అభ్యుదయ చలన చిత్ర వైతాళికుడు శ్రీ గూడవల్లి రామ బ్రహ్మ0 గారి జీవిత చరిత్ర 5 వ భాగం.17.6.25.

అభ్యుదయ చలన చిత్ర వైతాళికుడు శ్రీ గూడవల్లి రామ బ్రహ్మ0 గారి జీవిత చరిత్ర 5 వ భాగం.17.6.25.

Posted in రచనలు | Leave a comment

కథా సవ్య సాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు.18 వ భాగం.17.6.25

కథా సవ్య సాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు.18 వ భాగం.17.6.25

Posted in రచనలు | Leave a comment

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.17 వ భాగం.17.6.25.

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.17 వ భాగం.17.6.25.

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.17 వ భాగం.17.6.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ దశి.28 వ భాగం.17.6.25.

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ దశి.28 వ భాగం.17.6.25.

Posted in రచనలు | Leave a comment

మా పాపాయి స్వయం సిద్ధ వేదవల్లి -2(చివరి భాగం )

మా పాపాయి స్వయం సిద్ధ వేదవల్లి -2(చివరి భాగం )

 మా అన్నయ్య శ్రీ గబ్బిట లక్ష్మీ నరసింహ శర్మ ,వదిన శ్రీమతి కమలమ్మ దంపతులకు మా అన్నయ్య హాస్పేట్ లో రైల్వే స్టేషన్ మాస్టర్ గా పని చేస్తున్నప్పుడు అమ్మమ్మ పుల్లాభట్ల సుబ్బమ్మ గారింట పగోజి పోలసానిపల్లి లో జన్మించింది .నా దగ్గరున్న జాతకాల పుస్తకం ప్రకారం 1953లో రుధిరోద్గారి నామ సంవత్సరం శ్రీరామనవమి వెళ్ళిన దశమి మంగళవారం పుష్యమి నక్షత్రం రాత్రి 11గం .లకు జన్మించింది .అంటే 24-3-1953.కానీ స్కూల్ లో రికార్డ్ షీట్ లో మాత్రం 10-8–1952 గా రికార్డ్ అయింది .ఇదే అఫీషియల్ డేట్ ఆఫ్ బర్త్ గాచలామణి అవుతోంది .వేదవల్లి ఆని నామకరణం జరిగింది .మా ఇంట్లో మా పెద్దక్కయ్య పేరు వేదవల్లి .ఆమె ఒక కొడుకును ప్రసవించి చనిపోయిందని మా అమ్మ చెప్పేది .ఆమె జ్ఞాపకార్ధం వేదవల్లి పేరు పెట్టి ఉంటారు .మా వేదవల్లి అక్కయ్య నేను పుట్టకముందే చనిపోయిందని గుర్తు మా అక్కా బావ ల ఫోటో మా పెంకుటింటి ఉత్తరం వైపు గోడపై మేము డాబా కట్టేదాకా ఉండేది .చాలా అందమైన ముఖం ఆమెది చదువుల సరస్వతి గా మా అమ్మ చెప్పేది మా నాన్నకు ఆమె అంటే విపరీతమైన అభిమానం .అందుకే పాపాయి ఆని పిలిచేవారట .ఆ పేరే ఈ వేదవల్లికీపెట్టి అదే పాపాయిగా పిలిచేవారు .మేమందరం కూడా వేదవల్లిని’’ పాపాయి’’ అనే ముద్దుగా పిలిచేవాళ్ళం .అందరికీ అదే అలవాటయింది .పాపాయి పుట్టిన ఆరేళ్లకు మా అన్నయ్య దంపతులకు రామా నాద బాబు శ్రీ విళంబి  నామ సంవత్సరం మాఘ బహుళ పంచమి స్వాతి నక్షత్రం లో శుక్రవారం తెల్లవారుజామున 5-45గం లకు 28-2-1959జననం . బాలసార జరిగిన నెలలోపే మా అన్నయ్య హార్ట్ ఎటాక్ తో హాస్పేట్ లో మరణించాడు .ఈ విధంగా పాపాయి అరవయేట ,రాంబాబు పుట్టిన నెలలోపలె తండ్రిని కోల్పోయిన దురదృష్టవంతులయ్యారు .

 మా అమ్మ భవానమ్మ నాన్న మృత్యుంజయ శాస్త్రి గార్లు ఈ మనవరాలిని మనవడిని కళ్ళల్లో పెట్టుకొని పెంచి విద్యాబుద్ధులు నేర్పించారు .మానాన్న గారు 1961లో మరణించాక మా అమ్మ వాళ్ళిద్దర్నీ అలాగే పెంచింది .ఆమె 1982లో చనిపోయింది .నా వివాహం 1964ఫిబ్రవరిలో ప్రభావతితో జరిగింది .అప్పటి నుంచి మేమిద్దరం బాధ్యత వహించాం .పాపాయి ఉయ్యూరు హైస్కూల్ లో చదివింది .తోమ్మిదోక్లాస్ లో ఉన్నప్పుడు నేను సైన్స్ మాస్టర్ గా ఆక్లాస్ కు బోధించేవాడిని .పాపాయి క్లాస్ మేట్స్ కాళీ ప్రసాద్ చెల్లెలు రాజా కామేశ్వరి ,అలాగే మా ఇంటికి దక్షిణాన ఉన్న బెల్లంకొండ సుబ్బయ్యగారి అబ్బాయి హనుమంతం గారి అమ్మాయి సుశీల .ఈ ఇద్దరు నాదగ్గరే  ట్యూషన్ చదివేవారు .పాపాయి బాగా నే చదివేది మంచి మార్కులతోపాసయ్యేది  .SSLC  పాసయ్యాక బెజవాడ లో స్టెల్లా కాలేజి పియుసి లో చేరి హాస్టల్ లో ఉండి చదివింది .అక్కడ నీళ్ళు వాతావరణం పడేదికాదు .వారానికో పదిహేనురోజులకో నేను మా అమ్మా వెళ్లి చూసి వచ్చేవాళ్ళం .పరీక్ష తప్పింది .ఆరోగ్యం బాగా లేదని మా ఫామిలి డాక్టర్  వెంపటి కుమారస్వామి గారికి చూపించి మందులు వాడినా తగ్గక  పొతే ఆయన లెటర్ రాసిచ్చి గైనకాలజీ డాక్టర్ ను కన్సల్ట్ చేయమంటే మద్రాస్ లో మాపెద్దక్కయ్య లోపాముద్ర బావ కృపానిధి గారింటికి షినాయ్ నగర్ వెడితే ,లేడీ గైనకాలజిస్ట్  దగ్గరకు అక్కయ్య మమ్మల్ని తీసుకు వెళ్లి చూపిస్తే ‘’గైనకాలజిస్ట్ చూడాల్సిననంత జబ్బేమీ లేదు హాస్టల్ భోజనం పడక పోవటమే అంతకంటే ఏమీ లేదనిచేప్పి బలానికి మందులు రాసిచ్చి పంపింది ఈ ప్రయాణం లో మా మామయ్యగారమ్మాయి ’’ పాపి’’ ఆని మేము పిలిచే లక్ష్మీ నరసు కూడా  మా ఇద్దరికీ ఉయ్యూరు నుంచి తోడు వచ్చింది .కధ సుఖాంతం కనుక హాయిగా వెంటనే ఉయ్యూరు తిరిగివచ్చాం .

  పాపాయి పెళ్ళి ప్రయత్నాలుచేయటం  మాబావగారు వేలూరి వివేకానండంగారి తండ్రిగారు కృష్ణమూర్తిగారికి చిరివాడ ఉత్తరం రాయటం ఆయన వెంటనే ‘’ఎక్కడో వెతకక్కర లేదు .చిరివాదలోనే మావాడే వేలూరి వెంకటేశ్వర్లు గారి పెద్దబ్బాయి రామకృష్ణ ఉన్నాడు బికాం పాసయ్యాడు చాలా బుద్ధిమంతుడు మంచి కుటుంబం..స్థితిమంతులు .గుడివాడదగ్గర బేతవోలులో కాపురం ఉంటున్నారు పిల్లల చదువుకోసం . ప్రయత్నం చేయమని చెప్పటం నేనూ మా తమ్ముడు మోహన్ వెళ్లి మాట్లాడటం వారంతా సుముఖంగా ఉండటం ,ఉయ్యూరువచ్చి పిల్లను చూసుకోవటం నచ్చిందని చెప్పటం రామకృష్ణ నాయనమ్మ తాతయ్యలతో సహా ఆడపడుచులు మరుదులు నిరంజన్ పతంజలి తో సహా వచ్చి చూడటం ,తాంబూలాలు పుచ్చుకోవటం  శ్రావణ మాసం లో జోరున వర్షం లో మా ఇంట్లోనే వివాహం మాడంపతులం పీటలమీద కూర్చుని జరిపించటం చక చకా జరిగిపోయాయి .సాధారణంగా ‘’కతికితే అతకదు ‘’అంటారు కానీ మాపాపాయి పెళ్ళి ‘’‘కతికినా అతికింది ‘’.నేనూ మా తమ్ముడు ఆబ్బాయినిచూడటానికి  బేతవోలు వెడితే  మా వియ్యంకుడుగారు ఇంట్లో లేకపోతె మా వియ్యపురాలు ఎంతో మర్యాదగా మాట్లాడి అబ్బాయినిచూసి వెడుతుంటే ‘’మా ఇంట్లో భోజనం చేస్తేకాని వీల్లేదు .మనం బంధువులం .‘’ఆని ‘’ఆర్డర్ ‘’ఆప్యాయంగా వేస్తె రసం మామిడిపళ్ళతో  కమ్మని భోజనం పెడితే తిని ఉయ్యూరు వచ్చాం .ఆతర్వాత రాంబాబు డిగ్రీ  ,భోపాల్ లో చదువు ,బందరులో బిఎడ్ ట్రెయినింగ్ ,తర్వాత మా పెద్దక్కయ్య బావ ల చిన్నకూతురు జయలక్ష్మి తో వివాహం ,వాడు స్వంతిల్లు కట్టుకోవటం వాళ్లకు ఒక కొడుకు కళ్యాణ్ పుట్టటం  అరిగాయి .

 పెళ్ళి అయ్యాక అల్లుడు రామకృష్ణ విశాఖ లో ఉద్యోగం లో ఉన్నందున పాపాయినికాపురానికి విశాఖ తీసుకొని వెళ్లి దింపాం .రెండు మూడు రోజులున్నట్లు జ్ఞాపకం.పతంజలి మమ్మల్ని విశాఖ బీచ్ ,భీమ్లీ కూడా చూపించిన గుర్తు .ఆతర్వాత రామకృష్ణ గరివిడి FACOR కంపెనిలో ఉద్యోగం లో చేరటం ఫామిలి మార్చటం  వీలున్నప్పుడల్లా మేము వెళ్లి రావటం జరిగేది .అక్కడినుంచి అరసవిల్లి ,శ్రీకూర్మం చూసి రాటం మామాలు అయింది .అంచెలంచెలుగా అతడు ఎదిగి కంపెనీ బాస్ ల విశ్వాసం చూరగొని తలలో నాలుకగా మెలిగాడు .పియుసి తో ఆపిన పాపాయి మెల్లగా డిగ్రీ ప్రైవేట్ గాకట్టి పాసై బిఎడ్ కూడా చేసి ,ఆతర్వాత’’ law’’కూడా పాసై  కంపెని స్కూల్ లో సోషల్ టీచర్ గా చేరి రిటైరయ్యింది .చదువులతల్లి అయింది మా పాపాయి .ఇవన్నీ భర్త రామకృష్ణ సహాకారంతో స్వయం ప్రయత్నం తో సాధించిందే అందుకే మాపాపాయిని ‘’స్వయం సిద్ధ ‘’అన్నాను సార్ధకం గా .ఈలోగా ఇద్దరు మగపిల్లలు రవికిషన్ ,హరి కిషన్ బంగారుతంద్రులకు జన్మ నిచ్చి వారి వివాహాలు జరిపి మనుమళ్ళ తో హాయిగా ఉన్నారు .రవి హైదరాబాద్ లో సెటిల్ అయ్యాడు భార్య గాయత్రి .ఉత్తమా ఇల్లాలు .కొడుకు రేయాన్ష్ .హరి  అమెరికాలో సెటిల్ అయ్యాడు .భార్య శారిక .మంచి అమ్మాయి .ఇద్దరు అబ్బాయిలు .అమెరికాలో రాలీలో స్వంత ఇల్లు ఉంది .రవి ఇంకా స్వంతింటి వాడుకాలేదు .తోడికోడళ్ళు ఇద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటారు .

 రవికి అనుకోకుండా బైక్ ఆక్సిడెంట్ జరిగి కాలికి ఆపరేషన్ జరిగింది వాడు కోలుకోవటానికి దాదాపు ఏడాది పట్టింది తర్వాత తండ్రి రామకృష్ణకు హార్ట్ కంప్లైంట్ వచ్చి బైపాస్ జరిగింది .ఆయన కోలుకోవటానికీ ఏడాది పైనే పట్టింది . మెల్లమెల్లగా పాపాయి ఆరోగ్యం క్షీణించటం మొదలైంది చాలా విపరీతంగా బాధపడింది .ట్రీట్మెంట్ చాలా ఖర్చుతో జరిగేది తండ్రి తల్లి లను కంటికి రెప్పలా కాపాడుకొన్నారు రవి దంపతులు. గాయత్రి ఓర్పు మాటలకు అందనిది .హరి పెద్దకొడుకు కు హఠాత్తుగా జబ్బు చేయటం ,దానికి ట్రీట్మెంట్ ,అమెరికా ఉద్యోగాలుస్థిరంగా  లేకపోవటం తో వాడూ చాలాకస్టాలులు పడుతున్నాడు .వాడి మామగారు అమెరికా వచ్చి జబ్బుపడి అక్కడే చనిపోతే  ఆయన్ను ఇండియా చేర్చటం ,హైదరాబాద్ లో కార్యక్రమాలు జరిపించటం తలకు మించిన భారమైంది వాడికి .కాని గుండె నిబ్బరం ఉన్న వాడు .అన్నీ తట్టుకోన్నాడు .రెండేళ్ళ క్రితం తండ్రి రామ కృష్ణ మరణం హైదరాబాద్ లో రవి ఇంట్లో .బాడీ గరివిడి తీసుకు వెళ్లటం స్వంతింట్లో కార్యక్రమమాలు చేయటం అమెరికానుంచి హరి సమయానికి వచ్చి పాల్గొనటం అంతా నిన్నామొన్నా వ్యవహారంగా అయిపొయింది .ఈలోగా మా వదినగారు అంటే మాపాపాయి అమ్మగారు కమలమ్మ గారు నిరుడు జనవరి లో చనిపోవటం ఈజనవరిలో సంవత్సరీకాలు ,వాటికి పాపాయి వాళ్ళు రవి కుటుంబం రావటం అంతా ఖర్చుమీద ఖర్చు .అన్నదమ్ములిద్దరూ ఎంత గుండె ధైర్యంతో ఇవన్నీ భరించారో చూస్తె ఆశ్చర్యమేస్తుంది .ఇంతలో రవి మామగారికి రెండుమూడు నెలల క్రితం బైపాస్ దానికి తోడూ  కడపు లో ‘’క౦తి’’ ఆపరేషన్ .బాబోయ్ పగవాడికి కూడా ఇన్ని కస్టాలు రాకూడదని పిస్తుంది .

  ఈ ఫిబ్రవరి మాఘమాసం లో రవికొడుకు రేయాన్ష్ ఉపనయనం హైదరాబాద్ లో జరగటం ఒకటే శుభ కార్యం .మేము వెళ్లి వచ్చాం .అందరికి తన చేతనైన విధంగా నూతన వస్త్రాలతో సత్కారం చేయించింది మా పాపాయి కొడుకు కోడలితో .రవి గాయత్రి దంపతులు చూడముచ్చటగా ఉన్తెనేను జోక్ గా ‘’బృందావనం సినిమాలో రాజేంద్రప్రసాద్ రమ్యకృష్ణ లా ఉన్నారు అనగా వాల్లతోసహా  అందరూ పగలబడి నవ్వారు .హరికి జాబ్ ప్రాబ్లెం వలన రాలేక పోయాడు .ఢిల్లీ నుంచి రామకృష్ణ మేనకోడలు హేమ కూడా వచ్చింది .రామకృష్ణ పోయినప్పుడూ గరివిడి వచ్చింది హేమ ..పాపాయి మన శ్రీ సువర్చలా ఆంజనేయస్వామికి ,సరసభారతికి విరాళాలు ఇచ్చింది .ఇవే చివరి పనులని అనుకొని ఉండదు .హాయిగా మనవడి ఉపనయనం కళ్ళముందు జరగటం పాపాయికి ఎంతో ఊరట నిచ్చి ఉండాలి .వేదికమీద నిండుగా కూర్చున్నా పాపాయి నిబ్బరంగా ఉన్నట్లు అనిపించినా ఏదో’’ డౌట్’’’మనస్సులో మెదులుతూనే ఉంది .ఉపనయనం అయిన నాలుగు  నెలలకే విధి వక్రించి మా పాపాయి మాకు దక్కకుండా వెళ్ళిపోయింది .ఒకరకంగా బాధల కష్టాల కడలి దాటి వెళ్ళిపోయింది .మంచి హృదయం బందుప్రేమ ఆప్యాయత లున్న మాపాపాయి మరణం మాకు  తట్టుకో లేనిది అయింది .మా పాపాయి ఆత్మకు శాంతికలగాలని ,మా పాపాయి కుటుంబానికి సానుభూతి ప్రకటిస్తూ  మాపాపాయి కుటుంబం కలకాలం ఆయురారోగ్యాలతోసుఖ సంతోషాలతో వర్ధిల్లాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -17-6-25,-ఉయ్యూరు

Posted in రచనలు | Leave a comment

అభ్యుదయ చలన చిత్ర వైతాళికుడు శ్రీ గూడవల్లి రామ బ్రహ్మ0 గారి జీవిత చరిత్ర.5 వ భాగం.16.6.25.

Change text alignment

అభ్యుదయ చలన చిత్ర వైతాళికుడు శ్రీ గూడవల్లి రామ బ్రహ్మ0 గారి జీవిత చరిత్ర.5 వ భాగం.16.6.25.

Posted in రచనలు | Leave a comment

కథా సవ్య సాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు.17వ భాగం.16.6.25

కథా సవ్య సాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు.17వ భాగం.16.6.25

Posted in రచనలు | Leave a comment

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.16వ భాగం.16.6.25.

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.16వ భాగం.16.6.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.27 వ భాగం.16.6.25.

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.27 వ భాగం.16.6.25.

Posted in రచనలు | Leave a comment

మా పాపాయి స్వయం సిద్ధ వేదవల్లి -1

మా పాపాయి స్వయం సిద్ధ వేదవల్లి -1

మా పాపాయి స్వయం సిద్ధ వేదవల్లి -1

ఈనెల 8వ తేదీ ఉదయం మా అబ్బాయి రమణ వచ్చి ‘’వేదవల్లి అక్కయ్య  ఈ తెల్లవారు జామున సడెన్  హార్ట్ ఎటాక్ తోహాస్పిటల్ లో  చనిపోయి౦ది అని రవి ఫోన్ చేసి చెప్పాడు ‘’ఆని చెప్పాడు .నేను మా అమ్మాయి , వాళ్ళమ్మ ఒక్కసారి అవాక్కయ్యాం .తర్వాత కాసేపటికి వేదవల్లి పెద్దకొడుకు రవి ఫోన్ చేసి భోరున ఏడుస్తూ ‘’అమ్మ వెళ్లి పోయింది తాతయ్యా ‘’ఆని దుఖం ఆపుకోలేకపోయాడు .కాసేపు వోదార్చాం . తర్వాత చిన్నకొడుకు హరి అమెరికా నుంచి ఫోన్ చేసి ‘’తాతయ్యా !అమ్మ చాలా తీవ్ర పోరాటం చేసింది .చివరికి తప్పలేదు .బాధపదకండి’’అన్నాడు ‘వాడి గుండెనిబ్బరం మహా ఆశ్చర్యం కలిగించింది .ఒకే తల్లి పిల్లలు ఎలా వేర్వేరు విధంగా స్పందించారో ? వాడు అమెరికా నుంచి రావాలి కనుక ఎంత త్వరగా బయల్దేరినా సోమవారం సాయంత్రం లోపు రాలేడు.కనుక10వ తేది  మంగళవారం ఉదయమే కార్యక్రమం ఆని రవి చెప్పాడు .మేము ఎప్పుడు బయల్దేరాలని మీమాంస పడ్డాం .రవిదుఖాన్ని తగ్గించటానికి వెంటనే బయల్దేరాలని నిర్ణయించాం. మా శ్రీమతి ‘’నేను దాన్ని పెంచి పెద్దదాన్ని చేశాను .ఈ స్థితిలో వేదవల్లిని చూడలేను .మీరు వెళ్ళండి ‘’అన్నది .కనుక ఉదయం పదింటికే భోజనం చేసి నేను మా అమ్మాయి విజ్జి ,రమణ ,మా న్నయ్యగారి అబ్బాయి వేదవల్లి తమ్ముడు రాంబాబు కారులో బయల్దేరాం .ఈ లోగా ఫోన్లమీద విశేషాలు తెలుస్తున్నాయి .హాస్పిటల్ లోనే మార్చురీ లో ఉంచి ,మంగళవారం నల్లకుంట లో వాళ్ళు ఉంటున్న  అపార్ట్మెంట్  కింద సెల్లార్ లో ఉంచి అక్కడినుంచే స్మశాన వాటిక కు తీసుకు వెళ్ళే ఏర్పాటు చేస్తున్నారని తెలిసింది .వేదవల్లికి తెల్లవారు ఝామున హార్ట్ ఎటాక్ వచ్చినట్లు ,నాడి అందక చనిపోయినట్లు చెప్పారనిఆతర్వాత ఆఖరి ప్రయత్నంగా హార్ట్ పై మాసేజ్ చేయటం వలన హార్ట్ ఫంక్షన్ చేయటం మొదలుపెట్టి క్రమంగా వైటల్ ఆర్గాన్స్ అన్ని డీ ఫన్క్ట్ అయి ఉదయం 7-30 కు గుండె ఆగిపోయిందని తెలిసింది .విశ్వావసు జ్యేష్ట శుద్ధ త్రయోదశి స్వాతి నక్షత్రం ఆదివారం ఉదయం 73వయేట మా పాపాయి వేదవల్లి దాదాపు పదేళ్లు ఆనారోగ్య సమస్యలతో ,కొడుకు రవి కాలు యాక్సిడెంట్ తో, భర్త రామకృష్ణ హార్ట్ ప్రాబ్లెంస్ తో రెండేళ్లక్రితం ఆకస్మికమరణం ,రెండవకొడుకు హరి పెద్ద కొడుకు ఆరోగ్య సమస్య  తోఅన్నీ తట్టుకొని పిల్లలకు గుండె ధైర్యం కలిగించి’’ అన్నదమ్ముల౦  జీవితాంతం కలిసి ఉంటాము’’ అనే అనే వాగ్దానం తీసుకొని మూడురోజులక్రితం రవితో ‘’నాన్నా !అంతా అయిపోయిదిరా .జాగ్రత్త .తమ్ముడు హరి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు వాడి పెద్దపిల్లాడి ఆరోగ్య సమస్యతో .ఇద్దరు అన్యోన్యంగా ఉండండి నాన్నా ‘’ఆని చెప్పిందట .’’అలానే అమ్మా .నీకు దిగులు వద్దు .హాయిగా గుండె నిబ్బరంతో ఉండమ్మా ‘’ఆని కన్నీరు కార్చాడట ,ఇలా ఇహ బంధాలన్నీ తెంచుకొని మా పాపాయి వేదవల్లి వెళ్ళిపోయింది .9వతేదీ సాయంత్రం హరి వచ్చాడు హైదరాబాద్ .మేము ఆదివారం సాయంత్రం మా పెద్దబ్బాయి శాస్త్రి ఇంటికి చెర్లపల్లి వెళ్లి ,రాత్రి బయల్దేరి మా పెద్దకోడలు సమత తో సహా రవి ఇంటికి వచ్చి పలకరించాము .మా అమ్మాయి విజ్జి రవిని భార్య గాయత్రిని చాలా దగ్గర కూర్చుని ఓదార్చింది .వాళ్లకు మేము ఉన్నాము అనే ఉపశమనం కలిగించగలిగాం . రాంబాబు ను రవి ఇంట్లో వదిలి మళ్లీ రాత్రి బయల్దేరి మేము చర్లపల్లిచేరి భోజనం చేసి పడుకున్నాం .  .

  సోమవారం 9వ తేది ఉదయం టిఫిన్ చేసి ఓల్డ్ బోయిన్ పల్లి లో ఉన్న 93ఏళ్ల మా బావగారు శ్రీ వేలూరి వివేకానంద గారిని ఓల్డ్  వారి స్వగృహం లో కలిశాం .ఆయన చాలా ఎమోషనల్ అయ్యారు .వేదవల్లి మరణ వార్తచెప్పాం .తట్టుకోగాలిగారు .పాతవన్నీ గుర్తు చేసుకొన్నాం .అక్కడ ఉండగానే వాళ్ళ చిన్నబ్బాయిఅమెరికాలో ఉన్న  మా చిన్న మేనల్లుడు  శాస్త్రి , హైదరాబాద్ లో ఉన్న వాళ్ళమ్మాయి మా మేనకోడలు పద్మ కూడా మాట్లాడారు . .మాపెద్దమేనల్లుడు అశోక్ కూడా వచ్చాడు .బావగారింట్లో కాఫీతాగి దగ్గర్లోనే ఉన్న అశోక్ ఇంటికి వెళ్లి కాసేపు కూర్చుని వాళ్ళు పెట్టిన పునుగులు టిఫిన్ తిని ,బయల్దేరి ,35 ఏళ్ళక్రితం గుంటూరు పాలిటెక్నిక్ లో మా అమ్మాయి క్లాస్ మేట్ తులసి ని వాళ్ళ ఆఫీస్ లో కలిసి మళ్లీ చెర్లపల్లి చేరాం .మా అమ్మాయి హరి ఫ్లైట్ వివరాలన్నీ తెలుసుకొంటూనే ఉంది వాడు సాయంత్రం మూడున్నరకు దిగి ఐదున్నరకు రవి ఇంటికి చేరాడు .మేము సాయంత్రం ఆరు కు బయల్దేరి  రవి ఇంటికి మా అబ్బాయి శాస్త్రితో సహా చేరి రవి హరి లను పలకరించి వోదార్చాం .అప్పటికే వాళ్ళ చిన్నమేనత్త మూడు రోజులనుంచి అక్కడే ఉంటూ వాళ్ళను జాగ్రత్తగా చూసుకొంటున్నారు .గాయత్రి బందువు  హిరణ్యాక్ష శర్మ వైదిక కార్యక్రమాలకు ,హాస్పిటల్ వ్యవహారాలకు గొప్ప సాయం చేస్తున్నాడు .తలలో నాలుకగా వ్యవహరిస్తున్నాడు .రామకృష్ణ చనిపోయినప్పుడు కూడా గరివిడిలో ఇలాగే సాయపడ్డాడు .దాదాపు పాతిక ఏళ్లుగా గరివిడిలో మా వేదవల్లి రామ కృష్ణ ల ఇంటిని అన్ని  విధాలుగా చూసుకొంటున్న శ్రీమతి సావిత్రి ,కొడుకు వర్మల సేవ మాటలతో చెప్పలేము .సావిత్రి వారం క్రిందటే వచ్చింది .అ౦భ౦  లో కుంభం లాగా  రవి వాళ్ళ అపార్ట్ మెంట్ ను ఓనర్ అమ్మేయగా  వీళ్ళు అపార్ట్మెంట్ ఖాళీ చేయాలి నెలాఖరులోపు .దానికి సాయం చేయటానికి వచ్చింది సావిత్రమ్మ .ఒకరకంగా వాళ్ళ ఇంట్లో సభ్యులుగా నే ఉంటారు తల్లీ కొడుకు వర్మా కూడా .అంతటిభక్తి తాత్పర్యాలు వాళ్లకు .రామకృష్ణ మరణం సమయం లోనూ వారి సేవలు నిరుపమానం .

  10 వ తేదీ మంగళవారం మూడవ రోజు అంత్యక్రియలకు చెర్లపల్లిలో స్నానాదులు చేసి బయల్దేరి నల్లకుంట వచ్చాం .అప్పటికే పాపాయి పార్ధివ దేహం వచ్చి ఉంది .పురోహితులు వచ్చి కార్యక్రమాలన్నీ పూర్తి అయి శవ వాహనం బయల్దేరటానికి ఉదయం 10-30అయింది .రామకృష్ణ ఇద్దరు  తమ్ములు భార్యలు వచ్చారు మా తమ్ముడు  మోహన్ ,భార్య సునీత ,కొడుకు రాజు,మా  మేనకోడలు పద్మ ,మా అబ్బాయి శర్మ ,రవి మామగారు, గాయత్రి మేనత్త, భర్త ,కొడుకుకోడలు ,వేలూరి తారకం గారబ్బాయి కోడలు వచ్చారు .శాస్త్రోక్తంగా అన్నీ జరిగాయి అన్నదమ్ములు రవిహరి బహు శ్రద్ధగా నిర్వహించారు .దగ్గరలో ఉన్న అంబర్ పేట స్మశాన వాటికలో అంత్యక్రియలు .అక్కడే ఒకే సారి 15శవాలకు అంత్యక్రియలు జరిపే ఏర్పాటు ఉంది .మధ్యాహ్నం 12కు కపాల మోక్షం అవగానే మేమందరం స్నానాలు చేయటం రవి హరిలకు వపనం జరగటం అయింది .బయల్దేరి ఇంటికి రాగానే వాళ్ళిద్దరూ దీప దర్శనం చేసి పిండం తీసుకు పై అంతస్తు గోడపై పెట్టి కిందికి దిగగానే  భోజనాలు వడ్డించారు .భోజనం చేసి ,రాంబాబు తో సహా మేము బయల్దేరి రాత్రి ఏడుగంటలకు ఉయ్యూరు చేరాం .రవి అపార్ట్ మెంట్ లో ఇద్దరు ముఖ్యులు అన్ని ఏర్పాట్లు చక్కగా చేసి గొప్ప సాయం చేశారు .శవవాహకులు గా వ్యవహరించారు రాంబాబు తో సహా .రామకృష్ణ సోదరులిద్దరూ కిమిన్నాస్తి గా ఉన్నారు .ఆశ్చర్యమేసింది .మొన్న గురువారం ఐదవరోజు  12వ తేది రవి,హరి వచ్చి బెజవాడ ఫెర్రి దగ్గర కృష్ణా గోదావరి సంగమం లో అస్తినిమజ్జనం చేసి వెళ్లారు . ఈనెల 17,18,19 మంగళ బుధ గురువారాలలో పదవ రోజు, పదకొండవ రోజు ,పన్నెండవ రోజు .రాంబాబు ఇవాళ సాయంత్రం బయల్దేరి వెడుతున్నాడు .నేను, మా శ్రీమతి ,మా అమ్మాయి 18వ తేది బుధవారం ఉదయం భోజనం చేసి  బాచుపల్లి మా అబ్బాయి శర్మ ఇంటికి వెడతాం .మర్నాడుఉదయం రవి వాళ్ళ ఇంటికి వెడతాం .

సశేషం

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -16-6-25-ఉయ్యూరు

 .

 .

Posted in రచనలు | Leave a comment

అభ్యుదయ చలన చిత్ర వైతాళికుడు శ్రీ గూడవల్లి రామ బ్రహ్మ0 గారి జీవిత చరిత్ర.4 వ భాగం.15.6.25.

అభ్యుదయ చలన చిత్ర వైతాళికుడు శ్రీ గూడవల్లి రామ బ్రహ్మ0 గారి జీవిత చరిత్ర.4 వ భాగం.15.6.25.

అభ్యుదయ చలన చిత్ర వైతాళికుడు శ్రీ గూడవల్లి రామ బ్రహ్మ0 గారి జీవిత చరిత్ర.4 వ భాగం.15.6.25.

Posted in రచనలు | Leave a comment

కథా సవ్య సాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు.16.వభాగం.15.6.25.

కథా సవ్య సాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు.16.వభాగం.15.6.25.

Posted in రచనలు | Leave a comment

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.15 వ భాగం.15.6.25.

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.15 వ భాగం.15.6.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ దశి.26 వ భాగం.15.6.25

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ దశి.26 వ భాగం.15.6.25

Posted in రచనలు | Leave a comment

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.14వభాగం.14.6.25.

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.14వభాగం.14.6.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ దశి.25 వభాగం.14.6.25.

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ దశి.25 వభాగం.14.6.25.
https://youtu.be/7v6lJ65tIUw

Posted in రచనలు | Leave a comment

మనం మర్చిపోయిన భోపాల్ లో స్థిరపడిన మన ఆంధ్ర చిత్రకారుడు,రచయిత శ్రీ వేలూరి రాధాకృష్ణ

మనం మర్చిపోయిన భోపాల్ లో స్థిరపడిన మన ఆంధ్ర చిత్రకారుడు,రచయిత శ్రీ వేలూరి రాధాకృష్ణ

కృష్ణా జిల్లా చిరివాడలో జన్మించి ,పెద్ద చదువులు చదివి ఎదిగి మధ్యప్రదేశ్ భోపాల్ లో స్థిరపడిన ఆంధ్ర చిత్రకారుడు శ్రీ వేలూరి రాధా కృష్ణగారి గురించి ఈ తరానికి అస్సలే తెలియదు .కాశీనాథుని వారి భారతి మాసపత్రికలలో ఆయన చిత్రాలు ,వ్యాసాలూ తరచుగా దర్శనమిచ్చేవి .మా అమ్మ’’ ఆయన మన చిరివాడ వాడేరా’’ ఆని చెప్పేది  ఆయన వేలూరి శివరామ శాస్త్రి గారి తమ్ముడు రామ మూర్తి గారి అబ్బాయి .మరో తమ్ముడు వేలూరి కృష్ణమూర్తి గారి కుమారుడే మా చిన్నక్కయ్య దుర్గ గారి భర్త మా బావ గారు ..అంటే మా బావగారు రాధాకృష్ణ అన్నదమ్ముల పిల్లలు అన్నమాట .సంతోషించేవాళ్ళం .అంతకన్నా ఎక్కువ తెలియదు .ఒక సారి ఎప్పుడో మా బావ అక్కయ్య శ్రీ వేలూరి వివేకానంద శ్రీమతి దుర్గ గార్లు భోపాల్ లో ఉండగా వెళ్లినట్లు ,.అప్పుడు రాధా కృష్ణ గారి౦టికి తీసుకు వెళ్ళినట్లు గుర్తు .వారి తల్లిగారు కూడా అక్కడ ఉండేవారని జ్ఞాపకం .ఆతర్వాత ఎప్పుడో ఆంధ్రా కు వస్తే హైదరాబాద్ లో మాబావ గారింట్లో చూసినట్లు లీలగా  గుర్తు . మధ్య ప్రదేశ్ చిత్రకారుల జాబితాలో ,ఆంధ్ర చిత్రకారుల జాబితాలో 20వ శతాబ్ది తెలుగు వెలుగులు లో  వెతికితే వారి పేరే కనిపించక పొతే ,మా అబ్బాయి శర్మ కు  పై వివరాలు చెబితే వెతికి ,కొన్ని వివరాలు ,ఆయన రాసిన వ్యాసాలూ ఆయన మోనోకట్ చిత్రాలు పంపాడు వాటి ఆధారంగా ఆయన జీవిత విషయాలు పొందు పరుస్తున్నాను .ఇంకా ఎవరికైనా అదనపు విషయాలు  తెలిస్తే .అందజేయమని కోరుతున్నాను  .

  శ్రీ తిరుమల రామ చంద్ర గారికి శ్రీ వేలూరి రాదా కృష్ణ ఇచ్చిన ఇంటర్వ్యు ‘’హైదరాబాద్ నోట్ బుక్ ‘’లో వచ్చింది అందులోని విషయాలే రాస్తున్నాను .’’నిరంతర కళా సేవే నా లక్ష్యం .మా తండ్రి శ్రీ వేలూరి రామమూర్తిగారు ,పెదతండ్రి శతావధాని శ్రీ వేలూరి శివరామ శాస్త్రి గారు నాకు ఆదర్శం.వారి అడుగుజాడలలో నడచుకోవటమే నా కర్తవ్యమ్ ‘’అన్నారు  వేలూరి వారు  తిరుమల వారితో .ఇదీ ఆ వంశానికి తగిన మాట ఆని మెచ్చారు  రామచంద్ర .వేలూరి వారందరూ ఆకార సదృశ ప్రజ్ఞులు ,ప్రజ్ఞా సదృశాగములు ,ఆగమ సదృశ క్రియా శీలురు ,ప్రాతస్మరణీయులు.వేలూరి శివరామ శాస్త్రి గారిని తలచుకొన్నప్పుడు ‘’పులిగడిగినముత్తేము’’వంటి వారి రూప లావణ్య గుణ పాండిత్య ప్రజా సేవలు సాక్షాత్కరించి ,మనసు ఆనంద తు౦దిలమవుతుంది .ఆ వంశం వారంతా అలాంటి వారే .ఏదో ఒక సాధన ,ఏదో ఒక తపస్సు ,ఏదో ఒక మానవ సేవ లో పునీతులు .అలాంటి రామమూర్తి గారింటి కళాకారుల తనయుడు రాదా కృష్ణ మాటలు వేరుగా ఎలా ఉంటాయి ?అన్నారు తిరుమల ప్రజ్ఞాని .

  శ్రీ వేలూరి రాధాకృష్ణ 1930 లో కృష్ణా జిల్లా చిరివాడ అగ్రహారం లో పుట్టారు. అది సకల ఆగమ విద్యల ‘’సిరివాడ ‘’  .నెరవాడ ,పేర్వాడ .తండ్రి రామమూర్తి గారు సుప్రసిద్ధ కళా చార్యులు శ్రీ  ప్రమోద కుమార్ ముఖర్జీ శిష్యులు. తనకొడుకు కూడా అంతటి  కళాకారుడు కావాలని కోరుకున్నారు తండ్రి రామమూర్తి .తగిన శిక్షణ తండ్రిగారు పుత్రరత్నానికి ఇచ్చారు .తర్వాత మద్రాస్ వెళ్లి లలిత కళాశాలలో దేవీ ప్రసాద్ చౌదరి గారి వద్ద కళాభ్యాసం చేసి డిప్లమో పొందారు రాధా కృష్ణ .పిమ్మట శాంతినికేతన్ లో శ్రీ నందా లాల్ బోస్ వద్ద ప్రత్యెక శిక్షణ పొందారు .కొన్నేళ్ళు ఆంధ్రపత్రికలో కళా కారులుగా పని చేశారు .తర్వాత కళోపాధ్యాయ వృత్తీ చేబట్టి ,మధ్యప్రదేశ్ లోని ‘’పచ్ మర్హి’’లో ఆర్ట్ లెక్చరర్ గా కొనసాగారు .

  రాధాకృష్ణ లలితా కళా రంగం లో చేపట్టని ప్రక్రియ లేదు .చేబట్టి దిట్టతనం చూపనినిది ఏదీ లేదు.ఎన్నో నీటి వర్ణ చిత్రాలు తైల వర్ణ చిత్రాలు ,రేఖా చిత్రాలు , లినోకట్ చిత్రాలు,గ్రాక్ లను ఆయన తూలిక సుసంపన్నం చేసింది .అనంత కళా ఖండాలను సృజించినది .దానికి ప్రాచీన ఆర్వాచీన భేదం లేదు.ఇజాలజోలి లేనే లేదు .దానిది నిజమైన గతి, రీతి .తెలుగు ప్రజాజీవితం రమణీయంగా ఆయన తూలిక చిత్రించింది .తెలుగుప్రజలు వాటిని ఆదరించి స్వంతం చేసుకొన్నారు .ఆయన చిత్రాలలో పూజకోసం ,బాటసారులు ,క్షేత్రయ్య ,అప్రత్యక్ష శిష్యుడు ,నాట్య కౌశలం మొదలైనవి మన రాష్ట్ర ,దేశ ,అమెరికా ,స్విట్జర్లాండ్ ,,ఫిలిప్పీన్స్ మొదలైన ఇతర దేశాల కళా హృదయులనూ ఆకర్షించి అబ్బుర పరచాయి .అనేక చిత్రాలు మధ్యప్రదేశ్ గవర్నర్ రాజభవనాన్ని ,విదేశ ప్రముఖుల నివాసాలను అలంకరించాయి .

  వేలూరి  రాదా కృష్ణ అనేక వ్యక్తిగత ,సమష్టి కళా ప్రదర్శనలు నిర్వహించారు .విశేష ప్రశంసలు బహుమతులు అందుకొన్నారు .కవి విమర్శకుడు అవటం అరుదు .కళాకారుడు రచయిత ,కళా విమర్శకుడు కావటం కూడా అంతే.’’తన సుందర చిత్రాలలాంటి చక్కని శైలిలో రచన చేసి ,మౌలిక కళా విమర్శ చేసే ఇద్దరిలో ఒకరు వేలూరి రాధా కృష్ణ ఆని నా వ్యక్తిగత అభిప్రాయం’’ఆని కీర్తి కిరీటం పెట్టారు తిరుమల రామ చంద్ర ఆచార్యవర్యులు.తెలుగు ఇంగ్లీష్ లలో రాధాకృష్ణ కళారీతుల గురించి ముఖ్యంగా తెలుగు కళా వైదగ్ధ్యాన్ని గురించి అనేకానేక వ్యాసాలు  రాశారు .కళాకారుల జీవితాలను నిష్పక్ష పాతం గా చిత్రించారు .ఆయన రాసిన ‘’కళోదంతం ‘’  అనే గ్రంథం కళపై వచ్చిన ఉత్తమ గ్రంథం అన్నారు ఆచార్య .నేషనల్ బుక్ ట్రస్ట్ కోసం ‘’కాశ్మీర్ ‘’పుస్తకం రాశారు .ఆంధ్రకళావైభవాన్ని లిఖిత పూర్వకంగా చాటటం ఆయన లక్ష్యం .ప్రవాసం లోఅంటే ఇతర రాష్ట్రం లో  ఉన్నా తెలుగుతనం కాపాడుకోవటం ఆయనకు చాలా ఇష్టం .ఆంధ్రప్రదేశ్ లలితా కళా అకాడెమీ ఆదరించక పోయినా ,,మధ్యప్రదేశ్ లలితకళా అకాడెమీ సభ్యత్వమిచ్చి గౌరవించి అక్కున చేర్చుకొన్నది .

  ‘’నేను 1965లో భోపాల్ రాగానే ‘’ఆదర్శ సాంస్కృతిక పరిషత్ ‘’స్థాపించాను .మధ్యప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొంది రిజిస్టర్ అయిన సంస్థ ఇది . అయినా గుర్తింపు పొందలేదని ప్రతిభావంతులైన కళాకారులు విజ్ఞానమూర్తులు బాధ పడుతున్నారు .ప్రతిభావంతులైన చిత్రకారుల ను వారి శిల్పాలు చిత్రాలను ప్రదర్శించి ఆకర్షించటం నా లక్ష్యం .ఇక్కడే ‘’అఖిలభారత కళా ప్రదర్శన ‘’నిర్వహించాను .రెండు కళాసదస్సులు జరిపాను .అరడజను మంది ప్రముఖ కళాకారులను సత్కరించి గౌరవించాను .వ్యష్టి ప్రదర్శనలు అనేకం నిర్వహించి ప్రోత్సహించాను .భారత ప్రభుత్వం ఈ సంస్థను గుర్తించింది .దీనికి కేంద్ర లలితా కళా అకాడేమికి,ఆంధ్రప్రదేశ్ లలిత కళా అకాడేమికి సంబంధం ఉన్నది .   ఇటీవలే ‘’రిధం ఆర్ట్స్ సొసైటి ‘’పేరున ఒక ఆర్ట్ ఇన్స్టిట్యూట్ తెరచి ,వర్ధమాన కళాకారులను తయారు చేస్తున్నాను ‘’ఆని తిరుమల రామచంద్రజీ  చేసిన ఇంటర్వ్యు లో వేలూరి రాధా కృష్ణ మనసులోని భావాలు పంచుకొన్నారు .  

  తాను మధ్యప్రదేశ్ లో ఉండిపోవటం వలన తనను ఆంధ్ర ప్రజలు మర్చిపోయి ఉంటారని బాధపడ్డారని రామచంద్ర ఉవాచ .వేలూరి రాధాకృష్ణ ఆసేతు హిమాచల పర్యంత భారతావని తనదే ఆని గర్వపడే మహా వ్యక్తి ఆని ,ఆకళాసేవ అలానే కొనసాగాలని, తెలుగు వారు గుర్తించనంత మాత్రాన ఆయనకు వచ్చిన నష్టం ఏమీ లేదని ,ప్రచారానికి, పైమేరుగులకు ఆశించక కళకే అంకితమై వేలూరి రాదా కృష్ణ కళామతల్లి సేవ చేయాలని మనసారా ఆకాంక్షించారు తిరుమల రామ చంద్ర .

 కొసమెరుపుగా లోకజ్ఞులైన శ్రీ  సంపత్కుమార చక్రవర్తి ఉత్తరాలలో చివర ‘’తక్షక ‘’ఆని రాస్తారని, దాని అర్ధం ‘’తప్పులుంటే క్షమించ కలరు ‘’ఆని వివరించారు .తిరుమల వారిఈ వ్యాసం  దొరకక పొతే ప్రజ్ఞామూర్తి వేలూరి రాధా కృష్ణ గారి గురించి పూర్తిగా తెలిసేది కాదు .

‘’ శ్రీ వేలూరి రాధాకృష్ణ చిత్రలేఖన వైదుష్యం గురించి మధ్యప్రదేశ్  గవర్నర్ శ్రీ కే.వెంగళరాయరెడ్ది  హెవి ఎలెక్ట్రికల్స్ కమ్యూనిటి హాల్ లో స్థానిక ఆంధ్ర విజ్ఞాన సమితి ఏర్పాటుచేసిన రాధాకృష్ణ చిత్ర ప్రదర్శనను జనవరి 15న ప్రారంభిస్తూ (సంవత్సరం ?)రాధాకృష్ణ చిత్ర కళారీతులను,ప్రాభవాన్ని  ప్రశంసిస్తూ తమ రాజభవన్ అల౦కరణకోసం మూడు త్రివర్ణ చిత్రాలు కొన్నారు .రాధాకృష్ణ జాతీయ రక్షణ నిధికి అందించిన రెండు చిత్రాలను వేలం వేయగా వచ్చిన 20  వేల రూపాయలను రక్షణ నిధికి సమర్పించారు .ఈ సందర్భంగా రాధా కృష్ణ ఆంధ్ర విజ్ఞాన సమితికి ఒక వర్ణ చిత్రం బహూకరించారు ‘’ఆని స్థానిక భోపాల్ పత్రిక జనవరి 15నప్రచురించింది .సంవత్సరం తెలియదు .

  శ్రీ వేలూరి రాధా కృష్ణ మరణం  సంగతి కూడా మనకు తెలీదు.ఇంకో 5ఏళ్లలో ఆయన శతజయంతి కూడా వస్తోంది .దేశ దేశాలలో ఉన్న వేలూరి వారైనా  సమష్టిగా నిలబడి ఆ శత జయంతిని సగర్వంగా నిర్వహించాలని కోరుతున్నాను .మన అకాడేమీలు, కళాపరిషత్తులు ఈపనికి ముందుకు వస్తాయని నాకు నమ్మకం లేదు .

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -13-6-25-ఉయ్యూరు .

Posted in రచనలు | Leave a comment

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.13వ భాగం.13.6.25

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.13వ భాగం.13.6.25

Posted in రచనలు | Leave a comment

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.24 వ భాగం.13.6.25.

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.24 వ భాగం.13.6.25.

Posted in రచనలు | Leave a comment

 ఇప్పుడు దేవీ భాగవతం లోఆచార్యశ్రీ సృజనాత్మప్రత్యేకతలను దర్శిద్దాం .

·         కాలం మారుతోంది .సంస్కృత రచనలు ,పద్య రచనలు చదివి జీర్ణి౦చుకొనే శక్తి నేటి తరానికి లేదు.కానీ ఆస్తికత వారి నరనరాలలో జీర్ణించి ఉంది.వీరిని ఆకర్షించాలి అంటే వచనమే ,అందులోనూ  సులభతర మైన వచనమే శరణ్యం ఆని  ఆంధ్ర గీర్వాణ  ఉపన్యాసకులుగా ,ఆచార్యులుగా లబ్ధ ప్రతిష్టులైన ఆచార్య బేతవోలు రామబ్రహ్మం  గారు సులభ  వచన రూపంగా ఆహ్లాదంగా ,ఆనందంగా చదువుకొని,తొందరగా అర్ధం చేసుకొనే వీలుగా  శ్రీదేవీ మహాత్మ్యాన్ని రచించారు  .. కేంద్ర సాహిత్య అకాడమీ వారి పురస్కారం అందుకున్న గొప్ప గ్రంథ రాజం ఇది .ఆచార్యశ్రీ శేముషీ వైభవానికి, ఆంధ్ర గీర్వాణాలలో వారికున్న అపార శక్తి సామర్ధ్యాలకు ఇది అద్దం పడుతోంది .ఒకరకం గా ఇది ‘’చేతిలో ఉన్న ఆధ్యాత్మిక నవనీతం ..గుటుక్కున మింగటమే మనం చేయగలిగేది .అంత సులభంగా ‘’డౌన్ టు ఎర్త్ ‘’ గా మనకందించారు . దీనిని జన్మ నిచ్చిన తలిదండ్రులకు ,పునర్జన్మ నిచ్చిన గురు దేవులకూ అంకితమిచ్చి మాతా,పితృ, గురు ఋణం తీర్చుకొన్నారు .అప్పటికే వారికి మురారి సంస్కృత అనర్ఘ రాఘవం నాటకానికి  సురుచిర వ్యాఖ్యానం తో అర్ధతాత్పర్యాలు రచించిన అనుభవం ఉండనే ఉంది.

·         ఇప్పుడు దేవీ భాగవతం లోఆచార్యశ్రీ సృజనాత్మప్రత్యేకతలను దర్శిద్దాం .

·           సృజనాత్మకత అంటే –

·           ‘’కొత్త విలువైన ఊహలను, ఆలోచనలను,రచనలను చేసే సామర్ధ్యమే సృజనాత్మకత .లక్ష్యసాధనకు కొత్త పరిష్కా రాలు కనిపెట్టటం అన్నమాట .దీనివలన ప్రజలకు  నూతన విధానాలలో సమస్యల పరిష్కారం సాధ్యమౌతుంది  . పునరుజ్జీవన కాలం లో దీనికి కొత్త రూపు వచ్చింది .దీనిపై ఆసక్తి మనస్తత్వ శాస్త్ర ,మానవీయ శాస్త్రాల పై ఎక్కువగా కన్పిస్తుంది .వాస్తవికత సృజనాత్మకత తో కలిసి పని చేస్తుందని అందులో నిష్ణాతులు అన్నారు .సృజనాత్మకతను సౌందర్యాభిరుచి పరంగా కొందరు,సామాజిక ప్రభావంగా కొందరు భావించారు .

·         అనువాదం లో సృజన పాత్ర ఏమిటి ?

·         అనువాదం అంటే పునః కథనం .ఒక  భాషలో చెప్పిన దాన్ని మరొక భాషలో చెప్పటం అనువాదం .అంటే మూలం లోని దాన్ని చెప్పదలచుకొన్న భాషలో సరిగ్గా సహజం గా చెప్పటం .దీనిపై  అనేక అధ్యయనాలు జరిగాయి .

·         అనువాదంలో సృజనాత్మకత ఉండాలా ?
 అనువాదం అంటే  ముక్కకు ముక్కానువాదం కాదు .ఒక భాష నుండి మరొక భాషకు అనువాదం చేసేటప్పుడు, అనువాదకుడు అసలు రచన యొక్క భావాన్ని, శైలిని  ఉద్దేశాన్ని పరిగణనలోకి తీసుకుంటూ, కొత్త భాషలో అదే భావాన్ని సృష్టించగలగడం. ఇది కేవలం పదాలను మార్చడం కాదు, కానీ ఒక కళాత్మక ప్రక్రియ, ఇక్కడ అనువాదకుడు తన సృజనాత్మకతను ఉపయోగించి అసలు రచన యొక్క ఆనందాన్ని, భావాలను కొత్త భాషలో కూడా సృష్టించగలడు. అంటే మన కవిత్రయ మహాభారతం లాంటిది అన్నమాట .ఇవాళ ప్రపంచమంతా సృజనాత్మక అనువాదాన్ని కోరుకొంటున్నారు.దీనినే ‘’కంటెంట్  ట్రాన్స్ క్రియేషన్ ‘’అన్నారు .ఇక్కడ ఎవరికీ చెప్పాలి ? వారికి మూలం ఏమి  చెప్పాలను కొంటో౦ది అన్నవి చాలా ముఖ్యం .  ఇవన్నీ ఆచార్య బేతవోలుగారికి కొట్టిన పిండి, నల్లేరుపై నడక .

·           

·         ‘’ఏయే జన్మలలో ఏ దేవిని అర్చి౦చానో నాకు ఈ జన్మలో రెండు ముక్కలబ్బాయి.దానితో నీ మహిమావళిని ఆకాశ గంగా సదృశ వాక్కులతో  అభి  వర్ణిస్తాను అనుగ్రహించ’’మని శ్రీ రాజ రాజేశ్వరీ దేవిని ప్రార్ధించారు అత్యంత వినయ భూషణులై   . సాక్షాత్తు జగన్మాత ప్రధాన పాత్రవహించిన ఈ పురాణం పురాణ రాజమే అన్నారు .భుక్తి ,ముక్తి  దాయకం ఆని మనకు అభయమిచ్చారు .ఇందులో ధర్మార్ధ కామ మోక్షాలనిచ్చే మనోహర కథలున్నాయని ,యోగ, తంత్ర , మంత్రాది శాస్త్రాలు నిక్షిప్తమయి ఉదాత్తత ను కలిగించాయని  చేతిలో మిఠాయి పట్టుకొని బాలురను ఆకర్షించినట్లు చదువరులను ఆకట్టుకొన్నారు .ఇప్పటికీ ఆంధ్ర ప్రాంతం లో తాంత్రిక మతానుయాయులున్నారని అందుచే దేవీ భాగవతం ఇక్కడ బాగా ప్రసిద్ధి చెందిందని, దీనికి కారణం జగజ్జనని విజయవాటిక అయిన బెజవాడ లో శ్రీ కనకదుర్గా మాత ఇంద్రకీలాద్రిపై కొలువై ఉండటం కూడా గొప్ప విషయం అన్నారు .తమకున్న అనుభవం వలన కథాభాగాలు తేలికగానే అనువదించగలిగానని, తాత్విక విషయాలు కొంత ఇబ్బందిపెట్టినా, నీలకంఠుల వారి తిలక్ వ్యాఖ్యానం ,బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ గారి సౌభ్రాతృత్వం తో ఒడ్డుకు చేరగలిగానని కృతజ్ఞతలు ప్రకటించారు .తాంత్రిక -ఉపాసనా విషయాలలో ఏవైపుకు మొగ్గకుండా మధ్యేమార్గాన్ని అనుసరించానని చెప్పుకొన్నారు .వ్యాస భగవానుడే గుట్టుగా ఉంచిన వాటిని ,గురువే శరణ్యం అనుకొన్న చోట్లా వివరించే ప్రయత్నం చేసి పాఠకులను కీకారణ్యం లో పడవేయటం ఇష్టం లేక  వివరించే ప్రయత్నం విరమించి మార్గం సుగమం చేశానన్నారు .ఇది తన తెలియని అజ్ఞానానికి నిదర్శనం ఆని నిర్భయంగా ఒప్పుకొన్నారు .తీర్ధ క్షేత్ర దైవతాల వర్ణన విషయ౦ లో వ్యాసవాణి అమృతధారలను చిలికిస్తుందని ,ఆనంద లాస్యం చేస్తుందని ,,వాటిని వచనం లో పెడితే బాణీలో మార్పు వస్తుంది కనుక ఆ బాణీ పట్టుకోవటానికి తన శక్తి ధార పోయాల్సి వచ్చిందన్నారు .ధ్వని సంపుటీకరణం వలన  వ్యాసోద్దేశ ప్రయోజనాన్ని యధా తధంగా అందించే ప్రయత్నం చేశారు బేతవోలు వారు .ప్రధాన స్తోత్రాలలో మనం దీన్ని గమనించవచ్చు .తెలుగు పాఠకులకు ,దేవీ భక్తులకు ఇది పారాయణ గ్రంథం గా ఉండాలని ఆయువు పట్లు అయిన అన్ని శ్లోకాలను ఉదహరించారు .కవితా సౌరభాలను గుబాళించే శ్లోకాలను కూడా యధావిధిగా ఉదాహరించి మహోపకారం చేశారు .ఇవి అనువాదానికి అదనపు విలువలను అందించాయి .సాంకేతిక ,అప్రసిద్ధ పదాలకు బ్రాకెట్ లలో అర్ధాలు ఇవ్వటం గొప్పగా ఉంది.కొత్తపదాల పరిచయానికి ఇది రాజమార్గం అవుతుంది .సులభ తెలుగు శైలోలోనే  రాసినా,  ఉదాత్తత కు భంగం రాలేదు ,చిక్కదనం  సడలలేదు .మూలం లోని అందాలను చెదరనివ్వలేదు, మాసిపోనివ్వలేదు .తెలుగు వచనానికి ఉన్న ఒడుపు ఒయ్యారాలను త్యాగం చేయలేదు .శైలీ రామణీయకతకోసం కారకాన్ని మార్చుకొన్నారు .అవసరమైన చోట్ల ఒకటి రెండుపదాలు అదనంగా చేర్చారు .సంస్కృత మూలం లో దేనినీ మార్చలేదు .ఉన్నదేదీ జార్చలేదు .

·         ‘’యద్యచ్చరితం దేవ్యా స్తత్సర్వం లోకహేతవే -నిర్వ్యాజయా కరుణయా పుత్రే మాతుర్యధా తధా’’ అన్నట్లు అమ్మ వడిలో మాతృ వాత్సల్యం అనుభవించారు బేతవోలు గారు .

·          తృతీయ స్కంధం లో జనులకు హితమైనదే సత్యం .జ్ఞానులు విముక్తులు అంతర్యజ్ఞం చేయాలి .నిర్దుష్టంగా యుక్తి యుక్తంగా ,అత్యంత జాగ్రత్తగా యజ్ఞం చేస్తేనే సత్ఫలితాలు లభిస్తాయి .మునులకు, మోక్షకాములైన మహాత్ములకు విరాగులకు పూర్ణ యజ్ఞమైన మానవ యజ్ఞం చెప్పారు .దీనికి ఏ దోషాలు అంటవు . విష్ణుమూర్తి దేవీ యజ్ఞం చేసి దేవాధి దేవుడయ్యాడు .ఆని యజ్ఞ ధర్మాన్ని చాలా వివరంగా తేలికభాషలో చెప్పారు .

·           మహాదేవిని యోగ విద్యా రహస్యం చెప్పమని హిమవంతుడు అడిగితే ‘’జీవాత్మ పరమాత్మల సమైక్యమే యోగం ‘’ఆని చెప్పింది  సప్తమ  స్కంధం లో.విశ్వమే బ్రహ్మ అనే అనుభవం కలిగినవాడు బ్రహ్మ భూతుడు ,ప్రసన్నాత్ముడు .దేనికీ వెరవడు. ఉత్తమ దేవీ క్షేత్రాలను వివరిస్తూ కామాఖ్యాయోని మండలం కంటే ఉత్తమోత్తమ దేవీ స్థానం ఎక్కడాలేదు అన్నది .ధర్మం వల్ల భక్తీ, భక్తి వల్ల పరం లభిస్తాయి . అష్టమ స్కంధ౦ లో మేరుపర్వత శిఖరం పైన ఉన్న నేరేడుచెట్టునుంచి ఏనుగు తలలంతటి జంబూ ఫలాలు రాలి పగిలి పోగా జంబూ నది ఏర్పడింది, ఆని, భవుడు ఒక్కడే దేవుడు ఆని ,ఆయన బ్రహ్మ అక్షిగోళాలనుంచి జన్మించాడని,ఆయన సంకర్ష ణుడిని సదా ధ్యానిస్తూ దేవీగణం తో ఇలావృతం లో ఉంటూ,  లోకకార్యం చేస్తాడని  నారద మాహర్షికి  విష్ణువు బోధించాడు  . రాధికారాధన,దుర్గా రాధనా ఉన్నాయి .

·           దశమ స్కంధం లో అగస్త్యుని దక్షిణ యాత్ర ,స్వాయంభువు వి౦ధ్య వాసినిని ఉపాసి౦చటం ,మన్వంతరాలలో వివిధ నామాలతో దేవీ ఉపాసన ,మహిషాసురవధ,భ్రామరీ ఉపాసన ,ఏకాదశ స్కంధం లో సదాచార నియమాలు ,శౌచం ,రుద్రాక్ష భేదాలు ,భస్మ ధారణా ,,జపం ,వైశ్వ దేవం,ప్రాజాపత్యం   మొదలైనవి ఉన్నాయి 

·           చివరి ద్వాదశ స్కంధం లో  గాయత్రి మంత్రాక్షర మహిమ ,కవచం ,గాయత్రీ హృదయం ,స్తోత్రం ,అష్టోత్తర సహస్రనామాలు ,దీక్షా ప్రదానం ,స్కండిలకుండల సంస్కారాలు ,దీక్షా స్వీకారం ,ఇంద్రాదిదేవతలు దైత్యులతో యుద్ధంచేసి, నిర్జించి విజయ గర్వంతో సంబరాలు చేసుకొంటుంటే ‘’కేనోపనిషత్ ‘’లోని విధంగా వారి గర్వాన్నిఉమాదేవి  అణచటం ,మహాదేవి ఆత్మావిష్కారం ,గాయత్రీ మహిమ ,దేవీ శక్తులు పరిచారికలు,అష్ట మాతృకలు ,షోడశ దళ పద్మం ,చింతామణి గృహం శ్రీమాత ,జనమేజయుని మనశ్శాంతి ,శ్రీ దేవీ భాగవత ఫలశ్రుతి చెప్పి

·         ‘’సచ్చిదానంద రూపాం తాం గాయత్రీ ప్రతిపాదితాం -నమామి హ్రీమ్మయీం దేవీం ధియో నః ప్రచోదయాత్’’అంటూ వచన శ్రీ దేవీ భాగవతాన్ని ముగించారు ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు .  .

·           గబ్బిట దుర్గా ప్రసాద్ -27-5-25-ఉయ్యూరు .9989066375

·           ఈ క్రిందిది  ప్రసారం కాని నేను రాసుకొన్న  స్క్రిప్ట్

·         ద్వాదశ స్కంధ శ్రీదేవీ భాగవతాన్నిబేతవోలువారు సూటిగా ప్రారంభించి చరాచర జగత్తు అంతా ఆపరాశక్తి కి ఒక క్రీడా విలాసమని ,సృష్టించేవేళ సృజన ,రక్షణ పాలించే సమయంలో పాలన స్వరూప ,సంహార వేళ రౌద్రస్వరూప అనీ ,పరా పశ్యంతి మాధ్యమా రూప వాక్కు ఆ మాతస్వరూపమేనని ,త్రిమూర్తి సంపూజిత ఆ జగన్మాత ప్రసన్నురాలై మనకు అమోఘ వాక్ శక్తి అనుగ్రహించాలని అమ్మకు నమస్కరించి ,నరనారాయణ ,సరస్వతి ,వ్యాస మహర్షి లను స్తుతించి ఏ పురాణమైనా ప్రారంభించాలన్నారు .పరమ పావనం ,సులభంగా భుక్తి ముక్తులనిచ్చే మహా పురాణాన్ని అనుగ్రహించమని నైమిశంలో శౌనకాదులు కోరితే సూతమహర్షి ‘’లోకహితం కోరారు కనుక సకల శాస్త్రసారం పరమ పావనమైన దేవీ భాగవతం వినిపిస్తానని ,అది పాపారణ్యాలకు గండ్రగొడ్డలి ,తమస్సుకు పొద్దు పొడుపు ఆని ప్రారంభించి ,భగవాన్ వేద వ్యాస మహర్షి జననాది విషయాలు వేదవిభజన ,అష్టాదశ పురాణ రచన  వివరించి , దేవీ భాగవతాన్ని అందరు అన్ని వేళలా వినవచ్చు మానవులైతే చాలు అన్నాడు .అయితేదేవీ నవరాత్రులలో నవాహయజ్ఞం గా వింటే విశేష పుణ్యం .శ్రవణ మహా యజ్ఞాన్నిస్తుంది .అందుకే దేవీ మఖం అంటే దేవీ యజ్ఞం అన్నారు .దేవీ భాగవత గ్రంథ దానం  విశేష పుణ్య ఫలదం .ఆని శ్రవణ, దాన ఫలితం కూడా చెప్పాడు . అవసరమైన చోట్ల మూల శ్లోకాలను ఉదహరించి ,భావం నేరుగా వివరించారు .అందుకని కథా ప్రవాహం లో అలా అలా కొట్టుకు పోతూనే ఉంటాం .ఎక్కడా విసుగు అనిపించదు.ఇది బేతవోలు గారి ప్రత్యేకత,చాతుర్యం .

·           ‘’యోగ నిద్రా మీలితాక్షం విష్ణుం దృష్ట్వా౦బుజే స్థితః -అజస్తుష్టావ యాం దేవీం తామహం  శ్రవణం భజే ‘’విష్ణుమూర్తి యోగనిద్రలో ఉన్నప్పుడు ,నాభికమలం లోని బ్రహ్మ సగుణ నిర్గుణ మాయా స్వరూపిణి ,ముక్తి దాయిని అయిన ఆపరాశక్తికి నమస్కరించి దేవీ భాగవతం చెప్పటం మొదలు పెట్టాడు .   .తర్వాత వ్యాసజననం ,హయగ్రీవ ఉత్పత్తి చెప్పాడు .ఒకసారి విష్ణు వును నిద్రలేపటానికి వమ్రి, ఆయన ధనుస్సు ను కొరికితే ఆయన తల తెగి పడింది .ఎంత వెతికినా దొరకలేదు .త్రిమూర్తులు దేవతలు దిక్కు తోచక తబ్బిబ్బు అయి జగన్మాతను ‘’బ్రహ్మ విద్యాం జగద్ధాత్రీం సర్వేషాం జననీం తధా-యయా సర్వమిదం వ్యాప్తం త్రైలోక్యం స చరాచరం ‘’అంటూ  స్తుతించాలని భావించగా బ్రహ్మ నాలుగుముఖాలు వేదాలు మాతృ సూక్తం ఆలపించాయి .అమ్మ ప్రత్యక్షమై వారిని ఊరడించి  గుర్రం ముఖాన్ని తెచ్చి విష్ణుమూర్తి మొండానికి దేవ శిల్పి చేత అతికి౦ప జేయగా ఆయన హయగ్రీవుడై ,హయవదనరాక్షస సంహారం చేసి లోకాలను కాపాడాడు . అందుకే శ్రావణ పౌర్ణమినాడు,అంటే రాఖీ పౌర్ణమినాడు  వైష్ణవ దేవాలయాలలో శ్రీ హయగ్రీవ జయంతి జరుపుతారు .  

·          గబ్బిట దుర్గాప్రసాద్ -11-6-25-ఉయ్యూరు .    

Posted in రచనలు | Leave a comment

అభ్యుదయ చలన చిత్ర వైతాళికుడు శ్రీ గూడవల్లి రామ బ్రహ్మ0 గారి జీవిత చరిత్ర.3 వ భాగం.12.6.25.

అభ్యుదయ చలన చిత్ర వైతాళికుడు శ్రీ గూడవల్లి రామ బ్రహ్మ0 గారి జీవిత చరిత్ర.3 వ భాగం.12.6.25.

Posted in రచనలు | Leave a comment

కథా సవ్య సాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు.15 వభాగం.12.6.25.

కథా సవ్య సాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు.15 వభాగం.12.6.25.

కథా సవ్య సాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు.15 వభాగం.12.6.25.

Posted in రచనలు | Leave a comment

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.12వభాగం.12.6.25.

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.12వభాగం.12.6.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.23 వభాగం.12.6.25

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.23 వభాగం.12.6.25.

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.23 వభాగం.12.6.25.

Posted in రచనలు | Leave a comment

అభ్యుదయ చిత్ర వైతాళికుడు. శ్రీ గూడవల్లి రామ బ్రహ్మ0 గారి జీవిత చరిత్ర.2 వభాగం.11.6.25.

అభ్యుదయ చిత్ర వైతాళికుడు. శ్రీ గూడవల్లి రామ బ్రహ్మ0 గారి జీవిత చరిత్ర.2 వభాగం.11.6.25.

Posted in రచనలు | Leave a comment

కథా సవ్య సాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు.14 వ భాగం.11.6.25.

కథా సవ్య సాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు.14 వ భాగం.11.6.25.

Posted in రచనలు | Leave a comment

జూన్ 11న ఆలిండియా రేడియో విజయవాడ నుండి ప్రొఫెసర్ బేతవోలు రామబ్రహ్మం గారు అనువదించిన దేవీభాగవతంపై విలువైన ప్రసంగ ప్రసారం. గబ్బిట దుర్గా ప్రసాద్

జూన్ 11న ఆలిండియా రేడియో విజయవాడ నుండి ప్రొఫెసర్ బేతవోలు రామబ్రహ్మం గారు అనువదించిన దేవీభాగవతంపై విలువైన ప్రసంగ ప్రసారం. గబ్బిట దుర్గా ప్రసాద్

Posted in రచనలు | Leave a comment

అభ్యుదయ చలన చిత్ర వైతాళికుడు శ్రీ గూడవల్లి రామ బ్రహ్మ0 గారి జీవిత చరిత్ర.1 వ భాగం.7.6.25.

అభ్యుదయ చలన చిత్ర వైతాళికుడు శ్రీ గూడవల్లి రామ బ్రహ్మ0 గారి జీవిత చరిత్ర.1 వ భాగం.7.6.25.

అభ్యుదయ చలన చిత్ర వైతాళికుడు శ్రీ గూడవల్లి రామ బ్రహ్మ0 గారి జీవిత చరిత్ర.1 వ భాగం.7.6.25.

Posted in రచనలు | Leave a comment

కథా సవ్య సాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు., 13వ భాగం.7.6.25.

Posted in రచనలు | Leave a comment

స్త్రీ పునర్వివాహ ప్రోత్సాహకులు ,విద్యావేత్త ,లాయర్ ,జిల్లా మున్సిఫ్ ,వేద పాఠశాల స్థాపకులు ,యజ్ఞాలలో పశు హింస మాన్పించినకృష్ణా జిల్లా వాసి  -శ్రీ ఆత్మూరి లక్ష్మీ నృసింహ సోమయాజులు

స్త్రీ పునర్వివాహ ప్రోత్సాహకులు ,విద్యావేత్త ,లాయర్ ,జిల్లా మున్సిఫ్ ,వేద పాఠశాల స్థాపకులు ,యజ్ఞాలలో పశు హింస మాన్పించినకృష్ణా జిల్లా వాసి  -శ్రీ ఆత్మూరి లక్ష్మీ నృసింహ సోమయాజులు

కృష్ణా జిల్లా నూజివీడులో 25-8-1845న శ్రీ ఆత్మూరి కృష్ణమూర్తి శ్రీమతి రాఘవమ్మ దంపతులకు శ్రీ ఆత్మూరి లక్ష్మీ నృసింహ సోమయాజులుజన్మించారు .తండ్రి కుగ్రామం లో పనిచేయటం వలన యాజులుగారు 12వ ఏడు వరకు చదువుకోలేక పోయారు.1858లో బందరు హిందూ స్కూల్ లో చేరి .1965లో మెట్రిక్,ఉపాధ్యాయ పరీక్ష  పాసై ,1866లో ఎఫ్. ఎ.బంగారు పతకం తో కృతార్దులయ్యారు .14వ ఏటనే శ్రీమతి యశోదాంబతో వివాహం జరిగింది .

 1866,1869,1873లలో రెవిన్యూ శాఖవారి క్రిమినల్ ,సివిల్ పరీక్షలు పాసై ,1872,1874లలో బి .ఎ., బి .ఎల్.డిగ్రీలు పొందారు .1866-67లో బందరు చర్చి మిషన్ స్కూల్ లో ,1868-70మధ్య రాజమండ్రి ప్రొవిన్షియల్ స్కూల్ లో ఉపాధ్యాయులుగా పని చేశారు .1871-73మధ్య గంజాం జిల్లా డిప్యుటి ఇన్స్పెక్టర్ఆఫ్ స్కూల్స్  గా ఉద్యోగించారు .

  తర్వాత న్యాయవాద వృత్తిలో చేరి 1873-77మధ్య బరంపురం జిల్లా కోర్టు లో ,1878లో హైకోర్ట్ లో లాయర్ గా పని చేశారు .1878-80 లలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా చేసి ,1879-99వరకు ఇరవై ఏళ్ళు జిల్లా మున్సిఫ్ గా పలు చోట్ల పని చేసి గొప్ప పేరు ప్రతిష్టలు పొందారు .

 భారతీయ వాజ్మయాన్ని అవపోసన పట్టిన నృసింహ సోమయాజులుగారు బూజుపట్టిన సనాతన భావాల బూజు దులిపి ,వేదాలకు భగవద్గీత కు  గూడార్ధాలు చెప్పటం లో నిష్ణాతులయ్యారు  .మఠాధిపతుల ప్రశంసలు పొందారు.వేద ధర్మ శాస్త్ర గ్రంధాలు సేకరించి వేద పాఠశాల స్థాపించారు .యజ్ఞ యాగాలలో పశు బలిని నిరసించారు .వేదాలు శూద్రులు ,స్త్రీలు కూడా వినవచ్చునని ఘంటా పదంగా తెలియజేసి ప్రోత్సహించారు .’’వేదార్ధ ప్రకాశిక ‘’మాసపత్రిక నెలకొల్పి ,వేదాల భగవద్గీత సారాన్ని అందరికి తేలికగా అర్ధమయ్యేలా సులభ శైలిలో రాసి మహా ప్రచారం చేశారు .మూఢా చారాలను సమర్ధించే ఎంత గొప్పవారినైనా దూది ఏకినట్లు ఏకి పారేసేవారు.వేదాలలో స్త్రీల పునర్వివాహ విషయం ఉందని ఊరూ వాడా ప్రచారంచేశారు .విరూపాక్ష శంకరస్వామి దీన్ని వ్యతిరేకిస్తే, మద్రాస హైకోర్ట్ లో కేసు వేసి సాములోరికి రెండు వందల జుల్మానా వేయించిన ఘనాపాటీ లాయర్ సోమయాజులు గారు .

  సముద్రాలు దాటి వెళ్ళరాదనే  చాందస వాదాన్నిఖండించి అలా చేసిన వారిపై దండన విధించటం పై పోరాడి విజయంసాధించారు .బాల్య వివాహాలను ఖండించారు .మద్రాస్ లో ఉన్న ’’సర్వజాతీయ నీతి ప్రచారక సంఘం ‘’ లో సభ్యులుగా చేరి ,వివిధ రాష్ట్రాలు పర్యటించి ఉపన్యాసాలిస్తూ నీతి ధర్మాలను ప్రచారం చేశారు .13-6-1906 న 61వ ఏట ‘’అపర ఆంధ్ర వివేకానంద స్వామి ‘’లాంటి బ్రహ్మశ్రీ ఆత్మూరి లక్ష్మీ నృసింహ సోమయాజులు గారు పరమ పదించారు .   

ఆధారం -శ్రే మాధవ పెద్ది గోఖలే (మా గోఖలే )వ్యాసం .

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -7-6-25-ఉయ్యూరు .

Posted in రచనలు | Leave a comment

డా. ముట్నూరి సంగమేశం గారి. తెలుగు హాస్యం.2 వ భాగం.6.6.25.

Posted in రచనలు | Leave a comment

కథా సవ్య సాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు.12 వ భాగం.6.6.25.

కథా సవ్య సాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు.12 వ భాగం.6.6.25.

కథా సవ్య సాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు.12 వ భాగం.6.6.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ ముట్నూరి సంగమేశం గారి. తెలుగు హాస్యం.1 వ భాగం.4.6.25.

శ్రీ ముట్నూరి సంగమేశం గారి. తెలుగు హాస్యం.1 వ భాగం.4.6.25.

శ్రీ ముట్నూరి సంగమేశం గారి. తెలుగు హాస్యం.1 వ భాగం.4.6.25.

Posted in రచనలు | Leave a comment

కథా సవ్య సాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు.11వ భాగం.4.6.25.

కథా సవ్య సాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు.11వ భాగం.4.6.25.

Posted in రచనలు | Leave a comment

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.11వ భాగం.4.6.25.

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.11వ భాగం.4.6.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.22 వ భాగం.4.6.25.

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.22 వ భాగం.4.6.25.

Posted in రచనలు | Leave a comment

ఆనందవాణి పత్రిక సంపాదకుడు -శ్రీ ఉప్పులూరి కాళిదాసు

ఆనందవాణి పత్రిక సంపాదకుడు -శ్రీ ఉప్పులూరి కాళిదాసు

4-12-1915విజయ నగరం లో జన్మించారు శ్రీ ఉప్పులూరి కాళిదాసు.అక్కడే విద్య పూర్తి చేసి పాతికేళ్ళ వయసు లోపే పత్రికా రంగం లో ప్రవేశించి పత్రిక స్థాపకులయ్యారు .1932లో చదువుకొనే రోజుల్లోనే ,శ్రీ మల్లాజోశ్యుల వెంకన్నపంతులు గారి ప్రోత్సాహంతో పత్రికా విలేకరి అయ్యారు .హిందు ,బాంబే క్రానికల్ పత్రికలలో ఈయన రాసిన వార్తలు అచ్చయేవి . తెలుగు ఇంగ్లీష్ లలో వ్యాసాలూ రాసేవారు .ప్రముఖ  సంపాదకుడు  శ్రీ ఖాసా సుబ్బారావు ,రచయితలు శ్రీ మల్లాది రామ కృష్ణ శాస్త్రి ,న్యాయమూర్తి సర్ ముత్తా వెంకట సుబ్బారావు గార్లతో ఆంతరంగిక పరిచయం ఉండేది .రాజాజీ తో సాన్నిహిత్యం ఉండేది .

  1939లో స్వాతంత్ర్యోద్యమకవి శ్రీగరిమెళ్ళ సత్యనారాయణ గారితో కలిసి ‘’ఆనందవాణి ‘’వార పత్రిక మద్రాస్ లో  స్థాపించారు కాళిదాసు .2-1-1939న మొదటి సంచిక శ్రీ రాజాజీ ముఖ చిత్రంతో వెలువరించారు .ఇది యువ రచయితలకు కళాకారులకు గొప్ప ప్రోత్సాహం కల్పించింది .శ్రీపాద, మునిమాణిక్యం ,మల్లాది మొదలైన ప్రసిద్ధ రచయితలకు  అది వేదిక .1945లో వారపత్రిక ను మాస పత్రిక గా మార్చారు .1960లో కార్యస్థానం మద్రాస్ నుంచి హైదరాబాద్ కు మార్చారు .

  జాతీయోద్యమకాలం లో ఆనందవాణి కాంగ్రెస్ కు వెన్ను దన్నుగా ఉంటూ ఎన్నెన్నో రాజకీయ  సాంఘిక విష యాలపై చర్చలు ప్రచురించేది .శ్రీశ్రీ ‘’వారం వారం ‘’శీర్షిక ,’గళ్ళనుడికట్టు ‘’ .శ్రీ రావూరు వెంకట సత్యనారాయణ ‘’కప్పు కాఫీ ‘’ శీర్షిక నిర్వహించేవారు .రాజాజీ రాసిన రామాయణ భారత భాగవతాలను వ్యాస ప్రచురణాలయం  ద్వారాప్రచురించారు .సంపాదక శ్రేష్ఠులు శ్రీ ఎం .చలపతి రావు గారి ‘’ఆల్ ఇన్ ఆల్’’కు అనువాదంగా ‘’ఎందరో మహానుభావులు ‘’గ్రంథం ప్రచురించారు .

 శ్రీ వేంకటేశ్వర స్వామి అనే పుస్తకం రాశారు ఉప్పులూరి .’’రాధాకృష్ణన్ రీడర్ ‘’అనే అభినందన సంచిక కూడా వెలువరించారు .ఆనంద వాణి ఉప సంపాదకులుగా శ్రీ ఆండ్ర శేషగిరిరావు ,ముద్దా విశ్వనాధం ,మహంకాళి శ్రీరామమూర్తి శ్రీనివాస శిరోమణి ,వడలి మందేశ్వర రావు, ఆరుద్ర వంటి సాహితీ జగజ్జెట్టీలు పని చేశారు .ఆ రోజుల్లో చదువుకొన్న వారెవరైనా మద్రాస్ హైదరాబాద్ లకు వెడితే వారికి తమ పత్రికలో ఉద్యోగ కల్పనతో సాయం చేసేవారు .27-10-1995న ఎనభై ఏళ్ల వయసులో ఆనందవాణి పత్రికా నిర్వాహకులు శ్రీ ఉప్పులూరి కాళిదాసు మహాకవి కాళిదాసు ను చేరారు .  

ఆధారం -శ్రీ రాంభట్ల నృసింహ శర్మ గారి వ్యాసం .

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -4-6-25-ఉయ్యూరు 

Posted in రచనలు | Leave a comment

మీనూ మసాని రచన. మన ఇండియా.4 వభాగం.3.6.25.

మీనూ మసాని రచన. మన ఇండియా.4 వభాగం.3.6.25.

Posted in రచనలు | Leave a comment

కథా సవ్య సాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు.10 వ భాగం.3.6.25.

కథా సవ్య సాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు.10 వ భాగం.3.6.25.

కథా సవ్య సాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు.10 వ భాగం.3.6.25.

Posted in రచనలు | Leave a comment

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.10వ భాగం.3.6.25.

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.10వ భాగం.3.6.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.21.వ భాగం.3.6.25.

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.21.వ భాగం.3.6.25.

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.21.వ భాగం.3.6.25.

Posted in రచనలు | Leave a comment

మీనూ మసాని రచన. మన ఇండియా.3 వ భాగం.2.6.25.

మీనూ మసాని రచన. మన ఇండియా.3 వ భాగం.2.6.25.
https://youtu.be/rrEATBDpmEY

Posted in రచనలు | Leave a comment

కథా సవ్య సాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు.9 వ భాగం.2.6.25.

కథా సవ్య సాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు.9 వ భాగం.2.6.25.

కథా సవ్య సాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు.9 వ భాగం.2.6.25.

Posted in రచనలు | Leave a comment

కథా సవ్య సాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు.5 వ భాగం.1.6.25.

కథా సవ్య సాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు.5 వ భాగం.1.6.25.

Posted in రచనలు | Leave a comment

మీనూ మసాని రచన. మన ఇండియా.1 వ భాగం.31.5.25.

మీనూ మసాని రచన. మన ఇండియా.1 వ భాగం.31.5.25.

Posted in రచనలు | Leave a comment