మరో అన్నపూర్ణ,కరుణాంత రంగ –శ్రీమతి కైవారం బాలాంబ

మరో అన్నపూర్ణ,కరుణాంత రంగ  –శ్రీమతి కైవారం బాలాంబ

ప్రాతస్మరణీయులు

నిరతాన్న ప్రదాతలు  అంటే ఆంద్ర దేశం లో ముందు గుర్తు కొచ్చేది అపర అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ గారు .ఆ తర్వాత శ్రీ బందా పరదేశి గారు .పిమ్మట శ్రీమతి జిల్లెళ్ళమూడి అమ్మగారు .వీరి చేతి భోజనం తిని తరించని వారు లేరు అంటే అతిశయోక్తికాదు .అంతే కీర్తి వైభవాన్ని నిరతాన్నదానం చేతపొందిన మరో దివ్యవ్యక్తి శ్రీమతి కైవారం బాలాంబ గారు .ఎన్నో ఏళ్ళు గడిచిపోయినా వారి ఆప్యాయత ,ఆదరణ,ప్రేమ సేవా భావం తెలుగు జనం గుండెల్లో  స్తిరం గా  నిలిచిపోయాయి .వీరిలో బాలాంబ గారి గురించి ఈ తరం జనానికి పెద్దగా తెలిసి ఉండక పోవచ్చు .ఆమెను గురించి తెలియ జెప్పటానికే నేను చేస్తున్న ప్రయత్నం ఇది .

బాలాంబ గారి జీవిత విశేషాలు

గుంటూరు జిల్లా లోని అంగల కుదురు   గ్రామం లో బాలాంబ గారు 1849లో జన్మించారు వీరి తండ్రి గారు శ్రీ దేవులపల్లి సుబ్బన్న గారు .తల్లి గారు శ్రీమతి వెంకమాంబ గారు .ఈ కుటుంబం మొదటి నుండి దాన ధర్మాలకు ప్రసిద్ధి చెందినది .బాలాంబ గారు చిన్నప్పటి నుండి దాన ధర్మాలపై గొప్ప శ్రద్ధ చూపేవారు .ఇవి తలి దండ్రుల నుండిఆమె కు  సంక్రమించిన సద్గుణాలు .బాల్యం లో నే రామాయణ ,భాగవతాదిఆధ్యాత్మిక గ్రంధాలను చదివి సారాన్ని జీర్ణించుకొన్నారు .’’అమ్మా !అన్నం ‘’అనే కేక యెంత దూరం నుండి వినిపించినా ఆమెకు  వినపడేది .వెంటనే ఇంటి నుండి అన్నం కూరలు ,పచ్చళ్ళు తీసుకొని వెళ్లి  వాళ్లకు  పెట్టి సంతృప్తి చెందేవారు .వారు కడుపునిండా తింటే ఆమెకెంతో సంతోషం గా ఉండేది .వారిలోనే పరమాత్మ ను దర్శించేవారామే .

వివాహం –దాంపత్యం

గుంటూరు జిల్లా మంగళ గిరి నివాసి కైవారం సుబ్బన్న గారితో బాలాంబ గారికి వివాహం జరిగింది .పెండ్లి అవగానే కాపురానికి అత్తవారిల్లు మంగళగిరీ వచ్చారు .సుబ్బన్న గారితో కాపురం ఏంతో అన్యోన్యంగా  కొన్నేళ్ళు కొనసాగింది .ఇంతలో దైవ ఘటన మరో రకం గా ఉంది .సుబ్బన్న గారు అకస్మాత్తుగా చనిపోయారు .మొదటి నుంచి శ్రీ మంగళ గిరి లక్ష్మీ నృసింహ స్వామిఉపాసనలో బాలాంబ గారు గడిపేవారు . భర్త మరణం తో ధ్యాస అంతా స్వామి మీదే లగ్నం చేసి  స్వామి సేవలో జీవితాన్ని ధన్యం చేసుకొన్నారు  .కొంతకాలం మంగళ గిరి కొండపైనే ఉంది తపస్సు చేశారు .అనుకో కుండా బాలాంబ గారికి ఒక రోజు జ్ఞానోదయం అయింది .అన్నదానం చేయాలనే ప్రేరణ కలిగింది .

నిరతాన్న దాన కార్యక్రమం

మంగళ గిరి గ్రామం లో అన్నదాన కార్య క్రాన్ని బాలాంబ గారు ప్రారంభించారు .అన్నం పెట్టెటప్పుడు ఏ భేదమూ  పాటించే వారు కాదు . అదే ఆమె విశిష్ట వ్యక్తిత్వం .ఆ నాటి సంఘ ఆచార వ్యవహారాలలో ఇదొక గొప్ప ముందడుగే .నిరాడంబరం గా ,అదొక సేవా భాగ్యం గా అన్నదానాన్ని నిర్వహించేవారు .స్వ,పర భేదాన్ని ఏనాడు పాటించని సమద్రుష్టి బాలాంబ గారిది .ఆడంబరాల జోలికి పోకుండా ప్రశాంత చిత్తం తో నిరతాన్న దానాన్ని కొన సాగించారు ..క్రమంగా బాలాంబ గారి వితరణ  అందరికీ తెలిసి అందరి అభిమానానికి పాత్రురాలయ్యారు బాలాంబ గారు .ఆమె వారికి ఒక అన్నపూర్ణా దేవిగా గోచరిం చేవారు .

గ్రామం లోను ,చుట్టు ప్రక్కల గ్రామాలలోను బాలాంబ గారి సేవా తత్పరత ను గుర్తించిన దాతలు సహాయం చేయటానికి ముందుకొచ్చారు .వారి సహాయ సహకారాలను స్వీకరింఛి  బాలాంబ గారు అన్నదానాన్ని క్రమం గా విస్తరింప జేశారు .నిత్యం బాటసారులు ,పేదలు  భక్తులు ,వందలాదిగా వచ్చి బాలాంబ గారి ‘’అన్న దాన సత్రం ‘’లో అన్నదానాన్ని స్వీకరించి సంత్రుప్తిపొంది దీవించి వెళ్ళేవారు .పుణ్య క్షేత్రమైన మంగళ గిరి పానకాల స్వామిని దర్శించటానికి వచ్చే భక్తులకు ,బాటసారులకు ఇతరగ్రామాలనుండి స్వంత పనుల నిమిత్తం వచ్చేవారికి  అది ఒక కేంద్రమై నిలిచింది .బాలాంబ గారు అనే ఒక వ్యక్తీ ఇప్పుడు ఒక మహా సంస్థ గా ఎదిగారు .ఇంతటి భారీకార్య క్రమానికి కావలసిన వనరులు కూడా భారీగానే అవసరం కదా .

వనరుల సేకరణ

అందుకని బాలాంబ గారు ఎద్దుల బండీ మీద గ్రామాలలో పర్య టిం చేవారు .రైతులు అంద జేసే బియ్యం ,పప్పులు కూరలను సేకరిం చేవారు .రైతులు కూడా ఇదొక పవిత్ర యజ్ఞం అని భావించి తామూ అందులో భాగాస్వాములవుతున్నందుకు అధికమైన సంతోషం తో ఇష్టపూర్తిగా అన్నీ అందజేసి ,అది తమ పని గా భావించి సహాయ పడేవారు .పంటలు చేతికొచ్చినప్పుడు రైతులు బాలంబ గారి సత్రం లో సరుకులు తోలుకొని వెళ్లి పడేసేవారు  మంగళ గిరి స్వామి తిరునాళ్ళకు వచ్చే అసంఖ్యాక భక్త జనాలకు సత్రం లో కమ్మని రుచికరమైన శుచికరమైన భోజనాన్ని వండించి దగ్గరుండి వడ్డింప జేసేవారు బాలాంబ గారు .1926లో బాలాంబ గారు ‘’మంగళ గిరి అన్న పూర్ణ సత్రం ‘’అనే పేరుతొ ఒక ధర్మ సంస్థను నెలకొల్పారు. అన్నదానం ఒక నిరంతర కార్య క్రమంగా మారిపోయింది .ఆమె కీర్తి ప్రతిష్టలు జిల్లాలు దాటి రాష్ట్రమంతా వ్యాపించాయి .

యోగిని బాలాంబ గారు

ఫల ప్రాప్తికోసం కాకుండా అన్నదానం ఒక కర్తవ్యమ్ గా భావించి చేస్తున్న బాలాంబ గారు కేవలం ఒక యోగిని లాగా నే జీవించారు .యోగం లో ఆమెకు కొన్ని అద్భుత శక్తులు అలవడ్డాయి .ఎన్నో మహత్తులు ప్రదర్శించేవారని చెప్పుకొనేవారు .గుంటూరు సీమ అంటేనే ఆ నాడు కరువు ప్రాంతం .మెట్టపంటలేకాని మాగాణి భూములు చాలా తక్కువ .ఇంట్లో ఉన్న బావి నుండి నీరు తోడాలంటేనే మంగళ గిరి కొండ అంత ఎత్తున్న పొడవైన చేంతాడు కావాల్సి వచ్చేది .ఎక్కడో పాతాళం లో ఉన్నట్లు నీరు బావిలో కనిపించేది .దాన్ని చిన్న బొక్కేనతో పైకి తోడాలంటే చేతులు అరిగిపో యేవి బుజాలు నొప్పి పుట్టేవి .ఒక బకెట్ నీరు లాగిన వాడు బాల చంద్రునితో సమాన పరాక్రమం గలవాడనే వారు .అదీ ఆనాటి  పరిస్తితి .ఎవరైనా పొడుగ్గా ఉంటె ‘’మంగళ గిరి చాంతాడంత ఉన్నాడు ‘’అనే సామెత లోకం లో బాగా ప్రచారమైంది .ఇవన్నీ బాలాంబ గారు స్వయం గా అనుభవించిన కష్టాలే .ప్రజల బాధ ,వారి కాలేకడుపులు ,గుక్కెడు మంచి నీటి కోసం అర్రులు చాచే దైన్యం చూసి చూసి ఆమె కడుపు తరుక్కు పోయేది .ఏదో చేయాలనే తపన మొదలై  అన్నదానం చేసి వారికి కనీసం రొజు అన్నం తినే యోగ్యం కలిగించాలన్న భావనే ఆమెను అన్నదాన సత్ర నిర్మాణానికి ప్రోత్సహించి ఇంతటి మహత్కార్యాన్ని చేయించింది .

బాలాంబ గారు చిన్నప్పటి నుంచీ పురాణాలు చదివి అర్ధం చేసుకొని పారాయణ  చేసేవారని చెప్పుకొన్నాం .ఇప్పడు వైధవ్యం ,దైవ భక్తికి తోడై అన్నదాన మహత్కార్యానికి దోహద పడింది .అందర్నీ తన ఆత్మీయులు గా చూసుకొనే మహత్తర ఆత్మ సంస్కారం వారికి అబ్బంది .బాలాంబ గారిని చూస్తె సంస్కృత శ్లోకం ఒకటి గుర్తుకు వస్తుంది –

‘’శతేషు జాయతే శూరః –సహస్రేషు చ పండితః –వక్తా శత సహశ్రేషు –దాతా భవతా వా నవా ‘’

అంటే-శూరుడనే వాడు వందల్లో ఒకడు ఉంటాడు .పండితుడు అనేవాడు వేలల్లో ఒకడే ఉంటాడు .వక్త లక్షల్లో ఒకడు ఉండచ్చు .కాని ‘’దాత ‘’అనే వాడు అసలు ఉంటాడో ఉండడో.అంటే దాత అనే వాడు లభించటం బహు అరుదు అని భావం .సంప్రదాయపు కట్టు బాట్లను అతిక్రమించి అన్నదానం అనే పవిత్ర కార్యక్రమానికి ఆమె శ్రీకారం చుట్టారు .కరువు కాటకాతో అలమటించే బీదల కాలే కడుపులకు ఇంత అన్నం పెట్టి ఆదుకొన్న మరో అన్న పూర్ణ ,శాంతానికే శోభావైభవం బాలాంబ గారు .ఎవరి మెప్పుదలా మేహర్బానీకోసం చేసిన పనికాదు .ఆత్మ సంతృప్తికోసం  బాధితుల కన్నీరు తుడవటానికోసం ఆమె గారు చేసిన ఉడతంత సాయం .అదే మహద్భాగ్యం ఆ రోజుల్లో .అందుకే ఆమె మహా దాతల శ్రేణిలో చేరారు .నిరతాన్న దానం చేస్తూ ఆత్మ సంతృప్తి పొందుతూ దారిద్ర నారాయణ సేవతో పునీతమవుతూ జీవితాన్ని ధన్యం చేసుకొంటూ  భగవద్భక్తిలో తాదాత్మ్యం చెందుతూ 95ఏళ్ళ నిండు జీవితాన్నిసంతృప్తిగా  గడిపి ,కైవారం బాలాంబ గారు 12-8-1944న మన స్వాతంత్ర్యం రావటానికి సరిగ్గా ఏడాది ముందు స్వర్గస్తులయ్యారు .’’అన్న దాతా సుఖీ భవ’’

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-12-14-ఉయ్యూరు

 

.

 

Posted in రచనలు | Tagged | Leave a comment

సావిత్రి కన్నీళ్ళు పెడుతుంటే చూడలేక పోయాను – విజయనిర్మల

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆడశిశువులకు ‘నో ఎంట్రీ’! -లాస్య

ఆడశిశువులకు ‘నో ఎంట్రీ’!

  • -లాస్య

లింగ వివక్షను నిర్మూలించాలని ప్రభుత్వం ఎనె్నన్ని పథకాలను ప్రవేశపెట్టినా, భారీగా నిధులను ఖర్చు చేస్తున్నా ఫలితాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. చట్ట విరుద్ధ గర్భస్రావాలు, లింగ నిర్థారణ పరీక్షలు, భ్రూణహత్యలతో ఆడశిశువులు పుట్టకుండా అడ్డుకుంటున్న పరిస్థితులు ఇంకా చాలా రాష్ట్రాల్లో కొనసాగుతున్నట్లు గణాంకాలు ఘోషిస్తున్నాయి. ఇటీవలి కాలంలో లింగ నిష్పత్తి తగ్గినట్లు ప్రభుత్వం తాజాగా పార్లమెంటు సమావేశాల్లో అంగీకరించింది. ఆడపిల్ల పుడితే కుటుంబానికి భారమన్న భావజాలం నేటి ఆధునిక సమాజంలోనూ కొనసాగుతున్నందున లింగ నిష్పత్తి తీరు ఆందోళనకరంగానే ఉంది. ప్రతి వెయ్యి మంది బాలురతో పోల్చి చూస్తే దేశ వ్యాప్తంగా ఆడపిల్లల సంఖ్య 1991లో 945గా నమోదైంది. 2001లో ఆ సంఖ్య 927గా, 2011లో 918గా ఉంది. ముఖ్యంగా హర్యానా, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో ఆడపిల్లల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతోంది. దక్షిణాదితో పోల్చి చూస్తే ఈ పరిస్థితి ఉత్తరాదిలో ఎక్కువగా ఉన్నట్లు తేలింది. వధువుల కోసం ఉత్తరాది రాష్ట్రాల యువకులు పొరుగు రాష్ట్రాలకు వెళుతున్న పరిస్థితులే లింగ నిష్పత్తి తగ్గిందనడానికి సాక్షీభూతంగా నిలుస్తున్నాయి.
దేశంలో ఇతర ప్రాంతాల కంటే హర్యానాలోని పనె్నండు జిల్లాల్లో ఆడపిల్లల సంఖ్య బాగా తగ్గుముఖం పట్టింది. ఆ జిల్లాల్లో ప్రతి వెయ్యి మంది బాలురకు 834 మంది బాలికలు ఉన్నారని ఇటీవలి అధ్యయనంలో తేలింది. పంజాబ్‌లోని 11 జిల్లాల్లో ప్రతి వెయ్యి మంది బాలురకు 846 మంది బాలికలు ఉన్నారు. రాజస్థాన్, మహారాష్ట్ర, యుపిలోని కొన్ని జిల్లాల్లో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా లేదు.
గత మూడు దశాబ్దాలుగా జననాల తీరును విశే్లషిస్తే ఆడశిశువులు వద్దనుకుంటున్న దంపతుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. కుమారుడు పుడితేనే వంశం పెరుగుతుందని, కుటుంబానికి అండగా ఉంటాడన్న భావన ఇంకా అనేక కుటుంబాల్లో బలంగా ఉంది. సామాజిక పరిస్థితులు, సాంప్రదాయాల కారణంగా ఆడపిల్లలపై పలు రూపాల్లో వివక్ష కొనసాగుతోంది. ఆడపిల్లకు పెళ్లి చేయడం పెనుసమస్య అని ఇప్పటికీ ఎంతోమంది భావిస్తున్నారు. లింగ నిర్థారణ పరీక్షలు అందుబాటులోకి రావడంతో ఆడశిశువులు భూమీద పడకుండా అడ్డుకుంటున్నారు. గర్భస్రావాలు, భ్రూణహత్యలకు సైతం పాల్పడుతున్నందున ఆడపిల్లల సంఖ్య తగ్గుతోందని వైద్య నిపుణులు అంగీకరిస్తున్నారు. 1991లో దాద్రా, నగర్ హవేలి ప్రాంతంలో ప్రతి వెయ్యి మంది బాలురకు ఆడపిల్లల సంఖ్య 1013 కాగా, 2011లో ఆ సంఖ్య 926కు తగ్గింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బాలికల సంఖ్య 1991లో 975 ( ప్రతి వెయ్యి మంది బాలురకు) కాగా, 2011లో ఆ సంఖ్య 939గా నమోదైంది. 1991- 2011 మధ్యకాలంలో పశ్చిమ బెంగాల్ ఆ సంఖ్య 967 నుంచి 956కు తగ్గింది. మణిపూర్ (974 నుంచి 936), మేఘాలయ (986 నుంచి 970), నాగాలాండ్ (993 నుంచి 943) వంటి ఈశాన్య రాష్ట్రాల్లోనూ బాలికల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఒక్క మిజోరంలో మాత్రమే స్వల్పంగా ( 969 నుంచి 970కి) పెరిగింది. పంజాబ్‌లో 11 జిల్లాల్లో బాలికల సంఖ్య ఆందోళనకరంగా ఉన్నా, మిగతా జిల్లాల్లో 2001 నుంచి 2011 వరకూ స్వల్పంగా పెరుగుదల (798 నుంచి 846) కనిపించిందని కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఛత్తీస్‌గఢ్‌లో బాలికల సంఖ్య 2001లో 975గా, 2011లో 915గా నమోదైంది. కేరళలో బాలికల సంఖ్య 1991లో 958గా, 2011లో 960గా ఉంది. హిమాచల్ ప్రదేశ్‌లో ఈ సంఖ్య 1991లో 951గా, 2001లో 896కి తగ్గి, తిరిగి 2011లో 909గా పెరిగింది.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

janata parivaar

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -74 113-ధర్మ శాస్త్ర నిధి ,న్యాయాధీశ కవి –గుండేరావు హర్కారే

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -74

113-ధర్మ శాస్త్ర నిధి ,న్యాయాధీశ కవి –గుండేరావు హర్కారే

బహుభాషా వేత్త ,సంస్కృతానేక భాషా రచయిత ,ధర్మ శాస్త్ర నిధి శ్రీ గుండేరావు హర్కారే  13-3-1887 నహైదరాబాద్ లోరామారావు ,సీతా బాయి దంపతుల కు జన్మించారు .అరబ్బీ పారశీక భాషలను నేర్చి ,మెట్రి క్ చదివి   ,హైదరాబాద్ న్యాయ స్థానం లో గుమాస్తాగా ఉద్యోగం ప్రారంభించారు .తర్వాత తెలుగు ,మరాఠీ సంస్కృతం, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో పాండిత్యాన్ని సాధించారు .వృత్తిని  అంకిత భావం తో నిర్వహించటం గమనించి వీరిని అనువాదకునిగా చేసి పిమ్మట ఉన్నత న్యాయ స్థాన మండలి ప్రధాన న్యాయ  మూర్తి ఆంతరంగిక కార్య దర్శిగా ప్రభుత్వం నియమించి వారి బహుభాషా పాండిత్యానికి సరైన గౌరవాన్ని కలిగిం చింది .న్యాయ రాజస్వ ,గణాంకశాఖలలో ఉన్నత పరీక్షలు ఉద్యోగం సక్రమంగా నిర్వహిస్తూనే వ్రాసి ఉత్తీర్ణులయ్యారు .

సాహిత్యం లో గుండెలు తీసిన బంటు

భట్టు మూర్తి వసుచరిత్ర లోని మొదటి ,రెండు ఆశ్వాసాలను మరాఠీ లోకి అనువదింఛి ,అందులోని  కావ్య సౌందర్యాన్ని గొప్పగా వివరించారు గుండారే హర్కారే గారు .గద్వాల సంస్థానం లో 1919లో మున్సిఫ్ మేజిస్ట్రేట్ గా హర్కారే నియమింప బడ్డారు .క్రమంగా పదోన్నతి పొందుతూ ,జిల్లా న్యాయా దీశునిగా ,కలెక్టర్ గా ,సెషన్స్ జడ్జి గా ఎదిగి పదవీ విరమణ చేశారు .

న్యాయాదీశులుగా ఉంటూనే తీరిక వేళల్లో న్యాయ ,వ్యాకరణ ,పూర్వ మీమాంస మొదలైన శాస్త్రాధ్యయనం చేసి   లోతైన పరిశోధన చేసి,మద్రాస్ విశ్వ విద్యాలపు న్యాయ శిరోమణి ,సాహిత్య శిరోమణి పరీక్షలు రాసి,ఉత్తీర్ణులైనారు .ధర్మ శాస్త్రం లో ,తులనాత్మకసాహిత్యశాస్త్రాలలో పి. ఒ.ఎల్. పరీక్షనిచ్చి అత్యద్భుత ప్రతిభతో పాసైనారు .

ప్రతిభా పురస్కారం

హర్కారే గారి న్యాయ శాస్త్ర కోవిదత్వానికి మెచ్చి న్యాయ శాస్త్ర కేంద్రమైన నవ ద్వీపం లో పండిత పరిషత్తు  మెచ్చి ‘’వాచస్పతి ‘’బిరుదు ప్రదానం చేసి గౌరవించింది .   అయోధ్య ,బెల్గాం నగర పండిత సభలు ‘’విద్యా భూషణ ‘’నిచ్చి గౌరవించాయి .ఆలివర్ గోల్డ్ స్మిత్ఆంగ్లం లో  రాసిన ‘’ట్రావెల్’’ను సంస్కృతం లో పద్యాను వాదం చేశారు .దీనికి మైసూరు ప్రభుత్వం స్వర్ణ పతాకాన్ని ప్రదానం చేసి సమ్మానించింది.పూనా తిలక్ విద్యా పీఠం వీరిని పూర్వ మీమాంసా శాస్త్ర పరీక్షకులు గాను  ,మైసూర్ విద్వత్ పరీక్షకు సాహిత్య శాస్త్ర పరీక్షకులుగా సగౌరవం గా నియమించి వారి విద్వత్తును వినియో గించుకోన్నాయి .

వైవిధ్య భరిత రచనలు చేయటం లో హర్కారే గారు సర్వ సమర్ధులని పించుకొన్నారు .ఆంగ్లం లో ధామస్ గ్రేరాసిన ‘’ఎలిజీ’’,గోల్డ్ స్మిత్ రచించిన ‘’ద డిజర్తెడ్ విలేజ్ ‘’వర్డ్స్ వర్త్ రచన ‘’ఇంటి మేషన్ టు ఇమ్మోర్టా లిటి ‘’షేక్స్ పియర్ హేమ్లెట్ మిడ్ సమ్మర్ నైట్స్’’ లను సంస్కృతం లోకి శ్లోకానువాదం   చేశారు . ,పార్శీ లోని ‘’మస్నావీ షరీఫ్’’,అరబ్బీ భాషలో ఉన్న  ‘’ఖురానే షరీఫ్ ‘’ను సంస్కృతం లోకి అనువాదం చేసి తన పాండిత్య సామర్ధ్యాలను నిరూపిం చారు .యాజ్ఞ వల్క్య స్మృతికి ‘’మితాక్షారా’’అనే వ్యాఖ్యానం ,ఖురాన్ కు ‘’ఖురానే మితాక్షరా’’పారిభాషిక పద వివరణలతో ఉర్దూ భాష లోకి అనువదించారు .యాస్కుని నిరుక్తం ను కొంత వరకు   రాశారు .మరాఠీ సాహిత్య చరిత్రను తెలుగులోకి అనువదించారు .శబ్ద బోధ ప్రక్రియకు న్యాయ మీమాంస లను  ఆధారం గా సులభ వివరణ రచించారు .తెలుగు విజ్ఞాన సర్వస్వం ,సంగ్రహ ఆంద్ర విజ్ఞాన కోశం లలో హరారే రచిం చిన ‘’ఉర్దూ భాషా చరిత్ర’’ ‘’కుమరిల భట్టు ‘’వ్యాసాలు చోటు చేసుకొన్నాయి .

అఖిల భారత ప్రాచ్య విద్మన్ మహా సభ లో ‘’అభినవ గుప్త పాదుని రస వివరణ’’ పై ప్రత్యభిజ్నా సిద్ధాంత ప్రభావాన్ని గూర్చి రాసి న విమర్శనా వ్యాసం అత్యుత్తమమైనదిగా,తలమానికమైనదిగా  గుర్తింపు పొందింది .ఇలాంటి పరిశోధనావ్యాసాలు గుండే’రావు గారి లేఖిని నుంచి ఎన్నో ప్రవహించాయి .’’ప్రత్యయ కోశం ‘’,వీరు రచించిన వ్యారణ గ్రందాన్ని  ఉస్మానియా విశ్వ విద్యాలయ సంస్కృత శాఖ   ప్రచురించి గౌరవించింది .’’సంస్కృతం ‘’,’’భారతి ‘’ ‘’మధుర వాణి’’,ఎడ్యుకేషనల్ రివ్యు ‘’,’’ఇస్లామిక్ కల్చర్ ‘’మొదలైన పత్రికలో వీరి రచనలు వెలువడటం ఆ పత్రికలు చేసుకొన్న అదృష్టం .రేడియోలో అనేక భాషలలో శాస్త్రీయ వైజ్ఞానిక విషయాలపై  సూఫీ-బారతీయ వేదాంతాల తులనాత్మక పరి శీలనపై హర్కారే గారు మాట్లాడిన ప్రసంగాలు దాదాపు ఎనిమిది వందల పేజీల పైనే ఉన్నాయి అంటే అమితాశ్చర్యమేస్తుంది .

చెన్నై కుప్పుస్వామి శాస్త్రి పరిశోధనా సంస్థ ,ఆంద్ర రాష్ట్ర ప్రభుత్వం ,తెలుగు రచయితల సంఘం ,వీరిని సగౌరవం గా ఆత్మీయం గా సన్మానిం ఛి తమను తాము సన్మానం చేసుకొన్నాయి .ఆంద్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమి  వీరిని విశిస్టసభ్యులుగా స్వీకరించింది .భారత రాష్ట్ర పతి’వీరి శాస్త్ర నిస్టకు ప్రతీక గా ’మాన్యతా ప్రమాణ పత్రం ‘’(సర్టిఫికేట్ ఆఫ్ ఆనర్ ) అందజేసి సత్కరించారు .పాణినీయ సంస్కృత వ్యాకరణం ఆధునిక విజ్ఞాన శాస్త్రాల వంటిదే నని నిరూపిస్తూ ,రూప నిష్పత్తి ప్రక్రియ ను సులభం గా బోధించటానికి వీలుగా ‘’వ్యాకరణ యంత్రం ‘’ను నిర్మించిన సాంకేతిక విజ్ఞాని హర్కారే .దీనికోసం  ఒక పరిశోధనా విభాగాన్ని ఏర్పరచి ,కంప్యూటర్ విధానం లో ఆ యంత్రాన్ని ప్రవేశ పెట్టాలని కోరుకొన్నారు .ఆ కల సాఫల్యం కా  కుండానే మహా శాస్త్ర విజ్ఞాన కవిపండిత  బహుభాషా మర్మజ్న న్యాయాదిపతి శ్రీ గుండూరావు హర్కారే తొంభై వ ఏట 3-12-1979న కైవల్యం పొందారు .వారు లేని లోటు పూరింప రానిది .

Photo of Gunde Rao HarkareFront Cover

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -5-12-14-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -73 111-కాళిదాస సములు –శ్రీ పేరి కాశీనాధ శాస్త్రి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -73

111-కాళిదాస సములు –శ్రీ పేరి కాశీనాధ శాస్త్రి

‘’యదా కాళిదాస స్తధా కాశీ నాదః  ‘’అని పించు కొన్న మహా సంస్కృత విద్వాంస కవిపండితులు శ్రీ పేరి కాశీ నాద శాస్త్రి గారు .విశాఖ పట్నం మండలం గజపతి నగరం తాలూకా పురిటి పెంట గ్రామం లో 1885లో జన్మించారు .తండ్రి వెంకట శాస్త్రి, తల్లి మహాలక్ష్మమ్మ గార్లు .తండ్రి గారే ప్రధమ గురువులు .తండ్రివద్ద వ్యాకరణాన్ని ఔపోసనపట్టారు .మధ్వశ్రీ భీమా చార్యుల వారి వద్ద న్యాయ శాస్త్రాన్ని అభ్యసించారు .కొల్లూరు కామ శాస్త్రి గారి దగ్గర వేదాంత ,అలంకార శాస్త్రాలను నేర్చారు .

కాశీ నాద శాస్త్రి గారు విజయ నగర మహా రాజా ఆస్థాన పండితులు .తర్వాత రాజావారి సంస్కృత కళాశాలలో సంస్కృత ఉపాధ్యాయునిగా చేరి జీవితాంతం కొనసాగారు .పాఠ ప్రవచనం లో ప్రసిద్దులనిపించుకొన్నారు .వాద శక్తిలో ప్రతివాద భయంకరులే .మహా విద్వాంసులైనా, కవిగా కూడా కీర్తి గాంచారు .మహారాజు ఆనంద గజపతి భోజరాజు అని కాశీనాధ శాస్త్రిగారు కాళి దాసమహాకవి అని ఆరోజులలో అందరూ చెప్పుకొనేవారు .అనేక కవితలు రాసి వెలువరిస్తూ నానా రాజ సందర్శనం చేస్తూ సత్కార పురస్కారాలు అందుకొంటూ జైత్ర యాత్ర చేశారు .పండిత, కవి మహా జనమధ్యఎన్నో  కనకాభిషేకాలు  అందుకొన్న మహా శాస్త్ర విద్వాంసులు .

గోదావరీలహరి ,బ్రహ్మ సూత్ర భాష్యానువాదం అనే రెండు గ్రంధాలు రాసి ముద్రించారు .ఉత్తర శాకుంతలం అనే గ్రంధ వ్రాత ప్రతి ఇప్పటికీ విజయ నగర రాజ గ్రంధాలయం లో ఉందని చెబుతారు .శాస్త్రి గారు పూర్తిగా  గ్రాంధిక వాది .ఆ నాటి మరోగ్రాన్ధిక భాషా వాది అయిన కల్లూరి వెంకట రామ శాస్త్రి గారికి వత్తాసుగా ఉండేవారు .ఉర్లాం మొదలైన సంస్థానాల్లో శాస్త్రిగారు విద్వత్ పరీక్షకులుగాఉండి సన్మానాల నందుకొన్నారు .వీరి సంతానం ఆరుగురు .అందులో ఇద్దరుకుమారులు నలుగురు కుమార్తెలు .ప్రసిద్ధ శాస్త్ర పారంగతులు మహామహోపాధ్యాయ శ్రీ తాతాసుబ్బరాయ శాస్త్రి గారు కాశీ నాధ శాస్త్రిగారికి అల్లుడుగారు .అరవై రెండేళ్ళు జీవించి శాస్త్రిగారు 1920లో మరణించారు .

 

112- సంస్కృతం లోనే  ఉత్తరాలు రాసిన –నాగ పూడి కుప్పుసామయ్య

1864లో తమిళనాడు లోని తిరుత్తని లో కుప్పుసామయ్యగారు జన్మించారు .అసలుపేరు రామ కృష్ణ శర్మ .మద్రాస్ లో చదివారు తిరుపతిలో న్యాయ వాదిగా ఉండి,ఇక్కడే స్తిరపడ్డారు .సంస్కృతాంధ్రాలలో గొప్ప పండితులని పించుకొన్నారు .రెండుభాషల్లో కవిత్వం చెప్పి అనేకమైన గ్రంధ రచన చేసిన సవ్య సాచి .

శత ఘంటం వెంకట రంగ శస్త్రి గారు అనే మహా విద్వాంసుల శిష్యుడై సంస్కృతం అభ్యసించారు .వట్టిపల్లి నర కంఠీరవ శాస్త్రి ,వేదం వెంకట రాయ శాస్త్రి ,జనమంచి శేషాద్రి శర్మ వంటి ఆనాటి ప్రసిద్దులు వీరికి ప్రాణ స్నేహితులు .వీరి విద్వత్తును గుర్తించి ప్రభుత్వం తిరుపతి సంస్కృత కళాశాల పాలక మండలిలో సభ్యులనుగా నియమించి గౌరవించి వీరి అమూల్య సేవలను అందుకొన్నది .

నైష్టిక జీవనం వినమ్రత ,రుజువర్తనం వీరికి సహజ భూషణాలు .వీటికి శిష్యులు ఆకర్షింప బడి ఆరాధించారు .పారిజాతాపహరణం అనే నంది తిమ్మన ప్రబంధానికి ఎవరూ వ్యాఖ్యానం రచించ నందున వీరు చక్కని ‘’పరిమళోల్లాస వ్యాఖ్యానం’’బహు సుందరంగా సులభ శైలిలో 1929లో రాసి  ప్రచురింఛి ఆ లోటును తీర్చారు .సంస్కృతాంధ్రాలలో వీరు రచించిన కృతులు అనేకం ఉన్నాయి .అయితే చాలాభాగం అముద్రితాలే కావటం మన దురదృష్టం .మిత్రులకు శిష్యులకు కుప్పుసామయ్యగారు రాసే ఉత్తరాలలో ఎక్కువగా సంస్కృతమే రాసేవారు .అప్పుడప్పుడు తెలుగుపద్యాలతోనే ఉత్తరాలు రాసేవారు .సంస్కృతం లో రాసిన కావ్యాలనన్నిటిని  కావ్య సంపుటం గా చేసి ‘’సప్త రత్నావళి ‘’పేరిట ‘’1927లో ముద్రించారు .ఇందులో పది హేడు లఘుకావ్యాలున్నాయి . పారిజాతాపహరణం వ్యాఖ్యానం లో తన పుట్టుపూర్వోత్తరాలను పేర్కొన్నారు . నాగ పూడి  గ్రామం లో జన్మించానని ,భారద్వాజస గోత్రమని ,సామగద్రాహ్యాన సూత్రీకులమని ,యజ్నేశ్వరార్య పుత్రుడినని కుప్పుసామి పండితుడనని  ,రాసుకొన్నారు డెబ్భై ఏడేళ్ళు జీవించి ఈ మహా పండతకవి  1941లో పరమ పదించారు ..

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-12-14-ఉయ్యూరు  .

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆమెకు శునకాలే కన్నకొడుకులు

ఇవే కన్న కొడుకులు

మనుషులు చూపే ప్రేమలో వెనకాముందు ఆలోచనలేవైనా ఉంటాయేమో కాని.. శునకాలు చూపించే వాత్సల్యంలో నూటికి నూరు శాతం సహజత్వం ఉంటుంది. అందుకే మనుషులకు లేని విశ్వాసం కుక్కలకు ఉంటుందంటారు. ఆలాంటి మూగజీవులను చేరదీసి.. ఇద్దరు కొడుకులు లేరన్న లోటును తీర్చుకుంది విజయవాడకు చెందిన పాలడుగు సుజాత.
తను చేరదీసిన ఆ వీధిశునకాలు కన్నబిడ్డలకంటే ఎక్కువయ్యాయిప్పుడు. జీవితంలో ఎదురైన పెను విషాదాన్ని సైతం తుడిపేశాయవి. ఆ విషయాలనే ‘నవ్య’తో పంచుకున్నారు సుజాత..
‘‘మాది విజయవాడ. భర్త బాబూరావు వన్‌టౌన్‌లోని పాలఫ్యాక్టరీ ఉద్యోగి. నాకు చదవడం తప్ప రాయడం రాదు. అందుకనే గృహిణిగానే ఉండిపోయాను. మాకు ఇద్దరు అబ్బాయిలు. పెద్దోడు సాయితేజ బీటెక్‌ పూర్తిచేశాడు. విజయవాడలోనే ఎయిర్‌టెల్‌లో ఉద్యోగం వచ్చింది. రెండో అబ్బాయి సందీప్‌ విశాఖపట్టణంలో ఎంబీఏ చేస్తున్నాడప్పుడు. ఏ ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగిపోతున్న సమయం అది. ఒక రోజున – ఢిల్లీలోని నోకియా కంపెనీలో ఇంటర్వ్యూ ఉందని తమ్ముడిని కూడా వెంటబెట్టుకెళ్లాడు సాయితేజ. పదిహేను రోజుల తర్వాత ఒక ఫోన్‌ కాల్‌ వచ్చింది మాకు. ఆ వార్త విని కుప్పకూలిపోయాం. మా ఇద్దరు కొడుకులు అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లారని, అక్కడే లోయలో పడి చనిపోయారని తెలిసింది. కాళ్లు చేతులు ఆడలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. చెట్టంత కొడుకులు, జీవితమంతా ధారపోసి పెంచి పెద్ద చేసిన కొడుకులు.. హఠాత్తుగా మాయమైపోతే ఆ తల్లిదండ్రుల కడుపుకోత చెప్పేదేముంది? భరించిన వాళ్లకే తెలుస్తుంది ఆ బాధ! ఒక దశలో నేను పిచ్చిదాన్ని అవుతానేమోనన్నంత భయం. ఇక ఎవరి కోసం బతకాలన్నంత కుంగుబాటు. అంతా శూన్యంలా తోచేది. పిల్లలు లేని జీవితం ఇక ఎందుకు? ఏం సాధించాలని? ఎవరి కోసం బతకాలని? అనిపించేది.
అవే నా లోకం..
నా భర్తతో కలిసి కారులో వెళుతున్నప్పుడు – షడన్‌గా కారు డోర్‌ ఓపెన్‌ చేసి రోడ్డు మీద పడి చచ్చిపోవాలని చాలాసార్లు అనుకున్నాను. రెండేళ్లపాటు అవే ఆలోచనలు పట్టి పీడించాయి నన్ను. ఎవరితో మాట్లాడుతున్నా కళ్లలో నీళ్లు మెదిలేవి. అలాంటి విషాద సమయంలో ఒక రోజున – మా ఇంటి ముందు కాళ్లు ఈడ్చుకుంటూ బాధతో మూలుగుతూ ఒక శునకం కంటపడింది. దాని వెనక కాళ్లు రెండు నుజ్జు నుజ్జు అయిపోయాయి. బహుశా ఏదో వాహనం దాని మీద నుంచి వెళ్లినట్లుంది. ఆ కుక్క అవస్థను చూస్తూనే నా గుండె కరిగిపోయింది. అప్రయత్నంగానే అమాంతం వెళ్లి రెండు చేతుల్లోకి తీసుకున్నాను. అప్పుడది నా వైపు కృతజ్ఞతాభావంతో చూసిన చూపుకు మాటలు రాలేదు. అప్పటికప్పుడు ఇంట్లోకి తీసుకెళ్లి సపర్యలు చేశాను. అది కాస్త తేరుకుంది. ఇంట్లో ఎక్కడికి వెళ్లినా ఆప్యాయంగా నా వెనకే వచ్చేది. కొద్ది రోజుల్లోనే దాంతో అనుకోని బంధం ఏర్పడింది. ఆ కుక్కకు నేను పెట్టుకున్న ముద్దు పేరు శేషు. ఆ తర్వాత – మెడకు ఏదో బిగుసుకుపోయి దిక్కుతోచక పరుగులు తీస్తున్న మరో కుక్క నాకు తారసపడింది. దాన్ని అక్కున చేర్చుకుని వైద్యం చేయించాను. కొన్నాళ్లకు అది కూడా తేరుకుంది. ఈ రెండో శునకానికీ జిమ్మీ అని నామకరణం చేశా. ఆ రెండు పేర్లతో నేను పిలవగానే ఎక్కడున్నా అవి పరుగు పరుగున నా వద్దకు వచ్చి.. రెండు కాళ్లతో ఆప్యాయంగా నా మీదికి ఎగిరి.. ఎక్కడలేని ప్రేమను చూపించేవి. అలాంటిదే మరో కుక్కకు ఆశ్రయం ఇచ్చాను. ఆ మూడింటి పోషణ నాకొక వ్యాపకంగా మారిపోయింది. నాలో నాకు తెలియకుండానే.. నా ఇద్దరు కొడుకులు లేరన్న బాధ మెల్లగా తగ్గిపోవడం మొదలైంది. పిల్లల మీదున్న ఆ ప్రేమను ఈ శునకాల్లో చూసుకునేదాన్ని.
ఆసరా కావాలిప్పుడు..
విజయవాడలోనే కాళీకృష్ణ భగవాన్‌ ఆలయానికి సమీపంలోని ఓ అద్దె ఇల్లు వీటి నివాసం. నెలకు రెండువేలు అద్దె. ఒక్కొక్కటిగా తోడైన శునకాలు 34 అయ్యాయి. అవన్నీ షావుకార్లు పెంచుకున్న జాతికుక్కలు కాదు. వీధి శునకాలు. ఏ దిక్కూమొక్కులేని నిర్భాగ్య మూగజీవులు. వీధుల్లో తిరుగుతూ ఏ ప్రమాదాలకో, జబ్బులకో గురైనవి. నా బిడ్డలకంటే ఎక్కువయ్యాయి. ఇప్పుడు శునకాలే నా లోకం. వాటి ఆలనా పాలనతోనే సమయం గడిచిపోతోంది. ప్రతి రోజు ఉదయం ఆరింటికే బిస్కెట్లు తినిపించి, పాలు తాగిస్తాను. మధ్యాహ్నం మజ్జిగ అన్నం పెడితే ఆవురావురుమని తింటాయి. రాత్రికి కూడా ఏదో ఒక తిండి ఉంటుంది. ఆది, బుధవారాలప్పుడు మాత్రం మాంసాహారం అందజేస్త్తాను. శుక్రవారం నాడు మజ్జిగ అన్నానికి బదులు.. సాంబారు అన్నం వడ్డిస్తాను. ప్రతి ఆరు మాసాలకోసారి అన్ని శునకాలకు వైద్య పరీక్షలు ఉంటాయి. ఏడాదికి ఒకసారి వ్యాధినిరోధక ఇంజక్షన్లు తప్పనిసరి చేశాను. ఈ రోజుల్లో ఇద్దరు ముగ్గురున్న కుటుంబం గడవడానికే వేల రూపాయలు ఖర్చు అవుతుంది. మరి ఇన్నేసి మూగజీవులకు తిండి సమకూర్చడం ఆషామాషీ వ్యవహారం కాదు. శునకాల కోసం తీసుకున్న ఇంటి అద్దె, తిండి, వైద్యం ఇలా అన్నీ కలుపుకుంటే సుమారు నెలకు పాతికవేలు అవుతోంది. ఈ మొత్తంలో ఓ పదివేలు మాత్రం నా భర్త సమకూరుస్తున్నాడు. మిగిలిన డబ్బును నా సోదరి ముగ్గురు కూతుళ్లు తలా ఒక చేయి వేస్తున్నారు. అందరి ఔదార్యంతోనే బండి సజావుగా సాగుతున్నా.. ఈ మధ్యనే ఒక ఇబ్బంది వచ్చిపడింది. శునకాల కోసం తీసుకున్న ఇంటిని ఖాళీ చేయాల్సి వస్తోంది. వీధికుక్కల వల్ల చుట్టుపక్కల వాళ్లకు ఇబ్బందులు వస్తున్నాయని ఇల్లును ఖాళీ చేయమన్నారు. దీంతో ఈ కుక్కలన్నింటినీ ఎక్కడికి తరలించాలో అర్థం కావడం లేదు. కన్న బిడ్డల్లా చూసుకుంటున్న వీటిని ఉన్నఫలంగా నడి రోడ్డుమీద వదిలేయలేము కదా! నాకిప్పుడు కాస్త దాతల ఆసరా కావాలి. ఎవరైనా మూగజీవుల మీద ఔదార్యం చూపించే సహృదయ మానవతామూర్తుల అండ కావాలి. ప్రభుత్వం కూడా స్పందించి ఒక మార్గం చూపిస్తే అదే పదివేలు.
పాలడుగు సుజాత ఫోన్‌ : 99493 45644
‘‘మా ఇద్దరు కొడుకులు అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లారని, అక్కడే లోయలో పడి చనిపోయారని తెలిసింది. కాళ్లు చేతులు ఆడలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. చెట్టంత కొడుకులు, జీవితమంతా ధారపోసి పెంచి పెద్ద చేసిన కొడుకులు.. హఠాత్తుగా మాయమైపోతే ఆ తల్లిదండ్రుల కడుపుకోత చెప్పేదేముంది? భరించిన వాళ్లకే తెలుస్తుంది ఆ బాధ! ఒక దశలో నేను పిచ్చిదాన్ని అవుతానేమోనన్నంత భయం. ఇక ఎవరి కోసం బతకాలన్నంత కుంగుబాటు. అంతా శూన్యంలా తోచేది. పిల్లలు లేని జీవితం ఇక ఎందుకు? ఏం సాధించాలని? ఎవరి కోసం బతకాలని? అనిపించేది..
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఒకే వ్యక్తీ ఆరుమతాలు -శ్రీ అరవింద రావు

హిందూమతంలో ప్రముఖంగా ఉండే మూడు సంప్రదాయాల్ని ప్రచారం చేసిన ఆచార్యులు శ్రీ శంకరాచార్యులు, శ్రీరామానుజాచార్యులు, శ్రీమద్వాచార్యులు. వీరి పేర్లు మనలో చాలామందికి తెలుసు. చరిత్ర క్రమంలో వీరిలో మొదటివాడు ఎనిమిదవ శతాబ్దికి చెందిన శంకరాచార్యులు. ఈయన కే రళలో పుట్టాడు. కేవలం 32 సంవత్సరాలే జీవించాడు.ఆ స్వల్పకాలంలోనే దేశం నలుమూలలూ తిరిగాడు. కేరళ నుండి కాశ్మీర దేశం వెళ్లి అక్కడి పండితులతో వాదోపవాదాలు చేసి సర్వజ్ఞపీఠాన్ని ఎక్కాడు. పశ్చిమంలో ద్వారకలోనూ, తూర్పున ఉన్న పూరీ నగరంలోనూ పీఠాల్ని ఏర్పాటు చేశాడు. ఆయన రాసిన పుస్తకాలు అపారం. చాలా మూలగ్రంఽథాలపై వ్యాఖ్యలు వ్రాశాడు. ఇవన్నీ సాధారణంగా తెలిసిన విషయాలే. అయితే అతనికి షణ్మతస్థాపకాచార్యుడు – అంటే ఆరు మతాల్ని స్థాపించినవాడు అనే పేరు ఉందని చాలామందికి తెలీదు. ఒక వ్యక్తి ఆరు మతాల్ని స్థాపించడమేమిటి? ఇది ఆశ్చర్యం కలిగించే విషయమే.
మిగతా మతాల్లో లాగ హిందూమతంలో ఒక సంస్థాగత నిర్మాణం (ౌటజ్చుఽజీట్చ్టజీౌుఽ్చజూ ట్టటఠఛ్టిఠట్ఛ) లేకపోవడం వల్ల ఎవరికి వారే ఒక సంప్రదాయాన్ని ప్రారంభించి ఆచార్యులు, మహర్షులు అనుకునే ప్రమాదం ప్రాచీన కాలం నుంచీ ఉంది. పరమాత్మను ఏ విధంగానైనా ఉపాసన చేయవచ్చని ఉపనిషత్తులు కూడా స్వాతంత్య్రం ఇచ్చాయి. అందువల్ల శంకరాచార్యుల కాలంనాటికే విచ్చలవిడి సంప్రదాయాలు సమాజంలో ఏర్పడ్డాయి, శివుడు, శక్తి, సూర్యుడు, విష్ణువు మొదలగు దేవతా స్వరూపాలన్నీ వేదాల్లో చెప్పినవే. ఇవన్నీ ఒకే తత్త్వంలో వివిధ కోణాలనుంచి చూస్తే వచ్చే పేర్లు. ఇందులో భరత ఖండంలోని ఒక్కొక్క దేవుడి ఆరాధన ప్రముఖంగా ఉండేది. ఉదాహరణకు కాశ్మీరదేశంలో శివుడి ఆరాధన, బెంగాల్‌ ప్రాంతంలో విష్ణువు ఆరాధన, ఒరిస్సా ప్రాంతంలో సూర్యుడు, తమిళ ప్రాంతంలో షణ్ముఖుడు ఇలాగ. వీరిని ఉపాసన చేసే మార్గాలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ రీతుల్లో ఉండేవి. మనిషి స్వభావాన్ని బట్టి కూడా పూజా పద్ధతులు ఉంటాయి. శ్రీకృష్ణుడు దీన్నే సాత్విక, రాజస, తామస విధానాలు అని గీతలో చెబుతాడు. సాత్వికులు శ్రద్ధ, భక్తి, నియమనిష్ఠలతో పూజ చేసేవారు. రాజ గుణం ఉన్నవాళ్లు కొంత డాంబికంగా, తీవ్రమైన ఫలాకాంక్షతో పూజించేవారు. తామస ప్రవృత్తి కలవాళ్లు శాస్త్రవిరుద్ధంగా ఘోరమైన రీతిలో పూజలు చేసేవారు.
శంకరాచార్యుల కాలం నాటికి దేశంలో దాదాపు అరవై వరకూ విభిన్న సంప్రదాయాలు ఉండేవట. ఒకే దేవుణ్ని వివిధ సంప్రదాయాల్లో, వివిధ రీతుల్లో పూజించే వారట. వీటిని ముఖ్యంగా దక్షిణాచారము, వామాచారము అనే పేర్లతో రెండు తరగతులుగా చెబుతారు. ఈ పదాల్ని ఈనాటి ఉదాహరణతో బాగా అర్థం చేసుకోవచ్చు. ఒక పై ఆఫీసరు మన కార్యాలయం తనిఖీకి వచ్చినప్పుడు సంపత్సరం పాటు శ్రద్ధగా మనం చేసిన పనిని చూపించి మెప్పించడం అనేది దక్షిణాచారము. అలా కాకుండా పై ఆఫీసరుకు మద్యమాంసాదులు నైవేద్యం చేసి మంచి సర్టిఫికేట్‌ కొట్టడానికి ప్రయత్నించడం వామాచారము. దేవుడైనా, పై ఆఫీసరైనా మనిషి స్వభావం ఒకటే. అందువల్ల మనిషి మంచి ప్రవర్తన కలిగివుండి శ్రద్ధతో పూజించడం దక్షిణాచారం. శ్మశానాల్లో కూర్చుని మద్యమాంసాలు సేవిస్తూ, పూజ చేస్తున్నట్లు భావించుకోవడం వామాచారం.
శంకరాచార్యుల కాలం నాటికి ఇలాంటి వామాచారం అధికంగా ఉండేది. గణేశుడిని పూజించడంలో గణేశుడి బొమ్మపై మద్యాన్ని ఉమ్మి, గణేశుడు తన భార్యతో రతిచేస్తున్నట్లు భావిస్తూ కొద్దిమంది గడిపేవారు. ఇది ఉచ్ఛిష్టగణపతి సంప్రదాయం. కాపాలికులు అనేది మరొక సంప్రదాయం. మనుషుల పుర్రెల్ని మాలగా మెడలో వేసుకుని శ్మశానంలోని బూడిదను ఒంటికి పూసుకుని తాము జ్ఞానులమంటూ తిరిగేవారు మరికొందరు. బొటనవేలు కోసుకుని ఆ రక్తంతో సూర్యుడికి తర్పణం చేసేవారు మరొకరు. ఒంటినిండా శూలాలు గుచ్చుకుని తిరిగేవారు మరొకరు. మరికొందరు మన్మధుణ్ణి పూజించేవారు. మరికొందరు కుబేర భక్తులు. కొందరు భేతాళుణ్ణి, భూతపిశాచాల్నీ వశంలో పెట్టుకునేవారు. వీళ్లందరూ తీవ్రంగా ఉపాసన చేసేవారే. కానీ సమాజానికి సరియైున మార్గదర్శకం చేయ లేదు. ఈ రీతిగా వెర్రితలలు వేస్తున్న సమయంలో నాస్తికవాదం కూడా బలంగా ప్రచారంలోకి వచ్చింది.
శంకరాచార్యులు ఇలాంటి వామాచారాన్ని తీవ్రంగా విమర్శించారు. ఇది ఉపనిషత్తుల సంప్రదాయానికి పూర్తిగా విరుద్ధమని వాదించి అనేక దురాచారాల్ని మాన్పించారు. దేశమంతా గమనిస్తే ముఖ్యమైనవి ఆరు సంప్రదాయాలు ఉండేవి. అవి విష్ణువు, శివుడు, శక్తి, వినాయకుడు, సూర్యుడు, షణ్ముఖుడు (కుమారస్వామి) అనే దేవతారూపాలకు చెందిన సంప్రదాయాలు. శంకరాచార్యులు వీటికి సంబంధించిన దక్షిణాచారాన్ని మాత్రం సమర్థించి వీరందరిపై స్తోత్రాలు రాశారు. ఈయన స్తోత్రాలన్నీ వేదాంతపరంగా ఉంటాయి. ఆయా దేవుళ్లను కేవలం కోరికలు కోరడం కాకుండా పరబ్రహ్మ స్వరూపాలుగా వర్ణించడం, తనకు సరైన జ్ఞానం, వైరాగ్యం ఇవ్వమని కోరడం ఈయన స్తోత్రాల్లోని ప్రత్యేకత. పై ఆరు ఆచారాల్ని సమర్థించి, ఆ ఆరు రూపాలు కూడా పరమాత్మ రూపాలుగా చెప్పడం వల్ల ఇతడిని షణ్మతస్థాపకాచార్యుడు అన్నారు. ఈయన కొత్తమతాన్ని దేన్నీ స్థాపించలేదు. ఉన్నవాటి మధ్య ఘర్షణలు లేకుండా సమన్వయం చేశాడు. ఈనాటి భాషలో చెప్పాలంటే ఈయన ఒక గొప్ప సంఘసంస్కర్త.
మనం నేడు కూడా దక్షిణ భారత దేశమంతటా గమనించే పంచాయతనం అనే పద్ధతి శంకరాచార్యుల ప్రభావమే. పంచాయతనం అంటే ఐదు దేవతల్ని ఒకేచోట ఉంచి పూజించటం. ఉదాహరణకు విష్ణు దేవాలయం ఉంటే గర్భగుడిలో విష్ణుమూర్తి విగ్రహం ఉండి, ప్రాకారం నాలుగు మూలలా మిగతా నలుగురు దేవుళ్లు (శివుడు, గణపతి, శక్తి, సూర్యుడు) ఉండడం. శివుడి గుడి అంటే గర్భగుడిలో శివుడిని స్థాపించి మిగతా నాలుగు మూలలా మిగతా దేవుళ్లు ఉండడం. దేవాలయాల్లోనే కాకుండా తమ తమ ఇండ్లలో పంచాయతన పూజ చేసుకునేవాళ్లు కూడా ఇలాగే చేస్తారు. వంశపారంపర్యంగా వచ్చిన దేవతా చిహ్నాన్ని (సాలగ్రామము లేదా లింగం మొదలైనవి) మధ్యలో ఉంచి మిగతా చిహ్నాల్ని చుట్టూ ఉంచడం. వివిధ సంప్రదాయాల మధ్య శత్రుత్వం లేకుండా అందరినీ గౌరవించే సంప్రదాయం సమాజంలో స్థాపించడానికి శంకరాచార్యుల ప్రచారమే ముఖ్యకారణం. పాశ్చాత్యదేశాల్లో లాగ పరమతదూషణ మనలో లేదు. వైష్ణవులు విష్ణువే దేవుడని చెప్పినా మిగతావారిని రాక్షసులంటూ దూషించలేదు. శైవులు శివుడే దేవుడని చెప్పినా విష్ణువును రాక్షసుడని దూషించలేదు. విభిన్న సంప్రదాయాలన్నింటినీ ఉపనిషత్తుల గొడుగు కిందికి తేవడం, వాటి మధ్య సంఘర్షణలు లేకుండా చేయడం శంకరాచార్యుల గొప్పదనం.
భిన్నత్వంలో ఏకత్వం చూడటం అంటే ఇదే. ఉపనిషత్తులు ఇలాంటి ఏకత్వాన్నే బోధిస్తాయి. ఈ వాతావరణం దాదాపు 14-15 శతాబ్దాల వకకూ కొనసాగినట్లు తెలుస్తుంది. క్రమక్రమంగా ఉపనిషత్తులు, భగవద్గీత చెప్పిన బోధనలు బలహీనపడటం వల్ల శైవులు, వైష్ణవులు అనే పేరిట దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఘర్షణ జరగడం దురదృష్టకరమైన పరిణామం. మన మూల గ్రంథాల్లో చెప్పిన ఉదారమైన, శాశ్వతమైన భావాల్ని సరిగా అర్థం చేసుకోవడం, చాటిచెప్పడం ప్రపంచ శాంతికి ఒకే ఒక మార్గం.
డాక్టర్‌ కె. అరవిందరావు
రిటైర్డు డీజీపీ
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

న్యాయ భీష్ముడు ధర్మ మూర్తి జస్టిస్ కృష్ణయ్యర్ మరణం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

‘రేపు’ తీపి- జ్యోతిష్కులు వేదుల కామేశ్వరశర్మ-గొల్లపూడి మారుతీరావు-జీవన కాలమ్

‘రేపు’ తీపిగొల్లపూడి మారుతీరావు

జీవన కాలమ్

‘ఇతను ఇంతకంటే వృద్ధిలోకి వస్తాడు. రాజకీయాలలోకి వెళ్తాడు’
అన్నారు. హీరో నవ్వారు. శర్మగారు ఇప్పుడు లేరు. ఆయన మాటలు అక్షరాలా నిజమయ్యాయి. మానవ స్వభావానికి విశ్వాసం దగ్గర తోవ.
అది మతాలకు అతీతంగా మనకు తెలియని రేపు వైపు దృష్టి
సారిస్తుంది. అదే దాని రుచి. జిజ్ఞాస దాని పెట్టుబడి.

ఈ మధ్య మానవవన రుల మంత్రి స్మృతీ ఇరానీ భర్తతో కలసి నాథూలాల్ అనే జ్యోతిష్కుడితో జాత కాన్ని చూపించుకున్నారు. ఆవిడ మంత్రి అవుతారని లోగడ నాథూలాల్ చెప్పా రట. ఇప్పుడు రాష్ట్రపతి అవుతారని జోస్యం చెప్పా రు. ఇది బొత్తిగా మత ఛాందసమని పత్రికలవారు ఆమెను నిలదీశారు. ‘అది నా వ్యక్తిగత వ్యవహారం’ అన్నారు స్మృతీ ఇరానీ. ‘నాకూ జ్యోతిషం మీదా ఖగోళశాస్త్రం మీదా నమ్మకాలున్నాయి’ అంటూ మం త్రిని వెనకేసుకొచ్చారు నజ్మా హెప్తుల్లా.

‘ఆవిడ మానవ వనరుల మంత్రి. శాస్త్రీయమైన విశ్వాసాలనే ప్రోత్సహించాలి’ అన్నారు కాంగ్రెస్ నాయకులు మణిశంకర్ అయ్యర్‌గారు. వారికి గుర్తు లేని విషయమేమిటంటే జ్యోతిషం ఒక శాస్త్రంగా అంబేద్కర్ విశ్వవిద్యాలయం వంటి ఎన్నో విశ్వ విద్యాలయాలలో పాఠ్యాంశం. కాగా, అయ్యరు గారూ! వంద అనుభవాల పెట్టుబడి- విశ్వాసం. వంద సంవత్సరాల విశ్వాసాల పరిణతి -శాస్త్రం.

 మన దేశంలో చిలకలనీ, పావురాలనీ నమ్ము కొని వాటి పేరిట కలల్ని అమ్ముకుని పొట్టపోసుకునే పేవ్‌మెంట్ జ్యోతిష్కుల మధ్య, శాస్త్రీయమైన అన్వ యమూ, ప్రతిభా కల ఒక్క ప్రముఖుడిని గుర్తు పట్ట డం కష్టం. మిగతా తొమ్మిది మంది శాస్త్రాన్ని గబ్బు పట్టిస్తారు. దేశంలో తెలియని రేపుని బులిపించి డబ్బు చేసుకొనేవారెందరో. వీరంతా శాస్త్రం పేరు చెప్పి కాయలమ్ముకునే అవకాశవాదులు. రేపు గురిం చి ఎవరికెంత తెలుసో, ఆ రేపు వచ్చేవరకూ తెలి యదు. కాని వారికి లోనయ్యే లేదా నమ్మేవారి విశ్వా సం కల్మషం లేనిది. నమ్మించడంలోనే అవినీతి ఉంది. నమ్మడంలో అకుంఠితమైన విశ్వాసం మూలాలు ఉన్నాయి.

భవిష్యత్తు గురించి తు.చ. తప్పకుండా చెప్ప గల పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, ఫ్రెంచ్ జ్ఞాని నోస్టర్‌డామస్‌ల ‘కాలజ్ఞానం’ ఇప్పటికీ ప్రపంచా న్నంతటినీ ఆశ్చర్యపరుస్తోంది. పిడపర్తి దక్షిణా మూర్తిగారి జీవితచరిత్ర అద్భుత సంఘటనల మణి హారం. మిత్రుడు భమిడిపాటి రాధాకృష్ణ తన మృత్యువుకి ముహూర్తాన్ని తనే నిర్ణయించుకు న్నాడు. ముత్తుస్వామి దీక్షితార్ తన అవసానాన్ని గుర్తుపట్టి, శిష్యులను పిలిచి ‘మీన లోచన పాశమో చని కదంబ వనవాసిని’ (మీనాక్షి మేముదం దేహి’ కీర్తన – పూర్వీ కల్యాణి) అనే చరణాన్ని నెఱవల్ చెయ్యమంటూ తనువు చాలించారు. ఇది చరిత్ర. గ్రహధర్మాన్ని ఎరిగిన వారికి భవిష్యత్తు కరత లామలకం.

ఇందుకు నేనెన్నయినా ఉదాహరణలు చెప్పగ లను. పాతికేళ్ల కిందట మా నాన్నగారు విశాఖ కింగ్‌జార్జ్  ఆసుపత్రిలో చావుబతుకుల్లో ఉన్నారు- హార్ట్ అటాక్ వచ్చి, క్షయతో రెండు ఊపిరితిత్తులూ చెడి, కోమాలో. ఈ స్థితిలో మా తమ్ముడు మా కుటుంబ జ్యోతిష్కులు వేదుల కామేశ్వరశర్మగారిని కలుద్దామన్నాడు. నాన్నగారు వెళ్లిపోతున్నారనడా నికి జ్యోతిష్కుని ప్రమేయం అవసరం లేదు. అయి నా ఆశపోదు. వెళ్లాం. కామేశ్వరశర్మ గారు మా నాన్న గారి మిత్రులు. ఆయనకు కుష్టు. విషయం తెలిసి ఆయనా నివ్వెరపోయారు. దాదాపు గంటసేపు లెక్క లు వేశారు. అవతల ఆసుపత్రిలో చావుబతుకుల్లో నాన్నగారు. ఇక్కడ కాగితం మీద లెక్కలు వేస్తున్న జ్యోతిష్కుడు. ఆ క్షణంలో జ్యోతిషం మీదా, మా తమ్ముడి మీదా, ఆయన మీదా కలిగిన కోపం, అస హ్యం వర్ణనాతీతం. ఆఖరికి లెక్కలు పూర్తి చేసి తేలికగా, ‘మరేం పరవాలేదయ్యా! గండం గడిచి పోతుంది’ అన్నారు. నాకు కొట్టాలన్నంత ఆవేశం వచ్చింది. లేచి వచ్చేశాను. ఆ తర్వాత నాన్నగారు కోలుకుని, 14 ఏళ్లు జీవించి, నిద్రలో వెళ్లిపోయారు.

నేను సినీనటుడినయ్యాక ఇదే విషయాన్ని ఓ ప్రముఖ హీరోకి, హీరోయిన్‌కి చెప్పాను. వారిద్దరూ తమ జాతకాలు ఇచ్చారు. వారి పేర్లు చెప్పకుండా కామేశ్వరశర్మగారికిచ్చాను. ఆయన పరిశీలించి రెండు రోజుల తర్వాత చెప్పారు, ‘ఈ అమ్మాయి చాలా పాపులర్. త్వరలో పెళ్లవుతుంది’ అని. ఆ మాట విని హీరోయిన్ నవ్వేసింది- వేళాకోళంగా. కొన్ని నెలల లోనే ఆవిడ అమ్మ పైదేశానికి వెళ్లినప్పుడు అర్ధాం తరంగా పెళ్లి చేసేసుకుంది. ఆ పెళ్లి చాలాకాలం నిలవలేదు. అది వేరే కథ.

ఇక హీరో గురించి. ‘ఇతను ఇంతకంటే వృద్ధి లోకి వస్తాడు. రాజకీయాలలోకి వెళ్తాడు’ అన్నారు. హీరో నవ్వారు. శర్మగారు ఇప్పుడు లేరు. ఆయన మాటలు అక్షరాలా నిజమయ్యాయి.

మానవ స్వభావానికి విశ్వాసం దగ్గర తోవ. అది మతాలకు అతీతంగా మనకు తెలియని రేపు వైపు దృష్టిని సారిస్తుంది. అదే దాని రుచి. జిజ్ఞాస దాని పెట్టుబడి. విశ్వాసం ఇంధనం. అన్నిటికీ మిం చి ‘బంగారు భవిష్యత్తు’ దాని పదును.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నాన్న పాటకు నిత్య శ్రోతను ! అంటున్న కుమారుడు రత్నకుమార్

D25608368

నాన్న పాటకు నిత్య శ్రోతను !
అమృతం ఎన్నిసార్లు తాగితే తనివి తీరుతుంది? ఘంటసాల సంగీతం కూడా అంతే! మధు కలశంలో మధురమైన గీతాలను ముంచి శ్రోతలకు అందించినప్పుడు.. ఆ సంగీత దాహం ఎన్ని తరాలైనా తీరదు గాక తీరదు. ఆయన పాటల్ని ఎప్పుడు విన్నా మళ్లీ మళ్లీ వినాలన్నంత కొత్తగా ఉంటుంది.
ఆయన జ్ఞాపకాలు కూడా అంతే! ఎన్నిసార్లు స్మరించుకున్నా.. సంగీత సాగర సముద్రంలో హాయిగా విహరిస్తున్నట్లు అనిపిస్తుంది. నేడు ఘంటసాల జయంతి సందర్భంగా ఆయన కొడుకు ఘంటసాల రత్నకుమార్‌ను కలిసింది ‘నవ్య’.
‘‘ఘంటసాల అంటే శ్రోతలకు మహాగాయకుడు. నాకు తండ్రి, సంగీతవిద్వాంసుడు, మహానాయకుడు కూడా! మూర్తీభవించిన మానవత్వం ఆయనది. అందుకే అప్పటికీ, ఎప్పటికీ నాన్నే నా హీరో. నేను పీయూసీ చదివే రోజుల్లో చనిపోయారాయన. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాన్నను తలుచుకోని రోజు లేదు. ఆయన్ని స్మరించుకున్న తరువాతే ఏ పని అయినా ప్రారంభమవుతుంది. ప్రస్తుతం నేను డబ్బింగ్‌ ఆర్టిస్టుగా నిలదొక్కుకున్నానంటే – అది నాన్నగారి పుణ్యమే. ఘంటసాలగారి నుంచి సంక్రమించిన భాష, గాత్రం, సంస్కారం వల్లనే అది సాధ్యం అయింది. ఏ అర్థాన్ని, ఏ భావాన్ని ఎలా వాడాలో నాన్న నుంచే నేర్చుకున్నాను. డబ్బింగ్‌ ఆర్టిస్టుగా పేరుతెచ్చుకున్నాను. అయితే – నేను సినిమాల్లోకి రావడం నాన్నకు ఇష్టం లేదు. ఉన్నత చదువులు చదివి పెద్ద ఉద్యోగం చేసి, గౌరవనీయమైన స్థానానికి వెళ్లాలన్నది ఆయన కోరిక. అయినా సరే సంగీతం మీదున్న మమకారంతో ఆయనే నాకు ఆ విద్య నేర్పించారు. మొదట్లో నేనంత ఉత్సాహం చూపేవాడ్ని కాదు. మా అన్నయ్యకు సంగీతమంటే ఆసక్తి ఎక్కువ. అందుకే అతడిని సినిమా రంగంలో కొనసాగమన్నారు నాన్న. అన్నయ్య సుమారు ఇరవైకి పైగా వాయిద్యాలను పలికించేవారు. నాన్న సంగీత దర్శకత్వం చేపట్టిన సినిమాలకు అన్నయ్య పని చేశారు. అతను తమిళనాడు సంగీత కళాశాలలో కర్నాటక సంగీతంలో విద్వాన్‌ పట్టా అందుకోవడం విశేషం. అప్పట్లో అన్నయ్య పియానో అద్భుతంగా వాయించేవారు. నాన్నగారు పాడిన భగవద్గీతకు అన్నయ్య కీ బోర్డు ప్లేయర్‌. దురదృష్టం కొద్దీ అన్నయ్య అర్ధాయుష్షుతోనే తనువు చాలించడం విషాదం.
ఇసుకమీద చాప పరుచుకుని..
నాన్నగారితో మధురమైన జ్ఞాపకం మద్రాసులోని మెరీనా బీచ్‌కు వెళ్లడం. ఆయన విలాసవంతమైన ఆడంబరాలకు దూరంగా ఉండేవారు. అందుకనే – ఎప్పుడు ఖాళీ దొరికినా అందర్నీ మెరీనాబీచ్‌కు తీసుకెళ్లడం అలవాటు. అక్కడ ఇసుకతిన్నెల మీద చాప పరుచుకుని హాయిగా పడుకునేవారు. మేమంతా ఆయన చుట్టూ చేరి అల్లరి చేసేవాళ్లం. ఇంట్లో కూడా అంతే! మ్యూజిక్‌ కంపోజింగ్‌ జరుగుతున్నా పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ ఆడుకునేవాళ్లం. పిల్లల అల్లరికి ఏమాత్రం ఇబ్బంది పడేవారు కాదు నాన్న. పల్లెత్తు మాట అని ఎరగం. కోపం కూడా చాలా తక్కువ. పిల్లల గురించి ఎవరు ఫిర్యాదు చేసినా పెద్ద మనసుతో నవ్వి ఊరుకునేవారు. ఇక చదువు సంగతికొస్తే ఫలానా కోర్సు చేయండని, ఫలానాదే చదవండని కాని చెప్పేవారు కాదు. ‘‘పిల్లలకు ఏం కావాలో వాళ్లే నిర్ణయించుకుంటారు’’ అనేవారు తప్ప జోక్యం చేసుకునేవారే కాదు. అప్పుడప్పుడు నేను రికార్డింగ్‌ థియేటర్‌కు వెళ్లేవాడ్ని. అంతకుమునుపే ఇంట్లో రిహార్సల్స్‌ను వినడం వల్ల సగం పాట వచ్చేది. ఆటల్లో ఉన్నాసరే, నాన్నగారి పాటలు పిల్లలందర్నీ అంతగా ఆకట్టుకునేవి. అయితే సంగీతం పట్ల ముందు తరాల వారి అభిరుచి ఏవిధంగా ఉండేదో నాన్న అంచనా వేసేవారట. అప్పుడప్పుడు అమ్మతో ‘‘నా తదనంతరం నా పాటల్ని నా పిల్లలు వింటారంటావా?’’ అనేవారట. ఆ విషయాన్ని మాతో చాలాసార్లు చెప్పింది అమ్మ. ఈ తరం సంగతి ఎలాఉందో కాని మా వరకు నాన్న పాటల్ని వినని రోజు ఉండదు. ఆయన పాటలు వినడంతోనే రోజు మొదలవుతుంది. ముగుస్తుంది. నాన్న పాట వినందే నిద్ర కూడా పట్టదు.
కులమతాలకు దూరం..
నాన్నకు కుల, మత పట్టింపుల్లేవు. మాది సో్త్రత్రియ బ్రాహ్మణ కుటుంబం. 1950 దశకం నాటి పరిస్థితులు ఏవిధంగా ఉండేవో అందరికీ తెలుసు. ఇవేవీ పట్టించుకునేవారు కాదు ఆయన. చాలా సందర్భాల్లో హరిజనులతో కలిసి సహపంక్తి భోజనాలను చేసేవారు. ఒక రోజున గుర్రం జాషువాగారు మా ఇంటికి వచ్చారు. నాన్నగారు ఇంట్లో నుంచి ఎదురెళ్లి ఆయనకు స్వాగతం చెబుతూ ఇంట్లోకి వెళ్లారట. జాషువాగారు వెనకే వస్తున్నారనుకుని ఇంట్లోకి వెళ్లిపోయారు నాన్న. వెనక్కి తిరిగి చూస్తే జాషువాగారు ఇంటి బయటే నిల్చుండిపోయారు. ‘‘అయ్యో, జాషువాగారూ.. ఎందుకు బయటే నిల్చుండిపోయారు?’’ అన్నారు నాన్న. ‘‘మీరు బ్రాహ్మణులు కదా! ఇంట్లోకి రావచ్చో.. లేదో’’ అని చెప్పారట ఆ మహాకవి. ఆ మాటలు విన్న నాన్న దగ్గరికి వెళ్లి ఆప్యాయంగా చేయిపట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్లడం జరిగింది. ఇద్దరు కలిసి భోజనాలు చేశారప్పుడు.
హిందుస్తానీ సంగీత విద్వాంసుడు బడేగులాం అలీఖాన్‌ ఎప్పుడు చెన్నై వచ్చినా మా ఇల్లే ఆతిథ్యం. నాటి సంగీతకారులంతా ఆయన శిష్యులే! నాన్నగారిని దక్షిణ భారతీయ శిష్యుడని అలీఖాన్‌ చెప్పేవారు. మా ఇంటికి వచ్చినప్పుడు భోంచేయమని అమ్మ అడిగితే ‘‘వద్దమ్మా, మీరు బ్రాహ్మణులు కదా’’ అనేవారాయన. మా ఇంటి పైభాగంలోనే ఆయన వంట చేసుకునేవారు. ఒక్క రోజు మాత్రం మాతోనే భోంచేసేవారు.
సంకల్పబలం నిజమైంది..
అప్పటికే లాతామంగేష్కర్‌ భగవద్గీత బాగా పాపులర్‌ అయ్యింది. వాటిని నాన్నగారు విన్నారు. ఆవిడ సంస్కృత శ్లోకాలు చెబితే వాటికి ఆంగ్లంలో వాఖ్యానం వినిపించేవారు. అందుకే అది సామాన్యులకు, పామరులకు అందుబాటులో లేదన్నది నాన్నగారి భావన. ఆ లోటును పూడ్చేందుకు ఆయనే తెలుగు భగవద్గీతను పాడాలని నిర్ణయించారు. ఆ మహత్‌కార్యాన్ని 1973లో పూర్తి చేశారు. రికార్డు అయిన తర్వాత శ్రోతలు ఎలా స్వీకరిస్తారోనని మదనపడ్డారు. దురదృష్టం ఏంటంటే – ఆ రికార్డులు విడుదల కాకముందే నాన్నగారు మాకు దూరం అయ్యారు. ‘‘భగవద్గీత తరువాత సినిమా పాటలు పాడను’’ అని ఆయన ఏ క్షణాన ప్రతిన పూనారో తెలియదు కాని.. అదే నిజం అయ్యింది. అది ఆయన సంకల్పబలానికి నిదర్శనం.
‘‘ఇప్పుడు ఎంత మంది కొత్త గాయకులను ప్రోత్సహిస్తున్నారో నాకు తెలియదు కాని.. ఆ రోజుల్లో కొత్త వాళ్లకు బోలెడన్ని అవకాశాలు ఇచ్చారు నాన్న. ‘మాయాబజార్‌’లో ‘వివాహ భోజనంబు…’ పాటను కావాలనుకుంటే తనే పాడేవారు. కాని పాడలేదు. మాధవపెద్దిగారిచేత పాడించాలన్నది ఆయన ఆలోచనే! పిఠాపురం నాగేశ్వరరావు, పీబీ శ్రీనివాస్‌, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వంటి వాళ్లను ఎంతో ప్రోత్సహించారు’’
‘‘మనిషి ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో చెప్పేది భగవద్గీత. అలాంటిది మనిషి చనిపోయినప్పుడు భగవద్గీతను వినిపిస్తున్నారు. దాని వల్ల ఏమిటి ఫలితం..? అలా చేయడం నాన్నగారికి గౌరవం ఇచ్చినట్లు కాదు.’’
ఆఫీసుల్లో పనిచేసే బాయ్‌లను చూసినా ఆయన కనబరిచే ఆప్యాయత మాటల్లో చెప్పలేము. ఒకసారి స్టూడియోలో కాఫీ, టీలు తీసుకొచ్చే బాయ్‌ హఠాత్తుగా కనిపించలేదు. ‘‘ఆ కుర్రాడు ఏమయ్యాడయ్యా’’ అనడిగితే ‘‘రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు’’ అన్నారు. ఆ బాయ్‌ని గుర్తుచేసుకుంటూ.. ‘‘బహుదూరపు బాటసారి, ఇటు రా ఒక్కసారి…’’ అనే పాట రాశారు. ఆ పాట అప్పట్లో సూపర్‌హిట్‌.
ఈ రోజుల్లో ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు చిత్రసీమ ఏ విధంగా స్పందిస్తున్నదో.. ఆ రోజుల్లోనే నాన్నగారు కూడా కొన్ని కార్యక్రమాలు నిర్వహించి కొంత మొత్తాన్ని పోగు చేసి.. ప్రభుత్వాలకు అందివ్వడం చాలామందికి స్ఫూర్తినిచ్చింది.
గొంతు కేన్సర్‌తో నాన్న చనిపోయారన్న ప్రచారం జరిగింది. అందులో వాస్తవం లేదు. వైద్యానికి సంబంధించి ఎవరు ఏది చెప్పినా వెంటనే నమ్మే అలవాటు నాన్నది. ఆయనకు కేన్సర్‌ లేదు. హృద్రోగంతో చనిపోయారు. కొంతమందిని నమ్మి సరైన వైద్యం చేయించుకోకపోవడం వల్ల గొంతు పోయింది.
ఘంటసాలను తెలుగు సమాజం ఎన్నటికీ మరిచిపోదు. అమెరికాలో స్టాంపు విడుదల చేశారు. మన దగ్గర ఆయనవి పాతిక విగ్రహాలు వెలిశాయి. వర్ధంతులు, జయంతులు ఘనంగా చేస్తున్నారు. పాటలు వింటున్నారు. ఇంతకంటే ఏం కావాలి?
విజయవాడలోని సంగీత కళాశాల నాన్నపేరు మీదనే ఉంది. అక్కడే మ్యూజియం ఏర్పాటు చేయాలన్నది నా చిరకాలవాంఛ. మ్యూజియంలో నాన్నగారి వస్తువులన్నీ పెడితే బావుంటుంది. చివరగా ఆయన వేసుకున్న చెప్పులు, కళ్లజోడు, జుబ్బా, ఇతర వస్తువులన్నీ ఇస్తాను. నా వద్ద మూడు వేల పాటల రికార్డులు ఉన్నాయి. వాటిని కూడా మ్యూజియం కోసం అందజేస్తాను.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కళ పై ఆల్బర్ట్ కాము భావనలు -నా వ్యాసం -తెలుగు విద్యార్ధి- అక్టోబర్

kamus 001

Posted in రచనలు | Tagged | Leave a comment

సరసభారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు 74 వ సమావేశం – దర్శనీయ దైవ క్షేత్రాలు గ్రంధా విష్కరణ సభ – ఆహ్వానం

సరసభారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు

74 వ సమావేశం –  దర్శనీయ దైవ క్షేత్రాలు గ్రంధా విష్కరణ సభ – ఆహ్వానం

తేది ,సమయం -10-1-2015-ఆదివారం –సాయంత్రం -5 గం .లకు

వేదిక –శ్రీ సువర్చలాం జనేయ స్వామి దేవాలయం-మహితమందిరం(రావి చెట్టు బజారు ) –ఉయ్యూరు

కార్యక్రమం

సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవం సందర్భం గా –సా 5గం నుండి –శ్రీ పి .ఇంద్రకీలాద్రి శర్మ (ఏ గ్రేడ్ రేడియో ఆర్టిస్ట్ ) గారి బృందం చే సంగీత కచేరి

సాయంత్రం -6గం నుండి –-శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి 80వ జన్మ దినోత్సవ సందర్భం గా- ‘’దర్శనీయ           దైవ క్షేత్రాలు ‘’గ్రంధావిష్కరణ  మహోత్సవం

సభా ధ్యక్షులు –శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్  –సరసభారతి అధ్యక్షులు ,మరియు గ్రంధ కర్త

ముఖ్య అతిధి మరియు గ్రంధా విష్కర్త –శ్రీ జలదంకి ప్రభాకర్ –‘’నది’’ మాస పత్రిక సంపాదకులు

గౌరవ అతిధి –శ్రీ బొండాడ రామ మోహన రావు (రాం పండు)-ఉపాధ్యక్షులు -అఖిల భారత శ్రీ వాసవి ట్రస్ట్ –పెనుగొండ

గ్రంధం  అంకితం అందుకొనే వారు  –కపట మెరుగని సౌజన్య సౌశీల్య మూర్తి –శ్రీ కోగంటి సుబ్బారావు గారు

గ్రంధ ప్రాయోజకులు (స్పాన్సర్)-శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు –అమెరికా-

సభా ప్రారంభం –శ్రీమతి జోశ్యుల  శ్యామలాదేవి  -సరసభారతి ,గౌరవాధ్యక్షులు

ఆత్మీయ అతిధులు –శ్రీ చలపాక ప్రకాష్-రమ్య భారతి ,సంపాదకులు

శ్రీ రామినేని భాస్కరేంద్ర రావు ,శ్రీమతి శ్రీదేవి

శ్రీ కోగంటి శివప్రసాద్ ,శ్రీమతి పుష్పలత

మొదలైన కోగంటి వారి బంధు, మిత్ర వర్గం

పూర్తీ వివరాలతో త్వరలో ఆహ్వాన పత్రిక ను అంద జేస్తాం

జోశ్యుల శ్యామలా దేవి –మాదిరాజు శివ లక్ష్మి –గబ్బిట వెంకట రమణ – సాంకేతిక నిపుణులు

గౌరవాధ్యక్షులు            కార్య దర్శి               కోశాధికారి                వీరమాచనేని బాల గంగాధర రావు

గబ్బిట దుర్గాప్రసాద్

సరసభారతి అధ్యక్షులు

సాహిత్య  సాంస్కృతిక  సంస్థ –ఉయ్యూరు

9989066375,08676-232797,

తెలుగులో మాట్లాడటం మన జన్మహక్కు

 

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

వితంతు సమస్యల నవలా రచయిత్రి – నిరుపమా దేవి

 

వితంతు సమస్యల నవలా రచయిత్రి – నిరుపమా దేవి

బెంగాల్ లో సంపన్న కుటుంబం లో 1883లోమే నెల ఏడవ తేదీన బెహ్రంపూర్ లో జన్మించింది .తండ్రి నఫార్ చంద్ర భట్ట ఆలిపూర్ కోర్టు లో సబ్ జడ్జి గా పని చేశాడు .బాల్యం లో నే వివాహం జరిగి పదిహేనవ ఏటనే భర్తను కోల్పోయి భాగల్పూర్ లో ఉన్న తలి దండ్రులను చేరింది .ఈ సమయం లో ఆమెకు అనురూపా దేవి అనే ప్రసిద్ధ రచయిత్రి తో పరిచయం కలిగి జీవితాంతం ఈ మైత్రిని కొన సాగించింది .పవిత్రం గా వితంతు జీవితాన్ని గడుపుతూ కవిత్వం రాయటం ప్రారంభించింది .శ్రీమతీదేవి అనే మారు పేరుతొ మొదట్లో రచనలు చేసింది .
భాగల్పూర్ నివాసి ప్రసిద్ధ నవలా రచయిత శరత్ చంద్ర చటర్జీ (శరత్)కేంద్రం గా ఒక సాహితీ మిత్ర బృందమేర్పడింది .తాను సాంప్రదాయక వితంతు మహిళ అయి నందువలన ఆ బృందం సమావేశాలు వెళ్ళేది కాదు ,కాని తాను రాసిన కవితలను వారికి అందులో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న తన సోదరుడి ద్వారా అంద జేసేది .ఆ కవితలను చదివిన శరత్ వాటిని మెచ్చుకునే వారు .ఇది ఆమెకు మరింత ప్రోత్సాహాన్నిచ్చేది .నిరుపమ కు గొప్ప సమర్ధకుడిగా శరత్ నిలబడ్డారని సంబర పడేది .ఆమెను వచనం లో రచన చేయమని శరత్ హితవు చెప్పాడు .వచన రచన లో మహా ప్రసిద్ధుడైన శరత్ వచనం ముందు తాను చేసే వచన రచన వెలవెలబోతుందేమో నని భయపడి మొదట సాహసించ లేక పోయింది .కాని సహరచయిత్రులైన అనురూపాదేవి ,సురూపా దేవి ప్రోద్బలం ,పట్టుదలతో ,ఒప్పించటం వలన వచన రచన కు ఒప్పుకొని ,ప్రయత్నం ప్రారంభించింది .

నిరుపమా దేవి రాసిన మొదటి వచన రచన ‘’ఉచ్చ్రంఖాల్ ‘’అనే నవల .గొప్ప సంచలనాన్ని సృష్టించి ,అందరి అభిమానాన్ని పొందింది ..’’దీదీ’’(పెద్దక్కయ్య)అనే నవల 1915రాస్తే బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది . అంతకు రెండేళ్ళ ముందు ‘’అన్నపూర్నార్ మందిర్ ‘’(అన్నపూర్ణ దేవాలయం )ను ,1919లో ‘’శ్యామాలి ‘’నవలరాసింది ఇవీ గొప్ప సంచలన విజయాలను పొందాయి .వీటిలో పాత్రలు సజీవంగా ,ఆదర్శ ప్రాయం గా ఉంటాయి .సామాజిక ద్రుష్టి ,తో రాసిన నవలలు ఇవి .దీదీలో సురోమా పాత్ర చాలా విశిష్టమైనది .సాంప్రదాయ జీవితాన్ని గడుపుతూ ,ఆధ్యాత్మిక బలాన్ని చేకూర్చుకొంటూ సమాజ హితం గా మారాలనేది ఇందులో ఉన్న ముఖ్య సిద్ధాంతం .సంఘ సంస్కరణ అనేది సహజ సిద్ధం గా రావాలని కొరుకునేది .సానుభూతి ,సహవేదన, విస్తృత లోకజ్ఞానం ,ఆత్మ గౌరవం సాధించి ,మార్పు తేవాలని అభిప్రాయ పడింది .
నిరుపమా దేవి రచనలు చేసే కాలం లో మనదేశం లో ముఖ్యంగా బెంగాల్ లో స్వదేశీ ఉద్యమం మాహోద్రుతం గా నడుస్తోంది .సామాజిక మార్పు తో సంఘం ముందడుగు వేస్తోంది .కాని నిరుపమ మాత్రం వ్యక్తీ మానసిక పరివర్తన వల్లనే మార్పు పొందాలనే విషయాలనే రచనల్లో ప్రతి బింబింప జేసింది .సామాజిక బంధాలు విచ్చిన్నం కారాదని భావించింది .ధనిక వర్గాలవారు (భద్రకులు) అందులోని హీరో అమరనాద్ ను బాగా అభిమానించారు . అతనిలాగానే వారూ పల్లెలను వదిలి పట్నాలకు చేరి రాజీయ శూన్యం లో బతుకుతున్నారు .సరోమా అనే వ్యక్తిత్వం ధైర్యం ఆధునిక భావాలు ,ఉన్న మహిళను తీర్చి దిద్దిన తీరు ప్రశంసనీయం గా ఉంది .ఈ పాత్ర శరత్ సృస్టించిన పాత్రలకు విభిన్నం గా ఉండటం గమనించాల్సిన విషయం .సురోమా స్వయం సిద్ధ గా ,స్వయం సమృద్ధితో తనకాళ్ళ పై నిలబడే మహిళగా ,సనాతన ఆచారాలను పాటిస్తూనే ముందడుగేసే ఆదర్శ మూర్తిగా అందరిని ఆకర్షిస్తుంది .ఉమ అనే బాల వితంతువును ప్రకాష్ ప్రేమిస్తున్న విషయం తెలిసి ,ఉమ ను తనతో తీర్ధ యాత్రకు తీసుకొని వెళ్లి ,ప్రకాష్ కు వేరే అమ్మాయితో పెళ్లి చేస్తుంది .సురోమా ను ప్రకాష్ ప్రేమిస్తాడుకాని ఆమె కరుదనాన్ని అర్ధం చేసుకో లేక పోతూ ఉంటాడు .ఆ కాలం లో ఉమ లాంటి బాల వితంతువు కు పునర్వివాహం నిషిద్ధం . అందుకే ఉమను అతనికి దూరం చేసింది .చాలా ఏళ్ళ తర్వాత ఏంతో ఆలోచించి అమర నాద్ ప్రేమను అంగీకరించింది సురోమ .

జీవితాలం లో తొమ్మిది నవలలు రాసింది .ముందే మనం చెప్పుకొన్న నవలలు కాక ‘’అమేయ ‘’‘’,’’బిదిల్పి’’,’’బంధు’’’’అమర్ డయరి ‘’.’’యుగాంతరేర్ కధ ‘’,’’అనుకర్ష’’ నవలలు రాసింది .ఏ నవలల రాసినా అందులో కుటుంబ నేపధ్యం ఉంటుంది .భారత స్వాతంత్ర్య స్వదేశీ ఉద్యమ సమయం లో ఎన్నో దేశ భక్తీ గేయాలు ,కవితలు ప్రోబోధ గీతాలు రాసి దేశ భక్తిని రగుల్కొల్పింది .అవన్నీ వివిధ పత్రిక లలో ప్రచురితమైనాయి .1938లో ‘’భువన మోహిని స్వర్ణ పతక ‘’పురస్కారాన్ని నిరుపమా దేవి పొందింది .1943లో ‘’జగత్తారిణి బంగారు పతకాన్ని ‘’సాహిత్య సేవకు కలకత్తా యూని వర్సిటి నుండి అందుకొన్నది .జీవిత చరమాంకం లో వైష్ణవ భక్తురాలి గా మారి శ్రీ కృష్ణ దివ్య క్షేత్రమైన బృందావనం లో ప్రశాంత జీవితాన్ని గడిపింది . 7-1-1951న నిరుపమా దేవి 68వ ఏట మరణించింది.

– గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Posted in రచనలు | Tagged | Leave a comment

పశ్చిమ బెంగాల్‌లో అశాంతి

పశ్చిమ బెంగాల్‌లో అశాంతి

  • -తాడేపల్లి హనుమత్ ప్రసాద్
  • 02/12/2014
TAGS:

కలకత్తా ఒకప్పుడు దేశభక్తుల నిలయం. భరతమాత దాస్య శృంఖలాలను త్రెంచేందుకు అసంఖ్యాకంగా విప్లవకారులు విజృంభించిన కర్మభూమి. ఓ అరవిందుడు, ఓ వివేకానందుడు, ఓ నేతాజీ, ఓ రామకృష్ణ పరమహంస ఇలా అనేకమంది తమ జీవన కసుమాలను దేశమాత ముందుంచారు. ‘వందేమాతరం’ నినాదామిచ్చి బంకించంద్రుడు చరితార్థుడయ్యాడు. అది భారత స్వాతంత్రోద్యమ తారకమంత్రమైంది. అలాంటి బెంగాలు స్వాతంత్య్ర సమయంలో పశ్చిమ బెంగాలు, తూర్పు బెంగాలుగా విడిపోయింది. పాకిస్తాన్ పరమైన ఆ తూర్పు బెంగాలు 1971లో పాకిస్తాన్‌నుంచి విడిపోయి బంగ్లాదేశ్‌గా ఏర్పడింది. ముస్లింలు అధికంగా గల ప్రాంతాలు దేశ విభజన సమయంలో మనదేశంనుంచి విడిపోయాయి.
ఇది బ్రిటిషు విభజించు పాలించు విధానానికి పరాకాష్ఠ అయితే, పాకిస్తాన్‌నుంచి బంగ్లాదేశ్ ఏర్పడడం ముస్లింలు సైతం కలిసి జీవించలేరని, ఒక జాతిగా మనలేరని, అంతఃకలహాలతో కాపురం చేయలేరన్న సత్యాన్ని స్పష్టం చేస్తోంది. 1965లో భారత్, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధానంతరం 1971లో పశ్చిమ పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్‌పై యుద్ధం ప్రకటించింది. తమ దేశ ప్రజలని కూడా చూడకుండా పశ్చిమ పాకిస్తాన్ (ఇప్పటి బంగ్లాదేశ్) ప్రజల్ని చిత్రవధలు చేసారు. ఆడపడచులను వివస్తల్రను చేసి హింసించారు. వారి కిరాతక చర్యలకు బతకలేని లక్షలాది తూర్పు పాకిస్తాన్ ప్రజలు భారతదేశానికి వచ్చి ఆశ్రయం పొందారు. వలస వచ్చేవారిని మత భేదం లేకుండా తిండి, బట్ట, ఆశ్రయం ఇచ్చి సంవత్సరానికి పైగా పోషించింది పుణ్య భారత్. ప్రపంచంలో ఏ దేశం కూడా ముందుకొచ్చి ఈ బెంగాలీలకు నిష్కృతి మార్గం చూపని రోజుల్లో భారత్ సహాయ సహకారాలనందించింది. బంగ్లాదేశ్ అవతరించింది. ఈ విశాల విశ్వంలో తమకు స్నేహపాత్రులు అనదగ్గవారు భారతదేశ ప్రజలే, తమ అత్యంత మిత్రదేశం హిందూ దేశమే అని వేనోళ్ల కీర్తించారు బంగ్లాదేశ్ పాలకులు, ప్రజలు 1972లో. కాని గత 42 ఏళ్లలో బంగ్లాదేశ్ 20 కోట్లమంది హిందువులను తన్ని భారత్‌కు తరిమేసింది. భారత్ చేసిన మేలు మరిచి మత పిచ్చితో పేట్రేగిపోయింది. శత్రు ఆస్తి చట్టం పేర, తరిమివేయబడ్డ హిందువుల భూమిని స్వాధీనం చే సుకుంది. బంగ్లాదేశ్‌లో హిందువుల కన్నీటి గాథ ఎంత చెప్పినా తక్కువే.
నేడు పశ్చిమ బెంగాలు బాంబుల తయారీ కేంద్రంగా, తీవ్రవాదుల అడ్డాగా మారి భారత్‌లో అస్థిరత్వం సృష్టించే విదేశీ కుట్ర జరుగుతోంది. బంగ్లాదేశ్ కేంద్రంగా ‘జమాత్ ఉల్ ముజహిదీన్ బంగ్లాదేశ్’ ఉగ్రవాద సంస్థ ఇందుకు తగిన ప్రణాళిక రచించి అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు నేషనల్ ఇనె్వస్టిగేషన్ ఏజెన్సీ వర్గాల దర్యాప్తులో వెల్లడైంది. అక్టోబర్ 12, 2014 నాడు పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్‌లో ఖాగ్రాగర్‌లో ఒక అద్దె ఇంట్లో జరిగిన పేలుడులో షకీల్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఇతను బంగ్లాదేశీయుడు. 7 ఏళ్లుగా భారత్‌లో ఉంటున్నాడు. పేలుడు పదార్ధాల తయారీ సమయంలో ఈ పేలుడు జరిగింది. ఆ సందర్భంగా బద్రుల్ అలమ్ మొల్లా, మరో ఇద్దరు మహిళల్ని పోలీసులు అరెస్టు చేసారు. వారి విచారణనుబట్టి వారికి బంగ్లాదేశ్‌నుంచి ఆర్థికంగా, ఇతరత్రా అన్నివిధాల సహాయం అందుతోందని తెలిసింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ ఈ ప్రాంతాన్ని సందర్శించారు. తరువాత ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిసారు. పశ్చిమ బెంగాల్‌ను ఒక ఉగ్రవాద అడ్డాగా మార్చేందుకు జరుగుతున్న కుట్ర గురించి చర్చించారు. అప్రమత్తంగా ఉండమన్నారు. మమత ముందు కేంద్రాన్ని విమర్శించారు. కేంద్రం అతి క్రియాశీలత్వం ప్రదర్శిస్తోందన్నారు. కాని విషయం లోతు మమతకు తెలియనిదా? అందరు రాజకీయ నాయకుల్లాగే ఆమె కూడా సెక్యులర్ రంగు పులుపుకున్నారు. 2011లో నాడు శివశంకర్ మీనన్ బంగ్లాదేశ్‌తో తీస్తా జలాల పంపకం గురించి చర్చిస్తే 2014కు పరిస్థితి ఇలా ఎందుకుమారిపోయింది?
‘తాకి’ పశ్చిమ బెంగాల్ ఉత్తర 24 పరగణాల జిల్లా బంగ్లాదేశ్‌తో వున్న చిట్టచివరి భారత సరిహద్దు జిల్లా. అక్కడ బంగ్లాదేశ్‌నుంచి జనం వలసలు మామూలే. జనంతోపాటు సరుకు, అన్నీ అక్రమ రవాణా అవుతాయి. నిజానికి ‘తాకి’ రమణీయమైన పర్యాటక ప్రాంతం. 2011లో విజయదశమి రోజున లక్షమంది దుర్గాదేవి నిమజ్జనోత్సవ సమయంలో యచ్చామటి నది గుండా బంగ్లాదేశ్‌నుండి అక్రమంగా చొరబడ్డారు. అక్టోబర్ 2, 2014 తరువాత ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది. కేవలం 110 మంది ముస్లిం కుటుంబాలున్న సరిహద్దు గ్రామం సయ్యద్‌పూర్‌లోకి బంగ్లాదేశ్‌నుంచి ముస్లింలు వస్తూపోతుంటారు. ఆ గ్రామ ప్రజలకు ‘చొరబాటు’కు అర్ధం తెలీదు. చేపలు పట్టుకునే నూర్ మహమ్మద్ సర్దార్ భద్రత కట్టుదిట్టం చేసినా ఈ చొరబాట్లు ఆగలేదని ఒప్పుకున్నాడు. లక్షమంది చొరబాటు గురించి అడిగితే ఆ ఏడాది దుర్గాదేవి ప్రతిమల నిమజ్జన సమయంలో ‘గందరగోళం’ నెలకొందని ఒప్పుకున్నాడు. ‘జీవనోపాధి కోసం వస్తుంటారని’ పెదవి విరిచాడు. నకిలీ పాన్ నంబర్లతో, ఐడిలతో ఇలా యదేచ్ఛగా చొరబాట్లు జరగడానికి భారత్ ధర్మ సత్రమా? ‘తాకి’ వద్ద నియక్తులైన సరిహద్దు భద్రతాదళ అధికారి శివరతన్ సింగ్, నరేంద్రమోదీ ప్రధానమంత్రి అయిన తరువాత సరిహద్దులు భద్రంగా ఉన్నాయని, చొరబాట్లు ఆగాయని ఒప్పుకున్నాడు.
బుర్ద్వాన్ పేలుళ్ల తరువాత అనుమానాస్పద వ్యక్తుల్ని, సమూహాల్ని సరిహద్దు గ్రామాల ప్రజలు గుర్తించి సరిహద్దు భద్రత దళాలకు అప్పగిస్తున్నారట. అక్రమ చొరబాటుదార్లలో చాలామంది వ్యవసాయ కూలీలుగా, నిర్మాణ కార్మికులుగా వచ్చి రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలకు విస్తరిస్తారు. బంగ్లాదేశ్‌తో ‘సరిహద్దు భూమి ఒప్పందం’ (లాండ్ బౌండరీ అగ్రిమెంట్) బిల్లు 2013 నవంబర్‌లో యుపిఎ పార్లమెంటులో ప్రవేశపెట్టబడింది. కాని ఇంతవరకు పార్లమెంట్ దాన్ని ఆమోదించలేదు. సుమారు 70 లక్షలమంది బంగ్లాదేశీయులు బంగ్లాదేశీయులు భారత్‌లో పనిచేస్తున్నారని నివేదికలు తెలియజేస్తున్నాయి. ఆ విధంగా సుమారు సంవత్సరంలో 25 కోట్ల పనిదినాలను మనం బంగ్లాదేశీయులకిస్తున్నాం! అయినా వారికి, బంగ్లాదేశ్ ప్రభుత్వనికి భారత్‌పట్ల కృతజ్ఞత లేదు.
త్రిపుర, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్ మీదుగా శిక్షణ పొందిన తీవ్రవాదులు భారత్‌లోకి చొరబడడం విషయమై భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసింది. ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీ కొత్త ప్రభుత్వం ఏర్పడిన మరుసటిరోజే చొరబాటుదార్లు పెట్టే బేడా సర్దుకోవాలని హెచ్చరించారు. బెంగాల్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా బిజెపి తమ రాజకీయ ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది. బీర్‌భూమి వంటి బిజెపి బలంగా ఉన్న ప్రాంతాలలో మమత ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడుతోంది. నిజానికి జమాత్ ఎ ఇస్లామీ వంటి సంస్థల విషయంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా ఆందోళన చెందుతోంది.బంగ్లాదేశ్ సీనియర్ మంత్రి ఈ మధ్య మీడియాతో మాట్లాడుతూ ‘1971 యుద్ధ నేరాలకు పాల్పడిన జమాత్ ఎ ఇస్లామీ నాయకులకు బంగ్లాదేశ్ కోర్టు శిక్ష విధించిందని, ఇపుడు వారు పాకిస్తాన్ మద్దతుతో భారత భూభాగం ఆసరాగా విజృంభిస్తున్నారని, భారత్ దీన్ని నిరోధించాలని’ కోరారు. 2014 ఎన్నికల తరువాత బెంగాల్ ప్రజలు క్రమంగా మమత చిత్తశుద్ధిని శంకిస్తున్నారు. 34 ఏళ్ల కమ్యూనిస్టుల కంచుకోటను పగలకొట్టి నందుకు 40 నెలల క్రితం మమతను అంతా అభినందించారు. కాని మమత కూడా కమ్యూనిస్టుల హింసా తత్వాన్ని వొంటబట్టించుకుంది. తాజాగా 2013లో మిడ్నపూర్ జిల్లాలో మతకల్లోలాలు జరిగాయి. 2014 ఎన్నికల్లో 825 హింసాత్మక సంఘటనలు జరిగాయి. బుర్ద్వాన్‌లో జరిగిన పేలుళ్ల విచారణ జరగకుండా, సాక్ష్యాలు ఏవీ ఎన్‌ఐఏకు లభించకుండా స్థానిక పోలీసులు మాయం చేయడం మమత చిత్తశుద్ధిని శంకించేలా చేసాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కూడా విచారణపై ముందు తాత్సారం చేసింది. అందులో ఎన్‌డిఏకు రాజకీయ కారణాలు ఉండి ఉండవచ్చు.
ఎన్‌ఐఎ రంగప్రవేశంతో 150 మంది జిహాదీ తీవ్రవాదుల దురాగతాలు బట్టబయలు కానున్నాయి. అస్సాం పోలీసులు అంతకు ముందే ఆరుగుర్ని అరెస్టు చేసారు. మరో 30 మందిని అనుమానితులుగా గుర్తించారు. అందులో కొన్ని మదరసాలు, స్వచ్ఛం ద సంస్థలు కూడా ఉన్నాయి. బుర్ద్వాన్ పేలుళ్లకు, పాట్నా గాంధీ మైదాన్, చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ల పేలుళ్లతో ఉన్న సామ్యాన్ని కూడ ఎన్‌ఐఎ గుర్తించింది. సిములియా మదరసాలో తీవ్రవాదుల శిక్షణ విషయం గురించి కూడా ఎన్‌ఐఏ పేర్కొంది.
ఏతావాతా తెలిసేదేమంటే, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా బాంబులు కురిసిన నేల జిహాదీ తీవ్రవాదుల బాంబులతో బెంబేలయ్యే పరిస్థితి నేడు నిర్మాణమైంది. పాలకుల ఓటు బ్యాంకురాజకీయాలు, జాతీయ సమగ్రతకు సమైక్యతకు సవాలయ్యాయి. మా, మాటి, మనుష్ నినాదంతో అధికారంలోకి వచ్చిన మమతకు మాతృభూమిని రక్షించుకునేందుకు ఇదే ఆఖరి అవకాశం. లేదా, బెంగాల్‌లో మరో వందేమాతర ఉద్యమం పురుడుపోసుకుంటుంది. 2016 ఎన్నికల్లో జాతీయ శంఖారావం మార్మోగిపోతుంది. అందులో ఉన్మాదులతోపాటు ఉపేక్షాధోరణితో ఉన్న రాజకీయం కూడా మట్టి కరవడం ఖాయం.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విజయవాడ లో అమెరికన్ కాన్సోలేట్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వితంతు సమస్యల నవలా రచయిత్రి – నిరుపమా దేవి

వితంతు సమస్యల నవలా రచయిత్రి – నిరుపమా దేవి

బెంగాల్ లో సంపన్న కుటుంబం లో 1883లోమే నెల ఏడవ తేదీన బెహ్రంపూర్ లో జన్మించింది .తండ్రి నఫార్ చంద్ర భట్ట ఆలిపూర్ కోర్టు లో సబ్ జడ్జి గా పని చేశాడు .బాల్యం లో నే వివాహం జరిగి పదిహేనవ ఏటనే భర్తను కోల్పోయి భాగల్పూర్ లో ఉన్న తలి దండ్రులను చేరింది .ఈ సమయం లో ఆమెకు అనురూపా దేవి అనే ప్రసిద్ధ రచయిత్రి తో పరిచయం కలిగి జీవితాంతం ఈ మైత్రిని కొన సాగించింది .పవిత్రం గా వితంతు జీవితాన్ని గడుపుతూ కవిత్వం రాయటం ప్రారంభించింది .శ్రీమతీదేవి అనే మారు పేరుతొ మొదట్లో రచనలు చేసింది .
భాగల్పూర్ నివాసి ప్రసిద్ధ నవలా రచయిత శరత్ చంద్ర చటర్జీ (శరత్)కేంద్రం గా ఒక సాహితీ మిత్ర బృందమేర్పడింది .తాను సాంప్రదాయక వితంతు మహిళ అయి నందువలన ఆ బృందం సమావేశాలు వెళ్ళేది కాదు ,కాని తాను రాసిన కవితలను వారికి అందులో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న తన సోదరుడి ద్వారా అంద జేసేది .ఆ కవితలను చదివిన శరత్ వాటిని మెచ్చుకునే వారు .ఇది ఆమెకు మరింత ప్రోత్సాహాన్నిచ్చేది .నిరుపమ కు గొప్ప సమర్ధకుడిగా శరత్ నిలబడ్డారని సంబర పడేది .ఆమెను వచనం లో రచన చేయమని శరత్ హితవు చెప్పాడు .వచన రచన లో మహా ప్రసిద్ధుడైన శరత్ వచనం ముందు తాను చేసే వచన రచన వెలవెలబోతుందేమో నని భయపడి మొదట సాహసించ లేక పోయింది .కాని సహరచయిత్రులైన అనురూపాదేవి ,సురూపా దేవి ప్రోద్బలం ,పట్టుదలతో ,ఒప్పించటం వలన వచన రచన కు ఒప్పుకొని ,ప్రయత్నం ప్రారంభించింది .

నిరుపమా దేవి రాసిన మొదటి వచన రచన ‘’ఉచ్చ్రంఖాల్ ‘’అనే నవల .గొప్ప సంచలనాన్ని సృష్టించి ,అందరి అభిమానాన్ని పొందింది ..’’దీదీ’’(పెద్దక్కయ్య)అనే నవల 1915రాస్తే బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది . అంతకు రెండేళ్ళ ముందు ‘’అన్నపూర్నార్ మందిర్ ‘’(అన్నపూర్ణ దేవాలయం )ను ,1919లో ‘’శ్యామాలి ‘’నవలరాసింది ఇవీ గొప్ప సంచలన విజయాలను పొందాయి .వీటిలో పాత్రలు సజీవంగా ,ఆదర్శ ప్రాయం గా ఉంటాయి .సామాజిక ద్రుష్టి ,తో రాసిన నవలలు ఇవి .దీదీలో సురోమా పాత్ర చాలా విశిష్టమైనది .సాంప్రదాయ జీవితాన్ని గడుపుతూ ,ఆధ్యాత్మిక బలాన్ని చేకూర్చుకొంటూ సమాజ హితం గా మారాలనేది ఇందులో ఉన్న ముఖ్య సిద్ధాంతం .సంఘ సంస్కరణ అనేది సహజ సిద్ధం గా రావాలని కొరుకునేది .సానుభూతి ,సహవేదన, విస్తృత లోకజ్ఞానం ,ఆత్మ గౌరవం సాధించి ,మార్పు తేవాలని అభిప్రాయ పడింది .
నిరుపమా దేవి రచనలు చేసే కాలం లో మనదేశం లో ముఖ్యంగా బెంగాల్ లో స్వదేశీ ఉద్యమం మాహోద్రుతం గా నడుస్తోంది .సామాజిక మార్పు తో సంఘం ముందడుగు వేస్తోంది .కాని నిరుపమ మాత్రం వ్యక్తీ మానసిక పరివర్తన వల్లనే మార్పు పొందాలనే విషయాలనే రచనల్లో ప్రతి బింబింప జేసింది .సామాజిక బంధాలు విచ్చిన్నం కారాదని భావించింది .ధనిక వర్గాలవారు (భద్రకులు) అందులోని హీరో అమరనాద్ ను బాగా అభిమానించారు . అతనిలాగానే వారూ పల్లెలను వదిలి పట్నాలకు చేరి రాజీయ శూన్యం లో బతుకుతున్నారు .సరోమా అనే వ్యక్తిత్వం ధైర్యం ఆధునిక భావాలు ,ఉన్న మహిళను తీర్చి దిద్దిన తీరు ప్రశంసనీయం గా ఉంది .ఈ పాత్ర శరత్ సృస్టించిన పాత్రలకు విభిన్నం గా ఉండటం గమనించాల్సిన విషయం .సురోమా స్వయం సిద్ధ గా ,స్వయం సమృద్ధితో తనకాళ్ళ పై నిలబడే మహిళగా ,సనాతన ఆచారాలను పాటిస్తూనే ముందడుగేసే ఆదర్శ మూర్తిగా అందరిని ఆకర్షిస్తుంది .ఉమ అనే బాల వితంతువును ప్రకాష్ ప్రేమిస్తున్న విషయం తెలిసి ,ఉమ ను తనతో తీర్ధ యాత్రకు తీసుకొని వెళ్లి ,ప్రకాష్ కు వేరే అమ్మాయితో పెళ్లి చేస్తుంది .సురోమా ను ప్రకాష్ ప్రేమిస్తాడుకాని ఆమె కరుదనాన్ని అర్ధం చేసుకో లేక పోతూ ఉంటాడు .ఆ కాలం లో ఉమ లాంటి బాల వితంతువు కు పునర్వివాహం నిషిద్ధం . అందుకే ఉమను అతనికి దూరం చేసింది .చాలా ఏళ్ళ తర్వాత ఏంతో ఆలోచించి అమర నాద్ ప్రేమను అంగీకరించింది సురోమ .

జీవితాలం లో తొమ్మిది నవలలు రాసింది .ముందే మనం చెప్పుకొన్న నవలలు కాక ‘’అమేయ ‘’‘’,’’బిదిల్పి’’,’’బంధు’’’’అమర్ డయరి ‘’.’’యుగాంతరేర్ కధ ‘’,’’అనుకర్ష’’ నవలలు రాసింది .ఏ నవలల రాసినా అందులో కుటుంబ నేపధ్యం ఉంటుంది .భారత స్వాతంత్ర్య స్వదేశీ ఉద్యమ సమయం లో ఎన్నో దేశ భక్తీ గేయాలు ,కవితలు ప్రోబోధ గీతాలు రాసి దేశ భక్తిని రగుల్కొల్పింది .అవన్నీ వివిధ పత్రిక లలో ప్రచురితమైనాయి .1938లో ‘’భువన మోహిని స్వర్ణ పతక ‘’పురస్కారాన్ని నిరుపమా దేవి పొందింది .1943లో ‘’జగత్తారిణి బంగారు పతకాన్ని ‘’సాహిత్య సేవకు కలకత్తా యూని వర్సిటి నుండి అందుకొన్నది .జీవిత చరమాంకం లో వైష్ణవ భక్తురాలి గా మారి శ్రీ కృష్ణ దివ్య క్షేత్రమైన బృందావనం లో ప్రశాంత జీవితాన్ని గడిపింది . 7-1-1951న నిరుపమా దేవి 68వ ఏట మరణించింది.

– గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

– See more at: http://vihanga.com/?p=13318#sthash.k0U6nG0v.dpuf

Posted in రచనలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -71-

గీర్వాణ కవుల కవితా  గీర్వాణం -71-

109-  స్వాతంత్ర్య సమరయోధ కవి పండితులు- శ్రీ జటావల్లభుల పురుషోత్తం

బాల్యం –విద్య –ఉద్యోగం

తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయ పురం నివాసి  జటావల్లభుల కృష్ణ సోమయాజులు మహా లక్ష్మమ్మ దంపతులకు జటావల్లభుల పురుషోత్తం గారు 17-2-1906లో మాతామహుని ఇంట నడవ పల్లి లో జన్మించారు .మహా పండిత ప్రకాండుడైన పుల్య ఉమా  మహేశ్వర శాస్త్రి గారి వద్ద ముంగండ అగ్రహారం లో సంసృతం నేర్చారు .విజయ నగరం మహా రాజా కళాశాలలో చేరి ఇంగ్లీష్ లో బి .ఏ .డిగ్రీ పొందారు .పిఠాపురం మహా రాజా కాలేజిలో ట్యూటర్ గా చేరి కొంతకాలం పని చేశారు .పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు  ఆంధ్ర గీర్వాణ విద్యా పీఠంలో ప్రిన్సిపాల్ అయ్యారు .ఆ  విద్యా సంస్థ కార్య దర్శి వల్లూరి సూర్య నారాయణ రావు గారి కోరిక పై  ‘’స్మృతి కాలం స్త్రీలు’’,’’వేదకాలపు స్త్రీలు ‘’అనే రెండు పరి శోధనాత్మక గ్రంధాలు రాశారు  .

కొవ్వూరు లో పని చేస్తున్నప్పుడే మద్రాస్ యూని వర్సిటి నుండి సంస్కృతం లోను తెలుగు లోను ఏం ఏ .పట్టా పొందారు .1948లో పదవికి  రాజీ నామా చేసి విజయవాడ ఎస్. ఆర్. .ఆర్ అండ్ సి .వి .ఆర్ .ప్రభుత్వ కళాశాలలో సంస్కృత శాహాధ్యక్షులుగాచేరి 1961వరకు పదమూడు సంవత్సరాలు   సేవలందించారు .మళ్ళీ కొవ్వూరు గీర్వాణ విద్యా పీఠంలో సంస్కృత శాహాధ్యక్షులై ,తారవాత కాకినాడ పిఠాపురం రాజ వారకాలేజికి బదిలీ  అయి  1966ఉద్యోగ విరమణ చేశారు .1956-60 వరకు నేను విజయవాడ ఎస్ ఆర్ ఆర్ ప్రభుత్వ కాలేజిలో ఇంటర్ ,డిగ్రీ లు చదువుతుండగా శ్రీ జటావల్లభుల పురుషోత్తం గారు సంస్కృత శాక్షాధ్యక్షులుగా పని చేశారు .వారిని నిత్యం చూస్తూ వారి ఉపన్యాసం వినే అదృష్టం  పొందిన వాడిని .

సంస్కృతీ సేవ

ఉద్యోగ విరమణ పిమ్మట పురుషోత్తం గారు భారతీయ సంస్కృతీ పై అభిమానాన్ని పెంచుకొని అందులోని ప్రతి అంశాన్ని క్షుణ్ణం గా అధ్యయనం చేసి అపూర్వ గ్రంధ రచన చేశారు .వేదాలు ,ధర్మ శాస్త్రాలు ఇతిహాస పురాణాలు మొదలైన వాటిలో ప్రతి విషయం పై  ‘’హిందూ మతం ‘’,’’భారతీయ విజ్ఞానం ‘’,’’ధర్మ మంజరి ‘’,భారతీయ వైభవం ‘’,ఆధ్యాత్మిక వ్యాసాలూ ‘’,’’భగవద్గీతా ప్రవేశం ‘’,’’మహా కవి సందేశం ‘’అపూర్వ పండితీగారిమతో సుబోదాం గా రాశారు .వీరిది పూర్తిగా శాస్త్రీయ ద్రుష్టి .’’చిత్ర శతకం సంస్కృతం లో  రాశారు  ‘’జగద్గురు ప్రశస్తి ‘’అనే ఆవ్యాన్ని అంచి పరమాచార్యులు శ్రీ చంద్ర శేఖర యతీంద్రుల పై సంస్కృతం లో రచించారు .చిత్ర శతకం లో అనేక అంశాల పై చమత్కారంగా సంస్కృతం లో శ్లోకాలు రాశారు .

వేసవులలో ప్రతి ఏడాది ‘’ధర్మ శాల పాఠశాల ‘’నడిపారు .అందులో సుమారు రెండు నెలలు వివిధ ధర్మ శాస్త్ర విషయాలను బోధించేవారు .పురుషోత్తం గారు స్వాతంత్ర్య పిపాసి భారత స్వాతంత్ర్యోద్యమం లో పాల్గొని ‘’క్విట్ ఇండియా ‘’ఉద్యమం లో ప్రముఖపాత్రనుపోషించారు దీనికి ఫలితం గా  అరెస్ట్ కా బడి దాదాపు ఆరు నెలలు 1-4-1943-10-11-43 వరకు కారాగార వాసం అనుభవించారు  .ఆయన ఎప్పుడూ శుద్ధ తెల్ల ఖద్దరునే ధరించేవారు ఆకు పచ కండువా వేసేవారు ధోవతి ,,లాల్చీ వేసేవారు .

గౌరవాలు –   పురస్కారాలు

 

ఆంద్ర ప్రదేశ్ భాషాభి వృద్ధి సంఘం లో ప్రభుత్వం వీరిని సభ్యులను గా నియమించి సలహాలు స్వీకరించింది .సంస్కృత భాషాభి వృద్ధి కోసం ప్రభుత్వం తీసుకోవలసిన చర్చలను ఒక నివేదిక గా రాసి ప్రభుత్వానికి అంద జేశారు .1972ఒ కాకినాడ పుర జనులు పురుషోత్తం గారికి కనీ వినీ ఎరుగని రీతిలో ఘన సన్మానం చేసి కృతజ్ఞతను తెలియ జేసి ధన్యులయ్యారు .ఆ సందర్భం గా ‘’పురుషోత్తమ దర్శనం ‘’అనే ప్రత్యెక పుస్తకం ప్రచురించారు .అరవై ఆరేళ్ళు మాత్రమె జీవించి ఈ సాహితీ జీవి పురుషోత్తం గారు 28-10-1972న ‘’పురుషోత్తమ ప్రాప్తి ‘’పొందారు .

గంగా సమానః ఖలు శుద్ధ ధర్మః
సత్ కామ ఏవం యమునోపమశ్చ
తన్మేళనం యత్ర తదేవ పూతం
క్షేత్రం ప్రయాగాస్య మహో గృహేస్తి

ధర్మం అనే గంగ ,కామం అనే యమున ,దాంపత్యమనే అంతర్వాహినియైన సరస్వతితో కలిసి త్రివేణీ సంగమమై తనరారే ప్రయాగనే భార్య అట.ఇది పురుషోత్తం గారి ఒకానొక ముక్తకం .

 

.  ప్రాచీన కాలమ్ లో ఎందరో మహానుభావులు ,కవి పండితులు ,సంస్కృత భాషా వ్యాప్తికి జవ జీవాల  నిచ్చి ,ప్రజల మధ్యకు సంస్కృతాన్ని తెచ్చారు .వారికి వందనాలు ..ఆధునిక కాలమ్ లో అమరావానికి నీరాజనం పట్టి ,సులువుగా నేర్చుకొనే దారి చూపి ,ఆ భాషోద్ధరణకు బాలలు కూడా సులభం గా నేర్చుకొనే వీలుగా సంస్కృత ప్రబోదినులను రచించి జీవిత సర్వస్వం దేవభాషా సేవనం లో కరగించిన  త్యాగధనుల్లో ఆస్థానకవి శ్రీ కాశీ కృష్ణాచార్యులు ,శ్రీ జమ్మల మడక మాధవ రామ శర్మ ,శ్రీ జటావల్లభుల పురుషోత్తం గార్లు చిరస్మరనీయులు ,ప్రాతస్మరనీయులు .వారికి ప్రత్యెక నమో వాకాలు .

ఇప్పుడు శ్రీ జటావల్లభుల పురుషోత్తం గారు వ్రాసిన కొని ముక్తకాలను మీకు పరిచయం చేస్తాను .వారు విజయ వాడ లో srr ,cvr  కళాశాలలో సంస్కృత శాఖ ఆచార్యులు గా పని చేశారు .ఇవి ఈ నాటి సాంఘిక స్థితికి ,ధర్మ చ్యుతికి అద్దం పడతాయి .మన బాధ్యతనూ బాగా గుర్తు చేస్తాయి .చమత్కారం గానూ వుంటాయి .ముందుగా సంస్కృత భాషామతల్లికి వారి శ్లోకం తోనే వందనం చేస్తాను .

”సుధా స్రవంతీ సుర భాషి తాయా –సుచ్చానా సూక్తి సురత్న వార్ధిహ్—సుకావ్య సందోహ నిదిశ్చ వాణీ —సా  సంస్క్రుతాఖ్యా ,సుకృతి కలాభ్యా ”

”   మాతాహి   భాష వితతెస్చ లోకే —మాతేవ రక్ష్య త్య పితాశ్రితాన్హి —నా మాత్రు భాషా భువి సంస్క్రు తాఖ్యా —వాచ్యః కదం మాత్రు పడేవ చాన్యాః /.”

01 -అపకారం చేసే వారికి కూడా ఉపకారం చేస్తుందట భారత దేశం .ఆమె ఉదాత్త బుద్ధి ,ఎత్తైన హిమాలయ శిఖరమనే శిరస్సు వల్లనే తెలిసి పోతుందట

”పున్యావనే ,ద్రోహమతీ న్విదేశ్యం ——సద్గర్భ నిష్టాన్ ,ఖలుసే హిషే ,త్వం —వుచ్చైస్శిరత్వం ,తవ శూచితం ,హి —హిమాద్రి శ్రుమ్గేన మహోన్నతేన ”

02 –    ఆ పరబ్రహ్మను ప్రత్యక్షం గా చూసిన రమణ మహర్షి ,శ్రీ రామ కృష్ణ పరమహంస మున్నగు మహర్షులు ఈ భూమి మీద నే ఎందుకు పుట్టారు?అని ప్రశ్నించే వారికి సమాధానం ”నక్షత్రాలు ఆకాశం లోనే పుట్టి ఎందుకు ప్రకాశిస్తున్నాయి?”

”నాన్యస్య భూమే ర్భారతాస్య జాతాః -శ్రీ రామ కృష్ణో రమణాదయశ్చ –అత్రైవకిం ,బ్రహ్మవిదాం ,సుజన్మ –తారోదయః కిం గగనే న భూమౌ .”

03 – లోకం లో అందమైన వాటిని చూసి మానవుడు తృప్తి చెందుతాడు .కానీ స్త్రీ ని చూసి వికారం చెందటం వాడి దౌర్భాగ్యం

”ద్రుస్టాహి శోభాం ,గగనే మలే తాం —-తార గానశ్యా౦ భసి పద్మ పంక్తి ః –జనః తుస్తో స్కాత్కిమ భాగ్యమస్య —–స్త్రీ రత్న మాలోక్య వికార మేగతి ”

04 – కొత్తగా కాపురానికి వచ్చి నట్టింట్లో ఎప్పుడు తిరుగుతుందా అని వువ్విల్లూరిన అత్త గారు –కోడలు రాగానే ఆమె వ్యక్తిత్వాన్ని  సహిం చ లేదట. ఇది లోక సహజం ‘

”కదా స్నుశామే గృహవర్తినేశ్యాత్ -కదాను పుత్రస్య తయా శుఖం స్యాత్ –స్వశ్రూర్వి లపైవ మనల్ప కాలమ్ —సమాగాతాం న సహేత చిత్రం ”

05 –  -భార్య అంతే ఎవరో కాదట .ధర్మం అనే గంగా ,కామం అనే యమునా ,అంతర్వాహిని గా దామ్పత్యమనే సరస్వతి తో కలిసే ప్రయాగ త్రివేణీ సంగమమే నట

”గంగా సమానః ఖాలు శుద్ధ ధర్మః–సత్కామ ఏవం యమునోపమస్చ –తన్మేలనం యత్ర తదేవ పూతం —క్షేత్రం ప్రయాగాస్య మహో గృహేస్తి .

06 – స్త్రీ కి గౌరవం ఇవ్వాలి అనే ప్రబుద్ధుడు తన కుమార్తె వంటచేయటానికి ఒప్పు కోడు .కానీ వంటలక్క తో వండించుకొని తృప్తిగా తింటాడు .ఆమె కూడా స్త్రీ అన్న స్మృతి వాడికి వుండదు ఇదీ లోక రీతి

”చిత్రోహి వా దోస్తీ మదీయ కన్యా –మహానసే నైవ నియోజ నీయా –పూజ్యా శ్రియః స్థార్హి కధన్ను భుక్తి –ర్భ్రుత్యాహి పక్త్రీ;దకిం న సా స్త్రీ ;”

07 – ఈ రోజు మెడలోపూల  దండ వేసి ,హారతు లిచ్చి ,గౌరవించి మెచ్చి మేక తోలు కప్పు తారు .రేపే ఏదో నెపం మోపి ఆ  కంఠాన్నే  నరికేస్తారు .అందుకని కీర్తిని నమ్మ రాదు

”కన్చిత్ప్రజానే ,త్రుపదేని వేశ్య –స్వదేశ విద్రోహిని ,మా మానమతి   –కన్తేద్య నిక్షిప్యచ ,పుష్ప మాలాం —శ్వస్తీ ప్రదండం పరికల్ప ఏరన్ ”

08 -మానవుడు చిత్ర స్వభావుడు .తన కొడుకు చేసే దోషాలు తెలుసు కోడు .వాడిలో లేని మంచిగుణాలన్నీ వున్నాయని భావిస్తాడు .వాడి కోసం ఎన్నో తప్పులు చసి లోకాప వాదం పొందుతాడు .పుత్ర ప్రేమ

గుడ్డిది .గుడ్డి రాజు ద్రుత రాష్ట్రుడు దీనికి మంచి  ఉదాహరణ .

”జనో న జానాతి ,హి పుత్ర దోషాన్ —గుణాంశ్చ తస్మిన్న సతోపి పశ్యేత్ –పాపం తదర్ధం  ,బహుదా కరోతి —బలీః ,లోకే సుత మూల మోహః

 

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -1-12-14-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ ఆవుల కవితా గీర్వాణం -70

గీర్వాణ ఆవుల కవితా గీర్వాణం -70

108-ఆంద్ర ఆస్థాన కవి –శ్రీ కాశీ కృష్ణార్యుల వారు

బందరు జననం  –గుంటూరు నివాసం

1872లో శ్రీ కాశీ కృష్ణా చార్యుల వారు కృష్ణా జిల్లా మచిలీపట్నం లో జన్మించారు .భారద్వాజస గోత్రీకులు .తండ్రి లక్ష్మణాచార్యులు ,తల్లి అక్కి పిచ్చమాంబ .గుంటూరులోని శ్రీ రామ చంద్రాపురం అగ్రహారం వారైనశ్రీ కాశీ కృష్ణమాంబ ,వేద వ్యాస దంపతులు కృష్ణాచార్యుల వారిని దత్తత తీసుకొన్నారు .

బహుముఖీన పాండిత్యం

.గుంటూరులో అధరాపురపు శ్రీనివాసాచార్యుల వద్ద సాహిత్యాధ్యనం చేశారు .తరువాత నడిచి విజయనగరం చేరి మహిశూర భీమా చార్యుల దగ్గర తర్కాన్ని అభ్యసించారు .పేరి వెంకట శాస్త్రి గారి నుండి పాణినీయ వ్యారణం నేర్చారు .అక్కడ నుండి గోదావరీ తీరం చేరి కాకర పర్తి  నివాసి గుమ్ములూరి సంగమేశ్వర శాస్త్రి గారి దగ్గర తర్క శాస్త్రానికి మెరుగులు దిద్దుకొని ,ఆనాటి మహా మహులైన తార్కిక శిరోమణులతో సరి సమాన పాండిత్యాన్ని పొందారు .వేదాంత శాస్త్ర అంతాన్ని చూశారు .సంగీతం లో ప్రవేశించి నిధి అనిపించుకొన్నారు .వీణా వేణు ,వాయులీన ,మ్రుదంగ జంత్ర వాద్యాలలో  నిష్ణాతుడయ్యారు .ఇవే కాక కుమ్మరి, కమ్మరి, నేత ,వడ్రంగం పనులలోను అధిక ప్రావీణ్యం సాధించి తనకు రాని  విద్య లేనే లేదు అనిపించారు .విజయ నగరం లో సకల కళా ప్రపూర్ణులు అయ్యారు .

వివాహం –సంతానం –ఉద్యోగం

కృష్ణాచార్యుల వారికి పదకొండేళ్ళ వయసు లోనే శ్రీ మతి కుంభారిలక్ష్మీ నరసాంబ తో వివాహం జరిగింది .ఒక కుమారుడు ముగ్గురు కుమార్తెలకు జన్మ నిచ్చారు .గుంటూరు టౌన్ హైస్కూల్ ,గుడివాడ హైస్కూల్ లో దాదాపు పదేళ్ళు సంస్కృత ,ఆంద్ర అధ్యాపకులుగా ఈ ‘’పుంభావ సరస్వతి’’ పని చేశారు .

క్రిష్ణాచార్యీయం

పదేళ్ళ వయసులోనే కృష్ణాచార్యుల వారు పద్య రచన చేశారు .పందొమ్మిదవ ఏట మొదటి అవధానాన్ని గుంటూరు లో చేశారు .తర్వాత వారి అవధాన ప్రక్రియ నిర్వక్ర పరాక్రమం తో జైత్ర యాత్రలా సాగింది .1-12-1911 న బందరులో శతావధానం చేసి దేశం నలు మూలల నుంచి ప్రశంసా వర్షాన్ని అందుకొన్నారు ప్రతిభను నిరూపించుకొన్నారు .పలు చోట్ల అవధానాలు చేసి అవధాన కీర్తిని దశ దిశలా చాటారు .వినుకొండ ,అనపర్తి ,గద్వాల ,ఆత్మకూరు ,వెంకట గిరి ,నూజివీడు ,పిఠాపురం ,విజయనగరం మొదలైన సంస్థానాలలో శతావధానాలు చేసి ,ఆశు కవితలు చెప్పి మెప్పించి శెభాష్ అని పించి సంస్థానాధీశుల చేత ఘన సన్మానాలను అందుకొన్నారు. అవధాన సరస్వతిని ఊరూరా ఊరేగించిన అవధాన సరస్వతి శ్రీ క్రిష్ణాచార్యులవారు .

క్రిష్ణాచార్యులవారు జీవితాన్ని గీర్వాణ భాషా ప్రచారానికే  అంకితం  చేశారు .దీనికోసం ‘’మాతృభాషా సమాజం ‘’అనే సంస్థ ను స్థాపించి కృషి చేశారు .విద్యార్ధులు తేలికగా  సంస్కృతం నేర్చుకోవటానికి మూడు భాగాలుగా ‘’బాల బోధినులు ‘’రాశారు .’’క్రియాదర్శం,’’సంవాదం ‘’,’’వాల్మీకి  చరితం ‘’,’’ఆంద్ర సంస్కృత నిఘంటువు ‘’,అనే గ్రంధాలు రాశారు .ఇవే కాక ‘’గోస్టీవన మహాత్మ్యం ‘’(సంస్కృతం , తెలుగు లలో )’’అవధాన యాత్ర ‘’,అనేక మంది దేవీ దేవతలపై అష్టకాలు ,దండకాలు ,శతకాలు ,స్తోత్రాలు ఈ సాహితీ సరస్వతి లేఖిని నుండి జాలువారాయి .ఒక సారి నెల్లూరు లో ఒక అరగంటలో ‘’శ్రీ రంగ నాయక శతకాన్ని ‘’సంస్కృతం లో ఆశువుగా చెప్పి ఆశ్చర్య చకితులను చేశారు .ఆచార్యుల వారు మహా వక్త .ధారాళం గా ఎంతసేపైనా అనర్గళం గా ఉపన్యసించే నేర్పున్న వారు .

బిరుదులు- సత్కారాలు

శ్రీ కృష్ణాచార్యుల వారికి అవధాన శిరోమణి ,మహా మహోపాధ్యాయ ,విద్యా వారధి ,పౌరాణిక రత్న ,కళా ప్రపూర్ణ ,డి .లిట్ మొదదలైన బిరుదులూ గౌరవాలతో  సన్మానాలందు కొన్నారు .ఇవన్నీ వీరి కవితాశక్తికి పాండిత్య ప్రకర్షకు నిదర్శనాలు .వీరి సంస్కృత భాషా సేవను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పతి చేత 15-8-1960 న ఘన సన్మానం చేయించింది .గుంటూరు పురప్రముఖులు ఆచార్యులవారికి 1961 ఫిబ్రవరి 15,16తేదీలలో ‘’సంస్కృత సామ్రాజ్య పట్టాభి షిక్తుని ‘’గా చేసి ,రత్న ,కనక కిరీటాలతో అలంకరించి అపూర్వ వైభవం తో నభూతో నభవిష్యతి అన్నట్లుగా కలకాలం నిలిచిపోయే ఘనాతి ఘన తర ,ఘన తమ సత్కారం చేసి  తమ ఆత్మీయతను ,ఆప్యాయాన్ని ,గౌరవాన్ని విధేయతను ప్రదర్శించారు .

1962లో కాశీ కృష్ణాచార్యుల వారిని ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ ‘’నడయాడే సరస్వతి’’ని ’’ ‘’ఆస్థాన కవి ‘’గా నియమించి గౌరవం కల్గించి అద్భుత సత్కారం చేసి తన బాధ్యతను నెర వేర్చుకోన్నది .1963లో నేను రాజ మండ్రి ప్రభుత్వ ట్రెయినింగ్ కాలేజిలో బి .ఇ .డి .చేస్తుండగా మా కాలేజి సాంస్కృతిక వారోత్సవాలలో పాల్గొన టానికి ‘’ఈ వృద్ధ తాపసి’’ 91ఏట వచ్చారు .సభ పై అనంతస్తులో జరుగుతోంది వారు .మెట్లు ఎక్కి పైకి రాలేరని ఒక కుర్చీలో వారిని కూర్చో బెట్టి  నేనూ మిగిలిన మిత్రులం కలిసి మా చేతులతో వారిని నెమ్మదిగా మెట్ల మీదనుంచి సభా వేదికకు మోసుకొంటూ  చేర్చాం .ఆ సాహిత్య సంగీత సరస్వతిని స్పృశించి ,పైకి మోసుకొని వెళ్ళే మహద్భాగ్యం నాకు కలిగిందని మహా నందం పొందాను .అలాగే మళ్ళీ కిందికి దించి తీసుకొచ్చి పాదాల పై  ప్రణ మిల్లాం.వారు సంస్కృతం లోనే మాట్లాడారు అతి సరళమైన భాషలో .అందరికి అర్ధమయ్యింది .వారు ఇతరులతోనూ సంస్కృతం లోనే మాట్లాడేవారని చెప్పుకోగా విన్నాను . అవసరం వస్తే తప్ప అంతా సంసృతం లోనే సంభాషించే వారట .అంతటి దీక్ష వారిది .వారి బాల బోధినులు చదివి ఎందరో సంస్కృతం అభ్యసించారు వారు. ప్రతి ఏడాది పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులకు సర్టిఫికెట్లు ప్రదానం చేసేవారు .ప్రతి పట్టణం లోను పరీక్షా  కేంద్రాలు ఉండేవి . సంస్కృత భాషా వ్యాప్తికోసం తన జవ సత్వాలను ధారపోసి న ఈ అపర సరస్వతి  శ్రీ కాశీ క్రిష్ణాచార్యుల వారు 96వ ఏట 1967  బ్రహ్మైక్యం చెందారు .

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -1-12-14-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -69

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -69

106-మహా వ్యాఖ్యాన కర్త,శ్రీ సత్యనారాయణ స్వామి ప్రతిష్ట చేసిన  –అద్దేపల్లి కృష్ణ శాస్త్రి

దివి సీమ రత్నం

కృష్ణా జిల్లా దివితాలూకా టేకు పల్లి లో(ఘంటసాల గారు పుట్టిన ఊరు ) అద్దేపల్లి శివావధాని కుమారులు అద్దేపల్లి కృష్ణ శాస్త్రి 1846లో జన్మించి అరవై ఒక టవ ఏట 1907లో నిర్యాణం చెందారు .ఈయన సోదరులు అయిదుగురూ మహా విద్వాం సులే.ఆంగ్ల విద్య నేర్చుకోమని అన్నగారు ధవళేశ్వరం లో చేరిస్తే ,ఆ చదువుపై ఇష్టం లేక విజయనగరం వెళ్లి అప్పన భొట్ల గోపాల శాస్త్రి గారి వద్ద చాలాకాలం శుశ్రూష చేసి సాహిత్య ,తర్క వ్యాకరణాలలో పాండిత్యాన్ని సాదిం చారు .గురువు గారి మంత్రం శాస్త్ర విద్య శిష్యునికీ సంక్ర్రమించింది .కృష్ణ శాస్త్రి గారికి రాని శాస్త్రమే లేదు ఈయన తో ఆయనకు రాని  దానిపైన కూడా  వాదం చేయటానికి ఆనాటి మహా పండితులు జంకేవారు .గణపతి, బాల మహా మంత్రొపాసకులు .పాదుకాంత దీక్ష పొంది మూడు నెలలలో ప్రస్తాన త్రయాన్ని చదివేసిన అపర అగస్త్యులు .వీరి ప్రజ్ఞను కధలు గాధలుగా చెప్పుకొనేవారు .

గోపాల పుర వాసి

తూర్పు గోదావరి జిల్లా రాజోలు తాలూకా గోపాల పురపు నివాసి ఉప్పల పాటి జానకమ్మ అనే క్షత్రియ స్త్రీ విజయ నగర ప్రభువు అనుమతితో పన్నెండు మంది పండితులను తన గ్రామానికి దగ్గరలో పొడగట్ల పల్లిలో ఒక్కో పండితుడికి ఒక్క్కో ఇల్లు ,నాలుగు ఎకరాల సేద్య భూమి ఇచ్చి పండితులపట్ల తనకున్న భక్తిని చాటుకొన్నది. ఇలా వచ్చి స్థిరపడిన వారిలో మన కృష్ణ శాస్త్రి గారూ ఒకరు .ఇది గాక గురువుగారు గోపాల శాస్త్రి గారు  చనిపోయినప్పుడు రాసిన వీలునామా ప్రకారం అయిదేకరాలపోలం ,మొత్తం డబ్బూ కృష్ణ శాస్స్త్రి గారికి సంక్రమించింది .శిష్యునిపై గురువుగారికున్న వాత్సల్యానికిది నిదర్శనం .గురువు ములికి నాటి వారైతే శిష్యుడు వెలనాటి వారు .పుత్రునిలా ఆదరించారు శిష్యుని. గురువుగారి అంత్య క్రియలను శిష్యులు శాస్త్రి గారి చేతుల మీదుగశాస్త్రోక్తం గా జరిగాయి .

కృష్ణ శాస్త్రి ప్రజ్ఞ

1892లో కృష్ణ శాస్త్రి గారు శ్రీ సత్యనారాయణ స్వామిని అన్నవరం లో ప్రతిస్టిం చారు .అప్పటికి అన్నవరానికి ఏమీ ప్రాముఖ్యత లేదు .శాస్త్రి గారి మంత్రోపాసన ఎందరికో ప్రేరణ కల్గించింది .విదేశీయులు కూడా ఆయన వద్ద మంత్రం శాస్ట్ర రహస్యాలను తెలుసుకొనేవారు .’’జగన్మోహన మంత్రం ‘’లో గొప్ప ఉపాసకులు. దీన్ని గురించిన పుస్తకం శాస్ట్రి గారు రాస్తే అది జర్మనీ చేరిందట .

గోపాలపురం రాజా వారి ఆస్థాన పండితులుగా కృష్ణ శాస్త్రిగారు చాలాకాలం పని చేశారు .పురాణ ప్రవచనం లో అందే వేసిన చెయ్యి .వీరికి మించిన వారు ఆనాడు లేరట .వీరి ప్రజ్న బహు విచిత్రమైనది .ఒకో శ్లోకానికి 108రకాల అర్ధాలు చెప్పగల మహా నేర్పరి .దీనితో పండితపామరులందరూ వారి పురాణ శ్రవణం కోసం ఎదురు చూసేవారు .

సంస్కృత భాషలో వీరు రాసిన గ్రంధాలకు లెక్క లేదు .శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత విధానం ను విచిత్ర విధానం లో రాసి ముద్రించారు .వాల్మీకి రామాయణం లోని ఒక్కో శ్లోకానికి వంద రకాల వ్యాఖ్యానం రాసి కాశీ పండితులను మెప్పించిన మహా జ్ఞాని .ఈ గ్రంధానికి ‘’ఏక శ్లోక వ్యాఖ్యానం ‘’అనే పేరు పెట్టారాయన .’’ఆలంకార ముక్తావళి ‘’అనే వ్యాఖ్య రాసి ఆ శాస్త్రం లోను తన అసాధారణ పాండిత్య ప్రకర్షను నిరూపించుకొన్నారు .తర్క శాస్త్రం లో ‘’తర్కామృత తరంగిణి ‘’అనే గ్రంధం రాశారు కాని అముద్రితం .

107-నృత్త రత్నావళి రాసిన జాయప సేనాని

జాయప సేనాని కృష్ణా జిల్లా దివిసీమ కు చెందిన వాడు .కాక తీయ గజ సైన్యాధ్యక్షుడు .నాట్యకళా మర్మజ్ఞుడు .వెలనాటి క్రోయ్యూరు రాజు అయ్య వంశం వాడు భీమయ్యకు ప్రపౌత్రుడు .దుర్జయ సైన్యాధిపతి నారప నాయకుని పౌత్రుడు. పిన్న చోడుని కుమారుడు .తల్లి దానమ్మ .ఇతని సోదరులు పృధ్వీ ,నారప నాయకులు .నారమ్మ ,పేరమ్మ సోదరిలు .ఈ అయ్య  వంశం వారందరూ సామంత రాజులే సేనాదిపతులే .వెలనాటి చోళ భూపతికి సామంత రాజులుగా ఉండేవారు .

దివిసీమ నుండి –ఓరుగల్లుకు

1213లో కాకతీయ గణపతి మహారాజు తూర్పు ఆంద్ర పై దాడికి వచ్చి వెలనాటిని జయించాడు .జాయప సోదరీమణులైన నారమ్మ పేరమ్మలను పెళ్లి చేసుకొన్నాడు .జాయప శౌర్య పరాక్రమాలకు ఆకర్షితుడై తనతో ఓరుగల్లు తీసుకొని వెళ్లి గజసేనాదిపతిని చేశాడు .అతనికి ‘’వైరి గోదూమఘ రట్ట’’అంటే శత్రువుల్ని తిరగలిలో గోధుమలను పిండి చేసినట్లు చేసేవాడు అనే బిరుదినిచ్చి సత్కరించాడు .జాయప కృతజ్ఞతాపూర్వకం గా ‘’గణపతీశ్వరాలయం ‘’నిర్మించాడు.అనేక గ్రామాలను ఈ ఆలయానికి దానం చేసి స్వామి భోగాలకు ఉపయోగపడేట్లు చేశాడు . ఈ నాటి చేబ్రోలు ఆ నాటి తామ్ర పురం లో తండ్రి పేరిటచౌడే శ్వరాలయం నిర్మించాడు .

ఆలయానికి ఎదుట దేవదాసీలు ఉండటానికి రెండేసి అంతస్తుల భవనాలు కట్టించాడు  .

జాయప సేనానీయం

కాకతి ప్రభువు గణపతి దేవుడికి సంగీత ,నాట్య శాస్త్రాలపై అపారమైన అభిరుచి ఉండేది. జాయపకు కూడా యవ్వనం నుండి వీటిపై గొప్ప ఆరాధన ఉంది  .జాయప భరతుని నాట్య శాస్త్రం ,సోమేశ్వర దేవుని మానసోల్లాసం అప్పటికే చదివి లోతైన పాండిత్యాన్ని సంపాదించాడు .ఇవికాక అనేక ఆధునిక ప్రాచీన గ్రంధాలను చదివి జీర్ణం చేసుకొన్నాడు జాయప లో ఉన్న ఈ ప్రతిభ ను గురించిన చక్రవర్తి  ఆయనను ‘’నృత్త రత్నావళి ‘’గ్రంధాన్ని రాయమని కోరాడు కాదు కాదు శాసించాడు .వెంటనే మోదలు పెట్టి రాశాడు జాయప .దీని తాళ పత్ర ప్రతులు రెండు తంజావూర్ సరస్వతీమహల్  లో ఉన్నాయి .ఇందులో మొత్తం ఎనిమిది అధ్యాయాలు .అయిదవ అధ్యాయం లేదు .చివరి మూడు అధ్యాయాలను దేసీ నృత్యానికి కేటా ఇంచాడు  .అయినా చాలా లోతైన అధ్యయనం తో రాసిన గ్రంధం అనిపిస్తుంది నృత్త గీతాలలో ఉండే మార్గ  దేశి లపై చర్చ చేశాడు .మార్గ విభాగానికి భరతుని గ్రంధం, దేశీయ విధానానికి సోమేశ్వర గ్రంధం లను ఆధారం చేసుకొని రాశాడు .కీర్తి ధర ,భట్ట తండు రాసిన వాటినీ చర్చించాడు .నృత్త గీతాలలో జరిగిన పరిశోధన అంతాతెలియ జేశాడు .సిద్ధాంత రహస్యాలను సంస్కృతీ వైభవాన్ని గొప్పగా నిరూపించాడు .దేశి నృత్యాలలో పేరిణి ,ప్రేక్ఖనం రాసకం ,చర్చరి ,నాట్య రాసకం ,దండ రాసకం ,శివప్రియం ,చిందు ,కన్డుకం  భాన్దికం ఘంట సరి ,చరణం బహురూపం కోలాటం మొదలైన జాన పద నృత్య రీతులపై కూడా రాశాడు .వీటిలో పేరిణి శివ తాండవాన్ని అత్యధిక ప్రచారం చేసిన వారు నట రాజ రామ కృష్ణ గారు .వారికి ఏమిచ్చినా ఆంద్ర జాతి ఋణం తీర్చుకోలేదు .,జాయప ‘’గీత రత్నావళి ‘’అనే సంగీత గ్రందాన్నికూడా రాశాడు .నృత్త రాత్నావలిలోని నృత్యాలకు ఇందులోని సంగీతాన్ని ఉపామ్గం గా ఉండేట్లు రాశాడు కాని ఏ ఏ గ్రంధం శిధిలమైంది .జాయప సేనాని నృత్త రత్నావళిని 1254లో రాసినట్లు భావిస్తున్నారు .

Inline image 1 Inline image 2

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-12-14-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కథ ప్రియమైన పాపాయికి.. (కథ)

కథ ప్రియమైన పాపాయికి.. (కథ)

  • -ఎం.విజయకుమార్
  • 29/11/2014
TAGS:

కథల పోటీలో ఎంపికైన రచన
……………….

‘‘ఒక్కొక్కళ్ళకి ఇకఇకలు.. పకపకలు.. చదువూ సంధ్యాలేదు.. వేలకు వేలు డబ్బులు పోసి ఇంటి దగ్గరవాళ్ళు పంపితే, ఇక్కడికొచ్చి సోకులు పోవడం…’’ వాక్ ప్రవాహం సాగిపోతోంది.. ఎదురుగా తలలు దించుకొని ఆడపిల్లలు.. నరకానికి మారుపేరైన ఓ కార్పొరేట్ కాలేజీలో ఐఐటి ఓరియెంటెడ్‌లో ఇంటర్ చదువుతున్న పిల్లలు వాళ్ళు.. తిట్టిన తిట్టు తిట్టకుండా అరగంట నుంచి తిట్ల ప్రవాహం కొనసాగిస్తున్న ఆమె ఆ క్యాంపస్ ప్రిన్సిపాల్..
‘‘ఒక్కొక్కరూ ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు… కాకపోతే ఏంటి.. ఆ మార్కులు.? స్టడీ అవర్‌కి రమ్మంటే ఆలస్యంగా రావడం… వచ్చినాక చదుతారా? అంటే అదీ లేదు.. ఒక్కోదానికీ కబురు, ఒక్కోదాన్నీ…’’ పదాన్ని సాగదీస్తూ మధ్యలోనే ఆపింది ప్రిన్సిపాల్. తరువాత వాళ్ళ ఊహకే వదిలేస్తూ. వాళ్ళూ ఊహించుకోగలరు… ఆ తరువాత ఎంత ఛండాలంగా నైనా తిట్టగలిగేది- ఆ క్యాంపస్ డీన్. ప్రిన్సిపాల్ అయినా కొంచెం పర్లేదు. ఈ డీన్ మేడమ్ నోటికి అడ్డూ అదుపూ అసలు వుండదు. పిల్లల్ని తిట్టడం కోసమే ఆమెను అపాయింట్ చేసారేమో అన్నట్లు వుంటుంది.
ఓ పెద్ద సైజు సిలిండర్‌కి చీర కట్టినట్లు కింద నుంచి పైకి సమానంగా ఒకే రకంగా వుంటూ హడావుడిగా క్యాంపస్ అంతా తిరుగుతూ… నానా హైరానా పడే ఆమెను చూస్తే… కొద్దిమందికి భయం.. చాలామందికి అసహ్యం. వారాంతపు పరీక్షల్లో.. కొంచెం మార్కులు తగ్గినాయని చెప్పి ‘్ఫడ్‌బ్యాక్’ పేరుతో ఆ తిట్ల పురాణం. ఆడుతూ పాడుతూ చక్కగా చదవవలసిన పిల్లలను- కార్పొరేట్ కాలేజీ అని పిలువబడే ఓ జైలుకి తల్లిదండ్రుల ఆశ చేర్చింది. అనుక్షణం మఫ్టీలో వున్న పోలీసుల్లాంటి కాలేజీ సిబ్బంది కాపలా మధ్య పుస్తకాలకు వేలాడుతూ వుంటారు. పాఠం అర్థమయిందా..? లేదా..? అన్నదానితో పనిలేదు. స్నానం, తిండి, నిద్ర, వికాసం వంటి వాటితో ఏం పని లేదు. అదృష్టమో, దురదృష్టమో కానీ వీళ్ళు కొంచెం తెలివిగల పిల్లలే. అందుకే ‘్ఫస్ట్‌ట్రాక్’ బ్యాచ్ పేరుతో అనుక్షణం పుస్తకాల గుదిబండను మోస్తూనే వుండాలి. మనుషులతో పనిలేదు. మనసులతో పనిలేదు. మార్కులు ఏ మాత్రం తగ్గినా ‘్ఫడ్‌బ్యాక్’ అనో కౌనె్సలింగ్ అనో.. ఏదో ఒక పేరుతో తిట్ల పురాణం. కాలేజీ యాజమాన్యాల కంటికి వీళ్ళు పిల్లలు కాదు. తరువాతి సంవత్సరానికి అడ్మిషన్లు పెంచే యంత్రాలు. వాళ్ళ విద్యా వ్యాపారానికి పెట్టుబడి సాధనాలు.
పిల్లల మనసుల్లో ఎన్నో ఆలోచనలు. ఎదురుగా ఉన్న ప్రిన్సిపాల్‌ని, డీన్‌ని పొడిచి పారేద్దామన్న కసి. కాలేజీలో పడేసిన అమ్మానాన్నలమీద ఏదో తెలియని కోపం.. కానీ.. ఏమీ చేయలేని నిస్సహాయత. ఒక్కొక్కరి కళ్ళు వర్షించే మేఘాలుగా వున్నాయి. పంటి బిగువున దుఃఖాన్ని భరిస్తున్నారు. చచ్చిపోవాలన్నంత బాధ వుంది కొందరిలో. ఎప్పుడు వదిలేస్తారా..? వెళ్లి తనివిదీరా ఏడుద్దామా.. అన్నట్లు నిలబడి వున్నారు.
‘‘పోయి తగలడండి… ఈసారి మార్కులు తగ్గితే సహించేది లేదు’’ అన్న ప్రిన్సిపాల్ మాట పూర్తయ్యేలోపే… బతుకు జీవుడా అనుకొంటూ అక్కడినుంచి వేగంగా హాస్టల్ గదులవైపు వారు సాగిపోయారు.
***
అర్ధరాత్రి సమయం.. చాలామంది ఏడ్చి.. ఏడ్చి.. అప్పుడే నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నారు. నెమ్మదిగా స్వప్న లేచి కూర్చుంది. చుట్టూ చూసింది. మిగతా రూమ్మేట్లు ముగ్గురూ నిద్రలో వున్నారు. వాళ్ళ మనసుల్లో గూడు గట్టుకున్న దైన్యంలా బెడ్‌లైట్ వెలుతురు. ఆ గుడ్డి వెలుతురులోనే- మెల్లగా, శబ్దం రాకుండా తన పెట్టెలోనుంచి ఒక పుస్తకం తీసింది. పుస్తకం మధ్యలో ఓ కవరు లోనుంచి కాగితం తీసి.. టార్చిలైట్ వెలుగులో చదవసాగింది. చదవడం పూర్తయినాక.. కాగితం కవరులో ఉంచి నెమ్మదిగా పెట్టెలో వుంచి పడుకుంది. తనని ఎవరూ గమనించలేదనుకుని నిద్రలోకి జారుకుంది. తనని రెండు కళ్ళు గమనించాయని, ఆ కళ్ళు రూమ్మేట్ ఈశ్వరివని ఆమెకి తెలియదు.
***
ఈశ్వరి నెమ్మదిగా హాస్టల్ గదిలోకి ప్రవేశించింది. క్లాసులు జరుగుతుండగా తనకు ఒంట్లో బాగాలేదని అబద్ధం చెప్పి పర్మిషన్ తీసుకొని వచ్చేసింది. తరచూ అర్ధరాత్రి వేళ స్వప్న చదివేది ఏమిటో తెలుసుకోవాలన్న కుతూహలం ఆమెలో పెరిగింది. స్వప్న పెట్టెని సమీపించింది. దానికి తాళం వేసి లేదు. పెట్టె తెరచి వెతుకులాట ప్రారంభించింది. అడుగున ఎక్కడో ఓ పుస్తకంలో కవరు కనబడింది. అందులో నుంచి ఓ కాగితం తీసింది. ‘‘స్వప్న ఏం చదువుతున్నదో, అది బాయ్‌ఫ్రెండ్ రాసిన లవ్‌లెటరో ఏంటో.. తేలిపోతుంది’’ అనుకుంటూ కాగితం మడతలు విప్పింది. చూపులు అక్షరాల వెంట పరుగు తీయసాగాయి.
ప్రియమైన పాపాయికి…
ఓ సగటుజీవి అయిన నాన్న వ్రాయునది. మాటల్లో చెప్పలేని ఎన్నో విషయాలు అక్షర రూపంలో పొందుపరుస్తున్నాను. బహుశా నామీద ఎంతో కోపం వుండవచ్చు.. ‘నాన్న’ అన్న నా పెద్దరికాన్ని గౌరవిస్తూనో లేదా భయపడుతూనో.. నా నిర్ణయాన్ని నీవు ఆమోదించి వుండవచ్చు. చూసేవాళ్ళకి చిన్న విషయంగానో, హాస్యాస్పదంగానో అనిపించవచ్చు. కానీ నీ వైపునుంచి ఆలోచిస్తే ఎంతో బాధాకర విషయం. చదువు పేరుతో ఇంటికి దూరంగా.. ఓ కార్పొరేట్ కాలేజీలో నువ్వు చేరడం. పేరుకే అది కాలేజీ, నిజానికి అది ఒక జైలు అని తల్లిదండ్రులందరికీ తెలుసు, కానీ.. తప్పదు. తాము నెరవేర్చుకోలేని కలలు తమ పిల్లలన్నా నెరవేర్చాలన్న ఓ పెద్ద ఆశ. పోటీ ప్రపంచంలో పిల్లలు ఎక్కడ వెనుకబడిపోతారేమోనన్న భయం, బలహీనత. అందుకే వద్దు మొర్రో… అన్నా బతిమాలో, బెదిరించో స్థాయికి మించినదయినా అప్పో సోప్పో చేసి చేర్చటం, అక్కడినుంచి వొత్తిడి పెంచడం, ఊహల్లో బతకడం…
అప్పటివరకూ అమ్మానాన్నల ప్రేమను పొంది, చిరు అలకలు, బుజ్జగింపులతో.. ఆనందాలను ఆస్వాదిస్తూ ఓ అందమైన చిన్ని ప్రపంచంలో ఆనందంగా వున్న మిమ్ములను చదువు నెపంతో- కాలేజీ నాలుగు గోడల మధ్య బందీలను చేస్తాం. సగటు తల్లిదండ్రులను అందమైన ప్రకటనల మాయాజాలంలో ముంచేసే ఓ విద్యా వ్యాపార సంస్థలోకి మిమ్ములను నెట్టేస్తాం. మాటలకి, చేతలకు పొంతన లేకపోయినా.. రకరకాల పేర్లతో నిలువు దోపిడీ చేస్తున్నా నోరు విప్పలేని సగటు జీవులం. కాలేజీ వాళ్లు ఎంత దోపిడీ చేసినా ‘ఇదేమిటి..?’ అనే ప్రశ్నించే ధైర్యం చాలక, అనుక్షణం ఆత్మవంచన చేసుకుంటూ ముసుగులో బతికే పిరికివాళ్ళం.
మిమ్ముల్ని కలవడానికొచ్చిన ప్రతిసారీ తల్లిదండ్రులుగా మాకెంత నరకమో.. మెత్తని కత్తితో గుండెను కోస్తున్న ఫీలింగ్. మా బాధలు వింటే.. ఎక్కడ మీ మనసు మారుతుందో అని.. మాట మారుస్తూ.. మిమ్ములను ఏమారుస్తూ.. ప్రేమ పేరుతో తినుబండారాలను మీ నోటిలో కుక్కేస్తూ.. మీ నోరు తెరవనివ్వం. తిరిగివెళ్ళే ప్రతిసారీ.. గేటులోపలి నుంచి మీరు చేతులూపుతుంటే.. చెమ్మగిల్లిన మా కళ్ళు మీకెక్కడ కనబడతాయోనని.. మీరెక్కడ నొచ్చుకుంటారో అని.. ధైర్యంగా మీ కళ్ళలోకి చూసి వీడ్కోలు చెప్పలేని దౌర్భాగ్యులం..
ఇక మీ పరిస్థితి చూస్తే ఏముంది.? స్వేచ్ఛగా ఎగిరే పక్షి రెక్కలు విరిచి, పంజరంలో పడేసినట్లుగా అనుక్షణం మీకు నరకమే. మీరు పుస్తకాలనే తినాలి. పుస్తకాలనే తాగాలి.. పుస్తకాలనే శ్వాసించాలి.. అంటూ… ప్రతిక్షణం ఒత్తిడికి గురిచేసే కళాశాల యాజమాన్యం. ఆడపిల్లలుగా మీకు కలిగే ఇబ్బంది అర్థం చేసుకోకపోగా, మాటలతో మనసును గాయపరుస్తూ సాటి మహిళలే మిమ్మల్ని హింస పెడుతుంటారు. ఎవ్వరినీ ఏమీ అనలేక.. ఏమీ చెయ్యలేక, కోపాన్ని బాధలను దిగమింగుకుంటూ.. మీరు చదువుకునే యంత్రాల్లా మారతారు.
కానీ, కన్నా.. ఓ చిన్న అనుమానం నీకు రావచ్చు. ఇన్ని తెలిసి, ఇంత బాధపడే నాన్న… ఇక్కడ ఎందుకు చేర్పించినట్టు? ముందే చెప్పానుగా- సగటు తండ్రినని. తెలివిగల పిల్లను కార్పొరేట్ కాలేజీలో చేర్పించకుంటే అందరూ తిడతారన్న భయం. రేపు పోటీ పరీక్షల్లో నీకు మంచి ర్యాంక్ రాకపోతే నువ్వు చిన్నబుచ్చుకొని- ‘‘నన్ను అక్కడ చేర్చితే బాగుండేదేమో..’’ అని అనుకోకుండా ఉండాలన్న ఆశతో మంచి కాలేజీలో చేర్చాను.
ఇల్లు తప్ప వేరే ప్రపంచం తెలియని నీకు.. హాస్టల్‌లో మిగతా పిల్లల మధ్య గడిపితే… ప్రపంచం అంటే కొంతయినా తెలుస్తుందని మరో ఆశ. జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను తట్టుకునే మనస్తత్వం అలవడుతుందనే ఆలోచనతో హాస్టల్‌కి పంపాను. అయతే- నీకు నేనొక హామీ మాత్రం ఇవ్వగలను. ర్యాంకుల కోసం నువ్వు పరుగెత్తనక్కరలేదు. పరీక్ష అనగానే రాత్రింబవళ్లు హైరానా పడనక్కర్లేదు. చదువులో నీ సత్తా నిరూపించుకోవడానికి ప్రయత్నించు. కొన్నిసార్లు నువ్వు విజయం పొందవచ్చు.. ఇంకొన్నిసార్లు అపజయం పొందవచ్చు. విజయం సాధిస్తే గర్వం వద్దు. ఓటమిలో నిరుత్సాహం చెందకు. ఎవరేమన్నా సీరియస్‌గా తీసుకోకు, అలాగని వారి మాటలను నిర్లక్ష్యం చేయబోకు. మంచి మార్కులు పొందినా నిన్ను మెచ్చుకోని వారు- ఏ కొంచెం మార్కులు తగ్గినా నొచ్చుకొనే మాటలు అనటానికి ముందుంటారు. ఓ చిన్న మాట… కాలేజీ వాళ్ళు ఏదన్నా అన్నప్పుడు బాధపడొద్దు, కానీ బాధపడినట్లు నటించు. నీ మోములో బాధలాంటి ఏ భావం కనబడకపోతే.. నిర్లక్ష్య ధోరణిలో వున్నావని వారి అహం సంతృప్తి చెందక- మరింతగా మాటలనే ప్రమాదముంది. అప్పుడు ఎంత వద్దనుకున్నా నీ మనసు గాయపడవచ్చు. వీలయినంతవరకు ఏదైనా అనే అవకాశం వాళ్ళకివ్వకుండా చూసుకో.. ఎక్కువగా ఆలోచించి దిగులు పడకు. ఇలా రాశానని ఏమి అనుకోవద్దు. రాయాలనిపించి రాశాను.
ఒక్కటి మాత్రం గుర్తుంచుకో- ‘‘ప్రతిసారీ విజయం రాదు.. అలాగని అపజయం కూడా తిష్టవేసుకొని కూర్చోదు. నిజాయితీగా ముందు ప్రయత్నించాలి. ఫలితం తరువాత. నీ విజయానికి ఎంత మురిసిపోతానో.. నీ అపజయానికీ అంతే బాసటగానే వుంటాను. సగటు తండ్రినే గాని.. బాధల్లో నిన్ను ఒంటరి చేసేవాడిని మాత్రం కాదు. ఆల్వేస్ యువర్ లివింగ్ డాడ్… వుంటాను.. సెలవ్’’.
***
ఏదో అలికిడి వినబడటంతో- అప్పటికే ఉత్తరం చదవేసిన ఈశ్వరి తలెత్తి గుమ్మం వైపు చూసింది. ఎదురుగా స్వప్న. కోపంతో అరుస్తుందనుకుంటే.. అందుకు భిన్నంగా చిరునవ్వు చిందిస్తూ నిలబడి వుంది. ‘‘నాకు తెలుసు నువ్వు గమనిస్తున్నావని… ఏదో ఒక రోజు ఇలా చేస్తావని ముందే ఊహించాను… నీవు ఊహించుకొనే రహస్యాలేమీ లేవు నాకు’’ అంటూ దగ్గరికొచ్చి ఈశ్వరి భుజంపై చెయ్యి వేసింది. ‘‘బాగా దిగులుగా అనిపించినపుడు.. మా డాడీ రాసిన ఉత్తరం చదువుకుంటాను. నా పక్కన కూర్చొని నన్ను ఓదార్చుతున్నట్లుగా వుంటుంది, అందుకని…’’ వాక్యం పూర్తయ్యేలోపే.. స్వప్నను ఒక్కసారిగా ఈశ్వరి వాటేసుకుంది. ఈశ్వరి మనసులో కూడా ఏదో భారం తొలగిపోయినట్లుగా వుంది. ఇద్దరూ కొద్దిసేపు అలా వుండిపోయారు. స్వప్న ఆ ఉత్తరాన్ని మరోసారి ప్రేమగా చూసుకుంది. ‘‘ఐ లవ్ యు మై డాడ్.. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్’’ -అని ఉత్తరం అడుగున ఆమె రాసుకున్న వాక్యాలు మెరుస్తున్నాయి- వాళ్ళ కళ్ళల్లో కొత్త మెరుపులా.
*

రచయత ఫోన్ నెంబర్:
76600 91053

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆశ్రమాలు.. ఆధ్యాత్మిక వేదికలు

ఆశ్రమాలు.. ఆధ్యాత్మిక వేదికలు

  • 01/12/2014
TAGS:

శ్రీకాకుళం, నవంబర్ 30: పవిత్ర తపోవనాలు, భక్తి, ముక్తి, బాధ్యతలను ప్రసాదించే అసలైన వేదికలని, ఎందరో మహనీయులు ప్రాచీన కాలంలో ఇలాంటి వన, జ్ఞాన సంపదల నుంచి తపస్సు చేయడం ద్వారా ఆధ్యత్మిక మార్గాలను పామురులకు సైతం అందించగలిగారని రాష్టప్రతి పురస్కార గ్రహీత, సూర్యపీఠం అధిపతి సద్గురు కృష్ణయాజీ పేర్కొన్నారు. జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలం పెద్దబాడాం అమరగురు బాబాజీ సిద్ధయోగ తపోవనం మంగళకర వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఏర్పాటు చేసిన పీఠాపధితులు, స్వామిజీల వేదికలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. తల్లి సౌజ్ఞానం, తండ్రి అక్షరజ్ఞానం అందిస్తారని ప్రజ్ఞానం గురుబ్రహ్మలే బోధిస్తారంటూ గురుతర బాధ్యతను తపోవనం వ్యవస్థాపకులు, పరమేశ్వరానంద గిరి స్వామిజీ ధన్యులన్నారు. సర్వసంగ పరిత్యాగులైన సాధుసజ్జనులు అసలైన దైవస్వరూపులని, వారి సూక్తులను ఆచరించి జీవితాన్ని పునీతం చేసుకోవాలని భక్తులకు హితవుపలికారు. ఈ సందర్భంగా వేదికపై గల పీఠాధిపతులు, సాదుపుంగవులను దుస్సాలువాతో కప్పి ఫల, పుష్పాలు సమర్పించి పాదాభివందనం చేసి అందరికీ గురుబాధ్యతను గుర్తుచేశారు. నెమలికొండ శాంత్యాక్రమ దత్త పీఠాధిపతులు సద్గురు సదానంద సరస్వతీ స్వామిజీ మాట్లాడుతూ, తపోవనం అందరి భాగ్యమని, విశ్వకల్యాణం కోసం ఇందులో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దైవత్వాన్ని గురించి దైవికంగా జీవించాలన్నారు. పాత్యాశ్చ దేశాల్లో లేని బ్రహ్మ, ఆత్మజ్ఞానాలను, శాంతి ఆనందాలను ఈ దేశంలో చూడవచ్చునన్నారు. నాది-నేను- నావారు అనే ధ్యాసలో దైవానికి దూరం కారాదని సూచించారు. అదేవిధంగా ఆనందాశ్రమం వ్యవస్థాపకులు, స్వాభిమాన్ ట్రస్టు అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతీ, ఉత్తరాంధ్ర సాదుపరిషత్ గౌరవ అధ్యక్షులు, దుర్గాపీఠం వ్యవస్థాపకులు సమతానంద సరస్వతీ, నైమిశారణ్యాశ్రమ పీఠాధిపతి బాలబ్రహ్మనందస్వామి వారి ప్రసంగాల ద్వారా జన్మరహస్యం తెలుసుకోవాలని, రామాయణ, భారత, భాగవతం వంటి సనాతన ధర్మాన్ని ఉపదేశించే గ్రంథాలను పారాయణం చేయాలన్నారు. ఆశ్రమాలు, తపోవనాలను సంరక్షించడం ద్వారా జన్మను ధ్యానం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

చిత్రం.. కార్యక్రమంలో మాట్లాడుతున్న కృష్ణ యాజీ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అగ్నిసరస్సులో ఈదాల్సిందే… మదర్ ఇండియా సినిమా పాటలు –

అగ్నిసరస్సులో ఈదాల్సిందే…
శ్రమైక జీవన సౌందర్యాన్ని కళ్లకు కట్టినట్లు తీసిన చిత్రం ‘మదర్‌ ఇండియా‘ . నర్గిస్‌ తన అసమాన ప్రతిభను ప్రదర్శించిన ఈ చిత్రం 1957లో విడదల అయ్యింది. ఇందులోని ‘దునియా మే హమ్‌ ఆయేతో జీనా హి పడేగా’ అనే పాట ప్రతి భారతీయ హృదయాన్నీ ఉర్రూతలూపింది. శకీల్‌ బదాయునీ రాసిన ఈ పాటను , నౌషాద్‌ స్వరబద్ధం చేస్తే లతా మంగేష్కర్‌ తన చెల్లెళ్లు మీనా మంగేష్కర్‌, ఉషా మంగేష్కర్‌లతో కలిసి గానం చేశారు.
దునియా మే హమ్‌ ఆయే హై తో జీనా హీ పడేగా
జీవన్‌ మే అగర్‌ జెహర్‌ తో పీనా హీ పడేగా /దునియా మే/
(లోకంలోకి వచ్చాక మనం జీవించాల్సిందే
జీవితంలో విషమే ఉన్నా తాగాల్సిందే)
ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, జీవితం అపురూపమైనదే. ఈ కష్టాలకూ, బాధలకూ అతీతమైన ఒక జీవితానందం సజీవత్వంలోనే సిద్ధిస్తుంది. సుఖ సంతోషాలు, జీవన మాధుర్యాలూ అన్నిసార్లూ లభించవు. ఆ మాటకొస్తే జీవితంలో అత్యధిక భాగం సంఘర్షణలూ, సంక్షోభాలే ఉంటాయి. తేనెల జలపాతాలకన్నా, విష ధారలే ఎక్కువగా ఉంటాయి. ఒక వేళ అలా జీవితంలో విషఽభాండాలే ఉన్నా, ఆ విషాన్ని సైతం జీర్ణించుకోవాలి. ఎందుకంటే, ఆ విషాన్ని చిలికితే గానీ, జీవిత సత్యాలు బోఽధపడవు. ఆ సత్యాల్ని అక్కున చేర్చుకుంటే గానీ, అమృత భాండాలు మన చేతికందవు
గిర్‌గిర్‌కే ముసీబత్‌ మే సంబల్‌తే హి రహేంగే
జల్‌ జాయే మగర్‌ ఆగ్‌ పే చల్‌తే హీ రహేంగే
గమ్‌ జిస్‌నే దియే….
గమ్‌ జిస్‌నే దియే హై వొహీ గమ్‌ దూర్‌ కరేగా -2 / దునియా మే /
(కష్టాలు పడీ పడీ తిరిగి నిలదొక్కుకుంటాం
కాలిపోతున్నా సరే, నిప్పులమీద నడుస్తూనే ఉంటాం
ఎవరీ బాఽధలిచ్చారో…
ఎవరీ బాధలిచ్చారో వారే వాటిని దూరం చేస్తారు- /లోకంలోకి/)
ప్రశాంతంగా, ప్రసన్నంగా సాగిపోయేదే జీవితమనే భ్రమల్లోంచి ఎప్పటికైనా బయటపడాల్సిందే.. జీవితమంటే నిరంతర యుద్ధమనే సత్యం బోధపడేదాకా మనిషి ఎదిగినట్లు కాదు. మనలో మనకే జరిగే అంతర్యుద్ధమే కావచ్చు. చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితుల మీద యుద్ధం కావచ్చు. మొత్తానికి యుద్ధం తప్పదు. నిజానికి జీవితంలో పోరాటం చేయనిదే శాంతీ లేదు, ప్రసన్నతా రాదు. ఈ నిజాన్ని స్వీకరినంచినప్పుడే ఎన్నిసార్లు పడిపోయినా తిరిగి లేచే ప్రయత్నం చేస్తాం. ఎన్నిసార్లు ఓడిపోయినా తిరిగి గెలిచే ప్రయత్నం చేస్తాం.
ఔరత్‌ హై వో ఔరత్‌ జిసే దునియా కి శరమ్‌ హై
సంసార్‌ మే బస్‌ లాజ్‌ హీ నారీ కా ధరమ్‌ హై
జిందా హై జో…
జిందా హై జో ఇజ్జత్‌ సే వో ఇజ్జత్‌ సే మరేగా -2 / దునియా మే/
లోకం పట్ల వినయవిధేయతలున్న ఆడదే ఆడది. లోకపు గౌరవాన్ని నిలబెట్టే ధర్మమూ ఆడదారి మీదే ఉంది.
సజీవులెవరు?
పరువుగా బతికి పరువుగా మరణించినవారే లోకంలో ఎప్పటికీ సజీవంగా ఉంటారు. /లోకంలోకి /)
లోకం నుంచి మనం ఏవి ఆశిస్తామో.. లోకానికి మనం అవే ఇవ్వాలి. ఆ క్రమంలో లోకం పట్ల మనం వినమ్రంగా ఉండాలి. వినయంగా ఉండాలి. అనాదిగా మహిళ ఆ విలువల్ని పాటిస్తూనే ఉంది. అంత వినయంగా ఉంటూనే కుటుంబ గౌరవాన్నీ తద్వారా సామాజిక గౌరవాన్ని నిలబెట్టే బాధ్యత కూడా మహిళ మీదే ఉంది. అయితే, లోకంలో కోటానుకోట్ల మంది పుట్టారు, గిట్టారు. కానీ, నిజమైన బతుకు బతికిందెవరు? కడ ఊపిరి దాకా పరువుగా బతికి, పరువుగా ప్రాణాలు వదిలిన వాళ్లే కదా! గెలిచావా లేదా అన్నదొక్కటే ముఖ్యమా? ఆ నిలిచి, గెలిచే క్రమంలో ఏ విలువల మీద నడిచావన్నది అత్యంత ముఖ్యమవుతుంది.
మాలిక్‌ హై తేరే సాథ్‌ న డర్‌ గమ్‌ సే తూ యే దిల్‌
మెహ్నత్‌ కరే ఇన్సాన్‌ తో క్యా కామ్‌ హై ముష్కిల్‌
జైసా జో కరే….
జైసా జో కరేగా యహాఁ వైసా హీ భరేగా -2 / దునియా మే/
(దైవం నీ తోడుగా ఉన్నాడు బాధలకు భయపడాల్సిన పనేముంది?
మనిషి శ్రమించాలే గానీ, సాఽధ్యం కానిది ఏముంది?
ఎవరు ఎంత చేస్తే….
ఎవరు ఎంత చేస్తే వారికి ఇక్కడ అంతే ప్రాప్తిస్తుంది)
అన్నీ ఊరకే వచ్చిపడాలనుకునే వారికి తన శరీరమే తనకు పూర్తిగా సహకరించదు. అలా కాకుండా, తన శ్రమను నమ్ముకున్నవారిలో , శ్రమైక జీవన సౌందర్యాన్ని దర్శించిన వాళ్లల్లో అన్నేళ్లూ తనలో నిగూఢంగా పడి ఉన్న సర్వశక్తులన్నీ పెల్లుబికి వస్తాయి. ఆ సమయాన సాటి మనుషులూ, సమస్త ప్రకృతీ, చివరికి లోకంలోని దివ్యశక్తులు సైతం మనిషికి అండగా నిలబడతాయి. చేసిన వారికి చేసినంత అన్నట్లు, మనిషి ఏం చేస్తే దాని తాలూకు ఫలితమే వస్తుంది. తుమ్మ మొక్కను నాటి మామిడి పళ్లు కావాలంటే అది అయ్యే పనేనా? ఏమైనా సుఖంగా బతకాలనుకునే వారిని కష్టాలే వెంటాడతాయనేది వాస్తవం. కష్టాన్ని ప్రేమించేవారికే సకల సౌఖ్యాలూ సంప్రాప్తిస్తాయనేది ఏనాడూ మొక్కవోని ఓ పరమ సత్యం.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విరామ చిహ్నం -సతీష్ చందర్ కవిత

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

టి టి డి భారత వ్యాఖ్యానం ప్రామాణి కమైనదెనా?

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అభ్యుదయానికి ఆసరా ఎస్ వి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -68 105-రాయల్ సొసైటీ సభ్యుడు –రాం కరణ్ శర్మ

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -68

105-రాయల్ సొసైటీ సభ్యుడు –రాం కరణ్ శర్మ

విద్య –గ్రంధ రచన

బీహార్ లోని శరణ జిల్లా శివ పూర్ లో రాం కరణ్ శర్మ 1927లో జన్మించాడు .పాట్నా యూని వర్సిటి నుండి సంస్కృత హిందీ భాషల్లో ఏం ఏ .డిగ్రీ పొందాడు .సాహిత్యాచార్య ,వ్యాకరణ శాస్త్రి వేదాంత శాస్త్రి పట్టాలను సాధించాడు .అమెరికాలోని కాలిఫోర్నియా లోఉన్న బెర్కిలీ యూని వర్సిటి నుండి భాషా శాస్త్రం లో పి.హెచ్.డి ని ..’’ముర్రే బి ఎమన్యు ‘’గైడెన్స్ లో చేశాడు .సంస్కృత ఆంగ్లాలలో బహు రచనలు చేశాడు .సంధ్య ,పాధేయ శతకం ,వీణ అనే సంస్కృత పద్యకావ్యాలు ,రాయసా ,సీమా అనే నవలలు  మహా భారతమలో కవిత్వ మూలాలు అనే గొప్ప పరిశోధనాత్మక విశ్లేషణాత్మక గ్రంధం రాశాడు .ఎన్నో వైద్య గ్రంధాలను అనువదించాడు .మహాకావ్యలను ,పురాణాలను అనువాదం చేశాడు .ఇండాలజీ(భారతీయ చరిత్ర సాహిత్యం వేదాంతం సంస్కృతీ ) పై జరిగిన ఎన్నో సెమినార్ లలో పాల్గొని అనేక పరిశోధనా పత్రాలను రాసి వెలువరించాడు .

పురస్కారాలు

కేంద్ర సాహిత్య అకాడెమి నుండి సంస్కృతం లో అవార్డ్ అందుకొన్నారు .భాషా సాహిత్య పరిషద్ అవార్డ్ ,ధిల్లీ సంస్కృత అకాడేమి అవార్డ్ లను పొందాడు .కృష్ణ కాంత్ హాన్దీక్ మెమోరియల్ అవార్డ్  సంస్కృత భాషా వ్యాప్తికి చేసిన సేవకు లభించిది బిర్లా ఫౌండేషన్ వాచస్పతి పురస్కారాన్ని అంద జేసింది  .రాయల్ ఎసియాటిక్   సొసైటీ ,అమెరికన్ ఓరిఎంటల్ సొసైటీ లలో విశిష్ట సభ్యులుగా నియమిం పబడి గౌరవం పొందారు

దర్భంగలోని కామేశ్వర సింగ్ సంస్కృత యూని వర్సిటి వైస్ చాన్సెలర్ గా 1974-80కాలం లో పని చేశాడు రాం కరణ్ శర్మ .వారణాసి లోని సంపూర్ణానంద్ సంస్కృత యూని వర్సిటి కి కూడా ఉప కులపతిగా 1984నుండి ఒక ఏడాది సేవ  చేశాడు .అమెరకా  లోని చికాగో ,కొలంబియ ,పెన్సిల్వేనియా యూని వర్సిటీలకు విజిటింగ్ ప్రొఫెసర్ గా ఉన్నారు .

రాం కరణీయం

రాం కరణ్ శర్మ సంస్కృతం లో సంధ్య ,పాధేయ శతకం ,వీణా ,కవిత ,సర్వం సహా కావ్యాలను రాశాడు .రాయిసం సీమ అనే సంస్కృత నవలలు రచించాడు .ఇంగ్లీష్ లో elementsof poetry in Mha Bharata ,Anthology of midieval Indian literature,Researches in Indian and Buddhist philosophy (essays in honour of Professor Alex wayman )రాశాడు ఇవికాక శివ సహస్ర నామ శతకం ,శివ సుఖీయం ,గగన వాణి,చరక సంహిత ,రేజు వెనతీవ హితకారే –ఆయుర్వేద ,సర్వ మంగళ సుమనోమల ,దీపికా –ఇవి కాక గణేశ పురాణం ను స్వీయ సంపాదకత్వం లో వెలువరించాడు .

అంతర్జాతీయ భావ వ్యాప్తికి శర్మ అనేక సెమినార్ లను దేశ విదేశాలలో నిర్వహించాడు. భారత ప్రభుత్వానికి విద్యా సలహా దారుగాఉన్నాడు  ,ఎన్నో విశ్వ విద్యాలయాలు గౌరవ సలహాదారుగా శర్మ సేవలను వినియోగించుకొన్నాయి.

Inline image 1  Inline image 2 Inline image 3

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -30-11-14-ఉయ్యూరు

 

 

 

 

 

 

.

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -67

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -67

104-      సాహిత్య అకాడెమి పురస్కారగ్రహీత -రేవా ప్రసాద్ ద్వివేది

విద్యాభ్యాసం

మధ్య ప్రదేశ్ లో నర్మదానదీ తీరం లో నాదేర్ గ్రామం లో పండిత నర్మదా ప్రసాద్ ద్వివేది ,లక్ష్మీ దేవి దంపతులకు రేవా ప్రసాద్ ద్వివేది 22-12-1935నజన్మించాడు .ఎనిమిదేళ్ళ వయసులో తలిదండ్రులను కోల్పోయిన దురదృష్ట వంతుడు .కాశీకి వెళ్లి సంస్కృతాన్ని అభ్యసించాడు .సంస్కృత పూర్వ ఆధునిక సాహిత్యాన్ని అధ్యయనం చేశాడు .బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం నుండి సాహిత్యా చార్య  సంస్కృతం లో ఏం ఏ డిగ్రీ పొందాడు రాయపూర్ లోని రవి శంకర యూని వర్సిటి లో పి హెచ్ డి సాధించాడు .మధ్య ప్రదేశ్ జబల్పూర్ యూని వర్సిటి నుండి  డి లిట్ పొందాడు .ప్రతిభా విశేషం తో సంస్కృత ఆచార్య పదవిని బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం లో పొంది 1977-95వరకు నిరాఘాటం గా పద్దెనిమిదేళ్ళు పని చేశాడు .ఈ విశ్వవిద్యాలయ  ‘’డీన్’’గా రెండు సార్లు సేవలందిం చాడు రేవాప్రసాద్ ద్వివేది .వారణాసిలో ‘’కాళి దాస సంస్థాన్ ‘’ఏర్పరచిన ఘనత ద్వివేదీదే .

రేవా ప్రసాదీయం

రేవా ప్రసాద్ సంస్కృతం లో ‘’సీతా చరిత్రం ‘’ స్వాతంత్ర సంభవం ‘’అనే మహాకావ్యాలు రాశాడు .మొదటగా ‘’ఉత్తర సీతా చరితం ‘’మొదలు పెట్టి1956నుండి పన్నెండేళ్ళు 1968వరకు రాశాడు .ఇది రామాయణాన్ని అనుసరించి రాసినదే .ఉత్త్తర రామాయణ కద ఉంది .దీన్ని ఆనాటి సాంఘిక రాజకీయ పరిస్తితులనుస్పృశిస్తూ దేశ భక్తీ ప్రపూర్వాకం గా  రాశాడు . 1991లో రెండవ మహాకావ్యమయిన ‘’స్వాతంత్ర్య సంభవం ‘’కు కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కారం లభించింది .ఇందులో భారత స్వాతంత్రోద్యమ చరిత్ర ను విపులంగా వర్ణించాడు .అణుయుగం పై రాసిన సంస్కృత కవితలను ‘’ప్రమతః ‘’పేరు తో ప్రచురించాడు .మధ్య ప్రదేశ్ జీవన వాహిని అయిన రేవా అంటే నర్మదా నదిని స్తుతిస్తూ   ‘’శ్రీ రేవా భద్ర పీఠం ‘’ అనే కావ్యాన్ని రాశాడు .శత పత్రం అనే కవిత సంపుటిని ,’’యూతిక’’అనే నాలుగు అంకాల నాటకాన్ని రేవా రాశాడు .కావ్యాలంకారిక ,నాట్యాను శాసనం ,సాహిత్య శరీరం అనే మూడు అలంకార శాస్ట్ర గ్రంధాలను సంస్కృతం లో రాశాడు .వీటిపై తానె హిందీలో వ్యాఖ్యానాలు రాశాడు .1976లో కాళిదాస సమగ్ర సాహిత్యాన్ని ముద్రించాడు .కాళిదాసకృత ఋతు సంహార ,రఘు వంశ కావ్యాలపై సమగ్ర వ్యాఖ్యానం రాశాడు ద్వివేదీ .సంస్కృత అలంకార శాస్త్రాలపై  హిందీ లో వ్యాఖ్యానాలు రాశాడు .

ప్రసాద్ కు పురస్కారాలు

1978లో రాష్ట్ర పతి పురస్కారం అందుకొన్నాడు .స్వాతంత్ర్య సంభవ కావ్యానికి సాహిత్య అకాడెమి ,కల్పవల్లి ,వాచస్పతి ,శ్రీవేణిలనుండి   నాలుగు పురస్కారాలు లభీంచాయి .అలంకార శాస్త్ర రచనకుమహా మహోపాధ్యాయ  పి .వి కాణే పురస్కారాన్ని బంగారు పతాకాన్ని పొందాడు .మధ్య ప్రదేశ్ ,ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలనుండి మొత్తం తొమ్మిది అవార్డులను అందుకొన్న ఘనత రేవా ప్రసాద్ ది.భోపాల్ సంస్కృత అకాడెమి ‘’వ్యాసపురస్కారాన్ని’’ అంద జేస్తే ,రెండు సార్లు మిత్ర పురస్కారం ఒకసారి ‘’భోజ’’ అవార్డ్ గ్రహించాడు .న్యు ఢిల్లీ లోని రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ .మధ్య ప్రదేశ్ కాళిదాససంస్థాన్ ,సంస్కృత అకాడెమీ మొదలైన అనేక సంస్థలు ద్వివేదీని అనేక హోదాలలో నియమించి సేవలు అందుకొన్నాయి .,

Inline image 1  Inline image 2

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-11-14-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ప్రాణాలతో ఆడుకోకండి

ప్రాణాలతో ఆడుకోకండి

బంతి తో పరుగుల వరద పారుతుంది

బాల్ తో వికెట్లు కూలిపోతాయి

బంతి బౌండరీలు దాటు తుంది

బాల్ వికెట్ ను విసిరి గాల్లోకి లేపుతుంది

బంతి బెయిల్స్ ను డాన్సు చేయిస్తుంది

బాల్ స్పిన్ అయి స్పీడై చెలరేగుతుంది

కాని బంతి ప్రాణాలు తోడేస్తుందని అనుకోలేదు

అదే చేసింది బాల్ –‘’ఫిలిప్ హ్యూస్ ‘’ఊపిరాపేసింది

ఆసీస్ యువ క్రికెటర్ ఆశల ఉసురు తీసింది

చేల రేగుతున్న యువ కిశోరాన్ని కబళించేసింది

దానికేం తెలుసు తాను ఏ ఘోరం చేస్తోందో ?

విసిరిన వేటగాడు గాడు చెప్పాలి సమాధానం .

రెండు జట్ల ను సరిగా ఆడించే వాడు అంపైర్

బంతి అవుతుందను కొంటాడా తన పాలిటి ఫైర్ ?

పాపం ఇస్రాయిల్ అంపైర్’’ హిలేన్ ఆస్కార్ ‘’

బాల్  తగిలి బలైపోయాడు గ్రౌండ్ లోనే

క్రికెట్ ఒక క్రీడారంగం గా రాణించాలి కాని

రణ రంగం కాకూడదు ఎన్నటికీ

క్రికెట్ ఆటలో బంతికి బలైన హ్యూస్ ,ఆస్కార్ లు

క్రికెట్ రణ రంగ వీరులై వీర స్వర్గం పొందారు

వారిద్దరి మృతికి గుండె భారం తో కన్నీటి తర్పణమిద్దాం

బంతి తో ఆడుకోండి కాని ప్రాణాలతో కాదని హెచ్చరిద్దాం .

Inline image 1   Hillel Oscar

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-1-14-ఉయ్యూరు

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలంగాణా తొలిసినిమా ‘ఆదర్శం’

Namasthe Telangana Latest News

ఆదివారం
నవంబర్ 30, 2014

ఇది మన నిర్మాతల ఫస్ట్ సినిమా

Updated : 11/30/2014 3:30:31 AM
Views : 32
ఆదర్శం
మూగ సినిమాల నిర్మాణం ఆగిపోయి టాకీలు వచ్చాక హైదరాబాదులో నిర్మితమైన సినిమా మా యింటి మహాలక్ష్మి (1959). ఈ సినిమాతోనే
మన నగరంలో సినిమాల షూటింగ్‌లు మొదలయ్యాయి. దీంతో పాటు తెలంగాణ వారు నిర్మాతలుగా 1960లో చివరికి మిగిలేది సినిమా తీశారని
ఇప్పటి దాకా సినిమా చరిత్రకారులు చెబుతూ వచ్చారు. అదంతా నిజమని నమ్ముతూ వచ్చాం. అయితే, హైదరాబాదు స్టేటుగా ఉన్న కాలంలోనే
మద్రాసు వెళ్లి 1952లోనే తెలుగు సినిమా తీసిన తెలంగాణ నిర్మాతల గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అలా వారు తీసిన ఆ సినిమానే ఆదర్శం.

– హెచ్.రమేష్‌బాబు, 94409 25814


ఆదర్శం సినిమాను 1952లోనే తీశారు. దీని నిర్మాతలు నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్ తాలూకా కందిబండ, గణపవరం గ్రామాలకు చెందిన దేశ్‌ముఖ్‌లు.

ఈ సినిమా సంగతులు తెలుసుకోవాలంటే 1952కు మరో అయిదేళ్లు వెనక్కు వెళ్ళాలి. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత
అప్పటిదాకా స్వతంత్ర రాజ్యంగా ఉన్న నిజాం స్టేట్‌ని ఇండియాలో విలీనం చేయడానికి ఆయన అంగీకరించని సంగతి తెలిసిందే. దీంతో నిజాం వ్యతిరేక
పోరాటం ఉధృతమైంది. ప్రజలపై అణచివేతకు, దాష్టీకాలకు పాల్పడుతున్న రజాకార్ల దాడులను తప్పించుకునేందుకు ఉద్యమకారులు, ప్రజలు ఇతర
ప్రాంతాలకు తరలివెళ్లారు. ఈ పరిస్థితుల్లో కందిబండ గ్రామ దేశ్‌ముఖ్‌లైన నారపరాజు కుటుంబం జగ్గయ్యపేటకు వెళ్లింది. వీరి వెంబడే గణపవరానికి చెందిన
బంధువులు కూడా అక్కడికి వెళ్లారు.

జగ్గయ్యపేటలో ఉన్నప్పుడే వారికి విజయవాడలో పలు నాటక ప్రదర్శనలు, సినిమాలు చూసే అవకాశం కలిగింది. సినిమా రంగానికి చెందిన వారితో

పరిచయాలు ఏర్పడ్డాయి. ఆ కాలంలో ఆత్రేయ ఈనాడు నాటకం రాశారు. ఈ ప్రదర్శన విజయవాడలో జరిగింది. ఇందులో ఆయన ఒక ప్రధాన పాత్ర పోషించారు.
హిందూ, ముస్లింల సమైక్యతను ప్రబోధించే ఈ నాటకంలో ఆత్రేయ హిందువు వేషం వేశారు. 1948 జనవరిలో మహాత్మాగాంధీ హత్యానంతరం మారిన దేశ
పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాసిన నాటకం అది.

ఆ నాటకం మన నారపరాజు జానకి రామారావు, తమ్మర వేంకటేశ్వరరావులకు బాగా నచ్చింది. వారికి ఆత్రేయ అభిమాన రచయితయ్యారు. ఆ రోజుల్లోనే

భవిష్యత్తులో వీలైతే ఆత్రేయను రచయితగా తీసుకుని సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు. 1948 సెప్టెంబర్‌లో పోలీసు యాక్షన్ తరువాత జగ్గయ్యపేటకు
వెళ్లిన మన వాళ్లంతా కోదాడ ప్రాంతాలకు తిరిగి వచ్చి మళ్లీ తమ వ్యవహారాల్లో మునిగిపోయారు. ఆ తరువాత రెండేళ్లకు ఓ రోజు మద్రాసు సినిమా రంగంతో
పరిచయం ఉన్న జగ్గయ్యపేటకు చెందిన గౌరవరం వెంకటరామయ్య నారపరాజు దగ్గరకు వచ్చి మేమంతా వందమందిమి షేర్ హోల్డర్స్‌గా ఏర్పడి సినిమా తీస్తున్నాం.
మీరేమైనా కలుస్తారా? అనడిగారు. ఎందుకో గానీ వందమందితో కలసి ఏం సినిమా తీస్తాం. మేమే సొంతంగా తీస్తాం అని సున్నితంగానే తిరస్కరించారు జానకి
రామారావు. ఆ తరువాత కందిబండ, గణపవరంలో ఉన్న తన బంధువులతో కలసి పదిమంది భాగస్వాములై సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు. ఇది
జరిగింది 1951 జనవరి ప్రాంతంలో. శుభోదయం ఫిలింస్ ప్రై.లిమిటెడ్ బ్యానర్‌పై తమ సినిమా ప్రయత్నాలు ప్రారంభించారు. మొదటినుండి ఆత్రేయ తమ
అభిమాన రచయిత గనుక ఆయననే సినిమాకు రచయితగా ఏర్పాటు చేసుకున్నారు. కథ, మాటలు, పాటలు ఆయనే రాశారు.

దర్శకుడెవరనే ప్రస్తావన వచ్చినప్పుడు హెచ్.ఎం.రెడ్డి అయితే తారలను, బడ్జెట్‌ను అదుపులో ఉంచి సినిమా తీస్తాడని వెంకట్రామయ్య వెంట వెళ్లి ఆయన్ను

కలిశారు. అప్పుడాయన నేను బిజీగా ఉన్నాను. మీకు మంచి దర్శకుడిని సూచిస్తానని హెచ్.వి. బాబును పరిచయం చేశారు. ఆయననే దర్శకుడిగా
నిర్ణయించారు. ఈ హెచ్.వి.బాబు పూర్తి పేరు హనుమంతప్ప విశ్వనాథ్‌బాబు. ఈయన తొలి తరం సినీ దర్శకులలో ఒకరు. ద్రౌపదీ వస్త్రాపహరణం (1936),
కనక తార (1937), భోజ కాళిదాసు (1940), కృష్ణప్రేమ (1943), ధర్మాంగద (1949) అప్పటిదాక ఆయన తీసిన సినిమాలు. వీటిలో ధర్మాంగద కరీంనగర్‌కు
 చెందిన ధర్మపురి పుణ్యక్షేత్రంలో ప్రచారంలో ఉన్న జానపద గాథ. ఈ విషయాలు వేరొక సందర్భంలో ముచ్చటించుకుందాం.

ఆదర్శం సినిమా నటీనటుల సంగతికి వస్తే ప్రధాన పాత్రధారులు అంతా అప్పుడప్పుడే సినిమా రంగంలోకి వచ్చి స్థిరపడుతున్న వారే. హీరోలు కొంగర జగ్గయ్య,

 రామశర్మలు కాగా, నాయికలుగా షావుకారు జానకి, సావిత్రి నటించారు. ఇతర పాత్రలలో గౌరీనాథశాస్త్రి, వంగర, రామశాస్త్రి, శ్రీవత్స, టి.కృష్ణ, ఇందిరాచారి,
రేవతి, సరస్వతమ్మ తదితరులు నటించారు.

చిత్ర రచయితగా పనిచేసిన ఆత్రేయ ఒక ప్రధాన పాత్రలో నటించడం ఈ సినిమా ప్రత్యేకత. ఆయన తెరపై కనిపించిన తొలిచిత్రం కూడా ఇదే. కాగా, ఆ తరువాత

కోడెనాగు, మరో రెండు చిత్రాలలో నటించారాయన.

సాంకేతిక నిపుణులుగా సి.హెచ్.యి. ప్రసాద్ (కళాదర్శకత్వం), అన్నయ్య (ఛాయాగ్రహణం), అశ్వత్థామ (సంగీత దర్శకత్వం), ఎం.వి.రాజన్ (ఎడిటింగ్) తదితరులు

 పనిచేశారు. సినిమా ముగింపుకు వచ్చేసరికి హెచ్.వి.బాబు తప్పుకోవడంతో మిగిలిన దృశ్యాలను ఎం.వి.రాజన్, టి.కృష్ణలు డైరెక్ట్ చేశారు. టైటిల్స్‌తో దర్శక
నిర్మాతలుగా శుభోదయ ఫిలింస్ అని వేశారు.

ఇక నిర్మాతలుగా పదిమంది సంయుక్తంగా శుభోదయ పతాకంపై నిర్మించారని ముందుగానే చెప్పుకున్నాం. వారంతా వరుసగా నారపరాజు జానకి రామారావు,

తమ్మర వేంకటేశ్వరరావు (వీరిరువురూ మేనేజింగ్ డైరెక్టర్లు), కోదాటి వెంకట అప్పారావు, నారపరాజు లక్ష్మీ నరసింహారావు (నాబీరామ), కె.వి.లక్ష్మీనారాయణరావు,
కె.వి.రాజగోపాలరావు, కె.వి.వరదారావు, కె.వి.నరసింహారావు, కె.వి. సీతారామారావు, ఎస్.జె.వి.రామారావులు.

ఈ చిత్రంలో బాలనటుడిగా నిర్మాతల్లో ఒకరైన జానకి రామారావు కొడుకు సుగుణాకర్‌రావు నటించాడు. సినిమా ప్రారంభంలో వచ్చే కృష్ణహరే శ్రీకృష్ణహరే పాటలో

ఇందిరాచారి వొడిలో కూర్చున్న బాలుడు సుగుణాకరరావే. వైద్య ఆరోగ్యశాఖలో నౌకరీ చేస్తూ స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన వీరు ఇప్పుడు హైదరాబాదులో
ఉంటున్నారు. అలాగే, మేనేజింగ్ డైరెక్టర్లలో ఒకరైన తమ్మర వేంకటేశ్వరరావు కూడా నగరంలోనే ఉన్నారు. కాగా, 1974లోనే జానకి రామారావు కాలం చేశారు.

ఆదర్శం ఇతివృత్తం

స్థూలంగా సినిమా కథలోకి వెళితే… భారతదేశ స్వాతంత్య్ర సమయంలో పాకిస్థాన్ విభజన జరిగి మత కలహాలు రేగినపుడు పంజాబ్‌లో నివాసముంటున్న ఒక

తెలుగు కుటుంబం అల్లర్లకు బలవుతుంది. అందరూ పోగా అన్నా చెల్లెళ్లయిన రూప్, కామిని మాత్రం ప్రాణాలతో మిగిలి పారిపోతారు. మార్గమధ్యంలో రూప్ తప్పి
పోతాడు. కామిని ఎన్నో తంటాలు పడి మద్రాసు చేరుకుని ఒక నాటక సమాజంలో చేరుతుంది. మద్రాసులో ఉన్న శరణార్థుల శిబిరం సహాయార్థం నాటకాలు
వేస్తుంటారు. కామిని తనను తాను రక్షించుకోవడానికి మగవేషంలో తిరుగుతుంటుంది. ఈ విషయాన్ని నాటక సమాజంలో హీరోగా వేస్తున్న కుమార్ గుర్తిస్తాడు.
అటు తప్పిపోయిన రూప్, చెల్లెలిని వెదుకుతూ మద్రాసు వస్తాడు. బతుకు తెరువు కోసం ఒక సంగీత పరికరాల దుకాణంలో పనికి చేరతాడు.

నాటక సమాజం అధిపతి దయానిధి కూతురు శశి ఫిడేలు కొనాలని అక్కడికి వస్తుంది. తనకు సంగీతం నేర్పేందుకు అతనిని కుదుర్చుకుంటుంది. వీరిరువురు

ప్రేమలో పడ్తారు. అటు దయానిధి అక్రమాలను కుమార్ ఎండగట్టడంతో నాటక సమాజం నుండి అతను కామినితో సహా బయటికి వస్తాడు. కుమార్ కొత్తనాటక
సమాజం నెలకొల్పి వూరూరా నాటకాలాడి అంతటా పేరు ప్రఖ్యాతులు పొందుతాడు. అటు కుమార్ విడిచిన నాటక సమాజంలో రూప్ చేరి నాటకాలాడితే రాళ్లు
విసురుతారు. ఇంతలో కుమార్, కామిని విడిపోవలసి వచ్చి ఏకంగా తనకు తెలీకుండానే స్వయాన అన్న రూప్‌తో పెళ్లికి వొప్పుకుంటుంది. దుఃఖంతో ఆత్మ
హత్యకు యత్నిస్తుంది. చివరికి కథ సుఖాంతమవుతుంది.

ఎన్నో ఆశలతో, ఆశయాలతో, ఉన్నత ఆదర్శాలతో తీసిన ఆదర్శం చిత్రం 1952 డిసెంబర్ 25న విడుదలైంది. కానీ, బాక్సాఫీసు వద్ద ప్రేక్షకాదరణ లభించలేదు.


1952లోనే తీశాం:
చిత్ర నిర్మాతల్లో ఒకరైన తమ్మర వేంకటేశ్వరరావు మాటల్లోనే ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 1951 మార్చిలో మద్రాసు వెళ్లి సంవత్సరాంతానికి సినిమా పూర్తి

చేద్దామనుకున్నాం. కానీ, 1952 డిసెంబర్‌లో పూర్తయింది. దీనికి దర్శకునికి కథపై పూర్తిస్థాయి పట్టులేకపోవడం ఒక కారణమైతే, మధ్యలో మాకు రావలసిన
డబ్బు సకాలానికి రాకపోవడం, డిస్ట్రిబ్యూటర్‌కి కొన్ని ఆర్థిక సమస్యలు రావడం వీటన్నిటి వల్ల చిత్రం ఆలస్యంగా విడుదలైంది. నిర్మాణ వ్యయం పెరగడంతో
సినిమా నష్టాలు తెచ్చి పెట్టింది. దాంతో మేమంతా మద్రాసు వదిలి వచ్చేశాం. దాని నెగెటివ్ ఎక్కడుందో కూడా మాకు తెలియదు. ఆ తర్వాత మరో సినిమా తీయలేదు.

అయితే, ఆదర్శం సినిమా ఆర్థికంగా అపజయం పొందవచ్చు. కానీ, టి.కృష్ణ వంటి ఎడిటింగ్, డైరెక్షన్‌లో గొప్ప పేరొందిన టెక్నీషియన్‌ని, ఆ తరువాత రాష్ట్ర స్థాయి

నంది, జాతీయ స్థాయి అవార్డులు పొందింది. అంతేకాదు, ఊరుమ్మడి బతుకులు, నిమజ్జనం వంటి చిత్రాలు తీసిన బి.ఎస్.నారాయణ, తొలిజాతీయ ఉత్తమ సంగీత
దర్శకుడి అవార్డు అందుకున్న ఎం.వి.రాజు వంటి తెలంగాణకు చెందిన వారిని తెలుగు సినిమా రంగానికి పరిచయం చేసి చరిత్రలో మైలురాయి వంటి సినిమాగా
నిలిచింది ఆదర్శం.

మన తొలి తెలుగు సినిమా తారాగణం
జానకి – జగ్గయ్య
సావిత్రి – రామశర్మ
రేవతి – ఆత్రేయ
ఇందిరాచార్య, గౌరినాథశాస్త్రి
వంగర, సరస్వతమ్మ
శ్రీవత్స, టి.కృష్ణ

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బొబ్బిలి యుద్ధం కు యాభై ఏళ్ళు

bobbili1 001 bobbili2 001 bobbili3 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ముక్తికారకం.. వ్యాఘ్రేశ్వర దర్శనం

ముక్తికారకం.. వ్యాఘ్రేశ్వర దర్శనం

  • – సి. విజయలక్ష్మి
  • 20/10/2014
TAGS:

భక్తునికి భగవంతునికి తేడా ఉండదు. భగవంతుడు నిరాకారుడు, నిస్సంగుడు అయినా భక్తుని కోరిక ప్రకారం భగవంతుడు ఏ రూపంలో ధ్యానిస్తే ఆ రూపంలో భక్తునికి అగుపిస్తాడు. లయకారునిగా పూజించబడుతున్న పరమేశ్వరుడు భోళాశంకరుడిగా ప్రఖ్యాతి వహించినవాడు. ఎందుకంటే శివ అని అంటే చాలు శివుడు మోక్షమిస్తాడు. శివ అన్నా శివలింగంపైన కాసిని నీళ్లు పోసినా, మారేడు దళం వేసినా చాలు శివుడు అత్యంత ప్రీతుడై వారిని తన దరికి చేర్చుకుంటాడు. కైలాసంలో తన ప్రక్కనే కూర్చునబెట్టుకొంటాడు. అలాంటి శివుడు కేవలం మానవులు స్తుతిస్తేనే ప్రీతి చెందుతాడనుకొంటే పొరపాటే. ఎందుకంటే శివుని మనసార స్మరించిన జంతువులకుకూడా మోక్షం లభించినదన్న శివభక్తకథలు మనకు కనిపిస్తాయి. శ్రీకాళహస్తి క్షేత్రం కూడా ఈ విషయానికే తార్కాణంగా నిలిచిఉంది. అంతటి దయాళువు అయిన శంకరుని పూజించని వారు ఎవరు ఉంటారు! శివ అనని నోరు నోరే కాదు సుమా అన్న శివభక్తుల మాట నిజమే!
ఒకానొకకాలంలో భక్తవత్సలుడైన శివుడిని ఓ విప్రుడు అమితమైన ఇష్టంతో పూజించేవాడు. నిరంతరం శివనామస్మరణతో కాలయాపన చేసేవాడు.కార్తికమాసం వచ్చిందంటే ఉపవాసాలు, అభిషేకాదులతో శివుని అనుగ్రహం పొందటానికి శాయశక్తులా శ్రమించేవాడు. అలాంటి విప్రుడు ఓ కార్తిక సోమవారం రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయం సంధ్యలో శివోపాసన చేయటానికి ఉపక్రమించి మారేడు దళానే్వషణకు వెళ్లాడు. ఎక్కడ చూచినా చంద్రుడు అగుపిస్తున్నాడు కాని మారేడు వృక్షమే ఆ విప్రునకు కనిపించలేదు. విసిగిన ఆ విప్రుడు ఆ శివుడు నాకు మారేడు దళాలతో పూజించటానికి అవకాశం ఇవ్వకపోతే నేనేమి సేతు లింగా… అనుకొని ఇంటి ముఖం పట్టాడు. అలా తిరుగు ముఖం పట్టిన ఆ ద్విజునకు ఎదురుగా మారేడు వృక్షం కనిపించింది. ‘ఓహో శివానుగ్రహం నాకు కలిగింది. ఇదిగో ఈ బిల్వవృక్షమే దానికి చిహ్నం’ అనుకొని ఎంతో సంతోషంతో మారేడు వృక్షం నుంచి దళాలను తెంపపోయాడు. అంతే అక్కడే క్షుద్బాధతో ఉన్న ఓ సింహం నరవాసనను పట్టింది.పెద్దగా గ్రాండించుకుంటూ ఈ విప్రుడున్నచోటికి రాబోతోంది. దీన్ని చూచిన విప్రుడు నిరుత్తుడయ్యాడు. ఇక జీవితాశ ఇక లేదు అనుకొంటూ గబగబా మారేడు చెట్టు ఎక్కాడు. అక్కడే అమ్మా పార్వతీ తండ్రీ శివా నన్ను రక్షించండి. ఈ పులి నుంచి నన్ను కాపాడండీ అంటూ ఎలుగెత్తి పిలుస్తున్నానుకుంటూ మనసుననే మొరపెట్టుకుంటున్నాడు. ఆ వ్యాఘ్రరాజము చెట్టుకిందనే నిలిచి పైకి విప్రునకేసి చూస్తూ గాడ్రిస్తోంది. భయంతో బిర్రబిగిసిన విప్రుడు చేసేదేమీ లేక శివనామమే నన్ను రక్షించాల్సింది ఇక ఎవరూ నన్ను రక్షించలేరు అనుకొంటూ కన్నీటితో శివనామస్మరణ చేయసాగాడు. చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. ఆకలితో నకనకలాడే కడుపుతో పులి చెట్టుకింద కూర్చుంది. చెట్టుకొమ్మను ఆసరాచేసుకొన్న విప్రుడూ శివనామస్మరణచేస్తూనే నిత్యమూ తాను చేసే పూజనే మానసికంగా చేయసాగాడు. మానసికంగా శివలింగానికి మారేడు దళాలను సమర్పిస్తున్నట్లుగా భావించసాగాడు. కాని, నిజానికి తాను తెంపిన దళాలను కిందనున్న వ్యాఘ్రంపై పడవేయసాగాడు కొద్దిసేపటికి నైవేద్యాలు సమర్పించినట్లుగాను, నీరాజనాలు పలికి ఆత్మప్రదక్షిణ నమస్కారాలు కూడా మానసికంగానే చేసేసాడా బ్రాహ్మణుడు పూజ చేసేశాననుకొంటూ కళ్లు తెరిచి చూడగా వర్తమానంలోని పులి మారేడు దళాలతో కప్పబడి చలనం లేకుండా ఉంది. ఒకవేళ పులి వెళ్లిపోయిందేమో ఈ మారేడు దళాలన్నీ నేను చేసిన పూజలోని భాగాలేనా అనుకొంటూ శబ్దం లేకుండా చెట్టుదిగి ఏమీ చేయడానికి పాలుపోక ఊరిలోనికి పరుగెత్తాడు. అక్కడున్నవారికి రాత్రి జరిగిన వృత్తాంతమంతా చెప్పాడు. ఆ సంగతి విన్న యువకులు, గ్రామపెద్దలు కర్రలు, కత్తులు పట్టుకొని అడవికి విప్రునితో వచ్చారు. అక్కడున్న మారేడుదళగుట్ట వారికి కనిపించింది. ఇదే నేను ఉన్న మారేడు చెట్టు , అవే నేను పూజించిన దళాలు వాటికింద పులి వుంది అని చెప్పగా కొందరు మెల్లగా మెల్లగా దూరం గా నిల్చుని ఆ మారేడు దళాలను తొలగించసాగారు. అలా తొలగిస్తున్నప్పుడు పులి చర్మం కూడా తొలిగిపోయింది. వారంతా ఆశ్చర్యంతో చూస్తుండగా పులి వున్న ప్రదేశంలో పానవట్టంతో కూడిన శివలింగం వారిని ఆనందచిత్తులను చేసింది. ఆ రాత్రే ఆ ప్రాంత (పెద్దాపుర) సంస్థానాధీశ్వరునికి కలలో కనిపించి శివుడు ఫలాన మారేడు వృక్షం క్రింద వ్యాఘ్ర శరీరంనుంచి తాను ఉద్భవించినట్లు తనకో ఆలయనిర్మాణం చేపట్టుమని ఆదేశించాడట. ఆ సంస్థాన ప్రభువు తన పరివారంతో అక్కడికి అపుడే చేరుకున్నాడు. అక్కడ జరిగిన సంగతిని తెలుసుకొని తనకు వచ్చిన కలను అక్కడి వారికి తెలియచేశాడు. వారంతో ఎంతో సంతోషంగా వ్యాఘ్రశరీరంనుంచి ఆవిర్భవించిన శివుడు కనుక ఈ శివుణ్ణి వ్యాఘ్రేశ్వరునిగా కొలుద్దామని నిశ్చయించుకున్నారు. అందరూ కలిసి శివునికోసం ఆలయ నిర్మాణం చేశారు. అందుకే ఈ ఆలయానికి వ్యాఘ్రేశ్వరాలయం అనే వాడుక వచ్చింది. ఈ వ్యాఘ్రేశ్వర స్వామిని పుల్లేటి కుర్తివారు అర్చకులుగా ఉంటూ తరతరాలుగా స్వామిని సేవిస్తున్నారు. ఈ ఆలయంలో వ్యాఘ్రేశ్వరునితోపాటుగా శ్రీ రుక్మిణీ సత్యాసమేత గోపాలస్వామి, శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడుకూడా కొలువై ఉన్నారు. ఈ క్షేత్రానికి దగ్గరలో ఉన్న ఇరుసు మండ గ్రామంలో రాముని ప్రతిష్ఠగా భావించబడుతున్న బాలా త్రిపుర సుందరీ సమేత ఆనంద రామేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఇక్కడే శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం, శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య ఆలయం, ఓంకారేశ్వరాలయం కూడ మనం దర్శించుకోవచ్చు.
ఇంతకీ ఈ వ్యాఘ్రేశ్వరాలయం అంబాజీపేటకు అతిసమీపంలో, రాజమండ్రికి వెళ్లు ప్రధాన రహదారిలో, ఇంకా సులభంగా చెప్పాలంటే పుల్లేటి కుర్రు గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉంది.
ఈ ఆలయంలో కార్తికామాసంలో ప్రత్యేకారాధనలు జరుగుతాయ. మహాశివరాత్రి లాంటి ప్రత్యేకమైన దినాల్లో ఇక్కడి జరిగే శివపూజ కనుల పండుగగా సాగుతుంది. ఎక్కడెక్కడి నుంచో భక్తులు రావడం శివానుగ్రహాన్ని పొందటం ఈ క్షేత్రంలో పరిపాటిగా జరుగుతున్నదే నంటారు ఇక్కడి స్థా

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అంతకంతకూ పెరుగుతున్న యాగంటి బసవన్న

అంతకంతకూ పెరుగుతున్న యాగంటి బసవన్న

  • – దాసరి దుర్గాప్రసాద్
  • 24/11/2014
TAGS:

సర్వకాల సర్వావస్థలలోనూ నిరాకారుడు నిస్సంగుడు అయన భగవంతుని ఉనికి గోచరిస్తుందిక్కడ. బోళాశంకరుడిగా పూజలందుకుంటున్న ఆ స్వామి తన భక్తులు అడిగిందే తడువుగా వరాలిచ్చే దేవుడిగా ప్రసిద్ధి చెందాడు. ప్రఖ్యాత శైవ క్షేత్రాలలో యాగంటి ఒకటి. కర్నూలు జిల్లాలో బ్రహ్మంగారు నివసించిన బనగానపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే యాగంటి. ఆహ్లాదకరమైన ప్రకృతి అందాల నడుమ ఈ క్షేత్రం అలరారుతుంది. యాగంటి అతి పురాతన శైవ క్షేత్రం. చిట్టెప్ప అనే శివభక్తుడు శివుడికోసం యాగంటి ప్రాంతంలో తపస్సు చేశాడు. అతనికి ఓ రోజు ఓ పెద్దపులి కనిపించింది. అది సాక్షాత్తు శివుడే అని గ్రహించిన చిట్టెప్ప ‘నేగంటి శివుని నేగంటి’ అని ఆనందంగా అరిచాడు. దాంతో ఆ ప్రదేశానికి ‘నేగంటి’ అనే పేరు వచ్చి క్రమంగా అది ‘యాగంటి’గా రూపాంతరం చెందింది.
నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకునే యాగంటి దివ్య క్షేత్రానికి చేరుకున్న భక్తులు ఇక్కడి ప్రకృతి అందాలకు మైమరచిపోతారు. శివమహాదేవుడు ఈ క్షేత్రాన్ని తన నివాస స్థలంగా చేసుకోవడానికి కారణం ఇదే. యాగంటి శ్రీ ఉమామహేశ్వరస్వామి ఆలయం అతి పురాతనమైనది. అడుగడుగూ ఆధ్యాత్మికానుభూతులతోపాటు విశేషమైన పౌరాణిక గాథలతో ముడిపడి ఉన్న క్షేత్రమిది.
15వ శతాబ్దంలో విజయనగర రాజైన హరిహర బుక్కరాయలు యాగంటి ఉమామహేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించాడని శాసనాల ద్వారా తెలుస్తోంది. అనంతరం వచ్చిన రాజులు ఈ ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషిచేశారు.
ఈ ఆలయానికి ముందు పుష్కరిణి ఉంది. ఈ పుష్కరిణి దాటుకుని ముందుకి వెళితే అల్లంత దూరంనుంచే ఆలయ రాజగోపురం తేజో విరాజమానమవుతుంది. వివిధ దేవతామూర్తుల శిల్పాలతో ఇది అలరారుతుంది. మెట్లమీదుగా ఈ రాజగోపురాన్ని దాటి భక్తులు ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. ఇక్కడ ఒకపక్క అలనాటి రాతి శాసనాలు, ఎదురుగా ధ్వజస్థంభము, దృష్టి మండపం మనకు గోచరిస్తాయ. ఈ మండపంలో శివలింగమొకటి ఉంది. గర్భాలయానికి ఎదురుగా నంది విగ్రహం ఉంది. ఇక్కడ కొలువుదీరిన ఉమామహేశ్వరస్వామిని సాక్షాత్తు అగస్త్యుడు ప్రతిష్టించాడు. పానవట్టంపై ఉన్న లింగం మీద శివపార్వతుల మూర్తులున్నాయి. అగస్త్యుని అభీష్టం మేరకు ఇక్కడ ఈ క్షేత్రంలో స్వామివార్లు కొలువుదీరారని ఇక్కడి స్థల పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడు వీరభద్రస్వామి. ఆ స్వామి ఇక్కడ మరోపక్క ఆలయ ప్రాంగణంలో కొలువుదీరాడు. శివుని అంశతో పుట్టిన వీరభద్రస్వామి సర్వాభరణ భూషితమై శోభాయమానంగా కానవస్తాడు. స్వామి దర్శనం సర్వ శుభకరంగా భక్తులు భావించి కైమోడ్పులర్పిస్తారు.
వెనకవైపు భాగంలో కేదారేశ్వరస్వామి మందిరం ఉంది. ఈ కేదారేశ్వరస్వామి దర్శనం పంచమహాపాతకాలను దూరం చేస్తుంది. ఇక్కడే సుబ్రహ్మణ్యేశ్వరుడూ కొలువుదీరాడు.ఇక్కడి పుష్కరిణిని అగస్త్య పుష్కరిణి అంటారు. ప్రకృతి ఒడిలో పుట్టిన జలధార పర్వత సానువుల్లో ప్రవహించి ఆలయ ప్రాంగణంలోని కోనేరులో చేరుతుంది. ఈ కోనేరులో అగస్త్యుడు స్నానమాచరించిన కారణంగా దీనిని అగస్త్య పుష్కరిణి అని పేరు వచ్చిందంటారు. ఏ కాలంలోనైనా పుష్కరిణిలోని నీరు ఒకే మట్టంలో వుండడమేఇక్కడి విశేషం. ఇందులోని నీటికి ఔషధ గుణాలున్నాయని, ఇందులో స్నానమాచరిస్తే సర్వరోగాలు నయవౌతాయని అంటారు. ఇక్కడవేంకటేశ్వరస్వామి గుహ ఉంది. దీనిని చేరుకోవడానికి సోపాన మార్గం ఉంది. ఈ గుహలో అగస్త్యమహర్షి శ్రీ వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించాడు. యాగంటిలో తొలుత ప్రతిష్టించాలనుకున్న విగ్రహమిదే. ఈ విగ్రహంలోని ఒక భాగం ఇప్పటికీ భిన్నమైనట్లు భక్తులు గమనించవచ్చు. దీనిని పక్కగా శంకర గుహ ఉంది. దీనిని రోకళ్ళ గుహ అని కూడా అంటారు. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఈ గుహలోనే తన శిష్యులకు జ్ఞానోపదేశం చేశాడని చెబుతారు. ఈ గుహలో వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహం అచ్చెమ్మ విగ్రహంతోపాటు శంకర లింగాన్ని భక్తులు దర్శించుకోవచ్చు.
యాగంటి శ్రీ ఉమామహేశ్వరస్వామి ఆలయంలో ఉన్న మరో ప్రధానాకర్షణ ఇక్కడున్న బసవన్న విగ్రహం. యాగంటి బసవన్న అంతకంతకు పెరిగి కలియుగాంతమున రంకె వేసేను అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఉదహరించిన నంది విగ్రహం ఆలయ ప్రాంగణంలో భక్తులకు దర్శనమిస్తుంది. ఈ నంది విగ్రహం రోజురోజుకి పెరుగుతుంటుంది. ఇక్కడి ముఖ మంటపంలో స్వయంభువుగా వెలసిన బసవన్న విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. దానిని చూడగానే లేచి రంకె వేయడానికి సిద్ధంగా ఉందేమోనని అనిపిస్తుంది.
ఇక యాగంటిలో కాకి కనిపించదు. కారణమేమిటంటే- పూర్వం ఈ ప్రాంతాన్ని దర్శించిన అగస్త్యమహర్షి అక్కడ వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠిస్తే బాగుంటుందని భావించాడు. ఆయన ఆ విగ్రహాన్ని మలుస్తూ వుండగా చేతి బొటనవేలుకి గాయమైందట. తన సంకల్పములో లోపమేమో అనే సందేహం తలెత్తడంతో వెంకటేశ్వరస్వామి గురించి తపస్సుచేశాడు. ఆ సమయంలో కాకులు ఆయన తపస్సుకు భంగం కలిగించడంతో, అవి ఆ ప్రాంతంలో సంచరించకుండా నిషేధాన్ని విధిస్తూ శపించాడట. అందువల్లనే ఇక్కడ కాకులు కన్పించవని చెబుతారు.
ఈ ఆలయానికి కుడివైపువున్న కొండమీద దాదాపు నూట యాభై అడుగుల ఎత్తున అనేక ప్రకృతి సిద్ధమైన గుహలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి. 12మెట్లు ఎక్కి వెళ్తే ముందర అగస్త్య గుహవస్తుంది. అగస్త్యుడు ఇక్కడ చాలాకాలం తపస్సు చేసాడని ప్రతీతి. ఇదేకాక యాగంటిలో మరికొన్ని గుహలు ఉన్నాయి. ఓ విశేషమైన ఆధ్యాత్మికానందాన్నిచ్చే మహత్తర క్షేత్రం యాగంటి. ఇక్కడి శ్రీ ఉమామహేశ్వరస్వామి దర్శనం పూర్వజన్మల పుణ్యఫలం.

===============
యాగంటికి మార్గం
కర్నూలుకు 100 కిలోమీటర్ల దూరంలో బనగానపల్లికి 13 కిలోమీటర్ల దూరంలో యాగంటి క్షేత్రం వుంది. ఈ క్షేత్రాన్ని చేరుకోవడానికి కర్నూలు వరకు వచ్చి అక్కడ నుంచి బస్సులో చేరుకోవచ్చు. అలాగే బనగానపల్లి వరకు వచ్చి అక్కడ నుంచి ఏదైనా వాహనంలో కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. వసతి సౌకర్యం: యాగంటిలో బస చేయడానికి వసతి సౌకర్యం వుంది. సత్రాలు, కాటేజీలు ఇక్కడ భక్తులకు అందుబాటులో ఉన్నాయి.
===============

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మానవీయ వాణి.. భవాని

మానవీయ వాణి.. భవాని

  • -సుధామ
  • 29/11/2014
TAGS:

సృజనకాంతి
(సి.్భవానీదేవి సాహిత్య వివేచన)
సంపాదకులు: డా.సి.ఎస్.ఆర్.మూర్తి,
వెల: రూ.350/-
హిమబిందు పబ్లికేషన్స్, 102,
గగనమహల్ అపార్ట్‌మెంట్స్,
దోమల్‌గూడ, హైదరాబాద్- 29;

నాలుగు దశాబ్దాల తన సాహిత్య కృషి వేడుక సందర్భంగా – డా.చిల్లర భవానీదేవి గారు వెలువరించిన పుస్తకాల్లో తన సాహిత్యంపై వచ్చిన వ్యాసాలు, సమీక్షలు, తన గ్రంథాలకు సంతరించబడిన పీఠికలతో తెచ్చిన ‘సృజనకాంతి’ ఒకటి. భవానిగారి కవిత్వం, కథలు, సాహితీ విమర్శ, నాటకం, బాలసాహిత్యం, జీవిత చరిత్ర ప్రక్రియా రచనలను వివేచిస్తూ డబ్భైమందికి పైగా వివిధ సాహితీవేత్తల రచనలు ఇందులో వున్నాయి.
పలు ప్రక్రియల్లో రచనాకృషి సల్పినా చేపట్టిన ప్రతి ప్రక్రియలో తనదైన సృజన కాంతిని వెలయించారు భవానిగారని ఇందులోని వ్యాసాలు విశదపరుస్తున్నాయి. దాదాపు పది కవిత్వ గ్రంథాలు వెలువరించిన భవానిగారిది తాత్త్విక సౌధం మీది కాంతిపుంజంగా మునిపల్లెరాజు, వర్తమాన దుఃఖంలో రగిలిన సంవేదన అని విహారి, సామాజిక రుగ్మతల కవిత్వీకరణ అని కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి, ప్రగతిశీల కవిత్వ జలపాతం భవానిదేవి అని ఎస్వీసత్యనారాయణ, స్ర్తివాద కవిత్వం లో బలమైన గొంతుక అని ఆచార్య ఎస్వీరామారావు అభినందించారు. మానవీయవాణి భవాని అని డా.ఎన్.గోపి పేర్కొన్నారు. గోపిగారు సృజించిన ‘నానీలు’ ప్రక్రియలో రచన చేసిన తొలి మహిళ భవానిగారే.
వివాహమా ఎంత పనిచేశావ్!
నా పుట్టింటికి నన్ను అతిథిని చేశావ్
అన్న ఆవిడ ‘నాని’ నోచుకున్న ప్రాచుర్యం అంతాఇంతా కాదు. భవాని నానీలు, హైదరాబాద్ నానీలు ఆ ప్రక్రియను ఆమె వేగవంతం చేసిన కృషికి నిదర్శనం. ఇక భవానిగారి లలిత గీతాల కవిత్వం భక్తిరక్తి మాలికలంటారు శారదా అశోక్‌వర్థన్. వాటిని ఆమని ఆ ముఖంగా సంభావించారు డా.వడ్డెపల్లి కృష్ణ. భవానిది మనలను మనకు గుర్తుచేసే కవిత్వం అంటారు ఎన్‌క్యూబ్. అంతరంగ చిత్రాలు, అమ్మానన్ను క్షమించొద్దు, ఆవిడ కథాసంపుటాలు. ‘‘ప్రస్తుతం నెలకొన్న అనుబంధాల్లో రచయిత్రికెన్నో లొసుగులు కనిపిస్తున్నాయి. ఈ అపశృతులన్నీ మాసిపోయి ఆరోగ్యకరమైన, ఆనందప్రదమైన, ఆదర్శప్రాయమైన సమాజం ఒకటి ఉద్భవిస్తే ఎంత బాగుండునన్నది ఆమె ఆకాంక్ష. పుట్టినప్పటినుంచీ సాహిత్యంచేస్తున్న ఆలోచన కూడా అ దే’’అంటారు మధురాంతకం రాజారాం గారు ఆవిడ కథల గురించి. ‘‘తను వ్రాస్తున్నదానిలో తనకి కల్తీలేని విశ్వాసం ఉండాలి. చమత్కారం, అతితెలివి, అనవసర భేషజం లేకుండా చేసిన రచనలివి’’అని మెచ్చారు తురగా జానకీరాణి.
సాహితీ విమర్శనాప్రక్రియలో స్వాతంత్య్రానంతర తెలుగు, హిందీ కవిత- తులనాత్మక పరిశీలన అనేది భవానిగారి గొప్ప సిద్ధాంత రచన. ‘ఆసక్తిని కలిగించే ఆమె అధ్యయనం’వారి సాహితీ విమర్శలో కానవస్తుందని డా.జి.బాలశ్రీనివాసమూర్తి అంటారు. రాసింది రంగస్థలానికి ‘బొబ్బిలియుద్ధం’ అనే ఒక చారిత్రక నాటకం. ఒక మహిళ అలాంటి నాటకం రాసి ప్రదర్శింపచేయడమే ఒక విశేషం! అలాగే బాల సాహిత్యంలోనూ ఆవిడ చేసిన అవిరళకృషిని చొక్కాపు వెంకటరమణ, దాసరి వెంకటరమణ, శైలజామిత్ర ప్రభృతులు ప్రశంసించారు. అలాగే, కొర్రపాటి గంగాధరరావు జీవితం-సాహిత్యం ఒక సార్థక రచనగా వెలయించారు.
ఆర్తిని స్ఫూర్తిచేసుకుని సాహిత్య దాహార్తిని కీర్తిమంతంగా మలుచుకుంటున్న ప్రజ్ఞ్ధారీణి భవాని. వారి ర చనల సాహిత్య వివేచన గ్రంథాన్ని డాక్టర్ సి. ఎస్.ఆర్.మూర్తిగారు సంపాదకులుగా ముందుకు తేవడం ముదావహం.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాయలసీమ అస్తిత్వానికి ప్రతిబింబం

రాయలసీమ అస్తిత్వానికి ప్రతిబింబం

  • -వెలుదండ నిత్యానందరావు
  • 29/11/2014
TAGS:

శ్రీకృష్ణదేవరాయ జయంత్యుత్సవ
ఉపన్యాసాలు- వ్యాసాలు
సంపాదకులు: డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి
వెల: రూ.150; పుటలు: 160
ప్రతులకు: వేమన అధ్యయన కేంద్రం
తాళ్ళకాల్వ గ్రామం,
గాండ్లపెంట మండలం
అనంతపురం జిల్లా- 515521

డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి యువకోత్సాహంతో సేకరించి ప్రచురించిన ఉపన్యాసాల వ్యాసాల సంకలనం ఇది. రాయలసీమ ప్రత్యేక అస్తిత్వాన్ని ప్రకటించడం ఈ వ్యాసాల లక్ష్యం. 1929నుండి 1936 వరకు రాయలసీమలోని వివిధ ప్రాంతాలలో జరిగిన శ్రీకృష్ణదేవరాయ జయంత్యుత్సవాల్లో విద్వాంసులు చేసిన ప్రసంగాలను, సభల విశేషాలను హరినాథరెడ్డి శ్రీసాధన కౌమోదకి మొదలయిన పత్రికల్లో నుండి సేకరించి పునర్ముద్రించారు. అప్పటివారి భావజాలాలను, ఆ నాటి స్థితిగతులను ఎనబై ఎనిమిదేళ్ళుదాటి వచ్చిన పిదప ఉన్న స్థితిగతులను పోల్చిచూడడానికి ఇలాంటి గ్రంథాలు ఎంతో అవసరం. 1929-2014 మధ్యలో మద్రాసు నుండి విడిపోవడం, ఆంధ్రుల వ్యవహార సరళి పట్ల రాయలసీమవారి భయ సందేహాలు, ఆంధ్రప్రదేశ్ ఏర్పడడం, రాయలసీమవారే ఎక్కువ కాలం పరిపాలించినా రాయలసీమ క్షామం, దారిద్య్రం తొలగకపోవడం, తెలంగాణా కలవడం, దోపిడీకి గురికావడం, విడిపోవడం మొదలైన పరిణామాలెన్నో సంభవించాయి. ఆంధ్ర తెలంగాణ రాయలసీమ మూడు ప్రత్యేకమైన భిన్నమైన మనస్తత్వాల, సాంస్కృతిక వైరుధ్యాల అపవిత్ర కలయిక ఆంధ్రప్రదేశ్. తెలంగాణ తన దారి తాను చూసుకొంది. ఇదే తరుణంలో పనిలోపనిగా రాయలసీమ కూడ ఒక ప్రత్యేక రాష్ట్రంగా అవతరించి ఉంటే బాగుండేదేమో! బైరెడ్డి రాజశేఖరరెడ్డి లాంటి ఏ ఒకరిద్దరో గొంతు వినిపించారు. కాని అది ఎందుకో పుంజుకోలేదు. భవిష్యత్తులో జరుగబోయే పరిణామమదే.
1926లో వప్పూరు రామాచార్యుల సంపాదకత్వంలో వచ్చిన శ్రీసాధన పత్రిక రాయలసీమ గొంతును బలంగా వినిపించింది. 1929-1932ల మధ్య జరిగిన ఈ ఉత్సవాల్లో గాడిచర్ల హరిసర్వోత్తమరావు, వప్పూరు రామాచార్యులు, చిలుకూరి నారాయణరావు, రొద్దం హన్మంతరావు, రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, కల్లూరి సుబ్బారావు, వార్త కవి రామచంద్రరావు, కడప కోటిరెడ్డి, నాగపూడి కుప్పుస్వామయ్య, గార్లదినె్న సుబ్బారావు, అడవి లక్ష్మీనరసింహరావు లాంటి దిగ్గజాలు పాల్గొన్నారు.
గాడిచర్ల హరిసర్వోత్తమరావు పెనుగొండలో 1929 ఫిబ్రవరి 22న జరిగిన కృష్ణదేవరాయ జయంత్యుత్సవ సభలో అన్న మాటలకు నేటికీ ప్రాసంగికత ఉన్నట్లే ఉంది. నిన్నమొన్నటి వరకు రాయలసీమవారే ఆంధ్రులలో నుత్తములు. తూర్పునాటివారన్న యేవగింపు. వారు తండోపతండములుగ వచ్చి యిచట యాచన చేయుచుండెడు పేదలు. కృష్ణానది డెల్టా యేర్పడిన వెనుక వారైశ్వర్యవంతులైరి. మన తుంగభద్ర ప్రాజెక్టు యింకను విట్టి స్థితిలో నున్నదో తెలియదు (పుట.28). మొదటినుండి రాయలసీమ వారికి ఆంధ్రుల పట్ల అనుమానమే ముఖ్యంగా విశ్వవిద్యాలయ స్థాపన దగ్గర గొడవ వచ్చింది. రాజధాని విషయమై తగాదా వచ్చింది. శ్రీ్భగ్ ఒప్పందం. ఇంతేగాక బళ్ళారి, హోసూరు లాంటి రాయలసీమ ప్రాంతాలు కర్ణాటకలో కలపడం రాయలసీమ చరిత్రలో క్షంతవ్యంకాని అంశం.
కేవలం కృష్ణరాయల సూచకంగా కాకుండా సంగమ వంశస్థాపకులైన హరిహర బుక్కరాయల నుండి ఆరవీటి వంశీయుడైన అళియరామరాయల దాకా పరిపాలించిన సీమనుద్దేశించి రాయలసీమ అని పేరు పెట్టారట. సీడెడ్ డిస్ట్రిక్ (దత్తమండలం) అన్న కర్ణకఠోరమైన అసభ్య అవాచ్య నామాన్ని తీసేయడానికి నంద్యాలలో జరిగిన ఆంధ్ర మహాసభలో ఆనాటి పెద్దలందరు తీర్మానించి వ్యవహారంలోకి తెచ్చారు. (పుట.40). కృష్ణదేవరాయలకు సంబంధించిన అనేక విషయాలను చరిత్ర పుస్తకాలలో చదువుకోవచ్చు. ఆనాటి రాయలసీమ పెద్దల పేర్లను స్మరించుకొనే అవకాశాన్ని ఈ పుస్తకం కలిగ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అంతర్జాలంలో అ‘ద్వితీయం’

అంతర్జాలంలో అ‘ద్వితీయం’

  • 30/11/2014
  • — పి.ఎస్.ఆర్.

ఇంటర్ పూర్తయ్యాక ఏ కోర్సులో చేరాలి? మిగతావారి కంటే భిన్నంగా ఏదైనా అద్భుతం సాధించాలి! తన అభిరుచికి తగ్గట్టుగా విదేశాల్లో చదివి సత్తా చూపాలి! – కార్తీక్ బుర్రలో బోలెడన్ని ఆలోచనలు *** ఇంటికొచ్చే అతిథులు మెచ్చేలా కొత్తరకం వంట ఏదైనా చేయాలి! తన ఆతిథ్యాన్ని వారు కలకాలం గుర్తుంచుకోవాలి! అయితే, ఇప్పటికిప్పుడు రుచికరమైన మంచి వంటకం చేయడం సాధ్యమా? – సరిత మదిలో సవాలక్ష సందేహాలు *** అర్జెంటుగా యోగా నేర్చుకోవాలి.. పెళ్లికి ముందే ఊబకాయం తగ్గించుకుని నాజూగ్గా మారాలి.. కానీ, పొద్దునే్న లేవాలంటే విపరీతమైన బద్ధకం.. తనకు యోగా నేర్పే గురువెవరు..? – ప్రియాంకకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి *** మనసులో చెలరేగే భావాలకు అక్షర రూపం ఇచ్చేలా కవితలు, కథలు రాయడమంటే ఎంతో ఇష్టం.. సాహిత్యం, భాషపై మమకారం ఉన్న వారితో తన మనోభావాలను పంచుకోవడం ఎలా? – ఇరవై ఏళ్ల యామినికి ఇదో ఇరకాటం *** … ఇలా ఎనె్నన్నో ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు ఉన్నవారికి దిశానిర్దేశం చేస్తూ ‘ఆత్మీయ నేస్తం’గా నిలుస్తోంది- ‘అంతర్జాలం’. వారు, వీరు అనే తేడా లేదు… వయోభేదం అసలే లేదు.. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, వయోవృద్ధులు, గృహిణులు.. ఇలా అన్ని వర్గాల వారూ నేటి ఆధునిక యుగంలో ఇంటర్నెట్‌ను విరివిగా వాడుతూ తమ జీవనశైలిని మార్చుకుంటున్నారు. ‘అక్షరాలు రాని వారు నిరక్షరాస్యులు’- ఇది నిన్నటి మాట. ‘అంతర్జాలం వాడని వారు అన్నింటా వెనుకబడిన వారే’- ఇది ఇప్పటి మాట. దైనందిన జీవితంతో ఇంటర్నెట్ ఇంతలా పెనవేసుకుపోయింది. ఇంకా ‘అభివృద్ధి చెందుతున్న దేశం’గానే పరిగణింపబడుతున్న భారత్‌లో ఇటీవలి కాలంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఈ ఏడాది చివరి నాటికి మన దేశంలో ‘ఆన్‌లైన్’ వినియోగదారుల సంఖ్య 302 కోట్లకు చేరుకుంటుందని ఐఎఎంఎ (ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) తాజా నివేదిక చెబుతోంది. అగ్రరాజ్యమైన అమెరికాను వెనక్కి నెట్టేసి అంతర్జాల వినియోగంలో రెండోస్థానానికి భారత్ చేరుకోబోతోంది. 600 మిలియన్ల వినియోగదారులతో మొదటి స్థానంలో ఉన్న చైనాను రాబోయే కాలంలో మన దేశం అధిగమించే అవకాశాలు లేకపోలేదని నిపుణులు తేల్చి చెబుతున్నారు. అన్నింటికీ ఆధారమై… ఉదయం లేచింది మొదలు తిరిగి రాత్రి నిద్రపోయే వరకూ అన్ని వ్యవహారాలకూ అంతర్జాలంపై ఆధారపడక తప్పని రోజులివి. పలు రకాల పన్నులు చెల్లించాలన్నా, పాస్‌పోర్టుకు దరఖాస్తు చేయాలన్నా, వంట గ్యాస్ బుక్ చేయాలన్నా, పెళ్లి సంబంధాలు చూడాలన్నా, ఇంట్లోనే కూర్చుని ఎక్కడో అధ్యాపకులు చెప్పే పాఠాలు వినాలన్నా, రైలు, బస్, విమానం టిక్కెట్లు రిజర్వు చేసుకోవాలన్నా, కొత్తరకం వంటలు నేర్చుకోవాలన్నా, ఆన్‌లైన్ షాపింగ్‌కు, ఆన్‌లైన్ బ్యాంకింగ్‌కు, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలన్నా, ధ్రువీకరణ పత్రాలు పొందాలన్నా … ఇలా ఒకటేమిటి? అన్ని రకాల అవసరాలకూ అంతర్జాలాన్ని ఆశ్రయించాల్సిందే. ఇంటర్నెట్ సేవలు ‘ఇంతింతై వటుడింతై’ అన్నట్టు అంచనాలకు మించి విస్తరిస్తుండగా మరోవైపు సెల్‌ఫోన్ల వినియోగం తప్పనిసరైంది. అంతర్జాలానికి అనుసంధానంగా ‘సెల్‌ఫోన్ ఆధారిత టెక్నాలజీ’ అన్ని వర్గాల వారిలో అనూహ్య మార్పులు తెస్తోంది. వ్యక్తిగతానికే కాదు, సామాజిక ప్రయోజనాలకూ వెబ్‌సైట్లు దోహద పడుతున్నాయి. మహారాష్టల్రో ఓ స్వచ్ఛంద సంస్థ హెచ్‌ఐవి వ్యాధి ప్రభావంపై గ్రామీణులకు అర్థమయ్యేలా మొబైల్ ద్వారా సైన్స్ పాఠాలు బోధిస్తోంది. పాఠశాలల్లో పిల్లల హాజరీపై ఏరోజుకారోజు తల్లిదండ్రులకు ఒడిశా ప్రభుత్వం సందేశాలు పంపుతోంది. గుజరాత్‌లో ‘ఇ-మమతా హెల్త్’ పేరుతో గర్భిణులకు ఆరోగ్య సూత్రాలను మెసేజీల ద్వారా అందజేస్తున్నారు. అవినీతిని, అరాచకాలను ఎదిరించే వారికి నేడు సామాజిక వెబ్‌సైట్లు పదునైన ఆయుధాలు. వీడియో టేపుల్ని యూట్యూబ్‌లోకి ఎక్కిస్తూ అక్రమార్కుల బండారం బయటపెట్టేందుకూ అంతర్జాలం దోహద పడుతోంది. ఇంటర్నెట్ జీవితాల్ని మార్చేస్తోంది. రాజకీయాలను శాసిస్తోంది. స్వచ్ఛంద సేవకు ఆసరా ఇస్తోంది. ‘లోకల్ టాలెంట్’ గ్లోబల్ స్థాయిలో సత్తా చాటుతోంది. అభివృద్ధికి బాటలు వేస్తోంది. విజ్ఞాన కాంతులను వెదజల్లుతోంది. నేర పరిశోధనకు అండగా నిలుస్తోంది. ఇలా ‘అంతర్జాల సాధికారత’ సమాజంపై అపార ప్రభావం చూపుతోంది. ‘ఎక్కడ అంతర్జాలం ఉండునో అక్కడ ప్రగతి వెలుగులు ప్రసరించును..’- ఇది సరికొత్త ఆర్థిక మంత్రం అంటే అతిశయోక్తి కాదు. విద్య, వైద్యం, పౌష్టికాహారం వంటి విషయాల్లో మన దేశం ఇంకా వెనుకబడే ఉన్నా- ఇంటర్నెట్ వినియోగం, సెల్‌ఫోన్ కనెక్షన్ల విషయంలో మాత్రం శరవేగంగా దూసుకుపోతోంది. ఇంట్లో టాయిలెట్ లేకున్నా చేతిలో సెల్‌ఫోన్ తప్పనిసరైంది. మొట్టమొదట- సమాచారం తెలుసుకోవడం, దాన్ని ఇతరులతో పంచుకోవడంతో ప్రారంభమైన అంతర్జాల వినియోగం ఇపుడు ‘జీవితమంత విశాలం’గా విస్తరించింది. అది ఎంతలా మారిందంటే కంప్యూటర్‌కు, స్మార్ట్ఫోన్‌కు జీవితాన్ని అర్పించుకునే పరిస్థితి వచ్చేసింది. ఉదయం నిద్ర లేచాక యోగా పాఠాలు, ఆధ్యాత్మిక విషయాలకు వెబ్‌సైట్ చూడాల్సిందే. ఆ తర్వాత కాఫీ తాగుతూ ఈ-మెయిల్స్ చూసుకోవడం, ట్విటర్‌లో ట్వీట్లు చదవడం, ఫేస్‌బుక్‌లో మిత్రులను కలుసుకోవడం, ఆఫీసులో ఉన్నా లంచ్ టైమ్‌లో సరికొత్త మొబైల్ అప్లికేషన్స్ (ఆప్స్) కోసం అనే్వషించడం, ఇంటికొచ్చాక భార్యతో ముచ్చటిస్తూ ఆన్‌లైన్ షాపింగ్ చేయడం, నిద్రపోయే ముందు వెబ్‌సైట్ల నుంచి పాత పాటలు, కమ్మటి సంగీతం డౌన్‌లోడ్ చేసుకుని వినడం… ఇలా రోజంతా నీడలా- మన వెంటే ఇంటర్నెట్ అనివార్యమైంది. రాజకీయాలకు వేదికై… భారీ బహిరంగ సభలు, పెద్ద పెద్ద హోర్డింగులు, టీవీల్లో ప్రకటనల వల్ల అధిక వ్యయప్రయాసలు తప్ప అందరినీ ప్రభావితం చేయలేమన్న నిజాన్ని గ్రహించి ఇపుడు రాజకీయ పార్టీలు ఓటర్లను అంతర్జాల వేదికపై ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఎంతోమంది నేతలు ఫేస్‌బుక్, ట్విటర్‌లో ఖాతాలు తెరిచి తమ మనోభావాలను ఎప్పటికప్పుడు సామాజిక వెబ్‌సైట్లలో బహిర్గతం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఓటర్లను వలలో వేసుకునేందుకు- నేరుగా వారికే మెసేజీలు పంపుతూ రాజకీయ పార్టీలు సరికొత్త వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఎన్నికల ప్రణాళికలు, నేతల వ్యవహార శైలిపై ఓటర్లు కూడా సామాజిక వెబ్‌సైట్లలో చురుగ్గా స్పందిస్తున్నారు. వాగ్దాన భంగానికి పాల్పడే నేతలను వెబ్‌సైట్లలో పదునైన మాటలతో ఎండగడుతున్నారు. జాతీయ పార్టీలే కాదు, పలు ప్రాంతీయ పార్టీలు కూడా సొంతంగా వెబ్‌సైట్లను నిర్వహిస్తూ ప్రజలతో మమేకం అయ్యేందుకు తాపత్రయ పడుతున్నాయి. బహిరంగ సభలకు వెళ్లేందుకు, టీవీల్లో ప్రకటనలు చూసేందుకు తీరిక లేని ఓటర్లు కచ్చితంగా ఎస్‌ఎంఎస్‌లకు, ఈ-మెయిల్స్‌కు స్పందిస్తారన్న విషయం గ్రహించి నేతలు సామాజిక మీడియా వైపే మొగ్గు చూపుతున్నారు. ట్విటర్‌లో నేతల కబుర్లు, బ్లాగుల్లో వారి సందేశాలు ఓటర్లపై గణనీయమైన ప్రభావం చూపుతున్నాయి. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ పార్టీలు తమ ప్రచారానికి సామాజిక మీడియాను ప్రధాన వేదికగా చేసుకోవడం తెలిసిందే. పోలింగ్ శాతం పెంచేందుకు రాబోయే కాలంలో ‘ఆన్‌లైన్ ఓటింగ్’ కార్యరూపం దాల్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక- ఉపాధ్యాయులు, విద్యార్థులూ కలిసి టెక్నాలజీ సాయంతో కొత్త విషయాలను నేర్చుకునే దిశగా ఆధునిక పాఠశాలలు అడుగులు వేస్తున్నాయి. మారుమూల ప్రాంతాల్లో సైతం అంతర్జాల సౌకర్యం అందుబాటులోకి రావడంతో డిజిటల్ క్లాస్ రూములు, ఆడియో వీడియో సెంటర్లు దర్శనమిస్తున్నాయి. మరోవైపు మొబైల్ లెర్నింగ్ (ఎం-లెర్నింగ్) విధానం విశ్వవ్యాప్తం కాబోతోంది. అధ్యాపకుల్లో బోధనా నైపుణ్యాలు, విద్యార్థుల్లో జీవన నైపుణ్యాలను మెరుగుపరచేందుకు ఈ విధానం దోహదం చేస్తుంది. అమెరికాపై ఆధిక్యత… మన దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య ప్రస్తుతం 213 మిలియన్లు కాగా, ఈ ఏడాది డిసెంబర్ నాటికి 32 శాతం వృద్ధితో- 302 కోట్లకు చేరుకుంటుందని ఐఎఎంఎ (ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) నిపుణులు తమ తాజా నివేదికలో పేర్కొన్నారు. 2015 నాటికి ఈ సంఖ్య 354 మిలియన్లు దాటుతుందని వారు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ఇంటర్నెట్ వినియోగంలో భారత్ ఇపుడు మూడో స్థానంలో ఉంది. 600 మిలియన్ల వినియోగదారులతో చైనా ప్రథమ స్థానంలో, 279 మిలియన్ వినియోగదారులతో అమెరికా రెండో స్థానంలో నిలిచాయి. ఈ ఏడాది అంతానికి ‘పెద్దన్న’ అమెరికాను వెనక్కి నెట్టేసి రెండో స్థానాన్ని భారత్ కైవసం చేసుకోబోతోంది. మన దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య పది మిలియన్ల నుంచి వంద మిలియన్లకు చేరుకోవడానికి దశాబ్ద కాలం పట్టింది. కేవలం గత మూడేళ్లలో ఈ సంఖ్య వంద మిలియన్ల నుంచి 200 మిలియన్లకు చేరుకుంది. అయితే, 200 మిలియన్ల నుంచి 300 మిలియన్లకు చేరుకోవడానికి ఒక్క ఏడాది వ్యవధి చాలని నిపుణులు విశే్లషిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఈ ఏడాది అక్టోబర్ నాటికి 278 మిలియన్ల మంది నెట్ వినియోగదారులుండగా, పట్టణ ప్రాంతాల్లో 177 మిలియన్ల మంది (ఏడాది కాలంలో 29 శాతం వృద్ధి) వినియోగదారులున్నారు. పట్టణ ప్రాంతాలకు సంబంధించి ఈ సంఖ్య వచ్చే నెలాఖరుకు 190 మిలయన్లకు, 2015 జూన్ నాటికి 216 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా. గ్రామీణ ప్రాంతాల్లో నెట్ వినియోగం 39 శాతం మేరకు పెరిగింది. గత నెలాఖరుకు పల్లెల్లో అంతర్జాల వినియోగదారుల సంఖ్య 101 మిలియన్లు కాగా, ఈ ఏడాది చివరినాటికి 112 మిలియన్లకు, వచ్చే జూన్ నాటికి 138 మిలియన్లకు చేరుకోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇక, దేశ వ్యాప్తంగా 278 మిలియన్ల మంది మొబైల్ ఫోన్లను వాడుతుండగా, వారిలో ప్రస్తుతం 159 మిలియన్ల మంది నెట్ కనెక్షన్ కలిగి ఉన్నారు. ఈ ఏడాది అంతానికి సెల్‌ఫోన్లలో నెట్‌ను వినియోగించేవారి సంఖ్య 173 మిలియన్లకు, 2014 జూన్‌కు 185 మిలియన్లకు చేరుకుంటుంది. పట్టణ ప్రాంతాల్లో 119 మిలియన్ల మంది, గ్రామాల్లో 40 మిలియన్ల మంది ఇపుడు సెల్‌లో వెబ్‌సైట్లను వీక్షిస్తున్నారు. వచ్చే నెలాఖరుకు పట్టణాల్లో 128 మిలియన్లు, పల్లెల్లో 45 మిలియన్ల మేరకు మొబైల్‌లో నెట్ వినియోగదారుల సంఖ్య పెరగనుంది. శాశ్వతంగా నెట్ కనెక్షన్ తీసుకోకుండా ఏరోజుకారోజు డబ్బు చెల్లిస్తూ అంతర్జాలాన్ని వీక్షించే వారి సంఖ్య మన దేశంలో ఎక్కువగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో అధిక శాతం మంది సమాచార సేకరణకు, సామాజిక వెబ్‌సైట్లను చూసేందుకు,ఈ-మెయిల్స్‌కు, శోధన (సెర్చి)కు నెట్‌ను ఎక్కువగా వాడుతున్నారు. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో వినోదం కోసమే (87 శాతం) అంతర్జాల వేదికను ఆశ్రయిస్తున్నారు. రాబోయే రోజుల్లో సెల్‌ఫోన్లలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుందని నిపుణులు గణాంకాలను వల్లెవేస్తున్నారు. నెట్ వినియోగదారుల్లో 90 శాతం మంది సమాచార సేకరణ కోసం మొగ్గు చూపుతున్నారు. ఈ-మెయిల్స్ కోసం 78 శాతం మంది నెట్‌ను వాడుతున్నారు. 75 శాతం మంది సామాజిక వెబ్‌సైట్ల కోసం దీన్ని వినియోగిస్తున్నారు. 69 శాతం మంది వినోదం కోసం నెట్‌ను ఎంచుకుంటున్నారు. వీడియోలు, ఆన్‌లైన్ గేమ్స్, సంగీతం, పాటలు, ఆన్‌లైన్ షాపింగ్, సరికొత్త ఆప్స్ కోసం నెట్‌ను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య అధికంగా ఉంటోంది. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక నైపుణ్యంతో మనం అంబరవీధిన దూసుకుపోతామా? విలువల్ని మరచి పాతాళానికి దిగజారుతామా? అన్నది మన చేతుల్లోనే ఉంది. మంచి, చెడులతో సాంకేతికతకు సంబంధం లేదు. అదంతా మనిషి విచక్షణపైనే ఆధారపడి ఉంటుంది. సాంకేతిక సామర్థ్యం వినాశనానికా? వికాసానికా? అన్నది తేల్చుకోవాల్సింది మనమే. అంతర్జాలం కూడా ఓ అణుబాంబు లాంటిదే! దాన్ని మానవ కళ్యాణానికి, సమాజ హితానికి వాడుకోవడం అందరి కర్తవ్యం. * ఆన్‌లైన్ షాపింగ్ అదరహో! ఇంటి నుంచి కాలు కదపకుండానే అవసరమైన వస్తువులను ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా కొనుగోలు చేయడం మన దేశంలో ఇటీవలి కాలంలో పెరిగింది. పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరగడంతో దేశంలో ఇ-కామర్స్ కొత్తపుంతలు తొక్కుతోంది. ప్రస్తుతం మన దేశంలో ఈ-కామర్స్ మార్కెట్ విలువ 18,600 కోట్లు దాటిందని విశే్లషకుల అంచనా. మరో రెండేళ్లలో అంటే 2016 నాటికి భారత్‌లో ఈ-కామర్స్ మార్కెట్ 15 బిలియన్ డాలర్ల (93వేల కోట్ల రూపాయలు)కు చేరుకుంటుందని ‘సెర్చింజన్’ దిగ్గజం గూగుల్ తాజా నివేదికలో పేర్కొంది. 2012లో మన దేశంలో ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు చేసేవారి సంఖ్య 80 లక్షలు కాగా, ప్రస్తుతం ఆ సంఖ్య 3.5 కోట్లకు చేరింది. ఎలక్ట్రానిక్స్, దుస్తులు, సౌందర్య సాధనాలు, పాదరక్షలు, ఫర్నిచర్… ఇలా అన్ని రకాల వస్తువులను ఇళ్లలో కూర్చునే ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా కొనుగోలు చేయడం ఇపుడు ఫ్యాషన్‌గా మారింది. 2016 నాటికి ఆన్‌లైన్ షాపర్ల సంఖ్య 10 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఆన్‌లైన్ షాపింగ్‌కు సంబంధించి ప్రధాన నగరాల్లో సర్వే నిర్వహించగా, రాబోయే 12 నెలల కాలంలో తాము అన్ని రకాల కొనుగోళ్లను ఆన్‌లైన్ ద్వారానే చేస్తామని 71 శాతం మంది స్పష్టం చేశారు. ఇంటర్నెట్ వినియోగం విస్తరించడం, ఆన్‌లైన్ షాపింగ్ పట్ల విశ్వసనీయతతో తమ వ్యాపారం రాబోయే కాలంలో అనూహ్యంగా పెరగడం ఖాయమని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఫ్లిప్‌కార్డ్, ఆమెజాన్, స్నాప్‌డీల్ వంటి సంస్థలే కాకుండా దేశంలో ప్రముఖ ఉత్పత్తిదారులు సైతం సొంతంగా వెబ్‌సైట్లను ఏర్పాటు చేసుకుని ఈ-కామర్స్ రంగంలో అడుగుపెట్టేందుకు సుముఖత చూపుతున్నారు. 2016 నాటికి నమోదు కానున్న 10 కోట్ల మంది ఆన్‌లైన్ షాపర్లలో 4 కోట్ల మంది మహిళలు ఉంటారని గూగుల్ అంచనా వేసింది. పురుషులతో పోల్చితే మహిళలే ఎక్కువగా ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నారు. సౌందర్య సాధనాలు, గృహాలంకరణ, పిల్లల వస్తువులు, ఆభరణాలు వంటివి మహిళలు విరివిగా కొంటున్నారు. డిస్కౌంట్లు, ఇతర రాయితీలు, ఉచిత పథకాలు, ఇళ్ల వద్దకే సరకులను చేర్చడం వంటి కారణాలతో ఎంతోమంది ఆన్‌లైన్ షాపింగ్‌కు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా స్మార్ట్ఫోన్ల వినియోగం పెరగడంతో ఆన్‌లైన్ షాపింగ్ చేసే వారి సంఖ్య అధికమైంది. ప్రతి ముగ్గురు ఆన్‌లైన్ షాపర్లలో కనీసం ఒకరు మొబైల్ ద్వారా కొనుగోళ్లకు ఆర్డర్ చేస్తున్నారు. మొబైల్ ఫోన్ల ద్వారా తమకు అవసరమైన వస్తువుల కోసం గూగుల్‌లో ‘సెర్చి’ చేస్తున్న వారి సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఆన్‌లైన్ షాపింగ్‌కు ఇష్టపడుతున్నా ఈ పద్ధతిలో ఇపుడు కొన్ని అసౌకర్యాలు లేకపోలేదని 62 శాతం మంది వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము కోరుకోని వస్తువులు లేదా నాణ్యతపరంగా లోపాలున్న వాటిని వెనక్కి పంపడం (రిటర్న్) సంక్లిష్టంగా, ఖర్చుతో కూడిన వ్యవహారంగా ఉందని వారు అంటున్నారు. కాగా, షాపింగ్ మాల్స్‌లో కొనుగోళ్లు చేసేవారిలో 55 శాతం మంది ఆన్‌లైన్ షాపింగ్‌లో వస్తువుల నాణ్యత, ఆర్థిక లావాదేవీల్లో భద్రత వంటి విషయాలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నాణానికి రెండో వైపు.. సాంకేతిక పరిజ్ఞానం సర్వత్రా విస్తరించి, ఇంటర్నెట్ వినియోగం అనూహ్యంగా పెరిగిన నేపథ్యంలో కొన్ని విపరిణామాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. బూతు వెబ్‌సైట్లు, ఆన్‌లైన్ గేమింగ్, క్రికెట్ బెట్టింగ్‌ల వైపు ఎంతోమంది యువకులు మొగ్గు చూపుతున్నారు. మహిళలను వేధిస్తూ వారిని లొంగదీసుకునేందుకు కొందరు యువకులు ఫేస్‌బుక్ వంటి సామాజిక వెబ్‌సైట్లను దుర్వినియోగం చేస్తున్నారు. మహిళలకు సంబంధించి అసభ్యకర వ్యాఖ్యలు, అశ్లీల ఫొటోలను వెబ్‌సైట్లలో ఉంచడం ద్వారా కొందరు యువకులు వేధింపు చర్యలకు పాల్పడుతున్నారు. కంప్యూటర్లలో, సెల్‌ఫోన్లలో వెబ్‌సైట్లను వినియోగించే వారి సంఖ్య ఎంతగా పెరుగుతోందో.. అంతే వేగంతో పెడ పోకడలు విస్తరిస్తున్నాయి. ఇంటర్నెట్‌లో ‘పోర్న్’ (అశ్లీల) చిత్రాలు చూసే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ సైట్లను చూడడం కొంతమంది యువతకు వ్యసనంగా మారుతోంది. ఫలితంగా మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు అధికమవుతున్నాయని సామాజిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్‌కు సంబంధించి- అశ్లీల వెబ్‌సైట్లు చూసే వారిలో హింసా ప్రవృత్తి అధికమవుతోందని లండన్‌కు చెందిన ‘రెస్క్యూ’ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన తాజా అధ్యయనంలో తేటతెల్లమైంది. అశ్లీల చిత్రాలను చూడడం వల్ల కలిగే అనర్థాల గురించి ఆ సంస్థ విద్యార్థుల్లో చైతన్యం కలిగిస్తోంది. హైదరాబాద్ సహా దేశంలో పలు నగరాల్లో ఆ సంస్థ విద్యార్థులను సర్వే చేయగా అనేక ఆందోళనకర అంశాలు వెలుగు చూశాయి. 21 శాతం మంది విద్యార్థులు అశ్లీల చిత్రాలు, సామూహిక అత్యాచారాల సంఘటనలను చూసేందుకు ఇష్టపడుతున్నారు. తొమ్మిదేళ్ల వయసు నుంచే కొందరు బూతు వెబ్‌సైట్లు చూస్తున్నారు. కొందరు యువకులైతే వారానికి కనీసం నాలుగు గంటల చొప్పున అశ్లీల దృశ్యాలను చూస్తూ.. నిజజీవితంలోనూ తాము అలాగే చేయాలని ఆరాటపడుతున్నారు. బూతు చిత్రాల ప్రభావంతో కొందరు ఇష్టారాజ్యంగా లైంగిక కోర్కెలు తీర్చుకుంటూ ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడుతున్నారు. హింసాత్మక అత్యాచారాలు, పిల్లలపై అకృత్యాలు చూసేందుకు మొగ్గు చూపే యువత సంఖ్య అధికంగానే ఉంటోంది. ఈ వెబ్‌సైట్లను చూసే వారిలో కనీసం 10 శాతం మంది లైంగిక నేరాలు పాల్పడుతున్నారు. అశ్లీల వెబ్‌సైట్లు చూసే విద్యార్థుల్లో 53 శాతం మంది చిన్నపిల్లలకు సంబంధించి లైంగిక చర్యలను చూసేందుకు బానిసలవుతున్నారు. ఇంటర్నెట్ కేఫ్‌లపై ఎలాంటి నిఘా లేకపోవడంతో- వాటిలో బూతు సైట్లు చూసే వారి సంఖ్య నానాటికీ అధికమవుతోంది. ఐటి చట్టం ప్రకారం అశ్లీల వెబ్‌సైట్లను నిరోధించే అవకాశం ఉన్నప్పటికీ ఆ దిశగా చర్యలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. ట్విట్టర్.. లీడర్.. బిజెపి ప్రచార రథసారథిగా ఈ ఏడాది సాధారణ ఎన్నికల్లో ఆసేతుహిమాచలం ప్రభంజనం సృష్టించి, దేశ ప్రధానిగా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న నరేంద్ర మోదీ తాజాగా మరో ఘనతను సొంతం చేసుకున్నారు. ప్రముఖ సామాజిక వెబ్‌సైట్ ‘ట్విటర్’లో అక్షరాలా ఎనిమిది మిలియన్ల మంది అనుచరుల (్ఫలోవర్స్)తో మోదీ ప్రపంచంలోనే మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ట్విటర్‌లో 43 మిలియన్ల మంది అనుచరులతో అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా ప్రథమ స్థానంలోను, క్రైస్తవ మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్ 14 మిలియన్ల మంది అనుచరులతో ద్వితీయ స్థానంలోను ఉన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచే మోదీ సామాజిక మీడియాను ప్రజలతో మమేకమయ్యేందుకు ప్రచార వేదికగా మలచుకున్నారు. భారతీయ జనతా పార్టీ ప్రచార సారథిగా బాధ్యతలు చేపట్టాక ఎన్నికల సమయంలో ఆయన ట్విటర్ వంటి సామాజిక వెబ్‌సైట్లతో ముందుకు దూసుకుపోయారు. ఎన్నికల్లో బిజెపి అఖండ విజయం సాధించి, ఈ ఏడాది మే నెలలో మోదీ ప్రధాని పదవి చేపట్టిన తర్వాత ‘ట్విటర్’లో ఆయన అనుచరుల సంఖ్య రెట్టింపయ్యింది. ట్విటర్ ద్వారా తన మనోభావాలను ఎప్పటికప్పుడు జనంతో పంచుకుంటూ ఆయన ముందుకు దూసుకుపోతున్నారు. ప్రధాని పదవి చేపట్టిన సమయంలో ట్విటర్‌లో ఆయన అనుచరుల సంఖ్య నాలుగు మిలియన్లు మాత్రమే. ఆరు నెలల వ్యవధిలోనే ఆ సంఖ్య రెండింతలైంది. ఎన్నికల్లో మోదీ గెలిచినపుడు ఆయనను అభినందిస్తూ 70,586 ‘ట్వీట్లు’ నమోదయ్యాయి. భారత్‌కు సంబంధించి ఇదే ఇప్పటికీ ఓ రికార్డుగా నిలిచిపోయింది. కాగా, విదేశీ పర్యటనలో ఉండగా ‘ట్విటర్ మిర్రర్’ను వాడిన తొలి ప్రధానిగా ఆయన ప్రపంచ స్థాయిలో కొత్త రికార్డును దక్కించుకున్నారు. ‘ట్విటర్ మిర్రర్’ అనే ప్రక్రియ ద్వారా బహిరంగ సభలో మాట్లాడుతున్న వ్యక్తి తన వెనుక దృశ్యాలను సైతం తల తిప్పకుండా చూసుకునే వీలుంది. ఇటీవల ఆస్ట్రేలియాలో పర్యటన సందర్భంగా ఆ దేశ ప్రధాని టోనీ అబ్బోట్‌తో ఓ సభలో పాల్గొన్నపుడు, క్వీన్స్‌ల్యాండ్ వర్సిటీ విద్యార్థులను కలుసుకున్నపుడు ‘ట్విటర్ మిర్రర్’ను తాను వాడినట్లు మోదీ తన ‘ట్వీట్ల’లో పేర్కొన్నారు. ***

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విశ్రమించని తోడేలు..

విశ్రమించని తోడేలు..

  • 29/11/2014
TAGS:

దక్షిణాసియా ప్రాంతీయ సహకార సమాఖ్య- సార్క్-దేశాల శిఖర సభ ముగింపు రోజైన గురువారం నాడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాకిస్తాన్ పౌర ప్రభుత్వ అధినేత నవాజ్ షరీఫ్‌తో కరచాలనం చేయడం దృశ్య ప్రసార మాధ్యమాలలో ఆవిష్కృతమైంది. ఇదే సమయంలో జమ్మూ కాశ్మీర్‌లోని ఆర్నియా ప్రాంతంలో పాకిస్తానీ ఉగ్రవాద హంతకులు మన సైనిక దళాల స్థావరాలపై ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత హింసాకాండ కొనసాగుతోందనడానికి ఇది మరో సాక్ష్యం. ఈ జిహాదీ హంతకులను పాకిస్తాన్ సైనికులు ఆధీన రేఖను దాటించి మన వైపునకు ఉసిగొల్పినట్టు కూడ వెల్లడికావడం నవాజ్ షరీఫ్ నయవంచన విధానానికి మరో సాక్ష్యం. నవాజ్ షరీఫ్ ఖాట్మండులో ఉన్న సమయంలోనే ఈ దాడి జరగడం పూర్వ నిర్ధారిత పథకానికి నిదర్శనం. భారత వ్యతిరేక మతోన్మాద బీభత్సకలాపాలను విడనాడలేదని హంతక నిష్ఠను నిరూపించుకొనడానికి నవాజ్ షరీఫ్ నాయకత్వంలోని పాకిస్తాన్ పౌర ప్రభుత్వం చేస్తున్న నిరంతర ప్రయత్నంలో గురువారం నాటి దాడి భాగం. మన సైనికుల వేషాలను ధరించి మన సైనికులతో కలిసిపోవడం హఠాత్తుగా దాడులకు పాల్పడడం పాకిస్తానీ టెర్రరిస్టులు అనుసరిస్తున్న ఎత్తుగడ. అదేరీతిలో గురువారం కూడ పాకిస్తానీలు మన సైనిక స్థావరాల-బంకర్‌ల-లోకి చొరబడిపోయారు. ఎనిమిది మందిని హత్య చేశారు. నలుగురు టెర్రరిస్టులను హతమార్చడానికి 32 గంటల సమయం పట్టడం పాకిస్తానీ వ్యూహాత్మక పటిమకు నిదర్శనం. సార్క్ సమావేశం జరుగుతున్న సమయంలో మొదలైన దాడి శుక్రవారం కూడ కొనసాగింది. నరేంద్ర మోదీ కాశ్మీర్‌లోని ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించడం పూర్వ నిర్ధారిత కార్యక్రమం. అదే సమయంలో దాడులు జరపడం తమ జిహాదీ అస్తిత్వాన్ని చాటుకోవడం పాకిస్తాన్ పౌర ప్రభుత్వ లక్ష్యం. ఇలా చాటుకోవడం వల్ల మాత్ర మే అధికార పీఠాలను అంటిపెట్టుకొని ఉండడానికి వీలవుతుందన్నది పాకిస్తానీ రాజకీయ నాయకుల విశ్వాసం. పాకిస్తాన్ రాజకీయ వేత్తల సమష్టి స్వభావం అన్యమత విధ్వంసక జిహాదీ తత్వం. పాకిస్తాన్ సైనిక దళాల స్వభావం కూడ అదే. ఇందుకు ప్రధాన కారణం పాకిస్తాన్ ప్రజల సమష్టి స్వభావం అన్యమత విధ్వంసక తత్వం. కొంతమంది ఈ సమష్టి స్వభావానికి అపవాదం కావచ్చుగాక. ఈ మతోన్మాద తత్వం ప్రస్ఫుటించే మాధ్యమం భారత వ్యతిరేకత. అందువల్ల తమ వౌలిక భారత వ్యతిరేకతను పౌర ప్రభుత్వంవారు పదేపదే చాటుకుంటూ ఉండాలి. సైనిక ప్రభుత్వ విశ్వాసం పొందడానికి ఇదే మార్గం. ఈ విశ్వాసం సన్నగిల్లిన తక్షణం సైనిక దళాల వారు పౌర ప్రభుత్వాన్ని తొలగించి వేస్తున్నారు. నరేంద్ర మోదీతో ఖాట్మండు కరచాలనం…ఆధీన రేఖ వద్ద వెన్నుపోటు…నవాజ్ షరీఫ్ వంచన వ్యూహానికి ఇదీ నేపథ్యం. గతంలో వాఘా సరిహద్దు గుండా సీమాంతర బస్సును ప్రారంభించిన సమయంలోనే నవాజ్ షరీఫ్ ప్రభుత్వం కార్గిల్‌లోని కిరాయి హంతకులను, సైనికులను ఉసిగొల్పింది. 1999నాటి నుండి కూడ షరీఫ్ స్వభావంలో మార్పు రాలేదనడానికి జమ్మూలోని ఆర్నియా ప్రాంతంలో ప్రస్తుతం జరిగిన హత్యాకాండ నిదర్శనం. ఆర్నియా ఆధీన రేఖకు సమీపంలో ఉన్న ప్రాంతం.
ఖాట్మండులో జరిగిన సార్క్ సమావేశంలో నవాజ్ షరీఫ్‌తో ద్వైపాక్షి చర్చలు జరుపడానికి నిరాకరించడం ద్వారా మన ప్రధానమంత్రి పాకిస్తాన్ నడిపిస్తున్న హింసాకాండ గురించి ఇరుగుపొరుగు దేశాల ధ్యాస పెంచగలిగారు. అంతర్జాతీయ వేదికలపై కాశ్మీరు సమస్యను ప్రస్తావించడానికి అలవాటు పడిన నవాజ్ షరీఫ్ సార్క్ వేదికపై మాత్రం అలాంటి దుస్సాహసానికి ఒడిగట్టలేదు. మనదేశంతో ఎలాగైనా మళ్లీ చర్చలు ప్రారంభించాలన్న తహతహ దీనికి కారణం కావచ్చు. ఇలా చర్చలు ప్రారంభించినట్టయితే భారత వ్యతిరేక హింసాకాండ ప్రాధాన్యం తగ్గిపోతుంది. అంతర్జాతీయంగా పాకిస్తాన్‌కు చెడ్డపేరు సమసిపోతుంది. ఈ నవాజ్ షరీఫ్ ఎత్తుగడ ఖాట్మండులో బెడిసి కొట్టింది. భారత దేశాన్ని యుద్ధంలో ఓడించలేని పాకిస్తాన్..సాయుధులను, ఉగ్రవాదులను, బీభత్సకారులను ఉసిగొల్పి ప్రచ్ఛన్న యుద్ధం సాగిస్తోందని అమెరికా ప్రభుత్వం గత నాలుగవ తేదీన బహిరంగంగా ప్రకటించింది. అమెరికా ప్రభుత్వం వారు పాకిస్తాన్‌ను ఇలా బహిరంగంగా ఉగ్రవాద వ్యవస్థగా నిర్ధారించినట్టయింది. అమెరికాకు అంతర్జాతీయంగా ఉన్న పలుకుబడి కారణంగా అనేక దేశాల ప్రభుత్వాలు పాకిస్తానీ బీభత్సకాండను ఇప్పుడు గుర్తించగలిగాయి. అందువల్ల దేశం వెలుపల ఈ చెడ్డపేరును తగిలించుకోవడం నవాజ్ షరీఫ్ ప్రభుత్వానికి తక్షణ సమస్యగా మారి ఉంది. మన ప్రభుత్వం చర్చలకు అంగీకరించి నట్టయితే అమెరికా నిర్ధారణకు, అంతర్జాతీయ అభిప్రాయాలకు విలువలేకుండా పోతుంది. ఎందుకంటె పాకిస్తాన్ జరుపుతున్న హింసాకాడకు ప్రధానంగా బలియవుతున్నది భారతీయులే…
సరిహద్దులలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం మానుకోనంతవరకు పాకిస్తాన్‌తో చర్చల ప్రసక్తే లేదన్నది ప్రస్తుత మన ప్రభుత్వ విధానం. బీభత్సకారులను ఉసికొల్పడం మాననంతవరకు పాకిస్తాన్‌తో సకల విధమైన సంబంధాలను తెగతెంపులు చేసుకోవడం మన విధానం కావాలి. నేపాల్ తదితర సార్క్ దేశాల ఒత్తడికి లొంగిన కారణంగా సమష్టి ఇంధన నిధి ఒప్పందానికి నవాజ్ షరీఫ్ ఖాట్మండులో మద్ద తు పలుకవలసి వచ్చింది. సార్క్ దేశాలలో క్రమంగా తమ దేశం ఒంటరి అయిపోకుండా నిరోధించడానికే ఈ ఒప్పందానికి నవాజ్ షరీఫ్ అంగీకరించాడు. ఈ ఒప్పందాన్ని మనదేశం ప్రతిపాదించింది కాబట్టి ఇది మన ప్రభుత్వానికి వ్యూహాత్మక విజయం. తమ దేశంలో జరిగిన సభా వేదికపై భారత పాకిస్తాన్ ప్రధానులు కరచాలన లాంఛనాన్ని నిర్వహించాలన్న నేపాల్ ప్రభుత్వ అభ్యర్థనను మన్నించడం ద్వారా నరేంద్ర మోదీ రెండు వ్యూహాత్మక విజయాలను సాధించారు. మొదటిది నేపాల్ ప్రభుత్వానికి మన ప్రభుత్వం పట్ల మరింత సృహృద్భావం ఏర్పడింది. రెండవది పాకిస్తాన్‌తో స్నేహానికి మనదేశం సిద్ధమేనన్న భావం కూడ సార్క్ అధినేతల్లో కలిగింది. అయితే ఈ స్నేహం పాకిస్తాన్ తన హింసా ప్రవృత్తిని విడనాడినప్పుడు మాత్రమే సాధ్యం కాగలదు. పాకిస్తాన్ తన ప్రవృత్తిని మార్చుకోలేదన్నది జమ్మూకాశ్మీర్‌లో మళ్లీ జరిగిన దాడుల వల్ల ధ్రువపడింది. అందువల్ల పాకిస్తాన్‌ను దారికి తేవడానికి వలసిన తదుపరి చర్యలకు మన ప్రభుత్వం పూనుకోవలసిన తరుణమిది…
పాకిస్తాన్ ప్రేరిత హత్యాకాండ ఆగనంతవరకు పాకిస్తాన్ సరిహద్దు ద్వారాలను మూసివేయడం ఒత్తడి పెంచడానికి మొదటి చర్య కాగలదు. సీమాంతర వాణిజ్యం, బస్సు సర్వీసులు, రైలు ప్రయాణాలు నిలిపివేయడం వల్ల వివిధ రకాల వేషాలలో పాకిస్తాన్ నుండి జిహాదీలు మన దేశానికి రాకపోకలు జరుపకుండా నిరోధించడానికి వీలవుతుంది. అప్పటికీ పాకిస్తాన్ తన ఉగ్రవాద శిక్షణా శిబిరాలను నిర్మూలించకపోయినట్టయితే దౌత్య సంబంధాలను సైతం తెగతెంపులు చేసుకోవాలి. పాకిస్తాన్‌ను హింసాప్రేరక వ్యవస్థగా ప్రకటించాలని కోరుతూ ఐక్యరాజ్య సమితిలో తీర్మానం ప్రవేశపెట్టడానికి సైతం మన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. గతంలో పాకిస్తాన్‌ను కామన్‌వెల్త్‌నుంచి బహిష్కరించిన చరిత్ర ఉన్నది. సార్క్‌నుండి పాకిస్తాన్‌ను తప్పించే ప్రయత్నం చేయడం అందువల్ల తప్పు కాబోదు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పత్రికలే ప్రజాళి పట్టుగొమ్మ-డా. కనుపర్తి విజయ బక్ష్‌

పత్రికలే ప్రజాళి పట్టుగొమ్మ-డా. కనుపర్తి విజయ బక్ష్‌

నార్ల వెంకటేశ్వరరావు అనే కంటే ‘నార్ల’ అంటేనే చప్పున తెలుగువారికి అర్థమవుతోంది. వి.ఆర్‌.నార్ల అని ఆయన్ని అంటుంటారు. తెలుగు పత్రికా రచనకు సరికొత్త ఒరవడిని దిద్దిన ఆయన, మూడు దశాబ్దాల పాటు సంపాదకుడుగా తెలుగుపత్రికా పాఠకులకు చిరపరిచితుడు. నార్ల సంపాదకీయాలు విశిష్టంగా, వివేచనాయుతంగానేకాక, చర్చనీయాంశాలుగా కూడా వుండేవి. కేవలం నార్ల సంపాదకీయం కోసమే పత్రిక చదివే వారుండేవారన్న అతిశయోక్తి కాదు. ఆంగ్ల భాషలోను ప్రతిభా సంపన్నుడైన నార్ల ఇంగ్లీషు జర్నలిజం వైపు కాక తెలుగులోనే కొనసాగుతూ ఎనలేని కీర్తి ప్రతిష్ఠలను ఆర్జించుకొన్నారు. ఆయన తెలుగు పత్రికల సంపాదకుడుగా కొనసాగడం తెలుగు వారు చేసుకొన్న అదృష్టమేనేమో! ఆయనీ పత్రికా రచనను ఒక పవిత్రమైన వృత్తిగా స్వీకరించి నిబద్ధతతో నిజాయితీతో పనిచేశారు. పత్రికారంగంలో తిరుగులేని వ్యక్తిగా రాణించిన నార్ల అక్కడే ఆగి పోలేదు. తెలుగు సాహిత్యంలోని వివిధప్రక్రియల్లో ఆయన ఎన్నో రచనలు చేసారు. ఆంగ్లంలోను విశిష్టమైన రచనలు చేసారు.
పత్రికా సంపాదకత్వ బాధ్యతలను నార్ల ఆషామాషీ వ్యవహారంగా ఎన్నడూ భావించలేదు. పత్రిక తన భుక్తికి పనికి వచ్చే ఒక ఉద్యోగంగా ఆయన తీసుకోలేదు. ప్రజలచేతిలో ఆయుధంగా ఆయన పత్రికలను భావించారు. ప్రజలపక్షాన నిలిచి పత్రికలు యుద్ధం చేయాలి.
ప్రపంచ చరిత్రను పరిశీలించి చూచినట్లయితే పత్రికలు ప్రజల పక్షాన ప్రజల కోసమై పోరాడిందే ఎక్కువగా కనబడుతోంది. ఎన్నో దేశాల పోరాట యోధులు మతతత్వం, నియంతృత్వం, ఫ్యూడలిజం వంటి దాష్టీకాలనుంచి ప్రజలకు విముక్తికలిగించే దశలో పత్రికలను తమ పోరాటాలకు ఉపకరణంగా చేసుకొన్నారు. మన దేశంలోను పత్రికల ఆవిర్భావ వికాసదశలను పరిశీలించినట్లయితే దేశ ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని కలిగించడానికో దురాచారాలను నిర్మూలించడానికో, సాహితీ సంస్కృతుల అభివృద్ధికో స్థాపించినట్లుగా కనబుడతోంది. ఎలకా్ట్రనిక్‌ మీడియా కంటే ముందే విశాల భారతదేశాన్ని చుట్టివచ్చి ఒక ప్రాంత వాసులకు మరొక ప్రాంత వాసుల్ని దగ్గర చేసింది పత్రికలే.
ఈనాడు ఇబ్బడి ముబ్బడిగా ఛానల్స్‌ వచ్చి పడ్డా, ఇంటర్నెట్‌ సదుపాయమున్నా అతితక్కువ ఖర్చుతో ఎక్కువ సమాచారాన్ని అందించేవి -సామాన్యుడికి సైతం చేరువులో ఉన్నవి పత్రికలే. పత్రికలు చేసింది చాలా వున్నప్పటికి చేయవలసింది ఇంకా ఎంతో వుంది. పత్రికల పైని గురుతరబాధ్యత వుంది. ఎన్నెన్నో సమస్యలు దేశాన్ని, రాష్ట్రాన్ని ఆవహించినప్పుడు పత్రికా సంపాదకుడు సంయమనంతో, వివేచనతో వ్యవహరించవలసివుంటుంది. అట్టి వివేచన, విశ్లేషణ నార్ల వారి సంపాదకీయాల్లో మనకు కనబడుతోంది. మన రాష్ట్రం, మన దేశం ప్రపంచం అయోమయ విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు 1942 నుంచి 1978 వరకు నార్ల సంపాదకుడుగా ఉన్న పత్రికల్లో ఆయన అభ్రిపాయాలు సుస్పష్టంగా, హేతుబద్ధంగా వుండేవి. స్వాతంత్య్రం వచ్చాక ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో అభివృద్ధి మార్గంలో ప్రయాణిస్తోన్న ఈ దేశంలో సమస్యలు లెక్కకు మించినన్ని ఉన్నాయి. అభివృద్ధికి నోచుకోని, కనీసావసరాలు తీరని గ్రామాలు అనేకం ఉన్నాయి. ప్రజాప్రతినిధులు, ఏలికలు, పాలకులను పక్కనబెడితే ఉన్న ఈ సమస్యలన్నింటిని వెలుగులోకి తెచ్చే నాథుడెవరు? అని ప్రశ్నించుకుంటే ఠక్కున సమాధానం వచ్చేది ప్రజాస్వామ్యానికి కాపలాదారులైన వార్తా సంస్థలే. అట్లాటి పత్రికలు ఎన్ని వుండాలి, ఎట్లా వుండకూడదు అనే విషయంలో నార్లకు నిర్దుష్టమైన అభిప్రాయాలున్నాయి.
పత్రికా సంపాదకునిగా అపార విషయ పరిజ్ఞానం ఉన్న నార్ల కవిగా, నాటకకర్తగా, విమర్శకునిగా, హేతువాదిగా, మానవతావాదిగా, శాసీ్త్రయ విజ్ఞానశీలిగాను ఎన్నో రచనలు చేసారు. వేమనను విపరీతంగా అభిమానించిన నార్ల ఆ మహాకవి వలెనే ఆటవెలది పద్యాలు రాసారు. మొదట ‘వాస్తవమ్ము నార్ల మాట’ మకుటంతో రాసి, దానిని తర్వాత ‘నవయుగాల బాట నార్ల మాట’గా మార్చారు. ఈ పద్యాల్లో చమత్కారం, సూటిదనం, వ్యంగ్యం, లోకజ్ఞత కొట్టొచ్చినట్లు కనపడతాయి. వెయ్యి వరకు రాయాలనుకొన్న ఈ పద్యాల సంఖ్య అంతవరకు చేరుకోలేదు. అనేకానేక విషయాలను ఈ పద్యాల్లో వెల్లడించిన నార్ల పత్రికలంటే ఎట్లా వుండాలి అని కొన్ని పద్యాల్లో చెప్పారు.
పాలకుల కొమ్ముకాచే పత్రికలు, పాలకులకు పాదాభివందనం చేస్తూ బానిసల్లా వార్తలు అందించే ఎడిటర్లని ఆయన ఏవగించుకొన్నారు. ‘ఎడిటరైన వాడు బిడియముచూపు చో/ ధాటి తగ్గి వృత్తి ధర్మమందు/ కడుపు కూటి వ్రాత కక్కుర్తి వ్రాతరా!’ జరుగుతోన్న విషయాలను చూచిచూడనట్లు నిర్లక్ష్యం చేస్తూ ఉన్న విషయాలను బయటపెట్టని ఎడిటర్లు ఉంటే ఏమి? ఊడితే ఏమనేది ఆయన మాట. ‘వర్తమాన జగతి పరివర్తనాలపై/ స్వేచ్ఛతోడ వ్యాఖ్య సేయనట్టి/ ఎడిటరెందుకోయి ఏటిలో గలపనా?’ అని ఆయన అన్నారు. నిజానిజాలు తెలిపే పత్రికలు ప్రజలపక్షాన పోరాడే పత్రికలకే ప్రజాస్వామ్యంలో స్థానముంటుంది. అటువంటి పత్రికలనే ప్రజలు ఆదరిస్తారు. ఏదో ఓ పార్టీకో, కులానికో వెన్నుదన్నుగ నిలిచే పత్రికల పోకడలను ప్రజలు గమనించకపోరు. ఒకవేళ ఏదేని పత్రిక పత్రికకుండవలసిన లక్షణాలను మరచి ఏలికలకు కొమ్ముకాస్తే అటువంటివి పత్రికలే కావు హంతకులే అంటారు నార్ల. ‘నీతినియతిలేని నీచుని చేతిలో/ పత్రికుండెనేని ప్రజలకు చేటు/ హంతకుని చేతికత్తి గొంతులు కోయదా?’ పాలకులు కొందరు ‘మీడియా’ను పరమ శత్రువులుగా భావిస్తూ నిప్పులు చెరగుతుంటారు. అప్పుడు నిజానికి ప్రజాళి ఏం చేయాలి? ప్రజలపక్షాన పత్రికలు పోరాడుతున్నప్పుడు, మీడియా పక్షాన వుండి అది ప్రింట్‌ లేదా ఎలక్ర్టానిక్‌ మీడియా ఏదైనప్పటికీ వాటి పక్షాన వుండి ప్రజలు పోరాడాలి. కానీ ప్రజల్లో ఓ లాటి నిర్లిప్తత, భయం, పోరాటపటిమ లేకపోవడం కూడా మనం గమనించవచ్చు.
అసలు పత్రికలే లేకుంటే? ప్రజలపక్షాన వకాల్తా పుచ్చుకుని పోరాడేదెవరు? ప్రభుత్వాల తప్పొప్పులు చిట్టా విప్పేదెవరు? ప్రజాస్వామ్యం చక్కగా పరిఢవిల్లాలంటే ప్రజల కోసమై గొంతువిప్పే ఉపకరణాల్లో పత్రిక కూడ ఒకటన్నతి ఆయన దృఢమైన అభిప్రాయం. అందుకే నార్ల అంటారు: ‘పత్రిక నియంత పక్కలో బల్లెమ్ము/ పత్రిక ప్రజాళి పట్టుగొమ్మ/ ప్రభుత వక్రమౌను పత్రికలేనిచో’.
పత్రికలు అనుసరించవలసిన ధర్మం ‘సత్యనిష్ఠ’ అనిచెప్పారు నార్ల. పత్రికలు ప్రజాళికి మేలుమాత్రమే చేయాలనేది ఆయన ప్రగాఢ వాంఛ. అట్లాకాకుండా పత్రికలు ప్రజల్లో తప్పుడు విషయాలను ప్రచారం చేస్తూ, ఏదో ఒక ప్రయోజనం నిమిత్త ం వాళ్ళల్లో పోరాట పటిమను, చైతన్యాన్ని నిర్వీర్యం చేయటం తగదు. పత్రికొకటుంటే అదే ‘కాగల కార్యాన్ని నిర్వర్తిస్తుందని ప్రజలు ఆదమరచి నిద్రించగలరని’ అంటారు. పత్రికారంగంపైన నార్ల కెంత విశ్వాసం! ఎంత మక్కువ!
నార్ల మాటల్లో ఉత్తమ సంపాదకుడు అంటే ‘విశ్వమానవ దృష్టి, శీల సంపద, ధర్మాభినివేశం’ ఉన్నవాడు. ఇవి ‘లేనివాడు ఏమైనాకావచ్చు కాని ఉత్తమ శ్రేణి సంపాదకుడు కాలేడు’ అని నార్ల అన్నారు.
డా. కనుపర్తి విజయ బక్ష్‌
(డిసెంబర్‌ 1న నార్ల జయంతి)
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కొత్త మురిపెం’ ముగిసింది!

కొత్త మురిపెం’ ముగిసింది!

రెండు తెలుగు రాష్ర్టాలలో ప్రభుత్వాలు ఏర్పడి ఆరు నెలలు పూర్తికావస్తోంది. అంటే ప్రభుత్వాల పనితీరును అధ్యయనం చేయడానికి, ఆపై విమర్శలు లేదా ప్రశంసలు చేయడానికి అవసరమైన కూలింగ్‌ ఆఫ్‌ పీరియడ్‌ పూర్తికావస్తోంది. తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం, ఏపీలో చంద్రబాబు ప్రభుత్వానికి హనీమూన్‌ పీరియడ్‌ ముగిసింది. ఈ ఆరు నెలల్లో ఈ ముఖ్యమంత్రులు ఉభయులూ తమదైన శైలిలో తెలుగు ప్రజలను ఆశల పల్లకిలో విహరింపజేస్తూ వచ్చారు. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఉమ్మడి రాష్ట్రం విడిపోయినందున అటు కేసీఆర్‌కు, ఇటు చంద్రబాబుకు ప్రత్యేక సౌలభ్యం లభించింది. ప్రత్యేక రాష్ట్రం కావాలన్న తెలంగాణ ప్రజల సుదీర్ఘ స్వప్నం ఫలించినందున, అదే సెంటిమెంట్‌ను వినియోగించి తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రత్యర్థులను, విమర్శకులను ఆత్మరక్షణలోకి నెడుతూ వచ్చారు. అదే సమయంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే భూతల స్వర్గం దిగివస్తుందని నమ్మిన తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆచరణలో ఏమవుతాయో తెలియని అద్భుత పథకాలను కేసీఆర్‌ ప్రకటిస్తూ వచ్చారు. గ్రాఫిక్స్‌ మాయాజాలం ద్వారా హైదరాబాద్‌ ఎలా ఉండబోతోందో ఆవిష్కరించారు. ఈ అద్భుతాల మధ్య రైతుల ఆత్మహత్యలు, ఆసరా లభించని ఫించన్‌దారుల మరణాలు మరుగునపడిపోయాయి. ఇక ఏపీ విషయానికి వస్తే రాజధాని కూడా లేకపోవడం, లోటు బడ్జెట్‌తో రాష్ర్టాన్ని విభజించడాన్ని తనకు అనుకూలంగా మలచుకున్న చంద్రబాబునాయుడు ఎన్నికల సందర్భంగా తాను ఇచ్చిన హామీల అమలుకు ప్రజల నుంచి ఒత్తిడి రాకుండా తప్పించుకుంటున్నారు. అదే సమయంలో రాజధాని నిర్మాణంతో పాటు, ఇతర జిల్లాలలో తాను చేయబోతున్న అభివృద్ధిని చెప్పుకొంటూ, ప్రజలు కూడా కలలు కనేలా చేసుకుంటూ వచ్చారు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన ట్రాక్‌ రికార్డును చూసిన ప్రజలు కూడా చంద్రబాబు చెబుతున్న విషయాలను నమ్ముతూ వచ్చారు. మధ్యలో వచ్చిన హుద్‌హుద్‌ తుఫాను వల్ల నష్టపోయిన విశాఖ వాసులను ఆదుకోవడానికి అహర్నిశలు శ్రమించడం ద్వారా ప్రజల మన్ననలు కూడా చూరగొన్నారు.
 గ్రామీణంలో ఆగ్రహం
హనీమూన్‌ పీరియడ్‌ ముగిసినందున ఇప్పుడు ముఖ్యమంత్రుల పనితీరుపై విమర్శకులు తమ దృష్టిని కేంద్రీకరించారు. ప్రభుత్వాల పనితీరుపై ఉభయ రాష్ర్టాల ప్రజలు వ్యక్తంచేస్తున్న అభిప్రాయాలలో సామీప్యంకనిపిస్తోంది. తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న విద్యావంతులు, ఉద్యోగులు స్వరాష్ట్రం సిద్ధించింది అన్న భావనలో మునిగితేలుతూ ప్రభుత్వ లోటుపాట్లను పట్టించుకోవడం లేదు. కేసీఆర్‌ ప్రకటిస్తున్న పథకాలను చూసి ఆనందంలో మునిగి తేలుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇంతగా అభివృద్ధి చెందబోతుందా అంటూ కలల ప్రపంచంలో విహరిస్తున్నారు. అదే సమయంలో గ్రామీణ ప్రజల మనోభావాలు మరో రకంగా ఉంటున్నాయి. నమ్మి ఓట్లు వేసి అధికారం అప్పగించిన తమను ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్టించుకోవడం లేదన్న అభిప్రాయాన్ని గ్రామీణ రైతాంగంతో పాటు పేదలు కూడా వ్యక్తంచేస్తున్నారు. కరెంట్‌ సరఫరా సక్రమంగా లేక పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉండటంతో ప్రభుత్వంపై రైతాంగం ఆగ్రహంగా ఉంది. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వంపై నమ్మకాన్ని కోల్పోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. కష్టాలలో ఉన్న రాష్ర్టాన్ని నిలబెట్టడానికి, అభివృద్ధి చేయడానికి చంద్రబాబు తపిస్తున్నారనీ, తెగ కష్టపడిపోతున్నారనీ అంటూ విద్యావంతులు సానుభూతి వ్యక్తంచేస్తున్నారు. అదే సమయంలో రుణమాఫీ అమలు కాకపోవడంతో రైతులు, డ్వాక్రా మహిళలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి ఆరు మాసాలవుతున్నా రుణమాఫీని ఇంకెప్పుడు అమలు చేస్తారంటూ అధికారపక్ష ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నారు. ముఖ్యమంత్రుల ప్రకటనలను మభ్యపెట్టే మాటలుగా గ్రామీణ ప్రజానీకం అభిప్రాయపడుతోంది. దీంతో ఉభయ రాష్ర్టాల్లో ఫీల్‌ గుడ్‌ ఫ్యాక్టర్‌ పూర్తిగా కరిగిపోతోంది. కేసీఆర్‌, చంద్రబాబు ఇరువురు కూడా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చవలసిన తరుణం ఆసన్నమైంది. మాటల నుంచి చేతల్లోకి దిగాల్సిన సమయం వచ్చింది. హైదరాబాద్‌లో కూర్చుని అంతా సవ్యంగా ఉందనుకుంటే అది వారిష్టం.
కొందరు మంత్రుల కొద్ది చేష్టలు!

ముందుగా ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఎలా ఉందో పరిశీలిద్దాం. రాష్ర్టాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయాలని చంద్రబాబు నాయుడు తపనపడుతున్నారు. అందుకు అనుగుణంగా కష్టపడుతున్నారు కూడా! పెట్టుబడులను ఆకర్షించడానికి ఇప్పటికే సింగపూర్‌, జపాన్‌ దేశాల్లో పర్యటించి వచ్చారు. గతంలో హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమను అభివృద్ధి చేయడానికి ఇదే విధంగా అమెరికాలో పర్యటించారు. ప్రముఖ ఐటీ కంపెనీలను హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. ఎవరు అంగీకరించినా, అంగీకరించకపోయినా హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమ అభివృద్ధి చెందింది చంద్రబాబు హయాంలోనే! ఐటీలో ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయని తెలుగు ప్రజలకు తెలిసివచ్చింది కూడా ఆ కాలంలోనే! ఇవాళ అమెరికా, తదితర దేశాల్లో తెలంగాణ పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారంటే అప్పుడు పడిన పునాదే కారణం. ఇప్పుడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్‌ను బహుముఖంగా అభివృద్ధి చేయాలని చంద్రబాబు కలలు కంటున్నారు. ఇది తనకు లభించిన సదవకాశంగా ఆయన భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ను అద్భుతంగా అభివృద్ధి చేయడం ద్వారా తెలుగు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని ఆయన కోరుకుంటున్నారు. పనిలో పనిగా ఏపీలో జరిగిన అభివృద్ధి చూపించి 2019 ఎన్నికల్లో తెలంగాణలో కూడా తన పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చంద్రబాబు భావిస్తున్నారు.
ఈ క్రమంలో ముఖ్యమంత్రిగా ఎంత చేయాలో అంతా చేస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీకి చెందిన సహచరులు మాత్రం ఆయనకు గుదిబండగా మారుతున్నారు. కొంత మంది మంత్రులు, వారి పుత్రులు కలిసి అందినకాడికి దండుకుంటూ ప్రభుత్వానికీ, పార్టీకీ చెడ్డపేరు తీసుకొస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగుల బదిలీలను పారదర్శకంగా ఉండేట్టుగా అధికారుల ద్వారా చంద్రబాబు జరిపించారు. ఈ చర్యపై పార్టీ నుంచి విమర్శలు రావడంతో ఇప్పుడు ఆయన మంత్రులు, శాసనసభ్యులకు స్వేచ్ఛ ఇచ్చారు. దీంతో చిన్న ఉద్యోగి, పెద్ద ఉద్యోగి అన్న తేడా లేకుండా బదిలీల్లో డబ్బు చేతులు మారింది. ఒక జిల్లాలో అయితే ఉపాధ్యాయులు, స్టాఫ్‌ నర్సుల బదిలీలకు కూడా డబ్బు చేతులు మారిందని ఆరోపణలు గుప్పుమన్నాయి. రెవెన్యూ డివిజనల్‌ అధికారి బదిలీకి కోటికి పైగా చేతులు మారిన విషయం కలకలం రేపడం తెలిసిందే. ఇక ఇసుక అక్రమ రవాణా గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఎన్నికల హామీల్లో భాగంగా డ్వాక్రా మహిళలకు ప్రకటించిన రుణమాఫీని అమలుచేయలేకపోతున్నందున వారిని మరో విధంగా సంతృప్తి పరచాలన్న ఉద్దేశంతో ఇసుక క్వారీలను డ్వాక్రా మహిళల ద్వారా నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. అయితే ఈ రంగంలో వారికి అనుభవం లేకపోవడంతో డ్వాక్రా మహిళల పేరిట అధికారపక్షానికి చెందిన కొంతమంది ఇసుకను యథేచ్చగా అమ్ముకొని అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు గండి పడుతోంది. అదే సమయంలో వినియోగదారులపై భారం పడుతోంది. పరిస్థితులు కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ హయాంలో కంటే అధ్వానంగా మారాయని కొన్ని జిల్లాలలో ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే పరిస్థితులు బాగుపడతాయనుకుంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు అవుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు మంత్రివర్గంలో ఉన్నవారిలో ఒక మంత్రి తన కుటుంబ సభ్యుల చేతిలో బందీగా మారారు. దీంతో జిల్లాలో అన్ని విషయాల్లో ఆయన కుటుంబ సభ్యుల జోక్యం పెచ్చుమీరుతోందని జిల్లా ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
మరో మంత్రి విషయానికి వస్తే బదిలీలు సహా ఏ విషయంలోనైనా పని జరగాలంటే ఆయన కుమారుడిని కలిసి సంతృప్తి పరచాలట! మొత్తంమీద ఆంధ్రప్రదేశ్‌లో మెజారిటీ జిల్లాలలో ఇదే పరిస్థితి ఉంది. పది సంవత్సరాలపాటు అధికారానికి దూరంగా ఉండటం వల్ల కాబోలు తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు రేపు లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే జోక్యం చేసుకొని ఈ ధోరణికి అడ్డుకట్ట వెయ్యని పక్షంలో రాష్ర్టాభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషి, పడుతున్న శ్రమ పూర్వపక్షమవుతాయి. చంద్రబాబునాయుడు స్వతహాగా మొహమాటస్తుడు. తప్పు చేసిన వారిని తీవ్రంగా మందలించాలని, అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తారు. తీరా ఆచరణలోకి వచ్చేసరికి జావగారిపోతారు. తప్పు చేసిన వారిని పిలిపించుకొని సుద్దులు చెప్పి పంపుతారు. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రివర్గ సహచరులపై పూర్తి పట్టు సాధించుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు కూడా మంత్రులను తన అదుపాజ్ఞలలో ఉంచుకున్నారు. ఈ విషయంలో చంద్రబాబు విఫలమయ్యారనే చెప్పాలి. విచిత్రం ఏమిటంటే ముఖ్యమంత్రి తమ మాట వినడం లేదని మంత్రులు వాపోతుంటారు. అభిప్రాయాలను వ్యక్తపరచడంలో స్వేచ్ఛ ఇవ్వడం ఎంత ముఖ్యమో, అరాచకంగా ప్రవర్తిస్తున్న మంత్రులు, వారి కుటుంబ సభ్యుల్ని కట్టడి చెయ్యడం కూడా అంతే అవసరం. ఈ రెండింటి మధ్య సమతౌల్యం సాధించే దిశగా చంద్రబాబు చర్యలు తీసుకుంటారని కోరుకుందాం. ఎన్నికల హామీలలో ప్రధానమైన రుణమాఫీ విషయంలో ప్రజలు అసహనానికి గురవుతున్నందున వారి ఆవేదన ఆగ్రహంగా మారకముందే చంద్రబాబు దిద్దుబాటు చర్యలు తీసుకోవడం అవసరం. ఏపీలో ఇప్పుడున్న పరిస్థితులలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసే ప్రతిపక్షం కూడా లేకుండా పోయింది. సంఖ్యాపరంగా వైసీపీ బలంగా ఉన్నప్పటికీ నైతికంగా ఆ పార్టీ బలహీనపడింది. ఆ పార్టీ అధినేత జగన్‌మోహన్‌ రెడ్డిపై ప్రజలకు నమ్మకం క్రమంగా సడలుతోంది. రాజశేఖర్‌ రెడ్డి మీద ఉన్న అభిమానంతో ఈ పిల్లాడికి ఓటువేస్తే ఆయన నిలబెట్టుకోలేకపోతున్నారని పలువురు భావిస్తున్నారు. జగన్‌మోహన్‌ రెడ్డి కూడా ప్రతిపక్ష నాయకుడిగా సమర్థంగా వ్యవహరిస్తున్నాడన్న నమ్మకాన్ని కలిగించలేకపోతున్నారు. తన వైఫల్యాలను గుర్తించి సరిదిద్దుకోవాల్సింది పోయి ఫలానా ఫలానా పత్రికలు మోసపూరితంగా వ్యవహరిస్తున్నందువల్లనే చంద్రబాబు అధికారంలోకి రాగలిగారని విమర్శిస్తూ తనను తాను మభ్యపెట్టుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ఆయన చేస్తున్న కొన్ని ప్రకటనలు హాస్యాస్పదంగా ఉంటున్నాయి. చంద్రబాబుకు లేనిదీ తనకు ఉన్నదీ ‘దేవుడి దయ’ అని ఆయన తరచుగా అంటుంటారు. దేవుడి దయే ఉండి ఉంటే జగనే ముఖ్యమంత్రి అయిఉండేవారు కదా. ప్రతిపక్షాలు బలంగా ఉన్నాయా, బలహీనంగా ఉన్నాయా అన్నదికాదు. ప్రభుత్వం విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారు? అన్నది అధికారపక్షం తెలుసుకోవాలి. నవ్యాంధ్రలో అభివృద్ధికి బాటలు వేయడంతోపాటు ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు కృషి చేయడానికి, కింది స్థాయిలో అవినీతిని అరికట్టడానికి చంద్రబాబునాయుడు వెంటనే ఉపక్రమించవలసిన తరుణం ఆసన్నమైంది. లేనిపక్షంలో ప్రజలే ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు.

 కట్టడి మంత్రం…!

ఇక తెలంగాణ విషయానికి వద్దాం. తెలంగాణ సెంటిమెంట్‌ను కవచంగా మలచుకొని ఆరు నెలలుగా పరిపాలిస్తున్న చంద్రశేఖర్‌ రావు విషయంలో కూడా ఇంతకుముందే పేర్కొన్నట్టు గ్రామీణ ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. అయితే ప్రభుత్వ వ్యతిరేకత ప్రాచుర్యంలోకి రాకుండా ఉండడానికి ముఖ్యమంత్రి తనదైన వ్యూహాన్ని అమలుచేస్తున్నారు. తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలను పరిశీలిస్తే మొత్తం సభలో కేసీఆర్‌ ఒక్కరే తెలివైనవారు అన్న విషయం స్పష్టమవుతోంది. మీడియాతో పాటు రాజకీయ ప్రత్యర్థులను లొంగదీసుకోవడానికి లేదా అణచివేయడానికి సరికొత్త రాజకీయ వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. రెండు చానళ్లపై నిషేధం విధించడం ద్వారా మీడియాను ఇదివరకే లొంగదీసుకున్న కేసీఆర్‌, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీపై దృష్టి సారించారు. గతంలో శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వంలో చోటుచేసుకున్న అవకతవకలపై పత్రికలలో వార్తలు వచ్చేవి. వాటి ఆధారంగా ప్రతిపక్షాలు ప్రభుత్వాలను ఇరుకున పెట్టేవి. ఇప్పుడు తెలంగాణ శాసనసభలో సీన్‌ రివర్స్‌ అయ్యింది. నిన్నటివరకు అధికారంలో ఉండి ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కొందరు ప్రముఖుల గత చరిత్రపై కేసీఆర్‌ తన సొంత పత్రికలో ప్రముఖంగా వార్తలు ప్రచురిస్తున్నారు. దీంతో సదరు నాయకులు ఆత్మరక్షణలో పడిపోగా, ప్రభుత్వం జరుపుదామనుకుంటున్న విచారణలను తామే స్వాగతించే పరిస్థితిని వారికి కల్పిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నందున ఆయనను టార్గెట్‌ చేసి వార్తలు ప్రచురించారు. నాగార్జునసాగర్‌ కాలనీలో అక్రమంగా నివసిస్తున్నారంటూ వార్తలు ప్రచురించడం ద్వారా ప్రతిపక్ష నాయకుడు కె. జానారెడ్డిని ఆత్మరక్షణలోకి నెట్టారు. కేసీఆర్‌ వ్యవహార శైలి ఎలా ఉంటున్నది? ఆయన ప్రజాస్వామికవాదా.. కాదా? క్షమాగుణం ఉందా.. లేదా? ప్రభుత్వ నిర్వహణలో కార్యదక్షత ఎంత అన్న విషయాలను పక్కన పెడితే ప్రత్యర్థి రాజకీయ పార్టీలతో మాత్రం ఆయన చెడుగుడు ఆడుకుంటున్నారు.
కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించినంత వరకు మల్లు భట్టి విక్రమార్క ఒక్కరే శాసనసభలో ముఖ్యమంత్రిని గట్టిగా నిలదీయగలుగుతున్నారు. భూముల వ్యవహారాలకు సంబంధించి కడచిన కొన్ని రోజులలో ప్రభుత్వం కొన్ని విచారణలకు ఆదేశించింది. సభాసంఘాల నియామకం వల్ల అంతిమ ఫలితం ఎలా ఉంటుందనేది పక్కనపెడితే కేసీఆర్‌ మాత్రం రాజకీయంగా ప్రయోజనం చేకూర్చుకోబోతున్నారు. హౌసింగ్‌ సొసైటీల మీద సభా సంఘాల నియామకం మంచి ఉద్దేశంతోనే జరిగినా, దానివల్ల కొన్ని చానెళ్లు దారిలోకి వచ్చే అనుబంధ ప్రయోజనం కూడా చేకూరనున్నది. జూబ్లీహిల్స్‌ హౌజింగ్‌ సొసైటీలో జరిగిన అవకతవకలలో కొన్ని చానళ్ల యజమానులకు సంబంధం ఉందన్న విషయం బహిరంగ రహస్యంగా మారింది. గత ప్రభుత్వాల హయాంలో జరిగిన అవకతవకలను ఆయుధాలుగా, కవచాలుగా మలచుకొని రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీయడంతో పాటు, ప్రభుత్వంపై ఎవరూ విమర్శలు చేయకుండా చూసుకోవాలన్న ద్విముఖ వ్యూహంతో కేసీఆర్‌ ముందుకు వెళ్తున్నారు. దీంతో మొత్తం తెలంగాణ సమాజంలో భయం ఆవహించింది. ప్రభుత్వాన్ని తప్పుపడితే ఏ ముప్పు ముంచుకువస్తుందోనన్న భయంతో ప్రశ్నించవలసిన వర్గాలు స్తబ్ధుగా ఉంటున్నాయి. ఈ కారణంగానే చైతన్యానికీ, ప్రశ్నించే తత్వానికీ ప్రతీకగా ఉండే తెలంగాణ సమాజంలో స్తబ్ధత ఏర్పడింది. ఫలితంగా ప్రభుత్వాన్ని శభాష్‌ అని మెచ్చుకోవడంలో పోటీ పడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన కొన్ని నిర్ణయాలు ప్రశ్నార్థకంగా ఉంటున్నాయి. హుస్సేన్‌ సాగర్‌ చుట్టూ 40 వరకు భారీ టవర్లు నిర్మించాలన్న నిర్ణయం ఇందులో ఒకటి. ఈ టవర్లను నిర్మించి ఏమి చేస్తారు? వాటి అవసరం ఏమిటి? అని ప్రశ్నించే వారు కరువయ్యారు. ఇప్పటికే హైదరాబాద్‌లో పలు భవనాల్లోని పై అంతస్తులు ఖాళీగా పడి ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం కొత్త రాజధానికి తరలి వెళ్తే పలు ప్రభుత్వ భవనాలు కూడా ఖాళీ అవుతాయి. సచివాలయంలో సగం భవనాలు ఖాళీ అవుతాయి. వాటిని ఏమి చేయాలో తెలియకుండా ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన టవర్‌ను నిర్మించాలన్న కేసీఆర్‌ ఆలోచనను ఆక్షేపించడానికి కూడా ఎవరూ సాహసించలేకపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలలోని సాధ్యాసాధ్యాలను పరిగణనలోనికి తీసుకోకుండా మీడియా కూడా వాటికి విశేష ప్రాచుర్యం కల్పిస్తున్నది. గతంలో ఇలాంటి నిర్ణయాలు వెలువడినప్పుడు వాటిపై సమీక్షలు ఉండేవి. ఇప్పుడు ఎవరైనా ఆక్షేపిస్తే, ఏంటి తెలంగాణలో టవర్లు కట్టుకోకూడదా? మీరు తెలంగాణ ద్రోహులు అంటూ ఒంటికాలి మీద లేస్తున్నారు. దీంతో ఎవరికి వారు మనకెందుకులే అని సర్దుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవహార శైలి గమనించిన ఒక ప్రముఖ నాయకుడు మాట్లాడుతూ, ‘రాజకీయ పార్టీలను, మీడియాను బెదిరించడం ఇంత తేలికా? ఈ సంగతి మాకు తెలిస్తే మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే చేసి ఉండేవాళ్లం కదా’ అని వ్యాఖ్యానించారు. ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా సమకూరుతున్న బలాన్ని పక్కనబెడితే తెలంగాణ శాసనసభలో కేసీఆర్‌కు ప్రజలు ఇచ్చిన మెజారిటీ అంతంత మాత్రమే. మామూలుగా అయితే అత్తెసరుగా ఉన్న ప్రభుత్వానికి సుస్థిరత సమస్యగా మారేది. తెలంగాణలో ప్రస్తుతం అందుకు భిన్నంగా ప్రతిపక్షాలే అభద్రతా భావానికి గురవుతున్నాయి. ఇది మంచి పరిణామమా కాదా అన్నది పక్కనబెడితే, ఇట్లాంటి పరిస్థితి కల్పించిన కేసీఆర్‌ను అభినందించకుండా ఎలా ఉంటాం. తెలంగాణ సమాజం విలక్షణమైనది. ప్రతిఘటనతో పాటు అణకువ కూడా ఉంటుంది. అలాంటి సమాజంలో ఫ్యూడల్‌ పాలన ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్‌ రెడ్డికి సభలో ఎదురవుతున్న పరిస్థితులే ఇందుకు నిదర్శనం. తనపై నేరుగా విమర్శలు చేసిన రేవంత్‌రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చుక్కలు చూపిస్తున్నారు. శాసనసభలో రేవంత్‌ రెడ్డికి మాట్లాడే అవకాశం లేకుండా అడ్డుకుంటున్నారు.
ఇది ఏ రకమైన ప్రజాస్వామ్యం? అధికారంలో ఉన్నవారిపై ఆరోపణలు చేయడమే నేరమన్నట్లుగా తన చర్యల ద్వారా కేసీఆర్‌ ప్రతిపక్షాలను హెచ్చరిస్తున్నారు. ఈ దేశంలోని ఏ శాసనసభలో కూడా ప్రతిపక్ష సభ్యుడికి ఇలాంటి పరిస్థితి ఎదురై ఉండదు. జార్జి ఫెర్నాండెజ్‌ రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు శవపేటికల కుంభకోణంతో ఆయనకు సంబంధం ఉందని నమ్మిన ప్రతిపక్షాలు అప్పట్లో మంత్రిగా ఆయన లోక్‌సభలో మాట్లాడకుండా అడ్డుకున్నాయి. ఇప్పుడు ప్రతిపక్ష సభ్యుడు రేవంత్‌ రెడ్డిని అధికార స్థానంలో ఉన్న టీఆర్‌ఎస్‌ అడ్డుకుంటోంది. ఈ విషయంలో మిగతా ప్రతిపక్షాలు కూడా నిస్సహాయంగా ఉండిపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఎవరి భయాలు వారికి ఉండి ఉంటాయి. కొత్తగా ఏర్పడిన తెలంగాణను కేసీఆర్‌ ఏ రీతిన అభివృద్ధి చేస్తారో తెలియదు కానీ రాజకీయ ప్రత్యర్థులను, మీడియాను, పౌర సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేయడంలో మాత్రం సరికొత్త రికార్డు నెలకొల్పారు. భవిష్యత్తులో మరెందరిపై నిర్బంధం కొనసాగుతుందో తెలియదు. రాజకీయ నాయకుడిగా విజయం సాధించడం వేరు, ముఖ్యమంత్రిగా శభాష్‌ అనిపించుకోవడం వేరు. ఆర్భాటపు ప్రకటనలతో ఒక వర్గం ప్రజలను తనవైపు తిప్పుకోవడంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రస్తుతానికి సఫలీకృతులయ్యారు. ప్రత్యర్థులను అణచివేయడం ద్వారా తెలంగాణలో తనకు రాజకీయంగా ఎదురులేకుండా చేసుకోవడంలో విజయం సాధించారు. ఇల్లు అలకగానే పండగ కాదన్నట్లు ప్రస్తుతం ఉన్న ఫీల్‌గుడ్‌ ఎప్పటికీ ఉండదు. తెలంగాణ అభివృద్ధికి తాను కంటున్న కలలను ఆచరణలోకి తీసుకురావలసిన బాధ్యత ఆయనపై ఉంది. అదే సమయంలో తెలంగాణ ప్రజానీకం ఎదుర్కొంటున్న కష్టాలపై దృష్టిసారించవలసి ఉంది. ఈ రెండూ జరగని పక్షంలో ఇప్పుడు అధికారానికి భయపడుతున్నవారే రేపు ఎదురుతిరుగుతారు. అప్పుడు ఎవరిపై విచారణలకు ఆదేశించినా, ఆంక్షలు విధించినా ఫలితం ఉండదు. తెలివితేటల్లో తనకు తానే సాటి అయిన కేసీఆర్‌కు ఈ విషయం తెలియదా?

ప్రతిపక్షాలు బలంగా ఉన్నాయా, బలహీనంగా ఉన్నాయా అన్నదికాదు. ప్రభుత్వం విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారు? అన్నది అధికారపక్షం తెలుసుకోవాలి. నవ్యాంధ్రలో అభివృద్ధికి బాటలు వేయడంతోపాటు ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు కృషి చేయడానికి, కింది స్థాయిలో అవినీతిని అరికట్టడానికి చంద్రబాబునాయుడు వెంటనే ఉపక్రమించవలసిన తరుణం ఆసన్నమైంది. లేనిపక్షంలో ప్రజలే ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు.

కొత్తగా ఏర్పడిన తెలంగాణను కేసీఆర్‌ ఏ రీతిన అభివృద్ధి చేస్తారో తెలియదు కానీ రాజకీయ ప్రత్యర్థులను, మీడియాను, పౌర సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేయడంలో మాత్రం సరికొత్త రికార్డు నెలకొల్పారు… తెలంగాణ అభివృద్ధికి తాను కంటున్న కలలను ఆచరణలోకి తీసుకురావలసిన బాధ్యత ఆయనపై ఉంది. అదే సమయంలో తెలంగాణ ప్రజానీకం ఎదుర్కొంటున్న కష్టాలపై దృష్టిసారించవలసి ఉంది. ఈ రెండూ జరగని పక్షంలో ఇప్పుడు అధికారానికి భయపడుతున్నవారే రేపు ఎదురుతిరుగుతారు. అప్పుడు ఎవరిపై విచారణలకు ఆదేశించినా, ఆంక్షలు విధించినా ఫలితం ఉండదు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -66

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -66

102-విద్యా సాగరుడైన ఆచార్య జ్ఞాన సాగర్

ఇరవై వ శతాబ్దానికి చెందినా దిగంబర జైన ఆచార్య కవి జ్ఞానసాగరుడు .అనేక మహా  కావ్యాలు రాసి ఆచార్య విద్యాసాగర్ బిరుదు పొందాడు .అసలు పేరు భూరామల్ చబ్ద .తండ్రిపేరు చతుర్భుజ్. తల్లి ఘ్రిత్ భారిదేవి .రాజ స్తాన్ లోని సికార్ జిల్లా రానోలి లో జన్మించాడు .అయిదుగు పిల్లలో రెండవ వాడు .స్వగ్రామం లో ప్రాధమిక విద్య నేర్చి ,సంస్కృతాన్ని వారణాసి లో వర్నిజి స్థాపించిన ప్రసిద్ధ  ‘’స్వాద్ వాద్ ‘’మహా  విద్యాలయం లో  అభ్యసించాడు  .అచార్యశాంతి సాగర్ సాంప్రదాయానికి చెందిన  ఆచార్య వీర సాగర్ వద్ద   జైన మతావలంబిగా(క్షుల్లక్) దీక్ష పొందాడు .దీక్ష పొందిన తర్వాత ఆయన పేరు ‘’క్షుల్లక్ జ్ఞాన భూషణ్’’ గా మారింది .అక్కడ నాలుగేళ్ళు సాధనలో గడిపి, అదే సంప్రదాయానికి చెంది న ఆచార్య  శివ సాగర్ ఆశీస్సులతో  జైపూర్ లోని ఖనియాజి ఆశ్రమం లో1959లో  జైనముని అయ్యాడు .1968లో పదోన్నతి పొంది రాజస్థాన్ లోని నశీరా బాద్ లో ఆచార్య పదవి అధిస్టిం చాడు. నశీరాబాద్ లోనే 1-6-1973లో నిర్యాణం చెందాడు .

సంస్కృతం లో మహా నిధి అయిన జ్ఞాన సాగర్ అనేక అమూల్య గ్రంధాలు రచించాడు .ఆయన గ్రంధాలపై కనీసం ముప్ఫై మంది విద్యార్ధులు పరిశోధన చేసి డాక్టరేట్ డిగ్రీలు సాదించారంటే  ఆయన గ్రంధ విస్తృతి యెంత ఉత్తమమైనదో తెలుస్తుంది .మూడు వందల మంది రిసెర్చ్ పేపర్లు ఆయన గ్రంధాలపై రాసి ప్రచురించారు .సంస్కృత భాష మృత భాష అని ,దాని పని అయిపోయిందని ,దాన్ని ఇంకెవరూ చదవరూ దాని జోలికి పోరు అని భావిస్తున్న కాలం లో జ్ఞాన సాగర్  నాలుగు సంస్కృత మహా కావ్యాలు.రాశాడు .ఇవికాక మూడు జైన గ్రంధాలు రాశాడు .వీటిని చదివి మహా మహా సంస్కృత విద్యా వేత్తలు ,పండితులే ఆశ్చర్యం పొంది ముక్కు మీద వేలేసుకొన్నారు .అంతటి ఉత్తమోత్తమ సాహిత్య సృష్టి చేశాడు జ్ఞాన సాగర్ .ఆయన పేరుమీద కేంద్ర ప్రభుత్వం పోస్టల్ స్టాంప్ ను విడుదల చేసింది .

Inline image 1  Inline image 2

103- జగద్గురు శ్రీ రామ భద్రాచార్య

14-1-1950లో గిరిధర్ మిశ్రా గా జన్మించిన రామ భద్రా చార్య బహుభాషా వేత్త ,కవి వేదాంతి ,బహు గ్రంధకర్త ,మహా విమర్శకులు నాటక కర్త ,.గాయకులూ సంగీత దర్శకులు ‘’చిత్రకూట  కదా కారులు అన్నిటికి మించి నలుగురు జగద్గురువులలో ఒకరుగా  గా సుప్రసిద్ధులు .సర్యుపరీన బ్రాహ్మణ కుటుంబం లో రామ భాద్రాచార్య ఉత్తర ప్రదేశ్ లోని జానాపూర్ జిల్లా శాండీ కుర్ది గ్రామం లో జన్మించారు వీరిది వాశిస్టగోత్రం .తల్లి శచీదేవి. తండ్రి పండిత రాజ దేవ మిశ్రా .ఈయన మేనత్త భక్త మీరా బాయి భక్తురాలు .

రామ భాద్రాచార్య చిత్రకూటం లో సంత్  తులసీదాస్ స్మారకార్ధం’’ తులసీ పీఠం’’స్థాపించారు .దానికి వ్యపస్తాపక అధ్యక్షులుగా పని చేశారు .చిత్రకూటం లోని జగద్గురు రామ భాద్రాచార్య వికలాంగుల విశ్వ విద్యాలయాన్ని స్థాపించి దాని చాన్సలర్ గా జీవితాంతం ఉన్నారు .వికలాంగులు గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు చేయటానికి ఏర్పడిన ప్రత్యెక విశ్వ విద్యాలయం ఇది .రామ భాద్రాచార్య చిన్న నాట రెండవ నెలలోనే కంటి చూపు కోల్పోయారు .జీవితాంతం అంధ జీవితమే గడుపుతున్నారు .ఎన్ని వైద్యాలు చేసినా చూపు రాలేదు .ఎవరైనా చదివితే విని అర్ధం చేసుకొని అనంత జ్ఞానాన్ని సంపాదించారు .తానూ చెప్పి ఎవరి చేతనైనా రాయిస్తారు .అలానే అనంత గ్రంధ రచన చేశారు .ఇదొక అద్భుతమైన విషయం కనీ విననట్టిది .పది హేడవ ఏడు వరకు ఏ విద్యనూ నేర్చుకోలేక పోయారు .బ్రెయిలీ లిపిని ఏ సందర్భం లోనూ వాడని విద్యా వేత్త ఆయన .ఆదర్శ గౌరీశంకర్ సంస్కృత విద్యాలయం లో చేరారు .ఏక సందా గ్రాహి అవటం వలన చదివి వినిపించినదంతా ఆకళింపు చేసుకొనే వారు .సంపూర్ణానంద్ సంస్కృత యూని వర్సిటి లో వ్యాకరణం చదివారు .ఆచార్య ,మాస్టర్ డిగ్రీ లు సాధించారు .యూని వర్సిటి గ్రాంట్ కమిషన్ నుంచి స్కాలర్షిప్ పొంది అయిదేళ్ళు చదివి సంస్కృతం లో విద్యా వారిధి డిగ్రీ పొందారు ‘’.ఆధ్యాత్మ రామాయణములో పాణిని ప్రయోగం ‘’అనే అంశం పై పరిశోధన చేసి అందులో అపాణినీయప్రయోగాలపై ప్రత్యెక ద్రుష్టి తో రాశారు .పి .హెచ్. డి .సాధించిన తర్వాత అదే వర్సిటీలో వ్యాకరణ శాఖ అధ్యక్ష పదవి కి ఆహ్వానించినా  ,హిందూ మతం సంస్కృత వ్యాప్తి కోసం కృషి చేస్తానని సున్నితం గా తిరస్కరించి  తన కోరికను సఫలం చేసుకొన్నారు .

రామ భాద్రాచార్య 22భాషలలో నిష్ణాతులు ,ఆశువుగా కవిత్వం చెప్ప గల నేర్పున్నవారు .సంస్కృత, హిందీ ,అవధి మరాటీ మొదలైన భాషలలో అనేక గ్రంధాలు రచిం చారు .వందకు పైగా గ్రంధాలు యాభైకి పైగా పరిశోధన పత్రాలు రాశారు .ఇందులో నాలుగు సంస్కృత మహా కావ్యాలున్నాయి .తులసీదాసు రామ చరిత మానస్ ,హనుమాన్ చాలీసా ,పాణిని సంస్కృత ‘’అష్టాధ్యాయి ‘’ లపై విపుల మైన వ్యాఖ్యానాలు రచించారు .’’ప్రస్తాన త్రయం ‘’కు సంస్కృతం  భాష్యం రాశారు .సంస్కృత వ్యాకరణం న్యాయ ,వేదాంతా లలో మహా పండితునిగా గుర్తింపు పొందారు .భారత దేశం మొత్తం మీద తులసీ దాస్ పై పూర్తీ సాధికారిత ఉన్న శ్రేష్ట విద్వాంస పండితులని గుర్తింపు పొందారు .రామ చరిత మానస్ కు అద్భుత వ్యాఖ్యానం రచించారు .రామాయణ భాగవతాలకు’’ కదా కళా కారుని’’గా ప్రసిద్ధి చెందారు .ఆయన కదా ప్రదర్శనలు భారత దేశం లోని ప్రతి పట్టణం లోను నిర్వహించారు .అవి రేడియో టి వి లద్వారా ప్రసారమై గొప్ప గుర్తింపు లభించింది .విశ్వ హిందూ పరిషద్ అగ్ర నాయకులలో రామభాద్రాచార్య ఒకరు .

రామభాద్రాచార్య జీవితాంతం బ్రహ్మ చారిగా ఉన్నారు .వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించి వైరాగ్యం పొంది రామానంద సంప్రదాయం లో విరక్త దీక్ష తీసుకొన్నారు .

Inline image 3  

సశేషం

మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ -29-11-14-ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల అవితా గీర్వాణం -65

గీర్వాణ కవుల అవితా గీర్వాణం -65

100-సాహిత్య రత్న రహస్ బిహారీ ద్వివేది

ఉత్తర ప్రదేశ్ లోని అలహా బాద్ లో  రహస్ బిహారీ ద్వివేది 2-1-1947 జన్మించాడు సంస్కృతం లో రాష్ట్ర పతి ప్రశంసా పత్రం2012లో  అందుకొన్నాడు .సంస్కృత సాహిత్యం లో ఆచార్య డిగ్రీని ,సాహిత్య రత్నను ,ఏం. ఏ .లను పొందాడు .1977లో మధ్య ప్రదేష్ లోని జబల్పూర్ లో ఉన్న రాణి దుర్గా వతి యూని వర్సిటి నుండి సంస్కృతం లో పి. హెచ్ .డి.పొందాడు  .సంస్కృత మహా కావ్యాల గురించి ధీసిస్ సమర్పించాడు .తర్వాత జబల్పూర్ లో రాణి దుర్గావతి యూని వర్సిటి సంస్కృత శాఖలోనే అధ్యాపకునిగా చేరి శాఖాధ్యక్ష హోదా పొందాడు .ఆ కాలం లో 16మంది ఆయన వద్ద డాక్టరేట్ దీసేస్ చేశారు .విద్యా వాచస్పతి డిగ్రీ ని పొందాడు .

సంస్కృత హిందీ ఆంగ్లాలలో సుమారు యాభై పరిశోధనా పత్రాలను సమర్పించిన మేటి విద్యా వేత్త ద్వివేదీ .అందులో ముఖ్యమైనవి-ఏడవ శతాబ్దం లో సంస్కృత మహా కావ్యాలపై విమర్శనాత్మక పరిశోధన చేసి పి హెచ్ డి కి ధీసిస్ ను రాశాడు .తరువాత ‘’అర్వాచీన సంస్కృత కావ్యాను శీలనం ‘’ను ఆధునిక సంస్కృత కావ్యాలను విశ్లేషిస్తూ 1981లో రాశాడు .దీన్ని మధ్య ప్రదేశ్ లోని సాగర్ లో ఉన్న సాగరిక సమితి ముద్రించింది .సంస్కృత విమర్శనా వ్యాస సంకలం గా ‘’సాహిత్య విమర్శనం ‘’ను 2002లో తెస్తే సంపూర్ణానంద సంస్కృత విశ్వ విద్యాలయం ప్రచురించింది .స్వస్తి సందేశం ,స్వరిత సందేశం ,సంస్కృత వాజ్మయే విజ్ఞా న్ ,తీర్ధ భారతం అనే భారతీయ యాత్రా స్థలాలపై గ్రంధం రాశాడు

Inline image 1  

101-శతావ దాని గణేష్

సంస్కృత కన్నడ ,ఆంద్ర భాషలలో శతావధానం చేసి ఆశుఅవిత్వం లో దిట్ట అని పించుకొన్న బహు భాషా వేత్త ఆర్ .గణేష్ కర్నాటక లోని కోలార్ లో 4-12-196న జన్మించాడు .తండ్రి శంకర్ అయ్యర్ .తల్లి అలివేలమ్మ .చిన్నప్పుడు సంస్కృత తమిళ కన్నడ తెలుగు భాషా పరిచయం ఏర్పడింది .సంస్కృత కావ్యాలు చదివి జీర్ణం చేసుకొని పదహారో ఏట నే కవిత్వం చెప్పాడు .స్కూలు లో ఇంగ్లీష్ అభ్యసిస్తూ ప్రాకృత ,పాళీ ,గ్రీక్ లాటిన్ ఇటాలియన్ భాషల్లో ప్రావీణ్యం సంపాదించాడు .మెకానికల్  ఇంజినీరింగ్ లో బి .ఇ .పాసైనాడు .మెటలర్జీ లో ఏం ఎస్ .చేశాడు .మెటీరియల్స్ ,సైన్స్ మెటలర్జీ లలో పరిశోధన చేశాడు .సంస్కృతం లో ఏం ఏ .డిగ్రీని కన్నడం లోహంపి యూని వర్సిటి నుండి  డి .లిట్ ను ‘’అవధాన కళ’’పై ధీసిస్ రాసి పొందాడు .

శతావధానం

చక్కని చిక్కని ఆశుదారా  కవిత్వం ,సునిసిత మేధా ,అవగాహన, ధారణా ,జ్ఞాపక శక్తి ,హాస్య స్పూర్తి ,చిక్కులను అధిగమించే ఓర్పూ నేర్పూ  విస్తృత లోక పరిశీలన ,బహు శాస్త్ర పరిచయం, ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అన్నీ పుష్కలం గా ఉన్న గణేష్ అష్టావధాన శాతావదానాలను అలవోక గా చేసి  ప్రుచ్చకులను , సభాసదులను మెప్పించాడు .సంస్కృత కన్నడ తెలుగు -మూడు భాషలలో గణేష్ 1000కి పైగా అవధానాలు చేసి అపర  గణేశుడని పించాడు  .అమెరికా యూరప్ దేశాలలో ఇరవైకి పైగా అవధానాలు చేసి మెప్పుపొండాడు .15-12-1991 నమొదటి శతావదానాన్ని బెంగళూర్ లోని భారతీయ విద్యా భవన్ లో నిర్వహించాడు .మరో పదిహేను రోజుల్లో మరొక  అవధానాన్ని చేశాడు .ఇలా జైత్ర యాత్ర సాగింఛి2012లో పూర్తిగా కన్నడం లోనే చేశాడు .

గ్రంధ రచన

అవధానాలు చేసి ఊరుకోలేదు గణేష్ .’శతావధాన  శారద’’,  ‘’శతావధాన శ్రీవిద్య ‘’శతావధాన శాశ్వతి ‘’అనే గ్రంధాలు కూడా రాశాడు .ఇవి అవధాన విద్యలో రాణించాలనుకొన్న వారికి కరదీపికలు గా ఉన్నాయి .నాట్యాలకు పాటలు రాశాడు .యక్షగాన విద్య అభ్యసించి ,’’ఏక వ్యక్తీ యక్ష గానం ‘’అనే దాన్ని తాను తయారు చేసి ఎన్నో ప్రదర్శనలలిచ్చి తన ప్రజ్ఞను చాటాడు .ఈ విద్యకు ‘’మంటప ప్రభాకర ఉపాధ్యాయ ‘’అనే బిరుదు పొందాడు .షేక్స్పియర్ నాటకం  హామ్లెట్ కు కన్నడాను సరణం గా ‘’హొరాషియో ‘’రాసి  తానె ముఖ్యపాత్ర ధరింఛి ప్రదర్శించాడు .

సంస్కృతం లో గణేష్ –అన్వేషణం అనే ఏకాం కిక ,సాంబ లహరి అనే ఖండకావ్యం ,శంకర వివేకీయం అనే పద్య కావ్యం,అంతః కాంతి ,సౌగందిక చిత్ర  చూళిక (చిత్ర కావ్యం ),,శ్రీ కృష్ణ లహరి ,శ్రీ జాంబ లహరి ,శృంగార లహరి ,జటా శకుంతల ,ఇళాకైవల్యమ్ ,ఏవం అపిర్వతః ,చాటు చంద్రిక ,శ్రీ చంద్రేశ్వరి స్తవం ,మధు సద్మ అనే సంస్కృత కవిత్వ సంకలం .

కన్నడం లో వితాన ,నిత్య నీతిమొదలైన ఇరవై గ్రంధాలను రాశాడు .

బిరుదులూ పురస్కారాలు

గణేష్ కు కర్ణాటక ప్రభుత్వం ‘’రాజ్యోత్సవ ప్రశస్తి ‘’పురసారాన్ని అందించి గౌరవించింది .కావ్య కంఠప్రశస్తి ,రాష్ట్రీయ యువ ప్రతిభా పురస్కార ,బాదరాయణ –వ్యాస పురస్కారం ,తుంకూర్ యూని వర్సిటి నుండి గౌరవ డాక్టరేట్ ,చిత్ ప్రబంధ అవార్డ్ ,ఎర్యా ,సేదియాపు అవార్డులెన్నో ఆయన్ను వరించాయి .ఇంతటి బహుముఖ ప్రజ్ఞాశీలి డా.ఆర్ గణేష్ నడిచే సరస్వతిగా గణపతిగా భాసిస్తున్నాడు .

Inline image 2    

 

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-11-14-ఉయ్యూరు

 

 

 

 

.

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కోటి హనుమాన్ చాలీసా పారాయణ పూర్ణా హుతి-30-11-14 ఆదివారం -ఘంట సాల మ్యూజిక్ కాలేజి -విజయవాడ

chalisa1 001 chalisa2 001

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కాశ్మీర్ ప్రజల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి

కాశ్మీర్ ప్రజల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి

  • -స్వపన్ దాస్‌గుప్తా
  • 29/11/2014
TAGS:

జమ్ముకాశ్మీర్‌లో జరిగిన తొలిదశ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 71శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం, ఏవిధమైన హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడం నిజంగా భారత ప్రజాస్వామ్యంలోని గొప్పతనాన్ని మరోసారి ప్రపంచానికి చాటినట్టయింది. రాష్ట్ర ప్రజల్లో చొరబాట్లపై నెలకొనివున్న తీవ్ర వ్యతిరేకతను, ఈ ఎన్నికలు ధ్రువపరిచాయి. ఎగ్జిట్‌పోల్స్‌పై నిషేధం విధించడం వల్ల, విశే్లషకులు తగిన ఆధారాల కోసం మీడియా రిపోర్టులపైనే ఆధారపడక తప్పదు. ఇవి విస్తృతంగా మూడు అంశాలను మనకు తెలియజేస్తున్నాయి. మొదటిది, ముఫ్తీ మహమ్మద్ సరుూద్ కుమార్తె మహబూబా ముఫ్తీ నేతృత్వలోని పీపుల్స్ డెమాక్రటిక్ పార్టీ కాశ్మీర్‌లోని 46 స్థానాల్లో లాభం పొందబోతున్నది. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నేతృత్వం వహిస్తున్న నేషనల్ కాన్ఫరెన్స్, దాని సహచర కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తుడిచిపెట్టుకొని పోవడం ఖాయం. రెండవది భారతీయ జనతాపార్టీ రాష్ట్రంలో బలోపేతమైందనేది స్పష్టమైంది. బహుశా జమ్ము ప్రాంతానికి చెందిన వ్యక్తే రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో, ఇప్పటి వరకు హురియత్ కాన్ఫరెన్స్‌తో తప్పనిసరి పరిస్థితుల్లో అంటీముట్టని విధంగా సంబంధాలు నెరపుతున్న వారు ప్రస్తుత ఓటింగ్‌లో పాల్గొనడం ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నది. ఇక చివరిగా గత సాధారణ ఎన్నికల్లో భాజపా విజయం సాధించిన మూడు లోక్‌సభ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున విజయాన్ని నమోదు చేసుకోబోతున్నది. జమ్ములో భాజపా బలోపేతమయిందంటే..అక్కడ కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు పూర్తిగా దెబ్బతినడమే కారణం. ఇక లఢక్ ప్రాంతంలో భాజపా తన ఉనికిని చాలా శక్తివంతమైన రీతిలో చాటడమే కాకుండా, కాశ్మీర్ లోయలోని ఆ రు నియోజక వర్గాల్లో దూసుకుపోతున్నది.
జమ్ముకాశ్మీర్ అసెంబ్లీలో మొత్తం 87 స్థానాలున్నాయి. రాష్ట్రంలో సువిశాల ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఈ అసెంబ్లీ స్థానాల్లో, భాజపా 44+ స్థానాల్లో ఎంతవరకు విజయాలను నమోదు చేస్తుందనేది ప్రశ్నార్థకం. జమ్ము, లఢక్ ప్రాంతాల్లో మొ త్తం స్థానాలను గెలుచుకున్నా, కాశ్మీర్ లోయలోని ఆరుస్థానాలను ఆశ్చర్యం కలిగించే రీతిలో కైవసం చేసుకున్నప్పటికీ మ్యాజిక్ ఫిగర్ 44+ చేరుకోవడం సాధ్యమవుతుందా అన్నది విశే్లషకులను వేధిస్తున్న ప్రశ్న. అయితే ఒక్కటి మాత్రం నిజం. పార్టీ పనితీరు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ భాజపా జమ్ము కాశ్మీర్ రాజకీయాల్లో సరికొత్త కోణాన్ని ఆవిష్కరించిందనేది మాత్రం ముమ్మూటికీ నిజం. ఢిల్లీకి చెందిన ఒక విలేకరి కాశ్మీర్ లోయలో ఎన్నికల ప్రచార సరళిని కవర్ చేయడానికి వెళ్ళారు. కాశ్మీర్‌లోయలో ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాల్లో భాజపా అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి ఓట్లకోసం ప్రచారం చేయడం ఆమెను ఎంతో అబ్బుర పరచింది.‘‘ కొద్ది సంవత్సరాల క్రితం భాజపా అభ్యర్థులు ఆవిధంగా ప్రచారం చేసే పరిస్థితే ఉండేది కాదు. ఒకవేళ ధైర్యం చేసినా దాడికి గురి కావడమో కొన్ని సందర్భాల్లో ప్రాణహాని కూడా జరిగేది.’’
కొద్ది నెలల క్రితం రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంభవించిన వరదలు విలయాన్ని సృష్టించినప్పుడు, సహాయ కార్యకలాపాల్లో పాల్గొన్న మన సైనికులు అందించిన సేవ లు, లోయ ప్రజల్లో భాజపా అభ్యర్థుల పట్ల వ్యతిరేకత వ్యక్తం కాకపోవడానికి కారణమని చెప్పవచ్చు. మరో అభిప్రాయం ఏమంటే..మిగిలిన భారత ప్రజల మాదిరిగానే నూతన ప్రధాని నరేంద్ర మోదీకి మరో అవకాశం కల్పించాలన్న భావన ప్రజల్లో బలంగా నాటుకొని పోవడం వల్ల కూడా కావచ్చు. పూర్తిగా దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థను గాట్లో పెట్టడానికి నరేంద్ర మోదీ యత్నిస్తున్నారన్న అభిప్రాయం ప్రజల్లో గట్టిగా నాటుకుపోయింది. అన్నింటికంటే ఆసక్తి కలిగించే అంశం మహబూబా ముఫ్తీ ఎన్నికల ప్రచారంలో స్మార్ట్ సిటీల గురించి మాట్లాడటం! నేషనల్ కాన్ఫరెన్స్ పాలనా రాహిత్యాన్ని ఒకపక్క ఎండగడుతూనే మరోపక్క స్మార్ట్ సిటీల ప్రాముఖ్యత గురించి ఆమె మాట్లాడటం గొప్ప విశేషం.
అంతమాత్రం చేత రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రకియకు పెద్ద ఆటంకంగా మారిన 370వ అధికరణాన్ని తొలగించాలన్న భాజపా అభిప్రాయానికి రాష్ట్రంలో మద్దతు లభిస్తున్నదని కాదు. ఢిల్లీ మీడియా అనవసరంగా ఊహాజనితమైన వ్యాఖ్యలకు ప్రాధాన్యతనిచ్చిందనే చెప్పాలి. మరో ఆసక్తికరమైన అంశమేమంటే..జమ్ము కాశ్మీర్‌ను ఇండియన్ యూనియన్‌లో పూర్తిగా విలీనం చేయాలన్న అంశంలో పూర్తి సానుకూల స్థితి ఉన్నదని చెప్పవచ్చు. ఇస్లామిక్ గుర్తింపును ఏమాత్రం చెక్కుచెదరనీయకుండానే భాజపా దీన్ని సాధించడం విశేషం. బహుకాలంగా జమ్ముకాశ్మీర్ రాజకీయ నిర్వాసితులకు ఆశ్రయంగా మారుతున్న మాట నిజం. వీరివన్నీ కృత్రిమ సంక్షోభానికి దారితీసే అజెండాలే. వీటిల్లో కొన్ని సమస్యలు కేవలం పాకిస్తాన్ కోణంలోవి. ఈ అన్యమనస్కత, ఆసక్తి అనేవి ఉగ్రవాదం కేంద్రంగా కలవి కావు. కానీ జాతీయ సమస్యలకు బహు పరిష్కారాల కేంద్రంగా కలవి. పరిపాలనా విధానాల్లో అద్భుతమైన మార్పు వస్తుందని, మానవహక్కుల ఉల్లంఘన పట్ల అది తీవ్ర ప్రతిస్పందనతో కూడినదై ఉంటుందని మరికొందరి భావన. అయితే వీరందరి పరిశీలనలు అప్రమాణికమైనవి కావు. కానీ జమ్ము కాశ్మీర్ గురించిన కొన్ని వాస్తవాలను గుర్తుంచుకోవాలి. అందులో మొదటిది కాశ్మీర్ లోయ భారత ప్రమాణాల ప్రకారం అభివృద్ధి చందనిది లేదా పేదరికంలో మగ్గుతున్న ప్రాంతం కాదు. దీనికి విరుద్ధంగా జమ్ము ప్రాంతం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. తమ ప్రాంతంలోని వనరులను అభివృద్ధికోసం వినియోగించడంలో వహిస్తున్న నిర్లక్ష్యానికి కారణం కేవలం ఢిల్లీ మాత్రమే! తాము వినయ విధేయతలతో ఉండటాన్ని ఢిల్లీ అలుసుగా తీసుకుంటున్నదన్న భావం జమ్ము ప్రాంత ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ఇక రెండవది కేంద్రం నుంచి పెద్ద మొత్తంలో సబ్సిడీలు పొందుతున్నది కాశ్మీర్ లోయ ప్రాంతం మాత్రమే. రాష్ట్రంలో అర్థవంతమైన అంతర్గత ఆదాయాన్ని సృష్టించేందుకు అవసరమైన చర్యలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకోలేదు. ఇక్కడి ప్రజలపై విధించే పన్నులు చాలా తక్కువ. వీరికిచ్చే సబ్సిడీల మొత్తం మరింత ఎక్కువ.
జమ్ముకాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించడం వల్ల..ప్రభుత్వం పెద్ద మొత్తంలో పన్నులు విధిస్తుందని లేదా అందిస్తున్న సబ్సిడీలను ఒకేసారి ఎత్తివేస్తుందని లేదా అభివృద్ధి నిధులను నిలిపివేస్తుందని ప్రజలు భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. కాకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ చేయాల్సింది ఒకటుంది. అసలు ఖర్చు పెడుతున్న నిధులు ఎంతవరకు సద్వినియోగం అవుతున్నాయనేదానిపై లోతైన ఆడిటింగ్ నిర్వహించాలి. జాతీయ జనజీవన స్రవంతిలో విలీనం కావడం విషయంలో ఈశాన్య రాష్ట్రాలతో పోలిస్తే, జమ్ము కాశ్మీర్ పూర్తిగా వక్రించిన వ్యావహారిక సత్తావాదంతో నిండిపోయింది. దీని ఫలితంగా స్థానికంగా పెద్దలుగా చెలామణీ అయ్యేవారిలో చాలామంది అవినీతి కార్యకలాపాలకు పాల్పడటం సాధారణమైపోయింది. ఈ అనైతిక రాష్ట్ర నాయకులు భారత్‌కు చేసిన నష్టం లెక్కించడం సాధ్యం కాదు.
గతంలో జరిగిన ఎన్నికలతో పోలీస్తే ఈసారి జమ్ము కాశ్మీర్‌లో జరిగిన ఎన్నికల విషయంలో సర్వే సర్వత్రా ప్రశంసలే వినవచ్చాయి. భాజపా రంగంలో ఉండటం, ఎన్నికలు బహిష్కరించాలన్న ప్రచారం లేకపోవడం మొత్తం పరిస్థితినే మార్చివేసింది. జమ్ముకాశ్మీర్‌లో ఏర్పడబోయే నూతన ప్రభుత్వం రాష్ట్రాన్ని భిన్న పథంలో నిర్మించాలి. ఇప్పటి వరకు ఉన్నదానికంటే భిన్న మార్గంలో పయనించాలి. అయినప్పటికీ అదనపు ప్రోత్సాహం చాలా అవసరం. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సైన్యాన్ని తొలగించి, వారిస్థానంలో సుశిక్షితులైన పారామిలిటరీ దళాలను ఉంచడం శ్రేయస్కరం. దీన్ని ఒక్కసారి ప్రభుత్వం పరిశీలించాలి. కేవలం నియంత్రణ రేఖవద్ద మాత్రమే భారత సైన్యం చురుగ్గా పనిచేయాలి. చొరబాట్లను అరికట్టడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత.
ఎన్నికల ఫలితాలు వచ్చి, వీటిని జీర్ణం చేసుకున్న తర్వాత జమ్ము కాశ్మీర్‌పై ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పునఃసమీక్షించుకోవాలి.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నటుడు మహేష్ బాబు ను కలవాలనుకొంటున్న నట గాయక దర్శకుడు ఫరాస్ అక్తర్

మహేష్ ని కలవాలనుకుంటున్నా

నటన, దర్శకత్వం, పాటలు పాడటం- ఇలా బహుముఖ ప్రజ్ఞ ఉన్న బాలీవుడ్‌ నటుల్లో ఫరాన్‌ అక్తర్‌ ఒకరు. ఈయన ఇంకా బాగా గుర్తుకు రావాలంటే ‘రాకాన్‌’, ‘జిందగి నా మిలేగీ దొబారా’, ‘భాగ్‌ మిల్కా భాగ్‌’ వంటి చిత్రాల గురించి చెప్పుకోవాలి. ఈయన జీవితంలో సంగీతానికీ ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఓ కార్యక్రమం కోసం హైదరాబాద్‌ వచ్చిన ఆయనతో ‘నవ్య’ ప్రత్యేక ఇంటర్వ్యూ.
నటుడు, గాయకుడు, దర్శకుడు – ఈ మూడింటిలో మీరు దేన్ని ఎక్కువగా ఇష్టపడతారు?
దర్శకుడిగా పనిచేయడం ఎంత ఇష్టమో నటించడం కూడా అంతే ఇష్టం. ఇష్టం కదాని రెండూ ఒకేసారి చేయలేను. నటిస్తున్నప్పుడు పూర్తిగా దానిపైనే దృష్టిపెడతాను. దర్శకత్వం చేస్తున్నప్పుడు ధ్యాసంతా దానిమీదే. దేనిమీదైతే అమితమైన ఇష్టం, చేయగల సామర్ధ్యం ఉంటుందో ఆ పని చేసేందుకు వెనకాడకూడదు. ఈ సిద్ధాంతాన్ని నేను బలంగా నమ్ముతాను. ఒకవేళ అది ప్రయోగమే అయినప్పటికీ మీ పని మీరు చేయాలి. అప్పుడే ఆ పనిలో విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో టైం మేనేజ్‌మెంట్‌ అనేది చాలా కీలకం.
గాయకుడు అవ్వాలని ఎప్పుడనిపించింది?
బాల్యం నుండే సంగీతం అంటే ప్రత్యేకమైన ఇష్టం ఉండేది. చాలా ఏళ్లు గిటార్‌ వాయిస్తూ, పాటలు పాడాను. కాని సినిమా ప్రాజెక్టు వల్ల రెగ్యులర్‌గా పాడలేకపోయాను. అయినప్పటికీ ఏడాదిలో నాలుగైదు నెలల సమయాన్ని సమాజానికి సంబంధించిన అంశాల గురించి పాడేందుకు కేటాయిస్తాను. గాయకుడిగా నాకు మొట్టమొదటి స్ఫూర్తి ‘బీటిల్స్‌ బ్యాండ్‌’. ఈ బ్యాండ్‌ అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ల వల్లే నాకు సంగీతం పట్ల ఆసక్తి కలిగింది. హిందీలో నా మీద బాగా ప్రభావం చూపింది కిషోర్‌కుమార్‌, ఆర్‌.డి. బర్మన్‌లు. ఆ తరువాత ‘కోల్డ్‌ప్లే, యు2, పర్ల్‌ జామ్‌’ బ్యాండ్‌లంటే ఇష్టం.
అమితాబచ్చన్‌తో పనిచేస్తున్నారు కదా. ఆయనతో మర్చిపోలేని అనుభవాలేమైనా ఉన్నాయా?
మొదట్లో ఆయనతో పనిచేయడం ఎలాగా అని చాలా ఆందోళన పడ్డాను. కాని ఒకసారి పనిచేయడం మొదలుపెట్టాక అదెంత సులువో అర్థమైంది. ఆయన సానుకూల వ్యక్తిత్వం కలిగిన మనిషి. సెట్‌లో తన చుట్టూ ఉండే వాతావరణాన్ని ఎంతో తేలికపరుస్తారు. సెట్‌పైకి రాగానే ఆయనతో మాట్లాడితే చాలు మీకు తెలియకుండా కంఫర్టబుల్‌ జోన్‌లోకి వచ్చేస్తారు. ఆయనతో కలిసి పనిచేయడం అనేది అద్భుతమైన అవకాశం. నా సినిమా ఇంకా పూర్తికాలేదు ఇప్పటికీ ఆయనతో షూటింగ్‌ చేస్తూనే ఉన్నాను. ఆయన పనంటే నాకెంతో ఇష్టం. అమితాబ్‌తో కలిసి పనిచేసే అవకాశం రావడం వల్ల ఎక్కువ సమయాన్ని ఆయనతో గడుపుతున్నాను. అది నాకెంతో ఉత్సాహాన్నిస్తోంది.
తెలుగు సినిమా గురించి, ఈ పరిశ్రమ గురించి మీకెంతవరకు తెలుసు? హైదరాబాద్‌ వచ్చారు కదా తెలుగునటుల్ని ఎవరినైనా కలుస్తారా?
నా షెడ్యూల్‌ చాలా టైట్‌గా ఉంది. టైం దొరికితే మహేష్‌బాబుని కలుద్దామనుకుంటున్నాను. ‘మర్ద్‌’ కోసం మా నాన్న రాసిన కవిత్వాన్ని ఆయన తెలుగులో పాడారు.
‘మర్ద్‌’ క్యాంపెయిన్‌ గురించి…
మర్ద్‌(MARD- Men Against Rape and Discrimination) క్యాంపెయిన్‌ను 2013లో ప్రారంభించాను. ప్రారంభం నుంచే ఈ క్యాంపెయిన్‌ పలు సామాజిక వెబ్‌సైట్లలో చర్చలకు వేదికయ్యింది. షారుక్‌ ఖాన్‌, ప్రియాంక చోప్రా, అర్జున్‌ రాంపాల్‌, హృతిక్‌రోషన్‌లు దీనికి మద్దతుగా నిలిచారు. ఈ క్యాంపెయిన్‌ ఏర్పాటుచేయడం వెనక బలమైన కారణమే ఉంది. 2012 ఆగస్టులో ముంబయికి చెందిన పల్లవి అనే న్యాయవాది అతి కిరాతకంగా హత్యకి గురైంది. వాచ్‌మెన్‌ లైంగిక అఘాయిత్యానికి పాల్పడినప్పుడు ఆమె నిరాకరించడంతో ఆమెను కిరాతకంగా హత్య చేశాడా ప్రబుద్ధుడు.
క్యాంపెయిన్‌ను విద్యాసంస్థలకి చేరువ చేయాలనేది నా ఆలోచన. అలాగయితే మహిళల్ని గౌరవించాలనే సందేశాన్ని ప్రతి ఇంటికీ చేరేలా చేయొచ్చనేది నా అభిప్రాయం.
ఈ క్యాంపెయిన్‌ నుంచి ఏం కోరుకుంటున్నారు?
నా జీవితాంతం చేయాలనుకున్న పని ఇది. సంగీతం ద్వారా మర్ద్‌కు సాయపడదామనుకుంటున్నాను. అలాగని నేను దాన్ని సెన్సేషనల్‌ చేయాలనుకోవడంలేదు. మర్ద్‌ గురించి తెలుసుకున్న వాళ్లు దాన్లోని ఫిలాసఫీ పట్ల నమ్మకం చూపాలి. అంతేకాని అంతా విన్నాక ఆశ్చర్యంతో ‘అవును’ అనడంతో సరిపెట్టడం కాదు. బాల్యం నుంచే ఆడ, మగ ఇద్దరూ సమానం అనేది అర్థమయ్యేలా చెప్పాలనేదే మా ఉద్దేశం. సమాజంలో నెలకొన్న ఈ అసమానతల వల్ల ఎలాంటి దారుణాలు జరుగుతున్నాయో క్యాంపెయిన్‌ ద్వారా వివరిస్తాం. ఈ క్యాంపెయిన్‌ నాజీవిత కాలపు కమిట్‌మెంట్‌. ఒక్కరాత్రిలో మార్పు రాకపోయినా నెమ్మదిగా మార్పు రావడం ఖాయమనేది నా నమ్మకం. మేము ‘మ్యాజిక్‌ బస్‌’ అనే ఎన్జీవోతో కలిసి ఆడపిల్లల విద్య కోసం పనిచేస్తున్నాం. చాలా కుటుంబాల్లో సమీపంలో విద్యాలయాలు లేని కారణం వల్ల కాకుండా అమ్మాయిలకు చదువు ఎందుకనే భావనతో వాళ్లని చదివించరు. ఆ ధోరణి పోగొట్టి అమ్మాయిలకు చదువు చెప్పించేందుకు గాను ‘మ్యాజిక్‌ బస్‌’ కోసం నిధులు సేకరిస్తున్నాం.
మీరు ఎదుర్కొన్న వైఫల్యాలు ఎక్కువ సమయాన్ని పనికి కేటాయించేలా చేశాయా?
వ్యక్తిగత లేదా వృత్తిగత జీవితంలో ఎత్తుపల్లాలనేవి ఒక భాగం. అలాగని వాటి గురించే బాధపడుతూ డిప్రెస్‌ అయిపోయి అక్కడే ఆగిపోరు కదా. ఒడిదుడుకులు ఎదురైనప్పుడు వాటి గురించి ఆలోచిస్తూ సమయం వృథా చేసుకోకుండా తరువాత ఏం చేయాలనేది ఆలోచించాలి. అంతేకాని విచారిస్తూ కూర్చోవడం, చిటపటలాడడం, సోమరిగా మారిపోవడం వల్ల ఏం ఒరుగుతుంది. వైఫల్యాల నుంచి పాఠాల్ని నేర్చుకోవాలి. అప్పుడు వైఫల్యాలనే అవకాశాలుగా మలచుకోవచ్చు. అలాచేసినప్పుడు వైఫల్యం అనేది అనుభవపాఠంగా మాత్రమే మిగిలిపోతుంది. ఇక్కడ చెప్పిన వాటిలో చివర్లో చెప్పిన పని చేసేందుకే నేను ఇష్టపడతాను. ఇలా చెప్తున్నానని పుట్టుకతోనే నాకు ఈ సత్యం తెలిసిరాలేదు. జీవితానుభవాలే నేర్పాయి.
హైదరాబాద్‌లో ఇవ్వబోయే ఈ ప్రదర్శన గురించి మీరెలా ఫీలవుతున్నారు? ఈ ‘విండ్‌సాంగ్‌’ మ్యూజిక్‌ ఫెస్టివల్‌ గురించి వివరించండి…
దీని గురించి నా ఫీలింగ్‌ని ఒక్కమాటలో చెప్పడం కష్టం. కాన్సర్ట్‌ చేస్తున్న సమయంలో ఎక్కువమందిని కలుస్తాం. ఎక్కువమంది ఔత్సాహికులు వస్తారు. వాళ్లని చూస్తే మాకు ఉత్సాహం వస్తుంది. ప్రేక్షకులతో నేరుగా కలవడం వల్ల వాళ్లు మనం చేస్తున్న దాన్ని ఎంజాయ్‌ చేస్తున్నారా లేదా అనేది తెలుసుకోగలుగుతాం. ప్రదర్శన జరుగుతున్నప్పుడు వాళ్లలో కనిపించే వ్యక్తీకరణ నిజాయితీతో ఉంటుంది. అది చాలా అపురూపమైనది. ప్రదర్శన జరుగుతున్నప్పుడు ప్రేక్షకులతో అనుసంధానమయ్యేలాంటి అవకాశం సినిమాల్లో నటించినప్పుడు రాదు.
టైం దొరికితే మహేష్‌బాబుని కలుద్దామనుకుంటున్నాను. ‘మర్ద్‌’ కోసం మా నాన్న రాసిన కవిత్వాన్ని ఆయన తెలుగులో పాడారు.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment