ఉయ్యూరు లో ఒక రోజు ముందే కూసిన ఉగాది ‘కో(మరవోలు)యి(ఈ)ల -1

ఉయ్యూరు లో ఒక రోజు ముందే కూసిన ఉగాది కోయిల -1

ఉయ్యూరులోని   సరస భారతి సాహిత్య సంస్కృతిక సంస్థ 60వ సమావేశం గా శ్రీ జయ నామ సంవత్సర ఉగాది వేడుకలను 30-3-2014ఆదివారం సాయంత్రం 4 గం.లకు కే.సి.పి.మరియు రోటరీ క్లబ్ వారి సౌజన్యం తో శ్రీ వెలగ పూడి రామ కృష్ణ రోటరీ ఆడిటోరియం లో నిర్వహించింది .మర్నాడే అంటే 31-3-14సోమవారం శ్రీ జయ నామ ఉగాది .కనుక సందడి అంతా మా ఇంట్లోను ఊర్లోను కమ్మేసింది .కవి కోకిలలు కలస్వనం తో కవితా గానం చేయటం ,గళ మురళీ విన్యాసం లో శ్రీ కొమరవోలు శివప్రసాద్ ఎల కోవిల ‘’కుహూ కుహూ ‘స్వనాలు వినిపించటం తో వసంతం ఉయ్యూరు కు ముందే వచ్చిందని పించింది .

మా పెద్దబ్బాయి శాస్త్రి కోడలు ఛి సౌ సమత మనవాళ్ళు సంకల్ప్, భువన సాయి లు రెండో అబ్బాయి శర్మ కోడలుఛి సౌ  ఇందిరా మనవడు హర్ష సాయి ,మనవ రాలు హర్షితాంజలి ,మూడవ కొడుకు మూర్తి ,కోడలు ఛి సౌ రాణి మనవడు శ్రీ చరణ్ ,మనవరాలు రమ్య ,నాల్గవ కొడుకు రమణ కోడలు ఛి సౌ . మహేశ్వరి అందరూ వచ్చి పండుగ వాతావరణాన్ని తెచ్చారు .

అమెరికా నుంచి మా అమ్మాయి విజయలక్ష్మి మార్చి 23rd కి హైదరాబాద్ వచ్చి అక్కడినుండి ఉయ్యూరు వచ్చి ముందుగా అన్ని ఇంటి పనులు బజారు షాపింగ్ చేసింది. ఒక సంవత్సరం తరువాత వచ్చింది. పిల్లలు అమెరికాలో పరిక్షలకు ఉండిపోయారు.

మా అన్నయ్య గారి అబ్బాయి రామనాద్, కోడలు ఛి సౌ జయ మనవడు కళ్యాణ్ లు ,మా కుటుంబ స్నేహితులు మా శ్రీమతికి ఆత్మీయ మిత్రురాళ్ళు శ్రీమతి మల్లికాంబ శ్రీమతి భవానీ గార్లు మాతో బాటు పండుగ ముందు రోజు ,పండుగ రోజు మాతో నొ ఉండి సహాయ సహకారాలందించారు .మా ఇంట్లో అద్దెకున్న మేష్టారు కృష్ణ మూర్తి గారు ,భార్య గారు కుటుంబ సభ్యుల్లా మాతో కలిసి పోయారు .అందుకే ఈ హడావిడి .

మా పెద్ద మనుమడు (మా పెద్దబ్బాయి శాస్త్రి కొడుకు) సంకల్ప్ తంజావూరు నుండి దీని కోసం వచ్చాడు.

రెండు రోజులూ వంట వాళ్ళను పెట్టి వంటలు చేయించాం .ఇంటి ముందు షామియానా వేయించాం .100_1396భోజనానికి టేబుళ్లు కుర్చీలు ఏర్పాటు చేశాం .ఏర్పాట్ల విషయం అంతా ఇంటా బయటా మా రమణే చూశాడు .ఆడిటోరియం లో కార్యక్రమం జరప టానికి అనుమతిని ,రోటరీ క్లబ్ నిర్వాహకుడు శ్రీ కొండలు గారితో ను కెసీపి సి ఒ.ఒ.శ్రీ జి వెంకటేశ్వర రావు గారి తో మాట్లాడి ఏర్పాటు చేయించాడు .అతిధులకు కెసీపి గెస్ట్ హౌస్ లో రూములు బుక్ చేయించాడు .అలాగే సంగీత బృందాన్ని విజయవాడ స్టేషన్ నుంచి ఉయ్యూరుకు తీసుకొని రావటానికి ,కార్య క్రమం అయిన తర్వాత మళ్ళీ రాత్రికి స్టేషన్ కు చేర్చటానికి ఎసి ఇన్నోవా కార్ బుక్ చేయించాడు .ఆడిటోరియం లో కుర్చీలు ,మైకు ఏర్పాట్లకు కూడా రోటరీ సాయం చేసేట్లు చేశాడు .ఇవన్నీ వారు చేయ బట్టే కార్యక్రమం లోమా భారం కొంత తగ్గింది .అలాగే వేడుకల రోజున మధ్యాహ్నం టిఫిన్ టీ లు, రాత్రి డిన్నర్ కు కే సి పి కాంటీన్ వారు సరసమైన ధర లో అంద జేసేట్లు కూడారమణ చేయగలిగాడు .ఆహ్వాన పత్రిక డిజైన్ చేయటం వేదిక పైవిస్తృత మైన ముచ్చటైన  బానర్  ను ఏర్పాటు చేయటం ,జ్ఞాపికలను ‘’కర్నాటక సంగీత త్రయం ‘’చిత్రాలతో రూపొందించటం శ్రీ ప్రకాష్  చేత చేయించి కార్య క్రమానికి గొప్ప వైభవం తెచ్చాడు .వాడి చొరవ కృషి దీన్ని మహత్తరం చేసింది .

సుమారు ఇరవైరోజుల క్రితం స్థానిక అమరవాణి హైస్కూల్ వార్షికోత్సవానికి ప్రిన్సిపాల్ నాగరాజు ఆహ్వానిస్తే వెళ్లాను .శ్రీ పూర్ణ చంద్ ముఖ్య అతిధి. సుదీర్ టింబర్ డిపో నిర్వాహకుడు లయన్ క్లబ్ ప్రెసిడెంట్  నా శిష్యుడు సాంబశివ రావు  కూడా వేదిక పై ఉన్నాడు .నేను మాట్లాడుతూ ఉగాది వేడుకలను గురించి చెప్పి అందర్నీ ఆహ్వానించాను .నా పక్కనే కూర్చున్న లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సాంబ ‘’మాస్టారూ !ఇందులో నేనేమి చేయాలో చెప్పండి .చేస్తాను’’. అన్నాడు .’’సరే సంతోషం మా రమణ ను నీ దగ్గరకు  పంపిస్తాను ‘’అన్నాను. ఆహ్వానాలు  ఇవ్వటానికి సుదీర్ టింబర్ డిపో కి వెళ్లి సాంబ కు ఇచ్చాడు రమణ .అప్పుడు సాంబ ‘’నాన్న గారికి మాట ఇచ్చాను .నేనేమి చేయాలో చెప్పండి ‘’అని అడిగాడట .వచ్చిన వారందరికీ జ్ఞాపికలు మీ సౌజన్యం తో ఇస్తే బాగుంటుంది ‘’అన్నాడట .ఓకే అని దాని ఏర్పాట్లు చేశాడు సాంబ .ప్రకాష్  తో డిజైన్ చేయించి బెజవాడ లో ప్రింట్ చేయించి సాంబ కు ఇచ్చాడు రమణ  ఫ్రేములు కట్టించి అప్పగించాడు .ఇలా మరి కొంత భారం తగ్గింది .

కవి మిత్రులందరికీ రెండు సార్లు ఫోన్ చేసి ఆహ్వానించి ఆహ్వానాలు పది హీను రోజులు ముందే పోస్ట్ లోపంపాను .అలాగే అతిదులనూ ముందే ఆహ్వానించి అనుమతి పొందాను.శ్రీ వల్లీశ్వర్ విషయం రమణ చూశాడు .అసలు ముఖ్య అతిధి శ్రీ కొమర వోలు శివ ప్రసాద్ గారి తో మెయిల్ ద్వారా, ఫోన్ ద్వారా సంప్రదించాను ఆయన అమెరికా లో మాకు ఇచ్చిన హామీ మేరకు వెంటనే స్పందించి వస్తానని సంతోషం గా చెప్పారు .ఎంత ఇవ్వాలి అని నేను అడగ లేదు .కాని లోపల భయం వేసి ‘’మీ ఫార్మాలిటీస్? ’అని అడిగితె నవ్వుతూ’’ వాటి గురించి వర్రీ వద్దు నేనొస్తానుమా బృందం తో.  మీతో గడుపుతాను .’’అన్నారు టెన్షన్ పూర్తిగా తగ్గి పోయింది ‘’ మీ శ్రీమతిగారిని ని కూడా తీసుకొని రండి మీతో ‘’అన్నాం  నేనూ మా శ్రీమతీ .సరేనన్నారు .ఈ వేడుకలో పాల్గొనాలని మా అమ్మాయి ఛి సౌ విజ్జి అమెరికా నుంచి మార్చి ఇరవై రెండుకే వచ్చింది ,కనుక హడావిడి వేగం పుంజుకొంది

ఉగాది వేడుకలు

30-3-2014ఆదివారం ఉదయం అయిదింటికే మచిలీ పట్నం ఎక్స్ ప్రెస్ లో శ్రీ శివ ప్రసాద్ గారు వారి శ్రీమతి హైమవతి గారు సహకార వాద్య బృందం తో విజయ వాడ స్టేషన్ కు చేరుకొన్నారు.రోటరీ క్లబ్ వారే బానర్ కట్టుకొని వెహికల్ తీసుకొనివెళ్లి రిసీవ్ చేసుకొని ఉయ్యూరు కెసీపి గెస్ట్ హౌస్ లో ఏర్పాటైన రూముల్లో గౌరవం గా ఉంచి కాఫీ టిఫిన్లు ఏర్పాటు చేశారు  .ఇక్కడ కూడా మా బాధ్యతను కొంత వారు పంచుకొన్నారు .కనుక కొంత బరువు తగ్గింది అని పించింది .

ఇంట్లో వంట వాళ్ళు గోపాల్ భార్య వచ్చి వంట మొదలెట్టారు .మా అబ్బాయిల కార్లలో నేను మా పెద్దబ్బాయి శాస్త్రి రెండో వాడుశర్మ ,రమణ  మా అమ్మాయి విజయ లక్ష్మి లతో  గెస్ట్ హౌస్ కు వెళ్లి స్వాగతం పలికి కుశల ప్రశ్నలు వేసి ఏర్పాట్ల విషయం అడిగాము .అంతా బాగా ఉందన్నారు .ఆ రోజే ఉయ్యూరు మునిసి పాలిటీకి ఎన్నికలు .జనం వస్తారో రారో అనే దిగులు లోపల .ముందే ఓటు వేసి వెళ్లాను శివ ప్రసాద్ గారి దగ్గరకు .వారి బృందమూ అయిదుగురు .ప్రాక్టీస్ చేసుకొంటున్నారు .DSCN8485 DSCN8452అక్కడి నుండి మా శ్రీ సువర్చలాంజ నేయ స్వామి

DSCN8429ఆలయానికి కార్లలో వారి నందరిని తీసుకొని వెళ్ళాము .స్వామి సన్నిధి లో వారు ఒక కీర్తన ఈల పాట గా పాడి DSCN8433స్వామిని అర్చించి అనుగ్రహం పొందారు .అప్పుడే శ్రీ వల్లీశ్వర్ కూడా ఉయ్యూరు వచ్చి గుడికి చేరుకొన్నారు .అష్టోత్తర పూజ చేశాడు పూజారి మురళి .నైవేద్యం గా లడ్డూలు ,పులిహోర చేయించాం .మంత్రం పుష్పం  తర్వాతఆలయ మర్యాద తో అర్చక స్వామి చేత అందరికి స్వామి వారి శేష వస్త్రాలను అంద జేశాము .ఇది పూర్తీ అయ్యేసరికి పదకొండున్నర అయింది .అక్కడి నుండి ఇంటికి వారందరినీ సగౌరవం గా ఆహ్వానించి కార్లలో తీసుకొని వచ్చాం  అప్పటికే వంటలు పూర్తీ అయ్యాయి .

మా ఇంట్లో హాల్ లో టేబుల్స్ వేసి కోడళ్ళు వడ్డించారు .మామిడి కాయ పప్పు ఆవకాయ వంకాయ కూర దోసకాయ పచ్చడి పూర్ణం బూరెలు పులిహోర ,వడియాలు సాంబారు గడ్డ పెరుగు మా పెరటి లో పండిన  అమ్రుతపాణి అరటి పండ్లు తాంబూలం తో కమ్మని విందుఏర్పాటు  చేశాము 100_1391.అందరూ ఆనందం గా ఆరగించి మాకు సంతోషం కలిగించారు .భేషజం లేకుండా అంత పెద్దా ప్రపంచ ప్రసిద్ధ సంగీత నిధి మాతో కుటుంబ సభ్యులుగా మెలగటం ఆయన భార్య గారు హైమవతి గారు కూడా ఏంతో మురిసి పోవటం

100_1380
100_1383‘’నేను మీ అబ్బాయి లాంటి వాడిని ‘’అని శివ ప్రసాద్ గారు అనటం మరచి పోలేని మాటలు .’’మాకు ఇంత మర్యాదా మన్ననా ?’’అని హైమవతి గారు అనటం  వారిద్దరి సంస్కారానికి మచ్చు తునక .కనుక ఉగాది ముందే మా ఇంటికి వచ్చిందని పించటం సహజమే కదా .వారిద్దరి తో బాటు సహకార వాయిద్య విద్వాంసులు కూడా మా ఆతిధ్యానికి మురిసి పోయి కడుపు నిండా భోజనం చేశామని ఆనందం గా మమ్మల్ని అభి నందించటం చిరస్మరణీయం .100_1389 100_1392 100_1393ఇంతటి అనుభూతిని మా యాభయ్యవ వివాహ ససం దర్భం గా కలిగించిన వీరందరికీ ఏమిచ్చి, యేమని చెప్పి క్రుతజ్ఞతలను చెప్పుకోగలం ?ఇదేదో జననాంతర సౌహృదం అని పించింది .లేక పొతే వారేమిటి ?మా ఇంటికి రావటమేమిటి ?ఊహకు కూడా అందని విషయం .శ్రీ వల్లీశ్వర్ కూడా ఏంతో సంతృప్తి చెందారు .వల్లీశ్వర్ అన్నగారు ప్రఖాత హాస్య కదా రచయిత శ్రీ గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు గారు మా ఉయ్యూరు లో సూరి వారి అల్లుడు  నా చిన్ననాటి స్నేహితుడు  సూరి నరసింహం చెల్లెలు, నా శిష్యురాలు  ఛి సౌ అన్న పూర్ణ కు భర్త .దీక్షితులు గారితో 1961నుండి పరిచయం .వల్లీశ్వర్ మా బావ మరది, హైదరా బాద్ లో స్టేట్ బాంక్ ఉద్యోగి ఆనంద్ కు మంచి స్నేహితుడు .అతని ద్వారానే వల్లీశ్వర్ గారిని రప్పించాం .వల్లీశ్వర్ కు ఇక్కడ హోటల్ లో రూమ్ బుక్ చేశాడు రమణ .భోజనాల తర్వాత శివ ప్రసాద్ గారు మాట్లాడుతూ ‘’మా ఆవిడ ఎప్పుడూ ఎక్కడికీ నాతో కచేరీకి రాదు .మీరు రమ్మని పిలిచారని చెప్పాను రాక పొతే ఊరు కోరు అనీ చెప్పాను .వచ్చిన తరువాత వారి ఆదరణ ఆత్మీయత నువ్వు మర్చి పోలేవు .రాక పోతే ఏంతో కోల్పోతావు ‘’అని చెప్పి తీసుకొచ్చానని అన్నారు .ఆమె కూడా అంత కలుపు గోలుగా ఉన్నారు .మా అబ్బాయి కోడలు మా ఇంట్లో తిరుగుతున్న ఆనందమే కలిగించారు .హైదరాబాద్ వస్తే మా అమ్మాయితో సహా వారింటికి రావలసిందని ఆహ్వానించారు ఈ అనుభవం విలువైనది మాకు .అందరిని మళ్ళీ కారులో గెస్ట్ హౌస్ కు తీసుకొని వెళ్లి దింపారు మా అబ్బాయిలు .

మహిళా మాణిక్యాలు నా మాట

మహిళా మాణిక్యాలు పుస్తకం అంకితం పొందిన సౌ శ్రీమతి మైనేని సత్యవతి గారి పరిచయం

సరస భారతి శ్రీ జయ ఉగాది నివేదిక

సరస భారతి శ్రీ జయ ఉగాది పురస్కారాలను అందుకొన్న శ్రీ కొమరవోలు శివ ప్రసాద్

సరస భారతి శ్రీ జయ ఉగాది పురస్కార గ్రీత శ్రీ మతి మున్జులూరి కృష్ణ కుమారి –

సరస భారతి శ్రీ జయ ఉగాది పురస్కారాలను అందుకొన్న డాక్టర్ జి.వి.పూర్ణ చంద్

సరస భారతి శ్రీ జయ ఉగాది పురస్కారాలను అందుకొన్న జర్నలిజం ఘనాపాటి –శ్రీ జి.వల్లీశ్వర్

సరస భారతి శ్రీ జయ ఉగాది పురస్కారాలను అందుకొన్న – డా శ్రీ విద్య

ఘనంగా సరసభారతి ఉయ్యూరు ఉగాది ఉత్సవాలు – వార్త పత్రికలలో

మా 50 వ సంవత్సర వివాహ వేడుకలు

విజిల్ విజార్డ్” శ్రీ కొమరవోలు శివ ప్రసాద్… శ్రీ జయ నామ సంవత్సర ఉగాది వేడుకలు,-

శ్రీ జయ నామ సంవత్సర ఉగాది వేడుకలు

సశేషం

మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ -3-4-14-ఉయ్యూరు

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

మహిళా మాణిక్యాలు నా మాట

మహిళా మాణిక్యాలు  నా మాట

 

మేము నాలుగవ సారి అమెరికా 2012లో  అమెరికాలో నార్త్ కరోలినా లోని షార్లెట్ కు మా అమ్మాయి ఛి సౌ విజయ లక్ష్మి ,అల్లుడు ఛి అవధాని వాళ్ళ ఇంటికి వెళ్లి నప్పుడు లైబ్రరీలో తీసుకొని చదివిన అనేక పుస్తకాలలో మహిళల మీద రాసిన పుస్తకాలు నన్ను బాగా ఆకర్షించాయి .అందులో చాలా మంది మన వాళ్లకు తెలియనే తెలియదని పించింది . ఆ పుస్తకాలు ఆధారం గా వివిధ రంగాలలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన స్త్రీలపై అంతర్జాలం లో వరుసగా వ్యాసాలూ రాయటం ప్రారంభించాను .అవి అందర్నీ ఆకర్షించాయి .అదే సమయం లో ‘’విహంగ మహిళా వెబ్ మేగజైన్’’ మాస పత్రిక సంపాదకురాలు శ్రీమతి పుట్ల   హేమలత గారు తమ పత్రికకు కూడా వ్యాసాలూ రాయమని కోరితే అమెరికా నుండే మహిళామతల్లుల మీదనే ఆ పత్రిక కోసం ప్రత్యేకం గా వ్యాసాలూ రాయటం ప్రారంభించాను .ప్రతి నెలా సుమారు పదిహేనో తేదీన మరుసటి నెలకు వ్యాసం రాయమని మెయిల్ రాసేవారు .అలానే రాసి పంపిస్తున్నాను .అందులో అచ్చు అయిన తర్వాతే సరసభారతి సాహితీ బంధువులకు పంపే వాడిని .దాదాపు పది హీను ఆర్టికల్స్ ఆ పత్రిక కు రాశాను .

100_1450 100_1449 100_1448ఇవి కాక అంతర్జాలం లో నేను ప్రతిబా వంతులైన స్త్రీలపై రాస్తూనే ఉన్నాను .ఇవన్నీ కలిపి ‘’మహిళా మాణిక్యాలు ‘’పేరిట ఒక పుస్తకరూపం లో తేవాలని ఆలోచన ఈ మధ్యనే కలిగింది .ఏర్పాట్లు చేస్తూ విహంగ లో నేను రాయగా ప్రచురింప బడిన వ్యాసాలను ఈ పుస్తకం లో చేర్చటానికి శ్రీమతి హేమలత గారిని అనుమతించ వలసినది గా  కోరగా వెంటనే సంతోషం తో స్పందించి పుస్తకం తెస్తున్నందుకు  నన్ను అభినందిస్తూ ప్రోత్సహించి అనుమతి నిస్తూ నా వ్యాసాలను వరుస క్రమం లో నాకు పంపారు .వారికి కృతజ్ఞతలను తెలుపు కొంటున్నాను

గబ్బిట దుర్గా ప్రసాద్DSC_8066

సరసభారతి –సా హిత్య సంస్కృతిక సంస్థ

ఉయ్యూరు

‘’మహిళా మాణిక్యాలు ‘’పుస్తక రచనకు తోడ్పడిన పుస్తకాలు

శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు నాకు పంపి నాతో చదివించిన’’women of power and grace ‘’, ‘’Lincoln ‘s battles with God ‘’అనే రెండు పుస్తకాలు

మాతృశ్రీ పబ్లికేషన్ ప్రచురణ ‘’మాతృశ్రీ అనసూయా దేవి’’

తెలుగు విజ్ఞాన సర్వస్వం

ఇంగ్లీష్ వీకీ పీడియా

శ్రీ వాసవ్య రచించిన ‘’ప్రాచీన భారతీయ శాస్త్ర వేత్తలు ‘’

అమెరికా లో నార్త్  కెరొలిన లోని షార్లెట్ లో ఉన్న’’ బిల్లీ గ్రాహం’’లైబ్రరీలో నేను చదివిన అనేక ఆంగ్ల పుస్తకాలు

శ్రీ లకుమ కూర్చిన ‘’ఏం ఎస్ సుబ్బు లక్ష్మి ‘’పై వ్యాసాలు

వివిధ వార ,మాస ,దిన పత్రికలలో వెలువడిన వ్యాసాలూ

శ్రీ వకుళాభరణం రామ కృష్ణ గారు డొక్కా సీతమ్మగారి పై రాసిన వ్యాసం (దీనిని శ్రీ రామి నేని భాస్కరేంద్ర గారు నాకు పంపారు వారికి కృతజ్ఞతలు )

గబ్బిట దుర్గా ప్రసాద్

సరసభారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు

19-3-14-

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

మహిళా మాణిక్యాలు పుస్తకం అంకితం పొందిన సౌ శ్రీమతి మైనేని సత్యవతి గారి పరిచయం

                

మహిళా మాణిక్యమైన అర్ధాంగి శ్రీమతి మైనేని సత్యవతి గారికి

‘మహిళా మాణిక్యాలు ‘’   అంకితం

‘’మహిళా మాణిక్యాలు ‘’అనే ఈ యాభై ఎపి సోడులను అంతర్జాలం లో రాసి ,ఈ పుస్తకాన్ని సరసభారతి తరఫున ముద్రించ బోతున్నామని ,ఉత్సాహ వంతులైన స్పాన్సర్ లు ఉంటె స్పందించమని అంతర్జాలం లో సాహితీ బంధువులకు విన్న వంచాను .అంతే కొన్ని గంటల్లోనే అదే రోజు సాయంత్రం అమెరికా నుండి నాకు ఆత్మీయులు, సరసభారతి ప్రోత్సాహకులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు ఫోన్ చేసి ‘’ఎవరికీ ఆ అవకాశం ఇవ్వ వద్దు .ఎంత ఖర్చు అయినా నేనే పెట్టుకొని ఆ పుస్తకాన్ని ముద్రించటానికి తోడ్పడతాను .నా మనసులో ఎప్పటి నుంచో మా శ్రీమతి సత్యవతి కి ఒక పుస్తకం అంకితమివ్వాలని ఉంది .ఆ కోరిక ఇంతవరకు తీరలేదు .ఇప్పుడు మీ ద్వారా ఆ అవకాశం వచ్చింది .కనుక సత్యవతికి అంకిత మిచ్చి పుస్తకం ముద్రించటానికి అభ్యంతరం ఉందా ?’’అని అడిగారు .’’నాకు మహదానందం గా ఉంది .తప్పక మీ మనసు లోని కోరిక తీరుద్దాం ‘’అన్నాను.ఆయన సంతోషించి ‘’ఈ విషయం చాలా సీక్రెట్ గా ఉంచుదాం .సత్యవతికి సర్ప్రైజ్ ఇద్దాం ‘’అన్నారు సరేనన్నాను .అంతే ఆ సాయంత్రానికే నాకు’’ వెస్త్రెన్  మని ట్రాన్స్ ఫర్ ‘’ద్వారా  పుస్తక ముద్రణకు అవసరమైన డబ్బును పంపారు .మర్నాడు ఉదయమే నేను పోస్ట్ ఆఫీస్ నుంచి తీసుకొన్నాను .అదీ మైనేని వారి  స్పీడు .2012జూన్ లో వారి ఆహ్వానం పై అమెరికా లో నార్త్ కరోలినా షార్లెట్ లో మా అమ్మాయి ఛి సౌ .విజయ లక్ష్మి అవధాని దంపతుల ఇంటి నుంచి గోపాల కృష్ణ గారున్న అలబామా లోని హాంట్స్ విల్ కు వెళ్లాను. రెండు రోజులు వారి అతిధిగా ఉన్నాను. వారూ వారి సతీమణి శ్రీమతి సత్య వతి గారు చూపిన ఆదరణ, ఆతిధ్యం మరువ లేనివి. వారి అబ్బాయి కృష్ణ కుటుంబం చూపిన ఆత్మీయత కూడా అలానే ఉంది .అక్కడి మిత్రులందరికీ నన్ను పరిచయం చేశారు .అలబామా తెలుగు అసోసిఏషన్  తో నాకు అంటే ,సరసభారతికి  సన్మానం చేశారు .ఈ పుస్తక ముద్రణకు  పూర్తి ఆర్ధిక సహాయం అందించిన శ్రీ గోపాల కృష్ణ గారికి సరస భారతి మనస్పూర్తిగా కృతజ్ఞతలను అంద జేస్తోంది .ఇలాంటి వితరణ శీలుర తోడ్పాటు వల్ల నే ఇప్పటికి పన్నెండు పుస్తకాలను ముద్రించ గలిగామని సవినయం గా మనవి చేస్తున్నాము .

శ్రీమతి సత్యవతి గారి పరిచయంDSC_0095

సత్య వతి గారు గోపాల కృష్ణ గారికి అసలైన జీవిత సహ ధర్మ చారిణి .స్వయం సిద్ధ .అర్ధాంగి అనే మాట కు అసలైన నిర్వ చనం ఆమె .మైనేని భాషలో ‘’అలుపెరుగని అర్ధాంగి ‘’.గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా నల్లూరు గ్రామం లో సత్య వతి గారు పరుచూరి భావనారాయణ చౌదరి ,రత్న మాణిక్యం  దంపతులకు  1940 జూన్ ఒకటవతేదీన  ఏడవ  సంతానం గా  జన్మించారు .ఆమె సోదరి శ్రీమతి విమలా దేవి అమెరికా లో ఉంటున్నారు .సోదరులు శ్రీ స్వర్గీయ సుదర్శన రావు(ఆర్మీ ఇంజనీర్ ) ,కీ.శే .శ్రీ రామ క్రిష్నయ్య ( ఏం ఏ .పి హెచ్ డి – ప్రపంచ ప్రసిద్ధ గణాంక శాస్త్ర వేత్త అంటే ‘’వరల్డ్ ఫేమస్  స్టాటి స్టిషియన్’’) ,స్వర్గీయ శ్రీ జనార్దన రావు –(గ్రం దాలయ అధికారి )) .కీ .శే .శ్రీ బాబూ రాజేంద్ర ప్రసాద్(రీజినల్ ఇన్స్పెక్టర్ –ఎన్విరాన్ మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ )  లు అమెరికా లో  ఉన్నతోద్యాగాలు లో స్తిరపడి  స్వర్గస్తులయ్యారు .  సోదరుడు శ్రీ మధుసూదన రావు  ప్రొఫెసర్ గా అమెరికా లో ఉంటున్నారు .మరొక సోదరుడు శ్రీ శ్రీనాధ వర ప్రసాద రావు    అమెరికా లోని చికాగో లో ‘’యూని వర్సిటి ప్రింటింగ్ అండ్ యునిక్ ప్రింటింగ్ సంస్థ ‘’లో మేనేజర్ గా పని చేసి రిటైర్ అయి అమెరికా లో ఉన్నారు  .సోదరుడు స్వర్గీయ శ్రీ  శివాజీ రావు గారు స్వగ్రామం నల్లూరు లో వ్యవసాయంతోనే  జీవిస్తూ స్వర్గస్తులయ్యారు  .అంటే ఆమె సోదరులలో ఒక్కశివాజీ  రావు గారు మాత్రమె అమెరికా లో స్థిర పడ లేదన్న మాట . ఇండియా లోనే ఉండి పోయారు .

శ్రీమతి సత్య వతి గారు తెనాలి లో దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ, భాషా ప్రచారక్ పరీక్షలలో గణనీయమైన మార్కులతోఉత్తీర్ణులయ్యారు . ఉయ్యూరు లో శ్రీ సరస్వతి ట్యుటోరియల్ కాలేజి లో మెట్రిక్ సెకండ్ క్లాస్ లో పాస్ అయ్యారు.రేపల్లె దగ్గర నగరంలో ని శ్రీ వెలగ పూడి రామ కృష్ణా మెమోరియల్ కాలేజి లో పి.యు.సి పాసై, బి కాం మొదటి సంవత్సరం చదివారు .1965లో ఉయ్యూరు లోని సి బి .ఏం స్కూల్ లో  కొద్ది కాలం హిందీ పండిట్ గా పని చేశారు .కృష్ణా జిల్లా ఉయ్యూరు వాస్తవ్యులు  శ్రీ మైనేని గోపాల కృష్ణ గారిని వివాహ మాడారు .భర్త తో అమెరికా వెళ్లి అక్కడ కూడా గృహకృత్యాలు యదా విధి గా నిర్వహిస్తూ ఉద్యోగం చేశారు .అమెరికా లోని కెంటకి రాష్ట్రం  లూఈ విల్ లో ‘’ చెవ్రాన్  అకౌంటింగ్ సెంటర్’’లో డేటా ఎంట్రి ఆపరేటర్ గా 1973-78 కాలం లో పని చేశారు .అక్కడే’’ హ్యూమానా హాస్పిటల్ అండ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్’’ లో కంప్యూటర్ ఆపరేటర్ గా 1978నుంచి21ఏళ్ళు 1999వరకు సేవలందించారు .న్యు జెర్సీ లోని ప్రిన్ స్టన్ లో ‘’బ్రిస్టల్-మెయర్–స్కిస్బ్  ఫార్మ స్యూటికల్ ఇండస్ట్రి’’లో కంప్యూటర్ ఆపరేటర్ గా 2001నుండి2004 వరకు మూడేళ్ళు పని చేశారు . ఈ ఉద్యోగం చేస్తూనే ప్రిన్ స్టన్ లోనే’’ y.w C .చైల్డ్ కేర్ సెంటర్’’ లో పార్ట్ టైం ఉద్యోగమూ ఒక ఏడాది చేసి అలుపెరుగని శ్రమ జీవి అని పించుకొన్నారు .

      గృహిణి గా తన సమర్ధతను నిరూపించుకొంటు భర్త గోపాల కృష్ణ గారికి అన్ని విషయాలలో సహాయసహకారాలు అందిస్తూ   పిల్లల విద్యా విషయాలను పర్య వేక్షిస్తూ చెరగని చిరు దరహాసం తో సత్య వతి గారు ఏ సమయం లో నైనా కని పిస్తారు .అదీ ఆమె ప్రత్యేకత . కుటుంబం , బంధువర్గం లోని  వారందరికీ   ఆమె అందుబాటులో ఉండి సేవ లందించటం ఆమె నైజం .భారతీయ శాస్త్రీయ సంగీతం అంటే మక్కువ ఎక్కువ .భారతీయ నృత్య కళ పై ప్రత్యెక అభిమానం .వీటిని చూస్తూ, వింటూ ఆమె కాలాన్ని సద్విని యోగం చేస్తారు .అచంచలమైన భగవద్ భక్తీ ఆమె నర నరాన జీర్ణించుకు పోయింది .ముఖ్యం గా శ్రీ కృష్ణ పరమాత్మ ఆమె ఇస్ట దైవం .కుట్టు పని ,అల్లిక లో మంచి ప్రావీణ్యత ఉంది .ఆవరణ లో పెరటి తోటను పెంచి పుష్ప ఫల వృక్షాలను కాయ గూరలను పండించటం లో మహా నేర్పరి సత్యవతి గారు .ఇరుగు పొరుగు వారికి, బంధువులకు తమ తోటలో తాము పండించిన కూర గాయలను ఆమె  పంపించి, సంతృప్తి చెందుతారు .అంటే ఇతరుల తో పంచుకోవటం ఆమెకు అమిత మైన ఇష్టం .మాకు కూడా స్టెర్లింగ్ హైట్స్ కుపోస్ట్ లో పంపారు.’’పంచ భూత ప్రియ’’ సత్యవతి గారు .సేంద్రియ ఎరువులనే ఉప యోగిస్తారు . పుష్పాలే ఆమె ఊపిరి .ఉతికిన బట్టలను సూర్యరశ్మి   సోకే టట్లు ఆరు బయట ఆరవేయటమే ఆమె కు ఇష్టం .నీటిని చాలా పొదుపుగా ఉపయోగించి ఆదాచేస్తారు .మంచి పొదుపరి గా పేరుపొందారు .దేనినీ వృధా చేయటం ఆమె కు అసలు ఇష్టం ఉండదు .తోట లోని ప్రతి అంగుళం స్థలాన్ని సద్విని యోగ పరచి కరివేపాకు చెట్లు, మిర్చి ,పొట్ల, దోస,దొండ , సొర,కాకర ,చిక్కుడు  మొదలైన భారతీయ కూరగాయలను స్వయం సమృద్ధం గా పండించి ఆదర్శ వంతం గా ఉన్నారు .

    కుటుంబం లోని అందరితో సత్ సంబంధాలను నెరపటం ఆమె ప్రత్యేకత .తండ్రి గారంటే విపరీత మైన అభిమానం .ఆయన ఆదర్శాలే ఆమె కు శిరోధార్యాలు .ఆమె తండ్రిగారు రేపల్లె లో కో ఆపరేటివ్ బాంక్ లో ఉద్యోగం చేస్తూ,వ్యవసాయం చూసు కొంటు  నిత్యం భగవద్ గీతా పారాయణ చేస్తూ సంఘం లో పెద్ద గా ఉంటూ సమాజ సేవలో ధన్యులయ్యారు . ..ఆయన మరణం తరువాత  ,వారున్న వీధికి  ఆయన పేరు పెట్టి గౌరవించారు . ఆడంబరం ఎరుగని మహిళ శ్రీమతి సత్యవతి  .సాదా సీదా జీవితమే .గోపాల కృష్ణ గారి కష్ట సుఖాలలో మమేకం అయి ,వెన్ను తట్టి ముందుకు నడిపిన ఆదర్శ జీవి .సర్వ జన సంక్షేమం ఆమె ఆదర్శం . సకల జనులకు సత్య వతి గారు శ్రేయోభిలాషియే .తన ప్రాణం ,ఊపిరి ,సర్వస్వం సత్య వతి గారే నంటారు  ఆమెకు  తగిన భర్త అయిన శ్రీ గోపాల కృష్ణ గారు .ఆదర్శ దాంపత్యం వారిది .నలభై ఏళ్ళకు పైగా అమెరికా లో ఉంటున్నా మన సంస్కృతీ సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను చక్కగా పాటిస్తూ స్పూర్తి నిస్తున్న ఈ దంపతులు అభినందనీయులు .వారిద్దరూ జీవికా జీవులు .ఒకరి పై మరోకరికి అత్యంత విశ్వాసం ,ఆత్మీయత,అవ్యాజమైన ప్రేమ, ఆరాధనా .

   గోపాల కృష్ణ ,సత్యవతి దంపతులకు  ఇద్దరు కుమారులు .పెద్ద కుమారుడు శ్రీ  కృష్ణ. కోడలుశ్రీమతి రమ  .మనుమ రాళ్ళు ఛి శ్రేయ ,సెరీన .చిన్న కుమారుడు శ్రీ రవి .కోడలు  శ్రీమతి కవిత .మనుమడు ఛి కిరణ్ .మనుమ రాళ్ళు ఛి రియా ,కరీనా .కుమారులిద్దరూ కోడళ్ళు కూడా అమెరికా లోనే  వారు కోరుకొన్న ఉద్యగ వ్యాపకాలలో స్థిర పడ్డారు . 

          సరసభారతి ప్రచురిస్తున్న పన్నెండవ పుస్తకం’’మహిళా మాణిక్యాలు ‘’ను శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి ఆదర్శ గృహిణి , అర్ధాంగి అన్న పదానికి నిర్వచనం , సర్వ జన  శ్రేయోభిలాషి ,స్వయం సిద్ధ ,అలుపెరుగని కర్తవ్య పరాయణు రాలు  ,మహిళా మాణిక్యం అయిన శ్రీ మతి మైనేని సత్య వతి గారికి  అంకితం ఇవ్వటం  అత్యంత సముచితం గా ఉందని   , శ్రీ గోపాల కృష్ణ గారి చిరకాల కోరిక ను తీర్చే సదవకాశం లభించిందని , వారికి ఆమోదమూ ఆనందమూ కలు గుతుందని భావిస్తూ    హృదయ పూర్వకం గా అంకితమిస్తున్నాము  .వీరి దాంపత్యాన్ని , కుటుంబాన్ని కల కాలం ఆయురారోగ్య,ఐశ్వర్య , భోగ .భాగ్యాల తో వర్ధిల్ల జేయ వలసింది గా పరమేశ్వరుని ప్రార్ధిస్తున్నాను .అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భం గా ‘’మహిళా మాణిక్యాలు ‘’పుస్తకాన్ని మార్చి30  న సరసభారతి 60వ సమావేశం లో శ్రీ జయ నామ సంవత్శర ఉగాది వేడుకలలో ఆవిష్కరిస్తున్నందుకు మహా సంతోషం గా ఉంది .ఇది శ్రీ గోపాల కృష్ణ గారి మనసు లోని ఆకాంక్ష కూడా .అది నెరవేరుతున్నందుకు వారితో బాటు అందరికి సంతోషం గా ,సంతృప్తి గా ఉంటుందని భావిస్తున్నాను . ఈ సందర్భం గా మరొక శుభ వార్త .సరసభారతి ని రిజిస్టర్ చేయించాము .ఇప్పటి నుండి అది రికగ్నైజేడ్ సంస్థ గా ఉంటుందని తెలియ జేయటానికి సంతోషిస్తున్నాం రిజిస్టర్ నంబర్ —

                                                                  గబ్బిట దుర్గా ప్రసాద్ –

                                                                   అధ్యక్షులు –సరస భారతి

                                                                     సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు

                     ఉయ్యూరు – 19-2-14-

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరస భారతి శ్రీ జయ ఉగాది నివేదిక

సరస భారతి నివేదిక

ఉయ్యూరు లో  సరస భారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ 24-11-2009 న ప్రారంభమైంది .’’అక్షరం లోక రక్షకం ‘’అనేఆశయం  తో ప్రారంభించిన ఈ సంస్థ నాలుగేళ్ల ప్రస్థానాన్ని పూర్తీ చేసుకొని అయిదవ ఏడాది లోకి దిగ్విజయం గా ప్రవేశించింది .ఎన్నో విభినమైన కార్య క్రమాలను నిర్వహించింది .ప్రతి ఉగాదికి కవి సమ్మేళనాలను  నిర్వహించి ,పుస్తక రూపం లో అ కవితలను ప్రచురించింది  .సంగీత కచేరీ లు నిర్వహించింది .ఇప్పటికి యాభై తొమ్మిది సమావేశాలు నిర్వహించింది .ఈ శ్రీ జయ నామ సంవత్సర ఉగాది వేడుకలను ఉగాది కి ముందు రోజు న 60 వ సమావేశం గా  నిర్వహిస్తోంది .ప్రారంభం నుండి 7-4-13  వరకు జరిగిన సరస భారతి  ప్రగతిని   ‘సిద్ధ యోగ పుంగవులు ‘’పుస్తకం లో సవివరం గా వివరించి అందజేశాం ..అప్పటి నుండి జరిగిన కార్యక్రమ విశేషాలను ఇప్పుడు అంద జేస్తున్నాము .100_1428

శ్రీ హనుమజ్జయంతి సందర్భం గా 1-6-13న శ్రీమతి కే. కనక దుర్గా మహాలక్ష్మి తో ధార్మిక ప్రసంగాన్ని ఏర్పాటు చేశాము .2-6-13-న మధుర గాయకులూ శ్రీ ఆమంచి చంద్ర శేఖర్ చేత ‘’భక్తీ సంగీత విభావరి ‘’ని నిర్వహించాము .శ్రీ చంద్ర శేఖర్ స్వర్గీయ ఘంటసాల  గారికి మేనల్లుడు .అద్భుతం గా గానం చేసి శ్రోతలను మై మరపించారు .3-6-13-న  శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ రాసిన’’ శ్రీ ఆంజనేయ స్వామి మాహాత్మ్యం’’ ‘’పుస్తకాన్ని శ్రీ స్వామివారల శాంతి కల్యాణం సందర్భం గా ఆవిష్కరింప జేశాము. కాలని మహిళా మండలి వారి చే సాయంత్రం  శ్రీ హనుమాన్ చాలీసా ‘’పారాయణ ఏర్పాటు చేశాము .22-7-13 న వ్యాస జయంతి సందర్భం గా శ్రీ మాదిరాజు శ్రీనివాస శర్మ గారి చేత వ్యాస మహర్షి జీవితం, రచనల పై ప్రసంగం చేయించాము .27-8-13శ్రీ కృష్ణాష్టమి రోజున’’ శ్రీ కృష్ణ తత్వ వైభవం’’ పై శ్రీ ఏ .త్రినాధ శర్మ అద్భుతం గా ప్రసంగించారు .29-8-13 న శ్రీ గిడుగురామ మూర్తి పంతులు గారి  150 వ జయంతి ని ఉయ్యూరు సెంటర్ లో సమైక్య వేదిక మీద  నిర్వహించి ‘’సమైక్య శంఖారావం ‘’పేరిట సెంటర్ లోనే కవి సమ్మేళనాన్ని జరిపాం .ఎందరో విద్యార్ధినీ విద్యార్ధులు చక్కని చిక్కని కవిత్వం రాసి  వినిపించి తమ సృజనాత్మకత ను వ్యక్తం చేశారు .వందలాది జనం మధ్య జరిగిన ఈ కార్యక్రమం హై లైట్ గా నిలిచి అందరిని అలరించి ప్ర శంసలను  కురిపించింది .

ఏ సాహితీ సంస్థా నిర్వహించని అపూర్వ మైన  కార్యక్రమాన్ని51 వ సమా వేశం గా 17-9-13న సరస భారతి నిర్వహించింది .’’అపర అన్న పూర్ణ ,నిరతాన ప్రదాత ‘’అయిన స్వర్గీయ  శ్రీమతి డొక్కా సీతమ్మ గారి జీవితం పై మూడు పాఠ శాలల విద్యార్ధులకు వ్యాస రచన, వక్తృత్వ ,కవితల పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్ధులకు బహుమతి ప్రదానం చేశాము .దీన్ని గుర్తించిన సీతమ్మ గారి ముని వనవడు గారి అబ్బాయి అమెరికా లో ఉంటున్న శ్రీ డొక్కా రామ భద్ర సీతమ్మ గారి పేర  ప్రతిభగల పదవ తరగతి చదువుతున్న పేద విద్యార్ధులకు 10 000 రూపాయలను సరసభారతి కి పంపారు .దానిని మూడు స్కూళ్ళ లోని ముగ్గురు విద్యార్ధులకు ,ముగ్గురు విద్యార్ధినులకు అర్హత ప్రాతి పదిక మీద ఒక్కొక్కరికి 1668రూపాయలను స్కాలర్ షిప్ గా సీతమ్మ గారి ముని మనవడు శ్రీ సూర్య నారాయణ ,వారి సతీ మణిన శ్రీమతి త్రిపుర సుందరి దంపతుల చేతుల మీదుగా 52వ సమా వేశం లో22-10-13 న అంద జేశాము .ఈ సమా వేశం లోనే తెలుగు లెక్చరర్  శ్రీ గుంటక వేణు గోపాల రెడ్డి ‘’పాను గంటి వారి సాక్షి వ్యాసాల విశిష్టత’’ పై మహా ఆసక్తిగా ప్రసంగించి అందర్నీ ఆకట్టుకున్నారు  .ఇలా వరుసగా రెండు కార్య క్రమాలను సీతమ్మ గారి పై నిర్వహించి సెహభాష్ అని పించుకోన్నాము .53వ సమా వేశం లో కార్తీక మాస వైశిస్ట్యాన్నివ్యాఖ్యాన చక్ర వర్తి  శ్రీ అగ్ని హోత్రం శ్రీ రామ చక్ర వర్తి వివరించారు .54 వ సమా వేశం గా శ్రీ గీతా జయంతిని నిర్వహించి శ్రీ మధుసూదన పిళ్లే దంపతుల చేత గీతా మాహాత్మ్యం పై ప్రసంగం ఏర్పాటు చేసి విద్యార్ధుల చే గీతా పారాయణ చేయించి సరసభారతి ప్రచురించిన పుస్తకాలు అంద జేశాం .55వ సమావేశం 24-12-13-న జరిపి శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి చేత ‘’ధనుర్మాసం –తిరుప్పావై ప్రాధాన్యత ‘’పై ఉపన్యాసాన్ని అందించాం . .

56వ సమా వేశం విశిష్టతను సంతరించు కొన్నది .ఆచార్య పింగళి లక్ష్మీ కాంతం గారి 120వ జయంతి 42,వ వర్ధంతి (జనవరి 10)ని పింగళి వారి స్వగ్రామం చిట్టూర్పు లో కృష్ణా జిల్లా రచయితల సంఘం తో కలిసి సంయుక్తం గా నిర్వహించి అందరి మన్ననలను అందుకోన్నాం .పింగళి వారి జీవితం రచనల పై పరిశోధన చేసిన డాక్టర్ శ్రీ పింగళి వెంకట కృష్ణా రావు గారు ముఖ్య అతిధి గా విచ్చేసి కీలక ఉపన్యాసాన్ని చేసి  పింగళి వారిని అందరికి  పరిచయం చేశారు .కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్ష ,కార్య దర్శులు శ్రీ  గుత్తి కొండ సుబ్బారావు ,శ్రీ డా. జి వి.పూర్ణ చంద్ .శ్రీ మాదిరాజు రామ లింగేశ్వర రావు ,శ్రీ రావి రంగా రావు చింతల పాటి సోదరులు శ్రీ మద్దూరి విశ్వం శ్రీ కోసూరి ఆదినారాయణ శ్రీ గొట్టి పాటి రామ కృష్ణ ,గ్రామ పెద్దలు శ్రీ యల్లా ప్రగడ శ్రీ రామ మూర్తి,శ్రీ నాదెళ్ళ వెంకట గోపాల రావు ,శ్రీ వెలివెల వీర రాఘవయ్య ,శ్రీ దాసరి బసవ కుటుంబ రావు ,శ్రీ జి .జి .ఎస్ .ఎస్ .ఎస్. వి .ప్రసాద్,శ్రీ పరుచూరి రామ కృష్ణ ,శ్రీ శ్రీ పరుచూరి జగన్మోహన రావు   వంటి గ్రామ పెద్దలు పాల్గొన్న ఈ సభ వందమందికి పైగా శ్రోతల తో దిగ్విజయమైంది .గ్రామస్తులు అందించిన అపూర్వ సహకారం మరువ లేనిది .గ్రామీణ ప్రాంతం లో ఇలాంటి సభ నిర్వహించటం ఇదే ప్రధమం .దీని దిగ్విజయానికి అందరూ అభినందనీయులే .ముఖ్యంగా ఆగ్రామ స్తురాలు శ్రీమతి మాది రాజు శివ లక్ష్మి ,వారి కుటుంబం నిర్వ హించిన  పాత్ర చిరస్మరణీయం .ఇలాంటి సభలే తొలి జ్ఞాన పీఠపురస్కార గ్రహీత ,కవి సామ్రాట్   శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారి  ‘’స్వగ్రామం నందమూరు’’ లోను,సినీ సంగీత దర్శకులు శ్రీ పెండ్యాల నాగేశ్వర రావు గారి స్వగ్రామం కాటూరు లోను నిర్వహించాలని సరసభారతి భావిస్తోంది . 57వ సమా వేశం గా సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి  ఆరాధనోత్సవాన్ని పుష్య బహుళ పంచమి నాడు 21-1-2014న నిర్వహించి త్యాగరాజ స్వామికి అష్టోత్తర పూజ చేసి   పంచ రత్న కీర్తనలను విని పించాం. శ్రీ సీతా రామాంజనేయ  భక్త సమాజం చేత భజన ఏర్పాటు చేశాం .

58వ సమా వేశం  గా ప్రముఖ చలన చిత్ర నటీమణి శ్రీమతి అంజలీ దేవి ,నటుడు శ్రీ అక్కినేని నాగేశ్వర రావు ల మరణానికి శాఖా  గ్రంధాలయం లో సభ జరిపి నివాలులర్పించాం .                                                                           ఈసంవత్సరం విద్యార్ధుల కోసం ఇంత వరకు ఏ పాఠ శాలలోను కార్య క్రమాన్ని నిర్వహించ లేక పోయాం .ఆ లోటు ను 59వ సమావేశం తీర్చింది స్థానిక అమర వాణి హైస్కూల్ లో 22-2-14శనివారం ఉదయం 11 గంటలకు జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత స్వర్గీయ’’ రావూరి భరద్వాజ గారి ‘జీవితం రచనలు’’ పై విద్యార్ధులకు అవగాహన కల్పించటానికి ప్రముఖ కవి ,రచయిత్రి ,విమర్శకురాలు శ్రీమతి మందరపు హైమ వతి  ,ప్రఖ్యాత కవి శ్రీ ఆంజనేయ కుమార్ గారల చేత చక్కటి ప్రసంగాన్ని ఏర్పరఛి విద్యార్ధులకు గొప్ప అవగాహన కలిగించాం. ఉత్సాహం గా వారు పాల్గొని శ్రద్ధగా విని స్పందించారు .అమరవాణి విద్యార్ధులకు’’ భరద్వాజ జీవితం’’ పై వ్యాస రచన ,’’రచనల లో మానవ సంబంధాలు’’ పై వక్తృత్వ పోటీలు నిర్వ హించి బహుమతి ప్రదానం చేశాము .శ్రీ చల పాక ప్రకాష్ ఈ కార్యక్రమానికి రూప కల్పన చేసి అమరావాణి స్కూల్ గ్రంధాలయానికి  పుస్తకాలను బహూకరించి సహక రించారు .శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ అధ్యక్షత వహించగా అమర వాణి ప్రిన్సిపాల్ శ్రీ పి.వి.నాగ రాజు సభా నిర్వహణ చేసి అతిధులకు విందు నిచ్చారు .

శ్రీ జయ నామ సంవత్సర ఉగాది వేడుకలను ఉగాదికి ముందు రోజు 30-3-14ఆదివారం మధ్యాహ్నం రోటరీ క్లబ్ ఆడిటోరియం స్థానిక కే.సి.పి. మరియు రోటరీ క్లబ్ వారల సౌజన్య సహాయ సహకారాలతోరోటరీ క్లబ్ ఆడిటోరియం లో  నిర్వ హిస్తున్నాం .ఈ సభలో జిల్లా నలు మూలల నుండి వచ్చిన కవులు ‘’ వివాహం –దాంపత్యం ‘’అనే అంశం పై తమ కవితలను విని పించి అలరిస్తారు .ప్రపంచ ప్రఖ్యాత ‘’గళ మురళీ విన్యాసకులు ‘’(ఈలపాట సంగీత కచేరి ) విద్వాంసులు శ్రీ కొమర వోలు శివ ప్రసాద్ ముఖ్య అతిధిగా విచ్చేసి సరసభారతి ఉగాది పురస్కారాన్ని గ్రహిస్తారు .ఆ తర్వాత వారి’’ గళ మురళీ విన్యాసం (ఈల పాట సంగీత కచేరి)  ‘’తో తన్మయులను చేస్తారు ,కే.సి.పి.సి.ఒ.ఒ.శ్రీ జి వెంకటేశ్వర రావు ,ఆంద్ర ప్రదేశ్ మాస పత్రిక సంపాదకులు శ్రీ జి వల్లీశ్వర్ ,విజయ వాడ ఆకాశ వాణిసంచాలకులు శ్రీమతి ముంజు లూరి కృష్ణ కుమారి ,ప్రముఖ ఆయుర్వేద వైద్యురాలు    శ్రీమతి డాక్టర్ కే .శ్రీ విద్య (ఏం డి),కృష్ణా జిల్లా రచయితల సంఘం ముఖ్య కార్య దర్శి డా.జి వి.పూర్ణ చంద్ లు ఆత్మీయ అతిధులుగా విచ్చేసి మా పురస్కారాలను అందుకొంటారు  .ఈ ఉగాది కార్యక్రమానికిఅన్నివిధాల సహరించి  ,ఆడిటోరియం లో జరపటానికి అనుమతి నిచ్చి న కే సి పి .సి ఒ.ఒ.శ్రీ ఏం వెంకటేశ్వర రావు గారికి ,వారి సిబ్బందికి రోటరీ క్లబ్ అధ్యక్ష కార్య దర్శులకు కార్య వర్గానికి క్రుతజ్నతలు తెలియ జేసుకొంటున్నాం .

వివిధ రంగాలలో  ప్రపంచ ప్రసిద్ధులైన మహిళల గురించిసరసభారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ అంతర్జాలం లో సీరియల్ గా  రాసిన వ్యాసాలను ‘’మహిళా మాణిక్యాలు ‘’పుస్తకం గా   సరసభారతి  12వ ప్రచురణ గా ముద్రించి ఈ రోజున శ్రీ మతి మున్జులూరిక్రిష్ణ కుమారి గారి చేత ఆవిష్క రింప జేస్తోందని తెలియ జేయ టానికి సంతోషిస్తున్నాం . .ఇది దుర్గా ప్రసాద్ గారు రాసిన ఏడవ పుస్తకం . ఈ పుస్తకం ముద్రణ ఖర్చులన్నీ  ఉయ్యూరు వాసి ,ప్రస్తుతం అమెరికా లో అలబామా రాష్ట్రం లో హాంట్స్ విల్ లో  ఉంటున్న సరసభారతికి అత్యంత ఆప్తులు ,శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు భరించి పుస్తకం వెలువడటానికి తోడ్పడ్డారు .వారికి సరస భారతి  కృతజ్ఞత తెలియ జేస్తోంది .వారి కోరిక పై ‘’మహిళా మాణిక్యాలు ‘’  ‘’పుస్తకాన్ని ‘’మహిళా మాణిక్యం,సహధర్మ చారిణి అయిన మైనేని వారి  ధర్మ పత్ని సౌ. శ్రీమతి మైనేని సత్య వతి గారికి అంకిత మిస్తున్నాం .అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగే ఈ మార్చి నెలలో ఈ పుస్తకం ఆవిష్కరింప బడటం అత్యంత సమంజసమని భావిస్తున్నాము .

సరస భారతి అంతర్జాలం లోను గణనీయ మైన ప్రగతి సాధించిందని  మనకందరికీ తెలిసిన విషయమే .సరసభారతి ,,సువర్చలాన్జనేయ అనే రెండు బ్లాగులను , నిర్వహిస్తూ అందరి ప్రశంసలను  అందు కొంటున్నాం . .ఇప్పటికి ఈ రెండు బ్లాగుల వీక్షకుల సంఖ్య ‘’రెండు లక్షల పన్నెండు వేల ‘’ను దాటిందని సంతోషం గా తెలియ జేస్తున్నాము .ఉయ్యూరు కు ప్రాధాన్యత నిచ్చే ‘’ఉయ్యూరు టైమ్స్ ‘’అనే బ్లాగును కూడా నిర్వహిస్తున్నాం .సరసభారతికి  ఇప్పటి వరకు సహాయ సహకారాలందించిన వారందరికీ వినయం తో క్రుతజ్ఞతలను తెలుపు కొంటున్నాము. ఇక ముందుకూడా ఇదే ఆదరణ, అభిమానం ,ఆత్మీయత , సహాయ సహకారాలను అందించాలని కోరుతూ, అందిస్తారని ఆశి స్తున్నాము .

మాది రాజు శివ లక్ష్మి

కార్య దర్శి –సరస భారతి

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరస భారతి శ్రీ జయ ఉగాది పురస్కారాలను అందుకొన్న శ్రీ కొమరవోలు శివ ప్రసాద్

 

శ్రీ కొమరవోలు శివ ప్రసాద్

ప్రపంచ ప్రఖ్యాత ‘’గళ మురళీ విన్యాసకులు ‘’(ఈల పాట సంగీత విద్వాంసులు ),విజిల్ విజార్డ్ ,ఈలలీలాలోల   గళమురళి,విజిల్ విజార్డ్ (ఈల మాంత్రికుడు ) శ్రీ కొమరవోలు శివ ప్రసాద్ గారు గుంటూరు జిల్లాలోబాపట్ల లో కే.ఎస్.వి  .సుబ్బారావు రాజ్య లక్ష్మి దంపతులకు తొమ్మిదవ సంతానం సంగీత కుటుంబం లో గా1955ఏప్రిల్ 26న జన్మించారు ఏ గురువు వద్ద విద్య నభ్యసిమ్చాకుండా స్వతహాగానే వినికిదితో చిన్నప్పటి నుండి ఈల పాటపాడే వారు .ఈల పాట లో అద్వితీయ సాధన చేసి శాస్త్రీయత ను జోడించి సంగీత కచేరి లో ప్రపంచ ప్రసిద్ధులైనారు .ఈల పాటను ఆంద్ర దేశం లో మొదట ప్రారంభించింది స్వర్గీయ కే రఘురామయ్య గారు .ఆయననను ‘’ఈల పాట రఘుర్రామయ్య ‘’అని ఆప్యాయం గా పిలుచుకోనేవారు .ఆయన చూపుడు వేలును మడిచి నోటిలో ఉంచి గాలి పీల్చి వదులుతూ ఈల వేసి పాడేవారు .శివ ప్రసాద్ గారు ఏ సహాయం లేకుండా ‘’అసహాయ శూరులు’’లా ఈల పాట పాడుతారు .రఘురామయ్య గారికి ఈల పాట ఒక హాబీ .ఆయన ప్రఖ్యాత పౌరాణిక నాటక ,సినిమా నటులు .కాని శివ ప్రసాద్ గారికి  ఈల పాట ‘’జీవన వేదం ‘’.ఉచ్చ్వాస నిశ్వాసాలు ,ఊపిరి .వీరికి పాట అలవోక గా గా పలుకుతుంది .అలుపూ సొలుపూ లేకుండా ఎన్ని గంటలైనా పాడుతారు .శివ ప్రసాద్ గారికి ఈల ఒక ‘’శ్వాశావధానం ‘’.రఘురామయ్య గారు ఈల కు’’ స్టేజి గౌరవం’’ కలిగిస్తే, శివ ప్రసాద్ గారు ఈలపాట కు ‘’అంతర్జాతీయ వేదికను నిర్మించి’’  ఒక కళ గా ‘’ఆర్ట్ ఫాం’’ గా మలిచారు .ఈలకూ తనకూ యెనలేని కీర్తిని ఆర్జించారు .100_1656 100_1480

ఈల ఏమిటి ?దేనికి పనికొస్తుంది?వదిలెయ్యి అని శివప్రసాద్ గారిని ఎందరో మేటి సంగీత విద్వాంసులు నిరుత్సాహ పరిస్తే ,సంగీత  కళానిధి శ్రీ మంగళం పల్లి బాల మురళీ కృష్ణ గారు మద్రాస్ లో తన ఇంట్లో ఉంచుకొని భోజన వసతి సౌకర్యాలు  కల్పించి సంగీతం లోని మెలకువలన్నీ దగ్గరుండి నేర్పించారు . వారే తన మొదటి గురువు అని శివ ప్రసాద్ ఉప్పొంగి పోతారు . .బాల మురళి గారి భార్య శ్రీమతి అన్న పూర్ణ గారు నిజం గానే అన్న పూర్ణ లా కన్న కొడుకు లా ఆదరించారని కృతజ్ఞతలు చెప్పారు .తనను ప్రోత్సహించిన రెండవ వారు ప్రఖ్యాత సేహనాయ్ విద్వాంసులు భారత రత్న స్వర్గీయ బిస్మిల్లా ఖాన్ గారు  .తాను కూడా ఇలానే అందరి నిరుత్సాహాన్ని పొందానని కాని షెహనాయ్ కి  స్టేజి గౌరవాన్ని కల్గిన్చానని ,దానితో అందరూ గౌరవించారని  ధైర్యాన్నిచ్చి  ప్రోత్సహించారు .శ్రీనివాసన్ అనే వారు శాస్త్రీయ సంగీతాన్ని దగ్గర కూర్చో బెట్టుకొని నేర్పారు వీరందరి ఆడరమే తనను ఇంతటి వాడిని చేసిందని వినయం గా కృతజ్ఞతలు తెలియ జేస్తారు . లక్షలు ఖర్చు పెట్టి స్వంత కీ బోర్డు తయారు చేసుకొని కచేరీలు నిర్వహిస్తారు ..

 

శ్రీ జయ నామ సంవత్సర ఉగాది వేడుకలు,

ఆంద్ర ప్రదేశ్ శాసన సభ మాజీ స్పీకరు ,మహా రాష్ట మాజీ గవర్నరు స్వర్గీయ కోన ప్రభాకర రావు గారు తన ‘’మెంటార్ ‘’అని కృతజ్ఞతలు తెలుపుతారు .అనేక స్టేజీ లపై తనను చిన్నప్పటి నుంచి ఈల పాట పాడించి ప్రోత్సహించారని, ప్రధాని ఇందిరా గాంధి వద్ద పాడే అవకాశం కలిపించింది వారేనని పది నిమిషాలు   మాత్రమె   వింటానని కూర్చున్న ఇందిర గంటకు పైగా వింటూ తన్మయురాలైనారని ,అది మరచి పోలేని అనుభవమని అన్నారు …బాల మురళి గారితో బిస్మిల్లా ఖాన్ గారితో కలిసి కచేరీలు చేశారు  .ప్రతి ఏడాది జనవరి ఒకటవ తేదీ హైదరాబాద్ రవీంద్ర భారతి లో ‘గల మురళీ విన్యాసం ‘’చేసి సాటి కళా కారులను ప్రోత్సహిస్తారు .

భగవాన్ సత్య బాబా గారి సమక్షం లో ఎన్నో కచేరీలు చేసి మెప్పు పొందారు .బాబా గారి ఆశీస్సులు పుష్కలం గా అందుకొన్నారు .బాబా గారి ఆదేశం ప్రకారం అమెరికా మొదలైన దేశాలలో పర్య టించి ఈల పాట సంగీతం ద్వారా ప్రేమ ,సేవ ఆనందాలను పంచుతున్నారు .

విజిల్ విజార్డ్” శ్రీ కొమరవోలు శివ ప్రసాద్… శ్రీ జయ నామ సంవత్సర ఉగాది వేడుకలు,- ఈల పాట కు శాస్త్రీయ స్థాయి కలిగించాలని ,యూని వర్సిటి స్థాయి లో  ఈల  పాటను ఒక సబ్జెక్ట్ గా ప్రవేశ పెట్టించి నేర్పించాలని శివ ప్రసాద్ గారి ఆశయం .బాల మురళి గారు శివ ప్రసాద్ గారికి ‘’గళ మురళి ‘’అని బిరుదు నిచ్చారు ..అమెరికా లోని నార్త్ కరోలినా రాష్ట్రం షార్లెట్ నగరం లో2012 జూన్ లో  ‘’తెలుగు సమాఖ్య’’ వీరికి జరిపిన సన్మాన సభలో ‘’’ఈల లీలా లోల ,‘’గళ వంశి’’బిరుదులనిచ్చి గౌరవించింది .ఒక మహర్షి ధ్యాన సమాధి లో ఉండి,,అనాయాసం గా అసంకల్పితం గా సంగీత శ్రోతస్విని ని జాలు వారుస్తున్నట్లు ఉంటుంది ఈ ‘’పరి పూర్ణ నాద యోగి’’   సంగీత   స్రవంతి.సంప్రదాయ శాస్త్రీయ కర్నాటక సంగీతాం హిందూ స్తాని సంగీతం ,లలిత సంగీతం భక్తీ భావ సంగీతం సినీ సంగీతం ,ఫూజన్ సంగీతం అన్నీ వారి ఈల పాటల్లో ఒదిగి .వెలువడి మురిపించి మెరిపించి మై మర పిస్తాయి ..పరమేశ్వరుడు వారికి ఆయురారోగ్య భోగ భాగ్యాలనిచ్చి కాపాడాలని ,శివప్రసాద్ గారి సంగీత సరస్వతిని భారత ప్రభుత్వం గుర్తించి  ‘’పద్మ పురస్కారం ‘’  అందజేసి అందరిని సంతృప్తి పరచాలని కోరుకొందాం .శ్రీ జయనామ ఉఆది వేడుకలలో సరసభారతి శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ శ్రీమతి ప్రభావతి గారల యాభై వసంతాల వివాహ జీవిత ప్రత్యెక పురస్కారాన్ని అందుకోవలసినది గా శ్రీ కొమరవోలు శివ ప్రసాద్ గారిని అభ్యర్ధిస్తున్నాం .

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరస భారతి శ్రీ జయ ఉగాది పురస్కార గ్రీత శ్రీ మతి మున్జులూరి కృష్ణ కుమారి -విజయవాడ ఆకాశ వాణి iని కేంద్ర సంచాలకులు

శ్రీమతి ముంజులూరి కృష్ణ కుమారి

విజయ వాడ ఆకాశ వాణి లో దశాబ్డాల పాటు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ,కద లను చదవటం లో తనకు తానే సాటి అని నిరూపించుకొంటు ,బాలల కార్యక్రమాలను అద్వితీయం గా నిర్వహిస్తూ ,ప్రతి దాని లోను తనదైన ముద్ర వేసిన సాహితీ సంపన్ను రాలు శ్రీ మతి మున్జులూరి కృష్ణ కుమారి ..హాస్యానికీ ,లోతైన పరిశీలనకు ,పరిశోధనకు పెట్టింది పేరు అనిపించుకొన్న శ్రీపన్నాల సుబ్రహ్మణ్య భట్టు గారి అర్ధాంగి  కృష్ణ కుమారి గారు .భర్త పేరు భట్టు ను వాడుకోకుండా స్వయం శక్తితో ఎదిగిన మహిళా మాణిక్యం .తెలుగు మహిళగా కట్టూ బొట్టూ తో చూడగానే పవిత్రత జ్యోతకం అవుతుంది .అదీ ఆమె స్పెషాలిటి .అసిస్టంట్ డైరెక్టర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ గా విశిష్ట సేవలందించారు .ఆంద్ర విశ్వ విద్యాలయం లో కొంతకాలం ఉద్యోగించారు .సుబోధకం గా బాల సాహిత్య రచన చేసినందుకు కృష్ణ కుమారి గారికి ఆంద్ర ప్రదేశ్ గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు శ్రీ తుర్ల పాటి కుటుంబరావు ,బాలసాహిత్య సృష్టికర్త ,గ్రంధాలయోద్యమ సారధి శ్రీ వెలగా వెంకటప్పయ్య గారల  చేతుల మీదుగా విజయ వాడ పుస్తక మహోత్సవం లో పురస్కారాన్ని అందుకొన్నారు .100_1524 100_1526

గత మూడు సంవత్సరాలుగా విజయ వాడ ఆకాశవాణి కేంద్రం లో పూర్తీ బాధ్యతలతో ముఖ్య సంచాలకులుగా సేవలందిస్తూ విభిన్న కార్యక్రమాలకు రూప కల్పన చేసి,ప్రసారం చేస్తూ ప్రశంసలను అందు కొంటున్నారు .సరస భారతి నిర్వహిస్తున్న శ్రీ జయ నామ సంవత్సర ఉగాది వేడుకలలో స్వర్గీయ గబ్బిట భవానమ్మ మృత్యుంజయ శాస్త్రి గార్ల స్మారక ఉగాది పురస్కారాన్నిశ్రీ మతి మున్జులూరి కృష్ణ కుమారి గారిని అందుకోవలసినడిగా సగౌరవం గా ఆహ్వానిస్తున్నాము .

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరస భారతి శ్రీ జయ ఉగాది పురస్కారాలను అందుకొన్న డాక్టర్ జి.వి.పూర్ణ చంద్

డాక్టర్ జి.వి.పూర్ణ చంద్

డా. జి. వి. పూర్ణచ౦దు సాహిత్యాభిలాషి. వ౦దకు పైగా పుస్తకాల రచన. వాటిలో నలభై వరకూ సామాన్యుడికోస౦ వైద్య రహస్యాలను తెలిపిన పుస్తకాలున్నాయి.“తరతరాల తెలుగు రుచులు” పరిశోధనా గ్ర౦థ౦ తెలుగు వారి ఆహార చరిత్రపైన వెలువడిన తొలిగ్ర౦థ౦గా ప్రసిధ్ధి పొ౦ది౦ది. ఆ౦ధ్రభూమి ఆదివార౦ భూమిక,నడుస్తున్న చరిత్ర, నది, చినుకు మాసపత్రికలు ఇ౦కా అనేక మాస, వార పత్రికలలో శీర్షికలు వస్తున్నాయి.  ద్రావిడ విశ్వవిద్యాలయ౦ ప్రచురి౦చిన  “నైలూ ను౦చి కృష్ణ దాకా”, ఆ౦. ప్ర. అధికార భాషా స౦ఘ౦ ప్రచురి౦చిన “తెలుగే ప్రాచీన౦” గ్ర౦థాలు పరిశోధకుడిగా వీరికి మ౦చి పేరు తెచ్చిపెట్టాయి. తెలుగు భాష ప్రాచీనతనిరూపి౦చే వ్యాసాలు అనేక౦ ప్రచురితమయ్యాయి. తెలుగు భాషకు ప్రాచీనతా హోదాను సాధి౦చట౦లో చురుకైన పాత్ర పోషి౦చారు. కృష్ణాజిల్లా రచయితల స౦ఘ౦ ప్రథాన కార్యదర్శి. ప్రప౦చ తెలుగు రచయితల మహాసభలు రె౦డుసార్లు విజయవాడలో నిర్వహి౦చి భాషోద్యమానికి ఊపిరి పోశారు. తెలుగు విశ్వవిద్యాలయ౦, 30కి పైగా ఇతర స౦స్థలు పురస్కారాలతో గౌరవి౦చాయి. 2012లో తిరుపతిలో జరిగిన నాలుగవ ప్రప౦చ తెలుగు మహా సభల స౦దర్భ౦గా తెలుగు విశ్వవిద్యాలయ౦ వారు వీరి ‘మన ఆహార౦’ ఆహార చరిత్ర పరిశోధనా గ్ర౦థాన్ని ప్రచురి౦చి సత్కరి౦చారు.100_1538
సరస భారతికి మిక్కిలి అభిమానులు .శ్రీ గుత్తికొండ సుబ్బారావు శ్రీ పూర్ణ చంద్ లు లేకుండా సరసభారతి ఏ ముఖ్య కార్యక్రమాన్నీ నిర్వహించలేదు .ఉయ్యూరు అన్నా ఇక్కడి సాహితీ ప్రియులన్నా ,కార్యక్రమాలన్నా ఏంటో ఇష్టపడి వస్తారు .సరసభారతికి ,మాకు ఆ జంట కొండంత అండ .శ్రీ విజయ నామ ఉగాది వేడుకలలో సరసభారతి అందిస్తున్నఉగాది పురస్కారాన్ని అందుకోవలసి నది గా  శ్రీ పూర్ణ చంద్ గారిని ఆహ్వానిస్తున్నాము ..

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరస భారతి శ్రీ జయ ఉగాది పురస్కారాలను అందుకొన్న జర్నలిజం ఘనాపాటి –శ్రీ జి.వల్లీశ్వర్

జర్నలిజం ఘనాపాటి –శ్రీ జి.వల్లీశ్వర్

 

విద్యార్ధి దశ లోనే జర్నలిజం పై మక్కువ ను ఎక్కువగా పెంచుకొని తనదైన ముద్రవేసిన’’ హేలాపురి కలం యోధుడు ‘’శ్రీ జి.వల్లీశ్వర్, తెలుగు ఇంగ్లీష్ భాషల్లో సవ్యసాచి. వాటిపై సమాన ప్రతిభా విశేషం తో ఆంధ్రాంగ్ల జర్నలిజం ను సుసంపన్నం చేసిన జర్నలిజం ఘనాపాటీ.ఈ ద్విభాషా పాండిత్యం లో ప్రముఖ పాత్రికేయ  రచయిత గో.రా.శాస్త్రివంటి అతి కొద్ది మంది  విశేష ప్రతిభా సంపన్నుల కోవలోకి చేరి, అరుదైన గౌరవం పొందిన ప్రభావ శాలి. నాలుగు దశాబ్దాలుగా జర్నలిజం లో  సాగుతున్న శ్రీ వల్లీశ్వర్ పాత్రికేయ విజయ యాత్ర ప్రస్తానం లో ఏలూరు టైమ్స్ ,ఆంద్ర జ్యోతి , ఈనాడు , న్యూస్ టైమ్,  వంటి ప్రముఖ పత్రికలలో  వివిధ హోదాలలో వివిధ ప్రాంతాలలో సేవలందించారు . దేశ రాజధాని ఢిల్లీ లో తెలుగు అక్షరం వాడిని , వేడినీ నాడిని చూపించిన అక్షర యోధుడు వల్లీశ్వర్ . ప్రస్తుతం ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రచురిస్తున్న 100_1517 100_1516 100_1514‘’ఆంద్ర ప్రదేశ్’’పత్రికకు సంపాదకులుగా వల్లీశ్వర్ పని చేస్తున్నారు .స్వర్గీయముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డిప్రత్యెక ఆహ్వానం పై  ఆయన వద్ద  ప్రధాన ప్రజా సంబందాల అధికారి (డి.పి..అర్ .వో.)గా పని చేసిన సమర్ధుడు వల్లీశ్వర్ .మనిషి నిగర్వి మాట నిదానం .ప్రవర్తనలో నిరాడంబరుడు .సదా చెరగని చిరు నవ్వు చిందించటం వల్లీశ్వర్ కే స్వంతం .ఇంగ్లీష్ నుండి తెలుగుకు అనేక అనువాదాలు చేశారు .. ప్రముఖ ప్రచురణ సంస్థ ఎమెస్కో ప్రచురించిన పేరెన్నిక గన్నకొన్ని పుస్తకాలనూ రాశారు  పరిశోధనాత్మక ,పరిశీలనాత్మక రచనలో నాంది పలికి ,పరిధిని విస్తరించి తీర్చి దిద్దిన పాత్రికేయ యోధుడు శ్రీ వల్లీశ్వర్ కు శ్రీ జయ నామ సంవత్సర ఉగాది ‘’ఆత్మీయ పురస్కారాన్ని’’ సరసభారతి స్స్వర్గీయ గబ్బిట భావానమ్మ మృత్యుంజయ శాస్త్రి గారాల స్మారక ఉగాది పురస్కారాన్ని సంతోషం గా ,సగర్వం గా అంద జేస్తోంది .శ్రీ వల్లీశ్వర్ గారిని స్వీకరించ వలసినది గా కోరుతున్నాం .

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరస భారతి శ్రీ జయ ఉగాది పురస్కారాలను అందుకొన్న – డా శ్రీ విద్య

డాక్టర్  శ్రీమతి శ్రీ విద్య

శ్రీమతి శ్రీ విద్య తిరుపతి లో రాష్ట్రపతి పురస్కార గ్రహీత ,సంస్కృతం లో ఆచార్య పదవి లో రాణించిన వారు శ్రీ వెంకటేశ్వరవిశ్వ విద్యాలం ఓరియెంటల్  ఇన్స్టిట్యూట్  రిసెర్చ్  ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అయిన శ్రీ ములకలూరి  శ్రీమన్నారాయణ మూర్తి గారికి, శ్రీమతి సీతా మహాలక్ష్మి దంపతులకు కుమార్తె .గా జన్మించారు .తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద కళాశాల లో డిగ్రీ పొందారు .వారణాసి లోని బెనారస్ హిందూ విశ్వ విద్యాలం లో చదివి ఆయుర్వేదం లో ఏం డి .సాధించారు .బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం నుండి యోగా లో డిప్లోమో పొందారు .మచిలీ పట్నం లో చర్మ వ్యాధి నిపుణు లైన (డేర్మటాలజిస్ట్ )డాక్టర్ కోసూరు ఫణి కుమార్ గారిని  వివాహం చేసుకొన్నారు .ఈ దంపతులకుమారుడే ఛి అనిరుద్ .మామ గారు శ్రీ కోసూరు ఆదినారాయణ గారు పెదముత్తేవి ఓరిఎంటల్ పాఠ శాల ప్రధానోపాధ్యాయుని గా పని చేసి రిటైర్ అయ్యారు .అత్తగారు  శ్రీ మతి కామాక్షిగారు మొవ్వ లో  సోషల్ స్టడీస్ టీచర్ గా రిటైర్ అయ్యారు .

డాక్టర్ శ్రీ విద్యగారు 2003నుండి మచిలీ పట్నం లో ‘’పంచ కర్మ విధానం ‘’లో ఆయుర్వేద వైద్య సేవ చేస్తున్నారు .చెన్నై లోని శ్రీ సాయి రాం ఆయుర్వేద కళా శాల లో ‘’విజిటింగ్ అసోసియేట్ ప్రొఫెసర్ ‘’గా సేవలందిస్తున్నారు .పదికి పైగా జాతీయ ,అంతర్జాతీయ ఆయుర్వేద సెమినార్ లలో పాల్గొని విలువైన పత్ర సమర్పణ చేసి ఉత్తమ పత్ర సమర్పణ  బహుమతు లందు కొన్నారు ..

శ్రీ విద్య గారి ఆయుర్వేద సేవాకార్య క్రమాలకు మంచి గుర్తింపు లభించింది ‘’.డాబర్ ‘’ఆయుర్వేదిక్ అవార్డ్ అందుకొన్నారు .తిరుపతి జూనియర్ చేంబర్ వారు స్వర్ణ పతకం ప్రదానం చేసి గౌరవించారు .’’అష్ట వైద్యాన్ పులమంతాల్ శ్రీ  శంకర మూస్ స్మారక అవార్డ్ పొందారు   యోగా లో డిప్లొమా సాధించి నందుకు స్వర్గీయ యు. ఏ .ఆశ్రాని పురస్కారం అందుకొన్నారు .100_1531 100_1532

శ్రీమతి శ్రీ  విద్య గారి ఆయుర్వేద సేవలకు గాను సరసభారతి అందిస్తున్న స్వర్గీయ గబ్బిట భవానమ్మ మృత్యుంజయ శాస్త్రి గారల స్మారక శ్రీ జయ నామ సంవత్సర ఉగాది పురస్కారాన్నిఅందుకోవలసినది ఆ ఆహ్వానిస్తున్నాం .

వారి పరిచయం -రచన దుర్గా ప్రసాద్ –

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరస భారతి శ్రీ జయ నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనం -5 వివాహం –దాంపత్యం

సరస భారతి శ్రీ జయ నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనం -5

              వివాహం –దాంపత్యం

21-కలిసి ఉండటం ముఖ్యం –శ్రీమతి సింహాద్రి పద్మ (అవని గడ్డ )

ఇంటికి పునాది లాగ –దాంపత్యానికి వివాహం సహజం

అన్ని వివాహాల శాస్త్రీయతా ఒక్కటే –

ఇద్దరు జీవితకాలం కలిసి ఉండటమే వివాహ పరమార్ధం

నిజానికి ఇద్దరూ కలవటం కలిసి ఉండటం యెంత కష్టం ?-యెంత కష్టమో అంతతేలిక

ఎన్ని అహంభావ కవచాలు విప్పాలి ?ఎన్ని అహంకార కవాటాలు తెరవాలి?

ఒకచో వలపు వాగ్దానాలు మెరవాలి –ఒకచో కానుకల ప్రశంసలు తళుక్కు మనాలి

కన్నీటి వేళ ఓదార్పు స్పర్శలు –భరోసా ఇచ్చే సాహచర్యం కావాలి

మనసెరిగి మసలటం కమ్మనైన నమ్మకం –జీవితకాలం కలిపి ఉంచే సూత్రం

ఒకరికొకరు చేసుకొన్న ప్రమాణాలతో –కలిసి చేసే ప్రయాణాలు జీవన సాఫల్యం

ఒకరి లోకి ఒకరు ప్రవహిస్తూ –ఒకరిగా ఉండటం

పాటకు ప్రాణం గా కవితకు భావం లా కలిసుం డటం ముఖ్యం

కలిపుంచేది ఏదైనా సమ్మతమే –విడదీసేది ఏదైనా దుర్మార్గమే

జీవితకాలం కలిసుండటమే మరీ మరీ ముఖ్యం .

            22-అంతర్జాతీయం –శ్రీ బందా వెంకట రామా రావు (విజయ వాడ)

ఊరూరా ఉండేవి మెరక వీదులోక నాడు –ఆమెరకలన్ని కలిసి అమెరిక అయిం దీనాడు

హత విధీ !ఇంకెక్కడి వివాహం ,లేదేక్కడా దాంపత్యం –చాటింగులు ,డేతింగులు మీటింగుల పర్వం లో

స్త్రీకి స్త్రీకి వివాహామట –పురుషుల మధ్య దాంపత్యమట

విడాకుల చట్టాల వికృత రూపం విశ్వమంతా అలముకొంది

వేరుకుంపట్లు ,నిర్లక్ష్యం నిర్లజ్జా నాగరకత పేరులో నిండిన లోకం లో

వివాహ పరమార్ధం మరిచి విశ్రుంఖలత వెర్రి చేష్టలతో చేస్ట లుడిగి పోతున్నాం

వివాహ దాంప త్యాలు వంశోన్నతికోసమే నని మరిచి పోరాదు

ఉన్నది ఇవ్వటం లేనిది పొందటమే సహజీవన సౌందర్య పరమార్ధం .

23-జయీ భవ –శ్రీ మతి మాదిరాజు శివ లక్ష్మి (ఉయ్యూరు )

కొత్త తలపులతో గుండె ఝల్లు మంటుంటే –హృదయాంతరాళాల్లో మధురిమలు మోగుతుంటే

భారత ఖండాన ఒక దివ్య శిశువునివ్వాలనని –ఉవ్విళ్ళూరుతూ కొంగు ముడి వేసుకొంటారు

సుక్షేత్ర దేశం లో పవిత్రాశయాలు నెరవేర్చాలని –అందరూ ధన ధాన్యాలతో సుఖం గా వర్ధిల్లాలని

నూతన దంపతులు ఆ ఆది దంపతులను వేడుకొంటారు

ప్రపంచానికే మకుటాయమైన భారతీయ వైవాహిక వ్యవస్థ కు

జయీ భవ విజయీ భవ దిగ్విజయీ భవ .

24-జేజేలు –కుమారి మాది రాజు బిందు వెంకట దత్తశ్రీ (యాకమూరు)

చక్కగా చిక్కగా ఆత్మీయంగా –అపురూపం గా అనురాగం గా దైవాంశ సంభూతం గా

సాగుతున్న దాంపత్యం నిత్య నూతనం –అదే శ్రీ దుర్గా ప్రసాద్ గారి అయిదు పదుల దాంపత్య జీవనం

నవనీతమై నిత్య ‘’ప్రభావతం ‘’అయి –సరస భారతి యై –

సమాజానికి సాహితీ వెలుగు లందిస్తున్న దంపతులు వారు

కుటుంబాన్ని ,సమాజాన్నీ సమన్వయ పరుస్తూ

తెలుగు తల్లికి ముద్దుల పట్టియై –సరసభారతికి సారదులై అలరారుతున్న సుమనస్కులు

ధర్మో రక్షతి రక్షితః అన్న ఆర్యోక్తిని అభి వ్యక్తీకరిస్తూ –గృహస్తాశ్రమ ధర్మానికి నిలువుటద్దాలై

ఈ తాత గారు అమ్మమ్మ గారి అర్ధ శతాబ్ది దాంపత్య మహోత్సవానికి జేజేలు .

25-మన ధర్మం మనో ధర్మం –రోటేరియన్- శ్రీ నిమ్మగడ్డ సుబ్బా రావు (ఉయ్యూరు )

    వివాహం ఇష్టం తో చేసుకోవాలి –దంపతులు ఆదర్శ ప్రాయం గా మసలుకోవాలి

    వంశం సమాజం అభివృద్ధికి సంభావన తో సహక రించాలి

    ఆకళింపు అవగాహన ఆచరణ తో అందరి మనసులు ఆకర్షించాలి

    ధర్మార్ధ కామాలకు సమ వర్తనులై సాగాలి -వీటితోనే మోక్షం సాధించాలి

    మనిషి లోని ‘’షి ‘’ని లుప్తం చేయరాదు –అప్పుడే పరి పూర్ణ దాంపత్య ఘనత .

26-నిన్ను నీవు తెలుసుకో –శ్రీమతి కోకా విమల కుమారి (విజయ వాడ )

మల్లెల పరిమళం పంచిన పరమానంద జీవన సారం అన్యోన్య దాంపత్యం

తాళిని ఎగ తాళి  చేస్తే తప్పవు తిప్పలు –అనాలోచిత పోరాటాలు

 అనర్ధ హేతువని మహిళా తెలుసుకోవాలి

శృతి మించిన ఆత్మాభిమానం వరం కాదు శాపమే అవుతుందని గ్రహించాలి .

మూడు ముళ్ళ బంధాన్ని ముచ్చట అని తేలిక చేయొద్దు

నిన్ను నువ్వే తెలుసు కొంటేనే –నీఉనికి రక్షణ

27-వివాహమే జగద్రక్ష –శ్రీమతి కోపూరి పుష్పా దేవి (విజయ వాడ )

ప్రపంచాన్ని సవ్యం గా నడిపేది ,లోకాన్ని స్వచ్చం గా ఉంచేదీ వివాహమే

ఆధునిక సమాజానికి వారధి వివాహం –

మానవ విలువలపై విశ్వశాంతి భవన నిర్మాణమే వివాహం

మమకారాల ఎరువులు చల్లి –ప్రేమ సుమోద్యానవనాల్ని వృద్ధి చేస్తుంది

సాంస్కారానికి కట్టిన పట్టం వివాహం –స్త్రీకి పురుషుడు ఆలంబన

పురుషుడికి  స్త్రీకి ఆరాధన –సంసార వ్యవ సాయం తో సంతాన పంట పండాలి

ఆదర్శ సమాజాలే శ్రీ రామ రక్ష –అందుకే వివాహమే జగద్రక్ష .

                 దాంపత్యం

అక్కడి అమ్మాయి ఇక్కడి అబ్బాయి కలిస్తే కమనీయం

సృష్టికి ఉషోదయం –అతనికి ఆమె అపురూపం అతనికి ఆమె ప్రాణ దీపం

ఆమె ప్రమిద అయితే ఆతను తైలం –కళ్యాణ వత్తి ని వెలిగిస్తే జగతికి వెన్నెల కాంతులే

ఆమె తోడుంటే కొండలే అవుతాయి పిండి –అతని కోపాగ్ని ఆమె చిరునవ్వు మంచుకి తలొం చుతుంది  

ఆమె రుస రుసల సెగలూ పొగలూ –అతని ఆప్యాయతాబిమానాల పవనానికి పరారు

చిన్ని చిన్ని కలతలు –కాపురపు మధుర భాష

కోపాలూ ఆవేశాలు సంతోషాలూ సరిగమలూ –సంసార కావ్యం లో మధుర ఘట్టాలు

సంప్రదింపుల శృతి లయలు –సర్దు బాట్ల దిద్దు బాట్ల ఐక్యతా రాగాలు

కష్టాల్లో కన్నీళ్ళల్లో అండా దండా –మనవల ముద్దు మురిపాలలో స్వర్గ సుఖాలు

మంచికి బాసటగా సమాజానికి చేరువగా

ప్రాణ శరీరాల్లా ఏకమై మమైకమై ఒకరికొకరై

వర్దిల్లేదే దాంపత్యం –ఇది స్వర్గానికి సాపత్యం .

28-స్థిర  నిర్ణయం –లయన్ శ్రీ మాదిరాజు శ్రీనివాస శర్మ (యాక మూరు )

వివాహ వ్యవస్థను పునరుద్ధ రించటానికి పదండి ముందుకు

దాంపత్య జీవిత పరమార్ధాన్ని చాటి చెప్పుదాం రా రండి

కలిసి మెలిసి బతికి కుటుంబాలను కాపాడుకోవటానికి తరలి రండి

వారసత్వ విలువలు కాపాడాలంటే సంస్కృతిని   పాడాలంటే ముందుకు నడవండి

మనసున మల్లెలు పూయించి మధురానుభూతుల్ని పంచె

దాంపత్య జీవన ఔన్నత్యం నవతరానికి తెలియ జేద్దాం

అని మనసులో అందరం స్థిర నిర్ణయం చేసుకొందాం –అనుకొన్నది సాధిద్దాం

          29-.శ్రీమతి డా.జి రేజీనా (విజయ వాడ )

ఇరు మనసులు పెన వేసుకొనే మధుర క్షణాలే వివాహం

మూడు ముళ్ళ బంధం రెండు కుటుంబాల బాంధవ్యానికి నాంది

కొత్త జీవితానికి తెర దీసే మహిమాన్విత రసధుని

వావి వరుసలు పెరిగి బల పడే బంధుత్వం

గళానికి తాళి నల్ల పూసలు  కాలికి  మట్టెలు తో నూతన వధువు నవ కాంతులజ్యోతి

ఆలూ మగలూ  పాలూ తేనే వలే కలిసి రెండువైపులా బందుత్వాన్ని దృఢ పరచాలి

చిలిపి సరస సాంగత్య విలాసాల నుండి సంసార చదరంగం లో

అన్నీ తట్టుకొంటూ గమనం సాగించాలి

జీవన నౌకను గమ్యం చేర్చటానికి బాధ్యతల ఇరుసు పై చాక చక్యం గా

ద్వంద్వాలను అనుభ విస్తూ –ఆవలి తీరం చేరటమే దాంపత్య పరమావధి .

30-శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ శ్రీమతి ప్రభావతి గారల అర్ధ శతాబ్ది వివాహ మహోత్సవ సందర్భం గా

              శుభాభి నందనలు –శ్రీమతి వారణాసి సూర్య కుమారి (మచిలీ పట్నం )

సీ.ఆదర్శ మూర్తులైనట్టి దుర్గాప్రసాద్ –గారు ప్రభావతి ఘనులు వారు

  ఆదిదంపతులిల నవతరించితి రను –చందమ్ము భాసిల్లు జంట వారు

   సాహితీ రధమునకు సారధి యగుచును –ప్రగతి పదము నడుప గల వారు

   అర్ధ శతాబ్ది వివాహ వేడుకలను –సురల యాశీస్సుల నరయు వారు

తే.గీ.నాల్గు ముఖముల నరయునా నలుడు సతిని –వక్ష మందిడుకొనే హరి లక్షణముగ

      పార్శ్వమున నిలిపే సతి ని పరమ శివుడు –మనసు నిడిరి దుర్గా ప్రసాద్ మమత నింపి .

సీ.ఆడంబరము లేక ఆనంద లహరిని –జీవితమున శాంతి సిరుల నొంది

    పిల్ల  పాపల తోడ చల్లగ కాలము –గబ్బిట వారికి గడుచు చుండ

    బంధు మిత్రుల యెడ బాంధవ్య బంధమున్ –సహజ రీతి మెలగు సహ్రుదయులుగ

    పూర్వ పుణ్య ఫలము పొంది వీరు శతాబ్ది –కళ్యాణ వేడుకల్ ఘనత గాంచు

తే.గీ  పూవు తావి చంద్రుడు వెన్నెల వలెనుండి –భావి తరముల వారికి భాగ్య మనగ

        వీరు అన్యోన్య దాంపత్య విలువ తెలిపి –మంచి మార్గము సూచించు మాన్యు లగుచు

        ఆయురారోగ్య సంపద లలరు గాక .

           ‘’వివాహం –దామత్యం ‘’శీర్షిక లో కవితలు సంపూర్ణం .

 మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -3-4-14-ఉయ్యూరు

 

 

 

Posted in కవితలు | Tagged | Leave a comment

సరసభారతి శ్రీ జయ నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనం- వివాహం –దాంపత్యం

దాంపత్యం

సంసారం సైకిలుకు 
భర్త ముందుచక్రం,
భార్య వెనకచక్రం…
అనుబంధం చైను…

కాపురం రోడ్డు మీద 
భర్త ఆటో,
భార్య డ్రైవరు,
ప్రేమ పెట్రోలు…

కుటుంబం వేదిక మీద 
భర్త వక్త,
భార్య మైకు,
ఆత్మీయులే ప్రేక్షకులు…

వివాహం కంప్యూటరుకు
భర్త హార్డువేర్,
భార్య సాఫ్టువేర్,
నమ్మకం యాంటి-వైరస్.

దాంపత్యం మీద కవిత్వం అంటే 
శివపార్వతుల మీద రాసే పద్యం.

( వుయ్యూరు సరసభారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ దంపతుల వివాహ స్వర్ణోత్సవ సభలో చదవాలని రాసిన కవిత )

Posted in కవితలు | Tagged | Leave a comment

ఘనంగా సరసభారతి ఉయ్యూరు ఉగాది ఉత్సవాలు – వార్త పత్రికలలో

ugadi.. vuyyuru

మా 50 వ సంవత్సర వివాహ వేడుకలు

విజిల్ విజార్డ్” శ్రీ కొమరవోలు శివ ప్రసాద్… శ్రీ జయ నామ సంవత్సర ఉగాది వేడుకలు,-

సరస భారతి శ్రీ జయ నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనం -1 –‘’వివాహం –దాంపత్యం ‘’

Posted in వార్తా పత్రికలో, సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

రోజీ పాత్ర నాకే రాసిపెట్టినట్టుంది..

రోజీ పాత్ర నాకే రాసిపెట్టినట్టుంది..

వహీదా రెహమాన్ ఎంతటి అందగత్తో అంతటి ఆత్మాభిమాని. ఐదుపదుల నటనా జీవితంలో ఎక్కడా రాజీ పడకుండా బతికిన ధీర. ఆమె తొలి సినిమా తెలుగుది కావడం మనకు గర్వకారణం (రోజులు మారాయి). ఆమె జీవితాన్ని నస్రీన్ మున్నీ కబీర్ ‘కాన్వర్జేషన్స్ విత్ వహీదా రెహమాన్’ (వహీదా రెహమాన్‌తో సంభాషణలు) పేరుతో ఇటీవల పుస్తకంగా విడుదల చేశారు. అందులోని కొన్ని ఆసక్తికర భాగాలు మీ కోసం…

సత్యజిత్ రే గురించి…
నస్రీన్ మున్నీ కబీర్: సత్యజిత్ రేతో కలిసి పనిచేసే అవకాశం ఎలా వచ్చింది?
వహీదా రెహమాన్: ఫిల్మ్‌ఫేర్ ఎడిటర్ బి.కె. కరంజియా ద్వారా ఒక రోజు మా ఇంటికి ఒక ఉత్తరం వచ్చింది. అది సత్యజిత్ రే రాసిన ఉత్తరం. అందులో ‘నా తర్వాతి సినిమా (అభిజాన్)లో హీరోయిన్ గులాబీ పాత్రకు మీరైతేనే సరిగ్గా సరిపోతారని హీరో సౌమిత్ర ఛటర్జీ, మా యూనిట్ మొత్తం భావిస్తున్నారు. మీరు ఒప్పుకుంటే మేము చాలా సంతోషిస్తాం’ అని ఉంది. సత్యజిత్ రే లాంటి వ్యక్తికి నేను గుర్తొచ్చానని నాకు చాలా సంతోషమేసింది. కొన్నాళ్ల తర్వాత కలకత్తాలో ఉన్న రే తో మాట్లాడాను. ఆయన వెంటనే ‘వహీదా నీకు హిందీ సినిమాల్లో చాలా పెద్ద మొత్తం పారితోషికం ఇస్తారని తెలుసు నాకు. కాని నావి చిన్న బడ్జెట్ చిత్రాలు’ అని ఇంకా ఏదో చెపుతుంటే ‘సాబ్.. నన్ను సిగ్గుపడేలా చేయకండి. మీరు నన్ను అడగడమే నాకు పెద్ద గౌరవం. డబ్బు అసలు సమస్య కాదు. మీరు దాని గురించి మరిచిపొండి’ అని చెప్పాను. నాకు బెంగాలీ రాదని చెపితే ‘గులాబీ’ బీహార్ – బెంగాల్ సరిహద్దు ప్రాంతానికి చెందిన పాత్ర అని, భోజ్‌పురి – బెంగాలీ కలగలుపు భాష మాట్లాడుతుంది కాబట్టి సమస్య ఉండదని చెప్పారు.
నస్రీన్: ఆయన్ని చూడగానే మీకు కలిగిన తొలి అభిప్రాయమేమిటి?
వహీదా: రే చాలా పొడగరి. గంభీరమైన గొంతు. మాటతీరు కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ప్రతిదీ చాలా వివరంగా చెప్పేవారు. ప్రతి సీన్‌ను షాట్‌లవారీగా విభజించి పెట్టుకునేవారు. ఏ షాట్‌కు ఏ లెన్స్ వాడబోయేది కూడా రాసుకునేవారు. అప్పటికి అలా స్టోరీబోర్డులు తయారుచేసి పెట్టుకునేవారు ఎవరూ లేరు. అది మాకు బాగా ఉపయోగపడేది. నా చేతిలో బౌండ్ స్క్రిప్ట్ పెట్టిన అతికొద్ది మంది డైరెక్టర్లలో ఆయన ఒకరు.
‘అభిజాన్’లో ఒక సీన్‌లో నేను గుర్రబ్బండిలో కూర్చుని ఉండగా ఒక సేఠ్ వచ్చి నన్ను బలవంతంగా తీసికెళ్లే ప్రయత్నం చేస్తాడు. ఈ లోగా సౌమిత్ర కనబడటం, అతన్ని చూడగానే నేను కిందికి దూకి పారిపోవడం చేయాలి. అదంతా సత్యజిత్ రే చెప్పకముందే ఆయన అనుకున్నట్టుగానే నేను నటించేసరికి ఆయన చాలా ఆనందించారు. సినిమాల్ని ఎలా తీయాలో అలాగే మొదట్నించి చివరివరకు తీసేవారాయన. అందువల్ల సెట్‌లో ఉన్నా లేకపోయినా మన పాత్ర గురించి మనం లోతుగా ఆలోచించుకోగలుగుతాం. డైలాగ్ బట్టీ పెట్టి కెమెరా ముందు నిలబడి నటిస్తే చాలదు కదా, ఆ పాత్రలో ఒక మేరకయినా జీవించగలగాలి.
నస్రీన్: హిందీలో సినిమా తీయడం గురించి రేతో ఎప్పుడైనా మాట్లాడారా?
వహీదా: ఆయన చేత హిందీ సినిమా తీయించమని వాళ్లావిడ నాతో చెపుతుండేది. నేను ఒకసారి ఆ మాట అంటే ఆయనన్నారు కదా.. ‘నాకూ తీయాలనే ఉంది గాని వాటిలో బోలెడు పాటలు, డాన్సులు అవీ ఉంటాయి’ అన్నారు. హిందీ తనకు బాగా రాదు కాబట్టి ఆ భాషలో సినిమా తీయడం కష్టమని ఆనుకున్నట్టున్నారు. ‘నేను తీస్తే మాత్రం అందులో నువ్వు తప్పనిసరిగా ఉంటావు’ అన్నారు. చాలా ఏళ్ల తర్వాత ఆయన ‘షత్రంజ్ కె ఖిలాడి’ తీస్తున్నప్పుడు ఫోన్ చేసి ‘నా హామీ నిలబెట్టుకోలేకపోతున్నాను, ఎందుకంటే ఇందులో నీకు తగిన పాత్ర ఏదీ లేదు’ అని చెప్పారు.
‘గైడ్’ సినిమా గురించి…
నస్రీన్: సినిమాకు ముందే ఆర్. కె. నారాయణ్ ‘గైడ్’ నవల చదివారా మీరు?
వహీదా: రే నే ఇచ్చారు దాన్ని నాకు చదవమని. అప్పట్లో దాని ఆధారంగా ఆయనే ఒక సినిమా తీద్దామనుకున్నారు. ‘రోజీ’ పాత్ర నాకే ఇస్తానన్నారు కూడా. తర్వాత ఒకటి రెండేళ్ల తర్వాత దేవానంద్ తను ‘గైడ్’ తీస్తున్నట్టు చెప్పారు. రే తీసి ఉంటే పూర్తిగా వేరుగా ఉండేది. అయినా ‘రోజీ’ పాత్ర నాకే రాసి పెట్టినట్టుంది…
నస్రీన్: అదేమిటి? మీరు ఆ పాత్ర వేయకూడదని ఎప్పుడైనా అనుకున్నారా?
వహీదా: నేను వెయ్యకపోయేదాన్నే. ఎందుకంటే దేవానంద్ మొదట రాజ్‌ఖోస్లాను దర్శకుడిగా పెట్టుకుని ఆ సినిమా తీద్దామనుకున్నారు. దేవానంద్ ఆ ప్రతిపాదనతో నా దగ్గరకు వచ్చినపుడు ‘సోల్వా సాల్’ సినిమా షూటింగు సమయంలో ఆయనకు, నాకు జరిగిన గొడవ మర్చిపోయారా? అని అడిగాను. ‘అలాంటివన్నీ మామూలే. అప్పటికీ ఇప్పటికీ రాజ్‌లో మార్పు వచ్చింది. నువ్వూ పరిణతి చెందావు’ అన్నారు దేవానంద్. అయితే ఈ లోగా ఆయనే ఎందుకో రాజ్ ఖోస్లాను మార్చేశారు.
నస్రీన్: రాజ్ ఖోస్లాకు, మీకు గొడవ ఎందుకొచ్చింది అసలు?
వహీదా: ‘సోల్వా సాల్’ సినిమాలో నాది పదహారేళ్ల పడుచు పాత్ర. ఒకబ్బాయిని ప్రేమిస్తుంది. ఇద్దరూ పెళ్లిచేసుకుందామనుకుంటారు. ఇంట్లోంచి పారిపోతారు. ఆ అమ్మాయి తెలివితక్కువగా వాళ్లమ్మ నగలన్నీ తన వెంట తీసికెళుతుంది. ఇద్దరూ కలిసి రైలెక్కుతారు. సగం దారిలో ఆ అబ్బాయి ఆ నగల్ని దొంగిలించి పారిపోతాడు. నా పాత్ర కుంగిపోయి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది. రైలు దిగి సముద్రం వైపు నడుస్తుండగా సహప్రయాణీకుడిగా ఇదంతా గమనించిన దేవానంద్ నన్ను రక్షిస్తాడు. మా ఇద్దరి బట్టలు తడిసిపోతాయి. దగ్గర్లో ఉన్న దోబీఘాట్‌కి వెళ్లి మా బట్టలు ఆరేంతవరకు కొన్ని బట్టలు అడిగి తీసుకుని వేసుకుంటాం. ఆ సీన్‌లో ఏమైందంటే నా చేతికి ఒక షిఫాన్ చీర, స్ట్రాప్‌లెస్ జాకెట్టు ఇచ్చారు వేసుకోమని. ‘ఇవా నేను వేసుకోవాల్సినవి?’ అని రాజ్ ఖోస్లాను అడిగితే ‘వేసుకుని చూడు. ఇబ్బందిగా అనిపిస్తే వేరేదేదైనా వేసుకో’ అన్నాడు. వెంటనే స్ట్రాప్‌లెస్‌ది తీసేసి చేతులున్న వేరే బ్లౌజ్ వేసుకున్నాను. నేను సెట్ మీదికి వెళ్లగానే ఆయన గట్టిగా అరిచాడు. ‘నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? మధుబాలవా? మీనాకుమారివా? నర్గిస్‌వా? దర్శకుడు చెప్పే మాటలు వినవా? రెండు సినిమాలు రిలీజయ్యాయో లేదో అప్పుడే నీ మాటే నెగ్గాలనుకుంటున్నావు’ అన్నారు. గురుదత్ సినిమాలకు సంతకం చేసేటప్పుడే నేను ఎలా నా పేరును మార్చుకోనన్నానో, సి.ఐ.డి. సినిమాలో నా కాస్టూమ్స్ గురించి నేనెంత గొడవ చేశానో అవన్నీ చెప్పుకొచ్చాడు. ఇంతలో దేవానంద్ గొడవేమిటని అడిగారు. ఈ సీన్‌లో హీరో నా పేరు అడిగితే నేను లాజ్వంతి (సిగ్గరి) అని చెప్పాలి. అప్పుడు హీరో ‘అందుకేనా నీకింత సిగ్గు’ అంటాడు. మరి అటువంటి సీన్‌లో ఆ అమ్మాయి పూర్తిగా అపరిచితుడైన వ్యక్తి దగ్గరకు అటువంటి బట్టలు వేసుకుని రాగలదా? అన్నాను. రాజ్ ఖోస్లా జోక్యం చేసుకుని ‘ఇప్పుడు లాజిక్ గురించి మాట్లాడడం మొదలుపెట్టావా? నేనెలా డైరెక్ట్ చేయాలో నాకే చెపుతున్నావా?’ అన్నారు. ఆ రోజు షూటింగ్ అర్ధాంతరంగా ఆపేశారు. మర్నాటికి అందరి కోపాలూ తగ్గాయి. నేను వేరే బ్లౌజ్ వేసుకున్నాను. షూటింగ్ మామూలుగా సాగిపోయింది.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గుజరాత్ మహిళా సాంఘిక సంస్కర్త విద్యాగౌరీ నీలకంఠ-విహంగ మహిళా వెబ్ మేగజైన్ -ఏప్రిల్

             అసాధారణ మేధ ఉన్న విద్యా వేత్త ,సంఘ సేవకురాలు, సాంఘిక సంస్కర్త ,వ్యక్తిత్వం తో ,సాధారణ మహిళగా సమాజ సేవ చేసిన విద్యా గౌరీ నీల కంఠ గుజరాత్ రాష్ట్ర మహిళా మాణిక్యం .గుజరాతీ ఆంగ్ల భాషల్లో విద్వద్మణి. స్త్రీ అన్నిటా అగ్రగామిగా ఎదాలని స్త్రీ శక్తి ని సమాజం గుర్తించాలని వారికి అండగా నిలిచిన అలుపెరుగని పోరాట పటిమ ఉన్న నాయకురాలు .ఆ కాలం లో గుజరాతీ మహిలలో ఎక్కువ మంది ఇంటికే పరిమితమై ఉండేవారు బయటికి రావటం నామోషి గా భావించే వారు .స్త్రీలకు విద్య నేర్పిస్తే గృహిణులుగా కుటుంబ బాధ్యత నిర్వాహించరని తరతరాల కుటుంబ వ్యవస్థ కూలి పోతుందని  నమ్మకం తో ఉండేవారు .కాని గౌరి ఇది తప్పు అభిప్రాయం అని, విద్య నేర్పిస్తే ,స్త్రీ అంతకంటే ఎక్కువ బాధ్యత తో అక్క గా, చెల్లిగా, అమ్మగా , భార్య గా  రాణించ గలరని  నిరూపించాలని నిర్ణయించుకొంది.విద్యా గౌరీ .ఆమె పేరు లోనే విద్య వుంది, గౌరీ దేవికి ఉన్న సాహసం ఉంది .,పవిత్రత ఉంది .పేరుకు న్యాయం చేసింది .

    1876జూన్ ఒకటైన  గోపీలాల్ ధ్రువ ,బాలాబెన్ లకు విద్యా గౌరీ జన్మించింది .తండ్రి న్యాయ స్థానం లో ఉద్యోగం చేయటం వలన ట్రాన్స్ ఫర్ అవుతూ ప్రదేశాలు మారేవాడు .తల్లి మాత్రం కుటుంబాన్ని కని  పెట్టుకుంటూ ,కూతుళ్ళ విద్య కోసం అహమ్మదా బాద్ లోనే ఉండేది .విద్యాగౌరి ,చెల్లెలు శారదతో కలిసి స్కూల్ లో చేరి ఏడవ తరగతి చదివింది .ఆ కాలం లో బాలికల పాఠ శాల లేక పోవటం తో మహా లక్ష్మి టీచర్స్ ట్రెయినింగ్ కాలేజి లో గుజరాతీ, ఇంగ్లీష్ భాషలు చదివింది .స్కూల్ లో చదువుతుండగానే ఒక సంఘ సంస్కర్త,విద్యా వేత్త  కుమారుడు రమణ భాయ్ తో వివాహమయింది .అప్పటికి ఆమె వయసు పద మూడు .భర్త ఆమె కంటే తొమ్మిదేళ్ళు పెద్ద వాడు అవటం తో భర్తను గురువు గా, మార్గ దర్శి గా భావించింది .భార్యా భర్తలు’’జ్ఞాన సుధ ‘’అనే పత్రికకు కధలు రాసి సంపాదక బాధ్యతకూడా  చేబట్టి నడిపారు .

           భర్త ప్రోత్సాహం తో గౌరీ మెట్రిక్ పరీక్షకు కట్టింది . మూడేళ్ళ తరువాత ఉత్తీర్ణురాలై  సోదరి శారద తోకలిసి గుజరాత్ కాలేజి లో ఆర్ట్స్ సబ్జెక్ట్ లో బొంబాయి యూని వర్సిటీ పరీక్ష రాసింది .లాజిక్ లో ఆమె మొదటి స్థానం సాధించింది .బి;ఏ.; లో మోరల్ ఫిలాసఫీ, లాజిక్ సబ్జెక్టు లను ను ఎంచుకొని ఎనిమిదేళ్ళు చదివి   పూర్తి చేసింది .’’బి ఏ పాసై ఉద్యోగాలు చేస్తూ ఊళ్లు యేలాలా?’’ అని చాలా మంది ఆమె ను నిరుత్సాహ పరిఛి చదువు ఆపమనే వారు .వీటిని లెక్క చేయకుండా అకుంఠిత  దీక్ష తో చదివి  యూని వర్సిటి మొత్తం మీద  ప్రథమ శ్రేణి మార్కులతో ఉత్తీర్ణు రాలై గుజరాత్ కాలేజిలో ఫెలోషిప్ పొందింది .గుజరాత్ మొత్తం మీద గ్రాడ్యుయేట్లు అయిన తొలి హిందూ మహిళలుగా  విద్యా గౌరీ ,చెల్లెలు  శారదా మెహతా  రికార్డు సృష్టించారు .

   అహమ్మదా బాద్ లోని లేడీస్ క్లబ్ లో విద్యా గౌరీ చురుకైన పాత్ర నిర్వహించింది . క్లబ్ లో హిందూ పార్సీ క్రిస్టియన్ ముస్లిం మహిళలందరూ సభ్యులుగా ఉన్నారు ఈమె లో ని చొరవ ను గుర్తించి వారంతా గౌరీ ని ముందుంచి కార్యక్రమాలు నిర్వహించారు .అహమ్మదా బాద్ లో కాంగ్రెస్ సభ జరిగి నప్పుడు విద్యా గౌరీ సోదరి శారద తో కలిసి వందే మాతరం గీతం ఆలా పించింది . నేషనల్ ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యం లో విద్యా గౌరీ పేద ముస్లిం మహిళకు కుట్టుపని లో శిక్షణ నిచ్చింది .వయోజన విద్య ను ప్రోత్సహించింది .మొదటి ప్రపంచ యుద్ధం లో యుద్ధ నిధి సేకరించి తోడ్పడింది .ఈ సేవలకు గుర్తింపుగా బ్రిటిష్ ప్రభుత్వం గౌరికి ‘’మెంబర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ ‘’(M B .E.) ఇచ్చి గౌరవించింది .ఆమె ప్రజా సేవకు  గుర్తింపు గా  ‘’స్టార్ ఆఫ్ ఇండియా’’పురస్కారం అందుకొంది.కాని ఉప్పు సత్యాగ్రహం లో మహాత్మా గాంధీని అరెస్టు చేసి నందుకు నిరసన గా దాన్ని వాపసు ఇచ్చేసిన దేశ భక్తురాలు విద్యా గౌరీ .

   అహమ్మదా బాద్ ను కార్య క్షేత్రం గా చేసుకొని ‘’ఆల్ ఇండియా వుమెన్స్ కాన్ఫరెన్స్ ‘’నిర్వహించింది .చురుకైన పాత్ర పోషించి అధ్యక్షురాలై, చాలా సంవత్సరాలు మహిళా సేవ చేసింది .లక్నో లో జరిగిన  అఖిల భారతీయ  కాంగ్రెస్ కమిటీ సమావేశం లో పాల్గొని అందరి దృష్టినీ ఆకర్షించింది . అహమ్మదా బాద్ లో మగన్ భాయ్ కరం చంద్ బాలికల ఉన్నత పాఠ శాలను ,దివాలీ భాయ్  బాలికా పాఠశాలను , రణ చందా లాల్ చోటాలాల్ గర్ల్స్ హైస్కూల్ ను ,స్థాపించి బాలికలకు విద్యా సౌకర్యం కలిగించింది .వివాహం వల్ల  విద్య కోల్పోయిన వితంతువులకు ,పాఠశాలలకు వెళ్ళలేని (డ్రాపౌట్స్త్)స్త్రీలకూ సెకండరీ విద్య కోసం ‘’వనితా విశ్రాం ‘’లను నెల కోల్పింది .లాల్ శంకర్ ఉమియా శంకర్ మహిళా పాఠ శాల ను అహమ్మదాబాద్ లో ఏర్పాటు చేసింది .ఆ తర్వాత ఇది కార్వే యూని వర్సిటి కి అనుబంధ సంస్థ అయింది .ఈ విద్యాలయం లోనే విద్యా గౌరీ ఇంగ్లీష్, సైకాలజీ ,ఫిలాసఫీ లను బోధించింది .’’మహి పత్ రాం రూప్  రాం అనాధ శరణాలయానికి ‘’గౌరవ కార్య దర్శి గా ఆ తర్వాత, అధ్యక్షురాలిగా సేవలందించింది .విక్తోరియల్ జూబిలీ హాస్పిటల్ ,రణ్  చంద్ లాల్ చోటాలాల్ డిస్పెంసరీ లకు సభ్యురాలి గా పని చేసింది ఎన్నో సాంఘిక, ధార్మిక సేవా సంస్థలు ఆమెకు గౌరవ పదవు లిచ్చి ఆమె సేవ కు గుర్తింపు కలిగించి గౌరవించారు .గుజరాత్ రాష్ట్రం లో అనేక చోట్ల గ్రంధాలయాలు ఏర్పాటు చేసి గ్రంధాలయోద్యమం లో చురుకైన పాత్ర వహించింది  .పదిహేనవ గుజరాతీ సాహిత్య పరిషత్ కు అధ్యక్షురాలైనది .

   గుణ సుందరి, స్త్రీ బోధ ,శారద మొదలైన ఎన్నో పత్రికలకు వ్యాసాలు రాసి ఉత్తేజాన్నిచ్చింది .సోదరి శారద తోకలిసి ఆర్.సి దత్తు రాసిన ‘’ది లేక్ ఆఫ్ పామ్స్ ‘’పుస్తకాన్ని గుజరాతీ భాషలోకి అనువదించింది .ఆమె ప్రత్యేకం గా రాసిన వివిధ వ్యాసాలూ ‘’ఫోరం ‘’ ,నారీ కుమ్ఫ్ ,జ్ఞాన సుధ  మొదలైన పత్రికలలో ప్రచురిత మైనాయి . మహిళాభ్యుదయాని కి ,వారి విద్యా వ్యాప్తికి అంతు లేని సేవ లందించింది విద్యా గౌరీ .వితంతువులు మళ్ళీ వివాహం చేసుకొంటే తప్పేమీ లేదని,  ఒక సంఘ సంస్కర్త గా బోధించింది .కులాంతర వివాహాలను ప్రోత్సహించింది .వితంతువులు ,గృహ పీడనం లో బాధితులు ,పెళ్లి చేసుకోవాలను కొనే యువతులు విధి వంచితలు ఎందరో నిత్యం ఆమె దగ్గరకొచ్చి సలహాలు,సహయం పొంది ఊరట చెందే  వారు .శారదా చట్టాన్ని, హిందూ కోడ్ బిల్ ను అమలు పరచటానికి తీవ్ర కృషి చేసి మహిళాభ్యుదయానికి దారి చూపింది .ఏ రకమైన ప్రతిఫలాపేక్ష లేకుండా బాధితుల  ,పీడితుల  అణగ దొక్క బడిన  మహిళలను ఆదుకొని సహాయ సహకారాలందించి వెన్ను దన్ను గా నిలబడి వారి అభివృద్ధికి ఇతోధిక సహకారం అందించింది ,.

     విద్యా గౌరీ వజ్రోత్సవ సభలో  గాంధీ మహాత్ముడు పాల్గొని ‘’విద్యా గౌరీ భారతీయ  మహిళా  ఆభరణం . ఆమెకు ఎన్ని సత్కారాలు చేసి సన్మానిం చినా  చాలదు .  నిత్యం మరిన్ని సత్కారాలు చేసి గౌరవించాలి .ఆమె గొప్ప సంస్కర్త అయినా సంప్రదాయాన్ని గౌరవించి పాటించే మహిళా మాణిక్యం ‘’అని కీర్తించిన మాటలు అక్షర సత్యాలు . 1958లో 82ఏళ్ళ నిండు జీవితం గడిపి విద్యాగౌరీ నీల కంఠ మరణించింది .

విహంగ

  –   గబ్బిట దుర్గా ప్రసాద్ 

Posted in రచనలు | Tagged | Leave a comment

సరసభారతి శ్రీ జయ నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనం -4 వివాహం –దాంపత్యం

సరసభారతి శ్రీ జయ నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనం -4

ఉగాది కవి సమ్మేళనం వివాహం –దాంపత్యం ఫొటోస్

వివాహం –దాంపత్యం

17-వివాహం దాంపత్యం విడాకులు –శ్రీ పెదప్రోలు విజయ సారధి (ఉయ్యూరు )

మాంగల్య మంత్రం చదవకుండానే పూర్తయింది వివాహం –తెలివైన అబ్బాయికీ అమాయకుపు అమ్మాయికీ

పెద్ద మనుషుల ఆశీస్సులతో మూడడుగుల బంధం –పదుల ఏళ్ళు పరిమళించిన సహజీవన గంధం

రౌడీల గడీల పటేల్ల పట్వారీల అజమాయిషీ లో –వెట్టి చాకిరీ తో  వేదనకు గురౌతున్న అమ్మాయిని

ఆదరించి అలరించి ఆనంద పరిచాడు అబ్బాయి –అమ్మాయికి ఎన్నో ఆభరణాలు అలంకారాల సోయగాలు

హైటెక్కు నిక్కుల హారాలు స్వర్ణ చతుర్భుజాల సరాలు –ఇంద్ర భవనాలను మించిన సాధనాల సమాహారాలు

అనుకూల దాంపత్యం సోంపు –స్వార్ధ పరులకు కంట గింపు –

అమ్మాయికి ఘోర అన్యాయం అంటూ ఎంచిన లేని తప్పులు

విడదీసేందుకు కుట్రలు కుహకాలు కుతంత్రాలు –మధ్య వర్తుల ముసుగు లో పయోముఖ విష కుంభాలు

స్వప్రయోజనాల న నాశించిన గద్దలూ రా బండులూ –అరచేత ఆమలకం చూపుతూ

ముక్కలు చేశారు మూడడుగుల బంధాన్ని –ఇరు హృదయాలకు చేశారు మాయని గాయం

సమైక్య కిరణాలు రణాలు చేసినా ,సమన్యాయం అంటూ ఆక్రోశించినా దంపతుల మధ్య గీసేశారు విభజన రేఖ

విజయ చేసిన ఈ అన్యాయాన్ని జయా నువ్వైనా సరిదిద్ది ఐక్యత కూర్చి కాపురం నిల బెట్టు .

18-ఆదర్శ దాంపత్యం –డా.గుడిసేవ విష్ణు ప్రసాద్ –(అవని గడ్డ )

కం .అందరి ఎద లలరిం చుచు –చందన వ్రుక్షమ్ము పోల్కిచతురత తోడన్

సుందరమగు నడ వడికను –వందితమగునది వివాహ బంధంబనగన్ .

సీ. వినయ విదేయతల్ వెలుగొందు చుండెడి –జంట గా వర్ధిల్లి సాగునపుడు

ఆదర్శ వంతులై ఆత్మీయతను పంచి –సంసార సుఖమున సాగు నపుడు

మెచ్చగా నందరు మితమైన సంతాన –వంతులై శుభములు బడయు నపుడు

మంచి మాటలు నేర్పి మానవత్వము నింపి –బిడ్డలన్ మంచిగా పెంచు నపుడు

తే.గీ.ఇలయే స్వర్గంబు గా నిల్చి ఇంపు గొల్పు –శాంతి సౌఖ్యాలు నిండును జగతి యందు

ధర్మమిల నిల్చు నాల్గు పాదముల యందు –‘’జయ ‘’ఉగాది య చే కూర్చు జయము నెపుడు .

సీ.వాగర్ధముల వోలె వర్ధిల్ల వలయు -కలసి మెలసి యుండి కాంక్ష లూర

అర్ధ నారీశ్వర అన్యోన్య రూపమై –ఒకటిగా జీవించు డోర్పు మీర

జానకీ శ్రీరామ చంద్రులై సతతమ్ము –నీతిగా జీవించి నిలువ వలయు

తోడూ నీడగా నీడుజోడుగ నింపార –ఆదర్శ మార్గంబు నరుగ వలయు

పెండ్లి యన్నను నిండు నూరేండ్ల పంట –ఒక్క మాటగా బాటయు నొకటి కాగ

పుత్ర పౌత్రాది సంపత్ప్ర పూర్ణు లగుచు –బాధ్యతల తడ శుభములు బడయ వలయు .

సీ .సంసారమునకు నై సంస్కరించి నయట్టి –వైదిక సంస్కార విధము గనిన

స్త్రీ పురుషులకును స్థిరమైన దాంపత్య –కర్తవ్య నిష్టల కర్మ గనిన

విహరించగా విలాస విధము కాదని యేడి –విధి విధానము తెల్పు విధము గనిన

మనదైన సంస్క్రుతిన్ మకుటాయమానమౌ –మన వివాహ విదిని మైమ గనిన

సకల సౌఖ్యంబు సద్గుణ సంహితంబు –ధర్మ మార్గంబు చూపెడి దర్శనంబు

శక్తి యుక్తులు గల గృహస్తాశ్రమంబు –శుభము కూర్చును జనులకు శుభము శుభము ..

19—తిలా పాపం –శ్రీమతి కోనేరు కల్పన (విజయ వాడ )

సంసారం బండికి దంపతులే చక్రాలు –పాత చింతకాయ పద్యానికి మంచిది రోగం ఎవరికంటారా అందరికీ

అమ్మ తనం వాడి కాలి చెప్పు అయింది –అహంకారం ఉక్రోషం ,సమాన హక్కుల పోరాటం లో అమ్మతనం మరిచింది

నేటి తరాన్ని శాసిస్తోంది అవసరం అవకాశం మాత్రమె –బంధాలు కావు

డేటింగ్ వెర్రి పెరిగింది భ్రూణ హత్యలతో లోకం చెలరేగుతోంది

అమ్మతనం పోయి ఆడతనమే మిగిలింది –ఈ పాపానికి పరిష్కార మందు వేయాల్సిందే

తరువాతే పద్యం ముద్ద నోటికోచ్చేది .

20-శ్రీమతి ముది గొండ సీతారావమ్మ (మచిలీ పట్నం )

జీవాత్మల పరమాత్మల అనుబంధమే వైవాహిక  బంధం –అదేవివాహం

జన్మ జన్మ ల అందం గ మార్చుకోవాలి దంపతులు

ధర్మార్ధ కామ మొక్షాలకు తోలి మెట్టు వివాహం –అదే గృహస్తాశ్రమం

అప్పుడే మోక్షం కరతలామలకమే –అన్నిటిని సమానం గా ప్రేమించాలి

వంశాభి వృద్ధి కోసం కామం మంచిదే –అర్ధ కామాలు మంచి వైతే ధర్మ మోక్షాలు దాపునే ఉంటాయి

ఇదే సనాతన ధర్మం –అదే దాంపత్య జీవన విధానం .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-4-14-ఉయ్యూరు

 

 

 

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరసభారతి శ్రీ జయ నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనం-3 వివాహం –దాంపత్యం

సరసభారతి శ్రీ జయ నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనం-3

ఉగాది కవి సమ్మేళనం వివాహం –దాంపత్యం ఫొటోస్

వివాహం –దాంపత్యం

12-దాంపత్యమా  జయీ భవ –శ్రీమతి ఎస్.ఉషా రాణి (పెద ఓగిరాల )

అవును వాళ్ళిద్దరూ ఒక్కటయ్యారు –ఇప్పుడు కాదు ఎప్పుడో చారిత్రిక విభావ సంధ్యలోనే

సృష్టి స్తితి ప్రళయ కేళి మొదలైనప్పుడే –కావ్యేతి హాసాల ఆరంభ సంరంభం లోనే –వాళ్ళిద్దరూ ఒకటైనారు

ఆర్ష మో ప్రాజాపత్యమో ,గాన్ధ్వర్వమో స్వయం వరమో –ఏదైతేనేం అరుంధతి సాక్షిగా ఒకటయ్యారు

సునామీలు సైమానులు బాధించినా ప్రయాణం ఆగలేదు –ఉగాదులు ఉషస్సులు ఊసర క్షేత్రాలూ

నిర్జల తీరాలు నిబిడాం ధకారాలు వాళ్ళ గమనాన్ని ఆపలేక పోయాయి –

స్వప్నించిన కలల రత్న మంజూషను బుజాల కెత్తుకొని నడుస్తూనే ఉన్నారు

యుగాలు గడిచి తప్పిదాలు జరిగి దాంపత్యం నడి వీధి  పరిహాసమైనా

పరాభవానల జ్వలిత త్రేతాగ్నులనీ –కాల నాలిక పై గ్రంధస్తం కాని కధలనీ కన్నీళ్ళనీ

కల్లోలాలు ప్రణయ కలహాలూ కబళించినా –ఒకరికొకరు తోడూ నీడై శోభిస్తూనే ఉన్నారు

దాంపత్య రహస్యోపనిషత్తు లోని బీజక్షరాలై నడుస్తూనే ఉన్నారు

ఒకటి మాత్రం నిజం –ఏ నాగరకతా మహీ రుహమైనా

దాంపత్య క్షేత్రం లో కుటుంబ కదళీ వనాలలో పరిఢవిల్లి నప్పుడే

పది కాలాల పాటు నిలుస్తుంది –దాంప త్యమా జయీ భవ విజయీ భవ .

                      13-శ్రీమతి లక్కరాజు వాణీ సరోజినీ (విజయ వాడ )

 వివాహం విడదీయరాని బంధం –దైవ నిర్ణయం తో ముడి పడిన అద్వితీయఅనురాగ  బంధం

వ్యక్తీ గత రక్షణకు చట్ట బద్ధ బంధం –జీలకర్రా బెల్లం తో అయస్కాంత శక్తిలా అంటి పెట్టుకొని ఉంటుంది

అద్వైత భావానికి అంకురమవుతుంది –ప్రేమ నమ్మకం అనే నీరు పోసిపెంచి పోషించాలి

నవ నాగరకతా వ్యామోహం లో విడాకులు తమల పాకుల్లా చేతులు మారిపోతున్నాయ్

వివాహం కంటే సహజీవనమే ముద్దు అను కొనే యువత వ్యామోహం లో పడి వ్రేళ్ళనే కూల్చుకొంటున్నారు

వ్యక్తికీ సమాజానికీ హితం కోరే వైవాహిక వ్యవస్థకు నియమాలోచ్చాయి

దాంపత్య జీవితం సుఖ శాంతులతో కూడి దండిగా పండి దశ దిశలా వర్ధిల్లాలి .

                 14-శ్రీమతి సింహాద్రి వాణి(విజయవాడ )

పదవులెన్ని యున్న ,పరివారమున్నను –చదువు లెన్ని యున్న సంపదున్న

పరిణ యంబు  లేక పరి పూర్నతయే రాదు మానవాళి  కెపుడు మహిని చూడ .

వేదమంత్రములు వేల దీవెనలతో –అగ్ని సాక్షితోడు అక్షతలును

ముడులు మూడు చేరి అడుగులేడు నడిచి-ఇంటి వారలగుదు రొంటి వారు.

కష్ట సుఖము లందు కలిమి లేముల యందు –ఒకరికొకరు చాల ఓర్పు తోడ

కలిసి మెలిసి బ్రతుక కడ దాక తోడుగా –పరిణయంము వేయు బంధనమ్ము .

ధర్మ మార్గ మందు దాంపత్య పయనమ్ము –సాగ వలయు నిలను చక్క గాను

మాట కలుపు కున్న మమతాను రాగాలు –పొంగి పొరలు నెపుడు నింగి కెగయ .

జనుల కెల్ల నిల్లు జగతి లో తొలి బడి –ఆదిగురువులచట అమ్మ నాన్న

చిన్న తనము నుండే మిన్నగా సుగుణాలు –నేర్ప వలయు వారు నేర్పు తొడ .

సద్గుణాల బాట సంతానమును పెంచ –మానవతతో వారి మనసు నిండి

శాంతి కరుణ ప్రేమ  సాగరమ్మైసాగు –తల్లి దండ్రి జన్మ ధన్య మవగ.

               15-శ్రీమతి పెళ్ళూరి శేషుకుమారి (నేప్పల్లె )

వివాహం కుటుంబ వ్యవస్థకు పునాది –ఆలు మగల అనురాగానికి ఆలంబన దాంపత్యం

ఒకరికొకరు పాలు నీరు లా-ముందు తరాలకు బాసట గా

ముద్దు మురిపాల కలబోత కాపురం లో ఆసరా బలహీన క్షణాలలో ఏంతో అవసరం

కుటుంబ వ్యవస్థ చిన్నా భిన్నమైతే –నైతిక విలువలు దిగజారి

పరిమితి తనం తెలీని సంపాదనల సమకాలీనం లో

సదవ గాహన లోపించి –ఆవేశ కావేషాలతో

ఆత్మీయతాను బంధాలను కాల రాచుకొంటూ –కులాసాల పలకరింపులు లేని నైజాలు

వివాహం పవిత్రం –దాంపత్యం అను బంధ సుమ హారం అని గ్రహిస్తే జీవితం ప్రగతి పధం లో నడుస్తుంది .

            16- శ్రీ తుమ్మోజు రామ లక్ష్మణా చార్యులు (విజయ వాడ)

                        గృహస్థాశ్రమమ

ఆశ్రమంబుల కెల్లా నత్యుత్తమంబైన –ఆశ్రమంబది గృహస్తాశ్రమంబు

ఇహలోక పరలోక ఈయ లీడేరంగ-ననువైన ధర్మాల కాశ్రయంబు

ధర్మార్ధ కామాల కర్మ సూక్ష్మము నెంచు –సన్మార్గ గాముల స్వర్గ సీమ

రాజ యోగము కన్న రమ్య యోగము లేదు –సర్వార్ధ సాధక సత్య పధము

విమల గార్హస్త్య జీవన వైభవంబు –తలప నత్యంత సమ్మోద ధర్మ పదము

వినుతవైదిక యుద్వాహ విమల క్రతువు –సౌఖ్య శిఖరాదిరోహణ యోగ్య దాయి .

              

                           వివాహం

సాప్త పదీనమౌ  సఖ్యంబే సత్యమ్ము –చట్ట పట్టలు వట్టి నట్టే నడువ

కొంగు ముడి రాగంపు క్రొమ్ముడి –కేలు కేలును పట్టు టేలు కొరకే

ముత్యాల తలబ్రాలు మురిపాల సాబాలు –వేడ్క పంచు కొనంగ విన్నపాలు

తలుపు దగ్గర పేరు పలుమారు పలికించు –తల పోత తను వంత పులకరింత

బొమ్మ లాటల పేర కొమ్మ లాటలు చూడ బిడియాల బిగువులు సడలు కొరకే

ముంజేత రవళించు మురిపెంపు గాజుల-గల గలల తో మహాలక్ష్మి కనికరాలు .

అంగు ళీయకము వెదకేడి హస్త –చాలనములు భావింప నన్యోన్య కాము దీప

నములు శత శరత్తు లిలను పరము సరణి –ననఘమై సాగ వలెనని ఆర్ష కాంక్ష .

                దాంపత్యం

ఆమె మనసున యూహ లతని తలపుల రేగ –ననురూప భావాలు హాయి గొల్పు

ఆమె యూపిరులూద నతని హృదయమ్మూగ-కస్టాల సౌఖ్యాల కలసి మునుగ

పలుక చిలకల కల్కకులుకు నంచల కుల్క –పతి దేవు ననురాగ మతివ గెల్వ

అర్ధాంగి ముచ్చట లనురామున తీర్చి –కను రెప్ప తీరుగా కాచు నతడు

పాణి పట్టిన నాటి పెంపైన యానంద –యేళ్ళు గడచిన గాని యిగుర రాదు

అర లేని దాంపత్య  నానందముల కొల్వు  -కొరలేని సంపదల కూర్చి పెట్టి

పండిన దాంపత్య ఫలములౌ తనయులు –వంశోన్నతిని పెంచ నుత్సవంబే

ప్రణయ సీమల రాహస్యపార మెరిగి –ఆత్మ బంధంపు పరమార్ధ తత్వ మరసి

కలత లెరుగని సంసార కడలి దాటి –ధన్యు లగుదురు సద్ధర్మ దంపతులును .

    సశేషం

 మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ – 2-4-14-ఉయ్యూరు

 

 

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

భారతీయ ధార్మిక వ్యవస్తలొ, వివాహం అత్యంత విశిష్టమైనది

భారతీయ ధార్మిక వ్యవస్తలొ, వివాహం అత్యంత విశిష్టమైనది 

                                          కౌటుంబిక జీవన విధానానికి,సత్స మాజ  నిర్మాణానికి మూలం 

                                          సమస్త వర్ణాశ్రమాలు నిరాటంకంగా 

                                          ఆచరించటానికి ఆధారం 

                                          వేదవేద్యులు, సంప్రదాయకమైన పెద్దలు 

                                          విశేష ఉత్తమ ఫలకందాయకంగా 

                                          రూపొందించిన ఒక ధార్మిక క్రతువు 

                                          భారతీయ వివాహం ధర్మబద్ధమైనది 

                                         ధర్మార్ధ సిద్ధికి ధర్మపత్ని శ్రేష్టమైన సాధనం 

                                         మ్యారెజెస్ ఆర్ నాట్ ఫర్ రిక్రియేషన్ బట్ ఫర్ క్రియేషన్ 

                                         వివాహం కేవలం విలాసానికి కాదు 

                                         సృష్టి ధర్మం సజావుగా,సక్రమంగా సాగటానికి హేతువు 

                                         వివాహం కేవలం స్త్రీ,పురుషుల మధ్య 

                                         భౌతిక సంబంధం  మాత్రమే కాదు 

                                         భూమ్యాకాశాల మధ్య,భువిని, దివిని కలిపి ముడివేసే 

                                         మహత్తరమైన పవిత్ర బంధం 

                                         వివాహం, పరిపూర్ణులైన ఇద్దరు వ్యక్తుల కలయిక కాదు 

                                         క్షమాగుణం, దయ అనే విలువలు నేర్చుకునే 

                                         అసంపూర్ణ ఇద్దరు వ్యక్తుల కలయిక 

                                         సహధర్మచారిణి అనేపదం చాలా విశిష్టమైనది 

                                         అన్నిరంగాలలో పాశ్చాత్య ధోరణులు ప్రబలుతున్న ఈ కాలంలో 

                                         భారతీయ వివాహ వ్యవస్తలోని అంతర్యాన్ని,ఔన్నత్యాన్ని 

                                         ఈ కాలపు యువతీ యువకులు అర్ధం చేసుకోవాలి 

                                         విభిన్న వర్ణాలు ఏకమైన ఇంద్రధనుస్సు ఎలా మనోరంజకమో 

                                         దాంపత్యం కూడా అలా రాగరంజితం కావాలి 

                                         అన్యోన్య దాంపత్యమంటే అణగి మణగి వుండటం కాదు 

                                         భర్త సంతోషమే భార్యది, భార్య సంతోషమే భర్తదని గుర్తెరగాలి 

                                         జీవిత భాగస్వామికి ఎలా వుంటే నచ్చుతుందో 

                                         ఎలా వుంటే నచ్చదో కూడా ఇరువురూ ఆలోచించాలి 

                                         లేకపోతె స్వీట్ హోం కాస్తా హాట్ హోంగా మారుతుంది 

                                         పూవులా వికసిస్తేనే అందం 

                                         పరిమళ వాతావరణంలో తనువు మనసు 

                                         హాయిననుభవిస్తాయి,సేదతీరుతాయి 

                                         పంతాలు,పట్టుదలలు,ఘర్షణలు తెగేదాక లాగొద్దు 

                                         విసుక్కోవడాలు,కసురుకోవడాలతో సమస్యలు కొలిక్కి రావు 
                                         వివేకంతో ఒకరి అలవాట్లు మరొకరు అర్ధం చేసుకోవాలి 

                                        గొప్పదైన వివాహబంధం,భార్యాభర్తల సమిష్టి కృషితోనే సాధ్యం 

                                        పరస్పర గౌరవం,శృతిమించని ప్రశంసలు, దయ, ప్రేమలు 

                                        వివాహం విజయవంతమవటానికి ముఖ్య కారణాలు 

                                        సరైన భాగస్వామిని ఎంచుకోవటమే కాదు 

                                        సరైన భాగస్వామిగా కూడా ఉండాలి 

                                        భార్యాభర్తలిద్దరూ ఇంటికి సేవకులే , ఇద్దరూ యజమానులే 

                                         ప్రేమతో,ఓర్పుతో ఏమైనా సాధించవచ్చు 

                                         ఆగృహమే స్వర్గసీమ 

                                         ఈభూమిపై, అతున్నత సంతోషమేదైనా వుంటే 

                                        అది వివాహబంధం వలన వచ్చిన సంతోషమే
                                                                

                                                         జైహింద్                                                      

                                                                ఏ.మోహన్ మురళి కుమార్ (తేజస్విని)

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

మా 50 వ సంవత్సర వివాహ వేడుకలు






100_1739
100_1738 100_1732 100_1729 100_1728 100_1727 100_1726 100_1725 100_1724 100_1723 100_1722 100_1721 100_1720 100_1719 100_1718 100_1717 100_1716 100_1715 100_1714 100_1687 100_1670 100_1669 100_1668 100_1667 100_1666 100_1665 100_1664 100_1663 100_1662 100_1661 100_1660 100_1659 100_1569 100_1568 100_1567 100_1566 100_1565 100_1564 100_1563 100_1562 100_1561 100_1559 100_1558 100_1557 100_1556 100_1555 100_1554 100_1553 100_1552 100_1551 100_1550 100_1549 100_1548


DSCN8532100_1691100_1692100_1698100_1740100_1741100_1742
100_1419
100_1418 ugadi image DSC_8049-SMILE DSC_8051 DSC_8050 DSC_8055 DSC_8048-MOTION

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | 2 Comments

సరసభారతి శ్రీ జయ నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనం వివాహం –దాంపత్యం

100_1638 100_1637 100_1636 100_1635 100_1634 100_1633 100_1632 100_1631 100_1630 100_1629 100_1628 100_1627 100_1626 100_1625 100_1624 100_1623 100_1622 100_1621 100_1620 100_1619 100_1618 100_1617 100_1616 100_1615 100_1614 100_1613 100_1612 100_1611 100_1610 100_1609 100_1608 100_1607 100_1606 100_1605 100_1604 100_1603 100_1602 100_1601 100_1600 100_1599 100_1598 100_1597 100_1596 100_1595 100_1594 100_1593 100_1592 100_1591 100_1590 100_1589 100_1588 100_1587 100_1586 100_1585 100_1584 100_1583

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరసభారతి శ్రీ జయ నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనం -2 వివాహం –దాంపత్యం

సరసభారతి శ్రీ జయ నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనం -2

      ఉగాది కవి సమ్మేళనం వివాహం –దాంపత్యం ఫొటోస్

        వివాహం –దాంపత్యం

           5-శ్రీమతి వారణాసి సూర్య కుమారి (మచిలీ పట్నం )

సీ.చూడ చక్కని పెళ్లి చూచివద్దము రండి – ముడులు వేయ ముచ్చటండి

 వేల్పులు సహితము వేడుక చూడగా -వేంచేయును సుమండీ వేగ రండి

  వరుని కాశీ యాత్ర వరమౌను కనగనూ –కన్య దానము కడు రమ్య మండి

  సుముహూర్త సమయాన శోభిల్లు తెర సెల్ల –జీలకర్రయు బెల్ల మలదు రండి

  ముసి ముసి నగవుల మరియు నా  ఇరువురూ –కన్నుల పంటయే కాదు టండి

  ఆ వదూవరులపై అక్షతలను జల్లి –ఆ తలంబ్రాలను చూతమండి

  మంగళ కరమగు మంగళ సూత్రముల్ –కట్టు సంబరం కనగ రండి

  సప్త పదియును సత్సంప్రదాయము మెచ్చి –దీవించ వచ్చు నా దివ్యు లండి

  కొంగులు ముడి వేసి కొత్త దంపతులకు –కళ దెచ్చు నీ పాణి గ్రహణ మండి

   పరి పూర్ణత లభించు పరిణయమ్మటంచు –విజ్ఞులు నుడువగా విందు మండి  

 తే.గీ.కులము గోత్రములు వరని గుణము చూచి –కొమరిత కుశల మాశించి ,కోరి తెచ్చి

       పెండ్లి చేసిన యా తల్లి దండ్రి మనసు –తీర దీవించ వర్ధిల్లి తీరు నండి.

సీ.అంబుదంబు జలము ,అనిలమ్ము తావియై –శశియు రోహిణీ చందమలరి

   సూర్యుండురశ్మిగ శోభస్కరం బైన –సంద్రమ్ము నలలు  సతియు పతియు

  అన్యోన్య దాంపత్య మాదర్శ ప్రాయమై –మాట బాట లొకటై మనుటే ఘనము

 సద్భావ సాంప్రదాయ భరిత గృహమును –స్వర్గ సీమ యనుట సహజ మగును

తే.గీ.మనసులు కలిసి ప్రేమగా మసలు చుండ –అదియే ఆదర్శ దాంపత్య మనగ తగును

    సంతు గూడియును నెంతయు సంతసముగ-ఆయురారోగ్య సంపద నాలు మగలు

    ధరణి సుఖ జీవనము నొంది ధన్యులగును .

                   6- శ్రీమతి కందాళ జానకి (మచిలీ పట్నం )

పంచ భూతముల సాక్షి వివాహము –అతి పవిత్రము వివాహ సంప్రదాయము

ఏడు తరాల విజ్ఞత చూపు వివాహము –మూడు ముళ్ళ బంధము కలిగించే అనురాగం

నిలిచేను నిండు నూరేళ్ళ బంధముగా –భాగస్వామి తో బాంధవ్యం వెలుగొందును

తోడూ నీడయై జీవితం సాగును

జన్మ జన్మ ల బంధం దాంపత్యం –సుస్తిరమై వెలుగు దాంపత్యం

వంశ వృక్షం శాఖోప శాఖలుగా చేయు దాంపత్యం –దాంపత్యానికి లేదు వృద్ధాప్యం

ఆనంద మయమై నిత్య నూతనముగను-విలసిల్ల వలెను అనురాగ శోభ తో దాంపత్యం

జయ జయ నినాదాలతో సాగాలి జగమంతా .

         7-శ్రీమతి కొమర్రాజు కనక దుర్గా మహాలక్ష్మి (మచిలీ పట్నం )

వేద మంత్రాల నడుమను విధియే కూర్చె –నవని కళ్యాణ మనుచు

నిదియే పవిత్రమై యుగముల నిల్చి సాగే –భారత జాతికి దొరికిన భాగ్యమనగ.

   శుభ ముహూర్తము నిరువురు చూచు కొనగ –తాళి బంధాన సతిగాను తాను మారే

   సప్త పది సాక్షి పాటి తొడ సాగు గాదె –పుడమి జన్మ ల బంధమీ పురుషుడనుచు  .

అయిదు రోజుల పెళ్ళియె ఆగిపోయే –అయిదు గంటల పెండ్లిగా అలర సాగే

ధర్మ నిరతియే తొలగేనే ధనమదమున –విలువ తరగి పోయే వివాహ వేడ్క కిపుడు .

ధరణి దంపతులగుట ఏ ధార్మికతను –నిండు నూరేళ్ళ నవ్యత నిండ వలయు

ఆది దంపతులను రీతి అవని నిలువ –ధర్మ మోక్షాల కిది యేను తావు గాగ .

కష్ట సుఖముల కడలి లో కరగి పోవ –వంశ వ్రుద్దియే దాంపత్య భావ మనుచు

ఏబది వసంతములు నిల్చి ఈదినారు –పుత్ర పౌత్రాదుల సుఖము పొందినారు .

ఏడడుగుల నేవ్వరికిపుడేరుక లేదు –పాలు నీరుగా పతి సతులుండ వలయు

ఉప్పు నిప్పైన సంసార ఓడ మునుగు –నేటి యువత దీని నెరిగి మెలుగ వలయు .

            8-ఆతను ప్లస్ ఆమె –శ్రీమతి గుంటూరు మేరీ కృపా బాయి (మచిలీ పట్నం )

అతని చిరునవ్వే సెల ఏటి గలగలలా –ఆమె చిరు దరహాసం పున్నమి వెన్నెలలా

వెలుగొందే వేళ ఆ అనురాగ బంధం మాంగల్య బంధం –అదే పెళ్లి నాటి మూడు ముళ్ళ బంధనానికి దర్పణం

అతని మాటల సవ్వడిలో పరవశిస్తూ ఆమె –ఆమె పలుకుల మధురిమలు ఆతను

ఆస్వాదించే వేళఅవి మాటల మంత్రాలు –పెళ్లి మంత్రాలకు ప్రతి బింబాలు

అవగాహన ఆరాధన అనుబంధం మూడు సూత్రాలు –ఆమె మనసుకు నచ్చిన తత్వాలు

మంగళ సూత్రాలను తలపించే నేస్తాలు –

సంసారమందే సరిగమలు అంటూ అతను –బాంధవ్య మందే పదనిసలు అంటూ ఆమె

మురిసి పోయే వేళ అదే వివాహ బంధం –వివాహ బంధాన్ని రంగ రిస్తే జనించేను దాంపత్యం

ఉగాదికీ  దాంపత్యానికీ  ఉంది సంబంధం –తీపి చెడుల కలయికే ఉగాది

తీపి చెడుల సంగమమే దాంపత్యం –అతను ప్లస్ ఆమె ప్లస్ అనురాగం దాంపత్యం .

                  9-శ్రీమతి పద్మావతి శర్మ –(విజయ వాడ )

పెళ్లి చూపులు కట్న కానుకలు –శుభ లేఖల అందాలు పట్టు చీరెల రెప రెపలు కావు వివాహం అంటే

మంగళ  వాయిద్యాలు ,ఏడడుగులు ,సూత్ర ధారణా ,తలంబ్రాలు కావు వివాహమంటే

అల్లుడి గారి అలకలు ,మామ గారి బుజ్జగింపులు –మరదళ్ల సరసాలు ఘుమ ఘుమ వంటకాలు కావు వివాహమంటే

అగ్ని ప్రదక్షిణాలు ,అరుంధతి వీక్షణాలు ,అప్పగింతలు ఊరేగింపులు కావు వివాహమంటే

రెండు జీవితాలు రెండు కుటుంబాలు –కలసి నేసె వస్త్రమే వివాహం

అటు యిటూ ఏడు తరాలు తరింప జేసేదే వివాహం

ఆర్దికావసరాలు  భౌతిక సుఖం తీర్చటం కాదు దాంపత్యం

సమాజం ,పిల్లల కోసం అయిన వారికీ కాని వారికీ కాదు దాంపత్యం

వారి కోసం వారిద్దరికోసం మాత్రమె –అతడి కోసం ఆమె ఆమె కోసం అతను

బ్రతికేదే దాంపత్యం ఆమె పెదవి సైగాకే ఆటను స్పందిస్తే

అతని గుండె చప్పుడే ఆమె నవ్వుల జలపాతమైతే –అదే దాంపత్యం

ఆమెకూ అతనికి’’ కాళ్లు’’ పెరిగినపుడు –వారు ఇంకా వారి కోసమే బతికి

ఒక్కసారే నవ్వుతూ రాలి పోతే –అదే దంపతుల జీవితానికి ముక్తి మోక్షం .

               10-శ్రీ మైనే పల్లి సుబ్రహ్మణ్యం (ఆకునూరు )

 ఏ యుగానికైనా మనిషి ధర్మ మోకటేరా –బాల్య మందు భవిత బల ముండునురా

చదువు నేర్పిన విద్య చల్ల కుండరా –తెలుగుతల్లి చేతిలోని కలశ భాగ్యమదేరా

యవ్వనానికి ఎల్లలు లేవురా జీవితానికి జడ ఉందిరా

జడ లోని ఆంతర్యం అల్లి బిల్లిల ఆనంద మేరా

ప్రక్రుతి రహస్యం చెట్టు నుండి తెలుసుకో –ఆవును చూసి ఆహార్యం తెలుసుకో

గిట్టను చూసి బలమెంతో తెలుసుకో  -వెన్ను మణి పూస లన్నీ వరుస తప్ప రాదురా

ముద్దుగా మూడు మణుల వద్ద మూడు ముళ్ళు వేయగా

దశమి నాటి జాబిలీ నుండి పంచమి వరకు ప్రళయమేనురా

కరడు కట్టిన కామ కేళి కళా పోషణ కాదురా

యవ్వనమే యువతికి ఆభరణం –పదిల పరచుట ఆమె వంతు

దొంగిలించే దరహాసం మానరా

కూరిమి తోనే కుడి ఎడమలు కొలువు తీరు

మనుధర్మం ,ముని ధర్మం నీలోనే ఉందిరా

యుగానికో ధర్మం పరమ రహస్యం గా ఉండును రా

ఆది దంపతులకు ఆకాశమే ఇల్లూ లోకమే వాకిలి

కళా ఖండాల సృష్టి కర్తవు నీవే కదరా

నిన్ను సృష్టించింది అబలే కదరా –ఆమె కుటుం బయ్య   ధర్మ పత్ని అని మరవకు రా .

            11-శ్రీ చిత్తజల్లు భవానీ శంకర రావు (ఉయ్యూరు )

విజయుడు జయుడై రావటానికి ఒక రోజు ముందే –అర్ధ శతాబ్ది వివాహ మహోత్సవానికి

కవి మిత్రులు సాహితీ వేత్తలు విజ్ఞులు యేతెంచి ఉయ్యూరులో సందడి చేస్తున్నారు

కన్యాశుల్కం పోయి కట్న కానుకలోచ్చి జరుగుతున్నాయి నేడువివాహాలు

భార్యా భర్తల మధ్య సయోధ్య లేదు ఉన్నదంతా అయోధ్య మాత్రమె

ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి అప్పుడే వికశిస్తుంది దాంపత్య పుష్పం

మనసులెరిగి పెద్దలు చేయిస్తే వివాహం –అవుతుంది ముదావహం .

యువత నేర్వాలి ఎన్నో సుద్దులు లేకుంటే జీవితం అవుతుంది పిడిగుద్దులు.

   సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-4-14-ఉయ్యూరు

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరస భారతి శ్రీ జయ నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనం -1 –‘’వివాహం –దాంపత్యం ‘’

సరస భారతి శ్రీ జయ నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనం -1

   ఉగాది కవి సమ్మేళనం వివాహం –దాంపత్యం ఫొటోస్

     అంశం –‘’వివాహం –దాంపత్యం ‘’

1-               ముక్త పద గ్రస్తం -శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ –

రెండు మనసుల కలయికే వివాహం

వివాహం జీవితం లో ముఖ్య భాగం

భాగ స్వామి తో కలిసి నడిస్తేనే స్వర్గం

స్వర్గం అనుభవించి మళ్ళీ జారి పోరాదు

జారి పోయి నిరాశ తో భగ్నం చేసుకో రాదు

చేసుకొంటే నరకమే జీవితాంతం .

     దాంపత్యం ఒక అనిర్వచనీయ నిర్వచనం

      నిర్వచనాలతో నిలువదు నిండు సంసారం

      సంసారం లో సరిగమల స్థానం పవిత్రం

      పవిత్ర దాంపత్యమే అందరికి మార్గ దర్శనం

     మార్గ దర్శమైన దాంపత్యం ఏ దేశం లో నైనా స్వాగతం

    స్వాగత సత్కారాలు కోరనిదే ఆ అనుబంధం

    ఆ అనుబంధం శాశ్వతమై కుటుంబానికి కావాలి ఆలంబనం

    ఆలంబనం ఉన్న కుటుంబం పురోగమనానికి నాంది .

                               2-శ్రీమతి లక్ష్మీ సుభద్ర (విజయ వాడ)

 యువతి కలలు కల్లలు కాని వేళ-చూపులు కలిసిన నిశ్చితార్ధం వేళ

 జీవితం సార్ధక మవుతుందను కొన్న వేళ-ఆటంకాలు తొలగి పెళ్లి పీటల దాకా వచ్చిన వేళ

ఊహల పల్లకిలో తేలుతున్న వేళ దేవతలే పెళ్లి పెద్దలై చేసేదే వివాహం

అనురాగం నిండు నట్లు చేసేదే వివాహం –ఆత్మీయత ,ప్రేమలను కురిపించేది

అవగాహన ,ఓర్పూ ,సమ్మేళనం చేసేది వివాహం  -అపురూపమై నదే వివాహం

ఉన్నదానితో సంతృప్తి పడేదీ –ఒకరికొకరు తోడూ నీడ నిచ్చేదీ

మనసును మనసుతో కలిపేదీ-పాలు నీళ్ళు గా కలిసి పోయేదీ

ఒకరి కొకరు ప్రాణం గా –పార్వతీ పరమేశ్వరుల్లా కలిపి ఉంచేదే దాంపత్యం .

    3-వివాహ బంధం –శ్రీ విష్ణు భొట్ల ప్రసూన రామ కృష్ణ (విజయ వాడ )

 వివాహ బంధం అంటే –ఒక్క సారి గా  తెంచుకొంటే తెగే  పాశం  కాదు

జీవితాంతం కలిపి ఉంచేదీ తోడూ నీడ గా నిలిచి పోయేది

మూడు ముళ్ళ బంధం తో –అగ్ని సాక్షిగా వేదం మంత్రాల నడుమ

ఒక్కటిగా అయ్యేది వివాహ బంధం లోనే .

                   అందుకే

మన భారతీయ  సంస్కృతి లో –మన ఆచార వ్యవహారాల్లో

ఎన్నో ఎన్నెన్నో మార్పులు వస్తున్నా –జీవనం సహజీవనం వంటివి చొచ్చుకు వస్తున్నా

స్తిరం గా నిలిచి పోయింది మన వివాహ వ్యవస్థ

నాటికి నేటికి ఏ నాటికీ –కుంగి పోనిది కూలి పోనిది

తరతరాలు గా మార్గ దర్శి గా నిలిచింది –మన వివాహ బంధం

అదే మన భారతీయ జీవన వ్యవస్థ .

                     4-శ్రీమతి మద్దాలి నిర్మల (విజయవాడ  )

వివాహం దైవ నిర్ణయం –దాంపత్యం మధురాను బంధం

విడదీయ రాని అనురాగ బంధం –మారుతున్న సామాజిక భౌగోళిక స్తితుల్లో

దిగజారుతున్న విలువల నేపధ్యం లో –వివాహం దాంపత్యం విచ్చిన్నం కాకుండా

ఉండాలంటే కాస్తంత ఆలోచన అవసరమే మరి

పెళ్లి అనే  నూరేళ్ళ పంట వందేళ్ళు బాగా పండాలంటే

క్షేత్ర బీజాలుంటే సరి పోదు –మమతాను రాగాల మహా వృష్టి కురవాలి

సహనం ,సహకారం అనే సహజ వనరులు కావాలి

నిరంతర క్రుషికే దక్కు తుంది సమృద్ధి ఫలసాయం

వాక్కనే  వాణిని జిహ్వాగ్రం పై నిల్పాడు బ్రహ్మ

హృదయ స్థానం లో పదిలం గా ఉంచాడు విష్ణువు

అర్ధ నారీశ్వరమే ఆదర్శం గా గౌరవించాడు సాంబ శివుడు

ఒకే మాట ,ఒకే బాణం ,ఒకే బాట ఒకే భార్య గా చాటాడు శ్రీ రాముడు

కాపురమైనా కారడవి యైనా పతి వెంటే నడిచింది జానకీ  సతి

మంగళ సూత్రాలకు తోడుగా ఈ బంగారు సూత్రాలను జోడిస్తే

దాంపత్యం అయి పోతుంది ఇహ లోకపు నాకం .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -1-4-14-ఉయ్యూరు

 

 

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | 2 Comments

‘తెలుగు వెలుగు’ ఏప్రిల్ 2014 సంచిక – ‘సరదాగా మరికాసేపు’ పుస్తక సమీక్ష గబ్బిట కృష్ణమోహన్

scan00010001

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ విష్ణ్వాలయం శ్రీ దత్త గుడి లో చేసిన పంచాంగ శ్రవణం

శ్రీ జయ నామ సంవత్సర ఉగాది సందర్భం గా నేను శ్రీ విష్ణ్వాలయం శ్రీ దత్త గుడి లో చేసిన పంచాంగ శ్రవణం -31-3-14-విజిల్ విజార్డ్” శ్రీ కొమరవోలు శివ ప్రసాద్… శ్రీ జయ నామ సంవత్సర ఉగాది వేడుకలు,-

శ్రీ జయ నామ సంవత్సర ఉగాది వేడుకలు,

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

విజిల్ విజార్డ్” శ్రీ కొమరవోలు శివ ప్రసాద్… శ్రీ జయ నామ సంవత్సర ఉగాది వేడుకలు,- 

DSCN8522విజిల్ విజార్డ్”  శ్రీ కొమరవోలు శివ ప్రసాద్ ”గారు ఉయ్యూరులో శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయ సందర్శనం ,మా ఇంటిలో ఆతిధ్యం ,సరస భారతి60సమావేశం గా 30-3-2014 న రోటరీ క్లబ్ ఆడిటోరియం లో నిర్వహించిన శ్రీ జయ నామ  సంవత్సర ఉగాది వేడుకలు,-

శ్రీ జయ నామ సంవత్సర ఉగాది వేడుకలు,

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

శ్రీ జయ నామ సంవత్సర ఉగాది వేడుకలు

DSCN8522సాహితీ బంధువులకు ఉగాది శుభా కాంక్షలు -నిన్న సరసభారతి నిర్వహించిన ఉగాది వేడుకలు బాగా జరిగాయి సమయం తక్కువ గా ఉండటం ఆలస్యం గా ప్రారంభం వలన కవి సమ్మేళనం సంపూర్తి ఆ నిర్వహించ  లేక పోయి నందుకు చింతిస్తున్నాము జరిగిన అసౌకర్యానికి మన్నించవలసినది గా కవి బంధువులను వేడుకొంటున్నాను .భారీ ప్రోగ్రాం లోఇది   సహజం అనుకొన్నా ఇబ్బందికరమైన విషయమే నని అంగీకరిస్తున్నాను అయితే అందరికి జ్ఞాపికలు అంద  జేశామన్న సంతృప్తి మిగిలింది .కాని వారి అసంతృప్తి తీరనిదే అయింది .ఇది తప్ప అంతా  బాగానే ఉంది . సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు -దుర్గా ప్రసాద్

విజిల్ విజార్డ్” శ్రీ కొమరవోలు శివ ప్రసాద్… శ్రీ జయ నామ సంవత్సర ఉగాది వేడుకలు

ఉయ్యూరు సరసభారతి ఆధ్వర్యంలో ఆదివారం నాడు జరిగిన 60వ సమావేశంలో గళ మురళీ  శ్రీ కొమరవోలు శివ ప్రసాద్ ఈల పాట సంగీత కచేరి  ఉగాది వేడుకలు

సరసభారతి అందజేసిన శ్రీ జయ నామ సంవత్సర ఉగాది జ్ఞాపికugadi image

This slideshow requires JavaScript.

This slideshow requires JavaScript.

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఆమని విరిసింది -గీతం

amani 001

Posted in సేకరణలు | Tagged | Leave a comment

జ్యోతి లో కవరేజ్ 30 న సరసభారతి ఉగాది వేడుకలు

andhrajyoti 001

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

రాడికల్ హ్యూమనిస్ట్ స్వామి వివేకానంద అంటున్న డా శ్రీనివాస్ -బాపట్ల

super humanist vivekananda 001

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

రా’’చ’’కీయ ద్విప్లేట్స్-23

       రా’’చ’’కీయ  ద్విప్లేట్స్-23

1-‘’సి.ఏం ‘’అభ్యర్ధిగా నాయుడు ‘’వెంకయ్య ‘’

‘’బాబు’’ కు చెక్ పెట్టె యోచనలో బిజెపి’’ ఉందయ్యా ‘’.

2-‘’సుత్తి ‘’మాటల మాజీ కాంగీ పెసిడెంట్ ’’ సత్తి బాబు ‘’

 కాంగీ నొదిలి ‘’హస్తం లో  కమలం’’ ఉంచుకొంటాడట ‘’బొత్స బాబు’’.

3-అవుతాననుకొన్న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెంకటసామి  కొడుకులు ‘’వివేక బ్రదర్స్’’

 గులాబీ  తీర్ధం పుచ్చుకొని ఊగిపోయి , మళ్ళీ కాంగీ గూటికి చేర్తారట ‘’అవివేక బ్రదర్స్ ‘’.

4-శ్రీనివాస్ కు సుప్రీం ‘’ఝలక్ ‘’

 అవినీతి క్రికెట్ బాస్ ‘’ఖేల్ ఖతం ‘’

5-మాగుంట .పితాని ,సాయి ప్రతాప్

 దేశం తీర్దానికి రెడి చూపిస్తారా సత్తా ,ప్రతాప్ .?

6-మోడీ తోనే దేశానికి భవిత  అన్న ‘’జీవిత రాజ శేఖర్ ‘’

  పార్టీల మెట్లెక్కి అలసి ఇక్కడ చేరారా ‘’జీవితం’’ రోసి’’ సెంటిమెంట్ శేఖర్?’’

7-నిరాధార మైన వారికి ఆధారంఅని ఊరించి తెచ్చిన  ‘’ఆధార్ ‘’

‘’నీలే కర్’’ బుర్రలో తొలిచిన పురుగిది –ఆయన్ను కర్ణాటకలో చేస్తారేమో’’నిరాదార్ ? ‘’

8-‘’కరుణ’’ దయ తప్పిన కొడుకు ‘’అలగిరి ‘’

   పట్టిస్తాడా  నియంత స్టాలిన్ ను నమ్మి ‘’శంకరగిరి ‘’?

9-ఉత్తర ప్రదేశ్ లో ‘’మీరట్’’ అభ్యర్ధి’’ నగ్మా ‘’ను ఆకస్మాత్తు గా

  నడి వీధిలో ముద్దేట్టుకొన్నాడట  ‘’ హపూర్’’ అభ్యర్ధి   ‘’గజ రాజ్ సింగ్ ‘’

10కృష్ణా లో కాంగ్రెస్ కు వచ్చింది ‘’చావు కళ ‘’

  అభ్యర్ధులే లేక వందేళ్ళ కాంగి అవుతోంది   ‘’విల విల ‘’.

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్-26-3-14-ఉయ్యూరు

 

 

Posted in రాజకీయం | Tagged | Leave a comment

అమెరికా లోని మౌంట్ సోమా లో ఉంటున్న ప్రసాదావధాని…

అమెరికా లోని మౌంట్ సోమా లో ఉంటున్న ప్రసాదావధాని గారి బెజవాడ రామలింగేశ్వర పేటలో అత్తవారిల్లు -మరియు మా కజి న్ స్వర్గీయ సూరి రాదా కృష్ణ మూర్తి విజయా టాకీస్ దగ్గర  ఇంటిలో మేము -25-3-14-మంగళ వారం

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

తెలుగు వాచకాల్లో తప్పుల కుప్పలు – వేదుల సత్యనారాయణ

తెలుగు వాచకాల్లో తప్పుల కుప్పలు – వేదుల సత్యనారాయణ

తెలుగు భాష సర్వతోముఖాభివృద్ధి కోరుకుంటున్న ఈ సమయంలో వాచక పుస్తకాలలో ఇంగ్లీషు పదాలు ఏమిటి?… వాచక పుస్తకాలు దోష రహితంగా ఉండాలి. భాషా శైలిలో ప్రామాణికత అవసరం. వాటి ద్వారా పిల్లలు తెలుగు భాష నుడికారము, సౌందర్యము గ్రహించాలి.

మన ప్రభుత్వం పదే పదే తెలుగు భాషాభివృద్ధిని కోరుకుంటున్నట్లు ప్రకటిస్తుంది. భాషాభివృద్ధి అంటే ఏమిటి? ఆ భాష సంప్రదాయాన్ని, నుడికారాన్ని, సౌందర్యాన్ని పిల్లలకు తెలియజేయడం. వ్యావహారిక భాష పేరుతో ప్రభుత్వం ఈ విషయంలో విఫలమైంది. వ్యావహారిక భాష అనేది అన్ని చోట్ల ఒకే మాదిరిగా ఉండదు. కనుక భాషకు ఒక ప్రమాణం అవసరం. ఈ విషయం మన పూర్వులు పాటించారు. పాఠ్య పుస్తకాలలో కూడా ఆ నియమం పాటింపబడింది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత రాజకీయ జోక్యం వలన పాఠ్యా ంశాలు మారిపోయాయి. ప్రభుత్వం ఇటీవల ఒకటి నుంచి ఐదు తరగతుల వాచకాల రచనా విధానం, బోధనా పద్ధతులు పూర్తిగా మార్చివేసింది.

ఈ పద్ధతి పిల్లలకు ఎంతో మేలు చేస్తుందని ప్రభుత్వ వాదన. కానీ ప్రమాణాలు మాత్రం రోజురోజుకీ దిగజారిపోతున్నాయి. ఈ పుస్తకాలలో చూపబడిన కొన్ని చిత్రాలలోను, పదాలలోను దోషాలున్నాయి. కొన్నిచోట్ల సమాచారం తప్పులున్నాయి. వీటి విషయం ప్రభుత్వ దృష్టికి తెచ్చినా పట్టించుకోదు. కనుక ఈ తప్పులన్నీ ఒప్పులుగా చలామణి అయిపోతున్నాయి. గత వాచకాలలో కూడా ఇలాగే జరిగింది. ఇప్పుడు తిరిగి అదే జరుగుతుంది. పిల్లలకు గుణాత్మక విద్య అందివ్వాలని ప్రభుత్వం అంటుంది. గుణాత్మక విద్య అంటే ఏమిటి? గుణహీనమైన విద్య, కల్తీ విద్య ఎక్కడైనా ఉంటాయా? అసలు ఈ పేరు ఏమిటి? ఒకటవ తరగతి పుస్తకంలో ‘నాగలి’ చిత్రాన్ని చూపించారు. ఈ రోజులలో ఇంకా ‘నాగలి’ ఎందుకు? ట్రాక్టర్లు ప్రవేశించిన తరువాత పిల్లలు నాగలి ఎరుగరు. ఆ చిత్రానికి ‘అరక’ అని పేరు పెట్టారు. ‘అరక’ వేరు ‘నాగలి’ వేరు. రెండెడ్లను కాడికి కట్టి దున్నడానికి సిద్ధం చేసిన దానిని ‘అరక’ అంటారు. ఇందులో ఈ వాక్యాలు చూడండి.

1. రైతు అరకతో పొలానికి బయలుదేరాడు. (అరక చేనులోనే ఉంటుంది). 2. అరకతో దుక్కి దున్నాడు. దుక్కి అంటే దున్నడం, కృషి అని అర్థాలు. దుక్కి దున్నడం ఏమిటి? దుక్కిలెద్దు అంటారు. అనగా దున్నడానికి ఉపయోగించే ఎద్దు. పుస్తకంలో పలుచోట్ల ‘నాగలి’ చిత్రాన్ని చూపి దానిని ‘అరక’ అన్నారు. ‘మేషం అంటే మేక’ అని ఒక వాక్యం ఉంది. మేషం అంటే మేక కాదు. గొఱె . మేకకి గొఱె కి తేడా లేదా? రెండవ తరగతిలో గుణింతాలకు ఒక కొత్త పద్ధతి ప్రవేశపెట్ట బడింది. ఇది ఎందుకు? ఒత్తు అక్షరాలకి గుణింతాలు వ్రాయించడం అవసరం. ఉదా : ద్ద ద్దా, య్య య్యా, ఒత్తులు నేర్చుకున్నా పిల్లలు వాటిని ఏ అక్షరానికైనా ఉపయోగించగలరు. ఒక వాక్యం చూడండి. ‘గొడుగు లాగ గాలికి ఎగిరిపోయేవి కొన్ని చెప్పండి’. గొడుగు గాలిలో ఎగరడం ఏమిటి? తీవ్రమైన గాలి వీచినప్పుడు గొడుగులే కాదు చాలా ఎగిరిపోతాయి. ఇక మూడవ తరగతి వాచకంలో వింతలు చూద్దాం. పిల్లలను వ్యాకరణంలో ప్రజ్ఞావంతులుగా చేయాలని ప్రవేశపెట్టిన పదాలు చూడండి.

అచ్చులు, హల్లులు, అల్ప ప్రాణాక్షరాలు, మహా ప్రాణాక్షరాలు, సంయుక్తాక్షరాలు, ద్విత్యాక్షరాలు, ద్విరుక్తాలు మొదలయినవి. వ్యాకరణం పెద్ద తరగతులలో బోధించాలి. ‘మన పండుగలు’ అనే పాఠంలో పిల్లలు కొందరు రాజస్థాన్, బెంగాల్, తమిళనాడు వెళ్లి అక్కడ వివిధ పండుగల విశేషాలు తెలుసుకున్నారట. అందులో వాక్యం ‘వలీలకు ముస్లిములు కట్టే సమాధులను దర్గాలంటారు’ వలీలు అంటే ఎవరో తెలియజేయలేదు. ఇంకొక వాక్యం పరిశీలించండి. ‘దుర్గాదేవి గొప్ప యుద్ధం చేసి మహిషాసురుని ఓడించింది. ఆ మర్నాడు యుద్ధంలో అలసిపోయి గౌరీ మాత నిద్రపోయింది’. దుర్గాదేవి మహిషాసురుని ఓడించడం కాదు వధించింది. దుర్గాదేవి యుద్ధం చేస్తే గౌరీమాత అలసిపోవడం ఏమిటి? ఈ రెండు పర్యాయపదములని పిల్లలు గ్రహించాలా? మరొక విశేషం చూడండి. శునకం, కనకం అను పదాల అర్థాలు తెలుసుకునేందుకు ఈ వాక్యాలు చూపబడ్డాయి. 1. నేను చిన్న శునకాన్ని పెంచుకుంటున్నాను. 2. మా చెల్లెలికి కనకపు గాజులు కొన్నాము.

చిన్న శునకం కనకపు గాజులు అనకూడదు. చిన్న అనేది తెలుగు పదం, శునకం అనేది సంస్కృత పదం. అలాగే కనకం సంస్కృతం, గాజులు తెలుగు. వనరాజు అంటే అర్థం అడవికి రాజు సింహం అని చూపారు. వనరాజు ప్రయోగం ఏమిటి? వనదేవత ఉంటుంది. మృగములకి రాజు కనుక సింహాన్ని మృగరాజు అన్నారు. అది సరియైన ప్రయోగం. వాచక పుస్తకాలలో ప్రతి పదం, పద్యం పిల్లలకు పూర్తిగా అవగాహన కావాలి. ఇంగ్లీషులో దీనిని డిటైల్డు స్టడీ అంటారు. నాలుగైదు తరగతులలో 16 పాఠాలున్నాయి (ఒక్కొక్కదానిలో) ఇవికాక మరొక ఆరున్నాయి. ఇవి చదివి ఆనందించడానికి ఉద్దేశింపబడ్డాయి. ఇవి వాచక పుస్తకంలో ఎందుకు? పాఠ్యాంశాలు కొన్ని పత్రికలలోని కథల వలె ఉన్నాయి.

నాలుగవ తరగతి సూది కథలో తాటి దూలం అని ఒక ప్రయోగం ఉంది. తాటి వాసం అనాలి. అది సరియైన పలుకుబడి. చిత్రంలో తాటి వాసాన్ని టేకుదుంగ వలె చూపించారు. ఐదవ తరగతి శతక పద్యాలలో ‘ఏరకుమీ కసుర్‌యలు’ అను పద్యానికి భావంలో భూమిపై పచ్చికాయలు ఏరి తినకూడదని ఉంది. ఇక్కడ భూమిపై అని చెప్పనవసరం లేదు. ‘గోపి డప్పు కథ’ అను పాఠం అతుకుల బొంత వలె ఉంది.

అందులో ‘వీడు పొద్దున్నే నా మట్టిపాత్ర పగలగొట్టాడు అందులోనే బట్టలు ఉడికించి ఉతకాలి’ అని ఉంది. బట్టలు మట్టిపాత్రలో ఉడకబెట్టడం ఏమిటి? బట్టలు బానలో ఉడక బెడతారు. అది చాలా పెద్దది. తెలుగు భాష సర్వతోముఖాభివృద్ధి కోరుకుంటున్న ఈ సమయంలో వాచక పుస్తకాలలో ఇంగ్లీషు పదాలు ఏమిటి? గతంలో తెలుగు వాచకాలలో ఇంగ్లీషు పదాలు ఎన్నడూ లేవు. ఈ వాచకాలలో ఉన్న కొన్ని ఇంగ్లీషు పదాలు చూడండి. ఫోటో, పాలిథిన్, పోస్టర్, కేబుల్ వైరు, బ్యానర్, బొకే, ఓవెన్, వాషింగ్ మిషన్, రైస్ కుక్కర్, మాస్క్ ఇలా చాలా ఉన్నాయి. ఇవి ఆధునిక తెలుగు వాచకాలు కనుక వాటిలో ఇంగ్లీషు ఉపయోగింపబడింది కాబోలు. వాచక పుస్తకాలు దోష రహితంగా ఉండాలి. భాషా శైలిలో ప్రామాణికత అవసరం. వాటి ద్వారా పిల్లలు తెలుగు భాష నుడికారము, సౌందర్యము గ్రహించాలి. వచ్చాడు, వెళ్లాడు వంటి పదాలు పుస్తకాల ద్వారానే నేర్చుకోవలసిన అవసరం లేదు. ఉపాధ్యాయులు చెప్పవలసిన అవసరం లేదు.
– వేదుల సత్యనారాయణ

 

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రా’’చ’’కీయ ద్విప్లేట్స్-22

           రా’’చ’’కీయ ద్విప్లేట్స్-22

1’’-కిరణ్ ‘’అన్నాడు పోలవరం ఆపటానికి కాదు ’’ నీళ్ళ బకెట్ ‘’

 ఆపితే ‘’కెసిఆర్’’ ముఠాతో బాటు వరదల్లో అందరూ  ‘’తన్నటం ఖాయం బకెట్ ‘’.

2-వియ్యంకుడు’’ లెజెండ్ బాలయ్య’’ కు టికెట్’’ హిందూపూర్ ‘’

 మూలిగే నక్క పై తాటి పండు- అసలే ఇప్పుడక్కడ ’’ కాంగీ మరీపూర్ ‘’.

3- ఓట్లేస్తే తెప్పిస్తాడట ‘’జగన్’’ తండ్రి  ‘’రాజన్న రాజ్యం ‘’

 నమ్మి ఓటేస్తే ఇక సీమాంద్రలో’’ నాకేస్తే’’- ‘’మిగిలేది పూజ్యం ‘’.

4-తమకిష్టం లేని పెళ్లి చేసుకోందని నమ్మక ద్రోహం తో కూతురికి వేశారు’’ ఉరి ‘’

  గవర్నర్ రాజ్యమైనా ,జరుగుతూనే ఉన్నాయి  అన్యాయాలన్నీ  ఇదేం ‘’కిరికిరి ?’’.

5-‘’నిర్భయ’’ చట్టం ఉన్నా నిర్భయం గా చేస్తున్నారు’’ అత్యాచారం ‘’

 ఆడ వాళ్ళంటే అంత లోకువైపోయారా ఇదెక్కడి ‘’గ్రహచారం ‘’?

6-‘’గ్రాండ్ అలయన్స్’’ కు ప్రజలిచ్చారు’’ గ్రాండ్ సక్సెస్’’

  ఒపీనియన్ పోల్ నిజం గా కూటమికిస్తుందా ‘’అసలైన సక్సెస్?’’

7-ఒకటి కాదు రెండోట్లేయ్యండి మరాఠా వీరుడు’’ శరద్ పవార్ ‘’

  ‘’డబల్ బెనిఫిట్ ‘’ దేనికి ?ఓడిపోతానన్న భయమా ‘’ఎలక్షన్ వార్ ? ‘’  .

8-విశాఖ  లో ‘’గబ్బర్ సింగ్’’జన సేన గర్జన ‘’

 అన్న ‘’చిరు ‘’మదిలో చెలరేపుతాడా ‘’తర్జన భర్జన ‘’?

9-కాంగీ తో దశాబ్దాల బంధం పుటుక్కున తెంచుకున్న’’ జే.సి.’’

 సైకిలెక్కి ‘’బాబు ‘’ను  కూర్చో బెడతాడట వేసి  ఏ.పి.లో ’’ ఏ.సి.’’

10-దేశం గూడోదిలిన హాస్య ‘’బాబూ మోహన్ ‘’

  పదవిలో కులికి  ఇన్నాళ్ళకు తెలుసుకొన్నవా ‘’బాబూ!మోహన్ ! ‘’

11-కృష్ణా లో సైకిల్ పై స్వారీ చేయనున్న పిన్నమనేని,’’మండలి ‘’

   తరరాల కాంగీ  గూళ్ళు శిధిలమై   ఏర్పడుతున్న’’ కొత్త కూడలి ‘’.

12-కెసిఆర్ ,బాబుల ను స్తుతిస్తున్నఇరువైపు  ‘’ బ్రాహ్మణులు’’

   ‘’బ్లడ్ ఈజ్ ధిక్కర్ దాన్ వాటర్ ‘’అని తెలుసుకోలేని ‘ కర్మన్యులు ‘’.

   మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-3-14-ఉయ్యూరు

 

Posted in రాజకీయం | Tagged | Leave a comment

వారి త్యాగమే మన స్వాతంత్య్రం- కాటంనేని ముత్తయ్య

వారి త్యాగమే మన స్వాతంత్య్రం- కాటంనేని ముత్తయ్య

ప్రపంచ వ్యాప్తంగా వలస రాజ్యాలను ఏర్పరచుకుని రవి అస్తమించని సామ్రాజ్యాన్ని ఆంగ్లేయులు స్థాపించుకున్నారు. మన దేశం దాదాపు రెండు శతాబ్దాల పాటు తెల్లవారి చేతుల్లో బానిసత్వంలో అలమటించవల్సి వచ్చినది. మహాత్మాగాంధీ నాయకత్వంలో నిర్వహింపబడిన స్వాతంత్రోద్యమం, నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత జాతీయ సైన్యం సలిపిన స్వాతంత్య్ర పోరాటంతో పాటు, విప్లవ వీరుల సాహసోపేత సంఘటనలు కూడా దోహదపడ్డాయి. ఆ విప్లవ వీరుల్లో మొదటిగా చెప్పుకోదగిన వారిలో షహీద్‌భగత్ సింగ్ అగ్రగణ్యుడు. గాంధీ, నెహ్రూ, సుభాష్‌చంద్రబోస్ ఇతర భారతీయ నాయకులకు ఇదమిత ్థమైన సూర్తిని రగిలించిన జ్వాలాముఖి భగత్ సింగ్. సైద్ధాంతికంగా శషబిషలు పలికిన వారు కూడా సర్దార్ భగత్ సింగ్ త్రికరణ శుద్ధిని ప్రశంసించారు. భగత్ సింగ్ భారత చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనే ఒక అపురూప వ్యక్తి. అతడో వ్యక్తి కాదు, మహా ప్రస్థాన ప్రభంజన వ్యవస్థ..

1919 ఏప్రిల్ 13న జరిగిన జలియన్ వాలా బాగ్ మారణకాండ అప్పటికి 12 ఏళ్ళ వయసున్న భగత్ సింగ్‌ను తీవ్రంగా కలచివేసింది. జలియన్‌వాలా బాగ్ మారణహోమం జరిగిన మరునాడే స్కూల్‌కు బయలుదేరిన భగత్ సింగ్ కాల్పుల్లో అమరులైన ప్రజల రక్తంతో తడచిన పిడికెడు మట్టిని తీసుకుని రావి నదిలో నిమజ్జనం చేసి బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేస్తానని శపథం చేశారు. 1926లో తన గురువు కర్తాల్ సింగ్ శరభాగారి 11వ వర్ధంతి ‘నౌ జవాన్ భారత సభ’ ఆధ్వర్యంలో భగత్ సింగ్ జరిపించారు. ఆ సభలో బానిసత్వం ఎంత నికృష్టమైనదో, ఎంత కర్కశమైనదో వివరిస్తూ ‘జన్మించిన ప్రాణి మరణించడం తథ్యమని తెలిసిన భారతీయుల్లో ప్రతి ఒక్కరు దేశ, దాస్య విముక్తి కోసం ప్రాణాలను అర్పించాలని నిర్ణయం తీసుకోలేకపోవడం తనకు అర్థం కాని వింత అని’ ఆయన వాపోయారు. 1928లో సైమన్ కమిషన్ గో బ్యాక్ ఉద్యమం దేశమంతటా వెల్లువెత్తింది. సైమన్ కమిషన్ 1928 అక్టోబర్ 31న లాహోర్ వచ్చిన సమయంలో భగత్ సింగ్ బృందం కృషి వల్ల అన్ని ప్రజా సంఘాల వారు సంఘటితమై ఆ కమిషన్‌కు వ్యతిరేకంగా బ్రహ్మాండమైన నిరసన ప్రదర్శన నిర్వహించారు. లాహోర్ పట్టణంలో పూర్తి హర్తాళ్ జరిగింది. ఈ నిరసన ప్రదర్శనలపై పోలీసులు కర్కశంగా లాఠీ చార్జి చేశారు. లాఠీ దెబ్బల వలన లాలా లజపతిరాయ్ తీవ్రంగా గాయపడి 18 రోజుల తర్వాత నవంబర్ 17న మరణించారు. ఈ సంఘటనకు ప్రతీకారంగా దానికి బాధ్యుడైన సాండర్స్‌ను హతమార్చడంలో భగత్‌సింగ్ కీలకపాత్ర పోషించారు. జాతియావత్తూ ఈ చర్యకు భగత్‌సింగ్‌ను వేనోళ్ళ కొనియాడింది.

ఢిల్లీ సెంట్రల్ అసెంబ్లీలో 1929 ఏప్రిల్ మొదటివారంలో ప్రజారక్షణ బిల్లు (నేటి డిటెన్షన్ ఎమర్జెన్సీ లాంటి అధికారాలిచ్చే బిల్లు, కార్మికులకు ప్రాథమిక హక్కులైనా లేకుండా చేసే బిల్లు) చర్చకు వచ్చింది. విఠల్‌భాయి పటేల్, మోతీలాల్ నెహ్రూ, మహమ్మద్ అలీ జిన్నా, మదన్‌మోహన్ మాలవ్యా మొదలగు రాజకీయ నాయకులు ఈ బిల్లును ప్రతిఘటించి అసమ్మతిని వ్యక్తపరిచారు. అధికార పక్ష సభ్యుడు జార్జ్ మాస్టర్ 1929 ఏప్రిల్ 8వ తేదీన వైస్రాయ్‌గా తనకున్న ప్రత్యేక అధికారాలతో ఈ రెండు బిల్లులను ఆమోదిస్తూ అధికార ముద్ర వేశారు. సరిగ్గా అదే సమయంలో భగత్ సింగ్ ఎవరికీ గాయాలు తగలకుండా ఉండే విధంగా ఖాళీ ప్రదేశంలో బాంబు విసిరాడు. తర్వాత భటుకేశ్వర్ దత్తు విసిరిన బాంబు కూడా పేలింది. భగత్ సింగ్ పారిపోవడానికి అవకాశాలున్నా పారిపోకుండా పోలీసులకు పట్టుబడ్డాడు. కోర్టులో కేసు నడిస్తే తాము చేస్తున్న విప్లవపోరాటానికి దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం వస్తుందని ఆశించారు.

‘ఇండియన్ సోషలిస్టు రిపబ్లికన్ ఆర్మీ’ పేరుతో వేసిన కరపత్రంలో భారత ప్రజల తరపున అభివృద్ధి నిరోధక దమననీతిని పెంచే శాసనాలను నిరసించారు. లాలాలజపతిరాయ్ హత్యను ఆ కరపత్రంలో ఖండించారు. అదే విధంగా ఆ సంస్థ ప్రణాళికను ఆ కరపత్రంలో రేఖామాత్రంగా పరిచయం చేశారు. మనుషులందరినీ సోదరులుగా భావించి అందరి సుఖ సంతోషాలకు కృషి చేసే సమసమాజ స్థాపన కోసం మానసిక విప్లవం కలిగించడానికి అవసరమైతే ఆయుధాలను కూడా ప్రయోగించడానికి మేము వెనకాడము అని ఆయన కోర్టులో ఉద్ఘాటించారు. 1931 అక్టోబర్ 7వ తేదీన ప్రత్యేక కోర్టు భగత్‌సింగ్, రాజగురు, సుఖదేవ్‌లను మరణించే వరకు ఉరి తీయాలని తీర్పు చెప్పింది. విజయకుమార్ సిన్హా, శివవర్మ, కిషోర్‌లాల్ మొదలగు వారికి యావజ్జీవ కారాగార శిక్ష విధించి అండమాన్ జైలులో ఉంచాలని తీర్పు చెప్పింది. మోతీలాల్ నెహ్రూ అమూల్యమైన ప్రాణాలను పోగొట్టు కోవద్దు, పైకోర్టుకు అప్పీల్ చేసుకునే అవకాశం జారవిడుచుకోవద్దు అని విజ్ఞప్తి చేసినా ఆ ముగ్గురు వీరులు తిరస్కరించారు. ఉరితాళ్ళను ముద్దాడారు.

విప్లవవీరులైన తన ముద్దు బిడ్డలను కోల్పోయినందుకు యావద్దేశం ఎంతగానో పరితపించింది. ఈ సంఘటన విప్లవోద్యమానికి శరాఘాతమైంది. భారత ఉపఖండంలో మొట్టమొదటిసారిగా ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ (విప్లవం వర్ధిల్లాలి) అని నినదించిన భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్‌ల ఆదర్శంగా ఇప్పటికీ విప్లవకారులు ముందడుగు వేస్తూనే ఉన్నారు. ఆ ముగ్గురు అమరవీరులకు జోహార్లర్పిస్తూ…

– కాటంనేని ముత్తయ్య
పూర్వపు మధిర తాలూకా భూతనఖా బ్యాంకు అధ్యక్షుడు, ఖమ్మం డీసీఎంఎస్ మాజీ ఉపాధ్యక్షులు
(నేడు భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురులను ఉరితీసిన రోజు)

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలుగు సాహితీ శిఖరం పుట్టపర్తి.. – వాండ్రంగి కొండలరావు

తెలుగు సాహితీ శిఖరం పుట్టపర్తి.. – వాండ్రంగి కొండలరావు

తులసీదాసు రామాయణాన్ని చదివేందుకు పుట్టపర్తి వారు హిందీ భాషను నేర్చుకున్నారు. ఆ రామాయణాన్ని యుద్ధకాండవరకు కంఠస్థం చేసిన మహానుభావుడు నారాయణాచార్యులు. ఆ ప్రభావంతోనే జనప్రియ రామాయణాన్ని రచించారు…. వీరి రచనలలో తొలుత రవీంద్రకవి ప్రభావం ఉన్నప్పటికి ఆ తరువాత అరవిందయోగి ప్రభావం కన్పిస్తోంది.

కవిగా, పండితునిగా, సాహితీ విమర్శకునిగా, అనువాదకునిగా, బహుభాషా కోవిదునిగా, సంగీత కళానిధిగా, వక్తగా ఎనలేని ఖ్యాతిని సొంతం చేసుకున్న సరస్వతీ పుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు ధన్యజీవి. ‘వాణి నా రాణి’ అని పిల్లలమర్రి పినవీరభద్రుడు చెప్పుకున్నట్లు, శ్రీశ్రీ ‘ఈ శతాబ్దం నాది’ అని వెల్లడించుకున్న తరహాలోనే ‘పాండితీ శోభ పదునాల్గు భాషలందు’ అని పుట్టపర్తి నారాయణాచార్యులు సగర్వంగా చెప్పుకున్నారు. వందకుపైగా కృతులను రచించి తెలుగుభాషకు వన్నెతెచ్చిన మహానుభావుడు ప్రాచీనతకు నవ్యతకు ఓ వారధిగా నిలిచాడు. ఇన్ని ప్రత్యేకతలున్న మరో కవి తెలుగు సాహిత్యంలో కన్పించరనేది అక్షరసత్యం.

‘ఘల్లుఘల్లుమని, కాళ్ళ చిలిపి గజ్జెల మోయ/ ఆడెనమ్మో శివుడు! పాడేనమ్మ శివుడు!…’ అనే రీతిలో శివతాండవం కావ్యాన్ని రాశారు. పుట్టపర్తి వారికి ఈ కావ్యం అఖండ ఖ్యాతిని తెచ్చిపెట్టింది. వీరి కవితా శక్తిని, పాండితీ వైవిధ్యాన్ని, సంగీత, నృత్య హేలను లోకానికి చాటి చెప్పిన అద్భుత కావ్యమిది. ‘శివతాండవం’లోని ఖండికలను పుట్టపర్తి ఆలాపించిన సందర్భాలలో ప్రేక్షకులు, ఉర్రూతలూగేవారట. పరవశించి నాట్యం చేసేవారు. రగడ ఛందస్సులో దీనిని రాసారు.
1914 మార్చి 28వ తేదీన అనంతపురం జిల్లా చియ్యేరు గ్రామంలో జన్మించారు. దక్షిణ భారతదేశపు భాషలతో పాటు సంస్కృతం, మరాఠీ, బెంగాలీ, పార్శీ, ఫ్రెంచ్ తదితర 14 భాషలను నేర్చుకొని సెహబాస్ అనిపించుకున్నారు. అనంతపురం, పెనుగొండలలోను, తిరుపతి సంస్కృత కళాశాలలోను విద్యాభ్యాసం చేశారు. పదునాలుగేళ్ల వయసులోనే ‘పెనుగొండలక్ష్మి’ అనే పద్యకావ్యాన్ని రాసారు. ఈ కావ్యం విద్వాన్ పరీక్షకు పాఠ్య గ్రంథంగా నిర్ణయించారు. ఆయన విద్వాన్ పరీక్షకు (1938) హాజరయినప్పుడు తాను రచించిన ఈ కావ్యాన్నే పాఠ్యాంశంగా చదువుకోవలసి వచ్చింది. సాధారణంగా ఏ రచయితకూ ఎదురుకాని ఆశ్చర్యకరమైన అనుభవం ఇది. పెనుగొండలో రూపొందించిన పద్మినీ జాతి స్త్రీ శిల్పాన్ని తనివి తీరా చూసి కవి పొందిన భావావేశానికి నిదర్శనంగా ‘ఉలిలో తేనెల సోనలన్ చితికి… ముద్దుగొనియుండున్ ప్రేమ విభ్రాంతుడై’ అనే ఈ పద్యం పెనుగొండలక్ష్మీ కావ్యంలో ఎంతో హృద్యంగా కన్పిస్తుంది. కాళిదాసు ‘మేఘసందేశం’ ఆధారంగా నవ్యతను రంగరించి సామాజిక స్పృహతో పుట్టపర్తి వారు ‘మేఘదూతం’ కావ్యాన్ని రాసారు. ముచ్చటగా మూడు అధ్యాయాలతో ఉన్న ఈ గేయ కావ్యంలో సామాన్యుడే కథానాయకుడు. మానవతా దృక్పథానికి, శాంతికాముకతకు, వర్ణనా రమణీయతకు, చారిత్రాత్మకతకు నిలువుటద్దంగా నిలుస్తుంది. ఈ రసమయ కావ్యంలో ఓరుగల్లు వైభవాన్ని కళ్ళకు కట్టినట్టు వర్ణిస్తూ ‘అచట విద్యానాథు/ ఢమరకవి కనిపించు/ చీకిపోయిన గుండియలతో/ నా కట్టు బాష్ప సంతతితో’ అని రాసిన తీరు మనల్ని ఎంతో ఆకట్టుకుంటుంది.

పుట్టపర్తి వారి కావ్యాలలో మరో ఆణిముత్యం ‘షాజీ’. ఈ కావ్యాన్ని తొమ్మిదవ ఏటనే రాసారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పాఠ్యగ్రంథంగా నిర్ణయించారు.
పాండిచ్చేరిలో అరవిందయోగితో తనకు గల పరిచయం ఓ దివ్యానుభూతిగా పుట్టపర్తి వారు పేర్కొనేవారు. అరవిందుడు రాసిన ఆంగ్ల గ్రంథాలలో ఎనిమిదింటిని తేట తెలుగులో అనువదించారు. వీటిలో ‘తలపులు-మెరుపులు’, ‘గీతోపన్యాసములు’ ముఖ్యమైనవి. పుట్టపర్తివారు ప్రొద్దుటూరు, కడప, అనంతపురం విద్యాలయాల్లో అధ్యాపకునిగా పనిచేశారు. ఆయన ప్రతిభను గుర్తించి 1955లో తిరువాన్కూర్ (కేరళ) విశ్వవిద్యాలయం వారు నిఘంటు విభాగంలో ఎటమాలజిస్ట్‌గా నియమించారు. ఆ తరువాత న్యూఢిల్లీలోని కేంద్ర సాహిత్య అకాడమీలోని భాషా శాస్త్రాల గ్రంథాలయంలో 1958 నుంచి రెండేళ్లపాటు గ్రంథ పాలకునిగా పనిచేసి విశిష్ట సేవలందించారు. కుటుంబ సమస్యల వల్ల ఆ ఉద్యోగానికి స్వస్తి చెప్పి తిరిగి కడప రామకృష్ణ ఉన్నత పాఠశాలలో తెలుగు పండితునిగా చేరి ఉద్యోగ విరమణ వరకు అక్కడే పనిచేశారు. ప్రసిద్ధి చెందిన తులసీదాసు రామాయణాన్ని చదివేందుకు పుట్టపర్తి వారు హిందీ భాషను నేర్చుకున్నారు. ఆ రామాయణాన్ని యుద్ధకాండవరకు కంఠస్థం చేసిన మహానుభావుడు నారాయణాచార్యులు. ఆ ప్రభావంతోనే జనప్రియ రామాయణాన్ని రచించారు. మలయాళ భాషను అధ్యయనం చేసి నాటి కేరళ విద్యామంత్రి రాసిన ‘కొదిలైలున్ కురు శిలైక్’ అనే నవలను ఆంధ్రీకరించారు. విశ్వనాధ సత్యనారాయణ రాసిన ప్రసిద్ధ నవల ‘ఏకవీర’ను మలయాళ భాషలో అనువదించారు.

శివకర్ణామృతం, త్యాగరాజ సుప్రభాతం వంటి సంస్కృత గ్రంథాలు, విజయనగర సామాజిక చరిత్ర, మహాభారత విమర్శనం, రాయలనాటి రసికతా జీవనం, సమర్థరామదాసు, ఆంధ్ర మహాకవులు, వసు చరిత్ర వైభవం వంటి విమర్శనాత్మక గ్రంథాలు, గాంధీజీ మహాప్రస్థానం, కందుకూరి వీరేశలింగం, సరోజినీదేవి, అరవిందుడు వంటి జీవిత చరిత్రలను వెలయించారు. కేంద్ర సాహిత్య అకాడమీ కోరిక మేరకు బుద్ధ భగవానుడు, కబీర్ వచనావళి గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. వీరి రచనలలో తొలుత రవీంద్రకవి ప్రభావం ఉన్నప్పటికి ఆ తరువాత అరవిందయోగి ప్రభావం కన్పిస్తోంది. దేశ పర్యటనలలో భాగంగా హృషికేశ్ వెళ్లినపుడు అక్కడ శివానంద సరస్వతీ మహరాజ్ పుట్టపర్తి వారికి ‘సరస్వతీ పుత్ర’ బిరుదును ప్రదానం చేసి సత్కరించారు.

1974లో కేంద్ర ప్రభుత్వం పుట్టపర్తి వారికి ‘పద్మశ్రీ’ బిరుదునిచ్చి గౌరవించింది. ఆయన రాసిన జనప్రియ రామాయణానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. 1975లో శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం డి.లిట్ పట్టానిచ్చి సత్కరించింది. 1987లో ఆయన రచించిన ‘శ్రీనివాస ప్రబంధం’ గ్రంథానికి కలకత్తా భారతీయ భాషా పరిషత్తు వారు భిల్వార్ పురస్కారాన్ని ఇచ్చారు. బూర్గుల రామకృష్ణరావుచే బ్రహ్మభూషణ అవార్డును పొందారు. మధుర, చిదంబరం, నైవేలి, ఢిల్లీ, జంషెడ్‌పూర్ తదితర ప్రవాసాంధ్ర ప్రాంతాలలో సయితం ఘనసన్మానాలు అందుకున్నారు. నైనిటాల్‌లో జరిగిన అఖిలభారత కవి సమ్మేళనం, ఆకాశవాణి జాతీయ కవి సమ్మేళనంలో పురస్కారాలను గ్రహించారు. ఆచార్యుల వారి ధర్మపత్ని కనకమ్మ కూడా రచయిత్రి కావడం విశేషం. ఈ దంపతుల రచనలు ‘కావ్యద్వైయి’ సంపుటంగా వెలువడింది. తెలుగు సాహిత్య చరిత్రలో చెరగని ముద్ర వేసిన పుట్టపర్తి నారాయణాచార్యులు 1990 సెప్టెంబర్ 1న ఈ విశాల ప్రపంచం నుంచి నిష్క్రమించారు. ఆయన పేరు చిరస్మరణీయుల జాబితాలో చేరిపోయింది. జ్ఞానపీఠ్ అవార్డుకు అన్ని అర్హతలున్నా, ఎంచేతనో ఆయనకు దక్కలేదు.
– వాండ్రంగి కొండలరావు
అక్రిడేటెడ్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్
(మార్చి 28, 2014న శతజయంతి ముగింపు సందర్భంగా)

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కళింగాంధ్ర చరిత్రలో అపూర్వ ఘట్టం… – డా. తుర్లపాటి రాజేశ్వరి

కళింగాంధ్ర చరిత్రలో అపూర్వ ఘట్టం… – డా. తుర్లపాటి రాజేశ్వరి

కొసమెరుపు ఏమిటంటే భాగవతులు ప్రదర్శించే ఈ ‘కేళిక’లో ‘చోడగంగు’గా నిజమైన చోడగంగదేవ్ నటించటం! రంగస్థలం మీద తెరతీయగానే చోడగంగదేవ్ గుర్రం మీద, కత్తితో కనిపించగానే ప్రేక్షకులలో ఆశ్చర్యం, రాజూ అతడి పరివారంలో ఆందోళన మొదలైంది. రాజపాత్రధారి రంగస్థలంమీద కత్తితో పలువిధాల విన్యాసాలు చేస్తూ, రెప్పపాటులో వేదికమీద నుంచి జనం మధ్యలోకి దూకాడు. కొత్త రాజును సమీపించి అతడి శిరసును ఖడ్గంతో ఖండించి, తాను చోడగంగదేవ్‌నని ప్రకటించాడు. పిమ్మట సింహాసనాన్ని అధిష్టించాడు.

అనంతవర్మ చోడ గంగదేవ్ (క్రీ.శ. 1078-1147) గాంగ వంశ రాజులలో సుప్రసిద్ధుడు. ఈ రాజు పాలనలో ఒడిషా రాజకీయంగా, సాంస్కృతికంగా పురోగమించింది. చోడ గంగదేవ్ కళింగ రాజ్యాధిపతి దేవేంద్రవర్మ మొదటి రాజరాజు కుమారుడు. దేవేంద్రవర్మ మొదటి రాజరాజు కళింగ దేశాన్ని క్రీ.శ. 1072 నుంచి 1078 వరకు పాలించాడు. చోళరాజుని, వేంగీ దేశాన్ని పాలిస్తున్న నాటి చాళుక్య రాజుల్ని జయించిన పరాక్రమవంతుడు. చోళరాజైన మొదటి కుళోత్తంగుని కుమార్తె రాజసుందరిని మొదటి రాజరాజు వివాహమాడాడు. వీరి కుమారుడే చోడ గంగదేవ్. తండ్రి మొదటి రాజరాజు మరణానంతరం క్రీ.శ. 1078లో చోడ గంగదేవ్ కళింగ రాజసింహాసనాన్ని అధిష్టించాడు. దాయాదులు ఈ రాజ్యాన్ని ఆక్రమించాలని ప్రయత్నించటంతో చోడ గంగదేవ్ చిన్న వయసులో కష్టాల పాలయ్యాడు. దాయాది దేవేంద్ర వర్మ, ఉత్కళ సోమ వంశరాజు పురంజయునితో కలిసి చోడ గంగదేవ్‌ని ఓడించాడు. రాజ్యాధికారం పోగొట్టుకున్న చోడ గంగదేవ్ మారువేషంలో కొన్నాళ్ళు ఆంధ్ర దేశంలో సంచరించి- నాటకీయంగా మళ్ళీ రాజ సింహాసనాన్ని అధిష్టించాడు. ఈ సందర్భం మన తెలుగు కవితోనూ, మన తెలుగు కళారూపంతోనూ ముడివడి చరిత్రలో అద్భుత రసమయ ఘట్టంగా నిలిచింది. ఈ విషయాలను మన తెలుగు రచయితలూ, పరిశోధకులూ, అటు ఒడియా చరిత్రకారులూ, ఒడియా గ్రంథాలు ఉటంకించటం విశేషం.
వేములవాడ భీమకవి ఆంధ్ర దేశంలో సుప్రసిద్ధ శైవక్షేత్రం దాక్షారామం సమీపాన గల వేములవాడ గ్రామ నివాసి. భీమకవి తెలుంగాధీశుని సంబోధిస్తూ ఈ క్రింది పద్యం చెప్పాడు.

‘ఘనుడన్ వేములవాడ వంశజుడ; దాక్షారామ భీమేశనం
దనుడన్, దివ్యవిషామృత ప్రకటనా కావ్యధుర్యుండ; భీ
మన నాపేరు: వినంగ జెప్పితి దెలుంగాధీశ: కస్తూరికా
ఘన సారాది సుగంధ వస్తువులు వేగందెచ్చి లాలింపురా!’
ఈ సమాచారం వల్ల భీమకవి దాక్షారామంలో ప్రధాన దైవతమైన భీమేశ్వరుని అనుగ్రహం వలన జన్మించిన వాడని, విషమయమూ, అమృతమయమూ అయిన కావ్య నిర్మాణం చేయగల సమర్థుడనీ, సుగంధ ద్రవ్యాలంటే మోజు ఉన్నవాడనీ, ఇతరులను శాసించే పద్ధతిలో ఎంతటి వారితోనైనా మాట్లాడే – వెరసి – ఒక విలక్షణ వ్యక్తిత్వం కలవాడిగా ఊహించవచ్చు. భీమకవి శాపానుగ్రహ శక్తి, రచనలను గూర్చి ‘అమరకవుల’లో విద్వాన్ దీపాల పిచ్చయ్య శాస్త్రి, ‘సమగ్రాంధ్ర సాహిత్యం’లో ఆరుద్ర, తెలుగు సాహిత్య చరిత్ర గ్రంథంలో ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి, తదితరులెందరో పేర్కొన్నారు.

భీమకవి ఒక వితంతువుకి పుట్టినందున వేములవాడలో సాటి బ్రాహ్మణులందరూ వీరి కుటుంబాన్ని వెలివేశారు. ఒకరోజు గ్రామంలో చైనులు గారింట్లో కాశీ సమారాధాన జరుగుతోంది. ఒక భీమేశ్వరుని కుటుంబం తప్ప తక్కిన బ్రాహ్మణులందరూ భోజనాలకి వచ్చారు. లోపల వడ్డన పూర్తి అయింది. భీమన బయట అరుగు మీద కూర్చున్నాడు. జరిగిన అవమానానికి చాలా బాధపడుతూ, గ్రామంలో బ్రాహ్మణులకి బుద్ధిచెప్పటానికి ఇదే సమయమని తలచాడు. ‘పప్పలన్నీ కప్పలూ- అన్నమంతా సున్నమూ’ అని ఒక చిన్నపాట పాడాడు. వెంటనే లోపల విస్తళ్ళలో వడ్డించిన అన్నము సున్నమైంది. పప్పలు (భక్ష్యాలు) కప్పలై – ఇల్లంతా గంతులు వేస్తూ తిరగటం మొదలెట్టాయి. దానితో సమారాధన రసాభాస అయింది. దీనికంతటికీ కారణం భీమన కుటుంబాన్ని తాము వెలివేయటమని చైనులుగారు తెలుసుకున్నారు. ఆయన బయటకు వచ్చి భీమనను చూసి, క్షమాపణ చెప్పటంతో భీమన ‘కప్పలనీ పప్పలూ – సున్నమంతా అన్నమూ’ అని పాట పాడాడు. విచిత్రంగా అలాగే జరిగింది. ఆరోజు నుంచీ చిన్న భీమన భీమకవిగా మర్యాదా, మన్ననా పొందాడు. అప్పట్లో కవులు రాజుల సంస్థానాలను సందర్శించి తమ ప్రతిభా పాండిత్యాలను ప్రదర్శించి – పండిత సభలో సత్కారాలందుకునేవారు. వేములవాడ భీమకవి రాజాస్థానాలని సందర్శిస్తూ, ఒకమారు కళింగ దేశం వెళ్ళి రాజు చోడ గంగు దర్శనం కోరాడు. అయితే రాజు ‘సందడిలో ఉన్నాను: అది తీరాక రమ్మను’ అని భటుడికి చెప్పిపంపాడు.. అప్పుడు భీమకవికి కోపం వచ్చింది. ఇలా అన్నాడు.

‘వేములవాడ భీమకవి వేగమె కళింగ గంగు తా
సామము మాని కోపమున సందడి దీరిన రమ్ము పొమ్మనెన్
మోమును జూడ దోషమిక ముప్పది రెండు దినంబు లావలన్
జామున కర్థమందతని సంపద శత్రుల జేరు గావుతన్’
కవిగారి శాపం వల్లనో, రాజుకు పట్టిన దుర్దశ వల్లనో రాజ్యం శత్రువుల హస్తగతమైంది. చోడగంగు మారువేషంలో ఆంధ్ర దేశంలో తలదాచుకున్నాడు. ఒక రోజు రాత్రి భీమకవి వైభవంగా దివిటీలవారు త్రోవచూపుతుండగా పల్లకీలో వెళుతుంటే, పక్కన ఒక వ్యక్తి దారి సరిగ్గా కానరాక చీకట్లో గోతిలో పడి ‘..కాలి దివిటీ లేని బ్రతుకేమి బ్రతుకురా?’ – అని ఆక్రోశించటం వినిపించింది. కవి పల్లకీ ఆపి, మాటలలో అతడే రాజు చోడగంగు అని తెలుసుకున్నాడు. రాజు కూడా పల్లకీలో వ్యక్తి భీమనయని గ్రహించి తన తప్పు క్షమించమని, వేడుకున్నాడు. భీమకవి తన వాక్కు అమోఘమైన శక్తిగలదని చెబుతూ, రాజుని అనుగ్రహిస్తూ ఈ క్రింది విధంగా అన్నాడు.

‘వేయి గజంబులుండ పదివేల తురంగములుండ నాజిలో
రాయల గెల్చి సజ్జ నగరంబున బట్టము కట్టుకోవడిన్
రాయ కళింగ గంగ! కవిరాజు భయంకరమూర్తి సూడు దా
బోయిన మీన మాసమున బున్నము పోయిన షష్ఠి నాటికిన్’
కవిగారి దీవెన ఫలించి చోడగంగు ఉత్కళ రాజ సింహాసనాన్ని ఆక్రమించగలిగాడు. అయితే అది నాటకీయంగా రాజు మన భాగవతుల బృందంతో కలిసి సాధించగలిగాడు.
కళా సాంప్రదాయం కూచిపూడి భాగవతుల ప్రదర్శన : కృష్ణా జిల్లాలో మారుమూల గ్రామం కూచిపూడి. నాట్య ప్రశస్తి తెలుగునాట అత్యంత ప్రాచీన కాలం నుంచీ ఉండటం చేత సిద్ధేంద్రయోగికి పూర్వమే కూచిపూడి నాట్యవిద్యకు నిలయంగా భాసిల్లినదనే సిద్ధాంతాన్ని డా. వేదాంతం రామలింగశాస్త్రి ‘కూచిపూడి నాట్య ప్రశస్తి’ వ్యాసంలో వక్కాణించారు. కూచిపూడి నాట్యవిద్యలో భరతుడు మొదలైన ఆలంకారికులు, శాస్త్రవేత్తలూ పేర్కొన్న నాట్యాలంకార సూత్రాలన్నీ ప్రతిబింబిస్తాయి. అంతేకాకుండా శాస్త్రాలలో చెప్పని దేశీయతా విజ్ఞానాన్ని స్వంతం చేసుకుని కూచిపూడి నాట్యకళ ప్రశస్తి పొందింది. కూచిపూడి పండితులు – దేశ ద్రిమ్మరులు. శతాబ్దాలుగా వీరు ఊళ్ళలో పర్యటిస్తూ, అక్కడ ప్రదర్శనలిస్తూ కళాపోషకుల ఆదరణతో తమ జీవినం గడిపేవారు. ప్రదర్శనకు సమకాలీన చరిత్రలను స్వీకరిస్తూ – సమాజంలో రుగ్మతలను దురాచారాలను ఖండిస్తూ – రసోచితంగా ప్రదర్శించేవారు. పగటి వేషాలు కూడా జానపద కళారూపాలలో ఒకటి. కూచిపూడి పగటి వేషధారులకు నిలయంగా ఉండేది. సమీపాన ఉన్న గడ్డిపాడులో ఈ కళాకారుల సంఖ్య అధికంగా ఉండేది.

వేములవాడ భీమకవి ఆశీస్సులు పొందిన చోడగంగు శత్రువులు తనని గుర్తించకుండా పగటి వేషగాండ్ర ముఠాలో చేరి ఊరూరా తిరుగుతూ, వారితో సజ్జనగరం వెళ్ళాడు. ఈ విషయాన్ని అనంత వర్మ, చోడగంగదేవ్‌పై పరిశోధన చేసిన ఒడిషా చరిత్ర పరిశోధకుడు డా. కైలాస్ చంద్రదాస్ ఈ కింది విధంగా పొందుపరిచారు.
“… a group of people of Kuchipudi Bhagavat sect proceeded to kalinga with their musical instruments for a show. on the way the man carrying all the musical instruments on bealf of the party died. the party was in eager need of a man who would carry app these instruments to kalinga. The party people saw the deserted king (who was not known to them as chodaganga) who was singing a song. They negotiated with him that he would carry all the musical instruments to kalinga and would get food for his service. In this way the Bhagavata group and the man carrying all the musical instruments reached kalinganagara. The new king made all arrangements for stay. It was decided that the party would play the act by which he defeated the former king chodaganga..” (O.H.R.J. Vol XXXIV No : 344. Page 3)

ఇందులో కొసమెరుపు ఏమిటంటే భాగవతులు ప్రదర్శించే ఈ ‘కేళిక’లో ‘చోడగంగు’గా నిజమైన చోడగంగదేవ్ నటించటం! రంగస్థలం మీద తెరతీయగానే చోడగంగదేవ్ గుర్రం మీద, కత్తితో కనిపించగానే ప్రేక్షకులలో ఆశ్చర్యం, రాజూ అతడి పరివారంలో ఆందోళన మొదలైంది. రాజపాత్రధారి రంగస్థలంమీద కత్తితో పలువిధాల విన్యాసాలు చేస్తూ, రెప్పపాటులో వేదికమీద నుంచి జనం మధ్యలోకి దూకాడు. కొత్త రాజును సమీపించి అతడి శిరసును ఖడ్గంతో ఖండించి, తాను చోడగంగదేవ్‌నని ప్రకటించాడు. పిమ్మట సింహాసనాన్ని అధిష్టించాడు. ఈ అద్భుత రసాత్మక ఘట్టం గురించి ‘ఎల్లోరా’ తమ వ్యాసంలో పేర్కొన్నారు.

‘పగటి వేషాల ద్వారా రాజులలో మార్పును తేవడం, ప్రజల్లో చైతన్యాన్ని కలిగించడం ప్రత్యేకించి ఉదహరించవలసి ఉంటుంది. కళింగ గంగ రాజు పగటి వేషాల వారి సాయంతోనే శత్రువులను జయించాడనే కథ విన్నదే కదా!’ (జానపదకళలు – 2వ ప్రపంచ తెలుగు మహాసభలు, 1981 ప్రత్యేక సంచిక, పుట-88.)

‘మాదలాపంజి’ జగన్నాధ స్వామి ఆలయం పూరీలో భద్రపరిచిన “Temple Chronicle’. ఇందులోని రాజభోగం అధ్యాయంలో ఈ వృత్తాంతం పేర్కొన్నారు. “He came in the guise of an actor (nata besa re ase) pounced upon kataka (The soma vamsi kingdom) and declated himself king”. (O.H.R.J. Vol XXXIV No.344)
చోడ గంగదేవ్ సంహరించిన రాజు పేరు కర్ణదేవుడు. ఈ విషయం 12వ శతాబ్దికి చెందిన బెంగాలీ గ్రంథం రామచరిత్రలో కూడా పేర్కొనబడినట్లుగా కైలాస చంద్రదాస్ తన పరిశోధనా వ్యాసంలో రాశారు.
భాషా, ప్రాంతీయతా ఎల్లలను అధిగమించిన చోడగంగదేవ్ ఉత్కళ విజయ గాథ; అటు కూచిపూడి భాగవతుల ప్రాచీనతనీ, కళింగ చరిత్రలో వారు పోషించిన అమోఘమైన పాత్రనీ, ఇటు వేములవాడ భీమకవి కవితా శక్తిని ఉదహరించే సంఘటనలతో చరిత్రలో అపూర్వ కథనంగా నిలిచిపోయింది.
– డా. తుర్లపాటి రాజేశ్వరి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పిచ్చుకల తోటమాలి

పిచ్చుకల తోటమాలి

 
 
 

 

 
 
 

ఆఫీసుకి, ఇంటికి మధ్య దూరం ఐదు కిలోమీటర్లు పైబడితేనే “ఈ ట్రాఫిక్‌లో తిరగలేక చస్తున్నామని” అంటుంటారు హైదరాబాద్ మహానగరంలో. అటువంటిది ఆఫీసు దూరమైనా పర్వాలేదు మొక్కలు, చెట్లు పెంచి రకరకాల పిట్టలకు, పిచ్చుకలకు తన ఇంటిని నెలవుగా చేయాలనుకున్నారు తిరుమల్ ప్రసాద్ పాటిల్. అందుకే ఆయన రోజుకి 80 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన తిరుమల్ వారాంతాలలో తోటపని చేస్తూ గడపడమే ఇష్టం అంటారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే చదవండి…

“సిఎస్‌సి (కంప్యూటర్ సైన్సెస్ కార్పొరేషన్) అనే అమెరికా సంస్థలో నెట్ వర్క్ కన్సల్టెంట్‌గా పనిచేయడం మొదలుపెట్టి పదేళ్లవుతోంది. మా స్వస్థలం అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలంలోని కలుగోడు గ్రామం. మా నాన్నగారు రైతు. విఆర్ఓగా కూడా చేశారు. కాని మా ప్రధాన జీవనాధారం మాత్రం వ్యవసాయమే. ఐటి ఉద్యోగినే అయినప్పటికీ గ్రామీణ నేపథ్యం, రైతు కుటుంబం కావడం వల్ల మట్టితో అవినాభావ సంబంధం ఉంది నాకు. చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం 1998లో హైదరాబాద్‌కి వచ్చాను. 2006లో ఘట్‌కేసర్ మండలం, చౌదరిగూడా గ్రామంలో రెండొందల గజాల స్థలం కొని ఇల్లు కట్టుకున్నాను. 2008 నుంచి ఇక్కడే ఉంటున్నాం. మా ఆఫీసు నుంచి ఇంటికి 40 కిలోమీటర్ల దూరం. అంటే రానుపోను 80 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నాను రోజూ. పొగ, ధ్వని, వాతావరణ కాలుష్యాలకు దూరంగా ఉండడం కోసమే ఇంత దూరంలో ఇల్లు కట్టుకున్నాను. చెట్లు, పిట్టలు, పిల్లుల్ని పెంచుకోవచ్చనే కోరిక కూడా దీనికి ఒక కారణం. 200 గజాల్లో అంటే ఇల్లు పెద్దగానే కట్టొచ్చు. కాని గార్డెన్‌కి స్థలం ఉండాలన్న ఉద్దేశంతో ఇంటిని చిన్నదిగా కట్టాము. మా ఇంటి చుట్టూరా దాదాపు 70 రకాల చెట్లు ఉన్నాయి. మొక్కలు, చెట్లు ఉన్నాయంటే పక్షులు వస్తుంటాయి కదా! అలానే అవి రావడం మొదలైంది.

బుజ్జి పిట్ట.. బుల్లి పిట్ట…
పిచ్చుకలు, రకరకాల పిట్టలు వచ్చి వాలుతుంటే సంతోషంగా అనిపించి వాటికి గింజలు వేయడం, నీళ్లు పెట్టడం, గూడు కట్టుకునేందుకు వీలు కల్పించడం మొదలుపెట్టాను. గూడుకోసం ప్రత్యేక ఏర్పాటు ఎందుకనుకోవచ్చు? పాతకాలంలో అయితే పక్షులకి గూళ్లు కట్టుకునేలా ఇళ్ల నిర్మాణం ఉండేది. ఇప్పుడున్న కాంక్రీట్ జంగిల్‌లో వాటికి గూడు కట్టుకోవడానికి స్థలమే లేదు. పిచ్చుకలేమో సురక్షితమైన ప్రదేశం లేకపోతే గూడు కట్టుకోవు. నేను అట్టడబ్బాలు పెట్టేవాడ్ని కాని అవి అంతగా నిలిచేవి కావు. ఆన్‌లైన్‌లో వాటికి సంబంధించిన సమాచారం వెతికితే నాసిక్‌కి చెందిన ‘నేచర్ ఫర్ ఎవర్ సొసైటీ’ అనే స్వచ్ఛందసంస్థ కనిపించింది.

గూడు..గింజ..
ఈ సంస్థ పిచ్చుకల కోసం, ప్రకృతి సంరక్షణ కోసం పనిచేస్తుంది. వాళ్లని సంప్రదిస్తే పక్షుల గూడు కోసం ఎలాంటి ఏర్పాటుచేయాలి, గింజలు ఎలా పెట్టాలి అనే విషయాలు తెలిశాయి. గింజలు వేయడం ప్రత్యేక విద్యా అనిపించొచ్చు కాని పళ్లెంలో గింజలు పెడితే పక్షులు ముక్కుతో పొడిచి వాటిని చెల్లాచెదురు చేస్తాయి తప్ప తినలేవు. అలా కాకుండా వాటికి తిండి పెట్టేందుకు ప్రత్యేక పద్ధతి ఉందని వాళ్ల ద్వారానే తెలిసింది. ఆ సంస్థ వాళ్లు పిచ్చుకలకి ఉపయోగపడేలా తయారుచేసిన నెస్ట్ బాక్స్‌లు, గింజలు వేసే ఫీడర్స్ దొరికాయి. ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను. నెస్ట్ బాక్స్‌లు ఎలా పెట్టాలి, ఫీడర్‌లు ఎంత ఎత్తులో పెడితే వాటికి అనుకూలంగా ఉంటుందనే విషయాల మీద పరిశోధనలు చేసి మరీ తయారుచేశారు కాబట్టి అవి చక్కగా అమరిపోయాయి. పిచ్చుకలకి భయం పోగొట్టి, మన దగ్గరకు రావాలంటే ఏం చేయాలనేటువంటి విలువైన సమాచారాన్ని కూడా ఆ సొసైటీ వాళ్లు ఇచ్చారు.

పిచ్చుకలతో పాటు
మొదట్లో కొన్ని నెలలు పిచ్చుకలు వచ్చేవి కాని గింజలు తినేందుకు భయపడేవి. ట్రాప్ పెట్టామేమోనని దగ్గరికి రాకపోయేవి. ఏడెనిమిది నెలల పాటు చూసిన తరువాత ఫ్రెండ్లీగానే ఉందనుకుని గూళ్లు ఏర్పాటు చేసుకోవడం, పిల్లల్ని పెట్టడం మొదలుపెట్టాయి. అలా ఇప్పటివరకు ఐదారు తరాలే పెరిగాయి. పిచ్చుకలే కాకుండా రాబిన్, మునియా, హమ్మింగ్‌బర్డ్స్, బుల్‌బుల్ పక్షులతో పాటు మరో ఐదారు రకాల పక్షులు వస్తాయి. కొన్ని పక్షుల పేర్లు తెలియదు కాని చాలా అందంగా ఉంటాయి.
గత రెండేళ్లలో మా తోటకి వస్తున్న ఊర పిచ్చుకల సంఖ్య బాగా పెరిగింది. నెస్ట్ బాక్స్‌లు, ఫీడర్లు మా ఇంటి చుట్టుపక్కల ఐదారుమంది చేత కూడా కొనిపించాను. దాంతో వాళ్ల ఇళ్లకి కూడా పిట్టలు వస్తున్నాయి. అందుకే ఇప్పుడు మా కాలనీ అంతటా పిచ్చుకలు కనిపిస్తున్నాయి. వేసవిలో ప్రతిరోజూ తొమ్మిది రకాల పక్షులు వస్తాయి. హమ్మింగ్‌బర్డ్స్ శీతాకాలంలో ఎక్కువగా వస్తాయి. మిగతా సీజన్‌లలో వేరే రకాల పక్షులు పొద్దున్నా, సాయంత్రం వస్తుంటాయి. చలి, వర్షాకాలాల్లో తేమ ఉండడం వల్ల పురుగులు ఎక్కువగా ఉంటాయి. దాంతో వాటికి ఆహారం దొరుకుతుంది. వేసవిలో బయట ఆహారం దొరకడం కష్టం కాబట్టి మా ఇంటి తోటలోకే ఎక్కువ పక్షులు వస్తాయి. నాలుగైదు టబ్బుల్లో నీళ్లు నింపి ఉంచుతాం. నీళ్లు తాగుతూ, గింజలు, పళ్లు తింటూ రోజంతా కిచకిచమంటూ తిరుగుతుంటాయి. సాయంత్రం వేళకి చెట్ల మీదకి చేరుకుంటాయి. నీళ్ల సమస్య లేకుండా ఉండేందుకని ఇంటిపైన పడిన నీళ్లు, బాల్కనీ నుంచి వచ్చే నీళ్లకి కలిపి ఒకే పైపు ఏర్పాటుచేశాను. ఆ పైపును ఆరడుగుల ఇంకుడుగుంతలోకి పంపించాను. దీనివల్ల మా ఇంట్లో ఒక్క చుక్క నీరు కూడా వృథా కాదు.

వాటికోసమే సేంద్రీయం
క్రిమిసంహారక మందులు, ఎరువులు అస్సలు వాడను. పూర్తిగా సేంద్రీయ పద్ధతిలోనే అంటే వేపపిండి, వర్మికంపోస్టు మిశ్రమాన్ని వాడి మొక్కలు పెంచుతాను. చెట్ల మొదళ్లలో వేసే ఈ మిశ్రమాన్ని ఆరు నెలలకోసారి మారుస్తుంటాం. నాలుగైదు అంగుళాల లోతుకు తవ్వి వేయడం వల్ల మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. అందుకని సీజన్‌కి తగ్గట్టు వచ్చేవి తప్ప మామూలు పురుగులు రావు. మొక్కలకి రసాయన క్రిమి సంహారక మందులు వాడితే ఆ పురుగులు తిన్న పక్షులు చచ్చిపోతాయి. అందుకే పక్షులు క్షేమంగా ఉండాలంటే రసాయనాలకు దూరంగా ఉండాలి.

ఇంటి చుట్టూ మొక్కలు, చెట్లు ఉంటే దోమలు, పురుగులు, పాములు, తేళ్లు వస్తాయనే భయం ఉంటుంది. అలాంటివి ఇంట్లోకి రాకుండా ఉండేందుకు కిటికీలకు, తలుపులకి మెష్ డోర్లు పెట్టాం. మా తోటలో నందివర్ధనం, నూరు వరహాలు, కనకాంబరాలు, మల్లెపూలు, బ్రహ్మకమలాల మొక్కలతో పాటు కరివేప, వేప, కొబ్బరి, అల్ల నేరేడు పండ్లు, అరటి, దానిమ్మ, జామ, పంపర పనస, నారింజ, బొప్పాయి చెట్లు ఉన్నాయి. పదిహేను అరటి చెట్లు ఉండడం వల్ల ఏడాది పొడుగునా అరటి పళ్లు వస్తూనే ఉంటాయి.

ఫేస్‌బుక్‌లో స్నేహితులకి సలహాలు
నాకు ఫేస్‌బుక్ స్నేహితులు 500కి పైగా ఉన్నారు. వాళ్లలో మన దేశం వాళ్లే కాకుండా ఇతర దేశాల వాళ్లు కూడా ఉన్నారు. ఫేస్‌బుక్‌లో పిట్టల ఫోటోలు పెడుతుంటాను. అవి చూసి మేము కూడా పెంచుతామని కొంతమంది సలహాలు అడుగుతుంటారు. పక్షులకి గూడు ఎలా చేయాలి, ఫీడర్స్ ఎక్నడ్నించి తెచ్చారు, వాటిని ఎలా రప్పించాలి అని అడుగుతుంటారు. నాకు ఇంకో లక్ష్యం ఉంది. మా కాలనీలో దాదాపు వెయ్యి చెట్లు నాటాలని. ప్రభుత్వ అధికారులతో ఇప్పటికే దాని గురించి మాట్లాడాం. వానాకాలం వచ్చే లోపులో ఏర్పాట్లు చేసి తొలకరి పడగానే నాటుతాం. ఎక్కువ మెయింటెనెన్స్ లేకుండా భూమికి చలువనిచ్చే మొక్కల్ని నాటుతామ”ని వివరించారు.

జిమ్‌కెళ్లే అవసరం లేదు
వారాంతాల్లో ఉదయం ఐదున్నరకి నిద్రలేచి కాఫీ తాగి పని మొదలుపెట్టి తొమ్మిది లేదా పది గంటల వరకు చేస్తాను. దీనివల్ల జిమ్‌కి వెళ్లకుండానే వ్యాయామం చేసినట్టు అవుతుంది నాకు. వ్యవసాయం పని ఎలాగూ మాకలవాటే కాబట్టి నాకిదేం కొత్త కాదు. పదిగంటల తరువాత కుటుంబంతో బయటికి వెళ్లి… సాయంత్రం ఇంటికొచ్చి మళ్లీ నాలుగ్గంటల్నించి ఆరు గంటల వరకు పని చేస్తాను. శని, ఆదివారాల్లో నా రొటీన్ ఇదే.

– కిరణ్మయి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రా’’చ’’కీయ ద్విప్లేట్స్ -21

            రా’’చ’’కీయ ద్విప్లేట్స్ -21

1-‘’డోక్కా’’కు నడిచే దేవుడుట ‘’రాయ పాటి’’

 ‘’గురూ’’తో వెళ్ళాలో వద్దో తేల్చుకోలేకున్నాడు ‘’యే పాటీ !’’.

2-కమలం ఆంధ్రా ప్రచార సారధి ‘’పురందేశ్వరి’’

  బాబు పక్క వేదికపై ఎవరు ఎవరౌతారు’’ విజయేశ్వరి ‘’?

3-టి ఆర్ .ఎస్  తో జత కట్టిన’’ సి పి.ఏం  రాఘవులు ‘’

  ఎవడు బిచ్చమేస్తే వాడిపంచన చేరే కమ్మీ ‘’ఆంద్ర నాయకులు ‘’.

4-ఆంధ్రాలో సిట్టింగులకు  లేదుట ‘’ధోకా’’

 అధినాయకుల మాట విని పట్టేదేవరు’’ తోకా’’.?

5-బిజెపి ,టిడిపి లోక్ సత్తా జన సేన లను కలిపి ముడేస్తున్న ‘’జే.పి. ‘’

  ఈ ‘’కూటమూట’’ రాల్చి ఓట్ల పంటకు  విజన్ అవుతుందా ‘’ఏ.పి .?’’

6-తనిఖీలలో రోజూ పట్టు బడుతున్న  ‘’కోటాను కోట్లు ’’’

  పట్టుకుంటే ఎవరేస్తారు బాబూ వచ్చి బూతులో  ‘’”ఓట్లు “?

7- ఆదాయం తెలంగాణా కిచ్చి సీమాంద్రకు మిగిల్చారు ‘’అప్పులు ‘’

   ‘’ఆంధ్రా మేధావుల మాట’’ విని అనుకొన్నది సాధిస్తేనే తప్పుతాయి ‘’తిప్పలు ‘’.

8-తెలుగు దేశం పార్టీ ఉంది సుజనా, నారాయణా, రమేష్’’ త్రయం గుప్పిట్లో’’

  బయట పెట్టిన ఆర్.కే ..మేలుకో చంద్రా !లేదా నలిపేస్తారు  అదే’’ గుప్పిట్లో’’.  

9-బిజెపి లో చేరిన కాంగ్రెస్ సిద్ధాంత కర్త’’ ఏం .జే .అక్బర్ ‘’

  ఇప్పుడేమంటారు లౌకికులు ? అనుకోవాలిక  ‘అల్లాహో ఆక్బర్ ‘’.

10-కమలం వైపు’’ కావూరి’’ చూపు ,జస్వంత్ బి జే పి నుంచి’’జంపు ‘’

   ఇదే ఇప్పుడు నడుస్తున్న రాజకీయం కొడుతోంది ‘’కంపు కంపు ‘’.

11-కాంగ్రెస్ పై జరిగిందన్నాడు  అమాత్య్డుడు  చిరు ‘’అత్యాచారం ‘’

   పార్టీ కంటే దేశానికే ఎక్కువ జారిగిందని తెలీదా  ‘’అత్యాచారం’’? .

12- ‘’సర్వే’’ కు గెలుపు  ‘’వీజీ అ(ఆ)ట’’ ట ‘శాసన సభా స్థానం ‘’మల్కాజ్ గిరి ‘’

    సర్వే  చేసి చెప్పాడా ?లేకుంటే జనం పట్టిస్తారు ‘’మాన్యాలు శంకర గిరి  ‘’.

       మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-3-14-ఉయ్యూరు

Posted in రాజకీయం | Tagged | Leave a comment

జై సోమనాద్ అనే ప్రభాస తీర్ధం -2

   జై సోమనాద్ అనే ప్రభాస తీర్ధం -2

                               పురాణాలలో ప్రభాస్

వామన ,కూర్మ ,గరుడ ,భవిష్య ,మత్స్య ,పద్మ ,విష్ణు పురాణాలలోను శ్రీ మద్ భాగవతం ,దేవీ భాగవతం లోను ప్రభాస తీర్ధ ప్రస్తావన ఉంది .స్కంద పురాణం లో ఒక అధ్యాయం దీనికే కేటాయించ  బడింది . వృక్ష శాస్త్ర విభాగం లోనూ ఇంతే ప్రసిద్ధి పొందింది .ఏడు ఎనిమిది శతాబ్దాలలో ప్రభాస్ మరీ వెలుగు లోకి వచ్చింది .అన్ని గ్రంధాలో ఈ  క్షేత్రం గురించిన విశేషాలన్నీ ఉన్నాయి .

     స్కంద పురాణం ప్రభాస ఖండం లో దీని పై ఎన్నో కధనాలున్నాయి .అందులో కొన్నిటిని తెలుసు కొందాం .ప్రభాస ఖండం పూర్తిగా సోమనాధ లింగ వైభావానికే ప్రాముఖ్యతనిచ్చింది .దక్షప్రజాపతి తన 27గురు పుత్రికలను చంద్రుడికిచ్చి వివాహం చేశాడు .కాని చంద్రుడు అందులో రోహిణి పై  మాత్రమె ప్రేమ చూపించి మిగిలిన 26గురిని దగ్గరకు తీయలేదు .వీరు తమకు జరుగుతున్న అన్యాయాన్ని తండ్రి కి ఫిర్యాదు చేశారు. .దక్షుడు చంద్రునితో అందర్నీ సమానం గా చూడమని నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు. వినలేదు .కోపగించిన దక్షుడు అల్లుడు చంద్రుని కుష్టు వ్యాధి సోకి బాధ పడాలని శపించాడు .దీనితో చంద్రుడు కాంతి విహీనుడై వెలవెల బోయాడు .దీని ప్రభావం భూమి మీద ,సముద్రాల మీద పడింది .ప్రపంచం అల్ల కల్లోల మైంది .ఈ బాధ నుండి రక్షించటానికి మహర్షులు దక్షుని దగ్గరకు చేరి శాపం ఉపసంహరించమని కోరారు .శాప ఉపసంహారం తన చేతిలో లేదని ,కాని శివ దేవుని అనుగ్రహం సంపాదిస్తే ఉపశమనం కలగ వచ్చునని సలహా చెప్పాడు .

   చంద్రుడు శివుని గురించి ఘోర తపస్సు చేశాడు .సంతోషించిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై తాను చంద్రుని పూర్తీ గా స్వస్తుడిని చేయ లేనని కాని నెలలో పది హీను రోజులు ప్రకాశ వంతం గా ,మిగిలిన పది హీను రోజులు కళ తగ్గి కనిపించేట్లు చేయగలనని చెప్పాడు .సరే అంతవరకైనా నయం అని సంతోషించాడు అందుకే చంద్రునికి నెలలో శుక్ల ,కృష్ణ పక్షాలు ఏర్పడి మొదటి దానిలో కళలు పెరిగి రెండవ పక్షం లో క్రమం గా తరిగి పోతాయి .ప్రభాస తీర్ధం లో సోమనాధ జ్యోతిర్లిన్గాన్ని అర్చించి చంద్రుడు ఈ తపస్సు చేసి శివుడిని మెప్పించాడు .స్వామి కోడి అంగం పోలిక తో దర్శనమిచ్చాడు .ఆ రూప శివ లింగాన్నే చంద్రుడు ఇక్కడ ప్రతిష్ట చేసి యజ్న యాగాలు నిర్వహించాడు. సోముడు అంటే చంద్రుడు ప్రతిస్టించాడు కనుక సోమనాధ లింగం అయింది .

        దేవ దానవుల యుద్ధం లో రాక్షసులను జయించటం అసాధ్యం అని భావించిన దేవతలు దధీచి మహర్షి ని ఆశ్రయింఛి ఆయన శరీరం లోని ఎముకలను దానం చేయమని  అర్ధిం చారు . వాటి తో దేవతలు ఆయుధాలు చేసుకొని రాక్ష స సంహారం చేస్తారని వేడుకొన్నారు .దేవతల ప్రార్ధన మన్నించి దధీచి మహర్షి యోగ సమాధి చెంది,స్వచ్చంద మరణం పొందాడు .దేవతలు దధీచి మహర్షి ఎముకలను శరీరం నుండి వేరు చేశారు .ఇంద్రుడు దధీచి ప్రక్కటెముక తో వజ్రాయుధం తయారు చేయిన్చుకొన్నాడు .అలాగే మిగిలిన దేవతలు ఎముకలను తీసుకొని తమ తమ ఆయుధాలను తయారు చేయిన్చుకొన్నారు . మహర్షి శరీరం లోని రక్త మాంసాలను కామ ధేనువు నాకేసి ఖాళీ చేసి తోడ్పడింది . ఈ సంఘటన జరిగి నప్పుడు  దధీచి మహర్షి కొడుకు పిప్పలాదుడు చిన్న పిల్లాడు .అతను పెద్ద వాడై తన తండ్రికి జరిగిన జరిగిన అవమానకరమైన ,బాధా పూరితమైన మరణానికి ,దేవతలా కుటిలత్వానికి ప్రతీకారం తీర్చుకొవాలను కొన్నాడు .దీనికోసం అగ్ని దేవుడి అనుగ్రహం సంపాదించాలని తపస్సు చేసి మెప్పించి  సముద్రం లో ఉండే  ‘’బడబానలం ‘’తనలో చేరేట్లు వరం పొందాడు .తన తండ్రి దధీచి మరణాకి కుట్ర చేసిన దేవతల నందర్నీ నాశనం చేయమని బడబానలాన్ని ఆదేశించాడు .దీనికి భయపడ్డ దేవతలు విష్ణు మూర్తి ని శరణు వేడుకొన్నారు .

           విష్ణువు ఆదరా బాదర పరిగెత్తుకొచ్చి పిప్పలాదుని రోజుకు ఒక్క దేవతను మాత్రమె చంపెట్లు ఒప్పించాడు .మొదటగా వరుణ  దేవుడిని చంపాలని నిశ్చయించుకొన్నాడు .సరస్వతీ దేవిని భూమి మీదకు బడబానలాన్ని తీసుకు రమ్మనమని కోరాడు .అలాగే చేసింది సముద్ర తీరాన బడబాన అగ్ని సరస్వతి చేసిన పనికి సంతృప్తి చెంది వరం ప్రసాదిస్తానన్నాడు  .విష్ణు మూర్తి ముందు గా చేసిన హెచ్చరిక తో సరస్వతి దేవి బడబానలాగ్ని మూతి ని సూది బెజ్జం అంత చిన్నది గా చేసుకొని సముద్ర జలాలను పీల్చి ఖాళీ చేయమని కోరింది .ఆ కోరికను మన్నించాడు బడబానలుడు .సరస్వతికి వరం ప్రసాదించాడు .తర్వాత సముద్రాన్ని ఆ బుల్లి మూతి తో తాగి ఖాళీ చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు కాని శక్యం కాలేదు .కనుక వరుణ దేవుడిని సంహరింప లేకపోయాడు బడబానలుడు .ఇచ్చిన మాటకు నిలబడి బడబానలాగ్ని సముద్రం లోనే ఉండి పోయింది .

          సశేషం

               మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ -23-3-14-ఉయ్యూరు 

 
 
 
 
 
Posted in రచనలు | Tagged | Leave a comment

జై సోమనాద్ –ప్రభాస తీర్ధం -1

     జై సోమనాద్ –ప్రభాస తీర్ధం -1

భారత దేశం లోని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో గుజరాత్ లోని సోమనాద్ క్షేత్రం అగ్రగామి .ఎన్నో దండయాత్రలకు తట్టుకొని నిలబడింది .దీనికే ‘’ప్రభాస తీర్ధం’’ అని పేరు .’’జై సోమనాద్’’ పేరిట నేను రాస్తున్న విషయాలన్నీ ఇతిహాస ,పురాణ , చారిత్రికఅంశాలకు చెందినవి .ఆ క్షేత్రం ఎలా మొదలై యెంత ఉత్కృష్ట దశ అనుభవించి పతన మైనదీ , మళ్ళీ ఏ విధం గా  పునర్వైభవం తో భక్తజన సందోహానికి ఏ విధం గా స్పూర్తి దాయకం అయిందీ మొదలైన అంశా లను ఇందులో తెలియ జేసే ప్రయత్నం చేస్తున్నాను .ఇది ‘’శ్రీ ముదిగొండ శివ ప్రసాద్ ‘’గారి చారిత్రిక నవల కాదు .అన్ని అంశాల ప్రస్తావన ఉన్న వ్యాస పరంపర .ఆస్వాదించి ఆనందిస్తారని భావిస్తున్నాను .

చరిత్రకు పూర్వ ప్రభాసం

‘’దేవతేర్పి దుష్ప్రాకో మెహ్  సంగ్యంస్య రూపో  సర్వాంశముం –తీర్దానా ప్రధాన తీర్ధస్య రూపః ప్రభాస్ తీర్ధ ముత్తమం ‘’

అన్ని తీర్ధాలలో ప్రభాస తీర్ధం ఉత్తమ మైనదని దీని భావం .భారత దేశ పడమటి భాగం లో సౌరాష్ట్ర ప్రదేశం అరేబియా సముద్ర తీరం లో లో ‘’ప్రభాస తీర్ధం ‘’విరాజిల్లింది .ఇదే ప్రఖ్యాత సోమనాధ మహా లింగ క్షేత్రం .ఈ ప్రభాస తీర్ధం లోనే భగవాన్ శ్రీ కృష్ణుడు తన అవతార సమాప్తి చేశాడు .సముద్ర తీర ప్రాంతం కనుక ఇక్కడ వేసవిలోనూ శీతాకాలం లోను ఉష్నోగ్రతలలో పెద్దగా వ్యత్యాసం ఉండదు .ఇక్కడ వేసవి చల్లగా ఆహ్లాదకరం గా ఉండటమే ప్రభాస తీర్ధం ప్రత్యేకత .ప్రభాస తీర్దానికి దాగ్గర రైల్వే స్టేషన్ నాలుగున్నర కిలో మీటర్ల దూరం లో ‘’వేరేవాల్ ‘’లో ఉంది .1948వరకు ప్రభాస తీర్ధాన్ని ‘’ప్రభాస పట్టణం ‘’అనే వారు ఆ పేరుతోనే తాలూకా ,మునిసిపాలిటీ కూడా పిలువ బడేది .పూర్వపు జునాగద్ రాష్ట్రం లో ఇది ప్రధాన పట్టణం .1948తరువాత ఈ మునిసిపాలిటీ తాలూకా ను ‘’వేరేవాళ్ ‘’మునిసిపాలిటీ లో కలిపేశారు .దీని వలన ఈ ప్రాంత సాంఘిక ,రాజకీయ ,వాణిజ్య ప్రాముఖ్యత తగ్గి పోయింది .

ప్రభాసా తీర్ధం వైశాల్యం 2180ఎకరాలు .దీనికి దక్షిణం లో సముద్రం ,ఉత్తరం వైపు వ్యవసాయ భూములు ,ఫల వృక్షాలు ,ఉద్యాన వనాలున్నాయి .పడమర అంతా ఇసుక ఎడారి, స్మశానం .తూర్పున అంతా నిరూప యోగ భూమి ఉంది .కనుక దీని అభి వృద్ధి తూర్పు వైపుకే సాధ్యం గా ఉంది .ఎవరికీ శ్రద్ధ లేక పోవటం తో చాలా కాలం ఇది అభి వృద్ధికి నోచు కోలేదు .సోమనాధ దేవాలయ ట్రస్ట్ మాత్రం తన పరిధిలో కొంత అభివృద్ధి పనులు చేస్త్తూ ఉంది .

పూర్వకాలం లో ప్రభాస తీర్ధం ‘’శీట్లా’’ లో సూర్య దేవాలయం వరకు  విస్త రించి ఉండేది .నగ్రాదిల్ లో సూర్యాలయము ఉన్న ప్రాంతాన్ని ‘’నగర్ పూర్ ‘’అనే వారు .ఇక్కడే గంగానది ,హిరణ్య సరితా నదులు సంగమిస్తాయి దీన్ని సంగం ఆని పిలుస్తారు .ఇక్కడ త్రవ్వకాలు జరిపిన పురా వస్తు శాఖ వారికి వేదకాలం కంటే ముందు న్న వస్తువులు లభించాయి .ఇదీ దీని ప్రాధాన్యత .500కు పైగా నాగరకత లు ఇక్కడ వెళ్లి విరిశాయని ఆ శాఖ పేర్కొన్నది .చరిత్రకు పూర్వమే ఇక్కడ అనార్య సంతతి అయిన ‘’మీనూర్ ‘’అనే జాతి ఉండేదని పరిశోధనలో తెలిసింది .ఇక్కడి నుండి అనేక ఆర్య ఓడరేవులకు వర్తక వాణిజ్యాలు ఎగుమతి దిగుమతులు జరిగేవి .ఇలా కొన్ని శతాబ్దాలు గడిచాయి తరువాత సూర్య వంశానికి చెందిన ఆర్యులు సముద్రం ద్వారా ఇక్కడికి చేరుకొని స్థానిక జాతులను వెడల గొట్టారు .వారు ఇక్కడ ‘’అర్క తీర్ధం ‘’లేక భాస్కర తీర్ధం ‘’అనే పేర యాత్రా స్థలం ఏర్పాటు చేశారు .కొంతకాలం తరువాత చంద్ర వంశానికి చెందిన వారు ఇక్కడికి వచ్చి,బలాన్ని పొంది  ‘’సోమ తీర్ధం లేక చంద్ర తీర్ధం గా మార్చారు .మరి కొంత కాలం గడిచిన తర్వాత సూర్య ,చంద్ర వంశీయుల మధ్య సయోధ్యత కుదిరి ‘’ప్రభాస తీర్ధం ‘’గా ఈ ప్రదేశాన్ని పిలుచుకొన్నారు .అప్పటి నుంచి ఆ పేరే స్తిర పడి పోయింది  .

ప్రభాస్

స్కంద పురాణం లో ఒక కద ఉంది .దక్ష ప్రజాపతి అల్లుడైన చంద్రుడు ఒక్క రోహిణి నే చేర దీసి మిగిలిన భార్యలను దూరం చేసి నందువల్ల దక్షుడు కోపించి చంద్రుడికి ‘’కుష్టు వ్యాధి ‘’సోకాలని శపించాడు .అప్పుడు శాప విమోచనం చెప్పమని మామ ను ప్రార్ధిస్తే సోమనాధుని అర్చించ మని చెప్పాడు. చంద్రుడు ఇక్కడికి వచ్చి శివుడిని గూర్చి తపస్సు తో  సోమనాదార్చన చేసి వ్యాధి నుండి విముక్తుడైనట్లు ఉంది .అందుకే ‘’ప్రభాస తీర్ధం ‘’అయింది .ఈ ప్రాంతం లో సూర్య ప్రకాశం చంద్ర శీతలం రెండూ సమానం గా ఉంటాయి కనుక ‘’ప్రాభాస తీర్ధం ‘’అనే పేరు సార్ధకమయింది .ప్రభాసం అంటే ఉద్యయించే సూర్యుడుఉన్న  ప్రభాతం .స్కంద పురాణం మొదటి అధ్యాయంలో దీనికి నందన,శివ ,ఉగ్ర ,భద్రకా ,సమిదాన్ ,కామద్ ,వశ్వరూప్ ,పద్మనాభ్ ,సుదర్శన్ ,మోక్ష మార్గ్అనే పేర్లున్నాయి .

మహా భారత కాలం లో దీనికి భాస్కర తీర్ధం అని పిలిచారు .భాస్కర తీర్ధం ,అర్క తీర్ధం,సోమ తీర్ధం  అని కూడా పిలువ బడింది .సరస్వతీ తీర్ధం అనీ పేరుంది .శివ పట్నం అనీ అంటారు .జైన సాహిత్యం లో ‘’చంద్ర ప్రభాస్ పట్నం ‘’అన్నారు .గుజరాతీ సాహిత్యం లో ‘’ప్రభావ దేవ పట్నం ‘’అంటారు .మొగలాయిలు పట్టణ దేవ్ అంటే సోమ్ పూర్ అని ,సంవత్ అని విల్విపూర్ పట్నం అని ,సుర్ పట్నం అని సోమనాద్ పురం అని పేర్లున్నాయి .

మహా భారత కాలం లో ప్రభాస్ ఒక గొప్ప ఆధ్యాత్మిక తపో కేంద్రం గా  ,పవిత్ర తీర్ధం గా ప్రసిద్ధి చెందింది .శ్రీ కృష్ణ విహార భూమి అవటం తో దీని ప్రాశస్త్యం మరీ పెరిగి పోయింది .పాండవులకు యాదవులకు యాత్రా స్థలం అయిందని భారతం అరణ్య పర్వం లో ఉంది .’’సౌరాష్ట్ర దేశీయ స్తితే –సాగర తటే ప్రభాస తీర్ధః ‘’అని ఉంది .కృష్ణుని అన్న బల రాముడు ఈ క్షేత్ర దర్శనం చేసినట్లు భారతం లో శల్య పర్వం లో ఉన్నది .వన పర్వం లో యాదవ ,పాండవులు ఇక్కడ ఆవాసం ఉన్నట్లు ఉంది .

 

Inline image 1  Inline image 2

 

Inline image 3   

 

 

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -23-3-14-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

ఆదివారం ఈనాడు లో పుస్తక సమీక్ష – లంకె బిందెలు, సరదాగా మరికాసేపు

0001 0002

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రా’’చ’’కీయ ద్విప్లేట్స్ -19(ఖుషీ కుష్వంత్ స్పెషల్ )

    రా’’చ’’కీయ ద్విప్లేట్స్ -19(ఖుషీ కుష్వంత్ స్పెషల్ )

1-హాస్యం పొగరు విగరు, సెక్సూ ,మసాలా కలబోసిన ‘’హేపీ యశ్వంత్ ‘’

‘’ సర్దార్జీ జోకులకేకుల’’ మాస్టరు, సెంచరీ మిస్సయిన ‘’ఖుషీ కుష్వంత్ ‘’.

2-‘’డర్టి ఓల్డ్ మాన్ ఆఫ్ ఇండియన్ జర్నలిజం ‘’ముద్ర పడ్డా’’

 శృంగారం, బూతులు, జోకులు తన జీవితం లో ఒక భాగమే నన్న ‘’పంజాబ్ బిడ్డ ‘’.

3-నాలుగో ఏటనే ‘’శృంగార క్రీదాభిరాముడి’’నని జబ్బ చరచి  చెప్పిన ‘’సర్దార్జీ ‘’

 స్త్రీలను తల్లుల్లా చెల్లెల్లా చూచే సంస్కారం తనకు లేదన్నాడీ ‘’రాత మాస్టర్జీ’’.

4-‘’పరిటాల’’ వారసురాలు బాంబు నేల  ‘’సునీత ‘’

 ‘’సైకిల్’’ దిగి’’ కమలం’’ పట్టి  అవుతుందా’’ కాషాయం నేత ‘’?

5- కాంగీ కి జెల్ల కొట్టి’’ జేసి బ్రదర్స్ ’’

  సైకిలెక్కి జిల్లాలో చేసేస్తారా ‘’అదుర్స్ ‘’.

6-జనం లోకి నడిచి వెళ్ళే ఓపికా దమ్మూ లేక చేబట్టారు ‘’బస్సు యాత్ర ‘’

  చేసిందానికి పేడకల్లాపి చల్లి ‘’చిరుకు ‘’జనం చేస్తారా ‘’తుస్సు యాత్ర ?’’

7-‘’రాయ పాటి’’ తో  సహా చేరుతాడట’’ డొక్కా ‘’

   గుంటూరు ఏం పి గారి ప్లాన్ మాత్రం ‘’పక్కా ‘’.

8-నమ్మక ద్రోహి కెసిఆర్ అన్న ‘’నాగేంద్ర దానం ‘’

  ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదా ‘’జంప్ జిలానీ  వైనం’’?.

9- ఓటమి భయంతో ఎన్నిక కు దూరమైన ‘’చిదంబరం ‘’

  కొడుకుని నిల బెట్టినా ఓడించి పంపిస్తుందట’’ జయ’’ ‘’చిదంబరం ‘’.

10- ‘’తెరాసా’’ నుండి తనకు  స్పందన లేదన్న’’ కత్తీ సుత్తీ  నారాయణ ‘’

   ‘’ హలో’’ అనలేదని, జత కట్టేవారు లేరని.పాడుకొంటున్నాడు ‘’అల్లో నారాయణా ‘’!

11”-అలుగుట మాత్రమె” ఈ మధ్య   ఎరిగిన ఓల్డ్ మాన్ ”ఆద్వాని”
    ” మోడీ” నీడ కూడా చూసి భయపడుతున్నాడా ”ఆక్టా జేనేరిని ”.? 
  

 మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-3-14-ఉయ్యూరు 

 

Posted in రాజకీయం | Tagged | Leave a comment

ఉయ్యూరు మునిసిపాలిటీ ఎన్నికల సందర్భం గా…

ఉయ్యూరు మునిసిపాలిటీ ఎన్నికల సందర్భం గా ‘’మన చానెల్’’ లో’’లైవ్ ‘’గా ప్రసారమైన చర్చా వేదికలో నా ప్రసంగం
నిన్న ఉదయం ఉయ్యూరు లోని ‘’మన చానెల్ ‘’ మేనేజింగ్ డైరెక్టర్ ఫోన్ చేసి రేపు మునిసిపల్ ఎన్నికల సందర్భం గా చర్చా వేదికనుసాయంత్రం నాలుగింటికి  లైవ్ ప్రసారం చేస్తున్నామని నన్ను అందులో గ్రామ పెద్ద గా సరస భారతి అధ్యక్షుని గా  పాల్గొనమని కోరారు.సరే నన్నాను .ఈ రోజు అంటే 20వ తేది గురువారం సాయంత్రం చర్చా వేదికలో పాల్గొన్నాను .మేనేజింగ్ డైరెక్టర్ ఆహ్వానం పలికి వేదిక ఉద్దేశ్యాన్ని అందరికి తెలియ జేశారు .ఇందులో  చైర్మన్ పదవికి పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్ధులు తమ ఎన్నికల ప్రణాళిక ఏమిటో వివరిస్తారని ,పెద్దలు తమ అభిప్రాయాలను వెల్లడిస్తారని చెప్పారు .ముందుగా జగన్ పార్టీ నుంచి వంగవీటి శ్రీనివాస కుమార్ ,మరియు చైర్మన్ అభ్యర్ధి రెహ్మాన్ మాట్లాడి తమ అభిప్రాయాలను తెలియ జేశారు .తర్వాత మార్క్సిస్ట్ కమ్మ్యూనిన్స్ట్ పార్టీ తరఫున కార్య దర్శి మాట్లాడారు .తెలుగు దేశం తరఫున అభ్యర్ధులు పొగిరి రాము ,జమ్పాన ఉమామహేశ్వర రావులు తమ భావాలను ప్రణాళికలను వివరించారు .తర్వాతనన్ను మాట్లాడమన్నారు .నేను మాట్లాడిన విషయాలే మీకు తెలియ జేస్తున్నాను .
‘’మునిసిపల్ అంటే స్వేచ్చ గా ఉన్న ప్రాంతం లోని పౌరులు అని లాటిన్ భాష లో అర్ధం .ఒక విధంగా  మునిసిపాలిటి అంటే ‘’స్థానిక స్వేచ్చా ప్రాంతం ‘’దీనికే ‘’నగర పాలిక’’ అంటారు .అందులోని ప్రజలు నాగరికులు గా వ్యవాహరింప బడతారు  .అలెక్సాండర్ కు పూర్వం గ్రీకు దేశం లో ‘’పోలిస్ ‘’అనే స్వేచ్చాయుత నగర పాలిక సంస్థ లుండేవి .అలేక్సాండర్ తండ్రి ఫిలిప్ వీటిని జయించి ఒకే రాజ్యం చేశాడు .1687లో మన దేశం లో మునిసిపల్ పాలనా వ్యవస్థ వచ్చింది .మద్రాస్ ,కలకత్తా బొంబాయి లు మునిసిపల్ కార్పోరేషన్ లు1726 లో అయ్యాయి .1882లో అప్పటి బ్రిటిష్ వైస్ రాయ్ లార్డ్ రిప్పన్ ప్రజాస్వామ్య పాలనా విభాగం గా మునిసిపల్ చట్టం తెచ్చాడు .1919భారత ప్రభుత్వం మునిసిపాలిటీలకు అధికారాలు ఇవ్వాలని నిర్ణయించి1935లో పూర్తీ అధికారాలతో స్థానిక మునిసిపల్ ప్రభుత్వాలను ఏర్పరచింది .మునిసిపల్ వ్యవస్థ ను ఏర్పరచటం లో ఉద్దేశ్యాన్ని ప్రభుత్వం ఇలా వివరించింది ‘’’’strategic urban planning in a country to create effective ,responsive ,democratic ,transparent ,accountable local government ‘’ఏర్పడి ప్రజా సేవలో తరించాలని చెప్పింది .దీన్ని తెలుగు లో చెప్పాలంటే ‘’దేశం లో నైపుణ్యం తో నగర ప్రణాళిక తో ,ప్రజోపకరమైన విధానాలతో బాధ్యతా యుత ,జవాబు దారీ ఉన్న ప్రజాస్వామిక ,పారదర్శక  ప్రభుత్వాలు ఏర్పడాలి.వీటి ద్వారా స్థానిక ప్రాజలకు సేవలందించాలని భావం  .


మునిసిపాలిటీలు ప్రజారోగ్యం ,నీటి సరఫరా ,రక్షిత మంచి నీరు ,పారిశుద్ధ్యం పై ద్రుష్టి పెట్టాలి .విద్య ను ముఖ్య విషయం గా తీసుకొని అందరికీ విద్య నేర్పించాలి .ప్రజలను అంటు రోగాలనుంది కాపాడాలి .కట్టడాల నిర్మాణం పై అదుపు ఉండాలి .ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలి .ప్రజా రక్షణ ముఖ్యం .అగ్ని ప్రమాదాలనుండి కాపాడాలి .వీధి దీపాలు సక్రమం గా వెలిగెట్లు చూడాలి .అంతర్గత రోడ్లను నిర్మించాలి .ఇవన్నీ మునిసిపాలిటీ విధులు .
ఉయ్యూరు ఇప్పటిదాకా పంచాయితీ గా ఉంది .మూడేళ్ళ కితం మునిసిపాలిటి హోదా వచ్చింది .అయనా పంచాయితీ వాసన పోలేదు .మునిసిపాలిటి అని ప్రజలు ఇంకా అనుకోలేదు .పరిస్తితుల్లో మార్పు లేకపోవటమే దీనికి కారణం .సుప్రీం కోర్టు జోక్యం తో రాష్ట్రం లో మునిసిపల్ ఎన్నికలు జరగటం ఈ వ్యవస్థ పై రాజకీయ నాయకులకు ఉండే అలసత్వం ఏమిటో తెలుస్తోంది .ఉయ్యూరు మునిసిపాలిటి కి మొదటి సారి గా ఎన్నికలు ముప్ఫై వ తేదీ న జరుగుతున్నాయి .ఇక నుంచి వార్డు మెంబర్లు కౌన్సిలర్లు అని పంచాయితీ మునిసిపాలిటి అని ,సర్పంచ్ చైర్మన్ అని పిలువ బడుతారు .ఉయ్యూరు పంచాయితీ మొదటి ప్రెసిడెంట్ అలీం సాహెబ్ గారి సేవలు ఇప్పటికీ అందరూ చెప్పుకొంటారు .అలాగే కొత్త గా ఏర్పడే మునిసిపాలిటి అలాగే ఆదర్శ వంతం గా ఏర్పడి పాలించాలి ఉయ్యూరులో రాత్రి ఎనిమిది అయితే వైద్య సదుపాయం లేదు .ముందుగా దాన్ని పునరుద్ధ రించి ప్రాజల ప్రాణాలను కాపాడటం తక్షణ కర్తవ్యమ్ .దీన్ని ‘’హెల్త్ ఎమర్జెన్సి ‘’గా తీసుకొని ముందుగా అమలు చేయాలి .’’ఆధార్ కార్డు’’ తోఏర్పడ్డ ఇబ్బందుల్నుంచి జనానికి కాపాడాలి . సిలిండర్ కు  వెయ్యి రూపాయల పైన ఖర్చు పెట్టి కొంటె ఆ డబ్బు  బ్యాంకులలో  జమ కాలేదు .ఈ డబ్బు ను ప్రజలకు తిరిగి ఇచ్చి వేసేట్లు చూడాలి .ఇది రెండవ తక్షణ కర్తవ్యమ్ . రాజకీయ నాయకుల దందా తో ఇసుక అక్రమ రవాణాకు గురై సామాన్యుడికి అందకుండా పోతోంది. దాన్ని సీనరైజ్ చేసి ఆదాయం మునిసిపాలిటీలకు దక్కెట్లు తక్కువ రెట్ల లో ఇసుక అందరికి అందుబాటులోకి వచ్చేట్లు చేయటం మూడవ ముఖ్యమైన పని .
ఉయ్యూరు సెంటర్ లో కాలేజీలు ,స్కూళ్ళు విడిచి పెట్టిన తర్వాత వందలాది విద్యార్ధినీ విద్యార్ధులు బస్సులు అందకా పుష్పక విమానాల్లాంటి బస్సుల్లో ఫుట్ బోర్డ్ మీద  ప్రమాదపు అంచులలో ప్రయాణం చేస్తున్నారు. ఇది చూడటానికి చాలా భయంకరం  గాఉంటుంది .అందుకని సాయంత్రం వేళల్లో ఉయ్యూరు సెంటర్ నుండే సిటీ బస్సులు, సబర్బన్ బస్సులు అన్ని వైపులకు నడిచే ఏర్పాట్లు చేయటం నాలుగవ ముఖ్యమైన పని .ఉయ్యూరు సెంటర్ లో ఏ బస్సు ఎప్పుడొస్తుందో తెలియదు వెంటనే టైం టేబుల్ బోర్డు లు ఉంచాలి .అలాగే రైల్వే సమాచారమూ అందించాలి సెంటర్ లో ‘.ఇది అయిదవ ది.అన్నిటికి డబ్బు అవసరం ప్రజా ప్రతినిధులు ప్రభుత్వాన్ని ఒప్పించి, ఒత్తిడి చేసి డబ్బు సాంక్షన్ చేయించుకోవాలి .రాజలందరి సహకారం ,కే సిపి ,రోటరీ ,లయన్ క్లబ్ ల వంటి స్వచ్చంద సంస్థల సేవలు  ,వితరణ శీలురైన దాతల సహకారం తో ప్రజా సేవకు అవసరమైన నిధులు సేకరించాలి .
కొత్తగా ఎన్నికైన వారు ప్రజలకు అందు బాటు లో ఉండాలి .అధికారులకు పూర్తీ అధికారాలివ్వాలి .వారి పని విధానం పై పర్య వేక్షణ ఉండాలి .చాణక్యుడు కూడా అర్ధ శాస్త్రం లో రాజుకు దండన అధికారామే తప్ప మిగిలిన విషయాలలో మంత్రుల పర్య వేక్షణ లో జరగాలని చెప్పాడు .’’సోలార్ ఎనర్జీ’’ని ఉపయోగించి వీధి దీపాలను వెలిగించి కరెంట్ ఆదా చేయాలి .సాంస్కృతిక కార్య క్రమాలకు అన్ని హంగులతో పురమందిరం అంటే టౌన్ హాల్ నిర్మించి సభలూ సమా వేశాలు జరిపే సొకర్యం కలిగించాలి .రైల్ టికెట్ కౌంటర్ వచ్చింది .విమాన టికెట్ల కు కూడా ఉయ్యూరు లో ఏర్పాటు కల్గించాలి .చెత్తను కుళ్ళింప జేసి  అందులో నుంచి విద్యుత్ శక్తి ని పొందే ఏర్పాట్లు చేయాలి .ఉయ్యూరు లో ఎన్నో ఏళ్ళుగా ప్రజలు కలలు కంటున్న ఇంజినీరింగ్ ,మెడికల్ కాలేజీ లను ప్రాభుత్వం పై ఒత్తిడి తెచ్చి ఏర్పాటు చేయాలి .
చాలీ చాలని ఇళ్ళ స్థలాలను పంచకుండా పేదలకు అర్హులకు బహుళ అంతస్తుల భవనాలను నిర్మించి తక్కువ స్తలం లో ఎక్కువ మందికి ఆవాసం కల్పించాలి .క్రీడా ప్రాంగణమూ అవసరమే .వృద్ధుల సేవాశ్రమం ముఖ్యమే .రోటరీ క్లబ్ వారు శ్మశానాన్ని చాలా ఖర్చు పెట్టి పునర్నిర్మిస్తున్నందుకు అభినందనలు .దీనికి ‘చని పోయిన వారి శవాలను తరలించటానికి అందరికి అందు బాటు లో ఉండే ‘’మహా ప్రస్తానం ‘’అన బడే ‘’వాన్ ‘’ను ఏర్పాటు చేయటం అతి ముఖ్యమైన విషయం .ఉయ్యూరు మత సామరస్యానికి ప్రతీక గా ఉంది. దీన్ని కొత్త వారు స్పూర్తిగా తీసుకోవాలి .ఎందరో పెద్దలు వ్యవహార వేత్తలు ,వ్యాపారస్తులు ,విద్యా వంతులు ఉన్న పట్టణం .ఇక్కడి వారే కొలచల సీతారామయ్య గారు రష్యా వెళ్లి ‘’ఆయిల్ శాస్త్రవేత్త ‘’గా పేరు పొందారు .సూరి సీతారం రాం గోవా వీరుడని పించుకొన్నాడు .వీరందరి ప్రేరణ స్పూర్తి మనకు ఆదర్శం కావాలి .
‘’ రాక్షసీ! నీ పేరు రాజ కీయం ‘’అన్న మాట  మారిపోయి ‘’రాక్షకీ ! నీపేరు రాజకీయం కావాలి ‘’అనేది కొత్తనినాదం కావాలి . స్లోగన్ నాయకులను వదిలేసి ‘’విజన్ ‘’ఉన్న వారిని ఎన్నుకొని కొత్త మునిసిపాలిటీ కి కొత్త జవ సత్వాలను అందించండి .ఇలాంటి మంచి చర్చా వేదికను ఏర్పాటు చేసిన ‘’మీ, మా ,’’మన చానెల్ ‘’వారికి అభినందనలు .ఇలాంటి చర్చలు ఇక ముందుకూడా సామజిక అంశాలపై నిర్వహించి ప్రజా సేవ లో ముందుండాలని ‘’మన ‘’వారిని కోరుతున్నాను .నాకు ఈ వేదిక పై అవాకాశం ఇచ్చిన’’మన  వారందరికీ ‘’కృతజ్ఞతలు .’’అని ముగించాను .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -20-3-14-ఉయ్యూరు

Posted in రాజకీయం | Tagged | Leave a comment

మనిషే ముఖ్యమన్న మానవేంద్రుడు – గుమ్మా వీరన్న

మానవాళికి మహోన్నతమైన మానవవాద తత్వాన్ని అందించిన మహనీయుడు మానవేంధ్రనాథ్ రాయ్. ఎం.ఎన్.రాయ్‌గా ప్రసిద్ధుడైన మానవేంద్రుడు అసాధారణ ప్రతిభా సంపన్నుడు. ఆలోచనా రంగంలో, ఆచరణ రంగంలో అత్యున్నత దశలకు చేరిన అఖండ మేధావి. భావ విప్లవానికి దారితీసిన రాయ్ ఆలోచనలు, సామాజిక విప్లవానికి దారిచూపిన ఆచరణ, అనుభవాలు ఆయన తాత్విక జీవితాన్ని మూడు విలక్షణమైన దశలుగా తీర్చిదిద్దాయి. తీవ్రవాదిగా బయలుదేరిన రాయ్ క్రమంగా అం తర్జాతీయ కమ్యూనిస్టు నాయకుడుగా రూపొంది, చివరికి రాడికల్ హ్యూమనిస్టు సిద్ధాంతకర్తగా పరిణతి చెందాడు.

1946లో రాయ్ 22 సిద్ధాంతాల రూపంలో రాడికల్ హ్యూమనిస్టు తత్వాన్ని ప్రతిపాదించారు. ఆధునిక విజ్ఞాన శాస్త్ర ఫలితాలపై ఆధారపడి నిర్మించిన తాత్విక సిద్ధాంతమే రాడికల్ హ్యూమనిజం. ఈ నవ్య సిద్ధాంతం తాత్విక రంగంలో భౌతిక వాస్తవికవాదాన్ని, సామాజిక రంగంలో సమతావాదాన్ని, రాజకీయ రంగంలో పార్టీరహిత నిర్మాణాత్మక ప్రజాస్వామ్యాన్ని, ఆర్థికరంగంలో సహకార ఆర్థిక విధానాన్ని ప్రతిపాదిస్తుంది. వ్యక్తికి ప్రథమ స్థానాన్నిచ్చి స్వేచ్ఛగా, హుందాగా జీవించే హక్కును గుర్తించే వైఖరిని, తత్వాన్ని మానవవాదంగా నిర్వచించవచ్చు. అన్నిటికీ మానవుడే ప్రమాణమనేది దాని మౌలిక సూత్రం. మానవుడు తనకుతానే లక్ష్యం. మరొక లక్ష్యానికి అతడు సాధనం కారాదు. సమాజం మానవుని సృష్టి. తన సుఖ సంతోషాల కోసం స్వేచ్ఛ కోసం తాను చాలా సంస్థలను ఏర్పాటు చేసుకున్నాడు. చివరికి వాటికి తానే బానిసగా మారిపోయాడు. కులం, మతం, జాతి, వర్గం వంటివన్నీ సమష్టి మిథ్యా భావనలు. వాటి కోసం వ్యక్తులను బలిచేయడం జరుగుతోంది.

స్వార్థ రాజకీయాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయి. ప్రజాసంక్షేమమే తమ ధ్యేయమని అన్ని రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్నాయి. అందుకోసమే తమకు అధికారం కావాలంటాయి. చివరికి అధికారం కోసం పోరాటంలో అనేక రకాల అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నాయి. జాతి, కులం, మతం, వర్గం, ప్రాం తం వంటి సంకుచిత భావాలను రెచ్చగొట్టి విద్వేషాలను పురిగొల్పుతున్నాయి. లక్ష్యం ప్రజాసంక్షేమం నుంచి అధికారం మీదకు, అక్కడి నుంచి ధనార్జన మీదకు మారుతుంది. ఈ విధంగా ప్రజాస్వామ్యం అంతమై పార్టీస్వామ్యం, పార్టీ నాయకస్వామ్యం అవతరించింది. అంటే పార్టీ నాయకుల నియంతృత్వమే ప్రజాస్వామ్యంగా పరిణమించడం జరుగుతుంది. ఈ కారణం చేతనే పార్టీ రహిత ప్రజాస్వామ్యం కావాలంటుంది రాడికల్ హ్యూమనిజం.

ప్రజలు తమ సార్వభౌమాధికారాన్ని వినియోగించుకోడానికి చిన్న చిన్న స్థానిక ప్రజాసంఘాలుగా ఏర్పడాలి. ఈ స్థానిక సంఘాలు రాజ్యానికి పునాదిగా ఉండాలి. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ సంఘాలు ఏర్పడాలి. రాజకీయ విధులన్నీ వికేంద్రీకరించబడాలి. ఈ ప్రజాసంఘాలు స్థానిక స్వపరిపాలనాంగాలుగా పనిచేయాలి. అప్పుడు పిరమిడ్ ఆకారంలో ఏర్పడే రాజ్యవ్యవస్థ, రాజ్య విధులను సక్రమంగా నిర్వర్తించగలుగుతుంది. శాసనసభలకు సభ్యులను ఎంపిక చేయడమే గాక కొత్త చట్టాలను ప్రవేశ పెట్టడానికి, ప్రజాప్రతినిధులను వెనుకకు పిలిపించడానికి (రీకాల్) ప్రధాన సమస్యల విషయమై అభిప్రాయ సేకరణకు అధికారం ఉండాలి. ఈ భావాలనే లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ తన ‘సంపూర్ణ విప్లవం’లో ప్రతిపాదించారు.

పార్టీ లేకుండా రాజకీయాలు సాధ్యమా అని సందేహించే వారున్నారు. ఆ దిశగా ప్రయత్నించకుండానే నిర్ణయాలకు రావడం తొందరపాటవుతుంది. అయితే పార్టీరహిత రాజకీయాలు విజయవంతం కావాలంటే ముందుగా ప్రజలంతా విద్యావంతులు, చైతన్యవంతులు కావాలి. అందుకే అన్నిటికన్నా ముందుగా భావాలలో మార్పు రావాలి. భావాలలో వచ్చే మౌలిక మార్పునే ‘భావ విప్లవం’ అంటాం.
గుమ్మా వీరన్న
అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘం
(నేడు ఎం.ఎన్.రాయ్ 128వ జయంతి)

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వ్యంగ్య హాస్యం లో ”యశ్వంత్ ”-కుష్వంత్

వ్యంగ్యం,శృంగారం,హాస్యమూ ఆయన ఆయుధాలు
సర్దార్జీ జోకులకు చిరునామా
నవలా రచయిత, పాత్రికేయుడు కూడా

దేశవ్యాప్తంగా ఉగ్రవాద దాడులు జరుగుతున్న సమయంలో వాటి నుంచి తప్పించుకునేందుకు భారతీయ వీఐపీలకు పోలీసులు కొన్ని ముందు జాగ్రత్త చర్యలు సూచించారు. కొన్ని పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయవద్దని చెప్పారు. అవేంటంటే..తరచూ ఒకే హోటల్ లేదా రెస్టారెంట్‌కు వెళ్లవద్దు
ప్రతిరోజూ ఒకే సమయంలో ఒకే పార్కుకు వాకింగ్‌కు వెళ్లవద్దు
ప్రతిరోజూ ఆఫీసుకు ఒకే కారులో వెళ్లవద్దు
ప్రతి రాత్రీ ఒకే స్థలంలో ఒకే వ్యక్తితో పడుకోవద్దు

… కాస్తంత శృంగారంతో కూడిన హాస్యం కనిపించిందా!? అయితే ఇది తప్పకుండా కుష్వంత్ సింగ్ జోకే! వ్యంగ్యంతో కూడిన హాస్యోక్తులతో.. సర్దార్జీ జోకులతో.. తన రచనలతో దేశ ప్రజలను ఆనందడోలికల్లో ఓలలాడించిన ప్రఖ్యాత రచయిత, జర్నలిస్టు కుష్వంత్ సింగ్ (99) ఇకలేరు! సంపూర్ణ జీవితాన్ని అనుభవించడమే కాకుండా జీవిత చరమాంకం వరకూ ఏదో ఒక రచన చేస్తూ వచ్చిన అక్షర సైనికుడు గురువారం ఉదయం తన స్వగృహంలోనే ప్రశాంతంగా తుది శ్వాస విడిచారు. కుష్వంత్ భార్య 2001లోనే మరణించగా.. ప్రస్తుతం ఆయనకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. చనిపోయే చివరి క్షణం వరకు మానసికంగా ఆరోగ్యంగా, స్పృహలోనే ఉన్నారని, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది రావడంతో ఆయన మరణించారని కుష్వంత్ తనయుడు రాహుల్ సింగ్ చెప్పారు. ఉదయం మరణించిన కుష్వంత్‌కు గురువారం సాయంత్రమే ఢిల్లీలోని దయానంద్ ముక్తిధామ్ విద్యుత్తు శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులతోపాటు కేంద్ర మంత్రులు సల్మాన్ ఖుర్షీద్, కపిల్ సిబల్, బీజేపీ అగ్రనేత ఎల్‌కే ఆడ్వాణీ, జయా జైట్లీ తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు. కుష్వంత్‌కు అభిమానులు ఎంతమందో ఆయనను ద్వేషించేవారు కూడా అంతేమంది! భారత్, పాక్ శాంతి ప్రక్రియలో కుష్వంత్ అత్యంత కీలక పాత్ర పోషించారు. వీసా నిబంధనలు లేకుండా ఇరు దేశాల ప్రజలు స్వేచ్ఛగా సంచరించాలని ఆకాంక్షించేవారు. అలాగే, దేశంలో ‘సర్దార్జీ జోకులు’ తెలియనివారు ఉండరు. కుష్వంత్ జోకులనే సర్దార్జీ జోకులని పిలుస్తారు. అందుకే, కుష్వంత్ చనిపోయారని తెలిసిన వెంటనే సోషల్ మీడియాలో నివాళులు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, ఐయూఎంఎల్ నాయకుడు అహ్మద్, కేంద్ర మంత్రి మనీష్ తివారీ, సినీ నటుడు షారుక్ ఖాన్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.

బూతు జోకుల రచయిత
కుష్వంత్ అనగానే చాలామంది బూతు జోకుల రచయితగానే చూస్తారు. ఆయనను ‘ద డర్టీ ఓల్డ్ మేన్ ఆఫ్ ఇండియన్ జర్నలిజం’ అని కూడా అంటుంటారు. కానీ, శృంగారం, జోకులు ఆయన జీవితంలో ఒక భాగం మాత్రమే. రచయితగా ఆయన విభిన్న అంశాలపై రచనలు చేశారు. భారత్, పాకిస్థాన్ విభజన సమయంలో జరిగిన ఘటనలపై ఆయన రాసిన ‘ట్రైన్ టు పాకిస్థాన్’ మనసులను పిండేస్తుంది. ఇరు దేశాల సరిహద్దుల్లో అప్పటి ఘటనలను కళ్లకు కడుతుంది (ఇందులో కూడా ఆయన శృంగారానికి పెద్దపీట వేశారనేది మరో విమర్శ). మహిళలను ఆయన కేవలం శృంగారానికి పనికొచ్చే వస్తువుగానే చూశారు. అదే విషయాన్ని పలు సందర్భాల్లో స్పష్టం చేశారు కూడా. అందుకు తన చివరి రోజుల్లో రాసిన ఆత్మకథ ‘కుష్వంత్‌నామా – ద లెసన్స్ ఆఫ్ లైఫ్’లో ఆయన విచారం కూడా వ్యక్తం చేశారు. “మీకో విషయం చెప్పాలి. చిన్నప్పటి నుంచీ నేను కాముకుడినే. శృంగారపరమైన ఆలోచనలు నాకు నాలుగో ఏటనే మొదలైపోయాయి. ఇప్పుడు 97 పూర్తయ్యాయి. ఇప్పటికీ నా మది నిండా అవే ఆలోచనలు. భారతీయ సమాజంలో మహిళలను తల్లులుగా, చెల్లెళ్లుగా, కుమార్తెలుగా పరిగణిస్తారు. కానీ, నేను ఎన్నడూ అలా చూడలేదు” అని రాసుకున్నారు. న్యాయవాదిగా తన జీవితాన్ని ప్రారంభించి దౌత్యవేత్తగా ఎదిగారు. తర్వాత జర్నలిస్టుగా మారారు. భారత ప్రభుత్వం తరఫున కెనడా, టొరంటోల్లో సమాచార అధికారిగా పని చేశారు. బ్రిటన్, ఐర్లండ్‌ల్లోని హై కమిషన్ కార్యాలయంలో సమాచార అధికారిగా వ్యవహరించారు. ఆ తర్వాత ప్రణాళికా సంఘం ప్రచురించే ‘యోజన’ పుస్తకానికి వ్యవస్థాపక ఎడిటర్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత ద నేషనల్ హెరాల్డ్, హిందుస్థాన్ టైమ్స్‌లకు ఎడిటర్‌గా పని చేశారు. అప్పట్లో ఆయన రాసిన ‘విత్ మాలిస్ టూవార్డ్స్ వన్ అండ్ ఆల్’ ఎంతో ప్రాచుర్యం పొందింది.

ఇందిరకు అత్యంత సన్నిహితుడు
రచయితగా, జర్నలిస్టుగా, కామెంటేటర్‌గా విభిన్న పాత్రలను ఆయన పోషించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి అత్యంత సన్నిహితుల్లో కుష్వంత్ ఒకరు. ఇందిర విధించిన ఎమర్జెన్సీని సమర్థించిన అతి కొద్ది మందిలో ఆయన కూడా ఒకరు. అందుకే, ఎమర్జెన్సీ ముందు 1974లో ప్రభుత్వం ఆయనను పద్మ భూషణ్‌తో సత్కరించింది. 1980లో రాజ్యసభకు కూడా ఎంపికయ్యారు. కానీ, ఇందిరా గాంధీ హయాంలోనే అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంపై సైనిక చర్యకు నిరసనగా ఆయన పద్మ భూషణ్‌ను వెనక్కి ఇచ్చేశారు. అయినా, కేంద్రం 2007లో ఆయనను పద్మ విభూషణ్‌తో సత్కరించింది. 97 ఏళ్ల వయసులో తన ఆత్మకథ ‘ట్రూత్, లవ్ అండ్ ఎ లిటిల్ మాలిస్’ను రాశారు. దానిని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ సతీమణి గురుశరణ్ కౌర్‌కు అంకితమిచ్చారు. ఆ తర్వాత గత ఏడాది “2012 స్వాతంత్య్ర దినోత్సవం రోజున నాకు 98 ఏళ్లు వచ్చాయి. నా ఆరోగ్య పరిస్థితి నాకు తెలుస్తూనే ఉంది. మరో పుస్తకాన్ని ఇక రాయలేను. నేను చాలా ఏళ్లు జీవించాను. నాకు లోటు అన్నదే తెలియదు. సంపూర్ణ జీవితాన్ని అనుభవించాను. నిజం చెప్పాలంటే ఇప్పుడు నేను చచ్చిపోవాలని అనుకుంటున్నా. నా జీవితంలోనూ, జోకుల్లో కూడా నేను మనిషినీ వదిలిపెట్టలేదు. దేవుడినీ వదిలిపెట్టలేదు. అందుకే, తమను నవ్వించిన వ్యక్తిగా ప్రజలు గుర్తుంచుకుంటే నాకదే చాలు” అని రాసుకున్నారు. విచిత్రం ఏమిటంటే.. ప్రజలు ఆయనను హాస్యప్రియుడుగానూ గుర్తుంచుకుంటారు. అపహాస్య ప్రియుడుగానూ గుర్తుంచుకుంటారు!!

ప్రముఖ రచయిత, జర్నలిస్టు కుష్వంత్ సింగ్ వందేళ్లూ పూర్తి చేస్తారని ఎంతగానో ఆశించిన మేధావులు, విమర్శకులు, విశ్లేషకులు, కాలమిస్టులు, పాత్రికేయులు, రచయితలకే కాక అశేష పాఠకులకు, అభిమానులకు ఆయన తీవ్ర నిరాశనే మిగల్చినట్టయింది. ఈ లోకాన్ని దాదాపు పూర్తిగా చదివేసి, జీర్ణించుకున్న కుష్వంత్ అజ్ఞాత లోకానికి తన 99వ ఏట తరలిపోవడం కోట్లాదిమంది అభిమానుల్ని విషాదంలో ముంచేసిందనడంలో సందేహం లేదు. భారతదేశంలో ఆయన వంటి రచయిత గానీ, కాలమిస్టు గానీ న భూతో న భవిష్యతి.

ఇప్పటి పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో హడాలి అనే గ్రామంలో 1915 ఫిబ్రవరి 2న జన్మించిన కుష్వంత్ సింగ్ లండన్‌లో న్యాయశాస్త్రం చదివారు. ఆయన వ్యంగ్య, హాస్య రచనల్లో పేరెన్నికగన్న వ్యక్తి. కవితలు, పద్యాలంటే చెవి కోసుకునే కుష్యంత్ పాశ్చాత్యులకు, భారతీయులకు మధ్య ఉన్న సామాజిక, నడవడికి సంబంధించిన సారూప్యాలను తన హాస్య రచనల్లో, ప్రసంగాల్లో ప్రత్యేకంగా ప్రస్తావించేవారు. 1970, 1980 దశకాల్లో ఆయన అనేక సాహిత్య, వార్తా సంచికలకు, రెండు జాతీయ వార్తా పత్రికలకు సంపాదకుడుగా పనిచేశారు. 2007లో దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ ఆయనను వరించింది. ఆయన కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రారంభమైన ‘యోజన’ పత్రికకు ప్రారంభ సంపాదకుడు. ఆ తరువాత ఆయన ‘ది ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా’ వారపత్రికకు సంపాదకుడుగా బాధ్యతలు నిర్వహించి, దాని సర్క్యులేషన్‌ను 65 వేల నుంచి నాలుగు లక్షలకు తీసుకు వెళ్లారు.

ఆ తరువాత ‘నేషనల్ హెరాల్డ్’, ‘హిందుస్థాన్ టైమ్స్’ దినపత్రికలకు కూడా సంపాదకత్వం నిర్వహించారు. ఇలస్ట్రేటెడ్ వీక్లీలో ఆయన నిర్వహించిన ‘విత్ ది మెలైస్ టువార్డ్స్ వన్ అండ్ ఆల్’ అనే కాలమ్ కోట్లాది మంది అభిమానులను ఆకట్టుకుంది. ఈ కాలమ్‌లో ఆయన లౌకికవాద భావాలు, శాంతి సందేశాలు ప్రతిఫలించేవి. ఉర్దూ, పంజాబీ భాషల్లో ఉద్దండులైన పలువురు రచయితలతో తనకున్న సాన్నిహిత్యాన్ని ఆయన తన కాలమ్స్‌లో తప్పనిసరిగా ప్రస్తావించేవారు.
గ్రంథకర్తగా ఆయన దేశ విదేశాల్లో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన రాసిన ‘ట్రెయిన్ టు పాకిస్థాన్’, ‘ఐ షల్ నాట్ హియర్ ది నైటింగేల్’, ‘ఢిల్లీ’ పుస్తకాలు అనేక పర్యాయాలు పునర్ముద్రణలకు నోచుకున్నాయి. 95 ఏళ్ల వయసులో ఆయన రాసిన ‘ది సన్‌సెట్ క్లబ్’ అమ్మకాల్లో ఓ రికార్డు సృష్టించింది. ఇక ఆయన రాసిన ‘ఎ హిస్టరీ ఆఫ్ ది సిక్స్’ అనే రెండు సంపుటాల గ్రంథం అనేక భాషల్లోకి తర్జుమా అయింది. ఆయన అనువాదాలు, రచనల్లో సిక్కు మతం, సంస్కృతి, ప్రకృతి, వర్తమాన విశేషాలు, ఉర్దూ కవితలు పాఠకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆయన 2002లో రాసిన ఆత్మకథ ‘ట్రూత్, లవ్ అండ్ ఎ లిటిల్ మెలైస్’ అనే గ్రంథం విదేశాల్లో సైతం విపరీతంగా అమ్ముడుపోయింది. ఆయన 80కి పైగా గ్రంథాలు రాశారు.

1980 నుంచి 1986 వరకూ రాజ్యసభ సభ్యుడుగా కూడా ఉన్న కుష్వంత్‌కు 1974లో పద్మభూషణ్ పురస్కారం లభించింది కానీ, 1984లో స్వర్ణాలయంపై సైనికుల దాడికి నిరసనగా ఆయన ఆ పురస్కారాన్ని తిరిగి ఇచ్చేశారు. ఆయన కావల్ మాలిక్‌ను వివాహం చేసుకున్నారు. ఆయనకు రాహుల్ సింగ్ అనే కుమారుడు, మాలా అనే కుమార్తె ఉన్నారు. ఢిల్లీలో స్థిరపడ్డారు. తన స్త్రీలోలత్వం గురించి, కొందరు ప్రముఖ మహిళలతో ఉన్న సంబంధాల గురించి చేతిలో ‘స్కాచ్’ గ్లాసుతో నిర్మొహమాటంగా చెప్పుకునేవారు.

ఆయన తన ప్రజా జీవితంలో కొన్ని అభాండాలను కూడా మోయక తప్పలేదు. ఆయన పాలక కాంగ్రెస్ పార్టీకే అనుకూలమనే విమర్శలు వస్తుండేవి. ఇందిరా గాంధీ కుటుంబానికి ఆయన సన్నిహితుడు కావడం అందుకు కారణం. స్వర్ణాలయం మీద దాడి జరిగిన తరువాత ఆ సాన్నిహిత్యం బెడిసింది. ఆమె మరణానంతరం సిక్కుల మీద దేశవ్యాప్తంగా జరిగిన దాడులు కూడా ఆయనను కలచివేశాయి. ఆ తరువాత ఆయన ప్రముఖ న్యాయవాది హెచ్.ఎస్. ఫుల్కా ప్రారంభించిన సిటిజెన్స్ జస్టిస్ కమిటీలో చేరి సాధారణ పౌరుల హక్కుల కోసం పోరాడారు.

తాను చాలా అదృష్టవంతుడినని, చక్కని భోజనం, మధురమైన మద్యం ఏనాడూ తనకు దూరం కాలేదని కుష్వంత్ చెప్పేవారు. ‘కుష్వంత్‌నామాః ది లెసన్స్ ఆఫ్ మై లైఫ్’ అనే తన పుస్తకంలో ఆయన జీవితం నేర్పిన పాఠాల గురించి చక్కని ఉదంతాలతో రాశారు. వృద్ధాప్యం, మరణం పట్ల భయం, సెక్స్‌లోని ఆనందం, కవితల్లోని మాధుర్యం గురించి, హాస్యం ప్రాధాన్యం గురించి, సంతోషకర జీవితం గురించి అద్భుతంగా వ్యాసాలు రాశారు. అలాగే రాజకీయ నాయకులు, రాజకీయాలు, భారతదేశ భవిష్యత్తు వంటి అంశాలపై కూడా ఆయన లోతైన అవగాహనతో వ్యాసాలు రాశారు.ఆయన స్వయంగా చెప్పినట్టు ‘ది డర్టీ ఓల్డ్ మ్యాన్’ కుష్వంత్ పరిపూర్ణ జీవితాన్ని అనుభవించారు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మోహన ”కందాయం ”అనే సమ్మోహన మకరందం

 

 
 
 

స’మ్మోహన’ మకరందం

ఛళ్లున తగిలి నొప్పి కలిగించే సంఘటనను కూడా నవ్వుపుట్టించేలా చెప్పాలంటే భాషపై పట్టే కాదు, హాస్యప్రియత్వం కూడా మెండుగా ఉండాలి. పైగా అలాంటి వ్యక్తికి అపారమైన పాలనా అనుభవం కూడా ఉంటే పాఠకుడికి హాయిగా చదువుకోగల పుస్తకం లభిస్తుంది. అలాంటి పుస్తకమే- మోహన మకరందం. ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గర కీలకమైన బాధ్యతలు పోషించిన మాజీ ఐఏఎస్ అధికారి మోహన కందా జీవితానుభవాల చరిత్ర ఇది.. “నేనే కాదు.. ఉన్నత స్థానంలో ఉండే ప్రభుత్వాధికారులందరూ ఎఱ్ఱనలే. నన్నయ గ్రాంధికంలా ఉంటారు ఒక ముఖ్యమంత్రి. తిక్కన వ్యవహారికంలా ఉంటారు ఆయన వారసుడు. ఇద్దరి మధ్యా జరిగే ట్రాన్సిషన్ స్మూత్‌గా ఉండేలా, అధికార బదిలీ కుదుపుల్లేని ప్రయాణంలా ఉండేలా చూసేవాళ్లం మేమే”.. అనే మోహన్ కందా జీవితంలోని ఆసక్తికర భాగాలు..

గమనించారా… నా పేరూ, గాంధీగారి పేరూ ఒకటే! – మోహన్! దానికో స్టోరీ ఉంది. ఏడో నెలలో పుట్టిన నేను ఉంటానో, ఊడతానో అని పేరు కూడా పెట్టలేదు మా వాళ్లు. స్వాతంత్య్ర యోధురాలు, మహిళా ఉద్యమసారథి దుర్గాబాయి దేశ్‌ముఖ్‌గారున్నారు కదా, ఆవిడ అందరికీ దుర్గాబాయమ్మగారు కానీ నాకు దుర్గమ్మపిన్నే. తనూ మా అమ్మా కాకినాడలో క్లాస్‌మేట్స్. ప్రాణస్నేహితులు. ఉద్యమాల్లో కలిసి పనిచేశారు. మేం మద్రాసు వచ్చాక మళ్లీ స్నేహం బలపడింది.
మద్రాసు వచ్చాక ఆవిడ ఆంధ్రమహిళా సభ పెట్టింది. సభకు అడయార్‌లో ఓ భవంతి కట్టి దాని శిలాఫలకాల ఆవిష్కరణకు గాంధీగారిని రప్పించింది. గాంధీగారు వచ్చినపుడు నన్ను తీసుకెళ్లి ఆయన చేతిలో పెట్టారు. ఆయన నన్ను ఆశీర్వదించారు. అంతే.. నాకు ఆయన పేరు – మోహనదాస్ అని పెట్టారు. రాను రాను ‘దాసు’ కాలగర్భంలో కలిసిపోయింది. కాలక్రమేణా అది మోహన్‌బాబుగా.. మోహన్‌గా మిగిలింది.
* * *
కాకినాడలో మా మాతామహుడు చావలి రామసోమయాజులుగారు పేరుమోసిన కాంగ్రెసువాది. ఆయన పేరుమీద వీధి కూడా ఉందక్కడ. మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో మెంబర్ ఆయన. కాకినాడ మున్సిపాలిటికి పదహారేళ్లు నిర్విఘ్నంగా చైర్మన్‌గా చేసారు. ఆయనకు గుఱ పు బండి ఉండేదట. అది సాయంకాలం ఇంటికెళ్లే టైం అయిపోతే ఎవరు చెప్పక్కరలేకుండానే వెనక్కితిరిగి దానంతట అదే వచ్చేసేదట. తర్వాత గవర్నమెంటు సర్వీసులో చేరాక అటువంటి జీవాలను చాలా చూశాను. ఆఫీసుకి వచ్చే టైం మాట ఎలా ఉన్నా, వెళ్లే టైము కాగానే ఠంచన్‌గా వెళ్లిపోయేవారు. మొహం కడిగేసుకోవడం, బ్యాగ్ సర్దేసుకోవడం అన్నీ సాయంత్రం 5 గంటల లోపునే! అప్పుడు తెలిసింది – ఆ గుఱ ం గత జన్మలో ప్రభుత్వోద్యోగి అయి ఉంటుందని!
* * *
ట్రిక్కులు పనిచేయవు…
నా పేరు చెప్పగానే ఓ తరం వారు “పెళ్లి చేసి చూడు” సినిమాలో చిన్న పిల్లవాడి వేషం వేశారు కదా అంటారు. “అమ్మా నొప్పులే..” అనే ఓ నృత్య నాటికలో నేను స్కూలు పిల్లవాడి వేషం వేశాను. అదెలా జరిగిందంటే – మేం మైలాపూర్‌లో చెంగళనీర్ పిళ్లయార్ వీథిలో ఉండేవాళ్లం. దానికి దగ్గర్లో ఉన్న లజ్ కార్నర్‌లో హిమాలయా కూల్‌డ్రింక్స్ అని ఒక దుకాణం ఉండేది. అక్కడ కూర్చుని ఏవేవో కబుర్లు చెబుతూ ఉండేవాడ్ని. ఓ రోజు నేను అక్కడ కూర్చుని వాగుతూ ఉంటే నా ధోరణి చూసి “వీడికి స్టేజి ఫియర్ లేనట్టుంది. మనకు పనికి వచ్చేట్టున్నాడు” అనుకున్నారేమో, ఇద్దరు నా దగ్గరికి వచ్చి “బాబూ సినిమాల్లో యాక్ట్‌చేస్తావా?” అని అడిగారు(ట).
“తప్పకుండానండి పదండి” అన్నాను(ట).
“ముందర మీ అమ్మని, నాన్నని అడుగుదాం. ఇంటికెళ్దాం పద” అన్నారు(ట) వాళ్లు.
“అది మాత్రం వొద్దు. నేను యాక్ట్ చేయాలని మీకుంటే ముందర నన్ను తీసుకెళ్లండి తర్వాత వాళ్లకి చెబుదాం” అని వాళ్లని తొందర పెట్టేశాను(ట). వాళ్లు ఘటికుడివిరా బాబూ అనుకుని ఉంటారు.
తీసుకెళ్లి చిన్న ఆడిషన్ ఏదో చేశారు. అది బాగుంది లాగుంది. వేషం ఆఫర్ చేద్దామని మా ఇంటికి వచ్చారు. నేను సినిమాల్లోకి వెళ్లడం మా అమ్మకి సరదాయే. కానీ మా నాన్నకి చెప్పాలంటే భయం. అందుకే వాళ్లతో “ముందర మీరు కానివ్వండి. తర్వాత నేను ఆయనకు నింపాదిగా చెబుతా” అంది(ట).
* * *
ఎన్‌టిఆర్ – కోడితో పోటీ పడాలి..
ఎన్.టి. రామారావు గారి దగ్గర పనిచేయడం చాలా కష్టం. అలా అని పాపం ఆయన బ్రహ్మరాక్షసుడేమీ కాదు… చిక్కల్లా బ్రాహ్మీముహూర్తంలో.. అంటే తెల్లవారుఝామున ప్రారంభమయ్యే ఆయన దినచర్యతోనే… మనం కోడితో పోటీ పడి లేచి రెడీగా ఉండాలి. అప్పటికప్పుడే ఫోను చేసి నిద్ర లేపి మాట్లాడేస్తారు. “అబ్బే, ఇప్పుడు మీరు చెప్పినా బుర్రకెక్కదు. పదిగంటలకు ఆఫీసుకి వచ్చాక చెప్దురుగాని..” అంటే కుదరదు. ఆయన ముఖ్యమంత్రి. నేను ఆయన దగ్గర స్పెషల్ సెక్రటరీని. ఓ రోజు అటువంటి ‘అసురవేళ’లో నిద్రలేపి “మోహన్, ఆ సొసైటీది వాళ్ల కిచ్చేసేయ్..” అని ఒక్క ముక్క చెప్పేసి ఫోను పెట్టేశారు. నిద్రలో జోగుతూ విన్నాను. నిద్రమత్తు దిగాక ఆలోచిస్తే ఏమీ బోధపడలేదు – సవాలక్ష సొసైటీలలో ఏ సొసైటీ గురించి చెప్పారు? ఏది ఇవ్వాలి? వచ్చిన వాళ్లెవరు? వాళ్లేమడిగారు? ఈయన దేనికి సమ్మతించారు?
ఆయనకే ఫోన్ చేసి అడగాలా? అడగగలనా? ఏమీ తెలియనట్టు ఊరుకోనా?… గలనా? ఆ సొసైటీ ఏదో కనిపెట్టలేక, అప్పుడు సిఎం ఆఫీసులో మిత్రుడు హేమచంద్ర ప్రసాద్‌కి (రామారావుగారికి ప్రయివేట్ సెక్రటరీ) ఫోన్ చేసి “బాబూ, సరిగ్గా కాస్సేపు క్రితం ఆయనను కలిసిందెవరో గుర్తు పెట్టుకో. నేను ఆఫీసుకి వచ్చిన తర్వాత చెప్పు” అని చెప్పాను. ఆఫీసుకి వెళ్లాక ఆ వెళ్లినతన్ని పట్టుకుని, పిలిపించి “నువ్వేం అడిగావ్? ఆయన ఏం చేస్తానన్నారు?” అని కనుక్కుని… ‘ఓహో, ఇతను ఇలా అడిగాడు కాబట్టి ఆయన ఇలా చేస్తానని అని ఉంటారు” అనుకుని… రెండు ప్లస్ రెండు నాలుగన్నట్టు లెక్క వేసి సంగతి తెలుసుకుని దాని ప్రకారం అమలు చేశాను.
రిజర్వ్ బ్యాంక్ గవర్నగా పనిచేసి రిటైరైన వై. వేణుగోపాలరెడ్డి గారంటే నాకు చాలా గౌరవాభిమానాలు. ముక్కుసూటిగా మాట్లాడడంలో ఆయన దిట్ట. చెన్నారెడ్డిగారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన హైదరాబాదు జిల్లా కలెక్టర్. ఓ రోజు రాత్రి (అదే అర్ధరాత్రి) చెన్నారెడ్డిగారు ఆయనకు ఫోన్ చేసి “ఐ వాంట్ యూ టు కమ్ ఇమ్మీడియేట్లీ. ఓ విషయం డిస్కస్ చేయాలి” అన్నారు. వై వి రెడ్డిగారు తొణక్కుండా చెప్పారు – “నేను మా ఫ్రెండ్స్‌తో కూచుని ఓ చిన్న డ్రింక్ తీసుకుంటున్నాను సర్. ఇప్పుడొస్తే బాగుండదేమో! రేపు పొద్దున్న వస్తాను. కాదూ కూడదు అర్జంటు విషయం అంటారా, ఇప్పుడే ఫోన్‌లో చెప్పేయండి. ఏం చేయగలమో చూద్దాం” అన్నారు. చెన్నారెడ్డి గారికి అలాంటి జవాబు ఎప్పుడూ వచ్చి ఉండదు. చాలామంది అటువంటి పరిస్థితుల్లో ఉండవచ్చు కానీ ఆ విధంగా చెప్పడం మాత్రం వేణుగోపాలరెడ్డిగారికే చెల్లింది.
* * *
మేం ఏ ఎండకా గొడుగు పడతామా?
‘మా బ్యూరాక్రాట్స్‌కు ఎఱా ప్రగడే ఆదర్శం’ అని నేనంటే మీరు ఆశ్చర్యపడతారని నాకు తెలుసు. ఎందుకంటే ‘కవిత్రయం అనగా ఎవరు?’ అన్న బిట్ క్వశ్చన్‌కు ఆన్సర్‌గా రాసేటప్పుడు తప్ప ఎఱా ప్రగడ మనకు ఎక్కడా తగలడు.
నేనే కాదు ఉన్నత స్థానంలో ఉండే ప్రభుత్వాధికారులందరూ ఎఱ నలే. నన్నయ్య గ్రాంధికంలా ఉంటారు ఒక ముఖ్యమంత్రి. తిక్కన వ్యావహారికంలా ఉంటారు ఆయన వారసుడు. ఇద్దరి మధ్యా జరిగే ట్రాన్సిషన్ స్మూత్‌గా ఉండేలా, అధికార బదిలీ కుదుపుల్లేని ప్రయాణంలా ఉండేలా చూసేవాళ్లం మేమే. వరుసగా వచ్చే ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య పార్టీలు వేరే ఉండవచ్చు, సిద్ధాంతాలు తేడాగా ఉండవచ్చు, వయోభేదం ఉండవచ్చు, వేగంలో వ్యత్యాసం ఉండవచ్చు, విద్యాధిక్యతలో, అవగాహనలో, ప్రవర్తనలో, నైతికతలో – ఎన్నో రకాల భేదాలు ఉండవచ్చు.
ఎన్ని ఉన్నా పరిపాలించబడే ప్రజలకు మాత్రం తేడా తెలియకూడదు. ఒకే ప్రభుత్వం అనూచానంగా నడుస్తున్నట్టు అనిపించాలి. ముఖ్యమంత్రి ఎవరైతేనేం, ఏ పార్టీ అధికారంలో ఉంటేనేం, మనం నిత్యం చూసే ఆర్‌డీఓగారు మారలేదు, ఆయన పనితీరూ మారలేదు అనిపించాలి. నిజానికి మార్పు ఉంటుంది. కానీ అది మార్పులా అనిపించకుండా చూడడమే బ్యూరాక్రసీ లక్షణం. ఈ క్రమంలో బ్యూరాక్రసీ చాలా అవస్థే పడుతుంది. ఎఱా ప్రగడను పట్టుకుని నువ్వు నన్నయకు విధేయుడవని తిక్కనా, తిక్కనకు విధేయుడవని నన్నయా శంకించలేదు కానీ బ్యూరాక్రసీకి మాత్రం పాత వ్యవస్థకు విధేయులనే నింద మోయక తప్పదు.

మోహన మకరందం
అనుభవాలూ – జ్ఞాపకాలూ
రచయిత: మోహన్ కందా
పేజీలు: 252, వెల: 200 రూపాయలు
ప్రతులకు: నవోదయా బుక్ హౌస్, హైదరాబాదు, ఫోన్: 92474 71361

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment