రా’’చ’’ కీయ ద్విప్లేట్స్ -9

   రా’’చ’’ కీయ ద్విప్లేట్స్ -9

1-అశోకుడి పరాజయం

   కిరణుడి నిష్క్రమణం .

2-కే.సి.ఆర్ .దే ఘన విజయం

 అనుకొన్నది సాధించిన వైనం .

3-రెండు కళ్ళు పోయే నారాయణా

 కుళ్ళబొడి చారయ్య నారాయణా.

4- కమలం లో రేకుల మధ్య వైరం

   భలేగా సృష్టించి చేరింది బిల్లు తీరం  .

5- ఆంధ్రులు ఆరంభ శూరులు

  అని మళ్ళీ రుజూ చేసిన భీరులు .

6-అన్నీ అమ్మ ఇష్టం అని జుట్టు చేతికిచ్చి బీరాలు పోయి

 ఇప్పుడేడిస్తే ఏముంది ముందు  నూయి వెనక గోయి .

7-తెలిసీ తెలియని తొలి ప్రసంగం

 చేసి ‘’చిరు’’ చిన్న బోయాడు అంతా గరం గరం .

8-ఎవరిచ్చారో ఎవరు తీసుకొన్నారో’’ మూటలు ‘’

 ఆరోపణలతో కోట(కోట్లు)లు దాటాయి మాటలు .

9-ఈ ఆవేశం ముందు నుంచీ ఉంటే వెంకయ్యా !

 ఇంతదాకా ముంచు కోచ్చేది కాదు కదరా అయ్యా ..

10-పెద్దమ్మా చిన్నమ్మా  కూడ బలుక్కుని  ఒక్కటయ్యారు

   సీమాంద్రు మునిగిపోయామని  లబో దిబో మంటున్నారు .

11-అయిదు రోజులు నుంచొని ప్లకార్డు చూపించాడు కే .వి.పి.

 పాపం సొమ్మసిల్లి పడిపోయినా ఎవరూ చూపలేదు’’ పిటీ’’

12-ఇరవై తొమ్మిదో రాష్ట్రం ఎవరికి ఆమోదం మోదం ?

  ఈ పరంపర  ఆగక  అరవై  తొమ్మిదయి ఇస్తుందా ఖేదం ?

13-తెల్లోళ్ళ విభజించు –పాలించు కు మళ్ళీ విజయమా ?

  ఇన్నేళ్ళ స్వతంత్ర వృక్షం  కాసిన చేదు ఫలమా  లేక పరిహాసమా  ?

14-విభజించటం మాట ఏమో కాని’’ భజించటమే’’ ఉభయ సభల్లోనూ జరిగింది

  రాజ్యాంగం పట్టపగలు  నిలువునా  ‘’రేప్’’ చెయ్య బడిందనే ఆరోపణ మాత్రం మిగిలింది .

15-తెలుగు జాతి మళ్ళీ అయింది రెండు  రాష్ట్రాలు

   నాయకులయ్యారు ఇసుకలో తల దూర్చిన ఉస్ట్రాలు .

16-మనుషులు విడిపోయినా కలిసి ఉండాలి మనసులు

 ఇరువైపులా అభి వృద్ధి చెందితేనే తేలికవుతాయి  మనసులు .

17-ఇప్పటిదాకా కాట్ల కుక్కల్లావీధిన పడి కాట్లాడు కౌన్నాం .

 అన్నీ మరిచి పోట్ల గిత్తల్లా ముందు కెడదాం అనుకొందాం .

18-ఎక్కడున్నా ఉండాలి తెలుగు జాతి సజీవం

 అన్నదమ్ముల ఐక్యతే ఆంద్ర జాతికి జవం జీవం .

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభా కాంక్షల తో

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-2-14-ఉయ్యూరు 

Posted in రాజకీయం | Tagged | Leave a comment

రావూరి భరద్వాజ పై అమరావాణి హైస్కూల్ విద్యార్ధులకు అవగాహన సభ -సరసభరతి 59 వ సమావేశం -22-2-14- శనివారం -ఉదయం -11గం లకు

21-2-14ప్రపంచ  మాత్రు భాషా దినోత్సవ శుభా కాంక్షల తో -దుర్గా ప్రసాద్ 

                                అక్షరం లోక రక్షకం

సరసభారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు

జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత స్వర్గీయ రావూరి భరద్వాజ గారిపై అవగాహన సభ

వేదిక –శ్రీ అమరవాణి హైస్కూల్ –ఉయ్యూరు –కాకాని నగర్

తేది ,సమయం –22-2-2014-శనివారం ఉదయం -11గం లకు

విషయం –జ్ఞానపీఠ పురస్కార గ్రహీత స్వర్గీయ రావూరి భరద్వాజ జీవితం –రచనలు

సభాధ్యక్షులు –శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు

సభా నిర్వహణ ,అఆతిధ్యం –శ్రీ పి.వి.నాగ రాజు –ప్రిన్సిపల్ –అమరవాణి హైస్కూల్

ముఖ్య అతిధి –శ్రీమతి మందరపు హైమవతి –ప్రముఖ కవి, కదా రచయిత ,విమార్శ కురాలు

ఆత్మీయ అతిధి –శ్రీ కే .ఆంజనేయ కుమార్ –ప్రసిద్ధ కవి ,విమర్శకులు

సాహిత్యాన్ని సమాజం లోని అందరికి అందజేయాలనే తలంపు తో ఏర్పడిన సరసభారతి- విద్యార్ధులకు  రావూరి భరద్వాజ గారి ఆదర్శ జీవితం ,వారి ప్రముఖ రచనలు ,పొందిన పురస్కారాల పై  విద్యార్ధులకు అవగాహన కల్పించటానికి ఏర్పాటు చేసిన ఈ సభకు సాహిత్యాభిమానులందరూ ఆహ్వానితులే .విచ్చేసి ,పాల్గొని జయ ప్రదం చేయ ప్రార్ధన .

జోశ్యుల శ్యామల            మాదిరాజు శివలక్ష్మి   గబ్బిట వెంకట రమణ                    గబ్బిట దుర్గా ప్రసాద్

గౌరవాధ్యక్షులు                  కార్య దర్శి             కోశాధికారి                             అధ్యక్షులు –సరసభారతి

                                                                                                  9989066375,08676-232797

అమరవాణి ప్రిన్సిపాల్ శ్రీ నాగ రాజు –ఫోన్ -9440636357                    

తెలుగులో మాట్లాడటం మన జన్మ హక్కు                   ,

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

దొరసాని -దాసీ ఇద్దరూ సున్నాలే

 

ఒకప్పుడు ఆంధ్రదేశంలో విజయనగరం తర్వాత వెంకటగిరి అతి పెద్ద జమీందారి. 1900 సంవత్సరం నాటికి ఈ జమీందారి రాబడి సాలుకు 15 లక్షల రూపాయలంటే అది ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. ఈ జమీందారీని వెలుగోటి వంశస్తులు దాదాపు మూడు శతాబ్దాలు పాలించారు. ఆ సమయంలో ఈ జమీందారీలో అనేక మార్పులు వచ్చాయి. ఆ మార్పులను, అప్పటి సాహిత్యాన్ని విశ్లేషించి డాక్టర్ కాళిదాసు పురుషోత్తం రాసిన పరిశోధనా గ్రంథం ‘వెంకటగిరి సంస్థాన చరిత్ర- సాహిత్యం’. దీని ద్వారా ఆ నాటి పరిస్థితులనేకం మనకు తెలుస్తాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైన భాగాలు..

చంద్రగిరి సంస్థానాధీశుల్లో 27వ తరానికి చెందిన వాడు కుమారయాచమనాయుడు. 1848లో ఈయనకు పట్టాభిషేకం జరిగింది. ఈయన వెంకటగిరి సంస్థానాన్ని పరిపాలించిన జమీందారుల్లో మహా సమర్థుడు. జమీందారి ఆదాయం ఇబ్బడిముబ్బడిగా అభివృద్ధి చేసినవాడుగా, పరిపాలనను క్రమబద్ధం చేసినవాడుగా సంస్థాన చరిత్రలో ఇతనికి సుస్థిర స్థానం ఉంది. కుమారయాచమనాయుడు బాల్యం ఎట్లా గడిచిందో మనకు తెలియదు. ఈయన ఏం చదువుకున్నాడో, ఎటువంటి శిక్షణ పొందాడో వివరించే అధారాలేమీ లేవు. ఈయన ఆస్థాన పండితుల వద్ద సంస్కృతాంధ్రాలు, పార్సీ నేర్చుకున్నట్లు మాత్రం తెలుస్తోంది. ఆస్థానపండితుడు తర్కభూషణం వెంకటాచార్యుల బోధనలవల్ల బాల్యం నుంచే వైష్ణవం పట్ల అభిమానం ఉన్నట్లు, ఆధ్యాత్మిక, మత విషయాల్లో అభినివేశం ఉన్నట్లు తెలుస్తోంది. తన పాండిత్య విశేషం చేత, కవిపండిత పక్షపాతం చేత ‘సర్వజ్ఞ’ కుమారయాచమనాయుడని విఖ్యాతి పొందడమేకాక, ఆ పేరుతోనే పుస్తక రచన చేశాడు. 19వ శతాబ్ది ఆరంభానికి ఆంధ్రదేశంలోని వెలమ జమీందార్లలో వెంకటగిరి, నూజివీడువారు మాత్రమే రాజగౌరవంతో ప్రసిద్ధులయ్యారు. ఈ ఇద్దరితో పోల్చదగిన వెలమజమీందార్లు మరెవరూ ఆంధ్రదేశంలో ఆనాడు లేరు. సిరిసంపదలతో తులతూగడంతో పాటు, ఏడుగురు పురుషసంతానం ఉండటం కూడా వెలమ జమీందార్లలో కుమారయాచమనాయుని హోదా పెరగడానికి కారణమయింది. పిఠాపురం, బొబ్బిలి, జటప్రోలు జమీందార్లు పురుషసంతానం లేకపోవటం వల్ల కుమార యాచమనాయుడి కొడుకులనే దత్తత తీసుకున్నారు. తన తదనంతరం సంస్థానాధిపత్యం వహించే వారికి మార్గదర్శకంగా ‘నడుచుకోవాల్సిన పద్ధతుల’ను ఆయన ‘మామూల్ నామా’ పేరుతో చిన్న పుస్తకంగా రాశాడు. దీనిలో ‘ఘోషా నిబంధనలు’ అమలు చేయవలసిన పద్ధతుల గురించి చాలా సుదీర్ఘంగా వివరించాడు.

ఘోషా స్త్రీలు
పది పన్నెండు సంవత్సరాలు నిండిన మగపిల్లలను కూడా జనానాలోకి పోనివ్వగూడదని, జనానా మీద నిరంతరం నిఘా ఉంచాలని, ‘సాక్షాత్తూ అన్నదమ్ములు ఒకరి జనానావారిని ఒకరు చూడకూడదని’ కఠిన నిబంధన విధించాడు. ఈడొచ్చిన పురుషులు తల్లిని, తోడబుట్టినవాళ్లను తప్ప పినతల్లులు, పెదతల్లులు, వారి యుక్తవయస్కులైన కుమార్తెలను, సవతి తల్లులను కూడా చూడకూడదని నియమం పెట్టాడు. పూజలు పునస్కారాలు జరిపే సందర్భంలో కూడా పురోహితుణ్ణి పరదా చాటున కూర్చోబెట్టి మంత్రాలు చెప్పించాలని, ‘వైద్యుడు చూడవలసి వచ్చినప్పుడు ఇదే రీతిన పరదా చాటున వుంచి హస్తము చూపించవలయును’ అని చెప్పాడు. ఘోషాపద్ధతిని మినహాయింపు లేకుండా అమలు చేయమంటాడు. ఒకవేళ ఇంటల్లుడు ‘మన ఇంటిలోనే’ కాపురం ఉంటే, ఆయన భార్య పోతూ వస్తూ ఉండాల్సిందే తప్ప, అల్లుడు జనానాలోకి వెళ్లకూడదంటాడు. జనానా స్త్రీలు ఇల్లు విడిచి ఎక్కడికి వెళ్లినా, సవారీలకు పరదాలు కట్టి తీసుకొని వెళ్లాలని, ప్రయాణంలో కూడా దాసీలు జనానా స్త్రీలవెంట ఉండాలని, మాట వినిపించేంత దూరంలో పురుషులెవరినీ ఉండనివ్వకూడదని, ఈ నియమం కఠినంగా అమలుపరచాలని సూచిస్తాడు. తండ్రి కూతుళ్లతో, అన్నదమ్ములు అక్కచెల్లెళ్లతో ప్రత్యేకస్థలంలో కలుసుకొని సంభాషించవచ్చని కాస్త నిబంధన సడలిస్తాడు. జనానాస్త్రీలను వీలయినంత వరకూ పుట్టిళ్లకు పంపకూడదని, అత్యవసర పరిస్థితిలో పంపవలసి వస్తే భర్తో, మరుదులో వెంట వెళ్లాలనీ అంటాడు. వెళ్లిన చోట పహరా ఏర్పాటు చేసి, ‘పిన్న, పెద్ద గొల్ల మొదలైన వాండ్లు’ లోపలికి వెళ్లి పురుషులు లేరని తేల్చుకున్న తర్వాతే జనానా స్త్రీలను లోపలికి పంపాలని జాగ్రత్త చెబుతాడు. జనానా స్త్రీలు తండ్రికి, తోబుట్టువులకు మాత్రమే స్వయంగా జాబులు రాసుకోవచ్చని, ఇతరులెవరికైనా రాయవలసివస్తే, వేరే ఎవరి చేతయినా రాయించాలని సూచిస్తాడు. ఆటపాటలు, వినోదకార్యక్రమాలు వంటి ప్రదర్శనలు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదేశంలో కూర్చొని చూడాల్సిందే. వాళ్లు నాలుగు గోడల మధ్య జీవిస్తూ, రాజవీధి గుండా వెళ్లే ఊరేగింపులను ‘చిరుసోరణగండ్లు’ (చిన్న చిన్న రంధ్రాలు కలిగిన కిటికీలు) గుండా పరదాలమాటున నిలబడి చూసేవారు. మామూల్ నామా ఇప్పటి వరకూ పరిశోధకులకు అందుబాటులో లేదు. జమీందారి జీవితానికి సంబంధించిన అనేక పార్శ్వాలను- శృంగార జీవితంతో సహా ఇది స్పృశించింది.

వెంకటగిరివారికి కాళహస్తి, సైదాపురం, ముత్యాలంపాడు, తిరువూరు, తంగెళ్లమూడి, సోమవరప్పాడు తదితర జమీందార్లతో ఇచ్చిపుచ్చుకొనే సంబంధాలుండేవి. 1960ల వరకూ వెంకటగిరి సినిమాహాల్లో జనానాస్త్రీలకు ప్రత్యేక ప్రదర్శన ఉండేది. ‘ఈ రోజు నగిరోళ్ల ఆట’ అని ముందుగా ఊరంతా దండోరా వేసేవాళ్లు. జనానాస్త్రీలు మరణించినప్పుడు కూడా పరదాలు కట్టిన పల్లకీలోనే జమీందార్లకు ప్రత్యేకమైన రుద్రభూమికి తరలించి, అక్కడ దడులచాటున అంత్యక్రియలు జరిపేవారు. జనానా స్త్రీల చదువుసంధ్యల వివరాలు తెలియకపోయినా, 1870 ప్రాంతాలకు వెంకటగిరి రాణివాసంలో కొందరయినా చదువుకున్న స్త్రీలు ఉన్నట్లు మామూల్ నామా సూచిస్తోంది. ‘ఆర్థికహోదాను బట్టి దొరసాని, దాసి ఇద్దరూ సున్నాలే. ఇద్దరూ జీతం లేని దాసీలే..’

ఆడపాపలు
అంతఃపురదాసీలను వెంకటగిరిలో ఆడపాపలని అంటారు. పసివయసులోనే అంతఃపురంలో దాసీలుగా చేరి జీవితాంతం ఆ వృత్తిలో కొనసాగుతారు. వీళ్లలో తల్లీ కూతుళ్ల జంటలు కూడా ఉన్నాయి. ఒక్కొక్క రాణికి డజనుపైగా దాసీలుంటారు. రాణివాసంలో జనానా స్త్రీలకు, వారి బిడ్డలకు ఈ దాసీలు సంరక్షకులుగా, సహాయకులుగా ఉంటారు. వీరికి పెళ్లిళ్లు చేయరు. మగపిల్లలు పుడితే వాళ్లు కూడా జమీందార్ల సేవలో బతుకు వెళ్లదీస్తారు. ఆడపిల్లలు పుడితే తల్లుల మాదిరే కులవృత్తి స్వీకరిస్తారు. రాజకుటుంబాల్లో బయటనుంచి కోడళ్లుగా వచ్చిన యువతులు బాల్యం నుంచి తమకు దాసీలుగా ఉన్న స్త్రీలను తమవెంట తీసుకువస్తారు. కుమారయాచమనాయుని వ్యక్తిగత సేవకుల్లో 89 మంది బందీలు ఉన్నట్లు నమోదయింది. వీళ్ల జీతభత్యాలు కూడా పేర్కొనబడలేదు. బహుశా వీళ్లు ఆడపాపలయి ఉంటారు. వెంకటగిరి రాజావారి తల్లితోను, కుమార్తెతోను జరిపిన ఇంటర్వ్యూలో దాసీలే దొరలబిడ్డలకు పాలిచ్చి పెంచేవారని తేటతెల్లమయింది. దీనికి కారణం దొరసానుల అందం చెడిపోతుందనే భావం వాళ్ల మనసుల్లో ఉండటమే.. వారు ఎలాగూ నగర సంతానమే కాబట్టి, నగరంలో భాగమే కాబట్టి ఆడపాపలకు అందమైన పేర్లు పెట్టేవారు.

ఆడపాపల్లో మాతృస్వామ్య వ్యవస్థ ఉండేది. చాలా మంది ఆడపాపలకు వాళ్ల తండ్రులను గురించి తెలియదు. ఏ ఊరి నుంచి వచ్చారో ఆ ఊరి పేరు చెప్పుకొనేవాళ్లు. మత కర్మల్లో- తల్లి, అమ్మమ్మ, ఆమె తల్లి పేరు చెప్పి తర్పణాలు చేయించే ఆచారం ఉండేది. వెంకటగిరిలో ఆడపాపలు, వారి కుటుంబ సభ్యులు వందల సంఖ్యలో ఉండేవాళ్లు. 1930-40 నడుమ అక్కడ కొంత మంది ఆడపాపలు తమ కుమార్తెలకు వివాహాలు చేశారు. అప్పుడు జమీందారు ఈ విధంగా పెళ్లిళ్లు చేసిన దాసీలను పనుల్లోంచి తొలగించి, వారి మీద ఆంక్షలు పెట్టి ఇబ్బందులకు గురి చేశాడు. జమీందార్లు తమ కామవాంఛకు దాసీ పుత్రికలకు ఉపయోగించుకుంటున్నారని జమీన్‌రైతు పత్రిక ఆరోపించింది. “దాసీ లోకమంతయు ఈ విపరీతచర్యలకు సభలు చేసి, తమ అసమ్మతిని తెలిపి జమీందార్ల దుండగముల బహిర్గమనర్తురని ప్రార్థన’ అని ఆ పత్రిక విజ్ఞప్తి చేసింది.

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అడుగడుగునా అగ్ని పరీక్షలే

 

సాగిపోవాలనుకుంటే సంఘర్షణ గానీ, ఆగిపోవాలనుకుంటే ఏముంది? డాక్టర్ తొడసం చందు ఆగిపోవాలనుకోలేదు కాబట్టి సాగిపోవడానికి అవసరమైన ఘర్షణంతా పడ్డాడు. ఊరి పొలిమేరలు దాటడమే గగనమైపోయి, మూడో తరగతిలోనే చదువు ఆగిపోయి ఎక్కడో పశువుల కాపరిగా ముగిసిపోవాల్సిన జీవితం జిల్లా మెడికల్ ఆఫీసర్ స్థాయికి రావడం ఆశ్చర్యమే కదా మరి! తాను ఒక స్థానానికి చేరుకోవడమే కాకుండా తన జాతి జనులను పురోగమన దిశగా నడిపించారాయన. ఆదివాసుల హక్కులను కాలరాసే దురాగతాల మీద గళమెత్తేందుకు గోండులను సన్నద్ధం చేసిన ఘనత ఆయనకు ద క్కుతుంది. ఆ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు ఈ వారం ‘అనుభవం’లో..

ఆదిలాబాద్ జిల్లా తిర్యాణి మండలంలోని గుండాల మా ఊరు. మా ఊళ్లో మూడవ తరగతి వరకే ఉంది. నాలుగవ తరగతి కోసం ధర్మపురి వెళ్లాల్సి వ చ్చింది. అక్కడికి వెళ్లాలంటే మూడు గంటలు నడి చి, ఆ పైన తెప్పల మీద గోదావరి దాటి వెళ్లాలి. ఆ ప్రయాణం కష్టమని చెన్నూరు భీమవరంలో చేరాను. ఆ ఊరు ఇంకా దూరం. ఆ రోజుల్లోనే అంటే 1975-76 ప్రాంతంలోనే అక్కడికి వెళ్లడానికి 10 రూపాయలు బస్సు చార్జీలు అయ్యేవి. కాకపోతే అక్కడ హాస్టల్ ఉంది. మేము చదువుకున్న స్కూలు, హాస్టలు రెండూ ఆదివాసీ పిల్లల కోసం ఎన్. వి. రాజిరెడ్డి అనే దాత కట్టించినది. ఇతర కులాల పిల్లలు కూడా అందులో ఉండి చదువుకునే వారు. అక్కడ నేను పదవతరగతి దాకా చదువుకున్నాను. ఆ స్కూల్లో ఫస్ట్ ర్యాంకు సాధించిన విద్యార్థికి హైదరాబాద్‌లో పై చదువుల కోసం ఆయన ఆర్థిక సాయం అందించేవారు. కాని నేను పదవ తరగతి పరీక్షలు రాసి మా ఊరికి వచ్చిన కొద్ది రోజులకే మా గూడెం గూడెమంతా అగ్ని ప్రమాదంలో కాలిపోయింది. ఎవరికీ నిలువ నీడ లేకుండా పోయింది. అందుకే నాకు స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ వ చ్చినా సంతోషం అనిపించలేదు. స్కూలుకు వెళ్లి నా సర్టిఫికెట్లన్నీ తీసుకుని మా ఊరికి వచ్చేశాను.
హైదరాబాద్ పయనం
అయితే, మా హెడ్‌మాస్టర్, హాస్టల్ వార్డన్‌లు నన్ను వదిలిపెట్టలేదు. వెంటనే రమ్మని ఉత్తరం రాశారు.కానీ, ఆ ఉత్తరాన్ని మా నాన్నకు చూపించాను. అప్పుడు మాకు ఉన్నదల్లా ఒక మేకపోతు. మా నాన్న ఆ ఊరూ ఈ ఊరూ తిరిగి 300 రూపాయలకు ఆ మేకను అమ్మేశాడు. ఆ డబ్బులు తీసుకుని వస్తున్న సమయంలో దొంగలు నాన్న మీద దాడి చేసి ఆ మొత్తం లాక్కుని వెళ్లిపోయారు. ఆ పరిస్థితిలో మా అమ్మ తన కాళ్ల కడియాలు, నా చేతికి ఉన్న దండ కడియాలు అమ్మేసి వచ్చిన 300 రూపాయలు నా చేతిలో పెట్టింది. అయితే,స్కైలాబ్ గురించిన భయాందోళనలతో అట్టుడికి పోతున్న రోజులవి. అందుకే హైదరాబాద్‌కు వెళ్లడానికి వీల్లేదంటూ మా అమ్మమ్మ గోలపెట్టింది. వేరు వేరు ప్రదేశాల్లో కన్నా ఒకేచోట చనిపోవడం మేలు కదా! అన్నది ఆమె వాదన. నాన్న మాత్రం ఆమె వాదనను తోసిపుచ్చాడు. బతకడానికి కలిసి ఉండాలనుకోవడంలో అర్థం ఉంది గానీ, చావడానికి ఒకచోట ఉండాల్సిన పనేముంది? అంటూ నాన్న ఘాటుగానే ఖండించి నన్ను మా ఊరి పొలిమేరల దాకా సాగనంపి వెళ్లిపోయాడు. మా వార్డెన్ ఇచ్చిన లేఖ తీసుకుని వారిచ్చిన వివరాల ఆధారంగా నేను హైదరాబాద్‌లో ఉన్న రాజిరెడ్డి గారిని కలిశాను. నన్ను చూసి ఆయన మహా సంతోషపడ్డారు. అమ్మమ్మ వాదనను నాన్న ఖండించిన తీరు అప్పుడు కాదు కానీ ఆ తర్వాత నన్ను ఎంతో లోతుగా కదిలించింది. మునుముందుకు సాగిపోవాలనుకునే వాడికి మరణం భయపెట్టకూడదని నాకు ఆ సంఘటన ద్వారా బలంగా తెలిసొచ్చింది..
డాక్టర్ కావాలనుకుని పేషంట్‌నై….
అమీర్‌పేట న్యూసైన్స్ కాలేజ్‌లో చేరి ఇంటర్‌మీడియేట్ ఇక పూర్తయిపోతుందనుకున్న సమయానికి ఇంద్రవె ల్లిలో కాల్పులు జరిగి చాలామంది ఆదివాసులు చనిపోయారు. దాని ప్రభావం వల్ల ఎప్పుడైనా మేము మా ఊరికి వెళితే మమ్మల్ని నక్సలైట్లు అంటూ అరెస్టు చేయడం మొదలెట్టారు. ప్యాంట్, షర్ట్ వేసుకుని ఎవరు కనపడినా చాలు నక్సలైట్లుగా పేరు నమోదు చేసి మీ అన్నలు ఎక్కడున్నారో చెప్పండి అంటూ వేధించేవారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఇంద్రవెల్లిలో గాయాల పాలైన వారికి వైద్య సేవలు అందించడానికి వచ్చిన డాక్టర్లను చూసినప్పుడు అంతకుముందే మనసులో ఉన్న మెడిసిన్ చేయాలన్న కోరిక మరి కాస్త తీవ్రమయ్యింది. ఆ స్ఫూర్తితోనే ఎంసెట్ రాయడానికి ఉస్మానియా మెడికల్ కాలే జ్‌కు వెళ్లాను. సరిగ్గా ఆ రోజుల్లోనే మతకలహాలు జరుగుతున్నాయి. రెండు వైపుల నుంచి ర్యాలీ వస్తున్న సమయంలో నేనూ, నా మిత్రులం అందులో ఇరుక్కుపోయాం. లాఠీ చార్జి జరిగి నా చేయి విరిగింది. నన్ను తీసుకువెళ్లి హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. సీటు రాదని తెలిసినా పట్టుదల కొద్దీ ఎంసెట్ ఎంట్రెన్స్ రోజున వెళ్లి ఎడమ చేతితో ఎగ్జామ్ రాసి భరించలేని నొప్పితో మళ్లీ హాస్పిటల్‌లో చేరిపోయాను. డాక్టర్ అవుదామని వచ్చి పేషంట్ అయిన నా దుర్గతి నన్ను తీవ్రమైన దుఃఖానికి గురిచేసింది.

ఇక్కడ ఉంటే ఇలాంటి సంఘటనలు ఇంకేం జరుగుతాయోనని మెడిసిన్ ఆలోచనలను విరమించుకుని మా ఊరికి వెళ్లిపోయాను. కానీ, అక్కడికి వెళితే మాత్రం సుఖమేముంది? నక్సలైట్లేమో తమ క్యాడర్ పెంచుకునే ప్రయత్నంలో మా వెంటపడటం, పోలీసులేమో మేము వాళ్లకు ఇన్‌ఫార్మర్లుగా పనిచేస్తున్నామనుకోవడం ఇదే గొడవ. పిల్లాడి ప్రాణాలకే ముప్పు ఏర్పడేలా ఉందని రాజిరెడ్డి తెలిసిన వాళ్ల ద్వారా వెంటనే హైదరాబాద్‌కు తీసుకురమ్మని కబురు పంపారు. అంతగా చెప్పాక కూడా వెళ్లకపోవడమేమిటని బయలుదేరి వస్తుంటే, ఒక గుట్టమీది నుంచి జారి పడిపోయి నా కాలు విరిగింది. వరుస గాయాలతో నేను ఏమైపోతున్నానో నాకే బోధపడని స్థితి. ఇంక అమ్మనాన్నల విషయం ఏమనుకోవాలి? అందుకే మెడిసిన్ విషయం తర్వాత, ముందు బతకడం ముఖ్యం అనుకున్నా. అందుకే హైదరాబాద్‌లోని నాచారంలో ఉన్న ఒక చిన్న ఫ్యాక్టరీలో ఉద్యోగంలో చేరాను. వాళ్లు నాకు 200 రూపాయల వేతనం ఇచ్చేవారు. ఆ డబ్బుతోనే మెడిసిన్ కోచింగ్ తీసుకున్నాను. అదే 1983లో నే ను రాసిన ఎంట్రన్స్‌లో సీటు వచ్చేలా చేసింది. అడ్డంకులున్నవి ఆగిపోవడానికే అనుకుంటే అధిగమించడం అనే మాట మన నిఘంటువులోనే ఉండదు. అందుకే అడ్డంకులు తాత్కాలికంగా ఆపగలవేమో గానీ, ఆ తరువాత అవే మనల్ని ముందుకు సడిపించే సాధనాలని నేను భావిస్తాను.
కొండపల్లితో నన్ను ముడివేసి…
నేను మెడిసిన్ మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు అంటే 1983లో ఖైదీగా హైదరాబాద్‌లోని ఉస్మానియా హాస్పిటల్‌లో చేరిన కొండపల్లి సీతారామయ్యను డాక్టర్ వేషంలో ఉన్న నక్సలైట్లు తప్పించారు. సీతారామయ్యను తప్పించిన వారిలో నేనూ ఉన్నానన్న అభియోగం మోపి నన్ను, నాతో పాటు మరో 30 మందిని పోలీసులు దేవాపూర్‌లో అక్టోబర్ 23న అరెస్టు చేశారు. నేనున్నది గాంధీ హాస్పిటల్‌లో. ఆ సంఘటన జరిగింది ఉస్మానియా హాస్పిటల్‌లో అని చెప్పినా వినిపించుకోకుండా ఓ ఐదారు పోలీసు స్టేషన్లు తిప్పారు. నువ్వు నక్సలైట్‌వు. మీ నాయకులంతా ఎక్కడున్నారో, మీ దళం ఎక్కడుందో చెప్పు. లేదంటే కాల్చేస్తాం అంటూ భయభ్రాంతులకు గురిచేశారు. తర్వాత కొంత మందిని వదిలేసి 11 మందిని మాత్రం కోర్టుకు తీసుకువెళ్లి అక్కడినుంచి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. మెడిసిన్ చేస్తున్న కారణంగా నేను ఒట్టి నక్సలైటును కాక నక్సలైట్ నాయకుడు అయి ఉంటానని నన్ను మిగతా అందరితో కలిపి కాకుండా వేరే సెల్‌లో ఉంచారు. ఈ కేసు విషయంలో పోలీసులు నన్ను కోర్టులో హాజరు పరిచినప్పుడు చూస్తే కోర్టు ప్రాంగణంలో దాదాపు 500 మంది ఆదివాసులు కనిపించారు. వాళ్లంతా నక్సలైట్లుగానో లేదా నక్సలైట్లకు ఆశ్రయం ఇచ్చిన వారిగానో, మరో రకంగా వారికి సహకరించిన వారిగానో అభియోగాలు ఎదుర్కొంటున్న వాళ్లే. నన్ను కోర్టు ఆవరణలో చూసి నాన్న బావురుమని ఏడ్చేశాడు. మా విషయం తెలిసిన ఐటిడిఏ వారు నా తరపున ఒక లాయర్‌ను నియమించారు. ఎంబిబిఎస్ ఫస్ట్ ఇయర్ రిజల్టు వచ్చేనాటికి నాకు బెయిల్ దొరికింది. ఆ తరువాత ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి కోర్టుకు హాజరయ్యే వాణ్ని. నిన్ను మరో వ్యక్తిగా చిత్రించే సమాజం ఎప్పుడూ నీ పక్కనే ఉంటుంది. ఆ స్థితిలో నువ్వు నువ్వుగా నిలబడలేకపోతే, నీ జీవితం నీ చేతుల్లోకి రాదని నాకు ఎదురైన ప్రతి సంఘటనా పలు మార్లు చెప్పింది.
చట్టాలంటే లెక్కే లేదా?
నాకు, నా సహవిద్యార్థులు కొంతమందికి బెయిల్ దొరికిన నాటి నుంచి మాకోసం వచ్చే ఆదివాసుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. వాళ్లకోసం అవగాహనా సదస్సులు ఏర్పాటు చేస్తూ వచ్చాం.నా సెకండ్ ఇయర్ నుంచే ఈ కార్యక్రమాలు ఉధృతం చేశాను. ఆ క్రమంలో ఆదివాసులకు జరుగుతున్న అన్యాయాలు,ఆదివాసీ మహిళల మీద జరిగిన అత్యాచారాలు వేల సంఖ్యలో బయటికి రాసాగాయి. గిరిజనుల భూముల్ని ఎవరూ కొనకూడదు అని చెప్పే 1/70 చట్టం ఉంది. అయినా, వారికి సంబంధించిన రెండు లక్షల ఎకరాల భూములు 150 మంది ఆదివాసీయేతరుల చేతుల్లో ఉన్నట్లు బయటపడింది. ఆ విషయమై మేము మాట్లాడటం మొదలుపెట్టగానే తమ గోడు వెళ్లబోసుకోవడానికి మా కోసం వేలాది మంది రావడం మొదలెట్టారు. దాంతో అంతకు ముందున్న గోండు వన ఆదివాసి విద్యార్థి సంఘాన్ని గోండు వన సంఘర్షణ సమితిగా మార్చి, ఆదిలాబాద్‌లోని ప్రతి గ్రామానికీ వెళ్లి ఆదివాసులకు సలహాలు ఇచ్చే రాయి సెంటర్స్ ప్రారంభించాం. ఒక వైపు మేము ఇదంతా చేస్తుంటే మరో వైపునుంచి ఎన్‌టిరామారావు ప్రభుత్వం భూములపై గిరిజనులకుండే హక్కులను తొలగించే ప్రయత్నాలు మొదలెట్టింది. ఈ ధోరణి మమ్మల్ని దిగ్భాంతికి గురిచేసింది. ఆ వెంటనే మేము దానికి వ్యతిరేకంగా ఆదిలాబాద్ నుంచి వరంగల్, ఖమ్మం, ఉభయ గోదావరులు, శ్రీకాకుళం దాకా పోరాటాన్ని ఉధృతం చేశాం. వి.పి సింగ్‌ను ప్రత్యక్షంగా కలిసి ఈ విషయాల్ని నివే దించాం. ఆయన ఎస్.సి, ఎస్.టి కమీషనర్‌ను మన రాష్ట్రానికి పంపించారు. దానివల్ల చాలా మేలు జరిగింది. భారతీయ జన ఆందోళన్ అన్న సంస్థ నిర్వహణలో దేశంలోని పలు యూనివర్సిటీలకు వెళ్లి ఆదిలాబాద్ ఆదివాసుల సమస్యల గురించి వివరంగా మాట్లాడటం మొదలుపెట్టాం. ఇవన్నీ ఎన్‌టిఆర్ ప్రభుత్వాన్ని తన నిర్ణయం మార్చుకునేలా చేసింది. ఏకపక్షంగా మన పనేదో మనం చేసుకుంటూపోతే చాలదు, మనకు విరుద్ధంగా ఏం జరుగుతోందో తెలుసుకోకపోతే ఎంత ప్రమాదమో మాకు బోధపడింది.
అనాథల కోసం
ఒక రోజు ఒక ఆదివాసి ఒక అమ్మాయిని నా వద్దకు తీసుకువచ్చారు. ఏదో చిన్న సమస్య కారణంగా ఆ పిల్ల కళ్లల్లో తమకు తెలిసిన ఒక చెట్ల మందు పెట్టి పట్టీ కట్టేశారు. ఆ క ట్టు విప్పి చూస్తే అప్పటికే ఆ పిల్ల చూపు పోయింది. ఏమిటి మీరు చేసిన పని అని ఆగ్రహం వ్యక్తం చేశాను. ‘మేము ఊరూరూ తిరుగుతూనే ఉన్నాం, మదర్స్ కమిటీలు ఉన్నాయి. వెంటనే మా వద్దకు తీసుకువస్తే ఈ గతి పట్టేది కాదు కదా!’ అంటే వాళ్లు ఏమీ చెప్పలేక ఏడ్వడం మొదలెట్టారు. ఆ పిల్ల వెంట వచ్చిన పెద్దవాళ్లు ఆ అమ్మాయికి తల్లిదండ్రులిద్దరూ లేరని, ఆమె అనాథ అని చెప్పారు. వీళ్లంతా మానవత్వంతో ఆమెను చూస్తున్నార ంతే. ఆ చెట్టు పసరుతో మంచి జరుగుతుందనుకున్నారు కానీ ఇలా అనుకోకుండా జరిగిపోయింది అన్నారు. ఆ తర్వాత ఇలాంటి వాళ్లు ఇంకెంత మంది ఉన్నారోనని సర్వేచేశాం. ఇంద్రవె ల్లి పరిధిలోనే అలాంటి వారు 30 మంది దాకా ఉన్నారని తేలింది. ఈ విషయాన్ని ఆర్.డి.ఓ గారికి చెబితే వారికోసం ఒక హాస్టల్ ఏర్పాటు చేసి, పౌరసరఫరా శాఖ నుంచి బియ్యం, పప్పు లాంటి ఆహార పదార్థాలను సమకూర్చారు. అలా కొంతమంది పిల్లల జీవితాలను కాపాడగలిగాం. శరీర వ్యవస్థ గురించి తెలియక ఆరోగ్యాలు కోల్పోవడం, సామాజిక వ్యవస్థ గురించి తెలియక తమ ఉనికిని కోల్పోవడం ఆదివాసుల లోకంలో అడుగడుగునా కనిపించే దృశ్యాలు. ఎంతోమంది పెద్దలు ఆదివాసుల వేల ఎకరాల భూముల్ని కైవసం చేసుకుంటూ ఉంటే ఆదివాసుల చట్టాలు నిస్సహాయంగా ఆక్రోశిస్తున్నాయి. నేను ఓ మెడికల్ ఆఫీసర్‌గా ఆదివాసుల సమస్యల్ని పరిష్కరించండని వెళితే, ఈ సారి ఎం.ఎల్.ఏగా పోటీ చేయవచ్చు కదా అంటూ ఎర వేస్తాయి ప్రభుత్వాలు. కానీ, ఆదివాసుల జీవితాలకు కవచంగా నిలబడడానికి మించిన పదవి గానీ, ఆ పోరాటంలో సాగిపోవడానికి మించిన జీవన ధర్మం గానీ మరొకటి లేదని నా అంతరాత్మ నాకు నిరంతరం చెబుతూ ఉంటుంది.
– బమ్మెర

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వైద్య ఈశ్వర (వైదీశ్వర )ఆలయం(చివరి భాగం )

వైద్య ఈశ్వర (వైదీశ్వర )ఆలయం(చివరి భాగం )

తమిళ నాడు లో చిదంబరానికి ఇరవై ఏడు కిలో మీటర్ల దూరం లో వైద్యం చేసే ఏశ్వరుదైఅన వైదీశ్వరాలయం ఉంది .ఈ శివ దర్శనం సకల రోగ హరణం.నవగ్రహ దేవాలయాలలో ఇది అంగారక క్షేత్రం .ఆలయం ప్రక్కనే ఉన్న పుష్కరిణి ‘’అమృత పుష్కరిణి ‘’అంటారు ఇక్కడ స్నానం చేసినా ఈ నీరు తాగినా రోగాలన్నీ మాటు మాయం అవుతాయని ప్రగాఢ విశ్వాసం అందుకే కాశీ ,ప్రయాగ ల లో లాగా ఈ నీటిని భద్రం గా దాచుకొని తెచ్చు కుంటారు తీర్ధం లాగా సేవించి వ్యాధులను పోగొట్టుకొంటారు .ఏడవ శతాబ్దం లో నాయనార్లు నిర్మించిన ఆలయం ఇది .ఈ మహిమాన్విత ఆలయాన్ని శ్రీ రాముడు లక్ష్మణ సంమేతం గా దర్శించాడు .సప్తర్హులు సందర్శించిన క్షేత్రం ఇది .

అరణ్య వాసం లో ఉండగా సీతా సాధ్విని రావణాసురుడు అపహరించి లంకకు తీసుకొని వెడుతుండగా చూసిన జటాయువు దశాకంతుని తో పోరాడి మరణించాడన్న సంగతి మనకు తెలుసు సీతాపహరణం వార్తా ను రాముడికి చెప్పి మరణించాడు ఆ పక్షి రాజు శ్రీ రాముడు తన తండ్రి దాశరధ మహా రాజుకు అత్యంత ఆప్తుడు స్నేహితుడు అయిన జటాయువు ను పితృ సమానం గా భావించి ఇక్కడే దహన సంస్కారాలను విధ్యుక్త ధర్మ గా నిర్వ హించాడు .ఆ ప్రదేశాన్ని ఇక్కడ ‘’జటాయు కుండం ‘’అని పిలుస్తారు .స్వామి ఆలయానికి వెనుక భాగాన ఉంటుంది .ఇక్కడే శ్రీ రామ లక్ష్మణ జటాయు ,నాదాముని గాలవ మునుల చిన్న విగ్రహాలు ఆ సంఘటనకు సాక్షీ భూతం గా కనీ పిస్తాయి .

కుజుడు అని పిలువా బడే అన్గారకుడికి ఒకప్పుడు కుష్టు రోగం వచ్చి విపరీతం గా బాధ పడ్డాడు .మహర్షుల మాట విని ఈ వైదీశ్వర క్షేత్రానికి వచ్చి వైద్య ఈశ్వరుడైనా వైదీశ్వరుడిని భక్తిగా నిష్టగా కొలిచాడు శివుని అనుగ్రహం తో అంగారకుని కుష్టు వ్యాధి నయమైంది అంగారక విగ్రహం ఇక్కడ ఉంది .కుజ దోషం ఉన్న వారు ఈ శివుడిని పూజిస్తే దోష నివారణం అవుతుందని నమ్మకం .ఆచార్య ధన్వంతరి కూడా ఈ స్వామిని అర్చించి తరించాడు .

         

 

 

శంముఖుదైన కుమారస్వామి ని తల్లి పార్వతీ దేవి ఒక్క ముఖం తో కానీ పించమని ముద్దుగా కోరితే తల్లి మాట మన్నించి ఒక్క ముఖం తో ఇక్కడే దర్శన మిచ్చాడు తల్లి పార్వతి మురిసి పోయి ఏంటో సంతోషించి కుమారునికి ‘’వీ’’అనే ఆయుధాన్ని ప్రదానం చేసింది .దానితో కుమారస్వామి రాక్ష సంహారం చేశాడు .ఒక సారి ‘’సూరపద్మ ‘’అనే భీకర రాక్షసుదితో షణ్ముఖుడు ఘోర యుద్ధం చేశాడు వాడు కొట్టిన బాణపు దెబ్బలకు కుమారుడి ఒళ్లంతా గాయాలై స్పృహ కోల్పోయాడు .అప్పుడు తండ్రి శివుడు వైద్యుడే కనుక కుమారుని గాయాలను వైద్యం చేసి ,మాన్పిమళ్ళీ యుద్ధ సంనద్ధుని చేశాడు రెట్టించిన ఉత్సాహం తో పోరాడి ఆ రాక్షసుని సంహరించాడు స్కందుడు .ఇక్కడి శివుని విభూతి పరమ పవిత్రమైనదిగా రోగ నివారక మైనదిగా భావించి నుదుట ధరించి నోటిలో వేసుకొంటారు .

వైదీశ్వరాలయానికి అయిదు అంతస్తుల గోపురం ఆకర్షనీయం గా ఉంటుంది .లోపల సుబ్రహ్మణ్య స్వామి లోహ విగ్రహం ఉంది ఈయన్ను ‘’ముత్తు కుమారా స్వామి ‘’అని ఆప్యాయం గా పిలుచు కుంటారు .నట రాజ ,సోమస్కంద ,దక్షిణా అమూర్తి ,సూర్య .వేద  జటాయు సోదరుడైన ,సంపాతి విగ్రహాలను సందర్శించి త్రేతాయుగ గాధలను జ్ఞప్తికి తెచ్చు కొంటారు .

ఇక్కడి అమ్మ వారి పేరు ‘’తైయాల నాయకి ‘’.అంటే దుర్గా మాత అన్న మాట .ఆలయం లో శివుడు తన జటా జూతం లో బంధించిన గంగా నదిని బయటకు వదిలే గంగా విసర్జన లోహ విగ్రహం చూడ ముచ్చటగా ఉంటుంది .1070 -1120కాలం లో రాజా కులోత్తుంగ చోళుడు వేయించిన అయిదు శాసనాలు గొప్ప చారిత్రిక ఆధారాలు గా నిలుస్తాయి .అగస్త్య మహర్షి ఇక్కడి స్వామిని దర్శించి పునీతుడైనాడు అగ్స్త్యుడే ఇక్కడి నాదీ జ్యోతిషానికి ఆద్యుడు .వైదీశ్వరం ‘నాదీ జ్యోతిషానికి ముఖ్య కేంద్రం గా వర్దిల్లుతోంది .నాదీ జ్యోతిషం పై నమ్మకం ఉన్న వారు ఇక్కడికే వచ్చి జ్యోతిషం చెప్పించు కొంటారు .భూత భవిష్యత్ వర్తమానాలను నాదీ జ్యోతిషం తెలియ జేస్తుందని విశ్వాసం గత జనం లో తాము ఏ రూపం లో జన్మించామో ,ఏ మంచి చెడు పనులు చేయటం వలన ఈ జన్మ లో సుఖాలు కస్టాలు పడుతున్నామో తెలుసు కుంటారు భవ్య మైన భవిష్యత్తుకు మార్గాలను తెలుసు కొంటారు .అదీ వైదీశ్వరాక్షేత్ర విశేషం .ఇహ రోగాలను శివుడు బాపితే పర రోగాలను నాదీ జ్యోతిషం బాపుతుందన్న మాట .

తిరువన్నామలైలో అరుణా చలేశ్వర దేవాలయం

తమిళ నాడు లో చెన్నై కి సుమారు రెండు వందల కిలో మీటర్ల దూరం ,చిదంబరానికి నూట నలభై కిలో మీటర్ల లో తిరువన్నామలై క్షేత్రం ఉంది .ఇక్కడి కొండను అరుణా చలం అంటారు ఈశ్వరుడిని అరుణాచలేశ్వరుడు అంటారు పంచ భూత శివ లింగాలలో అరుణాచలం అగ్ని లింగ క్షేత్రం .శివుడిని ‘’అన్నమలయ్యర్ ‘’అని ఆర్తిగా పిలుస్తారు .అమ్మ వారు పార్వతీ దేవి ని ‘’ఉన్నములై అమ్మన్ ‘’అంటారు .ఏడవశాతాబ్దికే ప్రసిద్ధి చెందిన ఆలయం ఇది .

Set of temple towers with urban centre and hill range in the background   see caption  Temple tower with people passing through.

 

 

అరునాచలేశ్వరాలయం 25ఎకరాల విస్తీర్ణం లో ఆవరించి ఉంటుంది .నాలుగు వైపులా నాలుగు ద్వారాలు గోపురాలు ఉన్నాయి .తూర్పు గోపురం ఎత్తు 217అడుగులతో11అంతస్తులతో ఉంటుంది .ఆలయం లో వెయ్యి స్తంభాల మండపం ఆకర్షనీయం .ఉదయం అయిదు గంటల నుండి పది గంటల వరకు దర్శనం .మళ్ళీ సాయంత్రం అయిదు నుంచి ఎనిమిదిన్నర వరకు

కార్తీక పౌర్ణమి నాడు దీపోత్సవం అరుణాచలం ప్రత్యేకత .గిరి పై భాగం లో జ్యోతి ని ప్రజ్వలింప జేస్తారు దీనికి వట్టి కిలో మీటరు పొడవు ఉంటుంది అనేక వందల కిలోల ఆవు నెయ్యి తో వెలిగిస్తారు సుమారు వారం రోజుల బాటు దీపం వెలుగుతూనే ఉంటుంది మైళ్ళ దూరానికి కూడా కని పించి కను విందు చేస్తుంది ఈ కార్తీక దీపోత్సవాన్ని దర్శించేందుకు దేశం నలు మూల నుండి దాదాపు ముప్ఫై లక్షలకు పైనే భక్తులు వస్తారు దివ్య జ్యోతిని దర్శించి తరిస్తారు .ఆలయాన్ని చోళ రాజులు తొమ్మిదవ శతాబ్దం లో నిర్మించారు పదహారు స్తంభాల దీప దర్శన మండపం చూడ తాగినది .ఆలయం లో శంముఖుని దేవాలయం ఉంది ఇక్కడి మాజిఘ వృక్షం సుప్రసిద్ధ మైనది ..సంతానం కోరుకొనే వారు దీనికి ఉయ్యాల కడతారు .పిల్లలు పుట్టగానే వచ్చి మొక్కు చెల్లించు కొంటారు .కళ్యాణ మండపం వసంత మండపాలు కూడా ముఖ్యమైనవే అన్నిటి కన్నా6అడుగుల ఎట్టు ఉన్న నల్ల రతి నంది విగ్రహం మహా గంభీరం గా ఉంది శివుని దర్శనానికి అనుమతి నిస్తున్నట్లు గా ఉంటుంది .

ఏడవ శతాబ్దిలో తిరు జ్ఞాన సంబందార్ స్వామిపై కవితలు రాశాడు తొమ్మిదో శతాబ్దిలో మాణిక్య సాగర్ ‘’ఆన్ అమరి ‘’కావ్యం రాశాడు .భగవాన్ రమణ మహర్షి ఇక్కడ తపస్సు చేయతంవలన ఇరవయ్యవ శతాబ్దం లో తిరువన్నామలై కు విపరీతమైన ప్రశస్తి దేశ వ్యాప్తం గా  వచ్చింది ఇక్కడ పద్నాలుగు కిలో మీటర్ల గిరి ప్రదక్షిణం చేస్తూ మధ్యలో అష్ట దిక్పాలకులు ప్రతిష్టించిన శివ లింగాలను దర్శిస్తూ ఆది అరునాచలేశ్వరుని గుడి దర్శించి యాత్ర ను ఫల వంతం చేసుకొంటారు .

 

Decorated sooden car of a temple drawn by devotees

 

 

ఆలయానికి కొద్ది రూరం లో ఉన్న శ్రీ రమణాశ్రమ సందర్శనం తో తిరువన్నామలై యాత్ర సంపూర్ణం అవుతుంది

Samadhi Shrine        

 

 

ఇంతటి తో మేము ఈ ఫిబ్రవరి లో చేసిన కేరళ యాత్రా ,తమిళ నాడు యాత్ర దర్శిని సమాప్తం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ – 19-2-14-ఉయ్యూరు

 

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

చిదంబర శ్రీ నట రాజ దేవాలయం

   చిదంబర శ్రీ నట రాజ దేవాలయం

తమిళ నాడు  లో చిదంబరం లో సుప్రసిద్ధ నటరాజ స్వామి ఆలయాన్ని జీవితం లో ఒక సారైనా సందర్శించక పోతే జీవితం వృధా .అంత చక్కటి గొప్ప ఆలయం ఇది .శిల్పం పరాకాష్ట స్థాయికి తెచ్చిన ఆలాయ నిర్మాణం సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది .దీని శిల్పి ‘’విది  వేల్విదుగు పెరు మతక్కన్ .ఆయన శిల్ప చాతుర్యానికి జోహార్లు .ఆలయాన్ని పల్లవ ,పాండ్య ,విజయ నగర రాజులు వృద్ధి చేసి పోషించారు .ఇక్కడి కంచు శిలా విగ్రహాలు విశేష నాణ్యత చెందినవి .ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా చింత చెట్లుతో  బహు దట్టం గా  అరణ్యం గా ఉండేది .ఇప్పుడు కూడాదారి కిరు వైపులా గుత్తులు గుత్తులుగా కాసిన చింత చెట్లు కని పించి ఆనందాన్ని చేకూరుస్తాయి

చిదంబరాలయం

ఆలయ గోపురం బంగారు తాపడం చేయ బడి ఉంటుంది .ముఖ్య దైవం ‘’తిల్లై కూతన్  లేక తిల్లై నట రాజ్ .అంటే నాట్యం చేసే శివుడు అని అర్ధం .ఆయన చేసేది విశ్వ నృత్యం అంటే కాస్మిక్ డాన్స్ .అమ్మవారు శివ కామి .గర్భ గుడిలో స్పాటిక లింగం ఉంటుంది దీన్నే ‘’ఆకాశ లింగం’’ అంటారు ఈధర్ స్పేస్ అని పిలవచ్చు .పంచ భూత శివ లింగాలలో దీనికే ప్రాధాన్యత ఉంది .’51బంగారు బిల్వ దళాల మాల స్వామికి అలంకరణ గా ఉండి శోభాయ మానం గా కని  పిస్తుంది .శివుడు ‘’ఆనంద తాండవ నృత్యం ‘’ చేస్తాడిక్కడ ‘’.పొన్నంబలం’’ అంటే స్వర్ణ ధామం లో నటరాజ స్వామి కొలువై ఉంటాడు .ఆలయం లో భారత నాట్య భంగిమలున్న స్తంభాలు ఆకట్టుకొంటాయి .

ఆలయం లో అయిదు విశాల సభలు ఉన్నాయి .నిరంతరం మూడు వేదాలను పారాయణ చేసే బ్రాహ్మణులు దర్శన మిస్తారు .పాండ్య ,నాయన్ రాజ శిల్ప కళముగ్ధుల్ని చేస్తుంది .ఎన్నో తటాకాలున్నాయి .ఒకటి కాళికా అమ్మ వారైన శివ కామి అమ్మ వారి ఆలయానికి చెందినది .పతంజలి మహర్షి ,పులికాల్ ముని సందర్శించిన క్షేత్రం .275.శివ క్షేత్రాలలో అతి ముఖ్య మైనది చిదంబరం .మధ్య యుగ శైవ సాహిత్యం లో చిదంబరాన్ని అంబరానికి ఎత్తిన ప్రశస్తి కనీ పిస్తుంది .తిరునా ఉక్కరుసు ,తిరు జ్ఞాన సంబందార్ ,సుందరకవి మొదలైన వారంతా నటరాజ స్వామిని తనివి తీరా వర్ణించారు ,దర్శించి తరించారు .రెండవ కులోత్తుంగ చోళుడు నాయనార్ల దివ్య చరిత్రలను వెయ్యి కాళ్ళ మండపం లో చెక్కించాడు కోనేశ్వర (త్రిన్కోమలి) కైలాసాలతో దీన్ని పోలుస్తారు .

    

 

     

 

శివ తాండవం

ఈ సుందర అరణ్య ప్రాంతం లో చింత వృక్షాల నీడన శివుడు హాయిగా భిక్షాటన చేసే వాడు .ఇక్కడ వేలాది మునీశ్వరులు తపస్సు చేసుకొనే వారు .శివుడు సంధ్యా నృత్యం చేస్తుంటే విష్ణువు మోహినీ రూపం లో అనుసరించే వాడు .మునులు ఇబ్బంది గా బాధ పడే వారు .అరణ్యం లో ఉన్న సర్పాలను శివుడి పైకి ఉసి గోల్పారు మునులు .భయ పడి పారి పోతాడను కొన్నారు .కాని వాటిని శరీరం పై అలంకరణ గా దాల్చాడు శివుడు .లాభం లేదని శివుడిపై పులిని ప్రేరేపించి పంపారు .దాన్ని చీల్చి దాన్ని చర్మాన్ని వస్త్రం గా చుట్టుకొని గోళ్ళను ధరించాడు .’’మునులు ‘’మాయ లక ‘’అనే రాక్షసుడికి తమ శక్తులన్నీ ధార పోసి శివుదిపైకి పంపారు .శివుడు చిరు నవ్వుతూ ,ఆ రాక్షసుడి వీపుపై నిల్చుని  ‘’ఆనంద  తాండవం ‘’చేశాడు అదే చిదంబరం లోని నట రాజ విగ్రహం లో మనకు కని పిస్తాయి .ఋషులకు కను విప్పు కలిగింది .శివుని ముందు మంత్రాలు తంత్రాలేవీ పని చేయవని వీటికి ఆయన అతీతుడు అని గ్రహించారు .దాసోహం అన్నారు .శివోహం అని తెలుసు కొన్నారు .

దేవాలయ వైశిష్ట్యం

40 ఎకరాల సువిశాల దేవాలయం చిదంబర నట రాజ ఆలయం .చిత్ అంబరమే చిదంబరం .విమాన గోపురాన్ని907-1014కాలం లో రాజ రాజు ,కులోత్తుంగ చోళుడు అనేక నిర్మాణాలు చేశారు .రాజ రాజ చోలుది కుమార్తె రెండవ కుందవల్లి నిత్య పూజ కు భారీ విరాళాన్ని 1118-1135కాలం లో అంద జేసింది  .శివకామి అమ్మన్ దేవాలయం వద్ద ‘’శివ గంగ తటాకం ‘’ఉంది .ఆలయం లో అయిదు ప్రాకారాలున్నాయి .బయటిది బహిరంగ ప్రాకారం అంటే ఓపెన్ ప్రాకారం .లోపలి ప్రాకారం లో శివుడు ఉంటాడు .ఇంతకీ చిదంబరం అసలు విశిష్టత ఏమిటి ?’’విశ్వ హృదయ పద్మం యొక్క స్థానమే చిదంబరం’’. అంటే విరాట్ హృదయ పద్మ స్థానమే చిదంబరం అని గ్రహించి మనం దర్శించాలి .నట రాజ స్వామి ని ‘’సకల చిరు మేని ‘’అంటారు .

చిదంబర రహస్యం

గర్భ గుడి లో శివుడు మూడు రూపాలలో దర్శన మిస్తాడు .అసలు రూపం నట రాజ మూర్తి .దీన్ని ‘’సకల రూపం ‘’ అంటారు .ప్రక్కనే ఉన్న స్పటిక లింగం ను ‘’సకల నిఖిల రూపం ‘’అంటారు .మూడవది రూప రహిత ఆకాశ రూపం దీనినే ‘’నిష్కల రూపం ‘’అంటారు ఇదే చిదంబర రహస్యం  .ప్రపంచ అయస్కాంత మధ్య గత రేఖ అంటే ‘’మాగ్నటిక్ మెరిడియన్ ‘’చిదంబరం లో ఉంది .అందుకే చిదంబరానికి అంత టి ప్రాధాన్యత వచ్చింది .

.ఐదు పంచ భూత ఆలయాలలో చిదంబరం ఆకాశ లింగం .అరుణా చలం లో అగ్ని లింగం ఉంది .శ్రీ కాళ హస్తి లో  వాయు లింగం ఉంది . కంచి లో ఏకాంబరేశ్వర ఆలయం లో పృథ్వి లింగం ఉంది . జల లింగం తమిళ నాడులోని జంబుకేశ్వరం లో ఉంది (తిరువనైకావల్ )అంటే నాలుగు లింగాలు తమిళ నాడు లోనే ఉన్నాయి ఒక్క వాయు లింగమే ఆంద్ర ప్రదేశ్ లో కాళ హస్తి లో ఉంది .

ఆలయ నిర్మాణం లో నిక్షిప్తమైన ఆధ్యాత్మిక భావనలు

చిదంబర నట రాజ ఆలయానికి తొమ్మిది ద్వారాలున్నాయి .ఇవిమానవ శరీరం లోని నవ రంద్రాలకు  ప్రతీకలు .స్వర్ణ మందిరం లేక చిత్త సభ  లేక గర్భాలయం  మానవ హృదయానికి ప్రతీక . పంచాక్షర పది . చిహ్నం అదే శివాయన మహః .దీనినే ‘’కనక సభ’’అంటారు .చిత్ సభ నాలుగు స్తంభాల పై ఉంటుంది .ఈ స్తంభాలు నాలుగు వేదాలకు ప్రతీకలు .పొన్నాంబలం అనే గర్భాలయం 28స్తంభాలపై ఉంటుంది .ఇవి ఇరవై ఎనిమిది ఆగమ శాస్త్రాలకు ప్రతీకలు .పై కప్పు 64అడ్డ దూలాల తో ఉంటుంది .ఇవి 64కళలకుచిహ్నాలు .మిగిలిన అనేక క్రాస్ బీమ్స్ మానవ శరీరం లోని రక్త నాళాలకు ప్రతీకలు .పై కప్పు 21,600బంగారు ఇటుకల తో నిర్మించ బడింది .వాటి పై శివాయనమః అని రాయ బడి ఉంటుంది .ఇవి మానవుడు జీవిత కాలం లో పీల్చే ఉచ్చ్వాస నిస్స్వాసాలకు ప్రతీక .వీటిని బంధించటానికి ఉపయోగించిన 72 000 బంగారు మేకులు మానవ శరీరం లోని సమస్త నాడులకు ప్రతీకలు .పై కప్పు లోని  9 కలశాలు నవ శక్తులకు చిహ్నాలు .అర్ధ మండలం లోని 6స్తంభాలు ఆరు శాస్త్రాలకు ప్రతీకలు .అర్ధ మండపానికి ఉన్న8 స్తంభాలు ఎనిమిది పురాణాలకు సంకేతం .

ఆలయానికి ఉన్న తొమ్మిది ద్వారాల్లో నాలుగు ద్వారాలపై ఉన్న గోపురాలు ఏడు అంతస్తులు కలవి .ఇవి తూర్పు ముఖం లో ఉన్నాయి .దక్షిణ గోపురాన్ని పాండ్య రాజు ‘’చొక్కా సీయ తిరునవై ‘’నిర్మించాడు .పాండ్య రాజులు రెండు పెద్ద చేపలను నిర్మించారు .పశ్చిమ గోపురం 1150కాలానికి చెందింది .ఇక్కడ దేవత మహిషాసుర మర్దిని అమ్మ వారు. .స్కందుడు నెమలి పై కనీ పిస్తాడు .ఉత్తర గోపురం 1509-15  లో శ్రీ కృష్ణ దేవ రాయలు నిర్మించాడు . తూర్పు గోపురాన్ని పల్లవ రాజు  ‘’కోపెరుం సింగం ‘’1243-79లో నిర్మించాడు .తూర్పు ద్వారం పై 108 భారత నాట్య భంగిమలు భరతుడు రాసిన నాట్య శాస్త్రం ఆధారం గా శిల్పీకరించి చూపరుల దృష్టిని ఆకర్షిస్తాయి .

నట రాజ దేవాలయం లో కనక సభ లోనే పూజాదికాలు నిర్వ హిస్తారు .నృత్య సభలో 56స్తంభాలుంటాయి ముందు ధ్వజ స్థంభం పెద్దది గా ఉంది .ఇక్కడే కాళికా దేవిని నాట్యం లో శివుడు ఓడించాడు .ఆ భంగిమ కని పిస్తుంది .రాజ సభలో వెయ్యి కాళ్ళ మండపం ఉంది .ఇదే సహస్ర దళ పద్మం .సహస్రారానికి ప్రతీక .ఇక్కడే భగవద్దర్శనం లభిస్తుంది .ఈ చక్రమే వెయ్యి రేకుల పద్మానికి గుర్తు .సహస్రార చక్రం పైనే ధ్యాస ఉంచాలి ఇదే భగవద్ సాన్నిధ్యం .ఇదే యోగ రహస్యం .ఉత్సవ రోజుల్లోనే ప్రవేశం .దేవ సభలో పంచ మూర్తులు గణేశుడు ,సోముడు స్కందుడు ,శివానంద నాయకి మురుగన్,చండి కేశ్వరులు ఉంటారు .ఈ విషయాలు ఎవరూ చెప్పరు .నేను ఇవన్నీచదివి తెలుసు కొని  మేము చూసిన అన్ని దేవాలయ విశేషాలను నోటు బుక్ లో రాసుకొని మిగిలిన ముగ్గురికి ఆలయానికి వెళ్ళే ముందే చెప్పి  ఆ  దృష్టితో చూడమని చెప్పాను .వాళ్ళు ఎంతో ఆనందించారు .ఇవన్నీ తెలుసు కొని దర్శిస్తేనే మనకు సంతృప్తి కలుగు తుంది .అంత ఓపికా, తీరికా ఉండాలి .

   శివాలయం లో విష్ణ్వాలయం

చిదంబరాలయం లో శ్రీ గోవింద రాజ స్వామి ఆలయం ఉండటం ప్రత్యేకత ను సంత రించు కొంటుంది శివ కేశవ అభేదానికి తార్కాణ గా నిలుస్తుంది .ఇది 108వైష్ణవి దివ్య క్షేత్రాలలో ఒకటి గా గుర్టింపు పొందింది .మహా రాజ కవి కుల శేఖర ఆల్వార్ దీన్ని తన రామాయణం లో ‘’చిత్ర కూటం ‘’అని పేర్కొన్నారు .ఈ ఆలయం లో మూర్తి అచ్చం గా తిరుపతి లోని గోవింద రాజ స్వామి లాగా ఉంటుంది .ఒకప్పుడు ఇక్కడి ఉత్సవ మూర్తి ని భగవద్ రామానుజులు ఎత్తుకొని తనకు పడిన శిక్ష తప్పించుకోవటానికి పారి పోయారు .1564-1572లో కృష్ణప్ప నాయకుడు మళ్ళీ విగ్రహ ప్రతిష్ట చేశాడు నట రాజు ఆలయం లో విష్ణు మూర్తి ని పెట్టటం ఏమిటని శైవులు అడ్డు పెట్టారు .కాని రాజు ప్రతిష్ట చేసే శాడు .శైవులకు వైష్ణవులకు కోర్టు తగాదాలు చాలా కాలం నడిచాయి .చివరికి కోర్టు వైష్ణవుల పక్షాన్నేఅంటే ఆళ్వారుల పక్షాన్నే  తీర్పు నిచ్చింది .తగాదాలు సమసి పోయాయి

శివ కామి ఆలయం నట రాజ ఆలయానికి వెనక ఉంటుంది .అమ్మ వారు సర్వ శుభ దాయిని .కాళికా మాత అంశ ఆలయం ప్రవేశ మందిరం పై కప్పు మీద శివ పార్వతుల కళ్యాణ ఘట్టాల వర్ణ చిత్రాలు కన్నుల పండువు గా కని పిస్తాయి .

మరొక దేవాలయం లో పునర్దర్శనం చేద్దాం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -18-2-14-ఉయ్యూరు

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

సుచీంద్ర దర్శనం

సుచీంద్ర దర్శనం

 

తమిళ నాడు కన్యాకుమారి కి పన్నెండు కిలో మీటర్ల దూరం లో సుచీంద్ర క్షేత్రం ఉంది .ఇంద్రుడు శుచి అయిన ప్రదేశం కనుక సుచీన్ద్రం అయింది .ఇక్కడ శివుడు త్రిమూర్తి స్వరూపం లో దర్శన మిస్తాడు . అనసూయాదేవి త్రిమూర్తులను పసి పాపాలను చేసి ఉయ్యాలలో ఊగించి లక్ష్మీ సరస్వతి పార్వతీ దేవుల కు కను విప్పు కల్గించిందిఇక్కడే . .ఇక్కడి అలంకార మండపం ఎన్న దగినది .నాలుగు పెద్ద రాతి స్తంభాలు వాటికి అనుబంధ స్తంభాలతో ఒకఏక రాతి నిర్మితం .మరి రెండు స్థంభాలకు ముప్ఫై మూడు చిన్న స్తంభాలు కలిసి ఉంటాయి .ఇంకో రెండు స్థంభాలకు ఇరవై అయిదు చిన్న స్తంభాలు జత చేయ బడి ఉంటాయి .ఇవన్నీ సంగీత స్తంభాలే .ఏ స్తంభాన్ని మీటినా సంగీత స్వరం విని పించటం ప్రత్యేకత  ప్రతి చిన్న స్థంభం ఒక్కొక్క రకమైన సంగీత ధ్వని చేయటం ఆకర్షనీయం గా విశేషం గా ఉంటుంది .

ఆలయం వెలుపల పద్దెనిమిది అడుగుల ఎత్తు రాతి హనుమంతుని విగ్రహం విశ్వ రూప సం దర్శన భాగ్యాన్ని కలిగిస్తుంది .134అడుగుల గోపురం చాలా దూరానికే కానీ పిస్తుంది .ముఖ ద్వారమే ఇరవై నాలుగు అడుగుల ఎత్తుగా శిల్ప శోభితం గా ఉంటుంది .శైవులకూ వైష్ణవులకూ కూడా దర్శనీయ క్షేత్రం సుచీన్ద్రం .పెద్ద శివలింగం ప్రక్కనే విష్ణువు ఉంటారు గర్భ గుడి లో .ఏప్రిల్ –మే నెలలలో   ఒక సారి డిసెంబర్ జనవరి లో ఒక సారి ఉత్సవాలు జరుగుతాయి . పెద్ద జలాశయం ముందే కనిపించి ఆశ్చర్య పరుస్తుంది

Inline image 2  Inline image 3  Inline image 8Inline image 4  Inline image 5

Inline image 6  Inline image 7

 

      నాగర్ కోయిల్ లో శ్రీ  నాగ రాజ స్వామి ఆలయం

తమిళ నాడు లో నాగర్ కోయిల్ లో శ్రీ నాగ రాజ దేవాలయం చూడాల్సిన ప్రదేశం. నాగ రాజ కోవెల్ నాగర్ కోయిల్  అయింది ఇక్కడ అండ కృష్ణుని విగ్రహం నాగ రాజ స్వామి విగ్రహం ప్రసిద్ధి చెందినవి ..ముందు పెద్ద కోనేరు ఉంది .గరుత్మంతుడు అమృత భాన్దాన్ని తెస్తుంటే అందులోని కొన్ని చుక్కలు గరిక మీద పడ్డాయి కశ్యప బ్రహ్మ కద్రువ కుమారులైన నాగులు ఆ అమృతపు చినుకులను నాకితే వాటి నాలుకలు చీలి పోయాయి .నాగులు మానవ రూపం పొందుతారు .మనిషి తనకు అపకారం చేస్తే తప్ప పాములు ఏమీ చేయవు. అపకారం చేస్తే పగ బట్టి చంపేస్తాయి .దక్షిణ భారత దేశం లో నాగ పూజ అనాదిగా వస్తున్న సంప్రదాయం .నాగుల చవితి నాగ పంచమి సుబ్రహ్మణ్య షష్టి చాలా శ్రద్ధ గా చేస్తారు .

ఈ ఆలయం లో నాగ దేవతల తో పాటు జైన తీర్ధన్కరులైన మహా వీర ,పార్శ్వ నాద మందిరాలున్నాయి .ముఖ ద్వారం పై బుద్ధ విహారం లోని చైనా శిల్ప కళ అబ్బుర పరుస్తుంది .రామాయణం లో వాల్మీకి మహర్షి మహేంద్ర గిరి నాగుల ఆవాస భూమిగా పేర్కొన్నాడు .కొట్టార్ గా ప్రసిద్ధమైన ఈ ఊరు నాగర్ కోయిల్ గా మారింది .ఒకప్పుడు కాలక్కాద్ మహారాజు కుష్టు వ్యాధి తో బాధ పడుతూ ఈ ఆలయానికి వచ్చి నాగరాజ స్వామిని అర్చించ గానే వ్యాధి పోయింది .కృతజ్ఞతా పూర్వకం గా రాజు ఈ దేవాలయాన్ని నిర్మించాడు .ఆగస్ట్ సెప్టెంబర్ నెలల్లో ప్రతి ఆదివారం రాజు భార్యా సమేతం గా ఇక్కడికి వచ్చి నాగరాజ స్వామిని పూజించే వాడు .ప్రతి ఆదివారం వేలాది భక్తులు వచ్చి నాగ రాజులను దర్శించి పూజిస్తారు .ఇలాంటి దేవాలయమే కేరళలో ‘’సర్పర కాడు’’ లో ఉంది .అక్కడి నాగ రాజు ఇక్కడి నాగ రాజు ఒకే మాదిరిగా ఉంటారు .రాజా రవి వర్మ చిత్రించిన శేష నారాయణ స్వామి వర్ణ చిత్రం చూడ ముచ్చట గా ఉంటుంది .   

Inline image 1

మరో ఆలయం లో కలుద్దాం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -18-2-14-ఉయ్యూరు

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

శ్రీ అది శంకరాచార్యుల వారి జన్మ క్షేత్రం –కాలడి

  శ్రీ అది శంకరాచార్యుల వారి జన్మ క్షేత్రం –కాలడి

కేరళలో గురువాయూర్  కు 75కిలో మీటర్ల దూరం లో కాలడి గ్రామం ఎర్నాకులం జిల్లా లో ఉంది .ఇదే జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్యులు వారు జన్మించిన పవిత్ర క్షేత్రం .ఇక్కడి నుండే కాలి నడకన ఆసేతు హిమాచల పర్యంతం అనేక సార్లు తిరిగి నాలుగు ఆమ్నాయ పీఠాలు స్తాపించి ఆర్షధర్మాన్ని  నిల బెట్టారు. వైదిక మతోద్ధారణ చేశారు .అద్వైత మత స్థాపనా చార్యులు గా కీర్తి శిఖరాన్ని అధిరోహించారు .పరమ విశిష్టమైన కాకాశ్మీర్ శారదా పీఠాన్ని సమర్ధత నిరూపించి శారదా మాత అంగీకారం తో అధిరోహించి జగద్గురువు లని పించుకొన్నారు .ఆ మహాను భావుడే లేక పోతే చైనా ,పాకిస్తాన్ సరిహద్దు లో ఉన్న భారత దేశ ప్రజలు ధర్మానికి దూరమై పోయి ఉండేవారు. ఆయన ప్రబోధం సకల మానవ సోదరత్వమే .ఆధ్యాత్మిక కీర్తి పతాకని ప్రపంచం అంతా రెపరెప లాడించిన ఆ మహనీయ మూర్తి జన్మ స్థలాన్ని దర్శించాలనే తపన ఈ ఫిబ్రవరి లో తీరింది .ఆ మాహత్మునికి ఏమిచ్చినా హిందూ జాతి  ఋణం తీరనే తీరదు .అలాంటి పవిత్ర కాలడి గురించిన విశేషాలు ఇప్పుడు తెలియ జేస్తున్నాను .

శ్రీ శంకర జన్మ క్షేత్రం గుర్తింపు

ఎర్నాకులం జిల్లాలో పెరియార్ నదికి తూర్పున ఉంది కాలడి గ్రామం .ఈ గ్రామాన్ని గుర్తు పట్టటం మొదట పెద్ద సమస్య గా మారింది. అప్పుడు శృంగేరి పీఠం వారు మహా పండితుడు చారిత్రిక పరిశోధకుడుశంకరుల జీవితం పై అధారిటీ అయిన శ్రీ నడుకావేరి శ్రీనివాస శాస్త్రి గారిని కాలడికి పంపారు .అసలు ఆది శంకరుల  జన్మ స్థలాన్ని అన్ని ఆధారాలతో తేల్చమనిపంపారు . ఆయన ఇక్కడికి వచ్చి పరిశీలనా ,పరిశోధనా చేసి కైఫీయత్తులను తిరగేసి ఇప్పుడు శ్రీ శంకరులదేవాలయం కట్టబడిన ప్రదేశమే అసలైన ఆది శంకరుల జన్మ క్షేత్రం అని నిర్ధారించి రుజువులతో సహా తెలియ జేశారు .అప్పుడు ఈ ప్రదేశం అంతా ‘’కపిల్లి మన ‘’అనే ఆయన స్వాధీనం లో ఉండేది .ఈ విషయాన్ని శృంగేరి వారు తిరువాన్కూర్ మహా రాజా వారికి తెలియ జేశారు ఆ స్థలాన్ని తమకు ఇస్తే అక్కడ శంకర ఆలయం నిర్మించి స్మ్రుతి చిహ్నం గా తీర్చి దిద్దుతామని చెప్పారు .మహా రాజు మహాదానందం పొంది’’ కపిల్ల మ’న’’ నుంచి 1906లో ఈ ప్రాంతాన్ని స్వాధీన పరచుకి శృంగేరి పీఠానికి అప్పగించాడు .

శృంగేరి మఠం ఇక్కడ  1910లో శ్రీ ఆది శంకరుల ఆలయాన్ని నిర్మించింది .అదే కాలడి ఆవిర్భావ సంవత్సరం గా భావించారు .సరిగ్గా వంద ఏళ్ళకు 2010లో కాలడి శత వత్సర ఉత్సవాలను పీఠం ఘనం గా నిర్వ హించింది ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని పీఠం నిర్మించి ప్రచారం లోకి తెచ్చింది .లేక పోతే కాలడి అలాగే చరిత్ర గర్భం లో కలిసి పోయి ఉండేదేమో ?బాల శంకరులు తన తల్లి ఆర్యాంబ కోసమై పూర్నా నదిని ఇంటి వరకు మళ్లించిన ప్రదేశం శంకరాలయానికి దగ్గరలోనే ఉంది. దాని తీరం మీదనే శంకరులు శ్రీ కృష్ణ విగ్రహం ప్రతిష్టించారు .ఇక్కడే ‘’అచ్యుతాస్తకం ‘’చెప్పారు .శంకర ఆలయం లో శ్రీ శంకర ,శారదాంబ విగ్రహాలు జగన్మొహనం గా కనీ పిస్తాయి నిత్యం అభిషేకం పూజా హోమాదులు నిర్వహించే విశాల ప్రాంగణం ఉంది .శంకరుల తల్లి ఆర్యాంబ సమాధి కూడా ఇక్కడే ఆలయం లో ఉంది అక్కడ నిత్యం జ్యోతి వెలుగుతూనే ఉంటుంది . వినాయకుని చిన్న విగ్రహమూ ఉంది .ఇక్కడ తమిళ కన్నడ స్మార్త బ్రాహ్మణులే పూజారులు .

        

శంకరాచార్య కీర్తి స్థంభం

శంకరాలయానికి దగ్గరే శృంగేరి పీఠం ఉంది .ఇక్కడి శ్రీ కృష్ణ దేవాలయం లోనే శ్రీ శంకరులు 243పంక్తుల ‘’ప్రబోధ చంద్రోదయం ‘’రాశారు .కాలడి దేవస్థానం అధీనం లో ఉంది .రామ కృష్ణ మఠం కూడా సమీపం లో ఉంది .కాలడి గ్రామం లో ప్రవేశించ గానే మనకు కంచి కామ కోటి పీఠంవారు నిర్మించిన ఎనిమిది అంతస్తుల’’ కీర్తి స్థంభం ‘’అనే బృహత్ భవనం కానీ పిస్తుంది .అది శంకరుల జీవిత చరిత్ర అంతా చిత్రాలలో ప్రదర్శించారిక్కడ .పై అంతస్తుకు వెళ్లి నగర దర్శనం చేయ వచ్చు శ్రీ శంకరాచార్య ,శ్రీ గనేశుల పెద్ద విగ్రహాలు ఇందులో ఉన్నాయి .

     

చూడాల్సిన ప్రదేశాలు

కాలడికి ఒక కిలో మీటర్ దూరం లో మాణిక్య మంగళం లో శ్రీ కాత్యాయిని మాత దేవాలయం ఉంది .ఇది దుర్గా మాత ఆలయం .ఇక్కడే శంకరుల బాల్యం లో తండ్రి శివ శర్మ ఏదో పని మీద వెడుతూ కొడుకు కు అమ్మవారికి పాలు నైవేద్యం పెట్టి రమ్మని పంపాడు .అలానే బాల శంకరుడు అమ్మవారి ముందు పాల చెంబు ఉంచి నైవేద్యం పెట్టి తాగమని గోల చేశాడు అమ్మ వారు తాగక పోయే సరికి ఏడుపు లంకించుకొన్నాడు అప్పుడు అమ్మ వారు ప్రత్యక్షమై ఆ క్షీరాన్ని తృప్తిగా త్రాగి శంకరులకు ఆనందాన్ని కలిగించింది .ఈ అమ్మ వారి గురించే తరువాత ‘’సౌందర్య లహరి’’ రాశారు శంకరాచార్య .

కాలడికి రెండు కిలో మీటర్ల దూరం లో ‘’మట్టూర్ తిరు వేలు మాన్ శివ దేవాలయం’’ ఉంది. దీన్నిశంకరుల తండ్రి  శివ శర్మ ప్రతిస్టించాడు .ముసలి తనం లో శంకరుని తలి దండ్రులు ఇంత దూరం వచ్చి పూజాదికాలు చేయలేక శివుడిని ప్రార్ధించారు .అప్పుడు కల లో కన్పించి ‘’నాట్యం చేసే తెల్ల జింక ‘’ను అనుసరించి వెడితే తన లింగం దగ్గరకు చేరుస్తుందని చెప్పాడు .అలానే రోజూ చేసేవారు .అందుకే ఈ గుడికి ‘’తిరువెల్ల మాన్ మల్లి ‘’అనే పేరొచ్చింది .అంటే ‘’నాట్యం చేసే తెల్ల జింక ‘’అని అర్ధం .

నయ తోడూ శంకర నారాయణ దేవాలయం కాలడికి మూడు కిలో మీటర్ల దూరం లో ఉంది .ఇది అద్వైత అర్చనకు గొప్ప స్థానం గా ప్రసిద్ధమైంది .ఈ శివాలయం లో శంకరాచార్య విష్ణువును ప్రార్ధిస్తే ఆయన ప్రత్యక్షమై ఇక్కడి శివుని లో కలిసి పోయి శివ కేశవులకు భేదం లేదని నిరూపించినగొప్ప క్షేత్రం ఇది. అందుకే ముందు శివుడికి తర్వాత విష్ణువుకు ఇక్కడ అర్చన నిర్వహిస్తారు .

మంజప్ప కు ఎనిమిది కిలో మీటర్ల దూరం లో శివ శర్మ పూజారిగా ఉన్న ‘’మంజప్ప కార్విల్లి కావు శివ టెంపుల్ ‘’ఉంది

అలాగే ‘’తెక్కే మదోం ‘’అనే చోట శ్రీ కృష్ణుని గుడి పక్కనే తిరుచ్చి శంకర మఠం ఉంది ఈ మతానికి  చెందిన వారికే పూజార్హత .

శంకరుని తల్లి ఆర్యామ్బకు దహన సంస్కారాలను జరిపిన చోటు ఇప్పుడు శంకరాలయం లోనే ఉంది .పది నంబూద్రి కుటుంబాలలో శంకరునికి సాయం చేసినవి రెండే రెండు కుటుంబాలు .ఈ ప్రాంతాన్ని ‘’కపిల్లమన’’ అంటారు .ఆనాటి నుంచి ఈనాటి  వరకు నిత్య దీపారాధన జరుగుతూనే ఉండటం విశేషం .

కాలడి కరవు (ఆడట్టు కడవు )దగ్గరే నది మార్గం మారి కాలడి  గ్రామం ఏర్పడింది .ఇక్కడే శంకరులు శ్రీ కృష్ణ విగ్రహం స్థాపించారు .శ్రీ కృష్ణ ఉత్సవాలలో ఇక్కడి నుండే జలాన్ని తీసుకు వెడతారు

‘’మూతల ల కడవు ‘’అంటే మొసలి ఘాట్ -క్రోకడైల్ ఘాట్ అంటారు .ఇక్కడే నదిలో స్నానం చేస్తుంటే బాల శంకరుని మొసలి పట్టుకోంది. తల్లి అనుమతి తో నీటిలోనే ఆపద్ధర్మ సన్యాస దీక్ష తీసుకొన్నాడు బాల శంకరులు. ఇవి కాక శ్రీ శంకరాచార్య యూని వర్సిటి, కాలేజి, ఇంజినీరింగ్ కాలేజి చూడ తగిన ప్రదేశాలు .

అనంత పద్మ నాభుడి నుండి అరుణాచలేశ్వరుని దాకా -1

అనంత పద్మనాభుడి నుండి అరుణా చలేశ్వరుని దాకా -2

అనంత పద్మనాభుడి నుండి అరుణా చలేశ్వరుని దాకా -3

అనంత పద్మనాభుడి నుండి అరుణా చలేశ్వరుని దాకా -4(చివరి భాగం )

మరో క్షేత్ర దర్శనం లో కలుద్దాం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -18-2-14-ఉయ్యూరు

Posted in అనంత పద్మ నాభుడి నుండి అరుణాచలేశ్వరుని దాకా, నేను చూసినవ ప్రదేశాలు | Tagged | 1 Comment

గురవాయూర్ శ్రీ కృష్ణ మూర్తి

                గురవాయూర్ శ్రీ కృష్ణ మూర్తి

దక్షిణ ద్వారక

దక్షిణ దేశ ద్వారక గా ,కలియుగ వైకుంఠం గా ప్రసిద్ధి చెందింది గురవాయూర్ .అయినా 108వైష్ణవ దివ్య క్షేత్రాలలో గురవాయూర్ చేరక పోవటం విశేషం .కేరళ రాష్ట్రం మలబార్ తీరం లో గురవాయూర్ శ్రీ కృష్ణ క్షేత్రం ఉంది .దేవతల గురువు బృహస్పతి అన బడే ‘’గురువు వాయువు ల ఊరు’’ కనుక గురవాయూర్ అనే పేరు వచ్చింది .ఇక్కడ శ్రీ కృష్ణుని ఆకారం గా శ్రీ మహా విష్ణువు అఆరాధన జరగటం మరో విశేషం .స్వామి పాంచ జన్య శంఖువు ,సుదర్శన చక్ర్రం ,కౌమోదకి గద ,పద్మా లతో ,మేడలో తులసి మాలతో గురవాయూరప్ప అయిన శ్రీ కృష్ణుడు శోభిల్లుతూ దర్శనమిస్తాడు .ఈ మూర్తికి ఒక విశేషం ఉంది .వసుదేవునికి దేవకీ దేవికి శ్రీ కృష్ణ జననం ముందు సాక్షాత్కరించిన శ్రీ మహా విష్ణువు రూపమే ఇది .ఆది శంకారాచార్యుల వారు నిర్దేశించిన విధానం లోనే ఇక్కడ పూజాదికాలు నిర్వహింప బడుతాయి .అందుకే దక్షిణ ద్వారక అన్నారు .1427నుండి ‘’చెన్న నారాయణ నంబూద్రి ‘’బ్రాహ్మణులే ఇక్కడ అర్చకులు గా ఉన్నారు .ముఖ్య పూజారి తెల్ల వారు ఝామున 2-30గం లకు గర్భ గుడి ప్రవేశం చేసి పూజదికాలను పూర్తీ చేసి సరికి మధ్యాహ్నం 12-30వుతుంది అంత వరకు పచ్చి గంగ కూడా పుచ్చుకోకుండా నియమ గా ఉంటాడు అదీ ప్రత్యేకతే

            

Guruvayur Sri Krishna Temple

.

ప్రసిద్ధ యాత్రాస్థలం

5,000ఏళ్ళ నుంచి పూజింప బడుతున్న అర్చా మూర్తి శ్రీ గురవాయూర్ శ్రీ కృష్ణుడు .14వ శతాబ్దం వరకు ‘’కోక సందేశం ‘’అనే కావ్యం లో ‘’కురువాయూర్ ‘’గా ప్రసిద్ధం అయింది .కరువై అంటే సముద్రం .మలబార్ సముద్ర తీరం లో ఉంది కనుక ఆ పేరు సార్ధక మైంది .క్రమం గా పేరు గురవాయూర్ గా మారింది .’’మామన్ కం ‘’అనేది ఇక్కడి స్థానిక సంఘటన .’’తిరునాయ ‘’అనే చోట ‘’భారత పుజ్జక ‘’తీరం లో జరిగిందిది .కాలికట్ జమీందార్లకు ,వళ్ళువ నార్ ప్రజలకు ఇక్కడే అనేక సార్లు యుద్ధాలు జరిగాయి .కాలికట్ జమీందారు వైష్ణవుడై శ్రీ కృష్ణ భక్తుడు గా మారి పోయాడు .యదా రాజా తదా ప్రజా గా ప్రజలూ శ్రీ కృష్ణ భక్తులై పోయారు .1638గర్భాలయాన్ని ముందు  గా నిర్మించారు .’’విశ్వ బలి ‘’చేసి దుస్ట శక్తులను తరిమేశారు .పదహారవ శతాబ్దానికే గొప్ప యాత్రాస్తలమైంది గురవాయూర్ .

శ్రీ కృష్ణ విగ్రహం

గురవాయూర్ లోని శ్రీ కృష్ణ మూర్తి విగ్రహం ‘’పాతాలాన్జనశిల  ‘’అంటే యాంటి మోని  అనే అయస్కాంత శిలఅంటే ‘’సుర్మా శిల’’  తో తయారు చేయ బడింది .శ్రీ మహా విష్ణువు నిద్ర లేవగానే శ్రీ కృష్ణ రూపం దాల్చి తన విగ్రహాన్ని శివుడికి ఇచ్చాడు అయన బ్రహ్మ కు అంద జేస్తే బ్రహ్మ మనువుకు అతని భార్యకు అప్పగించాడు .శత రూప చక్ర వర్తి మగ సంతతి కోసం విష్ణుమూర్తి దర్శనం కోసం   తపస్సు చేశాడు .ఆయన అనుగ్రహించి తాను వారికీ పుత్రుడుగా జన్మిస్తానని తెలియ జేశాడు .అది నాలుగు జన్మలలో సాధ్యం అవుతుందని చెప్పాడు .నాలుగు జన్మలలో నాలుగు రూపాలుగా పుడతానని తెలియ జేశాడు .శత రూప దంపతులకు ‘’మొదట ‘’పృశ్ని గర్భుడు ‘’గా విష్ణువు జన్మించాడు .అతడు ఐహిక వాంఛ లకు దూరమై బ్రహ్మ చర్య వ్రత దీక్షలో గడిపాడు .రెండవ జన్మ లో కశ్యప ప్రజా పతి అదితి లకు వామనుడు గా జన్మించాడు .మూడవ జన్మ లో కౌసల్యా దశరధులకు శ్రీ రాముని గా జన్మించాడు .నాలుగవ జన్మ లో దేవకీ వసుదేవులకు శ్రీ కృష్ణుడిగా విష్ణువు పుట్టాడు .వారి కోరిక తీర్చాడు .శ్రీ కృష్ణ విగ్రహాన్ని ఉద్ధవుడు రుక్మిణీ దేవి అత్యంత భక్తీ శ్రద్ధాల తో పూజించారు .ద్వారకా నగరం లో తరతరాలుగా వస్తున్న ఈ శ్రీ కృష్ణ విగ్రహాన్ని స్వయం గా శ్రీ కృష్ణ పరమాత్మ యే ప్రతిస్టించాడు .

కృష్ణ విగ్రహం గురవాయూర్ చేరిన వైనం

ద్వాపర యుగాంత సమయం లో శ్రీ కృష్ణుని తో సహా  సకల యాదవ నిర్యాణ సమయం లో ద్వారక సముద్రం లో మునిగి పోతుందన్న సంగతి తెలిసిన కృష్ణుడు తన విగ్రహాన్నితనకు అత్యంత ఆప్తుడు అయిన ఉద్దవునికి అప్పగించి ద్వారక నుండి వెళ్లి పోయి సరి అయిన ప్రదేశం లో విగ్రహాన్ని ప్రతిస్టించమని కోరాడు .ద్వారక సముద్రం లో లయం అయిపోగానే ఉద్ధవుడు శ్రీ కృష్ణ విగ్రహాన్ని తీసుకొని బయట పడ్డాడు .దారిలో దేవగురుడు బృహస్పతికలిసి తానూ అదే పని మీద వచ్చినట్లు చెప్పాడు ఇ.ద్దరూ కలిసి వెడుతుంటే వాయుదేవుడూ అదే పని మీద వచ్చినట్లు చెప్పి కలిశాడు పాల్ఘాట్ సముద్ర తీరం చేరారు ముగ్గురూ .అప్పుడు పరశురాముడు కనిపించి తాను శ్రీ కృష్ణ విగ్రహం కోసం ద్వారకకు వేడుతున్నట్లు తెలియ జేయగా తమ వద్దే విగ్రహం ఉందని ఈ ముగ్గురూ చెప్పారు .అందరూ కలిసి తగిన ప్రదేశం కోసం అన్వేషిస్తూ గురవాయూర్ వచ్చారు .అప్పుడు ఇక్కడ శివ పార్వతులు  ప్రశాంతం గా తపస్సు చేసుకొంటున్నారు .వీరు వచ్చిన విషయం తెలుసుకొని శ్రీ కృష్ణ విగ్రహ ప్రతిష్టాపనకు ఇదే అత్యంత అనువైన ప్రదేశం అని చెప్పి తామిద్దరు  అక్కడి నుంచి వేరొక ప్రశాంత స్థలానికి వెళ్లి తపోదీక్ష కోన సాగించారు .పరశురాముని నేతృత్వం లో గురువు వాయువు సాయం తో ఉద్ధవుడుద్వారక నుంచి తెచ్చిన  శ్రీ కృష్ణ విగ్రహాన్ని ప్రతిష్టించారు .అందుకే గురవాయూర్ అని పేరు పొందింది ఈ క్షేత్రం .గురవాయూర్ యాత్ర పూర్తీ కావాలంటే ముందుగా  ఇక్కడికి చాలా దూరం లో ఉన్న ‘’ముమ్మయూర్ ‘’లో  శివ దర్శనం చేసి ఇక్కడికి రావాలి .అందరూ అంత దూరం వెళ్ళ లేరు కనుక గురవాయూర్ లోనే శ్రీ కృష్ణ దర్శనానికి ముందు ‘’ఈశాన్యం ‘’వైపు తిరిగి శివుడిని స్మరించితే అక్కడి శివ దర్శనం చేసి నట్లే .ఈ విషయం మనకు ఎవరూ చెప్పరు .తెలుసుకొని గురవాయూర్ వెళ్ళిన వారు దీన్ని ఆచరించాలి .

పంచ శ్రీ కృష్ణ క్షేత్రాలు

పూరీ లోని జగన్నాధ స్వామి ,తిరుపతి లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ,రాజస్థాన్ లోని నాద ద్వారా, గుజరాత్ లోని ద్వారక ,కేరళ లోని గురవాయూర్ –ఈ అయిదు శ్రీ కృష్ణ క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి .భూలోక వైకుం ఠం గా గురవాయూర్ ను భావిస్తారు .స్వామిని ఆప్యాయం గా ముద్దు గా ‘’గురవాయూరప్పన్ ‘’అంటే గురవాయూర్ తండ్రి ,నాయన, దేవుడు అని పిలుచుకొంటారు .అదే సరదాగా ‘’ఏమప్పా !గురవాయూరప్పా !’’అని వ్యంగ్యం గా లోకం లో ప్రసిద్ధమైంది కూడా .

శ్రీ కృష్ణ మూర్తి

కృష్ణ విగ్రహం చిన్న నల్ల రాతి విగ్రహం .రెండు అడుగులే ఉంటుంది .నల్ల యాంటి మోని అనే అయస్కాంత పదార్ధం తో తయారు చేయబడిన విగ్రహం .అందువలన ప్రత్యెక వైద్య గుణాలు ఈ విగ్రహం లో ఉన్నాయి .అందుకే ఇన్ని లక్షల మంది  ఎంతెంతో  దూరాల ను నుంచి వచ్చి దర్శనం చేసి పులకించి పోతారు. కృష్ణ వైభవం వర్ణనా తీతం. బహు సుందర కృష్ణ మూర్తి .విగ్రహాన్ని ప్రతి రోజూ నువ్వుల నూనె తో తుడుస్తారు .’’వాక ‘’అనే వన మూలికా భస్మాన్ని విగ్రహం పై చల్లుతారు .అప్పుడు దివ్య మైన కళా, కాంతి,తేజస్సు  గోచరిస్తాయి .ఆ తర్వాత విగ్రహానికి అభిషేకం చేస్తారు .ఈఅభిశేక జలాన్ని భక్తులు పవిత్ర తీర్ధం గా భావించి భక్తీ తో సేవిస్తారు .రోగ నివారకం అని గొప్ప నమ్మకం .ఇక్కడ తులాభారం తూగి స్వామికి దాన్ని కానుకగా ఇవ్వటం పెద్ద విశేషం దీనికోసం క్యూ లో జనం నిలబడి మొక్కు తీర్చుకొంటారు ఽఅలయమ్ లో ఏనుగులు మరీఆకర్షణ

ఇక్కడి సరస్సు ను రుద్ర తీర్ధం అంటారు .ఇక్కడే శివ పార్వతులు కృష్ణ విగ్రహ ప్రతిస్టాపన ముందు వరకు విహరించారు .పైన బట్ట లేకుండా శ్రీ కృష్ణుని దర్శించటం ఇక్కడి సంప్రదాయం. అందరూ పాటిస్తారు .ఒక్క సారి దర్శిస్తే చాలు జీవితం ధన్యమయినట్లే .

మరో ఆలయం లో మళ్ళీ  కలుద్దాం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -18-2-14-ఉయ్యూరు

అనంత పద్మ నాభుడి నుండి అరుణాచలేశ్వరుని దాకా -1

అనంత పద్మనాభుడి నుండి అరుణా చలేశ్వరుని దాకా -2

అనంత పద్మనాభుడి నుండి అరుణా చలేశ్వరుని దాకా -3

అనంత పద్మనాభుడి నుండి అరుణా చలేశ్వరుని దాకా -4(చివరి భాగం )

మరో ఆలయ విశేషాలు మరో సారి

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

ఉయ్యూరు శ్రీ వీరమ్మ తల్లి తిరుణాల సందడి 

తాత మనవడు ,మామ్మ మనవరాలు -ఉయ్యూరు శ్రీ వీరమ్మ తల్లి తిరుణాల సందడి

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

ఏ జీవితమూ ఒక ఓటమితో ఆగి పోదు అని భరోసా ఇస్తున్న సినీ రచయితా మరుధూరి రాజా-

 

‘మనసు సున్నితం.. రాత నవరసభరితం’ డైలాగ్‌రైటర్ మరుధూరి రాజా మీద మనమొక డైలాగు వేయాలనుకుంటే దీన్ని వేయవచ్చునేమో! ఆయనతో కాసేపు మాట్లాడినా, ఆయన రాసిన సినిమాలను చూసినా ఇదే అభిప్రాయం కలుగుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల మనసెరిగి రాయకపోతే – ముప్పయి ఏళ్లపాటు రెండొందల సినిమాలకు రాసుండేవారు కాదేమో! ‘నవభారతం’ నుంచి ఈ మధ్యే వచ్చిన ‘దేనికైనా రెడీ’ వరకు ఇప్పటికీ రాస్తూనే ఉన్న మరుధూరి అనుభవాలే ఈ వారం ‘డైలాగ్‌గురూ’

30 ఏళ్లు.. 200 సినిమాలు
గుంటూరులో జన్మించిన మరుధూరి రాజా ఒంగోలులో చదువుకున్నారు. ఆయనకు ఐదుగురు సోదరులు. పెద్దన్నయ్య ఎంవిఎస్ హరనాథరావు కూడా పేరున్న సినీ మాటల రచయిత. తండ్రి క్లర్కుగా చేసేవారు. తల్లి సంగీత ఉపాధ్యాయురాలు. చిన్నప్పటి నుంచే నాటకాలు రాయడం, వేషాలు కట్టడం, దర్శకత్వం చేయడం వంటి విషయాల్లో ఆరితేరారు మరుధూరి. సినిమాల్లోకి రాకమునుపే పద్దెనిమిది నాటకాలను రాసి గట్టి పునాది వేసుకున్నారు. ‘శ్రమదేవోభవ’ అనే నాటకాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శిస్తూ.. హైదరాబాద్‌లోని రవీంధ్రభారతిలో వేశారు ఒకసారి. నాటకాన్ని తిలకించడానికి వచ్చిన జంధ్యాల మరుధూరి ప్రతిభను ప్రశంసిస్తూ.. “సినిమాల పట్ల ఆసక్తి ఉంటే మద్రాసుకు వచ్చేయ్’ అన్నారు. వెంటనే ఆయన జంధ్యాలగారి వద్దకు వెళ్లి ‘శ్రీవారికి ప్రేమలేఖ’, ‘పుత్తడిబొమ్మ’, ‘రావూ గోపాలరావు’ సినిమాలకు సహాయ దర్శకులుగా పనిచేశారు. ఆ తర్వాత – ఈతరం ఫిలిమ్స్ బ్యానర్‌లో వచ్చిన ‘ప్రజాస్వామ్యం’ అనే సినిమాకు మాటలు రాస్తున్న పరుచూరి బ్రదర్స్ దగ్గర చేరారాయన. వారి వద్ద మెళకువలు నేర్చుకుని.. ‘నవభారతం’ అనే సినిమాతో డైలాగ్ రైటర్ అయ్యారు. అది హిట్ కావడంతో వెనుదిరిగి చూడలేదు. పోకూరి బాబూరావు, రాఘవేంద్రరావు, ఈవీవీ, ఎస్వీ కృష్ణారెడ్డి, జి.నాగేశ్వర్‌రెడ్డిల సినిమాలతోపాటు సుమారు రెండొందల సినిమాలకు డైలాగ్స్ రాశారు.

‘నా చేతులకు పదకొండు వేళ్లు ఉన్నాయి. ఆ పదకొండో వేలు ఇదే’ అంటూ సిగరెట్టును ముట్టిస్తూ.. ‘ఇది వెలిగితేనే మది వెలుగుతుంది..’ అని తన మీద తనే డైలాగును విసురుకుని.. మాట్లాడటం ప్రారంభించారు మరుధూరి రాజా. “ఈతరం బ్యానర్‌లో వచ్చిన ‘నవభారతం’ నాకు మొదటి సినిమా. ఒంగోలులో పోకూరి బాబూరావుగారికి ‘నవభారత్’ అని ఒక లాడ్జి ఉంటుంది. దానినే టైటిల్‌గా పెట్టి ఈ సినిమాను తీశారాయన. షూటింగ్ కూడా అదే ఊర్లో పెట్టుకోవడంతో.. ఆ లాడ్జిలోనే ఒక గదిని నాకు కేటాయించారు. అందులో కూర్చుని డైలాగ్స్ రాస్తున్నాను. అప్పట్లో ఒంగోలు ఫ్యాక్షన్ గడ్డ. ఎవరినైనా మర్డర్ చేయాలంటే స్ట్రీట్ లైట్లు తీసేసేవారు. ఆ రోజు కూడా లైట్లు లేవు. మర్డర్ గ్యారెంటీ అనుకున్నారు జనం. అనుకున్నట్లే – మా లాడ్జి ఎదురుగ్గానే ఒకతన్ని వేటకొడవళ్లతో ఎడాపెడా నరికిపడేశారు. నేను ధైర్యం చేసి రెండడుగులు వేశానో లేదో, లాడ్జి మేనేజర్ వచ్చి ‘సార్, అటు వెళ్లకండి. డేంజర్’ అని నా రూము ఖాళీ చేయించి వెళ్లగొట్టాడు. ‘నవభారతం’ కోసం డైలాగులు రాస్తున్నంత సేపు అదే దృశ్యం గుర్తుకొచ్చేది. ఒంగోలులో ఇలాంటి హత్యలు సర్వసా«ధారణమే అని నాకు తెలుసు. అయినా నా కళ్ల ముందు జరిగిన మర్డర్‌ను అంత సులువుగా మరిచిపోలేకపోయాను. ఎంత మొనగాడైనా సరే కత్తిని నమ్ముకుని బతికితే అదే కత్తి అతని అంతు చూస్తుంది అన్నది.. అప్పుడు నాకు కలిగిన అభిప్రాయం. సరిగ్గా ఇదే భావాన్ని ఒక సీన్‌లో పెట్టాల్సి వచ్చింది. దాని కోసం నేను రాసిన డైలాగ్ ‘కత్తితో మొదలైన యుద్ధం కత్తితోనే అంతం అయిపోతుంది’. ఈ డైలాగ్ పోకూరి బాబూరావుగారికి బాగా నచ్చింది. ఆ ఒక్కమాటతోనే సినిమా మొత్తం గుర్తుండిపోయిందని ఇప్పటికీ ప్రేక్షకులు చెబుతుంటారు.

అభ్యుదయ చిత్రాల దర్శకుడు టి.కృష్ణ గారి అబ్బాయి గోపీచంద్ అమెరికాలో చదువు ముగించుకుని హైదరాబాద్ వచ్చాడు. ఆయన హీరోగా ఫ్యాక్షన్ కథతో వచ్చిన సినిమా ‘యజ్ఞం’. ఫ్యాక్షనిస్టుల చేతిలో అమాయకజనం ఎలా బలైపోతారన్నది ఇందులోని సారాంశం. ఈ సినిమాకు రాస్తున్నంతసేపు 30 ఏళ్ల కిందట నవభారత్ లాడ్జి ఎదుట జరిగిన సంఘటనే మళ్లీ మళ్లీ కళ్ల ముందు మెదిలింది. ‘యజ్ఞం’లో ఒక చోట పోలీసైన ప్రకాష్‌రాజ్ విలన్‌తో అంటాడు ఇలా “ఛత్రపతి శివాజీకి దుర్గాదేవి ఖడ్గం ఇచ్చినట్టు నీ కూతురు నా చేతికి కంప్లయింట్ ఇచ్చింది. కంప్లయింట్ చేతికొచ్చాక రెడ్డెప్ప అయితేనేం? బోడి బొక్కప్ప అయితేనేం?” అని. ఈ డైలాగ్‌లో ఫ్యాక్షనిస్టులతో విసిగిపోయిన పోలీసుల అసహనం కనిపిస్తుంది. థియేటర్‌లో కూడా ప్రేక్షకులతో విజిళ్లు వేయించిన డైలాగ్ ఇది. ‘నవభారతం’లో రాసిన ‘కత్తితో మొదలైన యుద్ధం’ అనే మాటను మళ్లీ ఈ సినిమాలో కూడా రాశాను. క్లయిమాక్స్‌లో అందరూ కత్తులను పడేసి.. రక్తపాతానికి స్వస్తి చెబుతారు. ఆ సీన్‌కు ఒక శక్తివంతమైన మాటను రాస్తేనే న్యాయం చేయగలం. అందుకని ‘కత్తితో..’ డైలాగ్‌ను మళ్లీ వాడుకున్నాను.

ఈవీవీ సత్యనారాయణ చనిపోయిన రోజు- టీవీని ఆఫ్ చేసి మూడీగా ఉండిపోయాను. ఈవీవీ తీసిన ‘అలీబాబా అరడజను దొంగలు’ దగ్గరి నుంచి ‘కత్తికాంతారావు’ వరకు పదకొండు సినిమాలకు డైలాగులు రాశాను నేను. ఎదుటివాళ్ల బాధను అర్థం చేసుకునే మంచి మనిషి ఆయన. ‘అలీబాబా అరడజను దొంగలు’ తీస్తున్నప్పుడు ఒక సంఘటన జరిగింది. ముందుగా కథను అనుకోకుండా రెండొందల యాభై సీన్లు రాసేశాను. పది రోజుల్లో షూటింగ్ ఉంది. ఈవీవీ దగ్గరికి వెళ్లి ‘ఇదీ పరిస్థితి ఏంచేద్దాం?’ అన్నాను. ‘ఏముంది కుస్తీ పట్టడమే’ అన్నారాయన. వైజాగ్‌లోని షూటింగ్ స్పాట్‌కు వెళ్లిపోయి యూనిట్ మొత్తం కూర్చుని కథను రెడీ చేసుకున్నాం. షూటింగ్ మొదలైంది. ఒక చోట – విలన్‌కు కోపం వచ్చినప్పుడల్లా ‘వేసేసేదా సార్?’ అంటుంటారు అతని పక్కనుండే ఇద్దరు గన్‌మెన్‌లు. సమయం సందర్భం లేకుండా అదే మాట పదే పదే అంటుండటంతో.. ఒకసారి విలన్‌కు చిర్రెత్తుకొచ్చి “ముందు వీన్ని వేసేయండ్రా’ అంటాడు కోపంగా. వెంటనే అక్కడున్న అనుచరులు ఆ గన్‌మ్యాన్‌ను పక్కను లాగేస్తారు. అంతటితో ఆ పాత్ర ముగుస్తుంది. నిజానికి కథా పరంగా అతన్ని పంపించాల్సి అవసరం లేదు. కాని గన్‌మ్యాన్ అర్జెంటు పనిమీద ఇంటికి వెళ్లాల్సి రావడంతో అలా చేయాల్సివచ్చింది. దీని వెనక సంఘటన చెబితేకానీ మీకది పూర్తిగా అర్థం అవ్వదు. ఒకరోజు గన్‌మ్యాన్ వేషం వేసిన వ్యక్తి నా దగ్గరికి వచ్చి “సార్, మా అమ్మగారు చావు బతుకుల్లో ఉన్నారు. నేను వెంటనే ఊరికి వెళ్లిపోవాలి..” అనడిగాడు. అదే విషయాన్ని ఈవీవీతో చెబితే ‘ “ఇప్పుడు ఉన్నట్లుండి విలన్ పక్కన అతన్ని తొలగించడం కష్టం. కాని ఆయన బాధ చూస్తుంటే మాత్రం ఇంటికి వెళ్లకా తప్పదు. ఏం చేయాలి? నువ్వే ఏదో ఒకటి చెయ్!” అని నాకు వదిలేశారు. నేను ఏం చేయాలన్నా డైలాగులతోనే మాయ చేసి అతని పాత్రకు ముగింపును ఇవ్వాలి. ఆలోచిస్తుంటే ‘ముందు వీడి సంగతి చూడండ్రా’ అని ఎవరో ఎప్పుడో అన్న మాట గుర్తొచ్చింది. అదే మాటను ‘వీడ్ని వేసేయండ్రా’గా మారిస్తే ఎలా ఉంటుంది? అనుకుని కాగితం మీద రాసి ఈవీవీకి చూపిస్తే భలేగుంది అన్నారు. ప్రేక్షకులకు బాగా నవ్వు తెప్పించిన సీన్లలో ఇదొకటి. సినిమాలో ఈ సీన్‌ను చూసినప్పుడల్లా – ఒకరికి మంచి చేయబోతే మనకూ మంచే జరిగింది అనుకుంటుంటాను.

‘అమ్మాయిని చేయి పట్టుకుని’ వంటి మామూలు డైలాగులు రాసినా సరే.. “అమ్మమ్మో! వద్దండీ బాబు వద్దు!! మనవన్నీ ఫ్యామిలీ సినిమాలు. అక్షరం కూడా అశ్లీలం దొర్లకూడదు”అనేవారు ఎస్వీ కృష్ణారెడ్డి. ఒకప్పుడు వరుస హిట్లతో ఒక వర్గం ప్రేక్షకుల మనసును గెలుచుకున్న ఆయన సినిమా ‘ఎగిరేపావురమా’కు నేను మాటలు రాశాను. అందులో – ఇంట్లో పనిమనిషిని బలాత్కరిస్తాడు చరణ్‌రాజ్. విషయం తెలుసుకున్న ఆయన భార్య సుహాసిని – పనిమనిషిని ఇంటి నుంచి బయటికి పంపిస్తుంది. అప్పుడు చరణ్‌రాజ్ “ఎందుకే ఆ అమ్మాయిని బయటికి పంపిస్తున్నావ్”అంటాడు. వెంటనే ఆమె “మిమ్మల్ని పంపించలేను కాబట్టి” అంటుంది. మళ్లీ ఆమే కలుగజేసుకుని “చూడండీ! ఏ తండ్రి అయినా తన కూతురికి పెళ్లి చేసి కాపురానికి పంపించాలనుకుంటాడు. కన్నెరికం చేసి కాపురం పెట్టాలని ఎవ్వడూ అనుకోడు. ఆ సంప్రదాయం పశువుల్లోనే కానీ మనుషుల్లో లేదు. అది నా కూతురులాంటిది. అందుకే బయటికి పంపిస్తున్నాను” అని ఘాటుగా అంటుంది సుహాసిని. ఆ డైలాగ్‌లో ‘తండ్రి, కన్నెరికం’ అనే పదాలు ఒకే దగ్గర రావడం ఎస్వీ కృష్ణారెడ్డికి నచ్చలేదు. “ఈ పదాలు ఎందుకో చాలా ఇబ్బందిగా ఉన్నాయండీ బాబూ” అన్నారు. ‘సన్నివేశం అలాంటిది. కంచే చేనుమేస్తే సామెత ఉండనే ఉంది. ఆ మాత్రం రాయకపోతే సన్నివేశానికి సానుభూతి లభించదు’ అని ఆయన్ని ఒప్పించగలిగాను. సినిమా విడుదలయ్యాక.. కొందరు మిత్రులు ఫోన్లు చేసి అభినందించడం నాకిప్పటికీ గుర్తు. ఇదే సినిమాలో మరొక సీన్‌లో- నిర్మలమ్మ “నీ పెదవుల చప్పుడు నాకు వినిపించకపోయినా నీ గుండెచప్పుడు నాకు వినిపిస్తుంది” అనంటుంది కొడుకు జేడీ చక్రవర్తితో. షూటింగ్ చేస్తున్నప్పుడే చిత్రబృందంలోని వాళ్లందరికీ ఈ డైలాగ్ మనసును తాకింది. కొందరైతే ‘మా అమ్మకూడా అచ్చం ఇలాగే అంటుంటుంది సార్’ అన్నారు.

ఒక రోజున నాగార్జునగారి నుంచి కబురొస్తే – ఆఫీసుకు వెళ్లాను. “రాజాగారూ.. నాకు కచ్చితమైన హిట్ కావాలి. ఇందులో నా కొడుకు నటిస్తున్నాడు. ఒకవేళ సినిమా పోతే స్కూల్‌లో వాణ్ణి పిల్లలంతా ఏడిపిస్తారు. అప్పుడు నేను బాధపడాల్సి వస్తుంది. మీరందరూ గట్టిగా పని చేయాలి” అన్నారు. ఆ సినిమా పేరు ‘సిసింద్రీ’. ఇందులో అఖిల్ పసివాడుగా నటించాడు. ‘బేబీస్ డే అవుట్’కి ఇది రీమేక్ సినిమా. నేటివిటీకి తగ్గట్టు మాటలు రాయడం అంత సులువు కాలేదు. బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, సుధాకర్, గిరిబాబుల మధ్య నడిచే సరదా సీన్లకు అనూహ్య స్పందన వచ్చింది. క్లయిమాక్స్‌లో జంతువులన్నీ కలిసి సిసింద్రీని రక్షిస్తాయి. అప్పుడు శరత్‌బాబు “ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. మనిషిలో మాత్రం ప్రతి జంతువు లక్షణం ఉంటుంది” అంటాడు. జంతువుల్ని చూసినప్పుడల్లా నాకు అనిపించే భావననే డైలాగ్‌గా రాశాను.

కల్మషం లేని మనిషి జగపతిబాబు. ఆయనకు వ్యక్తిగత అభిమానిని నేను. మొన్నీమధ్యనే ఏబీఎన్ ఛానల్‌లో జగపతిబాబు ఇంటర్వ్యూ చూసి ఆయనకు ఫోన్‌చేసి మాట్లాడకుండా ఉండలేకపోయాను. ఎందుకంటే – ఆయననటించిన ‘శుభాకాంక్షలు’కు మాటలు రాసినప్పటి నుంచి ఆయనతో మంచి అనుబంధం ఉంది. ఆ సినిమాలో జగపతిబాబు ఇంటర్వ్యూకు వెళుతుంటే- అప్పు తీర్చలేదన్న కోపంతో సర్టిఫికెట్లను లాక్కెళ్లిపోతాడు మార్వాడీ. అతని పక్కనే ఉన్న మిత్రుడు సుధాకర్ “ఏమిట్రా నీకీ కష్టాలు?” అంటాడు. ఆ మాటకు జగపతిబాబు “చదువు పాఠాలు నేర్పి పరీక్షలు పెడుతుంది. జీవితం పరీక్షలు పెట్టి పాఠాలు నేర్పిస్తుంది” అని చెప్పే డైలాగ్ ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకుంది. హీరో మనస్తత్వంతోపాటు కథకున్న ఔచిత్యం, పాత్ర స్వభావం దృష్టిలో పెట్టుకుని రాయడం నాకు అలవాటు. సినిమాలో డైలాగే కాదు, నిజజీవితంలోనూ జగపతిబాబు ఎన్నో ఛాలెంజ్‌లను ఎదుర్కొన్న గట్టి మనిషి. ఇదే సినిమాలో ఇంకో చోట ప్రేక్షకులను ఆకట్టుకున్న సన్నివేశం జగపతిబాబు, రవళిలకు మధ్య జరిగింది. అది – “తీగకున్న పూలు రాలిపోతే తిరిగి అతికించలేం. చేయిజారి పోయిన ప్రేమను తిరిగి తెచ్చుకోలేం”అంటాడు జగపతిబాబు. “అప్పుడు మనసు మార్చుకోవాలి” అంటుంది రవళి. “మారిపోతే అది మనసు ఎట్లా అవుతుంది. మరిచిపోతే అది ప్రేమ ఎట్లా అవుతుంది?” అని జగపతిబాబు అంటాడు. గుంటూరులో జరిగిన ఒక వేడుకలో ఇదే డైలాగును జగపతిబాబు చెప్పడం విశేషం.

అప్పట్లో ఒంగోలు ఆకురౌడీలకు ప్రసిద్ధి. వారిలో కొందరు నా బాల్య స్నేహితులు. నేను సినిమాల్లోకి వచ్చాక ఒకసారి ఊరికి వెళ్లాను. ఒంగోలు నుంచి చీరాల వెళ్లేందుకు రైల్వేస్టేషన్‌కు వెళుతుంటే – డ్రాప్ చేయడానికి కృష్ణ అనే ఫ్రెండ్ వచ్చాడు. అప్పట్లో వాడొక చిన్నపాటి రౌడీ. అయినా మనిషి చాలా మంచివాడు. రైలు ఆగుతూనే నాకంటే ముందు బోగీలోకి ఎక్కి ‘కొంచెం జరుగయ్యా. నా ఫ్రెండ్ కూర్చుంటాడు’అని ఒక ప్రయాణీకుణ్ణి సర్దుకుని కూర్చోమన్నాడు. అతను దురుసుగా మాట్లాడటంతో మా వాడు “ఏం? కనిగిరి నీళ్లు ఏమైనా తాగొచ్చినావురా.. కాటమరాజులా ఎగిరి ఎగిరి పడుతుండావు?” అన్నాడు. ఆ మాట నాకు డైలాగులా వినిపించింది. ఈ సంఘటన జరిగిన కొన్నేళ్లకు- హీరో గోపీచంద్ ‘రణం’ సినిమాకు మాటలు రాశాను. ఒక సీన్‌లో హీరో, విలన్‌ల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. అంతలో విలన్ అనుచరుడు ఒకడొచ్చి హీరోను దొంగదెబ్బ తీయాలని ప్రయత్నిస్తాడు. దాన్ని చూడగానే హీరో “ఇక్కడ రాబందులు జమాబందీ చేసుకుంటుంటే.. ఊర పిచ్చుకలా ఎగిరొచ్చి రెక్కలు ఎగరేస్తావేంట్రా? రెక్కలు తెగిపోతాయ్” అంటాడు. రైల్లో కృష్ణ అన్న మాట.. ఈ డైలాగ్ రాయడానికి తోడ్పడింది..” అని ముగించారు మరు««ధూరి. సినీ జీవితంలో తనకు ఎదురైన గెలుపోటముల గురించి ఆఖర్న ఒకమాటన్నారు ‘ఏ జీవితమూ ఒక గెలుపుతో మొదలుకాదు. ఏ జీవితమూ ఒక ఓటమితో ఆగిపోదు’ అని. ‘ఒంటరిపోరాటం’లో వెంకటేష్‌తో రూపిణి చెప్పే డైలాగ్ అది. “ఎప్పుడో రాసిన ఆ డైలాగే నన్ను ఇప్పటికీ నడిపిస్తోంది”అని చెప్పారు.

సినిమా వాళ్లకు సెంటిమెంట్లు ఎక్కువ. మరుధూరి రాజాకు కూడా ఒక చిన్న సెంటిమెంటు ఉంది. ఇప్పటి వరకు రెండొందల సినిమాలకు డైలాగులను రాసిన ఆయన కాగితాలన్నింటినీ- బాసరకు తీసుకెళ్లి గోదావరిలో నిమజ్జనం చేస్తుంటారట! ‘సినిమా రచనలో ఎంత బిజీగా ఉన్నాసరే.. సహాయకులతోనైనా పంపించి ఆ పని చేయిస్తుంటాను. నాకు అదొక సెంటిమెంటు’ అంటున్న మరుధూరి రాజా.. మిగతావాళ్లలాగ డైలాగులు రాయడానికి ఏ ఖరీదైన హోటల్‌కో, అజ్ఞాతదీవులకో వెళ్లరు. ఇంట్లోనే నేలమీద ఒక చాప పరుచుకుని, వక్కపొడి, సిగరెట్టు ప్యాకెట్లను పక్కన పెట్టుకుని.. దమ్ము కొడుతూ.. రాసుకుంటాడీ ‘దమ్మున్న రైటర్’!. లేకపోతే మూడు దశాబ్దాలపాటు రైటింగ్ రాజ్యాన్ని ఏలేవారు కాదేమో!!

యజ్ఞం
“ఛత్రపతి శివాజీకి దుర్గాదేవి ఖడ్గం ఇచ్చినట్లు నీ కూతురు నా చేతికి కంప్లయింట్ ఇచ్చింది. కంప్లయింట్ చేతికొచ్చాక రెడ్డెప్ప అయితేనేం? బోడి బొక్కప్ప అయితేనేం?”

శుభాకాంక్షలు
“తీగకున్న పూలు రాలిపోతే తిరిగి అతికించలేం. చేయిజారిపోయిన ప్రేమను తిరిగి తెచ్చుకోలేం”

సిసింద్రీ
“ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. మనిషిలో మాత్రం ప్రతి జంతువు లక్షణం ఉంటుంది”

ఎగిరే పావురమా
“నీ పెదవుల చప్పుడు నాకు వినిపించకపోయినా నీ గుండెచప్పుడు నాకు వినిపిస్తుందిలేరా!”

గిల్లికజ్జాలు
“పిల్లలు పిల్లలుగా ఉన్నప్పుడు బొమ్మలతో ఆడుకుంటారు. వారు పెద్దవాళ్లయ్యాక మనల్ని బొమ్మల్ని చేసి ఆడుకుంటారు”

రణం
“ఇక్కడ రాబందులు జమాబందీ చేసుకుంటుంటే ఊరపిచ్చుకలా ఎగిరొచ్చి రెక్కలు ఎగరేస్తావేంట్రా? రెక్కలు తెగిపోతాయ్!”

ఎగిరేపావురమా
“ఏ తండ్రి అయినా తన కూతురికి పెళ్లి చేసి కాపురానికి పంపించాలనుకుంటాడు. కన్నెరికం చేసి కాపురం పెట్టాలని ఎవడూ అనుకోడు. ఆ సంప్రదాయం పశువుల్లోనే కానీ మనుషుల్లో లేదు”

– మల్లెంపూటి ఆదినారాయణ

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అత్తుకాల్ భగవతి ఆలయం

అత్తుకాల్ భగవతి ఆలయం
కేరళ లో తిరువనంతపురానికి మూడు కిలో మీటర్ల దూరం లో అత్తుకాల్ అనే చోట ఉన్న దేవతనే అత్తుకాల్ భగవతి అమ్మ వారు అంటారు .కాళికాదేవి అంశ మధుర మీనాక్షీ దేవి స్వరూపం ఉన్న దేవి .కన్నగి అనే అమ్మాయిని కోవలం అనే ధనికుడికి ఇచ్చి వివాహం చేశారు .అతను వేశ్యాలోలుడై భార్యను మరిచి పోయాడు .ఉన్నది అంతా క్షవరం అయి చివరికి తిండి లేక భార్య కన్నగి దగ్గరకు చేరాడు .ఆమె దగ్గర కూడా ఒక్క కాలి బంగారు అందెలు తప్ప అమ్ముకొని తినటానికి ఏమీ లేదు .మధుర వెళ్లి అమ్ముదామని ఇద్దరూ మధుర రాజ్యానికి చేరారు .ఒక అందే ఇచ్చి మధుర రాజు కు అమ్మమని కన్నగి భర్తను పంపింది .అతడు వెళ్లి అమ్మే ప్రయత్నం చేయగా అది రాణి గారి నగ అని దొంగిలించాడని కోవలం ను ఖైదు లో పెట్టించాడు

        

రాజు .ఈ విషయం కన్నగి కి తెలిసి రాజును రాణిని కలిసింది .తన దగ్గర ఉన్న రెండవ అందే ను రాజుకిచ్చి రాణీ గారి అన్దేనూ తెప్పించమని కోరింది .తన అందే ను పగల కొడితే అందులో వజ్రాలు బయట పడ్డాయి .రాణి గారి నగ ను పగల కొడితే అందులోంచి ముత్యాలు బయట పడ్డాయి .రాణి చెప్పింది అబద్ధం అని తేలింది .రాణి మోసం చేసి తన భర్త ను ఖైదు చేయించిందని కన్నగి మధుర రాజు రాణీలను నగరాన్ని శపించింది .కన్నగి ముక్తి పొన్దగా ఆ నగర దేవత దర్శన మిచ్చింది ..స్వంత ఊరు కొడుం గల్ వెడుతుంటే అక్కడ అట్టుకల్ నది దాటింది అక్కడ ఒక ముసలాయన నదిని దాటలేక ఇబ్బంది పడుతుంటే చిన్న పిల్లగా మారి ఆయన చేయి పట్టుకొని నది దాటించి వాళ్ళ ఇంటి దగ్గర దిగ బెట్టి అదృశ్యమైంది .ఆ రాత్రి ఆ ముసలాయన కలలో కన్పించి తనకు ఒక ఆలయాన్ని నిర్మించమని కోరింది .మూడు బంగారు గీతాలు కనీ పించిన తోటలో ఆలయాన్ని కట్టమని ఆదేశించింది .అలా వెలసిన ఆలయమే ఈ దేవాలయం ..

        

కుంభ మేళా నాడు లక్షలాది భక్తులు సందర్శించి అమ్మ వారికి పొంగళ్ళు నైవేద్యం వండి పెడతారు .ఎటు చూసినా అయిదు కిలో మీటర్ల దూరం లో పొయ్యిల మీద పొంగళ్ళు వండి నైవేద్యం పెట్టె వారే కని పించి ఆశ్చర్య పరుస్తారు .ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కింది .అంతటి ప్రాధాన్యత ఉంది ఈ ఆలయానికి .అమ్మవారికి శాస్త్రోక్తం గా పూజాదికాలు బ్రాహ్మణులు నిర్వహిస్తారు .చాలా మహిమాన్విత మైన అమ్మ వారు గా ప్రసిద్ధి .సాయంత్రం అర్చన చేసి హారతి ఇస్తూంటే కన్నుల పండువగా మహా వైభవం ఆ మధుర మీనాక్షీ దేవి ని చూస్తున్నంత దివ్య విభూతిగా ఉంటుంది .ఫిబ్రవరి తొమ్మిది నుండి పది హీను రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి .మేము వెళ్ళే నాటికే ఏర్పాట్లు ముమ్మరం గా జరుగుతున్నాయి విశాల మైన ప్రాంగణం .కళా భవనం ఆరు బయట పొంగళ్ళకు ఏర్పాట్లు కని పించాయి.

నాల్గు భుజాలతో ,చేతులలో ఆయుధాలతో అమ్మవారు దర్శన మిస్తుంది .విగ్రహాన్ని బదరీ నాద నుంచి వచ్చిన పురోహితుడి ఆధ్వర్యం లో ప్రతిష్టించారు . ఈ ఆలయాన్ని ‘’మహిళా శబరి మల దేవాలయం ‘’అని కూడా అంటారు .కన్నగి మధురను శపించి ఇక్కడ దేవతగా వేలిసిందని చరిత్ర .ఆమె సాక్షాత్తు పార్వతీదేవి అవతారం గా భావిస్తారు .తమిళ సంగం సాహిత్యం లో కన్నగి కద కు విశేష ప్రాముఖ్యం ఉంది .కేరళకు చెందిన విద్యాధర చట్టంగి స్వామి ఆలయాన్ని గుర్తించి పునర్ వైభవానికి కారకుడయ్యాడు .ఆలయ శిల్ప కళ ముగ్ధుల్ని చేస్తుంది. కేరళ, తమిళ కళా మిశ్రమ శిల్ప కళ ఉంటుందిక్కడ .ఆలయం లో మహిషాసుర మర్దిని ,రాజ రాజేశ్వరి పార్వతి దేవి విగ్రహాలు కనుల విందు చేస్తాయి గోపురం మీద దశావతార చిత్రాలు కన్నగి జీవిత చరిత్ర శిల్పాలు ఆకర్షనీయం గా ఉంటాయి .దక్షయజ్న శిల్పాలూ ఉన్నాయి .గర్భాలయం లో రెండు అమ్మ వారి విగ్రహాలుంటాయి .అందమైన విగ్రహం సకల ఆభరణ సుసోభితమై ఉన్న మనోజ్ఞా సుందర మూర్తి ఒకటి .ఈ అమ్మ వారి వెనుక ఇంకొక విగ్రహం అమ్మ వారిది ఉంటుంది .గణేశుని శిల్పాలూ ఉన్నాయి. ఒక వైపు భగవతి చిత్రం రెండవ వైపు శ్రీ చక్రం ఉన్న బంగారు నాణాలు ఇక్కడ ప్రత్యేకత .వీటిని కొని భద్రం గా దాచుకొంటాడు భక్తులు భక్తిగా .

  Photo of Kadampuzha Bhagavathy TemplePhoto of Kadampuzha Bhagavathy Temple

కన్యాకుమారి
తమిళ నాడు లో కన్యాకుమారి క్షేత్రం ఉంది .కన్యకా దేవి అయిన ప్రదేశం ఇది దక్షిణాగ్రమే కన్యా కుమారి .ఇక్కడ హిందూ మహా సముద్రం బంగాళాఖాతం అరేబియా సముద్రం మూడు సముద్రాలు కలిసే ప్రదేశం ఇది’’ త్రిసాగర సంగమం’’ ప్రదేశమే కన్యాకుమారి .ఇక్కడ సముద్రం మీద సూర్యోదయ సూర్యాస్తమయాలు చూడ దగ్గవి .అందుకోసమే లక్షలాది జనం దర్శించి ఆ మధురానుభూతి ని పొందుతారు .ఇక్కడి వివేకానంద్ రాక్ మెమోరియల్ తిరువల్లువార్ విగ్రహాలు తప్పక దర్శించాలి .
కన్యాకుమారి దేవత ఆలయం చాలా అందం గా ఉంటుంది అమ్మ వారికి భగవతి బల భద్ర ,శ్రీ బాల అనే పేర్లున్నాయి .దేవి అని కూడా పిలుస్తారు .అమ్మ వారి విగ్రహాన్ని పరశురాముడు స్థాపించాడు .వేదకాలం నాటి ఆలయం గా గుర్తింపు ఉంది .రామాయణ మహా భారతాలలో ప్రస్తావన ఉంది .మణి మేఖల అనే తమిళ సాహిత్యం లో దీనికి ప్రాధాన్యత ఉంది .నారాయణ ఉపనిషత్ ,తైత్తిరీయ సంహిత లోను ప్రస్తావన ఉంది .కృష్ణ యజుర్వేదం లో ప్రస్తావన ఉన్నది .

         

రామ కృష్ణ పరమ హంస ,వివేకా నదులు సందర్శించిన మహా క్షేత్రం ఇది .అమ్మవారు కన్యక గా సన్యాసి వేషం లో దర్శన మిస్తంది .1863 ,1938లో అనేక మంది బాలికలను కన్యాకుమారికి పిలిపించి స్వామి నిర్మలానంద అమ్మ వారికి పూజ చేయించారు .1935,36లలో కూడా ఇలాగే పూజలు చేయించారు కన్యకా మణులతో ఇదొక విశేషం .
ఒకప్పుడు ఈ ప్రాంతం ‘’పరవార్ రాజుల ‘’పాలన లో ఉండేది .ఇక్కడ అమ్మ వారు వెలయ టానికి ఒక గాధ ప్రచారం లో ఉంది .బాణాసురుడిని మహా శివుడు వదించే సమయం లో ఒక పిల్ల శివుడి పై ప్రేమ ను పెంచుకొని వివాహం చేసుకోవాలని నిశ్చయించుకొన్నది .శివుడూ వివాహానికి ఇష్టపడ్డాడు .బాణుడు కన్య వలననే మరణిస్తాడని తెలుసు కొన్న నారద మహర్షి వారిద్దరి పెళ్ళికి అడ్డు పడ్డాడు .కాని వివాహ ముహూర్తం కూడా నిర్ణయమై పోయింది .బ్రాహ్మీ ముహూర్తం లో వివాహ లాగ్నాన్ని నిర్ణయించారు .వివాహాన్ని ఎలాగైనా ఆపాలని నారదుడు నిర్ణ యించి నారదుడు కోడి పుంజు గొంతుతో ముందే కూశాడు .ముహూర్తం మించి పోయిందని భావించిన శివుడు పెళ్ళికి తరలి వెళ్ళకుండా ఆగి పోయాడు .పాపం ఆ పిల్ల శివుడు వచ్చి వివాహం చేసుకొంటాడని ఎదురు చూస్తూనే ఉంది.యెంత చూసినా శివుడు రాలేదు నిరాశ చెందింది కన్యక.అన్నమూ నీరు లేకుండా రోజులు గడిపింది .చేతికి వేసుకొన్న పెళ్లి గాజులు పగల కొట్టుకొన్నది .సన్యాసిని గా మిగిలి పోయింది .
అమ్మ వారిని ఇక్కడ బాలాంబిక గా పూజిస్తారు .నవ దుర్గాలలో ఒకటి అయిన కాత్యాయిని గా ఆరాధిస్తారు .భాద్రకాళిగా అర్చిస్తారు .దగ్గర లో పాతాళ భైరవ తీర్ధం కాల భైరవ దేవాలయం చూడ దగినవి .కన్యాకుమారి ని నారాయణి ,నిమిషా ,విజయ సుందరి ,బాల సుందరి గా కూడా ఆరాధిస్తారు .కన్యాకుమారి ఒక శక్తి పీఠం కూడాఽమ్మ వారి ముక్కెర చాలా విలువైంది .యెన్తొ దొరం దాకా కాంతి వెదజల్లుతుంది .
కన్యా కుమారికి దగ్గర లో ఆల్వార్ తిరు నగరి,కుర్తాలం ఉన్నాయి. ముట్టూర్ లో ‘హాన్గింగ్’ బ్రిడ్జ్ ‘’ఉంది. మండుర్తరై లో పులుల అభయారణ్యం ఉంది .నాగర్ కోయిల్ లో నాగ రాజ దేవాలయం ఉంది. పద్మనాభ పురం లో ‘’వుడేన్ పాలస్ ‘’చూడ తగినది .అలాగే పచియప్పన్ డాం కూడా .

అనంత పద్మ నాభుడి నుండి అరుణాచలేశ్వరుని దాకా -1

అనంత పద్మనాభుడి నుండి అరుణా చలేశ్వరుని దాకా -2

అనంత పద్మనాభుడి నుండి అరుణా చలేశ్వరుని దాకా -3

అనంత పద్మనాభుడి నుండి అరుణా చలేశ్వరుని దాకా -4(చివరి భాగం )
మరో దేవాలయ విశేషాలు మరో సారి
మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ -17-2-14-ఉయ్యూరు

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

శిలాక్షరాలలొ స్వరాల నిక్షేపం

shilaksharalu1 001 shilaksharalu2 001

Posted in సేకరణలు | Tagged | Leave a comment

తిరువనంత పురం లో శ్రీ అనంత పద్మ నాభ స్వామి

     తిరువనంత పురం లో శ్రీ అనంత పద్మ నాభ స్వామి

కేరళ రాష్ట్రం లో తిరువనంత పురం అనే త్రివేండ్రం లో శ్రీ అనంత పద్మ నాభ స్వామి కొలువై ఉన్నారు .ఆయన దర్శనం త్రిమూర్త్యాత్మక దర్శనమే .మేము ‘’రధ సప్తమి’’ రోజున పద్మనాభుడిని దర్శించి తరించాం . ఆ రోజు మేము ఉయ్యూరు నుండి తెచ్చుకొన్న జిల్లేడు ఆకులను శిరసు మీద , ఒంటి మీద పెట్టుకొని మంత్రపూతం గా పవిత్ర స్నానం చేసి ,ఆలయానికి వెళ్లి స్వామిని దర్శించటం మా పూర్వ జన్మ సుకృతం గా భావిస్తున్నాము .అనంత పద్ముని ఆలయ విశేషాలు వివరిస్తాను .

పద్మనాభుడే చక్ర వర్తి –రాజు పద్మనాభ దాసుడు మాత్రమే

ఒకప్పుడు తిరువనంత పురం ‘’ఎట్టు వీటి పిళ్ళై ‘’అధీనం లో ఉండేది .తరువాత రాజా మార్తాండ వర్మ ,పిళ్లే ను జయించి ఈ భాగాన్ని స్వాధీన పరచుకొన్నాడు .మార్తాండ వర్మ మహా రాజే ఈ ఆలయ నిర్మాత .తనను, తన రాజ్య సర్వస్వాన్ని ఆయన పద్మనాభ స్వామికి స్వాధీన పరచి ‘’పద్మ నాభ దాసుడు ‘’గా ఉండి పోయాడు .తన తర్వాతి రాజులు కూడా పద్మనాభ దాసులుగా ఉండాలని తీర్మానించాడు స్వామి సమక్షం లో .కనుక అప్పటి నుండి రాష్ట్రానికి చక్ర వర్తి ‘’అనంత పద్మ నాభ స్వామి ‘’యే.ఆయన శంఖమే రాష్ట్ర చిహ్నం . ‘’.జూ’’ దగ్గర పెద్ద శంఖం మనం చూడ వచ్చు .మార్తాండ వర్మ వంశీకులు అందరూ వర్మ లాగానే ప్రవర్తించారు .బ్రిటిష్ ప్రభుత్వం కూడా స్వామికి’’ 21gun salute ‘’ను సభక్తికం గా సమర్పించేది .ఇందిరా గాంధి చేసిన రాజ భరణాల రద్దు తో ఇప్పుడు ప్రభుత్వ పరం అయింది ఆలయం .అయినా ఆ వంశీకులదే ప్రధమ పూజ.ఆలయం లో పద్మనాభుడి తో బాటు శ్రీ నరసింహ స్వామి ,శ్రీ కృష్ణుడు గరుడ వాహనం మీద అరేబియా సముద్రం లోని శంఖు ముఖం బీచ్ వరకు ఊరేగుతారు .పది రోజుల ఉత్సవాలు నిర్వహిస్తారు వాటిని ‘’ఆరాట్టు ఉత్సవాలు ‘’అంటారు .ఆ పది రోజులూ పబ్లిక్ సెలవులే .విమానాలు కూడా ఎగరవు అంత పకడ్బందీ గా ఉంటుంది .స్వాతి తిరుణాల్ వంశజుడైన శ్రీ రామ కుమారా వర్మ ఇప్పుడు ఇక్కడ స్వాతి ఉత్సవాలను నిర్వాహిస్తారు .ఆయన గొప్ప సంగీత విద్వాంసుడు .శ్రీ వెంకటేశ్వర భక్తీ  చానేల్ లో విద్యార్ధులకు సంగీతంనేర్పుతూసాయంత్రం పూట  కని పిస్తారు

   Padmanabha Swamy temple at midday

.

పద్మనాభ విగ్రహం

పద్మ నాభ స్వామి విగ్రహానికి  ‘’’’సాదు సరక్కర ‘’అనే ఆయుర్వేద మిశ్రమం తో పూత పూస్తారు .అనంతుని పై శయనించే భంగిమ లో పద్మ నాభుడు దర్శనం ఇస్తాడు .శిరస్సు దక్షిణానికి ,చూపు మాత్రం తూర్పుకు ఉంటుంది .ఆది శేషుడు తల పైకెత్తి స్వామి బొడ్డులోంచి పైకి వచ్చిఎడమ చేతి లోని  పద్మ స్సౌరభాన్ని ఆఘ్రానిస్తున్నట్లు కనీ పిస్తాడు .స్వామి కుడి చేయి కిందకు ఉండి శివ లింగంశిరసు  పైన ఆనించి నట్లుంటుంది .బొడ్డులోని పద్మం లో బ్రహ్మ దేవుడు కనీ పిస్తాడు. బ్రహ్మ ప్రక్కనే శ్రీదేవి భూదేవి నిలబడి ఉంటారు .1,008 సాలగ్రామలతో చేసిన మాల పద్మనాభుని ఛాతీపై ప్రకాశిస్తూ ఉంటుంది .ఈ సాలగ్రామాలను నేపాల్ లోని గండకి నది నుండి తెప్పించి అతికించారు. అతకతానికి ‘’కటు సర్కర యోగం ‘’అనే ప్రత్యెక  ఆయుర్వేద మిశ్రమాన్ని ఉపయోగించారు .ఇలా చేయటం వలన క్రిమి కీటకాలు దరికి చేరవట .స్వామికి అభిషేకం చేయక పోవటం ఇక్కడి ప్రత్యేకత .ప్రత్యేక మూర్తికే  అభిషేకం నిర్వహిస్తారు .స్వామికి పుష్పమాలను మాత్రమె సమర్పిస్తారు .మా శ్రీమతి ప్రభావతి ఉయ్యూరు నుండి మాల అల్లుకొని వచ్చి స్వామికి సభక్తికం గా సమర్పించి ధన్యురాలైంది .అలానే గురవాయూర్ కృష్ణ స్వామికి , చిదంబర నటరాజు కూ ఉయ్యూరు నుండే మాలలు అల్లి తీసుకొచ్చి సమర్పించింది .పూలను’’ నెమలి ఈకలతోనే’’  ఊడ్చి తొలగించి శుభ్రం చేస్తారు ఆలయాన్ని.అదొక ప్రత్యేకత .

Temple Gopuram from the tank side

మూడు ద్వారాలలో  దర్శనం

స్వామి గర్భ గృహం ఒకే రాతి తో నిర్మించారు .అందుకే దీనిని ‘’ఒత్తక్కార్ మండపం ‘’అంటారు .పద్మ నాభ స్వామిని మూడు ద్వారాల ద్వారా దర్శించాలి అదొక ప్రత్యేకత .మొదటి ద్వారం నుండి చూస్తె పద్మనాభుని ముఖము కుడి చేతి కింద ఉన్న శివలింగం కానీ పిస్తాయి .రెండవ ద్వారం నుండి చూస్తె బ్రహ్మ దేవుడు ఉత్సవ మూర్తి ,శ్రీ దేవి భూదేవి దర్శన మిస్తారు మూడవ ద్వారం నుండి చూస్తె స్వామి పాదాలు మాత్రమె దర్శన మిస్తాయి .మొదటి ద్వారం ద్వారా శివుడిని రెండవ ద్వారం ద్వారా బ్రహ్మను మూడవ ద్వారం ద్వారా శ్రీ మహా విష్ణువు పాదాలను దర్శిస్తాము అన్న మాట అంటే త్రిమూర్తుల దర్శనం అనంత పద్మ నాభుడు కలిగిస్తున్నాడు .ఈ మూడు రూపాలు దర్శిస్తే కైవల్య ప్రాప్తి లభిస్తుందని సంపూర్ణ విశ్వాసం .

ఇలా దర్శించటానికి ఒక కద ఉంది .పూర్వం బిల్వ మంగళ మహర్షి (దివాకర ముని )శ్రీ కృష్ణుని దర్శనం కోసం ప్రార్ధించాడు .ఆయన బాల కృష్ణుడు గా దర్శన మిచ్చాడు .ముని పూజా మందిరం లో ఉన్న సాలగ్రామాన్ని చిలిపి బాల కృష్ణుడు అమాంతం మింగేశాడు .మునికి కోపం వచ్చి దండిన్చాతానికి దండం తో వెంబడిస్తే బాల కృష్ణ పారి పోయాడు .వెంబడించాడు ముని అరాన్యం లో ఒక చెట్టు వెనక దాక్కున్నాడు కొంటె కిష్టయ్య .ముని అక్కడికి చేరేసరికి ఆ మహా వృక్షం నెల వాలి పోయి అందులోంచి అనంత శయన మహా విష్ణువు గా అతి భారీ విగ్రామేర్పడింది .బిల్వా మంగళుడు చూసి ఇంత భారీ విగ్రహాన్ని తాను ప్రదక్షిణం చేసి అర్చిన్చాలేనని చెప్పాడు తన యోగ దండానికి మూడు రెట్లు మాత్రమె పొడవు ఉండేట్లుగా మారి పొమ్మని ప్రార్ధించాడు భక్త సులభుడైన స్వామి అనుగ్రహించి అలానే సైజు తగ్గించు కొన్నాడు అదే ఇప్పుడు మనం ఆలయం లో దర్శించే మూర్తి .స్వామి తనను మూడు ద్వారాల ద్వారాదర్శించాలని అప్పుడే ముక్తి లభిస్తుందని తెలియ జేశాడు అప్పటి నుండి మూడు ద్వారాల ద్వారా దర్శనం అనుగ్రహిస్తున్నాడు మూడు ద్వారాలు వెండితో చేయబడి ప్రక్క ప్రక్కనే ఉంటాయి .

      

అనంత  పద్మనాభుని ప్రత్యేకత

108 వైష్ణవ దివ్య క్షేత్రాలలో స్వామి పడుకొని కాని కూర్చుని కాని నుంచొనికాని  ఉంటె ఇక్కడ అనంత పద్మనాభుడు మూడు రకాలుగా దర్శనం ఇవ్వటం మరో విశేషం .గర్భ గుడి లో పడుకున్న భంగిమ లోను మధ్య ద్వారం లో నిలుచున్న భంగిమ లో ,ఉత్సవ మూర్తి కూర్చుని ఉన్నట్లు దర్శన మివ్వటమే ఆ విశేషం .గర్భ గుడిలోకి వెళ్లి వంగి నమస్కారం చేసే అర్హత ఒక్క తిరువాన్కూర్ మహా రాజుకే ఉంటుంది .గర్భ గుడిలో వదిలి పెట్టిన ఏ వస్తువైనా అనంతునికే చెందు తుంది .రాజును ‘’పద్మనాభ దాసు ‘’అనే అంటారు .విష్ణువే ఈ రాజ్య పాలకుడు అని ముందే చెప్పుకొన్నాం .క్షేత్రపాలకులు గరుడుడు విష్వక్సేనుడూ ..అనంతపద్మనాభుని ముఖం చాతీ తప్ప అంతా బంగారు మయమే అని ఇటీవలే కను గోన్నారట .ముస్లిం పాలకుల దండ యాత్రల భయం తో ‘’కటు సర్కర ఆయుర్వేద యోగం ‘’కలిగించి బంగారం కన పడ కుండా చేశారు .శిరసున ఉండే కిరీటం లో చెవులకు కుండలాలు ఉంటాయి .ఎడమ చేతిలో కమలం ,శివుడు కూడా బంగారు మయమే .

నైవేద్యమూ ప్రత్యేకమే

ఏడు పరశురామ క్షేత్రాలలో తిరువానంత పురం ఒకటి .స్వామికి నైవేద్యం గా పాయసం పెడతారు .తులాపాయాసం ,పరవాన్నం ,పాల్ మంగ ,ఒట్ట తులా పాయసం ,పంత రానుకాల పాయసం ,పాల పాయసం ముఖ్య నైవేద్యాలు.వీతికన్నితి కంటే ప్రత్యెక నైవేద్యం ఒకటి ఉంది దాన్ని ‘’ఉప్పు మంగ’’అంటారు .అంటే ఉప్పు నీటిలో పచ్చి మామిడి కాయను నాన వేసినది అని అర్ధం .దీన్ని నైవేద్యం పెట్టటానికి బంగారు పూత పూసిన ఎండుకొబ్బరి చిప్ప లో పెట్టి నివేదన చేస్తారు. దీనికి ‘’చిరట్ట ‘’అని పేరు .ఈ చిప్ప1200 ఏళ్ళ నుండీ ఉందట .ఇదీ విశేషమే   ప్రక్కనే ఉన్న నరసింహ స్వామికి పానకం ,అప్పాలు ,ఉండ్రాళ్ళు ,అవల్ నైవేద్యం పెడతారు .

ఉత్సవాలకూ ప్రత్యేకతే

అక్టోబర్ –నవంబర్ నెలలలో ‘’అల్పషి ఉత్సవం’’,మార్చి –ఏప్రిల్ లో ‘’పైన్ కుని  ఉత్సవాలను ‘’పది రోజుల పాటు పరమ వైభవం గా నిర్వహిస్తారు .అంటే ఏడాదికి రెండు సార్లు ఘనం గా ఉత్సవాలు చేస్తారు .నవరాత్రి ఉత్సవాన్నీ ఘనం గా చేస్తారు సరస్వతి దుర్గ కుమారస్వామి విగ్రహాలను ‘’కుటీర మాలిక ‘’కు తీసుకొని వస్తారు .ఆ తర్వాత పెద్ద ఊరేగింపు నిర్వహిస్తారు .తొమ్మిది రోజులు ‘’మహా భక్త కవి రాజు స్వాతి తిరుణాల్’’ సంగీతోత్సవాన్ని అద్భుతం గా జరుపుతారు .స్వాతి తిరుణాల్ త్యాగ రాజ స్వామి సమకాలికుడు .సంగీత త్రయం త్యాగరాజు ముత్తు స్వామి దీక్షితులు శ్యామ శాస్త్రి .స్వాతి తిరుణాల్ తో కలిసి సంగీత చతుస్టయంఅవుతారు .త్యాగ రాజ స్వామిని తన తిరువాన్కూర్ ఆస్థానానికి పిలిపించి సన్మా నించాలని చాలా సార్లు భక్తీ పూర్వాకం గా కబురు చేశాడు ఆహ్వానించాడు కాని త్యాగయ్య  రాలేదు చివరి సారి ఆహ్వానం పంపితే ‘’మనిద్దరం కలుసుకోనేది అక్కడే పై లోకం లోనే ‘’అని మర్యాదగా రాసి పంపారట .అలాగే ఇద్ద్దరూ పెద్దగా వ్యవధి లేకుండానే మరణించారు . అమర లోకం లో ఇద్దరూ కలుసు కొన్నారని భావిన్చారందరూ.ఆరేళ్ళకొక సారి జనవరి 14న లక్ష దీపోత్సవం చేస్తారు .అప్పుడు 56రోజుల పాటు మూడు వేదాలను పారాయణ చేస్తారు .

అనంత పద్మ నాభుని ఆలయ గోపురాన్ని 1566లో నిర్మించారు .100అడుగుల ఎత్తు 7అంతస్తులతో ఉంటుంది ఆలయం ప్రక్కనే పుష్కరిణి ఉంది .దీనికే ‘’పద్మనాభ తీర్ధం ‘’అని పేరు .ఆలయం లో 365పెద్ద గ్రానైట్ స్తంభాలున్నాయి .ఆలయం ముందు 80అడుగుల ఎత్తైన ధ్వజస్తంభం ఉంది .గోపురం కింది భాగాన్ని ‘’నాటాక శాల ‘’అంటారు .ఆలయ ఉత్సవాల రోజుల్లో ఇక్కడే కేరళ సంప్రదాయ నృత్యమైన ‘’కదా కేళి ‘’నృత్య ప్రదర్శన నిర్వహిస్తారు .

సంప్రదాయాన్ని కేరళీయులు బాగా పాటిస్తారు .ఏ ఆలయం లో చూసినా ఏనుగులు కానీ పిస్తాయి .ఆడవాళ్ళూ మగ వాళ్ళు కూడా బంగారు రంగు వెడల్పు అంచు తెల్ల చీరలు పంచలు  కడతారు .చూడ ముచ్చటగా ఉంటుంది .మన దేవాలయాలు లాగా ఇక్కడి ఆలయాలు ఉండవు .అన్నీ కొయ్య, పెంకుల కప్పు తో ఉంది మన పూర్వపు వసారా ఇల్లు లాగా ఉంటాయి .యెంత పెద్ద బిల్డింగ్ మీదనైన చివర యెర్ర పెంకులున్దాల్సిందే స్వాగత ద్వారాలు అదే సంప్రదాయం లో ఉంటాయి .అక్కడ కనీ పించిన పూజారులను, అధికారుల భక్తులను  ”నేల మాళిగ” ల గురించి అడిగాను ఎవ్వరూ చెప్పలేదు అడగరాదు చెప్ప రాఅన్నట్లు, ”ఆ ఒక్కటీఅడక్కు  ” అన్నట్లు వారు ముఖాలు పెట్టారు చిరు నవ్వు నవ్వుతూ

అనంత పద్మ నాభుడి నుండి అరుణాచలేశ్వరుని దాకా -1

అనంత పద్మనాభుడి నుండి అరుణా చలేశ్వరుని దాకా -2

అనంత పద్మనాభుడి నుండి అరుణా చలేశ్వరుని దాకా -3

అనంత పద్మనాభుడి నుండి అరుణా చలేశ్వరుని దాకా -4(చివరి భాగం )

మరో ఆలయ విశేషాలు మరో సారి

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -17-2-14-ఉయ్యూరు

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

మూడవ ప్రపంచ తెలుగు రచయితల మహా సభలు -మార్చ్-1,2,3 తేదీలలో -విజయవాడ ఘంట సాల మ్యూజిక్ కాలేజి లో-కృష్ణా జిల్లా రచయితాల సంఘం ఆధ్వర్యం లో

1prapancha sabhalu 001 2prapancha sabhalu 001 3prapancha sabhalu 001 4prapancha sabhalu 001

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

ఉత్తరాంధ్ర తన కదా ఏమిటి /అని ప్రశ్నిస్తొన్దన్న బమ్మిడి జగదీశ్వర రావు

తన ‘కథే’ మిటంటున్న ఉత్తరాంధ్ర – బమ్మిడి జగదీశ్వరరావు

\

‘ప్రాంతీయ అస్తిత్వం’ కేంద్రంగా చూసినప్పుడు ఉత్తరాంధ్రలో ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమాల స్పృహ లేదనే చెప్పాలి. అయితే ‘ప్రత్యేక తెలంగాణ’ పోరాటాలు ఈ పది పన్నెండేళ్ళుగా ఉధృతమవుతూ రావడం ఉత్తరాంధ్రకూ ఉత్తరాంధ్ర కథకులకూ ప్రేరణగా మారింది. దాంతో అస్తిత్వ స్పృహ యిప్పుడిప్పుడే మొదలై ఆ దిశగా కథా రచన ‘ప్రాంతీయ అస్తిత్వం’లోకి ప్రవేశించింది… పాయలుగా మొదలై ప్రతి అస్తిత్వంలోకి ప్రవహించిన అస్తిత్వవాదాలు తమకు తామే పరిపూర్ణము కామని కూడా గమనించాలి. అలాగే వివిధ అస్తిత్వవాద ఉద్యమాల్ని ఆరోగ్యకరంగా భావించి ఆహ్వానించాల్సిన విముక్తి ప్రధాన ఉద్యమాలు వాటి ఉనికిని గుర్తించడంలో తమ ఉనికికే ప్రమాదం వస్తుందని స్తబ్ధంగా వుండడం వల్ల వాటి ప్రాధాన్యత ప్రధానంగా సాహిత్యంలో లోపించిందని చెప్పక తప్పదు.

ఆంధ్ర రాష్ట్రమనగానే తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర… యివే, యివి మాత్రమే. ఈ మూడు ప్రాంతాల ‘త్రివేణి సంగమం’గానే తెలుగునేల ప్రచారమయ్యింది. ప్రదర్శితమయ్యింది. అటు రాజకీయ ప్రతినిధులూ వారు నడిపే ప్రభుత్వాలూ అవి వేసే కమిటీలూ – యిటు మీడియా ప్రతినిధులూ వారు నడిపే మేధావులూ అవి చూపే లెక్కలూ – యింకా చెప్పాలంటే సామాజిక శాస్త్రవేత్తల లెక్కలూ అన్నీ కలిపి- మూడు ప్రాంతాల ముచ్చటైన తెలుగువాళ్ళు! అంతే. ఉత్తరాంధ్ర వొక ఉష్ కాకి!
ఆంధ్రాలో ‘కోస్తా – ఆంధ్ర’ ఉన్నప్పుడు ‘ఉత్తరాంధ్ర’ ఎందుకు ఉండదు? ఉంటే కోస్తాంధ్రలో భాగంగానే ఎందుకుంది?

సామాజిక దర్పణంగా చూడాల్సిన సాహిత్యం ఒక్కటే విడిగా ఉత్తరాంధ్రని ఎన్నడూ చూస్తోంది. ప్రత్యేకతని గుర్తిస్తోంది. నిజానికి కోస్తాంధ్ర ఉత్తరాంధ్రల మధ్య నైసర్గిక స్వరూప స్వభావాల్లోనే కాదు, సామాజికం గా సాంస్కృతికంగా ఆర్థికంగా ఏ పోలికా లేదు. తెలంగాణకు రాయలసీమకు కోస్తాంధ్రకు మధ్య ఎంత వైవిధ్యముందో ఉత్తరాంధ్రకూ మిగతా ప్రాంతాల నడుమ అంతే వైవిధ్యముంది. ఈ వైవిధ్యాన్ని గుర్తించకుండా కోస్తాంధ్రతో కలిపి చూడడం.. కలిపి మాట్లాడ్డం ఒక విషాదం!
ఆంధ్రా పెత్తనం వద్దని ఆత్మగౌరవమంటూ తెలంగాణ వేరుపడింది. రాయలసీమ వెనుకబాటుతనంతో తమది ప్రత్యేక ప్రాంతమంది. ఎటోచ్చీ కోస్తాంధ్ర నీడన చీకట్లో అస్తిత్వమే అగుపించకుండా నిలబడింది ఉత్తరాంధ్ర!

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మూడు ప్రాంతాలు వెనుకబాటుకు వెనుకనే ఉన్నాయనేది నిర్వివాదాంశం. శ్రీకాకుళం జిల్లాలో నాగావళి, వంశధారతో పాటు మహేంద్ర తనయ, చంపావతి, బహుదా, కుంబికోటగడ్డ, సువర్ణముఖి, వేగావతి, గోముఖం వొకటి కాదు రెండు కాదు తొమ్మిది నదులు పారాడుతున్నాయి. విజయనగరం జిల్లాలో నాగావళి, సువర్ణముఖి, వేగావతి, చంపావతి, గోస్తాని, కందివలసగెడ్డ పారుతున్నాయి. విశాఖపట్నం జిల్లాలో శారద, తడవ, వరాహ నదులే కాక మేఘాద్రి గెడ్డ, గంబీరగెడ్డ, నరవ జలాశయాలూ వున్నాయి. నీటి వనరులే కాక అటు అంతులేని అటవీ ప్రాంతం.. యిటు అద్భుతమైన సముద్ర తీరం. తూర్పు కనుమల మధ్య సారవంతమైన నేల. ఆ నేలన వరి, చోడి, జొన్న, గంటి చెరకు, గోగు, నువ్వు, వేరుశనగ.. పండని పంట లేదు. యింకా ఉద్దాన తీర ప్రాంతాన కొబ్బరి.. మెట్టు ప్రాంతాల జీడిమామిడి.. మత్స్య పరిశ్రమ.. ఔషధ మొక్కలు మొదలు ఖనిజ సంపద వరకూ- ‘ఉత్తరాంధ్రకు తాళం కురసా? మేళం కురసా? యేటి కురసంతే..?’-
‘జబ్బడు కొప్పు.. జడేస్తే జారిపోయింది!’

-యేటీ తిత్తవ? యేటి కతేటి? -అనంటే కథలు కథలుగా కథకులు చెప్పినా- చెప్పిన / రాసిన దానికంటే.. చెప్పవలసింది/రాయవలసిందే ఎక్కువగా వుంది. గతించిన కాలాన్ని అటుంచితే, ఈ పుష్కర కాలంలో- కాలం కాని కాలంలో- ఉత్తరాంధ్ర కథ పాలకులు పట్టించుకోలేదు సరే, కథకులూ పట్టించుకోవలసినంత పట్టించుకోలేదు. ఉత్తరాంధ్ర కూడా అన్ని ప్రాంతాలలాగే పట్టుకు దొరక్కుండా పెనుమార్పులకు గురవుతూ వస్తోంది. సరళీకరణ, ప్రవేటీకరణ, ప్రపంచీకరణలకు వాటి ప్రభావాలకూ లోనవుతూ వస్తోంది.
‘ప్రాంతీయ అస్తిత్వం’ కేంద్రంగా చూసినప్పుడు ఉత్తరాంధ్రలో ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమాల స్పృహ లేదనే చెప్పాలి. అయితే ‘ప్రత్యేక తెలంగాణ’ పోరాటాలు ఈ పది పన్నెండేళ్ళుగా ఉధృతమవుతూ రావడం ఉత్తరాంధ్రకూ ఉత్తరాంధ్ర కథకులకూ ప్రేరణగా మారింది. దాంతో అస్తిత్వ స్పృహ యిప్పుడిప్పుడే మొదలై ఆ దిశగా కథా రచన ‘ప్రాంతీయ అస్తిత్వం’లోకి ప్రవేశించింది.

ప్రాంతీయ అస్తిత్వంలో భాగమైన స్థానిక పోరాటాలు వ్యవస్థల వైఫల్యాల్ని, వ్యవస్థల నిరంకుశత్వాన్ని ఎదిరించి ఉత్తరాంధ్ర పోరాట వారసత్వాన్ని మరోమారు నిరూపించుకున్నాయి. థర్మల్ పవర్ ప్లాంట్ల వ్యతిరేక ఉద్యమాల్లో ‘సోంపేట’ ముందుండి దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ నేపథ్యంలో వచ్చిన అట్టాడ అప్పలనాయ్డు ‘సందిగ్ధాకాశం’ ‘వికృతి’ కథల్ని చెప్పుకోవాలి. పిట్టమీద పిల్లిమీద పెట్టి రాసినా ఎంతో కళాత్మకంగా ఈ కథల్ని వర్తమాన చరిత్రలో భాగం చేసారు. నిజానికి సోంపేట మహోద్యమంగాని- దాన్ని ఆనుకొని ఉన్న ‘కాకరాపల్లి’ ఉద్యమంగాని ఆ మాటకొస్తే ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్న ఉత్తరాంధ్రలోని పదహారు థర్మల్ పవర్ ప్లాంటులుగాని- కొవ్వాడ మత్స్యలేశం దగ్గర నెలకొల్పనున్న అణువిద్యుత్ కేంద్రంగాని- ఇంకా చెప్పాలంటే ఇచ్ఛాపురం నుండి తడ వరకు డబ్బైయ్యారు థర్మల్ పవర్ ప్లాంట్లు.. ఎంత విద్యుత్‌ని ఉత్పత్తి చేస్తాయోగాని- అంతకు మించిన విద్యుత్‌శక్తి యిక్కడి ప్రజల్లో కనిపిస్తోంది. ఈ శక్తిని అందిపుచ్చుకోవడంలో- కథని చెయ్యడంలో- ఉత్తరాంధ్ర కథకులు వెనుకబడిపోయారు.

ప్రపంచవ్యాపితంగా వినాశనాల్ని చవిచూసిన దేశాలు విసర్జించిన పద్ధతుల్ని తెచ్చి మహాప్రసాదం అంటున్నాయి మనదేశాలు. సౌరశక్తి, వాయుశక్తి, బయోమాస్ లాంటి పునరుత్పాదక ప్రత్యామ్నాయ వనరులపై లేని శ్రద్ధ.. అత్యంత ప్రమాదకర పరిశ్రమలు నెలకొల్పడంలో ప్రభుత్వాల ఉద్దేశమేమిటో- వ్యతిరేకించే ప్రజల్ని వేధించి వెక్కిరించి తమ ముందస్తు నిర్ణయాన్ని ‘ప్రజాభిప్రాయ సేకరణ’ ప్రహసనంలో ప్రజామోదం పొందడమేమిటో- అది ఎవరి అభివృద్ధో- అభివృద్ధికి అణచివేతలేమిటో- మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండని మొరపెట్టుకోవాల్సి రావడమేమిటో- వృత్తులు పోవడమేమిటో- ప్రకృతి ప్రళయాన్ని మిం చిన విపత్కర పెనువిపత్తు యేమిటో- కోస్తా కారిడార్ల పేరుతోనో సెజ్‌ల పేరుతోనో పరిశ్రమల పేరుతోనో నోటిముందున్న కూడునే కాదు, కాలి కింద నున్న నేలను సయితం లాగేసుకోవడమేమిటో- విశాఖ మన్యంలోని బాక్సైట్ తవ్వకాలను జిందాల్ కంపెనీకి కట్టబెట్టడమేమిటో- కన్నెధార కొండమీద గ్రానైట్ వ్యాపారం గ్రాండుగా చేసుకొమ్మని మంత్రిగారి పుత్రరత్నానికి ప్రభుత్వం పాలేరులా పనిచేయడమేమిటో- ఆదివాసుల ఆరాట పోరాటమేమిటో- మైదానవాసుల మొరేమిటో- ప్రజలంటే నిర్వాసితులుగా వలస కూలీలుగా పుట్టిన గడ్డ మీద కాందిశీకులు కావడమేమిటో- ‘కథ’ యింకా చెప్పనే లేదు! అత్యంత వేగంగా మార్చేస్తున్న తలరాతల్ని ఎవరు ఎందుకు లిఖిస్తున్నారో పసిగట్టి పంచనామా జరిపి ప్రభుత్వమ్మీద కథల ఛార్జిషీట్ తెరవాల్సిన కథకులు తెరవనే లేదు!

కొత్త కథకులు రావడం లేదు. వచ్చినా గతాన్ని చెప్పడంలో తప్పితే వర్తమానాన్ని చెప్పడంలో ముందుకడుగేయలేకపోతున్నారు. అవగాహనా లేదు. అధ్యయనమూ లేదు. అస్తిత్వం ఏకరూపంగా కాక బహురూపాలుగా బహుముఖాలుగా వుండడము కూడా వొక కారణం. బహురూపాలుగా బహు ముఖాలుగా విస్తరించిన అస్తిత్వాల నడుమన వైరుధ్యం వుంది. అది శత్రుపూరిత వైరుధ్యంగా మొదలై మిత్రపూరిత వైరుధ్యంగా మారడాన్ని గమనించాలి. పాయలుగా మొదలై ప్రతి అస్తిత్వంలోకి ప్రవహించిన అస్తిత్వవాదాలు తమకు తామే పరిపూర్ణము కామని కూడా గమనించాలి. అలాగే వివిధ అస్తిత్వవాద ఉద్యమాల్ని ఆరోగ్యకరంగా భావించి ఆహ్వానించాల్సిన విముక్తి ప్రధాన ఉద్యమాలు వాటి ఉనికిని గుర్తించడంలో తమ ఉనికికే ప్రమాదం వస్తుందని స్తబ్ధంగా వుండడం వల్ల వాటి ప్రాధాన్యత ప్రధానంగా సాహిత్యంలో లోపించిందని చెప్పక తప్పదు. రాజ్య నిర్బంధమూ మార్కెట్ మాయాజాలమూ వైయక్తిక నిబద్ధతల సడలింపూ ప్రయోజనమూ.. వీటి కారణంగా ఉవ్వెత్తున లేచిన ఉద్యమాలు ఒడిదుడుకులకు లోనవడంతో ఆయా ప్రేరణలతో నడిచిన సాహిత్య సంస్థల కార్యక్షేత్రం విస్తరించకపోగా- అప్పటివరకూ రచయితలకు అందిస్తూ వచ్చిన పునాది అంశాలను కొత్తతరం అందుకొనే అవకాశం లేకపోయింది.

సిద్ధాంతాలను పనిముట్లుగా కాక పరమావధిగా భావించడమూ- అలా అని ప్రచారం జరగడమూ అసలు ఓ దృక్పథాన్ని రచయితలకు ఏర్పరచే వీలు పోయి ఎంతో నష్టం జరిగింది. జరుగుతూ వుంది. రాజకీయార్థంలో చూడకుండా రాజ్యం స్వభావాన్ని అర్థం చేసుకోలేం. రాజ్య స్వభావాన్ని అర్థం చేసుకోకుండా రాజ్యంలోని ప్రజల జీవనాన్నీ అర్థం చేసుకోలేం. కార్యకారణ సంబంధం బోధపడదు. సామాజిక సందర్భాలుగా కాక కేవలం ఘటనలుగా మాత్రమే చూసిన కథకులు నడుస్తున్న చరిత్రను కథనం చెయ్యడంలో సహజంగానే కన్నూ పెన్నూ పెట్టలేకపోయారు. సుదీర్ఘకాలంగా విశ్వాసముంచిన పాత కథకులు తమ కల నెరవేరకపోవడంతో నైరాశ్యానికి లోనయి అడపా దడపా కథల్ని రాస్తూ సరిపెట్టుకుంటున్నారేమోననిపిస్తూ వుంది.

సరే, రచయితల వెనుకబాటునుంచి మళ్లీ ఉత్తరాంధ్ర వెనుకబాటులోకి వచ్చి చూస్తే- ఎన్నో కథాంశాలు తమని కథలుగా మలచమని డిమాండ్ చేస్తూ ఎదురొస్తాయి.
‘ఉద్దానం’గా పిలవబడుతున్న ఉద్యానవనంలో ఈ పదేళ్ళకాలంలో పన్నెండువేలమంది మృత్యువాత పడ్డారు, కిడ్నీ వ్యాధుల వల్ల. ఏడెనిమిదేళ్ళుగా ఈ వ్యాధి రోజురోజుకూ విజృంభిస్తూ వస్తోంది. ఇవాల్టికీ ప్రతిపల్లెనుండీ ప్రతిరోజూ మూడు నాలుగు శవాలన్నా కనీసంగా లేస్తున్నాయి. ప్రతి ఊరూ వొక వల్లకాడే! వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (గిఏౖ) వారి దృష్టి కూడా పడిందిగాని మన గుడ్డి ప్రభుత్వాలకు చూపు ఆనలేదు. ప్రతిపక్షాల నోట ఒక్కమాట పలుకలేదు. చీమ చిటుక్కుమంటే చాలు కన్ను తిప్పే మీడియా కన్ను తెరవనేలేదు. చావుల నది నిశ్శబ్దంగా ప్రవహిస్తోంది. ఈ విషయమై ఉత్తరాంధ్ర కథ కూడా చప్పుడు చెయ్యలేదు. ‘కంబస్థం’ అనే కథలో కేవలం సమస్యను ప్రస్తావించిన బల్లెడ నారాయణమూర్తిదే ‘దగ్ధం’ అనే ఇంకో కథ తప్పితే మరొక్క కథ రాలేదు. ఎవరి కథలను వాళ్లే రాస్తున్న రాసుకోవలసిన కాలమిది. అగ్నికుల క్షత్రియులు (పల్లీలు), బలిజ-శెట్టి బలిజ (చేపల్ని వేటాడేవాళ్ళూ-అమ్మేవాళ్ళూ), శ్రీశైన (సెగడీలు) ఇంకా సాంప్రదాయక మత్స్యకారులు కండ్ర, తీర కులస్థులు (వీళ్లను ప్రభుత్వం యింకా ఓసీల్లోనే వుంచింది) సోంపేట బీల భూముల్ని ప్రభుత్వం నుండి లీజుకు తీసుకున్నది వీరే.. వీరిలో 18 ఉపకులాలు, అలాగే కమ్మరి, కుమ్మరి, దేవాంగులు.. యిలా యెందరో రెక్కాడితేగాని డొక్కాడని వాళ్ళే. కిడ్నీవ్యాధులు వొకవేపు.. థర్మల్ పవర్‌ప్లాంట్ల పిడుగులు వొకవైపు.. వైద్యం అందకపోయినా ఇంటింటికీ (పవర్‌ప్లాంటులను కాదన్నందుకు) కేసులు.. కోర్టే ఎక్కే గుమ్మం దిగే గుమ్మం.. మా కథల్ని ఎవరు రాస్తారని ఉద్దానం యింకా చూస్తూనే వుంది.

‘చుండూరు’ తెలిసిన వాళ్లకి- ‘కారంచేడు’ను ఎరిగినవాళ్లకి ఇక్కడున్న ‘లక్ష్మింపేట’ను కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. అగ్రకులాలు కాదు, వెనుకబడ్డ కులాలదాడిలో దళితులు ప్రాణాలు విడవడం వొక వార్తయ్యిందే తప్ప ‘కథ’ కాలేదు. నడుస్తున్న చరిత్రను సాహిత్యంలో యింకా భాగం చెయ్యవలసే వుంది. దళితవాదం సరే, కనీసం దళిత స్పృహతో దళిత అస్తిత్వాన్ని ఒక్కటంటే వొక్కటి ఒక్క అక్షరం కూడా రాలేదు. అంటరానితనం కథా రచనలోనూ కొనసాగుతున్నదా అనిపిస్తుంది. సంఘీభావం ప్రకటించిన కథకులు యింకా ఇక్కడి తడి ఆరని నెత్తురుకి కథారూపం యివ్వాల్సే వుంది.

విజయనగరం జిల్లా తోటపల్లి నిర్వాసితుల స్థితిగతులను అక్షరబద్దం చేస్తూ గంటేడ గౌరునాయుడు ‘మాయ’ కథను రాస్తే, గంగవరం పోర్టు నిర్వాసితులను గురించి రాయని కథ మిగిలే వుంది. గిరిజన ప్రాంతాల్లోని సాంస్కృతిక జీవనం.. ఆ జీవితంలోనికి ప్రవేశించిన ఆధునిక పోకడలు.. వారసత్వంగా కొనసాగుతున్న దోపిడీ కొత్తతరంలో వస్తున్న చైతన్యం.. సాంప్రదాయక వారసత్వాన్ని పాతరేసే మతమార్పిడి గురించి ఈ కాలంలో అదే ప్రాంతానికి చెందిన మల్లిపురం జగదీష్ తొలి గిరిజన కథకుడిగా అందరి దృష్టినీ ఆకర్షించాడు, అయితే గిరిజన అస్తిత్వాన్ని వారి వనరుల మీద వేరేవారి పెత్తనాన్ని కట్టబెట్టే ప్రభుత్వాన్ని తనవైపునుంచి చెప్పాల్సేవుంది.

ఢిల్లీలో ‘నిర్భయ’ ఆకర్షించినంతగా తమ యిళ్లలో తాము అత్యాచారాలకు గురైన 22 మంది గిరిజన మహిళల్ని ప్రభుత్వాలూ ప్రజలే కాదు, కథకులూ మర్చిపోయారు. భర్తలతో వెలియై ప్రభుత్వాధి నేతలతో వెక్కిరించబడ్డ వాళ్ల కథావస్తువు యింకా వేచిచూస్తూనే వుంది.
గిట్టుబాటు లేని జీడిపిక్క వ్యాపారస్తులకు లాభాలు తెచ్చి ప్రజలకు కాలుష్యపు పొగ చిమ్మినా దాని మసి యింకా కథకు అంటలేదు. 66గురు అమ్మవార్లు అక్కచెల్లెళ్లంతా అనాధలయినారు. ఇప్పుడు ఒక్క పూరీజగన్నాధస్వామికే కాదు ఏ దేవుడికీ కాళ్లూచేతులూ లేవు. అంతా అనాధలే. సాయి నామం వొక్కటే దీపం. ఆ చీకటి వెలుగుల కథలూ గుడిగోపురాల్లోనే దాక్కున్నాయి.

మండలానికో మాండలికం. యాస బాసల శ్రీకాకుళం వెక్కిరింతకు దగ్గరగా వున్నా- సాహిత్యంలో యెంతో దూరం ప్రయాణించింది. ఉత్తరాంధ్రలో వున్న పలుకూ పదనూ ఆభరణాలుగా ధరించిన జానపద వారసత్వం కథలు కొంతమేర అక్షరీకరించబడ్డాయి. ప్రతి జీవన సందర్భంలో వున్న పాట తొంగి చూస్తోంది. కనుమరుగవుతున్న పదాల్ని పదకోశాలుగా జియస్ చలం లాంటివాళ్లు భద్రపరుస్తూ వున్నారు- అదీ ‘కథ’ కేంద్రంగా.
శరవేగంగా విస్తరిస్తున్న విశాఖ మహానగర జీవితం సాధికారికంగా సాహిత్యీకరించబడలేదు. అయితే మధ్యతరగతి జీవుల.. ముఖ్యంగా స్త్రీల వేపునుండి మల్లీశ్వరి లాంటివాళ్లు రాయడమే కాదు, ఉత్తరాంధ్ర అది కూడా శ్రీకాకుళ యాసబాసల్ని ఒడిసి పట్టుకుని రాయడం ఓ శుభపరిణామం.

మరోవేపు తీరం పొడవునా వందలాదిగా ఫార్మా సుటికల్ కంపెనీలు ఇప్పటికే వెలిశాయి. ఇకముందు వెలియనున్నాయి. పచ్చటి పంటభూములే కాదు గుక్కెడు మంచినీళ్లు తాగే వీలులేని విషకాలుష్యం విస్తరిస్తూవుంది. ఉపాధి దొరికినా, ఉద్యోగం కొన్నాళ్లే, కాటేసినన్నాళ్లే. తలక్రిందులవుతున్న వాళ్ల కతలూ వెతలూ కడివెలకొద్దీ అలాగే వున్నాయి. వలసలు కొనసాగుతూనే వున్నాయి. అన్నవస్త్రాలు కావలసినచోట అణ్వాస్త్రాల తయారీకేంద్రాలు ఏర్పాటవుతున్నాయి.
ఉత్తరాంధ్ర రూపుమారుతోంది.. ఇక్కడి నాయకులు వాళ్ల అస్తిత్వం నిలుపుకోవడం కోసమైనా ఈ ప్రాంత ప్రయోజనాలను పట్టించుకోవడం లేదు. వాళ్ల వ్యాపారాల మత్తుల్లో వాళ్లు జోగుతున్నారు. జీవన్మరణ పోరాటాలు చేస్తున్న జనం తోవతప్పిపోయారు. తమ బతుకు బాగుకోసం కొట్లాడడం మాని.. తమ బతుకు భద్రతకోసం కొట్లాడడం మాని.. సమైక్య నినాదం అందుకున్నారు- ‘పొల్లు’ ఉద్యమంలో తాము ‘గట్టిగింజ’గా వున్నా ఫలితం లేదని మర్చిపోతున్నారు. అరవైఏళ్లుగా తెలంగాణ అసమానత పోవాలనే ఆత్మగౌరవంతో పోరాడుతుంటే- అదే అసమానతకూ నిర్లక్ష్యానికీ నిరాదరణకూ లోనవుతున్న ఉత్తరాంధ్ర ప్రజలు తమ ప్రత్యేక అస్తిత్వం కోసం పోరాడేరోజు వొకరోజు వస్తుంది..
అంతవరకూ యిక్కడి కథకులు చెయ్యాల్సింది చాలానే వుంది!
-బమ్మిడి జగదీశ్వరరావు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అమ్మాయిల గురించి అలా రాయను -అంటున్న డైరెక్టర్ పూరీ జగన్నాధ్

 

‘ఇడియట్’ ‘అమ్మానాన్నా తమిళమ్మాయి’ ‘పోకిరి’ వంటి హిట్ చిత్రాలతో యువత మదిని గెలుచుకున్న దర్శకుడు పూరీ జగన్నాథ్. ఏ విషయాన్నయినా సూటిగా మాట్లాడే ఆయనతో ఆంధ్రజ్యోతి – ఏబీఎన్ ఎమ్‌డీ వేమూరి రాధాకృష్ణ చేసిన ఓపెన్‌హార్ట్ సారాంశం ఇక్కడ…

మీ పెళ్లి ఎలా జరిగింది?
ఆమె షూటింగ్ చూడ్డానికి వచ్చింది. నాకు నచ్చింది. విజిటింగ్ కార్డిచ్చి ‘నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశముంటే ఫోన్ చెయ్యి’ అన్నా. వారం తర్వాత ఫోన్ చేసింది. ‘ఇలా ఎంతమందికిచ్చావు..’ అంది. అలా మొదలైంది మా పరిచయం. తర్వాత కలిసేవాళ్లం. ఐస్‌క్రీమ్‌లు అవీ తినిపించడానికి స్నేహితుల దగ్గర అప్పు చేసేవాణ్ని. ఒకసారి రెస్టారెంట్‌కెళితే ఆమె తందూరీ కోడి ఆర్డరిచ్చింది. అప్పటిదాకా నేను దాన్ని తినలేదు. అప్పుడు ఆమె ఎంత తింటుందో చూద్దామని నేను తినకుండా ఆగాను. మొత్తం తినేసింది. ‘అమ్మో ఈ పిల్లను నేను పెంచలేను’ అని పెళ్లి మానేద్దామనుకున్నాను. కాని తర్వాత ఇద్దరి కుటుంబాలనూ ఒప్పించాం. వాళ్లు బాగా ఖర్చు పెడతారని ‘నిన్నే పెళ్లాడతా’ షూటింగ్ అప్పుడు ఎవరికీ చెప్పకుండా చేసేసుకున్నాం. అసిస్టెంట్ డైరెక్టర్లు ఒకరు తాళి, ఒకరు కూల్‌డ్రింక్స్ అలా తెచ్చారు.

చేసిన సినిమాలు : పాతిక
హిందీ సినిమాలు : ఇద్దరు ప్రొడ్యూసర్లతో సంతకాలు చేశాను. సల్మాన్ కూడా కబురు పెట్టారు. కానీ అక్కడ పని నెమ్మదిగా నడుస్తుంది. నేనేమో పని లేకుండా ఉండలేను. అందుకని చెయ్యలేదు.
చదువు : డిగ్రీ ఫెయిలయ్యా. ఇంటరే అనుకోండి.
చిన్న సైజు దాసరి : ఆయనలాగా నేను పాటలు రాయలేదు.
తెలుగమ్మాయిలు : హీరోయిన్లుగా అప్రోచ్ అవరు. అదే ముంబైకెళితే వంద ప్రొఫైల్స్ వస్తాయి. ఇక్కడ టాలెంట్ ఉన్నా తల్లిదండ్రులు ప్రోత్సహించరు.
తర్వాత ప్రాజెక్టు : మహేష్‌బాబుతో అనుకుంటున్నా.
పాలిటిక్స్‌లోకి : వెళ్లను. నా పని నాది.
పిల్లలు : కొడుకు 10, కూతురు 9 చదువుతున్నారు.
బలహీనత : డబ్బంటే గౌరవం లేకపోవడం, ఎక్కువ నమ్మడం, మందు
బలం : వెరీ ఫోకస్డ్. పని లేకుండా ఉండలే ను.

– వెల్‌కమ్ టు ఓపెన్ హార్ట్. నమస్కారం పూరీ జగన్నాథ్‌గారూ. లేటెస్ట్‌గా ‘హార్ట్ఎటాక్’ తీశారు. నిర్మాతకు హార్ట్ ఎటాక్ వచ్చిందా? బానే ఉందా? టాకేంటి?
బానే ఉంది. యూత్‌కు బాగా నచ్చింది. నేనే ప్రొడ్యూసర్ని.
– మిగతా విషయాల్లోకి వెళ్లేముందు, మీకు బ్యాంకాక్ అంటే ఎందుకంత ఇష్టమో చెప్పండి?
బ్యాంకాక్ కాదు, పట్టాయా బీచ్‌లో కూర్చుని రాసుకోవడం ఇష్టం. ‘ఇడియట్’ సినిమా అప్పుడు మొదటిసారి వెళ్లాను. నాకది చాలా నచ్చింది. ఒక ముసలమ్మ, ఆమె కుటుంబం కాఫీ, టీల్లాంటివి అందిస్తారు. మొత్తానికి ఒక పర్సనల్ అటాచ్‌మెంట్ వచ్చేసింది.
– అక్కడే సెటిలయిపోతారా?
ఇప్పుడే కాదుగాని, ఒక చిన్న ఇల్లు కొనుక్కుని నేను, నా భార్య వృద్ధాప్యం అక్కడే గడపాలని ఆలోచన.
– అంతేనా, అక్కడ మసాజ్‌లంటే ఇష్టమా?
ఎన్నాళ్లు చేయించుకుంటాం మసాజ్‌లు? బోరు కొడుతుంది. వాళ్లు బాగా చేస్తారుగాని రోజూ చేయించుకుంటే ఒళ్లు నొప్పులొస్తాయి.
– సరే, మీ టాటూల గురించి కొంచెం…
టాటూ అనేది అడిక్షన్. ఒకటి వేస్తే రెండోది ఎక్కడ వేయించుకుందామా అనిపిస్తుంటుంది. నేను మొదటిది గోవాలో వేయించుకున్నాను. అది చైనా భాషలో లవ్. ఎందుకో చైనా అక్షరాలంటే నాకిష్టం. నేను వేయించుకున్న రెండో టాటూకు స్పానిష్‌లో ‘లెవెంత్ మైల్’ అని అర్థం. మన లక్ష్యం పది మైళ్లయితే, పదకొండు మైళ్లు పరిగెత్తమని చెబుతుంది అది. ఇంకోటి ‘నాట్ పర్మనెంట్’ అని. కష్టాల్లో ఉన్నా డబ్బున్నా లేకపోయినా, ఆఖరికి ప్రేమలో ఉన్నా – ‘ఈ క్షణం శాశ్వతం కాదు’ అని మనకు గుర్తు చేస్తుందది. సింపుల్‌గా చెప్పాలంటే ‘ఒళ్లు దగ్గర పెట్టుకోమని’.
– మీ వ్యక్తిత్వాన్ని ఇలా రూపొందించినవేమిటి?
చిన్నప్పట్నుంచి పుస్తకాలు ఎక్కువగా చదివేవాణ్ని. నన్ను బాగా ప్రభావితం చేసింది చలం, శ్రీశ్రీ, రంగనాయకమ్మ, రాచకొండ విశ్వనాథశాస్త్రి వంటి రెబెల్ రచయితలు.
– వాళ్లలాగా మీరూ దేవుణ్ని నమ్మరా?
నేను దేవుడున్నాడని నమ్ముతాను. ఏదో ఒక శక్తి ఉంది. నాకు బాగా ఇష్టమైన టాపిక్ దేవుడు. నాకేమీ పని లేనప్పుడు ‘ఎవడీడు, ఎక్కణ్నుంచి వచ్చాడు, మనల్ని ఒక్కొక్కర్నీ ఒక్కొక్కలాగా పుట్టించి అతనేం కావాలనుకుంటున్నాడు? ఏమీ కాకపోతే ఇంత డ్రామా ఎందుకు…’ ఇలా ఆలోచిస్తుంటా. నేను ఐదో తరగతిలో ఉన్నప్పుడు మా నాన్న ‘మొక్కు తీర్చనందుకే దేవుడు మన ఇంట్లో ఇన్ని అనర్థాలు కల్పిస్తున్నాడు..’ అన్నారు. ‘బొచ్చు ఇవ్వకపోతే దేవుడు కక్షగట్టి ఇలా కష్టాలు కల్పిస్తాడా? టార్చర్ చెయ్యాలని చూస్తే ఆయన దేవుడెందుకవుతాడు’ అన్నాను. మా నాన్న నావైపు చూసి ‘నీకు పెళ్లయి ముగ్గురు పిల్లలు పుడితే అన్నీ అర్థమవుతాయి, నమ్ముతావు’ అన్నారు.
– అది నిజమయిందా మరి?
దేవుణ్ని నమ్ముతాను తప్ప, ఇలాంటివి నమ్మను. దేవుడి దృష్టిలో అన్ని ప్రాణులు ఒకటే. ఎవరెవరు ఏం చేశారో చిట్టాలు రాసుకుని, స్వర్గం నరకం మెయింటెయిన్ చేస్తూ – అలాంటి పాకీ పనులు దేవుడు చెయ్యడు.
– కెరీర్ అప్స్ అండ్ డౌన్స్ చూసినప్పుడు దేవుడికి మొక్కుకోవాలనిపించలేదా?
నేను కష్టాలు, సుఖాలు అన్నీ చూశాను. కన్నీళ్లు పెట్టుకున్నాను. కాని మొక్కుకోలేదు.
– కష్టాలంటే ఎలాంటివి?
సంపాదించిన ఇళ్లూవాకిళ్లూ అన్నీ పోయి, వాటిని అమ్ముకుని అప్పులు తీర్చుకున్న రోజులు. నా దగ్గర పది కుక్కలుండేవి. వాటి ని పోషించలేక ట్రెయినర్‌కిచ్చేశాను. ఆ రోజు చాలా ఏడ్చాను. నాకు తెలిసి నిజమైన కష్టమనేది నేచర్ నుంచి వస్తుంది. ఎవడో మోసం చేసి, డబ్బు పోయి – ఇలాంటివి కాదు. రెండు కళ్లూ పోయి, రెండు కాళ్లూ పోయి లేదా సునామీ వచ్చి అందరూ చనిపోయి… ఇలాంటివి నేచర్ నుంచే వస్తాయి. సరదాగా ఓ సాయంత్రం బీచ్‌లో కూర్చుని వెన్నెల రాత్రి, భూదేవి అంటూ కవిత రాసుకుంటే బాగుంటుంది. కాని అదే రోజు సునామీ వచ్చి అందరూ పోతే అదే నేచర్ వయొలెంట్‌గా కనిపిస్తుంది.
– మీరు ప్రకృతి ప్రేమికులన్నమాట!
నా దగ్గరొక 50 పక్షులున్నాయి, రెండు కోతులున్నాయి, ఒక పిల్లి, కొన్ని బాతులు… తప్పనిసరిగా కాసేపన్నా వాటితో గడుపుతాను. పెట్స్ వల్ల మన నేచర్ మారిపోతుంది. కాస్త పెడితే సంతోషిస్తాయవి. మనుషులకు ఎంత పెట్టినా చాలదు.
– డబ్బు పోయిందన్నారు.. అలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది?
నాకు డబ్బంటే రెస్పెక్ట్ లేకపోవడం వల్ల. ఆర్థిక క్రమశిక్షణ లేదు. నాకెవ్వరూ అవి చెప్పలేదు. డబ్బుదేముంది ఎప్పుడైనా సంపాదించొచ్చు.. అంటూ వెళ్లాను. ఎవరేం చేస్తున్నారో పట్టించుకోలేదు.
– అంటే మోసపోయారని…
మోసపోవడం కూడా మన లోపమే. ఇప్పుడిప్పుడే నా మైండ్ మారుతోంది. డబ్బు దాచుకోవాలనిపిస్తోంది.
– క్షవరమైతేగాని వివరం తెలియలేదన్న మాట. ఎంత పోగొట్టుకున్నారు మీరు?
ఓ 85 కోట్లు.
– దీన్నుంచి మిగిలినవాళ్లకు చెప్పే సందేశమేమిటి?
జీవితమంటే యుద్ధం. ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే గుడ్డలిప్పేస్తారు. అడవిలో ఉన్నట్టు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. మనిషి నుంచి మనిషిని కాపాడటానికి మానవత్వం పుట్టింది. నిస్సహాయత నుంచి దైవం పుట్టింది. ఇవన్నీ ఆయుధాలే. మంచితనం – దుర్మార్గం రెండూ ఆయుధాలే.
– జీవన సారాంశం చెబుతున్నారు. ఆ సందర్భాల్లో డ్రగ్స్‌కు అలవాటు పడ్డారా?
లేదు. గడచిన మూడేళ్లుగా రెగ్యులర్‌గా తాగడం మొదలెట్టాను. మా గురువుగారు రామ్‌గోపాల్‌వర్మ పుణ్యమాని ఆయనతో కూర్చుని తాగుతున్నా. అదో పెద్ద ఎదవలవాటు.
– అంత డబ్బు పోతే డిప్రెషన్‌లోకి వెళ్తారు ఎవరైనా..
డిప్రెషన్‌లోకి వెళితే ఇంకా లోపలికెళ్లిపోతాం. మళ్లీ ఇళ్లుగిళ్లు కావాలంటే ఎలా వస్తాయి? మళ్లీ సినిమాలు రాయాలి, తియ్యాలి. దానికోసం ఫ్రెష్‌గా ఉండాలి. ఇంకా ఎక్కువ ఎక్సర్‌సైజ్ చెయ్యాలి. ఫిట్‌నెస్ ఒక్కటే మనల్ని కాపాడుతుంది. నాగార్జునగారు ఒక మంచిమాట చెప్పారొకసారి. ‘ఏరా భోంచేశావా అని అడిగేవాడుంటాడు, ఏరా సంపాదించి జాగ్రత్త చేసుకున్నావా అని అడిగేవాడుంటాడు. కాని ఎక్సర్‌సైజ్ చేశావా అని ఎవ్వరూ అడగరు’ అని. ఆ ప్రశ్న మనల్ని మనమే వేసుకోవాలి. నన్నాయన రోజూ ఎక్సర్‌సైజ్‌కు తీసుకెళ్లేవారు. నాగార్జునగారితో వెళ్లడం కిక్ అని వెళ్లానుగాని, సీరియస్‌గా తీసుకునేవాణ్ని కాదు. అది చూసి ఆయనలా చెప్పారు. అది నాకు చాలా పనికొచ్చింది.
– మరెందుకు మీరు డ్రగ్స్‌కు అడిక్ట్ అయ్యారనే ప్రచారం జరిగింది?
అలా అయితే మళ్లీ రాలేను కదా సార్? నా బ్రెయినే నా పెట్టుబడి. దాన్ని పాడు చేసుకుంటే ఏమొస్తుంది చెప్పండి? నాకు తెలిసి జీవితం ఎవ్వర్నీ వదిలిపెట్టదు. అందరి సరదా తీర్చేస్తుంది. అది అందరికీ కొద్దికొద్దిగా అర్థమవుతూ ఉంటుంది.
– దాసరి, రాఘవేంద్రరావు వంటి వారి తర్వాత వచ్చినవాళ్లలో మీరొక టాప్ డైరెక్టర్. మీ నేపథ్యం ఏమిటి?
మా ఇంట్లో మూడు బీరువాల పుస్తకాలుండేవి. మా నాన్న వ్యవసాయదారుడైౖనా బాగా చదివేవారు. మా ఊరు నర్సీపట్నం దగ్గర బాపిరాజు కొత్తపల్లి అనే పల్లెటూరు. నేను నాలుగైదు తరగతుల నుంచే ఆ పుస్తకాలను చదివేవాణ్ని. ఎనిమిదో తరగతి వచ్చేసరికి రామాయణం, భారతం మొదలుకొని టాప్ రైటర్లందరివీ పుస్తకాలు చదివేశాను. నాకెంత అర్థమైంది అని కాదు. విజయచిత్ర వంటి సినిమా మ్యాగజైన్ల వల్ల సినిమా పరిశ్రమ పట్ల విపరీతమైన గౌరవం కలిగింది. అదీగాక మాకో టూరింగ్ టాకీస్ ఉండేది. ‘నేడే చూడండి… ‘ అని సినిమా ప్రచారం చేసే రిక్షా ఉంటుంది కదా, రోజూ స్కూలయిపోగానే అదెక్కి థియేటర్‌కెళ్లేవాణ్ని. ఫస్ట్ షో అయ్యాక ఇంటి నుంచి వచ్చిన క్యారేజీ తినేసి సెకెండ్ షో అయ్యాక కలెక్షన్ పట్టుకుని ఇంటికెళ్లేవాణ్ని. అలా రోజూ రెండాటలు చూసేవాణ్ని. అలా ఆరో తరగతి నుంచి పొట్టి కథలు రాసేవాణ్ని. మా నాన్న వాటిని చదివేవారు. ఒకసారి మా ఊళ్లో ఒక నాటకాన్ని డైరెక్ట్ చేశా. దాన్ని మా అమ్మానాన్నలు చూశారు. మర్నాడు ఉదయం పిలిచి నా చేతిలో ఇరవై వేలు పెట్టి ‘సినిమా ఇండస్ట్రీకి వెళ్లరా, బాగుపడతావు’ అని పంపించారు. అది 89 -90 ఆ సమయంలో. అలా ఎంటరయ్యాను.
– తల్లిదండ్రులే ప్రోత్సహించడం అరుదు. బాగుంది. తర్వాత?
మధు ఫిలిమ్ ఇనిస్టిట్యూట్‌లో డైరెక్షన్‌లో చేరాను. శ్రీకాంత్ నటనకు అప్పుడే చేరాడు. ఆర్నెల్లు చూసి అక్కణ్నుంచి ఇద్దరం మానేశాం. తర్వాత కె. మురళీమోహనరావు అనే దర్శకుడి దగ్గర అసిస్టెంటుగా చేరదామనుకుని సురేష్ ప్రొడక్షన్స్ ఆఫీసుకెళ్లా. ఆయన గురించి అడిగితే ఆయన బయటికొచ్చి నన్ను లోపలికి తీసుకెళ్లారు. ‘ఇంత సులువా…’ అని నేను లోపల ఆశ్చర్యపోయాను. అప్పుడాయన ఒకమాట చెప్పారు. ‘ఖాళీగా ఉన్న డైరెక్టర్ నిన్ను పెట్టుకుంటాడు కానీ నువ్వు వెళ్లవు. బిజీగా ఉన్న డైరెక్టర్ దగ్గరే అసిస్టెంట్‌గా చేరదామనుకుంటావు. కాని అప్పటికే అక్కడున్నవాళ్లు వెళ్లిపోరు కనుక నీకా ఛాన్స్ త్వరగా దొరకదు. అందువల్ల బిజీ డైరెక్టర్ దగ్గర ఆ స్థాయికొచ్చే అసిస్టెంట్ ఎవడున్నాడో చూడు. అలాంటివారితో స్నేహం చెయ్యి. వాడు పైకొస్తే నీకూ దారి దొరుకుతుంది. వాడు చెడిపోతే నీ ఎంపిక తప్పని తేలిపోతుంది..’ అని చెప్పారు.
– భలే బాగా చెప్పారే ఆయన!
అవును. నేనూ దాన్నే పాటించాను. అప్పట్లో ‘శివ’ పెద్ద హిట్టు. బయటికొచ్చి చూస్తే రామ్‌గోపాల్‌వర్మ పేరు కన్పించింది. ఆయనకు దగ్గరగా ఉన్నది కృష్ణవంశీ. ఆయనతో స్నేహం మొదలెట్టాను. పని అడగలేదు. ఆయనే నన్ను ‘వర్మ క్రియేషన్స్’లోకి అసిస్టెంట్‌గా తీసుకున్నారు, తర్వాత రాముగారితో పనిచేశాను. తర్వాత ఒకసారి బోంబేలో షూటింగ్ చేస్తుంటే మురళీమోహనరావుగారొచ్చారు. ‘సార్ నేను…’ అని తనను తాను పరిచయం చేసుకుంటుంటే నేను ఆయనకు పాతవిషయమంతా చెప్పాను. ఆయన ఆశ్చర్యపోయారు. ‘నేను చెప్పిన విషయాన్ని మీరింత సీరియస్‌గా తీసుకుంటారనుకోలేదు. అయితే మరొక్క మాట చెబుతాను. అదేంటంటే, డబ్బు జాగ్రత్తగా పెట్టుకోండి. డబ్బు లేకపోతే ఏదీ ఉండదు. ‘నేను నూరు సినిమాలు చేశా, నూటేభై చేశా…’ అన్నా ఎవ్వరూ పట్టించుకోరు’ అని చెప్పారు. అలాగే అన్నా కాని పట్టించుకోలేదు.
– అయితే మీకు సినిమా కష్టాలేవీ లేవు..
సినిమా కష్టాల్లేకుండా ఎవ్వరూ ఉండరు. కృష్ణానగర్ నుంచి గోల్కొండకు.. షూటింగులకు నడిచి వెళ్లిన సందర్భాలెన్నో ఉన్నాయి. నన్నడిగితే అవసలు కష్టాలే కాదు. చేతిలో ఆఫర్లున్నప్పుడు పడినవే కష్టాలు. ఎదుగుతుంటే బరువు పెరుగుతుంది, కష్టాలు పెరుగుతాయి.
– మీ ఇబ్బంది చూసి అమ్మానాన్నలు బాధపడలేదా?
పడతారు కదండీ. రెండేళ్లు వాళ్లు పంపిన డబ్బు తీసుకున్నాను. తర్వాత నేనే చిన్నచిన్న పనులు చేసి సంపాదించుకున్నా. దూరదర్శన్‌లో ఓ ఎపిసోడ్ రాయడం, ఏదోకటి డైరెక్ట్ చెయ్యడం, పత్రికల్లో బొమ్మలు గియ్యడం… చేసేవాణ్ని. బొమ్మకు యాభై రూపాయలొస్తాయని ఆశ. కానీ వాళ్లు నాలుగు పత్రికలిచ్చి ‘బాగా వేస్తున్నావోయ్…’ అని పంపేసేవారు.
– శ్రమ దోపిడీ అన్న మాట…
అలా జరిగినప్పుడు నేనేం బాధ పడేవాణ్ని కాదు. ఎందుకంటే, అవతలివాడు వాడుకుంటున్నాడంటే నేను పనికొస్తున్నాననే కదా.
– మిగిలినవాళ్లతో పోలిస్తే మీ సినిమా టైటిల్స్, ట్రీట్మెంటు డిఫరెంట్‌గా ఉంటుంది.. అదెవరి ప్రభావం?
కొంత నా సొంతం. కొంత నన్ను ప్రభావితం చేసిన దర్శకులు. బాలచందర్, మణిరత్నం సినిమాలు చూసి ఇన్‌స్పైర్ అవుతాను. రామ్‌గోపాల్‌వర్మ సినిమాలు కాదుగాని ఆయనతో కూర్చుని మాట్లాడ్డం బాగా ఇష్టం. గంటల తరబడి ఆయన చెబుతారు, నేను వింటుంటాను.
ఝ పోకిరి అంత పెద్ద హిట్టవుతుందని అనుకున్నారా?
నేనూ అనుకోలేదు. మహేష్‌బాబూ అనుకోలేదు. నా దగ్గరున్న కొన్ని కథల్లో అదీ ఒకటి. అంతే. మంచి సినిమా అవుతుందనుకున్నాం. ఎడిటింగ్ అప్పుడు నా పక్కనున్నవాళ్లు ఫ్లాపవుతుందని అందరూ అనేవాళ్లు. ఎందుకంటే ఇందులో ఆడవాళ్లు లేరు, ఫ్యామిలీ లేదు… సినిమా నిండా గన్నులే… అని.
– మరి అది ఎందుకు హిట్టయింది?
నిజానికి పోకిరి తర్వాత మూడేళ్ల పాటు ఏ సినిమా తీసినా ‘పోకిరిలా లేదు..’ అనడం మొదలెట్టారు. అసలు అంత బాగా నేనేం తీశానా అని మళ్లీ ఆ సినిమా చూశాను. నిజం చెబుతున్నా, నాకైతే ఏమీ అర్థం కాలేదు. ఏదైనా సినిమా ఎందుకు హిట్టవుతుందో, ఎందుకు నచ్చుతుందో ఎవరికీ తెలియదు. అలా ఎవరైనా ‘నాకు తెలుసు, నాకు రాయడం వచ్చేసింది’ అంటే వాడు పిచ్చోడే.
– ‘అంత కష్టపడ్డా, ఇంత కష్టపడ్డా’ అనకుండా మరీ ప్లెయిన్‌గా చెబుతున్నారు…
నేను ఏ కథైనా వారం రోజులు రాస్తా. మరో వారం రోజులు డైలాగులు రాస్తా. ఏ సినిమా అయినా అంతే. వాటిలో కొన్ని హిట్టు, కొన్ని ఫట్టు.
– మీకు మొదటి అవకాశం ఎవరిచ్చారు?
పవన్ కళ్యాణ్ స్టారయ్యాక ఆయనతో సినిమా చేద్దామని ఆయన మేనేజర్ చుట్టూ తిరిగాను. దూరదర్శన్ పరిచయంతో శ్యామ్ కె. నాయుణ్ణడిగితే ఛోటా కె. నాయుడికి చెప్పారు. ఆయనకు పవన్ కళ్యాణ్ బాగా ఫ్రెండ్. ‘మంచి కథ చెప్పకపోతే నా పరువు పోతుంది. ముందు నాకు చెప్పమను’ అన్నారట ఛోటా. అప్పుడాయనకు ‘శ్రావణి సుబ్రమణ్యం’ కథ చెప్పా. ఆయనకు నచ్చి పవన్ దగ్గరకు పంపిస్తే ఆయన నాకు అరగంటే సమయమిచ్చారు. అదీ ఉదయం నాలుగ్గంటలకు. నేను వెళ్లి ‘బద్రి’ కథ చెప్పాను. ఏకంగా నాలుగు గంటల పాటు! క్లైమాక్స్ నచ్చలేదు మార్చమన్నారు. కొంత ప్రయత్నించాను కాని నాకే నచ్చలేదు. వారం తర్వాత కలిసినప్పుడు మళ్లీ అదే చెప్పాను. ‘నా గురించి నువ్వు క్లైమాక్స్ మారుస్తావా లేదా చూద్దామని అలా అడిగాను. ఇదే బాగుంది’ అన్నారు పవన్. అలా వచ్చింది అవకాశం. ‘ఛోటాకు చెప్పిన కథ వేరేలా ఉందే’ అన్నారాయన తర్వాత. అవకాశం పోతుందని ఆయనకది చెప్పానని నిజం చెప్పేశాను. నిజానికి నేనా సినిమా చేసేనాటికి ఆయన నటించిన సినిమాలేవీ చూడలేదు.
– అదేమిటి?
అమితాబ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ‘మర్ద్’ తర్వాత అన్నీ చెత్త సినిమాలు తీస్తున్నారని నేను సినిమాలు చూడటమే మానేశాను. ఇప్పటికీ ఏడాదికి ఒకటో రెండో తప్ప అసలు సినిమాలే చూడను. ఇప్పటిదాకా నా దగ్గరున్న కొన్ని కథలతో నెట్టుకొచ్చేశా. ఇప్పుడిక అప్‌డేట్ అవాలి కదా. అందుకని వచ్చే నెల బ్యాంకాక్ వెళ్లి చాలా సినిమాలు చూడాలనుకుంటున్నా.
– ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది?
బాధనిపిస్తుంది. ఒక ఐడియా మీద కోట్లు ఖర్చు పెడతాం. వంద సినిమాలు తీస్తే రెండు ఆడతాయి. ఆ రెండులో మనదొకటి ఉండాలంటే ఎంత కష్టమో ఆలోచించండి. ఇష్టంగా చేసిన ‘నేనింతే’ పోయినప్పుడు చాలా బాధపడ్డాను. దాన్నిప్పుడు ఎంబీయే స్టూడెంట్స్‌కు ఇన్‌స్పిరేషన్‌గా వాడుతున్నారు.
– మీకూ పవన్‌కూ విభేదాలొచ్చాయని…
నేను ‘ఇద్దరమ్మాయిలతో..’ ప్రమోషన్ కోసమని ఛానెళ్లలో ఇంటర్వ్యూలిస్తున్నా. ఒక కాలర్ ‘పవన్‌తో సినిమా వచ్చే ఏడాది ఉంటుందా..’ అన్నారు. ‘ఉండచ్చు..’ అన్నా. దాన్ని పట్టుకొని మరో కాలర్ ‘అందులో హీరోయిన్ ఎవరు..’ అన్నారు. అలాఅలా పదిహేను ఛానళ్లలో పవన్‌తో సినిమా అనేది టాపిక్కయి కూర్చుంది. అప్పుడు దక్కన్ క్రానికల్ వాళ్లొచ్చి తర్వాత సినిమాలో పవన్నెలా చూపిస్తారు.. అనడిగారు. విసుగొచ్చి ‘అయినప్పుడు చూద్దాం’ అని చెప్పా. దాన్ని నేను పవన్‌తో సినిమా చెయ్యను… అని రాసేశారు. అదీ కథ.
– సినిమా తియ్యాలని ఎందుకనిపిస్తుంది?
నాకు నచ్చిన ఆలోచన ఇతరులకు నచ్చకపోవచ్చు, నమ్మకపోవచ్చు. నేను పడ్డ అవమానాల వల్ల నాకే సొంతంగా సంస్థ ఉండాలని పెట్టుకున్నా. ఒకసారి దాసరిగారు ‘చిన్న సినిమాలు తియ్యవా..’ అనడిగారు. ‘వచ్చినవి చేస్తున్నా..’ అంటే, ‘ఒకరోజు మనకే ఫోన్లూ రావు, ఎవ్వరూ పలకరించరు. అప్పుడు తియ్యాల్సినవి చిన్న సినిమాలే. అవి తియ్యడమూ నీకు తెలియాలి..’ అన్నారు. గారడీవాడికి నాలుగైదు ఫీట్లు వస్తాయి. అవే చేస్తుంటే ఊళ్లోవాళ్లు చూడరు. అందుకని అప్‌డేట్ అవాలి.
– పూరీ సినిమాల్లో ఆడవాళ్లను కించపరుస్తూ డైలాగులుంటాయంటారు..
ఇడియట్, దేశముదురు, బిజినెస్‌మేన్ సినిమాల్లో ఏమే, ఒసే, రావే.. అని ఉన్నాయి తప్ప మిగిలిన సినిమాల్లో ఏమీ లేవు. కాని నాకు ఆడవాళ్లంటే గౌరవం, ఇష్టం. శ్రావణి సుబ్రమణ్యం, అమ్మానాన్న తమిళమ్మాయిలో జయసుధ, గోలీమార్‌లో రోజా ఇలా ఏ సినిమా అయినా చూడండి, దానిలో ఆడవాళ్లకు ఒక గట్టి వ్యక్తిత్వం ఉంటుంది. వాడెవడో ఎదవ ఏమే అంటే అమ్మాయి కారెక్టర్‌ను తక్కువ చేశానంటే ఎలా? నా సినిమాల్లో అమ్మాయిలను ఏదో ఒక పని చేసుకునేవారిగా చూపిస్తాను తప్ప ఖాళీగా ఉన్నట్టు చూపెట్టను. అలాగే పాటల్లో సైతం డబల్ మీనింగ్ రాయను. హీరో మీద మోజుపడి మీదమీద పడే క్యారెక్టర్లు రాయను. హీరోయినంటే పాట ముందొచ్చి పాటయిపోగానే వెళ్లిపోయే పాత్రలు రాయను.
– ‘కుక్కను పెంచుకున్నా మంచిదే, కూతురయితే లేచిపోతుంది’ అన్న డైలాగ్ రాశారుగా మీరు?
అది ‘కూతుళ్లు’ సినిమాలో ఒక తండ్రి ఫీలింగ్. కాని సార్, ఆడవాళ్లు లేకుండా మనం బతకలేం, సినిమాలు తియ్యలేం, సృష్టే ఉండదు.
– మీ యాంబిషన్ ఏంటి? తరువాత ఏం చేయబోతున్నారు?
కొత్త కథలు రాసుకోవాలి. బోల్డన్ని సినిమాలు తియ్యాలి.
ఓకే ఆల్ ద బెస్ట్

Posted in సినిమా | Tagged | Leave a comment

అనంత పద్మనాభుడి నుండి అరుణా చలేశ్వరుని దాకా -4(చివరి భాగం )

అనంత పద్మనాభుడి నుండి అరుణా చలేశ్వరుని దాకా -4(చివరి భాగం ) అరుణాచలం 11-2-14మంగళ వారం తెల్లవారు ఝామునే లేచి అన్ని కార్యక్రమాలు పూర్తీ చేసుకొని మిగిలిన వారూ ,సంధ్యా పూజా ,అరుణ పారాయణ మహా సౌరమంత్ర పారాయణ చేసి నేను, ఉదయం అయిదున్నరకు ఆటోలో

అరుణాచలేశ్వరుడిని దర్శించాం. తీరికగా దర్శనం లభించింది .ఇరవై రూపాయల స్పెషల్ దర్శనం .తనివి తీర అగ్ని జ్యోతిర్లిన్గాన్ని దర్శించి తరించాం . నిన్న రాత్రి దర్శనం ఇప్పుడు ప్రభాత దర్శనం .మనసు నిండుగా ఉంది తర్వాత అమ్మ వారి దర్శనం చేశాం .అక్కడా హాయిగా దర్శనమయింది .లోపల ఉన్న కుమారస్వామి గణేష్ మందిరాలను కూడా చూసి బయటికి సంతృప్తి తో వచ్చాం .అక్కడే ఉన్న హోటల్ లో ఇడ్లీ తిని కాఫీ తాగాం . గిరి ప్రదక్షిణం అరుణా చలేశ్వరుడిని చూడటం మల్లికా గారికి ఇదే మొదటి సారి .మేము చాలా సార్లు చూశాం .ఆమె కు ఎంతో అనుభూతి కలిగింది .ఇన్ని సార్లు వచ్చినా నేనెప్పుడూ గిరి ప్రదక్షిణం చేయలేదు .పద్నాలుగు కిలో మీటర్లు చుట్టి రావాలి .మధ్యలో ఎనిమిది శివలింగాలను చూడాలి .ఇవి అష్ట దిక్పాలకులు స్థాపించిన లింగాలుగా ప్రసిద్ధి. వీటితో బాటు ఆది అరుణాచలేశ్వర దేవాలయాన్ని కూడా దర్శించాలి. ఇవన్నీ తిరిగి రావటానికి మూడు వందల రూపాయలకు ఆటో మాట్లాడుకొన్నాం గుడి దగ్గరే .మమ్మల్ని చివరికి రమణాశ్రమం దగ్గర దించాలని చెప్పాం

.అలాగే అని బయల్దేరాడు .వరుసగా ఎనిమిది లింగాలు ఇంద్ర ,ఆగ్ని,వాయు,  కుబేర ఈశాన వరుణ, యమ,నైరుతి శివ లింగాలను దర్శించం ప్రతి చోటా ఆగటం చూడటం ఫోటోలు తీయటం చేశాం .మధ్యలో ఆది అరుణాచలేశ్వర దేవాలయం లో శివ దర్శనం అమ్మ వారి దర్శనం చేశాం .అంతా పూర్తీ అయ్యేసరికి గంట సమయం పైనే పట్టింది .ఇదే మొదటి సారి. బాగాఉంది .ఈ గిరి ప్రదక్షిణం కోసమే మంచి రోడ్డు వేశారు .ఇదివరకు కొండ  దగ్గర నుండి ప్రదక్షణం చేసేవాళ్ళు. ఇప్పుడు ఊరు పెరిగింది .కనుక గిరి ప్రదక్షిణం కాదు ‘’పురి ‘’ప్రదక్షిణం అన్నాను .గిరి చుట్టూ ఉన్న ఓషధుల గాలి మనకు సోకి ఆరోగ్యాన్నిస్తుందని భావన .శేషాద్రి స్వామి ఆశ్రమం చ దగ్గర దిగాం .లోపలి వెళ్లి చూశాం .ఆయన పేర ఉన్న లింగానికి అభిషేకం జరుగు తోంది. శేషాద్రి స్వామి మహాభక్తుడుగా ప్రసిద్ధి. ఆయన జీవిత చరిత్ర పుస్తకం అక్కడే ఉన్న షాప్ లో లేదని ప్రింట్ అవుతోందని చెప్పారు  .దీనికి దగ్గరే ఉంది శ్రీ రమణాశ్రమం . శ్రీ రమణాశ్రమం నడిచి శ్రీ రమణాశ్రమం కు వెళ్లాం నేనిది వరకు ఎన్నో సార్లు సందర్శించాను .నాకు మహా ప్రశాంతం గా ఉంటుంది .ఇక్కడ .అందుకే ఎన్ని సార్లు వెళ్ళినా మళ్ళీ వెళ్లాలని పిస్తుంది .మల్లిక గారికి కూడా కొత్త .ఒకటి రెండు సార్లు ఇక్కడ ఆశ్రమం లో రాత్రి ఉన్నాం .ఇప్పుడు మళ్ళీ .అన్నీ తిరిగి చూశాం .గోశాల ,

భోజన శాల వంట శాల మహర్షికి ఇష్టమైన లక్ష్మీ ఆవు పావురం కోతి పిల్లి కుక్కా వాటి సమాధులు తిరిగి చూశాం .తర్వాతా ఆశ్రమ లో రమణుల అమ్మ వారి సమాధి శివలింగం అభిషేకం చూశాం .రమణ మహర్షి ధ్యాన మందిరం ఎంతో ప్రశాంతం గా ఉంది .ధ్యానం చేసే వాళ్ళు అన్ని దేశస్థుల వారూ ఉన్నారు .ఇక్కడ కులానికి వర్గానికి వివక్షతకు స్థానం లేదు అది చాలు .అందరం ఒకటే నని తెలియ జేయటానికి .పుస్తక శాలలో శ్రీ కావ్య కంఠ గణ పతిరాసిన’’ఉమా సాహస్రం ‘’ అలాగే ‘’రుభు గీత ‘’పూర్తీ పుస్తకాలు ,శ్రీపింగళి  లక్ష్మీ కాంతం గారి అబ్బాయి సూర్య సుందరం గారు రాసిన ‘’రుభు గీతా సారం ‘’చిన్న పుస్తకం ఫోటోలు కొన్నాను

.అందరం రమణాశ్రమం  లో  భోజనం చేయాలను కొన్నాం .అదొక దివ్యాను భూతి .నలుగురి మీద కలిపి రెండు వందల రూపాయలు ఆశ్రమ నిధికి జమ చేసి రసీదు తీసుకొన్నాం .సరిగ్గా పదకొండున్నరకు భోజనం పెడతారు .పది నిముషాలు ముందు అక్కడికి చేరాలి .అయితే మనం యెంత మంది భోజనానికి వస్తామో ఆఫీస్ లో ముందుగా చెప్పితే చాలు .అన్నం, గోరు చిక్కుడు కాయ కూర ,సాంబారు ,రసం, ఖీర్ అనే పాయసం ,మజ్జిగ నిమ్మకాయ ఊరగాయ తో మహా ప్రసాదం గా భోజనం అడిగి అడిగి వడ్డించారు. అందరూ ఒకే పంక్తి లో కూర్చుంటే ఎంతో ముచ్చటగా ఉంది. ఫోటోలు తీశాను. అందరూ ఎంతో ఆనందించారు .మా ఎదురు గా కూర్చున్న దంపతులు మహా ముచ్చట పడి నవ్వుతూనే ఉన్నారు మేము ఫోటోలు తీస్తుంటే .పన్నెండు గంటలకు రమణాశ్రమం  వదిలి ఆటో మీద ఆకాష్ హోటల్ కు చేరుకొన్నాము ఒక గంట విశ్రాంతి తీసుకొన్నాం .

చెన్నై కి చేరిక సామాను తీసుకొని ఎదురుగుండా ఉన్న బస్ స్టాండ్ చేరాం. పావుతక్కువ రెండు గంటలకు మద్రాస్ ఎక్స్ప్రెస్ ఎక్కాం  వందరూపాయలు బస్ చార్జి .కారు లో వెళ్ళటానికి ఈ రెండు వందల కిలో మీటర్ల దూరానికి మూడు వేల అయిదు వందలు అడిగారు .అంత అనవసరం అని బస్ లోనే వెళ్లాం .నైవేలీ మీదుగా బస్ చెన్నైకి నాలుగున్నర గంటలు ప్రయాణం చేసి సాయంత్రం అయిదున్నరకు చేరింది .దారిలో జీడి మామిడి తోటలు విపరీతం గా కని  పించాయి అలాగే గురవాయూర్ నుంచి వస్తున్నప్పుడు కూడా జీడి తోటలు బాగా ఉన్నాయి .అక్కడి నుంచి సామాను తో ఆటోలో రెండు వందలిచ్చి షినాయ్ నగర్లో ఉన్న మా మేన కోడలు కళా చంద్ర శేఖర్ ల ఇంటికి అరగంట లో చేరాం .వెంటనే కాఫీ ఇచ్చింది కళ. తాగి ,స్నానాలు చేశాం .అప్పటికే ఆఫీస్ నుండి చంద్ర శేఖర్ ,మా మేనల్లుడు శ్రీనివాస్ వచ్చి మా కోసం ఎదురు చూస్తున్నారు .చంద్ర శేఖర్ కు కృతజ్ఞతలు చెప్పి అతను తీసుకొన్న శ్రద్ధకు మానిటరింగ్ కు ,ఫోన్ పలకరింపులకు ఏంతో మెచ్చాము .అందుకే దీన్ని ‘’శర్మా చంద్ర శేఖర విజయం ‘’అన్నాను .ముసి ముసి నవ్వ్వులు నవ్వాడు చంద్ర శేఖర్ .అతని ప్రణాళికయే ఇది .మా అబ్బాయి శర్మ తో అతను సంప్రదిస్తూ ప్లాన్ తయారు చేసి ఇద్దరూ కలిసి ఈ కేరళ ట్రిప్ విజయానికి కృషి చేశారు .భోజనం చేసి పడుకున్నాం .నాకు నిద్ర పట్టలేదు .అందరూ పడుకొన్నారు .

షాపింగ్ – 12-2-14బుధ వారం నా  సంధ్య ,పూజా ,పారాయణ అయిన తర్వాతా టిఫిన్ చేసి కాఫీ రెండో సారి తాగి పదింటికి ఆటో లో బయల్దేరి ‘’మదర్ షా ‘’అనే వస్త్రాలయానికి వెళ్లాం .ఎప్పుడూ ఇక్కడే బట్టలు కొంటాం .క్వాలిటీ బాగా ఉంటుంది .అన్ని రకాలు ఉంటాయి .మా అమ్మాయికి, కోడళ్ళకు మా ఆవిడకు చీరలు కొన్న్నాం. మనవరాళ్ళు ఇద్దరికీ పట్టు పరికిణీబట్టలు కొన్నాం .మా సువర్చలాన్జనేయ స్వామికి వస్త్రాలు కొందామను కొంటె మంచివి దొరకలేదు .అమ్మ వారికి మాత్రం  తీసుకొన్నాం  .అన్నీ పూర్తీ అయి ఇంటికి చేరే సరికి ఒంటి గంట దాటింది .భోజనం చేసి విశ్రాంతి తీసుకొన్నాం . కపాలేశ్వర ,పార్ధ సారధి కోవెల దర్శనం సాయంత్రం నాలుగింటికి ఏ.సి.టాక్సీ  నాలుగు గంటలకు ఆరువందల రూపాయలకు మాట్లాడుకొని బయల్దేరాం .ముందుగా మైలాపూర్ లో శ్రీ కపాలేశ్వర స్వామిని దర్శించాం .అక్కడి నుండి ట్రిప్లికేన్ లో శ్రీ పార్ధ సారధి స్వామి ని సందర్శించాం .అక్కడ ముప్పావు గంట లేట్ అయింది దర్శానికి ‘’.మీసాల కృష్ణుడు పార్ధ సారధి’’ .మా చిన్నప్పుడు ఎప్పుడు మద్రాస్ కు మా అక్కయ్యా వాళ్ళ ఇంటికి వచ్చినా మా అక్కయ్య లోపా ముద్ర మమ్మల్ని ఈ రెండు గుడులకూ తీసుకు వెళ్ళేది .బీచ్ లు చూసే వాళ్ళం .అక్కడి నుంచి టి నగర్ లో ఉన్న మా బంధువులు నోరి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు మద్రాస్ సిమెంట్స్ లో అత్యున్నత అధికారి గా పని చేసిన శ్రీ నోరి రామ క్రిష్ణయ్యగారుగారింటికి వెళ్లి దంపతులను చూశాం

.వీరిది ఉయ్యూరు దగ్గర తోట్ల వల్లూరు .రామ క్రిష్నయ్య గారు మా రెండో కోడలు ఛి . సౌ ఇందిరకు చిన తాత గారు . చాలా మంచి వారు .ఈ ప్రదేశానికి వచ్చినప్పుడల్లా వల్లూరు వెళ్లి మా ఇంటికీ వచ్చే వారు .అయిదారు నెలల క్రితమే వచ్చి వెళ్ళారు దంపతులు .మా శ్రీమతి,కి  మల్లికా గారికి చీరా జాకెట్ పెట్టి గౌరవించారు ఆయన సతీ మణి.అక్కడి నుండి సరాసరి షినాయ్  నగర్ చేరుకొని భోజనం చేసి పడుకోన్నాం. నిద్ర అసలు పట్టనే లేదు. ఈ రెండు రోజుల్లో మల్లిక గారి దగ్గర బంధువు అయిన గాయని,బాల సుబ్రహ్మణ్యం చెల్లెలు  ఎస్ పి శైలజ గారింటికి వేల్దామను కొన్నాం .మల్లికా గారు ఆమె కు ఫోన్ చేస్తే హైదరాబాద్ లో షూటింగ్ లో ఉన్నానని ,పది హీను రోజులు అక్కడే ఉంటానని చెప్పారు .ఆమెకు ఇవ్వటానికి సరసభారతి పుస్తకాలు కూడా తీసుకొని వెళ్లాను .కాని ఆశా భంగమే అయింది .అలాగే వెస్ట్ మాంబళం లో ఉన్న ‘’సంజీవినీ పీఠం’’ను కూడా దర్శించాలను కొన్నాం .కాని సమయం చాల లేదు .అదీ చూడలేక పోయాం . శ్రీ సాయి మందిర సందర్శనం –ఉయ్యూరు ప్రయాణం 13-2-14-గురువారం ఉదయమే అన్నీ పూర్తీ  చేసి ఆటోలో దగ్గరలోనే ఉన్న శ్రీ షిర్డీ సాయిబాబా మందిరానికి వెళ్ళాము.ఇక్కడ ఈ మందిరాన్ని ఏర్పాటు చేసిన వారు స్వామి కేశవయ్యజీ .మహా భక్తులు .తెలుగు వారే .ఎంతో ప్రాచుర్యం పొందిన మందిరం ఇది సినీ గాయిని ఎస్ జానకి మొదలైన వారంతా దర్శించి హాయిగా గానం చేసి తరిస్తున్న ప్రదేశం .చాలా సార్లు చూశాను .కేశవయ్య గారి చేతనే ఉయ్యూరు లో కే.సి.పి వారు ఫాక్టరీ దగ్గర శ్రీ సాయిబాబా మందిరాన్ని ప్రారంభింప జేశారు మద్రాస్ లో నూ ఇక్కడా బాబా చిత్ర పటాలే .ఆ తర్వాతా ఉయ్యూరు లో విగ్రహం పెట్టారు .కాని మద్రాస్ లో ఇంకా ఆ చిత్ర పటానికే అ పూజాదికాలు జరుగుతాయి .ప్రశాంత మైన ధ్యాన మందిర్ ప్రసాదాలు వినాయక గుడు ఉన్నాయి .దర్శనం తర్వాత అమర స్టోర్స్ కు వెళ్లి ప్రిస్టేజ్ చిన్నకుకర్ ,ఇండక్షన్ స్టవ్ వగైరాలు కొని ఇంటికి చేరాం .అమర స్టోర్స్ లో మంచి స్టీల్ వస్తువులు లభిస్తాయి .భోజనం చేసి విశ్రాంతి తీసుకొన్నాం . రాత్రి ఎనిమిదిన్నరకల్లా భోజనాలు పూర్తీ చేసుకొని కాల్ టాక్సీ లో సామాను పెట్టుకొని తొమ్మిదింటికి మద్రాస్ సెంట్రల్ స్టేషన్ చేరాం .పది గంటలకు తమిళ్ నాడు ఎక్స్ప్రెస్ లో ఎక్కి S7లో -3,4,6,8 మా రిజర్వేషన్ బెర్త్  లలో చేరి పడుకోన్నాం .తెల్లవారు ఝామున మూడున్నరకే నాన్ స్టాప్ గా ప్రయాణం చేసి బెజవాడ చేరింది ట్రెయిన్ .సామాన్లు కూలీలకిచ్చి రెండు వందలు సమర్పించుకొని  బయట మా  కోసం ఉన్న రామూ టాక్సీ ఎక్కి ఉయ్యూరుకు అయిదింటికి  అంటే పద్నాలుగవ తేదీ శుక్రవారం ఉదయం హాయిగా ఉయ్యూరు చేరాం .కేరళ ట్రిప్ సర్వం సంపూర్ణం .మద్రాస్ లో మా మేన కోడలు కళా  చంద్ర శేఖర్ అబ్బాయి బాలాజీ మా మేనల్లుడు శ్రీనివాస్ లు ఏంతో మర్యాదా మన్ననా ఆప్యాయతా ఆదరణా చూపించారు మమ్మల్ని ముగ్ధుల్ని చేశారు .అందుకే ఈయాత్ర ఇంత సంతృప్తిగా జరిగింది . ఇన్ని రోజుల యాత్రలో మద్రాస్ వచ్చే వరకు అంటే అయిదవ తెడ్డె నుండి పదకొండవ తేదీ వరకు కన్యాకుమారిలో ఒక పూట ,రమణాశ్రమం లో ఒక పూట మాత్రమె మేము ముగ్గురం భోజనం చేశాం .మల్లికా గారు రమణాశ్రమం లో మాత్రమె భోజనం చేశారు .మిగిలిన రోజులన్నీ టిఫిన్ ల తో సరి పెట్టుకోన్నాం.అయినా ఏ మాత్రం నీరసం గా అని పించలేదు ఉత్సాహం తగ్గలేదు .ఆకలి  అని పించి ఇబ్బందీ పడలేదు . ఏ రోజు కా రోజు ఆరోజు ఖర్చులు లెక్క వేసి నలుగురికీ పంచి డబ్బులు వసూలు చేసి ఇవ్వాల్సి వస్తే ఇచ్చి ఎక్కడా రూపాయ్ తేడాలేకుండా జాగ్రత్త గా గడిపాము .అందువల్ల అపార్ధాలు వచ్చే అవకాశం లేకుండా చేశాను . రాం బాబు  కే లెక్కలన్నీ అప్ప గించాను వాడు జాగ్రత్త గా అన్నీ బాధ్యత గా చూశాడు .నలుగురం ఆనందించాం అందుకే ‘’కేరళ ట్రిప్ సక్సెస్ ‘’. చూసిన క్షేత్రాల గురించి వివరం గా విశేషాలతో వెంటనే తెలియ జేస్తాను . సంపూర్ణం . మీ – గబ్బిట దుర్గా ప్రసాద్ -16-2-14-ఉయ్యూరు

 

 

అనంత పద్మనాభుడి నుండి అరుణా చలేశ్వరుని దాకా -3

అనంత పద్మనాభుడి నుండి అరుణా చలేశ్వరుని దాకా -2

అనంత పద్మ నాభుడి నుండి అరుణాచలేశ్వరుని దాకా -1

Posted in అనంత పద్మ నాభుడి నుండి అరుణాచలేశ్వరుని దాకా, నేను చూసినవ ప్రదేశాలు | Tagged | 1 Comment

తెలుగు వికీ పీడియా దశాబ్ది ఉత్సవం

        తెలుగు వికీ పీడియా దశాబ్ది ఉత్సవం

ఫిబ్రవరి పదిహేను ,పదహారు తేదీలలో విజయవాడ కాకర పర్తి భావనారాయణ కాలేజి లో తెలుగు వీకీ పీడియా దశాబ్ద ఉత్సవాలు జరిగాయి .నాకు పంపిన ఆహ్వానాన్ని మద్రాస్ లో ఉండగా చూసి అందరికి పంపాను .నిన్న వెళ్ళటం కుదరలేదు. ఇవాళ ఆదివారం వన్ టౌన్ లో ఒక చిన్న పని ఉన్నందున అది చూసుకొని కే బి యెన్ కాలేజి కి వెళ్లేసరికి పదిన్నర దాటింది .అప్పటికి ప్రారంభం కాలేదు. జి వి పూర్ణ చంద్ ,కాలానాధ భట్ట వారూ వచ్చారు నాతో బాటు .వీకీ పీడియన్లు పాతిక మంది కంటే కనీ పించలేదు. విద్యార్ధులు బాగానే పాల్గొన్నారు .వాళ్ళు ప్రాజెక్ట్ వర్క్ కూడా చేశారు .కాలేజి యాజమాన్యం ఈ కార్యక్రమానికి బాగా సహకరించి అన్ని ఏర్పాట్లు చేసింది .బయట ఊరి నుంచి వచ్చిన వారికీ వసతి కల్పించింది .హాజరైన వారందరికీ రెండు పూటలా టిఫిన్ కాఫీ భోజనాలను ఏర్పాటు చేసి గొప్ప ఉత్సాహాన్ని చూపింది .అందుకు వారు అభినంద నీయులు .’’కళా సదన్ ‘’అనే ఆరుబయట వేదిక మీద షామియానాలో కార్యక్రమం మొదలైంది .ఇంతలో వాన దంచేసింది .వేదిక ను మూడవ అంతస్తులోని సెమినార్ హాల్ కు మార్చారు .

సభాధ్యక్షులు పద్మశ్రీ తుర్లపాటి కుటుంబ రావు .పూర్ణచంద్ ,ప్రముఖ కార్డియాలజిస్ట్  డాక్టర్ రమేష్ బాబు ,మొదలైన వారందరూ అతిధులు .అర్జంట్ కేసు ఒకటి ఉండటం వలన రమేష్ బాబు ముందు మాట్లాడి వెళ్లి పోయారు తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు .ఆయన వెళ్లి పోయిన తర్వాత ప్రార్ధన తో అసలు సభ ప్రారంభమైంది.ఒక విద్యార్ధిని శ్రావ్యం గా గీతం ఆలా పించి వన్నె తెచ్చింది  జ్యోతి  ప్రజ్వలనం చేశారు .పూర్ణ చంద్ మాట్లాడుతూ తానూ తెలుగు వీకీ పీడియా ను తన రచనలకు బాగా ఉపయోగించుకోన్నానని ,తన రిఫెరెంస్ లలో ఎక్కువ భాగం వీకీ పీడియా కే సరిపోతోందని హర్ష ధ్వానాల మధ్య ప్రకటించారు .అన్ని ఫాంటుల కంటే కొత్త గా వచ్చిన ‘’మండలి ఫాంట్’’ చాలా బాగా ఉందని నిస్సంకోచం గా ఉపయోగించుకోవచ్చు నని , తాను దానినే అనుసరిస్తున్నానని చెప్పారు .’’వీవెన్ ‘’గారు తనకు ఇచ్చిన సలహాలు ఎంతో విలువైనవని కృతజ్ఞతలు తెలియ జేశారు .తాను వెన్నా అర్జున్ అభిమాని నన్నారు .మార్చి ఒకటి రెండు మూడు తేదీలలో విజయ వాడ ఘంటసాల సంగీత కాలేజిలో మూడవ ప్రపంచ తెలుగు రచయితల సభలు జరుగుతాయని అందరూ పాల్గొనాలని మూడవ రోజు ‘’సాంకేతిక విజ్ఞానం- తెలుగు’’ మీద సదస్సు ఉంటుందని తెలిపారు పూర్ణచంద్ .వెన్నా అర్జున్ అంటే ఉయ్యూరు లో మాతో పాటు పని చేసి చని పోయిన లెక్కల మేష్టారు వెన్నా రాజా రావు గారి అబ్బాయేమో నని నాకు అని పించింది .అతను దీనిలో బాగా ప్రావీన్యుడు అయ్యాడని మన సరసభారతి బ్లాగ్ ను రెగ్యులర్ గా చదువుతున్నాడని మండా బాలాజీ తో చెప్పినట్లు బాలాజీ నాతో ఇటీవల అన్నాడు అందుకే ఈ అనుమానం .

‘’ సందట్లో సడేమియా’’ గా నాకు ఇక్కడ ఒక ‘’ఫాన్ ‘’పరిచయమయ్యారు ఆయన పేరు సి.వి.రావు .మన బ్లాగులను రోజూ చదువుతానని బాగుంటాయని మంచి ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుందని ,దాదాపు రిఫెరెంస్ గా ఉంటాయని మెచ్చారు .చాలా ఆనందం వేసింది ఆయన వీకీ పీడియా  కు తొమ్మిదేళ్ళ నుండి సభ్యులట .అందులో తన ఆర్టికల్స్ ఉన్నాయట .నాకు దీని సంగతి తెలియక పోవటం ఆశ్చర్యం .నేను అందులో ఎందుకు మెంబర్ కాలేక పోయానో తెలియదు. ఇప్పుడు ఇదంతా చూస్తుంటే నేనూ మెంబర్ అయితే బాగుండేది అని పించింది . చేరాలి .అమీర్ అహ్మద్ దీని స్థాపన ,ప్రయోజనం, సేవలను వివరించారు .అర్జున రావు .పదేళ్ళ ప్రస్తానం లో ప్రముఖ పాత్ర పోషించారని అందరూ చెప్పుకొన్నారు .వాణిజ్య సంబంధం లేని మీడియా లలో తెలుగు వీకీ పీడియా అగ్రస్థానం లో నిలిచిందని ,అత్యధిక ప్రాధాన్యత కలిగిన వాటిలో అయిదవ స్థానం లో ఉందని ప్రకటించారు .ఇప్పటికి తెలుగు లో వివిధ అంశాల మీద 55,000వ్యాసాలూ అందులో చేరి ఎంతో ప్రాధాన్యతను సంతరించాయని అందరికి కర దీపికగా నిలుస్తోందని ‘’వీకీ’’ అంటే వేగవంతమైన అని ‘’పీడియా’’ అంటే విజ్ఞాన సర్వస్వం అని వివరించారు .

ఉదయం పదిన్నరకు సమోసాలు టీ లతో అల్పాహారం ఇచ్చారు .పది మంది వీకీ పీడియన్ లకు ఘన సత్కారం చేశారు .వారి సేవలు నిరుపమానమైనవని కీర్తించారు .అందులో వీవెన్ ,అర్జున రావుసుజాత, రెడ్డిగారు  మొదలైన వారున్నారు .వీరికి పది వేల రూపాయలు నగదు పారి తోషికం ఒక జ్ఞాపిక, వీకీ పీడియా తెల్ల టీ షర్ట్ కానుక గా తుర్ల పాటి వారి చేతుల మీదుగా అంద జేశారు .వేదిక మీది అతిధులకు జ్ఞాపిక, టీషర్ట్ లు బహూకరించారు .

‘’ పెద్ద బాల శిక్ష ‘’పుస్తకాన్ని అన్నివివరాలతో విశేషాలతో ఎప్పటి కప్పుడు ఆధునీకరిస్తూ ఇప్పటికి 18 సార్లు పునర్ముద్రించిన శ్రీ గాజుల సత్యనారాయణ గారికి ప్రత్యేకం గా సన్మానించారు .గాజుల వారు పుస్తకానికి’’ ఒక్క రూపాయి మాత్రమె ‘’లాభం గా తీసుకొని దీన్ని ముద్రించి ఎన్నో లక్షల మందికి ఉపయోగ పడేట్లు చేస్తున్నారని పూర్ణ చంద్ హర్షధ్వానాల మధ్య తెలియ జేశారు .గాజుల వారు రాసి ముద్రించిన ‘’తెలుగు వారి సంప్రదాయ వేడుకలు ‘’అనే 27రూపాయల చిన్న పుస్తకాన్ని అందరికి ఉచితం గా అందజేశారు .దాన్ని తిరగేస్తుంటే అందులో నాకు ఒక దోషం కనీ పించింది ‘’శంఖు స్థాపన ‘’అనే శీర్షిక కనీ పించింది .అది ‘’శంకు స్థాపన ‘’అని  ఉండాలని చెప్పాను ‘’నిజమే నండీ పొరబాటు జరిగింది ‘’అన్నారు .ఆయన న ఇటీవల ప్రచురించిన భారత దేశ దేవాలయాలు ‘’అనే పుస్తకాన్ని నేను బుక్ ఎక్సి  బిషన్ లో కొన్నాను .ఇంకా తెరిచి చూడలేదు .ఈ మధ్య చలపాక ప్రకాష్ గారు ఏదో విషయం మీద నాతో ఫోన్ చేసి మాట్లాడుతూ ‘’గాజుల సత్యనారాయణ గారి ఈ పుస్తకం లోమీ పేరు కూడా ఉదాహరించారు ‘’అని చెప్పారు ‘’పుస్తకం కొన్నాను కాని ఇంకా చూడలేదని ‘’చెప్పాను ఇవాళ గాజుల వారితో ఈ ప్రస్తావన తెచ్చాను .నేను ఆయనకు బాగా పరిచయమే .బాల సాహిత్య చక్ర వర్తి శ్రీ ముదునూరు వేంకటేశ్వర రావు గారికి సరసభారతి రెండేళ్ళ క్రితం సన్మానం చేసి నప్పుడు గాజుల వారినీ ఆహ్వానించాను .ఆయన స్వగ్రామం లో దసరా ఉత్సవాలలో ఉంటానని తీరిక దొరకదని ఇంకో సారి వస్తానని అన్నారు .ఇవన్నీ ఇప్పుడు గుర్తుకొచ్చాయి .

తుర్లపాటి వారు తాను రాసుకొన్న తన జీవిత చరిత్ర’’నా కలం నా గళం’’పుస్తకాన్ని  వీకీ పీడియా  లో పెట్టటానికి సకల హక్కులు రాసి దాఖలు పరచారు వేదిక మీద .ఇలా అయిన మొదటి పుస్తకం గా అది రికార్డు పొందిందని నిర్వాహకులు ప్రకటించారు .ఈ కాలేజి విద్యార్ధులు కంప్యూటర్ మేస్టర్ శ్రీ రమేష్ నాయకత్వం లో కే బి.యెన్ కాలేజి చరిత్ర అభి వృద్ధిని   ‘’QR code’’లో నిక్షిప్తం చేసి ప్రపంచం మొత్తం మీద దీన్ని వాడుక లోకి తెచ్చిన తోలి సంస్థా గత విద్యార్ధులుగా రికార్డ్ స్తాపించారు .ఏ విషయం ఎక్కడ ఉందొ సునాయాసం గా తెలుకోవటానికి ఈ కోడ్ ఉపయోగ పడుతుందట .తుర్లపాటి వారు దీన్ని ఓపెన్ చేశారు .ఇదొక ఘన విజయం .ఆ తర్వాత తుర్ల పాటి తన సహజ ధోరణిలో ఎప్పుడూ మాట్లాడే విషయాలనే 200/110 B.P.లో కూడా వాయిం చేశాడు .ఆ తర్వాతా అందరికి కింద భోజనాలు ఏర్పాటు చేశారు బఫే పధ్ధతి. స్వీటు, హాటు ,పప్పు, రెండు కూరలు సాంబారు పెరుగు అప్పడం తో భోజనం బానే ఉంది ఆప్యాయం గా వడ్డించారు .నాకు ఈ సభలో పాల్గొన్నందుకు సంతృప్తి గా ఉంది .ఉయ్యూరు లో వెంట్రాప్రగడ గణపతి గారి అబ్బాయి శ్రీమన్నారాయణ కాలేజి లో కనిపించి పలకరించి ఎండుకోచ్చారని అడిగితే విషయం చెప్పి నువ్వెండుకోచ్చావని అడిగా తన భార్య ఈ కాలేజీ లో లెక్చరర్ అని చెప్పాడు .

మధ్యాహ్న సదస్సు మూడున్నర దాకా మొదలవ్వా లేదు బోర్ కొట్టి బయటికి వచ్చేశాను ఈ కాలేజి కేమిస్త్రి లెక్చరర్ గారు నన్ను చూసి ఎక్కడిదాకా అని అడిగితే బస్ స్టాండ్ కు అనగా తన బందీ మీద అక్కడ దిగ బెట్టారు క్రుతజంత చెప్పాను పంచాంగం వారి అబ్బాయి శ్రీ వైష్ణవులు అని చెప్పారాయన కుర్రాడే .సంస్కారం అంటే అదీ .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -16-2-14-ఉయ్యూరు

Posted in సభలు సమావేశాలు | Tagged | 1 Comment

అనంత పద్మనాభుడి నుండి అరుణా చలేశ్వరుని దాకా -3

అనంత పద్మనాభుడి నుండి అరుణా చలేశ్వరుని దాకా -3

చిదంబరేశ్వర సందర్శనం

9-2-14-ఆదివారం చెన్నై ట్రెయిన్ లో పగలంతా ప్రయాణం .తిరుచ్చి మదురా తిరునల్వేలి వగైరా స్టేషన్ లు దాటి ప్రయాణం చేసింది రైలు .అక్కడ కులోత్తుంగ స్టేషన్ లో ప్లాట్ ఫాం పై వేస్తూన్న వేడి వేడి ఇడ్లీలు వడలు కొని తిన్నాం రుచికరం గా ఉన్నాయి .అంతకు ముందే నేను బ్రష్ చేసి సంధ్య ,పూజా పారాయణ చేశాను .కాఫీ త్రాగాం .ప్రదేశాలాలను  చూస్తూ కాలక్షేపం ,మా మనవడు సంకల్ప్ తంజావూర్ లో బి టెక్ ఫైనల్ లో ఉన్నాడు.ట్రిచి మీదుగా ట్రెయిన్ వెళ్తుందని ముందు మాకు తెలియదు .తెలిస్తే వాడికి ఫోన్ చేసి స్టేషన్ కు రమ్మనే వాళ్ళం.ట్రిచి స్టేషన్ దాటిన తర్వాత అని పించింది .సరే .సాయంత్రం నాలుగు పదికి విరుదా చలం జంక్షన్ చేరాం .

సామాన్లను మేమే దింపుకొని ,స్టేషన్ బయటికి వచ్చాం .అక్కడి నుండి బస్ మీద చిదంబరం వెళ్లాలని మొదట అనుకొన్నాం .కాని ఇక్కడి నుండి కారు మాట్లాడుకొని సరాసరి వెడితే రాత్రి దర్శనం కలుగుతుందని వెంటనే నిర్ణయించి పన్నెండు వందలకు కారు మాట్లాడుకొని చిదంబరం ఆరు గంటలకు చేరాం .మేము బుక్ చేసుకొన్న హోటల్ పేరు ‘’అక్షయ్ ‘’.సింగిల్ రూమ్ కు రెండు వేల రూపాయలు కట్టాం .నాలుగు బెడ్స్ .విశాలం గా బాగా నీట్  గా ఉంది .కాఫీ తెప్పించి తాగి స్నానాలు చేసేశాం .ఎడుమ్బావుకు నలభై రూపాయలిచ్చి చిదంబరం దేవాలయానికి చేరుకొన్నాం హోటల్ కు చాలా దగ్గరే సమయం చాలదని ఆటో లో వెళ్లాం .అప్పటికే ఎనిమిదయింది .సేవల కోసం ఇరవై నిమిషాలు దర్శనం ఆపేశారు .ఎనిమిదిన్నరకు దర్శనానికి అనుమతించారు .చాలా దూరం నుంచే దర్శనం .నటరాజ స్వామి సరిగ్గా కనీ పించలేదు .గర్భ గుడి అంతా చీకటి .నల్ల విగ్రహం .హారతి దీపం వెలుగు లో దర్శనం చేయాలి .నాకేమీ సంతృప్తి నివ్వలేదు ఇంతదూరం ఆశ పడి వచ్చి ఇదేమిటి అని పించింది. పూజారులు లోపలి బయటికి తిరుగుతూ విగ్రహానికి అడ్డం వస్తూ చిరాకు కల్గించారు .అప్పుడు నేను కేక లేశాను పూజారుల మీద .’’ఇంత దూరంఇంత డబ్బులు ఖర్చు పెట్టి మీ ప్రుస్టభాగాలను చూడ టానికి రాలేదు. మేము దేవుని ముఖం చూడ టానికే వచ్చాం తప్పుకొండి ‘’అనిఇంగ్లీష్ లో  అరిచాను .అప్పుడు పక్కకు తప్పుకున్నారు .అప్పుడు కొంచెం దర్శనం బాగా అయింది . డబ్బులు దొబ్బి లోపలి పంపిస్తున్నారని తర్వాతా తెలిసింది. కేరళలోఅనంత పద్మనాభుడి గుడిలో  దర్శనానికి నూట యాభై రూపాయల స్పెషల్ టికెట్లు తీసుకొన్నాం .దానితో బాటు వాళ్ళు పూజా సామగ్రి ఇచ్చారు .దర్శనం తర్వాతా ప్రసాదం పంచామృతం ఇచ్చారు .గురవాయూర్ లో దర్శనం ఫ్రీ .ఇక్కడ పది చేతిలో పెడితే స్వర్ణ మందిరం లోకి ప్రవేశం కల్పించి దర్శనం చేయిస్తున్నారు .ఈ విషయం దర్శనం తర్వాతే తెలిసింది .ఉదయం దర్శనం డబ్బులిచ్చి చేయాలను కొన్నామ్ .అక్కడే శ్రీ గోవింద రాజ స్వామి దర్శనం చేశాం

అమ్మ వారు శివ కామి దర్శనం కు వేళ అయిపొయింది. గుడి మూసేశారని చెప్పారు . దర్శనం తర్వాతా ఫోటోలు కొని హోటల్ కు నడిచి వెళ్లి అన్నం లేక పోతే ఇడ్లీ తిని రూమ్ కు నడిచి చేరాం .హాయిగా రూమ్ లో నిద్ర పోయాం .

10-2-14- సోమవారం తెల్ల వారు ఝామునే లేచి అన్నీ పూర్తీ చేసుకొని ఇరవై  ఏడు కిలో మీటర్ల దూరం లో ఉన్న ‘’వైదీశ్వరాలయం ‘’కు హోటల్ వాళ్ళ తో కారును తొమ్మిది వందల రూపాయలకు మాట్లాడుకొని ఆరు గంటలకే బయల్దేరాం .అక్కడ ఉన్న శివుడు సకల రోగ నివారకుడు .వైద్య నాద శివుడన్నమాట

. వైదీశ్వరుడు అంటారు .చాలా ప్రాచీన దేవాలయం .గొప్ప మహిమ గల శివుడు .అంగారక క్షేత్రం గా కూడా ప్రసిద్ధి .అంగారక దోషం ఉన్న వారు అంటే కుజ దోషం ఉన్న వారు ఈ శివుడిని అర్చిస్తే దోష హరం అవుతుంది .పతంజలి విగ్రహం అగస్త్య మహా ముని విగ్రహం ఉన్నాయి .పెళ్ళిళ్ళు జోరుగా ఆలయం లో జరుగుతున్నాయి .మహా సందడి గా ఉంది .ఇక్కడే శ్రీ రాముడు జటాయువుకు దహన సంస్కారాలు చేశాడు. అది గుడిలోనే ఉంది .దీన్ని జటాయు తీర్ధం అంటారు .ఇక్కడ కోనేరు ను ‘’అమృత పుష్కరిణి ‘’అంటారు ఈ జలం సర్వ రోగ నివారిణి .సీసాలతో పట్టుకొని ఇంటికి తెచ్చుకున్నాం .శిరస్సున అక్కడే చల్లు కొన్నాం .అమ్మవారు కాళీ మాత రూపం .ఇది నాడీ జ్యోతిషానికి పేరున్న కేంద్రం .అగస్త్యుడే నాడీ జ్యోతిష్యాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాడట .ప్రసాదాలు కొని ,తిని కారులో ఎనిమిదిన్నరకు హోటల్ అక్షయ్  కు చేరుకొన్నాం .వాళ్ళ షెడ్యూల్ లో ఈ రోజు మాకు బ్రేక్ ఫాస్ట్ ఉచితం .రెస్టారెంట్ కు వెళ్లి ఇడ్లీ, గారే, ఊతప్పం తిన్నాం వడలు మహా రుచిగా ఉన్నాయి .కారప్పొడి కమ్మగా  రుచిగా ఉంది .గారెలతో పొట్ట నిమ్పుకోన్నాం. ఎన్నైనా తినచ్చు లిమిట్ లేదు .కాఫీ త్రాగాం .సామాన్లు రూమ్ లో పడేశాం

సోమవారం శివ దర్శనం మహదానందం గా ఉంది .నడిచి నటరాజ స్వామి ఆలయానికి చేరుకొన్నాం .నలభై ఎకరాల ఆలయం ఇది అనేక ప్రాకారాలు శిలా స్తంభాలు నాట్య రీతులున్న శిల్పాలు అంతా కన్నుల పండువు గా దర్శించాలి .మనిషికి యాభై రూపాయలు చేతిలో పెట్టి నటరాజ స్వామిని దగ్గర గా చూశాం .తనివి తీరా చూడ గలిగాం ఆ భంగిమ చూసి తరించాం .నటరాజు గురించి వర్ణించి రాశాను కాని స్వయం గా చూడటం ఇదే ..చరితార్ధకమయింది నా  జన్మ .అక్కడి నుండి అమ్మవారు ‘’శివకామి’’ ఆలయానికి వెళ్లాం .అక్కడ పై కప్పు మీద  చక్కని వర్ణ చిత్రాలతో పార్వతీ కళ్యాణ ఘట్టాలు పులకింప జేశాయి .చిలక ముక్కు ఉన్న శుక మహర్షి చిత్రం మహాద్భుతంగా ఉంది .రాంబాబు ఫోటోలు తీయ బోతే కోప్పడి వెంటబడితే బయటికి పరుగెత్తుకొని పారిపోయాడు .నేను ఎవరి కంట పడకుండా ఫోటోలు నోక్కేశాను .నా జోలికి ఎవరూ రాలేదు .వాడు త్రివేండ్రం లో రవి వర్మ చిత్ర పటాలను ఫోటో తీస్తూ దొరికి పోయాడు .వాటిని అక్కడి మేనేజర్ కెమేరా లాక్కుని తొలగించింది కూడా .నేను తీశాను కానీ చిక్కలేదు .డబ్బు కట్టి ఫోటోలు తీసుకోవచ్చు ఎక్కడైనా .అన్నీ తిరిగి చూసి పన్నెండు గంటలకు నడిచి రూమ్ కు చేరుకొన్నాం .సామాన్లను తీసుకొని ఎదురుగా ఉండే బస్ స్టాండ్ కు చేరాం .మధ్యాహ్నం ఒకటి ఇరవైకి బయల్దేరే బస్ లో ఎక్కి మనిషికి డెబ్భై రూపాయల చార్జి తో తిరువన్నామలై బయల్దేరాం

తిరువన్నామలై

.సాయంత్రం అయిదున్నరకు తిరువన్నామలై చేరుకొన్నాం .బస్ స్టాండ్ దగ్గరే ఉన్న హోటల్’’ ఆకాష్ ‘’లో నాలుగు వందల యాభై  రూపాయల చొప్పున రెండు రూములు ఇదివరకే బుక్ చేసుకోన్నాం .వెళ్లి కాఫీ తెప్పించుకొని త్రాగి స్నానాలు చేసి అరుణాచలేశ్వర దర్శనానికి బయల్దేరాం .అరుణా చల శివ దర్శనం కండ్లారా పొంది అమ్మవారినీ దర్శించి ,ఇడ్లీ లను హోటల్ లో తిని రూమ్ కు వచ్చి హాయిగా నిద్ర పోయాం .ఇలాగ మాకు మాఘ మాసం పవిత్ర సోమ వారం నాడు వైదీశ్వర ,చిదంబరేశ్వర అరుణాచలేశ్వరశివ దర్శనం లభించింది అన్న మాట .చరితార్ధమైన రోజు గా ఈ రోజు మిగిలి పోయింది మాకు .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -15-2-14-ఉయ్యూరు

అనంత పద్మనాభుడి నుండి అరుణా చలేశ్వరుని దాకా -4(చివరి భాగం )

 

అనంత పద్మనాభుడి నుండి అరుణా చలేశ్వరుని దాకా -2

అనంత పద్మ నాభుడి నుండి అరుణాచలేశ్వరుని దాకా -1

Posted in అనంత పద్మ నాభుడి నుండి అరుణాచలేశ్వరుని దాకా, నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

అనంత పద్మనాభుడి నుండి అరుణా చలేశ్వరుని దాకా -2

  అనంత పద్మనాభుడి నుండి అరుణా చలేశ్వరుని దాకా -2

కన్యా కుమారి ట్రిప్

కన్యా కుమారి ఎక్స్ప్రెస్ ఫిబ్రవరి ఏడవ తేదీ శుక్రవారం ఉదయం తొమ్మిదిన్నరకు త్రివేండ్రం నుండి బయల్దేరి మధ్యాహ్నం పన్నెండుకు కన్యాకుమారి స్టేషన్ చేరింది

.అంతకు ముందే చంద్ర శేఖర్ మాకు అక్కడి నుండి తన బి.ఎస్.యెన్ ఎల్ .ఆఫీసు లో అక్కడ పని చేస్తున్న మణికంఠ రాజన్ అనే స్వంత టాక్సీ డ్రైవర్ ను ఏర్పాటు చేశాడు అతను స్టేషన్ కు వచ్చాడు సామాన్లను  కారు లో పెట్టి మమ్మల్ని శరవణ భవ హోటల్ కు తీసుకు వెళ్ళాడు అక్కడ నేను మా ఆవిడా రాం బాబూ భోజనం చేశాం .పొద్దుటి నుండి నాకెందుకో కొంచెం వామిటింగ్ సెన్సేషన్ ఉంది .తిన బుద్ధి కాకపోయినా ఏదో కతికాను. మల్లిక గారు ఇడ్లీ తిన్నారు .అక్కడి నుంచి సముద్రం దగ్గరకు తీసుకు వెళ్ళాడు సామాను కారు లోనే ఉంచి వివేకానంద రాక్ మెమోరియల్ కు టికెట్లు తీసుకొన్నాం.

మనిషికి ముప్ఫై రూపాయలు రాను పోను ఎక్కిన తర్వాతా లైఫ్ సేవింగ్ జాకెట్స్ వేసుకోన్నాం .ఎక్కడ బోట్  ఎక్కినా ఈ తతంగం తప్పదు .బాక్ వాటర్ డ్రైవ్ లోనూ త్రివేండ్రం లో ఇలాగే చేశాం .పది నిమిషాల్లో మెమోరియల్ చేరాం .అరేబియా సముద్రం బంగాళా ఖాతం  సముద్రాలూ ఇక్కడ కలిసి ఉండి నీలం ,రంగులోను ,కొంచెం తెల్లగా స్పష్టం గా కానీ పిస్తాయి .బోట్లోంచి బయటకు వచ్చి మెమోరియల్ చూశాం .మల్లికగారు రాంబాబూ తిరిగి చూసి వచ్చారు. మేము ఇదివరకు ఒక సారి చూశాం కనుక వెళ్ళలేదు .రాం బాబుకు ఇది మొదటి సారి  .మల్లిక గారు ఒక సారి చూశారు .అక్కడి నుండి మళ్ళీ బోట్లో తిరువల్లువార్ స్తూపం చేరాం .చాలా భారీ విగ్రహం .తమిళ నాడు ప్రభుత్వం కరుణా నిధి ఆధ్వర్యం లో ఏర్పాటు చేశాడు

.అపూర్వం గా ఉంటుంది .ఇందుకు కరుణానిధి ని అభినందించాలి తమిళ తోలి కవికి ఇచ్చిన అరుదైన గౌరవం .మన రాష్ట్ర ప్రభుత్వం ఏ కవికీ ఇలాంటి గౌరవం కల్పించక పోవటం దురదృష్టం. తిరువల్లువార్ సూక్తులను ‘’తిరుక్కురళ్ ‘’నుంచి ఏరి తమిళనాడు బస్సుల్లో రాయించి మరీ ప్రాచుర్యం కల్పిస్తున్నారు .

అక్కడి నుండి మేము కారు లో గాంధీ స్తూపం చేరాం .గాంధీగారి అస్థికలను ఇక్కడ ఉంచి సముద్రం లో కలిపారు .మంచి స్మారక భవనమే కట్టారు. లోపల రాట్నం వాడికే ఏర్పాట్లున్న రెండస్తుల భవనం ఇది .ఇక్కడే సునామీ మెమోరియల్ కూడా ఉంది .ఆది శంకరాచార్యుల గుడి కూడా ఉంది .అక్కడ నుంచి నడిచి సముద్రం వెంట కన్యాకుమారి అమ్మవారి దర్శనం చేశాం .నాలుగింటికి దర్శనం .పైన చొక్కా లేకుండా దర్శించాలి .అలానే చేశాం .శుక్ర వారం అమ్మ వారి దర్శనం పరమ పవిత్రం .సూర్యాస్తమయాన్ని చూడాలని కాచుకు కూచున్నాం .సరిగ్గా సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాలకు సూర్యాస్తమయాన్ని కళ్ళు ఆర్పకుండా తనివి తీరా చూశాం .ఇక్కడే హిందూ మహాసముద్రం బంగాళా ఖాతం అరేబియా సముద్రం మూడు సముద్రాలు కలుస్తాయి.’’త్రిసాగర సంగమం ‘’అన్న మాట . పూర్వం వచ్చినప్పుడు సూర్యోదయాన్ని మబ్బులు కమ్మటం వలన చూడ లేక నిరాశ చెందాం .ఇవాళ ఆ  అదృష్టం మాకు కలిగింది .అంతకు ముందు అరగంట క్రితం నేను ఒక్కడినే అక్కడ తిరుగుతూంటే పెద్ద వాంతి  అయి తిన్నది సగం వెళ్లి పోయింది .వాటర్ బాటిల్ కొని నోరు కడుక్కున్నాను .వీళ్ళకు చెబితే కంగారు పడుతారని చెప్పలేదు .ఇంకో పది నిమిషాలకు అస్తమయం అవుతుందనగా మళ్ళీ వీళ్ళ ఎదుటే పెద్ద వాంతి అయి అంతా ఖాళీ అయింది .అప్పుడు వీళ్ళు చూసి కంగారు పడ్డారు .నేను నిబ్బరం గానే ఉన్నాను .నోరు కడుక్కుని అస్తమయ సూర్యుడిని చూస్తూ ఫోటోలు తీస్తూనే ఉన్నాను .

కన్యాకుమారి లో పావు తక్కువ ఏడుకు బయల్దేరి పన్నెండు కిలో మీటర్ల దూరం లో ఉన్న సుచీన్ద్రానికి తీసుకెళ్ళాడు రాజన్ .అక్కడ గుడి మూసే సమయం అవుతోంది కంగారు గా లోపలి వెళ్లి త్రిమూర్త్యాత్మక శివుడిని దర్శించాం .అక్కడ నాకు వామిటింగ్ ఆవ బోతే బలవంతం గా ఆపుకోన్నాను .అక్కడే ఉన్న భారీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని సందర్శించాం . ఈ ప్రదేశం లోనే ఇంద్రుడు తన కు ఒళ్లంతా ఉన్న కళ్ళను శివుడిని అర్చించి పోగుట్టుకొన్నాడు .ఇంద్రుడు శుచి అయిన ప్రదేశం కనుక సుచీన్ద్రం అయింది. ఇక్కడే అనసూయా దేవి త్రిమూర్తులను పసి  పాపాలను చేసి ఆడించింది .మేము ఇదివరకు చూసిన దే.ఇక్కడి సరస్సు చాలా పెద్దది .

సుచీన్ద్రం నుండి నాగర్ కోయిల్ కు బయల్దేరుతుండగా మూడవ సారి పెద్ద వాంతి కారులో కూర్చున్డగానే అయింది .నోరు కడుక్కొని డైజిన్ టాబ్లెట్లు వాంతి నిరోధక మందులు రాం బాబు తో మెడికల్ షాప్ నుంచి తెప్పించి వేసుకోవటం మొదలు పెట్టాను .కొంత కంట్రోల్ అయింది .నాగర్ కోయిల్ చేరాం ‘’ నాగరాజ కోవెల’’ నాగర్ కోయిల్ గా మారింది .ఇది పెద్ద ఓడ రేవు .ఇక్కడి నాగ రాజ స్వామి ని తనివారా దర్శించాం .అక్కడి నుండి మణి  మమ్మల్ని నాగర్ కోయిల్ స్టేషన్ లో దిగ బెట్టాడు .అతనికి పన్నెండు వందల రూపాయలు ఇచ్చాం ఏ.సి.కారు ,సామానుకు భద్రతా చంద్ర శేఖర్ ఆఫీసు మనిషి .మంచి నమ్మకం ఉన్న వాడు .ట్రెయిన్ 6127గురవాయూర్ ఎక్స్ప్రెస్ లో S3 లో 17,18,19,20బెర్తులను చేరి పడుకోన్నాం .

గురవాయూర్

8-2-14- శనివారం ఉదయం ఆరు గంటలకు గురవాయూర్ స్టేషన్ చేరుకొన్నాం .అక్కడి నుండి ట్రాలీ లో లగేజ్ చేర్చి ప్రభావతిని కూడా దానిలో కూర్చో బెట్టి స్టేషన్ బయటికి వచ్చి ,ఆటో లో అరవై రూపాయలిచ్చి మేము బుక్ చేసుకొన్నా గోకుల్ రిసార్ట్స్ కు పది నిమిషాల్లో చేరాం .అప్పటికే ఆ హోటల్ వాళ్ళు రెండు సార్లు ఫోన్ చేశారు. ఒకే రూమ్ లో నాలుగు మంచాలున్న రూమ్ .పదమూడు వందల అరవై రెంటుకట్టాం .ముందుగా కాఫీ తెప్పించుకు తాగి స్నానాలకు ఉపక్రమించాం .అన్నీ పూర్తీ చేసి నా సంధ్య ,పూజా, పారాయణ పూర్తీ చేశాను .మిగిలిన వాళ్ళూ రెడీ అయ్యారు .అంతా ఆటోలో నలభై ఇచ్చి గురవాయూర్ దేవాలయం చేరాం .నేను కులశేఖర ఆల్వార్ అనే మహా రాజు కవి రాసిన ‘ముకుందమాల ‘’పుస్తకం వెంట తెచ్చుకొని వీలైనప్పుడల్లా చదువుతూ ఉన్నాను DSCN5218గురుఅవాయూర్ లో .లుంగీ ,పై పంచె తోనే దర్శనం .రూమ్ నుండి అలానే బయల్దేరాం .జనం బాగా ఉన్నారు .ఆడవాళ్ళకు ప్రత్యెక క్యూ ఉంది. వీల్లిద్దరిని అందులో నుంచో బెట్టి మేమిద్దరం వెనక ఉన్న క్యూ లో చేరాం. కెమెరా సెల్ అక్కడ క్లోక్ రూమ్ లో ఇచ్చే వచ్చాం .దాదాపు గంటన్నర పట్టింది గురవాయూరాప్ప దర్శనానికి .జీవితం ధన్య మైన దర్శనం ఇది .ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూసింది .విగ్రహం చిన్నదే DSCN5224 DSCN5227 DSCN5229అయినా మహా మహిమాన్వితమైనది .సాక్షాత్తూ శ్రీ కృష్ణుడే అందులో తనను తానూ ఆవిష్కరించుకొన్న విగ్రహం .శ్రీకృష్ణుని రూపం లో శ్రీ మహా విష్ణువు అర్చన జరగటం ఇక్కడి విశేషం .ద్వారక మునిగి పోయేటప్పుడు ఈ విగ్రహాన్ని తానాకు అత్యంత ఆప్తుడైన ఉద్ధవుడికి శ్రీకృష్ణుడు విగ్రహాన్ని ఇచ్చి అక్కడి నుండి వెళ్లి పోయి తగిన ప్రదేశం లో ప్రతిష్ట చేయమని ఆనతిచ్చాడు .ఆయన కు దేవాగురువు బృహస్పతి వాయుదేవుడు ,పరశు రాముడు కలిసి ప్రదేశాన్ కోసం వెతికి ఇక్కడికి అంటే మలబార్ తీరానికి వచ్చారు .శివుడు కూడా ఇక్కడే కృష్ణ విగ్రహాన్ని ప్రతిస్తిన్చామన్నాడు .అప్పుడు ఇక్కడ ప్రతిష్టించారు ..’’గురువు వాయువు ల ఊరు ‘’.కనుక ఇది ‘’గురవాయూర్ ‘’అయింది .పాతాలాన్జన శీల అనే ‘’యాంటి మని ‘’అనబడే అయస్కాంత శిలా విగ్రహం ఇది .అందుకే అంత శక్తి .దక్షిణ ద్వారక అంటారు గురవాయూర్ ను .ఎందరెందరో మహాను భావులు దర్శించిన దేవాలయం ఇది .తరించిన దివ్య క్షేత్రం ఇది .దర్శనం పూర్తీ అయిన తర్వాతా ఫోటోలు కొని ,తీసుకొని ఆటోలో రూమ్ చేరాం .తెచ్చుకున్న బిస్కట్లు పళ్ళు తిన్నాం భోజనం చేయలేదు కేరళ లో బాయిల్డ్ రైస్ తో అన్నం వండుతారు .మనం తిన లేము .కాసేపు విశ్రమించాం .మధ్యాహ్నం రెండు గంటలకు కారు లో బయల్దేరి శ్రీ ఆదిశంకరాచార్యుల జనంక్షేత్రం ‘’కాలడి గ్రామానికి’’ వెళ్ళటానికి హోటల్ వాళ్ళ తో కారు ను ఏర్పాటు చేసుకోన్నాం. రాను పోను నూట యాభై కిలో మీటర్లు .రెండు వేల రెండువందల రూపాయలు .

కాలడి లో ఆది శంకర జన్మ క్షేత్ర దర్శనం

సరిగ్గా రెండు గంటలకు ఏ.సి.ఇండికా కారు వచ్చింది .ఎక్కి కూర్చున్నాం .రోడ్డు మీద విపరీత మైన ట్రాఫిక్ మెలికల రోడ్లు పల్లె టూరి వాతావరణం .అందుకని గంటకు ఇరవై పాతిక కిలో మీటర్ల వేగమే .ఈ విషయం నెట్ ద్వారా ముందే తెలుసుకొన్నాం .DSCN5241 DSCN5242రాత్రి తొమ్మిదింటికి మేము మద్రాస్ ట్రెయిన్ ఎక్కాలి కూడా .దారిలో ఎక్కడ చూసినా పల్లెటూరి కేరళ దర్శనమే కలిగింది. ప్రశాంత వాతావరణం. ఇళ్ళల్లో కొబ్బరి చెట్లు వరి చేలు ఫల వృక్షాలు ముచ్చటగా ఉంది కాలడి చేరే దాకా మన కోన సీమ అందాలు కన్పించాయిక్కడ .పవిత్రత గోచరమైంది పులకించే ప్రకృతి ఆహ్లాదాన్ని చేకూర్చింది ఇదే తీరు మధ్యలో ఒక పెద్ద సిటీ ఉంది .కాలడికి అయిదింటికి చేరాం .అక్కడ శ్రీ శంకర భగవత్పాదుల జన్మ స్థలాన్ని వారి తల్లి గారైన ఆర్యాంబ ను దహనం చేసి న ప్రదేశాన్ని అక్కడే ఏర్పాటు చేసిన ఆమె స్మారకాన్ని ఆమె కోసం ఏర్పాటు చేసిన నిరంతరం వెలిగే జ్యోతిని దర్శించి సాష్టాంగ నమస్కారం చేసి పులకించి పోయాను .ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన క్షణం రానే వచ్చింది .నా జన్మ ధన్యమయింది

.నిరుడు ఫిబ్రవరి లో త్యాగరాజ స్వామి గారి తిరువయ్యార్ వెళ్లి త్యాగరాజ స్వామి నిర్యాణం చెందిన ప్రదేశాన్ని ఆయన వర్ధంతి నాడు పంచ రత్న కీర్తనలను గాయకులందరూ గానం చేసే  సంగీత సభ జరిగే ప్రదేశాన్ని చూసి తరించాం మేమిద్దరం మా మనవడు సంకల్ప్ .ఈ ఫిబ్రవరి లో శ్రీ శంకరుల దివ్య క్షేత్ర సందర్శనం .ఈ జీవితానికిది చాలు అని పించింది .అందరం ఏంతో  ఆనందించాం .దీన్ని శ్రీ శృంగేరి మఠం కట్టించింది .ఇక్కడ నేను అయిదు వందల రూపాయలు నిధి సమర్పించాను. మల్లిక గారూ అంతే .రాం బాబు వంద కట్టాడని జ్ఞాపకం .ప్రసాదం ఇరవై రూపాయలు కొన్నాం .

దీనికి దగ్గరే తల్లి ఆర్యాంబ కోసం శం

కరులు పూర్ణా నదిని మళ్లించిన ప్రదేశం ,తల్లికోసం నది ఒడ్డునశ్రీ  కృష్ణ విగ్రహాన్ని ప్రతిష్టించిన గుడిని చూశాం .గుడి మూసే ఉంది .పూర్ణా నది లో దిగి కాళ్ళు కడుక్కుని పవిత్ర జలాలను శిరసున చల్లుకోన్నాం .కాలడి మొదట్లో కంచి సంకర మఠం ఎనిమిది అంతస్తుల స్మృతి గోపురం ఉంది బయటి నుంచే చూశాం ఎక్కి అంతా తిరిగి చూచే ఏర్పాటు ఉంది శ్రీ శంకరుల జీవిత చరిత్ర అంతా అందులో చిత్ర రూపం లో దర్శించ వచ్చు పై అంతస్తునుంచి చూస్తె చాలా గొప్పగా ఉంటుందిట .శంకరులు నడిలోదిగి మొసలి పట్టుకొన్న ప్రదేశం ను ‘’క్రోకడైల్ ఘాట్ ‘’అంటారు అదీ చూడలేదు మేము .కట్టించిన అక్కడి నుండి బయల్దేరి రాత్రి ఎనిమిది గంటలకు గోకుల్ రిసార్ట్ కు చేరుకొన్నాం .టిఫిన్ తెప్పించుకొని పార్సెల్ చేస్యించుకొని ఆటో ఎక్కి స్టేషన్ చేరుకొన్నాం .రాత్రి 6128చెన్నై ట్రెయిన్ లో S4  లో 17,18,19,20 బెర్తులు చేరుకొన్నాం .రాత్రి తొమ్మిదిం బావుకు ట్రెయిన్ చెన్నై కి బయల్దేరింది .

కేరళ లో ఎక్కడా ప్లాస్టిక్ వాడకం లేదు .రోడ్లు స్టేషన్లు పరి శుభ్రం గా ఉన్నాయి .క్రమ శిక్షణ తో జనం ఉండటం చాలా ఆనందాన్ని కల్గించింది .రైలు స్టేషన్ ల లోనే కాదు రైలు పట్టాల మీదా ఫినాయిల్ చల్లటం ఇక్కడి ప్రత్యేకత .చెత్త ఎక్కడా కని  పించదు .మగపిల్లలు కాని ఆడపిల్లలు కాని ఎక్కడా అసభ్యం గా ప్రవర్తించటం చూడ లేదు అందరూ ప్రశాంతం గా ఉన్నట్లే కని  పించారు .ఈవ్ టీజింగ్ కని  పించలేదు .దేవాలయాలలో లంచాలు లేవు .అందరూ సమానమే .దేవాలయాల్లో దళారీలు కని  పించలేదు .దేవుని పై అచంచల విశ్వాసం కని  పించింది .భిక్ష గాళ్ళు కూడా ఎక్కడా కని  పించలేదు .ఎక్కడ చూసినా ప్రశాంత త గోచరించింది .మనసు ఆనంద పడింది .మర్యాదగా అందరూ ప్రవర్తించారు హోటల్ వాళ్ళూ చాలా ఆదరణా మర్యాదా చూపారు .ఇదొక అపూర్వమైన అనుభవం గా మిగిలి పోయింది. ఏంతో సంతృప్తి తో కేరళ ను వదిలి వెళ్ళాము .దీనికి బాధ్యులైన వారందరూ అభినంద  నీయులే .

స్తూలం గా పర్యటన విషయాలే రాస్తున్నాను .క్షేత్ర విశేషాలు వివరం గా తర్వాత రాస్తాను

చిదంబరం విశేషాలు తర్వాత తెలియ జేస్తాను

అనంత పద్మనాభుడి నుండి అరుణా చలేశ్వరుని దాకా -4(చివరి భాగం )

అనంత పద్మనాభుడి నుండి అరుణా చలేశ్వరుని దాకా -3

 

అనంత పద్మ నాభుడి నుండి అరుణాచలేశ్వరుని దాకా -1

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ – 15-2-14-ఉయ్యూరు

Posted in అనంత పద్మ నాభుడి నుండి అరుణాచలేశ్వరుని దాకా, నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

అనంత పద్మ నాభుడి నుండి అరుణాచలేశ్వరుని దాకా -1

అనంత పద్మ నాభుడి నుండి అరుణాచలేశ్వరుని దాకా -1

ఆలోచన

భారత దేశం లో దాదాపు అన్ని రాష్ట్రాలు తిరిగి చూశాము కాని కేరళా కాశ్మీర్ వెళ్లి చూడలేదనే బాధ నా మనసు లో ఉంది .కార్తీకమాసం లో పంచారామ సందర్శనం తర్వాతా ధనుర్మాస ప్రారంభం లో చిన్న తిరుపతి దర్శనం అయిన తర్వాతా ఈ కోరిక మరీ బలీయమైంది .మా శ్రీమతికూడా సరే నంది .మా కుటుంబ స్నేహితురాలు మాకు ప్రత్యక్ష ఆడపడుచు అని మేము భావించే సీతం రాజు మల్లికాంబ గారు కూడా మాతో వస్తానన్నారు. మా అన్నయ్య గారి అబ్బాయి రాం బాబు కూడా కలుస్తానన్నాడు .ఇవన్నీ పూర్తి అయేసరికి డిసెంబర్ చివరి వారం వచ్చేసింది .మా రెండో అబ్బాయి శర్మకు ఈ ప్లాన్ చెప్పి రైల్ టికెట్ల సంగతి చూడమన్నాం .వాడు వెంటనే చూశాడు .కేరళలో అనంత పద్మ నాభ స్వామిని గురవాయూర్ లో శ్రీ కృష్ణుని కాలడి లో శంకరాచార్య జన్మ స్థలాన్ని చూడాలనే మొదటి మా సంకల్పం .అటు నుండి మద్రాస్ వెళ్లి అక్కడి నుండి మళ్ళీ చిదంబరం అరుణాచలం  వెళ్లాలని ఆలోచన ఈ విషయాన్ని మద్రాస్ లో ఉన్న మా మేన కోడలి భర్త చంద్ర శేఖర్ కు చెప్పాం అతను దారిలోనే విరుదా చలం స్టేషన్ లో దిగి చిదంబరం ,అక్కడి నుండి అరుణాచలం వెళ్లి మద్రాస్ వస్తే సమయం త్రిప్పటా కలిసి వస్తుందని సలహా ఇచ్చాడు. బాగుందను కొన్నాం .

శర్మ ముందుగా బెజవాడ నుండి త్రివేండ్రం కు ,టికెట్ బుక్ చేసి ,అక్కడ ఒక రోజు మాత్రమె ఉండి మర్నాడు ఉదయం కన్యాకుమారి ,సుచీన్ద్రం నాగర్ కోయిల్ చూసి అక్కడ మళ్ళీ ట్రెయిన్ ఎక్కి గురవాయూర్ మర్నాడు ఉదయం చేరి స్వామి దర్శనం చేసి మధ్యాహ్నం నుండి కారు లో కాలడి వెళ్లి రాత్రికి ట్రెయిన్ ఎక్కి మద్రాస్ చేరేట్లు టికెట్ రిజర్వేషన్ చేయించాడు .త్రివేండ్రం లో ,గురవాయూర్ లో హోటల్ రూమ్స్ బుక్ చేశాడు. అంతా ఆన్ లైన్ లోనే .గురవాయూర్ నుండి రాత్రికి మద్రాస్ బయల్దేరే ట్రెయిన్ లో రిజర్వేషన్ చేయించాడు. దానిలో బయల్దేరి మర్నాడు సాయంత్రం విరుదాచలం లో దిగి ,అక్కడి నుండి చిదంబరం కార్ లో వెళ్ళేట్లు మాట్లాడాడు చంద్ర శేఖర్ .అతనే హోటల్ రూమ్స్ ఫోన్లో బుక్ చేశాడు .అక్కడినుండి వైదీశ్వరలయానికి కార్ లో వెళ్ళే ఏర్పాటు చేశాడు .చిదంబరం లో సాయంత్రం బయల్దేరి తిరువన్నామలై కు రాత్రి చేరి హోటల్ రూమ్ లో ఉండేట్లు రిజర్వ్ చేయించాడు .మర్నాడు ఉదయందర్శనం గిరి ప్రదక్షిణం చేసి రమణాశ్రమం చూసి మధ్యాహ్నం బస్ లో బయల్దేరి చెన్నై కి రాత్రికి చేరే ప్లాన్ చెప్పాడు చంద్ర శేఖర్ ఇది అందరికి నచ్చి దీన్ని బట్టి రిజర్వేషన్లన్నీ జరిపించారు శర్మా చంద్ర శేఖర్ కలిసి .

ఆచరణ

మాఘ మాసం లో కిందటి ఏడాది చంద్ర శేఖర్ కుమారుడి ఉపనయనానికి  మద్రాస్ వెళ్లి అతని సలహాతో కుంభకోణం తంజావూర్ ,పళని తిరువాయూర్ ,శ్రీ రంగం లను తిరుచ్చి  బేస్ చేసుకొని పర్యటిమ్చాం .ఇప్పుడు కూడా మాఘం లోనే మళ్ళీ ప్రయాణం .తమాషా అని పించింది .కేరళ లో మన భోజనం దొరకదు కనుక ఎలేక్ట్రిక్ కుకర్ తీసుకు వేల్దామనుకోన్నాం .కాని అను మతించరు హోటల్ లో అని చెప్పాడు చంద్ర శేఖర్. అందుకని ఆ ఆలోచన విరమించుకోన్నాం

.త్రివేండ్రం వెళ్ళే వరకు  రైల్ లో  తినటానికి ఏర్పాట్లు చేసుకోన్నాం .మా ఇంట్లో పూరీ కూరా నిలవ ఉండే గారెలు చేశాం మల్లికాంబ గారు పెరుగన్నం తెచ్చారు. రాం బాబు బిస్కెట్లు స్వీట్ హాట్ మంచినీరు ఏర్పాటు చేశాడు .కారం పొడి చింతకాయ పచ్చడి నిమ్మ కాయ ఊరగాయ అటుకులు తీసుకున్నాం .మనిషికి రెండే శాల్తీలు ఉండేట్లు అనుకొన్నాం .మా ఇద్దరి బట్టలు ఒక సూట్ కేస్ లో సర్దుకున్నాం .ఒక హాండ్ బాగ్ లో కావలసిన కొన్ని బట్టలు ,తయారు చేసినవి సర్దుకోన్నాం .అరటి ఆకులు కోసి తీసుకొన్నాం .ప్లాస్టిక్ గ్లాసులూ కాఫే కి ఫ్లాస్కు ,తీసుకొన్నాం దాదాపు తిండి కోసం ఏదీ కొనాల్సిన అవసరం లేకుండా చేశాం .కమలాలు ఆపిల్ పళ్ళు రాంబాబూ తో బాటు మేము కూడా ఎవరికి వారం తెచ్చుకోన్నాం .ఒక్క గురవాయూర్ లో తప్ప మిగిలిన చోట్ల సాయంత్ర దర్శనం ఉదయం దర్శనం అంటే రెండు సార్లు దర్శనం చేసేట్లు ఏర్పాట్లు చేసుకోన్నాం .

ఇదీ ప్లాన్

4-2-14మంగళ వారం రాత్రి పన్నెండు గంటలకు బ్రష్ చేసి స్నానాదికాలు పూర్తీ చేసి ,అందరూ మా ఇంటికి వచ్చారు .మేమూ రెడీ అయ్యాం . మా అబ్బాయి రమణ  రాము అని మాకు పరిచయం  అతనికి కారు కోసం చెప్పాడు .అతను కారు తీసుకొచ్చాడు 100_0618 - Copy - Copy (2)సామాను అంతా అందులో సర్దుకొని రాత్రి ఒంటి గంటకుబయల్దేరి బెజవాడ రైల్వే  స్టేషన్ కు చేరాం. ఏడవ నంబర్ ప్లాట్ ఫారం కు. త్రివేండ్రం ఎక్స్ప్రెస్ 22619ఎక్కి s3 లో 3,5,6,8బెర్తులు లోకి చేరాం. రాత్రి మూడు గంటలకు ట్రెయిన్ బయల్దేరింది .మమ్మల్ని ఎక్కించి రాము ఉయ్యూరు వెళ్ళాడు రాం బాబు శిష్యుడు ఒకతను కూడా తోడువచ్చాడు ట్రెయిన్ ఎక్కించటానికి. తొమ్మిది శాల్తీలు తో బయల్దేరాం ..నిద్ర పెద్దగా పట్టలేదు .ఉదయం లేచి మాతో తెచ్చుకొన్న కాఫీ త్రాగాం .తర్వాతా తెచ్చుకొన్న టిఫిన్ తిన్నాం. కాఫీ త్రాగాగానే నేను తెచ్చుకొన్న పుస్తకాల తో సంధ్యా వందనం పూజా పూర్తీ చేసి అరుణ పారాయణ మహా సౌర మంత్రం లను పూర్తీ చేసి టిఫిన్ తిన్నాను .మధాహ్నం పెరుగన్నం పళ్ళు తిన్నాం 100_0620 - Copy - Copy (2) 100_0622 - Copy - Copy (2) 100_0623 - Copy (3) 100_0624.సాయంత్రం గారెలు తిన్నాం. రాత్రికి పూరీ కూరా తిన్నాం .అయిదవ తేదీ అంతా ప్రయాణమే అయిదు బుధ వారం రాత్రిఒంటి గంటకు త్రివేండ్రం స్టేషన్ చేరుకొన్నాం .సామాను మేమే దింపుకొని ముప్ఫై రూపాయలిచ్చి మేము బుక్ చేసుకొన్న హోటల్ కు చేరాం. హోటల్ కు చాలా దగ్గర రోడ్డు దాటితే హోటలే .

చైత్రం లో మాఘం

ఆరవ తేదీ గురువారం – త్రివేండ్రం లో మేము బుక్ చేసుకొన్నా కేరళ ప్రభుత్వ హోటల్ పేరు ‘’చైత్రం ‘’.అంటే మేమిప్పుడు’’ చైత్రం లో మాఘ మాసం ‘’గడుపుతున్నామన్న మాట .రెండు రూములు బుక్ చేశాం .310,320.మదటి దాంట్లో ప్రభావతి మల్లికాంబ గార్లు రెండవ దానిలో నేనూ రాం బాబూ ఉన్నాం .నిద్ర ఎలాగూ పట్టదు కనుక మూడింటికే లేచి కాల కృత్యాలు పూర్తీ  చేసుకొని అప్పటికే ఒక సారి కాఫితాగాం నేను స్నానం తర్వాతా సంధ్య పూజ పారాయణ చేసి సిద్ధం గా ఉన్నాను 100_0631 - Copy (3) 100_0625 - Copy - Copy (2) 100_0626 - Copy - Copy (2) 100_0627 - Copy - Copy (2) 100_0630 - Copy (2).మిగిలిన వాళ్ళు కూడా రెడీ అయ్యారు .వెంట తెచ్చుకొన్న గారెలు బ్రేక్ ఫాస్ట్ గా తినేశాం .హోటల్ ప్రక్కనే కేరళ టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్ వాళ్ళ ఆఫీసు ఉంది .అక్కడికి వెళ్లి ఉదయం ఎనిమిదింటికి బయల్దేరే లోకల్ ట్రిప్ కు మనిషికి మూడు వందలు చెల్లించి బుక్ చేసుకోన్నాం .సాయంత్రం నాలుగున్నర ట్రిప్ కు రెండు వందల చొప్పున హార్బర్, కోవలం బీచ్ లకు బుక్ చేసుకోన్నాం .

ఎనిమిది గంటలకు ఏ.సి.మినీ వాన్ లో ఎక్కాం .మేము కాక ఇంకో దంపతులు మాత్రమె ఉన్నారు .మొదటగా శ్రీ అనంత పద్మ నాభ  స్వామి దేవాలయానికి తీసుకొని వెళ్ళారు .అక్కడ పాంటు చొక్కా కెమెరాలు ,సెల్ ఫోన్లు చెప్పులు క్లోక్ రూమ్ లో ఇచ్చి లుంగీ పై పంచ మాత్రమె వేసుకొని నేను రాం బాబు తయారయ్యాం 100_0632 - Copy - Copy (2) 100_0633 - Copy - Copy (2) 100_0634 100_0635 - Copy - Copy (2) 100_0636 - Copy - Copy (2) 100_0637 - Copy - Copy (2) 100_0638.ఆడవాళ్ళు చీర కట్టుకోవచ్చు చుడీదార్ దార్ నిషిద్ధం .లుంగీ లాంటి బట్టకట్టుకోవాలి .శ్రీ పద్మనాభ దర్శనం కనులారా చేసుకోన్నాం .బయటికి వచ్చి మళ్ళీ డ్రెస్ మార్చుకొని అక్కడే ఉన్న స్వాతి తిరుణాల్ మ్యూజియం చూశాం .అక్కడి నుంచిపద్మనాభ బీచ్ కు వెళ్లాం .అక్కడ ఒక అరగంట గడిపి కెనాల్ బాక్ వాటర్ డ్రైవ్ కు తీసుకు వెళ్ళాడు .అక్కడ మనిషికి వంద రూపాయలు ఇచ్చి స్పెషల్ బోట్ ఎక్కి ఒక గంట అందులో  ప్రయాణ సుఖం అను భావించాం .కెనాల్ ప్రక్కనే విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్ ఉంది. దాన్ని బోటు లోంచే చూశాం . తిరిగి వచ్చి ప్రక్కనే ఉన్న పార్కు చూసి మళ్ళీ కారులో జూ లో మమ్మల్ని వదిలేశారు .జూ అంతా నేను రాంబాబు మల్లికాంబ గారు తిరిగి చూశాం .ప్రభావతి ఒక చోట కూర్చుని ఉంది .జూలో లో పెద్ద జంతువులేవీ లేవు .పాములు నెమళ్ళు జింకలు జిరాఫీ లు కనీ పించాయి .ఎండి పడిపోయిన చెట్లను జంతు ముఖాలుగా చెక్కిన తీరు బాగుంది. ఫోటోలు తీశాం

.అక్కడి నుంచి బయటికి వచ్చి ‘’రాజా రవి వర్మ చిత్ర శాల’’ చూశాం జీవితం ధన్య మైనదని పించింది .కళ్ళు చెమర్చాయి .రవి వర్మ లేక పోతే మన పురాణ పురుషుల రూపాలేలా ఉండేవో మనకు తెలియదుకదా. ఆ పుణ్యం ఆయనదే .కొన్ని చిత్రాలను ఫోటోలు తీశాం

.కారు వాడు వెళ్లి పోయాడు .మేము ఆటో లో నలభై రూపాయలిచ్చి చైత్రానికి చేరుకొన్నాం .అక్కడే వాళ్ళ రెస్టారంట్ లో మసాలా దోసె తిని కాఫీ త్రాగాం .రూమ్ చేరి విశ్రాంతి తీసుకొన్నాం .మధ్యాహ్నం మూడింటికే లేచి తయారై ఆటోలో’’ అత్తకాల్ అమ్మ వారి’’ గుడికి వెళ్లాం .మూసి ఉంది .తిరిగి ఆటోలో రూమ్ చేరుకొన్నాం .నాలుగున్నరకు మినీ వాన్ లో హార్బర్ ,బీచ్ లకు ప్రయాణమయ్యాం మేము నలుగురమే ఎవరూ లేరు .ముందుగా హార్బర్ కు ఒక ముప్పావు గంట ప్రయాణం చేసి తీసుకొని వెళ్ళాడు .డీప్  వాటర్ ఫిషింగ్ ఇక్కడే జరుపుతారు .అది చూపించి ఇంకో అరగంట లో కోవలం బీచ్ కు తీసుకొని వెళ్ళాడు అక్కడ సముద్రాన్ని తనివి తీరా చూసి ఆనందించాం.అక్కడ బాదం చెట్లు విపరీతం .ఎర్రగా పండిన పళ్ళు రాలి పడి ఉన్నాయి .మా చిన్నతనం లో మేము చూసిన బాదం పళ్ళు కాయల్ని కొట్టి లోపలి పప్పు తిన్న అను భూతి జ్ఞాపకానికి వచ్చాయి ఆ కాలం లో బాదం ఆకుల తో విస్తళ్ళు కుట్టి అందులోనే భోజనాలు చేశే వాళ్ళం ..ముచ్చటేసింది .సాయంత్రం ఆరింటికి మమ్మల్ని అత్తుకాల్ భగవతి అమ్మ వారి గుడి దగ్గర దిమ్పమన్నాం. అలానే చేశాడు . అమ్మవారు’’ కన్నగి ‘’కి ప్రేరణ .కాళికా అమ్మ వారు .మధుర ను కన్నగి శపిస్తే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది అత్తకాల్ లో ఉంది కనుక ఆ పేరు .అది చూసు కొని ప్రసాదం తిన్నాం. చాలా దేదీప్యమానం గా ఉంది అమ్మ వారు ..తొమ్మిదవ తేదీ నుండి పది రోజులు ఉత్సవాలు ఏర్పాట్లు ముమ్మరం గా చేస్తున్నారు .ఆ రోజుల్లో నలభై లక్షల మంది సందర్శిస్తారు .నాలుగు కిలో మీటర్ల దూరం వరకు ప్రత్యెక మైన పొయ్యిల మీద పొంగళ్ళు వండి అమ్మ వారికి నైవేద్యం పెడతారట .రాత్రి త్రివేండ్రం లో ఈస్ట్ ఫోర్ట్ రోడ్ లో ఒక చేనేత వస్త్రాలయానికి వెళ్లి నేను కేరళ పంచె ,మా ఒదినకు చీర రాంబాబు వాళ్ళ అమ్మకు చీరలు ప్రభావతి రెండు చీరలు ,మల్లికాంబ గారు చీరలు కొని రూమ్ కు ఆటో లో చేరుకొన్నాం .

ఏడవ తేదీ శుక్ర వారం   తెల్లవారు ఝామున మూడుమ్బావుకే పద్మనాభ దేవాలయం తెరుస్తారు .అప్పటికే మేము లేచి అన్నీ పూర్తీ చేసుకొని నా సంధ్యా, పూజా ,పారాయణ అయిన తర్వాతా మూడుమ్ముప్పావుకు గుడికి చేరుకొన్నాం .స్వామి అభిషేకం కనులారా చూశాం .అమ్మవారినీ దర్శించి ,కాఫీ తాగి చైత్రానికి చేరాం .కాసేపు విశ్రాంతి తీసుకొని తొమ్మిదింటికి రూములు ఖాళీ చేసి దగ్గరే ఉన్న రైల్వే స్టేషను కు సామాన్లను మేమే తీసుకొని వెళ్లాం తొమ్మిదిం బావుకు 1638 కన్యా కుమారి ఎక్స్ప్రెస్ .అందులో s4లో  33,34,35,36,సీట్ల లో కూర్చున్నాం అది కన్యాకుమారికి మధ్యాహ్నం పన్నెండుకు చేరింది .మిగిలిన విషయాలు మరో సారి .ఇలా మాకు ‘’చైత్రం లో మాఘం ‘’గడిచింది .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -15-2-14-ఉయ్యూరు

 

అనంత పద్మనాభుడి నుండి అరుణా చలేశ్వరుని దాకా -4(చివరి భాగం )

 

అనంత పద్మనాభుడి నుండి అరుణా చలేశ్వరుని దాకా -3

 

అనంత పద్మనాభుడి నుండి అరుణా చలేశ్వరుని దాకా -2

 

 

 

Posted in అనంత పద్మ నాభుడి నుండి అరుణాచలేశ్వరుని దాకా, నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

హైదరాబాద్ పై సరోజినీ నాయుడు కవితలు

 

భారతదేశంలో ఏ మూలకు వెళ్లినా ఇద్దరు కవుల పేర్లు ప్రతి విద్యా వంతునికి తెలుసు. వారిలో ఒకరు రవీంద్రుడు. మరొకరు సరో జినీనాయుడు. ఇంగ్లీషు పాఠ్యాంశంలో భాగంగా ఆమె కవితను ఏదో ఒక తరగతిలో ప్రతి విద్యార్థి చదవడం అనివార్యం.

ఆధునిక భారతీయ ఆంగ్ల కవితకు హైదరాబాద్ నగరం వేదికన్నది ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు. కానీ భారతదేశంలో ఇప్పటికీ పేరిన్నిక గన్న సరోజినీ నాయుడు ఆధునిక ఆంగ్ల కవితా రచనకు హైదరాబాద్ జనజీవితమే ప్రాతిపదిక. సరిగా 130 ఏళ్ల క్రితం హైదరాబాద్ జనజీవితం మీద కవిత రాసినవారు లేరు. ఆనాటి హైదరాబాద్ సూఫీ సంస్కృతిని, తెలంగాణ జీవన రీతిని ప్రేమించిన గొప్ప సెక్యులర్ మానవతావాది సరోజిని. ఆ మాటకు వస్తే ఒక మహానగరపు జీవితాన్ని ఈ స్థాయిలో కవిత్వీకరించిన వారు ఆంగ్లంలో కూడా అరుదే.

హైదరాబాద్ చారిత్రిక కట్టడాలే కాదు అనేక రకాల కష్టజీవులపై కవిత కట్టిన రచయిత్రి ఆమె. ఒక హైదరాబాద్ బజార్స్ కవితలో ఆనాటి ఈ నగరపు సబ్బండ వర్ణాల జనజీవన రీతిని చిత్రిక పట్టిన జన కవయిత్రి. ఇంతేకాదు, ఆనాటి చేతివృత్తులవాళ్లు, గాజులమ్ముకునేవాళ్లు, బోయీ లు, విసుర్రాయి మీద పిండి పట్టే స్థానిక మహిళలు, ఫకీర్లు వాటిలో తారసపడతారు. ఈ స్థాయిలో జనజీవనాన్ని చిత్రించిన రచయిత ఇప్పటికీ ఆంగ్ల కవులలో లేరు. న్యూయార్క్ మీద కవిత రాసి న్యూయార్క్ పోయెమ్స్ పేరుతో సంకలనం వేసిన స్పానిష్ అమర కవి లోర్కా, ఇటీవలే మనల్ని వదిలిపోయిన దళిత మహాకవి నామ్‌దేవ్ ధసాల్ ఉన్నారు. ఆమె కవితా రచనకు, ఆమె కుటుంబానికి, హైదరాబాద్‌కు ఆధునిక తెలంగాణ సామాజిక, రాజకీయ, సాంస్కృతిక పరిణామాలకు బలీయమైన సంబంధమున్నది. హైదరాబాద్ స్థానిక సంస్కృతిపై, జనజీవనరీతిపై చర్చ జరుగుతున్న సందర్భమిది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 13న ఆమె జయంతి సందర్భంగా ఆమె కవితా రచనపై, వారి కుటుంబం చేసిన త్యాగాలపై ఒక పరిచయం.

ఆంగ్ల ప్రపంచాన్ని అబ్బురపరిచిన సరోజిని
ఆంగ్లంలో కవిత రాసి ఆ సాహిత్య ప్రపంచాన్ని అబ్బుర పరిచిన తొలి భారతీయ కవయిత్రి సరోజినీ నాయుడు. రవీంద్రుని గీతాంజలి కంటే ముందే తన కవిత రాసి పాశ్చాత్య సమాజాన్ని ప్రధానంగా ఆంగ్లో అమెరికన్ సమాజాన్ని మెప్పించిన ప్రతిభావంతురాలు, మహిళా మేధావి సరోజినీదేవి. ఆమె ప్రతిభకు అబ్బురపోయిన నిజాం ఆమెకు ప్రత్యేక పరిగణన కింద స్కాలర్‌షిప్పు మంజూరు చేశారు. 1893లో లండన్‌కు పయనమైన సరోజిని ఉన్నత చదువులకోసం కేంబ్రిడ్జ్‌లో చేరారు. అక్కడ ఆంగ్ల సాహితీ విమర్శకుడు, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం ఇంగ్లీషు ఆచార్యుడు ఎడ్మండ్ గూస్ ప్రోత్సాహం దొరికింది. తొలుత ఆమె ఇంగ్లీషు కవులను అనుసరించినా గూస్ సలహాతో ఆ ప్రయత్నాన్ని విరమించి భారతీయత ఉట్టిపడే కవితా రచనకు పూనుకున్నారు. 1905లో వెలువడిన మొదటి సంకలనానికి ముందుమాట రాసింది ఇంగ్లీషు సింబాలిస్టు, సర్రియలిస్టు కవి ఆర్థర్ హీనే. అదే రోజులలో మిస్టిక్ వర్స్ అనే ఆంగ్ల కవితా సంకలనంలో సరోజిని రాసిన ది లోటస్ కవిత చోటుచేసుకోవడంతో చిన్న వయస్సులోనే ఆమె ప్రశస్తి బాగా పెరిగింది.

మొదటి సంకలనమైన గోల్డెన్ థ్రెషోల్డ్ 1894-1905ల మధ్యలో సరోజిని వెలువరించిన కవితలతో ప్రచురితమైంది. విలియమ్ హీనమన్ అనే సంస్థ ప్రచురించింది. ఒకరకంగా భారతీయ నగర జీవితం మీద అందులో అనేకమంది కష్టజీవులపై ఆంగ్లంలో కవిత్వం రాసి అంతర్జాతీయం చేసిన కవయిత్రి ఆమె. మౌలికంగా కవయిత్రిగా బతికిన రచయిత్రి సరోజిని. 1893 నుంచి 1920 వరకు కవితా రచన చేశారు. పదమూడేళ్లకే ఆమె కవితా సంకలనం మెహిర్ మునీర్ అచ్చయింది. ఫార్సీ ప్రభావంతో రాసిన కవిత్వం అది. అటు తర్వాత గోల్డెన్ థ్రెశోల్డ్ (1905), ది బర్డ్ ఆఫ్ టైమ్ (1912), ది బ్రోకెన్ వింగ్ (1917) వెలువడ్డాయి. తర్వాత జాతీయోద్యమంలో తీరిక లేకుండా ఉండడంతో కవితా రచన వదిలేశారు. ఆమె ఆగమనం వరకు వలసవాదుల కవితకు అనుసరణగా మాత్రమే భారతీయ రచయితల ఆంగ్ల కవిత ఉండేది. దానిని దేశీకరించి ఇండియన్ ఇంగ్లీషు అనే భావనకు అంకురార్పణ చేసిన గొప్ప కవయిత్రి సరోజినీ నాయుడు.

సరోజినీ కవితకు సినారె అనువాదం
ఆమె పేరు రెండు వైద్య, విద్యాసంస్థలకు, ఒక రోడ్డుకు పెట్టినప్పటికీ ఆమె సాహిత్య కృషి తెలంగాణ, హైదరాబాద్ సాహిత్య, సాంస్కృతిక చైతన్యంలో భాగం కాలేకపోయింది. 1979లో శత జయంతి సందర్భంగా ఆమె కవితలలో మొత్తం 50 రచనలను ఎంపిక చేసి మహాకవి డాక్టర్ సి.నారాయణరెడ్డి ముత్యాల కోకిల పేరుతో తెలుగు చేసి పుస్తకం వేశారు. ఆమె ఆంగ్ల కవితలకు సరిధీటిగా తెలుగులోకి అనువదించినప్పటికీ ఆ పుస్తకం మరుగున పడిపోయింది. ఛందస్సుపై, హైదరాబాద్ దకనీ సంస్కృతి, దాని విలువల గురించి బాగా అవగాహన ఉన్న సినారె అనువాదం మూలప్రతి ప్రతిఫలించిన సరోజిని ఆత్మను పట్టుకోగలిగింది. ఆంగ్ల ఛందస్సులో ఆరితేరిన వ్యక్తి సరోజిని. ఆమె 20 ఏళ్లలోపే వెలువరించిన ఆంగ్ల కవిత అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడానికి ఇదొక కారణం కావచ్చు. ఆమె కవితా రచనకు సినారె అనువాదం ఒక గొప్ప నిరాజనం.

ఆంగ్లకవితకు జవసత్వాలు అద్దిన జనకవయిత్రి
మొత్తం భారతదేశంలో భారతీయ ఆంగ్ల కవితకు తొలి నిరేర్దశకులుగా కోల్‌కతాకు చెందిన డిరేజియో, మైకేల్ మధుసూదన్ దత్తు, తోరుదత్తు (మహిళా కవయిత్రి)లని భారతీయ ఆంగ్ల సాహిత్య చరిత్రకారులు చెబుతుంటారు. విచిత్రంగా డిరేజియోకు సమకాలంగా మహాత్మా ఫూలే భార్య, ప్లేగు రోగులను ఆదుకుంటూ అదే రోగం అంటుకుని మరణించిన మహనీయురాలు సాహిత్రీబాయి ఫూలే కూడా ఉన్నారు. నిజానికి తొలి భారతీయాంగ్ల కవులలో ఆమె కూడా ఒకరు. కానీ ఆమెకు ఆ ప్రశస్తి రాలేదు. వారి సమీప సమకాలికులలో హైదరాబాద్‌కు చెందిన సరోజినీనాయుడు, నిజామత్ జంగ్‌లు ఉన్నారు. గోల్డెన్ ట్రజరీ పేరుతో భారతీయ ఆంగ్ల కవితను సంకలించిన సీఫెల్ (ఇఫ్లూ) వైస్ ఛాన్స్‌లర్, కన్నడ సాహితీ రంగంలో ప్రముఖ రచయిత వీకే గోకక్ బెంగాలీ ఆంగ్ల కవుల తర్వాత సరోజినీనాయుడు, నిజామత్ జంగ్‌లకు విశేష ప్రాధాన్యం ఇచ్చారు.

ఈ నేపథ్యంలో భారతీయ ఆంగ్ల కవితారంగంలోకి అరుదెంచిన మహా కవయిత్రి సరోజినీదేవి. అప్పటి వరకు భారతీయ ఆంగ్ల కవితకు అంతగా ప్రశస్తి లేదు. గుర్తింపు కూడా అంతంత మాత్రమే. అప్పటి వరకు ప్రాథమిక దశలోనే ఉన్నది. డిరేజియో, మైకేల్ మధుసూదన్ దత్తు, తోరుదత్ సరోజిని కంటే ముందే ఆంగ్ల కవితా రచన చేసినవాళ్లే. భారతీయత తక్కువ. ఆంగ్ల కవితలో స్థానికతను, జాతీయతను, అంతర్జాతీయతను ప్రవేశపెట్టిన తొలి భారతీయ కవయిత్రి ఆమె. అటువంటి పరిస్థితులలో హైదరాబాద్‌లో పుట్టి అక్కడే ప్రాథమిక విద్య పూర్తి చేసిన భారతీయాంగ్ల కవితకు అంతర్జాతీయ ప్రతిష్ఠ, మన్నన సముపార్జించిపెట్టడం అసాధారణ విషయమే. ఆంగ్ల కవులుగా ప్రసిద్ధులైన రవీంద్రుడు, అరవింద్ ఘోష్ ఆమె తరువాతే ఆ కవితా రచన చేపట్టారు.

దేశవ్యాప్తంగా ఆమె కవితను చదవడం అనివార్యం
1870ల నుంచి 1980ల వరకు వారి కుటుంబం మొత్తం హైదరాబాద్, తెలంగాణ రాజకీయ, సాంఘిక సాంస్కృతిక, సాహిత్య వికాసానికి అంకితమై స్థానిక జనానికి అండగా నిలబడి అక్కడి సంస్కృతిలో సంలీనమైన కుటుంబం. 1940లో బెంగాల్‌లో ఒక మీటింగ్‌లో పాల్గొనడానికి వెళ్లినప్పుడు ఆమెను బెంగాలీ మహిళగా పిలుస్తారు. తనను అట్లా పిలువరాదని తనను తెలంగాణ మహిళగా పిలువాలని స్పష్టం చేశారు. భారతదేశంలో ఏ మూలకు వెళ్లినా ఇద్దరు కవుల పేర్లు ప్రతి విద్యావంతునికి తెలుసు. వారిలో ఒకరు జాతీయగీతం రచయిత రవీంద్రుడు. మరొకరు సరోజినీనాయుడు. ఇంగ్లీషు పాఠ్యాంశంలో భాగంగా ఆమె కవితను ఏదో ఒక తరగతిలో ప్రతి విద్యార్థి చదవడం అనివార్యం. గాంధీజీ, ఆజాద్, పటేల్ స్థాయిలో భారతదేశ జాతీయోద్యమానికి నాయకత్వం వహించిన సరోజిని హైదరాబాద్ ప్రజల మనిషి.

సరోజినీని తెలుసుకోవడమంటే హైదరాబాద్‌ను తెలుసుకోవడమే
హైదరాబాదే కాదు తెలంగాణ ఆధునిక చేతనలో భాగం కావల్సిన ఆమె కవితకు తగిన మన్నన లేకపోవడం శోచనీయం. మద్రాసు భారతి, కోల్‌కతా వాసులకు రవీంద్రుడు ఎటువంటివారో సరోజినీ హైదరాబాద్‌కు అంతే. ఇప్పుడిప్పుడే వారి కుటుంబం స్థానిక హైదరాబాదీలు, తెలంగాణవాసుల యాదిలోంచి కనుమరుగవుతున్న పరిస్థితి దాపురించింది. కాళోజి కవితను చదవడమంటే తెలంగాణను తెలుసుకోవడమే. సరోజినీ గురించి తెలుసుకోవడమంటే హైదరాబాద్ గురించి తెలుసుకోవడమే. తెలంగాణ ఎట్లాగు తమ చేజారిపోతుందన్న సీమాంధ్ర పాలకవర్గాలు హైదరాబాద్‌నైనా హస్తగతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్న సందర్భమిది. ఈ సందర్భంలో హైదరాబాద్ ఆధునిక చరిత్రకు అమ్మ లాంటి సరోజినీ దేవిని పదే పదే చదువుకోవడం, తలుచుకోవడమే అందుకు జవాబు.
-సామిడి జగన్‌రెడ్డి
94904 91551

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అవార్డులు తీసుకోవటం తన బాల హీనత అంటున్న కవి శివా రెడ్డి

 

ఆఫ్ ది రికార్డ్
కవులు ‘హీరో’లు కాకపోవచ్చు… కానీ వారిలో హీరోయిజానికి మించినదేదో ఉంటుంది.. సాహిత్యకారుడు ‘సెలబ్రిటీ’ స్టేటస్ పొందకపోవచ్చు.. కానీ వారిలో సెలబ్రిటీల్లో కనిపించని చరిష్మా ఏదో ఉంటుంది.. ఏ ఉత్ప్రేరకం వాళ్లని అలా తయారు చేస్తుందో ‘ఆఫ్ ద రికార్డ్’ మనకు తెలుపుతుంది.. ‘వివిధ’ పాఠకుల కోసం మొదటగా కె.శివారెడ్డితో ముఖాముఖి..

బాల్యంలో మీరేం కావాలని అనుకునేవారు? కవి కాకపోతే ఏమయ్యేవారు?
– కవిని కాకపోతే గొప్ప పాటగాన్ని అయ్యేవాన్ని. 11 ఏళ్లప్పుడే గాత్రం నేర్చుకోడానికి వెళ్లాను. ‘సభానంతర సభ’ల్లో నా పాటను అజంతా, మో, దేవిప్రియ, సిధారెడ్డి, స్మైల్, కొత్తపల్లి తదితరులు ఎంజాయ్ చేసేవాళ్లు.
నేను నిజానికి కథతో మొదలయ్యాను. డిగ్రీ సెకండియర్‌లో కాలేజ్ మ్యాగజైన్‌లో నాదొక కథ అచ్చయింది. సెకండియర్‌లో 24 పద్యాలు రాశాను. లలిత గీతాలు 200 దాకా రాసి ఉంటాను. తర్వాత వచన కవిత్వంలో పడ్డాను. కవిత్వం కోసమే హైదరాబాద్ వచ్చాను.

18 సంకలనాలు వేశారు కదా.. సంకలనాల్లో చేర్చని కవిత్వం ఇంకా ఎంత ఉంటుంది?
– పత్రికల్లో అచ్చయిన నాలుగు సంపుటాలంత కవిత్వాన్ని సంపుటాల్లో చేర్చలేదు. నాలుగైదు సంపుటాలంత కవిత్వం అచ్చుకు పంపనిది కూడా మిగిలిపోయింది. అదంతా భద్రంగా ఉంది. నాకు దేన్నీ పడేసే అలవాటు లేదు. చిన్న కవి పంపిన పుస్తకమైనా పడేయను. అలాగే నాకొచ్చిన ఉత్తరాలు కూడా భద్రంగా ఉన్నాయి.

మీరు చాలా విరివిగా కవిత్వం రాస్తున్నారు. అందువల్ల కవిత్వం పలుచబడడానికి, పునరుక్తికి అవకాశం ఉండదా?
– విస్తృతంగా రాయడం అనేది బహుశా ఆ కవి స్వభావానికి సంబంధించింది. అయితే విరివిగా రాసే కవి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే పైన చెప్పిన అంశాలు పరిహరించబడతాయి. విస్తృతంగా చదవడం వల్ల వస్తు వైవిధ్యం వల్ల క్రమక్రమంగా ఆంతరిక లోకాల్ని ఆవిష్కరించుకునే క్రమంలో ఉండటం వల్ల నన్ను నేను రీడిస్కవర్ చేసుకుంటూ పోవడం వల్ల వచ్చిన రీఇన్‌వెన్షన్ నన్ను రక్షించింది. ఒకవేళ ఒకే వస్తువు ఈ ఐదు దశాబ్దాల కాలంలో నా కవిత్వంలో దర్శనమిస్తే ఆయా నిర్దిష్ట స్థల కాలాల నుంచి దాన్ని బహుముఖంగా లోతుగా అందుకోవడం వల్ల మొనాటనీ కనిపించదు.

పైగా నాకు వస్తు నియమం లేదు. పొలిటికల్ కమిట్‌మెంట్ ఉంటుం ది. నిరంతర అన్వేషణ ఉండాలి వస్తువు విషయంలో. ప్రజా రాజకీయ నిబద్ధత నాకు చాలా విషయాలు బోధిస్తుంది. వస్తువు, ప్రయోగం విషయంలో వీటన్నిటికీ సంబంధించి ఎప్పటికప్పుడు నన్ను నేను అప్ టు డేట్ చేసుకోవడం చాలా మెలకువగా ఉండడం వల్ల కూడా పైన చెప్పినవి తప్పినవి.

మీ అంత విరివిగా కవిత్వం రాయడం అవసరమంటారా? ఇట్లా ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా?
– అవసరమే. ఒక బాడీ ఆఫ్ లిటరేచర్ ఉంటే తప్ప ఒక యాభై ఏండ్ల కాలంలో వచ్చిన మార్పుల్ని రికార్డు చేయడం సాధ్యం కాదు. నేను 20 పుస్తకాలే అచ్చేశాను. నెరూడ 50 కవితా సంపుటాలేశాడు. గ్రీకు కవి రిట్‌సాస్ 60 వేశాడు. ఎక్కువ రాసినా పల్చబడకుండా ఉండేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిందే. మనకు మాత్రం ఎక్కువ రాసినవాళ్లు లేరా! సినారె, సోసు, కుందుర్తి..
ఇంగ్లీషు కవిత్వం చదివేవారు ఆ భావాలను కాపీ కొడతారనే విమర్శ ఉంది? కొన్ని కవితలు చదివినప్పుడు ఇన్స్‌పైర్ కూడా అవుతాం కదా..
– ప్రపంచ వ్యాప్తంగా కవులందరూ ఒక రకంగా నన్ను ఇన్‌స్పైర్ చేశారు. ఈ మధ్య ఒక అఫ్ఘానిస్తానీ కవిత చదివి నేనొక కవిత రాశా. ఇక్కడి సందర్భాన్ని కవిత చేశా. ఆ విషయాన్ని ఉటంకించా. ఎక్కడ ఏ కవి నుంచి ప్రేరణ పొందినా ఎప్పుడూ దాయలేదు. ఇతర కవుల కవిత్వం రక్తనిష్ఠం కావాలి తప్ప అనుకరణ కాకూడదు.

కవిత్వం ఆవేశాత్మకం, వచనం ఆలోచనాత్మకం అంటారు. నిజమేనా?
– మనలో తప్పుడు అభిప్రాయాలు రుజువు చేయబడకుండా స్థిరపడ్డాయి. దాంట్లో ఇదొకటి. ఏం లేదు, కవిత్వంలో ఎమోషనల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. వచనంలో కాస్త తక్కువుంటుంది. అంతే తప్ప రెండు ప్రక్రియలు ఆలోచనాత్మకాలే. ఏ ప్రక్రియ చేసే పని ఆ ప్రక్రియ చేస్తుంది. పోటీ పెట్టడం అవివేకం. దేని అనుభవం దానిదే.
కవిత్వం మాత్రమే రాశారు. కథ ప్రయత్నించకపోవడానికి కారణం? రెండు ప్రక్రియల మీద దృష్టి పెడితే దెబ్బ తింటామనా?
– కవిత్వమ్ నాకు మహాంబోధి. అందులోనే మునిగిపోయాను. అందుకే ఇతర ప్రక్రియల జోలికి వెళ్లలేదు. ముందుమాటలు తప్ప. రాయకూడదనేం కాదు. కవిత్వానికే పరిమితమయ్యా.

నేను సవాలుగా తీసుకున్నదేమిటంటే దేన్నయినా కవిత్వంలోనే వ్యక్తీకరించాలని. కవిత్వం చేయాలని. అది నా స్వభావానికి సంబంధించినది.
రెండు మూడు ప్రక్రియల మీద దృష్టి పెట్టడం కన్నా సమస్త శక్తుల్ని ఒక ప్రక్రియ మీదే కేంద్రీకరించడం వల్ల ఒక నాణ్యత, ఒక పరిపక్వత సాధించవచ్చు అనుకున్నా.
మరి నవల రాసే ఉద్దేశమేమీ లేదా?
– ఎప్పటికైనా ఒక బృహత్ నవల రాయాలనే ఆకాంక్ష ఉంది.

మీరు విప్లవవాదా? విప్లవం అంటే మీ దృష్టిలో?
– విరసం సభ్యున్ని కాకపోయినా నేను విప్లవ కవినే.
కుల వర్గాల్ని ఆధిపత్యాల్ని నిర్మూలించి ఒక మహోన్నతమైన సమసమాజ స్థాపన.. దానికి సాయుధ విప్లవం మార్గం అనుకుంటున్నాం ఇప్పుడు. బహుశా అది నేను నమ్ముతున్నా. సమసమాజం వచ్చింతర్వాత కూడా పోరాట అవసరం ఉంటుంది. రాజ్యాధికారం కావాలనుకునే ఏ భావజాలపు సమూహాలకైనా తప్పకుండా ఒక బలమైన రాజకీయ కార్యాచరణ గలిగిన పార్టీ అవసరం.

విరసంలో ఎందుకు చేరలేదు?
– విరసం ఏర్పడేనాటికి శివారెడ్డి నేర్చుకునే దశలోనే ఉన్నాడు. ఇప్పటికి కూడా ఉన్నాడు. అప్పుడు చేరి ఉండాల్సింది. చేరకపోయినా దానితో గాఢ అనుబంధం నాలుగు దశాబ్దాలుగా ఉండడం వల్ల నన్ను విప్లవ కవిగానే పరిగణిస్తున్నారు. విరసం శివారెడ్డిని క్లెయిమ్ చేసుకుంది. నేను కూడా విరసాన్ని ఓన్ చేసుకున్నాను. అందుకనే విరసంతో పుట్టి పెరుగుతున్నవాన్ని అని చెబుతూ ఉంటాను.

అవార్డులు తీసుకుంటున్నారు కదా!
– కాలికి గజ్జె కట్టింతర్వాత ఎవడు కన్నుగొట్టినా ఒప్పుకోవాలంటారు. అటువంటిదేదో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తీసుకోవడానికి అంగీకరించినప్పుడే జరిగింది. ఈ చిన్న చిన్న లౌల్యాలకు దూరంగా ఉండటం మంచిదే. బహుశా నాలో ఇదొక బలహీనతేమో.
అస్తిత్వ వాదాలని రికార్డెడ్‌గా మీరు ఎక్కడా సపోర్ట్ చేసినట్లు కనిపించదు?
– వ్యతిరేకించినట్లు కూడా రికార్డు లేదు. వ్యతిరేకించలేదంటే అంగీకరించినట్లే కదా. అన్ని అస్తిత్వోద్యమాల నుంచి నేను చాలా నేర్చుకున్నాను. నా కవిత్వ విస్తృతికి అవి చాలా దోహదపడ్డాయి.
అంత పరోక్షంగా సపోర్ట్ చేయడమెందుకు? డైరెక్ట్‌గా చేయవచ్చు కదా?
– తాత్వికంగా మార్క్స్, లెనిన్, మావో ఆలోచనా విధానం నాది. అది నా గైడింగ్ ఫోర్స్, వ్యక్తిత్వానికి.. కవిత్వానికి. ఈ వెలుగులో నేనన్ని వాదాల్ని విశ్లేషించుకున్నాను. ఆయా వాదాల ప్రభావం నా కవిత్వంలో ప్రత్యక్షంగా చూడొచ్చు. ఇవన్నీ ఈ ఆలోచనా విధానంలో ఇముడుతాయనుకుంటాను. నేను అన్నింటికీ ఆరోగ్యకరమైన దూరాన్ని పాటించాను.

మీకు నచ్చని కవులు?
– ప్రజా వ్యతిరేక కవి ఎవడైనా నాకు నచ్చడు.
నచ్చని పుస్తకాలు?
– ‘తులసీదళం’ లాంటి పుస్తకాలు.
ఈ తరం కవులు మీ నుంచి నేర్చుకోకూడని అంశాలు?
– నేర్చుకోదగిన వాటికంటే నేర్చుకోతగనివి నాలో చాలా తక్కువ. ఒకటి- క్లాసికల్ లిటరేచర్ చదువుకోవడం వల్ల, పద్య సాధన వల్ల అబ్బిన సాంస్క్రిటైజ్‌డ్ డిక్షన్‌ని పూర్తిగా వదిలించుకోలేకపోవడం. రెండు- మోతాదుకు మించి లిరికల్ ఆటిట్యూడ్ ఉండడం.
కొత్తతరం కవులు విస్తృతంగా చదవడం లేదని విమర్శ ఉంది…
– మనం అనుకున్న పద్ధతిలో వాళ్లు చదవట్లేదేమో కాని అందినంత మేరా కొత్త సాహిత్యాన్ని కొత్త కవిత్వాన్ని చదువుతూనే ఉన్నారు. కాని ఈ సంక్లిష్ట సంక్షోభ సందర్భం ఇచ్చినటువంటి ఒక గొప్ప ఖిఞఠట వాళ్లకుంది. అదే తీవ్రతతో అదే తాజాదనంతో కొనసాగుతారా లేదా అన్నది పెద్ద ప్రశ్న. వాళ్ల అంకిత భావాన్ని బట్టి కొనసాగదల్చుకున్నవారు తప్పకుండా చదువుతారు.

ఇప్పటి కవుల్లో మీరు గమనించిన అవలక్షణాలు?
– 1. మీడియాకి బలైపోవడం. 2. ఉండాల్సినంత నమ్రత, అణకువ లేకపోవడం. దీన్నే అఖూౖఔఈ ఇంటలెక్చువల్ హ్యుమిలిటి అన్నాడు.
ఒక్క సంసారానికే కిందా మీదా పడుతుంటారు.. మీరు రెండు సంసారాలు నడుపుతూ కూడా విస్తృతంగా రాస్తున్నారు. ఏమిటి రహస్యం?
– పెద్ద రహస్యమేమీ లేదు. తెలుగులో సంభాళించుకోవడం అనే మాట ఉంది. బహుశా దాన్ని ఆచరణలో పెట్టాననుకుంటా. ఒక సంయమనంతో అన్నింటినీ బాలెన్స్ చేసుకునే దృష్టి కూడా దోహదం చేసిందనుకుంటా. ఈ గొప్పదనం నాది కాదు. వాళ్లదే. వాళ్లిద్దరు గానీ పిల్లలు గానీ నాకెప్పుడూ అవరోధాలు కాలేదు. ఉత్ప్రేరకాలు అయ్యారు తప్ప. నేను కవిగా బతికుండటానికి 80 శాతం వాళ్లే కారణం. ‘ప్రేమ నిచ్చిన ప్రేమ వచ్చును’ అనే రహస్యం నాకు తెలుసు.

మీరు మరో పెళ్లికి సిద్ధపడ్డానికి కారణం?
– మొదట నన్ను గాఢంగా ఆరాధించే వ్యక్తిని గమనించకపోవడం.. తర్వాత అలాంటి ఆ వ్యక్తిని వదులుకోలేక..
కవిత్వ సాధన మీలో ఏమైనా మార్పులు తెచ్చిందా?
– నా షార్ట్‌టెంపర్డ్‌నెస్ తగ్గించింది. అంటే నా వృత్తి ప్రవృత్తి ఒక రకంగా నన్ను శుద్ధి చేశాయి. దేంట్లోనూ అతి కాకుండా కాపాడాయి.
మీకు బాగా పేరు తెచ్చిన కవితల విషయంలో అసంపూర్ణతను ఏమైనా ఫీలయ్యారా?
– కవితలన్నీ అసంపూర్ణాలే. ఆ ఇన్‌కంప్లీట్‌నెస్ ఇంకో కవిత రావడానికి దోహదం చేస్తుంది.

మీరు ‘వేకువ’ అనే సాహిత్య పత్రిక నడిపారు కదా.. ఎందుకు ఆపేశారు?
– అందరికీ అదొక వేదికగా ఉండాలని ప్రారంభించాను. అయితే నా కవిత్వానికి వెచ్చించాల్సిన సమయాన్ని అది తినేయడం మొదలుపెట్టింది. నేను కవిత్వానికే అంకితం కాదలచుకున్నాను. అందుకే ‘భారతి’లో రాస్తున్న పుస్తక సమీక్షల్ని కూడా ఆపేశాను.
పేరు ప్రఖ్యాతులు పొందిన కవులకు చాలా ముఖాలు ఉంటాయంటారు. మీకు?
– ఇన్నేళ్ల సాధనా కార్యక్రమమంతా కూడా ఈ ముఖాల్ని తొలగించుకోవటంలోనే. వ్యక్తిగత వైరుధ్యాల్ని పరిష్కరించుకునే క్రమం గమనించకపోతే/తెలియకపోతే ముసుగు లవసరమౌతాయి.
మిమ్మల్ని బాధించిన సందర్భాలు, సంఘటనలు…
– దగ్గర మిత్రులనుకున్నవాళ్లు అమిత్రులవడం. అసూయ, ద్వేషాలు..
మీ సమూహంలోంచి వచ్చిన కవులు మిమ్మల్ని దాటి ముందుకెళ్ల లేదని ఒక విమర్శ..
– నా తర్వాత వచ్చిన రెండు మూడు తరాల్ని నాతో పోల్చి తూకం వేయకూడదు. బహుశా వాళ్లు క్రమ వికాసం చెందే దశలో ఉన్నారు. ఉత్తరోత్తరా వాళ్లు నన్ను అధిగమించవచ్చు. అధిగమించాలని కోరుకుంటున్నా.

మీ విషయంలో సభానంతర సభలు బాగా పండుతాయంటారు?
– సభానంతర సభలు బాగుండటానికి, హాయిగా ఉండటానికి అందరూ నగ్నంగా బైటికి రావడమే కారణం. సభానంతర సభలు ఎప్పుడూ కూడా సృజనాత్మక సన్నివేశాలే. కవిత్వం వింటం, చదవటం, డిక్టేట్ చేయడం, పాటలు పాడుకోడం.. ఇవన్నీ మనం బతికి ఉన్నామని చెబుతాయి, ఒక రకంగా.
-ఇంటర్వ్యూ : స్కైబాబ

కవిత్వంలో ఎమోషనల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. వచనంలో కాస్త తక్కువుంటుంది. అంతే తప్ప రెండు ప్రక్రియలు ఆలోచనాత్మకాలే. ఏ ప్రక్రియ చేసే పని ఆ ప్రక్రియ చేస్తుంది. పోటీ పెట్టడం అవివేకం. దేని అనుభవం దానిదే.
రెండు మూడు ప్రక్రియల మీద దృష్టి పెట్టడం కన్నా సమస్త శక్తుల్ని ఒక ప్రక్రియ మీదే కేంద్రీకరించడం వల్ల ఒక నాణ్యత, ఒక పరిపక్వత సాధించవచ్చు అనుకున్నా.
అస్తిత్వ వాదాలను వ్యతిరేకించినట్లు కూడా రికార్డు లేదు. వ్యతిరేకించ లేదంటే అంగీకరించినట్లే కదా. అన్ని అస్తిత్వోద్యమాల నుంచి నేను చాలా నేర్చుకున్నాను. నా కవిత్వ విస్తృతికి అవి చాలా దోహదపడ్డాయి.
 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అపరాధ భావన లేదు..బాధే ఉందిఅంటున్న నటి షకీలా

 

చాలా మందికి షకీలా ఒక శృంగార దేవత. ఆమెది ఒక్క సీను ఉన్నా చాలు సినిమా హిట్. ఒకప్పుడు హీరోయిన్ల కన్నా ఆమెకే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చేవారు. అలాంటి షకీలా గతమేమిటి? చిన్నప్పుడు సూళ్లూరుపేట దగ్గర కోటలో పెరిగిన ఆమె మలయాళం సినీ పరిశ్రమకు ఎలా వెళ్లింది? కోట్ల మంది పురుషుల కలలరాణి అయిన షకీలా జీవితంలో ఎప్పుడైనా సుఖపడిందా?- ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానంగా- షకీలా తన ఆత్మకథ రాసుకుంది. ‘నాలో అపరాధ భావన లేదు.. బాధే ఉంది’ అనే ట్యాగ్‌లైన్‌తో మలయాళంలో విడుదలయిన ఈ ఆత్మకథలోని కొన్ని భాగాలకు అనువాదమిది..

‘నేను ఆత్మకథను ఎందుకు రాయాలి? నా నుంచి ఎవరైనా నేర్చుకొనేది ఏదైనా ఉందా? నేను మదర్ థెరిస్సాను కాను. నేను పూర్తిగా ఒక కృత్రిమమైన జీవితాన్ని గడిపాను. నేను నటించిన చిత్రాలు కూడా కృత్రిమమైనవే. అలాంటప్పుడు నేను ఆత్మకథను ఎందుకు రాయాలి? మొదట్లో నాకు ఇలాంటి ఆలోచనలు ఉండేవి. అందుకే ఎవరైనా వచ్చి ఆత్మకథ రాయమంటే నేను ఒప్పుకొనే దాన్ని కాదు. నిరాకరించాను. కానీ ఆ తర్వాత నా మనసు మార్చుకున్నాను. నేను అందరిలాంటి ఆడపిల్లనే. సామాన్యంగా బతకాలనుకున్నాను. ప్రేమించాలనుకున్నాను. ఇతరుల చేత ప్రేమించబడాలనుకున్నాను. ఇవేమీ సాధ్యం కాలేదు. నా గురించి ఎవరికీ ఏమీ తెలియదు. నేను ఎలాంటి కష్టాలు పడ్డానో ఎవరికీ తెలియదు. నా పేరు శృంగార రసానికి ప్రతీకగా ఎందుకు మారిందో ఎవరికీ తెలియదు. షకీలాలు ఎలా పుడతారో, ఎలా రూపుదిద్దుకుంటారో అందరికీ తెలియాలనే ఇప్పుడీ ఆత్మకథ రాశాను.

శరీరాన్ని మాత్రమే
మలయాళీ కుర్రకారు శృంగార కలలకు నేను ప్రతిరూపమని ఒక సారి ఓ జర్నలిస్టు నాతో అన్నాడు. ఎవరికైనా ఆకలిగా ఉంటే వారికి అన్నం పెట్టాల్సిందే. అది తప్ప వేరే ఏదీ సంతోసాన్నివ్వదు. నా సినిమా నా శరీరాన్ని శృంగారభరితంగా చూపట్టడం తప్ప ఇంకేమీ చేయదు. నాలోని స్త్రీని, నాలోని నటిని ఎవరూ చూడరు. ఒక దశలో- సినిమా హీరోయిన్ల కన్నా నేను ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకొనేదాన్ని. ఒక లొకేషన్ నుంచి మరొక లొకేషన్‌కు విమానాల్లో తిరిగేదాన్ని. పగలనకా రాత్రనకా సినిమా షూటింగ్‌లలో పాల్గొనేదాన్ని. కొన్ని సార్లు- రోజుకు రెండు, మూడు గంటల నిద్ర కూడా దొరికేది కాదు. చాలాసార్లు బెడ్‌రూం సన్నివేశాల్లో నటిస్తూనే వళ్లు తెలియకుండా నిద్రపోయేదాన్ని. అలాంటి సన్నివేశాలను చూసి ప్రేక్షకులు నేను భావ ప్రాప్తి పొందుతున్నానని భావించేవారు. చాలా మంది దృష్టిలో నేను కామోద్దీపన కలిగించే ఒక శరీరాన్ని మాత్రమే. నాలో ఉన్న నటిని వెలికితీయటానికి ఎవ్వరూ ప్రయత్నించలేదు.

అమ్మే నాకు శాపం!
మా అమ్మకు సంబంధించి నాకు ఎటువంటి మంచి జ్ఞాపకాలు లేవు. ఆమె నన్ను ఎప్పుడూ ప్రేమగా చూడలేదు. ఆప్యాయంగా పలకరించలేదు. నా జీవితాన్ని నాశనం చేసింది మా అమ్మే. బహుశా మా అమ్మకు చిన్నప్పటి నుంచి నేనంటే ప్రేమ లేదు. అస్తమాను తిడుతూ ఉండేది. శాపనార్థాలు పెట్టేది. ఇలా నాకు పదహారేళ్లు వచ్చాయి. ఎప్పుడూ నన్ను తిట్టే అమ్మ ఒక రోజు నన్ను పొగిడింది. ఆ తర్వాత- నన్ను ఒక వ్యక్తి వచ్చి బయటకు తీసుకువెడతాడని చెప్పింది. అతను నన్ను ఒక డబ్బున్న వ్యక్తి దగ్గరకు తీసుకువెళ్తాడనీ.. అతనితో ‘మంచి’గా ఉంటే- మొత్తం కుటుంబ ఆర్థిక సమస్యలు తీరిపోతాయనీ చెప్పింది. అతను చెప్పినట్లు చేయాలని మరీమరీ చెప్పింది. నేను షాక్ తిన్నా. ఆమె మాటల వెనకున్న అర్థమేమిటో నాకు బోధపడింది.

కానీ నాకు వేరే ప్రత్యామ్నాయం లేదు. అమ్మ చెప్పినట్లే ఒక వ్యక్తి వచ్చి హోటల్‌కు తీసుకువెళ్లాడు. అక్కడ రూమ్‌లో ధనవంతుడని మా అమ్మ చెప్పిన వ్యక్తి ఉన్నాడు. అతనిని చూసి నేను బాధతో, భయంతో గడ్డకట్టుకుపోయా. ఆయన నన్ను రేప్ చేశాడు. ఇది ప్రారంభం మాత్రమే. ఆ తర్వాత అలాంటి ధనవంతులనేకమంది దగ్గరకు నేను వెళ్లాల్సి వచ్చింది. నాకు బాధ కలిగేది. అప్పుడప్పుడు కొంత తృప్తి కూడా కలిగేది. నేను నా కన్యాత్వాన్ని ఎప్పుడు కోల్పోయానో నాకే తెలియదు.

ఆల్కహాల్ తీసుకొనేటప్పుడు- పురుషుల కన్నా మహిళల కంపెనీనే నేను ఎక్కువగా కోరుకుంటాను. తాగిన తర్వాత పురుషులు తమ కామాన్ని వెల్లడిస్తారు. వారితో కలిసి తాగుతున్నానంటే వారి కోరికలు తీర్చటానికి నేను సిద్ధంగా ఉన్నాననుకుంటారు. అలాంటి వాళ్లను చూస్తే జాలేస్తుంది. వారి జీవితంలో భావ దారిద్య్రం ఎక్కువ. వారికి జీవితంలో సెక్స్ తప్ప వేరే భావన ఏదీ లేదా అనిపిస్తుంది. మహిళలతో అయితే ఎక్కువ స్వేచ్ఛ ఉంటుంది. వారిని కౌగిలించుకోవచ్చు. పట్టుకొని డ్యాన్స్ చేయచ్చు. వారు నా నుండి వేరే ఏం ఆశించరు కదా! ఈ పనులు పురుషులతో చేయలేను… సినిమాలో బెడ్‌రూం సీనుల్లో నటించేటప్పుడు- శృంగార భావనలు కలుగుతాయా అనే ప్రశ్నను చాలా మంది అడుగుతూ ఉంటారు. షూటింగ్ జరిగేటప్పుడు మొత్తం యూనిట్ అంతా ఉంటుంది. అందరూ చూస్తున్నప్పుడు సెక్స్ ప్రేరణలు ఎలా కలుగుతాయి? మహిళలకు సంబంధించినంత వరకూ శృంగారమనేది శరీరానికి సంబంధించినది మాత్రమే కాదు. మానసిక అనుబంధం లేకపోతే సెక్స్‌ను ఆనందించలేరు. నేను చిత్రాల్లో చేసేది కేవలం నటన మాత్రమే. నటిస్తున్నప్పుడు నాకెప్పుడూ సెక్స్ కోరికలు కలగలేదు.

దివాళాకోరు అక్క!
ఈ పుస్తకాన్ని మా పెద్దక్క నూర్జహాన్ చదవాలని నేను కోరుకుంటున్నా. ఆమే నేను దివాళా తీయటానికి ప్రధాన కారణం. ఒకప్పుడు దక్షిణ భారతదేశ చలనచిత్ర రంగంలో ఎక్కువ పారితోషికం తీసుకొన్న నటీమణిని నేనే. అయినా నా సంపాదనంతా మా అక్క దొంగిలించింది. ఆమే నా డబ్బు వ్యవహారాలన్నీ చూసేది. నేను తనని పూర్తిగా నమ్మాను. నా చిన్నప్పటి నుంచి తను నాతోనే ఉంది. ఎప్పుడూ తను అలా ప్రవర్తిస్తుందని నేను ఊహించలేదు. ఒక దశలో నేను ఈ సినిమాలతో విసిగిపోయాను. ఒక లొకేషన్ నుంచి మరొక లొకేషన్‌కు విమానాల్లో తిరగటం- కంటి మీద కునుకు లేకుండా షూటింగ్‌లు చేయటం నాకు విసుగనిపించాయి. నేను ఒక బ్రేక్ తీసుకుందామనుకున్నా. పెళ్లి చేసుకొని ప్రశాంతమైన జీవితాన్ని గడుపుదామనుకుంటున్నానని మా అమ్మతోను, నూర్జహాన్‌తోను చెప్పాను. వాళ్లిద్దరూ షాక్ తిన్నారు. నేనేదో పెద్ద నేరం చేస్తున్నట్లు చూశారు. నూర్జహాన్ అలాంటి తెలివితక్కువ నిర్ణయాలు తీసుకోవద్దని నచ్చచెప్పటం మొదలుపెట్టింది. వారు కేవలం నా డబ్బునే ప్రేమించారని, నా భవిష్యత్తు మీద వారికి ఎటువంటి ఆలోచన లేదని తేలింది. నాకు చాలా కోపం వచ్చింది. నేను సంపాదించిన డబ్బంతా ఇచ్చేయమన్నా. డబ్బంతా ఇంటికే ఖర్చు పెట్టేసానంది నూర్జహాన్. నాకు షాక్ తగిలినంత పనైంది.
(ఓపెన్ సౌజన్యంతో)

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అనంత శయనుడి నుంచి అరుణా చలే శ్వరుని దాకా

సాహితీ బంధువులకు శుభ కామనలు .ఫిబ్రవరి నాలుగు మంగళ వారం రాత్రి బయల్దేరి తిరువనంతపురం చేరి శ్రీ అనంత పద్మ నాభ స్వామిని దర్శించి ,అక్కడి నుండి కన్యా కుమారి లో అమ్మవారిని చూసి,వివేకానంద  రాక్ మెమోరియల్   ,శుచీంద్రం లో స్వామి దర్శనం చేసి ,నాగర్ కోయిల్ లో శ్రీ నాగ రాజ స్వామి దర్శనం పొంది ,అక్కడి నుండి గురవాయూర్ వెళ్లి శ్రీ కృష్ణ దర్శనం చేసి ,కాలడి లో శ్రీ శంకర భగవత్పాదుల జన్మ క్షేత్ర సందర్శనం తో చిరకాల లోరిక తీర్చుకొని ,,చిదంబరం వెళ్లి శ్రీ నటరాజ స్వామి దర్శనం తో పులకించి ,అక్కడే దగ్గరలో ఉన్న శ్రీ వై దీశ్వర మహా లింగాన్ని సందర్శించి ,అక్కడి నుండి తిరువన్నామలై చేరి శ్రీ అరుణా చలెశ్వర  అగ్ని లింగ దర్శనం పొంది ,చెన్నై కు పదకొండవ తేదీ రాత్రి మా మేనకోడలు ఛి సౌ కళా వాళ్ళింటికి చేరి,ఉదయం షాపింగ్ చేసి సాయంత్రం కపాలేశ్వర ,పార్ధ సారధి కొవెలలు దర్శించి ,మా బంధువు ,పెద్దలు శ్రీ నోరి రామ క్రిష్నయ్య దంపతులను వారింట్లో త్యాగ రాజ నగర్ లో చూసి ,మర్నాడు ఉదయం శ్రీ సాయిబాబా మందిరాన్నిఆన్నా నగర్ లో సందర్శించి ,రాత్రికి” తమిళ నాడు” ,లో బయల్దేరి ఇవాళ అంటే పద్నాలుగో తేదీశుక్రవారం  ఉదయం మూడున్నరకు విజయవాడ చేరి, ఉయ్యూరుకు కారు లో అయిదుగంటలకు చేరుకొన్నాం  .ఈ పది రోజులు మిమ్మల్ని అందుకే ”వలలో ”పడే య్యలెక పోయాను .యాత్రావిశేషాలను  త్వరలో మీ ముందు ఉంచుతాను .

    నేను మా శ్రీమతి ,మా అన్నయ్య గారి అబ్బాయిఛి  రాంబాబు ,మా కుటుంబ స్నేహితురాలు శ్రీమతి మల్లికాంబ -నలుగురం కలిసి వెళ్లి హాయిగా యాత్ర ను దిగ్విజయం గా చేసి వచ్చాం .దీనికి రూప కల్పనా ,రూట్ మాప్  హోటల్ రూం బుకింగ్ ,టికెట్ రిజెర్వేషన్ కారు బుకింగ్  ఫోన్ లో ఎప్పటి కప్పుడు పర్య వేక్షణా  చేస్తూ ,మాకు ఏ ఇబ్బందీ లేకుండా చూస్తూ   ప్రోత్సహించిన మా రెండో అబ్బాయి ఛి శర్మ ,మద్రాస్ లోని మా మేనకోడలు కళ  భర్త ఛి చంద్ర శేఖర్ ల తోడ్పాటుకు ఎంత చెప్పినా చాలదు అందుకే మా యాత్రను ”శర్మా చంద్ర శేఖర విజయం ”అన్నాను .–
            మీ -గబ్బిట  దుర్గా ప్రసాద్ -. 14-2-14-ఉయ్యూరు

 

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

ఉయ్యూరు వీరమ్మ ఊయ్యాలఉత్సవం – అశేష భక్త జన సందోహంతో కిక్కిర్సిన ఉయ్యూరు 

11vyr9 11vyr10 11vyr11 11vyr12 11vyr13 11vyr14 11vyr15

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఉయ్యూరు వీరమ్మ తిరునాళ్లు ప్రారంభం

వీరమ్మ చరిత్ర

ప్రసీద్ధి గాంచిన ఉయ్యూరు వీరమ్మ తిరునాళ్ళు మాఘమాసం భీష్మ ఏకాదశి నాడు ప్రతి సంవత్సరం ప్రారంభం అవుతాయి . సోమవారం రాత్రి వేలాది భక్తుల గండ దీపాలతో అమ్మవారు మెట్టినిల్లు నుండి బయిలు దేరి పుట్టినిల్లు కు వెళ్ళుతుంది. మెట్టినిల్లు నుండి బయిలుదేరిన వీరమ్మ పుట్టినిల్లు చేరడానికి సుమారు 24 గంటలపాటు గ్రామంలో గడపకు గడపకు వెళ్లి హారతులు అందుకుంటుంది.
వీరమ్మతిరునాళ్ళు మాఘమాసం భీష్మ ఏకాదశి నాడు ప్రారంభమై 15 రోజుల పాటు జరిగే ఈ క్రమంలో మెట్టినిల్లు నుండి బయిలుదేరే ముందు పోలీసులు పసుపు కుంకమలు సమర్పించిన అనంతరం గ్రామంలో గడప గడపకు వెళ్లి పసుపు కుంకమలు అందుకుంటుంది.
అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం ఉయ్యూరు పట్టణ పోలీసులు విర్మతల్లికి పసుపు కుంకమలు, నూతన వస్త్రాలు సమర్పిస్తారు. ఆ తరువాత ఆదిరాజు వంశస్తుల వద్ద అందుకొని వీధి వీధికి అమ్మవారిని తోడ్కొని వెళ్ళతారు భక్తులు.
జి వి రమణ
ఉయ్యూరు టైమ్స్ బ్లాగ్

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

స్టేట్ లీడర్ పక్ష పత్రికలో ఆచార్య పింగళి లక్ష్మీకాంతం కు సాహితీ నీరాజనం

2

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పి.జి ఉడ్ హౌస్ రచనలకు గబ్బిట కృష్ణమోహన్ అనుసృజన – లంకెబిందెలు , సరదాగా కాసేపు – పుస్తకావిష్కరణ – 24.01.2014 దృశ్యాలు

Photos of Book release function held on 24th January.
Krishna mohan_DSC0286
_DSC0297 _DSC0315 _DSC0316 _DSC0324 _DSC0329 _DSC0330 _DSC0331 _DSC0343 _DSC0346 _DSC0348

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

మొదటి తరం ఆసియామహిళా డాక్టర్- కాదంబినీ గంగూలి

మొదటి తరం ఆసియామహిళా డాక్టర్- కాదంబినీ గంగూలి

        బ్రిటిష్ ప్రభుత్వకాలం లో మొదటి తరం మహిళా పట్టభద్రురాలే కాక పాశ్చాత్య వైద్య శాస్త్రం లోశిక్షణ పొందిన  మొదటి తరం డాక్టర్ శ్రీమతి కాదంబినీ గంగూలీ .1861జులై 18న బీహార్ లోని భాగల్పూర్ లో బ్రహ్మ సమాజ మతస్తుడు వ్రజ కిషోర్ బాసుకు కుమార్తెగా జన్మించింది . తండ్రి హెడ్ మాస్టర్ గా పని చేసేవాడు . భాగల్పూర్ లో మహిళా విమోచనోద్యమాన్ని అభయ చరణ్ మాలిక్ తో కలిసి నడిపినవాడు .భారత దేశం లోనే మొదటి మహిళా సమాజాన్ని భాగల్ పూర్ లో1863 లోనే స్థాపించిన ఆదర్శ పురుషుడు .

   కాదంబిని ప్రాధమిక విద్య వంగ మహిళా విద్యాలయం లో ప్రారంభమైంది .1878 లో అక్కడ బెతూన్ స్కూల్ ఏర్పడింది ఈ స్కూల్ నుండి కలకత్తా విశ్వ విద్యాలయం లో ప్రవేశ పరీక్ష రాసిన తొలి మహిళ గా కాదంబినీ  గుర్తింపు పొందింది .ఆమె ప్రయత్న ఫలితం గా బెతూన్ కాలేజి  ఇంటర్ కోర్సును ,తర్వాత డిగ్రీ కోర్సును1883 ప్రారంభించటం విశేషం .బెతూన్ కాలేజి నుండి కాదంబినీ ,చంద్ర ముఖి బసు లు మొదటి సారిగా డిగ్రీ సాధించి రికార్డ్ నెలకొల్పారు .దీనితో బ్రిటిష్ ప్రభుత్వకాలం లో మొట్ట మొదట డిగ్రీ పొందిన భారతీయ మహిళలుగా   చరిత్ర  సృష్టించారు .

            కాదంబినీ కలకత్తా మెడికల్ కాలేజి లో చేరి మెడిసిన్ పూర్తి చేసింది .1886లో బెంగాల్ మెడికల్ కాలేజి డిగ్రీ ని పొందింది .ఈ ఘన విజయాన్ని అప్పుడు సాధించిన వారు ఇద్దరే ఇద్దరుమహిళలు . ఒకరు కాదంబినీ ,రెండవవారు ఆనంది గోపాల్ జోషి .పాశ్చాత్య వైద్య శాస్త్ర అభ్యాసానికి అనుమతి సాధించిన వీరిద్దరూ గర్వకారణమైనారు 1881లో అబలా బోస్ అనే ఆమె కూడా ప్రవేశ పరీక్ష పాస్ అయినా మెడికల్ కాలేజి లో ప్రవేశం లభించక పోవటం వలన మద్రాస్ వెళ్లి అక్కడ చేరినా మెడిసిన్ పూర్తి చేయలేక పోవటం విచారకరమైన విషయం . మొదట్లో ఉపాధ్యాయుల నుంచి, చాందస భావాల మనుష్యుల నుంచి కాదంబినికి అడ్డంకులేర్పడినా క్రమంగా ఆమె అచంచల విశ్వాసం దీక్షలతో అధిగమించి పురోగమించింది .1882లో ఇంగ్లాండ్ వెళ్లి అక్కడ  ఎడింబర్గ్ లో L.R.C P.ను ,గ్లాస్కో లో L.R.C.S..ను డబ్లిన్ నుండి  G.F.P.Sను సాధించింది .లేడి డబ్రిన్ ఆస్పత్రి లో కొద్దికాలం విద్యా సేవలందించి తర్వాతా స్వంతం గా ప్రాక్టిస్ మొదలు పెట్టింది .

               సంఘ సంస్కర్త ,స్త్రీ విముక్తి ఉద్యమ నాయకుడు బ్రహ్మ సమాజ అనుచరుడు అయిన ద్వారకా గంగూలీ ని కాదంబినీ 1883లో వివాహమాడింది .తూర్పు భారతంలోని బొగ్గుగని కార్మికుల జీవన పరిస్తితులు మెరుగు పరచటానికి ,మహిళా విముక్తి సాధనకు ఈ  దంపతులు చిరస్మరణీయ మైన సేవలు  చేసి గుర్తింపు పొందారు .1889 లో భారత జాతీయ కాంగ్రెస్ కు హాజరైన ఆరుగురు మహిళలో కాదంబిని ఒకరు .1908లో బెంగాల్ విభజన తర్వాత కలకత్తా లో కాదంబిని మహిళా సమావేశాన్ని నిర్వహించింది . దక్షిణాఫ్రికా లోని ట్రాన్స్ వాల్ కార్మికుల సమ్మెకు సాను భూతిగా కలకత్తాలో సత్యాగ్రహం జరిపింది . వారి సహాయం కోసం ధన సేకరణ చేసింది .ఎనిమిది పిల్లలకు తల్లి అయిన కాదంబినీ గంగూలీ కుటుంబ బాధ్యతలనూ అతి శ్రద్ధగా నిర్వహించేది .కుట్టుపని అల్లిక లలో ఆమె బహు నేర్పరి .అమెరికన్ చరిత్రకారుడు డేవిడ్ కోఫ్ ఈ దంపతుల అన్యోన్య ప్రేమ సేవాభావం అనితర సాధ్యమైనవి  అని రాశాడు అప్పుడున్న పరిస్తితులను అధిగమించి గంగూలీ దంపతులు సాధించిన విజయాలు అసామాన్యమైనవి .బెంగాలీ స్త్రీల విముక్తి సాధన లో వారిద్దరి కృషి నిరుపమానం .63ఏళ్ళ వయసులో 1923లో అక్టోబర్ మూడున కాదంబినీ గంగూలీ కను మూసింది .

                  –  గబ్బిట దుర్గా ప్రసాద్

 

Posted in రచనలు | Tagged | Leave a comment

ఆస్కార్ వైల్డ్ -2(చివరి భాగం )

       ఆస్కార్ వైల్డ్ -2(చివరి భాగం )

ఆస్కార్ వైల్డ్ కవిత్వపు అందాలు చూద్దాం .

1-The soul is born old but grows young .That is the comedy of life .the body is born young grows old .That is life’s tragedy .

2-All women become like their mothers .that is their tragedy .no man does .that is his .

3-He did not wear his azure coat .for blood and wine are blue .

4-that country’s a thing one should die for at need (వైల్డ్ తల్లి రాసింది )

5-the doctors found out that Bun bury could not live .So Bunbury died.

6-i would be drunk with life ,Drunk with the trampled vintage of my youth .

7-self possessed ,self centered and self comforted .To watch the world’s vain phantasm’stranslated y Tennyson

జాన్ రస్కిన్ గురించి రాస్తూ ‘’I learned nothing but what was good .there is you some thing of prophet ,of priest and of poet  and you the god’s gave eloquence such as they have given to none other ,so that your message might come for us with the fire of passion and the marvel of music ,making the deaf to hear and the blind to see ‘’.అన్నాడు వైల్డ్  అత్యంత వినయం గా ..

మహా కవి కీట్స్ సమాధి దగ్గర నేల మీద గడ్డిలో బోర్లా పడి  భక్తీ ప్రపత్తులు చూపిన కవితా పిపాసి . కీట్స్ పై అత్యంత భక్తీ ప్రపత్తులు ఉన్న వాడు  . కీట్స్ సమాధిని ‘’holiest place in Rome ‘’అన్నాడు .వైల్డ్ మహా మేధావి అయితే పోజు కొట్టటం అతని నైజం అన్నారు .

‘’there is nothing like youth .The middle aged are mortgaged to life ..the old one in life’s lumber rooms .youth is the lord of life .youth is the lord of life .youth have a kingdom waiting for it .’’అని యవ్వనాన్ని యువకులను మెచ్చాడు .

తన జీవితాన్ని గూర్చి చెబుతూ ‘’my whole life was but a school boy’s dream .To day my life begins ‘’అంటూ   నిండుగా నిగర్వం గా చెప్పాడు .అమెరికా ను కనుక్కున్నారు అనటం పొరబాటు .దాన్ని గుర్తించారు అంతే అన్నాడు .వాల్ట్ విట్మన్ అనే అమెరికా కవి గురించి ‘’this marvelous lord of rhythmic expression .’’.విట్మన్ వైల్డ్ ను ముద్దు పెట్టుకున్నప్పుడు స్పందించి ‘’the spirit who living blamelessly but dared to kiss the smitten

mouth of his own century ‘’అని పొంగి పోయి చెప్పాడు .అమెరికా దేశం దేవుడు అంటే సౌభాగ్యమే అని కితాబు ఇచ్చాడు .ఇంగ్లాడ్ దేశం కవి బతికి ఉన్నంత వరకు గుర్తించదు. చచ్చి పోయిన తర్వాత నెత్తికి ఎత్తు కొంటుంది అని చురక వేశాడు .లాంగ్  ఫెలో గురించి రాస్తూ ‘’Long fellow is himself a great poem .more beautiful than any thing he ever wrote .He is a great poet only for those who never read poetry .జీవితం అనే పుస్తకం తోటలో మొగ ఆడ లతో ప్రారంభం అవుతుందని అది బహిరంగమై ముగుస్తుంది  అన్నాడు  .’’the proper basis of marriage is a mutual misunderstanding ‘’ .

కళగురించి అద్భుతం గా చెప్పాడు ఆస్కార్ ‘’art takes life aspart of her rough material ,recreates it and re fashions it in fresh forms ..it is absolutely indifferent to fact invents ,imagines dreams and keeps between herself and reality ,the impenetrable barrier of beautiful style of decorative or radical treatment ‘’.

ఆస్కార్ వైల్డ్ చివరి రోజుల్లో పారిస్ లో అడుక్కుంటూ  బతికాడు .అక్కడ ఒక రోజు నెల్లి మేల్బా అనే ఆవిడ తారస పడితే ‘’I am going to ask you money ‘’అని నిస్సంకోచం గా అడిగాడు.అంతకు  ముందు చాలా కాలం క్రితం ఆమె తో ‘’I am the lord of language and you are the queen of song and so I suffice ,I shall have to write you a sonnet ‘’అన్నాడు.కాలంఎంత మార్చిందో చూడండి. ఓడలు బళ్ళు అయ్యాయి అంటే ఇదే నెమో ?.చావు  సమీపిస్తుంటే ‘’I did not know it was such a pain to die .I thought that life had taken  all  the agonies to itself .Every one is born a king and most people die in exile .-like most kings ‘’అని వేదాంత ధోరణి లో చెప్పాడు

ఆస్కార్ వైల్డ్ ఎప్పుడూ ఒక కద చెప్పే వాడట ./’’ఒక ఎడారిలో బోసి నోటి సింహం కన్పించింది .పాపం ‘’Androcles  అనే పళ్ళు కట్టే వాడు జాలి పడి దానికి ఎంతో నేర్పుగా బంగారు పళ్ళు స్వయం గా తయారు చేసి దాని నోటికి అమర్చాడు . .అతను క్రిస్టియన్ అవటం వలన రోమన్లు సర్కస్  కంపెనీ లో ఉన్న ఈ  సింహానికి ఆహారం గా వేశారు .ఆ సింహం అతడిని గుర్తు పట్టింది .అయ్యో నాకు సహాయం చేశాడు కదా కృతజ్ఞత చెప్పాలను కొన్నది .అతని పని తనానికి గొప్ప కానుక ఇవ్వాలను కొన్నది .రెండు గుటకల్లో వాడిని మింగేసి, తన పళ్ళ బలం ,లాఘవం వాడి  నేర్పరితనం యొక్క గొప్పతనం  చూపించింది ‘’.

ఇంత గొప్ప జీనియస్ గురించి సవివరం గా రాశాడు రచయిత .చదివి ఎంత సంతోషించానో మాటల్లో చెప్పలేను .ఈ అనుభవం మహా గొప్పది .జీవిత చరమ సంధ్యలో ఇబ్బందులు ,మచ్చలు  పడినా  అంటే ‘’స్కార్ ‘’ఏర్పడినా ‘’ఆస్కార్’’ ఇవాల్టి ‘’ఆస్కార్ అవార్డ్ ‘’తో సమానమైన వాడు .’’ఐరిష్ టవర్ ‘’అని పిస్తాడు .’’డర్బన్ దర్బాన్ ‘’.విమర్శక టార్జాన్ .విజ్ఞాన నిభాన్ .అందరి చేతా అభిమాన పురస్కారాలందుకొన్నా ,కొందరితో తిరస్కారాలు పొందినా ఎప్పటికీ , నిత్య యవ్వనుడే .సంజీవరెడ్డి మామూలుగా అనే మాటల్లో చెప్పాలంటే ‘’goody goody ‘’ యే వైల్డ్ ఆస్కార్  .’’లిటరరీ లార్డ్ అండ్ బోల్డ్ ‘’ఆస్కార్ వైల్డ్ .

సంపూర్ణం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-2-14-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నా దారి తీరు -73 చెరుకు రైతు గా నాఅనుభవం

నా  దారి తీరు -73

చెరుకు రైతు గా నాఅనుభవం

షుగర్ ఫాక్టరీ కింద చెరుకు వేయాలి అంటే ముందుగా సంబంధించిన చెరుకు మేస్త్రీ కి తెలియజేయాలి. వాళ్ళు అనుమతించిన తర్వాతనే పనులు మొదలెట్టాలి .మంచి విత్తనాన్ని వాళ్ళు సెలెక్ట్ చేసి చెబుతారు .దాన్నే ఉపయోగించాలి లేక పోతే రైతుకస్టాలు దేవుడికే ఎరుక .పర్మిట్ త్వరగా ఇవ్వరు సీజన్ చివర లో తోలాల్సి వస్తుంది .పైరు ఎంత బాగా పండినా సమయానికి నరికి ఫాక్టరికి తొలకపోతే దిగుబడి బాగా తగ్గి పోయి రైతుకు తగిన ప్రతి ఫలం రాదు. సబ్సిడీ ఇచ్చే విషయం లో కూడా తేడా ఉంటుంది .ఈ బాధలు పడలేక వాళ్ళు ఎంపిక చేసిన చెరుకు విత్తనాన్నే నాటుతారు రైతులు .ఉయ్యూరు అడుసుమిల్లి వారి కాలేజి కి వెనకాల చెరుకు పరిశోధనా సంస్థకు చెందినా క్షేత్రం ఉంది అక్కడ నాణ్యమైనచెరుకు విత్తనం అన్ని జాగ్రత్తలూ తీసుకొని పెంచుతారు .రేటు కూడా సరసం గా ఉంటుంది .మొదట్లో 07రకాన్ని ఎంపిక చేసి వేయించేది ఫాక్టరీ .గడ సన్నం గా ఉన్నా ఎత్తు బాగా పెరిగి విరిగి పోకుండాదృఢం గా ఉండి మంచి రసం ఇచ్చేది. రైతులకు ఈ విత్తనం కొంగు బంగారమే అయింది. చెరుకు వేసేవారేక్కువయ్యారు .ఏరియా పెరిగింది .అందుకని చెరుకు సాగు తగ్గించండి అని ఫాక్టరీ వాళ్ళు గోల చేశారు .ఖర్చులూ పెరిగి పోయి చెరుకు నరికే వాళ్ళు దొరక్క రైతులు చాలా ఇబ్బంది పడే వారు .లోకల్ గా నరికే వారు షెడ్యూల్ కులాల వాళ్ళే తప్ప మిగిలిన వారెవరూ ఆ పని చేసే వారు కాదు .ఒక వేళవాళ్ళు వచ్చినా ఎక్కువ రేటు అడిగే వారు .అందుకని కూలీల కోసం నల్ల గొండ జిల్లాకు వెళ్లి అక్కడి వారిని తక్కువ రేటు కు మాట్లాడుకొని ముందే అడ్వాన్సుఅద్వామ్సు లిచ్చి వారోచ్చిన తర్వాత  ఉండటానికి గుడిసెలు వేయించిఅప్పుడు  కొట్టించేవారు .ఒక్కో సారి వాళ్ళు రాక పోతే ఒకటి ఎందు సార్లు వాళ్ళ కోసం తిరిగి పిలిపించుకు రావాల్సి వచ్చేది .అక్కడా పంటలు బాగా పండే కాలం వస్తే డోరీ వారే కాదు .ఈ పనులన్నీ ఉయ్యూరులో చిన్నబ్బాయి  కాటూరు లో  అయితే సీతారామయ్య చూసేవాళ్ళు. నేనెక్కడికీ కదిలే వాడిని కాదు డబ్బు మాత్రం పెట్టు బడి పెట్టి పంపేవాడిని .వాళ్ళను మాట్లాడటం తీసుకురావటం వాళ్ళే చూసేవారు ఏర్పాట్లు కూడా వాళ్ళే బాద్య త గా చూశారు .

ఒకటి రెండు సార్లు నల్లగొండ కూలీలు ఎగ కొట్టారు .మా బాధ దేవుడికే ఎరుక .సమయం లో చెరుకు కొట్టక ఫాక్టరికి తొలక పోతే నెత్తిన చేతులే .అందుకని ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చేది .పుల్లేరు కాలువ జనవరి తర్వాత బిగిస్తారు .నీరు ఫాక్టరీ కే వదులుతారు .మరి రైతులకు కావాలంటే కాలువ మీద గుమాస్తా కో కళాసే దుర్గా రావు కో డబ్బు ముట్ట చెప్పితే రాత్రి ఎవరికీ తెలియ కుండా నీళ్ళు వదుల్తారు .ఇదంతా దొంగ చాటు వ్యవహారం .దీన్ని అందరూ పాటించేవాళ్ళు .బోరు ఉన్నవాళ్ళకు ఈ ఇబ్బంది ఉండదు .లేని వాళ్ళు ఉన్న వాళ్ళ దగ్గరా నీరు కొనుక్కోవాలి. అంటే ఎకరం తడిపితే రెండు వందలో మూడు వందలో బోరు యజమానికి ఇవ్వాలి .అదీ లెక్క .అలానే నేనూ తీస్సుకోనేవాడిని, ఇచ్చేవాడిని కూడా .

చెరుకు విత్తనం ఫాక్టరీ వాళ్ళు సప్లై చేయలేక పోతే మంచి విత్తనం వేసిన రైతుల దగ్గరే కోన మనే వారు .సెంటు విత్తనం ఇంత అని కొనుక్కో వాలి .ఆరు ఏడు నెలల విత్తనం లేత గా ఉండి నాట గానే మొలిచి బతుకు తుంది. నెలలు దాటితే అంత బాగా మోలిచేదీ కాదు దిగుబడి ఇచ్చేది కాదు .కొందరు రైతులు డబ్బు ముందు ఇస్తే తప్ప కొట్టనివ్వరు .కొందరు తెలిసిన వాళ్ళు అయితే కొలతలు అయిన తర్వాత ఇవ్వమని చెప్పేవారు .సాధారణం గా యాక మూరు లో చిన ఒగిరాలలో ,గారిక పర్రు లో కాలవ అవతల అవల్లభనేని వీర భద్ర రావు గారి చేలో ,లేక పోతే ఇప్పుడున్న ఆరి టి సి బస్ డిపో అంత వ్యవసాయ క్షేత్రమే అక్కడ కే సి పి డాక్టర్ నాగేశ్వర రావు గారు చెరుకు విత్తనం పెంచే వారు అక్కడో దొరికేది .ఒత్తుగా విత్తనం ఉంటె కొనే రైతుకు బాగా ఉంటుంది .పలచగా ఉంటె నష్టం .అది చూసి కొనాలి ఎకరానికి అయిదారు సెంటుల విత్తనం తొక్కే వారు .బాగా ఉంటె నాలుగు సెంట్లు చాలు .

చెరుకు విత్తనం 02అని కొత్తగా వచ్చింది ఇది చాలా లావుగా ఒత్తుగా పెరిగేది ఎకరానికి నలభై టన్నుల దిగు బడి నిచ్చేది .రైతుకు గొప్ప వరం గా అయింది. అందరూ అదే వేసేవారు .పిచ్చ డబ్బులోచ్చాయి .రైతులకు సబ్సిడీ బాగా ఇచ్చేవారు .బండీ కి రెండున్నర టన్నులు కట్టి తోలేవారు రెండెడ్ల  బండి మీద. దీనికీ టన్నుకు ఇంత అని తోలిన వాళ్ళకివ్వాలి .యెంత తోలిందీ ఫాక్టరీ లో చెరుకు మేస్త్రీలు వారి కింద గుమాస్తాలు జాగ్రత్త గా టికెట్లు ఆప్పగించేవారు బండీని ఫాక్టరీ లోని ట్రక్ లో పడేస్తే చెరుకు రైల్ పట్టాల మీద వాగన్లు నడిచి లోపలి వెడతాయి .వీటిని ట్రాక్టర్ తో తోయిస్తారు .అక్కడ కాటా ఉంటుంది .ఏ ట్రక్ ఎంత బరువు ఉంటుందో ముందే దాని నంబర్ బట్టి లెక్క ఉంటుంది .చెరుకు తో సహా బరువు చూసి దాన్ని తీసేసి నికర బరువు ను మన పేరున్న టికెట్ మీద ఎలెక్ట్రానిక్ పద్ధతిలో నోట్ చేస్తారు ఎన్ని టన్నుల ఎన్ని క్విన్తాల్లు న్నది దాని మీద ప్రింట్ అవుతుంది. మొదట్లో ఇదంతా చేతితోనే చేసేవారు ఇప్పుడంతా మెషీన్ మీదే జరుగు తోంది .వంద  క్వింటాళ్ళుఒక టన్ను .మన పేర ఉన్న టికెట్లను ట్రక్కు లు నడిచే ట్రక్ దగ్గర పందిరిలో ఉన్న గుమాస్తాలు తీస్సుకొని జాగ్రత్త చేసి తోలిన రైతు పేరు వెనక రాసి మనకు అడిగినప్పుడు ఇస్తారు .దీని వాళ్ళ ఎవరు యెంత తోలారో ,ఎన్ని బండ్లు తోలారో తెలుస్తుంది .ట్రాక్ మీద చెరుకు వేయగానే అందులో ‘’వాటర్ షూట్ ‘’లు ఉన్నాయేమో నని ఏరే వారుంటారు అది లేకుండానే రైతులు పొలం లోనే చెక్ చేసుకొని పంపుతారు అనుమానం వస్తే చాలా సార్లు తనిఖీ చేసి ఇబ్బంది పాలు చేస్తారు .ట్రాక్ మీద చెరుకు పడగానే కొందరు వచ్చి చెరుకు ఆకుతో కట్టిన కట్టలను ఎత్తి కట్టలు కొడవలితో కోస్తారు దీన్ని దవ్వ అంటారు .ఇది పశువులకు మంచి మేత .మా పాలేళ్ళు గొడ్లను ఫాక్టరీ దగ్గరకే తోలుకొని వెళ్లి దవ్వ ఏరి మేపెవారు వచ్చేటప్పుడు ఒక దవ్వ మోపు తెచ్చేవారు ఆరునెలలు ఇది పశుగ్రాసం .

తర్వాతా ఈ విత్తనానికి ‘’రెడ్ రాట్’’అనే యెర్ర కుళ్ళు తెగులు వచ్చేది దీన్ని పోగొట్టటానికి క్రిమి సంహారక మందులు వాడాల్సి వచ్చేది .వీటిని రైతులకు సబ్సిడీ మీద ఇచ్చేది ఫాక్టరీ .చెరుకు వేయాలంటే ఫాక్టరీ వాళ్లకు ఎగ్రిమెంట్ రాయాలి అవన్నీ పూర్తీ అయిన తర్వాతా ఎరువులు ఉచితం గా ఇస్తారు .ఎకరానికి కొంత దాబ్బు నగదు రూపం గా ఇచ్చేవారు .తర్వాత విధానం మారి ఎరువులు మాత్రమె ఇప్పుడు ఇస్తున్నారు .తర్వాతా అనేక రకాలైన విత్తనాలోచ్చాయి .06 ఆండీ రైతులకు బానే లాభాలు ఇచ్చింది .నీటి సప్ప్లై లేక పోవటం కరెంట్ సప్ప్లై సరిగ్గా లేక పోవటం ,వర్షాలు  సకాలం లో కురవక పోవటం కూలీల సమస్య ఫాక్టరీవాళ్ళ దురుసుతనం ,మేస్త్రీలకు డబ్బు ఇస్తే తప్ప పర్మిట్లు ఇవ్వక పోవటం  తో చెరుకు వేసే వాళ్ళే తగ్గి పోయారు .దిగు బడీ తగ్గి మానేస్తున్నారు .మా ఉయ్యూరు పొలం లో మూడేళ్ళ కు రెండేళ్ళు చెరుకు సాగు చేసే వాళ్ళం .అదే మా కుటుంబం ఆర్ధికం గా నిల బడటానికి కారణం అయింది .పెళ్ళిళ్ళు పేరంటాలు అన్నీ చెరుకు సాగు వల్లనే సాధ్యం అయ్యాయి. ఇది తిరుగు లేని నిజం .నేను రిటైర్ అయ్యేటప్పుడూ చెరుకు సాగు ఉంది .జీతం పూర్తిగా రాదు పెన్షన్ మీదే గడపాలి కనుక ఇది ఉపయోగ పడుతుందని అలా చేశాను .రెండేళ్ళు నిల దొక్కు కోవటానికి బాగా ఉపయోగ పడించి .చెరుకు మా ఇంటికి కల్ప వల్లి అయింది  ఎంత చెప్పినా తనివి తీరని బంధం అది .

సశేషం

మీ – గబ్బిట దుర్గా ప్రసాద్ -3-2-14-ఉయ్యూరు

 

Posted in నా దారి తీరు | Tagged | 1 Comment

జీవితాన్ని చదివాను అన్న కొలక లూరి ఇనాక్

కవి, కథకులు, నవలాకారులు, నాటక రచయిత, విమర్శకులు, వినూత్న పరిశోధకులు ఆచార్య కొలకలూరి ఇనాక్. సమాజంలోని అట్టడుగు వర్గంలోంచి ప్రభవించిన ఇనాక్ సమాజంలోని చీకటి కోణాల్ని తన రచనల ద్వారా బలంగా వ్యక్తీకరించారు. ఈ సాహితీ స్రష్టకు పద్మశ్రీ పురస్కారం లభించిన సందర్భంగా ‘వివిధ’ పాఠకుల కోసం ఆయనతో విపులమైన ఇంటర్వ్యూ..

ఇనాక్ గారూ! మీకు పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు అభినంద నలు. మీ సాహిత్యసేవకు తగినగౌరవం లభించిందని భావిస్తున్నారా?
– నా సాహిత్యానికి గాను పద్మశ్రీ లాంటి అవార్డు రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. నాకే కాదు, తెలుగు భాషకే గౌరవంగా భావిస్తున్నాను.
జాషువా, మీరు ఒకే జిల్లా నుంచి వచ్చారు. మీ మీద ఆయన ప్రభావం ఉందా? ఆయనతో మీ పరిచయం గురించి చెప్పండి?

– జాషువా పుణ్యాత్ముడు. మహానుభావుడు, మహాకవి. మా పల్లెల్లో ఆయనొక సజీవ చైతన్య దైవం. ఆయన్ని చూడటం, తాకటం గొప్ప అనుభవం. ఆయన నివసించే ఇంటిని చూడటం ఒక ఆరాధన. కవి అంటే మా జనంలో గొప్ప గౌరవం. జాషువాను చూసే నాలో కవి కావాలన్న బీజం పడింది. మా పల్లెల ప్రజలు ఆయన పట్ల చూపే భక్తి ప్రేరణ నన్ను రచయితను చేసింది. ఆయన సాహిత్యమంతా నా 18 ఏళ్లకు చదివేశాను. నేనేమయినా రాస్తే కరుణశ్రీ చూచేవారు. సవరించేవారు. ప్రోత్సహించేవారు.
నేను అప్పట్లో పద్యాలు రాసేవాణ్ణి. నా పద్యాలు చదివిన విజ్ఞులు జాషువా రచనలాగో, కరుణశ్రీ రచనలాగో ఉందనేవాళ్లు. అట్లా అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. నా పద్యాలు నావిగా ఉండాలి. ఆ ప్రభావాల నుంచి తప్పించుకోవటానికి పద్యం రాయటం మానేశాను. వచనం నన్ను ఆదరించింది. నా పద్యం నేను రాసినట్లే ఉంటుందని ఇప్పుడెవరైనా ‘ఆది ఆంధ్రుడు’ చదివితే గుర్తిస్తారు.

అంబేద్కరిజం తెలియని రోజుల్లోనే కులానికి వ్యతిరేకంగా రాశానని మీరొకచోట రాసుకున్నారు..
– మా తాతను మునసబు కొట్టి చంపాడు. అట్లా చంపి ఉండకూడదని నా పసి మనస్సు ఏడ్చింది. అది నా మొదటి కథ- ఉత్తరం. నాకప్పటికి 15 ఏళ్లు. నేనప్పటికి అంబేద్కరును ఎరగను. నా ఆకలి, నా అస్పృశ్యతా వ్యధ, నా చుట్టూ జీవితాలు చూచి దుఃఖంతో ఆక్రోశించటానికి నా సాహిత్యం అండయింది. నా సాంఘిక జీవితాన్ని, నన్ను పీడించిన సమాజ ధోరణిని గూర్చి రాశాను. నేను రాసింది పుస్తకాలు చదివి కాదు, సంఘాన్ని చదివి.
క్రైస్తవ నేపథ్యం నుంచి వచ్చిన మీరు తెలుగు సాహిత్యంలో ఎలా స్థిరపడ్డారు?

– క్రైస్తవులంటే ముఖ్యంగా మాలమాదిగలే కదా! వాళ్లు ప్రధానంగా ఉండేది- అప్పట్లో పల్లెల్లోనే. ఆ పల్లెలకు అప్పట్లో తెలుగు తప్ప సంస్కృతం, ఇంగ్లీషు అంతగా రావు. నేను పల్లె ప్రాణిని కాబట్టి తెలుగు ఇష్టమయింది.
అభ్యుదయ,విప్లవ సాహిత్యం ఉధృతంగా వస్తున్న రోజుల్లో ఆ ప్రభావంలో మీరు కొట్టుకుపోలేదు. స్వతంత్రమైన సాహితీ వ్యక్తిత్వంతోపాటు ప్రత్యామ్నాయ దృక్పథాన్ని మీ రచనల్లో వ్యక్తం చేస్తూ వచ్చారు? వర్గ కేంద్రమైన సాహిత్యం పట్ల మీరెందుకు ఆకర్షితులు కాలేదు?
– వర్గ కేంద్రమైన సాహిత్యం నాకిష్టమే. వర్ణ ప్రాంగణంలోని సాహిత్యం నన్ను బాధిస్తుంది. నా సాహిత్యంలో అభ్యుదయం విప్లవం – రెండు ధోరణులూ ఉంటాయి. వీటిపైన వీటికంటే ఎక్కువగా కులం నా గోల. నా గొడవ. దానీ పీడ నాకు వాస్తవం. ఆర్థికంగా పీడితులతోపాటు కుల, మత, వృత్తి పీడితులు నాకు సాహిత్యం ప్రసాదించారు. ఆర్థిక స్వావలంబన వచ్చినంత మాత్రాన జనం కులం ఉక్కు పంజరంలోంచి బయటపడలేరని నా తెలివిడి.
ప్రబంధ సాహిత్యం మీద మీరు చాలా చక్కటి విశ్లేషణలు చేశారు. వసుచరిత్ర రాసిన రామరాజభూషణుడు శూద్రకవి, శుభమూర్తి అని మీరు రాసిన చేసిన పరిశోధన అపురూపమైంది. విమర్శకులు ఆ గ్రంధాన్ని తిరస్కరించలేకపోయారు. అకడమిక్ రంగంలో ఆధిపత్య వర్గాలను ధిక్కరించి మీరు ఆ పరిశోధన చేశారు. అసలు ఆ రచన చేయాలని ఎందుకనిపించింది?

– పీడింపబడేవాడు నాకు తల్లి తండ్రి దైవం సోదరుడు బిడ్డ. శుభమూర్తి నాకు గురువు. నా గురువు బట్రాజుగా పిలవబడి, పీడింపబడి అవమానింపబడి, తృణీకరింపబడ్డాడు. సాహిత్య గురువు సాంఘికంగా సోదరుడు. ఆ మహాకవిని వసుచరిత్రను భక్తితో చదివాను. తెలుగు సాహిత్యంలో అది మహోత్కృష్ట ప్రబంధం. మహా కావ్యం. గొప్ప సాహిత్య సృష్టి. అంత గొప్ప రచన అవతరించటానికి అది పీడన నుంచి పుట్టటం శూద్రుడి గుండె నుంచి ప్రవహించటం కారణమని నాకు అనిపించింది. నేను దళితుణ్ణి పీడితుణ్ణి కావటాన శుభమూర్తి దుఃఖం నాకు వినిపించింది. ఆయన కన్నీటి తడి నా గుండెను తాకింది.
వసుచరిత్ర స్రష్ట పేరు శుభామూర్తి భట్టుమూర్తి అని కులం పేరుతో రామరాజభూషణుడని చేరదీసిన రాజు పేరుదో పిలిచారు. నా పేరు శుభమూర్తి అని ఆయన కంఠోక్తిగా చెప్పుకొన్నా ఇప్పటికీ ఎవరూ అలా పిలవటం లేదు, తలవటం లేదు. ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని పండితులు ఒక దృష్టి నుంచే చూస్తున్నారు. ఇంకో దృష్టి నుంచి చూడవచ్చునని నా అభిప్రాయం. అదే వసుచరిత్ర వైశిష్ట్యం.

మీ ‘ఆది ఆంధ్రుడు’ కావ్యానికి రాసిన ముందుమాటలో అమరావతీ స్తూపానికి పూర్ణకళశం బహుమతిగా ఇచ్చిన ఒక మాదిగ గురించి వివరంగా తెలిపారు. మీరు సమాజాన్ని, కావ్యవస్తువునీ ఒక చారిత్రక దృక్పథం నుంచి చూస్తుంటారు. ముఖ్యంగా ఈ దేశాన్ని నిర్మించిన ఈ దళితుల చరిత్రను, ఆర్యుల దురాక్రమణను ప్రస్తావిస్తూ వుంటారు. ఇది మీ మెథడాలజీ కదా! ఈ చారిత్రక దృక్పథం మీకెలా ఏర్పడింది.
– నేను సాహిత్యాన్ని సామాజిక నేపథ్యం నుంచి చూస్తాను. రాస్తాను. సంఘాన్ని సాహిత్యంలో ప్రతిబింబింపచేయాలని ఇష్టపడతాను. సాహిత్యం సంఘానికి దశ దిశ నిర్దేశం చేయాలని ఆలోచిస్తాను. ఆలోచన కార్యరూపం దాల్చటానికి, చర్యోన్ముఖం కావటానికి ఇష్టపడతాను. ఈ ఉన్నతి; స్వేచ్ఛ, స్వాతంత్య్రం సమానత్వం అన్న ప్రజాస్వామిక విలువలతో కలిసి ఉండాలని వాంఛిస్తాను; ఈ వాంఛ పరిపూర్ణమయితే రేపటి సమాజపు అస్తిత్వం అవగతమవుతుంది. ఇది భవిష్యద్దృష్టి. ఈ సమాజం వర్తమానంలో ఇలా ఉందంటే ఎటువంటి గతాన్ని వారసత్వంగా ఇవ్వగలిగిందో గుర్తిస్తాము. అటువంటి గతాన్ని వెదుకుతూ పోవటం నాకు అనివార్యం. అట్లాంటి అన్వేషణలో కనిపించినవాడు భుజంగరాయుడు. వాసిరెడ్డి వెంకటాద్రినాయుడి చేత అంటరానితనం నిర్మూలన శాసనం వేయించిన కార్యదక్షుడు. దళితుడు. దళితుల ప్రాచీనతా శైవభం నాకు ఆరాధ్యం. ఎందుకు స్మశానాలు తవ్వుకోవటమంటే ఆ ఎముకలు చెప్పే ఔన్నత్యం తెలుసుకోవటానికి. తెలుసుకొని ఏం చేస్తాను? గుండెల నిండా బలంగా గాలి పీల్చుకొని, ఛాతీ ఎగదట్టి నిర్భయంగా, ఆత్మగౌరవంతో, తలెత్తుకు తిరిగే దళితుల్ని చూస్తాను.

మీ మరో గొప్ప కావ్యం ‘కన్నీటి గొంతు’. అందులో శూర్పణఖ హృదయాన్ని ఆవిష్కరించారు. రామాయణం పట్ల మీ విమర్శనాత్మక పరిశీలన చాలా ఆసక్తిగా వుంది. రామున్ని ప్రతినాయకుడిగా చేస్తూ, రావణున్ని ధీరోదాత్త నాయకునిగా స్థాపించారు. కారణమేంటి?
– ధన్యవాదాలు. ఇంతమంది స్త్రీవాదులు సీతకు, అహల్యకు, మంధరకు, కైకకు, శబరికి జరిగిన న్యాయాన్యాయాల గూర్చి ఆవేదనాత్మక రచనలు చేశారు కదా, శూర్పణఖను గూర్చి ఏమీ రాయరేం? ఆమెకు అన్యాయం జరగలేదా? ద్రావిడ చక్రవర్తి అయిన రావణుడిని దశకంఠుడని వికారుడుగా, క్రూరుడుగా, రాక్షసుడుగా చిత్రించడం ఏం సబబు? వాల్మీకి పుట్టలోంచి పుట్టలేదు. ఆర్యుల బుర్రల్లోంచి పుట్టాడు. రామాయణం ఆర్యులు దక్షిణా పథానికి వ్యాపించటానికి పన్నిన రాజకీయ వ్యూహంలో భాగం. మీరు రామాయణాన్ని ప్రచార గ్రంథంగా, ఆర్యులు ద్రావిడుల్ని జయించే యుద్ధ వ్యూహంలో భాగంగా చూస్తే చాలా జీవన సత్యాలు కనిపిస్తాయి.

మీ మునివాహనుడు నాటకంలో తాత్వికత, తర్కం, కళా సౌందర్యం తొణికిసలాడే ఎన్నో సంభాషణలు రాశారు. అంత సోషల్లీ, ఫిలాసాఫికల్లీ, పొలిటికల్లీ సీరియస్ నాటకం రాయాలని ఎందుకనిపించింది? తిరుప్పాణ్ పాత్రను అలా చిత్రించడానికి కారణం?
– మునివాహనుడు చారిత్రక పాత్ర. పాణ్ కులస్థుడు. నాటి దళితుడు. దేవాలయ ప్రవేశం తిరస్కరింపబడ్డవాడు. పన్నెండుమంది ఆళ్వారుల్లో ప్రసిద్ధుడు. పది పాశురాలు పది పరిశోధన గ్రంథాల పెట్టు. తిరుప్పాణ్ ఆళ్వారు అని పిలువబడే దళితుడు మునివాహనుడు అయ్యాడు. అది అద్భుత కథా సందర్భం. దీన్ని గూర్చి వ్యాసం రాశాను. తృప్తి లేదు. నాటకం రాయదగ్గ అంశం అనిపించి రాశాను.
ఊరబావి, తలలేనోడు, కాకి వంటి అద్భుతమైన కథలు రాశా రు. ఎన్నో కథాసంపుటాలు వెలువరించారు. ఏ ఒక్క కథకూ మరో కథతో పోలిక వుండదు. అంత వైవిధ్యాన్ని చూపడం ఎలా సాధ్యం?
– సంఘం, మహారాజా సంఘం. సంఘంలో ఇంత వైవిధ్యమంటే, సంఘాన్ని ఆరాధించే రచయితకు అనంతమైన వైవిధ్యం లభిస్తుంది. గీతకు దిగువనున్న అందరిని గురించీ రాయాలనుకున్నాను. పాత్రలనేకం. వస్తువులనేకం. ఇతివృత్తాలనేకం. సంఘ జీవన వైవిధ్యమే సాహిత్య జీవన వైవిధ్యం.

రాయలసీమ జీవితం మీ సాహిత్యాన్ని ఎలా ప్రభావితం చేసింది?
– ఆంధ్రాచార్యుడికి, అనంతపురంలోనో, తిరుపతిలోనో విద్యార్థులతో జీవితం గడిపే రచయితకు, రాయలసీమ జీవితం అర్థం కావ టం అంత తొందరగా సాధ్యం కాదు. మాండలికం తెలిస్తే చాలనుకొంటారు చాలామంది. అది నిజం కాదు. ఒక ప్రాంత జీవితానికో జీవశక్తి ఉంటుంది. అది అర్థం కావటం వలస రచయితకు అంత సులభం కాదు. నాకు 30 ఏళ్లు పట్టింది. రాయలసీమ జీవితం ఎంత సుకుమారమో, సౌందర్య సమన్వితమో, ప్రశాంతమో; వెలుపల ఉన్న వారికి ఇక్కడి మనుషుల వ్యక్తిత్వ సౌజన్యం, సౌకుమార్యం, మంచితనం, ఓర్పు తెలియవు. సీమ జీవ లక్షణం తెలిశాకే నేను కథలు, నవలలు, నాటకాలు, కవితలు రాశాను. ఒకప్పుడు నాలోంచి గుంటూరును విడదీయటం కష్టంగా ఉండేది. ఇప్పుడు నాలోంచి అనంతపురాన్ని తొలగించటం అసాధ్యం.
జానపద సాహిత్య విమర్శ అనే ప్రత్యేకమైన ప్రక్రియను మీరే మొట్టమొదటగా ప్రతిపాదించారు. ప్రపంచంలో ఎక్కడా అలాంటి ప్రయత్నం జరిగినట్టు లేదు. జానపద సాహిత్య విమర్శకు శాస్త్రప్రతిపత్తి చేకూరుతుందా?
– మీరన్నది నిజమే! ‘జానపదుల సాహిత్య విమర్శ’ బలమైన ప్రతిపాదన. ప్రపంచంలో ఎక్కడా జానపదుల విమర్శ ఉందని పరిశోధకులు గుర్తించలేదు. నా పరిశోధన గ్రంథాన్ని గొప్ప గ్రంంథం అంటున్నారు. తర్కించలేదు. నిగ్గు తేల్చలేదు.
విస్కాన్‌సిన్‌లో ఇది గొప్ప గ్రంథం. ఇంతకుముందు ఇటువంటి దృక్పథం లేదు. ఇది మొదటి గ్రంథం. తెలుగు జానపదుల్ని సజీవంగా చూపిన పరిశోధన అని నిగ్గు తేలిస్తే ఉస్మానియాలో గుర్తింపు వస్తుంది. ఇల విశాలం. కాలం అనంతం. ‘జానపదుల సాహిత్య విమర్శ’ ఆద్య గ్రంథం. అది అలా శాశ్వతం.

కంచికచర్ల కోటేశు హత్య మీద మీరొక నాటిక రాశారు. అందులో ఇంకా ఎన్నో హత్యాకాండలు జరుగనున్నాయనే సంకేతాన్నిచ్చారు. ఆ తర్వాత కారంచేడు, చుండూరు జరిగాయి. అలా జరుగుతాయని ఎలా అంచనాకు రాగలిగారు?
– కోటేశు వంటి హత్యలు జరుగుతాయని భయపడ్డాను. భయపడ్డంత జరిగింది. కారంచేడు నుంచి పాతిక చోట్ల అంతే జరిగింది. ఇది ఇంతటితో ఆగదు. ఇంకా సాగుతుంది. ఇంకా పాశవిక దహనకాండ జరుగుతుంది. జాగ్రత్త పడకపోతే ఊళ్లు పేలిపోతాయి. ఎవరి ఊళ్ళు? ఊహించండి! ఆలోచించండి.

లౌకిక, ప్రజాస్వామ్య విలువలను సాహిత్యం కాపాడగలదా?
– కాపాడగలదు. ఆ విలువలతో సాహిత్యం సృష్టి కావటమే అవస రం. సాహిత్యం ప్రజాస్వామ్య విలువలను ప్రతిష్ఠించాలి. ఆ విలువలు ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తాయి.సాహిత్యమే ప్రజల్ని ఆధునీకరించిం ది. సమాజాలను నూత్నీకరించింది. మనిషిని మహోన్నతుణ్ణి చేసింది. చైతన్యవంతులైన ప్రజలు పరస్పర అవగాహనతో సహజీవనం సాగించటానికి సాహిత్యం నిశ్చయమైన, అనివార్యమైన అవసరం.
దళితుడికి దూరంగా ఉండే ఆంధ్రాచార్యత్వం చేపట్టిన మీరు గ్రహించేదేమిటి?
– తెలుగు చదువు బ్రాహ్మణుల విద్య మాత్రమే అనే దశ నుంచి అది మానవ సమూహాల గుత్త సొత్తు అనే దిశకు మారటం నా జీవిత కాలంలోనే చూశాను.
సాహిత్యంలోని ప్రభావిత వ్యవస్థలను ప్రజాస్వామీకరించాలని విమర్శకులంటున్నారు..
– ప్రజాస్వామ్యంలో అన్ని వ్యవస్థలు ప్రజాస్వామ్యీకరణం చెందాలి. దానికి అపవాదం లేదు. సాహిత్యం మినహాయింపు కాదు.
ఇంటర్వ్యూ: డా.జిలుకర శ్రీనివాస్, స్కైబాబ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పద్మ పురస్కారాలు కళ తప్పుతున్నాయి

పద్మ అవార్డులకు అనర్హులను ఎంపిక చేయడం జరుగుతోంది. ఫలితంగా ప్రతి ఏటా వీటిని తిరస్కరించే వారి సంఖ్య పెరుగుతోంది.

ప్రతిష్ఠాత్మకమైన పద్మ పురస్కారాలు కళ తప్పుతున్నాయి. భారతదేశ కీర్తిప్రతిష్టలు, వైభవం, ఉత్తేజాలను గుర్తు చేసే ఈ పురస్కారాలు ప్రస్తుతం వెలా తెలా పోతున్నాయి. విద్య, శాస్త్ర విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం, సాహిత్యం, కళలు, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, పౌరసేవల రంగాల్లో విశిష్టమైన ప్రతిభావంతులకు కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాలను ప్రదానం చేస్తుంది. వీటిని మూడు స్థాయిల్లో నెలకొల్పారు. అన్నిటికన్నా మిన్నగా పద్మవిభూషణ్, ఆ తరువాతి స్థానంలో పద్మభూషణ్, ఆ తరువాత పద్మశ్రీలను రాష్ట్రపతి ప్రకటించడం, గణతంత్ర దినోత్సవం రోజున ప్రదానం చేయడం ఆనవాయితీ అయింది. 1954లో ప్రప్రథమ పురస్కారాల ప్రదానం జరిగింది. 6 పద్మ విభూషణ్‌లు, 23 పద్మభూషణ్‌లు, 18 పద్మశ్రీలతో నాటి మేటి ప్రతిభావంతులను వివిధ రంగాల నుంచి ఎంపిక చేయడం జరిగింది.

నాటి నుంచి 2013 దాకా ప్రదానం చేసిన పురస్కారాలలో పలుమార్లు విమర్శలు, తిరస్కరణలు ఎదురయ్యాయి. అవార్డుల ప్రదానం తీరుతెన్నులు మారాల్సిన అవసరాన్ని ఎత్తిచూపుతూనే ఉన్నాయి. ఈ ఏడాది దాకా 290 మంది పద్మవిభూషణ్‌లు, 1126 మంది పద్మభూషణ్‌లు, 2678 మంది పద్మశ్రీలు వివిధ రంగాల నుంచి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వినతులు ప్రతిపాదనల ప్రాతిపదికగా ఎంపిక అయ్యారు. ఎప్పటికప్పుడు వాటిలో పొరపాట్లు, అనర్హులను అందలం ఎక్కిస్తున్నారన్న విమర్శలు, నిరసనలు ఎదురవుతూనే ఉన్నాయి. మొదటి ఏడాది ఎంపికలో వైవిధ్యానికి, అసలు సిసలు ప్రతిభకు పట్టం కట్టాలన్న ప్రభుత్వ యోచన క్రమంగా రాజకీయపు పలుకుబడితో ప్రభావితమవుతున్నాయని తేటతెల్లం అయింది. విజ్ఞులతో పాటు పురస్కారాల ప్రదానానికి ఆమోదం తెలపాల్సిన రాష్ట్రపతి కూడా హెచ్చరించి సవరింపులు చేయించిన సందర్భాలు ఉన్నాయి. మన ప్రప్రథమ రాష్ట్రపతి స్వయంగా ఒక ఆస్పత్రి నర్సుకు పద్మ ప్రదానం చేయమని పట్టుపట్టటం విపరీత విమర్శలకు నెలవు అయింది. మరో రాష్ట్రపతి హయాంలో ఆ భవనంలో అలంకరణలు మెరుగులు దిద్దిన మహిళకు పద్మ ప్రదానం అయింది.

కళ తప్పుతున్న కళలు
బిరుదులకు, పురస్కారాలకు తేడా తెలియని తీరులో ప్రభుత్వపరంగా ప్రదానం చేస్తున్న పద్మలు హుం దాగా గౌరవప్రదమైన స్థాయిని నిలుపుకోవటంలో తేలిపోతున్నాయి. నిబంధనలు తెలియనివారు, పాటించనివారు పెరిగిపోతున్నారు. కొందరి వివరాలు, పద్మలు తెచ్చుకున్న పద్ధతులు తెలుసుకున్న సమాజం ముక్కుమీద వేలు వేసుకుంటున్న సందర్భాలు అనేకం. ఆయా రాష్ట్రాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ప్రతిపాదనలను క్షుణ్ణంగా పరిశీలించి నిక్కచ్చిగా నిర్ణయించటంలో చాలా లోపాలు, లొసుగులు ఉంటున్నాయని పలుమార్లు తేటతెల్లం అయినా అందుకు తగ్గ దిద్దుబాటు చర్యలు మాత్రం లేకుండా పోతున్నాయి.

సగటున 1000కి పైచిలుకుగా వస్తున్న ప్రతిపాదనలను రాష్ట్రపతికి పంపటానికి హోంశాఖ రూపొందించటానికి నియమించే కమిటి ఒక్క పూటలో అన్నీ ఎలా పరిశీలించగలుగుతోందని అగర్వాల్ అనే ఆయన ప్రశ్నలతో సమాచార హక్కు వ్యాజ్యం నడిపితే ప్రభుత్వం నుంచి సరైన వివరణ లభించలేదు. ఢిల్లీలో పెద్దల ప్రమేయం, సిఫారసుల లేఖలు తీసుకున్నవారు పొందినవి, ఆ పైరవీలు తతంగాలు తెలియనివారు ఎన్నటికీ పొందలేనివి అడపాదడపా అన్ని రాష్ట్రాలలో, ప్రాంతాలలో చర్చకు వస్తూనే ఉన్నా ప్రమాణాలు పెంచటంలో శ్రద్ధ పెట్టేవారు మాత్రం లేకుండా పోయారు. మన దేశ అత్యున్నత న్యాయస్థానం 30 పేజీలతో పలు సూచనలతో తీర్పు ఇచ్చినా పద్మలు అనర్హులకు అలవోకగా అందుతూనే ఉన్నాయి. అసలు అవార్డులకు ఎవరిని ఎలా ఎంపిక చేస్తారన్న దానిపై స్పష్టత, పరిమితులపై కచ్చితమైన మార్గదర్శకాలు లేకుండానే జరిగిపోతున్నాయి. ఒక కేంద్ర మంత్రికి కంటి శుక్లాలు ఆపరేషన్ చేసిన ఢిల్లీ వైద్యురాలు, ప్రధానమంత్రికి వైద్యం చేసిన వారు, ప్రధాని కవితలను గానం చేసిన యువగాయని, అవినీతిపరుడుగా గుర్తింపు పొందిన వ్యక్తి దేశ అత్యున్నత పురస్కారాలను రాష్ట్రపతి నుంచి అందుకున్నారు. ప్రభుత్వాలను నడిపే రాజకీయ పార్టీలు ఒకరిని ఒకరు ఎద్దేవా చేసుకుంటూ చెప్పిన మాటలు మన చట్టసభల రికార్డులలో నమోదయ్యాయి. 2007లో రాష్ట్రపతి హోదాలో కలాం తిప్పిపంపిన పైల్‌లో లొసుగులు అభ్యంతరాలు మన దేశ ప్రతిష్టకు చెరగని మచ్చగా ఉన్నా సవరింపుపై చర్యలు లేకుండానే అన్నీ జరిగిపోయాయి.

కమిటీపై అనుమానాలు
మామూలుగా హోం శాఖ వారు నియమించిన కమిటీ రూపొందిన జాబితాకు ముగ్గురి పేర్లు అదనంగా జోడించటం మొత్తంగా ఆ జాబితాలోని 12కి వ్యతిరేకంగా నిఘా విభాగాల నివేదిక ఉండటం మన పురస్కారాల వ్యవస్థకు ఒక మరకగా వెల్లడి అయింది. 1996లో అప్పటి రాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ కూడా కమిటి సిఫారసులను తిరస్కరిస్తే రహస్య ఫైల్‌గా బయటకు తెలియకుండా దాటవేశారు. కొందరు సరైన సమాచారం కోసం పట్టువదలకుండా ప్రయత్నిస్తే ఫైళ్లలో కాగితాలు తీసేసి తారుమారు చేసి గందరగోళం చేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఒక సందర్భంలో ఏడాదికి 50కి మించి పద్మ పురస్కారాలు వద్దనుకున్న ప్రభుత్వం ఆ తరువాతి రోజుల్లో ఆనవాయితీ పరిమితిని 100 దాటించింది. ఆ తరువాత 120కి దాటవద్దని ఉత్తుత్తి ఆంక్షలు కాగితాలపై మాత్రమే ఉండేలా చేసింది. 1969లోనే ఆచార్య జె.బి. కృపలాని వంటి పెద్దాయన సంధించిన ప్రశ్నలు, విమర్శలు గుర్తుకు తెచ్చుకుంటే ఇప్పటి దిగజారుడు పద్ధతులు, అప్రతిష్ట అర్థం అవుతాయి.

దేశ అత్యున్నత న్యాయస్థానం వారు ఈ వ్యవహారాలన్నిటినీ సాకల్యంగా పరిశీలించి మార్గదర్శకాలు సూచించినా అసలు సారంలో పట్టింపు అంతంత మాత్రమే అయింది. లెటర్‌హెడ్‌లు, ఆహ్వాన పత్రాలు, కరపత్రాలు, పోస్టర్‌లు, పుస్తకాల వంటివాటిపై తమ పురస్కారాలను చాటుకోకూడదని వారించి చాలా ఏళ్లు అయింది. తమ పేర్లకు ముందు వెనుకల్లో పద్మలు చాటుకోవద్దని కచ్చితమైన నిబంధనలు మొదటి నుండీ ఉన్నాయి. 1977-80లలో 92-98 మధ్యలో పురస్కార ప్రదానంలో అంతరాయం, ఒడిదుడుకులు పలు లోపాలను చెప్పకనే చెబుతాయి. పలువురు పలు సందర్బాలలో తమకు ప్రకటించిన పురస్కారాలను ప్రకటించినప్పుడు నిర్వికారంగా పట్టింపులేకుండా వ్యవహరించారు. మరికొందరు తీవ్ర నిరసనలతో తిరస్కరించారు. గతంలో ఎం.జి. రామచంద్రన్ తనకు ప్రకటించిన పద్మశ్రీని నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. స్వాతంత్య్ర సమరయోధుడు, కేంద్ర మంత్రి అబ్దుల్ కలామ్ ఆజాద్ ఆ పురస్కారాలను తిరస్కరించిన వారిలో ముందున్నారు.

చరిత్ర రంగంలో కొత్త పుంతలు తెలియచెప్పిన ప్రొఫెసర్ రోమిల్లా థాపర్ 1992లోనూ, ఆ తరువాత 2005లోనూ పద్మ భూషణ్ ప్రకటించినా స్వీకరించటానికి విముఖత వ్యక్తం చేశారు. “విద్యాసంస్థలు, మా రంగంలోని వారు ఇస్తే మాత్రమే నన్ను ప్రశంసించటంలో అర్థం, యోగ్యత ఉంటాయి. నా కృషి పరిశోధనల ప్రమాణాలు తెలియని వారు ఏంచేసినా అర్థరహితంగా పరిగణిస్తాను” అని ఆయన తన అయిష్టతను వ్యక్తం చేశారు. 2003లో పద్మభూషణ్‌ను దత్తోపంత్ టేంగ్డే తిరస్కరిస్తూ తన గురువులకు, అందరికీ ప్రయోజనకరమైన ప్రవర్తన మార్గాన్ని చూపించిన పెద్దలను గుర్తించకుండా తనకు ఇవ్వజూపటం సమంజసం కాదని స్పష్టం చేశారు. సితార్ విద్వాంసుడు విలాయత్ ఖాన్ తన స్థాయిని నిర ్ణయించిన కమిటీ విజ్ఞతపై నిరసనతో రెండుసార్లు నిరాకరించారు. ఈశాన్య రాష్ట్రాలలో అశాంతి, హింస పెచ్చరిల్లిపోతుంటే తమ సూచనలు, పరిష్కార మార్గాలు పట్టించుకోని ప్రభుత్వంపై నిరసనతో తనకు ఏమీ వద్దని తిరస్కరించారు. పాత్రికేయుడు నిఖిల్ చక్రవర్తి ప్రభుత్వ మెచ్చుకోళ్లు యోగ్యత ప్రశంసలు తన వృత్తి విలువలు, ధర్మానికి తగవు అని దూరం పెట్టారు. బ్లూ స్టార్ ఆపరేషన్‌తో తన వారిని ఊచకోత కోసినవారి పురస్కారం తనకు వద్దని కుష్వంత్ సింగ్ రెండుసార్లు పద్మవిభూషణ్ ను తిరస్కరించారు. తనకన్నా ముందు అపాత్రులు, అథమస్థాయి వారికి పురస్కారాలిచ్చి ఆ తరువాత తనలాంటి వాళ్లకు ఇవ్వటం గౌరవప్రదం కాదని కళాకారిణి సితార దేవి నిరాకరించారు. మరెందరో కూడా అసమ్మతి వ్యక్తం చేస్తూ ప్రభుత్వ అవార్డుల దరిదాపుల్లోకి కూడా రామని అన్నారు.

 

 

 


 

 

 

మన రాష్ట్రంలో చిత్ర చిత్తాలు
కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన పదవులతో పాటు పద్మ పురస్కారాలకు అర్హులను ఎంపిక చేసి ప్రధానమంత్రి, రాష్ట్రపతిలకు ప్రతిపాదన నివేదికను పలు సంవత్సరాలు ఖరారు చేసిన కంటిపూడి పద్మనాభయ్యతో పాటు సుపరిపాలన వేదిక కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి వంటివారు మన వాళ్ల ఎంపిక పద్ధతులు లోపభూయిష్టం, ఆశ్రితపక్ష పాతంతో జరిగిపోతున్నాయని నిశితంగా విమర్శించారు. ఈ ఏడాది పురస్కారాల కోసం తాము చేసిన ప్రయత్నాలు, కనుగొన్న వాస్తవాలు బాహాటంగా వెల్లడించారు. ఇక ముందు మన రాష్ట్ర ప్రభుత్వ పద్ధతులు, ఎంపిక ప్రమాణాలు మారాలని హితవు చెప్పారు. ప్రతిపాదనలు పంపటానికి ముందు అందరికీ తెలిసేలా సెర్చి కమిటీని నియమించటం, తమకు తాము అర్హులని భావించేవారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలియచెప్పడం వంటి కనీస ప్రయత్నం కూడా చేయలేదని తప్పుపట్టారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలపై పట్ట్టింపు లేకుండా కొందరు ప్రభుత్వ కార్యదర్శి, విశ్వవిద్యాలయాలు, చలనచిత్ర అభివృద్ధి సంస్థ వంటివారి నుంచి పేర్లు తెప్పించి తమకు తోచిన రీతిలో ఖాయం చేసేసారని వెల్లడించారు. గడువు దాటిన తరువాత వచ్చినవి కూడా పరిగణించి కమిటి పరిశీలించి ఖరారు చేస్తే ముఖ్యమంత్రి తనకు తోచిన వారిని కూడా కలిపి ప్రతిపాదన పంపించారని రుజువులతో చెప్పారు. ఆ తరువాత ఆదనంగా మళ్లా కొందరి ఒత్తిడి మేరకు మరి కొందరివి కలిపారని కూడా వెల్లడించారు.

ఈ ఏడాది ప్రతిపాదనల్లో 40 శాతం వైద్యులే ఉండగా ఎన్నడూ సమాజంపట్ల, విధుల పట్ల బాధ్యతగా వ్యవహరించలేదని సులువుగానే చెప్పగలవారిని ఎంపిక చేశారని లోపాలన్నీ న్యాయస్థానం ముందుంచారు. విధులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని రుజువులున్న వారితో పాటు మార్పులు చేర్పులు జరిగిన తీరు తీవ్ర అభ్యంతరకరం అన్నారు. మొత్తంగా జరిగిందంతా మన ప్రభుత్వానికి పురస్కారాలకు గౌరవప్రదం కాదని నిక్కచ్చిగా తేల్చి చెప్పారు. గతంలోకి వెళ్లి వివరాలన్నీ వింగడిస్తే కొందరి పైరవీలు, రాజకీయ పలుకుబడులు, ప్రలోభాలు పద్మలకు తెగులులా అలముకున్నాయని తేటతెల్లం అవుతోంది.
– జి.ఎల్.ఎన్. మూర్తి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆస్కార్ వైల్డ్-1

    ఆస్కార్ వైల్డ్-1

యుక్త వయసు వచ్చిన దగ్గర నుంచి ఆస్కార్ వైల్డ్ అంటే పిచ్చ అభిమానం నాకు .ఉద్యోగం లో చేరిన తర్వాత అతని కధలు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లో ఉండటం వాటిని ఏంతో  ఆనందం గా చెప్పటం నాకు ఇష్టమైంది .అతని ‘’సెల్ఫిష్ జైంట్ ‘’కద మహా బాగా ఉండేది .జ్ఞానపు లోతులను తరచి చూసిన వాడుగా ఆరాధన .అమెరికా వచ్చినతర్వాత నాకు ‘’రిచర్డ్ ఎల్మన్ ‘’రాసిన అతని జీవిత కద లైబ్రరీలో కనిపించింది .తెచ్చి ,మహా శ్రద్ధగా చదివాను.అందులోని విషయాలను మీకు అంద జేస్తున్నాను .

           

చిత్రకారుడు ,కవి ,నాటక రచయితా ,విమర్శకుడు .అంటే ‘’ఆల్ ఇన్ వన్ ‘’ఆస్కార్ వైల్డ్ .ఈస్తటిక్ సెన్స్ లోనే ఏది రాసినా ఉండటం ఆయన ప్రత్యేకత .హోమో సెక్సువల్ .ఆ పిచ్చ లో పడి మగ పిల్లల తో సెక్స్ లో పాల్గొని కోర్టుల పాలై చివరి రోజుల్లో రెండేళ్ళు జైలు పాలై,ఆ తర్వాతా మూడేళ్ళు ఎవరికీ పట్టని వాడై ,ఇల్లూ లేక డబ్బూ లేక ఆదరణా లేక అలమటించాడు .మన శ్రీనాధ మహా కవి జీవితం గుర్తుకొస్తుంది .చివరికి ఎంతో దయనీయమైన పరిస్తితుల్లో చని పోయాడు .దిషణాహంకారం  బాగా ఉన్న వాడు .పూర్తీ పేరు ‘’oscar Fingal ‘’o’’flahertie Wills Wild ‘’ఇవన్నీ వదిలేసి అందరూ ఆస్కార్ వైల్డ్ అనే అంటారు .’’in his most pyrotechnic ,enchanting and extravagantly outrageous of 19th century literary men ,’’.గా ప్రసిద్ధుడు .the importance of being earnest Dorian Grey మొదలైన రచనలు సుప్రసిద్దాలు .ఐర్లాండ్ మేధావి .తల్లి మంచి కవి దేశ భక్తురాలు .డబ్లిన్ బాయ్ గా వైల్డ్ ను పిలుస్తారు .జాన్ రస్కిన్ తో సాన్నిహిత్యం ఉన్నవాడు .మేటర్ లింక్ ,గైడ్ అనే గొప్ప రచయితలతో మైత్రి .1880-90కాలం లో ఆంగ్ల సాహిత్యాన్ని దున్ని వదిలేసిన కలం హాలికుడు ఆల్కహాలికుడు కూడా ..అమెరికా వెళ్లి అక్కడా జేజేలు అందుకొన్న మహా రచయిత .అమెరికా జాతీయ కవి వాల్ట్ విట్మన్ ను సందర్శించాడు .’’love of women and ‘’men ‘’మధ్య ఊగిస లాడాడు అంటే ‘’ఆసిలేట్ ‘’అయ్యాడు ఆస్కార్ .డగ్లాస్ ,రోస్స్ అనే కుర్రాళ్ళతో సెక్స్ చేసి ఇబ్బంది పడ్డాడు .ఇది బహిరంగామయి డగ్లాస్ పై  కేసు పెట్టాడు .ఇద్దరికీ శిక్ష పడింది .

 

వైల్డ్ లో ఉన్న ‘’provocative intelligence ‘’ఎన్ని శాతాబ్దాలకైనా అతాని రచనలను చదివేట్లు చేస్తుంది .అందుకే అతన్ని’’unique and whole ‘’ అంటారు .జీవించింది నలభై ఆరు ఏళ్ళు మాత్రమె .సూక్ష్మంగా అతన్ని’’refulgent majestic ,and ready to fall’’గా అనుకొంటారు .అంటే దేదీప్యమానమైన, రాజయోగ్యమైన పతనం చెంద బోయే శిఖరం అన్న మాట .తనను తాను ‘’professor of aesthetics ‘’ అని చెప్పుకొన్నాడు .ఆనంద దేవత .అంటారు .కస్టాలు కన్నీళ్లు ఉన్న ప్రపంచాన్ని గురించే రాశాడు .అతను   ‘’good and  evil are not what they seem ,that moral tabs cannot cope with the complexity of behavior ‘’అని అభిప్రాయ పడ్డాడు .అతని భాష అతను సాధించిన అద్భుత విషయం,విజయమూ కూడా  .’’It is fluent with concession and rejection ‘’అని అతని భాషా పాండిత్యాన్ని నిగ్గు తేల్చారు .కని పించే ప్రపంచం నుండి కని పించని ప్రపంచానికి వారధి కడతాడు రచనలో .దీనిలో తన ప్రత్యేకతను, అసాధారణ అభిప్రాయాలని పంచుతాడు .’’his wit is an agent of renewal ,as pertinent now as a hundred years ago ‘’అని ఆస్కా ర్ హాస్య వ్యంగ్యాలను నిత్య నూతనం గా అభి వర్ణిస్తారు .’’The question posed by both his art and life end his art a quality of earnestness  which he always disavowed ‘’అని కీర్తించాడు రచయిత రిచర్డ్ ఎల్మన్ .

1856లో జన్మించి వైల్డ్ 1902లో మరణించాడు.ఆక్స్ ఫర్డ్ లో చదువుతూండగానే జర్మనీ పండితుడు మాక్స్ ముల్లర్ తో పరిచయమేర్పడింది .ఇతని ప్రతిభ పాండిత్యం అవగాహన సామర్ధ్యాలను చూసి మాక్స్ ముల్లర్ వైల్డ్ కు తాను చేయ బోయే వేదాల ను అనువదించే కార్య క్రమం అప్పగించాలని భావించాడు .అరగంటలో మూడు వాల్యూముల నవల చదివి పది నిమిషాల్లో అందులోని కద అంతా చెప్పేవాడు .అతని సామర్ధ్యం ఇంకోటి ఉంది అది అతనికే సాధ్యమైనది .రెండు పేజీలనూ రెండు కళ్ళ తో చదివే అద్భుత నేర్పు ఆయనది .ఆక్స్ ఫర్డ్ లో ఉండగా ‘’డివైన్ పేపర్ ‘’పరీక్షలో పరీక్షాధికారి 23వ చాప్టర్ ను కాపీ చేయ మంటే –చేస్తున్నాడు వైల్డ్ .కొంతవరకు చేయగానే ఆపెయ్య మన్నాడు ఎక్సామినర్ .ఈయన ఆపకుండా కొన సాగిస్తూనే ఉన్నాడు .కోపం వచ్చిన అధికారి ‘’నేను చెప్పింది విన పడలేదా ?’’అని అడిగితె ‘’విన పడింది .’’పాల్ ‘’నీళ్ళ లో మునిగి కొట్టుకుంటున్న ఘట్టం రాస్తున్నాను .ఆయన్ను ఒడ్డున పడేసి ఆపేస్తాను ‘’అన్న చతురుడు వైల్డ్ .

సశేషం

మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ -3-2-14-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

విక్టర్ హ్యూగో , థామస్ గ్రే,హెచ్ జి.వెల్స్

                విక్టర్ హ్యూగో

‘’supreme romantic bard of French literature’’అని పేరు పొందిన విక్టర్ హ్యూగో 1802లో పుట్టాడు .అసలు పేరు విక్టర్ మేరీ హ్యూగో .ఫ్రెంచ్ అకాడెమి గుర్తించిన కవి ప్రముఖుడు .1948లో మరణ శిక్ష పడింది .1949లో లేజిస్లేటివ్ అసెంబ్లీ కి ఎన్నికైనాడు .1951దేశ రాజకీయాలకు బలై పారిపోయి ప్రవాస జీవితం గడిపాడు .1860లో ఫ్రాన్స్ పాలకుడు గరి బాల్డీ కి అనుకూలం గా ఉన్నాడు .మళ్ళీ పారిస్ తిరిగి వచ్చాడు .1876 ఫ్రెంచ్ సెనేట్ కు ఎన్నికయ్యాడు .1885లో ఎనభై మూడవ ఏట మరణించాడు .ఎన్నో ఉత్థాన పతనాలను ఎదుర్కొన్న కవి రచయిత హ్యూగో .మూడవ నెపోలియన్ హ్యూగో ను దేశం నుంచి బహిష్కరించాడు .

         

ఓడ్స్,బాలడ్స్ ,పోయెమ్స్ రాశాడు హ్యూగో .నియో క్లాసిక్ నుంచి దృష్టిని మరలించాడు గగమనమూ మార్చుకొన్నాడు .హ్యూగోప్రభావం పడని రచయిత లేడు.Notre dame de Paris ,les miseraables రచనలకు ప్రపంచ వ్యాప్తం గా గొప్ప పేరొచ్చింది .ఈ రెండూ మానవ బాధలను కష్టాలను చాలా శక్తి వంతం గా వివరించి ఆ నాటి ప్రజల్ని ఆకట్టుకొన్నాయి .హ్యూగో కు బ్రహ్మ రధమే పట్టారు .కొన్ని సానేట్స్ ,కొన్ని నాటకాలు కూడా రాశాడు .రాసిన ప్రతి దాంట్లోనూ కొత్తదనం తీసుకొని రావటమే హ్యూగో ప్రత్యేకత .హ్యూగో కుమార్తె ‘’Adele’’తండ్రిని జ్ఞాపకం చేసుకుంటూ ‘’My father reads his poems on religions ,and began by speaking of religion of’’ Siva ‘’అన్నది అంటే శైవం పై హ్యూగో కు మక్కువ కలిగిందని తెలుస్తోంది .హ్యూగో కు ‘’విశ్వ ప్రేమ ‘’ఉంది .అతని కవితలో శైలీ విన్యాసానికి ముగ్దులవుతాం .సృజనకు ఆశ్చర్య పడతాం .ఈ రెండిటి తో హ్యూగో సాహిత్య లోకం లో గొప్ప రచయిత అని తన సాధన తో నిరూపించు కున్నాడు .మచ్చుకు ఒక కవిత చూద్దాం .

 

‘’ Love seeketh not itself to please –nor for it self hath any care –but for another gives its ease –and builds a Heaven in Hell’s despair .

As I wander the forest –the green leaves among –I heard a wild flower singing a song .

               థామస్ గ్రే

థామస్ గ్రే లండన్ లో16-12-1716లో జన్మించాడు .1743లా పట్టా ఒంపొందాడు .1751లో ‘’ఓడ్స్’’రాశాడు .1768లో కవితలు రాశాడు .1771జులై ముప్ఫైన మరణించాడు.ఎడ్మండ్ స్పెన్సర్ వలే గ్రే ను ‘’కవులకు కవి ‘’అంటారు .చాలా స్పష్టం గా గొప్ప శైలితో కవిత్వాన్ని చెప్పేకవి .కవిత్వ కళ పుష్కలం గా ఉన్న వాడు బతికింది యాభై అయిదు ఏళ్ళు మాత్రమే అయినా మంచి ప్రభావం చూపాడు .అతని కవిత్వం లో ‘’sympathetic human voice ‘’ఉందని మెచ్చుకొంటారు.

.ఆత్మ శక్తి అధికం గా ఉన్న కవీశ్వరుడు .ఒంటరి వాడి పోయాడు .శ్రావ్యత అలంకారం నిండిన కవితల్ని రాసి కీర్తి పొందాడు .కొన్ని కవితలను ఆస్వాదిద్దాం .

1-on hasty wings thy youth is flown –thy sun  is set –thy spring is gone –we flock while it is May

2-no more where ignorance is bliss –itsfolly to be wise

3-there confusion ,terror’child –conflict fierce and ruin wild –Agony that pants for breath –despair and honourable death

 

 

    

.

హెచ్ జి.వెల్స్

‘’ This century’s remarkable literary figure .Writer  ,scientist ,philosopher ,humanist ,public figure ,lover ,homo sexual etc.’’ ఇదీ వెల్స్ గారి ఘనత .అమెరికా లోని మెయిన్ యూని వర్సిటి లో హిస్టరీ ప్రొఫెసర్ .పూర్తీ పేరు హెర్బర్ట్ జార్జ్ వెల్ల్స్.ఆయన ది’’రెడియేటేడ్ ఎనర్జీ ‘’అంటారు .మహా మేధావి భావ తీవ్రవున్న వాడు. .శారీరక, సెక్స్ జీవితం లో నిష్ణాతుడు .మహిళా హక్కులను గౌరవించాడు .కుటుంబ నియంత్రణ ను ప్రోత్సహించాడు .విశ్వ వ్యాప్త విద్య కోసం ఆరాట పడ్డాడు .నిరాయుధీకరణకు మద్దతు పలికాడు .ప్రపంచ శాంతి కావాలని నిర్ద్వందంగా ప్రకటించాడు .అందుకే వెల్స్ ను ‘’desperaterly mortal ‘’అని పిలిచారు .

     Product Details

       

వెల్స్-21-9-1866 నజన్మించాడు .1884-87కాలం లో ‘’సైన్స్ స్కూల్ జర్నల్ ‘’కు సంపాదకుడి గా సమర్ధ వంతం గా పని చేశాడు .1892నుంచి ఆపులేకుండా రచనలు చేయటం ప్రారంభించాడు .మొదటి భార్య ఇసాబెల్ కు విడాకు లిచ్చి జెన్ ను పెళ్ళాడాడు .’’the time machine ,wonderful visit ‘’నవలలు రాసి మంచి పేరు తెచ్చుకొన్నాడు .1896 లో ‘’దివీల్స్ ఆఫ్ చాన్స్ ‘’,తర్వాత’’దిఇన్విజిబుల్ మాన్ ‘’. మొదలైన వంద రచనలు చేసి పారేశాడు .’’the war of the worlds .tales of space and time ,the discovery of the future ,the sea lady ,’’మొదలైన సైంటిఫిక్ ఫిక్షన్ నవలలు రాశాడు .1905లో ‘’modern Utopia ‘’,war in the air ,రాశాడు .1914లో రష్యా లో పర్యటించాడు .1916లో ‘’the elements of re construction war propaganda పై మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లో పని చేశాడు  .1920లో ‘’the outline of history ,రాశాడు world’disarma  ment race’’ను సమీక్షించాడు .’’మెన్ లైక్ గాడ్స్ ,రాశాడు .PE N కు ప్రెసిడెంట్ గా పని చేశాడు .మళ్ళీ రష్యా పర్యటన చేశాడు .1940లో ‘’rights of man declaration ‘’ప్రకటించాడు .1946లో ఎనభయ్యవ ఏట మహా రచయిత హెచ్ జి.వేల్స్ మరణించాడు

రష్యా పాలన పై ధ్వజ మెత్తి నందుకు వెల్స్ పై కమ్యూనిస్టులు గుర్ర్రు గా చూస్తారు .ఆయన చని పోయిన తర్వాత ఆయన పేర ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయటానికి ప్రయత్నిస్తే ఎవరూ సహక రించాలేదు .ఇప్పుడిప్పుడే స్పందన బాగా వస్తోంది .కారణ జన్ముడు వేల్స్ .బస్తాల కొద్దీ రాశాడు .ముట్టిన దంతా బంగారమే  అయింది .అన్నిటికి వరవడి పెట్టాడు .ఆయనది’’ పాదరస మేధ’’ అంటారు .జంతు శాస్త్రం పై టెక్స్ట్ బుక్ రాశాడు .జీవ పరిణామ సిద్ధాంత కర్త చార్లెస్ డార్విన్ పై వేల్స్ ‘’అధారిటీ. ‘’స్వయం గా సాధించి ఎందరిలో వెలుగు చూపించాడు సూర్తి కల్గించాడు .ఒక శతాబ్దానికి సరిపడా వెలుగు నిచ్చిన మేధావి రచయిత వేల్స్ .A well of knowledge ‘’అనిపిస్తాడు హెచ్ .జి వేల్స్ .

9-10-2002 బుధవారం నాటి నా అమెరికా (హూస్టన్ ) డైరీ నుండి

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-2-14-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఈలపాట రఘురామయ్య కు నివాళి

 

తెలుగు నాటకరంగంలో «ఈలపాట రఘురామయ్య ధృవతారగా వెలుగొందారు. 82 ఏళ్ల తెలుగు చిత్ర పరిశ్రమలోనూ పద్మశ్రీ ఈలపాటి రఘురామయ్య పేరు చిరస్థాయిగా నిలిచింది. 45వేల నాటకాలు ప్రదర్శించడమే కాకుండా వంద సినిమాల్లో నటించిన ఈయన తెలుసు సినిమా రంగంలోనే మొట్టమొదటి కృష్ణుడిగా నిలిచారు. లతెలుగు సినిమా పరిశ్రమ 1932లో ఆవిర్భవిస్తే, 1933వ సంవత్సరంలో ఈయన ‘పృధ్వీ పుత్ర’ అనే మొదటి సినిమాతో సినీరంగంలోకి ప్రవేశించారు. చూపుడు వేలు నాలుక కింద పెట్టి ఈలపాటతో ఆయన చేసిన వేణుగానం వల్ల ఈలపాట ఇంటిపేరుగా మారింది. 1901వ సంవత్సరం మార్చి 5వ తేదీన గుంటూరు జిల్లా సుద్దపల్లిలో జన్మించిన రఘురామయ్య 8వ ఏట నుంచే నాటకరంగ ప్రవేశం చేశారు.

శకుంతల, రత్నావళి, రాణి సంయుక్త వంటి స్త్రీ పాత్రలు, రాముడు, కృష్ణుడు, నారదుడు, భవానీ శంకరుడు వంటి పౌరాణిక పాత్రల్లో ఈయన నటించారు. చింతామణి, భక్తమార్కండేయ, కృష్ణప్రేమ, శ్రీకృష్ణాంజనేయ యుద్దం వంటి చిత్రాల్లో హీరోగా నటించిన రఘురామయ్య ఎన్నెన్నో వైవిధ్య పాత్రలు ధరించారు. సినిమాలు చేస్తున్నా, నాటకాన్ని వదలలేదు. అద్భుత నటన, అమరగానం, మురిపించే రూపం, మైమరిపించే ఈలపాటతో ఆరున్నర దశాబ్దాల పాటు రంగస్థలాన్ని ఏలారు. జవహర్‌లాల్‌నెహ్రూ, ఇందిరాగాంధీ, రబీంద్రనాథ్ టాగూర్, సర్వేపల్లి రాధాకృష్ణన్‌లు ఈయన కళాచాతుర్యాన్ని మెచ్చుకున్నారు. రాష్ట్రపతిగా వివి గిరి ఉన్నపుడు ఈలపాట రఘురామయ్య గారితో శ్రీకృష్ణ తులాభారం నాటకాన్ని రాష్ట్రపతి భవన్‌లో ప్రదర్శనను ఏర్పాటు చేయించుకున్నారు.

శివాజీగణేషన్, ఎం.జి.రామచంద్రన్, పి.సుశీల, ఎస్.జానకి, ఎస్పీ బాలసుబ్రహ్మమణ్యంలు ఈలపాట రఘురామయ్యను అభినందించారు. ఈలపాటతోపాటు తన నటనతో తెలుగునాట ప్రేక్షకుల విశేష ఆదరణ పొందిన ఈలపాట రఘురామయ్య 1975వ సంవత్సరంలో తనువు చాలించినా, ఆయన జ్ఞాపకాలు మాత్రం అజరామరంగా నిలిచాయి. ఈలపాట రఘురామయ్య స్మత్యర్ధం ఆయట కాంస్య విగ్రహాన్ని ఆయన స్వస్థలమైన గుంటూరు జిల్లా చెబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామంలో నేడు మధ్యాహ్నం మూడు గంటలకు తెలుగు భాషా సంఘం ఛైర్మన్ మండలి బుద్ధప్రసాద్ ఆవిష్కరించనున్నారు. ఈ విగ్రహావిష్కరణ సభలో ఎమ్మెల్సీ బసవపున్నయ్య, ఆచంట వెంకటరత్నం నాయుడు తదితరులు పాల్గొననున్నారు.

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

మాఘ మాసపు తోలి ఆదివారం -సూర్య పూజ ,పాలు పొంగించటం ,అరుణ పారాయణం 

This gallery contains 9 photos.

More Galleries | Tagged | Leave a comment

ఆనాటి గయ్యాళి చాయాదేవే -ఇవాల్టి వెండి తెర బంగారం-ఆంద్ర జ్యోతి

chayadevi 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

హోమం తో పంటలు క్షేమం అంటున్న రైతు చలసాని దత్

homam 1 001 homam2 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఏం చదువుకున్నానంటే…జీవితం చదువుకున్నాను -సత్యానంద్ -ఆంద్ర జ్యోతి

 

కళ్లు తిప్పుకోలేని అందం, ఖరీదైన దుస్తులు, భారీ సెట్టింగులు, అద్భుతమైన నటన.. ఇవన్నీ కుదిరినంత మాత్రాన సినిమా హిట్ అవుతుందా? నటుల ‘ఇమేజ్’ పెరుగుతుందా? పెరగదు. ఇంకా ఏదో కావాలి. అదే పవర్‌ఫుల్ ‘డైలాగ్’. ఒక పంచ్ మాట. అది పడితేనే నటులకు కిక్ వస్తుంది. స్టార్ ఇమేజ్ ఏర్పడుతుంది. అలాంటి మాటల్ని రాస్తూ.. తెలుగు తెర మీద మాయ చేసే ‘డైలాగ్ రైటర్స్’ అనుభవాలను వారం వారం మీ ముందు ఉంచబోతోంది ‘నవ్య’. అందులో భాగంగా నలభై ఏళ్లలో – నాలుగొందల సినిమాలకు రాసిన సినీ రచయిత సత్యానంద్‌తో ఈ కొత్త శీర్షికను ప్రారంభిస్తున్నాం..

“సార్, మీరు ఇండస్ట్రీకి వచ్చి నలభై ఏళ్లు అయ్యింది. మీరు రాసిన సినిమాలు నాలుగొందలు దాటాయి. వాటిలో మీరు రాసిన కొన్ని మంచి డైలాగులను ‘నవ్య’ పాఠకులతో పంచుకోగలరా ?” అని సత్యానంద్‌ను అడిగాము. “ఏ డైలాగని చెప్పమంటారు? రాయడం తప్ప గుర్తుంచుకునే అలవాటు లేదు నాకు” అంటూనే శ్రీనగర్‌కాలనీలోని సాయిసదన్‌లో తను ఉంటున్న ఫ్లాట్‌కు రమ్మన్నారాయన. సహజంగా సినిమా వాళ్ల ఇళ్లకు వెళ్లినప్పుడు ముందుగదిలో కనిపించే దృశ్యం – అవార్డుల ప్రతిమలు, వందరోజుల షీల్డులు. అయితే ఆయన ఇంట్లో అవేవీ లేవు. రాక్‌ల నిండా ఆంగ్ల పుస్తకాలే దర్శనమిచ్చాయి. సినిమాలు తప్ప మరో ధ్యాసలేని సత్యానంద్ 1973లో ఆదుర్తి సుబ్బారావు తీసిన ‘మాయదారి మల్లిగాడు’తో కెరీర్‌ను మొదలెట్టి.. ఈ మధ్యనే రామానాయుడు నిర్మించిన ‘నేనేం చిన్నపిల్లనా’ వరకు రాస్తూనే ఉన్నారు. తెలుగు సినిమా తెర మీద ‘కథ, మాటలు, స్క్రీన్‌ప్లే- సత్యానంద్’ అన్న కార్డు ఇప్పటికీ పడుతూనే ఉంది.

ఎవరు అమ్ముకోలేదు?
“ఎక్కడని మొదలు పెట్టేది? నాలుగొందల సినిమాలకు రాశాను. ఎందులో ఏ డైలాగ్‌ను చెప్పమంటారు? సరే, నా మొదటి సినిమా ‘మాయదారి మల్లిగాడు’తో మొదలుపెడతాను”అని మెల్లగా గుర్తుచేసుకోవడం మొదలుపెట్టారు సత్యానంద్. “రాజమండ్రిలో డిగ్రీ పూర్తి చేశాక.. సినిమాల మీద ఆసక్తితో మద్రాసు వెళ్లిపోయాను. ఆదుర్తి సుబ్బారావుగారు మా బంధువు. ఆయన దగ్గర రెండు సినిమాలకు పని చేశాను. ఒక రోజు ఆయన “సత్యానంద్, నీకొక సీన్ చెబుతాను. లైన్ పట్టుకుని ట్రీట్‌మెంట్ రాసివ్వగలవా? ప్రయత్నించు” అన్నారు. శ్రద్ధగా విని సీను మొత్తం రాసి ఆయన చేతిలో పెట్టాను. ఆయనకు నచ్చుతుందో లేదోనన్న టెన్ష్షన్ పడలేదు. “నువ్వు రాసింది బాగుంది. కృష్ణ, జయంతి, మంజులతో ‘మాయదారి మల్లిగాడు’ తీస్తున్నాను. దానికి నువ్వే డైలాగ్ రైటర్‌వు!” అన్నారు ఆదుర్తి.

రైటర్‌గా నాకదే తొలి సినిమా. అందులో వేశ్య వేషం వేసిన జయంతి ఒక కోర్టు సీనులో లాయర్‌తో గట్టిగా వాదిస్తుంది. వ్యక్తిగా తన తప్పును సమర్థించుకుంటూనే లోకం పోకడ చెప్పే డైలాగులు అవసరం. ఆ సమయంలో నాకైతే కోర్టు భాష తెలీదు. కొందరు తెలిసిన లాయర్లతో మాట్లాడాను. ఆ సీనులో- కోర్టు బోనులో నిల్చున్న జయంతి (వేశ్య పాత్ర)ని “అందాన్ని అమ్ముకోవడం నీచంగా అనిపించలేదా?” అని సీరియస్‌గా ప్రశ్నిస్తాడు లాయర్. అప్పుడామె “అమ్మకం అనేది అనాధిగా లోకంలో వస్తున్నది. ఎవరికి ఉన్నదాన్ని వారు అమ్ముకుంటూనే ఉన్నారు. కొందరు పదవుల్ని అమ్ముకుంటున్నారు. కొందరు పరపతిని అమ్ముకుంటున్నారు.

కొందరు మాటను అమ్ముకుంటున్నారు. కొందరు ఓటును అమ్ముకుంటున్నారు. కొందరు వరకట్నం పేరుతో కొడుకుల్ని అమ్ముకుంటున్నారు. కొందరు కన్యాశుల్కం పేరుతో కూతుళ్లని అమ్ముకుంటున్నారు. వాళ్లది తప్పు కానప్పుడు నాది తప్పు ఎందుకు అవుతుంది?” అంటూ లాయర్‌నే ఎదురు ప్రశ్నిస్తుంది. వాదోపవాదాలను విన్న జడ్జి “చూడమ్మా నువ్వు ఏం చదువుకున్నావు?” అని అడిగితే “ముప్పయి ఏళ్ల జీవితాన్ని చదువుకున్నాను.. నా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చదువుకున్నాను” అని సమాధానం ఇస్తుంది. అప్పట్లో ఈ డైలాగులు సినిమాకే హైలైట్ అయ్యాయి.

ఎలా కొట్టాను దెబ్బ..
మోహన్‌బాబు, నేను మంచి స్నేహితులం. ఆయనకు డైలాగులంటే చాలా ఇష్టం. అతని బలం డైలాగ్ డెలివరీనే! వాటిని చెప్పడంలో తనకో ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకున్నారు. మోహన్‌బాబు ఉన్నాడంటేనే ప్రేక్షకుల్లో కొన్ని అంచనాలు ఉండేవి. ‘పదహారేళ్ల వయసు’కు రాస్తున్నానప్పుడు. ఇందులో మోహన్‌బాబు పాత్ర బాగుంటుంది. “ఒరే, నాకు పవర్‌ఫుల్ డైలాగులు ఉండాలి. పెద్ద పెద్దవి రాసివ్వు” అని మా ఇద్దరి మధ్య ఉన్న చనువుతో అడిగేవారు. ‘పదహారేళ్ల వయసు’ డైరెక్టు తెలుగు కథ కాదు. తమిళ కథ. అందులో రజనీకాంత్ చేశారు. ఎదుటివాళ్లను ఏడిపిస్తూ ‘ఇదెప్టి ఇరికు’ (ఇది ఎలా ఉంది?) అనే ఊతపదాన్ని అంటుంటాడు అతను. అదే పాత్రను తెలుగులో మోహన్‌బాబు చేశారు.

‘ఇదెప్టి ఇరికు’ అనే పదాన్ని తర్జుమా చేసే దగ్గరే సమస్య వచ్చింది. మామూలుగా అయితే ‘ఇది ఎలా ఉంది’ అనాల్సి వస్తుంది. ఆ పదం మాకెవరికీ నచ్చలేదు. అందులో పంచ్ లేదు. అదే పదాన్ని – మోహన్‌బాబు శరీరభాష, ఉచ్చారణ శైలికి తగ్గట్టు ‘ఎలా కొట్టాను దెబ్బ’ అని రాశాను నేను. దాన్నే సినిమాలో పెట్టాము. ఆ పదం బాగా పాపులర్ అయ్యింది. అదే మాటను ఒక సన్నివేశంలో మోహన్‌బాబుకి కౌంటర్ ఇచ్చేందుకూ వాడుకున్నాం. “ఏరా కుంటోడా ఇట్రా” అని అటుగా వెళుతున్న చంద్రమోహన్‌తో కెలుక్కుంటుంది మోహన్‌బాబు బ్యాచ్.

అంతవరకు అమాయకంగా ఉన్న అతను కుంటుకుంటూ సీరియస్‌గా వచ్చి మోహన్‌బాబుకు లాగి ఒక్కటిస్తాడు. అది చూసి అక్కడున్న వాళ్లందరూ ఆశ్చర్యపోతారు. మోహన్‌బాబువైపు నోరెళ్లబెట్టి చూస్తున్నప్పుడు.. అతని పక్కనే నిల్చున్న సహచరుడు ఒకడు ‘ఎలా కొట్టాడు దెబ్బ’ అని రివర్స్‌లో చెప్పి ప్రేక్షకుల్ని నవ్విస్తాడు.

న్యాయమనేది..
ఎన్‌టిఆర్‌తో త్రివిక్రమరావు ‘జస్టిస్ చౌదరి’ తీస్తున్నారప్పుడు. ఆ సినిమాకు రాఘవేంద్రరావు దర్శకులు. అందరం కలిసి కథను తయారు చేశాం. దాన్ని ఒక శుభముహూర్తాన ఎన్‌టిఆర్‌కు వినిపించి ఓకే చేయించుకోవాలి. “బ్రదర్ మీరు తెల్లవారుజామున నాలుగు గంటలకు రండి. కథ చెబుదురుగాని” అన్నారాయన. వెళుతూనే “చెప్పండి బ్రదర్” అన్నారు. “సార్, ఇందులో మీది గంభీరమైన జడ్జి పాత్ర..” చెబుతుండగానే ఆయన – “జడ్జి పాత్ర అంటే ఏమంత ఆసక్తిగా ఉంటుంది బ్రదర్?” అన్నారు. “ఇందులో మంచి ఫ్యామిలీ డ్రామా ఉంది..” అంటూ కథ, మాటలు చెప్పాను. ఆయన ఏం చెబుతారా అని టెన్షన్‌తో ఎదురుచూస్తున్నప్పుడు “నేను మళ్లీ షూటింగ్‌లోనే మీకు కనిపిస్తాను. కథ ఓకే. అంతా సిద్ధం చేసుకోండి.

మనం ఈ సినిమా చేస్తున్నాం” అంటూ వెళ్లిపోయారు. అయితే ఈ సినిమాకు కొన్ని చోట్ల డైలాగులు రాయడం నాకొక సవాలుగా మారింది. తన తమ్ముడు ఒక నేరంలో ఇరుక్కోవడంతో విలన్ వేషం కట్టిన సత్యనారాయణ.. ఆ కేసును వాదించే జడ్జి ఎన్‌టిఆర్ ఇంటికి వెళతాడు. అప్పుడు -“నా తమ్ముడు చేసింది నేరమే అయినా వాడు నిర్దోషి అని మీరు తీర్పు ఇవ్వాలి” అని రవ్వంత బెదిరింపు స్వరంతో చెబుతాడు సత్యనారాయణ. ఆ మాటకు సమాధానంగా ఏ కుర్రహీరోకో అయితే “ఏంది బే నువ్వు నాకు చెప్పేది?”లాంటి మాటలేవో రాయాలి. కాని ఇక్కడున్నది ఎవరు? ఎన్‌టిఆర్! అందులోనూ ఆయనది గంభీరమైన జడ్జి వేషం. అందుకు బాగా ఆలోచించి రాసిన మాటలను అంతే అద్భుతంగా చెప్పారాయన.

“న్యాయమనేది ఎవరి చేతిలోనో కీలుబొమ్మ కాదు.. ఇష్టం వచ్చినట్లు ఆడుకోవడానికి. న్యాయమనేది ఏ ఒక్కడి స్వార్జితమో కాదు.. ఇష్టమొచ్చినట్లు వాడుకోవడానికి. న్యాయమనేది మార్కెట్‌లో అమ్మజూపే సరుకు కాదు. ఖరీదిచ్చి కొనుక్కోవడానికి. (కాస్త స్వరాన్ని పెంచుతూ, కనుబొమలు పైకి లేపుతూ) న్యాయమనేది మీ అమ్మ కన్న బిడ్డ కాదు. నువ్వు చెప్పినట్లు వినడానికి” అంటూ సింహంలా గర్జించి చెప్పిన ఎన్‌టిఆర్‌ను, ఆ సినిమాను కూడా మరిచిపోలేము.

బాక్స్ బద్దలవుతుంది..
డైలాగ్ రైటరే అన్నీ రాస్తాడనుకోవడం పొరపాటు. అప్పటికప్పుడు సెట్‌లో నటీనటులు కూడా మంచి డైలాగుల్ని మన మీదికి విసురుతుంటారు. బాగున్నాయనిపిస్తే వాడేసుకోవచ్చు. అలాంటి అనుభవమే ‘రౌడీ అల్లుడు’ తీసే టైమ్‌లో జరిగింది. ఒక సీన్‌లో – చిరంజీవి మానసిక ఆరోగ్యాన్ని తేల్చేందుకు డాక్టర్ వేషంతో వస్తాడు బ్రహ్మానందం. అతని చంకలో ఒక చిన్న నల్లటి సూట్‌కేస్ ఉంటుంది. బ్రహ్మానందం వేసే ప్రశ్నలకు చిరంజీవి వ్యంగ్యంగా సమాధానం ఇస్తుంటాడు. ఆఖర్న “నాతో పెట్టుకుంటే బాక్స్ బద్దలవుతుంది” అంటారు చిరు. అదొక చిన్న డైలాగ్. కాని భలే పాపులర్ అయ్యింది. అప్పట్లో అదొక ట్రెండ్‌ను సెట్ చేసింది. నిజానికి ఆ ఐడియా నాకొచ్చింది కాదు. బ్రహ్మానందం ఏదో ఒక ఊరికి వెళుతున్నప్పుడు ఎవరో కుర్రాడు పక్కనున్నోడితో “ఏంట్రోయ్ నేనంటే ఏమనుకున్నావ్? కొడ్తే బాక్సు బద్ధలైపోతుందిరోయ్” అని తమాషాగా అన్నాడట. ఆ మాటను బ్రహ్మానందం చిరంజీవితో చెప్పాడట. “ఈ మాట భలే ఫన్‌గా ఉందండీ. ఎక్కడైనా పెడితే బావుంటుందేమో ఆలోచించండి”అని చిరంజీవి నాతో చెప్పారు. నాక్కూడా నచ్చడంతో వాళ్లిద్దరికీ మధ్య నడిచే సన్నివేశానికే రాశాను.

ఆస్తి నాకు పాస్తి నీకు..
నేను రాసిన వాటిలో మంచి మాటలున్న మరో సినిమా ‘దేవత’. అక్కాచెల్లెళ్లుగా నటించిన జయప్రద, శ్రీదేవిల మధ్య సెంటిమెంట్‌ను పతాక సన్నివేశాలకు తీసుకెళ్లాల్సి వచ్చింది. ఇంకో సీన్‌లో శోభన్‌బాబుతో శ్రీదేవి “మా అక్క ఒక దేవత. మంచి తప్ప చెడు, పుణ్యం తప్ప పాపం తెలియని ఆ దేవతను అందుకోగలిగిన దేవుడివి నువ్వు ఒక్కడివే” అంటుంది. “ఆమె బతుకులో దీపం పెట్టడానికి నువ్వు చీకట్లోకి నడిచావు” అంటాడు శోభన్. ఇలాంటి భారమైన మాటలే కాదు.. సినిమాలో హాస్యానికీ కొదవ లేదు. ఆస్తి పంపకం గురించి ఒక చోట మోహన్‌బాబు “ఆస్తీపాస్తిలో ఆస్తి నాకు పాస్తి నీకు. ఇల్లువాకిలిలో ఇల్లు నాకు వాకిలి నీకు. పొలంపుట్రాలో పొలం నాకు పుట్ర నీకు. గొడ్డుగోదాలో గొడ్డు నాకు గోదా నీకు” అని చెప్పే డైలాగుల్ని తెలుగువాళ్లు ఎన్నటికీ మరిచిపోలేరు.

తొలి చిత్రాలకు..
నాగార్జున ‘విక్రమ్’, పవన్‌కళ్యాణ్ ‘అక్కడ అమ్మాయి- ఇక్కడ అబ్బాయి’, మహేష్‌బాబు ‘రాజకుమారుడు’ ఇవన్నీ ఆ హీరోలు అరంగేట్రం చేసిన సినిమాలు. వీటన్నిటికీ నేనే డైలాగ్ రైటర్ని. అప్పటికి కొత్త హీరోలైనా సరే, వారి ఇమేజ్‌ను పెంచేలాగే డైలాగుల్ని రాయాలి. అది వాళ్ల కెరీర్‌కు అవసరం. అయితే మోతాదు మించితే నష్టం కలిగిస్తుంది. నాగార్జున చేసిన ‘విక్రమ్’ మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చిన సినిమా. సెంటిమెంట్ కూడా ఉంది. అవన్నీ దృష్టిలో పెట్టుకుని రాస్తున్నప్పుడు “అబ్బాయి కొత్తవాడు. లెంతీ డైలాగులు వద్దు. తక్కువ మాటలతో ఎక్కువ యాక్షన్, గ్లామర్‌లతో నడిపిద్దాం” అన్నారు ఆ సినిమాకు దర్శకుడైన వి.మధుసూదనరావు. అనుకున్నట్లే సింపుల్ డైలాగుల్ని రాయాల్సొచ్చింది. నాగార్జునకు అది తొలి సినిమా అయినప్పటికీ చాలా ఎనర్జిటిక్‌గా చెప్పారు. ఆ నాటికి ఆయనకు తెలుగు చదువుకోవడం కాస్త కష్టంగా ఉండేది.అందుకని ఆ డైలాగుల్ని ఇంగ్లీషులో రాసుకుని చెప్పేవారు.

ప్రతి హీరో స్వభావం, ఆలోచనలు, నటనలను ప్రతి డైలాగ్ రైటర్ పరిశీలిస్తుంటారు. ఆ ఇమేజ్‌కు తగ్గట్టే రాస్తారు ఎవరైనా. పవన్‌కళ్యాణ్‌కు అలాగే రాశాను. చిరంజీవి సినిమాలకు రాస్తున్నప్పటి నుంచి పవన్ నాకు బాగా తెలుసు. ఆయనకు పుస్తకాలంటే ఇష్టం. మా ఇంట్లో ఆంగ్ల సాహిత్య పుస్తకాలు చాలా ఉండేవి. వాటి కోసం మా ఇంటికి వచ్చేవారాయన. ఒకప్పుడు థ్రిల్లర్, క్రైమ్, ఫిలాసఫీ పుస్తకాలను బాగా చదివేవారు. ఆ తర్వాత ప్రపంచ చరిత్రలో ప్రముఖులైన స్టాలిన్, హిట్లర్, మావోల పుస్తకాలను చదివేందుకు ఆసక్తి చూపించేవారు. సరే ఇదలా ఉంచితే – అతని గొప్ప లక్షణమేమిటంటే – ఏ డైలాగ్ అయినా ముందు చదువుకుని, ఓన్ చేసుకుంటారు. ఆ తర్వాత చదివి వినిపిస్తారు. అప్పుడేమీ అనిపించదు.

షూటింగ్ స్పాట్‌లోకి వెళ్లాక.. మనమెవ్వరమూ ఊహించని విధంగా చెప్పడం పవన్ గొప్పదనం. అంత అద్భుతంగా డైలాగ్స్ చెప్పి అందర్నీ ఆశ్చర్యపరుస్తారు.’అక్కడ అమ్మాయి-ఇక్కడ అబ్బాయి’ మొదటి సినిమా అయినా డైలాగ్స్‌ను చెప్పడంలో ఆయన ఏమాత్రం ఇబ్బంది పడలేదు. డైలాగులు కాలాన్ని బట్టే పుడతాయి. నాగేశ్వరరావు టైమ్‌లో హీరోయిన్ అక్కడుంటే హీరో ఇక్కడ నిల్చుని మాట్లాడుకునేవారు. ఇప్పుడు సీను మారిపోయింది. ఏ కాఫీడేలోనో దగ్గర దగ్గర కూర్చుని మాట్లాడుకుంటుంటారు యువతీయువకులు. కాబట్టి కాలాన్ని బట్టి సినిమాలు, సినిమాలకు తగ్గట్టు డైలాగులు రాయాల్సి వస్తుంది.”

రజనీకాంత్ అగ్గిపుల్ల..

రైటర్ ఒకటనుకుని రాస్తే, దాన్ని రెట్టింపు చేసి అవలీలగా నటించే వాళ్లలో అగ్రగణ్యుడు రజనీకాంత్. తెలుగులో ఆయన నటించిన ‘ఆమె కథ’కు డైలాగులు రాసేప్పుడు నాకీ అనుభవం ఎదురైంది. సినిమాలో అదొక కీలక సన్నివేశం. ఇందులో రజనీది నెగటివ్ రోల్. ఒక చోట ఒక డైలాగ్ చెప్పి, ఎదురుగ్గా ఉన్న ఆడమనిషి చెంపమీద ఒక దెబ్బ వేయాలి. అది సీను. అందుకు ఆయన చెప్పాల్సిన డైలాగ్ “లోకంలో ఏదైనా సరే పాడైపోతే దాని వాడకం తగ్గిపోతుంది. ఒక్క ఆడది మాత్రం పాడైపోతే దాని వాడకం పెరుగుతుంది. అందుకే నిన్ను పాడుచేసి, నీతో బిజినెస్ చేస్తున్నాను”. దాన్ని చదివిన రజనీకాంత్ “బాగుంది. అయితే కొంచెం స్టయిల్ మారుద్దామా?” అనడిగారు. “ఎలా చేద్దామో చెప్పండి” అన్నాను నేను. “ఆ డైలాగ్ చెప్పి, ఆమెను ఒకటి పీకాలి. అంతేకదా!” అన్నారు. “అవును” అంటూ ఆయన ఏమి చెబుతారోనన్న ఆసక్తితో ఆయన వైపు చూస్తున్నాము. “ఏమీలేదు. ఆ డైలాగ్ చేప్పే ముందు కుడిచేతిలో అగ్గిపుల్ల, ఎడం చేతి వేళ్ల మధ్య సిగరెట్ పెట్టుకుంటా. కుడిచేత్తో కొడుతూ అగ్గిపెట్టె మీద అగ్గిపుల్లను గీసుకున్నట్లే చెంపమీద దెబ్బవేసి అగ్గిపుల్ల గీసుకుని… ఆ అగ్గిపుల్లతో ఈ చేతిలో ఉన్న సిగరెట్‌ను ముట్టించుకుంటాను. అంతే! ఎలా వుంటుంది?” అన్నారు రజనీ. “అద్భుతం” తప్ప మరోమాట రాలేదు మాకు. రజనీ సినిమాలకు పనిచేసిన అనుభవం నాకెంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. నన్నోసారి ఆయనింటికి భోజనానికి ఆహ్వానిస్తే వెళ్లాను. అంత పెద్ద ఇమేజ్ కలిగిన హీరో అన్న భావనేదీ తన మనసులోకి రానివ్వకపోవడం ఆయన గొప్పదనం. ఇద్దరం భోంచేశాక నేను బయటికొస్తున్నప్పుడు ఆయనే గేటు తీసి, కారు డోర్ వేసే వరకు పక్కనుండి మర్యాదలు చేశారు.

‘అత్తకు యముడు – అమ్మాయికి మొగుడు’లో అత్తకు, అల్లుడికి మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో ప్రతిసీను ఉత్కంఠకు గురి చేసేలా రాశాను. ఒకచోట “నా కూతుర్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావో చెప్పు?” అని వాణిశ్రీ ప్రశ్నిస్తే “నీ కూతురు ఆడది కనుక, నేను మగాణ్ణి కనుక. కాదంటావా – నీకేమైనా డౌటా?” అని చిరు చెప్పే డైలాగ్,, అతని స్టయిల్ అద్భుతం.

ఏ ‘ప్రేమించు’లో హీరోయిన్ లయ అంధురాలు. అంధుల భాష, ఉద్వేగాలు ఎలా ఉంటాయి? జీవనవిధానం ఎలా ఉంటుంది? మనం బయట రోజూ చూస్తూనే ఉంటాం. అయితే అదే పనిగా వాళ్ల మధ్యకు వెళ్లి పరిశీలిస్తే కాని పూర్తిగా అర్థం అవ్వదు. ఫీలైతేనే కొన్ని డైలాగుల్ని బాగా రాయగలం. అందుకని నేను రెండుసార్లు హైదరాబాద్‌లోని ఒక అంధపాఠశాలకు వెళ్లాను. అక్కడున్న పిల్లల్ని పరిశీలించి, వారితో కాసేపు మాట్లాడి వచ్చాకే.. ఈ సినిమాకు మాటల్ని రాయడం సులువైంది. హీరోయిన్ లయ కూడా నాలుగుసార్లు ఆ పాఠశాలకు వెళ్లొచ్చి నటించింది.
ఏ రాఘవేంద్రరావు ‘నిండు నూరేళ్లు’ తీస్తున్న సమయం అది. అనారోగ్యంతో బాధపడుతున్న కొడుకుకు తల్లి జయసుధ. “ఆ పిల్లవాడు నెల రోజుల్లో చనిపోవాలి” అని కథా చర్చల్లో నిర్ణయించుకున్నాం. ఒక సన్నివేశంలో డాక్టర్ వచ్చి.. ఈ అబ్బాయికి బ్లడ్ క్యాన్సర్ వచ్చిందని చెబితే.. ఆ పిల్లవాడు ఎన్ని రోజుల్లో చనిపోతాడో మనకు తెలిసుండాలి. లేకపోతే డైలాగులు రాశాక చిక్కులొస్తాయి. అందుకని అప్పట్లో కొందరు వైద్యుల్ని కలిసి ఏ జబ్బు వస్తే సుమారుగా ఎన్ని రోజుల్లో చనిపోతారో కనుక్కుని మరీ మాటల్ని రాశాను.

ఏ ‘న్యాయం కావాలి’లో కోర్టు సన్నివేశం ఒకటుంది. దాని కోసం కొన్ని రోజులపాటు చర్చలు నడిచాయి. అందులో చిరంజీవిది నెగిటివ్ పాత్ర. శారదను హైలైట్ చెయ్యాలి. మంచి డైలాగులు పడటం కోసం బాగా ఆలోచించాల్సి వచ్చింది. అందులో చిరు ఒక చోట “తప్పు ఆడది చేసినా.. మగాడు చేసినా శిక్ష మాత్రం ఆడదానికే. ఎందుకంటే దేవుడు మా మగాడు కనుక” అంటాడు. ఆ డైలాగ్‌లో ఉన్న లాజిక్ అప్పట్లో చాలామందికి నచ్చింది. అయితే ఈ డైలాగ్‌ను పెట్టొచ్చో లేదోనన్న సంశయం మొదలైంది. ఇదే సినిమాలో అతిథి పాత్ర వేసేందుకు దాసరినారాయణరావు వచ్చారు. అప్పుడు నేను రాసిన డైలాగ్‌ను తీసుకెళ్లి ఆయనకు చూపించారు. ఆయన “బెస్ట్‌గా రాశారు. బాగుంది” అనడంతో అది తెర మీదికొచ్చింది.
ఏ కమల్‌హాసన్‌తో ‘ఒక రాధ ఇద్దరు కృష్ణులు’ సినిమాను తిరుపతి దగ్గరున్న తలకోనలో తీస్తున్నప్పుడు.. డైలాగ్ రైటర్‌గా నేనక్కడికి వెళ్లాను. కాగితం మీద రాసిచ్చిన డైలాగుల్ని ఏకాగ్రతతో చదివేవారు కమల్. అప్పటికప్పుడు చిన్న చిన్న మార్పులు చేయాలని అడిగేవారు. మేమందరం విశ్రాంతి గదిలో ఉన్నప్పుడు వచ్చి.. “రేపు షూటింగ్‌లో ఎలా చేస్తానో చేసి చూపిస్తాను. చూస్తారా?” అని అడిగి డైలాగులు చెప్పి, నటించి చూపించడం ఇప్పటికీ గుర్తు. నేను రాసిన డైలాగులకు అదనపు హావభావాలను జోడించేవారు కమల్. ఒక్కోసారి మనం నియంత్రించకపోతే ఎక్కడికి వెళతారో ఆయనకే తెలియదు. నటన అంటే అంత పిచ్చి ఆయనకు.

మల్లెంపూటి ఆదినారాయణ
ఫోటో : శ్రీనివాస్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నా దారి తీరు -72 నమ్మకస్తులైన ఇద్ద్దరు నిఖా మాన్లు

       నా దారి తీరు -72

నమ్మకస్తులైన ఇద్ద్దరు నిఖా మాన్లు

కాటూరు పొలం లో బోర్ వేయటం అద్భుతమైన జలధార పడటం ,నాలుగు అంగుళాల గొట్టం ద్వారా నీరు ఎడతెరపి లేకుండా రావటం మా అదృష్టం .మా చేలకు నీరు సమృద్ధిగా అందివ్వటం తో బాటు చుట్టు ప్రక్కల రైరులు కూడా ఈ బోరు మీద చాలా మంది ఆధార పడ్డారు .వేసవిలో చెరుకు తడికి నారలు పోసుకోవటానికి ఆరు  తడికి అందరూ మా మీదే ఆధార పడ్డారు .అప్పటి దాకా ఎన్నో ఏళ్ళ నుండి మాకు సహకరిస్తున్న వర్రే సోదరులు చెరుకు వేశారు మాకోసం .బాగా పండింది .మాకు రావాల్సింది అంతా బాగానే ముట్టజెప్పారు .మ పేరనే ఫాక్టరీ కి చెరుకు తోలి నేనే డబ్బు తీసుకొనేట్లు చేశారు .చెరుకు రెండు ఏళ్ళ పంట .రెండో పంట అయిన తర్వాత వాళ్ళు లెక్కలకు వచ్చారు .అన్నీ సరిగ్గా లెక్క చెప్పాను .కాని అందులో తమ్ముడు భాస్కర రావు కొంచెం తొందర మనిషి .నేనేదో కొంత కక్కూర్తి పడ్డానని  వాళ్లకు రావాల్సింది  అంతా ఇవ్వకుండా కొంత నోక్కేశానని కడవకొల్లు లో ఎవరితోనో అన్నట్లు నాకు తెలిసింది .నన్ను ‘’తమ్ముడూ ‘’అని పిలిచే భాస్కరరావు లో ఇంత క్రూర ఆలోచన ఉండటం నేను సహించ లేక పోయాను .ఒక రోజు ఇంటికి పిలిపించి అన్న దమ్ములిద్దరితోనూ మాట్లాడాను. మళ్ళీ లెక్కలన్నీ చూపించాను. అన్న వెంకటస్వామి చాలా మర్యాదస్తుడు మా నాన్న కాలం నుండి ఉన్న అత్యంత నమ్మకమైన వాడు .అందుకని ఆతను కూడా ‘’తమ్ముడు గారూ మా వాడు తొందర పడ్డాడు .మనసులో పెట్టుకోకండి .దీన్ని ఇంతటితో మరిచి పోదాం ‘’అన్నాడు భాస్కర రావు కూడా తప్పు ఒప్పుకున్నాడు .వీళ్ళు ఎప్పుడు మా ఇంటికి వచ్చినా అమ్మ వాళ్లకు స్వయం గా వడ్డన చేయించి కడుపు నిండా భోజనం పెట్టి పంపేది మా నాన్న కాలం లోనూ మా కాలం లోనూ కూడా .పురి కట్టేటప్పుడు ధాన్యం బండ్ల మీద తోలుకొచ్చి కొట్లో పోయటం ,పురి కట్టటం ,ఇంటి దగ్గరే వెంట్లు పేనటం అంతా వాళ్ళు చేశేవారు .వాళ్ళ తండ్రి సుబ్బయ్య కూడా అంత బాధ్యత గా ప్రవర్తించేవాడు వాళ్ళ తో పాటు కొందరు కూలీలు వచ్చే వారు .వీరందరికీ అమ్మ మా ఆవిడ వండి తృప్తిగా భోజనం పెట్టి చేతిలో కొంత డబ్బు పెట్టి పంపేవాళ్ళం .ఇదొక ఆనవాయితీ గా వచ్చింది అది అలానే అమలు చేశాం .మా స్వంత మనుష్యుల  కిందనే చూశాం .మానాన్నాను బాబాయి గారు అనేవాళ్ళు .మా అమ్మను పిన్నీ అని పిలిచేవారు .

నా మనసులో భాస్కర రావు ఉదంతం కలత పెడుతూనే ఉంది.వీళ్ళను తప్పించటం ఎలాగా అని ఆలోచిస్తున్నాను .కాటూరులో మా ప్రక్క చేను కడవకొల్లు లో ఒకప్పుడు ఉండి అప్పుడు బెజవాడలో ఉంటున్న ఒక బ్రాహ్మణాయన పొలం ఉంది. దాన్ని సీతారామయ్య అనే ఉప్పరి అతను సాగు చేసేవాడు .వాళ్ళ నాన్న పెద్ద మీసాలతో పొట్ట తో పొట్టిగా లావుగా నీరుకావి పంచ ,కోరా బనీను తో ఉండేవాడు . అతను కమ్మరి పనీ బాగా చేసేవాడు .సీతారామయ్య ఈ కరణం గారి పొలం లో పని చేస్తుంటే నాకు ;కాళింది;మడుగులో నాగేన్ద్రుడి పడగల పై నృత్యం చేసే కృష్ణుడు కనీ పించేవాడు. తన పనేదో తాను చేసుకు పోవటం మర్యాద గా మాట్లాడటం చాలా స్పీడ్ గా పని చేయటం నాకు ఎంతో నచ్చాయి .అందుకని అతనికి మా పొలం పనులు అప్పగిస్తే బాగుంటుంది అని పించింది .ఆ విషయ  పై తర్జన భర్జన పడుతున్నాను .ఒక సారి చేలో కనీ పిస్తే సీతారామయ్య ను మా పొలం వ్యవసాయం కూడా చూడమని అడిగాను .కొన్ని రోజులు ఆలోచించి చెబుతానన్నాడు .అలానే ఒక రోజు ఇంటికి వచ్చి తాను మా చేను సంగతి చూడటానికి ఒప్పుకొన్నాడు .బోరు ఉంది కనుక ఎకరానికి పద్దెనిమిది బస్తాలు మాకు ఇచ్చి ,ఖర్చులు పెట్టుకొని మా తరఫున సాగు చెయ్యమన్నాను. నీళ్ళు కరెంటు ఖర్చు మాదే .సరేనన్నాడు .ఒక మంచి రోజు నేనే చూసి పొలం పని లోకి దిగమన్నాడు .ముందు గా సరి హద్దు గట్లు పెట్టటం తో అతను మా పని లో ఉన్నట్లయింది .నా టెన్షన్ తగ్గింది .వర్రే వాళ్ళు ఇంటికి వచ్చి ‘’తమ్ముడు గారూ !ఇలా చేశారేమిటి ?’’అని అడిగారు .అప్పుడు నేను ‘’మీ అన్నదమ్ములలో ఒకరి మాట ఒకరికి పడటం లేదు .నా మీద నింద కూడా వేశారు .ఇలాంటి పరిస్తితులలో ఒకరి మీద ఒకరికి నమ్మకం పోయిన తర్వాతా ఇక మీరూ మేమూ ఎవరి దారి వారు చూసుకోవటం మంచిది’’ అన్నాను .ఏమీ అనలేక వెళ్ళిపోయారు .ఇలా సీతారామయ్య అనే సమర్ధుడు మా పొలం చూడ టానికి ఏర్పడ్డాడు.ఇది నాకు సంతృప్తి గా ఉంది పెద్దగా పొలం వెళ్ళకుండా తప్పింది. మా అమ్మాయి చిన్నపిల్ల గా ఉన్నప్పుడు సీతారామయ్య రంగ ప్రవేశం చేశాడు మాఅమ్మాయి విజ్జి అంటే మహా ముచ్చట పడేవాడు .అతని భార్యా ,కొడుకు బసవయ్య కూడా కస్టపడి పని చేసేవారు సీతారామయ్య కు మంచి ఆలోచన ఉండేది ,చక్కగా అమలు చేసేవాడు .బోరు ఉన్ది కనుక మే రెండో వారం లోనే నారు పోసేవాళ్ళం .జూన్ చివరికి బోరు నీళ్ళతో సాగు చేసేవాళ్ళం .పంట బాగా పందేది .లాభాలలోకి  వ్యవసాయం వచ్చింది .ఎప్పుడైనా మరీ అవసరం అయితేనే డబ్బుసహాయానికి నా దగ్గరకు వచ్చే వాడు .అలానే సర్దేవాడిని. పంటల్లో తీర్చేసే వాడు .ఇలా కొనసాగింది కొంతకాలం .

ఉయ్యూరు చేను ఫాక్టరీకి వెనక ఉంది .దీనిలో కూడా బోరు వేయాలనుకోన్నాం . మామయ్యగారి   చేను మా పక్కనే ఉంది ఇక్కడా కాటూరు లో కూడా .ఇప్పటిదాకా పద్మనాభమే మా వ్యవసాయం చూసేవాడు వాడిదీఅలవి కాని   వ్యవసాయం .ఖర్చులకు తగిన ఫలసాయం రావటం లేదు .ఎలా అని ఆలోచనలో పడ్డాను .మా నాన్న కాలం లో మా పొలం వ్యవహారాలూ చూసే మింట సత్యం మేనల్లుడు చిన్నబ్బాయి అనే  వెంకటరావు మంత్రాల రాధాకృష్ణ మూర్తి గారి పొలం చూసేవాడు .అతనూ కస్టపడి పని చేసేవాడిలా గమనించాను .ఒక రోజు చిన్నబ్బాయి ని అడిగాను మా పొలం కూడా చూడమని సరే నన్నాడు .మంచి నమ్మకస్తుడు .నెమ్మదిగా మాట్లాడేవాడు .కొడుకు సత్యం సహాయం కూడా ఉంది .బండీ ఎడ్లు ఉన్నాయి .కనుక ఇబ్బందేమీ లేదు .అతన్నీ మంచి రోజు చూసి చేలోకి దిగామన్నాను .గట్లు పెట్టటం తో పని ప్రారంభించాడు .కనుక ఉయ్యూరు సమస్యా తీరింది .ఇక్కడ తరచుగా చెరకు వేసేవాళ్ళం .బోరు వేయటానికి మంటాడలో ఒకకాపు ఆయన  దగ్గరకు వెళ్లి సరైన  ప్రదేశం చూసి చెప్పమన్నాను ఆయన అనుకొన్న రోజు వచ్చి చేతిలో ఒక చిన్న కర్ర పుల్లను రెండు చేతుల వేళ్ళ మధ్యా పట్టుకొని చేలో తిరిగాడు. ఒక చోట ఆపుల్ల గిరగిరా తిరిగింది అదే సరైన స్థానం బోరు వేయటానికి అని చెప్పాడు .సరే నని గుర్తుపెట్టుకొని పద్మ నాభం సాయం తో బోరు వేశాము .ఆయనకు నూట పదహార్లు తాంబూలం గా చిన్నబ్బాయి చేతికిచ్చి పంపాను .దాదాపు రెండువందల అడుగుల్లో నీరు పడింది .అంత గొప్ప ధార కాదు.ఇనపగోట్టాలు ఉయ్యూరులోనే తీసుకొన్నాం  బ్రహ్మం బావమరిది ఆరిక పూడి నాగేశ్వర రావు గారి దగ్గరా వెంకటేశ్వర దియేటర్ దగ్గరున్న ఇంకొక శిష్యుడి దాగ్గారా కొన్నాం .మోటారు కొనలేదు కాటూరు పొలం మోటారు తెచ్చి వాడేవాళ్ళం నాకు బోరుకు మోటారు బిగించటం ఆడించటం చేసేవాడిని .నా స్నేహితుదు సూరి నరసింహం కే.సి.పి. లో ఎలేక్త్రీషి యన్ .అతని సహాయం ఇక్కడా కాటూరు లోనూ తీసుకొనే వాళ్ళం అర్ధ రాత్రి అపరాత్రి ఎప్పుడు పిలిచినా డ్యూటీ వేళకాక పోతే నరసింహం వచ్చి వాలేవాడు .అలాగే నా శిష్యుడు చిలుకూరి కూడా  .బోరు వేసే ఖర్చులు ఉమ్మడి డబ్బు లోన్చేపెట్టాను   మూదు అంగుళాల  నీరు బానే పోసింది ..కరెంట్ కు కూడా పద్మనాభమే అప్పటి ఏం ఎల్ ఏ అన్నే బాబూరావు గారి స్నేహితుడు బందర్లో డివిజనల్ ఇంజినీర్ అవటం తో అప్లికేషన్ పెట్టిన వారం లోనే శాంక్షన్  అయింది .షెడ్డు కట్టాము అయితే ఇక్కడొక సమస్య వచ్చింది మొటారును అయిదు అడుగుల గుంటలో పెదితేకాని ఆడదని చెప్పారు .అలానే చేశాం .ఇక చెరుకు సాగుకు  ధోకా లేదు .చుట్టూ పక్కల వారికీ నీరు సప్ప్లై చేశాం .అప్పటిదాకా అంటే మా అమ్మ ఉన్నంత కాలం ఉమ్మడి గానే డబ్బు వాడాను .ఎవరికీ ఏమీ ఇవ్వలేక పోయాను .మాఅమ్మ మరణం తర్వాత మా అమ్మ పేరా ఉన్న ఎకరం పొలం లో అయివేజు మా ఇద్దరక్కయ్యలకూ చెరిసగం పంటలు రాగానే ఇచ్చేవాడిని .పార్టిషన్ డీడ్స్దీ అందరం కలిసి రాసుకొని ఎవరి వాటాకు ఎంత వస్తుందో అంతా ఇచ్చేసేవాడిని .   ఖర్చులు రాసి అందరికి అంద జేసేవాడిని . శిస్తులూ కరెంటు బిల్లులూ నేనే కట్టి లెక్కల్లో చూపించేవాడిని .నీళ్ళు పక్క చేను వాళ్లకు ఇస్తే వారిచ్చే డబ్బు కూడా జమల్లో చూపించేవాడిని .కొందరు రైతులు కల్లాలలో ధాన్యం రూపం లో ఇవ్వటం కూడా  ఉండేది .ఏమైనా మా రెండు బోర్లు బంగారు తల్లులు .గంగ మా పొలం లో కదం తొక్కు తోందా  అన్నట్లు అని పించింది .

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ –1-2-14-ఉయ్యూరు

 

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

ఆరవ జాతీయ చిన్నకధల పోటీ విజేతలకు సోమేపల్లి సాహితీ పురస్కారాలు -రమ్య భారతి దశమ వార్షికోత్సవ వేడుకలు -9-2-14 సా.6కు -బెజవాడ

ఆరవ జాతీయ చిన్నకధల పోటీ విజేతలకు సోమేపల్లి సాహితీ పురస్కారాలు -రమ్య భారతి దశమ వార్షికోత్సవ వేడుకలు -9-2-14 సా.6కు -బెజవాడsomepallipuraskaram 001

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

హోమర్ నుండి జాయిస్ దాకా -3(చివరి భాగం )

  హోమర్ నుండి జాయిస్ దాకా -3(చివరి భాగం )

జోనాధన్ స్విఫ్ట్

జోనాధన్ స్విఫ్ట్ రాసిన గలివర్ ట్రావెల్స్ ఎన్నో రకాల కొత్తదనాన్ని సంత రించుకుంది .ఇది ప్లేటో కు వ్యతిరేకం గా ఉన్నట్లు ఉంటుంది .ఇందులోని Houyhnhnmsఅనే వాళ్ళు స్వీయ నియంత్రణ కలిగి ,మంచీ మర్యాడకల ,నిజాయితీపరులు .సమన్వయము ఉన్న వారు .అప్పుడే నాగరకతలో ప్రవేశించిన నవీనులు .త్వరగా నేర్చే శక్తి ఉన్నవారు .అంత లేకి స్వభావం అంత అందమైన వారూ కారు .భయపడరు .పిరికి పందలూ కారు .చావు అంటే అసలు భయం లేని వారు .రచయిత స్విఫ్ట్  ‘ideal rational republic is much horse cultured ‘’అన్నాడు .’’hous’’లు వేదాంతులు ,వీరి జీవితం తర్కం పైన నడుస్తుంది .’’yahoos’’అనే వాళ్ళు సామాన్య మానవులు .వీరు తిండికి బానిసలు .ఈ యాహూ నే మన వాళ్ళు డాట్ కాం గా ఉపయోగిస్తున్నారు .’’justice is present when reason controls spirit and spirit controls appetite .’’ అని వీళ్ళ స్వభావాన్ని తెలియ జేశాడు .’’Hous’’అనే వారు బుద్ధి మంతులు ,ఆలోచనాపరులు . గలివర్ వంటి సైనికులను మంచి స్వభావాలు ధైర్య సాహసాలే నియంత్రిస్తాయి .సాధారణ మానవులైనా యాహూలు కనీస అవసరాలైన ఆకలి వంటి వాటి చేత  నియంత్రింప బడతారు .కనుక వీరిని రాజ్యం రాజ్యాంగం సంస్కరించి వృద్ధి లోకి తేవాలి .ఇందులో కొన్ని మాటలు చాలా అర్ధ వంతం గా ప్రయోగిస్తాడు స్విఫ్ట్ .’’hubris’’అంటే గర్వం తో మదించిన వాడు.గలివర్ మొదటి యాత్రలో తన లోకి తప్ప చుట్టూ ఉన్న ప్రపంచం అంతా చూస్తాడు .చివరి యాత్రలో స్నేహం బంధుత్వాలను అవతలివారు బలవంత పెడితే ఒప్పుకుంటాడు .దీన్ని అందుకే ‘’mock epic ends in mock tragedy .’’అన్నారు విశ్లేషకులు .స్విఫ్ట్ ఈ నవలలో జంతువుకు –ఆలోచనా పరులకు తేడా చూపిస్తాడు .మనిషి ఆలోచన వివేచనా పరుడిగా చిత్రిస్తాడు .తర్కానికి ప్రాధాన్యత నిస్తాడు హౌసులు రీజన్ కే ప్రాధాన్యత నిచ్చి ఆత్మను పట్టిన్చుకోరు .వీరికి ఆకలి గోల లేదు .యాహూలకు ఆకలే తప్ప ఆత్మ జ్ఞానం ,ఆలోచనా లేవు .గలివర్ యత్రికుడికి ఆకలీ ఆత్మా ఆలోచనా మూడూ ఉన్నాయి .అందుకని ఈ మూడిటిని వదిలేసి ‘ange beta’’ప్రపంచం లో ఏ మనిషి అతనికి కనీ పించలేదు .ప్లేటో కోరిన యుటోపియా కాని ,అఆధునిక మానవుడు కలలు కంటున్న సమాజం కాని ,సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం ఉన్న మనుష్యులు కాని కనీ పించలేదు .సోక్రటీస్ ‘’పరీక్షించని జీవితం జీవించటానికి అర్హమైంది కాదు ‘’అని చెప్పాడు .స్విఫ్ట్ ‘’స్వీయ విశ్లేషణ స్వచ్చమైన ఆలోచన కు పరిమిత మైతే అప్పుడు నువ్వు పరీక్షించిన జీవితం జీవించటానికి అర్హమైనది కాదు ‘’అని అభిప్రాయ పడ్డాడు .

      

  డాస్టొవ్ స్కి

 

డాస్తోవ్ స్కి  ‘’the brothers karmazov’’నవల రాశాడు .ఇతని దృష్టిలో ‘’god’s locomotive  passes over the bodies and souls of all characters .it is both a murder mystery and spiritual mystery .’’దేవుడు స్వేచ్చ అనే వరం ఇచ్చాడని భావించాడు .పడటం లేవటానికే అంటే చావటం మళ్ళీ పుట్టతానికే అనే తత్త్వం చెప్పాడు .అన్నిటికీ అందరూ బాధ్యులే నంటాడు.బాధలతో జ్ఞానం రాదన్నాడు .సమాజం పై ప్రేమ ,తోటివాడి పై సానుభూతి ఆదరణ ,అతని అస్తిత్వాన్ని గుర్తించటం అనేదే ‘’అందరూ  ఆన్నిటికి బాధ్యులు ‘’అన్న దానికి నిర్వచనం .

    Product Details

టి.ఎస్.ఇలియట్

ఇలియట్ రాసిన ‘’వేస్ట్ లాండ్ ‘’కావ్యం జగద్విఖ్యాతః మైంది .ఇది మరణం పునరుత్థానం లకు సంబంధించింది .అతని భావనలో స్మశానంలేక సమాధి  అంటే  ‘’emotional rather than intellectual .disillusions  meant melancholy ‘’.వేస్ట్ లాండ్ కవిత జీవితం లో చావు ను గురించి చెప్పింది .ఆ కవిత కొన్ని రేణువులే కాని అంత్య ప్రాసలు కావు (the poem is particles than rhymes).అది జీవితానికి అర్ధం వివరించేది .ఇందులోని నీరు అగ్ని పుట్టుక ,చావు ప్పునర్జన్మలకు స్థావరాలు .ఇందులో ‘’objective correlative theory ‘’ఉందని విశ్లేషకాభిప్రాయం .వేస్ట్ లాండ్ కవితను ‘’A ghost poem full of un identified voices of the dead phantoms ,invisible prophets ‘’గా అభివర్ణిస్తారు .భారతీయ పదాలను ఇందులో ఉపయోగించి పాశ్చాత్య దేశాలలో వాటి వ్యాప్తికి దోహద పడ్డాడు ఇలియట్ .దీన్ని ప్రచురించటానికి ఎజ్రా పౌండ్ కవి ఎంతో ప్రోత్సహించాడు .దీని నడక తమాషా గా ఇలా ఉంటుంది ‘’water rock ,rock water road ,road mountains ,mountains rock water ,water rock ‘’దీన్ని ‘’టైట్ పాటేర్న్ ‘’అన్నారు

 

       

జేమ్స్ జాయిస్

 

జేమ్స్ జాయిస్ రాసిన ‘’యులిస్సేస్’’ఆధునిక కవిత కు మార్గ దర్శకత్వం చేసింది . వ్యతిరేక మైనదికాదని ‘’yes’’అని ఉపయోగించాడని అంటారు .’’lovely nothingness of every day life ‘’ ను రచయిత ప్రత్యక్షం గా చూశాడు .కుటుంబ జననం ,జీవితం లోని సంతోషం ,విషాదం నిండి ఉంటుంది ‘’Joyce elebrates the creativity of the family ,the joys ,the sorrows of life ,the at –one –mea nt of author and reader through the shares of imaginative recreation afforded by great literature and the courage and dignity of which the human spirit is capable ‘’అనేది యులిసిస్ లో సారం గా చెప్పారు .దీనితో కవిత్వం లో ‘’చైతన్య స్రవంతి ‘’-స్ట్రీం ఆఫ్  కాం షస్  నెస్ ‘’ను ప్రారంభించిన మొదటి వాడని పించుకొన్నాడు జేమ్స్ జాయిస్ .

 

Product Details       

 

ఇలియట్ ,పౌండ్ ,జాయిస్ అనే ఈ త్రయం కవిత్వం లో కొత్త మార్గాలను తొక్కారు .కొత్త భావ వ్యాప్తి చేశారు .కొత్త లోకాలనూ సృష్టించి చూపించారు .అందుకే వీరు ‘’అమరత్రయం ‘’అని పించుకున్నారు .వీరిని అనుసరించి కవిత్వం రాయని ఆధునిక కవి ఏదేశం లోనూ లేడనే చెప్ప వచ్చు ఇలా ఆదికవి హోమర్ నుంచి జాయిస్ దాకా వచ్చిన అనేక మార్పులను ,కొత్త పద్ధతులను ,రచయిత ‘’వాలెస్ గ్రే ‘’అరచేతిలో అరటి పండులా చక్కని విశ్లేషణ తో మన ముందుంచాడు. గ్రే నిజం గా రచనకు ‘’గ్రేస్ ‘’తెచ్చాడు .

 

 

 

సమాప్తం

అమెరికా (హూస్టన్ )లో 7-10-2002 నాటి నా డైరీ నుండి

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-2-14-ఉయ్యూరు

Posted in అనువాదాలు | Tagged | 2 Comments