కవితా ‘’శబ్ద శిఖరాలు ‘’

కవితా ‘’శబ్ద శిఖరాలు ‘’

హైదరాబాద్ ఆకాశ వాణి కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మాన్యులు శ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ గారు తమ కేంద్రం ఆధ్వర్యం లో ఈ ఏడాది గణ తంత్ర దినోత్సవ సందర్భం గా నిర్వహించిన జాతీయ కవి సమ్మేళనం లో తెలుగు అనువాద కవితలను ‘’శబ్ద శిఖరాలు ‘’పేరిట ముద్రించి నాకు ఒక కాపి ని పంపగా ఈనెల పదిహేడున అందింది .దాన్ని నిన్న అంటే ఇరవయ్యవ తేదీ న చదివేశాను .ఇలా జాతీయ కవి సమ్మెళన కవితల్ని ఆకాశ వాణి పుస్తకం గా ముద్రించటం ఇదే ప్రధమం .ఈ పూనిక ,ఆలోచన ,శ్రీ ఆదిత్య ప్రసాద్ గారికి వచ్చినందుకు బహుదా అభినంద నీయులు .నాకు తెలిసి నంత వరకు జాతీయ కవి సమ్మెళన.తెలుగు అనువాద కవితలను శ్రీ సాగి కమలాకర శర్మ గారు తమ ‘’మూసీ ‘’మాస పత్రిక లో ,ప్రతిఏడాది ఫిబ్రవరి సంచికలో ప్రచురించే వారు .ఇప్పుడిది  ఆకాశ వాణి హైదరా బాద్ కేంద్రానికి దక్కింది .కొత్త గా ఆలోచించటం నవ్య మార్గాలను పాత విధానాలపై నిర్మించిటం,అనుక్షణ పరిశోధన ల  లో ఆయన అందె వేసిన చెయ్యి .సంగీత సాహిత్య సంపన్నులైన వారి కీర్తి కిరీటం లో ఇది కలికితురాయి .నా మీద ఉన్న ప్రత్యెక అభిమానం తో నాకు పంపినందుకు వారికి కృతజ్ఞతలు అంద జేస్తూ ఇందులోని విశేషాలను ‘’కవితా ‘’శబ్ద శిఖరాలు ‘’శీర్షిక తో మీకు అందజేస్తున్నాను .

 

 

 

 

 

2014గణ తంత్ర దినోత్సవ జాతీయ కవి సమ్మేళనం హైదరాబాద్ ఆకాశ వాణి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ శ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ గారి ఆధ్వర్యం లో హైదరాబాద్ లో జనవరి తొమ్మిదవ తేదీ బాగ్ లింగం పల్లి లోని ఏ.పి ఎస్.ఆర్ .టి.సి.కళా భవనం లో జరిగింది .22 భారతీయ భాషలకు చెందిన వివిధ కవులు సమర్పించిన కవితలను 22మంది కవులు హిందీలోకి అనువాదం చేయగా ,సుప్రసిద్ధులైన 22 మంది తెలుగు కవులు తెలుగులోకి అనువాదం చేశారు .మొత్తం 66మంది కవీశ్వరుల భువన విజయం లాంటి ఈ బృహత్తర కార్య క్రమాన్ని  మాన్యులు శ్రీ మంగళ గిరి వారి చొరవ సాహసం అంకిత భావం తో దిగ్విజయం గా నిర్వహించి ఢిల్లీ అధికారులను మెప్పించటమే కాక స్థానికులు ,సాహిత్యాభిమానులు అశేషం గా విచ్చేసి కవితా సోయగాలకు మురిసి అభినందించారు .సాహసం చొరవ ,దీక్ష ,ఆలోచన ,ఆచరణలో అద్వితీయులైన శ్రీ ఆదిత్య ప్రసాద్ గారి సమర్ధతకు నిదర్శనం గా ఈ కవి సమ్మేళనం న భూతో న భవిష్యతి అన్నట్లు జరిగిందని వార్తా మాధ్యమాలు బహుదా ప్రశంశా వర్షం కురిపించాయి .

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఆంద్ర ప్రదేశ్ గవర్నర్ శ్రీ ఇ .ఎస్. ఎల్.నరసింహన్ ,సభాధ్యక్షులుగా ఆలిండియా రేడియో న్యూఢిల్లీ డైరెక్టర్ జనరల్ శ్రీ ఆర్ .వెంకటేశ్వర్లు వేదికను సుసంపన్నం చేయగా ,చెన్నై ఆలిండియా రేడియో అడిషనల్ డైరెక్టర్ శ్రీ కే.పి. శ్రీనివాసన్ శుభాకాంక్షలు తెలిపారు .హైదరాబాద్ ఆకాశ వాణి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మరియు  ఈ కార్యక్రమ నిర్వాహకులు శ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ ప్రస్తావన చేసి శోభ తెచ్చి ఆ కాంక్షను వివరించారు .’’ఇది అత్యంత అరుదైన కార్యక్రమమని ‘’న భూతో గా ‘’నిర్వహించిన హైదరాబాద్ కేంద్రం ,నిర్వాహకులు శ్రీ ఆదిత్య ప్రసాద్ గారి సమర్ధ బృందానికి హృదయ పూర్వక శుభాకాంక్షలు ‘’అని ఆనందం గా చెప్పారు శ్రీ  వెంకటేశ్వర్లు .ప్రసంగం కొనసాగిస్తూ ‘’మానవీయ విలువలను ఒక తరం నుండి మరో తరానికి అందించే అద్భుత సాధనం సాహిత్యం అని ,భిన్నత్వం లో ఏకత్వాన్ని ప్రశంసిస్తూ ,సమాకాలీన సామాజిక సమస్యలకు సున్నితం గా స్పందిస్తూ హృదయ స్పర్శిగా ఉన్న ప్రతి కవితా ఖండికా చీకట్లను పార దోలే చిరు దీప కళిక అన్నారు .మొట్టమొదటి సారిగా జాతీయ కవి సమ్మేళనం వేదిక పై ప్రాంతీయ భాషాను వాదాలు అంటే’’ మన తెలుగు’’ అనువాదాలు సమర్పించటం అద్భుత ప్రయత్నమని ,వీటిని పుస్తక రూపం లో తీసుకు రావటం అభినంద నీయమని దీనికి ప్రేక్షకుల స్పందన అత్యద్భుతం గా ఉండటం కొనియాడ దగిన విషయమనీ అన్నారు .శ్రీ శ్రీనివాస్ ‘’జాతీయ సమైక్య వేదిక పై ,భాషాఐక్యత ,సామరస్యం వెళ్లి విరిశాయి.పరస్పర అవగాహనకు తోడ్పడింది .’’అని కీర్తించారు .

శ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ తమ ప్రస్తావనలో ‘’ఈ రోజు ఆకాశ వాణి హైదరాబాద్ కేంద్ర చరిత్రలోనే కాకుండా ,దేశ వ్యాప్తం గా ఉన్న ఆకాశ వాణి వ్యవస్థలోనే ఒక అపూర్వ ఘట్టం అని ,సాధారణం గా ఆతీయ కవి సమ్మేళనాలు ఉత్తర హిందూ దేశ ఆకాశ వాణి కేంద్రాలలో నిర్వహించటం ఆన వాయితీ గా వస్తోందని ,అక్కడ హిందీ అనువాదాలకే స్తానం ఉండేదిని ,ఈ వేదిక పై తెలుగు అనువాదాలకు చోటు కల్పించమని డైరెక్టర్ జనరల్ శ్రీ వెంకటేశ్వర్లు గారిని కోరిన వెంటనే అనుమతించటం మరువ రాని అనుభూతి అని ,గవర్నర్ గారు అన్నిటిలో దిట్ట అని వారి రాక అందరికి ఆనంద దాయకమని జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత శ్రీ సి నారాయణ రెడ్డి గారు సభా ప్రారంభాకులుగా విచ్చేయటం సభా గౌరవాని ఇనుమ డింప జేసిందని ,తమ సిబ్బంది అహరహం కష్టించి దీన్ని దిగ్విజయం చేశారని ,పని దినం లో నిర్వ హించిన ఈ కవి సమ్మేళనానికి అనూహ్యం గా  యువత ,రసజ్న ప్రేక్షకులు పెద్ద సంఖ్యలోహాజరవటం చిరస్మరణీయం ‘’అని  ఆనడాను భూతులతో   కృతజ్ఞతలు తెలియ జేశారు .

మొదటి కవిత ‘’కేదార విలయ తాండవం ‘’ప్రో .జి ఎస్.ఆర్ కృష్ణ మూర్తి సంస్క్రుత కవితకు డా..తాడేపల్లి పతంజలి గారి తెలుగు అనువాదం .ఛందో గర్భితమైన పద్యాలివి .ఎందరినో పొట్ట పెట్టుకున్న కేదార నాద్ వరద భీభత్సం దీనికి నేపధ్యం .కంటిముందే తండ్రి తల్లి అన్నా చెల్లీ అందరూ ప్రవాహ ఉధృతికి కొట్టుకు పోయి విగత జీవులై పోతుంటే గుండెలు పిందించే దృశ్యాన్ని కవులిద్దరూ భావ గర్భితం గా దృశ్యమానం చేశారు .’’నట్టింటిలో ప్రాణముల్ అల్లల్లాడేది వేల వారి తుది వాన్చాకార మేమౌనోకో “”అని బాధ పడ్డారు .శివుడికి ఆశుతోషుడు అనే పేరుంది .అంటే సుఖాలను ఇచ్చేవాడు కాని ఇక్కడ దుఖాన్ని కలిగించాడు .’’వేల్పుల దేవర యాశుతోషుకున్ కేలిది మొక్కినంశివుడు కీడును గోడును ఆప లేదు ‘’అని వ్యధ చెందాడుకవి .’’వికారాళ భీకర విద్యుల్లతా దంస్ట్రాo కురమ్ములముల దండ దాల్చే ‘’పద్యం విలయ తాండవానికి  శాబ్దిక  స్వరూపమే .ఈ కవిత సమకాలీన స్పృహకు నిదర్శనం

‘’వ్యాఖ్యాన రహితం ‘’కవితను డా కరబిదేక హజారికా అస్సామీ భాషలో రాస్తే డా.దేవరాజు మహారాజు తెలుగు సేత చేశారు .’’కొన్ని సంబంధాలకు పేర్లు ఉండవని ,కొన్ని వర్దిల్లటానికి ఇల్లు కూడా ఉండవని ,అలా నగర మంతా చుట్టి గోధూళి లో వెనుదిరుగుతారని ఎండు టాకుల పరుపుల మీద మేనువాల్చి సంకల్పం సంశయం ,నిస్సహాయాల భూమికల్ని మరుసటి రోజు కోసం చుట్టిపెడతారని’’ అన్నారు .’కొందరు ఎలాంటి వారంటే ‘’వాళ్ళను చూస్తూనే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి –వాళ్ళకు గుక్కెడు   నీళ్ళిచ్చే  వారుండరు .వేల వేల సంబంధాల విచిత్ర సమ్మేళనం ఇది .అయినా వారి పేరు ఏ పట్టిక లోను ఉండదు ‘’అని అనామకుల గురించి ఆవేదన చెందుతాడు కవి .కాని ఒక హెచ్చరిక మాత్రం చేస్తాడు ‘’అస్తిరమైన క్షణాలపై నిఘా పెడుతూ –దూరం నుంచి కాలం చూస్తూ ఉంటుంది ‘’ జాగ్రత్త కోసం హితవు తో కూడిన హెచ్చ్చరిక ఇది .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-7-14-ఉయ్యూరు

 

Posted in రేడియో లో | Tagged | Leave a comment

పిబరే కృష్ణ .ర.సం.-6(చివరి భాగం )

పిబరే కృష్ణ .ర.సం.-6(చివరి భాగం )

అలా కొండలు బండల వెంబటి తిరుగుతున్న మనకు మరో మోసగాడు ఎడురౌతాడు .చీటీలు కట్టమని పెద్దయ్యను అడిగితె చీదరించిపోమ్మంటే ,ఆయన అటు పోంగానేభార్య నారాయనమ్మను బుట్టలో వేసి డబ్బు దొబ్బి ‘’నీ యట్ల పెద్దమ్మల్ని దద్దమ్మలని ఇబుటికి ఎందర్ని సూసిం ట్ని’’అని  మనసులో అనుకోని ఉడాయిన్చాడొకడు ‘’నింగి నిజాము ,దొంగ యాసము ‘’కత లో .వ్యవసాయం దండగ కాదు పండగ అని ‘’రైతు కళాచారం ‘’(సంస్కృతీ )లో పొలం పనులు అందరూకలిసి కట్టుగా చేసుకోవటం ,ఆ ఫలితాన్నీ హుషారుగా పంచుకోవటం లో ఉన్న సంతృప్తిని వ్యక్తం చేసే కధ .నీతితి పుస్తకాలు గీత పుస్తకాలకంటే ‘’నేల ఉనికి నాకు బాగా తెలుసు నాయునికి ఈ నేల మన్నని దాన్నిన్కనే నాకు మన్ను పైన ఇష్టం .మన్ను పని ఇంగా ఇష్టం .ప్రపంచానికే అన్నం పెట్టె ఈ అన్న పూర్ణమ్మ బిడ్డను నేను .మీ బిడ్డను కాలేను .మీరు పొండా’’అని గదిరిన నేల పుత్రుని ఆరాధన .రైతు కళాచారం .శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు .ఉన్నదంతా పోగొట్టుకుని తిండికి లేక ఏదో బతుకు తెరువు దారి చూపించమని ఒక ‘’తెలివప్ప’’ను అడిగితె వాడు హోసూరు కొండపైకి తీసుకెళ్ళి చెత్తలో పడి ఉండే దిష్టి బొమ్మ బయటికి తీసి ,ఎండి కుళ్ళి పడున్న నిమ్మకాయలు ఏరి ఒక వేప కొమ్మకు దిష్టి బొమ్మ తగిలించి వేప చెట్టుమీద దిష్టి దేవుడున్నాడని తానూ కొండా కింది వాళ్ళదగ్గర ప్రచారం చేస్తానని జనం వచ్చి మొక్కు తీర్చుకునేట్లు  చేస్తానని నిమ్మకాయల్ని వాళ్ళ చుట్టూ తిప్పి  దిష్టి పోయిన్దని చెప్పమని బోధిస్తాడు .ఇంతకంటే వాళ్ళేమీ చేసి చావలేరని ఊహిస్తాడు .ఊళ్ళో ప్రచారం బాగా జరిగి జనం రావటం నిమ్మకాయల దిష్టి తీయటం పెద్ద ప్రహసనం గా తయారై పోయింది .మనిషికి రూపాయి ఫీజు .పదేళ్ళయినా తర్వాత తెలివప్ప వచ్చి చూశాడు .తన కళ్ళను నమ్మలేక పోయాడు .అక్కడ ఒక గుడి వెలిసింది .జనం సముద్రం లావచ్చి వెడుతున్నారు .దిష్టికి పది రూపాయల రేటు పెరిగింది .దంపతులు తెలివప్పను గుర్తించి అంతా ఆయన చలవే నన్నారు .దిష్టి కోసం పదేక రాల నిమ్మ తోట పెంచానని దిష్టి బొమ్మల ఫాక్టరీ పెట్టానని ,మంచి ఇల్లు కట్టుకున్నామని చెప్పి మర్యాద చేసి రెండు నిమ్మకాయలు దిష్టితీశారు ఆయనకు .’’ అమంత్రము నాకే ఏసిరి ‘’అని తెలివప్ప తెలివి తప్పి పడిపోయాడు .దేశం లోని వెర్రి వెంగలప్పల స్వభావికి నిజ రూపమే ఇది .

అమ్మా కావాలి ఆలీ కావాలి యెట్లా?కొడుక్కు సంకటం వచ్చింది .గోడ  ఉపాయం చెప్పింది .’’మీ అమ్మ అలిగితే దానిమాటలు పట్టుకుంటావా? నేను నీ బిడ్డ నమ్మా అను .అమ్మ అర్ధం చేసుకుంటుంది .నీ భార్య అలిగితే ‘’మీ అమ్మ తిట్టిన్దనుకో .నేను అందర్లా అమ్మ కొడుకుని కాను నేను నా పెండ్లాము దాసుడిని అను సర్దుకు పోతుంది’’ అని’’ అమ్మా ఆలీ’’ తగువు తీర్చింది గోడ .ఇంతేనా దీనికే తానూ ఇదైపోవాలా అనుకోని ఆ వెర్రి పీనుగు నాటకాలు సురూ చేశాడు ఇద్దర్నీ మెప్పించాడు .ఇంతే కద .గోడకు మొర పెట్టుకోమంటారు సామెత గా .అదే ఇక్కడ నిజమైంది .’’కష్టపడే వాళ్లకు కావలైతే నేమి బీడు అయితే నేమి ‘’అని యదార్ధాన్ని చెప్పిన కథ ‘’ఓణీ సేను ‘’ఇంట్లో డబ్బుకు కట  కట .చేను అమ్మితే కాని పరిష్కారం కాదు .భార్య కు పుట్టింటారు పసుపు కుంకుమ కింద ఇచ్చిన పొలం (ఓణీ సేను )అమ్మాడు. తరువాత వరస పెట్టి అన్నీ అమ్ముకోవాల్సోచ్చింది .చిన్నకొడుక్కి రాయి రప్పా ఉన్న చేను వచ్చింది .భార్యతో కస్టపడి అంతా చదును చేసి సాగు చేస్తే బంగారప్పంట పండింది .పంట కోయటానికి అమ్మనోచ్చి పూజ చేయమని కోరాడు .’’బంగారు పండే బూముల్ని అమ్మి నిన్ను ఆ కావలిలా కష్ట పడే మాద్రి సేస్తిని .నేనొచ్చి యేమని పూజ సేస్తును సిన్నా ‘’అని ఏడ్చింది తల్లి .మర్నాడు అందరూ చేలోకి వెళ్ళారు .పినతండ్రి పంటను చూసి కుశాలయ్యాడు ‘’ఓణీ సేను ని మించి పంట పండిం డావే .కొడుకంటే వీడమ్మా ‘’అని బుజం తట్టి తల్లినీ మెచ్చుకోనేట్లు చేశాడు .

 

మనం తినే కూడును కూడా మిషన్ల లాగా తిన కూడదు పండ్లను ఉపయోగించి నవలాలి అని చెప్పేదే  ‘’గువ్వల్ని సూసి నేర్వాల ‘’కత .ఇక్కడి వారికి మబ్బూ దేవుడే పొద్దూ దేవుడే .మనకి కూడా అంతే కదా .ఒక పెళ్ళాం  మొగుడిని పక్కింటి గౌడు ను చూసి భయమూ భక్తీ నేర్చుకోమంటుంది .గౌడు పొద్దున్నే లేచి ఆవులకు మేతేసి కడిగి దణ్ణం పెడతాడు సూర్యుడికి నమస్కరిస్తాడు .సాములోల్లలా గౌడు లా ఉండాలే  మనుష్యులని భార్య భావం కొన్నేళ్ళకు సాములోల్లకు గౌడుకు పెద్ద తగాదా అయింది .కొడుకు తనకు పుట్టలేదని గౌడు ఇంట్లోంచి వాణ్ని గేట్టేసాడు నువ్వు చచ్చావు అని కూతురికి పిండం పెట్టారు .అప్పుడు భర్త ‘’ఏమే వాళ్ళ మాదిరిగా నన్ను ఉండమాన్నావా “అని అడిగితె నెత్తీ నోరు కొట్టుకొని తప్పు తెలుసుకుని ‘’మీరు ఇట్లే ఉండండ ‘’అని ఆప్యాయం గా బువ్వ వడ్డించిన భార్యా భర్తల కథ ఏ ‘’అంతా పుంగు మొకానికి రంగు ‘’.బాహ్యాడంబరాలు కాదు మనసు కావాలి అని తెలియ చెప్పే కధ..పాత తరం మాటలు అర్ధం కాక తల్లికేదో పెద్ద జబ్బు అని డాక్టర్ వసంత దగ్గరకు తీసుకొస్తే ఆమె మాటల్లో అర్ధం గ్రహించి జబ్బు కాదు డబ్బు దాచిన మనేద అని ముక్క దొబ్బులు పెట్టిన ‘’అంశంకి ‘’కద.జీవితం అర్ధం పరమార్ధం ‘’జీవించటమే ‘’అనే నీతి ,ఒక సాములోరు ఊళ్లోకి వచ్చి సుద్దులు చెబుతుంటే ఒక అవ్వశ్రీరామునికాలం లోనే శంబూకుడు రాముడిని ఎలా ఎదిరించాడని అడిగితె సామి ‘’ఈ ముండకి ఇసయం ఎలా తెలిసే ‘’నని ఆశ్చర్య పోతాడు .అర్జునిడికంటే ఏకలవ్యుడు గొప్ప విలుకాడైనా విలువ నివ్వని శాస్త్రాలను కడిగేసింది అవ్వా .’’మీరు ఒగ నాదన్నా మా ఇండ్లల్లా సెయి కదిగిండారా/’’అని నిలేస్తే అవాక్కయ్యాడు సాములోరు .శాస్త్రాలను దుల్లి సేస్తే చెదలు కూడా మిమ్మల్ని ముట్టవు ‘’అని శాపనార్ధాలు పెట్టాడు .కోపం తారస్తాయికి చేరిన అవ్వ ‘’సేదల్లా  (చెదలు )పుట్టి సేదల్లా పెరిగే వాళ్ళం మేము .మమ్మల్ని చెదలు ముట్టవా ?మీ సేమడాలు ఒలిసి సెప్పులు కుట్టునాని .మీరే అమ్మకి అబ్బకీ కాకుండా అగ్గికి పుట్టినోళ్ళ మాద్రి అగ్గిలా కాలి బూడిదవుతారు .మీ బూడిదని సేదలు బొంగులా కూడా పెట్టుకోవు ‘’అని ఝాడించి పారేసింది అవ్వ .’’’ఎట్లేట్లా ‘’అనే చివరి కద లో

ఇవన్నీ జీవితాన్ని పరచిన కథలే .చదివే ఓపిక ఉండాలి కాని అన్నీ భారత భాగవత రామాయణాలు చెప్పే నీతి  కధలే .భూమిని నమ్ముకున్న వారి కతలే .చెట్టూ పుట్టాకధలే. వాటి నిస్వార్ధాన్ని విడమర్చే వే .క్రుతజ్ఞాతకు పట్టం కట్టేవే .మనో మాలిన్యాన్ని ఊడ్చిపారేసేవే .డాక్టర్ వసంత్ ప్రతిదాన్ని సాన పట్టి చిత్రిక పట్టి మెరుగులు తీర్చినట్లున్న కధలే .దీనికోసం ఆయన పడిన తపన ,శ్రమ అందరూ మెచ్చాల్సిందే చదివి తీరాల్సిందే .పెద్దాయన శ్రీ నంద్యాల నారాయణ రెడ్డి ‘’రచయితా వైద్యుడు కా బట్టి ఆయన వ్రుత్తి నైపుణ్యాన్ని అంతా ఈ కతల్లో నిమ్పిరి .కొన్ని తావులలో చేదు మందులు మింగిస్తారు .కొన్ని తావులలో చురుక్కుమని సూదితో పొడుస్తారు .కొన్ని తావులలో గాయ పడిన మనసుకి మెల్లగా మలాము పూసి మెత్తటి కట్టు కడతారు .కతలంతా ఈ గుణాలను నింపి మన ముందు వడ్డించిరి వసంత్’’అని మనస్పూర్తిగా చెప్పిన మాటలు చదివిన వాళ్లకు పచ్చి నిజాలని పిస్తాయి .ఈ పుస్తకం లో వసంత్ఎన్నో సామెతల ఆమెతలు గుది గుచ్చి సందర్భాన్ని బట్టి వాడాడు .పల్లె ప్రజ మాట్లాడే బూతులూ రాశాడు .అది నేటివిటి అని వదిలేయచ్చుమనం. ఏ ప్రాంతం లో నైనా జీవ భాష లో రాస్తున్నప్పుడు అవి  దొర్లి వచ్చి కూర్చున్డటం సహజం .వాటిని పంటి కింద రాళ్ళు అనుకోనక్కర్లేదు .ఇప్పుడు సామేతాల వైభోగం చూద్దాం

ముత్తయిదుల తావ ముండకేం పని?,సారాయి సోర్గము సేద్యము నరకము రామ సేంద్రా ,తిత్తిరి బిడ్డను కంటే ఎలకెత్తుకుని పోయి ఎంనులా పెట్టె నంట ,సింత లేని సివంగి సంత కోక బిడ్డను కనింది ,motuku pula vana 001 vendi moyillu 001

చివరగా వాళ్ళ భాషలోనే ‘’మీరంతా ఈ రెండు పోత్తాలు సదు ఉండ్రి.కతలు ఇనుకొండ్రి.అందులోని సారాంశం అర్తము సేసుకోనాకి  రాండా  బేగి రాండా’’అని పిలుస్తూఇది అధిక్షేపణ కాదని మనవి చేస్తూ  కృష్ణ రసం ను పానం  చేయ  వలసినది గా కోరుతు సెలవ్ .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-7-14-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

పిబరే కృష్ణ .ర.సం.-5

పిబరే కృష్ణ .ర.సం.-5

‘’ మోతుకు పూల వాన’’ లో తడిశాం కదా ఇప్పుడు’’ వెండి మబ్బుల్లో ‘’విహరించి  ‘’బండ బతుకులకు’’ చూసి సాను భూతి ప్రకటిద్దాం .డాక్టర్ శ్రీ   యెన్ .వసంత్ –‘’అగరం వసంత్ ‘’అనే మారు పేరుతో రాసిన 54కదల సమాహారమే పై శీర్షిక .వ్రుత్తి రీత్యా డాక్టర్ అయినా వసంత్ ప్రవ్రుత్తి రీత్యా సాహిత్య కారుడు .నాడి పట్టుకొని రోగ నిదానం చేసి చికిత్స చేసినట్లు ,చూపులతో లోకాన్ని ఆరసి ,లోపాలను కని పెట్టి సాహితీ చికిత్స చేయగల పరేంగితావ గాహి .ఎందరి హృదయాలలోనో పరకాయ ప్రవేశం గా దూరి వారి ఆంతర్యాన్ని వెలువరించిన హృదయ పరిశీలకుడు .హోసూరు ప్రాంత కొండా కోనా ,చెట్టూ పుట్టా వివరాలేరిగిన .వాడుబండ బతుకుల ఆంతర్యం తెలిసిన వాడు .జబ్బును డబ్బు జబ్బునూ కనిపెత్తటగాలాడు .న్యాయం గా ఆయన భాష సంస్కార వంతమైనది .కాని మట్టిని నమ్మిన వాడు .అందులో బతుకుతున్న వాడు .మరి ఆ భాష లో రాస్తే నే అది చరితార్ధమౌతుందని నమ్మి ,తన ప్రాంతం వారు మాట్లాడే భాషను విని తెలుసుకొని అధ్యయనం చేసి అలవర్చుకుని ఆ భాషను సంపన్నం చేయటానికే రాశాడు .ఈ పుస్తకానికి  శ్రీ నంద్యాల నారాయణ రెడ్డి ‘’పత్రికల తెలుగు అద్దాల అరల్లో అందాల బొమ్మ అయితే తావు (నేటివ్)తెలుగు చెమటను చిందించి సాకే అమ్మ .తెలుగు తల్లి కనిన గారాల బిడ్డ మా హోసూరు తెలుగు ‘’అంటూ రాసిన  ముందు మాటలు నూటికి నూరు పాళ్ళు సత్యాలే .కొంచెం ఓపికతో చదవటం ప్రారంభిస్తే వదల లేము .ఇవన్నీ పూర్తిగా కదా కృతిలో లేక పోవచ్చు గల్పిక మాదిరీ ఉండచ్చు .కాని చదివించే కండ గల కతలు .ఇందులోని ముఖ్య విషయాలే మీ ముందుంచుతున్నాను .

హోసూరు లాంటి చలవ ప్రాంతాల్లో తెల్ల జొన్నలు ,ఏడాకుల జొన్నలు తింటే ఉడుకు పుట్టి ఆరోగ్యానికి మంచిది .ఆనపకాయలు అంటే సోరకాయల్ని ఉడకేసుకుని తింటే ఒంటికి మంచిది .సంక్రాంతికి ,కజ్జాయలపండక్కి  (దీపావళి  )తప్పక సొరకాయలు ఉడకేసి తినాలి .దొంగ సాములోరు దేవుడినే దొంగిలించే కద ‘గవి గుట్ట ‘’.కడుపు లో నులి పురుగులు పడి బడికుర్రాడేడుస్తుంటే వాణ్ని నానా అల్లరి పెట్టి ‘’జగిని లోడు ‘’అని నిక్ నేం పెట్టి న సావాసగాళ్ళ భరతం పట్టింది బడిలోనే వాళ్ళమ్మ –కైవారం తాతగారి పాట ‘’తోక పురుగులు మూడు పాళ్ళు నిండి ఉంది నీచు నీళ్ళు ‘’పాడి బుద్ధి చెప్పింది ‘’జగిని గోడు ‘’అంటే నులిపురుగులున్నవాడు .అని అర్ధం .బియ్యం మరలో మోసాన్ని బయటపెట్టాదొక రైతుకొడుకు పాలేరు చేయని సాహసం చేసి దొబ్బిన బియ్యాన్ని తిరిగిపొండాడు ఆ మూటను వాడి పెద్దమ్మకిస్తే వాడి ‘’ఆపెకారానికి ‘’అంటే ఆపేక్షకు మురిసిపోయింది .కడుపులో పురుగులు పడకండా అపుడపుడు బెది మందుగా బెది నూనె అంటే ఆముదం తాగించటం ఇంకా అక్కడ ఉంది .మనకు అవుట్ ఆఫ్ ఫేషన్ అయింది .

చేను పక్కల వాళ్ళు దొంగతనం గా గోడల మేత కోసుకోవటం గొడ్లను మేపటం సాధారణం గా జరిగేదే .దొరికితే దొంగ దొరక్క పొతే దొర .పక్క చేలో మేస్తోంది గా మనకేం అని ఏ రైతైనా అనుకుంటే రేపు వాడి చేలో మేయ్యవని గ్యారంటీ లేదు అందుకే ఒక రైతు పక్క చేలల్లో పడిన పక్కూరి ఆవుల మందను బయటికి తోలి ఊరందరి మెప్ప్పు పొందాడు .జండా పార్టీ ఓళ్ళు అంటే నక్స లైట్లు గ్గ్రామాల్లో వేలుగుతెద్దామనుకొంటే గ్రామస్తులు పాత దోరణిలోనే సాగటం వాళ్లకు విసుగు తెప్పించింది .చేను పక్క కల్లు కాచి తాగుబోతులకు పోసి వీరంగం సృష్టిస్తుంటే తెలివైన రైతు ఆ కల్లు కుళ్ళిన అరటిపళ్ళూ కుక్క తలకాయ తో కాచారని ప్రచారం చేసి వారిని హడల కొట్టి అక్కడ దుకాణం లేకుండా  చేశాడు పాక పీకెట్లు చేశాడు .అపాయానికి ఉపాయం ఉన్న వాడే తెలివైన వాడు జొన్న చేలల్లో ఆవులు దొంగతనం గా పది మేస్తుంటే ఒక యజమాని బామ్మర్ది వాటికి జొన్న కంకుల్లో గుండు సూదులు గుచ్చ్చాడు అవి తిని ఆవులు చచ్చిపోయాయి .ఈ పాపం తనదే నని భావించి ఆ రోజు నుంచి కొంత మేత కోసి గట్టు మీద పడేసి కావాల్సిన వాళ్ళు తీసుకుని పోయేట్లు చేశాడు ఆసామి .మేతలు లేని వాళ్ళు హాయిగా తీసుకెళ్ళి మేపుకుంటున్నారు .సోషలిజం అంటే ఇంతకంటే ఎక్కడుంది స్వామీ?

ఆ ఊళ్ళో కాపులకు .మాల వాళ్లకు  బ్రాహ్మలకు విడి విడిగా బావులున్నాయి .ఒకరి నూతినీరు ఇంకొరు తాగరు .బావులు తవ్వేటప్పుడు మొట్టమొదట నీళ్ళ రుచి చూసినవాడు తాత .ఏదో మాటల సందర్భం గా ఈ మాట బయట పెట్టాడు తాత .’’అయితే ఈ ఊర్లా మూడు బాయిల్నీ ముందర ఎంగిలి సేసింది నువ్వేనా తాతా ‘’అని నవ్వాడు  బాపన కుర్రాడు .అందరూ నవ్వుకున్నారు .అంతే బాపనోళ్ళ బాయి ఎంగిలైందని మూసేసి బోరు వేసేసుకున్నారు మర్నాడే .అప్పుడు తాత ‘’మనుషులు మారి నట్లున్దారుకాని వాళ్ళ మనసులు మారలేదురా .ఆళ్ళ పిల్లోడు ఇని ఆల్లకు సేప్పింటాడు .అందుకే ఇంతపని సేస్తిరి ‘’అన్నాడు తాత మనవడితో .

ఆ ఊళ్ళో వీరుల గుడి ఉంది .అక్కడికెళ్ళి మొక్కితే వీరత్వం తన్నుకోస్తుందని నమ్మకం .ఆ గుడిలో నిధి ఉందని దొంగలు తవ్వటం ఒక కుర్రాడు అనుకోకుండా చూసి గుడిలో దణ్ణం పెట్టుకొని వీరత్వం విజ్రుమ్భించి వాళ్ళని చితక బాది తోలేశాడు .అప్పటి నుంచి వాడిని ‘’వీర గాడు ‘’అన్నారు .కన్నడ వాగ్గేయ కారుడు పురందరదాసు చెప్పాడని ఒక పకీరు సాయిబుల పండక్కి వచ్చిన అందరి విస్తళ్లలో ఉమ్మేస్తున్నాడు .అందులో నే భోజనాలు వద్దిన్చుకుని  మహా  ప్రసాదం గా తింటున్నారందరూ .రచయిత ఇలా చేయటం బాగాలేదన్నాడు .అప్పుడు పకీరు పురందరదాసు చెప్పిందే తానూ ఫాలో అవుతున్నానని చెప్పి కావాలంటే పెద్దవాళ్ళను కనుక్కోమన్నాడు ఒక పెద్దాయన ‘’తురు కరు కరిదరే ఉన్నబహుదన్నా-తురుకరు  వెంజలు అతి పుణ్యవయ ‘’అని చదివాడు .ఇది విన్న రచయిత పగల బడి నవ్వాడు అసలు అర్ధం తెలీకుండా ఇంతకాలం మూఢం గా వీళ్ళు ప్రవర్తిస్తున్నారని గ్రాహించాడు  లోతు విచారించి అందరికి అందులోని గూడార్ధం వివరించాడు .ఒక సారి ఒక తురక రాజు  పురందర దాసుకు ఎదురై  తురకల మీద ఒక పాటకాని పద్యం కాని చెప్పమన్నాడు .చెప్పక పొతే నరికేస్తానని బెదిరించాడు .అప్పుడు చెప్పిన పద్యం ఇది .ఇందులో రెండు రకాల అర్ధాలున్నాయి .మొదటిది –తురకలు పిలిస్తే భోజనానికి వెళ్ళాలి .వాళ్ళ ఎంగిలి చాలా పుణ్యం అని .రెందోఅర్ధం ఆవుదూడ పిండితే లేక పాలు ఇస్తే తినోచ్చు  తాగొచ్చు .ఆవుదూడ ఎంగిలి మహా పుణ్యం మొత్తం మీద ఆవుపాలు తాగొచ్చు ఆవు దూడ ఎంగిలి మహా పుణ్యం అని .అర్ధం .తురక రాజు దాసుగారు తన్ను పొగిడాడు అనుకోని ఆయనకు మొక్కి వెళ్ళిపోయాడు ఆ రాజులాగే ఈ పకీరు ,పకీరులాగే మూర్ఖ జనాలు ప్రవర్తించారని బుద్ధి చెప్పాడు .అందరూ దూ దూ అని ఉమ్మేస్తూ వెళ్ళిపోయారు .ఇలాంటిపకీర్లను చూసే హోసూరు ప్రాంతాపు తత్వ వేత్త ,కవి, బోధకుడు,అందరికి ఆరాధ నీయుడు  స్వర్గీయ కైవారం తాత గారు ‘’లలాట శూన్యము ,కంట కుల్లావి ,మెడ నిండా దారాలు ,మణి పూసలుకొన్ని ,ఒడ్డు పొడుగునా పెద్ద గడ్డాలు పెంచుక లుంగీ కట్టుకుని గంజాయి పొగ దీసి అల్లా నెరుగని కల్ల కాజీ పకీరుల్లారా ‘’అని యెగతాళి చేశాడు .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-7-14-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

కధలు దొరక్క పోవట మే దర్శకుడు నాగి రెడ్డి సమస్య

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కొదమ పల్లె లో ఓ వెన్నెల రాత్రి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాబందుల్లా మిగిలిపోవద్దు.. గరుడ పక్షిలా ఎదగండి

రాబందుల్లా మిగిలిపోవద్దు.. గరుడ పక్షిలా ఎదగండి

Published at: 20-07-2014 03:31 AM

మనపై గౌరవం తగ్గేందుకు కారణం మనమే
గౌరవం డిమాండ్‌ చేస్తే రాదు.. ప్రజలు ఇవ్వాలి
గెలిచే వరకే పార్టీలు.. తర్వాత అందరి కోసం పనిచేయండి
ప్రజాప్రతినిధుల అవగాహన తరగతుల్లో స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌

హైదరాబాద్‌, జులై 19(ఆంధ్రజ్యోతి): ‘గరుడ పక్షి… రాబందు రెండూ ఆకాశంలో చాలా ఎత్తులో ఎగురుతాయి. రెండూ పక్షి జాతికి చెందినవే. కానీ గరుడ పక్షికి మనం ఇచ్చే గౌరవం ఎక్కువ. అది దేవుడి వాహనం. రాబందుకు ఆ గౌరవం లేదు. అది మృత కళేబరాల్లో మిగిలిపోయిన మాంసం కోసం తిరుగుతుంది. ప్రజాప్రతినిధులు ఈ విషయాన్ని నిత్యం మననం చేసుకోవాలి. మనం గరుడ పక్షిలా ఉండాలా.. లేక రాబందులా మిగిలిపోవాలా అన్నది ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. ప్రజల కోసం పనిచేసేవారికి గరుడ పక్షిలా ప్రజల మనన్న దక్కుతుంది. ప్రజల మీద బతికేవారిని రాబందుల్లా చీదరించుకుంటారు. లక్షల మందిలో మీకు మాత్రమే ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యే అవకాశం వచ్చింది. సద్వినియోగం చేసుకోండి’ అని లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇక్కడ నిర్వహిస్తున్న అవగాహన తరగతుల్లో భాగంగా శనివారం ఆమె ప్రజాప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజాప్రతినిధులకు ఇటీవలి కాలంలో ఎందుకు గౌరవం తగ్గుతోందని ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు వేసిన ప్రశ్నకు ఆమె సూటిగా సమాధానం చెప్పారు.

’దానికి కారణం మనమే. గౌరవం డిమాండ్‌ చేసి తెచ్చుకొనేది కాదు. ప్రజలు వారంతట వారు ఇవ్వాలి. మీలాగా నేనూ రాజకీయవేత్తనే. నా నియోజకవర్గానికి మీలో ఎవరైనా వెళ్లి నేను తప్పు చేశానని విమర్శిస్తే చాలా మంది ప్రజలు ఖండిస్తారు. నాపై వారిలో ఉన్న సదభిప్రాయానికి అది నిదర్శనం. అందుకే నేను నా నియోజకవర్గంలో 8 సార్లు గెలిచాను. మీరూ ఆ స్థాయికి ఎదగాలి. మెజారిటీ నేతలు ఇలా ఉంటే తప్పనిసరిగా రాజకీయ వ్యవస్థకు గౌరవం పెరుగుతుంది’ అన్నారు. ప్రజల ముందు గొప్పగా కనిపించాలని తాపత్రయపడవద్దు. మీరు గొప్పవారని ప్రజలు అనుకోవాలని సుమిత్రా మహాజన్‌ ప్రజాప్రతినిధులకు హితవు పలికారు. ప్రజలు మీకు ఎంత ఇచ్చారో వారికి అంతకు రెట్టింపు ఇవ్వండి. అప్పుడు మీరు మంచి నాయకులు, మంచి ప్రజా ప్రతినిధులు అవుతారు’ అని వివరించారు.

గెలిచిన తర్వాత ప్రజాప్రతినిధులు పార్టీలను పక్కనపెట్టాలి. అందరి మనిషిగా ఎదగాలి.. అలాగే ఉండాలని ఆమె నొక్కి చెప్పారు. ‘నేనూ రాజకీయవేత్తనే. నా వద్దకు నాకు ఓటు వేసినవారు…వేయనివారు ఇద్దరూ వస్తారు. అందరినీ ఒకేలా అక్కునచేర్చుకుంటా. 360 డిగ్రీల కోణం అంటే మొత్తం చుట్టూ చూడటం. ప్రజాప్రతినిధి పనితీరు ఆ రకంగా ఉండాలి’ అని ఆకాంక్షించారు అందరికీ నమస్కారం అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించిన సుమిత్ర అందరికీ ధన్యవాదాలు అంటూ తెలుగులో ముగించారు. మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి నజ్మా హెప్తుల్లా ఈ సమావేశంలో ప్రసంగిస్తూ మాజీ కేంద్ర మంత్రి పర్వతనేని ఉపేంద్రను గుర్తు చేసుకొన్నారు. ఏపీ శాసనమండలి చైర్మన్‌ చక్రపాణి జ్ఞాపక శక్తి తనను ఆశ్చర్యపరిచిందని, 1984లో ఢిల్లీలో తాను ఏ నెంబర్‌ ఇంటిలో.. ఏ రోడ్డులో ఉన్నానో ఆయన చెప్పారని.. ఆ విషయం తనకే గుర్తు లేదని ఆమె వ్యాఖ్యానించారు. అతిథులకు మెమొంటోలు బహుకరించే సమయంలో ఆమె తన కోసం ఎంపిక చేసిన నెమలి బొమ్మను కాదని వెంకటేశ్వర స్వామి చిత్రం ఉన్న జ్ఞాపికను అడిగి తీసుకొన్నారు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పిబరే కృష్ణ. ర.సం -3

పిబరే కృష్ణ. ర.సం -3

పెంచిన గొడ్డు మీద మమకారం ,అది దూరమైతే వచ్చే విచారం మాటలకు అందనిది .మనకే కాదు మనకు మాలిమి అయిన ఆ గొడ్డు కూ అంతే ఆపేక్ష ఉంటుందని తెలియ జెప్పినశ్రీ  చిన్నయ్య గారి మల్లేష్ చెప్పిన ‘’పటం కట్టి పెట్టుకో నుండాము’’కధ.నల్లావును తెల్లావును సంతనుంచి తోలుకొచ్చాడు యజమాని. తెల్లావు అందరికి మాలిమయింది .నల్లావు పొట్ల గిట్టలా దగ్గరకు చేరనివ్వటం లేదు. ఇంటిల్లి పాదీ దాన్ని చూసి భయపడుతున్నారు .మేత నీళ్ళు  పెట్టటానికీ  భయమే .బుసలు కొడుతుంది .తెల్లావు దూడను పెట్టి మరీ కుటుంబానికి దగ్గరయింది .నల్లావును వదిలించుకోవాలని పెద్దాయన ప్లాను .రెండు ఆవులుల్ని తీసుకుని  నల్లావునమ్మి తెల్లావు జతకు ఇంకోదాన్ని తెచ్చుకుందామని సంతకు వెళ్ళాడు .ఒంటి ఆవును కొనం అని  బేరగాళ్ళు అందరూ అన్నారు .గత్యంతరం లేక ఇష్టం లేక పోయినా   నల్లావుతో బాటు తెల్లావునూ  అమ్మాల్సోచ్చింది .తెల్లావు ‘’అంబా అంబా ‘’అని కన్నీరు కారుస్తూ కొన్నవాడితో వెళ్ళింది .వాళ్ళ యదలనిండా అబ్బుకున్న మబ్బు వాళ్ళకన్నా ముందే వాళ్ళ ఊరు పోయి తబ్బుకొని ఉంది .ఇంటికి చేరేసరికి ‘’అరవై నాళ్లుగా అలక్కుండా ఇడి సేసిన పొయ్యి గడ్డ మాదిరి గా ఉంది మా ఊరు ‘’అంటాడు యజమాని దుఖం తో .యజమాని తల్లి కొడుకును ‘’బొమ్మలు ఆడించే వాడు పై నున్నాడు ఆయప్ప యెట్లా ఆడిస్తే అట్లాంటా ఆడాలప్పా ‘’అని ఓదార్చింది .’’దానిని అమ్మినబుడు అది నన్ను సూసిన సూపును మరిసేకి కాదమ్మో ‘’అని కన్నీరు ధారగా కార్చాడు .పేగు గ బంధం కన్నా గొడ్డు బంధం బలీయమైనట్లని పించింది .మూడు రోజులతర్వాత తెల్లావు ఎలా బయట పడిందో సరాసరి ఇంటికొచ్చేసి సావిట్లో నుంచుంది .’’యెంత గాపకమే మా మీద కూతురా .ఇన్ని మైళ్ళు ఎట్లోస్తివి కూతురా ‘’అని ఆప్యాయం గా తెల్లావును కావలించుకొని ఆనందం తో కన్నీరు కార్చాడు యజమాని .ఆవు గాయాలకు మందు రాసి కట్టు కట్టి మేత వేశాడు ఆప్యాయం గా .తెల్లావును కొన్న ఆసామికి వాళ్ళ కాసులు వాళ్లకి మర్నాడు సంతలో ఇప్పించేశాడు ఋణం ఉంచుకోకుండా .చాలా ఏళ్ళు తెల్లావు కామ దేనువులా ఇంట్లో లక్ష్మీ దేవిలా వెలిగి బిడ్డల్ని కని  చనిపోయింది .చేలో గుంత తవ్వి గౌరవం గా కృతజ్ఞతగా పూడ్చేశారు .సంక్రాంతికి తీసిన తెల్లావు ఫోటో ను ఫ్రేం కట్టించి ఇంట్లో దాచుకున్నారు .అదీ అనుబంధం రక్త బంధం కంటే బలీయమైంది .చెప్పిన విధానం బాగుంది .

పల్లె టూరి వాళ్ళు గొర్రెల మాదిరి అనుకోని నలుగురు బయటి వాళ్ళు వచ్చి ఆయిలింజన్లకు లోనిస్తోంది ప్రభుత్వం అని చెప్పి అందర్నీ ఒక చోట చేర్చి ఒక్కొక్కరి దగ్గర అరవై రూపాయలు వసూలు చేసి ,పంగనామాలు పెట్టి డబ్బుతో హోటల్లో హాయిగా మెక్కు తుంటే సప్లైయర్  ‘’ఈలల కేవుల్లో సరైన గొర్రెలు సిక్కి పోయిరి .ఇంగోక నెల నాల్లన్నా మసాల్దోసేలు తినిందే తినింది’’అని నవ్వుకుంటాడని ‘’ఆ నలుగురు ‘’కద చెప్పి  ముగించారు శ్రీ జూజు వాడిజయరాం .

అతన్నేవరో స్నేహితుడినని చెప్పి పాత జ్ఞాపకాలను గుర్తు చేసి హోటల్లో కాఫీ తగించి బిల్లు కట్టేసి ,సెల్ నంబర్ ఇమ్మంటే నాలుగు రోజుల కిందటే చేశాగా ఆనంబర్ కే చెయ్యి అని చెప్పి చెయ్యిచ్చి ఇంతలో అతనికి ఫోన్ వస్తే ఆందోళన గా మాట్లాడి వాళ్ళ బావకు సీరియస్ అని చెప్పి ఆటో ఎక్కి వెళ్లి పోయిన వాడెవడో అసలు గుర్తుకే రాని స్తితిలో ఉన్నాడు ‘’ఆతడేవడో “’కద లో రచయిత శ్రీ తాడేపల్లి శ్రీనివాస ప్రసాద్ .

హోసూరు సాహితీ పితామహుడు శ్రీ నంద్యాల నారాయణ రెడ్డి ‘తెలుగు తావు ‘’కత లో భాషాభిమానం లేని వారందర్నీ ఉతికి ఆరేసి దెయ్యాల్ని చేసి చెట్లకు వేలాడ దీశాడు .హోసూరు సాహితీ క్షేత్రం లో రెడ్డి గారొక దొడ్డ రచయిత .స్పూర్తి ,ప్రేరణ ,పెద్దన్న .తెలుగు ప్ప్రేతాలకు అరవ ,కన్నడ ప్రేతాలు నిలవ టానికి నీడ కూడా ఇవ్వట్లేదని నర్మ గర్భం గా తెలుగు వారికి తమిళ కన్నడ రాష్ట్రాలు చేస్తున్న అన్యాయాన్ని అన్యాప దేశం గా చెప్పిన సరదా దెయ్యాల కద.తెలుగు మాటలు మర్చి పోయి ఆంగ్ల పదాల వ్యామోహం లో పడ్డ వారని చురుకైన వ్యంగ్య కొరడాలతో దెబ్బ తీశాడు పెద్ద రెడ్డి గారు .

ఉబ్బు లింగాలు ఎలా బోల్తాపడి దెబ్బతిని సర్వస్వం కోల్పోతారో వ్యసనం యెంత దుస్తితి కల్గిస్తుందో  చెప్పేశ్రీమతి యెన్ సురేఖ రాసిన  నీతి కద ‘’యసనం ‘’.హనుమంత రావు కు పొగడ్తలంటే ఇష్టం పొగిడితే యెంత పనైనా చేస్తాడు .ఎంతైనా ఖర్చూ చేస్తాడు .డ్రామా పిచ్చి కూడా ఉంది.డబ్బు  పెట్టి నాటకాలాడించి ,మద్రాస్ వెళ్లి సినిమా తీయాలని ఉన్న దంతా ఊడ్చిపారేశాడు .పెండ్లాం తీరూ అంతే ‘’అల్పునికి అధికార మిస్తే అర్ధ రేతిరి గొడుగు పట్ట మనే టైపు .మొగుడు ఆమె పేర పెట్టిన ఆస్తి నంతా అమ్మి పుట్టినింటి వారికీ  కట్ట బెట్టింది .వాళ్ళు పనికిమాలిన ప్లాటు ఒకటి ఆవిడకు కొని మిగాతాదంటే నొక్కేశారు బొక్కేశారు .ఆవిడా మొగుణ్ణి వదిలి పట్నం చేరింది .ఇంట్లో ఈగల మోత బయట పల్లకి మొతగా ఉన్న హనుమంతం చివరికి చిప్ప  చేతికొచ్చి అడుక్కు తింటూ బతికాడు .ఈ కద తన పిల్లలకు చెప్పిందో ఇల్లాలు .పిల్లలు తెలివిగా ‘’హనుమంతప్పను ఇంట్లో వొళ్ళు బయటోళ్ళుఇడిసేశారు మంచోల్లుగా ఉండటానికి ఇదా ఫలితం ?’’అని అడిగారు .దానికామె ‘’హనుమంతప్ప మంచోడు అయినందుకు సేడిపోలేదు యాసనాల జోలికి పోయి సేడిపోయాడు ,మంచిగానే మనం ఉండాల’’అని సందేహాన్ని తీర్చింది .

చిన్న తనం లో పిల్లలు ఆడే చిన్న అబద్ధాలను ,తప్పించుకోటానికి వేసే ఎత్తు గడలను అవి బెడిసి కొడితే వచ్చే అపాయాన్ని ‘’సావన బెలుగు సామి ‘’(శ్రావణ బెలగోళ స్వామి )కధలో శ్రీ నా వేం అశ్వద్ధ రెడ్డి సరదాగా పిల్లల మనస్తత్వాన్నిఆవిష్క రిస్తూ చెప్పాడు .సినిమా హాల్లో కి అబద్ధం ఆడి వెళ్లీ  లాగూ చొక్కా కూడా విప్పెయించి కొట్టిన దెబ్బలకు బెంబేలెత్తి పోయాడోక పిల్లాడు  .వాడి  ఉనికి తెలుసుకున్న అత్తయ్య ,అత్త కూతురు వచ్చి దిగంబరం గా దిశ మొలతో ఉన్న వాడిని ‘’యేమిరా సావన బెలుగు సామి నిలిసి నట్లా నిలిసుండావు’’అంటున్న అమ్మలక్కలను కసిరి ఇంట్లోంచి ఒక చెడ్డీ తెప్పించి మేనల్లుడికి తొడిగించి మానం కాపాడింది అత్త .వాడి ఇంటికి తీసుకు పోయి’’రే తరకల నా బట్టా!నీపైన ఎతబెట్టుకుని నిన్నట్నింకా  ఒగ కడి కవళ మైనా ముట్ట లేదురా ఈల్లిద్దరూ ‘’అంది అత్త .అమ్మంటే అప్పుడే విలువ తెలిసింది వాడికి .ఆవిడ కూడా కొడుకును పొదివి పట్టుకుని ‘’ఏలమ్మా నా కొడుకు నట్లా ఏడిపిస్తావు ‘’అని అత్తను కసిరి వాడికళ్ళు’’ ఉజ్జీ ‘’ తబ్బు కొనింది వాని యమ్మ .చిన్న కధలో ఎన్నో భావోద్వేగాలు ఆప్యాయత ప్రేమ ,ఆదరణ ,బుద్ధి చెప్పటం దార్లో పెట్టటం అన్నీ కల బోసిన కత .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-7-14-ఉయ్యూరు

 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

పిబరే కృష్ణ .ర.సం -4.

పిబరే కృష్ణ .ర.సం -4.

శ్రీ పూతల పట్టు రఘునాధ రెడ్డి పేరెన్నిక గన్న  రచయిత.ఆయన రాసిన ‘’ఆ నెత్తురూ ఆ చెమటే ‘’గుండెల్ని పిండిస్తుంది .తండ్రి పెద్దకుడుకును కానీ కానీ కూడ బెట్టి చదివించి పెళ్లి చేసి చేతికి ఆధారమవుతాడనుకుంటే మెదడు వాపోచ్చి చచ్చిపోయి తండ్రి దుఖాన్ని కష్టాన్ని మరింత  పెంచాడు .రెందోకొడుకు మీద   ఆశ పెట్టుకున్నాడు. వాడికి చదవు అబ్బలేదు .కానిచిత్తూరు లో ’’ గుడ్డ లంగడి’’పెట్టి అనుభవం లేక అప్పులు చేసి తలెత్తుకు తిరగ లేకుండా చేశాడు .తన చిన్నప్పుడు తండ్రి  చేసేదిలేక కూరగాయల గంప నెత్తి  కెత్తుకొని సంతలో కంటే ఇంటింటికీ తిరిగి అమ్మితే డబ్బు లేక్కువోస్తాయని  తిరుగుతున్నాడు .దీన్ని చూడ లేక పోయాడు  చిన్నాడు .ఆ మాటే అమ్మతో అన్నాడు ‘’ఇంకొన్నాళ్ళు మనకీ అగసాట్లు తప్పవు .అన్న సదివి ఉద్యోగం రాగానే ఈ ఇక్కట్లుండవు ‘’అని సముదాయించింది .అప్పుడు కడుపు లో తిండి లేకుండానే తల్లీ తండ్రి పొలం పనులు చేసుకొంటూనే ఉన్నారు .

ఇవన్నీ ఫ్లాష్ బాక్ లాచిన్నకోడుక్కు గుర్తుకొచ్చి ‘’కస్టపడే వాళ్లకు కడ కన్నా సుకం దొరకతా దంటారు .మా నాయనకు కడా వరకు అగసాట్లే మిగిలినాయి .మా బతుకులు సిన్గారించాలని ఆయన బతుకును ఎండ బెట్టుకున్నాడు .ఆయన నెత్తిన పెట్టుకుని మోసి మోసి అమ్మింది కూరగాయలూ ,కూరాకులూ కాదు –ఆయన నెత్తుర్నీ చమట నూ అమ్మి నలుగురు బిడ్డలా కడుపు నింపాడు .ఆ నెత్తురూ ,ఆ చమటే మా అన్న చేతిలో బడి పుస్తకమైంది .అవే మా అక్కోల్ల మెడలో తాళి బొట్టయింది .అవే చిత్తూర్లో నా పేరిట గుడ్డ లంగడి అయింది ‘’అని నిర్వేదం చెందుతాడు .ఇప్పుడు ‘’సంపారిస్తా ‘’(సంపాదిస్తా)నెమ్మది గానే ఉన్నాడు .నాయన్ని కడుపు కింత ముద్ద పెట్టి చూసుకో గలడు.అయితే’’ ఆ ముద్ద తినేకి నాయన లేడిప్పుడు’’ అని దుఖిస్తాడు .గుడ్డల యాపారం లో తానూ అంతా పోగొట్టుకున్నందుకు తన్ను చూసి వేదన పడిపడి’’లక్క వాయి ‘’కొట్టి అపుడే తీరిపోయినాడు . కొడుకుగా తండ్రి రుణాన్ని తానేట్లా తీర్చుకో గలను ?అంటూ వేదనకు గురైనాడు .

ఇందులో ప్రతి మాట అర్ధ వంతం గా రాశాడు రచయిత .అంతా జీవిత అనుభవ సారమే .పేదోళ్ళ నిరాశా నిస్ప్రుహలె .కదా కధనం లో మంచి పట్టు సాధించాడు ‘’పూతల పట్టు ‘’.

పల్లె టూరి సింగిల్ టీచర్  బడి భాగోతమే ‘’కోడి గుడ్ల మేస్టరు’’.అయ్యవారు ఇస్కూల్ కి రాగానే కాళ్ళు బల్ల మీద పెట్టి కుర్చీలో హాయిగా గుర్రెట్టి పడుకుంటాడు .’’ఇంట్లో వాళ్ళ రావిడి పడలేక ‘’బడి కోస్తాడు గురూ గారు .పిల్లలూ దేవాన్తకులే మేస్టారి ని బురిడీ కొట్టించే ఘనులే .చదువు చెబితే మాత్రం గోడకు సున్నం అతికి నట్లు మనస్సులో నాటుకు పోతుంది .చెప్పాలిగా .సందేహం వచ్చి నిద్ర లేపి అడిగితే ‘’చిత్రాన్నమూ బెల్టు బువ్వా’’ తిని పిస్తాడు .అంటే వాయిన్చేస్తాడన్న మాట .మేస్తురికి కోడి గుడ్లు లంచం ఇస్తే ఇంకేమక్కర్లేదు. అందుకే ఆయన ‘’కోడి గుడ్లు మాస్తురు ‘’అయ్యాడు .కొట్టకుండా ఉండాలంటే కోడి గుడ్డు చదివిన్చాల్సిందే అయ్యవారికి అదే లంచం ఆయనకు .త్రిక సంధి సూత్రం తెలియదని విశ్వామిత్రుని తపస్సు భగ్నం చేసిన మేనక లా ఒకమ్మాయి అడిగితే ,ఆమె పుస్తకం లోని చిన్నయ సూరి సూత్రం చదివింది .చిర్రున కోపం వచ్చింది మేస్టారికి ‘’ఆంధ్రా వాళ్లకి ఏమీ ‘’పంగ ‘’లేదు .అట్లా మాటల్లో రాయక పొతే అందరికి తెలిసేట్లు తెలుగు లో రాస్తే ఏమి ?’’అని విసుక్కుని తన పద్ధతిలో తేట తెల్లం గా ‘’అ ,ఈ ,ఏ లను మూండ్లు అంటారు .మూండ్ల మీది ఒంటి హల్లు జంట హల్లుగా మారుతుంది .జంట హల్లు అయినప్పుడు ముందరి పొడవచ్చు పోట్టిదవుతుంది .నేను పాటము రాసింటే ఇట్లే రాసి ఉందును .తెలుగు చిన్నోల్లకు నోళ్ళు తిరగని మాటలతో పుస్తకాలు నింపేసి చదువుమంటే యట్లా ?పాట మంటే యెట్లుం డాల.మేస్తురు చెప్పక పోయినా చదివితే చాలు తానుగా తెలిసి పోవాల ‘’అని పాటం తో బాటు గొప్ప హితవూ చెప్పాడు అయ్యవారు .అయ్య వారికి కొడుగుడ్డు నజరానా ఇస్తే గబుక్కున గోడకు కొట్టి సోనంతా నోట్లో పోసుకుని గుటుక్కున మింగుతాడు .కదా రచయిత శ్రీ రాజన్న గారి శ్రీకాంత్ .సరదా గా ఉన్నా యదార్ధానికి ఆయువు పట్టు ఉన్న కథ .

శ్రీ మతి రామక్క గారి సుమ రాసిన ‘’సమసి పోయిన తాళి బొట్టు ‘’లో తల్లి తాళి బొట్టు తూటు పడి ,నల్ల పూసలు మాసిపోయి యెర్ర గుండ్లు సమసిపోయి కనిపించాయి ఆడపిల్లలకు. అదే వాళ్ళు చూడటం మొదటిసారి. అయ్యో అని ఏడుస్తున్నారు ‘’బిడ్డలో బిడ్డలో అని అంతా బిడ్డలకే చేసి పెట్టి ,తన కోసం ఇంతైనా యోచన చేయకుండా బతికేస్తోంది ‘’తల్లి అని తెలుసుకున్నారు .దుఖాన్ని ఆపుకో లేక పోతుంటే ఆయమ్మ ‘’అయ్యో కోతి బిడ్డల్లారా ఎందుకే అట్లా ఏడుస్తారు .ఇది మా అత్తకి వాళ్లత్త యేసిన తాళి బొట్టు .నా పెండ్లపుడు మెరుగు పెట్టించి వేసిరి .అందుకే పాతదయి సమసి పోయింది .ఏడ వద్దు కల కుండా ఉండండి ‘అని ఓదార్చింది ఆ దొడ్డ ఇల్లాలు కూతుళ్ళను .కొత్త తాళి బొట్టు తెచ్చి పెడతానని పెద్దకోడుకన్నాడు .’’వద్దు కొడకా .ఈ బంగారును ఏమైనా ఎత్తుకు పోతానా .రాజమ్మ కొడుకులు చేసి నట్లు చేయకుండా ఊళ్ళో నామర్యాద ఊరోళ్ల ముందర నిలబెట్టండి కొడకా అంతే చాలు ‘’అని అడ్డు చెప్పింది .తల్లిపై గౌరవం పిల్లలపై ఆపేక్షా ఏదీ కావాలనుకొని పెద్దరికం ,మర్యాద బతుకు కోసం తపన మనకు కని  పిస్తాయి .ఒక కూతురు తాళి బొట్టును పసుపు దారానికి కూర్చి అమ్మ మేడలో వేయగా  సంతృప్తి పడ్డారందరూ .గుండెలోతులను తడిమే కద.

చివరికద  ‘’కృష్ణ రసం ‘’ కు స్పూర్తి ప్రదాత ,సారధి సచివుడు ,నేస్తం ,ప్రేరణ ’ప్రళయ కావేరి ‘’వంటి అద్భుత జీవిత వాస్తవ కధలను రాసిన శ్రీ సా వేం .రమేష్ రాసిన ‘’ఎందుండి వస్తీవి తుమ్మెదా “’.ఇందులో  కొడుకు వస్తాడని అందరికి చెబుతూ ఎదురు చూస్తా,వాడేదో కాగితం రాసినట్లు చెబుతూ ,వెతుక్కుంటూ ,వాడిరాకను ఈమె వాయిదాలు వేస్తూ వాడు  రాక పోవటాన్ని జీర్ణించుకోలేక తాగుడు కు అలవాటు పడి దమ్ము కొడుతూ’’ఎందుండి వస్తీవి తుమ్మెదా ‘’పాట పాడుకుంటూ  బిచ్చ గత్తే లాగాతిరుగుతూ పెట్టింది తింటూ బతికే ఒక ముసిలి కద..రచయిత కనపడ్డ ప్పుడల్లా ‘’కొడుకా నువ్వే నా కొడుకువి ‘’ అనేది .ఆమె చనిపోయిన సంగతి చాలా కాలానికి తెలుసుకున్న రచయిత అవాక్కయ్యాడు .

ఇలా ‘’మోతు(దు)కు పూల వాన ‘’కదా గుచ్చం ఆద్యంతం అలరిస్తుంది .ఆ పూల వాన లో తడిసి ముద్దవుతాం గుండెలను తట్టుతుంది .మనసును ఆలోచింప జేస్తుంది .కలవర పెడుతుంది .సాను భూతి చూపిస్తుంది .ఇవన్నీ హోసూరు ప్రాంత నిసర్గ భాషా సౌందర్యానికి వన్నె చిన్నేలే .వారి కతలే ,వెతలే ,మట్టి గుబాళిం పులే .ఇందులో వాడిన కొన్ని మాటల కు అర్ధాలు తెలుసుకుని ఆ భాషా మాధుర్యాన్ని ఆస్వాదిద్దాం . కృష్ణ రసాన్ని పానం  చేద్దాం .

మొయిలు –మబ్బు ,బానము –ఆకాశం ,మీజు –ఈత ,మచ్చు –కత్తి,కొర –మంచు ,మొరము –చేట ,ఆనె రాళ్ళు –వడగళ్ళు  ,బూబమ్మ పురుగులు –సీతా కోక చిలకలు ,తలవరు –పంచాయితీ ప్రెసిడెంట్ ,శాన బోగుడు –కరణం,కారే దారుడు –మునసబు ,దిట్టము –పధకము ,చేపలుకి –సెల్ ఫోన్ ,పోల్లరి –టైలర్,అరిది –చోద్యం ,సమసిపోవు –అరిగి పోవు .

దీని తర్వాత శ్రీ అగరం వసంత్ రాసిన ‘’వెండి మొయిళ్ళు –బండ బతుకులు ‘’కదా సంపుటి లోని కదా వివరాలు తెలియ జేస్తాను .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-7-14-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

ఆ హీరో” నాగయ్య” గారి I జీవితమే సందేశం

ఆ హీరో జీవితమే సందేశం

  • 06/07/2014
  • |

  • -బుద్దా మురళి

పెద్దింటి అబ్బాయి పేదింటి అమ్మాయి ప్రేమించుకుంటారు. మా అంతస్థెక్కడ మీ అంతస్థెక్కడ అని పెద్దింటి అబ్బాయి తండ్రి పేదింటి అమ్మాయి తండ్రిని నిలదీస్తాడు. బాబు గారు కులానికి పేదవాళ్లం కావచ్చు కానీ గుణానికి పేదవాళ్లం కాదు బాబు మీ పెద్దొళ్ల శరీరంలో ప్రవహించేది రక్తమే మా పేదోళ్ల శరీరంలో ప్రవహించేది రక్తమే అంటూ ఆ ముసలి తండ్రి ఆయసంతో దగ్గుతూ డైలాగులు చెబుతాడు. మనసులేని ఇలాంటి వాళ్లను ఎంత బతిమిలాడినా వారు కరగరు నాన్నా వాళ్లకు మనుషులు, మానవత్వం కన్నా డబ్బే ముఖ్యం అంటూ పేదింటి అమ్మాయి తన వంతు డైలాగులు వినిపిస్తుంది. చివరకు ఆ పెద్దింటి ఆయనకు జ్ఞానోదయం అవుతుంది. మనిషికి కావలసింది డబ్బు కాదు, మనను ప్రేమించే మనుషులు అని తెలుసుకున్నాను, నా కళ్లు తెరిపించారు అంటూ ఆ పెద్దింటాయన వారిద్దరి పెళ్లి జరిపిస్తాడు. చాలా సినిమాల్లో కనిపించే దృశ్యమిది. డబ్బు ముఖ్యం కాదు అని ఎన్ని సినిమాల్లో ఎంత మంది రచయితలు ఎన్ని పాత్రలతో చెప్పించినా అది నిజం కాదు. డబ్బు అన్నీ సమకూర్చకపోవచ్చు కానీ ఏది కావాలన్నా డబ్బు కావలసిందే. డబ్బు లేకుండా దొరికేవి కొన్ని ఉండొచ్చు కానీ చాలా అవసరాలకు మాత్రం డబ్బు కావలసిందే. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే కాకపోవచ్చు కానీ చాలా సంబంధాలు డబ్బుతోనే ముడిపడి ఉంటాయి. డబ్బుకు ఏమాత్రం విలువ లేదని చాటి చెప్పే సినిమా ను తీయాలన్నా బోలెడు డబ్బు కావాలి. డబ్బుకు విలువ లేదని డైలాగులు రాసే రచయిత డబ్బు కోసమే ఆ పని చేస్తాడు. డబ్బు ముట్టిన తరువాతే హీరో ఆ డైలాగులు చెబుతాడు…. డబ్బుచెల్లించి సినిమా చూసే మనలాంటి సగటు ప్రేక్షకుడు మాత్రం జీవితంలో డబ్బుకు విలువ లేదని ఎంత చక్కగా చెప్పారు అని ఆలోచిస్తూ ఖాళీ అయిన జేబులతో దియోటర్ నుంచి ఇంటికి వెళ్లాలి. అన్నింటికీ డబ్బు కావలసిందే. మనిషికి డబ్బు జబ్బు ప్రమాదకరమే కావచ్చు కానీ డబ్బు లేకుండా జబ్బులు వస్తే మనిషి జీవితం మహా ప్రమాదంలో పడ్డట్టే.
సినిమా కథల్లో డబ్బు విలువ గురించి చాలా తక్కువగా చెప్పినా చాలా మంది సినిమా వాళ్ల వాస్తవ జీవితాలు డబ్బు విలువను చాటి చెప్పే విధంగా ఉంటాయి. నా జీవితమే నా సందేశం అంటూ మహాత్మాగాంధీ తన ఆత్మకథ రాసుకున్నారు. ఒక రకంగా చిత్తూరు నాగయ్య జీవితానికి సైతం ఈ ట్యాగ్ బాగా సరిపోతుంది.
తెలుగు సినిమా పరిశ్రమలో ఆయన తొలి సూపర్ స్టార్. అత్యధిక పారితోషకం తీసుకున్న నటుడు. 1948 అంటే మహామహానటులే నెలకు మూడు వందలు నాలుగు వందల రూపాయల జీతంతో సినిమాల్లో నటించిన కాలం అది. ఆ సమయంలో చిత్తూరు నాగయ్య తీసుకున్న పారితోషకం ఎంతో తెలుసా? సరిగ్గా లక్ష రూపాయలు. అంటే ఆ కాలంలో ఒక సినిమాకు చిత్తూరు నాగయ్య తీసుకున్న పారితోషికంతో మద్రాసులోనో, హైదరాబాద్‌లోనూ కొన్ని వందల ఎకరాల భూములు వచ్చేవి. చిత్తూరు నాగయ్య అదే చేసి ఉంటే ఇప్పుడాయన ఆస్తి కొన్ని వేల కోట్ల రూపాయలు అయ్యేది. అలా చేయలేదు కాబట్టి స్వయంగా ఆయనే చివరి దశలో అపాత్రదానం చేయవద్దు. నా జీవితం మీకు ఒక పాఠం కావాలి అని హితవు పలికారు తప్ప తన పరిస్థితికి ఎవరినీ నిందించలేదు. 1948లో లక్ష రూపాయల పారితోషికం తీసుకున్న ఆ మహానటుడు. అవసాన దశలో 1970 ప్రాంతంలో కేవలం కడుపు నింపుకోవడానికి వందల రూపాయల పారితోషికానికి సినిమాల్లో చిన్నా చితక వేషాలు వేస్తూ, అద్దె ఇంటిలో నివసించారు. ఇప్పటి హీరోలు విలన్ల కన్నా ఎక్కువ బీభత్సం సృష్టిస్తున్నారు. చిత్తూరు నాగయ్య హీరోగా వచ్చిన కాలంలో అన్ని సాధు పాత్రలే… ఆ పాత్రల ప్రభావం సినిమా షూటింగ్ వరకే ఉంటే బాగుండేది. కానీ ఆయన జీవితంపై సైతం ప్రభావం చూపించాయి. పోతన పాత్రలో జీవించిన ఆయన ఆయన లానే ధాన ధర్మాలు చేస్తూ పోయారు. రామదాసు సినిమాతో బాగా నష్టపోయారు. దానికి తోడు దాన ధర్మాలకు అంతు లేదు. ఆయన స్టూడియో నిత్యాన్న దాన సత్రంగా వెలుగొందేది. 1938 నుంచి 1973 వరకు చిత్తూరు నాగయ్య దాదాపు రెండువందల సినిమాల్లో నటించారు. భక్తపోతన, రామదాసు, యోగివేమన, త్యాగయ్య అని నటించిన చిత్రాల్లో ముఖ్యమైనవి. ఈ సినిమాల ప్రభావం నాగయ్యపై బాగా పడింది. వాస్తవిక జీవితంలో అందులోనూ సినిమా రంగంలో నమ్మించి మోసం చేసేవారు ఎలా ఉంటారో, విజయం దక్కినప్పుడు కాటేసే పాములు ఎలా పొంచి ఉంటాయో ఆ సాధు స్వభావి గ్రహించలేకపోయారు. అంతా అయిపోయిన తరువాత ఇక్కడ గోముఖంతో ఉండే పులులు చాలా ఉన్నాయని వాటితో జాగ్రత్తగా ఉండాలని చెప్పుకొచ్చారు. అయితే అప్పటికే ఆయన వద్ద ఏమీ మిగలలేదు. 1947లో నాగయ్య నటించిన యోగివేమన నటించిన సినిమా చూసి ముమ్మడివరానికి చెందిన బాలుడు బాలయోగిగా మారారు. తెలుగునాట తొలి తరం హీరో, సంగీత కర్త, గాయకుడు, దర్శకుడు, నిర్మాత. తెలుగులోనే కాదు తమిళంలోనూ ఆ కాలంలో ఎంతో పేరు గడించారు. దక్షిణ భారత దేశంలో పద్మశ్రీ అవార్డు పొందిన తొలి హీరో. చిత్తూరు నాగయ్య జీవితం సినిమా వారికే కాదు సంపాదనపై అవగాహన కలిగించడానికి, సంపాదించిన డబ్బును జాగ్రత్త చేసుకోకపోతే భవిష్యత్తు జీవితం ఎలా ఉంటుందో చెప్పడానికి చిత్తూరు నాగయ్య జీవితం ఏ కాలం వారికైనా ఏ రంగం వారికైనా ఒక పాఠంగా ఉపయోగపడుతుంది.
చిత్తూరు నాగయ్య తన తరువాత తరం వారికి నటనలోనే కాదు సంపాదన, జాగ్రత్తలపై కూడా తన జీవితం ద్వారా చాలా బలంగా పాఠం నేర్పించారు. ఈ తరం సినిమా వాళ్లు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండేందుకు ఇలాంటి వారి జీవిత చరిత్రలే కారణం. ఈ పాఠాలు సినిమా వారికే కాదు అందరికీ ఉపయోగకరమైనవే.
*

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ముని ”మాణిక్యం ”-రుక్కు తల్లి

నవలా పరిచయం: వి.రాజారామమోహనరావు
 

‘రుక్కు తల్లి’ రచయిత: కీ.శే. మునిమాణిక్యం నరసింహారావు
తమదైన ప్రత్యేకతగల రచయితలు కొందరుంటారు. అలాంటి రచయితే శ్రీ మునిమాణిక్యం నరసింహారావుగారు. నిఖార్సైన, సంసారపక్ష హాస్యంతో వినూత్నంగా రాసిన కాంతం కథల రచయిత. అయితే కాంతం కథల ఖ్యాతి మరుగున ఉండిపోయాయి ఆయన రాసిన నవలలు. ఆయన నవలలు కూడా రాశారని తక్కువ మందికి తెలుసు. ఆ నవలలు, ఆయన హాస్య కథలలా కాక, చాలా గంభీరంగా, లోతుగా ఉంటాయని మరీ తక్కువ మందికి తెలుసు. 

ఈ నవలను 1958లో కొండపల్లి వీరవెంకయ్య అండ్ సన్స్. రాజమండ్రి వారు అచ్చు వేశారు. సాంఘిక నవలలు పూర్తి విషాదభరితంగా రాయటం అప్పటికి తెలుగులో తక్కువ. గంభీరమైన వస్తువుని తీసుకుని పాఠకులని రంజింపజెయ్యటం కత్తిమీద సాములాంటిది. కావాలనే మునిమాణిక్యంవారు ఈ ప్రయత్నం చేపట్టారనిపిస్తుంది. మృధువైన సరస శృంగారం, సున్నితమైన హాస్యం కాంతం కథల అంతర్వాహిని. ఆ వాహిని అడుగున, హాస్యాన్ని పండించే ఆ బలం వెనుక, ఓ గంభీరత, జీవితపు మౌలికత వున్నాయి. ఆ మూల శక్తి నవలా రూపమే “రుక్కు తల్లి”. ఈ నవలా శిల్పం విషయంలోనూ కొత్త పద్ధతి అవలంభించారు మునిమాణిక్యంవారు. రుక్కుతల్లి స్మృతి గ్రంథంలా వుంటుంది. రుక్కుతల్లి గురించి కుటుంబ సభ్యులు అందరూ చెప్పుకునే స్మృతులుగా నడుస్తుంది కథ. 

రుక్కమ్మ తండ్రి ఆరంభించినట్టు కథ మొదలవుతుంది. 

‘అది ఆశ్వయుజ బహుళ అమావాస్య. బైట అంతా చిమ్మ చీకటి. మునిసిపల్ దీపాలు మాత్రం వెలుగుతున్నాయి. బొంయ్‌మంటూ గాలి వీస్తున్నది. ఆ గాలి దొడ్లో చెట్లను, ఇంటికప్పును కౌగలించుకుని ఏడ్చి, మైదానంమీదపడి ఏడుస్తూ ఎక్కడికో వెళ్లిపోయింది. చీకటి పడింది’ ఇదీ నవల ఆరంభం. నవలాంశంలోని విషాదం ప్రకృతిలో ప్రతిబింబించేలా ఆరంభించారు. 

భార్య పోయిన వెంటనే, ఆ ఇంటికి కూతురు రుక్కుతల్లి ఎలా ఇంటిపెద్దయి బాధ్యతలు స్వీకరించిందో చెప్పాడాయన. తోడబుట్టిన వాళ్ళని కంటికి రెప్పలా కాచుకోవటం, తండ్రికి కావాల్సిన సదుపాయాలు కూర్చటం, వంటావార్పూ చూసుకోవటం… చెపుతుంటే ఉట్టిమాటలేకానీ, చేతల్లో అదో పెద్ద బాధ్యత, ఎంతో అనుభవం వున్న ఇల్లాలు చెయ్యగలిగిన పని. రుక్కు తల్లికి పధ్నాలుగేళ్ళు మాత్రమే. ఆ కబుర్లు అలా సాగుతుండగా, రుక్కుతల్లి బామ్మ… “ఇదంతా ఎందుకర్రా, రాధాయకు జ్వరం వచ్చినప్పుడు రుక్కు పడిన యాతన ఇంతా, అంతానా! చూచిన వాళ్ళంతా ఆశ్చర్యపోయారు” అంది. ఆ విషయాలు వివరంగా చెప్పమన్నారు చుట్టూ వున్నవాళ్ళు. ఆవిడ చెప్పటం ఆరంభించింది. 

రాధాయకు పెద్ద పెట్టున జ్వరం వచ్చింది. మామూలుగా చూపించే డాక్టరు చలపతిరావు గారికి చూపించారు. నూటనాలుగు, నూరు అయిదు డిగ్రీలు. వారం అంతా అలాగే గడిచింది. రెండో వారం జ్వర తీవ్రత ఇంకా హెచ్చింది. పసివాడు చాలా నీరసించిపోయాడు. రుక్కు హడలిపోయింది. ఒక్క నిమిషమైనా వాడిని వదిలి వుండేది కాదు. ఎప్పుడూ రాధాయ పక్కనే పడుకునుండేది. పక్క వదిలి లేచిందో రాధాయ కెవ్వున కేకవేసి ఏడ్చేవాడు. అక్కని కదలనిచ్చేవాడు కాదు. డొక్కలో దూరి పడుకునేవాడు. అన్నం తినటానికి కూడా వెళ్ళనిచ్చేవాడు కాదు. 

సరిగ్గా అదే సమయంలో రుక్కుతల్లి చెల్లెలు సుశీల పెళ్ళి. పెళ్ళికి తెనాలి అలాగే జబ్బు పిల్లాడితో వెళ్ళారు. పెళ్ళి సమయం అంతా రుక్కుకి తమ్ముడి ఆందోళనే. ఆ తర్వాత ఆ జ్వరం మరీ పెరిగింది. పిల్లాడికి రక్త విరోచనాలు ఆరంభమయ్యాయి. పరిస్థితి చెయ్యి జారిపోతుందేమో అనిపించే సమయంలో నిష్టగా రుక్కు దేవీ పూజ చేసింది. అద్భుతం జరిగినట్టు రాధాయకి జ్వరం, అనారోగ్యం తగ్గుముఖం పట్టాయి. రుక్కుతల్లి కఠోరశ్రమ, గురి రాధాయని బ్రతికించాయని అందరూ అనుకున్నారు. తల్లి లేకుండా చెల్లెలి పెళ్ళి, తమ్ముడి ఆందోళన చెరోవైపు దిగలాగుతున్నా, ఎంతో పెద్ద తరహాగా రుక్కుతల్లి చూపించిన నిబ్బరం అందరికీ అబ్బురమైంది. ఇక్కడ మునిమాణిక్యం నరసింహారావు గారు ఉత్తరం రూపంలో రాసిన మాటలు గుండెల్ని పట్టుకుంటాయి. ఓ పధ్నాలుగేళ్ళ పిల్ల పెద్ద తరహాలో మాట్లాడే ఆ పలుకులు ఏ మాత్రం అజాగ్రత్తగా రాసినా, ముది పేరక్క కబుర్లైపోయే ప్రమాదం వుంది. 

“ప్రతివాళ్ళూ వచ్చి రాధాయ బుగ్గగిల్లి, మా తండ్రే! ఎంత పాటు పడ్డావురా నాయనా! ఆ భగవంతుడు సరిగ్గా చూశాడు అని ముద్దు పెట్టుకుని పండో, ఫలమో వాడి చేతుల్లో పెడుతున్నారు. వాడు మళ్లీ నలుగురిలో పడ్డందుకు ఎంతో సంతోషంగా వుంది” తెనాలి నుంచి రుక్కు తండ్రికి రాసిన ఉత్తరంలో మాటలు ఇవి. 

ఈ మాటల్లో నుడికారం మొత్తం దృశ్యాన్ని కళ్ళకు కట్టిస్తుంది. తమ్ముడు చచ్చి బ్రతికిన ఆనందం, నలుగురి ఆదరం, తండ్రితో ఇదంతా ఉత్తరం ద్వారా పంచుకోవటం… ఇవన్నీ ఏక కాలంలో, కొద్ది వాక్యాలలో సాధించారు రచయిత. 

రాధాయ దగ్గర్నుంచి జ్వరం రుక్కుతల్లికి అంటుకోవటం, అది న్యూమోనియాగా మారటం, రుక్కుతల్లి యాతన, ఆమె మేనమామ సత్యం ఆవేదన, తండ్రి నరక యాతన, ఆ ఇంటి పెద్ద సత్యం అత్తగారు రాజమ్మగారి సూటిపోటి మాటలు, తల్లిలేని పిల్ల రుక్కుకి తలదువ్వేవారు లేక విపరీతంగా పేలు పట్టి, కొద్దిగా మిగిలున్న ఆ పిల్ల రక్తాన్ని పీల్చటం, మంచం మీదికి చీమలు రాకుండా, మంచం నాలుగు కోళ్ళు, నీళ్ళు పోసిన పళ్ళాలలో పెట్టడం లాంటి ఎన్నో సూక్ష్మాతిసూక్ష్మ విషయాలు వివరించాడు రచయిత. జ్వరంపడిన మనిషిమీద ప్రేమ, ఇంటినంతా రోగగ్రస్తం చేస్తుంది. ఆ దిగులు కనిపించకుండా అందరినీ కమ్ముకుంటుంది. రోగం వచ్చిన వాళ్ళ చుట్టూ వుండేవాళ్ళ ప్రవర్తన మానవత్వానికి గీటురాయిగా తీసుకోవచ్చు. ఇలాంటి అంశాలవల్లే ఇంత దిగులు. కథా ఆసక్తిగా చదువుతాం. చూపులనుంచి జారిపోయే జీవితం చూపించటం ఓ కళ. నిత్యం కళ్ళముందు కనిపిస్తున్న మన మనసుకి ఎక్కని విషయాల్ని హత్తుకునేలా రాయటం రచనా ప్రక్రియ బలం. 

సహజంగా మన నమ్మకాలకి ఆవల వుండే విషయాలు కొన్ని ఈ నవలలో వున్నాయి. చనిపోయిన రుక్కు అమ్మగారు రుక్కుకి కనపడటం. రుక్కుకి జబ్బుగా వున్నప్పుడు వచ్చి పక్కలో కూచోవటం, రుక్కు తండ్రికి కూడా ఇలాగే భార్య కనిపించిన భావన. దేవతని ప్రార్థించి రుక్కు తమ్ముడి జ్వరాన్ని తను తీసుకోవటం, తమ్ముడు రాధేయ చావుని తనమీద వేసుకోవటం లాంటి దైవిక సంఘటనలున్నాయి. కానీ ఇప్పటికీ ఇలాంటి నమ్మకాలు కొందరిలో వున్నాయి. ఇలాంటి ఈ రకం రచనాతీరు, ఈ నవలకి సాంద్రతని కూర్చిందేకానీ, పలచన చెయ్యలేదు. సెంటిమెంట్‌లా తోచే ఎన్నో సంఘటనలు “రుక్కుతల్లి”లో వున్నాయి. 

రుక్కు తన మేనమామ గురించి చెబుతూ… “పదిహేనేళ్ళ కిందట మొదటిసారి నేను కళ్ళు తెరిచినప్పుడు, ముందుగా చూచింది మామయ్యనే! నేను తల్లి గర్భంలోంచి మామయ్య చేతుల్లో పడ్డానుట! అప్పటినుండి మామయ్యకు నామీద ప్రేమ, నేను పసిగుడ్డుగా ఉన్నప్పుడే మామయ్య నన్ను ఎత్తుకు ఆడించాడు. నాకు ప్రాణాధారమైన అన్నం తినటం నేర్పింది కూడా మామయ్యే! ఒక్కటే కోరిక ఉందమ్మా. మామయ్యను చూస్తూనే పోవాలని ఉంది” 

“దేవి, ఆజ్ఞ! నా ప్రాణం కానుకగా ఇచ్చాను! నేను ఉంటే మామయ్య నాకు సహాయం చేయటం, ప్రేమ వర్షించటం మానడు. ఇది చూసి మామయ్య అత్తగారు రాజమ్మగారు దుఃఖపడక మానదు. తద్వారా మామయ్య కాపురంలో కలతలు. నేను లేకపోతే ఇవన్నీ ఏవీ ఉండవు. దేవీ ఆజ్ఞ ప్రకారం ఎట్లాగో పోవాల్సిందే. ఇది కూడా కలిసొస్తుందని సంతోషిస్తున్నా” ఇవీ రుక్కుతల్లి భావాలు. 

చివరి దశలో సత్యం రుక్కుతల్లి తలని తన తొడపై పెట్టుకున్నాడు. అది మామయ్యనే నమ్ముకుంది. మామయ్య దేముడనుకుంది. మామయ్య చేతుల్లోనే అది పుట్టింది. మామయ్య చేతుల్లోనే ఉంది. 

రుక్కుతల్లి అలాగే పరలోకాలకు తరలిపోయింది. మేనమామ మేనకోడళ్ళ ఆప్యాయ బంధం, తండ్రీ కూతుళ్ళ బంధాన్ని మించి కనపడటం “రుక్కు తల్లి” నవలలో చూస్తాం. ఇదో భిన్న సంప్రదాయాంశం. 

ఓ పధ్నాలుగేళ్ళ పిల్లని కథానాయికనిచేసి, ఆ పిల్ల త్యాగాల్ని, దైన్యాల్ని రసభరిత రచనగా తీర్చి దిద్దగలగటం గొప్ప విషయం. ఈ నవలలోని ఓ ప్రతిపాదన కలకాలం నిలిచేది. ‘బిడ్డలను ప్రేమతో పెంచటానికి స్త్రీయే కావాలి. స్త్రీ చేసిన త్యాగం పురుషుడు ఎప్పుడూ చెయ్యలేడు. స్త్రీ చూపగల ఓర్పు, సహనము పురుషుడికి తల్లకిందులుగా తపస్సు చేసినా రాదు. స్త్రీ ప్రేమ స్వరూపిణి’. 

ఈ ప్రతిపాదనకి తగినట్టుగానే ‘రుక్కు తల్లి’ నవల రూపకల్పన జరిగింది. 

‘బిడ్డలు కన్నతల్లులారా! మీరు పదిమంది చేరి మాట్లాడుకొంటున్నప్పుడు రుక్కు తల్లి పేరు ఒకసారి తలవండి. బుద్ధి తెలిసిన ఏ పిల్లయినా తమ్ముళ్ళను, చెల్లెళ్ళను ప్రేమతో చూడకపోతే రుక్కు కథ చెప్పండి’ అంటూ గురజాడవారి పూర్ణమ్మని గుర్తుతెచ్చేలా ఈ నవల ముగించారు నరసింహారావుగారు. 

కుటుంబంపట్ల ఆడపిల్లకి ఉండే అపరిమిత అనురాగం రుక్కు తల్లి నవల. ఆనాటి కుటుంబ సంప్రదాయంలోని బలం అర్థం చేసుకోవటానికి ఈ నవల చదివి తీరాలి. 

హాస్య రచయితగా పేరుపొందిన ముణిమాణిక్యం నరసింహారావుగారి గంభీర చింతన, నవలా రచనలోని నవ్యరీతి, జీవితపు పొరల్లోని మానవతా చ్ఛాయల్ని ఆయన పట్టుకున్న తీరు విలక్షణమైంది. విషాదభరిత రస కావ్యం ‘రుక్కు తల్లి’.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆనందయోగ మార్గమిదే! క్షేమేచార భిక్

Published at: 18-07-2014 00:33 AM

భౌతికమైన సంపద ఎంత ఉన్నా అది ప్రాపంచిక సౌఖ్యాలు ఇవ్వగలదు. కానీ ఆనందాన్ని ఇవ్వలేదు.    మన అంతరంగంలో జ్ఞానం పీఠం వేసుకొనే దాకా శాంతి లభించదు. ప్రకృతిని జయించానని విర్రవీగుతున్న మానవుడు తన భావోద్వేగాల మీద నియంత్రణ సాధించలేకపోతున్నాడు. వ్యక్తిగత జీవితంలోను, ఇతరులతో కలిసి నివసించే సహజీవనంలోను, ఉద్యోగ వ్యాపారాల్లోను తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నాడు. వీటన్నింటికీ విరుగుడు ధ్యాన, జ్ఞాన మార్గాలే అంటారు సిద్దార్థ బుద్ద విహార ట్రస్ట్‌ ఛైర్మన్‌  వెన్‌. ఖేమాచార భిక్కు …   

మన దేశంలో సుప్రసిద్ధ బౌద్ధ గురువుల్లో వెన్‌ దీపాంకర ఒకరు. ఆయన ఒక సారి టిబెట్‌లో దమ్మతత్వం మీద ప్రసంగించటానికి వెళ్లారు. ఆయన తనతో పాటుగా ఒక వంట మనిషిని కూడా తీసుకువెళ్లాడు. ఆ వంట మనిషికి వంట సరిగ్గా రాదు. పైగా పేచీకోరు. అది గమనించిన కొందరు భక్తులు- ’మీరు ఎందుకు ఆ వంటమనిషిని భరిస్తున్నారు? అతనిని వెనక్కి పంపేయండి. మీ అవసరాలు మేం చూసుకుంటాం’ అని దీపాంకర వద్దకు వచ్చి ప్రశ్నించారు. అప్పుడు దీపాంకరుడు- ’’ అతన్ని నేను ఒక నౌకరుగా చూడటం లేదు. ఒక గురువుగా భావిస్తున్నాను. అతని అసమర్థత, పేచీకోరుతనం నాకు ప్రతి రోజూ పాఠాలు నేర్పుతూ ఉంటాయి. నాలో సహనాన్ని, నిబ్బరాన్ని పెంచుతూ ఉంటాయి..’’ అని సమాధానమిచ్చాడు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవటంలోనే మనిషి అసలైన సమర్థత దాగి ఉంటుంది.

జీవితం ఒక ఆనంద సీమ అని అందరం అనుకుంటూ ఉంటాం. కానీ, చాలా మంది జీవితం ఎందుకంత నిర్లిప్తంగా ఉంటోంది?- ఎందుకంటే మన జీవితంలో దేనికి స్థిరత్వం లేదు. ఏదీ శాశ్వతం కాదు. అయితే పరిణామక్రమంలో పరిణితి ఒక ప్రక్రియ. నిరంతరం చైతన్యశీలంగా ఉండటమే ఈ ప్రక్రియకున్న ఏకైక మార్గం. వ్యక్తుల అంతరంగాలు అనునిత్యం కొత్తదనాన్ని సంతరించుకోవాలి. అప్పుడే అవతలి వ్యక్తుల్లోని భిన్నత్వాన్ని, వ్యతిరేక తత్వాన్ని కూడా జీర్ణించుకోగలుగుతారు. కానీ ఆధునిక ప్రపంచంలో ఇది జరగడం లేదు. కొత్తదనాన్ని సంతరించుకోని వారిలో స్వార్థం పెరుగుతూ వెళ్తుంది. సర్వ అశాంతులకూ, సమస్త సంఘర్షణలకూ అదే కారణమవుతుంది.  స్వార్థశక్తులకు, మార్పునకు మధ్య జరిగే ఘర్షణ వల్లే అశాంతి ఏర్పడుతుందంటాడు బుద్ధుడు.
తోటలో పువ్వుల్లా…
ప్రపంచంలో అందరూ ఒకరితో మరొకరికి సంబంధం లేకుండా బతకగలిగితే ఇన్ని సమస్యలు ఉండవు. ఎవరి అభిప్రాయాలు వారివి. కానీ ఒక సంఘంలో నివసిస్తున్నప్పుడు సహజీవనం అనివార్యమవుతుంది. ఇతరుల దృక్పథాల్ని, అభిప్రాయాల్ని గౌరవించాల్సి వస్తుంది. పరమ విరుద్ధమైన ఆలోచనలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుంది. సాధారణంగా మనతో ఏకీభవించేవారితో కలవటానికే మనం ఇష్టపడతాం. కానీ దాని వల్ల వృద్ధి ఉండదు. అభిప్రాయాల మధ్య ఘర్షణ, ఆలోచనలలో రాపిడీ ఉన్నప్పుడే ఎదుగుదల సాధ్యమవుతుంది. ఇతరుల వాదనలో ఉన్న సత్యాన్ని గ్రహించి, దానిని ఆచరించగలిగితే కొత్త మార్గాలు మన కళ్ల ముందు గోచరమవుతాయి.  ఇతరులతో  స్నేహంగా  ఉండడం అంటే ప్రకృతితో స్నేహంగా, ఉండడమే.  శరీరం కాలిపోయేంతటి ఎండలోనూ మనం జీవిస్తాం. దానికి పరమ విరుద్ధంగా  ఉండే చలిలోనూ జీవిస్తాం.    నిలువెల్లా తడిపి  ముద్దచేసే  వర్షంలోనూ జీవిస్తాం.  వాటిలో మనం దేన్నీ ద్వేషించం.   పరమ విభిన్నమైన వాతావరణ  పరిస్థితుల్లో జీవించడానికి  మనం  సిద్ధమైనట్లే విభిన్నమైన వ్యక్తుల మధ్య జీవించడానికి   కూడా  మనం సిద్ధంగా  ఉండాలి. మనం  మన శత్రువుల్ని   ప్రేమించగలంతటి   ఉన్నతులం కాకపోవచ్చు.   కానీ,   మన ఆరోగ్యం , మన సంతోషం కోసమైనా కనీసం  వారిని మన్నించి మరిచిపోవాలి. సాధారణంగా అందరికీ వైరుధ్యం అంటే ఒక వ్యతిరేకత ఉంటుంది. దాని నుంచి దూరంగా జరిగిపోవటానికి ప్రయత్నిస్తారు. కానీ దానిని అర్థం చేసుకుంటే గొప్ప సత్యాలు తెలుస్తాయి.
దాంపత్యంలో….
పెళ్లిల్లు స్వర్గంలో నిర్ణయిస్తారు అంటారు. కానీ దాంపత్యం సరిగ్గా లేకపోతే ఆ జీవితాలు నరకకూపాలవుతాయి.  దంపతుల హృదయాలలో కేవలం స్వార్థం మాత్రమే ఉంటే- ఆ బంధం ఎంతో కాలం నిలబడదు. అడుగడుగునా తలెత్తే  వైరుధ్యాలను అర్థం చేసుకొని,  అసూయ, ఆగ్రహం, అనుమానం వంటి మానసిక స్థితులకు అతీతంగా ఉండటానికి సహనం కావాలి.  ఔన్నత్యం మనిషిని  దేవుడిగా మారుస్తుంది. హీనత్వం  మనిషిని నిర్వీర్యం చేస్తుంది. ఇక్కడ మనం దేవతలంటే ఎవరో కూడా తెలుసుకోవాలి. దేవతలంటే సకల సద్గుణ సంపన్నులు అని కాదు.  ప్రపంచంలో ఎవరూ పరిపూర్ణులు  కాదన్న సత్యాన్ని  గుర్తించి వ్యవహరించే వారని అర్థం. ఇలాంటి ఔనత్యాన్ని కలిగినప్పుడు దాంపత్యం సజావుగా సాగిపోతుంది.
మూలాలు పెకిలిస్తేనే…
అవగాహన, సహనం- ఈ రెండు గుణాలతో వైరుధ్యాలను అధిగమించవచ్చు. ఇది సాధ్యం కానప్పుడు అశాంతి ప్రబలుతుంది. ప్రస్తుతం మనం అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. మునుపెన్నడూ లేనంతగా మనం శాంతి కోసం వెతుకుతున్నాం. ఇప్పుడు ఏర్పడిన అంశాంతి అంతా భౌతిక సంపద కోసం వెంపర్లాటం వల్ల వచ్చేదే. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎంతో ప్రగతి సాధించిన అగ్ర రాజ్యాలు కూడా ఈ సమస్యతోనే బాధపడుతున్నాయి. భౌతికమైన పురోగతి మనిషిని సంతోషపెట్టలేదనే సత్యాన్ని మానవాళి విస్మరించింది. దానికి మూల్యం చెల్లిస్తోంది. జ్ఞానం- దాని వల్ల సంక్రమించే నీతి,  ఉదాత్తత, ఇవి మాత్రమే శాశ్వతమైనవని  గ్రహించిన రోజు శాశ్వతంగా శాంతి ఏర్పడుతుంది. ఆ  శాంతి సాధనకు పునాదిగా నిలిచే జ్ఞానాన్ని సముపార్జించటానికి ధ్యానం తోడ్పడుతుంది.                 

. నవ్య డెస్క్‌

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రెండు లక్షల తో ”అయిస్ క్రీమ్ ”(సినిమా) చేసి రికార్డు కొట్టిన రామ్ గోపాల్ వర్మ

బడ్జెట్‌తో కాదు.. ఐడియాతో సినిమా చేశారు!

Published at: 17-07-2014 01:06 AM

‘‘వర్మ మొదటి నుంచీ ముక్కుసూటి మనిషి. ఒకప్పటి వర్మకీ, ఇప్పటి వర్మకీ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం అతనిలో సెంటిమెంట్‌ అప్పీల్‌ వచ్చింది. ఐడియాని నమ్మి   సినిమా చేసి హిట్‌ సాధించాడు. ఇప్పట్లో సినిమా అనగానే ఎవరికీ కథగానీ, ఇంకోటిగానీ అవసరం లేదు. బడ్జెట్‌ ఎన్ని కోట్లు అనే అడుగుతున్నారు. ‘ఐస్‌క్రీమ్‌’లాంటి సినిమాలు అలాంటి పరిస్థితుల్లో మార్పులు తెస్తాయి. మారుతున్న టెక్నాలజీని అర్థం చేసుకుని వర్మ చేసిన ప్రయోగం ఫలించింది. కొందరు కలిసి యూనిట్‌గా అయి సినిమా చేసి, లాభాలు వచ్చిన తర్వాత ఎవరి వాటాను వారు తీసుకోవడం చాలా బావుంది. ఇలాంటి ఆల్టర్నేటివ్‌    సినిమా లేకపోతే పరిశ్రమ మనుగడ కష్టం. రూ.50 కోట్లు ఖర్చుపెట్టిన సినిమాకు రూ.51 కోట్లు వస్తే అది లాభం కింద లెక్కకాదు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ ‘ఐస్‌క్రీమ్‌’కు పెట్టిన ఖర్చుకు దాదాపు 20 రెట్లు లాభాలను చవిచూశాడు. ‘ఐస్‌క్రీమ్‌2’ను వెంటనే మొదలుపెట్టడం బావుంది’’ అని దాసరి నారాయణరావు అన్నారు. ఇటీవల విడుదలైన ‘ఐస్‌క్రీమ్‌’ విజయోత్సవ వేడుక హైదరాబాద్‌లో బుధవారం ఉదయం జరిగింది. దాసరి నారాయణరావు   పాల్గొని చిత్ర యూనిట్‌కు పారితోషికాలను చెక్కుల రూపంలో అందజేశారు. నవదీప్‌, తేజస్వి జంటగా రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెరకెక్కించిన సినిమా ‘ఐస్‌క్రీమ్‌’. ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ ‘‘ముందు రూపాయి లేకుండా సినిమా చేద్దామని, సినిమా విడుదలయ్యాక మాత్రం అందరికీ పారితోషికం తప్పకుండా ఇవ్వాలని, మోసం చేస్తే పైకి రాలేనని వర్మ చెప్పారు. దానికి తగ్గట్టే సినిమాను ప్లాన్‌ చేశాం.

రూపాయికి రూపాయి మిగిలింది. ఈ సినిమాతో నా టీమ్‌ అంతా ఆనందంగా ఉంది’’ అని చెప్పారు. చక్కటి సినిమాలో నటించినందుకు ఆనందంగా ఉందని నవదీప్‌ అన్నారు. వర్మ మాట్లాడుతూ ‘‘ఎంతోమందికి సినిమా తీయాలని ఉంటుంది. అందుకు డబ్బులు అవసరం లేదు. ఐస్‌క్రీమ్‌ తీసిన సిస్టమ్‌లో ఎవరైనా సినిమా తీసి అవతలివారిని మెప్పించగలిగితే తప్పకుండా సినిమాలను విడుదల చేసి లాభాలను చవిచూడవచ్చు. కాకపోతే సమష్టిగా పనిచేయాలి. అదే జరిగితే పరిశ్రమతో పనిలేకుండా ఎక్కడైనా, ఏ ప్రాంతంలో అయినా సినిమాలు చేయొచ్చు. ఇప్పటి వరకు అందరూ వర్మ స్కూల్‌ అని అంటుంటారు. నిజంగా నాకు స్కూల్‌ లేదు. కానీ ఈ టెక్నిక్‌ల గురించి వీడియోల ద్వారా వివరించాలని ఉంది’’ అని అన్నారు.
నాది కుక్కబుద్ధి: ఇటీవల రివ్యూలు రాసిన వారిని ‘చీకట్లో అరిచే కుక్కలు’ అన్న వర్మ దాని గురించి మాట్లాడుతూ ‘‘అమితాబ్‌బచ్చన్‌ని కూడా ట్విట్టర్‌లో బూతు మాట అన్నవాడిని నేను. అయినా ఆయన దాన్ని తప్పుగా తీసుకోలేదు. ఆయనకు నా గురించి తెలుసు. స్పాంటేనియస్‌గా మాట్లాడటం నాకు అలవాటు. అలా కాకుండా ఏదో మొహమాటానికి మాట్లాడితే అది నేను మాట్లాడినట్టు ఉండదు. నేను రాసిన లేఖలో మీడియా మొత్తాన్ని కించపరచలేదు. ఒక వెబ్‌సైట్‌లో పర్టిక్యులర్‌ రివ్యూ  రాసిన వ్యక్తినే అన్నాను. అతని విషయంలో ఇంకా ఆ మాటకు నేను కట్టుబడే ఉన్నాను. మిగిలిన వాళ్లను ఉద్దేశించి అన్నట్టు అనిపిస్తే సారీ. నాది కూడా కుక్కబుద్ధే’’ అని వివరించారు.

Posted in సినిమా | Tagged | Leave a comment

స్మృతిపథంలో బసవపున్నయ్య –

స్మృతిపథంలో బసవపున్నయ్య

Published at: 18-07-2014 01:11 AM

పార్టీ కార్యకర్తల్లో పిడివాదం పెగరకుండా కృషిచేసిన అరుదైన కమ్యూనిస్టు నాయకుడు మాకినేని  బసవపున్నయ్య. భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమాలలో ఆయనది ప్రధాన పాత్ర. బసవపున్నయ్య సంస్కారం ఉన్నతమైనది.

ఇది సీపీఎం ప్రముఖ సిద్ధాంతకర్త కీ.శే. మాకినేని బసవపున్నయ్య (యం.బి.) శతజయంతి సంవత్సరం. పుచ్చలపల్లి సుందరయ్య గారు తన ఆత్మకథలో ‘కొత్తగా సీపీఎం ఉమ్మడి సీపీఐ నుంచి విడివడి ప్రత్యేక పార్టీగా ఏర్పడినప్పుడు యం.బి.ని పార్టీ ప్రథమ జాతీయ కార్యదర్శిగా మహాసభ ఎన్నుకుంటుందని నేను భావించాను. సీపీఐలో అంతర్గత పోరాటంలోనూ, సీపీఎంకు ప్రత్యేక పార్టీగా సైద్ధాంతిక అస్తిత్వాన్ని ఇవ్వడంలోనూ ఆయన పాత్ర చాలా ముఖ్యమైనది. అయితే కొత్త పార్టీకి దేశవ్యాప్తంగా పేరు ప్రతిష్టలున్న నాయకుడు కావాలని నన్ను ఎన్నుకున్నారు’ అని రాశారు. అంటే యం.బి.కి సీపీఎంలో ఉన్న ప్రాధాన్యం అర్థం అవుతుంది. అంతేకాదు, యం.బి. కూడా తనతో పాటు, పార్టీ కేంద్రంలో ఉండి పార్టీకి సైద్ధాంతికంగా, నిర్మాణరీత్యా సహకరిస్తేనే తాను జాతీయ ప్రధాన కార్యదర్శి పదవికి అంగీకరిస్తానని స్పష్టం చేశానని కూడా సుందరయ్య చెప్పారు.

యం.బి.ది పార్టీ వాద ప్రతివాదాల్లో ఒక విలక్షణమైన, ఆకర్షణీయమైన శైలి! సీపీఎం ఏర్పడిన కొత్తలో పత్రికల వాళ్లు ఆయనను ‘సీపీఐ కమ్యూనిస్టు పార్టీ కాదా?’ అని అడిగితే ఆయన వెంటనే ‘వాళ్లు కమ్యూనిస్టులయితే మరి నేనెవర్ని?’ అని ఎదురు ప్రశ్న వేశారు. ఇప్పుడు అన్ని కమ్యూనిస్టు పార్టీలు మిగిలిన కమ్యూనిస్టు పార్టీలను వాటి వాటి పేర్లతోనే పిలుస్తున్నారనుకోండి! 1980-81లో అనుకుంటా సూర్యాపేటలో ఒక ఎన్నికల బహిరంగ సభలో మాట్లాడుతూ ‘నా బట్ట తలపై వెంట్రుకలైనా దట్టంగా రావచ్చు గానీ, ఇందిరాగాంధీ గెలవడం కల్ల!’ అని యం.బి. అన్నారు. సీపీఎం అభిమానులు బ్రహ్మాండంగా చప్పట్లు చరిచారు. తీరా ఆ ఎన్నికలలో ఇందిరా గాంధీ ఘనవిజయం సాధించారు. ఆ తదుపరి ఒకసారి యం.బి. కలిసినప్పుడు ‘అదేంటండీ, అంత ఘంటాపథంగా ఇందిరాగాంధీ ఓడిపోతుందని అన్నారు…?’ అని అడిగాను. ‘భలేవాడివయ్యా నా సైన్యాన్ని ఎన్నికల యుద్ధంలోకి దింపుతున్నాను. ఆ సందర్భంలో నాకు ఇందిరాగాంధీ గెలుపు ఖాయమనిపించినా, ‘ఇందిరా గాంధీ గెలుస్తుంది – మనం ఓడిపోతామని’ చెబితే – మనవాళ్లు ఇక గోడలమీద రాతలు కూడా మొదలెట్టరు’ అని అన్నారు (అప్పుడు ప్రధాన ప్రచారం గోడలపై రాతలే – ఫ్లెక్సీలు రాలేదు).

యం.బి.కి చిన్నతనం నుంచి హేతువాద దృక్పథం ఉండేది. వాళ్ల ఊళ్లో రచ్చబండ వద్ద ‘పోతరాజు’ (గ్రామ దేవత – ఒక కర్ర ముక్క పాతిపెట్టి పుసుపు కుంకుమ పూసి)కు, కొలుపులు, జాతర్లు జరిగేవట. పోతరాజు మహిమల కథలు! ఒకరోజు ఒక కుక్క ఆ పోతరాజుపై కాలుపైకెత్తి మూత్రం పోయడం యం.బి. చూశారట! అంతలావు పోతరాజు ఆ మాత్రం కుక్కనే ఏం చేయలేకపోయాడని ఈయన తనకాలితో పోతరాజును తన్నాడట! ఇది ఆయన బంధువులెవరో చూసి ‘వేలెడంత కూడా లేవు ఎంత పొగర్రా నీకు, ఉండు ఇంట్లో చెప్తానని’ కేక వేశాడట! అందుకు ఇంట్లోంచి పారిపోతే, తెనాలిలో వారి ఊరు వాళ్లెవరో గుర్తించి, వాళ్ల ఊరు తీసుకెళ్లారట! కందాళం హనుమంతరావు గారని అప్పుడు కొల్లూరులో ఒక హెడ్‌ మాస్టర్‌ బాగా మంచి పేరున్న ఆయన. తన స్కూల్లో యస్‌.యస్‌.యల్‌.సి. విద్యార్థులకు ఫైనల్‌ పరీక్ష ముందు పరీక్ష పెట్టి, కొంతమందిని పరీక్షలో నెగ్గలేరని డిటెయిన్‌ చేశారట! ఆ డిటెన్‌షన్‌ విధానానికి వ్యతిరేకంగా యం.బి. నాయకత్వాన విద్యార్థులు సమ్మె చేశారట! అప్పుడు యం.బి. రాయించిన నినాదం ఏమంటే ‘ఎట్లాగూ కృతార్థులయ్యే విద్యార్థులను పాస్‌ చేయించడంలో కందాళం వారి గొప్ప ఏముంది – అలా చదువులో వెనుకబడిన విద్యార్థులను పాస్‌ అయ్యేలా చేయిస్తేనే గదా ఆయన ప్రతిష్ఠ!’ అని. అది చదివి హెడ్‌ మాస్టర్‌ తన స్కూలు విద్యార్థుల ముందు ఆ నినాదాన్ని మెచ్చుకున్నారట. అప్పుడు మా నాన్నగారు కొల్లూరు హైస్కూలు విద్యార్థి.

గోర్బచేవ్‌ సోవియట్‌ యూనియన్‌లో తొలిసారి గ్లాస్‌నాస్త్‌ (బహిరంగంగా వాస్తవ పరిస్థితిని వెలిబుచ్చడం) ప్రవేశపెట్టాడంటారు. కానీ యం.బి. దాన్ని, అంతకుముందే అవలంబించేవారు. ఢిల్లీలో కేంద్ర రాజకీయ పాఠశాల జరిగింది. మన రాష్ట్రం నుంచి కొరటాల సత్యనారాయణ, వి.యన్‌. రెడ్డి, టి.వి.ఆర్‌. చంద్ర, నేను అక్కడికి విద్యార్థులుగా వెళ్లాం. యం.బి. ‘1951 ఎత్తుగడల పంథా’ గూర్చి పాఠం చెప్పారు. అయిపోయిన తర్వాత మేము ముగ్గురమూ (కొరటాల రాలేదు) యం.బి.ని విడిగా కలిసి మా సందేహం అడిగాం. ‘మన భారత విప్లవ పంథా రష్యా మార్గమా, చైనా మార్గమా అన్న చర్చ…’ అని నేను ప్రశ్న పూర్తి చేయకుండానే ‘అసలు మీకు ఒక విషయం చెప్పాలి! క్లాసులో సీరియస్‌గా పాఠం చెప్తే ఆ విషయం చెప్పలేదు కదా!’ మనం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో దిగబడ్డాం! ఇప్పుడు మీరు మా గురించి, మార్క్సిజంలో నిష్ణాతులం అనుకున్నట్లే మేమప్పుడు పార్టీ కేంద్రం  బొంబాయిలో ఉన్న డాంగే, రణదివే, అజయ్‌ఘోష్‌ల గురించి వాళ్లకు మార్క్సిజం వేళ్ల కొసలపైన ఉంటుందనీ, ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పగలరని అనుకునేవాళ్లం. ఇక్కడ మాకు ఆ సాయుధ పోరాటం సందర్భంగా ఏదైనా సమస్య వస్తే బొంబాయిలో వాళ్లకి ఆ సమస్య గురించి రాసి వారిని పరిష్కారం చూపమని అడిగేవాళ్లం. వారు పరిష్కారం రాసి పంపేవారు. ఆ పరిష్కారం మాకు అతికేది కాదు. అదే విషయం ‘కామ్రేడ్స్‌ మీ పరిష్కారం ఇక్కడ మాకు అన్వయం కావడం లేదు’ అని మళ్లీ వారికి పంపేవాళ్లం. వాళ్లు దానికి ‘ఎందుకు కుదరదు కామ్రేడ్స్‌ – అని లెనిన్‌ ఇలాంటి సందర్భంలో అంటూ ఒక రెండు పేజీల లెనిన్‌ కొటేషన్‌ జోడించి సమాధానం ఇచ్చేవారు. వీళ్లతో అయితే మేం చర్చించగలం గానీ, లెనిన్‌తో చర్చించ గల స్థాయి మాకు లేదు కదా! అందుకని మావో కొటేషన్‌ ఏదన్నా మాకు అనుకూలంగా వున్నది వెలికితీసి ఒక మూడు పేజీల కొటేషన్‌తో వారికి మళ్లీ రాసేవారం. ఇలా వారిది రష్యా మార్గం అయింది, మాది చైనా మార్గం అయింది. నిజానికి వారికి రష్యా మార్గమూ, మాకు చైనా మార్గమూ క్షుణ్ణంగా తెలిసింది కాదు’ అని చెప్పారు. అయినా నేను పట్టువదలని విక్రమార్కుని మాదిరి ‘ఇంతకీ మీరు ఏం చెప్పాలని’… ‘అని ప్రశ్న వేయకముందే’ సరే! క్లాసులో నా పాఠమే కాదు ఇప్పటి నా వివరణ సారాంశం కూడా మీకు అర్థం కాలేదన్న మాట అని ఆయన నవ్వారు. అప్పుడు గానీ మాకు తట్టలేదు. మేమూ పకపకా నవ్వాము.

ఇంకోసారి విడిగా మాట్లాడేటప్పుడు- ‘అదిగో, ఆ మావోగారి కాళ్లు, గడ్డమో పట్టుకుని ఇక్కడకు తీసుకువచ్చి ‘మంగళాపురం’ (చండ్ర రాజేశ్వరరావు గారి ఊరు)లో రహస్యంగా వుంచి, ఇక్కడ విప్లవం తీసుకురమ్మని ప్రాధేయపడదాం! ఆయన వల్ల అవుతుందేమో చూద్దాం – అయినా మన దేశం – మన భౌతిక పరిస్థితి – మన ప్రజల చైతన్యం – ఇవి ప్రధానం గానీ, ఏ నాయకుడినో కాపీ కొడితే కుదురుతుందా?’ అని అన్నారు. ‘ఇప్పుడు జరగబోయే బహిరంగ సభలో, మా చైనా చూడండి, అక్కడ తిండిలేని వాడు లేడు, బట్టలేని వాడు లేడు, ఇల్లు లేనివాడు లేడు, నిరుద్యోగి ఉండడు – అంటూ చేతులు బారజాపుతూ ఉపన్యసిస్తాను.’ అది సరేసారు, ‘మన చైనాలో అధ్యక్షుడు లీ షాల్‌ చీని 10 సంవత్సరాలు జైల్లో పెట్టి సరిగ్గా తిండి కూడా పెట్టకుండా చంపారట కదా అని ఎవరన్నా లేచి అడిగితే మొహం ఎక్కడ పెట్టుకోవాలి? అయితే అలా అడగరు ఎవ్వరు – అసలు నాయకులకు ఎదురు ప్రశ్న వేస్తే ఊరుకుంటామా – మన వాలెంటీరే కర్ర చూపించి కూర్చోపెడతాడు’ అని ఇంత బాహాటంగానూ అనేవారు. మావో ప్రసిద్ధ రచన ‘ఆన్‌ కాంట్రడిక్షన్స్‌’ (వైరుధ్యాలపై) విమర్శిస్తూ ఆ మావో, మిత్ర వైరుధ్యం అంటారేమిటి? వైవిధ్యం కాదు. వైరుధ్యంలో మళ్లీ మిత్రత్వం ఏమిటి? మైసూరు పాకు తింటూ పచ్చి మిరపకాయ నంజుకున్నట్లు అని అనడమే గాక, దానిపై ఒక విమర్శనాత్మక పుస్తకమే రాశారు. ఓంకార్‌ను సీపీఎం పార్టీ నుంచి రాష్ట్ర కార్యవర్గం తొలగించింది. ఆ తర్వాత యం.బి. రాష్ట్ర కార్యవర్గ సమావేశానికొచ్చారు. ఆయన ఓం కార్‌ బహిష్కరణ విషయంలో రాష్ట్ర కమిటీలో ‘బహిష్కరించడమేనా మరో మార్గం లేదా? ఒక్క ఓంకార్‌ తిరిగి పార్టీకి లభించాలంటే ఎంత కష్టం! ఓంకార్‌ మీ దృష్టిలో తప్పుచేసి ఉండొచ్చు. కానీ ఓంకార్‌ తప్పులేనా చేసింది. సాయుధపోరాటంలో ఆ తర్వాత వరంగల్‌ జిల్లా పార్టీ నిర్మాణంలో ఆయన పాత్ర ఏమిటి? ఆయనపై చర్య తీసుకునే ముందు ఓంకార్‌తో ఒకసారి నేను మాట్లాడే అవకాశం కల్పించి ఉండవలసింది. ఇక మీ ఏకగ్రీవ నిర్ణయానికి ఇప్పుడు చేసేదేముంది?’ అని తన అసంతృప్తిని వినిపించారు.

ఇలా చాలామంది కంటే పార్టీలో ఓపెన్‌ మైండ్‌తో ఉండడమే గాక, కొంత వరకూ పార్టీ కార్యకర్తలలో గుడ్డివిశ్వాసం, పిడివాదం పెరగకుండా కృషి చేయాలని భావించే అరుదైన నేతలలో ఆయన ఒకరు. భగవతీ చరణ్‌ వర్మ రాసిన ‘చిత్రలేఖ’ నవల నాకు నచ్చింది. ఆయనకు ఇచ్చి మీరు చదవండి అని అడిగాను. ఆయన చదివి ‘బాగుంది దీనిపై మన ప్రజాశక్తిలో సమీక్ష చేయమన్నారు.’ ‘ఎందుకులెండి  విఠల్‌ గారికి ఇప్పుడు ఈ వేశ్యల, రాజుల, రంగప్పల నవల ఎందుకు నచ్చిందో అని మన కార్యకర్తలు విస్మయపడతారు’ అన్నాను. ‘సరేనయ్యా వాళ్లు ఏది కావాలంటే అది ఇవ్వడమేనా మన పత్రిక చెయ్యాల్సింది. వాళ్లను అట్లా అయినా ఆలోచింపనియ్యి’ అని ప్రోత్సహించారు. ఇలా ఎంతని చెప్పగలం? ఏది ఏమైనా మనదేశంలో కమ్యూనిస్టు ఉద్యమాలలో సిద్ధాంత వేత్తలలో ఆయనది ప్రధాన పాత్ర. ఆయనదొక విలక్షణమైన శైలి! తాను సీపీఎంలో నిర్వహించిన అంతర్గత పోరాటం సందర్భంగా యం.బి. తనతో కలిసి రాలేదన్న అసంతృప్తి సుందరయ్యకు ఉండేది. ఆయన తన రాజీనామా లేఖలో కూడా ఆ విషయం ప్రస్తావించారు. జలంధర్‌ మహాసభలో యం.బి., ఇ.యం.యస్‌.లు కేంద్రకమిటీ తరపున తయారుచేసిన డాక్యుమెంట్‌కు సుందరయ్య గారు ప్రత్యామ్నాయ డాక్యుమెంటు పెట్టారు. యం.బి., సుందరయ్యగారి ప్రత్యామ్నాయ డాక్యుమెంటును తీవ్రంగా విమర్శించారు. కానీ సుందరయ్య మరణానంతరం ఆయన సంతాప సభలో మాట్లాడుతూ ‘ప్రపంచ వ్యాప్తంగా నాకు తెలిసిన ఐదుగురు మార్క్సిస్టు అగ్ర నేతల్లో సుందరయ్య ఒకరు’ అని ఎంతగానో ప్రసంశించారు. ఆయన సంస్కారం ఉన్నతమైనది.

– డా. ఎ.పి. విఠల్‌

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఎన్నాళ్లీ వేఽధింపులు? ఇకపై సాగవు! అంటున్న మహిళా మణులు

ఎన్నాళ్లీ వేఽధింపులు? ఇకపై సాగవు!

Published at: 18-07-2014 00:38 AM

మహిళలపై లైంగిక వేధింపులు ఈ నాటివి కావు. ఆ బాధలను బయటికి చెప్పుకోలేక మనసులోనే ఆవేదన చెందే అభాగినులు ఎందరో! కానీ తరం మారింది, బాధిత మహిళలందరూ కలిసి అలాంటి సమస్యలను ఎదుర్కోవడానికి కొంగు బిగించారు. ఒక సంఘంగా ఏర్పడ్డారు. అందుకు నిదర్శనం సికింద్రాబాద్‌ రైల్వేవర్క్‌షాప్‌ మహిళా సంఘం…

తీవ్ర అనారోగ్యంతోపాటు ప్రమాదాల్లో అర్ధాంతరంగా భర్తలు మరణిస్తే, దిక్కుతోచని పరిస్థితుల్లో పిల్లల ఆలనా పాలన కోసం ఇంటికే పరిమితమైన వారి భార్యలు కారుణ్య నియామకం కింద వర్క్‌షాప్‌లో వచ్చిన ఉద్యోగాల్లో చేరారు. ఒంటరిగా జీవన సమరం సాగిస్తున్న ఆ మహిళా ఉద్యోగినులకు కొందరు అధికారులు, ఉద్యోగుల నుంచి లైంగిక వేధింపులు ఆరంభమయ్యాయి.
రైల్వే ఉద్యోగి అయిన భర్త కేన్సర్‌తో మరణించాడు. దీంతో అత్తింటివారు కోడలితోపాటు ముగ్గురు పిల్లల్ని ఇంటి నుంచి బయటకు గెంటేశారు. పిల్లల్ని తీసుకొని కారుణ్య నియామకం కింద రైల్వేవర్క్‌షాప్‌లో టెక్నీషియన్‌గా ఉద్యోగం పొందిన ఆ మహిళ మొదటిసారి వంటింటి నుంచి బయటకు వచ్చింది. ఆ ఒంటరి మహిళకు ఆఫీసులో వేధింపులు ఎదురయ్యాయి. ఆమె గురించి కొందరు మగవాళ్లు అవాకులు చవాకులు పేల్చేవారు. అంతటితో ఆగకుండా ఓ పురుష ఉద్యోగి మరో అడుగు ముందుకేసి ఓ రోజు బలవంతపెట్టే మాటొకటి అన్నారు. అంతే! కన్నీటిపర్యంతమైన ఆ మహిళ ధైర్యం తెచ్చుకొని రైల్వే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో వేధించిన ఉద్యోగిపై బదిలీవేటు పడింది. రోడ్డు ప్రమాదంలో భర్త మరణించడంతో ఉద్యోగంలో చేరిన మరో మహిళకు అడుగడుగునా ఇవే సమస్యలు. ఇలాంటి వారంతా కలిసి ఒక్కటవ్వాలని నడుం బిగించారు. వర్క్‌షాప్‌ మహిళలను సంఘటితం చేసి ఈ ఏడాది ఆరంభంలో మొదట స్ర్తీశక్తి సమ్మేళనాన్ని నిర్వహించారు. సంక్రాంతి పండగను పురస్కరించుకొని ముగ్గుల పోటీలు కూడా నిర్వహించి విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సమావేశమయ్యారు. ఇలా ఒకరికొకరు దగ్గరయ్యారు. ఇకపై పురుషులకు చెప్పుకోలేని సమస్యలను మనకు మనమే పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నారు ఆ మహిళలు. దీని కోసం ప్రత్యేకంగా ఓ సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు.
అందరి భద్రత కోసం..
రైల్వే వర్క్‌షాప్‌లో మహిళా శక్తిని బలోపేతం చేస్తూ ‘వర్క్‌షాప్‌ మహిళ’కు ఈ ఏడాది ఏప్రిల్‌ 17న శ్రీకారం చుట్టారు. ముందుగా మహిళా ఉద్యోగినుల్లో చైతన్యం నింపేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించారు. వర్క్‌షాప్‌ మహిళ ఆవిష్కరణానంతరం మొదటిసారి మహిళా ఉద్యోగినులను బస్సుల్లో అనంతగిరిహిల్స్‌లో విహారయాత్రకు తీసుకువెళ్లారు. మరోసారి జహీరాబాద్‌లోని వ్యవసాయక్షేత్రంలో పర్యావరణ విహారయాత్రలోనూ పలువురు మహిళా ఉద్యోగినులు పాల్గొన్నారు. ఇలా విహారయాత్రల్లో అందరినీ మాట్లాడించి వారి సాధక బాధకాలను అడిగి తెలుసుకోవడం కార్యక్రమ ఉద్దేశం. పురుషులు వేధిస్తే తామే తప్పు చేస్తున్నామన్న భావన వీడి ధైర్యంగా ముందుకొస్తే చర్య తీసుకుంటామంటోంది సంఘం కార్యదర్శి విష్ణువందన.
కలిసికట్టుగా ఎదుర్కొనేందుకు..
వర్క్‌షాప్‌లో పనిచేసే ఓ మహిళా ఉద్యోగినికి ఓ అధికారి ఏడాది కాలంగా ద్వందార్ధపు మాటలతోపాటు… తీక్షణపు చూపులు, వెకిలిచేష్టలతో వేధిస్తుండే వాడు. పదిరోజుల క్రితం సదరు అధికారి ఓ రోజు రాత్రి ఆ మహిళ ఇంటికే ఏకంగా ఫోన్‌ చేసి అసభ్యకరంగా మాట్లాడాడు. ఈ సంఘటనతో ఆ మహిళా ఉద్యోగిని కుటుంబంలోనూ చిచ్చు రేగింది. దీంతో బాధితురాలు చేసిన ఫిర్యాదుతో వర్క్‌షాప్‌ మహిళలు మూకుమ్మడిగా కలిసి సదరు ఇంజనీరు కార్యాలయానికి వెళ్లి ఆయన్ను కాలరు పట్టుకొని బయటకు రప్పించి నిలదీశారు. ‘‘నీ భార్యకు ఎవరైనా ఇలా ఫోన్‌ చేస్తే నీకెలా ఉంటుంది’’ అని ప్రశ్నించారు. ఇంట్లో జరుగుబాటు లేక ఉద్యోగానికి వచ్చిన మహిళలను ఇలా వేధిస్తావా? అంటూ ఘెరావ్‌ చేసి చీఫ్‌ వర్క్‌షాప్‌ మేనేజరుకు ఫిర్యాదు చేశారు వాళ్లు. మహిళలంతా కదిలివచ్చి నిలదీయటంతో భయపడిన అధికారి క్షమాపణలు చెప్పారు. మహిళ పట్ల అసభ్యకరంగా మాట్లాడిన ఇంజనీర్‌పై ఉన్నతాధికారులు బదిలీవేటు వేశారు. మరో మహిళా ఉద్యోగినిని వేధించిన మరో ఉద్యోగిని కూడా మహిళలు నిలదీసి, ఆయనతో క్షమాపణలు చెప్పించారు. సిగ్నల్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్స్‌ వర్క్‌షాప్‌లో  పనిచేస్తున్న అయిదునెలల గర్భిణి బరువులు మోయడం వల్ల కడుపులో నొప్పి వస్తోందంటే, ఓ అధికారి వెటకారంగా మాట్లాడారు. దీంతో ఆ అధికారి వద్దకు మహిళలు వెళ్లి నిలదీశారు. రైల్వే ఉన ్నతాధికారులతో మాట్లాడి గర్భిణికి మెటిర్నిటీ లీవు ఇప్పించామంటున్నారు సంఘం నాయకురాలు సావిత్రి.
‘‘మా నాన్న హార్ట్‌ఎటాక్‌తో మరణిస్తే చదువుకుంటున్న నాకు కారుణ్య నియామకం కింద వర్క్‌షాప్‌లో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంలో చేరిన మొదట్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. కానీ ఆలోచించి వేధింపులను ధైర్యం తెచ్చుకొని ఎదుర్కొన్నాను.. ’’ అన్నారు మరో ఉద్యోగిని చంద్రకళ.

కీచకుల భరతం పడతాం
సికింద్రాబాద్‌లోని అన్ని రైల్వే వర్క్‌షాప్‌లలో మా మహిళా సంఘం ప్రతినిధులు తిరిగి వారి సమస్యలను అడిగి తెలుసుకునేందుకు ఓ కార్యక్రమాన్ని రూపొందించాం. మహిళల సమస్యల పరిష్కారానికి కౌన్సెలింగ్‌ చేపడుతున్నాం. పనిచేస్తున్న మహిళలను లైంగికంగా వేధిస్తే సహించేది లేదు. కీచక అధికారుల భరతం పడతాం. చట్టప్రకారం వారిపై జీఎంతోపాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం.
– విజయ జగదీశన్‌, ఛైర్‌పర్సన్‌, వర్క్‌షాప్‌ మహిళ, సికింద్రాబాద్‌

నవ్య డెస్క్‌

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పిబరే కృష్ణ .ర.సం.-2

పిబరే కృష్ణ .ర.సం.-2

కన్న పేగు విలువ తెలియ జెప్పే కద ను శ్రీ ఎద్దుల సత్యనారాయణ రెడ్డి రాశారు .తల్లికి షుగర్ ఎక్కువై ఇన్సులిన్ మీద బతుకుతోంది .దాన్ని తెమ్మంటే తాత్సారం చేస్తున్నాడు కొడుకు .వాడి పరిస్తితీ అస్తవ్యస్తం గానే ఉంది .చేతిలో డబ్బు ఆడటం లేదు .పెళ్ళాం పేరుకు ‘’వనిత’’ కాని ఆ లక్షణాలు లేనిది .వాడికి అప్పే దొరకటం లేదు .మధ్యలో నలిగిపోతున్నాడు .వాడు స్నానం చేస్తుంటే వాడి చిన్నపాప మిద్దె మీది  నుంచి జారి కిందపడి చెవిలోంచి నెత్తురు కారుతోంది .వనిత ఏడుస్తూ మొగుడ్ని పిల్చింది .ఇంతలో  వాడి తల్లి వచ్చి ‘’’’దేవుడా !నా కొడుక్కిన్ని అగచాట్లు ఎందుకు పెడతాఉన్నావు ?పాపిస్తోడా యేమిరా ఈ బాదలు ,అప్పా దేవుడా కనికరము చూపించి కాపాడు తండ్రీ ‘’అని గోడు గోడున ఏడుస్తూ ,పాపను సముదాయిస్తూ ముద్దాడుతోంది .స్నేహితులెవరో కారు తెచ్చారు.పిల్లను హాస్పిటల్ కు తీసుకెళ్ల టానికి .వాడు పిల్లతో కారెక్క బోతుంటే ‘’కొడకా ఇద్దో ఈ నూర్రాపా యలు ఉంది నా తావున .తీసుకో ‘’అని వాడి చేతిలో నలిగిన నోట్లను పెట్టింది ఆ అమ్మ .కన్నపేగు విలువ మరి ఆ తల్లికి కాక ఎవరికి తెలుస్తుంది ?

శ్రీ కలువ కుంట నారాయణ తన ఊరి జ్ఞాపకాలను గుది గుచ్చి చెప్పాడు .పూర్వం అంతా నడకే నని ఇప్పుడీ కార్లు బస్సులు వచ్చి నడక మర్చిపోయారని  ‘’గేపకం ‘’చేసుకొన్నాడు .ఊర్లోని బండా గుండూ,చప్పితోడు ,పోట్టబ్బవంటి మారు పేర్లున్న మనషులు గుర్తుకొచ్చారు .’’బాపన చీమలు ,మాల కాకులు ,కుమ్మరి పురుగులు వడ్రంగి పిట్టలు ,సాలె పురుగులు ,దేవాంగ పిల్లులు ,గొల్ల భామలు ,దాసరి పాములు గుర్తుకొచ్చి ప్రపంచం లో ఏ భాషలో కూడా ఇలా కులం పేర్లున్నాయా ?ఇక్కడే ఈ ప్రత్యేకత ఏమిటి అని ఆలోచిస్తాడు .కప్పల్లాగా వానకు సంబర పడే జీవి లేదని చెబుతాడు .వాటిల్లో కోమటికప్పలు ‘’బేరం సారం ‘’ అని కంసాలి కప్పలు ‘’టక్కుం బిక్కుం ‘’అని ధ్వని చేస్తాయని బాపన కప్పలు ‘’నెయ్యి పప్పూ ‘’అంటా యని చిన్నప్పుడు పెద్ద వాళ్ళు చెప్పింది జ్ఞాపకం వస్తుంది .తండ్రి ని ఊళ్ళో అంతా  ‘’ఆయవారా ‘’అని పిలవటం ఆయనే తనకూ గురువవటం ,నాటకాలు ప్రాక్టీస్ చేయటం ,నరసయ్య నాయుడు నిద్ర పోతూకూడా మద్దెల దరువు లయ తప్పకుండా వాయించటం గుర్తుకొచ్చి మురిసి పోతాడు .ఇప్పుడు వేసే నాటకాలలో గందర గోళం ఉందని బాధ పడతాడు .’’నా చిన్న నాటి అనుభవాలు గుత్తులుగా మొలసుకొని వస్తున్డాయి .అందరితో పంచుకోవానే తహ తహ నన్ను  ‘’నీ గేసుకొన్న(దార బోసుకున్న ) గ్యాపకాలు ‘’రాయిన్చిందని ముగిస్తాడు .

శ్రీ కారు పల్లి నరసింహ మూర్తి ‘’అమ్మే ఆపేకారము ‘’పేరు తో రాసిన కధలో తల్లి అనాకారితనానికి  లొట్ట కన్నుకు కొడుకు చీదరించుకొంటూ దూరం గా పోయి పెద్దింటి పిల్లను పెళ్ళాడి సంపన్నుడై కూడా ఊరికి రాకుండా వచ్చినా తల్లిని చూడకుండా పుట్టిన పిల్లల్ని నాయనమ్మ కు చూపకుండా ఉంటాడు .ఒక సారి వాడు కుటుంబం తో ఊర్లో జరిగే ‘’తేరు ‘’ను చూడటానికి వచ్చాడు  .పిల్లలు ముసలి అవ్వ ఫోటో తీశారు ఫ్రెండ్స్ కు చూపిద్దామని .కొడుకును  గుర్తుపట్టిన తల్లి వాడికి కనపడకుండా వెళ్ళిపోయి ఊరి కారణం  చేత ఒక ఉత్తరం కొడుక్కి రాయించి వాడెక్కడున్నా కని  పెట్టి ఉత్తరం ఇమ్మని కోరింది .అలానే అడ్రస పట్టుకొని వాడి చేతిలో ఉత్తరం పెట్టాడు .చదివిన కొడుకు నిలువునా నీరై కన్నీరు కాలువలు కట్టేట్లు గా ఏడ్చాడు .తన తప్పు తెలుసుకొన్నాడు .తల్లి రాసిన ఉత్తరం లో ‘’చని పోయేముందైనా నీకు నిజం తెలియాలని రాస్తున్నా.నాకన్ను ఎలా లొట్ట బోయిందో ఊళ్ళో కరణానికి (శాన బొగులు )నాకే తప్ప ఎవరికీ తెలియదు .నీ చిన్నప్పుడు ఒక ఆబోతు  రంకె లేస్తూ వీధిలో వీరంగం చేస్తోంది .అది అక్కడే నుంచున్న నీ మీదకోస్తుంటే దాన్ని నేను అదిలిస్తే అది రెచ్చిపోయి నా పై బడి కుమ్మేసింది .నాకన్ను లొట్ట బోయింది .మొహమంతా గీక్కు పోయి వికారం గా మారింది  .నీకూ దెబ్బలు తగిలాయి .నిన్నూ నన్నూ కారణం  పట్నానికి తీసికెళ్ళి హాస్పిటల్ లో చేర్పించాడు .నా గాయాలు మూడ్రోజుల్లో తగ్గాయి .నీజ్వరంనెల్లాళ్ళ దాకా  తగ్గ లేదు .మీ నాన్న గుర్తుగా జాగ్రత్త గా  పెట్టుకున్న తాళి బొట్టూ, కమ్మలూ అమ్మి ఆసుపత్రికి కట్టి నిన్ను బతికిన్చుకొన్నా . నువ్వు బతికి బాగుండాలని  తపన పడి సాకి పెద్దోన్ని చేశా .కూలి నాలి చేసి కరణం ఋణం కూడా తీర్చేశాను .ఇక మిగిలింది నాకు నేనుండే ఇల్లు అది నీ పేర రాసి కరణానికిచ్చి  దస్తావేజు పంపిస్తున్నా .నా కొడుక్కోసం పోగొట్టుకున్న కన్ను నా కొడుకును   దూరం చేసింది .ఒక సారి ఇంటికొచ్చి నన్ను అమ్మా అని పిలు చాలు ‘’.ఆ ఫోటో లో ఉన్నదే నాయనమ్మ అని వాళ్లకు ఏడుస్తూ చెప్పాడు .తప్పు తెలుసుకుని పశ్చాత్తాప పడ్డాడు .

పిల్లాడు తీసిన అమ్మ ఫోటో ను తీసుకొని కుటుంబం తో పల్లెకొచ్చి ,ఇంటిని స్కూల్ పేర రాసి అందులో డెవలప్ చేసిన అమ్మ ఫోటో పెట్టి ‘’నా ఎట్లా కొడుకు ఇంగేవారికి ఈయద్దుదేవుడా !’’అని అందరికి వినబడేట్లు మొక్కి వెళ్ళిపోయాడు .కళ్ళు చెమర్చే పేగు బంధం కల మరో కద. దృక్కోణం మాత్రం వేరు .

యువకదా రచయిత శ్రీ కేంచప్ప గారి మునిరాజు ‘’ఎనుముపోతు  పండుగ ‘’లో పిల్లలకు దున్నపోతును అమ్మవారికి బలివ్వటం ఇష్టం ఉండదు .దాన్ని కాపాడాలని అనుకొంటారు వారి వల్లకాదు .’’సప్పలమ్మ తల్లి దీపాల పండుగ ‘’నాడుదాన్ని తెగేసి బలిస్తారు .మాంసాన్ని  ఊరంతా ప్రసాదం గా తీసుకొని వండుకొనే రివాజు .పిల్లలకు కడుపు తరుక్కు పోతూ ఉంటుంది జంతు హింస .కాని ‘’కోసిన పాపం తింటే పోతుంది’’అనే సామెత చెప్పాడో మారెప్ప .సరే నను కొంటారు .దున్నను నరికే వాడి చేతులు పడిపోవాలని కోరుకుంటారు .కాని ఏమీ చేయలేని నిస్సహాయా స్తితి వారిది .చివరికి ఒక్కేటుతో ఎనుమును నరకడం మాంసంఅమ్మవారికి నైవేద్యం పెట్టటం  వండుకు తినటం ఆ మసాలా కంపు కు పిల్లలు మురిసి పోవటం జరిగి అమ్మవారు శాంతించి జల్లు కురిపించిందని సంబర పడతారు .ఈ తంతులో జరిగే ప్రతి విషయాన్ని వివరించాడు రాజు .పిల్లల మనస్తత్వమూ మనకు తెలుస్తుందింది ఇందులో .

శ్రీ గోనోళ్ళ సురేష్ రెడ్డి ‘నల్ల రగ్గు ‘’కధలో మంచి సస్పెన్స్ ఉంది .పెద సావు కారు బుచ్చయ్య   ,కస్టపడి చేను చేసుకొనే రాజన్నఅనుకోకండా హత్యలకు గురి అవుతారు .ఎలా జరిగిందో ఎవరికీ తెలియదు. రక రకాల ఊహా గానాలు రేగుతాయి .నల్ల రగ్గు కప్పుకొన్న వారెవరో ఈ హత్యలు చేశారని అందరూ అనుకొంటారు .బుచ్చయ్యను రాజన్న చంపాడని రాజన్నను భార్య నరసమ్మ చంపిందని కధనాలు పుకార్లు షికార్లు చేస్తాయి .ఎవరికి అర్ధం కాక బుర్రలు పగల కొట్టుకొంటున్నారు  .’’ఏయ్ పుంగు మాట లేలరా .సంపినప్డు సూసినోడేవరూ లేరు .సంపినోడేవడో ఆడికే ఎరిక మనకేలరా “’అను కొంటారు .చివరి వాక్యం లో ‘’ఉతికి ఎండేసి మడిసి పెట్టిండే నల్ల రగ్గు ను తీసి బిడ్డల మీద కప్పుతా కసిగా నగు కొనింది సావుకారి పెండ్లాము బయ్యమ్మ ‘’అని ముగిస్తాడు రచయిత . ఇందులో వివాహేతర సంబంధాలు ప్రధానం గా ఉండి హత్యకు కారణాలౌతాయని మనకు చివరికి తెలుస్తుంది .ఈ హత్యలు చేసింది షావుకారు బుచ్చయ్య భార్య బయ్యమ్మే నని నమ్మాల్సి వస్తుంది .

శ్రీ మతి కొమాండూరు కృష్ణ కళా వతమ్మ’’ పుట్టింటి బెమ ‘’లో పుట్టింటి సంప్రదాలకు భిన్నం గా అత్తింటి పద్ధతులను అలవర్చుకోవటం మొదట్ల్ కష్టం గా ఉన్నా చివరికి రాజీ పడి అత్తగారి విధానాలనే ఆచరించిన ఒక కోడలి మనస్సు వివరణ ఉంది .

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -18-7-14-ఉయ్యూరు

 

 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

పిబరే కృష్ణ.ర.సం

పిబరే కృష్ణ.ర.సం.

మూడేళ్ళ క్రితం నేను హోసూరు వెళ్లి అక్కడి సాహితీమిత్రుల గురువు ,సారధి ,రచయిత కవి విమర్శకుడు అయిన శ్రీ నంద్యాల నారాయణ రెడ్డి గారిని ,యువ కవి రచయిత అవార్డు గ్రహీత డాక్టర్ వసంత గారిని ,కుర్ర కవి ఫోర్సుఫుల్ కదా రచయిత శ్రీ మునిరాజు మొదలైన వారిని కలిసి ,వారి కార్యక్రమాల తీరు తెన్నులను అడిగి తెలుసుకొని ,వారిమాతల్లోనే రికార్డ్ చేసుకొన్నాను .హోసూరు కు ఒక ప్రత్యేకత ఉంది .దాన్ని తమిళం వాళ్ళు కన్నడిగులు పట్టించుకోవటం లేదు .భాషా ప్రయుక్త రాస్త్రల్లు ఎర్పదినప్పుదేర్పడ్డ ఆంద్ర రాష్ట్రం కాని ఇప్పుడు విడి పోయి అప్పుడు కలిసి ఏర్పడ్డ ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం కాని హోసూరు మొర ఆలకిన్చాలేదని తమల్ని రెంటికి చెడ్డ రేవళ్ళు గా చూస్తున్నారని మనసులోని బాధ నంతా వెల్ల గక్కారు .వీలైనప్పుడల్లా వెల్ల గాక్కుతూనే ఉన్నారు .అయితే ఏ మాత్రం ధైర్యం కోల్పోకుండా అక్కడి మిత్రులందరూ కలిసి తమ తెలుగును కాపాడుకోవాలని కృత నిశ్చయం తో ఉద్యమాలు చేసి తెలుగు బడులను భాషను బతికిన్చుకొంతున్నారు .హోసూరు కృష్ణ గిరి జిల్లాలో తమిళ నాడులో ఉంది .అందుకని కృష్ణ గిరి రచయితల సంఘం గా అంటే ‘’కృష్ణ రసం ‘’గా ఏర్పడి సామూహికం గా పండగలు ,పబ్బాలు ,జాతీయ దినోత్సవాలు అరుపు కొంటున్నారు .హోసూరు తెలుగు మాండలికాన్ని జీవింప జేయటానికి కవితాలు కతలు ఆ యాసలోనే రాసి రూపు కట్టిస్తున్నారు .విడువ కుండా పుస్తక ప్రచురణ చేస్తున్నారు .నాతో మూడేళ్ళ క్రితం ఏర్పడ్డ సన్నిహితత్వాన్ని మర్చిపోకుండా వారి ప్రచురణలు నాకు పంపిస్తూనే ఉన్నారు నేనూ సరసభారతి రచనలను వారికి చేరుస్తూనే ఉన్నాను .ఈ నెల పడవ తేదీన డాక్టర్ వసంత్ గారు ఈ సంవత్సరం మే నెలలో ప్రచురించిన రెండు కదా సంకలనాలు ‘’మోతుకు పూల వాన ‘’,వెండి మొయిళ్ళు  బండ బతుకులు ‘’పుస్తకాలు పంపారు .మా అమ్మాయి వాళ్ళను అమెరికాకు ఫ్లైట్ ఎక్కించటానికి పన్నెండు రాత్రికి హైదరాబాద్  బయల్దేరి వెళ్లాం .పదమూడు ,పద్నాలుగు ,పది హీను తేదీలలో  ఆ పుస్తకాలను ఆబగా చదివేశాను .నిజమైన జీవితం  వాళ్ళు అనుభవిస్తున్న  బాధలు  కస్టాలు సుఖాలు ,ప్రక్రుతి సంపద ,ఆపేక్షలు అనురాగాలు ,ఆత్మీయతలు పరోపకారం మోసం ,దగా,తెలుగు భాషను మనవాళ్ళు పట్టించుకోక పోవటం ,పండగలు ,పబ్బాలు అన్నీ ఈ రెండిటిలో పుష్కలం గా ఉన్నాయి .అన్నిటిలో అంతర్వాహినిగా వారి వేదన ఉంది .వారి హోసూరు మాధ్యమం లో పుట్టిపెరిగిన కతలివి .వారి జీవిత ,జీవన విధానాలకు దర్పణాలివి .వారి ఆవేదనకు గుర్తులివి .ఆ భాషా మాధుర్యం లో అలా కొట్టుకు పోతూనే ఉంటాం. ఆ తీయ తేనియ తెలుగు రసాన్ని తాగుతూనే ఉంటాం మనం మర్చి పోయిన తిక్కన తెలుగును పాదు చేసి చక్కగా పోషిస్తున్నారు .చిక్కగా రాస్తున్నారు మత్తేక్కిస్తున్నారు .వారి నిరంతర సాహితీ కృషికి మనసారా అభినందిస్తున్నాను .ఇంత గొప్ప సేవ చేస్తున్న వారిని  బయట ప్రాంతాలలో ఉన్న ఏ సాహితీ సంస్థా గుర్తించి తగిన ప్రోత్సాహం ఇవ్వటం లేదని బాధగా కూడా ఉంది .అయితే ఎవరి సాయం అక్కరలేని అసహాయ శూరులు కృష్ణ గిరి రచయితల సంఘం సభ్యులు .సూటిగా నడవటమే వారికి తెలిసిన విద్య .అదే వారికి రాచ మార్గం .ఈ సంఘానికి మార్గ దర్షులు శ్రీ సామల రమేష్ బాబు ,శ్రీ సా వేం రమేష్ గార్లు .వారంటే వీరికి అపారమైన గౌరవం . ఆ సాహితీ మూర్తులందించిన కదల గురించే నేను మీకు తెలియ  జేస్తూ ‘’పిబరే కృష్ణ రసం ‘’అంటున్నాను

మోతుకు పూల వాన

ఈ పుస్తకం లో ముందు మాట రాస్తూ కృష్ణ రసం సభ్యులు శ్రీ జి నారాయణ రెడ్డి ‘’తల్లికోసం తల్లి నుదికోసం ,తల్లి నుడి లో మాట కోసం ,పాట కోసం ,చదువుకోసం ,చదువును చెప్పించే బడి కోసం ,తెలుగు ఏలుబడికోసం –ఈ గడ్డ పడుతున్న తపన లో నుంచి పుట్టిందే మా కృష్ణ రసం .సుమారు ఏభై మంది కవులు రచయితల వేదిక ఇది ‘’అని చెప్పారు .ఈ సంస్థ 2010నుంచి ఏడాదికి రెండు ‘’పోత్తాలు ‘’వెలువరిస్తున్నారు .ఇందులో పందొమ్మిది మంది కధకుల కధలున్నాయి .వీరిలో నలుగురు  దేవి శెట్టి పల్లెకు చెందిన వారే కావటం విశేషం .వారి ఆశయాన్ని పద్య రూపం లో నారాయణ రెడ్డి గారు ‘’వత్సరంబున కోక సారి వరుసగాను –వింత వింత గా కతలు విస్తరింప

పుస్తకంబులు ముద్రించి పంచు చుండు –తెలుగు భాషను నిల బెట్టు దీక్ష తోడ ‘’అని చెప్పారు .

..శ్రీ అగరం వసంత్ రాసిన ‘’కొరివి పెట్టె కొడుకు ‘’కద’’ప్రక్రుతి గురించినది .’’బంగారం తింటారా?బదికేకి బోజనము కావాల.’’అని ప్రక్రుతి పిల్లను సోమ్ముగలాడైన సూర్యుడి  కిచ్చి పెళ్లి చేస్తే దాని బతుకు బూడిదే అవుతుందని ఒక నాయనమ్మ కొడుక్కి చెబుతుంది .సూర్యుడిని ‘’పోద్దప్ప ‘’అని చంద్రుడిని’’ వెలుగు నాయాల ‘’అని ఆప్యాయం గా పిల్చుకొంటారు .పెళ్ళికి సూర్యుడి కొడుకు అంగారకుడు మధ్యలో అగ్గి రాజేస్తాడు .అవ్వను తిడతాడు .అవ్వకు వెలుగు నాయాలకిచ్చి పెళ్లి చేస్తే కాపురం బాగుంటుందని చెప్పింది. చివరికి అందరూ ఒప్పుకుని ప్రకృతిని వెలుగు నాయాలకిచ్చి లగ్గం చేస్తారు . పెళ్లి అయిన  ఏడాదికి ప్రక్రుతి ప్రక్రుతమ్మ అయింది . ‘’నేల చరాలు ‘’అనే బిడ్డను కన్నది .కొన్నేళ్ళకు ఉభయ చరాల్ని కని ,పక్షులను ప్రసవించి ఇక చాలనుకొని ‘’మనిషి ‘’ అనే బిడ్డడిని కన్నది .వాడు పెరిగి  తల్లికే కొరివి పెట్టె ప్రక్రుతి వినాశకుడైనాడు .ఈ విషయం ప్రక్రుతమ్మకు  తెలియక కన్నది అని ముగిస్తాడు డాక్టర్ వసంత్ .

శ్రీ అమర నారా బసవ రాజు రాసిన ‘’మా వూరు బతికి పోయే ‘’కదఒక కుక్క ఆంతర్యం .అది విన్న కధలూ కమామీషు .బలే కమ్మగా చెప్పారు రాజు గారు .తన చిన్నతనం లో ఏంతో హాయిగా బతికానని  ఇప్పుడు ముద్దకు దిక్కు లేదని  పెద్దింటి కుక్క బాధ పడుతుంది .ఆ కాలం లో అందరూ హాయిగా వాకిళ్ళలో చేరి రాత్రిపూట పిచ్చా పాటీ కబుర్లు చెప్పుకుని ,’’కుంటి  ముట్టిచ్చే ఆట ‘’,’’ఉప్పడి పట్టు ఆట ‘’,ఆదేవారాని ఆడాళ్ళు  ముసిలోళ్ళు వక్కాకు నములుతూ కాలక్షేపం చేసేవారని జ్ఞాపకాలను నేమరేసుకొంటుంది .,ఇప్పుడు ‘’మాపు’’అయితే చాలు ఊరు ‘’బెకో ‘’అంటూ ఉంటోంది . అంతా  సీరియళ్ళలో మునిగి బయటికే రావటం లేదట .ఆ ఇల్లు ఈ ఇల్లూ తిరిగి అక్కడ దొరికినదేదో తినేది కుక్క బతులని అంటున్నారని ,కాని ఈ కాలం లో ముసిలోళ్ళ బతుకులు కుక్క బతుకుల్ని చేస్తున్నారని వాపోయింది .ఒక ముసలాడు ముసలి భార్యను ఓదారుస్తూ ‘’మనం పండు టాకులం .నీడలో పడితే కుళ్లుతాం .ఎండలో పడితే ఎండుతాం .శివరాత్రికి చివుళ్ళు వస్తాయికదా ,మనకొచ్చిన కాలం ఈ కుర్రనాయాల్లకూ  వస్తుందిలే ‘’అని ఊరడించటం కుక్క వింటుంది .ఈ నాటి పిల్లలకు ఒక్క వేమన పద్యమూ రాదు అని క్షోభ పడతాడు తాత .ఆ కాలం చదువులు పండితునికి పామరునికి తెలిసేట్లు తెలుగు లో ఉండేవని మెచ్చాడు .ఇప్పటి సదువులు ఆళ్ళ అబ్బాలకే తెల్వట్లా ఆల్లకేం తెలుస్తాయని ఆవేదన పడ్డాడు .

పెద్దింట్లో రోజూ నీళ్ళు కాచుకొనే కాగు ను విసిరి బయట పారేస్తే అది కుక్క తో తన గోడు వెల్ల బోసుకోన్నది .ఇప్పుడు హీటర్లు గీజర్లు వచ్చి తనకు పని లేకుండా పోయిందని కాగు ఏడ్చింది .గౌడు ఇంట్లో గౌడు సాని పెత్తనం పోయి కోడలు పెత్తనం వచ్చింది ముసలాళ్ళను లెక్క చేయటం లేదు ‘’వెలక్కాయ కంటే కొంచెం పెద్ద రాగి సంకటి ముద్ద ‘’ను మామకు పెడుతోంది .ఆయన ఇక తనకేం పెడతాడు అని వగచింది .కాని ముసలి ‘’’ఎన్ని పిల్లల్ని పెట్టిం డావో .మనిషికే దిక్కు లేని ఈ కొంపను నమ్ముకోన్నావే .తిను కూతురా ‘’అని ఆప్యాయం గా కొంత కుక్కకు పెట్టాడు .’’జూ రాయే ముండా!ఈ కాడి తిని పో ‘’అని రెండు పిడికిళ్ల చద్ది వేశాడు .అదీ జీవకారుణ్యం .ఇవన్నీ గమనిస్తున్న కుక్క ‘’కరెంటు పోవాల అందరూ ఈదిలోకి రావాల సందడి సేయాల ‘’అను కొంటోంది మనసులో .

తధాస్తు దేవతలు దీవించారు .కరెంటు ఎప్పుడిస్తారో ఎప్పుడు తీసేస్తారో తెలీని పరిస్తితి వచ్చింది .ఇళ్ళల్లో టి విలు  బందు అయ్యాయి. కాగు బయటికి తీసి నీళ్ళు కాస్తున్నారు .నూనె దీపాలు వెలిగించుకొంటున్నారు .పగలూ రాతివీది అరుగుల మీదికి చేరుకొని కబుర్లు చెప్పుకొంటూ ఆటా పాటా పాడుకొంటూ కోళ్ళకూ కుక్కలకీ సంగటి మెతుకులు రాలుస్తున్నారు .ప్రతి శనివారం ఆంజనేయ గుడిలో పూజలు భజనలు హరికధలు చెప్పిస్తున్నారు .మళ్ళీ పూర్వకాలం బతికి వచ్చి ‘’మా వూరు బతికి పోయే ‘’అను కొన్నది గ్రామ సింహం .అద్భుతం గా కధను నడిపించారు రాజు గారు .

సశేషం

దక్షిణాయన పుణ్యకాల ప్రవేశ శుభా కాంక్షలతో

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -17-7-14-ఉయ్యూరు

 

 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

మానవత్వానికి ఎత్తిన పతాక – నదీన్ గార్డిమేర్

మానవత్వానికి ఎత్తిన పతాక – నదీన్  గార్డిమేర్

తొంభై సంవత్సరాల సాఫల్య జీవితం గడిపి ,మహా కావ్యాలన దగిన గొప్ప రచనలు చేసి సాహిత్యం లో నోబెల్ పురస్కారాన్ని పొంది ,మానవ సేవా భాగ్యం లో తనవు ,మనసులను ధన్యం చేసుకొన్న దక్షిణాఫ్రికా మహిళా మాణిక్యం నదీన్ గార్డి మెర్ ఈ నెల పదమూడున పుట్టిన గడ్డ జోహాన్స్ బర్గ్ లో మరణించింది .ఆమె జీవితం అందరికి ఆదర్శ ప్రాయం .

 

Inline image 1  July's People (1981)    The Pickup (2001)

 

గార్డి మెర్ 1923నవంబర్ ఇరవై న దక్షిణాఫ్రికా లోని జోహేన్స్ బర్గ్ దగ్గర గనులకు నెలవైన స్ప్రింగ్స్ గూటంగ్ లో జన్మించింది .తండ్రి ఇసిడోర్  గార్డి  మెర్ వాచీలను తయారు చేసే యూదు సంతతి వాడు .తల్లి హన్నా లండన్ కు చెందినది .తల్లి పూర్తిగా జ్యూ యిష్ సంప్రదాయం లోను ,తండ్రి దానికి విరుద్ధం గ సెక్యులర్ పద్ధతిలోను ఉన్న కుటుంబాల వారు .నదీన్ ఆ దేశం లోని ఆర్ధిక అసమానత్వాన్ని ,జాతి విద్వేషానికి  వ్యతిరేక భావ వ్యాప్తికి  తలిదండ్రులే కారకులు ,ప్రేరకులయ్యారు .తండ్రి రష్యాలోని జారిస్ట్ రాజుల కబంధ హస్తాల నుండి తప్పించుకు వచ్చినా దక్షిణాఫ్రికాలోని నల్ల జాతి వారి పట్ల సాను భూతి లేని వాడు .తండ్రికి విరుద్ధం గా తల్లి నల్ల జాతీయుల బానిసత్వాన్ని ,పేదరికాన్ని చూసి జాలిపడి సహాయం చేస్తూండేది .నల్ల జాతి పిల్లలకోసం క్రేచీ అనే శరణాలయాన్ని స్థాపించింది .ప్రభుత్వం కూడా నల్ల జాతి వారి పట్ల నిర్దాక్షిణ్యం గా క్రూరంగా అమూనుశం గా వ్యవ హరించేది .ఒక సారి ప్రభుత్వ పోలీసులు వీరింటిపై దాడి చేసి సర్వెంట్ రూమ్ లో ఉన్న డైరీలు,సాహిత్యాన్ని పట్టుకు పోయారు .

గార్డి మెర్ కేధలిక్ కాన్వెంట్ స్కూల్ లో చేరి చదివి నప్పటికీ ఇంటి వద్దే తల్లి ఎక్కువగా నేర్పింది .తల్లికి పిల్లను స్కూల్ కు పంపటం అంతగా నచ్చేదికాదు .ఇంటి దగ్గర ఖాళీ సమయం లో రచన చేస్తూ 1937అంటే పద్నాలుగేళ్ళప్పుడే ‘’ది క్వెస్ట్ ఫర్ సీన్ గోల్డ్ ‘’అనే చిన్న పిల్లల కదా పుస్తకం రాసి ప్రచురించింది .ఈ కధలు చిల్డ్రన్స్ సండే ఎక్స్ప్రెస్స్ పత్రికలో ప్రచురింప బడ్డాయి .రెండవ పుస్తకమూ పిల్లల కోసమే ‘’కం ఎగైన్ టు మారో ‘’రాసింది .పదహారవ ఏట యువ రచయిత్రి గా ప్రఖ్యాతమైంది .విల్ట్ వాటర్ స్త్రాండ్ యూని వర్సిటిలో ఒక ఏడాది చదివి అన్ని జాతుల వారితో కలసి మెలసి తిరిగింది .డిగ్రీ పూర్తీ చేయకుండానే జోహాన్స్ బర్గ్ కు 1948కి చేరింది .బోధనలో గడుపుతూ రచనలు చేస్తూస్థానిక పత్రికలకు రాస్తూ  ప్రచురిస్తూ అక్కడే ఉండేది .తన తోలి రచనలను ‘’ఫేస్ టు ఫేస్ ‘’పేరిట 1949లో ముద్రించింది .

1951లో ‘’ది న్యూ యార్కర్ ‘’పత్రికలో ఆమె కద ‘’ఏ వాచర్ ఆఫ్ ది డేడ్’’ప్రచురణ తో ఆమె కీర్తి విపరీతం గా వ్యాపించింది .తనకాలం లో చిన్న కద గొప్ప ప్రాచుర్యం, ప్రభావం కల్గించిందని గార్డి మెర్ అంటుంది .న్యు యార్కర్ తో పాటు అనేక ప్రముఖ పత్రికలకు ఆమె కధలు రాసింది .అన్నీ గొప్ప విజయాలనే తెచ్చి పెట్టాయి .ఆమె పుస్తకాలను మొదట ప్రచురించిన లులూ  ఫ్రీడ్ మాన్ అనే మహిళ, పార్ల మెంటేరియాన్ అయిన బెర్నార్డ్ ఫ్రీడమన్ భార్య .వాళ్ళ ఇంట్లోనే జాతి వ్యతిరేకతను తిరస్కరించే రచయితలను గార్డి మెర్ కలుసు కొన్నది .డెంటిస్ట్ జేరాల్ద్ గావ్రాన్ ను వివాహం చేసుకొని ఆడపిల్లను కన్నది .’’ది లైయింగ్ దేశ’’అనే మొదటి నవల రాసి 1953లో ప్రచురించింది . మూడేళ్ళ తర్వాత భర్తకు విడాకులిచ్చి రీనోల్ద్ కాషియేర్ అనే గొప్ప కళా పోషకుడిని పెళ్లి చేసుకొన్నది .జీవితాంతం ఈ బంధం కొనసాగింది .కొడుకు సినిమా రంగం లో ఉన్నాడు .

1960 లో జరిగిన హింసాత్మక ఘటనలు ,జాతి వ్యతిరేక పోరాటాల ను చూసి ఆమె ఉద్యమం లో కి అడుగు పెట్టింది .త్వరగా రాజకీయం గా ఎదిగి నెల్సన్ మండేలా  డిఫెన్స్ అటార్నీలలో ఒకరైంది .మండేలా గొప్ప ఉపన్యాసం ‘’ఐ యాం ప్రిపెరేడ్ టు డై ‘’రాసింది గార్దిమేర్ .అది ఒక మంత్రం లా పని చేసి గొప్ప ప్రభావాన్ని కలిగించింది .దేశం తెల్ల జాతి నుండి విముక్తి పొందింది .1990లో మండేలా చెర నుండి విముక్తి పొందినప్పుడు మొదటిగా ఆయన  చూడాలనుకొన్న వ్యక్తీ గార్డి మెర్ నే .అలా నే చూసి పులకిన్చిపోయాడు ఆమె కర్తవ్య దీక్షకు అంకిత భావానికి ఉద్యమ స్పూర్తికీ .1960-70దశకం లో ఎక్కువ కాలం జోహాన్స్ బర్గ్ లోనే గడుపుతూ అమెరికాలోని అనేక యూని వర్సిటీలకు విజిటింగ్ ప్రొఫెసర్ గా వెళ్లి బోధించేది ఉపన్యసిస్తూండేది .దీనితో ఆమె అంతర్జాతీయ వ్యక్తీ అయింది .ఇక్కడే ఆమె కు మొదటి అత్యుత్తమ పురస్కారం లభించింది .అక్కడ ఉండగానే రచనల ద్వారా ప్రసంగాల ద్వారా దక్షిణా ఫ్రికాలోని జాతి విద్వేషాన్ని రూపు మాపాలని డిమాండ్ చేసింది .

ఆమె అమెరికా లో ఉన్నప్పుడే ఆమె రచనలను దక్షిణాఫ్రికా తెల్ల జాతి ప్రభుత్వం చాలా కాలం  నిషేధించింది ..’’ది లెట్ బూర్జువాస్ వరల్డ్ ‘’అనే స్వీయ అనుభవ గ్రంధాన్ని రాసింది .ఆమె రాసిన ‘’ఏ వరల్డ్ ఆఫ్ స్ట్రేంజర్స్ ‘’పుస్తకాన్ని పుష్కరం పాటు తెల్ల ప్రభుత్వం నిషేధించింది .బూర్జువాస్ వరల్డ్ పుస్తకాన్ని ప్రచురణ అంతరం ఒక నెల రోజుల్లో నిషేధించింది ప్రభుత్వం .కాని పబ్లికేషన్స్ కమిటీ ఈ నిషేధాన్ని తిరస్కరించి ఆమెకు న్యాయం చేసింది .ఆరు నెలల తర్వాత ప్రభుత్వం మరో కుంటి సాకుతో నిషేధిస్తే ఆమె జవాబుగా ‘’ఎస్సేన్శియల్ గేస్స్చర్స్ ‘’రాసి,ఇద్దరు నల్ల రచయితల పుస్తకాలను నిషేధించి తన పుస్తకాన్ని ఎందుకు నిషేధించలేదో వివరించమని కమిటీని ప్రశ్నించింది .అలాగే ‘’జులిస్ పీపుల్ ‘’పుస్తకమూ నిషేధానికి గురి అయింది .ప్రాంతీయ విద్యా బోర్డ్ ఈ పుస్తకం తో పాటు మిగిలిన నల్ల వారి పుస్తకాలపై నిషేధపు ఆంక్షలను తాత్కాలికం గా తొలగించింది .’’జులై ‘’పుస్తకం మరే జాతి  విద్వేషానికి ఆజ్యం పోస్తున్నట్లుగా ఉంది అన్న కమిటీ అభిప్రాయాన్ని ఈమె తప్పుపట్టింది .ప్రజలూ ప్రజా సంఘాలు ఆమెనే సమర్ధించాయి .ఇలా  నిరంతరం పోరాటం చేస్తూనే ఉండేది .

దక్షిణాఫ్రికా ప్రభుత్వం నిషేధించిన నెల్సన్ మండేలా పార్టీ ‘’ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ‘’లో ఆమె మొదటి నుంచి సభ్యురాలు .అదే దక్షిణాఫ్రికా ప్రజలకు విముక్తి సాధనం అని నమ్మి పని చేసింది .ఉద్యమకారులకు తన ఇంటిలో ఆశ్రయమిచ్చి అరెస్ట్ కాకుండా కాపాడింది .1986లో ఇరవై రెండు మంది ఉద్యమ కారుల తరఫున ‘’దేల్మాస్ ట్రేజన్ ట్రయల్ ‘’లో వారికి అనుకూలం గా వాదించటం తన జీవితం లో మరచి పోనీ రోజు అంటుంది .జాతి వ్యతిరేక కార్యక్రమాలలో ప్రదర్శనలో ఉత్సాహం గా పాల్గొనేది .రాజకీయ ,జాత్యహంకార ధోరణి పై ఉపన్యాసాలలో నిప్పులు కురిపించేది .

గార్డి మెర్ లోని సాహితీ మూర్తికి జనం నీరాజనాలన్దించారు .అనేక పురస్కారాలిచ్చి సన్మానించారు .1991లో సాహిత్యం లో అత్యుత్తమ పురస్కారం నోబెల్ బహుమతినిచ్చి అందుకొన్నది .బహుమతి ప్రదానం రోజున ఆమె మానవ జాతి సేవకు సాహిత్యానికి  చేసిన సేవ ,చిరస్మరణీయం అని నోబెల్ కమిటీ ప్రశంసించింది .జాతి వ్యతిరేకతనేకాదు ,పత్రికా హక్కుల నిషేధాన్ని ,ఇన్ఫర్మేషన్ పై సెన్సార్ ను వ్యతిరేకించింది .’’సౌత్ ఆఫ్రికా యాంటి సెన్సార్షిప్ యాక్షన్ గ్రూప్  ‘’స్టీరింగ్ కమిటీ లో పని చేసింది .’’సౌత్ ఆఫ్రికా రైటర్స్ కాంగ్రెస్ ‘’కు వ్యవస్థాపక అధ్యక్షురాలుగా ఉంది .’’సౌత్ ఆఫ్రికా లెటర్స్ అండ్ ఇంటర్నేషనల్ లిటరరీ ఆర్గ నైజేషన్స్’’(PEN)కు వైస్ ప్రెసిడెంట్ గా పని చేసింది .దక్షిణాఫ్రికా ఎయిడ్స్ మహమ్మారి పాలైతే ప్రజలకు అవగాహన కల్పించి ఎందరి ప్రాణా లనో  కాపాడింది .’’ట్రీట్ మెంట్ యాక్షన్ కాంపైన్ ‘’కోసం ఇరవై మంది రచయితల చేత ‘’టేల్లింగ్ టేల్స్ ‘’పేర చిన్న కధలు రాయించింది . ఎయిడ్స్ నివారణ కోసం దాతల నుండి నిధి సేకరించి ప్రభుత్వానికి అంద జేసింది .ప్రెసిడెంట్ టాబూ మోబాకి ఎయిడ్స్ విషయం లో సరైన శ్రద్ధ తీసుకో నందుకు ప్రశ్నించి మిగిలిన అన్ని విధానాలను సమర్ధించింది .

తన దేశం విషయం లోనే కాదు ఏ దేశం లో అన్యాయం జరిగినా నిరసన తెలియ జేసింది .క్యూబా అధ్యక్షుడు ఫిడేల్ కాస్ట్రో తీవ్రం గా జబ్బు పడ్డప్పుడు తన తో బాటు ఆరుగురు నోబెల్ పురస్కార గరహీతల చేత  వ్రాత పూర్వకం గా క్యూబా లో అస్తిరత్వం రెచ్చ గొట్టవద్దని అమెరికాను హెచ్చరించింది .ఆరంజ్ ప్రైజ్ ను మహిళలకే ఇవ్వటాన్ని నిరసించి తనకు ఇవ్వబోయిన ప్రైజ్ ను తిరస్కరించింది .2006 లో ఆమె ఇంట్లో దొంగలు పది భీభత్సం సృష్టించారు .స్నేహితులు కేసు పెట్టమని ప్రోత్సహించినా ఆ పని చేయలేదు .తానూ నాస్తిక వాదిని అని చెప్పుకున్నా దాన్ని ఏ నాడూ ప్రచారం చేయలేదు .ఆమె జీవిత చరిత్రను ‘’నొ కోల్డ్ కిచెన్ ‘’గా రోనాల్డ్ సురేష్ రాబర్ట్ రాసి 2006లో ప్రచురించాడు .ఇద్దరు కూర్చుని చర్చించుకుని ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత రచన అంతా ముందుగా తనకు చూపించి ఓకే చేసిన తర్వాత ముద్రించాలను కొన్నారు .కాని రచయిత ఆమె కు ఇష్టం లేని విషయాలను అందులో రాసినందుకు నిరసన తెలియ జేసి తన అనుమతి లేదని చెప్పింది .రోనాల్డ్ స్వంతం గా పుస్తకాన్ని రాసి ప్రచురించాడు. దాన్ని ఆమె సమర్ధించ లేదు .

ఆమె రచనలలో ప్రేమ ,రాజకీయమే చోటు చేసుకొంటాయి తన దేశం విదిపోవటాన్ని ఆమె వ్యతిరేకించింది .అధికార అనుబంధాలను సత్యాన్ని శోధించి రాసింది .ఆమె రచనలు సామాన్య ప్రజలకు కధలు చెప్పినట్లుగా రాయటం ప్రత్యేకతను  సంత రించుకోన్నది .ఆమెకు వచ్చిన అవార్డులు రివార్డులు అసంఖ్యాకం .జేమ్స్ టైట్ బ్లాక్ మెమోరియల్ ప్రైజ్ ,బుకర్ ప్రైజ్ ,సి యెన్ ఏ ప్రైజ్ ,స్కాటిష్ ఆర్ట్స్ ప్రైజ్ ,రోమ్ ప్రైజ్ ,బెన్నెట్ అవార్డ్ ,అమెరికన్ అకాడెమి ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అవార్డ్ ,ఫెలో రాయల్ సొసైటీ ఆఫ్ లిటరేచర్ ,పాట్రన్  కాంగ్రెస్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా అవార్డ్  మొదలైన వాటితో బాటు నోబెల్ ప్రైజ్ ను పొందింది .పది హీను నవలలు ,’’ది ఫస్ట్ సర్కిల్ ‘’అనే నాటకం దాదాపు ఇరవై కదా సంకలనాల పుస్తకాలు ,అయిదు వ్యాససంపుటులను గార్డి మెర్ తన జీవిత కాలం లో రాసింది .తొంభై ఏళ్ళు జీవించి 2014 జులై 13ణ ఆ మహా రచయిత్రి సంఘ సేవకురాలు నదీన్  గార్దిమేర్ జోహాన్స్ బర్గ్ లో తనువు చాలించింది .

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -16-7-14-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

ది లాస్ట్ వేవ్: యాన్ ఐలండ్ నావెల్’

ది లాస్ట్ వేవ్: యాన్ ఐలండ్ నావెల్’

రచయిత: పంకజ్ సెక్షారియా
 

వాళ్లు చరిత్రలో అతిపెద్ద సునామీని కూడా తట్టుకున్నారు. 2004లో భారత దేశమే కాకుండా, దక్షిణాసియా మొత్తంగా సునామీ ధాటికి ప్రకంపించిపోయిన భీకర క్షణాల్లో కూడా వారిలో ఒక్కరు కూడా ఎలాంటి ఇబ్బందికి గురికాకుండా సురక్షితంగా బయటపడ్డారు. అయితే సముద్రమట్టానికి ఎత్తున పర్వత ప్రాంతాల్లో నివసించడం తెలిసిన వారికి తమ జాతి అంతర్ధానమైపోతుండటానికి కారణాలు మాత్రం తెలీవు.
సునామీలు, తుఫానులు వారిని కదిలించలేవు. కాని కాలం గడిచే కొద్దీ తమ జాతి అంతర్థానమవుతున్న సూచనలు వారికి స్పష్టమవుతూనే వస్తున్నాయి. వాళ్లెవరో కాదు. ప్రపంచంలోనే అత్యంత పురాతన ఆదిమ జాతుల్లో ఒకటైన జార్వా తెగ ప్రజలు. అండమాన్ వీరి నివాస స్థలం. వాళ్ల జీవితంలోని కొత్త కోణాలను బయటపెట్టిన కాల్పనిక నవల ‘ది లాస్ట్ వేవ్: యాన్ ఐలండ్ నావెల్’. రచయిత పర్యావరణ కార్యకర్త పంకజ్ సేక్సారియా. తను హైదరాబాద్ నివాసి కావడం మరీ విశేషం.

 

ఒక పరిశోధకుడిగా అనేకసార్లు పంకజ్ అండమాన్‌ని సందర్శించారు. ప్రతి యాత్రలోనూ తనకు అండమాన్ కొత్తకోణంలో కనిపిస్తూ వచ్చింది. పర్యావరణ కార్యకర్తగా జార్వాల జీవితాలను సన్నిహితంగా స్పర్శించిన పంకజ్ అంతరించి పోనున్న జాతుల్లో ఒకటిగా నిలిచిన జార్వా తెగ ప్రజల జీవితాలకు అక్షరరూపమిచ్చారు. అదీ కాల్పనిక సాహిత్య రూపంలో.. జార్వా తెగను వెంటాడుతున్న కఠిన వాస్తవాలకు సాహిత్య రూపం ఇవ్వడం ఇదే మొదటిసారి.

జార్వా తెగ ప్రజల సమస్యలపై రూపొందిన ‘ది లాస్ట్ వేవ్’ నవలను గత శుక్రవారం హైదరాబాద్‌లోని గోతె-జెంట్రుమ్‌లో ఆవిష్కరించారు. లక్ష్యం లేని ఒక పర్యాటకుడు పురాతన జార్వా తెగప్రజలను ఎలా కలిశాడు, ఆ తెగ ప్రజల జీవితాలను కళ్లారా ఎలా దర్శించాడు అన్నదే ఈ వినూత్న నవలాంశం.

 

కథ: నవల మొత్తంగా హరీష్ అనే ఈ సముద్ర ప్రయాణికుడి చుట్టూనే తిరుగుతుంది. జార్వా తెగ అంతర్థానానికి దారితీస్తున్న అనేక బాహ్య కారణాలను దగ్గరనుంచి గమనిస్తున్న క్రమంలో ఈ నవల కథానాయకుడు తనకు తానుగా ఈ కమ్యూనిటీ కోసం పోరాటకారుడిగా మారిపోతాడు. ఈ నవల మొత్తానికి ఇదే కీలకాంశం.ఈ నవలలో 30 ఏళ్ల హరీష్ ప్రధాన పాత్రధారి. పెళ్లి విడాకులకు దారితీయడంతో విషాదంలో కూరుకుపోయాడు. అండమాన దీవుల గురించి తెలుసుకోవడానికి తన స్నేహితుడితో కలిసి ఆ దీవికి పయనమవుతాడు. ఆ దీవిలో ఉన్నప్పుడు అక్కడి గిరిజనులు, ఇతర ప్రాకృతిక ప్రాణులకూ మధ్య ఘర్షణలోని సంక్లిష్టతలను అర్థం చేసుకుంటాడు. ఇక్కడే అతడు స్థానికురాలైన సీమను కలుసుకుంటాడు. ఇక్కడే పుట్టి పెరిగిన ప్రజలపై తను పరిశోధన సాగిస్తూంటారు. జారా కమ్యూనిటీ ప్రవర్తనలో వస్తున్న మార్పులు దీవివాసులకు వినోదం కలిగిస్తుంటాయి. బయటి ప్రపంచం పట్ల వారి శత్రుభావం ఉన్నట్లుండి మాయమౌతుంది. వారి వైఖరి కాస్త మారుతుంది. చివరకు హరీష్, జార్వా తెగ ప్రజల సమస్యలపై పోరాడేందుకు నిర్ణయించుకోవడంతో కథ ముగుస్తుంది. 

రచయితకు నవలా పరంగా ఇది తొలి రచన కాకపోవచ్చు. అంతకుముందు పర్యావరణంపై, జార్వా తెగపై ఎన్నో వ్యాసాలు రచించారు. ప్రచురించారు. ‘ఒక ఘటనను, కథను వర్ణించడంలో కాల్పనిక సాహిత్యం ఒక వినూత్న ప్రక్రియ. మన కళ్లముందు జరుగుతున్న ఒక జాతి పతనావస్థను నవలా రూపంలో చెప్పడాన్ని నేను నిజంగానే సవాలుగా తీసుకున్నాను’ అని రచయిత చెప్పారు. న్యూఢిల్లీలోని జామా మిలియా ఇస్లామియాలో మాస్ కమ్యూనికేషన్‌లో పీజీ పూర్తి చేశారు.

 

జార్వా కమ్యూనిటి ఉనికిపై ఇంతవరకు ఎవరూ సమగ్రంగా దృష్టి పెట్టలేకపోయారు. తన పుస్తకం ఇతవరకు తెలియని ఇతర కోణాలను స్పృశించిందని పంకజ్ చెబుతారు. ‘మీడియాలో అనేక కథలు, కథనాలు వస్తుంటాయి. చాలాకాలంగా అండమాన్ దీవులకు వెళుతూ వస్తున్నాను. వారి జీవన విధానం, వారి జీవితాల చుట్టూ అలుముకున్న అనేక గాథలను అర్థం చేసుకుంటూ వచ్చాను. అయితే బయటి ప్రపంచానికి మాత్రం ఇప్పటికీ జార్వాల గురించి తెలిసింది చాలా తక్కువే. అండమాన్ లోని సెల్యులార్ జైలు, మంచి టూరిస్ట్ ప్రదేశంగా అండమాన్ విశిష్టత, ఆ దీవి చుట్టూ నెలకొన్ని వివాదాలు ఇవే ప్రధానంగా మీడియాలో వస్తున్నాయి. కాని అంత పెద్ద సునామీనే అవలీలగా జయించిన జార్వా తెగ ప్రజలు ఎందుకు అంతర్థానమవుతున్న జాతిగా మిగిలిపోతున్నారనే అంశం ఎవరి దృష్టినీ ఆకర్షించలేదు. బయటి సమాజానికి తెలియని కొత్త కోణాలనే నా కాల్పనిక నవలలో స్పృశించాను’ అంటున్నారు రచయిత. 

రచయిత చాలాకాలంగా ఎన్జీఓ, కార్యాచరణ గ్రూప్ కల్పవృక్ష్‌‌తో కలిసి పనిచేస్తున్నారు. ఇది 30 ఏళ్ల నుండి ఉనికిలో ఉంది. ఈ సంస్థ కార్యకర్తగానే తను అండమాన్ దీవులకు పలుసార్లు వెళ్లివచ్చారు. ఈ ఎన్జీవో నేతృత్వంలో అండమాన్ లోని జార్వా తెగ పరిరక్షణ కోసం అనేక కార్యక్రమాలు రూపొందించారు. 2006లోనే అటవీ సమాచార హక్కుపై వీరు పనిచేశారు. ఒక నిర్దిష్ట కమ్యూనిటీకి చెందిన స్థానికుల కోసం పర్యావరణ విద్యను కూడా చేపట్టారు. జార్వాల వర్యావరణ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో ఇది వివరిస్తుంది. ఈ తెగ ప్రజలకు సమస్యలు ఎదురైనప్పుడు వారిముందు పరిష్కారమార్గాలను కూడా చూపించారు. వాటిని కాలానుగుణంగా అక్షరబద్ధం చేశారు. 

కొంత మంది అండమాన్ దీవుల నిసర్గ సౌందర్యాన్ని గురించి చెప్పారు. కొందరు ఆ దీవిలోని ఆదిమ గిరిజన జాతి గురించి చెప్పారు. కాని రచయిత, జర్నలిస్టు, సామాజిక కార్యకర్త పంకజ్ సెక్షారియా నవల విశిష్టమైనది. ఇది కాల్పనిక రచనే కావచ్చు, కాని అందమైన కథ, అద్బుతమైన సజీవపాత్రలతో ఇది రూపొందింది. పైగా అనేక వాస్తవమైన, చారిత్రక ఆధారాలను ఈ నవలలో మనం గమనించవచ్చు. అండమాన్ దీవులపై అత్యంత అభిమానం, 20 ఏళ్ల పాటు సాగించిన అవిరామ పరిశోధనా ఫలితమే ‘ది లాస్ట్ వేవ్’ నవల. అండమాన్ దీవి అద్బుత గాథను ఈ నవల చిత్రిక పట్టింది. 

రచయిత మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసినప్పటికీ స్వీయ అభిరుచితో మాస్ కమ్యూనికేషన్‌లో పీజీ పూర్తి చేశారు. తర్వాత నానోటెక్నాలజీ రీసెర్చ్‌లో సృజనాత్మక సంస్కృతులు అనే అంశంపై పీహెచ్‌డి చేశారు. కల్పవృక్ష్ ఎన్జీవో సభ్యుడు. రెండు లఘుచిత్రాలను కూడా తీశారు. అండమాన్ దీవిగురించిన తృష్ణతో రెండు దశాబ్దాలతరబడి అండమాన్ భౌగోళిక స్వరూపం, చరిత్ర, ప్రజలు, వారి పర్యావరణ వ్యవస్థ వంటి అనేక అంశాలపై రచయిత పరిశోధిస్తూ పోయారు. ఇప్పటికే మూడు కాల్పనిక రచనలు చేసిన పంకజ్ 2010లో కల్పవృక్ష ఎన్జీవో ప్రచురించిన ‘ది జార్వా ట్రైబల్ రిజర్వ్ డోజియర్ – కల్చరల్ అండ్ బయొలాజికల్ డైవర్సిటీస్ ఇన్ ది అండమాన్ ఐలండ్స్’ అనే పుస్తకానికి సహ సంపాదకుడిగా కూడా వ్యవహరించారు. 

ఇంతవరకు రచయిత ది హిందూ, ఫ్రంట్‌లైన్, శాంక్చువరీ ఆసియా, డౌన్ టు ఎర్త్, తెహెల్కా తదితర పత్రికలలో 200 ప్రత్యేక కథనాలు, ఫీచర్ కథనాలు, ఫొటో ఫీచర్లు, అభిప్రాయ వ్యాఖ్యలు ప్రచురించారు. 

భారతీయ ప్రముఖ ప్రచురణ సంస్థ హార్పర్ కోలిన్స్ ఇండియా మే నెలలో ‘ది లాస్ట్ వేవ్ – యాన్ ఐలండ్ నావెల్’ను ప్రచురించింది. అసలు ధర రూ.350 కాగా పుస్తకాల షాపుల్లో, ఆన్ లైన్లో కాస్త తక్కువకే లభ్యమవుతోంది. అండమాన్ దీవుల, జార్వా తెగ చరిత్రను సమగ్రంగా తెలుసుకోవాలంటే ఈ నవలను తప్పక చదవాలి. ఫ్లిప్‌కార్ట్, అమేజాన్ ఆన్‌లైన్ పుస్తక షాపుల్లో కూడా దీన్ని తీసుకోవచ్చు. ఈ ఆగస్టులో ఈ నవలను అండమాన్ దీవుల్లోనే ఆవిష్కరించడానికి రచయిత ప్రయత్నిస్తున్నారు. 

అండమాన్ దీవులు, దీంట్లో నివసిస్తున్న గిరిజన తెగల మార్మికత, నిగూఢత గురించి పూర్తిగా అవగాహన చేసుకున్న రచయిత హైదరాబాద్ నివాసి కావడం విశేషం. ఈ దీవులకు, జార్వా తెగకు సంబంధించి వెలుగులోకి రాని పలు అంశాలపై కొన్నేళ్లుగా రచయిత కథనాలు రాస్తూ వచ్చారు. జర్నలిజం, రీసెర్చ్‌ను దాటి ఇక్కడి జీవితం గురించి చెప్పడానికి నవలను ఎంచుకున్నాను, దీనిద్వారా దీవిపై కొత్త దృక్కోణాలు వెలుగు చూడటమే కాకుండా విస్తృత పాఠకులకు అండమాన్ విశేషాలు అందుతాయనే అభిప్రాయంతోనే ఈసారి నవలా రచనను ఎంచుకున్నానని పంకజ్ చెప్పారు. 

గిరిజన జాతుల అంతర్థాన ప్రక్రియపై ఈ నవల ఒక సందేశాన్ని ఇస్తుంది. పర్యావరణంతో సహా వారు ఎదుర్కొంటున్న పలు సవాళ్లను ఈ కథ వివరిస్తుంది.

 

ప్రతులకు

భాగ్యనగరంలోని ప్రముఖ పుస్తక విక్రయకేంద్రాలు
ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయవచ్చు.
వెల: రూ. 224 కిండల్ వెబ్‌సైట్‌లో రూ.214
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పద్య కధనం -శ్రీ మాడుగుల నారాయణ మూర్తి గారు -మూసీ మాసపత్రిక -జులై

padyakadha 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆంద్ర విశ్వ విద్యాలయ మాజీ వైస్ చాన్సెలర్ ప్రస్తుత గీతం యోని వర్సిటి చాన్సెలర్ పద్మశ్రీ కోనేరు రామ కృష్ణా రావు గారి స్పందన

koneru 001

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

మా విశ్వనాథ, ఐ.వి., కె.వై.ఎల్‌ – డా. వెల్చాల కొండలరావు :

మా విశ్వనాథ, ఐ.వి., కె.వై.ఎల్‌ – డా. వెల్చాల కొండలరావు

Published at: 14-07-2014 02:22 AM

ఈ మధ్య ప్రత్యేక తెలంగాణ వాదం బాగా బలపడ్డాక, తెలంగాణ రాష్ట్రమేర్పడ్డాక చాలామందికి అదివరకటి సుపరిచితులు అపరిచితుల్లాంటి వారైపోయారు, ఇంకా అయిపోతూనే ఉన్నారని అచటచటా అనడం జరుగుతోంది. కానీ నాకు మాత్రం నా సుపరిచితులు అప్పటికీ, ఇప్పటికీ సుపరిచితులే. వారి యెడ నా గుండె అప్పటికీ ఇప్పటికీ అలాగే కొట్టుకొంటుంది, నా మనసు వారివైపు అలాగే నాకు తెలియకుండానే లాగుతుంది.

అప్పటి రావెల సోమయ్య గారు, ఐ.వి. చలపతిరావు  గారు, తుమ్మపూడి కోటేశ్వరరావు గారు, సి. సుబ్బారావు  గారు, నాయని కృష్ణకుమారి గారు, తంగిరాల సుబ్బారావు గారు, ఛాయాదేవి గారు, రాఘవాచారి గారు, కె.వై.ఎల్‌.  నరసింహారావు గారు, సి.ఎస్‌. రావు గారు, బి.వి.ఎల్‌. నారాయణరావు గారు, జి.ఆర్‌.ఎస్‌. రావు గారు, కృష్ణమోహన్‌ గారు, వైద్యనాథ అయ్యర్‌ గారు, హరిప్రసాద్‌ గారు, సుందరయ్య గారు, ఆత్రేయ శర్మగారు, అరుణా వ్యాస్‌   గారు, మండలి బుద్ధప్రసాద్‌ గారు, గొల్లపూడి మారుతీరావు గారు, మునిపల్లె రాజు గారు, ప్రసన్నకుమార్‌ గారు, కె. నాగేశ్వరరావు గారు, ఇంకా ఎందరో అప్పటికీ ఇప్పటికీ ఒకలాంటి వారే, నావారు.

అలాగే నేను ప్రేమించినవారు, నన్ను ప్రేమించిన వారు చనిపోయిన వారిలో కూడా ఎంతో ముందున్నారు. ఆవుల సాంబశివరావు గారు, ధూళిపాళ్ల శ్రీరామమూర్తి గారు, పి.ఎస్‌. రామచందర్‌రావు గారు, అప్పయ్యశాసి్త్ర గారు, నండూరి కృష్ణమాచార్య గారు నా క్లాస్‌మేట్‌ ఎం. వీరభద్రరావు గారు… ఇంకా మరెందరో.

నేను తెలంగాణ వాణ్ణి. పైన పేర్కొన్న వారంతా తెలంగాణేతరులు. కానీ నన్ను వారలా చూడలేదు, నేను వారినలా అనుకోలేదు. అసలాభావమే ఎన్నడూ మాకురాలేదు. ఎప్పుడు కలిసినా కులాసాగా మాట్లాడుకునేవారం, నవ్వేవారం, నానా కబుర్లు చెప్పుకునే వారం.
అప్పట్లో నేను కరీంనగర్‌ ఎస్‌.ఆర్‌.ఆర్‌. కాలేజీలో ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌గా ఉన్నప్పుడు చలపతిరావు గారు మాకు ప్రిన్సిపాల్‌గా వచ్చారు. ఆయన సతీసమేతంగా దిగారు బస్టాండ్‌లో. స్ఫురద్రూపి, ఆజానుబాహువు. తెల్లని వస్ర్తాల్లో ఉన్న ఆయన్ని అలాగే చూస్తూ ఉండిపోయాను.  రండి మా ఇంటికని తీసుకెళ్ళాను. రెండు మూడు రోజులున్నాక కిరాయింటికి వెళ్ళారు. కాలేజ్‌లో అందరమూ కలిసి ఆడుకునేవారం, పాడుకొనేవారం, నవ్వుకొనేవారం, అనేకానేక విషయాల గురించి చర్చించుకొనేవారం.

ఐ.వి. చలపతిరావు గారికి మంచి వక్తగానే కాక సాంఘిక, సాంస్కృతిక కార్యకలాపాల్లో కూడా చాలా ఆసక్తి కలవారిగా పేరుంది. అతనికి చెందిన ఆ గౌరవం కళాశాలలో పనిచేసే మా అందరికీ దక్కేది. మాకే కాదు, విద్యావంతులకు, అధ్యాపకులకు, విద్యార్థులకు వారివలన గౌరవం, గుర్తింపు సమకూరేది. మా గౌరవానికి వారు నిధిగా, మాప్రతినిధిగా మేమందరమూ భావించేవారం. ఇంతకూ ఇక్కడ చెప్పదలచిన విషయమేమిటంటే, ఆ రోజుల్లో ఇతడు అక్కడివాడు, ఇక్కడివాడను భేదమెవరికీ వుండేది కాదు. వారలాంటి భావం వచ్చేట్లు నడిచేవారు కారు. అందరం ఎంతో కలిసి మెలిసి ఉండేవాళ్లం. విశ్వనాథగారి లాంటి, కె.వై.ఎల్‌. నరసింహారావు గారి లాంటి, పాండురంగం గారి లాంటి, ఐ.వి. చలపతిరావు గారి లాంటి సుపరిచితులు, శ్రేయోభిలాషులు నాకెంతో మందున్నారు. నన్నడిగితే నాకు ఇక్కడి వారిలో కంటే అక్కడి వారిలోనే తెలిసిన వారు ఎక్కువున్నారు.

మా కరీంనగర్‌ వారు అప్పటికీ ఇప్పటికీ స్థానికులమైన మాకన్నా కవిసమ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ గారి, ఐ.వి. చలపతిరావు గారి, కె.వై.ఎల్‌. నరసింహారావు గారి పేర్లు ఎక్కువచెప్పుకుంటారు. వారిని మరిచిపోరు, పోలేరు. ఎందుకంటే వారు అక్కడ అంత శ్రద్ధా నిమగ్నతలతో పనిచేసేవారు. అక్కడివారిని అంత ప్రేమించేవారు, గుర్తించేవారు, గౌరవించేవారు. అదీ ‘సమైక్యత’ అను పదానికి అసలర్థం. కలిసుండడం కాదు కలిసిమెలిసి ఉండడం, ఒకేచోట ఉండడం కాదు, ఒకటిగా ఉండడం.

ఇక, కవి సమ్రాట్‌ విశ్వనాథ వారు, తనకు జ్ఞానపీఠ పురస్కారం వస్తే తెలంగాణ వారమైన జువ్వాడి గౌతమ రావుగారిని, కోవెల సంపత్కుమారాచార్య గారిని, నారాయణరావు గారిని, కోవెల సుప్రసన్నాచార్య గారిని, నన్ను వారి ఊరికి (నందమూరు) తీసుకెళ్ళి అనేకానేక అతిథి సత్కా రాలు చేసి స్వయానా తమ చేతులతో వడ్డిస్తూ, ‘ఈ కరీంనగర్‌ వాసుల రుణం నేనెన్ని జన్మలకు తీర్చుకోగలను’ అని అన్నారంటే మనమూహించుకోవచ్చు వారు ఆ నేలను, ఆచటి వారిని ప్రేమించారో, గౌరవించారో, ఎంతగా  వారితో మమేకమయ్యారో.

విశ్వనాథ, ఐ.వి. చలపతిరావు, కె.వై.ఎల్‌. నరసింహారావు ముగ్గురూ ముగ్గురే ముత్యాల లాంటి వారు. వారి ప్రిన్సిపాల్‌గిరీ కాలంలో వారొక విధమైన పరిపాలనా చరిత్రను సృష్టించారు. అచటి విద్యార్థులకే కాదు అచటి వారందరికీ విద్యంటే, సాహిత్యమంటే, సంస్కృతంటే, దేశభక్తంటే, సామాజిక స్ఫూర్తి అంటే ఏమిటో, వారి పాఠాల ద్వారా, ఉపన్యాసాల ద్వారా ఉద్బోధల ద్వారానే కాక వారి జీవన విధానాల ద్వారా చూపెట్టారు. అలాగే సాదాసీదాగా బ్రతకడమంటే, నీతి నిజాయితీగా ఉండడమంటే, వికాసవంతం గా, వినయవంతంగా, వివేకవంతంగా, ఆత్మాభిమానంతో, ఆత్మ విశ్వాసంతో జీవించడమంటే ఎలాగో వారు స్వయానా జీవించి చూపించారు.

అలాగే పాండిత్యమంటే ప్రతిభంటే ఏమిటో, వాటి కొరకు ఎలా పరిశ్రమించాలో, పాటుపడాలో చూపెట్టారు. ఒక మంచి ఆచార్యుడంటే, ఒక మంచి విద్యా పరిపాలకుడంటే ఎలాంటి వాడో కూడా. ఆరోజుల్లో కళాశాలలకు బైటి ప్రపంచానికి సంబంధమే ఉండేది కాదు. కానీ, ప్రిన్సిపాళ్ళుగా చలపతిరావుగారు, కె.వై.ఎల్‌. నరసింహారావుగారు అలాంటి సంస్కృతిని బ్రేక్‌ చేసి సంస్థకూ, సంఘానికీ సంబంధం ఏర్పరిచారు. చలపతిరావు గారు, పి.వి. నరసింహారావు గారితో కలిసి జిల్లా అంతటా పర్యటించి విద్య, సాంఘిక, సాంస్కృతిక, సామాజిక, రాజకీయ విషయాలపై కూడా ఉపన్యసించేవారు. ఇంగ్లీషులోనే కాక తెలుగులో కూడా ధారాళంగా మాట్లాడేవారు. ఆ విధంగా అక్కడి వారికి ఎంతో సాంఘిక, రాజకీయ, ఆర్థిక, సాహిత్య సాంస్కృతిక చైతన్యం, సామాజిక ప్రేరణ కలిగించేవారు. అలాగే దేశభక్తి, స్వయంశక్తి కూడా. ఎవరూ వారివైపు వ్రేలు చూపించేవారు కారు వారు అక్కడివారు కారని. అప్పటికీ ఇప్పటికీ తెలంగాణవారు వారందరినీ తెలంగాణ వారికన్నా ఎక్కువ ప్రేమిస్తారు, ఆ కాలేజీలో వారు గడిపిన రోజులు అపుడపుడు జ్ఞాపకం చేసుకుంటుంటారు, వాటిని ‘గోల్డెన్‌ డేస్‌’గా, ‘లక్కీడేస్‌’గా భావిస్తారు.

నాకూ ప్రిన్సిపాల్‌గా మంచిపేరు వచ్చిందంటే అది వారి వలననే, వారిచ్చిన స్ఫూర్తి వలననే. నేనెప్పుడూ ప్రిన్సిపాల్‌ అంటే అలాగుండాలని అనుకునే వాడిని వారిని చూసి,   వక్త అంటే అలా ఉండాలని అనుకునే వాడిని వారిని విని.  వారు జీవితమంతా అలాగే నిస్వార్థంగా గడిపారు నిప్పులాంటి నిజాయితీ పరులుగా. నూరేళ్ళకు దగ్గర పడుతూ కూడా ఇప్పటికీ ఐ.వి. చలపతిరావు గారు నిర్విరామంగా రచనలు చేస్తూ, ఉద్బోధలు చేస్తూ అలాగే ఉన్నారు అప్పటిలాగే ఆదర్శప్రాయంగా, ఇప్పటికీ ఈ వయసులో కూడా ఇంకా అనేకానేక పుస్తకాలు వ్రాస్తూ, అనేకానేక చోట్ల ఉద్యమిస్తూ, అనేకానేక విద్యాసంస్థల్లో సలహాదారులుగా పనిచేస్తూ, వారి పాత కొత్త పరిచయస్తులందరినీ ఆశ్చర్యపరుస్తూ, ఆనందపరుస్తూ.
అందుకే అంటాం మేము విశ్వనాథ వారిని, ఐ.వి. చలపతిరావు గారిని, కె.వై.ఎల్‌. నరసింహారావు గారిని వారు మీ వారే కాదు మా వారు కూడానని. మీవారికన్నా వారు మా వారే ఎక్కువని. అందుకే అంటాము అప్పటికీ ఇప్పటికీ మా విశ్వనాథయని. మా చలపతి రావుగారని, మా కె.వై.ఎల్‌. నరసింహారావు గారని.

అందుకే గదా అన్నారు విశ్వనాథ వారు వారి వేయిపడగలలో…

‘ఏ కులం, ఏ వర్ణం, ఏ ప్రాంతం వారయితేనేమి? తాదృశ్య మహా ప్రకృతులకు నమస్కారం!’ అని. అలాంటివారు ఆంధ్రా ప్రాంతం వారైనా, తెలంగాణ ప్రాంతం వారైనా మరి మనవారే కదా మరి మనందరివారు.

– డా. వెల్చాల కొండలరావు
కన్వీనర్‌, తెలంగాణ కల్చరల్‌ ఫోరమ్‌.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రావి శాస్త్రి గారి స్నేహితులలో ఒకడిగా ఉండాలనుకొన్న దర్శకుడు బి యెన్ రెడ్డి –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నెల్లూరు టౌన్ హాల్ కు శతాయుస్షు

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మనం’తో ఆ తప్పులన్నీ తుడుచుకుపోయాయి అంటున్న నాగార్జున

గతంలో కొన్ని సినిమాల విషయంలో తాను చేసిన తప్పులన్నీ ‘మనం’ సినిమాతో తుడుచుకుపొయ్యాయని నాగార్జున అన్నారు. ఈ సినిమా ఇచ్చిన ఆనందాన్ని పంచుకోవడానికి నాన్న (ఏఎన్నార్‌) లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు తరాల నటులు నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య కలిసి నటించగా అక్కినేని కుటుంబం నిర్మించిన ‘మనం’ విడుదలై 85 థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. విక్రమ్‌కుమార్‌ డైరెక్ట్‌ చేసిన ఈ సినిమా విజయోత్సవాన్ని సోమవారం రాత్రి అన్నపూర్ణ ఏడెకరాల స్టూడియోలో నిర్వహించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ తన తండ్రిని గుర్తు చేసుకున్నారు. ‘‘ఈ సినిమా సెట్స్‌ మీదుండగానే నాన్నకిది చివరి సినిమా అవుతుందని తెలిసి కుమిలిపోయాం. చివరి రోజుల్లో నటించడానికి ఎంత ఇబ్బందిగా ఉన్నా వచ్చి తన పాత్రను ఆయన పూర్తి చేశారు. ఎంతో కష్టపడి చేసిన ఈ సినిమా హిట్టవుతుందో, లేదోనని భయపడ్డాను. ప్రపంచవ్యాప్తంగా పెద్ద హిట్టవడంతో ఆ ఆనందాన్ని పంచుకోవడానికి నాన్న లేకపోవడం ఎంతో బాధనిపించింది. ఆయన లేనిలోటును ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రోగ్రాం ద్వారా మరచిపోవడానికి ప్రయత్నిస్తున్నా’’ అని ఆయన చెప్పారు. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ కష్టపడ్డారని చెబుతూ ‘‘దర్శకుడు విక్రమ్‌కుమార్‌ అయితే వేరే లోకమనేది లేకుండా పనిచేశాడు. అద్భుత దృశ్యకావ్యంలా దీన్ని మలచాడు. ఆయనను అక్కినేని కుటుంబం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది. మనం మంచి సినిమాయే కాదు, అందమైన సినిమా. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం సినిమాకు ప్రాణం పోసింది’’ అని ఆయనన్నారు. ఈ సినిమాకి సంబంధించి తనకెన్నో అద్భుతమైన అనుభూతులున్నాయని విక్రమ్‌కుమార్‌ అన్నారు.
ఈ చిత్రంలో నటించడం ఓ బాగ్యంగా భావిస్తున్నానని జయప్రకాశ్‌రెడ్డి చెప్పారు. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సీఈఓ మహేశ్‌ రామనాథన్‌ మాట్లాడుతూ ‘‘ఈ చిత్ర నిర్మాణంలో పాలు పంచుకున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అవకాశం లాంటిది ఈ చిత్రం. ఇది తెలుగు సినిమా చరిత్రలో శాశ్వత స్థానం సంపాదించుకునే చిత్రం. ముంబైలో ఈ చిత్రాన్ని చూసిన మా మిత్రులు హిందీలో దీన్ని రీమేక్‌ చేయడం అసాధ్యమని తేల్చేశారు’’ అని చెప్పారు. ‘మనం’ విడుదలైనప్పుడు ఆస్ర్టేలియాలో ఉన్నాననీ, అక్కడే ఈ చిత్రాన్ని చూశాననీ, తన కళ్లవెంట నీళ్లు వచ్చాయనీ వెంకట్‌ అక్కినేని తెలిపారు. ఇప్పటికి ఈ సినిమాను తాను మూడు సార్లు చూశాననీ, దీనిని ప్రశంసిస్తూ లెక్కలేనన్ని ఫోన్లు వచ్చాయనీ ఏఎన్నార్‌ కుమార్తె నాగసుశీల అన్నారు. విక్రమ్‌కుమార్‌ అద్భుతంగా చిత్రాన్ని మలచాడనీ, అనూప్‌ తన సంగీతంతో చిత్రాన్ని మరో స్థాయికి తీసుకు వెళ్లాడనీ నాగచైతన్య చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ డైరెక్టర్‌ కె. రాఘవేంద్రరావు, ‘శిరిడిసాయి’ నిర్మాత మహేశ్‌రెడ్డి అతిథులుగా పాల్గొని యూనిట్‌ సభ్యులకు జ్ఞాపికలు అందజేశారు. రచయిత హర్షవర్థన్‌, కళా దర్శకుడు రాజీవన్‌, ఎడిటర్‌ ప్రవీణ్‌ పూడి, సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌, గేయ రచయిత చంద్రబోస్‌, నటులు కృష్ణుడు, శ్రీనివాసరెడ్డి, దువ్వాసి మోహన్‌, కౌశల్‌, నటి విజయలక్ష్మి, ఇతర యూనిట్‌ సభ్యులు, అక్కినేని కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మహిళలకూ ఓ అఖాడా! :

అలహాబాద్‌గా పేరొందిన ప్రయాగ పవిత్ర పుణ్యక్షేత్రం. గంగ, యమున, సరస్వతి త్రివేణీ సంగమ నిలయం. ఇక్కడ  సాధువులెంతోమంది గంగా నదీ తీరం పొడవునా ఆశ్రమాలేర్పరుచుకుని కనిపిస్తారు. ఆ నివాస ప్రదేశాలే ‘అఖాడా’లు. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 13 అఖాడాల్లో 4 అలహాబాద్‌ సమీపంలోనే ఉన్నాయి. ఇక్కడి నుంచి ప్రతి పన్నెండేళ్లకోసారి జరిగే కుంభమేళాలో పాల్గొనటం కోసం సాధువులెంతో మంది తరలి వస్తూ ఉంటారు. ఒళ్లంతా బూడిద పూసుకున్న అఘోరాలు, నాగ సాధువులు, లక్షల మంది సన్యాసులు అమావాస్య రోజున గంగానదిలో స్నానాలాచరిస్తూ కనిపిస్తారు. అయితే వారిలో మహిళా సాధ్వీలు చాలా తక్కువ. వారికంటూ ప్రత్యేకంగా అఖాడా కూడా లేదు.  అందుకే  దేశ వ్యాప్తంగా 10 వేలకు పైగా ఉన్న సన్యాసినులందరూ ఒక అఖాడాను ఏర్పాటు చేసుకున్నారు. దీనికి శంకరాచార్య అఖాడా అని పేరు పెట్టుకున్నారు. ఈ అఖాడాకు ప్రధాన సాధ్వి  50 ఏళ్ల ‘మహంత్‌ త్రికాల్‌ భవంత’.
అసలీ అఖాడా పుట్టడం వెనకొక కారణముంది. సాధారణంగా కుంభమేళాలో అఖాడాల కోసం ప్రత్యేకమైన స్థలం కేటాయిస్తారు. 99 శాతం పురుషులు నివసించే ప్రదేశంలో మహిళలు నివసించటం కష్టం కాబట్టి తమకు కూడా ప్రత్యేక ప్రాంతం కావాలని సాధ్వీలు చాలా కాలంగా డిమాండ్‌ చేస్తూ వచ్చారు. అయితే వీరి డిమాండ్‌ను ఎవరూ పట్టించుకోలేదు. తమకు ఒక ప్రత్యేకమైన అఖాడా ఉంటే అక్కడ నివసించటం సులభమవుతుందని భవంత, ఆమె అనుచరులు భావించారు. జగద్గురు శంకరాచార్య పేరిట ఒక అఖాడాను కూడా ఏర్పాటు చేసుకున్నారు. తమకంటూ ఒక ప్రత్యేక అఖాడా ఉండాలని సాధ్వీలు పట్టుపట్టడం, దానిని ఏర్పాటు చేసుకోవటం చరిత్రలో ఇదే ప్రథమం.  ‘‘హిందూ ధర్మంలో పురుషులు, సీ్త్రలు అనే వివక్ష లేదు. ఇద్దరూ సమాన భాగస్వాములే. అంతే కాదు మహిళలు పుట్టుకతోనే పూజ్యులు. వారే భగవంతుడిని శ్రద్ధగా సేవిస్తారు..’’ అంటారు భవంత. ప్రస్తుతం శంకాచార్య అఖాడాలో అనేక మంది సాధ్వీలు నివసిస్తున్నారు. పురుష అఖాడాలలో మాదిరిగానే ఇక్కడ కూడా బాధ్యతలన్నింటినీ స్పష్టంగా విడగొట్టారు. వీటిని అఖాడాలలో నివసించే కొందరికి అప్పచెప్పారు. ప్రస్తుతం అఖాడాలో హిందు సంప్రదాయ పద్ధతులను బోధించటంతో పాటుగా ఆయుధాలను ఉపయోగించటం కూడా నేర్పుతున్నారు. మహిళల స్వీయ రక్షణకు ఇది తప్పవనేది భవంత అభిప్రాయం. వచ్చేసారి జరిగే కుంభమేళాలో తమకు కూడా సముచిత గౌరవం కల్పించాలని లేకపోతే తాము తిరగబడతామని కూడా భవంత హెచ్చరిస్తున్నారు.
ఆధ్యాత్మికతకు అంకితం
మహంతి త్రికాల్‌ భవంత ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీర్జాపూర్‌ వాసి. ఈమెకు ఒక తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. భవంతకు చిన్న వయసులోనే ఆధ్యాత్మికతపై ఆసక్తి ఏర్పడింది. వివాహమంటే విముఖత ఉన్నా తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు పెళ్లి చేసుకున్న భవంతకు ఒక కొడుకు, కూతురు జన్మించారు. ఆ తర్వాత భర్త నుంచి విడిపోయిన భవంత ఆధ్యాత్మిక బాట పట్టారు. ఆమె పప్పులు, తృణ ధాన్యాలు ముట్టుకోరు.   పళ్లు, కూరగాయలు మాత్రమే తింటారు.  పొడవాటి దుస్తులు ధరించి, బంతిపూలు పెట్టుకొనే  భవంత అఖాడాలోని  దేవాలయం లోపలి గదిలో గడుపుతారు. ఈమె ఉపయోగించే చేతి సంచులు, ల్యాప్‌టాప్‌ కవర్‌ అన్నీ కాషాయ రంగులోనే ఉండటం విశేషం.

విధులు         – పేర్లు
కొఠారి               – కోశాధికారి
భండారి            –  పాకశాల అధిపతి
కొత్వాల్‌            – కాపలాదారు
రమ్తా పంచ్‌      – దేశంలోని అన్ని శాఖలనూ పర్యవేక్షించే వ్యక్తి
వీటిలోని అన్ని ప్రధాన హోదాలు పూర్తిగా మహిళలకే పరిమితం.

అఖాడాలో ఒక రోజు
ఉదయం 4గం. – నిద్ర మేల్కొనటం.
5 – 6 – మంగళ హారతి
6 – 7-  ధ్యానం, జపం
8-9.30  – టీ, అల్పాహారం
9.30 – 10 – హారతి పూజ
11 గంటలకు  – భోగ ప్రసాదం
మధ్యాహ్నం నుంచి – భక్తుల దర్శనం
సాయంత్రం 5 – దేవాలయం, పరిసరాలు శుభ్రం చేయటం
7 – సంధ్య హారతి
8 – 9 – భజన,  ప్రసాదం
10 – నిద్ర

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలుగు బోయల వీరగాథ ‘బోయకొట్టములు పండ్రెండు’

తెలుగు బోయల వీరగాథ ‘బోయకొట్టములు పండ్రెండు’

Published at: 14-07-2014 02:26 AM

చారిత్రక కల్పనా నవల ‘బోయకొట్టములు పండెండ్రు’లో రచయిత కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె చూపించిన శిల్పవిన్యాసం అమోఘం. ముఖ్యంగా ఆధునిక యూరోపియన్‌ చారిత్రక నవలా శిల్పాన్ని యథాతథంగా  తీసుకోలేదు. దానికి అచ్చతెలుగు జానపద కథన శైలిని జోడించి  ఒక కొత్త వొరవడిని సృష్టించారు.

పండరంగని అద్దంకి శాసనానికి తొలి మధ్యయుగ ఆంధ్ర చరిత్రలో చాలా ప్రాముఖ్యత ఉంది. అది చరిత్ర నిర్మాణానికీ, ఆర్థిక, రాజకీయ సాంస్కృతిక నిర్మాణానికీ, భాషా పరిణామానికీ అన్నింటికీ ముఖ్యమైనదే. క్రీ.శ. 624 నాటి తొలి మధ్యయుగ ఆంధ్ర చరిత్రలోని రాజకీయ కల్లోలం ఒక సామ్రాజ్య ఆవిర్భావానికి దోహదం చేసింది. ఈ చారిత్రక యుగానికి సంబంధించిన ప్రజా జీవనం ఏంటి? ఈ చరిత్రను నడిపించిన శక్తులేవి? అనేవి నిజానికి ఇప్పటికీ సాధికారిక సమాధానం లేని ప్రశ్నలు.
ఆంధ్ర దేశంలో షోడశ మహా సామ్రాజ్యాలలోని అస్సక గణం శాతవాహన సామ్రాజ్యంగా విస్తరించడం భారత చరిత్రలో ముఖ్య ఘట్టం. అటు తరువాత విష్ణుకుండినులు.. రాష్ట్రకూటులు పరిపాలన సాగించినా రెండో పులకేశి వేంగిని జయించి కుబ్జ విష్టువర్థనుణ్ణి పాలకుడుగా నియమించడం తెలుగు చరిత్రలో అత్యంత కీలకమైన మలుపుని తీసుకొచ్చింది. మధ్యయుగాల యుద్ధకాంక్షలు- సాంస్కృతిక విస్తరణలూ- వీరుల క్రూరత్వాలు మొదలైనవన్నీ మొదలై పతాక స్థాయికి చేరుకున్న కాలం ఇది. దక్షిణా పథ రాజ్యాల మధ్య ఘోరయుద్ధాలతో పాటు వైవాహిక సంబంధాలు ఏర్పడి చిన్న చిన్న రాజ్యాలు బలమైన రెండు సామ్రాజ్యాలుగా ఆవిర్భవించవలసిన కాలం ఇది.

భారత ఉపఖండంగా వందలాది జాతులు- వలసలతో నిరంతరం సంఘర్షించుకున్న ఈ ఉపఖండం ఒక దేశంగా ఏర్పడటానికి దోహదం చేసిన ముఖ్యమైన చోదక శక్తులు వ్యవసాయం -సంస్కృతి అని చెప్పాలి. చారిత్రక యుగంలో వర్ధిల్లిన సార్ధవాహులు -బౌద్ధం- జైనం ఒక తాత్విక సామాజిక విప్లవానికి నాంది పలికాయి. అప్పుడప్పుడే ఏర్పడుతున్న లేత రాజ్యం ముందు రెండు మార్గాలు పరుచుకున్నాయి.
ఒకటి వ్యవసాయం -గ్రామం పునాదిగా వర్ణ కుల వ్యవస్థ సామాజిక రూపంగా ఉండి బ్రాహ్మణుల మంత్రాంగం క్షత్రియుల నాయకత్వంలోని వైదిక వర్ణ వ్యవస్థ.
రెండోది వ్యవసాయం -వర్తకం -పట్టణాలు పునాదిగా వర్ణకుల వ్యవస్థ లేని సమాజంగా ఉండి బ్రాహ్మణ మంత్రాంగానికి చోటులేని క్షత్రియ నాయకత్వంలోని గణతంత్ర వ్యవస్థ.
ఈ రెండు మార్గాలలో రాజ్యం ఏ మార్గం ఎంచుకోవాలి అనేదాన్ని వైదిక ఆర్థిక వ్యవస్థ నిర్దేశించింది.
వ్యవసాయం-గ్రామం-చేతివృత్తులు -బ్రాహ్మణులు -అవైదిక అగ్రకులాలు -సత్శూద్రులు- దేవాలయం ఉండే స్వయం సంపూర్ణ ఆర్థిక వ్యవస్థ ఇది. ఈ వైదిక ఆర్థిక వ్యవస్థ ఏర్పడటం అంత సునాయాసంగా జరిగింది కాదు. లేదా అహింసాయుతంగా ఏర్పడిందీ కాదు. బ్రాహ్మణులు- క్షత్రియులు- వైశ్యులు ఒక వర్గంగా శూద్రులు -ఆదివాసులు మరో వర్గంగా జరిగిన వర్గపోరాటం ఫలితంగా ఏర్పడిన వ్యవస్థ ఇది. హింస -వర్ణసాంకర్యం -కులం -వైదిక సంస్కృతి సాధనాలుగా దేశమంతా వైదిక ఆర్థిక వ్యవస్థ ఏర్పడింది.

భారత చరిత్రలో మనకి ఈ ఘర్షణకి సంబంధించిన చారిత్రక ఆధారాలు అతి తక్కువగా కనిపిస్తాయి. వందలాది సంవత్సరాలు స్థిరంగా ఉండిపోయిన ఈ ఆర్థిక వ్యవస్థ పాత ఘర్షణల తాలూకూ ఆనవాళ్లని దరిదాపుగా చెరిపివేసింది.
కాబట్టి ఈ ఘర్షణ చరిత్రని పునర్నిర్మించుకోవడానికి ఆధునిక కాలంలో జీవించి ఉన్న గత చరిత్రని విశ్లేషించుకుంటూ భౌతిక ఆధారాల చుట్టూ కల్పనని జోడించుకుంటూ పోవాలి. ఇది చరిత్ర అధ్యయనానికీ కళా సౌందర్యానికీ దోహదం చేసే అద్భుత కళా రూపం అవుతుంది. అటువంటి అద్భుత కళారూపం కరణం బాలసుబ్రహ్మణ్య పిళ్ళే రాసిన ‘బోయకొట్టములు పండ్రెండు’ నవల.

తెలుగులో చరిత్రని ఆధారం చేసుకొని అల్లిన చరిత్ర కాల్పనిక నవలల సంఖ్య కొద్దిపాటివే. పురాణవైర గ్రంథమాల చారిత్రక నవలల కోవలోనివి కాదు. బాపిరాజు -గోనగన్నారెడ్డి, అడివి శాంతిశ్రీ, నోరి నరసింహశాసి్త్ర -వాఘిరా, తెన్నేటి సూరి -చంఘీజ్‌ ఖాన్‌, అల్లం రాజయ్య, సాహుల -కొమురం భీం లాంటి నవలలు చారిత్రక కాల్పనిక నవలలు. ఈ కోవలోని నవల ‘బోయకొట్టములు పండ్రెండు’.

పండరంగని శాసనంలోని ఈ మాటను తీసుకొని ఇప్పటి దాకా ఉన్న చరిత్రని అధ్యయనం చేసి రాసిన ఒక జాతి వీర గాథ ఇది. ఆ జాతి బోయ.

బహుశా నల్లమల అటవీ ప్రాంతంలో నివసించిన గిరిజన జాతి బోయలు. ఒక్క ఆంధ్ర ప్రాంతాన్నే తీసుకున్నా అటవీ ప్రాంతంలోని జాతుల సంఖ్య తక్కువ కాదు. దండకారణ్యంలో గోండులు కోయలు గుత్తికోయలు సవరలు జాతాబులు చెంచులు ఇంకా ఎన్నో జాతుల ప్రజలు ఉన్నారు. వేలాది సంవత్సరాల క్రితం ఇప్పటికన్నా ఎన్నో రెట్ల వైశాల్యంలో ఉండిన అటవీ ప్రాంతాలలో చరిత్రకెక్కని ఎన్నో రకాల ప్రజలు నివసించి ఉండొచ్చని ఊహించవచ్చు.

భారత ఉపఖండంలో రాజ్యం అనేది ఏర్పడిన తరువాత మొదటి నుండీ దానికున్న కర్తవ్యం ఈ వేరు వేరు జాతుల ప్రజల్ని ఒక రాజ్యపు పాలితులుగా మార్చడం. అందుకోసం వైదిక సమాజ చట్రంలోకి ఈ జనాన్ని చేర్చుకోవడం. ఈ పరిణామం అంతా మనం చరిత్రలో చూడొచ్చు. వందల తరాలు గడిచాక ఈ జాతుల ఆనవాళ్ళు ఎక్కడా లేకుండా అవన్నీ వివిధ అవైదిక కులాలుగా వైదిక సమాజ చట్రంలోకి చేరిపోయాయి.

కానైతే బౌద్ధం, జైనం లాంటి తాత్విక చింతనలు మనకి చేసిన మహోపకారం ఆయా జాతుల అమ్మదేవతల పూజల్ని కొనసాగనివ్వడం. బౌద్ధ శ్రమణకులు ఆనాటి ప్రజల అనూచాన పూజాదికాలలో కల్పించుకోకుండా అష్టాంగ మార్గాన్ని ప్రబోధించారు. ఫలితంగా బ్రాహ్మణ్యం ఈ జాతుల ప్రజల్ని వాళ్ళ వాళ్ళ అమ్మ దేవతలు వాళ్ల జాతి పురాణ గాథలతో సహా చేర్చుకోవల్సి వచ్చింది. అంతేకాక అమ్మదేవతలనీ, పురాణ గాథల్నీ ఆమోదించాల్సి వచ్చింది.

ఈ గాథలు, ఈ పండుగలు ఈ ఆచార వ్యవహారాలే ఇవాళ మనం గతాన్ని గురించి ఊహించడానికి ఉన్న ఆధారాలు. వీటికి ఉన్న భౌతిక యదార్థత ఎంత తక్కువైనా అది ఈవేల్టికీ మన జీవితంలో కొనసాగుతున్నది. మన చారిత్రక జీవనంలోని ఈ సంక్లిష్టతలోంచి ఒక సాంఘిక జీవనాన్నీ పరిణామాన్నీ చిత్రించిన బోయకొట్టములు పండ్రెండు అచ్చంగా తెలుగు ప్రజల వీరగాథ.

పల్లవులకీ వేంగి చాళుక్యులకీ మధ్య జరిగిన యుద్ధాలలో త్రిపురాంతకం ప్రాంతంలోని బోయలు నలిగిపోయి తమ జీవనం కోసం అణ్డెక్కి ప్రాంతానికి బయలుదేరడంతో ఈ నవల ప్రారంభమవుతుంది. మొదటి బోయ వీరు వీరనబోయడు అతని భార్య మంగసాని పల్లవుల ప్రాపకాన్ని సంపాదించి అణ్డెక్కి ప్రాంతంలో స్థిరపడతారు. క్రమంలో ఇవి పన్నెండు బోయకొట్టాలుగా విస్తరిల్లుతాయి.

పల్లవులతోనూ చాళుక్యులతోనూ కలవకుండా తమ మానాన తాము జీవిద్దామని బోయ నాయకులు భావించినా అది సాధ్యపడదు. ఇటు పల్లవ రాజో అటు చాళుక్య రాజో ఎవరో ఒకరివైపు ఉండాల్సిన స్థితి బోయలది.

పల్లవులైనా చాళుక్యులైనా వాళ్ళు విస్తరింప చేయదల్చుకున్న వ్యవస్థ మాత్రం ఒకటే. రాజ్యం కోసం విస్తరణ కోసం యుద్ధాలు చేసుకున్నా ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడం వీరి ధ్యేయం.

పల్లవ రాజప్రతినిధి జయవర్మ మొదటి వీరనబోయనితో కట్టెపు దుర్గాన్ని నిర్మించమనీ, వీరన బోయన వంశం వారు మొత్తం బోయ కొట్టాలకు పాలకులుగా ఉండాలనీ, పన్నులు వసూలు చేయాలనీ, జనం అంతా యుద్ధ విద్యలలో ఆరి తేరి ఉండాలనీ ఆజ్ఞాపిస్తాడు.

బోయ కొట్టాల మీదికి వచ్చిన చాళుక్య జయసింహ వల్లభుడు పల్లవుల అనుమతులనీ ఆమోదిస్తూనే వాటితో పాటు బౌద్ధానికి వ్యతిరేకంగా బ్రాహ్మణుల్ని గ్రామంలో ఉంచుకోవాలనీ శివాలయాలు కట్టుకోవాలనీ పూజలు చేయాలనీ ఆజ్ఞాపిస్తాడు. అంతటితో ఆగకుండా రెండవ వీరన బోయణ్ని శిక్షణ కోసమని తనతో తీసుకుపోతాడు.

తమని పోలిన ఒక వైదిక రాజరిక వ్యవస్థని బోయల్లో నెలకొల్పి ఆ వ్యవస్థని తమ సామంత రాజ్యంగా చేసుకోవాలనే యోచన ఇరువేపులా కనిపిస్తుంది. కానీ బోయలు ఈ వైదిక రాజరిక వ్యవస్థలో చేరకుండా తాము తాముగా ఉండిపోవాలని ప్రయత్నిస్తారు. ఈ రెంటి మధ్య ఏ విధమైన ఘర్షణ -శాంతి జరిగాయనేదే ఈ నవల.

ఒకటవ వీరన బోయడు- మంగసాని, రెండవ వీరనబోయడు- జయశ్రీ, సంపంగి, కసవనబోయడు- పృధ్వీవ్యాఘ్రరాజు, నన్ని బోయడు- పొన్ని బోయడు, పొన్ని బోయడు- వకుళ, గుణగ విజయాదిత్యుడు- పండరంగడు.. ఈ ప్రధాన పాత్రల చుట్టూ జరిగిన ఘట్టాలు తొలి మధ్యయుగ చరిత్రని మన ముందు ఉంచుతాయి.

పృధ్వీవ్యాఘ్రరాజు బలవంతంగా వైదిక రాజరికాన్ని బోయలలో ప్రవేశపెట్టాలని ప్రయత్నిస్తాడు. బోయ కొట్టాలుగా ఉన్న సమాజాన్ని ఒక రాజరిక వ్యవస్థగా మార్చడానికి ప్రయత్నిస్తాడు. అతని ప్రయత్నమే ఫలించి ఉంటే చరిత్రలో చాళుక్యులకి ఒక బలమైన సామంత రాజ్యం ఉండేది. లేదా బోయలే బలపడి తెలుగు నాట ఒక కొత్త రాజవంశంగా తలెత్తేది.

తలెత్తలేదు. పృధ్వీవ్యాఘ్రరాజు కాలానికి నిరంతర యుద్ధాలనించి బయటపడి తీరికగా ఉన్న పల్లవులు బోయకొట్టాల మీద తమ ఆధిపత్యాన్ని ప్రతిష్టించుకున్నారు. పల్లవ ఉదయచంద్రుడు కసవనబోయని మనుమడు వీరభద్ర బోయణ్ణి నాయకుడిగా చేశాడు. వీరభద్ర బోయడు పసి వయస్సులోనే హత్యకు గురౌతాడు. తరువాత నన్ని బోయడు పొన్ని బోయడు అనేవారు బోయకొట్టాలకు నాయకులౌతారు.

ఇక్కడి వరకూ వేంగి చాళుక్యులతో మైత్రినీ బంధాన్నీ పెంచుకున్న బోయ కొట్టాలు ఇప్పుడు పల్లవులతో మైత్రినీ, బంధాన్నీ పెంచుకుంటారు. బోయ ప్రతినిధిగా నన్ని బోయడు- నాగరికతను నేర్చి వైదిక రాచరిక మర్యాదల్ని వంట పట్టించుకున్న పొన్ని బోయడు ఇద్దరూ కలిసి బోయకొట్టాలను బలపరుచుకున్నారు. పొన్ని బోయడు వకుళను వివాహమాడడం ద్వారా పల్లవుల బంధుత్వాన్ని ఏర్పరుచుకున్నాడు.

బహుశా బోయ కొట్టాల వంటి ఒక పరిపాలనా విభాగం ఇక రాజ్యంగా రూపాంతరం చెందాల్సి ఉంది. అప్పటికే గ్రామం ఏర్పడిపోయింది. బ్రాహ్మణులు, వివిధ కులాల చేతివృత్తుల వారు వ్యవసాయం అన్నీ బోయ కొట్టాలలో స్థిరపడ్డాయి. వైదిక గ్రామం ఏర్పడి ఉంది. కాబట్టి అన్ని రకాలుగా వైదిక బోయ రాజ్యం ఏర్పడడానికి నేపథ్యం ఏర్పడింది.

కానీ చరిత్ర ఇంకోలా సాగింది. 108 యుద్ధాలతో విసిగి వేసారిన చాళుక్యరాజు మరణం తరువాత గుణగ విజయాదిత్యుడు అధికారంలోనికి వచ్చాడు. ఇతడికి స్పష్టమైన లక్ష్యం ఉంది. అందుకు తోడు వీరుడూ అతి క్రూరుడూ అయిన పండరంగని సేనాధిపత్యం ఉంది.

చారిత్రక కల్పనా నవలలో రచయిత చూపించిన శిల్పవిన్యాసం అమోఘం. ముఖ్యంగా ఆధునిక యూరోపియన్‌ చారిత్రక నవలా శిల్పాన్ని యథాతథంగా తీసుకోలేదు. దానికి అచ్చతెలుగు జానపద కథన శైలిని జోడించి ఒక కొత్త వొరవడిని సృష్టించారు. చాలా ముఖ్యంగా చారిత్రక నవలలో కల్పన అనేది చాలా క్లిష్టమైన అంశం. చారిత్రక సంఘటనల వాస్తవికత మీద కొన్ని చారిత్రక పాత్రల్ని ఆధారంగా తీసుకొని కల్పిత పాత్రల్ని సృష్టించి రాయడం రచయిత సామర్థ్యానికి పరీక్ష. మనకి చాలా చారిత్రక నవలల్లో చరిత్రని కల్పన అధిగమిస్తూ ఉంటుంది.

చరిత్ర గమనంలోని భౌతిక వాస్తవికతని ఏ మాత్రం విస్మరించకుండా ఏ మాత్రం అధిగమించకుండా వాస్తవికతని ప్రస్ఫుటీకరించే కల్పనని జోడించడం ఈ నవలకి అద్భుతమైన శైలిని ఇచ్చింది. ఒక్కొక్క తరంలోని -ఒక్కొక్క కాలంలోని సంఘటనల మధ్య ఉత్థాన పతనాల గతితార్కికతనీ, వాటి వెనుక ఉండే చారిత్రక చోదక శక్తుల్నీ కళాత్మకంగా చిత్రించారు.

మొట్ట మొదట నవల పేరే మన్ని కట్టిపడేస్తుంది. తెలుగు భాషా చర్చ నవలలో సందర్భాఆనికి తగినట్లుగా ప్రవేశిస్తుంది. జానపద పాటలు వాటి శైలీ సంస్కృత సంధుల్ని సమాసాలనీ తెలుగులోకి ప్రవేశపెట్టడానికి కృషినీ దానికి వ్యతిరేకతనీ కూడా చిత్రిస్తుంది ఈ నవల.

నిజంగానే చరిత్రలో చాలా సంఘటనలు యాదృచ్ఛికంగా జరగవు. రాజ్యం- మానవుల చైతన్య శీల కార్యాచరణనించి జరుగుతాయి. రాజ్యం అండదండలతోనే వైదిక ఆర్థిక వ్యవస్థ విస్తరించింది. దీనికి సముద్రగుప్తుడి నించి అన్ని రాజ్యాలు దోహదం చేస్తాయి. సాంస్కృతిక రంగంలో ఇది సహజ పరిణామం అనిపించవచ్చు గానీ ఇది బలప్రయోగంతో విస్తరించినదే. అలాగే భాష- తెలుగు భాష, కవిత్వం, ఛందస్సు, ఇవన్నీ సాహిత్యేతర రాజరిక అవసరాల కోసం సృష్టించినవి. అన్నంత మాత్రాన అందులో మనం వ్యతిరేకంగా తీసుకోవల్సింది  ఏమీ లేదు.

మరో ముఖ్యమైన అంశం బౌద్ధం. ఈ నవలా చారిత్రక కాలానికి బౌద్ధ విస్తరణ భీతి వైదిక రాచరికాన్ని వెన్నాడుతూనే ఉంది. అందుకే బౌద్ధం విస్తరించకుండా- ముఖ్యంగా పాలితులలో, అంతకన్నా ముఖ్యంగా బోయల వంటి జాతులలో విస్తరించకుండా రాజ్యం ఎన్నో పటిష్ఠమైన ఏర్పాట్లు చేసుకుంది. దీని చివరి ఫలితం నన్నయ మహా భారత అనువాదం.

తెలుగు భాషలో వచ్చిన చారిత్రక కల్పన నవలల్లో ఇది ప్రజల చారిత్రక వీరగాథని చిత్రించిన అద్భుత నవల.

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నా దారి తీరు- 75 బ్రాహ్మణ వ్యవసాయం

నా దారి తీరు- 75

బ్రాహ్మణ వ్యవసాయం

మా చిన్నప్పుడు అందరూ ఒక సామెత చెప్పేవారు .ఒకతన్ని ఎవరో ఒకాయన ‘’పల్లకీ ఎక్కుతావా ?బ్రాహ్మాణ వ్యవసాయం చేస్తావా?అని అడిగితే ‘’పల్లకిలో కుదుపులు తట్టుకోలేను బ్రాహ్మణ వ్యవసాయమే చేస్తాను హాయిగా ‘’‘’అన్నాడట .అంటే బ్రాహ్మణుల వ్యవసాయం అంతే ‘’వీజీ ‘’అన్న మాట .అడిగే వాడుండడు ,పట్టించుకొనే వాడుండడు అని భావం. కస్ట పడకుండా ఫలితం వస్తుంది .వాళ్ళని కౌలు పేరుతో మోసం చేయచ్చు అని వ్యంగ్యార్ధం .కారణం వీళ్ళు పొలం వెళ్లరు .ఏ పంట వేస్తున్నారో తెలుసుకోరు .యెంత ఆదాయం వస్తుందో యెంత రేటుకు అమ్మాడో  అక్కర్లేదు .సంవత్సరం అవగానే వాళ్ళ చేతిలో ఏదో కొంత పెడితే చాలు అని అందరూ అనుకోవటమే బ్రాహ్మణ వ్యవసాయం .

కాని మా ఉయ్యూరులో పక్కనున్న సాయిపురం ,కనక వల్లి ,పెనమకూరు పేద వోగిరాలలో  లలో బ్రాహ్మణులు గొప్పగా వ్యవసాయం చేసేవారున్నారు .వీరందర్నీ స్వయం గా నేను చూశానుకూడా .ఉయ్యూరు లో మా మేన మామ గంగయ్య గారు ఆయన తండ్రి శింగిరి శాస్త్రిగారు ,పిన తండ్రి నరసింహం గారు నిత్యం పొలం వెడుతూ పాలేళ్ళతో పని చేయిస్తూ అజమాయిషీ చేస్తూ ,అవసరమైతే దుక్కి దున్నటం , నాట్లు వేయటం, కలుపు తీయటం కొత్త కోయటం   ,కట్టి వెత నూర్పిడి పనుల్లో ఆరి తేరిన వారే .వీరు పొలంలో  కని  పిస్తే చాలు కూలీలకు తమ కంటే ఆసాములకే పనులు బాగా తెలుసునని మరింత కస్టపడి పని చేసేవారు .మా అమామయ్య ధాన్యం బస్తాలు మినుము బస్తాలు కూడా మోసెంత సామర్ధ్యం ఉన్నవాడు .పాలేళ్ళతో కలిసి కట్టెలు కొట్టేవాడు .ఈయన దెబ్బకి వాళ్ళు ఝాడిసే వాళ్ళు .అంత పనిమంతుడు .ఎడ్ల బండీ కట్టటం తోలటం ఆయనకు బాగా అలవాటే . కనుక మా మామయ్య కుటుంబం బ్రాహ్మణ వ్యవసాయం అనేదానికి తగరు అన్నమాట .అలాగే శాయి పురం లో బ్రాహ్మణులంత గొప్ప వ్యవసాయ దారులే .అన్ని పనులూ స్వయం గా చేసుకొనే వారే మంచి పంటలు పండించే వారు కనుక వీరికీ ఈ మాట కుదరదు .

కనకవల్లి ,పెనమకూరు లో ఎక్కువ మంది బ్రాహ్మణులు స్వంత వ్యవసాయం చేసి బాగు పడ్డ వాళ్ళే .కనక వల్లిలో వారిని శ్రీ మంతులు  అంటారు .వారు కూడా గొప్ప వ్యవసాయ దారులు .దగ్గరుండి వ్యవసాయం చేయించేవారు .చెరుకూ బాగా సాగు చేసేవారు . మంచి స్థితిపరులు .దాన గుణ సంపన్నులు .అక్కడి పేద ప్రజలకు తమ భూమి లో కొంత పంచి పెట్టిన వదాన్యులు .కనక వల్లి అగ్రహారం అంతా వారి అధీనం లోనే ఉండేది .వారి అబ్బాయి సోమయాజులు గారు సర్పంచ్ గా చాలా కాలం పని చేశారు .ఇప్పటికీ వారికి అక్కడ భూములున్నాయి .కాని చదువులకోసం కుటుంబం ఉయ్యూరు కు చేరింది .అయిన అజమాయిషీ చేస్తూ పంటలను పండిస్తున్నారు .మిగిలిన వారిలో విష్ణుభొట్ల సోమయాజులు  హైస్కూల్ లో నా క్లాస్ మేట్ .అతనికీ మంచి భూవసతి ఉంది .స్వంత వ్యవసాయం చేసేవాడు .వయసు దృష్ట్యా ఉయ్యూరు లో కాపురం ఉండి యాజమాన్యం చేస్తున్నాడు .అలాగే వెంపటి వారికీ పొలాలున్నాయి వారూ కస్టపడి వ్యవసాయం చేసేవారే .ఇప్పుడు ఆ కుటుంబమూ పట్నాలకు చేరారు .ఇప్పుడు బ్రాహ్మణీకం అక్కడ నామ మాత్రమె .పెనమకూరు లో బ్రాహ్మణులలో మంచి వ్యవసాయ దారులున్నారు .ఇప్పటికీ స్వంత వ్యవసాయం చేస్తూ అనేక రకాల పంటలు పండిస్తున్నారు .అందులో ‘’అనుముల ‘’వారి కుటుంబం వ్యవసాయానికి పెద్ద పేరు .

ఉయ్యూరులో చోడవరపు వారు మంచి  స్థితి పరులు .వ్యవసాయానికి పాలేళ్ళు ,బండీ ఎడ్లు ఉండేవి .ఇది చంద్ర శేఖర రావు గారి కాలం వరకు సాగింది .ఆయన మా నాన్నగారికి సహాధ్యాయి .వారి కుమారుల అజమాయిషీ వచ్చేసరికి వ్యవసాయాన్ని కౌలుకు ఇచ్చి పంట తీసుకొనే వారు .మంత్రాల రాధాకృష్ణ మూర్తి ,ఆయన మామ గారు ఉయ్యూరులో మొదటి ఎరువుల డిపో పెట్టిన యడవల్లి శ్రీరామ మూర్తిగారు శ్రీమంతులే. గొప్ప వ్యవసాయదారులే .వారూ తర్వాత వ్యవసాయాన్ని వదిలేశారు .ఉయ్యూరులో గోవిందరాజు శ్రీరామ మూర్తిగారు ఆయన తమ్ముడు  , నా సహాధ్యాయి అబ్బి అనే పరబ్రహ్మానంద శర్మ లకు గరుగు దగ్గర మెత్త భూమి ఉంది. చెరుకు ,పసుపు కంద మొదలైనవి బాగా పండించేవారు గొప్ప ఫలసాయాన్ని తీసేవారు .మెట్ట వ్యవసాయం లో బాగా లాభ పడ్డారు .వీరందరికీ మించి వ్యవసాయం ఇప్పటికీ చేస్తున్నవారు గరుగు మీద సోమయాజుల కృష్ణ మూర్తి గారి కుటుంబం .కృష్ణ మూర్తిగారు చెరుకు ,మొదలైన  మెట్ట పంటలు బాగా పండించేవారు .పాలేళ్ళు ,బండీ ఎడ్లు ఉన్నాయి  దున్నటం దగ్గరనుండి అన్ని పనులు చేయగల వారు .ఫాక్టరీ కి చేరుకును వారే స్వయం గా తోలే వారు .ఆయన తర్వాత అబ్బాయిలు కూడా ఇప్పటికి శ్రద్ధగా వ్యవసాయం చేస్తూనే ఉన్నారు .అలాగే మా అమామయ్య గారి అబ్బాయి చేస్తూనే ఉన్నాడు .

మా నాన్న గారి కాలం లోను నా టైం లోను మేము గట్టు మీద కూర్చునే వ్యవసాయం చేయించాం .కనుక మాది ‘’బ్రాహ్మణ వ్యవసాయం ‘’అనచ్చు .కాని వ్యవసాయం కోసం ఎప్పుడూ అప్పులు చేయకుండా గడుపుకోచ్చాం .మంచి నిఖామానులైన సీతారామయ్య కాటూరు పొలానికి ,చిన్నబ్బాయి ఉయ్యూరు పొలానికి ఉండి మాకు ఏ ఇబ్బందీ లేకుండా చేశారు ..నేను తప్పకుండా పొలం లో జరిగే అన్ని ముఖ్యమైన పనులు దగ్గరుండే చేయిన్చేవాడిని .కనుక వ్యవ సాయం లో ఎప్పుడూ నష్టం రాలేదు .జాయింటు కౌలుకూ కొంతకాలం చేశాము .పూర్తిగా వాళ్ళ మీద వదిలీ చేశాను .ఎందులోనూ ఇబ్బంది రాలేదు వ్యవసాయం కోసం ఎకరాలు అమ్మక పోవటమే నేను చేసిన మంచిపని అనుకుంటాను .అంతకు మించి ఏమీ లేదు .ఈ వ్యవసాయమే మా కుటుంబానికి ఏడు గడ గా నిల బడింది .దాని వల్లనే అందరం హాయిగా ఉన్నాం .మా తమ్ముడి భాగం అతనికిచ్చి ,ఫలసాయం కూడా అతను అమ్ముకొనే దాకా ప్రతి ఏడాది అప్పగించేవాడిని .మా అన్నయ్య గారి అబ్బాయి రామనాధ బాబు కు కాటూ రులో నాతో పాటు పొలం ఇప్పటికీ ఉంది .పంటలు రాగానే ఫలసాయం అందిస్తాను  .కనుక బ్రాహ్మణ వ్యవసాయమే అని పించినా నేను చేసింది నష్ట వ్యవసాయం కాదు లాభం తోనే చేశాను .దానికి కారణం నమ్మకస్తులైన నిఘా మానులే అని నిక్కచ్చిగా చెప్పగలను .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -.12-7-14-ఉయ్యూరు

 

 

 

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

వ్యాస జయంతి గా గురు పూజ

 

వ్యాస జయంతి గా గురు పూజ

వ్యాస భగవానుడని బాదరాయణుడని ప్రసిద్ధి చెందిన వ్యాస మహర్షి జన్మదినం ఆషాఢపౌర్ణమి .పద్దెనిమిది పురాణాలను బ్రహ్మ సూత్రాలను రాసి భారతీయ సాహిత్యం లో హిమాలయోన్నతుడైనాడు వ్యాసుడు .వేదం విభజన చేసి అందుబాటులోకి తెచ్చిన లోకజ్నుడాయన .కృష్ణ ద్వైపాయన బిరుదాంకితుడు .యమునా నదీ తీరం లో జన్మించిన వ్యాసుడు మహా భారతంరాయటమే కాక  అందులో లో ముఖ్య పాత్ర దారికూడా .విష్ణు మూర్తి అవతారమే వ్యాసభగవానుడు .సత్యవతీ దాశరాజుల కుమారుడు .సేతి,మాది నదుల సంగమ స్థానం లో జన్మించాడని కూడా అంటారు .ఈ ప్రదేశానికి ఆయన పేరే పెట్టారు .ప్రస్తుతం నేపాల్ లో తనాహు జిల్లాలోని తనౌళి పట్నం లో వ్యాసుడు జన్మించినట్లు భావిస్తారు . .విచిత్ర వీర్యుడు వ్యాసుడి కుమారుడు .విచిత్ర వీర్యుని కుమారులే పాండురాజు ,ద్రుత రాస్త్రుడు .విదురుడు వీరిద్దరికీ సోదరుడు .

Inline image 1

 

ప్రతి ద్వాపర యుగం లోను వ్యాసుడు జన్మించి వేద విభజన చేస్తాడని విష్ణు పురాణం చెబుతోంది .మహా భారత రచనకు రాయసకారుడిగా గణపతిని పెట్టుకొన్నాడు .తన ఘంటానికి ఆప కుండా పని చెప్పితేనే రాస్తానని షరతుపెట్టి రాశాడు .భారతానికి జయ అనే పేరుంది .ఇందులో విష్ణు సహస్రనామం భగవద్ గీతా ఉన్నాయని మనకు తెలుసు .వ్యాసుని చివరి రచనే మహా భారతం .భారతాన్ని ఉగ్ర సేన సౌతి మౌఖికం గా వ్యాపింప జేశాడు .నైమిశారణ్యం లో శౌనకుడనే కులపతి  ,ఆయన  శిష్యులైన మహర్షుల సమక్షం లో దీన్ని వినిపించాడు .

వ్యాసుడు బౌద్ధ వాజ్మయం లోను చోటు చేసుకొన్నాడు . పాళీ భాషలో’’ కన్హ దిపాయన’’ అన్నారు .జాతక కధల్లో బాగా కనిపిస్తాడు .సిక్కుల మత గ్రంధం గురు గ్రంధ సాహెబ్ లోవ్యాసుడు బ్రహ్మ దేవుని కుమారుడు అని ఉంది .గురు గోవింద సింగ్ వ్యాసుడిని వేద నిధి అన్నాడు ,కౌటిల్యుడు రాసిన అర్ధ శాస్త్రం లో వ్యాసుని విషయం తమాషాగా ఉంటుంది . దాండక్య అనే పేరున్న భోజుడనే రాజు ఒక బ్రాహ్మణ స్త్రీని  బలాత్కరించ బోతే రాజ్యం వంశం పూర్తిగా నాశమై పోయాయి .వాతాపి అనే వాడు అహంకారం తో అగస్త్యుని అవమా  నించి నప్పుడు ద్వైపాయనుడిని పైకి వెళ్ళినప్పుడు  నశించి పోయారని చాణక్యుడు వివరించాడు .ఈ కదా బౌద్ధ జాతక కధల్లో వృష్ణి కధను పోలి ఉంటుంది .

వ్యాసుడు బదరీ అంటే రేగు చెట్ల వనం లో జన్మించాడుకనుక బాదరాయణుడు అయ్యాడనే కధనం ఒకటి ఉంది .ఈయనే బ్రహ్మ సూత్రాలు రాసి వేద వేదాంత విశేషాలను అందులో నిక్షిప్తం చేశాడు .బ్రహ్మ సూత్రాలు భగవద్ గీత ఉపనిషత్తులను ప్రస్తాన త్రయం అంటారు .ఈ మూడిటికీ కర్త వ్యాసుడే .పతంజలి యోగ శాస్త్రానికి ఆధారం వ్యాసమహర్షి చెప్పిన సూత్రాలే అని అంటారు .ఇంత విశిష్ట వ్యక్తీ భగవాన్ వేదం వ్యాస మహర్షి జన్మ దినం ఈ రోజు .ఒక్క సారి స్మరించి తరిద్దాం .ఆయన పెట్టిన అక్షర భిక్ష అన్నపూర్ణ గా వెలుగుతోంది .మహర్షి వ్యాసునికి మనః పూర్వకం గా సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పిద్దాం .

వ్యాసపౌర్ణమి –గురు పౌర్ణమి –వ్యాస జయంతి శుభా కాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -12-7-14-ఉయ్యూరు

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

నా దారి తీరు -74 షుగర్ ఫాక్టరీలో చెల్లింపులు

నా దారి తీరు -74

షుగర్ ఫాక్టరీలో చెల్లింపులు

చెరుకు ను ఫాక్టరీ కి తోలిన తర్వాత ,లేక అవసరం అయితే కొంత తోలిన తర్వాత మనం తోలిన చెరుకు తాలూకు ఫాక్టరీ వాళ్ళు నమోదు చేసిన చెరుకు తూకం ఉన్న టికెట్లు ఇస్తారు .వాటిని తేదీ క్రమం లో అమర్చి మొత్తం  మనం ఇచ్చిన టికెట్ల నంబర్ చివరి టికెట్ వెనకాల వేసి ,పాస్ బుక్ లో పెట్టి ,వోచర్ మీద రెవిన్యు స్టాంప్ అంటించి దానిమీద సంతకం పెట్టి ,సాక్షి సంతకం కూడా తెలిసిన రైతు తో చేయించి ఆయన రైతు నంబర్ ను కూడా నమోదు చేయించి ,ఫాక్టరీ లో దీన్నీ చూసే గుమాస్తాకు ఇవ్వాలి .దానికి పెద్ద క్యూ ఉంటుంది .అందులో నిలబడి మన వంతు వచ్చిందాకా ఉండి ఇవ్వాలి. దానిపైన వాళ్ళు ఫలానా రోజుకు ఇస్తామని చెప్పి వాయిదా వేసి ,రాస్తారు .అప్పుడు వెళ్లి తీసుకోవాలి .మా నాన్న గారి చనిపోయిన 1961నుండి నాకు దీని అనుభవం ఉంది .అప్పుడు అంతా మాన్యు వల్ వర్క్ .కనుక తోలిన   చెరకుకు  దానికి తగిన టికెట్లు వచ్చాయో లేదో వాళ్ళు తనిఖీ చేసి ఫాక్టరీ,నుంచి ఏదైనా ధన రూపం లో లేక ఎరువుల రూపం లో లబ్దిపొందారా లేదా అని చెక్ చేసి  లేడ్జేర్లు, ఫైళ్లు తిరగేసి ఒకటికి రెండు సార్లు కౌంటర్ చెక్ చేసుకొని  ముందు ఆ డబ్బు మినహాయించి మిగిలినదాంట్లో దాదాపు ఎనభై శాతం డబ్బు ఇచ్చేవాళ్ళు .వాయిదా వేసిన రోజుకు ,సమయానికీ మళ్ళీ వెళ్ళాలి .అప్పుడూ మనలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారుకనుక మళ్ళీ క్యూ ఆ క్యూ అంతా అవటానికి చాలా సమయం పట్టేది .మన వంతు రాగానే యెంత డబ్బు వచ్చేదీ చెప్పి ,మెయిన్ ఆఫీస్ లో ఉన్న కాష్ కౌంటర్ దగ్గరకు పంపిస్తారు .అక్కడా లైన్ ఉంటుంది .డబ్బు ఇచ్చె ఆయ న మన మొహం చూసి మనమే ఆ వోచర్ మీద సంతకం పెట్టామని తేల్చుకొని ,ఆ వోచర్ మనకిచ్చి ,దాని వెనక మళ్ళీ సంతకం చేయించి మన వూరి వారెవరైనా అక్కడ ఉంటె వారి తో సాక్షి సంతకాలు రెండు చేయించి వాళ్ళ రైతు నంబర్లు నాట్ చేయించి  ఆయన కిస్తే అప్పుడు డబ్బు ఇస్తాడు .అప్పుడు బాంకులు లావా దేవీలు లేవు .అంతా స్వయం గా వెళ్లి తెచ్చుకోవాల్సిందే .డబ్బు ఇచ్చే ముందు అక్కడే కూర్చున్న మేనేజర్ చెక్ చేస్తాడు తోలిన  చెరకుకు  ఉన్న రేటు ప్రకారం సరిగ్గా లెక్క వేశారా లేదా చూస్తాడు .

1960-70కాలం లో టికెట్లు తీసుకొనే కౌంటర్ లో అంజయ్య గారు అనే ఆయన ఉండేవాడు ఆయనది గోపువాని పురం అని జ్ఞాపకం .పంచె కట్టి కొంచెం లావు కళ్ళద్దాలతో ఉండేవాడు .జోడు ముక్కు మీదికి జారుతూ ఉండేది సకిల్ మీద వచ్చేవాడు కమ్మ వారు .చాలా మంచి వాడు .లెక్కల్లో దిట్ట .అచ్చం మన అల్లు రామ లింగయ్య లా గా ఉండేవాడు  నేను అన్నా, మా నాన్న గారన్నా చాలా అభిమానం గా ఉండేవాడు ..నాకు తక్కువ రోజుల్లో వాయిదా పడేట్లు చేసేవాడు .ఆమ్యామ్యాలు ఆయనకు తెలియవు .పరిచయమే .ముక్కు సూటి మనిషి అందరికి ఆయన అంటే గౌరవం విసుగు ఉండేదికాదు .ఆ పెద్ద పెద్ద  లేద్జేర్ల పుస్తకాల మధ్య ఆయన  ఒక లిలీ పుట్ లా కని పించేవాడు .చాలా నెమ్మదిగా మాట్లాడేవాడు ఆయన అంటే నాకు విపరీతమైన అభిమానం .అందుకే మరీ గుర్తుంచుకొని ఆయన గురించి రాస్తున్నాను .ఇలా చాలా సంవత్సరాలు నడిచింది .

ఆ తర్వాతా బ్యాంకులు రైతులకు అప్పులివ్వ టానికి ముందుకొచ్చాయి .వాటిల్లో డబ్బు లేని రైతులే కాదు అందరూ అప్పు తీసుకొనే వారు కొంచెం వడ్డీ తక్కువ .యెంత డబ్బు అప్పు తీసుకోన్నామో  బ్యాంకి వాళ్ళు తెలియ జేసేవారు .అగ్రిమెంట్ లో బ్యాంక్  కాగితాలు కూడా చేర్చేవారు .బ్యాంకి అప్పు ,వడ్డీ పోను మిగిలిందే ఫాక్టరీలో చెల్లించే వారు .పనులు కొంత తేలికయ్యాయి .కాష్ ఇచ్చే ఆఫీసులో కలువ పాములకు చెందిన భాస్కర రావు గారు అనే ఆయన ఉండేవాడు .ఎర్రగా పాంట్ షార్ట్ తో ఉండేవాడు .మా బజారు లోనే టాంక్ దగ్గర అద్దేకుండేవాడు,. వాళ్ళబ్బాయి నాదగ్గర ట్యూషన్ కూడా చదివే వాడు .చాలా స్పీడ్ మనిషి .కౌంటర్ చెక్ చేయటానికి ఆయన భలే తమాషాగా స్పీడ్ గా చేసి సంతకం పెట్టె వాడు .నాకు బాగా పరిచయం కనుక ఆ విధానానం నచ్చి అడిగితే చెప్పాడు .పైసా కూడా తేడా  వచ్చేదికాదు. ఇప్పుడది మర్చిపోయాను .తోలిన టన్ను లను టన్నుకు రేట్ తో హెచ్చించి యెంత మొత్తం డబ్బు వస్తుందో చెక్ చేయటం అన్నమాట .గుమాస్తాలు ఓచర్ మీద అవన్నీ వేసి రాసి లేద్జేర్ లో పోస్టింగ్ వేసి ఈయన కు పంపిస్తే అప్పుడు కౌంటర్ చెక్ చేసి డబ్బు ఇవ్వమని సంతకం పెడితే కౌంటర్ లో డబ్బు ఇచ్చేవారు. భాస్కర రావు గారు గలగలా మాట్లాడేవాడు. రాత్రి పూట మా ‘’పార్ధి గారి పార్ల మెంట్ ‘’కు వచ్చి మాతో కూర్చునే వాడు .కమ్మ వారు .మర్యాదున్న పెద్దమనిషి .

వెలగ పూడి రామ కృష్ణ గారి ఇద్దరబ్బాయిలు దత్తు గారు మారుతీ రావు ఇద్దరూ కొంతకాలం ఉయ్యూరు షుగర్  ఫాక్టరీ రీని మేనేజ్ చేశారు .తర్వాత వాటాలు పంచుకొన్నారు వి.ఏం.రావు అనే మారుతీ రావు గారికి ఉయ్యూరు ,చల్ల పల్లి ఫాక్టరీలు వచ్చాయి. దత్తు గారికి మాచెర్ల సిమెంట్ ఫాక్టరీ మద్రాస్ లోని సెంట్రల్  వర్క్ షాప్  వచ్చాయి .దత్తు గారి  కే.సి.పి .పేరు వచ్చింది. రావు గారు కెసీపి తో పాటు ind cor  పేరొచ్చింది .రెండిట్లోనూ నాకు షెర్లున్నాయి .రావు గారు గొప్ప మెకానిక్ .ఫాక్టరీ లో ఏ భాగం లో ఏముందో ఆయనకు  క్షుణ్ణం గా తెలుసు అనుకొనే వారు. ఎక్కడైనా రిపేర్ వస్తే స్పాట్ లోకి వెళ్లి రెండు మూడు నిమిషాలలో దాన్ని  రెక్టిఫై చేసేవారని చెప్పుకొంటారు . మేషిన్రి మీద అంత అవాగాహన ఉన్న వారు .అయన చేతిలోకి ఫాక్టరీ వచ్చిన తర్వాత ఫాక్టరీ సామర్ధ్యాన్ని పెంచారు .పూర్వం కన్నా రెట్టింపు సామర్ధ్యం తో రెట్టింపు చెరుకు ఆడే యంత్రాలను తెప్పించి బిగించారు . కనుక క్రషింగ్ కెపాసిటి పెరిగింది .రైతులకు సబ్సిడీలు బోనస్ లు బాగా ఇచ్చారు .క్షుణ్ణంగా మేనేజ్ మెంట్ అవగాహన ఉన్న వాడు కనుక మెషీన్ పవర్ పెంచి మాన్ పవర్ తగ్గించటం ప్రారంభించారు .రైతులు తాము తోలిన చెరకు డబ్బు కోసం ఫాక్టరీ చుట్టూ తిరిగే పద్ధతికి స్వస్తి చెప్పారు .ప్రతి రైతు తో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించి డబ్బు వారి అకౌంట్ లో సరాసరి పడేట్లు చేసి ఎంతో రిస్క్ నుంచి రైతుల్ని కాపాడారు మారుతీ రావు .అగ్రిమెంట్ ఇవ్వటమే రైతుపని మిగిలిన లావాదేవీలన్నీ బ్యాంక్ ద్వారానే .

రైతు తోలిన చేరుక్కు టన్నుకు ఇంత అని కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బు ఇస్తుంది .దానికీ వాయిదాల మీద వాయిదాలు పడేవి .ఖాళీ గా ఉన్న వారికైతే ఫరవాలేదు .ఉద్యోగస్తులకు, ఆడ వాళ్లకు మహా ఇబ్బందిగా ఉండేది.ఒకోసారి సెలవు పెట్టాల్సి వచ్చేది . ఆ నరకం  నుండి కాపాడిన వాడు రావు గారే .ఇప్పుడు ఏంతో హాయిగా ఉంది .యెంత డబ్బు వచ్చినా బ్యాంక్ అకౌంట్ లో పడిపోతుంది .కావాల్సినప్పుడు తీసుకోవటమే .ఇంత గొప్ప సంస్కరణ తెచ్చిన వ్యక్తీ మారుతీరావు .ఫాక్టరీకి ‘’ప్లాంట్ మేనేజర్’’ ఉన్నతాధికారి .దాన్ని తర్వాత  ‘’జెనరల్ మేనేజర్’’ అన్నారు . నాకు తెలిసినప్పటి నుంచి సీతా రామా రావు గారు ఇంజేటి జగన్నాధ రావు గారు ,బసవయ్య గారు ఇలా చాలా మంది పని చేశారు .ఇప్పుడు ఆ పోస్ట్ ను ‘’చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ‘’గా పిలుస్తున్నారు .ఇప్పటి ఆ ఆఫీసర్ శ్రీ జి వెంకటేశ్వర రావు .ఉయ్యూరు ,చల్లపల్లి ఫాక్టరీలు రెండిటికీ కలిపి ఈయనే సి ఇ ఒ.

జగన్నాధ రావు గారు ప్లాంట్ మేనేజర్ గా  ఉన్నప్పుడు మంచి ప్రజా సంబంధాలు కలిగి ఉండేవారు .ఉన్నతమైన ఉదాత్త వ్యక్తీ .ఎత్తుగా  ఎర్రగా కళ్ళద్దాలతో తెల్ల పాంటు షార్ట్ లతో చూస్తూ ఉంటేనే గౌరవం కలిగేది అందరి తో సత్సంబంధాలు నేరపే వారు  . ఎన్నో అభి వృద్ధి కార్యక్రమాలు నిర్వ హించారు .ఫాక్టరీ ఎదురుగా సాయి బాబా ఆలయం ,కార్మిక భవనం కెసీపి స్కూల్ లో బిల్డింగ్ ల నిర్మాణం చుట్టూ ప్రక్క గ్రామాలకు పక్కా రోడ్లు వంతెనలు ,బస్ షెల్టర్లు ఆయనతోనే ప్రారంభమైనాయి .అనేక దేవాలయాల అభి వృద్ధికి తోడ్పడ్డారు .మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయానికి అయిదు వేల రూపాయలు విరాళం ఇవ్వటమే కాదు మేము కోరిన వెంటనే వచ్చి మాతో బాటు స్వామి వారల ప్రతిష్ట ను చేశారు .ఆయన భార్య శ్రీమతి వసుమతి దేవి రామ కృష్ణ మహిళా సమాజం ఏర్పరచి మహిళలకు చేతిపని ,కుట్టుపని మొదలైన వాటిల్లో శిక్షణ నిప్పించి మహిళాభ్యుదయానికి పాటు పడ్డారు. ఆ దంపతులను చూడగానే ఆది దంపతుల్లా అని పించే వారు .రైతులకే కాదు కార్మికులకూ అండగా ఉండేవారు .ఉయ్యూరు చుట్టూ ప్రక్క గ్రామాల హైస్కూళ్లలో భావన నిర్మాణాలు రక్షిత మంచి నీటి సరఫరా ,టిఫిన్ షెడ్ ,సైకిల్ షెడ్ వంటివి ఎన్నో ఆయన పాలన లో  రికార్డ్  బ్రేక్ గా నిలిచాయి .ఉయ్యూరు శివాలయం లో దక్షిణాన ఉన్న  రేకుల షెడ్ నిర్మాణం మా వార్డ్ మెంబర్ కోలచల చలపతి ,గోవింద రాజు శ్రీరామ మూర్తి గారు వంటి పెద్దల సహకారం తో ఫాక్టరీ వారి సాయం తో జరిగిన బృహత్తర కార్య క్రమం. వృద్ధాశ్రమం, కంటి ఆస్పత్రి ,రోటరీ క్లబ్ ఏర్పాటు దాని ద్వారా ప్రజా సేవ ప్లాంట్ మేనేజర్ శ్రీ ఇంజేటి జగన్నాధ రావు గారి చొరవ కృషి ,అవగాహన వల్లనే సాధ్యమైనాయి .కార్మికులు సమ్మే చేయకుండా వారి అన్ని కోర్కెలను ఫాక్టరీ తీర్చేట్లు మేనేజ్ మెంట్ తో చర్చలు జరిపి చొరవ తీసుకొనే వారు .ఆయన  అంటే  మేనేజి మెంట్ కు కూడా అంత గౌరవం . ఫాక్టరీ సంక్షేమం కోసం నెల రోజులు యజ్ఞం చేయించారు .రోజూ సాయంకాలం ప్రవచన సామ్రాట్ శ్రీ మల్లాది చంద్ర శేఖర శాస్త్రి గారి వంటి పెద్దల నాహ్వానించి వేదం శాస్త్రాల పై ప్రసంగాలు చేయించారు .సాయి బాబా ఆలయ నిర్మాణానికి మద్రాస్ నుంచి స్వామి కేశవయ్య గారిని ఆహ్వానించి ఆయనతో సాయి బాబా చిత్రపటాన్ని ఆవిష్కరింప జేశారు .ప్రతి ఏటా శ్రీ రామ నవమి జరిపి,సీతా రామ కల్యాణం చేసేవారు .ఫాక్టరీ ఉద్యోగస్తులతో నాటకాలు వేయించేవారు .వేదాంతం సత్యనారాయణ  శోభానాయుడు లాంటి కళా కారులను పిలిపించి ప్రదర్స్ధనలు ఏర్పాటు చేసి కళలకు ప్రోత్సాహం కల్పించారు .పౌరాణిక నాటకాలు,ఓలేటి వెంకటేశ్వర్లు మల్లాది సూరి బాబు , వంటి సంగీత కళా నిదులచే పాట కచేరీ జరిపించారు .

కార్మిక నాయకుడు చొప్పరపు సుబ్బారావు  గారు ఫాక్టరికి కార్మికులకు మధ్య ఏ సమస్యలు లేకుండా చేసి చనిపోయే వరకు నాయకత్వాన్ని వహించారు ప్రస్తుతం వారి అబ్బాయి శ్రీ కొండలు పలాగే ప్రజా సంబంధాలను కలిగి ఫాక్టరీలో పని చేస్తూ అందరికి తలలో నాలుక లాగా ఉన్నారు .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -11-7-14-ఉయ్యూరు

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

మాస్కోలో ఓ అమెరికన్ సైంటిస్ట్

యుఎస్ఎస్ఆర్ జ్ఞాపకాలు
 

ఆంగ్ల మూలం: మెల్విన్ బి. నథాన్సన్:

 

ఇ మొ గెల్ఫాండ్‌కి అంకితం – (ఆయన శతజయంతికి)
(ఆంగ్ల మూలానికి తెనుగు అనువాదం : వాసుదేవరావు ఎరికలపూడి)’
టీసెస్ ఆఫ్ అమెరికన్ మాథమాటికల్ సొసైటీ’ ఫిబ్రవరి, 2014 సంచిక నుండి.
అనువాదకుని ముందుమాట:
ఈ వ్యాస రచయిత ప్రొఫెసర్ మెల్విన్ బి నథాన్సన్ అమెరికా సంయుక్త రాష్ట్రాల లోని సిటీ యూనివర్సిటీ అఫ్ న్యూయార్క్‌కు చెందిన లెహ్మన్ కాలేజ్ అండ్ గ్రాడ్యుయేట్ సెంటర్‌లో గణితాచార్యుడు. ప్రొఫెసర్ నథాన్సన్, సోవియట్ యునియన్ కొనసాగుతున్న రోజుల్లో కొంతకాలం మాస్కో నగరంలోని స్టేట్ యూనివర్సిటీ అఫ్ మాస్కోలో ప్రసిద్ధ గణితాచార్యుడు ప్రొఫెసర్ గెల్ఫాండ్ దగ్గర విద్యార్థిగా ఉన్నారు. ప్రొఫెసర్ గెల్ఫాండ్ శతజయంతికి రాసిన వ్యాసంగా ఈ రచన ‘నోటీసెస్ అఫ్ అమెరికన్ మాథమాటికల్ సొసైటీ’ ఫిబ్రవరి 2014 సంచికలో వచ్చింది. ఇంటర్నెట్‌లో సోవియట్ నాళ్ళల్లో వివిధ రంగాల్లోని శాస్త్రజ్ఞుల స్థితి గతుల గురించీ, వారి పరిశోధనల గురించీ ఎన్నో వ్యాసాలూ, ఎంతో సమాచారమూ దొరుకుతాయి. కానీ, ఈ అనువాదకుని చూపుకి ఈ వ్యాసం క్లుప్తంగానూ, సూటిగానూ, సరళంగానూ ఉన్నట్టుగా అనిపించి తెలుగు పాఠకులకు అనువదించి అందజేయాలనిపింపజేసింది. 

సోవియట్ రష్యా గతించి చాలా కాలమయింది. సోవియట్ యూనియన్ బతికున్న రోజుల్లో అక్కడ ఒక నియంతృత్వం స్వైరవిహారం చేసింది. సోవియట్ యూనియన్ లోనూ  తూర్పు ఐరోపాలోని సోవియట్ కబంధ హస్తాల్లో ఇరుక్కున్న కమ్యూనిస్ట్ దేశాల్లోనూ ఆ రోజుల్లో ఏమి జరుగుతోంది అన్నది బయట ప్రపంచానికి ముఖ్యంగా పాశ్చాత్య దేశాలకు తెలియనిచ్చేవారు కారు. అప్పటి ఆ పరిస్ఠితిని (మొదటగా చర్చిల్) ‘ఇనుపతెర’గా అభివర్ణించేవారు.

ఎన్నో విధాలుగా శక్తివంతమైన అమెరికాకు సైతం సోవియట్ యూనియన్‌లో ఏమి జరుగుతున్నదో ఇతమిత్థంగా తెలిసేది కాదు. రష్యాలో అంతరిక్ష పరిశోధన ఏ దిశగా నడుస్తోందో తెలుసుకోవటానికి అమెరికన్ ప్రభుత్వం కొట్టుకు పోయేది. అయినా అప్పటి రాజకీయ పరిస్థితులతో మనలో కొంతమందికైనా కొద్దోగొప్పో పరిచయం ఉంది, కానీ ఉన్నతవిద్యా, పరిశోధనా ఆనాటి రష్యాలో ఎలా సాగాయో మనలో చాలామందికి ఏమాత్రమూ తెలియదనే చెప్పాలి. 

ఇతర శాస్త్రాల విషయం ఎట్లా ఉన్నా గణిత శాస్త్రానికి ఒక ప్రత్యేకత ఉన్నది. గణితశాస్త్ర అధ్యయనం ఒక ఊహాలోక విహరణం. ఈ కారణంగా సాధారణంగా గణిత శాస్త్రజ్ఞులు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటారు. అలాగే బాహ్య ప్రపంచం గూడా వీళ్ళను దూరంగా ఉంచుతుంది. అంటే రాజకీయ ఒత్తిళ్ళు గణితశాస్త్ర పరిశోధనల మీద ఉండే అవకాశం చాలా తక్కువ. అయినప్పటికీ ఆనాటి సోవియట్ గణిత శాస్త్ర వేత్తల మీద కూడా రాజకీయం తన భయానక ఆధిపత్యాన్ని చెలాయించింది. వాళ్లు నియంతృత్వ పిశాచపు కోరల్లోనే తమ ఊపిరులు పీల్చుకున్నారు.

ఇతర శాస్త్ర అధ్యయనాలతో పోలిస్తే గణిత శాస్త్ర పఠన పాఠనాలు తమ జీవికకు కనీసావసరాలు కూడా సమకూర్చలేనివని అనుభవమైనా ఆ భయంకరమైన వాతావరణం లోనే కేవలం గణిత శాస్త్రాధ్యయనం ప్రసాదించే అలౌకిక ఆనందం మీది ప్రీతితొ మాత్రమే వాళ్ళు అక్షరాలా అహర్నిశలూ  శ్రమించి పరమోత్కృష్టమైన మేథో నైశిత్యంతో తమ శాస్త్రాధ్యయనాన్ని కొనసాగించారనీ, శాస్త్ర పరిథుల్ని అబ్బుర పరచే రీతిలో విస్తరింప చేశారనీ ఈ వ్యాసం చెబుతుంది. తెలుగు నాట నేటి మన వైజ్ఞానికులకూ, ఉన్నత విద్యాలయాలలోని ఉపాధ్యాయులకూ ఈ విషయాన్ని ఏమాత్రమైనా ఈ అనువాదం అందజేయగలిగితే అదే పదివేలు.

 

వాసుదేవ రావు ఎరికలపూడి 

*******************

 

ఒక అమెరికన్ మాథమాటిషియన్ (లేదా)

నేను సోవియట్ యూనియన్‌ని ఎలా ధ్వంసం చేశాను?
విశిష్ట సోవియట్ గణితశాస్త్ర వేత్త ఇస్రేల్ మొయిసీవిచ్ గెల్ఫాండ్ సెప్టెంబర్ 2, 1913 న యుక్రెయిన్ లోని ఒడెస దగ్గరి ఓక్నీ (తరువాత కాలం లో క్రాస్ని ఓక్నీ లేదా ఎర్ర ఒక్నీ )లో జన్మించి న్యూ జెర్సీ లోని న్యూ బ్రన్ స్విక్‌లో అక్టోబర్ ఐదు, 2009లో దివంగతుడయాడు. 1917 రష్యా విప్లవాలు యూనియన్ అఫ్ సోవియట్ సోషలిష్ట్ రిపబ్లిక్ (యుఎస్ఎస్ఆర్) ని డిసెంబర్ 29, 1922 న నిర్మించుకోవటానికి జరిగిన ఒప్పందాన్ని ఖరారు చేశాయి. సోవియట్ యూనియన్ డిసెంబర్ 26, 1991 తన ఉనికిని చాలించింది. గెల్ఫాండ్ సోవియట్ యూనియన్ కన్నా ముందు పుట్టి అది శిధిలమైన తరువాత కూడా బతికాడు. 

ఆయనతో నా పరిచయం పరోక్షంగా జరిగింది. 1970 లెంట్, ఈస్టర్ సెమెస్టర్‌లలో నేను కేంబ్రిడ్జ్ యునివర్సిటీ ప్యూర్ మాథమాటిక్స్ అండ్ మాథమాటికల్ స్టాటిస్టిక్స్ డిపార్ట్ మెంట్‌లో సందర్శక పరిశోధనా విద్యార్థిగా ఉన్నాను. ఆ రోజుల్లో బేల బల్లొబాస్ నా స్నేహితులలో ఒకడు. బేల హంగేరియన్. ఆక్స్ ఫర్డ్ నుంచి పిహెచ్. డి తెచ్చుకున్న బేల ఇంగ్లండ్ లోనే ఉండి పోవాలని నిశ్చయించుకున్నాడు. మరిక హంగరీకి తిరిగి వెళ్ళకూడదని గూడా నిర్ణయిం చుకున్నాడు. కోల్డ్ వార్ పరిభాషలో బేల హుంగరీని విడిచి పలాయనం చిత్తగించి ప్రతిపక్షులు, పెట్టుబడి దారుల పంచనజేరాడు. పాశ్చాత్య దేశాలలో చదువుకోటానికి వెళ్ళే ముందు ప్రాచ్య దేశం, అంటే యుయస్‌యస్ఆర్‌లో చదవాలని హంగరీ వాళ్ళు బేలకి షరతు పెట్టారు. దాంతో బేల ఒక సంవత్సరం మాస్కో స్టేట్ యునివర్సిటీలో గడిపాడు. అక్కడ బేల గెల్ఫాండ్ దగ్గర చదువు కున్నాడు. వ్యక్తిగతం గానూ, గణితశాస్త్ర వేత్త గానూ ప్రొఫెసర్ గెల్ఫాండ్ బేలను గాఢంగా ప్రభావితం చేశాడు. గెల్ఫాండ్ ఎలా అసాధారణమైన వాడో –  ఆయన వైశిష్ట్యం గురించి –  బేల నాకు తరచూ చెపుతుండేవాడు. 

కేంబ్రిడ్జ్‌లో నా చదువు ముగిసిన 1970 వేసవిలో నేను సోవియట్ యూనియన్‌కి చిన్న ట్రిప్‌గా వెళ్లాను. జీవశాస్త్రంలో డాక్టరేట్ తర్వాతి పరిశోధనకి మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ నుంచి వచ్చి కేంబ్రిడ్జ్‌లో ఒక సంవత్సరం గడిపిన మరొక అమెరికన్ బులెటిన్ బోర్డ్ మీద తను యుఎస్‌ఎస్ఆర్‌లో డ్రైవింగ్ చేస్తూ తిరగాలను కుంటున్నాననీ తోడుగా ఎవరైనా వస్తారేమోనని చూస్తున్నాననీ ఒక నోట్ పెట్టాడు. హెల్సింకి నుంచి  ట్రైన్‌లో ప్రయాణం చేసి సోవియట్ యునియన్ లోకి లెనిన్ గ్రాడ్‌లో  అడుగుపెట్టి, కారు అద్దెకు తీసుకుని దక్షిణంగా మాస్కో మీదుగా కాకేషస్ దాకా డ్రైవ్ చేసుకుంటూ పోవటం అతని ప్రణాళిక. 

సోవియట్ అకాడమీ అఫ్ సైన్సెస్ నుంచి ఈ అమెరికన్ జీవశాస్త్రజ్ఞుడికి అతిథిగా ఉపన్యసించ వలసిందని ఆహ్వానం వచ్చింది. అక్కడ ఇతనికి ఆతిధ్యమిచ్చే సాధికార బాధ్యత బయో కెమిస్ట్రీలో ఎన్నదగిన సోవియట్ విజ్ఞానవేత్త డేవిడ్ గోల్డ్ ఫార్బ్ ది. నేను కూడా గోల్డ్ ఫార్బ్‌ని కలుసుకున్నాను. ఆయనతో నాకు గెల్ఫాండ్‌ని కలుసుకోవాల నున్నదని చెప్పాను. గోల్డ్ ఫార్బ్, గెల్ఫాండ్‌ని కాంటాక్ట్ చేశాడు. గెల్ఫాండ్ బాగా బిజీగా నైనా ఉండి ఉండాలి లేదా పూర్వ పరిచయం లేని ఒక అమెరికన్‌తో సమావేశమవటం విజ్ఞత కాదనైనా అనుకుని ఉండాలి. నాకు నంబర్ థియరీలో ఆసక్తి ఉందని గోల్డ్ ఫార్బ్ గెల్ఫాండ్‌తో చెప్పినప్పుడు గెల్ఫాండ్ తను యమ్.జె. గ్రెవ్, ఐ.  ఐ. ప్యాటెట్స్కీ- షపీరోలతో కలిసి – జెనరలైజ్డ్ ఫంక్షన్ల మీద రాసిన పుస్తకాల్లో ఆరో భాగం ‘రిప్రసెన్టేషన్ థియరీ అండ్ ఆటోమార్ఫిక్ ఫంక్షన్స్’ అన్న పుస్తకాన్ని నాకిమ్మని చెప్పిగోల్డ్ ఫార్బ్‌కి ఇచ్చాడు. 

క్గోల్డ్ ఫార్బ్‌కి ఒక కాలు లేదు. అతను ఆ కాలిని రెండవ ప్రపంచ యుద్ధ భూమిలో పోగొట్టుకున్నాడు. గోల్డ్ ఫార్బ్ హిస్టారియన్ అవుదామనుకున్నాడు. కానీ నియంతృత్వ పాలనలో వృత్తిగా చరిత్ర చాలా ప్రమాదకరమైనది. స్టాలిన్ రష్యాలో చరిత్ర ప్రత్యేకంగా ప్రాణాంతకమైనది. ఆ కారణంగా గోల్డ్ ఫార్బ్ మెడికల్ స్కూల్‌లో చేరి మాలిక్యులార్ జెనెటిక్స్‌లో రీసెర్చ్ చేశాడు. ‘పొట్ట ఎప్పుడూ  పొట్టే’ అన్నాడతను నాతో. 

నా తోటి పర్యాటకుడైన జీవశాస్త్రవేత్త ప్రబల వామపక్షవాది. [అమెరికన్] విద్యా సంస్థలలో ఉన్న చాలామంది లాగానే నేనూ వియత్నాం యుద్ధ వ్యతిరేకినే. ఐనప్పటికీ అతను నాకు ఎంత ఎడమగా ఉంటాడంటే అతని పక్కన నేను రైటిస్ట్ లాగా కనిపించాను. పైకి ప్రజల దృష్టిలో కమ్యూనిస్ట్ పార్టీ విధానాలకు విధేయులుగా కనపడుతూ  లోలోపల నియంతృత్వానికి తీవ్ర వ్యతిరేకతతో వియత్నాంలో అమెరికా సైన్యాల ప్రవేశాన్ని -ఎంతోమంది అమెరికన్ సైంటిస్టులు నిరసిస్తున్నప్పుడు- సమర్ధిస్తున్న సోవియట్ సైంటిస్టులకు నేను ఇలా రైటిస్ట్‌గా కనపడటం నన్ను వాళ్ళకు తృటిలో దగ్గరి వాణ్ణి చేసింది. కమ్యూనిస్టులను అంతం చేయటమన్న దాంట్లోవాళ్ళకు నమ్మకం ఉంది. ఇది మాస్కోలో నేను ఈ (ప్రచ్చన్న) వైరుధ్యంలో నేర్చుకున్న మొదటి పాఠం. 

కమ్యూనిస్ట్ పార్టీ పదవుల్లో ఉన్న వాళ్ళల్లో చాలామంది వాళ్ల పిల్లలకు  సైన్స్‌కి సంబంధించిన ఉద్యోగాల కోసం పరిచయాలను వాడుకునేవారు. వాళ్లు – నియంతృత్వం లో- తాము సమసిపోకుండా ఉండటానికి చేయవలసినదంతా చేసినవాళ్ళు, రాజకీయాలు ఎంత ప్రమాదకరమైనవో తెలుసుకున్నవాళ్లు. వాళ్ళపిల్లలు – నిర్భయంగా- భద్రత తో బతకాలని కోరుకుంటున్నవాళ్లు. 

సోవియట్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో గానీ, యూనివర్సిటీలలో గానీ, డిగ్రీ చదువుల్లో ఉన్న పిల్లల్లోనూ, పరిశోధనల స్థాయిలో ఉన్న విద్యార్థుల్లోనూ  చాలామంది పార్టీకార్యకలాపాల నిర్వహణలో పై స్థాయిలో ఉన్నవాళ్లతో  సంబంధ బాంధవ్యాలు ఉన్నవాళ్ళే. సైంటిస్టులకు కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధాలుండటమనేది ఎప్పుడూ అది తెచ్చిపెట్టే లాభాలను తెచ్చిపెడుతునే ఉండేది. పార్టీతో సంబంధాలు లేని పెద్ద సైంటిస్టులు వాళ్ళకూ, వాళ్ళ విద్యార్థులకూ నిలవ నీడ కోసం పార్టీతో గట్టి సంబంధాలున్న చాలా చిన్న స్థాయి సైంటిస్టులతో కలిసి పనిచేసేవారు. ‘కలిసి పనిచేయడం’ అంటే పార్టీ సభ్యులుగా ఉన్న అంతంత మాత్రం సైంటిస్టు గాళ్ళకు పరిశోధనల ప్రచురణలలో సహ రచయితల హోదా ఇవ్వటం. ఇటువంటి వైజ్ఞానిక రాజకీయం నియంతృత్వ పాలన లేని చోట్ల కూడా కనపడే విషయమే అనుకోండి. 

నాకు గెల్ఫాండ్ దగ్గర ఒక సంవత్సరం పాటు గణిత శాస్త్ర విషయాలు నేర్చుకుంటూ గడపగలిగే అవకాశం కోసం ప్రయత్నించాలని అనిపించటానికి బేల బొల్లబాసే కారణం. ఇది సాధ్యపడేటట్టు చేయటం అంత తేలికైన విషయం కాదు. కోల్డ్ వార్ రోజుల్లో ఒక అమెరికన్ మాస్కోలో ఏ అధ్యయనమైనా, పరిశోధనైనా చేయటమన్నది దాదాపు అసాధ్యమైన విషయమే. పారిస్‌లోనో, కేంబ్రిడ్జ్ లోనో అయితే చిటికిన వేలిగోటితో ఏర్పాటు చేసుకోగలం. విమానం ఎక్కటం ఫ్రాన్స్‌కో ఇంగ్లాండ్‌కో వెళ్ళటం, అంతే. కానీ ఒక సామాన్య అమెరికన్ సోవియట్ యూనియన్‌లోకి ప్రవేశించాలంటే కొద్దికాలానికి మాత్రమే అనుమతితో ఎంతో డబ్బు కర్చయ్యే పర్యాటకం గానే సాధ్యం. 

అయినప్పటికీ ప్రభుత్వ స్థాయిలో రెండు దేశాల మధ్యా రెండు రకాల ఒప్పందాలున్నాయి. ఇక్కడినుంచి అక్కడకు ఒకళ్ళు వెళ్తే అక్కడనుంచి ఇక్కడకు ఒకళ్ళు వచ్చే ధోరణి లో. వీటిలో ఒకటి వాషింగ్టన్ లోని నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కీ, సోవియట్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కీ మధ్య కుదిరిన ఒప్పందం. కానీ ఇది కుర్ర సైంటిస్టులకు కాదు. సీనియర్లకు, కొద్ది కాలానికి. 

రెండవది ఈ రెండు దేశాల మధ్యా కొంత విశాలమైన సాంస్కృతిక సంబంధాల విషయంలో ఉన్నపరస్పర అంగీకారం. మేము ‘న్యూయార్క్ ఫిల్హార్మానిక్’ను మాస్కోకి పంపుతామనుకుంటే వాళ్ళూ ‘బొల్ష్ వా బాలే’ని న్యూయార్క్‌కి  పంపే పధ్ధతిలో. ఈ ఒప్పందంలో ఉన్న మరో చిన్న అంశంగా యూనివర్సిటీ స్థాయిలో డాక్టరేట్ కోసం కృషి చేస్తున్న విద్యార్థులకూ, డాక్టరేట్ వచ్చింతర్వాత పరిశోధనలను విస్తృత పరచుకునే పోస్ట్ డాక్టొరల్ విద్యార్థులకూ ‘పరస్పర’ రీతిలో సందర్శనకు అవకాశం ఉంది. 

ప్రతి సంవత్సరం అమెరికనులు నలభైమంది అమెరికన్ యువ పండితులను ఎంపిక చేస్తే సోవియట్లు నలభైమంది సోవియట్ యువ పండితులను ఎంపిక చేస్తారు. ఒక దేశం ఎంపిక చేసిన పండితులను అతిథులుగా రానివ్వటానికి రెండవ దేశం అంగీకరించాలి. అమెరికన్ వైపునుండి ఈ కార్యకలాపాలు న్యూయార్క్ లోని వివిధ అమెరికన్ విద్యావేత్తల సంఘాల సమాహార సంస్థకు అనుబంధంగా ఉన్న ఐరెక్స్ (ఇంటర్నేషనల్ రిసెర్చ్ అండ్ ఎక్స్ ఛెంజెస్ బోర్డ్) నిర్వహించేది. 

ఈ పరస్పర సందర్శనలో పండితుల ఎంపిక ఒక పధ్ధతిలో జరిగేది. రష్యనులు నలభై మంది ఇంజనీర్లను, కంప్యుటర్ సైంటిస్టులను అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూ ట్ ఆఫ్ టెక్నాలజీ కి పంపిస్తే అమెరికన్లు నలభై మంది విద్యార్థులను మాస్కోకి డాస్ టొవిస్కీ‌నీ , రాస్పుటిన్‌నీ అధ్యయనం చేయటానికి పంపేవాళ్ళు. ఐరెక్స్ ఎప్పుడూ అతి తక్కువ మంది సైంటిస్టులను యుఎస్ఎస్ఆర్‌కి పంపేది. దీనికి కారణం రష్యాలో సైన్స్‌లో రిసెర్చ్‌కి చాలా తక్కువ అవకాశాలుండటంతో అక్కడ తప్ప వేరెక్కడా వీలు కాని రీసెర్చ్ విషయం అయితేనే ఆ శాస్త్రవిభాగంలో పరిశోధకులను రష్యాకు ఎంపిక చేయటం జరిగేది. సైన్స్ ప్రతిచోటా ఉంది. సైంటిఫిక్ రీసెర్చ్‌లో ఏదైనా సమస్యని యుఎస్‌ఎస్ఆర్‌లో మాత్రమే పరిష్కరించగలమని అనటం అంత తేలిక కాదు. నువ్వు చేసే పరిశోధనాంశ విశేషాలు రష్యన్ భాషలో ఉన్నా, నీ పరిశోధన రష్యన్ సాహిత్యం లోనో, లేదా రష్యన్ చరిత్ర లోనో అయి దానికి సంబంధించిన వెనకటి కథలన్నీ సోవియట్ యూనియన్‌లో మాత్రమే దొరికే పక్షాన నువ్వు నీ పరిశోధన కోసం మాస్కో వెళ్ళాల్సి ఉంటుందని నీ ప్రణాళికలో పేర్కొనటం సమంజసంగా ఉంటుంది. 

ఐరెక్స్ ప్రోగ్రాంలో పాలుపంచుకున్న మొట్టమొదటి గణిత శాస్త్ర పరిశోధకుణ్ణి అయ్యాను నేను, 1972-73లో. ఐరెక్స్‌కి నేను పెట్టుకున్న దరఖాస్తులో ప్రపంచంలో ఉన్నఅత్యున్నత స్థాయికి చెందిన గణిత శాస్త్రవేత్తలలో పెక్కుమంది సోవియట్ యూనియన్లో ఉన్నారనీ, వాళ్ళందరూ మాస్కోలో కేంద్రీకృతమైయున్నారనీ వాళ్ళు దేశం విడిచి బయటకెక్కడికీ ప్రయాణం చేయటానికి వీలులేదనీ వాళ్ళతో కలిసి పనిచేయటం ఎంతో విలువైన అనుభవమనీ రాసాను. ఇవి బలమైన కారణాలు. ఐరెక్స్ఆమోదం లభించింది. ఐరెక్స్‌కి నెను గెల్ఫాండ్‌తో కలిసి పనిచేయటమే నా ప్రణాళికగా దరఖాస్తు చేసుకున్నాను. దీనికి, నా అధ్యయనానికి పర్యవేక్షకునిగా  ఉండటానికి  గెల్ఫాండ్ అంగీకరించాలి. ఆయన ఒప్పుకున్నాడు. నాకు వీసా వచ్చింది. నేను మాస్కో వెళ్ళాను. 

ఒక విడతలో ఐరెక్స్ పథకంలో యుఎస్ఎస్ఆర్ వెళ్ళే అమెరికన్లందరూ ఆగస్ట్ నెలలో పారిస్‌లో కలుసుకోవాలి. పారిస్‌లో కలుసుకుని అక్కణ్ణుంచి విమానంలో మాస్కో వెళ్ళాలి. నేను కొద్ది రోజులు ముందుగానే పెట్టె నిండా లెక్కల పుస్తకాలూ, ఒక ‘ఒలివెత్తి‘  టైపు రైటర్‌తో పారిస్ చేరుకుని, పారిస్‌లో బడి వీథిలో ఒక చౌకరకం  హోటల్లో ఉన్నాను. ఆ హోటల్లో ఉండి పాల్ ఎర్డొష్‌తో నా మొట్టమొదటి రీసెర్చ్ పేపర్‌గా తయారయిన విషయం మీద విపరీతంగా కష్టపడి పనిచేశాను. ఆ పని పూర్తయి పేపర్ రాయటం అయింతర్వాత వ్రాత ప్రతిని ఫ్రాన్స్ నుంచి  పోస్ట్ చేయటానికి సమయం చాలకపోయింది. కానీ ఐరెక్స్ విద్యార్థులకు మాస్కోలోని అమెరికన్ దౌత్య కార్యాలయం కొన్ని ప్రత్యేక సౌకర్యాలు కలగ జేసింది. అన్నిటికన్నాఎక్కువ ఉపయోగపడే సౌకర్యాలలో ఒకటుంది. అది యూఎస్ఎస్ఆర్ బయటికి దౌత్య తపాలా సంచిలో ఉత్తరాలు పంపించుకునే వీలు. సైంటిఫిక్ వ్రాత ప్రతులను అమెరికాకు పంపించటంలో యుఎస్ఎస్ఆర్ తపాలా -మృదువుగా చెప్పాలంటే- అంత నమ్మదగింది కాదు. నేను నా పేపర్‌ని వియన్నాకు వెళ్తున్న ఒక నావికుడు చేత్తో పట్టుకుపోతున్న తపాలా సంచిలో పడేసి ‘ప్రొసీడింగ్స్ ఆఫ్ ది అమెరికన్ మాథమాటికల్ సొసైటీ’ కి పంపగలిగాను. 

గెల్ఫాండ్‌తో నా మొట్టమొదటి సమావేశం మాస్కో స్టేట్ యూనివర్సిటీలో నలుగురూ కూచుని కబుర్లు చెప్పుకునే చోట జరిగింది. అప్పుడు ఆయన నాకు చెప్పిన రెండు విషయాలు జ్ఞాపకం ఉన్నాయి. మొదటిది ఆయన మంత్రంగా ప్రసిద్ధిచెందినది. “ఉన్నది ఒకే గణిత శాస్త్రం”.  తర్వాత ఆయన సోవియట్ యూనియన్‌లో ఉన్న యువ గణిత వేత్తలలో కల్లా మరీ ప్రతిభావంతుల పేర్లు – ఒక చిన్న చిట్టా – అప్పజెప్పినట్టుగా చెప్పి, “నాకన్నా వాళ్ళకు గణిత శాస్త్రం చాలా ఎక్కువ తెలుసు, కానీ నా కున్న ఊహాశక్తి  మెరుగైనది.” అన్నాడు. ప్యాతెత్ స్కీ-షపిరో, మనిన్‌లు చెపుతున్న పాఠాలకు హాజరవమని  గెల్ఫాండ్ నాకు సూచించాడు గానీ, అన్నింటికన్నా నా మాస్కో గణిత శాస్త్రాభ్యాసంలో విలువైనదని నేననుకునేది ఎంతో ప్రఖ్యాతి పొందిన ‘గెల్ఫాండ్ సోమవారం రాత్రుల సెమినార్లలో పాలు పంచుకోవటం . ఆ సెమినార్లు ‘ఇన్నింటికి మొదలు పెట్టాలి’ అని అధికారికంగా ఏమన్నా ఉండేదేమో నాకు గుర్తుకు రావటం లేదు. అందరూ చాలా ముందుగానే వచ్చి ఆ హాల్లో జేరుకుని లెక్కలే మాట్లాడుకోవటం మొదలుపెట్టే వారు. అసలు సెమినారు -ముందుగా నిర్ణయించుకున్న శాస్త్ర విషయ చర్చ – మెల్లిగా మొదలయ్యేది. ఒకళ్ళతర్వాత ఒకళ్ళు మాట్లాడుతునే ఉండే వారు. సెమినారు ముగియాలనుకున్న టైమ్ ఏదైనా ఉంటే అది దాటి చాలా కాలం అయిపోయేది. చివరికి ఆ హాలు తుడిచి శుభ్రం చేసే ఆవిడ వచ్చి మమ్మల్ని బయటకు వెళ్ళగొట్టేదాకా. 

ఎవరైనా మాట్లాడుతుండగా గెల్ఫాండ్ వాళ్ళను ఆపి వింటున్నవాళ్ళలో ఎవరినైనా ఉద్దేశించి అప్పుడు నడుస్తున్న విషయాన్ని వివరించమని అడగటం సర్వసాధారణంగా జరిగేది. నేను మొదటి సారి ఈ సెమినార్లకి హాజరయింది ఒక ఉపన్యాసం కొనసాగుతూఉంటే మధ్యలో వెళ్లినప్పుడు. గెల్ఫాండ్ “మెల్విన్ నీకు అర్థమౌతోందా?” అని అడిగాడు. “కావట్లేదు”. ” ఏం, ఎందుకని?” “వాళ్ళు రష్యన్‌లో మాట్లాడుకుంటున్నందువల్ల”. ఆయన వెంటనే డిమా ఫుక్స్‌ని నా పక్కన కూచుని నాకు వాళ్ళ రష్యన్‌ని ఇంగ్లిష్‌లోకి అనువదించి చెప్పమని పురమాయించాడు. కొద్దికాలానికే నా రష్యన్ భాషా పరిచయం మెరుగై ఇంక భాష మీద నెపం వేసే అవకాశం పోయింది. 

ఎవరు ఏం నేర్చుకోవాలో గెల్ఫాండే నిర్ణయించేవాడు, సెమినార్‌లో చెప్పేవాడూ. ఒకసారి గెల్ఫాండ్ ఆర్నాల్డ్‌ను ‘పి -యాడిక్ సంఖ్యల’ గురించి కొన్ని వరస ఉపన్యాసాలు ఇమ్మన్నాడు. ఆర్నాల్డ్‌కి ఈ పని కష్టంగా తోచింది. ఆర్నాల్డ్ ‘రియల్ సంఖ్యల’ పరిధిలోనూ, ‘కాంప్లెక్స్ సంఖ్యల’ పరిధి లోనూ ఉద్దండుడు, కానీ పి -యాడిక్ సంఖ్యలకు సంబంధించిన గణితంలోవచ్చే కొన్ని ముఖ్యమైన విలువలను అవగాహన చేసుకోవటంలో ఇబ్బంది పడ్డాడు. ఈ విలువల గురించి  సంఖ్యాశాస్త్రంలో కృషి చేస్తున్న ప్రతి యువ గణిత విద్యార్థికీ తెలుసు. ఆర్నాల్డ్ వంటి గొప్ప గణితజ్ఞుడు ఇలా కొంతమందికి చాలా సులువుగా తెలిసిన శాస్త్ర విషయాలను అర్థం చేసుకోవటానికి తన్నుకోవటం ఒక పాఠం నేర్పింది. అంతమందికీ మంచినీళ్ళ ప్రాయంగా అనిపించిన విషయమే అయినా అది నీకు కష్టంగా అనిపిస్తే నిన్ను నువ్వు దద్దమ్మగా పరిగణించుకోనవసరం లేదని. 

నడవటం రష్యన్ సంప్రదాయం. చలికాలం నిజంగానే చల్లగా ఉంటుంది. అయినా గాలి తక్కువగా ఉండటం వల్ల అంత చలిని భరించగలం. సెమినారు ముగిసిన తర్వాత తరచుగా కొంతమంది ఒక జట్టుగా గెల్ఫాండ్‌తో బయలుదేరేవారు. వాళ్ళు నడుచుకుంటూ, మాట్లాడుకుంటూ రాత్రి బాగా పొద్దుపోయేదాకా దట్టంగా మంచు పడ్డ రోడ్ల పక్కల మీద లెక్కలు చేసుకుంటూ. రాసుకుంటూ ఆయనతో వెళ్ళేవారు. బహిరంగ ప్రదేశాల్లో స్వేచ్చగా మాట్లాడు కోవచ్చు. గదుల్లో అయితే గోడలకు చెవులుంటాయి. చాలామంది గణిత శాస్త్రజ్ఞులు నన్ను “నడుద్దాం రమ్మ”నే వారు. రోడ్ల మీది వేరెవరి జోక్యమూ లేని ‘ఏకాంత స్వేచ్చ’లో నన్ను “అమెరికాలో ఎలా ఉంటుంది?”, అమెరికా లో యూదులంటే ద్వేషం ఎంత ఎక్కువగాఉంది?”, “అమెరికన్ యూనివర్సిటీలలో ఉద్యోగం రావటం ఎంత కష్టం?” అని అడిగేవారు. ఆనతి కాలంలో వలస విధానం సులభమవటంతో వాళ్ళందరూ వలస వెళ్లి పోయారు. 

1989లో గెల్ఫాండ్ అమెరికా సంయుక్త రాష్ట్రాలకు వలస వెళ్ళాడు. తొలుత హార్వర్డ్ విశ్వవిద్యాలయం లోనూ, మసచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లోనూసందర్శకాచార్యునిగా ఉండి, రట్జర్స్ యూనివర్సిటీలో విశిష్టాచార్యునిగా ఉన్నాడు. జీవశాస్త్రవేత్త గోల్డ్ ఫార్బ్ కూడా రష్యాను వదిలి న్యూయార్క్ వెళ్లి పోయాడు. 

ఇరెక్స్‌లో మాస్కో వచ్చిన అమెరికన్ విద్యార్థులందరూ శయనా గారాలవంటి గదుల్లో ఉండేవారు. సంవత్సరం తర్వాత సంవత్సరం వచ్చే అమెరికన్ విద్యార్థులు మారొచ్చు గానీ అమెరికన్లకు ఇచ్చే గదులు మాత్రం మారేవి కావని నాకు విశదమైంది. ఆ గదులు అన్నీ ఒకే అంతస్తులో కాక వేరు వేరు అంతస్తులలో, ఒక దాని మీద ఒకటి, సరిగ్గా మీదగా, అమెరికన్లను వీళ్ళ ఆవాసంలో గూఢంగా కనిపెట్టి ఉండటానికి భవనానికి నిలువుగా కేబుళ్లను అమర్చుకోవటానికి సులువుగా ఉండేటట్లు ఏర్పాటు చేసేవారు. “నీ గదిలో నీకు ఏమైనా ప్రత్యేకంగా కావలసినది అమర్చాలని నువ్వు అధికారులకు చెప్పాలనుకుంటే అదుగో ఆ బల్బుకు చెప్పు’ అన్నది అక్కడ సుపరిచితమైన నవ్వూసు. 

యూనివర్సిటీలో ఉన్న’కమసోల్’లో చురుకుగా ఉన్న వాళ్ళలో నాకు చాలా మంది మిత్రులు. కమసోల్ కమ్యూనిస్ట్ పార్టీ యువజన శాఖ. అందులో ఉన్న వాళ్ళకు అమెరికన్లతో స్నేహం వాళ్ళు విధిగా చేయవలసిన పార్టీ కార్యక్రమంగా అప్పజెప్పబడిందని అనుకోవచ్చు. “మీ గదుల్లో టేపు చేసిన మాటల్లో ప్రతి గొంతూ వాళ్లు గుర్తుపట్టలేర”ని నాతో కొమోజోలు వ్యక్తి ఒకరన్నారు. 

యూనివర్సిటీ బయటి జీవితానికి కొమోసోల్ అద్దం పట్టేది. బయటి జీవితంలో సామాన్య ప్రజానీకానికి లేని కొన్ని ప్రత్యేక ప్రతిపత్తులూ, సదుపాయాలూ కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న వ్యక్తులకు ఉన్నాయి. ఉదాహరణకు, యూనివర్సిటీలో పై తరకల కొమోసోల్ వ్యక్తులకు వాళ్ళల్లో వాళ్లు మాత్రమే జరుపుకునే పార్టీలు ఉండేవి. అటువంటి పార్టీ కొకదానికి నేను వెళ్ళాను. ఆ పార్టీలో ఎస్టోనియా నుంచి తెప్పించుకున్న బృందం రాక్ సంగీతం ఉండింది. ఇతర మామూలు విద్యార్థులు ఆ పార్టీలోకి జొరబడటానికి ప్రయత్నించినప్పుడు కొమొసోల్ పోలీసులను పిలిచారు. 

మధ్యలో వచ్చిన క్రిస్మస్ సలవులకు నేను అస్వస్థతో ఉన్న నా తల్లిని చూడటానికి వెనక్కు -ఫిలడెల్ఫియాకి- వచ్చాను. శలవల తర్వాత తిరిగి మాస్కో వెళ్ళినప్పుడుగెల్ఫాండ్, “సోవియట్ యూనియన్‌లో కొన్నాళ్ళుండి, అమెరికా వెళ్లి మళ్ళీ సోవియట్‌కి రావటం నీకెలా అనిపించింది?”అని అడిగాడు. “బాగానే ఉంది గానీ, ఇంటిదగ్గర మొదటి వారమంతా ఫోన్ మాట్లాడాలంటే జంకుపుట్టేది” అన్నాను. 

రష్యన్ సాహిత్యం, ప్రత్యేకించి పుష్కిన్ రచనలను, చదవమని గెల్ఫాండ్ నన్ను ఉద్బోధించేవాడు. పుష్కిన్ కవిత ‘మొట్జార్ట్ అండ్ సాలియెరి’ రికార్డునూ, ఇల్యా -పెత్రోఫ్‌లు కలిసి రాసిన నవలలనూ నాకు ఇచ్చాడు. నాకు ఆయన మిన్లోసూ, షపిరోలతో కలిసి తను రాసిన ‘రిప్రజంటేషన్ ఆఫ్ ది రొటేషన్ గ్రూప్ అండ్ లారెంజ్ గ్రూప్’ అన్న పుస్తకమూ, ఇంగ్లిష్‌లో ఉన్న(ఆంద్రే) వెయిల్ రాసిన ‘బేసిక్ నంబర్ థియరీ’ అన్న పుస్తకమూ వాటితో పాటు వివిధ గణితశాస్త్ర  విభాగాలలో పుస్తకాలు కూడా ఇచ్చాడు. స్నేహాలు చేసుకోవటంలో గెల్ఫాండ్‌కి ఉన్న ఆసక్తి, నేర్పూ అపారమైనవి. ఆంద్రే వెయిల్ గెల్ఫాండ్‌ను చూడటానికి మాస్కో వచ్చాడు. వాళ్ళిద్దరూ దగ్గరి  స్నేహితులయ్యారు. నేను వెనక్కి వచ్చింతర్వాత ఒక సంవత్సరం పాటు తనకు సహాయకునిగా ఉండటానికి వెయిల్ నన్నుప్రిన్స్‌టన్‌లో ఉన్న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీకి ఆహ్వానించాడు. నాకైతే నిజం తెలీదు గానీ నన్ను గెల్ఫాండ్ వెయిల్‌కి సిఫార్స్ చేసి ఉంటాడనీ వెయిల్ స్నేహితుని మాటను గౌరవించాడనీ అనే నేననుకుంటూ ఉంటాను. 

మాస్కోలో నువ్వు నీ సోవియట్ స్నేహితులను ఒకరి కొకరు కలుసుకోలేని చట్రాలలో ఉంచటం నేర్చుకుంటావు. అమెరికన్‌తో పరిచయం ఉండటం ప్రమాదకరమైనది. ఎక్కడబడితే అక్కడ సమాచారం చేరవేసేవాళ్ళు. నీ పరిచయస్తులే, ఒక అమెరికన్ కలుసుకుంటున్న ప్రతి వ్యక్తి గురించీ తెలుసుకునే పార్టీలో సాధికారిక పై విభాగాలకి  నిస్సందేహంగా ఉప్పు అందిస్తారు. 

నాకు మాత్రం భయభ్రాంతుణ్ణై పోవలసిన అవసరం కనిపించలేదు. జాగ్రత్తగా మసలుకోవాలని మాత్రం తెలుసును. నాకు ఏ ప్రమాదమూ లేదని నేనెరుగుదును. ఈ  నిర్భీకతకు కారణం నాకు అమెరికన్ పాస్‌పోర్ట్ ఉండటమే. రష్యన్లు అంతర్జాతీయ వ్యవహారాలతో గొడవలు కోరుకోరు. నన్ను అరెస్ట్ చేస్తే చేయవచ్చు, జడిపించవచ్చు. నేను ఉద్రేకపడకుండా ప్రశాంతంగా ఉన్న పక్షాన నన్ను ఇంటికి తరలించేస్తారు. అది పెద్ద విషయమేమీ కాదు. సోవియట్ పౌరుల పరిస్థితి మాత్రం ఇలా ఉండదు. వాళ్ళ పరిస్థితి ప్రమాదాలలోకి నెట్టే పరిస్థితే. వాళ్ళను యూనివర్సిటీ నుంచి పంపించేయటం మొదలుకొని, ఉద్యోగాలలోంచి తొలగించటం దాకా, వాళ్ళ జీవితాలను బుగ్గిచేయటం దాకా ఏదైనా సంభవమే. అమెరికా సంయుక్త రాష్ట్రాలు వియత్నాంలో ఘోర యుద్ధం చేస్తున్నప్పటికీ, హనోయి మీద బాంబులు వేస్తున్నప్పటికీ, ఒక వంక ఆగ్నేయాసియాలో కర్ర చూపిస్తూ, మరొక వంక – అమెరికన్లతో వ్యాపారాన్ని పెంచుతున్నట్టుగా రాయితీలూ, రష్యాకు ఎగుమతులూ ఎరగా – యూఎస్ఎస్ఆర్‌కి కారట్లూ చూపిస్తూ, కిసింజర్ అంతర్జాతీయంగా అనుసరిస్తున్న జోడు గుర్రాల సవారీ సూత్రం కారణంగా రెందు దేశాల మధ్యనా ఏర్పరుచుకున్న విద్యా విషయకమైన పరస్పర ఒడంబడికతో, మాస్కోలో, ఎటువంటి గూఢచారి చర్యలతోనూ సంబంధం లేకుండా కేవలం ‘అమెరికన్ లాగా వ్యవహరిస్తున్నాడన్న ‘నేరం’ మాత్రం మోపబడ్డ అమెరికన్ పౌరుడి భద్రతకు ఏమీ ముప్పు లేదు. 

సోవియట్ యూనివర్శిటీలన్నిటిలో లాగే, మాస్కో స్టేట్ యూనివర్సిటీలో కూడా ‘మొదటి విభాగం ‘ -రష్యన్‌లో పెర్వియ్ ఒట్ డెల్ – ఉండేది. ఇది KGB అనే సంక్షిప్త నామం తో ప్రసిద్ధమైన సోవియట్ భద్రతా – గూఢచర్యా సంస్థ యూనివర్సిటీలలో ఎర్పాటు చేసుకున్న కార్యాలయం పేరు. గెల్ఫాండ్ అమెరికాకు వచ్చేసి రట్జర్స్‌లో ఆచార్యుడుగా ఉన్న రోజుల్లో నా ఎదుట నెమరు వేసుకున్న కథ. “నేనిది నువ్వు మాస్కోలో ఉన్న రోజుల్లో చెప్పలేకపోయాను. నీవక్కడ ఉన్నప్పుడు నన్ను చూడటానికి పెర్వియ్ ఒట్ డెల్ మనిషి ఒకరొచ్చారు. ‘మీదగ్గర నథాన్సన్ అనే ఒక అమెరికన్ విద్యార్థి ఉన్నాడు. అమెరికన్లు వాళ్ళకిష్ట మొచ్చినట్టుగా ఉంటారని నాకు తెలుసు. అయినా నథాన్సన్ అమెరికన్లతో పోల్చినా మరీ విచ్చలవిడిగా ఉన్నాడు. అతన్ని మేము దేశం నుంచి పంపించేయాల్సి ఉంటుంది ‘, ఇవి ఆ KGB అధికారి అన్న మాటలు.” 

రాజకీయ చతురత పుష్కలంగా ఉన్న గెల్ఫాండ్ , “దానికేం, మీరు అతన్ని పంపించేయటం మీకు తప్పని సరి అయితే పంపించేస్తారు. కానీ నాకు తెలిసినంత వరకూ  నథాన్సన్‌కి అమెరికాలో చాలా మంది స్నేహితులున్నారు. అతన్ని మీరు వెనక్కి పంపించేస్తే  అంతర్జాతీయంగా పెద్ద లొల్లి అవుతుంది. అతన్ని ఇప్పుడు పంపించేయటం కన్నా అతను తన ఈ సంవత్సరం గడువు పూర్తి చేసుకుని వెళ్లి పోయింతర్వాత మళ్ళీ రానీయకుండా చేయడం మేలుగా ఉంటుంది.” అన్నాడు. అలాగే జరిగింది. 

నేను  మరొక సంవత్సరం పాటు మాస్కోలో అతనితో గడపటం నా గణిత శాస్త్ర విద్యాభివృద్ధికి మేలని గెల్ఫాండ్ భావించాడు. కానీ నేను మాస్కో స్టేట్ యునివర్సిటీకి మళ్లీ వెళ్ళటమన్నది జరగని పని అని తేటతెల్లంగా తెలుస్తూనే ఉంది. సంయుక్త రాష్ట్రాలకీ సోవియట్‌కీ మధ్య పరస్పరం సైంటిస్టులను అతిథులుగా పంపే రెండో ఒడంబడిక అటువైపు సోవియట్ అకాడమీ అఫ్ సైన్సెస్ పరిథిలో ఉంది. గెల్ఫాండ్ నన్ను సోవియట్ అకాడమీకి దరఖాస్తు చేసుకోమన్నాడు. అలా చెబుతూనే ఈ సారి నేను రష్యాలో వేరొక విద్యాసంస్థకే రాగలను కాబట్టి, నేను జేరబోయేచోటు ‘స్తెఖ్లొఫ్ ఇన్‌స్టిట్యూట్’ మాత్రం కాకుండా చూసుకోమని హెచ్చరించాడు, ఆ గణితశాస్త్రాధ్యయన సంస్థ  సోవియట్ కెల్లా యూదు ద్వేషానికి పరాకాష్ఠ  అన్నాడు. సోవియట్‌లో ఉన్న ప్రథమశ్రేణి గణిత శాస్త్రవేత్తలైన పలువురు యూదు పండితులకు ఆశ్రయమై. సమాచారాన్ని చేరవేయటంలో వచ్చే సమస్యలను గణిత శాస్త్ర సమస్యలుగా అధ్యయనం చేసే ‘ఇన్‌స్టిట్యూట్ ఫర్ ప్రాబ్లమ్స్ ఇన్  ట్రాన్స్‌మిషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్’ ని నాకు రికమండ్ చేస్తూ నన్ను ఆ సంస్థకు అర్జీ పెట్టుకోమన్నాడు. 1977లో నేను అలాగే దరఖాస్తు చేసాను వాళ్లు అంగీకరించటం గూడా జరిగింది. 

అయితే చివరి క్షణాలలో సోవియట్ విదేశ వ్యవహారాల మంత్రాలయం నాకు వీసా ఇవ్వటానికి నిరాకరించింది. నేను వెళ్ళలేక పోయాను. నాకు సోవియట్ వీసా ఇవ్వకపోవడం – గెల్ఫాండ్ అప్పుడేదో మాటవరసకు అంటే – నిజంగా అంతర్జాతీయ వ్యవహారంగా తయారై, ‘న్యూయార్క్ టైమ్స్’లో పడి వార్తా మాధ్యమాలు సోవియట్ చర్యని  అంతర్జాతీయంగా సైంటిస్ట్‌లను ఆదరించటంలో హెల్సింకి ఒప్పందాలను సోవియట్ అతిక్రమించినట్లుగా చిత్రించాయి. 

కమ్యూనిజంలో ఉన్నప్పుడు అది సోవియట్ యూనియన్ కావచ్చు, తూర్పు ఐరోపా కూటమిలో ఉన్న దేశం కావచ్చు అక్కడి మనుషుల అంతరంగాన్నీ బాహ్య జీవితాన్నీ ఒక వింత ఒత్తిడి విడతీసి, వేరుచేసేస్తుంది. రష్యనులు ‘స్లోజ్ను’ అని పిలుచుకునే ఈస్థితి, ఈ విడతీత ‘క్లిష్టమైనది’.  మాస్కోలో చదువుతో ముడిబడ్డ ఉద్యోగాలు కమ్యూనిస్టు పార్టీతో సత్సంబంధాలుండి పార్టీ అంగీకరించిన వారికే దక్కేవి. 

గణితశాస్త్రం చదువుకునేవాళ్ళకు – ఆమాటకొస్తే గణితశాస్త్రమే జీవితంగా గడిపేవాళ్ళకు – పెద్దగా ఆదాయం గానీ పోషణ గానీ ఉండేవి కావు. వాళ్ళు కేవలం గణిత శాస్త్రం మీద ప్రేమతో, గణిత శాస్త్రాధ్యయనం ప్రసాదించే బుద్ధివికాసం కోసం, ఆత్మానందం కోసం, తప్ప పశ్చిమ దేశాలలో లాగా వృత్తిగా తీసుకుని అందులో పైపైకి పోదామని ఈ విద్యాభ్యాసానికి వచ్చిన వారు కారు. ఐతే సోవియట్ వ్యవస్థ సమసి పోయిన తర్వాత రష్యన్ గణిత శాస్త్ర అధ్యయనం ఈ అమాయకత్వాన్నీ, స్వచ్చతనీ కొంత వరకూ కోల్పోయి అమెరికా, ఇరోపాలోల్లాగా వృత్తి లక్షణాలను సంతరించుకుంది. అంతే కాదు, ఇప్పుడు ఇర్కుట్‌స్క్‌లో “మాంసం” కొనుక్కోవచ్చు. ఏనాడూ సోవియట్ అనుభవించిన స్థాయిలో లేమిని మనం అనుభవించలేదు. ఇప్పటి రష్యన్ గణిత శాస్త్ర వాతావరణాన్ని మనం నిందించకూడదు. కోల్డ్ వార్ రొజుల్లో మాస్కోలో ఉన్న (ఒక) అమెరికన్‌కి అప్పటి రష్యన్ గణిత శాస్త్ర జీవితంలో కనపడిన బుద్ధి తీక్ష్ణతా నాణ్యత పరమాద్భుతమైనది. 

నాతొ పరిచయమయేదాకా, భయమన్నది తెలీకుండా, జీవితాన్నొక  హాయిగా తీసుకునే ధోరణి గల మనుషులుంటారని తను అనుకోలేదన్నాడు ఖజ్దన్ ఒకసారి నాతో. రష్యా లో ప్రతివాళ్ళూ సర్వకాల సర్వావస్థల లోనూ ఒక  ప్రమాదం పొంచిఉన్నదనీ దానినుంచి తమను కాపాడుకోటానికి చేసే ప్రయత్నమే జీవించటంగా బతికుతూ ఉండేవాళ్ళు. 

ఏమి మాట్లాడినా, కావాలని కాకపోయినా, లేదూ కావాలని అపకారం చేసే ఉద్దేశ్యంతో తాము అన్నదానికి వ్యాఖ్యానాలు జోడించి ‘పై వాళ్ళకు’ అందజేసే వాళ్ళున్నారనీ , పర్యవసానంగా తాము బడినుంచి వెళ్ళగొట్టబడవచ్చు, దేశ బహిష్కారం కాబడవచ్చు, జైల్లో వేయబడవచ్చు, చంపబడవచ్చునన్న నిత్య భయంతో వేయికళ్లతోతమను తము చూసుకుంటూ గడిపేవాళ్ళు. బతుకన్న తర్వాత ఎప్పటికప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది. ఎవర్ని నమ్మాలి? ఈ మనిషిని ఎంతవరకు నమ్మొచ్చు?  ఎంత వరకూ మనసు విప్పి చెప్పుకోవచ్చు? ఈ వ్యక్తీ నామీద KGBకి ఫిర్యాదు  చేయవచ్చా? నా గురించి  తన స్వప్రయోజనాలకోసం అబద్ధాలు చెప్పొచ్చేమో ?అమెరికన్లకు ఇటువంటి ఒత్తిడి తెలీదు. ‘పెర్సెక్యూషన్’ – పుట్టుకను బట్టీ, మతవిశ్వాసాలను బట్టీ, ఆలోచనా సరళిని బట్టీ శిక్షించటం, హింసించటం, అంతంచేయటం – అన్నది ఒకటున్నదని తెలియకుండా, అటువంటి భయాలు లేకుండా పెరిగాం. మనదేశం భాగ్యవంతమైనది, మనం కాకపోయినా. ఇక్కడ వివక్షత లేని న్యాయ చింతన ఉన్నది. పాత రోజుల్లో, బాణామతి వంటి క్షుద్రారాధకుల్ని తరిమి కొట్టినట్టుగా కమ్యూనిస్ట్‌ల వెంటబడి వేటాడటమన్న మెకార్తీఇజం – చెడ్డదే కానీ, అది సాగినది చాలా స్వల్పకాలంపాటు.. – చెలరేగినప్పుడు కూడా ఆ పాత తరం వాళ్ళు సోవియట్ ప్రజలు భయపడినంతగా భయపడింది లేదు. 

గతించిన యూఎస్ఎస్ఆర్ గాంభీర్యం యెంత పెళుసుగా ఉండేదంటే ఆ పెళుసు దనాన్ని గురించి ఏమి చెప్పినా అతిశయోక్తి అవదు. ఒక అమెరికన్, మాస్కోకి వెళ్లి – తన చదువు కోసం ఉన్న కొద్దికాలంలోనే – అక్కడ అమెరికన్ లాగా సంచరిస్తూ, ఎవరికీ భయపడకుండా, లైబ్రరీలనుంచీ, శాస్త్ర ప్రాచీనతనీ, పాతరోజుల పరిశోధకుల కృషి ఫలితాలనీ పదిలపరిచి ఉంచి అధ్యయనానికి తోడ్పడే చోట్లు యేవైతే ఉంటాయో వాటన్నిటి నుంచీ బయటికి తోసేస్తామనే బెదిరింపులకు వణికిపోకుండా, ఒంటిచేత్తో సోవియట్ రాజకీయ వ్యవస్థని ధ్వంసం చేయగలిగేవాడని చెప్పినా కూడా అత్యుక్తి కాదు. సోవియట్లు ఒక స్వతంత్ర దేశంలో స్వేచ్ఛా వాతావరణంలో బతుకుతున్న వాళ్ళ మనస్థితికీ, నియంతృత్వ పాలన ఉన్న దేశంలో బతుకుతున్న ప్రజల మానసిక స్థితి గతులకూ మధ్య ఉన్న తేడాని గ్రహించగలిగారు. సోవియట్ అధికారులు తమ సామాన్య ప్రజాజీవనం నుంచి అమెరికన్లని దూరంగా ఉంచాలనుకోవటం సరియైన ఆలోచనే. మనం వాళ్ళ రాజ్య వ్యవస్థకు ముప్పు, సోవియట్లకు మనం ఒక ప్రమాదం. 

 

నా అభ్యర్థనను మన్నించి అనువాదానికి అనుమతి ఇచ్చిన ఆంగ్ల వ్యాస రచయిత ప్రొఫెసర్ మెల్విన్ బి నథాన్సన్‌కీ, అమెరికన్ మాథమాటికల్ సొసైటీకీ ధన్యవాదాలు. 

 

వాసుదేవరావు ఎరికలపూడి

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అదృష్టంకొద్దీ ఇప్పుడు విశ్రాంతి దొరికింది – మణిశర్మ

అదృష్టంకొద్దీ ఇప్పుడు విశ్రాంతి దొరికింది – మణిశర్మ

Published at: 11-07-2014 00:39 AM

‘‘సంగీత దర్శకుడిగా నా జర్నీ సో ఫార్‌ సో గుడ్‌. మా నాన్నగారు మ్యూజిక్‌ నేర్చుకోకపోతే నాకు సంగీతంతో పరిచయం ఏర్పడేది కాదేమో. నాన్నగారికి మ్యూజిక్‌ వచ్చి… పరిశ్రమకు రాకపోయినా నేను పరిశ్రమకు వచ్చేవాడిని కాదేమో. ఏ సభల్లోనో వాయించుకుంటూ ఉండేవాడినేమో. ఏదేమైనా చిన్నప్పటి నుంచి మ్యూజిక్‌ అంటే నాకు ఆసక్తి ఉండేది కానీ, మ్యూజిక్‌ డైరక్టర్‌ని కావాలని ఎప్పుడూ అనుకోలేదు. మ్యూజిక్‌ నేర్చుకున్న తర్వాత ఇవన్నీ ఆటోమేటిగ్గా జరిగాయి. అంతేగానీ నేను ఎప్పుడూ ప్లాన్‌ చేసుకోలేదు. ఇప్పటికీ నాకంటూ ప్రత్యేకంగా గోల్‌ ఏదీ లేదు’’ అంటున్నారు మణిశర్మ. సంగీత దర్శకుడిగా ఆయన ఎన్ని హృదయాలను ఏలారో అందరికీ తెలిసిందే. శుక్రవారం పుట్టిన రోజు చేసుకుంటున్న మణిశర్మతో ‘చిత్రజ్యోతి’ ప్రత్యేకంగా మాట్లాడింది. ఆ సరిగమలు మీకోసం..

 ప్ర: ఒక వైపు పెద్ద సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలూ చేశారు. ఎలా బ్యాలన్స్‌ చేసుకోగలిగారు. ఆ రహస్యం మాతో పంచుకుంటారా?
మామూలుగా నాలో ఏదో భయం ఉండేది. అందుకే ఓ యాటిట్యూడ్‌ అలవాటైంది. అది మా ఇళయరాజాగారిని ఫాలో అవడం. ఆయన కూడా అంతే. ఒక వైపు పెద్ద సినిమాలు చేసేవారు. మరో వైపు కామెడీ సినిమాలు చేసేవారు. గోపీచంద్‌ ‘యజ్ఞం’ సినిమాకు నేనే సంగీతం చేశాను. నా కెరీర్‌ మొత్తం మీద అంత తక్కువ ఎమౌంట్‌ని నేనెప్పుడూ తీసుకోలేదు. చిరంజీవిగారు, మహేష్‌బాబు సినిమాలకు సంగీతం చేసినప్పుడే ఈ సినిమా కూడా చేశాను. ఎందుకు చేశానంటే కారణాలున్నాయి.. కొంతమంది దర్శకులుగానీ, నిర్మాతలు గానీ తొలిసారి సినిమాలు చేసేటప్పుడు ‘అన్నగారూ… మీరు చేయాలి. మీరు చేస్తే నాకు లైఫ్‌ వస్తుంది’ అని అనేవారు. వెంటనే చేసేవాడిని. అప్పుడు వారు చాలా ఆనందించేవారు. వాళ్ల సంతోషంలో నేను ఆనందాన్నివెతుక్కునేవాడిని. ఎందుకంటే… ఎంత సంపాదించి ఏం లాభం? ఎంత తింటాం? డబ్బు అనేది ఆల్వేస్‌ హ్యాపీనెస్‌ కాదు. బతకడానికి కావాలనుకోండి. కానీ మా లాంటి మ్యుజిషియన్స్‌కి, సెన్సిటివ్‌ మ్యుజిషియన్స్‌కి అదే ఆనందం.  డైరక్టర్‌ వచ్చి సన్నివేశాలు చెప్పగానే హార్మోనియం ముందు కూర్చుని బాణీలు కడతాను.

ప్ర: ఇప్పటికీ హార్మోనియం ముందు కూర్చుంటారా..
అవునండీ. అందుకే నా పాటల్లో ఇప్పటికీ మెలోడీ ఉంటుంది.

 ప్ర: మీ పేరు చూసి సీడీలు కొనేవారు కోకొల్లలు కదండీ..
అది హార్డ్‌ ఎర్న్‌డ్‌ నేమ్‌. హార్డ్‌ ఎర్న్‌న్డ్‌ మనీ అంటారు కదా. అలా ఇది నేమ్‌. ఈ రోజున కూడా చాలా మంది నన్ను కలిసి ‘ఎందుకు సార్‌ వరుసగా చేయడం లేదు’ అని అడుగుతుంటారు. ‘ఊరికేలేవయ్యా. వాళ్లకి నా సంగీతం నుంచి రిలీఫ్‌ కావాల్సి వచ్చింది. 15 ఏళ్లు దాదాపుగా అన్ని సినిమాలు నేనే చేశాను కదా. కొత్త టాలెంట్‌ వస్తున్నారు. దేవి అయితేనేం, తమన్‌ అయితేనేం, హారిస్‌, జోష్వా శ్రీధర్‌… ఇలా అందరూ మన దగ్గర పనిచేసిన వారే వస్తున్నారు’ అని అంటున్నా.

 ప్ర: మీ అబ్బాయి సాగర్‌ మహతి కూడా సంగీత దర్శకత్వం చేస్తున్నారు కదా?
అవునండీ. గోపీచంద్‌ సినిమాకు సంగీతం చేస్తున్నాడు. వెస్ట్రన్‌, క్లాసికల్‌ ట్రైనింగ్‌ తీసుకున్నాడు. ఓ ఐదేళ్లు కీబోర్డు ప్లేయర్‌గా చేశాడు. నా దగ్గర కూడా నేర్చుకున్నాడు.

ప్ర: మిమ్మల్ని సలహాలూ, సూచనలు అడుగుతుంటాడా?
లేదండీ. నేను ఇళయరాజాగారి దగ్గర, ఎమ్మెస్‌ విశ్వనాథన్‌ గారి దగ్గర, కీరవాణిగారి దగ్గర (నా ఫస్ట్‌ సినిమా నుంచి 100 సినిమాల దాకా చేశా), విద్యాసాగర్‌ దగ్గర, అలాగే రాజ్‌-కోటిగారి దగ్గర కీబోర్డు ప్లే చేశాను. 15ఏళ్ల పాటు వాళ్లతో మెలిగిన నేను అవేమీ నా సంగీతంలో కనిపించకుండా ఉండాలని 6 నెలలు కీబోర్డు వాయించడం మానేశాను. నాకు కొంత ప్రాబ్లెమ్‌ వచ్చినా నేను ఎక్కడికీ వెళ్లకుండా నా రోల్‌ నేను చేంజ్‌ చేసుకున్నా. శాటిస్‌ఫాక్షన్‌ ఉండాలంటే ఆ మాత్రం శాక్రిఫైజ్‌ చేయాల్సిందే. ‘చూడాలని ఉంది’ ఆడియో ఈ రోజు వేసుకున్నా ఫ్రెష్‌గా ఉంటుంది. ‘తీసెయ్‌రా ఆ పాట’ అనేటట్టు ఉండదు. చిరు, పవన్‌, మహేష్‌.. కాంబినేషన్లతో నేను చేసిన పాటలన్నీ ప్రజాదరణ పొందినవే. శివరాత్రి వస్తే ఇప్పటికీ ‘భం భం భోలే..’, ‘సదా శివ సన్యాసి’ వంటి పాటలు వినిపిస్తూనే ఉన్నాయి. రీసెంట్‌గా నెల్లూరు నుంచి ఒకాయన ఫోన్‌ చేసి ‘నాయనా.. నేను డిస్టర్బ్‌డ్‌గా ఉన్నప్పుడు ‘నమ్మిన నా మది మంత్రాలయమే’ అనే పాట వింటాను. నా కళ్లమ్మట నీళ్లు వస్తాయి’ అని చెప్పాడు. ఇలాంటివి వింటున్నప్పుడు నాకు చాలా ఆత్మ సంతృప్తి కలుగుతుంది.

   ప్ర: అంత ఆత్మ సంతృప్తిని అనుభవించిన మీరు కావాలనే సినిమాలు తగ్గించుకున్నారా?
అదృష్టవశాత్తూ తగ్గాయండీ. 15 ఏళ్లు కీబోర్డు ప్లేయర్‌గా రాత్రింబవళ్లు పనిచేశా. ఆ తర్వాత 15 ఏళ్లు మ్యూజిక్‌ డైరక్టర్‌గా చేశా. ఇప్పుడు కూసింత సమయం దొరికింది. అయామ్‌ ఎంజాయింగ్‌ మై లైఫ్‌. నాకు లైఫంతా నాలుగు గోడల మఽధ్యే గడిచిపోయింది. ఇప్పుడే అయామ్‌ ట్రావెలింగ్‌ ఆల్‌ ఓవర్‌ ద వరల్డ్‌. ఇప్పుడు హీరోలు డ్యాన్సింగ్‌ చేసే పాటలు చేయాలని లేదు. అవి కూడా ఒకప్పుడు చేశాను. కానీ ఆ టైమ్‌ అయిపోయింది. అందుకే నేను వెళ్లిపోయిన తర్వాత కూడా నా పేరు నిలబెట్టే పాటలు చేయాలనుకొంటున్నాను. ఇప్పుడు నేను పెద్దగా సినిమాలు చేయకపోయినా నేను మిస్‌ అయ్యేంతగా ఏమీ ఉండటం లేదు.

   ప్ర: మిక్సింగ్‌లో కింగ్‌ మీరే అనే పేరుంది. అందుకు స్పెషల్‌గా ఏమైనా చేసేవారా?
నా పాటలో ముందు మాట వినిపించాలి. వేటూరిగారు, శాసి్త్రగారు వంటి లిరిసిస్ట్‌లు మనదగ్గర ఉన్నప్పుడు, వాళ్లిచ్చే సాహిత్యం వినిపించకుండా పీకనొక్కేస్తే ఇంక భాష ఏం నిలుస్తుంది? అందుకే మొదటి నుంచీ నేను ఆ విషయంలో నిక్కచ్చిగా ఉన్నాను.‘రామ్మా చిలకమ్మ’ అయినా ఇంకోటయినా పాటలో పదాలు వినిపించాల్సిందే. పాట వింటూ ఆ పదాలను పేపరుపై ఎవరైనా రాయగలగాలి అనుకునేవాడిని.

   ప్ర: నాలుగ్గోడల మధ్య జీవితాన్ని గడిపిన మీరు ఎలా అప్‌డేట్‌ అయ్యేవారు?
ఇంటికి వెళ్లినప్పటి నుంచీ మ్యూజిక్‌ రన్‌ అవుతూనే ఉండేది. వరల్డ్‌లో ఏ యే మ్యూజిక్‌లున్నాయి.. జాజ్‌, వెస్టర్న్‌.. వాటిలో కొత్తగా ఏం వచ్చాయి. వాటిని కొనడం, వినడం.. స్నానం చేసినా, నిద్రపోయినా… 24 గంటలు సంగీతం రన్‌ అవుతూనే ఉండేది. దీనివల్ల ప్రాబ్లమ్‌ అయింది. ఓ రోజు రాత్రి మా ఇంట్లో దొంగలు పడ్డారు. ఈ శబ్దంలో ఆ శబ్దం వినిపించలేదు. అప్పటినుంచి రాత్రుళ్లు వినడం మానేశా.

   ప్ర: అప్పట్లో ఇంటర్నెట్‌ ఇంతగా అందుబాటులో ఉండేది కాదుగా. మరి వరల్డ్‌ మ్యూజిక్‌ని మీరెలా సంపాదించేవారు?
నేను ప్రతి ఏడాది విదేశాల్లో మ్యూజిక్‌ టూర్‌లకు వెళ్లేవాడిని. అప్పుడు క్యాసెట్లు, సీడీలను సేకరించేవాడిని. నా స్నేహితులు పంపేవారు. బాలుగారు  వెళ్లినప్పుడు తెచ్చేవారు. సౌండ్‌కి ఆల్వేస్‌ టచ్‌లో ఉండేవాడిని. సౌండ్‌ని ఆరాధించేవాడిని. పాటల్లో ఏం చెప్పినా పద్ధతిలో చెప్పాలని ప్రయత్నించేవాడిని.

   ప్ర: మీరు పరిశ్రమకి వచ్చిన కొత్తలో పాటలకు ఇంత ప్రాచుర్యం ఉండేదా?
ఉండేది. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. యూట్యూబ్‌, రేడియోలు, ఇంటర్నెట్‌లు.. ప్రాచుర్యం ఎక్కువగా ఉంది. ఈ ఎక్స్‌పోజర్‌ మంచిదే.  సంగీతం బావుంటే ఎంత త్వరగా శ్రోతలకు చేరువవుతుందో, బాగా లేకుంటే అంతే త్వరగా స్టేల్‌ అయిపోతుంది.
 ప్ర: ఇప్పుడు సీడీలు కొనేవాళ్లే లేరు. మొత్తం డిజిటలైజేషన్‌ అవుతోంది. దాని గురించి మీరేమంటారు?
ఇందాక చెప్పినట్టు డిజిటల్‌ ఎక్స్‌పోజర్‌ ద్వారా ఆడియోకు కాస్త మార్కెట్‌ వస్తోంది. రెహమాన్‌, హారిస్‌ లాంటి వారు చాలా ప్లానింగ్‌గా ఉంటున్నారు. ఎక్కడా మోసపోవట్లేదు. తాము చేసిన సంగీతాన్ని చాలా బాగా సంరక్షించుకుంటున్నారు. కానీ నేను ఆ రకంగా ఎప్పుడూ పట్టించుకోలేదు. నాకు అవన్నీ చేసిపెట్టేవారు కూడా లేరు.  ‘మీకున్నన్ని హిట్లు నాకు ఉంటే అవి ప్లే అయితే వచ్చే డబ్బులతో జల్సాగా ఉండేవాడిని. పనే చేసేవాడిని కాదు సార్‌’ అని హారిస్‌ జైరాజ్‌ ఎన్నోసార్లు నాతో అంటుంటాడు. డిజిటల్‌ విధానంలో పాటలు ప్లే అయిన ప్రతిసారీ మీటర్‌ తిరుగుతూనే ఉంటుంది. సృజనకారులకు డబ్బులు వస్తూనే ఉన్నాయి.

    ప్ర: రీరికార్డింగ్‌లో మీరు దిట్ట అనే పేరుంది..
నేను మా గురువుగారిని ఎక్కువగా అనుసరిస్తుంటాను. పాటలకన్నా రీరికార్డింగ్‌పై ఎక్కువ ఆసక్తి ఉండేది. టీవీల్లో వచ్చే ఆర్‌.ఆర్‌.ను రికార్డ్‌ చేసేవాడిని. అలాగే రికార్డింగ్‌ రూముల్లోనూ రికార్డ్‌ చేసుకునేవాడిని. ఏదైనా దర్శకుడు చెప్పే సన్నివేశాన్ని ఆకళింపు చేసుకోవడం వల్లనే మంచి సంగీతం వీలవుతుంది.

   ప్ర: సినిమాలు తీయాలనే ఆలోచన ఎంత వరకు వచ్చింది?
సినిమాలు తీసి బాగుపడ్డవాడు ఎవడూ లేడని తెలిసి కూడా నేను ఆ తప్పు చేశాను. చాలా నష్టం అనుభవిస్తున్నాను.  ‘ముంబై 125 కి.మీ’ త్రీడీ హారర్‌ సినిమా హిందీలో నిర్మించాను. చేతులు కాలాయి. పట్టుకోవడానికి ఆకులు కూడా లేవు.

   ప్ర: లైవ్‌ రికార్డింగ్‌లు తగ్గిపోతున్న తరుణంలో వాద్యకారుల పరిస్థితి?
ఒడ్డున పడ్డ చేపల్లా విలవిల్లాడిపోతున్నారు. ఇళయరాజాగారు ఇప్పటిదాకా ఒక్క రికార్డింగ్‌ కూడా లైవ్‌ ఆర్కెసా్ట్ర లేకుండా చేయలేదంటే నమ్మండి. నేను కూడా నా వంతుగా చాలా కృషి చేస్తున్నాను.

  ప్ర: మ్యూజిక్‌ స్కూల్‌ ప్రారంభించే ఆలోచనలున్నాయా?
చేద్దామనే ఓ ప్లేస్‌ తీసుకున్నా. చెన్నైలోని ఈసీఆర్‌లో. స్కూలు, బోర్డింగ్‌ వసతులు కల్పిస్తూ స్కూలును ఏర్పాటు చేద్దామనుకున్నా. మునులు తపస్సు చేస్తే అడ్డంకులు సృష్టించే రాక్షసులు ఎప్పుడూ ఉంటారని మనం చదివాం. నేను ఈసీఆర్‌లో తీసుకున్న స్థలం విషయంలోనూ అదే జరిగింది.  డాక్యుమెంట్‌లో నాకు అమ్మిన వారు చిన్న తప్పు చేశారు. అది తెలుసుకుని ఒక వ్యక్తి నాపై  కేసు పెట్టాడు. ఇప్పుడు ఆ కేసు సివిల్‌ కోర్టులో ఉంది. నేను 2002లో స్థలం కొంటే 2010లో అతను మీద పడ్డాడు.

     ప్ర: అదెలా సాధ్యం?
మా నాన్నగారు వేదం నేర్చుకున్నారు. మ్యూజిక్‌ ఫ్యామిలీలో పుట్టాను. నేను మోసం ఎందుకు చేస్తాను? నాకు రికార్డింగ్‌ రూమ్‌, ఎయిర్‌పోర్టు తప్ప ఇంకేమీ తెలియదు. నేను ఎంతో పోగొట్టుకున్నాను గానీ, ఇతరులది తీసుకోవడం ఎప్పుడూ లేదు. మణిశర్మ ల్యాండ్‌ గొడవ అని వార్తలను రాసేవారు కనీసం నా అభిప్రాయం తీసుకోవాలి కదా. నేను ఇప్పటిదాకా ప్రభుత్వం దగ్గర ల్యాండ్‌ కూడా తీసుకోలేదు. మా రికార్డింగ్‌ థియేటర్‌ను కూడా వడ్డీకి డబ్బులు తెచ్చుకుని నేనే కట్టుకున్నాను. ఏ ప్రభుత్వం నాకు సెంటు భూమిని ఇవ్వలేదు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పదాలకు భావాల తళుకులు.. -మల్లాది కృష్ణానంద్

పదాలకు భావాల తళుకులు..

  • -మల్లాది కృష్ణానంద్

నీటిరంగుల ఛిత్రం
-వాడ్రేవు చినవీరభద్రుడు
వెల: రూ.150
e-book కోసం www.kinige.com

వాఢ్రేవు చిన వీరభద్రుడు వెలువరించిన కవితా సంపుటి ‘నీటి రంగుల చిత్రం’. ఈ సంపుటిలో జీవితానందం సిద్ధించే మెలకువ కోసం కవి నిరంతరంగా అనే్వషించడం కనిపిస్తుంది. వాడ్రేవుగారి నిర్వికల్ప సంగీతం (1986), ఒంటరి చేల మధ్య ఒక్కత్తే అమ్మ (1995), పుర్యానం (2004), కోకిల ప్రవేశించే కాలం (2009) తర్వాత వచ్చిన కవితా సంపుటి ‘నీటి రంగుల చిత్రం’. తన కవిత్వం గురించి, తన మీద ప్రభావం చూపించిన కవుల గురించీ చినవీరభద్రుడు, మరో సాహిత్యాభిమాని ఆదిత్య కొర్రపాటితో చేసిన సంభాషణ ఈ సంపుటిలో ప్రచురించారు. ఇది ఈ పుస్తకానికి అదనపు ఆకర్షణ అనొచ్చు.
కవిత్వం మాటల్నే ఆశ్రయించుకుని ఉన్నప్పటికీ, అది మాటల్లో మాత్రమే లేదనీ, విద్యుచ్ఛక్తి రాగి తీగ లోపలనుంచి కాకుండా రాగి తీగ వెంబడి ప్రసరించినట్లే కవిత్వం కూడా మాటల్లోంచి కాకుండా మాటల చుట్టూ ప్రసరిస్తుందనే గ్రహింపు ఈ కవిత్వం పొడగునా కనిపిస్తుందని వాడ్రేవు అంటారు. నా కవితలో రాగాత్మక ఉంది. పొందిక కూడా ఉంది. ఒక స్వర్ణకారుడు బంగారు నగకి నగిషీ పెట్టడంలో ఉండే పనివాడితనమంతా నా కవితలో ఉంటుందంటాడు వాడ్రేవు.
కవి కేవలం తన భావాలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడం తొలిరోజుల్లో జరిగే పని. కవి పరిణతి చెందే కొద్దీ శిల్పం మీద దృష్టిపెట్టక తప్పదు.
మనకి ‘ద్రష్ట’, ‘స్రష్ట’ అనే రెండు పదాలున్నాయి.
శ్రీశ్రీ ‘మహాప్రస్థాన‘ గీతాలనాడు ద్రష్ట, ‘మరో ప్రస్థానం’ నాటికి శ్రీశ్రీ స్రష్టగా మారాడంటారు వాడ్రేవు. కవిత అంటే కేవలం వర్ణన లేదా అభిప్రాయ ప్రకటన కాదు.చిన్ని చిన్ని వివరాల వల్ల కవిత తన అనుభూతిని తన శ్రోత హృదయంలో ఎంతో విశ్వసనీయంగా ముద్రిస్తాడని కూడా మనం గమనించాలంటాడు. ఎంత మేరకు వదిలిపెట్టాలన్నదే కవి శిల్ప పరిణతికి గీటురాయి అంటాడాయన. నా దృష్టిలో కవిత్వం దానికదే అత్యంత శక్తివంతమైన భావ ప్రసార సాధనమంటాడు వాడ్రేవు. నా కవిత్వంలో సాధారణ పత్రికా భాషనీ, సామాజిక రాజకీయ భాషనీ వీలైనంతగా పరిహరించడానికే ప్రయత్నించానంటాడు వాడ్రేవు.
ఈ కవితా సంపుటిలో వాడ్రేవు 182 కవితలు 208 పేజీలలో ప్రచురించాడు.
ముందుగా కాపాడుకోవల్సిన పద్యం అంటూ…
‘‘ఇంధనం అగ్నిగా మారినట్లు, ప్రతిరోజూ ఒక పద్యంగా మారాలని ప్రార్థిస్తున్నానంటాడు‘‘ కవి.
పాలుగారే ప్రపంచంతో-అనే కవితతో ప్రారంభించిన వాడ్రేవు నా ఆరాటమిదే అనే శీర్షికతో బహు చతురతతో ముగించాడు.
ఇటలీలోని ఫ్లోరెన్స్ నగరంలో ప్రముఖ కవి, శిల్పి మైకెలాంజిలోని స్థానికులు అడిగారట.
ఏమని?
మేం రోజూ చూసే శిలనే ప్రవక్తగా నువ్వెట్లా మలిచావని?
ఏది డేవిడ్ కాదో దాన్ని చెక్కేసానని మైకెలాంజి జవాబిచ్చాడు.
చమత్కారుడైన వాడ్రేవు కూడా..
‘‘నాలో ఏది చిన వీరభద్రుడు కాదో దాన్ని తొలగించాలని, నా ఆరాటమిదేనని, కడు రమ్యంగా కవితా సంపుటిని ముగించారు.
ఆ తర్వాత ఓ 10 పేజీలలో యువకవి ఆదిత్యతో కొర్రపాటితో అభయ వచనాలు శీర్షికతో ప్రశ్న-జవాబులో వాడ్రేవు తన మనస్సును పాఠకుల మందుంచాడు.
చక్కని మధుర లలిత పదాలతో పాఠకుల్నీ భావకవులుగా తీర్చేలాగ సాగే ఈ కవితా సంపుటిని ప్రతి ఒక్కరూ తప్పక చదివి తీరాలి. తెలుగు కవిత్వాన్ని అభిమానించే ప్రతి వారింటా తప్పక ఉండవల్సిన పుస్తకం.
నవోదయ బుక్‌హౌస్, కాచిగూడ, హైదరాబాద్ తదితర అన్ని పుస్తకాల షాపుల్లో లభిస్తుంది.

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

చట్ట విరుద్ధంగా నేనేమీ చేయట్లేదు అంటున్నసినీ నిర్మాత సురేష్

చట్ట విరుద్ధంగా నేనేమీ చేయట్లేదు

యాభై ఏళ్ల కృషి ఫలితంగానే తాము నేడున్న స్థాయికి చేరుకున్నామనీ, కష్టం, ప్రతిభతోటే ఎవరైనా ఎదుగుతారనీ, తాను న్యాయంగానే థియేటర్లను నడుపుతున్నానే కానీ, చట్ట విరుద్ధంగా ఏమీ చేయట్లేదనీ సురేశ్‌ ప్రొడక్షన్స్‌ అధినేత డి. సురేశ్‌బాబు చెప్పారు. వెంకటేశ్‌ కథానాయకుడిగా శ్రీప్రియ డైరెక్ట్‌ చేసిన ‘దృశ్యం’ చిత్రాన్ని రాజ్‌కుమార్‌ సేతుపతితో కలిసి ఆయన నిర్మించారు. శుక్రవారం ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని మంగళవారం తమ స్టూడియోలో పత్రికలవారితో మాట్లాడిన ఆయన చిత్ర రంగానికి చెందిన పలు అంశాలతో పాటు, తనపై వస్తున్న విమర్శలకూ సమాధానం చెప్పారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే…
ఇది సురేశ్‌ ప్రొడక్షన్‌కు 50వ సంవత్సరం. నేను 32 ఏళ్ల క్రితం 1982లో నా కెరీర్‌ను ప్రారంభించా. ‘దేవత’ నుంచి ప్రొడక్షన్‌ వ్యవహారాలు చూస్తూ వస్తున్నా. అయితే నా పేరు ‘బొబ్బిలి రాజా’ నుంచి ఉంటుంది. మనకంటూ కొన్ని డ్రీమ్‌ సినిమాలుంటాయి. లైఫ్‌లో అలాంటి సినిమాలను కొన్నే తీస్తాం. నాకు ‘బొబ్బిలి రాజా’, ‘ప్రేమించుకుందాం రా’ డ్రీమ్‌ ఫిలిమ్స్‌. మనం ఎదిగేకొద్దీ ఫ్యామిలీ విలువలున్న సినిమాల వేపు మొగ్గు చూపుతాం. కానీ ముప్పై ఏళ్ల తర్వాత కథలు వింటుంటే అప్పటి కథల్లానే ఉంటున్నాయి. అదే విజన్‌ కనిపిస్తోంది. అందుకే మంచి కథల కోసం ఎప్పుడూ ఎదురుచూస్తూనే ఉంటున్నాం. వెంకటేశ్‌ ఎప్పుడూ కొత్త కథల కోసం చూస్తుంటాడు. నేను ఫ్యామిలీ ఓరియంటెడ్‌ డిటెక్టివ్‌ ఫిల్మ్‌ చెయ్యాలని ఎప్పట్నించో చూస్తున్నా. చాలామందిని అడిగా – షెర్లాక్‌ హోమ్స్‌ లాంటి సినిమాని ఫ్యామిలీ డ్రామాలో సెటప్‌ చేసి చెప్పమని. ‘దృశ్యం’ చూసినప్పుడు, మంచి అనుభూతిని పొందాను. సింపుల్‌ స్టోరీని చాలా బ్రిలియంట్‌గా చెప్పారు. ఔట్‌స్టాండింగ్‌ స్ర్కీన్‌ప్లే. వెంకటేశ్‌ ‘ఐ యామ్‌ రెడీ టు డూ ద ఫిల్మ్‌. ఆర్‌ యు రెడీ టు మేక్‌ ది ఫిల్మ్‌?’ అన్నాడు. ఆ సినిమా హక్కులు రాజ్‌కుమార్‌ సేతుపతి వద్ద ఉండటంతో ఆయనతో కలిసి ఈ సినిమా చేశాం. మలయాళంలో డిసెంబర్‌లో రిలీజైతే, జనవరిలో ఓకే చేశాం. మార్చి 6 నుంచి రెండు నెలల పాటు నాన్‌స్టాప్‌గా షూటింగ్‌ చేసి, సినిమాని పూర్తి చేశాం.
నేటి కాలపు కథ
‘దృశ్యం’ ఏ ఇంట్లో అయినా జరగ్గలిగిన ఓ కథ. నేటి కథ. రెగ్యులర్‌ ఫ్యామిలీ డ్రామా సినిమా కాదు. నేటి టెక్నాలజీతో వచ్చే సమస్యలతో కూడిన ఫ్యామిలీ డ్రామా. సమస్య, దానికి పరిష్కారం, ఇన్వెస్టిగేషన్‌ అన్నీ టెక్నాలజీ ఆధారంగా కనిపిస్తాయి. విజయనగరం, అరకు మధ్య ఉండే ఒక కాల్పనిక గ్రామంలో హీరో కేబుల్‌ ఆపరేటర్‌ . అతనికి సినిమాలంటే పిచ్చి. నాలుగో తరగతి పాసైన అనాథ. తన లైఫ్‌లో వచ్చే సమస్యలకి పరిష్కారాలను సినిమాల నుంచే తీసుకుంటాడు. అలాంటి వ్యక్తి కుటుంబంలో ఓ సీరియస్‌ ప్రాబ్లెమ్‌ వస్తే తన సినిమా జ్ఞానాన్ని ఉపయోగించి, దాన్నెలా పరిష్కరించాడనేది ఆసక్తికరం. సమస్యను హీరో గెలిచే తీరును చూస్తే ఇలా గెలవాలని ప్రేక్షకులు ఫీలవుతారు. ఇందులో వచ్చే సమస్యని చూస్తే అందరి వళ్లూ జలదరిస్తాయి. కొత్త కథలు రాయడానికి ఇది హెల్పవుతుంది.
పేరు కోసమే స్టూడియోలు
మా నాన్న జెమిని, ఏవీఎం స్టూడియోస్‌ లాగా ఓ స్టూడియోస్‌ కట్టాలని రామానాయుడు స్టూడియోస్‌ కట్టారు. కానీ అప్పటి స్టూడియోల్లో చాలా మూతపడిపోయాయి. వాహిని, జెమిని, భరణి స్టూడియోలు ఇప్పుడు లేవు. ఇటీవల ఏవీఎం స్టూడియోకు వెళ్తే అందులో నాలుగు గోడలు కట్టేశారు. ఆ రోజు నేను చాలా బాధపడ్డాను. రేపు నాకూ అలాంటిదే జరగొచ్చు. ఇవాళ హైదరాబాద్‌లో సారథీ స్టూడియోస్‌, అన్నపూర్ణ స్టూడియోస్‌, రామోజీ ఫిల్మ్‌సిటీ, రామానాయుడు స్టూడియోస్‌, నానక్‌రామ్‌గూడ స్టూడియోస్‌ రన్నింగ్‌లో ఉన్నాయి. పద్మాలయా స్టూడియోస్‌ రన్‌ కావట్లేదు. సారథీ స్టూడియోస్‌ను నైజీరియా ఉంటున్న వ్యక్తి కొన్నారు. ఎప్పుడైనా దాన్ని ఆయన రియల్‌ ఎస్టేట్‌ కింద మార్చవచ్చు. మా స్టూడియోను ఎంత కాలం వీలైతే అంత కాలం నడపాలనేది మా ఆశయం. నానక్‌రామ్‌గూడ స్టూడియో ప్రభుత్వ స్థలంతో కట్టింది కాదు. మా అమ్మాయి పెళ్లయ్యాక అక్కడ షాదీఖానా కడదామనుకున్నా. కానీ నాకు సినిమా తీయడానికి లొకేషన్లు లేకపోతే నేను దాన్ని కన్వెర్ట్‌ చేయను. నా సినిమాలకు కావాల్సిన సెట్లు వేసుకుని సినిమాలు తీస్తుంటాను. నాకు తెలిసి ఫిల్మ్‌ స్టూడియోలు డబ్బులు సంపాదించవు. నాగేశ్వరరావు గారు సినిమాల్లో సంపాదించి స్టూడియో కట్టారు. ఆయన గనక బ్యాంకులో అప్పులు తెచ్చి కట్టుంటే దివాలా అయ్యుండేవారు. మాకు సూపర్‌ డూపర్‌ హిట్‌ సినిమాలు గనక వచ్చి ఉండకపోతే మేం స్టూడియో కట్టేవాళ్లం కాదు. వెంకటేశ్‌ యాక్టర్‌ కాకపోతే స్టూడియోలో ల్యాబులు పెట్టేవాళ్లం కాదు. కృష్ణగారు సక్సెస్‌లో ఉండటం వల్లే స్టూడియో కట్టగలిగారు. తమ పేరు నిలవాలనుకునే వాళ్లు కట్టుకుంటారు తప్ప వ్యాపారం చేద్దామని ఎవరూ కట్టరు. ఇవాళ 95 శాతం సినిమాల షూటింగులు ఔట్‌డోర్‌లో జరుగుతున్నాయి. పెద్ద సినిమాలకు సెట్స్‌ కావాలి కాబట్టి స్టూడియోలు అవసరం. రూ. రెండు కోట్లలోపు బడ్జెట్‌ సినిమాలు స్టూడియోల్లో సినిమాలు తీయలేవు. ఏడాదికి 150 సినిమాల్లో స్టూడియోల్లోని ఫ్లోర్స్‌లో షూటింగ్‌ జరిపే సినిమాలు 20 నుంచి 25 మాత్రమే ఉంటాయి.
పెద్ద కలలు కనాలి
సినిమాని మరో లెవల్‌కు తీసుకెళ్లే డైరెక్టర్స్‌ కావాలి. తమిళనాడులో శంకర్‌ ఉంటే మనకు రాజమౌళి వచ్చాడు. హైదరాబాద్‌ నుంచి ‘అవతార్‌’, ‘టైటానిక్‌’ ఎప్పుడు తీస్తారు? మనం అసలు ఢిల్లీ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కే వెళ్లం. నేషనల్‌ అవార్డ్స్‌కు వెళ్లం. ఇలాగైతే తెలుగు సినిమా ఎప్పుడు ఎదుగుతుంది? హాలీవుడ్‌ సినిమా తీయాలనేది నా కల. దానికి కావాల్సిన టీమ్‌ను ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నా. పెద్ద కలలు కనాలి. ఇవాళ 95 శాతం మంది నిర్మాతలు, దర్శకులు అప్పుడు చేస్తున్న సినిమా బాగా ఆడితే చాలన్నట్లు అనుకుంటుంటారు. మనకి ఎలాంటి గోల్స్‌ ఉండవు. రాజమౌళి లక్ష్యం ఉంది. హాలీవుడ్‌లో మహాభారతం తియ్యాలనేది ఆయన గోల్‌. దానివైపే ఆయన జర్నీ ఉంటుంది. శంకర్‌ అసిస్టెంట్‌గా ఉన్నప్పుడే తాను వంద కోట్ల సినిమా తియ్యాలని కలలు కనేవాడు. అలాంటి ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు మనకు ఎక్కువమంది కావాలి. మా నాన్న స్టూడియో కట్టాలని కలలు కని కట్టారు. నేను సర్వైవల్‌ ప్రొడ్యూసర్‌ని. నా కంపెనీని ఇబ్బందులు లేకుండా రన్‌ చేయాలనుకుంటాను. మళ్లీ నా కొడుకు రానా డ్రీమర్‌. ఇంటర్నేషనల్‌ స్టార్‌ని అవుతాననేది అతని కల. అన్ని భారతీయ భాషల్లో సినిమాలు చెయ్యాలనేది అతని కల.
మనం ఎదగాలి
ఇవాళ హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్‌ క్వాలిటీతో సినిమాలు తియ్యడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలూ ఉన్నాయి. కానీ మనకు మైండ్‌ లేదు. స్ర్కిప్ట్‌ లేదు. స్కిల్‌ లేదు. మనకు తెలుగు సినిమాలు తియ్యడం వచ్చు, హిందీ సినిమాలు మేనేజ్‌ చెయ్యడం వచ్చు కానీ, ఒక ఇంగ్లీష్‌ ఫిల్మ్‌ ప్రొడక్షన్‌ను హ్యాండిల్‌ చెయ్యడానికి మొత్తం యాభై మంది కూడా లేరు. అలా కాకుండా మన ప్రమాణాలు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి. బాలీవుడ్‌లో వాస్తవిక లక్ష్యాలు పెట్టుకుంటారు. మనం అవాస్తవిక లక్ష్యాలు పెట్టుకుంటున్నాం. దురదృష్టవశాత్తూ మన సినిమా వీకెండ్‌ బిజినెస్‌ అయిపోయింది. 365 రోజుల్లో 175 రోజుల్లోనే బిజినెస్‌ వస్తుంది. మిగతా రోజుల్లో బిజినెస్‌ కాదు. దాంతో ఆ 175 రోజులను తెలివైన నిర్మాతలు లాగేసుకుంటున్నారు. కొంతమంది ఆ రోజులు తమక్కావాలని అడుగుతుంటారు కానీ, వాళ్లకు దొరకవు.
నాలుగు స్ర్కిప్టులు రెడీ
రానా కోసం ఇంతదాకా నేను ఏం చేయలేదు. ఒళ్లు తగ్గించుకుంటే సినిమా చేస్తానని చెప్పాను. వాడు తగ్గించుకున్నాడు. ఈలోగా శేఖర్‌ కమ్ముల వచ్చి తాను చేస్తానని ‘లీడర్‌’ చేశాడు. తర్వాత వాడు చేసిన రెండు కథలు – ‘నేను నా రాక్షసి’, ‘నా ఇష్టం’ నాకు నచ్చలేదు. ‘కృష్ణం వందే జగద్గురుమ్‌’ ఐడియా నాకు నచ్చింది. నేను తీద్దామనుకుంటే తానే తీసుకుంటానని క్రిష్‌ అన్నాడు. ఇప్పుడు ‘బాహుబలి’తో బిజీ అయ్యాడు. నాకు వాడితో చేయడానికి టైమ్‌ దొరకట్లేదు. త్వరలోనే వాడితో ఖచ్చితంగా ఓ సినిమా చేస్తా. డైరెక్టర్‌ హను ‘కవచం’ అనే స్ర్కిప్ట్‌ రెడీ చేశాడు. అలాగే పరశురామ్‌ ‘చుట్టాలబ్బాయ్‌’ అనే కథను రెడీ చేస్తున్నాడు. పూరి జగన్నాథ్‌, శ్రీధర్‌ రాఘవన్‌ (బాలీవుడ్‌ డైరెక్టర్‌) కలిసి ఓ కథ రెడీ చేస్తున్నారు. సెల్వ రాఘవన్‌ ఓ స్ర్కిప్ట్‌ రెడీ చేస్తున్నాడు. మా రెండో అబ్బాయి అభిరామ్‌ను ప్రొడక్షన్‌ వ్యవహారాల్లో పెట్టాను. వాడిని హీరోగా పరిచయం చేస్తామని చాలామంది వస్తున్నారు. వాణ్ణి అప్పుడే చెడగొట్టకండని చెబుతున్నా.
కష్టంతోటే
ఫలితం
ఏ బిజినెస్‌లోనూ రాత్రికి రాత్రే అంతా వచ్చేయదు. ఇవాళ మేం ఈ స్థితిలో ఉన్నామంటే యాభై ఏళ్ల కృషి ఫలితం. మాకు ఉన్నదంతా న్యాయంగా వచ్చిందే, న్యాయంగా చేసిందే. ‘చిరంజీవి ఇంట్లో ఐదుగురు హీరోలున్నారు, మా ఇంట్లో ఒక్కరే హీరో ఉన్నారు’ అని ఎవరైనా ఏడుస్తారా? చిరంజీవి గారు కష్టపడ్డారు. పవన్‌కల్యాణ్‌, బన్నీ, రామ్‌చరణ్‌ కష్టపడ్డారు. వాళ్లు ఊరికే హీరోలు కాలేదు. ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు కాబట్టే హీరోలయ్యారు. కృష్ణ గారికి ఇద్దరు కొడుకులున్నారు. మహేశ్‌ ఒక్కడే సూపర్‌స్టార్‌ అయ్యాడు. ఇంకొకతను కాలేదు. ఎందుకని? మహేశ్‌లో టాలెంట్‌ ఉంది కాబట్టే అయ్యాడు. ఎవరికీ ఊరికే ఏదీ రాదు. డిసి్ట్రబ్యూటర్‌గా ఉన్న దిల్‌ రాజు టాలెంట్‌తో నిర్మాత అయ్యారు. ఎం.ఎస్‌. రెడ్డి విజయవంతమైన నిర్మాత కాలేకపోయారు. కానీ వారబ్బాయి శ్యాంప్రసాద్‌రెడ్డి తన ప్రతిభతో సూపర్‌ సక్సెస్‌ఫుల్‌ ప్రొడ్యూసర్‌ అయ్యారు. వాళ్లకు ఎవరికో ఉందని నేనేడుస్తుంటే ఎలా? ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, భారతదేశంలోనే మొత్తం థియేటర్లను నలుగురైదుగురే కంట్రోల్‌ చేయబోతున్నారు. ఒక కంపెనీ వాళ్లు ఈ ఏడాది 300 థియేటర్లను కొనాలని లక్ష్యంగా పెట్టుకొని కొనేయబోతున్నారు. ఇంటరెస్ట్‌ ఉన్నవాళ్లు వాటిని రన్‌ చేస్తుంటారు. రేపు నాకు ఆసక్తి లేకపోతే నా థియేటర్లను వేరే వాళ్లకు అమ్మేస్తాను.  నేను వాస్తవానికి ‘దృశ్యం’ను ఆగస్ట్‌ 14కు తీసుకు రావాలని అనుకున్నా. కానీ అదే టైమ్‌కు ఎన్టీఆర్‌ ‘రభస’, సూర్య ‘అంజాన్‌’ వస్తున్నాయి కాబట్టి, నా సినిమా ముందుగా రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడే తెస్తున్నా. అదే నేను ఆగస్ట్‌ 14కి తేవాలనుకుంటే నా సినిమా రెండు లేదా మూడో ఆప్షన్‌ అవుతుంది. ఎగ్జిబిటర్లు మొదట ఎన్టీఆర్‌ సినిమాకి ప్రిఫరెన్స్‌ ఇచ్చి, తర్వాత ‘దృశ్యం’కు ఇస్తారు. అది నేను అండర్‌స్టాండ్‌ చేసుకోవాలి. నేను మొండిగా అప్పుడే తేవాలనుకుంటే ఎగ్జిబిటరే చెబుతాడు, అప్పుడు వద్దని. జూలై 11కి ఏ సినిమాలూ లేవు కాబట్టి తెస్తున్నా. ఎగ్జిబిటర్‌కు అవసరాన్ని సృష్టించాకే సినిమా తేవాలి. మన సినిమాకు డిమాండ్‌ని సృష్టించాలి. సినిమా పూర్తవడంతోటే థియేటర్‌ దొరకాలంటే ఎలా దొరుకుతుంది? ‘ఆ నలుగురి దగ్గర అవున్నాయి, ఈ ముగ్గురి దగ్గర ఇవున్నాయి’ అంటే ఏం చేస్తాం? దానికి సమాధానం ఉండదు. నేనేదైనా చట్టవిరుద్ధంగా చేస్తుంటే అప్పుడడగవచ్చు. కాంపిటిషన్‌ కమీషన్‌లో ఇలా చేయకూడదనుంటే చేయను. చట్ట విరుద్ధంగా నేనేమీ చేయట్లేదే.
ఇండసీ్ట్ర తరలిపోవచ్చు
ఇండసీ్ట్ర ఎక్కడికైనా, ఎప్పుడైనా తరలిపోవచ్చు. మంచి వాతావరణం ఉన్నచోటకీ, మంచి రాయితీలు ఉన్నచోటకీ వెళ్తుంది. తడ, వైజాగ్‌, విజయవాడ వంటి చోట్లకి తరలిపోవచ్చు. వచ్చే ఐదేళ్లలో స్మార్ట్‌ టెక్నీషియన్స్‌ వచ్చేస్తారు. కేరళ తరహాలో తమ చుట్టూనే సినిమా తీసేసుకుంటారు. నెక్ట్స్‌ జనరేషన్‌ టెక్నీషియన్లు ఆఫీసుల్లో కూర్చోరు. తమ ఇళ్లదగ్గరే తమదైన ప్రపంచాన్ని ఏర్పరచుకుంటారు. ఎడిటింగ్‌ రూమ్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదు. డబ్బింగ్‌ థియేటర్‌ను కూడా తమ దగ్గరే పెట్టుకుంటారు. ఒన్‌ డే ఆర్టిస్టుల గురించే ఇండసీ్ట్ర ఒకచోట ఉండాలి. నేను వేరే ఊరికి వెళితే వాళ్లకు ఖర్చులు పెట్టుకోవాలి. దాని కోసమే ఇండసీ్ట్ర ఇక్కడ ఉండాలని కోరుకుంటా. ఇప్పుడు రెండు రాషా్ట్రలయ్యాయి. ఇండసీ్ట్రకి ఒక బేస్‌ హైదరాబాద్‌లో ఉంటుంది. మరో బేస్‌ వైజాగ్‌ లేదా తడలో ఉండొచ్చు. షూటింగ్‌లు చేసుకోవడానికి ప్రాబ్లెమ్స్‌ లేకుండా ఉండాలి. ఇక్కడ స్టూడియో మినహా ఎక్కడ షూటింగ్‌ చేసినా పోలీస్‌ పర్మిషన్‌ కావాలి. విదేశాల్లో అలాంటివి అవసరం లేదు కాబట్టే వెళ్లి చేసుకుంటున్నారు. కేరళలో ‘దృశ్యం’ షూటింగ్‌ హాయిగా చేసుకున్నాం. ఇక్కడ అలాంటి వాతావరణం లేదు.

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నటి” మీనా ” ను రెహమాన్‌ కూడా పాడమన్నారట-

రెహమాన్‌ కూడా పాడమన్నారు

‘పూసింది పూసింది పున్నాగ..  పూసంత నవ్వింది నీలాగ..’ లాంటి  పాటలతో ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులను మరిపించి, మురిపించిన మీనా చాలా కాలం తర్వాత ‘దృశ్యం’తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఒకప్పుడు అగ్ర హీరోలతో కలిసి నటించిన ఈ సీతారామయ్యగారి మనవరాలు  నవ్యతో తన జ్ఞాపకాలను పంచుకుంది…

‘‘పెళ్లయ్యాక కొన్నాళ్లు గ్యాప్‌ తర్వాత మళ్లీ సినిమాలు చేయమని నా వద్దకు బోలెడు స్ర్కిప్టులు వచ్చాయి. వైవిధ్యమున్న పాత్ర అయితేనే ఒప్పుకుంటాను అని చెప్పాను. అలాంటి సమయంలో ‘దృశ్యం’ ఆఫర్‌ వచ్చింది. కథ నచ్చింది. తెలుగులో నన్ను అందరు కుటుంబ కథా చిత్రాలతో బాగా గుర్తుపెట్టుకున్నారు. ఈ సినిమాలో చక్కటి ఫ్యామిలీ కథ నడుస్తుంది. ఇందులో నా పాత్ర పేరు ‘జ్యోతి’. అన్ని షేడ్స్‌ కలిగిన పాత్ర ఇది. స్ర్కిప్టు చెప్పినప్పుడు నాకదే నచ్చింది. ఇప్పుడు ‘దృశ్యం’తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడం సంతోషంగా ఉంది. తెలుగులో నాకు చిన్నప్పుడే హీరోయిన్‌గా అవకాశాలు వచ్చాయి. రజనీకాంత్‌ సినిమాలోను బాలనటిగా చేశాను. అప్పట్లోనే సుమారు ముప్పై నుంచి నలభై చిత్రాల్లో చేశాననుకుంటా. ఏడో తరగతి పూర్తయ్యాక రాజేంద్రప్రసాద్‌గారి సరసన హీరోయిన్‌గా ఆఫర్‌ వచ్చింది. అలా తెలుగులో ‘నవయుగం’తో కథానాయికను అయ్యాను. అంత చిన్నవయసులో చేద్దామా వద్దా అని ఆలోచించాను. ఆ చిత్రం పెద్దగా ఆడకపోయినా ‘సీతారామయ్యగారి మనవరాలు’లో అక్కినేని నాగేశ్వరరావుగారి మనవరాలిగా చేసే ఛాన్స్‌ రావడం కలిసొచ్చింది. అప్పుడు ‘వద్దండీ, స్టడీస్‌ డిస్ట్రబ్‌ అవుతుంది’ అని మా తల్లిదండ్రులు చెప్పారు. అయితే కథపరంగా నా పాత్రకు ఒక ప్రత్యేకత ఉందని చెబితే సరే అన్నారు. ఆ చిత్రం నాకొక ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. ఆ తర్వాత వరుసగా తెలుగు సినిమాలు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే!

 

పాడటం అదే ఆఖరు..
విజయవంతమైన చిత్రాల్లో నటించిన కథానాయికగానే నేను అందరికీ తెలుసు. కాని నేనొక మ్యూజిక్‌ ఆల్బమ్‌ చేసిన సంగతి చాలామందికి తెలియదు. నిజానికి నాకు మ్యూజిక్‌ గురించి పెద్దగా తెలియదు. ఇక పాడటం అంటే ఎంత కష్టమో ఊహించుకోండి. అదే మాటను భారతీరాజ గారి కొడుకు మనోజ్‌తో అన్నాను. ఎందుకంటే అతనే నన్ను తమిళ ఆల్బమ్‌ చేయమని అడిగాడు కాబట్టి. అప్పట్లో ఇంగ్లీష్‌ ఆల్బమ్స్‌ హవా నడుస్తుండేది. ‘మీరు పాడాలి’ అని అడిగేసరికి నాకు షాక్‌. ‘మీకు తమిళం వచ్చు. మంచి స్వరం ఉంది. అంతకంటే ఏం కావాలి?’’ అన్నాడతను. సరే, ఒకసారి ప్రయత్నించి చూద్దామని పాడాను. ఆ ఆల్బమ్‌లో ఎనిమిది పాటలు ఉన్నాయి. సంగీతాభిమానులను ఆకట్టుకుంది. ఆ ఆల్బమ్‌ను చూసి.. డి.ఇమామ్‌గారు ఒక చిత్రానికి పాడమంటే ఒక పాట పాడాను. అది చాలా క్యూట్‌ అండ్‌ బబ్లీ సాంగ్‌. సినిమాల్లో అదే నేను పాడిన తొలి, చివరి పాట. అంతకుముందు రెహమాన్‌గారు కూడా పాడమని అడిగితే – ‘‘అదేంటి? మీరు అంత పెద్ద పెద్ద మ్యూజిక్‌డైరెక్టర్లు, నన్ను పాడమంటారేంటి? నాకు ఏం తెలుసు?’’ అని సరదాగా చెప్పాను. నాతో పాడించాలన్నది వారి ముచ్చట. అంతే!

 

ఆ పాటకు ఏడ్చాను..
తమిళం, మళయాలం, తెలుగు, కన్నడలలోని పెద్ద పెద్ద స్టార్స్‌తో అంటే – రజనీకాంత్‌, చిరంజీవి, మమ్ముట్టి, మోహన్‌లాల్‌, నాగార్జున, వెంకటేష్‌ వంటి అగ్ర నటులతో కలిసి చేసే అవకాశం నాకే వచ్చింది. అది నా అదృష్టం. ఇంతపెద్ద స్టార్‌లతో నటిస్తున్నప్పుడు నటనలో పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. నేను చిన్నప్పటి నుంచి బాలనటి కావడం వల్ల ఆ సమస్య రాలేదనుకుంటా! అయితే ‘ముఠామేస్ర్తీ’లో చిరంజీవిగారి పక్కన ఒక పాటకు స్టెప్పులు వేస్తున్నప్పుడు మాత్రం అబ్బో చాలా ఇబ్బందే పడ్డాను. ఆయనతో పోటీపడి డ్యాన్స్‌ చేయడమంటే మాటలు కాదు. నేను క్లాసికల్‌డ్యాన్స్‌ నేర్చుకున్నాను కాని బ్రేక్‌డ్యాన్సులు గట్రా తెలీవు. ఎప్పుడు టీవీల్లో కూడా చూడలేదు. అందులో ‘చికుచికుచాం చాం’ అనే పాటొకటి అన్నపూర్ణ స్టూడియోలో చిత్రీకరిస్తున్నారప్పుడు. ఒకపక్కనేమో చిరంజీవి, మరోవైపు పాటకు డ్యాన్సులు కంపోజ్‌ చేసింది ప్రభుదేవా. అమ్మో!! వారిద్దరిదీ డెడ్‌లీ కాంబినేషనండీ (నవ్వుతూ). వాళ్లతో నేనెక్కడ పోటీపడేది? అదిరిపోయాను. ప్రాక్టీస్‌ చేస్తుంటే ఏడుపొచ్చేది. ‘భయపడకు. నేనున్నానుగా..’ అంటూ చిరంజీవిగారు నా కోసం రిహార్సల్స్‌ చేసి ప్రోత్సహించేవారు. ఎనిమిదిసార్లు వేయాల్సిన ఒకే రకమైన స్టెప్పుల్ని కంటిన్యూస్‌గా చేయడం నాకు చాతకాలేదు. నాలుగుసార్లు చెప్పున రెండు దఫాలుగా డ్యాన్స్‌ చేసేలా చేశారు. హమ్మయ్య! అని ఊపిరి పీల్చుకున్నాను. నేను ఆ పాటకు బాగా డ్యాన్స్‌ చేశాననిచెప్పి.. వారి ఇంటికి ఫోన్‌ చేసి.. వేడి వేడి దోశ, కర్రీ చెప్పించారు చిరంజీవిగారు.

 

రజనీ ఎక్కడున్నారో..
ఇలాంటి అనుభవాలు చెబుతున్నప్పుడు రాజమండ్రిలో రజనీకాంత్‌ గారు గుర్తుకొస్తారు. ఆయనతో నా మొదటి చిత్రం ‘యజమాని’. ఒకప్పుడు ఆయనతోనే బాలనటిగా చేసిన నేను.. ఈ చిత్రంలో హీరోయిన్‌గా చేస్తుండటం కొంత చిత్రంగా అనిపించింది. రాజమండ్రిలో షూటింగ్‌ పూర్తి చేసుకుని మద్రాసు వెళ్లిపోతున్నాము అప్పుడు. ‘యజమాని’కి ముందే తెలుగులో ‘మనవరాలు’, ‘చంటి’, ‘అల్లరిఅల్లుడు’ వంటి మంచి చిత్రాలు చేయడంతో హీరోయిన్‌గా ఎంతో ఫాలోయింగ్‌ వచ్చింది. అది రజనీకాంత్‌కు తెలియదు. మేము మద్రాసుకు రైల్లో వెళ్లేందుకు రాజమండ్రి రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాము. రజనీగారు ప్లాట్‌ఫాం మీదకు వెళ్లిపోయారు. నేను మాత్రం రైలు వచ్చాక వస్తానని చెప్పి కారులోనే కూర్చుండిపోయా. ‘లేదు మేడమ్‌ మాతోపాటు రండి.. రండి. ఫ్లాట్‌ఫాం మీద కూర్చుని మాట్లాడుకోవచ్చు’ అన్నారు యూనిట్‌ సభ్యులు. నేను అక్కడికి వెళితే ప్రయాణికులంతా నన్ను చుట్టుముట్టేస్తారని తెలుసు. వాళ్లకు తెలీదు. ఎంతచెప్పిన వినకపోతే కారు దిగి ప్లాట్‌ఫాం వద్దకు వెళ్లిపోయాను. అప్పటికే అక్కడ రజనీకాంత్‌గారు కూర్చున్నారు. ఆయన్ను పట్టించుకోని ప్రయాణికులు నన్ను చూస్తూనే వరద వచ్చిపడ్డట్టు నన్ను ముంచెత్తేశారు. జనం దాడికి మా వాళ్లందరు చెల్లాచెదరయ్యారు. ఎవరు ఎక్కడున్నారో అర్థం కాలేదు. ఆ హడావిడిలో రజనీ ఏమైయ్యారో కూడా తెలీలేదు. ఇక నాకు ఊపిరాడక రైలు వస్తూనే కనిపించిన బోగీలోకి ఎక్కి.. ఊపిరి పీల్చుకున్నా. రైలు కదిలింది. అరగంటయ్యాక.. మరో స్టేషన్‌లో రైలు ఆగిన తర్వాత.. రజనీకాంత్‌గారు నేను కూర్చున్న పెట్టెలోకి వచ్చి.. ‘‘ఓ మీనా.. మై గాడ్‌.. ఏమిటీ క్రేజ్‌. నీకింత ఫాలోయింగ్‌ ఉందా. అద్భుతం!!’’ అన్నారు ఆయన ఆశ్చర్యంగా. నాకది అప్పట్లో పెద్ద కాంప్లిమెంట్‌. ఇంకోసారి ‘వీర’ అని ఆయనతోనే సినిమా చేస్తున్నాను. అది కూడా రాజమండ్రిలోనే షూటింగ్‌. అదే టైమ్‌లోనే రాజశేఖర్‌గారితో నేను చేసిన ‘అంగరక్షకుడు’ రిలీజ్‌ అయ్యింది. సినిమా చూడాలి చూడాలి అని తమిళ యూనిట్‌సభ్యులు అడిగితే.. టికెట్లు కొని బయలుదేరేందుకు సిద్ధమయ్యాను. రజనీగారిని పిలవాలా వద్దాని సంశయంతో పిలిచాను. వెంటనే ఆయన ‘నువ్వు వెళుతున్నావు కదా! అయితే నేనొస్తాను’ అని మాతోపాటు సినిమాకొచ్చారు. సినిమాచూసి హోటల్‌కు వచ్చే వరకు ఆయన ఏమీ మాట్లాడలేదు. నచ్చిందో లేదో నాకు చెప్పలేదు. హోటల్‌లో దిగుతూనే ‘గ్రేట్‌ జాబ్‌ మీనా. చాలా హెవీ క్యారెక్టర్‌. సులువుగా చేశావు’ అన్నారు. రాజమండ్రిలో రజనీతో కలిసి సినిమా చూడటం నిజంగా స్వీట్‌ మెమొరీ!

రియాల్టీ మరింత వినోదం
‘‘సీరియల్‌ కంటే రియాల్టీషోలు బోర్‌ కొట్టవు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అందులోను రకరకాల వ్యక్తులతో స్పాంటేనియస్‌గా మాట్లాడటం పెద్ద వినోదం. అయితే సహజంగా నేను మితస్వభావిని కావడంతో ‘నీకొంగు బంగారం కాను’ టీవీ షో చేస్తున్నప్పుడు కొంత ఇబ్బంది పడ్డాను. ‘‘మాట్లాడండి మాట్లాడండి..’’ అని షో నిర్వాహకులు అడిగేవారు. నాకైతే ఏం మాట్లాడాలో అర్ధమయ్యేది కాదు. ఆ తర్వాత అలవాటైపోయింది..’’

టీవీ అన్‌లిమిటెడ్‌
‘‘సినిమాల్లో అవకాశాలు తగ్గిన తర్వాతే టీవీరంగంలోకి వస్తారు అనే అభిప్రాయం ఉంది. నా విషయంలో అది సరైనది కాదు. నాకు డిమాండ్‌ ఉన్నప్పుడే కోరి టీవీరంగం వైపు వచ్చాను. నిజానికి సినిమాల్లో చేయలేని ఫెర్ఫార్మెన్స్‌ను టీవీ సీరియల్స్‌లో చేయవచ్చు. అన్ని రకాల షేడ్స్‌లో నటించే అవకాశం లభిస్తుంది అన్నది నా అభిప్రాయం. తొలిసారిగా ‘లక్ష్మీ’ అనే తమిళ సీరియల్‌ చేశాను. ఆతర్వాత అదే భాషలో రెండు చేశాను. తెలుగులో ‘అనుబంధాలు’ సీరియల్‌ కూడా పేరుతెచ్చింది’’

. నవ్య డెస్క్‌

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కధా కమా మీషు -19(చివరి భాగం )

 

బ్రాహ్మణాల కధా కమా మీషు -19(చివరి భాగం )

గోపధ  బ్రాహ్మణం -2

గోపధం లో కొన్ని పదాల వివరణ అత్యద్భుతం గా ఉంటుంది ఆ వైభవాన్ని తెలుసుకొందాం .

1-స్వేదం –సు వేదమే స్వేదం అని అర్ధం చెప్పింది .అంటీ బాగా వేదం చదవటం .వేదం గట్టిగా చదివి  కంఠస్తం కావాలంటే చమట పట్టేట్లు చదవాలి .కా బట్టే ఈ సువేద పదం స్వేదం గా మారిందని వివరణ ఇచ్చారు ఇందులో .

2-రధం –రస అనే శబ్దం నుంచి వచ్చింది .రస పూర్ణం అంటే ఆనంద పూర్ణం గా ఉండటం .దీని వల్ల రధం అనే సంజ్ఞ రూపొందింది .

3-దీక్షిత –ధీక్షిత పదం నుండి ఇది వచ్చింది .శ్రేష్టమైన బుద్ధిని పొందేవాడు ధీక్షితుడు .అదే దీక్షిత గా మారింది.అందుచేత అతడు పెద్దలచే నమస్కరింప దగిన వాడు అవుతాడు .

4-మఖ –అంటే యజ్ఞం .ఖ అంటే చిద్రాలు దోషాలు .మ అంటే పోగొట్టేది .దోషాలు లేనిదిగా చేసేది .మఖ అంటే యజ్ఞం .దోషాలు లేనిదిగా యజ్ఞం ఉండాలి ..అంటే యజ్న కర్మ లో ఏ విధమైన పోరబాట్లు, దోషాలు ఉండరాదని తెలుస్తోంది .

5-సామ –సా అంటే లక్ష్మి అమ అంటే జ్ఞానం .లక్ష్మీ సంబంధమైన జ్ఞానం అని సామ కు  అర్ధం .

6-కుంతాపసూక్తం – కు అంటే చెడు తాప అంటే తపింప జేయటం .చెడును నశింప చేసే సూక్తమే కుంతాప సూక్తం .అధర్వ వేదం లో దీనికి ప్రసిద్ధి ఎక్కువ .

కొన్ని సుభాషితాలు

1-దేవతలు పరోక్ష ప్రియులు ,ప్రత్యక్ష ద్వేషులు .ఈశ్వరుని అచింత్య శక్తిని వర్ణించే సందర్భం లో నిది .ఈశ్వరుడు పరోక్షం గా ఉన్నా ఇష్టుడు .ఈ భౌతిక జగత్తు ప్రత్యక్షం గా ఉన్నా ద్వేషింప దగినది .ఇది అశాశ్వతం .

2-యజ్ఞాలలో ఋత్విక్కులు అసమర్ధులు గా ,బ్రహ్మ చర్య దీక్ష లేని వారుగా ,రాగ ద్వేషాలున్న వారు గా ఉంటె ఆ యజ్ఞం నాశనమవుతుంది .సదాచారమే యజ్న ఋత్విక్కులకు ముఖ్యం .

3-మట్టి బెడ్డలు కుండలో వేస్తె అవి శౌచ కర్మకు ,దాన్యోత్పత్తికి పనికి రావు .ఉపయోగపడే వాటిని తగని స్థానం లో ఉంచరాదు అని అర్ధం .

4-యాజకుడు తేజస్వి ,సత్య వాది,వ్రత నిస్టూడు గా ఉండాలి .అతడు మంచి వాడు కాక పోతే పచ్చికుండలో నీళ్ళు పోసినప్పుడు విచ్చి నీరు కారిపోయినట్లు యజమాని ప్రయోజాన్ని నాశనం చేస్తాయి .

5-తలిదండ్రులు చిన్న తనం లో కుమారుడిని పోషిస్తే ,వాడు పెద్ద వాడై వారిని పోషించాలి .ఇది తెలిస్తేనే నిజమైన యజ్ఞం .తలిదండ్రుల సేవే నిజమైన శ్రాద్ధం ,తర్పణం కూడా .బతికి ఉండగా పట్టించుకోకుండా చని పోయిన తర్వాత శ్రాద్దాలు చేసినా అది నిష్ప్రయోజనం .

6-జరిగి పోయిన కాలం పరిమితం .రాబోయే కాలం అపరిమితం. గతం లో చెడు చేసినంత మాత్రాన  కుంగి పోనవసరం లేదు .భవిష్యత్తు తరువాత వచ్చేదికనుక మంచి చేసి ఆ దోషాన్ని పోగొట్టుకోవచ్చు .నిరాశ చెందక్కర లేదు .

ఇప్పుడొక్క సారి ఈ బ్రాహ్మణం లో చెప్ప బడిన విషయాలను పునరాలోకిద్దాం .  పూర్వ బ్రాహ్మణం లో సృష్టి విధానం ఓం మహాత్మ్యాన్ని వివరించారు .సృష్టి అంతా ఓం నుండే ఏర్పడింది .ఓం బ్రహ్మ ,విష్ణు, రుద్రాత్మకం .దీన్ని వెయ్యి సార్లు జపిస్తే కోరికలన్నీ సిద్ధిస్తాయి .గాయత్రీ మంత్రోపాసన చేస్తే సంతతి కూడా బలం గా ఉంటుంది. శిష్యుడు గురు శుశ్రూష చేసి పంచాగ్నులను వశం చేసుకోవాలి .గృహిణి అతడికి భిక్ష పెట్టాలి .భిక్ష పెట్టక పోతే పుణ్యాలన్నీ నశిస్తాయి .మాంస భక్షణ నిషిద్ధం .విపాట్ నది ఒడ్డున వసిస్టా శ్రమం ఉన్నది

ఉత్తర బ్రాహ్మణం లో దర్శ పూర్నమాసం నుండి చిన్న యాగాలు ,పెద్ద యాగాల వివరణ ఉంది .ఖగోళ ,జ్యోతిష సంబంధ విషయాలు చెప్ప బడ్డాయి .చిత్త మొదలైన నక్షత్రాలు పౌర్ణమి రోజు చంద్రునితో కలిసే చైత్రం మొదలైన నెలలు ఏర్పడుతాయని చెప్పారు. ఫాల్గుణ పూర్ణమి నుండి సంవత్సరం మొదలైంది అని పేర్కొన బడింది .భూమి గోళాకారామని ,సూర్యుడు ఎప్పుడూ చాటు కాడని వివరించింది .తిరుగుతూ ఉండే భూమి అంచున సూర్య కాంతి పడుతుందని తెలిపారు .

బ్రాహ్మణాల కధా కమా మీషు  సర్వం సంపూర్ణం .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -10-7-14-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కధా కమా మీషు -18

బ్రాహ్మణాల కధా కమా మీషు -18

ప్రణవం

పర బ్రహ్మ బ్రహ్మ దేవుడిని ఒక తామరాకు పై సృష్టించాడు .తన కోరికలను ,లోకాలను ,దేవతలను ,వేదాలను ,యజ్ఞాలను ,శబ్దాలను ,భూతాలను స్థావర జంగమాలను ఏ విధం గా ఏకాక్షరం వలన తెలుసుకోవాలి అని ఆలోచించి ,బ్రహ్మ చర్యాన్ని పాటించి చివరకు ‘’ఓం’’అనే ప్రణవాన్ని కనుగొన్నాడు .ఓంకారం లో రెండు వర్ణాలు ,నాలుగు మాత్రలు ఉన్నాయి .ఇది సర్వ వ్యాపి ,మార్పు లేనిది ,బ్రాహ్మీ మాయం .దీని నుంచే కోరిన వస్తువులు ,సమస్త లోకాలు ,దేవతలు ,యజ్ఞాలు ,శబ్దాలు ,స్థావర జన్గమాత్మకమైన భూతాలు పుట్టాయి .

ప్రణవం లోని మొదటి అక్షరం నుండి స్వర్గం ,రెండవ అక్షరం నుంచి తేజస్సు వెలుగు పుట్టాయి .ఓంకారం లోని మొదటి స్వర మాతృక నుంచి భూమి అగ్ని ఓషధులు ,వృక్షాలు ,భూహ్ అనే వ్యాహృతి ,గాయత్రీ ఛందస్సు మూడు విధాలైన స్తామాలు ,తూర్పు దిక్కు ,వసంత రుతువు వాక్కు ,నాలుక సృష్టింప బడ్డాయి .దాని రెండవ స్వర మాత్ర నుంచి అంత రిక్షం ,వాయువు ,యజుర్వేదం ,భువ అనే వ్యాహృతి ,త్రిష్టుప్ ఛందస్సు ,పది హేనురకాల స్తామాలు ,పశ్చిమ దిక్కు ,గ్రీష్మ ఋతువు ఉచ్చ్వాస నిస్శ్వాసాలు చేసే అవయవాలు నిర్మించ బడ్డాయి .మూడవ స్వర మాత్ర నుండి స్వర్గం ,సూర్యుడు ,సామ వేదం ,స్వః అనే వ్యాహృతి ,జగతీ ఛందస్సు ,ఉత్తర దిక్కు ,వర్ష రుతువు ,కళ్ళు మొదలైనవి ఏర్పడ్డాయి .దాని ‘’వ’’కార మాత్ర నుండి నీరు ,చంద్రుడు ,అధర్వ వేదం ,నక్షత్రాలు , అంగీరసులు ,అనుష్టుప్ ఛందస్సు దక్షిణ దిక్కు ,శరదృతువు  మనసు మొదలైనవి జనించాయి .దాని ‘’మ’’కార మాత్ర నుండి ఇతిహాస పురాణాలు ,వాక్కు ,ఛందో యుక్తమైన భాష ,ఉపనిషత్తులు ,వ్రుధాత్ ,కారత్ ,గుహన్ ,మహాత్ ,తత్ ,శం,ఓం అనే వ్యాహృతులు ,నృత్యం ,గానం .చైత్ర రాధా దేవతలు ,తేజస్సు ,తేజస్సు ,వెలుతురూ ,ఊర్ధ్వ దిక్కు ,అదో దిక్కు ,హేమంత ,శిశిర ఋతువులు సృష్టింప బడ్డాయి .

ఓంకార సహాయం తో దేవతలు రాక్షసులని జయించారు ఓంకారమే అన్ని వేదాలకు మూలం .ప్రపంచానికి ఆధారం .ఈ విధం గా దిక్కులు ,ఛందస్సు ,పంచ భూతాలు ,వేదాలు రుతువులు ,సూర్య చంద్రులు ,ఇతిహాస పురాణాలు ,ఓంకారం నుండి పుట్టాయని గోపద  బ్రాహ్మణం  చెప్పింది .

గాయత్రీ మంత్రం

గాయత్రిని మించిన మంత్రం లేదు ‘’ఓం భూర్భువస్సువః త్తత్చావితుర్వ రేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ‘’అనేది గాయత్రి మంత్రం .గాయత్రికే సావిత్రి అని పేరు ఈ మంత్రం తత్త్వం గ్లావుడు ,మౌద్గాల్యుడు అనే ఇద్దరు ఋషుల మధ్య జరిగిన సంభాషణ రూపం లో వివరించ బడింది .మైత్రేయ వంశం లో పుట్టిన గ్లావుడు మౌద్గాల్యునికి వేదాలు వాటి అర్ధాలు తెలియవు అని నిందించాడు .అందుకు మౌద్గాల్యుడు ‘’సకల వేదం సారం ,సకల ఆధార మైన గాయత్రీ మంత్రం యొక్క తత్త్వం నీకు తెలుసా?’’అని శిష్యుని ద్వారా ప్రశ్నించాడు .మంత్రం తత్త్వం తనకు తెలియదని ,మౌద్గాల్యుని తూల నాది నందుకు క్షమాపణ చెప్పుకొని గాయత్రీ మంత్రం తత్వాన్ని ఉపదేశించమని వేడుకొన్నాడు .మౌద్గాల్యుడు సాకల్యం గా వివరించి చెప్పాడు .

‘’వేదాలు ఛందస్సు ,సవిత (సూర్యుడు)యొక్క శ్రేష్టమైన భాగాలు .అన్నం ఆయన ప్రకాశం .ధియః అంటే విధులు లేక కర్మలు .వీటి వల్లనే ఆయన లోకమంతా  సంచ రిస్తాడు .మనస్సు సవిత .వాక్కు సావిత్రి .మనసున్న చోట వాక్కు ,వాక్కు ఉన్న చోట  మనస్సు ,ఉంటుంది .అగ్నియె సావిత్రి .పృథ్వి సావిత్రి .అగ్ని ఆదిత్యుడు వేదాలు వేదాలు ఛందస్సులు యజ్ఞం దక్షిణ సమస్తం సావిత్రియే .దీని తత్వాన్ని తెలుసుకొన్న వాడు సర్వ పాప విముక్తుడై సుఖ సంతోషాలను పొందుతాడు .

రుక్ –సామల సంబంధం

ఉత్తర భాగం లోని తృతీయ ప్రపాఠకం లో ఈ రెంటి సంబంధం చెప్ప బడింది .ఆదిలో రుక్ ,సామలు మాత్రమె ఉండేవి .రుక్కు కు ‘’సా’’అని సామకు ‘’ఆమ ‘’అని పేరు .పుల్లింగం లో ఉన్న సా తో స్త్రీలింగం లో ఉన్న’’ ఆమ ‘తో’’సకల జీవరాసులని అభి వృద్ధి చేయతామికి మనం కలుసు కొందాం ‘’అని చెప్పింది .కాని సామ అందుకు ఒప్పుకోలేదు .రుక్ కన్నా తానే గొప్ప అని ప్రగల్భాలు పోయింది .కోపించిన  రుక్ తానె రెండు భాగాలుగా విడిపోయి మొదటి భాగం రెండో భాగం తో మాట్లాడింది .కాని రెండో భాగం పలకనే లేదు .అప్పుడు తాను మూడు భాగాలుగా విడిపోయి సామను మళ్ళీ పలకరించింది .కనుక సామ మూడు రుక్కుల చేత కీర్తింప బడుతోంది .ఈ సంభాషణ అంతా ‘’సా’’,’’మ’’మధ్య జరిగింది .

గమ్ అనే ధాతువుకు డో’’ ప్రత్యయం చేరిస్తే గో’’శబ్దం ఏర్పడుతుంది .గో శబ్దానికి పొందదగిన పదార్ధం అని అర్ధం .పొంద దగింది వేదవాణి ,పృధివీ రాజ్యం ,స్వర్గ సుఖం .వీటిని పొందే మార్గాన్ని తెలిపే బ్రాహ్మణం కాబట్టి గోపధం అయింది .వేదం విజ్ఞానం పొందటం ,రాజ్య వ్యవహారాలూనడపటం ,పరమ సుఖాన్ని పొందటం అనే పురుషార్ధాలు కలుగుతాయి .

పూర్వం వైదిక యుగం లో ‘’పని ‘’అనే కొండ జాతి వాళ్ళు బ్రాహ్మణుల ఆవులను దొంగిలించి కొండ గుహలో దాచారట .’’సరమ ‘’అనే ఇంద్రుని కుక్క ఆ ఆవులకోసం వెతుకుతూ అనేక ప్రదేశాలు తిరిగి కనుక్కోన్నది .ఇంద్రునికి తెలిసింది ఇంద్రుడు దండెత్తి పణి జాతి వారి బలాన్ని చేదించి ఆవులను విడిపించాడు .అన్గిరసులు ఇంద్రునికి సాయం చేశారు .అందుకే గోపద బ్రాహ్మణం   అధర్వాం గీరస బ్రాహ్మణం ఆనే పేరు తెచ్చుకోంది .ఈ నాటి డిటెక్టివ్ పరిశోధనకు ఆ నాడే బీజం పడిందని భావించ వచ్చు .అడుగు జాడలు వేలి ముద్రలు కుక్కల సాయం తో నేరస్తుల ఆచూకీ ఇవన్నిటికీ ఈ బ్రాహ్మణం ఆధారమే .

తొలి ఏకాదశి శుభా కాంక్షలు

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ – . 8-7-14 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ప్రేమించుకుందాం రా’ వంటి సినిమాలు ఇప్పుడు చెయ్యలేను..వెంకటేశ్‌

ప్రేమించుకుందాం రా’ వంటి సినిమాలు ఇప్పుడు చెయ్యలేను..వెంకటేశ్‌

 

‘‘ఇరవై ఏడేళ్ల కెరీర్‌ తర్వాత కూడా ‘ప్రేమించుకుందాం రా’ వంటి సినిమాలు చెయ్యలేను కదా. ఇప్పుడు మెచ్యూర్డ్‌ సబ్జెక్టులు చెయ్యాలి. అలాంటి సబ్జెక్టులను అన్వేషించడం ఇవాళ క్లిష్టమే’’ అని చెప్పారు వెంకటేశ్‌. ఒకప్పటి హీరోయిన్‌ శ్రీప్రియ డైరెక్ట్‌ చేసిన ‘దృశ్యం’ చిత్రంలో ఆయన కథానాయకుడిగా నటించారు. డి.సురేశ్‌బాబు, రాజ్‌కుమార్‌ సేతుపతి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఆ సినిమా గురించీ, ఇతర అంశాల గురించీ పత్రికల వారితో విపులంగా సంభాషించారు వెంకటేశ్‌. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే…

చాలా రోజుల తర్వాత సింపుల్‌, హ్యాపీ ఫ్యామిలీ ఫిల్మ్‌ చేశాను. ఫ్యామిలీ సబ్జెక్ట్‌లోనే నైస్‌ థ్రిల్లింగ్‌ ఎలిమెంట్‌ ఉంది. అది నచ్చి చేశా. నాకూ కాస్త భిన్నమైన పాత్ర. భార్య, ఇద్దరు పిల్లలతో ఆనందంగా గడిపే రాంబాబు ఆనే కేబుల్‌ టీవీ ఆపరేటర్‌ పాత్ర. జీవితంలో జాగ్రత్తగా ఉండాలనే, డబ్బు విలువ తెలిసిన మనిషి. సినిమాలను ఇష్టంగా చూస్తూ వాటితో ప్రభావితమయ్యే మనిషి. కుటుంబంలో అనుకోని ఓ ఘటన జరిగితే దాన్ని రాంబాబు ఎలా తెలివిగా, ఆసక్తికరంగా హ్యాండిల్‌ చేశాడనేది ప్రధానాంశం. ఈ మనసుకు బాగా దగ్గరైన పాత్ర. నిజ జీవితంలో నేను పిల్లల తండ్రినే కాబట్టి ఆ పాత్రలో సులువుగా ఇమిడిపోయా. ఎప్పుడూ చెయ్యని థ్రిల్లర్‌ 27 ఏళ్ల కెరీర్‌లో ఇప్పటి వరకూ నేను ఫ్యామిలీ సబ్జెక్టులో థ్రిల్లర్‌ చేయలేదు. అది చేసే మంచి అవకాశం వచ్చింది. మంచి స్ర్కిప్టులు రావట్లేదని ఎప్పుడూ అంటుంటాం. వచ్చినప్పుడు వాటిని చెయ్యాలి కదా. నేను సరైన నిర్ణయం తీసుకున్నానని అనుకుంటున్నా. ఇది ప్రేక్షకుల భావోద్వేగాలను అందుకునే సినిమా. కమర్షియల్‌ అంశాలతో పాటు వైవిధ్యం ఉన్న సినిమా. ఇండసీ్ట్రవాళ్లతో పాటు జనం కూడా ఇలాంటి సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు. కన్నీళ్లు పెట్టుకున్నా ఇందులో రాంబాబు సినిమాలు చూస్తూ ఏవైనా ఎమోషనల్‌ సీన్స్‌ వచ్చినప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటుంటాడు. నిజ జీవితంలో నేనైనా, ఎవరైనా అంతే. నా సినిమాల్లోనే కాదు, ఎవరి సినిమాల్లో అయినా మనసును కదిలిందే భావోద్వేగ సన్నివేశాలు వచ్చినప్పుడు నాకు కన్నీళ్లు వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. నావి ఎక్కువగా కన్నీళ్లు తెప్పించే సినిమాలే కదా. నేను చేసిన వాటిలోనే ‘రాజా’, ‘ధర్మచక్రం’, ‘ప్రేమ’, ‘వసంతం’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ వంటివి చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాను. లేడీ డైరెక్టర్‌తో మొదటిసారి శ్రీప్రియ అనుభవం ఉన్న నటి. ఎనర్జిటిక్‌ పర్సనాలిటీ. ఇదివరకే ఓ సినిమాని డైరెక్ట్‌ చేశారు. టెలివిజన్‌లో చాలా వర్క్‌ చేశారు. షి డన్‌ గుడ్‌ జాబ్‌. ఈ సినిమాని ఆమె చాలా బాగా రూపొందించారు. సబ్జెక్ట్‌ను బాగా హ్యాండిల్‌ చేశారు. నటులందరితో మంచి పర్ఫార్మెన్స్‌ను రాబట్టుకున్నారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. తెలుగులో ఈ సినిమాని చెయ్యాలనుకున్నప్పుడు ఆమెకు మొదటి ఛాయిస్‌ను నేనే. ఓ రెండు సార్లు కూర్చొని మాట్లాడుకున్నాం. దానితో పరస్పరం కలిసి పనిచెయ్యాలని నిర్ణయించుకొని, ఏ ఇబ్బందీ లేకుండా చేశాం. అలా మొదటిసారి ఓ లేడీ డైరెక్టర్‌తో చేశాను. రజనీకాంత్‌ను ఇమిటేట్‌ చేశా ‘దృశ్యం’ విశ్వజనీనత ఉన్న సబ్జెక్ట్‌. ఏ ప్రాంతంలోని కుటుంబంలోనైనా జరిగే సంఘటనలతో తయారైన సినిమా. ఎక్స్‌ట్రార్డినరీ స్ర్కీన్‌ప్లే. అందువల్ల ఒరిజినల్‌కు ఎక్కువ మార్పులు చెయ్యాల్సిన అవసరం ఉండదు. అందులో మోహన్‌లాల్‌ ఓ చోట మమ్ముట్టిని ఇమిటేట్‌ చేస్తే, ఇందులో నేను రజనీకాంత్‌ను ఇమిటేట్‌ చేశాను. ఛాలెంజ్‌గా తీసుకున్నా ఈ సినిమా ఒరిజినల్‌ చేసిన మోహన్‌లాల్‌తో మాట్లాడా. చాలా కాలం తర్వాత ఆయన చేసిన డిఫరెంట్‌ ఫిల్మ్‌ ఇది. అక్కడ అతి పెద్ద హిట్లలో ఇదొకటి. సాధారణంగా ఆయన సినిమాలను రీమేక్‌ చెయ్యడం కాస్త కష్టమైన వ్యవహారమే. ఆయనది ఔట్‌స్టాండింగ్‌ అండ్‌ డిఫరెంట్‌ స్టయిల్‌ ఆఫ్‌ యాక్టింగ్‌. ఆయన వాయిస్‌తో, నటనతో మ్యాచ్‌ కావడం అంత ఈజీ కాదు. అయితే ఇది యూనివర్సల్‌ ఫీల్‌ ఉన్న సబ్జెక్ట్‌ కాబట్టి ఛాలెంజ్‌గా తీసుకుని చేశా. కొత్త అనుభవం సాధారణంగా నా సినిమాల గురించి నేనెక్కువగా చెప్పను. కానీ దీనికి చెప్పాలనిపిస్తోంది. మొత్తంగా ప్రేక్షకులకు ఈ సినిమా ఓ కొత్త అనుభవాన్నిస్తుంది. ఈ సినిమాలో భాగం కావడం నాకు ఆనందంగా ఉంది. నా కెరీర్‌లో అందరి ప్రశంసలూ అందుకున్న సినిమాల్లో ఒకటిగా నిలుస్తుంది. ఇవాళ ఇలాంటి సినిమాలు రావాల్సిన అవసరం ఉంది. భారీ బడ్జెట్‌ అవసరం లేని ఇలాంటి సబ్జెక్టుల వల్లా నిర్మాతలకూ, డిసి్ట్రబ్యూటర్లకూ సంతోషం కలుగుతుంది. ఇలాంటి సినిమాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అభిమానులకూ ఇది ఆనందాన్నిచ్చే సినిమా. ఇండసీ్ట్రకి మేలు ఈ సినిమాకి ప్రధాన బలం స్ర్కిప్టే. వెరీ గ్రిప్పింగ్‌ అండ్‌ ఎక్స్‌ట్రార్డినరీ స్ర్కీన్‌ప్లే. మానవ భావోద్వేగాలు ప్రేక్షకులకు బాగా కనెక్టవుతాయి. సినిమా ప్రారంభమైన అరగంటలో మనం సినిమా చూస్తున్నామనేది మరిచిపోయి, కథలో భాగంగా మారిపోతాం. మన జీవితంలోనే అలాంటి సంఘటనలు జరుగుతున్నట్లు లీనమైపోతాం. అందులో సందేహమే లేదు. ఆ ఇన్‌వాల్వ్‌మెంటే ఈ సినిమాకి కీలకం. కమర్షియల్‌ సినిమాలు తీస్తున్నాం. వాటిలో పది శాతం సినిమాలే ఆడుతున్నాయి. ఆ ఆడుతున్న వాటిలో జనం ఏదో ఓ ఎమోషన్‌కు కనెక్టయ్యారన్నమాట. ఇది అలా ప్రేక్షకులకు కనెక్టయ్యే సినిమా. కనెక్టయితే చాలు జనం చూస్తారు. ఇలాంటి సినిమాలు హిట్టయితే ఇండసీ్ట్రకి కూడా మేలు జరుగుతుంది. భిన్నమైన కథలు వస్తాయి. వాళ్లను అడుగుతా మల్టీస్టారర్స్‌లో నాకు మంచి రోల్‌ ఇస్తే తప్పకుండా చేస్తా. ఇవాళ్టి యంగ్‌ హీరోస్‌ అందరూ నాకు మంచి స్నేహితులే. వాళ్లతో కలిసి పనిచేయడానికి ఇష్టపడతా. అలాగే డైరెక్టర్లు నాకు చాలా సన్నిహితం. తప్పకుండా మంచి పాత్రలను డిజైన్‌ చెయ్యమని వాళ్లను అడుగుతా. నాకు విలన్‌గా చెయ్యాలని ఉంది. అయితే జనం నన్ను యాక్సెప్ట్‌ చేస్తారో, నా కోసం డైరెక్టర్స్‌ విలన్‌ రోల్‌ సృష్టిస్తారో, లేదో.. నా చేతుల్లో లేదు. నాకు కావాల్సింది ఒకటి, వచ్చేది ఒకటి, తీసుకోవడం ఒకటి. ‘నాగమల్లి’లో గ్రే షేడ్స్‌లో ఉన్న పాత్ర చేశా. దాన్నెవరూ చూడలేదు. అందరికీ పని దొరకాలి నేనెప్పుడూ పని కోసం ఎదురు చూస్తుంటాను. ప్రతి ఒక్కరితో కలిసి పనిచెయ్యాలనుకుంటా. వాళ్లు ఏ రాషా్ట్రనికి సంబంధించిన వాళ్లనేది నేను పట్టించుకోను. నాకు తెలిసి తెలుగు ఫిల్మ్‌ ఇండసీ్ట్రని సెపరేట్‌ చెయ్యాలని ఎవరికీ లేదనుకుంటాను. నిజంగా ఎవరైనా కోరుకుంటే పెద్దలు కూర్చొని సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తాను. ఏదైనా విభజన అనేది ఎవరికీ ఇబ్బంది కలగకుండా, మృదువుగా జరగాలని కోరుకుంటా. ఇది వినోద పరిశ్రమ. అన్ని భాషా చిత్రాలను మన తెలుగువాళ్లు ఆదరిస్తుంటారు. హిందీ, తమిళ, మలయాళ సినిమాలెన్నో ఇక్కడ బిగ్గెస్ట్‌ హిట్స్‌ అయ్యాయి. అందరూ ఒకటిగా ఉంటే బాగుంటుందనేది నా అభిప్రాయం. విభజన జరిగినా అందరికీ పని దొరకాలి. ప్రతిభకు అవకాశం లభించాలి. ఏం జరుగుతుందో చూడాలి. యావరేజ్‌ స్ర్కిప్టులొస్తున్నాయి ‘మనం’ వంటి సబ్జెక్ట్‌ దొరకడం నాగ్‌ అదృష్టం. నాగేశ్వరరావుగారి చివరి సినిమా. ఆయనకు సరైన నివాళి. ఆ సినిమా రావడం నాకు ఆనందాన్నిచ్చింది. ఆ సబ్జెక్ట్‌ వాళ్లకి కరెక్ట్‌. ఆ సినిమాని చూస్తూ బాగా ఎంజాయ్‌ చేశాను. నాన్న, నేను, రానా కలిసి నటించాలంటే మంచి స్ర్కిప్ట్‌ దొరకాలి. అందరూ యావరేజ్‌ స్ర్కిప్టులు తెస్తుంటే ఎవరు చేస్తారు? మంచి స్ర్కిప్టులు మా వద్దకు రావట్లేదు. ‘రాధ’ చెయ్యట్లేదు ‘గోపాల గోపాల’ మొదటి షెడ్యూల్‌ పూర్తయింది. ‘దృశ్యం’ రిలీజ్‌కు రావడంతో దానికి కాస్త విరామం ఇచ్చాం. ప్రధాన పాత్ర దేవుని మీద కేసు వెయ్యడం అనేది ఆసక్తికరమైన పాయింట్‌. పవన్‌కల్యాణ్‌ ఈ నెలాఖరున షూటింగ్‌లో జాయినవుతారు. మొదట నా కేరక్టర్‌ వర్క్‌ మొదలైంది. మా మధ్య చాలా ఆసక్తికరమైన సన్నివేశాలుంటాయి. ఈ సినిమాని జనం కచ్చితంగా ఎంజాయ్‌ చేస్తారు. ఈ మధ్య ఓ పెద్ద సీన్‌ చేశాను. ఫెంటాస్టిక్‌ అనిపించింది. అద్భుతమైన డైలాగ్స్‌ ఉంటాయి. ఒరిజినల్‌ స్ర్కిప్టు (ఓఎంజి – ఓ మై గాడ్‌)లో మన నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేశారు. ‘రాధ’ సినిమా చెయ్యట్లేదు. కొత్తగా ఏ సినిమాకీ కమిట్‌ కాలేదు. స్ర్కిప్టులు వింటున్నా.

 

 

Posted in సినిమా | Tagged | Leave a comment

ప్రజలకోసమే పని చేసిన సమర్ధ ఐ .ఏ. ఎస్ .అధికారి శ్రీ పి.వి.ఆర్.కే .ప్రసాద్ -1

ప్రజలకోసమే  పని చేసిన సమర్ధ ఐ .ఏ. ఎస్ .అధికారి శ్రీ పి.వి.ఆర్.కే .ప్రసాద్ -1

‘’సమాజ శ్రేయస్సుకోసం పని చేయటం ,సంకల్పం లో స్వార్ధం లేనంత వరకు దైవ బలం తప్పక తోడుగా ఉంటుందని నమ్మి ,నిబ్బరం ,మనో ధైర్యం ,పనిలో విశ్వాసం ,అపారమైన సృజనాత్మకత అద్భుత ప్రజా సంబంధాలు ,ఓర్పు ,లౌక్యం ,తార్కిక వాదన ,కార్య నిర్వాహక సామర్ధ్యం ,ఉన్న ఐ ఏ ఎస్ అధికారి శ్రీ పి.వి.ఆర్.కే ప్రసాద్ .వివిధ విరుద్ధ స్వభావాలున్న ముఖ్యమంత్రుల వద్ద ను ,సాక్షాత్తు శ్రీ వారి ఆలయం తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయ కార్య నిర్వాహణాదికారిగా ,విశాఖ పోర్ట్ చైర్మన్ గా  ప్రధాన మంత్రి పి.వి గారి దగ్గర ,వివిధ హోదాలలో ప్రసాద్ పని చేశారు .అందరి వాడు అనిపించుకొన్నారు . సమర్ధత కు ప్రతి రూపం .నిస్వార్ధ సేవకు నిలువెత్తు రూపం .తన శ్రీవారి అనుభవాలను ‘’నాహం కర్తా –హరిహ్ కర్తా ‘’అని మొదటి పుస్తకం రాసిన సంగతి అందరికి తెలుసు .రెండేళ్ళ క్రితం ‘’అసలేం జరిగిందంటే –‘’పేరు తో రాసిన పుస్తకం లో ప్రజా సేవలో తన జీవితం ధన్య మైన సంఘటనలు పూస గ్రుచ్చినట్లు ఎక్కడో మొదలు పెట్టి గిరికాలు తిప్పుతూ ,సంఘటన పూర్వా పరాలను స్పృశిస్తూ ,తనకెదురైన సమస్యలను వివరిస్తూ ,వాటిని అధిగమించటానికి నిస్వార్ధం గా ప్రజా సంక్షేమమే ధ్యేయం గా పని చేశారు .నాలుగు వందలకు పైగా పేజీలున్న ఈ పుస్తకాన్ని  అయిదారు  రోజుల్లో ఆమూలాగ్రం చదివాను .అందులోనుంచి సంఘటనలకు మాత్రామే ప్రాధాన్యం ఇచ్చే విషయాలను ,నాకు నచ్చిన విషయాలను మీ అందరికోసం అందిస్తున్నాను .

శ్రీ ప్రసాద్ ఖమ్మం జిల్లా కలెక్టర్  గా జలగం వారు కావాలని వేయిన్చుకొన్నారు . శ్రీ జలగం వెంగళ రావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడుమూడున్నర ఏళ్ళు పని చేసి ఆ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేట్లు చేశారు .ముఖ్యమంత్రి ఈయనకు కావలసిన అధికారాలు డబ్బు అన్నీ అందించారు .వాటితో జిల్లా రూపురేఖలే మార్చేశారిద్దరూ .ఏ రాజకీయ నాయకుని క్రీనీడ పడకుండా జాగ్రత పడ్డారు .చివరికి వాళ్లకు కోపం వచ్చి ప్రసాద్ గారి దగ్గరకొచ్చి ‘’అయ్యా అన్నీ మీరిద్దరే చేస్తున్నారు  మా రాజకీయ నాయకులం ఎందుకూ పనికి రాకుండా పోతున్నాం .మీరు చేసిన అభివృద్ధి చాలు .ఇక మాకు పెత్తనం రాక పోతే ఓట్లు పడవు కనుక మీరు మీ కు కావాల్సిన చోటుకు బదిలే చేయించుకోండి ‘’అని చెప్పారు .ఇలాంటిస్పందన వస్తుందని ఆయన ఊహించలేక ముఖ్యమంత్రిని తన్ను హైదరాబాద్ ట్రాన్స్ ఫర్ చేయమని కోరారు .ఆయన  అఖండ  మేధావి .’’ప్రసాద్ మా వాళ్ళు ఏమైనా అన్నారా?’’అని కూపీ లాగి విషయం అర్ధమై హైదరబాద్ ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ కు బదిలీ చేశారు .

అక్కడ చేరిన మూడు నెలల్లోనే దివి సీమ ఉప్పెన వచ్చింది .వేలాది జనంచనిపోయాయి  ,వేలాది పశువులు చనిపోయాఇ . .నీళ్ళు అన్నీ కలుషితమయ్యాయి .తాగు నీరు లేక,అంటువ్యాధులు పెరిగే ప్రమాదం వచ్చింది . జలగం ఫోన్ చేసి ప్రసాద్ కు పూర్తీ అధికారాలిచ్చి దివి సీమకు పంపి పది రోజుల్లో ఎక్కడ వీలైతే అక్కడ రిగ్గులతో బోరు బావులు తవ్వించి భూ గర్భ జలాలను జనాలకు అంద జేయవలసిందని యెంత డబ్బు ఖర్చైనా పరవా లేదని  ఆర్డర్ జారీ చేశారు . అంతే ఆఘ మేఘాల మీద దివి సీమకు ప్రభుత్వ రిగ్గులు ,ప్రైవేట్ రిగ్గులను తెప్పించి డీజల్  డ్రమ్ములు  గాస్ లైట్లు ఇప్పించి ,స్థానిక ప్రజలను అగ్గి పుల్ల కూడా అడగ కుండా అన్నీ ఏర్పాటు చేసి ,పర్య వేక్షిస్తూ ,అత్యవసర కార్యక్రమంగా  మంచి  నీటి సరఫరాను భావించి అధికారులతో పని చేయించారు .మరమ్మత్తులకు మెకానిక్కులు ,టెంట్ లు వారి భోజన వసతి అన్నీ చూశారు .’’దెబ్బ తిన్న ప్రతి గ్రామానికి తాగునీరు ఇద్దాం .ఆకలి ,నిద్రకోసమే తప్ప మిగిలిన సమయ మంతా ఈ పనికే కేటా ఇంచండి మీ సామర్ధ్యం వలన కొన్ని వేల కుటుంబాలను నిల బెట్ట గలుగుతాం .’’అని కింది అధికారుల్ని ప్రోత్సహించి పంపారు .

ప్రసాద్ గారు అక్కడే ఉండి పర్య వేక్షిస్తూ ,ప్రతి రోజు జీపులో తిను బండారాలు డీజిల్ కాన్లు రిగ్గ్గులు పై చేస్తున్న గ్రామాలకు పంపించారు .ఎన్ని అడుగులు లోతుకు వెళ్ళినా నీరు పడనీ గ్రామాలకు  టాంకర్ల ద్వారా మంచి నీరు సప్ప్లై చేయించారు .రోజూ గ్రామలో నీటి సరఫరా ఆ తటాంకర్ల తోనే చేయించారు .చీకటి రాత్రులలో చుట్టూ శవాలమధ్య  వాటికంపు మధ్య ,చలిగాలిలో ,ఆ సిబ్బంది దాదాపు ఇరవై నాలుగు గంటలూ శ్రమించారు .వారికీ అంటూ రోగాలు సోకాయి ,విరేచనాలు పట్టుకున్నాయి .అయినా మొక్క వోని ధైర్యం తో సిబ్బంది పని చేసి పది రోజుల పనిని ఆరు రోజుల్లోనే సంతృప్తికరం గా పూర్తీ చేశారు .ఆ నాటి కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ వి ఎస్ రెడ్డి గారు సిబ్బందిలో ప్రతి ఒక్కరిని  ప్ర శం సించి అభినందించారు .తనకు ముఖ్య మంత్రి ఇచ్చిన పనిని సంతృప్తిగా దిగ్విజయం గా పూర్తీ చేసి ప్రసాద్ గారు ముఖ్యమంత్రిని కలిసి  వివరించారు .జలగం   ఆనందం  పట్టలేక ‘’రాజ కీయ ప్రయోజనాలకోసం నిన్ను ఖమ్మం జిల్లా నుంచి పంపించేశారు .కాని ఇప్పుడు దివి తాలూకాకి  నువ్వే అవసరం అయ్యావు ప్రసాద్ .ఇక్కడ నీ అవసరం ఉందనే నెమో ముందు చూపుగా నిన్ను మా జిల్లా వాళ్ళు వద్దని ఉంటారు ‘’అని మెచ్చుకొన్నారు ..

Product Details

 

 

రేపు తొలి ఏకాదశి –శుభాకాంక్షలు

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-7-14-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

డాక్టర్‌గా ఉండటమే బెస్ట్‌ అన్న కిమ్స్ హాస్పిటల్స్ అధిపతి

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రాషా్ట్రల్లో అతి పెద్ద ఆసుపత్రుల గ్రూపుల్లో కిమ్స్‌ ఒకటి. అతి కొద్ది కాలంలోనే అగ్రశ్రేణి ఆసుపత్రిగా ఎదిగిన కిమ్స్‌ సీఈఓ డాక్టర్‌ భాస్కరరావుతో ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ‘ ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’

ఆర్కే: వెల్‌కం టు ఓపెన్‌హార్ట్‌. నమస్కారం డాక్టర్‌ గారు భాస్కరరావు: నమస్కారం ఆర్కే: డాక్టర్‌గా పాపులర్‌గా అవటం, ఒక సంస్థను నడపటం వేర్వేరు అంశాలు. వీటిని మీరు ఎలా బ్యాలెన్స్‌ చేస్తున్నారు?

భాస్కరరావు: డాక్టర్‌గా వృత్తి ప్రారంభించినప్పుడు- పెద్ద డాక్టరు అవ్వాలి. ఎక్కువ సర్జరీలు చేయాలని ఉండేది. పెద్ద ఆసుపత్రి కట్టాలని నాకు మొదట లేదు. ఆ తర్వాత అనుకోకుండా ఆసుపత్రి స్థాపించాను.

ఆర్కే: డాక్టర్‌గానే మీకు సంతృప్తి ఎక్కువంటారు?

భాస్కరరావు: అవును. అడ్మినిసే్ట్రషన్‌ అనేది థాంక్‌లెస్‌ జాబ్‌. ఎవ్వరినీ సంతృప్తి పర్చలేం. పేషెంట్లు అయితే నూటికి 98 మందికి న్యాయం చేయగలం. అందుకే డాక్టర్‌గా ఉండటమే బెస్ట్‌!

ఆర్కే: ఇప్పుడు రోజుకు ఎన్ని ఆపరేషన్లు చేస్తున్నారు?

భాస్కరరావు: రెండు, మూడు ఆపరేషన్‌లు చేస్తున్నాను. రోజూ దాదాపు ఏడు గంటలపాటు సర్జరీల్లో బిజీగా ఉంటాను. నాలుగైదు గంటలు అడ్మినిసే్ట్రషన్‌ వ్యవహారాలు చూస్తాను. ఓ అరగంట హాస్పిటల్‌లో రౌండ్స్‌ వేస్తాను.

ఆర్కే: ఎన్ని వేల ఆపరేషన్‌లు చేశారు?

భాస్కరరావు: నేను సొంతంగా 16వేల ఆపరేషన్‌లు చేశాను. నేను ఇన్‌వాల్వ్‌ అయిన ఆపరేషన్‌లు స్టూడెంట్‌ లైఫ్‌నుంచి అసిస్ట్‌ చేసిన కేసులతో సహా 30వేలదాకా ఉంటాయి.

ఆర్కే: ఎలాంటి ఆపరేషన్లు చేసినప్పుడు తృప్తి అనిపిస్తుంది?

భాస్కరరావు: చిన్నపిల్లలకు సర్జరీలు చేయటం చాలా కష్టం. అలాంటివి చేసినప్పుడు తృప్తిగా అనిపిస్తుంది. కొన్ని ఎమర్జెన్సీలుంటాయి. ఆ టైమ్‌లో చేయకపోతే ప్రాణాపాయం ఉంటుంది. అలాంటి వారికి ఆపరేషన్‌లు చేసి వారు సక్సెస్‌పుల్‌గా ఇంటికెళ్లినపుడు చాలా సంతోషంగా ఉంటుంది.

ఆర్కే: కొందరు డాక్టర్లు కేసులను ఎందుకు రిజెక్ట్‌ చేస్తున్నారు? బతికినా బతకకపోయినా తన వద్దకు వచ్చిన వారిని కాదనకుండా చేయాలి కదా!

భాస్కరరావు: క్రిటికల్‌ కేసులను హ్యాండిల్‌ చేయాలంటే సర్జన్‌ ఒకడే సరిపోడు. ఒక వ్యవస్థ ఉండాలి. మానవ వనరులు ఉండాలి. మౌలిక సదుపాయాలు ఉండాలి. టెక్నాలజీ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు కేసు ఫెయిలయినా పేషెంట్లు అర్థం చేసుకుంటారు. లేకపోతే మనకు కూడా గిల్టీగానే ఉంటుంది.

ఆర్కే: హాస్పిటల్‌ సక్సెస్‌ రేటు దెబ్బతింటుందనే భయంతో క్రిటికల్‌ కేసులను పుచ్చుకోరనే అపవాదు కూడా ఉంది కదా! భాస్కరరావు: బాగా అనుభవమున్న సర్జన్‌ అయినా, మౌలిక సదుపాయాలు లేకపోతే రిజెక్ట్‌ చేస్తారు.

ఆర్కే: నీలోఫర్‌ హాస్పిటల్‌లో ఎక్కువ మంది పిల్లలు చనిపోతూ ఉంటారు. అందరూ తిరస్కరించిన కేసులను మా దగ్గరకు తీసుకువస్తారు.. వారు చనిపోతే మా అకౌంట్‌లో వేస్తారని వారు అంటూ ఉంటారు..

భాస్కరరావు: అవును. కార్పొరేట్‌ ఆసపత్రుల్లో ఖర్చును భరించలేనివారు ఉంటారు. వారు ప్రభుత్వ హాస్పిటల్స్‌కు వెళ్తారు. ఆపరేషన్‌ చేసిన తర్వాత గాడ్జెట్స్‌ అవసరం. సర్కారు ఆసుపత్రుల్లో ఆ టెక్నాలజీ లేదు.

ఆర్కే: కిమ్స్‌ పెట్టాలని ఎందుకు అనుకున్నారు?

భాస్కరరావు: నేను రంగరాయ ప్రభుత్వ వైద్యకళాశాలలో చదువుకున్నాను. ఆ తర్వాత ఆసే్ట్రలియా వెళ్లి వచ్చాను. వెల్లూరు హాస్పిటల్‌లో, నిమ్స్‌లో పనిచేశా. మనం ఎంత చేసినా ప్రభుత్వ సంస్థల్లో కొన్ని పరిమితులుంటాయి. అందువల్ల, ఉత్సాహం పోతుంది. వృత్తిలో ఇంకా రాణించాలంటే ప్రయివేటు ఆస్పత్రి పెట్టడం మంచిదని భావించాను. మా నాన్నగారు గుండె సమస్యతో మరణించారు. అందువల్ల ఆయన పేరిట నెల్లూరులో ఒక ఆసుపత్రి ప్రారంభించాను. హైదరాబాద్‌ నుంచి వారానికి ఓ రోజు వెళ్లి సర్జరీలు చేసేవాడిని. దానికి బాగా పేరు వచ్చింది. ఆ తర్వాత రాజమండ్రిలో పెట్టా. పది మంది స్నేహితులతో కలిసి కిమ్స్‌ ప్రారంభించాను. మొదట్లో 120 బెడ్స్‌ ఉండేవి. ఇప్పుడవి వెయ్యి బెడ్స్‌ అయ్యాయి.

ఆర్కే: మిగతా హాస్పిటల్స్‌తో పోలిస్తే మీ దగ్గర ఫీజు తక్కువ ఉంటుందా?

భాస్కరరావు: మా వద్ద 25 నుంచి 30 శాతం వరకు ఫీజులు తక్కువగా ఉంటాయి.

ఆర్కే: కార్పొరేట్‌ ఆసుపత్రులు రోగుల్ని పిప్పి పీల్చేస్తున్నాయనే అపవాదు ఉంది. దాని నుంచి మీరు బయటపడ్డారా?

భాస్కరరావు: కార్పొరేట్‌ హాస్పిటల్‌కు వెళితే దోపిడీ అనీ, అన్నీ అమ్మేసుకోవాల్సిందేననే నానుడి ఉంది. మా హాస్పిటల్‌లో అలా ఉండదు. నేను నెలకు అరవై లక్షల రూపాయల వరకు డిస్కౌంట్ల రూపంలో ఇస్తుంటాను. ఏమైనా ప్రజల్లో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ గురించిన చైతన్యం రావాల్సి ఉంది. మనం తాగే కప్పు కాఫీ ఖర్చు నెలకు 600 రూపాయలు. అంటే సంవత్సరానికి 7,200. ఇదే సొమ్ముతో ఒక కుటుంబానికి నాలుగు లక్షల రూపాయల వరకూ మెడిక్లెయిమ్‌ ఇన్సూరెన్స్‌ చేయించుకోవచ్చు. బైక్‌ కొంటే, ఇల్లు కడితే ఇన్స్యూరెన్స్‌ చేయిస్తాం. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ చెల్లించం. ఆరోగ్యం ఉచితంగా అందాలనే భావన బలంగా నాటుకుపోయింది.

ఆర్కే: ప్రస్తుతం ఉన్నవాటిలో బెస్ట్‌ మోడల్‌ ఏమిటి?

భాస్కరరావు: మునుముందు ఇన్స్యూరెన్స్‌ చేసుకోకపోతే సామాన్యులు బతకలేరు. అందువల్ల అందరూ ఇన్సూరెన్స్‌ కట్టాలి. ప్రభుత్వం వైపు నుంచి కూడా ఒత్తిడి ఉండాలి.

ఆర్కే: ఆరోగ్యశ్రీకి మోటివేషన్‌ మీరే కదా?

భాస్కరరావు: అవునండి. రాజశేఖర్‌రెడ్డి గారు నాకు పర్సనల్‌గా తెలుసు. అగర్వాల్‌ గారని హెల్త్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా ఉండేవారు. ఆయన పట్టుబట్టారు. నా దగ్గరకు మూడు సార్లు వచ్చారు. అలా పుట్టిందే ఆరోగ్యశ్రీ. అయితే కొందరు బాస్కరరావు కోసమే రాజశేఖర్‌రెడ్డి ఆరోగ్యశ్రీ పెట్టాడని ఆరోపణలు చేశారు. మన రాష్ట్రంలోని 2 కోట్ల 23 లక్షల కుటుంబాలకు- ప్రతి ఫ్యామిలీకి మూడువేల రూపాయల చొప్పున ఏడువేల కోట్ల రూపాయలు ఇన్స్యూరెన్స్‌ చెల్లిస్తే రోగులందరూ ఏ ఆసుపత్రికైనా వెళ్లి చికిత్స తీసుకోవచ్చునని సూచించాను. చాలా రాష్ట్రాల్లో ఈ పథకాన్ని అమలు చేశారు. అమెరికన్‌లు కూడా పరిశీలించి వెళ్లారు.

ఆర్కే: ఆరోగ్యశ్రీ వచ్చాక కొన్ని హాస్పిటల్స్‌ తాము చేయనివి కూడా చేశామని చెప్పి క్లెయిమ్స్‌ పెట్టుకొని డబ్బు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి అవి మీ దృష్టికి వచ్చాయా?

భాస్కరరావు: అవి అంత తీవ్రమైన ఆరోపణలు కాదండి. మిగతా గవర్నమెంటు పథకాలతో పోలిస్తే ఆరోగ్యశ్రీ పారదర్శకంగా సాగుతుంది.

ఆర్కే: మీ నేపథ్యమేమిటి? అసలు మెడిసిన్‌ చదవాలని ఎందుకనిపించింది?

భాస్కరరావు: నాది చాలా లోయర్‌ మిడిల్‌క్లాస్‌ ఫ్యామిలీ. ముగ్గురు బ్రదర్స్‌ము. ఇద్దరు సిస్టర్స్‌. మా మదర్‌కు పిల్లల్ని చదివించాలనే ఒక బలమైన కోరిక. మా ఊళ్లో 5వత తరగతి వరకే ఉంది. అందుకే మేమంతా మా మామయ్య వాళ్ల ఊరు బుచ్చిరెడ్డిపాలెంలో ఉండి చదువుకున్నాం. చదువు మాకు బాగా అబ్బింది. మా నాన్న గారు కూడా ఆర్థికంగా బాగా సపోర్టు చేసి చదివించారు. మా పెద్దన్నయ్య ఇంజనీరు అయ్యాడు. రెండో బ్రదర్‌ అగ్రికల్చర్‌ బిఎస్సీ. సెకండ్‌ బ్రదర్‌ మెడిసిన్‌ చేద్దామంటే రాలేదు. నేను మూడోవాడ్ని. అప్పటికే మా బ్రదర్‌ కృష్ణయ్య కాంట్రాక్టులు చేసి ఆర్థికంగా బలోపేతమయ్యారు. సపోర్టు ఆయన నుంచి మొదలైంది.! ఆయనకు గవర్నమెంటు జాబ్‌ వచ్చింది. అయితే గవర్నమెంటు జాబ్‌లో చేరితే కుటుంబాన్ని సజావుగా చూడలేరని చదువుకు పెట్టిన అప్పులు తీర్చలేమని, కాంట్రాక్టులు చేస్తూ, కుటుంబాన్ని పైకి తీసుకువచ్చారు. నన్ను డాక్టరును చేయాలని మా బ్రదర్‌కు కోరికగా ఉండేది. మేం ముగ్గురం చదువుకుంటే దాని విలువ తెలిసివచ్చింది. వందల ఎకరాల భూములున్నా ఆ విలువ రాదు.

ఆర్కే: ప్రాక్టీసు చేస్తున్న మీకు సర్పంచి అవ్వాలని ఎందుకనిపించింది?

భాస్కరరావు: పవర్‌ ముగ్గురి వద్ద ఉంటుంది. ఒకరు కలెక్టరు, రెండు సీఎం, మూడు పీఎం. దేశాన్ని మార్చాలనుకుంటే ఈ ముగ్గురికీ నిమిషం కూడా పట్టదు. అయితే, సర్పంచి అయ్యాక మనమేమీ చేయలేమని తెలిసొచ్చింది. రోడ్లు వేసినా, రక్షితనీటి పథకాన్ని నిర్మించినా ఆనందం లేదు. ప్రొఫెషన్‌ బెటరని డిసైడ్‌ అయ్యాను.

ఆర్కే: ఇప్పటికీ మీ అన్నదమ్ములు ముగ్గురూ ఉమ్మడిగానే ఉన్నారా?

భాస్కరరావు: కలిసే ఉన్నాం. ఈ రోజుకు కూడా మా మధ్య డిస్కషన్స్‌, ఆర్గ్యుమెంట్స్‌ జరుగుతుంటాయి. అయినా ఎక్కడా సమస్యలు తలెత్తవు. మా పెద్ద బ్రదర్‌ కృష్ణయ్య మమ్మల్ని చదివించి పెంచారు కాబట్టి ఆయనదే చివరి మాట. వివాదాలు ఎక్కువగా ఆడవాళ్ల దగ్గరి నుంచి వస్తాయి. కాని వారు మమ్మల్ని ప్రభావితం చేయలేక పోయారు. వారు కూడా మమ్మల్ని పట్టించుకోరు. వేర్వేరు ఇళ్లల్లో ఉన్నా ఏదైనా ఆయన చెప్పినట్లు వినాల్సిందే.

ఆర్కే: ఆస్తులన్నీ ఉమ్మడిగానే ఉన్నాయా?

భాస్కరరావు: ఆస్తులు ఎక్కడున్నాయి ఏంటీ అనేది మాక్కూడా తెలియదు. అంతా సంపాదించింది ఆయనే . మేమంతా ఖర్చుపెట్టడమే తప్ప ఎవరికి వారు సంపాదించుకోవటం, అది నాది, ఇది నాది అనే విభజన భావన లేనేలేదు. ఆర్కే: ఇంట్లో ఆడవాళ్లతో ఏమీ సమస్యలు రావా? మీది అరెంజడ్‌ మ్యారేజా ? లవ్‌ మ్యారేజా? భాస్కరరావు: మాది అరేంజ్డ్‌ మ్యారేజే. మా బ్రదర్స్‌ ఇద్దరూ బంఽధువులనే చేసుకున్నారు. అందరూ బిగినింగ్‌ నుంచి తె లుసు. నేనొక్కడినే బయటి సంబంధం చేసుకున్నాను. లక్కీగా అందరూ మంచివాళ్లే దొరికారు. అందరూ చాలా క్లోజ్‌గా ఉంటారు. అందుకే ఏ సమస్యలూ లేవు.

ఆర్కే: గురవారెడ్డి గారు మీరు తోడళ్లుళ్లు కదా ? మీరిద్దరికీ కంపాటబులిటీ బాగుంటుందా?

భాస్కరరావు: సొంతంగా పెట్టుకుంటే బాగుంటుందని వెళ్లిపోయి సన్‌షైన్‌ హాస్పిటల్‌ ప్రారంభించాడు. బాగా ఎదుగుతున్నాడు. ఫ్యామిలీ పరంగా కలిసే ఉంటాం.

ఆర్కే: మీ మిసెస్‌ భవనం వెంకట్రాం కూతురు కదా!

భాస్కరరావు: అవును. ఆయన సీఎంగా ఉన్నపుడు నా పెళ్లి అయింది. మాదాల జానకీరాం గారు సంబంధం తెచ్చారు. ఆయన మాకు బంధువు.ఆయనకు ముగ్గురు అల్లుళ్లు ఉన్నా నన్నే ఎక్కువగా ఇష్టపడే వారు.

ఆర్కే: ఇప్పుడు స్టేట్‌ డివైడ్‌ అయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ ఎట్లా ఉండబోతోంది. ఆంధ్రాలో ఎలా ఉంటుంది?

భాస్కరరావు: రెండింట్లోనూ బాగుంటుంది. మాకు ఇక్కడ 1000 బెడ్లు ఉన్నాయి. ఆంధ్రాలోనూ వెయ్యి పడకల హాస్పిటల్స్‌ ఉన్నాయి. కొత్తగా, గుంటూరులో గానీ, విజయవాడలో గానీ హాస్పిటల్‌ కట్టాలని చూస్తున్నాం. ఇప్పుడున్న హాస్పిటల్స్‌ను 300 బెడ్‌ల ఆసత్రిగా తీర్చిదిద్దుతాం. సీమాంధ్రలో అడ్వాన్సు పరికరాలతో ఆసుపత్రులను అభివృద్ధి చేయాలనుకుంటున్నాం.

ఆర్కే: మీకు పిల్లలు ఎంత మంది?

భాస్కరరావు: ఇద్దరు బాబులు. పెద్దబ్బాయి ఎంబీబీఎస్‌ చేశాడు. సూపర్‌స్పెషాలిటీ చే స్తానంటే నేనే అక్కర్లేదని హాస్పిటల్స్‌ చూసుకోమని చెప్పాను. రెండో అబ్బాయి బీబీఏ చదివి ఎంఎస్‌ ఫైనాన్స్‌ చేశాడు. ఫైనాన్స్‌ వ్యవహారాలు చూసుకోమని చెప్పాను.

ఆర్కే: నెక్ట్‌ ్స మీరు ఏం అచీవ్‌ చేయాలనుకుంటున్నారు.?

భాస్కరరావు: మెడికల్‌ ఫీల్డులో చేయాల్సింది చాలా ఉంది. నర్సింగ్‌ స్కూలు, ఫార్మసీ, ఫిజియోథెరపీల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్‌ ఇవ్వాలి. నర్సింగ్‌ కేర్‌ చాలా ముఖ్యమైనది. దాన్ని డెవలప్‌ చేయాలి. మెడికల్‌ ఎడ్యుకేషన్‌లో క్వాలిటీ తీసుకురావాలనేది నా సంకల్పం. శ్రీకాకుళంలో మెడికల్‌ కళాశాల తీసుకున్నాను. క్వాలిటీతో వైద్యసేవలు అందించాలని అనుకుంటున్నాను. మరో వందేళ్లపాటు హాస్పిటల్స్‌ను ముందుకు తీసుకువెళ్లేలా చూడాలనేది నా లక్ష్యం.

‘‘ రాజశేఖర్‌రెడ్డి గారు నాకు పర్సనల్‌గా తెలుసు. అగర్వాల్‌ గారని హెల్త్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా ఉండేవారు. ఆయన పట్టుబట్టారు. నా దగ్గరకు మూడు సార్లు వచ్చారు. అలా పుట్టిందే ఆరోగ్యశ్రీ. అయితే కొందరు బాస్కరరావు కోసమే రాజశేఖర్‌రెడ్డి ఆరోగ్యశ్రీ పెట్టాడని ఆరోపణలు చేశారు ’’

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పరిమితుల్ని దాటి చూసే వాస్తవికతే మార్మికత (వివిధ

నా ఉద్దేశ్యంలో ప్రేమని గురించిన నవల విప్లవాన్ని గురించిన నవల కంటే తక్కువేం కాదు. రచయితకున్న నిజమైన విప్లవాత్మక బాధ్యత ఏమిటంటే తను రాయాలనుకున్న వస్తువుని మరింత బాగా రాయటం

90ల తర్వాత తెలుగు సాహిత్య ప్రపంచంలో మాజికల్‌ రియలిజానికి మార్క్వెజ్‌ పర్యాయపదం అయ్యాడు. 1982లో నోబెల్‌ ప్రైజ్‌ తెచ్చిపెట్టిన ‘ఒన్‌ హండ్రెడ్‌ ఇయర్స్‌ ఆఫ్‌ సాలిట్యూడ్‌’ నవలలోని యునైటెడ్‌ ఫ్రూట్‌ కంపెనీ గ్లోబలైజేషన్‌కి ఉదాహరణగా మారింది. గ్రామీణ నేపథ్యం గల మన రచయితలు ఎక్కడో ఖండాంతరాల అవతల మకొండోలో తమ ఊరినీ, తమ ఊరిలో ఉర్సులా వంటి తల్లుల్నీ చూడగలిగారు. మొన్న తన మరణం తర్వాత వేలాది సామాన్య పాఠకులు, రచయితలతో పాటు, కొలంబియా అధ్యక్షుడు, అమెరికన్‌ ప్రెసిడెంట్‌ కూడా సంతాపం ప్రకటించారు. ఇంతగా ఖండాంతర నానా జాతుల సాహిత్య హృదయాలనీ ప్రపంచపు నలుమూలలా కొల్లగొట్టిన మార్క్వెజ్‌ దక్షిణ అమెరియా కొలంబియాలోని ఓ మారుమూల అరాచక రచయిత. తన నవయవ్వనంలో ఎలా రాయాలో తెలీక తబ్బిబ్బయిన మన తోటి తెలుగు కుర్ర రచయితలలాంటి వాడే అయినా, రాయటం కోసం బతికేందుకు దుర్భరమైన కష్టాలకు సిద్ధమవటం, తనదైన రచనా శిల్పాన్ని సాధించటం అందుకు దోహదపడ్డాయి. ఓ మామూలు కథ రాయడానికి 500కి పైగా కాగితాలు తగలేస్తాననే మార్క్వెజ్‌ అంటే, మన రచయితలకు షాక్‌ తగలక తప్పదు. 1983లో సహ రచయిత, తన మిత్రుడు కూడా అయిన మెండోజాకి ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో మార్క్వెజ్‌ అనేక విషయాలను ప్రస్తావించాడు. రష్యా, ఫ్రెంచి, చైనాల తర్వాత, ఇప్పుడు లాటిన్‌ అమెరికన్‌ సాహిత్యం మనల్ని వెంటాడబోతోంది గనుక, మార్క్వెజ్‌ మాటలని జాగ్రత్తగా విని వాటిని మనదైన వాస్తవికతలోంచి ఆలోచించటం, చర్చకు పెట్టటం తెలుగు సాహిత్యానికి తప్పనిసరి. అందులో ఇదొక ప్రయత్నం…

 నువ్వు అలా నవు్ముతావా?

– అవును. రచయిత తన జీవిత కాలంలో రాసేది ఒకే ఒక పుస్తకం అని నవు్ముతాను. అదెన్ని పేర్లయినా తగిలించుకోనీ, ఎన్ని సంపుటాల్లో అయినా రానీ. బాల్జాక్‌, కాన్రాడ్‌, మిల్‌విల్లే, కాఫ్కా ఎవర్నయినా తీసుకో. రాసేది ఒకే పుస్తకం. ఒక్కోసారి రాసిన వాటిలో ఒకదానికి బాగా పేరొచ్చిందనుకో, ఇక ఆ రచయిత ‘ఆ ఒకే ఒక పుస్తకం తాలూకూ రచయిత’గా చరిత్రలో మిగిలిపోతాడు. సెర్యాంటిస్‌ డాన్‌క్విక్సోట్‌ రచయిత. ఆయన రాసిన కథలు ఎవరికి గుర్తున్నాయి? గాటివూలా రచయిత మిగ్యుల్‌ ఏంజెల్‌ ఆసి్ట్రయాస్‌కి ‘ది ప్రెసిడెంట్‌’ నవలా రచయితగానే పేరు. కానీ అది అతని ‘లెజెండ్స్‌ ఆఫ్‌ గాటివూలా’ కంటే గొప్పదేం కాదు.

అలా అయితే, రచయిత ఒకే ఒక పుస్తకం కోసం జీవిస్తాడని అనుకుంటే, నీ సంగతేంటి? నీ ఒకే ఒక పుస్తకం ‘వుకోండో’ పుస్తకమేనా?(వూర్క్యెజ్‌ రచనల్లో తరచూ వచ్చే ఊరి పేరు వుకోండో)

– కాదు. నీకూ తెలుసు. Leaf Storm, One Hundered Years of Solitude ఈ రెండు నవలల్లో వూత్రమే వుకోండో వస్తుంది. మిగతా రచనల నేపథ్యం కొలంబియా తీరాన ఉండే ఒక వూరువుూల పట్నం. అక్కడికి రైలూ, రోడ్డూ ఉండవు. లాంచీలో ప్రయాణమే.

ఫ అయితే నీ ఒకే ఒక పుస్తకం…

– నా ఒకే ఒక పుస్తకం ఏకాంతం. ఏకాంత వాసానికి చెందిన వునిషి. Leaf Storm లో వుుఖ్యపాత్ర బతుకూ చావూ అంతా ఏకాంతంలోనే.No one writes to the colonel లో కల్నల్‌ ఎదురుచూస్తూ.. చూస్తూనే ఉంటాడు. ఎప్పటికీ రాని తన పెన్షన్‌ కోసం. In Evil Hour నవలలో మేయర్‌ కూడా ఏకాంత జీవి. అయితే అతనికిది ‘అధికారం వల్ల వచ్చిన ఏకాంతం.’

 ఏకాంతమే నీ అన్ని రచనలకీ వస్తువయితే దాని వుూలాలు ఎక్కడ నుంచీ వచ్చాయి? నీ బాల్యం నుంచా?

– అది నా ఒక్కడికి సంబంధించింది కాదు. అది అందరి సవుస్య. అయితే ఒక్కొక్కరు ఒక్కోలా దాన్ని ప్రకటించవచ్చు. ఏకాంత భావన చాలావుంది రచనలలోకి చొరబడింది. కొంతవుంది రచయితలకి తెలిసీ – ఇంకొందరికి తెలీక. నీ రచనల్లో కూడా. కాదా?

అవును. నేనూ రాశాను. నీ One Hundered Years of Solitude నవలకి బీజ రూపం నువ్వు ఎప్పుడో రాసిన Leaf Storm లో ఉంది. అప్పటి ఆ యువ వూర్క్వెజ్‌ గురించి ఇప్పుడు నువ్వే వునుకుంటున్నావు?

– జాలి పడతాను. ఎందుకంటే అతను నవలని త్వరత్వరగా వుుగించేశాడు. తను మొదటిసారీ చివరిసారీ రాసేది ఆ నవలే అనుకున్నాడు. అప్పటి తన ప్రపంచ జ్ఞానాన్నంతా – వుుఖ్యంగా తను అమెరికన్‌, యూరోపియన్‌ రచయితల నుంచి నేర్చుకున్న అన్ని మెళకువల్నీ, చవుక్కుల్నీ అందులో ప్రదర్శించాడు.

 ఆ నవల రాసినప్పుడు నీకు ఇరవై రెండేళ్లు. బారాంక్విలా లో ఉండి అందరూ వెళ్లిపోయాక పత్రికాఫీసులో తెల్లార్లూ కూర్చుని రాసుకునే వాడివి.

– అవును. నేనక్కడే ఓ హోటల్‌లో ఉండేవాడిని. అదో వేశ్యల అడ్డా. రూం అద్దె ఒకటిన్నర పెసోలు. ఓ కాలవ్‌ు రాస్తే వుూడు పెసోలు వచ్చేవి. సంపాదకీయం రాస్తే ఇంకో వుూడు. రూం అద్దె క్టటలేని రోజు నా Leaf Storm రాత ప్రతిని హోటల్‌ గువుస్తా దగ్గర తనఖా పెట్టేవాడిని. నేను ఆ కాగితాల కోసం తప్పక తిరిగి వస్తానని అతని నవ్ముకం.

 ఆ నవల అచ్చువేయటం కష్టవుయిందా?

– అవును. ప్రచురణకరర్త దొరకటానికే ఐదేళ్లు పట్టింది. ఓ అర్జెంటినా ఎడిటర్‌ అయితే నువ్వు రచనలు వూనేసి చేపలు పట్టుకోటం వుంచిదని పెద్ద ఉత్తరం రాశాడు.No Body Writes to the Colonel ని ఫ్రాన్స్‌లో గాలివూర్డ్‌ వాళ్లకి పంపాను. దాన్ని రెండో రోజే తిరగ్గొట్టారు.

 నీ రచనా పద్ధతిలో వచ్చిన తేడాల గురించి అడగాలి. Leaf Storm నవలకీOne Hundered Years of Solitude నవలకీ మధ్య రాసినWrites to the Colonel, In Evil Hour, Big Mama’s Funerel నవలల్లో నువ్వు హఠాత్తుగా వాస్తవిక పద్ధతిని ఆశ్రయించావు నీ వ్యూజిక్‌ని వదిలేసి. భాష సూటిగా, శిల్పం సాపుగా చాలా పరిమితుల్ని విధించుకున్నట్టు ఉంటుంది. ఎందుకనీ?

– Leaf Storm రాసినప్పటికి వాస్తవికతను కవితాత్మకంగా పాఠకులకి చేర్చేదే వుంచి నవల అనుకునేవాడిని. అది వచ్చిన కాలం- కొలంబియాలో రక్తసిక్త నిర్బంధం, తీవ్రమైన అణచి వేత అవులవుతున్న కాలం. ‘ఆ పాలకుల క్రూరత్వాన్ని నీ నవల బహిర్గతం చేయలేదు. ఖండించలేదు’ అని నా ‘మిలిటెంట్‌ మిత్రులు’ అనటం మొదలుపెట్టారు. దాంతో నేను ఒక అపరాధ భావనకి గురయ్యాను. అలాంటి భావాల్ని ఇవాళ ఒప్పుకోలేను. అవి సాహిత్యాన్ని తేలిక పరిచే పొరపాటు అభిప్రాయాలు. కానీ అప్పుడే వున్పించిందంటే- దేశం ఎదుర్కొంటున్న తక్షణ రాజకీయ సాంఘిక వాస్తవికతను ప్రతిబింబించటం రచయిత బాధ్యత అని. ఆ దశలో రాసినవే అలాంటివి. అయితే అదృష్టవశాత్తూ నేను త్వరలోనే ఆ దశను దాటి సాహిత్యం గురించిన నా పాత భావనలోకి తిరిగి వెళ్లాను. ఆ రచనలు కొలంబియా జీవన వాస్తవికతను యథాతథంగా ప్రతిబింబిస్తాయి. అవి రాయడం పొరపాటు అనీ అనుకోను. అయితే వాటిలో వాస్తవికతకు సంబంధించిన దూరదృష్టి లేకపోవటం కన్పిస్తుంది. అవి సూటిగా బల్ల గుద్ది నట్టు ఉంటాయి. అట్టే పరిపక్వం చెందని దశ అది. ఇంకో టేవుంటే ఆ రచనలన్నీ ‘చివరి పేజీతోనే ఖచ్చితంగా వుుగు స్తాయి.’ ఆ రచనా పద్ధతి ఇప్పుడయితే ఇరుకుగా అన్న్పిస్తుంది. అంతకంటే బాగా రాయగలనని అప్పటికే నాకు తెలుసు.

 నీలో ఆ మార్పుకి కారణం ఏమిటి?

– నా రచనల గురించి విశ్లేషించుకోవటం. చాలా కాలం ఆలోచించాక ఒక నిర్ధారణకి వచ్చాను. నేను చేయాల్సిన పని- ఇంకా పెద్ద పని- మిగిలి ఉందని అర్థమయింది. అదేమంటే నా దేశ రాజకీయ సాంఘిక వాస్తవికతను చెప్పటానికి మాత్ర మే నిబద్ధుడిననటం కాదు. అంతకంటే పెద్దదయిన ఈ ప్రపం చాన్నీ దాని వాస్తవికతనూ చెప్పటం. ఆ చెప్పటంలో కూడా నిస్పక్షపాతంగా ఉండటం, దేనివైపూ మొగ్గు చూపకపోవటం. అలా నా స్వానుభవం ద్వారా లాటిన్‌ అమెరికాలో నిబద్ధ సాహిత్యంగా చెలామణి అవుతున్న దాన్ని నేను అంగీకరించలేకపోయాను. అలాంటి సాహిత్య నిబద్ధతలో చాలా సమస్యలున్నాయి. అయితే వ్యక్తిగతంగా నేను రాజకీయ నిబద్ధుడిని. నా రాజకీయ నిబద్ధత నీకు తెలుసు.

 సోషలిజానికా…?

– అవును. నేను సోషలిస్టు ప్రపంచాన్ని కోరుకుంటున్నాను. ఆ సమసమాజం ఇవాళ కాకపోతే రేపు వస్తుందని నమ్ముతున్నాను. అయితే లాటిన్‌ అమెరికాలో నిబద్ధ సాహిత్యంగా పిలవబడుతున్న దానితో ఇంకా చెప్పాలంటే సామాజిక ప్రతిఘటనా నవలా ప్రక్రియతో నాకు విభేదాలున్నాయి. ఎందుకంటే దాని ప్రాపంచిక దృక్పథానికి పరిమితులున్నాయి. అందువల్ల అది తాను ఆశించిన రాజకీయ చర్యలకు ఉపయోగపడదు. సరికదా! అందుకు వ్యతిరేక ఫలితాన్నే ఇస్తోంది. ఎందుకంటే లాటిన్‌ అమెరికన్‌ ప్రజలు నిర్బంధం మీదా అన్యాయాల మీదా గురిపెట్టే నవలలని మించిన సాహిత్యాన్ని ఆశిస్తున్నారు. సాహిత్యం గురించిన వారి అంచనాలు మరింత పెద్దవి. ఎందుకంటే ఆ సమస్యల గురించి వారికి లోతుగా ముందే తెలుసు కాబట్టి. రచయితలు ఏమి రాయాలో రాయకూడదో నిర్దేశించటం ద్వారా రచయితల సృజనాత్మక శక్తికి బంధనాలు వేయటం అనే తప్పుని నా మిలిటెంట్‌ మిత్రులు తెలిసో తెలియకో చేస్తూ ఒక్కోసారి రియాక్షనరీగా కూడా వ్యవహరిస్తున్నారు. నా ఉద్దేశ్యంలో ప్రేమని గురించిన నవల విప్లవాన్ని గురించిన నవల కంటే తక్కువేం కాదు. రచయితకున్న నిజమైన విప్లవాత్మక బాధ్యత ఏమిటంటే తను రాయాలనుకున్న వస్తువుని ‘మరింత బాగా రాయటం’.

 తక్షణ రాజకీయ అవసరాల కోసం రాయటం ఆపావు. సరే,One Hundered Years of Solitude లాంటి వాటిలో మార్మిక వాస్తవికతా పద్ధతిని ఎలా సాధించావు?

– అలా కథ చెప్పే పద్ధతి మా అమ్మమ్మది. ఓ చిన్న మారుమూల పట్టణంలో ఆమె జీవితం గడిచింది. అక్కడ సమ్మకాలకీ మూఢనమ్మకాలకీ తేడా లేదు. వాళ్ల కథలూ కబుర్లూ ఎంత నమ్మశక్యంగా ఉంటాయంటే అవి వాళ్ల రోజువారీ చర్యల్లో భాగం. నేనా రచనా పద్ధతిని కొత్తగా కనుక్కోలేదు. దెయ్యాలూ, భూతాలూ, కల్పనలూ, చిత్రమయిన జబ్బులూ, మంత్ర వైద్యాలూ, మూఢనమ్మకాలూ మా లాటిన్‌ అమెరికన్‌ సమాజానికే ప్రత్యేకం. వాటినే నేను రచనల్లోకి తీసుకువచ్చాను.

భాష దగ్గరికి వద్దాం.One Hundered Years..నవలలో పదజాలం ఘాటుగా, సారవంతంగా, మెరుపుల్లాంటి విన్యాసాలతో నిండి ఉంటుంది. ఆ భాష నీ ఇతర పుస్తకాల్లో అట్టే కన్పించదు. ఎందుకని?

– ఇలా అంటే స్వాతిశయంగా ఉంటుందేమో కానీ ఆ స్థాయిలో నేనే నవలనయినా రాయగలను. కానీ వాటికి ఆ భాష అవసరం లేదు. అందుకే అవి వేరుగా ఉంటాయి.

 ఇదెలా ఉందంటే రచయిత రోజుకో చొక్కాని మార్చినట్లు, ప్రతి పుస్తకానికీ ఒక్కో రకమైన భాష వాడుకోవచ్చు అన్నట్లుంది. భాష రచయిత అస్తిత్వంలో ఒక భాగం కాదా?

– కాదు. రచయిత కాదు భాషని నిర్దేశించేది. వస్తువు తనకవసరమైన భాషను శిల్పాన్నీ ఎంచుకుంటుంది. అందుకే In EVIL Hourలాంటి నా రచనలు సూటిగా పత్రికా విలేఖరి పద్ధతిలో ఉంటాయి.One Hundered Years నవలకి శైలీ, శిల్పం సంపద్వంతంగా ఉండాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే అది కల్పనాత్మక ఇంద్రజాలిక వాస్తవికతను చిత్రించాలి కనుక- భాష కూడా అలానే ఉండాలి.

 ప్రపంచ సాహిత్య విమర్శకులంతాOne Hundered Years.. నవలని తిరుగులేని ఉత్తమ రచనగా పరిగణిస్తుంటారు. నువ్వు మాత్రం ఎక్కడా దాని గురించి గొప్పగా చెప్పుకోలేదు. అదంటే నీకంతగా ఇష్టం ఉన్నట్లు లేదు…

– అవును. ఇష్టం లేదు. అది నా జీవితాన్ని నాశనం చేసింది. అది అచ్చయ్యాక అంతకు ముందటి నా జీవితాన్ని కోల్పోయాను.

ఎలా?

– అది తెచ్చిన పేరు ప్రఖ్యాతులు. అవి వచ్చాక వాస్తవికతను గ్రహించే సున్నితత్వం పోతుంది. అధికారం చేజిక్కించుకోవటం వల్ల కూడా అదే జరుగుతుంది. దానికయ్యే ఖర్చు స్వంత జీవితాన్ని పణంగా పెట్టటం. అది అనుభవంలోకి వస్తే కానీ అర్థం కాదు.

 ఆ నవలకి దక్కిన బ్రహ్మాండమయిన విజయం న్యాయం కాదంటావు?

– అవును. న్యాయం కాదు. నా దృష్టిలో అది సాపుగా, సరళంగా, మెరుగులద్ది రాసిన నవల. సంక్లిష్టత లేదు. ఫ ఆ నవలని తిరస్కరిస్తున్నావా? – లేదు. కానీ లోకంలో ఉండే చమక్కులూ, అలంకారాలూ అన్నీ కలగలిపి అది రాస్తున్నప్పుడే నాకు తెలుసు.

ఏమని?

– అంతకంటే బాగా రాయగలనని. దాన్ని మించి రాయగలనని..

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కధా కమామీషు -17-

బ్రాహ్మణాల కధా కమామీషు -17-

గోపద బ్రాహ్మణం

అధర్వ వేదానికి చెందిన బ్రాహ్మణమే గోపద బ్రాహ్మణం అయినా అధర్వ సంహిత కు సాక్షాత్తుగా సంబంధం లేదు .యజ్న యాగాలతో బాటు ఇతరవిషయాలూ ఉన్నాయి .అధర్వ వేదం లో నిష్ణాతుడైన వాడే యజ్ఞాలలో బ్రహ్మ గా ఉండాలని ఇందులో చెప్ప బడింది .బ్రహ్మ విధులు ,ప్రాముఖ్యాన్ని గూర్చి ఇతర బ్రాహ్మణాలు చెప్పలేదు .కర్మ లోపం వల్లజరిగే పాపాలకు ప్రాయశ్చిత్తం ఉన్నది. రుత్విక్కులలో బ్రహ్మ కున్న ఉన్నత స్థానాన్ని వివ రిం చింది .

‘’ప్రాయశ్చి త్త రాను ధ్యానై రనుజ్ఞానాను మన్త్రనైహ్-హోమైశ్చ యజ్న విభ్రంశం సర్వం బ్రహ్మ ప్రపూరయేత్’’

ఇందులో నూరు ప్రపాఠకాలుఉండేవి అని  తెలుస్తోంది దిరికినవి కేవలం పదకొండే పతంజలి మహర్షి పేర్కొన్న అవయవ లక్షణం దీని లోనిదే .ఓంకార స్వరూపం ,ప్రతి వేదం బ్రహ్మ చర్యం ,గాయత్రీ మంత్రం రహస్యార్ధం తెలుసుకోవటానికి గోపద బ్రాహ్మణం ఏంతో ఉప యోగ పడుతుంది .

ఈ బ్రాహ్మణం  పూర్వభాగం ఉత్తర భాగం అని రెండుగావిభజింప బడింది .పూర్వం లో అయిదు ఉత్తరం లో ఆరు ప్రపాఠకాలున్నాయి .పూర్వ భాగం లో సృష్టి సముద్రాల పుట్టుక ,భ్రుగువు మహర్షి జననం  ,అధర్వ మహర్షి ఉత్పత్తి ,అధర్వ వేదావిర్భావం బ్రహ్మ సృష్టి ,ఓంకారోత్పత్తి ,గాయత్రీ మాహాత్మ్యం ,బ్రహ్మ చారి ధర్మాలు ,యాగాలలో బ్రహ్మ స్థానం ,దేవ యజనం ,బ్రహ్మోదనం ,ఆత్రేయ యజ్ఞం ,ఋత్విక్కుల అర్హత ,స్వాహా శబ్ద ఉత్పత్తి ,యజ్న దీక్ష ,వాటిల్లో వేదం మంత్రం వినిమయం ఉంటాయి .ఉత్తర భాగం లో యజమాని ,అతిధులు ,నక్షత్రోత్పత్తి ,చాతుర్మాస్య యాగాలు  ,,దేవాసుర యుద్ధం ,అగ్నీధ్ర నియమానం ,వషట్కార విశేషాలు ,దక్షిణ ,ఉక్త దేవతలు షోడశి నిర్వచనం ,శర్వం ,వాజపేయ ప్రశంస ,ఆప్తార్యామ ప్రశంస ,సంపాత మంత్రోత్పత్తి ,అహీన యాగ విశిష్టత ,మొదలైనవి చెప్ప బడ్డాయి .ఈ బ్రాహ్మణం గుజరాత్ ప్రాంతం లో ఏర్పడిందని క్రీ పూ అయిదవ శతాబ్ది ది అని తెలుస్తోంది .దీనికెవరూ వ్యాఖ్యానం రాసినట్లు లేదు

యజ్ఞం లో పాల్గొనే రుత్విక్కులలో బ్రహ్మ ప్రధానమైన వాడు .ఆయన అధర్వ వేదాం లో నిష్ణాతుడై ఉండాలి .యజ్న యాగాలలో జరిగేలోపాలకు బ్రహ్మ గారు చేయాల్సిన ప్రాయస్చిత్తాలు  చెప్పారు.ఇందులో యజ్నక్రమ వైశిష్ట్యాన్ని బాగా తెలియ జేశారు .అగ్న్యా దేయం కంటే పూర్ణాహుతి ,దానికన్నా హోమం ,అంతకంటే దర్శ పూర్ణ మాసాలు ,వాటి కంటే ఆ  ఆగ్రయణం  ,దానికంటే చాతుర్మాస్యలు ,వాటికంటే పశు బంధం ,దానికన్నా అగ్ని స్టోమం , అంతకంటే రాజ సూయం ,దానికన్నా వాజ పేయం ,అంతకంటే అశ్వ మేధం ,దానికన్నా పురుష మేధం ,అంతకంటే సర్వ మేధం ,దానికన్నా దక్షిణా వంతాలు ,వాటికంటే దక్షిణలు , అదక్షినలు ,సహస్ర దక్షిణం ఉత్తమ మైనవని తెలియ జేయ బడిందిం . పురుషునికి సంవత్సరానికి పోలికలను మహా ఆశ్చర్యం గా చెప్పారు .దీనితోనే ఈ బ్రాహ్మణానికి ప్రాముఖ్యత పెరిగింది .

ప్రపంచ సృష్టి

ఏ వేదం లోనూ  లేనంత గొప్పగా సృష్టి గురించి గోపధం తెలియ జేసింది .మొదట్లో పరబ్రహ్మ ఒకడే ఉండేవాడు .తనలాంటి మరో దైవాన్ని సృష్టించాలని తపస్సు చేసి తన దేహం లో వేడి పుట్టించి ఫాల భాగం నుండి చెమట కార్చాడు .ఈ స్వేదానికే సువేదం అనీ పేరు .అంటే బాగా జ్ఞానం కలిగింది అని అర్ధం .దీనివల్ల  సమస్తమూ ఆయనకు అవగతమవుతుంది .మరింత తపస్సు చేశాడు .రోమ కూపాలనుంచి స్వేదం ధారలుగా ప్రవహించింది .ఆ దారాలతో ప్రపంచ సృష్టి చేసి ,సృష్టిని ధరించి పాలించాలనుకొన్నాడు .వెంటనే స్వేద ధారలలోకి తొంగి చూశాడు .తన ప్రతి బింబం కనిపించింది .ఆయన రేతస్సు ఆ స్వేదం లో జారి పడింది .స్వేదం లో వేడి పుట్టించి దాన్ని రెండు భాగాలుగా చేశాడు ..అందులో ఒకటి తాగటానికి వీలు లేని ఉప్పు సముద్రం ,మరొకటి తియ్యని నీరు ఏర్పడ్డాయి .ఈ తీయని  నీటిలో వేడి పుట్టించాడు .అంతకు ముందే అందులో పడిన రేతస్సు ఎండిపోయి దాని నుంచి భ్రుగువు అనే రుషి జన్మించాడు .వెంటనే పరబ్రహ్మ అదృశ్యమైనాడు .

భ్రుగువు పరబ్రహ్మను వెతక టానికి అన్ని దిక్కులూ వెతికాడు .తూర్పులో వాయువు ,దక్షిణం లో మాత రిశ్వ ,,పడమర లో పవమానం ,ఉత్తరం లో వాతం అని అశరీర వాణి పలికి కింద నీటిలో చూడమన్నది .చూడగా నోటి నుండి అదర్వుడు అనే రుషి పుట్టాడు .కింద నుంచి పుట్టాడు కనుక అదర్వుడు అనే పేరు .ఆయన దేహం బ్రహ్మ దేహం లాగా తేజో వంతం గా ఉంది .ఆయనే సృష్టికార్యం జరిపే ప్రజా పతి .పర బ్రహ్మ అధర్వుని దేహాన్ని తపింపజేసి  వేడేక్కించటం వలన ఆయన దేహం నుండి  ఏకర్చ ,ద్వార్చ్య ,త్ర్యర్చ,చతుర్చపంచర్చ ,షడర్చ ,సప్తార్చ ,అస్టర్చ ,నవర్చ ,దశర్చ అనే పది మంది ఆదర్వణ ఋషులు జన్మించారు .వీరి నుంచి ఏకాదశర స్చ ,ద్వాదశర్చ ,త్రయోదశర్చ , చతుర్దశర్చ,పంచ దశర్చ ,షోడశార్చ ,సప్త దశర్చ ,త్రయోదశార్చ ,చతుర్ధశార్చ ,పంచాదశార్చ ,షోడశార్చ ,సప్త దశర్చ ,అష్ట దశర్చ ,ఎకోనవవిమ్షర్చ , విమ్శారస్చ  అనే పది మంది అధర్వ ఋషులు తిరిగి పుట్టారు .అధర్వణుడు ,అధర్వ ఋషులు దర్శించిన మంత్రాలకే అధర్వ వ్రేదం అని పేరు .దీని నుండి ఓంకారం పుట్టింది .

పరబ్రహ్మం నుండి భూమి ,అంతరిక్షం ,స్వర్గ అనే మూడు లోకాలు పుట్టాయి .ఆయన పాదం నుండి భూమిని ,ఉదరం నుండి అంతరిక్షాన్ని ,తలనుండి స్వర్గాన్ని సృష్టించాడు .భూమి  నుండి  అగ్ని ,అంతరిక్షం నుండి వాయువు ,స్వర్గం నుండి ఆదిత్యుడు లను సృష్టించాడు .అగ్ని వలన ఋగ్వేదం ,వాయువు నుండి యజుర్వేదం ,ఆదిత్యుని నుండి సామ వేదం ,వెలశాయి .ఋగ్వేదం నుండి    భూహ్ అనే వ్యాహృతి ,యజుస్సు నుండి భువః ,సామం నుండి సవః అనే వ్యాహృతులు పుట్టాయి .

ఉప్పు నీటి నుండి సముద్రం ,అన్ని వైపులకు వ్యాపించి తమకు ఒక దేవు డిని మ్మని ప్రార్ధిస్తే ,వరుణుడు అధి దేవత అయ్యాడు .వరుణుడి నుండి ముచ్యుడు ,పుట్టాడు ఇతనే మృత్యు దేవత .ఇతని దేహం నుండి రసాలు కారాయి.రసాల నుండి పుట్టిన వారే అంగీరస ఋషులు .ఇలా అధర్వాన్గీరసులు భ్రుగ్వాన్గీరస ఋషులు జన్మించారు .అంగీరసులు దర్శించినదే అంగీరస వేదం .దీని నుండి జనత్ అనే వ్యాహృతి పుట్టింది .పరబ్రహ్మ తూర్పు దిక్కు నుంచి సర్ప వేదాన్ని ,దక్షిణ దిక్కు నుండి పిశాచ వేదాన్ని ,పశ్చిమం నుంచి అసుర వేదాన్ని ,ఉత్తరం నుండి ఇతిహాస వేదాన్ని ,ఊర్ధ్వ ,అదో దిక్కుల నుండి పురాణ వేదాన్ని సృష్టించాడు .సర్ప వేదం నుండి ‘’వ్రుధాత్ ‘’,పిశాచ వేదం నుండి కారత్ ,అసుర వేదం నుండి గుహన్ ఇతిహాస వేదం నుండి మహాత్ ,పురాణ వేదం నుండి తత్ అనే వ్యాహృతులను సృష్టించాడు .తర్వాత చంద్రుడు ,గ్రహాలూ ,వృక్షాలు మొదలైనవి సృష్టించాడు .

పిమ్మట పర బ్రహ్మ ఒక యజ్ఞాన్ని చేసి దానిలో అగ్ని ని హోత గా ,వాయువు అధ్వర్యుగా ,సూర్యుని ఉద్గాత గా ,చంద్రున్ని బ్రాహ్మ గా ,పర్జన్యుడిని సదస్యునిగా ,ఓషధులు ,వృక్షాలు  చమస్సులు (గరిట లాంటిది )గాను ,విశ్వేదేవతలను హోత గాను ,అధర్వాన్గీరాసులు గోప్తలుగాను నియమించాడు .గోప్తలు యజ్ఞం లో జరిగే లోపాలను సవరిస్తారు .ఇలా అధర్వ వేదం ,దాని ప్రాముఖ్యత ,అధర్వామ్గీరాసుల ప్రాశస్త్యం విశిష్టం గా గోపద బ్రాహ్మణం లో వివరించ బడింది .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-7-14 –ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

13th July Invitation

Top

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

రైలు ప్రయాణం లో తారసపడ్డ రాజనీతిజ్ఞులు – రీడేర్స్ డైజెస్ట్ -లీన శర్మ – తెలుగు అనువాదం -గబ్బిట కృష్ణమోహన్

Attached a copy of the article that appeared in Reader’sscan0001 Digest July 2014 and its Telugu translation for wide publicity రైలు ప్రయాణం  లో తారసపడ్డ రాజనీతిజ్ఞులు   – రీడేర్స్ డైజెస్ట్  -లీన శర్మ  – తెలుగు అనువాదం -గబ్బిట  కృష్ణమోహన్
0001 0002 0003 0004
Posted in రచనలు | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కధా కమామీషు -16

బ్రాహ్మణాల కధా కమామీషు -16

ఉప బ్రాహ్మణాలు -2

తపస్సు అంటే ఇంద్రియాలను అదుపులో పెట్టుకొనే ముఖ్య  సాధనం  అని అందులో మూడు రకాలున్నాయని చెప్పుకొన్నాం .ఇప్పుడు వాటి వివరాలను తెలుసుకొందాం .

క్రుచ్చ్రం

మూడు రోజులు పగటి పూట మాత్రమె సాత్వికాహారం తింటూ ,తరువాత మూడు రోజులు రాత్రిమాత్రమే భోజనం చేస్తూ ,మరో మూడు రోజులు ప్రయత్నం చేయకుండా దొరికిందే తింటూ ,చివరి మూడు రోజులు పూర్తిగా ఉపవాసం చేయాలి .ఇలా పన్నెండు రోజులు దీక్షగా  చేస్తూ , వెంటనే ఫలితం రావాలంటే పగలంతా నిల్చునే ఉండాలి .రాత్రిళ్ళు కూర్చునే ఉండాలి .సత్యం మాత్రమే మాట్లాడాలి .చెడు సాంగత్యం పనికి రాదు .’’రౌరవం ‘’,’’యౌదాజయం ‘’అనే సామలను గానం చేస్తూ ఉండాలి .చివరికి దేవతా తర్పణం మొదలైనవి చేసి ,దేవతలకు నైవేద్యం పెట్టి తినాలి .ఈ పన్నెండు రోజుల తపస్సును ‘’క్రుచ్చ్రం ‘’అంటారు .

అతి క్రుచ్చ్రం

పైన చెప్పిన నియమాలన్నిటిని పాటిస్తూ ,కుడి చేతిలో పట్టినంత అన్నాన్ని మాత్రమె రోజుకు ఒక సారి తినాలి .అదే అతి క్రుచ్చ్రం .

క్రుచ్చ్రాతి క్రుచ్చ్రం

ఈ రెంటికి మించిన ఘోర తపస్సు .పన్నెండు రోజులూ నీటిలోనే ఉండాలి .మిగిలిన నియమాలన్నీ పై మాదిరే .ఈ మూడు తపస్సులు చేస్తే పాపాలు నశిస్తాయి

ప్రాయశ్చిత్తాలు

.శాస్త్రం చెప్పినట్లు చేయక పోవటం ,నిషేధించిన పనులు చేయటం ,సమాజానికి హాని కలిగేవి చేయటం పాపాలు అని పించుకొంటాయి .పాపాలకు చేసే ప్రతీకారమే ప్రాయశ్చిత్తం .అనేక రకాల పాపాలకు వాటికి తగిన ప్రాయశ్చిత్త విధులున్నాయి .ఉదాహరణకు –అశ్లీలం లేక బూతు మాట్లాడితే ‘’దదిక్రా వ్ణో అకార్షం ‘’మొదలైన సామలను గానం చేయాలి .ఎవరినైనా దూషిస్తే ప్రాయశ్చిత్తం గా ‘’ఇదం విశ్నుర్వి చక్రమే ‘’సామను చదవాలి .తలిదండ్రులను గురువును దూషించిన పాపం పోవటానికి ‘’తమాహం సోమ రారణ ‘’సామ చదవాలి .ఇలా ఎన్నో ఉన్నాయి .

కామ్య కర్మలు

ఆయుర్దాయం పెరగటానికి ‘’తు చే తునాయ ‘’మొదలైన సామలతో తెల్ల ఆవాలను మంత్రించి ప్రతి రోజూ తినాలి. చిన్న చిన్న రోగాలకు ‘’శం నొ దేవీ రభీస్టయే ‘’సామతో నేతిని మంత్రించి రోజూ శరీరానికి రాసుకోవాలి .సర్ప భయం లేకుండా చేసుకోవటానికి శంఖ పుష్పి ,సర్ప గంధ లను నూరి గుళిక చేసి దగ్గరుంచుకొని ‘’చర్శానీ ద్రుతం ‘’ సామ తో  మూడు సార్లు అగ్నిలో హోమం చేయాలి .అప్పుడు ఆ  గుళికను మెడలో కట్టుకోవాలి. విషం తిన్నా హాని చేయకుండా ఉండటానికి ‘’త్వమిమీ ఓషధీ ‘’సామను రోజూ గానం చేయాలి .ముసలితనం మృత్యువు రాకుండా దుంపలు పండ్లూ తింటూ ,జింక తోలు ధరించి మౌనం గా నెల రోజులు అడవిలో ఉండి పుష్య పూర్ణిమ నాడు  ‘’ఉద్వయంత మసస్పరి ‘’అనే సామ తో సూర్యుడిని పూజించాలి .ఇలా నాలుగేళ్ళు చేస్తే జరా మ్రుత్యువులు దూరం .

దేవతాధ్యయన బ్రాహ్మణం

అగ్ని ,ఇంద్రుడు ,ప్రజాపతి ,సోముడు ,వరుణుడు ,త్వష్ట ,అంగిరసుడు ,పూషా ,సరస్వతి ,ఇంద్రాగ్నులు కలిసి పది మంది సామ గానానికి అది దేవతలు .కాలేయం రౌరవం మహోత్సవం మొదలైన సామలకు దేవత అగ్ని .వామ దేవ్యం ,సామకు ప్రజాపతి దేవత .ఔశన కావం అనే సామకు సోముడు దేవత .యజ్న యజ్నీయం కు వరుణుడు,వార వంతీయం ,ఆభీవర్తనం సామలకు త్వస్ట దేవతలు .స్వ్హ ప్రుస్టా అనే సామకు అంగిరసుడు ,కౌశీతం ,దైవోదానం మొదలైన వాటికి పూషా దేవతలు .కొన్నిటికి సరస్వతి మరికొన్నిటికి ఇంద్రాగ్నులు దేవతలు .మిగిలిన సామలన్నిటికీ ఇంద్రుడే దేవత .వసువులు ,రుద్రులు ,ఆదిత్యులు విశ్వే దేవులు అనే నలుగురు సామ దేవతలు .ఇంద్రాగ్ని ప్రజాపతులు దేవతలు ఇంకా కుదిస్తే ‘’బ్రహ్మ ‘’ఒక్కడే సామ లన్నిటికీ దేవత

రుక్కు ను తల్లి అని ,గానాన్ని తండ్రి అని ,స్వరాన్ని ప్రజాపతి అంటారు .గాయత్రి అన్నా సావిత్రి అన్నా ఒక్కటే .

సంహితో పనిషత్ బ్రాహ్మణం

సామ గాన రహస్యాలను తెలియ జెప్పేది ఈ బ్రాహ్మణం .అధ్యయనం గురు శిష్య సంబంధం ,ధర్మ శాస్త్ర విషయాలు చెప్ప బడ్డాయి .మందరం మాధ్యమం తార అనే స్థాయీ భేదాన్ని బట్టి గానం మూడు రకాలు .వీటికి దేవ సంహిత ,అసుర సంహిత ,రుషి సంహిత మొదలైన సాంకేతిక పదాలనుప యోగించారు .ఆయా గాన ఫలితాలూ చెప్ప బడ్డాయి .గానం చేసేటప్పుడు మూల మంత్రాలలో వచ్చే మార్పులను అంటే ఉన్న అక్షరాలూ జారిపోవటం కొత్తవి చేరటం ‘’హో ,హోఇ.,తాఇ’’మొదలైన విచిత్ర ధ్వనులు ,ద్రుతం విలంబితం మొదలైన వృత్తులు ,స్వర ప్రస్తార విషయాలు ఉన్నాయి. గాన ప్రభావం వలన మూల సాహిత్యం లో కలిగే అనేక మార్పులను సామ వేదమే నాంది పలికింది

స్వాధ్యయనం ఏరోజు మాన రాదనీ సామ జపం వలన యజ్న యాగాలు చేసిన ఫలితం వస్తుందని ప్రోత్సహించింది .

వంశ బ్రాహ్మణం

సామగాన ఋషుల పరంపర ఇందులో ఉంది .’’బ్రహ్మకు ,ఆచార్యులకు ఋషులకు సకల దేవతలకు నమస్కారం ‘’అనే మాటతో ఇది ప్రారంభ మౌతుంది .మిత్ర వర్చాసుడు ,బ్రహ్మ వృద్ధి ,గిరి శర్మ ,నిగడుడు ,త్రాతుడు ,రుద్ర భూతి మొదలైన అరవై మంది సామ గురువుల గురించి వారి గోత్రాల గురించి పేర్కొన బడింది .అందరికీ మొదటి గురువు ‘’బ్రహ్మ ‘’మాత్రమె అన్నారు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-7-14-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వెండి తెర బంగారం కుమారి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment