంధం ప్రాచ్య ,పాశ్చాత్య ఆలంకారికుల పాలిటి చింతామణి , కల్ప వృక్షమే, కామ దేనువే  అయింది .వీరి ‘’తత్సమ చంద్రిక ‘’వ్యాకరణ గ్రంధం వ్యాకరణ శాస్త్రం లో తలమానిక మైనది .చిన్నయ సూరి బాలవ్యాకరణానికి కూడా వ్యాఖ్యానం రాశారు .సంస్కృతాంధ్ర వ్యాకరణాలు మొత్తం చదివి అర్ధం చేసుకొని వ్యాఖ్యానించి రాసిన శాస్త్రి గారి పై రెండు గ్రంధాలు వ్యాకరణ విద్యార్ధులకు ,వ్యాకరణం బోధించే పండితులకు శిరో దార్యాలుగా నిలిచాయి .

శాస్త్రి గారు సంస్క్తుతం లో 20 కి పైగా గ్రంధాలు రచించారు .తెలుగులో 25వరకు అరుదైన పుస్తకాలు రాశారు .రెండు భాషల లోను వీరు రచించిన గ్రంధాలు మృదు మధుర శైలిలో ఉండి  రసజ్నులను ఆకట్టుకొన్నాయి .వీటిలో కొన్ని ముక్తకాలు, కొన్ని ఖండకావ్యాలు ఉన్నాయి .తెలుగు నుంచి సంస్కృతం లోకి ,సంస్కృతం నుండి తెలుగు లోకి శాస్త్రి గారు తర్జుమా చేసిన గ్రందాలెన్నో ఉన్నాయి .అంటే అనువాదకులుగా శాస్త్రిగారు గొప్ప కృషి చేశారు .రచనలన్నీ శిష్ట వ్యాకరణ ప్రయోగాలతో ఉంటాయి. అందుకే వీరిని ‘’ఆ జన్మ సిద్ధ కవి ‘’అన్నారు .జాతక కధలను కొన్నిటిని ‘’జాతక కదా గుచ్చం ‘’పేరుతొ సంతరించారు .’’గోవర్ధనుడి ‘’సప్త శతీ సారం ‘’ను తెలుగు లోకి అనువాదం చేశారు . ముక్కు తిమ్మన పారిజాతాపహరణం ను ‘’భర్త్రు దానం ‘’గాను ,పోతన గారి కొన్ని భాగవత ఉపాఖ్యానాలను ‘’భాగవతాను వాదః ‘’,పింగళి సూరన కళా పూర్ణోదయ ప్రబంధాన్ని ‘’కళా పూర్ణోదయం ‘’గా సంస్కృతీకరించారు .దీని వలన తెలుగు కవుల ప్రబంధ నిర్మాణ సౌందర్యాన్ని యావద్భారత సంస్కృత పండితులకు మ్రుస్టాన్న భోజనం గా అందజేశారు .రుక్మిణీ కళ్యాణం ను ‘’కీర సందేశం ‘’గా ,రాశారు .ద్వంద్వ యుద్ధం ,ఖడ్గ తిక్కన ,వాసవ దత్త ,రేణుక విజయం వివేకానందం అనే సుప్రసిద్ధ రచనలు చేశారు .

అమృత కణాలు ,స్మరగీతి ,మొదలైన ముక్తక సంకలనాలు తెచ్చారు .’’నది మంత్రపు సిరి ‘’అనే అధిక్షేప కావ్యాన్ని రాశారు .తెలుగు లోని మను చరిత్రాది పంచ మహాకావ్య కధలను ‘’ఆంధ్ర ప్రబంధ కధలు ‘’గా రాశారు .దీనినే ‘’ఆంద్ర కావ్య కతాః’’గాను ,తెనాలి రామ కృష్ణుని కధలను ‘’ఆంద్ర దేశ హాస్య కదాః ‘’గా ను సంస్కృతం లో రాసి ఆ భాషాభిమానులకుతెలుగు రుచి చూపించి  పరిచయం చేశారు .శాస్త్రి గారు ‘’కాదంబరీ పరిణయః ‘’అనే స్వతంత్ర సంస్కృత నాటకం రాశారు .స్వంత తెలుగు రచనలను సంస్కృతం లో కి అనువదించుకొన్న వారిలో సూర్య నారాయణ శాస్త్రి గారే ప్రప్రధములు .ఆ కీర్తి చిరస్మరణీయం .

వన పర్తి ,గద్వాల ,సంస్థానాధీశులు శాస్త్రి గారిని ఆహ్వానించి  గౌరవించి సత్కరించారు .ప్రతి ఏటా వార్షికాలు ప్రదానం చేశారు .ఎందరో జమీన్ దారులు ,సాహిత్య సంస్థలు శాస్త్రిగారిని సన్మానించాయి .ఆంద్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ లో విశిష్ట సభ్యులను చేసి ప్రభుత్వం గౌరవించింది .ఖమ్మం జిల్లా ఇల్లెందువిద్వత్ సమావేశం లో ‘’విద్యా రత్న ‘’బిరుదు అందుకొన్నారు .ఆఖరి శ్వాస వరకు సాహిత్య జీవనం సాగించిన సాహిత్య్పజీవి సన్నిధానం సూర్య నారాయణ శాస్త్రి గారుఎనభై  అయిదేళ్ళు జీవించి 14-10-1982న సరస్వతీ సన్నిధానం చేరారు .వారి లోటు సాహిత్య లోకం లో తీరనిదిగా మిగిలిపోయింది .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -15-12-14-ఉయ్యూరు

 

.

 

 

 

.

 

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

సంగీత దర్శకుడు చక్రి ఆకస్మిక మృతి

మ్యూజిక్‌ డైరెక్టర్‌ చక్రి కన్నుమూత..

ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ చక్రి (40) ఈరోజు ఉదయం మృతి చెందారు. గుండె పోటుతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చక్రి తుది శ్వాస విడిచారు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్ర్బాంతికి గురైంది. చక్రి అసలు పేరు చక్రధర్‌ జిల్లా. చక్రి జూన్‌ 15న 1974 వరంగల్‌ జిల్లాలోని మహబూబాబాద్‌లో జన్మించారు. పూరిజగన్నాథ్‌ దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా నటించిన ‘బాచి’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు సంగీత దర్శకుడిగా పరిచయమైన చక్రి…ఎన్నో మ్యూజికల్‌ హిట్స్‌ అందించారు. ఇప్పటి వరకు చక్రి 85 సినిమాలకు మ్యూజిక్‌ అందించారు. చక్రి సంగీతం అందించిన చివరి చిత్రం దర్శకరత్న దాసరినారాయణరావు రూపొందించిన ‘ఎర్రబస్సు’ సినిమాకి చక్రి మ్యూజిక్‌ సమకూర్చారు. ఇడియట్‌, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, సత్యం, శివమణి, దేశముదురు వంటి చిత్రాలను మ్యూజికల్‌ హిట్స్‌గా నిలబెట్టారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ‘సింహా’ సినిమాకుగాను చక్రి అందించిన స్వరాలకు నంది అవార్డు అందుకున్నారు. సత్యం చిత్రంలో ఆయన గాయకుడిగా పాడిన పాటకు ఫిలింఫేర్‌ అవార్డు కూడా అందుకున్నారు.
ప్రముఖ సంగీత దర్శకుడు చక్రికి చిత్ర పరిశ్రమ సంతాపం..

ప్రముఖ సంగీత దర్శకుడు చక్రికి మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. చక్రి మృతి పట్ల మెగాస్టార్‌ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, నిర్మాత రామానాయుడు, దర్శక రత్న దాసరి నారాయణరావు, నటులు రవితేజ, అల్లు అర్జున్‌, సాయి ధరమ్‌ తేజ్‌, దర్శకుడు మారుతి, సంగీత దర్శకురాలు శ్రీలేఖతో సహా పలువురు చిత్ర పరిశ్రమ సంతాపం వ్యక్తం చేశారు. చక్రి మరణ వార్త విని నమ్మలేకపోయానని చిరంజీవి అన్నారు. చక్రి చాలా మంచి వ్యక్తి, అలాంటి వ్యక్తి దూరం కావడం బాధకరమని నిర్మాత రామానాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. చక్రి నాకు తమ్ముడు లాంటివాడని, చక్రికి నేను పెద్ద అభిమానిని, తను లేని లోటు తీర్చలేనిది అని బాలకృష్ణ సంతాపం వ్యక్తం చేశారు. చక్రి లేడనే వార్తను నేను నమ్మలేక పోతున్నానని సంగీత దర్శకురాలు శ్రీలేఖ అన్నారు. చక్రి మన మధ్య లేకపోయినా..ఆయన అందించిన పాటల్లో బతికే ఉన్నారు. ‘జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది’ అంటూ ఆయన ఎందుకు కంపోజ్‌ చేశారో తెలియదు కానీ అది సరిగ్గా ఆయనకే వర్తిస్తుందనుకుంటున్నానని శ్రీలేఖ సంతాపం తెలిపారు.
చక్రి మృతి పట్ల పూరి తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ – ”నా సోదరుడు (చక్రి)ని చాలా మిస్ అవుతున్నాను. మా ఇద్దరి కెరియర్ ఒకేసారి ఆరంభమయ్యింది, ఎన్నో అనుభూతులు పంచుకున్నాం. నా సినిమాలకు ఎన్నో మంచి పాటలిచ్చారు” అని పేర్కొన్నారు.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వెండి తెర జడ్జి పి జె. శర్మకు కి వెయ్యి అవమానాలు

వెండితెర జడ్జి

ఆదివారం మృతి చెందిన పి.జె. శర్మ పూర్తి పేరు పూడిపెద్ది జోగేశ్వరశర్మ. విజయనగరం జిల్లా కల్లేపల్లిలో పుట్టి పెరిగిన శర్మ మొదట రంగస్థలంపై పేరు తెచ్చుకొని, సినీ నటుడు కావాలనే సంకల్పంతో మద్రాస్‌ వెళ్లారు. ‘ఇల్లరికం’లో కథానాయకుడు అక్కినేని నాగేశ్వరరావు స్నేహితుల్లో ఒకడిగా చేసిన చిన్న పాత్రతో నటునిగా పరిచయమయ్యారు. శ్రీశ్రీ, ఆరుద్ర ఆయనకు సమీప బంధువులు. అప్పట్లో శ్రీశ్రీ తెలుగు డబ్బింగ్‌ సినిమాలతో బిజీగా ఉండేవాళ్లు.
నటుడిగా అవకాశాలు రాక ఇబ్బందులు పడుతున్న శర్మను డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా ప్రయత్నించమని సలహా ఇచ్చింది వాళ్లే. అలా కంఠమే పెట్టుబడిగా ఆయన డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా మారి, బిజీ అయ్యారు. తన కెరీర్‌లో దాదాపు వెయ్యి సినిమాల్లో వివిధ పాత్రలకు ఆయన తన కంఠాన్ని అరువిచ్చారు. అయితే నటుడిగా పేరు సంపాదించుకోవాలనేదే ఆయన ప్రగాఢ వాంఛ. కానీ వందలాది సినిమాలు చేసినా, ఆయనకు బలమైన పాత్రనిచ్చేవాళ్లే లేకపోయారు. నటునిగా ఆయనది విఫల చరిత్ర. సాధారణంగా ఆయన దగ్గరకు వచ్చేవి జడ్జి పాత్రలు, డీజీపీ, ఐజీ స్థాయి పోలీసు పాత్రలు వంటి హుందా పాత్రలే. చేసినవాటిలో కాస్త మెరుగైనవి ‘తల్లి ప్రేమ’, ‘తుకారాం’, ‘దాన వీర శూర కర్ణ’, ‘ఎర్ర మల్లెలు’, ‘కలెక్టర్‌ జానకి’ వంటి చిత్రాల్లో చేసిన పాత్రలు.
అడుగడుగునా అవమానాలే

అప్పట్లో చెన్నైలోని తేనాంపేటలో ఉన్న ఫిల్మ్‌చాంబర్‌ ప్రివ్యూ థియేటర్‌లో సినిమాల ప్రివ్యూలు ప్రదర్శించేవాళ్లు. తను నటించిన సినిమాల ప్రివ్యూలకు కుటుంబంతో కలిసి వెళ్లే ఆయనకు అవమానాలు ఎదురయ్యేవి. కుర్చీలు నిండాక ఎవరైనా ప్రముఖులు వస్తే, మొదట కుర్చీల నుంచి లేపేది శర్మ కుటుంబాన్నే. వాళ్లను నిల్చుని చూడమని చెప్పేవాళ్లు, లేదంటే బయటకు వెళ్లమనేవాళ్లు. ఈ అవమానాలు తట్టుకోలేక ఆయన ప్రివ్యూలకు వెళ్లడం మానేశారు. ‘‘ఆ రోజుల్లో మా అమ్మానాన్నలకు గౌరవప్రదంగా ప్రివ్యూ చూపించాలనేది నా కల. చెన్నైలోని దేవి-శ్రీదేవి ప్రివ్యూ థియేటర్‌లో నా ‘పోలీస్‌ స్టోరీ’ని వాళ్లకు చూపించడం ద్వారా ఆ కలను నిజం చేసుకున్నా. థియేటర్‌లో అమ్మానాన్నలిద్దరే కూర్చుని సినిమా చూశారు. నేను కూడా వాళ్ల పక్కన కూర్చోకుండా, ప్రొజెక్షన్‌ రూమ్‌లో కూర్చున్నాను’’ అని చెప్పారు సాయికుమార్‌. తన కెరీర్‌లో శర్మ మంచి అవకాశాల కోసం మధనపడని రోజు లేదు. ఏదైనా సినిమా ప్రారంభమైతే, అందులో తనకు పాత్ర ఉంటుందా, ఒక వేళ ఉంటే, దానికి నాలుగు డైలాగులన్నా ఉంటాయా, లేదా అని మధనపడేవాళ్లు. ఆయన గంభీరమైన గొంతును ఉపయోగపెట్టుకొనే పాత్రలు రాకపోవడం నిజంగా విచారించదగ్గ విషయం.
ఆజానుబాహువైన ఆయన బూట్ల సైజు 11 అంగుళాలు. ఆ సైజు బూట్లను తెప్పించకుండా సొంత బూట్లనే తెచ్చుకోమనేవాళ్లు ప్రొడక్షన్‌ మేనేజర్లు. అంతేకాదు, ఎక్కువ సందర్భాల్లో సొంత కాస్ట్యూమ్స్‌నే ఆయన వాడాల్సి వచ్చేది. ఇంతాచేసి, ఆ పాత్ర చేశాక, సినిమాలో అది ఉంటుందా, ఎడిటింగ్‌లో పోతుందా అనే టెన్షన్‌ కూడా ఆయనను వేధించేది. ఎందుకంటే సినిమా నిడివి ఎక్కువైనప్పుడు ఎడిటింగ్‌లో ఆయన పాత్రను తీసేసిన సందర్భాలు కూడా తక్కువేమీ కాదు. ఆయన నటించిన సినిమాలు వంద రోజుల వేడుక జరుపుకున్నప్పుడు జ్ఞాపిక ఇచ్చినట్లే ఇచ్చి, ఆయన వేదిక దిగాక, ఆయన చేతుల్లోంచి నిర్వాహకులు ఆ జ్ఞాపికను తిరిగి తీసేసుకున్న సందర్భాలూ ఎక్కువే. అలాగే ఆ వేడుకల తర్వాత యూనిట్‌కు ఏర్పాటుచేసే పార్టీకి ఎవరైనా ముఖ్యమైన వాళ్లు వస్తే టేబుల్‌ దగ్గర నుంచి మొదట లేవమని చెప్పేది కూడా ఆయననే. శర్మ ఎదుర్కొన్న ఇలాంటి అవమానకర సంఘటనలకు ఆయనతో పాటు కలిసి తిరిగే ఆయన పెద్ద కుమారుడు సాయికుమార్‌ ప్రత్యక్ష సాక్షి. అందుకే తన కుమారులు సినిమాల్లోకి రావాలని శర్మ కోరుకోలేదు. కానీ ఆయన అనుకున్నట్లు జరగలేదు. ముగ్గురు కొడుకులూ సినిమాల్లోనే కెరీర్‌ను వెతుక్కోవడం విధి వైచిత్రి.
సంతాపం

పి.జె. శర్మ మృతికి చిరంజీవి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆదివారం శర్మ అంత్యక్రియలకు ముందు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించిన చిరంజీవి, ఆయనకు శ్రద్ధాంజలి ఘటించి, కుటుంబ సభ్యులకు తన సానుభూతి తెలిపారు. అలాగే ఓ ప్రకటనలో శర్మ మృతి పట్ల మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మురళీమోహన్‌, అలీ సంతాపం తెలిపారు.
  
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాచకొండను రక్షించు కొందాం

rachakonda1 001 rachakonda2 001 rachakonda3 001 rachakonda4 001 rachakonda5 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం – 91 – 137-స్వర్ణ కమల గ్రహీత ,, నడిచే పాణిని –పేరి సూర్య నారాయణ శాస్త్రి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం –   91

137-స్వర్ణ కమల గ్రహీత ,, నడిచే పాణిని  –పేరి సూర్య నారాయణ శాస్త్రి

 

గురుముఖ విద్య

20-8-1910జన్మ దినం గా కల పేరి సూర్య నారాయణ శాస్త్రి గారు విజయ నగరం జిల్లా పెదనందిపల్లిలో సర్వేశం ,సోమమ్మ దంపతులకు జన్మించారు .పేరి అప్పల నరసయ్య శాస్త్రి గారివద్ద కావ్య నాటక ,అలంకారాలను అధ్యయనం చేశారు .పేరి వెంకటేశ్వర శాస్త్రిగారి నుండి భాష్యంత వ్యాకరణంఅభ్యసించారు .’’వైయాకరణ భూషణ సారం ‘’ ,’’లఘు మంజూష ‘’,శబ్ద కౌస్తుభ ‘’,,’’భాట్ట దీపిక ‘’,’’కావ్య ప్రకాశిక ‘’,’’రస గంగాధరం ‘’గ్రంధాలను తాతారాయుడు శాస్త్రిగారి శిష్యరికం లో నేర్చారు .’’ఖండన అద్వైత ప్రస్తానం .’’,చతుస్తంత్రి ‘’,’’న్యాయ కాణాది ‘’మున్నగు వానిని పేరి లక్ష్మీ నారాయణ శాస్త్రి ,కొల్లూరు  సోమ శేఖర శాస్త్రి ,కొల్లూరు లక్ష్మణ మూర్తి శాస్త్రి ల నుండి గురుముఖతా అధ్యయనం చేశారు .

వ్యాకరణ బోధనా సామర్ధ్యం –

విద్యార్ధిగా ఉంటూనే ఉద్యోగం చేశారు .సింహాచల సంస్కృత పాఠ శాల అధ్యాపకులయ్యారు ..1940విజయ నగర మహారాజా వారి సంస్కృత కళాశాలలో అధ్యాపకుగా నియమింప బడ్డారు .ముప్ఫై ఏళ్ళు విద్యా బోధన కొనసాగించారు  వేలాది మంది  ప్రతిభా వంతులైన శిష్యులను తయారు చేశారు .’’కౌముది ‘’అంటే ఇనప ముద్ద అని భయపడే వారు బోధకులు అలాంటి అయః పిండమైన కౌముదిని వెన్నెల అంత ఆహ్లాదం గా శాస్త్రి గారు బోధించి మనసుకు ఆహ్లాదం కలిగించేవారు .ఒక రకం గా ‘’కౌముది శాస్త్రి ‘’గారు అనిపించుకొన్నారు .

అమూల్య గ్రంధ రచనా పాటవం

విద్యా బోధనా కొన సాగిస్తూనే అమూల్య గ్రంధ రచనా చేశారు .సంస్కృత భాషలో ‘’నాగేష లఘు మంజూష ‘’కు ‘’నాగేశ భావ ప్రకాశ వ్యాఖ్య ‘’,’’వైయాకరణ భూషణ సారం ‘’కు ‘’తత్వ దర్శిని ‘’వ్యాఖ్య ,’’’’ఖండ దేవా భట్ట రహస్యం ‘’కు ‘’భావ ప్రకాశ వ్యాఖ్య ‘’’’వైయాకరణ భూష సారం ‘’కు’’తత్వ దర్శిని వ్యాఖ్య ‘’,’’ఖండదేవ భాట్ట రహస్యం ‘ ‘’రచించిన మహా పండితులు సూర్య నార్యయన శాస్త్రి గారు .తెలుగు భాషలో న్యాయ ,వైశేషిక ,సాంఖ్య,పూర్వ మీమాంస ,ఉత్తర మీమాంస లకు వ్యాకరణ శాస్త్రాన్నికూడా జోడించి ‘’  షడ్ దర్శనములు’’ పేరిట అనువదించారు ‘’వ్రుత్తి విచార’’అనే గ్రంధం  ‘’పంచ వృత్తి  విచారం ‘’కు ఆంధ్రానువాదం గా రచించారు .పతంజలి మహర్షి ‘’అద్వైత ప్రకరణం ‘’ను ‘’ఆంద్ర వివరణ సారం ‘’,’’పరమార్ధ సారం ‘’గా తెలిగీకరించారు .’’భర్త్రు హరి వాక్య నదీయం ‘’ను  శ్రీభాష్యం అప్పలాచార్యుల వారితో కలిసి అనువదించారు .’’కుమార సంభావ విమర్శ ‘’ను శాస్త్రిగారు రాశారు .పత్రికలకు అనేక వ్యాసాలు రాశారు. అందులో ముఖ్యమైనవి ‘’స్పాటి స్పోటనం ,’’బహువ్రీహి సమాసం’’ బాగా ప్రసిద్ధి చెందాయి .ఆంధ్రా యూనివర్సిటి సైన్స్ అధ్యాపకులు వసంత రావు వెంకట రావు గారితోకలిసి ఆంద్ర ప్రభ లో ‘’కాల తత్త్వం ‘’ధారా వాహిక గా రాశారు .’’కౌముదికి ‘’తెలుగులో సులభ విధానం ‘’లో ‘’వ్యాకరణ సిద్ధాంత మంజరి ‘’పేరిట అనువాదం చేశారు .రసగంగాధర వ్యాఖ్యలన్నీ క్రోడీకరించి ‘’జగన్నాధ గూడార్ధ దీపిక ‘’రాసి జగన్నాధ పండితుని శేముషీ వైభవాన్ని ఆవిష్కరించి తన ఆరాధనా భావాన్ని చాటుకొన్నారు .

జంగమ పాణిని- అలంకారాలైన  బిరుదులు  సత్కారాలు

ఈ ప్రతిభను గుర్తించి శృంగేరీ పీఠాదిపతులు శాస్త్రి గారిని ‘’జంగమ పాణినః ‘’అంటే ‘’నడిచే పాణిని ‘’. ,అని గౌరవించి ఘనం గా సత్కరించారు .మన రాష్ట్రం లోనే కాకుండా ఉజ్జయిని జయపూర్ , ,పూనా మున్నగు ప్రదేశాలలో జరిగిన విద్వత్ సభలకు ఆహ్వానింపబడి  సన్మానితులయ్యారు .శాస్త్రి గారికి గొప్ప నటనా కౌశలం దర్శ కత్వ ప్రతిభా ఉన్నాయి ఉజ్జయిని నగరం లో 14 రాష్ట్రాల మధ్య ‘’కాళిదాస అభిజ్ఞాన శాకుంతల ‘’నాటక పోటీ జరిగితే అందులో ‘’రాజ పురోహితుడు ‘’గా నటించి నాటకాన్ని నిర్వహించి ప్రధమ స్థానాన్ని ఉత్తమ ప్రదర్శనకు ఉత్తమ నటనకు ఎంపికై ‘’స్వర్ణ కమలం ‘’బహుమతిగాపొందిన విశేష ప్రజ్ఞా శీలి .

వ్యాకరణ రత్న ,వ్యాకరణాచార్య ,ఉపనిషద్ధర్మ వాచస్పతి ,దర్శనా చార్య ,పద వాక్య ప్రమాణజ్న వంటి సార్ధక బిరుదులెన్నో శాస్త్రిగారిని వరించి  సార్ధకమై ,గౌరవం పొందాయి .’’విశ్వ సంస్కృత భారతి ‘’సంస్థ శాస్త్రి గారిని సగౌరవం గా ఆహ్వానించి లక్ష రూపాయల నగదు ప్రశంసా పత్రం అందజేసి సత్కరించింది .కాశీ  విశ్వవిద్యాలయం ‘’మహా మహోపాధ్యాయ ‘’గౌరవ బిరుదునిచ్చి గౌరవించి సన్మానించింది .అరవై వ ఏడు మీద పడినా , పదవీ విరమణ చేసినా శాస్ట్రి గారు  శిష్యులకు బోధించటం మాన లేదు .సంస్కృత బోధనా చేస్తూనే ఉన్నారు .రాజమండ్రి గౌతమీ విద్యా పీఠం,మంత్రాలయం ,తిరుపతి కేంద్రీయ విద్యా పీఠాలలో సంస్కృతం బోధిస్తూనే ఉన్నారు .అదే వారికి మహదా నందమైన వ్యాపకం గా ఉండేది .

ఎనభై అయిదేళ్ళు చక్కని ఆరోగయం తో   జీవించి ,అధ్యయన ,అధ్యాపన, గ్రంధ రచనలను నిరంతరం కొనసాగించి సార్ధక జీవి అనిపించుకొన్న పేరి సూర్య నారాయణ శాస్త్రిగారు1995 సెప్టెంబర్ లో ‘’సవిత్రు మండల నారాయణ మూర్తి ‘’ని చేరుకొన్నారు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -15-12-14-ఉయ్యూరు

.

 

 

 

.

 

 

ణం

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సరసభారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు 74 వ సమావేశం – దర్శనీయ దైవ క్షేత్రాలు గ్రంధా విష్కరణ సభ – ఆహ్వానం

promplet sarasabharathi


0001invitation 1 001invitation 2 001invitation 3 001


Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

బాపు పేరు వెనక ఏముందో చెప్పిన -ప్రొఫైల్ఆర్టిస్ట్ శంకర నారాయణ –

పేరు వెనక…

మర్రిచెట్టు కింద ఏ మొక్కా ఎదగదని నానుడి ఉంది. కానీ ఆ మహా మర్రి వృక్షం స్వయంగా వంగి తన కంటే చిన్నవాడ్ని చేయి పట్టి నడిపించింది. రేఖా చిత్రాలు ఎలా గీయాలో చూపింది. కొంత కాలానికి ‘ఒట్టి రేఖా చిత్రాలేనా? రంగులు కూడా వేయరా!’ అంటూ ప్రోత్సహించింది. ఆ మహా వృక్షం పేరు ‘బాపు’. ఆయన తమ్ముడు శంకరనారాయణ కూడా చేయి తిరిగిన చిత్రకారుడు. బాపు ప్రథమ జయంతి సందర్భంగా అన్నయ్య జ్ఞాపకాలు ఆయన మాటల్లోనే…  
‘‘మేం నలుగురు అన్నదమ్ములం, ఒక అక్క. ఆమే అందరి కంటే పెద్దది. మా బాల్యం మద్రాసులోనే గడిచింది. పుట్టింది నరసాపురంలో అయినా, పెరిగిందంతా ఇక్కడే. ప్రతి వేసవిలో ఊరికి వెళ్లే వాళ్లం. అక్కడ ‘స్టీమర్‌ స్ర్టీట్‌’ అని గోదావరి ఒడ్డున ఓ వీధి ఉండేది. మా ఆరుగురు మావయ్యలు అక్కడే ఉండేవారు. అక్కడికి వెళ్లినప్పుడు గోదావరి, లాంచీలు, పడవలు చూడ్డం సరదాగా ఉండేది. నేను, బాపు గోదావరిలో ఈతకు వెళ్లేందుకు భయపడి అటు వైపు వెళ్లేవాళ్లం కాదు.

బాపు – కలం పేరు కాదు…
మా నాన్నకు గాంధీ గారంటే చాలా అభిమానం. అందువల్లే అన్నయ్యను ముద్దుగా ‘బాపు’ అని పిలిచేవారు. అంతేకానీ అది మా అన్నయ్య కలం పేరు కాదు. చిన్నతనంలో కాస్త నల్లగా ఉన్నా… బొద్దుగా ముద్దుగా ఉండేవాడు బాపు. అన్నయ్య బాగా అల్లరి చేసేవాడు. ఆ అల్లరి భరించలేక మా అమ్మ తాడుతో స్తంభానికి కట్టేసేది. చిన్నతనం నుంచీ బాపుకి పట్టుదల చాలా ఎక్కువ. ఒక పని అనుకుంటే జరిగి తీరాల్సిందే. అందుకోసం ఎంతో శ్రమించేవాడు. బీచ్‌కి వెళ్లినా అక్కడ కూడా పుస్తకాలు చదువుకుంటూ, బొమ్మలు వేసేవాడు. బొమ్మల వ్యామోహం ఎంతలా ఉండేదంటే మా నాన్నగారి కోర్టు కాగితాలపైనా వేసేవాడు. నాన్న కోప్పడి, అరిచేవారు కానీ తన క్లయింట్‌లకు మాత్రం ‘చూడండయ్యా, మా వాడు వేశాడు’ అని వాటిని చూపించి, మెచ్చుకునేవారు. మా నాన్న, చిన్నాన్న (బుచ్చిబాబు) కూడా చిత్రకారులే.
‘లా’ చదివారు కానీ…
చిన్నతనంలో ఆర్ట్‌ స్కూల్‌లో చదువుకోవాలనుకునేవాడు. కానీ పరిస్ధితులు అనుకూలించక ఆ కోరిక తీరలేదు. మా నాన్న తన 49వ ఏటే పోయారు. నాన్న మమ్మల్ని బాగా చదువుకోవాలని చెప్పేవారు. అందుకే అన్నయ్య ‘లా’ చదివాడు. లాయరుగా పేరు నమోదు చేసుకున్నప్పటికీ ప్రాక్టీస్‌ మాత్రం చేయలేదు. కుటుంబ పోషణార్థం సంపాదన మొదలుపెట్టాడు. ‘ఆనంద వికటన్‌’లో పనిచేసిన ‘గోకుల్‌’ అనే చిత్రకారుడంటే ఆయనకెంతో ఇష్టం. ఇటీవల నేనాయన్ని కలిసినపుడు ‘ప్రపంచంలో బాపు వంటి చిత్రకారుడు లేడయ్యా, అన్ని రంగాల్లో ఇంతటి నైపుణ్యం చూపిన వారే లేరు. మీ వాడికి సమస్తం వచ్చు’నని మెచ్చుకున్నారు.
సమయపాలన ముఖ్యం
అన్నయ్య తన సంపాదనలో ఎక్కువ భాగం పుస్తకాలకే ఖర్చు చేశాడు. విదేశాలకు వెళ్లేవాళ్లకి ‘ఫలానా పుస్తకం అక్కడ దొరుకుతుందట, తీసుకురండి’ అని చెప్పేవాడు. సమయపాలనకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చేవారు. ఐదు గంటలకు వస్తామని ఎవరైనా చెప్తే.. పది నిమిషాలు ముందే వారికోసం తయారై ఎదురు చూసేవాడు. వాళ్లు రావడం ఆలస్యమయితే.. చిరాకు పడిపోయేవాడు. తను ఎవరినైనా కలుస్తానని మాటిస్తే ఆ సమయానికి సిద్ధంగా ఉండేవాడు. బొమ్మలు, పుస్తకాలతో పాటు సంగీతమంటే కూడా చాలా ఇష్టం. చిన్నపుడు మౌత్‌ఆర్గాన్‌ బాగా వాయించేవాడు. ఖరీదైన హార్మోనియం కూడా ఉండేది. అన్నయ్య మంచి ఫోటోగ్రాఫర్‌ అనే విషయం చాలామందికి తెలియదు. నేను ఎంఏ చదివిన తరువాత ఉద్యోగం రాక ఆరు సంవత్సరాలు ఖాళీగా ఉన్నాను. ఆ రోజుల్లో పూర్తిగా
మర్రిచెట్టు కింద ఏ మొక్కా ఎదగదని నానుడి ఉంది. కానీ ఆ మహా మర్రి వృక్షం స్వయంగా వంగి తన కంటే చిన్నవాడ్ని చేయి పట్టి నడిపించింది. రేఖా చిత్రాలు ఎలా గీయాలో చూపింది. కొంత కాలానికి ‘ఒట్టి రేఖా చిత్రాలేనా? రంగులు కూడా వేయరా!’ అంటూ ప్రోత్సహించింది. ఆ మహా వృక్షం పేరు ‘బాపు’. ఆయన తమ్ముడు శంకరనారాయణ కూడా చేయి తిరిగిన చిత్రకారుడు. బాపు ప్రథమ జయంతి సందర్భంగా అన్నయ్య జ్ఞాపకాలు ఆయన మాటల్లోనే…
‘‘మా నాన్నంటే మాకందరికీ చాలా భయం. అందుకని మా నాన్నని ఏమైనా అడగాలంటే, నన్ను ముందుకు తోసి నా ద్వారా అడిగించేవాడు. లేదా మా బామ్మతో చెప్పించేవాడు. ఆయనకు కోపం ముక్కుమీదే ఉండేది. అదే బాపుకీ వచ్చింది. ఏ మాత్రం తేడా వచ్చినా కోపం వచ్చేస్తుంది. అయితే అదంతా కొన్ని క్షణాలే తరువాత తనే దగ్గరికి తీసేవాడు. నన్ను బొమ్మలు వేయమని బాపు-రమణ ఇద్దరూ ప్రోత్సహించేవారు. ఎలా వేయాలో బాపు గైడ్‌ చేసేవాడు’’
మా నాన్నగారు గతించిన ఏడాదిన్నరకే మరో అన్నకూడా చనిపోయారు. అప్పుడు బాపు మాకు పెద్దదిక్కయ్యాడు. ఎంత ఇబ్బంది ఉన్నా ఏనాడూ నిరుత్సాహంగా మాట్లాడేవాడు కాదు. బొమ్మలు గీయడం, రేడియో నాటికలు ఆయన వ్యాపకం. ఆయనే నాకు స్ఫూర్తి.
బాపు-రమణలతో ఉన్నాను. రమణగారిని సినిమా ఆఫీసులకు తిప్పడం, బాపు వేసిన బొమ్మలు పత్రికల ఆఫీసులకు తీసుకువెళ్లి ఇవ్వడం నా డ్యూటీ. ఆ తరువాత నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది.
కబుర్లు, షికార్లు రమణతోనే
బాపు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. ఇంట్లో పిల్లలతో కూడా అలానే ఉండేవాడు. కానీ అన్ని విషయాలు ఆయనకు తెలిసేవి. రమణగారే అంతా చూసుకునేవారు. మాతో సరదాగా ఉండేవారు. కబుర్లు, షికార్లు అన్నీ రమణతోనే. మా అమ్మ రమణను పెద్ద కొడుకనుకునేది. బాపు-రమణల మధ్య సంభాషణ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సాయంత్రాలు వాళ్లు మాట్లాడుకుంటూ ఉంటే ఎన్నో విషయాలు తెలిసేవి. ఇద్దరూ బాగా చదువుతారు కాబట్టి వాళ్ల మాటల్లో పలు అంశాలు చోటు చేసుకునేవి. అంత స్నేహంగా ఉన్నా, ఎవరి నిర్ణయాలు వారివే. ఇండివిడ్యువాలిటీ తప్పేవారు కాదు.
బొమ్మ వేయని రోజు లేదు
రవీంద్రభారతిలో నా బొమ్మల ప్రదర్శన జరిగినపుడు ఎవరికీ తెలియకుండా వచ్చి ప్రదర్శన తిలకించాడు. ‘నీ బొమ్మలు వారంవారం చూస్తున్నా, ఇన్ని బొమ్మలు ఇలా ప్రదర్శనగా చూడ్డం గొప్పగా ఉందిరా’ అన్నాడు. ఆ మెచ్చుకోలే నాకు గొప్ప బహుమతి. ఆ తరువాత 2008లో అనుకుంటా ‘ఎంతకాలం రేఖా చిత్రాలేనా! రంగులు ట్రై చెయ్‌రా!’ అంటూ ఉత్తరం రాశాడు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, బొమ్మ వేయకుండా ఉన్న రోజు లేదు. రమణ వెళ్లి పోయిన తరువాత శూన్యంగా మారిపోయాడు. అప్పటి వరకూ రమణ లేకుండా భోజనం కూడా చేసేవాడు కాదు. రమణ లేకపోవడం తీవ్రమైన వెలితిగా భావించేవాడు. నిరాడంబరంగా ఉండడం, మౌనంగా తన పని తాను చేసుకోవడం బాపుకి ఇష్టం. అలాగే ఉన్నాడు. అలాగే వెళ్లిపోయాడు.’’
మన్నవ గంగాధరప్రసాద్‌, చెన్నై

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

”బాపు అనిర్వచనీయుడు ”-వి ఏ కె రంగారావు

.ఏ నిర్వచనానికి లొంగని వారు
– విఏకె రంగారావు
‘‘బాపు-రమణలతో నా పరిచయం 1957 నాటిది. అప్పట్లో నేను ఆటోమొబైల్‌ ప్రొడక్ట్స్‌ ఆఫ్‌ ఇండియా అనే ఒక స్కూటర్‌ (లాంబ్రెట్టా) కంపెనీలో పనిచేస్తూ ముంబైలో ఉండే వాడ్ని. ఆ రోజుల్లో మల్లీశ్వరి సినిమాలో చిన్న నాగరాజుగా వేసిన నా స్నేహితుడు వెంకటరమణతో కలిసి ఇద్దరూ నేను ఉంటున్న పేయింగ్‌ గెస్ట్‌ గదికి వచ్చారు. అందులో ఒకరు బాపు. ఈ వెంకటరమణ గోవిందరాజు సుబ్బారావు తమ్ముడి కుమారుడు. పిల్లలు లేకపోవడంతో సుబ్బారావు పెంచుకునే వారు. ఈ వెంకటరమణ సోదరి బాపు భార్య. ఆ రోజు ముంబైలో కలవడానికి ముందే బాపు గారి కార్టూన్‌ కథ పుస్తకం ‘సుహేళి’ చూశాను అన్నాను. బాపు ‘చూశారా?’ అని సంతోషించారు. ఆ మధ్యలో రెండు సంవత్సరాలు బొబ్బిలిలో ఉంటూ, తరచూ మద్రాసు వెళ్లేవాణ్ని, ఆ రోజుల్లో బాపుతో పాటు వారి మేడ మీద ఉండే రమణను కూడా కలిసేవాణ్ని. చివరకు 1960లో నేను చెన్నైలో స్ధిరపడిన తరువాత బాపు-రమణలతో పరిచయం స్నేహంగా మారింది. వీరి ద్వారా నాకు మల్లాది రామకృష్ణ శాస్ర్తిగారు, పి.బి. శ్రీనివాస్‌, బెంగళూరుకు చెందిన సినిమా నిర్మాత, థియేటర్‌ యజమాని (బాపు రమణలకు మంచి మిత్రుడు) భక్తవత్సలం వంటి వారితో సాన్నిహిత్యం ఏర్పడింది. అంటే 1960 తరువాతే నాకు రామకృష్ణ శాస్ర్తిగారితో పరిచయం కలిగింది. అప్పటికే శాస్ర్తి గారి పేరుతో వచ్చిన ‘చిన్నకోడలు’, ‘రేచుక్క’, ‘రాజనందిని’ సినిమాలు నేను చూశాను. మల్లాది వారి రచన ‘రాజనందిని’ నాకు ఎంతో నచ్చిన సినిమా. ఆ సినిమా ఎక్కడ ఆడుతూ కనిపించినా చూశాను. బాపు-రమణలే నన్ను ఆంధ్రపత్రిక వీక్లీ సంపాదకులు శివలెంక రాధాకృష్ణగారికి ‘ఈయన రికార్డుల గురించి రాస్తా‘రని పరిచయం చేశారు. అపుడు నేను రాయవలసిన వ్యాసాలకు శీర్షికగా రమణ ఏవో పేర్లు చెప్పినా నాకు అంతగా నచ్చలేదు. రామకృష్ణ శాస్ర్తి గారే ‘సరాగమాల’ అన్నారు. వెంటనే అంగీకరించాను. తరువాత జ్యోతి మాసపత్రిక కోసం ఒకసారి కృష్ణ జయంతి సందర్భంగా కృష్ణునిపై ప్రత్యేక సంచిక ‘కృష్ణజ్యోతి’ తేవాలనుకున్నాం. దానికి రమణ సకాలంలో కథ ఇవ్వలేదు. కానీ మరో వారంలోనే కృష్ణునిపై రమణ రాసిన ‘కానుక’ అనే కథ వేరే వార పత్రికలో వచ్చింది, నాకు ఎంతో కోపం వచ్చి, ‘‘యు ట్రైటర్‌’’ అంటూ టెలిగ్రాం యిచ్చాను. ఆ తరువాత ఆ కథను రమణ ఒక పుస్తకంగా వేసి నాకే అంకితమిచ్చారు! అలాగే ‘ప్రేమించి చూడు’ షూటింగ్‌ సమయంలో హార్సిలీ హిల్స్‌లో ఏఎన్‌ఆర్‌తో అనుబంధం కూడా బాపు-రమణల ద్వారానే జరిగింది. అంతకు ముందు పరిచయం ఉన్నా, స్నేహంగా బలపడింది బాపు-రమణ ద్వారానే. ఇక నా ‘జనార్దనాష్టకం’ పుస్తకానికి అందమైన బొమ్మలు బాపు ఉచితంగా వేసిచ్చారు. బాపు-రమణలకు సంబంధించి వారి చిత్రాల్లో ‘వంశవృక్షం’, ‘గోరంత దీపం’ నాకు ఎంతో నచ్చుతాయి. ఒకసారి ‘పెళ్లి పుస్తకం’ సినిమాలో అనుకుంటాను ‘మంచిదినము నేడు’ అనే మూవనల్లూరు సభాపతయ్య గారి ‘పదం’ పెట్టాలన్నారు. నేను వద్దు అది చాలా స్లోగా ఉంటుంది. ఎవరూ యిష్టపడరు కొంత స్పీడున్న ‘కృష్ణం కలయ సఖీ సుందరం’ పెట్టమన్నాను. అయితే సినిమాలో ఆ పాటను వారు వాడుకున్న తీరు నాకు నచ్చలేదు. ఆదే వారికి చెప్పాను. మా మధ్య అన్నీ అంగీకారాలే అంటే అది అసత్యం. మేం ఎన్నో విషయాల్లో విభేదించుకునేవారం. కోతి కొమ్మచ్చిలో రమణ సూచనగా అన్నాడు కూడా ‘రంగారావు ఆయనతో ఆయనే ఏకీభవించడు’ అని. అంతవరకే. బుల్లెట్‌ సినిమాలో కూడా ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ పాటలో ‘అమరావతినగర అపురూప శిల్పాలు’ అని ఉంది. దీనిపై నాకు రమణ గారికి పెద్ద పంచాయతీ జరిగింది. అయితే రచయిత శ్రీరమణ మార్చాడు అన్నారు. టంగుటూరి సూర్యకుమారి పాడిన రికార్డు నావద్ద ఉంది అందులో ‘అమరావతి గుహల అపురూప శిల్పాలు’ అనే ఉంది. రచయిత రాసిన దానిని మార్చకూడదు అనేది నా వాదన. అంతవరకే, దీని వలన మా స్నేహానికి వచ్చిన యిబ్బంది ఏమీ లేదు. రమణ నన్ను ‘చిక్కి’ అంటారు. ఇతరులను నొప్పించే గుణం ఏమాత్రం లేదు. వీరు కళాకారులుగా నిర్వచనానికి అందరు. బాపు దర్శకత్వ ప్రతిభలో 20శాతం రమణకు, రమణ రచనా నైపుణ్యంలో 20 శాతం బాపుకీ దక్కుతుందని నా నమ్మకం. ఒక్కోసారి రమణ ఏమైనా అంటారు కానీ, బాపు దేనికి స్పందించరు. సినిమా బాగాలేదు అన్నా ‘అలాగా? సరే!‘ అంటారు. చాలా బావుంది అన్నా ‘అలాగా! సరే!’ అని నవ్వి ఊరుకుంటారు.
బాపు బొమ్మ అంత అందంగా బొమ్మ వేసేవారు లేదు. బాపు లాగా ‘పెర్స్‌పెక్టివ్‌’ తెలిసేలా చిత్రించిన వారు లేదు. దేశంలోనే అటువంటి చిత్రకారుడు లేడు. అమ్మాయి చదువుతుంటుంది, అటుపక్క తలుపు, ఓ దీపం, మరచెంబు, వాకిలి, గేటు వద్ద పూల తీగ వంటివి ‘ఒక ఫ్రేమ్‌’ చిత్రించడం బాపు ప్రత్యేకత. బాపుకి పాత హిందీ సినిమా సంగీతం తెలిసినంతగా మరో దర్శకునికి తెలియదు. ఆయన మా యింటికి వచ్చి ఎన్నో పాటలు స్వయంగా రికార్డు చేసుకువెళ్లేరు. బాపుకి గజళ్లపై కూడా మంచి పట్టుంది. ఒక్క సంగీత దర్శకుడు సత్యం గారికే అంతటి అవగాహన ఉండేది. రమణకు సినిమా పాటలు రాయడం యిష్టం లేదు. కానీ దగ్గరుండి మంచి పాటలు రాయించుకోగలరు. ‘సీతాకల్యాణం’, ‘సంపూర్ణరామాయణం’ రెండూ రామాయణ కథలే అయినా, వాటిని తీసిన పద్ధతిలో ఎంతో తేడా ఉంది. ‘బాపురమణీయం’ పుస్తకంలో తప్పులను సవివరంగా పేర్కొన్నపుడు కూడా అంతే, మరుసటి రోజు రమణ బొకే పట్టుకుని వచ్చి ‘‘చిక్కీ, నువ్వు రాసినట్లు మరెవ్వరూ రాయలేదు. అయితే, ఆ పుస్తకం మీద నువ్వు పెట్టినంత శ్రద్ధ మేం పెట్టలేదు’’ అన్నారు. మా మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నా అవి స్నేహానికి ఎన్నడూ అడ్డురాలేదు. రమణ రాసిన ‘కానుక’, ‘ఒకబృందావన విహారం’, ‘రాధా గోపాలం’ కథలు జీవితానికి దగ్గరగా ఉంటాయి. అవీ నాకు ఎంతో యిష్టం. మేం అప్పట్లో (1960-65) ఎల్‌ఫిన్‌స్టన్‌ థియేటర్‌ వద్ద సోడా ఫౌంటెన్‌కి (ఐస్‌క్రీం పార్లర్‌) తరచూ వెళ్లే వాళ్లం. అక్కడ లభించే ఫ్లేవర్స్‌ అంటే బాపు, రమణలకి ఎంతో యిష్టం. అప్పట్లోనే అక్కడ ఎనిమిది రకాల ఫ్లేవర్స్‌లో ఐస్‌క్రీంలు లభించేవి. ఆ షాపతను స్వీడన్‌ నుంచీ ఎసెన్స్‌లు తెప్పించే వారు. బాపు రమణలతోనే నాకు రామకృష్ణ శాస్ర్తి అనే నిధితో పరిచయం కలిగింది. అలాగే నాకు ఎంతో పేరు తెచ్చిపెట్టిన ‘సరాగమాల’ ప్రారంభానికి వారే కారకులు. ఆ విధంగా నేను వారికి ఎంతో రుణపడి ఉంటాను. బాపు- రమణలు గొప్ప వారని నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారు ఏ నిర్వచనానికీ లొంగని వారు.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నన్ను మామిడి పండులా ఉన్నావు ”అని బాపు అన్నారని”ముత్యాలముగ్గు” నటి సంగీత

మామిడి పండులా ఉందన్నారు

బాపు సినీకావ్యాల్లో చెప్పుకోదగినది ‘ముత్యాలముగ్గు’. ఎన్నిసార్లు చూసినా మళ్లీమళ్లీ చూడాలనిపించే చిత్రం అది. ఆ సినిమాలో హీరోయిన్‌గా నటించి ఆ టైటిల్‌నే తన ఇంటిపేరుగా మార్చుకున్న సీనియర్‌ నటి సంగీత. బాపు మలచిన కుందనపు ‘బొమ్మ’ల్లో సంగీత కూడా ఒకరు. బాపు జయంతి సందర్భంగా ఆయన గురించి సంగీత చెబుతున్న విశేషాలు…
‘‘నేను మేగజైన్‌లో యాడ్‌లు చేసేదాన్ని. ఒకసారి ప్రకటనల కోసమని స్టిల్‌ ఫోటోగ్రాఫర్‌ భూషణ్‌ నా ఫోటోల్ని తీశారు. ఆయన బాపుగారి సినిమాలకు కూడా పనిచేసేవారు. నా ఫోటోలు బాపుగారికి చూపించడం, ఆయనకి నచ్చడంతో ‘ముత్యాలముగ్గు’లో అవకాశం వచ్చింది. ఈ సినిమా కంటే ముందు ‘అందాలరాముడు’ చేయాల్సింది. కానీ, కుదరలేదు. నేనేమో ఇండస్ర్టీకి కొత్త. ఏం తెలిసేది కాదు. అవే ఫోటోలు చూసి విశ్వశ్వరరావుగారు ‘తీర్పు’లో అవకాశం ఇచ్చారు. అది హీరోయిన్‌గా నాకు తొలి సినిమా కాగా విడుదలైంది మాత్రం ‘ముత్యాలముగ్గు’.
మేకప్‌ లేకుండా నటించమన్నారు

‘తీర్పు’ షూటింగ్‌ జరుగుతుండగానే ‘ముత్యాలముగ్గు’కి నన్ను హీరోయిన్‌గా తీసుకున్నట్లు చెప్పారు. మేకప్‌ లేకుండా నటించాలన్నప్పుడు కొంచెం ఫీలయ్యాను. ‘సినిమా అంటే గ్లామర్‌ కదా, మేకప్‌ లేకుండా నటించామంటారేంటి?’ అనుకున్నాను. అంతకుముందు బాపుగారి గురించి నాకు తెలీదు. సినిమా అంటేనే పెద్దగా తెలీదు. స్కూల్లో స్కిట్స్‌ చేసేదాన్ని. మా స్వస్థలం వరంగల్‌. సెలవులకు సికింద్రాబాద్‌లో ఉన్న మా పెద్దక్క దగ్గరకి వెళ్లినప్పుడు పక్కనే ఉన్న డాన్స్‌ స్కూల్‌లో డాన్స్‌ నేర్చుకున్నాను. మద్రాసుకి వచ్చిన తరువాత కూచిపూడి, భరతనాట్యం నేర్చుకుని అరంగేట్రం చేశాను. చిన్నప్పుడు స్కూల్లో చేసిన డాన్స్‌లతోనే సినిమాపై ఇష్టం పెరిగింది. ‘మంచి ఫోటోజెనిక్‌ ఫేసు. సినిమాల్లో ఎందుకు ట్రై చేయకూడదు’ అని మా ఫ్రెండ్స్‌ అనేవారు. ‘తీర్పు’ పూర్తికాకుండానే ‘ముత్యాలముగ్గు’లో నటించాను. సరదాగా కూర్చుని మాట్లాకుంటున్నప్పుడు షాట్‌ రెడీ అంటే వెళ్లిపోయేవాళ్లం. కొద్దిగా టచప్‌ చేసేవాళ్లంతే.

పాట నా ఫస్ట్‌ షాట్‌
నా ఫస్ట్‌ షాట్‌ ‘ముత్యమంత ముగ్గు…’ పాట. ముఖం పక్కకు తిప్పి చూడాలి. అలా రెండు, మూడు షాట్‌లు తీసి వేరే వర్క్‌ చేసుకున్నారు. నన్ను మళ్లీ పిలవలేదు. ‘రెండు షాట్‌లే తీశారు. మళ్లీ పిలవడం లేదు. ఈ సినిమాలో ఉంటామా, లేదా’ అని ఫీలయ్యాను. మరుసటి రోజు ఉదయం సెట్స్‌కి వచ్చి చూస్తే అందరి ముఖాల్లో ఒకటే సంతోషం. బాపుగారు, రమణగారు… అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. బాపు నా చేయి పట్టుకుని ‘మామిడిపండులా ఉంది నీ ముఖం’ అన్నారు. మేకప్‌ లేకుండా చేయడం సినిమాలో ఎలా ఉంటుందోనని టెస్ట్‌ చేశారనుకుంటా. ముఖానికి పసుపు రాసుకుని, కుంకుమ పెట్టుకోవాలంతే. లిప్‌స్టిక్‌ రాసుకుంటే.. రవ్వంత ఎక్కువైనా ‘తుడిచేయ్‌ తుడిచేయ్‌..’ అనేవారు.
స్ర్కిప్టు చూస్తే సినిమా చూసినట్టే…
సెట్‌లో బాపుగారు తక్కువ మాట్లాడతారు, ఎక్కువ పనిచేస్తారు. అలాగే పని చేయించుకుంటారు. ‘ఇలా చేయమ్మా, అలా చేయమ్మా’ అని చెప్పరాయన. స్ర్కిప్టు చేతికిచ్చేస్తారు. స్ర్కిప్టు ప్యాడ్‌ ఇచ్చి, బొమ్మలు చూపించి అలా చేయమనేవారు. అందులో బొమ్మలు, సీను, డైలాగులు.. అన్నీ ఉంటాయి. ప్రతి షాట్‌ బొమ్మ గీసేస్తారు. ఒక సీనులో 50 షాట్లుంటే, 50 బొమ్మలుంటాయి. బాపుగారి స్ర్కిప్టు చూస్తే సినిమా చూసినట్టే ఉంటుంది. అన్ని క్యారెక్టర్లకి బొమ్మలు గీసేస్తారు. ఆయన దర్శకత్వంలో ఏడెనిమిది సినిమాలు చేసుంటాను. అన్నింట్లోను ఇంతే. ‘ముత్యాలముగ్గు’ షూటింగ్‌ పూర్తయ్యాక ప్రొజెక్షన్స్‌ వేశారు. నేను 10-15 ప్రొజెక్షన్స్‌ చూసుంటాను. ఎవరి కోసం ప్రొజెక్షన్‌ వేసినా వెళ్లేదాన్ని. నా సినిమా చూడాలని అంత ఆసక్తిగా, ఆరాటంగా ఉండేది. తరువాత ఏ సినిమానూ నేనన్ని సార్లు చూడలేదు.
మాది తండ్రీ కూతుళ్ల బంధం
ముత్యాలముగ్గు సినిమాతో బాపుగారి కుటుంబానికి బాగా దగ్గరయ్యాను. రమణగారి కుటుంబం కూడా అంతే. బాపు ఎంత తక్కువగా మాట్లాడేవారో, రమణ అంత బాగా మాట్లాడేవారు. మంచిచెడ్డలు చెప్పుకోవడం రమణగారితోనే. బాపుతో మాట్లాడాలంటే కొంచెం భయంగానే ఉండేది. అనవసరంగా కదిపితే విసుక్కునేవారు. ఒకసారి ‘పెళ్లి కొడుకు’ షూటింగ్‌లో ఒక ఆర్టిస్ట్‌ సమయానికి రాలేదని బాపుగారికి కోపం వచ్చింది. షూటింగ్‌ ఆలస్యమవుతోంది, వెలుతురుపోతుందన్న టెన్షన్‌ ఆయనది. ఆ మూడ్‌లోనే నాపై కూడా కేకలు వేశారు. నాకేం అర్థం కాలేదు. ‘నేనేం తప్పుచేయలేదు, నన్నెందుకు తిడుతున్నారు’ అని బాధపడ్డాను. ఆర్టిస్ట్‌ వచ్చాక రెడీ అవుదామన్న ఉద్దేశంతో నేనున్నాను. ఆ ఆర్టిస్ట్‌ వచ్చాక నేను రెడీ అవుతున్నాను వెంటనే ఆయన రూమ్‌కి వచ్చి ‘ఏంటమ్మా ఏమనుకుంటున్నావు. ఆలస్యం ఏమిటి? ఇలా అయితే ఎలా..’ అని తిట్టారు. ఆ తరువాత షాట్‌ తీశారు. ఆ తరువాత బాపుగారు నన్ను దగ్గరకి పిలిచి ‘సారీ సంగీత, టెన్షన్‌లో అనేశాను. అయినా నీపై నాకు ఆ చొరవ ఉందమ్మాయ్‌. అందుకే తిట్టాను’ అన్నారు. ఆ మాటతో అప్పటి వరకు పడిన బాధంతా పోయింది.
దీర్ఘం తీసి తిట్లు తిన్నాను…
బాపుగారితో ‘పెళ్లీడు పిల్లలు’, ‘త్యాగయ్య’, ‘పెళ్లికొడుకు’, ‘సుందరకాండ’ సినిమాలతోపాటు భాగవతం సీరియల్‌ చేశాను. అందులో రామాయణం ఎపిసోడ్‌లో ‘కైకేయి’ పాత్ర ఇచ్చారు నాకు. బాపుగారు ఆ విషయం చెప్పగానే ‘కైకేయి.. పాత్రా…’ అని కాస్త దీర్ఘం తీశాను. వెంటనే ఆయన ‘ఏం చేయలేవా? ఆ రోజుల్లో జమున చేసింది. ఎంత పెద్ద హీరోయిన్‌ ఆవిడ’ అంటూ మందలించి ఆ సినిమా చూడమని చెప్పారు. ఆ క్యారెక్టర్‌కి నన్ను అడిగారేంటబ్బా అని దీర్ఘం తీయడంతో నేను నటించనని చెప్తున్నాను అనుకున్నట్టున్నారు.
అంతా బొమ్మల ప్రపంచమే…
ఆయన దగ్గర నేను నేర్చుకున్నది చేసే పనిని సంతోషంగా 100 శాతం ఇన్వాల్వ్‌మెంట్‌తో చేయడం. సెట్‌లో రమణతో లేక కెమెరామెన్‌తో డిస్కస్‌ చేస్తారేగానీ, సరదాగా కబుర్లు చెప్పడం ఆయనకి ఇష్టం ఉండదు. షూటింగ్‌ గ్యాప్‌లో కూడా స్ర్కిప్టుతోనే ఉంటారు. సెట్లోనే కాదు ఇంట్లో కూడా ఆయన ఎక్కువ మాట్లాడేవారు కాదు. ఎప్పుడు చూసినా ఇంట్లోని స్టూడియో రూమ్‌లో బొమ్మలు గీసుకుంటూ ఉండేవారు. చివరిగా ‘సుందరకాండ’లో ఆయనతో పనిచేశాను. ఒంట్లో బాగోలేదని రమణగారు చెన్నైలోనే ఉండిపోయి షూటింగ్‌ రాకపోతే బాపు చాలా ఒంటరిగా ఫీలయ్యేవారు. 

అలా మాట్లాడ్డం చాలా అరుదు…

ఇండస్ర్టీకి వచ్చి 35 ఏళ్లు దాటింది. ఇప్పటికీ నన్ను చూస్తే ‘ముత్యాలముగ్గు సంగీత’ అనే అంటారు. ‘లవకుశ’ సినిమాకి సాంఘిక రూపం ‘ముత్యాలముగ్గు’. దాన్ని మరిపింపచేసేలా ఈ సినిమా తీశారు. ఇన్నేళ్లయినా ఇంకా ఆ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారంటే అదే ‘బాపు రమణీయం’. ‘పద్మశ్రీ’ వచ్చినప్పుడు శుభాకాంక్షలు చెబుదామని ఇంటికి వెళ్లాను. మీకు ‘పద్మభూషణ్‌’ వస్తే బాగుంటుంది అన్నాను. ‘ఏ ఎందుకు భారతరత్న వస్తే బాగుండదా?’ అని గట్టిగా నవ్వేశారు. అవార్డుల్ని ఆశించే తత్వం కాదని తమాషాగా చెప్పారు. ఆయన ఇలా జోక్‌గా మాట్లాడ్డం చాలా అరుదు.

ఆ షాక్‌లో ఏడుపు రాలేదు…
బాపుగారి మరణం చాలా పెద్ద షాక్‌. టీ వీలో బాపుగారు మరణించారని చూసినప్పుడు నాకస్సలేమీ అర్థం కాలేదు. ‘బాపు ఇక లేరు’ అన్నది తప్పేమో, ఇంకెవరైనా అయ్యుంటారేమో అన్న భావనలోనే ఉన్నాను. అబద్ధం అయితే బాగుండని దేవుడ్ని కోరుకున్నాను. ఆ షాక్‌లో ఏడుపు రాలేదు. వృత్తిపరంగా డబ్బు కోసం సినిమాల్లో నటించడం పక్కనబెడితే, మనసుకి నచ్చి పనిచేయడం ఎంతో ఆత్మసంతృప్తినిస్తుంది. అలా చేసిన సినిమాలు బాపు సినిమాలు. ఎక్కడ ఉన్నా ఆయన ఆశీస్సులు మాకెప్పుడూ ఉంటాయి. ఆయన నాకిచ్చిన ‘ముత్యాలముగ్గు సంగీత’ అన్న పేరు నిలబెట్టుకుంటే నా జీవితం ధన్యమైనట్లే.’’
‘‘ఆయన ఆఖరి సినిమా ‘శ్రీరామరాజ్యం’లో నటించే అవకాశం చేజారిందన్న బాధ ఉంది. ఈ సినిమాలో క్యారెక్టర్‌ ఉంది, తరువాత చెబుతాను అన్నారు. ఒకరోజు రాత్రి కో-డైరెక్టర్‌ ఫోన్‌ చేసి ‘రేపు ఉదయం షూటింగ్‌ ఉంది. రండి’ అన్నారు. అప్పుడు నేనో తమిళ సినిమాలో నటిస్తున్నాను. మరుసటి రోజు షూటింగ్‌ ఉంది. వాళ్లని పర్మిషన్‌ అడిగితే ‘కాంబినేషన్‌ సీన్‌ ఉంది, కుదరద’న్నారు. ఎల్లుండి వస్తానని కో-డైరెక్టర్‌కి చెప్పాను. వేరే కారణాలతో ఆ పాత్రలో నటించలేకపోయాను. రాముడి సోదరి పాత్ర నేను చేయాల్సింది..’’
 గనిరెడ్డి అరుణ్‌కుమార్‌, చెన్నై
ఫోటోలు: కర్రి శ్రీనివాస్‌

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

సింగమనేని నారాయణకు పెద్దిభొట్ల సుబ్బరామయ్య పురస్కారం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నీరుకొండపై అతి పెద్ద ”అన్న గారి” విగ్రహం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బాపు చిత్ర కళా ప్రస్తానం -(బాపు 82 వ పుట్టిన రోజు )నండూరి పార్ధ సారధి –

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

హరిజన సేవలో ధన్యురాలైన శ్రీమతి రామి నేని రామానుజమ్మ

హరిజన సేవలో ధన్యురాలైన శ్రీమతి రామి నేని రామానుజమ్మ

Inline image 1

ఎక్కడో మధ్య ప్రదేశ్ లోని బిలాస పూర్ లో జన్మించి ,ఆంద్ర ప్రదేశ్ లో కృష్ణాజిల్లాలో ఒక కుగ్రామానికి కోడలుగా వచ్చి  మహాత్ముని పిలుపుకు స్పందించి సంఘ సేవలో అందునా ముఖ్యం గా హరిజన సేవలో జీవితాన్ని ధన్యం చేసుకొన్న పునీతురాలు శ్రీమతి రామినేని రామానుజమ్మ .ఆమె చరిత్ర అన్ని తరాలకూ ఆదర్శమే .

‘’ గాంధీ టోపీ గవర్నర్ ‘’అని ప్రసిద్ధి చెందిన కృష్ణా జిల్లా పామర్రుకు దాగ్గరలో ఉన్న పెదమద్దాలి  కు చెందిన ఈడ్పు గంటి  రాఘవేంద్ర రావు గారి అక్కగారు   రామినేని రామనుజమ్మ గారు .తండ్రిగారు నాగన్న గారు . తమ్ముడు  రాఘ వేంద్ర రావు గారు మధ్య ప్రదేశ్ లోని బిలాస పూర్ లో వ్యాపారం చేస్తున్నప్పుడు 1880 లో జన్మించారు .రాఘ  వేంద్ర రావు గారు ఇంగ్లాండ్ వెళ్లి బారిస్టర్ పాసై ఇండియా కు తిరిగివచ్చి కొంతకాలం న్యాయ వాద వ్రుత్తి చేసి జాతీయ నాయకులు  బాల గంగాధర తిలక్ ప్రభావంతో రాజకేయ ప్రవేశం చేసి  బిలాస పూర్  మునిసిపల్ చైర్మన్ అయ్యారు .గాంధీజీ నాయకత్వాన ఉద్యమాలలో పాల్గొన్నారు .స్వశక్తితో ఎదిగి రెండేళ్ళు నాగపూర్ ప్రావిన్స్ ప్రధాన మంత్రిగా ,ఏడేళ్ళు హోమ్ మంత్రిగా  నాలుగు నెలలు గవర్నర్ గా పని చేశారు .ఇంతటి చైతన్య శీలి కి రామానుజమ్మ గారు అక్కగా   పుట్టటం అదృష్టం .

రామానుజమ్మ గారు  కృష్ణా జిల్లా ఉయ్యూరు కు దగ్గరలో ఉన్న కుమ్మమూరు గ్రామం లో  రామినేని వియ్యన్న గారి ని  వివాహ మాడి రామినేని వారి  ఇంటికోడలయ్యారు .భర్త మంచి స్థితి పరులు గొప్ప భూస్వామి , గ్రామ మునసబు .వియ్యన్న గారు ఉయ్యూరు లో1909 లో ఏర్పడిన ‘’ఉయ్యూరు లిటరరీ అసోసియేషన్ అండ్ సోషల్ క్లబ్ ‘’కు వ్యవస్థాపక సభ్యులు .ఒక కుమారుడు కౌసలేంద్ర రావు పుట్టిన తర్వాత భర్త మరణించారు .కౌసలేంద్ర రావు గారికి ఈడుపు గంటి రాఘ వేంద్రరావు గారు మేనమామ  .హిందీ రాష్ట్రం లో ఉండటం వలన రామానుజమ్మ గారికి  సహజం గా హిందీ అలవడింది .మరాఠీలో ప్రావీణ్యం సంపాదించారు .విజయవాడ లో భండారు అచ్చమాంబ గారి వద్ద ఇంగ్లీషు ,తెలుగు నేర్చారు .అత్తవారింట కుమ్మమూరు గ్రామం లోనే ఉంటూ పిల్లవానిని పెంచుతూ సమాజ సేవ చేశారు .

హరిజనుల కోసం పాఠ శాలను కుమ్మమూరు గ్రామం లో నిర్మించి పేద హరిజన విద్యార్ధులకు విద్యా సౌకర్యం కలిగించిన వితరణ శీలి రామానుజమ్మ గారు .భారత జాతీయోద్యమం లో చురుకుగా పాల్గొన్నారు .హిందీ భాషలో మంచి ప్రజ్ఞ ఉండటం చేత 1921లో ‘’పుత్రోపహారం ‘’అనే హిందీ గ్రంధాన్ని తెలుగులోకి అనువదించారు .దీనిలో బాలలు సత్ ప్రవర్తన కలిగి ఉండాలని దానికోసం ఎలా నడుచుకోవాలో తెలియ జేశారు .ఆదర్శం గా జీవించి అనేక సంస్థలకు వ్యక్తులకు దాన ధర్మాలు చేసి విద్యా వ్యాప్తికీ సాంఘిక మార్పులకు దోహద పడ్డారు .

ఆణి ముత్యం లాంటి వీరి కుమారుడు రామి నేని కౌసలేంద్ర రావు విదేశాలలో న్యాయ శాస్త్ర విద్య నభ్యసించి ,నాగపూరు హైకోర్ట్ న్యాయ వాదిగా పని చేశారు .తర్వాత ప్రభుత్వ న్యాయ వాదియై ,అడ్వకేట్ జనరల్ అయి ,నాగ పూరు హైకోర్ట్ న్యాయ మూర్తిగా ఉన్నారు  . ఫైనాన్స్ కమీషన్ సభ్యులుగా నియమింప బడి గౌరవం పొందారు.తల్లి రామానుజమ్మ గారి గొప్ప సుగుణాలైన విశాల ద్రుష్టి ,నిష్పాక్ష పాతం ,సత్ప్రవర్తన   సాటి వారి యెడ ప్రేమాదరణలు కౌసలేంద్ర రావు గారికి సంక్రమించాయి .

కౌసలేంద్ర రావు గారి భార్య శ్రీమతి సరోజినీ దేవి మదన పల్లి లో రాటకొండ వారి ఆడపడుచు . కుమారుడు అంటే రామానుజమ్మ గారి మనుమడు శ్రీ రామి నేని భాస్కరేంద్ర రావు ‘’ఇండిపెండెంట్ చార్టర్డ్ అకౌంటెంట్.గా ఉంటున్నారు . మనం అందరం మర్చి పోయిన ఎన్నో చారిత్రిక విశేషాలను ఆయన కంప్యూటర్ లో భద్ర పరచి అందిస్తూ ఉంటారు .’’ఇరవై వ శతాబ్దపు తెలుగు వెలుగులు ‘’అనే శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయంప్రచురించిన  విస్తృత ఆచూకీ (రిఫెరెంస్ ).గ్రంధ రచన ‘’సంపాదక సలహా మండలి ‘’లో సభ్యులు .గొప్ప పుత్రుడైన  –కౌసలేంద్ర రావు గారిని ,సమర్ధ వంతుడైన మనుమడు భాస్కరేంద్ర రావు ను తన వారసులుగా అందించిన రామినేని రామానుజమ్మ గారు97 ఏళ్ళు  సార్ధక జీవితం గడిపి 1977లో మరణించారు .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -14-12-14-ఉయ్యూరు

 

Posted in సేకరణలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -90- 135-వ్యుత్పత్తి నిఘంటు రచయిత –తాత వెళ్లి మిఠాచార్ శేషగిరి శాస్త్రి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -90

135-వ్యుత్పత్తి నిఘంటు రచయిత –తాత వెళ్లి మిఠాచార్  శేషగిరి శాస్త్రి

తమిళదేశం లో గీర్వాణ  పంట

తమిళనాడు ఉత్తర ఆర్కాట్ జిల్లా తిరువత్తూరు తాలూకా లో పుదూరు ద్రావిడ కుటుంబం లో తాతవెళ్ళి మిఠాచార్ శేష గిరి శాస్త్రి 1847 లో జన్మించారు .వారిది విద్వత్ కుటుంబం .చిన్నతనం లోనే అసాధారణ ప్రతిభా ప్రదర్శనం చూపించారు .మద్రాస్ ప్రెసిడెన్సి కాలేజి లో 1871 లో పట్ట భద్రులయ్యారు .అదే కాలేజిలో సంస్కృత పండితులుగా పని చేశారు .తర్వాత 1875లో సంస్కృతాంధ్రాలలో ఏం ఏ .సాధించారు .మద్రాస్ లో మొట్టమొదటి సారిగా సంస్కృతం లో ఏం ఏ డిగ్రీ పొందిన వ్యక్తిగా చరిత్రకెక్కారు .

ఉద్యోగ వైబోగం

విద్యాశాఖలో చేరి స్కూళ్ళ ఇన్స్పెక్టర్ గా ,ప్రెసిడెన్సి కాలేజిలో గీర్వాణ భాషా మహోపాద్యాయులుగా సేవ చేశారు .తర్వాత మద్రాస్ ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారం లో ‘’క్యూరేటర్ ‘’గా  చివరి వరకు పదవి నిర్వహించి చివరలో 1893 లో ‘’డాక్టర్ అవార్డ్ ‘’ను పొందారు .పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ప్రెసిడెన్సి కాలేజి ‘’ప్రాక్తన శాఖాధ్యక్షులు’’ గా కొనసాగారు .సంస్కృత ,తమిళ భాషలకు ఫైలాలజికి ,మరాఠీ భాష కు ఎన్నో సంవత్సరాలు పరీక్షకులుగా ఉన్నారు .

బహుభాషలలో  భాషా సేవ

శాస్త్రిగారు విస్తృత పరిశోధకులు .తులనాత్మక పరిశోధనలు చేసిన భాషాభిమాని .’’ఆంద్ర శబ్ద తత్త్వం ‘’అనే రెండు భాగాలతెలుగులో  ఉద్గ్రంధం రాశారు .’’తమిళ శబ్ద తత్త్వం ‘’ఆనే తమిళ భాషలో గ్రంధం రచించారు .’’ఆంద్ర భాషా తత్వ పరిశీలనం ‘’అనే ప్రధమ భాగాన్ని ఇంగ్లీష్ లో రాశారు .’’తమిళ సారస్వత చరిత్ర ‘’ను ఆంగ్లం లో వెలయింప జేశారు .‘’అర్దానుసార తత్త్వం ‘’ తెలుగు గ్రంధమూ రాశారు .

శేషగిరి శాస్త్రి గారి వివిధ  భాషా పరిశోధనకు ప్రావీణ్య నైపుణ్యాలకు మేటి ఉదాహరణలు  వీరు రాసిన సంస్కృత ,ఆంద్ర ,కన్నడ ,తమిళ మళయాళ భాషలకు రాసిన ‘’ప్రత్యెక వ్యుత్పత్తి నిఘంటువులు ‘’ అనితర సాధ్యమైన కృషి ఇది అని భాషా శాస్త్ర వేత్తలు బహుదా ప్రస్తుతించారు శాస్త్రిగారిని .కాని ఇవి పూర్తీ గా రాయకుండానే శాస్త్రి గారు మరణించటం ఆ  భాషలు చేసుకొన్న దురదృష్టం .యాభై నాలుగేళ్ళు మాత్రమె జీవించి ఇంతటి భాషా సంపదను భాషలకు అందజేసిన శేష గిరి శాస్త్రిగారు 1901లో పరమ పదించారు . .

136-బాల వ్యాస ,వ్యాకరణాలంకార –వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి

విద్యార్జన

వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రిగారు తూర్పు గోదావరిజిల్లా కాకినాడ తాలూకా వాజులూరులో భావనారాయణ ,కామేశ్వరమ్మ దంపతులకు1894 లొ జన్మించారు .షష్టి నాడు పుట్టారు కనుక చదువుల మేటి సుబ్రహ్మణ్యీశ్వరుని పేరు పెట్టారు .పేరు సార్ధకం చేశారు శాస్త్రిగారు. మాతామహులు రేగిళ్ళకామ శాస్త్రి గారి దగ్గార సంస్క్రుతకావ్యాలు చదివి ,పిఠాపురం చేరి పేరి పేరయ్య శాస్త్రిగారి వద్ద సిద్ధాంత కౌముది ని నేర్చారు .పితాపురాస్థాన  విద్వాంసులైన వేదుల సూర్య నారాయణ శాస్త్రి గారి సన్నిధానం లో మహా భాష్యాంతం వ్యాకరణాన్ని మంజూష తో సహా ఆపోసన పట్టారు .ఆస్థాన తర్క విద్వాంసులైన శ్రీపాద లక్ష్మీ నారాయణ శాస్త్రి గారి శిష్యులై న్యాయ శాస్త్రాన్ని నేర్చుకొన్నారు .ఆస్థాన వేదాంత శాస్త్రజ్ఞులైన దెందుకూరి నరసింహ శాస్త్రి గారి వద్ద వేదాంత శాస్త్రాన్ని గ్రహించారు .

విద్యాదానం

అనేక ప్రాంతాలనుండి తన వద్దకు విద్య నేర్వటానికి వచ్చిన యాభై కి పైగా విద్యార్ధులకు భోజన వసతులు ఏర్పాటు చేసి విద్య గరపారు .శిష్యులకు కావ్య నాటకాలంకారాలను  వ్యాకరణాన్ని బోధించారు .1930-50మధ్య ఇరవై ఏళ్ళు పిఠాపురం లోని వీరి గృహం ఒక ఆదర్శ గురుకులం గా భాసించేది .నిత్య పాఠ ప్రవచనాలు ,ఆర్హ గ్రంధ పరిశీలనం  గ్రంధ రచన చేయటం వీరి దిన క్రుత్యమైపోయింది .వీరి శిష్యులందరూ వీరి అంత పాండిత్యం సంపాదించి గురువుగారి పేరు నిలబెట్టి శాస్త్ర పాఠాలు చెప్పి శాస్త్ర విద్యా ప్రచారం చేసి ఆర్ష ధర్మాన్ని నిలబెట్టినవారే .అలాంటి వారిలో కప్పగంతుల సుబ్రహ్మణ్య శాస్త్రి ,ముళ్ళపూడి నారాయణ శాస్త్రి ,ప్రతాప హనుమచ్చాస్త్రి మొదలైన వారున్నారు .

ప్రజ్ఞా సుబ్రహ్మణ్యీయం

పిఠాపురం ప్రజల అభ్యర్ధన మేరకు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు శ్రీ మద్రామయణాన్ని ధారావాహికం గా ప్రవచనం చేసి అందరి అభిమానాన్ని సంపాదించి ఘన సత్కారం తోబాటు గురువుగారి సమక్షం లో ‘’బాల వ్యాస ‘’బిరుదును ,గుర్తుగా బంగారు ఉంగరాన్ని తమ గురు బ్రహ్మ చేత వెలికి తోడిగించుకొన్న  అదృష్ట వంతులు . .ఆంద్ర దేశం లోని విద్వాద్ లోకం వీరికి ‘’తర్క వ్యాకరణ వేదాంత కేసరి ‘’,’’మహోపాధ్యాయ ‘’గౌరవం తో సన్మానించింది .విజయ వాడ పండిత పరిషత్తు ‘’వ్యాకరణాలంకార ‘’బిరుదు నంద జేసింది .అయోధ్య సంస్కృత పత్రికాదిపతులు ‘’మహా భారత మర్మజ్న ‘’తో గౌరవించి సత్కరించారు .ఇతర రాష్ట్రాలవారు ఆహ్వానించి సన్మానించారు .

మహా గ్రంధ రచన

శాస్త్రి గారు విమర్శనా సాహిత్యం లో అందే వేసిన చేయి .వ్యాసభారతం పై వచ్చిన దుర్విమర్శలకు దీటైన సమాధానాలు చెప్పి ,భారత ప్రామాణ్యాన్ని నిరూపించి ‘’మహా భారత తత్వ కధనం ‘’అనే ఆరుభాగాల మహా గ్రంధం రచించారు .’’కర్ణోత్పత్తి ‘’గ్రంధం కూడా రాశారు .’’శ్రీ మద్రామాయణ తత్వ కధనం ‘’,రామాయణ రహస్యాల సమీక్ష ‘’అనేవి మరో రెండు ముఖ్య గ్రంధాలు రాశారు .నాస్తికత్వానికి సరైన సమాధానాలు విపులంగా రాసి ‘’ఆస్తికత్వం ‘’అనే పేరుతొ మూడు భాగాల అద్భుత రచన చేశారు .సంస్కృత భాషలో ‘’మహా భారత తత్వ దీపః ‘’అనే మహోన్నత గ్రంధం రాశారు .ఈ గ్రంధానికి ఉత్తర ప్రదేశ్ ,ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వాలు పురస్కారాలు అంద జేశాయి .ఈ దేశం లోనే కాక విదేశాలలోనూ విద్వాంసుల ప్రశంసలనూ అందుకొన్న గ్రంధ రాజం ఇది .శాస్త్రిజీ అనేక పత్రికలకు వివిధ విషయాలపై ఎన్నో వ్యాసాలూ రాసి జ్ఞాన బోధ చేశారు .’’శాస్త్రి గారి వాణి  ఆర్ష వాజ్మయానికి భద్ర కవచం ‘’అన్నారు విద్వాంసులు .అన్నిటా విఖ్యాత ప్రామాణికులు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు .ఈ విద్యా తపస్వివారణాసి వారు  ఎనభై నాలుగు సంవత్సరాలు ఆరోగ్యం గా జీవించి సార్ధక జీవనం సాగించి 1979 లో  ఆ వారణాసి విశ్వనాదునిలో ఐక్యంయ్యారు .

 

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-12-14-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం- 89 – 132-క్రోడ పత్ర రచయిత-గుమ్మలూరి సంగమేశ్వర శాస్త్రి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం- 89

132-క్రోడ పత్ర రచయిత-గుమ్మలూరి సంగమేశ్వర శాస్త్రి

ఏదైనా ఒక శాస్త్రం మీద రాసిన సంగ్రహ విమర్శను ‘’క్రోడ పత్రం ‘’అంటారు .గుమ్మలూరి  సంగమేశ్వర శాస్త్రి గారు రాసిన క్రోడపత్రాలు నేటికీ తర్క శాస్త్రాధ్యయనం చేసే వారికి కరదీపికలుగా నిలిచాయి .అంతటి ధిషణ శాస్త్రి గారిది .తర్కాన్ని తక్రం (మజ్జిగ  )తాగినట్లు అలవోకగా నేర్చి నేర్పిన విదుషీ మణి.

జననం –విద్య

శాస్త్రిగారు బొబ్బిలి తాలూకా గంగన్న పాడు గ్రామం లో గుమ్మలూరి లక్ష్మీనారాయణ ,వెంకమాంబ దంపతులకు 1863లో జన్మించారు .బొబ్బిలి ఆస్థాన పండితులైన మండపాక పార్వతీశ్వర కవి వద్ద సంస్కృత కావ్యాధ్యయనం చేశారు .సుసర్ల సీతా రామ శాస్త్రి గారి దగ్గర తర్క శాస్త్రం చదువుకొన్నారు .శ్రీపాద రామ శాస్త్రి గారి నుండి న్యాయ శాస్త్రాన్ని మధించారు .ఇప్పటికే వీరి కీర్తి చంద్రికలు దశ దిశలా వ్యాపించాయి .

నేర్చుకోవాలన్న తపన మాత్రం శాస్త్రి గారిని వదిలి పెట్టలేదు .విజయనగరం చేరి భీమాచార్యుల వారి వద్ద ,కాశీ వెళ్లి ప్రఖ్యాత పండితుల వద్ద తాను నేర్చిన పాండిత్యానికి మెరుగులు దిద్దుకొన్నారు .స్వగ్రామం చేరారు .అప్పటికే శాస్త్రి గారి బహుముఖీన ప్రజ్ఞ లోకం లో విశదమై దాదాపు ఎనభై మంది శిష్యులు గా చేరి విద్య నేర్చారు .వీరందరికీ గురుకుల వాసం లో వసతి ,భోజనాలు కల్పించి విద్యా బోధనా చేయాలి .అప్పుడే పశ్చమ గోదావరిజిల్లా కాకర పర్రు గ్రామస్తులు శాస్త్రిగారిని శిష్య సమేతం గా తమ గ్రామం వచ్చి ఉండమని విన్నవించుకొన్నారు .వారి అభ్యర్ధన మేరకు అక్కడికి చేరుకొన్నారు .మూడున్నర ఏళ్ళు గ్రామస్తులిచ్చిన సహకారం తో కాకర పర్రులోనే ఉంది శిష్యులకు విద్యాదానం చేశారు.

ఉద్యోగ వ్యాసంగం

1898లో విజయ నగరం మహారాజా ఆనంద గజ పతి గారు శాస్త్రి గారిని ఆహ్వానింఛి తమ సంస్కృత కళాశాలలో అధ్యాపకులుగా నియమించి గౌరవించారు .శాస్త్రి గారి శాస్త్ర వాదనా పటిమ ముందు యెంత కొమ్ములు తిరిగిన పండితుడైనా బోల్తా కొట్టాల్సిందే .అంత ఉద్దండ పండితులు సంగమేశ్వర శాస్త్రి గారు .1921లో మధ్వస్వామి  ‘నైయాయిక మహా సభ నిర్వహించారు .శాస్త్రి గారు పాల్గొని ,తన నిరుపమాన వాదనా సామర్ధ్యం తో అందరినీ చకితులను చేసి మధ్వ స్వామి వారి మెప్పు పొంది ఘనంగా సత్కరింప  బడ్డారు  నవద్వీపం వెళ్లి అక్కడి తర్క శాస్త్ర మేధావులను మెప్పించి  మురిపించి ప్రశంసా పత్రాలను అందుకొన్నారు .

పాశ్చాత్య ప్రశంస

భారతీయ పండితులే కాదు పాశ్చాత్య పండితులు కూడా శాస్త్రిగారి వాదనా నైపుణ్యానికి అబ్బుర పడేవారు .వారి వైదుష్యానికి జోహార్లు పలికారు .అలాంటి వారిలో ‘’జాన్సన్ అనే జర్మనీ పండితుడు ‘’శాస్త్రిగారి శాస్త్ర సామర్ధ్యానికి ముగ్ధుడై ఆయన వద్ద చేరి శాస్త్ర రహస్యాలను ఆకళింపు చేసుకొనేవాడు .దీనితో శాస్త్రి గారి కీర్తి దేశం లోనే కాక విదేశాలలోనూ మారు మోగిపోయింది .పాశ్చాత్యులు మెచ్చి శాస్త్రిగారికి గౌరవ డాక్టరేట్ లను ప్రదానం చేశారు .

క్రోడ పత్ర క్రోడీకరణ

శాస్త్రిగారు పిఠాపురం ,ఉర్లాం సంస్థానాలలో తర్క శాస్త్ర పరీక్షాదికారిగా ఉన్నారు .సంగమేశ్వర శాస్త్రి గారి పేరు వినగానే అందరికి వీరి ‘’క్రోడ పత్రాలు ‘’చప్పున జ్ఞాపకానికి వస్తాయి .శాస్త్రి గారు రాసిన ‘’మాధురీ పంచ లక్షణీ క్రోడపత్రాలను 1933 లో మైసూరు ప్రభుత్వం ముద్రించి గౌరవిస్తే ,’’జగదీశ్వర సిద్ధాంత లక్షణ క్రోడపత్రం ‘’ను ఆంద్ర విశ్వ కళాపరిషత్తు ప్రచురించి  గౌరవించింది .తర్క శాస్త్రం చదివే మన దేశ పండిత విద్యార్ధులకు శాస్త్రిగారి క్రోడపత్రాలు కరదీపికలు .యాభై సంవత్సరాలు మాత్రమె జీవించిన ఈ తర్క న్యాయ శాస్త్ర మహా విద్వాంసుడు గుమ్మలూరి సంగ మేశ్వర శాస్త్రి గారు 1913లో శివైక్య మయ్యారు .

133-శంకరాద్వైత నిష్ణాతులు –చదల వాడ సుందర రామ శాస్త్రి

ఆంద్ర దేశం లో వావిళ్ళ రామ స్వామి అండ్ సన్స్ ప్రెస్ ప్రఖ్యాతి చెందింది .దీని స్థాపకులే వావిళ్ళ రామ స్వామి శాస్త్రిగారు .వీరు సంస్కృతాంధ్రాలలో అరుదైన పుస్తకాలన్నీ సేకరించి పరిష్కరించి ప్రచురించారు .పుస్తక ముద్రణకు ఒక ‘’హాల్ మార్కు ‘’రామ స్వామి శాస్త్రి గారు .వీరి అల్లుడే చదల వాడ సుందర రామ శాస్త్రి గారు .1840 లో జన్మించారు .రామ శాస్త్రిగారు సంస్కృతాంధ్రాలలో దిట్ట .పందొమ్మిదవ శతాబ్దపు ప్రసిద్ధ పండితులలో ఒకరుగా గుర్తింపు పొందారు శంకరాద్వైతం లో నిష్ణాతులు .సంస్కృతం లో స్రగ్ధరా వృత్తం లో ‘’ఆదిత్య స్తవం ‘’అనే శతకం రచించారు .ఇది మయూరుడు సంస్కృతం లో రాసిన సూర్య శతకానికి దీటుగా ఉందని పండితులు ప్రశంసించారు .భగవద్గీతా భాష్యాలన్నీ క్షుణ్ణంగా అధ్యయనం చేసి ,పరిశీలించి ,పరిశోధించి ,’’ఆనంద చంద్రిక ‘’అనే వ్యాఖ్యానం తో ఆరు సంపుటాలు ప్రచురించారు .వాల్మీకి మహర్షి రాచిన శ్రీ మద్రామాయణానికి ప్రతి పద ,టీకా తాత్పర్యాలు రాసి 15 సంపుటాలుగా ముద్రించారు మామగారు మరణించిన తర్వాత వావిళ్ళ వారి ప్రెస్ బాధ్యతలను చేబట్టి పుస్తక ప్రచురణను కొన సాగించారు ..డెబ్భై అయిదేళ్ళు జీవించి 1925 లో మరణించారు .

 

134-కులపతి –కప్ప గంతుల సుబ్రహ్మణ్య శాస్త్ర్తి

బాల్యం –విద్యాభ్యాసం

1911లో పశ్చిమ గోదావరిజిల్లా నిడమర్రు మండలం ‘’చిన నిండ్ర కొలను ‘’గ్రామం (ఫత్తేపురం )లో పోతుకూచి వారి కన్నాపురం అగ్రహారం లో వేదం శాస్త్ర పారంగతులు కప్పగంతుల  కామావధానులు ,మహా లక్ష్మమ్మ దంపతులకు జన్మించారు .తండ్రి వద్దే వేదాధ్యయనం చేశారు .పిసుపాటి రామ చంద్రయ్య గారి దగ్గర ఆంద్ర ,ఆంగ్ల హిందీలను నేర్చుకొన్నారు .గుంటూరులో ప్రతాప కృష్ణ మూర్తి శాస్త్రి గారి దగ్గర సాహిత్యం చదివారు .కంభం పాటి రామ మూర్తి ,అభినవ విద్యా రణ్య ,పద్మ విభూషణ్ ఉప్పులూరి గణపతి శాస్త్రి ,బాలవ్యాస వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారల  నుండి ‘’భాష్యంత వ్యాకరణం‘’ఆసాంతం నేర్చుకొన్నారు .బ్రహ్మశ్రీ మండలీకా వెంకట రామ శాస్త్రి గారి శిష్యులై వేదాంత ,న్యాయ శాస్త్రాలను ,సంపూర్ణం గా గ్రహించారు .చెళ్ళ పిళ్ళ వెంకట శాస్త్రి గారి వద్ద ‘’కావ్యజ్న శిక్షా భ్యాసం ‘’చేశారు .

ప్రతిభా సుబ్రహ్మణ్యీయం

సుబ్రహ్మణ్య శాస్త్రిగారు మహా వక్త .వారి వాగ్ధాటి అమోఘం .కాళిదాస శ్రీ  హర్షాది  కవుల సౌందర్య ప్రతిభపై ఎన్నో ప్రసంగాలు చేశారు వ్యాకరణ శాస్త్ర గాంభీర్యాన్ని గూర్చి ,సంస్కృత సాహిత్య లోతులపైనా ,వేదం శాస్త్ర విషయాల గురించి ,వేదాంత శాస్త్ర రహస్యాలపైనా పలు ప్రసంగాలు చేసి శ్రోతలను ఆకట్టుకొనే వారు .పశ్చిమ గోదావరిజిల్లా ఏలూరు లో స్తిరపడ్డారు

సంస్కృత విద్యాలయ ప్రారంభం

ఏలూరు లో  గుండు కృష్ణ మూర్తి ,సోమంచి లింగయ్య ,సభాపతి వంటి వారి సహాయ సహకారాలతో పవరుపేట లో ‘’హేలాపురి సంస్కృత పాఠశాల ‘’ను 4-3-1943 నస్థాపించి ప్రాచీన సంప్రదాయ విధానం లో విద్యార్ధులకు సాహిత్య ,వ్యాకరణ ,వేదాంత శాస్త్రాలు బోధించేవారు .విద్యార్ధులకు ఉచిత భోజన వసతి ,ప్రతిభా వంతులైన వారికి ఉపకార వేతనాలు కల్పించి ప్రోత్సహించారు .శాస్త్రి గారు ఈ విద్యాలయానికి ‘’కుల పతి ‘’గా వ్యవహరించేవారు .విద్యా ప్రవీణ భాషా ప్రవీణ  హిందీ  బి ఏ .పరీక్షలకు విద్యార్ధులకు శిక్షణ నిచ్చేవారు ఉపాధి అవకాశాలున్న విద్యలనూ నేర్పించేవారు .                     శిష్య మహానుభావులు

పెదముత్తేవి  ముముక్షు పీఠాదిపతులు .శ్రీ శ్రీ లక్ష్మణ యతీంద్రులు ,ప్రసిద్ధ సంస్కృత కవి పండితులు ఏలూరు పాటి అనంతరామయ్య ,మానాప్రగడ శేష సాయి ,సూరి భోగేశ్వర శాస్త్రి ,కప్పగంతుల వీర భద్ర శాస్త్రి ,శ్రీమాన్ రొంపి చర్ల శ్రీనివాసా చార్యులు ,మొదలైన ఉద్దండ శాస్త్ర పండితులందరూ ఈ పాఠశాలలో చదివి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి శిష్యరికం చేసిన వారే .ఆ నాటి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీ పి.ఎల్.శివరాం ,ఈవిద్యాలయం లోనే చదివి ,శాస్త్రి గారి వద్ద వేదాంత శాస్త్రాన్ని అధ్యాయం చేశారు .ఈ సంస్కృత విద్యాలయాన్ని రాష్ట్రం లోనే ప్రామాణిక మైన విద్యా సంస్థగా శాస్త్రి గారు తీర్చి దిద్దారు .

ఉపన్యాస లహరి –వితరణ

శాస్త్రి గారు భారత భాగవత రామాయణ పురాణాలపై  ,వేదాంత భాష్య విచారణ పై ఎన్నో ప్రవచనాలు ,ప్రసంగాలు చేసి వచ్చే ఆదాయాన్ని విద్యాలయ విద్యార్ధుల పోషణకు ,విద్యాలయాభి వృద్ధికి విని యోగించిన ధర్మ పరాయణులు .వీరి సంస్కృత భాషా సేవకు పాండిత్యానికి కంచి కామ కోటి పీఠాది పతులు . గౌరవించి సత్కరించి ప్రశంసించారు .నిరంతర గీర్వాణ విద్యా సేవలో జన్మ చరితార్ధం చేసుకొన్నా కప్పు గంతుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు 14-10-1974 న అరవై మూడవ ఏట సుబ్రహ్మణ్య సన్నిధి చేరారు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-12-14-ఉయ్యూరు

 

 

.

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బొట్టు మీద మంచి పట్టుగా

బొట్టు మీద మంచి పట్టుగా

రసపట్టుగా కవితలల్లి కట్టు బాటు
చెప్పి ,మంచి విప్పి గుట్టు మట్టు
లన్ని ఎరుక పరచి దారి చూపి నట్టి
సంస్కారులకు  పట్టు చుంటినేను  ప్రణతి
    గబ్బిట  దుర్గా ప్రసాద్ – 14-12-14 ఉయ్యూరు
Posted in రచనలు | Tagged | Leave a comment

అత్యధునాతన కవిత్వం – అనుభవవాదం – ఓ ఇంట్రో

అత్యధునాతన కవిత్వం – అనుభవవాదం – ఓ ఇంట్రో

  • కాసుల ప్రతాపరెడ్డి, 9848956375
  • 07/12/2014
TAGS:

అధునాతన సమాచార సాంకేతిక విజ్ఞానం సాహిత్యానికి మనుషులను ముఖ్యంగా యువకులను దూరం చేస్తుందనే అభిప్రాయం ఇంకా బలంగానే ఉంది. ఇంటర్నెట్ వంటి ఆధునిక సమాచార వినిమయ సాధనాలవల్ల యువత సాహిత్యంవైపు చూడడం లేదని కూడా భావిస్తూ వస్తున్నాం. స్పందనలు నశించి సెన్సిటివిటీ కోల్పోతున్నారనే అభిప్రాయం కూడా బలంగానే ఉంది. సెన్సిటివిటీ కోల్పోయినప్పుడు మనిషిలో స్పందనలు కరువవుతాయని అంటారు. అదేవిధంగా మనిషి ఒంటరి గుహలోకి పారిపోతున్నాడని, సామాజిక సంబంధాల ప్రాధాన్యత తగ్గిందని అనుకుంటూ వస్తున్నాం. కానీ అదంతా అపప్రథ మాత్రమేనని ఇటీవల వచ్చిన కవితా సంకలనాలు రుజువు చేస్తున్నాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో మనిషి ఒంటరివాడవుతున్న మాట నిజమే గానీ ఆ ఒంటరితనాన్ని అత్యద్భుతంగా ఆవిష్కరిస్తున్నారు వర్తమాన కవులు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆలంబనగా చేసుకుంటూనే వినూత్న రీతిలో కవిత్వాన్ని ఆవిష్కరిస్తున్నారు. అనుభవ వాదానికి పెద్దపీట వేస్తున్నారు. ఈ అనుభవవాదం తెలుగు కవిత్వానికి కొత్తదేమీ కాదు. ఆధునిక కవిత్వానికి వచ్చినపుడు దాన్ని బైరాగితో మొదలుపెట్టవచ్చు కాబోలు. ఈ అనుభవవాదం రెండు రకాలుగా భిన్నమైంది. ఒకటి- ఇది ఇస్మాయిల్, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ వంటి అనుభూతివాద కవులు మీదుగా నడిచి వచ్చింది కాదు. బాహ్యమైన దృశ్యాలను చూసి స్పందించి ఊహలను, ఆలోచనలను మాత్రమే ఆవిష్కరించే కవిత్వం కాదు. రెండోది- ఇది భౌతికమైన లేదా బాహ్యమైన అనుభవవాదం కన్నా ఆత్మగత అనుభవవాదానికి ప్రాధాన్యం ఇచ్చింది. అంటే ఆత్మికమైన అనుభవవాదం. తన ఆత్మగత అనుభవం నుంచి, అంటే అమూర్తమైన అనుభవం నుంచి వచ్చే అనుభవవాద కవిత్వం. ఈ రకంగా ఈ కవిత్వం వస్తువులోనే కాకుండా వ్యక్తీకరణ తీరులోకూడా సమూలమైన మార్పును తెలుగుకు అందించింది.
అఫ్సర్, సీతారాం, ప్రసేన్ వెలువరించిన రక్తస్పర్శ కవితా సంకలనంతో స్పష్టంగా ఇది తెలుగు కవిత్వంలో వ్యక్తీకరణ రూపం తీసుకుందని భావించవచ్చు. ఇది సామాజిక ప్రయోజనం కోసం సాహిత్యం అనే నినాదాన్ని తోసిపుచ్చే అనుభూతివాద కవులకు సంబంధించింది కాదు. ఏదైనా సరే, తన వైయక్తిక అనుభవం నుంచి వ్యక్తీకరించడమే దీని ప్రధాన లక్షణం. పులిపాటి గురుస్వామి, శ్రీకాంత్, ఎం.ఎస్.నాయుడు ఈ ఒరవడిని ముందుకు తీసుకుని వచ్చారు. యాకూబ్ తన పూర్వ కవిత్వానికి భిన్నంగా నదీ మూలం లాంటి ఇల్లు కవితా సంకలనం ద్వారా తనను తాను బ్రేక్ చేసి ఆ వైపు దూసుకొచ్చాడు. కొత్త కవుల ద్వారా మమేకం కావడంవల్ల అతని వస్తువులోనే కాకుండా వ్యక్తీకరణలోనూ మార్పు వచ్చింది కావచ్చు. మోహన్ రుషి, నందకిశోర్, బాలసుధాకరవౌళి, కాశిరాజు వంటి కవులు వస్తువులోనూ అభివ్యక్తిలోనూ కొత్తదనానికి పీఠం వేశారు, వేస్తున్నారు.
మోహన్ రుషి జీరో డిగ్రీ, బాలసుధాకర్ వౌళి ఎగరాల్సిన సమయం, నందకిశోర్ నీలాగే ఒకడుండేవాడు, కాశిరాజు భూమధ్యరేఖ వంటి ఇటీవల వచ్చిన కవితా సంకలనాలు తెలుగు కవిత్వానికి కొత్త పరీమళాన్ని అద్దాయి. వీరు తమ మూలాలనుంచి ఆధునికతను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచీకరణ కారణంగా వచ్చిన భౌతికమైన మార్పులనే కాకుండా ఆత్మికమైన మార్పులు, అంటే మానవ సంబంధాల్లో వచ్చిన మార్పులను తమ మూలాల నుంచి పలుకుతున్నారు. జీవితానికి కొత్త అర్థాలు కూడా ఇస్తున్నారు. వీరు సామాజిక ప్రయోజనం కోసం సాహిత్య సృజన జరగాలనే నినాదానికి వ్యతికమేమీ కాదు. కులాలను, మతాలను, ప్రాంతాలను, జెండర్‌ను సానుకూల దృష్టితోనే, ప్రజాదృక్కోణం నుంచే చూస్తున్నారు. కానీ, దాన్ని వైయక్తికం చేసుకుని, ఆత్మగతం చేసుకుని తన వ్యక్తిగత అంతర్లోకాల నుంచి పలుకుతున్నారు. బాహిర్‌లోకానికన్నా అంతర్లోకాన్ని ప్రధానం చేసి మాట్లాడుతున్నారు.
చచ్చేలోపు చాలాసార్లు నిశ్శబ్దపు చావులకు గురవుతుండడమే జీవితం అని మోహన్ రుషి రాసిన వాక్యాన్ని ఎన్ని రకాలుగానైనా విశే్లషించుకోవచ్చు. ఆధునిక జీవితంలోని అన్నిరకాల పెడధోరణులకు, అంటే యాంత్రిక జీవితానికి కూడా అన్వయించుకోవచ్చు. ఆధునికతలోని సంక్లిష్టతను వ్యక్తం చేయడానికి వాక్యం కింద వాక్యాన్ని రాయాలనే నిబంధనను ఈ కవులు ఉల్లంఘించారు. మోహన్ రుషి కవిత చూస్తే ఇది వైయక్తిత అనుభవాలను బాహిర్లోకాలుగా, ఉమ్మడి అనుభవాలుగా మారుస్తున్నారు.
ఇటువంటి కవులు ఇంకా చాలామందే వున్నారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చినవి కొద్దిమంది కవితా సంకలనాలు మాత్రమే. అవి వస్తే ప్రస్తుత కవిత్వం డిక్షన్ మాత్రమే కాకుండా వస్తువు కూడా ఎంత మారిందో అర్థమవుతుంది. ఏదో ఒక వాదానికి కట్టుబడి కవిత్వం కవిత్వ విశే్లషణలో ఇరికిపోతాడు. కానీ, ఈ కవులు అటువంటి కవిత్వ వర్గీకరణకు అందకుండా పోతున్నారు. కవులను కాకుండా కవిత్వాన్ని మాత్రమే విశే్లషించే పరిస్థితి వచ్చినపుడు ఈ కవులకు కూడా కవిత్వ విమర్శలో చోటు దొరుకుతుంది.

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ధర్మ మార్గానికి దారిచూపే కొత్తమ్మ తల్లి

ధర్మ మార్గానికి దారిచూపే కొత్తమ్మ తల్లి

  • -జి.కృష్ణమూర్తి
  • 29/09/2014
TAGS:

అఖిలాండకోటి బ్రహ్మాండములకు అధిదేవతయైన భగవతి శ్రీ దుర్గాదేవియే సమస్త విశ్వానికి, ఉనికిని నిలబట్టేది. ఈ తల్లే లక్ష్మి, సరస్వతి, పార్వతి రూపాలుగా తన్ను తాను సృజియంచు కొంటుంది. వైకుంఠ వాసునిచేత లక్ష్మిగా గౌరవింప బడినా, కైలాస వాసునికి అర్థనారీశ్వరి అయనా చతుర్ముఖునికి ఇల్లాలైనా ఆ తల్లి రూపాలే అవన్నీ. ఆ తల్లే నేడు శ్రీకాకుళం జిల్లా, కోటబొమ్మాళిలో శ్రీ కొత్తమ్మ తల్లిగా కొలువు దీరింది. కలియుగ ప్రభావం చేత మానవులల్లో దుష టచింతనలు కలుగుతున్నాయ. అటువంటి వాటిని పరిహరించి మానవులంతా ధర్మమార్గంలో నడిచేట్టు చేయటానికే ఈ తల్లి కాలాతీత, గుణాతీత శ్రీ ఆదిపరాశక్తి స్వరూపిణి శ్రీ కొత్తమ్మ తల్లిగా కొలువైంది. ఈ తల్లిని ఆరాధిస్తే, స్మరిస్తే, స్త్రోత్రం చేస్తే సర్వదుఃఖాల నుంచి, బాధల నుంచి రక్షణ పొంది, విముక్తులయ వారు ధర్మమూర్తులుగా మారుతారని భక్తుల పరిపూర్ణ విశ్వాసం.
స్థల పురాణం: 1925 సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లా, కోటబొమ్మాళికి చెందిన కమ్మకట్టు చినఅప్పలనాయుడు కోటబొమ్మాళి మండలం నారాయణవలసలో వారపు సంతకు ఎడ్లబండిపై వెళ్ళివస్తూ ఉండేవాడు. ఓ రోజు సంత నుంచి వస్తుండగా మార్గమధ్యలో ఓ ముతైదువ బండి ఆపి, ‘నాయనా ముసలిదాన్ని నాకు నీవు వెళ్ళే దారిలో నన్ను దించేయమని’అడిగింది. అందుకు చిన అప్పలనాయుడు సరేనని బండి ఎక్కించుకున్నాడు. వేకువజామున కోటబొమ్మాళి గ్రామంలోకి వెళ్ళిన తోవ, శ్రీ పట్నాయికుని వెంకటేశ్వరరావు గారి తోట వద్దకు బండి రాగానే ఆమె బండిని ఆపమని దేవతామూర్తి స్వరూపంగా దిగి తోటలోనికి వెళ్ళిపోయింది. అదిచూచి ఆశ్చర్యపోయి నోటమాటరాక నిల్చున్న వాడల్లా ఇంటికి వెళ్లిపో యాడు. ఆ తర్వాత చిన అప్పలనాయుడికి ఆ రాత్రి కలలో ఆమె కనిపించి, నేను కొత్తమ్మ తల్లిని, నీవు బండి ఆపిన తోటవద్ద నేను వెలిశాను. ప్రతి భాద్రపద మాసంలో వచ్చే పోలాల ఆమావాస్య తర్వాత వచ్చిన మంగళ, బుధవరాల్లో నీ ఇంటి వద్ద అర్చించి, గురువారం నాయుడు అమ్మవారి జంగిడిను నీ భార్య తలపై పెట్టి పసుపు కలశాలతోను, ఘటాలతోను, నృత్య వాయిద్యాలతో నా నివాసానికి వచ్చి నన్ను కొలిస్తే నీ కోర్కెలను తీరుస్తానని చెప్పింది. ఈ సంగతి ఊరివారందరికి చెప్పి అప్పలనాయుడు అమ్మ కొలువుకు బయలుదేరగా ఊరి వారంతా అమ్మ అనుగ్రహాన్ని పొందటానికి అప్పటి నుంచి ప్రతీ సంవత్సరం ఈ ఉత్సవాలను అత్యంత వైభంగా జరుపుతున్నారు. కోరిన కోరికలను తీర్చే కల్పవల్లిగా రాష్ట్రేతర ప్రాంతాల నుంచికూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి కానుకల, విరాళాలు ఇచ్చి అమ్మవారి మొక్కులను తీర్చుకుంటున్నారు. ఈ మూడు రోజులు భక్తి, సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ మండలంలో పండుగ వాతావరణం నెలకొంటుంది.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మసీదులో వేదమంత్రం — అసలు మహాత్ముడు

మసీదులో వేదమంత్రం — అసలు మహాత్ముడు

  • 30/11/2014
  • |

  • – ఎం.వి.ఆర్.శాస్త్రి

మసీదులో వేదమంత్రం!!
కల కాదు నిజం. ఊహ కాదు – వాస్తవం.
అయితే కావొచ్చు. అది మారుమూల, ఊరవతల – మనుషులెవరూ లేని ఏ పాడుబడ్డ మసీదులోనో అయి వుంటుంది – అనుకుంటున్నారా?
కాదు. అది జరిగింది దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో. అందునా – సుప్రసిద్ధమైన జుమ్మా మసీదులో. అది కూడా శుక్రవారం ప్రార్థన సమయాన వేల మంది మహమ్మదీయుల సమక్షంలో!

ఓహో! అయితే – నమాజు వేళ ఏ హిందూ మతోన్మాదో చొరబడి, ముస్లింలను రెచ్చగొట్టటానికి మంత్రాలు వినిపించాడేమో…!?
వినిపించినవాడు హిందువే. పైగా కాషాయం కట్టిన స్వామి. కాని దొంగతనంగా చొరబడలేదు. ముసల్మాన్లను రెచ్చగొట్టటానికి ఆ పని చేయలేదు. ముస్లిం నాయకులే, మహమ్మదీయ మతం పెద్దలే పట్టుబట్టి ఆయనను అక్కడికి ప్రత్యేకంగా పిలిపించారు. సందేశం ఇమ్మని సాదరంగా కోరారు. ఆయన పలికింది శ్రద్ధగా విన్నారు. మెచ్చుకున్నారు.
ఇది జరిగింది 1919 సంవత్సరం ఏప్రిల్ 4న.
ఆ స్వామి పేరు శ్రద్ధానంద సరస్వతి.
ఇస్లాం తప్ప వేరొక మతాన్ని మహమ్మదీయులు గుర్తించరు. అందునా ఒక ప్రవక్తగాని, ఒక పవిత్ర గ్రంథంగాని లేకుండా విగ్రహాలను ఆరాధించే హిందువులతో మతపరంగా, తాత్వికంగా వారికి ప్రాథమికమైన విభేదాలు ఉన్నాయి. హిందువులతో కలిసిమెలిసి సామరస్యంగా సహజీవనం చేయాలని కోరే మహమ్మదీయులు కూడా హిందూ పెద్దలను తమ పవిత్ర ప్రార్థనా స్థలంలోకి ఆహ్వానించి (వారు ఎంతటి మహాత్ములైనా సరే), వారి చేత సందేశం ఇప్పించాలని కోరుకోరు. అలాంటిది – అత్యంత ప్రధానమైన మసీదులో వేలాది ముసల్మాన్లను ఉద్దేశించి ఒక హిందూ మతాచార్యుడు ప్రసంగించటం దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని అపురూప ఘట్టం. ఆ మాటకొస్తే ప్రపంచ చరిత్రలోనే అది అపూర్వం.
‘హిందూ-ముస్లిం ఐక్యత స్వరాజ్యం కంటే గొప్పది; ఆ ఐక్యత లేనప్పుడు స్వాతంత్య్రం కూడా నాకు అక్కర్లేదు’ అని పదేపదే చాటి, ముస్లింల సుహృద్భావం కోసం ఎంత దూరమైనా వెళ్లి దేనికైనా తెగించిన మహాత్మాగాంధిని కూడా తమ మసీదులో అడుగుపెట్టమని మహమ్మదీయులు ఏనాడూ కోరలేదు. అంతటి మహాత్ముడికే చిక్కని ఆ అవకాశం శ్రద్ధానంద సన్యాసికి ఎలా దక్కింది? యథార్థంగా జరిగిందేమిటో నేరుగా స్వామి శ్రద్ధానంద మాటల్లోనే వివరంగా వినండి:

ఏప్రిల్ 4 ఢిల్లీ చరిత్రలో రెడ్ లెటర్ డే! విచ్చలవిడి కాల్పుల తరవాత వచ్చిన మొదటి శుక్రవారం అది. ది గ్రేట్ జుమ్మా మసీదులో మృతవీరులకు ఆత్మశాంతిని కోరుతూ సామూహిక ప్రార్థనలు జరగనున్నాయి.
మామూలు ప్రకారం నేను నగరంలో తిరుగుతున్నాను. ‘హిందువులు కూడా మసీదుకు వచ్చి సంస్మరణ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని ముసల్మాన్ సోదరులు పట్టుబడుతున్నారు. మనం ఏమి చెయ్యాలి’ అని చాలామంది పెద్ద మనుషులు నా దగ్గరికి వచ్చి అడిగారు. వాళ్లకు సందేహం ఎందుకు వచ్చిందంటే – మేనేజింగు కమిటీ అనుమతి లేకుండా మసీదులోకి ప్రవేశించే హక్కు ముస్లింలు కానివారికి ఉండదు. మరీ ముఖ్యంగా నమాజు సమయంలో. నేను వాళ్లను కాసేపు ఆగమని చెప్పి దగ్గర్లోనే ఉన్న అబ్దుల్ రహమాన్ వకీల్ ఆఫీసుకు వెళ్లాను. హకీం సాహెబ్‌ను సంప్రదించకుండా మసీదుకు వెళ్లవద్దని రహమాన్‌గారు సలహా ఇచ్చారు. హకీం సాహెబ్ ఇంట్లో లేరు. దాంతో నేను నా ఆశ్రమానికి తిరిగొచ్చాను. నమాజు ముగిసేదాకా వెళ్లకూడదనే నేను నిశ్చయించాను.
నేను ఏదో రాసుకుంటూండగా మధ్యాహ్నం 1 గంటకి దాదాపు యాభై మంది ముసల్మాన్లు నా నివాసం మెట్లెక్కి వచ్చి, ప్రేమపూర్వకంగా బలవంతపెట్టి బయటికి తీసుకెళ్లారు. టాంగాలోకి ఎక్కించారు. కొంతదూరం వెళ్లాక దానికంటే వేగంగా వెళ్లే వాహనంలోకి.. అలా వాహనాలు మారుస్తూ చివరికి మోటారుకారు ఖాళీగా దొరికితే అందులోకి ఎక్కించి హుటాహుటిన తీసుకువెళ్లారు. జుమ్మామసీదు చేరగానే తొందరబెట్టి, దక్షిణం వైపు మెట్ల దగ్గరికి పరిగెత్తించారు. ‘మహాత్మాగాంధీకీ జై’ ‘హిందూ – ముసల్మాన్‌కీ జై’ అన్న కేకల మధ్య నేను మెట్లెక్కాను.
లోపల గుమికూడినవారు 30 వేలకు తక్కువ ఉండరు. నేను చివరి వరసలో కూచోబోతూండగా ముసల్మాన్ సోదరులు పరిగెత్తుకుంటూ వచ్చి లోపలి భవనాల గుండా బయటికి వెళ్లి… మత బోధకుడి (పేష్ ఇమాం) ముందు ఆసా బల్ల (pulpit) అమర్చిన చోటికి తీసుకెళ్లారు. వౌల్వీ అబ్దుల్ మజీద్ జనాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్నాడు. నన్ను గమనించి ఆగాడు. నేను సందేహించాను. పైకి వెళ్లమని వందల మంది అరిచారు. రెండు మెట్లు ఎక్కాక నేను మళ్లీ తటపటాయించాను. జన సమూహం ఒక్క ఉదటున లేచి ‘పైకి వెళ్లండి వెళ్లండి’ అని కేకలు పెట్టారు. నేను బల్ల దగ్గరికి చేరాక వారు కూర్చున్నారు.
వౌల్వీ అబ్దుల్ మజీద్ తన ప్రవచనాన్ని కొనసాగిస్తారని నేను అనుకున్నాను. కాని ఆయన ‘అమరవీరుల రక్తం గురించి పవిత్ర ఖురాన్ ఏమనేదీ మీరు ఇప్పటిదాకా విన్నారు. ఇదే విషయాన్ని మన హిందూ సోదరుల పవిత్ర గ్రంథమైన వేదం కూడా ఎలా ప్రబోధిస్తుందన్నది స్వామి శ్రద్ధానంద మీకు ఇప్పుడు చెబుతారు’ అని పలికి ప్రసంగం ముగించారు. హఠాత్తుగా నేను మాట్లాడవలసి వచ్చింది.
త్వంహి నః పితా వసో త్వం మాతా శతక్రతో బభూవిథః
అధాతే సమ్నమీమహే
నీవే తల్లివి; తండ్రివి; మా అందరికీ నీవే శరణు… అంటూ భగవంతుడిని ప్రస్తుతించే ఋగ్వేద మంత్రంతో నేను ప్రారంభించాను. మృతవీరుల నిష్కళంక బలిదానాన్ని ప్రస్తావించి, హిందూ – ముస్లిం సంఘీభావాన్ని ఉగ్గడించే ఈ కవితను వినిపించాను:
‘హిందూ నే సనమ్ మే జల్వా పాయా తేరా
ఆతిష్ పాయి ఫిగాన్ నే రాస్ గయా తేరా
దేహ్రీ నే కియా దెహ్ సే తబీర్ తుఝే
ఇన్‌కార్ కిసీ సే బన్‌నా ఆయా తేరా’
ఆ సమయాన అక్కడ ఉన్నవారు నాటి సన్నివేశాన్ని చక్కగా వర్ణించగలరు. చివరలో నేను మూడుసార్లు ‘ఓం శాంతి’, ‘ఆమీన్’ అని ఉచ్చరించగానే మొత్తం జనమంతా నాతో గొంతు కలిపారు. అది ఉత్తేజకరమైన దృశ్యం. నేను కిందికి దిగి నిష్క్రమిస్తుండగా ప్రజలు మెచ్చుకోలుగా చూశారు.
లోపల ఈ సుందర సన్నివేశం నడుస్తూండగా మసీదు వెలుపల మిలిటరీ, పోలీసులు సాయుధ శకటాలతో మోహరించి ఉన్నారు. నాయకులు ఉద్బోధించిన ప్రకారం ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు.
[Inside Congress, Swami Shraddhananda, pp.68-70]

ఈ కాలంలో చాలామంథికి ఇది సహజంగానే నమ్మబుద్ధి కాదు. ఔనుమరి. హిందువులు, ముస్లింలు పరస్పర శత్రువులనీ… ఏ మాత్రం సందు దొరికినా హిందూ మతోన్మాదులు అమాయక ముస్లింలను ఊచకోత కోస్తారనీ… వారి బారి నుంచి మైనారిటీలను రక్షించటానికే సెక్యులర్ నేతాశ్రీలు స్పెషల్ డ్యూటీ మీద భూమిపై అవతరించారనీ… అమాంబాపతు రాజకీయ నాయకులు అనేక దశాబ్దాలుగా నూరిపోశారాయె! హిందువులు, ముసల్మాన్లు ఒకచోట గుంపుగా తారసపడ్డారంటే తలలు పగిలాయనే, గొంతులు కోసుకుంటారనే మనకు లెక్క! అలాంటి ఘోరాలేవీ జరగకుండా రెండు వైరి వర్గాలనూ అదుపులో ఉంచి, శాంతి భద్రతలు కాపాడటానికే పోలీసులు, పారా మిలిటరీ బలగాలు కళ్లలో వొత్తులు వేసుకుని కాపలా కాస్తుంటారని అనుకుంటాం.
అలాంటిది దేశంలోకెల్లా పేరుమోసిన జామా మసీదులో హిందువులు, ముస్లింలు కలిసి ప్రార్థనలు చేయడమేమిటి? కాషాయం కట్టిన హిందూ సన్యాసి వారికి హితబోధ కావించడమేమిటి? మసీదు లోపల హిందూ – ముస్లిం జనాలుంటే వెలుపల పోలీసు, మిలిటరీ సాయుధ శకటాలు బారులు తీరడమేమిటి? తుపాకులు, శతఘ్నలు నోళ్లు తెరిచి చూస్తూంటే ఇరు మతాల ప్రజలు ప్రశాంతంగా నిష్క్రమించడమేమిటి? దీనికి మించిన అద్భుతం ఇంకేముంటుంది?
కాని చరిత్ర పుస్తకాల్లో కాని… మత సామరస్యం కోసమే, హిందూ ముస్లిం సఖ్యత కోసమే ఊపిరి పీలుస్తున్నామని చెప్పే ‘సెక్యులర్’ నాయకమ్మన్యుల మాటల్లో కాని దీని ఊసే వినపడదేమి? ఎవరూ పట్టించుకోలేదంటే నిజానికి ఇది జరగలేదేమో!? అలా శంకించడానికీ వీలు లేదు. హిందూ పక్షపాతి అని ఎవరూ నింద వెయ్యలేని… జవహర్లాల్ నెహ్రుగారే తన ఆత్మకథలో ఈ అపూర్వ ఘట్టాన్ని గుర్తు చేసుకున్నారు ఇలా:

Swami Shraddhanand, an Arya Samajist leader had stood in the pulpit of the great Jame Masjid of Delhi and preached to a mighty gathering of Muslims and Hindus of unity and India’s freedom. And that great multitude had greeted him with loud cries of Hindu – Musalman – ki – jai, and outside in the streets they had jointly sealed that cry with their blood.
[An Autobiography, Jawaharlal Nehru, P160]

(ఆర్య సమాజ్ నాయకుఢు స్వామి శ్రథ్ధానంద ఢిల్లీలో ది గ్రేట్ జామే మసీదులో బోధకుడి వేదికపై నిలబడి ముస్లింలు, హిందువులు కూడిన మహా జనసమూహానికి ఐక్యత గురించి, భారత స్వరాజ్యం గురించి ప్రబోధించాడు. ‘హిందూ-ముసల్మాన్‌కీ జై’ అని జనబాహుళ్యం బిగ్గరగా కేకలు వేశారు. బయట, వీధుల్లోనూ హిందువులు, ముస్లింలు కలిసి ఆ నినాదాన్ని తమ రక్తంతో సీలు చేశారు.) *

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మరుగునపడ్డ మహనీయుడు — అసలు మహాత్ముడు – 2

మరుగునపడ్డ మహనీయుడు — అసలు మహాత్ముడు – 2

  • 07/12/2014
  • |

  • – ఎం.వి.ఆర్. శాస్త్రి

మన పుణ్యభూమిలో మహాత్ములకు కొదవలేదు. ఏ కాలంలో, ఏ రంగంలో చూసినా తమ ఉనికి చేతనే లోకానికి వెలుగు చూపిన మహనీయులు ఆట్టే కష్టపడకుండానే కనిపిస్తారు. అయినా ‘మహాత్ముడు’ అనగానే మనకు స్ఫురించేది మోహన్‌దాస్ కరంచంద్ గాంధీగారే.
గాంధీజీ జీవించి ఉన్న కాలంలో ఆయన మహాత్మ్యాన్ని దేశం యావత్తూ ఏనాడూ ఏకగ్రీవంగా అంగీకరించలేదు. ఆయనను సాక్షాత్తూ దేవుడిగా, లేక అవతార పురుషుడుగా కొలిచినవారు, ఆయన మాటను వేదవాక్కుగా తలిచిన వారు, ఆయన నిప్పుల్లో దూకమంటే దూకడానికి సిద్ధపడినవారు, ఆయనలో ఇసుమంత దోషాన్ని కలనైనా ఊహించలేనివారు ఎంతమంది ఉండేవారో-

గాంధీగారితో తీవ్రంగా విభేదించినవారు… ఆయన సిద్ధాంతాలు, విధానాలు దేశానికి అరిష్టమని నమ్మినవారు… ఆయనను కపటిగా, పక్షపాతిగా, చపలచిత్తుడిగా, అబద్ధాలకోరుగా, నీతిమాలిన వాడిగా ఏవగించుకున్నవారు కూడా అంతే మంది – ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువే ఉండేవారు. జాతీయోద్యమంలో చిరస్మరణీయులైన మహా దేశభక్తులు చాలామంది ఏదో ఒక సమయంలో గాంధీ వైఖరిని తీవ్రంగా వ్యతిరేకించినవారే. ఆఖరికి నెహ్రు, పటేల్ వంటి అనుంగు శిష్యులు కూడా గాంధీ నడవడిని, పోకడను ఏదో ఒక సమయంలో తప్పుపట్టినవారే.
కోట్ల మందికి ఆరాధ్యుడై, లక్షల మందిని స్వాతంత్య్ర సమరానికి కదిలించి, మొత్తం జాతీయోద్యమ గతిని మార్చిన మహానాయకుడిగా గాంధీగారి ప్రాముఖ్యాన్ని ఎవరూ తక్కువ చేయలేరు. నీతికి, నియమబద్ధతకు, సత్యసంధతకు మారుపేరైన సత్యాగ్రహ ప్రవక్తగా ప్రపంచం మీద ఆయన వేసిన చెరగని ముద్రను సగౌరవంగా స్మరించవలసిందే. ఎంతైనా మనిషే కనక మానవ సహజమైన బలహీనతలు గాంధీజీలోనూ ఉన్నాయి. తెలిసి చేసినా తెలియక చేసినా ఆయన వల్ల పెద్ద తప్పులు జరిగాయి. వాటికి దేశం భయానకమైన మూల్యం చెల్లించింది.
గాంధీగారి జీవిత కాలంలోనే ఆయన లోపాలను, వైరుధ్యాలను ఎంతోమంది ఆయన మొగం మీదే తూర్పారబట్టినప్పుడు… కాలం గడిచి, ఆయా ఘటనలూ వివాదాలూ వేడి తగ్గి చరిత్ర పుటలకెక్కి, తరాలు మారాక – జాతి జీవితంలో, జాతీయోద్యమంలో గాంధీజీ పాత్ర, దాని మంచి చెడ్డల గురించి ఇంకా లోతైన మూల్యాంకనం జరిగి ఉండాల్సింది. చిత్రమేమిటంటే – కాలం గడిచేకొద్దీ మన అవగాహన మరింత తేటపడవలసింది పోయి అంతకంతకూ మసకబారిపోయింది. జాతీయోద్యమంలో గాంధీ, నెహ్రులను మాత్రమే విరాట్ పురుషులుగా చిత్రిస్తూ, వారిలోని చీకటి కోణాలను కప్పేస్తూ… వారికి గిట్టని వారి, వారితో విభేదించిన వారి ప్రాధాన్యాన్ని పథకం ప్రకారం హరిస్తూ… పథకం ప్రకారం చరిత్రకు వెల్లవేత జరిగింది. దాంతో ఎందరో మహా వ్యక్తులు, వారు సాగించిన ఎన్నో గొప్ప పోరాటాలు, వారు దేశానికి చేసిన అమోఘమైన సేవలు జాతి స్మృతిపథం నుంచి క్రమంగా చెదిరిపోయాయి.
అలా మరుగున పడ్డ మహాపురుషుల్లో మొదటి వరసలో ఎన్నదగిన వాడు స్వామి శ్రద్ధానంద. ఆయన అసలైన మహాత్ముడు. ఆ మాటంటే బహుశా మహాత్మాగాంధీకి కూడా అభ్యంతరం ఉండదు. ఎందుకంటే ఆయనను మహాత్ముడిగా మొట్టమొదట గుర్తించిన వాడు మోహన్‌గాంధీగారే. దక్షిణాఫ్రికా నుంచి ఆయన రాసిన జాబే ఇందుకు రుజువు:

Phoenix, Natal
21 Oct, 1914
Dear Mahatmaji
Mr.Andrews has familiarised your name and your work to me. I feel that I am writing to no stranger. I hope, therefore, that you will pardon me addressing you by the title which both Mr.Andrews and I have used in discussing you and your work. Mr.Andrews told also how you, Gurudeva and Mr.Rudra had influenced him. He described to me the work your pupils did for the passive resisters and gave such word pictures of the life at Gurukula that as I am writing this I seem to be transported to the Gurukula. Indeed he has made me impatient to visit the three places described by Mr.Andrews and to pay my respects to the three good sons of India who are at the head of these institutions.
I remain,
Yours,
Mohandas K. Gandhi
[Inside Congress, Swami Shraddhanand, p.48]

ఫీనిక్స్, నేటాల్
21 అక్టోబర్, 1914
ప్రియమైన మహాత్మా
మీ పేరు, మీరు చేస్తున్న పని మిస్టర్ (సి.ఎఫ్) ఆండ్రూస్ నాకు పరిచయం చేశాడు. నాకు తెలియని కొత్త మనిషికి ఉత్తరం రాస్తున్నానని నాకు అనిపించటం లేథు. మీ గురించి, మీరు చేస్తున్న పని గురించి మాట్లాడుకునేటప్పుడు నేను, ఆండ్రూస్ ఉపయోగించే బిరుదుతోనే మిమ్మల్ని సంబోధించాను. ఇందుకు మన్నిస్తారని ఆశిస్తున్నాను. మీరు, గురుదేవ (రవీంద్రనాథ్ టాగోర్), మిస్టర్ రుద్ర (్ఢల్లీలో సెయింట్ స్టీఫెన్స్ కాలేజి ప్రిన్సిపాల్) తనను ఎలా ప్రభావితం చేసిందీ ఆండ్రూస్ చెప్పాడు. సత్యాగ్రహుల కోసం మీరు, మీ విద్యార్థులు ఏమి చేశారో అతడు నాకు వివరించాడు. గురుకులంలో జీవితాన్నీ కళ్లకు కట్టినట్టు చెప్పాడు. ఆండ్రూస్ వర్ణించిన ఆ మూడు చోట్లకు వెళ్లి, ఆ సంస్థలను నడిపిస్తున్న భారతమాత గొప్ప పుత్రులు ముగ్గురినీ ఎప్పుడెప్పుడు చూస్తానా అని నేను తహతహలాడుతున్నాను.
ఇట్లు
మీ మోహన్‌దాస్ కె.గాంధి

దక్షిణాఫ్రికాలో సత్యాగ్రహాన్ని గాంధీజీ 1914లో మళ్లీ మొదలెట్టాడు. అక్కడి సత్యాగ్రహులకు సహాయంగా లక్షల రూపాయల విరాళాలు పంపించాలని గోపాలకృష్ణ గోఖలే భారతీయులకు విజ్ఞప్తి చేశాడు. దానికి ఆశించినంత స్పందన రాలేదు. ఆ సమయాన స్వామి శ్రద్ధానంద (అప్పట్లో ఆయన పేరు లాలా మున్షీరాం. ఇంకా సన్యాసాశ్రమం స్వీకరించలేదు) గాంధీ మొగం ఎరగకపోయినా, ఆయన సాగిస్తున్న దక్షిణాఫ్రికా ధర్మ యుద్ధానికి మద్దతుగా నిధుల సేకరణకు నడుము కట్టాడు. హరిద్వార్‌లో ఆయన గురుకులంలోని బ్రహ్మచారులు నెల రోజుల పాటు పాలు, నెయ్యి మానేసి, సెలవు రోజుల్లో కూలీ పని చేసి 1500 రూపాయలు పోగు చేశారు. ఆ రోజుల్లో అది చాలా పెద్ద మొత్తం. ఉత్తరంలో గాంధీజీ ప్రస్తావించింది ఈ సహాయానే్న.
‘విశ్వకవి టాగోర్, శ్రద్ధానంద, ప్రిన్సిపాల్ సుశీల్‌రుద్ర – ఈ ముగ్గురు ఆండ్రూస్ దృష్టిలో త్రిమూర్తులు. దక్షిణాఫ్రికాలో ఉండగా అతడు ఎప్పుడూ వాళ్ల గురించి చెబుతూండేవాడు’ అని గాంధీజీ తన ఆత్మకథ “The First Experience” అధ్యాయం)లో రాశాడు.
1914లో సత్యాగ్రహం ముగించాక ఫీనిక్స్ ఆశ్రమం సహచరులు, గాంధీ స్వదేశానికి మరలారు. లండన్‌లో ఆగి తనను కలసి వెళ్లవలసిందని గోఖలేగారు గాంధీకి చెప్పాడు. ఆయన కోసం ఎదురుచూస్తూ, ఇతర రాచకార్యాలు చక్కబెడుతూ గాంధీ లండన్‌లో ఉండగా, ఫీనిక్స్ బృందం ఇండియా వచ్చేసింది. వారిని ఎక్కడ ఉంచాలన్న సమస్య ఎదురైంది. అప్పుడు ఆండ్రూస్ సలహాపై వారికి హరిద్వార్‌లోని కాంగ్‌డీ గురుకులంలో బస ఏర్పాటు చేశారు. ‘స్వామి శ్రద్ధానందజీ వారిని సొంత పిల్లల్లా చూసుకున్నాడు’ అని గాంధీజీ ‘ఆత్మకథ’లో మెచ్చుకున్నాడు.
ఇండియాకు తిరిగొచ్చాక సంవత్సరంపాటు దేశమంతా తిరిగి రమ్మన్న గోఖలే మాట మీద చేసిన దేశాటనలో గాంధీగారు హరిద్వార్ వెళ్లి తాను ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్న మహాత్ముడిని కలిశాడు. అది 1915లో కుంభమేళా కాలం.
‘గురుకుల్ చేరి మహాత్మా మున్షీరాంజీని కలవటం గొప్ప అనుభూతి. ఆయనది భారీ విగ్రహం. బయటి రణగొణ ధ్వనికీ, గురుకులంలోని ప్రశాంతికీ అద్భుతమైన తేడా కనిపించింది. మహాత్ముడు నన్ను తన ప్రేమతో ముంచెత్తాడు. బ్రహ్మచారులు నన్ను చక్కగా చూసుకున్నారు’ అని ‘ఆత్మకథ’లో గాంధీజీ గుర్తు చేసుకున్నాడు.
తనకు సమయానికి సహాయం చేసిన మహాత్ముడిని కలిసి, ఆయన ప్రేమకు, అక్కడి ప్రశాంత వాతావరణానికి ముగ్ధుడయ్యాక ఆయనతో గాంధీగారి అనుబంధం మరింత గట్టిపడి ఉండాలి. గట్టిపడింది కూడా. మున్షీరాంజీకీ గాంధి మహా నచ్చాడు. ఆయన ప్రభావంవల్లే గురుకులాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయనను సంప్రదించే, ఆయన సలహా మేరకే సత్యాగ్రహ సమరంలో తొలి అడుగులు వేశాడు.
కాని ఈ అన్యోన్య మైత్రి ఎక్కువ కాలం నిలవలేదు. లోతుకు వెళ్లే కొద్దీ, చేదు అనుభవాలు అయ్యే కొద్దీ, గాంధీ తత్వం స్వామీజీకి బోధపడింది. క్రమేణా దూరం పెరిగింది. శ్రద్ధానందకు లౌక్యం తెలియదు. తాను నమ్మింది కుండబద్దలు కొట్టినట్టు ఎదుటి వారి మొగం మీదే చెప్పడం ఆయనకు అలవాటు.
ఆ సంగతి మొదటి ఉత్తరంతోనే గాంధీగారికి అర్థమైంది. దక్షిణాఫ్రికా నుంచి ఆయన ఇంగ్లీషులో జాబు రాస్తే ‘మహాత్మా మున్షీరాం’ హిందీలో జవాబు రాశాడు. పైగా ‘హిందీని ‘జాతీయ భాష’ చేయాలని కోరుకునేవాడికి తన దేశవాసులతో విదేశీ భాషలో ఉత్తరాలు రాసే హక్కు లేదు’ అని నిష్కర్షగా చెప్పాడు కూడా. గాంధీగారు మళ్లీ ఎన్నడూ ఆయనకి ఇంగ్లీషులో రాయలేదు. ఇద్దరి మధ్య ఉత్తరాలన్నీ హిందీలోనే నడిచాయి.
కొసమెరపు: పైన ఉటంకించిన తొలిజాబు కోసం గాంధిగారి ‘కలెక్టెడ్ వర్క్స్’లో వెతక్కండి. అది మీకు అక్కడ కనపడదు. వేరొకరిని ‘మహాత్మా’ అని సంబోధించడం మహాత్ముడి కాంతి వలయానికి శోభనివ్వదని అనుకున్నారో?! అలా సంబోధించబడ్డ వాడు ఉత్తరోత్తరా తమ మహాత్ముడికి ఎదురు తిరిగినవాడు కావటం ఇబ్బందిగా తోచిందో?! గాంధీగారి ఉత్తరాలను, అన్ని రకాల రాతలను సంపుటీకరించిన మహాత్ములు మొత్తానికి ఆ ఉత్తరాన్ని దాచేశారు.
పైన చెప్పుకున్న చరిత్ర వెల్లవేతకు ఇదో చిన్న ఉదాహరణ!
*

స్వార్థం లేని విరాగి
లాలా మున్షీరాం మొదటి నుంచీ దమ్మున్న కార్యకర్త. ఆయన చేసే పనే ఆయనకు నాయక స్థానాన్ని ఎల్లప్పుడూ తెచ్చిపెడుతూ వచ్చింది. ప్రజలను ఆకర్షించే లక్షణం ఆయనలో ఉంది. ఆయన మొహమాటం లేకుండా మాట్లాడుతాడు. తాను నమ్మినదాన్ని పట్టుదలతో ఆచరిస్తాడు. 1892-93లోనూ, ఆ తరవాతా జరిగిన కొన్ని సంఘటనలనుబట్టి మున్షీరాంజీ ప్రాచుర్యం కోసం, నాయకత్వం కోసం పాకులాడుతాడని నేను భావించాను. ఆ అభిప్రాయం తప్పని నెమ్మది మీద గ్రహించాను. ప్రతి గొప్ప వ్యక్తికీ ఉన్నట్టే మున్షీరాంజీలోనూ కొన్ని లోపాలు ఉండవచ్చు. ఆయన త్వరగా ఉద్వేగానికి లోనవుతాడు. కాని అది తాను మనస్ఫూర్తిగా అంకితమైన ఆశయాల విషయంలోనే. ఆయన సేవానిరతి గొప్పది. తన విశ్వాసాల కోసం ఎంతటి కష్టనష్టాలకైనా వెనుదీయడు. ఆయన లేశమైనా స్వార్థం లేని విరాగి.
-లాలా లజపతిరాయ్ (‘ఆత్మకథ’లో)

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

‘అంతా పాపులే… దేవుళ్లూ దొంగలే’ ….3

‘అంతా పాపులే… దేవుళ్లూ దొంగలే’ ….3

  • 14/12/2014
  • |

  • – ఎం.వి.ఆర్. శాస్త్రి

చదువు పట్టదు. జులాయిలా తిరుగుతాడు. చెడు సావాసాలు. మాంసం లేనిదే ముద్ద దిగదు. చెడ తాగుతాడు. సానివాడల చుట్టూ తిరుగుతాడు. పక్కా వ్యభిచారి. దేవుడిని నమ్మడు. పైగా తిడతాడు. పరమ నాస్తికుడు. హిందూ మతమంటే మంట. సాధు సంతులంటే అసహ్యం.
ఇదీ అవతారం! ఉండాల్సిన అవలక్షణాలు అన్నీ ఉన్నాయి. చిన్నప్పుడు మున్షీరాంను చూసిన వారెవరూ అతడి గురించి ఒక్క మంచి మాట చెప్పరు. వీడు భ్రష్టుడు; పాపాత్ముడు; మంచి కుటుంబంలో చెడబుట్టాడు; జన్మలో బాగుపడడు – అని ఏవగించుకుంటారు. అంతగా కంపరం కలిగించిన ఆ నికృష్టుడే మునుముందు గొప్ప ధర్మవీరుడవుతాడు; దారి తప్పిన వారికి మార్గం చూపిస్తాడు; చదువులను వెలిగిస్తాడు; మహా విద్యా సంస్థను నడుపుతాడు; వేద విజ్ఞానాన్ని, సనాతన ధర్మాన్ని నిలబెడతాడు; పవిత్రంగా జీవిస్తాడు; జాతి గర్వించదగ్గ మహా పురుషుడవుతాడు – అని కలనైనా ఊహించరు.

మున్షీరాం పుట్టింది ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి ఏడాది ముందు. 1856 ఫిబ్రవరి 22న. పంజాబ్‌లోని జలంధర్ జిల్లా తల్వాన్ గ్రామంలో. సుక్షత్రియ కుటుంబంలో. వారిది మడి, ఆచారం నిష్ఠగా పాటించే సాంప్రదాయక కుటుంబం. తాతలాగే తండ్రి కూడా శివభక్తుడు. తల్లికీ పూజా పునస్కారాలు జాస్తి. ఐదుగురు పిల్లల తరవాత పుట్టిన కడగొట్టు బిడ్డ కనకేమో మున్షీరాంను (మొదట పెట్టిన పేరు బృహస్పతి. పలకటం కష్టమని దాన్ని మున్షీరాంగా తరవాత మార్చారు) అల్లారుముద్దుగా పెంచింది. తండ్రి నానక్‌రాం ఈస్టిండియా కంపెనీ కొలువులో పోలీసు అధికారి. ఉద్యోగరీత్యా ఊళ్లు తిరుగుతూండేవాడు. తరచు బదిలీలుండేవి. దానివల్ల పిల్లవాడి చదువు సరిగా సాగలేదు. తండ్రికి క్షణం తీరిక లేకపోవటం, తల్లి గారాబం అబ్బాయిని చెడగొట్టాయి.
దానికితోడు చెడు సావాసాలు. చిన్నతనంలోనే బడి ఎగ్గొట్టి బలాదూరుగా తిరగటం, భంగు, సారా తాగటం, చీట్ల పేక ఆడటం అలవాటైంది. వయసొచ్చాక పడుపుగత్తెలనూ మరిగాడు. కొత్వాలుగారి అబ్బాయి కావటంవల్ల ఎవరూ మందలించేవారుకారు. మొదట్లో కాస్తో కూస్తో దేవుడి మీద గురి ఉండేది. పోనుపోను అదీ పోయింది.
దానికీ కొన్ని కారణాలున్నాయి.
మున్షీరాం విద్యాభ్యాసం ఎక్కువగా కాశీలో జరిగింది. తండ్రి అక్కడి కొత్వాలు. చిన్నప్పుడు దైవభక్తి బాగానే ఉండేది. తరచూ గుడికి వెళ్లి విశ్వనాథుని దర్శనం చేసుకునేవాడు. 19వ ఏట ఓ రోజు సాయంత్రం చీకటి పడ్డాక ఆలయానికి వెళ్లాడు. ప్రధానాలయం గుమ్మం బయట ఇద్దరు పోలీసులు కాపలా ఉన్నారు. లోపల రేవా మహారాణిగారు ఉన్నారు. ఆమె అర్చన ముగిసేదాకా ఎవరినీ పోనిచ్చేది లేదన్నారు.
మున్షీరాం దిమ్మెరపోయాడు. అంతలో ఒక పోలీసు అతడు ఫలానా అని గుర్తు పట్టి దయచేసి కొద్దిసేపు వేచి వుండమని మర్యాద చేయబోయాడు. కుర్రవాడు ఆగకుండా విసురున ఇంటికి వెళ్లాడు. రాత్రి నిద్రపట్టలేదు. ఎంతసేపూ అదే ఆలోచన. దేవుడి దగ్గర కూడా ఎక్కువ తక్కువలు ఉంటాయా? మనుషులకు భేదభావం ఉండొచ్చు. దేవుడికి ఏమైంది? ఎవరో మహారాణి వచ్చిందని మురిసి మామూలు భక్తులను దగ్గరికి రానివ్వనివాడు ఏమి దేవుడు? అసలు దేవుడనే వాడున్నాడా? మనిషి చెక్కిన విగ్రహమేనా?
ఇలా ఆలోచిస్తూ పోయే కొద్దీ విశ్వనాథుడి మీదే కాదు, అందరు దేవుళ్ల మీదా మున్షీరాంకు అసహ్యం వేసింది. రారుూరప్పలకు మహిమ ఉన్నదని మూర్ఖంగా నమ్మే హిందూ మతమంటేనే విరక్తి పుట్టింది. సరైన దారి ఏదో ఎవరు చూపించగలరా అని ఆలోచిస్తే తనకు పరిచితుడైన ఒక క్రిస్టియన్ మిషనరీ స్ఫురించాడు. పుస్తకాల్లో తాను చదివిన రోమ్ నాగరికత, క్రీస్తు కరుణ గుర్తొచ్చాయి.
కిరస్తానీ మతం మీద కుతూహలం కలిగి, తెలిసిన ప్రొటెస్టంట్ మిషనరీ దగ్గరికి వెళ్లాడు. అతడు బోలెడు సంతోషపడ్డాడు. మంచి నిర్ణయం తీసుకున్నావ్. నీ కళ్లు తెరచుకున్నాయి. ప్రభువు నిన్ను కరుణించాడు. వెంటనే మా మతంలోకి మారు’ అని వెంటపడ్డాడు.
‘అది తరవాత చూద్దాం. ముందు మీ మతం గురించి చెప్పు’ అన్నాడు మున్షీరాం. అతడి ప్రశ్నలకు సందేహాలకు అవతలి వాడు జవాబు చెప్పలేక పోయాడు. అతడి వల్ల కాదనుకొని, మున్షీరాం ఓ రోమన్ కాథలిక్ ప్రీస్టు దగ్గరికి వెళ్లాడు. మొదటి వాడి మీద అతడు నయం అనిపించాడు. క్రైస్తవ మతం గొప్పతనం చెబితే అర్థంకాదు. సందేహాలు పక్కనపెట్టి చర్చికి వస్తూ ఉండు. మెల్లిగా నీకే అంతా తెలుస్తుంది’ అన్నాడు.
మనవాడికి ఆ సలహా నచ్చింది. ఇంట్లో వాళ్లకు చెప్పకుండా చర్చికి వెళ్లసాగాడు. అక్కడి పద్ధతులు, బోధలు అతడిని ఆకట్టుకున్నాయి. ఫాదరీ మంచితనం మరీ నచ్చింది. చేరవలసిన చోటికి చేరాననుకున్నాడు. క్రైస్తవ మతం పుచ్చుకునేందుకు నిశ్చయించుకున్నాడు. ఆ సంగతి ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. ఒక స్నేహితుడిని మాత్రం సంప్రదించాడు. అతడేమో ‘మంచిది. అలాగే కానియ్’ అన్నాడు.
ఇంకేం? ‘మీ మతం తీసుకుంటాను. ఏమి చేయాలో చెప్పండి’ అని అడగటానికి ఫాదర్ ఇంటికి వెళ్లాడు. ఆయన కనపడలేదు. ఇంట్లో అలికిడి లేదు. లోపలికి వెళ్లి తొంగి చూస్తే ఇంకో ఫాదరీ ఎవరో ‘నన్’ (క్రైస్తవ సన్యాసిని)తో అసభ్య భంగిమలో కనపడ్డాడు.
మున్షీరాంకి దిమ్మ తిరిగింది. మళ్లీ చర్చి గుమ్మం తొక్కితే ఒట్టు. ఇంకోసారి మధురలో ఏదో గుడి చూడబోతే ఓ మూల గోసాయి పూజారి భక్తురాలితో సరసమాడుతూ కనిపించాడు. ఈ అనుభవాలతో మున్షీరాంకి దేవుళ్లన్నా, మతాలన్నా మనసు విరిగింది. అందరూ దొంగలే, అసలు దేవుడనేవాడే లేడు అని నిశ్చయానికి వచ్చి పక్కా నాస్తికుడయ్యాడు.
అదే సమయంలో అతడి తల్లి మరణించింది. తండ్రికీ వ్యాపకాలు ఎక్కువయ్యాయి. దాంతో కుర్రవాడికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. ఎప్పుడో తప్ప కాలేజికి వెళ్లేవాడు కాదు. పాఠం పుస్తకాలు పక్కన పడేసి వాల్టర్ స్కాట్, చార్లెస్ డికెన్స్ నవలలు తెగ చదివేవాడు. వారణాసిలో పరీక్ష తప్పి, అక్కడ బాగా లేదని అలహాబాద్ కాలేజిలో చేరాడు. అక్కడా క్లాసులు ఎగ్గొట్టి, సావాసగాళ్లను వెంటేసుకుని జూదాలు ఆడేవాడు. భంగు, మద్యం తెగ తాగేవాడు. సానివాడల్లో గానా బజానాలు చేస్తూ కులికేవాడు. పాపం చేస్తున్నావ్ అని ఎవరైనా మందలిస్తే అంతా పాపులే, అంతటా మోసమే, దేవుళ్లూ దొంగలేనంటూ తిట్టిపోసేవాడు. సాధువులను, సన్యాసులను చూస్తూనే మండిపడేవాడు.
ఇలా దేవుడికీ, ధర్మానికీ ఆమడదూరమై, నాస్తికత్వంలో మునిగి తేలుతూండగా మున్షీరాం ఓసారి సెలవులకు బరేలీ వెళ్లాడు. అప్పట్లో అతడి తండ్రి ఉద్యోగం అక్కడ. ఇంట్లో కూడా ఇలాగే రెట్టమతంతో అడ్డదిడ్డంగా వాదిస్తూంటే ఓరోజు తండ్రి అన్నాడు ‘ఎవరో దయానంద స్వామి అట! ఊళ్లోకి వస్తున్నాడు. చాలా గొప్పవాడు అంటున్నారు. ఈ పిచ్చి వాగుళ్లు మానేసి ఆయన సభకి వెళ్లు. అప్పుడైనా నీ తిక్క కుదురుతుందేమో’ అన్నాడు. ‘నేను వెళ్లను’ అన్నా వినలేదు. ‘పెద్దపెద్ద తెల్లదొరలు కూడా హాజరవుతారట. అక్కడ బందోబస్తూ అదీ జాగ్రత్తగా చూసుకోమని పైనుంచి ఆదేశాలొచ్చాయి. కాబట్టి నేను ఎలాగూ వెళతాను. ఇంట్లో కూచుని ఏం చేస్తావ్, నువ్వూ రావలసిందే’ అని తండ్రి పట్టుబట్టాడు.
కుమారుడికి ఉక్రోషం వచ్చింది. ‘సరే వస్తాలే’ అని పైకి అన్నాడు. ‘వచ్చి ఏమి చేయాలో అది చేస్తానులే’ అని లోపల అనుకున్నాడు. తనకు తోడుబోయిన తొట్టిగ్యాంగును కూడగట్టాడు. సభలో అల్లరి చేసి, వచ్చిన స్వాములారిని పరాభవించాలని పథకం వేశాడు. ‘ఉండు నీ భరతం పడతా’ అని సన్యాసి మీద పళ్లు నూరుతూ, జతగాళ్లను వెంటేసుకుని సభాస్థలికి ఈలవేస్తూ వెళ్లాడు.
తన జీవితంలో అదే గొప్ప మలుపు అని అతడికి తెలియదు.
వచ్చినవాడు సామాన్యుడు కాదు.
స్వామి దయానంద సరస్వతి. ఆర్య సమాజ్ సంస్థాపకుడు. దేశంలో ఎందరో ఉద్దండ పండితులను శాస్త్ర చర్చల్లో పిండి చేస్తూ, వెర్రిమొర్రి వాదాలను ఖండిస్తూ, వేద ప్రమాణాన్ని అద్భుతంగా నిరూపిస్తూ ఆధ్యాత్మిక రంగంలో ప్రభంజనంలా ముందుకు దూసుకుపోతున్న వేదమూర్తి.
తిట్టుకుంటూ, పళ్లు కొరుకుతూ తీరా స్వామి దగ్గరికి వెళ్లాక ఏమైంది?

మొదటిసారి స్వామి దయానంద సరస్వతిని చూడగానే నాకు కొత్త జన్మ వచ్చింది. నాలో ఏదో విశ్వాసం ఉప్పొంగింది. ఆయన వర్ఛస్సు, తేజస్సు అచ్చెరువు కలిగించి నన్ను కట్టి పడేశాయి. రెవరెండ్ టి.జె.స్కాట్, మరి కొందరు యూరోపియన్లు అక్కడ కూచుని స్వామి చెప్పేది మహా శ్రద్ధగా వింటున్నారు. అప్పుడు స్వామి ఓంకారం గురించి మాట్లాడుతున్నారు. ఒక సంస్కృత పండితుడు ఇంత ధాటిగా మాట్లాడి, చదువుకున్న వారిని ఇంతలా ఆకట్టుకోవడమేమిటని నాకు ఆశ్చర్యం వేసింది. ఆ ఋషి ప్రభావం వల్ల నా వంటి నాస్తికుడికి కూడా గొప్ప ఆత్మానందం కలిగింది.
[Swami Shraddhanand (Autobiography) Ed.M.R.Jambunathan, p.27]
బరేలీ టౌన్‌హాల్‌లో కొథ్దిరోజులపాటు దయానంద ఋషి వరసగా ప్రసంగాలు చేశాడు. క్రైస్తవ మతాచార్యుడు రెవరెండ్ స్కాట్, కమిషనర్ ఎడ్వర్డ్, కలెక్టర్ రీడ్, ఇంకా డజన్ల కొద్దీ యూరోపియన్లు రోజూ హాజరై ఆయన మాటలు శ్రద్ధగా ఆలకించేవారు. పుక్కిటి పురాణాల గురించి, పంచపాండవుల పెళ్లి, ద్రౌపది బహు భర్తృత్వం లాంటి అంశాల అసంబద్ధత గురించి స్వామీజీ నిశితంగా ఆక్షేపిస్తూంటే తెల్లదొరలు చెవులు రిక్కించి, ముసిముసిగా నవ్వుతూ బాగా ఆనందించేవారు. అదే ఊపులో కన్యకు గర్భం లాంటి క్రైస్తవ లీలలనూ స్వామి అంతే తీవ్రంగా ఎండగడుతూంటే వారి మొగాలు మాడిపోయేవి. అంత పరుషంగా క్రైస్తవ మతాన్ని ఆక్షేపిస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉండవచ్చని వారితో వీరితో కబురు పంపించారు. స్వామి ఆ హెచ్చరికలను కొనగోటితో కొట్టిపారేశాడు. ‘కలెక్టర్లకు, గవర్నర్లకు కోపం వస్తుందేమోనని భయపడేవాడిని కాను. ఆత్మకు చావు లేదని నమ్మినవాడిని. నన్ను ఎవరేమి చేయగలరు?’ అని ఆయన మెరిసే కళ్లతో బహిరంగ సభలో గంభీరంగా సవాలు చేస్తూంటే ఆయన ధైర్యానికి అందరూ అవాక్కయ్యారు. మతాలకు, సంకుచిత అంతరాలకు అతీతమైన స్వామి దివ్యబోధ విదేశీయులను ఎంతగా ఆకట్టుకున్నదంటే రెవరెండ్ స్కాట్ ఆయనను తన చర్చికి సాదరంగా ఆహ్వానించి క్రైస్తవ భక్తులకు ప్రవచనం ఇప్పించాడు.
చెబితే ఎవరూ నమ్మని ఈ ఘటనలన్నీ మున్షీరాం జాగ్రత్తగా గమనించేవాడు. దయానంద ఋషి ఊళ్లో ఉన్నన్నాళ్లూ రోజూ ఆయన బసకు వెళ్లి రాత్రి వరకూ ఆయననే అంటిపెట్టుకుని ఉండేవాడు. వీలు చిక్కినప్పుడల్లా తన సందేహాలను అడుగుతూండేవాడు. మళ్లీ నోరెత్తకుండా స్వామి సూటి జవాబులు ఇచ్చేవాడు. అయినా మున్షీరాంకు మనసు సమాధానపడేది కాదు. ఏదో తెలియని అశాంతి. ‘మీరు ఏమి చెప్పినా ఎంత చెప్పినా నాకు దేవుడి మీద గురి కుదరటం లేదు ఎందుకని?’ అని ఓసారి ఆయననే అడిగేశాడు. ‘నీకు గురి కలిగిస్తానని నేనెప్పుడు చెప్పాను? అది దేవుడు చేయాల్సిన పని. సమయం వచ్చినప్పుడు చేస్తాడు’ అన్నాడు స్వామి.
అలాగే జరిగింది. *

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నేమరేసిన మెమరీస్ -బాపు

bapumemories2 001 memoriesof bapu 001

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

హిందూజాల చేతికి లండన్ చారిత్రిక భవనం -చాళుక్య వీరభాద్రుడుగా ”రానా

బర్త్‌డే స్పెషల్‌ : చాళుక్య వీరభద్రుడిగా రానా (13-Dec-2014)

గుణశేఖర్‌ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘రుద్రమదేవి’ చిత్రంలో రానా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. నిడవర్ద్యపురం (నిడదవోలు) యువరాజు చాళుక్య వీరభద్రుడిగా రానా కనిపించబోతున్నారు. డిసెంబర్‌ 14న రానా పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. దేశంలోనే తొలిసారిగా స్టీరియోస్పోపిక్‌ త్రీడీ విధానంలో ఈ చిత్రాన్ని గుణశేఖర్‌ తెరకెక్కిస్తున్నారు. భారీ వ్యయంతో రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ గెస్ట్‌ రోల్‌ కూడా బాగా ఉపయోగపడేలా కనబడుతుంది. ఈ చిత్రం ప్రస్తుతం గ్రాఫిక్‌ వర్క్స్‌ పూర్తిచేసుకుంటోంది.

ఈ చిత్రంలో రాణీ రుద్రమగా అనుష్క, చాళుక్య వీరభద్రునిగా  రానా, గణపతిదేవునిగా కృష్ణంరాజు, శివదేవయ్యగా  ప్రకాష్‌రాజ్, హరిహరదేవునిగా సుమన్, మురారిదేవునిగా  ఆదిత్యమీనన్, నాగదేవునిగా  బాబా సెహగల్, కన్నాంబికగా నటాలియాకౌర్, ముమ్మడమ్మగా  ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ఫేం జరాషా, మదనికగా హంసానందిని, అంబదేవునిగా  జయప్రకాష్‌రెడ్డి, గణపాంబగా అదితి చంగప్ప, కోటారెడ్డిగా  ఆహుతి ప్రసాద్, టిట్టిబిగా వేణుమాధవ్,ప్రసాదాదిత్యగా  అజయ్ కనిపించనున్నారు.
ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మాటల నిప్పు జాతికి ముప్పు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నిమ్నోన్నతాలలో నితీష్ కుమార్ – అపూర్వరచయితాకొవ్వలి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ యన్ టీ రామారావు – వ్యవసాయ ఋణాలపై వడ్డీ మాఫీ 1984

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -88 – 131-గణితావదాన శేఖర –పులి వర్తి శరభా చార్యులు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -88

131-గణితావదాన శేఖర –పులి వర్తి శరభా చార్యులు

విశ్వ బ్రాహ్మణ కుటుంబం లో పులివర్తి శరభాచార్యులు 1912లో జన్మించారు .సువర్ణ రుషి గోత్రీకులు .తండ్రి నాగ భూషణం ,తల్లి శేషమ్మ .తెనాలి తాలూకా కొల్లూరులో పుట్టారు .బి .ఏ .బి .ఇడి పాసై ప్రభుత్వ విద్యాశాఖలో ప్రవేశించారు .జిల్లా విద్యాశాఖాధికారిగా అంచే లంచేలుగా పదోన్నతి పొంది పదవీ విరమణ చేశారు .

శరభా చార్యులకు చిన్న నాటి నుండి ఆధ్యాత్మ గురువు లైన తత్వా నందుల  వారి శిష్యులుగా ఉన్నారు .దీనీతో ప్రభుత్వోద్యోగం చేస్తూనే ,ఆధ్యాత్మ భావ పరంపరాలలో ఉన్నత శ్రేణి సాధించారు .బాల్యం లోనే కవిత్వ ధార అబ్బింది . సంస్కృతం లో గొప్ప ప్రావీణ్యాన్ని సాధించి ‘’నివేదనం ‘’,’’మరుత్సందేశః ‘’ ‘’యశోధరా ‘’అనే కావ్యాలను ,’’కలాదర్శః ‘’అనే సంస్కృత నాటకాన్ని రాశారు .తెలుగులో ‘’కల్హార మాల ‘’,’’రత్న గర్భ ‘’,’’కర్మ భూమి ‘’రాశారు .ఆచార్య శ్రీ ఆంగ్ల భాషలోను నిష్ణాతులు .ఇంగ్లీష్ లో ‘’డాక్టర్స్ వార్ ‘’అనే కావ్యం రచించి ఆశ్చర్య పరచారు అంటే త్రిభాషా కవులన్న మాట .అందుకే ‘’త్రిభాషా కవి ‘’కవి బిరుదు నందుకొన్నారు .వీరు రాసిన సంస్కృత కావ్యాలను వంగవోలు ఆది శేష శాస్త్రి తెలుగులోకి సరస సరళ భాషలోకి అనువదించారు .

జిల్లా విద్యా శాఖాదికారిగా ఉంటూనే అస్టావదాన విద్యనూ నేర్చుకొని వందకు పైగా అవధానాలు చేసి రసజ్ఞుల మెప్పు పొందారు .గణితం లోనూ అవధానం చేయవచ్చు నని నిరూపించి ఆ విద్యను కనిపెట్టి ,ఆ విద్యలో ఆద్యులై   సాటి లేని మేటి అనిపించుకొని గణితావధానాలు  చేశారు .’’ఈ వింత అవధానం అందరిని ఆకర్షించింది చాలా ప్రదర్శనలిచ్చారు .’’గణితావదాన శేఖర ‘’గౌరవ పురస్కారాలనందుకొన్నారు .వీరు చేసిన అవధాన విశేషాలు, పద్యాలు అన్నిటిని సంకలితం చేసి ‘’అవధాన వాణి‘’ గ్రంధం గా విడుదల చేశారు .వినయం ,.విజ్ఞత మూర్తీభవించిన అవధాన శేఖరులు ఆచార్యుల వారు .జీవితమంతా ఆధ్యాత్మిక దారిలో  గడిపిన వీరు అతి నిరాడంబరం గా నే ఉండేవారు ఏనాడూ హళ్ళూ పెళ్ళూ, అధికారం ,ఆర్భాటం, హోదా, దర్జా, డాబు ,దర్పం లేకుండా నే  ఉన్నారు .ఎంత ఎదిగారో అంత ఒదిగి ఉన్నవివేక మూర్తి .ప్రజ్ఞా పాటవ ప్రదర్శనా చేయని హుందా తో కూడిన అరుదైన వ్యక్తిత్వం వారిది . అరవై ఎనిమిది సంవత్సరాలు ప్రజాసేవలో సాహితీ సుజనుల మధ్య గడిపిన పులి వర్తి శరభా చార్యుల వారు 1980లో శంభు లోకం చేరారు . .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -13-12-14-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సీనియర్ సిటిజను వాణి – వార్షికోత్సవం

Aviary Photo_130629517350309929

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -87- 130-షేక్స్ పియర్ నాటక కధలు సంస్కృతం లో రాసిన –మేడేపల్లి వెంకట రమణాచార్యులు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -87

130-షేక్స్ పియర్ నాటక కధలు సంస్కృతం లో రాసిన –మేడేపల్లి వెంకట రమణాచార్యులు

పండిత వంశం

మేడేపల్లి వెంకట రమణాచార్యులు గోల్కొండ వ్యాపారి బ్రాహ్మణులు .వైష్ణవ మతావలంబులైన ఆచార్యులు .ప్రపత్తి ప్రవరుణులు .ఊరట్ల జమీందారు లైన సాగి వారి ఆస్థానం పండితులైన వీరి వంశం లో తాతరామాచార్యులగారి కమారుడు రఘునాధ దాసు వీరి తండ్రి గారు . అనకా పల్లి లో 1862లో జన్మించారు ..వీరి మూడవ ఏట తండ్రి ఉద్యోగం కోసం విజయ నగరం చేరారు .

తపో నిష్ట తో సర్వం స్వాధీనం

ఆచార్యులవారు తండ్రి వద్దనే పంచాకావ్యాలను చదువుకొన్నారు .విజయ నగరం మహా రాజా వారి హైస్కూల్ లో  విద్య నార్జించి 1877లో మెట్రిక్ పాసైనారు .కూరెళ్ళ సూర్య నారాయణ శాస్త్రి గారి వద్ద ‘’కౌముది ‘’,’’కాళికా వ్రుత్తి ,’’తర్క ప్రకరణలు ‘’ అభ్యసించారు .సంస్కృత భాషలో గొప్ప పాండిత్యాన్ని సాధించారు .కాలేజీ లో గుమాస్తాగా ఉద్యోగించారు .రమణాచార్యులు నిత్య తపో నిస్టాపరులు .దీనితో వారికి అలవడని విద్య లేకుండా పోయింది .అన్నిటా అసాధారణ మేధస్సు అలవడింది .

విద్వద్ శిరోమణి ముడుంబై నరసింహా చార్యుల గారి శిష్యులై ,వేదాంత విద్యనూ ,వారి తమ్ముడు వరాహ స్వామి వద్ద’’ ద్రావిడ ఆమ్నాయం ‘’నేర్చారు .1891లో రాజావారి కళాశాలలో సంస్కృత ఉపాధ్యాయులుగా చేరి 1935వరకు నలభై అయిదేళ్ళ సుదీర్ఘ కాలం పని చేశారు .ఆంగ్ల భాషా పాండిత్యమూ ఉండటం తో ఆచార్యుల వారు తులనాత్మక భాషా శాస్త్రం ను ,(కంపారటివ్ ఫైలాలజి ),సంస్కృత భాషా శాస్త్రాన్ని అధ్యయనం చేసి అపార విద్వత్తు సాదించుకొన్నారు వీటిని బోధించటం లో వీరి నేర్పు అమోఘం గా ఉండేదని ప్రశంసలు పొందారు .

చతుర్భాషా కవితాచార్యం

ఆచార్యుల వారి ఆంద్ర భాషా వైడుష్యమూ చిన్న నాటి నుండే అలవడింది .విద్వత్ కవిఅయిన మహారాజా వారి  ఆస్థానం లో ఉండటం బాగా కలిసి వచ్చింది .రాజావారు ‘’సతతము సంతస మొసంగు సత్య వ్రతికిన్ ‘’అనే మకుటం ఇచ్చి ఆస్థాన కవులను శతకం రాయమని కోరారు .వాటిలో ఆచార్యుల వారు రాసిన ‘’’’సత్య వతీ శతకం ‘’ఉత్క్రుస్ట కావ్యం గా ఎన్నికై మంచి కీర్తిని తెచ్చి పెట్టింది .ఆచార్యుల వారి తొలిరచనే ఇది .దీనికి ప్రశస్తి రావటం ముదావహమైన విషయం .

‘’నమ్మాళ్వార్ల గాదా సహస్ర మైన ‘’’’తిరు మొళి’’ని పద్యాలుగా ఆంధ్రీకరణం చేసి తన ఉభయ భాషా పటిమను నిరూపించుకొన్నారు .ఈ పద్యాలకే ‘’ఆంధ్రా గీర్వాణ శట కోప సహస్రం’’పేరుతొ సంస్కృత శ్లోకాలు రాసి ప్రచురించారు .’’దేవ వ్రత చరిత్ర ‘’ఆంద్ర కావ్యాన్ని ప్రౌఢ ప్రబంధ శైలిలో రచించి విద్వత్తును ప్రకటించారు .’’నాలాయిరం ‘’అనే నాలుగు వేల  ద్రావిడ భాషా గాధలను తెలుగు పద్యాలుగా మలచారు .

పార్ధ సారధి శతకం ,శ్రీ కృష్ణ చరిత్ర ‘’గద్య ,,’ ఆంద్ర సేతు బంధ మహాకావ్యం ,’’ఆంద్ర హర్ష చరిత్ర ‘’గద్యం రాశారు .అన్నిటికన్నా బాగా అందరినీ ఆకర్షించినది ఆచార్యుల వారు ఆంగ్ల మహా కవి షేక్స్ పియర్ రాసిన చారిత్రాత్మక మైన అద్భుత నాటకాల కధలను సంస్కృతం లో రచించటం .ఎవరూ చేబట్టని గొప్ప ప్రక్రియ .ఇవికాక తెలుగులో ‘’ప్రాకృత భాషోత్పత్తి ‘’,’’నిఘంటు చరిత్ర ‘’,,’’పాండురంగ మహత్మ్య విమర్శనం ‘’,ఆర్ష భాగా విభాగం ‘’,’’అలంకార శాస్త్ర చరిత్ర ‘’అనే అపూర్వ గ్రంధాలను రచించి భాషా శాస్త్రం లో తనకున్న పట్టు ను నిరూపించుకొన్నారు .ముప్ఫై రెండు ఉపనిషద్ విద్యలకు తెలుగులో విస్పష్ట విపుల వ్యాఖ్యానం రాసి చరితార్దులయ్యారు ఆచార్యుల వారు .జీవితాంతం గ్రంధ పఠనం ,గ్రంధ రచనలతోనే కాలక్షేపం చేసిన మహా విద్వద్ వరేన్యులు శ్రీ మేడే పల్లి వెంకట రామణాచార్యుల వారు ఎనభై ఒక్క సంవత్సరాలు సంపూర్ణ ఆరోగ్యం గా జీవించి 1943 లో వేంకట రమణ ధామం చేరుకొన్నారు .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -13-12-14-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కృతజ్ఞత’లో ప్రతిఫలించే వ్యక్తిత్వం.. .. అక్షరాలను తడిపిన ‘బహుముఖ వర్షం’

కృతజ్ఞత’లో ప్రతిఫలించే వ్యక్తిత్వం..

  • -మార్తి వెంకటేశ్వర శాస్ర్తీ
  • 13/12/2014
TAGS:

మ్యాజిక్
ఆంగ్ల మూలం: రోండా బర్న్
తెలుగుసేత: సత్యవతి
ప్రచురణ: 2014, వెల: రు.295/-
ప్రచురణ: మంజుల్ పబ్లిషింగ్ హౌస్ (పి.)లిమిటెడ్
2 ఫ్లోర్, ఉషాప్రీత్ కాంప్లెక్స్,
42, మాలవియనగర్,
భోపాల్- 462003.

పుస్తకానికి మ్యాజిక్ అని పేరు పెట్టారు గానీ, ఇదేమీ ఇంద్రజాలానికి సంబంధించిన పుస్తకం కాదు. ఒక రకంగా చూస్తే దీనిని వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకంగా భావించవచ్చు.
‘‘ఎవరి దగ్గరయితే ఎక్కువగా ఉంటుందో వారే మరింత ఎక్కువగా పొందుతారు. ఎవరి దగ్గర ఉండదో వారు దగ్గరున్నది కూడ పోగొట్టుకుంటారు’’ అని పవిత్ర గ్రంథం బైబిల్‌లోని మాథ్యూ సువార్తలో చెప్పబడిన దానిని కొన్ని శతాబ్దాలుగా చాలామంది సరిగా అర్థం చేసుకోలేకపోయారని రచయిత్రి తెలిపారు. ఇక్కడ చెప్పబడింది ‘సంపద’ గురించి అని ఇటీవలి వరకూ భావించారని, అయితే ‘కృతజ్ఞత’ గురించి చెప్పబడిన సంగతి ఈమధ్యనే బోధపడిందని అన్నారు.
ఈ పుస్తకం మొత్తం ‘కృతజ్ఞత’ అన్న ఒకే ఒక్క పదం చుట్టూ కేంద్రీకృతమయింది. కృతజ్ఞతాభావాన్ని జీవన శైలిలో అలవరచుకోవటానికి వీలుగా ఉండేటట్లు ఇందులో 28 అభ్యాసాలున్నాయి.
పుస్తకంలో థాంక్యూ అన్నమాట అనేకసార్లు కనిపిస్తుంది. మొక్కుబడిగా థ్యాంక్యూ అనడం వల్ల ప్రయోజనమేదీ ఉండదనీ, మనస్ఫూర్తిగా థాంక్యూ అనడం అలవరచుకోవాలనీ రచయిత్రి అన్నారు.
అంతా మనమంచికే అన్న విశ్వాసంతో సరియైన జీవన విధానం అవలంబిస్తూ మంచి ఆలోచనలుచేస్తూ కృతజ్ఞతాభావాన్ని అలవరచుకున్నప్పుడు మంచి ఫలితాలు చేతికందుతాయని రచయిత్రి స్పష్టపరిచారు.
ఇది విదేశీ రచన కాబట్టి ఇందులో దైవానుగ్రహం, పూర్వజన్మ సుకృతం వంటి పదాలు కనిపించవు. అయితే పుస్తకాన్ని ఒకటికి రెండుసార్లు చదివినప్పుడు సృష్టినీ, గ్రహగతులనూ నియంత్రిస్తున్న పరమాత్మను ఉద్దేశించి కూడా కృతజ్ఞతలు తెలుపుకోవాలని చెప్పినట్లుగా బోధపడుతుంది. కోరికలు నెరవేరకముందే, నెరవేరినట్లు విశ్వసించి, కృతజ్ఞతలు తెలుపుకోవటం వల్ల అవి తప్పకుండా నెరవేరుతాయని రచయిత్రి ప్రకటించారు.
జాలి, కరుణ, కృతజ్ఞత వంటి మంచి భావాలను అలవరచుకోవాలనీ, ఎవరినీ నిందించటం గానీ, ద్వేషించటం గానీ చేయకూడదని, అప్పుడే అన్ని రకాల సంపదలూ అప్రయత్నంగా సిద్ధిస్తాయనీ వివరించారు.
ఎవరైనా ఏదయినా సహాయం చేసినప్పుడు కృతజ్ఞతలు చెప్పటం సహజంగా అందరూ చేసేదే. ప్రకృతిలో మనకు తోడ్పడే వాటికి కూడా థాంక్స్ చెప్పాలంటారు రచయిత్రి. మనం తినే ఆహారానికి, తాగే నీటికి, పీల్చే గాలికి కూడా మనం కృతజ్ఞతలు తెలపాలన్నారు. (పే.90)
మనం ఆతృతగా ఎదురుచూస్తున్న డబ్బు సరియైన సమయానికి చేతికందటం గానీ, అనుకోని పరిస్థితులలో ఎవరో కొత్త వ్యక్తి తటస్థపడి తగిన సహాయం చెయ్యటంగానీ జరిగినప్పుడు దానిని అదృష్టం అనో లేక కాకతాళీయంగా జరిగిందనో భావిస్తుంటామనీ- అయితే అటువంటి సందర్భాల వెనుక ఒక సార్వజనీనమైన సత్యం ఉంటుందని రచయిత్రి అభిప్రాయపడ్డారు. (పే.159)
‘మానవులలో ఉండే మంచి లక్షణాలలో తప్పులు చెయ్యటం కూడా ఒకటి. అయితే అందులోనుంచి సరయిన పాఠం మనం నేర్చుకోవాలి’ అని చెప్తూ దీనిని ఉదాహరణలతో ఆసక్తికరంగా 26వ అభ్యాసంలో తెలిపారు.
ఫిర్యాదులు చెయ్యటం, ప్రతికూల ఆలోచనలు చెయ్యటం వంటివి మానెయ్యటానికి కొన్ని సూత్రాలను 7వ రోజు అభ్యాసంలో ఇచ్చారు.
పుస్తకంలోని 28 అభ్యాసాలను రోజుకొకటి చొప్పున ఆచరణలో పెట్టటానికి వీలుగా రూపొందించారు.
‘ఉదయం లేస్తూనే నేలమీద కాలు మోపి భూమికి కృతజ్ఞతలు చెప్పండి’ అని చెప్తూ ఇంకా ఏయే వస్తువులకు థ్యాంక్స్ చెప్పాలో 11వ అభ్యాసంలో తెలిపారు. బాత్‌రూములో అద్దానికి, తొడుక్కునే బట్టలకు, కాళ్లకు వేసుకునే పాదరక్షలకూ థ్యాంక్స్ చెప్పాలన్నారు. ప్రతి వస్తువులోనూ చైతన్యం ఉంటుందని భగవాన్ రమణమహర్షి చెప్పిన సంగతి మనకు తెలిసిందే.
నిత్య జీవితంలో తటస్థపడే అనేకమందికి ‘్థ్యంక్యూ’ అనాలని వివరించారు. ఈ పుస్తకంలోని విషయాలన్నీ తన అనుభవంలో చేసి చూశానని, అద్భుతమైన ఫలితాలు సాధించానని రచయిత్రి తెలిపారు. తన బంధుమిత్రులలో అనేకమందికి కూడా చక్కటి ఫలితాలు రావటం చూశాకనే ఈ పుస్తకం ప్రకటించినట్లు తెలిపారు. మీరు ఎంతోకాలం కలలుకన్నవన్నీ హఠాత్తుగా మీకు అందవచ్చు. అవలా సాధ్యం కావటానికి ఏయే శక్తులు సహకరించాయో మీకు ఎప్పటికీ తెలియకపోవచ్చు. ఎందుకంటే అద్భుతాలన్నీ అదృశ్యసీమలలోనే జరుగుతాయి’’అని రచయిత్రి అన్నారు. (పేజి 3).
అనువాదం బాగుంది. పుస్తకంలోని అంశాలూ బాగున్నాయి.

 

అక్షరాలను తడిపిన ‘బహుముఖ వర్షం’

  • -మానాపురం రాజా చంద్రశేఖర్
  • 13/12/2014
TAGS:

బహుముఖ వర్షం
యక్కలూరి వై.శ్రీరాములు
వెల: రూ.60/-
ప్రతులకు:
కౌండిన్య పబ్లిషర్స్,
15/140, పి అండ్ టి కాలనీ,
దిల్‌సుఖ్‌నగర్,
హైదరాబాద్- 500 060
ఫోన్: 9866171648

భావుకతను ప్రాణవాయువుగా చేసుకుని శ్వాసిస్తున్న యువకలాల్లో కవి యక్కలూరి వై.శ్రీరాములుగారిది ఒక ప్రత్యేకశైలి. పలు రకాల అనుభూతుల్ని వర్షంరూపంలో పలవరిస్తూ కవిత్వంగా కలవరించడం మొదలుపెట్టారు. ఈ ప్రయత్నం ఆయన రాసిన ‘బహుముఖ వర్షం’లో ప్రతిఫలిస్తుంది.
‘‘అనుభూతుల మేఘాలనుండి రాలిన
చినుకుల పలుకులతో
వేనవేల వాక్యాల రంగుదారాలు పేనుతూ
ధారగా సాగుతూ/ పుడమి పుటలపై
పంచరంగుల పూల కవితల్ని
అల్లుతున్న వాన’’ అని విశే్లషించి చెప్పడంలో -్యళఆజష ఉనఔళఒఒజ్యశ బయటపడుతుంది. ఈ ముప్పేట అల్లికలో వర్షపు చిక్కదనం చినుకుల సవ్వడితో కవిత్వపు చక్కదనంగా మారిపోతుంది. భావధార రంగురంగుల పూల దారాల కవితల్ని అల్లుతుంది. కాబట్టే వచనానికీ కవిత్వానికి మధ్య దాగిన అడ్డుపొర చిరిగి చినుకుల స్పర్శకు చిత్తడిగా రూపాంతరం చెందుతుంది.
‘‘రాత్రి వచ్చిన వానలో తడుస్తూ
నా కవితలోంచి ఎగిరి వచ్చిన అక్షరాలే
చెట్టు కొమ్మపై/ వాలిన పక్షులయ్యాయి’’ అంటూ అక్షరాల్ని, పక్షులుగా మలిచిన తీరు శ్రీరాములుగారి కవితాదృష్టికి అద్దంపడుతుంది. మామూలు వానకి సాహిత్యపు వానకి తారతమ్యం కొట్టొచ్చినట్టు రూపుకట్టేది ఈ దృశ్యవీక్షణంలోనే! అనుభూతి పరాకాష్ట దశకు చేరుకున్నపుడే ఇది సాధ్యపడుతుంది.
‘వాన నడక వయ్యారం’ కవితలో-
‘‘ఎండిన మట్టిపెంకుల పెళ్ళలతో
నిండిన చెఱువుగట్టుపై నిలబడి
కన్నీరైన మా వూరికి/ నేనో మంచి నీటి సముద్రాన్నవుతాను’’ అని చెబుతుంటే… ధ్వని ప్రధానమైన సమస్యకేదో పరిష్కారమార్గాన్ని కనుక్కొని కవితా పాదాల రూపంలో పరుస్తున్నట్టు అనిపిస్తుంది. పాదరసం లాంటి చురుకైన మనసు గాలికంటే వేగంగా పరుగెత్తి మదిలోతుల్లో మిగిలిపోయిన వెనుకటి దృశ్యానికి ఇక్కడ అక్షరరూపం ఇవ్వగలిగింది. ఇదే దీనికి అదనపు ప్రయోజనం. ఈ ఒడుపును అందిపుచ్చుకునేదే అసలైన కవిత్వం. ఈ లక్షణం శ్రీరాములుగారిలో అడుగడుగునా కనిపిస్తుంది.
ఇంకోచోట అంతర్ముఖత్వంతో కవి ఇలా ప్రవహిస్తారు.
‘స్వప్నచలన వర్షం’ శీర్షికలో…
‘‘కడలినై పైకెగరి/ మేఘమై ఊగి/ చినుకై రాలి
నదై సాగి/ మీలో నేనై/ నాలో మీరై
నాలోనేను ప్రవహించాలని వుంది’’
తాదాత్మ్యం చెందిన ఒకానొక స్థితిలో చైతన్యస్వరం కవితాస్వరమై క్షణాల మధ్య ప్రవహిస్తుంది. దీని తీవ్రతను ఒడిసిపట్టుకోవడం ఎవరితరమూ కాదు. జ్వలన స్వభావాన్ని కలిగి, చలనగీతాన్ని ఆలపించి, పురోగమన దిశలో ముందుకు దూసుకుపోతుంది. ఇది హృదయ కవిత్వానికి ప్రతిబింబం. నిలువెత్తు దృశ్యసమాహారానికి అక్షరరూపం. కాబట్టి ప్రవాహం అంతర్ముఖత్వమైంది.
మొత్తంమీద చూస్తే ఈ బహుముఖ వర్షంలో తడిసిన పద్య పాదాలు కవిత్వ చరణాలై హొయలుహొయలుగా వంకలుతిరిగి అనేక వయ్యారాలు పోయాయి. ఈ తపనను అనేక సందర్భాల్లోంచి ఏరుకుని ఒకచోట కుప్పబోశారు శ్రీరాములుగారు. అలాంటి విరుపులని మెరుపుల రూపంలో ఒక్కసారి తనివితీరా తడిమి కళ్ళతో పొదివి పట్టుకునే ప్రయత్నం చేద్దాం.
‘‘పిడికిళ్ళ నిండా మేఘాల్ని నింపుకున్న ఆకాశం/ చినుకుల విత్తనాల్ని నేలపై చల్లుతోంది’’ అంటారు. ‘‘వాన పాటకు మేఘపు పైటవేసి/ నదిలో నావగా వదులుతాను’’ అని అంటారు ఇంకోచోట. ‘‘చినుకుల జీవాక్షరాల్ని/ పలుకుల బీజాక్షరాలుగా మలిచి/ మనిషి నాలుకపై లిఖిస్తుంది’’అని చెప్పడం మరో ఎత్తుగడ. ‘‘మట్టికి విత్తనానికి/ పెళ్ళిచేసే అక్షింతలు కదా/ ఈ వాన చినుకులు’’ అంటూ వేరొక శిల్ప నిర్మాణాన్ని ప్రదర్శిస్తారు. వానని ప్రస్తావిస్తూ… ‘‘వానంటే/ మన్నూ, మిన్నూ కలిపే కరచాలనం/ వానంటే/ నిన్నూనన్నూ నిలిపే జీవజాలం’’ అంటారు కవి యక్కలూరి వై.శ్రీరాములు.
ఇలా చెప్పుకుంటూ పోతున్నపుడు… వాస్తవాన్ని వాస్తవంగా
వెలుగు సూర్యుడిగాను/ శ్రద్ధ సహనంగాను
పరిణామం చెందటమే పరమార్థం’’ అనటంలో చాలా దూరదృష్టి కనబడుతుంది. లోచూపునకు పదునుపెడుతుంది. లోపభూయిష్టమైన వ్యవస్థను ఎత్తిచూపుతుంది. అక్షర లక్షల విలువచేసే సారాన్ని, జీవన సారాంశంగా తెలియజేస్తుంది. శిల్పపరమైన ఈ ఎత్తుగడ ఒక పరిణామ దశకు కొనసాగింపుగా వెలుగునీడగా పరుచుకుంటుంది.
కాలం గోరంతల్ని కొండంతల్నిచేస్తే, సామాజిక వ్యవస్థ ఆధునిక జీవన దృశ్యాల్ని బతుకు భూతద్దంలోంచి చూపించి యాంత్రికతను బయటపెడుతుంది. అలా నలిగి, రాటుదేలి, మొనదేరిన చైతన్య శీలత్వమే కవి వీరభద్రాచారిగారు మననుండి ఆశించేది. ఆ ఆశ తీరాలంటే నవనవోనే్మషమైన, నిశ్చల నిర్మలాకృతి మయమైన వర్తమాన సంక్షుభిత జీవన వాస్తవికతను కళ్ళకు కట్టించే ప్రయత్నంచెయ్యాలి. ఆ నమ్మకం కార్యరూపం దాల్చాలంటే ఈ వాక్యాల తడుములాటలోని భావచైతన్యాన్ని అందిపుచ్చుకోవాలి. అప్పుడే ఈ ‘దర్పణం’లోని అంతర్మథనాన్ని అర్థం చేసుకోగలుగుతాం. అలాంటి దిశగా ఆశావహ దృక్పథంతో అక్షరానుభవాల వెంట పరుగులుతీద్దాం.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

హస్తిన ఎన్నికల్లో కమలం గుబాళింపు -వెస్ట్ బెంగాల్ లో ”మమత ” బేజారు

బీజేపీకే హస్తిన పీఠం!

– స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వం
– మొత్తం 70 స్థానాల్లో 46 కైవసం
– 18 స్థానాలతో రెండో స్థానంలో ఆప్‌
– ఏబీపీ న్యూస్‌-నీల్సన్‌ సర్వే వెల్లడి 

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 12: లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో వరుస విజయాలతో మంచి ఊపు మీద ఉన్న బీజేపీ… ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ దుమ్మురేపనుంది! తిరుగులేని మెజార్టీతో కమలనాథులు పాలనా పగ్గాలు కైవసం చేసుకోనున్నారని ఏబీపీ న్యూస్‌-నీల్సన్‌ జరిపిన అభిప్రాయ సేకరణలో వెల్లడైంది. అధికారం చేజిక్కించుకోవడానికి పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్న నేపథ్యంలో… ఈ సర్వే నిర్వహించగా… రాష్ట్రంలోని మొత్తం 70 స్థానాల్లో బీజేపీ కనీసం 46 సీట్లను గెల్చుకుంటుందని వెల్లడైంది. గత ఎన్నికల్లో బీజేపీకి 31 సీట్లు మాత్రమే వచ్చాయి. మరోవైపు, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) బలం గణనీయంగా పడిపోయింది. గత ఎన్నికల్లో ఆ పార్టీకి 28 సీట్లు రాగా… ఈ సారి 18 సీట్లే వస్తాయని సర్వేలో తెలిసింది. కాంగ్రెస్‌ పరిస్థితి కూడా దిగజారింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 8 సీట్లు ఉండగా… ఈ సారి ఆ సంఖ్య 5కు పడిపోయింది. పార్టీల పరిస్థితి ఇలా ఉంటే… ముఖ్యమంత్రిగా ఆప్‌ నేత కేజ్రీవాల్‌ వైపే ప్రజలు మొగ్గు చూపారు.
బీజేపీ నేత హర్షవర్ధన్‌(38శాతం) కంటే కేజ్రీవాల్‌(39శాతం)కే ప్రజల్లో ఎక్కువ ఆదరణ ఉంది. కేవలం 49 రోజులు మాత్రమే కేజ్రీవాల్‌ ప్రభుత్వాన్ని నడిపినా… ఆ సమయంలో ఆయన పనితీరు పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయబోనని మాజీ సీఎం షీలా దీక్షిత్‌ చెప్పినా… ఆమెకు ప్రజల్లో ఆదరణ బాగా తక్కువ(7శాతం)గా ఉంది. ఈ సర్వేలో మొత్తం 6528 మంది అభిప్రాయాలు తెలుసుకున్నారు. కాగా, ఢిల్లీలో అత్యంత ప్రజాదరణ ఉన్న నేతగా మోదీ (63శాతం) ప్రథమ స్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో కేజ్రీవాల్‌ (25), రాహుల్‌ గాంధీ (12) ఉన్నారు.
తప్పని సెగ
పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న శారదా చిట్‌ఫండ్‌ స్కామ్‌లో ఆ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మదన్‌ మిత్రను సీబీఐ అరెస్టు చేయడం ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ. ఈ కుంభకోణంలో ఒక మంత్రిని అరెస్టు చేయడం ఇదే ప్రధమం కావడంతో పాటు, ఆయన మమతకు అత్యంత సన్నిహితుడు కూడా. అంతకంటే ముఖ్యంగా, శారదా గ్రూప్‌ కంపెనీల్లో ఆయన పెట్టుబడిదారు.

ఏడాదిన్నర క్రితం వెలుగులోకి వచ్చిన ఈ కుంభకోణం మీద దర్యాప్తు కొనసాగుతున్నంత కాలమూ రాజకీయం కూడా రంజుగా సాగుతూంటుంది. రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయ్యేవరకూ పతాకస్థాయిలోనే ఉంటుంది. 15లక్షలమంది అమాయకుల నుంచి వేలాది కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన అసలు సంగతి పక్కనబెట్టి, కేవలం ఈ కంపెనీమీదే ఎందుకు కక్షకట్టారని మమతా బెనర్జీ ప్రశ్నిస్తున్నారు. ఆ కంపెనీ పెద్దలతో పాటు ఇప్పటికే ఒక్కరొక్కరుగా అరెస్టయిన తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకులు కూడా కోర్టు చుట్టూ తిరుగుతుంటే, ఇప్పుడు సీబీఐ గాలి ఏకంగా మంత్రులమీదకు మళ్ళినప్పుడు ఎదురుదాడి మరింత పెంచక తప్పదు. ఎన్నికల్లో ప్రత్యక్షంగా ఎదుర్కొనలేక పిరికిపంద మోదీ ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోందనీ, అమిత్‌ షా, సీబీఐ సమావేశంలో మిత్రా అరెస్టుకు రంగం సిద్ధమైందని తృణమూల్‌ నాయకురాలు విరుచుకుపడుతున్నారు. బర్ద్వాన్‌ పేలుళ్ళకు మందుగుండు సమకూరింది ఈ కుంభకోణం సొమ్ముతోనే అంటూ అమిత్‌షా కలకత్తాలో విస్పష్టంగా ప్రకటించి దీదీని గద్దెదించందే వదలనని రణనినాదం చేయడంతో పోరు పతాకస్థాయికి చేరింది.
డబ్బు పోగొట్టుకున్న సామాన్యుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నట్టే, శారదా అధినేత తన కంపెనీల్లో తెలివిగా ఇరికించిన అనేకమంది రాజకీయనాయకులు, సినీనటులు బితుకుబితుకు మంటూ బతుకుతున్నారు. అస్సాం మాజీ డీజీపీ శంకర్‌ బారువా అవమానం భరించలేక ఏకంగా తనింట్లో ఆత్మహత్యే చేసుకున్నాడు. శారదా మీడియా గ్రూప్‌కి ప్రధాన కార్యనిర్వాహకుడిగా వ్యవహరిస్తూ లక్షలాది రూపాయల వేతనం అందుకున్న తృణమూల్‌ మాజీ నాయకుడు, మమతా బెనర్జీ కుడిభుజం కునాల్‌ ఘోష్‌ ఆత్మహత్య చేసుకుంటానని జైల్లోనే హెచ్చరికలు చేశాడు. ప్రధాన లబ్ధిదారు మమతని ఎందుకు వదిలేశారని ఆయన వాదన.

‘మా నాయకులంతా దొంగలు… చివరకు నేను కూడా దొంగనే. మిగతా వారంతా సర్వసంగ పరిత్యాగులన్నమాట’ అని ఏడాది క్రితం మమత ఎగతాళిగా మీడియాతో వ్యాఖ్యానించారు. వరుసగా జరుగుతున్న అరెస్టులు, ఆ కంపెనీకీ, ఆమె పార్టీ నాయకులకూ బలమైన ఆర్థికబంధాలున్నాయన్న ప్రతిపక్షాల విమర్శలను నిజం చేస్తున్నాయి. తన వాగ్ధాటితో ఎంతగా నెట్టుకువస్తున్నప్పటికీ, ఒకపక్క తీవ్రవాదులకు రాష్ట్రం ఆశ్రయమిస్తోందన్న విమర్శలు, మరోపక్క ఈ కుంభకోణంలో ఒక్కటొక్కటిగా బైటపడుతున్న అంశాలు మమతని ఇరకాటంలో పడవేస్తున్నమాట నిజం. శారదా అధినేత సుదీప్తసేన్‌ సీబీఐకి రాసినట్టుగా చెబుతున్న లేఖలో చాలామంది తృణమూల్‌ నాయకుల పేర్లున్నాయనీ, దీనిని ఆధారంగా తీసుకున్నా కాకున్నా అది అందించిన సమాచారంతో ఆధారాలు వెతికిపట్టుకుని మరీ మరిన్ని అరెస్టులు జరగక తప్పదని అంటున్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిగా ఉన్న సుదీప్తసేన్‌ ఎనిమిదేళ్ళ క్రితం చిట్‌ఫండ్‌ వ్యాపారాన్ని ఆరంభించి, ఇంత తక్కువ కాలంలో వేలాది కోట్లు నొల్లుకోవడడం రాజకీయ అండ లేనిదే ఏమాత్రం సాధ్యం కాదన్నది వాస్తవం. వసూళ్ళలో మూడోవంతు ఏజెంట్లకే ఇచ్చినప్పుడు వారు వేల సంఖ్యలో తయారవకుండా ఉండరు, లక్షల సంఖ్యలో సామాన్యులను ముంచకుండానూ ఉండరు. సమకూరిన వేలాది కోట్లతో కొత్త కంపెనీలు అనేకం పుట్టుకొచ్చాయి. బెంగాల్‌నుంచి మరో నాలుగు రాష్ట్రాలకు కూడా సంస్థలనూ వ్యాపారాన్నీ విస్తరించాడు. చట్టాలను ఉల్లంఘించి జరుగుతున్న ఈ వ్యాపార విస్తరణని గుర్తించడానికి సెబీకి మూడేళ్ళు పట్టింది. ఇంతలోగా తన రాజకీయ పలుకుబడిని కూడా విస్తరించుకున్న సుదీప్తొ సేన్‌ మమత అనుచరుగణాన్ని తన భూరి విరాళాలతో, హోదాలతో తనవైపు తిప్పుకున్నాడు. మంత్రులను తన కంపెనీల్లో పెట్టుబడిదారులుగా మార్చడం, వారి వారి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి వాటిని పరోక్షంగా కాపాడటం, మిథున్‌ చక్రవర్తి వంటి నేతలుగా ఎదిగిన నటులను భారీ పారితోషికాలతో బ్రాండ్‌ అంబాసిడర్లుగా నియమించుకోవడం ఇత్యాది జాగ్రత్తలు తీసుకున్నాడు. పార్టీతో ఇంతగా మమేకమైపోయిన కంపెనీపై చర్యలు తీసుకోవడానికి మమత ప్రభుత్వానికి మనసు ఎలా ఒప్పుతుంది? సెబీ విడతలవారీగా హెచ్చరికలు చేసినా ప్రయోజనం లేకపోవడంతో, చివరకు తన అనుమతిలేకుండా ఎక్కడా పెట్టుబడులు పెట్టకూడదంటూ ఆంక్షలు విధించింది. నాన్‌బ్యాంకింగ్‌ సంస్థలపై కేసులు పెట్టమంటూ రిజర్వు బ్యాంకు చేసిన సూచనలు కూడా ఆదిలో అమలు కాలేదు. చివరకు సెబీ, రిజర్వుబ్యాంక్‌ ఒత్తిడి పెరిగిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ వేయడంతో శారదా కంపెనీకి కష్టాలు మొదలయ్యాయి. శారదా కుంభకోణాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌తోనూ,సీబీఐతోనూ విచారించాలని చివరకు న్యాయస్థానాలు చెబితే తప్ప వ్యవహారం ముందుకు కదలలేదు.
ఏడాదిన్నర కాలంగా దర్యాప్తు సాగుతూ, దాడులు జరుగుతూ, అరెస్టులు కొనసాగుతూ శారదా కుంభకోణం కథ ఇప్పటికీ ముగియలేదు. ఈ మధ్యకాలమంతా ఇది రాజకీయంగా అగ్గి రాజేయడానికి తప్ప సామాన్యుడికి స్వస్థత చేకూర్చిందేమీ లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కొద్ది వందల కోట్ల రిలీఫ్‌ ఫండ్‌ వేలాదికోట్లు కోల్పోయిన అమాయక ప్రజలకు పంచడానికి ఏమూలకు సరిపోతుంది? వ్యవహారాన్ని ఎన్నికలతో ముడిపెట్టకుండా సత్వరమే దర్యాప్తు పూర్తిచేయడంతో పాటు, బాధితులందరినీ ఆదుకునేందుకు కేంద్రం రంగంలోకి దిగితే నిరాశానిస్పృహల మధ్య ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్న సామాన్యులను కాపాడినవారవుతారు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బాపు గీతలు జాతికి చక్కిలిగింతలు!

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -86 -129-రేడియోలో సంస్కృత పాఠాలు చెప్పిన ,సర్వోదయ ప్రచారకులు .-కే నృ .వేం .అప్పారావు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -86

129-రేడియోలో సంస్కృత పాఠాలు చెప్పిన  ,సర్వోదయ ప్రచారకులు  .-కే నృ .వేం .అప్పారావు

విద్యా వైదుష్యం

Displaying ke nru ve 001.jpg

కేశి రాజు వెంకట నృశింహ అప్పారావు గారు 1913లోమార్చి పద్నాలుగున  తూర్పు గోదావరిజిల్లా దేవీ పట్నం లో జన్మించి ,ప్రాధమిక విద్య అక్కడే చదివి తర్వాత కొవ్వూరు జిల్లా బోర్డ్ హైస్కూల్ లో సెకండరీ విద్య పూర్తీ చేశారు కొవ్వూరు ఆంద్ర గీర్వాణ విద్యా పీఠం లో విద్య నేర్చారు .హిందీ లో రాష్ట్ర భాష పరీక్ష పాసైనారు .ఆంద్ర విశ్వ విద్యాలయం నుండి సంస్కృతాంధ్రాలలో ఉభయ భాషాప్రవీణ  డిగ్రీ పొందారు .’’ఇండో యూరోపియన్ భాషా శాస్త్రం’’ పై పరిశోధన చేసి పత్రాన్ని సమర్పించి ఆంద్ర విశ్వ కళాపరిషత్ నుండి పి .ఓ.ఎల్ డిప్లమా తీసుకొన్నారు .నాగ పూర్ యూని వర్సిటీ నుండి ఏం .ఏ.డిగ్రీ సాధించారు .

విద్యా బోధన-రాజకీయ ప్రవేశం

కొవ్వూరు లో వాడ్రేపు జోగాయమ్మ సంస్కృత కళాశాల అంటే ఆంధ్రగీర్వాణ విద్యా పీఠంలో ఆంధ్రోపన్యాసకులుగా పని చేశారు .దేశ భక్తీ మెండుగా ఉన్న అప్పారాగారు ఉద్యోగం చేస్తూనే 1941 వ్యష్టి సత్యాగ్రహం లో పాల్గొని అరెస్ట్ అయి నాలుగు మాసాలు జైలు శిక్ష అనుభవించిన దేశ భక్తులు .క్విట్ ఇండియా ఉద్యమం లోనూ పాల్గొని ఏడాదిన్నర జైలు శిక్ష అనుభవించారు .గాంధీ గారి పిలుపై స్పందించి ఎన్నో నిర్మాణాత్మక కార్య క్రమాలలో పాల్గొన్నారు .ఆచార్య వినోబాభావేగారి సర్వోదయ  ప్రభావం అప్పారావు గారిపై పడింది .తెనాలి నుండి వెలువడే ‘’సామ్య యోగం ‘’అనే సర్వోదయ పక్ష పత్రికకు గౌరవ సంపాదకులుగా సేవ చేశారు .

సామాజిక సేవ –

కొవ్వూరులో రెబ్బాప్రగడ మందేశ్వర శర్మ  గారు స్థాపించిన ‘’వీర మందిరం ‘’అనే సంస్థ ద్వారా ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న గిరిజనుల విద్యా సంస్కృతుల అభివృద్ధి కోసం అవిశ్రాంత కృషి సల్పారు .వారి జీవితాలలో వెలుగులు పూయించారు .

కేశవ నృసింహీయం

1938నుండి పదేళ్ళు కొవ్వూరు సంస్కృత కాలేజి లోఅధ్యాపకులు గా  పని చేసి ,ఉపాధ్యక్షులు గా పదోన్నతి పొందారు .1948 నుండి 1974వరకు ఆంద్ర గీర్వాణ కళాశాలాధ్యక్షులుగా సేవలందిం చారు .1975లో ఆంధ్రా యూని వర్సిటిలో సంస్కృత శాఖలో రిసెర్చ్ ఫెలోగా ఉన్నారు .సంస్కృతం హిందీ భాషలలో ఎన్నో పుస్తకాలు రచించారు .అందులో ఖండకావ్యాలు ,కధలు ,విమర్శనా వ్యాసాలున్నాయి .వీరి సంస్కృత కావ్యాలు  –‘’పంచవటి ‘’,గంగా లహరి ‘’మొదలైనవి .వీటికి తెలుగు అనువాదమూ తామే చేసి ప్రచురించారు .’’బృందావనం ‘’అనే కావ్యాన్ని సంస్కృతం హిందీ ,తెలుగు భాషలలో రచించి తన పాండిత్య ప్రకర్షను ప్రకటించుకొన్నారు .

గాంధీజీ బోధనలను ఏర్చి కూర్చి ‘’గాంధీ గీతా ‘’గాను ,వినోబా భావే సామ్య వాడ సూత్రాలకు వివరణాత్మకం గా  ‘’సంయోగ కరికాః’’ అనే గ్రంధాన్ని రాశారు .వీరి కధలు’’ ఆకాశ వాణి ‘’ద్వారా చాలా ప్రసారమయ్యాయి .వడ్ల మూడి గోపాల క్రిష్నయ్య గారు  సాంఖ్య  యోగాత్మకం గా మాత్రా చందసులో రాసిన ‘’మనిషి –మహర్షి ‘’అనే గేయ కావ్యాన్ని అదే రాగ తాళ లయలతో మాత్రా ఛందస్సులోనే సంస్కృతం లో రచించి యెనలేని కీర్తిని పొందారు .వినోబా హిందీలో రాసిన ‘’శిక్షణ విచార ధారా’’ను తెలుగులోకి తర్జుమా చేశారు .కాళిదాసుఅభిజ్ఞాన శాకుంతలం నాటకాన్ని తెలుగు నాటకం గా మలిచారు .తెలుగులో ఖండ కావ్యం గా ‘’వసుంధరా సాంత్వనం ‘’రచించారు .తన తెలుగు వ్యాసాల సంపుటిని ‘’వ్యాస పీఠం ‘’గా వెలువరించారు ఆంగ్ల భాషలో ‘’ఎస్సేస్ ఆన్ స సింథేసిస్ ‘’వ్రాసి ముద్రించారు .విజయ వాద ఆకాశవాణి ద్వారా ”అమర భారతి ”పేరిట విద్యార్ధులకు సులభం గా సంస్కృత బోధనా కార్యక్రమాన్ని ఎన్నో ఏళ్ళుగా నిర్వహించిన ఘనత నృసింహ అప్పా రావు గారిది .”కేయూరాని విభూషితే ”’అనే శ్లోకం తో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం ఎందరినో ప్రభావితం చేసింది . శబ్ద ప్రయోగాలు శ్లోక వివేచనా ,కవితా ప్రతిభా ,కవి చేసిన చమత్కారాలను అప్పారావు గారు  అరటి పండు వొలిచి చేతిలో పెట్టినంత సులువుగా వివరించి ఉత్సుకతను కల్గించేవారు

పురస్కార గౌరవాలు

ఆంద్ర విశ్వ విద్యాలయం ఎకడమిక్ కౌన్సిల్ సభ్యులుగా నియమింఛి అప్పారావు గారిని గౌరవిం చింది .సంస్కృత బోర్డ్ ఆఫ్ స్టడీస్ లో సభ్యులుగా సేవ చేశారు .వీరి సాహిత్య సాంఘిక సేవా కార్య క్రమాలను పరిగణన లోకి తీసుకొని ఆంద్ర విశ్వ విద్యాలయం 1974లో ‘’కళా ప్రపూర్ణ ‘’బిరుదు గౌరవం అందజేసి సత్కరించింది .అప్పారావు గారు అరవై నాలుగేళ్ళు జీవించి 1977 జనవరి పన్నెండున అకాల మరణం పొంది సాహితీ లోకానికి వెలితి మిగిల్చారు .

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -12-12-14-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

33 కోట్ల దేవుళ్లున్నారా?- డాక్టర్‌ కె. అరవిందరావు

33 కోట్ల దేవుళ్లున్నారా?- డాక్టర్‌ కె. అరవిందరావు

గత వ్యాసాల్లో దేవుణ్ణి రెండు స్థాయిల్లో తెలుసుకున్నాం. ఒకటి అంతటా వ్యాపించి ఉన్న శుద్ధచైతన్యం. మరొకటి సృష్టికర్తగా మనం భావించుకుని పూజించే దేవుడు. మొదటిస్థాయిలో ఉన్నది తాత్త్విక పరమైన విషయం. రెండవ స్థాయిలోని దేవుడికి సృష్టించడం, పోషించటడం, భక్తుల్ని రక్షించడం మొదలైన గుణాలను అతనిపై మోపి మతం స్థాయిలో నిర్మించుకున్న దేవుడు. 
దేవుడికే సంబంధించిన మరొక ప్రశ్న గూర్చి తెలుసుకోవాల్సి ఉంది. మనకు ముప్పదిమూడు కోట్ల దేవుళ్లనీ, ఏ దేవుణ్ణి పూజించాలో తెలియదనీ వ్యాఖ్యలు వస్తూ ఉంటాయి. గోవును పూజించాలని చెప్పే సందర్భంలో టీవీలలో ప్రవచనాలు చెప్పేవారు కూడా గోవు కడుపులో 33 కోట్ల దేవుళ్లు ఉన్నట్టుగా పురాణాల్ని ఉటంకించి చెబుతూంటారు. అసలు ఈ 33 అనే సంఖ్య ఎలా వచ్చిందో తెలుసుకోవాలి. ఇది మనకు కొంత గజిబిజిగా అనిపించవచ్చు. కాని ఓపికగా గమనిద్దాం.
మనకు ఉపనిషత్తులు మూలగ్రంథాలు. బృహదాకరణ్యకం అనే ఉపనిషత్తు (శాకల్యబ్రాహ్మణం అనే అధ్యాయం) జనకమహారాజు సభలో జరిగిన వేదాంత చర్చను చెబుతుంది. యాజ్ఞవల్క్యుడు అనే బ్రహ్మజ్ఞానితో మిగతా పండితులందరూ దేవుడంటే ఏమిటి అనే విషయమై చర్చిస్తారు. దేవుళ్లు ఎందరు అని కూడా ఒక ప్రశ్న వస్తుంది. యాజ్ఞవల్క్యుడు వేదంలోని మాటనే ఉటంకించి దేవతలు 3,306 అంటాడు. వాళ్లందరూ ఎవరు అనే ప్రశ్నకు వారందరూ కూడా 33 రకాల దేవతల యొక్క అనేక రూపాలు అని చెబుతాడు. ఆ 33 ఎవరు అనే ప్రశ్నకు ఆరు దేవతల రూపాలు మాత్రమే అంటాడు. ఆ ఆరు ఎవరు అంటే ఇద్దరి రూపాలు మాత్రమే. అలా క్రమక్రమంగా చివరకు ఒక్క దేవుడే అనేక రూపాలలో కనిపిస్తాడని చెబుతాడు. 3,306 అనడం దేవతలు అనంత సంఖ్యలో ఉంటారు అని చెప్పడానికి మాత్రమే.
దేవతలు అనే పదానికి మనం అనుకునే అర్థం వేరు. వేదంలో ఉన్న అర్థం వేరు. దివ్‌ అనే సంస్కృత ధాతువుకి ప్రకాశించేది, చైతన్య స్వరూపమైనది అని అర్థం. ప్రకృతిలోని పృథ్వి, వాయువు, మేఘం మొదలైనవన్నీ చైతన్య స్వరూపాలే. విశ్వంలో ఉన్న జీవశక్తి మొత్తాన్ని పరిశీలిస్తే 33 దేవతలు అనేవి ముప్పై మూడు తరగతులుగా మనం చూడగల్గిన జీవశక్తులే అని తెలుసుకోగలం. అలాగే‘ కోటి ’ అనే పదానికి మనం అనుకునే అర్థం వేరు. నూరు లక్షలు అనేది ఒకానొక అర్థం మాత్రమే . ఈ సందర్భంలో కోటి అంటే తరగతి , category అని అర్థం. ప్రాణికోటి, వృక్షకోటి , జీవకోటి , శిష్యకోటి అన్నట్లుగా. ముప్పదిమూడు కోట్ల దేవతలు అనప్పుడు ముప్పది మూడు తరగతుల చైతన్య స్వరూపాలు అని అర్థం.
33 రకాలు ఏమిటి ? సృష్టిలో కొన్ని శక్తులు మనల్ని పోషిస్తాయి. కొన్ని కష్టపెడతాయి. మరికొన్ని కాలానికి సంబంధించినవి. మనల్ని పోషించి, నివసింపజేసే శక్తుల్ని వసువులు అన్నారు. ఈ కోవకు చెందినవి ఎనిమిది. విశ్వాన్ని మనం పరిశీలిస్తే ప్రాణికోటి బతకడానికి ఆధారమైన ఎనిమిది ఏవి అని గమనించగలం. అవి అగ్ని , భూమి , వాయువు, అంతరిక్షం , సూర్యుడు , చంద్రుడు , నక్షత్రాలు మొదలైనవి. కేవలం ఈ ప్రకృతి శక్తులన్నీ మనిషి జీవించడానికి అవసరం. ఇవే పరిణామం చెంది మనిషి శరీరంగానూ, ప్రాణాలుగానూ ఏర్పడ్డాయి. ప్రాణులు దేహం. ఇంద్రియాలను కలిపి microcosm గా భావిస్తే విశ్వమంతా microcosm అని భావించవచ్చు. విశ్వంలో ఉన్నదే శరీరంలోనూ ఉంది. విశ్వంలో ఉన్న పై శక్తులే తాము జీవిస్తూ ప్రాణుల్ని జీవింపచేస్తాయి కావున వీటిని వసువులు అన్నారు ( వసు అంటే సంస్కృతంలో జీవించడం అని అర్థం ).
రోదనం చేయించే ( బాధపెట్టే ) శక్తుల్ని రుద్రులు అన్నారు. రుద్రులు అంటే ఇక్కడ ఈశ్వరుడు అనే అర్థం కాదు. ఏకాదశ రుద్రులు ( పదకొండు రుద్రులు ) అని మనం మామూలుగా వింటూంటాం. ఇవి మన శరీరంలోని ఐదు జ్ఞానేంద్రియాలు , ఐదు కర్మేంద్రియాలు, మనస్సు మొత్తం పదకొండు. మనిషి మరణించే సందర్భంలో ఈ పదకొండూ నశిస్తాయి. మన దగ్గర వాళ్లైన బంధుమిత్రులను ఏడిపిస్తాయి. అందువల్ల ఇవి రుద్రులు అని ఈ మంత్రానికి అర్థం.
మిగతా కొన్నింటిని ఆదిత్యులు అన్నారు. ఇవి పన్నెండు. పన్నెండుగురు ఆదిత్యులు ఎవరన్న ప్రశ్నపై సంవత్సరంలో ఉన్న పన్నెండు మాసాలే ఇవి అని సమాధానం. కాలం మనందరి ఆయుర్ధాయాన్నీ, కర్మఫలాన్ని మెలమెల్లగా క్షయం చేస్తూ వెళుతూంటుంది. ఆదదానం అంటే సంస్కృతంలో స్వీకరించడం అని అర్థం. మన ఆయుర్ధాయాన్ని తీసుకుంటూ పోతున్నాయి కావున వీటిని ఆదిత్యులు అన్నారు.
వసువులు 8, రుద్రులు 11, ఆదిత్యులు 12 మొత్తం కలిపితే ముప్పది ఒకటి. వీటితో పాటు ఇంద్రుడు , ప్రజాపతి అనే ఇద్దరితో కలిపి 33 అవుతుంది.
యాజ్ఞవల్క్యుడి సమాధానాలన్నీ వివిధ దృష్టి కోణాల నుంచి చెప్పిన మాటలే. విశ్వమంతా అనేక రూపాల్లో ప్రకటనమైయున్న ఒకే ఒక చైతన్యశక్తి, హిరణ్యగర్భుడు అని వ్యవహరించబడినది ఒకే దేవతాస్వరూపం అని ఉపనిషత్తు చెబుతుంది.
ఇంద్రుడు, ప్రజాపతి ఎవరు అంటే వర్షించే సమయంలో మెరపు ( వజ్రాయుధం ) ఆయుధంగా గల ఇంద్రుడు లోకరక్షణకు చిహ్నం. ప్రజాపతి అంటే యజ్ఞం అని అర్థం. యజ్ఞం అనేది వైదిక సంస్కృతిలో మనుష్యులకు, ప్రకృతిలోని శక్తులకు ఉన్న సంబంధాన్ని , పరస్పరం ఆధారపడి ఉండటాన్ని సూచిస్తుంది.
మరో దృష్టికోణం నుండి చూస్తే విశ్వమంతా అన్నము, ప్రాణము అనే రెండు శక్తులు మాత్రమే. దీన్నే ఆధునికmatter and energy అనవచ్చు. ఒకటి తినబడేది, మరొకటి తినేది. వైదికభాషలో దీన్నే అగ్ని, సోమము అన్నారు. మనం తినే అన్నమంతా సోమము. ప్రాణుల దేహాల్లో వైశ్వానరుడు అనే పేరుతో ఉన్నదే అగ్ని. మనం రోజూ భోజనం చేసేటప్పుడు ప్రాణాయస్వాహా, అపానాయస్వాహా అంటూ ప్రాణానికి వేసే ఆహూతులే వైశ్వానరుడనే అగ్నికి వేసే ఆహుతులు . ప్రాణం యొక్క మరో రూపమే అగ్ని. ఈ విధంగా చేయడం భోజనాన్ని ఒక యజ్ఞంగా భావించడమని పెద్దలు చెబుతారు.
చివరగా ఒక్కదేవుడు ఎవరు అంటే అదే హిరణ్యగర్భుడు ( చైతన్యంలో ఏర్పడే మొదటి cosmic being ) అని యాజ్ఞవల్క్యుడంటాడు. ఆ ప్రాణశక్తి ఒక్కటే రకరకాల పేర్లతో రూపాలతో , వివిధ కర్మలతో, గుణాలతో , శక్తిభేదాలతో అనేక రూపాలు పొంది మూడురకాలుగా, 33 రకాలుగా, 3306 గా ప్రకటమవుతూంటుంది. అలాగే ముక్కోటి దేవతలు అన్నప్పుడు మూడు తరగతులుగా ప్రకటమవుతున్న జీవశక్తి అని అర్థం. ఇవే భూమికి సంబంధించిన నీరు, అగ్ని మొదలైనవి, అంతరిక్షానికి సంబంధించిన గాలి మొదలైనవి, ఆకాశానికి సంబంధించిన సూర్యుడు మొదలైనవి.
ఉపనిషత్తులో ఆ తర్వాత జరిగే సంభాషణ గమనిస్తే విశ్వంలో ఉన్న జీవశక్తి అంతా కేవలం హిరణ్యగర్భుడు మాత్రమే అని తెలియడమే కాక ఈ విశ్వమనేదే సత్యం, జ్ఞానం, అనంతం, అనబడే శుద్ధచైతన్యంలో కనిపించే ఒకానొక దృశ్యం మాత్రమే అంటూ యాజ్ఞవల్క్యుని ప్రతిపాదన నడుస్తుంది. ఇది శుద్ధవేదాంత చర్చ. ‘ ఏకం సత్‌ విప్రా : బహుధా వదన్తి ’- ‘ఉన్నది ఒకటే, పండితులు అనేక విధాలుగా వివరిస్తారు ’ అనే మాటలకు పై చర్చయే వ్యాఖ్యానం. ఆవు కడుపులో దేవుళ్లున్నట్లు చెప్పడం పురాణాల ధోరణి.
డాక్టర్‌ కె. అరవిందరావు

రిటైర్డు డీజీపీ
ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను navya@andhrajyothy.com కు పంపండి
Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

జ్యోతిర్లింగాలు పరమ శ్రేయో సాధకాలు – మహాశక్తి కేంద్రాలు – సద్గురు

జ్యోతిర్లింగాలు పరమ శ్రేయో సాధకాలు – మహాశక్తి కేంద్రాలు – సద్గురు
భారతీయ సంస్కృతి ఈ ప్రపంచంలోని అతి కొద్ది ప్రాచీన సంస్కృతుల్లో ఒకటి. భౌగోళిక విస్తారం పరంగా చూస్తే ఈ ప్రపంచంలో ఇటువంటి సంస్కృతి బహుశా ఇది ఒక్కటే అయ్యుంటుంది. వేలాది సంవత్సరాలుగా ఈ గడ్డ మీది జనావళి అంతా మానవాళి అంతిమ శ్రేయస్సు కోసమే పరితపిస్తూ వస్తోంది. భౌతికపరమైన శ్రేయస్సును కేవలం జీవితంలోని ఓ చిన్న అంశం మాత్రంగానే ఇక్కడి ప్రజానీకం పరిగణిస్తూ వచ్చారు. ఇంతకు ముందు ఈ భారతావనిలో జన్మించిన వారికి జీవితమంటే వ్యాపారమో, భార్యో, భర్తో, కుటుంబమో కానే కాదు వారి జీవితమంతా కేవలం ముక్తి పొందడం కోసమే జీవితంలోని ప్రతి అంశమూ ముక్తి సాధనకు అనువుగా మలచబడింది. ఈ సమాజ వ్యవస్థ మొత్తం ఇదే విధంగా రూపుదిద్దబడింది.
అందువల్ల ఇక్కడ వారు సహజంగానే తాము రూపొందించిన ప్రతి పరికరాన్ని జీవితంలోని ప్రతి పరిస్థితిని మోక్ష సాధనకు అనువుగా మలచుకోవాలనుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం మీ వివాహం జరిగితే ఈ వివాహ క్రతువు నడిపించే సందర్భంగా పురోహితుడు ‘ఇక్కడ మీరు మీ జీవిత సహచరుల కలయిక ముఖ్యం కాదు. ఈ క్రతువు కేవలం మీకు వివాహం జరగడానికి సంబంధించినది మాత్రమే కాదు. మీరు ఉభయులూ కలిసి ఈ వివాహబంధాన్ని మీ అంతిమ లక్ష్యాన్ని సాధించడానికి ఉపయోగించుకోండి. మీలోని కొన్ని పరిమితులు, నిర్భందతలను అధిగమించే స్థితిలో లేరు కాబట్టి వాటిని ఈ వివాహం ద్వారా మీ అంతిమ శ్రేయోసాధనకు, పరమాత్మను చేరుకోవడానికి సాధనాలుగా మలచుకోండి’ అని చెబుతాడు. ప్రతీదీ దేశంలో ఇలాగే ఉంటుంది.
ఇదే ఉద్దేశ్యంతో మరెన్నో శక్తివంతమైన సాధనాలు ఈ సంస్కృతిలో సృజించబడ్డాయి. ఇలానే జ్యోతిర్లింగాలు కూడా చాలా శక్తివంతమైన సాధనాలుగా సృష్టించబడ్డాయి. వీటిలో కొన్ని ఇప్పటికీ కూడ సజీవంగా , చాలా శక్తివంతంగా విరాజిల్లుతున్నాయి. అవి ఎంతో ప్రయోజనకరమైనవి. ఒక వ్యక్తి తనంతట తాను ధ్యానంలో నిమగ్నుడవగలిగితే అప్పుడు వెలుపలి సాయం అనేది అంత అవసరం ఉండకపోవచ్చు. కానీ, ఆ స్థితికి ఇంకా చేరని వారికి మాత్రం ఈ సాధకాలు చాలా అవసరమవుతాయి. ఇటువంటి శక్తి రూపాల సన్నిధిలో చాలా శక్తివంతమైన అనుభూతి కలుగుతుంది.
జ్యోతిర్లింగాలు పరమ శక్తివంతమైనవి. ఎందుకంటే వాటిని ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ప్రతిష్టీకరించి నెలకొల్పారు. ఈ ప్రపంచంలో 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. భౌగోళికంగా, ఖగోళపరంగా ఎంతో విశిష్టత ఉన్న కేంద్ర బిందువుల్లో వాటిని ప్రతిష్టించారు. ఈ ఉనికిలో ఉన్న కొన్ని శక్తులకు అనుగుణంగా ఈ కేంద్రాలున్నాయి. చాలాకాలం కిందట ఎంతో మహత్తరమైన జ్ఞానం గల మహానుభావులు గ్రహ, నక్షత్ర గమనాల ఆధారంగా ఈ ప్రాంతాలను గణించి ఈ కేంద్రబిందువులను నిర్ధారణ చేశారు. మానవ శక్తియుక్తులనే కాకుండా , ప్రాకృతిక శక్తులను కూడా ప్రాంతాల్లోనే ఏర్పరచారు.
మూర్తులను శక్తివంతం చేసే శాస్త్రం నిర్దేశించిన నియమ నిబంధనలు పద్ధతుల ప్రకారం ఈ జ్యోతిర్లింగ క్షేత్రాల ప్రతిష్టాపన జరిగింది. చాలా అసాధారణ అద్భుతమైన రీతిలో మానవ జీవనాన్ని పరిపుష్టం చేయడానికి జీవ శక్తులను వినియోగించే శాస్త్రమిది. మట్టిని ఆహారంగా మారుస్తున్న ప్రక్రియను వ్యవసాయం అంటాం. ఆహారాన్ని మాసం , ఎముకలుగా రూపాంతరం చెందిస్తున్న విధానాన్ని జీర్ణప్రక్రియ అంటాం. ఈ మాంసాన్ని అంటే ఈ మాంసాయుతమైన శరీరాన్ని మట్టిగా మార్చే ప్రక్రియను దహనం అంటాం. అలాగే శరీరాన్ని , ఓ రాతిని లేదా ఖాళీ స్థలాన్ని ఓ దివ్యశక్తిగా మార్చే ప్రక్రియను ప్రతిష్టీకరించడం లేదా ప్రతిష్టాపన అంటాం. ఇది పరమాద్భుతమైన శాస్త్రం దురదృష్టవశాత్తూ , ఇప్పుడు ప్రతిష్టాపన అంటే అసలేమిటో మనం మరచిపోయాం. అందువల్ల ఈ పేరుతో అర్థంపర్థంలేని పరిహాసాత్మకమైన కార్యకలాపాలు ఎన్నో సాగిపోతున్నాయి. దీనితో జనం దీనిని వ్యాపారంగా మార్చుకుని సొమ్ము చేసుకుంటున్నారు.
నేను సాధారణంగా గుడులకు వెళ్లను కానీ ఉజ్జయిని లోని మహాకాళేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రానికి వెళ్లడం జరిగింది. ఈ దేవాలయాన్ని అనేకమార్లు ధ్వంసం చేశారు. మనదేశం మీద దండెత్తిన వాళ్లు ఈ దేవాలయాన్ని కూలగొట్టారు. ఈ కారణంగా ఇప్పటికీ రెండు, మూడు మార్లు తిరిగి నిర్మించి పున:ప్రతిష్ట చేయటం జరిగింది. ఏదేమైనా ఇప్పటికి కూడా మీరు అక్కడికి వెళ్లి ఆ జ్యోతిర్లింగ సన్నిధిలో కూర్చున్నారంటే … వేలాది సంవత్సరాలుగా అక్కడ ఉన్న ఆ చిన్న స్వరూపం . ఆ చిన్న రాతిముక్క మిమ్మల్ని ఒక అద్భుతమైన అనుభూతిలో ముంచేస్తుంది. ఆ మహాశక్తి స్వరూపం కేవలం నిన్ననే ప్రతిష్టింపబడిన దానివలె మహాశక్తి తరంగాలను వెదజల్లుతూ ఉంది.

జీవితంలో వీటి మహత్తును పరిపూర్ణంగా అనుభవంలోకి తెచ్చుకోగలిగిన వారికి జ్యోతిర్లింగాలు మహాశక్తివంతమైన సాధనాలు మీ శారీరక, మానసిక వ్యవస్థను పరిపూర్ణంగా పున:వ్యవస్థీకరించుకోగలిగే నేర్పు మీకు తెలిస్తే , ఈ జ్యోతిర్లింగాల సన్నిధిలో మీ వ్యవస్థను సమూలంగా మార్చుకోగలగుతారు. ఈ భూమిమీద ప్రతిష్టించిన ప్రతి లింగానికీ, దానికి సంబంధించిన ప్రత్యేకమైన సాధన ప్రక్రియ అనేది మాత్రం ఈ రోజుల్లో పూర్తిగా మాయమైపోయింది. అందువల్ల దేవాలయాలు ఇప్పుడు చాలా కాలం కిందట చనిపోయిన వారి స్మృత్యర్థం నిర్మించిన స్మారక చిహ్నాలుగా మిగిలిపోయాయి. జ్యోతిర్లింగాల్లో కొన్ని సజీవంగా లేవు. కాని మిగిలిన వాటిలో చాలా లింగాలు ఇప్పటికీ మహాశక్తి వంతమైన సాధకాలే.
– సద్గురు
 
 
 
కుండలినీ చక్రాలు – ధ్యానం
వెన్నెముక పొడవునా ఉండే శ క్తి కేంద్రాలను చక్రాలు అంటారు. ఇవి నాడీ వ్యవస్థ ఆధారితంగా ఉంటాయి. కటిభాగం నుంచి మొదలై కపాలానికి చేరతాయి. వీటిలో సహస్రార చక్రం అన్నింటికన్నా కీలకమైనది. వెన్నెముకలో సుషుమ్న, ఇద , పింగళ అనే ప్రధాన కేంద్రాలు ఉంటాయి. జీవ శక్తికీ, ప్రాణశక్తికీ కేంద్రంగా ఈ చక్రాలను పరిగణిస్తారు. స్థూలశరీరానికి సంబంధించిన ఒక మౌలిక అంశమే ప్రాణం. ప్రాణశక్తిని చైతన్యపరిచే ఈ చక్రాలే జీవితానికి మూలం .
1. తలనుంచి కటి భాగందాకా వెళ్లే ఈ చక్రాల్లో తలలో ఉండేది సహస్రార చక్రం. ఏడు చక్రాల్లో ఇది మకుటం లాంటిది. జీవ చైతన్యానికీ పూర్తి ఎరుకకు సంబంధించింది. ఇది సాధార ణ స్పృహకు, కాలానికీ, స్థలానికీ అతీతమైన ఒక అద్భుత ప్రపంచంతో ముడివడి ఉంటుంది. ఈ చక్రాలు ఎదిగినప్పుడు విద్వత్తును, విజ్ఞానాన్నీ, అవగాహనననూ పెంచుతాయి. ఆఽధ్యాత్మిక బంధాన్నీ, ఒక దివ్యానందాన్నీ కలిగిస్తాయి. సహస్రార చక్రం తల మీద ఉంటుంది. ఇక్కడ 20 పొరలు ఉంటాయి. ఒక్కో పొరలో 50 రేకుల చొప్పున మొత్తంగా 1000 రేకులు ఉంటాయి. మౌలికంగా ఇది వాయిలెట్‌ వర్ణంలా అనిపిస్తుంది. కానీ, వాస్తవానినికి ఇది పలు వర్ణాలతో ఉండి ‘ఓం’ అనే బిందువును ప్రతిబింబిస్తుంది. అంతే కాదు స్వీయ జ్ఞానమయమైన ఒక దివ్యానందపు అనుభూతిని, ఒక మహోన్నతమైన ఆలోచనను, విఽశ్వైక్య భావనను కలిగిస్తుంది.
2. ఆజ్ఞ చక్రం
ఇది రెండు కనుబొమ్మల మధ్య ఉండే మూడవ నేత్రం. దీన్ని భృకుటి చక్రంగానూ, మూడో చక్రంగానూ పరిగణిస్తారు. ఇది బాహ్యనేత్రంతోనూ, మనస్సాక్షి ఆధారంగానూ చూసే ప్రక్రియకు సంబంధించినది. ఇది మన మనో విజ్ఞాన అంశాల్ని, ఆర్కీటైపల్‌ స్థాయి అవగాహనా ద్వారాలు తెరిపిస్తుంది. ఇది పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పుడు అన్నింటినీ స్పష్టంగా చూడగలుగుతాం. ఆజ్ఞచక్రం సమర్థవంతంగా పనిచేస్తున్నప్పుడు అద్భుతమైన ఏకాగ్రత ఉంటుంది. విషయాల్ని లోతుగా అర్థం చేసుకోగలుగుతాం.
3. విశుద్ధ చక్ర
ఇది గొంతు భాగంలో ఉంటుంది. ఇది భావ వ్యక్తీకరణ, సృజనాత్మక సామర్థ్యాన్ని పెంచడానికి సంబంధించినది. ఇక్కడ ప్రపంచాన్ని ప్రతీకాత్మకంగా, అంటే శబ్ద, భాష ప్రకంపాల ద్వారా తెలుసుకోగలుగుతాం. సృజనాత్మక ఐక్య భావనను, స్వీయ వ్యక్తీకరణ శక్తినీ ఇది పెంచుతుంది.
4 అనాహత చక్ర
ఈ చక్రాన్ని హృదయ చక్రం అని కూడా పిలుస్తారు. ఇది ఏడు చక్రాలకు మధ్యన ఉంటుంది. ఇది ప్రేమ సంబంధితమైనది. ఇది శరీరానికీ -మనసుకూ, పురుషుడికీ- సీ్త్రకీ , అస్తిత్వానికీ- నీడకు, అహానికీ-ఏకత్వానికీ మధ్యనుండే వైరుధ్యాలను సమన్వయం చేస్తుంది. ఇది గాఢమైన ప్రేమానుభూతికీ, అంకిత భావాన్నీ, లోతైన ఒక ప్రశాంత స్పృహనూ, అందులో మమేకమయ్యే మానసిక స్థితిని కలిగిస్తుంది. ఇది ఆత్మవిశ్వాసాన్నీ, ఽధైర్యాన్నీ నింపుతుంది. విషయాల్ని సహజంగా, యధాతథంగా స్వీకరించే మానసిక దిటవునూ పెంచుతుంది. తన అస్తిత్వాన్ని కాపాడుకుంటూనే, సమాజంలో మమేకమయ్యే శక్తిని కూడా కలిగిస్తుంది.
5 మణిపూర చక్ర
దీన్ని శక్తి చక్ర అని కూడా పిలుస్తారు. ఇది మన అంతర్గత శక్తిని నడిపిస్తుంది. మన శరీర వ్యవస్థనూ, జీవక్రియల్ని సైతం నియంత్రిస్తుంది. ఇది శరీరానికి అపారమైన శక్తిని ప్రసాదిస్తుంది. ఇది ప్రభావవంతంగా ఉండేలా, తక్షణమే స్పందించేలా చేస్తుంది. ఎవరి మీదా ఆధిపత్యం లేని నైజాన్ని పెంపొందిస్తుంది. మనం తీసుకునే ఆహారం, శ్రమ, విశ్రాంతుల తోడ్పాటుతో శరీరంలోని ప్రాణశక్తిని నిలబెడుతుంది. అహాన్ని గుర్తించడంతో పాటు, స్వీయ విశ్లేషణకు అవసరమైన శక్తిని ప్రసాదిస్తుంది.
7. స్వాదిష్టాన చక్ర
ఇది. పొట్ట, కటి భాగం, లైంగిక అవయవాలకు సంబంధించినది. భావోద్వేగాలకు, లైంగిక విషయాలకు సంబంధించినది. ఇది అనుభూతులు, కోరికలు స్పందనలు, కదలికల ద్వారా ఇతరులతో సంబంధం పెంచుకుంటుంది. ఇది కాంతినీ, అనుభూతుల్లో గాఢతనూ, లైంగిక సంతృప్తినీ, మార్పును స్వీకరించే సామర్థ్యాన్నీ పెంచుతుంది. స్వాదిష్టాన చక్రం మేధోపరమైన స్వచ్ఛతను, జ్ఞాపకశక్తినీ, సక్రమమైన, స్వచ్ఛమైన ఆలోచనల్నీ కలిగిస్తుంది. భావోద్వేగాలతో మమేకమై, గొప్ప ఆనందానికి పాత్రమయ్యేలా చేస్తుంది.
వెన్నెముక మొదట్లోనే ఈ చక్రం ఉంటుంది. ఇది భూమికి అనుబంధమైనది. ఇది మన మనుగడ గురించిన స్పృహను కలిగిస్తుంది. పునాది లాంటిది. ఇది ఆరోగ్యాన్నీ, సంపన్నతను, బధ్రతను, చలాకీతనాన్నీ కలిగిస్తుంది. నిర్భయత్వాన్నీ, సురక్షిత భావాన్నీ, భౌతిక ఐక్య భావనను, స్వీయ రక్షణా శక్తినీ కలిగిస్తుంది.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చిన్నయ సూరి 208 జనందినోత్సవం -తెలుగు భాషా వికాస సదస్సు -కేల్ రావు భవన్ -20-12-14-శనివారం మధ్యాహ్నం 3గం లకు

chinnaya suri1 001 chinnaya suri2 001చిన్నయ సూరి 208 జనందినోత్సవం -తెలుగు భాషా వికాస సదస్సు -కేల్ రావు భవన్ -20-12-14-శనివారం మధ్యాహ్నం 3గం లకు

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

మరో గిన్నీస్ కు రంగం సిద్దం -కూచి భొట్ల ఆనంద్

మరో గిన్నీస్ కు రంగం సిద్దం

ప్రవాసాంధ్ర సంస్థ సిలికానాంధ్ర – ఈ నెల 26 నుంచి 28 వరకూ మూడు రోజులు హైదరాబాద్‌లో అంతర్జాతీయ కూచిపూడి సమ్మేళనాన్ని నిర్వహిస్తోంది. 8500 మంది నృత్యకళాకారులు పాల్గొనే ఈ కార్యక్రమంలో మరోసారి గిన్నిస్‌ రికార్డు సాధించనుంది. ఈ సమ్మేళనానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం గురించి సిలికానాంధ్ర నిర్వాహకులు కూచిభొట్ల ఆనంద్‌ అనేక విశేషాలు తెలియజేశారు.

‘జగమంత తెలుగుకుటుంబం’ అనేది సిలికానాంధ్ర నినాదం. ఇప్పటి దాకా మేము మూడు సార్లు నృత్య సమ్మేళనాలు నిర్వహించాం. ఈ సారి హైదరాబాద్‌లో ‘నవతరం-నాట్యతరంగం’ పేరిట ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది సమ్మేళనానికి బోలెడు ప్రత్యేకతలు ఉన్నాయి. ఈసారి ఇందులో పాల్గొనేందుకు ఇప్పటి దాకా 8 వేల మంది నమోదు చేసుకున్నారు. వీరిలో 18 దేశాలకు చెందిన నృత్య కళాకారులు ఉన్నారు. మన దేశం నలుమూలల నుండి దాదాపుగా రెండువేల ఐదువందల మంది హాజరవబోతున్నారు. వీరికి వసతి, ఆతిథ్య ఏర్పాట్లకు సంబంధించిన కూపన్ల పంపిణీ పూర్తయ్యింది. ‘మహాబృంద’ నాట్యంగా పిలిచే ఈ ప్రదర్శనలో ఇప్పటివారికి చాలా మందికి తెలియని ‘రామాయణ శబ్దం’, ‘బాలగోపాలతరంగం’ అంశాలతో కూచిపూడి మువ్వల రవళి జరుగుతుంది. ఈ నెల 26వ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు 600 మంది గురువులు, వారి శిష్యబృందం కలిసి కూచిపూడి గ్రామకుల దేవతలైన బాలాత్రిపురసుందరి, రామలింగేశ్వర స్వామి చిత్రపటాలతో కళారూప శోభాయాత్ర నిర్వహిస్తారు. దీనితో కార్యక్రమం ప్రారంభమవుతుంది. సంప్రదాయబద్ధమైన సూత్రధారుల వేషధారణతో కళాకారుల ఊరేగింపు చేశాక పూర్వరంగం – రంగపూజ చేసి ఽధ్వజావిష్కరణ చేస్తారు. ఆ తరువాతి రెండురోజులు 22 నృత్య ప్రదర్శనలు జరుగుతాయి. ఇవే కాకుండా అభినయపూర్వక ప్రసంగాలు, ఇష్టాగోష్టి వంటి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం.
మంచి మనసులు తోడై…
ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించడమంటే ఖర్చుతో కూడుకున్నదే. అయితే అమెరికా నుంచి ఇక్కడివరకు మంచి పనికి మేమున్నాం అనేవాళ్లు బోలెడు మంది ఉన్నారు. వారి మంచి మనసుల వల్లనే కార్యక్రమ ఏర్పాటు సాధ్యపడుతోంది. ఈ ఏడాది సమ్మేళనానికి తెలంగాణ ప్రభుత్వం నుండి మంచి ప్రోత్సాహం లభిస్తోంది. క్రీడల శాఖ వారు గచ్చిబౌలి స్టేడియాన్ని ఉచితంగా కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం యాభై లక్షల రూపాయల నిధులిచ్చింది. మిగతాది కళాభిమానుల నుండి సమకూరుతుంది. సమ్మేళనంలో పాల్గొనే వారు 800 రూపాయలు రుసుము చెల్లించాలి.. వాస్తవానికి ఈ కార్యక్రమంలో పాల్గ్గొనే వారికి ఆతిధ్యం ఇవ్వాలంటే నాలుగువేల రూపాయల దాకా ఖర్చు అవుతుంది. అందుకే రుసుము వసూలు చేస్తున్నాం.
తొలిసారి అమెరికాలో..
కూచిపూడి అంతర్జాతీయ సమ్మేళనాన్ని మొదటిసారి అమెరికాలోని కూపర్టినో నగరంలో నిర్వహించాం. అప్పుడు నాట్యంలో అగ్రశ్రేణి కళాకారుల్ని, మహామహులైన గురువుల్ని పేరుపేరునా ఆహ్వానించాం. ఆ కార్యక్రమంలో యామిని కృష్ణమూర్తి, రాజారెడ్డి వంటి ప్రముఖులు ప్రేక్షకులను అలరించారు. 335 మంది బృందంతో చేసిన నాట్య ప్రదర్శన మొట్టమొదటి ప్రపంచరికార్డు సృష్టించింది. ఆ తరువాత 2010 డిసెంబర్‌లో హైదరాబాదులో నాలుగువేల మంది ప్రతినిధులతో 2850 మంది నర్తకులు చేసిన ‘థిల్లాన’ కూడా రికార్డులకి ఎక్కింది. 2012లో అంతకన్నామిన్నగా 6500 మంది ప్రతినిధులు, 5700 మంది నర్తకులతో ‘దశావతారం శబ్దం’ రాష్ట్రపతి ముందు ప్రదర్శించారు. ఈ ప్రదర్శన మన రికార్డుల్ని మనమే తిరగ రాసేలా చేసింది.
 జిఎల్‌ఎన్‌ మూర్తి, హైదరాబాద్‌
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నెల మీద నడిచిన ఇంద్ర ధనుస్సు -భారత రత్న, ఏం ఎస్-లకుమా వ్యాసం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శివాలయం పై తాజ్ మహల్ నిర్మాణం !!!

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శాంతికాముక సత్యార్ది మలాల ”నోబుల్ సందేశం ”

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -85 -128-న్యాయ భూషణ ,న్యాయ స్థాపక –పేరి లక్ష్మీ నారాయణ శాస్త్రి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -85

128-న్యాయ భూషణ ,న్యాయ స్థాపక –పేరి లక్ష్మీ నారాయణ శాస్త్రి

విద్యోపాసన

పశ్చిమ గోదావరి కోన సీమ లోని పేరూరు అగ్రహారం లో శ్రీ విద్యోపాసకులైన పేరి అనంత రామావధానులు ,వెంకమాంబ దంపతులకు లక్ష్మీ నారాయణ శాస్త్రి గారు 1877లో జననమొందారు .తండ్రి గారే ప్రధమ గురువు గారు .తాతగారైన వేదాధ్యన సంపన్నులు ,నిత్య పార్ధివ లింగ పూజా దురంధరులు ,శ్రీ విద్యో పాసకులైన సుబ్బావదానుల వారు.చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన దురదృష్ట వంతులు వీరు .తల్లిగారు అన్నీ అయి పెంచారు .అల్లారు ముద్దుగా పెరిగారు .ఎనిమిదవ ఏట శాస్త్రిగారికి ఉపనయనం చేశారు .

పదహారో ఏడు వచ్చేదాకా నైయాకరణ చూడామణి అయిన మందా చెన్నయ్య శాస్త్రి గారి దగ్గర శిష్యులై సంస్కృత కావ్య నాటక ,న్యాయ వేదాంత ప్రకరణాలను క్షుణ్ణం గా అధ్యాయం చేసి కరతలా మలకం చేసుకొన్నారు .దురవ గాహన మైన  శాస్త్ర విషయాలను అతి సునాయాసం గా అర్ధం చేసుకొని వంట బట్టించు కొన్నారు .తన దిషణా సంపదత తో గురువు గారినే ముచ్చట పడేట్లు చేశారు .

విజయ నగరం రాజా వారి సంస్కృత కళాశాలలో న్యాయ శాస్త్ర అధ్యాపకులైన గుమ్మలూరి సంగమేశ్వర శాస్త్రి గారు అనే అపర గౌతముల వద్ద పదేళ్ళు ,పిఠాపుర సంస్థాన వైయాయిక సార్వ భౌములని పేరొందిన శ్రీ పాద లక్షీనరసింహ శాస్త్రి గారి  అంతేవాసిగా రెండేళ్ళు మొత్తం పన్నెండేళ్ళు న్యాయ శాస్త్రాన్ని మధించారు .

విద్యా బోధన

తన అసాధారణ వైదుష్యం తో పిఠాపురం ,ఉర్లాం మున్నగు సంస్థానాలను సందర్శించి పండితులను ప్రభువులను మెప్పించి గొప్ప సన్మానాలు అందుకొన్నారు .అన్ని శాస్త్ర పరీక్షలలో సర్వోత్తములుగా ఉంటూ అందరికీ చేరువయ్యారు ఆస్థానం లో న్యాయ వేదాన్తాలను అతి సులభ విధానం లో బోధిస్తూ ఎందరో శిష్యులకు  విద్య నేర్పి తీర్చి దిద్దారు .దీనితో వీరి కీర్తి చంద్రిక దశ దిశలా వ్యాపించింది .

1902లో విజయ నగర సంస్కృత మహా విద్యాలయం లో న్యాయ శాస్త్రాధ్యాపకులుగా పదవీ బాధ్యతలు చే బట్టారు . 1913లో  .గురువు సంగమేశ్వర శాస్త్రి గారు పదవీ విరమణ చేసిన పిమ్మట లక్ష్మీ నారాయణ శాస్త్రి గారుప్రధాన న్యాయ శాస్త్ర పండితులుగా నియమింప బడి సేవలందించారు .

వైదుష్య ప్రదర్శన –బిరుద సత్కారాలు

 

1924 లో రాజా గారి ఆజ్ఞ తో రాజస్థాన్ లోని జయ పుర సంస్థానాన్ని దర్శించారు .అక్కడ  మహా విద్వత్ సభలో తన ప్రతిభా సామర్ధ్యాలను వాదనా పటిమను ,ధీశక్తిని ప్రదర్శించి మెప్పించి ‘’న్యాయ భూషణ ‘’బిరుదాన్ని సత్కారాన్ని అందుకొన్నారు . విజయ వాడలోని ‘’త్రిలింగ విద్యా పీఠం’’వ్యవస్థాపక అధ్యక్షులు ముదిగొండ వెంకట రామ శాస్త్రి గారు శాస్త్రిగారిని ఆహ్వానించి శాస్త్ర ప్రదర్శన చేయించి ‘’న్యాయ స్థాపక ‘’గౌరవ బిరుదు ప్రదానం చేసి ఘనం గా సత్కరించారు .ఈ గౌరవాన్ని పొందిన ఆంధ్రులలో వీరు అయిదవ వారు .అధీతి బోధనా చరణ తో జీవితాన్ని ధన్యం చేసుకొన్నారు .అ నాటి బ్రిటిష్ ప్రాభుత్వం శాస్త్రి గారికి ‘’మహా మహోపాధ్యాయ ‘’బిరుదు ను  అందజేసి తగిన గౌరవం కలిగించిది .న్యాయ వేదాన్తాలనే కాకుండా మంత్రం ,జ్యోతిష శాస్త్రాలను  అధ్యయనం చేసి అనుస్టించిన నైస్ష్టికులు శాస్త్రి గారు .వీటిని నిరంతరం శిష్యులకు బోధించేవారు .

రచనా పాటవం

ఒక పట్టాన లొంగని తల పండిన మహా విద్వాంసులకే కొరుకుడు పడని ఉదయ నాచార్యుడు రాసిన ‘’కుసుమాంజలి ‘’ని శాస్త్రి గారు అతి సులువుగా ,సరళం గా ఆంధ్రీకరించారు .గదాధర భట్టా చార్యుని ‘’హేత్వభాస సామాన్య నిరుక్తి ;,’’నవ్యభి చార సామాన్య నిరుక్తి ‘’అనబడే నవ్య న్యాయ శాస్త్ర మహా గ్రంధాలకు ‘’లలిత’’అనే సరళ వివరణలు రాసి అందరికి అందుబాటులోకి తెచ్చారు .దీనివల్ల శాస్త్రిగారి అసాధారణ న్యాయ శాస్త్ర పాండిత్యం అవగాహన ,వ్యుత్పత్తి ,అనుసరణ లు తెలుస్తున్నాయి .ఇదేగాక మాధవాచార్యుల ‘’సర్వ దర్శన సంగ్రహం ‘’లోని ఎన్నో భాగాలను అనువదించారు .దురదృష్ట వశాత్తు ఈ గ్రంధం  ముద్రణకు నోచుకోలేదు .డెబ్భై రెండేళ్ళు జీవించిన ఈ న్యాయ శాస్త్ర కోవిదులు ,న్యాయ భూషణులు పేరి లక్ష్మీ నారాయణ శాస్త్రి గారు 1949లో నారాయణ  సన్నిధానం చేరారు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-12-14-ఉయ్యూరు

 

 

 

 

.

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment