పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -45 మానవీయ కవి -జేమ్స్ రస్సెల్ లోవెల్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -45

అమెరికా కవులు –

మానవీయ కవి -జేమ్స్ రస్సెల్ లోవెల్

లోవెల్ ,హోమ్స్ఇద్దరు కవులేకాక వ్యాస రచయితలు కూడా ఇద్దర్నీ కలిపే ఉదాహరిస్తూన్తారు .లోవెల్ 22-2-1819 న మాసా చూసేట్స్ లోని  కేం బ్రిడ్జి లో పుట్టాడు .తండ్రి వద్ద పాత బాలడ్స్ ,జానపద గీతాలు నేర్చాడు .హార్వర్డ్ గ్రాడ్యుయేట్ అయ్యాడు .లా చదివి నా ప్రాక్టీస్ చేయలేదు .ఆఫీసు పెట్టినా క్లైంట్ ల కంటే పబ్లిషర్లు ఎడిటర్లను ఆకర్షించాడు .’’పెన్సిల్వేనియా ఫ్రీమన్ ‘’పేపర్ లో బానిసత్వ నిర్మూలనపై వ్యాసాలూ రాశాడు .మెక్సికో తో యుద్ధం వలన బానిస రాష్ట్రాలు  పెరుగుతాయని భావించాడు ‘’బిగ్లో పేపర్స్ ‘’లో సెటైర్లు దంచి రాశాడు .మొదటి కవితా సంపుటి ముద్రించాడు .ఇరవైలో ‘’ది విజన్ ఆఫ్ సర్ లాంఫాల్ ‘’రాసి రొమాంటిక్ అభిరుచి ఉన్నవారిని ఆకర్షించాడు .బిగ్లో పేపర్స్ లో ‘’బోస్టన్ కొరియర్ ‘’ ప్రారంభించి భిన్నత్వ ధోరణిలో నడిపాడు .యుద్ధ వ్యతిరేకం గా ఎన్నో కవితలు రాసి మెప్పించాడు .

‘’ez for war I call it murder –there you have it plain an flat –I donot want to go no further ‘’అన్నాడు ‘’ఏ ఫేబుల్ ఫర్ క్రిటిక్స్ ‘’రాసి తేలిక విషయాలపై దృష్టినీ పెట్టాడు .ఎమర్సన్ పో ,బ్రయంట్ మొదలైన వారి నందరిని ఉతికి ఆరేశాడు .

ఒక ఏడాది యూరప్ లో గడిపాడు .భార్య చనిపోయింది రచనలో మునిగాడు .లాంగ్ ఫెలో చైర్ కు ఎంపికైఆధునిక భాషలపై అనేక ఉపన్యాసాలిచ్చాడు .జర్మన్ ఫ్రెంచ్ ఇటాలియన్ భాషల్లో పండితుడైనాడు .స్పెయిన్ దేశానికి మంత్రి అయ్యాడు .రెండవ భార్య ఇంగ్లాండ్ లో ఉండగా చనిపోయింది .అమెరికా తిరిగి వచ్చి అనేక విమర్శనాత్మక వ్యాసాలూ రాశాడు .పది వాల్యూముల గ్రంధ రచన చేసిన ఉద్దండ పండితుడు .వందేళ్ళ వరకు రాయాల్సిన వన్నీ సిద్ధం చేసుకొన్నాడు .కాని పుట్టిన ఇంటిలోనే 12-8-1891న డెబ్భై రెండేళ్లకే చనిపోయాడు ..మధురమైన భాషలో కవిత్వం రాశాడు .రైమింగ్ బాగా తెలిసిన వాడు .మాండలికానికి హోదా ,గౌరవం కల్పించాడు .నిజాయితీ గా అసలైన యాంకీ గా ‘’హ్యూమర్ ను హ్యూమన్ ‘’ను మేళవించాడు .అమెరికం రొమాంటిక్ కవిగా ,’’ఫైర్ సైడ్ ‘’కవుల్లో ఒకడుగా గుర్తింపు పొందాడు .’’who ever is most universal is most national ‘’అని అంటాడు .బోస్టన్ ,హార్వర్డ్ బ్రాహ్మిన్ కల్చర్ కు ప్రతినిధి .ఆధునిక సివ్ల్ రైట్స్ ఉద్యమానికి ప్లాట్ ఫారం నిర్మించాడు .’’ది ప్రెసెంట్ క్రిసిస్ ‘’కవిత సివి ల్  వార్  కల్లోలాన్ని దృష్టికి తెచ్చింది .

James Russell Lowell circa 1855.jpg

 

 

అన్ని ప్రక్రియలకు ఆద్యుడు – ఎడ్గార్ అల్లాన్ పో

పేరులోనే ‘’ఎలోన్ ‘’ఉంది కనుక ఒంటరివాడుగానే జీవించాడు  .జీవితం లోని కస్టాలు దుఖాలకు కుంగి విచారమే పరమావధిగా ప్రవర్తించాడు ,రాశాడు  .తల్లీ తండ్రీ ఇద్దరూ స్టేజి నటులే .మాసా చూసేట్స్ లోని  బోస్టన్ లో19-1-1809 న జన్మించాడు .రిచ్మాండ్ లో న్యుమోనియా వచ్చింది .తండ్రి తరఫు తాత పెంపకం లో పెరిగాడు .రిచ్మాండ్ వ్యాపారి జాన్ అలన్ సంరక్షణ లో ఉన్నాడు .అలాన్ కు పిల్లల్లేరు .ఇంగ్లాండ్ లో మంచి స్కూల్ లో చేర్పించాడు అక్కడ ఒంటరితనం బాధించి ‘’ది లేక్ ‘’కవిత రాశాడు ‘’death was in that poisonous wave –and in its gulf a fitting grave –for him who thence would solace bring –to this lone imagining ‘’అని భావ గర్భిత కవిత రాశాడు .అమెరికా తిరిగి వచ్చిఒక స్నేహితుని తల్లి  మిసెస్ స్తానర్డ్ పై తల్లి భావం తో ప్రవర్తించాడు .వర్జీనియా వర్సిటిలో చేరి శ్రద్ధ చూపకుండా తాగుడులో పడి గెంటి వేయ బడ్డాడు .పెంపుడు తండ్రి అలాన్ తో పోట్లాడి బయటికొచ్చేశాడు .’’టామర్లేన్ ‘’ ‘’బై ఏ బోస్తోనియన్ ‘’అని తన పేరు లేకుండా రాసి ప్రచురించాడు .ఎవరికీ పట్టలేదు .రెండేళ్ళు సైన్యం లో పని చేసి ,అలాన్ వలన బయటికొచ్చాడు .మళ్ళీ అలాన్ తో పోట్లాడి తాగుడుతో చనిపోతున్న తమ్మిడికి సేవ చేశాడు .మళ్ళీ వెస్ట్ పాయింట్ లో ఉద్యోగం పొందాడు .అధికారుల ఆజ్ఞలను ఉల్లంఘించి నందుకు ఉద్యోగం లోంచి తప్పించేశారు .

పెంపుడు తండ్రి అలాన్ తో మళ్ళీ పోట్లాడి ,అతనేమీ ఇవ్వక పోయేసరికి’’ పెన్నీ లెస్ ఫెలో’’ గా రోడ్డున పడ్డాడు పో .అనారోగ్యం తాగుడు ,దరిద్రం నిరాశ దుఖం ఆవహించి ఉక్కిరి బిక్కిరి చేశాయి .సృజనాత్మక రచనలు చేశాడు .ఒక కదా రాస్తే యాభై డాలర్ల ప్రైజ్ వచ్చింది .కజిన్ వర్జీనియాను పెళ్లి చేసుకొన్నాడు .అనేక పత్ర్తికలకు ఎడిటర్ గా పని చేసి వదిలేశాడు .తాగనిదే ఉండ లేక పోయేవాడు కిక్కు కోసం తాగి జీవితాన్నికిక్ చేసుకొని  నాశనం చేసుకొన్నాడు .కుటుంబాన్ని ఫోర్డ్ హాం కు మార్చాడు.కుటుంబ  బాధ్యతలనుంచి ఎప్పుడూ వెనక్కు పోలేదు .భార్య చనిపోయింది .మరీ విషాదం లో మునిగాడు .తల్లి లేని లోటును జీవితాంతం అనుభవించి వేదన చెందాడు .అందుకే రచనలలో మాత్రుభావానికి పెద్ద పీట వేస్తాడు .

ముప్ఫై ఎనిమిది లో న్యూరోటిక్ ,గా మతి స్తిమితం లేని వాడుగా మారి పోయాడు .విధవ రాలైన సారా విలియం విట్మన్ తో కలిసి ఉన్నాడు .అస్తిమితత్వం తో ఆత్మా హత్యా ప్రయత్నాలు చేశాడు .భ్రమ, భ్రాంతులతో చివరి రోజులు గడిపాడు .ఎవరూ పట్టించుకో లేదు .రోడ్ల వెంబడి పది తిరిగే వాడు .అంత గొప్ప కవి అనాధగా రోడ్డు పక్క మురికి కాలవ దగ్గర పడి7-10-1849 లో నలభై రాకుండానే చనిపోయాడు .

‘’almost without the first sign of moral principle or the simpler affections of the heart ,poe;s verses illustrate an intense faculty of technical and abstract beauty with the rhyming art to excess ,an incorrigible propensity toward nocturnal themes and demoniac under tone behind every page ‘’ అని వాల్ట్ విట్మన్ ప్రశంసించాడు .అన్ని విషయాలలో అందమైన అమ్మాయి చావు ను వర్ణించాడు .క్రియ కు అత్యంత ప్రాధాన్యత నిచ్చి కవిత్వం రాశాడు .కవిత్వం అంటే ‘’is opposed to a work of science by having ,for its immediate object ,an idefinite instead of a definite pleasure being a poem only so far as the objects attained .అని అభిప్రాయ పడ్డాడు పోప్.గోల్డ్ బాగ్ రెవిన ,మర్డర్ ఇన్ ర్యు మాంటేగ్ ‘’కవితలు అతని ప్రతిభకు నిదర్శనాలు .దెయ్యాలు భూతాల కధలు రాశాడు .డిటెక్టివ్  కధలల్లాడు. కవిత్వం పై గొప్ప వ్యాస పరంపర రాశాడు .చివరగా ‘’poe;s poems are full of the music of another sphere ,a shadowy half world ,out of space ,out of time ,where Poe;s spirit was un happy at home ‘’అని అంచనా వేయ వచ్చు .మిస్టరి కధలకు ఆద్యుడు .కవిత్వం రాసి జీవితం గడప వచ్చునని రుజువు చేసిన కవి .గోదిక్ రచనలలో సుప్రసిద్ధుడు .హారర్ కదల సృష్టికర్త .పజిల్ నిర్మాత సాహిత్య విమర్శన లో శిఖరాగ్రాన నిలిచాడు ..నిర్దాక్షిణ్య సంపాదకీయాలు సాహితీ విమర్శలు చేశాడు .యూరప్ అంతటా ఆరాధనీయుడైన కవి .ఫిజిక్స్ లోను కాస్మాలజి  లోను ప్రవీణుడు .’’యురేకా’’ నుపూర్తీ  అంతరజ్ఞానం తో (ఇంట్యూషన్ )రాసి మెప్పు పొందాడు .’’క్రిప్టోగ్రఫీ ‘’అంతు చూసిన వాడు .చిన్నకధలు నాటికలు రాసి సుసంపన్నం చేశాడు .

Inline image 1

 

 

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-6-14-కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -44 అమెరికా కవులు

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -44

అమెరికా కవులు

బేకన్ రాసిన ‘’నోవం ఆర్గానం ‘’ముద్రణ పొందిన తరువాత  1620లో కొత్త ప్రపంచం లేక న్యు ఇంగ్లాండ్ అనే అమెరికా లోని కేప్ కాడబే కాలనీ కి ‘’పిలిగ్రిం  ఫాదర్స్’’అన బడే సేటిలర్స్ మొదట చేరుకొన్నారు .విజ్ఞానం కోసం మానవుడి అన్వేషణ ,విజయం అని బేకన్ పేర్కొన్నాడు వందేళ్ళ తర్వాత క్లాయోన్ బిషప్ వేదాంతి  జార్జి బెర్క్లీ  కొన్ని కవితలను ‘’ఆన్ ది  ప్రాస్పెక్టస్ ఆఫ్  ప్లాంటింగ్ ఆర్ట్స్ అండ్ లెర్నింగ్   ఇన్ అమెరికా ‘’రాస్తూ ,అమెరికా లో కవిత్వం రాయటానికి కొత్త విషయాలున్నాయన్నాడు .బెర్కిలీ ఆశాభావం తో కవిత్వం అల్లాడు .కాలనీ కాలం అంతా పాత ధోరణి సామేతలతోనే కవిత్వం సాగింది .అమెరికాలో మొదటి కవయిత్రి ,న్యూ ఇంగ్లాండ్ గవర్నర్ కూతురు ,ఇంకో గవర్నర్ భార్య అయిన ‘’అన్నే బ్రాడ్ స్ట్రీట్ ‘’1612-1672)గుర్తింపు పొందింది .తన కవితా సంకలనానికి ‘’ది టెన్త్ మ్యూజ్ లేట్లీ స్ప్రంగ్ అప్ ఇన్ అమెరికా ‘’అని అర్ధవంతమైన పేరు పెట్టింది .పాత రొడ్డు కవిత్వ ధోరణిలో కాకుండా స్పెన్సర్ ,,రాలీ ,ఫ్రెంచ్ కవి ద్యు బర్తాస్ వంటి ప్రముఖుల ప్రభావం తో రాసింది . 1624-1729కాలం వాడైన ఎడ్వర్డ్ టైలర్ రాత ప్రతులు ఆయన చని పోయిన రెండు వందల ఏళ్ళ తర్వాత కాని బయట పడ లేదు ,టేలర్ మెటాఫిజికల్ గా  మత భావ స్పూర్తి గా హెర్బర్ట్,డోన్నెల మార్గం లో  రాశాడు .న్యూ ఇంగ్లాండ్ నుంచి న్యూ జేర్సికి కవిత్వపు సీనుమార్చిన వాడు 1752-1832కాలం వాడైనఫిలిప్  ఫ్రే న్యూ ‘’.అతను రాసిన ‘’ది ఇండియన్ బరియల్ గ్రౌండ్ ‘’మొదలైన కవితలలో స్థానిక విషయాల ప్రస్తావన ఉన్నా ,పద్దెనిమిదో శతాబ్ది ఇంగ్లీష్ పధ్ధతి లోనే రాశాడు .స్వంత సీమ భావం తో రాసిన మొదటికవి ,’’అమెరికా కవిత్వ పిత ‘’విలియం కల్లెన్ బ్రయాంట్ .ఆయన గురించే ఇప్పుడు మనం తెలుసుకో బోతున్నాం .

అమెరికా కవిత్వ జనకుడు –విలియం  కల్లెన్ బ్రయాంట్

ఇంగ్లీష్ కవులు పోప్,నుండి కూపర్ దాకా మరీ ముఖ్యం గా ‘’రాబర్ట్ బ్లైర్ ఇంకా చెప్పా లంటే ‘’గ్రేవ్ యార్డ్ స్కూల్ ‘’ప్రభావం తో విలియం కల్లెన్ బ్రియాంట్ తన స్వంత బాణీ వాణి తో కవిత్వం చెప్పాడు .దీనితో అమెరికా కవిత్వానికి ఒక ‘’డిగ్నిటి’’అంటే గౌరవం ,పరువు లభించాయి .మే ఫ్లవర్ సంతతికి చెందిన వాడై  మాసా చూసేత్స్ లోని కమ్మింగ్ టన్ లో   3-11-1794న జన్మించాడు  .అర్భక జీవిగా  బతుకు తాడో లేడో అన్న  భావం తోపుట్టాడు .తల కాయ మామూలు కంటే పెద్ద సైజ్ లో ఉండేది .అక్కడి గ్రామీణ డాక్టర్ రోజూ మంచు నీటిధారలో ముంచి మామూలు సైజు కు తెచ్చాడు .ఆరోగ్య సూత్రం గా తండ్రి కొడుకును రోజూ తనతో అరణ్యాలకు నడకకు తీసుకొని వెళ్ళేవాడు .

రెండేళ్లకే చదవటం వచ్చేసింది .పదికి కవిత్వమే రాస్తే ‘’హాంప్ షిర్ గెజిట్ ‘’లో ప్రింట్ అయింది .పదమూడుకు జఫర్సన్ కు వ్యతిరేకం గా సెటైర్’’ది ఎంబార్గో ‘’ రాశాడు . పదిహేడు లో  పరిపూర్ణ  కవి అయ్యాడు .’’టానా టోప్సిస్ ‘’రాసి డెస్క్ లో ఉంచేశాడు  .ఎప్పుడో తండ్రి కంట బడితే ఆయన నార్త్ అమెరికన్ రివ్యూ ఎడిటర్ కు ఇస్తే చదివి ముచ్చట పడి నిరంతరం రాసి పంపించమని చెప్పాడు .అలాగే రాస్తే వేసేవారు పత్రికలో .ఈ కవితలు చదివిన రిచార్డ్ హెన్రి డొన్నా’’అట్లాంటిక్ సముద్ర ఈతీరం లో ఇలా అద్భుతం గా కవిత్వం రాసిన వాడేవరూ ఇంతవరకు లేరు ‘’అని శ్లాఘించాడు .రాసినవన్నీ పేపర్లు అచ్చువేశాయి మంచి రివ్యూలే వచ్చి ప్రోత్సహించారు .అప్పటికే లా చదివినా ప్రాక్టీస్ పై మనసు పోలేదు .విమర్శకులు ‘’అమెరికా నాయక కవి ‘’అని ప్రశంసిస్తున్నారు .ముప్ఫై అయిదులో ప్రసిద్ధ ‘’న్యూ యార్క్ ఈవెనింగ్ పోస్ట్ ‘’పత్రికకు ఎడిటర్ ఇన్ చీఫ్ అయ్యాడు .జీవితాంతం ఇదే పోస్ట్ లో పనిచేశాడు .నలభై లో అయిదు కవిత సంకలనాలు ముద్రించాడు .ఫ్రాన్సెస్ ఫెయిర్ చైల్డ్ ను వివాహమాడా డు .

ప్రెసిడెంట్ లింకన్ బానిస విమోచనకు ఏంతో మనస్పూర్తిగా సహకరించి ప్రచారం చేశాడు ..ఇంగ్లాండ్ నవలా చక్ర వర్తి చార్లెస్ డికెన్స్ అమెరికా పర్యటనకు రాగానే ‘’బ్రియాంట్ ఎక్కడ?’’అని అడిగాడంటే అతని కీర్తి చంద్రికల వ్యాప్తి ఏమిటో తెలుస్తోంది .దేబ్భైలో కూడా మంచి ఆరోగ్యం గా ఉన్నాడు .నడక వ్యాయామం తో బాటు నిత్యం కవిత్వం రాసే వాడు .’’లైబ్రరి ఆఫ్ పోఎట్స్ అండ్ సాంగ్స్’’అనే బృహత్ గ్రంధాన్ని రివిజన్ చేశాడు .ఎనభై నాలుగవ ఏట న్యూ యార్క్ సెంట్రల్ పార్క్ లో ఇటలి దేశ భక్తుడు ‘’మజ్జిని ‘’ శిలా విగ్రహాన్ని మే నెలలో  ఆవిష్కరిస్తూ ,ఎక్కువ సేపు తల మీద టోపీ లేకుండా నిలబడి ఉండటం తో  ఎండ వేడికి తట్టుకోలేక కూలి పోయాడు మెదడుడలో రక్తనాళం గడ్డకట్టటం తో కోమా లోకి వెళ్లి పోయాడు .కొన్ని వారాల తర్వాత12-6-1878న ఎనభై నాలుగవ ఏట చనిపోయాడు .

యవ్వనం లో ముసలి వారికోసం ముసలి తనం లో పిల్లలకోసం రాశాడు బ్రియాంట్ .’’అమెరికా వర్డ్స్ వర్త్ ‘’అని అందరూ గౌరవం గా పిలిచే వారు .అతిసాదారణం గా ,స్వచ్చం గా ,పవిత్రం గా ఉండేవాడు .సరదా మనిషికూడా .’’ఏ ఫేబుల్ ఫర్ క్రిటిక్స్ ‘’లో లోవెల్ బ్రియాంట్ లోని లోపాలను తెలియ జేశాడు .అయితే వీరందరి కంటే ఎడ్గార్ అస్లేన్ పో ‘’ in character no man stands more loftily than Bryant .the peculiarity melancholy expression of his countenance has caused him to be accused of harshness or coldness of heart .Never was there a greater mistake .His soul is charity itself ,in all respects generous and noble ‘’అని ఖచ్చితమైన యదార్ధవివరణ చేశాడు .అమెరికన్ రొమాంటిక్ కవి గా పేరు .మార్టిన్ లూధర్ కింగ్ ఏంటో మెచ్చుకొని ఆయన చెప్పిన మాట ‘’truth crushed to earth will rise again ‘’అని పడే పడే గుర్తు చేసేవాడు .వాల్ట్ విట్మన్ కు ‘’మెంటార్ ‘’.

 

 

 

William Cullen Bryant Cabinet Card by Mora-crop.jpg

వ్యక్తిత్వ వికాస కవి   –రాల్ఫ్ వాల్డో ఎమర్సన్

న్యు ఇంగ్లాండ్ కవిత్రయం గా ఎమర్సన్ విట్ట్టియర్ ,లాంగ్ ఫెలో లు గుర్తింపు పొందారు .సంస్కృతికి ఆనవాలుగా నిలిచారు .వీరి వలననే అమెరికా స్వంత గడ్డ పై   కవిత్వ బీజం  నాటబడి ,సాగు చేయబడి ,పోషింపబడి వికసిత పుష్పమై , అందంగా ఆకర్షణీయం గా  సువాసనలీనుతోంది .

‘’గాడ్ ఇంటాక్సికేటేడ్ యాంకీ ‘’గా పిలువాడే రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ 25-5-1803లో మాసా చూసేత్స్ లోని బోస్టన్ లో జన్మించాడు .తండ్రి వారసత్వం గా వచ్చిన యూనిటేరియన్ క్లేర్జిమన్ అయ్యాడు .మూఢాచారాలకు వ్యతిరేకి ..ఎనిమిదో ఏట తండ్రి చనిపోతే ఎనిమిది మంది సంతానాన్ని పోషించే బాధ్యతా ఎమర్సన్ పై పడింది. అందరి సానుభూతి సహకారం తో బాధ్యతను నేర వేర్చి పెంచి పెద్ద వాళ్ళను చేశాడు .అంత తెలివైన వాడు కాక పోయినా పందోమ్మిదేళ్ళకే హార్వర్డ్ గ్రాడ్యుయేట్ అయ్యాడు .కొంతకాలం స్కూల్ లో బోధించి తర్వాతా చర్చి మినిస్టర్ అయ్యాడు .ఎలెన్ లూసా టకర్ ను వివాహమాడి ,మినిస్టర్ పదవి వదిలేశాడు .ఇతరులకు బోధించటా న్ని సమర్ధించాడు .యూరప్ సందర్శించాడు .అదే జీవితాన్ని గొప్ప మలుపు తిప్పింది .కార్ లైల్ వర్డ్స్ వర్త్ కవులతో సమావేశమై జీవితపు విలువలను అధ్యయనం చేశాడు .ఇంగ్లాడ్ తిరిగి లేక్ పోఎట్స్ ను చూశాడు .కార్ లైల్ కు సన్నిహితుడయ్యాడు .

తిరిగి వచ్చి కంకార్డ్ లో కాపురం పెట్టిలిడియా జాక్సన్ ను  రీండవ పెళ్లి చేసుకొన్నాడు .ప్రదేశాలు తిరుగుతూచాలా ఉపన్యాసాలిచ్చాడు .అసాధారణ మేధావిగా పండిన వేదాంతిగా గుర్తింపు వచ్చింది .’’మనిషి అంటే బంధుత్వాల కలయిక ,అస్తిత్వ వ్రేళ్ళ మూలం ‘’అనే వాడు .ఎవరు బాగా అర్ధం చేసుకొంటారో వారే గొప్ప .ఉత్సాహం లేకుండా దేన్నీ పొందాలెం హీరోయిజం కు రీజన్ అనవసరం అందుకే గొప్ప .వ్యక్తిలో ప్రపంచ భావన ఉంటేనే అది ఆకర్షిస్తుంది .మతం లో కొత్త ఆలోచనలు భావాలు వ్యాప్తి చెందించాడు ఎమర్సన్ .నలభై నాలుగులో ‘’పోయెమ్స్ ‘’ప్రచురించాడు .ఒక ఏడాది తర్వాతా ‘’మే డే అండ్ అదర్ పోయెమ్స్ ‘’తెచ్చాడు .వ్యాస సంకలనాలు రెండు ముద్రించాడు . డెబ్భై లో జ్ఞాపక శక్తి క్షీణించింది .లాంగ్ ఫెలో చని పొతే సమాధి దగ్గర ‘’అతను మంచి వాడు .కాని పేరు మాత్రం గుర్తుకు రావటం లేదు ‘’అన్న జ్ఞాని .సమాజానికి దూరమైపోయి కంకార్డ్ లో 27-4-1882లో డెబ్భై తొమ్మిదో ఏట మహా జ్ఞాని ,స్కాలర్ కవి వేదాంతి తత్వ వివేచనా పరుడు ఎమర్సన్ మరణించాడు .ఆయన వేదాంతం మానసిక మైంది .’’Emerson ;s poetry is both rich and casual –homespun cloth of gold –‘’అని లోవెల్ మెచ్చాడు .ఎన్నో భాషలలోని అనువాదం పొందిన రచనలు చేశాడు ముఖ్యం గా భారతీయ ఫిలాసఫర్లు ఎమర్సన్ ను ఆదర్శం గా భావించారు .

 

 

 

బానిసత్వ వ్యతిరేక కవి –  జాన్ గ్రీన్ లీఫ్ విట్టర్

ఎమర్సన్ లాగానే అనుదిన కర్మ కండను విట్టర్ వ్యతిరేకించాడు .తండ్రి వ్యవసాయ దారుడు 17-12-1807లో మాసా చూసేత్స్ లోని హావేర్ హిల్ లో పుట్టాడు చిన్నప్పుడే తండ్రితో పొలం వెళ్లి సాయం చేశాడు శీతాకాలం లో ఎనిమిది సెంట్లకు స్లిప్పర్ జత తాయారు చేసి అమ్మి ట్యూషన్ ఫీజు సంపాదించాడు మొదటి తరం అఎసత్రికి చేతిలో కేవలం ఇరవై అయిదు సెంట్లు మాత్రమె ఉన్నాయి ..దేనికైనా మైళ్ళకొద్దీ దూరం నడిచి తెచ్చుకోవాల్సి వచ్చేది స్కూల్ టీచర్ బుర్న్స్ కవిత్వ పుస్తకం ఇస్తే ఇష్టపడి చదివాడు .దాన్ని జీవితాంతం దగ్గర పెట్టుకొన్నాడు .పద్దేనిమిదేల్లకే ‘’ఫ్రీ ప్రెస్ ‘’మాసపత్రిక లో కవిత మొదటికవిత ప్రచురించారు .వరుసగా నూట యాభై కవితలు రాశాడు .బానిస వ్యతిరేకం గా ‘’జస్టిస్ అండ్ ఎక్స్పిదిఎంసి ‘’కరపత్రిక ముద్రించాడు ..బానిసత్వ వ్యతిరేకతపై స్పందించిన కవి రాజకీయ నాయకుడు అయ్యాడు .ఎమర్సన్ లాంటి ఫ్రీ థింకర్స్ బానిసత్వాన్ని సమర్ధించటం జీర్ణం చేసుకో లేక పోయాడు .

ఫిలడెల్ఫియా వెళ్లి ‘’పెన్సిల్వేనియా ఫ్రీమన్’’పత్రికకు సంపాదకుదయ్యాడు .బానిసత్వ నిర్మూలన సంఘానికి పెన్సిల్వేనియా హాల్ ను వేదిక చేశాడు .’’the crank of an opinion mill –making his rustic reed of song –a weapon in the war of wrong ‘’అని బాధపడ్డాడు .తర్వాత ‘’స్నో బౌండ్ ‘’లో తన కవితా శక్తియుక్తులన్నీ ప్రదర్శించాడు .ఎనిమిది సెంట్ లకు స్లిప్పర్ జత తయారు చేసిన ఈ కుర్రాడు ఇప్పుడు అక్కడ ప్రముఖ సిటిజన్ అయ్యాడు .లిజేందరి ఫిగర్ అనిపించాడు .అతని ఎనభయ్యవ పుట్టిన రోజు జాతీయ పండుగ గా నిర్వహించారు .ఎనభై అయిదవ పుట్టిన రోజుకు కొన్ని నెలల ముందు 7-9-1892న విట్టర్ కవి మరణించాడు .’’ఏ ఫేబుల్ ఫర్ క్రిటిక్స్ ‘’లో రస్సెల్ లో వెల్ ‘’there is Whitttier ,whose swelling and vehement heart –strains the strait breasted darb of the Quaker apart –a fervor of mind which knows no separation –twixt simple excitement and pure inspiration ‘’అని మెచ్చుకొన్నాడు .’’సాంగ్ ఆఫ్ ది నీగ్రో బాట్ మాన్ ‘’అనేక ముద్రణలు పొందింది .క్వేకర్ ఉద్యమకవి గా కూడా ప్రసిద్ధుడు .

 

 

Inline image 1

హెన్రి వాడ్స్ వర్త్  లాంగ్ ఫెలో

లాంగ్ ఫెలో కవికి పాఠ్యపుస్తకాలు  తీవ్రఅన్యాయాన్ని  చేశాయి .చేత్తకవితలే ఎంచి ,వేసి ఆయన గౌరవ భంగం కల్గించాయి .అయన కవితలు నీతి బోదకాలు అంటూ అపచారమూ చేశారు .కనుక ఆయన అంటే వాల్ పోస్టర్ కవి అనుకొన్నారు .ఆకారమూ విలేజ్ మినిస్టర్ లా ఉండేది .’’వంటింటి కవి ‘’అని ముద్రపడింది .కాని అమెరికా కవుల్లో బాగా ప్రాభవ మున్న కవి లాంగ్ ఫెలో .ఇరవై నలుగురు పబ్లిషర్లు ఆయన రచనలను ప్రచురించాటమంటే అసామాన్య విషయమే .’’ది కోర్ట్ షిప్ ఆఫ్ మెయిల్స్ స్తాన్దిష్ ‘’పదివేల కాపీలుఒక్క రోజులోనే ఇంగ్లాండ్ లో  అమ్ముడయింది .’’ది సాంగ్ ఆఫ్ హైవత ‘’ప్రపంచ భాషలన్నిటిలోనూ అనువాదం పొందింది .కాని సమకాలీన కవులు లాంగ్ ఫెలోను’’ షార్ట్ ఫెలో ‘’గా భావించి అన్యాయం చేశారు .’’అమెరికా లోని భిన్న సామాజిక స్తితులపై విభిన్న మానవులపై ,సామాజిక వర్గాలపై ,వృత్తుల వారిపై విలువైన కవిత్వం రాసి మాబోటి వారికి మార్గ దర్శనం చేశాడు లాంగ్ ఫెలో ‘’అన్నాడు అమెరికా జాతీయ కవి వాల్ట్ విట్మన్ .సంవత్సర ఆదాయం యాభై వేల డాలర్లకు పైనే ఉండేది .’’ది హంగింగ్ ఆఫ్ ది క్రేన్ ‘’కవిత మూడు వేల డాలర్లు సంపాదించింది .

27-2-1807లో మెయిన్ లోని పోర్ట్ లాండ్ లో జన్మించాడు .తన బాల్యాన్ని ‘’a boy;s will is the wind;s will –and the thoughts of youth are long long thoughts ‘’అని రాసుకొన్నాడు .తండ్రికమ్మరి పని చేసేవాడు .చిన్నప్పుడే తను కవిని అవుతాననే నమ్మకముండేది లాంగ్ ఫెలోకి .ఇర్వింగ్ రాసిన దానికి అనుకరణగా ‘’స్కెచ్ బుక్ ‘’రాశాడు .పన్నెండో ఏట ‘’ది బాటిల్ ఆఫ్ లోవేల్స్ పాండ్ ‘’కవిత పోర్ట్ లాండ్ గెజెట్ లో అచ్చయింది .బోదేన్ కాలేజి లో చేరి అన్నిటా ప్రధముడు గా వచ్చాడు .’’చాతర్తాన్ అండ్ హిస్ పోయెమ్స్ ‘’పై రాయమంటే ‘’అవర్ నేటివ్ రైటర్స్ ‘’గా పేరు మార్చి రాసిన సాహసి .లాయర్ కావాలని లేదు .సాహిత్యం మీదే మనసు .ఆధునిక సాహిత్యం పై ఒక చైర్ ను ఏర్పరచి వచ్చి చేరమని బౌడెన్ ఆహ్వానిస్తే వెళ్లి చేరి పందొమ్మిదో ఏట దాన్ని నిర్వహించిన లేత కుర్రాడు అని పించాడు దీని వలన విదేశీ యాత్ర సాధ్యమైంది ఫ్రాన్స్ స్పెయిన్ ఇటలీ జెర్మని వంటి దేశాలు తిరిగి సాహిత్యాన్ని అధ్యయనం చేసి ఆ వారసత్వాన్ని తన దేశీయ అమెరికన్ కవిత్వం లో జోడించాడు ..ఇరవై నాలుగులో పదవి స్తిరపడింది మేరీ స్తోరేర్ పోటర్ ను వలచి పెళ్ళాడాడు బోధనపై పెద్దగా ఇష్టం లేక పోయినా పాతికేళ్ళు బోధనా చేసి హార్వర్డ్ ప్రొఫెసర్ అయ్యాడు .మళ్ళీ విదేశీయానం స్కాండినేవియన్ జర్మన్ సాహిత్యాన్ని అర్ధం చేసుకొని కార్లైల్ ను కలిసి విద్యా వేత్తతలతో మెదిలాడు .స్వీడిష్ భాష నేర్చాడు ఫిన్ని భాష లోని మహాకావ్యం ‘’కలేవేల ‘’ను జేర్ణం చేసుకొని తన ‘’హైవత ‘’లో ప్రతిబింబింప చేశాడు .

అమెరికా తిరిగి వచ్చి కరిగీ హౌస్ అనే చారిత్రాత్మక ప్రదేశం లో నివశించాడు .పదిహేనేళ్ళు చిన్నదైన ఫాని ఎలిజా ను వలచి వలపించి రెండో పెళ్లి చేసుకొన్నాడు .వీరి వివాహం బోస్టన్ లో పెద్ద పండగే అయింది .అయిదుగురు పిల్లల్ని కన్నారు .ఒక రోజు ప్రమాద వశాత్తు కొవ్వోత్తికి భార్య సమ్మర్ డ్రెస్ కు అంటుకొని కాలుతుంటే లాంగ్ ఫెలో పక్క రూమ్ లో నుంచి పరిగెత్తుకొని వచ్చినా ఆర్పలేక ఆమె పూర్తిగా కాలి చనిపోయింది .విచారం అలముకొన్నా కవిత్వం ఆగలేదు .’’పోయెమ్స్ ఆఫ్ స్లేవరి ‘’రాసి ఎవరూ చేయని సాహసం చేశాడు .ఇవాన్జిలీన్ మొదలైన లిరిక్స్ రాశాడు .ఇంకా గొప్ప రచనలు రావాల్సి ఉంది .

‘’టేల్స్ ఆఫ్ ఏ వె సైడ్ ఇన్ ‘’ప్రచురించి పేరు తెచ్చుకొన్నాడు .వయసు పబడిన కొద్దీ రచనా క వ్యాసంగం పెరిగింది .అరడజను పుస్తకాలు రాశాడు .నరాల జబ్బు బాధించింది హార్ట్ ఎటాక్ వచ్చింది .24-3-1882న చనిపోయాడు వెస్ట్ మినిస్టర్ ఆబ్బే లో సమాధి చేశారు .కధలను మహాద్భుతం గా చెప్పాడు .కవిత్వం పర్వత ఝరి లాగా వేగం గా ప్రవహిస్తుంది .మార్గ దర్శిగా గుర్తింపు పొందాడు .అమెరికా గడ్డపై స్వంత కవితా సేద్యం చేసి అమూల్య ఫలాల నందించిన తోలి తరం కవులలో ముఖ్యుడు .అమెరికా కు సంపూర్ణ వికాసాన్ని ఇచ్చిన కవులలో ఒకడు .

డాంటే రాసిన డివైన్ కామెడీ ని అనువాదం చేసిన మొదటి అమెరికాన్ కవి లాంగ్ ఫెలో .లిరిక్ పోయెమ్స్ రాసి మాస్ కు చేరువైన కవి .హెక్సా మీటర్ లో ,ఫ్రీ వేర్స్ లో కూడా రాశాడు .హీరోయిక్ కప్లేట్స్ బాలడ్స్ నూ రాశాడు .నైతిక ,సాంస్కృతిక విలువలకుప్రాధాన్యత నిచ్చాడు  ,భౌతికానికి అతీతం గా ఆలోచన చేశాడు .ఆయన కాలం లో అందరికంటే ప్రసిద్ధుడు .విట్మన్ ఫ్రాస్ట్ మొదలైన కవులకు ప్రేరణ .

 

Inline image 2

 

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-6-14-కాంప్ –మల్లాపూర్ –అమెరికా

 

 

గబ్బిట దుర్గా ప్రసాద్

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -43 క్రిస్మస్ గీత రచయిత్రి – క్రిస్టినా రోసేట్టి

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -43

క్రిస్మస్ గీత రచయిత్రి –   క్రిస్టినా రోసేట్టి

క్రిస్టినా- రోసేట్టి కుటుంబం లో చిన్నది .5-12-1830లో లండన్ లో పుట్టింది .గాబ్రియల్ కు విరుద్ధం అందగత్తె కాదు .డాంటే గాబ్రియల్ రాసిన మొదటి  సినిమాలో వర్జిన్ గా నటించింది .కవిగా ,పైంటర్ గా వారసత్వాన్ని కాపాడుకోంది.ఇటాలియన్ నేపధ్యం ఉన్నందున విజయం రాలేదు .మగాళ్ళు వెంబడి పడే వారు .పద్దెనిమిదేళ్ళ పడుచు జేమ్స్ కాలింసన్ తో ఎంగేజ్ మెంట్ చేసుకోంది. ప్రీ రాఫేలైట్ బ్రదర్ హుడ్ అయిన అతను రోమన్ కేధలిక్ గా మారగానే ‘’తూ నా బొడ్డు’’ అని కాన్సిల్ చేసింది.కాలిన్స్ ఆమె ప్రశాంత మానసిక స్తితిని అల్ల కల్లోలం చేశాడు .ముప్ఫై వ ఏట చార్లెస్ కాయిలీని ప్రేమించి జీవితాంతం అతని తో ఉంది . ‘’హేవెన్లి బ్రైడ్  గ్రూం’’కోసం కలలు కన్నది . హంగూ ఆర్భాటం లేకుండా నే ఆ తరం లో పేరెన్నిక గన్న కవి గా గుర్తింపు పొందింది .’’గార్బిన్ మార్కెట్ ‘’,దిప్రిన్సెస్ అండ్ ఆదర్ పోయెమ్స్’’’’ఏ పీజిఎంట్ అండ్ ఆదర్ పోయెమ్స్ ‘’వరుసగా రాసి ప్రచురించింది .గుండె బలహీనత తో బాధ పడింది .అరవై లలో కేన్సర్ వచ్చి ఆపరేషన్ చేయించు కొన్నది .కాని ప్రార్ధనలోనే ప్రశాంతం గా 29-12-1894 లో చని పోయింది .దాదాపు వెయ్యి కవితలు రాసింది .అందులో ప్రి రాల్ఫెలైట్ భావాలు పోదిగింది . ‘’గోబిన్ మార్కెట్ ‘’కవిత కు మంచి పేరుంది .’’ఎల్లెన్ ఎలిఎన్ ‘’అనే మారు పేరుతో రాసేది .చని పోయిన తర్వాతే ప్రసిద్ధి పొందింది .ఆమె రాసిన క్రిస్మస్ గీతం ‘’బ్లీక్ మిడ్ వింటర్ ‘’అందరు పాడుకొంటారు .

‘’white and golden Lizzie stood –like a lily in a flood –like a rock of blue-veined stone –lashed by tides obstreperously –like a beacon left alone –in a hoary roaring sea –sending up a golden fire’’లా కవిత్వం సాగిపోతుంది .ప్రయోగాలు లేని భావుకత .విచారాన్ని ,లిరికిజం తో సమ్మేళనం చేసి రాసింది .

‘’when I am dead ,my dearest –sing no sad songs for me –plant thou no roses at my head –nor shady cypress tree ‘’—-‘’I shall not see shadows –I shall not feel the rain –I shall not hear the nightingale –sing on ,as if in pain –happly I may remember –and haply may forget ‘’

 

 

Inline image 1

.

ఎడ్గార్ అలెన్ పో తో సాటి -ఆల్గేర్నాన్ చార్లెస్ స్విన్ బర్న్

స్విన్ బర్న్4-5-1837లో లండన్ లో పుట్టాడు .  అరిస్తో క్రాటిక్ కుటుంబం .తండ్రి అడ్మిరల్. తాత లార్డ్ .ప్రీ రాఫలైట్ లను అధిగమించాలని ప్రయత్నించాడు స్విన్ బర్న్.ఇరవై అయిదులో ‘’ది క్వీన్ మదర్ అండ్ రోసమాండ్ ‘’అనే రెండు చారిత్రాత్మక ట్రాజెడీ నాటకాలు రాసి రోసేట్టి కి అంకితమిచ్చాడు .బ్లాంక్ వేర్స్ లో లిరిక్స్ రాశాడు .’’అట్లాంటా ఇన్ కాలిడాన్ ‘’రాసి సెన్సేషన్ సృష్టించాడు .బైరన్ రాసిన చైల్డీ హరాల్డ్ తర్వాతా అంతటి గొప్ప కవిత రాలేదు .భావాలు తీవ్రం గా ,ఆచారాలకు విరుద్ధం గా ఉండటం తో యువకుల గుండె చప్పుడు కు దగ్గరైంది .’’వెన్ ది హౌండ్స్ ఆఫ్ స్ప్రింగ్ ‘’లో దుమ్ము దులిపేశాడు .

‘’they gave him light in his ways –and love ,and a space for delight –and beauty and length of days –and night and sleep in the night –his speech is a burning fire –with his lips he traveileth –in his heart is a blind desire –in his eyes foreknowledge of death –‘’అంటూ నిప్పులు కక్కుకుంటూ ఎగిరాడు నింగికి .

ముప్ఫై లో ప్రసిద్ధ కవి అని పించుకొన్నాడు .కవే కాక  ‘’ కాంట్ర వర్సీ’’ కూడా అయ్యాడు .అతని కామం బూతు అందరికి జుగుప్స కల్గించాయి .నలభై లలో ‘’స్టేడి ఆఫ్ షేక్స్ పియర్ ‘’,సాంగ్స్ అండ్ స్ప్రిన్గ్సైడ్స్ ‘’మోడరన్ హేపతాల్జియా ‘’లు వరుసగా రాసి సంచలం సృష్టించాడు .విడువ కుండా రాస్తూనే ఉన్నాడు అయిదు పద్య నాటకాలు ,ఒక నవల ,పది వచన పుస్తకాలు రాసి ఏదీ వదలకుండా రాశాడని పించుకొన్నాడు .’’swinburne has now said not only all he has to say about every thing  but all he has to say about nothing ‘’ అని ఎస్టిమేట్ చేశారు .ఆలోచనా పరుడిగా కంటే ఆవేశ పరుడు .’’యెన్ సైక్లో పీడియా బ్రిటానికా –పదకొండవ ఎడిషన్ ‘’కు సహక  రించాడు .రెండు సార్లు నోబెల్ ప్రైజ్ కు ఎంపికైనాడు .కాని రాలేదు .’’the tumultuous out cry of the adjectives and head strong  rush of undisciplined sentences  are the index of the impatience and laziness  of a disorderly mind’’అని ఇలియట్ తీర్మానించాడు .ఎడ్గార్ అల్లెన్ పో తర్వాత ఇంగ్లాండ్ అమెరికాలలో నిజమైన కవి స్విన్ బర్న్ అన్నాడు హెచ్ పిలోక్రాఫ్ట్ .

Inline image 2

 

విక్టోరియన్ రియలిస్ట్ –  థామస్ హార్డీ

పందొమ్మిది ఇరవై శతాబ్దాలకు వారధి థామస్ హార్డీ .సగం రొమాంటిక్ సగం వాస్తవ వాది .రాసిన కవితలు ఆధునిక కవితలకు మార్గ నిర్దేశం చేశాయి .2-6-1840లో డార్సేట్ లోని డార్చెస్టర్ లో పుట్టాడు .రాసిన నవలకు ఇదే నేపధ్యం అయింది .అర్భకం గా పుట్టి తల్లి సంరక్షణ లో ఎనిమిదో ఏడు వరకు ఇంట్లోనే ఉన్నాడు .పదహారవ ఏట ప్రసిద్ధ ఆర్కిటెక్ట్ దగ్గర సహాయకుడిగా చేరాడు .అప్పటికే కవితలు గిలుకుతున్నాడు .’రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రిటిష్ ఆర్కి టెక్ట్ ప్రైజ్ పొందాడు కార న్ వాల్ వెళ్లి వికార్ మరదల్ని ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు .ఆర్కి టేక్చార్ లో నీతులున్నా ధన లక్ష్మి కనికరించలేదు .వదిలేసి ‘’ది పూర్ మాన్ అండ్ ది లేడీ ‘’రాసి ప్రచురిద్దామనుకొంటే అందులో ‘’సరుకు లేదు ‘’అని తిప్పి పంపేశారు .కసిగా ‘’డెస్పరేట్ రేమిడీస్ ‘’రాస్తే ఒక మాదిరి ప్రోత్సాహం వస్తే ఇక రాస్తూనే ఉన్నాడు .నవలా ప్రయత్నమూ చేసి చివరికి కవిత్వమే ఫుడ్డూ బెద్డూ అనుకోన్న్నాడు  .ముప్ఫై అయిదు నలభై మధ్యలో ఎనిమిది నవలలు దించాడు .ముప్ఫై కి పైగా చిన్న కధలు రాశాడు .ఇవన్నీ క్లిక్ అయి లక్ష్మీ ప్రసన్నం కలిగించాయి .’’టెస్ట్ ఆఫ్ ది డీ ఆర్బర్ విల్లీస్’’రాసి విమర్శకులను ఆకర్షించాడు .ఓవిడ్ ,టేరిస్ లను యవ్వనం లోనే చదివాడు .డార్విన్ ను ,స్టువార్ట్ మిల్ ను అధ్యయనమ చేశాడు .’’టేస్స్ ‘’రాశాడు .’’తుస్సు ‘’మంది .విమర్శకుల జడివానకు ప్రతిగా సమాధాన గొడుగు పట్టి నిరుత్తరుల్ని చేశాడు .పిచ్చి కోపం తో ఒకడు దాన్ని తగల బెట్టి బూడిద పార్సెల్ చేసి హార్డీకి పంపాడు

అరవైలో ‘’వేసేక్స్ యెమ్స్ ‘’రాసి ప్రచురిస్తే ఎవరూ పట్టించుకో లేదు .మరో అయిదేళ్లకు ‘’పోయెమ్స్ ఆఫ్ పాస్ట్ అండ్ ప్రెసెంట్ ‘’విడుదల చేస్తే కొంత ఉత్సాహం వచ్చింది ‘’డైనాస్టీ’’మొదటి భాగం రాసి ప్రచురించాడు .నాలుగేళ్ల తర్వాతా ‘’నెపోలియన్ యుద్ధాలు ‘’ను మూడు పుస్తకాలలో పందొమ్మిది అంకాలుగా రాశాడు .నూట ముప్ఫై సీన్లున్నాయి .డెబ్భై రెండులో భార్య మరణించింది .తన సేక్రేటరినే పెళ్లి చేసుకొన్నాడు .సోమర్ సెట్ మాం రాసిన ‘’కేక్స్ అండ్ ఐల్స్ ‘’హార్డీ జీవితమే .మూడు గొప్ప కవితా పుస్తకాలను రాసి ముద్రించాడు .ఎనభై ఎనిమిదవ ఏట జలుబు చేసి తీవ్రమై .11-1-1928న హార్డీ మరణించాడు .వెస్ట్ మినిస్టర్ ఆబ్బే లో సమాధి చేసి ,అయన వీలునామా లో రాసిన దాని ప్రకారం గుండెను తనకు అతి ఇష్టమైన డార్చేస్తర్ గ్రామం లో సమాధి చేశారు .

డార్విన్ ను సమర్ధించినా విశ్వానికి కేంద్రం మానవుడు అన్న దాన్ని హార్డీ ఒప్పుకో లేదు .సైన్సు ను సాహిత్యం గా మార్చిన ఘనుడు .ప్రకృతిని వర్డ్స్ వర్త్ తో బాటు అర్ధం చేసుకొన్నాడు .ప్రపంచం దేవుడి ఓటమి అన్నాడు .విక్టోరియా యుగపు చివరివాడైనా కొత్త దనం కోసం ప్రయత్నించాడు .

‘’when the present has latched its postern behind my trermulous stay’’మొదలైనవి అతని కవితలు  -విక్టోరియన్ రియలిస్ట్ అంటారు .పతనమై పోతున్న విక్టోరియన్ సంఘం పై విమర్శ చేశాడు .లారెన్స్ ,వర్జీనియా ఉల్ఫ్ లకు ప్రేరణ .లిరిక్స్ సెటైర్ బాలడ్స్ ,డ్రమాటిక్ మొనోలోగ్స్ రాసి మెప్పించాడు .బోయేర్ యుద్ధం మొదటి ప్రపంచ యుద్ధాలపై మంచి కవితలు రాశాడు .ప్రేమ జీవిత వైఫల్యాలపైనే ఎక్కువ గా రాశాడు .కవితల్లో ఐరనీ(పరిహాసమ్ ) పాలు ఎక్కువే .ఇరవయ్యవ శతాబ్ది గొప్ప కవుల్లో ఒకడుగా ప్రసిద్ధుడు .జంతు హింసకు వ్యతిరేకి .ఫ్రాస్ట్, ఆడెన్ మొదలైన వారిపై ప్రభావం చూపాడు .ఆక్స్ ఫర్డ్ బుక్ ఆఫ్ ట్వెంటి ఎత్ సెంచరి వెర్సెస్ ‘’లో హార్దీవి ఇరవై ఏడు కవితలను చేర్చి లార్కిన్ హార్డీ కవితా ప్రాభవానికి ప్రాచుర్యం కలిగించాడు .

Thomashardy restored.jpg

 

 

ఇంగ్లాండ్ దేశ పందొమ్మిదో శతాబ్ది  ఇరవయ్యవ శతాబ్ది ప్రారంభ కవుల ముచ్చట్లు సమాప్తం .ఇక న్యూ ఇంగ్లాండ్ ‘’కొత్త ప్రపంచం ‘’అని పిలువ బడే అమెరికా కవుల ముచ్చట్లు తెలుసు కొందాం రేపటి నుంచి –

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ – 9-6-14- కాంప్ –మల్లాపూర్ –హైదరాబాద్ .

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -42–విదరింగ్ హైట్స్ నవలా కారిణి – ఎమిలి బ్రాంట్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -42

విదరింగ్ హైట్స్ నవలా కారిణి –  ఎమిలి బ్రాంట్

టెన్నిసన్ కు భిన్నం గా ఎమిలీ బ్రాంట్ జీవవించింది  .ఐరిష్ తండ్రికి జన్మించింది  .తండ్రి  చిత్రకళ నేర్చుకొందామనుకొన్నాడు కానీ యవ్వనం లో నే మరణించాడు .ఎమిలీ బ్రాంట్ 1818-1848కున్న అక్కలు మంచి రచయిత్రులే .అయితే ఎమిలీ అక్కల్ని మించి పోయింది .దాదాపు చదువు అంతా ఇంటి వద్దే నేర్చింది .క్లేర్జి డాటర్స్ స్కూల్ లో చేరింది అక్కడి పరిస్తితులు ఆహారం దారుణం .సోదరి షార్లెట్ తోకలిసి బ్రసెల్స్ వెళ్లి ,అక్కడా ఇమడలేక వచ్చేసింది .ఆమె రచనల్లో స్వీయ చరిత్ర ఏంతో తెలుసుకోవటం కష్టమే .’’బ్రాన్ టేస్ వెబ్ ఆఫ్ చైల్డ్ హుడ్ ‘’అనే పుస్తకం లో ఫన్నీ ఎలిజబెత్ ఇచ్చిన వివరణే అందరికి ఆధారం .

ఎమిలీ సోదరీమణులు ఒక ఊహా గ్రామాన్ని నిర్మించుకొన్నారు దానికి ‘’గొండాల్ ‘’అని పేరు పెట్టారు .ఇది ఫసిఫిక్ దీవుల్లో ఉందనిమాపులు తయారు చేశారు .కవిత్వం లో ఫిక్షన్ ,ఎలిగరి ,స్వీయ చరిత్రా అన్నీ కల గలిపి ‘’ది ఓల్డ్ స్తాయిక్ ‘’లో రాసింది ఎమిలీ పాత్రలు ‘’.గొండాల్ సాగా’’ గా సాగిపోతాయి .’’cold in the earth ,and the deep snow piled above thee –far ,far removed ,cold in the dreary grave –have I forgotten ,my only love ,to love thee –severed at last by Time;s  all wearing wave ‘’అంటూ సాగే కవిత్వం అది .ఈ అక్క చెల్లెళ్ళ పేరిట ఒకే ఒక పుస్తకం వెలువడింది వాళ్ళ అస్తిత్వాన్ని దాచేసుకొన్నారు .తాము ఆడవాళ్లమని చెప్పుకోదలచ లేదని అన్నారు .స్వంత ఖర్చుతో పుస్తకం ముద్రించి లాభా పేక్ష లేకుండా విడుదల చేశారు .రెండు కాపీలే అమ్ముడు పోయాయి మిగిలినవి ట్రంకు పెట్టెల్లో మూలుగుతున్నాయి .’’ఎల్లీస్ బెల్స్ ‘’అనే మారు పేరుతోనే రాసేది .ఆమె రాసిన గొప్ప నవల ‘’విదరింగ్ హైట్స్’’ఆదే ఆమె పేరుకు ,ప్రభావానికి కారణ మైంది .

బ్రాంటీ కుటుంబాన్ని క్షయ వ్యాధి పీడించింది అక్కలు చనిపోయారు ఎమిలీ ఎలాగో తట్టుకొని బతికింది .ముప్ఫై వ ఏట ఎమిలి కి దగ్గు జలుబు పట్టి క్షీణించింది మగాడి లా ధైర్యం గా జబ్బుతో పోరాడింది కాని విధికి లొంగి 19-12-1848న మరణించింది .’’షిర్లీ ‘’కవిత లో హీరోయిన్ ను ధైర్య వంతురాలిగా చూపింది .ఇరవై రెండేళ్ళ వయసులో రాసిన ‘’ది ఓల్డ్ స్తాయిక్ ‘’కవితలో యెమిలీ అసాధారణ ధైర్యం వ్యక్తిత్వం కని  పిస్తుంది .ఒక సారి తొంగి చూద్దాం –

‘’riches I hold in high esteem –and love I laugh to scorn –and lust of fame was but a dream –that vanished with the morn ‘’-and if I pray ,the only prayer –that moves my lips for me –is ‘’leave the heart that now I bear –and give me liberty ‘’ సంగీత ,శబ్ద శక్తి కి ఎమిలీని మెచ్చుకొంటారు .ఒకే ఒక్క నవలతో నవలా మణిగా వెలిగిపోయింది .1850దాకా ఆమె అసలు పేరు వెలుగు లోకి రాలేదు .’’a peculiar mixture of timidity and sportan like character ‘’-she was painfully shy and physically brave to a surprising degree . తన విధి నుంచి అంగుళం కూడా ప్రక్కకు తొలగని దీక్షా పరురాలు ఎమిలీ .

 

Inline image 1    Wuthering Heights (1847)

 

ఫ్లారెన్స్ నైటింగేల్ కు  సెక్రెటరి  -ఆర్ధర్ హగ్ క్లగ్

ఆర్ధర్ హగ్ క్లగ్ మారుతున్న ప్రపంచం లో పుట్టాడు .మార్పు నచ్చక పూర్వ భావనలే గోప్పవనే వాడు .భవిష్యత్తుపై నమ్మకం లేని వాడు .మొదటి నుంచి ఒడి దుడుకుల జీవితమే .1-1-1819న లివర్ పూల్ లో పుట్టి నాలుగవ ఏట సౌత్ కారోలిన్ చేరాడు తండ్రి తో .రగ్బీ స్కూల్ లో చేరి ప్రముఖ హెడ్ మాస్టర్ అయిన డాక్టర్ థామస్ ఆర్నోల్డ్ శిష్యుడైనాడు .ఆక్స్ ఫర్డ్ కాలేజిలో చేరి ,ప్రపంచ  పర్యటనకు బయల్దేరాడు .ఫ్రెంచ్ విప్లవ కాలం లో పారిస్ లో ఉన్నాడు .రోమ్ లో  అమెరికా ఫిలాసఫర్ ఎమర్సన్ ను కలిశాడు .ఆయన వలన అమెరికాలో వారానికి ఆరుడాలర్ల జీతం తో బతకచ్చు అని తెలుసుకొని అమెరికా వెళ్ళిపోయాడు .అమెరికాలో ఉపన్యాసాలిస్తూ ,అనువాదాలు చేస్తూ గడిపాడు ..లాభం లేదని గ్రహించి ఇంగ్లాండ్ చేరుకొన్నాడు ..పెళ్లి చేసుకొని ఫారిన్ మినిస్ట్రీ ఎడ్యుకేషన్ కమిషన్ రిపోర్ట్ కు సెక్రెటరి అయ్యాడు ..ఆరోగ్యం దెబ్బతిని మలేరియా సోకి ఫ్లారెన్స్ లో 13-11-1861న చనిపోయాడు

క్లగ్ జేవితం వాగ్దానాల మయమే తప్ప సాధించింది శూన్యం .సత్యాన్వేషకుడు గా మిగిలి పోయాడు బౌద్ధిక జ్ఞానం స్తిమితం లేకుండా చేసింది .కొన్ని కవితలు బాగా రాశాడు .’’thou shalt have one God only ,who –would be at the expense of two –no graven images may be –worshipped ,except the currency ‘’అతని ‘’ఆమర్స్ డీవాయెజ్ ‘’లో సెటైర్ తో బాటు సీరి యెస్ నేస్ కూడా ఉంది .ప్రేమ ,ప్రయాణం ,మతం  పై అతని అభిప్రాయం తెలియదు కాని ఆత్మ అన్వేషణ కని పిస్తుంది .హెక్సా మీటర్లలో కవిత్వం రాశాడు .భార్య సోదరి ఫ్లారెన్స్ నైటింగేల్ కు యుద్ధ సమయం లో జీతం లేని సెక్రెటరి గా సేవలందించాడు .

Arthur Hugh Clough 1860.jpg

 

 

ముని కవి  – మాధ్యూ ఆర్నోల్డ్

ఆర్నోల్డ్ కూడా విక్టోరియన్ కవి .నమ్మకం ,అనుమానాల మధ్య ఊగిస లాడాడు .ఇంగ్లిష్ క్రిటిసిజం కు మూల భావాలుగా ఆయన మాటలుంటాయి .తండ్రి రగ్బీ స్కూల్ హెడ్ మాస్టర్ .మాధ్యూ మిడిల్ సెక్స్ లోని లాలేహాం లో క్రిస్మస్ ఈవ్ నాడు 1822లో పుట్టాడు .రగ్బీ స్కూల్ లో చదివి కవిత్వం రాసి రాగ్బీ ప్రైజ్ సాధించాడు .ఇది ‘’అలారిక్ ఎట్ హోమ్’’గా ప్రసిద్ధం .ఎన్నో గౌరవాలు పొందాడు .బలోలి కాలేజికి స్కాలర్షిప్ వచ్చి చేరి హగ్ క్లగ్ కు హాస్టల్ మేట్అయ్యాడు .న్యుదిగేట్ ప్రైజ్ పొందాడు .

ఇరవై రెండులో డిగ్రీ పొంది రగ్బీ స్కూల్ లో పని చేసి ఒరిల్ కాలేజికి ఫెలోషిప్ సాధించాడు .లార్డ్ లాన్స్ డౌన్  కు పాతిక ఏళ్ళ కే  సెక్రెటరి అయ్యాడు  .వివాహం తో పొజిషన్ పెరిగి స్కూళ్ళ ఇన్స్పెక్టర్ అయ్యాడు .విదేశీయానం తరచూ ప్రయాణాం తనను ఇంటికి దూరం చేస్తున్నాయని బాధ పడేవాడు .’’ది స్త్రేయిడ్ రివీలర్ అండ్ ఆదర్ పోయెమ్స్ ‘’ను ఇరవై ఏడవ ఏట పబ్లిష్ చేశాడు .రెండేళ్ళ తర్వాత ‘’ఎమ్పిడికిల్స్ ఆన్ యెత్నా ‘’రాసి ప్రచురించాడు అరవై అయిదేళ్ళు మంచి ఆరోగ్యం తో జీవించి కొద్ది పాటి అస్వత్తత తో 15-4-1888న చనిపోయాడు . రోమాం టిజానికి-మోడరనిజానికి   వారది ఆర్నోల్డ్ .’’want of logic and thoroughness of thought’’కు ప్రాధాన్యత నిచ్చాడు .’’న్యు జర్నలిజం ‘’కు ఆద్యుడు ఆర్నోల్డ్ .ఆయన రాసిన వన్నీ ‘’కవర్ టు కవర్ ‘’చదివిస్తాయి .

ఆర్నోల్డ్ రాసిన సంస్కృతీ ,మతం వ్యాసాలూ బాగా ప్రసిద్ధి పొందాయి ‘’ఫైలిష్టినేస్ ‘’ను వ్యతిరేకించాడు .అంటే మధ్యతరగతి మనస్తత్వాన్ని వారి ఉదాసీనతను వ్యతిరేకించాడు .’’poetry had an ethical purpose ,that it should be ‘’a criticism of life’’and he believed that he believed that his own verse exemplified it .’’అని అభ్ప్రాయ పడ్డాడు .కవిత్వం అంటే జీవితానికి వ్యాఖ్యానం .దీన్ని కవి అందం గా శక్తి వంతం గా అన్వయించి చెప్పాలి .నీటికి వ్యతిరేకమైన కవిత్వం జీవితానికీ వ్యతిరేకమే అవుతుంది .నైతికత కు ఉదాసీనం గా ఉండే కవిత్వం జీవితానికీ వ్యతిరేకమే అంటాడు ఆర్నోల్డ్ మహా సహాయుడు .ఆర్నోల్డ్ కవిత్వాన్ని గౌరవిన్చారుకాని ప్రేమించ లేదు .అతని డవర్ బీచ్ కవితలోని కొన్ని పంక్తులలో ‘’eternal note of sadness ‘’కానీ పిస్తుంది .’’the sea of faith-was  once too,at the full ,and round earth;s shore –lay like the folds of a bright girdle furled –but nowi only hear –its melancholy ,long withdrawing roar –retreating to the breath –of the night wind ,down the vast edge drear –and naked shingles of the world ‘’.

ప్రి రాఫెలైట్స్త్

మాధ్యూ ఆర్నోల్డ్ రాసింది పెసి మిస్టిక్ కవిత్వాన్నిఆదరించక పోయినా విక్టోరియన్ ప్రజలు    ఫిట్జెరాల్డ్ రాసిన ‘’ఒమర్ ఖయ్యాం ‘’,ఫర్కార్ టప్పర్ రాసిన ‘’ప్రావేర్బియాల్ ఫిలాసఫీ ‘’ని లక్షలాది మంది చదివారు .పందొమ్మిదో శతాబ్ది మధ్యలో యాంటి విక్టోరియన్ గ్రూప్ ఒకటేర్పడింది .దీన్ని ప్రి రాఫెలైట్స్  బృందం ‘’అన్నారు .1850లో వీళ్ళు ఒక మేగజైన్ ను ‘’ది జేర్మ్’’పేరిట విడుదల చేశారు .అది ఒక పైన్తర్స్ ఉద్యమంగా మొదలైంది .యాంత్రిక యుగాన్ని విమర్శిస్తూ  సమకాలీన జీవితాన్ని వ్యాఖ్యానించింది .కళకు కొత్త జవ జీవాలు,గౌరవ పరాభవాలు  కల్పించాలని కోరింది .మన ఆలోచనలలో నిజాయితీ ఉండాలని కోరింది రాఫెల్ ,రినైసేన్స్ ల తర్వాత ‘’we must be early Christian-pre –Raphaelite’’అన్నారు .ఈ ఉద్యమం బాగా వ్యాపించి పైన్తర్లను కొంతమంది రచయితలను ప్రభావితం చేసింది .అదొక మిశ్రమ సంస్థ అయింది .అందులో విలియం హాల్మాన్ హంట్ ,ఎడ్వర్డ్ బర్న్స్ జోన్స్ ,ఫోర్డ్ మదాక్స్ బ్రౌన్ ,జాన్ ఎవరెస్ట్ మిల్లేస్ వంటి పైన్తర్లున్నారు .దంటే గాబ్రియల్ రోసేట్టే పైంటర్ మాత్రమె కాక కవి కూడా .విలియం మోరిస్ ఒక కొత్త సంస్కృతికి దారి తీశాడు .గాజు కిటికీలను ,వస్తుసామగ్రిని ,కంబలీలను ,పరికరాలను కొత్త తరహాలో నిర్మించాడు .తనకాలం లో చిన్న బోయిన దాన్ని మళ్ళీ వైభవానికి తెచ్చాడు .దీన్ని యుటోపియన్ఆఫ్ ‘’న్యూస్ ఫ్రం నో వేర్ ‘’;గా తెలిపాడు

కోవెం ట్రీ పాట్ మోర్

జేర్మ్స్మేగజైన్ కు యధాశక్తి కృషి చేసిన వాడు కోవెంట్రీ పాట్ మోర్ .23-7-1823లో ఎప్పింగ్ ఫారెస్ట్ లో పుట్టి ,తండ్రి వద్దే అన్నీ నేర్చి ,తండ్రిలా పైంటర్ అవకుండా సాహిత్యానికే అంకితమయ్యాడు .థాకరే ‘’వికసిస్తున్న కవి మొగ్గ ‘’అన్నాడు .ఇరవై ఒకటిలో మొదటి సంకలనం ‘’యాన్ ఏంజెల్ ఇన్ ది హమ్ ‘’వదిలాడు  బ్రిటిష్ మ్యూజియం కు అసిస్టంట్ లైబ్రేరియన్ అయ్యాడు .భార్య మరణం తో రోమన్ కేధలిక్ అయి ,ఒక ఎస్టేట్ కు అధిపతి అయ్యాడు .’’అన్  నొన్  ఈరోస్ ‘’రాసి అందులో గృహస్థ జీవితం ,ప్రేర్మలను కరిపించాడు .మొద్దో పెళ్లి చేసుకొని లిమింగ్ టన్లో ఉన్నాడు .26-11-1896న డెబ్భై మూడో ఏట చనిపోయాడు .అతని భాష అధిక తియ్యదనం ,విసుగుదనం తో ఉంటుంది .

 

Inline image 2

 

కవి చిత్రకారుడు -డాంటే గేబ్రియల్ రోసేట్టి

విక్టోరియన్ కాలం లో రోసేట్టీలు ఫైన్ ఆర్ట్స్ కు గొప్ప సేవ చేశారు .తండ్రి ఇటాలియన్ తల్లి సగం ఇటాలియన్ .ఇల్లు అంతా నియో పోలిటన్లు టస్కాన్ సంస్కృతీ తో జీవించింది. పెద్ద కోడుకు డాంటే  గాబ్రియల్ కవిగా పెయింటర్ గా ,నాయకుడు గా ఎదిగాడు 12-5-1828లో పుట్టిన గాబ్రియేల్ తన కవితలకు స్వయం గా బొమ్మలు వేసుకొని చిన్నతనం లోనే అందరిని ఆకర్షించాడు .ఇరవైలలో ఫోర్డ్ మడాక్స్ బ్రౌన్ అనే గొప్ప పైంటర్ దగ్గర చేరి మెళకువలు గ్రహించాడు .కొన్ని నెలల తర్వాతా ఇద్దరు మిత్రులతోకలిసి ‘’ప్రి రాఫెలైట్ బ్రదర్ హుడ్ ‘’ను స్థాపించాడు .విలియం మోరిస్ మొదలైన వారందరూ చేరి ఊపు తెచ్చారు .రోసేట్టి వేసిన చిత్రాలు ప్రి రాఫెలైట్స్ కు అద్డ్డం పడతాయి .జాన్ రస్కిన్ ఈ ముఠాపై విరుచుకు పడ్డాడు .రోసేట్టి సంపూర్ణ మోడల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసి సాధించాడు .ఎలిజబెత్ సిద్దాల్ తో ప్రేమాయణం సాగించి ,పెళ్ళాడి తన కలల స్వరూపాన్ని పొందాడు .ఆమె ఎప్పుడూ జబ్బు పడే ఉండేది బాధ భరించలేక మత్తు మందుకు అలవాటు పడింది .ఒక రోజు డోసు ఎక్కువై నిద్రలోనే చనిపోయింది

భార్య చనిపోయిన తర్వాతా రోసేట్టి లండన్ లోని చాల్సియా లో ఉన్నాడు .రొమాంటిసిజం పై కొంత కాలం ఊగాడు .కీట్స్ పై  ఆరాధన పెరిగింది ..’’బాలడ్స్ అండ్ సీన్స్ ‘’అనే అద్భుత కవితా సంకలనం తెచ్చి 9-4-1882న రోసేట్టీ మరణించాడు .యూరోపియన్ సింబాలిజం పై గొప్ప ప్రభావం చూపాడు .ఈస్థటిక్ ఉద్యమానికి ఊపిరిలూడాడు . పెయింటింగ్ లో  డేకరేటివ్ ఆర్ట్ లో గొప్ప సాధన చేశాడు .

Inline image 3

 

సశేషం

మీ-గబ్బిటదుర్గా ప్రసాద్ -9-6-14-కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు -51 సోడాలోనే కాదు మాటల్లోనూ గాస్ బాగా దట్టించి కిక్కిచ్చే మా- సోడా మోహన్

ఊసుల్లో ఉయ్యూరు -51

సోడాలోనే కాదు మాటల్లోనూ గాస్ బాగా  దట్టించి కిక్కిచ్చే మా- సోడా మోహన్

మేము  1950లో హిందూపూర్ నుంచి ఉయ్యూరుకు పూర్తిగా మకాం మార్చేశాము .అప్పుడు నాకు పది ఏళ్ళు .వేసవిలో దాహం వేస్తె ఉయ్యూరు సెంటర్ లో బూర గడ్డ బసవయ్య కొట్టు ముందు ‘’హిమాలయా కూల్ డ్రింక్స్ ‘’అనే షాపు ఉండేది అక్కడికి వెళ్లి ఐస్ లో పెట్టిన చల్లని సోడా కొట్టించుకొని తాగే వాళ్ళం .కావలసిన వాళ్ళు డ్రింకులు తాగే వాళ్ళు. అప్పుడు మాకు అంత ‘’దృశ్యం ‘’లేదు .దాని యజమానులు ఇద్దరు ముస్లిం లని జ్ఞాపకం .గళ్ళ లుంగీలతో బారెడు నల్ల యెర్ర గడ్డాలతో చూపులకు కొంచెం భయంకరం గా ఉండేవాళ్ళు .ఒకటని పేరు’’ బాబులు’’అని జ్ఞాపకం  ఊరు ఊరంతా సాయం వేళ సోడా డ్రింకులకు అక్కడికే చేరేవారు .సోడా ఓపెనింగ్ మోతలతో సెంటర్ అంతా దద్దరిల్లేది చూట్టానికి ,వినటానికి సరదాగా ఉండేది . ఆ డ్రింకు షాపు యజమానుల్లో ఒకాయన తర్వాత టైలర్ గా మారి మా బట్టలు కుట్టేవాడు వాళ్ళ అబ్బాయిలు నాకు క్లాసు మేట్లు.మా ఇళ్లదగ్గర ఆడవాళ్ళకు సోడా తాగాలంటే చాలా ఇబ్బంది గా ఉండేది .అవకాశమే ఉండేది కాదు .

అదుగో అలాంటి పరిస్తితులలో’’ సోడా మోహన్  ‘’   ఆపద్బాన్ధవుడే అయ్యాడు మాకు .ఇంటింటికీ సోడా బండీ  తీసుకొచ్చి సోడా అరలపై రెండు గొనె సంచీలు కప్పి ఎక్కడ నీళ్ళు ఉంటె అక్కడ వాటిని పూర్తిగా నీటి తో తడిపి ప్రతిక్షణం సోడా చల్లగా ఉండేట్లు చేసేవాడు .అవసరమైతే గడ్డి కప్పే వాడు .కనుక సెంటర్ కి సోడా కోసం వెళ్ళాల్సి వచ్చేదికాదు .అతనే మా ఇంటికి వచ్చేవాడు మిట్ట మధ్యాహ్నం పన్నెండు నుంచి రాత్రి ఎనిమిదింటి దాకా సోడా బండీ బ్రాహ్మణ కోమట్ల బజార్లలో తిప్పేవాడు .సోడాలన్నీ ఖర్చాయి పోయేవి మా దాహార్తిని తీర్చిన ‘’సోడా భగీరధుదు ‘’సోడా మోహన్ .ఎర్రగా కుది మట్టం  గా కాఖీ నిక్కర్ ,గళ్ళ చొక్కాతో ఉండేవాడు ఎప్పుడూ నవ్వు ముఖం తోనే కని పించేవాడు .సరదాగా మాట్లాడే వాడు .మాటల్లో దించి అక్కర లేక పోయినా సోడా కొట్టి తాగించటం మోహన్ ప్రత్యేకత .సోడా ను ఓపెనర్ తో కొట్టి దాదాపు మూడు నాలుగు నిమిషాలు  గాస్ ను  బుస బుస  పొంగించి కెవ్వు కేక లా శబ్దం వచ్చేట్లు చేసి తాగటానికి ఇచ్చేవాడు .ఆ సోడా తాగితే యెంత కడుపు నిండా భోజనం చేసినా యిట్టె అరిగి పోయేది .అదీ మోహన్ సోడా స్పెషాలిటి .కనుక ఒక సోడా తో ఆగే వారు కాదు రెండు తాగి బ్రేవ్ మని  త్రేం చాల్సిందే .అదీ దాని ప్రభావం .అందుకే నేను ‘’మోహన్ !నువ్వు సోడా కంటే నీ గాస్ మాటలనే మాకు అమ్ముతున్నావయ్యా ‘’అనే వాడిని .దాదాపు మా కంటే అయిదారేళ్ళు చిన్న వాడేమో మోహన్ .

సోడా మోహన్ అనే అందరూ పిలిచేవారు అవతల బజారు లో సోడా కోడితే మా బజారులో విని పించేట్లు చేయ గల నేర్పు అతనిది .కనుక ఆ శబ్దం విని లైన్ లో ఉన్నాడని తెలిసి మా సందు చివర నిలుచొని ఇంటికి పిలిచే వాళ్ళం .ఇంటిల్ల పాదీ తాగే వాళ్ళం  .అందుకని సాయంత్రం ప్రతి రోజు మా ఇంటికి రాకుండా వెళ్ళే వాడు కాదు .’’సోడా చల్లని ఐస్ సోడా ‘’అని అరుస్తూ సోడా అమ్మే వాడు .వేసవిలో మా అక్కయ్యలు బావలు మేనల్లుల్లు మేన కోడళ్ళు ఉయ్యూరు వచ్చేవారు కనుక సోడా లకు మంచి గిరాకీ ఉండేది .అప్పుడు సోడా అర్ధణా అని జ్ఞాపకం తరువాత అణా అయింది .ఆ తర్వాత పది పైసలు  ,పావలా అర్ధ రూపాయి దాకా పాకింది .అప్పట్లో సోదాలో నవాసారం కలిపే వారని అది హాని అని అనేవారు కాని సోడా మోహన్ సోడా లో అదిఉండేది కాదని మా నమ్మకమే కాదు ఊళ్ళో అందరి నమ్మకం కూడా .అందుకే మోహన్ అంటే ఆదరణ హెచ్చు .అతని సోడా తాగక  పొతే రోజు గడవదని నమ్మకం ఏర్పడ్డాయి .

సోడా మోహన్ అసలు పేరు రామ మోహన్ .ఇంటి పేరు కొలసాని  అని జ్ఞాపకం కాపులు .వాళ్ళ నాన్న నరసింహా రావు .హైస్కూల్ దగ్గర ఇప్పటి సుందరమ్మ పేటలో స్థలం కొని పాక వేసుకొని ఉండేవాడు అతను టైలర్ .బట్టలు కుట్ట్టే వాడు మా బట్టలూ కుట్టేవాడని జ్ఞాపకం .ఎర్రగా భారీ పర్సనాలిటి నీరుకావి లుంగీ కట్టేవాడు చొక్కా తోడుక్కుండగా నేను చూడ లేదు .ఒళ్లంతా బొచ్చు తో భీకరం గా ఉండేవాడు .మంచివాడు మేమంటే గౌరవం గా ఉండేవాడు .భార్య కూడా ఎర్రగా భారీ పర్సనాలిటీయే .రామ మోహన్ కు ఇద్దరు తమ్ముళ్ళు ,ఒక చెల్లెలు  రెండవ  వాడు కృష్ణ మోహన్ .ఊర వారి సినిమా హాల్ దగ్గర సోడా బీడీ సిగరెట్ బడ్డీ పెట్టాడు ఇప్పుడు ఆటో కొని నడుపుతున్నాడు .మూడవ వాడి పేరు జ్ఞాపకం లేదుకాని నేను ఉయ్యూరు హైస్కూల్ లోపని చేసినప్పుడు చదివాడు .చెల్లెలు కూడా ఎర్రగా బాగా ఉండేది స్కూల్ లో నా స్తూదేంటే సోడా మోహన్ ఆర్ ఎస్ ఎస్ కు వీర విధేయుడు .మాతో బాటు సంఘానికి వచ్చేవాడు .అతను ఎంత ఎర్రగా ఉంటాడో అంతటి నల్లని పిల్లను చేసుకొన్నాడు ఆశ్చర్య మేసింది .గేదెలను కొని మేపుతూ పాలు అమ్మేవాడుకూడా సాధారణం గా భార్యయే ఇళ్ళకు తెచ్చి పాలు పోసేది .ఇతనికి సోడా వ్యాపారమే సరి పోయేది .హైస్కూల్ లో గడ్డి పాట  పాడేవాడు గడ్డికోసి గేదెలను మేపే వాడు .పాట  అప్ప్రువ్ కాక పొతే వచ్చి నాకు చెప్పే వాడు . టైం పడుతుందని సలహా చెప్పేవాడిని   మాస్టార్ని అయిన తర్వాతా ‘’మేస్టారూ ‘’అనే పిలిచేవాడు .ఆప్యాయతకు మారు పేరు గా మసిలాడు .ఊరందరి కి మంచివాడని పించుకొన్నాడు తగాదా మనిషి కాదు .డబ్బులు చేతిలో లేక పొతే అప్పు పెట్టి తాగి ఒకే సారి చెల్లించే వాళ్ళం .బి జే పి  అన్నా మోహన్ కు మంచి అభిమానమే వాజ్ పాయి అద్వాని గురించి వీరావేశం గా చెప్పేవాడు .అలాగే ఒక పల్లెకారు అతను చిన్న వంతెన దగ్గర ఉండేవాడు పగలల్లా చేపలు లు పట్టి అమ్ముకొని సాయంత్రాలలో మా పార్ధి మేస్టారి పార్ల మెంట్ కు చేరేవాడు .పేరు  జగన్నాధం అని గుర్తు . ఆర్ ఎస్ ఎస్ జనసంఘ్  జెపి లంటే యెంత అభిమానమో అతనికి మాటల్లో చెప్పలేను మాతో పాటు టు చక్కగా పరిశుభ్రమైన భాష లో రాజకీయాలు మాట్లాడేవాడు మేము చెప్పింది వినేవాడు .తను చెప్పదలచింది సంకోచం లేకుండా చెప్పేవాడు .ఎలక్షన్లు వస్తే మాకు సందడే సందడిఅర్ధ రాత్రి దాకా కబుర్లే .కోమటి సాంబయ్య ,పార్ధి, కొలచల చలపతి ,మండా వీర భద్ర రావు ,ఎల్ ఐసీ శ్రీ హరిరావు ,ఇంకో ఎల్ ఐసీ కొమటా యన ,నేనూ ముత్తయ్య మేష్టారు ఆయన కెసీపి భాస్కర రావు మొదలైన వారందరం చేరే వాళ్ళం .భలే సరదాగా ఉండేది .సోడా మోహన్ సోడా లన్నీ అమ్ముకొని ఇంటికెళ్ళి భోజనం చేసి వచ్చి మాతో చేరేవాడు .

సోడాల ధ్యాసలో ఉన్నాం కనుక మా ఉయ్యూరు సోడా గాస్ గురించి చెప్పక పొతే ఉయ్యూరు నన్ను క్షమించదు .మా షుగర్ ఫాక్టరీ బై ప్రాడక్ట్ గా సోడా గాస్ ఉండేది సిలిండ ర్లలో నింపి  హై ప్రేసర్  లో లిక్విడ్ గా మార్చి నిలవ ఉంచి హోల్ సెల్ గా రిటైల్ గా అమ్మేవారు .అక్కడి నుండే తెచ్చుకొని సోడా మెషిన్ కు సిలిండర్ బిగించి సోడా కాయల్ని శుభ్రం గా గడ్డిపరకల తో కడిగి ,మిషన్ న్ కు తగిలించి సోడా గాస్ నింపి కేసుల్లో అమర్చుకొని బ లలోను సోడా బండీ లలోను పెట్టుకొని అమ్మేవారు .ఏ గాస్ కు లేని ప్రత్యేకత ఉయ్యూరు సోడా గాస్ కు ఉంది . దీని రుచి కిక్కు అదుర్స్ తాగిన వాడు కెవ్వు కేక .మిగతా ఊళ్ళలోని గాస్ ఎందుకో ఏదో వాసన వచ్చేది .ఇది మాత్రం చాలా స్వచ్చం గా ఉండేది .అందుకే రాష్ట్రం అంతా  ఉయ్యూరు నుంచే సిలిండర్లు తెప్పించుకొనే వారు .”ఇది గాస్ ”కాదు పచ్చినిజం . కంకిపాడు పామర్రులలో బస్ లు ఆగినా ఉయ్యూరులోనే ప్రయాణీకులు సోడా కొట్టించుకొని తాగే వారు  అదే  మా కెసీపి సోడా గాస్ కున్న ప్రత్యేకత

మా ఇంటినుంచి సెంటర్ కు వెడుతుంటే సెంటర్ కు దగ్గరలో కుడిప్రక్కన ఒక కుర్ర సాహేబు గారి కిళ్ళీ కొట్టు ఉండేది .అక్కడ కిళ్ళీ స్పెషల్ అక్కడే అందరూ కిళ్ళీలు కట్టించుకోనేవారు చాలా రుచిగా ఉండేది .అతని దగ్గరా సోడాల అమ్మకం ఉండేది .హిమాలయా కూల్ డ్రింక్స్ మూత పడిన తర్వాత ఈ బడ్డీ లోనే సోడా తాగేవారు బాగా ఉండేది కూడా .అతను మనిషి కురచ పొట్ట లావు .అతని బావ మరిది నా శిష్యుడు ట్యూషన్ కూడా చదివాడు .కొంత కాలం బస్ రిజర్వేశాషన్ టికెట్లు  కూడా అమ్మేవాడు అతనిదే కాటూరు రోడ్డులో ఉన్న సహారా ఆఫీసు బిల్డింగ్ అని విన్నాను .

సోడా మోహన్ కు పోటీగా ఇద్దరు ముగ్గురు సోడా బండీ లు వేసుకొని ఊరిలో తిరిగి సోడా లమ్మే వారు .అందులో ఒక  సాహేబు గారు ఒక సన్నగా పీలగా ఉండే కాపు ఆయనా ఉన్నారు .వీరి సోడా కంటే సోడా మోహన్ సోడా కే అప్పటికీ ఇప్పటికీ గిరాకీ ఎక్కువ .ఈ మధ్య మోకాళ్ళ నెప్పి తో బాధ పడుతున్నట్లు సోడా మోహన్ చెప్పాడు .కాని సోడా అమ్మకం మాన లేదు .ఇప్పుడు లక్ష్మి టాకీస్ అని పిలువ బడే ఏకాంబరేశ్వర పిక్చర్ పాలెస్ దగ్గర బడ్డీ కొట్టు లో సోడా లు అమ్మేవారు .అలాగే అన్ని దియేటర్ల దగ్గరా ఇప్పుడున్నాయి .

జనం తెలివి మీరి ఇప్పుడు మామూలు సోడా తాగటం మానేశారు నిమ్మకాయ సోడా లే తాగుతున్నారు .ఉయ్యూరు సెంటర్ లో అయిదారు షాపులు ఉన్నాయి నిమ్మకాయ కోసి రసం పిండి పోడవైనపెద్ద గాజు   గ్లాసులో పోసి కొద్దిగా సోడా ఉప్పు పంచదార  లేక ఉప్పు కలిపి రెండు మూడు సోడా లు దానిలో కొట్టి ,నురగలు తెప్పించి చెంచా తో కలిపి ఇస్తారు చాలా బాగుంటుంది వేసవి స్పెషల్ అయిన్దిప్పుడు నిమ్మకాయ సోడా .నా ముస్లిం శిష్యుడికి సెంటర్ లో కనక దుర్గా హోటల్ దగ్గర నిమ్మకాయ సోడా షాపులున్నాయి నేను తాగ టానికి వెడితే చాలా స్పెషల్ గా కలిపి ఇస్తాడు .అందరి కంటే డబ్బు తక్కువే తీసుకొంటా డుకూడా .ఇప్పుడు మా బజారులో కోట దగ్గరే నిమ్మకాయ సోడా తయారు చేసి అమ్మతున్నారు .కిందటి వేసవిలో అమెరికా నుంచి మా అమ్మాయి మనవలు వచ్చినప్పుడు రోజూ అక్కడికే వెళ్లి రాత్రివేళ నిమ్మకాయ సోడా తాగేవారు .అంతకు ముందు కొన్నేళ్ళు నిమ్మకాయ రసాం కలిపి గాస్ తో సోడా బుడ్డి  ని నింపి కొట్టి ఇచ్చేవారు . అది  అంత  బాగుండే దికాడు .ఇప్పటి విధానమే  చాలా బాగుంది .కొందరు సోడాను రబ్బరు ఓపెనర్ అక్కర్లేకుండా వ్రేల్లతోనే కొట్టే మొనగాళ్ళు ఉండేవారు వాళ్ళు కొడుతుంటే గుడ్లు అప్పగించి చోద్యం గా చూసే వాళ్ళం

ఇన్నాళ్ళకు, ఇన్నేళ్ళకు సోడా మోహన్ గురించి రాయటానికి అవకాశం కలిగింది ఇన్నేళ్ళు రాయ నందుకు సిగ్గు పడుతూ ఇప్పటికైనా రాయ గలిగి నందుకు ఆనందిస్తూ సోడా మోహన్ గురించి రాయలేదేమని నన్ను ప్రశ్నించిరాయమని గట్టిగా చెప్పి ప్రేరణ నిచ్చిన మా రెండో అబ్బాయి ఛి శర్మ  ను అభినందిస్తున్నాను .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-6-14-కాంప్ –మల్లాపూర్ –హైదరా బాద్

 

 

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | 2 Comments

పూర్వఆంగ్ల కవుల ముచ్చట్లు -41

పూర్వఆంగ్ల  కవుల ముచ్చట్లు -41

                            పందొమ్మిదవ శతాబ్దం -చీకటి వెలుగులు
   విక్టోరియన్ యుగాన్ని”వింత ”యుగం అని సాధారణం గా అంటారు ..చాలా సీరియస్ గా రాసిన వారూ చాలా సుందరం గా కమ్మగా రాసిన వారూ ఉన్నారు .జీవితాన్ని తేలిక గా తీసుకొని రాసిన వారూ ఉన్నారు .నీతికి నిబద్ధులైన వారు ,,అజాగ్రత్త గా ఉన్న వారు ఉన్నారు ..సమాజం  లో తల్లులు భరించ  రానిది ,ఆడపిల్లలు చదవకుండా విడిచి పెట్టనిదీ  లేని కవిత్వం రాసి పేరు పొందిన వాడు టెన్నిసన్ కవి .కాలమ్ ,1870  .
      విక్టోరియన్ కాలం లో  పదవీ గౌరవాలే పరమార్ధాలు .దీనికె బెర్నార్డ్ షా ”సెవెన్ డేడ్లి వర్త్యూస్ ”అన్నాడు .మ ధ్య తరగతి ప్రజలు నీతికి పోరాడారు ..స్పెన్సర్ ”అభివృద్ధి అకస్మాత్తుగావచ్చేదికాక పోయినా అవసరమే ”అన్నాడు . భౌ తిక  వాదాన్ని నియంత్రించక పొతే ప్రమాదం అన్న వారూ ఉన్నారు .కార్మిక న్యాయాలు ,ట్రేడ్ యూనియన్ ల హక్కులు ,సహకార సంస్థలు ,వాటి ఉద్యమాలు ,కామన్ వెల్త్  దేశాలలో ప్రపంచ సోదర భావం వంటివి చోటుచేసుకొన్నాయి .
           lలఘు కవితలలలో మేటి అయిన ఆస్థానకవి -ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్
      ఈ విరుద్ధ భావాలను కవిత్వం లో నింపిన వాడు  ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్  6-8-1809లో లింకన్ షిర్ లోని సోమర్బై లో పన్నెండుగురు సంతానం లో నాలుగవ వాడుగా పుట్టాడు ..ఏడవ  ఏట లౌత్ స్కూల్ కు పంపారు చదువు బాగా రావాలని హెడ్ మాస్టారు పిల్లల తలను పుస్తకాలతో బాదేవాడు ..పన్నెండు ఏళ్ళకే  స్కూల్ వదిలి ,పందొమ్మిది వరకు తండ్రి దగ్గరే చదివాడు .తండ్రికి   క్లాసిక్స్ అభిమానం అయితె కొడుకు హోరేస్ రాసిన ఓడ్స్ బట్టీ పట్టిన తరువాతే యూనివర్సిటీకి   పంపాడు …తండ్రితమ్ముడి వలన మోసపోయి ఆస్తి పోగొట్టుకొని మూడీ గామారాడు .ఇద్దరు పిల్లలకు నరాల బలహీనత ..ఇంకొడు  మత్తుమందు కు బానిస  .యెప్పుడూ  నెల మీదే పడి  ఉండేవాడు ..ఈవిష యాలన్నీ కవిత్వం లో రాసుకొన్నాడు కవి టెన్నిసన్
               చదవటం రాక ముందే టెన్నిసన్ కవిత్వం చెప్పాడు .యెనిమిదెడి ఏళ్ళకే  బ్లాంక్ వేర్స్ లో ఆరువేల పంక్తుల మహా కావ్యాన్ని రాసిన చిన్నారి పెద్దకవి పద్నాలుగులో మిల్టన్ రాసిన ”సామ్సన్ అగోనిస్టెస్ ”.ను వ్యాఖ్యానించి వివరణా త్మకం గా రాసి విమర్శకుల జాబితాలో చేరాడు రెండు .  నాటకాలు ”ఆర్మ గడాన్ ”అనే కవిత రాశాడు .దీనినె తర్వాతా మార్చి ”టిం బుక్టూ ”పేర ముద్రింఛి బహుమతి పొందాడు ..బైరాన్ మృతికి విచారించి ,అడవుల్లోకి వెళ్లి రాళ్ళ మీద ”బైరాన్ ఈజ్ డేడ్ ”అని రాసి మనసులోని బాధ పోగొట్టుకొన్నాడు ..సొదరుడు చార్లెస్ తోకలిసి ”పోయెమ్స్ బై టు  బ్రదర్స్”రాసి అచ్చు వేశాడు ..ఇంకొ సోదరుడు ఫ్రెడరిక్ రాసిన నాలుగు కవితల్ని అరవై ఏళ్ళ తర్వాత ప్రసిద్ధ కవిగా పెరుపొందినా  చేర్చి ”కలేక్టేడ్  వర్క్ ”లో చేర్చి ప్రచురించిన పెద్దమనసు టెన్నిసన్ ది
   పందొమ్మిది లో చార్లెస్ తో కలిసి కేంబ్రిడ్జి ట్రినిటి కాలేజి లో చేరి మెట్రిక్ పాస్ అయ్యాడు అక్కడే  ఆనందం గా ఉండలేక ఇంటి మీద మనసు మల్లింది .”ది అపోజిల్స్ ”అనే క్లబ్ ను స్నేహితులతో కలిసి స్తాపించాడు ..సైన్సును అభిమానిన్చినా అందులో దూసుకు పోలేక పోయాడు.డి గ్రీ పొందకుండానే కేంబ్రిడ్జి ని వదిలేశాడు .అండర్  గ్రాడ్యు ఎట్ గా ఉండగానే”పోయెమ్స్ చీఫ్లీ లిరికల్ ”రాసి ముద్రించాడు .అతి గా ఉందనిపించినా తియ్యదనామ్  ఎక్కువైందని పించినా ”మారియానా ”,వంటి వాటిలో సంగీతం అలరించింది  మూడేళ్ల  తర్వాత మరో కవితా సంకలనం తెచ్చాడు ..కీట్స్  ను చీల్చి చెండాడిన వాడే దీన్నీ అదే ధోరణి లో విమర్శించాడు ..తన ఆత్మ గౌరవం దెబ్బ తిందని టెన్నిసన్ అనుకొన్నాడు .. ఉపయోగం లేనిదైనా అందులోని సంగీత ధ్వనులు మెచ్చ కుండా ఉండలేక పోయారు
 ఇరవై మూడులో హెన్రి ఆలం అనే చరిత్ర పరిశోధకుడు ,తండ్రి ముఖ్య స్నేహితుడు అనుకోకుండా హోటల్ రూం లో రక్తం గడ్డ కట్టి చనిపోతే చలించిపోయి , బయటికి  రాలేక పోతున్నాడు .అయన పై ”ఇన్ మెమోరియం ”అనే కవిత రాశాడు ..దేవుడు  అంటే  ఏమిటో కొంచెం అవగాహనకు వచ్చాడు . కీట్స్ ,మిల్టన్ ల ఎలిజీ ల లాగా కాకుండా దీన్ని స్వీయ భావ ప్రకటన గా రాశాడు .ఇది కవిత మాత్రమె కాని జీవిత చరిత్ర కాదని చెప్పాడు .”ring out ,wild bells to the wild sky -the flying cloud ,the frosty light -the year is dying in the night -ring out ,wild bells ,and let him die ”
  ”ring out the old ,ring in the new -ring ,happy bells ,across the snow -the year is going ,let him go -ring out the false ,ring the true ”.. అనేవి అందరూ తరచుగా వాడే వె అంతగా జనం లోకి చొచ్చుకు పోయింది ..సొదరుడు  చార్లెస్  కు ఎంగేజ్ మెంట్ అయిన తర్వాతా నల్ల  మందుకు అలవాటు పడ టం తో కాన్సిలయింది ..టె న్నిసన్ పద్నాలుగేళ్ళ నుంచి ఎదురు చూస్తున్న ఎమిలీ ని పెళ్లి చేసుకొన్నాడు …ఈ హుషారులో మెమోరియం విడుదల చేశాడు అదే  సమయం లో వర్డ్స్ వర్త్ కవి చని పోవటం తో ఆస్థానకవి గా టెన్నిసన్ నియమింప బడ్డాడు ..పుట్టిన  కొడుకుకు ”హల్లాం ”పేరు పెట్టాడు ..ఇన్ని విజయాలు సాధించినా టెన్నిసన్ ప్రజల కవి అని పించుకో లేక పోయాడు .కాని విద్యావంతులలో ప్రముఖుడు గా నిలిచాడు అయిదేళ్ళ  తర్వాత ”ది ప్రిన్సెస్” రాసి ప్రచురించాడు ..ఇన్దులొ సంగీతాన్ని స్త్రీ సమస్యలతో మేళ వించాడు .. ఇవాళ దీన్ని పట్టించుకొనే వారెవరూ లేరు
  దంపతులు ఐల్ ఆఫ్ వైట్ లో స్తిరపడ్డారు .”టు సేక్రేడ్ పైప్స్ ”’రాశాడు 1855 లో రాసిన ”మౌడ్”ను మెలోడ్రామ గా వదిలాడు అది ”చిన్న హామ్లెట్ ”అని చెప్పుకొన్నాడు .కని పసలేదన్నారు .”ఐడిల్స్ ఆఫ్ ది కింగ్”రాసి అందులో ఆరవ శతాబ్దానికి చెందినా ఆడ మగ వారిని గురించి ”క్వీన్ ఈనోక్ ఆర్డెన్ ”గురించి రాశాడు .చివరి కాలం లో టెన్నిసన్ అత్యుత్తమ కవిత రాశాడు .దెబ్భై లో ”బలడ్స్ అండ్ ఆదర్  పోయెమ్స్”రాశాడు .ఇప్పుదె అనేక గౌరవాలు అందుకొన్నాడు ఽఅక్స్ ఫర్డ్ గౌరవ డాక్టరేట్ ఇచ్చింది గ్లాస్గో యూని వర్సిటి రెక్తార్శిప్ ఇస్తానంటే తిరస్క రించాడు ..ప్రధాని గ్లాడ్ స్టన్ తో కలిసి నార్వే డెన్మార్క్ టూర్ చేశాడు ..యెనభై లో నరాల బలహీనత తో గౌట్ వచ్చింది ..ఇన్ఫ్ల్యు ఎంజా సోకింది .ఱచన మాత్రం మాన లేదు .ప్రూ ఫులు సరిదిద్దుతూనే ఉన్నాడు .”సిమ్బలీన్ ”లో ఒక పాసేజి పై చూపుడు వ్రేలిని ఉంచి చూస్తూ 6-10-1892అర్ధ రాత్రి మరణించాడు ఽఅయన శవ పేటిక లో షేక్స్ పియర్ నాటకాన్ని ఉంచి వెస్ట్ మినిస్టర్ ఆబ్బె లో గౌరవ లాంచనాలతో సమాధి చేశారు .
   ఆ కాలం లో బాగా ప్రాచుర్యం పొంది ,బాగా చదవ బడిన కవి టెన్నిసన్  మార్గ దర్శి కాదుకాని పూర్వకవుల దారిలో పయనించి గొప్ప కవితా సేద్యం చేసి మంచి పంటలే పండించాడు”he was one of the best and one of the worst of poets” అంటారు .సెంటి   మెంట్  ను ఎక్కువ గా వాడుకొన్నాడు.”what does little birdie say -in her nest at peep of day?-let me fly ,says little birdie -mother ,let me fly ” అనే లైన్లు అందరి మనస్సులో ఉండిపోయాయి .టె న్నిసన్ ను  ”a cross between the traditional ministrel and the conventional maiden aunt ”  అని ఆట పట్టించారు  టెన్నిసన్ కు జనాన్ని తనతో లాక్కుపోయే కవితా బలం లేదంటారు .చివరగా”if the style was not the complete man ,it was the expression of the artist who was a perfectionist in verbal felicities .few poets have had a finer ear for the delicate nuances of sound ,and still fewer have surpassed Tennyson;s  undulating ease ,his limpid lyricism ,and some times matchless music ”.
    రాసిన ప్రతిదానినీ పెర్ఫెక్షన్ కోసం అనేక మార్లు మార్చి రాసిన ఏకైక కవి టెన్నిసన్  గ్రీకు ,లాటిన్ కవిత్వం లోని నాణ్యమైన భావనలను ఛందస్సును చక్కగా ఉపయోగించుకొన్నాడు విక్టోరియన్ కవులలో క్రమ పధ్ధతి భావాలను అనుసరించి ఉత్తమ కవి గా భాసించాడు .తన కవిత్వం తో ప్రేరణ కల్గించలేక పోయినా వ్యక్తిత్వం తో ప్రభావితం చేశాడు జీవితాన్తమ్ డిప్రెషన్ తో బాధ పడుతున్నా కవితాధార ఆగిపోనీకుండా ఇంకి పోనీకుండా కాపాడుకొన్నాడు .”saddest of all English poets ”whose technical mastery of verse and language proved a surface to  his poetry;s depth to the abyss of sorrow  ” అని ఇలియట్ కవి టెన్నిసన్ కవి పై ముద్ర వేశాడు . సుమారు నలభై దాక రచనలు చేశాడు
Alfred Lord Tennyson 1869.jpg  
    సశేషం
  మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ -8-6-14–కాంప్ -మల్లాపూర్ -హైదరా బాద్
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -40 విక్టోరియా కాలపు ప్రేమ కధలు

పూర్వాంగ్ల  కవుల ముచ్చట్లు -40

         విక్టోరియా కాలపు ప్రేమ కధలు
             మొనోలోగ్స్ సిద్ధ హస్తుడు – రాబర్ట్ బ్రౌనింగ్
బ్రౌనింగ్ జీవించిన డెబ్భై ఏడు సంవత్సరాలలో న్పందోమ్మిదవ శతాబ్దపు ఇంగ్లాండ్ అనేక ప్రశాంత విప్లవాలను చవి చూసింది .విక్టో రియన్ కాలం లో మార్పులు నెమ్మదిగా వచ్చినా అవి గణ నీయమైనవి .కారల్ మార్క్స్ కు అప్పటికి అంత సీను లేదు ..పార్ల ర మెంట్ లో డబ్బున్న వాళ్ళకే ఓటు హక్కు అనే దానిపై తర్జన భర్జన జరుగుతోంది . సమాన  వోటు హక్కు కోసం ప్రజలు పట్టు బడుతున్నారు ..చారిటా న్ ల ఈ ఉద్యమం క్రమంగా బలపడి అనుకొన్నవి సాధించారు .ఆ  శతాబ్ది మధ్యలో కాని బాల కార్మికుల పని పై ఆంక్షలు రాలేదు .ఫక్తరీ కూలీల జీవితాలు బాగు పడలేదు .యెలిజ బెత్ బారెట్   బ్రౌనింగ్   ‘రిక్రై  ఆఫ్ ది చైల్డ్ ”థామస్ హుడ్ ”సంగ్ ఆఫ్ ది షర్ట్”లే వీటిని సాధించాయి . డార్విన్ పరిణామ [ సిద్ధాంతం సైన్సుకు మతానికి మధ్య చిచ్చు  పెట్టింది ..బైబిల్ చెప్పిందే నమ్మాలి అన్న దానికి సవాలుగా నిలిచింది ..విశ్వమ్ లో మానవుడి ఉనికికి ప్రాదాన్యమేర్పడింది .
       సాహిత్యం లోను ఎన్నో మార్పులోచాయి ..విక్టో రియన్ నవల అయిన స్కాట్ నవలపై ఏవ గింపు కలిగింది . కల్పనా సాహిత్యాన్ని డికెన్స్ విజ్రుమ్భించి రాసి మెప్పిస్తున్నాడు .నిజాయితీ కంటే బాధ్యతకు ఎక్కువ గౌరవం లభిస్తోంది . అదిగో ఇలాంటి నేపధ్యం లోనే రాబర్ట్ బ్రౌనింగ్ కవి7-5-1812నకంబర్వేల్ లో   ఉద యించాడు అందరు  ఇంగ్లాండ్ కవుల్లా కాకుండా ఇతని వ్రేళ్ళు వెస్ట్ ఇండీస్ లో ఉన్నాయి .తాత గ్రియోల్ రక్తం ఉన్నవాడుఅదే  నల్ల రంగు  బ్రౌనింగ్  కు వచ్చి యెర్ర ఇంగ్లాండ్ కవులకు భిన్నం గా ఉండేవాడు .తల్లి సార వీదర్మన్  జర్మన్ జ్యూఅయిన నావికుని కూతురు ..ఈతాతనె  బ్బ్రొఉనింగ్  షిప్ఓనర్  అనే వాడు .ఈయన డూండీ లోని స్కాటిష్ స్త్రీని పెళ్లి చేసుకొన్నాడు .తల్లి నుండి తనకు సంగీతం సంక్రమించిందని బ్రౌనింగ్ చెప్పాడు .
         తండ్రిపైనే బ్రౌనింగ్ ఎక్కువ ఆధార పడ్డాడు .. తండ్రి వెస్ట్ ఇండీస్ లోని కిట్స్ లో చెరుకు వ్యవసాయం చేసే వాడు ఽఅ క్కడి   బానిసల పై దౌర్జన్యాన్ని ఎదిరిస్తే తండ్రి బాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ లో పనిలో పేట్టాడు ఽఅ క్కద పెద్దమనిషిగా ,విద్యా  వంతుడిగా ,బైబిల్ అభిమానిగా మారాడు  .తండ్రి  లైబ్రరీలో ఆరు వేల పుస్తకాలు వివిధ భాషల్లో ఉండేవి .ఇక్కదె పెరక్లియాస్ ,ఫాస్తాస్ ,మొదలైనవి చదివాడు ఈ విషయం లో జీవితాంతం తండ్రికి రుణ పడి  ఉన్నాడు . తండ్రి మంచి రచయిత కూడా .”డెవలప్ మెంట్ ”అనే స్వీయ చరిత్ర కవిత్వం లో వీటిని బ్రౌనింగ్ వివరించాడు . లండన్   వర్సిటి లో చదివిన కొద్దికాలం లోనే కావలసింది అంతా నేర్చేశాడు ..పన్నేండవ ఏట తాను ఎమికావాలనుకోన్నదీ ఖచ్చితం గా నిర్ణయించుకొన్నాడు ..”ఇన్ కండిటా ”అనే కవితా సంకలాన్ని తెచ్చాడు ..తండ్రి  మెచ్చుకొన్నాడు కాని దాన్ని నాశనం చేశాడు బ్రౌనింగ్ .
 ప ధ్నాలుగో ఏట ఒక గొప్ప సంచలనమే సృష్టించాడు .”పాలిన్ ”రాసి దానికి ”ఫ్రాగ్ మెంట్ ఆఫ్ కన్ఫెషన్ ”’పేరుతొ ఇరవై ఒక్క ఏట విడుదల చేశాడు .దానికి తానే అధికారినని ముప్ఫై నాలుగవ ఏట కాని చెప్పుకో లేదు .దీన్ని కలేక్తేడ్ పోయెమ్స్ లో చేర్చి ప్రచురించాడు .
 ఇరవై  రెండులో విదేశీ యాత్ర చేశాడు .రష్యా లో రెండు నెలలు ఉండి  రినైసేన్స్ డాక్టర్ పెరక్లియాస్ ను కలిశాడు ..ఈ ప్రభావం తో నలుగు వేల పంక్తుల ”పారసేల్సాస్ ”రాశాడు ..దీని ఖర్చు తండ్రి పెట్టాడు .దీన్ని చదివిన నటుడు విలియం మార్కేదీ తనకొక నాటకం రాసి పెట్టమని అడిగాడు ..”స్త్రఫోల్డ్స్ ”రాసి1837 లో ప్రచురించాడు ..దీనిని కోవెంట్ గార్డెన్ దియేటర్ లో అయిదు అంకాల నాటకం గా ప్రదర్శించారు ..నటులు బాగా చేయలేదని బ్రౌనింగ్  యిదేమి నాటకమని డైరెక్టర్ తిట్టుకొన్నారు .జీవితం  లో దియేటర్ నాటకం రాయను అని భీష్మించాడు .కాని రెండేళ్ళ తర్వాతా విజ్రుమ్భించి రాశాడు .
     మొదటి సారి ఇటలి వెళ్లి వెనిస్ అందానికి ముగ్ధుడయ్యాడు .”సార్దేల్లా ”అనే రైమేడ్ పోయెం రాశాడు .ఇది ఆరు వేల లైన్ల కవిత ..సంకల్ప బలం తో దేనినైనా సాధించ వచ్చు అనేది ఇందులో సారాంశం ..కార్ లైల్ భార్య ఇదేమి కవిత్వం అంటే ,టెన్నిసన్ మొదటి చివరి పంక్తులు బాగున్నాయని దేప్పాడు .అవే -who will may hear Sodello ;s story told ”అనే మొదటిది ”who would has heard sordello;s story told”అనే రెండో  లైనూ
 ఇలా విమర్శలోచ్చినా  మంచి రచన చేసి విజయం సాధించాలని నిశ్చయించాడు ..”పిప్పా పాస్సీ ”నాటిక రాశాడు .”కింగ్ వికార్ కింగ్ చార్లెస్ ”,రిటర్న్ ఆఫ్ ది ద్రూసేస్ ”,బ్లాట్ ఇన్ ది స్కచియాన్ ”కోలంబెస్ బర్త్ దే ”రాసి వదిలినా దేనికీ పేరు రానే లేదు .డ్రమాటిక్ . లిరిక్స్ డ్రమాటిక్ రొమాన్స్ అండ్ లిరిక్స్ రాశాడు .రెండవ  సారి ఇటలీ వెళ్ళినప్పుడు షెల్లీ కీట్స్  సమాధులను సందర్శించాడు .ఈ స్పూర్తితో ”లేడీ జేరాల్డైన్స్ కోర్ట్ షిప్   ”రాశాడు
  బ్రౌనింగ్ కుం ఆడ వాళ్ళపై వ్యామోహం కలగ లేదు ..ఒక వేళ  అవకాసం వస్తే తన కంటే పెద్ద వాళ్ళ నే ప్రేమించాడు  ఆరేళ్ళు  పెద్దదయిన  ఎలిజబెత్ బారెట్ తో లవ్ లెటర్స్ జరిపాడు అమె గ్రీకు లాటిన్ లలోన్ దిట్ట . తండ్రి  క్రూరుడు బ్రౌ నింగ్ ను స్నేహితునిగా చూసింది ..ప్రెమా దోమా అంటే కుదరని చెప్పింది ..నలభై లొఆమె ఆరోగ్యం దెబ్బతింటే ఇటలీ తీసుకు వెళ్ళాడు ..నయమ్ అయింది .ఇద్దరు దగ్గరయ్యారు కొడుకు పుట్టాడు .”సానేట్స్  ఫ్రం పోర్చుగీస్ ”రాశాడు .ఇది ”లవర్స్ పాస్ వర్డ్ ”గా కొన్ని త రాలను ప్రభావితం చేసింది .వర్ద్స్ వర్త్ మరణం తో  తనకు  కు ఆస్థాన పదవి దక్కుతుందని ఆశించింది ఎలిజ బెత్ కాని టెన్నిసన్ కు దక్కింది . .భర్తకంటె  పేరు ప్రఖ్యాతులు పొందింది ఒక రకం గా బ్రొనింగ్ ను  బారెట్ భర్త అనేవారు .విక్తొరియన్ కాల రచయితలలో నగ్రగామి అని పించుకోండి ఎలిజ బెత్ .”డి క్రి ఆఫ్ డి చిల్ద్రెన్ ”,మ్యూసికల్ ఇన్స్ట్రుమెంట్స్ ”,ఆరోరా లీ మాత్రమె జనానికి గుర్తున్నాయి .
    భార్య ప్రభావం నుండి బయట పడటానికి ఇటాలియన్ కవిత్వం వైపు వెళ్ళాడు .సాహిత్యమ్ లో ఇటలియే తన యూని   వర్సిటి అన్నాడు .బ్రొనింగ్ కు తండ్రి తరఫునుంచి వచ్చిన డబ్బు కంటే భార్య సంపాదనలో లభించిందే ఎక్కువ ..వీరి కుటుంబ స్నేహితుడు జాన్ కెన్యా చనిపోయి వీరికి పదకొండు వేల పౌండ్ల డబ్బు  ఇచ్చాడు ..బ్రొనింగ్ కు కొడుకు పుట్టాడు .విచరమ్ అలముకొంది .”మెన్ న్ అండ్ విమెన్ ”1855లో రాశాడు .ఇక రాసే వాటన్నిటిలో సంగీతం మేళ వించాడు .భార్య లోని కవిని మెచ్చాడు భర్త బ్రౌనింగ్ .ఫ్లా రెన్స్ లో ఆమె జబ్బు పడింది ..ఉబ్బస వ్యాధి బ్రౌనింగ్ ను పీడిస్తోంది  చనిపోయింది తర్వాతా ఇరవై ఎనిమిదేళ్ళు బతికాడు .
 ”డ్రా మాటి స్ పెర్సానే ”1864లో రాసి ప్రచురించాడు .డెత్   ఇన్ ది  మ డెసర్ట్ ,యూత్ అండ్ ఆర్ట్ ,చైనీస్ పజిల్ మొదలైనవి రాశాడు
డెత్ పునర్ముద్రణ పొందింది 1868లో ”రింగ్ అండ్ ది  బుక్ ”తెచ్చాడు .ఒక రోజు మార్కెట్ కు వెడుతుంటే పదిహేడవశ తాబ్దికి చెందిన లాటిన్ పుస్తకం న పడింది దాన్ని ఆధారం గా రాశాడు తండ్రి చనిపోయిన తర్వాత ,భార్య మరణం తర్వాత రెండో పెళ్లి ఆలోచన చేయలేదు జోలియా వేట్  వుడ్ తో సన్నిహితం గా ఉన్నా హద్దులు దాట  లేదు చివరి ఇరవై ఏళ్ళలో ఎన్నో రాసి ప్రచురించాడు ..ఒక నిష్ణాతుడైన సర్జన్ లా బాంక్ ప్రెసిడెంట్ లా కని  పించేవాడు
   1881లో మొదటి సారిగా బ్రౌనింగ్ సొసైటీ  ఏర్పడింది .దీనికి ఆక్స్ ఫర్డ్ ఇంగ్లీష్ నిఘంటు  ఎడిటర్ ఫ్రెడరిక్ జేమ్స్ ఫర్నివాల్ కారకుడు ఆ తర్వాత ఎన్నో క్లబ్బులు ,సొసైటీలు డిస్కషన్ గ్రూపులు ఏర్పడ్డాయి .దెబ్భై లో మాంచి హుషారుగా ఉన్నాడు .”డ్రమాటిక్ ఐడిల్స్ ”రాసి ముద్రించాడు .”ది  ఇన్ ఆల్బం” రాశాడు .. ఇంకా  ఎన్నో రాశాడు అయనలొని సృజన ఆగలేదు .లిబరల్ అయినా అన్ని ముఖ్య కార్యక్రమాలకు హాజరయ్యే వాడు .కొదుకు పైంటర్ అయి అమెరికా అమ్మాయిని పెళ్లి చేసుకొన్నాడు జలుబుతో ప్రారంభమై హార్ట్ ఎటాక్ తో 12-12-1889న నవ్వుతూ కను మూశాడు .వెస్ట్  మినిస్టర్ ఆబీ లో పోఎట్స్ కార్నర్ లో సమాధి చేశారు
 బ్రౌనింగ్ ను ఆశా వాది  అంటారు ”God is in heaven -all is right with the world ‘అన్నదే ఆయన తత్త్వం .అయనలొ గొప్ప టెక్నిక్ ఉంది ఛందస్సును విచ్చల విడిగా మార్చి రాశాడు ..సాహిత్యం  లో గొప్ప శక్తి సంపన్నుడైన కవి గా బ్రౌనింగ్ నిలిచి పోయాడు ‘
Brounning;s restless energy is inherent in the incalculable range of his interests .he seems to have determined as G;k Chesterton observed ”to leave no spot of the cosmos unadorned by his poetry ”and he almost succeeded ”.
   ఈ నాడు బ్రౌనింగ్ డ్రమాటిక్ మోనో లాగ్స్ నే బాగా అభిమానిస్తున్నారు అందులో వక్త స్వభావం ఖచ్చితం గా బయట పడుతుంది ఇవి సాలిలోక్వి లాగా కాకుండా పూర్తిగా పాత్రను ఆవిష్కరిస్తాయి మానవుని విషయం లో దైవ చేస్ట ల్ని తెలియ జేస్తాడు ఇలియట్ ,ఎజ్రా పౌండ్ లు ఈ మోనో లోగ్స్ ను బాగా వాడుకొని సుసంపన్నం చేశారు  నాటకీయ కవిత్వాన్ని బ్రౌనింగ్ అద్భుతం గా తీర్చి దిద్ది మార్గ దర్శకుడైనాడు భార్యా భర్తలు స్పిరిట్య లిజం కు ఆకర్షితులైనారు .దీని ప్రభావం వలననే దృఢమైన కొడుకు ”పెన్ ”పుట్టాడు చివరి రచన ”అసలాండో ”బ్రౌనింగ్ మరణించిన రోజే పబ్లిష్ అవటం యాదృచ్చికం జీవితకాలం లో ఎన్నో అవార్డులు పొందాడు .లండన్ యూని వర్సిటి కి జీవితకాలం గవర్నర్ గా ఉన్నాడు . గ్లాస్గో కు లార్డ్ రెక్టార్ షిప్ కు ఆహ్వానించినా ఉపన్యాసాలివ్వాల్సి వస్తుందని వద్దన్నాడు .సుమారు అరవై రచనలు రాసి ప్రచురించిన సాహిత్య జీవి బ్రౌనింగ్

Robert Browning by Herbert Rose Barraud c1888.jpg   

couple
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వేద పరమా (త్మ)ర్ధం

వేద పరమా (త్మ)ర్ధం

 

వేద పరమా (త్మ)ర్ధం

శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు ఏంతో  ఆత్మీయం గా నేను తప్పక చదవాలని భావించి అమెరికా నుండి ఆర్డర్ పై స్వర్గీయ కొత్త సచ్చిదానంద మూర్తి గారు ఆంగ్లం లో రాసిన ‘’వేదార్ధ మీమాంస ‘’కు వాడ్రేవు చిన  వీర భద్రుడు చేసిన తెలుగు సేత పుస్తకాన్ని పంపారు .హైదరాబాద్ లో ఉంటున్న ఈ అయిదారు రోజుల్లో దాన్ని ఆసాంతం చదివాను .ఎన్నో విషయాలను గుది గుచ్చి ఒక చోట చేర్చి కరతలామలకం గా  వేదం ఎందుకు చదవాలి ,అందులో ఉన్న పరమార్ధం ఏమిటి ,ఎందుకు దానికి దూరమై పోతున్నాం ,పాశ్చాత్యులు వేదం ను సరిగ్గా అర్ధం చేసుకో కుండా ,ఏవేవో చదివి విపరీతార్ధాలను ఎలా రాశారు ,దానివలన వేద పరామార్దానికి ఏర్పడిన ఇబ్బంది ఏమిటి అన్న విషయాలను నాలుగు వేదాలు ఉపనిషత్తులు ,మహా భారత భాగవత రామాయణ ,మనుస్మ్రుతులు   మీమాంస ,శ్రీ శంకర ,రామానుజ ,మాధవాచార్యుల భాష్యాలు ,సాంఖ్య ,న్యాయ  వైశేషిక ,బ్రహ్మ సూత్ర ,భగవద గీతాదుల నాధారం గా  సవివరం గా శాస్త్ర ప్రమాణం గా చర్చించి నిగ్గుతేల్చి అతి సరళ భాషలో ఇంగ్లీష్ లో రచించి తన విశేష శేముషీ వైభవానికి ,పరిజ్ఞానానికి దర్పణం గా ‘’వేదార్ధ మీమాంస ‘’ను రాస్తే అంతకంటే సరళ సుందరం గా ప్రతి మాటను సాధికారికం గా ప్రతి భావాన్ని ఉజ్జ్వల తేజో విలసితం గా అనువాదం చేసి అసలు మూల గ్రందాన్నే చదువుతున్నామనే అమోఘ అనుభవాన్ని కలిగించారు  చిన వీర భద్రుడు .నిజం గా వాణినా రాణి అన్న చిన వీరభద్రకవి అనిపించి ,పెద వీర భద్రుడే అనే నిశ్చయాన్ని కల్పించారు .మూల ,అనువాద రచయితలిద్దరికీ కై మోడ్పు ఘటిస్తూ అందులో నేను తెలుసుకొన్న నాకు నచ్చిన  ముఖ్య విషయాలను ‘’వేద పరమా (త్మ)ర్ధం ‘’గా మీ ముందు ఉంచుతూ ,మీకూ ఆ అను భూతిని పంచుతున్నాను .

ఋగ్వేద,యజుర్వేదాలలో  లో సత్యమే జ్ఞానమని ,యజ్ఞం కర్తవ్యమని యజ్నమంటే శుద్ధి చేసే కర్మ అని తెలియ జేశారు .రుక్కుల ద్వారా వర్ణింప బడింది సామం ద్వారా గానమైంది . అధర్వం అన్ని వేదాల సారమే .యజ్న మార్గానికి దారి చూపింది ‘’అధర్వుడు ‘’. ఆయన పేర ఆ వేదం పిలువ బడింది .భ్రుగువులు కూడా ఆయనకు సమానమే అందుకే దానికి అధర్వాన్గీరసం లేక భ్రుగ్వాన్గీరసమని పిలుస్తారు   .కైవల్య పధం నాలుగు కొమ్ములు కల వృషభం అ కొమ్ములే నాలుగు వేదాలు యజ్న మార్గం లో పరమ పురుషుడిని తెలుసుకోవాలి .ప్రతిదీ ఈశ్వరునితో కూడుకొని ఉంది అనే భావం రావాలి .వేద వృక్షానికి పూసిన పువ్వే సామ వేదం .మానవుడిలో ఉన్న బ్రహ్మాన్ ను ఎరుక పరచేదే  అధర్వ వేదం .వేదాల్లో యజ్న యాగాదులకు సంబంధించింది అంతా ‘’త్వం ‘’, భగ వంతుని గుణ గణాలను వర్ణించేది ‘’తత్ ‘’ వేదాంతం బ్రాహ్మణ ,ఆత్మల ఏకత్వాన్ని తెలియ జేస్తుంది .

వేదాలు ఎ భేదామూ లేకుండా ఒకే విషయాన్ని గూర్చి చెప్పాయని భగవత్ పాదులన్నారు .జీవితం లోని అత్యున్నత సూత్రం గా సత్యాన్ని ప్రతిస్టించటం ఉపనిషత్తులు చేసిన గొప్ప పని అని ‘’లూడర్స్ ‘’వివరించాడు . ఏధర్మాన్ని  బ్రహ్మాన్ని ఎరుక పరుస్తుందో అదే వేదం .కోరిన కోర్కెలను తీర్చటానికే వేదాన్ని వాడుకో రాదు అంతకు   మించిన అమూల్య జ్ఞానం ఉందని గ్రహించాలి .మానవ జీవితం లో ఏ కర్మ అయినా యజ్ఞమే .అదొక ఆరాధనా కార్య క్రమం .మన కోరికలు తీర్చుకోవటం కోసం దేవతలకు అర్పించే కానుకలే యజ్ఞం .యజ్ఞం మానవుల్ని దేవతల్ని కలిపి ఉంచే ఒప్పందాలు .యజ్ఞం చేయక పోవటం అమానుషం ,సామాజిక ఉపద్రవం .దేవతలు పురుషుడిని హవిస్సు చేసి యజ్ఞం చేశారు .అంటే మానసికం గా చేశారని భావం ,ప్రపంచం మహా పురుషుని దేహం .యజ్ఞం చేయటం పురుష స్వరూపమే అవుతుంది .యజమాని యజ్ఞం హవిస్సు ,అగ్ని అన్నీ పురుషుడే .’’పురుషాత్మకం సర్వం ‘’అన్నది వేదం .భగవంతుడు తనలోని సమస్త జీవుల్ని వెలికి తీసి వాటి అనుభవం కోసం తన సర్వస్వాన్ని వారికి ప్రసాదిస్తున్నాడు .ఈ సృష్టి భగవంతుడు చేసే యాగమే .

యజ్ఞం చేసేటప్పుడు మానవుడు తన పాత అస్తిత్వాన్ని దేవతలకు హవిస్సుగా అర్పించి దగ్ధం చేసుకొంటాడు . ఏరూపం లో కొలిస్తే ఆయన ఆరూపం లో చేరువౌతాడు బగవంతుడు .బ్రాహ్మణాలు ఆరణ్యకాలు యజ్ఞాన్ని ఒక కారుణ్య కర్మ గా మార్చాయి .తన మంచికోసం చేసేది యజ్ఞం .సమస్త ప్రాణులకోసమూ  జ్ఞానోదయం కోసం చేస్తే మహా సత్రం అంటారు .అందరం బ్రహ్మ ,దేవ ,పితృ ,మనుష్య ,భూత యజ్ఞాలనే పంచ మహా యజ్ఞాలు చేయాల్సిందే ..వేదం అధ్యయనం చేస్తూ చిత్త ఏకాగ్రత ,ఇంద్రియ నిగ్రహం ,స్తిత ప్రజ్ఞత ,ఆధ్యాత్మిక శీలం ,యశస్సులో అభివృద్ధి  బ్రాహ్మన్  కు హవిస్సులంద జేయటమే బ్రహ్మ యజ్ఞం .తన దగ్గర ఏది ఉందొ దాన్ని భగ వంతుడికి సమర్పించటం దేవ యజ్ఞం .బీదలకు, అవసరమున్న వారికి సాయం చేయటం మనుష్య యజ్ఞం .సర్వ భూత కోటికీ వీలైనంత సాయం చేయటం ,ప్రేమించటం భూత యజ్ఞం .మొత్తం జీవ కోటితో సంబంధమే భూత దయ .మనిషి విశ్వ ప్రణాళిక లో ఒక భాగం .మనిషి శాశ్వత ,అతీతమైన దానితో బాటు తాత్కాలిక అస్తిత్వం తో కూడా ముడి పడి ఉంటాడు .తనకోసం తోటివారికోసం  భగవంతుడికోసం జీవించటమే అన్నిటికన్నా ఉత్క్రుస్ట మైన యజ్నం .

ఉపనిషత్తులు –ప్రజా పతియే తనను తానూ ఒక మహా యజ్న పశువుగా భావించి తనను తానె యజ్ఞం చేసుకొన్నాడని చెప్పింది మనిషి జీవితమంతా సోమయాగమే నంది .ప్రపంచమే ఒక హోమం .భూమి దాని ఇంధనం .అగ్ని దాని పొగ .రాత్రి దాని మంట .చంద్రుడు భస్మం .నక్షత్రాలు విస్ఫులిన్గాలు ఈ అగ్నికి దేవతాలు వర్షాన్ని హవిస్సుగా సమర్పిస్తారు .దాని నుంచి అన్నం వస్తుంది మనిషి ఒక అగ్ని .అతడికి దేవతలు అన్నాన్ని హవిస్సుగా అర్పిస్తారు .దానినుంచే జీవితం పుడుతుంది .పరబ్రహ్మ మనిషిలోనే ఉన్నాడు .మనిషి తినేది అంతా పరబ్రహ్మానికి నైవేద్యమే .కౌతికీ ఉపనిషత్తు –మనిషి నిద్రపోతున్నా మెలకువ గా ఉన్నా  నిర్విరామం గా యజ్ఞం చేస్తున్నట్లే లెక్క అని చెప్పింది

స్వర్గీయ ఉప్పులూరి గణపతి శాస్త్రి యజ్ఞాల ఘట్టాలు అధ్యయనం ,పారాయణ యజ్ఞం చేసిన దానితో సమానమే అన్నారు .స్వాధ్యాయ ప్రవచానలకు మించిన యజ్ఞమే లేదు .బ్రహ్మ జ్ఞానమే మానవ జీవిత పరమార్ధం .భూత భవిష్యత్ వర్తమానాల మీద ఆధిపత్యం ఎవరికి ఉందొ ,ఎవరు ఈ ప్రపంచానికి అతీతం గా ఉన్నాడో ఆయనే శాశ్వతుడు నిత్య నూతనుడు .ఆయనే మర్త్య ప్రపంచం లో ఉన్న అమర్త్యుడు ,అతడు మృత్యువుకు భయ పడడు .గాఢం గా కోరుకొనే వారికి పరమ ధామం లో ప్రతిదీ ఏక రూపం ధరించినట్లే ఉంటుంది .అన్నిటి లోను పని చేసే ఏక సూత్రమే బ్రాహ్మన్ అని ఆరణ్యన్యకాలు అంటున్నాయి  .అందరిలోనూ ఉన్నది ఒకటే ఆత్మా .ఇవాళ ఉన్నది రేపు ఉండబోయేది ఆయన ఒక్కడు మాత్రమె .పరమ పదం లో దివ్య రూప రహితుడైన పురుషుడి నుంచే దేవ మనుష్య జీవరాశులన్నీ ప్రభ వీస్తున్నాయని ముండకోపనిషత్ అంటోంది .దేవాతలైనా బ్రాహ్మాన్ ను దాటి ముందుకు పోలేరు . ఈ మహా సత్యమే వేద సారం ఆ సత్యం తెలియక పోతే సారాంశం బోధ పడదు ‘’నా వేద విన్మనుతే తమ బృహంతం ‘’.

వేదాలు ఒక దానికొకటి అనుసంధించుకునే ఉన్నాయి .సత్యం జిజ్ఞాస ,మీమాంస వల్లనే గోచరిస్తుంది .’’పోస్ట్ మోడరన్ యుగ తాత్విక పధ్ధతి అయిన ‘’హెర్మ న్యూటి క్స్ ‘’అంటే ఇరవయ్యవ శతాబ్దపు పాశ్చాత్య తాత్వికులు తత్వ శాస్త్రం లో తాము కొత్తగా కనుక్కొనే సత్యం ఏదీ లేదని తాము ప్రాచీన తత్వ వేత్తల రచనలను మళ్ళీ పూర్తిగా చదివితే సరిపోతుందని భావించారు .గత పది హేను వందల ఏళ్లుగా భారతీయ ఆచార్యులేవ్వరూ తాము కొత్తగా యేదర్శనాన్ని ప్రతి పాదిస్తున్నట్లు చెప్ప లేదు ..పాత వాటికి భాష్యాలు మాత్రమె రాస్తున్నారు .భాష్య సంప్రదాయానికి ‘’హెర్మ న్యూటిక్స్‘’కు తేడా ఉంది .భాష్యం లో భాష్య కారుడు ఏదో ఒక సంప్రదాయానికి బద్ధుడై రాస్తాడు కానిహిర్మన్యూ టిక్స్  తటస్థ భావం తో నిష్పక్ష పాతం గా ,ఎటు వంటి లోగో  సేంత్రిజం  లోను కాకుండా ప్రాచీన రచనలను అర్ధం చేసుకొంటుంది .ఇదే విధానాన్నిపద్మ విభూషణ్ శ్రీ కొత్త సచ్చిదానంద మూర్తి గారు అవలంబించి వేద సారాన్ని అర్ధం చేసుకొనే ప్రయత్నం చేశారు .ఇది నేడు భారత దేశానికి అత్యంత అవసరమైన రచన ‘అందుకే నాకు ఇష్టం ‘’అని అనువాదకులు శ్రీ చిన వీర భద్రుడు స్పష్టం గా తెలియ జేశారు .

‘’శబ్ద బ్రహ్మేతి యచ్చేదం  శాస్త్రం  వేదాఖ్య ముచ్యతే –తదిష్యదిధీస్టితం సర్వమేకేన  పరమాత్మనా ‘’

వేదం గా పిలువ బడే ఈ శాస్త్రం అంతా శబ్ద బ్రాహ్మ స్వరూపం గా ,ప్రసిద్ధి కెక్కినది అంతా కూడా ఆ పరమాత్మ వల్లనే ప్రేరేపిత మైంది .ఆయనలోనే పాదుకుని ఉంది ..(తాంత్రిక వార్తికం లో కుమారిలుడు )

 

 

 

 

 

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -6-6-14-కాంప్-బాచుపల్లి –హైదరా బాద్

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రమణాచారి బాధ

అధికారులు రెండు రకాలు. ప్రభుత్వ నిబంధనలను తూచాతప్పకుండా పాటించేవారు ఒక రకమైతే నిబంధనలను పాటిస్తూనే- ప్రజల అవసరాలను గమనించి వాటిని తీర్చేవారు రెండోరకం. ఇటు రాజకీయనాయకులకు, అటు ప్రజలకు మధ్య వారధులుగా వ్యవహరించే అధికారుల పని ప్రతి రోజు కత్తి మీద సామే. అలాంటి బాధ్యతలను తనదైన శైలిలో నిర్వహించిన మాజీ ఐఏఎస్ అధికారి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి. రమణాచారి జీవితానికి చీకోలు సుందరయ్య ‘ప్రజలు..ప్రభుత్వం.. ఒక ఐఏఎస్’గా పుస్తకరూపం ఇచ్చారు. అందులోనుంచి కొన్ని ఆసక్తికర భాగాలు…

డాక్టర్ మర్రి చెన్నారెడ్డి అందరిలాంటి ముఖ్యమంత్రి కారు. రాష్ట్రంలో, కేంద్రంలో ఎవరెవరు ఏమిటో బాగా తెలిసినవారు. తన అధికారుల్లో ఎవరి బలాలు, బలహీనతలు ఏమిటో ఎరిగినవారు. ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక ఆయనకు ప్రిన్సిపల్ సెక్రటరీగా జి. కుమారస్వామి రెడ్డి ఉండేవారు. కె.వి. రమణ పీఆర్వో. ఆయనతోపాటు కిషన్‌రావు, రాజేంద్రమోహన్ గోనెల తదితర అధికారులుండేవారు. రమణ రోజూ ఉదయం తొమ్మిది గంటలకు ఆఫీసుకొస్తే రాత్రి రెండుగంటల వరకూ ముఖ్యమంత్రి కార్యాలయంలోనే ఉండవలసి వచ్చేది. అది చాలా ఇబ్బందిగా ఉండేది. ఓ రోజు రమణ సాహసించి కుమారస్వామిరెడ్డిగారిని అడగనే అడిగారు.
‘రోజూ ఇంతంతసేపంటే కష్టం కదా సార్? రాత్రి పదింటికైనా ఇంటికెళ్తే బాగుంటుంది.’
రెడ్డిగారు వెంటనే అన్నారు.
“నేనే ఉంటే నీకేం ప్రాబ్లం! ఇది మన డ్యూటీ. ముఖ్యమంత్రిగారు వెళ్లేంతవరకు మనం ఉండాలి. తప్పదు!”
చెన్నారెడ్డి అలవాట్లలో ముఖ్యమైనది ఆయన ఆఫీసు నుంచి బయటకు వెళ్లేటప్పుడు తన కార్యాలయంలో ఎవరెవరున్నారు, ఎవరు లేరు… ఉన్న వారిలో సెల్యూట్ చేసిన వారెంతమంది… చేయని వారెవరెవరు… వంటి విషయాలు కూడా గమనించేవారు. ఎవరైనా కనిపించకపోతే రెండోరోజు ఆ విషయం ప్రస్తావన కొచ్చేది. దాంతో అధికారులు, సిబ్బంది విధిగా సి.ఎం. వెళ్లేంతవరకూ ఉండి ఆయనకు కనిపించి, సవినయంగా నమస్కరించి మరీ వెళ్లేవారు!
అందువల్ల రమణ ఆ విషయంలో రాజీపడ్డారు. ప్రభుత్వాధికారిగా తనకు పనివేళలు ఉండవు అన్న సత్యాన్ని గుర్తించారు. దానికి అలవాటుపడ్డారు.
చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆయన మిత్రుల్లో చాలామంది సచివాలయానికి వచ్చి ఆయనతో మాట్లాడుతూ ఉండేవారు. వాస్తుశిల్పి బి.ఎన్.రెడ్డి, సీనియర్ రాజకీయనాయులు జి. వెంకటస్వామి, హాషిం, రోడామిస్త్రీ, ఉమా వెంకట్రామిరెడ్డి, గీతారెడ్డి వంటివారు తరచూ వచ్చేవారు. అలా ఎవరైనా వచ్చినపుడు మరీ అవసరమయితే తప్ప ఆయన అధికారుల్ని పిలిచేవారు కాదు.
ఓ పర్యాయం ఆంధ్ర మహిళా సభలో కార్యక్రమానికి ఆయన వెళ్లవలసి వచ్చింది. రమణని పిలిచి ప్రసంగం తయారుచేయమన్నారు. రమణ తయారుచేశారు. అది చదివి చెన్నారెడ్డి ఆనందించారు. ముఖ్యంగా ఆ ప్రసంగంలో రమణ ఉదహరించిన ఉర్దూ కవిత ఆయన్ని బాగా ఆకట్టుకుంది.
‘లోగోంకే పాస్ వక్త్ హై – నఫ్రత్‌కే వాస్తే
జబ్‌కే హయాత్ కమ్‌హై – మొహబ్బత్‌కే వాస్తే’
ఇదీ ఆ ఉర్దూ కవిత. (జనం వద్ద వైరం కోసం సమయం ఉంది… కానీ ప్రేమకోసం మాత్రం సమయం లేదు.) దీన్ని చెన్నారెడ్డి తన మిత్రులందరికీ చెప్పారు. “మా కొత్త పీఆర్వో తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషుల్లో ఉద్దండుడు” అంటూ పలుమార్లు ప్రశంసించారు. ఇది రమణలో ఆత్మవిశ్వాసం పెంచింది. అప్పట్నించి చెన్నారెడ్డి ఇష్టుల్లో రమణ ఒకరయ్యారు.
నందమూరికి ప్రాతఃకాల సేవ
“నన్నెప్పుడూ కులీకుతుబ్‌షా అని (ఎన్.టి. రామారావు గారు) పిలిచేవారు. ఎందుకంటే ఆయన కులీకుతుబ్‌షా నగరాభివృద్ధి సంస్థకు చైర్మన్. నేను వైస్ చైర్మన్. ఉదయం నాలుగున్నర గంటలకి దర్శనం చేసుకోవాల్సి వచ్చేది. మా పెద్దమ్మాయి వీణ పెళ్లికోసమని తార్నాకలో పెద్ద ఇల్లు అద్దెకు తీసుకుని ఉండేవాడిని. తార్నాక నుంచి రోడ్ నెం.13 బంజారాహిల్స్‌లో ఉన్న ఎన్.టి.ఆర్. గారింటికి వెళ్లేవాడిని. రాత్రి ఏ మూడుగంటలకో లేవవలసి వచ్చేది. ముఖ్యమంత్రిగారింటికి నాలుగుంబావుకి చేరుకునేవాడిని. సాంబ్రాణి ధూపం… పరిమళాల మధ్య శ్రీ వేంకటేశ్వర సుప్రభాతాన్ని నాలుగన్నర గంటలకల్లా వినిపింపచేయడం ఇన్ఫర్మేషన్ డిపార్టుమెంట్ కమీషనర్‌గా నా కర్తవ్యం. సుప్రభాతం వినిపింపచేసే టెక్నికల్ ఆపరేటర్ రాకున్నా కమీషనర్ రానట్టే లెక్క. టెక్నికల్ ఆపరేటర్ కూకట్‌పల్లిలో ఉండేవాడు. అతని అవస్థలు దృష్టిలో పెట్టుకొని ఆటోకోసం పాతిక రూపాయలు చెల్లించేవాళ్లం. అవసరమైతే ముఖ్యమంత్రి ఇంట్లోనే అతను ఏదో ఓ మూలన ఉండాల్సి వచ్చేది పాపం. ఇంచుమించుగా నాతోపాటు లేదా కొంచెం ముందు డి.జి.పి. గారు వచ్చేవారు. మీరు ముందా నేను ముందా అన్నట్లుండేది మా స్థితి. సాధారణంగా డి.జి.పి.యే సీనియారిటీ దృష్టిలో ఉంచుకొని ముందుగా సియంని సందర్శించేవారు. నేను కొన్నాళ్లు ఓపిక బట్టి డి.జి.పి. గారితో అన్నదేమిటంటే “పోలీస్ శాఖకి సంబంధించిన విషయాలన్నీ – అక్రమాలు, లాఠీచార్జీలు, దోపిడీలు, దుర్మార్గాల గురించి ఉంటాయి. బ్రాహ్మీముహూర్తంలో సియం ఈ రకమైన విషయాలు వినేదానికంటే కమీషనర్‌గా నేను చెప్పే అంశాలు, వార్తలే ఆయనలో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తాయి. కాబట్టి నేనే వెళ్లి చెబితే బాగుంటుందనే వాడిని.” ముందు నా విధిలో భాగమేమిటంటే వార్తాపత్రికల్లోని వివిధాంశాల్ని వారికి వివరించడం. ముందుగా పాజిటివ్, తర్వాత నెగిటివ్, తర్వాత మోర్ నెగిటివ్‌గా విషయాలను విభజించుకొని తెలిపేవాడిని. వార్తాపత్రికలు తేవడానికి ఒక అసిస్టెంట్‌ని ఉదయం నాలుగు గంటలకే ముఖ్యమంత్రి గారి ఇంటికి తెచ్చేలా ఏర్పాటు చేశాం. వార్తాంశాల్ని వివరిస్తున్నంతసేపు ఆయన బుద్ఢుడిలా కూర్చుని వినేవారు. ఆయన కళ్లు మూసుకుని వింటే తదేకంగా వింటున్నట్లు. ప్రభుత్వ పథకాల పట్ల ప్రజల అభిప్రాయాల్ని, ప్రజాప్రతినిధుల అభిప్రాయాల్ని వివరించడం కూడా నా డ్యూటీలో భాగమే. అప్పుడప్పుడూ నా కంటే ముందే నందమూరి లక్ష్మీపార్వతి గారు కొన్ని చెప్తుండేవారు. ఒకనాడు ‘ఈనాడు’లో ఒక కార్టూను వచ్చింది. బండిని లాగుతున్న సియం, కొరడా ఝళిపిస్తున్న లక్ష్మీపార్వతి బొమ్మ ఉంది అందులో. ‘కమీషనర్‌గా ఏం చేస్తున్నట్లు మీరు’ అన్నారు.
‘పత్రికల్లో వచ్చే కార్టూన్లకి కమీషనర్‌కి సంబంధం ఉండదండీ’ అన్నాను.
‘నో… వెంటనే ఎడిటర్‌తో మాట్లాడండి. అవసరమైతే నా మాటగా చెప్పండి. మళ్లీ ఏ విషయం నాకొచ్చి చెప్పండి” అని ఆయన అన్నారు.
అప్పుడు ఎడిటరు ఎలాగూ ఉండడు. అది నాకు తెలుసు. అయినా ఆయన మూడ్ గమనించి నేను ఎడిటర్ గారిని కలుస్తాను అని చెప్పాను.
తర్వాత ఎడిటర్ గారిని కలవడం, సియంకి చెప్పడం అదో కథ.
ప్రజలు.. ప్రభుత్వం.. ఒక ఐ.ఎ.ఎస్.
(డా. కె.వి. రమణాచారి జీవన తరంగాలు)
రచయిత: చీకోలు సుందరయ్య
పేజీలు: 208, ధర: 100 రూపాయలు
ప్రతులకు: ఎమెస్కో బుక్స్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పూర్వ ఆంగ్ల కవుల ముచ్చట్లు -39 క్లాసికల్ స్కాలర్ –జాన్ కీట్స్

పూర్వ ఆంగ్ల కవుల ముచ్చట్లు -39

క్లాసికల్ స్కాలర్ –జాన్ కీట్స్

సాధారణ చదువు మాత్రమె ఉన్నా  ,వంశం లో ఎవారూ క్లాసికల్ సాహిత్యాన్ని చదవక పోయినా జాన్ కీట్స్ మాత్రం క్లాసికల్ స్కాలర్ అయ్యాడు .తాత లండన్ లో గుర్రాల శాల నిర్వాహకుడు .తండ్రి థామస్ కీట్స్ మాత్రం అందులో పనివాడైనా దాని యజమాని కూతుర్ని పెళ్లి చేసుకొన్న అదృష్టవంతుడు .తొలి సంతానమే జాన్ కీట్స్ .స్వాన్ అండ్ హోప్ స్తేబిల్స్ లో 1795  ఇరవై  తొమ్మిదిన   పుట్టాడు . బాల్యం బాగానే గడిచింది .పదేళ్ళ వయసులో తండ్రి గుర్రం  కిందపదేస్తే   చనిపోయాడు .మూడు నెలల తర్వాత తల్లి వేరొకరిని పెళ్ళాడి వెళ్లి పోయింది .అమ్మామ్మ జెన్నింగ్స్ దగ్గరకు పిల్లలు చేరారు .తల్లి అప్పుడప్పుడు వచ్చి పిల్లల్ని చూసి వెళ్ళేది .తల్లి మరణానికి ముందు జాన్ ,అతని తమ్ముడు జార్జి యెన్ ఫీల్డ్ స్కూల్ లో చేరారు .అమ్మమ్మ ఈ పిల్లలకు గార్దియన్లుగా ఇద్దరినీ ఏర్పరచింది .అమ్మమ్మ చావు తర్వాత బంధువులే లేని వారయ్యారు .అమ్మమ్మ ఆస్తి తగాదాల్లో పడింది .ఈ తగాదా కీట్స్ మరణించిన సంవత్సరానికి కాని తేలలేదు .

కీట్స్ స్కూల్ జీవితం హుషారుగానే గడిచింది .అక్కడి హెడ్ మాస్టర్ జాన్ క్లార్క్ కీట్స్ పై గొప్ప ప్రభావం కలిగించాడు .కొత్త భావాలు ఆలోచనలు ,కళాత్మక విషయాలను ప్రోత్సహించేవాడు .కీట్స్ కంటే ఎనిమిదేళ్ళ పెద్ద వాడైన ఆయనకొడుకు చార్లెస్ అక్కడే టీచర్ గా పని చేస్తున్నాడు .కీట్స్ లోని కవిని గుర్తించారు తండ్రీ కొడుకులు .కీట్స్ కు ఆటలంటే ఇష్టం కుస్తీలు ,మరీ ఇష్టం ఎవరితోనైనా యే క్షణాన్నైనా పోటీపడి పీటీ దెబ్బ కొట్టగలదాడసవాలు చేసేవాడు .నిజానికి కీట్స్ సన్నగా బలహీనం గా ఉండేవాడు .ఒక రోజు పోటీలో రెచ్చిపోయి ఒకడి చెవులు కొరికి జేబులో వేసుకొన్నాడు కీట్స్ .

మహా కావ్యాలు  కంట బడ్డాయి .రాబిన్సన్ క్రూసో ,పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ లను దీక్షగా చదివాడు .ఓద్ రాసిన మెటా మార్ఫోసిస్ అనువాదాన్ని చదివాడు . క్లాసికల్ డిక్షనరి అనువాదాన్ని పూర్తీ చేశాడు .’’ఎనీద్ ‘’కు వచన అనువాదం చేశాడు ‘’ఇంట్రడక్షన్ ఫర్ ఆస్ట్రానమి ‘’,   మిల్టన్ పోప్ థామ్సన్ మొదలైన కోటే షాన్ లకు రెండు బహుమతులు పొందాడు . ‘’ఎడిక్షనరి ఆఫ్ మర్కండైజ్ ‘’ పై మోజేర్పడింది .సర్జన్ థామస్ హామ్మండ్ దగ్గర అప్రెంటిస్ చేశాడు .తమ్ముడు  బుక్ కీపింగ్ లో చేరాడు . ఇంటికి రెండుమైళ్ళ దూరం లో ఉన్న కౌడేన్ క్లార్క్ దగ్గరకు వారానికోసారి వెళ్లి అతను చదివేవి వినేవాడు .అది రొమాంటిక్ కాలం కనుక పాత ధోరణులకు స్వస్తి చెప్పి కొత్తగా ఇద్దరూ ఆలోచించేవారు .పూర్వకవుల భావాలను స్పెన్సర్ స్టాంజాలలో అద్భుతం గా కీట్స్ రాసి వినిపించేవాడు .కౌడేన్ దగ్గర నుంచి ‘’ది ఫైరీ క్వీన్ ‘’ను అరువుగా తీసుకొని ఆశ్విక వేగం తో చదివి పారేశాడు .నాలుగేళ్ళు అప్రాంటిస్ చేసిన తర్వాత స్వంత ఇల్లే లేని ఇంటిమీద ధ్యాస మళ్ళింది .అమ్మమ్మ చని పోయింది తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎవరి వ్యాపకాలలో వాళ్ళున్నారు .డాక్టర్ అవాలనే కోరిక ఉండేది కాని సర్జన్ అవటం ఇస్టంలేదు.హామ్మన్డ్స్ హాస్పిటల్ వదిలేసి లండన్ లో గీస్ హాస్పిటల్ లో చేరాడు .మేటీరియామేదికా ,అనాటమీ మిడ్ వైఫ్   బాటని లెక్చర్లు వినేవాడు .  ఫ్లవర్ డ్రాయింగ్ లో పండి పోయాడు .తోటి వాడు హెన్రీ స్టీఫెన్స్ సర్జన్ అయి పోయాడు .కీట్స్ మనసు మాత్రం దేని మీదో ఉంది .కూపర్ కజిన్ పై మనసు పారేసుకొన్నాడు .తొమ్మిది నెలల తర్వాతమందుల దుకాణం పెట్టుకోవటానికి సర్టిఫికేట్ ఇచ్చారు .మందుల లక్షణాలు వాటి  కంపోజిష న్ లు గా గ్రహించాడు .ఇంత చేస్తున్నా’’ మనసంతా నువ్వే’’ అంటూ కవిత్వం మీదే ఉండిపోయింది .కవిత్వ శక్తికి దాసోహమన్నాడు .కౌడేన్ క్లార్క్ తో ఒక సారి  ‘’The other day during a lecture there came a sunbeam into the room and with it a whole troop of creatures floating in the ray and I was off with them into a fairy land ‘’ అంటూ స్వప్న లోకం లో విహరించాడు .జబ్బు పడ్డవారికి నయం చేయటం తనకు చేతకానిపని అని  గ్రహించాడు .చివరిసారిగా ఒక పేషెంట్ ఆర్టేరిను ఓపెన్ చేసి కలల్లో తేలిపోయి అద్భుతాలు చూసి ఇక మళ్ళీ సర్జికల్ సామగ్రి జోలికి   వెళ్ళలేదని  కీట్స్ స్వయం గా చెప్పాడు .

ఇరవై ఒకటి లో కొన్ని కవితలే రాశాడు .ఇమిటేషన్ ఆఫ్ స్పెన్సర్ ‘’అనే సానెట్ రాశాడు .తను ఇంకా సర్జన్ గా ఉండలేనని తేల్చి చెప్పేశాడు .కీట్స్ కు సన్నిహితులు అతని సోదరులే .సేవేర్న్ అనే చిత్రకారుడు కీట్స్ అద్భుత చిత్రాన్ని గీశాడు .చాలా ముచ్చటగా కీట్స్ కనీ పిస్తాడు .లండన్ లో చాపి సై డ్ జిల్లాలో సోదరులతో కొంతకాలం ఉన్నాడు .ఒక రోజు ఉదయం  పదింటికి కీట్స్ ఆ రాత్రి అంతా నిద్రపోకుండా మేలుకొని రాసిన ‘’ఆన్ ఫస్ట్ లుకింగ్ ఇంటు  చాప్మాన్స్ హోమర్ ‘’ ‘’much have I travelled in the realms of gold –and many goodly states and kingdoms seen ‘’అని ప్రారంభమయ్యే సానెట్ చదివి వినిపించాడు .పసిఫిక్ సముద్ర అన్వేషణ పై ‘’కోర్తెజ్ ‘’కవిత రాశాడు .వీటి వ్రాత ప్రతులు ఉన్నాయి . హంట్ రాసిన దానికి ఫైన్ వేసి జైల్లో పెట్టారు . ‘’కవిత్వం కాన్షస్  తో రాసేది కాదు అన్ కాన్షస్ గా రాసేదని’’ కీట్స్ అభిప్రాయం ‘’.a drainless shower –of light is poesy –it is the supreme of power –its might half –slumbering on its own right arm ‘అన్నాడు  .హంట్ బృందం లో కీట్స్ సభ్యుడైనాడు .వర్డ్స్ వర్హ్ కీట్స్ ను మెచ్చాడు .హుంట్ తో సాన్నిహిత్యం కీట్స్ కు ఎంతో మేలు చేసింది .’’the poetry of earth is never dead ‘’తో ప్రారంభమైన కవిత అందరిని మెప్పించింది ‘’ ఆ న్ దిగ్రాస్ హాపర్ అండ్ ది క్రికెట్ ‘’మొదలైనవి పేరొందాయి .సమీక్షలూ అనుకూలం గానే వస్తున్నాయి .

ఈ ఆనందం ఎక్కువ కాలం లేదు .సోదరుడు టాం అనారోగ్యం తో తిరిగి వచ్చాడు .అందరూకలిసి వెల్  వాక్ లో స్తిరపడ్డారు .హాంప్  స్టేడ్ బృందం  పెరిగి పోయింది .కీట్స్ ధ్యాస అంతా కవిత్వం మీదనే .కవిత్వం రాయకుండా ఒక్క క్షణం కూడా ఉండేవాడు కాదు .షేక్స్ పియర్ ను చదివితే చాలు అతడొక విజ్ఞాన సర్వస్వం అనే వాడు .’’ఎందిమియాన్ ‘’ ‘’తన ప్రాజ్ఞా సర్వస్వం అని తన శక్తి అంతా  ధార పోసి రాశానని చెప్పాడు .దాన్ని ‘’పోలార్ స్టార్ ఆఫ్ పోయిట్రీ ‘’అన్నాడు .చాంపియన్ పత్రిక లో డ్రామా క్రిటిక్ గా ఉన్న రేనాల్డ్స్ సెలవలకు వెడుతూ బాధ్యతా కీట్స్ మీద ఉంచాడు ఒదేల్లో రిచర్డ్ త్రీ ,నాటకాలు చూసి సమీక్ష చేశాడు వర్డ్స్ వర్త తో కలయిక హుషా రునివ్వలేదు తన ప్రాభవం తగ్గి పోతోందని ఆ లేక్ పోయేట్ బాధ పడుతున్నాడు .కీట్స్ లండన్ వదిలి జార్జి స్థానం లో తీగ్ మౌట్  లో పని చేశాడు .

1818 ఏప్రిల్ లో ‘’ఎందిమియాన్ ‘’ప్రచురించాడు .సమీక్షలు చాలా వ్యతిరేకం గా వచ్చాయి .అందులోని’’a thing of beauty is a joy for ever ‘’ అందరి నాలుకల మీదా నాట్యమాడింది .విమర్శ జడివాన నుంచి బయట పడటానికి స్విట్జర్లాండ్ వెళ్లాడు .బ్రౌన్ తోకలిసి ఐర్లాండ్ చూశాడు .వాతావరణం బాగోలేక వారానికే బెల్ఫాస్ట్ చేరారు అక్కడి నుండి బాలన్త్రే వెళ్లి విపరీతమైన వర్షాలు చలి దగ్గు జలుబు పట్టి క్షయ వ్యాధి లక్షణాలు కనిపించాయి .హాంప్ స్టేడ్ కు తిరిగోచ్చేశారు .టాం పరిస్తితి మరీ దారుణం .అతన్ని కనీ పెట్టి ఉంటున్నాడు కీట్స్ .రివ్యూలు డిప్రెషన్ తెప్పించాయి క్వార్తెర్లి రివ్యు కోకేరిస్కూల్  ,ఎందేమియాన్ లపై విషమే కక్కినా మిగిలిన వారికంటే కొంత నయం .పుస్తకాలు అమ్ముడుపోక డబ్బు ఇబ్బంది ఎక్కువైంది .బైరన్ సూతీ మూర్ లు ఆర్ధిక సాయం చేసి నిల బెట్టారు .టాం చనిపోయాడు తల్లికి, టాం కు ,వచ్చిన క్షయ తననూ కబ ళించివేస్తుందని తెలుసుకొన్నాడు .

ఇంతలో మరో ఎదురు దెబ్బ తగిలింది .ఫాన్నీ ప్రేమ అనుకొన్నట్లు ముందుకు సాగటం లేదు .భవిష్యత్తు అంధకారం గా ఉంది .విజయం పొందలేని కవి అని పించుకొన్నాడు .వారిద్దరి మధ్యా ప్రేమలేఖలు 1936లో మాత్రమె ప్రచురణ అయ్యాయి .ఆమె కు కీట్స్ పై ఆరాధన తగ్గలేదు .విధవ రాలు వేషం తో గడిపింది .1818లో ‘’ట్రూ థామస్ ‘’అనే బాలడ్ గొప్పగా రాశాడు .సోదరుడు జార్జి స్పెక్యులేషన్ లో బోలెడు సొమ్ము పోగొట్టుకొన్నాడు .ఎటూ పాలుపోక జర్నలిజం లో ఉండాలని మెడిసిన్ ప్రాక్టీస్ చేయాలని ఊగిస లాడాడు ..’’లామియా ‘’ఒతో ది గ్రేట్ ‘’రాశాడు .ఫాన్ని లేకుండా బతకలేనని చెప్పుతున్నాడు .ఎనిమిది వందల లైన్ ల ‘’ది కాప్  అండ్ ది  బెల్ ‘’ను సాహసోపేతం గా రాశాడు .బాగా డిప్రేస్ అయ్యాడు .ఏడు వందల పౌండ్లు ఆస్తిని అమ్మి జార్జి కిచ్చాడు వ్యాపారం కోసం .అదేమీ కీట్స్ స్వంతం కాదని కీట్స్ చనిపోయిన తర్వాత జార్జి చెప్పటం విడ్డూరం .

1820 ఫిబ్రవరి లో ఫాన్ని కి పరిస్తితి వివరిస్తూ జాబు రాశాడు. కీట్స్ కు చావు ఘడియలు దగ్గర పడ్డాయి .చలి దాగ్గు బలహీనత బాధిస్తున్నాయి రక్తం కక్కు కొంటున్నాడు .కొవ్వొత్తి వెలుగులో దుప్పటిపై కక్కిన రక్తాన్ని తానె పరీక్షించి చూసి ‘’that drop of blood is my death warrant ‘’అని తేల్చి చెప్పేశాడు .హేమరేజే లు ఎక్కువైనాయి .మార్చిలో కొంత గుణం కనిపించింది .లండన్ వెళ్లి ‘’క్రిస్ట్ ఎంట్రి ఇంటు జెరూసలెం ‘చూద్దామను కొన్నాడు .’’లామియా ఇసబెల్ల ,ది ఈవ్ ఆఫ్ సెయింట్ ఆగ్నెస్ ‘’మొదలైన పోయెమ్స్  చివరి వాల్యూం లో చేర్చాడు .1820జులై లో ప్రింట్ చేశాడు .దీనిపై మంచి  స్పందనే వచ్చింది .అమ్మకాలు జోరుగా సాగాయి .ఇంగ్లాండ్ లో రాజకీయ దుమారం రేగింది నాలుగవ జార్జి భార్య ను వదిలేశాడు దీనితో అయిదు వందల కాపీలే అమ్ముడయ్యాయి .’’ఇసబెల్లా ఆర్  ది పాట్  ఆఫ్ బాసిల్ ‘’బోకాసియో లోని ఒక కద. ఈవ్  ఆఫ్ ఆగ్నెస్ గొప్ప విజయమే .సెప్టెంబర్ పద్దెనిమిదిన జోసెఫ్ సేవేర్న్ తోకలిసి కీట్స్ రొమ్ కు నావ మీద బయల్దేరాడు .నెల రోజులు ప్రయాణించి చేరారు .

కీట్స్ చివరి రెండు నెలలు మానసిక ఆందోళన శారీరక బాధ తో గడిపాడు .అసూయ ,ఆవేశాలకు అతీతం గా ఉన్నాడు .తన దీన స్తితిని నేపుల్స్ చేరిన తర్వాత బ్రౌన్ కు జాబు రాసి తెలిపాడు .బాధ విపరీతమై రాయలేక పోయే వాడు .23-2-1821న  సేవేర్న్ ను పిలిచి ‘’lift me up.iam dying .don;t be frightened .thank god it;s come ‘’అని చివరి మాటలు అని ఊపిరి అందకఏడు గంటలు బాధపడి అర్ధ రాత్రి అసువులు బాశాడు కీట్స్ కవి .రెండు రోజుల తర్వాతా రొమ్ లోని  ప్రోటేస్టంట్  సేమేటరి లో ఖననం చేశారు .ఆయన రాసిన కవితా (ఎపితా )’’here lies one whose name was writ in water ‘’ఉన్న ఫలకాన్ని ఉంచారు .కీట్స్ కోరిక మేరకు సమాధిపై అతని పేరు రాయలేదు .కవిగా అయిదేళ్ళ కాలమే జీవించాడు ..తన కవిత్వాన్ని సీరియస్ గా రాశాడు కాని గర్వం తో పొగరుతో రాయలేదు .కీట్స్ కవిత్వం అంటే ఒక భావోద్రేకమే కాని ఆలోచనా పరం కాదంటారు .ఇది అబద్ధం అది ఆలోచన భావోద్రేక సమ్మేలనమే .అతని ఊహకు ప్రతీకయే .సవ్యమార్గం లో జాగ్రత్తగా ఉండమనే కీట్స్ సందేశం .ఇంద్రియాతీత భావన కు రూప కల్పన చేశాడు నైటింగేల్ కవితలో గౌరవ ఆరాధననుంచి యదార్దానికి ప్రయాణించాడు .కీట్స్ కు ఒక దివ్యమైన కల ఉండేది అదే ‘’a dream of a world made not only lovelier but worthier of living .it was a pursuit of a dedicated poet ,a tragic lover ,and a brave man ,who wounded by derision and weakened by a fatal disease ,confronted death with a deathless vision ‘’.

ఐదారేళ్ళు మాత్రమె కవిగా ఉన్నా కీట్స్ కవిత్వాన్ని ఇప్పటికీ ఆరాదిస్తూనే ఉన్నారు .ఓడ్స్ మీద రసపట్టు ఉన్న కవి .టెన్నిసన్ ఇలియట్ లను ప్రభావితం చేశాడు .రొమాంటిక్ కవిత్వం లో షెల్లీ కీట్స్ లు ధ్రువ తారలు గా నిలిచారు . కీఎత్స్ రాసిన ఉత్తరాలకు కూడా సాహిత్య గౌరవం అమితం గా ఉంది .

 

John Keats by William Hilton.jpg

 

 

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-6-14-ఉయ్యూరు

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వ ఆంగ్ల కవుల ముచ్చట్లు -38 శోక కవి –కవి అనధికార శాసన కర్త అన్న- పెర్సి బిషెల్లీ షెల్లీ -2(చివరి భాగం )

పూర్వ ఆంగ్ల కవుల ముచ్చట్లు -38

శోక కవి –కవి అనధికార శాసన కర్త అన్న-  పెర్సి బిషెల్లీ షెల్లీ -2(చివరి భాగం )

మేరీ కి పిల్లలు పుడుతూనే ఉన్నారు .గాద్విన్ పారసైట్ అయ్యాడని షెల్లీ బాధ పడుతూనే ఉన్నాడు .బిషప్ గెట్ లో ఒక ఏడాదే ఉన్నారు .ప్రతిచోట తనకు శత్రువులేక్కువైనారని భావించాడు .జేనేవా దగ్గర సేఖేరాన్ లో కాపురమున్నారు .బైరన్ వచ్చి చేరాడు .షెల్లీ బైరన్ లు కలిసి ఫ్రీ లవ్ సొసైటీ పెట్టారని గుసగుసలు వచ్చాయి .అందరు కలిసి ఎంజాయ్ చేస్తున్నారు .కొద్దికాలానికి బైరన్ ను వదిలేసి వీళ్ళు వెళ్ళిపోయారు .గాద్విన్ కూతురు తండ్రి నిజ స్వభావాన్ని తెలియ జేస్తూ ఉత్తరాలు రాస్తోంది .లండన్ చేరిన నెలకే ఆమె ఆత్మ హత్య చేసుకొన్నట్లు తెలిసింది ..షెల్లీ షాకయ్యాడు .హారియట్ అకస్మాత్తుగా అదృశ్యమైంది .ఇది మరో షాక్ .ఆమె శవమై సేర్పెంటిన్ రివర్ లో తేలింది .ఆమె వయసు ఇరవైఒక్కటి మాత్రమె .ఎలిజా రాసిన ఉత్తరానికి షెల్లీ చలించలేదు .హారియట్ మరణం తో మేరీ ని పెళ్లి చేసుకొనే లైసెన్స్ వచ్చింది షెల్లీ కి .తన పిల్లల్ని ఇవ్వమని షెల్లీ ఎలిజా ను కోరాడు .కోర్టును ఆశ్రయించాడు .తండ్రిగా అనర్హుడు అని అనేక డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించారు .కోర్టు నమ్మి అతని చేతుల్లో పిల్లలు పాడై పోతారుకనుక పిల్లల్ని తీసుకొనే అర్హత లేదని తీర్పు నిచ్చారు .కోర్టులో ఓడిపోవటం తో డిప్రేస్ అయ్యాడు .క్లారా  కు పిల్లాడు పుట్టినందుకు సంతోష పడ్డాడు .లీ హంట్ సర్కిల్ లో చేరిపోయాడు .ఇరవై రెండేళ్ళ కీట్స్ కవి వీళ్ళతో కలుస్తున్నా షెల్లీకి దగ్గర కాలేక పోయాడు  .

మార్లో లో కాపురమున్నాడు .మేరీ తో మెర్రీ  గా ఉంటున్నాడు .కవితా ఝరి పారిస్తూనే ఉన్నాడు .ముప్ఫై చిన్న కవితలను రాశాడు నాలుగు వేల ఎనిమిది వందల పంక్తుల దీర్ఘ కవిత  ‘’దీ రివోల్ట్ ఆఫ్ ఇస్లాం ‘’రాశాడు .గాద్విన్ బెదిరిమ్పులేమీ ఆగలేదు .బైరన్ క్లైర్  గురించి, పుట్టిన పిల్ల గురించి పట్టించుకోలేదు .షెల్లీ ఆరోగ్యమూ తగ్గిపోతోంది మొదటి సారి గుండెపోటు వచ్చింది .ఇంగ్లాండ్ వదిలి ఆరోగ్యం కోసం ఇటలీ వెళ్లాడు .మిలన్ కు క్లైర్ అల్లెగ్రా ,పిల్లలు చేరారు .తొమ్మిది వారాలు అక్కడే ప్రదేశాలు తిరుగుతూ ,ప్లేటో రాసిన ‘’సిమ్పోజియాంస్ ‘’ను అనువాదం చేశాడు .మనిషి యొక్క వ్యక్తిత్వం కోసం అన్వేషణ ,కలయిక యేప్రేమ అన్నాడు .బైరన్ షెల్లీ కుటుంబానికి తన సౌధం వాడుకొనేందుకు ఇచ్చాడు షెల్లీ ‘’జూలియన్ అండ్ మద్దాలో ‘’రాయటం మొదలు పెట్టాడు .’’దిసెన్సి ‘’అనే ట్రాజేడి లో మొదటి భాగం రాశాడు .క్లారా   డిసేంటరి వ్యాధితో బాధ పడి  చనిపోయింది .శోకం లో ఉన్నా జూలియన్ రాస్తూనే ఉన్నాడు .క్లైర్ తో లవ్ ఎఫైర్ సాగిస్తున్నాడు .వీళ్ళ పాపానికి పుట్టిన పిల్లలెవరో ఎవరికీ తెలీదు .

ముగ్గ్గురూ నేపుల్స్ చేరారు .రాయటం తగ్గించి బోట్ షికార్లు ,రైడింగ్ సైట్ సీయింగ్ లో గడిపాడు .ఆరోగ్యమూ శక్తి సమకూడాయి .కుర్రాడిగా కనిపిస్తున్నాడు .రొమ్ చేరారు .రెండున్నర ఏళ్ళ కొడుకు విలియం చనిపోయాడు .లెగ్ హారన్ కు మకాం మార్చారు .ఫ్లారెన్స్ చేరుకొన్నారు మేరీ నాలుగో సంతానం గా పెర్సి ఫ్లారెన్స్ ను కన్నది .సెన్సి రాయటం పూర్తీ చేశాడు .’’the best thing I ever wrote ‘అనుకొన్నాడు .కాని మంత్లీ క్వార్టర్లీ రివ్యూలు ‘’అసంబద్ధం ,అవివేక రచన ‘’అన్నాయి ఫ్లారెన్స్ లో గాలి తీవ్రత ఎక్కువ .ఎప్పుడూ వర్షమే .పీసా వెళ్లారు .అక్కడ ఉన్నరెండు ఏళ్లలో   అతని లోని జీనియస్ విజ్రుమ్బించాడు .’’ది మాస్క్ ఆఫ్ అనార్కి ‘’అనే శిఖరాయమానమైన కవిత రాశాడు అందులో ‘’rise like lions after slumber –in unvanquishable number –shake your chins to earth like dew –which in sleep had fallen on you –ye are many –they are few ‘’ .గొప్ప లైన్లు .ఇక్కడే అతని ‘’స్కైలార్క్ ‘’,క్లౌడ్ ,లవ్స్ ఫిలాసఫీ ‘’సెన్సిటివ్ ప్లాంట్ ‘’అనే అపూర్వ కవితలు రాశాడు .’’ఇంగ్లాండ్ ఇన్ 1819 ‘’రాశాడు .ఇక్కడి వేడి భరించలేక సాన్  గులియానో కు వెళ్లారు .అక్కడ వర్షాలు విపరీతమై నదులు పొంగి ప్రవహిస్తున్నాయి .వరదలు ముంచెత్తుతున్నాయి .టాం మెడ్విన్ వచ్చి చేరి షెల్లీ తో రాజకీయ సాహిత్య ప్రసంగాలు చేస్తూ షెల్లీకి తిండి ధ్యాసే లేకుండా చేస్తోంది .

ఇరవై తొమ్మిదో ఏట మరో అమ్మాయితో శ్రుంగారం రంగరించాడు.ఆమె ఇరవై రెండేళ్ళ ఏమిలా వివియాని .ఆమెకు కాన్వెంట్ చేర విడిపించి పెళ్లి చేసుకొని  చాంపియన్ అవ్వాలను కొన్నాడు . .ఏమిలా షెల్లీకి స్పిరిట్యువల్ సిస్టర్ అయింది ఆమె తండ్రి పీసా గవర్నర్ .కేసును షెల్లీ డ్యూక్ దాకా తీసుకెళ్ళాడు .గవర్నర్ మరోపార్శ్వం జనానికి తెలియాలనే వాడు .’’ఎపి సైకిడియాన్ ‘’అనే కవితను దీనిపై రాశాడు .ఇందులో ‘’ప్లాటోనిక్ లవ్ ‘’ఉంది .అదేకాక ఫ్రీ లవ్ సెక్స్ కోరికా ఉన్నాయి .ఆరు వందల లైన్ ల కవిత ఇది .సంఘం లోని ఇరుకు మనస్తత్వాన్ని చూపాడు ,’’  with one child friend ,perhaps a jealous foe –the dreariest and longest journey go ‘’ఉదాహరణకు చూపాను .ఇది పూర్తీ అయి ప్రింట్ అయ్యే లోపే ఎమిలీ జైలు నుంచి పారిపోయి వేరొకరిని పెళ్లి చేసుకొని షెల్లీ కి షాకిచ్చింది .వందకాపీలు మాతమే వేయించాడు .

పీకాక్ అనే వాడు ఆధునిక ప్రపంచం లో కవిత్వానికి స్థానం లేదని రాశాడు .తన శక్తి యుక్తులను కూడా దీసుకొని కవిత్వానికి ఉన్న శక్తి సామర్ధ్యాలను నిరూపిస్తూ ‘’డిఫెన్స్ ఆఫ్ పొయెట్రీ ‘’రాశాడు .సమాజం లో కవిపాత్ర గొప్పదని వాదించాడు .’’lift evil from the hidden beauty of the world and make familiar objects be as if they were not familiar . ‘’అని చెప్పి కవిత్వ సామర్ధ్యాన్ని ‘’ever strengthens and purifies the affections enlarges the imagination and adds spirit to sense .poets are the un acknowledged legislators of the world ‘’అని ధంకా బజాయించి చెప్పాడు .ఈ చివరి వాక్యాన్నే అందరూ ఉదాహరిస్తారు అంత ప్రాచుర్యం పొందిన వాక్యం అది .

‘’అడనోస్ ‘’అనే చివరి గొప్ప కవిత రాశాడు అది మహా గొప్ప ఏకైక కవిత అంటారు .ఫిబ్రవరిలో కీట్స్ కవి రొమ్ లో చనిపోయాడు .ఏప్రిల్ కు కాని ఈ విషాద వార్తా షెల్లీకి తెలియ లేదు .అడనోస్ కూడా కవిత్వాన్ని సమర్ధించే మరో కవితే.కీట్స్ ను అతని క్షయ వ్యాధి కంటే విమర్శకులే అతిగా రాసి దారుణం గా చంపేశారని షెల్లీ అభిప్రాయ పడ్డాడు .లిసిడియాస్ తర్వాత గొప్ప ఎలిజీ గా యాభై అయిదు  స్పెంసేరియన్ స్టాం జాలు గా రాశాడు .ఎక్కడా జోరు ,కాని భావం భాష తగ్గకుండా పకడ్బందీ గా రాశాడు .దుఖానికి పరాకాష్టగా  నిలిచి పోయి షెల్లీని చిరంజీవి ని చేసింది .

‘’the one remains ,the many change and past –heaven;s light for ever shines –earth;s shadow fly –that light whose smile kindles the universe –that beauty in which all things work and move –by man and beast and earth are mirrors of –the fire for which all thirst now beams on me –consuming the last clouds of cold mortality ‘’అని చలించి జ్వలించి  చెప్పాడు .ఈ దుఖం తో ఆగిపోలేదు .ఇంకా తన సృజన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాడు .కీట్స్ మరణం తర్వాత షెల్లీ  పీసన్ లిటరరీ సర్కిల్ సభ్యుడయ్యాడు .లేరిసి లో గల్ఫ్ ఆఫ్ స్పీజియా దగ్గర చిన్న ఇల్లుకోనుక్కున్నాడు .అయిదుగురూ అక్కడే ఉన్నారు .ఇల్లు ఇరుకు మురికి కొంప అందులోనే సర్డుకొంటున్నారు .షెల్లీకి ఈత రాకపోయినా బోట్ షికారంటే ఇష్టం

పన్నెండు అడుగుల బోట్ ‘’ఏరియల్ ‘’ను కొన్నాడు విలియం తో కలిసి మొదటిసారి గా హేగ్ హారన్ కు బో ట్ నడుపుకొంటూ వెళ్లారు .బైరన్ ఇంటికీ వెళ్లి వచ్చారు .జూలై ఎనిమిదిన విలియం తోకలిసి లేర్సికి బోట్లో తిరిగి వస్తున్నారు .కాని ఇంటికి చేర లేక పోయారు .విపరీతమైన గాలి ,వర్షం నడపటం అసాధ్యం అని పించింది .బోట్ నదిలో తిరగ బడిపోయింది .మళ్ళీ లేవలేక పోయారు .రెండు వారాల తర్వాత వారిద్దరి శవాలు ఒడ్డుకు కొట్టుకోచ్చాయి .కీట్స్ రాసిన కవిత షెల్లీ జేబులో ఉండి పోయింది .కుళ్ళిన శవాలను బీచ్ ఒడ్డున సున్నపు పొరల్లో సమాధి చేశారు .మళ్ళీ కొన్ని నెలల తర్వాత వీరి అభ్యర్ధన పై తవ్వి తీసి శవాలను అప్పగించారు .షెల్లీ గుండె దెబ్బ తిన లేదట .ట్రేలావని అనే వాడు దాన్ని లాగేశాడు రొమ్ లోని ప్రోటేస్తంట్ సేమేటరిలో చితా భస్మాన్ని జాగ్రత్త చేశారు .ఇక్కడే కీట్స్ నూ సమాధి చేశారు  ఇద్దరు కవులు ప్రక్క ప్రక్కనే సమాధిలో ఉండిపోయారు .ఇంకో నెల లో షెల్లీకి ముప్ఫై ఏళ్ళువచ్చి ఉండేవి  .18-7-1822న షెల్లీ మరణించాడు .

షెల్లీజీవితం  .’’a paradox of reason and irresponsibility ‘’అన్నారు .’’where music and moon light and feeling are one ‘’అన్నాడు విలియమ్స్ .షెల్లీ ని మాధ్యూ ఆర్నోల్డ్ ‘’a beautiful and ineffectual angels  beating in the void his luminous wings in vain ‘’అంటూ కీర్తించాడు .కాని షెల్లీ లో మానవ దానవ స్వభావాలు రెండూ జమిలిగా ఉన్నాయని మనం తెలుసుకొన్న చరిత్ర  చెబుతోంది .’’drive my dead thoughts over the universe ‘’అన్నాడు షెల్లీ .సమాజం లో కవి పాత్రను విస్పష్టం గా విప్పి చెప్పిన వాడు షెల్లీయే .ప్రకృతిలోని అన్ని స్వభావాలకు రూప కల్పనకవి చేస్తాడని చెబుతూ ‘’from these create he can –forms more real than living man –nursing of immortality ‘’

షెల్లీ స్ప్లిట్ పెర్సానాలిటి .మనిషి గమ్యం తెలిసిన కవి .హింస ,స్వేచ్చ ల మధ్య యుద్ధం గురించి రాశాడు .నిరాశ అంటే చిరాకు పడ్డాడు .నిజానికి ‘’అసలైన కవి ‘’అని పించాడు షెల్లీ .కవితల్లో శిఖరాయమానవైనవీ పాతాళానికి చేరినవీ రాశాడు .సంపూర్ణ వికాసం  లేని కవితలు రాశాడనీ అన్నారు .అతని లిరికల్ పవర్ ముందుగా మనల్ని కట్టి పడేస్తుంది తర్వాత తల ఊపుకొంటూ మనం వెంటబడి పోతాం .స్కైలార్క్ కవిత అతని గుండెల లోతుల్లోంచి జలపాతం గా ఉబికిన కవిత .అలాగే ఒజిమండియాస్ కవితలో గొప్ప తాత్విక దృక్పధాన్ని వెలువరించాడు .

‘’the world;s great age begins anew –the golden years return –the earth doth like a snake  renew –her winter weeds outworn ‘’

‘’heaven smiles and faiths and empires gleam –like wrecks of dissolving dream ‘’

Oh!cease –must hate and death return ?-cease must men kill and die ?-cease drain not to its dregs the urn –of bitter prophecy –the world is weary of the past –oh!night it die or rest at least ‘’

వంటి అమ్రుతోపమానమైన కవితా పంక్తులు రాసి అమరకవి అయ్యాడు షెల్లీ .కవిత్వ సారాంశాన్ని వీటిలో తెలియ జేసిన మహా కవి .’’such poems convey the very essence of poetry .-an unbodied joy so keen that in spite of every prejudice the world must listen and respond to it ‘’

శోక లోకైక చక్ర వర్తి అని పించుకొన్న షెల్లీ తో మన దేవుల పల్లి కృష్ణ శాస్త్రి గారిని పోలుస్తారు .కృష్ణ శాస్త్రి మరణిస్తే శ్రీ శ్రీ ‘’షెల్లీ మళ్ళీ మరణించాడు ‘’అని అన్నమాట మనాకందరికి గుర్తుండే ఉంది .రొమాంటిక్ కవుల్లో అగ్రేసరుడు నాలుగైదు తరాలను ప్రభావితం చేసిన వాడు .విక్టోరియన్ పరి రాల్ఫిట్ కవుల పై విశేష ప్రాభావం చూపాడు .దంటే రోసేట్టి ఆస్కార్ వైల్డ్ వంటి హేమా హేమీలకు గురు తుల్యుడు .బెర్నార్డ్ షా కారల్ మార్క్స్ ,సిన్క్లైర్ దోరో ,లకు మార్గ దర్శి .అనేక ఉద్యమాలకు రాజకీయ ఆలోచనలకు షెల్లీ భావాలే తోడ్పాటైనాయి .అహింసా విధాన ఆందోళనకు తెర తీసిన వాడు షెల్లీ

షెల్లీ పూర్తీ

సశేషం

మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ -5-6-14-కాంప్ –బాచుపల్లి –హైదరాబాద్

‘’

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వ ఆంగ్ల కవుల ముచ్చట్లు -37 వాస్తవం పై తిరుగు బాటు –పెర్సి బిషి షెల్లీ

పూర్వ ఆంగ్ల కవుల ముచ్చట్లు -37

వాస్తవం పై తిరుగు బాటు –పెర్సి బిషి షెల్లీ

షెల్లీ పుట్టేనాటికి ఇంగ్లాండ్ పారిశ్రామిక విప్లవ ఫలితాల చేదు అనుభవాలతో ఉన్నా సృజనాత్మకత విజ్రుమ్భించింది .విలియం బ్లేక్ ముప్ఫై అయిదులో ‘’సాంగ్స్ ఆఫ్ ఎక్స్పీరియెన్స్ ‘’రాస్తున్నాడు బర్న్స్ ముప్ఫై మూడులో స్వీయ లిరిక్స్ తో చేల రేగుతున్నాడు .ఇరవై రెండేళ్ళ వర్డ్స్ వర్త్ ఫ్రాన్స్ లో విప్లవం రుచి చూస్తున్నాడు .ఇరవైలలో ఉన్న కాల్ రిడ్జి కేంబ్రిడ్జిలో చేరబోతుంటే ,పద్దెనిమిదో  ఏట సూతీ ,లాంబ్ పదిహేడు ,బైరన్ నాలుగేళ్ల బుడ్డాడు గా ఉన్నారు .

షెల్లీ పూర్వీకులు సంస్కృతి పట్ల పెద్దగా అభిరుచి ఉన్న వారు కాదు .సాధారణ కుటుంబీకులే అయినా అంతటా విస్తరించారు .వారి వ్రేళ్ళు  అమెరికాలోనూ ఉన్నాయి .షెల్లీ ముత్తవ్వ న్యూ యార్క్ మిల్లర్ కు విధవ రాలు .తిమోతీ షెల్లీని అనే కొత్తగా కాలనీకి చేరిన వాళ్ళబ్బాయి నిపెళ్ళాడి  బిషీ ని న్యూ యార్క్ లోని న్యూ జేర్సిలో 1752 లో కన్నది .కుటుంబం ఇంగ్లాండ్ చేరింది అప్పుడు బిషీ యువకుడే .స్వంతం గా ఎదగాలని నిర్ణయించుకొన్నాడు .డబ్బు బాగా ఉన్న ఒక క్లేర్జిమన్ కూతురితో లేచిపోయి పెళ్లి చేసుకొని ,ఆమె చనిపోయే నాటికిసంపదతో పాటు   ముగ్గురు పిల్లల తండ్రి అయ్యాడు .రెండో పెళ్లి చేసుకొని ఏడుగురిని కన్నాడు .ఆమె నుంచి గొప్ప సంపద కలిసొచ్చింది .వీళ్ళ పెద్దబ్బాయి తిమోతీ కి కౌంటీలో మంచి సంబంధం చూసి పెళ్లి చేశాడు .వీరి ఏడుగురి సంతానం లోపెద్ద వాడు  పెర్సి బిషేల్లీ 4-8-1792.లో  లండన్ కు నలభై మిల్ల దూరం లో ఉన్న ససెక్స్ లోని హోషం ఫీల్డ్ బేస్ లో పుట్టాడు .

షెల్లీ తండ్రి ఆచారాలను తు చ తప్పకుండా పాటించాడు .కొడుకంటే విపరీతమైన గర్వం అభిమానం .చెల్లెళ్ళు అన్న మీద అమిత అనురాగాన్ని చూపారు .ఈ అనుబంధాల మధ్య హాయిగా బాల్యం గడిపాడు .ఇప్పటినుంచి పరిస్థితులు మారిపోయాయి .సియాన్ హౌస్ మిడిల్ క్లాస్ చదవ టానికి పంపారు .అతని చందాలు సున్నిత మనస్తత్వం  ,నాణ్యమైన ప్రవర్తన తోటి విద్యార్ధులకు ఈర్ష కలిగించాయి .అందులో ఒకడు అతనికజిన్ టాం మిద్విన్ కూడా ఉన్నాడు .అతనే తర్వాత షెల్లీ జీవిత చరిత్ర రాశాడు .ప్రతి రోజూ రౌడీయిజం చేసి షెల్లీని భయ పెట్టారు .ఒక రకం గా క్రూరం గా హింసించారు .కొద్దికాలం ఓర్చుకొన్నాడు .తరువాత ఎదురు తిరిగాడు .అక్కడ బోధించే సాహిత్యం భాషా శాస్త్రాలకంటే ఖగోళం కెమిస్ట్రి   ఫిజిక్స్ అంటే ఇష్టపడ్డాడు .పిల్లలందరి చేత చెట్ట పట్టాలు పట్టించి షాక్ కు గురి చేసేవాడు .పన్నెండేళ్ళ వయసులో సైన్స్ అంటే వీర అభిమనమేర్పడింది .యీటన్ లో ఉన్న ఆరేళ్ళు తోటి వారు షెల్లీతో చెలగాటం ఆడారు .ఆ హింస భరించలేక పిచ్చి వాడయ్యాడు .గ్రే రాసిన ఎలిజీ ని బట్టీ పట్టి అప్పగించాడు .అక్కడ గడిపిన చివరి కాలం లో ఒక ‘’ఊహా  ప్రపంచాన్ని ‘సృష్టించు కొన్నాడు .గోదిక్ రచనల పారం ఎరిగాడు .ఎన్నో క్లాసిక్స్ చదివాడు .కొడుకు సాహిత్యాభిమానానికి  తండ్రి ఏంతో మురిసి పోయేవాడు .

సూతీ చాటర్త న్  లు అభిమానులైనారు .బెంజమిన్ ఫ్రాంక్లిన్ అంటే గౌరవం .1810లో తండ్రి చదివిన ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటి కాలేజి లో చేరాడు .మొదటి రోజునే థామస్ జెఫర్సన్ హాగ్ తో పరిచయం కలిగింది .అతనితోకలిసి ఒక కరపత్రాన్ని అన్యాయాల నేదిరిస్తూ వెలువ రించాడు .ఇద్దర్నీ బహిష్కరించారు .తండ్రి ఎదుట పడటానికి సంకోచించాడు విషయం తెలిసిన తండ్రి షాకయ్యాడు .పద్దెనిమిదేళ్ళ షెల్లీ రాడికల్ అయిపోయాడు .’’రాముని బుద్ధిమంత తనం రావణుడి భాష్యం ‘’గా మారిపోయింది . తండ్రి  ఆస్తి ఇవ్వటానికి ఒప్పుకోలేదు .అయినా దారికి రాలేదు కొద్ది పాటి దనం మాత్రమె అప్పగించి మిగిలింది అందరకు పంచేయ్యమని తిమోతీకి చెప్పాడు ఆమె  అవాక్కే అయింది  అతని స్నేహితుల్ని పిలిపించి మంచి దారిలో నడిచేట్లు చేయమని కోరింది .ఏడాదికి రెండు వందల పౌండ్లు ఇచ్చే ఏర్పాటు చేసింది .

గోదిక్ సాహిత్యం పై ఉన్న మోజు పెరిగిందే కాని తగ్గలేదు .ఒక వైన్ మర్చంట్ కూతురు హారియట్ వెస్ట్ బ్రూక్ ను ప్రేమించి ఆమెఇంటికి వెడితే  వోల్తైర్ రాసిన ‘’డిక్షనరీ ఫైలాసఫిక్ ‘’చదువుతూ కనీ పించింది .తండ్రి రాక్షసుడని గ్రహించి ఆ ఇంటి చేర విడిపిస్తానన్నాడు .మరో ఏడాదికి ఆమె ను తండ్రి ఆంక్షలను తిరస్కరించమన్నాడు ఫ్రీ లవ్  బాన్ధవ్యానికి సిద్ధమవ మన్నాడు .ఇది ఆమె అక్కకు ఇష్టం లేదు .ఆమెను ఎడిన్ బర్గ్ తీసుకొని వెళ్లి పెళ్లి చేసుకొన్నాడు .ఇంటిని నుంచి గెంటివేత ,అమ్మాయితో పారిపోవటం షెల్లీ తల్లిని కలవర పెట్టాయి .ఇక సత్రం యజమాని కూతురితో సల్లాపం మరీ బాధించి ఆస్తిలో ఏమీ దక్కకుండా చేసింది .ఫ్రీ లవ్  ఆచరణసాధ్యం కాదని గ్రహించాడు .హాగ్ వీళ్ళతో ఉంటూ హారిఎట్ ను ముగ్గులో దించే ప్రయత్నం చేస్తున్నాడు .ఆమె పై మొహం పెంచు కొన్నందుకు కాదు అతని జెలసీ ని వ్యతిరేకించాడు .ఈ పరిస్థితుల్లో హారియట్ తల్లికంటే అధికం గా ప్రేమించే ఎలిజా వచ్చి అన్నిటిని చక్క బరిచింది .లేక్ డిస్ట్రిక్ట్ లో షెల్లీ దంపతుల తోబాటు ఆమె కూడా గెస్ట్ గా ఉంది . 1812లో ఈ రాక్షస ప్రేమ బాధ తప్పించుకోవటానికి డబ్లిన్ వెళ్లాడు భార్య ఎలిజా లతో .అక్కడ సుఖం గా ఉండటానికన్నా ప్రచారానికే వెళ్లాడు .’’అడ్రస్ టు ఐరిష్ పీపుల్ ‘’రాసి అతి తక్కువ ధరకే ప్రచారం కోసం అమ్మాడు .వీధుల చివర్లలో నిలబడి భార్యా భర్తా వాటిని అమ్మారు .ఇంటి బాల్కనీ పై నుంచి రోడ్డుమీదకు పామ్ఫ్లేత్స్ విసిరారు .’’డిక్ల రేషన్ ఆఫ్ రైట్స్ ‘’ను కూడా ఇలాగే చేశారు .

తనేదో తప్పు చేస్తున్నట్లు అనిపించేది యువకుడి కర్తవ్యమ్ ఇదికాదని పించింది .విలియం గాద్విన్ రాసిన ‘’పొలిటికల్ జస్టిస్ ‘’ను బైబిల్ గా భావించాడు .ఐర్లాండ్ లో స్వేచ్చ ఉద్యమం బల పడలేదు నిరాశ తో ఇంగ్లాండ్ చేరాడు .ఇరవై ఏళ్ళు వచ్చేసరికి షెల్లీ అనుమానాస్పడుదయ్యాడు .ఐరిష్ రాజకీయ వ్యవస్థను దెబ్బ తీయటానికి కుట్ర పన్నుతున్నాడని  ఆరోపణ వచ్చింది .దీనితో కొంచెం స్పీడ్ తగ్గించాడు .కవిత్వమే ఆయుధం అని నిర్ణ యించుకొన్నాడు .’’క్వీన్ మాబ్ ‘’అనే ఇరవై రెండొందల లైన్ల దీర్ఘ కవిత రాశాడు .ప్రపంచం లోని రాజకీయ సాంఘిక పరిస్తితులమీదా,రాబోయే కాలం లో జరగ బోయే విషయాలపైనా రాశాడు .ఇందులో  పరిణామ సిద్ధాంతం ,ప్రాచీన నాగరకతా ధ్వంసం ,యుద్ధ భీతి ,సమాజం లో అవినీతి లంచ గొండితనంఉన్నాయి  ,శాకా ఆహారం అవసరం పై ‘’విన్దికేషన్స్  ఆఫ్ నేచురల్ డయట్  ‘’రాయటమే కాక శాకా హారి గానే ఉండిపోయాడు .అవసర న్యాయం ను సమర్ధించాడు .చట్టబద్ధ వివాహాన్ని వ్యతి రేకించాడు .మతాధిపతుల ఆగడాలను బయట పెట్టాడు –‘’and priests dare babble of a god of peace –even whilst their hands are red with guiltless  blood –murdering the while ,uprooting every germ –of truth exterminating spoiling all –making the earth a slaughter house ‘’అని నిర్మొహమాటం గా వివరించాడు

క్వీన్ మాక్ పుస్తకాన్ని పైరసీ చేసి అమ్మారు .ప్రభుత్వం ఇలా రాసిన వాడు తన పిల్లలను పెంచేందుకు సమర్ధుడు కాదన్నది .కోర్టు కేసు అయింది దేవుడిని పవిత్ర గ్రంధాలను దూషిస్తున్నాడని నేరం .మొదటి బిడ్డ పుట్టింది ఆమెకు ఎలిజా ఇయాన్తే అని పేరు పెట్టాడు .తల్లి ఏమీ దగ్గరకు రానీయక పోవటం ఆర్ధికం గా ఆసరాగా నిలబడక పోవటం విషాదమే మిగిల్చింది .అప్పుల వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు .పిల్లను చూసుకోవాలి కడుపులో ఇంకోరున్నారు .చివరికి గాద్విన్ ఏ శరణ్యమై గాడ్ అయ్యాడు జీవితాంతం .గాద్విన్ శిష్యురాలు మేరీ  పరిచయమైంది ఆమె స్త్రీహక్కు ఉద్యమ కారిణి .ఇంటికి దూరం గా మేరీకి దగ్గరగా బతుకు తున్నాడు .చివరికి హారియట్ అందరు కలిసి ఉందామని రాజీ చేసింది .భార్య హారియట్ సోదరిలాగా మేరీ భార్య లాగా ఉండే ఒప్పందం అది .బైరన్ కొడుకుని అని చెప్పుకొన్న వాడొకడు తరువాత ఈవిషయాలన్నీ  – బయట పెట్టాడు .అతను రాసిన ఉత్తరాలన్నిటినిత చనిపోయిన వందేళ్ళకు ప్రచురించారు .

మేరీ తో విడిగా కాపురం పెట్టాడు .గాద్విన్ దంపతుల అభ్యర్ధన తో మేరి షెల్లీని వదిలి వెళ్లి పోవటానికి వప్పందం కుదిర్చాడు దీన్ని తట్టుకోలేక పోయాడు కవి పుంగవుడు .ఇంత నల్లమందు మేరీ చేతిలో పెట్టి ఆమె వెళ్ళిపోతే ఆమెతో బాటు తానూ చస్తానని బెదిరించాడు .గాద్విన్ కూతురు అతన్ని ఓదార్చి ఇంటికి పంపేసింది .హారియట్ తో ఉంటున్న అతనిలో మానవ స్వభావం ఏమీ లేకుండా ప్రవర్తిస్తున్నాడు .ఆమెను సోదరి గా  చూడ లేక వ్యధ చెందుతున్నాడు .నిజాన్ని ఒప్పుకోలేక పోతున్నాడు క్షోభ అనుభ విస్తున్నాడు .డబ్బు లేక కాదు తోటి మనిషిని అర్ధం చేసుకొనే మనస్తత్వం లేని కవి అయ్యాడు .మానవత్వంగురించి తెలుసుకాని మనష్యుల గురించి తెలియని అవివేకి .కవిత్వాన్ని అనుభవించాలి వేదాంతాన్ని అర్ధం చేసుకోవాలి అనే హారియట్ పాటి జ్ఞానం లేక పోయింది .అన్నమాట నిలుపుకోకుండా రహస్యం గా మేరీ వచ్చి మెర్రి చేసుకొని వెడుతోంది .అతన్ని లేవ దీసుకొని పోయే ప్లాన్ వేసింది .తాను షెల్లీ జీవితం లోకి ప్రవేశించి ఉండకపోతే షెల్లీ ఎప్పుడో చచ్చేవాడని అన్నదికూడా .

28-7-1814తెల్ల వారు జామున నాలుగింటికి  షెల్లీ,మేరీ క్లైర్ లతో ఒక కోచ్ లో రహస్యం గా ఫ్రాన్స్ కు ఉడాయిన్చేశారు .పారిస్  కు మాంచి మిట్ట మధ్యాహ్నం చేరారు .బాగా అలసిపోయారు .వాచీని అమ్మేసి ఒక నాటు పడవ అద్దెకు తీసుకొని స్విట్ జర్లాండ్  కు బయల్దేరారు .షెల్లీ అంటే స్నేహితులందరికీ అసహ్యమేసింది .హారియట్ రెండవ బిడ్డను కడుపుతో ఉంది. లాయర్ సలహా కోరింది .కొడుకును కన్నది .’’డిసేర్టేడ్ వైఫ్ ‘’పేర ఉత్తరం రాసింది .షెల్లీ తాత చనిపోయాడు .షెల్ల్లీ కి లక్ష పౌండ్ల ఆస్తి దక్కింది .అప్పులు తీర్చేశాడు .గాద్విన్ కు వెయ్యి పౌండ్లు ముట్ట జెప్పాడు .ఒక రకం గా జీవితం కుదుట బడ్డట్లే .గ్రీక్ లాటిన్ ఫ్రెంచ్ లను మేరీ క్లైర్ లకు నేర్పుతున్నాడు .సానుభూతి పొందలేని జీవి అయ్యాడు .

 

 

 

Percy Bysshe Shelley by Alfred Clint crop.jpg

షెల్లీ విశేషాలు మళ్ళీ –

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-6–14-కాంప్ –బాచుపల్లి –హైదరా బాద్

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వ ఆంగ్ల కవుల ముచ్చట్లు -36 రొమాంటిసిజం కు ప్రేరకుడు -లార్డ్ బైరన్-2

పూర్వ ఆంగ్ల కవుల ముచ్చట్లు -36

రొమాంటిసిజం కు ప్రేరకుడు -లార్డ్ బైరన్-2

ఊరు మార్చినా బైరన్ తీరు మార్చుకోలేక పోయాడు .రాజ భోగాలు చిహ్నాలు వదల్లేదు కాని మనసు వ్యధా భరితమై ఉంది .మాథ్యూ ఆర్నోల్డ్ చెప్పినట్లు ‘’the pageant of his bleeding heart’’గా రక్తం కారుతున్న గుండెతో ఉత్సాహం గా ఉన్నాడు .ఆయన కారేజిలో మంచం పరుపు ,కుర్చీ ,రాత బల్ల ఉన్నాయి నెపోలియన్ అంటే అభిమానం ఈ హంగామా తో యూరప్ పర్యటన చేశాడు .జేనేవా చేరి షెల్లీ దంపతుల్ని చూశాడు .రాడికల్ ఫిలాసఫర్ విలియం గాద్విన్ ను కలుసుకొన్నాడు .తనకు ప్రేమాస్పదం గా ఉత్తరాలు రాసే క్లైర్ ను చూశాడు .చెడ తిరుగుడు తిరిగినా బైరన్ కు ‘’ఫ్రీ లవ్ సొసైటీ ‘’మీద ఇష్టం లేదు .కాని ఫ్రీ లవ్ వ్యాప్తికర్త షెల్లీ అంటే అభిమానం .షెల్లీ  కూడా బైరన్ తీవ్ర భావాలకు ముచ్చటపడ్డాడు అతని సృజన కు జోహార్లిచ్చాడు .లోవేల్ పీకాక్ తో బైరన్ చాలా ప్రత్యేకమైన వ్యక్తీ అని కాని చంచల స్వభావం  ఉన్నవాడని రాశాడు .

క్లైర్ పై ప్రేమ లేకున్నా ,కోరిక గాఢమైతే ఆమెకూడా లొంగింది .షెల్లీ దంపతులతో వీరిద్దరూ కలిసి మెలిసి ఉన్నారు .ఇది ఎక్కువ కాలం సాగలేదు ఆమెను వదిలిన్చుకొన్నాడు బైరన్ .చిలాన్ కోట కు వెళ్లి పోయాడు .ఇక్కడే ‘’ది ప్రిసనర్ ఆఫ్ చిల్లాన్ ‘’కవిత రాశాడు. క్లైర్ తో పడుకోన్నాడుకాని ఆమె అంటే అయిస్టమే.ఆమెను ఒక ప్రైవేట్ సెక్రటరీగా తన గజి బిజీ రచల కాపీయిస్ట్ గానే భావించాడు .గర్భవతిని అని ఆమె చెప్పింది .షెల్లీలు ఇంగ్లాండ్ వెడుతూ ఆమెను జాగ్రత్తగా చూసుకోమంటే సరే అన్నాడు .తన మనోభావాలను అగస్తాకు రాస్తూ ఈ యువతుల బాధ ఎక్కువైన్దన్నాడు .జేనేవా నుండి ఇంగ్లాండ్ కు ఒక బిడ్డను కనటానికే వచ్చానని రాసుకొన్నాడు .క్లైరా వెళ్ళిపోయినా బాధ తాగ్గలేదు .మెటా ఫిజిక్స్ కు మౌంటెన్స్ కు మధ్య ఊగిసలాడుతున్నాడు .దానినే కవిత గా ఇలా చెప్పాడు .’’there is a power upon me which withholds –and makes it my fatality to live for I have ceased –to justify my deeds unto myself –the last infirmity of evil’’.

అగస్తాకు తన గుండె బాధ అంతా ఉత్తరాల్లో వివరిస్తున్నాడు .ఇటలీకి చేరి మూడినెస్’’ ను వదిలిన్చుకొన్నాడు .మిలన్ లో హుషారుగా ఉన్నాడు .ఆడ్రియాటిక్ కు చేరాడు జూలియెట్ సమాధి చూశాడు. నవంబర్ లో చలి రోజున వెనిస్ వచ్చాడు .అంతా తడి గా చీకటిగా ఉందని పించింది .మానసిక ప్రశాంతత అక్కడ దొరకదనుకొన్నాడు .ఇక్కడే గొప్ప పేరు పొందిన లిరిక్స్ రాశాడు అందులో ‘’సో వెల్  గో నో మోర్ ఏ రొవింగ్ ‘’కవిత ఉంది .’’for the sword outwears its sheath –and the soul wears out the breast –and the heart must pause to breathe –and love itself have rest ‘’క్లైర్ నుంచి ఉత్సాహం తో ఉత్తరాలోస్తూనే ఉన్నాయి. షెల్లీలతో ఉన్న ఆమె బాత్ లో పెళ్లి చేసుకోంది  కూతురు అల్లీగ్రా పుట్టిందని తెలిసి బైరన్   సంతోషించాడు .వెనిస్ దగ్గర బ్రెంతాలో ఒక కాటేజీ అద్దెకు తీసుకొని ఉన్నాడు .మార్గారిటా కాగ్నిఅనే మురికి వాడ పిల్ల తో  తో సన్నిహితం గా మెలిగాడు .ఆమె నిప్పుల కుంపటి ..ఇంటి ని కుదిర్చిన మేరియానాతో తగాదాపడి జుట్టూ జుట్టూ పట్టుకోన్నారిద్దరూ .డబ్బున్న  లార్డ్ కనుక సర్దుకు పోయారు .బైరన్ ఏది రాసినా ముందే డబ్బు చెల్లించే పబ్లిషర్ దొరికాడు .1818లో ‘’ డాన్ జువాన్ ‘’నవల ప్రారంభించాడు .అప్పులేవీ లేవు హాయిగా ఉన్నాడు .న్యుస్టేడ్ ఆబ్బే లక్ష పౌండ్లకు అమ్మేశాడు ఇటాలియన్ స్టేటస్ ప్రకారం ‘’ప్లూటోక్రాట్ ,అరిస్టోక్రాట్ ‘’అయ్యాడు .గ్రాండ్ కెనాల్ ఒడ్డున పలజో మోసినిగో కొని స్తిరపడ్డాడు .మందీ మార్బలం తో కుక్కా నక్కా ,నెమలి కొంగ కోతి లతో అక్కడ తిష్ట వేశాడు .

అదేమీ  ఖర్మమో ఇంత సంపద ఉన్నా ఇంకా సుఖం లేదనుకొంటున్నాడు .ఇంగ్లాండ్ వార్తలు శుభ సూచికం గా లేవు అక్కడికి వెళ్ళిన తర్వాత మరీ దారుణ వార్తలు వినాల్సి వచ్చింది .అగస్తా అన్నబెల్లాలు వచ్చి సాయం చేస్తున్నారు అగస్తాను రక్షించే ఉద్దేశ్యం తో అనబెల్లా ఉంటోంది .సోదరుడు బైరన్ తో ఆమె ప్రవర్తన జుగుప్స కలిగిస్తోందని పధ్ధతి మార్చుకోమని కౌన్సెలింగ్ ఇస్తోంది .అగస్తా రాసిన ప్రేమ లేఖలను బైరన్ తిరిగి ఇచ్చేశాడు .’’నిన్ను నువ్వు కించ పరచు కోవద్దు ‘’అని సలహా ఇచ్చాడుకూడా .’’మనం మానవ మాత్రులం .మనం కలిసి ఉండాలని దైవ నిర్ణయం .వచ్చి ఇక్కడే ఉండు ‘’అని రాశాడు .ఆమె తిరస్కరించింది .ఉత్తరాలు రాయటం తాగ్గించింది .విడిపోవటం పతనం కాకూడదని బైరన్ నిర్ణయించాడు ‘’all suffering doth destroy ,or is destroyed –even by the sufferer and in each event ends’’అని కవిత చెప్పాడు .

బుర్ర్ర బానే ఉన్నా శరీరం దెబ్బ తింటోంది.లావయ్యాడు ముందుగానే జుట్టు తెల్లబడింది .డాన్ జువాన్ ను హుషారుగా రాస్తూనే ఉన్నాడు .వచనం అనుకొంటే కవితా దోరణి లో సాగుతోంది .ఇందులో సాహస కృత్యాలు సెటైర్ త్రుణీకారం అన్నీ ఉన్నాయి ‘’don Juan is one of the most personal aswell as one of the most enlivening long poems ever written ‘’అని పించుకోంది.’’టర్న్ కోట్  లేక్ పోయెట్స్’’అని పించుకొన్నవర్డ్స్ వర్త్  సూతీ లకు ఎదురొడ్డి రాసిన కవిత్వం ఇది వాళ్ళని అవహేళన చేస్తూ రాసిన పంక్తులెన్నో ఉన్నాయి దీనిని ‘’ masterly virtuoso performance ‘’అన్నారు .దీన్ని రాస్తూనే తాను ఏమిటో తన భావాలేమిటో నిర్వచనం చేశాడు .జ్ఞాపకాలను ,అనుభవాలను రాయాలని సంకల్పించాడు .దీని రాత ప్రతిని ముర్రే అనే పబ్లిషర్ కు ఇస్తే మళ్ళీ ఇంకొక స్కాండల్ లో ఇరుక్కుపోతాడేమో నని   తగల బెట్టేశాడు .

                   బైరన్ కు కస్టాలు ప్రారంభమయ్యాయి .నెర్వస్ అయిపోయాడు .కలత చెందుతున్నాడు .బాదర బందీ తగ్గించేసుకొన్నాడు .తెరిస్సా గుస్సియోలి తో పరిచయం అయింది .మన వాడికి ముప్ఫై ఒకటి ఆమెకు పందొమ్మిది .ఆమెకు అప్పటికే పెళ్లి అయింది బైరన్ తో చనువుగా ఉంటోంది పార్టీలకు వెంట  తిప్పుకొంటున్నది . అది ఇటలీ సంప్రదాయమే నట .బైరన్ ఒక ‘’లవర్ సర్వెంట్’’ .ఆమె భర్తకు ఇదంతా తెలుసు .కాని ఏమీ చేయలేని స్తితి .భార్యా భర్తా ఎక్కడికి వెళ్ళినా కుక్క లాగా వెంట వెళ్ళాల్సి వచ్చేది ఆమె బలవంతం మీద అయిష్టం గానే వెళ్ళే వాడు .’’the die is cast –and I must but bitterly pass the rubicon .Every thing is to be risked for a woman one likes’’అని తోకాడించు కొంటూ వెళ్ళేవాడు లార్డ్ బైరన్ .ఆమె గర్భం విచిన్నమైనప్పుడు మన వాడిని  సహాయానికి ఉంచారు .నయం అయిన తర్వాతా తెర్రేసా తో కలిసి గుర్రపు స్వారి చేశాడు వందకు పైగా ఆమెకు ప్రేమ లేఖలు గిలికాడు .బొలోనా వెళ్లారు దంపతులు .బైరన్ వెంట వెళ్లాడు .అక్కడా సుఖం దొరకలేదు చూపు సుఖమేకాని శారీరక సౌఖ్యం పొందలేక దిగులు .తనను తానూ చవటాయ్ వెర్రి వెధవాయ్ అయి పోతున్నానేమో నని ఆందోళన .తెరెసా తనను మోసం చేస్తోందని దిగులు  .ఇవన్నీ అగస్తాకు రాస్తున్నాడు ఆమె ఓదారుస్తూనే ఉంది .తెరిస్సా ధైర్యం చేసి   ఒక ప్రైవేట్ ఇంట్లో ఉంది.కౌంట్ గుస్సియోలి తిరిగి వచ్చాడు రేవీనా కు భార్యను తీసుకు పోవటానికి నిశ్చయించాడు .బైరన్ ను ఇక తమ తో రావద్దని చెప్పాడు .హతాశుడై ప్లాటోనిక్ ప్రేమ వర్షిస్తూనే ఉన్నాడు  .కాని ఆమెకు జ్వరం వచ్చి బైరన్ తన వద్ద ఉండాలని కోరుకొన్నది .తప్పిందికాదు విసనకర్ర విసరటం ,పెళ్ళాడిన స్త్రీకి గుర్తింపు పొందిన ప్రేమికుడుగా ఉండటం చేస్తున్నాడు .తన హీన దీన స్తితిని ‘’  I have been more ravished myself than any body since Trojan war ‘’అని రాసుకొన్నాడు .

తెరెసా ఆరోగ్యం కుదుటబడి బ్రిటీష డిప్లమాటిక్ కార్పస్ కు బైరన్ సేవలు అవసరమని చెప్పి తమతో రమ్మన్నాడు ఈ కామెడీ ఇలా సాగుతూనే ఉంది .అందుకే ‘’Byron was more captured than captivated ‘’అన్నారు .చివరికి ఆమె భర్తనుంచి విడిపోవాలనుకోంది .విడాకులు అసాధ్యం .తలిదండ్రులు ఆమెనే సమర్ధింఛి కోర్టుకు వెళ్లి భర్త ఆమెను క్రూరం గా  హిం సిస్తు న్నాడన్నారు .  ఆమె గెలిచింది .కాని బైరాన్ కు ఈ విజయం అచ్చి రాలేదు .వెళ్లి పోతున్నానని చెప్పితే ఏడ్చేసింది వెళ్ళిన తర్వాత పుట్టింటికి చేరింది . .

బైరన్ తన కవిత్వం రా స్తూనే ఉన్నాడు .ఉత్సాహం ప్రేరణ కావాల్సి వస్తున్నాయి డాన్ జువాన్ లో ఐదో అధ్యాయం మొదలెట్టాడు .మెరీనో ఫెలీరియో ,సర్దానాపలాస్ ,ది తు ఫోస్కారి అనే మూడు ట్రాజెడీలు రాశాడు అతని ‘’విజన్ ఆఫ్ జడ్జి మెంట్ ‘’కు పేరు బాగా వచ్చింది .అతని రాజకీయ దోరణులు ఇబ్బంది కలిగిస్తున్నాయి .నిఘా ఉంచారు .కూతురు అల్లీగ్రా ఏమైందో ననే ఆందోళన ఎక్కువైంది. బాగా చలిగా ఉండే కాన్వెంట్ లో ఉంచారాపిల్లను  .అయిదేళ్ళ పిల్ల జబ్బు చేసి చచ్చిపోయిన్దని తెలిసింది .లిబరల్స్ పరిస్తితి దారుణం .గామ్బాలను దేశం వదిలిపోమ్మనే ఒత్తిడి ఎక్కువైంది ..ఆలస్యం చేస్తూ చివరికి పీసా చేరి షెల్లీలను కలిశాడు .మేలోడ్రమటిక్ స్టాంజాలు  అద్భుతం గా రాస్తున్నాడు .షెల్లీ బృందం లో తానొక ‘’యాహూ ‘’గాడి గా ఉన్నానను కొన్నాడు .బైరన్ ఉంటున్న ఇంట్లో నుంఛి లీహంట్ బయటికి నెట్టేసి ఆక్రమించాడు .బైరన్ ను నానా దుర్భాషలాడి అవమానించాడు .

తెరెసా ఉత్తరాలు రాస్తూ డాన్ జువాన్ ను ఆపెయ్యటం కాని లేదా ఇంకాస్త శృంగారాన్ని రంగరించి ,అవినీతిని తగ్గించి రాయమని కోరింది .నిజం గా ఆమె అతి గర్విష్టి .1822లో బైరన్ చావుకు దగ్గరయ్యాడు .షెల్లీ ఆకస్మిక చావుకు బాధపడి అంత గోప్పకవి స్వార్ధ రహితుడు ఎవరూ లేరని మెచ్చాడు గ్రీకులు స్వాతంత్ర యుద్ధం చేస్తున్నారు అక్కడికి వెళ్లి గ్రీకు కమిటీ సభ్యుడయ్యాడు .గేనోవా వెల్లాలనుకొంటే తెరెసా తానూ వస్తానంటే వద్దని వెళ్ళిపోయాడు .గ్రీస్ చేరాడుకాని శుభ సూచనలేవీ కనీ పించలేదు .గ్రీకుల్లో అంతర్య్ద్ద్ధం తీవ్రం గా ఉంది .వాతావరణమూ బాగా లేదు .అనుకోకుండా జబ్బు పడ్డాడు తన చావు డ్రమాటిక్ గా సమాప్తం అవ్వాలని అనుకొన్నాడు ఒక గ్రీకు కుర్రాడితో హోమో సెక్స్ లో పాల్గొని ఎన్నో ఏళ్లుగా మనసులో ఉన్న కోర్కె ను తీర్చుకొన్నాడు .వాడికోసం ఒక కవిత కూడా రాశాడు ‘’if Greece should fall ,I will bury myself in its ruins .If she should establish her independence I will take up residence in some part or other perhaps Attica ‘’అని గ్రీకు స్వాతంత్రం కోసం కల కన్నాడు .గ్రీసు చేరి, తానూ ఉద్యమం లో పాల్గోనాలనుకోన్నాడుకాని అవకాశం ఇవ్వలేదు .యుద్ధం చేస్తూ వీర మరణం పొందాలనుకొన్న వాడు మంచం మీద జబ్బు పడి చనిపోవాల్సి వచ్చ్చింది .మలేరియా సోకింది డాక్టర్ల మీద బైరన్ కు గురి లేదు ,19-4-1824న ‘’నాకూతురు నా చెల్లెలు ‘’ అని  కలవరిస్తూ లార్డ్ బైరన్ కవి చనిపోయాడు .

బైరన్ కవి కవిత్వం అతని జీవిత విధానమే .అది కదిలించదు ప్రేరణ కల్గించదు  .కీట్స్ కవి ‘’సెన్సస్  తో జీవిస్తే ,బైరన్ ‘’సెన్సేషన్ ‘’జీవించాడు బైరన్ టెక్నిక్కులు అతని వేగం ,తెలివి ,అజాగ్రత్త  చేష్టలకు దర్పణాలు .అంత్యప్రాస హిట్ కాని ఫట్ కాని అవుతుంది .అతని సాహిత్య పరిజ్ఞానం విస్ఫోటనమే అని పిస్తుంది .’’oh 1might I kiss those eyes of fire?’’అన గల నేర్పున్నవాడు .బైరన్ సృజన శీలి మాత్రమె కాదు స్వయం వ్యక్తిత్వం ఉన్న నటుడు కూడా .నాటక రంగంపై అభిరుచి అతని లో ఉన్న కవిని దెబ్బ తీసింది .కవులపై ప్రేమ అతని కి స్త్రీలపై ఉన్న ప్రేమకంటే నీచం .కవితా దృక్పధాన్ని అర్ధం చేసుకోకుండా రాశాడు .సెన్సేషన్ మాత్రమె బైరన్ కవిత్వాన్ని బతికించింది .అతనిలోని సెక్సువల్ ఎనర్జీ ఊగినట్లు అతని కవితా పంక్తులు ఊగుతాయి .రొమాంటిక్ శక్తి సామర్ధ్యాలకు బైరన్ రాసిన ‘’డాన్ జువాన్ ‘’గొప్ప ఉదాహరణ మాస్టర్ పీస్ అన వచ్చు .సగం ఫిలాసఫర్ అంటారు బైరన్ ను .’’an ardent lover,a ruthless libertine –is creator intended him to be both a paragon and a paradox ,an amoral but some how indignant onlooker who wants to face a lying world with the truth ‘’అని ఆవిష్కరించారు ఆయన రాసిన జువాన్ ఆధారం గా .

‘’చైల్డ్ హోరాల్డ్స్ పిల్గ్రిమేజ్ ‘’బైరాన్ సాధించిన మరో విజయం మాన్ఫ్రేడ్ కవిత ఉత్సాహాన్నివ్వటమే కాక   గోప్పకవిత అనిపిస్తుంది .బైరన్ జీవితాన్ని పూర్తిగా తెలుసుకోవాలంటే ‘’కిం ‘’కవిత చదవాలి .అందులో ఇటలీ విప్లవం ,అతని పాత్ర తెలుస్తాయి .దీన్ని లేక్ కవులు హారర్ కవిత్వం అన్నారు .’’వర్డ్స్ వర్త ది రాజీ పధ్ధతి అయితే బైరన్ ది తిరుగు బాటు ‘’అని కాల్  రిడ్జి జడ్జి చేశాడు .బైరన్ ఒక తరాన్ని పూర్తిగా ప్రభావితం చేశాడు .డాస్తోవిస్కి లాంటి వారికి ప్రేరణ గా నిలిచాడు. గోదేకు జర్మన్  రోమాం టి క్స్ కు  మార్గ దర్శి అయ్యాడు .స్వేచ్చను ప్రేమించిన ప్రేమికుడు బైరన్ .మనిషివిలువను గుర్తించాడు .ఎక్కడా స్తిరం గా ఉండలేక ఇమడలేక సంచారి గా జీవించాడు .అందుకే బైరన్ ను‘’exiled pilgrim of eternity .he had that within him which shall tire torture and time ‘’.

బైరానిక్ హీరోలను సృష్టించాడు అతని విధానాన్ని ‘’బైరో మానియా ‘’అంటారు .అతని ప్రభావం ఖండాంతరం గా వ్యాపించింది .బైరన్ సొసైటీ ఏర్పడి స్మారకోపన్యాసాల నేర్పరుస్తున్నారు .రొమాంటిక్ ఉద్యమానికి గొప్ప ప్రేరకుడు బైరన్ .

 

 

బైరన్ సమాప్తం

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-6-14-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నా రాజధాని

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పూర్వ ఆంగ్ల కవుల ముచ్చ్చట్లు -35 చారిత్రిక బలి

పూర్వ ఆంగ్ల కవుల ముచ్చ్చట్లు -35

చారిత్రిక బలి

జార్జి గార్డన్ లార్డ్ బైరన్

జార్జి గార్డన్ రొమాంటిక్  ఉద్యమ హీరో .నిజమైన బైరానిక్ వ్యక్తీ ,.అందగాడు ,దేన్నీ లెక్క చేయని వాడు .అంగవైకల్యం ఉన్నా అరిస్తోక్రాట్ గా వెలిగాడు .స్వేచ్చను కోరి ,కలల్లో తేలి ,మేధావి అయిన ప్రేమికుడు .

అడ్మిరల్ జాన్ బైరన్ బైరాన్ కవి తాత .తీవ్రస్వభావి కనుక ‘’ఫౌల్ వెదర్ జాక్ ‘’అని మారు పేరుతో పిలిచే వారు .కవి బైరన్ అంకుల్ ఒకడు హత్య కేసులో ఉన్నాడు .ఈ  స్వభావాలు వారసత్వం గా పొందిన బైరన్ కవి చిన్నప్పుడే స్నేహితుడితో ద్వంద్వ యుద్ధం చేశాడు .తండ్రిని ‘’మాడ్ జాక్ ‘’అనే వారు .తండ్రి ఒక వివాహితను లేపుకు పోయి ఆమె మొగుడికి  విడాకులిచ్చిన తర్వాత పెళ్లి చేసుకొన్నాడు .అగస్తా అనే కూతురు పుట్టింది .ఆమె డబ్బు అంతా హరించాడు.మొదటి జేమ్స్ రాజు బంధువులమ్మాయిని  చేసుకొన్నాడు .ఈమె తండ్రి గర్వి ,తీవ్ర మనస్తత్వం ఉన్నవాడు ..ఆత్మ హత్య చేసుకొన్నాడు .

ఇక జార్జి గార్డన్ విషయానికొస్తే 22-1-1788లో కాలు వంకర తో పుట్టి ఎన్ని ఆపరేషన్లు జరిగినా సరికాక ,తల్లి విపరీత ధోరణులకు బాధ పడుతూ చాలా కాలం గడిపాడు .కొడుకును ఈ తల్లి ‘’చిన్నారి కుంటి కుంక  ‘’అని పిలిచేది .తండ్రి డబ్బు జల్సాగా ఖర్చు చేసి తాగుడు తో చచ్చాడు .బైరన్ కు నర్సుగా ఉన్న మేరీ గ్రే తొమ్మిదేళ్లప్పుడు పాపం చేయవద్దని బోధిస్తూనే సెక్స్ లో మెకానిజం నూ బాగా నేర్పింది .ఇదే తర్వాత విజ్రుమ్భించింది .తండ్రి మరణం తో జార్జి గార్దన్ ఆస్తికి వారసుడైనాడు  ఈయన చనిపోవటం తో బైరన్ కు తోమ్మిది ఏళ్ళ ప్పుడే  లార్డ్ అయ్యాడు .న్యు స్తేడ్ ఆబ్బే లోని స్వంత ఎస్టేట్ కు తల్లి బైరన్ ను తీసుకు వెళ్ళింది .హారో స్కూల్ లో చదివాడు .స్వతంత్రుడు అవటం తో ఎవరినీ లెక్క చేసే వాడు కాదు .పదహారేళ్ళ వయసులో కజిన్ మేరీ చావర్త్ ను ప్రేమిస్తే ఆమె కూడా ప్రేమాయణం సాగించి చివరికి ఒక భూస్వామిని  పెళ్లి చేసుకొన్నది .గుండె జారి గల్లంతైన బైరన్ విరహం తో ఎన్నో కవితలు ‘’వైడ్ –దిడ్రీం ‘’రాశాడు .సాహిత్యం లో మేటి అనిపించుకొన్నాడు .

పది  హేడేళ్ళల్లప్పుడు ట్రినిటి కాలేజి లో చేరాడు. అయిదు వందల డాలర్ల అలవెన్స్ వచ్చేది .రూం ను అందం గా తీర్చి దిద్దుకోవటానికి దీన్ని ఖర్చు చేశాడు .యువ రాజు దర్జా వెలిగించాడు .అప్పుల అప్పారావు అయ్యాడు .కాలేజి నీతిని కాని డబ్బును కాని ఇవ్వదు అని స్నేహితుడికి ఉత్తరం రాశాడు .కొంత కవిత్వం గిలికాడు .కాని ఎవరూ మెచ్చ్చ లేదు ..ఉండలేక బయటికొచ్చాడు . మళ్ళీ చేరినా చదువు మీద శ్రద్ధ పెట్ట లేదు .రొమాంటిక్ నవలలు చదువుతూ ఫెన్సింగ్ వేస్తూ చదువు ఎగాగొట్టి కాల క్షేపం చేశాడు .కొందరు మంచి స్నేహితుల్ని సంపాదించుకొన్నాడు అందులో జాన్ కాం హాబ్ హౌస్ బైరన్ కు ఎక్సి క్యూటర్అయ్యాడు .గాంబ్లింగ్ లో ఆరితేరాడు .మొత్తం మీద ‘’ముక్కి’’ డిగ్రీ సాధించాడు .హౌస్ ఆఫ్ లార్డ్స్ లో స్థానం పొందాడు .’’ఇంగ్లీష్ బార్డ్స్ అండ్ స్కాచ్ రేవ్యూయర్స్ ‘’రాసి ప్రచురించాడు .ఇది పోప్ రచనా స్తాయిని పొందింది .పోప్ అంటే బైరాన్ కు మహా ఇష్టం .’’దంసియాడ్ ‘’రాసినా పేరు రాలేదు .

1809బైరాన్ కు మెజారిటీ వయసు వచ్చింది .దానితో బాటు అదృష్టమూ వరించింది .పన్నెండు వేల పౌండ్ల అప్పులు తీర్చాడు .ఆదాయం తగ్గింది రౌడీ పార్టీ తో కలిశాడు .ఈ బృందం లో ప్రతివాడు ఒక సన్యాసి వేషం వేసుకొనే సన్నాసే ..విందు ,మందు, చిందు లతో కాలం గడిపారు .ఇది లేడీ బైరన్ కు నచ్చలేదు .భార్యను వదిలేసి యూరప్ వెళ్లాడు .లిస్బన్ లో ఉన్నాడు .అక్కడి నుండి అయిదు వందల మైళ్ళు గుర్రం మీద ప్రయాణించి ‘’పెర్ఫెక్ట్ సైబీరియా ‘’చేరుకొన్నాడు మాల్టా వెళ్లి అల్బేనియా చేరాడు . కాం స్టంట్ నోపిల్  వెళ్లి హేల్లెస్ పాయింట్ లో ఈత కొట్టి ఏథెన్స్ కు వచ్చాడు .ఆర్ధర్ ఎడ్లిస్తాన్ తో స్నేహం చేశాడు .గ్రీస్ వెళ్లి ‘’పాఫియాన్ ప్లెజర్ ‘’అనుభవించి లండన్ చేరాడు .ఆస్తిని పర్య వేక్షించేవారి అలసత  వలన రాబడి బాగా తగ్గిపోయింది బొగ్గుగనుల్లో బొగ్గు కాదుకదా సుఖమూ రాలేదని రాసుకొన్నాడు .తల్లి చని పోయింది .ఏదో పాపం తనను కుటుంబాన్ని పీడిస్తోందని గ్రహించాడు .ఐర్లాండ్ జాతీయ గాయకుడు కవి టాం మూర్ తో పరిచయమైంది .హౌస్ ఆఫ్ లార్డ్స్ లో మొదటి ప్రసంగం చేశాడు బైరన్ .ఆధునిక యంత్ర సామగ్రి రావటం తో వర్కర్లను తీసి వేయక  తప్పలేదు .వాళ్లకు కోపం వచ్చి అన్నీ ధ్వంసం చేశారు .’’మెషీన్ రెకర్స్ ‘’అనే నాటకాన్ని జర్మన్ నాటక కర్త ‘’ఎర్నెస్ట్ టోల్లెర్ ‘’రాశాడు .ప్రభుత్వం ‘’ఫ్రెం బ్రేకర్స్ బిల్ ‘’ప్రవేశపెడితే బైరన్ వ్యతిరేకించాడు .పని చేసే వారిలో బైరన్ కు స్నేహితులెవరూ లేరు .

యూరప్ పర్యటన లో ఉండగానే బైరాన్ దీర్ఘ కవిత ను స్పెన్సర్ స్తాన్జాలతో రాయటం ప్రారంభించాడు .గ్రీసు దేశం లో పూర్తీ చేశాడు .రెండు కాంటోలను 1818లో ముద్రించాడు.ఆ విషయాన్ని బైరన్ ‘’ Byron awoke one morning and found myself famous ‘’అని రాసుకొన్నాడు .ఇందులో విషయం బైరన్ దే.రొమాంటిక్ టచ్ ఇచ్చాడు అంతే..బైరన్ కు ఉన్న పురుషత్వం స్త్రీ మనస్సు ఆడవాళ్ళకు విపరీతమైన ఆకర్షణ అయింది చుట్టూ మూగే వారు .ఇతనికంటే ముందే వాళ్ళు అతన్ని ‘’ముగ్గులోకి దించే వారు ‘’.అప్పుడు పురుష సింహమే అయిపోయేవాడు .వల పన్ని పడేసేవాళ్ళు .అందం ఆకర్షణ రాచరికం ఉండటం తో అన్ని అంతస్తుల స్త్రీలు అతని తో సంగమించి సంతృప్తి చెందేవారు .అందులో మేరీ కరోలిన్ లాంబ్ ఒకరు .ఆమెకు  భర్త కాబోయే ప్రధాని .యవ్వనోద్రేకం లో ఉన్న ఆమెను  భర్త సుఖ పెట్టలేక పోతున్నాడని బైరన్ చెంత చేరి శృంగార లీలా విలాసం సాగించి ‘’ఈ లాంబ్ ఆ సింహానికి’’ ఎర అయి పోయింది .’’that beautiful face is my fate –mad ,bad ,dangerous to know ‘’అని డైరీలో రాసుకొంది.ఆడ వాళ్ళ శృంగార సామ్రాట్ అయ్యాడు .వాళ్ళ రక్షణా ఏడుగడ తానె అనిపించాడు .సర్వ సౌఖ్యాలు పొందాడు ,పొందించాడు .అదో లోకం గా గడిపాడు ఆ దక్షిణ నాయకుడు ..పడేయ్యటం పడ వేయించుకోవటం ‘’వీజీ ‘’అయి పోయింది .’’నాటీ’’అని అందరూ ప్రేమగా ఆప్యాయం గా పిలిచేవారు ఈ ‘’లవ్ లార్డ్ బైర’న్ ‘’ను .’’అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం –‘’తరం తరం నిరంతరం ఈ అందం ‘’గా గడిచి పోతోంది .కరోలిన్ ను యెంత దూరం చేయాలనీ ప్రయత్నించినా అంత మీద పడి పోతోంది .ఇప్పటికి మన శ్రుంగార లార్డ్ వయసు పాతిక మాత్రమె .

ఏది చేసినా పధ్ధతి ప్రకారమే సాగించాడు .అన్న బెల్లా బైరాన్ కు సాయం చేసేది .కాని ఆమె ఇష్టం లేకుండా ముందుకు అడుగు వెయ్యలేక పోయాడు ఇంతలో లేడీ ఆఫ్ ఆక్స్ ఫర్డ్ జెం ఎలిజబెత్ అనేవివాహిత  నలభై ఏళ్ళ పిల్లా జెల్లా తో ఉన్నావిడ బైరాన్ పై మోజు పడింది .ఎన్నో షరతులు పెడితే వదిలేశాడు .ఇంకా చాలా మంది గాలం వేస్తున్నారు మన’’కవి చేప’’ చిక్కటం లేదు .హాయిగా ప్రశాంతం గా గడపాలని కోరుకొన్నాడు .కవిత్వమే పరిష్కారం అని ఎంచుకొన్నాడు .1813లో ‘’ది  జియనోర్ అండ్ ది బ్రిడ్ ఆఫ్ అబిదోస్ ‘’పబ్లిష్ చేశాడు .తర్వాత ‘’కార్సైర్ ‘’రాస్తే పన్నెండు వేల కాపీలు అమ్ముడు పోయాయి .న్యు స్తేడ్ ఆబ్బే ఎస్టేట్ ను లాభానికి అమ్మాడు .కాని కొనే వాడు పూర్తీ డబ్బు ఇవ్వలేక పోవటం తో బైరన్ కే దక్కింది .బిజీ బిజినెస్ మాన్ అయ్యాడు .ఒంటరితనం బాధిస్తోంది .

తన టర్కిష్ కద ఆధారం గా ‘’ది బ్రిడ్ ఆఫ్ అబిదోస్ ‘’ఇద్దరు విఫల ప్రేమికుల కదరాశాడు విషాద ‘’ఎపిజిల్ తు ఆగస్తా ‘’రాసాడు .బిడ్డను కన బోయే ముందు లేడీ మేల్బోర్న్ అనే అమ్మాయిని ప్రేమించి ఆమె చెల్లెలిని తీసుకొని యూరప్ వెళ్లాడు .పాపం చేస్తున్నావని ఆమె చెప్పినా పేడ చెవిని పెట్టాడు .పెళ్లి చేసుకోమని మేల బోర్న్ కోరుతోంది ,అనబెల్లా మీద మనసు దూరం కావటం లేదు .ఎటూ పాలు పోనీ స్తితి .కాని సృజన శక్తి మాత్రం విజ్రుమ్భిస్తూనే ఉంది .చెల్లెలు ఆగస్తా మాత్రం పాదరస బుద్ధి ఉన్న అన్న గారి జీవితం ఏమై పోతుందో అని కల వర పడుతోంది .1815లో అనబెల్లాను పెళ్లి చేసుకొన్నాడు .చర్చి లోంచి బయటికి రాగానే ‘’నన్ను సంస్కరించేంత గోప్పదానివా నువ్వు “’అని గురుడు పెట్రేగి పోయి అన్నాడు .పక్కలో పడుకోవచ్చా అని అడిగితే యవ్వనం దాటేదాకా పడుకోమ్మన్నాడు .తన సోదరితో బైరన్ ప్రేమకలాపం సాగిస్తున్నాడన్న రూమర్లు విన్నది .కాని అవి అబద్ధాలని నమ్మింది

బైరన్ పరిస్తితి రోజు రోజుకూ కుంగి పోతోంది .డిప్రెషన్ లో పడిపోతే అనబెల్లా సేవ చేస్తోంది .డబ్బు చేతిలో ఆడటం లేదు మరీ ఉద్రేకం పెరిగింది .అప్పుల వాళ్ళు రోజూ వచ్చి చెవిలో రోద పెడుతున్నారు అనబెల్లా గర్భిణి .సాయం కోసం అగస్తా వచ్చింది .బైరాన్ ను ప్రశాంతం గా ఉంచగలిగింది సోదరి ఆగస్తా మాత్రమె అను  బిడ్డ ను కన్నది .కాని బైరన్ కు ఇదేమీ పట్టలేదు .పిచ్చివాడై పోతున్నాడు .పిచ్చ పిచ్చగా భార్యను తిడుతున్నాడు బిడ్డ మీద ప్రేమే చూప లేదు కూతురికి ‘’అగస్తా ఆదా’’ పేరు పెట్టాడు .అగస్తాను పంపిడ్డామనుకొంటే ఆమె ఇక్కడే ఉండి పోయింది .బైరన్ ను ఎప్పుడూ ఎవరో ఒకరు కని  పెట్టుకొని ఉండాల్సిన అవసరమేర్పడింది .అగస్తా తలిదండ్రులను చేరి మళ్ళీ తిరిగి రాలేదు .పెళ్లి సంబడం ఒక ఏడాది మాత్రమె .ఈ విడిపోవటం అనేక పుకార్లకు చోటు కల్పించింది .’’నాకు రెండొందల మంది తో సంబంధం ఉంది ‘’గర్వం గా చెప్పుకొనే మగధీరుడు అనేక అభియోగాల్లో చిక్కుకొన్నాడు .అగస్తా తో అక్రమ సంబంధం ఉందనీ చెవులు కొరుక్కున్నారు .కాని బైరన్ ఆమెలో తన తల్లినే చూసుకొన్నాడు. తల్లి ప్రేమ ను పొందలేని బైరాన్ ఆమె సన్నిధిలో ఆ మాతృప్రేమ రుచిని పొందుతున్నాడు .25-4-1816న మన లార్డ్ గారు సెమి రాయల్  దర్జాతో ముగ్గురు సేవకులు ,ఒక డాక్టర్ తో స్వయం గా ప్రవాస జీవితాన్ని ఎన్నుకొని లండన్ వదిలి వెళ్లి పోయాడు .కుళ్ళి కంపుకొట్టే ఈ సమాజానికి దూరం గా వెళ్తున్నానని చెప్పుకొన్నాడు బైరన్ .ఇరవై ఎనిమిదేళ్ళ ఈ కవి వీరుడు ఇంకా సాధించాల్సిన అద్భుతాలెన్నో ఉన్నాయి .

 

 

 

 

 

మరిన్ని బైరన్ సంగతులు ఈ సారి

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -3-6-14-కాంప్-బాచుపల్లి –హైదరాబాద్

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రాజ లక్ష్మీ పార్ధ సారధి -విహంగ మహిళా వెబ్ మాసపత్రిక జూన్ లో నా వ్యాసం

రాజ లక్ష్మీ పార్ధ సారధి

                        రాజ లక్ష్మీ పార్ధ సారధి మద్రాస్ లో అలివేలు ,పార్ధ సారధి దంపతులకు 8-11-1925లో జన్మించింది .తండ్రి బర్మా షెల్ కంపెనీ ఉద్యోగి .ఆయన స్వాతంత్ర సమర యోధుడు టి రాఘవాచారి గారి కుమారుడు .రాజ లక్ష్మి సెయింట్ జాన్ స్కూల్ లో హోలీ క్రాస్ కాలేజిలో చదివి డిగ్రీ చేసింది .తర్వాత జర్నలిజం లోమద్రాస్ యూనివర్సిటీ నుండి 1947లో ఇరవై రెండేళ్లకే పోస్ట్ గ్రాడ్యుయేట్ అయింది .జర్నలిజం కాలేజీ ప్రారంభమైన మొదటి ఏడాదే జర్నలిజం చదివి పాసైన మొదటి విద్యార్ధిని గా లక్ష్మి చరిత్ర సృష్టించింది .ఎం.ఎడ్ పూర్తి చేసి మద్రాస్ విశ్వ విద్యాలయం నుండి చరిత్రలో ఏం. ఏ .చదివి సాధించింది .

               జర్నలిజం లో డిగ్రీపొందగానే ‘’ది హిందూ ‘’ఆంగ్ల పత్రికలో ‘’ కుముదం’’,’’ స్వదేశ మిత్రన్’’ అనే తమిళ పత్రికలలో జర్నలిస్ట్ అయింది .’’దిమెయిల్’’ సబ్ ఎడిటర్ గా పని చేసి ఆర్ధర్ హేలేస్ వలన అపూర్వ జ్ఞానాన్ని పొందింది .క్రీడలు మొదలైన విషయాలపై రాసేది .ఎందరో ప్రముఖులను ఇంటర్వ్యూ చేసిన ఘనత ఆమెది . నాటక రంగ నటుడు ,ప్రయోక్త దర్శకుడు అయిన పార్ధ సారధిని వివాహమాడింది .పెళ్లి చేసుకొని జర్నలిస్ట్ ఉద్యోగం మానేసింది .1958లో ‘’పద్మా శేషాద్రి బాల భవన్ ‘’స్థాపించింది .నుంగంబాకం రిక్రియేషన్ క్లబ్ కు చెందిన మహిళలతో కలిసి నుంగంబాకం లో శేషాద్రి అనే దాత ఇచ్చిన ధనం తో ఆయన కోరిక మేరకు ఆయన భార్య పద్మ పేర పద్మా శేషాద్రి బాల భవన్ ను పదమూడు మంది విద్యార్ధులతో తన ఇంట్లో పై అంతస్తులో ఉన్న రేకుల షెడ్ లో ఏర్పరచింది .విద్యార్ధులు పెరిగారు .వసతి చాలటం లేదు .ఏడాది తర్వాత స్వంత భవనాన్ని ఏర్పరిచింది .1971లో టి. పి. రోడ్ లో మొదటి బ్రాంచ్ ని ఏర్పరిచింది .రెండేళ్ళ తర్వాత మొత్తం అయిదు బ్రాంచీలను స్థాపించి సక్రమంగా నిర్వహిస్తూ సంఘంలో మంచి పేరు తెచ్చుకుంది. 8000మంది విద్యార్ధులతో 500మంది స్టాఫ్ తో మూడు పువ్వులూ ఆరుకాయలుగా విస్తరిల్లింది .

                             ఈ స్కూల్ స్థాపించిన రోజు 1958 నుండి ఆ సంస్థకు డీన్ మరియు డైరెక్టర్ గా వ్యవహరించింది .ఉదయం స్కూల్ లో పని చేసిసాయంత్రం మహిళలకు విద్య నేర్పిస్తూ ,రాత్రి వర్ధమాన నటులకు నటన లో శిక్షణ నిస్తూ క్షణం విశ్రాంతి లేకుండా పని చేసింది .ఆమె ఇల్లు ఒక విద్యా సాంస్కృతిక కేంద్రమే అయింది .స్కూల్ లో హిందూ ధర్మాన్ని సంప్రదాయాలను బోధించే ఏర్పాట్లు చేసింది .తమిళ నటుడు మాజీ ముఖ్య మంత్రి ఏం జి రామ చంద్రన్ స్కూల్ లో ‘’హేతువాదాన్ని ‘’బోధిస్తే బాగుంటుందని సలహా ఇచ్చాడు .ఎందరో సినీ నటులు నాటక రంగ నటులు ఈ సంస్థకు భారీగా విరాళాలు అందించారు వాటిని సక్రమంగా ఖర్చు చేస్తూ సౌకర్యాలు కలిగిస్తూ స్వంత భవనాలను నిర్మిస్తూ పార్ధ సారధి విద్యా సంస్థలను ( వై జి పి సంస్థలను)అభి వృద్ధి చేసింది .

                  భారత దేశం లో విద్యా వ్యాప్తికి లక్ష్మీ పార్ధ సారది అవిశ్రాంత కృషి చేసింది .అన్ని దశలలో విద్యా స్థాయిని పెంచటానికి తీవ్రంగా పని చేసింది ..విద్యా వ్యవస్థలో’’ సి.బి ఎస్.బి. ‘’విధానాన్ని ‘’ అమలు చేయటం లో భాగస్వామిని అయింది .విద్యా వ్యాప్తికి ,సాహిత్యానికి ఆమె చేసిన కృషి ని గుర్తించి భారత ప్రభుత్వం రాజ లక్ష్మీ పార్ధ సారధికి’’ పద్మ శ్రీ ‘’పురస్కారాన్ని అందజేసి గౌరవించింది .ఆమె కుమారుడు మహేంద్ర తమిళ నాటక ,సినీ నటుడుగా రాణిస్తున్నాడు .
వై జి.పి గా గుర్తింపు పొందిన రాజలక్ష్మీ పార్ధసారధి ‘’ఎక్స్ లెన్స్ బియాండ్ క్లాస్ రూమ్ ‘’అనే స్వీయ చరిత్రను రాసుకొన్నది .ఏదైనా సాధించాలనే తీవ్రమైన తపన , విజన్ ,అలుపెరుగని పోరాట పటిమ ,అపార శక్తి సామర్ధ్యాలు ,సృజనాత్మక ఆలోచన ,అద్భుత జ్ఞాపక శక్తి ,అపూర్వ భావాలు ,నిర్భీకత ,నిర్దుష్ట విధానం ,సృజన శీలత ,భగవంతునిపై అపార విశ్వాసం తిరుగులేని ఆత్మ శక్తి ,మొహమాటం లేని వాగ్భాషణం ,నిష్కపటమైన హృదయం రాజలక్ష్మికి ఉన్న అనేక సుగుణాలలో కొన్నిమాత్రమే .

                            ఈ శతాబ్ది విద్యా వేత్త .ప్రపంచ విద్యా వ్యవస్థలో చురుకైన పాత్రతో విశ్వ మానవ సౌభ్రాతృత్వానికి కృషి చేస్తున్న విదుషీమణి .’’విద్యా సేవా రత్నం’’ అని బిరుదు పొంది ,’’నారీ రత్నం’’ గా భాసిస్తోంది .జర్నలిస్టు ‘రష్మి’’అని బంధువులు స్నేహితుల చేత ‘’రాజమ్మ’’ అని ఆప్యాయంగా పిలువబడుతోంది .ఏ ఇజానికి దగ్గర కాకుండా ,మానవతయే, ధ్యేయంగా నిర్విరామ కృషి చేస్తున్న ఆదర్శ గృహిణి .తన చరిత్రను తాను నిర్మించుకొన్న ఆదర్శ మహిళ .88 ఏళ్ళ వయసులో నిత్య యవ్వనం తో అనుక్షణం సేవా దృక్పథంతో జీవితాన్ని తీర్చిదిద్దుకొంటున్న నారీ శిరోమణి రాజలక్ష్మీ పార్ధ సారధి .

-గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పూర్వ ఆంగ్ల కవుల ముచ్చట్లు -34

పూర్వ ఆంగ్ల కవుల ముచ్చట్లు -34

చిత్ర విచిత్రాలకు ప్రేరణ

టెక్నిక్ ,ప్రయోగాలలో కవిత్వం లో అనేక మార్పులోచ్చి కొత్త శబ్ద సృష్టి జరిగింది  ఈ .  సృష్టికర్తలకు దూరం గా కొద్దిమంది దూరమై చిత్రాలు చేశారు అందులో సావేజ్ లాండర్ ,జాన్ క్లేర్ ,థామస్ లోవేల్ బెద్దోస్ఉన్నారు .

వాల్టర్ సావేజ్ లాండర్

తన విపరీత ధోరణులకు తానె బలి అయినవాడు వాల్టర్ సావేజ్ లాండర్ .ఆ శతాబ్దం లో చిక్కని కవిత్వాన్ని చెప్పాడు తొంభై ఏళ్ళ జీవితం లో పోరాటాలు పోట్లాటలతో ఎక్కువ గడిచి పోయింది .కోర్టు కేసులు ,అవమానాలు,అప్పుడప్పుడు విజయాలుతో మిశ్రమ జీవితం .ఓల్డ్ స్తాఫార్డ్ కుటుంబం లో వార్  విక్ లో 30-1-1775లో పుట్టాడు .మొదటి చార్లెస్ రాజు తల నరక బడిన సాంవత్సరిక దినమే  లాండర్ పుట్టిన రోజు అవటం విశేషం .తండ్రి సంపన్న డాక్టర్ .కొడుకును నాలుగో ఏట స్కూల్ లో చేర్చాడు . పదేళ్ళకే లాటిన్ లో అసమాన ప్రజ్ఞ చూపి  రగ్బీ స్కూల్ లో చరిత్ర సృష్టించాడు .అదే కొంప ముంచింది .ఒక మేస్ట రు తో  వాక్య నిర్మాణం విషయం లో గొడవ పడి తప్పు తెలుసుకొన్నా క్షమాపణ కోరకపోతే స్కూల్ నుంచి పంపించేశారు .పందొమ్మిదో ఏడు ట్రినిటి కాలేజి లో చేరి రోజు వారీ విధానాన్ని అతిక్రమించి ప్రవర్తిస్తే’’పిచ్చి జాకోబిన్ ‘’అన్నారట.ఉద్రేకం తో ఊగి ఒక సారి తోటి విద్యార్ధిని తుపాకితో కాల్చాడు .సస్పెండ్ చేశారు తండ్రి వచ్చి పధ్ధతి మార్చుకో మని చెప్పినా మార లేదు .పైగా ‘’నాకు చదువు చెప్పగలిగినంత స్థాయి లో ఆక్స్ ఫర్డ్ లేదు ‘’అన్న పొగరు బోతు .

లండన్ వెళ్లి ..ది   పోయెమ్స్ ఆఫ్ వాల్టర్ సావేజ్ లాండర్ ‘’పుస్తకాన్ని ముద్రించాడు .మరో మూడేళ్లకు ‘’జేబీర్ ‘’అనే మహా కావ్యాన్ని రాసి అచ్చు వేశాడు .దీనికి  లాటిన్ మాతృక ఉంది .మిల్టన్ కవితో పోల్చదగిన స్థాయి పొందాడు .రెండేళ్ళ తర్వాతామరీ విజ్రుమ్భించి దాదాపు యాభై దాకా కవిత్వాం వచన రచనలు రాసి ప్రచురించాడు ..ముప్ఫై ఏళ్లకే తండ్రి చనిపోయాడు .ఆస్తి సంక్రమించింది లేక్ డిస్ట్రిక్ట్ ,బ్రిస్టల్ ,లను చూస్తూ సూతీ వర్డ్స్ వర్త ల తో స్నేహం చేశాడు .వేల్స్ లో అందమైన ఎస్టేట్ కొనుక్కున్నాడు .ఫ్రాన్స్ విప్లవ నాయకులపై సాను భూతి చూపాడు .నెపోలియన్ ను వ్యతిరేకించాడు .గౌరవ కల్నల్ పదవి పొందాడు .అతని బృందం వారిలో కలిసి పొతే ఇంగ్లాండ్ తిరిగి వచ్చేశాడు .ముప్ఫై ఆరేళ్ళ వయసులో పదహారేళ్ళ పడుచును ఒక బాలే లో చూసి మోహించి చేతిలో పెన్నీ కూడా లేని బాంకర్ కూతురైన ఆమెను పెళ్లి చేసుకొని రెండు నెలల్లోనే తప్పు చేశానని గ్రహించి ,ఒక లేడీ హిట్లర్ ను పెళ్లి చేసుకోన్నానని నెత్తి బాదుకొన్నాడు .ఆమెకు లేని అలవాట్లు లేవు .విసిగెత్తి పోయాడు కోపం తీవ్రమైంది .భార్యతో పక్కింటి వాళ్ళతో ,అద్దెకుంటున్న వారితో పోట్లాడే వాడు .ప్రభుత్వానికి వ్యతిరేకం గా వ్యాసాలూ రాశాడు .ఇంగ్లాండ్ నుంచి బహిష్కరిస్తే భార్య తో ఇటలీ కి వెళ్ళిపోయి ,వీడి బాధ  భరిస్తూనే  ఆమె నలుగురు పిల్లల్ని కన్నది .ఇటలీ కవి తో తగాదా పెట్టుకొంటే ఇటలీ నుంచి బహిష్కరిస్తే జెనోవా వెళ్లి మెడిసి పాలస్ లో ఉన్నాడు .’’పానీ పట్టు ‘’(నీటి తగాదా)లో పొరుగు వాడితో ద్వంద్వ యుద్ధం చేశాడు .పిచ్చ కోపం వచ్చి వంట వాడిని కిటికీ లోంచి తోటలోని పూల పొదల్లోకి నేట్టిపారేశాడు .’’అయ్యయ్యో వయొలెట్ పూల చెట్ల సంగతి మర్చిపోయానే ‘’అనుకొన్నాడట పాపం . నలభై –యాభైలలో వచనం రాస్తూ ‘’ఇమేజరీ కన్సర్వేషన్స్ ‘’రాసి ప్రచురించాడు హిస్టారికల్ డైలాగ్స్ ను రెండు భాగాలుగా తెచ్చాడు .అరవై లో సర్వ శ్రేస్టుడని పించుకొన్నాడు  కార్లైల్  a tall broad ,burly man with gray hair and large fierce –rolling eyes of the most restless ,impetuous vivacity ,not to be held in by the most perfect breeding ,expressing itself in high colored superlatives ,indeed in reckless exaggeration ,now and then in a dry ,sharp laugh ,not of sport but of mockery ‘’అనిలాండర్ రూపాన్ని  కళ్ళకు కట్టినట్లు  వర్ణించాడు .ఇదే రూపాన్ని చార్లెస్ డికెన్స్ తన ‘’బ్లీక్ హౌస్ ‘’నవలలో బాయ్ హారన్ ‘’గా చిత్రించాడు .

ఇరవై  అసంతృప్త   జీవితం వ్యధల పాలైంది .భార్యకు విదాకులిచ్చేశాడు .ఇంగ్లాండ్ చేరి బాత్ లో ఉండి  డికెన్స్ తో స్నేహం పొందాడు .పిల్లలతో సయోధ్య సాధించి దగ్గరకు పిలిపించుకొన్నాడు .తండ్రి తన కళ్ళ ముందే చని పోవటం జీర్ణించుకోలేక పోతున్నానని కూతురు బ్రౌనింగ్ కు రాసింది ..ఇంకో కోర్టు కేసు మీద మళ్ళీ ఇటలీకి పారి పోవాల్సోచ్చింది .వెయ్యి పౌండ్ల నష్ట పరిహారాన్ని చెల్లించాల్సి వచ్చింది .బ్రౌనింగ్ ఎమర్సన్ తో పరిచయం కలిగింది .’’లాస్ట్ ఫ్రూట్స్ ఆఫ్ యాన్ ఓల్డ్ ట్రీ’’ని ఎనభై లో రాశాడు .మూడేళ్ళ తర్వాతా ‘’డ్రై స్టిక్స్ ఫాగోతేడ్ బై దిలేట్ వాల్టర్ సావేజ్ లాండర్ ‘’రాసి ప్రచురించాడు .తొంభై వ పుట్టిన రోజుకు మూడు నెలల ముందు లాండర్ 17-9-1864న చనిపోయాడు .మనిషి లోని కళ అతని జీవితం తో సమాంతరం గా నడవదు అని రుజువు చేశాడు .అతని కాన్వర్ సెషన్స్ ‘’క్లాసికల్ గా ఉంటుంది .అతని చిక్కని స్తాన్జాలు ఆకర్షణీయం గా ఉంటాయి ..అతని గొప్పలు కవిత్వం లో ఇరికించాడు .’’I strove with none for none was worth my strife –nature I loved and next to nature art –I warmed my hands before the fire of life –it sinks and I am ready to depart ‘’అతనిలో గర్వం ,అసంబద్ధ జీవితం తో గడిపాడు .జీవితమనే అగ్ని తో చేతుల్ని వెచ్చ చేసుకొన్నాడు .బైరన్ షెల్లీ లకు మధ్య వారధిగా ఉన్న కవి .ఎపిగ్రామ్స్ ను పకడ్బందీ గా రాశాడు ఎలిజీలను అపూర్వం గా సృష్టించాడు .’’he was a classic no formalist ‘’అని పించాడు .’’so royally serene in its commanding power upon tragic main springs of terror and of pity .’’

జాన్ క్లేర్

సమకాలీనులు ఇచ్చ్చా పూర్వక కవి అని పొగడిన జాన్ క్లేర్ ఇరవై వ శతాబ్ది దాకా ఎవరికీ గుర్తు లేడు.చని పోయిన అరవై ఏళ్ళ తర్వాతా అతని పై ఉన్న విరుద్దాలను ఖండించి అలాన్ పోర్టర్ ,ఎడ్మండ్ బ్లండర్ లు క్లేర్ రచనలను ప్రచురించారు .13-7-1793న జాన్ క్లేర్ న్యూ యంపి షైర్  లోని హెల్ప్ స్తాన్ లో అక్షరజ్ఞానం లేని తండ్రికి కొడుకుగా పుట్టాడు .తండ్రికున్న కొద్ది పాటి పొలం లో తండ్రికి తోడుగా వ్యవసాయ పనులు చేశాడు .రాత్ర్ల్లు బడికి వెళ్లి చదివే వాడు ఒక సారి పొరిగింటి ఆయన గడ్డి వాగన్ నుంచి కిందపడి మెడ విరిగిన దృశ్యాన్ని చూసి జాన్ మానసికం గా చలించి స్తిమితం కోల్పోయాడు ..పశువులను కాచాడు తర్వాత తోటమాలి ఉద్యోగం చేసి మేరీ జాయిస్ సంపన్న రైతు కూతురు పై ప్రేమలో పది ఆమె తద్రి కట్టడి చేస్తే కుంగిపోయి మామూలు మనిషి కాలేదు .ఆమె చనిపోయిన తర్వాత బతికి ఉండనే భ్రమలో ఎన్నో కవితలు రాశాడు .అందులో కొన్ని వారేవా అనిపిస్తాయి .

ఇరవై రెండవ ఏట సున్నపు బట్టి లో పని చేశాడు .జిప్సీ లతో తిరిగాడు .కవిత్వం రాయటం మొదలెట్టాడు ..తండ్రి ఏదో సాయం చేస్తున్నాడు చాలటం లేదు .అదృష్ట వశాత్తు ఒక పబ్లిషర్ ఇతని ‘’పోయెమ్స్ దిస్క్రిప్తివ్ ఆఫ్ రూరల్ లైఫ్ ఆంద్ సీనరీ ‘’పుస్తకం ముద్రించాడు .బ్రహ్మాండ విజయం సాధించింది .కొందరు మాత్రం ‘’రైతు కవి ‘’అన్నారు .పుస్తకాలన్నీ వెంటనే అమ్ముడయ్యాయి .ఏ విజయం తో లండన్ చేరాడు .ఎడిన్బర్గ్ కోటరీ తో మమేకం అయ్యాడు .లార్డ్ మిల్టన్ వంటి వారితో పరిచయం కలిగింది .విలేజ్ మాన్ స్త్రల్,ముద్రణ పొందింది .ఇదీ బాగా ప్రాచుర్యం పొందింది స్నేహితులు ఇతనికోసం గ్లాసులు కొట్టుకొని అతని ఆరోగ్యం కోసం తాగి సంబురాలు చేసుకొన్నారు .

పొలం లో సేద్యం చేస్తూ ఖాళీ సమయం లో కవిత్వం రాస్తూ గడిపాడు .తన పుస్తకాలను ముప్ఫై మైళ్ల  దూరం  మోసుకొని వెళ్లి అమ్మే వాడు .రాయబోయే దాన్ని కూడా టేలర్ అనే పబ్లిషర్ కు ఇచ్చి రెండు వందల పౌండ్లు డబ్బు ఇమ్మని కోరితే ఆత ను ఇవ్వకుండా ‘’దేవుడు నిన్ను ఎలా పుట్టిన్చాడో అలానే ఉండు అంతకంటే ఆశ పడకు ‘’అని మనసును గాయ పరిచాడు .విపరీత శారీరక శ్రమ ,రచనల వలన మానసికశ్రమ తో అలసిపోయి నీరసపడ్డాడు .బాధలను మరచి పోవటానికి తాగుడు అలవాటు చేసుకొన్నాడు .కుటుంబ సభ్యులు తొమ్మిది మంది అయ్యారు .’’ది షెపర్డ్స్ కాలెండర్’’ను మరో ఎనిమిదేళ్ళకు ది రూరల్ మ్యూజ్ ‘’లను రాసి ప్రచురించాడు .కాని ఇవి జనాన్ని ఆకర్షించాఆలేక పోయాయి అతని విగర్ తగ్గిందని భావించారు .

నలభై లో మానసిక స్తితి మొదటి సారిగా దెబ్బ తిన్నది త్వరలోనే తెరుకొన్నాడు కాని ఏడాదికే మళ్ళీ తిరగ బెట్టింది .అతనిలో నిరాశ విచారం పెరిగాయి .ఒక రోజు మర్చెంట్ ఆఫ్ వెనిస్ నాటకం చూస్తూ షైలాక్ పాత్ర దారి పై కోపం తో సీటు నుంచి లేచి చంపేస్తానని రంగం మేదీ వెల్ల బోయాడు .భ్రమ భ్రాంతి అతన్ని చుట్టుముట్టాయి .డాక్టర్ల దగ్గర చేర్చి ట్రీట్మెంట్ ఇప్పించారు ఎప్పింగ్ ఫారెస్ట్ శానిటోరియం కు పంపారు .ఒక రోజు ఇంటికి వెళ్లాలనే కోరిక కలిగి స్వంత ఊరు హెల్ప్ స్తాన్ కు ఒంటరిగా నడిచి బయల్దేరి మూడు రోజులు ప్రయాణించి చేరాడు .కొంత ఆరోగ్యం బాగు పడిందని పించింది .కాని పరిస్తితి చే జారి పోతోంది పూర్తిగా పిచ్చి వాడై పోయాడని నిర్ధారించి నార్త్ యంతాన్ కంట్రీ అసిలియం కు తరలించారు .ఇక్కడే ఇరవై ఏళ్ళు ఉండిపోయాడు .ఇక్కడే ‘’ది షీప్ ఆఫ్ స్ప్రింగ్ ‘’,ఐ యాం ‘’,ఇన్విటేషన్ తు ఎతర్నితి ‘’మొదలైన గొప్ప కవితలు రాశాడు .ఒంటరి జీవితం బాధించింది .భార్య పిల్ల మంద తో ఇబ్బంది పడుతూ వచ్చి చూడ లేక పోయింది .శరీరకాయా భాగాలు పని చేయటం మానేశాయి కాళ్ళూ చేతులు కదిలించలేక పోయాడు .నడక అసలే లేదు చివరికి పక్ష వాతం వచ్చి డెబ్భై ఒకటి వయసులో మే నెల ఇరవై 1864 లో మరణించాడు .రొమాంటిక్ కవుల కంటే చాలా ముందుకు దూసుకొని పోయిన కవి .నార్త్ అమెరికా లో జాన్ క్లేర్ సొసైటీని ఏర్పరచి స్మరించి ,సేవలు చేస్తున్నారు .’’Clare was the most influential poet aside from Words Worth to practice it in an older style ‘’.

థామస్ లోవెల్ బెద్దోస్

బ్రిస్టల్ దగ్గర క్లిఫ్ తన లో జూన్ ముప్ఫిన 1830లో బెద్దోస్ పుట్టాడు .మెరియా ఎద్జి వర్త సోదరి అన్నా ఎద్జి వర్త ఇతని తల్లి .తండ్రి గొప్ప వైద్యుడు .కొంతవరాకు శాస్త్ర వేత్త కూడా రాయల అకాడెమి ప్రెసిడెంట్ డేవిస్ గిల్బర్ట్ దగ్గర సహాయకుడు .వింత ప్ర యోగాలు చేసేవాడు .పది హేదేల్లప్పుడు బెద్దోస్ రెండు బహుమతులు పొందాడు .ఒకటి గ్రీకులో రెండోది లాటిన్ లో .ఒక నాటిక రాసి మార్నింగ్ పోస్ట్ మేగజైన్ లో ప్రచురించాడు ఆక్స్ ఫర్డ్ పెం బ్రోక్ కాలేజి లో చేరి షి ల్లర్ పండితుడి ప్రభావానికి గురి అయి జర్మని సాహిత్యం పై అమిత శ్రద్ధ చూపాడు .జర్మని స్విట్జర్లాండ్ లు తిరిగి ,ఫిలాసఫీ కవిత్వం లకు అప్లికేషన్ పెట్టినా చివరికి ‘’అనాటమీ ‘’లో చేరి చదివాడు .అప్పుడే ‘’డే త్స్ జెస్ట్ బుక్ ‘’అనే త్రాజేడి ను ఇరవై నాలుగు లో రాయటం మొదలు పెట్టి ఎప్పటికప్పుడు మార్పులు చనిపోయే వరకు చేస్తూనే ఉన్నాడు .గోదిక్ సాహిత్యాన్ని అమిత ఇష్టపడ్డాడు .తానూ ఒక ప్రసిద్ధ ఎలిజబెతేనియాన్ అని భ్రమించేవాడు  .నలభై ఏళ్లకు ఎలిజబెతాన్లలలో తానూ చివరి వాదిననుకొని పిల్లి గడ్డం పెంచటం ప్రారంభించి షేక్స్ పియర్ లాగా పోజు పెట్టేవాడు .ఒక నటుడితోకలిసి నాటకాలాడి,వాడు తనకంటే గొప్ప నటుడని పేరు పొందితే అసూయ కలిగి చంప బోయాడు మరో సారి పోట్లాటలో క్షనికోద్రేకం లో .తనకాలి నరం  త్ర్మ్పుకొని  ఆత్మా హత్యా ప్రయత్నం చేసుకొన్నా మాన్  ఆఫ్ మూడ్స్ .ప్రాణాపాయం తప్పినా ,విషం తాగి 26-1-1849 న చనిపోయాడు ఏఎ క్షనికోద్రేకి ..

‘’Is that te wind dying ?o not-it is only two devils that blow –through a murderers bones ,to and fro –in the ghosts moon shine ‘’ఒక ఉదాహరణ కవిత మాత్రమె .డ్రమటిస్ట్  అయినా వ్యక్తిత్వం ఉన్న పాత్రలను సృష్టించలేక పోయాడు .అతని కవిత్వం మాత్రం ‘’full of thoughts and richness of diction’’అని బేరీజు వేశారు .

 

 

 

 

 

 

 

     సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ – 2-06-14-కాంప్-బాచుపల్లి –హైదరాబాద్

 

Posted in పుస్తకాలు | Tagged , | Leave a comment

ద్రోణ వ్యధ -జోస్యం విద్యా సాగర్ -పద్యాలు

drona badha 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -33 ముగ్గురు కవుల ముచ్చట్లు

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -33

ముగ్గురు కవుల ముచ్చట్లు

కాల్ రిడ్జినెదర్ సస్తో వే లో ఉన్న టాం పూల్ ఉన్న ఊరికి వెళ్ళాడు  .అది బాగా నచ్చింది ఇక్కడే సారాబిడ్డను కన్నది  .నుదిటి నుంచి బుజాలదాకా బాధ ఎక్కువైంది ,ఇప్పటిదాకా వాడుతున్న నల్లమందు డోసుబాగా  పెంచాడు .అయినా తగ్గ లేదు .1797లో రేస్ దౌన్ లో ఉన్న వర్డ్స్ వర్త్ ను కలుసుకొన్నాడు .అనుంగు మిత్రుల్లా ఉన్నారు .సూతే విషయం చర్చించారు .సాధారణం గా తీసుకోవటమే తప్ప ఇవ్వటం తెలియని వర్డ్స్ వర్త్ ఇప్పుడు ఆతిధ్యం లో ఆరి తేరాడు .ఆల్ఫాక్సేన్ కు మారిన ఆయన్ను దాదాపు రోజూ చూసేవాడు .1798ఈ కవులిద్దరు కలిసి ‘’లిరికల్ బాల్లడ్స్ ‘’ను రొమాంటిక్ పద్ధతిలో రాయాలని నిశ్చయించారు .రాసిన దానికి కొత్తదనం ఆకర్షణ తెచ్చాడు కాల్ రిడ్జి.అది1800లో విడుదలైంది .మరో రెండేళ్ళ తర్వాత మార్పులు చేసి మళ్ళీ ప్రచురించారు .వర్డ్స్ వర్త్ ముందు మాట రాశాడు .’’wonder and beauty could be achieved by the mere mention of words like wondrous beautiful and that the clichés and circumlocuationsof the established poetic diction were in themselves poetry .’’ అనే అభిప్రాయాన్ని వ్యతిరేకించాడు .’’poetry not only could but should be written in the language really used by men ‘’అని చెప్పాడు .లిరికల్ బాలడ్స్ కు స్పందన పెద్దగా రాలేదు .నిరుత్సాహ పడ్డారిద్దరూ .కొన్ని తరాలను ప్రభావితం చేసిన ఈ కవితలు అప్పుడు మాత్రం ఆదరణకు నోచుకోలేదు .కాల్ రిడ్జి రాసిన ‘’దిరైం ఆఫ్ ది ఎంషేంట్ మారినర్’’ఇంగ్లీష్ సాహిత్యానికే వన్నె తెచ్చింది .అలాగే వర్డ్స్ వర్త్ రాసిన సాలి లోక్వి ‘’lines composed a few miles above Tintern Abbey’’గోప్పప్రభావాన్ని కలిగించినా దానిపై దృష్టిపడలేదు .అందరూ ఎక్కువ గా ఉదహరించే వర్డ్స్ వర్త్ నిర్వచనం poetry is the spontaneous overflow of powerful feeling –takes its origin from emotion recollected in tranquility ‘’ కు మంచి ఉదాహరణ .

దీని తర్వాత కాల్ రిడ్జి కష్టాల్లో బాధల్లో పడ్డాడు .ప్రారంభించిన ‘’కుబ్లాయ్ ఖాన్ ‘’పూర్తికాలేదు .అది పెద్ద నష్టం అన్నాడు .కుబ్లాయ్ ఖాన్ లో మంత్రాలున్నాయని ,పునరావ్వృతమైన ప్రతి చోటా అద్భుత శక్తి గోచరిస్తుందని ,అది గోదిక్ నమ్మకానికి విజయమని ,సర్వోత్కృష్ట రచన అని భావించాడు .

సూతీ ఇంగ్లాండ్ తిరిగి వచ్చేశాడు పోర్చుగల్ లో ఆరు నేలలుండిస్వభావాన్ని మార్చుకొన్నాడు .సూతీ వర్డ్స్ వర్త్ ను కాల్ రిడ్జి ని మరీ సన్నిహితులయ్యేట్లు చేశాడు .ఈ ఇద్దరు కలిసి జర్మని వెళ్ళారు .జర్మని సాహిత్యాన్ని అవలోడనం చేసి ఆ  ఫిలాసఫీని క్షుణ్ణం గా అవగాహన చేసుకొన్నాడు కాల్ రిడ్జి .వర్త్ మాత్రం అంత ఉత్సాహం చూపకుండా గోస్లార్ వెళ్ళాడు అక్కడ ‘’లూసీ పోయెమ్స్ ‘’రాయటం ప్రారంభించాడు .దీనికి దోరోతి కాని వేరెవరైనా అజ్ఞాత వ్యక్తీ కాని ప్రేరణ అయి ఉండాలి .ఇందులో తన బాల్య జ్ఞాపకాలను పొందు పరచాడు. జర్మన్ భాష నేర్వలేక పోయాడు. జర్మన్లను ప్రేమించ లేక పోయాడుకూడా .మన శ్రీనాధుడు రాయల సీమ బాధల్ని చాటువులుగా చెప్పినట్లు జర్మని అనుభవాల్ని కవిత్వీకరించాడు –‘

‘’I travelled among unknown men in lands beyond the sea –nor England ,didi I know till then –what love I bore to thee –it is past melancholy dream –nor will I quit the shore –a second time ,for still I seem –t love thee more and more ‘’అంటూ మాతృదేశం ఇంగ్లాండ్ కు దూరమైనందుకు బాధ పడ్డాడు .

1799 డిసెంబర్ ర్ లో దోరోతి తో విండర్ మియర్ దగ్గర డవ్ కాటేజీ లో కాపురం పెట్టాడు .పల్లె ప్రాంతం .అందమైన కొండలు ఆకర్షణీయ ప్రక్రుతి అందాలు మనసును పరవశింప జేశాయి .తాను డెమొక్రాట్ గా ఉన్నానని అక్కడే విశ్రాంతి పొందుతానని చెప్పాడు .డోరోతికూడా తన ‘’డార్లింగ్ బ్రదర్ ‘’వివాదాల జోలికి పోకుండా ప్రశాంతం గా ఇక్కడే ఉండటం ఇష్టం .ఆమెకు కాల్ రిడ్జి అంటే ఫాసినేషన్ ఏర్పడింది .అతను భార్యకు ఇంకా విడాకులివ్వలేదు .ఆమె మెంటల్ గా దెబ్బ తిన్నది .ఆమెను చిన్న పిల్లలా చూసుకోవాల్సి వచ్చింది .

విలియం తో యూరప్ వెళ్ళింది .ఆతను భార్య అన్నేట్టే ను కూతుర్ని చూశాడు .పెళ్లి సంగతి తేల లేదు .భర్తగా ఆమెను సంతృప్తి పరచలేదు .ఫ్రాన్స్ లో ఒక నెల ఉండి కూతురు కరోలిన్ తో షికార్లు చేస్తూ గడిపాడు .ఇంగ్లాండ్ కు తిరిగి వచ్చి మేరీ హచిన్సన్ ను పెళ్లి చేసుకొన్నాడు .ఆమెపై కవితలు చిలికాడు ‘’she was a phantom of delight –when first she gleamed upon my sight ‘’-a perfect woman nobly planned –to warm ,to comfort and command ‘’అని పొగిడాడు .మేరీదోరోతీలు అన్యోన్యం గా ఉన్నారు .హనీమూన్ కు ఈమె కూడా వెళ్ళింది ..మేరీ నలుగురు పిల్లల్ని కంటే ఇద్దరు ముందే పోయారు .సారా హచిన్సన్ కూడా వీరితో కలిసి పోయింది .

కాల్ రిడ్జి పరిస్తితి ‘’నానాటికి తీసి కట్టు నాగం భొట్లు ‘’గా తయారైంది .తనలో కవి చచ్చిపోయాడని చెప్పాడు ఆరోగ్యం కోసం మాల్టా వెళ్ళాడు .వర్డ్స్ వర్త్ తో కలిసి పని చేయలేననుకొని దానిని ‘’the lachet of whose shoes I am unworthy to unloose ‘’అని కవితాపరం గా చెప్పుకొన్నాడు .ఆధారం లేకుండా ఉండలేక పోతున్నాడు ఇబ్బందులూ పడుతున్నాడు, పెడుతున్నాడు .కవితా శక్తి మందగించింది ఆరోగ్యం తో బాటు .’క్రిస్టబెల్ ‘’మొదలు పెట్టి చాలా కాలం అయినా పూర్తీ చేయ లేదు .టెక్నికల్ క్రిటిసిజం ,వ్యాసాలూ ,జర్నలిజం తో గడపాలను కొన్నాడు .మాట్లాడటం మొదలెట్టితే నాన్ స్టాప్ గా మాట్లాడుతున్నాడని హేజ్లిట్ అన్నాడు .ఉపన్యాసలిస్తున్నాడుకాని చప్పట్లు కొట్టించుకో లేక పోతున్నాడు .లండన్ వెళ్ళిపోయాడు మళ్ళీ తిరిగి రాలేదు నలభై అయిదు లో కవళికల్లో మార్పు బాగా వచ్చింది .చివరి పద్దెనిమిదేళ్ళు కస్టాలు కొంత తగ్గాయి కొడుకులిద్దరూ కవిత్వం లో దూసుకు పోతున్నారు .ట్రీట్ మెంట్ పొందుతూ కూడా సృజన ఆపలేదు ‘’బయాగ్రఫా లిటరేటా ’’రాశాడు వ్యాసాలను పరిష్కరించి పునర్ ముద్రించాడు .మిల్టన్ షేక్స్ పియర్ లపై ఉపన్యాసాలిచ్చాడు .జనం మెచ్చారు దిఫ్రెండ్ అండ్ సిబిలిన్ ‘’కూ ఆదరణ వచ్చింది .ఫిలాసఫర్లు సైంటిస్టులు కాల్ రిడ్జి తో సమావేశమై చర్చలు జరిపి ఆయన విలువైన అనుభవాలను తెలుసుకొనేవారు .’’reason is much nearer to sense than to understanding –for reason is direct aspect of truth an inward beholding –‘’అని అభిప్రాయ పడ్డాడు .ఆ ఆత్మ శక్తి తోనే చివరి రోజులు గడిపి 25-7-1834నకాల్ రిడ్జి మహా కాలం లో కలిసి పోయాడు .

చనిపోయే ముందు సూతీ ని వచ్చి ఉండమన్నాడు .కాని అతను ఒక ఆదర్శం లో ఉన్నాడు ‘’all man needed to be successful was a comfortable religion and simply of common sense ‘’అని రాసి రాలేదు .అతని ‘’జోన్ ఆఫ్ ఆర్క్ ‘’బాగా పేరు పొందింది .అతని ఉత్తరాలూ బాగా ప్రఖ్యాతి తెచ్చుకోన్నాయి. చిన్న కవితలు బాగా ఆకర్షించాయి .’’టాలబా ది డి స్ట్రాయర్ ‘’,ది కార్స్ ఆఫ్ కహేమ ‘’అనే ఎపిక్ లు రాసి విమర్శకుల ప్రశంసలు పొందాడు.క్వార్తర్లి రివ్యు లో అతను రాసిన వ్యాసాలూ అందర్నీ అలరించాయి .’’హెన్రి జేమ్స్ పై’’ కవి చనిపోయిన తర్వాత మూడవ జార్జి సూతీ ని ఆస్థాన కవిని చేశాడు .సర్ వాల్టర్ స్కాట్ కు ఇవ్వాలని ఆహ్వానిస్తే ఆయన తిరస్కరించాడు .తగిన వాడు అని అందరూ మెచ్చారు .కాని నైతిక విలువలు లేని వాడికి ఈ పెద్దరికం ఏమిటి అని కొందరు గుసగుసలాడారు .గౌరవం తో బాటు కస్టాలు వచ్చాయి .చాలా కాలందూరం గా ఉన్న భార్యా పిల్లల్లో ఏడుగురు పిల్లలు చనిపోయారు .భార్యకు మతిస్తిమితం లేక శరణాలయం లో చేర్చారు .ఆమె చనిపోయిన వెంటనే కరోలిన్ బౌవేల్స్ అనే ఆవిడను పెళ్లి చేసుకొన్నాడు ..మనస్సాక్షికి ,సర్దుబాటుకు మధ్య నలిగిపోయాడు .21-3-1843నరాజాస్థానకవి సూతీ మరణించాడు .వెస్ట్ మినిస్టర్ ఆబ్బే లో సమాధి చేసి గౌరవించారు .యాభై వాల్యూముల వచనం కవిత్వం వెలువరించాడు .ఒకటి రెండు బాలడ్స్ తప్ప ఏవీ మిగల్లేదు .

ఆధునిక కవిత్వానికి మార్గ దర్శి వర్డ్స్ వర్త్

ఈ త్రయం లో అందరికంటే పెద్ద వాడు వర్డ్స్ వర్త్ .సహచరుల మరణం తర్వాత చాలాకాలం జీవించి ఉన్నాడు .ఆత్మా దర్శనం ,ఆత్మా సంతృప్తి తో జీవించాడు .అతని మాటలు ‘’మోనో లోగ్స్ ‘’లా ఉంటాయి .సంభాషణాచాతుర్యం లేదు .లేక్ డిస్ట్రిక్ట్ లో మరో వైపున్న రైడాల్ మౌంట్ కు చేరాడు స్పానిష్ ప్రజలు క్రూర నియంత ప్రభుత్వాన్ని కూల దోసినప్పుడు మాట్లాడలేదు .ఇటాలియన్లు విముక్తి సాధించినప్పుడూ మౌనమే .స్వేచ్చ కంటే రక్షణ ముఖ్యం అని భావించాడు .ఫ్రీప్రెస్  ను వ్యతిరేకించాడు .వెస్ట్ మోర్ లాండ్ కు స్టాంప్స్ దిస్త్రిబ్యూటర్ గా నియమింప బడ్డాడు .లిబరల్ వ్యతిరేకులను   ఎదిరించాడు .దీనికి కానుక గా వెస్ట్ మోర్ లాండ్ కు ‘’జస్టిస్ ఆఫ్ దిపీస్ ‘’ను చేశారు డెబ్భై రెండులో పూర్తీ గా టోరీ అయి పోయాడు .రాజు ఏడాదికి మూడు వందల పౌన్ల్ పెన్షన్ ఏర్పాటు చేశాడు .సూతీ మరణించిన తర్వాత ఆస్థాన కవి అయ్యాడు .డ్రెస్ ను అరువు తెచ్చుకొని వేసుకొన్నాడు .రాణి విక్టోరియా ముందు ఆ డ్రస్ వేసి ఒంగొని సలాం చేశాడు .దీన్ని ఆయనకు సరిపోయేట్లు కత్తిరించి సరి చేయటానికి టైలర్ మాక్స్ టన్ చాలా కష్టపడ్డాడట .రాబర్ట్ బ్రౌనింగ్ అసూయ పడి కవితలో ఏడ్చాడు .

వర్డ్స్ వర్త్ జీవితం లో చివరి పాతిక ఏళ్ళలో పెద్దగా ఏమీ రాయనే లేదు .కవిత్వాన్ని సరిదిద్దుకొంటూ ,చర్చలు జరుపుతూ గడిపాడు ‘’యాభై లో మొదలు పెట్టిన ‘’దిఎక్స్ కర్షన్ ‘’జీవిత సాఫల్య రచనగా భావించాడు .అందులో ఫిలాసఫీ కానికవిత్వం కనీ లేదాన్నారు దోరోతి ఆరోగ్యం కుదుట బడలేదు .కళ్ళు సరిగ్గా కనిపించక చదవటం మానేశాడు. .ఎనభై వ పుట్టిన రోజు  తర్వాతా కొన్ని రోజులకే 23-4-1850వర్డ్స్ వర్త్ కవి ‘’ఈ వరల్డ్ ‘’ను వదిలేసి ‘’వర్త్ ను మాత్రమె’’ మిగిల్చిఉంచేసి ,పై లోకాలకు చేరాడు .ఆయన సమాధిపై ‘’two voices are there –one is of the sea –one of the mountains –each a mighty voice ‘’అని ఆయనే రాసుకొన్న కప్లేట్ ను రాసిన శిలా ఫలకాన్ని ఉంచారు .

ఇంగ్లాండ్ లో గొప్ప కవుల్లో ఒకడు .గొప్ప ఫిలాసఫర్ ..అందరు ఉదహరించే అనేక కవితా పంక్తుల్ని రాసి జనం నాలుక పై వర్దిల్లాడు అతనిలో రెండు విరుద్ధ ప్రక్రుతులున్నాయి ఒకటి యువ బే ఫర్వాతనం ,తీవ్ర మనస్తత్వం రెండోది పండిన ముసలితనం లో జ్ఞాన సంపాదన తో రాసిన ఆదర్శ కవిత్వం .ఇందులో ప్రతిమాటకూ సార్ధకత ఉంది .తన కవిత్వాన్ని తానె ఎస్టిమేట్ చేస్తూ ‘’to console the afflicted ,to add sunshine to day light  by making the happy happier .But a poem is not primarily a therapy its purpose is not to instruct ,although it may do so ,but to delight .అని చెప్పాడు .ఆత్మ పరిశీలన ఉన్నవాడు .ఒక ట్యూటర్ లాగా చెబుతాడు .అందుకని ఆయన కవిత్వం పాఠంలాగా కాకుండా రిపోర్ట్ కార్డ్ ల్లాగా ఉంటుందని కొందరి అభిప్రాయం .ఉపదేశం ఇవ్వటానికే ప్రాధాన్యం ఇచ్చాడు ఇది అబ్సర్డ్ గా అనిపిస్తుంది .మనుషుల యదార్ధ భాష నేమీ ఆయన ఉపయోగించలేక పోయాడు .గ్రామీణ ప్రజల గురించి రాసినా వారి ఆదరణ పొందలేదు .తనకు తాను తప్ప ఎవరూ తెలియదన్నాడు .

‘’the giant Words Worth –god love him ‘’అని కాల్ రిడ్జి మెచ్చాడు .మిల్టన్ తర్వాత ఇంత గొప్ప కవి ఇంగ్లాండ్ లో పుట్టలేదన్నారు .ప్రక్రుతి తన ఆరాధనకు స్పందించింది అంటాడాయన .ప్రక్రుతిని చూసి మురిసే పసి వాడి కంటే ఆరాధించే కుమారుడిలా కని  పిస్తాడు .ఆయన గురించి ఎవరెన్ని చెప్పినా, అన్నా ఆయన మాత్రం ‘’mover and shaker ‘’గా ఉండిపోయాడు .’’He altered the course of English literature by the very contradictions of his theory and practice .he made us revise our concept of the poetic idiom and ,in his revitalization of the language ,changed the tone as well as the direction of modern poetry ‘’.

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -31-5-14-ఉయ్యూరు

‘’ .

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఉయ్యూలోని ‘హిందూ స్మశాన వాటిక అభి వృద్ధికి ”అమెరికా నివాసి శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి విరాళం

సాహితీ బంధువులకు -శుభకామనలు -ఉయ్యూరు వాసి ,ప్రస్తుతం అమెరికా నివాసి శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు ఉయ్యూరు లో ”హిందూ స్మశాన వాటిక ‘ను రోటరీక్లబ్ వారు  ఆధునీకరించి అభివృద్ధి చేస్తున్న సందర్భం గా నా ద్వారా విషయం తెలుసుకొని ఉడతా భక్తిగాతానూ భాగస్వామి అవాలనే తలంపు తో ఇరవై అయిదు వేల రూపాయలు విరాళం గా నాకు పంపి రోటరీ వారికి అందజేయ మన్నారు .ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారి ఆలయం లో ,మీడియా మిత్రుల సమక్షం లో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీ నాగేశ్వర రావు గారికి స్టేట్ బాంక్ ఆఫ్ ఇండియా  చెక్ ద్వారా అంద జేశాను  మై నెని వారి వదాన్యతకు క్లబ్ ప్రెసిడెంట్ గారు ఎంతో కృతజ్ఞత తెలియ జేశారు .ఇలాంటి  దాతల సహకారం వలననే శ్మశానాన్ని ఒక కోటి రూపాయలతో ఆధునీకరించే ప్రాజెక్ట్ చేబట్టామని ,దాతల సహకారం మరువ లేనిదని స్వచ్చందం గా ముందుకొచ్చి విరాళాలు అందిస్తున్నారని మైనేని వారికి ప్రేరణ కలిపించి విరాళం తెప్పించిన దుర్గా ప్రసాద్ గారి లాంటి వారి సహకారం మరచిపో లేనిదని చెప్పారు.దుర్గా ప్రసాద్  .myneni donation to rotary club uyyuru 001

ఉయ్యూరు హిందూ శ్మశాన వాటిక ఆధునీకరణ అభి వృద్ధికి అమెరికా వాసి శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు రోటరీ క్లబ్ వారికి ఇచ్చిన విరాళం ఇరవై అయిదు వేల రూపాయల చెక్ ను అండ జేస్తున్న చిత్రాలు 100_3482 100_3483 100_3484 100_3485 100_3486 100_3487 100_3488

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | 1 Comment

సరసభారతి సమావేశంలో – ఏకపాత్రాభినయం

This gallery contains 13 photos.

More Galleries | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -32 అంతమైన స్వప్నం

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -32

అంతమైన స్వప్నం

ఒకరి ప్రతిభతో ఒకరు పోల్చటానికి వీలు లేక పోయినా వర్డ్స్ వర్త్ ,కాల్రిద్జ్ టేలర్ ,సూతే లు కొత్త మార్గాలు తొక్కారు .తిరుగు బాటు చేయక పోయినా వ్యతిరేకించారు .మనిషి సాటి మనిషిపై బాధ్యత గురించి ఆలోచించారు .రాజకీయాల బదులు సాంఘిక నీతి రాజ్యమేలాలని స్వప్నించారు (యుటోపియ).తమ సృజన తో ఆత్మ శక్తిని అందించి మంచి గొప్ప ప్రపంచం కోసం కలలు కన్నారు .కాని అవి కల్లలే అయ్యాయి .దీనికి అనేక సంఘటనలు కారణమయ్యాయి .వాగ్దానాల హోరేక్కువైంది .బాస్తిల్లీ పతనం వలన రోమాన్స్ ,రివల్యూషన్ లు పల్చ బడ్డాయి .తిరుగు బాటు యువకుల కర్తవ్యమే అయింది .కవులు శృతి కలిపారు లు . వర్డ్స్ వర్త్  వీరందరి తరఫునా వకాల్తా తీసుకొని ‘’bliss was it in that dawn to be alive –but to be young  was very heaven ‘’.అని చెప్పాడు .

కల సాకారం కావాలనే అందరూ భావించారు .స్తబ్దత నుంచి చైతన్యం రావాలని కోరారు .కాని శిష్యులకు వాస్తవం చెడు అయింది .హింస ధ్వనిని తట్టుకోలేక పోయారు ఫ్రెంచ్ .విప్లవం తరువాత  నాలుగేళ్ళకు  ఇంగ్లాండ్ ఫ్రాన్స్ తో యుద్ధం చేసింది .నియంత నెపోలియన్  బెదిరింపుతో  భయం తో పందొమ్మిదో శతాబ్ది ఉదయించింది .తిరుగు బాటు విముక్తి కి అని ,యుద్ధం భావ శుద్ధి (కేతార్సిస్ )కి అన్న అభిప్రాయం తప్పు అయింది .యువత అంతా మధ్య తరగతి కన్జర్వేట్లు గా మారారు .సూతీ ఆస్థాన కవి అయ్యాడు .కాల్రిడ్జి  లైబ్రరీ పుస్తకాలలో కూరుకు పోయాడు .వర్డ్స్ వర్త్ ప్లేటు మార్చి’’ టోరీ’’ అయ్యాడు .

ప్రకృతి కవి – విలియం వర్డ్స్ వర్త్

ప్రకృతికవి అని పిలువ బడే విలియం వర్డ్స్ వర్త్ 7-4-1770నకంబర్ లాండ్ లో కాకర్ మౌత్ లో పుట్టాడు .ఇది అందమైన లేక డిస్ట్రిక్ట్ లో దార్వేంట్ నదీ తీరం లో ఉంది .తండ్రి లాయర్ .ఎస్టేట్ వొనర్ కూడా .వీరిని’’ నార్త్ కంట్రీ పీపుల్స్ ‘’అంటారు .పురాత యార్క్ షైర్ ముతక మనుషులని ముద్రపడ్డారు .భాష కూడా చాలా మొరటుగా ఉంటుంది ..అయిదుగురు పిల్లలలో విలియం రెండవ వాడు .తల్లి ముప్ఫై ఏళ్ళకే చని పోయింది .విలియం సోదరి డరోతి కంటే భిన్నమనస్తత్వం ఉన్న వాడు .చిన్నప్పుడే మూడీ గా కొరుకుడు పడనీ వాడుగా ఉండేవాడు .ఒక సారికోప పడితే గదిలో దూరి చస్తానంటూ బెదిరించాడు .అమ్మ తరఫు బంధువులైన ‘’కూకాంస్ ‘తరచూ వచ్చి వెల్తూండేవారు .వారిలో మేరీ హచిన్సన్ అనే కజిన్ పై ప్రేమలో పడి పెళ్లి చేసుకొన్నాడు .తల్లి చావుతరవాత ఎనిమిదో ఏట హాక్ షెడ్ లోని గ్రామర్ స్కూల్ కు పంపారు .ఏదో వానాకాలం చదువు చదివి అత్తిసరు మార్కులతో ముక్కాడు .క్లాసు పుస్తకాలలోని చదువుకంటే విండర్ మీర్ ,ఆమ్బుల్ సైడ్ పర్వత దృశ్యాల వలన నేర్చిన చదువే ఎక్కువ .ఇంటిలో ఉండే ఆనందం కంటే ఇక్కడే ఎక్కువ ఆనందం సంతోషం పొందేవాడు .ఆటా పాటా ,స్కేటింగ్ ,నడక కొండలేక్కి దిగటం సరస్సులో స్నానాలు ఏంతో ఇష్టం గా ఉండేవి .స్వీయ జీవిత చరిత్ర గా పిలువ బడే ‘’ప్రేల్యుడ్ ‘’లో ఇవన్నీ రాసుకొన్నాడు కవితాత్మకం గ .‘’attends upon the motion of the winds –embodied in the mystery of words’’అందుకే ఈ కవిని ‘’the essential passions of the heart ‘’కు అంకితమైన కవి అంటారు .

తండ్రి మరణం తర్వాత కుటుంబం విచ్చిన్నమైంది .పద్నాలుగేళ్ళప్పుడు అన్న రిచర్డ్ తోకలిసి అమ్మ తరఫు ‘’కాక్సంస్ ‘’ల దగ్గరకు చేరాడు .చిన్నప్పటి నుంచి అన్యోన్యం గా మెలగిన సోదరి దరోతి తల్లి కజిన్ దగ్గర పెరుగుతోంది .పదేళ్లకు కాని ఆమెను మళ్ళీ చూడలేక పోయాడు .ఎవరి మీదో ఆధారపడి ఉండటం ఇష్టం లేని విలియం పది హేడవ ఏట సెయింట్ జాన్స్ కాలేజిలో చేరి విశేష ప్రతిభ కనబరచాకుండానే ,చదువు పై అంతశ్రద్ధ లేకుండా చదువంటే ఏవగింపు కలిగి మానేశాడు .వికారం గా’’ వేగ బాండ్’’గా  కని పించేవాడు .మృదు స్వభావం లేదు .మొరటుతనమే కనిపించేది అన్నిట్లోనూ .స్నేహితులూ ఏర్పడలేదు .ఒంటరిగా రోడ్ల మీద తిరుగుతూ బయటికి వినిపించేట్లు పాడుకొంటూ తిరిగే వాడు .వంద  పంక్తుల ‘’యాన్ ఈవెనింగ్ వాక్ ‘’కవిత రాసి తన తీరు తెన్నులను నింపాడు .జేమ్స్ బీటిల్ అనే  మినిస్త్రెల్ ‘’ప్రేల్యుడ్ ‘’రాయమని ప్రోత్సహించాడు .

కాలేజి లో చదువు పూర్తిచేసి  లా చదువుతాడేమో నని  కుటుంబం ఆశ పడింది .మనవాడికి ఆ ధ్యాసే లేదు .పార్శ్వ నెప్పి ,తల నెప్పి తో బాధ పడేవాడు .విలియం ఏది చేసినా చెల్లెలు హర్షించేది .’’ఆరోగ్యం బాగా ఉంటె వాడే లా చదువుతాడులే ‘’అని సర్ది చెప్పేది .సైన్యం లో చేరాలను కొన్నాడు .లండన్ చేరి ఫ్రాన్స్ లో జరుగుతున్న విషయాలు తెలుసుకొన్నాడు బాష్టిస్తి పతనమైంది .రాజరికాన్ని కూల ద్రోసి ప్రజాస్వామ్యం ఏర్పరచారు ..ప్రేల్యుడ్ కవితలను బ్యూపే అనే ఆతను మెచ్చి ప్రోత్సహించాడు .స్వార్ధ రహిత విప్లవ వాదిగా మారాడు .దానినే ‘’France standing at the top of golden hours –and human nature seeming born  again ‘’అని కవిత్వీకరించాడు .నిరంకుశత్వాన్ని ఈసడించాడు .ప్రజలు తమ భవిష్యత్తును తీర్చి దిద్దుకోవాలని చెప్పాడు .ఇదొక ‘’యుటోపియా ‘’.దీన్ని సాధ్యం చేయాలని ఆలోచించాడు .ఒక రకం గా .పునర్జన్మ పొందాడు .ఆర్లియాన్స్ లో ఒక లాడ్జి లో ఉన్నాడు .పాల్ వాలన్ తోపరిచయం జీవితాన్నే మార్చేసింది .అయన తన సోదరి ‘’ఆన్నేట్టే ‘’ను కవికి పరిచయం చేశాడు .ఆమె ఫ్రెంచ్ కన్య .మన వాడి మారిన మనస్తత్వం ఆమెకు నచ్చింది  .ఇద్దరూ ప్రేమలో పడి ఒక కూతురుఆన్ కరోలిన్  ను కన్నారు .ఫ్రాన్స్ ఇంగ్లాండ్ మధ్య యుద్ధం మొదలైంది .ఎక్కడికీ కదిలే వీలే లేకుండా పోయింది .భార్య పిల్లను పంపే అవకాశమే లేదు. ఇంగ్లీష్ దేశస్తుడైనా తను ‘’ప్రపంచ భక్తుడు ‘’అని పించుకొన్నాడు .ఆ ఊహా ప్రపంచానికి తన భార్య ఒక ప్రతీక అనుకొన్నాడు .

ఇరవై మూడులో తీవ్ర హింసల పాలయ్యాడు .ఫ్రాన్స్ లో హింస రాజ్యం చేస్తోంది .కాని ఇది ప్రపంచ విముక్తికి దోహదం చేస్తున్దనుకోన్నాడుపాపం .భార్య విషయం లో ఆందోళన ఎక్కువైంది .అక్రమ సంతానానికి కారకుడైనందున ఇంట్లోకి రానివ్వలేదు .అక్కడ భార్య ఇతనికోసం ఎదురు చూస్తోంది .భర్త ఏదో ఒక రోజు వచ్చి కలుసుకొంటాడని ఎదురు చూస్తోంది .కానిమనవాడు ఆ జ్ఞాపకాలన్నీ తుడిచేసుకొన్నాడు .ఆమెతో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలను తగల బెట్టాడు .ఈ ఉదంతాన్ని డెబ్భై ఏళ్ళు దాచేశాడు విలియం మరణం తర్వాతే ఇది బయట పడింది .ఆమెకు ద్రోహం చేశానని మనసు క్షోభ పడుతోంది .విప్లవం ఊపులో అన్నీ మరిచాడు .చివరికి అది రక్తపు టేరులను పారిస్తోందని తెలుసుకొన్నాడు .ట్యూటర్ గా ,మేగజైన్ కు రచయితగా ఉండాలనుకొన్నా సాగలేదు .సంపాదనే లేదు. స్నేహితుల దయాదాక్షిణ్యం పైనే జీవిస్తున్నాడు .క్షయ తో మరణానికి చేరువ లో ఉన్న రైస్లీ అనే అతనికి సేవచేశాడు .అతని మరణం తో తొమ్మిది వందల పౌండ్లు లభించాయి .

డరోతి మేనమామల ఇల్లు వదిలి విలియం ను చేరింది .పల్లె టూరు లో ఉండాలని కోరింది .అతను  ‘’నేచర్స్ లారిఎట్ ‘’కావాలని భావించింది .లండన్ వెళ్ళిపోయాడు .మళ్ళీ దొర్సేట్ షైర్ లో రేస్ డౌన్ లో ఒక అద్దె ఇల్లు తీసుకొని ఉన్నారు .వారిద్దరి మధ్య విపరీతమైన ఆకర్షణ ప్రేమ ఉండేవని చరిత్రకారులు చెప్పారు .వారిద్దరి మధ్యా సంభాషణలు కూడా ప్రేమికుల సంభాషణల్లా ఉండేవి .ఆమె ఇతని భావాలకు విరుద్ధం గా కని  పించేది .ఇరవై మూడేళ్ళ వయసులో ఒక పబ్లిషర్ విలియం రాసిన ‘’డిస్క్రిప్టివ్ స్కెచెస్ ‘’,యాన్ ఈవెనింగ్ వాక్ ‘’లను ముద్రించి ఇచ్చాడు .ఇవి ఆగస్టన్ పోయిట్రీకి అనుకరణ .సమీక్షలు ఆశా జనకం గా రాలేదు. కాల్ రిడ్జి వచ్చి వీరితో చేరిన తర్వాతే విలువతెలిసింది .వర్డ్స్ వర్త్ ‘’వర్త్ ఏమిటో ‘’ లోకానికి తెలిసింది ఆంగ్ల కవిత్వా తీరు తెన్ను మార్చేసే కవిత్వం వచ్చింది .కాల్ రిడ్జికి విపరీతమైన భావోద్రేకం ఊహా ఉన్నాయి .వర్డ్స్ వర్త్,  కాల్ రిడ్జి,  సూతే త్రయం అవిభాజ్యమై కొత్తపోకడలతో ఇంగ్లీష్ కవిత్వాన్ని కదను తొక్కించారు .

సామ్యుల్ టేయిలర్ కాల్ రిడ్జి

కాల్ రిడ్జ్ రాసి వదిలిన వాటిని పూర్తీ చేయటానికి రెండు నిండు జీవితాలు చాలవు అంటారు .తేల్చుకోలేని మనస్తత్వం ,నల్లమందు భాయీ .21-10-1772లో దేవాన్ లో సెయింట్ మేరీ లోని ఒటారిలోజన్మించాడు .పదముగ్గురి లో చివరి సంతానం .అన్నతో గొడవ పడి వాడు చావా కొడితే నది ఒడ్డున స్పృహ తప్పి పడిపోయి మర్నాటి దాకా లేవలేదు .చలికి ఒళ్ళు మొద్దుబారింది. దీనితో నరాల బాధలేర్పడ్డాయి .అందువలన జీవితం అంతా దాదాపు పనికి రాని  వాడుగా ఉండి పోవాల్సి వచ్చింది .ఒంటరిగా పుస్తకాలతో కాలక్షేపం చేశాడు .’’అరేబియన్ నైట్స్ ‘’చదివి ఆరేళ్ళ వయసులో సాహస గాధ లంటే మహా ఇష్టపడ్డాడు .మాయలు మంత్రాలు తమాషా కధలు చదివి రాత్రుళ్ళు పలవ రించేవాడు ..తొమ్మిదో ఏట దరిద్రం తో తండ్రి చనిపోయాడు .ఒక లోకల్ జడ్జి కాల్ రిడ్జి ని చారిటీ స్కూల్ లో చేర్పించాడు. .అక్కడి మురికి వాతావరణం నచ్చలేదు.తిండి అసలు బాగా లేదు చిన్న రొట్టె ముక్కే గతి .ఇవి భరించలేక ఒక మూల చేరి ‘’చదువే చదువు’’ గా గడిపాడు .రివరెండ్ జేమ్స్ బాయర్ అనే టీచర్ మాత్రం ఇతన్ని దారిలో పెట్టి మార్చాడు .’’Boy! the school is your father .The school is your mother –the school is your sister .,your brother all the rest of your relations ‘’అని ప్రబోధించాడు .జీజస్ ను ప్రేమించమని బోధించాడు .అంటే కాల్ రిడ్జి జీవితం కార్నర్ తిరిగింది .

అతని చూపుల్లో మార్పు వచ్చింది కాని కవళికలు ఒకదానికొకటి పొంతన లేకుండా ఉన్నాయి .కళ్ళల్లో కాంతి ప్రస్పుటం గా గోచరిస్తోంది .అందరిలో కొట్టవచ్చినట్లు ప్రత్యేకం గా కని  పించే వాడు .విలియం ‘’రిడ్జి’’ ని ఇంటికి ఆహ్వానిస్తే అతని సోదరి ఇవాన్స్ పై మనసు పారేసుకొని ,చెట్ట పట్టాలేసుకొని తిరిగాడు .ఆమెపై కవితా వర్షం కురిపించాడు .కాల్ సోదరుడు లూక్ డాక్టర్  అయ్యాడు .మనవాడికి సర్జన్ అవాలనే అభిలాష కలిగింది .కుప్ప తెప్పలుగా మెడికల్ పుస్తకాలు, సామగ్రి అందు బాటులో ఉన్నాయి .రోగాల, మందుల గురించి సమగ్ర జ్ఞానం సాధించాడు .ఇదంతా ఒక భ్రాంతిలో చేసిన పని .కీళ్ళ వాతం తిరగ బెట్టింది .పది హేడు నుండి పందొమ్మిదేళ్ళ వరకు మంచం మీదే ఉండి పోయాడు .

జీసస్ కాలేజ్ కేంబ్రిడ్జి నుంచి స్కాలర్షిప్ పొందాడు .మంచానికే పరిమితమై పోయాడు .జబ్బుతో .ఫ్రెంచ్ రివాల్యూషన్ చూసి రిపబ్లికన్ గా మారి గొప్ప వక్త అయ్యాడు .అప్పులు ఎక్కువయ్యాయి  .తప్పించుకోవటానికి లండన్  పారి పోయాడు .దీనినే అతని భాష లో ‘’I fled to London to debauchery ‘’అన్నాడు .సంపాదన లేదు .ఉన్నదానితో గాంబ్లింగ్ ఆడాడు .ఆత్మ హత్యా ప్రయత్నం చేశాడు .ఇరవై ఒకటిలో పేరు మార్చుకొన్నాడు .ఆర్మీ లో చేరాడు .నాలుగు నెలల తర్వాత సోదరుడు జార్జి చలవ తో బయట పడ్డాడు .అన్నీ తొందర బాటు నిర్ణయాలే . కేంబ్రిడ్జి కి తిరిగి వచ్చి స్కాలర్షిప్ పునరుద్దరింప బడితే చదువు సాగించాడు .అద్భుతం గా అనేక అనువాదాలు చేశాడు .మొదటి రచన ‘’లెవ్ టి ‘’మొదలెట్టాడు .దీనికే ‘’సర్కాసియాన్ లవ్ చాంట్ ‘’అని మరో పేరు .రాబర్ట్ సూతీ తో పరిచయమేర్పడింది .ఇద్దరికీ కవిత్వం పిచ్చి ఎక్కువే .

రాబర్ట్ సూతీ

12-8-1774లో బ్రిస్టల్ లో పుట్టాడు రాబర్ట్ సూతీ .వంశం బాగా గౌరవాదరాలున్నదే .తాత సోమర్సెట్ రైతు .తండ్రి బట్టల వ్యాపారి .తల్లి సంపన్న గృహం నుంచి వచ్చింది .సూతీ పిన తల్లి రక్షణ లో పెరిగాడు .ఆడపిల్లలా ముద్దు చేసి డ్రెస్ చేసి ఆరేళ్ళ వరకు పెంచింది .ఎనిమిదో ఏట ‘’స్కిపియో ‘’అనే ట్రాజెడీ రాశాడు .తర్వాత కవిత్వం రాశాడు .పదమూడు లో పెద్ద అంత్య ప్రాసల కవిత్వం రాశాడు .లాటిన్ లో పాండిత్యం సంపాదించి తోటి వారికి నేర్పాడు .

స్కూల్ చదువు కుంటి నడక నడుస్తోంది ‘’ది ఫ్లాజలేంట్ ‘’అనే స్కూల్ మేగజైన్ ను నిర్వహించాడు .కాలానికి భిన్నమైన దొరణు లుంటే స్కూల్ నుంచి బయటికి పంపేశారు . క్రైస్ట్ చర్చికి అప్ప్లై చేస్తే తిరస్కరించారు .ఆక్స్ ఫర్డ్ లోని బిలియాల్ కాలేజి అడ్మిషన్ ఇచ్చింది .అందులో చేరిన కొద్ది రోజులకే బ్రిటన్ ఫ్రాన్స్ యుద్ధం మొదలైంది .చదువు వదిలేసి రిపబ్లికన్ అయ్యాడు .అక్కడ దేశం లో కొంపలు మునుగుతుంటే , స్వతంత్రం కోసం పోరు సాగుతుంటే  కాలేజిలో ‘’యూక్లిడ్ ‘’చదువుతూ కూర్చోవటం భావ్యం కాదను కొన్నాడు .ఈ భావాలతో ‘’జోన్ ఆఫ్ ఆర్క్ ‘’రాయటం ప్రారంభించాడు .ఇంకా అప్పటికి వేదాంతం ఒంట బట్టలేదు .యువ రక్తపు పొంగులో రాసిన రచన అది .సమాజానికి తీవ్ర చికిత్స కావాలన్నాడు .అమెరికా వెళ్ళాలనే ఆలోచనా వచ్చింది .అమెరికా లో స్వాతంత్ర పోరాటం నచ్చింది. స్వేచ్చ పొందటం ఆకర్షించింది .

అరిస్తోక్రసికి వ్యతిరేకం గా పాంటిసోక్రసి  ఏర్పాటు

సూతీ కాల్రిడ్జి స్నేహిత బృందం ఆడా మగా కలిసిఒక బృందాన్ని ఏర్పాటు చేసుకొన్నారు   .ఆదర్శ జీవితం గడపటమే ధ్యేయం .అందులో పన్నెండు జంటలు ఉన్నాయి  .కొంత పొలం సంపాదించారు .ప్రతి వారూ రోజుకు మూడు నాలుగు గంటలు కస్టపడి పని చేయాలి .వచ్చింది అందరూ సమానం గా అనుభవించాలి .ఒక నమూనా రాజ్య స్థాపన చేయాలని ఆదర్శం .యుద్ధానికి ,విప్లవానికి దూరం గా ఉండి దీన్ని సాధించాలని ప్లాన్ .కాల్రిడ్జి దీనికి నికి పాంటిసోక్రాసి పాన్తిసోక్రసి ‘’అని పేరు పెట్టాడు .ఇది అరిస్తోక్రసి కి వ్యతిరేకం .స్వయం నిర్ణయ ప్రభుత్వం ఏర్పడాలి .కొద్ది మందిని ఎన్నుకొని వారిద్వారా పాలన సాగించాలి .ఇందులో ప్రతి ఒక్కరికీ సమాన హక్కులూ బాధ్యతలు ఉంటాయి .ఇదొక సాంఘిక సంస్థ .వీరి భావనలు అభిప్రాయాలు అంతా కవితాత్మకం గా ఆకర్షణీయంగా  గా ఉన్నాయి .కొంత కాలం ఈ ‘’స్వప్న లోక విహారం’’ బాగానే నడిచింది. కాని కాల్ రిడ్జి ఇవాన్స్ ను మర్చిపోలేక  పోతున్నాడు .సారా ఫ్లికర్ కు లైన్ వేస్తున్నాడిక్కడ .ఇంగ్లాండ్ వదిలి ఊహా లోకం లో విహరించ వద్దని మేరీ ఇవాన్స్ చెబుతూనే ఉంది .ఆమె ఇతన్ని సోదరుడి లాగా భావిస్తున్నాని రాసింది .షాక్ అయి అవాక్కయ్యాడు  ఇర  ఇరవై మూడు వయసులో కాల్ రిడ్జి సారా ను పెళ్లి చేసుకొన్నాడు ..యెంత పకడ్బందీ గా ప్లాన్ చేసినా ‘’పాంటిసోక్రసి ‘’ఇబ్బందుల పాలయ్యింది .ఇంగ్లాండ్ అమెరికాల మధ్య కొత్త ఒప్పందం కుదిరింది .ఈ బృందం వేల్సు లో ఒక ప్రదేశాన్ని ఎన్నుకొని అక్కడికి చేరి రచనలు చేసి ,వ్యవసాయం చేస్తూ డబ్బు సంపాదించా లను కొన్నారు .ఇందులో ఇద్దరు అప్పుల్లో మునిగి ఉన్నారు .బృందం చీలిపోయే దశకు చేరింది .’’the fraternal group ceased to fraternize ‘’అయిపొయింది .ఒకరి నొకరు తిట్టుకొన్నారు .సూతీ రహస్యం గా ఎడిత్ ను పెళ్ళాడాడు .ఆమె లా చదవటానికి నిర్ణయించుకోంది. కాల్ రిడ్జి ఈ ముఠాను వదిలేసి క్లేవేడాన్ చేరి కవిత్వం లో పడ్డాడు .

ఈ త్రయం పై మరి కొన్ని విశేషాలు ఈ సారి

SamuelTaylorColeridge.jpg  William Wordsworth 001.jpg

Robert Southey.jpg   రాబర్ట్ సూతీ                                    

కాల్రిడ్జి                                                           వర్డ్స్ వర్త్

రాబర్ట్ సూతీ

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-5-14-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రాచకీయ ద్విప్లేట్స్ -34(సామాన్యుడు అసామాన్యుడైన వేళ)

                          రాచకీయ ద్విప్లేట్స్ -34(సామాన్యుడు అసామాన్యుడైన వేళ)

1-భారత ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ బతికించాడు ఓటరైన ‘’సామాన్యుడు’’

 కుళ్ళిన సమాజాన్ని ,అవినీతి పాలకుల్ని ఏరిపారేసి అనిపించాడు ‘’అసామాన్యుడు ‘’ .

2-ప్రజలు ,సార్క్ దేశాధిపతుల సమక్షం లో ప్రధానిగా పట్టాభిషిక్తుడైన ‘’మోడీ ‘’

   సమర్ధుడు  తగిన నాయకుడు,పాలకుడు యెంత వెతికినా  –ఇంకోడు’’ ఏడీ?’’

3- అర్హత ఉన్నవారిని తన సహచర మంత్రులుగా చేర్చి పక్కన పెట్టి   ముసలి ముఠా

   శాఖలూ సమర్దులకే అప్పగించి కొత్తరక్తం ఎక్కించి ఉత్సాహం ఊపు నిచ్చిపేల్చాడుజోడు గుళ్ళపిస్తోలుఠా.

4-మంత్రిపదవి  పొందింది  రాహుల్ ను ముప్పతిప్పలు పెట్టిన ‘’ఇరానీ స్మృతి’’

  పాపం ‘’మొద్దబ్బాయి’’ నిద్రపట్టకుండా  తలచు కొంటాడేమో  ‘’పరాభవ స్మృతి ‘’?

5-కాంగ్రెస్ కొంప ‘’ఖాళీ ‘’

 పని చేయ దింక ఏ’’ మోళీ ‘’.

6-.ఎక్కిన మర్నాడే ‘’నల్ల కుబేర భరతం’’ పట్టటానికి ఏర్పాటు చేశాడు  ‘’సిట్’’

  పదేళ్ళు పాలించినా ఆదిశలో ముందుకు వెళ్ళకుండా చేసిన కాంగీ పాలన ‘’షిట్ ‘’.

7-కొత్త రాజధాని, రాష్ట్రం అభి వృద్ధికి దాతలను ప్రోత్సహిస్తున్న ‘’ఆంద్ర జ్యోతి ‘’

  వరదలా వచ్చి పడుతున్న నిధులతో నిండుగా  వెలగాలి ‘’ స్వర్ణాంధ్ర జ్యోతి ‘’.

8-పదికోట్ల మంత్రం జపించే సి.పి.ఐ ‘’నారాయణ ‘’

  సి.పి.ఏం . ముందు భంగపడి  అయ్యాడు అయ్యో ‘’వెర్రి నాయన ‘’

9-జగన్ పార్టీ ది పరనిందా,’’సొంత డబ్బా ‘’

  మైసూరా ,వెంకన్న ముఠావాయించేది’’ పరస్పర డబ్బా ‘’.

10-ఓడినా సిగ్గురాని ఖద్దరు  చేతి నేతలు

  అది నేత్రి పాదాల పై ఇంకా పడి లేవని’’ పీతలు ‘’.

     మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-5-14-ఉయ్యూరు

Posted in రాజకీయం | Tagged | Leave a comment

”మహిళా మాణిక్యాలు ‘పుస్తకం పై శ్రీమతి కోపూరి పుష్పాదేవి సమీక్ష -ఆంద్ర భూమి 25-5-14 ఆదివారం

manikyala samiksha 001

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -31 హాలిక కవి –రాబర్ట్ బర్న్స్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -31

హాలిక కవి –రాబర్ట్ బర్న్స్

మరచి పోరాని కవిత్వం రాసి, మేధావిగా కష్టజీవి గా, విఫల రైతుగా ,సహజ పాండిత్యునిగా ,ప్రతీకాత్మక కవి గా ,లిజెండరీ హీరో గా ,సంచార జాతి దేవుడి గా రాబర్ట్ బర్న్స్ సుప్రసిద్ధుడు .’’ది ఫార్మర్స్ ఇంగిల్ ‘’అనే కవిత చాలా సాధికారకం గా రాశాడు .25-1-1759లోస్కాట్ లాండ్ లోని ఐరిషైర్ లో  కిల్ లోని అల్లోవే లో జన్మించాడు .తండ్రి విలియం బర్న్స్ స్వంత చేతులతో ఒక చిన్న కాటేజీ  నిర్మించుకొన్నాడు .అంతా రైతు వాతావరణం .తల్లి కూడా అదే కుటుంబం నుంచి వచ్చింది .చదువు రాని స్త్రీ .బైబిల్ లో కొన్ని పేజీలు  మాత్రం చదవ గలిగేది .జానపద కధలు చెప్పటం లో ఆరి తేరి ,పిల్లలకు  ఆ కధలతో వినోదం పంచేది .ఆమె సోదరి కూడా వీరితోనే ఉండి ఆమెకు పాటల్లో గృహ క్రుత్యాలలో తోడుగా ఉండేది .ఆరవ ఏట బర్న్స్ అల్లోవే స్కూల్ లో జాన్ మర్డాక్ దగ్గర విద్య నేర్చాడు..ఆ మేస్టారికి ఫుడ్డూ బెడ్డూ అన్నీ ఈ రైతులే చూసేవారు .నిర్దుష్టమైన ఇంగ్లీష్ ను పిల్లలు నేర్వాలని ఆయన తాపత్రయం .తండ్రి బర్న్స్ కు పొలం పనులు నేర్పాడు. మూడు వారాలు సెలవ ఇస్తే దూరం గా ఉంటున్న గురువు గారు మద్రోక్ దగ్గకు వెళ్లి చదువుకొనే వాడు

తండ్రికి మొదటి బ్రేక్ డౌన్ ,కొడుకు మొదటి కవిత ఒకే సారి వచ్చాయి .పది హేనవ ఏట రైమ్స్ తో కవిత్వం రాశాడు .కూలీల కష్ట జీవితాలను పేదరికాన్ని కవిత్వీకరించాడు .పంటలు వాటికి పట్టే చీడ పీడలూ కవిత్వం లో చోటు చేసుకొన్నాయి .పందొమ్మిది లో కుటుంబం లోచ్లీ కి మారి ఏడేళ్ళు ఉండి పోయారు .ఇరవైలో అలిసాన్ బేగ్ బీ అనే పని కత్తే ను ప్రేమించి ముగ్గు లోకి దించాడు ..ఆమెపై కవితలూ రాశాడు .ఇక్కడి వాతావరణం నచ్చక ఇర్విన్ వెళ్ళాడు .తండ్రి అప్పులపాలై క్షయ సోకి చావు బతుకుల మీద ఉన్నాడు .తండ్రి దగ్గరకు చేరి సేవ చేశాడు .అతనిలోని రచయిత బయటికి వచ్చి విజ్రుమ్భించాడు .తండ్రి మరణానికి ముందు ‘’కామన్ ప్లేస్ బుక్ ‘’మొదలు పెట్టి రాస్తున్నాడు మనసులో మెదిలిన ప్రతిభావాన్నీ కాగితం పై పెట్టాడు .తండ్రి పోయిన తర్వాత వ్యవసాయం చేశాడు నకిలీ విత్తనాలు ,అదనుకు సాగు చేయక పోవటం తో నష్టాల్లో కూరుకు పోయాడు .పెట్టు బడులే రాలేదు .

ఈ వూరు వదిలేసి పక్కనే ఉన్న మాచ్లిన్ చేరాడు .అక్కడ అందమైన అమ్మాయిలూ సరదా అబ్బాయిలతో కాల క్షేపం చేశాడు .ఎలిజ బెత్ పాటన్ అనే మరో పని అమ్మాయి ని వలచాడు .ఆమెతో అక్రమ సంతానాన్ని పొందాడు .తండ్రి అయ్యాననే గర్వం తో’’ఏ పోఎట్స్ వెల్కం టు హిజ్ లవ్ బిగాతెన్ డాటర్ ‘’ ఒక కవిత రాసి పేపర్ కు పంపాడు .పుట్టిన పిల్లను బర్న్స్ తల్లే పెంచింది .ప్రియురాలికి ఇరవై పౌండ్లు ఇచ్చి సర్దు బాటు చేసుకొన్నాడు. ఆమె తలిదండ్రులను చేరింది .తెలియని జబ్బు ప్రవేశించి బాధిస్తోంది .రాసిన కవితలను చేతి వ్రాత ప్రతులనే అందరికీ ఇచ్చే వాడు .స్టాంజాలు రాయటం లో కొత్త పుంత తొక్కాడు .అందుకే వాటిని ‘’బర్న్స్ స్టాం జాలు ‘’అనే ముద్రపడింది .’’జాలీ బెగ్గర్స్ ‘’అనే కవిత తరతరాలుగా చదివించింది .ఇందులో జంతువుల ఆత్మ ఘోష ఉంది .

ఇరవై ఆరులో ఒక తాపీ మేస్త్రి కూతురు జీన్ ఆర్మార్ ను ప్రేమించాడు .తండ్రి ఒప్పుకోలేదు .సాక్షుల సమక్షం  లో పెండ్లాడి లీగల్ మారేజీ చేసుకొన్నాడు .మామ కు కోపం వచ్చి ఇతన్ని అల్లుడే కాదు పొమ్మన్నాడు .వినే వాడిది పాపం కవితలు పిలిచి వినిపించేవాడు .జమైకా వెళ్లి చెరుకు సాగు చేద్దామనుకొన్నాడు .ఇంతలో ఇంకో పాలమ్మే మేరీ కాంప్ బెల్ అనే అమ్మాయిని లైన్ లో పెట్టుకొన్నాడు .ఆమెను ‘’హైలాండ్ మేరీ’’అని పిలిచి కవిత్వం చిందించాడు .ఆమెకు కడుపోచ్చింది .పిల్లను కనీ ఆమె చనిపోయింది. బర్న్స్ అనారోగ్యం పాలయ్యాడు .చనిపోయిన మేరీ పై ఎలిజీ రాశాడు .జమైకా వెళ్లి చెరుకు సేద్యం చేశాడు .ఇక్కడా నెత్తిన చేతులే .మామగారి తో అసమర్దుదనిపించుకొని వ్యవసాయం లో దెబ్బతిని ఏమీ సాధించలేని వాడని ముద్రపడ్డాడు. చివరికి కవిత్వమే శరణ్యం అనుకొన్నాడు .జాలీ బెగ్గర్స్ ను ఒక మారుమూల ఊరిలో ప్రింట్ చేశాడు మూడు  షెల్లింగుల రేట్ పెట్టాడు .చాలా మంది ఎగపడి చందా రారులై నారు ప్రింట్ చేసి డబ్బు బాగా సంపాదించాడు .ఒక్క నెలలో ఒక అజ్ఞాత పల్లెటూరి అంత్య ప్రాసల కవి కవిత్వాన్ని ఆరు వందల మంది పోషించి వెలుగు లోకి తెచ్చారు ఇరవై  ఏడు లో ‘’సేలేడోనియా బార్డ్ ‘’అని ఆ అమాయక అక్షరం ముక్క రాని ప్రజల చేత కీర్తింప బడ్డాడు బర్న్స్ .స్కాటిష్ మాండలికం లో ఉన్న ఇంగ్లీష్ శైలిలో వాటిని నగిషీలు చెక్కాడు .ఇంగ్లీష్ కవిగా గుర్తింపు పొందాలని ఉవ్విళ్ళూరుతున్నాడు .కిల్మర్నాక్ పోయెమ్స్ గా పిలవ బడే ఈ కవితలు నలభై మూడు .ఇందులో చేత్తకవితలూ ఉన్నాయి .ఒక మంచి కవిత ను చూద్దాం –

‘’is there in human form ,that bears a heart –a wretch a villain lost to love and truth –that can with studied ,sly ,ensnaring art –beasty sweet jenny;s un suspecting youth ‘’

ఈ సంకలనం డబ్బు నిచ్చింది .దానితో ఆశ పెరిగి అదృష్టాన్ని పట్నం లో పరీక్షించుకొందామని ఎడిన్ బర్గ్ చేరాడు .అక్కడి సాహితీ ప్రముఖులేవరూ స్వాగతించలేదు .’’పొలం లో పెంట పోగు  మీద పెరిగిన పుష్పం గా ‘’అందరూ భావించారు .మనిషి అధైర్య పడ్డ్డాడు .పేరు  ప్రఖ్యాతులు ఒక్క సారిగా రావని గ్రహించాడు .క్రమం గా జనం దగ్గరకు వస్తున్నారు .ప్రతిభకు గుర్తింపు వచ్చింది .చిన్న చిన్న సన్మానాలు చేస్తున్నా వారి మధ్య తానూ తేలి పోతున్నట్లు భావించాడు డబ్బు వస్తోందికాని మానసికానందం లేదు .ఎరల్ ఆఫ్ గ్లేన్కారిన్ సహాయం తోతన కవితల  రెండవ ఎడిషన్ తెచ్చాడు .చేతిలో డబ్బు ఆడుతోంది .కాని మానసిక ప్రశాంతత కరువైంది .సరిహద్దు రాష్ట్రాలు తిరిగాడు ప్రయోజనం కనీ పించలేదు .పల్లె జనుల పాటలు వింటూ వాటి ని సరి చేస్తూ హాయిగా గడిపాడు .

ఎడిన్ బర్గ్ లో స్కాటిష్ సాంగ్స్ ను’’స్కాట్స్ మ్యూజికల్ మ్యూజియం ‘’వెలువరించే ప్రాజెక్ట్ లో జేమ్స్ జాన్సన్ వచ్చి సహాయం చేయమంటే చేశాడు .అవి ఆరు వాల్యూములుగా తెచ్చారు .అందులో బర్న్స్ ఎక్కడ  సరిదిద్దాడో ఎక్కడ స్వంతవి చేర్చాడో   తెలీకుండా చేశాడు .వినటానికి మహా కర్ణ పేయం గా వచ్చాయి .బర్న్స్ జీఎవితం లో ఇదొక గొప్ప ఎచీవ్ మెంట్ అయింది .ఈ ప్రాజెక్ట్ వలన బర్న్స్ ఒక’’ లిరిక్ రైటర్’’ అని పేరు వచ్చింది .ఇంటికి వెళ్ళటానికి ఇష్టం లేదు .రెండో సారి ఎడిన్ బర్గ్ కు వచ్చినప్పుడు  ఆగ్నెస్  మాక్లి హోస్ ను ప్రేమించాడు  .ఆమె ఇతనికి తగిన అమ్మాయి .అప్పటికే ఇద్దరు పిల్లలు పుట్టారు. కాని పెళ్లి చేసుకోలేదు  .అదృష్టం కలిసొచ్చి ఎక్సైజ్ లో ఆఫీసర్ ఉద్యోగి అయ్యాడు .నిత్ నది ఒడ్డున  డం ఫ్రైస్ లో చిన్న వ్యవసాయ క్షేత్రం కొన్నాడు .జీన్ కు ఇద్దరేసి కవల పిల్లల్ని కన్నది నలుగురూ రోజులే బతికి చనిపోయారు .అప్పడు పెళ్లి చేసుకోన్నాడామెను .దాన్ని’’I gave her a matrimonial title to my corpus ‘’ అని కవిత్వీకరించాడు .జీన్ గ్రుహిణిగా ప్రింటర్ గా ,సహకరించింది .స్మగ్లింగ్ ను అరికట్టే ఉద్యోగం చేస్తూ ఏడాదికి యాభై పౌండ్ల జీతం పొందుతున్నాడు .జీన్ స్వయం గా పొలం పనులు చేస్తూ చేయిస్తూ ఉండేది మరో బిడ్డ జననం .ఇక్కడి నీరస జీవితం బోర్ కొట్టింది .

ముప్ఫై రెండులో అన్నే పార్క్ అనే బార్ లో అమ్మాయిని పడేశాడు ప్రేమలో. ఆమె ఆరాధనలో మళ్ళీ కవిత్వం దూకి పారింది .ఈ ప్రేమకు ఒక కూన కూడా పుట్టింది .అక్కడ జీన్ మరో పిల్లాడిని కన్నది. ఐలిష్ లాండ్ వ్యవసాయం ఏమీ కూడు పెట్టటం లేదని గ్రాహించి మొత్తం అంతా అమ్మేశాడు .డంఫ్రైస్ కి మకాం మార్చి వచ్చే కొద్ది జీతం తో బతికాడు .అయిదేళ్ళు ఇక్కడే ఉండి చనిపోయాడు .రాజకీయాలు  ,పౌర సమస్యలపై రాశాడు .1776అమెరికన్ కాంగ్రెస్ ను మెచ్చుకొన్నాడు .ఫ్రెంచ్ విప్లవాన్ని సమర్ధించాడు .1792లో నిత్య గర్భిణి అని పించుకొన్న జీన్ ఇంకో పిల్లఎలిజ బెత్ ను  ప్రసవించింది .పొలం లో పంట  పండించా లేక పోయినా   భార్య  జీన్ కడుపు పండిస్తున్నాడీ హాలిక కవి .ఇదివరకటిలానే ఈ సంతానమూ దక్కలేదు .బర్న్స్ కుఫిట్లు  ,తాగుడు వలన వాత రోగం వచ్చింది .అయినా ‘’జాన్ ఆండెర్సన్ మై జో ‘’,అనే పురాతన బూతుకదను ఆధునిక పరిభాషలో మార్చి వివాహ బాంధవ్యాన్ని బలపరచేట్లు రాశాడు .కిల్మార్ నాక్ ఎడిషన్ తర్వాతా ఆరేళ్ళకు కొత్త ఎడిషన్ తెచ్చాడు అందులో ఇరవై  తొమ్మిది కొత్త కవితలున్నాయి .ఇందులో కొన్ని ‘’రౌడీ రైమ్స్ ‘’కూడా చేరాయి .

ముప్ఫైలలో వ్యాధి పెరిగింది .ఇంకో ఏడాదికి మరీ క్షీణించి పోయాడు .ఆకలి లేదు.ఎముకల పోగుగా మిగిలాడు .గోరు చుట్టుమీద రోకటి పోటు లా ఒక పబ్లిషర్ బర్న్స్ ఒక బిల్లుకు డబ్బు చెల్లించలేదని కోర్తుకెళ్లాడు .జైలుకు వెళ్ళాల్సి వస్తుందేమో నని మోనని భయ పడ్డాడు .భార్య జీన్ కు జాబు రాశాడు పరిస్తితి ని తెలియ జేస్తూ .అవే చివరి అక్షరాలు  .21-71796న హాలికుడై  ,నిరాశతో ఆల్కహాలికుడైన కవి రాబర్ట్ బర్న్స్ చనిపోయాడు .గొప్ప కవుల జాబితాలో బర్న్స్ చేరడు .లోతైన అంతర్ ద్రుష్టి ,ఊహా లేనికవి .భాష హోరేత్తిస్తుంది .రసహీంత ఇబ్బంది కలిగిస్తుంది .కాని ‘’Burns distilled a pure essence of the crude stuff of life ‘’అని తేల్చారు .’’a conciliation of the regional and the universal was finally accomplished .The overwhelming conflicts may have resulted in the death of the peasant ,but they brought everlasting life to the poet ‘’.

 

బర్న్స్ కవిత్వం లో రిపబ్లికనిజం తో బాటు రాదిక లిజం కూడా ఉన్నాయి .అతని దస్తూరి అనేక రకాలుగా ఉండేది అందుకని ‘’మానిక్ డిప్రెషన్ ‘’లో ఉండేవాడని తెలుస్తోంది .’’బ్లూ డేవిలిజం ‘’తో బాధ పడినట్లు అతనే చెప్పుకొన్నాడు .స్కాటిష్ కేనదియన్లు బర్న్స్ ను అమితం గా ఆరాధించారు .అమెరికా నవలా కారుడు స్టెయిన్ బెక్ బర్న్స్ కవితలో ఒక భాగాన్ని తీసుకొని ‘’ఆఫ్ మిస్ అండ్ మెన్ ‘’నవల రాశానని చెప్పుకొన్నాడు .సాలింజర్ కూ ప్రేరణ నిచ్చినకవి .బర్న్స్ రచనలు రష్యన్ భాషలోకి అనువాదం చెంది సామాన్యులను విశేషం గా ఆకట్టుకొన్నాయి .’’ఏ మాన్స్ ఏ మాన్ ‘’కవిత రష్యన్ లకు ప్రగతి శీలం గా అనిపించి’’ప్రోగ్రెసివ్ ఆర్టిస్ట్ ‘’అన్నారు . 1924.రష్యాలోకి అనువదింప బడిన కవితలు ఆరు లక్షల కాపీలు అమ్ముడై రికార్డు సృష్టించాయి .బర్న్స్ పేరా ప్రత్యెక స్టాంప్ ను రష్యా ప్రభుత్వం విడుదల చేసింది .రాబర్ట్ బ్రౌన్ స్కాలర్శిప్పులిస్తున్నారు .బర్న్స్ పేరా అయిదు పది పౌండ్ల కరెన్సీ నోట్లు విడుదల చేశారు .’’ది గ్రేటెస్ట్ ష్కాట్ ‘’గా గౌరవించి ఆరాధిస్తున్నారు .

 

Inline image 1

 

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-5-14ఉయ్యూరు –

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

హనుమజ్జయంతి

ఉయ్యూరు శ్రీ సువర్చలన్జనేయ స్వామి దేవాలయం లో శ్రీ హనుమజ్జయంతి మూడుర్ ఒజుల పాటు  వైభవం గా జరిగింది . మొదటి రోజు 21-5-14బుధవారం ఉదయం అయిదు గంటల నుండి అష్ట   కలశాల శ్రీ స్వామి    స్నపన నిర్వహించాము   అనంతరం ,మన్యుసూక్తం తో అభిషేకం నిర్వహించాము ఆలయ అర్చకులు ఛి వేదాంతం మురళీ కృష్ణ ఈ కార్యక్రమాన్ని మా అబ్బాయి వెంకట రమణ స్వయం గా పాల్గొని  జరిపించాడు .ఉదయమ్ తొమ్మిది గంటలకు సామూహికం గా గంధ సిందూర పూజ జరిగింది .నైవెద్యమ్ తీర్ధ ప్రసాద వినియోగం తో మొదటి రోజు ఉదయం కార్య క్రమం పూర్తీ  అయింది

 

సాయంత్రం  సరసభారతి 61వ కార్య క్రమంలో  శ్రీమతి కొమాండూరి కృష్ణ ‘’దాస్య భక్తీ –శ్రీ ఆంజనేయ స్వామి ‘’అనే అంశం పై గంట సేపు అలవోకగా ,ఆసక్తిగా ,ఎన్నో ఉదాహరణలతో ,ప్రసంగించారు .యామెకు ఆలయ మర్త్యాదతోఅర్చకుడు సన్మానించాడు . సరసభారతి ఆమెకు చీరా జాకెట్ శాలువా 500రూపాయల  నగదు ,జ్ఞాపిక సరసభారతి పుస్తకాలనిచ్చి మా అమ్మాయి ఛి సౌ విజయ లక్ష్మి చేత  సత్కరించింది .ఇందులోకార్య దర్శి శ్రీమతి శివలక్ష్మి సహకరించింది . అంతకు ముందు హనుమాన్ చాలీసా చేసిన శ్రీ గుడిసేవ స్వామి కి రెండు వందల రూపాయలు నగదు కానుక గా అందించాను ..తరువాత శ్రీ సీతారామాంజ నేయ భక్త సమాజం వారు రెండుగంటల సేపు తన్మయత్వం తో భజన చేసి అందరి ప్రశంసలు అందుకొన్నారు .వారి నాయకులు శ్రీ బాబూరావు గారికి ఆలయ మర్యాదలతో ముందుగానూ తరువాత సరసభారతి సత్కరించి500రూపాయలు నగదు కానుక, శాలువా, జ్ఞాపిక పుస్తకాలను అంద జేసింది మొదటి రోజు కార్యక్రమం ఇలా భక్తీ శ్రద్ధలతో బాగా జరిగింది .

రెండవ రోజు 22-5-14గురువారం ఉదయం తొమ్మిది గంటలకు సామూహికం గా ,రసాల మామిడి పండ్ల   తో ,అరటి పండ్ల తో దానిమ్మ ,బత్తాయి ద్రాక్ష జామ సపోటా బొప్పాయి మొదలైన పండ్ల తో విశేష అర్చన నిర్వ హించాము .న భూతో గా సాగిన ఈ పండ్ల పూజ చాలా వైభవం గా జరిగింది .ప్రసాద నైవేద్యం ,మంత్రం పుష్పం తీర్ధ ప్రసాద వినియోగం తో ఉదయం కార్యక్రమం ముగిసింది .సాయంత్రంసరసభారతి నిర్వహించిన 62వ సమావేశం లో  మచిలీ పట్నం సోదరులు ఛి వీరు భొట్ల పవన్ కుమార్ (12సం ),వరప్రసాద్ (6సం)లు పల్నాటి బాలచంద్రుడు మాయ సభలో దుర్యోధనుడు ,అర్జునుడు మొదలైన వేషాలతో పౌరాణిక ,వేషధారణ తో ముచ్చటగా నటించి మెప్పించారు .నిన్న ,ఈ రోజు జరిగిన ఈ సాంస్కృతిక కార్యక్రమాలకు జనం పెద్దగా రాక పోవటం బాధించింది .ఎండ వేడి కూడా 43 ఉండటం ఒక కారణం అయి ఉంటుంది .పెళ్ళిళ్ళ సేజన్ కూడా .వీరు భొట్ల చిరంజీవులకు మా మనుమరాలు ఛి రమ్య చేత శాలువాలు కప్పించి ఒక్కొక్కరికి 500రూపాయల కానుక లిప్పించి పుస్తకాలు జ్ఞాపికలు అంద జేయిన్చాము .అంతకు ముందు ఆలయ సంప్రదాయం తో ఆ చిన్నారులకు శేష వస్త్రాలను అర్చకుని చేత అంద జేయిన్చాం .వీరి తండ్రి శ్రీ మూర్తి గారిని సరసభారతి సత్కరించి శాలువా1000రూపాయల నగదు పుస్తకాలు జ్ఞాపికలను మా అన్నయ్య గారి అబ్బాయి ఛి రామనాధ బాబు చేత ఇప్పించాము . మూర్తి గారు ఏంటో శ్రద్ధతో పిల్లలను తీర్చి దిద్దుతూ ,ఆహార్యం తానే సమకూరుస్తూ ,పడుతున్న కష్టం మరిచి పోలేనిది .కార్య దర్శి శ్రీమతి శివ లక్ష్మి కూడా పాల్గొన్నది .తర్వాతా జరగాల్సిన కూనపరెడ్డి వెంకటేశ్వర రావు భజన .అతను రాక పోవటం తో రద్దు అయింది .చక్ర పొంగలి పులిహోర ప్రసాదాలను అందరికి అంద జేశాం.దీనితో రెండవ రోజు కార్యక్రమం పూర్తయింది

23-5-14-శుక్రవారం  వైశాఖ బహుళ దశమి శ్రీ హనుమజ్జయంతి –సందర్భం గా ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు’’ వంద కట్టల ‘’తమల పాకులతో విశేష అర్చన(నాగవల్లీ దళపూజ ) నిర్వహించాము .ఉదయం ఆలయం తెరచినప్పటి నుండి స్వామి వారల దర్శనానికి వందలాదిగా భక్తులు వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళారు .పది గంటలకు శ్రీ సువర్చలాన్జనేయస్వామి వారాలకు శాంతి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించాము .మా ఆలయ అర్చకుడు మురళి,విశ్వశాంతి ఉపాధ్యాయుడు శ్రీ చక్ర వర్తి పౌరోహిత్యం చేసి విశేషాలను తెలియ జేస్తూ శ్రీ బలరామ కృష్ణ గారి సహకారం తో కల్యాణాన్ని కమ నీయం గా నిర్వహించారు. నేనూ ,మా శ్రీమతి పీటల మీద కూర్చుని శ్రీ స్వామి వారల కల్యాణాన్ని శ్రద్ధ గా నిర్వహించాము .ఎండ 44దిగ్రీలున్నా భక్త జనం సముద్రం లా వచ్చి ఆలయం లో బయటా షామియానాలలో కూర్చుని కన్నుల పండువుగా కల్యాణాన్ని దర్శించి తరించారు .మేము మాత్రమె స్వామి వారాలకు తలంబ్రాలు పోయటం కాకుండా వచ్చిన అందరి చేతా తలంబ్రాలనుప్రతిసారీ లాగే తలంబ్రాలు  పోయిన్చాము .భక్తులు పరవశించి పోయారు .శ్రీ బంగారు నాగేశ్వర రావు గారు ప్రతి ఏడాది లాగానే ఈ ఏడు కూడా స్వామి వారికి వెండి ఉత్త్తర జంధ్యాలు అమ్మ వారికి మట్టెలు ,మంగళ సూత్రాలుతయారు చేసి  తలంబ్రాలకు ముత్యాలు  తయారు  భార్య గారితో అంద జేశారు .ఆమె కూడా కల్యాణం అయేవరకు కూర్చుని ఆనందించారు .సరసభారతి కార్యక్రమాలను ఆలయం లో నిర్వహించ టానికి సహకరించిన మా అర్చకుడు ఛి మురళిని శాలువాతో ను 500రూపాయల నగటు తోను సత్కరించాము .హైదరాబాద్ నుంచి వచ్చిన మా పెద్ద కోడలు ఛి సౌ సమతా మా అమ్మాయి ఛి సౌ విజ్జి మా మనవరాలు ఛి రమ్య వచ్చిన వారందరికీ నిన్న పూజ చేసిన రసాల మామిడి పండ్లు అంద జేశారు .బహుశా ఉయ్యూరు లో ఇలా ప్రతి ఏడూ శ్రీ హనుమజ్జయంతి రోజున మామిడి పండ్లను పంచిపెట్టటం మా ఆలయం లో తప్ప ఏ ఆలయం లోను లేదు .దీనికి నాకు స్పూర్తి –మా చిన్నప్పుడు విష్ణ్వాలయం  లో వైశాఖ పౌర్ణమి నాడు శ్రీ వేణుగోపాల స్వామి  కల్యాణాన్ని నిర్వహించేవారు .ఉయ్యూరు హెడ్ కరణం స్వర్గీయ ఆదిరాజు నరసింహా రావు గారు ట్రస్ట్ బోర్డ్ అధ్యక్షులుగా ఉండి కార్యక్రమాన్ని నిర్వహించే వారు .అప్పుడు ‘’పోతుల్లాంటి బంగినపల్లి మామిడి పళ్ళు ‘’ఆందరికీ ఇచ్చేవారు .ఆ తర్వాత ఎవరూ చేసిన జ్ఞాపకం లేదు .మన ఆలయం లో భక్తుల సహకారం తో దీన్ని నిర్వహిస్తూ  వస్తున్నాము ..అప్పాలు ,రవ్వకేసరి ,పులిహోర ,పానకం ల ప్రసాదాలిచ్చి అందరి మన్ననలను పొందాము .సాయంత్రం కాలనీ మహిళా మండలి వారు శ్రీ హనుమాన్ చాలీసాను 108సార్లు పారాయణ చేసి భక్తీ ప్రకంపనలు సృష్టించారు .వీరికి  ప్రేరణ గా మొదటి నుంచీ ఉన్న యాభై ఏళ్ళ క్రిందటి నా శిష్యురాలు ,నా దగ్గర ఎస్ ఎస్ ఎల్ సి కి ట్యూషన్ చదివి మా ఇంట్లోనే పడుకొని చదివిన ఛి భాగ్య లక్ష్మి కి అందరి మాట గా మా పెద్ద కోడలు ఛి సౌ సమత తో శాలువా కప్పించి 500నగదు జ్ఞాపిక మహిళా మాణిక్యాలు పుస్తకం ఇప్పించాను .మా పెద్దబ్బాయిఛి శాస్త్రి  చిన్నప్పుడు భాగ్య లక్ష్మి చదివింది .వాడికి రోజూ జడ వేసి పూలు పెట్టేది .అలాంటి శాస్త్రి భార్య సమత చేత సన్మానం చేయించటం తమాషా అనిపించింది. మా అబ్బాయి ఛి రమణ మొక్కుకున్న108కొబ్బరి కాయలను మా కోడలు అమ్మాయి మనవరాలు బడ్డీ బుడ్డి వాళ్ళన్నయ్య పెద్దాడు సహాయంతో కొట్టారు .అందరికి కొబ్బరి చిప్ప అరటి పండ్లు పనస తొనలు ,స్వామికి ప్రత్యేకం గా వేసిన గారెల దండ లోని గారెలు ప్రసాదం గా అంద జేశాము .సాయంత్రమూ ఖాళీ లేకుండా భక్తులు వచ్చి స్వామి దర్శనం చేసుకొని పోతూనే ఉన్నారు ..ఈ విధం గా శ్రీ హనుమజ్జయంతి అత్యంత వైభవం గా మూడు రోజులు జరిగి అందరికి ఆనందం కలిగించింది .

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -24-5-14-ఉయ్యూరు

 

 

 

Posted in దేవాలయం | Tagged | Leave a comment

సంక్షోభంలో భాషా వికాసం

సంక్షోభంలో భాషా వికాసం

రాష్ట్ర విభజన తరువాత సాంస్కృతిక రంగం, భాషా వికాసం వంటివి ఏ రూపం సంతరించుకోబోతున్నాయన్నది అటు తెలంగాణలోనూ, ఇటు ఆంధ్రప్రదేశ్‌లోనూ చర్చనీయాంశంగా మారింది.

తెలుగుతనానికి ప్రతిరూపంగా ఉండాల్సిన మన ప్రభుత్వ సాంస్కృతిక శాఖ మరో వారం రోజులలో పెనుమార్పులు సంతరించుకోబోతోంది. జూన్ 2 నుంచి 2 రాష్ట్రాలుగా అవతరించనున్న అరవై ఏళ్ళ ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తెలంగాణ రాష్ట్రంలో సరికొత్త సాంస్కృతిక శాఖ మొగ్గ తొడగబోతోంది. ఇప్పటి దాకా కొనసాగిన భాషా, సాంస్కృతిక శాఖ మరో ఆరు నెలల కాలంలో ఎలా రూపుదిద్దుకోబోతోందనే చర్చ ప్రారంభమైంది. పలు ప్రాంతాల్లో కళాకారులు తమకు తోచిన రీతిలో సదస్సులు, చర్చలు కొనసాగిస్తున్నారు. 1981లో సాంస్కృతిక శాఖ ఏర్పడిన తరువాత 33 ఏళ్ల కాలంలో ఇది రూపు మార్చుకోవడం ఇదే మొదటిసారి. ఇప్పటి దాకా సజావుగా సరైన కార్యక్రమాలేవీ జరగలేదు. సరైన విధివిధానాలే రూపుదిద్దుకోలేదు. ప్రస్తుతం రమారమి 265 మంది సిబ్బంది, వారికి బాధ్యతలు నిర్దేశించే ఒక సంచాలకుడు దాదాపుగా 70 కోట్ల రూపాయల కేటాయింపులతో ఈ శాఖలో వ్యవహరాలు జరుగుతున్నాయి. అయితే, ఈ కార్యక్రమాలు మదింపు మాత్రం ఇంతవరకూ జరగలేదు.

తెలుగు కళా రంగంలో ముఖ్యమైన అధ్యాయాలు, ఘట్టాలు కాగితాల కట్టల్లో చిందరవందర అయిపోతున్నాయి. తెలుగువారికి మాత్రమే చెందిన సంస్కృతీ సంప్రదాయాలను భద్రపరచటం వంటివి ప్రభుత్వం తమ బాధ్యతగా భావించడం సాంస్కృతిక శాఖ చరిత్రలోనే లేదు. కొద్ది మంది కళాకారులు మాత్రమే దీని వల్ల ప్రయోజనం పొందారు. ప్రభుత్వ నిర్వహణలోని ప్రాంగణాలు, నిర్వహణాధికారులు, అతి కొద్ది మంది కళాకారులు ఉత్తుత్తి సంబరాలతో 60 ఏళ్లు కోట్లాది రూపాయలను దుర్వినియోగం చేశాయి. చాలామంది ముఖ్యమంత్రులు, సాంస్కృతిక రంగం పట్ల కనీస అవగాహన, మమకారం లేని వారు కొందరి ఇచ్చకాలను, అవినీతి మాయలను గొప్పవిగా భ్రమింపచేస్తూ ప్రభుత్వపరమైన మోసాన్ని పరంపరగా కొనసాగించారు.

తెలియని సంస్కృతి
మన ప్రభుత్వ రాజముద్రికలో ఉన్న విశేషాల నుంచి పలు అంశాలపై అవగాహన, మమకారం పెంచకుండానే, కనీస ప్రయత్నాలు లేకుండానే ఆరు దశాబ్దాలు గడిచిపోయాయి. మన సంస్కృతికి కీలకమైన ప్రతీకగా శాతవాహనుల పాలనను ప్రస్తుతించే పూర్ణకుంభం తెలుగు సచివాలయం ముందు అనామకంగా ఎవరి పట్టింపూ లేకుండా ఉంది. మా తెలుగుతల్లికి మల్లె పూదండ అనే తెలుగుజాతి గీతం ఇక మీదట ఒక రాష్ట్రానికే పరిమితం అయిపోయింది. తెలుగుజాతి జీవనాడిగా ఒక శాస్త్రీయ నృత్య సంప్రదాయంలో సుశిక్షితులైన 25,000 మంది కళాకారులతో ప్రపంచ వేదికలు, రికార్డులు నెలకొల్పిన కూచిపూడి నాట్యం కూడా అధికారికంగా కుంచించుకుపోబోతోంది.
మన రాష్ట్రంలో తొలి రోజుల్లో విద్యాశాఖలో ఆ తరువాత సమాచార పౌర సంబంధాల శాఖలో అంతర్భాగంగా ప్రభుత్వ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారు. 1981 జూలై నుంచి ఇప్పటి సాంస్కృతిక శాఖ ఉనికిలోకి వచ్చింది. ఆ శాఖ ఏర్పాటయినా సాహిత్యం, కళలకు సంబంధించి అకాడమీలు కూడా కొనసాగుతూ ఉండేవి. ఆయా అకాడమీలకు అధ్యక్షులు, సిబ్బంది ఉండేవారు. అన్ని కళలకు ఆలవాలంగా కేంద్ర ప్రాంగణంగా రవీంద్ర భారతి పెద్ద ప్రయత్నాలు లేకుండానే రూపుదిద్దుకొంది.
ప్రామాణికమైన కళారంగ విశ్లేషకుడిగా రచయితగా ప్రసిద్ధి చెందిన పి.ఎస్.ఆర్. అప్పారావు తొట్టతొలి సంచాలకుడిగా సాంస్కృతిక శాఖ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టారు. ఆయన తరువాత కన్యాశుల్కం నాటకం, శంకరాభరణం సినిమాల ద్వారా లబ్ధప్రతిష్టుడైన జె.వి. సోమయాజులు సంచాకుడిగా బాధ్యతలు నిర్వహించారు. సంస్కృతి, కళలపై నిజమైన మక్కువ కలిగినవారు ఏ కార్యక్రమాన్ని చేపట్టినా దాన్ని తమ వ్యక్తిగత ప్రయోజనానికి అనువుగా మలుచుకోగలిగిన సమర్థ అవినీతిపరులు సంచాలకుడి బాధ్యతలను, పనితీరును పలు విధాలుగా మలుపులు తిప్పారు. పలు ప్రభుత్వ శాఖలను ఏక కాలంలో నిర్వహించిన రికార్డుతో పాటు శిల్పారామం వంటి సాంస్కృతిక కేంద్రాలు నెలకొనటానికి కారకుడైన అధికారి జి. కిషన్‌రావు. ఇక కె.వి.రమణ వంటి ఐ.ఏ.ఎస్ అధికారులు పలు చర్యలతో సాంస్కృతిక రంగానికి పేరు ప్రతిష్ఠలు సంపాదించిపెట్టారు.

ఈ శాఖకు ఇంతవరకూ 32మంది సంచాలకులుగా వ్యవహరించారు. ఈ శాఖలో ఐ.ఎ.ఎస్ సీనియర్ అధికారులతో పాటు తెలుగు సంస్కృతి పట్ల ఏమాత్రం గౌరవాభిమానాలు లేని వారు కూడా ఆ స్థానంలో అధికారం చలాయించి అప్పటి దాకా సక్రమంగాఉన్నవాటిని కూడా భ్రష్టుపట్టించారు. ప్రస్తుతం సంచాలకుడిగా కొనసాగుతున్న కవితా ప్రసాద్ 5 ఏళ్ళుగా ఆ శాఖలో పలు చ క్కని కార్యక్రమాలకు సమన్వయకర్తగా వ్యవహరించారు. గతంలో ఎన్నడూ లేని అట్టహాసాలు 100 కోట్ల పైచిలుకు నిధుల వ్యయం ఆయన హయాంలో జరిగాయి. జీవ వైవిధ్య సదస్సు, ప్రపంచ మహాసభలు, పలు ఉత్సవాలు రవీంద్రభారతి ప్రాంగణంలో నిర్వహించిన శతరూప వంటి కార్యక్రమానికి 80 లక్షల పైచిలుకు ఖర్చుతో వర్ధమాన కళాకారులకు గతంలో లేని నగదు పారితోషికంతో ప్రోత్సహించారు.
2012 లో జరిగిన 4వ ప్రపంచ మహాసభల తరువాత ప్రభుత్వం 2013 ఏడాదిని భాష సాంస్కృతిక శాఖ సంవత్సరంగా ప్రకటించింది. అన్ని జిల్లాలో కలెక్టర్లకు వినిమయ అధికారం కట్టబెడుతూ 45 కోట్ల రూపాయల పైచిలుకు ఖర్చు చేసింది. అయినా పలు జిల్లాల్లో లెక్కలు పూర్తి కాని గందరగోళంలోనే రాష్ట్ర విభజన జరిగిపోతోంది. తెలుగు మహాసభల నిర్వహణలో నిధులు ఉదారంగా రావటంతో పందేరం కూడా మరింత ఉదారంగా జరిగింది. వాటికి బాధ్యులు ఎవరు అన్న మీమాంస కొనసాగుతుంది.

సాంస్కృతిక విభజన
విభజనకు సంబంధించిన 9వ షెడ్యూల్‌లో భాగంగా భాషా సాంస్కృతిక శాఖ రెండు పాయలు గా వేరు దారుల్లో సాగేలా సంసిద్ధం అయిపోయింది. 52 -48 నిష్పత్తిలో పంపకాలకు ప్రతిపాదనలు ఖరారు అయిపోయాయి. జూన్ నెలాఖరు దాకా తాత్కాలిక ఏర్పాట్లు ఆ తరువాత ఆయా రాష్ట్ర ఏలికల ఆలోచనలకు తగిన రీతిలో తలపెట్టినవన్నీ సజావుగా జరిగేలా నిర్దేశన మార్గం రెడీ అయింది. మొదటి 4 మాసాలకు అవసరమైన నిధుల కేటాయింపు కూడా జరిగిపోయింది. రెండు రాష్ట్రాలకు చెరి 17 కోట్ల రూపాయలు అందివచ్చే ఏర్పాటు జరిగింది. జూన్ 3 నాటికి రెండు రాష్ట్రాలకు చెందిన సాంస్కృతిక శాఖల కార్యాలయాలకు సంబంధించి భవనాలు, అందుకు కావల్సిన వనరుల కేటాయింపు ఖరారు అయినా అందుకు భాధ్యతలు వహించాల్సిన సంచాలకుల ఎంపిక నియామకం దశ మాత్రం కనీస సన్నాహాలకు నోచుకోలేదు.

ప్రస్తుత సంచాలకుడి నియామకం తెలంగాణకు చెందినవాడైనా డిప్యుటేషన్ కావటంతో సందిగ్ధత కొనసాగుతోంది. ఆంధ్ర ప్రాంత శాఖకు సంచాలకుడి నియామకం కూడా జరగాల్సి ఉంది.కాగా ఈ శాఖకు సంబంధించి సంపూర్ణ అవగాహన, కళారంగం పట్ల అభినివేశం కలవారిని మాత్రమే నియమించాలన్న మార్గదర్శక సూత్రం ఖరారు అయింది. అందుకు తగ్గ వెతుకులాటకు ఎక్కడా ప్రయత్నం ప్రారంభం కాలేదు. భాష, పురావస్తు ప్రదర్శనశాలలు, అందుకు సంబంధించిన శాఖ, శిల్పకళ, పౌర గ్రంథాలయాలు, ప్రాచ్యలిఖిత ప్రతుల భాండాగారం, అన్ని కళలకు చెందిన అకాడమీలు, ప్రాచీన భాష హోదా వంటివి కూడా ఈ శాఖలో ఉండేలా చేయాలన్న నిర్ణయం పరిశీలనలో ఉంది. ప్రతిష్టాత్మకమైన రవీంద్రభారతి ,తెలుగు లలితకళా తోరణంలు పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికి చెందుతాయి. ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల విభజన కూడా పూర్తయిపోయింది.హైదరాబాదులోని 3 కళాశాలలతో పాటు వరంగల్, నిజామాబాద్, మంధనిలలో గల కళాశాలలు తెలంగాణకు చెందుతాయి. దాదాపుగా అన్ని కళాశాలలో బోధన సిబ్బందికి చెందిన ఖాళీలు చాలా ఉన్నాయి. అందుకు అవసరమైన నియామకాలకు చేపట్టిన చర్యలు తొలిదశలోనే పెండింగ్‌లో ఉన్నాయి.

హామీలు గాలికి…
గతంలో 4 గురు ముఖ్యమంత్రులు ఉగాది రోజున ప్రకటిస్తామని హామీలు ఇచ్చి దశాబ్దాలు గడిపేశారు. ప్రస్తుతం దాని ప్రస్తావనే లేదు. 3 అకాడమీలకు సంబంధించి విధాన నిర్ణయం జరిగినా అమలుకు ప్రయత్నాలు ప్రారంభం కానే లేదు. అత్యుత్తమ నాటకాలు, నవలలకు ప్రభుత్వం తరఫున పోటీలు నిర్వహించి లక్ష రూపాయల బహుమతులు, ప్రోత్సాహక బహుమతులు ఇవ్వాలన్న నిర్ణయానికి స్పందన బాగున్నా తదుపరి చర్యలకు చురుకుదనం కొరవడింది. రమారమి 150 నాటకాలు 50 నవలలు పోటీలకు సమాయత్తం కాగా, అందుకు తగిన న్యాయ నిర్ణయం ఇంతవరకూ జరగలేదు. మరో వైపు నాటక నంది పోటీలు నిర్వహించే బాధ్యత రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అబివృద్ధి సంస్థ నుంచి సాంస్కృతిక శాఖకు మార్పిడి అయినా గత ఏడాది పోటీలు వరంగల్ లో నిర్వహించాలన్న విధాన నిర్ణయం సమాచార పౌర సంబంధాల కమీషనర్ వద్ద నానుతోంది.

ఏప్రిల్ 16 న తెలుగు రంగస్థల దినోత్సవం నిర్వహించే ఆనవాయితీ ఈ ఏడాది ఉత్తుత్తి మంత్రం అయింది. ఇలా ఉండగా, తెలుగు సాంస్కృతిక వికాసంపై ఇరు ప్రాంతాలలో చర్చలు, సదస్సులు జరుగుతున్నాయి. ఏలూరులో కళారత్న కె.వి.వి. సత్యనారాయణ, పలు నంది అవార్డుల విజేత ఖాజావలీ, కూచిపూడి గురువు పసుమర్తి కేశవ ప్రసాద్ అ నిర్వహణలో కొత్త రాష్ట్రంలో సాంస్కృతిక విధానంపై చర్చాగోష్టి నిర్వహించారు. హైదరాబాదులో ఎల్లా వెంకటేశ్వరావు నేతృత్వంలో పలువురు కళాకారులు ప్రతిపాదనలు చేశారు. కేంద్ర రాష్ట్ర పురస్కార గ్రహీతలు, పలువురు విద్వాంసులు కళారంగం వికాసం కోసం రెండు తెలుగు రాష్ట్రాలలో చేపట్టాల్సిన విధివిధానాలను నూతన ప్రభుత్వాలకు సమర్పించనున్నారు. తెలంగాణకు చెందిన కళాకారుల పక్షాన కరీంనగర్‌లో కృపాదానం, వరంగల్ ప్రాంతీయులు పి. శేఖర్ బాబు, వనం లక్ష్మీకాంతరావు, మిర్యాలగూడెంలో తడకమళ్ల రామచంద్రరావు వంటివారు ప్రభుత్వానికి కొత్త ఆలోచనలు అందచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఞ జి.ఎల్.ఎన్. మూర్తి

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సాహితీ గంధం గంగాధరం

సాహితీ గంధం గంగాధరం

1974లో అరసం మహాసభలు ఒంగోల్లో జరిగినప్పుడు చిరసం నుంచి మధురాంతకం రాజారాం,
కలువకొలను సదానంద, ఎస్.మునిసుందరం లాంటి ప్రముఖ సాహితీ మూర్తులతోను, కవి మిత్రులు
విజయకుమార్ (సౌభాగ్య), కేఎస్వీల తోను గంగాధరం శిష్యుణ్నిగా ఆయన వెంట వెళ్లడం అదో మరపురాని అనుభూతి! 1975 జనవరిలో అనుకుంటా కడపలో ఆ జిల్లా రచయితల సంఘం ఏర్పాటు చేసిన మూడు రోజుల సాహితీ సమావేశాల్లో పాల్గొన్నారు గంగాధరం. ఆధునిక కవిత్వం గురించిన సదస్సుకి ఆయనే అధ్యక్షత వహించారు.

ఇవాళ మన వాడుకలో లేకపోవడం వల్ల రంగు రుచి వాసన కోల్పోయిన మాటల్లో త్రికరణశుద్ధి ఒకటి. మంచినే అనుకోవడం, అనుకున్నదే చెప్పడం, చెప్పినట్టే చెయ్యడం ఇదీ త్రికరణశుద్ధి! అయితే లోపల ఏదో అనుకోవడం, ఆ అనుకున్నది లోపలే దాచుకోవడం, ఆ ఆలోచనకి, ఈ మాటలకి ఏమాత్రం సంబంధం లేనట్టుగా తమ ప్రయోజనం మాత్రమే పరమావధిగా ఎంత అన్యాయమయినా, అక్రమమయినా ఎవరికీ వెరవక తెగించి చేసెయ్యడం- డిప్లమసీ! ఇవాళ చిన్నా పెద్దా తేడా లేకుండా ఏ పదవిలో ఉన్నవాళ్లకయినా అవశ్యం వుండవలసిన క్వాలిటీ ఇదే! ఇప్పటి మన వ్యవస్థలో ఈ బహువేషధారణ సామర్థ్యం ఎవరిలో ఎంత ఎక్కువగా వుంటే ఈ సమాజంలో వాళ్లకి అంతగా గుర్తింపు, రాణింపు! ఇదీ నేటి కాలగతి-ప్రవాహం! అయితే సమాజ హితాన్ని కోరి ఏటికి ఎదురీదగలిగిన ధైర్యస్థైర్యాలున్నవాళ్లు కళాకారులు. ముఖ్యంగా కవులు! కానీ పైకి అభ్యుదయం, సమానత్వం అంటూనే లోలోపల జాతి మూలాల్లో అభ్యుదయ వ్యాధులుగా అల్లుకుపోతున్న మేధావులు, సంకుచిత స్వభావులు కవులు కావడం అనివార్యమైన, అపాయకరమైన పరిణామం! ఇలాంటి స్వార్థపూరితమైన ఈ సమాజంలో, ఈ సన్నివేశంలో దాదాపు నాలుగు దశాబ్దాల కాలాన్నిదాటి వెనక్కి వెళితే అక్కడ ఆశావహమైన మా విద్యార్థి జీవితంలో అమాయకమైన మా అక్షర ప్రపంచంలో అప్పుడప్పుడే ఉదయించిన ఓ కాంతి పుంజం ఇప్పటికీ వెలుగులు చిమ్ముతూ గోచరిస్తుంది. అసలైన అభ్యుదయ కర్మానుష్ఠానం కోసం అవతరించిన ఆ తేజఃప్రసారం నూతలపాటి గంగాధరం! తన వ్యక్తిత్వమే కవిత్వమైన ఆ అభ్యుదయ కవిని, రవిని ఆవాహనం చేసుకున్న అనుభూతిని మనసారా ఒక్కసారిఅందుకుందామన్న ఆశతో ఒక్కసారిగా ధ్యానముద్రలోకి వెళితే –
1966 ప్రాంతాల్లో మేం చిత్తూరుజిల్లా నిండ్ర జిల్లా పరిషత్ హైస్కూల్లో పదవ తరగతిలో వున్నప్పుడొచ్చారు మాకు గంగాధరం- సీనియర్ తెలుగు పండిట్‌గా! రావడంతోటే ముందుగా మా అందరినీ ఆకట్టుకుంది ఆయన నిలువెత్తు గంభీర విగ్రహం! ఆపైన ఆయన పాఠ ప్రవచన విధానం! తర్వాత తర్వాత తన సాహితీ సంబంధమైన సంస్కారం! అంతవరకు తెలుగుని ఏదో ఒక పాఠ్యాంశంగా మాత్రమే చదువుతున్న మేము అప్పట్నుంచి అదో కవితాంశంగా ఓ ప్రత్యేకమైన శ్రద్ధతో అధ్యయనం చెయ్యడం మొదలెట్టాం. వ్యాకరణం, ఛందస్సు, అలంకారాలు కేవలం మార్కుల కోసం సాగే వ్యవహారంలా కాక మాకందరికీ అభిరుచి పాత్రమైన అంశాలుగా మారిపోయాయి. పైగా వారిమల్లే తెలుగు విద్వాన్ పట్టభద్రులమైతే తెలుగు పంతుళ్లుగా బ్రతుకు తెరువూ ఏర్పడుతుందన్న బలమైన ఆశ కూడా అప్పట్లోనే మాకు కలిగివుండాలి. కాబట్టే నేనూ, మరో ముగ్గురు మిత్రులూ పనిగట్టుకుని తిరుపతి వెళ్లి ఓరియంటల్ కాలేజీలో చేరాం! ఆయన అప్పట్లో అలా మాకు తెలుగు పండిట్‌గా రావడం వల్లే ఇవాళ మేం మీముందు ఇలా నిలబడగలుగుతున్నాం- అని ఇప్పటికీ సభల్లో చెప్పుకుంటూనే వున్నాం! శిష్యుల్ని అంతగా ప్రభావితుల్ని చెయ్యగలిగిన ఆకర్షణీయమైన వ్యక్తిత్వం గంగాధరంగారిది!
మరి గురువుగారి వూరు నాగలాపురం దగ్గర రామగిరి! మా వూరికీ, రామగిరికీ మధ్య దూరం ఆరుమైళ్లు! శనివారం సాయంత్రం నేనూ, మా వూళ్లోని మరో మిత్రుడూ నాథముని (అతనూ ఇప్పుడు లేకపోవడం అదో విషాదం) కలిసి సైకిళ్లమీద రామగిరికి బయలుదేరేవాళ్లం. అక్కడ ఆ వూళ్లో రామయ్య, రామ్మూర్తి, హరనాథ్ మొత్తం ఐదుగురు మిత్రులం. గురువుగారి వెంట పక్కనున్న అరుణా నదికి ఉదయం, సాయంకాలం మా వాహ్యాళి. ఆ గట్లు, చెట్లనీడలు తాత్కాలికంగా మా తరగతి గదులు. ఆ సమయమంతా గురువుగారి సాహితీ ప్రబోధాలు. ఇక ఆ తరువాత వారి ఇంటికి తిరిగివెళితే ఎండవేళ మండువాలో మకాం. రాత్రి డాబా మీద చందమామని చూస్తూ లైటు వెలుతుర్లో, వెన్నెల్లో కవిత్వ పఠనం. నేర్చుకుంటున్న ఛందస్సులో మా ప్రారంభ ప్రయోగాలు. గురువుగారి సలహాలు, సూచనలు!
ఆ తరువాత హైస్కూలు చదువు ముగిసి, తిరుపతికి వెళ్లి చదువుకునే ఆర్థిక స్తోమత లేక రేండేళ్లు ఖాళీగా వుండి మళ్లీ అప్పటిదాకా కలలుగన్న ఆ కాలేజీ చదువు కొనసాగించడం! అలా రెండేళ్ల తరువాత కూడా ఎల్లాగయినా సరే కష్టపడి విద్వాన్ చదవాలి అని ఆ కోర్సుని పూర్తిచెయ్యడం, కేవలం గంగాధరం గారి స్ఫూర్తివల్ల! వారి మల్లే కవిగా, రచయితగా పత్రికల్లో మన పేరూ చూసుకోవాలన్న తపన వల్ల!
అలా తిరుపతిలో వున్న నాలుగేళ్లలోను మధ్యమధ్య వారి నుంచి వుత్తరాలు! చిత్తూరు జిల్లా రచయితల సంఘం విశేషాలు, సమావేశాలు! అప్పుడే ఆయన మాటమీద అందులో సభ్యత్వం. తృతీయ వార్షికోత్సవ మహాసభల్లో తొలిసారిగా నేను కవిసమ్మేళనంలో పాల్గొనడం. అప్పుడు అధ్యక్షత వహించిన తిరుమల రామచంద్ర ‘చీకటి కళ్లు’ అన్న నా వచన కవితని ప్రత్యేకించి మెచ్చుకుంటే ఎంత సంబరపడ్డారో గురువుగారు! అలాగే నేను కాలేజీ విద్యార్థిగా వున ్నరోజుల్లోనే ఓ దినపత్రిక ఆదివారం అనుబంధంలో నా సాహిత్య వ్యాసం అచ్చయితే ఆ రోజున్నే ఓ సాహితీ సమావేశం కోసం తిరుపతికొచ్చారు గంగాధరం. అప్పట్లో కలుసుకోలేక వెంటనే వూరెళ్లిపోయారు. తరువాత ఓ రోజు వుత్తరం రాశారు. ‘నీ వ్యాసం మొదట చూసింది నేను. ఆ రోజే నీకు అభినందనలు తెలుపుదామనుకున్నాను. మళ్లీ నువ్వు కనిపించలేదు. ఉత్తరం రాద్దామనుకున్నాను. తీరిక లేకపోయింది. నీ ఉత్తరం చూశాను. బదులు రాయడానికి ఇప్పటికి తీరికైంది. సెలవులు వచ్చాయి కదా, క్షణం ఒక చోట తీరిగ్గా కూర్చోవడానికి వీల్లేకపోతోంది. నీ వ్యాసం పత్రికలో చూచినప్పుడు నేనెంత సంతోషించానో చెప్పలేను. నా మొదటి రచన అచ్చయినప్పుడు కూడా నేనంత సంతోషించలేదు.”
అంతేకాదు, అప్పట్లో నా కవితలు అచ్చయితే వాటిని క్లాసుల్లో పిల్లలకి చదివి వినిపించి “వీడు… నా శిష్యుడు” అని చెప్పి మురిసిపోయేవారట గురువుగారు! లోకంలో పుత్రోత్సాహం పొందే తండ్రులుంటారు. కాని ఛాత్రోత్సాహం పొందిన నిజమైన గురువు గంగాధ రం!
తరువాత 1974లో అరసం మహాసభలు ఒంగోల్లో జరిగినప్పుడు చిరసం నుంచి మధురాంతకం రాజారాం, కలువకొలను సదానంద, ఎస్.మునిసుందరం లాంటి ప్రముఖ సాహితీ మూర్తులతోను, కవి మిత్రులు విజయకుమార్ (సౌభాగ్య), కేఎస్వీల తోను గంగాధరం శిష్యుణ్నిగా ఆయన వెంట వెళ్లడం అదో మరపురాని అనుభూతి! ఇంకా అలాంటివే మరికొన్ని సంఘటనలు! అలాగే 1975 జనవరిలో అనుకుంటా కడపలో ఆ జిల్లా రచయితల సంఘం ఏర్పాటు చేసిన మూడు రోజుల సాహితీ సమావేశాల్లో పాల్గొన్నారు గంగాధరం. ఆధునిక కవిత్వం గురించిన సదస్సుకి ఆయనే అధ్యక్షత వహించారు. అప్పుడు పక్కనే ప్రొద్దుటూర్లో పండిట్స్ ట్రెయినింగ్‌లో వుంటూ మిత్రులతో కలిసి వచ్చాన్నేను ఆ సమావేశాలకి. అదే చివరిచూపు! ఆ సమావేశాలు పూర్తయి ఆయన రామగిరికి వెళ్లింతర్వాత సరిగా మే నెలలో నేనక్కడ ట్రెయినింగ్‌లో వుండగానే జరిగింది ఆ దుర్ఘటన! అంతటి షాక్‌లోను వెంటనే నన్ను గుర్తుతెచ్చుకుని మిత్రుడెవరో వుత్తరం రాస్తే తెలిసి తట్టుకోలేక, నమ్మీ నమ్మక, పరీక్షల్ని పట్టించుకోక పరుగెత్తుకొచ్చాను రామగిరికి! వచ్చేసరికి ఏముంది? వారి శోకగృహం అది నిజమని నమ్మమంది. అరుణా నది బావురుమంది. చేలగట్లు మౌనం వహించాయి. ఆ రాత్రి చంద్రుడు వెలవెలపోయాడు. మనస్సులో అతి భయంకరమైన, విషాదభరితమైన నిశ్శబ్దం మాత్రం అలుముకుంది.
నాకు ఊహతెలిసి నా జీవితంలో జరిగిన మొట్టమొదటి ప్రియ వియోగం అది. నాకే కాదు, మా ఇంటిల్లిపాదికీ! అదివరకోమారు మా వూళ్లో మా ఇంటిని వెదుక్కుంటూ వచ్చారు గురువుగారు. ఆ శిష్యవాత్సల్యానికి కరిగిపోయేరు అప్పట్లో మా అమ్మానాన్న, మా పెదనాన్న! ఆ అనుబంధంతోనో, ఏమో! వారిని పలకరించడానికన్నట్టు వారు వెళ్లిన ఆరు నెలలకి మా పెదనాన్న, మరో ఆరు నెలలకి మా నాన్న ‘మన గంగాధరం అయ్యోరు’ అనుకుంటూ ఆయన దగ్గరికే వెళ్లిపోయారు. నాకు లోకం తెలియని వయసులో వెంటవెంటనే ముమ్మారు వినిపించిన మృత్యుఘోష. అదే మొదటి డిప్రెషన్ నా జీవితంలో ! – విధి చవిచూపింది! తరువాతి రోజుల్లో స్నేహం పేరుతో సన్నిహితులు మిగిల్చిన చేదు అనుభవాల్ని అలావుంచితే, నా జీవననౌక అలా విద్వాన్ తీరం వేపు సజావుగా సాగడానికి చుక్కాని, తెడ్డూ తెరచాపల్లా తోడ్పడ్డ ఆ మహానుభావులు మువ్వురూ నా ఉద్యోగ జీవితం ప్రథమాంక ప్రారంభానికే లేరు. ఇప్పుడు విశ్రాంత జీవితం కొనసాగిస్తున్న ఈ దశలోను గురువుగారి జ్ఞాపకాల బరువుని మోస్తూ సజీవ స్మృతి చిహ్నాలుగా మిగిలినవాళ్లం నేనూ, నా మిత్రులు నలుగురూ వున్నాం!
గంగాధరంగారి పెళ్లి సందర్భంలో కవిమిత్రులందించిన ‘తలంబ్రాలు’ అన్న కవితా గుచ్ఛంలో
నీలిమేఘము వంటివాడా!
నేస్తుడా!
నింగిలో తారాడువాడా! – అన్న సదానందగారి సంబోధనల్లోని ఉపమ అతిశయోక్తులు తనపట్ల స్వభావోక్తిగా-
గంగాధరుని వివాహము
సంగతి విని పొంగిపోతి; సరస కవిత్వో
త్తుంగ తరంగాంచిత యగు
అంగన గొనునట్టి సుకవి కగుత శుభంబుల్
అన్న దాశరథి సంభావనకి సాక్షాత్ అక్షరరూపంగా వెలిగిన ఆ ఆదర్శామృతమూర్తిని మళ్లీ మనం చూడగలమా
ఈ చర్మ చక్షువులతో-మనశ్చక్షువులతో తప్ప!
మనసు ప్రమిదచేసి మంచిని వెలిగించి
నాడు వెలుగజేయువాడె నరుడు!- హైస్కూలు వీడ్కోలు సభలో మమ్మల్ని సాగనంపుతూ గంగాధరం పలికిన ప్రబోధం అది! అక్షరాలకీ, ఆచరణకీ మధ్య దూరం తగ్గించిన నిజమైన అభ్యుదయ కవి, కర్మిష్ఠి ఆయన.
సామాజిక వర్గ స్పృహ మరీ బలీయంగా వున్న గ్రామీణ వాతావరణంలో ఆ వర్గ విభేదాల్ని విస్మరించి తన విద్యార్థులందరికీ తమ ఇంట సమంగా ఆతిథ్యం ఇప్పించిన అభ్యుదయ భాస్కరుడు. మొదట తాను వెలిగాడు. తరువాత తనవారిని వెలిగించాడు. మొత్తం సాహితీ ప్రపంచానికే వెలుగులు పంచాడు. ఇప్పుడు ఆ వెలుగు దివ్వెలే ఆయనకి అక్షర నీరాజనం సమర్పిస్తున్నాయి. తిరుపతి పట్టణం కేంద్రంగా ‘గంగాధరం సాహితీ కుటుంబం’ పేరిట ఆయన మిత్రులు కొందరు కవిత, కథ, నవల, విమర్శ వీటిలో ఒక్కో ఏడు ఒక్కో ప్రక్రియలో ప్రతి ఏటా ఎన్నికైన అత్యుత్తమ గ్రంథకర్తకి అత్యున్నత పురస్కారం అందించి గౌరవిస్తున్నారు. చిరంజీవి ఐన కవి పేరిట సాటి కవిని ఏటా సత్కరించే సత్సంప్రదాయాన్ని ఇప్పటికీ సజావుగా కొనసాగిస్తున్నారు.
– డాక్టర్ కాసల నాగభూషణం
09444452344

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కవిత్వమై గెలిచిన తెలంగాణ

కవిత్వమై గెలిచిన తెలంగాణ

తెలంగాణ మలి దశ ఉద్యమంలో కవులు నిర్వహించిన పాత్ర మరువలేనిది.
సాహిత్య పేజీల్లో నిరంతరం కవిత్వం ఊట లాగా వెలువడుతూనే ఉండింది. వేలాది కవితలు,
వందలాది సంపుటులు, పదుల సంకలనాలు వెలుగు చూశాయి. ఎన్నో సంస్థలు ఏర్పడి
మొదలు కవిత్వం ద్వారానే తెలంగాణ ఆకాంక్షను వ్యక్తపరిచాయి.

ఉద్యమం పక్కదారి పట్టినప్పుడల్లా తెలంగాణ కవులు హెచ్చరికలయ్యారు. ఉద్యమం వెనకపట్టు పట్టినప్పుడల్లా ముల్లుగర్రలతో అదిలించారు. ఈ క్రమంలో తెలంగాణ కవులు ఎక్కడా వెనకడుగు వేసిన దాఖలా కనిపించదు. ఆత్మవిశ్వాసంతో ఎక్కడికక్కడ, ఎప్పటికప్పుడు నిలదీస్తూ ముందుకు సాగారు. యుద్ధ వీరులని తలపించారు. రాజకీయ ఉద్యమం చతికిల పడిన సందర్భాలొచ్చి నప్పుడల్లా కవిత్వంతో జవసత్వాలనిచ్చే ప్రయత్నం చేశారు.

ఉద్యమమైనా మొదట కవిత్వంలో వ్యక్తమవుతుంటుంది. భావ కవి త్వం, అభ్యుదయ, విప్లవ, స్త్రీవాద, దళిత, ముస్లిం, తెలంగాణ కవిత్వా లు ఆయా ఉద్యమాల్లో తొలి దశలో తమ వంతు పాత్ర నిర్వర్తించాయి. మిగతా ఉద్యమాల కన్నా తెలంగాణ ఉద్యమానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఉద్యమం రాజకీయ ఉద్యమంతో మమేకమై చివరికి తమ ఆకాంక్ష ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావంతో కార్యరూపం దాల్చడంతో సఫలీకృతమైంది.
తెలుగు సాహిత్యం పేరు మీద తెలంగాణ సాహిత్యానికి అన్యాయం జరిగింద ని, వివక్షకు గురైందని స్పృహలోకి వచ్చిన తెలంగాణ కవులు ఎన్నో ప్రశ్నలు సం« దిస్తూ కవిత్వం రాయడం వరకే పరిమితం కాకుండా కార్యాచరణలోకి దిగారు. తమ భాష, సంస్కృతి వేరని ఎలుగెత్తి చాటారు. ఉద్యమానికి ఊతమయ్యారు.
1969 ఉద్యమం సందర్భంలో భావజాల రంగంలో సమైక్యాంధ్ర భావనదే పైచేయి అయింది. కాని మలిదశ ఉద్యమంలో తెలంగాణ కవులు, కళాకారులు కవిత్వం ద్వారా పాట ద్వారా అనేక పుస్తకాల ద్వారా భావజాల రంగంలో సమైక్యాంధ్ర భావనను పూర్వపక్షం చేసి సీమాం«ద్రులపై పైచేయి సాధించగలిగారు.
తెలంగాణ ఉద్యమం సమయంలో ఎందరో కవులు నిలిచి వెలిగితే, మరెందరో పుట్టుకొచ్చారు. కాళోజీ లాంటివారు మొదట్లో సమైక్యవాది అయినప్పటికీ త్వరలోనే ఆయన తెలంగాణ వాదిగా మారి, ‘ప్రాంతేతరుడు మోసం చేస్తే పొలిమేర దాకా తరిమికొడతాం/ప్రాంతం వాడే మోసం చేస్తే ప్రాంతంలోనే పాతర వేస్తాం’ అనేంత తీవ్ర స్థాయిలో కవిత్వం రాశారు.
1995 నుంచి తెలంగాణ మలిదశ ఉద్యమం రాజుకుంది. 1998లో తెలంగాణ కవులు, సాహిత్యకారులు సుంకిరెడ్డి నారాయణరెడ్డి, నందిని సిధారెడ్డి, కె.శ్రీనివాస్, అంబటి సురేంద్రరాజు, కాసుల ప్రతాపరెడ్డి తదితర ముఖ్యులు కూడి తెలంగాణ సాంస్కృతిక వేదికను ఏర్పర్చుకున్నారు. ఐదుగురు కన్వీనర్లుగా- సురేంద్రరాజు, సుంకిరెడ్డి, మల్లేపల్లి లక్ష్మయ్య, అనిశెట్టి రజిత, స్కైబాబ ఎంపికయ్యారు. ఎన్నో కవిసమ్మేళనాలు, సదస్సులు జరిగాయి. ఈ సంస్థ తరఫునే సురేంద్ర రాజు, సుంకిరెడ్డి సంపాదకత్వంలో ‘మత్తడి’ (2002 డిసెంబర్) అన్న బృహత్ కవితా సంకలనం వెలువడింది. ఇందులో 1917 నుంచి 1952 వరకు ఒక విభాగం, 1952 నుంచి 1998 వర కు రెండవ విభాగం, 1995 నుంచి 2002 వరకు మూడవ విభాగంగా విభజించి మొత్తంగా 258 మంది కవిత్వాన్ని సంకలనం చేశారు. 2002 నాటికి తెలంగాణలో పేరుబడ్డ కవులందరూ ఇందులో ఉన్నారనే చెప్పవచ్చు. ‘మత్తడి’ రూపుదిద్దుకుంటున్న సమయంలోనే జూలూరి గౌరీశంకర్ సంపాదకత్వం లో ‘పొక్కిలి’ (2002 మే) సంకలనం వెలువడింది. 129 మంది కవిత్వం ఇందులో చోటుచేసుకుంది.
అప్పటికే లబ్దప్రతిష్ఠులైన సిధారెడ్డి, సుంకిరెడ్డి, జూకంటి జగన్నాధం, ఎస్.జగన్‌రెడ్డి, అఫ్సర్, సిద్ధార్థ, దెంచనాల శ్రీనివాస్, కాసుల ప్రతాపరెడ్డి, జూలూరి గౌరీశంకర్, అమ్మంగి వేణుగోపాల్, ఆశారాజు, నాళేశ్వరం శంకరం, షాజహానా, అన్నవరం దేవేందర్, అన్వర్, స్కైబాబ, పొట్లపల్లి శ్రీనివాసరావు, వఝల శివకుమార్, కోట్ల వెంకటేశ్వరరెడ్డి, కోడూరి విజయకుమార్ తదితరులు తెలంగాణ కవిత్వం రాశారు. గద్దర్, గూడ అంజయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్న తదితర వందలాది మంది వాగ్గేయకారులు తెలంగాణ ఉద్యమంలో పాటల రూపంలో కవిత్వాన్ని పండించారు. వేముల ఎల్లయ్య, ఎం.వెంకట్, సీతారాం, ప్రసేన్, యాకూబ్, అయిల సైదాచారి, పగడాల నాగేందర్, అంబటి వెంకన్న, బెల్లి యాదయ్య తదితరులు ఎంతోమంది రాసిన కవిత్వం తెలంగాణ కవిత్వానికి అదనపు సౌందర్యాన్ని, వస్తు విస్తృతిని అందించింది.
రెండేళ్ల తర్వాత సిధారెడ్డి ఆధ్వర్యంలో ఆయనే అధ్యక్షుడుగా తెలంగాణ రచయితల వేదిక ఏర్పడింది. తెరవే అన్ని జిల్లాలకు విస్తరించడమే కాకుండా ఎందరో కొత్త కవులకు ఊతమందించింది. ‘సోయి’ అనే పత్రికను వెలువరించింది. అనేక సభలు సమావేశాల ద్వారా ఉద్యమ కవిత్వం విరివిగా పుట్టుకొచ్చేలా కృషి చేసింది. 2007లో జూకంటి జగన్నాధం, జూలూరి గౌరీశంకర్ అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నికై ఈ సంస్థ మరెన్నో కార్యక్రమాలు తీసుకుంది. 2012లో ఈ సంస్థకు సూరేపల్లి సుజాత కార్యదర్శిగా ఎంపికయ్యారు. 2006లో సుంకిరెడ్డి, సంగిశెట్టి శ్రీనివాస్, స్కైబాబ, పసునూరి రవీందర్ తదితరుల పూనికతో ‘సింగిడి’ తెలంగాణ రచయితల సంఘం ఏర్పడి ఎన్నో సదస్సులు, సభలు నిర్వహించడంతోపాటు కొన్ని విశిష్టమైన సంకలనాలు వెలువరించింది. ‘1969-73 తెలంగాణ ఉద్యమ కవితా’ సంకలనం కూడా ఈ సంస్థ వెలువరించింది.
2009లో ‘జాగో..జగావో’ పేర ప్రొ.జయశంకర్ ప్రారంభోపన్యాసంతో ఒక రోజంతా జరిగిన కవిసమ్మేళనంలో వచ్చిన కవితలకు మరిన్ని పాటలు జోడించి ‘జాగో..జగావో’ తెలంగాణ ఉద్యమ కవిత్వం పేర 120 మందికి పైగా కవులతో సంకలనం వెలువడి మలి ముద్రణ కూడా పొందింది. కెసిఆర్ నిరాహారదీక్ష తర్వాత నడిచిన ఉద్యమంలో ఈ సంకలనంలోని పాటలు, కవితలు విద్యార్థులకు, ఉద్యమకారులకు ఎంతో తోడ్పడ్డాయి. టాంక్‌బండ్‌పై విగ్రహాల కూల్చివేత సందర్భంలో ‘దిమ్మిస’ వినిర్మాణ కవిత్వం పేర 51 మందితో ఒక సంకలనం వెలువడడం విశేషం. ఈ సంకలనం వల్ల కూల్చివేత పట్ల ఎక్కువ వ్యతిరేకత రాకుండా తెలంగాణ కవులు చేయగలిగారు. శ్రీకృష్ణకమిటీ రిపోర్టు వెలువడిన వెంటనే ఆగ్రహోదగ్రులైన కవులు 31 మంది దాకా కలిసి తీసుకొచ్చిన ‘క్విట్ తెలంగాణ’ సంకలనంలోని కవితలు వివాదాస్పదమవడం తెలిసిందే. తెలం గాణ వ్యతిరేకులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈ కవులను మొత్తం ఆంధ్రా ప్రాంతంవారి వ్యతిరేకులుగా చిత్రించే ప్రయత్నం జరిగింది. అనంతరం ‘మునుం’ పేర 256 మంది కవులతో మరో సంకలనం వేముగంటి మురళీకృష్ణ, వఝల శివకుమార్, అందెశ్రీ, కాంచనపల్లి, దాసరాజు రామారావు తీసుకొచ్చారు. అయితే ఈ సంకలనంలో తెలంగాణేతరులు రాసిన కవిత్వం కూడా చేర్చడం పలు విమర్శలకు దారితీసింది. తర్వాత అనిశెట్టి రజిత పూనికతో 100 మందికి పైగా కవులతో ‘జిగర్’ సంకలనం వెలువడింది. డా.ఖుతుబ్ సర్‌షార్, స్కైబాబ సంపాదకత్వంలో ‘రజ్మియా’ తెలుగు-ఉర్దూ సంకలనం (36 మంది తెలుగు ముస్లిం కవులు, 31 మంది ఉర్దూ కవులు) వెలువడింది. తెలంగాణ జాతిపిత జయశంకర్ చనిపోయిన సందర్భంలో జూలూరు సంపదకత్వంలో ‘జయశంకరా’, వేముగంటి మురళీకృష్ణ సంపాదకత్వంలో ‘జయశిఖరం’ కవితా సంకలనాలు వెలువడ్డాయి. ఇవే కాక వివిధ జిల్లాల నుంచి ఎన్నో సంస్థలు ఎందరెందరో కవులతో సంకలనాలు వెలువరించాయి. కొన్ని జిల్లాల కవులతో ప్రత్యేకమైన సంకలనాలు కూడా వెలువడ్డాయి. ప్రత్యేక సంచికల్లోనూ కవిత్వం విరివిగా చోటుచేసుకుంది. రెండు సంచికలుగా వెలువడిన ‘ముల్కి’ పత్రికలోనూ, మరెన్నో ఛోటా మోటా పత్రికల్లోనూ తెలంగాణ కవిత్వమెంతో అచ్చయింది. అన్వర్, సుంకర రమేష్, అన్నవరం దేవేందర్ లాంటివారు పత్రికల్లో అచ్చయిన కవిత్వాన్ని సంకలనాలుగా వెలువరించారు. అఖిల భారత తెలంగాణ రచయి తల వేదిక ఇతర రాష్ట్రాలలోని కవులను కూడా ఉద్యమంలో భాగం చేసింది. మొత్తంగా తెలంగాణ కవుల్లో తెలంగాణ కోరుకోని కవి ఒక్కరూ మిగలలేదంటే, తెలంగాణపై ఒక్క కవిత కూడా రాయని కవి మిగల్లేదంటే అతిశయోక్తి కాదేమో!
ఉద్యమం పక్కదారి పట్టినప్పుడల్లా తెలంగాణ కవులు హెచ్చరికలయ్యారు. ఉద్యమం వెనకపట్టు పట్టినప్పుడల్లా ముల్లుగర్రలతో అదిలించారు. ఈ క్రమంలో తెలంగాణ కవులు ఎక్కడా వెనకడుగు వేసిన దాఖలా కనిపించదు. ఆత్మవిశ్వాసంతో ఎక్కడికక్కడ, ఎప్పటికప్పుడు నిలదీస్తూ ముందుకు సాగారు. యుద్ధ వీరులని తలపించారు. రాజకీయ ఉద్యమం చతికిల పడిన సందర్భాలొచ్చినప్పుడల్లా కవిత్వంతో జవసత్వాలనిచ్చే ప్రయత్నం చేశారు.
ఉద్యమంలో భాగంగా వివిధ సందర్భాల్లోనూ విభిన్నంగా, విరివిగా కవిత్వం వచ్చింది. ‘తెలంగాణ ఎప్పుడు? ఎట్లా?’ ‘ఇప్పుడేం చేద్దాం’, ‘తెలంగాణ కవుల గర్జన’, ‘విద్రోహదినం’, ‘యుద్ధభేరి’, ‘సిర్ఫ్ తెలంగాణ’ అంటూ పూట పూటంతా, రోజు రోజంతా కవిసమ్మేళనాలతో ఉద్యమం ఉర్రూతలూగింది. ఆత్మహత్యలు, సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్, సాగరహారం ఇలా ఎన్నో సందర్భాలు పోరాట రూపాలై కవిత్వం పలికాయి. తెలంగాణ ఉద్యమం పలికించిన వివిధ రూపాలు- దూలా, బతకమ్మ, బోనాలు, రాస్తారోకోలు, రహదారుల బంద్, రోడ్లమీద వంటావార్పు-సామూహిక భోజనాలు లాంటివన్నీ కవిత్వంలోనూ ప్రతీకలయ్యాయి. సబ్బండ వర్ణాల వృత్తులన్నీ ఉద్యమంలో నిరసన రూపాలవడం, ప్రతీకలవడం విశేషం. ఇట్లా ఒక ఉద్యమం ఇన్నేసి రకాల కవిత్వాన్ని అందివ్వడం అరుదేనేమో! అయినప్పటికీ అవన్నీ ఉద్యమానికి ఊతమందించాయనడంలో సందేహం లేదు. తెలంగాణ ఏర్పడుతున్నది కాబట్టి ఇక ముందు తెలంగాణ కవులు రాశి కన్నా వాసి మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంది. మరింత బలమైన, లోతైన భావంతో, విభిన్న కోణాల నుంచి కవిత్వాన్ని అందించాల్సి ఉంది. తెలంగాణ కవిత్వం మరింత విస్తృతి పెంచుకోవాల్సి ఉంది.
-స్కైబాబ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -30 స్వర్గ నరకాల పరిణయం చిత్ర శిల్ప కవి -విలియం బ్లేక్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -30

స్వర్గ నరకాల  పరిణయం

చిత్ర శిల్ప కవి -విలియం బ్లేక్

లండన్ లో 28-11-1757న జన్మించిన విలియం బ్లేక్ తండ్రి హోసరీ మర్చంట్ .పుట్టుక నుంచి విజనరీ ద్రుష్టి ఉన్న వాడు .నాలుగేళ్ళప్పుడే భగవంతుడు కనిపించినట్లు అను భూతి పొందాడు .పొలాలలో నడుస్తూ డుస్తూ  దేవతా గణాలతో ఉన్నట్లు వాటికి రెక్కలున్నట్లు భ్రమించాడు .ప్రతి పొదలో నక్షత్రాలున్నట్లు అను భూతి పొందాడు .వాటిని తన చేతి అర్రతో స్పర్శించి ఆనందాన్ని పొందాడు .తమ్ముడు రాబర్ట్ ఈ అనుభవానికి ప్రత్యక్ష సాక్షి .పెద్దన్న జేమ్స్ తండ్రి వ్యాపారాన్ని నిర్వహిస్తే మూడో వాడు జాన్ తప్ప తాగి చనిపోయాడు .సోదరి కేతరీన్ అవివాహితగానే ఉండి పోయింది

బ్లేక్ స్కూల్ లో చదవనే లేదు .ఎప్పుడూ యేవో బొమ్మలు వేసుకొంటూ ఆ నాటి లండన్ ను కొత్తకోణం లో చిత్రించేవాడు  ఇంటికి ధేమ్స్ నది అతి దగ్గర.ఇవే అతని జీవితాన్ని మలుపు తిప్పాయి .ఆ నాటి కుర్ర కారు కు విరుద్ధం గా కొడుకు ఉండటాన్ని తండ్రి విపరీత ధోరణిగా భావించక ప్రోత్సహించాడు .పదో సంవత్సరం లోనే ఆర్ట్ క్లాసులకు పంపాడు .ప్లాస్టర్ ,గ్రీకు దేవతలా చిత్రాలు డబ్బు  ఇచ్చి అతని సృజనను ప్రోత్సహించాడు .బ్లేక్ జీవితాదర్శం మైకేల్ యాంజే లో ల అవ్వాలని .సొసైటీ ఆఫ్ అప్ప్రేన్టిస్  లో చేరాడు .వెస్ట్ మినిస్టర్ ఆబ్బే లో ఉన్న స్మ్రుతి చిహ్నాలను కాపీ చేసుకొన్నాడు .అందులోని గోదిక్ ఆభరణాలపై ప్రత్యెక ద్రుష్టి పెట్టాడు .ఈ భావన ను ఎప్పుడూ వదలుకోలేదు .పదహారు లో స్వంత ‘’జోసెఫ్ ఆఫ్ అరిమాటియా అమాంగ్ ది రాక్స్ ఆఫ్ ఆల్బియాన్ ‘’అనే శిల్పాన్ని తయారు చేశాడు .దీని నేపధ్యం అంతా సృజన తో కల్పించాడు .ఇది మైకేలాన్జేలో శిల్పం ‘’ క్రూసి ఫిక్సేషన్ ఆఫ్ సెయింట్ పీటర్ ‘’ను గుర్తుకు తెస్తుంది .దీనిని వర్ణిస్తూ’’ఈ పదహారేళ్ళ పడుచు కుర్రాడు ‘’ రాసిన  కేప్షన్ తలలు పండిన పండితులు రాసినట్లు గా ఉండి అందర్నీ ఆశ్చర్య పరచింది అదే –‘’this is one of the Greek artists who built the cathedrels in what we call the Dark ages wandering about in sheepskins and goat skins ,of whom the world was not worthy .Such were the Christians in all ages ‘’.

ఇరవై ఒకటి లో బసీర్ దగ్గర శిక్షణ పూర్తీ చేసుకొని స్విస్ ఆర్టిస్ట్ జార్జి మోసర్ దగ్గర చేరి మెరుగులు దిద్దుకొన్నాడు .మానసిక దృష్టితో ప్రతి విషయాన్ని దర్శించి అనుభూతి చెంది చిత్రించే వాడు, శిల్పించేవాడు .గోదిక్ కళలో శిల్పాలు జీవంలేక శవాక్రుతి లో ఉన్నాయని పించేవి .వాటికి అమరత్వం లేదని  అనుకొన్నాడు .స్వీయ భావన తో అనేక చిత్రాలు గీశాడు ,చెక్కాడు  కాని అవి జీవన భ్రుతికి సరిపడడబ్బు నివ్వలేదు .’’ఎటర్నల్ యూత్ ,ఎటర్నల్ మాన్ ‘’గా తయారు చేశాడు .ఏంతో మానసిక ఆనందాన్ని అనుభ వించాడు .’’గ్లాడ్ డే ‘’అనేది బ్లేక్ ఆదర్శ చిత్ర రాజం .అన్నారు   బంగారు రంగు జుట్టుతో బ్లేక్ స్వర్ణ  కిరీట దారి గా కనిపించేవాడు .ఇరవై అయిదులో కీధరిన్ సోఫియా బూచర్ తో సల్లాపం సాగించాడు .నల్ల కళ్ళచదువు రాని ఆ సుందరిని పెళ్ళాడి తానె గురువై చదవటం రాయటం నేర్పాడు .ఆదర్శ గృహిణి గా ఆమె సహకరించింది .తన భర్త ఎప్పుడూ స్వర్గ లోక విహారే అనేది ఆమె .తిండికి కూర్చున్నప్పుడు ఖాళీ ప్లేట్ మాత్రామే పెట్టేది .తండ్రి చనిపోయిన తర్వాత కుటుంబాన్ని పెద్దన్న చూసుకొన్నాడు .బ్లేక్ ఒక ప్రింట్ షాప్ పెట్టాడు .అన్న రాబర్ట్ అకస్మాత్తుగా మరణించాడు .రాబర్ట్ ఆత్మా సీలింగ్ దాటి విశాల గగనం లోకి చేరటం తాను చూశానని బ్లేక్ చెప్పాడు .సచిత్ర మేగజైన్లను తాయారు చేయటం స్వీయానుభవం తో సాధించాడు .ప్రింట్ షాప్ అచ్చి రాలేదు .పబ్లిషర్ల పుస్తకాలకు సొగసులు కూర్చే పని చేశాడు .బ్లేక్ అందంగా కవితాలను చదివేవాడు మాథ్యూస్ తో కలిసి తన పుస్తకం ‘’పోలిటికల్ స్కెచెస్ ‘’ముద్రించాడు .రాత మాథ్యూస్ ,బొమ్మలు బ్లేక్ తో బాగా వచ్చింది .ఎలిజబెతేన్ జాకోబిన్ కవుల ధోరణి లోనే రాశాడు .కానివీటికి  కొత్త స్వేచ్చ ,స్వచ్చత అద్దాడు .పునరుజ్జీవనం రొమాంటి కవిత్వాలకు మధ్య వారధి గా బ్లేక్ కొత్త పోకడలు పోయి కవిత్వం రాశాడు .

ముప్ఫై లో ‘’సాంగ్స్ ఆఫ్ ఇన్నోసేన్స్ ‘’రాసి ప్రచురించాడు .వినటానికి మహదానందం గా ఉండేవి .బ్లేక్ కవితా లక్షణాన్ని మోనా విల్సన్ ‘’a return from the idea of Excellence to that of Ecstasy as the aim and justification of poetical enterprise ‘’అని శ్లాఘించాడు .బ్లేక్ అరాసిన దిలాంబ్ ,దిలిటిల్ బ్లాక్ బాయ్ ,యాన్ అనదర్  సారో  నైట్ ‘’కవితలు అందరూ చదివిన వాళ్ళమే .భారీ సహాయం తో బ్లేక్ సాంగ్స్ ఆఫ్ ఇన్నో సెన్స్ పుస్తకాన్ని చేతితో తయారు చేసి ,ఇంకెవరూ పబ్లిష్ చేయ కుండా విడుదల చేసి చరిత్ర సృష్టించాడు .ఇలా ఇంతకూ ముందెవరూ చేయలేదు .దీనినే బ్లేక్’’ఇల్ల్యూమినేటేడ్ ప్రింటింగ్ ‘’అన్నాడు .కాగితాలను అందం గా ఆకర్శ ణీయం గా బంగారు రంగుతో కొన్ని పేజీలు  వివిధ వర్ణాలతో తయారు చేసి ధగ ధగ మెరిసేట్లు చేశారు .అతని ఆలోచనకు ఆచరణకు సృజనాత్మక శక్తికి అందరూ నివ్వెర పోయారు ..స్పష్టం గా నిర్డుస్టం గా కంటికి బాగా కనిపించి విందు చేస్తూ చదివిన్చేట్లు చేసి తయారు చేశారు బ్లేక్ దంపతులు .

దీనికి సీక్వెల్ గా కొన్ని లిరిక్కులు రాశాడు .బ్లేక్ భావన ప్రకారం చిన్నపిల్లాడు ఈడెన్ వదిలి ,ప్రపంచంలో ఎదిరించి బతుకుతూ ,స్వర్గం లో పోగొట్టుకోన్నదాన్ని ఇక్కడ పొందాలి .ద్వంద్వాలను ఏకం చేయటమే బ్లేక్ ఆదర్శం’’a fusion of innocence and experience ,good and evil ,flesh and spirit and as he was so enunciate with challenging vehemence ,the marriage of heaven and hell’’ .రెండు విభిన్న ప్రపంచాలలో బ్లేక్ జీవించాడు .అలానే అతని సృజన కళకూడా ఉండేది .కొద్ది కాలం తర్వాత ‘’ట్రయల్ ‘’ దిబుక్ ఆఫ్ ది తేల్’’రాశాడు కాని ఎనభై అయిదేళ్ళ తర్వాతాకాని ముఉద్రింప బడ లేదు .బ్లేక్ స్వీడిష్ ఫిలాసఫర్ ‘’స్వీడెన్ బర్గ్ ‘’అను యాయి .బర్గ్ ‘’దేవుడిని దివ్య మానవుడు ‘’అన్నాడు .బ్లేక్ ధనాత్మక స్వభావం ఉన్న వాడు .వార్ధక్యం పై పడిన కొద్దీ బ్లేక్ అందరికి దూరం గా ఉన్నాడు .

1793లో గ్రామీణ లామ్బెత్ కు చేరి చిన్న ఇంట్లో ఉన్నాడు .పిల్లల జంజాటం లేదు భార్యా భర్త హాయిగా ఆనందాన్ని అనుభవించారు .ధనమూ బాగానే వస్తోంది .సుఖ జీవితం గడుపుతున్నారు .ముప్ఫై లలో సంతృప్తికర జీవితాన్ని అనుభవించాడు .కొత్తా భావనలు మనసులో చోటు చేసుకొన్నాయి .పాత వాటిని మార్చి కొత్తగా తయారు చేశాడు భార్య సాయం తో .వాటిని ‘’richly illuminated volumes’’అన్నాడు .ఇంగ్లాండ్ చరిత్ర ,ను పిల్లల కోసం రాశాడు .గేట్స్ ఆఫ్ పారడైజ్ ను కూడా పిల్లలకోసమే .దీర్ఘ కవితలను రంగుల హర్మ్యం గా తయారు చేశాడు. అమెరికా రివల్యూషన్ కు మద్దతుగా ‘’అమెరికా –ఏ ప్రాఫసీ ‘’రాశాడు ఊహా  ప్రపంచం లో ఉన్దేవాప్పుడూ .బ్లేక్ చిత్రాలు దివ్య కళా విభూతితో దర్శన మిచ్చేవి . జార్జి  కంబర్ లాండ్ అనే నేషనల్ ఆర్ట్ గాలరీ కి చెందిన ఆయనతో పరిచయం ఏర్పడింది .బ్లేక్ ను ఎడ్వర్డ్ యంగ్ రచన ‘’నైట్ థాట్స్ ‘’కు చిత్రాలు వేయమనికోరితే వేశాడు .నలభై మూడు చిత్రాలతో ఇది మొదటిభాగం గా వెలువడింది .

నలభై లో ‘’ది ఫోర్ జోస్ ‘’అనే సింబాలిక్ రచన ప్రారంభించాడు .ఇందులో పాత కొత్త నిబంధనలకు సంబంధిన వన్నీ చోటు చేసుకొన్నాయి .కొంత గందర గోళాన్ని సృష్టించాడు .’’he who works and has his health can not starve ‘’అనే దృఢమైన నమ్మకం బ్లేక్ కు ఉండేది ..ఆగస్ట్ గ్రామం లో ఒక ఇల్లు   అద్దెకు తీసుకొని ఉన్నారు జంట .’’ఫెల్హాం ‘’అనే రచన ప్రారంభించి చిక్కుల్లోపడ్డాడు .సహాయకుడి గా పెట్టుకొన్న వాడి పధ్ధతి బాగాలేక తరిమేస్తే వాడు రాజుకు ఫిర్యాదు చేస్తే రాజుకు  విషయం వివరిస్తూ ఉత్తరం రాశాడు .ఒక సైన్కాదికారిని కొట్టాడని నేరం మోపారు .కేసైంది .బ్లేక్ నిర్దోషి అని తీర్పు వచ్చింది .రాజు బ్లేక్ ను సెక్రెటరి అసిస్టంట్ ను చేశాడు .పాపం బ్లేక్తను ద్వేషించిన  ‘’హెలీ కవి ‘’రాసిన దాన్ని విని,, పొగడాల్సిన  కష్టం వచ్చింది .దీనికి విచారపడుతూ ‘’o why was I born with a different face ?-why was I not orn like the rest of my race?-when I look ,each one starts !when I speak ,I offend –when I am silent and passive ,I lose every friend ‘’అని రాసుకొన్నాడు .శత్రుకవుల దాడిని సునాయాసం గా తిప్పికొట్ట గలుగుతున్నాడు కాని శ్రేయోభిలాషులు  పెట్టె ఇబ్బందుల్ని  భరించ లేక పోతున్నాడు .విసుగొచ్చి లండన్ వదిలి పుట్టిన ఊరికి చేరాడు .పవిత్ర జీవితాన్ని ప్రశాంతం గా గడుపుతున్నాడు .కొత్త సింబాలిక్ కవితలు’’మిల్టన్ అండ్ జెరూసలెం’’  రాస్తున్నాడు .ఇవి మిల్టన్ రాసిన పారడైజ్ లాస్ట్ కు వివరణలతోకూడిన చిత్ర దృశ్యాలు .రెండేళ్ళు బాగానే గడిచింది .

లాభా పేక్ష తో ముచ్చటైన డిజైన్ లతో ‘’కాంటర్ బారీ పిలిగ్రిమ్స్   ‘మొదలు పెట్టాడు .ఇది తెలుసుకొన్న స్తాత్ బాండ్ అనే వాడు పబ్లిక్ ఎక్సిబిషన్ పెట్టి కుబేరుడయ్యాడు .అందరూ బ్లేక్ ను కవిగా అంతగా గుర్తించలేదు .బాధ పడ్డాడు .అతని సృజన కళను ఎవరూ గుర్తించక పోవటం దురదృష్టం .ఒక ‘’డిస్క్రిప్టివ్ కేటలాగ్ తయారు చేసి తన చిత్రాలను ప్రదర్శించాడు .ఫలితం శూన్యం .యాభైలలో పేదరికం వరించింది. భార్య ఆతను ఊహల్లో విహరిస్తుంటే భార్య సంసారాన్ని దిద్దుకోన్నది .ఇంటి అద్దె కూడా చెల్లించలేని దయనీయ స్తితి .కొద్ది మంది ఉదారుల సహాయం లభించక పోయి ఉంటె బ్లేక్ దంపతులు ఆకలితో చని పోయి ఉండేవారు .అతని శిష్యులు గురువు లోని అసామాన్య కళను ఆరాధిస్తూ సహాయం చేశారు .ఇంకా ఇరవై ఏళ్ళు బతికి అసలైన రచన చేయాల్సి ఉంది .మిల్టన్ పై పుస్తకాల డిజైన్ పూర్తీ అయింది .దిఎవర్ లాస్టింగ్ గాస్పెల్ ‘’ఇంకా రావాలి .గేట్స్ ఆఫ్ పారడైజ్ మళ్ళీ తేవాలి చాసర్ కధలు పునర్ముద్రణ పొందాలి .వీటిలో మిల్టన్ పై వచ్చింది అత్యంత ఆశ్చర్యకరమై నదే .దీన్ని బ్లేక్’’sublime allegory for future generations similar to Homer;s Illiad ‘’and Milton;s paradise lost .వీటిని అంతరాత్మ ప్రబోధం గా రాశానని చెప్పాడు .దీన్ని ‘’grandest poem that this world contains ‘’అని బ్లేక్ చెప్పుకొంటే ‘’the most confusing of his long parables an un successful melding ‘’అన్నారు విమర్శకులు .

నిజం గా బ్లేక్ మిల్టన్ తో తాదాత్మ్యం చెంది రాశాడు .మిల్టన్ ను ‘’క్లాసిక్ ఎథీస్ట్ ‘’అన్నాడు బ్లేక్ .ముసలితనం వస్తున్న కొద్దీ మిల్టన్ లా కాకుండా బ్లేక్ జాగ్రత్త పడ్డాడు .మానసిక పోరాటాన్ని ఆపలేదు .విప్లవం గురించి ఎక్కడా బయటికి చెప్పలేదు .అరవై లో ఆరోగ్యం దెబ్బతినటం మొదలైంది .ఒణుకు ,ఫిట్లు వస్తున్నాయి .చిత్రకళా కారుడిగా నే గుర్తుండి పోయాడు .1827ఏప్రిల్ లో తాను మృత్యు ద్వారం  నిరీక్షిస్తున్నట్లు జార్జి కంబర్లాండ్ కు జాబు రాశాడు .శరీరం క్రుశిస్తున్నా బుద్ధి మనసూ బలం గా నే ఉన్నాయన్నాడు .ఇదే ఆఖరి ఉత్తరం అయినా చివరి రచన మాత్రం కాదు .విపరీతమైనశ్రమ ,రచనల తో చిక్కి శల్యమైనాడు .మూత్రపిండాలలో రాళ్ళ బాధ తో ఉన్నా డాంటేపై చిత్రాలు గీస్తూనే ఉన్నాడు .12-8-1827నచిత్ర శిల్ప కవి విలియం బ్లేక్ ఇహం అనే నరకాన్ని  వదలి పరం అనే స్వర్గాన్ని చేరుకొన్నాడు .

‘’to see a world in a grain of sand –and a heven in wild flower –hold infinity in in the palm of your hand –and Eternity in an hour ‘’అన్న కవిత దేశదేశాలలో బహుళ ప్రచారమైంది .బ్లేక్ ను పిచ్చోడు అన్నారు సమకాలికులు .కాని ‘’Blake was like the figures he loved to draw bound to no law of nature moving gravely to his goal, employing the emanations of earth ,air ,fire and water at home among the elements .this outward creation  was a transparent shell though which Blake beheld the fiery secret ,the burning core of e cstacy ‘’.సూర్యోదయం అయినప్పుడు ఆయన చుట్టూ గోల్డ్ గినియా లాంటి వలయం కనీ పిస్తుంది అనటం వాస్తవం కాదు –నాకు మాత్రం  ‘’an innumerable company of heavenly host crying Holy Holy Holy is the Lord god Almighty ‘’కనిపించటం యదార్ధం అని తాదాత్మ్యం తో అన్న దివ్య విభూతి పొందిన ప్రక్రుతిఆరాధకుడు. చిత్ర శిల్ప కవి విలియం బ్లేక్ మహాశయుడు .ఫ్రీ లవ్ సొసైటీ కి ఈజమ్ వేసింది బ్లేక్ అంటారు .వివాహ బంధం విషయం లో క్రిస్టియానితికి  వ్యతిరేకం గా ఉండేవాడు .’అతనిది ”  enlightened philosophy ”

William Blake by Thomas Phillips.jpg

 

 

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-5-14-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

5-5-14ఆదివారం రోహిణి ప్రవేశం నాడు – శ్రీ కనక దుర్గమ్మ -శ్రీ నృసింహ స్వామి- శ్రీ తిరుపతమ్మ దేవాలయ సందర్శనం

25-5-14ఆదివారం రోహిణి ప్రవేశం నాడు – బెజవాడశ్రీ  కనక దుర్గమ్మ వారు ,వేదాద్రి శ్రీ నృసింహ స్వామి ,పెనుగంచి ప్రోలు శ్రీ తిరుపతమ్మ దేవాలయ సందర్శనం -ఖమ్మం లో మా తోడల్లుడు శ్రీ మూర్తిగారి గృహం ,వత్స వాయిలో నేనుముప్ఫై ఏళ్ళ క్రితం మొదటి సారిగా హెద్మాస్ట ర్  గా పని చేసిన హై స్కూలు ,నేను అద్దెకున్న ఒక గది, ఆ ఇంటి వోనర్లు పుల్లయ్య నాయుడు కుటుంబం . 

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు-29 ఆలివర్ గోల్డ్ స్మిత్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు-29

ఆలివర్ గోల్డ్ స్మిత్

10-11-1728లో ఆల్వార్ గోల్డ్ స్మిత్ ఐర్లాండ్ లోని  లాంగ్ గ్ ఫీల్డ్ లోని పల్లాస్ మోర్ లో జన్మించాడు .తండ్రి క్లేర్జిమన్ ట్రినిటి కాలేజి లో చేరి ,చదువు మీద  శ్రద్ధ  పట్టక ,విదూషకుడిగా అల్లరి చేస్తూ గడిపాడు .కర్క్ కు పారిపోయి ఆడామగా పిల్లలకు డాన్స్ లో వినోదం కల్పించాడు .కాలేజిలో మళ్ళీ చేరమని కోరితే చేరి తక్కువ మార్కుల తో డిగ్రీ ముక్కాడు .తర్వాత హోలీ ఆర్డర్ కు అప్ప్లై చేస్తే తిరస్కరించారు .సంపన్నకుటుంబం కు  ట్యూటర్ గా కుదిరాడు .నిలవ లేక వదిలేసి ,ఒక స్కూల్ లో చేరి నీరస రొటీన్ కు విసిగి మానేశాడు .బాబాయి ఇచ్చిన యాభై పౌండ్లతో జల్సాగా గాంబ్లింగ్ లో పోగొట్టుకొన్నాడు .ఇంగ్లాండ్ వదిలి అమెరికా వెల్లి డాక్టర్ అవాలని అను  కొన్నాడు .లేడేన్ లో క్లాసులకు హాజరై మెడికల్ డిగ్రీ సాధించాడు .తండ్రి వదిలి వెళ్ళిన చివరి పెన్నీ కూడా ఖర్చయి పోయింది .ఫ్రాన్స్ స్విట్జెర్లాండ్ లకు ఒకే ఒక షార్ట్ పాంట్ లతో చేతిలో ఫ్లూట్ తో కదిలి వెళ్ళాడు .డాన్సులు ఉత్సవాలలో తిరిగాడు .పూటకూళ్ళ ఇళ్ళల్లో వాయిస్తూ పోట్టపోసుకొన్నాడు .

ఇరవై  ఆరు లో నిరాశ తో తిరిగి లండన్ చేరాడు .చిన్న పల్లె టూరిలో డాక్టర్ గా ప్రాక్టీస్ పెట్టినా రాణించలేదు .ఇండియా లో డాక్తర్  చేయాలనుకొన్నా అవకాశం రాలేదు .తప్పక రచయితా అయ్యాడు .ఏది కావాలంటే అది రాశాడు కాసుల కోసం .మారుపేర్ల తో పబ్లిషర్లు అడిగినవన్నీ రాశాడు అనువాదాలు లిటరరీ సర్వేలు చేశాడు .’’ది  బీ’’పత్రిక కు ఎడిటర్ అయ్యాడు .వ్యాసకర్త గా పేరు తెచ్చుకొన్నాడు .దాదాపు డబ్బు లేకుండానూ ,డబ్బు చేతికొస్తే విచ్చల విడిగా తగలేస్తూ గడిపాడు .సామ్యుల్ జాన్సన్ తో పరిచయం ఏర్పడింది .ఏ కష్టమొచ్చినా ఆదుకొన్నాడు .డబ్బు ఎలా జాగ్రత్తగా వాడుకోవాలో తెలియ జెప్పాడు ‘’వికార్ ఆఫ్ వెక్ ఫీల్డ్’’నవల రాసి దాన్ని అమ్మి ఇంటి అద్దె బాకీ తీర్చాడు .వోల్టైర్ ,పార్నెల్ ,మొదలగు వారి చరిత్రలు రాశాడు .ఇంగ్లీష్ గ్రామర్ రాశాడు .నాటకాలతో అదృష్టం పరిక్షిన్చుకోవాలను కొన్నాడు ‘’దిగుడ్ నేచార్డ్ మాన్ ‘’,’’ది ట్రావెలర్ ‘’నాటకాలు రాశాడు .ఆరేళ్ళ తరువాత ‘’ది డిసేర్తెడ్  విలేజి ‘’నాటకం అమరుడిని చేసింది .

నలభై అయిదేళ్ళు వచ్చాయికాని చేతిలో పైసా నిలవటం లేదు .ఆరోగ్యమూ దెబ్బ తింది .మనసూ సరిగ్గా లేదు నలభై నాలుగేళ్ల వయసులో గోల్డ్ స్మిత్  4-4-1774న చనిపోయాడు .రచనల్లో తన కష్టాలను ప్రతిఫలింప జేశాడు .ఆరాధన పొందిదింప లేక పోయాడు .వికార్ నవలా ఆయన జీవిత చరిత్రే .కవితలు ఆయన సాహిత్యం లో తక్కువ గానే ఉన్నాయి .’’I can not afford to court the draggle –tail muses –they would let me starve ‘’అన్నాడు .పోప్ తర్వాత దిట్రావెలర్ కవిత మంచి పేరు పొందింది .డేసేర్తేడ్ విలేజి పూర్తిగా వాస్తవికత ఉన్నదికాదు .ముచ్చ టైన కవి అన్నాడు వాషింగ్ టన్ ఇర్వింగ్ .ఆయన రాసిన విలేజ్ స్కూల్ మాస్టర్ ,విలేజ్ ప్రీచర్ ,విలేజ్ కవితలు అతని స్వంత ఐర్లాండ్ కు సంబంధించినవే .అందులో అమాయకత్వం వ్యక్తిత్వం కనీ పిస్తాయి .గోల్డ్ స్మిత్ మరణం తర్వాతా టెంపుల్ చర్చ్ వెస్ట్ మినిస్టర్ ఆబే లో స్నేహితులు జాన్సన్ నాయకత్వం లో ఒక క్లబ్ ఏర్పాటు చేశారు లాటిన్ నుంచి జాన్సన్ అనువదించిన ‘’Oliver Gold smith –a poet  naturalist ,and historian who left scarcely any style of writing untouched and touched nothing that he did not adorn ‘’of all the passions whether smiles ,were to be moved or tears a powerful yet gentle master .ingenius ,vivid ,versatile ,sublime .In style clear levated elegant ‘’అని రాసిన ఫలకాన్ని సమాధిపై అమర్చారు .

 

Oliver Goldsmith by Sir Joshua Reynolds.jpg

 

 

క్రిస్టఫర్ స్మార్ట్

గొప్ప మతాత్మక కవితాలు రాసి క్రిస్టఫర్ స్మార్ట్ చరిత్రలో నిలిచిపోయాడు జర్నలిస్ట్ గా ఉన్నా ఈ కవితలే రాశాడు .దివ్య స్వచ్చత కోసం రాశాడు .11-4-1722 ణ కెంట్ లోని  షిప్ హార్న్ లో జన్మించాడు .తండ్రి స్తివార్డ్ గా ఒక చిన్న ఎస్టేట్ యజమాని గా ఉన్నాడు .తండ్రి చని పోయిన తర్వాతా పదకొండేళ్ళ వయసులో వేన్ ఫామిలీ ఇతన్ని రేబీ కాజిల్ కు తీసుకొని వెళ్ళారు .కౌన్తెస్ ఆఫ్ విల్చేసా స్మార్ట్ తెలివి తేటలకు ముచ్చట పడి పాట్రన్ గా ఉన్నది .కావాల్సిన డబ్బు అంద జేసేది .నాలుగేళ్ళకే రైం తో కవిత్వం చెప్పాడు .పద మూడేళ్లకే ఒడ్ రాశాడు పద హేదేల్లకు పెంబ్రోక్  కాలేజి లో చేరాడు .ర్హేటరిక్ లో లెక్చరర్ అయ్యాడు .ప్రేమలో పడ్డాడు .ఆమె పై కవితలు రాశాడు .తాగుడుకు బానిస అయ్యాడు .క్లాసులో నిద్రపోయేవాడు .ఇరవై అయిదులో అప్పుల పాలయ్యాడు .ఇంట్లో నుంచి భయం తో బయటికి వెళ్ళే వాడు కాదు .కేంబ్రిడ్జి వదిలి లండన్ చేరి ప్రింటర్ పబ్లిషర్ న్యూ బెర్రీ కు సహాయం చేశాడు .బాల సాహిత్యం ప్రచురించే సంస్థ అది .అతని బంధువులమ్మాయిని  పెళ్ళాడాడు .

‘’ఆన్ ది ఎటర్నిటి ఆఫ్ దిసుప్రీం బీయింగ్ ‘’రాసి సియాటన్ ప్రైజ్ పొందాడు .అయిదేళ్ళలో నాలుగు సార్లు ఈ బహుమతి పొందాడు .’’ది హిల్లియాద్ ‘’అనే హోమర్ రచన ఆధారం గా సెటైర్ రాశాడు .అనేక సంస్థలు అతన్ని గౌరవించాయి .స్మార్ట్ భ్రాంతి పూర్వక రచనలు ప్రమాదకరం అని జాన్సన్ అన్నాడు .శరణాలయం లో చేరాడు .అక్కడే గొప్ప కవిత రాశాడు .’’ఏ సాంగ్ టు డేవిడ్ ‘’అనే ఆశ్చర్యకర రచన చేశాడు .విడుదలైన స్మార్ట్ కు స్నేహితులు చందాలు వేసుకొని సాయం చేశారు .పని చేయలేక తాగుడు మానలేక అప్పులు తీర్చలేక అప్పుల అప్పారావు గా జీవించి కింగ్స్ బెంచ్ ప్రిజన్ లో ఖైదుపాలయ్యాడు .21-5-1771లో చనిపోయాడు

బ్రౌనింగ్ ఒక శతాబ్దం తర్వాతా స్మార్ట్ రచన్ అ ఆధారం గా ‘’సాల్ ‘’రాశాడు .స్వస్థత కోల్పోయిన మనసుతో ఇమేజేరీ కవితలు రాశాడు .సాంగ్ డేవిడ్ అనేక సార్లు ముద్రణ పొందింది మొదటి సారి చదివితే అర్ధం కాదు కాని చదివిన కొద్దీ అద్భుతం అని పిస్తాయి .ప్రక్రుతి పైనా జాతీయ భావ జాలం మీదా గొప్ప కవిత్వం రాశాడు .ప్రక్రుతి ఆరాధకుడు .జంతుజాలాన్ని ప్రేమించాడు images in A Song to David are related also to depictions of the Temple in Isaac Newton’s Chronology of Ancient Kingdoms Amended (1728), the John Bunyan‘sSolomon’s Temple Spiritualiz’d (1688), and to the Geneva Bible, these works were relied on by the Freemasons.[194]

Based on this theory, the first pillar, the Greek alpha, represents the mason’s compass and “God as the Architect of the Universe.”[195] The second, the Greek gamma, represents the mason’s square.[196] In addition, the square represents the “vault of heaven.”[193] The third, the Greek eta, represents Jacob’s ladder itself and is connected to the complete idea of seven pillars.[197] The fourth, the Greek theta, is either “the all-seeing eye or the point within a circle.”[197] The fifth letter, the Greek iota, represents a pillar and the temple.[198] The sixth letter, the Greek sigma, is an incomplete hexagram, otherwise known as “the blazing star or hexalpha” to the Freemasons.[198] The last, the Greek omega, represents a lyre and David as a poet..

 

 

 

 

Christopher Smart.jpg

థామస్ చాటర్టన్

కీట్స్ చేత ‘’దిమార్వేలేస్ బాయ్ ‘’అని పిలవ బడిన థామస్ చాటర్ టన్ ఒక పేద స్కూల్ మాస్టారబ్బాయి .చర్చి నీడలో బాల్యం గడిచింది .జననం 20-11-1752.ఎనిమిదేళ్ళవరకు అక్షరం ముక్క నేర్ఫ్వ లేదు .ఫ్రెంచ్ మ్యూజిక్ ,బైబిల్ మీద మోజేర్పడింది .పదో ఏట కవిత్వం అలవడింది .మేరీ రెడ్ క్లిఫ్ చర్చి లో ఒక గది లో ఉండిపురాతన గ్రందాల రాత ప్రతులను ,స్పెల్లింగ్ ల ను అధ్యయనం చేశాడు .’’దిరోమాంటే ఆఫ్ దిస్నిఘ్నేట్’’కవిత చదివి అసలు రచయితా ఎవరో తేల్చి చెప్పాడు .పది హేనేళ్ళా లో అందగాడైన ఈ కుర్రాడు రూమ్సీ ని ప్రేమించాడు బ్రిస్టల్ అటార్నీకి అసి స్టంట్  గా పని చేశాడు శ్రద్ధ చూప లేదు .’’దాడ్స్లీ ‘’రాసి పేరుపొందాడు ..ఇది బాగాపేల లేదు.హోరేస్ వాల్ పోల్ కు రాశాడు సహాయం చేయమని .మోసం జరిగిందని గ్రహించి న్యాయం చేసి మళ్ళీ ఆ జోలికి పోవద్దన్నాడు .

పది హేడేళ్ల్లప్పుడు లండన్ వెళ్లి  ‘’రౌలీ’’ పోయెమ్స్ ,సాంగ్స్ ,డ్రమాటిక్ లిరిక్స్ ,అసంపూర్తి నాటకాలు రాశాడు ఒక నెలలోనే అరడజన్ మెగా జైన్లకు రచనలు చేసి పేరొందాడు .లండన్ మేయర్ స్పాన్సర్ గా ఉంటానని వాగ్దానం చేశాడు సేకరించి రాసిన పురాతన గ్రందాల ముద్రణ కు ఎవరూ ముందుకు రాలేదు .మేయర్ చనిపోవటం తో స్నేహితులకు ముఖం చూప లేక పోయాడు  .చలి ఆకలి తో అలమటించాడు .హాల్ బారన్ గారేట్ కు చేరి బయటికి వచ్చేవాడు కాదు .తల్లికి భార్యకు సంతోషం గా ఉన్నట్లు పోజు పెట్టేవాడు .ఎవరైనా ముందుకొచ్చి డబ్బు ఇస్తామంటే అగౌరవం అని భావించేవాడు .రచన , జర్నలిజం తో బతక లేనని నిర్ధారించుకొన్నాడు .ఆఫ్రికా షిప్ ట్రేడింగ్ లో స్థానం సంపాదించాడు .

24-8-1770లో ఇంటి యజమానురాలు ఇతను చిన్న రొట్టె ముక్కలు మాత్రమెవారం రోజులుగా  బతుకుతున్నాడని తెలుసుకొని మంచి ఆహారం తీసుకొని అంద జేస్తే ఆకలి లేదని వద్దన్నాడు .అర్ధ రాత్రి ఒక రొట్టెల దుకాణానికి వెళ్లి అప్పుకు రొట్టె ముక్కలిమ్మన్నాడు .ఇవ్వనని వాడంటే జీవితం పై విరక్తి కలిగి ఎలుకలు చంపటానికి కావాలని’’ ఆర్సెనిక్ ‘’తెచ్చుకొని తినేశాడు .రెండు రోజులుగా రూము తలుపులు తెరచుకోక పోవటం తో లోపల తాళం వేసిన అ గది తలుపులు పగల కొట్టి లోపలి వెళ్లి చూస్తె చాటర్టన్ చనిపోయి ఉన్నాడు .అప్పటికి అతని వయసు పది హేడు సంవత్సరాల తొమ్మిది నెలలు మాత్రమె .అతని చుట్టూ చినిగిన రాత ప్రతులెన్నో ఉన్నాయి .పాపర్ అయి చనిపోయాడుకనుక ఈ కవిని వర్క్ హౌస్ షూ  లేన్ లో సమాధి చేశారు .

ఇతని కవితల్లో చాసర్ ,స్పెన్సర్ చాయలుంటాయి .పందొమ్మిదో శతాబ్దం వరకు ఇతని కవితలు ఆదరం పొందాయి .రొమాంటిక్ కవులు ఇతన్ని వెతికి పట్టుకొని పునర్జీవి ని చేశారు .కార్లైల్ ఇతని డార్క్ టోనేడ్ మ్యూజిక్ కు పరవశం చెంది ‘’కుబ్లాయ్ ఖాన్ ‘’లో వాడుకొన్నాడు .కీట్స్ ‘’ఎండిమేన్ ‘’లోఈ  కవిని గురించి రాశాడు .మొదట ఆంగ్లం లో సాధారణం గా రాసి తర్వాతా రౌలీ విధానం లోకి మార్చాడని భావిస్తారు. కవితల్లో మనసులోని భావాలను సగమే చెప్పాడు . అనేక మేనరిజాలను ప్రయోగించాడు .ప్రతిభ ఉన్నా సమర్ధించి ప్రోత్స హించే వారు లేక దెబ్బ తిన్న కవి చాటర్టన్ .మరణం 24-8-1770 .మధ్య యుగానికి చెందినా అనేకమైన వాటికి అనుసృజన ,అనువాదాలు చేశాడు .పది హేనవ శతాబ్దికి చెందినా థామస్ రౌలీ అనే ఊహా జనిత సన్యాసిని తానుగా భావించి ఆ ధోరణి లో రాశాడు .చాటర్టన్ ‘’స్వాన్ సాంగ్ ‘’అని పిలువా బడే చివరి కవిత అందర్నీ కదిలించింది –

‘’awake awake o Birtha swotie  mayde –‘’

 

 

 

Thomas Chatterton.jpg  

చావు సీను

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-5-14-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -28 విలియం కాలిన్స్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -28

విలియం కాలిన్స్

విలియం కాలిన్స్ విషాద గీతాల కవి .1721నపుట్టి 1759 లో చనిపోయాడు .ఇతని జీవితం కూడా విషాదాంతమే .మతి స్తిమితం కోల్పాయాడు చివర్లో ..చీసేస్టర్ లో టోపీల వ్యాపారి కొడుకు .ఆక్స్ ఫర్డ్ లో మాగ్దలీన్ కాలేజి లో చదివాడు .’పెర్షియన్ కలోగ్స్  ‘’ను డిగ్రీ చదువుతూనే రాశాడు .పదామూడేల్ల వయసులో మొదటి సంకలనం పబ్లిష్ చేశాడు .ఇరవై  ఆరులో ‘హౌ స్లీప్ ది బ్రేవ్ ‘’రాశాడు .ప్రతిభా వంతుడైన కవి అని పించాడు .చర్చి ,సైన్యం లలో దేనిలో చేరాలో తెలీక ఊగిస లాడాడు.ఇరవై  ఎనిమిదిలో చేతిలో దమ్మిడీ లేని స్తితి .ఒక అంకుల్ ఆదుకొన్నాడు .ముప్ఫై లో ఉన్మాదం వచ్చింది .చివరి తొమ్మిదేళ్ళు మానసిక ఆందోళన ,శారీరక రుగ్మత లతో బాధ పడ్డాడు .ఆక్స్ ఫర్డ్ లో శరణాలయం లో ఉన్నాడు .ఎవర్నీ చూడ టానికి ఇష్టపడలేదు చని పోయినా ఎవరికీ తెలియ లేదు ఏ పేపర్లోనూ అతని చావు వార్తా రాలేదు .‘’దిర్జీ అండ్ సింబలిన్ ‘’మాత్రం అందర్నీ ఆకర్షించింది .ఇది స్వీయ చరిత్ర .విషాదం గా సాగుతుంది .మంచి భావుకత ఉన్న కవి

WilliamCollinsPoet.jpg

 

.                          విలియం కూపర్

ఈ ప్రపంచ దుస్తితికి కుంగి కాలిన్స్ లానే పిచ్చివాడైన విలియం కూపర్ 26-11-1731లో బెర్కామ్స్ స్తేడ్ లో పుట్టాడు .అసూయ అతాన్ని తోటివారికి దూరం చేసింది .బోర్డింగ్ స్కూల్ లోనే అందరూ ఏడిపించేవారు .వెస్ట్ మినిస్టర్ చేరాడు …సొలిసిటర్ కు సహాయకుడి గా ఉన్నాడు .మిడిల్  టెంపుల్  లో బార్ లో చేరాడు .ఒక కజిన్ ను ప్రేమించి భంగపడి దెబ్బతిన్నాడు .కొద్దిగా ప్రాక్టీస్ లో ఉండగా తోటి లాయర్ల ఈసడింపుకు గురై రెండో సారి  దెబ్బతిన్నాడు నరాల బలహీనత మరీ కుంగ దీసింది .తరచూ  డిప్రెషన్  కు లోనయ్యే వాడు .ముప్ఫై రెండులో హౌస్ ఆఫ్ లార్డ్స్ లో గుమాస్తా ఉద్యోగం వస్తే చేరాడు .అక్కడ చేయాల్సిన పని చూసి మనస్తిమితం కోల్పోయాడు .చావాలని ప్రాయత్ని స్టే శరణాలయం లో చేర్చారు .పద్దెనిమిది నెలల తర్వాతా బయటికొచ్చాడు .హంటింగ్ హాం చేరాడు మొరాలియన్ అన్విన్  దంపతులు ఆదరించారు .రెండేళ్ళ తర్వాతా మొరలె గుర్రపు సవారిలో కిందపడి చనిపోతే కూపర్ బకింగ్ హాం షైర్ లో ఒల్నీ కి చేరాడు .మేరీ అతని వెంట ఉంది జాగ్రత్త గా కనీ పెట్టి చూస్తుండేది .ఇద్దరి మధ్యా వలపులు సాగి పెళ్లిదాకా వచ్చి మళ్ళీ దురదృష్ట వశాత్తు మేరీ చనిపోవటం తో మూడోసారి మానసికం గా దెబ్బ తిన్నాడు .శారీరక, మానసిక ఆరోగ్యాల లేమితో డెబ్భై ఏళ్ళు బతికి 25-4-1800లో చనిపోయాడు .జాన్ న్యూటన్ అనే మత ప్రవక్త ప్రేరణ తో ఇవాంజెలికల్  ధోరణి లో  అరవై ఏడు భక్తీ కవితలు రాశాడు .వీటికి ‘ఒల్నీ హైమ్స్’’అని పేరు పెట్ట్టాడు .పెళ్లి చేసుకో దలచిన అమ్మాయి గురించిన చింతన తో రాశాడు .కూపర్ కవి విషాదాన్ని సిసిల్ ‘’ది  స్త్రికేన్ ‘’లో రాసిన లార్డ్ డేవిడ్  కు చూపాడు .యాన్తాలజిస్తులు కూపర్ రాసిన ది పాప్యులర్ ఫీల్డ్ ‘’,ఆన్ ది లాస్ ఆఫ్ దిరాయల్ జార్జి ‘’కవితల్ని తరచూ ఉదహరిస్తారు .గొప్ప లేఖా సాహిత్యాన్నీ రచించాడు మంచి  ప్రభావం  ఉన్నా విధి చేతిలో దెబ్బ తిన్న కవి.”ది డై వేర్తేడ్ హిస్టరీ ఆఫ్ జాన్ గిల్పిన్ ”రాశాడు

 

 

 

William Cowper by Lemuel Francis Abbott.jpg

బీద డాక్టర్ కవి -జార్జి క్రేబిల్

వివాదాస్పదు డని పించుకొన్న జార్జి క్రేబిల్ 24-12-1754లో ఆల్దేన్ బర్గ్ లోని సఫోల్క్స్ లో పుట్టాడు .విద్యా గంధం లేని వాడు .స్వయం కృషితో అన్నీ నేర్చాడు .ఉప్పు పన్ను వసూలు చేసే ఉద్యోగం చేశాడు .తర్వాత ఒక సర్జన్ కు అసిస్టంట్ అయ్యాడు .మిడ్ వైఫ్ గానూ ఉన్నాడు.రోజు కూలి చేసీ బతికాడు .చివరకు ఆల్డే బర్గ్ లో డాక్టర్ అయ్యాడు .అతని ఊరి వాళ్ళు ఇతను బీదవాడనే భావన తో ఉండి డాక్టర్ గా గుర్తించలేదు .అతని సామర్ధ్యం పై నమ్మకం పెట్టుకోలేక పోవటం తో కేసులు రాక రాబడిలేక డాక్టర్ గా ఫైల్యూర్ అని పించుకొన్నాడు .ఇరవైఆరుకే చిల్లిగవ్వ లేని డాక్టర్ అయ్యాడు .ఎందరినో కలిశాడు .ప్రయోజనం శూన్యం .ఎడ్మండ్ బర్క్ ఆదరింఛి లండన్ తీసుకొని వెళ్ళాడు .అక్కడ సామ్యుల్ జాన్సన్ వంటి వారిని కలిసి వారి సాయం పొందాడు .బర్క్ సలహాతో చర్చి విధుల్లో చేరాడు .మళ్ళీ స్వంత ఊరు ఆల్దేబర్గ్ చేరినా అతని పేదరికం అతన్ని వెక్కిరించి అతని ద్వారా మత బోధ పొందటానికి ఎవరూ ముందుకు రాలేదు .మళ్ళీ నిరాశ .బర్క్ సలహా మేరకు జార్జిని చాప్లిన్ చేశాడు డ్యూక్ ఆఫ్ రట్ లాండ్ .సారా ఎమిలీ ని పెళ్ళాడాడు . దొర్సేట్ షైర్  లో రెండు పట్టణాలను అప్పగించాడు .

అక్కడే మొదటి ‘’ది విలేజ్ ‘’అనే కవితా సంకలనం తెచ్చాడు .ఇందులో గోల్డ్ స్మిత్ రోమాన్స్ కవితలని చెండాడాడు నవలా కర్త సర్ వాల్టర్ స్కాట్ ఆహ్వానిస్తే ఎడిన్ బర్గ్ వెళ్ళాడు .జార్జి కవిత కు అబ్బుర పడి చదివి విని పించుకొని మెచ్చి పదేళ్ళ తర్వాత కూడా వాటిని మర్చి పోకుండా నోటితో చెప్పాడు స్కాట్ .వయసు పెరిగిన కొద్దీ భావ సాంద్రతా  పెరిగింది అరవైలో త్రో బ్రిడ్జి చర్చి కి మినిస్టర్ అయ్యాడు ‘’టేల్స్ ఆఫ్ ది హాల్ ‘’రాశాడు .థామస్ హార్డీ ‘’నేను క్రేబిల్ రాసిన విలేజ్ చదవక పోయి ఉంటె నా నవలలను రాసి ఉండే వాడిని కాను ‘’అని కితాబు ఇచ్చాడు .అభిమానులు ,కవుల మధ్య చివరి రోజులు గడిపాడు .జలుబు తో ప్రారంభమైన  జబ్బు అతని ప్రాణాలను 3-2-1832న బలి కొన్నది .దాదాపు అజ్ఞాత కవిగా మిగిలాడు .ఒక శతాబ్దం తర్వాతా ఎడ్విన్ ఆర్లింగ్ టన్ క్రేబిల్ గుణ గణాలను ‘’  ‘’plain excellence and stubborn skill ‘’ ‘అని పొగిడారు .

 

George Crabbe by Henry William Pickersgill.jpg

ఆస్థాన కవి హోదా ను తిరస్కరించిన  – థామస్ గ్రే

పన్నెండు మంది పిల్లలలోమిగిలింది ఒక్క  ధామస్ గ్రే ఒకడుమాత్రమె  .అలాగే ఒకే ఒక్క ‘’ఎలిజీ ‘’తో కవుల్లో అగ్రేసరుడని పించుకొన్నాడు గ్రే .లండన్ లో 26-12-1716జననం .చిన్నప్పుడే క్షయ లక్షణాలతో ఇబ్బంది పడ్డాడు .నుదుటిపై ఒక రక్త నాళాన్ని కోసి తల్లి బతికించింది. తండ్రి ముక్కోపి .దమ్మిడీ సంపాదన లేదు భార్య వదిలేసి పోయి కొడుకును స్వంతం గా పెంచుకోంది .తల్లి తరఫు బంధువు ఆదుకొన్నాడు .ప్రధాని ,రిచార్డ్ వెస్ట్ మరియు లార్డ్ చాన్స్ లర్ ఆఫ్ ఐర్లాండ్  కొడుకు హోరేస్ వాల్ పోల్ కు అసిస్టంట్ గా చేరాడు .లార్డ్ అకస్మాత్తుగా చనిపోతే గ్రే ఒకసానెట్ ను రాశాడు అది బాగుందని అన్నారు  ’’and weep the more because I weep in vain ‘’ .పీటర్ హౌస్ లో లాయర్ అవాలనే కోరిక ఉండేది క్లాసిక్స్ పై ద్రుష్టి పడింది గణితం మానేసి అనువాదాలు చేశాడు కేమ్ బ్రిడ్జి లో  చదివినా డిగ్రీ పొందలేదు .వాల్ పోల్ తనతో యూరప్ పర్యటనకు గ్రే ను వెంట తీసుకొని వెళ్ళాడు .రెండేళ్ళు ఇటలీ ఫ్రాన్స్ వగైరాలు చూశారు .ధన గర్వంతో గ్రే ను చిన్న చూపు చూసేవాడు వాల్ పోల్ .గ్రే ఇంగ్లాండ్ తిరిగోచ్చేశాడు .రెండేళ్ళు చదివి లాలో డిగ్రీ పొందాడు .కాని ప్రాక్టీస్ చేసిన దాఖలాలు లేవు

తల్లి రిటైర్ అయి ఇతని దగ్గరే ఉంది .వాల్ పోల్ జరిగిన దాన్ని క్షమించమని మిత్రుడికి కబురు పంపాడు అతను రాసిన ఎలిజీ అద్భుతం అన్నాడు .దాన్ని కావ్యం గా రాయమని కోరాడు .ఏడేళ్ళు రాసి అద్భుతం అని పించాడు ..పరువు ,ప్రతిస్టా పెరిగాయి .వ్రాత ప్రతి పైరేట్ అయి ఒక పబ్లిషర్ చేతికొచ్చి ప్రింట్ చేశాడు .డబ్బు తీసుకోవటానికి గ్రే తిరస్కరించి దెబ్బతిన్నాడు .దాన్ని అమ్ముకొన్న పబ్లిషర్ వెయ్యి పౌండ్లు సంపాదించుకొన్నాడు .తల్లి చని పోయిన తర్వాత పల్లెటూరిలోనే ఉన్నాడు .పూర్వ చరిత్ర ,ఐస్ లాండిక్ వేర్స్ లపై దృష్టి  పడింది .’’పిండారిక్ ఓడ్స్ ‘’రాశాడు .నలభై లలో రాజాస్థాన కవి పదవి కి ఆహ్వానం వచ్చినా తిరస్కరించాడు .అది ఏ సరుకూ  బుర్రా లేని విలియం’’ వైట్ హెడ్ ‘’కు దక్కింది .

ప్రొఫెసర్ అయి బోధించాలని ఆరాట పడ్డాడు. రాలేదు యాభై రెండులో ‘’ప్రొఫెసర్  ప్రొఫెసర్ ఆఫ్ హిస్టరీ   అండ్ మోడరన్ లాంగ్ వేజేస్ ‘’అయ్యాడు .యాభై మూడులో స్విట్జెర్లాండ్ వెళ్ళాలను కొన్నాడు .అకస్మాత్తుగా జబ్బు పడ్డాడు .వాత రోగం వచ్చి క్షయ ముదిరి యాభై అయిదేళ్ళలో 30-7-1771.నచనిపోయాడు .పిండారీ ఓడ్స్ అందర్నీ మెప్పించాయి దానికి సరి అయిన రచన రాలేదు .అందుకే ‘’elegy is the one poem which entitles Gray to enduring fame .He presents a series of twilight pictures and condenses a philosophy which is both sad and soothing .youth to fortune and to fame unknown ‘’అని అతని స్నేహితుడు భావించాడు .

”the elegy written in a country church yard ”   కు విశేష   ప్రాభవం పొందాడు

PortraitThomasGrayByJohnGilesEccart1747to1748.jpg

 

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-5-14-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -27 సోగాసు,లాలిత్యాల పతనం

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -27

సోగాసు,లాలిత్యాల పతనం

పద్దెనిమిదో శతాబ్ద సాహిత్యం కృత్రిమం ,వక్రం ,పదాడంబరం అనే పేరు తచ్చుకోంది .పోప్ కాలం అంతా వ్యక్తిగత కవిత్వానికే ప్రాధాన్యమై పోయింది .గొడవలు ,మనస్పర్ధలె రాజ్యం చేశాయి .కాని వీటికి విరుద్ధం గా కవిత్వం లో మరో పాయ ప్రవహించింది .గ్రామీణ ఇంగ్లాండ్ పుష్ప ఫల ,భరితమై పంటలకాలవాలమైంది  .వీటి అందాలను కవిత్వం లో నింపారు కవులు .అలాంటి వారిలో మాధ్యూ గ్రీన్ జేమ్స్ థామ్సన్ ,థామస్ గ్రే జాన్ డయ్యర్ ,విలియం కాలిన్స్ ,విలియం కూపర్ .మారుతున్న పల్లె స్తితి గతులను ఆలివర్ గోల్డ్  స్మిత్ గ  జార్జి క్రాబిల్ లు ఆవిష్కరించారు .క్రిస్టోఫర్ స్మార్ట్ ,థామస్ చాట్టేర్ట న్ ,కొంతపట్న  వాసనను పల్లె కవిత్వానికి అంటించారు .రాబర్ట్ బర్న్స్ పాటలు విలియం బ్లేక్ ,విజన్ మరి కొంత మార్పును చూపాయి . రెండో తరాహా కవులు సామ్యుల్ జాన్సన్ ,చార్లెస్ చర్చిల్ లు మాత్రం పోప్ తరహా కవిత్వాన్నే అనుసరించారు .హీరోయిక్ కప్లేట్స్ రాశారు .భావాలను వృద్ధి చేసి కవిత్వ విధానం లో మార్పులు చూపారు .ఈ ప్రయత్నాలు ,కొత్త పోకడలు ,రీతి ఉన్నా కన్సర్వేటివ్ మనస్తత్వం ఉందని ఇలియట్ అన్నాడు .

సాహిత్య షరాబు ,నిఘంటు నిర్మాత – సామ్యుల్ జాన్సన్

కవిగా గుర్తింపు లేక పోయినా అసలు కవే కాక పోయినా సామ్యుల్ జాన్సన్ ఆగస్టస్ కాలం లో విశేష ప్రాభవం ఉన్న వ్యక్తీ .వ్యాస కర్త ,జీవిత చరిత్రకారుడు ,లేక్సికో గ్రాఫర్ ,విమర్శకుడు ,గొప్ప సంభాషణా చతురుడు .17-9-1709లో శాఫోర్డ్ షైర్ లోని లిచ్ ఫీల్డ్ లో జన్మించాడు .తండ్రి పుస్తక వ్యాపారి .బాల్యం బాలారిస్టాలతో గడిచింది .నాలుగేళ్ళప్పుడు ‘’కింగ్స్ ఈవిల్ ‘’అనే జబ్బు సోకి ,రాజుగారి హస్త స్పర్శ తో తగ్గుతుందనే నమ్మకం తో లండన్ కు  తీసికెళ్లారు .అన్నే రాణి చేయాల్సింది అంతా చేసింది కాని గుణం కనీ పించలేదు .ఆ జబ్బుతోనే జీవితాంతం  బాధ పడ్డాడు .కంటి చూపు తగ్గి పోయింది .ఇన్ని అవరోదాలెదురైనా  స్వయం గా విజ్ఞాన సముపార్జన చేశాడు  .అతని జ్ఞాపక శక్తి అసాధారణం .గ్రామర్ స్కూల్ లో లాటిన్ నేర్చాడు పందోమ్మిదిలో ఆక్స్ ఫర్డ్ లోని పెంబ్రూక్  కాలేజిలో చేరి ,ఒక ఏడాది చదివి ఆర్ధిక ఇబ్బందులతో మానేశాడు .అతని బూట్లు చిరిగి పోయి పాదాలు బయట పడేవి కొత్తవి కొనుక్కోలేనంత నిర్భాగ్యుడు .

రెండేళ్ళ తర్వాత తండ్రి మరణం తో ఆయన ఇచ్చిన ఇరవై పౌండ్ల తో జీవించాల్సి వచ్చింది .మార్కెట్ బాస్ వర్త్ లోని ఒక స్కూల్ లో టీచర్ గా చేరి పొట్ట పోసుకొన్నాడు .బిమ్మింగ్ హాం జర్నల్ కు రాస్తూ కాస్తో కూస్తో సంపాదిస్తూండే వాడు .అక్కడి పుస్తక వ్యాపారి జాన్సన్ మొదటి పుస్తకం ‘’ ఏ ఒడ్ టు అబిసీనియా ‘’ను ప్రచురించాడు .ఇరవై ఆరో ఏట ఎలిజ బెత్ పోర్టర్ ను పెళ్లి చేసుకొన్నాడు .ఆమె ఇతితని కంటే ఇరవై ఏళ్ళు పెద్దదైన వితంతువు .ఇద్దరు కలిసి బోర్డింగ్ స్కూల్ నడిపారు .ఏడాదికే మూత పడింది .జాన్సన్ లండన్ చేరి అక్కడే ఉండిపోయాడు .చూడటానికి అందం గా ఉండే వాడుకాదు .కోపం ఉద్రేకం ,సరైన వస్త్ర ధారణ లేక పోవటం ,తీవ్ర స్వభావం జాన్సన్ బాహ్య  లక్ష ణాలు .సన్నగా అస్తిపంజరం లా ఉండేవాడని శిష్యుడు బాస్వేల్ గురువును వర్ణించాడు .ఒక కంటితోనే చూడా గలిగే వాడు .అవయవాలను స్వేచ్చగా కదిలించ గలిగే వాడు కాదు .కాని మానవత్వం ఉన్నవాడు .న్యాయ ధర్మాలతో సంచరించేవాడు  సాహిత్యాన్ని బేరీజు వేసి తూచి నాణ్యతను నిగ్గు తేల్చే గొప్ప సమర్ధత ఉన్న షరాబు .ప్రతి సాహిత్య కారుది మీదా జాన్సన్ ఏం చెప్పాడు అని అందరూ ఎదురు చూసే వారు .

‘’ది జెంటిల్ మానస్ మెగ జైన్ ‘’ ప్రింటర్ పబ్లిషర్ ఎద్వార్డ్ కేవ్ –జాన్సన్ కు ఉద్యోగం ఇచ్చాడు .అందులో పని చేస్తూ వ్యాసాలూ స్కెచ్ లు కవితలు ,పార్ల మెంటరీ చర్చల పై  రిపోర్టులు రాశాడు .వినపడని వాటిని స్వయం గా సందర్భానికి తగి నట్లు కూర్చి రాసేవాడు .జువేనాల్ రాసిన ‘’మూడవ సెటైర్ ‘’పారా ఫ్రేజ్ రాశాడు తర్వాత ‘’వానిటీ ఆఫ్ హ్యూమన్ విషెస్ ‘’పదకొండేళ్ళ తర్వాతా రాశాడు .అతని కామెంటరీ లన్నీ లాటిన్ పద జాలం తో బైబిల్ సూక్తి ముక్తావళి తో ఉండేవి .ఒక సమగ్ర డిక్షనరీ తయారు చేయాలనే కోరిక కలిగి దానికి తగిన ప్రణాళిక తయారు చేసి లార్డ్ చెస్టర్ ఫీల్డ్ కు సమర్పించాడు .యేళ్ళు  గడిచినా దానిపై రాజు స్పందించలేదు నిర్లక్ష్యానికి బాధ  పడ్డాడు .అనుమతి లేక పోయినా మొదలు పెట్టాడు .పూర్తీ చేశాడు దీనిమీదా రాజు పెద్దగా ద్రుష్టిపెట్టలేదు .విసిగెత్తి విన్నపాలుగా జాబులు రాశాడు .కావాలనే రాజు అలా చేశాడని గ్రహించాడు

జాన్సన్ అదృష్టం దోబూచు లాడింది .’’ఐరీన్ ‘’పేరరాసిన బ్లాంక్ వేర్స్ ట్రాజెడీని గార్ర్రిక్ అనే శిష్యుడు ప్రదర్శించాడు దీని కి రెండు వందల పౌండ్లు మాత్రమె వచ్చాయి .ట్రాజెడీ ట్రాజేడీనే మిగిల్చింది త .’’రాసీల్స్ –ప్రిన్స్ ఆఫ్ అబిసీనియా ‘’నవల రాశాడు  దీన్ని ఒల్తైర్  రాసిన ‘’కాన్దీద్ ‘’తో పోల్చారు .మూడవ జార్జి అధికారం లోకి వచ్చిన తర్వాత జాన్సన్ కు ఏడాదికి మూడొందల పెన్షన్ ఏర్పాటు చేశాడు .ఆర్ధిక స్తితి బాగు పడింది .షేక్స్ పియర్ నాటకాలను ఎనిమిది పుస్తకాలుగా పూర్వపు వారి కామెంటరీ ల ననుసరించి తెచ్చాడు. అందులో జాన్సన్ సామర్ధ్యం తక్కువే నన్నారు .చివరి రచన గా ‘’లైవ్స్ ఆఫ్ ది పోఎట్స్ ‘’ను డెబ్భై వ ఏట రాయటం ప్రారంభించాడు. అదే వ్యాపకం గా జీవించాడు. రెండు వందల గినీలోచ్చాయి అతని జ్ఞాపక శక్తి మేధా ,కూర్పు అనితర సాధ్యమని పించాయి .రెండు వందల ఏళ్ళ  పాటు అదే కవుల జీవితాలకు కరదీపిక గా నిలిచింది .కవుల జీవితం కవిత్వం అందులోని సొంపులు ఇంపులు విమర్శనాత్మకం గా రాశాడు .సత్యాన్వేషణ లో ఎవరినీ వదలలేదు .’’un disputed leader of thought for a quarter of a century –a writer whose prodigious reputation surpassed his out put .’’డెబ్భై అయిదేళ్ళ వయసులో 13-12-1784 న జాన్సన్ మరణించాడు .వెస్ట్ మినిస్టర్ ఆబ్బే లో సమాధి చేశారు .

జాన్సన్ రాసిన చిన్న కవితాలలో మెరుపులు లేవు గుర్తుండి పోయేవీకావు .’’రాసిలాస్’’ లో జాన్సన్ ‘’the business of a poet is to examine not the individual but the species –to remark general properties and large appearences .he does not number the streaks of the tulip or describe the different shades of verdure of the forest ‘’అని భాష్యం చెప్పాడు .సాహిత్యం లో జీవిత చరిత్రలకు తేరా దీసిన వాడు జాన్సన్ .రాసి తక్కువైనా వాసి ఎక్కువ అనేట్లు కవిత్వం రాశాడని కొందరి అభిప్రాయం .’’క్రిటిక్కుల క్రిటిక్ ‘’అన్నారు .

Portrait of Samuel Johnson after Sir Joshua Reynolds

 

వ్యంగ్య కవి చార్లెస్ చర్చిల్

చర్చిల్ కవిత్వం ఏవగింపు అన్నాడు సామ్యుల్ జాన్సన్ .చర్చిల్ కవిత్వం తాత్కాలికానందాన్నిస్తుందని శిష్యుడు బాస్వేల్  అంటాడు .సమకాలీనులను ఆశ్చర్య చకితుల్ని చేశాడు చర్చిల్ .ఒక క్లేర్జిమన్ కు 1732లో పుట్టిన చర్చిల్ వెస్ట్ మినిస్టర్ స్కూల్ లో చదివి కేంబ్రిడ్జి సెయింట్ జాన్ కాలేజిలో చదివాడు కాని మెట్రి కూడా పాస్ కాలేదు .బాకీ ఉన్న డబ్బులు కవిత్వం రాసి తీరుస్తానన్నాడు .’’అపాలజీ ‘’రాసి వెయ్యి పౌన్లు ఆర్జించాడు .భార్యనోదిలేసి కనపడిన అందరితో కులికాడు .ఒక వ్యాపారి కూతురికి లైన్ వేసి కొంపలో కూర్చో బెట్టాడు. ముతక కవిత్వం గిలికాడు ‘’ది ప్రాఫేసీ ఆఫ్ ఫామిన్ ‘’రాసి కొంచెం కదిల్చాడుజనాన్ని .జనం మర్చిపోయిన కవుల్లో చర్చిల్ ఒకడయ్యాడు .ముప్ఫై రెండులో ఒక ప్రయాణం లో ఆక్సి డెంట్ వలన4-11- 1764లో చనిపోయాడు .1763లో రచనలు ముద్రింప బడ్డాయి.

 

  

 

గ్రీన్ ,డయ్యర్ ,థామ్సన్

ప్రయోజన కరమైన కవిత్వాన్ని రాసిన వారిలో మాధ్యూ గ్రీన్ ఉన్నాడు .1697లో పుట్టి 1737లో చని పోయాడు .లండన్ లో పుట్టి అదే ప్రపంచం గా బతికాడు మర్యాదాపూర్వక కవితలల్లాడు .క్వేకర్స్ కోసం ది సీకర్ ‘’,’’అపాలజీ ఫర్ క్వేకర్స్ రాశాడు .ఒకరకం గా క్వేకర్ కవి .

ఉన్నికవి-  జాన్ డయ్యర్ వేల్స్ 1699-1744వాడు .ఇటలీలో పెయింటింగ్ కోర్సు చదివాడు .ప్రక్రుతి దృశ్యాలను చిత్రకారుడి దృష్టితో చూశాడు కవిత్వం సాహిత్య భ్రాంతి తో ఉంటున్దని అన్నారు  .ప్రతి నామ వాచాకానికి విశేషనం ఉంటుంది .క్లేర్జిమన్ అయిన డయ్యర్ పరిశీలనను నీతి బోధనాన్ని చేర్చి మనిషి కోసం రాశాడు. విషయాన్ని వాస్తవ దృష్టితో చూసి కవిత్వం రాశాడు .ఏడు వందల లైన్ ల ‘’ప్లీస్ ‘’రాశాడు .ఇది వర్జిల్ రాసిన జిఅర్జిక్స్ లా ఉంటుంది .ఉన్ని నేత విషయమే ఎక్కువ ..మగ్గాల ధ్వనుల్ని పసికట్టి కవిత్వం లో చోటుకల్పించాడు. మాంచెస్టర్ ,చెస్ ఫీల్డ్ లకు వృత్తికి ప్రతీకలివి ‘’the cries of sorrow sadden all the streets –and the disease of intemperate wealth ‘’ అను ఉన్ని వ్రుత్తి లో వారి కష్ట సుఖాలన్నీ కళ్ళకు కట్టించాడు .’’ఉన్ని కవి ‘’అని పిస్తాడు ‘’గ్రాన్గేర్ హిల్’’అనే ప్రసిద్ధ కవిత లో పతన వాస కవిత్వం లోని డొల్ల తనాన్ని చూపాడు .సూక్తి ముక్తావళి లాంటి కవిత్వాన్ని రాశాడు .

బ్రిటన్ జాతీయ గీతాన్ని రాసిన  జేమ్స్ థామ్సన్ 1700లో పుట్టి 1748లో మరణించిన స్కాట్ లాండ్ కవి .ఎడిన్ బర్గ్ యూని వర్సిటి లో చదివి చర్చి మినిస్టర్ కు సెలెక్ట్ అయి మనసు మార్చుకొని లండన్ చేరి పోప్ సర్కిల్ లో చేరి ,పోషకుల వలన ఇటలీ ఫ్రాన్స్ లు తిరిగి ఫ్రాన్స్ లో లార్డ్ చాన్స్ లర్ కొడుకుకు కు ట్యూటర్ అయ్యాడు .డ్రామటిస్ట్  గా విజయ దుందుభి మొగిన్చి లండన్  తిరిగి వచ్చాడు .గ్రామీణ రిచ్ మాండ్ లో కాపురమున్నాడు .అయిదు ట్రాజేడీలు రాశాడు .టెన్ సిలబిల్ బ్లాంక్ వేర్స్ ను వాడాడు .’’ఒ సోఫియా సోఫియా ‘’అనే దీర్ఘ ఎలిగరి  కవిత రాశాడు .’’ది కాజిల్ ఆఫ్ ఇండోలేసేన్స్ ,’’ఆల్ఫ్రెడ్ ‘’లు కూడా రాసి మెప్పించాడు .ఆల్ఫ్రెడ్ లో బ్రిటన్ జాతీయ  గీతం ఉంది .ప్రకృతిని ప్రేమిస్తూ చాలా రాశాడు .దీర్ఘకవితల్లో బ్లాంక్ వేర్స్ నుపయోగించాడు. కొత్త పరిశోధనలపై కవిత్వం రాసి అంతకు ముందెవరూ చేయని సాహసం చేశాడు .శరదృతువులో జాబిలీ అతనికి ‘’week and blunt ,is wide refracted rays ‘’లా కని పించింది .’’ది సీజన్స్ ‘’లో పెద్దగా సంచలనాత్మకమైన విషయాలు లేవు .కాని ఆ పంక్తులలో సంగీతం మనసుకు హాయి నిస్తుంది .ఆ తరం కవులలో ఎవరికీ అబ్బని ఈ సంగీత గుణం థామ్సన్ కవిత్వం లో చేరి బంగారానికి తావి అబ్బి నట్లయిది .దీనికి జెర్మనీ అనువాదం ప్రపంచ ప్రసిద్ద మైంది .ధాంసన్ మరణం పై జాన్సన్ స్పందిస్తూ ‘’ by taking cold on the waters between London and Kew ,he caught a disorder which careless exasperation ended in a fever that put end to his life’’అన్నాడు .

సశేషం

రేపు శ్రీ హనుమజ్జయంతి -శుభా కాంక్షలతో

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -2-5-14-ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఎంత మంది మహత్ములబ్బా! గాంధీపై పటేల్ విసుర్లు -raj mohan gandhi

ఎంత మంది మహత్ములబ్బా! గాంధీపై పటేల్ విసుర్లు

Published at: 22-05-2014 00:23 AM

భారత స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రలో సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్‌కు ఒక ప్రత్యేక స్థానముంది. గాంధీ, నెహ్రూ, పటేల్‌ల మధ్య ఉన్న సంక్లిష్టమైన అనుబంధాలు, జాతీయోద్యమంపై వాటి ప్రభావం, సమకాలీన భారతదేశంలో పటేల్ సిద్ధాంతాల ఆవశ్యకతలపై ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. అయితే పటేల్ జీవితాన్ని సమగ్రంగా చిత్రీకరించిన రచనలు అతి తక్కువ. ఈ లోటును పూరిస్తూ గాంధీ మనమడు, చరిత్రకారుడు రాజ్‌మోహన్ గాంధీ ఇంగ్లీషులో రాసిన పటేల్ జీవితకథను-“వల్లభ్‌భాయ్ పటేల్.. ” పేరిట ఎమెస్కో పబ్లికేషన్స్ ఇటీవల తెలుగులో ప్రచురించింది. దానిలోని కొన్ని ఆసక్తికర భాగాలు..

లండన్‌లో లా కాలేజీలను ‘ఇన్స్ ఆఫ్ ద కోర్ట్’ అని పిలిచేవారు. అటువంటి కాలేజీలలో ఒకటైన మిడిల్ టెంపుల్‌లో వల్లభ్‌భాయ్ చేరాడు. అక్కడ కోర్సులో భాగంగా మూడేళ్లలో తొమ్మిది టర్మ్‌లు చదవాలి. ప్రతి టర్మ్‌లో ఏదో ఒక ఇన్‌లో కనీసం ఇన్నిసార్లు రాత్రిపూట భోజనం చేయాలనే నియమం ఉంది. తనకన్న ముందు మోహన్‌దాస్ గాంధీ, మహమ్మద్ అలీ జిన్నా, విఠల్‌భాయ్ అలాగే చేసారు. 1910లో జవహర్‌లాల్ నెహ్రూ కూడా ఇన్నర్ టెంపుల్‌లో చేరాడు. ఆయన వల్లభ్‌కన్న 14 సంవత్సరాలు చిన్నవాడు. అక్కడ చేరేముందు నెహ్రూ.. హారో, కేంబ్రిడ్జ్‌లలో చదివాడు; వల్లభ్‌లాగా పెట్లాడ్, నడియాడ్, బోర్సాడ్‌లలో కాదు. లండన్‌లో వల్లభ్, జవహర్‌లాల్ కలిసినట్లు ఎక్కడా రికార్డు లేదు. భౌతికంగా, విద్యాపరంగా సమీపంలో ఉన్నా వారు ఎవరి ప్రపంచంలో వారుండిపోయారు.

‘ఈక్విటీ’ అనే సబ్జెక్టులో మొదటి మార్కులు వచ్చినందుకు వల్లభ్‌భాయ్‌కు, గాడ్‌ఫ్రే డేవిస్ అనే క్లాస్‌మేట్‌కు 1911 జనవరిలో కాలేజీవారు అయిదేసి పౌండ్లు బహుమతిగా ఇచ్చారు. ఆ బహుమతి పొందినప్పుడు తనకు ఎంత ఆనందం కలిగిందో ఆయన నర్సీభాయ్‌కి రాసిన ఒక ఉత్తరాన్ని బట్టి గ్రహించవచ్చు.

“గౌరవనీయులైన సోదరులు నర్సీభాయ్‌కి, నేను ఒక పరీక్ష రాసాను. మొదటిర్యాంక్ వచ్చింది. గౌరవనీయులైన తల్లిదండ్రులకు నా ప్రణామాలు తెలియజేయండి. అక్కడి సమాచారాలు రాస్తుండండి. కాశీభాయ్ అసలేమీ రాయటంలేదు… భగవంతుని దయ ఉంటే తక్కిన రెండు సంవత్సరాలు త్వరలోనే గడిచిపోయి, తిరిగి మీ అందరినీ చూస్తాను. మీ సేవకుని ప్రణామాలు. వల్లభ్‌భాయ్.”

ఇంగ్లాండులో విద్యార్థులు కోరుకుంటే సుమారు 20 నెలలకే పరీక్షలు రాయవచ్చు. ఆనర్స్‌లో పాసైన వారు తమ ఇన్‌లో మరొక టర్మ్‌పాటు నిర్ణీత కార్యక్రమం ప్రకారం డిన్నర్లు పూర్తిచేస్తే, అప్పుడు వారిని ఆరునెలలు ముందే బార్‌కు పిలుస్తారు. ఆ విధంగా విఠల్‌వలెనే వల్లభ్ కూడా 20 మాసాలకే ఫైనల్ పరీక్షలు రాసి, ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడై, 50 పౌండ్ల బహుమతి గెలుచుకున్నాడు. దాని గురించి కూడా ఇంటికి ఉత్తరం రాసాడు:

“మిడిల్ టెంపుల్, లండన్ నుంచి నర్సీభాయ్‌కి, 7-6-1912:
నా పరీక్షలు పూర్తయ్యాయి. ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడినయ్యాను. అందువల్ల ఆరు మాసాలు ముందుగానే ఇంటికి రాగలను. వచ్చే జనవరిలో తిరిగివస్తాను. ఈ మాట తల్లిగారికి, తండ్రి గారికి తెలియజేయగలరు. మిత్రులకు కూడా తెలుపగలరు. ఇంతే విశేషాలు. ప్రణామాలతో మీ సేవకుడు వల్లభ్‌భాయ్.”

అగ్రస్థానానికి చేరేందుకు పటేల్ కోసం ఒక నిచ్చెన వేసి ఉంచి, సమయం కోసం ఎదురుచూస్తుండిన విధి, మరో ఇతర ఆలోచనకు కూడా చేసింది. ఆ విధి 1915లో మరొక బారిష్టర్‌ను అహమదాబాద్‌కు తీసుకుని వచ్చింది. ఆయన పేరు మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ. ఆయన అప్పటికే ఇరవై సంవత్సరాలకు పైగా దక్షిణాఫ్రికాలో గడిపాడు. వల్లభ్‌భాయ్‌కన్న ఆరేళ్లు పెద్దవాడైన గాంధీ దక్షిణాఫ్రికాలోని భారతీయులకు శ్వేతజాతీయులతో సమానావకాశాలకోసం ఉద్యమించి చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించాడనటంలో సందేహంలేదు. స్వదేశానికి తిరిగి వచ్చిన నెలరోజులలోనే ఆయనను మహాత్ముడన్నారు. అందుకు వల్లభ్‌భాయ్, “మనకు ఇప్పటికే చాలామంది మహాత్ములున్నా” రంటూ ఈసడించాడు. గుజరాత్ క్లబ్ సభ్యులు కొందరు నగరంలో గాంధీ ఆరంభించిన కొచ్‌రబ్ ఆశ్రమానికి కుతూహలం కొద్దీ వెళ్లారు. వారు.. సత్యాగ్రహం, అహింస అనే కొత్త ఆయుధాలను గాంధీ తీసుకొచ్చాడనే కబురు మోసుకొచ్చారు. ఆ ఆయుధాలు భారతీయులకు ఉపయోగపడగలవని, బహుశా వారిని పరాయి పాలన నుంచి విముక్తులను కూడా చేయగలవని ఆయన నమ్ముతుండినట్లు వారికి తోచింది. అంతేకాదు, విద్యావంతులైన భారతీయులు ధాన్యం విసరాలని, మరుగుదొడ్లను శుభ్రంచేయాలని ఆయన చెప్పాడని వాళ్లు చెప్పారు.

అది విని నవ్విన పటేల్, గాంధీ “తిక్క” గురించి, “విచిత్ర ఆలోచనల” గురించి వ్యంగ్య వ్యాఖ్యలు చేసి అందరినీ నవ్వించాడు. కొందరి ఆహ్వానంపై గాంధీ ఒకరోజు ఆ క్లబ్బుకు వెళ్లాడు. అక్కడి లాన్స్‌పైన ఆయన చేయబోయే ప్రసంగం వినేందుకు కొందరు వెళ్లారు. వారంతా వరండాలోని తన బ్రిడ్జ్ టేబుల్ పక్కనుంచి వెళుతుండగా చిరాకుపడిన వల్లభ్‌భాయ్, వారిని ఆపేందుకు ప్రయత్నించాడు. బ్రిడ్జ్ టేబుల్ వద్ద పటేల్ చర్యలను గమనిస్తుండిన మావ్లంకర్ ఆ తరువాత చెప్పిన వివరాలను బట్టి, అదంతా 1916 వేసవికాలంలో జరిగినట్లు నిర్ధారించవచ్చు. అంతలో గాంధీ రావటాన్ని చూసి మావ్లంకర్ లేచి నిలుచున్నాడు.

పటేల్: మావ్లంకర్, ఎక్కడకు వెళుతున్నారు? ఎందుకు లేచారు?

మావ్లంకర్: చూడండి, గాంధీ వస్తున్నారు.

పటేల్: అయితే ఏమిటి. మన గేమును చూసి మీరు ఇంకా ఎక్కువ నేర్చుకోవచ్చు. ఆయనేమంటాడో నేను చెప్పగలను. ఆయన మిమ్మల్ని గోధుమల నుంచి రాళ్లు ఏరగలరా అని అడుగుతాడు. అందువల్ల దేశానికి స్వాతంత్య్రం లభిస్తుందట.
ఆ మాట విని అందరూ మరింత పెద్దగా నవ్వారుగాని మావ్లంకర్ మాత్రం గాంధీ కోసం వెళ్లాడు. ఆయన ఉద్దేశంలో, వల్లభ్‌భాయ్ తన ధోరణిలో ఆ విధంగా మాట్లాడినప్పటికీ ఆ సరికే “ఆ మనిషిని గౌరవించటం” మొదలుపెట్టాడు. పాతికేళ్ల తరువాత వల్లభ్‌భాయ్ ఆ విషయమై మాట్లాడుతూ, 1915లో, 1916లో తను సుమారు 40 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు, విశిష్టమైన మేధాశక్తిగల యువకులు గాంధీపట్ల ఆకర్షితులు అవుతుండటం తనకు అర్థంకాని విషయంగా తోచిందని ఒప్పుకున్నాడు.

డిసెంబర్‌లో బీహార్‌లో పర్యటించిన పటేల్ రైతులను ఉద్దేశించి హిందీలో ప్రసంగాలు చేసాడు. అందులో మధ్యమధ్య గుజరాతీని చేర్చాడు. సూటిగా మాట్లాడే ఆయన పద్ధతి అక్కడ కొత్త పుంతలు తొక్కింది:
“నేను మీమీద కోపగించటానికి వచ్చాను తప్ప ఆశీర్వదించేందుకు కాదు. మహాత్ముడు ఇతర ప్రాంతాలకన్న ముందుగా మీవద్దకు వచ్చారు. కాని ఆ గౌరవానికి మీరు అర్హులైనట్లు తోచటం లేదు. మిమ్మల్ని నోరుమూయించే క్రూరమైన ప్లాంటేషన్ యాజమాన్య ధోరణులు ఇప్పుడు లేవు. అయినప్పటికీ మీరు ఇంకా మూగపశువుల్లా ఉంటున్నారు. మీ జమీందార్లపై రాత్రింబగళ్లు ఫిర్యాదులు చేస్తారు. కాని వాళ్లను దారికి తెచ్చేందుకు ఏమీ చేయరు… జమీందార్లు తమ పద్ధతులు మార్చుకోనట్లయితే వారికోసం వ్యవసాయం చేయకండి.

మీ స్త్రీలను పరదాల వెనకే ఉంచటానికి మీకు సిగ్గువేయటం లేదా? ఎవరీ స్త్రీలు? మీ తల్లులు, సోదరీమణులు, భార్యలు. వాళ్లు బయటి ప్రపంచంలోకి వచ్చినట్లయితే మీ బానిసత్వాన్ని చూసి ఇక మీతో తెగతెంపులు చేసుకుంటారని భయపడుతున్నారా? వారితో మాట్లాడే అవకాశమేగాని నాకు లభిస్తే, ఇటువంటి పిరికిభర్తలతో సంసారం చేయటంకన్నా విడాకులివ్వమని చెప్తాను.

మతంపేరిట బాల్యవివాహాలు చేసే బ్రాహ్మణులు, బ్రాహ్మణులు కారు, వారు దయ్యాలు. జమీందార్లు, బ్రాహ్మణుల నియంతృత్వానికి ఇష్టపూర్వకంగా లొంగిపోయే మీకు, రైతులనిపించుకునే అర్హత లేదు.”

వల్లభ్‌భాయ్ 1929వ సంవత్సరంలో చేసిన ప్రసంగాలన్నింటిలో భూమిశిస్తు హెచ్చుగా ఉండటం గురించి ప్రస్తావించేవాడు. ఆ అంశాన్ని ఆధారంగా చేసుకుని భారతదేశాన్నంతా ఒకటి చేయవచ్చునన్నది ఆయన నమ్మకం. కాని మహాత్మునికి అంత నమ్మకం ఉండేది కాదు. ఆయన ఆ అంశాన్ని 1929 సెప్టెంబర్ యంగ్ ఇండియా సంచికలో చర్చించాడు.

వల్లభ్‌భాయ్ పటేల్ (జీవిత కథ)
రచయిత: రాజ్‌మోహన్ గాంధీ
తెలుగు సేత: టంకశాల అశోక్
వెల:300 రూపాయలు
పేజీలు: 822

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -26 పోట్టివాడైనా గట్టి వాడు –అనధికార ఆస్థాన కవి -అలేక్సాండర్ పోప్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -26

పోట్టివాడైనా గట్టి వాడు –అనధికార ఆస్థాన కవి -అలేక్సాండర్ పోప్

‘’  విషం కక్కే సాలీడు ‘’అని సమకాలీనులు అన్నా ,శారీరక వంకర్లున్నా ,,మానసిక వక్రత ఉన్నా ,ఈ నాడు అలేక్సాండద పోప్ కవి ఆరాధింప బడుతూనే ఉన్నాడు .’’కోల్డ్ బ్లడేడ్ టెక్నీషియన్’’ అని పేరు .తెలివిగల వ్యాస కర్త ,తమాషా రైమ్స్ తో కవిత్వాన్ని పండించిన వాడు .కాలాతీత కవిత్వాన్ని సృష్టించాడని ఇరవయ్యవ శతాబ్ది విమర్శకుల అభిప్రాయం .’’one of the greatest poets of our poets who is in his two finest poems perhaps the most flawless artist of our race has produced ‘’అని ఎడిత్ సిట్వేల్ చేత ప్రశంసింప బడ్డాడు .ఆయన రచనలు అనేక ఆలోచనలకు  పదకోశం .షేక్స్ పియర్ తర్వాత తరచుగా ఉదహరింప బడే కవి .’’to  err is human to forgive is divine ‘’,a little learning is a dangerous thing ‘’,fools rush where angels fear to tread ‘’men must wlalk before they dance ‘’మొదలైనవి అందరూ తరచుగా ఉదాహరించేవే .

అలేక్సాండర్ పోప్ లండన్ లో 22-5-1688న జన్మించాడు .ముసలి తలిదండ్రులకు ఒక్కడే కొడుకు .తండ్రి లినెన్ డ్రీపర్ .చిన్నప్పుడు కుర్రాడు బానే ఉండే వాడు .కాని చిన్ననాటే జబ్బుకు గురై ఆరోగ్యాన్ని కోల్పోయాడు మళ్ళీ పూర్వ ఆరోగ్యాన్ని పొందలేదు .ఇక పొందలేదని కూడా రూఢి అయింది .పూర్తిగా ఎదగక పొట్టి వాడుగా నే ఉండిద పోయాడు .డొక్క లోపలి పోయి యూని వర్సిటీలలో చదవ లేదు .సామాన్య కుటుంబం లో పుట్టటం వలన అన్నిటికీ దూరమైనాడు .జీవితాంతం బాధించిన ఆవ్యాధియేఅన్నిటికీ కారణమైంది .విధి వక్రించింది ఒక రకం గా .పదేళ్ళ వయసులో గ్రీక్ లాటిన్ లను అనువదించిన మేధావి .పన్నెండుకు హోరేస్ రాసిన సాలిట్యూడ్ కు పారా ఫ్రేజ్ రాశాడు .అది ఇప్పటికీ గొప్ప ఆ యాన్తాలజి గా గుర్తింపు పొందుతోంది .ఒక మహా కావ్యాన్ని ‘’అలేక్సాండర్ ప్రిన్స్ ఆఫ్ రోడ్స్ ‘’పేరిట రాయటం ప్రారంభించాడు .ఇందులో తానూ అభిమానించిన అందరికవుల చాయలూ ఉన్నాయి .ముఖ్యం గా వర్జిల్ ,హోమర్ లంటే వీరాభిమానం .

లండన్ నుంచి కుటుంబం విన్ స్టార్ ఫారెస్ట్ లోని బిన్ ఫీల్డ్ కు మారినప్పుడు ఈ కావ్యం మొదలెట్టాడు .దాన్ని తగల బెట్టేశానని చెప్పాడు కాని పన్నెండు పదిహేనేళ్ళ మధ్య దాన్ని మళ్ళీ రాసి వెలుగు లోకి తెచ్చాడంటే పొట్టోడు గట్టొడే అని పిస్తుంది అందుకే ‘జయంట్’డ్వార్ఫ్ ‘’అన్నారు .పద్నాలుగో ఏట ‘’ఆన్ సైలెన్స్ ‘’,అపాన్ నతింగ్ ‘’లు రాశాడు .పదహారు లో వరుస ‘’పాస్తోరల్ ‘’పోయెమ్స్ రాశాడు .ఇవి వ్రాతప్రతులుగా అందుకొన్న వాల్ష్ ,జార్జి గ్రాన్ విల్లీ వంటి వారిని మెప్పించాయి ‘’ఒక అజ్ఞాత మహా మేధావి అడవిలో మగ్గుతున్నాడు ‘’అను కొన్నారు .ఇలాగే విజ్రుమ్భించి రాస్తే అందర్నీ మించిపోయే మహా కవి అవుతాడని మురిశారు .ఇది తెలిసిన జాకబ్ తాన్సన్ అనే ముద్రాపకుడు వాటిని ముద్రిస్తానని  ముందుకొచ్చ్చాడు .అతనిలో మహా పాండిత్యం కవితా ప్రతిభా ఉన్నాయని గ్రహించాడు .వాటి ముద్రణ తో పోప్ గొప్ప కవి అయి పోయాడు ఇరవై కే .

ఇందులో పోప్ గొర్రెల కాపర్లు లండన్ వాసుల్లా మాట్లాడి ఆశ్చర్య పరుస్తారు .ఒకే రైం ను కొన్ని పంక్తుల్లో వాడాడు .చెవికి ఇంపైన పదజాలం తో అతనొక  మాటల  సృష్టి కర్త అయ్యాడు .

ఇరవై రెండో ఏట ‘’ఎస్సే ఆన్ క్రిటిసిజం ‘’రాశాడు .ఇందులో భాష లో భావం లో శబ్ద కూర్పులో హోయాల్లో లయలలో ఆయన పోకడలు అనంతం .ఇది పోయెం ఆఫ్ ది పీరియడ్ గా గుర్తింపు పొందింది .సరి అయిన విద్య నేర్వాలని హెచ్చరించాడు .కొత్తదనం కోసం పాకులాడ వద్దన్నాడు .కొత్తొక వింతా పాతొక రోత అనే భావం వదిలేయ్యమన్నాడు .’’fear not the anger of the wise to raise .those best can bear reproof who merit praise ‘’అని బోధించాడు .

‘’his life is had been no longer than one of his poems –the life of half a day ‘’అని కొందరు ఈసడించారు .అతని శారీరక అవ లక్షణాన్ని ఆవ హేళన చేయటం తో ఆ ఇరవై మూడేళ్ళ యువకుడు మానసికం గా కున్గిపోయాడు .కాని ఎక్కడా బయట పడలేదు .కాని లోలోపల కుములుతున్నాడు .తన బాధను ఒక కవితలో’’ గే కవి’’కి చెప్పుకొన్నాడు .యాభై లో ఎవరొ ఒకరి సాయం లేకపోతే నిలబడ గలిగే వాడుకాదు .దీన్ని జాన్సన్ ఎద్దేవా చేశాడు .అబట్టలు మార్చటం కూడా ఎవరో చేయాల్సిందే. ఎప్పుడూ ఒకసేవకుడు   ఉండాల్సి వచ్చేది .నరక యాతన అనుభవించాడు .దీనికి తోడూ సూటి పోటీ మాటలు .ఆయనకు తెలియ కుండా జోనాధన్ స్విఫ్ట్ తో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు  ప్రింట్ చేశారు .స్విఫ్ట్ గ్రహించి  తనకు పోప్ రాసినవి తిరిగి పంపించేశాడు .ఇలా ఆ కురచ మహా కవిని అన్ని విధాలా అవహేళన చేశారు .ఇందులో పోప్ స్వయం క్రుతాపరాధమూ లేక పోలేదు .

ఏంతో మంది స్త్రీల తో తిరిగాడంటారు .అందులో తెరెసా ,మార్తా బ్లౌంట్ అనే సిస్టర్స్ ఉన్నారు .ఇందులో ఒకరు ఆయన అర్ధాంగి అయి ఉంటారని ఊహా గానం .అనుమానాలకు తావు ఇవ్వటం పోప్  లక్షణం కూడా .లేడీ మాంటేగ్ తో ఒప తగాదా పడ్డాడు .ఆమె చేసిన అవమానాన్ని మర్చిపోలేక పోయాడు ఒకదాని వెంట ఒకటి కవితలు గిలికి పారేశాడు .ఆమె కున్న మర్మావయవ జబ్బును అందరికి  అంటించింది అని కూడా   .’’ది రోప్ ఆఫ్ దిలాక్ ‘’లో అనేక అసందర్భాలున్నాయి ‘ది ఎపిసిల్ టు డాక్టర్ ఆర్బత్ నాట్ ‘’ను నలభై ఆరో ఏట ప్రచురించాడు .పోప్ కంటే పాతికేళ్ళు పెద్ద వాడైన ఆర్బర్త్ నాట్ ‘’ద్వేషం వదిలేయి మానవ ప్రకృతిలోని మంచినీ నీతినీ గురించి ఇక నుంచైనా రాయి ‘’అని సలహా ఇచ్చాడు .అది తనమంచికోసమే ననీ చెప్పాడు .దీనితో పోప్ కళ్ళు తెరుచుకొన్నాయి కొత్త భావాలు ఆలోచనలు దర్శనాలు తో కవిత్వం దారి మళ్ళింది .వ్యక్తిగత ద్వేషాన్ని దూరం చేసుకొన్నాడు .’ఎపిజిల్స్ ‘’లో తన నూతన ప్కడలు చూపాడు కాని లోపల లార్డ్ హీర్వీ పై ద్వేషం వదలలేదు  .

పోప్ అనువాదం చేసిన ఇలియడ్ ప్రచురణ తో ఆర్ధికం గా పున్జుకొన్నాడు ఒక్కో దానికి గినియా రేటు పెట్టాడు ఆరు వందల మందికొన్నారు .రాజు రెండు వందల పౌండ్లు కానుక ఇచ్చాడు .ఆరుగురు అసిస్టంట్ లతో ఆ అనువాదాన్ని ఆరేళ్లలో పూర్తీ చేశాడు .అయిదు వేల పౌండ్ల ధనాన్ని చేకూర్చింది ఇది .దీనిపై విమర్శలోచ్చాయి ఇది హోమర్ రచన లా లేదన్నారు .ఇవేవీ పోప్ ను ఆపలేక పోయాయి ఆ కాలపు ‘’సాహిత్యమార్తాండుడే ‘’అయ్యాడు .దీనితర్వాత ‘’ట్వికెన్ హాం ‘కు మకాం మార్చాడు చిన్న ఇల్లు తోట ఏర్పాటు చేసుకొన్నాడు .స్విఫ్ట్ వచ్చి ఇక్కడ కొంతకాలం ఉన్నాడు పోప్ ను గురించి ‘’.Pope has the talent well to speak –but not to reach the ear his loudest voice is low and wea k –the Dean too deaf to hear ‘’అని స్విఫ్ట్  తన అనుభవాన్ని గురించి రాశాడు .ఒడిస్సీ కి పోప్ రాసిన మూడు భాగాల పుస్తకాలు అప్పుడే పబ్లిష్ అయ్యాయి నాలుగు అయిదు భాగాలు ఏడాది తర్వాతా వచ్చాయి .’’the story is Homer;s  but the accent is Pope;s ‘’అన్నారు .ఇరవై నాలుగు భాగాలలో అయిదు తప్ప మిగిలినవ్నీ పోప్ ట్రాన్స్లేట్ చేశాడు .నిజానికి ఆయన చేసినవి పన్నెండు మాత్రమె. మిగిలిన వాటికి పర్య వేక్షణ చేశాడు .

నలభై లో’’ది దంసియాడ్’’అనే స్వీయ రచన ప్రారంభించాడు ,ఇందులోపగా ద్వేషం పరాకాష్ట లో ఉంటాయి .యాభై ఒకటిలో దైవం మానవుడు అనే విషయాల మీద రాయాలని ఉందని జాన్ కార్లైల్ కు రాశాడు .’’ఎస్సే ఆన్ మాన్ ‘’రాశాడు .దీన్ని ముద్రించిన తర్వాతా అయిదేళ్ళు సెటైర్స్ వగైరా రాశాడు .’’డి వర్క్స్ ఆఫ్ అలేక్సాండర్ పోప్ ‘’ముప్ఫై వ ఏట నే ముద్రించారు .రెండో భాగం నలభై ఏడులో దీనితో పాటు ఉత్తర ప్రత్యుత్తరాలూ అచ్చయ్యాయి .సన్నిహితురాలైన మార్తా బ్లాంట్ కు చివరి ఉత్తరం మార్చ్ లో రాశాడు .రెండు నెలల తర్వాతా’’30-5-1744లో ‘’మరు గుజ్జు మహా కవి ‘’మరణించాడు . డాక్టర్ ను తన ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగాడు చనిపోయే ముందు బాగుందని వాళ్ళు అంటే ‘’here I am dying hundred good symptoms ‘’అని తన చావు దగ్గర పడిందని చెప్పాడు .రోమన్ కేధలిక్ చర్చి విధానం లో అంత్య క్రియలు చేశారు  చేశారు .చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ ,చర్చ ఆఫ్ సెయింట్ మేరీ ది విర్జిన్  ఆఫ్ ట్వింకిల్ హాం లలో సమాధి చేశారు .

‘’Pope was an accurate recorder of a society that flourished on cliques and intrigues and countless subterfuges.to this society Pope was a victim and mocking contributor .he was also un acknowledged laureate .it is a poetry that speaking almost entirely to the disillusioned intelligence ,springs from the dischanted mind –a saddened but a cynical mind ,aware that while men;s  machanations may make for ignoble living ,they also make entertaining and some times enduring literature ‘’అని పోప్ ను అతని కవిత్వాన్ని అంచనా వేశారు .

హీరోయిక్ కప్లేట్స్ లో సుప్రసిద్ధుడు .ఆక్స్ ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ లో పోప్ ను అనేక మార్లు షేక్స్పియర్, టెన్నిసన్ ల తర్వాతా ఉదాహరించారు .బైబిల్ సంస్కృతికి ప్రతి బింబం గా ఉన్నాడు .స్త్రీ భావ వ్యతిరేకి అని స్త్రీ వాద రచయితలు భావించారు .

 

 

Alexander Pope by Michael Dahl.jpg        

  

పోప్  మరణ దృశ్యం

 

సశేషం మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-5-14-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల ముచ్చట్లు -25 డచెస్ ఆఫ్ న్యూ కాజిల్ –అందాల రాశి –స్త్రీ వాద రచయిత్రి -మార్గరెట్ లూకాస్ కేవండిష్

పూర్వాంగ్ల ముచ్చట్లు -25

డచెస్ ఆఫ్  న్యూ కాజిల్  –అందాల రాశి –స్త్రీ వాద  రచయిత్రి -మార్గరెట్ లూకాస్ కేవండిష్

‘’మార్గ రేట్ లూకాస్ ఎంత రొమాంటిక్ లేడీ యో అంత రొమాంటిక్ గా రాసింది ‘’అన్నాడు సామ్యుల్ పెపీస్ .ఈమెతో బాటు దీటుగా రాసిన మరి ఇద్దరు ఆఫ్రా బెన్ ,అన్నే ఫించ్  అనే స్త్రీ కవులు .మార్గరెట్ లూకాస్ 1623లో లో బాగా పేరున్న కుటుంబం లో పుట్టింది .సోదరులు సాహసులైతే సోదరిలు పధ్ధతి ఉన్నవారు .కాని మార్గ రేట్ కు మాత్రం రోమాన్స్  వంటిన పుట్టిన విద్య .నడవటం నేర్చిన నాటి నుండే ఇందులో దిగింది .బ్రిటన్ అంతర్యుద్ధం లో వీరి కుటుంబాన్ని ప్రవాసానికి పంపారు. లూకాస్ హేన్రిట్టా మేరియా కు చెలికత్తె గా చేరింది .యాభై ఏళ్ళ న్యూ కాజిల్ డ్యూక్ ఈమెను చూడగానే ప్రేమించి పెళ్ళాడాడు .రాజుతో బాటు తాత్కాలికం గా దూరమైనా మళ్ళీ లండన్ చేరారు .రేస్తోరేషన్ తర్వాత భర్తను డ్యూక్ ను చేశాడు  ఈమె డచేస్ అయింది .ఖరీదైన దుస్తులు ధరించి అందం గా అలంకరించుకోనేది .ఏ ఉత్సవం లో పాల్గొన్నా అందరూ తనకోసం ఎదురు చూడాలని ఆలస్యం గా వచ్చేది .అరడజన్ స్త్రీలు ఆమె కారేజ్ ను లాక్కోచ్చేవారు అంత వైభవం ఒలక బోసింది .రాయల్ సోసైటీలోకి దురుసుగా ప్రవేశించేది .దేస్కార్టేస్ హాబ్స్ మొదలైన ఫిలాస ఫర్ ల తో తనకున్న విభేదాలను బహిర్గతం చేసేది .హాబ్స్ ‘’ఏ నీతి పుస్తకం లోను లేనంత నీతి మార్గరెట్ దగ్గర ఉంది ‘’అన్నాడు  .ఇంతటి వైభవం గా జీవించిన ఆమె యాభై వ ఏట 1673లో మరణించింది .సైన్స్ ఫిలాసఫీ లను అలవోకగా రాసింది .’’అబ్సర్వేషనన్స్ అపాన్ ఎక్స్పెరిమెంటల్  ఫిలాసఫీ ,దిస్క్రిప్షణ్ ఆఫ్ ఏ న్యు వరల్డ్ ‘’అనే సైన్స్ ఫిక్షన్ రాసింది .

మార్గరెట్ కవిత్వం ప్రాధమికం గా నే ఉన్నా మహిళా ప్రభావం ఉండేది . ఫాంటసి ప్రాధాన్యత నిచ్చింది .చెట్లు జంతువులుగా కనిపిస్తాయి .పది హేడు ,పద్దెనిమిది శతాబ్దాలలో స్త్రీలు తేనే ,గులాబి పూల వంటివారని కవులు వర్ణించారు

File:Margaret Cavendish.jpg

 

గూఢచారి కవి   –  ఆఫ్రా బెన్

జాన్ ,ఏమిస్ ల కూతురు ఆఫ్రా బెన్ ఒక వేగు గా గుర్తింపు పొందింది .కెంట్ లో 1640లో ఒక మంగలి కుటుంబం లో పుట్టింది .ఇంగ్లాండ్ అధీనం లో ఉన్న సురియం గయానా లలో చదివింది .పద్దెనిమిదో ఏట ఇంగ్లాండ్ చేరింది .సాటిలేని మాట కారి .ఇరవై ఆరేళ్ళ వయసులోనే భార్తాను కోల్పోయింది .రెండవ చార్లెస్ కు డచ్ యుద్ధం లో  గూఢ చారి గా పని చేసింది .మిలిటరీ వ్యూహం లో మంచి నేర్పున్న మహిళా .చాలా విలువైన ,ముఖ్య సమాచారాలను సేకరించి రాజుకు అందజేసింది .కాని ఆమె కు ఇంటా బయటా శత్రువులున్నారు .కుట్రలు పన్ని ఆమె ను రాజుకు దూరం చేశారు .ఆఫ్రా పేదలు ఉండే  చెరసాల లో బంధించి హింసించారు .

పునర్వైభావాన్ని రచనల ద్వారా సాధించాలని నిర్ణయించుకోంది.సహజ రచనా చాతుర్యం అలవడింది .తన సాహసాలను ప్రేరణ నిచ్చేట్లునాటకాలు  రాసింది .దాదాపు పది హేనును నాటకాలు రాసింది .అందులో ‘’రోవర్ ‘’బాగా క్లిక్ అయింది .మధ్యమధ్య కవితలూ నవలలూ రాసి మెప్పించింది .చిన్న నాటి స్మృతులను ‘’ఒరనూకో ‘’,లో రాసుకొన్నది .అదొక బానిస కదా .ఫిలాసఫికల్ ఫిక్షన్ .ప్రజా భిమానాన్ని ఎక్కువ కాలం పొందలేక పోయింది .యాభై ఏళ్ళకే చనిపోతే వెస్ట్ మినిస్టర్ ఆబ్బే లో సమాధి చేసి గౌరవించారు .నాటకాలు ఆమె లో ఒక పార్శ్వాన్ని ,కవిత్వం రెండో పార్శ్వాన్ని తెలియ జేస్తాయి .మగాదిలాగా రాసిందన్నారు కాని మించి రాసింది .

All women together, ought to let flowers fall upon the grave of Aphra Behn… for it was she who earned them the right to speak their minds… Behn proved that money could be made by writing at the sacrifice, perhaps, of certain agreeable qualities; and so by degrees writing became not merely a sign of folly and a distracted mind but was of practical importance.[13]

 

 

 

Aphra Behn by Peter Lely ca. 1670.jpg

అన్నే ఫించ్

1661లో అన్నే కింగ్స్ మిల్ లో అన్నే ఫించ్ – విలియం కింగ్స్ మిల్ ,కు సౌత్  యాంప్ టన్ వద్ద సిద్ద్ మాన్తాన్ లో పుట్టింది .ఇరవై రెండో ఏట రాజ దర్బార్ లో మెయిడ్ గా చేరింది .కల్నల్ ఫించ్ ను పెళ్ళాడింది .చిన్నప్పుడే కవిత్వం రాసింది .డ్రాడేన్ ను పోప్ ను చదివి అర్ధం చేసుకోంది .వీరిలా అతిగా పోకుండా రాసింది .ఆలోచనాత్మకం గా స్త్రీ వాదం గా రాసింది .హాయిగా తోటలో విశ్రాంతి పొందేది .పల్లె పట్టు సొగసుల్ని కవిత్వం లో ప్రతిఫలింప జేసింది ..తానూ అమితం గా ప్రేమించి ఇష్టపడిన చోటే అరవైలో చని పోయింది .ఆమెను వర్డ్స్ వర్త్ ‘’ఏ నేచురల్ రేవేరీ ‘’అని కీర్తించాడు .అందులో తాజా గ్రామీణ ఇమేజరీ ఉంటుంది .’’if for a woman I would die ‘’the Ateist and the acorn ‘’కవితలు స్నిగ్ధ మనోహరం గా ఉంటాయి .’’if they re denied ,I on my self can live –and slight those aids unequal chance can give –when in the sun my wings can be displayed –and in retirement I can bless the shade’’అనేది ఆమె కవితల్లో ఒకటి .కింగ్ విలియం కు విధేయత ప్రకటించే ప్రమాణం చేయటానికి తిరస్కరించింది .హాయిగా జీవించినా కింది వారి దుఖాన్ని గురించి రాసింది. ఆమెను మేలాన్కలి వుమన్ అన్నారు .

 

చార్లెస్ సిడ్నీ

1639లో రోచెస్టర్ లో పుట్టిన చార్లెస్ సిడ్నీ వాదం కాలేజి లో చదివి ‘’మెర్రి గాంగ్ ‘’లో చేరి రెండవ చార్లెస్ కాలం లో పనికి మాలిన రెండు ట్రాజేడీలు రాసి ,కొద్దిగా నయం అనిపించినామూడు కామెడీలు రాసి కల కలం సృష్టించాడు .శ్రోతలకు వీనుల విందు చేశాడు .మంచిపాటలే రాశాడు

 

 

.Sir Philip Sidney from NPG.jpg

రిచార్డ్ లీ,ఆంబ్రోస్ ఫిలిప్స్ ,థామస్ పార్నెల్ ,జాన్ బ్రియాన్

 

వీరి గురించి అప్పుడప్పుడు మాత్రమె చెప్పుకొంటారు ముగ్గురూ 1649 ,1675 ,1679ల లో పుట్టి 1779 ,1718లలో చనిపోయారు .లీ ని ‘’చిత్ర కవి ‘’ ఫిలిప్స్ రాసిన ఈక్లోగ్స్ ‘’అప్పటిగోప్ప కవిత్వం అన్నారు .’’నంబి పంబీ ‘’అనే మారు పేరు .డబ్లిన్ లో పుట్టిన పార్నెల్ ఇలియడ్ ను అనువాదం చేసి చని పోయిన తర్వాతా పబ్లిష్ అయి పేరొందాడు .ఓడ్స్,కదాత్మకాలు పవిత్ర కవితలు రాశాడు .

షార్ట్ హాండ్ పిత –జాన్ బిరామ్

జాన్  బిరామ్ 1692-1763వాడు .హిమ్స్ రాశాడు .పాస్టో రల్  రైమ్స్ ,దయాలిక్ట్ వెర్సెస్ రాశాడు .’’ది యూనివర్సల్ ఇంగ్లీష్ షార్ట్ హాండ్ ‘’కనీ పెట్టి మాంచెస్టర్ లో బోధించాడు .లేఖా సాహిత్యం లో దూసుకు పోయాడు .’’జర్నల్స్ అండ్ పేపర్స్ ‘’కు మంచి పేరు .ఇందులో ఆ కాలం నాటి నిత్య జీవితాన్ని డైరీ లాగా రాశాడు . అంటాలజిస్టులు తప్ప అందరూ బ్రియాన్ ను మర్చిపోయారు అతని ఎపిగ్రం గుర్తింపు పొందింది .’’God bless the king –I mean the faith;s defender –god bless –no harm in blessing –our pretender –but who pretender or who is king?-god bless us all ,that is quite a different thing ‘’మచ్చుకు ఒకటి .

 

 

John Byrom.jpg

జాన్ గే

1685లో పుట్టి 1732లో చనిపోయిన జాన్ గ్రే విట్ ఉన్నకవి నాటకాలు ఒపెరాలకు లిబర్టోలు ,నీతి కధలు జానపదాలు ,పట్నకవితలూ ,రాజకీయ సెటైర్లూ రాశాడు .బారన్ స్టేబుల్ లో బీద వాడుగా పుట్టి పదేళ్ళకే అనాధ అయ్యాడు  మెట్రో పాలిటన్ జీవితం లో అడుగు వర్గాల దయ నీయ స్తితిని స్వయం గా అనుభవించీ చూసి చాలించాడు .లండన్ లో సిల్క్ మర్చంట్ దగ్గర పని చేశాడు ‘’ది ఆర్ట్ ఆఫ్ వాకింగ్ ది స్ట్రీట్స్స్త్రీ ఆఫ్ లండన్ ‘’లో ఆ నగర ఆనందం విషాదాలను చూపించాడు .వీటినే నలభై ఏళ్ళ వయసులో ‘’దిబెగ్గర్స్ ఒపేరా’’లో రాస్తే జాన్ రిచ్ దర్శకత్వమ్ చేశాడు .దీనితో డబ్బు  వచ్చింది .దాన్ని ‘’made rich Gay and Gay rich ‘’అని చమత్కరించాడు .ఇందులో ప్రభుత్వాధికారుల మీద సెటైర్లు బాగా పండాయి పేలాయి . ప్రధాని సర్ రాబర్ట్  వాల్ పోల్ ను ఉద్దేశించి రాశాడు .అతని అవినీతి భాగోతాన్ని చీకటి వ్యాపారాన్ని చీల్చి చెండాడాడు .హాన్దిలియాన్ ఒపేరా అవక తవకలు ఎండ గట్టాడు .. దీనికి ఈక్వేల్ రాయాల్సి వచ్చింది .’’పోలీ ‘’రాశాడు .రాజకీయ కారణాలతో బాన్ చేశారు అతాని అదృష్టం దోలాన్దోలమానం అయింది .ఫేబుల్స్ కవితల్లో వచ్చిన డబ్బు అంటా అయిపొయింది సౌత్ సీ స్కాండల్ అనే ఆర్ధిక దోషం పై చర్చ జరిగింది కొద్ద్దికాలమే జీవించినా సుఖ పడ్డాడు నలభై ఏడులో చని పోయాడు .ఆరు వేల పౌండ్ల నిలువ ధనాన్ని చని పోయేటప్పటికి సంపాదించాడు అతాని ప్రాభవానికి వెస్ట్ మినిస్టర్ ఆబ్బే లో ఖననం చేశి గౌరవించారు .

‘’life is a jest and all things show it –I thought so once and now I know it ‘’.మంచికవిత .డ్రై డే న్  పోప్ లంత క్రూరం గా రాయలేదు ‘’a satire without spite ‘’గ రాయటం ఇతని ప్రత్యేకత .అతను రాసిన కవిత్వం అంతా నిరాపెక్షనీయ కవిత్వామే అన్నారు .పల్లె వాడైనా పట్నం లో గుర్తింపు పొందాడు .

John Gay - Project Gutenberg eText 13790.jpg

 

జోనాధన్ స్విఫ్ట్

ఈ పేరు వినగానే గలివర్స్ ట్రావెల్స్ అందరికి గుర్తోస్తుంది .నిజానికి ఆయన కవికాడు . 1667లోడబ్లిన్ లో  పుట్టి 1745లో చనిపోయాడు .తీవ్రమైన చురుకుదానం భావోద్వేగాలతో రగిలి పోయాడు .జీవితా చరమాంకం లో కవిత్వం రాశాడు డ్రైడేన్ కవికి కజిన్ .తండ్రి చనిపోయిన తర్వాతా అంకుల్ దయాదక్షిన్యాల మీద బతికాడు .ఇరవై రెండేళ్లకే ఇంగ్లాండ్ లోని సర్ విలియం టెంపుల్ అనే దూర బంధువుకు సేక్రేఅతరి అయ్యాడు .టెంపుల్ తన కన్నా తెలివి తేటల్లో తక్కువ వాడు అంతేకాక అక్కడి స్ట్రిక్ట్ డిసిప్లిన్ ను భరించలేక పోయాడు .ఏదో మంచి జరుగుత్న్డనే ఆశతో పదకొండేళ్ళు అలానే లాగించాడు .లాభం లేదనుకొని ఎయిర్ లాండ్ చేరుకొన్నాడు డబ్లిన్ లో సెయింట్ పాట్రిక్ కు డీన్అయ్యాడునలభై లో .ఇక్కడా ,లండన్ లోనూ గడిపాడు కాలం మత బోధ , రచనలు  చేస్తూ ఉన్నాడు .అడిసన్ స్టీవ్ ,పోప్ మొదలైన ప్రముఖులతో పరిచయాలేర్పడ్డాయి  .రాజకీయం గా కరపత్రా రచనలో దూసుకు పోయాడు మతం లో విద్యా విధానం లో అవినీతిని బయట పెట్టాడు .ఐరనీ తో అందరికి చెమటలు పట్టించాడు .

ఈస్తర్ జాన్సన్ అనే అమ్మాయిని  చిన్నప్పటి నుండి ప్రేమించాడు .టెంపుల్ వద్ద ఆమె తల్లి సేవకురాలు .ఈ పిల్ల ఆయన పిల్లె అను పుకార్లు షికార్లు చేశాయి .ఈ అమ్మాయికి ట్యూటర్ గా స్విఫ్ట్ ఉన్నాడు ఐర్లాండ్ లో స్తిరాపడి ఆమెనూ డబ్లిన్ లో ఉంచాడు .డబ్లిన్ వ్యాపారి కూతురు వెనిసా తో పీకల్లోతు ప్రేమలో పడ్డాడు .ఈస్తర్ తో ప్రేమ ఈమె తో సల్లాపాలు ఇబ్బంది పెట్టాయి .ఇద్దర్నీ మైంటైన్ చేశాడు ..కొద్దిరోజుల్లో వేనేసా ,మరో అయిదేళ్ళలో ఈస్తర్ మరణించారు .గలివర్స్ ట్రావెల్స్ ను యాభై వ ఏట రాశాడు .అరవై లో తాను పతనం చెందుతున్నట్లు గ్రహించాడు .చెవుడు బాగా వచ్చి బాధించింది .ఇంకో పదేళ్ళు బతికాడుకాని గార్దియన్లు అవసరమైనారు .పెరాలిసిస్ తో బాటు అఫెశియా జబ్బు వచ్చింది .డెబ్భై ఎనిమిదో ఏట చనిపోయాడు .తన సమాధి పై’’here lies jonathan Swift –where savage indignation can no longer tear his heart .అని రాయించాడు తన ఆస్తిని బుద్ధి  మాంద్యులకు  చికత్స చేసే హాస్పిటల్ కు రాశాడు .

‘’పోయిట్రీ –ఏ రాప్సడి ‘’లో ఆయన ఐరాని అంతా గుప్పించాడు దీన్నే ఎప్పుడూ అందరూ ఉదహరిస్తారు .’’so naturalists observe a flea –has smaller fleas that on him prey –and hese have smaller still to bite them –and so proceed ad infinitum ‘’ఆయన కవిత్వం లో నిరాశ ఉండదు .’’he gave his little health he had –to build a house for fools and mad –and showed by one satiric touch –no nation wanted so much –that kingdom he hath left his debtor –I wish it soon may have a better ‘’అన్నకవిత చాలా ప్రసిద్ధం .

 

Jonathan Swift by Charles Jervas detail.jpg

మాధ్యూ ప్రయర్

మాధ్యూ ప్రయర్ పెద్ద గా పేరున్న వాడుకాడు .1664లో పుట్టి 1721లో చనిపోయాడు .డ్రై డే న్ అనుయాయి .సమకాలీన పరిస్తులపై వ్యంగ్యాత్మకం గా చెణుకులు రాశాడు .తండ్రి పోయిన తర్వాతా లార్డ్ డార్సేట్ ప్రాపకం పొందాడు అతనే వెస్ట్ మినిస్టర్ స్కూల్ లో చేర్పించి చదివించాడు  కేం బ్రిడ్జి లో సెయింట్ జాన్ కాలేజిలో చేర్పించాడు పదమూదేళ్ళప్పుడే ఓవిడ్ ,ఆరెస్ లను అనువాదం చేసిన చిన్నారి పిడుగు .చార్లెస్ మాంటేగ్ తో కలిసి డ్రై డే న్  రాసిన దాన్ని కధలుగా రాశాడు .కవిత్వం రాజకీయం రెండిటిలోనూ సవ్య సాచి అయ్యాడు .హాలండ్ రాయబారికి సెక్రెటరి హోదా వచ్చింది .పారిస్ లో సీక్రెట్ ఏజేంట్ గా నియమింప బడ్డాడు .టోరీలతో జత కలిపాడు .వారికోసం అనేక సమావేశాలు నిర్వహించి ‘’ట్రీటీ ఆఫ్ అత్రేచ్ట్ ‘’శాంతి ఒప్పందం సాధించాడు దీనికే అతని పేర ‘’మాట్స్త్ పీస్ ‘’అని పిలిచారు .

అన్నే రాణి మరణం తర్వాతా రాజకీయం గా బల పడే యత్నం చేశాడు .కాని తన్నింది .విగ్గులు జైల్లో పెట్టారు .రెండేళ్ళ తర్వాత విడుదలయ్యాడు .కంచే బాగు చేయటం ,సంపద వృద్ధి చేయటం లో కృత క్రుత్యుడైనాడు .యాభై నాలుగులో అతని మొదటి కవితా సంపుటి ‘’పోయెమ్స్ ‘’వెలువడింది .రచన లాభ సాటిఅని గ్రహించాడు .అమ్మకాలు చేస్తే నాలుగు వేల గినియస్లు  లభించాయి .,ఇదీ లార్డ్  హార్లీ ఇచ్చిన నాలుగు వేల పౌన్డ్లూ కలిపి ఎస్సెక్స్ లో డౌన్ హాల్ కొన్నాడు .అందాగాడు కాకపోయినా  మంచితనం తో   స్నేహితుల్ని పొందాడు పదహారవ లూయీ స్నేహితుడైనాడు .క సారి ఆయన్ను రాజు వేర్సైల్స్ లాగా చిరస్మరణీయ వి ఏవైనా ఎర్పరచాడా అని అడిగితె ‘’monuments of my master;s actions are to be seen every where except in his own house ‘’అని రాయబారిగా ఉన్నా చమత్కరించాడు .

దాదాపు అన్ని ప్రక్రియలలోనూ ప్రయర్ రచన చేశాడు .లాంగ్ సాలిలోక్వీకప్లేట్స్ సెటైర్స్ ,వ్యాసాలూ బాలడ్స్  లను రాశాడు సద్యో కవితలు చెప్పాడు .’’be to her virtues very kind –be to her faults a little blind ‘’అన్న కవిత పేలింది .గుర్తుండి పోయే కవిత్వం రాశాడు .తనను గురించి ‘’nobles and heralds by your leave –here lies what once was  Mathew prior –the son of Adam and Eve –can Bourbon or  Nassau claim higher?

 

 

 

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-5-14-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మృత్యువును పరిహసించినకార్టూనిస్ట్ -శేఖర్

ఆంధ్రజ్యోతి కార్టూనిస్ట్ శేఖర్ కన్నుమూత

జీర్ణకోశ కేన్సర్‌తో మృతి
రెండేళ్లుగా అంపశయ్యపైనే..
తుదిశ్వాస వరకూ కళకే అంకితం

ఆ కుంచెకు నవ్వించడమే తెలుసనుకున్నాం. నిప్పులు చిమ్మడమే ఎరుకనుకున్నాం. గుండె లోతుల్లోంచి పిండిన సంవేదనను బొమ్మ కట్టడం చూశాం. కానీ, శిథిలమవుతున్న శరీరాన్ని వేళ్ల మధ్యకు తెచ్చుకొని రోజూ ఒక సూర్యోదయాన్ని చిత్రీకరిస్తున్న విషయం మిత్రులకే చాలాకాలం తెలియదు. బ్రష్‌కు కాన్వాస్ అమరినట్టు.. చెదరని గీతకు చక్కని రాత సైజోడయి ‘సై..సై..’ అంటూ రాజకీయ కార్టూన్‌ని పరుగులు పెట్టించిన ఆంధ్రజ్యోతి కార్టూనిస్ట్ శేఖర్ మరిలేరు.

హైదరాబాద్, మే 19 : కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆంధ్రజ్యోతి కార్టూనిస్ట్ శేఖర్ (కంభాలపల్లి చంద్రశేఖర్) కన్నుమూశారు. రాష్ట్రంలో రాజకీయ కార్టూనింగ్‌కు వన్నెతెచ్చిన శేఖర్ (49) గత రెండేళ్లుగా జీర్ణకోశ సంబంధ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని ఓ ఆస్ప త్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవా రుజామున తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య చంద్రకళ, కుమార్తె చేతన, కుమారుడు నందు ఉన్నారు. నల్లగొండ జిల్లా సూర్యాపేటలో జూలై 16, 1965లో శేఖర్ జన్మించారు. చిన్నతనం నుంచి బొమ్మలు గీయడం అభిరుచిగా పెట్టుకొన్న ఆయనను చుట్టూ ఉన్న ఉద్యమ వాతావరణం ఉత్సాహపరిచింది. ఎంఏ (తెలుగు) పూర్తయిన తరువాత పూర్తిగా చిత్రకళారంగానికే శేఖర్ అంకితం అయ్యారు. పత్రికలను వేదిక చేసుకొని తన భావాలకు రూపం ఇవ్వడం మొదలుపెట్టారు. ప్రజాశక్తి దినపత్రికలో కార్టూనిస్ట్‌గా 1989లో తన ప్రస్థానం మొదలుపెట్టారు.

కొంతకాలం ఇతర పత్రికల్లో పనిచేసి.. 19 97లో రాజకీయ కార్టూనిస్టుగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో చేశారు. తుదిశ్వాస విడిచేవరకు సంస్థకు సేవలు అందించారు. 20 ఏళ్లలో దాదాపు 45 వేల కార్టూన్‌లు ప్రచురించారు. ఆయన బొమ్మలు హిందీ, ఇంగ్లిష్, గుజరాతీ, పంజాబీ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఆంధ్రజ్యోతి అనుబంధ నవ్య వార పత్రికలో శేఖర్ ట్యూన్స్, ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో లైఫ్ లైన్ శీర్షికలను నిర్వహించారు. మృతి చెందడానికి కొద్దిరోజుల ముందే ‘కాస్ట్ కేన్సర్’ పుస్తకాన్ని తీసు కొచ్చారు. గిదీ తెలంగాణ, బ్యాంక్ బాబు, శేఖర్ టూన్స్, పారాహుషార్ తదితర కార్టూన్ పుస్తకాలు వెలువరించారు. బెల్జియమ్‌లో 1996లో జరిగిన కార్టూన్ ఎగ్జిబిషన్‌లో పాల్గొని ఉత్తమ కార్టూనిస్టుగా అవార్డు అందుకున్నారు. హిందూస్థాన్ టైమ్స్ 1998లో నిర్వహించిన పోటీలో పాల్గొని.. విజేతగా నిలిచారు.

రాష్ట్ర ప్రభుత్వం 2006లో ఉత్తమ కార్టూనిస్ట్ పురస్కారంతో సత్కరించింది. ఇటీవల అమెరికా ప్రభుత్వం ఆహ్వానం మేరకు అక్కడ జరిగిన కార్టూన్ ఎగ్జిబిషన్‌లో పాల్గొ న్నారు. ఆయన మరణవార్త తెలియగానే చిత్రకళ, రాజకీయ, ఉద్యమ, సాహిత్య రంగాలకు చెందిన ప్రముఖులు, ఆయన సహచరులు, అభి మానులు బోడుప్పల్‌లోని శేఖర్ స్వగృహానికి తరలివచ్చి నివాళులర్పించారు. బోడుప్పల్ నుంచి బయలుదేరిన అంతిమ యాత్ర సాయంత్రం నాలుగు గంటలకు కాచిగూడలోని అంబర్ పేట హిందూ శ్మశాన వాటికకు చేరుకుంది. కుమారుడు నందు తండ్రి చితికి నిప్పు అంటించారు. ప్రొఫెసర్ కంచె ఐలయ్య, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, ప్రముఖ కార్టూనిస్టులు రమణ, నర్సిమ్, మోహన్ తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

పత్రికా రంగానికి తీరని లోటు : కేసీఆర్
శేఖర్ మృతి పట్ల టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం వెలిబుచ్చారు. శేఖర్ మృతి పత్రికా రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. పత్రికా లోకానికి, పాఠకులకు శేఖర్ సుపరిచితులని టీ-బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ‘శేఖర్ టూన్స్” శీర్షిక ద్వారా భావి కార్టూనిస్ట్‌లకు మార్గదర్శిగా నిలిచారని ప్రెస్ అకాడమీ చైర్మన్ ఎ.సత్యారావు తెలిపారు. ఐజేయూ సెక్రటరీ జనరల్ డి.అమర్, వై.నరేందర్ రెడ్డి, ఏపీయూడబ్ల్యూజేఎఫ్ ప్రధాన కార్యదర్శి జీ ఆంజనేయులు, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ కన్వీనర్ బీ బసవపున్నయ్య, జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు బి.చక్రధరి తదితరులు నివాళులర్పించారు.

ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ నివాళి
శేఖర్ పార్థివదేహానికి ఆంధ్రజ్యోతి ఎమ్‌డీ వేమూరి రాధాకృష్ణ, ఎడిటర్ కె. శ్రీనివాస్, నెట్‌వర్క్ ఇన్‌చార్జ్ కృష్ణప్రసాద్, ఇతర సిబ్బంది నివాళి అర్పించారు. దుఖఃంలో మునిగిపోయిన శేఖర్ కుటుంబాన్ని వేమూరి రాధాకృష్ణ పరామర్శించారు. ప్రముఖ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి, అల్లం నారాయణ, వినయ్ కుమార్, తెలకపల్లి రవి, ఉద్యమ నాయకులు కోదండరాం, విమలక్క, వరవరరావు, జూలూరు, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ యాదగిరి రెడ్డి నివాళులు అర్పించినవారిలో ఉన్నారు.

మృత్యువును పరిహసించినవాడు…

 

శేఖర్ లేడని తలచుకుంటేనే గుండెలు పిండేస్తున్నాయి. జీవితంతో పోరాడి గెలుపును ఆస్వాదించే సమయానికి మృత్యువు సవాలు విసిరింది. ఆఖరి నిముషం దాకా కలం, కుంచెతో మృత్యువును ఏమార్చి చిట్టచివరకు అలసి సొలసి కడపటి నిద్రలోకి జారిపోయాడు. సోమవారం నాటి ఆంధ్రజ్యోతి సంచికలో శేఖర్ ఆఖరి కార్టూన్ సంతకం చేసి పెన్నుమూశాడు. శేఖర్‌తో నాది దాదాపు రెండున్నర దశాబ్దాల పై అనుబంధం. ప్రజాశక్తితో ప్రారంభమైన మా పరిచయం హైదరాబాద్‌లో పెనవేసుకుపోయింది. తను ఆంధ్రప్రభలో చేరిన తర్వాత నేను ఆంధ్రజ్యోతికి వచ్చాను. దాదాపు రోజూ కలసే వాళ్ళం.
కార్టూన్లకే పరిమితం కాకుండా చిత్రలేఖనానికి సంబంధించిన సకల రంగాలని ఆకళింపు చేసుకునేందుకు బాలి, టీవీ నుంచి బాపూ వరకు పెద్ద పెద్ద కళాకారులను కలుసుకోవడం, టెక్నిక్‌లు చర్చించడం శేఖర్‌కు ఇష్టమైన పని. తుమ్మపూడిలో కళాతత్వ విమర్శకుడు సంజీవదేవ్‌ను కలిసేందుకు టి. వెంకట్రావు గారితో కలసి వెళుతూ నన్ను కూడా తీసుకువెళ్ళారు. అప్పుడు సంజీవదేవ్‌ను అనుకోకుండా ఇంటర్వ్యూ చేసే అవకాశం నాకు దొరికింది.
జీవితం పట్ల అంతులేని ఆపేక్ష, కార్టూన్ ప్రపంచంలో రారాజు కావాలనే ఆకాంక్ష, పట్టువీడని పరిశ్రమ కలిస్తే కంభాలపల్లి చంద్రశేఖర్ అవుతాడు. హైదరాబాద్‌లో లబ్దప్రతిష్టులైన మోహన్ లాంటి టైకూన్‌ల స్థాయికి తాను ఎదగాలనేది ఒక ఆకాంక్ష. ప్రజాక్షేత్రంలో పనిచేసే వారు ఎవరైనా కరపత్రం నుంచి పోస్టర్… కవర్ పేజీదాకా ఏమి వేసి పెట్టమని అడిగినా శేఖర్ ఎంతో ఇష్టంతో ఆ పని చేసిపెట్టేవాడు.
మేమిద్దరం పుస్తకాలు వేయడం నుంచి సిండికేట్ నడిపేదాకా ఎన్నెన్నో ఆలోచనలు చేసేవాళ్ళం. ఆ చర్చలలో అసాధ్యం అనుకున్న ఐడియాలను తర్వాత కాలంలో అమలు జరిపాడు. శేఖర్ టూన్స్ వంటి సిండికేషన్ ద్వారా చాలా భాషలలోకి తన బొమ్మను నడిపించాడు. అలాగే అమెరికా టూర్. ఎలా ఆహ్వానం వచ్చిందో, ఎలా వెళ్ళాడో… నాకయితే ఆశ్చర్యం. అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేయ డం కూడా ఒక కళే. దానికి అవసరమైన పరిశ్రమ, పట్టుదల శేఖర్‌కు చిన్నతనం నుంచే బాగా అబ్బినట్లున్నాయి.
జీవిత సహచరి చంద్రకళకు అక్షరాభ్యాసం నుంచి కంప్యూటర్ కళలో దిట్టగా తీర్చిదిద్దడం వరకూ ఎన్నో సవాళ్ళు గెలిచాడు. మృత్యువు విసిరిన వలను సైతం పట్టుదలతో నిముష నిముషం తను తప్పించుకున్న తీరు వైద్యం చేస్తున్న డాక్టర్‌కే ముచ్చట కల్పించిందని మిత్రులు కొందరు చెప్పారు. వైద్యం లేని రోగానికి జీవితేచ్ఛ అనే ఔషధాన్ని శేఖర్ సొంతంగా పరిశోధించి కనుగొన్నాడు. దానితోనే ఇన్నాళ్ళు చావును చంపుతూ బతికాడు. కానీ క్లినికల్ ట్రయల్స్ లెక్కలు ఎక్కడో తప్పాయి. డ్రగ్ డిజైనింగ్‌లో ఏదో తేడా జరిగింది. ఆ క్షణాన్ని క్షణంలో మృత్యువు అవకాశంగా తీసుకుంది.
చాలా కాలం క్రితం నేను విజయవాడలో వుండగా శేఖర్ చిన్న సర్జరీ చేయించుకున్నాడు. డాక్టర్ ఆపరేషన్ తర్వాత చిన్న టిష్యూను బయాప్పీకి పంపినప్పుడు తనకేదో అంతుపట్టని జబ్బు వచ్చిందేమోనని భయపడ్డాడు. డాక్టర్‌తో మాట్లాడమని నాకు ఒక తెల్లవారుజామున హఠాత్తుగా ఫోన్ చేశాడు. నేను తనను ట్రీట్ చేస్తున్న డాక్టర్‌తో తెలిసిన డాక్టర్ మిత్రుడితో మాట్లాడి భయపడాల్సింది లేదని చెప్పించాను.
సాధారణంగా ఏ కాస్త తేడా వచ్చినా నాతో చెప్పేవాడు. కానీ ఈ సారి ఆపరేషన్ జరిగిన తర్వాత తెలకపల్లి రవి చెప్పేదాకా తనకు ఇంత పెద్ద జబ్బు చేసిందని నాకు తెలియదు. ఇంత జబ్బులోనే… నాకు బైపాస్ జరిగిందని తెలిసి పలకరించడానికి రామ్‌నగర్ దాకా వచ్చాడు. సెల్ సిగ్నల్ లేకపోవడంతో ఆ రోజు కలవలేకపోయాం. మిత్రులను సంతోషపెట్టడం శేఖర్‌కు ఇష్టమైన పనుల్లో కల్లా ఇష్టమైనది. ఇకముందు ఇలా సంతోషపెట్టేదెవరు. శేఖర్ లేని లోటును తీర్చేదెవరు.
– 

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

రాచకీయ ద్విప్లేట్స్ -33(ఎలక్షన్ పోస్ట్ మార్టం )

    రాచకీయ ద్విప్లేట్స్ -33(ఎలక్షన్ పోస్ట్ మార్టం )

1-బి జే.పి రాజకీయ చదరంగం లో సూత్ర దారి ‘’అమిత్ షా’’

   దిగిపోయిన పరువును పైకెత్తి ప్రత్యర్ధులకు పెట్టాడు ‘’షా ‘’.

2- గుడ్డిగా కొడుకు కూతురు ,మేనళ్ళుళ్ళను వెనకేసుకొచ్చిన’’ కరుణానిధి ‘’

   ‘’జయ’’ చేతిలో కాటా దెబ్బతిని ఒక్క సీటూ  లేక పాలయ్యాడు ‘’అధోగతి ‘’

3-మోడీ ని కాదని ‘’ హస్తం ‘’ఆలంబనం పొందిన ‘’నితీష్ ‘’

   ఉన్నదీ  ఉంచు కొన్నదీపోయి రాచకీయం గా అయ్యాడు ‘’మటాష్ ‘’

4-మధ్య ప్రదేశ్ ,రాజస్థాన్ గుజరాత్ లలో కాంగ్రెస్’’సున్నా’’

  భస్మాసుర ‘’హస్తం ‘’పెట్టుకొన్న వారికి  అంతేరా ’’ వెర్రి కన్నా  ‘’ .

5-‘ నమ్మి ప్రచారం తో సహా అన్నీ అప్పగిస్తే ‘’చిరంజీవి  ‘’

   తన పార్టీ తో బాటు హస్తాన్నీ చంపి పారేసి చేశాడు   ‘’మెగా ఫ్లాప్ షో’’.

6-కుటుంబం లోని నలుగురినే కాదు పార్టీని  ముంచి తానూ మునిగాడు ‘’బొత్స’’

  సోల్లూ ,పోల్లూ ,పని నిల్లూ,డబ్బు మందూ బెల్ట్ షాపులూ ఫుల్లూ తో ‘’చేతికి ‘’ఇచ్చాడు’’బొచ్చె ‘’

7-షీలా కొడుకు తో సభ్యులను కొట్ట్టించిన మధు యాష్కీ

  పూర్తిగా ఓడి రెంటికి చెడ్డ రేవడై మధువు కోసం ఇష్కీ ఇష్కీ .

8-తల్లీ  కొడుకుల  రాజీనామా వద్దన్న దద్దమ్మ కాంగీ వర్కింగ్ కమిటీ

   సిగ్గూ శరం లేకుండా మళ్ళీఅమ్మ  కాళ్ళ మీద పడటం ఏమిటి ?

9-అంటకాగిన నితీష్ ను ఆదర్శం గా తీసుకో లేరా ?

   మళ్ళీ పాత పాటే పాడి బుద్ధి తెచ్చుకోలేరా?

10- కత్తీ సుత్తీ ,కొడవలి మధ్య పోరాటం

ఇంకా బుద్ధి రాక సీట్ల కోసం ఆరాటం .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-5-14-ఉయ్యూరు

 

Posted in రాజకీయం | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -24 చమత్కార ప్రపంచం

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -24

చమత్కార ప్రపంచం

డ్రైడేన్ కవికి పోప్ కవికి మధ్య అర్ధ శతాబ్ద కాలం కవిత్వానికి చిన్న రోజులే .రేస్తోరేషన్ తర్వాతాకవిత్వం చాలా కృత్రిమం గా ,తయారైంది .సాహసానికి వీరత్వానికి ప్రాముఖ్యత పెరిగింది .మనస్సాక్షికి అవకాశం వచ్చింది .మెటాఫిజికల్ కవిత్వం ఆదరణ కోల్పోయింది .బుద్ధి చతురత ,హాస్యాలకు మోజు ఎక్కువైంది .సామ్యుల్ పెపీస్ ,ఎవిలిన్ రాసిన విమర్శ ,సమీక్ష ,కరపత్రరచన డైరీ లను ఆదరించారు .సున్నితత్వాన్ని ,వినోదాన్ని కోరారు .ఈ పరిధిలో రాసి గుర్తింపు పొందిన వారిలో జాన్ విల్మాంట్ ఎరల్ఆఫ్ రోచెస్టర్, మార్గరెట్ లూకాస్ ,ఆఫ్రా బెన్ అన్నే ఫించ్ ,లేడీ విన్చేల్సియా ,మొదలైన వారున్నారు .వారిని గురించి సంక్షిప్తం గా తెలుసుకొందాం .

సెటైర్ వజ్రం -ఎరల్ఆఫ్ రోచెస్టర్ –జాన్  విల్మాంట్

జాన్  విల్ మాంట్ రెక్ లెస్ మనిషి .1-4-1647 న ఆక్స్ ఫర్డ్ షైర్ లో డిచిలీ లో పుట్టాడు .పన్నెండేళ్ళ వయసులోనే తండ్రికి వారసుడై ఎరల్ ఆఫ్ రోచెస్టర్ అయ్యాడు .ఆక్స్ ఫర్డ్ వాడాన్ కాలేజి లో చదివి పదిహేనవ ఏటనే  ఏం ఏ పాస్ అయ్యాడు .డచ్ వారికి వ్యతిరరేకం గా యుద్ధం లో పాల్గొన్నాడు .ఇంగ్లాండ్ తిరిగి వచ్చి రెండవ చార్లెస్ రాజుకు సన్నిహితుడయ్యాడు .అందం అధికారం ప్రాపకం తో అన్నీ పొందాడు . సెక్సు  స్కాన్దల్స్ ,అవినీతి లో చిక్కుకు పోయాడు .డచ్ రాజు చార్లెస్ ను అవమాన పరుస్తూ రాస్తే అతను ప్రయాణం చేసే నౌకను తగల బెట్టించాడు .రోచెస్టర్ రాజ  వంశానికి చెన్దిన మాలేట్ ను శృంగారం లోకి దించే ప్రయత్నం చేస్తే ఆమె తిరస్కరిస్తే రహస్యం గా  పెళ్లి చేసుకోక తప్ప లేదు .ఆమెతో బాటు అందుబాటులో దొరికిన సామాన్య స్త్రీల దగ్గరనుంచి రాజకన్యలు రాణీ లనూ  అనుభవించటం మొదలెట్టాడు .చార్లెస్ రాజు రాసలీలలను కవితామయం చేశాడు .విసుగెత్తి అతన్ని బహిష్కరించారు .భార్య ఎస్టేట్ లో తల దాచుకొన్నాడు .రాజు ఇతన్ని వదలుకోలేక పోయాడు .

ముప్ఫై ఒకటవ ఏట ఆరోగ్యం దెబ్బతినటం మొదలైంది .జ్వరం వచ్చి శరీరాన్ని మనసును ఇబ్బంది పెట్టింది .రెండేళ్ళ తర్వాత తను చేసిన పాప కృత్యాలకు సిగ్గుపడ్డాడు పశ్చాత్తాపం చెందాడు .ముప్ఫై మూడవ ఏట నే 16-6-1680న చని పోయాడు .చాలా అనాగరక భాష లో కవిత్వం రాశాడు .’’ఫేర్ వెల్ టు ది కోర్ట్ ‘’,కవిత అరువు సొమ్ముతో అలంకరించిందే .ఏ సెటైర్ ఎగైనెస్ట్ మాన్ కైండ్’’కవిత  అతని మనసును ఆవిష్కరిస్తుంది . .’’I would be a dog ,a monkey or a bear –or any thing but that vain animal –who is so proud of being rational ‘’అని మనిషిగా పుట్టటానికి ఇష్టం లేదన్నాడు .రోచెస్టర్ అసందిగ్ధ భావాలను వదిలి వెళ్ళాడు .అతను చనిపోయిన తర్వాతే కవితలు అచ్చయ్యాయి .రెండున్నరశతాబ్దాల తర్వాతా1926 లో ముద్రణ కు నోచుకోన్నాయి .జాన్ హోవార్డ్ ఇంగ్లాండ్ లో ప్రింట్ చేశాడు .అమెరికాలో వద్దన్నారు .

‘’love a woman !you are an ass –it is a most insipid passion –to choose out for your happiness –the silliest part of God’s creation ‘’అని తన అనుభవాలను  నెమరేసుకొంటూ బాధ పడుతూ బోధ చేశాడు .తప్పుడు భావాలను వ్యాప్తి చెందిన్చాడని అందరూ నిరసించారు .ఒక్క మాటలో చెప్పాలంటే ‘’Rochester expressed himself in many and often opposed moods –sordid and witty indignant and indifferent ,daring vulgar and always him self ‘’.ప్యూరిటన్ ల ఆధ్యాత్మిక సాధికారతను ఎదిరించి నిలిచినమొదటివాడు .ఆ తరానికి మార్గ దర్శి కూడా .సేటైరిస్ట్ లలో అగ్రగామి అనిపించాడు .విక్టోరియన్ కాలం లో అతని కవిత్వం చాలా భాగం సెన్సార్ అయింది .ఆధునిక కవులు గ్రాహం గ్రీన్ కు ఎజ్రా పౌండ్ కూ ఆదర్శం .హాబెర్ట్ యొక్క మెటీరియలిజం కు దూరం గా ‘’లినర్టి నిజం ‘’రాశాడని విమర్శకులన్నారు .యవ్వన మదం లో చెడ తిరుగుళ్ళు అసభ్య శృంగారం వ్యభిచారం లతో అతనికి ‘’గనేరియా ‘’సోకి దానితోనే చనిపోయాడు .ఆక్స్ ఫర్డ్ షైర్ లో స్పీల్స్ బరి చర్చ లో సమాధి చేశారు .అతను రాసిన ‘’డెత్ బెడ్ రి నన్సిఎషన్ ‘’అనే ‘’లిబర్టి నిజం ‘’ను తర్వాత ప్రచురించారు .ఇందులో భావాలన్నీ ‘’ప్రాడిగల్ సన్ ‘’పశ్చాత్తాపం గ నేఉంటాయి .అతని ‘’ప్రేన్తిస్ వర్క్ ‘’,ఎర్లీ మేచూరితి ‘’ ట్రాజిక్ మేఛూరిటి ,’’దిసిల్యూజన్ అండ్ డెత్ ‘’అనే నాలుగు విమర్శ గ్రంధాలు దాదాపు అతని జీవిత చరిత్రలే .డెబ్భై అయిదు కవితలు రాశాడని తేల్చారు .

చార్లెస్ రాజు పై రాసిన ‘’we have pretty witty king –and whose words no man relies on –he never said a foolish thing –and never did a wise one ‘’ను చదివి రాజు నవ్వుకొని ‘’that is right –my words are my own but my actions are those of my ministers ‘’అన్నాడట .అతని కవిత్వం లో విజ్ఞానం ,ప్రభావం రెండూ ఉంటాయి  మారుపేర్ల తోనే ఎక్కువ గా రాశాడు .నాటక రంగం పై మోజు ఎక్కువ అంతకంటే అందులో నటించే నటీమణులంటే మరీనూ .’’కొడాం ఆర్ దిక్విన్తెసేన్స్ ఆఫ్ డిబాచేరి ‘’నాటకం బాగా పేరు పొందింది .తగల బెట్టగా మిగిలిన ‘’సోడాంనాటకాన్ని అమ్మితే 45,600పౌండ్లు వచ్చాయట .భార్యకూ స్నేహితుడికీ రాసిన ఉత్తరాలు సరస సల్లాపాల్లాగా,చాల తేలిక వచనం తో అందర్నీ ఆకర్షించాయి .

ఆ కాలం లో ఎందరో నటులకు రోచెస్టర్ ఆదర్శం .   శామ్యూల్ జాన్సన్  ‘’worthless and dissolute rake ‘’    అన్నాడు  .ఆండ్రూ మార్వేల్ మాత్రం ‘’the only man in England that had the true vein of satire ‘’అని పొగిడాడు .వోల్ టైర్ ‘’మాన్ ఆఫ్ జీనియస్ అండ్ గ్రేట్ పోయేట్ . సెటై ర్ లలో శక్తి ,సామరధ్యం ఉన్నాయి ‘’అని మెచ్చాడు .   హాజ్ లిట్ రోచేస్టర్ కవితలు సాన బెట్టిన వాజ్రాలని కాంతితో మెరిసి పోతూ ఉంటాయనీ అన్నాడు  . గోతే   తన స్వీయ చరిత్రలో  రీజన్ కు మానవత్వానికి వ్యతిరేకం గా ఉన్న  రోచెస్టర్ సెటైర్ ను పొందు పరచాడు .ఇలా దూషణ భూషణ తిరస్కార పురస్కారాలన్డుకొన్నాడు రోచెస్టర్ .

John Wilmot.jpg  

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-5-14-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నాద స్వరానికి ప్రాణ ప్రతిష్ఠ-

నాద స్వరానికి ప్రాణ ప్రతిష్ఠ

Published at: 19-05-2014 08:22 AM

మంగళ వాయిద్యరంగంలో సరికొత్త తరం విద్వాంసులు మన సాంస్కృతిక రంగంలో కొత్త అధ్యాయాలు సృష్టిస్తున్నారు. తెలుగు గడ్డ మీదే కాదు, అమెరికా ఆలయాలలో సైతం రసవత్తర స్వరార్చనతో దేవతలతో పాటు భక్తజనులను పరవశింపచేస్తూ ఆశీస్సులు అందుకుంటున్నారు. తెలుగుగడ్డపై నాదస్వర విన్యాసాలలో సరికొత్త రికార్డులు సృష్టించిన తరిగోపుల నారాయణ మనుమలు చిరుప్రాయంలోనే హేమా హేమీలైన విద్వాంసులు సాధించలేని రసరమ్య చరిత్రను నమోదు చేస్తున్నారు. ప్రతిష్టాత్మక వేదికలపై వారి నాదస్వర కచేరీలు ఇప్పటికే ప్రపంచ రికార్డులు సృషి ్టంచాయి. తాతయ్య శిక్షణతో నిత్య సాధనతో ఆ స్వరప్రపంచ సిసింద్రీలు మన సాంస్కృతిక రంగ పెద్దల మన్ననలతో చిరు సెలబ్రిటీలుగా మారిపోయారు. మన ప్రభుత్వం నిర్వహించే సంగీత నృత్య కళాశాలలు సాధించలేని ఆశయ లక్ష్యాన్ని హైదరాబాదు చిక్కడపల్లి ప్రాంతంలోని డోలు తాతయ్య సాధించాడు.
వేలాది ఏళ్ళ నుంచి మన నాగరికతలో మమేకమైన మంగళ వాయిద్యాలు, నాదస్వర కచ్చేరీలు అత్యాధునిక నాగరికతలో చిత్ర విచిత్ర విన్యాసాలను సంతరించుకున్నాయి. శుభకార్యాలు, విందు వినోదాల్లో సంకల్పం నుంచి సంపూర్ణం దాకా సుస్వరాల నేప«థ్యంలో నాదస్వరాలు, మంగళవాయిద్యాలు ఒక భాగం అయిపోయాయి. అయిదుగురితో కూడిన బృందంతో శుభకార్యాల సమయంలో ప్రతి ఇంటా వాద్యకారులు ప్రాధాన్యం సంపాదించుకున్నారు. డోలు, సన్నాయి, తాళంతో పాటు శ్రుతి పెట్టెతో మేళ తాళాలు తెలియని వారు ఉండరు. అయితే, యాభై అరవై ఏళ్ల ముందునాటి పద్ధతులు సమూలంగా మారిపోయాయి. గొప్పగొప్ప విద్వాంసులు మహా మహా అద్భుతాలు సృష్టించిన రాగాలు, లయ విన్యాసాలు మరుగైపోయి అరుదైపోయాయి.
దక్షిణ భారతంలోని ఆలయాల్లో నాదస్వరం తో నే తలుపులు తెరుచుకునే సంప్రదాయంలోని మెలకువలు, ఆచారాలు ఇతరులకు మార్గదర్శకాలయ్యాయి. ఉత్తర భారతంలో విస్తరించిన హిందుస్తానీ సంగీతంలో షెహనాయ్‌తో దేవుడికి మేలుకొలుపు చెప్పటం ఆనవాయితీ. 1200 ఏళ్ల మన ఆలయాల చరిత్రలో నాదస్వర సుప్రభాతం తెల్లారకట్ట వీనుల విందు చేయటం తో పాటు మనసుకు ఉల్లాసం, ఉత్తేజం కలిగించటం ఆగమశాస్త్రంలో విధివిధానం అయింది. తూర్పు వెలుగులు విప్పారుతుంటే, భూపాలరాగంతో స్వరాలు వెల్లువెత్తిస్తుంటే ఆ పరిసరాలన్నీ మంగళప్రదంగా మారుతాయని వేలాది ఏళ్లుగా ఓ నమ్మకం ఉంది. శ్రీరాగం నేపథ్యంలో హారతి, ఉత్సవాలు, మూలవిరాట్టుల ఊరేగింపులలో నాటరాగం ఆలపించటం ప్రత్యేకంగా మల్హరితో రాగమాలికలతో డోలు వాయిద్య విన్యాసాలు చేయడం ఆలయాల సంప్రదాయం అయింది.
శుభకార్యాలో మేళతాళాలు
ఆలయ సేవలలో కమ్మకమ్మగా ఆనందభైరవి, నీలాంబరి రాగాలలో మంద్రంగా లాలిపాటల వరుసలో పవళింపు సేవలు నిర్వహించటం అనూచానంగా కొనసాగుతూనే ఉంది. గంగానదీ తీరంలో షెహనాయ్‌తో కాశీ విశ్వేశ్వరస్వామికి స్వరార్చన చేసిన బిస్మిల్లా ఖాన్ భారతరత్న గా మన జాతి మన్ననలు అందుకొన్న తీరుతెన్నుల్ని అవలోకిస్తే మన ఆలయ విద్వాంసుల ప్రతిభాపాటవాలు మనకు పులకింతలతో పాటు కాసింత గర్వం కూడా పెంచుతాయి. ఇప్పటి తమిళనాడులో వందల సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్న వందల ఆలయాలలో క్రమంగా అలవడిన నాదస్వరంలో ఈ తరం గమనికలోనికి రాని అంశాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఆలయంలో స్వరాల కొలుపులతో మాత్రమే కాక మాడ వీధులలో ఊరేగింపులు, హారతుల సమయంలో నాదస్వరం కీలకమైంది. నాయీబ్రాహ్మణ కులం, ముస్లింలలో ప్రత్యేక తెగ గా గుర్తింపు ఉన్నవారు తరతరాలుగా దేవతల స్వరార్చనలో బతుకుదారిని ఎంచుకున్నారు. వైణిక బాణి, నాదస్వర బాణీలుగా స్వర ప్రపంచంలో పరిగణించే పద్ధతుల్లో మన కళ్ల ముందే మనకు తెలియనివి చాలా చాలా ఉన్నాయి. సెమ్మంగుడి శ్రీనివాసయ్యర్‌లాంటి అగ్రశ్రేణి గాయకుడు తనకు గాత్ర శుద్ధికి, పద్ధతికి ఉద్దీపన తెచ్చిపెట్టింది తమ పల్లెలోని నాదస్వరమే అనేవారు. పైడిస్వామి వంటి నాయీబ్రాహ్మణుడి నేతృత్వంలో జరిగిన నాదస్వర బృంద కచ్చేరీతోనే తనకు గానంలో సంగతులు అబ్బాయని ప్రసిద్ధ విద్వాంసుడు ఎం.ఎస్. బాలసుబ్రమణ్య శర్మ చెప్పుకునేవారు….
ఇంటింటా ఎలాంటి వేడుక జరుపుకున్నా ఆ సందర్భంలో మంగళ వాద్యాలను ఏర్పాటు చేయటం తాత ముత్తాతల తరాలనుంచి ఆనవాయితీ అయింది. శుభాలతో పాటుఅశుభాలు జరిగినప్పుడు బాజాలు జాతరలు గ్రామదేవతల పూజలలో వేరువేరు పద్ధతులు అలవాట్లు అయిపోయాయి. గృహాలలో శుభప్రదంగా భావించే చిన్నా పెద్దా పండుగలలో మేళం తప్పనిసరి అయిపోయింది. ఆకుపచ్చని మామిడి తోరణాల మధ్య సన్నాయి మేళం, భజంత్రీలు లేకుండా ఉండని సంప్రదాయం మనలో మమేకం అయింది. ఖరహరప్రియ, కళ్యాణి రాగాలతో ఉల్లాసాన్ని పొంగులెత్తించటం అందరి అనుభవాలలోనిదే. మన వాగ్గేయకారులు ఆయా సందర్భాలు, సన్నివేశాలకు అనువుగా చేసిన రచనలు వాయిద్యాలతో అనుభూతిలోకి తేవటం మన మనసుల్లో మెదులుతాయి. మునిరామయ్య, దాలిపర్తి పిచ్చాహరి, దోమాడ చిట్టబ్బాయి,షేక్ చిన పీరు సాహెబ్, అన్నవరపు బసవయ్య వంటివారు నాదస్వర రంగంలో రసవత్తర స్వర విన్యాసాలు సృష్టించారు. ఈ తరంలో తరిగిపోయిన విద్వాంసుల పరంపరలో 78 ఏళ్ల తరిగోపుల నారాయణ సంప్రదాయ నిష్ఠతో పలు విజయాలు సాధించారు.
ఎల్లలు దాటిన విన్యాసాలు
తాత ముత్తాతల నాదస్వర వారసత్వంలోని అసలు సిసలు సారాన్ని సారస్వాన్ని అందిపుచ్చుకున్న పెద్దాయన నారాయణ తన మనుమలతో సాధిస్తున్న రికార్డులు గత వైభవంలో వన్నెల్ని గుర్తుకు తెస్తున్నాయి. పలువురు పెద్దల మెప్పుతో పాటు అమెరికాలోని ఆలయాలలో పాత తరం కచ్చేరీలపై శ్రద్ధాసక్తులు పెరిగేలా చేయగలుగుతున్నారు. వందల సంఖ్యలో మన ఆలయాలు విరివిగా పెరిగినా, అక్కడ నాదస్వర విద్వాంసుల సేవలను వినియోగించుకోకపోగా, రికార్డులు, సీడీలను ఉపయోగించి స్వరార్చనను సరిపెడుతున్న తీరుతెన్నులు కొద్దిగా బాధ కలిగిస్తాయి. వారు ఈ పరిస్థితిని మార్చి కొత్తతరంలో ప్రావీణ్యం పెంచుతున్నారు. ఆయన మనుమలు ఇద్దరు, ఒక మనుమరాలు చిరుత ప్రాయంలోనే అసాధారణ ప్రతిభ తో దిన దిన ప్రవర్ధమానం అయ్యేలా చేయగలిగారు. మన దేశంతో పాటు దేశ విదేశాల్లో ఆ బుల్లి విద్వాంసుల త్రయం సాధిస్తున్న విజయాల గురించి తాతయ్య వివరించారు.
కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం మిడుతూరు పల్లె నుంచి రాజధాని నగరానికి వచ్చి మా కులవృత్తి విద్యలో ప్రామాణికమైన పద్ధ్దతులు పెంచటానికి చేతనయిన వన్నీ చేశాను. మా వాళ్ల తో గత వైభవం లోని గౌరవ ఆదరాలు పెంచుకోవటంపై కావాల్సిన శిక్షణ సాధనలకు అవకాశాలు పెంపొదిస్తున్నాం. 1981 నుంచి నేను చేసినవన్నీ గమనించండి. ఇంకా ఎంతో చేయాల్సి ఉంది. నా ఆలోచనల్ని పంచుకుంటూ మెచ్చుకున్న సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఆనంద్ నడుం బిగిస్తే మన రాష్ట్రంలోని4,200 మంది నాదస్వర కళాకారులు, 1,082సన్నాయిలు, 321 క్లారినెట్‌లు, 1331 డోలులు శృతి, తాళంతో ఒకే వేదికపై ప్రదర ్శన ఇచ్చారు. ఆ నేపథ్యంలోనే మా ఇంటి బుడతలు ప్రత్యేక ప్రదర్శనలు ఇచ్చారు.హైదరాబాదులో పుట్టిపెరిగిన 6 ఏళ్ల చిన్నారి మణిదీప్ తాతయ్యగా నా నుంచి నేర్చుకున్న డోలు విన్యాసాలు చిత్రవిచిత్ర జతులు గమకాలతో పాత తరం పెద్దల నాద విద్వత్తు తో పెద్దల నుంచి మెప్పు పొందాడు.
డోలుపై తాళం వాయించటంలో ఆ సిసింద్రీ ప్రతిభ గవర్నర్‌తో సహా ఎందరో పెద్దల్ని ఆకట్టుకుంది. పద్యాలు రాయటంలో ఛందస్సులా లయ వాయిద్యంలో తాళం అత్యంత కీలకమైంది. అదే ప్రాణంలాంటిది. 35 తాళాల ప్రస్తారక్రమం, దానికి దీటుగా 108 తాళాలు వాటికి ముందు పంచగతుల గమనం, దక్షిణ మార్గం, అతిచిత్ర మార్గం వంటి విన్యాసాలు అలవోకగా చేయగలిగాడు. అంతకన్నా రెండేళ్లు పెద్ద అయిన మనుమరాలు, మనుమడు అమెరికాలో అంతకు మించిన నాదస్వర సత్తాతో మహామహుల ఆశీర్వచనాలు అందుకుంటున్నారు. నేను ఆ దేశంలో 6 నెలలు, ఇక్కడ చిక్కడపల్లిలో, ఆ తరువాత మా స్వగ్రామంలో ఆసక్తి కలిగినవారందరికి ఇందలో శిక్షణ ఇస్తున్నా.
అమెరికాలోని దేవాలయాలలో నాదస్వరం కోసం స్థిరంగా ఎవరూ లేరని గమనించాను. అక్కడి ఆలయాల్లో మేళం కోసం శ్రీలంక, తమిళనాడులకు చెందిన కొద్ది మంది వాయిద్య ప్రవీణులు దూరప్రాంతాలకు ప్రయాణాలు చేస్తూ ఆయా కార్యక్రమాలు సజావుగా జరిగేలా చేస్తున్నారు. తరాల మార్పిడి వల్ల మారిపోయిన నాదస్వరంలో తేడాలు, పట్టింపు లేకుండా కొనసాగిపోతున్నాయి. నా కుమారుడు సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగిగా బోస్టన్ ప్రాంతంలో స్థిరపడి, మా కులవృత్తిలో చిన్ననాటి సాధన వట్టిపోకుండా ఆయా ఆలయాల్లో అవకాశం బట్టి నాదస్వరంలో కచ్చేరీలు చేస్తున్నాడు. ఒక మనుమరాలుకి పేరు కూడా రాగశ్రీ అని పెట్టుకున్నాం. ఆ పిల్ల మా నాదస్వర వారసత్వంతో పాటు గాత్రంలో కూడా మంచి పట్టు సాధించింది. మా ముగ్గురు మనుమలు కలిసి అమెరికాలో వీలయినన్ని ప్రాంతాలలో కచ్చేరీలు చేసేలా కొందరు పెద్దలు కలిసి సన్నాహాలు చేస్తున్నారు. 78 ఏళ్ల వయసు పైబడటం తో నాకు తెలిసిన విద్య, మెలకువలు తరువాతి తరానికి అందించాలన్న తపన పెరిగింది.
డోలు వాయిద్యం, గ్రహ, గతి బేధం, చాపు తాళ సమ్మేళనం వంటి వాటి పై సీడీలు రూపొందించాను. అరుదైన సింహనందిని, గోపుచ్ఛయతి, సమతాళం, మిశ్రగమనం, దివ్యసంకీర్ణ గతి, త్రిపుటతాళంలో భిన్నగతులు, డోలు త్రయం, డోలు పంచకం, సప్తకం, తాళ వాద్య కచ్చేరీ, స్వరలయ విన్యాస తరంగిణి, దశ డోలు వాయిద్యం లతో సప్తతాళాల జతి వంటివి సీడీల రూపంలో వెలువరించాను. ఇవి కేవలం వినికిడికి మాత్రమే కాక శబ్ద రహస్యాలు వాటి సొంపులు విన్యాసాలు అవగతం చేసుకోవటానికి కూడా ప్రయోజనకరం. ఇంకా శివతాండవంలో, డమరుక యతిలో మా డోలుతో పాటు పద్మశ్రీ ఎల్లా వారి మృదంగంతో కూడా చేశాం. 12 నిమిషాల 24 సెకండ్లలో 35 తాళాలు వాయించి గిన్నిస్ నమోదుతో రికార్డుతో తెలుగు నాదస్వర కేతనం ప్రపంచం అంతా చూసేలా చేశాను. అందరి ఆదరాభిమానాలతో ఇంట గెలిచి రచ్చ గెలవటం అన్నట్టుగా అమెరికాలో మా చిన్నారులతో కలిపి కచ్చేరీ చేసి జేజేలు పంచుకునేలా చేస్తా.
జూ జి.ఎల్.ఎన్. మూర్తి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దా. కొలకలూరి ఇనాక్తొ రాసిన మొదటి దళిత స్త్రీవాద కధ ఊరబావి

తొలి దళిత స్త్రీవాద కధ ఊరబావి

Published at: 19-05-2014 03:26 AM

ఒక సాహిత్య ఉద్యమం సామాజిక, చారిత్రక కారణాల వల్ల కొంత వాడివేడి తగ్గాక పునర్‌మూల్యాంకనం చేసుకోవడం అవసరం. అప్పటివరకు గుర్తింపుకు రాని రచనలు, రచయితలు, కవులు, కవయిత్రులు ముందుకు వస్తారు. ఈ పనిని ఎక్కువగా విమర్శకులు, రచయితలు చేస్తారు. ఒక్కోసారి వీరిలో ఆ ఉద్యమ కవులు, రచయితలు కూడా ఉంటారు. అంటే ఒక ఉద్యమం తర్వాత సాహిత్య వాతావరణం కొంత నిశ్శబ్దానికి గురై మరో ఉద్యమం ప్రారంభమయ్యే మధ్య కాలంలో ఆ సాహిత్యాన్ని కొత్త సైద్ధాంతిక పద్ధతుల ద్వారా, లేదా పాత పద్ధతుల ద్వారా పరిశీలించడం జరుగుతుంది.
దళిత సాహిత్యం దళిత స్త్రీకి ఇచ్చిన గుర్తింపు తక్కువే. అయితే స్త్రీవాద సాహిత్యం, దళితవాద సాహిత్యం దళిత స్త్రీ వాదానికి కావాల్సిన నేపథ్యాన్ని ఏర్పరిచాయి అనడంలో ఎటువంటి అనుమానమూ లేదు. దళిత స్త్రీ సాహిత్యంగా ‘నల్లపొద్దు’ కవితా సంకలనం ఆధునిక తెలుగు సాహిత్య పరిణామంలో గుర్తించదగిన మైలురాయి లాంటిది. గోగు శ్యామల, జూపాక సుభద్ర, జాజుల గౌరి, బోయ జంగయ్య, గద్దల బాను, కాలువ మల్లయ్య మొదలైన వాళ్లు దళిత కథాసాహిత్యాన్ని సుసంపన్నం చేశారు, చేస్తున్నారు.
‘దళిత స్త్రీ గురించి దళిత స్త్రీలే రాయాలి’ అనే అంశాన్ని వదిలి ఆలోచిస్తే దళిత సాహిత్యం ఉద్యమ స్థాయికి రాకపూర్వమే – 1969 జూలై 2, ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో వెలువడిన కొలకలూరి ఇనాక్ కథ ‘ఊరబావి’. ఈ కథను దళిత సాహిత్యంలో భాగంగా కాక, దళిత స్త్రీ వాదానికి భూమికగా గుర్తించాల్సిన అవసరం ఉంది. సాహిత్య ఉద్యమ పరిణామంలో చైతన్యం, ప్రతిఘటన అనేవి చివరి అంశాలు. కానీ వీటిని రచయిత ఈ కథలో దళిత సాహిత్య ఉద్యమ ప్రారంభంలోనే చిత్రించారు.
2002 మార్చి 8న అలీసమ్మ విమెన్స్ కలెక్టివ్ విడుదల చేసిన ప్రకటనలో భారతీయ స్త్రీవాదాన్ని పితృస్వామ్య దృక్కోణం నుండే కాకుం డా కులతత్వ కోణం నుండి కూడా చూడాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది- ‘భారత మహిళా లోకా న్ని కులతత్వ పితృ స్వామ్యం చీల్చివేసిన విషయాన్ని గుర్తించవల సిందిగా దళితేతర స్త్రీలనూ మేం కోరుతున్నాం. భారతదేశంలో కేవలం పురు షాధిపత్యం మాత్రమే కాదు, కులతత్వ పితృస్వా మ్యం పనిచేస్తుందన్న విషయాన్ని గుర్తించ వలసిందిగా మిమ్మల్ని కోరు తున్నాం. భారతీయ మహిళల్లో కొనసాగుతున్న భిన్నత్వం (బహుళత్వం) రాజకీయ ప్రాధాన్యతను గుర్తించవలసిందిగా కోరు తున్నాం. మీరు రూపొందుతున్నారు, మేం ధ్వంస మవుతున్నాం. మిమ్మల్ని గుడిలో ప్రతిష్టిస్తున్నారు. మమ్మల్ని రేయింబవళ్లూ పనిచేయమని పొలాల్లో విసిరేస్తున్నారు. మిమ్మల్ని ‘సతి’గా మార్చుతున్నా రు. మమ్మల్ని వేశ్యలుగా మార్చుతున్నారు. ప్రజా స్వామిక స్త్రీవాదం ఏదైనా దాని లక్ష్యం జండర్, కులం, వర్ణం మొదలైన అధికార నిర్మాణాల్లో యిమి డి వున్న సామాజిక బంధాలను మార్చడమే.’
జండర్, కులం, వర్ణం అనే మూడు విధాల దళిత స్త్రీ పొందుతున్న అవమానాలను, ప్రతి ఘటించిన వైనాన్ని ‘ఊరబావి’ కథలో ఇనాక్ చిత్రించారు. కథలో ప్రధానాంశం దళితుల నీటి సమస్య. ఈ సమస్య పరిష్కారాన్ని ఆనాటి సాహిత్య పరిస్థితుల దృష్ట్యా రచయిత సంస్కరణ లేదా ఉద్ధరణ ద్వారా చూపాలి. కానీ ఇనాక్ ఒక మాదిగ స్త్రీ చైతన్యం ద్వారా పరిష్కారాన్ని చూపడం గుర్తించదగిన గొప్ప విషయం.
క్లుప్తంగా కథ విషయానికి వస్తే- వేసవి కాలంలో మిగిలిన బావులు ఎండి పోవడంతో పల్లెజనం, గ్రామంలోని జనం ఒకే బావి నుంచి నీళ్లు తెచ్చుకోవలసి వస్తుంది. పల్లెలో దళితులు బావినీళ్లు తోడుకోడానికి గ్రామంలోని వాళ్లు ఒప్పుకోరు. ఊరిజనం కనికరించి తోడిపోయాలి. బావి దగ్గరకు నీటికెళ్లిన మాదిగ చిదంబరం భార్యను ఊరి యువకుడు బాన ఎత్తుతూ ఆమె శరీరాన్ని చూస్తూ, తాకుతూ బాన వదిలేస్తాడు. బాన పగిలి పోతుంది. విషయం పల్లెంతా, ఊరంతా పాకుతుంది. ఎవరికీ తెలియకుండా చిదంబరం భార్య బావిలో ఎద్దుదట్టేన్ని పడేస్తుంది. అంతకు ముందే చిదంబరం ఊరి జనాలను వేణుగోపాలస్వామి ఆలయంలోకి పోలీసు సహాయంతో వెళ్లడం, రైల్వే స్టేషన్లో బెంచీపై కూర్చొని ఊరిజనాలు వస్తే లేవకపోవడం లాంటి సంఘటనల్లో ఎదిరించి ఉంటాడు. అందువల్ల చిదంబరం మీద అనుమానంతో మునసబు చిదంబరం తండ్రి రాముడ్ని, చిదంబరాన్ని కట్టేసి కొడతాడు. కానీ ఆ రాత్రి చిదంబరం భార్య మునసబును ఎవరికీ తెలియకుండా మంచానికి కట్టేసి కొడుతుంది. మునసబు సావిడికి, వాములకు నిప్పు పెడుతుంది. దాంతో ఊరి జనాలు, మునసబు బావి నీళ్లను పల్లెజనాలు వాడుకోడానికే ఒప్పు కుంటారు. చివరకు బావిలో ఎద్దు దట్టేన్ని బయటకు తీయడానికి అందరూ భయపడుతుంటే చిదంబరం భార్య చాకచక్యంగా బయటకు లాగుతుంది.
ఈ కథలో అన్యాయానికి గురయ్యే పాత్రలు మూడు. ఒకరు- చిదంబరం తండ్రి రాముడు. ఇతడు ఏమాత్రం చైతన్యం లేని వ్యక్తి. రెండు- చిదంబరం. ఇతడు సమస్యకు సానుకూల పరిష్కారాన్ని కోరుకుంటా డు. మూడు- చిదంబరం భార్య. బావి దగ్గర జరిగిన అవమానానికి అతడ్ని కొట్టడం.. పల్లెనీటి సమస్య తీర్చడానికి ఎద్దుదట్టేన్ని బావిలో వేయడం.. రైల్వేస్టేషన్లో భర్త చిదంబరాన్ని కొట్టడానికి చెయ్యెత్తిన ఊరి అతడ్ని ఆపి, దబాయించడం.. మామను, భర్తను కొట్టిన మునసబును మంచానికి కట్టేసి కొట్టడం.. మునసబు ఆస్తి సావిడి, వాములు తగలబెట్టడం.. చివరకి ఎవరి వల్లా కాని ఎద్దుదట్టేన్ని బావిలోంచి తీయడం.. ఇవన్నీ మాదిగ స్త్రీ చైతన్యాన్ని తెలియజేసే సంఘటనలే.
చిదంబరం భార్య నీటికోసం బావి దగ్గరకెళ్లి పొందిన అవమానంలో ఒక్క జెండర్ అంశమే కాకుండా నీటిని బావి దగ్గర సొంతంగా తోడుకోలేకపోవడం అనే దళిత సమస్య కూడా ఉంది. ఈమె భర్తను, మామను కొట్టడం, రైల్వే స్టేసన్ సంఘటనలు ఒక్క కుల సమస్యనే కాకుండా భూస్వామ్య వ్యవస్థలో ఉన్న వర్గ సమస్యను కూడా తెలియజేస్తాయి. అదే విధంగా ఎద్దుదట్టేన్ని బావిలోంచి తీయడంలో దళిత స్త్రీకి శ్రమలో ఉన్న ప్రాధాన్యాతను కూడా తెలియజేస్తుంది. ఈ అంశాలన్నీ దళిత స్త్రీకి, దళితేతర స్త్రీకి గల భేదాన్ని వివరిస్తూ, దళిత స్త్రీ ఎదుర్కొనే సమస్యలను కూడా మన ముందుకు తెస్తాయి.
ఈ కథ వెలువడిన సుమారు పదేళ్లకు దళితులపై జరుగుతున్న అనేక దాడులు వెలుగులోకి వచ్చాయి. ప్రకాశం జిల్లా కారంచేడు గ్రామంలో మాదిగకుంట చెరువులో పశువులకు పెట్టే కుడితిని పోయడం జరిగింది. ఆ కుంటలో నీళ్లు మాదిగలు తాగేవాళ్లు. దీనిని దళిత స్త్రీ సువార్తమ్మ ఎదిరించింది. తర్వాత ఈ సమస్యే పెద్ద తిరుగుబాటుకు దారితీసింది. అంతేకాదు కారంచేడు దళిత స్త్రీ హత్యల కేసులో ప్రధాన సాక్షి అలీసమ్మ. ఆమె కొడుకును చంపడం స్వయంగా చూసింది. సాక్ష్యం చెప్పడానికి పూనుకోవడంతో ఆమెను కూడా చంపేశారు.
‘ఊరబావి’ కథలో రూపం విషయానికి వస్తే- కథ సమస్యతో ప్రారంభమవుతుంది. ముగింపులో సమస్య పరిష్కారం ఉంది. పాత్రోచితమైన భాష, వర్ణనలన్నీ సహజత్వానికి దగ్గరగానే ఉంటాయి. కథ సర్వసాక్షి దృక్కోణంతో సాగినా రచయిత ఎక్కువగా కథలో ప్రవేశించారు. ప్రధాన పాత్ర చేసే పనులను గోప్యంగా ఉంచి ‘ముళ్ల’ను వర్ణించడం ద్వారా తెలియజేస్తారు- ‘చిదంబరం మునసబు మంచం వైపు చూశాడు. చేతులు తలవైపు పట్టెకూ, కాళ్లు కాళ్ల కట్టకూ కట్టి వేయబడ్డాయి. ముళ్ళు! నేర్పయిన ముళ్ళు! ఏనుగు ముళ్ళు! అతనికి ఊరబావి గిలకల పట్టెలకు మోకులు వేసిన ముళ్ళు గుర్తుకు వచ్చాయి!’ కథ చివరలో ఎద్దు దట్టేన్ని బావి లోంచి తీసిన తర్వాత ముళ్లు గురించి చిదంబరం ఈ విధంగా ఆలోచిస్తాడు. ‘చిదంబరం ఇందాకటి నుంచి ఆలోచిస్తున్నాడు. బావిలోంచి మోకులు తెచ్చి ఆమె పట్టెకు వేసిన ముళ్లు గూర్చి. చక్కని ముళ్లు! అందమయిన ముళ్లు! నేర్పుగల ముళ్లు! ఏనుగు ముళ్లు!’
ఈ కథలో చిదంబరం భార్య అని ప్రధాన పాత్రను పేరు లేకుండా చిత్రించడం వెనుక దళిత స్త్రీకి సమాజంలో, దళితుల్లోనూ ప్రాధాన్యత తక్కువగా ఉందని తెలియజేయడం మాత్రమే. ఈ విధంగా ఈ కథ దళిత స్త్రీచే రచించబడకపోయినా, దళిత రచయితగా గుర్తింపు పొందిన పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ దళిత స్త్రీ చైతన్యాన్ని, ప్రతిఘటనను కథలో వాస్తవ రూపంలో రాశారు. దళిత స్త్రీవాదం నేడు తన మూలాలను కథలో కూడా వెతుక్కునే సమయం వచ్చింది కాబట్టి ఈ కథను ప్రప్రథమ కథగా గుర్తించాల్సిన అవసరం ఉంది.
-శ్రీభవ్య
9603935285

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సామాన్యుని చేతిలోకి పుస్తకం

సామాన్యుని చేతిలోకి పుస్తకం

ఉత్తమ గ్రంథాల ప్రచురణ కోసం, యువజనుల్లో పఠనాసక్తిని పెంపొందించడం కోసం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధీనంలో న్యూఢిల్లీలో 1957లో స్థాపించబడిన సంస్థ నేషనల్ బుక్ ట్రస్ట్ (ఎన్‌బిటి). దీని విభాగాలు మొదట కోల్‌కతా, బొంబాయి, బెంగుళూరులలో ఏర్పాటయ్యాయి. 2009లో జాతీయ అనువర్తిత ఆర్థిక పరిశోధనా మండలి సహకారంతో ఎన్‌బిటి దేశవ్యాప్తంగా యువజనులలో పుస్తక పఠనాభిలాష అలవాట్లపై ఒక సర్వే నిర్వహించింది. అక్షరాస్యులైన యువజనుల విద్యా స్థాయికి, వారి పఠనాసక్తులకు మధ్య సంబంధమున్నట్టు ఆ అధ్యయనంలో వెల్లడయింది. టెలివిజన్ ప్రసారాలను వీక్షించడం, ఇంటర్నెట్ సర్ఫింగ్ చేయడం కంటే పుస్తక పఠనమే ముఖ్యమని అక్షరాస్యులైన యువజనులలో 75 శాతం మంది అభిప్రాయపడినట్టు ఆ సర్వే వెల్లడించింది.
1986 జాతీయ విద్యా విధానం స్ఫూర్తితో సమాజంలోని అన్ని వర్గాల వారికి పుస్తకాలను అందుబాటులోకి తేవడానికి ముఖ్యంగా బాలలు, యువతలో పఠనాసక్తిని పెంచడానికి ప్రతి రాష్ట్రంలోనూ కేంద్ర పాలిత ప్రాంతాలలోనూ ‘బుక్ ప్రమోషన్ సెంటర్స్’ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన ప్రకారం ఎన్‌బిటి అన్ని రాష్ట్రాలలోనూ ఈ సెంటర్స్‌ను ఏర్పాటు చేసే పనిలో ఉంది. అందులో భాగంగా ప్రస్తుతం గౌహతి, పాట్నా, గోవా, అగర్తలా లతోపాటు హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న సాక్షరతా భవన్‌లో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే జూలైలోగా సెంటర్ ప్రారంభం కానున్నది. బుక్ ప్రమోషన్ సెంటర్‌లో పుస్తక విక్రయ కేంద్రంతో పాటు సాహితీవేత్తలు, చిత్రకారులతో సమావేశాలు, చర్చలకు సైతం సదుపాయంగా ఉండేలా ఒక సమావేశ మందిరాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. పుస్తక ప్రచురణ, పఠనాసక్తిని ప్రోత్సహించడం, భారతీయ గ్రంథాలను విదేశాలలో ప్రచారం చేయడం, రచయితలకు, ప్రకాశకులకు ఆర్థిక సహాయం చేయడం, బాలల సాహిత్యాన్ని ప్రోత్సహించడం ఎన్‌బిటి ప్రధాన కార్యక్రమం. ఈ సంస్థ చాలా సంవత్సరాలుగా దేశమంతటా పుస్తక ప్రదర్శనలను ఏర్పాటు చేస్తోంది. ప్రతి రెండేళ్ల కొకసారి న్యూఢిల్లీలో విశ్వ పుస్తక వేదికను ఏర్పాటు చేస్తున్నది. ఆసియా, ఆఫ్రికా దేశాలలో జరిగే పుస్తక ప్రదర్శనల్లోకెల్లా ఇదే పెద్దది. ఇందులో 1200కు పైగా దేశ విదేశాల ప్రచురణ సంస్థలు పాల్గొంటాయి. ఈ ప్రదర్శనల్లో రచయితలతో ముఖాముఖి, పుస్తకావిష్కరణలు, చర్చలు, సెమినార్లు, వర్క్‌షాప్‌లు నిర్వహిస్తుంది.
పుస్తక పరిశ్రమ అభివృద్ధికి ప్రచురణ, విక్రయ విభాగాల్లో ప్రతిభావంతులైన యువకుల కోసం ఢిల్లీలో మూడు మాసాల శిక్షణా తరగతులు నిర్వహిస్తుంది. 100 రూపాయల సభ్యత్వ రుసుముతో ఎన్‌బిటిలో సభ్యులుగా చేరిన వారికి ప్రతి కొనుగోలుపై 20 శాతం తగ్గింపు ఉంటుంది. సాహిత్య అకాడమీ, పబ్లికేషన్స్ డివిజన్ మొదలైన సంస్థల ప్రచురణలను కూడా ఈ బుక్ ప్రమోషన్ సెంటర్ విక్కయ కేంద్రం అందుబాటులో ఉంచుతుంది. ఇంకా ఎన్నో రకాలుగా ఉపయోగకరంగా ఉండే ఈ సెంటర్‌ను సాహిత్యకారులందరూ ఉపయోగించుకోవాలని దాని బాధ్యులు పత్తిపాక మోహన్ కోరుతున్నారు.

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వంటింటి సూర్యోదయాలు-మందరపు హైమవతి

వంటింటి సూర్యోదయాలు-మందరపు హైమవతి

పొద్దున్నే లేవగానే
పొగలు కక్కే కాఫీ తాగుతూ
పేపరు చదవాలని నా చిరకాల వాంఛ
కలల శాలువా కప్పుకొని
నిద్రా దేవత కౌగిలిలో
ఇంటిల్లిపాది పరవశిస్తున్న వేళ
నేను మాత్రం కళ్ళు నులుముకొంటూ
కాలు పెడతాను వంటింట్లోకి
నా సుందర సూర్యోదయాలన్నీ
వంటింటి ఆకాశంలోనే
ప్రతి ప్రభాతం కాఫీరాగం పలికించడానికి
శ్రుతి చేస్తాను వంటింటి వాయులీనాన్ని
చిన్నప్పుడు భయపెట్టిన దయ్యాల కథల్లా
పెద్దయ్యాక వెంటాడే పీడకల వంటిల్లు
నలభీమ పాకమని ప్రస్తుతించినా
వంటింటి పుస్తకంపై కాపీరైటు వనితలకే
విద్యార్థులు ఒక జవాబునే పదే పదే రాసినట్లు
ప్రతి రోజు బియ్యం కడిగి కడిగి
కూరలు తరిగి తరిగి
ప్రతినిత్యం లక్షల క్షణాల అవిరళ శ్రమ
పచ్చడి ప్రియులకు పప్పు ప్రియులకు
వేపుడు లేనిదే వెర్రెత్తి పోయేవారికి
అందరి అభిరుచుల మేర వండిపెట్టి
నా అభిరుచినే విస్మరించిన నేపథ్యంలో
ఇల్లు పట్టించుకోని వాళ్ళు
పిల్లల పేర్లు తెలియని వాళ్ళు
సంఘసేవకులుగా కీర్తింపబడుతున్న వేళ
మున్నూటరవై ఐదు రోజులు
వంటింటి చెరసాలలోనే మగ్గిపోతూ
నిగమశర్మ అక్కలా మిగిలిపోతున్నా
ంంం
ఉపమలతో రూపకాలతో
ఉత్తమ కవితను తీర్చిదిద్దినట్లు
కనుల విందుగా నోటికి పసందుగా
నా శాయశక్తులా సమయమంతా వెచ్చించి
వంట చేసి వడ్డించినా
చేస్తావుగానీ మా అమ్మ చేతివంటను
మరపించలేవనే అభిప్రాయ ప్రకటనతో
నేనొక దిగులు పిట్టను
ంంం
ఎంత జాగ్రత్తగా వున్నా
ఎప్పుడో ఒకప్పుడు పప్పులో కాలెయ్యక తప్పదు
నా అభిమాన కవి కవిత్వం చదువుతూ
తిక్కన కందంలా తీర్చిదిద్దాలనుకొన్న
తియ్యని కంద పులుసు
ఛందో భంగమైన పద్యంలా
అంద వికారంగా మారినపుడు
ప్రతి పద్య చమత్కార చేమకూర కవిత్వంలా
హృద్యంగా వండదలచిన చేమదుంపల కూర
చేదు రుచినే మిగిల్చినపుడు
పరవశింపచేసే పాటలు వింటూ
మల్లెమొగ్గలా పరిమళించాల్సిన అన్నాన్ని
మసిబొగ్గులా మార్చినపుడు
వెండిగిన్నెలాంటి పాలగిన్నె
కుండపెంకులా మాడినపుడు
వంటంటే శ్రద్ధ లేదని
రుచి లేని పచనంతో
తన జీవితం వ్యర్థమైందని
శ్రీవారు పరిపరి విధాలుగా
గాయపరచినపుడు నా మనసును…
ంంం
బాల్య వివాహ పంజరంలో
ఊపిరాడక ఉసురు కోల్పోయిన పూర్ణమ్మ
కలలు కాలరాచిన కన్యాశుల్క బాధిత బుచ్చమ్మల
బ్రతుకు కన్నీటి చిత్రాలు చిత్రించినందుకు గాక
సామూహిక వంటశాలలు నిర్మించాలని
ఒక చిన్న మాట రాసిన గురజాడ చేతిపై
ఒక చిన్న ముద్దు పెట్టాలని నా కోరిక
-మందరపు హైమవతి
94410 62732

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీమతి మల్లాది సుబ్బమ్మ -నిత్య చైతన్య శీలి అని చెప్పిన -ఓల్గా

నిరంతర చైతన్యశీలి – ఓల్గా

సనాతన సంప్రదాయ కుటుంబంలో 1924లో పుట్టి, పదకొండేళ్ళకు పెళ్ళి చేసుకుని, ఐదుగురు పిల్లల్ని కనిపెంచిన ఒక స్త్రీ, ఒక సామాజిక ఉద్యమకారిణిగా, స్త్రీవాదిగా మారిన క్రమమే మల్లాది సుబ్బమ్మగారి జీవితం. ఈ జీవితం ఆమె స్వయంగా నిర్మించుకున్నది. తన నిర్ణయాల ప్రకారం తన జీవితాన్ని నిన్నటి వరకూ కొనసాగించిన మల్లాది సుబ్బమ్మగారు ఇవాళ లేరు. తన జీవితంలో సగం కాలం తన చుట్టూ అల్లుకున్న ఆచారాలు సంప్రదాయాలనే ముళ్ళ పొదలను నరకటంలోనే వృథా అయిపోయిందనీ, కొంతవరకు మాత్రమే సమాజానికి ఉపయోగపడిందనీ ఆమె చెప్పుకునేవారు.

చిన్నతనంలోనే కనుపర్తి వరలక్ష్మమ్మ గారు నడిపించిన స్త్రీ వితైషిణీ మండలి ప్రభావం సుబ్బమ్మ మీద ఉంది. ఆ సంఘంలో పనిచేసిన అనుభవం తర్వాతి రోజుల్లో అనేక సంఘాలు పెట్టి నడపటానికి ఆమెకు ఉపయోగపడింది. 1972లో ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంలో పాల్గొనటంతో ఆమె సాంఘిక ఉద్యమాలలోకి అడుగుపెట్టారు. ‘ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెరుగుతున్నాయి. పగిలిన అద్దం ఎంత అతికించినా అతుకు అతుకే తప్ప సహజం కాలేదు. అందువల్ల విడిపోతే తప్ప పరిస్థితి చక్కబడదు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఇచ్చి తీరాలి’ అని ఆమె ఆనాడు చీరాల సభలో మాట్లాడారు. ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన సంగతి తెలిసి కొంతకాలంగా అస్వస్థతలో ఉన్న ఆమె ఏమనుకున్నారో! ఆ తర్వాత జయప్రకాశ్ నారాయణ్ ప్రారంభించిన ఉద్యమంలో పాల్గొన్నారు. ఎమరె ్జన్సీలో భర్త రామ్మూర్తి గారు అరెస్టయి జైలులో ఉంటే, ఆ కాలమంతా ఎమర్జెన్సీ వ్యతిరేక భావాల ప్రచారం ఏదో ఒక రూపంలో చేస్తూనే వచ్చారు. 1979లో అభ్యుదయ మహిళా సమాఖ్యకు అధ్యక్షురాలై అనేక కార్యక్రమాలు చేపట్టారు. కూరగాయల ఎగుమతి వల్ల ఇక్కడ వాటి ధరలు పెరగటాన్ని గమనించి ఎగుమతిని నిషేధించాలని కోరుతూ జంటనగరాల మహిళా సంఘాలన్నీ కలసి చేసిన ఆందోళనలో సుబ్బమ్మ ముందు నిలచి పనిచేశారు. ఆ రోజు ఉల్లిపాయల ధర రూపాయి నుంచి మూడు రూపాయలకు పెరిగిందని ఆందోళన చెయ్యాలని పిలుపు ఇస్తే స్వచ్ఛందంగా వెయ్యిమందికి పైగా స్త్రీలు వచ్చి ఊరేగింపులో పాల్గొన్నారు. అలాంటి చైతన్యవంతమైన కాలంలో ఆ కాలాన్ని సద్వినియోగం చేస్తూ జీవించారు మల్లాది సుబ్బమ్మ.

కుల నిర్మూలనోద్యమంలో కూడా ఆమె చాలా కృషి చేశారు. కులనిర్మూలన సంఘంలో చేరి, సభలలో మాట్లాడటం, వ్యాసాలు రాయటం, ఆ సంఘం చేసే కులాంతర వివాహాలను ప్రోత్సహించి సహాయపడటం వంటి పనులెన్నో చేశారు. 1983లో కుల, మత ప్రసక్తిలేని వివాహాలను ప్రోత్సహించటానికి ‘అభ్యుదయ వివాహ వేదిక’ని స్థాపించి ఎన్నో ఆటంకాలను ఎదుర్కొంటూ కూడా కులాంతర, మతాంతర వివాహాలు జరిపిస్తూ వచ్చారు. హేతువాద ఉద్యమంలో భాగమై ఆ చైతన్య వ్యాప్తికి దోహదం చేశారు. 1988లో రాజస్థాన్ హైకోర్టు ఆవరణలో ఆరు అడుగుల మనువు విగ్రహాన్ని ప్రతిష్ఠించారని విని సుబ్బమ్మగారు అంబేద్కర్ సంఘం వారి మీటింగులో దుష్ట మేధావి మనువు అంటూ మనుధర్మ శాస్త్రాన్ని తూర్పార బట్టారు. రాడికల్ హ్యూమనిస్టుగానూ ఆమె పనిచేశారు.

స్త్రీల సమస్యల మీద అనేక వ్యాసాలు, కథలు, నవలలు రాశారు. చాలా రాడికల్ భావాలతో ఆమె కథలు సాగేవి. వికాస కేంద్ర స్థాపన తన జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టమని సుబ్బమ్మ గారు చెప్పేవారు. సమస్యలలో ఉన్న స్త్రీలు ఎవరైనా అక్కడికి రావచ్చుననే ధైర్యం కలిగించే ప్రయత్నం చేశారు. ‘నేను ఫెమినిస్టుని కాదు’ అని సామాజిక ఉద్యమాలలో సేవలో, రచనలో ఉన్న చాలామంది స్త్రీలు చెప్పుకుంటున్న రోజుల్లో ‘నేను ఫెమినిస్టుని, హ్యూమనిస్టు ఫెమినిస్టుని’ అని చె ప్పుకున్న సాహసవంతురాలు సుబ్బమ్మగారు. ఆమె ఆత్మకథ శీర్షిక కూడా ‘పాతివ్రత్యం నుంచి ఫెమినిజం దాకా’. ఆంధ్రప్రదేశ్‌లో సారా వ్యతిరేకోద్యమం పెద్ద ఎత్తున సాగిన నాటికి సుబ్బమ్మ గారికి 68 సంవత్సరాలు. అయినా సారా వ్యతిరేకోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ప్రదర్శనల్లో, ప్రభుత్వంతో జరిపే చర్చలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సభలలో తన వాగ్ధాటితో సారాపై విరుచుకు పడ్డారు.

‘మల్లాది సుబ్బమ్మ ట్రస్టు’ అని పెట్టి తన స్థిర చరాస్తులను పిల్లలకు కాకుండా ట్రస్టు ద్వారా సామాజిక సేవకు అందేలా చేయటం సుబ్బమ్మగారి ప్రత్యేకత. ఒకప్పుడు ఆమె నివసించిన ఇంట్లో ఇప్పుడు బాలికలకు వృత్తి శిక్షణ కళాశాల నిర్వహిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం అక్కడ సుబ్బమ్మగారు తన విగ్రహాన్ని ప్రతిష్టించారు. జీవించి ఉండగానే ఇలా ఎందుకు చేస్తున్నారని అడిగితే-మరణించిన తర్వాత మన గురించి ఎవరు పట్టించుకుంటారు? మనం చేసిన పనులను మనమే గౌరవించుకుంటే తప్పేంటి అని అన్నారు. అప్పుడు నవ్వేశాం గానీ మన దేశ చరిత్ర నిర్మించిన స్త్రీల గురించి మనకి తెలిసినదెంత?

వారు తమ గురించి తాము కొంత శ్రద్ధ తీసుకుని ఉంటే స్త్రీల చరిత్ర ఎంత సంపన్నవంతంగా ఉండేది అనిపించినపుడు సుబ్బమ్మగారు చేసిన పని అర్థవంతమైనదేనేమో అనిపిస్తుంది. ఈ పురుష ప్రపంచంలో స్త్రీలు పని చేసుకుంటూ పోవటమే కాక తమ గురించి తాము చెప్పుకోవాలి. లేకపోతే ఇంత ఆధునిక కాలంలోను వారిని తేలికగా మర్చిపోతారు.

భోళాగా కనిపిస్తూ, గలగలా మాట్లాడుతూ, విశ్రాంతి లేకుండా పనిచేస్తూ, నమ్మినదాన్ని నిక్కచ్చిగా చెప్తూ, దానిని ఆచరిస్తూ ఎంతటి అధికారులనైనా నిర్భయంగా నిలదీస్తూ తనకున్న అవకాశాలన్నిటినీ సద్వినియోగం చేసుకున్న మల్లాది సుబ్బమ్మగారు తన సేవల ద్వారా, చరిత్రలో చిరకాలం జీవిస్తారు.

-ఓల్గా

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment