హాస్య బ్రహ్మ లో సంగీత సరస్వతి

        హాస్య బ్రహ్మ లో సంగీత సరస్వతి

భమిడి పాటి కామేశ్వర రావు గారంటే హాస్య బ్రహ్మ అని హాస్యం కోసమే పుట్టారని గోదావరి మాండలీకాన్ని శ్రీ పాద తో బాటు పాదుకోల్పారని మోలియర్ ,మేటర్లింకు లకు తన హాస్య నాటికల ద్వారా లింకులు గొంకులు లేకుండా తగి లించారని మాత్రమె తెలుసు కాని వారిలో వెల్లి విరిసిన సంగీత సరస్వతి గురించి ‘’చాలా చాలా చాలా’’ మందికి తెలీనే తెలీదు .నా లాంటి కొందరు అదృష్ట వంతులు వారి ‘’త్యాగ రాజు ఆత్మా విచారం ‘’చదివిన వారికి కొంత బోధ పడి ఉంటుంది.అదీ పై పై స్పర్శ మాత్రమె .వారికి సంగీతం వాచో విదేయం .అందునా త్యాగ రాజు గారు అంటే వారికి వల్ల  మాలిన అభిమానం .ఆయన రచనల్లో సాహిత్యాన్ని వదిలేసి మన అరవ గాయకులూ చేసిన చేస్తున్న తప్పుల్ని విని చూసి వారి హృదయం ఏంతో గాయ పడ్డది .అందుకే అసలు త్యాగ రాజు గారు సాహిత్యం ద్వారా ఏం చెప్పారో అని మధన పడి మధన పడి విశేష కృషి చేసి ఆ ఆత్మా విచారాన్ని ప్రకటించారు ,ప్రచురించారు .దీన్ని తల్లా వఝల పతనజలి శాస్త్రి చక్కగా ఆవిష్కరించారు .అందులో విశేషాలే ఈ శీర్షిక లో చెబుతున్నాను .

9-1-1947లో శ్రీ పాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తన ‘’కళాభివర్ధిని పరిషత్ ‘’ఆధ్వర్యం లో రాజ మండ్రి లో  సభ జరిపి భ.కా.రా.మేస్టారిని ఘనం గా సత్కరించారు .దీనికి కారణం వారు త్యాగ రాజు ఆత్మ విచారం రచన ప్రారంభించటమే .1948జనవరికి మేస్టారి రచన పూర్తయింది .ఆ సందర్భం గా శాస్త్రి గారు మళ్ళీ సభ జరిపి కామేశ్వర రావు మేస్టారిని22-2-48న నూతన వస్త్రాలు సమర్పించి సన్మానించారు. అదీ శాస్త్రి గారికి సంగీత సాహిత్యాల పట్ల, తోటి రచయితల పట్లా ఉన్న ఆదరణ .ఇలాంటి అరుదైన సన్మాన కార్యక్రమాలను ఆ రోజుల్లో శ్రీ పాద వారు భమిడి పాటి వారే చేసే వారట .త్యాగ రాజు గారు మరణించిన ఖచ్చితం గా వందేళ్ళకు మేస్టారి రచన సాదికారికం గా వెలువడింది .అంతవరకూ ఎవరూ ఈ పనికి పూను కోలేదు ,.

అరవ పాటకులకు తెలుగు సాహిత్య పరిచయం లేక పోవటం, ఉన్నా బుగ్గన కిళ్ళీ దట్టించి పాడటం తో సాహిత్యం ‘’హుష్ కాకి ‘’ అవటం వారే తెలుగు వారికి ఆడర్శమవటం తో త్యాగ రాజు గారి మనో ధర్మం ఏమిటో ఎవరికీ అర్ధం కాని ‘’బ్రహ్మ పదార్ధం ‘’అయింది .అందుకే మేష్టారు అంతగా కలత చెందారు .’’త్యాగయ్య ఆర్ద్రతా ,ఆర్తీ ఎవరికీ అక్కరలేక పోయాయి

గిరికీలు తీసే రాగాలతో ఆయన్ను ఉక్కిరి బిక్కిరి చేసేశారు .ఆయన ఆత్మ ను అన్వేషించ లేక పోయారు .కీర్తనలలో గుండెను పిండేసే ఆర్తి ఉంది .భక్తీ సంబంధిత ఆర్ద్రత ఉంది .కచేరీలలో ఇవేవీ ఉండేవికావు .పైగా ‘’కచేరీ బాణీ’’ అంటూ ఒకటి మొదలైందని ‘’బాధపడ్డారు తన పుస్తకం లో .‘’త్యాగ రాజు హృదయ కవి ‘’.హృదయం’’ అనే మాటను ఆయన వాడి నన్ని సార్లు ఏ తెలుగు కవీ వాడలేదు .ఈయన రచనల్లో ప్ప్రతిదీ మేధా సంపద మాత్రమె కాదు మనసుకు సంబంధించింది అని మర్చి పోయారు .ఆయన మనో క్షోభ వర్ణనా తీతం .ఆయన మాటా ,భావం సూటిగా హృదయాలను తాకే సామర్ధ్యం కలవి .ఆయన పరితాపం విప్పి చెప్పటం లో అది సకల మానవ హృదయ పరితాపమే అని పిస్తుంది .అతని హృదయ వైశాల్యమూ కనీ పిస్తుంది .హృదయ కవికి ముఖ్య లక్షణం సామరస్యం ,సర్వ సమత్వ భావం .ఆతను విరుద్ధాలను ,ద్వంద్వాలను సమన్వయము చేసిన వాడు .’’ఎవరని  వర్ణిం చెదిరా?’’లో రాముడిని గురించి తను పడిన సందేహం ,తనను గురించి మనం పడేట్లు చేశాడు .అతడు సంగీత సాహిత్యాలను ‘’దుప్పటించాడు ‘’అన్నారు మేష్టారు

.

‘’అంతేకాదు సగుణత్వ నిర్గుణత్వాలను సమపాళం కూడా చేశాడు త్యాగ బ్రహ్మ .’’అరవత్వ ఆంధ్రత్వాన్ని కర్నాటించాడు ‘’వాస్తవికత్వ అవాస్తావికత్వాల మధ్య తేరా తీశాడు .ఆయన గుండె తడి ఉన్న విలక్షణ భక్త కవి .అంతకు ముందు, ఆ తర్వాత ఎవరూ ఇలా చేయలేదు .ఇవాల్టి కచేరీలలో శ్రోత కంటే గాయకుడే ఎక్కువ నష్ట పోతున్నాడు .శ్రోతకు స్వర మాధుర్యం ఆలాపనా అన్నా దక్కుతాయి .కాని తన ఆవరణ లోంచి ,మరో ఆవరణ లోకి పోయే ఉత్కృష్ట అవకాశాన్ని ‘’గాన విడుచు కుంటున్నాడు ‘’అన్నారు హాస్య బ్రహ్మ ఆ సంగీత బ్రహ్మ గొప్పతనాన్ని పొగుడుతూ కచేరీలలో ఆ ఆనందం దక్కక పోవటాన్ని జీర్ణించుకో లేక పోతూ .

త్యాగ రాజు ఆత్మ విచార గ్రంధం లో మేష్టారు తొమ్మిది శీర్షికలు పెట్టారు .త్యాగ రాజు మనసుకి సంబంధించి చెప్పుకున్నవి ,రాముడిని  ఉద్దేశిస్తూ అతన్ని సంబోధిస్తూ అన్నవి ,జనం తో అన్నవి ,ఇతరుల్ని ప్రశంశిస్తూ అన్నవి ,అనుభవ సారం గలవి ,కవి కాలాన్ని నిన్దించేవి ,సగుణత్వాన్ని నిరూపించేవి ,దేవ భాషలో ఉన్నవి ,పూజా విధానం గురించినవి .ఇవీ నవ శీర్షికలు .ఆచార్య విస్సా అప్పా రావు గారు త్యాగ

రాజ శత వార్షికానికి ఏదైనా ఒక వ్యాసం రాసి పంప మంటే మేష్టారు ఈ రచన ప్రారంభించారు అదీ నేపధ్యం .సమయానికి రచన పూర్తికాక విస్సా వారికి క్షమాపణ ఉత్తరమూ రాశారు .అలా పొడిగించటం వల్ల  ఆంద్ర సాహిత్య సంగీతజ్నులకు మేస్టారి అపూర్వ గ్రంధం దక్కింది .’’నిజానికి మేస్టారే త్యాగ రాజ స్వామి అయి రచించిన గ్రంధం ఇది ‘’అని పతంజలి గారిచ్చిన కితాబు మరచి పోలేనిది .

భాగవతం తర్వాత అంతటి పారాయణ గ్రంధం మేస్టారి రచన .సంగీత ప్రియులకు కీర్తనల లోని అర్ధం అంతరార్ధం జీర్నమవటం వాళ్ళ రాగ సౌందర్యాన్ని ఎక్కువగా అనుభవిస్తారు అన్నారు పతంజలి .నిజం గా ఈ పని చేయాల్సిన వారు సాహిత్య భాషా శాస్త్ర వేత్తలు .కాని పాపం వారెవ్వరూ దీని జోలికే పోలేదు .ఈ పుస్తకానికి పరిచయాన్ని శ్రీ పాద వారు రాశారు .’’వ్యాకరణ సూత్రాల వాసనే కాని రసానుభవం ,యోగ్యతా పెట్టి పుట్టని తెలుగు సాహిత్య వేత్తలూ దీన్ని స్ప్రు శింపక పోయారు ..వేమన్న కవితల యడా ఇలాంటి అరసికతా ముద్రనే తగిలించుకొన్నారు .వారికి పల్లవి ప్రస్తావనే సంగీతం వీరికి పద రచన- కవిత్వమే కాక పోవడమూ త్యాగ రాజ సాహిత్యానికి ఈ సౌభాగ్యం పట్టక పోవడానికి ముఖ్య హేతువు ‘’అన్నారు .’’వాడుక భాష ప్రాచుర్యం వల్లనే త్యాగ రాజ సాహిత్యానికి ఇలాంటి ప్రకాశం  సిద్ధిం చటమున్నూ  గమనించ దగ్గ విషయం ‘’అన్నారు శ్రీ పాద వల్ల్లభులైన శాస్త్రి గారు .త్యాగయ్య వాడిన పదాలు చిన్న చిన్నవి ఆయన వాడిన పోలికలు కూడా నిత్య జీవితం లో అతి సాధారణం గా పరిచయమైనవే .అన్వయించాటానికి మేష్టారు పడ్డ శ్రమ గొప్పది .ఆ దీక్ష గొప్పది .మేస్టారి ఏకాగ్రత మరీ గొప్పది ‘’అని శ్లాఘించారు శాస్త్రిగారు హాస్య బ్రహ్మ లోని సంగీత సరస్వతిని ఆవిష్కరిస్తూ .

‘’కీర్తనల్లొని భావాలు ,ఉత్కంఠ,విచారం ,పారవశ్యం ,అణు మాత్రం వదిలి పెట్ట కుండా పోగు చేసి చమత్కారం గా పూల దండల్లా అల్లేశారు ‘’అని మెచ్చారు పాకాల వెంకట రాజ మన్నార్. ,

నిజంగా త్యాగ రాజు గారు కీర్తనలు రాయలేదు .అవి వెలువడినాయి .అంటే త్యాగయ్య గారి నోటంట వెలువడుతుండగా శిష్యులు ‘’పల్చటి మామిడి చెక్కల ‘’మీద వేగం గా రాస్తూండే వారట .అలా దక్కాయి త్యాగరాజ స్వామి కీర్తనలు మనకు .త్యాగ రాజు గారికి పరమాత్మయే

ఆధారం ,గమ్యం ,శృంగారం ,వైరాగ్యం ,ఐదో తనం ,సర్వస్వం అని మేస్టారన్నారు .తన హృద్భూషణుడు సగుణ ,నిర్గుణ రూపాల్లో నిండి ఉన్న పరమాత్మ .’’పరమాత్మ ఇంగిత మెరిగిన సంగీత లోలుడు ‘’అన్నారు హాస్య బ్రహ్మ . .ఇంతగా త్యాగ రాజు గురించి ,ఆయన కీర్తనల గురించి అర్ధం చేసుకొన్న రీతిలో అన్యులేవరూ చేసుకోలేదు .’

‘’కీర్తన ఆలాపిస్తున్నప్పుడు ఆ రాగం కీర్తన ,మాటల్లో ఉండే మహోత్క్రుస్టమైన అర్ధాన్ని పెంపొందించి ,వాక్కు కి అసాధ్యమైన పని చేస్తున్నట్లు స్పురించాలి .అంటే కేవలం నాదమైన ఆ స్వరాలు కూడా అర్ధం అవుతున్నట్లు శ్రోతకి అని పించాలి ‘’అని హాస్య బ్రహ్మనాద బ్రహ్మ ను గురించి వివరించారు .’’త్యాగ రాజు అంటే నాద సుధారసం యొక్క నరాక్రుతి’’ (గాన శాస్త్రం యొక్క గాదు )అని మేస్టారి నిర్వచనం .’’బ్రాకెట్ ఆడింది ‘’మేస్టారే .నేను కాదు, పతంజలి గారూ కాదు .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-12-13-ఉయ్యూరు

 

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

పాఠకులు పెరుగుతున్నారు

 

వివిధ భాషల్లో ప్రచురితమయ్యే పుస్తకాలను ఒక భాష నుంచి మరొక భాషకు అనువాదం చేసి- దేశ ప్రజలందరికీ అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ నేషనల్ బుక్ ట్రస్ట్. దీని ఆధ్వర్యంలో నేటి నుంచి హైదరాబాద్‌లో పుస్తక ప్రదర్శన జరుగుతోంది. దాదాపు 14 ఏళ్ల తర్వాత ఎన్‌బీటీ నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో పాల్గొనటానికి ఆ సంస్థ డైరక్టర్ సికిందర్ హైదరాబాద్ వచ్చారు. పుస్తకాలకు సంబంధించిన అనేక అంశాలపై మాట్లాడారు.. ఆ వివరాలలోకి వెళ్తే..

– ప్రజలలో పఠనాసక్తి ఎలా ఉంది? ఈ విషయంపై నేషనల్ బుక్ ట్రస్ట్ ఇప్పటి దాకా అనేక సర్వేలు చేసింది కదా.. అవేం చెబుతున్నాయి ?

*ప్రజలలో పఠనాసక్తి తగ్గింది అనుకోవటం తప్పు. పుస్తకాలకు ఎప్పుడూ మార్కెట్ ఉంది. కాని ఆ పుస్తకాలు ప్రజల దగ్గరకు చేరే ప్రక్రియలోనే కొన్ని సమస్యలున్నాయి. దీనికి సంబంధించిన ఉదాహరణలు మీకు మూడు చెబుతాను. ఈ మధ్య- ముంబాయిలో మేం పుస్తక ప్రదర్శన నిర్వహించాం. చాలామందికి ఆశ్చర్యంగా ఉంటుంది కానీ దాదాపు 12 ఏళ్ల తర్వాత ముంబాయిలో జరిగిన తొలి పుస్తక ప్రదర్శన అది. పుస్తక ప్రదర్శన చివరి రోజున దాదాపు 80 వేల మంది ఆ ప్రదర్శనకు వచ్చారు. ఈ మధ్య ఢిల్లీలోని ఒక మెట్రో రైల్వే స్టేషన్‌లో మేము పుస్తకాల షాపు తెరిచాం. ఇది పెద్దగా విజయవంతమవుతుందనే ఆశ మాకు కూడా లేదు. కానీ అనూహ్యంగా ఇది విజయవంతమయింది. రోజుకు కనీసం 200 నుంచి 500 పుస్తకాలు విక్రయిస్తున్నాం. ఈ మధ్య మేము కాశ్మీర్‌లో ఒక పుస్తక ప్రదర్శన నిర్వహించాం. దాదాపు 20 ఏళ్ల తర్వాత నిర్వహించిన తొలి ప్రదర్శన అది. దీనిలో మా గోదాముల్లో ఉన్న మొత్తం ఉర్దూ పుస్తకాలన్నీ అమ్ముడయిపోయాయి. ఈ ఉదాహరణల ఆధారంగా చూస్తే పుస్తకాలు చదివే వారి సంఖ్య నిజానికి పెరుగుతోందని అర్థమైంది. వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటంలోనే సమస్యలున్నాయి.

– ఎన్‌బీటీనీ ఈ ఉద్దేశంతోనే ఏర్పాటు చేశారు కదా.. ఆ లక్ష్యాన్ని ఎందుకు సాధించలేకపోతున్నారు..?

* ఎన్‌బీటీ పుస్తకాల గురించి చాలామందికి తెలియని మాట నిజమే. దీనికి ఒక కారణం చవక ధరలు. మా పుస్తకాలు 50 రూపాయల లోపే ఉండేవి. కమిషన్ తక్కువ వస్తుంది కాబట్టి ఎవరూ తమ పుస్తకాల దుకాణాలలో పెట్టుకునే వాళ్లు కాదు. రెండో కారణం చాలా కాలంగా ఎన్‌బీటీ లక్ష్యం పుస్తకాలను ప్రచురించడం మాత్రమే. ఇప్పుడు ఆ లక్ష్యాన్ని మరింత విస్తృత పరిచి, పఠనాసక్తిని పెంచటానికి ప్రయత్నిస్తున్నాం. దీనిలో మొదటి అడుగుగా హైదరాబాద్ సహా నాలుగుచోట్ల బుక్ ఫెసిలిటేషన్ సెంటర్లు పెడుతున్నాం. దీనిలో పుస్తక విక్రయ కేంద్రాలతో పాటుగా చదువుకోవటానికి లైబ్రరీ, రచయితలు కలుసుకోవటానికి, పుస్తకాలు విడుదల చేసుకోవటానికి వీలుగా కాన్ఫరెన్స్ హాల్, రచయితల సమావేశాల కోసం మరో హాలు ఉంటాయి. హైదరాబాద్‌లో దీనికి అవసరమైన 3 వేల చదరపు అడుగుల స్థలం ఇవ్వటానికి ఆంధ్ర మహిళా సభ ముందుకు వచ్చింది. ఇది మరో రెండు మూడు నెలల్లో ప్రారంభమవుతుంది.

– పుస్తకాలను ప్రజల దగ్గరకు తీసుకువెళ్లటానికి మీరు చేస్తున్న ప్రయత్నాలేమిటి?
* పుస్తక ప్రదర్శనలు నిర్వహించటం ఒక పద్ధతి. మాతో భావసారూప్యం ఉన్న సంస్థలతో కలిసి పనిచేయటం రెండో పద్ధతి. పుస్తక పఠనానికి సంబంధించిన వర్క్‌షాపులను, సెమినార్లకు నిర్వహించటానికి మేము ఆర్థిక సాయం చేస్తాం. ఎవరైనా వర్క్ షాపు పెట్టుకుంటే దానికి అయ్యే ఖర్చులో 75 శాతం మేం భరిస్తాం. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను నేనే స్వయంగా చూస్తా. ఆసక్తి ఉన్నవారు మమ్మల్ని నేరుగా సంప్రదించవచ్చు.

_ మహిళా సాహిత్యం, దళిత సాహిత్యం మొదలైన వాటిపై ఎన్‌బీటీ సరైన శ్రద్ధ చూపించటం లేదనే విమర్శ బలంగా వినిపిస్తూ ఉంటుంది..

*మా వద్ద ఎనిమిది వేల రన్నింగ్ టైటిల్స్ ఉన్నాయి. వీటిలో వర్తమాన రచయితలు రాసిన పుస్తకాలు తక్కువే. ఈ సమస్యను పరిష్కరించటానికి ప్రతి భాషలోను ఒక అడ్వైజరీ కమిటీ వేశాం. దీనిలో పుస్తకాలతో సంబంధం ఉన్నవారు సభ్యులుగా వ్యవహరిస్తారు. దీనిలో ఒక మహిళ తప్పనిసరిగా ఉంటారు. వీరి సూచనల మేరకు మేము పుస్తకాలను ప్రచురిస్తాం. అయితే ఈ కమిటీలు అంత క్రియాశీలకంగా వ్యవహరించటం లేదనేది వాస్తవం. దీని పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇక ముందు మహిళా సాహిత్యం, దళిత సాహిత్యాలను ఎక్కువగా ప్రచురించటానికి ప్రయత్నిస్తాం. ఇక్కడ మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలి. నేను విదేశీ పుస్తక ప్రదర్శనలకు వెళ్లినప్పుడు- అక్కడి వారు భారతీయ రచయితలు నేరుగా ఇంగ్లీషులో రాసే పుస్తకాల కన్నా వివిధ ప్రాంతీయ భాషల్లో వచ్చే సాహిత్యం నుంచి చేసే అనువాదాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఈ సాహిత్యమే మన సమాజం అసలు స్వరూపాన్ని తెలియజేస్తుందని పేర్కొంటారు. ఈ మధ్య కాలంలో ఎన్‌బీటీ సమకాలీన సాహిత్య ప్రచురణకు గట్టి ప్రయత్నమే చేస్తోంది.

– ప్రస్తుతం ఈ -కంటెంట్‌కు, ఈ- కామర్స్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. కాని ఇప్పటి దాకా ఎన్‌బీటీ ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు కనబడదు..
* రెండేళ్ల క్రితం నేను పదవిలోకి వచ్చినప్పుడు- మాకున్న ప్రధానమైన సమస్య వేర్ హౌసింగ్. మా దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయో కూడా కచ్చితమైన లెక్కలు లేవు. ఇప్పుడు అది గాడిలో పడింది. ఈ- కామర్స్ ద్వారా పుస్తకాలను విక్రయించే ప్రయత్నం ఈ మ«ధ్యే మొదలుపెట్టాం. ప్రస్తుతం ఎన్‌బీటీ సైట్ ద్వారా 800 టైటిల్స్‌ను కొనుగోలు చేయవచ్చు. ఇక ఈ -బుక్స్ విషయానికి వస్తే త్వరలో చెన్నైకు చెందిన ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోబోతున్నాం. వచ్చే ఏడాది చివరి నాటికి కొన్ని ఈ- బుక్స్ మార్కెట్‌లోకి వస్తాయి.
ఇంటర్వ్యూ: సి.వి.ఎల్.ఎన్, ఫోటో: గోపి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అరుణా చాల మహిమ శ్రీ శైలం శక్తి పీఠం -చాగంటి

 

 
 
 

అన్ని శివలింగాలూ ఒకటి కాదు. ఒక్కో లింగానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. అరుణాచలంలో ఉన్న అగ్నిలింగం గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు శర్మ ఈ వ్యాసంలో వివరించారు.

శివుడిని నమ్మి ప్రదక్షిణం మొదలుపెట్టారో వారికి జీవితంలో కావాల్సినవి ఇస్తాడు. మూడో అక్షరం ‘క్షి’ అంటే – ఈజన్మలో అనుభవించవలసినటువంటి పాపాలను ధ్వంసం చేయటం. ఇక నాలుగో అక్షరం ‘ణం’. అరుణ గిరికి ప్రదక్షిణం చేసిన వాడికి పాపం పుణ్యం ఉండదు కనుక వాడు మోక్షానికి అధికారి అవుతాడు.

అరుణాచలంలో అగ్నిలింగం ఉంటుంది. పేరు బట్టి ఆలోచిస్తే- అగ్నిలింగం దగ్గర అగ్నిహోత్రం ఉండాలి. కానీ అరుణాచలంలో శివలింగ దర్శనం చేసుకుంటే అక్కడ మనకి అగ్నిహోత్రం కనిపించదు. అటువంటప్పుడు దానిని అగ్నిలింగం అని ఎదుకు పిలుస్తారు అనే సందేహం కలగవచ్చు. అక్కడ రాశీభూతమయిన జ్ఞానాగ్ని ఉంది. అందుకే మన పెద్దలు జీవ కోటి యాత్రలో ఒక చోట అడ్డంగా గీత ఉంటుంది అని చెబుతారు. ఆ గీతకు ముందున్నది అరుణాచల ప్రవేశానికి ముందు గడిపిన జీవిత యాత్ర. ఆ గీతకు తరువాతది అరుణాచల ప్రవేశం జరిగిన తరువాతి జీవయాత్ర. అరుణాచలంలో అంతరాలయంలోని శివ లింగానికి కొంచెం దగ్గరగా కూర్చుంటే ఉక్కపోసేసి చెమటలు పట్టేసి వేడితో సతమతమయిపోతున్నట్టుగా అనిపిస్తుంది.

ఒకానొకప్పుడు శంకరుడు మానవులకు నాలుగు వరాలిచ్చాడు. వీటిలో మొదటిది- “దర్శనాత్ అభ్రశదసి”. చిదంబరంలో పరమేశ్వరుడి జ్ఞానంతో దర్శించటం. ఇది కుదరకపోతే “జననాత్ కమలాలయే”. కమలాలయే అంటే తిరువారూర్. అక్కడ పుడితే మోక్షం లభిస్తుంది. కానీ పుట్టడం మన చేతిలో లేదు కదా! అందువల్ల ” కాశ్యాంతు మరణాన్ ముక్తిహి కాశీ”. వారణాసిలో ప్రాణం వదిలి పెట్టేస్తే మోక్షం ఇచ్చేస్తానన్నాడు. మరణం కూడా మన చేతుల్లో ఉండదు. అందువల్ల “స్మరణాత్ అరుణాచలే” అన్నాడు. అరుణాచల శివుడిని తలుచుకుంటే పాపరాశిని ధ్వంసం చేస్తాను అన్నాడు. అరుణాచల క్షేత్రం అంత గొప్పది.

ఆ పేరెలా వచ్చింది?
అచలం అంటే కొండ. ఆ కొండకు ప్రదక్షిణం చెయ్యాలంటే పధ్నాలుగు కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. ఆ కొండ కింద ఉన్నభాగాన్ని అరుణాచల పాదాలని పిలుస్తారు. అక్కడికి వెళ్ళిన భక్తులు ఆ కొండకి ప్రదక్షిణం చేస్తారు. అక్కడ ఈ కొండకి ప్రదక్షిణం చేస్తే- కోట్ల జన్మలలో చేసిన పాపాలన్నీ దగ్ధమవుతాయి. భగవాన్ రమణులను చూడ్డానికి ఎవరయినా అరుణాచలం వెళ్తే ఆయన మొదటగా ‘గిరి ప్రదక్షిణం చేశారా?’ అని అడిగేవారు. ప్రదక్షిణానికి ఆయన ఒక నిర్వచనం చెప్పేవారు. ప్రదక్షిణంలో మొదటి అక్షరం ‘ప్ర’ అంటే సమస్త పాపరాశిని ధ్వంసం చేయటం. ‘నేను అరుణగిరికి ప్రదక్షిణ చేయడానికి బయలుదేరుతున్నాను..’ అని ఈశ్వరునికి నమస్కరించి మొదటి అడుగు తీసి ఇలా వెయ్యగానే, పాపరాశి ధ్వంసమవుతుంది.

రెండో అక్షరం ‘ద’ అంటే కోరికలు తీర్చటం. శివుడిని నమ్మి ప్రదక్షిణం మొదలుపెట్టారో వారికి జీవితంలో కావాల్సినవి ఇస్తాడు. మూడో అక్షరం ‘క్షి’ అంటే – ఈజన్మలో అనుభవించవలసినటువంటి పాపాలను ధ్వంసం చేయటం. ఇక నాలుగో అక్షరం ‘ణం’. అరుణగిరికి ప్రదక్షిణం చేసిన వాడికి పాపం పుణ్యం ఉండదు కనుక వాడు మోక్షానికి అధికారి అవుతాడు. గిరి ప్రదక్షిణం అనేటటువంటిది మనం అక్కడ ప్రయత్నపూర్వకంగా చెయ్యాలి. అరుణ పర్వతానికి మీరు ఎన్నిమార్లు ప్రదక్షిణము చేసినా, ఒక్క పర్వతానికే చేయకూడదు. పర్వతానికి చుట్టూ ఉన్న అన్ని ఆలయాలను దర్శనం చేస్తూనే ప్రదక్షిణం చేయాలి. గిరి ప్రదక్షిణానికి బయలుదేరినప్పుడు మొట్టమొదట దక్షిణ దిక్కున కనబడే లింగం యమలింగం.

దక్షిణ దిక్కు యమధర్మరాజు ఉంటాడు. దక్షిణ దిక్కున ఉన్న యమధర్మరాజు అన్రుగహంతో ఆయువు వృద్ధి అవుతుంది. ప్రదక్షిణం చేస్తున్నప్పుడు నైఋతి దిక్కుకు వెళ్ళేటప్పటికి అక్కడ నైఋతి లింగం ఉంటుంది. అది రోడ్డు మీదికి కనపడదు. రోడ్డుకి కాస్త లోపలికి ఉంటుంది. నైఋతి లింగం దగ్గర కూర్చుని కాసేపు ధ్యానం చేసుకోవడమో, ఒక శ్లోకమో, పద్యమో, శివ సందర్భమో చెప్పుకోవాలి. ఇక ఉత్తర దిశగా ఉన్నది కుబేర లింగము. ఇక్కడ ప్రార్థన చేస్తే ఐశ్వర్య సంపత్తి కలుగుతుంది.
 

మోక్షసాధనకు వరం 

 

 
 
 

విశిష్టమైన హైందవ సంస్కృతిలో ప్రతి మాసానికీ ప్రాశస్త్యం ఉంది. అయితే మాసాలన్నింటిలో మార్గశిర మాసం ఎంతో ప్రత్యేకమైనది. మార్గశిరం సర్వం పర్వదినాల సమాహారం. మార్గశిర మాసాన్నే ‘మార్గశీర్షం’ అని కూడా వ్యవహరిస్తారు. శీర్షం అంటే అగ్రభాగం అని అర్థం. మాసాల్లోకెల్లా అగ్రగణ్యమైనది కాబట్టి మార్గశిరానికి ఈ పేరు వచ్చింది. ఈ విషయాన్నే తేటతెల్లం చే సేలా మాసాలలో తానే మార్గశిరమని అర్జునునికి గీతాచార్యుడు విభూతి యోగంలో తేటతెల్లం చేశాడు. అర్జునునితో కృష్ణపరమాత్మ తాను ‘వేదానాం సామవేదోస్మి దేవానాం వాసవః’అంటే ‘ ఇంద్రుడు’ అని చెబుతూనే తాను ‘ మాసానాం మార్గశీర్షోహం’ అని ప్రకటించాడు. వాసుదేవుని దివ్యవాక్కులను ప్రతిబింబించేలా మార్గశిరమంతా మోక్షదాయకాలైన పర్వదినాలెన్నో ఉన్నాయి.

మార్గశిర ప్రారంభంలోనే శివ పుత్రుడైన కుమారస్వామిని అర్చించే ‘సుబ్రహ్మణ్య షష్టి’ పర్వదినం వస్తుంది. మార్గశిర శుద్ధ షష్టిని సుబ్రహ్మణ్య షష్టిగా ఘనంగా జరుపుకుంటారు. షణ్ముఖుడైన కుమారస్వామిని ఆత్మతో కూడిన పంచభూతాలకు నిదర్శనంగా భావించి పూజించే సాంప్రదాయం తమిళనాట ఉంది. యోగసాధకులు స్కంధుని ఆరు ముఖాలను షట్చక్రాలుగా భావించి ఆరాధిస్తారు. సుబ్రహ్మణ్యరూపాన్ని బ్రహ్మజ్ఞానానికి సంకేతంగా భావించే ఆర్ష సంప్రదాయమూ దేశంలో అనూచానంగా వస్తోంది. సుబ్రహ్మణ్యుని ఆరాధన యోగబలాన్నీ, ఆరోగ్య ఫలాన్నీ ప్రసాదిస్తుంది.

‘మిత్రసప్తమి’ గా పేర్కొనే మార్గశిర శుక్లపక్ష సప్తమి నాడు జగన్మిత్రుడు, లోకాలకు కాంతినిచ్చే సూర్యదేవుని సమస్త హిందువులూ ఆరాధిస్తారు. ఈ శుభ తిథి నాడు ప్రత్యక్ష నారాయణుడైన సూర్యభగవానుణ్ని పూజిస్తే దివ్యమైన ఆరోగ్యమూ, మహాభాగ్యమూ ఒనగూడుతాయని భ క్తుల విశ్వాసం. హైందవ సంస్కృతిలో అంతర్భాగమై దివా కరుని ఆరాధన పావనమైన రీతిలో జరిపే భాను సప్తమి, రథసప్తమి, మార్తాండ సప్తమి, అచల సప్తమి, దళ చ ట్పూజ పర్వదినాలలాగా ‘మిత్రసప్తమి’ కూడా అత్యంత యోగదాయకమైన పర్వదినం.

మార్గశిర శుక్లపక్ష ఏకాదశిని ‘గీతాజయంతి’గా జరుపుకుంటారు. విశ్వమానవ విజ్ఞాన కోశంగా భావించే భగవద్గీతను ఈ పర్వదినాన కురుపాండవ యుద్ధ సమయాన అర్జునునికి శ్రీకృష్ణ పరమాత్మ బోధించాడు.
ఇక మహామహిమాన్వితమైన శుక్లద్వాదశీ వ్రతాన్ని మార్గశిర శుక్ల ద్వాదశి నాడు ఆచరిస్తారు. ఆ రోజున అత్యంత శ్రద్ధతో దేవదేవుడైన మహావిష్ణువుని ధ్యానిస్తూ కేశవార్చన చేస్తే ఎనిమిది పౌండరీక యజ్ఞాలు చేసిన ఘనమైన ఫలాన్ని ఈ వ్రతం ప్రసాదిస్తుందని లోక కళ్యాణ కారకుడైన నారదుడికి సనక మహర్షి తేటతెల్లం చేసినట్లు నారద మహా పురాణ ం చెబుతోంది. మార్గశిర శుక్ల త్రయోదశి నాడు భక్తులు అభయదాయకుడైన హనుమంతుని సేవిస్తారు. ఆ రోజున అతి పవిత్రమైన హనుమద్‌వ్రతాన్ని ఆచరిస్తారు. శరణాగత వజప్రంజరుడైన అంజనీసుతుని ఆరాధన దుష్టపీడను భంజించి జీవితాన సుఖ సంతోషాలను పంచి రంజకం చేస్తుంది.

మార్గశిర మాసంలోనే సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించడంతో ధనుస్సంక్రమణ పుణ్యకాలం ఆరంభమవుతుంది. అది మొదలుకుని సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించేంత వరకు ఉండే పవిత్రమైన మాసమే ‘ధనుర్మాసం’. వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసం ధనుర్మాస పుణ్యకాలం. ధనుర్మాసమంతా వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. తన హృదయ నందనంలో పూచిన భక్తి భావ సుమాలనే ప్రేమతో శ్రీరంగనాధునికి సమర్పించి, ఆ దేవదేవునికి సమర్పించాల్సిన మాలలను తానే ధరించి, ఆ స్వామి కృపకు పాత్రురాలై శ్రీరంగనాధుని సాయుజ్యాన్ని పొందిన ఘన చరిత గోదాదేవిది. ఈమెనే వైష్ణవ సాంప్రదాయంలో అండాళ్ అనీ, చూడి కుడుత నాంచారి అనీ వ్యవహరిస్తారు. గోదాదేవి రచించిన ‘ తిరుప్పావై’లోని భక్తి భావస్పోరకమైన 30 పాశురాలను ఈ మాసం రోజూలూ విష్ణాలయాలన్నింటా ఎంతో భక్తి శ్రద్ధలతో పారాయణ చేస్తారు. కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవేంకటే శ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల రోజులూ సుప్రభాతానికి బదులుగా తిరుప్పావైని పఠిస్తారు.

సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే పుష్య శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే ‘మార్గళి’ మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ పర్వదినాన్నే ‘ముక్కోటి ఏకాదశి’ గా జరుపుకుంటారు. ఈ పర్వదినాన దేవాదుందుభులు మోగుతుండగా శ్రీమహాలక్షీ సమేతుడైన శ్రీమహావిష్ణువు వైకుంఠం ఉత్తర ద్వారానికి జేరి ముక్కోటి దేవతలకు తన దివ్యద ర్శన భాగ్యాన్ని కలుగచేస్తాడని పురాణవచనం. దీనికి సంకేతంగానే దేశంలోని వైష్ణవాలయాలన్నింటా భక్తులు దర్శనం చేసుకునేందుకు వీలుగా ఆలయ ఉత్తర ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ఈ పవిత్ర పర్వదినాన నారాయణుని అర్చిస్తే, ఆయతో బాటు ముక్కోటి దేవతలనూ ఆరా«ధించిన ఫలం వస్తుంది కాబట్టి ఏ ఏకాదశిని ‘ ముక్కోటి’గా పేర్కొనడం జరిగింది. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశిగా పేర్కొంటారనే ఐతిహ్యమూ ఉంది. ముక్కోటి ఏకాదశి నాడే క్షీరసాగర మధనంలో హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ పవిత్రమైన రోజునే పరమశివుడు హాలాహలాన్ని మింగి లోకాలకు ఆనందాన్ని కలిగించాడు.

ఇవేగాక దత్త జయంతి, కృష్ణాంగారక చతుర్దశి వంటి మరిన్ని పర్వదినాలు కొలువై మార్గశిరానికి కమనీయతను సంతరించి పెట్టాయి. ఈ విధంగా మార్గశిరం అనుదినం ప్రత్యేకమై, పవిత్రమైన పర్వదినాలకు ఆలవాలమై విలసిల్లుతోంది. నిరతమూ ఆ భగవానుని స్మరిస్తూ, ఆయన సేవలో తరిస్తూ, సన్మార్గంలో చరిస్తూ మార్గశిరం ఇచ్చే పుణ్యఫలాన్నీ, ముక్తి బలాన్నీ సొంతం చేసుకుందాం.
ం’వ్యాఖ్యాన విశారద’ వెంకట్ గరికపాటి

శ్రీ శైలం శక్తి పీఠం 

 

 
 
 

దేశంలోని అష్టాదశ పీఠాలలో శ్రీశైలం కూడా ఒకటి. ఆ క్షేత్ర మహిమ గురించి చాగంటి కోటేశ్వరరావు చెబుతున్న విశేషాలు తెలుసుకుందాం..సాధారణంగా శంకరాచార్యుల వారు క్షేత్రముల గురించి ఎక్కువగా ప్రస్తావించరు. కాని ఆయన కూడా శివానందలహరిలో శ్రీశైలాన్ని ప్రస్తుతిస్తారు. ఇక్కడ పరమేశ్వరుడు వెలసినటువంటి కొండపేరు శ్రీగిరి. మనం ఎవరినయినా గౌరవవాచకంతో పిలవాలని అనకున్నప్పుడు పక్కన శ్రీకారం చుడతాము. శ్రీకారం వేసినట్లయితే వారిని గౌరవించి పిలిచినట్టు లెక్క. శైలమునకు ముందు శ్రీకారం వ్రాయబడి శ్రీశైలము అయింది. ఇలా తిరుమలకొండ పేరుకు శ్రీ చేర్చబడింది. అందుకే వరాహపురాణంలో ‘శ్రీశైలే పూరయిష్యామి కించిత్కాలాదనంతరయే’ అంటారు. శ్రీశైలములు రెండు. ఒక శ్రీశైలము తిరుమల. ‘తిరు’ అంటే ద్రవిడభాషలో గౌరవవాచకమయిన శ్రీకారము. ‘మలై’ అంటే కొండ. తిరు + మలై = శ్రీ + శైలము (కొండ) = శ్రీశైలము. తిరుమలకొండ అయిన శ్రీశైలము మీద స్వామి కరచరణాదులతో ఉన్నాడు. ఇక్కడ శ్రీశైలములో స్వామి లింగమూర్తియై అరూపరూపిగా ఉన్నాడు. ఉన్నది ఒక్క పరమాత్మే రెండుగా భాసిస్తున్నాడు. ఈ పర్వతానికి శ్రీగిరి అన్నపేరు రావడానికి సంబంధించిఒక స్థలపురాణం ఉంది.

ఒక భక్తురాలు తాను ఒక కొండగా మారాలని కోరుకుంది. ఆమె శైలముగా మారింది అని చెబుతారు. కాని తాత్త్వికమయిన రహస్యం వేరు. కొన్ని పరమపవిత్రమయిన కొండలు ఉంటాయి. అక్కడ ఈశ్వరుడు స్వయంభువుగా వెలుస్తాడు. అలా వెలియాలంటే అది ప్రాకృతమయిన కొండకాదు. దానియందు ఏదో శక్తి ఉండాలి. అందుకే పెద్దలు- శిలాభోగం, స్థలాభోగం అని చెబుతూ ఉంటారు. ప్రపంచములో ఎన్నో శిలలు ఉంటాయి. ఏదో ఒక శిలను పట్టుకు వచ్చి, దానిని చెక్కి దేవాలయములో పెడతారు. అది దేవతామూర్తి అవుతుంది. దానికి ఎన్నో అభిషేకములు పూజలు చేయబడుతుంటాయి. దానినే శిలాభోగం అంటాము. కొన్ని కొన్ని స్థలములలోవున్న నిర్మాణములలో ఎప్పడూ శుభం జరుగుతూ ఉంటుంది. దానినే మనం స్థలాభోగం అంటాము. ఒక స్థలానికి ఉన్న శక్తిని మనం కనిపెట్టలేం. పెద్దలకు మాత్రమే తెలుస్తుంది.

శక్తి కోణం..
శ్రీగిరి అన్నప్పుడు అందులో ‘శ్రీ’ ఉన్నది. లలితాసహస్రనామము ‘శ్రీమాతా’ అని ప్రారంభమయింది. ‘శ్రీ’లో ‘శ’కార ‘ర’కార ‘ఈ’కారములు ఉన్నాయి. ఆ మూడక్షరములు బ్రహ్మశక్తి ,రుద్రశక్తి ,విష్ణుశక్తిలను తెలియజేస్తాయి. ఈ మూడు శక్తులు ఉన్నటు వంటి కొండ శ్రీశైలము. ఈ మూడు శక్తులు మమేకమయిన శక్తిరూపిణి భ్రమరాంబిక. అందుకని శ్రీశైలము ఒక శక్తిపీఠము. ఆ కొండ మీద అడుగుపెట్టినవాడు సరస్వతీకటాక్షమునుకాని, లక్ష్మీకటాక్షమునుకాని జ్ఞానమునుకాని నోరువిప్పి అడగనక్కర్లేదు. అతనికి కావలసినది ఆ కొండలోంచి ప్రసరిస్తుంది. అది అంత శక్తివంతమయిన స్థలము. అక్కడకి వెళ్తే మనస్సు లయమయిపోతుందని పెద్దలు చెబుతారు. మనస్సు లయం అయిపోతే బాహ్యప్రపంచంతో సంబంధం ఉండదు. శ్రీశైలపర్వతము ఎన్నో ఓషధులకు ఆలవాలము. శ్రీశైలమునకు దగ్గరలో సిద్ధేశ్వరం అనే క్షేత్రం ఉన్నది. అక్కడ ఒక అమ్మవారు ఉన్నారు. అక్కడి అమ్మవారికి భక్తులు స్వయంగా బొట్టు పెట్టవచ్చు. అమ్మవారికి కంకుమబొట్టుపెట్టడానికి ఆవిడ నుదరు మీద వేలుపెడితే- ఆ నుదురు శిలామూర్తిగా ఉండదు. వేలికి ఆమె నుదురు మెత్తగా తగులుతుంది. ఇక శ్రీశైలమల్లికార్జునుడిది ధూళి దర్శనం. మనం ఉన్న ప్రదేశం నుంచి శ్రీశైలంవెళ్ళే లోపల శరీరం ఎంతో అశౌచమునకు లోనవుతుంది. అప్పుడు శుభ్రపడటం కోసం స్నానం చేసి దర్శనానికి వెళ్తే ఆయన చిన్నబుచ్చుకుంటాడని పెద్దలు చెబుతారు. శ్రీశైలంలో ధూళిదర్శనం చేయాలి.

శ్రీశైలంలో శిఖరేశ్వరము అని ఒకదానిని పెట్టారు. శిఖరేశ్వరంలో నువ్వులుపట్టుకెళ్ళి నంది యొక్క వ్రిగహం దగ్గర పోస్తారు. పూర్వకాలంలో శివాలయంలో ‘చరనంది’ అని ఒక నంది ఉండేది. సాధారణంగా శివాలయములలో స్థిరనంది అని ఒకటి ఉంటుంది. అది కదలదు. కొన్ని దేవాలయాలలో చరనందులు కూడా ఉండేవి. ఇవి కదులుతాయి. పూర్వం రోజులలో ఇప్పుడు ఉన్నంత వైద్యసదుపాయం ఉండేదికాదు. కానీ ప్రతి గ్రామంలో శివాలయం విష్ణ్వాలయం తప్పకుండా ఉండి తీరేవి. ఎవరయినా గర్భిణీ అయినస్త్రీకి అనుకోకుండా నొప్పులు వస్తే, పట్నానికి తీసుకువెళ్ళడానికి అవకాశంలేకపోతే, అంతర ఆలయం మూసేసి ఉన్నా కూడా పరుగెత్తుకుంటూ అర్చకుడి దగ్గరకు వెడితే ,ఆలయ ప్రధానద్వారపు తలుపు తీసేవారు. బాధపడుతున్నటు వంటి గర్భిణీస్త్రీ ఇల్లు ఎటువైపు ఉన్నదో అటువైపు దేవాలయంలోని ఈ చరనందిని తిప్పేవారు. ఈ చరనంది అటు తిరగగానే సుఖప్రసవములు జరుగుతాయని నమ్మేవారు. శిఖరేశ్వరంలో కూడా మనం ఈశ్వరుణ్ణి పొందలేక పడుతున్న బాధ నుంచి విముక్తం కావడానికి నువ్వులువేసి తిప్పుతారు. తిప్పి శ్రీశైలశిఖరము చూడాలి. కాని యథార్థమునకు ఆ శిఖరము నంది శృంగములలోంచి కనపడదు. కానీ శిఖరాన్ని ఊహించుకోవాలి.
(ఎమెస్కో ప్రచురించిన శివపురాణం నుంచి)
 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అనంత పద్మ నాభ రావు గారి అనంత పాటవం

 

బహుముఖ ప్రజ్ఙాశాలిగా పేరుపొందిన డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు ఆకాశవాణి, దూరదర్శన్‌లలో మూడున్నర దశాబ్దాల పాటు పని చేశారు.21వ ఏటనే అష్టావధానం చేసిన ఈ ప్రజ్ఞాశాలి కవిగా, నవలా రచయితగా, పరిశోధకుడిగా, అనువాదకుడిగా, జీవిత చరిత్రకారుడిగా, వ్యాఖ్యాతగా తెలుగు సాహిత్యానికి మొదటి నుంచీ విశిష్ఠ సేవలందిస్తున్నారు.దూరదర్శన్ అదనపు డైరెక్టరు జనరల్‌గా పదవీ విరమణ చేసిన అనంతరం చేస్తున్న ఆధ్యాత్మిక, సాహిత్య సేవల గురించి అనంత పద్మనాభరావు చెబుతున్న సెకండ్ ఇన్నింగ్స్ కబుర్లు…

మాది నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం సమీపంలోని చెన్నూరు గ్రామం. నా పాఠశాల చదువు ముగిశాక నెల్లూరులోని వీఆర్ కళాశాలలో డిగ్రీ, తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంఏ చదివాను. యూనివర్శిటీలో పీజీలో నాకు గోల్డ్ మెడల్ వచ్చింది. ఉన్నత విద్య పూర్తి కాగానే నాకు ప్రకాశం జిల్లా కందుకూరు ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకుడిగా ఉద్యోగం వచ్చింది. ఎనిమిదేళ్లపాటు అధ్యాపకుడిగా పనిచేశాక, ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి, ఆకాశవాణిలో తెలుగు ప్రసంగ శాఖ ప్రొడ్యూసర్‌గా చేరాను. కడప, విజయవాడ ఆకాశవాణి కేంద్రాల్లో పనిచేస్తూనే 1982వ సంవత్సరంలో యూపీఎస్సీ పరీక్షల్లో విజయం సాధించి ఆకాశవాణి అసిస్టెంట్ డైరెక్టరుగా చేరాను. 1987వరకు హైదరాబాద్ ఆకాశవాణి అసిస్టెంట్ డైరెక్టరుగా పనిచేసి, ఢిల్లీలోని ఆకాశవాణి స్టాఫ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టరుగా పదోన్నతిపై వెళ్లాను. మూడేళ్లపాటు ఢిల్లీలో పనిచేశాక, 1990లో ఆకాశవాణి స్టేషన్ డైరెక్టరుగా పదోన్నతి లభించింది. స్టేషన్‌డైరెక్టరుగా న్యూఢిల్లీ, విజయవాడ, కడప, అనంతపూర్‌లలో పదేళ్లపాటు పనిచేశాను. అనంతరం చెన్నయ్, ఢిల్లీల్లో జాతీయ ఛానల్‌కు డైరెక్టరుగా పనిచేశాను. ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాల్లో వివిధ కార్యక్రమాలకు రూపకల్పన చేశాను. దూరదర్శన్ అదనపు డైరెక్టరు జనరల్‌గా పనిచేస్తూ 2005 ఫిబ్రవరి 28వ తేదీన పదవీ విరమణ చేశాను. నాకున్న ముగ్గురు పిల్లలు వివిధ ఉన్నతోద్యోగాల్లో స్థిరపడ్డారు. దీంతో నా సెకండ్ ఇన్నింగ్స్‌లో దేవుడి సన్నిధిలో సాహిత్యసేవలు చేద్దామని నిర్ణయానికి వచ్చాను.

శ్రీ వెంకటేశ్వరుని సేవలో…
ఢిల్లీలో పదవీ విరమణ చేసి విమానంలో తిరిగి హైదరాబాద్‌కు వస్తుండగా అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య కార్యనిర్వహణాధికారి శర్మ తారసపడ్డారు. రిటైర్‌మెంట్ అనంతరం ఏం చేయాలనుకుంటున్నారని ఆయన అడిగితే పదవీ విరమణ అనంతరం నేను శ్రీవెంకటేశ్వరుని సేవలో స్వచ్ఛంద సేవలు చేయాలని ఉందని చెప్పాను. దీంతో ఈఓ విజ్ఞప్తిపై 2005వ సంవత్సరంలో టీటీడీ ప్రాజెక్ట్సు కోఆర్డినేటర్‌గా చేరాను. శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్టు సమన్వయకర్తగా అయిదేళ్లు పనిచేశాను. అప్పుడే భక్తి ఛానల్ పనులు పర్యవేక్షించాను. టీటీడీ ఆధ్వర్యంలోనే 2008లో ఎఫ్ఎం కమ్యూనిటీ రేడియోను ఆరంభించాను.

సివిల్స్ అభ్యర్థులకు పాఠాలు
సివిల్ సర్వీసులో శిక్షణ ఇస్తున్న నారాయణ కళాశాలకు ప్రిన్సిపాల్‌గా రెండేళ్లపాటు పనిచేశాను. యూపీఎస్సీ ఇంటర్వ్యూ బోర్డు సభ్యుడిగా ఉంటూ సివిల్స్‌లో శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు పాఠాలు చెబుతున్నాను. కళాశాల ప్రిన్సిపాల్ పదవికి రాజీనామా చేసి, పలు కళాశాలల విద్యార్థులకు గెస్ట్ ఫ్యాకల్టీగా పాఠాలు చెబుతున్నాను. హైదరాబాద్ స్టడీ సర్కిల్, అప్పా, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌తోపాటు ఉస్మానియా, అంబేద్కర్ ఓపెన్, హైదరాబాద్, పద్మావతి, ఢిల్లీ జామియా మిలియా తదితర 15 యూనివర్శిటీల విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నాను.

సాహిత్యసేవలు
సాహిత్యంపై మక్కువతో ఒకవైపు పుస్తకాలు రాస్తూనే, పలు పత్రికలకు నిరంతరం వ్యాసాలు రాస్తున్నాను. ప్రతి రోజూ 20 పేజీలు రాయనిదే నాకు నిద్ర పట్టదు. అందుకే యోజన, ఉద్యోగ విజయాలు, ఆరాధన, దర్శనమ్, సప్తగిరి తదితర మాసపత్రికలకు వివిధ అంశాలపై వ్యాసాలు రాస్తున్నాను. కవిగా, అవధానిగా, నవలా రచయితగా, పరిశోధకుడిగా, అనువాదకుడిగా, జీవిత చిత్రకారుడిగా, వ్యాఖ్యాతగా తెలుగు సాహిత్యానికి నాకు వీలైనంతగా సేవలందిస్తున్నాను. ఇప్పటికే నేను రాష్ట్రపతి వి.వి. గిరి, ప్రకాశం, రాయలసీమ రత్నాలు పేరిట ప్రముఖుల జీవిత చరిత్రలతో పాటు నవలలు, అనువాదాలతో కూడిన 70కు పైగా పుస్తకాలు రాశాను. నా 21 వ ఏటనే అష్టావధానం ఆరంభించి తెలుగు నాట యాభైకి పైగా అష్టావధానం కార్యక్రమాల్లో పాల్గొన్నాను. రామాయణాన్ని స్త్రీ పాత్రల ద్వారా ‘అంతరంగ తరంగం’ పేరిట రాశాను. విశ్వనాథవారి ‘వేయి పడగలు’ పుస్తకాన్ని మరో ఇద్దరు రచయితలతో కలిసి ఆంగ్లంలోకి ఇటీవల అనువదించాను. ఆకాశవాణి ఏటా జరిపే జాతీయ కవి సమ్మేళనానికి జాతీయ తెలుగు కవిగా నన్ను ఎంపిక చేయడం నాకెంతో ఆనందాన్నిచ్చింది.

అందరూ రచయితలే
నాతోపాటు కుటుంబ సభ్యులందరూ రచయితలే కావటం విశేషం. నేను రాసిన 70 పుస్తకాలు ప్రచురితమైనాయి. నా సతీమణి శోభాదేవి అన్నమాచార్యపై నాలుగు పుస్తకాలు రాశారు. నా పెద్ద కుమారుడు రమేశ్ చంద్ర జాబ్ ఇంటర్వ్యూ, మారథాన్ రేస్ టు సివిల్ సర్వీసెస్, దటీజ్ ఐటి పుస్తకాలు రాశాడు. నా చిన్న కుమారుడు వేదిక్ గణితం, ఎథిక్స్‌పై పుస్తకాలు రాశాడు.

నిత్య విద్యార్థి
ఒక వైపు ఉద్యోగం చేస్తూనే చదువు కొనసాగించాను. ఎంఏ తర్వాత ఉద్యోగంలో చేరినా, ఆ తర్వాత పీహెచ్‌డీ చేశాను. జర్నలిజంలో డిప్లమా, పబ్లిక్ రిలేషన్స్‌లో పీజీ డిప్లమా, ఆస్ట్రాలజీలో పీజీ డిప్లమాలు చేశాను. శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంఏలో ప్రథమ ర్యాంకు సాధించి బంగారు పతకాన్ని సాధించాను. పబ్లిక్ రిలేషన్స్‌లో బంగారు, కాంస్య పతకాలు లభించాయి. ఏటా నాలుగు పుస్తకాలు రాయడం, అవధానాల్లో పాల్గొంటుంటాను. నేను రాసిన పుస్తకాలపై అయిదుగురు విద్యార్థులు పరిశోధనలు చేయడం నాకెంతో సంతృప్తినిచ్చింది. అవధానం చేయడం, నవలలు రాయడం, అనువాదాలు చేయడం, కవితలు, కథలు, గేయ, వచన, పద్య రచనలు ఇలా సాహిత్యంలోని అన్ని ప్రక్రియల్లోనూ నాకు ప్రవేశముంది.

సేవా సంస్థలతో అనుబంధం
సుమారు 37 ఏళ్లపాటు కళాశాల, ఆకాశవాణి, దూరదర్శన్‌లలో ఉద్యోగం చేయడమే కాదు, పదవీ విరమణ చేశాక వివిధ స్వచ్ఛంద సంస్థల కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నాను. కంచికామకోటి పీఠం ఆస్థాన విద్వాంసుడిగా కొనసాగుతున్నాను. మద్రాసు తెలుగు అకాడమి గౌరవ అధ్యక్షుడిగా సేవలందించాను. మా నాన్న జ్ఞాపకార్థం అనంత లక్ష్మీకాంత సాహీతీ పీఠాన్ని ఏర్పాటు చేసి, ప్రతి ఏటా కళాకారులు, కవులను సన్మానిస్తున్నాను. యూపీఎస్సీ నిర్వహిస్తున్న సివిల్ సర్వీసు పరీక్షల్లో మన తెలుగు గిరిజన అభ్యర్థులు ఎంపికయ్యేలా వారికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. దీని కోసం భీమవరంలోని వశిష్ఠ ఆశ్రమం ఆధ్వర్యంలో ఏర్పాటైన గిరిజన పరిశోధన సంస్థ గౌరవ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. మరో వైపు ప్రాంతీయ సెన్సార్ బోర్డు సభ్యుడిగా కూడా పనిచేస్తున్నాను** అంటూ ప్రముఖ సాహీతీవేత్త అనంత పద్మనాభరావు తన సెకండ్ ఇన్నింగ్స్ కబుర్లు ముగించారు. ఆరు పదుల వయసు దాటిన తరువాత పునఃప్రస్థానంలోనూ ఒకవైపు సేవలతో పాటు అక్షర పద్మాంజలితో సాహిత్యసేవలు చేస్తున్న డాక్టర్ అనంత పద్మనాభరావుని మనమూ అభినందిద్దాం.

ఎన్నెన్నో అవార్డులు
తెలుగు సాహిత్యానికి విశిష్ఠ సేవలందించిన డాక్టర్ అనంత పద్మనాభరావుకు పలు అవార్డులు లభించాయి. ఈయనకు 2000 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమి నుంచి ఉత్తమ అనువాదక బహుమతి లభించింది. ఈయన చేసిన సాహిత్య సేవలకు గుర్తింపుగా 1999లో ఢిల్లీ, మద్రాసు తెలుగు అకాడమీల అవార్డులు వచ్చాయి. 2004లో డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి అవార్డు, దోమ వెంకటస్వామి గుప్తా అవార్డు, 2003లో చెన్నయ్‌లో భారతీయ సమైక్యతా పురస్కారం, 2002లో ఢిల్లీలో రాష్ట్ర్టీయ ఏక్తా అవార్డు, 2000 సంవత్సరంలో నాగభైరవ కళాపీఠం అవార్డు, 1996లో విజయవాడలో ఈకే అవార్డు, 1991లో కవిత్రయ అవార్డు, 1992లో ఎస్. ఆంజనేయులు అవార్డులు లభించాయి. 1993లో ఉత్తమ అనువాదకుడిగా తెలుగు యూనివర్శిటీ పురస్కారం పద్మనాభరావుకు దక్కింది. సనాతన« దర్మ ఛారిటబుల్ ట్రస్టు ఇటీవల ఈయనను శ్రీరామ నవమి పురస్కారంతో సత్కరించింది. గత ఏడాది డిసెంబరులో ప్రపంచ తెలుగు మహాసభల్లో అవధానిగా అనంత పద్మనాభరావును సన్మానించారు. న్యూయార్క్‌లో జరిగిన ఆటా సభలో ఈయన్ని సత్కరించారు. రేడియో నాటకాలపై పరిశోధన చేసేందుకు కేంద్ర సాంస్కృతిక శాఖ పద్మనాభరావుకు ఫెలోషిప్‌నిచ్చింది.

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

కంచి జిల్లా లో పెను పని చేసిన స వెం రమేష్

 

అయ్యా ,
తమిళనాడు లోని కంచి జిల్లాలోని ఉత్తర మేరూరు అనే వూరు లో 1-12-2013 న  తెలుగు నేర్చుకోవడానికి 21 మంది తెలుగు రాని తెలుగు వారు పోగయ్యరు. 17 వూళ్ళ నుంచి వొచ్చిన వీరికి వరుసగా 6 గంటలు స వెం రమేష్ గారు, తనకు వెన్ను నొప్పి వున్నా లెక్క చేయక, పాఠము లను నేర్పినారు.
తమిళం లో వివరాలు వున్న తెలుగు వాచకములను ఇందు కోసం వారు వేరుగా తయారు జేశారు. వాటిని వారు చాల సంతోషంగా 10 రూపాయల చొప్పున కొనుక్కొని, తమ ఊళ్ళల్లో తెలుగు వారి అందరికీ తెలుగు నేర్పుతామని మాట ఇచ్చారు.
ఇందులో 6 గురు ఆడ వారు వుండటం గమనార్హం.
6 గంటల్లోనే వారు రాయటం నేర్చుకొని, చివరలో చిన్న తెలుగు మాటలను నల్ల బల్ల మీద రాయ గలగటం కార్యకర్తలకు ఆనందాన్నిచ్చింది.
అసలైన తెలుగు కోసం [ఇంగ్లిష్ తెలుగు, సముస్క్రుతం తెలుగు, హిందీ తెలుగు కాకుండా ] పోరాడుతున్న మొత్తం దేశం లోని ఏకైక యోధుడు గా స వెం రమేష్ అందరికీ పరిచయమే.
8500548142 కు పిలుపు చేసి మీరు ఆయన గారి తో మాట్లాడి, మప్పిదాలు చెప్పటం మన కనీస కర్తవ్యం.
నుడి ఊడిగంలో,
మీ అనుగరి(అభిమాని).
పారుపల్లి కోదండ రామయ్య, రిటైర్డ్ ఎలక్ట్రికల్ చీఫ్ ఇంజనీర్.
తెలుగును బతికించుకోవాలంటే 1. ప్రతి కొలువుకు  తెలుగును వొక తప్పనిసరి అర్హతగా పెట్టాలని 2. ప్రతి బడిలో తెలుగును వొక తప్పనిసరి మందల [విషయం] గా నేర్పాలని మనం ఎసపు [ఉద్యమం] ను మొదలెట్టాలి.

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మనకు తెలీని భ.కారా మేస్టారు

శ్రీ తల్లా వఝల పతంజలి శాస్త్రి గారు రచించి సాహిత్య అకాడెమి వారు ప్రచురించిన ”భమిడి పాటి కామేశ్వర రావు ‘పుస్తకం నిన్న కొంత చదివాను అ దులో కొన్ని ముఖ్య సంగతుల్ని మీకు తెలియ జేస్తున్నాను . download
  కామేశ్వర రావు గారు పశ్చిమ గోదావరి జిల్లా ఆకి వీడులో జన్మించారు . తండ్రికి అరవయ్యవ ఏట రావు గారు పుట్టారు . జన్మ తేది 30-4-1897.నర్సా పురం టేలర్ స్కూల్ లో కొంతకాలం చదివి ,కాకినాడ పిఠాపురం కాలేజి లో ఇంటర్ పూర్తీ చేసి ,రాజ మండ్రి  ఆర్ట్స్ కాలేజి లో గణితం లో డిగ్రీ పొందారు .. అక్కడే టీచర్స్ ట్రయినింగ్ పాసై వీరేశలింగం స్కూల్ లో లెక్కల మేష్టారు గా 31ఏళ్ళు పని చేసి 1953లో పదవీ విరమణ చేశారు . అయిదేళ్ళ తర్వాత కేన్సర్ వ్యాధి తో 25-8-1958న మరణించారు . ఆయనకు ”కారా కిళ్ళీ ”వేసుకొనే అలవాటు బాగా ఉండేది అదే  ఆయన గొంతు కేన్సర్ కు కారణమై చని పోవటం బాధా కరం .
  తండ్రి నరసావధన్లు పరమ నైష్టి కుడు ,మహా పట్టుదల మనిషి ఆ  పట్టుదలే  రావు గారికి వచ్చింది అదే అండగా నిలబడింది జీవితాంతం ..మేస్తారికి మంచి లెక్కల మేష్టారు గా పేరుంది ..యెవరి తోనూ సన్నిహిత సంబంధాలు లేవు ఆ యనకు ”’బాగు -బాగు ;-మేష్టారు ”అనే నిక్ నెమ్ పిల్లలు తగిలించారు . ఆ  పేరు తో చిన్న నాటిక కూడా ఆయన రాశారు .
 మేస్టారి తాత గారు నడవ లేని వాడు అందు  తండ్రి నరసావధనులు గారు తానూ బయటికి వెళ్ళేటప్పుడు తండ్రిని కావడి లో పెట్టుకొని తనతో ఆ నాటి” శ్రావణ కుమారుడు” లాగా తీసుకొని వెళ్ళేవారు అంతటి పితృభక్తి పరాయణులు మేస్టారి  తండ్రి గారు . తల్లి, తండ్రీ మరణించే దాకా ఆయన వివాహం చేసుకో లేదు నలభయ్యవ ఏట వారిద్దరి మరణం తర్వాతే పెళ్లి చేసుకొన్నారు . తన కొడుకు కామేశం తన లాగే వేద విద్య నేర్వాలని తండ్రి ఆరాట పడ్డారు .కాని మేస్తారికి డిగ్రీ చదవాలని కోరిక .దబ్బు లేదు ఒక ఇరవై  వెండి  నాణాలు కొడుకు మొహాన కొట్టి డిగ్రీ సాధించామని పంపారు  . కాకినాడలో ఇంటర్ లో కృష్ణ శాస్త్రి గారు సహాధ్యాయి మేస్తారికి . అప్పటి దాకా సాహిత్యం అంటే తెలీని మేస్తారికి శాస్త్రి గారి వల్ల అ గంధం అబ్బింది .. పేద విద్యార్ధికి ఇచ్చే ఉపకార వేతనం అందుకోగాలిగారు .దానితొదిగ్రీ చేశారు .. అవసరమైతే తండ్రిగారికి చెప్పి బంధువు దగ్గర అప్పు చేసి చదివి ట్రే  యింగ్ పూర్తీ చేశారు . ఎల్ టి కాగానే వీరేశ లింగం స్కూల్ లో లెక్కల మేస్తారుగా చేరారు .
      బెత్తం ఉపయోగించే వారు కాదు చలోక్తులతో బోధనా రక్తి కట్టించే వారు ఇంటర్ వాళ్లకు కూడా విద్య చెప్పే పాండిత్యం ఉండేది ..యెదుటి  వారిని ఛలోక్తి తో నవ్విన్చట మే కాని తానూ నవ్వటం ఎప్పుడూ ఉండేది కాదు అదీ మేస్టారి ప్రత్యేకత ..ఇంగ్లేష్  రచయితలు రాసిన ఆల్జీబ్రా పుస్తకాలు కొని వాటిని విద్యా బొధనలొఉపయొగింటమేస్టారి స్పెషాలిటి . పరీక్షల ముందు విద్యార్దులన్దర్నిజాంటి గంగన్న పంతులు గారి మెడ మీదకు పిలిపించి సబ్జెక్ట్ అంటా రివైజ్ చేసి అందరికీ టీ  పార్టీ ఇచ్చే వారు ఽఅఫ్శనల్ లెక్కల వరికిఈ గౌరవం ప్రత్యేకం గా ఉండేది .
  శుభ్రమైన అంచు ఉన్న తెల్లటి ధోవతీ ,తెల్ల చొక్కా ,దాని పై గోధుమ రంగు కోటు  బూట్లు నెత్తిన టోపీ ఇదీ ఆ రోజుల్లో భ కా. రా మేస్టారి వేషం . తెల్ల వారు ఝామున నాలుగింటికి లేచి గోదావరి లోస్నానం చేసి ,వరవర రావు హోటల్లో టిఫిన్ చేసి కాఫీ తాగి ,”కారా కిళ్ళీ ”బుగ్గన బిగించి ”ఇంటికెళ్ళే వారు తొమ్మిదింటికి భోజనం చేసి పదింటికి స్కూల్ కు చేరే వారు .కపి లేశ్వరాపురం జమీందారు గారి పెద్దబ్బాయి యెస్.పి.బి.పత్తభి రామా రావు కు లెక్కలు సరిగ్గా అర్ధం కావటం లేదని ఇంటికిట్యూషన్ కోసం పమ్పిస్తాననిఆయన తండ్రి కబురు చేశారు దానికి మన మేస్టారి సమాధానం ”మీ వాడు లెక్కలు సరిగ్గా చెయ్యటం లేదంటున్నారు అంటే అతనికి అర్ధం అయ్యేటట్లు నేను లెక్కలు చెప్పటం లేదని నాకు అర్ధమయ్యింది. అర్ధం  అ యెట్లు చెప్పటం నా బాధ్యత ధర్మం .దీనికి నాకు డబ్బేమీ ఇవ్వక్కర్లేదు ”అని చెప్పి అతని పై ప్రత్యెక శ్రద్ధతో లెక్కలు బోధించి తీర్చి దిద్దారుఆఅయనె ఆ తర్వాతవిద్యా మంత్రి అయ్యాడని మనకు తెలుసు
   ఒక సారి స్కూల్ లో మేస్టారి అబ్బాయి రాధా కృష్ణ కూడా చదివె రోజుల్లో పరీక్ష పేపరును ఆత ను  పధకం ప్రకారం దోగిలించి మిగిలిన స్నేహితులకిచ్చాడు ఇది చాల రహస్యం గా చేశాడు పండితపుత్రుడు ంఅమ ర్నాదు పరీక్షలో బ్రహ్మాండం గా లెక్కలు చేయచ్చని  చంకలు గు లుద్దు కొన్నారు మిత్ర బృందం కాని క్వేస్చిన్ పేపర్ చూసి నీళ్ళు కారి పోయారు తము తస్కరించిన పేపర్ బదులు కొత్త పేపర్ ఇచ్చారు . మేస్తారిద్రుస్తి అంత నిశితం గా ఉండేది దీని పై కొడుకు రాధా కృష్ణ ”నాలుగు తిట్టి ,రెండు తగిలించినా బావుండేది .ఒక్క మాట అనకుండా శిక్ష మాలు చేశారు నాన్న ”అని బావురు మన్నాడు ఱాధా కృష్ణ గొప్ప హాస్య రచయితా .యెన్నొ సినిమాలకు మాటలు రాసి మెప్పించిచి హాస్య రచయిత
  రాధా కృష్ణ కు చిన్నప్పటి నుంచి సినిమాలు చూడటం సరదా తండ్రి నడిగి డబ్బులు తీసుకొని వెళ్లి చూసోచే వాడు మేష్టారు ఇంగ్లీష్ సినిమాలు బాగా చూసేవారు వారానికి ఒకటైనా చూసేవారు తనతో కొడుకునీ తీసుకొని వెళ్ళే ఒక రోజు కొడుకు సినిమాకు డబ్బు లడి గాడు .వద్దని చెప్పకుండా మేస్టారు”సినీ గీతోపదేశం” చేశారు ఇలా ”పరీక్షలైనాసరే ,పరీక్ష తప్పినా సరే ఏది ఏమైనా సినిమాలుటం మానకు .  . పరీక్ష ఎలాగూ పోతుంది ఉద్యోగం రాదన్న బెంగ లెదు.నిన్ను రోజూ హాలు వాళ్ళు చూస్తూనే ఉన్నారు కనుక పిలిచి టికెట్లు గేటుద గ్గర చించే ఉద్యోగం ఇస్తారు.పెల్లి కాదనే చింతా అక్కర్లేదు ఆడ వాళ్ళ గేటు దగ్గర టికెట్లు చించే వాడి  కూతుర్నిచ్చి పెళ్లి చేస్తారు .వీలయితె ముగ్గురు కలిసి టికెట్లు చిమ్పుకొంటు బతికేయ్యచ్చు .తప్పకున్దా సినిమాకి వెళ్లి రా నాన్నా “‘అన్నారు బుర్ర వాచీ పోయింది రాధాకృష్ణ ‘మళ్ళీ    సినిమా మాటెత్తితే ఒట్టు  . అదీ మేస్టారి మార్కు ట్రీట్ మెంటు .
  మేస్తారి ఖగోలపాన్దిత్యం బాగా ఉండేది ఱాధా కృష్ణ కు ఇంజీ నీరింగ్ చదవాలని ఉండేది తండ్రి రావు గారికి అంత స్తోమత లేదు కాని మినిస్టర్  పట్టాభి రామా రావురికమెండేషన్ తో సీట్ సంపాదించే ప్రయత్నం చేశాడు రాధాకృష్ణ .తన్ద్రికి తెలిసిపట్టాభి రామా రావు దగ్గరకు వెళ్లి  ”మా వాడికి ఇంజిరీనిగ్ చైవే అర్హతలేదు .టు తు తు ఇప్పించి పొరబాటు చేయద్దు ”అని చెప్పి వచ్చారు . కుర్రాడికి మతి తప్పి సి.యె.చెసి సినీ రచయితా గా స్తిర పడ్డాడు
  శ్రీ సుబ్రహ్మణ్య షష్టి  శుభా కాంక్షలతో
 మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -6-12-13- కాంప్ –మద్రాస్
Posted in మహానుభావులు | Tagged | Leave a comment

అలుపెరుగనిదే అసలైన జీవితం

అలుపెరుగనిదే అసలైన జీవితం

 

 

కఠోరమైన సత్యాల్లోంచే హాస్యం పుడుతుందంటారు. అలాంటి ఎన్నో కఠోర సత్యాల్ని కార్టూన్లుగా మలిచిన వారే కార్టూనిస్టు ‘సరసి’. మూడున్నర దశాబ్దాలకు పైగా కార్టూన్ల సేద్యం చేస్తున్న సరస్వతుల రామ నరసింహం అదే ‘సరసి’ హాస్య బాణాలు దాదాపు అన్ని తెలుగు పత్రికల్లోనూ కనపడుతూనే ఉంటాయి. ఆరు జాతీయ, ఆంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న గీతకారుడాయన. రాష్ట్ర శాసన సభలో అసిస్టెంట్ సెక్రెటరీగా పని చేసి ఇటీవలే ఉద్యోగ విరమణ చేసిన ఆయన జీవన ప్రస్థానంలోని కొన్ని సంఘటనలే ఈ వారం అనుభవం.

ఆవిష్కరణ అయిపోగానే రామారావు నన్ను ఉద్దేశించి ‘సరసి గారూ! మీరు వేసిన ఈ చిత్రం శాశ్వతం. మీరూ, నేనూ అశాశ్వతం’ అన్నారు. ఆ మాటలు ఇప్పటికీ నా చెవుల్లో గింగురు మంటున్నాయి. ఎన్‌టి రామారావు గారు వెళ్లిపోయారు. ఆ పెయింటింగ్ మాత్రం ఇంకా అక్కడ నిలబడి ఉంది. వెనకో ముందో నేనూ వె ళ్లిపోతాను. అయినా ఆ పెయింటింగ్ అక్కడే ఉంటుంది. కళారూపాలకు ఉండే ఆ శాశ్వతత్వమే కళాసృష్టిలో ఉండే ఎంతటి కష్టాన్నయినా భరించే శక్తినిస్తుంది.

ఆనందంగా ఉన్నప్పుడు ఎవరికైనా జీవితం అందంగానే కనిపిస్తుంది. కానీ, పరిస్థితులు కాస్త వికటించినప్పుడు ప్రతిదీ వికటాట్టహాసం చేస్తున్నట్లే అనిపిస్తుంది. కాకపోతే ఆ వికటత్వంలోని పేర డీని అర్థం చేసుకుంటే ఆ వికారం నుంచి బయటపడి హాయిగా నవ్వుకోవచ్చు. అన్నీ సవ్యంగానే సాగిపోతున్నప్పుడే కాదు జీవితపు ఒడుదుడుకుల మధ్య కూడా హాయిగా నవ్వుకోవడానికి కార్టూన్లు ఎంతో కొంత ఉపకరిస్తాయని నేన నుకుంటాను. అందుకే కొన్ని దశాబ్దాలుగా ఈ దారిన పడి నడుస్తున్నాను.
పశ్చిమ గోదావరి జిల్లా బోడపాడు మా సొంతూరు. రహదారులు కూడా లేని ఒక చిన్న పల్లెటూరు. చదువుకోసం పొరుగూరు వెళ్లాల్సిన పరిస్థితి. మా ఇంట్లో ఎప్పుడూ ఒక హాస్యభరితమైన వాతావరణం ఉండేది. మా అమ్మ స్కూలుకు వెళ్లి ఏమీ చదువుకోకపోయినా మేము హైస్కూలులో నేర్చుకున్న చంధస్సుతో పద్యాలు రాసి మాకే వినిపించేది. మా నాన్నగారు ఎంతో చమత్కారంగా మాట్లాడేవారు. భోజన సమయంలో మా అమ్మతో “వంట బాగానే చేశావు కానీ, నువ్వు రాసే ఆ పద్యాల వాసనకే వంట పాడైపోయింది.

” లాంటి మాటలు అంటూఉండే వారు. అంతటితో ఆగక ఆమె రాసిన పద్యాలమీద పేరడీలు చె ప్పేవారు. అది విని మేమంతా ఘుెల్లుమనే వాళ్లం. నేను కార్టూన్లు వేయడానికి ఆ వాతావరణమే బీజంగా పనిచేసిందేమో అనిపిస్తుంది. అయితే కార్టూన్ల పట్ల నాకు విపరీతమైన ఆసక్తి ఏర్పడటానికి, చివరికి నేను కార్టూనిస్టుగా స్థిరపడటానికి మాత్రం పరోక్షంగా బాపు గారి స్ఫూర్తే కారణం. బొమ్మలు వేయడం మాత్రం నాకు తమ్మా సత్యనారాయణ గారు నేర్పారు. నేను వేసిన అంబేద్కర్, పొట్టి శ్రీరాములు, కాసు బ్రహ్మానందరెడ్డి గార్ల తైల వర్ణచిత్రాలు రాష్ట్ర అసెంబ్లీ కమిటీ హాల్‌లో నిలిచే యోగ్యతను పొందడానికి ఆయనే కారణం.

ఎప్పటికీ నిలుస్తాయనే
నేను అసెంబ్లీ రిపోర్టర్‌గా ఉన్న రోజుల్లో అంటే 1995లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావు గారు అసెంబ్లీ కమిటీ హాల్‌లో అంబేద్కర్ తైలవర్ణ చిత్రాన్ని పెట్టాలని సంకల్పించి నాకు చె బితే నేను వేశాను. అసెంబ్లీ జరుగుతున్న రోజుల్లోనే ఒక ఖాళీ సమయాన ఎన్‌టి రామారావు గారి చేతుల మీదుగా ఆ చిత్ర ఆవిష్కరణకు ఏర్పాట్లు జరిగాయి. ఎంఎల్ఏలు, మంత్రులతో ఆ స్థలమంతా నిండిపోయింది. రామారావు గారు పెయింటింగ్ వద్దకు వస్తూండగానే అప్పటిదాకా ఆ పెయింటింగ్ వద్దనే ఉన్న నన్ను భద్రతా సిబ్బంది వచ్చి దూరంగా వెళ్లిపొమ్మన్నారు. నేను ఆశ్చర్యపోయి “అయ్యా ఆ పెయింటింగ్ వేసిన ఆర్టిస్ట్‌ను నేనే. పైగా నేను అసెంబ్లీ స్టాఫ్ మెంబర్‌ను. ఆ పెయింటింగ్‌ను ఆవిష్కరిస్తున్న సమయంలో నన్ను వెళ్లిపొమ్మంటారేమిటి?” అన్నాను. అయినా వాళ్లు నా మాట వినిపించుకోకుండా బయటికి నెట్టేశారు.

చివరికి పెయింటింగ్ వద్దకు రామారావు గారు వచ్చారు. చిత్రపట ఆవిష్కరణకు కొద్ది క్షణాల ముందు రామారావు గారు “ఇంతకీ ఆ చిత్రకారుడేడీ?” అన్నారట. అప్పటికి గానీ నా అవసరం భద్రతా సిబ్బందికి తెలిసి రాలేదు. వెంటనే ఆవిష్కరణ చోటికి వచ్చేయాలంటూ పిలిచారు. ఎక్కడో వెనక ఒక మూలన నిలుచున్న నేను ఎలాగోలా స్టేజ్ మీదికి వచ్చాను. ఆవిష్కరణ అయిపోగానే రామారావు నన్ను ఉద్దేశించి ‘సరసి గారూ! మీరు వేసిన ఈ చిత్రం శాశ్వతం. మీరూ, నేనూ అశాశ్వతం’ అన్నారు. ఆ మాటలు ఇప్పటికీ నా చెవుల్లో గింగురు మంటున్నాయి. ఎన్‌టి రామారావు గారు వెళ్లిపోయారు. ఆ పెయింటింగ్ మాత్రం ఇంకా అక్కడ నిలబడి ఉంది. వెనకో ముందో నేనూ వె ళ్లిపోతాను. అయినా ఆ పెయింటింగ్ అక్కడే ఉంటుంది. కళారూపాలకు ఉండే ఆ శాశ్వతత్వమే కళాసృష్టిలో ఉండే ఎంతటి కష్టాన్నయినా భరించే శక్తినిస్తుందన్న సత్యం రామారావు గారి గొంతులో నాలో ఇప్పటికీ ప్రతిధ్వనిస్తుంటుంది.

అన్నం పెట్టిన చేయి కదా!
నాకు అప్పుడు పదేళ్లు ఉంటాయేమో. అప్పటికే బాగా పొద్దెక్కింది. మా ఇంటికి ఎదురుగా ఉన్న రోడ్డు అవతల రెండెడ్ల బండి తొట్లో ఒకతను పడుకుని ఉన్నాడు. మాది చిన్న పల్లెటూరే కాబట్టి అతడు మా ఊరి వాడు కాదని తెలుస్తోంది. చాలా సేపటినుంచి అలా ఎండలో పడుకున్నాడేమిటనుకుని మా నాన్నగారు ఆయన వద్దకు వెళ్లి ఏ ఊరని అడిగితే ఫలానా ఊరని చెప్పి “ధాన్యం వేయడానికి రాత్రే వచ్చానండి, పడుకునే సరికి బాగా రాత్రయ్యింది. అందుకే ఇప్పటిదాకా మెలుకువ రాలేదు” అని చెప్పాడు. “సరే కానీ, చద్ది అన్నం ఉంది. తింటావా?” అన్నారు నాన్న. అందుకాయన ” తింటానండీ” అన్నాడు వెంటనే. అమ్మ అతనికి అన్నం పెట్టి ఆవకాయ పచ్చడి వేసింది. అన్నం ఎర్రబడిపోయేంతగా పచ్చడి కలిపి పెట్టిన అన్నమంతా తినేశాడు. రెండవసారి అన్నం పెట్టి మళ్లీ ఆవకాయ వేసింది. అలా అమ్మ పెడుతూనే ఉంది. అన్నం రక్తం ముద్ద అయ్యేలా పచ్చడి కలుపుకుని తింటూనే ఉన్నాడు. కాసేపటికి అతని కళ్లెంట ధారగా నీళ్లు వస్తున్నాయి. పచ్చడిలో కారం ఎక్కువ అవ డం వల్లేమో అనుకుంది అమ్మ. కానీ, గమనిస్తే అతను ఏడుస్తున్నాడనే విషయం అర్థమైపోయింది. ఆ మాటే అమ్మ నాన్నకు చెప్పింది.
అతను అన్నం తినేసి చెయ్యి కడుక్కున్నాక, నాన్న అతనితో “ఎందుకు బాబూ ఏడుస్తున్నావు?” అన్నాడు. అందుకు అతను “అయ్యా! మీరు నన్ను పిలిచి అన్నం పెట్టారు. మీకు సంబంధించి ఒక నిజం తెలిసి కూడా నేను మీకు చెప్పక పోతే నేను మీకు ద్రోహం చేసినవాడినవుతాను.” అన్నాడు. నాన్నగారు ఆశ్చర్యంగా చూశారు. ” ఏమిటో చెప్పు” అన్నారు. వెంటనే అతను “అయ్యా! నెల రోజుల క్రితం మీ పొలాన్ని కౌలుకు చేసే మీ రైతు మీ పొలంలోని ధాన్య రాశిలోంచి ఒక బండి ధాన్యాన్ని అతి రహస్యంగా రాత్రికి రాత్రే తాడేపల్లిగూడెం మిల్లుకు చేరవేశాడండి. ఆ బండి కట్టింది నేనే అయ్యా!. మీ అన్నం తిన్నాక ఆ నిజాన్ని దాచిపెట్టలేకపోతున్నానండి” అంటూ తలవంచి దండం పెట్టాడు. ఐదెకరాల పంట ధాన్యంలోంచి ఎవరైనా ఒక బండి ధాన్యం తీసేస్తే గుర్తు పట్టడం కష్టమే. అందుకే అప్పటి దాకా మాకా విషయం తెలియనేలేదు. పట్టెడు అన్నం తిన్నదానికి అతడు చూపిన కృతజ్ఞత ఈ రోజు వరకూ నా మనసులో ఒక అనిర్వచనీయమైన విషయంగానే మిగిలిపోయింది.

నిష్కామ యోగి
మా ఊరు బోడపాడుకూ చింతపల్లికీ మధ్యన వెంకయ్య కాలువ అని ఒకటుంది. దాన్ని దాటే వెళ్లాలి ఎవరైనా. అలా వెళ్లాలంటే దోనెలో వె ళ్లడం ఒక్కటే మార్గం. గోదావరి నుంచి వచ్చే ఆ కాలువ చాలా వడిగా పయనిస్తుంది. ఎంతో బలంగా గడకర్ర వేస్తే తప్ప కాలువ దాటడం సాధ్యం కాదు.సహదేవుడు అనే ఒకే ఒక వ్యక్తి ఆ దోనె నడుపుతాడు. దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి అతని పని అదే. అతనికిప్పుడు దాదాపు 80 ఏళ్లు. ఆ రోజునుంచి ఈ రోజు వరకు ఆ పని అతనొక్కడే చేస్తున్నాడు. వేరెవరూ ఆ పనికి రారు. కొత్త బాటసారులెవరైనా వస్తే కొంత డబ్బు ఇస్తారు కానీ, తెలిసిన గ్రామస్తులు మాత్రం పంట మీద కొంత ధాన్యం ఇస్తారు. కాలవకు ఆవల అతనికో గుడిసె ఉంటుంది. ఎప్పుడు వండుకు తింటాడో, ఎప్పుడు పడుకుంటాడో ఏమో కానీ, ఉదయం నుంచి అర్థరాత్రి దాకా ఎప్పుడు చూసినా దోనె మీదే కనిపిస్తాడు.

అర్థరాత్రి దాటాక పిలిచినా దోనె తోసుకుని వస్తాడే తప్ప రానని అనడు.ఆ మధ్య ఎవరో ఒక పాపను పెంచుకుంటున్నాడన్న వార్త ఏదో వచ్చింది. దోనె నడపడం అతని జీవితంలో భాగమైపోయిందే తప్ప అది అతని జీవనాధారమని కూడా కాదు. పరిసర గ్రామ ప్రజలంతా ఎప్పటికైనా వంతెన పడుతుంది, అతనికి ఆ కష్టం తీరుతుందని అనుకుంటారు గానీ, అదొక కలగానే ఉండిపోయింది.. ఇప్పటికి రెండు సార్లు ఆ వంతెన కోసం నిధులు మంజూరు అయ్యాయి. మంత్రులు వచ్చి శంకుస్థాపన కూడా చేశారు. కానీ ఇంత వరకు ఆ పని జరగలేదు. అతనింకా ఆ దోనె నడుపుతూనే ఉన్నాడు. అందరినీ ప్రవాహాన్ని దాటించి గమ్యానికి చేరుస్తున్నాడు గానీ, అతను మాత్రం ఆ ప్రవాహాన్ని దాటడం లేదు. ఆ ప్రవాహమే అతని జీవన గ మనం అనుకోవాలేమో! నాకైతే నిష్కామ కర్మకు అతనో నిలువెత్తు నిదర్శనంగా అనిపిస్తాడు.
 బమ్మెర
ఫోటోలు: సాల్మన్ రాజు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మద్రాస్ మ్యూజింగ్స్

మామేనల్లుడు చిశ్రీనివాకు  సుస్తీ చేసిందని  తెలిసి మద్రాస్ కు వెళ్లి చూసి రావాలనుకోన్నాను  మంగళ  వారం ఉయ్యూరు లో పోస్ట్ ఆఫీస్ లో ఉన్న రిజర్వేషన్ కౌంటర్ లో గురువారం పినాకిని మద్రాస్ కు శుక్రవారం తిరుగు ప్రయాణానికి  టికెట్లు  కొన్నాను ..ప్రయాణం అంటే మా ఇంట్లో హడావిడి ఎక్కువ .

 గురువారం ఉదయం అంటే ఈరోజు ఉదయం ఆరింటికి బెజవాడలో పినాకిని బయల్దేరుతుంది .దాన్ని అందుకోవటానికి ఉయ్యోఒరు నుండి స్టేషన్ కు ఉదయం పావు తక్కువ నాలుగు నుండి బస్ లున్నాయి పరగడుపుఏమీ పెట్ట కుండా మా ఆవిడ పంపదు కనుక రాత్రి నిద్ర లేకుండా గడిపి,తెల్ల వారుఝామున రెండున్నరకే నేను లేస్తే మూడింటి కల్లాలేచింది  .నెను స్తవ్ మీద వేడి నీళ్ళు పెట్టుకొని స్నానం చేసే సరికి కాఫీ చేసి ఇచ్చింది తాగిసంధ్యా వందనం పూర్తీ చేశాను పూజ చేద్దామంటే ఇవాళ  ఊరికి వెళ్తున్నాను కనుక దేవుడి పులికాపు చేద్దామని రాత్రే నాతో దేవుల్లను చింతపండు నీళ్ళలో నానేయించింది ..పల్లు తోముకొని రాత్రి రుబ్బి ఉంచిన మినప పిండి మిర్చి అల్లం వగైరాలతో వేడి వేడిగా పునుగులు చేసి నాకు పెట్టి దారిలోతినటానికి కొన్ని  పాక్ చేసి ఇచ్చింది .అం తా పూర్తయ్యేసరికి సరికి పది నిమిషాలు తక్కువ నాలుగు అయింది .. మా  అబ్బాయి రమణ బైక్ మీద నన్ను సెంటర్ కు తీసుకొని వెళ్లి 222సిటి బస్ ఎక్కించి ఇంటికి వెళ్ళాడు అది వెంటనే బయల్దేరి అయిదు నిమిషాలు తక్కువ అయిదింటికి బెజవాడ రైల్వే స్టేషన్ చేరింది  ఒక గంట గడిస్తే తప్ప పినాకిని వచ్చి బయల్దేరదు.ఒకనంబర్ కె వస్తుంది కనుక హాయిగా కూర్చుని వచ్చేపోయే బండ్లను చోస్తోఒ గడిపాను .సరిగ్గా పినాకిని అయిదున్నర కు వచ్చింది .యెక్కి కూర్చున్నాను .ఉదయమ్ పూజ చేసుకో లేదు కనుక పుస్తకాలు తీసి పూజ చదువుకొన్నాను .సరిగ్గా ఆరింటికి బయల్దేరింది .
   ఆయ్యప్పలె ఎక్కారు .నెత్తి మీద ఇరుమూద్ద్లు మేడలో దండలు నల్లని వస్త్ర ధారణా తో స్టేషనంతా సందడే సందడి ఱైలు ఆగిన ప్రతి స్టేషన్ లోను అయ్యప్ప స్వాములు గుంపులు గుంపులుగా ఎక్కారు వాళ్లకు వీడ్కోలు చెప్పటానికి బంధు మిత్రులు తన్దోపతందాలుగావచ్చారు .ఈహడా విడి సూల్లూర్రు పేట దాకా సాగింది .నిద్ర పట్టలేదు .
    పదిన్నరకు నెల్లూరు లో మా శ్రీమతి మూట కట్టించిన టిఫిన్ మళ్ళీ లాగించి మంచి నీళ్ళు తాగాను . .బండీ అంతా  జనమే జనం  .నెను నాతో శ్రీ తల్లా వఝల పతంజలి శాస్త్రిగారి రచన ”భమిడి పాటి కామేశ్వర రావు ”చదవటం మొదలు పెట్టాను ..నేను ఇదివరకు నిది తెలుసుకొని అనేక విషయాలను పతన్జలిగారు చక్కగా క్రోడీకరించి చెప్పారు ఆయన జీవితం లో పడిన ఆర్ధిక ఇబ్బందులు వాటిని అధిగమించి మొక్క వోని ధైర్యం తో ఆయన ముందుకు సాగిన వైనంచాలాగోప్పగా రాశారు మాస్టారి ని సంపూర్ణం గా విష్కరించే పని చేశారు .సుమారు ఒక నలభై పేజీలే చదివాను మిగతాది తీరిగ్గాచదవాలి .ఇన్త మంచి పుస్తకాన్ని జనవరి లోనే నేను కొనుక్కున్నాఇంత చదవలేక పోయి నందుకు సిగ్గు పడ్డాను ఇప్పటికైనా చదువుతున్నందుకు ఆనందించా . ఇప్పటిదాకా ప్రయాణం హాయిగా సాగింది ..
  నాయుడు పేట దాటాం ఽక్కది నుంచి ”రాజా వారి సత్రం ”అనే స్టేషన్ వచ్చింది సత్రం అని తెల్లుగు లోను హిందీ లోను బాగానే రాశి ఉంది ఇంగ్లీష్ లో ”ఛత్రం”అని రాసి ఉంది ఇది తమాషా ఽఅ స్టేషన్ పేరే ఒక తమాషా .. చీరాల అని తెలుగు లో ఉంటె chiralaఅని ఇంగ్లీష్ లో ఉనతమ్ వింత .. బండిని లూప్ లైన్లో పెట్టారు మద్రాస్ నుంచి వచ్చే మూడు రైళ్లకు క్రాసింగ్ ఇచ్చారు దీనితో మా బండి గంటన్నర ఆలస్యం గా బయల్దేరింది .సత్రమ్ నుండి సూళ్ళూరు పేట కు ఒంటెద్దు నడకే .ఇక పేట నుంచి చెన్నై సెంట్రల్ దాకామల్ల్లీ ఊరుకో ఉరుకు ంఅధ్యాహ్నమ్ ఒకటిం బావు కు చేరాల్సిన బండి మూడుం బావుకు ముద్దు ముద్దు ఆ స్టేషన్ లో అడుగు పెట్టింది ..పాపమ్ మా మేనకోడలి కొడుకు బాలాజీ ఒంటి గంటకే స్టేషన్ కు వచ్చి మా బందీకోసం కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్నాడు .న్ను దిగాఅనె తన బైక్ మీద ఇంటికి చేర్చాడు .ఇన్తికొచ్చె సరికి పావుతక్కువ నాలుగు ..ఇన్త్లొ మా మేనల్లుడు శ్రీనివాస్ కూడా వచ్చి నాకోసం కూర్చున్నాడు .ఉయ్యోరు నుండి తెచ్చిన స్వీటు హాటు మా మేనకోదలుకల కు ఇచ్చి భోజనం చేశా .వన్త అంటి చేసిన బంగాళాదుంప వేపుడు వేగలేదు కాని పొట్ల కాయ కూతు అదిరింది .సామ్బారు అదరహ ఱసమ్ భేష్ .తిని సాయంత్రం ఆరు వరకు పంచారామ విశేషాలు డొక్కాసీతమ్మ గారి పై సరస భారతి కార్యక్రమ వివరాలు ,పౌరామి నటి సత్యనారాయణ వ్రతం గుడిలో కార్తీక దీపాలు చెప్పాను నిద్ర పోలేదు .ఇన్తతి ఓపిక ఎలావచ్చిన్దినాకు అని వీళ్ళంతా బోలెడు ఆశ్చర్యం .
   శ్రీనివాస్ ఆరోగ్య విషయాలు అడిగి తెలుసు కొన్నాను చాలా భాగం నయ మిది అనిచెప్పాడు ఆరు నెలలు మందు వాదాలన్నాడు బరువుతగ్గాడు .యెమైనా కుదుట పడ్డందుకు మహా సంతోషం గా ఉంది ..దారిలొ రెండు మూడు సార్లు మా రమణ ఫోన్ చేసివాకాబు చేస్తూనే ఉన్నాడు .కాఫీ తాగి నేను బాలాజీ ”పూర్విక ”అనే సెల్ షాప్ కు వెళ్లి సేల్త్రాన్ఫోన్లు చూశాంఽయిదు వేలు ఖరీదు పండగ అఫార్లున్తాయని కోన కుండా వచ్చాం
   సాయంత్రం అయిదున్నరకు తణుకు నుండి స్పందన మామ గార మూర్తి గారు ఫోన్ చేశారు ఽఅ నాడు నేను మాట్లాడిన విషయాలు బాగున్నాయని ,రసరాజు గారికి నేను పంపిన పుస్తకాలు అందాయని చెప్పి రసరాజు గారు తన ప్రక్కనే ఉన్నారని మాట్లాడమని చెప్పారు మాట్లాడాను ఽఅ రోజు తణుకు లో నా ప్రసంగం చాలా బాగుదని ,పుస్తకాలు అందాయని చదివి మల్లీరాస్తానని తన పుస్తకాలు కూడా నాకు పంపిస్తున్నానని చెప్పి ఇలాకలుసుకోన్నండుకుసంతోశం గా ఉందని మూర్తిగారి ఆత్మీయత చెప్పలేదని అన్నారు  ఱాత్రి ఎనిమిదింటికి భోజనం చేశాను మా అక్కయ్య అల్లుడు చంద్ర శేఖర్ తో కలిసి ఇలా ఈ రోజు గడిచి పోయింది భలే అనుభవాన్ని మిగిల్చింది ..
  మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ – 5-12-13-కాంప్ -మద్రాస్ .

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

సినీ గీతా మకరందం –3 ప్రభాత ప్రభాకర దర్శాన్నిచ్చే ‘’దినకరా సుభకరా ‘’

       సినీ గీతా మకరందం –3

ప్రభాత ప్రభాకర దర్శాన్నిచ్చే ‘’దినకరా సుభకరా ‘’

వినాయక చవితి సినిమా లో పాటలూ ,మాటలూ రాయటమే కాదు దర్శక నిర్మాత కూడా అయ్యారుసీనియర్ సముద్రాల .అందులో ఘంట సాల తన సంగీత ప్రతిభను అణువు అణువునా ప్రదర్శించాడు .ప్రారంభం లోనే హంస ధ్వని రాగం లో ‘’వాతాపి గణ పతిం భజే ‘’ను అద్వితీయం గ గానం చేసి భక్తీ ని చిప్పిల జేశారు ఘంటసాల మాస్టారు .అంతేకాదు అంతకు ముందు కచేరీలలో దాన్ని ఎవరు ఎలా పాడే వారో తెలీదు కాని మన మాస్టారు దాన్ని జనరంజకం చేసి ,ప్రజా బాహుళ్యం లోకి ఆ పాట ను ఆపాత మధురం గా దివి నుండి భువికి తీసుకొచ్చారు .అది ఆయన చలువే .తెలుగు జాతి తీర్చుకో లేని ఋణం అది .ఇది ఇలా ఉంటె-

గుమ్మడి సత్రాజిత్తు పాత్రలో ఉదయాన సూర్య దేవుడికి అర్ఘ్యం ప్రదానం చేస్తూ పాడిన , పాడిన ఘంటసాల ,నటించిన గుమ్మడి దర్శకత్వం తో సంపూర్ణత తెచ్చిన సముద్రాల చిరస్మరణీయులయ్యారు .

ప్రభాత సమయం లో భాస్కర స్తుతి భూపాల రాగం విన్నంత హాయిగా ఉంది .మాస్టారి స్వరం ,గాత్రం భక్తిని సూర్య కిరణాల్లాగ వర్షించాయి .మనసుల్ని మహిమాన్వితం చేశాయి .భక్తీ భావం తో మనమూ ఆ  సవిత్రు మండల సూర్య నారాయణ మూర్తి కి చేతులు అనుకో కందా నే జోడిస్తాం .భక్తిని ప్రదర్శిస్తాం. ఇంత అద్భుతాన్ని ఆ గీతం సాధించింది .అదిగో ఆ పాట.

‘’దినకరా !శుభకరా !దేవా !దీనాదారా తిమిర సంహార ‘’దినకరా—

పతిత పావనా ,మంగళదాతా ,పాప సంతాప లోక హితా

బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూపా !వివిధ వేద విజ్ఞానా వినుత పరిపాలిత భాస్కర ‘’దిన కరా శుభ కరా .

‘చీకటి ని నశింపజేసే వాడు ,దినాన్ని కలిగించే వాడుసూర్యనారాయణుడు .మనం చేసే పాపాలను పోగొట్టి పతిత జనోద్దరణ చేసే మహానుభావుడు .మంగళ కరుడు .లోకానికి తన కిరణ స్పర్శ చేత హితాన్ని చేకూర్చే వాడు .ఆయన ఎవరో కాదు సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపుడు .వారికీ ఆయనకూ భేదమే లేదు .సూర్యునికి నమస్కరిస్తే, అర్ఘ్యం ఇస్తే వారినీ పూజించి నట్లే .అనేక వేదాల విజ్ఞాన సారం సవిత్రుడు .విమతుల ను సరైన మార్గం లో పెట్టి పరిపాలించే వాడు భాస్కరుడు ‘’ఆదిత్యుడు .

ఇటు లౌకిక భావాలను ,అటు వేదాంత భావాలను మిశ్రితం చేసి భాస్కర ప్రభావాన్ని త్రిమూర్త్యాత్మకం గా నినదించిన స్తుతి సుప్రభాతం గా భావించాలి దీనిని .ఘంట సాల స్వర లాలిత్యం మధురిమ తార స్తాయి లో ఉన్నాయి .పవిత్రత పరమ ఉత్క్రుస్టం గా ఉంది భక్తీ జ్ఞానం వైరాగ్యాల సమ్మిశ్రితం ఈ గీతం .అందుకే ఇది నాకు ‘’గీతా మకరందం ‘’అని పించింది .గుమ్మడి హావభావ ప్రకటన కు గొప్ప అవకాశం. దాన్ని సంతృప్తిగా నేర వేర్చాడు మహా నటుడు కేరక్టర్ యాక్టర్ వెంకటేశ్వర రావు గుమ్మడి .ఉదయం వేళ ఈ గీతం వింటే పాపహరం, భవహరం, ముక్తి ప్రదం .అంతగొప్పగా ఉన్న గీతం .సినీ గీతమైనా గీత గోవిన్దమైంది మకరందమైంది .

మరో మకరందం లో కలుద్దాం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-12-13-ఉయ్యూరు

 

 

Posted in సినిమా | Tagged | Leave a comment

సావిత్రి

Kommareddy Savitri (6 December 1935 – 26 December 1981), was an Indian film actress,
director and producer. She appeared in versatile roles in TeluguTamilKannada and Hindi
language films. In 1960, she received the Rashtrapati Award for her performance in the film
Inline images 1
Savitri was born in a Telugu speaking Kapu caste to couple Nissankara Guruviah and Subhadhramma
 in Chirravuru (near Tenali) in GunturMadras Presidency, now part of Andhra Pradesh. Her father died
when she was 6 months old. Later, her family moved to Chirravuru. She studied in Kasturbhai High School.
 Her maternal uncle was the driving force for Savitri’s Career. She learned music and Indian classical dance
 from Sistla Purnayya Sasthri, starting from the age of 8 (1941). She performed stage shows as a child
. She acted in 318 films in TeluguTamilKannada and Hindi languages, with between ten and fifteen
 movies being released per year.
She gave a few public performances as a child artiste in Vijayawada. Later, she worked in a theater company
run by Nandamuri Taraka Ramarao. She also started her own company, the Navabharata Natya Mandali. Her
 best stage role was in Atma Vanchana, written by Bucchi Babu.
Inline images 2

She was offered a role in ‘Agni Pariksha’ in 1949. However she looked too young (she was 14) in screen tests

and so was dropped. Then, she was selected for the lead role in the film Samsaram by the banner ‘Sadhana

Chitra’ in 1950. However, she was replaced by Pushpavalli and was given a small role, with Nageswara Rao.

She performed a dance in Pathala Bhairavi in 1951. Her first big role was as a second lead actress Pelli Ches

i Choodu by L. V. Prasad in 1952.

Inline images 3

She later acted in memorable Telugu films like Chandra Haram (1953), Devadasu (1953), Ardhangi (1955),

Missamma (1955), Donga Ramudu (1955), Amara Deepam (1956), Todikodallu (1957), Mayabazaar (1957)

, Abhimanam (1958), Mangalya Balam (1958), Appu Chesi Pappu Koodu (1959), Sri Venkateswara Mahatyam

(1960), Chivaraku Migiledi (1960), Manchi Manasulu (1961), Aradhana (1962), Gundamma Katha (1962), Rakta

Tilakam (1963), Mooga Manasulu (1963), Doctor Chakravarthy (1964), Poojaphalam (1964), Devatha (1965),

Pandava Vanavasam (1965), Kanya Sulkam, Naadi Aada Janme, Prana Mitrulu (1967), Varakatnam (1968),

Maro Prapancham (1970), Manase Mandiram (1966) and Jagan Mohini (1978). These movies are testimony to

her versatile acting skills.

Wikipedia

 Inline images 5

Saiyan tere prem ki deewani ban ayee hun Lata Mangeshkar Film Bahut Din Huye 1954

http://www.youtube.com/watch?v=CTgwiO7vNtg

Director:S. S. Vasan
Producer:S. S. Vasan
Music:B. S. Kalla, B. Shanker Shastry, J. Kashyap
Main Cast:Madhubala, Rattan Kumar, Agha, Kanhaiyalal, Lalita Pawar,

Pushpavalli, M.K. Radha, Roy Chowdhury, Neela, Indira Acharya

Inline images 6

“JAI-JAI HEY JAGDAMBE MATA” BY LATA MANGESHKAR,

https://www.youtube.com/watch?v=sSNpbi53JnI

https://www.youtube.com/watch?v=t_qGHWnDOVs

M.D:CHITRAGUPTA-“GANGA KI LEHREN 1964”

Inline images 7

Balsam Shri Krishna Full Movie  P1. (1968)

http://www.youtube.com/watch?v=HJ03Dm8u8MM

Inline images 8

Balram Shri Krishna P2. (1968)

http://www.youtube.com/watch?v=SwqEiOxYUAc

Inline images 18

Manase Kovelaga Song – Mathru Devatha Movie Songs – NTR – Savithri

http://www.youtube.com/watch?v=KYsPKgJ-ph8

Inline images 9

Ardhangi 1955- Raka raka vachavu chandhamama

http://www.youtube.com/watch?v=HYtjSz6HyeQ

Inline images 10

Donga Ramudu Songs – Chigurakulalo Chilakamma – ANR Savithri

http://www.youtube.com/watch?v=65gt3xXLNtM

CAST: ANR, Savithri, Jamuna
Music: Pendiala Nageswara Rao
Donga Ramudu (1955)

Inline images 11

Akasha Veedhilo ~ Mangalya Balam | Master Venu | Ghantasala, P Leela

http://www.youtube.com/watch?v=6vOEiwHxdzA

Inline images 14

Manjal Mahimai.1959 AGAYA VEEDHIYIL

http://www.youtube.com/watch?v=Em6XbRpn4r4

Inline images 19

Abhimanam Songs – Oho Basthi Dorasani – Akkineni Nageswara Rao

http://www.youtube.com/watch?v=gkbFfqs5IhE

Inline images 12

Rakta sambandam

http://www.youtube.com/watch?v=tsnMBAq7ZpE

Inline images 13

Malarnthum Malaratha

http://www.youtube.com/watch?v=imwsn-J8NuM

Pasamalar (Also known in English as: The Flower of Love) is a 1961 film starring

Sivaji Ganesan and Gemini Ganesan. The film was cast in 1961 and directed by

A. Bhimsingh. This film is considered to be one of the greatest Tamil movies ever

made. Stellar performances from Sivaji Ganesan and Savitri make this movie a

pleasure to watch. This movie was a great hit of its time and the melodious songs

are a delight to hear to this day. One of the song, Vaarayen Thozhi Vaarayo, is still

played in all Tamil weddings.

Inline images 15

Devatha  – Aalayana Velasina – NTR – Savitri

http://www.youtube.com/watch?v=SNr5RD6VUZ0

Inline images 16

Dr.Chakravarthy  – Neevuleka Veena – ANR – Savitri

http://www.youtube.com/watch?v=kl5pW2ukseM

Inline images 17

Vinipinchani Ragale Chaduvukunna Ammaylu

http://www.youtube.com/watch?v=ezM9GCfc_VQ

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.comGabbita Durga Prasad
Rtd. head Master
Sivalayam Street
VuyyuruKrishan District
Andhra Pradesh
India
phone : 08676-232797
958676-232797
Cell :     9989066375

(248) 786-8594

Saiyan tere prem ki deewani ban ayee hun Lata Mangeshkar Film Bahut Din Huye (1954)

JAI-JAI HEY JAGDAMBE MATA_ – GANGA KI LAHREN 1964_Raag – Yaman Kalyan.

“JAI-JAI HEY JAGDAMBE MATA-3″BY LATA MANGESHKAR,M.D:CHITRAGUPTA-“GANGA KI LEHREN”

Баларам Шри Кришна / Balram Shri Krishna P1. (1968)

Баларам Шри Кришна / Balram Shri Krishna P2. (1968)

Manase Kovelaga Song – Mathru Devatha Movie Songs – NTR – Savithri – KV Mahadevan

Ardhangi Song- Raka raka vachavu chandhamama

Donga Ramudu Songs – Chigurakulalo Chilakamma – ANR Savithri Jamuna

Akasha Veedhilo ~ Mangalya Balam | Master Venu | Ghantasala, P.Susheela | Sri Sri

Manjal Mahimai.1959 AGAYA VEEDHIYIL

Abhimanam Songs – Oho Basthi Dorasani – Akkineni Nageswara Rao, Savitri, Krishna Kumari

Rakta sambandam

Malarnthum Malaratha HD Song

Devatha Songs – Aalayana Velasina – NTR – Savitri

Dr.Chakravarthy Songs – Neevuleka Veena – ANR – Savitri

Vinipinchani Ragale Chaduvukunna Ammaylu

Posted in సినిమా | Tagged | 1 Comment

విజ్ఞులైన అలనాటి శాస్త్రజ్ఞులు -30(చివరి భాగం ) మరి కొందరు అలనాటి శాస్త్రజ్ఞులు

విజ్ఞులైన అలనాటి శాస్త్రజ్ఞులు -30(చివరి భాగం )

మరి కొందరు అలనాటి శాస్త్రజ్ఞులు

త్రిశత –క్రీ.పూ.పదవ శతాబ్ది వాడు .తండ్రి రెండవ వాగ్భటుడు .దీర్ఘ కాలిక వ్యాధులకు ‘’చికిత్సా కలిక ‘’అనే ఒక సిద్ధాంత గ్రంధం రాశాడు .అతిసార ,,మూత్ర పిండాల వ్యాధులను గురించి వివ రించాడు .మూత్ర పిండం లోరాళ్ళు  ఫిస్త్యులా రక్త స్రావం వగైరాలపై ద్రుష్టి పెట్టాడు .

వంగ సేన –పదమూడవ శతాబ్ది బెంగాల్ వాడు తండ్రి దదాధర వద్దనే వైద్యం అభ్యసించాడు .’’చికిత్సా సార సంగ్రహ ‘’రచించాడు .వ్యాధి నిరూపణ అంటే నిదానం పై నూట తొంభై నాలుగుభాగాలు రాశాడు .

అమరసింహ –రోగ కారణ సంబంధ శాస్త్ర వేత్త (ఏటియాలజి ) లో నిధి .పద్నాలుగో శతాబ్ది వాడు .తండ్రి రాజ పుత్ర .కాశ్మీర్ భిషక్ వరుడు  తోమార దేవ వర్మ నుండి ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేశాడు. వేదం, సాహిత్యం ,ధర్మ శాస్త్రం ,తంత్ర శాస్త్రాలను ‘’వీర సింహావ లోకన ‘’గ్రంధం లో వివరించాడు .

వర్ధ మాన –భౌతిక శాస్త్ర వేత్త .పద్నాలుగో శతాబ్దం వాడు .వైశేషిక ,న్యాయ శాస్త్రాలలో మహా పండితుడు .న్యాయ కుసుమావళి ,శ్రీ వల్లభ

న్యాయ లీలావతి ,ఖండన ఖండ ఖాద్య ప్రకాశిక ,తత్వ చింతామణి ,న్యాయ బిందు ప్రకాశిక ,న్యాయ పరిశిష్ట మొదలైన గ్రంధ కర్త.

ఉదయనా చార్య—పన్నెండవ శతాబ్దం కు చెందినా తార్కికుడు .తత్వ వేత్త .న్యాయ వైశేషిశికాలలో దిట్ట .వీటిపై అనేక గ్రంధాలు రాశాడు .ఆత్మ తత్వ వివేక ,కనద సూత్ర భాష్య ,జాతి నిగ్రహస్థాన  వ్యాఖ్య ,న్యాయ కుసుమాంజలి ,న్యాయ పరిశిష్ట రాశాడు .

ఉగాదిత్య –ఎనిమిదో శతాబ్దికి చెందినాకర్నాటక శాస్త్రజ్ఞుడు .జైన మతం లో ప్రముఖుడు .రాష్ట్ర కోట రాజు నృప తుంగ ఈయన వైద్య శాస్త్ర పరి ణతికి ముగ్ధుడై తన ఆస్తానం లో రాజ వైద్యునిగా నియమించాడు .మాంసం ,మద్యాలను నిషేధించాడు ‘’కళ్యాణ కారక ‘’వైద్య గ్రంధం రాశాడు .జైన సాహిత్యం లో దీనికి ప్రాధాన్యత ఉంది .

వామ దేవ –ఖగోళ శాస్త్ర వేత్త ..గౌతమ మహర్షి కుమారుడు వేదకాలం వాడు .బృహస్పతి(జూపిటర్) గ్రహాన్ని మొదట గుర్తించిన వాడు .ఋగ్వేద అధర్వణ వేదాలలో ఈయన ప్రస్తావన ఉంది ..

వృంద—రసవాది .సిద్ధ వైద్యం లో గొప్ప వాడు .తొమ్మిదో శతాబ్ది వాడు ‘’సిద్ధ యోగ ‘’రచయిత .రాగి అభ్రకం ,గంధకం మొదలైన వాటిని మందులలో వాడే విధానం సూచించాడు .

వ్యాడి—రత్న పరిశోధకుడు .క్రీ పూ ఆరవ శతాబ్ది వాడు .వ్యాకరణ వేత్త కూడా .పాణిని తర్వాత అంతటి స్తానం పొందిన వాడు .

సర్సేన—క్రీ.శ.అయిదు వందల వాడు .ఖగోళ శాస్త్ర వేత్త .’’రోమక సిద్ధాంత ‘’గ్రంధం రాశాడు .చంద్ర గ్రహ ముడి (నోడ్)పరిభ్రమణ ఒడవు చంద్ర గ్రహ సంబంధ అతి గొప్ప ,వాస్తవ అక్షాంశ రేఖ గూర్చి వివరణ నిచ్చారు .

శివ దాస సేన –పదిహేనవ శతాబ్ది వాడు .వైద్య వేత్త .బెంగాల్ రాజు ఆస్తాన వైద్యుడు .చక్ర పాణిదత్తా ‘’ద్రవ్య గుణ సంగ్రహ ‘’మీద ,చరక సంహిత మీద విపులమైన వ్యాఖ్య రాశాడు .నాడి ద్వారా శరీర తత్వాన్ని తెలుసుకొనే విధం రాశాడు

శౌనక –మహా  ముని. విష శాస్త్రం మీద అధారిటి ఉన్న వాడు .’’శౌనక తంత్ర ‘’రాశాడు ఇందులో ప్రక్రుతి లో ఉన్న అన్ని విషాలను, వాటి విరుగుడు లను గురించి రాశాడు .

శివ దత్త మిశ్ర –ఔషధ నిర్మాణ శాస్త్ర వేత్త .పదిహేడవ శతాబ్ది వాడు .ఔషధ కర్త ,ప్రయోగ శాలి .ఔషధ విజ్ఞాన శాస్త్రానికి పదకోశాన్ని సంస్కృత అక్షర మాల గా రాశాడు .540శ్లోకాలున్న గ్రంధం ఇది .వ్యాధి విభజన (నోసాలజి )మీద ‘’సమాజ సముచ్చయ ‘’గ్రంధం రాశాడు .480శ్లోకాలతో మూలికా నిఘంటువు (మెటీరియా మెడిక )రాశాడు చికిత్సా శాస్త్రం (ధేరాప్యూటిక్స్ )ను అందులో ఇమిడ్చాడు .రెండర్దాలిచ్చే శబ్దాలతో ఒక డిక్షనరీ రాశాడు. ఔషధ మొక్కలు మూలికా వైద్యం గురించి అందరికి తెలియ కుండా ఇలా కట్టు దిట్టం చేశాడు .వివరాలన్నీ కోడ్ భాష లో ఉన్నాయి .

ఇలా ఎంద రెందరో అలనాటి మన శాస్త్రజ్ఞులు న్నారు .వారి ని గురించి రేఖా మాత్రం గానే పరిచయం చేశాను .ఇది నా అదృష్టం గా భావిస్తున్నాను .ఈ అదృష్టాన్ని నాతొ బాటు మీకూ అందించాలనే తపనే మీకు ఈ వివరాలను అందజేసింది .ఈ వ్యాస పరంపరకు ముఖ్య ఆధారం శ్రీ వాసవ్య రచించిన ‘’ప్రాచీన భారతీయ శాస్త్ర వేత్తలు ‘’అని మొదటి ఎపిసోడ్ లోనే తెలియ జేశాను .మళ్ళీ ఒక సారి చెబుతున్నాను అంతే.

మన కుతుబ్ మీనార్

మన ప్రాచీన ఇంజినీరింగ్ ప్రతిభకు తార్కాణ ధిల్లీ లో మేహ్రోలి వద్ద ఉన్న ‘’కుతుబ్ మీనార్ ‘’. ప్రతి ఏడాది జూన్ 22 న దీని నీడ భూమి మీద పడక పోవటం అద్భుతం .28.5డిగ్రీల ఉత్తర అక్షాంశాం మీద ఇది ఉంది .ఈ నిర్మాణం 5డిగ్రీలు వాలి ఉండటం వల్ల భూ మధ్య రేఖ కు అటూ ఇటూ గా సూర్యుడి చలనం వల్లదీని నీడ భూమి మీద పడదు .

అలాగే కన్యా కుమారి వద్ద నిర్మించిన గాంధీ స్మారక కట్టడం లో ఏడాది లో అక్టోబర్ రెండవ తేది అంటే మహాత్ముడి  గారి పుట్టిన రోజు న కట్టడం లోపల ప్రతిష్టింప బడిన గాంధి విగ్రహం మీద సూర్య కరణాలు ప్రసరిస్తాయి .

తమిళ నాడు లో ‘’అడుతురై ‘’అనే చిన్న ఊరిలో ‘’సూర్య నార్ కోవిల్ ‘’అంటే సూర్య దేవాలయం’’ మన ప్రాచీన నిర్మాణ చాతుర్యానికి నిదర్శన గా ఉంది .ఇలాంటివి శ్రీ కాళ హస్తి ,శ్రీ రంగం దేవాలయాలు మరెన్నో దేవాలయాలలో  కూడా ఉన్నాయి .అబ్బుర పరుస్తాయి

మన ద్రుష్టి అభ్యుదయం వైపు ప్రసరించాలి .అందుకే కణాద మహర్షి .’’ద్రుస్టానాం దృస్ట ప్రయోజనానాం –దృష్టా భావే ప్రయోగో భ్యుదయాయ ‘’అని చెప్పాడు .దీని భావం –మనకు తెలిసిన విజ్ఞానం అందరికి పంచె లక్ష్యం తో ,మరింత స్వంత జ్ఞానాభివృద్ధి కోసం ,తెలిసిన విజ్ఞానాన్ని లోతుగా అధ్యయనం చేసి ,ప్రయోగాత్మకం గా పరిశీలించి నిగ్గు తెల్చటమే అభ్యుదయ మార్గం అవుతుంది .

‘’discover the inspiring you –discover the empowered you –discover the winner in you –discover the real you ‘’

అనేది మనందరి ఆదర్శం కావాలి..

‘’ విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు’’ సర్వం సంపూర్ణం  .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-12-13-ఉయ్యూరు

 

‘’

Posted in సైన్స్ | Leave a comment

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -29 మనం మరచిన అలనాటి మరికొందరు శాస్త్రజ్ఞులు

   విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -29

మనం మరచిన అలనాటి మరికొందరు శాస్త్రజ్ఞులు

జీవకుడు –క్రీ .పూ .అయిదు ఆరు శతాబ్ది వాడు .పాట్నా దగ్గర రాజ గృహ ఆస్థాన వేశ్య శాలా వతికి కుమారుడు .అప్పుడు మగధ సామ్రాజ్య రాజధాని రాజ గృహ .బౌద్ధం ఉన్నత దశలో ఉన్నప్పుడు గొప్ప వైద్యుడుగా ఉన్నాడు. బుద్ధునికి కూడా వైద్యం చేశాడు అరుదైన శస్త్ర చికిత్సలు చేసే వాడు .శిశు వైద్యం లో ప్రవీణుడు’’ కౌమార భ్రుత్య ‘’అనే శిశు రోగ వైద్యం ఈయన ద్వారా వచ్చిందే .

కళ్యాణ –క్రీ శ .1590లో అహి చాత్ర లో పుట్టాడు .తండ్రి మహీం దర . .’’బాల తంత్ర ‘’అనే వైద్య గ్రంధం రాశాడు .పిల్లల వ్యాదులనే ముఖ్యం గా చేసుకొని రాశాడు.గోడ్రాలి కి చికిత్స చేసి సంతాన ప్రాప్తి కల్గించే వాడు సుఖ ప్రసవం, శిశి సంరక్షణ లో ప్రత్యెక శ్రద్ధ తీసుకొన్నాడు .

వర్యో విద–చరకుడు తన సంహిత లో ఈయన గురించి రాశాడు శరీర ఆరోగ్యానికి వాయువు పోషిస్తున్న పాత్ర మీద పరిశోధన చేశాడు .

యత్వి సభ –గణిత శాస్త్రజ్ఞుడు. భూస్వరూప శాస్త్రం లో కృషి చేశాడు

 

సిద్ధ నిత్యా నాద –పద్నాలుగో శతాబ్ది వాడు .రస రత్నాకరం రాశాడు పర్వత పుత్ర గా ప్రసిద్ధుడు.రస ఔషధాలు తయారు చేశాడు .

సింహ గుప్త –విద్య శాస్త్ర వేత్త .వాగ్భాటుడికి మొదటి కుమారుడు .వ్యాధి నిర్ధారణలో అద్వితీయుడు .

స్పుజ ధ్వజ –ఖగోళ శాస్త్ర వేత్త .బెంగాల్ లో 269లో జననం .దౌత్యవేత్త గా ప్రసిద్ధుడు .’’యవన జాతక సిద్ధాంత ‘’రాశాడు .149లో యవనేశ్వార్ రాసిన గ్రీకు ఖగోళ గ్రంధాన్ని సంస్కృతం లోకి అనువాదం చేశాడు .వైద్య శాస్త్ర విజ్ఞాన సర్వస్వం తయారు చేశాడు .

సురేశ్వర –పదకొండవ శతాబ్ది వాడు .రస వాది .’’శబ్ద ప్రదీప్ ‘’రాశాడు ఇనుము ,బంగారం రాగి ,అభ్రకం మొదలైన వాటి ఉత్పత్తివిదానాలను రాశాడు .’’లోహ సర్వస్వ ,లోహ పధ్ధతి అనే గ్రంధాలు ప్రసిద్ధ మైనాయి .

తోడర్ మల్లు –అక్బర్ మంత్రి .1539జననం .అనేక శాస్త్రాలలో నిష్ణాతుడు .’’తోడార నంద ‘’రాశాడు .అందులో ఆయుర్వేద సౌఖ్యం ఒక విభాగం

త్రిమల్ల భట్టు –పదిహేనవశతాబ్దం లో కాశీ లో జన్మించాడు రోగానిదానశాస్త్రం, ఆహారం ,పద్యం ,చికిత్సా శాస్త్రాలు రాశాడు .ఔషధ నిర్మాణ శాస్త్రం విభజన శాస్త్రం రాశాడు ద్రవ్య గుణ శత శ్లోకి ,వైద్య చంద్రోదయ ,వృత్త మాణిక్య మాల్ ,యుగాంత రంజిని అనే ఈయన గ్రంధాలు దేశ విదేశాలలో ప్రాచుర్యం పొందాయి .

విజయా నంద –ఖగోళ శాస్త్ర వేత్త ..966లో జన్మించాడు .’’కరణ తిలక ‘’సిద్ధాంత గ్రంధం గా రాశాడు .దీన్ని ఆల్ బెరూని అరెబిక్ భాషలోకి అనువాదం చేశాడు .’’ఘావో రాట్అల్ జిజాన్ ‘’అని పేరు పెట్టాడు .

విజయ రక్షిత –పద మూడవ శతాబ్ది వాడు .వైద్య పరిశోధనలో అసామాన్యుడు .’’మాధవి నిదానం ‘’రాశాడు

వృద్ధ జీవక –క్రీ .పూ.ఐదో శతాబ్ది వాడు ‘’వృద్ధ జీవకాయ తంత్ర ‘’రాశాడు వైద్య విజ్ఞానం అంటా ఇందులో ఇమిడ్చాడు .

సోమేశ్వర -1126-38వాడు .కర్నాటక చక్ర వర్తి .అన్ని శాస్త్రాలలో నిధి .’’అభిలశితార్ధ చింతామణి ‘’రాశాడు .లోహాలు వాటి తయారీ వైద్యం లో

వాటి ఉపయోగాలను చర్చించాడు .నిద్ర ,క్రీడలు వినోదం నిత్య జీవితానికి యెంత అవసరమో వివరించాడు .

ఖండ దత్త –గణిత మేధావి మహా రాస్త్రీయుడు .1039వాడు .ఖగోళం లోనూ మేటి .మారాఠీ పాఠ్య గ్రంధాలు రాశాడు .చంద్ర, సూర్య గ్రహణాలు ఎందుకేర్పడతాయో తెలిపాడు ‘’ధ్రువ మానస ‘’గ్రంధం లో గ్రహాల భ్రమణాలు గ్రహణాల మీద గ్రహాల రేఖాంశాలను గణన చేసి105 పద్యాలలో పొందు పరచాడు . ఖగోళం పై ‘’సిద్ధాంత శేఖర ‘’గ్రంధం రచించాడు .

సూత్ర ధారా మండన –భవన నిర్మాణ వేత్త .పదిహేనో శతాబ్ది వాడు .అనేక దేవాలయాలకు రూప శిల్పి ‘’రాజ్య వల్లభ మండన ‘’రాశాడు .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-12-13-ఉయ్యూరు

Posted in సైన్స్ | Tagged | Leave a comment

సినీ గీతా మకరందం -2 లలిత రాగ మకరందం ‘’చిగురాకులలో చిలకమ్మా ‘’

సినీ గీతా మకరందం -2

లలిత రాగ మకరందం ‘’చిగురాకులలో చిలకమ్మా ‘’

అన్న పూర్ణా బానేర్ పై నాగేశ్వర రావు నిర్మించిన మొదటి చిత్రం దొంగ రాముడు .అదే సమయం లో రామా రావు ‘’జయ సింహ ‘’అనే జానపద సినిమా తీశాడు ,నా గ్ సాంఘిక  చిత్రం తీసి రికార్డు సృష్టించాడు .సాంఘిక చిత్రాల లో ఆణిన ముత్యం గా  కే వి.రెడ్డి దీన్ని  తీర్చి దిద్దాడు .మాటా ,పాటా సీనియర్ సముద్రాల .సంగీతంసుస్వరానికి మాధుర్యానికి ‘’పెంద్యులం ‘’అయిన  పెండ్యాల .అందరు కమ్మని వంట గాళ్ళే.అందుకే అంత కమ్మగా సినిమా తయారైంది .నాగేశ్వర రావు యవ్వన సౌందర్యం ,ఇంకా లావేక్కని సావిత్రి అందచందాలు, అభినయం ,వీటికి తావిని అందించాయి .హాయిగా కమ్మగా సాగే హుషారు పాట, కొంటె పాట ,కొసరి మురి పించే పాట బుద్ధి చెప్పే పాట, గాంధీ తాత గొప్పతనాన్ని విడమర్చే పాట దేని కదే హాయి గూర్చాయి ,అన్నిటికి ‘’సాహిత్య సముద్రం’’ సముద్రాల కలకండ పదాలతో పాటలు రాసి వన్నె తెచ్చాడు .పెండ్యాల నాగేశ్వర రావు తన సంగీత వైదుష్యానికి సొగసు లద్డాడు. సరళ స్వరాలతో మనసు గిలి గింతలు పెట్టాడు .అలా విరిసిన

ఒక పుష్ప గీతమే సావిత్రి ,నాగేశ్వరరావు ల మధ్య నడిచిన యుగళ గీతం .ఆ అందాన్ని ,ఆ మక రందాన్ని ఆస్వాదిద్దాం .

‘’ఓ చిగురాకులలో చిలకమ్మా –చిన్న మాట విన రావమ్మా

మరు మల్లెలలో మామయ్యా –మంచి మాట సెలవీవయ్యా .

పున్నమి వెన్నెల గిలి గిం తలకు-పూచిన మల్లెల మురిపాలు

నీ చిరు నవ్వు కు సరి కావమ్మా –

ఓ—ఓ– ఓ –

ఎవరన్నారో ఈ మాటా తెలిసీ పలికిన నీ నోటా

ఆ –ఆ –ఆ—

వలచే కోమలి వయ్యారాలకు –తలచే మనసున తీయ దనాలకు కలవా విలువలు సెలవీయా ?

పై మెరుగులకే భ్రమ పడకయ్యా –మనసే మాయని  సొగసయ్యా –

గుణమే తరగని గుణమయ్యా—

ఊ—ఊ-ఊ ‘’

 

ప్రేమించిన అమ్మాయి ని చిగురాకులలో చిలకమ్మ తో పోల్చటం భలే తమాషా గా ఉంది .తన మనసులో ఉన్నది  చిన్న మాటే –దాన్ని వినమని బతిమాలుతున్నాడు .వింటే సరిగ్గా స్పందిస్తున్దని ఆశ, ఆరాటం అత గాడికి .

ఆమె కూడా పల్లె టూరిదే .కాయా, కసరూ అమ్ముకోనేదే .అయినా ఆమె భావమూ అతి సున్నితం గా ఉండటమే సముద్రాల చూపిన ప్రత్యేకత .ప్రియుడిని మరు మల్లెలలో మామయ్యా అంది అంతే లలితం గా .ఆ చెప్పే మంచి మాటేదో సెలవీవయ్యా అని భలేగా అడిగింది .’సెలవీయటం ‘’సముద్రాల ఎంచుకొని వేసిన ‘యాప్ట్ పదం ‘’.అప్పుడాయుకుడికి  ఆ మంచిమాటేమిటో సెలవిస్తాడు .ఆమె చిరు నవ్వుకు పున్నమి వెన్నెల గిలిగింతలకు పూచిన మల్లెల మురిపాలు సరికావు పొమ్మన్నాడు .ఆమె కు ఇది గొప్ప అభి నందన .అంత సున్నితం గానూ చెప్పాడు. కాదు చెప్పించాడు రచయిత .ఇక్కడ నాయికా నాయకుల అభినయమూ అద్భుతం గా ఉండేట్లు టీర్చి దిద్దాడు తన దర్శక ప్రతిభ తో కెవి రెడ్డి .ఆమె దాన్ని తేలిగ్గానే తీసుకోంది.ఎవరో అన్న ఈ మాటను నువ్వు తీసుకొని నాకు ఆపాదిన్చావు .అందులో భావాన్ని బానే అందుకొని నాకు అతికిన్చావు .నీ నోటితో ఇలాంటి కమ్మని మాట వినటం ఇంపుగా సొంపుగా ఏంతోరుచిగా ఉన్నట్లు ఉంది అందామె .

ఎప్పుడూ మనసులో మధురం గా తలచుకొంటూ ,వలచే కోమలి వయ్యారాలకు ,తలచే మనసున తియ్యదనాలకు విలువలు కట్టటం సరికాదు అసలు కట్టలేము అన్నాడు గడుసు కుర్రాడు దొంగ రాముడు .

ఆమె ఒక ఆకు ఎక్కువే చదివింది .పై మెరుగులకు భ్రమసి పోవటం చేటు తెస్తుంది .మనసు మాయని సొగసు కనుక గుణమే ప్రధానం .అది తరగని నిధి .దానికే విలువ ఎక్కువ అని జీవిత సత్యాన్ని కాచి వడ బోసి నట్లు సెలవిచ్చింది .ఇద్దరూ హాయిగా నవ్వుకుంటారు .అతడు కొద్ది రోజుల్లో నేరస్తుడు అనే ముద్ర వేయిచుకో బోతాడు అనే  సూచన కూడా ఇందులో కనీ పిస్తుంది. రాబోయే కధకు సూచ్యార్ధ సూచన ఆమె వాడిన మాట .ఇన్ని విషయాలను సముద్రాల అతి సున్నిత పదజాలం తో ,సందర్భోచితం గా ఒక పల్లె టూరి యువ జంట పై రాసి వారి మనసులలోని భావాలను ,ఆంతర్యాలను మహా నేర్పుగా వెలువరించారు .ఈ పాటకు అంతకు మంచిన స్వరం తో, బాణీ తో ,రాగ బంధం గా  మధురం గా  గా మనసులకు గిలిగింతలు పెట్టేట్లు  హాయిని కూర్చేట్లు పెండ్యాల స్వరకల్పన చేశారు. అంత కమ్మగా జిక్కీ ,ఘంటసాలలు పాడి దానికి అమరత్వం కల్గించారు .మధ్యలో వచ్చే ‘’ఓఓ లు ఉఊలు ,ఆ ఆ లు ‘’మాధుర్యాన్ని పెంచి వీనులకు విందు కూర్చి లలితా మనోహరత్వానికి ఆభరణం అయ్యాయి .ఈ మొత్తాన్ని అతి సహజం గా ఆకర్షణీయం గా ,వారి నిండు మనసుల కు ,ప్రేమ వలపుకు హృదయపు లోతులకు దర్పణం గా సెల్యులాయిడ్ పై చిత్రీకరించి సుమధుర కావ్యం గా ఈ పాటను చిత్రీకరించారు కే వి.రెడ్ది. అందరూ అందరే. అందుకే పండింది .మనసు నిండింది .అభినందనల నందుకొంది ఈ  పాట. అందుకే నాకు గీతా మకరందం అయింది .

మరో మకరంద బిందువు తో కలుద్దాం .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-12-13-ఉయ్యూరు

‘’

Posted in సినిమా | Tagged | Leave a comment

శశి శేఖరుడి కద-చాగంటి అభి భాషణం –

 

పరమేశ్వరుడికి ‘శశి శేఖరుడు” అనే పేరు కూడా ఉంది. శివుడికి ఆ పేరు ఎలా వచ్చిందో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు శర్మ వివరిస్తున్నారు.శశకం అంటే కుందేలు. దూకే స్వభావం ఉన్నది కుందేలు. అలాంటి స్వభావం ఉన్నదే కాలం. ఈ కాలాన్ని ఒడిసిపట్టుకొని తన వద్ద పెట్టుకున్నవాడు కాబట్టి శశి శేఖరుడు అని పిలుస్తారు. ఈ నామాన్ని మనం తాత్విక ధోరణిలో కూడా చూడాలి. మనిషికి సుఖము ఉంటే కాలం దూకేస్తుంది. దుఃఖం కలిగితే కాలం గడుస్తున్నట్టు అనిపించదు. కానీ కాలంలో
సుఖదుఃఖాలు రెండూ ఉంటాయి. కాలానికి ఉన్న ఈ ద్వైదీ స్వభావాన్ని వైదిక సమన్వయం చేస్తే అది సరైన నిర్వచనమవుతుంది. అలాంటి ద్వైదీ స్వభావం ఉన్న కాలాన్ని ఆభరణంగా ధరించిన వాడు శివుడు. దీనినే చంద్రరేఖతో సూచిస్తారు. ఈ పేరు రావటానికి వేరొక కథ కూడా చెబుతారు. దక్ష ప్రజాపతికి ఇరవై ఏడుమంది కుమార్తెలు. వీరిందరికీ నక్షత్రాలు పేర్లు పెట్టారు. వీరందరినీ చంద్రుడికిచ్చి వివాహం చేశారు. వాస్తవానికి ఇంత మంది భార్యలున్న చంద్రుడు చాలా ఆనందంగా ఉండాలి.

కానీ చంద్రునిలో ఒక దోషం ఉంది. ఆయనకు విచక్షణ ఉండదు. తొందర ఎక్కువ. చంద్రుడు తన భార్యలలో ఒకరైన రోహిణి మీద ఎక్కువ ప్రేమను కనబరిచేవాడు.. ఇది సహజంగా మిగిలిన ఇరవై ఆరుమందికి బాధ కలిగించింది. దీనితో వారు తండ్రి దగ్గరకు వెళ్లి, “నాన్నగారూ! మీరు ఎందుకు ఈ తప్పు చేశారు? మా ఇరవై ఏడు మందిలో ఒకవేళ రోహిణియే అందగత్తేమో! రోహిణినొక్కదాన్నీ చంద్రుడికిచ్చి వివాహం చేస్తే సరిపోయేది. చందమామలాంటి భర్తను పొందడానికి మేం అర్హులం కామేమో! అందుకేనేమో చంద్రునికి రోహిణి మీద ఉన్న ప్రేమ మా మీద లేదు. మేం ఎంత పనికిమాలినవారమైనా మాకు తగిన భర్తలు పృథ్విలో ఉండరా? మాకు చాలా బాధగా ఉంది ” అని మొరపెట్టుకున్నారు. దక్షప్రజాపతికి చాలా కోపం వచ్చింది. వెంటనే చంద్రలోకం వెళ్లాడు. చంద్రునితో “నీకు నేను నా ఇరవై ఏడు మంది కుమార్తెలనూ ఇచ్చి వివాహం చేసినప్పుడు అందరినీ జ్రాగత్తగా సమానంగా చూసుకుంటానని మాట ఇచ్చావు. కానీ నువ్వు ఒక్క రోహిణితో మాత్రమే ఉంటున్నావని తెలిసింది. ఇలా ఉండడానికి వీలులేదు. ఇరవై ఏడు మంది పిల్లల కంటి వెంటా నీళ్ళు రాకూడదు. అందరినీ సమానంగా చూసుకోవాలి’ అని హితవు చెప్పాడు. చంద్రుడు అంగీకరించాడు. కొంతకాలం గడిచింది. కానీ చంద్రుడి ప్రవర్తనలో ఎలాంటి మార్పూ రాలేదు.

దీనితో దక్షుడికి చాలా కోపం వచ్చి చంద్రుడిని, ‘నీ విశృంఖలత్వానికి నేను అడ్డువేస్తాను. నీవు క్షయ వ్యాధి పీడితుడవు అవుదువు గాక’ అని శపించాడు. చంద్రుడికి క్షయవ్యాధి వస్తే దేవతలందరూ నీరసపడిపోయారు. దీనికొక కారణముంది. చంద్రుడు బాగా ప్రకాశిస్తే ఆయన అన్రుగహం వల్ల ఓషధులు ప్రకాశిస్తాయి. ఓషధులు బాగా ప్రకాశిస్తే ఓషధులతో కూడిన ద్రవ్యంతో యజ్ఞం చేయవచ్చు. యజ్ఞంలో ఈ ఓషధుల్ని కూడా వేస్తే ఈ హవిస్సులను దేవతలు తీసుకుంటారు. అప్పుడు దేవతల ఆకలి తీరుతుంది. చంద్రుడికి క్షయవ్యాధి సోకడం వలన దేవతలకు హవిస్సులు లేవు. ఇది చంద్రుడి వ్యక్తిగత సమస్య కాదు. లోకాల సమస్య అయి కూర్చుంది. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ, ‘నేను లోక సంక్షేమం గురించి చెబుతున్నాను. ఇప్పుడు చంద్రుడు ప్రభాస క్షేత్రానికి వెళ్ళాలి. ప్రభాస క్షేత్రం సముద్ర ఒడ్డున ఉంది. ఆ ప్రభాస క్షేత్రంలో ఒక గుంట తవ్వి అందులో ఒక పార్థివ లింగాన్ని పెట్టుకుని పంచాక్షరి మహా మంత్ర జపాన్ని మృత్యుంజయ మంత్రంతో కలిపి అనుష్ఠానం చెయ్యాలి.

అప్పుడు శంకరుడు కరుణిస్తాడు’ అని ఉపాయం చెప్పాడు. వెంటనే చంద్రుడు ప్రభాస క్షేత్రానికి వెళ్ళాడు. అక్కడకు వెళ్ళి పంచాక్షరీ మహా మంత్రాన్ని మృత్యుంజయ మహా మంత్రంతో అనుసంధానం చేసి కొన్ని కోట్ల సార్లు జపం చేశాడు. శంకరుడు పార్వతీ సమేతంగా ప్రత్యక్షమయాడు. చంద్రుడు తనకి క్షయవ్యాధి తగ్గిపోయేలా చేయమని పరమేశ్వరుని ప్రార్థించాడు. పరమేశ్వరుడికి వరమిచ్చే శక్తి ఉంది. కానీ వరం ఇస్తే, దక్ష ప్రజాపతి మాటకు విలువ లేకుండా పోతుంది. అప్పుడు శివుడు చంద్రుడితో, “నీకు క్షయ ఉంటుంది. కానీ నువ్వు పదిహేను రోజులు క్షీణిస్తావు. పదిహేను రోజులు వృద్ధి పొందుతుంటావు. క్షయ పూర్తిగా లేదు కాబట్టి నశించిపోవు. నువ్వు నా అనుగ్రహం పొందావని తెలుసుకోవడానికి నాతో కలిపి నీ దర్శనం చెయ్యడానికి నా పేరే నీతో కలుపుకుంటాను. చంద్రశేఖర అని పిలిపించుకుంటాను” అని ఆ చంద్రుణ్ణి తీసి నెత్తిన పెట్టుకున్నాడు.

 

Posted in సేకరణలు | Tagged | Leave a comment

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -28 నేత్ర చికిత్స లో రెండవ సర్ఫోజి ‘’రాజే’’

          విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -28

 

నేత్ర చికిత్స లో రెండవ సర్ఫోజి ‘’రాజే’’

చత్ర పతి శివాజీ వంశస్తుడు రెండవ సెర్ఫోజి మహా రాజు యుద్ధాలలో ఆరితేరిన వాడు .వైద్యం లో అవిశ్రాంత కృషి సల్పిన వాడు .తమిళ నాడు లో తంజావూర్ లో 1777లో జన్మించాడు .బ్రిటిష్ ప్రభుత్వం సెర్ఫోజి అధికారాన్ని1799 లో స్వాధీనం చేసుకొని పదవీ భ్రస్టూడిని చేసింది..

పదవి పోవటం ఒక రకం గా మంచే చేసింది .ప్రాచీన భారతీయ సంప్రదాయ వైద్య గ్రంధాలను సంహితలను కూలం కషం గా అధ్యయనం చేశాడు .నేత్ర వ్యాధి చికిత్స ను ప్రత్యేకం గా ఎన్నుకొని తన వైదుష్యాన్ని అందులో చూపించాడు .ప్రత్యామ్నాయ వైద్యాలైన సిద్ధ వైద్యం ,ఆయుర్వేదాలకు పరిశోధనా కేంద్రాలను ‘’ధన్వంతరి మహల్ ‘’పేరిట నెలకొల్పాడు .దక్షిణ భారత దేశం లో దీనిని ముఖ్య కేంద్రం గా నిర్వహించాడు .వైద్య శాస్త్ర పరిశోధకులను ఏర్పరచి వారితో అనేక పరిశోధనలు చేయించి వైద్యాన్ని అందు బాటులోకి తెచ్చాడు ..తయారైన

ఔషధాలను గోడౌన్ లో నింపి అవసరమైన వారికి సరఫరా చేశాడు .ఔషధ మొక్కలను వన మూలికలను సేకరించి భద్ర పరచాడు .సిద్ధ వైద్యం లో అనేక ప్రయోగాలు చేయించాడు .

సెర్ఫోజి తాను  మాత్రం నేత్ర వైద్యం పై నే ద్రుష్టి పెట్టాడు .నేత్రవైద్య గ్రంధాలను క్షున్నం గా అధ్యయనం చేసి చికిత్సా విధానాన్ని సులభ తరం చేశాడు .నేత్ర చికిత్సా సాధనాలు ఆయన వెంట ఎప్పుడూ ఉండేవని చరిత్రకారుల కధనం .కాశి,ప్రయాగ మొదలైన పవిత్ర క్షేత్రాలకు వెళ్లి అక్కడి యాత్రికులకు సేవలందించే వాడు సెర్ఫోజి ..కంటి పొరను అతి తేలిక గా తొలగించే నైపుణ్యం ఆయన కుండేది ..18శతాబ్దం లో ఇదొక అద్భుత విజయం అని బ్రిటిషర్లు ,అందరూ మెచ్చుకొన్నారు

Inline image 1Inline image 2

 

.

సెర్ఫోజి చిత్రకారుల చేత నేత్ర రోగుల కళ్ళను చిత్రాలు గా గీయించి భద్ర పరచాడు .సెర్ఫోజి నేత్ర వైద్య వివరాలన్నీ తంజావూర్ సరస్వతి మహలో లో మనం చూడ వచ్చు .నేత్ర వైద్యం లో శాస్త్ర చికిత్స లో ఇంతటి వైభవాన్ని ప్రపంచం మొత్తం మీద సాధించిన ఘనత సెర్ఫోజి రాజుదే .ఆయన వైద్య రంగానికి చేసిన సేవల లిఖిత పత్రాలు లభిస్తున్నాయి

.50దాకా చార్టులు ,రాత ప్రతులు ఉన్నాయి .సెర్ఫోజి నేత్ర చికిత్స కు ‘’కేస్ హిస్టరీ ‘’కూడా రాసి పెట్టుకొన్నాడు .వ్యాధి నిర్ధారణ తో బాటు అతి సూక్ష్మ విషయాలనూ అందులో రాశాడు .ఆధునిక నేత్ర శాస్త్ర పారి భాషిక పదాలు ‘’కార్నియా ,కంజుక్తివా ,కాప్యూల్ ,ఆఫ్ దిలెన్స్ ,పోస్తీరిఅల్ చేంబర్ ‘’మొదలైనవి ఈ చార్టులలో ఉండటం ఆశ్చర్యమేస్తుంది .5-60 ఏళ్ళ వయసున్న రోగులలో కేటరాక్ట్, గ్లకోమా లక్షణాలు ఉండటం సర్వ సాధారణం అని చెప్పి ,వారి ద్రుష్టి స్థాయి ,,ఆపరేషన్ తర్వాతా వారి చూపు విషయం అన్నీ జాగ్రత్తగా ఈ చార్టులలో నిక్షిప్తం చేశాడు .

రోగులకు వాడిన మందుల వివరాలు కూడా చార్టులలో రాశాడు .మనదేశానికి చెందినవే కాక  యూరోపియన్ మందులను కూడా వాడి నట్లు చార్టుల ద్వారా మనకు తెలుస్తుంది .’’సిల్వర్ నైట్రేట్ ,బెల్లడోనా,చాక్ పౌడర్ ,పిప్పర మెంట్ వాటర్ ‘’లను ఎక్కువగా సేర్ఫోజి  వాడాడు .సెర్ఫోజి తన వైద్య అధ్యయనానికి చరక సుశ్రుత సంహితలనే కాక సమకాలిక బ్రిటిష్ గ్రంధాలను అవలోడనం చేశాడు .వీటిని తన స్వంత అనుభవాలతో జోడించి ప్రజలకు ఉచితం గా వైద్య సేవ లందించాడు

 

 

రాజా సెర్ఫోజి . 1832లో నేత్ర వైద్య శిఖామణి సెర్ఫోజి రాజా మరణించాడు .భారతీయ నేత్ర వైద్య రంగానికి రా రాజు సెర్ఫోజి రాజు ఆధునిక నేత్ర వైద్యానికి గొప్ప స్పూర్తి ప్రదాత సెర్ఫోజి .

 

సశేషం

 

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-12-13-ఉయ్యూరు

Posted in సైన్స్ | Tagged | Leave a comment

సినీ గీతా మకరందం -1 వేగాన్ని పాటలో చూపిన గీతం

సినీ గీతా మకరందం -1

 

వేగాన్ని పాటలో చూపిన గీతం

 

తెలుగు చిత్ర జగత్తులో’’క్లాసిక్ ‘’అని మొదటగా పేరొందిన సినిమా మల్లీశ్వరి .అందులో పాటలు ,మాటలు, సంగీతం, అభినయం, దర్శకత్వం అన్నీ ఉన్నత స్తాయిలో ఉన్నాయి .అందుకే ఆ హోదా అందుకోంది .బి నాగి రెడ్డి దర్శకత్వ ప్రతిభకు నిలువు టడ్డం గా నిలిచిన సినిమా .కృష్ణ శాస్త్రి మాటా ,పాటా,సవ్య సాచిత్వం గా సాగిన చిత్రం .రసాలూరు రాజేశ్వర రావు సంగీత స్వరమాదురులు కురిసిన సినిమా .భానుమతి అందాలే కాక నటనకు గీటురాయిగా నిలిచింది ఘంట సాల స్వర మాధుర్యం శిఖరాయ మానం గా  ఉన్నచిత్రం .అన్నీ కల బోసి ఒక మధుర రసం మామిడి పండుగా రూపొందిన చిత్రం మల్లీశ్వరి .

ఇందులో ఎన్నో పాటలున్నా ,అన్నీ అద్భుతమే అయినా ఏదీ రెండోదానికి తీసి పోనట్లున్నా నా మనసును ఆ నాడేకాదు ఈనాడూ ఆకర్షించే పాట మల్లీ ,నాగరాజులు సంతకు  వెళ్లి రెండెడ్ల బండీ లో ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ఘంట సాల ,భానుమతుల యుగళ గీతం

అంటే బండీ పాట అత్యద్భుతం .ఆకాశం లో మేఘాలు నల్లగా ముసురుకొన్నాయి .ఇకనో ఇప్పుడో వర్షం వచ్చేట్లుంది .ఇంటికి పోవాలనే తొందర నాయికా నాయకులకు ఉంది .చీకటి పది పోతోంది .ఇంటి వద్ద పెద్దలేమను కొంటారో అని భయం .వర్షం భారీగా వస్తే తమ పరిస్తితి ఏమిటిఅని కంగారు ఇద్దరిలో ఉంది .త్వర త్వర గా ఇంటికి చేరిపోవాలి .అప్పుడు వికసించింది పాట.గిత్తల ఉరుకులు మబ్బుల బారుల పయనం లను రాజేశ్వర రావు స్వరకల్పనలో రూపం ధరించేట్లు చేశాడు .ఆ పరుగు వేగం అంతాపాట లో ధ్వనింప జేశాడు .ఆ తర్వాత ఎన్నో సినిమాలలో ఇలాంటి పాటలోచ్చినా దీని ముందు అన్నీ బలా దూరే దేవదాసు లో నాగేశ్వర రావు పట్నం నుంచి గుర్రబ్బండీ లో వచ్చే పాట ఉన్నా దీని తర్వాతే .అంత ఆకర్షణ గా విరిసింది ఈ పాట.భానుమతి ఘంట సాల ల కమనీయ గాత్రం రాజేశ్వర రావు భావానికి అనుగుణం గా పరిగెత్తి ఒక మధురాను భూతిని కలిగించింది

‘’-  ఏయ్ పరుగులు తీయాలి .-ఒ గిత్తలు ఉరకలు వెయ్యాలి

ఊరు చేరాలి –మన ఊరు చేరాలి

ఓ –హోరుగాలి కారు మబ్బులు –మూగే లోగా, ముసిరే లోగా –ఊరు చేరాలి  మన ఊరు చేరాలి .

 

గల గల గల కొమ్ముల గజ్జెలు –గణగణ గణ మెడలో గంటలు

వాగులు దాటి వంకలు దాటి –ఊరు చేరాలి

నల్లని మబ్బులు గుంపులు గుంపులు

తెల్లని కొంగలు బారులు బారులు అవిగో –అవిగో

ఊగే గాలుల తూగే తీగలు అవిగో –

కొమ్మన మూగే కోయిల  జంటలు

జుమ్మున మూగే తుమ్మెదాగుంపులు

అవిగో అవిగో –అవిగో అవిగో –ఆ ఆ ఆ

ఇదీ పాట.ఎద్దుల కొమ్ముల గజ్జెల మోత ,మెడలోని గంటల మోతా వినిపించటమే కాదు కనీ పించేట్లు చేశారు రాజేశ్వర రావు .దాన్ని చిత్రాను వాదం చక్క గా చేశారు రెడ్డిగారు .వాగులు ,వంకలూ దాటాలన్న ఆదుర్దా .త్వరగా ఇంటికి చేరాలనే అతి తాపత్రయం అంతా ప్రతిధ్వనిమ్ చింది ఇక్కడ  .మరి వీళ్ళను మరీ తొందర పెట్టాయి తెల్లని కొంగలు బారులు తీరి గూళ్ళకు చేరటానికి వీలై  నంత వేగం తో పోతున్నాయి .వీటిని భయ పెడుతూ నల్లని మబ్బులు బారులు బారులుగా ఆకాశం లో కనీ పిస్తూమరీ తొందర చేస్తున్నాయి .అవి ఎక్కడో లేవు .అవిగో అక్కడే ఉన్నాయి బాబోయ్ అని వెన్ను చరుపుగా ఉన్నాయి .కోయిలలన్నీ కొమ్మల మీద మూగుతుంటే ,తేనే టీగలు జుం ఝుం అంటూ ముసురుతూ భయ పెడుతున్నాయి .కనుక గీత రచయితా కృష్ణ శాస్త్రి పల్లె వాతా వరణం లో దేన్నీ వదల కుండా భావాన్ని పొందు పరిస్తే దాని కనుగుణం గా స్వరాల జల్లు కురిపిస్తూ బండీ వేగాన్ని ,జోడెద్దుల జోరు తో జత కలిపి పరుగులు తీయించారు .ఇలా అన్నీ సమ పాళ్ళలో కుదిరి ,అనుకొన్న ఎఫెక్ట్ కు ఏంతో దోహదం చేసి ‘’,ఓ ఓ,ఏఏ ,ఆ ఆ ‘’లు పాత లో వేగాన్ని పెంచటానికి ఏంటో సహకరించాయి .పాటను చిరంజీవి ని చేశాయి .ఇందులో అందరూ అందరే .అందరి సమిష్టి కృషి తో ఈ గీతంన భూతో గా నిలిచి పోయింది ,’’హాట్స్ ఆఫ్ టువన్ అండ్ అల్ ఇన్ దిసాంగ్ . మరో గీతా మకరందం లో మళ్ళీ కలుద్దాం ..

‘’‘’మీ గబ్బిట దుర్గా ప్రసాద్ -3-12–13-ఉయ్యూరు

 

Posted in సినిమా | Tagged | Leave a comment

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -26 శాస్త్రజ్ఞులైన అలనాటి రాజులు

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -26

శాస్త్రజ్ఞులైన అలనాటి రాజులు

విహంగ శాస్త్ర వేత్త –జహంగీర్

అక్బర్ కొడుకు జహంగీర్ మొగల్ చక్ర వర్తి మాత్రమె కాదు గొప్ప ప్రక్రుతి శాస్త్ర పరిశోధకుడు ,విహంగ శాస్త్ర వేత్త కూడా . 1605-27మధ్య కాలం లో పక్షులను మొక్కలను జంతువులను బాగా పరిశీలించి వివరాలను చెప్పే వాడు .కళా సాహిత్యాలకే కాక భవన నిర్మాణానికి ,ప్రక్రుతి విజ్ఞానానికి ఏంతో సేవచేశాడు .

Inline image 1Inline image 2Inline image 3Inline image 4

 

 

 

జహంగీర్ కు పక్షులంటే పిచ్చ ప్రేమ .వాటి ప్రవర్తన ,జీవన విధానాల గురించి ఒక గ్రంధమే రాశాడు .వృక్ష ,జంతు జాలం పై సాధికారిక రచన చేశాడు తన జ్ఞాపకాలు(తుజు –క-జహంగిరి ) అనే పుస్తకం లో .సమకాలీన శాస్త్ర వేత్తల జీవిత చరిత్రలనూ రాశాడు .ఖగోళ ,సాంకేతిక శాస్త్ర గ్రంధాలను సంస్కృతం లో వెలువరించాడు .యుద్ధాలు తిరుగు బాట్లు ,రాజకీయ కల్లోలాల మధ్య కూడా జహంగీర్ తన పరిశోధనలను కోన సాగించటం విశేషం .తన సమాచార గ్రంధం లో

36రకాల జాతుల జంతువుల్ని ,37వర్గాల వృక్షాలను గుర్తించి అమూల్య సమాచారాన్ని పొందు పరచాడు .వీటి లక్షణాలు వీటిపై పర్యావరణ ప్రభావం శరీర నిర్మాణ విషయాలు బరువు ,పేర్లు ,కొలతలు అన్నీ నిక్షిప్తం చేశాడు .ఆస్థాన చిత్రకారుడు ఉస్తాద్ మన్సూర్ చేత ఆ జంతువుల వృక్షాల పై పెయింటింగులు కూడా వేయించి ప్రదర్శింప జేశాడు .స్వయం గా జహంగీర్ జంతు ప్రదర్శన శాల ను నిర్వహించాడు .సూర్య ,చంద్ర గ్రహణాలు ,తోక చుక్కల గురించి కూడా జహంగీర గ్రంధస్తం చేశాడు .కొత్త పక్షి కనపడగానే ఆస్థాన చిత్రకారుడి తో బొమ్మ వేయించి భద్ర పరచే వాడు .ఈ చిత్రాల ఆల్బం పక్షుల పరిశోధనా శాస్త్రానికి (ఆర్నిదాలజి )కి ఏంతో తోడ్పడింది .

ఆధునిక కాలం లో మన’’ సలీం ఆలీ’’ ‘’పక్షి ప్రేమికుడు’’ గా గుర్తింపు పొందిన విషయం మనకు తెలిసిందే .

ఆధునిక రాకెట్ రూప శిల్పి టిప్పు సుల్తాన్

. 1232లో చైనా వారు మంగోలులతోయుద్ధం చేసినప్పుడు మొదటి సారిగా రాకెట్లను ప్రయోగించారు .ఆ తర్వాత రాకెట్ స్వరూపం చాలా మారింది .ఫిరంగులు వాడకం వచ్చిన తర్వాత రాకెట్లు వెనక పడ్డాయి .1560తర్వాత రాకెట్ వాడకం నిలిపేశారు 18శతాబ్దం చివర్లో మైసూరు ను పాలించిన టిప్పు సుల్తాన్ రాకెట్. లకు పునర్జీవనం కల్పించాడు.ఈస్ట్ ఇండియా కంపెనీ కి ఎదురు తిరిగి ఆధునిక టెక్నాలజీ తో మళ్ళీ రాకెట్ లను నిర్మించి వారిపై ప్రయోగించిన ఘనత హైదరాలీ కుమారుడు టిప్పు సుల్తాన్ దే .

1799 మే నెలలో జనరల్ హరిన్ నాయకత్వం లో బ్రిటిష్ సైన్యాలు శ్రీ రంగ పట్నం మీద దాడి చేశాయి .టిప్పు సుల్తాన్ వారిపై ప్రయోగించిన రాకెట్ వర్షానికి బ్రిటిష్ సైన్యం భారీగా నష్ట పోయింది .తన రాకెట్ దళాన్ని అయిదు వేల కు పెంచి టిప్పు బ్రిటిష్ సైన్యానికి చుక్కలు చూపించాడనిబ్రిటిష్ సైన్యాధికారి ‘’కల్నల్ గెరాల్డ్ ‘’తన పుస్తకం లో రాశాడు .సంచలనం కలిగించిన ఈ వార్త అందర్నీ ఆలోచన లోకి నెట్టి మళ్ళీ రాకెట్ వైభవానికి దారి తీసింది. అనేక పరిశోధనలు  రూపుదాల్చటానికి కారణమైంది .టిప్పు స్వయం గా దగ్గరుండి రాకెట్ల ను ప్రయోగింప జేసే వాడు .ఈ విషయాలన్నీ ‘’ది  ఆరిజన్స్ అండ్ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ ఆఫ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ‘’అనే గ్రంధం లో బ్రిటిష్ శాస్త్ర వేత్త సర్’’ బర్నాల్ రావెల్ ‘’రాశాడు .

 

Inline image 5Inline image 6

టిప్పు సుల్తాన్ తInline image 1యారు చేసిన తుపాకి

టిప్పు ప్రయోగించిన రాకెట్ ను ఒక దాన్ని ఇంగ్లాండ్ కు తీసుకొని వెళ్లి ‘’కోన్ గ్రేవ్ ‘’‘’అనే పరిశోధకుడు పరీక్షించాడు ఆ టెక్నాలజీకి నీరాజనాలన్దించాడు అప్పటి బ్రిటిష్ ప్రధాని’’విలియం పిట్ ‘’,డిఫెన్స్ కార్య దర్శి ‘’క్రేసర్ వీద్’’కూడా క్షున్నం గా పరిశీలించి అబ్బుర పడ్డారు .1805లో బ్రిటిష్ సైన్యానికి అధునాతన రాకెట్ ను తయారు చేసే పనిలో నిమగ్న మయ్యారు .వాటి ఫలితం గానే నెపోలియన్ తో బోలాంగ్ హార్బర్ దగ్గర జరిగిన యుద్ధం లోను ,కోపెన్ హాగ్ పై జరిగిన దాడి లోను బ్రిటిష్ సైన్యం ఈ రాకెట్ల ను ప్రయోగించి విజయాలను సాధించింది .ఈ విషయాలను మన మాజీ రాష్ట్ర పతి కలాం గారు ప్రస్తావించారు .ఆయన సుప్రసిద్ధ రోదసీ శాస్త్ర వేత్త అని మనకు తెలుసు కదా .

టిప్పు సుల్తాన్ పాలన కాలం లో శస్త్ర చికిత్సా విధానం కూడా పాశ్చాత్యుల మెప్పు పొందింది .1792యుద్ధం లో టిప్పు సైన్యం లో నలుగురికి చేతులు ముక్కు తెగి పోయాయి .ఒక కుమ్మరి వైద్యుడు శాస్త్ర చికిత్స చేసి కొత్త ముక్కు ను అతికించాడు ఈ విషయాన్ని బ్రిటిష్ వైద్యులు డాక్టర్ ధామస్ క్రాస్ ,డాక్టర్ జేమ్స్ ఫింద్లే’’ స్వయం గా ఫోటోలు తీసి ,ఒక సమగ్ర నివేదిక తయారు చేసి బ్రిటిష్ గెజెట్ లో ప్రచురింప జేశారు .ఈ నివేదికనే 1794అక్టోబర్ ‘’జంటిల్ మాన్ ‘’అనే లండన్ నుంచి వెలువడే మాస పత్రిక లోప్రచురించారు .శస్త్ర చికిత్స జరిగిన విధానం అంతా పూస గుచ్చి నట్లు అందులో రాశారు .దీనిపై ఆ పత్రిక సంపాదకుడు ‘’ఇలాంటి ఆపరేషన్లు అనేకం  విజయ వంతం గా నిర్వహించటం  భారతీయులకే చెల్లింది .కొత్త ముక్కు చక్కగా అతుకుతుంది .అంతకు ముందు ఎలా ఉండేదో అచ్చం అలానే ఉండటం ఆశ్చర్య కరం .నుదురు మీది చర్మ పు పోర తీసిన ప్రాంతం లో ఉన్న మచ్చ కాలక్రమం లో మాయమై పోతుంది ‘’అని భారతీయ శస్త్ర చికిత్సా నైపుణ్యాన్ని బహుదా ప్రసంసించాడు . .

మధ్య యుగ నవాబులలో ‘’మహమ్మద్ బీన్ తుఘ్లక్’’ అనే పిచ్చి తుఘ్లక్ గణితం ,ఖగోళం ,వైద్యం ,తర్కం ,శాస్త్ర విజ్ఞానాలలో అమోఘమైన పాండిత్యం ఉన్న వాడని పించుకొన్నాడు .మహా మేధావి .యుద్ధ విద్యలో ఆరి తేరిన వాడు .ధిల్లీ సుల్తానులలో మత మౌధ్యం లేని ఏకైక సుల్తాన్ తుఘ్లక్ .నిర్మాణ సామర్ధ్యం రాచకీయ చతురత ప్రసంశ నీయం .

 

 

 

 

 

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-12-13-ఉయ్యూరు

Posted in సైన్స్ | Tagged | Leave a comment

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -27

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -27

 

అంతరిక్ష పరిశోధక రాజా జయ సింగ్

రాజా జయ సింగ్ 1686లో జన్మించాడు .అప్పటికే మొగలాయీల పాలన క్షీణ దశ లో ఉంది .యవ్వనం లో ఔరంగ జేబ్ తో సాన్నిహిత్యం సంపాదించాడు .విశాల్ ఘర్ ఆక్రమణకు సాయం చేశాడు .మెచ్చిన జేబు ‘’’’సవా’’బిరుదు ఇచ్చాడు .1797లో మహమ్మద్ షా పానిపట్టు యుద్ధం లో ఓడిపోయాడు .అప్పుడే జయ సింగ్ కు అవకాశం వచ్చింది .ఆధునిక ప్రణాళిక ఆధారం గా రాజస్తాన్ లో జైపూర్ పట్నాన్ని నిర్మించాడు .అంబర్ కోట లో ముస్లిం యువరాణి జయ సింగ్ ను చంద్రునికి భూమికి యెంత దూరం ఉందని ఒక రోజు హఠాత్తుగా అడిగింది .అప్పటి నుంచి ఖగోళ పరిశోధకుడయ్యాడు

 

Maharaja Jai Singh of Amber and Maharaja Gaj Singh of Marwar, 1630.jpg

 

 

.

యలుగ్ బేగ్ ,టైరో బ్రాహే,జాన్ సలాం స్తీద్ మొదలైన నిర్మాణ కర్తలకు దీటుగా ఒక ఖగోళ శాస్త్ర పరిశోధకుడిగా ,గణిత శాస్త్ర వేత్తగా ,జయసింగ్ పేరు పొందాడు .ఒక డిగ్రీ కి ‘’సైన్ ‘’విలువ కనుకొన్నాడు .ఈయన కని  పెట్టిన  ఒక వందేళ్ళ తర్వాత యలుగ్ బేగ్  ఆ విలువను సాధించాడుఅలమా జెస్ట్ ,తాబ్యులే ఆస్త్రానిక మొదలైన గ్రంధాలను సంస్కృతం లోకి అనువదించాడు జయ సింగ్ మహా రాజు .1730లో ఒక బృందాన్ని పంపి లిస్బన్ రాజు దగ్గరున్న ఖగోళ శాస్త్ర వేత్త ‘’జేవియర్ డే సెల్వా ‘’ను దిల్లీకి పిలిపించాడు .షా రాజు కూడా ప్రోత్సహించాడు . జైపూర్ లో అబ్సర్వేటరి నిర్మాణానికి అనుమతించాడు .దీనితో బాటు వారణాసి లో గంగా తీరం లో ,ఉజ్జయిని లో క్షిప్రా నది ఒడ్డున దిల్లీలో జంతర్ మంతర్ అబ్సర్వేటరిలను స్తాపించాడు .

ధిల్లీ లో జంతర్ మంతర్ లో యంత్ర ,మంత్రం పరికరలున్నాయి .కొందరు బంది పోట్లు దీన్ని ధ్వంసం చేశారు .ఇక్కడ ‘’సామ్రాట్ యంత్ర ‘’,రాం తంత్ర .జయప్రకాష్ తంత్ర ,మిశ్ర యంత్ర అనే నాలుగు ప్రధాన నిర్మాణాల అంతర్యం ఈ నాటికీ నిగూఢ రహస్యం గానే ఉంది .

సామ్రాట్ యంత్ర –ఇది సన్  డయల్ .కాలాన్ని చెబుతుంది .జయసింగ్ మేధో నిర్మాణం ఇది

.రాం తంత్ర –రెండు గోళాకార నిర్మాణాలు .ప్రతిదాని మధ్య ఒక స్తంభం ,గ్రహ మండలం లో వివిధ గ్రహాల సమతల కొణాల అధ్యయనానికి గుర్తులు .గ్రహాల స్తితి గతులను ఖచ్చితం గా కనుక్కో వచ్చు .1818లో ఖగోళ శాస్త్ర వేత్త’’ దార్నే’’ దీన్ని సందర్శించి ‘’ఒకే సమయం లో వివిధ ఖగోళ శాస్త్ర అధ్యయనాలు చేసిన పొర బాట్లను నిరోధించటానికి ,ఫలితాలను పోలిక చేయ టానికి ఈ నిర్మాణాలు చేబట్టిన జయ సింగ్ ప్రపంచ ఖగోళ శాస్త్రానికి మహోప కారం చేశారు ‘’అని కీర్తించాడు .

జయ ప్రకాష్ ,రామ యంత్ర రెండు కూడా నక్షత్రాలను ,గ్రహాలను నిశితం గా పరిశీలించేటానికి వీలు కలిగింది .గిన్నె ఆకారం లో ఉండే ఈ పరికరాలు ఆకాశం లో ప్రయాణించే ఒక వస్తువు ద్రవ్యాన్ని పూర్తీ స్తాయిలో గంట గంటకూ గుర్తింప జేస్తాయి .

మిశ్ర యంత్రం –నాలుగు భాగాలున్న యంత్రం .నియమితమైన చక్ర భాగం లో ఉండే ధ్రువ రేఖ ను సూచిస్తుంది .మధ్యాహ్నం 12గంటలకు యూరప్ ఖండం లో రెండు ,జపాన్ ఫసిఫిక్ మహా సముద్రాలలో ఒక్కొక్కటి వంతున నాలుగు స్తానాలకు సంబంధించి ఈ ద్రువరేఖ సూచిస్తుంది .రెండవ వైపు సామ్రాట్ యంత్ర భాగం ,మూడవది దక్షినోత్తర భిత్తి యంత్రం ఉంది ఇది మధ్యాహ్న రేఖ యొక్క ఉన్నతాంశాన్ని అంటే

ఎత్తు ను తెలియ జేయటానికి తూర్పు గోడమీద ఉంది .నాల్గవది కర్కట రాశి వలయ .పడమటి గోడ మీద ఉంది ,కర్కాటక రాశి లోకి సూర్య గ్రహ ప్రవేశాన్ని తెలుపుతుంది .

 

 

Inline image 1Inline image 7Inline image 8

 

 

 

మిశ్ర యంత్ర కు నైరుతి భాగం లో ఉన్న రెండు స్తంభాలు సంవత్సరం లో అతి పెద్ద అతి చిన్న పగటి సమయాలరోజులను తెలుఉతాయి .డిసెంబర్ లో వీటిలో ఒక స్తంభం తన నీడ ను పూర్తిగా రెండవ స్తంభం మీదకు ప్రసరింప జేస్తుంది .జూన్ నెల లో తన నీడ ను రెండవ స్తంభం పై అసలు పడ నివ్వదు .రాజా జయ సింగ్ నిర్మించిన ఈ ‘’వేద శాలలు ‘’అంటే అబ్సర్వేటరీలు చాలాకాలం నిరుప యోగం గా పడి ఉన్నాయి .యలుగ్ బేగ్ అధ్యయనాలకు సమంధించిన ‘’తారా సరణి ‘’గ్రంధాన్ని సవరించి ,ఆధునీకరించటానికే ఎక్కువ సమయం ఖర్చు చేశాడు జయ సింగ్ .కాని గ్రాహ కూటమి సంబంధించిన ప్రాచీన అధ్యయనాలు అధ్యయనాలు  సరి యైనవి కావని గ్రహించాడు .భూ అక్షం పరిభ్రమణ పై విస్తృత అధ్యయనం చేశాడు .

ఇంత కస్టపడి ఇంత బుద్ధి పెట్టి నిర్మించిన జంతర్ మంతర్ ఒక అద్భుతం గా మిగిలి పోయిందే కాని జయ సింగ్ ఆశించిన ఫలితాలను ఇవ్వ లేక పోయింది .అసలు సంస్కృతం లో దీని పేరు ‘’యంతర్ -మంతర్ .‘’అపభ్రంశం చెంది ‘’జంతర్ మంతర్ ‘’అయింది ఇప్పుడు ఈ పేరు గారడీ కి ,కని కట్టు కు పర్యాయ పడమై పోయింది .హత విధీ

-15—1-2001 ణ ప్రఖ్యాత భౌతిక శాస్త్ర వేత్త స్టీఫెన్ హాకింగ్ జంతర్ మంతర్ ను దర్శించాడు .దీని నిర్మాణ వైభవాన్ని ,ఆలోచనలను మెచ్చుకొన్నాడు దీనికి పునర్వైభవం సాధించాలని హితవు చెప్పాడు .’’.Einstein had objected strongly to the un certainty principle in physics .,remarking that God did not play dice with the universe .But the evidence is that god is a quiet a gambler .it was necessary to incorporate the un certainty principle into Einstein;s general theory of relativity ‘’అని ఢిల్లీ లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ‘’బిగ్ బాంగ్ ‘’అంశం మీద ప్రత్యెక ప్రసంగం చేస్తూ వ్యాఖ్యానించాడు’’ సైన్స్ కింగ్ స్టీఫెన్ హాకింగ్ ‘’.

జంతర్ మంతర్ నిర్మాణం లో జయసింగ్ కు సహకరించిన వాడు మన జగన్నాధ పండిత రాయలూ ఉన్నాడు .ఈయన తూర్పు గోదావరి జిల్లా ‘’ముంగండ’’ గ్రామస్తుడు .అలభ్యమైన ప్రాచీన గ్రంధాలను తిరిగి

సంస్కృతం లో రాసిన దిట్ట .’’సామ్రాట్ సిద్ధాంత’’పేరిట గణిత శాస్త్ర పరిశోధన గ్రంధాన్ని రాశాడు పండితుడు .జగన్నాధుని గంగా లహరి రసగంగాధారం అనే అలంకార శాస్త్రం ఆయన వైదుష్యానికి కర దీపికలు జయ సింగ్ నిర్మించిన అబ్సర్వేటరికి తన వంతు సహకారం అందించిన శాస్త్ర పండితుడు జగన్నాధ పండితుడు

 

ప్రాచీన కాలం లో ‘’వైబ్రేషనల్ ఎనేర్జి’’ అంటే మంత్రం శక్తి ఆధునిక కాలం లో ‘’మెకానికల్ ఎనేర్జి ‘’గా మారిందని భావిస్తున్నారు .అయిన్  స్టీన్ ఐన చెప్పిన ‘’లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనేర్జి ‘’మన మహా భారతం లో కనిపిస్తుంది .ద్రుత రాస్త్రుడికి సంజయుడు కురు క్షేత్ర యుద్ధాన్ని దివ్య దృష్టితో హస్తిన నుంచే చూచి వివ రించాడు .ఇవాళ మనం అనేక విషయాలను  చానెళ్ళ ద్వారా ఎన్నో వేల మైళ్ళ నుండే చూస్తున్నాం దీనికి అదే మూలం .

అయిన్ స్టీన్ న్ గారి ‘’formula nothing –but Autom bomb;s principle –E=mc2అనేది మన గాయత్రి మంత్రం లోని భావనకు సరి పోతుంది అంటారు .’’వరేణ్యం ‘’అంటే స్క్వేర్ .’’సవితు’’ అంటే’’ వెలాసిటి ఆఫ్ లైట్’’ .ఈ రెంటిని సమన్వయ పరిస్తే ఆయిన్ స్టీన్   భావన అందు తుంది అంటారు

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -3-12-13-ఉయ్యూరు   .

.

 

Posted in సైన్స్ | Tagged | Leave a comment

సలలిత రాగ సుధారస సారం – ఈటీవీలో స్వరాభిషేకం – క్రిష్ణమోహన్ జ్ఞాపకాలు

swarabhishekam0001 0002

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఆంద్రులు అంటే ఆగ్రహం

ఆంద్రులు అంటే ఆగ్రహం

‘తెలుగు వాళ్లంటే’ సోనియాకు కోపమా? అది… పీవీ నరసింహారావు నుంచే మొదలైందా? లేక… అంతకుముందు నుంచేనా? ఆమె కోపానికి కారణమేమిటి? రాష్ట్రాన్ని విభజించి తీరాల్సిందే అన్న పట్టుదల ఎక్కడి నుంచి వచ్చింది? సి.నరసింహారావు రాసిన ‘సోనియా జీవన విశ్లేషణ’లో చివరి భాగం…

రాజీవ్‌గాంధీ ప్రధాని అయిన తరువాత లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టే సభ్యులెవరని అడిగితే… దక్షిణాదిన తెలుగు అనే భాష మాట్లాడే రాష్ట్రం నుంచి వచ్చిన ఎంపీలని సోనియాకు తెలిసింది.

కాంగ్రెస్ పార్టీ ఇతర మిత్రపక్షాలతో కలసి 2004లో ప్రభుత్వం ఏర్పరచగానే సోనియాగాంధీ జాతీయ సలహామండలి (ఎన్ఏసీ) ఏర్పరిచారు. రాజకీయవాదులెవరికీ అందులో స్థానం కల్పించకుండా ఉన్నత విద్యావంతులు, సమాజసేవలో దీర్ఘకాలంగా పాల్గొన్నవారికే సభ్యత్వం ఇచ్చారు. వివిధ విధానాలకు ఆ సలహామండలి రూపకల్పన చేస్తుంది. ప్రభుత్వం వాటిని చేపడుతుంది. పది సంవత్సరాలుగా మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అనేక విధాన నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొందరు సిద్ధాంతకర్తలు మాత్రమే వాటితో విభేదించారు. కానీ, లక్షలాదిగా ప్రజలు వీధుల్లోకి వచ్చి, అతి తీవ్రస్థాయిలో విభేదించిన నిర్ణయం ఒకే ఒక్కటి తీసుకోవడం జరిగింది. అదే… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన. సోనియా చొరవతో, పట్టుదలతో తీసుకున్న నిర్ణయం ఇది. ఆమె సొంతంగా తీసుకున్న నిర్ణయం ఇది తప్ప మరొకటి లేదని చెప్పవచ్చు. సోనియాకు రాజకీయాలపైగల ఏవగింపువల్ల అసలు దినపత్రికలను ముట్టుకోరు. తన చుట్టుపక్కల ఉన్నవాళ్లు మాట్లాడే హిందీ తప్ప… భారతదేశంలోని ఇతర ప్రధాన భాషల గురించి ఆమెకు ఇసుమంతయినా తెలియదు. రాజీవ్‌గాంధీ ప్రధాని అయిన తరువాత లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టే సభ్యులెవరని అడిగితే… దక్షిణాదిన తెలుగు అనే భాష మాట్లాడే రాష్ట్రం నుంచి వచ్చిన వారని ఆమెకు తెలిసింది.

సోనియా 1983లో పౌరసత్వం తీసుకోవడం గురించి, పౌరసత్వం తీసుకోకుండానే 1980లో ఆమె ఓటరుగా చేరడం గురించి లోక్‌సభలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఉపేంద్ర చాలా ఘాటుగా విమర్శించారు. ఆ విమర్శలతో ఆమె ఎంతగా గాయపడ్డారంటే… హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఉపేంద్ర ఎదురుపడినప్పుడు ‘నీ అంతు చూస్తా’ అని హెచ్చరించారట! దీనిపై లోక్‌సభలో గందరగోళం జరిగింది. తరువాత బోఫోర్స్ కుంభకోణం గురించి తెలుగుదేశం సభ్యులే ప్రధానంగా లోక్‌సభలో లేవనెత్తారు. సోనియా పాత్రను ప్రస్తావించారు. అసలు ఖత్రోకీ ఎవరని ప్రశ్నించారు. తెలుగుదేశం ఆనాడు లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షంగా ఉండేది. సభలో మాట్లాడే అవకాశం వారికే ఎక్కువగా వచ్చేది. వారితో ఇతర ప్రతిపక్షాలు జత కలిసేవి. ప్రతిపక్షంలో ఉన్న జైపాల్‌రెడ్డి (ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీ, కేంద్రమంత్రి) బోఫోర్స్‌పై తీవ్ర విమర్శలు గుప్పించగా… రాజీవ్‌గాంధీ అమిత క్రోదంతో ‘మీకు శారీరక వైకల్యమే కాదు, మానసిక వైకల్యం కూడా ఉంది’ అని మండిపడ్డారు.

దీనిపై పార్లమెంటులో పెద్ద దుమారం చెలరేగింది. వి.పి.సింగ్ కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లడం, ప్రతిపక్షాలన్నీ కలసి కూటమిగా ఏర్పడడం, ఆ కూటమి ఏర్పాటుకు తెలుగుదేశం చొరవ తీసుకోవడం వంటివి సోనియాకు తెలుగువారిపై తీవ్ర ఆగ్రహం కలగడానికి కారణమయ్యాయి. దానికి తగ్గట్టే, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికైన ఒక మహిళా ఎంపీ రాజీవ్‌కు అతి సన్నిహితంగా ఉంటుందన్న వార్తలు సోనియాను అమితంగా కలచివేశాయి. సోనియా జాతీయ సలహా మండలి చైర్మన్‌గా లాభదాయక పదవిలో ఉన్నందున… ఆమె లోక్‌సభ సభ్యత్వం రద్దుచేయాలని టీడీపీ నేత ఎర్రన్నాయుడు గళమెత్తారు. ఇతర విపక్ష సభ్యులూ ఈ అంశాన్ని లేవనెత్తారు. దీంతో జాతీయ సలహామండలి అధ్యక్ష పదవితోపాటు లోక్‌సభ సభ్యత్వానికీ 2006లో రాజీనామా చేయాల్సి రావడం సోనియాను తీవ్రంగా కలచివేసింది. ఆ తర్వాత ఆమె తిరిగి లోక్‌సభకు పోటీచేసి ఎన్నికయ్యారు.

ఇక 1991లో విధిలేని పరిస్థితుల్లో పి.వి.నరసింహారావును తాను ప్రధానిని చేస్తే, ఆయన తననేమాత్రం ఖాతరు చేయకపోవడంతోపాటు తనగురించి చులకనగా మాట్లాడుతున్నట్లు తెలుసుకుని ఆమె ఖిన్నురాలయ్యారు. తన పట్ల ఎన్నడూ కృతజ్ఞతాభావం చూపలేదనే కోపంతో పీవీపై ఆమెలో ద్వేషం పెరిగింది. తాము కేంద్రంలో, రాష్ట్రంలో తిరిగి అధికారానికి వచ్చిన తరువాత రాష్ట్రానికి రాజశేఖర రెడ్డిని ముఖ్యమంత్రిని చేయగా… ఆయన ఎవరినీ ఖాతరు చేయకుండా స్వతంత్రంగా వ్యవహరించడం, అనేక ఆరోపణలు రావడం, 2009 ఎన్నికలకు ముందు రాష్ట్రాన్ని రెండుగా విభజించాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాలని ఆమె ఆదేశించినా ఖాతరు చేయకుండా రోశయ్య కమిటీని ఏర్పాటు చేయడం వంటి అనుభవాలతో తెలుగువారి పట్ల సోనియాకు తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ‘నిజాయతీగల క్రైస్తవులు తాము ఇచ్చిన మాటకు ఎప్పటికీ కట్టుబడి ఉంటారు’ అని సోనియాకు తన చిన్నతనం నుంచి తల్లి, తండ్రి చెప్పేవారు.

“ఆంధ్రప్రదేశ్‌ను విభజించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇస్తానని నేను వాగ్దానం చేశాను. రాష్ట్రంలో రెండోసారి అధికారానికి వచ్చిన తరువాత అయినా ఆ మాట నిలబెట్టుకోవాలి” అని సోనియా పార్టీలో కీలకమైన వ్యక్తులకు రెండుమూడు సార్లు చెప్పారు. ఆమె ఈ అంశానికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో దీనిద్వారా వారికి అర్థమైంది. 2009లో తాను తీసుకొన్న విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరాహార దీక్ష చేసిన ఆంధ్రా ఎంపీకి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆమె అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. ఆయన రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌కు పెద్ద మొత్తం విరాళంగా పంపితే దాన్ని తిప్పికొట్టారు. రాష్ట్ర విభజనపై ఆమె ఎంత పట్టుదలగా ఉన్నారో ఇంతకన్నా వేరే చెప్పనవసరం లేదు.

తెలివితక్కువ వ్యక్తులు కీలక స్థానాల్లో ఉన్నా, కీలక నిర్ణయాలు తెలివి తక్కువగా తీసుకుంటున్నా ఈ ప్రభుత్వం, ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలా ముం దుకు సాగుతున్నాయన్న అనుమానం ప్రతి ఒక్కరికీ కలుగుతుంది. ఆ సందేహాన్ని నివృత్తి చేస్తూ ప్రఖ్యాత చరిత్రకారుడు అర్నాల్డ్ టాయన్‌బీ తన ‘స్టడీ ఆఫ్ హిస్టరీ’ గ్రంథంలో ఇలా చెబుతారు. “మానవ చరిత్రలో వేలాది సంవత్సరాలు కొనసాగిన రాచరిక వ్యవస్థలో, అత్యధిక శాతం రాజులు అవివేకులే అయి ఉండేవారు. అయినా ఆయా రాజ్యాల పురోగతికి ఆ రాజుల అవివేకం అడ్డుకాలేదు”.

ఇదీ చదువు…
సోనియా స్వయంగా అంగీకరించిన ప్రకారం… ఆమె కళాశాల, విశ్వవిద్యాలయ స్థాయి చదువులేవీ చదవలేదు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీవంటి అర్హతలు ఆమెకు లేవు. ఆమె పూర్తి చేసింది… సాంతా తెరెసా ఇన్‌స్టిట్యూట్‌లో మూడేళ్ల విదేశీ భాషల (ఇంగ్లిషు, ఫ్రెంచ్) కోర్సు. కేంబ్రిడ్జిలోని లెనాక్స్ కుక్స్ స్కూలులో ఇంగ్లిషుపై సర్టిఫికెట్ కోర్సు. పొరుగు దేశాలలో ఉపాధికోసం వెళ్లే యువతుల కోసం సాంతా తెరెసాలో ఇంగ్లిషు, ఫ్రెంచి భాషలను నేర్పే కోర్సులు ప్రవేశపెట్టారు. ఇక.. కేంబ్రిడ్జిలోని లెనాక్స్‌కుక్ స్కూల్‌ను రిటైర్డ్ ప్రొఫెసర్ ఒకరు నడిపేవారు. ఇంగ్లిషు, ఫ్రెంచి భాషలను సోనియా ఇతర దేశాల్లో తన ఉద్యోగావకాశాలను మెరుగుపరచుకునేందుకే నేర్చుకున్నారు.

భాషా వ్యాసంగం..
మొదట్లో… సోనియా సాధారణ విషయాలను, తన మదిలోని భావాలను ఇంగ్లిషులో సరిగ్గా వ్యక్తం చేయలేకపోయేవారు. ఆమె చెప్పిన అంశాలను అర్థం చేసుకోవడానికి ఇందిరాగాంధీ ఇంకో రెండుమూడు ప్రశ్నలు అడగాల్సి వచ్చేది. ఇది ఆమెకు చాలా చికాకు కలిగించేది. అందుకే పనివారితో, ఇతరులతో మాట్లాడడానికి వీలుగా హిందీ నేర్చుకోవాలని సోనియాను ఇందిర ఆదేశించారు. అతి ప్రవీణురాలైన ఒక టీచరును కూడా ఇందుకోసం నియమించారు. ఆ అధ్యాపకురాలు, సోనియాకు హిందీ అక్షరాలు నేర్పడానికి నెల రోజులపాటు ప్రయత్నించింది. అయినా, సోనియా మనస్సుకెక్కలేదు. సోనియా కూడా ఇలా నేర్చుకోవడం తనవల్ల కాదని తేల్చేశారు. ఇతరులతో వచ్చీరాని హిందీలో మాట్లాడడం మొదలుపెడితే, క్రమంగా ఆ భాష వచ్చేస్తుందని సోనియా ఒక నిర్ణయానికి వచ్చి, ఆ ఉపాధ్యాయురాలిని మాన్పించి వేశారు.

సోనియాగాంధీ విపరీత మనస్తత్వం గలవారు కాదు. అపసవ్య ఆలోచనా ధోరణిగలవారు అసలేకాదు. అయితే ఆమెకెందులోనూ కించిత్ పరిజ్ఞానం లేదు.ఏ అంశాన్నీ అవగతం చేసుకోలేరు. పైగా భారత సమాజం గురించి కనీస అవగాహన లేదు. ఎటువంటి విలువలకూ కట్టుబడి ఉండాలన్న నిబద్ధత లేదు. ఎవరికైనా… అసలు అవగాహనే కనీస స్థాయిలో ఉన్నప్పుడు అవగాహనను పెంచుకోవాలన్న కాంక్ష అంతకంటే కనీస స్థాయిలో ఉంటుంది.

 

ఫోర్సుగా..బోఫోర్సుగా!

ఆమె దేశ ప్రధానమంత్రికి కోడలు! కానీ… చేతిలో డబ్బులుండేవి కావు! కేవలం నెలకు నాలుగైదువేలు వస్తాయని చెప్పగానే… ఆమె ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఏజెంట్ అయ్యారు. ఆ తర్వాత సోనియాపై ఇంకా ఎలాంటి ఆరోపణలు వచ్చాయి? ఖత్రోకీ కుటుంబంతో ఆమెకు పరిచయం ఎలా కలిగింది? తెలుగువాడైన పీవీ నరసింహారావు ప్రధాని ఎలా అయ్యారు? పీవీ అంటే సోనియాకు ఎందుకంత కోపం? చదవండి…

ఇండియాలో 1968 ఫిబ్రవరి నుంచి నివసిస్తున్నా 1983 వరకు సోనియా భారత పౌరసత్వం తీసుకోలేదు. ఆమె ఇటాలియన్ పాస్‌పోర్ట్ ఆధారంగానే ఇక్కడ ఉండేవారు. సంబంధిత పత్రాలను ఎప్పటికప్పుడు నవీకరించుకోవడానికి (రెన్యువల్) ఇటలీ ఎంబసీకి వెళ్లేవారు. ఒకసారి ఎంబసీలో సోనియాకు మేరియా ఖత్రోకీ తటస్థపడ్డారు. ఆమె సోనియాను గుర్తుపట్టి తననుతాను పరిచయం చేసుకున్నారు. తన భర్త ఒట్టావియో ఖత్రోకీని మెలినారీ అనే మిత్రుడు రాజీవ్‌గాంధీకి పరిచయం చేశారని మేరియా చెప్పారు. ఎంబసీలో సోనియా పని పూర్తయ్యాక కూడా వాళ్లిద్దరూ చాలాసేపు కబుర్లు చెప్పుకొన్నారు. సోనియా వివాహమైన తరువాత ఇందిరాగాంధీ ఒక హెచ్చరిక చేశారు. తమ ఇంట్లో విదేశీయులు బస చేయడం తనకేమాత్రం అంగీకారం కాదని, సోనియా బంధువులు వచ్చినా ఏదైనా అతిథిగృహంలో ఉంచాల్సిందే తప్ప తమ అధికారిక నివాసంలో ఉండడం కుదరదని చెప్పారు. తల్లి చెప్పిన మాటలను రాజీవ్ «ద్రువీకరించారు.

సోనియా తల్లితండ్రులు, అక్క అనుష్క, బావ తదితరులు వస్తే ఖత్రోకీ ఇంట్లోనే ఉండేవారు. కాంగ్రెస్ పార్టీ 1980లో తిరిగి అధికారానికి వచ్చిన తరువాత ఖత్రోకీ కార్యకలాపాలు తారస్థాయికి చేరుకున్నాయి. స్నామ్ ప్రొగెట్టీ అనే కంపెనీకి ఖత్రోకీ భారతదేశంలో ప్రతినిధి. భారత్‌లో ఎవరు రిఫైనరీ పెట్టాలన్నా, ఎరువుల ఫ్యాక్టరీ కట్టాలన్నా ఆ కాంట్రాక్టు ఈ ఇటలీ కంపెనీకి ఇచ్చి తీరాల్సిందే. ఆ విధంగా 1985 వరకు దాదాపు 60 కంపెనీల నిర్మాణ కాంట్రాక్టులు ఈ కంపెనీకి దక్కాయి. వాళ్లకు ఇవ్వకపోతే ఏం జరుగుతుంది? అని ప్రశ్నించవచ్చు. నావల్ కిశోర్‌శర్మ మంత్రిగా ఉన్నప్పుడు హజీరా, బీజపూర్, జగదీశ్‌పూర్ ఆయిల్ పైపులైను నిర్మాణ కాంట్రాక్టును, రూ.300 కోట్లు తక్కువ టెండరు వేసిన ఫ్రెంచ్ కంపెనీకి ఇచ్చారు. వెంటనే నావల్ కిశోర్ శర్మ మంత్రి పదవి పోయింది. కేబినెట్ సెక్రటరీ పి.కె.కౌల్‌ను అమెరికా రాయబారిగా పంపించారు. గెయిల్ చైర్మన్‌గా ఉన్న హెచ్.ఎస్.భీమాను తొలగించారు. ఆ తర్వాత ఖత్రోకీ ఏమైనా చెబితే రాజీవ్ చెప్పినట్టేనని ఉన్నతాధికారులందరూ భావించేవారు. బోఫోర్స్ కుంభకోణంలో ఖత్రోకీ పేరు ప్రముఖంగా వినిపించింది. స్వీడన్ కంపెనీ అయిన బోఫోర్స్‌కు ఇటలీతో సంబంధంలేదు. కానీ, ఆ కంపెనీ ప్రతినిధి విన్‌ఛద్దా.. బోఫోర్స్ ఫిరంగులను ఖత్రోకీ ద్వారా కొనిపించి, ఖత్రోకీ ఖాతాల్లోకి నలభైకోట్ల రూపాయలు బదిలీ చేశారు.

బోఫోర్స్ కుంభకోణం బయటపడగానే… రక్షణ శాఖ సహాయమంత్రి అరుణ్‌సింగ్ ఎంపీ, మంత్రి పదవులకు రాజీనామా చేసి ఎక్కడికో దూరంగా వెళ్లి ప్రశాంత జీవనం గడపసాగారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన శేఖర్‌గుప్తాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చాలా ఆసక్తికర విషయాలు చెప్పారు. “నేను బోఫోర్స్ లావాదేవీలో నయాపైసా తీసుకోలేదు. రాజీవ్ కూడా తీసుకోలేదని నాకు తెలుసు. కానీ, బోఫోర్స్ నలభైకోట్లు చెల్లించిన విషయం రుజువైంది. ఆ డబ్బు ఎక్కడికి చేరిందో పూర్తిస్థాయి విచారణ జరిపి, దోషులను పట్టుకొని, ఈ పాపంలో మనకు భాగస్వామ్యం లేదని నిరూపించుకొందాం అని నేనెంత వేడుకొన్నా రాజీవ్ వినలేదు. ఈ డబ్బు ఎక్కడకు చేరిందో రాజీవ్‌కు తెలుసని నాకు అర్థమైంది” అని తెలిపారు.

ఇటలీలో ఇండియా షాప్

సోనియా తండ్రి స్టెఫినోమైనో 1983లో చనిపోయారు. అక్కడ వారి కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. సోనియా తన అక్క అనుష్కతో రెండుచోట్ల రెండు షాపులు పెట్టించారు. రివొల్టాలో ఉన్న షాప్ పేరు ఏంటికా. అర్‌బస్సాలో పెట్టిన షాప్ పేరు ‘గణపతి.’ ఫ్రంట్‌లైన్ పత్రిక విలేకరి నారవానే అక్కడకు వెళ్లి వివరాలు తెలుసుకోబోతే… ఆయనతో మాట్లాడేందుకు అనుష్క తిరస్కరించారు. ఒక్కొక్కటి లక్ష రూపాయలకుపైగా ఖరీదైన కశ్మీరీ శాలువాలు, ఇండియా నుంచి వచ్చిన బొమ్మలు, గాజులు, గొలుసులు విపరీతమైన ధరలకు అక్కడ అమ్ముడుపోవడాన్ని ఆ విలేకరి గమనించారు. సోనియా చొరవతోనే ఈ వస్తువులన్నీ ఇటలీకి ఎగుమతి అవుతున్నట్లు ఆ విలేకరి పేర్కొన్నారు.
ఎంతోకాలం రాజీవ్, సోనియాలను అతి సన్నిహితంగా పరిశీలించిన పాత్రికేయురాలు తవ్లీన్‌సింగ్ తన పుస్తకం ‘దర్బార్’లో… రాజీవ్ ప్రధాని అయిన తరువాత ఆయన చుట్టూ ఉన్నవారు అతి కొద్దికాలంలో కోట్లు సంపాదించారని, దీనికి ఒక్కొక్కరూ ఒక్కో మార్గాన్ని ఎంచుకొన్నట్లు చెప్పేవారని తెలిపారు. కానీ… తమ పలుకుబడి ఉపయోగించి ప్రభుత్వం దగ్గర పనులు ఇప్పించి, లబ్ధి పొందుతున్నట్లు తేలిగ్గా అర్థమవుతోందని తవ్లీన్‌సింగ్ ఒక నిర్ణయానికి వచ్చారు. ఇందిర హత్య తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 414 సీట్లు వచ్చాయి. ఆ ప్రభుత్వాన్ని దేశంలో ప్రతిఒక్కరూ సద్భావంతో చూడడం, మీడియా పెద్దగా విమర్శించకపోవడంతో అప్పుడు జరిగిన అవినీతి కార్యకలాపాలు అంతగా వెలుగు చూడలేదు. రాజీవ్ అధికారంలో ఉన్నప్పుడు, సోనియా ప్రాభవం ఎంతగా సాగేదంటే… ఖత్రోకీ దంపతులను ఎలాంటి తనిఖీలు లేకుండా లోపలికి అనుమతించాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి. ఖత్రోకీ… ప్రధాని నివాసానికే ఉన్నతాధికారులను పిలిపించి మాట్లాడేవారు. ఇదంతా సన్నిహితంగా చూసిన ఒక ఉన్నతాధికారి “ప్రధాని పదవి ఇంతగా దిగజారిన సందర్భం మరొకటి లేదు. అయినా సోనియాగాంధీకి చెప్పగలిగేదెవరు? చెబితే అర్థం చేసుకుంటారా?” అని వ్యాఖ్యానించారు. తాను అందరికంటే గొప్పదాన్నని విశ్వసించే సోనియాగాంధీకి ప్రతిక్షణం తన నమ్మకాన్ని నిర్ధారించుకొనే, తన ఆధిపత్యాన్ని ప్రకటించుకొనే అవకాశం లభించింది.

మరో దశ…

బోఫోర్స్ కుంభకోణానికి మూలకారకురాలు సోనియానే అని, ఆమెపై రాజీవ్‌గాంధీ విరుచుకుపడ్డారని 1989 ఎన్నికల సమయంలో వార్తలు వచ్చాయి. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని సగానికిపైగా కోల్పోయి 197 సీట్లకు పరిమితమైంది. అధికారాన్ని కోల్పోయి ఒంటరిగా మిగిలింది. కానీ… అధికారంలోకి వచ్చిన పార్టీలు ఏకతాటిపై, ఏకోన్ముఖంగా నడిచేవి కావు. గత నిర్ణయాలపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టి కాంగ్రెస్ అగ్ర నాయకత్వాన్ని ఇబ్బందిపెడదామనే ఆలోచనే వారికి లేదు. ఈ పార్టీల మధ్య చెలరేగిన విభేదాల వలన ప్రభుత్వం కుప్పకూలి 1991లో తిరిగి లోక్‌సభ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల ప్రచారంలో ఉండగానే రాజీవ్‌గాంధీ హత్యకు గురయ్యారు. రాజీవ్ ఇక లేరన్న వాస్తవాన్ని సోనియాగాంధీ తట్టుకోలేరని, ఈ విషాదాన్ని పంచుకోవడానికి ఆత్మీయ మిత్రులెవరూ లేరని, ప్రతి ఒక్కరినీ ఆమె చేజేతులా దూరం చేసుకున్నారని అంతా భావించారు. “నేను వద్దని వేడుకొంటున్నా పరిస్థితుల ప్రాబల్యం వలన రాజీవ్ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. ఇటువంటి ఘోరం జరిగే ప్రమాదం ఉందని నేను పది సంవత్సరాలుగా భయపడుతూనే ఉన్నాను. చివరకు నా భయమే నిజమైంది” అని సోనియా ఒక ఇటాలియన్ పత్రికా విలేకరితో చెప్పారు. 1991 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 224 సీట్లు వచ్చాయి. సోనియాను ప్రధాని పదవి చేపట్టవలసిందిగా కాంగ్రెస్ నాయకులంతా అభ్యర్థించారు. ఆమె అందుకు తిరస్కరించి… పీఎన్ హక్సర్, ఎంఎల్ ఫోతేదార్, అరుణా అసఫాలీని ఉప రాష్ట్రపతి శంకర్‌దయాళ్ శర్మ దగ్గరకు పంపారు. ‘మీరు ప్రధాని పదవి స్వీకరించండి’ అని ఆయన్ను కోరారు. తనకు వయస్సు పైబడిందని, తానంత శ్రమపడడానికి సిద్ధంగా లేనని ఆయన సున్నితంగా తిరస్కరించారు. అప్పుడు సోనియాగాంధీ తగిన ప్రధాని అభ్యర్థి ఎవరని హక్సర్‌ను ప్రశ్నించారు. ఆయన తడుముకోకుండా పీవీ నరసింహారావు పేరు చెప్పారు.

పీవీ తాను ప్రధాని అయిన వెంటనే రాజీవ్‌గాంధీ ఫౌండేషన్ అనే సేవా సంస్థను నెలకొల్పారు. దానికి సోనియాను చైర్మన్‌గా, ఇద్దరు పిల్లల్ని డైరెక్టర్లుగా ఎంపిక చేశారు. ఢిల్లీ నడిబొడ్డున కోట్ల విలువజేసే ప్రభుత్వ భవంతిని ఆ ట్రస్టుకు ఇచ్చారు. వంద కోట్ల రూపాయలను ప్రభుత్వ గ్రాంటుగా ఇచ్చారు. సోనియాకు రాజకీయాల పట్ల చెప్పలేనంత ఏవగింపు ఉంది గనుక, కనీసం ఆమె ఈ సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెంపొందించుకోవచ్చని ఆశించారు. ట్రస్టు కార్యక్రమాలు నిర్వహించడానికి, అనుభవజ్ఞులైన అధికారులను నియమించారు. సోనియా మొదటి సంవత్సరం ఆ సేవా కార్యక్రమాలపట్ల కొంత ఆసక్తి ప్రదర్శించారు. ఆ తరువాత వాటిని పట్టించుకోవడం పూర్తిగా మానివేసి, కేవలం తాను సంతకాలు పెట్టాల్సిన అవసరం వచ్చినప్పుడు మాత్రమే వివరాలు అడిగి తెలుసుకునేవారు.

ఆలోచనలతో కొత్త మలుపు
మొదట్లో… తనలో అసాధారణ శక్తులున్నాయన్న విశ్వాసం ఒకవైపు, తనలోని లోపాలు, బలహీనతలు బయటపడితే నిరాదరణకు లోనవుతాననే భయం మరోవైపు సోనియా మదిలో తిష్టవేసుకుని ఉండేవి. ఇందిరాగాంధీ చనిపోయిన తరువాత తనలో లోపాలున్నాయని మథనపడడం మాని అందరిపైనా తన ఆధిపత్యాన్ని నిర్ధారించుకోవడం, తన గొప్పదనాన్ని అందరూ అంగీకరించేలా చేయడం ప్రారంభమైంది. రాజీవ్‌గాంధీ చనిపోయిన తరువాత ఆమెలో బలీయమైన అహంభావం చోటుచేసుకొంది. “నేను కోరింది సాధించగలను. నేను ఏం చెబితే అది జరుగుతుంది’ అనే భావన మరీ బలపడింది. విపరీతమైన అహంభావం ఆవహించినప్పుడు చుట్టూ ఉన్న సమాజంలో తమ పాత్ర ఏమిటని కాకుండా, తమ మనసులో ఈ సమాజానికి ఎటువంటి స్థానం ఇవ్వవచ్చన్న ఆలోచనలు మొదలవుతాయి. ఇందిర కుటుంబానికి పీవీ అత్యంత విశ్వాసపాత్రుడు. ఏ అంశంపైన అయినా తడుముకోకుండా మాట్లాడగలిగే మేధావి. ఏ పదవినైనా అత్యంత సమర్ధంగా నిర్వహించగలరని, ఆయన నిజాయతీని శత్రువులు కూడా శంకించరని పేరు ఉంది. రాజీవ్‌గాంధీ ఉన్నప్పుడు సోనియాతో ఆయన ఎప్పుడూ వివరంగా మాట్లాడిన సందర్భం లేదు. ప్రధాని అయిన తరువాత ఆయన కొన్ని కీలక అంశాల గురించి అయిదారుసార్లు వివరంగా చర్చించబోయేవారు. కానీ, ప్రతిసారి ఆయన నిర్ఘాంతపోయి, నిశ్చేష్టులై బయటకు వచ్చేవారు. సోనియా ఎవరు చెప్పినా వినడమే తప్ప తిరిగి మాట్లాడరు. కానీ, ఆమె అభిప్రాయం తెలుసుకోవాలనే ఉద్దేశంతో పీవీ ఒకటికి రెండుసార్లు అడగడం ఇద్దరికీ ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టించింది. తరువాత తన ‘ఇన్‌సైడర్’ నవలలో కథానాయకుడు ఆనంద్ ఒక ప్రముఖ రాజకీయవేత్తను అభివర్ణిస్తూ… “చాలా గొప్పవాడినని అతను భావిస్తాడు. తనకన్నీ తెలుసుననుకొంటాడు. అతను నోరువిప్పితే చాలు అతని అజ్ఞానం దుర్గంధంలా వ్యాపిస్తుంది” అని పేర్కొంటారు. సోనియాకు అసలు ఏ అంశంపైనా కనీస పరిజ్ఞానం లేదని, అతి సామాన్య విషయాన్ని కూడా అవగతం చేసుకోలేదని, భారతదేశం గురించి, ఈ దేశ చరిత్ర, ప్రజల జీవన విధానం గురించి ఆమెకు లేశమాత్రమైనా అవగాహన లేదని కచ్చితంగా గుర్తించిన తరువాత… తప్పనిసరి సందర్భాలలో మాత్రమే సోనియాను పీవీ కలిసేవారు.

తప్పదంటూ తనే..
1997లో సోనియా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకొన్నారు. 1998 మార్చి 14న సీతారాం కేసరిని చాలా అవమానకరమైన రీతిలో తప్పించి, సోనియాగాంధీని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఎంపిక చేశారు. పేదలకు న్యాయం చేయగల శక్తి తమకు మాత్రమే ఉందని, ఇతర పార్టీలు పేదలను పట్టించుకోవని తానొక నిర్ణయానికి వచ్చానని, అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకొని దేశాన్ని ఒక దారిలో పెట్టాలని తన పిల్లలిద్దరూ కోరారని, అందుకే అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్నానని సోనియా చెప్పారు. 1999 ఎన్నికల్లో సోనియా దేశమంతటా విస్తృతంగా పర్యటించి కాంగ్రెస్ కు ప్రచారం చేశారు. అయినా, కాంగ్రెస్‌కు చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అతి తక్కువగా 114 లోక్‌సభ సీట్లు మాత్రమే వచ్చాయి. ఆ ఎన్నికలలో తాను కూడా గెలుస్తానో లేదోనన్న అనుమానంతో సోనియా అమేథీ నుంచి, బళ్లారి నుంచి కూడా పోటీ చేశారు. 2004లో, 2009లో మిత్రపక్షాల మద్దతుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయనతో సోనియాకు తీవ్ర విభేదాలు తలెత్తాయి. కానీ, మన్మోహన్‌తో చాలా సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. మన్మోహన్ తన చదువు పూర్తయ్యాక పాతిక సంవత్సరాలపాటు రకరకాల ఉద్యోగాలు చేశారు. తర్వాత పీవీ హయాంలో ఆర్థికమంత్రిగా, ఇప్పుడు ప్రధానిగా ఉన్నా… పదవిని ఆయన ఒక ఉద్యోగంలాగానే పరిగణిస్తారు. ప్రతిరోజూ సాయంత్రం అయిదుగంటలకల్లా ఒక ఉద్యోగిలాగా ఇంటికి వెళ్లిపోతారు. తనకీ ఉద్యోగం ఇచ్చిన వారి ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాలనుకుంటారు. పైగా రాజకీయాలను ఈసడించుకొనే సోనియా… మన్మోహన్ వృత్తిరీత్యా రాజకీయవాది కాకపోవడమే ఆయనకు సరైన అర్హతగా పరిగణించి ఉంటారు.

పీవీతో పెరిగిన అంతరం

మన్మోహన్ సింగ్‌ను పీవీ ఆర్థికమంత్రిగా నియమించి, ఆర్థిక నియంత్రణలను సడలించగానే ఆర్థిక వ్యవస్థ కొత్త ఊపిరి పోసుకుంది. పత్రికలన్నీ పీవీ పాలనను, నిర్ణయాలను ప్రస్తుతించసాగాయి. రాజకీయాల్లో పీవీకి 40 సంవత్సరాల ప్రత్యక్ష అనుభవం ఉంది. అలాగే, ఢిల్లీలో నాయకులకు భజన చేస్తూ పదవులు పొంది, పైరవీలు చేసే నాయకులెవరో ఆయనకు తెలుసు. రాష్ట్రాలలో ఆయా నాయకులకున్న బలమేమిటో తెలుసు. పీవీ దగ్గర తమ పప్పులుడకవని తెలిసిన ఆ నాయకులంతా సోనియాను కలవడం మొదలుపెట్టారు. ఆమె మొదట్లో వీరినెవరినీ ఆదరించే వారుకారు. కానీ, పీవీ తనను తరచుగా కలవకపోవడం, ప్రభుత్వంలో తీసుకొంటున్న నిర్ణయాలను వివరించకపోవడం… ఒక్కమాటలో చెప్పాలంటే తననసలు పట్టించుకోకపోవడం సోనియాను కలచివేసింది.

సోనియా గురించి పీవీ తన సన్నిహితుల దగ్గర ‘దట్ పూర్ లేడీ’ అంటూ చులకనగా మాట్లాడుతున్నారని, ఆమె వ్యక్తిగత వివరాలు అందరికీ చెబుతున్నారని, రాజీవ్ పాలనలో తీసుకొన్న నిర్ణయాలను పత్రికల వారికి అందించి, సోనియాను అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆమెకు నేతలు చెప్పేవారు. అయితే, పీవీపై తనకున్న కోపాన్ని ఉపయోగించుకుని తన అనుగ్రహం పొందడానికి వీరంతా ప్రయత్నిస్తున్నారని ఆమె గుర్తించి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయేవారు. తాము చెప్పేవి ఓపికగా వింటున్నారు గనుక ఆమె ఏకీభావం ప్రకటిస్తున్నట్లేనని ఆ నాయకులు భావించేవారు. “మీకు విధేయులుగా ఉండడం వలన పీవీ మాపై కక్ష సాధిస్తున్నారు. మా అనుచరులెవరికీ పదవులు లభించడంలేదు. మాకు సొంతపార్టీ పెట్టుకోక తప్పని పరిస్థితులేర్పడ్డాయి’ అంటూ ఎన్డీ తివారీ ప్రభృతులు సోనియాతో మొరపెట్టుకొన్నారు. పార్టీ పెట్టవద్దని ఆమె వారిని వారించలేదు. 1994లో తివారీ మరో పార్టీ పెట్టారు. అర్జున్‌సింగ్ వంటి పెద్ద నాయకులు కూడా అందులో చేరారు. ప్రత్యేకమైన పార్టీ పెట్టుకున్నాక కూడా ఆ నాయకులు తరచూ సోనియాను కలుస్తున్నట్లు పీవీకి ఇంటెలిజెన్స్ నివేదికలు వచ్చేవి.

(సోనియా ఇప్పటిదాకా ఒక్క కీలకనిర్ణయమైనా సొంతంగా తీసుకున్నారా? తీసుకుంటే… అది ఏది? తెలుగువారంటే సోనియాకు తీవ్రమైన కోపం, ద్వేషం ఉన్నాయా? ఉంటే… ఎందుకు? కీలకమైన వివరాలు… రేపటి సంచికలో!)

 

Select ratingGive it 1/5Give it 2/5Give it 3/5Give it 4/5Give it 5/5

బలహీన లక్ష్యాలను దెబ్బతీసి అందరినీ భయపెట్టే వ్యూహం

ఇప్పుడు… సోనియా అంటే ఒక శక్తి. ఆమె మాట అధికార పార్టీకి శిలా శాసనం. ఆమె అనుకుంటే ఎలాంటి చట్టాలైనా పుట్టుకొస్తాయి. కాదనుకుంటే… చట్టుబండలవుతాయి. ఇంత శక్తిమంతురాలైన సోనియా… ఇండియాకు వచ్చిన తొలినాళ్లలో ఎలా ఉండేవారు? ఆమెతో మిగిలిన వారు ఎలా మెలిగేవారు? ‘నాతో జాగ్రత్త!’ అనే సంకేతాలను సోనియా ఎలా పంపేవారు? సోనియా జీవితంలోని ఆసక్తికరమైన ఘట్టాలతో వ్యక్తిత్వ వికాస నిపుణుడు సి.నరసింహారావు రాసిన వ్యాసంలో రెండో భాగమిది…

తనతోపాటు చదివిన యువతులందరూ క్రైస్తవ సన్యాసినులుగా, ఇళ్లలో పనిమనుషులుగా, చిన్న చిన్న పనులు చేసేవారుగా ఉంటే…తానిలా భారత ప్రధాని కుమారుడిని వివాహమాడి ఎన్నడూ కనీవినీ ఎరుగని జీవితాన్ని పొందగలగడం సోనియాకు మహాద్భుతంగా అనిపించసాగింది. అతి సాధారణ స్థాయిలో ఉన్నవారి జీవితంలో ఒక మహాద్భుతమైన సంఘటన జరిగి, ఉన్నట్లుండి గొప్ప స్థానం పొందితే వారెలా భావిస్తారు? తనలో తాను కూడా గుర్తించలేని ఏవో అద్భుత శక్తులు, అసాధారణ ప్రతిభా పాటవాలు ఉన్నాయని భావిస్తూ, తమకు తాము అపూర్వ ప్రాధాన్యతను ఆపాదించుకోవడం ప్రారంభిస్తారు. జరిగిందంతా కలా, వాస్తవమా అనే సందిగ్ధం నుంచి బయటపడి,ఇదంతా వాస్తవమే అని నిర్ధారించుకోవడానికి కొన్ని వారాలు పడుతుంది. ఆ తరువాత తోటి వారెవ్వరూ గుర్తించలేని గొప్పదనమేదో తమలో ఉందన్న విశ్వాసం క్రమేణా బలపడడం ప్రారంభమవుతుంది. వెంటనే అంతే బలమైన సంశయం కూడా ఉద్భవిస్తుంది. తనలో తాను ఉన్నాయనుకొంటున్న గొప్పదనం, అసాధారణ ప్రతిభా విశేషాలు లేవని ఇతరులు గుర్తిస్తే…తనకిప్పుడు లభించిన ఉన్నత స్థాయిని కోల్పోవలసి వస్తుందేమోనన్న అభద్రతా భావం నీడలాగా వెన్నాడటం ప్రారంభిస్తుంది. ఈ అభద్రతా భావన నుంచి, తమను ఆవహించిన భయం నుంచి బయటపడే రీతిలో అప్పుడు వారి ప్రవర్తన రూపుదిద్దుకొంటుంది.

తడబడుతూ తొలి అడుగులు

1967 తరువాత అనేక రాష్ట్రాలలో కాంగ్రెస్ అనూహ్యమైన ఓటమిని ఎదురైంది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, ఇందిరాగాంధీకి మధ్య చెలరేగిన విభేదాలు తీవ్ర సంక్షోభం స్థాయికి చేరుకున్నాయి. ఇందిరాగాంధీకి ఇంట్లో వ్యవహారాలు పట్టించుకొనే తీరిక వుండేది కాదు. ఇందిరాగాంధీ పట్ల పూర్తి భయంతో, అణకువతో మెలుగుతూ నిరంతరం ఆమెతో మాట్లాడే అవకాశం కోసం సోనియా ఎదురుచూసేవారు. అయినా, ఇందిరాగాంధీ ఆమెను పట్టించుకొనేవారు కాదు. తన ప్రవర్తనను ఎలా మార్చుకోవాలో, ఎలా మెలగాలో తెలియజేస్తూ ఇందిర ఒకనాడు సోనియాకు ఒక లేఖ రాసి పంపారు. ఎప్పుడూ తన గదిలో ఒంటరిగా కూర్చుని ఉండే సోనియా, ఆ లేఖ అందగానే… ఏడుస్తూ ఇందిర వ్యక్తిగత కార్యదర్శి ఉషాభగత్ వద్దకు వెళ్లారు. “ఎప్పుడూ ఇంట్లోనే ఉంటాను కదా! ఏదయినా నాతో చెప్పవచ్చు. నాతో మాట్లాడవచ్చు. ఇలా ఓ కాగితంపై రాసి ఇవ్వడమేమిటి?” అని దీనంగా ప్రశ్నించారు.

ఉషాభగత్ ఆమెను ఓదార్చి… ‘ఇందిర తెల్లవారుజామునే లేచి తన కార్యాలయంలోకి వెళ్లి ఇతరులకు తాను తెలియజేయవలసిన విషయాలను కాగితంపై రాస్తారు. ఆమె తన తండ్రికి, భర్తకు కూడా ఇలాగే లేఖలు రాసేవారు’ అని చెప్పారు. అయినా, సోనియాగాంధీ ఆ షాక్ నుంచి తేరుకోలేకపోయారు. తరువాత రోజుల్లో ఇందిరాగాంధీకి సోనియా బాగా సన్నిహితమయ్యారు. ఇందిర సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి వేడినీళ్లు, టవల్, ఆమె కట్టుకొనే చీర అన్నీ సిద్ధం చేసిపెట్టేవారు. ఆమె ఎప్పుడు ఏ ఆహారం తీసుకొంటుందో గుర్తించి, అవి సిద్ధంగా ఉన్నాయో పర్యవేక్షించేవారు. అత్యంత నిపుణురాలైన పరిచారికలా సోనియా అత్తగారి దగ్గర వ్యవహరించేవారు. 1970లో రాహుల్, 1972లో ప్రియాంక పుట్టిన తరువాత సోనియా ఇందిరాగాంధీకి మరింత దగ్గరయ్యారు. అప్పటికి ఇందిరాగాంధీ కూడా రాజకీయంగా ఉచ్ఛస్థితికి చేరుకున్నారు. అయినా, ఇందిరా పట్ల సోనియా మదిలో భయం అలాగే ప్రతిష్టితమై ఉంది.

ఏ క్షణమైనా తన తల్లితండ్రుల వద్దకు (ఇటలీ) వెళ్లిపోవాల్సి రావచ్చన్న భయం ఆమెను నిరంతరం వెన్నాడడం వల్లనే సోనియా 1968 తరువాత 1983 వరకు భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసి ఉండరని ఆమె వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన మాధవన్ ఒక వ్యాసంలో పేర్కొన్నారు. 1975 జూన్ 25న దేశంలో ఎమెర్జన్సీ విధించిన తరువాత ఇందిరాగాంధీ మహాశక్తివంతురాలిగా అవతరించారు. ఈ పరిణామం జరిగి ఉండకపోతే సోనియా తన మదిలోని అభద్రతా భావాన్ని, ఆందోళనను, ఉద్రిక్తతను తొలగించుకొని కొద్దికాలంలోనే మామూలు వ్యక్తిగా అయ్యేవారేమో! కానీ, ఇంతపెద్ద దేశానికి మహారాజ్ఞిగా కోట్లాది మందిని శాసిస్తున్న ఇందిరాగాంధీ కోడలిగా తాను తగనేమో అన్న భయాందోళన.. తనలో ఏదో గూఢమైన శక్తి దాగి వుండడం వల్లనే ఇంత గొప్ప స్థితికి జేరుకోగలిగానన్న ఆత్మవిశ్వాసాన్ని కమ్మివేస్తుండేది. దెబ్బతీస్తుండేది.

అమాయకత్వపు ఛాయలు…

ఆ రోజుల్లో సోనియా, రాజీవ్‌గాంధీ ఇతర సన్నిహిత మిత్రులతో కలసి ప్రతి వారం ఒకటి రెండు పార్టీలకు వెళుతుండేవారు. అక్కడ సోనియా ప్రవర్తన గురించి, ప్రఖ్యాత పాత్రికేయురాలు తవ్లీన్‌సింగ్ తన కొత్త పుస్తకం ‘దర్బార్’లో అతి విపులంగా వివరించారు. ఆ పార్టీలకు సతీశ్ శర్మ, ఆయన భార్య స్టెర్రీ తప్పనిసరిగా వచ్చేవారు. స్టర్రీ ఇంగ్లండుకు చెందిన వనిత కావడంతో సోనియా ఆమెతోనే ఎక్కువగా మాట్లాడుతుండేది. సోనియాను ఎవరైనా పలకరించడానికి ప్రయత్నించినా ఆమె చాలా ముభావంగా ఉండేవారు. అప్పట్లో సోనియా స్కర్టులు, ఫ్రాకులు మాత్రమే ధరించేవారు. అందరికీ భిన్నమైన వ్యక్తినన్నట్లు ప్రవర్తించేవారు. ఒకటి రెండుసార్లు ఆమె ఏమయినా చెప్పబోతే, అందరూ ఆసక్తిగా తమ దృష్టి సారించేవారు. చివరకు ఈమె చెప్పేది చాలా పేలవంగా ఉండేది. ఒకరోజు “మా ఇంట్లో కూడా దోమలు విపరీతంగా ఉన్నాయి. పిల్లల ఉయ్యాల కింద దోమలు రాకుండా కాయిల్స్ వెలిగిస్తున్నాము. తరువాత డాక్టరు చెప్పాడు… దోమకాటుకంటే ఈ కాయిల్స్ వలన వచ్చే పొగే ఎక్కువ హాని చేస్తుందని” అని చెప్పి సోనియా పెద్దగా నవ్వారు. మిగిలిన వారు ఎవ్వరూ నవ్వకపోగా, ఇందులో ప్రత్యేకత ఏమున్నదన్నట్లు విచిత్రంగా చూడగానే సోనియా చిన్నబుచ్చుకున్నారు.


సంజయ్‌గాంధీ ప్రమాదంలో మరణించిన తరువాత అమేథీ పార్లమెంటు సీటు ఖాళీ అయ్యింది. అక్కడ ప్రచారానికి రాజీవ్‌గాంధీతో పాటు సోనియా కూడా వెళ్లారు. భారతదేశంలోని గ్రామాలను చూడడం ఆమెకిదే మొదటిసారి. అప్పటికి… ఈ దేశంలో స్థిరపడి పన్నెండు సంవత్సరాలయినా, భారతదేశంలో ఇతర ప్రాంతాలు చూడాలన్న ఆసక్తి ఆమెకు లేశమంతయినా లేదు. అమేథీలో తనకెదురయిన ఒక అనుభవాన్ని ఆమె విచిత్రంగా చాలాసార్లు వివరించేవారు. ఒక గ్రామానికి వెళ్లినప్పుడు, ఒక పసిపిల్లవాడు పాక్కుంటూ వెళ్లి, పేడలో చేతులు పెట్టి ఆడుకోవడం చూశానని, ఆ దృశ్యం తననెంతో కలచివేసిందని, ఇంతటి పేదరికాన్ని తాను ఊహించి ఎరగనని సోనియా ప్రతిసారీ వివరించి చెప్పేవారు. ఆమె చెప్పేది వినడానికి అక్కడ ఉన్న వారెవరూ పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. అక్కడ ఉన్న మహిళలందరూ రాజీవ్ భార్యగా, ఇందిరాగాంధీ కోడలిగా సోనియాను అమితంగా గౌరవించేవారు.

అదే సమయంలో ఆమె చెప్పేది వినడానికి, ఆమెతో కబుర్లు చెప్పడానికి ఎవరూ అంతగా ఆసక్తి కనపరిచేవారు కాదు. ఈ కారణంగా సోనియాలో తన పట్ల తనకు ఉన్న సందిగ్ధం, ద్వైదీభావన మరింత బలపడేవి. తనలో ఏవో అద్భుత, అసాధారణ శక్తులు దాగున్నాయని, అందుకే ఇంతటి ఉన్నత స్థితికి చేరుకోగలిగానన్న విశ్వాసం ఒకవైపు… తనకెందులోనూ ప్రవేశం, ప్రావీణ్యత లేదని వెల్లడయిపోతే తనకు లభించే గౌరవం, ప్రాధాన్యం మటుమాయమైపోతాయన్న అభద్రత మరోవైపు ఆమెను అయోమయానికి గురిచేసేవి. రాజీవ్‌గాంధీకి అతి సన్నిహితులైన వారిలో రాజకీయాల్లో ఉన్నవారు, రాజకీయాలకు దూరంగా వున్నవారు కూడా ఉండేవారు. సోనియా మాత్రం రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేనివారి దగ్గర కూర్చోవడానికే అధికాసక్తి కనపరిచేవారు.

ఆమెకు రాజకీయాల పట్ల, సమాజ ధోరణుల పట్ల, భారతదేశ విస్తృతిని గురించి, ఇక్కడి వైవిధ్యం గురించి ఎటువంటి అవగాహన లేదు. పైగా వీటిని అవగతం చేసుకోవడానికి ఏనాడూ ప్రయత్నించకుండా అసలు మనకు రాజకీయాలు వద్దు, రాజకీయాలకు దూరంగా ఉందాం అని అవకాశం వచ్చిన ప్రతిసారీ రాజీవ్‌గాంధీని అభ్యర్థించేది. రాజీవ్ కూడా అందుకు అంగీకరించేవారు. ఫలితంగా ఇక్కడి రాజకీయాల స్వరూప, స్వభావాలను పట్టించుకోవలసిన అవసరం ఆమెకు లేకుండాపోయింది. ఏ అంశాన్నీ అధ్యయనం చేయడానికి ప్రయత్నించకుండా తనకు రాజకీయాల పట్ల ఆసక్తి లేదన్న వంకతో అన్నింటికీ దూరంగా ఉండేవారు. తనకు తెలియని విషయాలను అర్థం చేసుకోవడానికి ఆమె ఏమాత్రం ప్రయత్నించేవారు కాదు.

తప్పని రాజకీయం…

1984లో ఇందిరపై అంగరక్షకులు కాల్పులు జరిపినప్పుడు అక్కడే ఉన్న సోనియాగాంధీ ఇందిరాగాంధీని హాస్పిటల్‌కి తీసుకువెళ్లడం, అక్కడ ఆమె మరణించినట్లు ప్రకటించడం, మరుసటిరోజే రాజీవ్‌గాంధీ దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడం, తమ నివాసాన్ని రేస్‌కోర్స్ రోడ్డులోకి మార్చడం చకచకా జరిగిపోయాయి. ఇందిర చనిపోయిన క్షణం నుంచి సోనియాను తీవ్రమైన భయం ఆవహించింది. తన భర్త రాజీవ్‌గాంధీకి కూడా ప్రాణభయం ఉందన్న ఆలోచనలే ఆమెను వణికించివేసేవి. దానికి తగ్గట్టే పీడకలలు వచ్చేవి. అర్ధరాత్రి నిద్రలేచి, వచ్చింది పీడకలే అని సరిపెట్టుకున్నా తిరిగి నిద్రపట్టేది కాదు. అత్యంత సుశిక్షుతులైన అంగరక్షకులు నిరంతరం తనను వెన్నంటి ఉంటారని, తనకెటు వంటి ప్రమాదం జరగదని రాజీవ్‌గాంధీ అనేకసార్లు సర్దిచెప్పడంతో సోనియాకు కొంత ఉపశమ నం కలిగేది.

కానీ, 1986 అక్టోబరు 2న అనుకోని సంఘటన ఒకటి జరిగింది. ఆరోజున మహాత్మాగాంధీ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచడానికి రాజీవ్, సోనియాలు రాజ్‌ఘాట్‌కు వెళ్లారు. దూరం నుంచి ఒక సిక్కు యువకుడు ఒక నాటు తుపాకీతో రాజీవ్‌పై కాల్పులు జరిపాడు. సిక్కు యువకుడు కాల్చడానికి ప్రయత్నించడం కంటే, ఆ కాల్పుల శబ్దం వినగానే రాజీవ్ పక్కనే ఉన్న అంగరక్షకు లు ప్రాణభయంతో పారిపోవడం సోనియాను ఎక్కువ కలచివేసింది. ఇక పరిపాలనా వ్యవహారాల్లో తాను జోక్యం చేసుకోవడం తప్పనిసరి అనే నిర్ణయానికి సోనియా వచ్చారు.

అధికార వ్యవహారాలపై పట్టు

సోనియా మనఃస్థితిలో మరో ప్రధాన దశ మొదలైంది. తనలో అసాధారణ, అతీత శక్తులేవో ఉన్నాయన్న నమ్మకం మరింత బలపడింది. అదే సమయంలో తనకేమీ తెలియదన్న విషయం బయటపడిపోతుందేమోనన్న ఆందోళన బలహీనపడ్డాయి. ఇప్పుడు తన గొప్పదనాన్ని అందరూ అంగీకరిస్తున్నారు. దానితోపాటు అందరిపైనా తన ఆధిపత్యాన్ని ఎప్పటికప్పుడు తాను నిర్ధారించుకోవాలి. అలా నిర్ధారించుకొన్నప్పుడు తన ఆధిపత్యాన్ని ఎవరూ తిరిగి ప్రశ్నించడానికి సాహసించరు. తనను సాధారణ వ్యక్తిగా ఎవ్వరూ పరిగణించరు. ఈ ఆలోచనలతోనే తన గొప్పదనాన్ని ప్రతి ఒక్కరితోనూ అంగీకరింపజేయాలన్న తపన, బలమైన ఆకాంక్ష ఆమెలో మొదలయ్యాయి. 1986లో రాజీవ్‌పై హత్యాప్రయత్నం జరిగిన తరువాత అరుణ్ నెహ్రూను హోంశాఖ నుంచి తప్పించాలని రాజీవ్‌పై సోనియా తీవ్ర ఒత్తిడితెచ్చారు.

ఆయన నెహ్రూ కుటుంబానికి సన్నిహిత బంధువు. అంతేకాకుండా రాజీవ్‌తో ఆయనకు సత్సంబంధాలు ఉండేవి. అయినా రాజీవ్‌కు భార్య మాట వినక తప్పలేదు. ఆ దెబ్బతో అరుణ్ నెహ్రూకు కాంగ్రెస్‌లో స్థానం లేకుండా పోయింది. సోనియాగాంధీ కారణంగా తమ మంత్రి పదవులు పోతున్నాయన్న అనుమానం వ్యాపించడంతో అందరూ ఆమె పట్ల అమిత వినమ్రత ప్రదర్శించేవారు. అదిచూసి, తన గొప్పదనం, అందరిపైనా ఆధిపత్యం నిర్ధారణ అయ్యాయ ని ఆమె భావించేవారు. తన గొప్పదనాన్ని నిర్ధారించుకోవడానికి సోనియా ఎప్పు డూ బలహీనమైన వ్యక్తుల్ని, సులభమైన లక్ష్యాలను ఎంచుకొంటారు. ఫలితంగా ఎక్కడా ఎదురుదెబ్బతగిలే అవకాశం ఉండదు.

 

ఒక సోనియా…4 సంఘటను

తన తండ్రి ఆరోగ్యం సరిగా లేదని చూసి రావడానికి సోనియా ఇటలీలోని స్వగ్రామానికి వెళ్లారు. ఆమె వచ్చిందని తెలుసుకొని టురిన్ పట్టణంలోని సాంత తెరెసా స్కూలులోని ముఖ్యులు, పాత విద్యార్థులంతా సమావేశమవుతున్నారని, ఆవె కూడా ఓ పది నిమిషాలు వచ్చి వెళితే తామెంతో సంతోషిస్తామని వేడుకొన్నారు. సోనియా పదిహేనేళ్ల వయస్సులో అక్కడ స్కూలులో ఇంగ్లీషు, ఫ్రెంచి నేర్చుకోవడానికి వెళ్లి హాస్టల్‌లో ఉం డేది. ఆమెతోపాటు ఆ గదిలో మరో ఇద్దరు యువతులు ఉండేవారు. సోనియాకు ఉబ్బసం ఉండేది. రాత్రిపూట విడవకుండా దగ్గుతుండేది. ఆమె దగ్గడం వలన తమకు నిద్రపట్టడంలేదని, ఆమెకు ప్రత్యేకగది ఇవ్వాలని ఆ ఇద్దరు యువతులు వార్డెన్‌తో చెప్పారు. ప్రత్యేక గదిలేదంటూ రాత్రిపూట వరండాలో పడుకోవలసిందిగా ఆ వార్డెన్ సోనియాను కోరింది.

సోనియా కూడా ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా అందుకు అంగీకరించారు. పగలంతా ఆ ఇద్దరు యువతులతో సోనియా అతి సన్నిహితంగా ఉండేది. ఆరోజున, తమ బాల్య స్నేహితురాలు సోనియా వస్తున్నట్లు తెలుసుకుని ఆ ఇద్దరు యువతులు మహాసంబరపడ్డారు. బడి బయటే నిలబడి సోనియా కోసం ఎదురుచూడసాగారు. అనుకొన్న సమయానికి సోనియా వచ్చారు. “నువ్వు చాలా గొప్పస్థానానికి ఎదిగావని అప్పుడప్పుడు ఇక్కడ పేపర్లో వస్తుంటుంది. ని న్ను చూసి చాలా గర్విస్తున్నాం” అని ఆ ఇద్దరు యువతులు చెప్పారు. ముందుగా వాళ్లను గుర్తుపట్టనట్లుగా సోనియా అభినయించారు. చివరకు గుర్తుకు వచ్చారని చెప్పి.. వాళ్లను వదిలేసి ముందుకు వెళ్లి అందరినీ పలుకరించసాగారు. ఆ ఇద్దరు యువతులు ఖిన్నులైపోయారు. సోనియాకు కావలసింది అదే!

రాజీవ్‌గాంధీకి డూన్ స్కూలు రోజుల నుంచి అరుణ్‌సింగ్ అత్యంత సన్నిహిత మిత్రుడు. అరుణ్‌సింగ్ కపూర్తలా రాజ వంశానికి చెందిన వ్యక్తి. మహానిజాయితీపరుడు. రాజీవ్‌గాంధీ తన తల్లి ఉన్నప్పుడే, అరుణ్‌సింగ్‌ను ఉత్తర ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎంపిక చేయించారు. రాజీవ్‌గాంధీ తాను ప్రధాని అయిన తరువాత రేస్‌కోర్సు రోడ్డులోకి మకాం మార్చి.. తన ప్రక్క ఇంటిని అరుణ్‌సింగ్‌కు ఇప్పించారు. అరుణ్‌సింగ్ భార్య నైనా చాలా భోళామనిషి. అందరితో కలుపుగోలుగా మాట్లాడేవారు. సోనియాకు అత్యంత సన్నిహితంగా, అంతరంగికురాలుగా ఉండేవారు. ఇద్దరి ఇళ్ల మధ్య మోకాలి ఎత్తులో చెక్కగేటు మాత్రమే ఉండేది. నైనా ఎప్పుడు పడితే అప్పుడు సోనియా ఇంట్లోకి వెళ్లగలిగేవారు. రాజీవ్ ప్రధాని అయిన తరువాత అతి సంపన్నులను అనుకరిస్తూ, సోనియా విపరీతంగా ఖర్చుపెడుతున్న విషయాన్ని నైనా ఇతర మిత్రులవద్ద ప్రస్తావించారు. ఆ విషయం సోనియా దృష్టికి వచ్చింది. దీనిపై ఆమె నైనాను పిలిచి అలా మాట్లాడవద్దని చెప్పవచ్చు లేదా గట్టిగా మందలించవచ్చు. అందుకు భిన్నంగా… తమ ఇళ్ల మధ్య ఉన్న గేటుకు తా ళం వేయించడమేకాదు, అక్కడ ఒక గార్డును కాపలా పెట్టారు. ఇది గమనించి నైనా ఖిన్నురాలయ్యారు.

(నైనాకే ఇంతటి పరాభవం ఎదురైతే, తామంతా ఇకపై సోనియాతో అత్యంత జాగ్రత్తగా మెలగాలన్న భావనతో సోనియా సన్నిహితురాలందరి ప్రవర్తనలోను మార్పు కొట్టవచ్చినట్లు కనిపించసాగింది. తన గొప్పదనం, ఆధిపత్యం నిర్ధారితమయ్యాయని సోనియా భావించుకోవడానికి ఇటువంటి సంఘటనలు ఆమెకు ఆలంబనంగా అవుతాయి.)

ఢిల్లీలో అత్యంత ప్రముఖ పాత్రికేయురాలు తవ్లీన్‌సింగ్ సోనియాతో అత్యంత సన్నిహితంగా ఉండేవారు. సోనియాకు ఆమె ఎప్పుడైనా ఫోను చేయవచ్చు. ఎప్పుడైనా వాళ్లింటికి వెళ్లవచ్చు. అలాగే, బయట పార్టీలకు వెళ్లినప్పుడు సోనియా తవ్లీన్ ప్రక్కన కొం తసేపు తప్పనిసరిగా కూర్చునే వా రు. తవ్లీన్ ఒక అపార్ట్‌మెంటు ఫ్లాట్ లో ఒంటరిగా ఉండేవారు. రాజీవ్ ప్రధాని కాకముందు సోనియా ఇంకా ఒకరిద్దరు స్నేహితురాళ్లు తవ్లీన్ ఇంటికి వెళ్లి ఒకపూటంతా గడిపేవా రు. సోనియా వాళ్లకు ఇటాలియన్ వంటలు రుచి చూపేవారు. అవి అత్యంత రుచికరంగా ఉండడం తో అందరూ ఆమెను మరీమరీ అభినందించేవారు. ఈ సాన్నిహిత్యం నేపథ్యంలో… సోనియా గాంధీని ఇంటర్వ్యూ చేయాల్సిందిగా తవ్లీన్‌ను ఇండియాటుడే సంపాదకుడు కోరారు. సోనియా ఎవరికీ ఇం టర్వ్యూ ఇవ్వదని తవ్లీన్‌సింగ్ చెప్పారు.

‘మీకు తప్పకుండా ఇస్తారు’ అని అరుణ్‌పూరీ చెప్పారు. ‘ఆమె ఇవ్వదని తెలిసి కూడా నేనెలా అ డుగుతాను? కావాలంటే ఆమె ప్రొఫైల్ రాద్దాం’ అని తవ్లీన్ పేర్కొన్నారు. సోనియాను ఆ మాట అడిగినప్పుడు… సందేహిస్తూనే అంగీకరించారు. మరుసటి రోజు ఇండియాటుడే సిబ్బంది తవ్లీన్‌తో కలిసి ప్రధాని నివాసానికి వెళ్లి సోనియాను కలిశారు. “ఇందిరాగాంధీ ప్ర ధానిగా ఉన్నప్పుడు దాదాపు పన్నేండేళ్లు ఆమెకు అతిసన్నిహితంగా వున్నారు. ఇప్పుడు ప్రధాని భార్యగా ఉన్నారు. మీరు ఇందిరాగాంధీలో గమనించిన ఉన్నత లక్షణాలేమిటి?” అని తవ్లీన్‌తోపాటు వెళ్లిన ఒక విలేకరి చాలా వినయంగా ప్రశ్నించాడు. సోనియాగాంధీ ఏమాత్రం తడుముకోకుండా… ‘పొద్దున్నే కార్యాలయానికి వెళ్లేప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ చీర ఎలా కట్టుకొనేదో, తిరిగి సాయంత్రం ఇంటికి వ చ్చేవరకు ఆ చీర అలాగే ఉండేది. ఆమె వారానికి ఒక పూట ఏమీ తినకుండా ఉపవాసం చేసేది. అది ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ రెండు విషయాలు నేను ఆమె నుంచి నేర్చుకొన్నాను” అని తెలిపారు. ఈ స మాధానం విని అక్కడున్నవారంతా బలవంతాన న వ్వు ఆపుకొన్నారు. ఆ తరువాత తవ్లీన్ ఆమెతో సరదాగా రకరకాల విషయాలు ప్రస్తావించి వాతావరణా న్ని తేలికపరిచింది.

చివరిగా.. ఇటలీకి, ఇండియాకు ఉన్న ప్రధాన తేడా ఏమిటని ఆమె ప్రశ్నించారు. దాని కి సోనియా తడుముకోకుండా ఒక రొట్టె పేరు, మూడు వంటకాల పేర్లు చెప్పారు. ‘అవి ఇండియాలో ఎక్కడా దొరకవు. కాని ఇటలీలో ప్రజలు చాలా ఇష్టపడతారు’ అని తెలిపారు. మరుసటి వారం సోని యా ప్రొఫైల్ ఇండియాటుడేలో ప్రచురితమైంది. అది విమర్శనాత్మకంగా లేదుగానీ, సోనియా ఆశించినరీతిలో అభినందనాపూర్వకంగా లేదు. అంతే కాదు. అక్కడక్కడా ఆమెపై వచ్చిన ఆరోపణలను కూ డా ప్రచురించారు. తరువాత తవ్లీన్‌సింగ్ సోనియాకు ఫోను చేసి, ఎ టువంటి విమర్శలు లేకుండా ఇలా మృదువుగా రాయించడానికి తా నెంతో శ్రమపడ్డానని చెప్పబోయినా.. సోనియా వినిపించుకోలేదు. మరుసటిరోజు నుంచి తవ్లీన్‌తో సంబంధాలన్నీ బంద్ అయ్యాయి. తవ్లీన్ ఫోను చేస్తే సోనియాకు ఇవ్వగూడదన్న ఆదేశాలు వెలువడ్డాయి.

ఇందిర ప్రధానిగా ఉన్న సమయంలో ఇంట్లో కుటుంబ సభ్యులెవరూ లేనప్పుడు సోనియా ప్రధాని వ్యక్తిగత సిబ్బంది ఉండే ఆఫీసులో కూర్చునేవారు. ఒకరోజు… ఓరియంటల్ ఫైర్ ఇన్సూరెన్స్ కు చెందిన ఒక వ్యక్తి వచ్చి అక్కడి సిబ్బందికి ఇన్సూరెన్సు పా లసీ అందించేందుకు వచ్చారు. తరువాత సోనియా పట్ల అతి వి నమ్రత కనబరుస్తూ… ఆమె అడిగిన వివరాలన్నీ చెప్పారు. ప్రతీ ఫ్యాక్టరీ, ప్రతి కార్యాలయానికి బీమా తప్పదని… ఏజెంటుకు ఇన్సూరెన్స్ కంపెనీ 15 శాతం కమీషన్ చెల్లిస్తుందని వివరించాడు. ఎంతో మంది ఎంపీలు కూడా ఇలా బీమా పాలసీలు చేయిస్తుంటారని తెలిపారు. ‘మీరు కూడా బీమా కంపెనీలో ఏజెంటుగా చేరితే… నెలకు ఎవ్వరికీ తెలియకుండా నాలుగైదు వేలు వస్తాయి’ అని చెప్పా డు. సోనియా సందేహిస్తూనే అందుకు అంగీకరించారు. ఆమె ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంటుగా ప్రధా ని నివాసాన్ని చిరునామాగా ఇవ్వడం తరువాత చాలా వివాదాస్పదమైంది. పార్లమెంటులో దీనిపై ప్రశ్న కూడా రావడంతో ఇందిర ఖిన్నురాలయ్యారు. సోనియా కంగారుపడి వెంటనే తన ఏజెన్సీని రద్దు చేసుకున్నారు.

(నాలుగైదువేల కమీషన్ కోసం ఓరియంటల్ కంపెనీలో ఏజెంట్‌గా చేరడం నుంచి… బోఫోర్స్ కుంభకోణం సూత్రధారి ఖత్రోకీ కుటుంబానికి సహకారం దాకా సోనియాపై ఎన్నెన్ని ఆరోపణలున్నాయి? రాజీవ్ మరణానంతరం ఆమె మరింతగా ఎలా మారిపోయారు? తెలుగువాడైన పీవీని ప్రధానిగా ఎలాంటి పరిస్థితుల్లో
అంగీకరించారు? రేపటి సంచికలో…)

 

 

కాంగ్రెస్‌వారికి ‘మేడమ్’
చాలామందికి ‘అమ్మ’
కొందరికి ‘దేవత’
మరి సోనియా గురించి మీకేం తెలుసు?

సి.నరసింహారావు రాసిన సోనియా గాంధీ వ్యక్తిత్వ విశ్లేషణ ఈ రోజు నుంచి ‘ఆంధ్రజ్యోతి’లో!

ఎడ్‌వైజ్ ఆంటోనియో అల్‌బైనా మైనో… ఈమె ఎవరో మీకు తెలుసా??? పోనీ… సోనియా గాంధీ? ఈమె ఎవరో తెలియని వారు కచ్చితంగా ఉండరు. సోనియా గాంధీ అసలు పేరు… ఎడ్‌వైజ్ ఆంటోనియో అల్‌బైనా మైనో! తొమ్మిదేళ్లకుపైగా దేశాన్ని పాలిస్తున్న అధికార కూటమికి ఆమె అధినేత్రి. ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన మహిళల్లో ఆమెది తొమ్మిదో స్థానం. ఎక్కడో ఇటలీలో సాధారణ అతివగా పుట్టిన సోనియా… ఇండియాలో అత్యంత శక్తిమంతమైన మహిళగా ఆవిర్భవించడం ఒక్కసారిగా జరిగిపోలేదు. అనేక సంఘటనలు ఆమెపై ప్రభావం చూపాయి. సోనియా జీవితంలోని ముఖ్యమైన, ఆసక్తికరమైన ఘట్టాలను ఇప్పటికే పలువురు ప్రముఖులు అక్షరాల్లో నిక్షిప్తం చేశారు. ఆ ఘట్టాలను విశ్లేషిస్తే ఆమె వ్యక్తిత్వం ఏమిటో అర్థమవుతుంది. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు, మానసిక విశ్లేషకుడు సి.నరసింహారావు ఆ పని చేశారు. గతంలో ఆయన వైఎస్, చంద్రబాబు, జగన్ వ్యక్తిత్వాన్ని విశ్లేషిస్తూ రాసిన వ్యాసాలను ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించింది. ఇప్పుడు… సోనియా జీవన విశ్లేషణనూ ప్రచురిస్తోంది. సోనియా గురించి ఎందుకు తెలుసుకోవాలంటారా? తొమ్మిదేళ్లుగా దేశ దిశను నిర్దేశిస్తున్న, ఇప్పుడు రాష్ట్ర గతిని శాసిస్తున్న ఆమె గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి… తెలుసుకోండి!

ఎవరీ సోనియా?…ఈ ప్రశ్న అడిగితే జనం ఫక్కున నవ్వొచ్చు. కానీ… ఇదే ప్రశ్నను 1999 మే 15వ తేదీన లోక్‌సభ మాజీ స్పీకర్ పీఏ సంగ్మా అడిగారు. “సోనియా గురించి నిజంగా నాకేమీ తెలియదు. తెలిసిన వారు ఇక్కడగానీ, మనదేశంలోగాని ఒక్కరయినా ఉన్నారా?” అని సంగ్మా ప్రశ్నించారు. అంతే… అక్కడ నిశ్శబ్దం రాజ్యమేలింది. సోనియాకు భారత్ గురించి ఏం తెలుసు? ‘ఇండియా’ అనగానే ఆమెకు గుర్తొచ్చిన విషయాలు ఏమిటి? రాజీవ్ గాంధీతో పెళ్లి ఎలా జరిగింది? మనమూ తెలుసుకుందాం! ప్రశ్నలతోనే మొదలుపెడదాం!

“అసలెవరీ సోనియా? ఆమె గత చరిత్ర ఏమిటి? అమెకున్న విద్యార్హతలేమిటి? భారతదేశంపట్ల అమెకున్న అవగాహన ఏమిటి? ఇక్కడి ప్రజలు, ఈ భిన్న సంస్కృతులు, విభిన్న భాషల గురించి ఆమెకేం తెలుసు? భారత గ్రామీణ పరిసరాలను గురించి ఆమెకేమయినా తెలుసా? భారత రాజ్యాంగం అమె ఎప్పుడయినా చదివారా? అసలు చదవగలరా? మన స్వాతంత్య్ర పోరాటం గురించి అమెకు లేశమాత్రమయినా తెలుసా? వందకోట్ల ప్రజల ఆశలు, అభిలాషలు, విద్యాసంపద, శక్తి సామర్థ్యాలు, మనందరి ఆత్మగౌరవం, హుందాతనం, నాగరికతా పరిణామ క్రమం ఈ నేలతో అనుసంధానమై ఉన్నాయి. ఇక్కడ పుట్టనివారికి ఈ దేశంలో ఉన్నత పదవిని అలంకరించే అర్హత ఉండదు” అంటూ 1999వ సంవత్సరం మే 15వ తేదీన బొంబాయిలో పీఏ సంగ్మా కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. శరద్‌పవార్, తారిఖ్ అన్వర్, పీఏ సంగ్మా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లి నేషనలిస్టు కాంగ్రెసు పార్టీని స్థాపించడానికి సిద్ధమైన రోజులవి. అక్కడి కార్యకర్తలు అరుపులు, కేకలతో సోనియాను విమర్శించడం పట్ల తమ మద్దతును, సమ్మతిని తెలియజేస్తున్నారు. అప్పుడు సంగ్మా తిరిగి ఇలా అన్నారు. “సోనియాను వివర్శించడంకోసం నేనా మాటలు అనలేదు. సోనియాను గురించి నిజంగా నాకేమీ తెలియదు. తెలిసిన వారు ఇక్కడగాని, మనదేశంలోగాని ఒక్కరయినా ఉన్నారా?” ఈ ప్రశ్నతో అక్కడ అందరిలో గంభీరతతో కూడిన నిశ్శబ్దం నెలకొంది.

ఆశ్చర్యం ఏమిటంటే, సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టిన పదిహేను సంవత్సరాల తరువాత కూడా.. ఆ గంభీర నిశ్శబ్దం అలానే కొనసాగుతోంది. ఈ పదిహేనేళ్ల కాలంలో ఆమె సొంతంగా ఒక్కటంటే ఒక్క పత్రికాగోష్టి నిర్వహించలేదు. ఒక్క పత్రికకు గానీ, ఒక్క ఛానల్‌కు గానీ ఇంటర్వ్యూ ఇవ్వలేదు. లోక్‌సభలో చదవడం కాకుండా ఒక్కసారి కూడా తనంతట తానుగా ప్రసంగించలేదు. ఈమెపై రాణి సింగ్ రాసిన పుస్తకంలో కూడా, సోనియా ఒక్క పుస్తకం చదివినట్లు అసలు ప్రస్తావించలేదు. కంప్యూటర్‌ను వినియోగించడం అసలామెకు తెలియదు. ఆమెను ఇంతకాలంగా వందలాది మంది కాంగ్రెసు నాయకులు కలిసి అనేక విన్నపాలు విన్నవించుకొన్నారు. అన్నిటికీ తల ఊపడం, ముక్త సరిగా అవును కాదు అని చెప్పడమే తప్ప ఏ నాయకుడు కూడా ఆమె తనతో విపులంగా సంభాషించినట్లు చెప్పడం జరగలేదు. ఇంతటి విశాల భారతదేశంలో, సంక్లిష్ట ప్రజాస్వామ్య వ్యవస్థలో వివిధ కీలక అంశాలపై ఆమెకున్న అభిప్రాయాలు, ఆమె విశ్వసించే విధానాలు, సిద్ధాంతాలు అసలేమయినా ఉన్నాయా? ఇంత కాలంగా బహిరంగంగానే కాదు. పార్టీ ముఖ్యుల వద్ద కూడా, తాను విశ్వసించే రాజకీయ విలువలు, విధానాల గురించి ఆమె ప్రస్తావించిన దాఖలాలేదు. అందుకే సోనియా గాంధీకి ఏ కీలక అంశం పట్ల ఎటువంటి కనీస అవగాహన లేదని నిర్ణయించుకోవచ్చు.
యాభైఏళ్ల వయసు వచ్చే వరకూ, మన దేశంలో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండి, పైగా రాజకీయాలను చీదరించుకొంటూ, రాజకీయాలకు దూరంగా ఉందామని తన భర్తను ఒప్పించి, జీవితకాలంలో రాజకీయాల జోలికి వెళ్లగూడదని నిర్ణయించుకొన్న సోనియాగాంధీ, అసలు రాజకీయాలపట్ల అవగాహనను ఏర్పరచుకోవడానికీ ఎప్పుడూ ప్రయత్నించలేదు. అంతేకాదు! ఈ దేశస్థితిగతులపట్ల కనీస పరిచయంలేని వ్యక్తికి మనదేశంలో అమలయ్యే ప్రజాస్వామ్యంపట్ల, ఇక్కడి పరిపాలనా వ్యవస్థ, న్యాయవ్యవస్థ, చట్టాలపట్ల అవగాహన ఎలా ఏర్పడుతుంది? అన్నింటికీ మించి క్రమబద్ధమైన విద్యాభ్యాసం లేని సోనియాగాంధీ స్వీయ అవగాహన, ఆలోచనలే నేటి రాజకీ య విశేషాలు గా తనకు తాను పరిగ ణించుకొంటుంటారు.

బాల్యం, విద్యాభ్యాసం
రెండో ప్రపంచ యుద్ధం మొదలయ్యే రోజుల్లో లూసియానా అనే గ్రామం నుంచి ఇటలీ సైన్యంలో జేరిన నిరుపేద యువకుల్లో ‘స్టెఫినోమైనో’ ఒకరు. సైన్యంలో చేరిన ఆరునెలలకే స్టెఫినోతో సహా చాలామంది రష్యన్ సైన్యానికి పట్టుబడ్డారు. వారందరినీ యుద్ధ క్యాంపులో బంధించి, యుద్ధం ముగిసిన తరువాత రష్యన్ ప్రభుత్వం విడుదల చేసింది. అలా విడుదల అయిన స్టెఫినోమైనో లూసియానా గ్రామంలో తాపీ వృత్తిలో స్థిరపడి పవోలా ప్రెడెబెన్‌ను వివాహమాడాడు. వారి పెద్ద కూతురి పేరు అలెగ్జాండ్రియా. ఆమెను ‘అనుష్క’ అనే ముద్దుపేరుతో పిలిచేవారు. 1946 డిసెంబరు 9వ తేదీన రెండో కూతురు జన్మించింది. ఆమె పేరు ‘ఎడ్‌వైజ్ ఆంటోనియా అల్‌బైనా మైనో’. ఆమెను ‘సోనియా’ అనే ముద్దుపేరుతో పిలిచేవారు. మూడో కూతురు పేరు నాడియా మైనో. లూసియానా బాగా వెనుకబడిన గ్రామం. అక్కడ పాఠశాల లేదు. రోడ్లు లేవు. ఆ గ్రామంలో దాదాపు అందరూ నిరక్షరాస్యులే! తాపీపని చేసి, వచ్చే కొద్దిపాటి ఆదాయంతో తమ కుటుంబం గడవడం దుర్లభమని గుర్తించిన స్టెఫినో ‘అర్‌బస్సానో’ అనే చిన్నపట్టణానికి తన కుటుంబంతో సహా 1950లో తరలి వెళ్లారు. అక్కడకు వెళ్లాక ఆయన ఆదాయం పెరిగింది. కానీ, పిల్లలు చదువుకోవడానికి పాఠశాల లేదు. ప్రతివారం స్టెఫినో, ఆయన భార్య క్రమం తప్పకుండా అక్కడ చర్చికి వెళ్లేవారు. ఇంట్లో కఠినంగా, నిరంకుశంగా వ్యవహరించే స్టెఫినో, చర్చి ఫాదర్ వద్ద అతి వినమ్రంగా ఉండేవారు. అన్నిటికీ ఆయన సలహాలు తీసుకొనేవారు. అక్కడ పాఠశాల లేకపోవడంతో ఆ చర్చి ఫాదరే వారానికి ఒకటి రెండు రోజులు అక్కడి పిల్లలను పోగుచేసి అక్షరాలు, చిన్న చిన్న వాక్యాలు రాయడం, చదవడం నేర్పేవారు. అనుష్క అక్షరాలు నేర్చుకోవడంపట్ల ఏమాత్రం ఆసక్తి కనపరిచేది కాదు. కానీ, సోనియా మాత్రం ఆ ఫాదర్ దగ్గరకు క్రమం తప్పకుండా వెళ్లి అక్షరాలు నేర్చుకొంది.

1960లో స్టెఫినో తన ఒక్కడి సంపాదన కుటుంబం గడవడానికి సరిపోవడంలేదని, ఇద్దరు పెద్ద పిల్లలకు పదిహేను సంవత్సరాల వయస్సు వచ్చిందని, వారిని ఎక్కడైనా ఉద్యోగంలో పెట్టించమని చర్చి ఫాదర్‌ను కోరాడు. “ఇటలీలో ఉద్యోగాలు దొరికే సమస్యే లేదు. ఈ దేశం ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉంది. ఉద్యోగాలు పొరుగు దేశాలైన బ్రిటన్, ఫ్రాన్సులలోనే లభిస్తాయి. అనుష్కకు అక్షరజ్ఞానం లేదు గనుక ఆమెకు ఎక్కడా ఉద్యోగం లభించదు. సోనియా ఇటలీ భాష బాగానే నేర్చుకొంది. కానీ, పొరుగు దేశాలలో చిన్న ఉద్యోగం దొరకాలన్నా ఆయా భాషలు నేర్చుకోవాలి. ఆ భాషలు నేర్చుకొంటే అప్పుడేమయినా ప్రయత్నించవచ్చు” అని ఆ చర్చి ఫాదర్ వివరించి చెప్పారు.

ప్రస్తుతం నివసిస్తున్న అర్‌బస్సానో పట్టణానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో టురిన్ అనే పట్టణంలో క్రైస్తవ సన్యాసినుల (నన్స్) కోసం ఉద్దేశించిన ‘ఇస్టిట్యూటో సాంతా తెరిసా’ అనే ఒక ప్రాథమిక పాఠశాల ఉంది. చుట్టుప్రక్కల గ్రామాలకు చెందిన యువతులు అక్కడ హాస్టల్లో ఉండి ఐదో తరగతి వరకూ చదువుకొని, తరువాత క్రైస్తవ సన్యాసినులుగా వివిధ ప్రాంతాలకు వెళ్లి జీవనం గడిపేవారు. 1962లో మాధ్యమిక పాఠశాలను, ప్రక్క దేశాలలో ఉపాధికోసం వెళ్లే యువతులకోసం ఇంగ్లీషు, ఫ్రెంచి భాషలను నేర్పే కోర్సులను కూడా ప్రవేశపెట్టారు. చర్చి ఫాదర్ సలహా మేరకు సోనియా ఆ స్కూలులో 1962లో చేరారు. అక్కడ హాస్టల్‌లో ఉంటూ 1964లో విదేశీ భాషల కోర్సును పూర్తి చేశారు. సోనియా ఆ కోర్సు పూర్తి చేసి ఇంటికి వచ్చిన తరువాత ఆమె తండ్రి స్టెఫినో చర్చి ఫాదర్ దగ్గరకు వెళ్లి ఎక్కడైనా ఉద్యోగం ఇప్పించమని కోరారు. ఉద్యోగ ప్రకటనలు చూసి బ్రిటన్, ఫ్రాన్సులలో ఉద్యోగం కోసం చర్చి ఫాదర్ దరఖాస్తులు పంపసాగారు.

ఇంగ్లండులోని కేంబ్రిడ్జి పట్టణంలో ఒక క్రెష్‌లో (పగటి పూట తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళుతూ తమ పిల్లల్ని వదిలిపెట్టి వెళ్లే కేంద్రం) సోనియాకు ఉద్యోగం వచ్చింది. ఆమెకు వచ్చే జీతం బొటాబొటీగా సరిపోయేది. ఇంటికేమీ పంపించలేకపోతున్నానని, ఇంకేదయినా మంచి ఉద్యోగం కావాలంటే ఏంచేయాలని సోనియా తన సహ ఉద్యోగినిని అడిగింది. అప్పుడామె మొహమాటం లేకుండా చెప్పింది. ‘నీకు సరైన ఇంగ్లీషు రాదు. ఇంగ్లీషులో చక్కగా మాట్లాడగలిగితే తప్ప ఇక్కడ ఉద్యోగాలు దొరకవు. ఇక్కడ ఒక రిటైర్డు ఇంగ్లీషు ప్రొఫెసరు రోజూ రెండు గంటల చొప్పున ఆరు వారాల్లో ఇంగ్లీషు నేర్పుతున్నాడు. ఆ ‘లెనాక్స్‌కుక్ స్కూల్’లో చేరితే నీకు ఇంగ్లీషు వస్తుంది. అప్పుడు మంచి ఉద్యోగం పొందగలవు” అని తెలిపింది. ఇంగ్లీషు మాట్లాడే వాతావరణం, స్కూలులో క్రమబద్ధమైన బోధనతో చిన్నచిన్న వాక్యాలతో ఇంగ్లీషులో సంభాషించగల చాతుర్యం సోనియాకు అలపడింది. ఆ స్కూల్‌లో సర్టిఫికెట్ రాగానే చాలా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేశారు. ఒక నెల లోనే కేంబ్రిడ్జి యూనివర్సిటీలోని ట్రినిటీ కాలేజీలోని కాలేజ్ బార్‌లో ఆమెకు వెయిట్రెస్ ఉద్యోగం వచ్చింది.

అప్పట్లో.. సోనియా దృష్టిలో ఇండియా!
సోనియా తన అక్క అనుష్కకు రాసిన ఒక లేఖను లండన్‌లోని టైమ్స్ పత్రిక చాలాకాలం తరువాత ప్రచురించింది. “ఆయనను మొదటిసారి చూడగానే నా గుండె వేగంగా కొట్టుకోసాగింది. తొలి చూపులోనే ప్రేమంటే ఏమిటో నా అనుభవంలోకి వచ్చింది. ఒక రాకుమారుడు నన్ను వివాహమాడతాడని చిన్నప్పటి నుంచి కన్న కలలు నిజమయ్యాయి. వాళ్ల అమ్మ ఇండియా అనే దేశానికి ప్రధాని. ఇండియా ఎక్కడుందో నాకు తెలియదు. పాములు, ఏనుగులు, అడవులతో నిండిన దేశంగా నాకో అభిప్రాయం ఉంది. నాకా దేశం గురించి ఏదీ స్పష్టంగా తెలియదు” అంటూ సోనియా రాసిన లేఖ పత్రికలో ప్రచురితమైంది. రాజీవ్ తన ప్రేమ గురించి తల్లితో చెప్పాడు. సోనియాకు సంబంధించిన వివరాలు చెప్పగానే ఇందిరాగాంధీ గట్టిగా తిరస్కరించింది. “ఆ అమ్మాయి అసలేమీ చదువుకోలేదు. తండ్రేమో తాపీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తాడు. పుట్టిపెరిగింది ఇటలీలోని మారుమూల గ్రామం. ఇంగ్లీషు కూడా సరిగ్గా రాదు. అటువంటి అమ్మాయి నీకు భార్యగా ఎలా సరితూగుతుంది? మన ఇంట్లో ఎలా సర్దుకోగల్గుతుంది?” అని ప్రశ్నించారు. తల్లిని ఒప్పించడానికి రాజీవ్ ఏ ప్రయత్నమూ చేయలేదు. లండన్ వెళ్లిన తరువాత, తన తల్లి తమ వివాహానికి అంగీకరించలేదని, నెమ్మదిగా అంగీకరించవచ్చని సోనియాతో చెప్పారు. సోనియా, రాజీవ్ కలిసి లండన్‌లోని అన్ని రెస్టారెంట్లకు వెళుతుండేవారు. భారతదేశం నుంచి వచ్చిన ప్రముఖులు రాజీవ్ ఒక యువతితో కలిసి తరచుగా లండన్‌లో కన్పిస్తున్నట్లు ఇందిరాగాంధీతో చెప్పసాగారు. “రాజీవ్‌గాంధీ అంతర్వర్తనుడు. ఎవరితోనూ కలిసేవాడు కాదు. ఎప్పుడు ముభావంగా, ఒంటరిగా ఉండేవాడు. నేను మొదట్లో ఇటలీ అమ్మాయితో పెళ్ళికి అంగీకరించలేదు. కానీ, వారి మధ్య బలమైన అనుబంధం నెలకొందని గుర్తించాక వారి వివాహానికి అంగీకరించాను” అని ఇందిరాగాంధీ తన సన్నిహితురాలు పాపుల్ జయకర్‌తో చెప్పారు. ఇందిరాగాంధీ తన అంగీకారాన్ని తెలపగానే సోనియా ఇండియాకు వచ్చారు. ఇందిరాగాంధీ కుటుంబ మిత్రులు అమితాబ్ బచ్చన్ ఇంట్లో సోనియా 1968 జనవరి మొదటివారం నుంచి రాజీవ్‌తో నిశ్చితార్థం జరిగే 25 ఫిబ్రవరి 1968 వరకు ఉన్నారు. తరువాత ప్రధాని నివాసంలోనే వివాహం జరిగింది. మరుసటి రోజు అత్యంత వైభవోపేతంగా హైదరాబాద్ హౌస్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు.

“రాజీవ్‌ను మొదటిసారి చూడగానే నా గుండె వేగంగా కొట్టుకోసాగింది. తొలి చూపులోనే ప్రేమంటే ఏమిటో నా అనుభవంలోకి వచ్చింది. ఒక రాకుమారుడు నన్ను వివాహమాడతాడని చిన్నప్పటి నుంచి కన్న కలలు నిజమయ్యాయి. వాళ్ల అమ్మ ఇండియా అనే దేశానికి ప్రధాని. ఇండియా ఎక్కడుందో నా కు తెలియదు. పాములు, ఏనుగు లు, అడవులతో నిండిన దేశంగా నా కో అభిప్రాయం ఉంది. నాకా దేశం గురించి ఏదీ స్పష్టంగా తెలియదు!”
– తన సోదరికి సోనియా రాసిన లేఖ

రాజీవ్ పరిచయం.. వివాహం
అప్పటికి… ట్రినిటీ కాలేజీలో రాజీవ్‌గాంధీ రెండు సంవత్సరాలుగా ఇంజనీరింగ్ చదువుతున్నాడు. క్లిష్టతరమైన ఆ కోర్సు చదవడం పట్ల ఆయనకు ఆసక్తి ఉండేది కాదు. ప్రొద్దున్నే కాలేజీలో ఓ గంట గడిపి బయటకు వచ్చేసేవారు. కాలేజ్ బార్‌లో కూర్చుని కాలక్షేపం చేసేవారు. పొద్దున్న పదిన్నర తరువాత ఆ బార్‌లో విద్యార్థులుగాని, అధ్యాపకులుగానీ ఎవరూ ఉండేవారు కాదు. అక్కడే రాజీవ్‌కు, సోనియాతో పరిచయం ఏర్పడింది.
పేద కుటుంబాలలో బాలికలందరికీ చిన్నతనంలో తల్లులు చెప్పే కథలు ఒకేలా ఉంటాయి. రాకుమారుడు గుర్రంపై వెళుతూ, ఓ పేద యువతి అందం చూసి నిర్ఘాంతపోయి, ఆమెను వివాహమాడడానికి నిర్ణయించుకుంటాడు. ఒక్కసారిగా పేద యువతి యువరాణి అయిపోతుంది. సోనియాకు కూడా చిన్నతనంలో తల్లి, ఇతరులు ఇటువంటి కథలే చెప్పేవారు. తానే ఇలా యువరాణిని అయినట్లు సోనియా కలలు కనేది. సోనియాతో రాజీవ్‌కు బలమైన ప్రేమానుబంధం ఏర్పడిన తరువాత ఆమెకు వివాహమాడతానిని అతను వాగ్దానం చేశారు. ఇంతలో ఆయన కేంబ్రిడ్జి యూనివర్సిటీ విడిచి వెళ్లాల్సి వచ్చింది. అప్పటికి ఇందిరాగాంధీ భారత దేశ ప్రధానమంత్రి. కేంబ్రిడ్జిలో కఠినతరమైన బోధనా నిబంధనలకు రాజీవ్ తట్టుకోలేకపోయాడని గుర్తించి.. లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీలో ఆయనను చేర్పించింది. కేంబ్రిడ్జి కాలేజ్ బార్‌లో ఉద్యోగం వదిలి సోనియా కూడా లండన్‌లోని పాకిస్థాన్‌కు చెందిన ఎగుమతి దిగుమతి వ్యాపారి సల్మాన్ తస్సీర్ వద్ద కార్యాలయ కార్యదర్శిగా ఉద్యోగంలో చేరింది. ఈమె తన వద్ద ఉద్యోగానికి పనికిరాదని భావిస్తూ “నీకు వివాహమైందా?” అని చివరిగా సల్మాన్ ప్రశ్నించారు. ‘భారత ప్రధాని కొడుకుతో నా వివాహం నిశ్చయమైంది’ అని ఆమె చెప్పగానే, అతను మరో మాట మాట్లాడకుండా ఆమెకు ఉద్యోగం ఇచ్చారు.

(ఒక సాధారణ విదేశీ మహిళ… భారత దేశానికి ‘యువరాజు’ వంటి రాజీవ్ గాంధీకి జీవిత భాగస్వామిగా మారారు! దేశం కాని దేశంలో, పూర్తిగా కొత్తదైన వాతావరణంలో, అన్నింటికీ మించి… ఒక దేశ ప్రధానమంత్రి కోడలిగా సోనియా గాంధీ ఎలా ఇమడగలిగారు? తనను తాను ఎలా మలచుకున్నారు? అప్పటిదాకా ఆమె ఆలోచనలు ఎలా ఉండేవి? అవి ఎలా మారాయి? ఆమె మాటల్లో వినిపించే ‘అమాయకత్వం’ గురించి అంతా ఏమనుకునే వాళ్లు? రేపటి సంచికలో!)
 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -25 విమాన శాస్త్రజ్ఞుడు భరద్వాజ మహ

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -25

విమాన శాస్త్రజ్ఞుడు భరద్వాజ మహర్షి

భాగవతం లో సాల్వుడు ‘’సౌంభక ‘’అనే విమానం లో ద్వారకా నగరం మీద యుద్ధం చేశాడని ఉంది .గయోపాఖ్యానం లో గయుడు ఆకాశం లో రధం లో వెడుతూ ఉమ్మి వేస్తె అది శ్రీ కృష్ణ్డుడు  సూర్యుని కిచ్చే అర్ఘ్యజలం లో పడటం ,అది శ్రీ కృష్ణార్జున యుద్ధం దాకా వెళ్ళటం తెలిసిందే .రామాయణం లో కుబేరుని ‘’పుష్పక విమానాన్ని ‘’రావణుడు లాక్కొని అనుభ వించాడు .దానిలోనే శ్రీ రామాదులు లంక నుంచి అయోధ్యకు చేరారని తెలిసిన విషయమే .వసు రాజు కు ఇంద్రుడు ఒక విమానం ఇచ్చాడు అది ‘’ఎయిర్ కండిషన్డ్ విమానం ‘’..దానిలో సకల సౌకర్యాలు ఉన్నాయి .

వి అంటే పక్షి .గాలిలో పక్షి లాగా ఎగిరేది విమానం అని పిలువ బడింది ..మహా భారత కాలానికే విమాన శాస్త్రం వృద్ధి చెందింది .ఋగ్వేదం లో విమాన యాన ప్రసక్తి ఉంది .మూడు చక్రాలతో ఆకాశం లో విహరించేరదాలున్నట్లు మన పురాణాలలో ఉంది .’’బృహత్ యంత్ర సర్వస్వం ‘’లో విమాన యానం కు సంబంధించిన రచన ఉంది .దీనికి అను బంధం గా ‘’సంస్కార రత్నావలి  ‘’,’’శకట యానం ‘’,’’లోహ తంత్ర’’,’’యాన బిందువు ‘’మొదలైన గ్రంధాలు వచ్చాయి .’’బృహత్ యంత్ర సర్వస్వం ‘’ను భూర్జర పత్రాల మీద రచించిన భారద్వాజ మహర్షి వివరాలు అందు బాటు లో లేవు .

వు .Inline image 1Inline image 2

Inline image 3

క్రీ.పూ.ఏడవ శతాబ్దిలో భరద్వాజుడు జన్మించినట్లు తెలుస్తోంది .తండ్రి బృహస్పతి .తల్లి మమత .హిమాలయ పర్వత సానువులలో జన్మించినట్లు భావిస్తారు .ఋగ్వేద అధర్వణ వేదం ,రామాయణ ,మహా భారతాలలో భరద్వాజ ప్రసక్తి ఉంది .ఈయనే విమాన శాస్త్ర రచయిత గా అందరు భావిస్తారు .భరద్వాజుడు రాసిన ‘’బృహత్ యంత్ర సంహిత ‘’లో విమాన శాస్త్రం ఒక భాగం మాత్రమె .ఇందులో అనేక పూర్వ గ్రంధాలను ఆధారం చేసుకొని రాసినట్లు చెప్పాడు .ప్రాచీన విజ్ఞాన గ్రంధాలు ముఖ్యమైనవి 25ఉన్నాయి .అవి ‘’వైశ్వానర తంత్రం ,ధూమ ప్రకరణం ,సౌదామిని కళ,శక్తి సూత్రం ,అంశు బోధిని ,వాయు తత్వ ప్రకరణం ,ఆకాశ  తత్త్వం.

భరద్వాజుడు రాసిన విమాన శాస్త్రం కు విపులమైన వ్యాఖ్యానం రాసిన వాడు ‘’బోదా నంద’’ .ఆయన రాసిన ప్రకారం భరద్వాజుడు వేదాలను మదించి ,ఈ యంత్ర శాస్త్రాన్ని తయారు చేశాడు .భారద్వాజునికి పూర్వమే కొంతమంది విమాన శాస్త్రం పై అనేక పరిశోధనలు చేశారని,గ్రంధస్తం చేశారని  తెలుస్తోంది .అయితే అవి అస్పస్టాలు అసంపూర్నాలు అవటం తో అసలు విషయం తెలియ లేదు .శౌనక మహర్షి రాసిన ‘’వ్యోమ యాన యంత్రం ‘’వాచస్పతి రాసిన ‘’యాన బిందు ‘’,నారాయణ రాసిన ‘’విమాన చంద్రిక ‘’దుండి నాధుడు రాసిన ‘’వ్యోమ యానార్క ప్రకాశిక ‘’,గార్గ్య మహర్షి రాసిన ‘’యంత్ర కల్పం ‘’,చక్రాయన రచించిన ‘’భేత యాన ప్రదీపిక ‘’మొదలైనవి భరద్వాజుని విమాన శాస్త్రానికి ముందువే .

భరద్వాజ విమాన శాస్త్రం లో ఎనిమిది అధ్యాయాలువంద అధికరణాలు,500సూత్రాలున్నాయి  ,ఇదీ అసంపూర్తి గ్రంధమే .పూర్తీ గ్రంధం అలభ్యం .భరద్వాజుడు తన విమాన శాస్త్రం లో మొత్తం 32విమాన శాస్త్ర సిద్ధాంతాలు ఉన్నాయని పేర్కొన్నాడు .విమాన నిర్మాణం లో

32యంత్రాలున్నట్లు ,వాటిని ఎక్కడెక్కడ అమర్చాలో వాటి పనులేమిటో కూడా తెలియ జేశాడు .2005లో హరిద్వార్ లో ఆవిష్కరింప బడిన ఆమంచి బాల సుదాకర శాస్త్రిగారి రచన  ‘’భరద్వాజ వైమానిక ‘శాస్త్రం ‘’లో కావలసిన వివరాలున్నాయట .శాస్త్రి గారు విజయ వాడలో ‘’మహర్షి కాల జ్ఞానం ‘’సంపాదకులట.ఇందులో మూడు వేల శ్లోకాలు వంద అధ్యాయాలు ఉన్నాయి తెలుగు ఇంగ్లీష్ లలో ఈ పుస్తకం వేలు వడిందట .  మన దేశం లో రైట్ సోదరులకు పూర్వమే బొంబాయి లో’’ శివ శంకర్ బాపూజీ తల పడే ‘’అనే శాస్త్ర వేత్త1895లో మొదటి విమానాన్ని తయారు చేసి ఆకాశం లో ఎగిరెట్లు చేశాడట .ఈయన బొంబాయి చైనా బజార్ లో ఉండేవారు .సంస్క్రుత ఆంగ్లలో  నిష్ణాతుడు .విజ్ఞాన పరిశోధనల్లో ఆరి తేరిన వాడు .బొంబాయి జే.జే.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో లెక్చరర్ .వేదం వాగ్మయాన్ని అవలోడనం చేసిన వారు .1913లో శివకర్ గారు ‘’ప్రాచీన విమాన విద్వేచా శోధ’’పేరుతొ మరాఠీ లో ఒక గ్రంధం రాశారు .భార్య మిత్రుల సహకారం తో వేదం లోని విజ్ఞాన శాస్త్రాన్ని ఆధారం చేసుకొని విమానాన్ని నిర్మించారు .తన విమానానికి‘’మరుత్సఖ’’ (వాయు మిత్రుడు ).అని పేరు పెట్టారాయన .బొంబాయి లోని ఆర్ట్ సొసైటీ నిర్వహణ లో ఉన్న టౌన్ హాల్ లో ప్రదర్శించారు .పాదరసాన్ని  ,సౌర శక్తిని ఇంధనాలు గా ఉపయోగించారు .బొంబాయి లోని ‘’చౌ పట్టి’’సముద్ర ప్రాంతం లో ప్రయోగించి నడిపించారు .1500అడుగుల ఎత్తు  వరకు ‘’మరుత్సఖ ‘’యెగిరి క్షేమం గా భూమి మీదకు దిగింది .ఆ నాటి బరోడా యువరాజు సాయీజీ రావు గైక్వాడ్ ,ప్రసిద్ధ న్యాయ వేత్త మహా దేవా గోవింద రానడే ,వాణిజ్య వేత్త లాల్జీ నారాయణ్ జీ మొదలైన ప్రముఖు లందరూ ఈ విమానాన ప్రయోగాన్ని చూశారు .దీన్ని అభి వృద్ధి చేయటానికి కావలసిన ఆర్ధిక సాయం చేస్తామని వీరందరూ ప్రకటించారు .కొద్దికాలానికే ఆయన ఆరోగ్యం క్షీణించటం భార్య మరణించటం తో ,శివాకర్ గారు కూడా చని పోవటం తో ఈ ప్రయోగం ఆగిపోయింది .ఈయన వారసులు ఈ తోలి విమానాన్ని బ్రిటిష్ కంపెని కి అమ్మేశారు .బాల గంగాధర తిలక్ తన కేసరి పత్రిక లో 1953 may 10న  ఒక వ్యాసం రాశారు ‘’శివకర్ తల పడే’’ విమాన ప్రయోగం గురించి పూర్తీ వివరాలు అందులో రాశారు .బ్రిటిష్ ప్రభుత్వం పరువు పోతుందనే భయం తో ఈ విషయాన్ని అంతకు ముందు

 

బయటికి పొక్క కుండా చేసింది. కాని తిలక్ గారి వల్లనే మొదటి సారి లోకానికి తెలిసింది .1950లో ‘’శిల్ప సంసార ‘’అనే పత్రిక వేదాలలో విమాన శాస్త్ర వివరాలను ధారా వాహిక గా రాచురించింది .1956లో జనవరి ఎనిమిదిన ‘’త్రిపుర ‘’పేరు తో ఒక ప్రత్యెక విమానానికి సంబంధించిన కొన్ని రేఖా చిత్రాలను ప్రచురించారు .ఈ విమానం భూమి మీద ,గాలి లోను ఎగుర గలదని తెలిపింది .

భారద్వాజుడి విమాన శాస్త్ర అధ్యయనాన్నిఅనేక మంది ఆధునిక శాస్త్ర వేత్తలు చేశారు .ఇందులో డాక్టర్ రామ ప్రభు ,డాక్టర్ మహేశ్వర్ సేరోన్ ,డాక్టర్ యెన్ జి దొంగ్రే ,పి రామ చంద్ర రావు మొదలైన వారున్నారు.

1956-60-ల మధ్య రష్యా నుంచి ఉయ్యూరు కు రెండు సార్లు వచ్చిన ఉయ్యూరు వాస్తవ్యూలు రష్యాలో ఆయిల్ శాస్త్ర వేత్త శ్రీ కొలచల సీతా రామయ్య గారు ఇక్కడ జరిగిన పౌర సన్మానం లోను విడిగా బంధువుల ఇంటి లోను మాతో మాట్లాడి నప్పుడు భరద్వాజ మహర్షి రాసిన విమాన శాస్త్రాన్ని జర్మనీ దేశశాస్త్రజ్ఞులు ఇండియా నుంచి తీసుకొని వెళ్లి జర్మని లో విమానాన్ని తయారు చేశారని చెప్పారు .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-12-13-ఉయ్యూరు

 

.

Posted in సైన్స్ | Tagged | 2 Comments

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -24 అలనాటి మహిళా శాస్త్రజ్ఞులు

          విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -24

అలనాటి మహిళా శాస్త్రజ్ఞులు

ఈ కింది మహిళలు వివిధ రంగాలలో తమ విజ్ఞతను ప్రదర్శించి చరిత్ర పుటల్లో స్తానం సంపాదించుకొన్న వారే .

ప్రాచీన యుగం లో– ప్రజాపతి గౌతమి ,ఆమ్రపాలి ,కృపి ,సంఘ మిత్ర గౌతమీ బాలశ్రీ ,ధ్రువ దేవి ,ప్రభావతి గుప్త ,అవ్వైయ్యార్ ,కారైక్కల అమ్మయార్ ,రాజ్యశ్రీ ,మహత్తర ,సూర్య దేవి ,అండాళ్ప్రముఖ స్తానం పొందారు .

రాజ పుత్ర యుగం లో –భారతి ,అవంతి సుందరి ,దిడ్డ,మైనాల దేవి ,కళా వాటి ,శాంతలా దేవి ,అక్క మహా దేవి ,లీలావతి ,సంయోగిత ,అనుపమ .

ముస్లిం యుగం లో –రజియా సుల్తానా ,ముక్తా చాఘ్ ,దేవల దేవి ,పద్మిని ,గంగా దేవి ,మీరాబాయ్ .

 

మొఘల్ యుగం లో –గుల్ బదన్ బేగం ,దుర్గా వాటి ,చాంద్ బీబీ ,రూపమతి ,హాబ కాటూన్ ,నూర్జహాన్ ,ముంతాజ్ మహల్ ,జిజియా బాయ్ ,జహానారా ,జబ –ఉన్నీసా ,లాల్ కన్వర్ ,మస్తానీ .

నూర్జహాన్

షాజహాన్ భార్య ముంతాజ్ కు దగ్గర బంధువు నూర్జహాన్ .మేధా సంపద .ప్రకృతి పరిశీలనా గల స్త్రీ .సుగంధ పుష్ప పరిశోధనలో ఆరి తేరింది .పుష్పాల నుంచి సుగంధ తైలాలను ‘’దిష్టిలేషన్ పధ్ధతి ‘’ద్వారా తయారు చేసింది అన్న విషయం చాలా మందికి తెలియదు ..j1611లో జహంగీర్ మొహరున్నీసా అనే వితంతువును వివాహమాడాడు .ఈమె ‘’నూర్జహాన్ ‘’అనే పేరు పొందింది .నూర్జహాన్ అంటే’’ ప్రపంచ కాంతి’’ అని అర్ధం .జహంగీర్ 1627 లో చని పోయిన తర్వాత షాజహాన్ అధికారం లోకి వచ్చి ఈమెను నిరాదరణ కు గురి చేశాడు .జీవనం గడవటానికి ఆమె సుగంధ అత్తరులను ,తైలాలను తయారు చేసి అమ్ముకొని బతికింది .గులాబీ అత్తరు తయారు చేయటం లో గొప్ప పేరు పొందింది .నూర్జహాన్ 1645డిసెంబర్ 25న చని పోయింది .దేవరపల్లిసత్యనారాయణ రావు అనే ఆయన సెంటులు  తయారు చేసి ఆమె పేర మీద ‘’నూర్జహాన్ సెంట్ ‘’అని అమ్మే వారు .

 

 

Inline image 1Inline image 2

ఆంద్ర మహిళా శాస్త్రజ్ఞులు

చింతల సీతా దేవి

1929ఏప్రిల్ 21న జన్మించిన చింతల సీతా దేవి గుంటూరు మెడికల్ కాలేజి లో వైద్య విద్య నేర్చింది .ఆంధ్రా మెడికల్ కాలేజి విశాఖ లో ఏం డి .చేసింది .అ తర్వాతF.I .M.S.A డిగ్రీ పొందింది .ఆంధ్రా మెడికల్ కాలేజి లో బయో కేమిస్ట్రి విభాగం లో ట్యూటర్ గా చేరి అంచెలంచలుగా ఎదిగి సికంద్రా బాద్ గాంధి మెడికల్ కాలేజి లో బయోకెమిస్ట్రీ అసిస్టంట్ ప్రొఫెసర్ అయింది .కర్నూలు మెడికల్ కాలేజి ప్రొఫెసర్ అయి ఆంధ్రా మెడికల్ కాలేజి వైస్ ప్రిన్సిపాల్ అయి ప్రిన్సిపాల్ గా 1981-84వరకు పని చేసి రిటైరయింది

జీవ రసాయన శాస్త్రం లో రోగ నిర్ధారణ లో అనేక పరిశోధనలు చేసింది .అంతర్జాతీయ మెడికల్ జర్నల్స్ లో 52కు పైగా పరిశోధనా

పత్రాలను రాసి ప్రచురించింది సీతా దేవి .’’అసోసియేషన్ ఆఫ్ క్లినికల్ బయో కేమిస్త్స్ ఆఫ్ ఇండియా ‘’పత్రిక సంపాదక వర్గం లో పని చేసింది .అనేక పరిశోధనా వ్యాసాల ను వెలువరించింది 1975లో F.A.M.S.లో ఫెలోషిప్ పొందింది  .1981లో ‘’ఇంటర్నేషనల్ మెడికల్ సైన్స్ అకాడెమి ఫౌండర్ ఫెలో ‘’గా ఎన్నికయింది .’’అసోసియేషన్ ఆఫ్ క్లినికల్ బయో కేమిస్త్స్ ఆఫ్ ఇండియా ‘’వారి గౌరవ సభ్యత్వాన్ని పొందింది .’’ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజియాలజిస్త్స్ అండ్ ఫార్మ కోలాజిస్త్స్ ‘’కు ఉపాధ్యక్షురాలిగా ,అద్యక్షు రాలిగా ఎన్నికయింది సీతా దేవి ..’’అసోసియేషన్ ఆఫ్ క్లినికల్ బయో కేమిస్త్స్ ఆఫ్ ఇండియా ‘’వారి నాల్గవ వార్షిక సదస్సుకు ఆర్గనైజింగ్ సెక్రెటరి గా వ్యవహరించింది .దీనితో సీతా దేవి ఖ్యాతి అంతర్జాతీయం గా పెరిగింది .

ఆంధ్రా మెడికల్ కాలేజి పూర్వ విద్యార్ధిగా ఆ కాలేజికి ఎన్నో సేవలందించింది సీతా దేవి .’’ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ నిర్వాహకురాలిగా అఖండ సత్కారం పొందింది .త్రివేండ్రం మెడికల్ కాలేజి వారి సిల్వర్ జూబిలీ ఒరేషఅవార్డు పొందింది .రోగ నిర్ధారణ ,జీవ రసాయన శాస్త్రం లో విశేష కృషి చేసిన సీతా దేవి ఆంద్ర మహిళా రత్నం

కే .ఇందిరా బాయ్ .

శిశు రోగ నిర్ధారణ లో ,పరిశోధనలో ప్రఖ్యాతి పొందిన శాస్త్రజ్ఞురాలు కే .ఇందిరా బాయ్ .30-8-1927ణ శ్రీ కాకుళం జిల్లాలో పుట్టింది .వైద్యం లోM.D.,D.C.H ,F I .A P.,F .I C .P లను పొందింది  .యూనిసెఫ్ ,ప్రపంచ ఆరోగ్య సమస్త లలో ఫెలోషిప్ పొందింది .’’అమెరికన్ అకాడెమీ ఆఫ్ పీడియాట్రిక్స్  ‘’ ,’’ఇంటర్నేషనల్ మెడికల్ సైన్సెస్ అకాడెమి ,’’నేషనల్ అకాడెమి ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆఫ్ ఇండియా మొదలైన ఎన్నో సంస్థలలో ఫెలోషిప్ అందుకొన్నది .

 

విశాఖ కింగ్ జార్జి హాస్పిటల్ అసిస్టంట్ సర్జన్ గా ,ఉద్యోగం లో చేరి  ఆంధ్రా మెడికల్ కాలేజి లో పీడిదయాట్రిక్స్ అసిస్టంట్ ప్రొఫెసర్ గా ,ఎస్.వి.లో అధిపతిగా ,ఉస్మానియా లో ప్రొఫెసర్ గా రాజా ముత్తయ్య కాలేజి ప్రోఫెసార్ గా పని చేసి గొప్ప అనుభవం  పొందింది .

1921లో ‘’ఇండియన్ అకాడెమి ఆఫ్ పీడి యాట్రిక్స్  ‘’కు అధ్యక్షురాలైనది .ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ అడ్వాన్స్ మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ,ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ ట్విన్ స్టడీస్ సంస్థలలో అనేకహోదాలలో పని చేసింది డాక్టర్ బి.సి.రాయ్ నేషనల్ అవార్డ్ ను పొందింది.

కోలా రాజ్య లక్ష్మి

చిత్తూరు జిల్లా పుత్తూరు లో జన్మించింది ఆంధ్రా యూని వర్సిటి నుండి డాక్టర్ పట్టా పొందింది .ఎండి.అయింది .గుంటూర్ మెడికల్ కాలేజి లో ఉద్యోగం ప్రారంభించి ఉస్మానియాలో చేరింది .’’ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ ,పబ్లిక్ హెల్త్ లాబ్ అండ్ ఫుడ్ అధారిటి డైరెక్టర్ అయింది .పద్మావతి మహిళా విశ్వ విద్యాలయానికి వైస్ ప్రిన్సిపాల్ గా పని చేసింది .వాక్సిన్ ప్రొడక్షన్ బోర్డ్ ,రాష్ట్ర టెక్నికల్ కమిషన్ ఫర్ రివెంషాన్ అండ్ కంట్రోల్ ఆఫ్ వాటర్ ప్ల్యూషన్ ,మైక్రో బయాలజీ సంస్తలకు వివిధ హోదాలలో పని చేస్డ్డింది .రాష్ట్ర ఫార్మసి కౌన్సిల్ లో అనేక పరిశోధనలు చేసి వెలువరించింది .

.45కు పైగా పరిశోధనా పత్రాలు ప్రచురించింది .దేశ విదేశీ వైద్య సంఘాలలో గౌరవ సభ్యత్వాన్ని పొందింది .’’ఇండియన్ వాటర్ వర్క్స్ అవార్డ్ ,కే.ఎస్.రావు అవార్డ్ ,సుశ్రుత అవార్డ్ లను అందుకోండి రాజ్య లక్ష్మి

 

Inline image 1Inline image 2

.

వినోదిని రెడ్డి

హైదరాబాద్ లో 1934లో జన్మించింది ఏం డి ,డి సి హెచ్ ,ఎఫ్ ఐ పి కోర్సులను చేసింది ఉస్మానియా అసోసియేట్ ప్రొఫెసర్ గా ఉన్నది పీదియాత్రిక్స్ లో ఫెలోషిప్ పొంది వైద్య పరిశోధనలు చేసింది .ఏ.విటమిన్ లోపం వాళ్ళ వచ్చే వ్యాధులపై .నేషనల్ ఇంస్తితిత్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ కు డైరెక్టర్ అయింది ‘’.xeropthalmia ‘’జబ్బు కు కారణాలు కనుగొన్నది .కమలా మీనన్ మెడికల్ అవార్డ్ ,పి.ఎస్.రాజు అవార్డ్ మొదలైన అవార్డు లెన్నో పొందదిండి

Inline image 3Inline image 4

 

మందవల్లి గౌరీ దేవి

అనకా పల్లి లో పుట్టిన గౌరీదేవి మానసిక శాస్త్ర వేత్త గా ప్రఖ్యాతి పొందింది .న్యూరాలజీ లో డి.ఏం.డిగ్రీ పొందింది ఉస్మానియా లో ప్రొఫెసర్ గా చేరి ,డిల్లీ యూని వర్సిటి కి చెందిన కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ,సఫ్దర్ జంగ్ హాస్పటల్ లో న్యూరాలజీ ప్రొఫెసర్ గా పని చేసింది .కామన్ వెళ్త హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ లో అధిపతిగా ఉంది నేషనల్ ఇన్స్టిట్యూట్

ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్ లో అసోసియేట్ ప్రొఫెసర్ గా ,ప్రొఫెసర్ గా పని చేసింది .ఇండియన్ మెడికల్ సైన్స్ వారి ఫెలోషిప్ పొందింది .అనేక అంతర్జాతీయ సంస్థ లలో విశిష్ట సభ్యత్వం పొంది దేశ ఖ్యాతిని ఇనుమడింప జేసింది .

పద్మా బందో పాధ్యాయ

తిరుపతిలో జన్మించి మెడిసిన్ లో డిప్లమా డిఫెన్స్ సైన్స్ లో ఉన్నత విద్యా పొందిన పద్మా గంగోపాధ్యాయ ఏం డి సాధించింది ఆర్మేడ్ ఫోర్స్ మెడికల్ సైన్స్ లో ఉద్యోగం ఆరంభించి,ఆర్కెటిక్ ఖండం పరిశోధనా బృందం లో పరిశోధన చేసింది .బెంగళూర్ యూని వర్సిటి లో ఏవియేషన్ మెడిసిన్ లో అసోసియేట్ ప్రొఫెసర్ గా చేరి అనేక ఉన్నత స్తానాలు పొందింది .

ఐరో మెడిసిన్ సోఅసైటీ ఆఫ్ ఇండియా ,ఇంటర్నేషనల్ మెడికల్ సైన్సెస్ అకాడెమి మొదలైన సంస్థలలో గౌరవ సభ్యత్వంపొందింది .న్యూయార్క్ అకాడెమి ఆఫ్ సైన్సెస్ గౌరవ పురస్కార గ్రహీత పద్మ .విశిష్ట సేవా మెడల్ , A.F.W.W.A..అవార్డు ను పొందింది .డిఫెన్స్ సర్వీసేస్ స్టాఫ్ కాలేజి లో ఉన్నత విద్య లో ప్రధమ శ్రేణి లో పాస్ అయి ఆర్మీ మెడికల్ కాలేజి సైనిక ఉద్యోగం లో చేరిన మొదటి మహిళా మన పద్మా బందో పాధ్యాయ . 1981లో వాయు సేవా దళం లో విశిస్టసేవలందించిన ఉద్యోగిని గా అపూర్వ సత్కారం అందుకోంది పద్మ .దేశ విదేశీ ప్రసిద్ధ మెడికల్ జర్నల్స్ కు పాతిక పైగా పరిశోధనా వ్యాసాలను రాసి ప్రచురించిన విశిష్ట మహిళా శాస్త్రజ్ఞురాలు పద్మ.

Inline image 6Inline image 7Inline image 8Inline image 9

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ – 2-12-13-ఉయ్యూరు

Posted in సైన్స్ | Tagged | Leave a comment

తెలుగునాట త్యాగయ్యకు సమాధి

 

త్యాగయ్య సంగీతాన్ని ఆలపించడం తప్ప, ఆయన సంగీతజ్ఞతకు ప్రాచుర్యం కల్పించడానికి తెలుగునాట ఇంతవరకూ జరిగిందేమీ లేదు. తిరువయ్యూరు తమిళులు తప్ప తెలుగువారు ఏనాడూ స్ఫూర్తిని పొందలేకపోయారు.

తెలుగుతనంతో సంగీతాన్ని సుసంపన్నం చేసిన త్యాగరాజును తెలుగువాడని చెప్పుకుంటూ మురిసిపోవటం తప్ప ఆ స్మృతులు, పరంపర కాపాడుకోవటంలో శ్రద్ధ కొరవడుతోంది. 2013 ఏడాదిని తెలుగు భాష సాంస్కృతిక వికాస సంవత్సరంగా ప్రకటించిన తరువాత చివరి రోజులు కరిగిపోతున్నా త్యాగయ్యకు సంబంధించిన వారసత్వ పరిరక్షణలో ఇదమిత్థమైన కార్యాచరణను కూడా రూపొం దించలేకపోయారు. ఆ రంగంలో మనసుపెట్టి నిబద్ధతతో కృషి చేసేవారికి కాస్తంత ప్రోత్సాహం కల్పించటంలో ప్రభుత్వానికి సాంస్కృతిక రంగ ప్రముఖులకు ఆలోచనలు కూడా లేకపోవటం తెలుగుతనానికి మకిలి మరక అయింది.

ప్రపంచంలో మరెక్కడా లేనంత వైభవంగా జరిగే సంగీతోత్సవం తమిళనాడులోని తిరువాయూరులో జరుగుతున్నా మన రాష్ట్రంలో సంగీత కళాకారులు, విద్వాంసులు క్రమం తప్పకుండా పాల్గొంటున్న ఆనవాయితీ లేనే లేదు. ప్రభుత్వం తరపున కొన్ని సంవత్సరాలు త్యాగరాయ ఆరాధన ఉత్సవాలు జరిగినా అందులో దుబారా, అవినీతి తప్ప అసలు సిసలు చిత ్తశుద్ధి అంతంత మాత్రమే. సాంస్కృతిక శాఖ కార్యాలయ ప్రాంగణంలో సంబంధిత అధికారుల పాత్ర ప్రభుత్వ నిర్వహణలోని సంగీత నృత్య కళాశాలల అ«ధ్యాపకులు వారి వెంట వచ్చే కొద్దిమంది విద్యార్థులకు పరిమితమైపోతోంది. మొత్తం మీద ఆ ఉత్సవం కొందరికి మాత్రమే సంబరం.

విశాలమైన తెలుగు గడ్డపై త్యాగయ్య కీర్తనల ప్రాచుర్యం పెద్ద ఎత్తున సంగీతోత్సవం చేయటంపై 33 ఏళ్ల సాంస్కృతిక శాఖ ఎన్నడూ దృష్టి పెట్టలేదు. మొక్కుబడి పనుల్లో కూడా తమ పబ్బం గడుపుకొనే పద్ధతి మాత్రం మానలేదు. తమిళనాడులో త్యాగయ్య సమాధి వద్ద వేలాది మంది సంగీతజ్ఞులు నిష్టతో చేసే ఆరాధన పద్ధతులు మనలో కాస్తంత కూడా కదలిక తీసుకు రాలేకపోయాయి. స్వరమయమైన జీవితం, త్యాగయ్య సన్నిధి తప్ప సంపదలను పెంచుకోవాలన్న తపన లేని హైదరాబాదీ విద్వాంసుడు కొల్లెగాళ్ సుబ్రమణ్యం వంటి వారి కృషి కూడా ప్రభుత్వ ప్రోత్సాహం పొందలేకపోయింది. తంజావూరు సమీపంలో గల తిరువయ్యూరులో త్యాగయ్య ఆలయం తీర్థయాత్ర క్షేత్రంగా మారిన క్రమాన్ని అవగతం చేసుకుంటే తెలుగుదనంపై ఆపేక్ష కలవారికి మరచిపోతున్న కర్తవ్యం మననంలోకి వస్తుంది. 167వ ఆరాధన జనవరి 17 నుంచి 21 వరకు నిర్వహించటానికి చెన్నై నుంచి పెద్దయెత్తున సన్నాహాలు జరుగుతున్న సమయంలో మన ఆలోచనల నుంచి నెమరుకు తెచ్చుకోవాల్సినవి చాలానే ఉన్నాయి.

మారుతున్న క్రమం
1847లో పుష్య బహుళ పంచమి రోజున సమాధి స్థితి పొందిన త్యాగయ్యకు స్వరనీరాజనాలతో ఆరాధన ఉత్సవం చేయటం 1941 దాకా స్పష్టమైన రూపుదిద్దుకోలేదు. కొందరు స్వార్థంతో, ఆభిజాత్యంతో తమకు తామే పెద్దలుగా ప్రకటించుకుని, అద్భుత స్వర ప్రపంచానికి గ్రహణం పట్టించారు. నిజమైన అభిమానుల వల్లే ఆరాధన ఉత్సవాలు విశ్వవ్యాప్తం అయ్యాయి. త్యాగయ్య వద్ద శిష్యరికం చేసినవారు, ఆయన ఆలపిస్తుంటే రాసిపెట్టి భద్రపరిచిన వారు 1847 స్వామి సమాధితో ఎవరి దోవన వారు చీలికలు పేలికలు అయ్యారు. వాలాజాపేట వెంకటరమణ భాగవతార్, ఉమయాళపురం సుందర భాగవతార్, కృష్ణ భాగవతార్, తిలైస్థానం రామయ్యంగార్, తంజావూరు రామారావు, వీణా కుప్పయ్యర్, మానాంబు చావడి వెంకట సుబ్బయ్యర్ వంటివారు నిత్యం త్యాగరాజు వెంట ఉండేవారు.

త్యాగయ్య శిష్యులలో చొరవ లేని కారణంగా 1885 దాకా తిరువయ్యారులో కుటుంబ సభ్యులు పెట్టే ఆబ్దీకం తప్ప స్వరనివాళి పద్ధతి లేనే లేదు. 1905లో శిష్యవర్గంలోని ఇద్దరు వైరి వర్గాలు విడివిడిగా పోటాపోటీగా త్యాగయ్య ఆరాధనకు తెరతీశారు. పంచమి రోజు ప్రధాన దినంగా ఒక వర్గం వారు అయిదు రోజులు ముందు మొదలుపెట్టి చేసేవారు. మరో వర్గంవారు ఆ తరువాత 4 రోజులు చేసే వారు. సమారాధనతో పాటు పేదలకు అన్నదానం వంటివి నిర్వహించేవారు. ఆ పరిసర ప్రాంతాల్లో బియ్యం, పప్పులు, కూరగాయలు, చందాలు వసూలు చేస్తుండటంతో కొందరు పెద్దల జోక్యం చేసుకుని ఈ రెండు వర్గాల మధ్య రాజీ కుదర్చారు. దాంతో సంయుక్త నిర్వహణకు నాంది పడింది.

కాగా ఛాందసంతో ఆరాధనలో నాదస్వరం వద్దని, మహిళలు ఇక్కడికి రాకూడదని నిషేధాలు విదించి, మరికొన్ని ఆంక్షలు కూడా విధించి, ఆరాధనకు వచ్చేవారికి ఆటంకాలు కలిగించేవారు. అవన్నీ తెలుసుకుని అచ్చంగా ఏం చేయాలో నిర్ణయించుకున్న అసలైన అభిమాని నాగరత్నమ్మ తిరువయ్యారులో ప్రవేశించటంతో అక్కడి వ్యవహారాలు మొత్తంగా మారాయి. నాట్యంతోపాటు ఆలాపనలో నిష్ణాతురాలైన ఆమె తనకు సమకూరిన సంపదనంతా త్యాగయ్యకు వెచ్చించాలని నిత్య సంస్మరణకు నెలవుగా సమాధి ప్రాంతాన్ని జన సందర్శనీయ స్థలంగా చేయాలని తన శేష జీవితాన్ని అక్కడే గడపాలని భావించారు. అప్పటిదాకా ఆ గ్రామంలోని సత్రాలు, చావడులలో జరిగేవన్నీ సమాధి పరిసరంలో ఆలయ ప్రాంగణంలో వైభవంగా ఎల్లకాలం జరిగేలా చేయాలని ఆమె ఎంతగానో తపించింది. త్యాగరాజు గురువు శొంఠి వెంకటరమణయ్య సమాధి పక్కన, త్యాగయ్య నిర్యాణం చెందిన ప్రాంతం పక్కన ఉన్న స్థలాన్ని ఆమె కొనుగోలు చేశారు.

కేసులు, ఫిర్యాదులు
నాగరత ్నమ్మ రావడం, ఆమె పని పద్ధతులు ఏమాత్రం గిట్టని శిష్య పరంపర ఆధిపత్యంతో చికాకులు పెట్టారు. ఫిర్యాదులు, కేసులతో త్యాగయ్య సమాధి ఆలయ నిర్మాణం వంటివి న్యాయస్థానం తీర్పు దాకా వెళ్లాయి. మొత్తం మీద 1921లో అక్కడ అడుగుపెట్టిన నాగరత ్నమ్మ తాను అనుకున్నట్టుగానే స్థలం సేకరించి, విగ్రహాన్ని తయారు చేయించి, 1925 జనవరి7 నాటికి కుంభాభిషేకంతో ఆలయాన్ని ఆరాధన పద్ధతులకు అనువుగా తీర్చిదిద్దారు. కోర్టువారు కూడా త్యాగయ్యకు శ్రద్ధాంజలికి అందరూ కూడివచ్చేలా ఓ స్పష్టమైన విధానాన్ని అందరికీ ఆమోదమైన విధంగా ఖరారు చేశారు.

1940 దాకా కార్యక్రమాలన్నీ అప్పటి నిర్వాహకుల యోచనలకు తగ్గట్టుగా జరిగాయి. హరికేశ నల్లూరు భాగవతార్ చొరవతో విద్వాంసులందరినీ సమావేశపరిచి ఘన రాగ పంచకం ఎంపిక చేసి ఆరాధన, ఆలాపన, పూజలకు కొత్తదారి తెచ్చిపెట్టారు. పంచరత్నాలుగా ప్రాచుర్యంలోకి వచ్చిన నాట, గౌళ, ఆరభి, వరాళి, శ్రీ రాగాలను నాదస్వరం తో పాటు ఆడా మగా తేడాలు లేకుండా సామూహికంగా ఆలపించటం శాస్త్రీయ సంప్రదాయం అయింది.ఆ ఆరాధన నమూనా మొత్తం సంగీత ప్రపంచానికి ఆదరణీయంగా దేశవిదేశాల్లో అనుసరణీయంగా మారింది. కొత్త కొత్త ఆలయాలు అన్ని ప్రాంతాల్లో సంగీత నిలయాలుగా ఆవిర్భవించాయి.
– జి.ఎల్.ఎన్. మూర్తి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పాపాలు పరిహరించే కోదండ శివుడు!

 

శంకరుడికి ‘పినాకి’ అనే పేరు కూడా ఉంది. రామచంద్రమూర్తి చేతిలో కోదండం ఉంటుంది. కోదండం లేని రామచంద్రమూర్తి అరుదుగా కనిపిస్తాడు. కోదండం పట్టుకున్న శివుడు అరుదుగా కనిపిస్తాడు. పరమశివుడు మేరు పర్వతాన్ని ధనుస్సుగా పట్టుకుంటాడు. మహావిష్ణువు చేసేటటువంటి రాక్షస సంహారానికి, శంకరుడు చేసేటటువంటి రాక్షస సంహారానికి ఒక చిన్న తేడా ఉంటుంది. మహావిష్ణువు రాక్షస సంహారం చేసేటప్పడు ఆ రాక్షసుడు ఏ వరాలు కోరుకున్నాడో వాటికి మినహాయింపుగా చంపడానికి వీలయినటువంటి శరీరాన్ని స్వీకరిస్తాడు. శంకరుడు తన రూపంలోనే రాక్షస సంహారం చేస్తాడు. కానీ శివుడు ధనస్సును పట్టుకున్నట్లు సాధారణంగా కనబడడు. అయితే, ఈ విషయం మనకు శాబ్దికంగా తెలుస్తుంది. యజుర్వేదములోని శ్రీరుద్రము (రుద్రాధ్యాయం)

‘నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః
నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముత తే నమః
యా త ఇషుపశ్శివతమాశివం బభూవ తే ధనుః

శివాశరవ్యాయా తవ త యా నో రుద్ర మృడయ’- అని ప్రారంభమవుతుంది. కోపంగా ఉన్న శివుడికి నమస్కారం చేసి శరణు కోరటం ఈ స్తోత్ర ప్రధానోద్దేశం. కోపంతో ఉన్నవాడు తన చేతిలో ఉన్నటువంటి ఆయుధం నుండి బాణాలను విడిచిపెడతాడు.అవి మనల్ని బాధిస్తాయి. రుద్రుడు మేరు పర్వతమనే బంగారు ధనస్సును, దానిని సంధించటానికి రెండు పక్కలా తూణీరాలను పట్టుకొని ఉన్నాడు. దీనిని ఈశ్వరుని ఘోర రూపమంటారు. అటువంటి ఘోర రూపంలో ఉన్న ఈశ్వరుడు తన ధనుస్సును తీసి ఎక్కుపెట్టినట్లయితే ఉత్తర క్షణం అందరి కళ్లలో అశ్రుధారలు కారతాయి. ఈ జగత్తుకు తల్లీ తండ్రీ ఆయనే. అలాంటి వ్యక్తి అందరినీ ఎందుకు బాధపెడతాడు? మనం చేసిన పాప ఫలితం ఉంటుంది. అది బాధపడితే తప్ప పోదు. కాబట్టి శివుడు మనను ఏడిపిస్తాడు.

‘నేను పాపం చేశాను. కానీ నన్ను అంత ఏడిపించకు. నేను తట్టుకోలేను. నేను ఏడిస్తే చివరకు నీ పాదాల మీద విస్మృతి కలుగుతుంది. నేను ఆ ఏడుపులో ఉండిపోతాను. నా మనస్సుకు ఏదో బాధ కలుగుతుంది. నేను ఆ బాధలో ఉండడంలో నా జీవితంలో కొంతకాలం నీ పాదములకు దూరమయిపోతాను. నిష్ఠతో నీ పాదాలను పట్టుకోలేని స్థితి నాకు వచ్చేస్తుంది. కాబట్టి ఈశ్వరా, నీ కోపానికి ఒక నమస్కారం. ఈశ్వరా నీ ధనుస్సుకు ఒక నమస్కారం. ఈశ్వరా, నీ బాణాలకు ఒక నమస్కారం.’

‘యా త ఇషుపశ్శివతమాశివం బభూవ తే ధనుౖ’
‘కాబట్టి నువ్వు మేం సంతోషించే బాణాలను వేయాలి. మేము ఏదో కొద్దిగా పుణ్యం చేసుకున్నాం. నువ్వు సర్వస్వతంత్రుడివి. నువ్వు తలుచుకుంటే నన్ను నీ భక్తుడిని చేసుకుంటే ఎవరూ అడ్డురారు. నా మీద దయ ఉంచి నన్ను నీ మార్గంలో పెట్టుకో. ఈశ్వరా, నువ్వు మమ్మల్ని అలా అనుగ్రహించు’ అని ప్రార్థిస్తే ఇప్పుడు ఆయన ప్రసన్నుడవుతాడు. ఇప్పడు ఆయన పట్టుకున్న ధనుస్సుకు, మొదట్లో పట్టుకున్న ధనుస్సు తేడా కనిపిస్తుంది. మొదటిది ఘోర రూపం. ‘నీవు నీఘోర రూపాన్ని వదిలి శాంత రూపాన్ని స్వీకరించు. తండ్రీ, మా పట్ల ప్రసన్నుడవు కావలసింది’ అని అడుగుతాం. అసలు పినాకిని అనే శబ్దాన్ని మీ జీవితానికి అన్వయం చేసుకోవడానికి మొదట రుద్రం ఇదే విధంగా వివరించింది. ఇదీ అసలు ధనుస్సు. ఈ ధనుస్సును మీరు జీవితంలోకి అన్వయం చేసుకోవాలి. మీరు తప్పు చేస్తే ఘోర రూపంతో ఈశ్వరుడిని చూడవలసి వస్తుంది.

అసలు తప్పు చేశానని చెప్పుకోవలసిన రోజు మీ జీవితంలో ఎందుకు రావాలి? మీరు మీజీవితంలో శాంతమయిన శివ దర్శనాన్ని కోరుకున్నవారయి ఉండాలి. అంటే మీరు తప్పులు చేయకుండా ఉండడానికి ప్రయత్నించాలి. శివతత్త్వం చాలా గంభీరంగా ఉంటుంది. ఆయన వెండి ధనుస్సును పట్టుకుని ఏం చేస్తున్నాడు? మీరు చేసిన పాపాలకు తగిన శిక్షను విధిస్తూ మీపాపములను పరిహారం చేస్తున్నాడు. రాష్ట్రపతి ఉదారుడైపెట్టిన క్షమాభిక్షతో విడుదలయిన ఖైదీ ఎంత పాపం చేసినా కొట్టుకుపోయినట్టు, ఎంత పాపం చేసినవాడయినా ఈశ్వరుని పాదాలు పట్టుకున్నవాడయితే ఆయన పాదాల మీద విస్మృతి కలగవలసిన అవసరం లేని రీతిలో తప్పించి వాడు భరించగలిగినంత దుఃఖాన్ని మాత్రమే ఇచ్చి తప్పిస్తాడు. కాబట్టి మీకు ఇప్పుడు శిక్ష వెయ్యడంలో కూడా ఆయన ఒక తండ్రి బిడ్డలను చూసుకున్నట్టు చూసి కొడతాడు. కాబట్టి ‘ఈశ్వరా మేం పాపం చేశాం. మీరు కోపంతో కూడిన ధనుస్సుతో మాకు కనపడవద్దు. మీరు ప్రసన్నమూర్తియై మాకు కనపడండి’ అని కోరుకుంటాం.

అసలు సనాతన ధర్మంలో మిమ్మల్ని భయపెట్టడానికి మీరు చేసే పాపానికి ఫలితం ఇచ్చేవాడు ఒకడు, మీ భయం తీయడానికి ఒకడు వేర్వేరుగా ఉండరు. ‘భయకృత్ భయనాశనః’ భయాన్ని సృష్టించేవాడు పరమాత్మే. భయాన్ని తీసివేసేవాడూ పరమాత్మే. ఇది సనాతన ధర్మంలో ఉన్నటువంటి జీవధార. మీకు ఒక కష్టం కలిగించడానికి, కష్టాన్ని తొలగించడానికి ఈశ్వరుడే కారకుడు. ఆ కష్టాన్ని మీరు మరిచిపోయేటట్టు చేసేటటువంటి కాల స్వరూపుడు కూడా ఈశ్వరుడే. గురు స్వరూపియై మళ్లీ వచ్చి మీ మనస్సు కు తగిలిన గాయాన్ని మాన్పించి మిమ్మల్ని మళ్లీ య«థా మార్గంలో మళ్లీ తిప్పినవాడు కూడా ఈశ్వరుడే. ఈశ్వరుని కారుణ్యానికి అంతులేదు.

కాబట్టి శాస్త్ర ప్రకారం, ఆయన పట్టుకున్న ధనుస్సు మనకు ఎప్పుడూ రక్షణే కల్పిస్తుంది. కాబట్టి శాబ్దీకం ‘పాతీతి పినాకెై’ అని చెప్పింది. ఈ ధనుస్సు మీకు ఘోర రూపంతో పాప ఫలితాన్నిచ్చినా, అఘోర రూపంతో సుఖాన్నిచ్చినా అది చేస్తున్నది మీ రక్షణే! కనుక ఆ ధనుస్సు లోకాలను రక్షించగలిగినటు వంటిది. అ ధనుస్సు ఎన్ని కోట్లమంది ఉన్నారో ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయో అన్నిటినీ రక్షిస్తుంది. అదీ ఆయన చేతిలోని ఉన్న ధనుస్సు ప్రత్యేకత. అందుకే రుద్రం ఆ« దనుస్సును అంత స్తోత్రం చేసింది. రుద్రుడు అటువంటి ధనుస్సును కలిగి ఉన్నాడు. ఆయన చేతిలో ఉన్నది పినాకము.

 

పాపాలు చేసి…దీపం పెడితే సరిపోదు! (ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే)

 

 

అవధానాలను అవలీలగా చేసే గరికపాటి నరసింహారావు ఆంధ్ర మహాభారతం మొదలు ఆంధ్రప్రదేశ్ విభజన వరకు ఏ అంశాన్నెత్తుకున్నా అవలీలగా వ్యాఖ్యానించగలరు. ఎంతో క్లిష్టమైన విషయాలను సైతం చమక్కులతో వివరించే ఆయన ఆంధ్రజ్యోతి – ఏబీఎన్ ఎమ్‌డీ వేమూరి రాధాకృష్ణ నిర్వహించిన ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ కార్యక్రమంలో తన అంతరంగాన్ని ఆవిష్కరించారు.

నేను ఆధ్యాత్మిక ఉపన్యాసాల్లోనూ అంతే నిక్కచ్చిగా ఉంటాను. ‘ఎన్ని పాపాలు చేసినా కార్తీకమాసంలో దీపాలు పెడితే అవన్నీ పోతాయి’ లాంటి పనికిమాలిన ప్రకటనలు ఎందుకు? అలా చెప్పి పాపాలను ప్రోత్సహిస్తున్నారు. సారా కొట్టు పెట్టి వంద కుటుంబాలను ఆర్పేసి నెలకోసారి దీపం పెడితే సరిపోతుందా? హిందూ ధర్మం అంత లోకువ కాదు. కోటి కల్పాలు గడిచినా చేసిన కర్మను అనుభవించక తప్పదని ఉంది శాస్త్రంలో. ‘ఒక్క దీపం కోటి పాపం…’ అని కొటేషన్లు చెప్పకూడదు. శివుడంత లోకువగా ఉన్నాడా? భగవంతుడికి ఓట్లు అవసరం లేదు. అందువల్ల ఆయన దేన్నీ మాఫీ చెయ్యడు. పాపం ఒక జ్ఞాపకం. మనస్సులోంచి అది పోవాలి. సీడీలో ఒక పాట స్థానంలో మరొక పాట రికార్డు చేసినట్టు నిరంతరం ఆర్తితో భగవన్నామ స్మరణ చేస్తే ఆ జ్ఞాపకాలు పోయి ఇది రికార్డవుతుంది.

ప్రాంతాలు విడిపోవడం సమస్య కాదు. స్వాంతాలు విడిపోవడం సమస్య. స్వాంతమంటే మనసు. కలిసి కూర్చుని చర్చించుకుంటే అన్నీ పరిష్కరించుకోవచ్చు. విడిపోయామని తెలంగాణవాళ్లు నన్నయ భారతం చదవడం మానెయ్యరు. ఆంధ్రాలో పశువుల కాపర్లు సైతం పాడుకునే పోతన భాగవత పద్యాలను వాళ్లేం పాడుకోవడం ఆపెయ్యరు. ఘంటశాల గానప్రవాహాన్ని చీలుస్తారా? తెలుగు విడిపోదు, చెడిపోదు తెలుగు వెలుగుతుంది. రెండు కన్నులతో ఇక నుండి ఇంకా వెలుగుతుంది.

గరికపాటి: శ్రీశ్రీ సాహిత్యం చదివి నేనెంతో ప్రభావితం అయ్యాను, అందుకని పెద్దవాడికి శ్రీశ్రీ అని పెట్టాను. తర్వాత ఆడపిల్ల పుడితే గరికపాటి సూకీ అని పేరు పెడదామనుకున్నాను. కాని మగపిల్లాడు పుట్టాడు. కన్యాశుల్కం తొమ్మిది గంటల నాటకం ప్రదర్శిస్తున్న రోజే పుట్టాడని వాడికి గురజాడ అని పెట్టుకున్నా. ఎక్కడికెళ్లినా ‘మీ నాన్న భలే పేర్లు పెట్టారు’ అంటుంటారు వాళ్లను.

నాకు ఎన్టీఆర్ అంటే అభిమానం. రాముడి పాత్రలో మెప్పించిన ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నప్పుడు స్పందించమంటే ‘ఆయన రాముడు ఈయన ఏన్టీరాముడు. ఆయన ఏకపత్నీవ్రతుడు – ఈయన లోకపత్నీవ్రతుడు’ అని చమత్కరించాను.

ఆర్కే : నమస్కారం గరికపాటిగారు. నిజజీవితంలో మీ అవధానం ఎలా ఉంది?
గరికపాటి : మంచి ప్రశ్న. అవధానం వేదిక మీద చెయ్యడం ఎంత ముఖ్యమో నిజ జీవితంలో చెయ్యడం అంతే ముఖ్యం. అవధానం అంటే ధారణ, జ్ఞాపకశక్తి. ఎన్ని ఆటంకాలున్నా పనిచెయ్యగలగడం. ఇది నిజజీవితంలోనే ఎక్కువ అవసరం. ఉదాహరణకు నేను స్వయంగా బజారుకెళ్లి సరుకులు, కూరగాయలు తెచ్చుకుంటాను. నా భార్య ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చెబుతుంది. చెప్పినప్పుడు కాగితమ్మీద రాసుకుని తర్వాత ఒక్కటీ మర్చిపోకుండా తీసుకొస్తాను. బయట ఎంత పండితులైనా, ఇంట్లో బంధం ప్రకారమే నడుచుకోవాలి. అవతలివాళ్లను మెప్పించాలి. యోగవాసిష్ఠం లాంటి గ్రంథాలు ఒంటబట్టిన తర్వాత ఆడపని మగపని చిన్నపని పెద్దపని అనేమీ ఉండదు. ఎవరు ఫోన్ చేసినా నంబర్లు రాసుకుంటాను.

ఆర్కే : మీకు ధారణ ఎక్కువ కదా. రాసుకోవడం ఎందుకు?
గరికపాటి : కావలసిన యాభై నంబర్ల వరకూ నాకు గుర్తుంటాయి. ప్రయత్నిస్తే ఎవరికైనా గుర్తుంటాయి. అవధాన కళ ద్వారా మేథాశక్తిని బాగా వినియోగించుకోవాలన్నది యువతరానికి చెప్పొచ్చు. వేదిక మీద ఎనిమిది పద్యాలు చెబితే గంటన్నరలో అయిపోతుంది. కాని నేను వాటితో పాటు దైవభక్తి, దేశభక్తి, నైతిక విలువలు, సత్ప్రవర్తన – వంటివి జోడించి చెబుతాను. చాలామందికి తెలియదు – నేను పదో క్లాసు ఒకసారి తప్పాను. ఇంగ్లీషు ఒక మార్కు తక్కువ వచ్చింది. మా నాన్నగారు కేకలెయ్యకపోగా ‘ఒకసారి తప్పితే గట్టిపడుతుంది సబ్జెక్టు’ అన్నారు. మాది పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం.

ఆర్కే : అసలే అక్కడ వ్యంగ్యం ఎక్కువ…
గరికపాటి : అవును. అందుకే ‘సీనియర్ స్టూడెంట్’ అంటారని భయం. కాని పరీక్ష తప్పి మళ్లీ చదవడం నాకు మేలు చేసింది. రెట్టింపు మార్కులు సాధించాను. నిజానికి మొదటిసారి ఉత్తీర్ణుడై ఉంటే ఇంత ఉత్తేజం కలిగేది కాదేమో. అందుకని నేను అవధానాల్లో తరచూ చెబుతుంటాను – ‘మేం అవతార స్వరూపులం కాదు. మా కాళ్లకు మొక్కితే మీకేదో వస్తుందనుకోకండి. మా చేతికి నాలుగు పళ్లు ఇచ్చి పాండిత్యాన్ని కొట్టేయాలని చూడకండి. ఆశీర్వచనం ఇచ్చేంత పెద్దవాణ్ని కాదు’ అని. సెంటిమెంటు పెరిగే కొద్దీ శాస్త్రజ్ఞానం తగ్గిపోతుంది. అవధానంలోనే కాదు, ఆధ్యాత్మిక రంగంలో కూడా ఉన్నాం గనక పంచెలు, పళ్లు, పాదాభివందనాలు, పారితోషికాలు – అన్నీ సమర్పిస్తూ ఉంటారు.

ఆర్కే : కాని దాన్ని చాలామంది ఎంకరేజ్ చేస్తున్నారుగా..
గరికపాటి : పాదాభివందనాలు, గురుదక్షిణలను ప్రోత్సహిస్తున్నారంటే వాళ్లకు అహం ఉన్నట్టు. ఇక అప్పుడు పాండిత్యం ఉపయోగం ఏముంది? కేవలం మన మాటల ద్వారా అవతలవాళ్లకేమీ అందదు, మనసు ద్వారా అందుతుంది. మన భావతరంగాల్లో అహంకారం ధ్వనించకూడదు. నా అవధానాలకు కాలేజీ కుర్రాళ్లు వస్తుంటారు. వ్యస్తాక్షరి వంటి క్లిష్టమైన అంశాలకు నేనెలాగ వేలి కణుపుల మీద సాధన చేస్తానో వివరించి వాళ్లనూ అలా చెయ్యమని చెబుతుంటాను. పాండిత్య ప్రకర్ష కారణంగానో, అహం వల్లనో అవధానాన్ని కొందరికే పరిమితం చేసి అందరికీ అందనిదానిగా తయారుచేస్తున్నారు. కాని అవధానం నేటి తరానికి ఎంతో ఉపయోగం. మీకు ఇవాళ ఇరవై పనులున్నాయనుకోండి. ధారణ సాధన చేస్తే వాటన్నిటినీ గుర్తు పెట్టుకోవడం సులువు.


ఆర్కే : పూర్వం కూడా మీరు చెబుతున్న పద్ధతిలోనే అన్నీ గుర్తు పెట్టుకునేవారు కదా…
గరికపాటి : మనకు అపూర్వమైన వారసత్వం ఉంది. కులాలతో సంబంధం లేకుండా రైతులకు సైతం ఎంతో విజ్ఞానం ఉండేది. అలాంటిది ధారణను కేవలం పండిత కళ చేసేస్తే అది బూజు పట్టిపోతుంది.

ఆర్కే : చేశారనేదే కదా ఆవేదన?
గరికపాటి : ఆవేదన అదే. కాని మన వరకూ మనం అర్థరాత్రి గాలి వీచినంత సహజంగా మన ధర్మాన్ని నిష్కల్మషంగా అహంకార రహితంగా చేస్తూ వెళితే అది వ్యాపిస్తుంది. నేను ఇరవయ్యేళ్లుగా దాన్ని గమనిస్తున్నాను.

ఆర్కే : ప్రశ్నలు పూరించలేక ఇబ్బంది పడిన సందర్భాలున్నాయా?
గరికపాటి : ఉన్నాయి. అవధానులు బైటికి చెప్పరుగాని, ప్రతి అవధానంలోనూ మా సంతృప్తి మేరకు మేం చెయ్యలేకపోతాం. ఓటమిని ఒప్పుకున్నప్పుడే గెలుపుబాటలో ముందుకు సాగగలం. నేనొకసారి మిర్యాలగూడలో అవధానం చేస్తున్నాను. పృచ్ఛకుల్లో మరింగంటి పురుషోత్తమాచార్యులని మంచి కవి ఉన్నారు. ఆయన ఇచ్చిన సమస్యకు ఏం చెప్పాలో నాకు వెంటనే తోచలేదు. అవధానంలో సమస్య ఇచ్చిన నిమిషం లోపల పద్యాన్ని మొదలుపెట్టాలి. భావ స్ఫురణ ఉండాలి. చురుగ్గా బుర్రను పరుగెత్తించాలి. అది కుదరక ఏదో గిట్టుబాటు చేశాను. అది సరికాదని నాకూ తెలుసు. అవధానం పూర్తి చేసి వేదిక దిగి రాగానే నాకు అది స్ఫురించింది. మర్నాడు ఫోన్ చేసి, ‘ఆచార్యులుగారూ క్షమించండి. నాకు తోచలేదండీ. వేదిక దిగాక తోచింది..’ అని చెప్పాను. ఆయనెంత మంచివాళ్లంటే, ‘పర్వాలేదయ్యా, నేను నిన్నలా ఇబ్బంది పెట్టకుండా ఉండాల్సింది…’ అన్నారు!

ఆర్కే : మీరు రాజకీయాల మీద కూడా చేస్తుంటారా?
గరికపాటి : చిరంజీవి పార్టీ పెట్టిన కొత్తలో ఓ దత్తపది ఇచ్చారు. ఆయన నటించిన సినిమాలు ఖైదీ, ఠాగూరు వంటివి ఇచ్చి అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పమన్నారు. “కాలుమోపగానె ఖైదీల విడిపించు – ఈ స్వయంకృషికిక ఎదురులేదు – అదుపుచేయునేమో అవినీతి ఠాగూరు…’ అంటూ చెప్పాను. వారి అదృష్టమో మన అదృష్టమో వారు అధికారంలోకి రాలేదనుకోండి. ‘మాకు 180 సీట్లొస్తాయి’ అన్నారు ముందు. ఫలితాలు చూస్తే 18 వచ్చాయి. ‘కోల్పోయినదేముంది శూన్యం తప్ప’ అని ఛలోక్తి విసిరాను. కాని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరి మీదైనా ఛలోక్తి విసరాలంటే ఇబ్బందిగా ఉంది. మనిషి సరసాన్ని, ఛలోక్తిని కోల్పోతే జీవితం ఏముంటుంది? ఇప్పటికీ అవధానాల్లో అప్రస్తుత ప్రసంగం అంటే రాజకీయాలే ఎక్కువగా వస్తాయి. ‘ద్రౌపది ఐదుగురిని చేసుకోవడం ధర్మమా, రాముడు వాలిని చంపడం ధర్మమా అని. అవి తప్ప మరేమీ మంచి విషయాలు లేనట్టు. మన జాతికి చర్య మీద ఆసక్తి లేదు, కేవలం చర్చ మీదే ఆసక్తి.

ఆర్కే : ఇంకా ఇలాంటి రాజకీయ ఛలోక్తులు ఏం చేశారు?
గరికపాటి : మీ సొమ్మేం పోయిందండి, అడుగుతారు తర్వాత నేను ఇబ్బంది పడాలి…
ఆర్కే : నాది కదా బాధ్యత మీరు చెప్పండి.
గరికపాటి : ఆ విషయంలో నాకు మీరే స్ఫూర్తి. సింగిల్ మేన్ ఆర్మీలా దూసుకెళ్లిపోతుంటారు మీరు. మిమ్మల్ని చూసి నేను కూడా ధైర్యంగా మాట్లాడుతుంటాను. మొన్న మచిలీపట్నంలో కిరణ్‌కుమార్ రెడ్డి ధైర్యస్తులని చెప్పాను. కాంగ్రెస్ అక్కడ, ఇక్కడ కూడా పోతుందని చెప్పాను. కేసీఆర్‌తో కలిస్తే ఏమో. అయితే ఆయన తన పట్టు ఎందుకు వదులుకుంటారు? ఎవరి పట్టు వాళ్లు చూసుకుంటారు. అవధానాల్లో రాజకీయ, సామాజిక, ఆధ్యాత్మిక పరిస్థితులను విశ్లేషించాలి. ముఖ్యంగా యువతరాన్ని ఆకట్టుకోవాలంటే శృంగారం, హాస్యం, నేరాలు ఘోరాలు ఇవన్నీ చెప్పాలి. కొన్ని చెప్పలేను. చెప్పినవి సైతం పరిమితుల్లో ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్ కావాలంటే రామాయణ భారతాలు చదవాలి.

ఆర్కే : ఇవాళ అంత విద్య, విద్వత్తు ఎవరి దగ్గరుంది?
గరికపాటి : విశ్వవిద్యాలయాల్లో చదువులే అలా ఉంటున్నాయి. ఆశతో ముందుకు వెళ్లాలి. మీరు పత్రిక నడపటం లేదా ఆశావహ దృక్పథంతో?
ఆర్కే : రేపటి గురించి ఆశ లేకపోతే ఎలా?
గరికపాటి : భగవంతుడు నాకీ కండువా వేసినందుకు నాకు తోచింది చేస్తాను. ఇప్పటికైనా ఒకటి నుంచి ఐదు వరకు తెలుగు మాథ్యమం పెడితే పది పదిహేనేళ్లకు మార్పు వస్తుంది. బడి విడిచే ముందు ఒక్క అరగంట తెలుగు పద్యాలు పాడిస్తే ఏడాదికి వంద పద్యాలు, పదేళ్లకు వెయ్యి పద్యాలు నోటికి వచ్చేస్తాయి. ‘సరదాగా వినండి – నాతో పాటు అనండి’ అంటే చాలు. వాళ్ల తెలివితేటలు, ధారణ బాగా పెరుగుతాయి. అవి చేస్తే బురదలో నుంచి తామరపూలు పూస్తాయి. ఒక్క శ్లోకం నన్ను ఇవాళ మీ ముందు నిలబెట్టింది.

ఆర్కే : అదేమిటి?
గరికపాటి : తె లుగు యూనివర్సిటీలో ఉద్యోగం వస్తుందనుకుంటే చివరి నిమిషంలో పిడుగులాంటి వార్త విన్నాను. 250 అపాయింట్‌మెంట్లు రద్దు చేశారు. అవధాన ప్రతిభ ఉందిగాని దాని మీద బతకడం ఎలా? అప్పటికి పెళ్లయింది, ఇద్దరు పిల్లలు. విరక్తి వచ్చేసి అయిపోదామనుకున్నా. హిమాలయాల్లో సింహాన్ని వేటాడ్డానికి వెళ్లిన కిరాతుల గురించి వర్ణిస్తూ కాళిదాసు రాసిన శ్లోకం చదివాను. అప్పుడు నాలో ఆలోచన మొదలైంది. బహుశా ఆ ఉద్యోగం జారిపోవడం మన మంచికేనేమో. నన్ను అమ్మవారు అవధానానికే వాడుకోవాలనుకుంటోందేమో అనిపించింది. అప్పటివరకూ నాస్తికుణ్ని. ఆ తర్వాతే నేను ఆస్తికుడిగా మారాను. గుంటూరు వెళ్లి విజ్ఞాన్ రత్తయ్యగారి దగ్గర పని చెయ్యడం మొదలుపెట్టాను. తర్వాత కొందరం కలిసి కోనసీమలో రెసిడెన్షియల్ కాలేజీ పెట్టాం. భాగస్వాముల మధ్య కుదరక అది మానేశాను. తర్వాత కాకినాడలో ఆదిత్య కాలేజీలో శేషారెడ్డిగారు ఆఫర్ ఇచ్చారు. ‘ఆరు వేల జీతం ఇస్తాను ప్రిన్సిపాల్‌గా ఉండండి’ అని. అదికూడా వినలేదు. గరికపాటి కాలేజ్ అని సొంతంగా ఒకటి పెట్టాను. దానిలో మా వాళ్లెవరూ చేరలేదు, వేరేవాళ్లు అసలే చేరలేదు.

ఆర్కే : ఉభయ భ్రష్టత్వం అన్నమాట.
గరికపాటి : బ్రాహ్మలం కదండీ. వ్యాపారం మా స్వభావంలో లేదు. మా నాన్న ఇచ్చిన నాలుగు ఎకరాలను కరిగించేశాను. ఇంట్లో పనిమనిషి చేతే పనిచేయించలేం, పదిమంది చేత ఎలా చేయించగలం? పనిమనిషులెవరూ లేక నా తల్లి కాలేజీ పిల్లల కంచాలు కడుగుతుంటే చూడలేకపోయాను. కాలేజీ మూసెయ్యాలనుకున్నా. అప్పుడు చైతన్య మెడికల్ కాలేజీ రాజుగారు లక్ష రూపాయలు డబ్బు పట్టుకుని వచ్చారు. ‘మీ కాలేజీ ఇబ్బందుల్లో ఉందని తెలిసింది. మీరు మా కాలేజీలో చేరండి’ అని డబ్బులు అక్కడ పెట్టి వెళ్లిపోయారు. బ్లాంకు చెక్కు కూడా ఇచ్చారు. రాత్రి ఇంట్లో చర్చించుకుని కాలేజీ సామానంతా విలువ కట్టి ఆయనకు అమ్మేశాను. చెక్కు మళ్లీ ఆయన చేతుల్లోనే పెట్టేశాను. తర్వాత ఆయన కాలేజీలో చేరి పాఠాలు చెబుతూ అవధానాన్ని మెరుగుపరుచుకున్నాను. శంకరాచార్య సాహిత్యం చదువుతుంటే దుఃఖం తగ్గి, ఆశ పెరిగింది. దైవానుగ్రహం అంటే ఎక్కణ్నుంచో వచ్చేది కాదు. అనుసృత్య గ్రహణమ్ అని అర్థ్థం. దైవాన్ని అనుసరించి సాధన చెయ్యాలి. నెమ్మదిగా సమస్యల్లోంచి బయటపడ్డాను. టైమ్‌టేబుల్ ప్రకారం పుస్తకాలు చదువుకుంటుంటాను.

ఆర్కే : ఇప్పటికీ టైమ్ టేబుల్ ఉందా?
గరికపాటి : ఉంది. నేను దానికి కవిసమయం అనే పేరు పెట్టుకున్నాను. గంటగంటకు ఏం చెయ్యాలనేది అందులో ఉంటుంది.
ఆర్కే : ఇంత పాండిత్యం ఉండి మీరు సినిమాల్లోకి ఎందుకు అడుగుపెట్టలేదు?
గరికపాటి : గడచిన ఆరేడేళ్లుగా బాగా అవకాశాలొస్తున్నాయి. కాని మనసుకు సంపూర్ణమైన స్వేచ్ఛ ఉండాలి తత్వవేత్తకు. ఆందోళన లేకపోతేనే స్వేచ్ఛ ఉంటుంది. సినిమా రంగంలో దర్శకుడు, నిర్మాత, నటీనటులు అందరికీ ఆందోళనే. అంతా వైకుంఠపాళీనే అక్కడ. ‘మీరు అక్కడకెళ్లి దాన్ని బాగుచెయ్యొచ్చు కదా’ అంటుంటారు. ‘అక్కడికి వెళ్లాక మనం దాన్ని బాగుచేసేదేం ఉండదు, మనం చెడిపోతాం అంతే’ అంటాన్నేను. పౖౖెగా అక్కడ గ్లాసు లేనిదే మాట్లాడరు. నాకది చిరాకు.

ఆర్కే : అందరూ అలా ఉండరండి. గ్లాసు ముట్టనివాళ్లు చాలామందే ఉన్నారు సినిమాల్లో…
గరికపాటి : అవును. మా మిత్రుడు జొన్నవిత్తుల ఉన్నాడు. కాని తెల్లవార్లూ మెలకువగా ఉండటం, చర్చలు – నాకు నడవవు. రెండోది మనం ప్రాచీన సాహిత్యం చదువుకున్నాక ఏ నిర్మాతో వచ్చి రాసిన దానిలో వేలు పెడితే అవమానంగా అనిపిస్తుంది. అలాగని అందులో ప్రతిభ తక్కువని కాదు. సీతారామశాస్త్రి, రామజోగయ్య, చంద్రబోస్, అనంతశ్రీరామ్ – ఇంతమంది ఉండగా ఆ రంగానికి మన సేవలు అవసరం లేదు. ఆధ్యాత్మికతను కుండబద్దలు కొట్టి చెప్పేవారు కావాలి. ముఖ్యంగా అవధానం.

ఆర్కే : ఆధ్యాత్మిక రంగంలో ప్రవచనాలు చెప్పేవాళ్లు ఎక్కువైౖపోయారు. ఎవరికి వాళ్లు పీఠాలు, పీటలు వేసుకుని కూచున్నారు. భక్తులూ కిటకిటలాడుతున్నారు. ఇంత భక్తి పెరుగుతుంటే పాపాలు ఎందుకు పెరుగుతున్నట్టు? స్వాములు మూఢభక్తిని పెంచుతున్నారా? ఎన్ని పాపాలు చేసినా ఏదో ఒకటి చేస్తే సరిపోతుందని చెప్పడమా? మీ విశ్లేషణ ఏమిటి?
గరికపాటి : ఆముక్త మాల్యదలో ఒక పద్యం ఉంది. మౌనంగా అర్థరాత్రి గాలి వీచినంత సహజంగా మన పని మనం చేసుకుపోతే మంచి ఫలితాలు వాటంతటవే వస్తాయి. ఏ ఉపన్యాసం చెప్పినా, చివర్లో తెలుగులో మాట్లాడదాం అని చెబుతుంటాను. వ్యవస్థ ఎంత చెడిపోయినా, చిట్టచివరి వేరు పట్టుకుని నేను శాయశక్తులా ధర్మాన్ని నిలబెట్టడానికి కృషి చేస్తాను. ఉదారస్య తృణం విత్తం – శూరస్య మరణం తృణం – విరక్తస్య తృణం భార్య – నిస్పృహస్య తృణం జగత్ అన్న మాటను నేను నమ్ముతాను. కోరికలేని వాడికి ప్రపంచమే గరిక పాటి.

ఆర్కే : మీ భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి?
గరికపాటి : యువతరం కోసం వ్యక్తిత్వ వికాసం, సంభాషణా నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు, నిర్వహణ సామర్థ్యం – ఈ నాలుగింటినీ మన సాహిత్యం ఆధారంగా చిన్న పుస్తకాలుగా సరళమైన భాషలో, వాళ్లకు ఉపయోగపడేట్టుగా రాయాలనుకుంటున్నాను. అలాగే దేవాలయాల్లోనూ, వయసు మళ్లినవారికీ ప్రవచనాలుగా కాకుండా ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలకెళ్లి నవతరానికి మంచి మాటలు చెప్పి మార్పు తేవాలన్నది నా ఉద్దేశం.
ఆర్కే : మీరు అలుపెరగని పోరాటం చేయాలని కోరుకుంటున్నాను.

Posted in వార్తా పత్రికలో | Leave a comment

కార్తీకం లో మా పంచారామ సందర్శనం -5(చివరి భాగం )

కార్తీకం లో మా పంచారామ సందర్శనం -5(చివరి భాగం )

కార్తీకం లో మా పంచారామ సందర్శనం -4 ద్రాక్షా రామం

కార్తీకం లో మా పంచారామ సందర్శనం -3

కార్తీకం లో మా పంచా రామ సందర్శనం -2

కార్తీకం లో మా పంచా రామ సందర్శనం – దర్శన మాలిక

కార్తీకం లో మా పంచా రామ సందర్శనం

ఈ సోమ వారం అర్ధ రాత్రి పన్నెండు దాకా దర్శనం ఇచ్చి ఒక పావు గంట మాత్రమె ఆలయ దర్శనం ఆపేసి మళ్ళీ రాత్రి పన్నెండుం బావుకు దర్శనం ఏర్పాటు చేశారు. సామర్ల కోట కుమారా రామం లో .రెండు గంటలకు బస్ దిగి ఒక వంతెన దగ్గర ఆటో లో మనిషికి అయిదు రూపాయలిచ్చి  ఆలయం దగ్గరకు చేరాం .ముప్ఫై  రూపాయల స్పెషల్ దర్శన టికెట్లు కొని లైన్ లో నిలబడి కుమారా భీమేశ్వర స్వామిని దర్శించాం .అమ్మవారు బాలా త్రిపుర సుందరీ దేవి ని దర్శించాం .మిగతా దేవతా మూర్తులను దర్శించి ,లడ్డు ప్రసాదం కొని,అప్పుడే వచ్చిన  వేడి వేడి పులిహోర ప్రసాదంకూడా కొని తిన్నాం . ,బయటి కొచ్చి  కాఫీ త్రాగాం.ప్రభావతి పప్పు చెక్క కొని నవిలింది .యన మండ్రసాయి భార్య కొడుకు లతో కలిసి ఆటో లో మనిషికి పది రూపాయలిచ్చి వంతెన దగ్గరకు చేరి అక్కడే ఉన్న బస్సు ఎక్కి కూర్చున్నాం . .అందరు వచ్చేసరికి మూడు అయింది .అప్పుడు బస్సు బయల్దేరింది .ఇప్పుడు ఆలయ విశేషాలను తెలుసు కొందాం .

 

 

’మున్ను చాళుక్య భీమ రాత్పున్గవుండు-భక్తీ వెలయింప ,నాభీమ వరము నందు –నిల్చి యార్తుల కోర్కెల నించు నట్టి –సదయు జాళుక్య భీమేశు సంస్తుతింతు’’అన్నాడు శ్రీనాధుడు భీమ ఖండం లో ఈక్షేత్రాన్ని గురించి .దీన్ని ‘’చాళుక్య భీమ వరం ‘’అని కూడా అంటారు .సామర్ల కోట రైల్వే స్టేషన్ దగ్గర ఉంది .చాళుక్య భీముడు ఈ పట్నాన్ని కట్టించి రాజధానిగా పాలించి ,ఈ ఆలయాన్ని పునర్నిర్మించాడు .ఇక్కడ కుమార స్వామి అమృత లింగ శకలాన్ని ప్రతిస్టించాడు .కనుక ఈ క్షేత్రం ‘’కుమారా రామ భీమేశ్వరం ‘’అయింది .స్కంధా రామం అని పేరు కూడా ఉంది .

సామర్ల కోటకు ‘’శ్యామల కోట ‘’అని పేరు ఇక్కడ చాళక్య భీముడు కట్టిన కోట ఉంది .అది శిధిలమైంది .కుమార గిరి బావ మరది కాటయ వేముడు దీన్ని జయించి శ్యామలా  దుర్గాన్ని పునర్నిర్మించ బూనాడు .త్రవ్వుతూ ఉంటె మహిషా సుర మర్దిని అమ్మ వారి విగ్రహం దొరికింది దాన్ని ‘’శ్యామల దేవి ‘’పేరు తో కాటయ వేముడు ప్రతిస్టించాడు .దీనికి దక్షిణం గా గ్రామ నిర్మాణం చేసి దానికి ‘’శ్యామలా దుర్గం ‘’అని పేరు పెట్టాడు .అది క్రమం గా మారి ‘’సామర్ల కోట ‘’అయింది .శ్యామలా దేవి ఇప్పుడు ఈ భీమేశ్వరాలయం లో ప్రాకార దేవత గా కొలువై ఉన్నారు .ఈ శ్యామల కోట బొబ్బిలి యుద్ధం లో ఒక ప్రధాన పాత్ర వహించింది .ఒకప్పుడు ‘’స్వాములు ‘’ఇక్కడ ఉండే వారు .అందుకని స్వాముల కోట అయింది అదే సామర్ల కోట అయింది .

దేవాలయం చుట్టూ 18అడుగుల ఎత్తు ప్రాకారం ఉంది .నాలుగు వైపులా గోపురాలున్నాయి .ఇక్కడి శిల్పకళ ద్రాక్షారామాన్ని పోలి ఉంటుంది .ఇక్కడ కూడా ‘’నమూనా దేవాలయం ‘’ఉంది .దక్షిణం గా ప్రదక్షిణ చేస్తూ వెడితే తూర్పున ఉన్న కోనేటిలో స్నానమో పాదప్రక్షాళనో చేసి ఆలయ ప్రవేశం చేయాలి కోనేరుకు భీమ గుండం అని  ,పుష్కరిణి అని పేర్లు .కుమారనది లేక కుమార సరస్సు అంటారు .కుమారారామానికి దగ్గరలో ‘’కొమరేరు ‘’ప్రవహిస్తోంది .శ్రీ నాధుడు ‘’బాదరాయణు డత్యంత భక్తీ నియతి –దివ్య వాహిని ‘’గోమరేట’’దీర్ద మాడి –శిష్య వర్గంబు దాను దర్శించి ,మ్రొక్కి –శాశ్వతునకు జాళుక్య భీమేశ్వరునకు ‘’అన్నాడు

 

శివుడు వ్యాస మహర్షిని కాశీ నుంచి వెళ్ళ గొట్టిన తర్వాత ద్రాక్షారామాన్ని ,కుమారారామాన్ని సందర్శించి నట్లు భీమ ఖండం లో ఉంది

ధ్వజ స్తంభం దాటి లోపలికొస్తే నల్ల రాతి నంది విగ్రహం కనిపిస్తుంది ప్రాకార దేవతలను సూర్య దేవుడిని చూసి మహా గణపతి ,సప్త మాతృకలు దాటితే దక్షిణ ద్వారం వస్తుంది .ఇది దాటి తూర్పుకు వెడితే సరస్వతీ దేవి కుమార స్వామి కనీ పిస్తారు .వాయవ్యం లో మహిషాసుర మర్దిని ,ఉత్తర తూర్పులో శ్రీ మహా విష్ణువు ,దక్షిణాన లక్ష్మీదేవి దర్శించి ,ఉతర ద్వారం దగ్గరకు చేరాలి .దాన్నిదాటి ప్రాకార మండపం చేరితే చండీశ్వర స్వామి ,వీరభద్ర స్వామి ,ఈశాన్యాన వల్లీ సుబ్రహ్మన్య స్వామిని దర్శించాలి .ఇక్కడే ఉయ్యాల మండపం ఉంది .ఈ మండపం ‘’ఊపితే కదులుతుంది ‘’ఇదీ విశేషం ..ప్రాకారం లో బాలా త్రిపురసుందరి దేవి పశ్చిమాభి ముఖం గా దివ్య కాంతులతో దర్శన మిస్తారు .

అమ్మ వారి దర్శనం తర్వాత రెండు మెట్లు దిగి చతురస్రాకార గర్భ గుడి లో భీమేశ్వర స్వామి పాను వట్టం పై తెల్ల పాల రాతి రంగులో

ఉన్న పన్నెండు అడుగుల ఎత్తున్న శివ లింగం పై అంతస్తు దాకా ఉంటుంది .దీనినే ‘’యోగ లింగం ‘’అంటారు .కిందిఅంతస్తు గర్భ గుడి కి దక్షిణ ప్రాకారం ఉంది .ఇది చాలా చీకటి ప్రాకారం .కింది అంతస్తులో శివలింగాన్ని దర్శించ టమే కాని పూజాదికాలుండవు .పై అంతస్తులో ‘’రుద్ర భాగం ‘’లో అభిషేకాలు ,పూజాలు నిర్వహించాలి .కింది అంతస్తులోకి గర్భ గుడి నుండి కిందికి దిగి దక్షిణం లో ఉన్న మెట్ల ద్వారా పై అంతస్తుకు చేరచ్చు .ఈ మెట్లు చిన్నవి తల వంచి వెళ్ళాలి లేకుంటే పై అంతస్తు కు తల తగులుతుంది .ఈ దక్షిణ ఆగ్నేయ ద్వారాన్ని ‘’సూర్య ద్వారం ‘’అంటారు .కిందికి దిగటానికి ఉత్తరాన మెట్లుంటాయి .ఈ ఉత్తర ఈశాన్య ద్వారమే ‘’చంద్ర ద్వారం ‘’.ఈ సూర్య ,చంద్ర ద్వారాలు రెండు గర్భ గుడికి నాశికా రంధ్రాలు అంటారు మానవుడి నాసికా ద్వారాల్లలో ఎడమ వైపుది చంద్ర నాడి కుడిది సూర్య నాడి .యోగీశ్వరుడు ఈ రెండు నాడుల గుండా ప్రాణాయామ ప్రక్రియ ద్వారా ప్రాణ వాయువు ను సహస్రారం లో అంటే శిరస్సులో చేర్చి పరమాత్మ అను భూతి పొంది ఆనందమయ మైన జీవికి ఇది యోగ మార్గం గా నిర్మించిన ద్వారాలు గా వీటిని భావిస్తారు .

 

గర్భాలయానికి నాలుగు దిక్కులా ద్వారాలుంటాయి .చైత్ర ,వైశాఖ మాసాల్లో సూర్య భగవానుడి ఉషః కిరణాలు ఉదయాన స్వామి పాదాల పైన సాయంత్రం అమ్మ వారి పాదాల మీద పడటం విశేషం .కార్తీక మాసం లో ,మార్గ శిర మాసం లో ,మహా శివ రాత్రి నాడు విశేష పూజలు అభి షెకాలు నిర్వహిస్తారు .శరన్నవ రాత్రులలో శ్రావణ మాసం లో అమ్మ వారికి కుంకుమ పూజ విశేషం .మాఘ బహుళ ఏకాదశి నాడు స్వామికి గ్రామోత్సవం కల్యాణోత్సవం రధోత్సవం వైభవం గా జరుగుతాయి .

అనేక మంది రాజులు పాలించిన ప్రదేశం ఇది .నంద వంశ రాజుల నుంచి తూర్పు చాళుక్యుల వరకు దీన్ని పాలించి స్వామిని దర్శించి కానుకలర్పించారు .కాళింగ దేశం నుండి పిఠాపురం  రాజ మండ్రి వరకు పాలించిన చాళుక్యులు ఈ ప్రాంతాన్ని దర్శించిన వారే .కుబ్జ విష్ణు వర్ధనుడి దగ్గర నుంచి మేడ విజయాదిత్యుని వరకు ముప్ఫై మంది పాలించారు .చాళుక్య భీముడు కుమారా రామ భీమేశ్వరాలయాన్ని నిర్మించాడు .తన యుద్ధాలవిజయాలకు ప్రతీక గా దీన్ని నిర్మించాడు .ఈయన 300యుద్ధాల విజేత ఈయన .కుమారారామ భీమేశ్వరాన్ని

రాజధానిగా చేసుకొని పాలించాడు.వీర చాళుక్యుడు అని పించుకొన్నాడు .అందుకే ‘’చాళుక్య కుమారా రామ భీమేశ్వర స్వామి ‘’గా ప్రసిద్ధి చెందాడు .

ఈ రంతం కొంతకాలం గోల్కొండ నవాబుల అధీనం లోను ఉంది ఈ నాటి హుసేన్ పురం వరకు వ్యాపించి ఉండేది .కొంతకాలం పెద్దాపురం సంస్థానం లో ,పిఠాపురం సంస్థానం లోను ఉండేది .ఆలయ పశ్చిమ ద్వారం వద్ద పశ్చిమ గోడకు ఒక గణ పతి  విగ్రహం ఉంది .ఈ విగ్రహం నాభి లో ఒక వజ్రం ఉండేదని ,రాత్రి పూట ఆ వజ్రం నుంచి కాంతి పుంజాలు వెలువడి భక్తులకు మార్గ దర్శకం గా ఉండేది .దాన్నెవరో దొంగిలించారు .వ్యాసుడు హీమేశ్వరుని ,రాజ నారయుణుడి ని దర్శించాడుఅని భీమేశ్వర పురాణం లో ఉంది .

‘’రాజ నారాయణ స్వామి రమ్య భావన –తార్క్ష్య కేతన పతికి నర్తనము గారపు –కుమారా రామ మాహర్మరేఖయ –చాళుక్య భీమేశు సదన వాటి ‘’అని వర్ణించాడు శ్రీ నాధుడు .ఆలయానికి పడమర రెండు కిలో మీటర్ల దూరం లో మాండవ్య లక్ష్మి దేవి సహిత నారాయణ స్వామి ఆలయం ఉంది .దీనికే ‘’రాజ నారాయణ స్వామి ఆలయం ‘’అంటారు .

కాటన్ దొర ఏర్పాటు చేసిన నీటి కాలువల వల్లఈ గ్రామానికి సామర్ల కోట తో సంబంధం తెగి పోయింది .గ్రామం నామ మాత్రం గా మిగిలింది .అయితే వంతెనలు నిర్మించటం వల్లసామర్ల కోట కు రాక పోకలు జరుగుతున్నాయి .

ఇలా పంచారామాలను  ఈ కార్తీక మాసం లో ,అందునా సోమవారం నాడు దర్శించే అరుదైన అవకాశం లభించి ,జీవితం ధన్య మైనదని పించింది .తెల్ల వారుజ్హామున మూడు గంటలకు మా బస్సు బయల్దేరి మళ్ళీ వచ్చిన దారిలోనే పాలకొల్లు ,భీమ వరం దాటి కైకలూరు చేరే సరికిమంగళ  వారం ఉదయం ఎనిమిదింటికి చేరింది .అక్కడ ఒక అరగంట ‘’రిసెస్’’కు సమయం కోసం బస్ స్టాండ్ లో ఆపారు డ్రైవర్లు .’’ఒకటి రెండు’’ కానిచ్చిఎనిమిదిన్నరకు బయల్దేరి గుడి వాడ ,వెంట్రప్రగడ కలవ పాముల ,కాటూరు మీదుగా ఉయ్యూరు సెంటర్ లో ఉదయం పది పది కి చేరాం .న్యాయం గా సోమ వారం రాత్రి ఉయ్యూరు చేరాలి .కాని పది గంటలు ఆలస్యం గా ఉయ్యూరు చేరాము .మా మనుమ రాలును ఇంటి దగ్గర దింపి ఇంటికి వచ్చి పళ్ళు తోముకొని ,స్నానం చేసి ,సంధ్య పూజాదికాలు నిర్వహించాను , మా కోడలు రాణి కి ముందే ఫోన్ చేసి మాకు కూర పచ్చడి చేసి పంపమని చెప్పాను .అలాగే మేము వచ్చేసరికి కారియర్ లో మా మనవడు చరణ్ చేత పంపింది .టిఫిన్ గా సీరియల్ తిన్నాం ..అన్నం వండుకొని ఆ కూరా పప్పు పులుసు తో తిన్నాం .మధ్యాహ్నం పన్నెండు గంటలకు బయల్దేరి బెజవాడ వెళ్లి బస్ లో తణుకు సాయంత్రం నాలుగింటికి చేరి అక్కడ నన్నయ భట్టారక పీఠం లో ‘’రామాయణ భారతాలలో మానవ విలువలు ‘’పై ప్రసంగించి రాత్రి ఒంటి గంటకు ఇంటికి చేరాను .ఇలా ఆదివారం నుండి మంగళ వారం దాకా మూడు రాత్రులు నిద్రలేకుండా గడిపాను. అయినా ఆనందం గా హాయిగా ఉంది .

పంచారామ సందర్శనం సర్వం సంపూర్ణం .

మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ -1-12-13-ఉయ్యూరు

.

Posted in పంచా రామ | Tagged | Leave a comment

కార్తీకం లో మా పంచారామ సందర్శనం -4 ద్రాక్షా రామం

కార్తీకం లో మా పంచారామ సందర్శనం -4

ద్రాక్షా రామం

కార్తీకం లో మా పంచారామ సందర్శనం -3

కార్తీకం లో మా పంచా రామ సందర్శనం -2

కార్తీకం లో మా పంచా రామ సందర్శనం – దర్శన మాలిక

కార్తీకం లో మా పంచా రామ సందర్శనం

అర్ధ రాత్రి పన్నెండు గంటలకు ఇరవై రూపాయల స్పెషల్ దర్శనం టికెట్లు కొని భీమేశ్వర స్వామి దర్శనం కన్నుల పండువుగా చేసుకోన్నాం .ఆ తర్వాత  అష్టా దశ శక్తి పీఠాలలో ఒకటైన మాణిక్యాంబ అమ్మ వారి ని సందర్శించి పునీతులయ్యాం .ఆలయం చాలా పెద్ద ప్రాకారం లో ఉంది .బయట నాటకాలు హరికధలు తెల్ల వార్లూ కార్తీకం లో నిర్వ హిస్తున్నారు ఇరవై ఏడవతేది రాత్రికి శ్రీని వాస కల్యాణాన్ని తిరు పతి దేవస్థానం  వారు ఇక్కడ నిర్వహిస్తున్నట్లు అనౌన్స్ చేస్తున్నారు .మైక్ లో.మా బస్ దిగిన చోట కాక ఆలయం ఎడమ వైపు ఉంచారు .అక్కడికి నడిచి వెళ్లి ఎక్కి కూర్చుని మిగిలిన వారి క కోసం ఎదురు చూశాము .ఇప్పుడు ఆలయ విశేషాలు తెలుసు కొందాం .

‘’ద్రాక్షారామాత్పరం క్షేత్రం –న భూతో న భవిష్యతి ‘’అని వ్యాస భగ వానుడు ‘’భీమ ఖండ మహా పురాణం ‘’లో చెప్పాడు .పంచారామాలలో

రెండవదిగా త్రిలింగ క్షేత్రాలలోను రెండవదిగా ,ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఉపలింగ క్షేత్రం గా ద్రాక్షా రామం వర్ధిల్లింది .

శివుడి అమృతలింగం రెండవ భాగం ఇక్కడ పడింది .దీన్ని పవిత్ర గోదావరి జలాలతో సంప్రోక్షణ చేసి ఇక్కడ ప్రతిష్టించాలని సప్త ఋషులు భావించారు .కాని ఇక్కడ అప్పుడు నదిలేదు .గోదావరిని ప్రార్ధించారు .ఆమె మహర్షులతో ప్రయాణమై వచ్చింది .కాని మార్గ మద్యం లో ఋషుల ,రాక్షసుల ఆశ్రమాలన్నీ మునిగి పోయాయి దీనికి కోపించిన వారాంతా గోదావరిని అదృశ్యం అయేలా శపించారు .అప్పుడు ‘’తుల్య భాగుడు ‘’అనే రాక్షస రుషి మధ్య వర్తి గా ఉండి గోదావరిని అంతర్వాహిని గా ప్రవహించేట్లు చేస్తాడు .సప్తరుషులైన కశ్యప ,అత్రి ,జమదగ్ని ,విశ్వా మిత్ర ,గౌతమ ,వసిష్ట ,భారద్వాజుల చేత తీసుకొని రా బడింది కనుక దీనిని ‘’సప్త గోదావరి ‘’అంటారు .రాక్షసులతో వివాదం కారణం గా గోదావరి రాక ఆలస్యం అయి నందున శివుడు బ్రహ్మాది దేవతలా అభ్యర్ధన మేరకు ఇక్కడ ముహూర్త సమయానికి ‘’భీమేశ్వరుడు ‘’అనే పేరు తో మార్గ శిర శుద్ధ చవితి నాడు ‘’స్వయంభు ‘’గా వెలిశాడు .సప్తర్షులు వచ్చి విషయం తెలిసి నివ్వెర పోతారు.ఆలయం లోపలి వెళ్లాలని ప్రయత్నిస్తే అక్కడ విపరీత మైన వేడి గా ఉండటం గమనించారు .ఇంతలో ఆశీర వాణి’’ఇక్కడ స్వయంభు గా శివుడు వెలిశాడు  .సూర్యుడు మొదటి సారిగా స్వామిని అర్చించాడు ఈ వేడి తగ్గటానికి ఈ గ్రామం లో ఎనిమిది దిక్కులలోను ఎనిమిది సోమ లింగాలను ప్రతిస్టిం చండి .అప్పుడు ఈ వేడి తగ్గు తుంది ‘’అని వినబడింది.

Inline image 1Inline image 2Inline image 3Inline image 4

 

 

అప్పుడు సప్తర్షులు తూర్పున కోలంక లో సూర్యుడు ,ఆగ్నేయం లో దంగేరు లో కశ్యపుడు ,దక్షిణాన కోటి పల్లి లో అత్రి మహర్షి ,నైరుతి కోరు మిల్లి లో భరద్వాజుడు ,పడమర వెంటూరు లో విశ్వా మిత్రుడు వాయవ్యం సోమేశ్వరం లో గౌతముడు ,ఉత్తరాన వెల్ల గ్రామం లో వసిస్టూడు ,ఈశాన్యం పెను మళ్ళ లో జమదగ్ని మహర్షులు సోమేశ్వరుని పేర అష్ట లింగాలను ప్రతిష్టించారు .వీటినే ‘’అష్ట సోమేశ్వర క్షేత్రాలు ‘’అంటారు .

ద్రాక్షా రామం పంచారామమే కాక పన్నెండవ శక్తి పీఠం కూడా .నవ బ్రహ్మ లలో ఒకరైన దక్ష ప్రజా పతి .ఇక్కడే యజ్ఞం చేశాడు అందువల్ల ‘’దక్ష వాటిక ‘’అయింది .ఇక్కడే పార్వతీ దేవిని అవమానించి అల్లుడు శివుడిని  నిందించటం వల్ల  పార్వతి యోగాగ్నిలో దహనం చెందింది శివుడిఆజ్న తో వీర భద్రుడు దక్షయ యజ్న విధ్వంసం చేసింది ఇక్కడే ఇక్కడే విష్ణువు చక్రాన్ని తినేశాడు భద్రుడు. సూర్యుని పళ్ళు రాల గొట్టాడు .బతిమాలితే మళ్ళీ ఇచ్చాడు .శివుడు భార్యా వియోగం తో పార్వతీ దేవి సతీదేవి శరీరాన్ని భుజం పై వేసుకొని విలయ తాండవం చేస్తుంటే విష్ణువు చక్రం తో ఆమె దేహాన్ని పద్దెనిమిది ఖండాలు చేశాడు అవి పడిన చోటల్లా శక్తి పీఠం అయింది. ఇది పన్నెండవ శక్తి పీఠం అయింది .

ద్రాక్షా రామం ఎత్తైన రాతి ప్రహరీతో నాలుగు వైపులా నాలుగు రాజ గోపురాలతో ,అయిదు ప్రాకారాల మధ్య ఉంది ..మొదటి ప్రాకారం లో కొబ్బరి తోటలో నైరుతి భాగం లో మంగళ వార మండపం ,వాయవ్యం లో 70.స్తంభాల సోమ వార మండపం ,ఈశాన్య ములో రుద్ర తీర్ధం ,కాల భైరవుడు ,అష్ట భైరవులు ,తూర్పున అశ్వత వృక్షం మొదలు లో శంకర నారాయణు లుంటారు .తూర్పున నందీశ్వరుడు ధ్వజ స్తంభం ఉన్నాయి .దక్షిణాన శ్రీ అన్న పూర్నా సమేత విశ్వేశ్వర స్వామి ,మేధా దక్షిణా మూర్తి ఆలయాలున్నాయి .

Inline image 5Inline image 6Inline image 7Inline image 8Inline image 9

 

 

భక్తులు మొదట ప్రధాన ప్రాకారమండపం వద్ద కుడి వైపు నాట్య గణ పతి  దర్శించి ,ఎడమ వైపున డుండిగణపతిని చూసి ,లోపలి వెళ్లి కుడివైపు శ్రీ రామ ప్రతిష్టితమైన శేత్రపాలకుడు లక్ష్మీ నారాయణులను దర్శించి ,ఎడమ వైపున శ్రీ కృష్ణ దేవరాయలు ప్రతిష్టించిన విరూపాక్ష స్వామిని చూసి ‘’,ఆలయ నమూనా’’ ను చూడాలి .బాల భీమేశ్వరుడు ,నట రాజ స్వామి ,సప్త మాతృక దర్శనం చేయాలి .సూర్య నారాయణ ,సుబ్రహ్మణ్య స్వాములని చూడాలి .మహిషాసుర మర్దిని ,చండీశ్వర స్వామి నవగ్రహ ,అష్ట దిక్పాలక మండపాలు ,శ్రీ వీరభద్రేశ్వరాలయం ,వటుక భైరవుడు ,లక్ష్మీ గణపతి,నకులేశ్వరుడు ,చతుర్ముఖ బ్రాహ్మలు ,మొదలైన ప్రాకార దేవతలను చూడాలి .

స్వామి ప్రధాన ఆలయం లో కింది భాగం లో 14అడుగుల ఎత్తుతో స్పటిక లింగాకారం గల స్వామి లింగ స్వరూపం గా కింది అంతస్తు నుండి పై అంతస్తుకు ఉంటుంది .ప్రధాన ఆలయం కింద భాగం లో శ్రీ సూరేశ్వర స్వామి ,శ్రీ దుర్గా దేవి ,శ్రీ ఆంజనేయ స్వామి ,108శివ సాల గ్రామాలతో కూడిన ‘’భీమ సభ ‘’మధ్య ఉన్న స్వామి వారి మూల విరాట్ కు (దీనినే

‘’చీకటి కోణం ‘’అంటారు )ప్రదక్షిణం చేసి ,మూడవ ప్రాకారం చుట్టి ప్ర వేశించాలి .నాల్గవ ప్రాకారం చూసి ,కింది అంతస్తులో మూల విరాట్ కి నమస్కరించాలి .ఇక్కడ పూజ ,అభిషేకాలుండవు .వెనక్కి వచ్చి దక్షిణం లో మొదటి  ప్రాకారం దగ్గర పది మెట్లు ఎక్కి ,పై అంతస్తులో నంది మండపం చేరి మళ్ళీ అయిదవ ప్రాకార ప్రదక్షిణ చేసి తూర్పు ఆగ్నేయం గా కైలాస గణపతి ని చూసి ఈశాన్యాన పంచ లోహ నట రాజ స్వామిని దర్శించి పార్వతి మందిరాలను చూడాలి .కింది భాగం లో పాన వట్టం నుండి 14అడుగుల ఎత్తుఉంది పై అంతస్తు వరకు వ్యాపించిన భీమేశ్వర స్వామి పై భాగం మూడు అడుగుల లింగాన్ని దర్శించాలి .ప్రదక్షిణ మండపం లో దక్షిణ నైరుతి లో రాతి స్తంభం పై శ్రీ వ్యాస భగ వానుని విగ్రహం తప్పక దర్శించాలి .అంతరాలయం లో పార్వతీ అమ్మ వారు ఉత్సవ మూర్తులు ఉంటారు .

పై అంతస్తు గర్భాలయం లో మూడు వైపులా విశాల మైన కిటికీలతో కింది నుండి పైకొచ్చిన భీమేశ్వర మహా లింగాన్ని దర్శించ వచ్చు .ప్రక్కనే ఉన్న మాణిక్యాంబ అమ్మ వారిని  దర్శించాలి .తూర్పు వైపు మెట్ల మీదుగా కిందికి దిగాలి .పది మెట్లు దిగితే శ్రీ చక్రస్థిత  అష్టాదశ శక్తి

పీఠాలలో పన్నెండవది అయిన మాణిక్యాంబ అమ్మ వారిని ప్రత్యెక ఆలయం లో దర్శించాలి .

మాఘ శుద్ధ ఏకాదశి కి భీష్మ ఏకాదశికి మాణిక్యాంబ సహిత భీమేశ్వర స్వామికి ,లక్ష్మీ నారాయణులకు ఒకే ముహూర్తం లో నిర్వహించటం విశేషం .శివ కేశవ అభేదాన్ని ఇక్కడ చూడగలం .

ఈశాన్యం లో వెలుపలిప్రాకారం లో డెబ్భై స్తంభాలతో సోమ వార మండపం లో ఉత్సవాలు జరుగుతాయి .ఆలయానికి రెండు కిలో మీటర్ల దూరం లో ‘’వేగాయమ్మ పేట ‘’లో మాణిక్యాంబ అమ్మ వారి పుట్టిల్లు. ,అక్కడే అమ్మవారి పన్నెండవ శరీర భాగం పడిందని అంటారు .కల్యాణం రోజున స్వామి వారు ఊరేగింపుగా వేగాయమ్మ పేటకు వచ్చి వెళ్తారు .

క్రీ పూ.ఒకటవ శతాబ్దినుండి ఈ క్షేత్రం ప్రసిద్ధమైంది .హాల శాత వాహనుడు  ‘’హాలుడు ‘’‘’గాదా సప్త సతి ‘’ని సంకలనం చేశాడు .ఆయన సింహళ రాకుమారి లీలావతిని  ఇక్కడే సప్త గోదావరి తీరం లో శ్రీ

భీమేశ్వరాలయం లో వివాహం చేసుకొన్నట్లు జరిగి  ‘’లీలా వతి  కావ్యం ‘’లో రాశాడు .  గోరఖ్ పూర్ ‘’కళ్యాణ తీర్దాన్కాలు ‘’లో లలితా రాగం లో జ్ఞాన పద శివ లింగ ప్రాదుర్భావ పటలం లో అష్టోత్తర దివ్య శత క్షేత్రాలలో ‘’ద్రాక్షారామేత్ భీమేశం ‘’అని వర్ణన ఉంది .రాజ శేఖర కవి రాసిన బాల రామాయణం లో ఈ స్వామి స్తుతి వర్ణన ఉంది .కవి సార్వ భౌముడు శ్రీనాధుడు భీమ ఖండం లో ఈ స్వామి మహాత్మ్యాన్ని పరవశించి వర్ణించాడు ‘’విభావంబునకు ప్రభవంబును , ,విలాసంబునకు ,నివాసంబును ,నవ వర్గంబునకు వర్గంబును ,ధర్మంబునకు మర్మంబును ,దానంబునకు నిదానంబును ,విద్యలకు నిలయమై ‘’ద్రాక్షా రామ క్షేత్రం విలసిల్లిందని వర్ణించాడు .కవి భయంకరుడు వేముల వాడ భీమ కవి ‘’ద్రాక్షా రామ భీమేశ నందనుడన్ ‘’అని చెప్పుకొన్నాడు .ప్రౌఢ కవి మల్లన్న తన ‘’రుక్మాంగద చరిత్ర ‘’ను ఈ స్వామికి అంకితమిచ్చాడు .పదహారవ శతాబ్ది వాడిన సూరన్న కవి ‘’ధనభి రామ కావ్యం ‘’ను ద్రాక్షారామ స్వామికి అర్పణ చేశాడు .ఈ క్షేత్రానికి ఎందరెందరో రాజులు భూస్వాములు విలువైన వి దానం చేసినట్లు ఇక్కడున్న400,శాసనాల ద్వారా తెలుస్తోంది .

ఇక్కడి పంచ తీర్దాలైన –దక్ష యజ్ఞం జరిగిన దక్ష తీర్ధం ,సతీదేవి శరీర భాగం పడిన ముక్తి క్షేత్రమైన వేగాయమ్మ పేట ఎల్లారమ్మ గుడి ,పాప హారిణి అయిన భీమ పేట లోని సోమ తీర్ధం ,హిమవంతుడు తపస్సు చేసి శంకర వరం పొందిన హైమావతి క్షేత్రం ,సప్త ఋషులచే గౌతమిని అంతర్వాహిని గా తీసుకు రా బడిన సప్త గోదావరి తీర్ధ క్షేత్రం అందరు ఓపికగా చూడ దగినవి .

ఇక్కడే ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇంద్రేశ్వర ,సిద్దేశ్వర ,యోగీశ్వర ,కాళేశ్వర ,యమేశ్వర ,వీరభద్రేశ్వర ,బ్రహ్మేశ్వర ,కపాలేశ్వర ,కుక్కుటేశ్వర ,సోమేశ్వర మహేశ్వర,సప్త కోటి రామ లింగేశ్వర క్షేత్రాలన్నీ ద్రాక్షా రామం చుట్టూ ఉన్నాయి .భీమేశ్వరాలయం మొదటి ప్రాకారం లో కాల భైరవాలయం వెనక రుద్ర తీర్ధం ఉంది .ఇక్కడ స్నానం చేస్తే పంచ మహా పాతకాలు నశిస్తాయి .ఆలయ వంశ పారం పర్య ట్రస్టీలు వేగాయం పేట జమీన్ దార్లు వాడ్రేవు రంగ నాయకమ్మ గారి కుమారులు వాడ్రేవు విశ్వ సుందర రావు బహద్దర్ ఆలయాన్ని అభి వృద్ధి చేశారు . 125ఎకరాల ఈనాం భూమిని స్వామికి సమర్పించారు .వీరి మనుమడు రాజా వాడ్రేవు సుందర రత్నాకర రావు ఈ విషయాలను చూస్తున్నారు .ఆలయం దేవాదయ శాఖ ఆధ్వర్యం లో నిర్వ హింప బడుతోంది .

ద్రాక్షారామ సందర్శనం తర్వాత బస్సు బయల్దేరి రాత్రి  రెండు గంటలకు  సామర్ల కోట లో ఉన్న ‘’కుమారారామం ‘’చేరింది .ఆలయ విశేషాలు తర్వాత తెలుసు కొందాం .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -1-12-13- ఉయ్యూరు

 

 

Posted in పంచా రామ | Tagged | Leave a comment

అస్తమించిన మరో చరిత్ర శిఖరం – వకుళాభరణం రామకృష్ణ

 

పురావస్తు ఆధారాల సాయంతో చరిత్ర పునర్నిర్మాణం జరగాలన్న ప్రక్రియ భారతదేశంలో ఆలస్యంగా ఆరంభమైంది. సాహిత్యాధారాలు ప్రధానంగా – వేద వాంగ్మయం, ప్రాచీన కావ్యాలు, కావ్యావతారికలు, యాత్రా చరిత్రలు ఇత్యాదులే చరిత్ర రచనకు ఉపకరించుకున్నారు. జాతీయోద్యమం ఊపందుకొన్నాక, గతకాలపు వైభవాన్ని, కీర్తిని తవ్వితీసి ప్రజల ముందుంచాలన్న భావజాలం ముందుకొచ్చింది. 1920వ దశకంలో, సర్ జాన్ మార్షల్ లాంటి పురావస్తు శాస్త్రవేత్తలు కాలగర్భంలో కలిసిపోయిన చరిత్రను త్రవ్వితీసి కొత్త ఆవిష్కరణలు చేశారు. ఇందులో భాగంగానే హరప్పా సంస్కృతి వెలుగులోకొచ్చింది. దీంతో, ప్రపంచంలో అత్యంత, పురాతన నాగరికతల్లో భారతదేశమూ చోటు దక్కించుకొంది. నికార్సయిన ఆధారాలతో, పురావస్తు, శాసన, నాణేలు, కట్టడాలు ఆధారంగా, సాహిత్యాధారాలతో సరిచూసి, చరిత్ర రచన ఆరంభమైంది.

ఈ ధోరణి, ఆంధ్ర దేశంలో, 20వ శతాబ్దం మొదటి దశకంలో ఆరంభమైంది. 1910లో రాబర్ట్ సీవెల్ విజయనగర సామ్రాజ్యంపై Forgotten Empire అనే అద్భుతమైన గ్రంథం ప్రచురించారు. ఆంధ్ర దేశంలో చరిత్రకారులకిది మార్గదర్శకం కాగా, జయంతి రామయ్య పంతులు ఆంధ్ర సాహిత్య పరిషత్తు (1911), అంతకు ముందు, కొమర్రాజు వారి విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలి (1905), కొమర్రాజు, చిలుకూరి వీరభద్రరావులు తెలుగువారి చరిత్రపై రాసిన గ్రంథాలు, 1925లో ఏర్పడ్డ ఆంధ్ర ఇతిహాస మండలి వచ్చాయి. ఈ కుదురునుంచే మల్లంపల్లి, నేలటూరి, సురవరం, మారేమండ, భావరాజు ఇలా మరెందరో చరిత్రకారులు తెలుగువారి చరిత్రకు పునాదులు వేశారు.

తొలితరం చరిత్రకారుల స్ఫూర్తితో, ఆ తర్వాతి తరంలో ముందుకొచ్చిన వారిలో, ఇంగువ కార్తికేయ శర్మ ప్రముఖులు. నెల్లూరు జిల్లా పల్లెపాడులో పుట్టి (1937) పెరిగిన శర్మ, నాగపూర్ విశ్వవిద్యాలయంలో, స్నాతకోత్తర విద్య పూర్తిచేసి, పూణేలో పరిశోధన చేశారు. పురావస్తు త్రవ్వకాల్లో ప్రావీణ్యం సంపాదించారు. వీరి పరిశోధనాంశం Development of Early Saiva Architecture With Special Reference to Andhradesa. ఈ పరిశోధన తర్వాత, శర్మ విస్తృతంగా పురావస్తు త్రవ్వకాలు చేపట్టారు. ఇందులో చెప్పుకోదగ్గ వాటిలో ముఖ్యమైనవి పెదవేగి, గుడిమల్లాం, గుంటుపల్లి, నాగార్జున కొండ, పైయన్‌పల్లి (తమిళనాడు), పేని, సర్కొబాడ, అమరావతి కాగా, హరప్పా సంస్కృతి పొడిగింపుగా, గుజరాత్‌లోని ప్రాచీన ఓడరేవు, కాళీబంగన్ దగ్గర త్రవ్వకాల్లో పాల్గొనడం విశేషం. ముఖ్యంగా క్రీ.పూ. 2, 3 శతాబ్దాల నాటి శైవక్షేత్రంగా, గుడిమల్లాం చారిత్రక నేపథ్యాన్ని నిగ్గుదేల్చడం శర్మ కనుగొన్న ముఖ్య పరిశోధనల్లో ఒకటి.
ఇంగువ కార్తికేయ శర్మ బహుముఖ ప్రజ్ఞా పాండిత్యాలు గల చరిత్రకారుడుగా గణుతికెక్కారు. పురావస్తు పరిశోధనలే కాక, నాణేల పరిశోధనలో కృషిచేసి, శాతవాహనుల కాలంనాటి నాణేలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, శాతవాహన రాజుల కాలాన్ని (Chronology)
ఖరారు చేశారు. The Coinage of the Satavahana Empire గ్రంథాన్ని వెలువరించారు. శాసనాలను పరిశీలించి, ముఖ్యంగా, బ్రాహ్మి లిపిలోని శాసనాలను నిశితంగా అధ్యయనం చేసి, Early Andhra Inscriptionsòపై ప్రామాణిక గ్రంథాన్ని రచించారు. గుల్బర్గా జిల్లా ప్రాంతంలో లభించిన సన్నతి శాసనాలను సేకరించి, వాటికి భాష్యం చెప్పారు.

అనన్య సామాన్యంగా సాగిన శర్మ కృషి చరిత్ర విభాగంలో పలు అధ్యయనాలకు దారితీసింది. మ్యూజియాలజీ, ప్రాచీన సంపద పరిరక్షణ, వాస్తు నిర్మాణ, ప్రతిమా (Conography) శాస్త్రాల్లో ప్రావీణ్యం సంపాదించారు. Numismatic Society of South India కి బాధ్యులుగా, ఆ సంస్థ ప్రచురించిన పరిశోధక జర్నల్‌కు సహ సంపాదకులుగా పనిచేశారు. బౌద్ధంపై ప్రత్యేకించి విశేష కృషి సల్పిన శర్మ, Buddhist Monuments of China, and South East Asia అనే గ్రంథాన్ని వెలువరించారు. ఈ పరిశోధనలో భాగంగా, చైనా, జపాన్, టిబెట్, నేపాల్ దేశాలను సందర్శించి, అక్కడ నెలకొన్న బౌద్ధ మత సంబంధ విశేషాలను అధ్యయనం చేశారు. వారి ప్రచురణల్లో చెప్పుకోదగ్గ మరో గ్రంథం Science of Archaeology in India. తెలుగులో, ‘ఆంధ్ర దేశంలో శైవ, వైష్ణవ ప్రతిమా లక్షణం’, రాశారు. ప్రతిమా శాస్త్రంలో వారి ప్రావీణ్యానికి నిదర్శనం వారి ‘సప్తస్వరశివ’ అనే వ్యాసం.

అఖిల భారత పురావస్తు శాఖలో సంచాలకులుగా పురావస్తు త్రవ్వకాలను, కట్టడాలను పర్యవేక్షించారు. సాలార్ జంగ్ మ్యూజియం సంచాలకులుగా, అనేక కొత్త ప్రదర్శితాలను (Eplifits) సంపాదించడమే గాక, Westren Gallery వారి హయాంలోనే ప్రారంభం కావడం విశేషం. వారసత్వ సంపద పరిరక్షణ వారికి ప్రాణప్రదం. పురావస్తు శాఖ నుంచి, సాలార్ జంగ్ మ్యూజియం దాకా వారీ విషయంలో ప్రత్యేక శద్ధ్ర ప్రదర్శించారు. యునెస్కోలో సభ్యులుగా పనిచేశారు కూడా. మనకున్న చరిత్రకారుల్లో ఇంతటి బహుముఖ ప్రజ్ఞాశాలి మరొకరు లేరనడం అతిశయోక్తి కానేరదు. ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కలిసి సంయుక్తంగా వెలువరిస్తున్న ఎనిమిది సంపుటాల ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర – సంస్కృతి గ్రంథాల్లో రెండవ సంపుటానికి, ‘తొలి చారిత్రక ఆంధ్రప్రదేశ్ క్రీ.పూ. 5000 – క్రీ.శ. 624), సంపాదకత్వం వహించారు.
– వకుళాభరణం రామకృష్ణ

మాయ నుంచి తప్పించుకోవడం ఎలా?

 

 

కార్తీక మాసం ఉపాసన కాలం కాబట్టి ఈశ్వరుడు భక్తులకు చేరువలో ఉంటాడు. కానీ ఆ ఈశ్వరుడిని మాయ కమ్మేసి ఉంటుంది. ఆ మాయను దాటి ఆ ఈశ్వరుడిని చేరుకోవటం ఎలాగో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు శర్మ తెలియజేస్తున్నారు.

మానవుడికి మోక్షాన్ని ఇవ్వగల శక్తి ఈశ్వరుడికి ఉంది. ఆయన శక్తి క్షీణించిపోనిది. నిరంతరం ఉత్సాహభరితమైనది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సృష్టి అంతా ఈశ్వరనిదే. ఈ విషయం తెలుసుకునే పెద్దలు, ‘అంతా ఈశ్వరుడిదే.. ఈశ్వరుడిది కానిది ఏదీ లేదు’ అనే భావనతో బతుకుతారు. ఈశ్వరుడిని చేరుకోవటం ఎంత సులభమో.. అంత కష్టం కూడా. ఆయన మాయ మనను అడ్డగిస్తూ ఉంటుంది. ఈశ్వరుడి అనుగ్రహం వల్లే ఆ మాయ తొలగుతుంది. దీనికి ఒక ఉదాహరణ చెప్పవచ్చు. మేఘం సూర్యుడి వల్లే ఏర్పడుతుంది. సూర్యుడు సముద్రంలో నీటిని గ్రహిస్తే ఆ నీరు ఆవిరిగా మారి మేఘ రూపంలో ఏర్పడుతుంది. ఆ మేఘం సూర్యుడికి అడ్డు వస్తుంది. అప్పుడు సూర్యుడు కనబడడు. ఈ విధంగానే ఈశ్వరుడు సృష్టించిన మాయ- మనకు అడ్డుపడుతుంది. ఇది ఈశ్వరుడి ఆరాధన వల్ల, ఈశ్వర స్వరూపులయిన గురువాక్కుల వల్ల తొలగుతుంది. అందుకే మన పెద్దలు గురువులేని విద్య గుడ్డి విద్య.. అంటారు.

మాయా స్వరూపం
ఈ మాయ చాల చిత్రంగా ఉంటుంది. దీని వల్ల కామక్రోధాలు వస్తాయి. ఈశ్వరునితో ఉన్న పట్టు పోతుంది. అంతా తన ప్రజ్ఞగానే కనిపిస్తుంది. గొప్ప మహాత్ములయినవారు కూడా ఒక్కొక్కసారి మాయకు వశులయిపోతూ ఉంటారు. అలాంటి వాటిని మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. మహాత్ములెవరూ తమ జీవితంలోని సంఘటనలను దాచరు. వారు అన్ని విషయాలనూ రాసేస్తారు. మహాత్మా గాంధీ తన జీవితంలో ఎలాంటి సంఘటననూ దాచలేదు. చంద్రశేఖర పరమాచార్య తన 73వ ఏట- ‘ఇప్పటికీ ఆశ అప్పుడప్పుడు నన్ను వశపరుచుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది’ అని చెప్పుకున్నారు. దీనికి సంబంధించి శివ పురాణంలో ఒక గొప్ప కథ ఉంది. ఒకానొక సమయంలో నారద మహర్షి హిమాలయాల కింది భాగంలో, పరమ శివుడు తపస్సు చేసిన ప్రాంతంలో కూర్చుని- పరబ్రహ్మాన్ని గురించి తపస్సు చేశారు. నారదుడిని పరీక్షించటానికి ఇం«ద్రుడు మన్మథుడిని పంపాడు.

మన్మథుడి ప్రయత్నాలకు నారదుడు లొంగలేదు. నారద మహర్షి తపస్సు సఫలీకృతం అయింది. ఆ తపస్సు పూర్తిచేసి ఆయన బయటకు వచ్చి శంకరుడి దగ్గరకు వెళ్లాడు. ‘ఈశ్వరా, హిమాలయాల్లో ఉండే గుహలో కూర్చుని నేను తపస్సు చేశాను. మన్మథుడు వచ్చి నా మీద బాణాలు వేసే ప్రయత్నం చేశాడు. కానీ నేను ఆ మన్మథ బాణాలను లెక్కపెట్టలేదు. కామాన్ని జయించి నేను తపస్సులో సిద్ధిని పొందాను’ అన్నాడు. నారదుని మాటలు విని శంకరుడు నవ్వాడు. ‘నారదా, నువ్వు చాలా చక్కటి మాట చెప్పావు. నువ్వు కాముడినే జయించావా? కాముడిని జయించడమంటే మాటలు కాదు. నేను చాలా సంతోషించాను. కానీ నారదా, నీకొకటి చెబుతాను, గుర్తుపెట్టుకో. నా దగ్గర చెప్పినట్లు నారాయణుడితో చెప్పకు’ అని సలహా ఇచ్చాడు. కానీ నారదుడు శంకరుడి మాటలను పెద్దగా పట్టించుకోలేదు. గురువుల మాటను తిరస్కరించడం అంటే ఇదే! నారదుడు వైకుంఠానికి బయలుదేరాడు.

మధ్యలో తన తండ్రి, సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మ దగ్గరకు వెళ్ళాడు. తండ్రితో కూడా తాను చేసిన తపస్సు గురించి, మన్మథుడు వచ్చి బాణాలు వేసినా తాను చలించని విషయాన్ని గురించి చెప్పాడు. అప్పుడు బ్రహ్మ, ‘నువ్వు ఎక్కడ కూర్చుని తపస్సు చేశావో అక్కడ ఇంతకు పూర్వం పరమ శివుడు కూర్చుని తపస్సు చేశాడు. అక్కడికి మన్మథుడు వస్తే ఆయన తన మూడవ కంటి మంటతో అతన్ని కాల్చేశాడు. అపుడు మన్మథుడు బూడిద అయిపోయాడు. ఆ ప్రాంతంలో మన్మథ బాణాలు పనిచేయకపోవడానికి కారణం, నువ్వు కాముడిని గెలవడానికి కారణం ఇంతకు పూర్వం ఈశ్వరుడు అక్కడ తపస్సు చేయడం. అది శివ ప్రజ్ఞ. నీ ప్రజ్ఞ కాదు” అని మందలించాడు. అందువల్ల మనం ఎప్పుడైనా ఏదైనా సాధిస్తే అది ఈశ్వరాన్రుగహం వల్ల జరిగిందనే అనుకోవాలి. అంతేకానీ మన ప్రతిభగా చెప్పుకోకూడదు. ఆ సాధించిన దానిని మనలో నిక్షేపించుకోకూడదు.
(ఎమెస్కో ప్రచురించిన కాశీ పురాణం నుంచి)

 

 

శంభు నామ మహత్యం!

 

 

కార్తీక మాసంలో శంభునామాన్ని జపిస్తే అన్ని పాపాలూ పోతాయని పెద్దలు చెబుతూ ఉంటారు. దీని వెనకున్న తత్వాన్ని చాగంటి కోటేశ్వరరావు శర్మ ఇక్కడ వివరిస్తున్నారు.

పరమ శివుడిని ‘శంభుః’ అని ఒక చిత్రమయిన నామంతో పిలుస్తారు. ‘శం’ అంటే నిరతిశయమయిన సుఖం. ‘భావయతి’ అంటే కల్పించేవాడు. ఒక వస్తువును అనుభవించినప్పుడు దాని వల్ల కొంత సుఖానుభూతి కలుగుతుంది. ఒక వస్తువు అస్థిత్వంలో ఉండడానికి, అది అనుభూతిగా మారడానికి మధ్యలో చాలా తేడా ఉంటుంది.

ఈ శక్తిని ప్రసాదించేవాడు ఈశ్వరుడు. అందుకే- ‘ఈశ్వరాత్ జ్ఞానమన్విచ్ఛేత్ జ్ఞానదాతా మహేశ్వరః’ అంటారు. ఈశ్వరుని అన్రుగహం వల్ల మాత్రమే జ్ఞానం కలుగుతుందని దీని అర్థం. శంభునామాన్ని గట్టిగా పట్టుకుని ఆ నామంతో పిలిస్తే, ఆయన మన భావాల్ని మార్చి మనసును ఈశ్వరుడి వైపు తిప్పుతాడు. స్రత్పవర్తన కల్పిస్తాడు. అందుకే ప్రతి రోజూ శంభునామాన్ని చెప్పుకుంటూ ఉంటూ శంభుని అన్రుగహాన్ని పొందాలి. అప్పుడు శంభుడు-ఈ లోకంలో సుఖం దగ్గర నుంచి నిరతిశయ సుఖం వరకు, ఊర్ధ్వలోక సుఖం వరకు ఎంత సుఖం ఉందని అందరూ అనుకుంటున్నారో అన్నీ ఇస్తాడు. దీనినే కామకోటి అని పిలుస్తారు. కామకోటి అంటే కోర్కెలను ఇవ్వడంతో మొదలుపెట్టి కోర్కెలు లేకుండా చెయ్యడం వరకు తీసుకువెళ్ళి, ఆ తరువాత పుణ్యాన్ని ఇచ్చి, పుణ్యం వల్ల ఊర్ధ్వలోక ప్రాప్తి వరకు ఇచ్చి, తరువాత మరల తిరిగి రానవసరం లేని పునరావృతరహిత శాశ్వత శివ సాయుజ్య స్థితిని అనుగ్రహిస్తాడు.

లోకములు మూడు..
ఈ లోకంలో సుఖంగానే జీవిస్తున్నాం. మిగిలిన విషయాల గురించి అప్పుడే చింత ఎందుకనే భావన కొందరిలో ఉంటుంది. అందుకే మన పెద్దలు లోకాలను మూడుగా విభజించారు. ఒక లోకం కేవలం సుఖాలను అనుభవించడానికి మాత్రమే ఉంటుంది. అక్కడ దుఃఖస్పర్శ ఉండదు. మరొక లోకం- నరకంలో- సుఖమన్నది ఉండదు. ఎప్పుడూ ఏడుపులు, పెడబొబ్బలు, కేకలు, అరుపులతో భయంకరంగా ఉంటుంది. అది నరక లోకం. ఇక భూలోకంలో సుఖం, దుఃఖం రెండూ ఉంటాయి. ఒక రోజు మనిషి చప్పట్లు కొట్టేస్తూ, పొంగిపోతూ, అన్నీ నేనే అనుకుంటూ ఉంటాడు. మరొక రోజు కుమిలిపోతూ ఏడుస్తూ ఉంటాడు. అదే భూలోకం. ఇక్కడ జీవుడు సుఖదుఃఖాలను రెండిటినీ అనుభవిస్తూ ఉంటాడు. ఇక్కడి నుంచి పూర్ణ దుఃఖం కలిగిన లోకం లోకయినా వెళ్ళవచ్చు లేదా పూర్తి సుఖం కలిగిన లోకం లోకయినా వెళ్ళవచ్చు. కానీ స్వర్గానికి వెళ్లాలంటే పాపం చేయకుండా ఉండాలి. అది అంత తేలికైన పని కాదు.

మనం సాధారణంగా ‘చతుర్ముఖ బ్రహ్మ మన లలాటం మీద రాసిన రాతప్రకారం మనం పనులు చేసేస్తూ ఉంటాం’ అని అనుకుంటాం. కానీ అది తప్పు. మన పూర్వీకులు మనం అనుక్షణం శివుడిని ప్రార్థించాలని కోరుకున్నారు. అందుకే తిలకధారణాన్ని సూచించారు. విభూతి తీసుకొని నుదుటను బొట్టు పెట్టుకుంటే- పార్వతీ పరమేశ్వరుల్ని నుదిటిపై పెట్టుకున్నట్లే! ‘లలాట లిఖితారేఖా పరిమార్తుం నశక్యతే’ అనేది సామాన్య సిద్ధాంతం. అంటే బ్రహ్మ రాసిన రాత మారదు అని చెప్పటం. కానీ తిలకధారణ చేసి విభూతి పెట్టుకోగానే, ఆలోచనా సరళిలో మార్పు వస్తుంది. తప్పుడు పనులను మానేయాలనే భావన కలుగుతుంది. అటువంటి తప్పుడు పనులను చేయకూడదనే పూనిక రావడం ప్రారంభమవుతుంది. మనసును జయించటానికి ముందు శరీరాన్ని అలంకృతం చేస్తారు. అలా చేయడం ప్రారంభిస్తే దుఃఖాన్ని స్వీకరించి దుఃఖం నుండి బయటపడతారు.

ఇది వినటానికి చాలా చిత్రంగా ఉంటుంది. ఈ లోకంలో సత్త్వం, రజస్సు, తమస్సు అనే మూడు గుణములు ఉన్నాయి. ఈ త్రిగుణాలు మన మనసును సుఖాలను అనుభవించమని ప్రోత్సహిస్తూ ఉంటాయి. ఉన్నతిని పొందకుండా బాధిస్తూ ఉంటాయి. ఉన్నతిని పొందకుండా బాధించే త్రిగుణాల బాధ నుండి బయటపడడానికే చాలా మంది సంసారమనే కొత్త బాధను ఎంచుకుంటారు. సంసారంలో ఉండి తరించడం చాల కష్టం. అలా తరించాలంటే దానికి మార్గం తెలియాలి. మరి బాధపోవడానికి సుఖంలోకి కదా వెళ్ళాలి? మరి బాధపోవడానికి బాధలోకి వెళ్లమనడంలో ఉద్దేశం ఏమిటి? సత్వరజస్తమోగుణాలనే మూడు గుణముల నుండి బయటపడడానికే సంసారంలోకి ప్రవేశించి సుఖాలను అనుభవించి, ఈ సుఖాలు సుఖాలు కావు, నిజమయిన సుఖం ఈశ్వరుడే అనే లక్షణాన్ని ఏర్పరచుకుని, వైరాగ్య సంపత్తిని పెంపొందించుకోవడం. దీని వల్ల ఇక ఇంద్రియాలు, మనసు చలించని స్థితికి వెడతాడు. దీనిని ఒక ఉదాహరణతో చెప్పవచ్చు. గాలి మల్లెపూల మీదుగా వెళ్తుంది. తాను మల్లెపూవుల మీద నుండి వస్తున్నానని పొంగిపోదు. అశుద్ధం మీదుగా వెళ్తుంది. తాను అశుద్ధం మీదుగా వెళ్ళానని బాధపడదు. దేని మీద నుంచి వెళ్ళినా గాలి గాలిగానే ఉంటుంది. దానికేమీ బాధలేదు. అలాగే పూర్ణ వైరాగ్యం పొందిన వారికి సుఖదుఃఖాల బాధ ఉండదు.
(ఎమెస్కో పబ్లికేషన్స్ ప్రచురించిన శివ పురాణం నుంచి)

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కార్తీకం లో మా పంచారామ సందర్శనం -3

       కార్తీకం లో మా పంచారామ సందర్శనం -3

కార్తీకం లో మా పంచా రామ సందర్శనం -2

కార్తీకం లో మా పంచా రామ సందర్శనం – దర్శన మాలిక

కార్తీకం లో మా పంచా రామ సందర్శనం

క్షీరారామం

శ్రీ మహా విష్ణువు చే ప్రతిస్తింప బడి బ్రహ్మ చేత సేవింప బడిన దివ్య క్షేత్రం క్షీరా రామం .పావు తక్కువ ఎనిమిదికి బస్ ఆగిన చోటు నుండి మేమిద్దరం నడుచుకొంటూ వచ్చి క్షీరారామ రామ లింగేశ్వర్ఫా స్వామిని దర్శించాం  మా మనవరాలు రమ్య  ‘’భీమ వరం వరం దెబ్బకు’’ అలసి పోయి రాలేనంది. ఒక పిల్ల తల్లి కూడా బస్ లో ఉంటె ఆవిడకు అప్పగించి మేమిద్దరమే వచ్చాం .మిగిలిన రెండు క్షేత్రాలకూ రమ్య రాలేదు బస్ లోనే ఉంది .వందలాది ‘’పంచారామ స్పెషల్ ‘’బస్సులు రాష్ట్రం నలు మూలల నుండి ఈ నాల్గవ సోమ వారం నాడు పంచారామ దర్శనం కోసం వేలాది భక్తులు తరలి వచ్చారు .అన్నీ లక్సరీ బస్సులే ..రామ లింగేశ్వర దర్శనం తర్వాత పార్వతీ అమ్మ వారిని గణపతి మొదలైన దేవతామూర్తులను జనార్దన స్వామిని దర్శించం .ఆలయం బయట ‘’పాలకొల్లు స్పెషల్ పాపడి ‘’పావు కిలో నలభై రూపాయలు పెట్టి కొన్నాం .అక్కడి నుండి బస్ దగ్గరకు చేరాం .దగ్గరలో ఉన్న హోటల్ లో రెండు ప్లేట్ల ఇడ్లీ లు తెచ్చాను

నేను మా ఆవిడా చెరో ప్లేట్  తిన్నాం .ప్లేట్ పది రూపాయలు రెండిడ్లీ లు .ఒక ప్లేట్ కింద లెక్క. బాగున్నాయి .ఇప్పుడు క్షేత్ర మహాత్మ్యాన్ని తెలుసు కొందాం

.Kshira rama temple main entranceinside temple view

పూర్వం వ్యాఘ్ర పాడుదు అనే మహర్షి కి ఉపమన్యువు అనే కుమారుడు పుట్టాడు.కొడుకు సర్వ వేదం విదుడై పవిత్రం గా జీవించే వాడు .సరైన యోగాభ్యాసం చెయ్యక పోవటం వల్ల  యోగ భ్రస్టూడై నిరుపేద బ్రాహ్మణ కుటుంబం లో పుడతాడు .తల్లి పాలు కొని పోయ్యలేక పిండి పాలు పోసి పెంచుతుంది .ఒక సారి తల్లితో మేన మమల ఇంటికి వెడితే అక్కడ మంచి ఆవుపాలు తాగి ఆ రుచి మరిగిఇంటికి వచ్చిన తర్వాత  పిండి పాలు తాగ నని మారాం చేస్తాడు .రోజు రోజుకీ చిక్కి పోతున్నాడు .తండ్రి కొడుక్కి శివ పంచాక్షరి బోధించి జపించ మంటాడు .ఉప మన్యువు మహా నిష్టతో జపిస్తాడు .భక్తికి మెచ్చిన శివుడు మారు వేషం లో వచ్చి శివ నింద చేస్తాడు .యితడు మంత్రించిన విభూతి ని శివుడి పై జల్లగా వేష దారి శివుడు అర్ధ నారీశ్వరుడై పోతాడు .ఉపమన్యువు ను ఎత్తుకొని పార్వతీ దేవికి ఇచ్చి పెంచమంటాడు ఆమె హస్తం నుంచి పాలు ప్రవహిస్తాయి అప్పుడు ఆ ప్రాంతం అంతా ‘’క్షీర కొలను ‘’అంటే ‘’పాల కొలను ‘’గా మారి పోయింది .అదే పాలకొల్లు క్షీరారామ అయింది .ఈ గ్రామం ‘’ఉపమన్యు పురం ‘’అయింది పాలుకారే మర్రి రావి చెట్లు ఎక్కువగా ఉండటం వల్ల  కూడా పాలకొల్లు అయింది అంటారు .

త్రిమూర్తి ఆలయం గా క్షీరారామం ప్రసిద్ధి చెందింది .ఆలయం లో పార్వతీ పర మేశ్వరులు ,లక్ష్మీ నారాయణులు ,సరస్వతీ సహిత బ్రహ్మ దేవుడు కొలువై ఉన్నారు .దేవాలయ శిఖరం 120అడుగుల ఎత్తుఉండిదూరానికీ దర్శన మిస్తుంది .గోపురం పై తపోనిస్టలో ఉన్న శివుడు ఇంద్రాది అష్ట దిక్పాలకులు ,పంచ ముఖ పరమేశ్వరుడు ,నాట్య గణపతి ,లక్ష్మీ గణ పాటి ,సరస్వతి గజ లక్ష్మి ,కాలియా మర్దనం ,శివలీలలు ,దశావతారాలు మొదలైన ఎన్నో శిల్పాలు కను విందు చేస్తాయి .1774ఏప్రిల్ 14నశ్రీ బచ్చు అమ్మయ్య గారు గోపుర నిర్మాణానికి పూనుకోన్నారని స్తానికులు అంటారు .

Carvings on the wallInline image 1Inline image 2Inline image 3

దేవాలయ రాజ గోపురం దాటి లోపలి వెడితే శివుని సిమెంటు విగ్రహం పెద్ద సైజ్ లో కనీ పిస్తుంది .ధ్వజస్తంభం ఉత్తరాన ఆంజనేయ స్వామి గుడి ,దక్షిణం లో వీరభద్రుని గుడి ఉంటాయి .ఉత్తర దక్షిణం గా

విశాల మండపం వివాహాది శుభ కార్యాలకు యజ్ఞాలకు ఉపయోగ పడేట్లు గా నిర్మించారు .దీనినే ‘’పంచముఖ ప్రాంగణం ‘’అంటారు .శ్రీ క్షీరా రామ లింగేశ్వర స్వామి చుట్టూ జనార్దన స్వామి ,వినాయకుడు సుబ్రహ్మణ్యుడు ,గోకర్నేశ్వరుడు వేర్వేరు విమాన శిఖరాల తో కొలువై దర్శన మిస్తారు. స్పెషల్ దర్శనం పది రూపాయలు .శ్రీ రాముడు ప్రతిష్ట చేసిన రామ లింగేశ్వర స్వామి స్పటిక లింగం తారకాసుర వధ లో అతని కంఠం లో ఉన్న అమృత లింగాన్ని కుమార స్వామి చేదిన్చినప్పుడు పడిన నొక్కులే పంచారామాలలో లింగాలపై నొక్కులుగా కనీ పిస్తాయి ఇక్కడి శివలింగం మొన దేలి ఉండటం వల్ల  ‘’కొప్పు ‘’భాగాన్ని సూచిస్తోందని అంటారు .శాసనాలలో ఈ స్వామిని ‘’కొప్పు రామ లింగేశ్వరుడు ‘’గా పేర్కొన్నారు .ఈ లింగం అమృత లింగం లోని శిరస్సు భాగమే నని అందరూ చెబుతారు .

ఉత్తరాయణ ,దక్షిణాయన కాలాలో సూర్యోదయాన సూర్య కిరణాలు పెద్ద గోపురం రెండ వ అంతస్తు నుండి ప్రాకారాలను దాటి రామ లింగేశ్వర లింగం పై ప్రసరించటం ఇక్కడి విశేషం .ఆలయ ముఖ ద్వారం

పై విష్ణు మూర్తికి క్షీరా రామేశ్వరుడు ‘’సుదర్శన చక్రం ‘’ప్రసాదించే సుందర శిల్పం చూడ ముచ్చట గా ఉంటుంది .ఇక్కడి శివుని అర్చిస్తే దారిద్ర బాధ ఉండదని నమ్మకం .ప్రాకార మండపం లో శిల్ప కళా విరాజమాన నందీశ్వర విగ్రహం ఉంది .పడమర ‘’రుణ హార గణ పతి’’ని దర్శించి నందీశ్వరుని కి ప్రదక్షిణం చేసి ,శ్రీ క్షీరారామ లిన్గేశ్వరుడిని దర్శించాలి .ఈ గణ పతిని దర్శిస్తే అప్పుల బాధలుఉండవు అని నమ్మకం .స్వామి పవళింపు సేవ గది చూడాల్సిందే నటరాజ విగ్రహం ఆకర్ష ణీయం.

ఇక్కడి అమ్మ వారు పార్వతీ దేవి .స్వామికి ఎదురుగా దక్షిణాన ఉత్తర ముఖం గా ,స్వామికి కుడి వైపు ఉంటుంది .శంకర భగవత్పాదులు ఇక్కడ శ్రీ చక్రమును ప్రతిష్టించారు .అమ్మవారిని ‘’త్రిపుర సుందరీ దేవి ‘’గా కూడా పిలుస్తారు .జనార్దన స్వామి లక్ష్మీ దేవి సమేతం గా ఇక్కడ లింగాన్ని ప్రతిష్టించి ,పూజించి ,కొలువైనాడు శంఖ ,చక్ర గద ,పద్మ ధరుడై ,దశావతారాలు చెక్కిన మకర తోరణాలతో భక్త వత్సలుడై ఉంటాడు .

.

ప్రాకారం లో దుండి గణపతి ,లలితా దేవి ,వాసవీ కన్యకా పరమేశ్వరి ,వీర భద్రుడు ,సప్త మాతృకలు ,బ్రాహ్మీ, మహేశ్వరి ,కౌమారి వైష్ణవి , వారాహీ, చాముండీ వాహనాల తో దర్శన మిస్తారు .నైరుతి లో సరస్వతి అమ్మ వారు పుస్తక పాణి యై దర్శన మిస్తుంది .శ్రీ సంతోష రూపా దేవి ,దుర్గా దేవీలనూ చూడ వచ్చు పడమర తూర్పు ముఖం గా నెమలి వాహనం పై కార్తికేయుడున్నాడు .వాయవ్యం లో మహిషాసుర మర్దిని ఉత్తరాన కంచి కామాక్షి ,నాగేంద్రస్వామి ,సుందోప సుందులు ,నట రాజు ,దత్తాత్రేయ స్వామి ,ఆది శంకరా చార్యులు ,శనీశ్వరుడు రాధ కృష్ణుల విగ్రహాలు చూడ వచ్చు .

తూర్పు ప్రాకారం లో పశ్చిమ ముఖం గా సూర్య బగ వానుడు ,కాశీ విశ్వేశ్వరుడు ,నగరేశ్వరుడు బాణాసురుడు ,కాల భైరవ విగ్రహాలున్నాయి .ఇక్కడి నాగేశ్వర స్వామిని దర్శించి చిమ్మిరి నైవేద్యం పెడితే సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్మకం .తూర్పున శనీశ్వరుడు లింగా కారం లో ఉండటం విశేషం . నగరేశ్వరుడిని అగస్త్య మహర్షి ప్రతిష్టించాడని చెబుతారు .శ్రీరాముడు రావణ వధ దోషాన్ని పోగొట్టుకోవటానికి చేసిన 108శివలింగ ప్రతిస్టలలో 106వ లింగాన్ని ఇక్కడే ప్రతిష్టించినట్లుస్థల పురాణం ..అందుకే పాలకొల్లు అపర కాశి అని పించు కొంటున్నది .

క్రీ శ..918లో మొదటి చాళుక్య భీముడు ఈ పంచారామాలను గుర్తించి ఆలయాలు నిర్మించాడని చారిత్రిక కధనం .ఈ గుడిలో 75శిలా సాస నాలున్నాయి వాటిపై రంగులు పూయటంతో చరిత్ర కను మరుగౌతోంది .1136-1640మధ్య కాలం లో చాళుక్యులు ,రెడ్డి రాజులు ,కాకతి రాజులు మరెందరో భక్తులు విశేషం గా దానాలు ఇచ్చారు అలయాభి వృద్ధికి కృషి చేశారు .1176లో వెల నాటి చోడ రాజు భార్య గుందాంబిక అఖండ దీపారాధన కోసం భూదానం ఇచ్చింది .1276లో కోట గణపతి దేవ మహా రాజు నాట్య మండపానికి కంచు తలుపులు పెట్టించాడు .1296లో ఇతని రాణి ‘’ ఒడయ మహా దేవి ‘’దీపావళికి దీపోత్సవానికి శివ రాత్రి రోజు బ్రాహ్మణ అన్న సంతర్పనకు 10పుట్ల భూ దానం చేసింది .1316లో శ్రీ రామ నారాయణ చక్ర వర్తి శని వార మండపాన్ని కట్టిస్తే ,1385లో కాటయ వేమా రెడ్డి ప్రభువు పుష్ప వాహనాన్ని ఏర్పాటు చేశాడు 1388లో అల్లారెడ్డి  రెడ్డి ప్రభువు శివాలయాన్ని కట్టించి ‘’అల్లాడేశ్వరుడు  ‘’పేర లింగ ప్రతిష్ట చేశాడు  1415-1416లో బెళ్ళాపిన్నమ నేని ,నరహరి నేని అనే భక్తులు బంగారు రధాన్ని ,కళ్యాణ మండపాన్ని ఇచ్చారు 1596కే పవళింపు సేవ మందిరం ఉంది .1714లో పాలకొల్లు నిజాం పాలన లోకి వెళ్ళింది .క్షీరారామం పంచారామమే కాకుండా ‘’శిల్పా రామ క్షేత్రం ‘’గా ప్రసిద్ధి చెందింది .

చైత్ర శుద్ధ దశమి నాడు స్వామి వారల కల్యాణోత్సవం వైభవం గా నిర్వహిస్తారు .ఏకాదశి నాడు రధోత్సవం చేస్తారు 1972లో శ్రీ రామ లింగేశ్వర’’ ఓరిఎంటల్ కాలేజి ‘’ని ఏర్పరచి సంస్కృతవిద్యా బోధన ను ఉచిత భోజన వసతి సదుపాయాలతో కల్పించారు .

పాలకొల్లు లో బయల్దేరి రాత్రిపదకొండు నలభై అయిదు నిమిషాలకు ద్రాక్షా రామం చేరాము .ఆ విశేషాలు తర్వాత తెలియ జేస్తాను.

సశేషం

మీ –గబ్బిట దుర్గా రసాద్ -1-12-13-ఉయ్యూరు

Posted in పంచా రామ | Tagged | 1 Comment

వేయి పడగలు –రేడియో నాటకం –శశి రేఖా పరిణయం (పదహారవ భాగం )

వేయి పడగలు –రేడియో నాటకం –శశి రేఖా పరిణయం (పదహారవ భాగం )

ఈ రోజు అంటే నవంబర్ ముప్ఫై  న శనివారం ఉదయం ఏడుం బావుకు కవి సమ్రాట్ విశ్వ నాద వారి వేయి పడగలు పదహారవ భాగం ‘’కిరీటి -శశిరేఖా పరిణయం ‘’గా ప్రసార మయింది .కిందటి వారం పంతులు  ‘’జోస్యుల ‘’ఉన్మాదం, మరణం తో విషాదాంతమైన ఎపిసోడ్ ,ఈ వారం కిరీటి వివాహం తో మొదాంతం అయి హాయి అని పించింది .కిరీటి ధర్మా రావు అరుంధతి ల వద్దకు వచ్చి తన గోడు వెళ్ళ బోసుకోవటం వీళ్ళిద్దరూ ధైర్యం చెప్పి కార్యోన్ముఖుడిని చేయటం తో ఈ వారం కధ ప్రారంభ మైంది .చిక్కి శల్యమై దిక్కు తోచని స్తితిలో ఉన్న కిరీటిని ఓదార్చి ,ధైర్యం చెప్పి ముందుకు నడిచేట్లు చేశారు .వీరి మధ్య సంభాషణలు రసవత్తరం గా ఉన్నాయి .

ధైర్యం తెచ్చుకొన్న కిరీటి చక్కని మాయోపాయం చేసి మామకు ఉత్తరం రాసి ,బోల్తా కొట్టించి ,మామ మనసును  మార్చి ,ఆయనే తనకూతురు శశిరేఖను కిరీటికి ఇచ్చి  పెళ్లి చేయటానికి ముందుకొచ్చేట్లు చేస్తాడు ..ఇదంతా ‘’మినీ మాయా బజార్ ‘’అని పించి మహా సరదా గా ముగింపు కొచ్చింది .

 

ఈ ఎపిసోడ్ ముందు ప్రముఖ సాహితీ వేత్త ఒకరు(వారి పేరు వినలేక పోయాను ) వేయి పడగలు పై తమ అమూల్య అభిప్రాయాన్ని విడ మర్చి వివరించారు .’’వెయ్యి పాత్రలున్న ఈ నవలను నాటకం గా మలచటం ఏంతో కష్టం .కాని  అలాంటి దాన్ని సులభ సాధ్యం చేసి, నాటకం గా  ఏంతో  రంజకం గా మలచి ప్రసారం చేసి తన సామర్ధ్యాన్ని నిరూపించుకొన్న హైదరాబాద్ ఆకాశ వాణిని ,యెంత అభినందించినా మాటలు చాలవు అన్నారు .పాత్ర దారు లందరూ తమ పాత్రలను అత్యంత సమర్ధ వంతం గా పోషించి నాటక విజయానికి ఏంతోసహకరించారు.  అందరు అభి నంద నీయులే ‘’అని పొంగిపోతూ కొని యాడారు .

విజ్ఞప్తి –ఎపిసోడు కు  ముందు ‘’వేయి పడగలు’’ గొప్పదనాన్ని గురించి వివరించే సాహితీ ప్రముఖుని పేరు చెబుతున్నారు .బాగుంది .వారి ప్రసంగం అయిన తర్వాత కూడా వారి పేరు మరొక్క మారు చెప్పటం భావ్యమేమో నని పిస్తోంది .రేడియో లోఇది మామూలే. దీని వల్ల  ఒక అరనిముషమే ఖర్చు అవుతుంది .నా సూచన ను గమనించి ఇకపై అనుసరిస్తారని ఆశిస్తున్నాను .

గబ్బిట దుర్గా ప్రసాద్ -30-11-13-ఉయ్యూరు

Posted in రేడియో లో | Tagged | Leave a comment

కార్తీకం లో మా పంచా రామ సందర్శనం -2

    కార్తీకం లో మా పంచా రామ సందర్శనం -2

కార్తీకం లో మా పంచా రామ సందర్శనం – దర్శన మాలిక

కార్తీకం లో మా పంచా రామ సందర్శనం

మా ‘’పంచ రామములు ‘’బస్సు అమరావతిలో దాదాపు నాలుగు గంటలు ఆలస్యం గా ఉదయం తొమ్మిదింటికి బయల్దేరింది .బెజవాడ బెంజ్ సర్కిల్ కు పదిన్నరకు చేరి అక్కడి నుండి కంకిపాడు వచ్చి అక్కడ పావుగంట ‘’రీసెస్ ‘’కోసం ఆగి ,మానికొండ గుడివాడ ,కైకలూరు ,ఆకివీడు ,అర్తమూరు ,ఉండి మీదుగా భీమవరం కు మధ్యాహ్నం రెండుగంటలకు సుమారు అయిదు గంటలు ప్రయాణించి చేరింది .డ్రైవర్లు అరగంటలో దర్శనం చేసుకొని రావాలని చెప్పారు .బస్ ఆగిన చోటు నుండి గుడికివెళ్ళటానికే  పావు గంట పట్టింది .దారిలో వినాయక స్వామి గుడి షిర్డీ సాయి బాబా గుడి అయ్యప్ప గుడులు చూసి శ్రీ భీ మేశ్వరాలయం చేరాం .విపరీత మైన రద్దీ గా ఉంది .యాభై రూపాయల టికెట్ కొని ముగ్గురం లైన్ లో నిలబడి ఉన్నాం . దాదాపు గంట ‘’నరుకుల వేట్లాట ‘’తర్వాత ఇరుకు క్యూలో కాళ్ళు  నెప్పి పుట్టేలా నిలబడి ,భీమేశ్వర స్వామిని దర్శించాం .అమ్మ వారు పార్వతి దేవిని సందర్శించాం .అసలు ఇక్కడ చూడాల్సింది గును పూడిలో ఉన్న సోమేశ్వరాలయం అందుకే దీనికి సోమా రామం అని పేరొచ్చింది .కానిమా బస్ వాడు దీని నే చూపించాడు .ఇది వరకే మేం సోమారామం చూశాం కనుక నిరాశ పడలేదు .

చాళుక్య భీముడు అనే రాజు పేర భీమ వరం ఏర్పడింది .భీమ వరం దగ్గర ఉండిరాజులువీర శైవులు .వీరికాలం లో నూజి వీడు జల్లి సీమలలో భీమ వరం శోభాయమానం గా విలసిల్లింది . 1434 లోదేవకుమారుడు శింగన అనే భక్తుడు గునుపూడి భీమవరం సోమేశ్వర స్వామికి ఎన్నో కానుకలు సమర్పించాడు .ఒక సారి జటాజూట రాజుకు ఓంకార స్వామి ప్రత్యక్షమై గునుపూడిలో సోమ రామం లో శివుని అమృత లింగ శకలం పడి ఉందని ,అక్కడికి వెళ్లి చంద్ర పుష్కరిణి లో స్నానం చేసి అన్న పూర్ణా సమెత సోమేశ్వర దర్శనం చేస్తే మూగతనం పోతుందని చెప్పాడు .అలాగే మాటలు వచ్చాయి రాజ్యానికి చేరాడు రాజుగా పట్టాభి షిక్తుదయ్యాడు

Inline image 1Inline image 2Inline image 3

Inline image 4SOMESWARA SWAMY TEMPLESOMESWARA SWAMY TEMPLEMonuments 4Monuments 2

సోమేశ్వర ఆలయం ముందున్న చంద్ర పుష్కరిణి లో స్నానం చేయాలి దానికి ఎదురుగా పది హీను అడుగుల నందీశ్వర దర్శనం చేయాలి .నందిని దాటి ఏడు అంతస్తుల ముఖ మండపం దాటిలోపలి వెడితే

,దక్షిణం లో సూర్య నారాయణుడు ఉత్తరం లో సుబ్రహ్మణ్య స్వామి ,ఈశాన్యం లో నవ గ్రహాలూ చూసి ధ్వజ స్తంభం దాటి తూర్పు ముఖం లో గణపతి ,ఉత్తరాన కుమార స్వామి ,సభా మండపం దాటి అంతరాలయం చేరితే దక్షిణ ముఖం గా ఉత్తరం వైపున్న పార్వతీ అమ్మ వారు కోటి కాంతులతో విరాజిల్లుతూ దర్శన మిస్తారు .గర్భాలయం లో సోమేశ్వర లింగం రెండు అడుగుల ఎత్తునకన్పిస్తాడు .దక్షిణ ద్వారం గుండా బయటికి వచ్చి మెట్ల మీదుగా రెండో అంతస్తు చేరితే సోమేశ్వర స్వామి శిరసు పై రెండో అంతస్తులో నాలుగు అడుగుల ఎత్తున్న అన్న పూర్ణ అమ్మ వారు దర్శన మిస్తారు .దక్షిణాన కళ్యాణ మండపం ఉంది .

క్షేత్ర పాలకుడైన జనార్దన స్వామి పశ్చిమం లో తూర్పు ముఖం గా ఉంటాడు అందువల్ల ఇక్కడ వివాహాది శుభ కార్యాలు చేసుకో వచ్చు .శ్రీ నాద కవి సార్వ భౌముడు భీమపురాణం లో  లో అగస్త్య మహర్షి సోమా రామాన్ని సందర్శించి నట్లు రాశాడు .

రోహిణి మీద అధిక ప్రేమతో చంద్రుడు మిగిలిన భార్యలను నిర్లక్ష్యం చేస్తే దక్షుడు కోపగించి శపిస్తాడు శాప విమోచనం తెలప మంటే చంద్ర

పుష్కరిణి లో స్నానం చేసి అక్కడి శివుడిని అషె కిస్తే .విమోచనం జరుగుతుందని చెప్పాడు అలాగే చేశాడు.అందుకే అది చంద్ర పుష్కరిణి అని పేరొచ్చింది స్వామిని కి   సోమేశ్వర స్వామి అని పేరొచ్చింది .

మళ్ళీ బస్ దగ్గరకు చేరేసరికి మూడున్నర అయింది .అందరు వచ్చేసరికి అయిదు దాటింది .అప్పుడు బయల్దేరి ‘’మావూళ్ళమ్మ’’అమ్మ వారిని దర్శించాం .మేము తెచ్చుకొన్న పూరీ లను కూర తో పాటు కడుపు నిండా లాగించాం .కమలాలు కొని తిన్నాం .ఇక్కడ రోడ్లు ఇరుకు .న్యాయం గా గుడి దగ్గరే బస్ పెట్ట వచ్చు. ట్రాఫిక్ ఇబ్బందులెన్నో .మా డ్రైవర్ అక్కడి సబ్ ఇన్స్పెక్టర్ ను అడిగితె ‘’ఇక్కడ కొటీశ్వరులున్నారు కాని ప్రజల్ని గురించి పట్టించుకొనే వాడు ఒక్కడూ లేడు మా బాధ యేమని చెప్పం ?/’’అన్నాడు .అక్కడి నుండి బయల్దేరి రాత్రి ఏడున్నరకు పాల కోల్లు చేరాం .ఇక్కడ క్షీరామమం ఉంది .దాని వివరాలు తరువాత తెలుసు కొందాం

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -29-11-13-ఉయ్యూరు

Posted in నేను చూసినవ ప్రదేశాలు, పంచా రామ | Tagged | Leave a comment

తణుకు –నన్నయ భట్టారక పీఠం లో నా ప్రసంగం -4(చివరి భాగం)

తణుకు –నన్నయ భట్టారక పీఠం లో నా ప్రసంగం -4(చివరి భాగం)

1తణుకు –నన్నయ భట్టారక పీఠం లో నా ప్రసంగం -3

తణుకు –నన్నయ భట్టారక పీఠం లో నా ప్రసంగం -2

తణుకు –నన్నయ భట్టారక పీఠం లో ‘’రామాయణ ,భారతాలలో మానవ విలువలు –పై నా ఉపన్యాసం —

శ్రీ కృష్ణుని బాల్యం అంతా వ్రజ భామల మధ్య గోపాలుర మధ్య గడిచింది .వీరికి చదువు లేదు .ఆయనపై అమిత అనురక్తి ,ఆరాధనా మాత్రమె ఉన్నాయి .వారి నిష్కామ ప్రేమ కు తగిన ప్రతి ఫలం ఇవ్వాలను కొన్నాడు .’’తన దివ్య విభూతి ని నిరతిశయం గా ప్రేమించి భజిస్తే మోక్షం వస్తుందని ‘’హామీ ఇచ్చాడు వారికి .వారితో రాసక్రీడలు జరిపాడు అదొక దివ్య విభూతి .దీనిని కొందరు అపార్ధం చేసుకొన్నారు .ఆనీబిసేంట్ దీనిపై ఒక పుస్తకమే రాసింది అందులో ఆమె ‘’till 19 th century rasaleela provoked only devotion and not ribaldry ‘’అని ఘంటా పధం గా చెప్పింది .

‘’ ఏ జాతి ,ఏ కులం వాడైనా ఏ రూపం లో ధ్యానించినా మోక్షం కలుగుతుంది ‘’అని చెప్పాడు .గీతలో పరమాత్మ .అంటే భక్తిలో ‘’సోషలిజం ‘’తెచ్చాడు .’’రిలీజియన్ ఆఫ్ డివోషన్  ‘’అంటే భక్తిలో ఉదాత్తత ను శ్రీ కృష్ణుడు చెప్పిన భక్తీ మార్గం లోనే సాధ్యమవుతుంది .’’ధర్మం విషయం లో న్యాయం గా ,ఉచితం గా ఉండాలని సంసారాలను వదిలి అరణ్యాలకు

వెళ్ళటం సన్యాసం కాదని ,కామ్య కర్మ ల సన్యాసమే నిజమైన సన్యాసమని’’బోధించి భక్తిలో విప్లవం తెచ్చాడు గీతా చార్యుడు . కర్మ ను వదిలిన్చుకోవటము  త్యాగం కాదని ,కర్మ ఫలాసక్తి లేక పోవటమే త్యాగమని గట్టిగా చెప్పాడు .ఇది ఆనాడే కాదు ఈ నాడు అందరికి  ఆదర్శ మైంది .ఇప్పుడు కొన్ని ప్రధాన ఘట్టాలలోకి తొంగి చూద్దాం

అభి మన్యుడు ఉత్తర పాణి గ్రహణం చేశాడు అది ఎలా ఉందంటే ‘’మత్తేభం చిగురాకు పై ఉన్న ఆసక్తితో వ్రుక్షాగ్రం నుంచి సుకుమారంగా ,తొండం తో గ్రహించి నట్లుంది ‘’మార్దవం కోమలం రక్తిమ కిసలయాల ప్రధాన ధర్మం .అలాంటి హస్తాన్ని అంటే సమగ్ర సౌందర్యాన్ని అభి మన్యకుమారుడు గంభీరం గా ,అనురాగం తో ,నాగరకత తో గ్రహించాడు ఇది లోకోత్తర భావం .ఈ నాటి వదూవరులకు చక్కని సుకుమార భావాన్ని తిక్కన కవి అందించాడు .

రారాజు కొలువు లో ఉన్న భీష్మ ద్రోణుల పరిస్తితి దారుణం గా ఉంది .ధర్మాన్ని ప్రతిఘటటించ టానికి  మనసొప్పటం లేదు .కాదు అని అధర్మ పరుల ఆగడాలను ప్రతిఘటించే నైతిక ధైర్యమూ చాలని ధర్మా ధర్మాల మధ్య సంకట స్తితిలో ,సందిగ్ధం లో నలిగి పోయారు

.అంటే అవసరమైనప్పుదు చేతులు ముడుచుకొని కూర్చుని జరిగే అనర్ధానికి కారకులయ్యారు .అలాగే కొడుకు పై వ్యామోహం ,సంపద పై ఆశ ,రాజ్యాధికారం ,పాండవుల పట్ల భయం గుడ్డి రాజుని కిం కర్తవ్యతా మూఢుడిని చేసింది .ఒక రకం గా భారతం లో ప్రతి పాత్రా సంకట స్తితి నేడుర్కొన్నదే .

రాయ బారాల విషయానికి వద్దాం .ఇందులో మానవ విలువలు ప్రతి బిమ్బించాయి వ్యక్తిత్వాలు ప్రకాశించాయి .ముందుగా ద్రుపద పురోహితుడిని పాండవులు కౌరవుల దగ్గరకు రాయ బారం పంపారు .అతడు బ్రాహ్మణుడు కనుక సహజం గా పరుషం గానే చెప్పాడు దానితో అక్కడి వారి మనసుకు గాయాలయ్యాయి .ఇది గ్రహించాడు పితామహుడు .’’ఏ మయ్యా !ఇలా పరుషం గా మాట్లాడితే కార్యం సానుకూల మవుతుందా ?’’అని మెత్తగానే చివాట్లు పెట్టాడు .కాని విప్రుడు కనుక అధర్మాన్ని ఖండించే ధైర్యం ,నిజాన్ని నిర్భయం గా చెప్పే స్వాతంత్ర్యం ఉన్న వాడని పించాడు .రాజ పురోహితుడు కనుక అధికారం తో కూడిన తీక్ష్ణత ఆయన మాటల్లో ఉన్నాయి ‘’దుర్యోధన సర్పాన్ని రెచ్చగొట్టిన వాడయ్యాడు ‘’అంటాడు తిక్కన

రెండవది సంజయ రాయ బారం –ఇతను రెండు పక్షాల వారికీ కావలసిన వాడే .యుక్తాయుక్తాలు ,నేర్పు ఉన్న వాడు .’’గాస్ కొట్టగలడు తీసేయ్య గలడు.    రాగానే ధర్మ రాజును పొగిడాడు .’’అస్తోక పుణ్య ధనుడు –మీ తండ్రి ధరణి నాధుడుఅని గ్రేడింగ్ లో చెప్పాడు .మన మెత్తని పులి ధర్మజుడు తక్కువ తిన లేదు ‘’ఆ రాజు మా దేశంగల కారుణ్యము కతమునను సుఖముగా నిట్లున్నాము ‘’అని ‘’కాకువు ‘’తో సమాధానం చెప్పి ,,కౌరవ క్షేమాన్ని అడిగి ,తన తమ్ముల వీర విక్రమ పరాక్రమాలను ఏకరువు పెట్టాడు .సంజయుడు ధర్మ రాజు ఆంతర్యం గ్రాహించాడు .’’కారుణ్యం చూపు ‘అని చాలా చెప్పాడు ‘’చంద్ర వంశం వాడివి మనసు చల్లగాఅమృతం గా  ఉండాలి .’’అని ‘’నిపుణ హృదయ ‘’అని ములగ చెట్టు ఎక్కించాడు .యుద్ధం లో జయాపజయాలు దైవాధీనం అన్నాడు .చివరికి కాళ్ళ బేరానికి వచ్చి అందరికి వంగి వంగి దణ్ణాలు పెట్టాడు .క్రోధ శాంతి చేయ మని విన్న వించాడు .పెద్ద రాజు ఇతన్ని పంపేటప్పుడే ‘’శాంతి ప్రకారం కార్యం నడుపు .ఒక్కటిగా ఉండటానికి ఏర్పాటు చేసిరా ‘’అని ఆదేశించాడు దీన్ని ఓర్పుగా నేర్పుగా ప్రయోగించాడు రాయ బారి.

ధర్మ రాజుకు ఎక్కడో కాలింది .’’ఏమయ్యా !ముందు మమ్మల్ని పోగిడావు .యుద్ధం లో వాళ్ళే జయిస్తారని బీరాలూ పలికావు .చివరికి సంధి అంటున్నావు .ఇంత పక్ష పాతం నీ కెందుకు ?’’అని నిలదీశాడు .సంజయుని మాటలు ‘’దుర్నయం బెట్టిదం బెండు ‘’లాగా ఉన్నాయన్నాడు .కానీ అతని వినయం ,నేర్పు ఎవరి దగ్గరా ఉండవు అని కితాబు ఇచ్చాడు కూడా .అయిదు ఊళ్లు ఇవ్వటానికి కొడుకు ఒప్పుకోడు .వాడి మూర్ఖత్వం చెల్లాలి .ధర్మ రాజు శాంతించాలి అదీ గుడ్డి రాజు తపన .అందుకే సంజయ రాయ బారం .

సంజయుడు ద్రుత రాస్త్రుడితో నిష్కర్ష గానే ‘’వాళ్ళ సైరణ వెరపు గా భావించటం తప్పు .సాదు రేగితే ప్రళయమే ‘’అని హెచ్చరించాడు .సంజయుడు హితుడు ,వాక్చతురుడే కాని అక్కడి ఆస్తానం లో’’ సోషల్ స్టేటస్’’ లేని వాడు .కనుక అతని ఉపదేశం ఫలించదు అని గ్రహించిన కృష్ణుడే తానె రాయ బారిగా వెళ్ళాడు .

ముందుగా పాండవుల అభి ప్రాయాలన్నీ విన్నాడు అంతా శాంతి మంత్రమే జపించారు .ద్రౌపది మాత్రం వీళ్ళ సంధి యత్నాల్ని నిర్దాక్షిణ్యం

గా నిరసించింది .తన పరాభవాల్లి వెళ్ళ గక్కింది .ఆమె క్షోభ భూ దేవి క్షోభే అయింది . భూభారం తగ్గాలని ఆరాట పడింది .దుర్జనులతో పోత్తేమిటి ?అని నిల దీసింది .సంధి ప్రయత్నాలు మానక పొతే పాండవులంతా బుద్ధి హీనులు ,క్రుపాణులు ,క్షత్రియ తేజం లేని వారు అని పురజనులు అనుకొంటారని ఈసడిం చింది . నిస్తేజం గా ఉండటం కంటే రాజుకు వీర మరణమే మంచిది అని గుర్తు చేసింది .హస్తిన లో కుంతీ కూడా ఆత్మ గౌరవం గల స్త్రీ గా ,కోడలి అవమానాన్ని దిగ మింగిన అత్తగా క్షోభించింది .తగిన ప్రతిక్రియ జరగక పొతే పీడన చల్లారదు అని తెగేసి చెప్పింది .భార్యకు జరిగిన పరాభవానికి ప్రతీకారమే తగిన కర్తవ్యమ్ అని కొడుకులకు చెప్పి పంపింది .దీనితో’’ ధర్మజ మహా సముద్రానికి చెలియలి కట్ట లేదు ‘’అని అందరు గ్రహించారు .ఇలా భిన్న వ్యక్తుల మనోభావాలు ప్రతి బిమ్బిం చాయి  రాయ బారాలలో .

భీష్ముడు శర తల్పం మీద ఉన్నాడు .కర్ణుడు ఆయన్ను సందర్శించి భక్తీ ,వినయాలు ప్రదర్శించి ప్రణామం చేశాడు .’’అలుక దక్కి నన్ను అధిక వాత్సల్య శీలతము గాజూచి తగిన మాట లాడవే మహాత్మా !’’అని

 

రుద్ధ కం ఠం తో ప్రార్ధించాడు .పశ్చాత్తాపం తో పరితపించాడు .పితామహుడు కూడా ‘’  నీదెస గోపింతూనే  !అది శిక్ష కాని దోషంబు కాదు –నీవు పాండుతనయుం డగుట  జేసి, నీ యెడల వాత్సల్యంబు కాని ,మత్సరంబు లేదు ‘’అని అనునయించాడు .కౌరవులకు జయం కలగదని పాండవులను చేరమని ఉచిత సలహా పారేశాడు ..’’దైవా ధీనము సర్వ మున్ మన మతిం దప్పింప గావచ్చునే ?’’అని మర్యాద గా చెప్పాడు .తన ధర్మాన్ని నేర వేర్చటానికి అనుమతి నివ్వమని కోరి అనుజ్న తీసుకొని కదిలి వెళ్ళాడు కర్ణుడు .భీష్ముడి దయనీయ స్తితి ని చూసి ‘’భారత వీరాగ్రణీ!నీ సచ్చరితము ఫలమే ఇట్లిచ్చట యునికి –దాత నేమనగనేర్తున్ ‘’ అంటూ ‘’బాణాల పరుపు’’ మీద పడి ఉన్న భీష్ముని పరిస్తితిని చూసి కలత చెందాడు .కన్నీరు కార్చాడు .భీష్ముడు చని పొతే తప్ప అస్త్రం పట్టనని భీష్మించిన కర్నుడిలో ఇంత మార్పు వచ్చింది .మానవీయ విలువలను వర్షించిన ఘట్టం ఇది .మానసిక స్వభావ ఆవిష్కరణ గొప్పగా జరిగిన సందర్భం ఇది

కౌరవ స్త్రీఅలు అందరు కలిసి చని పోయిన వారి అపర కర్మలకు బయల్దేరి వెళ్ళే టప్పుడు శోకం ఘనీభ వించింది మంచు లా కురిసింది . .ద్రుత రాస్త్రుడి హృదయ వేదన, శోకం వర్ణనా తీతం .గాంధారి పుత్ర శోకం లో మునిగి పోయింది .తానూ ఏడుస్తూనే మిగిలిన  స్త్రీలను ఓదారుస్తోంది ఇంతలో ద్రౌపది కనీ పించింది .ఆమె కూ పుత్రశోకమే కదా. కాని ఆమెను పొదివి పట్టుకొని ఓదార్చింది .’’నీనా తెరగ కోక్కటియ ‘’ అని నిట్టూర్చింది .భీముడు ఎదురైతే ‘’గుడ్డి వారికి ఊతకర్ర అవసరం .అలాంటి డి ణా కొడుకుల్లో ఒక్కడినైనా మిగిల్చి  ఊతకోలగా ఉంచక అందర్నీ చంపెశావా “??అని హృదయ విదారకం గా దుఖించింది .కడుపు కోత అంత బాధిస్తుంది .

భారతం చివరి పర్వాలలో కరుణ కురిసింది .విషాద అంతం అయింది  .విధి ప్రాబల్యం అర్ధమైంది .స్వార్ధ త్యాగం ప్రధానమైంది .స్త్రీ పర్వం లో శోకం ఉద్వేగం –శాంతి ఆనుశాసనికాలలో నిర్వేదం ,మౌసలం లో కరుణ ప్రధానం అయినా ధ్యేయం అయిన శాంతరసం మూడింటా అంతర్వాహిని గా ప్రవహించింది .ఇతి వృత్తాన్ని తనలో లయం చేసుకొని ఒక గొప్ప పర మార్ధాన్ని బోధించింది మహా భారతం .’’అని నా ప్రసంగాన్ని ముగించాను .దాదాపు నాన్  స్టాప్ గా గంటా పది నిమిషాలు ప్రసంగించాను .

అందరు మెచ్చుకొన్నారు .ఉచిత రీతిలో సన్మా నించి ,శాలువా కప్పి ‘’రెండు కవర్లు ‘’నా చేతిలో పెట్టారు అధ్యక్షులు ,.మిగిలిన నిర్వాహకులు .వినయం గా అందరికి నమస్కరించాను .సభ బయట నన్ను శ్రీ రస రాజు గారికి పరిచయం చేశారు మూర్తి గారు. ఆయన్ను కృష్ణా జిల్లా రచయితల సంఘ సమా వేశాలలో రెండు మూడు సార్లు చూశాను తణుకు నివాసి .మా టి వి .సత్యనారాయణకు మంచి మిత్రుడు .నేను చాలా బాగా మాట్లాడానని రస రాజు గారు మెచ్చుకున్నారు .మా దూరపు బంధువు శశి కాంత్  కూడా వచ్చి చివరిదాకా ఉన్నాడు. రస రాజు గారితో కలిసి ఫోటోలు  దిగాం అందరం .మూర్తి గారి అబ్బాయి హర్ష ,స్పందన కూడా వచ్చి అయన తో ఫోటోలు దిగారు .రస రాజు గారి అడ్రస్ తీసుకొని సరస భారతి పుస్తకాలు వారికి పంపిస్తానని చెప్పాను ఆయన కూడా తమ పుస్తకాలు పంపుతామన్నారు .

మూర్తి గారు స్కూటర్ మీద తమ ఇంటికి తీసుకొని వెళ్ళారు .అక్కడ వెంటనే భోజనం చేశాను .చేమ దుంపలు మెత్తగా వేయించిముక్కా ముక్కా అంటూ కోకుండా వేయించారు . మహా రుచి కరం గా ఉంది .టమేటా చట్నీ ,పులుసు తో కమ్మని భోజనం పెట్టారు . ఆ రాత్రి అక్కడే ఉండమని మూర్తిగారు ,భార్య ,కొడుకు కోడలూ బతిమిలాడారు ఉండలేనని చెప్పాను .మూర్తి దంపతులు నాకు శాలువ కప్పి సత్క రించారు ఇంట్లో .స్పందన తాంబూలాల సమయం లోను వారింట్లో నాకు ,మా బావ మరిది ఆనంద్ కూ శాలువా కప్పారు ..అంతసహృదయులు మూర్తిగారు .నన్ను స్కూటర్ మీద వై జంక్షన్ లో ‘’ఇంద్ర బస్ ‘’ఎక్కించారు వచ్చేటప్పుడు బెజ వాడ నుండి ఎక్స్ప్రెస్ బస్ చార్జి నూట అయిదు (కాట్ కార్డ్ )అయితే,ఇప్పుడు ఈ’’ శీతల యంత్రం’’ చార్జి నూట తొంభై ఒక్కటి విజయ వాడకు .రాత్రి పదకుండు నలభై అయిదుకు బెంజ్ సర్కిలో దింపాడు. వెంటనే’’ ఇసుక లారీ ‘’దొరికితే ఎక్కి రాత్రి ఒంటి గంటకు ఉయ్యూరు చేరి ఇంటికొచ్చి హాయిగా పడుకొన్నాను .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -29-11-13-ఉయ్యూరు

 

 

 

 

.

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

తణుకు –నన్నయ భట్టారక పీఠం లో నా ప్రసంగం -3

తణుకు –నన్నయ భట్టారక పీఠం లో నా ప్రసంగం -3

తణుకు –నన్నయ భట్టారక పీఠం లో నా ప్రసంగం -2

తణుకు –నన్నయ భట్టారక పీఠం లో ‘’రామాయణ ,భారతాలలో మానవ విలువలు –పై నా ఉపన్యాసం –1

‘’మానవ అన్వేషణ కోసం చేసే ప్రయాణమే రామాయణం ‘’అన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక పరిశోధకులు స్వర్గీయ ఇల పావులూరి పాండు రంగా రావు గారు .రాముడు విశ్వ ప్రేమ ,కనికరం ,పూనరావాసం లను ప్రపంచానికి పంచాడు .నోటి మాటలు చెప్పకుండా ఆచరించి చూపి మార్గ దర్శి అయ్యాడు .ఒక విధం గా మంచికి చెడు కు మధ్య అవగాహనే రామాయణం .మానవ దృక్పధం లో మారీచ రాక్షసుడికి గుణ పాఠం చెప్పి ప్రాణాలు కాపాడాడు రాముడు .’’మానవాస్త్రం ‘’అనే మార్మిక అస్త్రాన్ని రాముడు ప్రయోగించి మారీచాదులను తరిమేశాడని వాల్మీకి మహర్షి అన్నారు .వాడిని సంస్కరించాడు .వాడికి మనశ్శాంతి కల్గించాడు .రుషి తుల్యుడినీ చేశాడు .రావణుడికి హితవు చెప్పే స్తాయికీ ఎదిగాడు .సహనం ,ఓర్పు  నశించేట్లు చేస్తే తాముడు ఊరుకోడు .అందుకేరావణ  మారీచాదులను చంపాల్సి వచ్చింది .మానవ జాతి మానుగడ కోసమే రావణ సంహారం చేశాడు .

భరద్వాజ మహర్షి శ్రీ రామాదులకు ఆతిధ్యమిచ్చి ‘’రామా !నీకు ఏదైనా సంకల్పం ఉంటె నేను నేర వేరుస్తాను ‘’అన్నాడు .అప్పుడు రాముడు తనకోసం తన వారికోసం ఏదీ కోరుకోకుండా ‘’మహర్షీ !ఇక్కడ మీ

ఆశ్రమం నుంచి అయోధ్య వరకు వెళ్ళే మార్గం లోచెట్లు  అన్నికాలాల్లో ఫల పుష్ప భరితం అయెట్లు అనుగ్రహించండి ‘’అన్నాడు .అలానే చేశాడు మహర్షి .

కుంభ కర్ణుడి లో ధైర్యం ,పట్టుదల ,కారుణ్యం,నిస్స్వార్ధ త్యాగం  ఉన్నాయి .ఇంద్ర జిత్తు స్వార్ధం తో ఏ తప్పూ చేయలేదు .తండ్రి మద్దతుకోసమే ఏదైనా చేశాడు .పాపం దుస్ట తండ్రికి కొడుకుగా పుట్టటమే ఇంద్ర జిత్ తప్పు .మొదట్లో వాలి సుగ్రీవులు హార్దిక సౌభ్రాతృత్వం తోనే ఉన్నారు తర్వాత అధికార కాంక్ష వారిద్దరిని వేరు చేసింది

‘’మానవ హుందా తనానికి రాముడు ప్రతీక ‘’సహచరులకు రాముడు ఇచ్చిన ‘’మానవతా స్పర్శ ‘మానవ పరిధిని దాటి పశు హృదయాలనూ తాకింది అదీ రాముని లోని మాన వాతా గుణం .రధ సారధి గా ఉన్న సుమంత్రుడు  రాజ నీతిజ్ఞుడు ,వేదాంతి ,చివరికి ప్రవక్త స్తాయి ని పొందాడు .అదీ రామ ప్రభావం .శ్రీ రాముని ఆధ్యాత్మిక ప్రకాశం ,మానవతా స్పర్శ సుమంత్రుడిని అంత ఉన్నత స్తితి కి చేర్చింది

.

గుహుడు భరతుని హృదయం లోకి చొచ్చుకు పోవాలని ఏంతో  ప్రయత్నించాడు .అందుకే మహర్షి వాల్మీకి ‘’గహన గోచరుడు ‘’అన్నాది మెచ్చుతూ .నిస్వార్ధ సేవకు ,త్యాగానికి ప్రతీకలు జటాయువు ,సంపాతి .

‘’దేశ కాలాలకు అతీతమైన నిత్య సత్య ప్రకాశకావ్యం వాల్మీకం .మానవ జీవితం లో అన్ని కోణాలను ఆవిష్కరించి ,శాశ్వత విలువలను ప్రతిష్టించిన‘’విశ్వ కావ్యం రామాయణం ‘’అన్న ఇల పావులూరి వారి మాటలు శిరోధార్యాలు .

‘’కుటుంబ వృద్ధిం ,ధన ధాన్య వృద్ధిం –స్త్రియస్య ముఖ్యాః సుఖం ఉత్తమంచ –శ్రుత్వా శుభం  కావ్య మిదం మహార్ధః-ప్రాప్నోతి సర్వం భూపాచార్ధసిద్ధిం ‘’.

ఇప్పుడు యుగం మారి త్రేతాయుగం నుంచి కృత యుగం లోకి ప్రవేశిద్దాం .మహా భారతానికి నాయకుడు శ్రీ కృష్ణుడు అని ఇందులో శాంత రసం ఉందని ముందే చెప్పుకున్నాం .శ్రీ కృష్ణుడు ఎలాంటి నాయకుడు ?

 

‘’Sree Krishna is the first teacher in the history of the world to discover and proclaim the grand truth of love for love’sake and duty for duty sake ‘’.అన్నారు శ్రీ త్యాగీశా నంద

అంటే ప్రేమ ప్రేమ కోసం  విధి –కర్తవ్య నిర్వహణ కోసమనే సత్యాన్ని ప్రపంచ చరిత్ర లో మొదట గ్రహించి ప్రకటించిన ప్రధమ ఆచార్యుడు శ్రీ కృష్ణుడు .

‘’in Krishna we find the ideal house holder ,and the ideal sanyasin ,the hero of a thousand battles who knew no defeat ,the terror of despots ,psychophants ,,hypocrats ,sophists and pretenders .The master statesman ,the uncrowned monarch ,the king maker who had no ambition for himself ‘’అని కీర్తించారు స్వామి త్యగీశానంద తమ ‘’సర్వ సిద్ధాంత సౌరభం ‘’లో

అంటే ‘’ఆదర్శ గార్హస్త్యం ,ఆదర్శ సన్యాసం శ్రీ కృష్ణుని లోనే చూస్తాం .ఆయన అపజయం ఎరుగని రణ రంగ ధీరుడు .నిరంకుశులకు పరాన్న భుక్కులకు ,వంచకులకు ,కుతర్క వాదులకు నటించే వారికి ఆయన భయంకరుడు .అతి కుశల రాజకీయ వేత్త కృష్ణుడు .కిరీటం లేని చక్ర వర్తి .రాజ్య నిర్మాత .స్వార్ధ రహితుడు

‘’డాక్టర్ అమీయా సేన్ గుప్తా కృష్ణుని గుణ గణాలను వర్ణిస్తూ ‘’krishna gives knowledge to the ignorant ,powr to weak ,mercy to sufferers ,and goodness to the wicked .His qualities are for the sake of others ,not for himself .He naturally becomes the dearest treasure of a human heart ‘’అన్నారు .ఇవన్నీ కృష్ణుని మానవీయ గుణాలకు ఉత్కృష్ట రూపాలు .

‘’భక్తిభిహ్ శాన్తిభిహ్ భక్తో కే గీత మే హై –ధర్తీకే వాసియోకి ముక్తీ –ప్రీత్ మే హై ‘’అన్నాడు ప్రముఖ కవి ఇక్బాల్ .అంటే ‘’జనులందరి మధ్య ప్రేమ వికసిస్తే భూమి స్వర్గం గా మారుతుంది .ఆ ప్రేమనే శ్రీ కృష్ణుడు అందరికి పంచాడు .

మహా భారతం లో సత్యా సత్యాలకు ,ధర్మా ధర్మాలకు ,దైవ ,రాక్షస భావాలకు జరిగే సంఘర్షణ ప్రధాన ఇతి వృత్తం .భారతం అర్ధ ప్రాధాన్యం కలది .పరబ్రహ్మ స్వరూపాన్ని ,విధి ప్రభావాన్ని ,లోకులకు తేట తెల్లం చేసి సత్య ధర్మాలను లోకం లో ప్రతిస్టిం చటమే  వ్యాస మహర్షి ఆశయం .అప్పటికే సంఘం లో న్యాయ ధర్మాలు క్షీణించి పోయాయి అధర్మం పెచ్చరిల్లింది. అందుకే భారత యుద్ధానికి దారి తీసింది .తానూ ఆ యుద్ధానికి నికి సాక్షీ భూతుడు కనుక ఆ కధను ఆధారం గా చేసుకొని ధర్మ ప్రచారాన్నిసంఘ ఉద్ధరణను చేయటానికి పూను కున్నాడు కృష్ణ ద్వైపాయన వ్యాసుడు .మధ్యలో ఎన్నో రసాలు తరంగాలు గా  వచ్చి ఎగసి పడి సమసి పోయి చివరికి ప్రశాంత మైన శాంతియే  వర్ధిల్లాలని వ్యాస భావం .శ్రీ కృష్ణుడు నాయకుడు .కనుక భారతం కావ్యమే కాదు ‘’శాస్త్రం ‘’కూడా .లౌకిక ఇతి వృత్తం ఆధారం గా ఆధ్యాత్మికత ను ప్రతి పాదించాడు .లోక కల్యాణానికి మార్గం వేశాడు భగవాన్ వ్యాసుడు .

‘’’ ఆయుష్యంబితి హాస వస్తు సముదాయం ,బై హికాముష్మిక శ్రేయః ప్రాప్తి నిమిత్త ముత్తమ సభా సేవ్యంబు లోకాగమ –న్యాయైకాంత గృహంబు నా బరగి –నానా వేద వేదాంత విద్యా యుక్తంబగుదాని జెప్ప దొడగెం దద్భారతాఖ్యానమున్ ‘’-‘’కమనీయ ధర్మార్ధ కామ మోక్ష ములకు నత్యంత సాధనం బైన దాని ‘’వ్యాస మహర్షి చెప్పాడు అని మహా కవి తిక్కన కీర్తించాడు .

విరాట పర్వం లో స్త్రీ కి జరిగిన అవమానం,శీ ల రక్షణ కోసం ఆమె చేసే ప్రయత్నాలు ,దాని ద్వారా జరిగిన పరిణామాలు లోక సామాన్యమై కీచక వధ ఒక ప్రబంధమే అయింది .

భారత కాలం నాటికి ‘’యౌవనేషు విషయైషి ‘’,వార్ధకే ముని వ్రుత్తి’’అనే భావన ఉండేది .బ్రాహ్మణ ,క్షత్రియులు స్వర్గ సుఖం కోసం వాజ పెయ ,రాజ సూయ ,అశ్వ మేధా ,పురుష మేధా మొదలైన యాగాలు చేసే వారు .ఉపనిషత్తులు బాగా ప్రచారం అవటం తో నిష్కామ తపస్సు ,బ్రహ్మ నిది ధ్యాస చేయటమే జన్మ సాఫల్యం గా భావించారు .ఈ నేపధ్యం లో ‘’గీతోపదేశం ‘’అని వార్య మైంది ప్రవృత్తికి నివృత్తికి మధ్య ఒక మధ్య బిందువు పై సమాజాన్ని నిలపాల్సి వచ్చింది అంటే ఈ రెండిటికి ‘’బాలన్స్ ‘’సాధించాల్సి వచ్చిందన్న మాట .అదే సాధించాడు గీత ద్వారా శ్రీ కృష్ణ పరమాత్మ .

ఆ నాటి సమాజం లో వర్ణ సంకరం బాగా జరిగి పోయింది దీనికి కారణం చంద్ర వంశ రాజులు అన్ని చోట్లా వ్యాపించి అన్నికులాల వారినీ పెళ్లి చేసుకోవటమే .దీనితో మిశ్రమ కులాలేర్పడ్డాయి .అప్పటిదాకా వేదం శాస్త్రాలు చదివిన వైశ్యులు వ్యవసాయం లో పడ్డారు .స్త్రీలలో అన్ని వర్ణాల వారు ఏర్పడ్డారు . చదువు అబ్బలేదు .యజ్న యాగాలు ,సన్యాసం దుర్లభ మయ్యాయి .ఈ స్తితిలో ఉన్న వారికి ‘’పరమ పదం’’దుర్లభ మైంది .వీళ్ళు మోక్షానికి అర్హులు కారు అని అగ్ర వర్ణాల వారు భావించారు

.ఇలాంటి దీనులను ఉద్ధరించటానికి ‘’జనతా జనార్దనుడు ‘’అవసరమయ్యాడు ఆ పని నెర వేర్చాడు శ్రీ కృష్ణుడు.ఏం చేశాడో తరువాత తెలుసు కొందాం .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ – 29-10-13-ఉయ్యూరు

 

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

ఉసిరి తల్లి చెట్టు నీడన వర్షం లోమా ఇంట వన భోజనాలు

This gallery contains 47 photos.

More Galleries | Tagged | Leave a comment

మరో కోణంలో సర్దార్ పటేల్ – ఎ.జి.నూరానీ

 

మన దేశంలో ఉన్న వేర్వేరు రాజ్యాలను విలీనం చేసి ఒక యూనియన్‌గా చేసిన ఘనత సర్దార్ పటేల్‌దేనా? ఈ విషయంలో అప్పటి వైస్రాయ్ మౌంట్‌బాటెన్ ఎలాంటి సాయం చేశారు? ఈ విషయంలో ఆయన పాత్రను చరిత్ర తక్కువ చేసిందా?- ఈ అంశాలను ఎ.జి. నూరాని తాజాగా రాసిన ‘ది డిస్ట్రక్షన్ ఆఫ్ హైదరాబాద్’ అనే పుస్తకంలో విశ్లేషించారు.

‘అమెరికాలోని రాష్ట్రాలను విలీనం చేసి ఒక దేశంగా మార్చటంలో అబ్రహం లింకన్‌కు, వల్లభాయ్ పటేల్‌కు ఒక తేడా ఉంది. అబ్రహం లింకన్‌కు దక్షిణాది రాష్ట్రాలంటే ద్వేషం లేదు. వల్లభాయ్ పటేల్‌కు హైదరాబాద్ అస్థిత్వమన్నా, దాని సంస్కృతి అన్నా, ముస్లిములన్నా ద్వేషభావముంది. నెహ్రూ అభిప్రాయాలు దీనికి పూర్తిగా భిన్నంగా ఉండేవి. నెహ్రూకు హైదరాబాద్ సంస్కృతి అంటే ఆరాధనా భావముండేది. 1956లో హైదరాబాద్ సమగ్రతను కాపాడటానికి నెహ్రూ ప్రయత్నించాడు. ముస్లిములపై జరిగిన అత్యాచారాలకు చాలా బాధపడ్డాడు. అయితే లింకన్ మాదిరిగానే నెహ్రూ లక్ష్యం కూడా యూనియనే. నెహ్రూ, పటేల్‌ల మధ్య ఉన్న తేడాలు మనకు స్పష్టంగా తెలుసుకోవటానికి ఒక ఉదాహరణ ఉంది. 1945లో ముంబాయి మెరైన్ డ్రైవ్‌లో ప్రాణ్‌సుఖ్‌లాల్ మఫత్‌లాల్ హిందూ స్విమ్మింగ్‌బాత్‌ను పటేల్ ప్రారంభించాడు. ఇది కేవలం హిందువుల కోసమే. ముస్లిములకు దీనిలో ప్రవేశం లేదు. నెహ్రూ ఈ స్థాయికి దిగజారేవాడు కాడు. మహమ్మద్ ఆలీ జిన్నా ఈ విషయంలో పటేల్‌ను దుయ్యపట్టాడు. 1945, నవంబర్ 18వ తేదీన విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో- “హిందువులు, ముస్లిములు సోదరులని.. భారత్ ఒక దేశమని లాంటి ప్రకటనలు పటేల్ చేయకుండా ఉంటే బావుంటుంది. ఒక వేళ ఆయన చెప్పిన విలువలనే పాటించే వ్యక్తి అయితే హిందువులకు మాత్రమే ఉద్దేశించిన స్విమ్మింగ్ బాత్‌ను ఎందుకు ప్రారంభోత్సవం చేస్తాడు? ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి వ్యతిరేకంగా కొందరు యువకులు చేసిన ప్రదర్శనను ఆయన గమనించలేదా?” అని జిన్నా పటేల్‌పై విరుచుకుపడ్డాడు.

ఇక పటేల్ ప్రేరేపిత పోలీస్ యాక్షన్ నిజాంతో పాటుగా నెహ్రూను కూడా ఉద్దేశించినదే. కాశ్మీర్ విషయంలో తనను పూర్తిగా నిర్లక్ష్యం చేసారనే భావనతో ఉన్న పటేల్ హైదరాబాద్ విషయంలో పూర్తి నిర్ణాయాధికారం తనదేనని నిరూపించదలుచుకున్నాడు. అందుకే నెహ్రూను ఈ విషయంలో ఎక్కువ సంప్రదించలేదు. వాస్తవానికి కాశ్మీర్ విషయంలో పటేల్‌ను నెహ్రూ ఎక్కువ సార్లు సంప్రదించాడు. ఆపరేషన్ పోలో తర్వాత నిజాం పట్ల, ముస్లిముల పట్ల పటేల్ ప్రవర్తన ఆయన సైద్ధాంతిక పక్షపాతాన్ని స్పష్టంగా చెబుతుంది. హిందు భావజాలాన్ని ప్రోత్సహించే గ్రూపులకు పటేల్ ఒక ఉక్కుమనిషిగా మారాడు. ఆయనను భారత బిస్మార్క్‌గా కీర్తించే వ్యక్తులు- తమ అజ్ఞానాన్ని బయటపెట్టుకుంటూ ఉంటారు. భారత యూనియన్‌లో రాజ్యాల విలీనం రెండు దశలలో జరిగింది. మొదటి దశలో అవి భారత్‌తో విలీనమయ్యాయి. రెండో దశలో వాటి పునర్‌వ్యవస్థీకరణ, దేశంలోని ఇతర ప్రాంతాలతో ఏకీకృతం జరిగింది. రెండో దశలో పటేల్‌కు ఎక్కువ పాత్ర ఉందని ఎవ్వరూ అనలేరు. ఇక రాజ్యాలు భారత్ యూనియన్‌లో విలీనం కావటంలో వైస్రాయ్ మౌంట్ బాటెన్, ఆయన దగ్గర పనిచేసే సంస్కరణల కమిషనర్ వి.పి. మీనన్‌ల పాత్ర చాలా కీలకం. ఈ పాత్రలను చరిత్రలో తక్కువగా చూపించారనే చెప్పాలి. ఈ విషయాన్ని హడ్సన్ రాసిన చరిత్ర స్పష్టం చేస్తుంది.
సంస్థానాలకు సంబంధించిన సమస్యలను మౌంట్‌బాటెన్ తొలి సారి పటేల్‌తో చర్చించినప్పుడు- ఇంకా స్టేట్స్ మినిస్ట్రి (రాజ్యాల విలీనం కోసం ఏర్పాటు చేసిన శాఖ) ఏర్పడలేదు.

ఈ చర్చ జరగటానికి ఒక నేపథ్యముంది. స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న రాజ్యాల గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదని, అక్కడ నివసించే ప్రజలు పాలకులపై తిరగబడి, అధికారాన్ని కాంగ్రెస్‌కు అప్పగిస్తారని పటేల్ భావించారు. ఈ విషయాన్ని మీనన్‌కు చెప్పారు. మీనన్ ఈ విషయాన్ని మౌంట్‌బాటెన్‌కు చెప్పటంతో ఆయన పటేల్‌తో ఈ విషయాన్ని చర్చించారు. ఈ చర్చలో- స్వతంత్ర రాజ్యాల దగ్గర సుశిక్షితులైన సైనికులు ఉన్నారని.. ఉదాహరణకు హైదరాబాద్‌లో ఒక డివిజన్ సైనికులు ఉన్నారని, చిన్న చిన్న రాజ్యాలలో రాజుల బాడీగార్డులు ఉన్నారని పటేల్‌కు మౌంట్ బాటెన్ వివరించారు. తిరుగుబాటుదారులను కాల్చివేయటానికి ఈ సైన్యాలు సిద్ధంగా ఉన్నాయని- దీని వల్ల హింస తప్పదని మౌంట్ బాటెన్ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితి వల్ల భారత్‌కు వచ్చే లాభం కన్నా జరిగే నష్టం ఎక్కువ ఉంటుందని కూడా ఆయన చెప్పారు. ఈ మాటల అర్థాన్ని వివరించాలని మౌంట్‌బాటెన్‌ను పటేల్ కోరారు. ఈ సమస్యలకు శాంతియుత పరిష్కారం మంచిదని భావిస్తున్నానని- అందువల్ల రాజుల బిరుదులు, వ్యక్తిగత ఆస్తులు, సివిల్ లిస్ట్‌లో ఉన్న అంశాలను వదలేసి- రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్స్‌ను మొదలైనవి కేంద్ర ప్రభుత్వం వద్ద ఉంచుకోవాలని మౌంట్ బాటెన్ వివరించారు. ఈ విషయాన్ని తాను ఆలోచిస్తానని చెప్పి పటేల్ వెళ్లిపోయారు.

మళ్లీ వైస్రాయ్‌ని కలిసినప్పుడు పటేల్ మౌంట్‌బాటెన్‌తో- “మీ ప్రతిపాదనకు నేను అంగీకరిస్తాను. కాని ఒక్క షరతేమిటంటే – నాకు బుట్ట నిండుగా యాపిల్స్ కావాలి” అని పటేల్ పేర్కొన్నారు. మీ ఉద్దేశమేమిటి? అని మౌంట్‌బాటెన్ రెట్టించారు. “565 యాపిల్స్ (అప్పట్లో ఉన్న మొత్తం రాజ్యాల సంఖ్య) ఉన్న బుట్టనే నేను కొంటాను. ఒకటి, రెండు యాపిల్స్ తక్కువయినా నేను కొనను” అని పటేల్ తెగేసి చెప్పారు. “దీనిని నేను పూర్తిగా అంగీకరించలేను. నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. ఒక వేళ 560 యాపిల్స్ ఉంటే కొంటారా?” అని మౌంట్‌బాటెన్ అడిగారు. “కొంటానేమో?” అని పటేల్ సమాధానమిచ్చారు. రాజ్యాలు విలీనం కావటంలో తమకు సహకరించాలని మౌంట్‌బాటెన్‌ను భారత ప్రభుత్వం కోరింది. ఆయన హోదా తమకు ఉపయోగపడుతుందని భావించింది. దీని ప్రకారం చూస్తే- రాజ్యాల విలీనంలో మౌంట్ బాటెన్ కీలక పాత్ర పోషించాడని.. దేశం ముక్కలు కాకుండా అడ్డుకున్నాడని అర్థమవుతుంది. ఈ రాజ్యాలు అప్పటికే ఉన్న రాష్ట్రాలతో కలిపి, ప్రజాస్వామ్య పాలన ప్రారంభమయ్యేలా పటేల్ చూశాడు. అయితే సమస్యలు ఎదురయినప్పుడు సైనిక చర్యకే పటేల్ మొగ్గు చూపించేవాడు.

జూనాగఢ్ రాజ్యం పాకిస్థాన్‌లో విలీనం కావాలనుకున్నప్పుడు – ఆ రాజ్యంపై సైనిక చర్య తీసుకోవాలని పటేల్ యోచించాడు. నెహ్రూ ఆయనకు మద్దతు ఇచ్చాడు. 1947, సెప్టెంబర్ 17న సైనిక చర్య ఒకటే సమాధానమని కేంద్ర కేబినెబ్ తీర్మానం చేసింది. 1948లో అప్పటి దాకా ఉన్న సంప్రదాయాలకు విరుద్ధంగా- హైదరాబాద్‌లో సైనికచర్యను బ్రిటన్ విదేశాంగ మంత్రి ఎర్నస్ట్ బెవిన్ విమర్శించారు. “దురదృష్టకరమైన విషయమేమింటే – ఈ కొత్త రాజ్యం యుద్ధ స్ఫూర్తిని అభివృద్ధి చేసుకుంటోంది. దీనిని మనందరం ఖండించాల్సిన అవసరముంది” అని ఆయన హౌస్ ఆఫ్ కామన్స్‌లో వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ను భారత యూనియన్‌లో విలీనం చేసుకున్న పద్ధతి వల్ల భారత్ పెద్ద మూల్యం చెల్లించాల్సి వచ్చింది. దీని వల్ల అంతర్జాతీయంగా భారత ప్రతిష్ఠ దెబ్బతింది. సెక్యూరిటీ కౌన్సిల్ విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు కూడా విదేశాంగ మంత్రి స్పందించారు.

హైదరాబాద్‌కు సంబంధించిన విషయంలో రెండు అంశాలున్నాయన్నారు. మొదటిది- ఐక్యరాజ్యసమితి చార్టర్ ప్రకారం హైదరాబాద్‌కు ఉన్న చట్టపరమైన హక్కులు. హైదరాబాద్ హోదాను దృష్టిలో ఉంచుకొని సెక్యూరిటీ కౌన్సిల్ ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలా వద్దా అనే విషయంలో ఆయనకు ఎటువంటి సందేహం లేదు. స్టాండ్‌స్టిల్ ఒప్పందం, హైదరాబాద్ సారభౌమత్వానికి ముగింపు పలకటం, మిగిలిన అంశాలపై విదేశాంగ శాఖకు చెందిన న్యాయవాదులు వేర్వేరు వాదనలను విన్నవించారు. అయినా ఆయన తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు. హైదరాబాద్, ఐరాసకు చెందిన మరో చార్టర్‌కు చెందుతుందా? అనేది రెండో అంశం. ఈ విషయంలో సెక్యూరిటీ కౌన్సిల్ నిర్ణయం ఎలా ఉన్నా- ఒక అంతర్జాతీయ ట్రిబ్యునల్ వద్దకు ఈ అంశం వెళ్లాలని ఆయన భావించారు..”

– ఎ.జి.నూరానీ
(నేడు హైదరాబాద్‌లో ‘ది డిస్ట్రక్షన్ ఆఫ్ హైదరాబాద్’ ఆవిష్కరణ జరుగుతుంది)

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తణుకు –నన్నయ భట్టారక పీఠం లో నా ప్రసంగం -2

తణుకు –నన్నయ భట్టారక పీఠం లో నా ప్రసంగం -2

తణుకు –నన్నయ భట్టారక పీఠం లో ‘’రామాయణ ,భారతాలలో మానవ విలువలు –పై నా ఉపన్యాసం –1

‘’ఆకృతి రామ చంద్రు విభావాక్రుతి ,కన్బొమ తీరు స్వామి చాపాక్రుతి

కన్నులన్ ప్రభు క్రుపాక్రుతి ,కైశిక మందు రామ దేహాక్రుతి

సర్వ దేహమున యందున రాఘవ వంశ మౌళి ధర్మాక్రుతి

కూరుచున్న విధ మంతయు  స్వామి ప్రతిజ్ఞమూర్తియై ‘’

గా లంకలో ఉన్న సీతమ్మ రావణాసురుడికి కన్పించింది .వేలాది మైళ్ళ దూరం లో సీతా తా రాములున్నా వారి హ్రుదయాలెప్పటికీ సన్నిహితం గానే ఉన్నాయి .సీత దేహ మంతా రాముడు వ్యాపించి ఉన్నాడు .కను బొమ రామ చాపం లా,రాముని ప్రతిజ్ఞా స్వరూపం గా సీత ఉంది కనుక వారికి అభేదమే దాన్ని చేదించే ప్రయత్నం చేస్తే రాముని విల్లు సమాధానం చెబుతుంది ధర్మా గ్రహం వస్తే సర్వ నాశనమే కలుగు తుంది అని హెచ్చరిక ..అలాంటి సీత మనస్సు మార్చటం సాధ్యం కాదని తెలుసుకున్నాడు రావణుడు .అందుకే అంటాడు ‘’ఆతని యందీమెకు గల ప్రత్య యంబు  –లోతునకు సముద్రములు చాలవు .ఎత్తునకు పర్వతములు చాలవు .వేగమున నదులు చాలవు .ఇంత ప్రశ్రయము విశ్లదీకరింప శివుడోక్కడే దయ చూడ వలే ‘’అని తెలుసుకొన్నాడు .అదీ సీతా రాముల ఆదర్శ దాంపత్యం .అదే ఆదరణీయంఅనుసరణీయం ..అందుకే అది రామ మార్గము సీత మార్గము అయి రామాయణం అని పించుకోంది..కనుకనే ‘’సీతాయణ మూ అయింది .అందుకే ‘’సీతాయః చరితం మహాత్ ‘’అన్నారు .విశ్వ నాద గారి కుమారుడు శ్రీ కృష్ణ దేవ రాయలు అమెరికా లో ఉంటూ ‘’సీతాయణం ‘’పేర వచన రామాయణం రాశారు నేను చదవటం జరిగింది .

జన సామాన్యం తో కలిసి మెలిసి వారి కస్టాలు ,బాధలు ,ఇబ్బందులను తొలగించి ,వారి సేవ చేయటమే శ్రీ రాముని ధ్యేయం గా వాల్మీకి రాముడిని చిత్రించాడు .తాటక స్త్రీ కనుక దాన్ని చంపటానికి కొన్ని క్షణాలు సంకోచించాడు .కాని అధిక జన సుఖం కోసం పాపం వచ్చినా ఫరవా లేదని చంపేశాడు .అందుకే మహర్షి వాల్మీకి ‘’సరైన దారిలో సరైన సమయం లో సరైన పనిని సక్రమంగా చేస్తే ,జరగాల్సింది జరిగి తీరు తుంది ‘’అన్నాడు సీతా స్వయం వర సమయం లో .స్వచ్చమైన ప్రేమకు ప్రతీక రాముడే .అందువల్ల రామ దర్శనం తో అహల్య పూర్వ రూపం పొందింది .వ్యక్తిత్వానికి ఇంతటి శక్తి ఉందన్న మాట .

పట్టాభి షేకం జరుగుతుందని తండ్రి దశరధుడు చెప్పి నప్పుడు రాముడు పొంగి పోలేదు అడవికి వెళ్ళ మన్నప్పుడు కుంగీ పోలేదు అంతటి ప్రశాంత చిత్తం తో ఉన్నాడు అదే అందరికి ఆదర్శం కావాలి .బాహ్య ప్రపంచం లో తనాకు విశాల మైన అవకాశాలు కలుగ బోతున్నాయని మునులతో కలిసి పని చేసే గొప్ప అదృష్టం కలగ బోతోందని ‘’ప్రజల మనిషి ‘’అని పించుకోవటానికి కైక అవకాశం ఇచ్చిందని ఆనంద పడ్డాడు ‘’దేవి !లోక మానస్తు ఉత్సహే ‘’అన్నాడు పిన తల్లి కైక తో .ప్రపంచం అంతా రాముడే .రాముడే ప్రపంచం ‘’అందుకే రామ దాసు ‘’అంతా రామ మయం జగ మంతా రామ మయం ‘’అన్నాడు అదే ప్రభువుకు ఉండాల్సిన  లక్షణం .

భరతుడు వచ్చి అరణ్యం లో రాముడిని కలిశాడు అయోధ్యకు రమ్మని బతిమిలాడాడు ఇద్దరూ ఎవరి వాదాన్ని వారు స్ట్రాంగ్ గా చెప్పారు .సత్యం కోసమే పోరాడారు .అదీ సత్య పాలన .భరతుడు నిద్ర లేని రాత్రి గడిపాడు రాముడి పక్కనే ఉండి మౌనమే ఇద్దరి మధ్య రాజ్య మేలింది .వాల్మీకి ఇక్కడ ‘’మౌనం అవధులు దాటితే రాత్రి కూడా మౌనం గానే గడిచి పోయింది .’’శోచతా మేవ రజనీ ,దుఖేన వ్యత్య వర్తత్ ‘’

విరాధుడు రామ లక్ష్మణులను భుజాల పై కెత్తుకొని అడవిలో పారి పోయాడు .లక్ష్మణుడికి విపరీతమైన కోపం వచ్చి వాణ్ని చంపెస్తానన్నాడు .అప్పుడు రాముడు ‘’ఈ దుర్గమ అరణ్యం లో ఆ రాక్షసుడు మనకు దారి చూపాడు .కనుక వాడికి మనం కృతజ్ఞత చూపాలి ‘’అన్నాడు ఇదీ మానవీయ విలువ .విరాధుడు మార్గ దర్శి అయ్యాడు .శర భంగ మహర్షిని దర్శించమని చెప్పాడు కూడా .కబంధుడనే రాక్షసుడు కిష్కింద కవైపుకు వెల్ల మని సలహా ఇచ్చాడు .ఇలా బద్ధ శత్రువులు కూడా రాముడికి సాయం చేశారు .ఇది రామ వ్యక్తిత్వం మహిమ .అందుకే రాముడు ‘’బద్ధ శత్రువులే శ్రేయోభిలాషులవటం అనూహ్యం గా ఆశ్చర్యం గా ఉంది ‘’అన్నాడు .మంచికి అంతటి విలువ ఉంది అని చెప్పే సన్ని  వేశం ఇది .కబంధుడు ఆశీర్వ దించి పంపాడు సోదరుల్ని .

అగస్త్య మహర్షి రామునితో ‘’సీత ఆనందానికి నువ్వు కారకుడివి గా ఉండాలి’’ .అని హితవు చెప్పాడు ‘’అజేయ బల పరాక్రమాలున్నా నువ్వు శాంతి మార్గాన్ని ఎంచుకోన్నావు. కనుక తప్పక విజయం సాధిస్తావు ‘’అని దీవించాడు మహర్షి అగస్త్యుడు . శాంతి కి అంతటి విలువ ఉంది .జనస్థానం  లో పద్నాలుగు మంది రాక్షసులతో ప్రారంభ మైన యుద్ధం పద్నాలుగు వేలతో ఘోర సంగ్రామం గా మారింది ఒంటి చేత్తో అజేయ ధనుర్ పరాక్రమాన్ని చూపి కళ్ళు మిరు మిట్లు అయేట్లు వాళ్ళ నందరిని చంపేశాడు క్షణాలలో ఎప్పుడు బాణం వదిలాడో ఎప్పుడు శరాన్ని సంధానం చేశాడో తెలీకుండా చేశాడు .రావణ సేనాధిపతులు ఖరుడు ,దూషణుడు ,త్రిశురులు అసువులు కోల్పోయి రావణుడికి తీవ్ర నష్టం చేశాడు .దేవతలు స్తుతించారు తమ్ముడు లక్ష్మణుడు ‘’చిరు నవ్వు చిందించాడు .సీత రాముడిని అభి నందిస్తూగాఢం గా అల్లుకు పోయింది భర్త ను .దీనితో శ్రమ అంతా మర్చి పోయాడు .రాముడు .మంచి పని చేస్తే అభి నందిస్తే వచ్చే ఫలితం ఇది .

మాయ లేడిని సీత కోరినప్పుడు దాని వెనుక ‘’భగవత్ ప్రేరణ ఉంది ‘’అని రాముడు భావించాడు .అదొక ప్రశ్నా సమయం గా అనుకొన్నాడు స్తిర దృఢ ధైర్య చిత్తం తో అన్నిటికీ సిద్ధ పడ్డాడు .అదీ స్తిత ప్రజ్నుడి లక్షణం ..

శ్రీరాముని ఉదాత్త వ్యక్తిత్వం సుగ్రీవుడికి నైతిక సహకారాన్ని అందించింది .ఇక్కడ వాల్మీకి ‘’ఏష రామ శివాహ్ పంధాః ‘’అన్నాడు .అంటే ఒక వైపు రాముడుగా మరో వైపు దేవత గా రాముడి మహోన్నత వినయ గుణం  భాసించింది .వాలి వధ లో అంగదుడిని ,వాలి భార్య తార లకు పునరా వాస సౌకర్యం కల్గించాడు రాముడు .సుగ్రీవుడు వారిద్దరిని చేర దీసేట్లు చేశాడు రామ మూర్తి .కిష్కింధలో అప్పటికి ఉన్నసంక్షోభ తీవ్ర  రాజ కీయ మార్పులను అత్యంత శాంతి యుతం గ సాధించాడు రాముడు .అదీ రాకీయ దురంధరత .సుగ్రీవుడు రాకీయానికి దాంపత్య సుఖానికి చాలాకాలం దూరమై ఉన్నాడు కనుక అతనికి సమయం ఇవ్వాలని రాముడు భావించి అతడు మానసికం గా స్తిర పడటానికి నాలుగు నెలల గడువు ఇచ్చాడు .కార్య సాఫల్యతకు ఇంతటి వివేకం ఉండాలి అని మంకు తెలిపాడన్న మాట .

తాను  రామ బంటుని అని యెంత చెప్పినా ఆతను చేసిన సహాయానికి మెచ్చిహనుమ ను  ‘’మహాత్మా !’’అని సంబోధించి అతనిలో ఉన్న గొప్పతనాన్ని లోకానికి చాటాడు .యుద్ధం లో ఒక సారి అంతఃపురం పై అంతస్తు మీద తిరుగుతున్న రావణుడిని చూసి ఉద్రేక పడి సుగ్రీవుడు ఒక్క సారి లంఘించి వాడికిరీటం కింద పడేసి వస్తే రాయుడు ‘’రా బోయే రోజుల్లో అధిక జన నాశనం, విపత్తులు రానున్నాయి ధైర్య ,నిగ్రహాలు చాలా ముఖ్యం ‘’అని హితవు చెప్పాదు.అతనిప్రాణం  చాలా విలువైనది అని తెలియ జెప్పాడు .అన్న రావణుడు చని పోయిన తర్వాతా విభీషణుడి తో ‘’శరీర దోషాలన్నీ మృత్యువు తో అంతమవుతాయి .కనుక అన్న రావణుడికి దహన సంస్కారాలు చెయ్యి ‘’అని బోధించాడు ఇక్కడే మనం చెప్పుకొనే వాల్మీకి మాట ‘’మరణం తాని వైరాణి’’గుర్తుందికదా .

ఇలా మానవ విలువలైన సత్యం ధర్మం ,న్యాయం ,గౌరవం ,హోదా ,హుందా తనం ,మర్యాద ,కరుణ ,రెమ వాత్సల్యం సహా వేదన సాను భూతి మొదలైన వాటిని సందర్భోచితం గా రాముడు మిగిలిన రామాయణ పాత్రలు చూపించి వాటి విలువలను పెంచారు .వీటికి కాపాడే విషయం లో రాముడు ‘’మనస్సాక్షి ‘’కి ప్రాధాన్యత నిచ్చాడు

సీతా దేవి శ్రీ రాముని తో జరిపిన అతి తక్కువ సంభాషణ లో వినయం ,రాజ వంశ గౌరవం ప్రతి స్పందిస్తుంది .ఇలాంటి ఆదర్శ వనితా తన సహ ధర్మ చారి అయి నందుకు గర్వ పడుతున్నాను అని అంటాడు .సీతను అనసూయా దేవిని ఒకే పదం వాడి వారి ఔన్నత్యాన్ని మనకు గుర్తు చేశాడు మహర్షి .’’అనసూయ –అనసూయ తో మాట్లా డింది ‘’అంటాడు వాల్మీకి .ఒక అనసూయ అత్రి మహర్షి భార్య మహా సాధ్వి రెండవ అనసూయ అంతటి సాధ్వీత్వాన్ని పొంద బోతున్న సీతా దేవి .ఇది మహిళకు ఆదర్శం కాదా ?జటాయువు చూపిన సాహసం త్యాగ నిరతి ని సీత ప్రసంశించింది .ఆతను రాముడికి తన వార్త తెలియజేసే వరకు అతన్ని బతికించమని దేవుళ్ళను ప్రార్ధించింది .అతని మరణానికి సాను భూతి ప్రకటించింది  ఇది మానవ విలుకున్న ప్రాధాన్యత .

హనుమ చూసిన సీత ను ‘’సీతేక్షణ ‘’అన్నాడు .ఆమె చూపుల్లో రాముడే కనీ పిస్తాడు .ఆమె చూపుల్లో సహిష్ణుత ,సమానత్వం కనీ పించాయి హనుమకు .సీత భౌతిక సుఖాలకు అతీతం గా రాముడి ఘనతను పెంచింది .సంపూర్ణ మానవుడి గా రాముడిని తీర్చి దిద్దింది సీత .అందుకే జీవితాన్ని వ్యయం చేసిన త్యాగ మూర్తి .త్యాగం అత్యంత ఉదాత్త మాన వీయ విలువ .ఒక ఆదర్శ స్త్రీకి ఉండాల్సిన అన్ని లక్ష ణాలు ఆమె లో మూర్తీభవించి ఉన్నాయి .సంసారిక జీవితానికి ఉద్దేశ పూర్వకం గా దూరం గా ఉంది త్యాగం విసర్జన ల ద్వారా అమర్త్యులం అవాలని చెప్పిన వేదం వాక్యానికి సీతా రాములు ప్రతీకలు .

సీత జాడ తెలియక రాముడు కోపోద్రిక్తుడై ‘’సర్వ నాశనం చేస్తాను ‘’అన్నప్పుడు తమ్ముడు మంచి మాటలతో ఆయన ఉద్రేకాన్ని తగ్గించి మరీ సన్నిహితుడయ్యాడు .అందుకే రాముడు అతడిని ‘’నా ప్రధాన మిత్రుడు ‘’అని గౌరవం గా అన్నాడు తమ్ముడిని ..హనుమ సీతా రాముల తో సమానం గా దేవతా స్వరూపుదయ్యాడు .ఇది అతని త్యాగం సేవకు లభించిన అత్యధిక స్తాయి, గౌరవం ప్రతిష్ట .

మిగిలిన విషయాలు రేపు తెలియ జేస్తాను

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-11-13-ఉయ్యూరు

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

కార్తీకం లో మా పంచా రామ సందర్శనం – దర్శన మాలిక

కార్తీకం లో మా పంచా రామ సందర్శనం

Posted in పంచా రామ | Tagged | Leave a comment

టి.శోభనాద్రి  గారి 81వ జన్మ దినోత్సవ సభ

This gallery contains 22 photos.

More Galleries | Tagged | Leave a comment

తణుకు –నన్నయ భట్టారక పీఠం లో ‘’రామాయణ ,భారతాలలో మానవ విలువలు –పై నా ఉపన్యాసం –1

తణుకు –నన్నయ భట్టారక పీఠం లో ‘’రామాయణ ,భారతాలలో మానవ విలువలు –పై నా ఉపన్యాసం –1

నవంబర్ పదహారు సాయంత్రం నాలుగు గంటలకు నేను హైదరాబాద్ లో ఉండగా మా బావ మరిది ఆనంద్ వియ్యంకులు ,తణుకు విజయ బాంక్ ఆఫీసర్ అయిన శ్రీ జి.వి.ఎల్ .యెన్ మూర్తి గారు ఫోన్ చేసి తణుకు లో తమ సంస్థ నన్నయ భట్టారక పీఠమ్ లోఇరవై ఆరవ తేదీ మంగళ వారం సాయంత్రం ఆరున్నర గంటలకు  ననను  ‘’రామాయణ మహా భారతాలో మానవ విలువలు ‘’పై ప్రసంగించమని కోరారు. సరే అన్నాను .కాని నాకు ఆహ్వానం ఇరవై రెండో తేదీన అందింది .అప్పటి దాకా దానిపై ఆలోచించ లేదు .ఆ మర్నాడు కూచుని విషయాలను నోట్స్ రాసుకోన్నాను .ఇరవై నాలుగు ఉదయం బెజ వాడలో ప్రముఖ ఇంజినీర్ శ్రీ టి.శోభనాద్రి గారి 81వ జన్మ దినోత్సవాన్ని వారి కుమారులు కూతుళ్ళు వైభవం గా జరుపుతున్నారని రావలసిందని ఆహ్వానం పంపారు .ఉదయం పదింటికి వెళ్లి ఆ కార్య క్రమం చూసి శాలువా కప్పి జ్ఞాపిక ఇచ్చి విందు ఆరగించి ఇంటికొచ్చే సరికి మధ్యాహ్నం మూడు దాటింది .రాత్రికి ‘’పంచారామ సందర్శనం .’మంగళ వారం దయం పదింటికి కాని తిరిగి రాలేక పోయాం .అంటే రెండు రోజులు విశ్రాంతి లేకుండా గడిపాను .భోజనం చేసి మధ్యాహ్నం పన్నెండు కు బయల్దేరి బెజ వాడ బెంజ్ సర్కిల్ దగ్గరకు ఒంటి గంటకు చేరి ఒకటిన్నరకు అమలాపురం ఎక్స్ ప్రెస్ బస్ ఎక్కాను. విషయాన్ని మూర్తి గారికి ఫోన్లో  చెప్పాను .సాయంత్రం నాలుగింటికి తణుకు’’ వై జంక్షన్’’ దగ్గర దిగాను .మూర్తి గారు వచ్చి స్కూటర్ పై తమ ఇంటికి తీసుకొని వెళ్ళారు .అక్కడ మా బావ మరిది కూతురు స్పందన అల్లుడు అంటే మూర్తిగారి అబ్బాయి హర్ష ఉన్నారు .వేడి వేడిగా ‘’పుల్లట్లు ‘’వేసి పెట్టారు మూర్తిగారి సతీమణి కాఫీ ఇచ్చారు .నా పరిచయం కోసం వివరాలు అడిగి రాసుకొన్నారు మూర్తిగారు .సాయంత్రం అయిదున్నరకు నన్ను స్కూటర్ పై ఎక్కించు దారిలో ‘’నన్నయ భట్టు ‘’గారి విగ్రహం ,దానికి కొద్ది దూరం లో ‘’గుర్రం పై ఎక్కిన సర్ ఆర్ధర్ కాటన్ దొర గారి విగ్రహాలను చూపించి శ్రీ రామ కృష్ణ సేవా సదన్ కు తీసుకొని వెళ్ళారు .అక్కడ నన్ను అందరికి  పరిచయం చేశారు .హాలు లోపలి కాలు పెట్టగానే ‘’వేలాది దోమలు స్వాగతం ‘’పలికి ముద్దులు పెట్టుకొని భయ పెట్ట్తాయి .ఎలా తట్టుకుం టున్నారో వీళ్ళు అనుకొన్నాను .

మంగళ వారం సాయంత్రం సరిగ్గా ఆరున్నరకు సంస్థ కార్య దర్శి శ్రీ సుశర్మ గారు స్వాగతం పలుకగా శ్రీ అక్కి పెద్ది రామ సూర్య నారాయణ ప్రార్ధన చేశారు.సభాధ్యక్షులు ఈ సంస్థ అధ్యక్షులైన’’ అభినవ కృష్ణ రాయ’’ బిరుదాంకితులుడాక్టర్ శ్రీ జి.ఎస్.వి.ప్రసాద్ .సభకు నన్ను శ్రీ మూర్తిగారు పరిచయం చేశారు .సరస భారతి పుస్తకాలు ‘’సిద్ధయోగి పుంగవులు ,శ్రీ ఆంజనేయ స్వామి మాహాత్మ్యం ‘’అధ్యక్షా కార్య దర్శికి ,ప్రార్ధన చేసిన వారికి మాజీ ఏం ఎల్ ఏ గారికి ఇచ్చాను తర్వాత నేను నా ప్రసంగాన్ని కొనసాగించాను .

‘’మీసంస్థ   కు నాకు ఒక సంబంధం ఉంది .మేము ఉయ్యూరులో 1960లో ‘’నన్నయ కళా సమితి ‘’స్తాపించి అయిదారేళ్ళు నిర్వహించాం .ప్రసిద్ధ వ్యాఖ్యాత శ్రీ కాళ్ళూరివ్యాస మూర్తి గారి చే రామాయణ రహస్యాలను నెల రోజులు చెప్పించం .కల్లోరి సుబ్బా రావు గారు అనే సంగీత విద్వాంసుని చేత కచేరి చేయించాము .ఒక రాగం పాడుతుంటే వీణ తీగెలు ఆ సవరానికి అనుగుణం గా కంపింప జేశారు సుబ్బారావు గారు ఆ తర్వాతా వారి ప్రతిభ దేశమంతా ప్రపంచం అంటా తెలిసింది . ఆ తర్వాతా మా ఉద్యోగాల వల్లదూరప్రాంతాలకు వెళ్ళటం వలన కార్య క్రమాలు ఆగిపోయాయి .మీ సంస్థ తొంభై ఏళ్ళ  చరిత్ర కలిగి ఉందని తెలిసి ఆనందం గాఉంది  .మీరు  మాకు అన్నయ్యలు ‘’నన్నయ్య ‘’గారి వల్ల .మీఊల్లో పంచదార ఫాక్టరీ ఉంది ,మా ఉయ్యూరులోను ఉంది కాని మాది ఆసియాలోనే పెద్ద ఫాక్టరీ .మా కే.సి.పి.పంచదార క్రిస్టల్స్ చాలా నాణ్యమైనవి .మాకు సిమెంట్  ఫాక్టరీ కూడా ఆ పేరుతొ ఉంది .మీ  గోస్తనీ నది ‘’తణుకు దుఃఖ దాయిని ‘’.డెబ్భై దశకం లో వచ్చిన తుఫాను వల్ల  గోస్తని పొంగి ఏంతో నష్టాన్ని కలిగించింది .అప్పుడు ఆ వార్తలను మా

విద్యార్ధుల చేత ఫోటోలు తో సహా సేకరింప జేసి ‘’వణుకు తున్న తణుకు ‘’పేర మా సైన్స్ ఎక్సి బిషన్ లో పెడితే మా విద్యార్ధులకు బహుమతి వచ్చింది .

మూర్తి గారితో నాకు సుమారు మూడేళ్ళ క్రితం పరిచయం అయింది వారబ్బాయి హర్ష ను మా బావమరిది కుమార్తె స్పందన కిచ్చి వివాహం జరిపించారు .పెళ్లి చూపుల నుంచి పెళ్లి దాక ,వీరిని కలుస్తూ ఉండేవాళ్ళం వీరి కొత్త ఇంటి గృహ ప్రవేశానికీ వచ్చాం .మా బావమరది ఏలూరు స్టేట్ బాంక్ లో పని చేస్తు ఉండగా  అక్కడ వందేళ్ళకు పైగా చరిత్ర ఉన్న ‘’యంగ్గ్ మెన్ హిందూ అసోసియేషన్ ‘’లో రాష్ట్రం మొత్తం లో ప్రసిద్ధి చెందినా చిత్రకారులను పిలిచి లైవ్ చిత్రాలు గీయించే సందర్భం లో నన్ను ‘’చిత్రకళ ‘’పై మాట్లాడించాడు  .మళ్ళీ మా బావమరిది వియ్యంకులు గారైన మూర్తి గారు తొంభై ఏళ్ళ చరిత్ర ఉన్న తమ సంస్తలో నాతొ మాట్లాడిస్తున్నారు .ఈ రెండూ భలే తమాషాగా ఉన్నాయి .

ఇక్కడ నన్నయ విగ్రహం చూసి నమస్కరించాను .రాజ రాజ నరేంద్రుడు నన్నయ గారితో తణుకు నుంచి మా కృష్ణ జిల్లా ‘’కలి దిండి ‘’వచ్చి అక్కడి ‘’పాతాల భోగేశ్వర స్వామి ‘’ని దర్శించాడు .అక్కడ ఉన్న కోనేటి దగ్గర నిల బడి ‘’హర హర హర ‘’అని మూడు సార్లు అంటే కోనేటి లో నుండి మూడు నీటి బుడగలు పైకి వస్తాయి .ఇప్పటికీ ఇది జరుగుతూనే ఉంది .రాజుకు అక్కడ ఒక నాగ కన్య కనిపించి తాము రోజు సాయం వేళలో స్వామిని దర్శించిపాతాల లోకానికి వెళ్లి పోతామని  వేల్ ఈ స్వామి మహా మహిమాన్వితుడని చెప్పింది .ఆ విషయాలు విన్న నన్నయ తన్మయం తో ‘’వాసుకి’’ మొదలైన నాగ దేవతా స్తుతి చేశాడు .అప్పుడు రాజు నన్నయ ను ‘’భారతాన్ని తెలుగు లోకి అనువదించమని ప్రాధేయ పడ్డాడు .తొలి తెలుగు కవి అని పించుకొన్న నన్నయ భారత ఆంధ్రీకరణకు పూనుకోవటానికి కలిదిండి గొప్ప నేపధ్యం అయింది ఈ నాగస్తుతిని నన్నయ ‘’ఉదంకో పాఖ్యనం ‘’లో చేర్చుకొన్నాడు .ఇలా తణుకుకు మా కృష్ణా జిల్లా కలిదిండికి బాంధవ్యం కూడా కలిగింది .కాటన్ దొర పై  ఈ మధ్యనే నేను ఇంటర్ నెట్ లో ‘’అపర భగీరదీయం ‘’పేర పది ఎపి సోడ్లు రాశాను ..ఈ కార్తీక సాయం సంధ్యా సమయం లో ఈ సంస్థ కార్య క్రమం లో అవకాశం ఇచ్చిన వారందరికీ కృతజ్ఞతలు .ఇదంతా నేనిక్కడికి రావటానికి నేపధ్యం .ఇక అసలు విషయం లోకి వెళ్తున్నాను.

‘’హెలెన్ ఆఫ్ ట్రాయ్ ‘’లో హెలెన్ అనే మహిళ ఆ నాడు యెంత భీభత్సం సృస్తిమ్చిందో ట్రాయ్ ని గ్రీకు దేశాన్ని ఎలా వాణి కిమ్చిందో చరిత్ర చదివిన వారన్దరికీ తెలుసు ఇప్పుడు వచ్చిన ‘’హెలెన్ ఆఫ్ ఆంధ్రా ‘’తుఫాను ఇక్కడి మీ కొనసీమను అక్కడి మా కృష్ణా జిల్లాను అతలాకుతలం చేసి భీభత్సం సృష్టించింది .దీని వల్ల  ఎందరో మరణించారు ఏంటో మంది ఇబ్బంది పడ్డారు ఆస్తి నష్టం జరిగింది ఆ మరణించిన వారి ఆత్మలకు శాంతి కలగాలని వారి బంధువులకు, ,నష్టపోయిన వారికీ సాను భూతి, సహవేదనను తెలియ జేస్తున్నాను ఎందు కంటే ఇవాళ మనం మాట్లాడుకొనే విషయం ‘’మానవ విలువలు ‘’కనుక ఆప్యాయత అనురాగం ,స్నేహం బాంధవ్యం ప్రేమ ,కరుణ సాను భూతి కృతజ్ఞత సౌభ్రాతృత్వం సహవేదన ,విశ్వమానవ ప్రేమ మొదలైనవి అనేవి మానవ విలువలు .’’వేటిని ఆచరిస్తే మన జీవితాను ఉన్నతం ఉత్తమం అవుతాయో అవే విలువలు’’ .రామాయణం చెప్పినా భారతం చెప్పినా ఈ విలువలను కాపాడుకోవాలనే .మరి ఈ ఇతిహాసాలకు మూలం దేనిలో ఉంది ?ఋగ్వేదం లో ‘’మనుర్భవః’’అని ఒక రుక్ ఉంది అంటే ‘’మనిషిగా జీవించు ‘’అని అర్ధం. మనిషిగా బతికితే ‘’మనీషి ‘’అవవచ్చు అది వస్తే అప్పుడు మన ఆలోచన ‘’క్రింవంతు విశ్వం ఆర్యం ‘’అవుతుంది అంటే ఈవిశ్వం అంత ఆర్య మయం కావాలి .అంటే ఉన్నత మైన ఉత్తమ మైన పద్ధతిలో ఉండాలి అని మన సంస్కృతీ చెప్పిన విషయం .

రామాయణానికి నాయకుడుశ్రీ రాముడు భారతానికి శ్రీకృష్ణుడు నాయకుడు. రామాయం ధర్మ వీరం .భారతం శాంత రస ప్రాధాన్యం కలది .రాముడు నడచిన మార్గం లో నడవాలి కృష్ణుడు చెప్పి నట్లు చేయాలి .భారతం అర్ధ ప్రాధాన్యత కలది .రామాయణ కర్త వాల్మీకి మహర్షి ఆదికవి ఆదికావ్యం .భారత కర్త వ్యాస భగవానుడు .తెలుగు లో కవిత్రయం భారతాంధ్రీకరణ చేశారు తొలి తెలుగు కవి నన్నయ .ముందుగా రామాయణం లో మానవ విలువలను గురించి తెలుసు కొందాం

సశేషం –

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-11-13-ఉయ్యూరు

.

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

కార్తీకం లో మా పంచా రామ సందర్శనం

          కార్తీకం లో మా పంచా రామ సందర్శనం

సాధారణం గా రద్దీ సమయాలలో పుణ్య క్షేత్ర సందర్శనం నాకు ఇష్టం ఉండదు .పుణ్యం మాట దేవుడెరుగు .ఆ ఇబ్బందులు పడలేమనే అలా వెళ్ళాం .అందుకే ఖాళీ సమయాలలో ఆయా క్షేత్రాలు దర్శించి సావకాశం గా చూడటం అలవాటైంది.పంచారామాలను ఇదివరకు రెండు మూడు సార్లు అన్నీ ఒక్క సారే కాక పోయినా వీలుని బట్టి చూశాము .ఎందుకో ఈ సారి కార్తీక మాసం లో పంచా రామ సందర్శనం చేయాలని అని పించింది .మొదటి మూడు వారాలలో కుదరలేదు .ఇక నాల్గవ వారం లో ఈ నెల ఇరవై నాలుగు ఆదివారం రాత్రికి ఉయ్యూరు నుంచి ఆర్.టి.సి.వాళ్ళు ఈ స్పెషల్ బస్ ఏర్పాటు చేశారని తెలిసి మా అబ్బాయి రమణ తో వివరాలు కనుక్కోమని చెప్పాం. వాడు అడిగి తెలుసుకొని ,బుక్ చేసే ఆయన ఇంటికే వచ్చి బుక్ చేస్తాడని చెప్పాడు .అట్లాగే ఆర్ టి.సి.ఉద్యోగి వెంకటేశ్వర రావు మా ఇంటికి వచ్చి డబ్బు కట్టించుకొని నాకు,మా శ్రీమతి ప్రభావతికి ,మా మనుమ రాలు రమ్య కు టికెట్స్ బుక్ చేశాడు .పెద్దలకు 490రూపాయలు పిల్లలకు380రూపాయలు .మొత్తం రాను పోను 700కిలో మీటర్ల ప్రయాణం .చౌకే అని పించింది . ఆది వారం రాత్రి పదకొండున్నర కు బస్ బస్ స్టాండ్ లో బయల్దేరుతుందని అన్నీ చూసిన తర్వాత సోమ వారం రాత్రి పన్నెండు కు ఉయ్యూరు చేరుతుందని చెప్పాడు .సోమ వారం పంచారామ దర్శనం అని ఏంతో సంతోషించాం .

ఆది  వారం రాత్రిఎనిమిదింటికే భోజనాలు పూర్తీ చేసుకొని  పదకొండు గంటలకు ఆటో లో ముగ్గురం బస్ స్టాండ్ చేరాం . ‘’పల్లె వెలుగు బస్’’ .రాత్రి పన్నెండు గంటలకు ఉయ్యూరు లో బయల్దేరింది .కంకిపాడులో ఎక్కిన వారితో సహా మొత్తం 53మంది ,ఇద్దరు డ్రైవర్లు జోగేశ్వర రావు వెంకటేశ్వర రావు .ఆది  వారం రాత్రికి బెజవాడ ,అక్కడి నుండి  కృష్ణ కరకట్ట మీదుగా అమరావతికి రాత్రి రెండుమ్బావు కు చేరింది .దర్శనం చేసి ఎప్పుడు మళ్ళీ తిరిగి రావాలో డ్రైవర్లు ఎవరికీ చెప్పలేదు .ఇది ఒక లోపం .రెండవది బస్ ‘’పంచ రామములు ‘’ని బోర్డు పెట్టారు .నేను మాలో కొందరు అయిన యనమండ్ర పార్ధ సారధి గారి అబ్బాయి సాయి అతాని భార్య ,కొడుకు ,పాల పర్తి వెంకట్రామయ్య గారి అబ్బాయి సుబ్రహ్మణ్యం భార్య ,ఊర మల్లి కొట్లో గుమాస్తా రామా రావు మాకు తెలిసిన వాల్లుళ్ళు ఉండటం కొంచెం బాగుందని పించింది .’’పంచలో రామ దర్శనం చేయిస్తున్నారు మన డిపో వాళ్ళు.అంటే పంచె లో రామ అంటే స్త్రీ ల దర్శనం చేయిస్తున్నారన్న మాట ‘’అని వీళ్ళకు చెబితే పగల బడి నవ్వారు  సాయి కుటుంబం మాకు చేదోడు వాదోడు గా ఉన్నారు

.

దేవాలయం ఆవరణ లో ఉన్న పంపుల  దగ్గరే ఆడ ,మగా అందరం సిగ్గు విడిచి మేమందరం స్నాలు చేశాం .అక్కడేఉన్నరావి ,ఉసిరి చెట్ల కింద   మన ఆడవాళ్ళు దీపాలు వెలిగించుకొన్నారు .ఇదంతా అయ్యే సరికి మూడున్నర అయింది .వెంటనే అక్కడే ఉన్న దర్శనం లైన్ లో నిల్చున్నాం.  .ఒక్కో టికెట్టు నూట పాతిక రూపాయలు .కొని వెంటనే ముందు .కెళ్ళాం అక్కడి నుండి సరాసరి మెట్లు ఎక్కి శ్రీ అమరేశ్వర స్వామిని సందర్శించాం . దివ్య దర్శనం గా భాసించింది .ఉషోదయానికి పూర్వమే ప్రభాత శివ దర్శనం అయి నందుకు ఏంతో సంతృప్తి గా ఉంది అమ్మ వారు శ్రీ బాల చాముండీ దేవి ని, క్షేత్ర పాలకుడు శ్రీ వేణు గోపాల స్వామిని దర్శించి బయటికి వచ్చేసరికి తెల్ల వారు ఝామున నాలుగుమ్బావు మాత్రమె అయింది .బస్ సత్తెన పల్లి రోడ్డులో అంబేద్కర్ విగ్రహం వద్ద ఉందని తెలుసుకొని ఆటో లో అక్కడికి చేరాం .అక్కడి ఒక బడ్డీ కొట్లో మంచి కాఫీ తాగాం .ఆరురూపాయలు ఒక్కో కాఫీ .వెంటనే బస్ తలుపు తీసి అందులో ఎక్కి కూర్చున్నాం .సాయి ,సుబ్రాహ్మణ్యం కుటుంబాలు హాయిగా పడుకొన్నారు ఇద్దరూ పౌరోహిత్యం చేస్తున్న వాళ్ళే .నేను మాత్రం ఇలాంటి అవకాశం రాదు అనుకోని నాతొ తెచ్చుకొన్న పుస్తకాలు తీసి సంధ్యా వందనం నిత్య పూజ చదువుకొని .

తర్వాత మహాన్యాసం చదివినమక ,చమకాలతో  ఏక రుద్రాభిషేకం చదివి ,దశ శాంతులు సామ్రాజ్య పట్టాభి షేకం పూర్తీ చేసి,శివ అష్టోత్తర ,శతనామావళి పూర్తీ చేశా.ఆ తర్వాత ‘’బిల్వ అస్తోత్తరం ‘’కూడా చదివి మూలుగా ఇంటి దగ్గర చేతలు, మంత్రాలతో చేసి నట్లు ఒక్క మంత్రాలు మాత్రమె చదువు కొని ,నైవేద్యం ,హారతి మంత్రం పుష్పం పూర్తీ చేశాను .ఇదంతా అయ్యే సరికి ఆరు గంటలయింది .

ఇంకా చాలా మంది రావాలి .అప్పుడు డ్రైవర్లకు కంగారు పట్టుకోంది .మేమిచ్చిన ఫోన్ నంబర్లకు ఫోన్లు చేయటం ప్రారంభించారు .కొంత మంది లాండ్ నంబర్లు ఇవ్వటం, కొందరిచ్చిన సెల్ తీసుకు రాక పోవటం కొంత ఇబ్బంది అయింది .డ్రైవర్ జోగేశ్వర రావు’’ఆసులో గొట్టం’’ లాగా రోడ్డు మీద తిరుగుతూనే ఉన్నాడు .రెండో ఆయన ఫోన్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు .యాభై రూపాయల టికెట్ల వారు ,ఉచిత దర్శనం వాళ్ళు కొందరు ఏడింటికి వచ్చారు .దేవాలయం లో మైక్ లో చెప్పించమని డ్రైవర్ తోచెప్పాను .అలాగే ఫోన్ చేసి చెప్పించాడు కూడా .మిగతా వాళ్ళు రాలేదని అందరం తిట్టుకోన్నాము .కొందరు అక్కడి రోడ్ మీద ఉన్న దుకాణాలలో టిఫిన్లు చేశారు .మేము మాత్రం ఇంటి నుంచి తెచ్చుకొన్న గారే లు ,బిస్కట్లు తిని ,కమలాలు తిని మందులు వేసుకోన్నాం .ఉదయం తొమ్మిదింటికి అందరు చేరారు .అప్పుడు డ్రైవర్లకు చెప్పాను ‘’ఈ సారి ఆపినప్పుడు యెంత టైం లో రావాలో ఖచ్చితం గా చెప్పండి ఆ సమయం లో రాక పొతే వాళ్ళ కోసం బస్ ఆగదని తెలియ జేయండి ‘’అన్నాను అలాగే చెప్పారు .డ్రైవర్లు ఇద్దరూ మంచి వాళ్ళే .బస్సు కూడా కత్తి  లాగా ఉంది డ్రైవర్లూ కత్తులె అందుకే యెంత దూరం అయినా యిట్టె నరికేసి నట్లు ..బస్ ను బాగా నడి పించారు. ఇద్దరు ఎక్స్ప్రెస్ ద్డ్రైవర్లే. .ముద్దు ముద్దు గా తొమ్మిదింటికి అంటే మేము దిగిన ఏడు  గంటల తర్వాత బయల్దేరింది .ఈ ఆలస్యం  రోజంతా ఇబ్బంది పెట్టింది .

పంచారామాలు,వాటి వివరాలు

అమరావతి లోని అమరేశ్వర స్వామి విశేషాలు తెలుసు కొందాం .అమరా వతి గుంటూరు జిల్లాలో ఉంది .దీనిని ‘’అమరా రామం ‘’అంటారు స్వామి ‘’అమరేశ్వర స్వామి ఇంద్రుడు ప్రతిస్టించాడు ‘’ఆయన ముఖం ‘’అఘోరం ‘’స్వరూపం శాంతి స్వరూపం’’ అమ్మ వారు ‘’బాల చాముం డేశ్వరి  .రెండోది పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమ వరం లోని భీమేశ్వరవామి అలాగే ప్రక్కనే గును పూడిలో ఉన్న సోమేశ్వర స్వామి .స్వామి పేరు సోమేశ్వరుడు .’’సద్యో జాత ‘’ముఖం .స్వరూపం ‘’నిత్య నూతనం ‘’.చంద్ర ప్రతిష్టి తం .అమ్మ వారు పార్వతి దేవి ఈ క్షేత్రాన్ని సోమా రామం అంటారు .మూడవది పశ్చిమ గోదావరి లోనే పాలకొల్లు లో ఉన్న  ‘’క్షీరా రామం ‘’.స్వామి రామ లింగేశ్వరుడు .’’ఈశాన ముఖం ‘’.’’లోక మంతా తానె అయిన స్వరూపం’’ .’’ఈశాన ముఖం ‘’.శ్రీ రాముడు ప్రతిష్ట చేసిన లింగం .అమ్మవారు పార్వతి దేవి .నాల్గవది ద్రాక్షా రామం .తూర్పు గోదావరి జిల్లాలో ‘’దాక్షారం ‘’లో ఉంది .స్వామి భీమేశ్వరుడు .’’తత్పురుష ముఖం ‘’.స్వరూపం ‘’ఆత్మ ‘’.’’స్వయంభువు  ‘’.అమ్మ వారు మాణిక్యాంబ .అయిదవది కొమారా రామం .తూర్పు గోదావరి జిల్లా సామర్ల కోటలో ఉంది .స్వామి కుమారారామ భీమేశ్వరుడు .’’వామ దేవ ముఖం ‘’.’’సత్య సుందర స్వరూపం ‘’.కుమార స్వామి ప్రతిష్టి తం .అమ్మ వారు బాలా త్రిపుర సుందరి . ఇప్పుడు అమరారామం గురించి తెలుసు కొందాం .

అమరా రామం

కృష్ణా నదీ తీరం లో ఉన్న మహా మహిమాన్విత పుణ్య క్షేత్రం .అమరారామం .ఇంద్ర ప్రతిష్ట కనుక అమరేశ్వరుడు అయాడు .తారకాసుర కంఠాన్నిశివుడు చేదించినప్పుడు శివుని అమృత లింగం

అయిదు భాగాలుగా విడి పోయి పెద్ద భాగం అమరావతిలో పడింది దీనిని ఇంద్రుడు ప్రతిస్తించాడు మిగిలినవి పైన చెప్పిన నాలుగు చోట్ల  పడి ఆరామాలయ్యాయి .  కృష్ణానది పడమటి దిశ నుంచి తూర్పుకు మలుపు తిరిగిన చోట  ఆలయం నిర్మించారు .ఈ క్షేత్ర మహాత్మ్యాన్ని గురించి స్కాంద ,బ్రహ్మ ,పద్మ పురాణాలలో ఉంది ..ఈ ఆలయానికి మూడు ప్రాకారాలున్నాయి నాలుగుదిక్కులా నాలుగు ధ్వజ స్తంభాలున్నాయి.దక్షిణ ద్వారం లో ముఖ మండపం ఉంది .తూర్పు ద్వారానికి ఎదురుగా కృష్ణా నదీ ప్రవాహం ఉంటుంది .ఇది ‘’పంచాయతన క్షేత్రం ‘’కూడా అంటే గణపతి ,అంబిక ,సూర్య నారాయణ ,శ్రీ మహా విష్ణువు అంశ అయిన వేణు గోపాల స్వామి ఉంటారు .క్షేత్ర పాలకుడు కాల భైరవుడు .ఇది శివ కేశవులకు అభేదమైన క్షేత్రం .మూల విరాట్ శ్రీ అమర లింగేశ్వర స్వామి  36 అడుగుల ఎత్తున్న లింగాకారం .పై అంతస్తులో 9అడుగులు ఎత్తైన శ్వేత లింగాకారం ఉండగా ,మిగిలిన 23అడుగుల లింగం కింది అంతస్తులో గోడ కట్టి మూసి వేయ బడి ఉంది .

    

ఏకాదశ లింగాలు మూడు ప్రాకారాలలో ప్రతిస్తింప బడ్డాయి .ముఖ మండపం దక్షిణ ముఖం గాను ,గర్భాలయం తూర్పు ముఖంగా ,ఉంది .మొదటి ప్రాకారం లోకి ప్రవేశించ గానే ప్రాకార దేవతలు ‘’ప్రణవేశ్వరుడు ,

శంకరా చార్యులు ,కాశీ విశ్వేశ్వరుడు ,ఉమామహేశ్వరుడు,దత్తాత్రేయుడు ,రుద్రా పాదాలు ,జ్వాలా ముఖీ దేవి ,అగస్త్యేశ్వరుడు ,పార్దివేశ్వరుడు ,సోమేశ్వరుడు ,నాగేశ్వరుదు ,మహిషాసుర మర్దిని ,కోసలేశ్వరుడు ,వీర భద్రుడు అనే దేవతా మూర్తులను సందర్శించాలి

Inline image 3Inline image 4    తూర్పు ద్వా

తూర్పు ద్వారానిఎడురుగా కృష్ణా నది స్నాన ఘట్టం కనీ పిస్తుంది ఇక్కడి నుంచి మొదటి ప్రాకారం లోకి వస్తే పశ్చిమ ద్వారం వైపు ఉత్తరాభి ముఖం గా లింగా కారం లో అన్నపూర్ణా సహిత కాశీ విశ్వేశ్వరుడు ,గణపతి, నంది ని దర్శించాలి .తూర్పు ముఖం గా ఉన్న జ్వాలాముఖి అమ్మ వారిని దర్శించాలి మారేడు వృక్షాలు ,పున్నాగ వృక్షాలు పవిత్రతకు చిహ్నాలుగా ఉంటాయి .కృష్ణా నది మరొక వైపు ఎదురు గా కనీ పించే ‘’వైకుంఠ పుర క్షేత్రం ‘’చూస్తె పంచా రామాలలో ఉన్న మొదటి క్షేత్రమైన అమరావతి వైభవం, ప్రత్యేకత తెలుస్తాయి

రెండో ప్రాకారం తూర్పు ద్వారం గుండా ప్రవేశిస్తే కృష్ణమ్మ పరవళ్ళు ఒళ్ళు గగుర్పోడుస్తాయి .ప్రాకారం లోపల ప్రదక్షిణం గా వెళ్తే విఘ్నేశ్వరుడు ,కాలభైరవుడు మధ్య నవ గ్రహ మండపం ,అక్కడే శ్రీ కృష్ణ దేవ రాయలు ,అమరావతి ప్రభువు వాసి రెడ్డి వెంకటాద్రి

కాలాలలో,తులాభారం తూగిన మండపాలున్నాయి .తర్వాత నవ గ్రహమండపం ,దాని కెదురుగా యాగా శాల చూడచ్చు .‘ పడమటి వైపు సంతాన గోపాల స్వామి ,వాయవ్యం లో కుమార స్వామి ,ఈశాన్యం లో సిందూరం రంగులో శ్రీ ఆంజనేయ స్వామి తర్వాత నవ గ్రహమండపం ,దాని కెదురుగా యాగ శాల చూడచ్చు .

మూడవ ప్రాకారం లో 23మెట్లు ఎక్కి పైకి  వెళ్లి ఆగ్నేయంలో పస్చిమాభి ముఖం లో ఉన్న కాళహస్తీశ్వర స్వామిని దర్శించ వచ్చు .కొంత దూరం కిందికి నడిస్తే మెట్ల దారి కనీ పించి నైరుతికి వెడితే తూర్పు ముఖం గా శ్రీశైల  మల్లేశ్వర స్వామిని దర్శించ వచ్చు .ప్రదక్షిణం చేస్తూ వెడితే ధ్వజ స్తంభం కనీ పిస్తుంది . అక్కడ గోడ పై ఉన్న జ్యోతిర్లిన్గాలను చూడాలి .తూర్పు ముఖం గా కాశీ విశ్వేశ్వరుడు ఉంటాడు .తూర్పు ధ్వజ స్తంభం వద్ద సూర్య భగవానుడిని చూడాలి .ఇక్కడి నుంచి సభా మండపం లోకి వెళ్ళాలి .ఉత్త్తర దక్షిణాభి ముఖం గా ఉన్న బాలచాముం డేశ్వరి  అమ్మ వారిని దర్శించి తరించాలి .నంది మండపం ,నందిని చూసి ,గర్భాలయం లో ఉన్న 9 అడుగుల లింగా కార

అమరేశ్వర స్వామి మూల విరాట్టు ను దర్శించి జన్మ చరితార్ధం చేసుకోవాలి .స్వామికి అభిషేకాలు నిర్వహించుకో వచ్చు ,శుద్ధ స్పటిక లింగా కార శివ లింగమే అమరేశ్వర లింగం .వెనక్కి వెళ్లి నంది మండపం లో శ్రీ వేణుగోపాల స్వామిని దర్శించి శివ కేశవులకు భేదం లేదని గ్రహించాలి .తర్వాత నిలుచున్నా ప్రమాణం లో ముఖం అంతా పసుపు ,ముఖం పై యెర్ర కుంకుమ బొట్టు లో ఉన్న బాల చాముండీ శ్వరి అమ్మ వారిని దర్శించి అనుగ్రహం పొందాలి ..మూడవ ప్రాకారం పైన తారకాసుర వధ ఘట్టం మొత్తం రంగు చిత్రాలలో చిత్రింప బడి ఉండటం చూస్తాం .కార్తీకం లో ను ,మహా శివరాత్రి నాడు ఇక్కడ విశేష కార్య క్రమాలు జరుగుతాయి .

అమరావతి పూర్వపు పేరు ‘’ధాన్య కటకం ‘’.ఒకప్పటి ముఖ్య పట్నం .కోట్ల రాజ వాఆఅమ్శస్తులు పాలించారు .వెంకటాద్రి నాయుడు వల్ల  ఇక్కడ పట్నం ఏర్పడింది .1795లో రాజధానిని చింతపల్లి నుంచి అమరావతికి మార్చాడు .తన పరగణా లో ఒకే ముహూర్తం లో108శివ లింగాలను నాయుడు ప్రతిస్టించాడు .శాతవాహనులు మొదలైన రాజు లెందరో స్వామిని దర్శించి కానుక లందించారు .ఆలయం లో ఎక్కడ చూసినా శిలా శాసనాలు కనీ పిస్తాయి . మూడవ ప్రాకారం లో ఉత్తర దక్షిణ ద్వారాల వద్ద ,రాజా వెంకటాద్రి నాయడి ముఖ మండపం ఉంది .కొమ్మ నాయుని శాసనం ,కోట కేత రాజుల శాసనాలు ,అనవేమా రెడ్డి శాసనం ,కృష్ణ దేవరాయ శాసనం ,హాద్రికం పెద్దప్పం గారి శాసనం ముఖ్యం గా అందరూ చూడాలి .

దీనికి దగ్గర లో ధరణి కోటలో బౌద్ధ స్తూపం ,మ్యూజియం తప్పక చూడాల్సినవి .స్తూపం శాలి వాహనుల కాలం లో 100అడుగుల ఎత్తు 138,అడుగుల వ్యాసం ,521అడుగుల  చుట్టు కొలత గల’’ జాతక కదా’’ విశేషాలతో ఉన్న శిల్ప కళా వైభవం వర్ణనా తీతం .నాగ రాజుల కాలం నుండి నాగార్జునుని కాలం వరకు నాల్గు దశల్లో ఇది పూర్తీ అయింది .ఇక్కడి విశ్వ విద్యాలయం లో శిల్పం చిత్ర లేఖనం ,సంగీతం వాస్తు శాస్త్రం ,ఆరోగ్య శాస్త్రం ,వైద్య శాస్త్రం మొదలైనవి బోధించే వారు .చైనా టిబెట్ ,బర్మా ,సింహళం నుంచి కూడా విద్యార్ధులు ఇక్కడికి వచ్చి విద్య నేర్చే వారు ..అమరావతి మ్యూజియం మన దేశం లోనే మొదటి శ్రేణికిచెందింది .ఆలయం దగ్గరే షిర్డీ సాయి ,సత్య శాయి ,కపోతేశ్వర ధ్యాన మందిరాలు చూడ దగినవి .కృష్ణా నదికి ఎదురుగా ఎత్తైన తిన్నె మీద ధ్యాన ముద్ర లో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామిభారీ  విగ్రహం దర్శనీయమైంది .అందువల్ల అమరావతి హిందువులకు ,బౌద్ధులకు ప్రధాన ఆరాధనా స్తలం అయింది

Inline image 1Inline image 2

..

తర్వాత మేము దర్శించిన భీమేశ్వర స్వామి ని వివరిస్తాను

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ – 27-11-13- ఉయ్యూరు .

Posted in నేను చూసినవ ప్రదేశాలు, పంచా రామ | Tagged | Leave a comment

నేనూ, నాన్నా, తెలుగుకథ -ఎ.ఎన్.జగన్నాథశ

 

కథాసరిత్సాగరంలో కథాప్రక్రియకు సంబంధించి సోమదేవభట్టు పదిహేడు ముఖ్యమయిన విశేషణాలను పేర్కొన్నాడు: 1.కథ ఉల్లాసాన్ని కలిగించాలి. 2.ఇంపుగా ఉండాలి. 3.మనసును దోచుకోవాలి. 4.విలక్షణంగా ఉండాలి. 5.కరుణాది భావాలను పలికించాలి. 6.వైవిధ్యభావాలను రూపుకట్టాలి. 7.ప్రయోజనం కలిగించాలి. 8.కొత్తదై ఉండాలి. 9.చిన్నదై ఉండి, ఆలోచింపజేయాలి. 10.పెద్దదయి ఉండి, ప్రయోజనాన్ని చేకూర్చాలి. 11.మానవాతీతశక్తిని ప్రస్ఫుటించాలి. 12.వినోదాన్ని అందించే చమత్కారాన్ని సొంతం చేసుకోవాలి.13. నైతికవిలువలు నేర్పాలి. 14.అనుకున్న భావాన్ని ఆవిష్కరించడంతో పాటు ఆలోచనల్ని రేకెత్తించాలి. 15.ఆకట్టుకోవాలి. 16.అర్థచిత్రణ ఉండాలి. 17.అమాయకత్వాన్ని కూడా అక్షరీకరించవచ్చు.

లేగదూడని భుజాలకెత్తుకుని నాన్నా, పనసకాయని గుండెలకద్దుకుని నేనూ ఇద్దరం కొండెక్కాం. నాన్న ఆయాసపడుతూ నిల్చున్నారు. నేను కూడా ఆయాసపడుతూ నాన్న పక్కనే నిల్చున్నాను. కొండ మీద నుంచి కిందికి చూశాను. అదిగదిగో… అక్కడ ఉంది అగ్రహారం. వ ంద గడప ఉన్న అంత పెద్ద అగ్రహారం కూడా కాగితం మీద వేసిన బొమ్మలా చిన్నదిగా కనిపించింది. కొండ దిగి, చేరుకోవాలక్కడకి. మా దేవిడీ అక్కడే ఉంది.
అటు అగ్రహారానికీ ఇటు దొరవారిపల్లెకీ మధ్యలో పెద్ద కొండ ఉంది. ఆ కొండ మీదే ఇప్పుడు నేనూ మా నాన్నా నిల్చుని ఉన్నాం. దొరవారి పల్లెలో మా నల్లావు ఈనింది. అదే నాన్న భుజాల మీది లేగదూడ. అక్కడి పల్లె కాయే నా చేతిలోని పనసకాయ.
“పనసకాయ ఆవపెట్టి వండితే ఉంటుందిరా, బలే రుచి” అన్నారు నాన్న.

“పట్టుకుని పద” అన్నారు. ఇద్దరం బయల్దేరాం.
చూస్తూండగానే కొండ మీద మబ్బులు కమ్మాయి. టప టపమంటూ ఇంతకో చినుకు పడి, తర్వాత వానగా పుంజుకుంది. తల దాచుకునేందుకు ఎక్కడా ఎలాంటి చోటూ కనిపించలేదు. దాంతో తడిసిపోయాం. దూడని పట్టుకుని నాన్న బలే చిందులేశారు. పనసకాయని పట్టుకుని నేనూ చిందులేశాను కాని, నాన్నంత బాగా వెయ్యలేకపోయాను. తడిసిన బనియనూ, పంచె నాన్న ఒంటిని అంటుకుని కనిపించాయి. నా నిక్కరూ, చొక్కా కూడా నన్నంటుకుని, నీరోడ సాగాయి.
పట్టుమని పావుగంట కూడా కురవలేదు, ఆగిపోయింది వర్షం. కొండ మీద నుంచి నీరు ధారలు కట్టి కిందికి ప్రవహిస్తోంది. గులుక్ గులుకంటూ శబ్దిస్తోంది.
“జాగ్రత్తగా దిగు” అన్నారు నాన్న. వర్షానికి తడిసిన కొండ మీంచి దిగడం చాలా కష్టం. దిగనారంభించాం.

“కథ చెప్పు నాన్నా” అడిగాను.
“హరికథ చెప్పమంటావా? గిరికథ చెప్పమంటావా?” అడిగారు.
“అదేదీ వద్దు. తెలుగుకథ చెప్పండి” అన్నాను.
“తెలుగుకథ కాదు, తెలుగుకథ గురించి చెబుతాను, విను” అన్నారు నాన్న. చెప్పసాగారిలా.
“తెలుగుకథ ఎప్పుడు పుట్టిందో తెలుసా? మన విజయనగరం గురజాడ అప్పారావుగారు రాశారే కన్యాశుల్కం, అది పుట్టక ముందే తెలుగకథ పుట్టిందిరా. కన్యాశుల్కం నాటకంలో రామప్పంతులు ‘అది వేరే కథ’ అంటాడు. అలాగే ఆ నాటకం చివర్లో ‘డామిట్! కథ అడ్డంగా తిరిగింది’ అంటాడు గిరీశం. ఈ రెండు మాటలతో కథే ముందు పుట్టి, తర్వాత నాటకం పుట్టిందని గురజాడ చెప్పక చెప్పాడు”
“అమ్మ ఏమో భారత రామాయణాలప్పుడే కథ పుట్టిందంది.”

“దాని బొంద. పాత చింతకాయపచ్చడి కబుర్లూ అదీను. అప్పుడు పుట్టింది కథ, తెలుగుకథ కాదు. అలాగయితే నిజం చెప్పాలంటే ‘ఏడు చేపలకథ’తోనే తెలుగుకథ పుట్టింది.
అనగనగా ఒక రాజు. ఆ రాజుకి ఏడుగురు కొడుకులు. ఏడుగురు కొడుకులూ వేటకెళ్ళారు. ఏడు చేపలు తెచ్చారు…కథ ఉంది చూశావూ, దాన్నే మొదటి తెలుగుకథ అంటాన్నేను. కాదన్నవాణ్ణి చూపించు, కాలూ చెయ్యీ తీసేస్తాను” కోపగించుకున్నారు నాన్న.
“ఉన్నాయిరా, పేదరాశి పెద్దమ్మ కథల దగ్గర్నుంచి, పంచతంత్రం కథల దాకా అన్నీ కథలే! కాని, అసలు సిసలు తెలుగుకథ మాత్రం పందొమ్మిది వందల పదకొండులోనే పుట్టింది. కాదన్న గాడిద కొడుకుని చూపించు” అన్నారు మళ్ళీ. ఆ కోపంలో కాలు జారి పడబోయారు. నిలదొక్కుకున్నారంతలోనే!
“బరువుగా ఉందా?” అడిగారు.
“లేదు, చెప్పండి” అన్నాను.

“నేను అడుగుతోంది పనసకాయ గురించి, తెలుగుకథ గురించి కాదు” అన్నారు నాన్న. నేను ఎలాంటి జవాబూ ఈయలేదు.
“ముందో రెండు కథలు రాశాడు గురజాడ. దిద్దుబాటు, దేవుడు చేసిన మనుషుల్లారా…అని. మొదటికథ కథేగాని, అంత బరువేమీ లేదందులో. రెండో కథ దేవుడు చేసిన మనుషుల్లారా లేదూ, అది గొప్పకథ. లక్షణాలన్నీ పుణికి పుచ్చుకుందది” అన్నారు నాన్న.
పల్లెకి వెళ్తూ, కొండెక్కుతూ నాయుడు కనిపించాడు. నాన్నని పలకరించాడు.

“ఏం పంతులుగారూ, ఎక్కణ్ణుంచి?” అడిగాడు.
“ఇంకెక్కణ్ణుంచి, మీ పల్లె నుంచే. మా కర్రావు ఈనింది, ఇదిగో దూడ పుట్టింది. ఇంటికి తీసుకుని వెళ్తున్నాను.”
“మరి ఆవు ఏది?”
“వస్తోంది, వెనక వస్తోంది” అన్నారు నాన్న.
“ఓ దమ్ము లాగుతారా?” అడిగాడు నాయుడు.

“అడిగిన తర్వాత కాదంటానా?” అన్నారు నాన్న. నాయుడు జేబులోంచి చుట్టల కట్ట తీశాడు. అందులోంచి నాన్నకి ఒకటిచ్చి, తనొకటి తీసుకున్నాడు. ఇద్దరూ చుట్టలు ముట్టించారు. కాళ్ళ మధ్య దూడను ఉంచుకుని, రాయికి నడుం వాల్చారు నాన్న. అతనికెదురుగా నాయుడు నిల్చున్నాడు. పనసకాయను కింద ఉంచి, అది దొర్లిపోకుండా దాని కాలుంచి నిలబడ్డాన్నేను.

“పంతులుగారూ, కథంటే ఏమిటి? కథానిక అంటే ఏమిటి? రెండూ ఒకటేనా? లేకపోతే తేడా పాడాలున్నాయా?” అడిగాడు నాయుడు. హఠాత్తుగా నాయుడు అలా అడిగేసరికి నాన్న ఆశ్చర్యపోయారు.
“నీకెందుకివన్నీ?” నాయుణ్ణడిగారు.
“ఎందుకంటే, మా అబ్బాయి విజయనగరం సంస్కృత కాలేజీలో భాషాప్రవీణ చదువుతున్నాడు కదా, వాడంటాడు, ఇప్పుడు పత్రికల్లో వస్తున్నవాటిని కథలన కూడదు. కథానికలనాలంటాడు. ఆ మాట మీద బొబ్బిలిలో డిగ్రీ చదువుతున్న మా పెద్దమ్మాయికీ, వాడికీ పెద్ద గొడవయిపోయింది” అన్నాడు నాయుడు.

నాన్న కళ్ళు మూసుకున్నారు. ఏదో గుర్తు చేసుకుంటున్నారనిపించింది. కాస్సేపటికి కళ్ళు తెరిచారు. చెప్పారిలా.
“మొన్నామధ్య ఇంద్రగంటివారు ఓ వ్యాసం రాశారులే! అది మీ వాడు చదివినట్టున్నాడు. నిజమే, మీ వాడన్నది కరక్టే! ఇప్పుడు పత్రికల్లో వస్తున్న వాటిని ‘కథానిక’లనే అనాలి. అగ్నిపురాణం సాహిత్య మీమాంస చేసింది. అందులో గద్య కావ్య విభాగం గురించి ఏమని ఉందంటే…
ఆఖ్యాయికా కథా ఖండకథా పరికథా తథా
కథానికేతి మన్యంతే గద్యకావ్యం చ పంచధా!!”

“అంటే అర్థం ఏమిటి పంతులు గారు?” అడిగాడు నాయుడు. నాన్న శ్లోకానికి గాబరాపడి పొగను మింగేశాడేమో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు నాయుడు. కన్నీళ్ళతో నాన్నని చూశాడు.
“ఆఖ్యాయిక, కథ, ఖండకథ, పరికథ, కథానిక అని గద్య కావ్యాలు అయిదు రకాలు. ఇందులో ‘కథానికే’ ఇప్పుడు పత్రికల్లో వస్తున్న కథలు” అన్నారు నాన్న.
“మరి నాకు శలవు” అన్నాడు నాయుడు. నాలుగు అడుగులు గబగబా వేసి కొండెక్కసాగాడు.
చుట్టని నేల మీద గట్టిగా రాసి, ఆర్పేశాడు నాన్న. ముందటి లాగానే దూడని భుజాల మీదికెత్తుకున్నాడు. ‘పద’మన్నట్టుగా నన్ను చూశాడు. కాలి కింద ఉన్న పనసకాయను భుజమ్మీదకు ఎత్తుకుని నాన్నని అనుసరించాన్నేను.
“మనం ఎక్కడున్నాం రా?” అడిగారు నాన్న. సమాధానంగా కిందికీ మీదికీ చూశాన్నేను.

“కొండ మీద మనం ఎక్కడున్నామని నేను అడగటం లేదు. కథ మీద మనం ఎక్కడున్నామని అడుగుతున్నాను. చెప్పు, ఎక్కడున్నాం మనం?”
“గురజాడ దగ్గర ఉన్నాం కాని, కథ తర్వాత సంగతి, ముందు ఇందాక నాయుడుకి చెప్పారే కథానిక గురించి, దాని లక్షణాలు చెప్పండి నాన్నా” అడిగాను.
మరో శ్లోకం అందుకున్నారాయన.

“భయానకం సుఖపరం గర్భే చ కరుణో రసః
అద్భుతోం2తే సుక్లపార్థా నోదాత్తా సా కథానికా!!” అన్నారు. కథానికకి రెండు బాహ్య లక్షణాలున్నాయిట! అవి, ఒకటి: కథని ఓ అని తెగ లాగకుండా ‘భేష్’ అన్నట్టుగా పొందిగ్గా చెప్పాలి. రెండు: పెద్ద పెద్ద సమాసాలు, వర్ణనలతోనూ కథ బిగిసిపోకూడదు. అలాగే ఆభ్యంతర లక్షణాలు మూడున్నాయి. ఒకటి: పాఠకుణ్ణి భయ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే విధంగా కథలో విచిత్ర సంఘటనలు ఉండాలి. రెండు: హృదయాన్ని కరిగించే కరుణరస సన్నివేశం ఉండాలి. మూడు: కథాంతం పాఠకుని ఊహకి అందకూడదు. ఇవి కథానిక లక్షణాలు” అన్నారు నాన్న.
పొదచాటుగా నిలబడి కుక్క ఒకటి చూస్తోంది మమ్మల్ని.
“నాన్నా కుక ్క” అన్నాను. దాన్ని చూపించాయనకి. నవ్వారు నాన్న.

“అది కుక్క కాదు, నక్క” అన్నారు.
“తెలియని వాళ్ళు కథా, కథానిక రెండూ ఒకటే అంటారు. జాగ్రత్తగా రెంటికీ తేడాలు తెలుసుకోవాలి. తెలుసుకుంటే మంచిది” అన్నారు.
“ఇదంతా కాదు, ఎంత టైంలో చదవగలిగితే కథానిక అంటారు. అది చెప్పండి” అడిగాను.
“ఒక్కసారి కూర్చుని చదవడం మొదలుపెడితే పావు గంట నుంచి ముప్పావు గంటలోపు కథానిక అయిపోవాలి”
“కథానిక దేన్ని చిత్రించాలి?”
“ఒక అద్భుత సౌందర్యాన్ని, లేదంటే ఓ భయంకర దృశ్యాన్ని, కాదంటే ఓ కరుణాద్భుత సన్నివేశాన్ని చిత్రీకరించాలి. ఇదంతా ఎంత క్లుప్తంగా ఉంటే అంత మంచిది” అన్నారు నాన్న.
“భయానకరసంతో ప్రారంభించి, కరుణరసాన్ని పోషిస్తూ అద్భుతరసంతో క్లుప్తంగా ముగిస్తే కథానిక కాదా?” అడిగాను నేను.

“ఎందుకు కాదు, భేషుగ్గా అవుతుంది” అన్నారు.
“కథ దగ్గరకి వస్తే కథాసరిత్సాగరంలో కథాప్రక్రియకు సంబంధించి సోమదేవభట్టు పదిహేడు ముఖ్యమయిన విశేషణాలను పేర్కొన్నాడు. అవి 1.కథ ఉల్లాసాన్ని కలిగించాలి. 2. ఇంపుగా ఉండాలి. 3. మనసును దోచుకోవాలి. 4. విలక్షణంగా ఉండాలి. 5. కరుణాది భావాలను పలికించాలి. 6. వైవిధ్యభావాలను రూపుకట్టాలి.7. ప్రయోజనం కలిగించాలి. 8. కొత్తదై ఉండాలి. 9. చిన్నదై ఉండి, ఆలోచింపజేయాలి. 10. పెద్దదయి ఉండి, ప్రయోజనాన్ని చేకూర్చాలి. 11. మానవాతీతశక్తిని ప్రస్ఫుటించాలి. 12. వినోదాన్ని అందించే చమత్కారాన్ని సొంతం చేసుకోవాలి. 13. నైతికవిలువలు నేర్పాలి. 14. అనుకున్న భావాన్ని ఆవిష్కరించడంతో పాటు ఆలోచనల్ని రేకెత్తించాలి. 15. ఆకట్టుకోవాలి. 16. అర్థచిత్రణ ఉండాలి. 17. అమాయకత్వాన్ని కూడా అక్షరీకరించవచ్చు” అన్నారు నాన్న.
“ఇవన్నీ ఇప్పుడు రాస్తున్న కథలకు కూడా వర్తిస్తాయా?” అడిగాను.
“ఎందుకు వర్తించవు. ఎంచక్కా వర్తిస్తాయి. అయితే వర్తింపచెయ్యాలి” అని, ఆయాసంగా ఉందేమో ఆగారు నాన్న. నేనూ ఆగిపోయాను.

నాన్న ఓ శ్లోకం చదివారు.
“అశ్వం శస్త్రం శాస్త్రం వీణా, వాణీ నరశ్చ నారీచ, పురుష విశేషం ప్రాప్య హి, భవంతి యోగ్యా అయోగ్యాశ్చ” -అంటే అర్థం ఏమిటో తెలుసా?
గుర్రం, ఆయుధం, శాస్త్రం, వీణ, శబ్దాలు, పురుషులు, స్త్రీలు…అంతా తాము ఆశ్రయం పొందిన వారి సామర్థ్యాలకు అనుగుణంగానే యోగ్యమయినవీ, అయోగ్యమయినవిగా ప్రచారమవుతాయి. వాటిలో ఇప్పుడు కథ-కథానికను కూడా మనం చేర్చుకోవచ్చు” అని నవ్వారు నాన్న. తర్వాత మామూలు కథల గురించీ, మంచి కథల గురించీ, గొప్ప కథల గురించీ చాలా విషయాలు చెప్పారు. నాన్న చెబుతూంటే నేను వింటూ ఇద్దరం కొండ దిగిపోయాం. అగ్రహారానికి చేరుకున్నాం. దేవిడీలోనికి ప్రవే శించాం. నా చేతిలో పనసకాయను అమ్మ అందుకుంది. నాన్న భుజాల మీది దూడను అన్నయ్య అందుకున్నాడు. ఇద్దరం తేలికపడ్డాం.

ఆనాడు పనసకాయను అమ్మకు అందించి తేలికపడ్డానేమోగాని, నాన్న చెప్పిన కథను భుజాలకెత్తుకుని, నేటికీ తేలికపడలేకపోతున్నాను. ఆ బరువును దించుకునే క్రమంలోనే రచయితనయ్యాను. సంపాదకుణ్ణయ్యాను. సంపాదకునిగా నాకు తెలిసింది కొంత. తెలుసుకోవాల్సింది కొండంత ఉండడంతో గొప్ప కథ లూ, గొప్ప కథకుల గురించి నేను తెలుసుకోవడమే కాదు, పాఠకులకు కూడా తెలియజేస్తే బాగుంటుందనిపించింది. అనిపించి, ‘నవ్య నీరాజనం’ ప్రారంభించాను. రెండు వందల వారాల పాటు నిరాటంకంగా ఈ శీర్షికను కొనసాగించాను. విశేషాదరణ లభించింది. ఎందరో మెచ్చుకున్నారు దీన్ని. వారు మెచ్చుకున్న యాభైమంది కథకుల ఇంటర్వ్యూలనూ, యాభై కథలనూ తొలి విడతగా ఎంపిక చేసి ఈ పుస్తకాన్ని తీర్చిదిద్దాను. అభిమానించి ఆదరిస్తారని ఆశిస్తున్నాను.
-ఎ.ఎన్.జగన్నాథశర్మ
నవ్య వారపత్రిక సంపాదకులు

‘నవ్య నీరాజనం’ రెండు వందల వారాల పాటు నిరాటంకంగా కొనసాగిన శీర్షిక. ఎందరో మెచ్చుకున్న యాభైమంది కథకుల ఇంటర్వ్యూలనూ, యాభై కథలనూ తొలి విడతగా ఎంపిక చేసి తీర్చిదిద్దిన పుస్తకమిది..

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దైవ నిద్ర అంటే ఏమిటి?

 

కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశినాడు మహావిష్ణువు నిద్ర లేస్తాడు..ఆ దైవ నిద్ర వెనకున్న అంతర్యమేమిటో ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు శర్మ వివరిస్తారు.

మహా విష్ణువు ఆషాఢ మాసంలో ఏకాదశి రోజున పడుకుంటాడు. కార్తీక మాస శుక్లపక్ష ఏకాదశి వరకు నిద్రపోతాడు. క్షీరాబ్ది ద్వాదశినాడు మళ్లీ నిద్ర లేస్తాడు. నిద్ర లేచి తులసి బృందావన ప్రవేశం చేస్తాడు. అందుకే ఆ రోజు తులసి చెట్టుకు, ఉసిరిచెట్టుకు పూజలు చేస్తారు. ఈ మాటలు విన్న వెంటనే మీలో కొందరికి మహావిష్ణువు నిద్రపోతే లోకాల్ని ఎవరు పరిపాలిస్తారు? అయినా దేవుడు నిద్రపోవటమేమిటి? ఇలాంటి ప్రశ్నలు తలెత్తి ఉంటాయి. “కృతఘ్నఘ్నాయ దేవాయ బుద్ధిషాం పతయే నమః..”. ఉదయాన్నే ఈశ్వరుడు వచ్చే సమయానికి లేచి స్వాగతం చెప్పాలి. ఎవరైతే లేవరో వారు కృతఘ్నులే. ఈశ్వరుడికి స్వాగతం చెప్పకుండా నిద్రపోతే జీవుడు పరమేశ్వర స్వరూపం కాలేడు. అలాంటిది- దేవుడే నిద్రపోతే? కానీ, మహావిష్ణువు నిద్రపోడు. కేవలం నిద్రపోయినట్లు నటిస్తాడు. అందరినీ భ్రమింపచేస్తాడు. కానీ అనుక్షణం కనిపెట్టుకొనే ఉంటాడు. అయినా వాసుదేవుడు, వామదేవుడు ఒకరేనని ముందే చెప్పుకున్నాం. అందుకే కార్తీక మాసాన్ని వైష్ణవులు కూడా జరుపుకుంటారు. కార్తీక దామోదరుడిని కోలుస్తారు. అసలు కార్తిక దామోదరుడు అంటే ఏవరు? ” ఉదరే దామ యస్యేతి..” అని అమరకోశం చెబుతుంది.

కడుపు మీద తులసిమాల ఉన్నటువంటివాడిని దామోదరుడు అని పిలుస్తారు. అలాంటి వాడు ఎవరు? దీనికి కూడా “దామ్యే ఉదర మాత్రా బద్ధ ఇతి దామోదరః” అని అమరకోశంలో ఒక శ్లోకం ఉంది. ” అమ్మతో, ఒక తాటితో కట్టబడి నడుం ఒరిసిపోయినవాడు దామోదరుడు.” అంటే శ్రీకృష్ణుడు. అయితే ఇదంతా విన్న తర్వాత “అసలు పరమేశ్వరుడికి అమ్మ ఎవరు?” అనే అనుమానం కూడా రావచ్చు. పరమేశ్వరుడు లేనినాడు ఈ లోకాలే లేవు. ఆయన ఎప్పుడు పుట్టాడో కూడా ఎవరికి తెలియదు. అలాంటి వాడికి తల్లేమిటి? ఈ భూమిపైకి వచ్చిన తర్వాత పరమేశ్వరుడికి తల్లి ప్రేమ తెలిసి వచ్చింది. ఆయన ఆ ప్రేమబంధంలో చిక్కుకుపోయాడు. అప్పటి దాకా ఆయనకు అమ్మ తెలియదు. అమ్మ పాలు తెలియదు. యశోద పాలు తాగటం మొదలుపెట్టిన తర్వాత ఆ బంధంలో చిక్కుకుపోయాడు. ఈ మొత్తం వ్యవహారాన్ని పోతన తన భాగవతంలోని దామోదర లీలలో అత్యద్భుతంగా వర్ణించారు. దామోదర లీల విశేషమేమిటంటే- బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులు- ఈ నాలుగు ఆశ్రమాల్లో ఉన్నవారు దీనిని వింటారు.

ఈశ్వర రూపం
ఈశ్వరుడి రూపం ఎలా ఉంటుంది? ఇది చాలా మందికి వచ్చే అనుమానం.
ఏకో దేవః సర్వ భూ, సర్వభూతేషు….
సర్వభూతాంతరాత్మ సర్వభూతాధివాసః
సాక్షీ చేతో కేవలో నిర్గుణశ్చ, కర్మాధ్యక్షః సర్వభూతాధివాసః- అని చెబుతారు. “పరమేశ్వరుడికి రూపమే లేదు. నిర్గుణుడు. నిర్జనుడు..” అని దీని అర్థం. అలాంటి వాడు కూడా మానవులకు ఒక ఆధారం దొరకాలి కాబట్టి ఒక రూపాన్ని స్వీకరిస్తాడు. అందుకే గీతలో కృష్ణభగవానుడు
“పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే” అని చెబుతాడు. “నన్ను ఒక రూపంతో చూడాలని కోరుకునే పరమభాగవతోత్తములైన వారి కోర్కె తీర్చడం కోసం వారి మాంస నేత్రానికి దర్శనమవటానికి ఒక పాంచభౌతిక స్వరూపంతో ఆవిర్భవించాను తప్ప అదే నా స్వరూపం కాదు. నా అసలు స్వరూపం వ్యాపకత్వం. అంతటా నిండి నిబిడీకృతమైపోయాను” అనేది ఈ శ్లోక తాత్పర్యం. దీనిని భాగవతంలో మరింత సరళంగా ప్రహ్లాదుడి నోట-
ఇందుగలడందులేడని
సందేహము వలదు చక్రిసర్వోపగతుం
డెందెందు వెదకి చూచిన
నందందే కలడు దానవ్రాగణి వింటే.. (భాగ. 7-275) అని పలికిస్తాడు. “నాన్నా, నువ్వు విష్ణువు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అంటావేంటి? వ్యాపకత్వం వల్ల అంతటా నిండిపోయాడు” అని హిరణ్యకశపుడికి వివరిస్తాడు. మనం ఈశ్వర స్వరూపంలో కూడా శివకేశవుల ఐక్యతను చూడవచ్చు.
సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్
స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దశాంగుళమ్.. అని ఒక శ్లోకం ఉంటుంది. ఈ బ్రహ్మాండాలు ఎంతవరకు వున్నాయో అంతవరకు మహావిష్ణుడు పెరిగిపోయి ఉంటాడు. శివుడు ఈ బ్రహ్మండమంతా నిండిపోయి ఉంటాడు. మనకు ఏది ప్రీతిపాత్రమో- ఆ నేత్రం నుంచి ఆ దేవదేవుడిని చూస్తాం.
కానీ ఈ రెండింటికీ ఉన్న భేదం ఏమి లేదు. వస్తువు ఒకటే. దానిని నిర్ధారించేది మార్గశీర్షం. ఉపాసనలో చిట్టచివరకు వెళ్లిపోయిన తర్వాత ద్యోతకాలు కావాల్సినది అదే. అందుకోసమే ఉపాసనా కాలమైన కార్తీకం తర్వాత మార్గ శీర్షం వస్తుంది.

 

ఉపాసనకు ఉత్తమమైన కాలం కార్తీకం

 

కార్తీక మాసం ఉపాసనా కాలమని మనకు తెలుసు. పరమేశ్వరుడికి చేరువ కావటానికి అనువైన కాలం ఇది. అలాంటి పరమేశ్వరుడిని ఎలా చేరుకోవాలో చాగంటి కోటేశ్వరరావు శర్మ ఇక్కడ వివరిస్తున్నారు.

ఆషాడం నుంచి కార్తీకం వరకూ ఉన్న కాలాన్ని ఉపాసనా కాలం అంటారు. ఈ సమయంలో భక్తులందరినీ పరమేశ్వరుడు గమనిస్తూ ఉంటాడు. వారి భక్తికి తగినట్లుగా అనుగ్రహిస్తూ ఉంటాడు. భక్తి అపారమైనప్పుడు ఆయన వశమయిపోతాడు. వారు తిట్టినా, కొట్టినా ప్రీతిగా స్వీకరిస్తాడు. ఈ ఉదాహరణ కోసం ఎక్కడి దాకానో వెళ్లాల్సిన అవసరం లేదు. మహా పుణ్యక్షేత్రం తిరుమలలో అనంతాచార్యుల వారు గునపం విసిరితే శ్రీవారి గడ్డానికి తగిలింది. అందుకే ఇప్పటికీ స్వామి వారి గడ్డానికి గంధం పెడతారు. శివార్జునల యుద్ధం కూడా అలాంటిదే. భగవంతుడికి, మనకు మధ్య ఉన్న ప్రేమానుబంధం తెలియనప్పుడు చేసే పూజ యాంత్రికమవుతుంది. ఇప్పుడు మీలో కొందరు మనకు భగవంతుడిపై ప్రేమ ఎందుకుండాలని అడగవచ్చు. మనలో చాలా మందికి కుటుంబమంటే ప్రేమ ఉంటుంది. మనం ఏ పని చేసినా వారిని కూడా గుర్తు పెట్టుకుంటాం.

వారిని నొప్పించే పనులు చేయం. మనకు వారిపై ఉన్న ప్రేమ ఈ విధంగా చేయిస్తుంది. కానీ మనకు కనిపించని పరమేశ్వరుడిపై ప్రేమెందుకు ఉండాలి? ఎందుకంటే మన జీవం, జీవితం ఆయన ప్రసాదమే.
దీనినే అన్నమాచార్యుల వారు- “వడిబాయక తిరిగే ప్రాణబంధుడా! ” అని అద్భుతంగా చెప్పారు. మన శ్వాసకు, మన పుట్టుకకు, మన అస్తిత్వానికి అన్నింటికీ కారణం ఆయనేనని దీని అర్థం. మానవ జన్మలో జీవుడు ఉన్నంత కాలం శరీరంతో అనుబంధం ఉంటుంది. ఆ అనుబంధం ఉన్నంత కాలం ఈశ్వరుడిపై ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమకు ఒక రూపం భక్తి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. భక్తి అంటే అరగంటసేపు పూజా మందిరంలో కూర్చోవటం కాదు. ఈ ప్రపంచాన్నే ఒక పూజామందిరంగా చూడగలగటం. అలా ఉపాసన చేయగా చేయగా పరమేశ్వర కృప కలుగుతుంది. ఇది ఒక రోజో, రెండు రోజులో చేసే ప్రక్రియ కాదు. జీవితాంతం చేయాల్సిన యజ్ఞం. దక్షిణాయనంలో ఉపాసన చేశాం, పరమేశ్వర సాక్షాత్కారం కలగలేదని ఆగిపోకూడదు. ప్రయత్నిస్తూ ఉంటే పరమేశ్వరుడిని చేరుకుంటాం.

భక్తులకు ఒక లక్ష్యం నిర్దేశించటానికి ఒక ఆకృతిని సృష్టిస్తారు. ఉదాహరణకు, కర్రతో గోడను దూకే వారు ఉంటారు. వాళ్ళు చేత్తో కర్ర పట్టుకుని పరుగెత్తుకొస్తారు. కర్రను భూమికి తాటించి ఆ కర్రను ఆధారం చేసుకొని తన శరీరాన్ని అలా పైకెత్తి గోడ మీద వరకు తీసుకెళతారు. గోడ మీద వరకు వెళ్ళిన తరువాత కర్రను ఇటువదలి తానటు పడిపోతాడు. అప్పుడు కర్ర కిందపడిపోతుంది. అంతే తప్ప, “ఓ కర్రా! గోడ దూకడానికి నాకింత దూరం సహకారంగా వచ్చి, నా శరీరాన్ని పైకెత్తడానికి ఉపయోగపడ్డావు. నువ్వు కూడా నాతో రా అనడు.” అంటే కర్రతో పాటు ఆ వ్యక్తి కూడా కిందపడిపోతాడు. ఈశ్వర ఉపాసన కూడా అలాంటిదే.

అనుగ్రహం ఎలా పొందాలి?
వ్యాపారం చేసేవాడు తన దగ్గర ఉన్న డబ్బును పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేస్తాడు. ఉపాసన క్రమంలో మొదటి పెట్టుబడి పరమేశ్వరుడిచ్చిన ఈ శరీరం. స్నానం చెయ్యడం, ఓ మడిబట్ట కట్టుకోవడం, జీవుని కష్టపెట్టడం, సామ్రగి తెచ్చుకోవటం, కూర్చోవడం, పూజ చెయ్యడం, పుష్పార్చన చెయ్యడం – ఇవన్నీ శరీరాన్ని కష్టపెట్టడానికి. ఈశ్వరుడి అనుగ్రహం అంత సులభం కాదనే విషయాన్ని తెలియజేయటానికి. ఉపాసనలో తొలి అడుగు అమ్మవారి అనుగ్రహం పొందటం. ఆ తల్లి అనుగ్రహం లేకపోతే ఇంద్రియ లౌల్యం మీద భ్రాంతి పోదు. అందుకే పరదేవతా స్వరూపాన్ని వర్ణన చేసినప్పుడు-“సింధూరారుణ వ్రిగహాం త్రినయనాం, మాణిక్యమౌళిస్ఫుర తారానాయక శశిశేఖరాం, స్మృతముఖాం ఆపీతవక్షోరుహాం, పాణిభ్యామలిపూర్ణ రత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం” అని వర్ణిస్తారు. “అమ్మవారి చేతిలో ఒక అమృత పాత్రవంటి పాత్రను పట్టుకుంటుంది. ఎవరిని అన్రుగహించాలో వాడికి భక్తి పాశాలు వేస్తుంది.

ఎవడు భక్తి భావన లేకుండా కేవలం లౌల్య బుద్ధితో ఉంటాడో అటువంటి వాడికి ఆమె భక్తి పాశాలు దొరకవు. వాడు ఇంద్రియ లౌల్యంతో నశించిపోతాడు” అని దీని అర్థం. అందుకే ఉపాసనను అశ్వనీ నక్షత్రంతో కూడుకున్న ఆశ్వయుజ మాసంతో మొదలుపెట్టమంటారు. దీని వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఆషాఢ మాసంలో అసలు ప్రయాణం ప్రారంభమవుతుంది. అందుకే ఈ మాసంలో గురు పూర్ణిమ వస్తుంది. ఆ తర్వాత మనల్ని అన్ని విధాలుగా అనుగ్రహించాల్సిన తల్లి లక్ష్మీదేవి. శరీరంలో బలం, తేజస్సు, ఉపాసనను కొనసాగించే శక్తి అన్నీ ఆమె ఇవ్వాలి. అందుకే ఆమెను శ్రావణ మాసంలో కొలుస్తారు. ఇక కార్తీకం ఉపాసనా కాలం కాబట్టి పార్వతీదేవిని కొలవమని చెబుతారు.

 

కార్తీకంలో త్రిలోచన గౌరీ వ్రతం

 

కార్తీకమాసంలో తదియ తిథి రోజున త్రిలోచనగౌరి వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతం చేయటం వెనకున్న తత్వాన్ని చాగంటి కోటేశ్వరరావు శర్మ వివరిస్తారు.

సంస్కృత భాష నేర్చుకునే వాళ్ళందరూ
వాగర్థా వివసంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ॥ అనే శ్లోకాన్ని తప్పనిసరిగా నేర్చుకుంటారు. వాక్కు, అర్థము- ఈ రెండింటినీ విడదీయలేరు. వీటికున్న సంబంధం అవినాభావమైనది. శివపార్వతులు కూడా ఈ వాక్కు, అర్థములాంటివారేనని ఈ శ్లోక అర్ధం. అందుకే వీరిద్దరినీ ప్రకృతి పురుషులుగా వర్ణిస్తూ ఉంటారు. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా అది అయోమయానికి, అవ్యవస్థకు, అనాచారానికి దారి తీస్తుంది. ప్రకృతినుంచి పురుషుడు విడిపోయాడనుకోండి శివం కాస్తా – శవమవుతుంది. ఈ విధంగా ప్రకృతిపురుషుల కేళి జరిగే ప్రదేశమే కైలాసం. ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారు మూర్తీభవించినట్టుగా వుంటుంది. శివుడు చిన్మయ రూపంలో ఉంటాడు. అంతే కాదు శివలింగం ఎంత తడిస్తే ఎంత చల్లబడితే ఎంత ఆరాధన చేస్తే లోకాలు అంత చల్లబడుతాయి. కార్తిక మాసం ఉపాసనా కాలం కాబట్టి శివలింగానికి అభిషేకం చేస్తే పాపాలు తీరుతూ ఉంటా యి. ఈ పాపాలు ఎందుకు తీరాలనే ప్రశ్న చాలా మందికి ఉదయిస్తుంది. దీనికి సమాధానమే
– శంకరాచార్య విరిచిత
పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననే జఠరే శయనం
ఇహ సంసారే బహు దుస్తారే కృపయా పారే పాహి మురారే॥ స్తోత్రం. ఈ సంసార భ్రమణ పరితాపం వదిలిపోవటానికి, రెండు జన్మాల మధ్య పరితాపాన్ని త్యజించటానికి తోడ్పడేవాడు ఈశ్వరుడు. అంతే కాదు మానవ జననానికి కారణం కోరిక. ఈ కోరికకు ఒక రూపం మన్మథుడు. అలాంటి మన్మ«థుడిని తన మూడో కంటి మంట చేత దహనం చేసిన వాడు ఈశ్వరుడు. అయితే ఈ చర్యలన్నింటిలోను అమ్మవారి ప్రమేయం కూడా ఉంటుంది. అందుకే పరమేశ్వరుడి కన్ను శివుడిది మాత్రమే కాదు, పార్వతీ దేవిది కూడా. అందుకే ఆమెను త్రిలోచన అని కూడా పిలుస్తారు. తన భక్తులకు శివుడు ఎలాంటి వరాలిస్తాడో.. అమ్మవారు కూడా అంతే దయతో భక్తులను కనికరిస్తుంది. ఆమెను ప్రసన్నం చేసుకుంటే భక్తుల కోరికలన్నీ తీరినట్లే. అందుకోసమే కార్తిసమాసంలో తిదియనాడు త్రిలోచనగౌరి వ్రతం చేస్తారు. ఆ రోజు కొన్ని ప్రత్యేకమైన పూలతో పూజ చేస్తారు.
 

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తమిళ నాట తెలుగు నాటకం -ఆంద్ర జ్యోతి -24-11-13

 

 

1tamila nata telugu natakam 0012tamilanata telugu natakam 002

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాచకీయ ద్విప్లేట్స్ మరియు వెండి తేర బంగారం

evsaroja 001 dviplets 001

Posted in రచనలు | Tagged | Leave a comment

సమిష్టి పనివిధానం నేర్పుతుంది- వీఎస్ రావు

 

వఝ్జా సాంబశివరావు అంటే ఎవరూ గుర్తు పట్టకపోవచ్చు కాని బిట్స్ పిలానీ డైరెక్టర్ ‘వీఎస్ రావు’ అంటే మన రాష్ట్రంలోనే కాదు, ఇతర రాష్ట్రాలవారు కూడా సులువుగా గుర్తు పడతారు. ఎన్నో ఏళ్లు రాజస్థాన్‌లోని పిలానీ క్యాంపస్‌కు డైరెక్టర్‌గా పనిచేసిన ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోని బిట్స్ క్యాంపస్ బాధ్యతను నిర్వహిస్తున్నారు. ‘నువ్వు ఏ పనైనా చెయ్యగలవు’ అన్న స్ఫూర్తిని నింపిన సొంతూరు తుళ్లూరు గురించి ఆయన చెబుతున్న విశేషాలే ఈ వారం ‘మా ఊరు’

“మా ముత్తాత ప్రకాశం జిల్లాలోని ఏదో గ్రామం నుంచి గుంటూరు జిల్లాలోని తుళ్లూరుకు వచ్చారట. ఆమాట అలాఅలా విన్నదే. మా తాత కాలం నుంచి మాది తుళ్లూరే. మా నాన్న వెంకటపతిరావు సామాన్య రైతు. పది ఎకరాల పొలం ఉండేది. మా అమ్మ అనసూయమ్మదీ తుళ్లూరే. మా ఇంటికీ మా తాతగారింటికీ మధ్య దూరం – రెండు మూడిళ్లే. అంతేకాదు, ఊళ్లో సగం మంది ఏదో వరసన మాకు బంధువులే. మాకు దగ్గర్లోని పెదకాకానిలో భ్రమరాంబ స్వామి దేవాలయం ఉంది. మా చుట్టుపక్కల ప్రాంతాల్లో అది ముఖ్యమైన గుడి. ఆ గుళ్లోని శివుడి వల్లే నాకు సాంబశివరావనే పేరు పెట్టారు.

బంధుప్రీతి అలవడింది
మా నాన్నకున్నది పదెకరాలే అయినా, మరో ఇరవై ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసేవారు. తర్వాత స్నేహితులతో కలిసి రైసు మిల్లు పెట్టారు, ఆ తర్వాత పొగాకు కంపెనీ పెట్టారు. చెప్పొచ్చేదేమంటే – మాకు ఏదీ లోటుండకూడదని, మేం దర్జాగా పెరగాలన్న ఉద్దేశంతో ఆయన చాలా శ్రమించేవారు. ఆయన పెద్దగా చదువుకోలేదు గాని తెలుగు చక్కగా రాయడం, చదవడం వచ్చిన మనిషి. రాత్రి పూట భోజనాలయ్యాక మా నాన్న గొంతెత్తి భాగవత పద్యాలు పాడితే వింటూ నిద్రలోకి జారుకోవడం నాకొక అద్భుతమైన జ్ఞాపకం. బంధుప్రీతి ఆయనలో చెప్పుకోదగ్గ మరో లక్షణం. దాంతో మా ఇల్లు నిత్యం బంధువులతో కళకళలాడుతూ ఉండేది. వాళ్లకు స్నానాలకు వేణ్నీళ్లు పెట్టడం, భోజనంలోకి ప్రత్యేకంగా ఏదోకటి చేయించడం – ఇలాంటి మర్యాదలన్నీ మాకు నేర్పించారాయన. బహుశా ఆ ప్రభావం వల్లనే నేను బిట్స్ పిలానీ డైరక్టర్ అయ్యాక కూడా మా క్యాంపస్‌లో చదవడానికి వచ్చే ప్రతి విద్యార్థి గురించి, లెక్చర్లకు, సెమినార్లకు వచ్చే అతిథుల గురించి బాగా చూసుకోవడం అలవాటైంది. విద్యాసంబంధ విషయాలే కాకుండా, క్యాంపస్‌లో ఉన్నంతసేపూ వాళ్లకు కావలసినవన్నీ సక్రమంగా అందుతున్నాయా లేదా అన్నది జాగ్రత్తగా పట్టించుకుంటాను.

వానాకాలం కష్టాలు
మా ఊరి చుట్టూ చాలా వాగులుండేవి. వానాకాలంలో అవన్నీ పొంగి ప్రవహిస్తూ ఉండేవి. దాంతో ఆ కాలంలో మా ఊరొక ద్వీపాన్ని తలపించేది. రాకపోకలు పూర్తిగా బంద్. వచ్చే ఒక్క బస్సు కూడా వచ్చేది కాదు. విజయవాడ వెళ్లాలన్నా, గుంటూరు వెళ్లాలన్నా కిలోమీటర్ల కొద్దీ దూరం నడవాల్సి వచ్చేది. ఒక్కొక్కసారి మరీ అత్యవసరమైతే కృష్ణానది వరకూ నడిచి వెళ్లి అక్కడ పడవెక్కి విజయవాడ వెళ్లేవాళ్లం. అలాంటి వానాకాలంలో ఒకసారి మా నాన్న నన్ను భుజాల మీద ఎక్కించుకుని వాగు దాటడం నాకు లీలగా గుర్తుంది. మా ఊళ్లో టూరింగ్ టాకీస్ ఒకటి ఉండేది. అది కూడా వానాకాలం వస్తే ఎత్తేసేవారు. అందులో ఎన్టీఆర్ సినిమాలను చూడటం గొప్ప సరదాగా ఉండేది. ఎన్టీఆర్ అంటే నాకెంత ఇష్టమో చెప్పలేను. ఇప్పటికీ నేను విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు ఎన్టీఆర్ నాలోకి ఆవహించినట్టు ఫీలవుతుంటాను.

చెరువులో బడి
ఊరికి దగ్గరగా ఒకటే పెద్ద మంచినీటి చెరువుండేది. దాన్ని మూడు భాగాలుగా విభజించారు. ఒక కట్ట కట్టి చాకలి రేవును విడదీశారు. మరో భాగంలో స్కూలు కట్టారు. అందుకని మా బడి చెరువులో ఉన్నట్టుండేది. పెద్ద వానలు పడితే మునిగిపోయేది. వానలు తగ్గిన చాలా రోజుల వరకూ చుట్టూ బురదబురదగా ఉండి క్లాసుకు వెళ్లలేకపోయేవాళ్లం. అందుకే మావి వానాకాలం చదువులని స్నేహితులంతా కలిసినప్పుడు నవ్వుకుంటుంటాం. చిన్న తరగతులు పూరిపాకల్లో నడిస్తే, పెద్ద క్లాసులు భవనపు గదుల్లో నడిచేవి. ఒక్కో తరగతీ పాసయి పైకి వెళుతుంటే ఆ గదుల్లో కూర్చుని చదువుకోవచ్చని ఎంతో సంతోషంగా ఉండేది. మాకు చదువు అనేది రోజువారీ చేసే రకరకాల యాక్టివిటీల్లో ఒకటి. అదే పూర్తిస్థాయి యాక్టివిటీ కాదు. అందువల్ల ఒత్తిడి అంటే ఏమిటో తెలియకుండా, ఆడుతూపాడుతూ చదువుకునేవాళ్లం. మా ఊరికి కృష్ణా నది నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. సెలవులొస్తే చాలు నది ఒడ్డుకు వెళ్లి హాయిగా ఆటలాడుకునేవాళ్లం.

‘యూ కెన్ డూ ఇట్’ అంటుంది…
మా ఊరికి పచ్చని చీర సింగారించినట్టుగా చుట్టూ నిమ్మ, అరటి, జామ తోటలు ఉండేవి. ఖాళీ దొరికితే చాలు, ఆ తోటల్లోకి వెళ్లిపోవడం, కావలసినన్ని పళ్లు తినడం, ఆడుకోవడం. ఇదే మా పని. దాగుడుమూతలు, నేలాబండా, డౌన్‌చార్ – పప్పుచార్‌లాంటి ఆటలెన్నో. మరీ పసిపిల్లలు మా ఆటల్ని చూస్తూ ఉండేవాళ్లు. ఇక్కడ ఒక ముఖ్య విషయం చెప్పాలి. బోలెడంత మంది పిల్లలం కలిసి పరుగులు పెడుతూ ఆడుకునేవాళ్లం. కాబట్టి పదిమందిలో మెలగడం, అక్కడ వచ్చే సమస్యలను పరిష్కరించుకోవడం, సంతోషాన్ని పంచుకోవడం – ఇవన్నీ అలవడేవి. కాని ఇప్పటి పిల్లలు ఒంటరిగా కూర్చుని వీడియో గేములు ఆడుకుంటున్నారు. మరి పైన చెప్పిన లక్షణాలన్నీ బాలలకెలా వస్తాయని ఆశ్చర్యంగా ఉంటుంది నాకు. మా చిన్నప్పుడు ఊరికి విద్యుత్ సౌకర్యం ఉండేది కాదు. సాయంత్రం ఆరవుతూనే అన్నాలు తినేసి ట్యూషన్ మాస్టారింటికి వెళ్లి చదువుకునేవాళ్లం. అందరం కలిసి చదవడం గొప్ప సంతోషంగా ఉండేది. ఆటపాటలైనా, పాఠాలు చదవడమైనా అందరూ కలిసి చెయ్యడం వల్ల ఒత్తిడి ఉండేది కాదు. ఎదుగుతున్నకొద్దీ మాట, నడక వచ్చినట్టుగా టీమ్ స్పిరిట్ కూడా సహజంగా వచ్చేసేది. ఊళ్లో పెళ్లో ఇతర శుభాశుభ కార్యాలో జరిగితే ఇప్పట్లాగా గదిలోకి పోయి తలుపులు బిడాయించుకుని చదువుకోమని చెప్పేవారు కాదు పెద్దవాళ్లు. ఆ కార్యక్రమాల్లో ఎవరి వయసుకు తగినట్టు వాళ్లకు ఏదో ఒక పని చెప్పేవారు. అందువల్ల ఆ వయసు నుంచే కార్యభారాన్ని శక్తి కొద్దీ పంచుకోవడం, నిర్వహించడం కూడా వచ్చేది పిల్లలకు. ఇప్పుడు ఆలోచిస్తే ‘యూ కెన్ డూ ఇట్’ అన్న స్ఫూర్తిని అంత చిన్నతనంలోనే నింపడం అన్నమాట అది. ఇదీ పల్లెటూరు చేసే మేలు.

ప్రసాదాల కోసం ఎదురుచూపులు
గుంటూరు జిల్లా అంటేమండే ఎండలకు ప్రసిద్ధి. కాని నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో మా ఊళ్లో వాతావరణం చాలా బాగుండేది. సంక్రాంతి ముందు గొబ్బెమ్మల కోసం ఆవు పేడ సేకరించడానికి నానా పాట్లూ పడేవాళ్లం. మేం ఊరంతా తిరిగి ఆవు పేడ సేకరిస్తే, ఆడపిల్లలు వాటితో గొబ్బెమ్మలు పెట్టి మురిసిపోయేవారు. అది ధనుర్మాస సమయం కూడా కావడంతో మా ఊళ్లోని రామాలయం, వేణుగోపాలస్వామి ఆలయాల్లో వేకువ జాము నుంచే పూజల హడావుడి మొదలయ్యేది. ఆ వాతావరణాన్ని తల్చుకుంటే మనసులో ఎంత ప్రశాంతంగా ఉంటుందో మాటల్లో చెప్పలేను. చిన్నప్పుడు భక్తిభావమంటూ ఏముంటుంది, ప్రసాదాల మీద ధ్యాస తప్ప? ధనుర్మాసంలో దేవుళ్లకు పులిహోర, దద్దోజనం, చక్రపొంగలి అంటూ రకరకాల పదార్థాలు నైవేద్యం పెట్టేవారు, తర్వాత వాటిని అందరికీ పంచిపెట్టేవారు. ఆ ప్రసాదాల కోసం గుళ్ల చుట్టూ తిరిగేవాళ్లం. వాటి రుచి ఇప్పుడు తల్చుకున్నా నోట్లో నీళ్లూరుతాయి. సాయంత్రం చీకటి పడ్డాక చిరు చలిలో దేవుళ్ల ఊరేగింపులు జరిగేవి. ఊరుఊరంతా వాటిలో తప్పకుండా పాల్గొనేవారు. తర్వాత చెరువులో తెప్పోత్సవం చేసేవారు. దాన్ని చూడటం భలే బాగుండేది. సంక్రాంతికి ఊళ్లో కోడి పందేలుండేవిగాని ఇతర ప్రాంతాల్లోలాగా ఎక్కువ డబ్బు పందేలు కాయడం, లేదంటే పరువు కోసం హోరాహోరీ పోట్లాడటాలు ఉండేవి కాదు. అదొక వినోదంగా నడిచేది అంతే.

మట్టితోనే మహా ప్రీతి
మా ఊళ్లో సంక్రాంతి తర్వాత గొప్పగా చేసుకునే పండగ వినాయక చవితి. బడి పిల్లలు ఊరంతా తిరిగి గ్రామస్థుల దగ్గర్నుంచి చందాలు వసూలు చేసేవాళ్లం. ఊరి చెరువు ఒడ్డున ఒక సత్రం ఉండేది. అక్కడ పిల్లాపెద్దా అందరూ కలిసి మట్టితో పెద్ద గణపతిని తయారుచేసేవాళ్లం. ఊరంతటికీ అదొక్కటే గణపతి ప్రతిమ. ఇళ్లలో పూజలు అయిపోయాక సాయంత్రం నుంచి ఊరి వాళ్లంతా వచ్చి గణపతిని దర్శించుకునేవారు. మూడో రోజున ఎడ్లబండిని అలంకరించి గణపతిని దానిమీదికి ఎక్కించి ఊరేగించేవాళ్లం. ఇప్పట్లాగా మైకులు, సినిమా పాటల హోరు ఏమీ లేకుండా ఆ ఊరేగింపులో భజనలు చేస్తూ, భక్తి పాటలు పాడుతూ నడిచేవాళ్లు అందరూ. తర్వాత చెరువులో నిమజ్జనం చేసి ఎవరిళ్లకు వాళ్లు చేరుకునేవాళ్లం. వినాయకచవితి రోజు సాయంత్రం అప్పుడప్పుడు ఏదైనా నాటకం వేసేవాళ్లం. నేనొకసారి రామాయణంలో సీతగా వేశానని గుర్తు. శ్రీరామనవమి వస్తే మా ఊళ్లోని రామాలయం దగ్గర పెద్ద జాతర జరిగేది. రకరకాల తినుబండారాల దుకాణాలు, రంగులరాట్నం వంటి వినోదాలు, ఆటలు – ఆ కోలాహలమే వేరు.

గొడవల్లేని ఊరు
నాకు ఊహ తెలిసే నాటికి మా ఊళ్లో ఐదు వేల జనాభా ఉండేది. అన్ని కులాలవాళ్లూ ఉండేవారు. పాతతరం పద్ధతిలో మా ఊళ్లోనూ అందరూ వరసలు పెట్టి పిలుచుకునేవారు. పేర్లు పెట్టి మాట్లాడుకోవడం అప్పట్లో ఎవరూ చేసేవారు కాదు. మా ఊరు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేది. ఏ రకమైన గొడవలూ లేని ఊరు. సాధారణంగా రాజకీయాలో, కులమతాలో, పేదాగొప్పా తేడాలో, ఏదో ఒక రకమైన గొడవలు, మాటపట్టింపులు ఉండకమానవు. కాని మా ఊరు వాటన్నిటికీ అతీత ం. అప్పటికీ ఇప్పటికీ మా ఊరిది అదే తీరు. మా ఊరిప్పుడు మండల కేంద్రం అయింది. పల్లెటూరి రూపురేఖలు మారిపోయి చిన్నపాటి టౌన్‌లాగా అనిపిస్తోంది. అయినా తన ప్రత్యేకతను నిలుపుకుంటూనే ఉంది, అక్కడ పుట్టినవాళ్లను పెద్దవాళ్లుగా మలుస్తూనే ఉంది.

విద్యార్థుల కోసం…
మా అక్క, బావగార్లతో పాటు మా అమ్మ ఊళ్లోనే ఉంటోంది. మేం రాజస్థాన్‌లోని పిలానీలో ఉన్నన్ని ఏళ్లూ, ప్రతి వేసవి సెలవులకూ మా ముగ్గురమ్మాయిలూ తుళ్లూరొచ్చి నెల రోజులుండి నాన్నమ్మ, మేనత్తలతో గడిపి వెళ్లేవారు. అన్ని రకాలుగా బాగున్న మా ఊరు విద్యా రంగంలో కాస్త వెనుకబడిందన్న బాధ నాలో ఉంది. ఆ లోటు లేకుండా నా తర పు నుంచి ఏదైనా చెయ్యాలని ఆలోచిస్తున్నాను. ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకారవేతనాలతో మొదటి అడుగు వేద్దామనుకుంటున్నాను.

అవి రావు…
నేను రైతుబిడ్డనే అయినా నాకు సీరియస్ వ్యవసాయం తెలియదు. ఎందుకంటే ఎప్పుడైనా సరదాగా పొలానికి వెళ్లివచ్చేవాణ్ని తప్ప, అవసరం కొద్దీ కాదు. అందువల్ల నాకు దున్నడం, నాట్లు వంటి పనులు రావు. వేరుశెనగకాయలు పీకడం, ఎండబెట్టిన కాయలను బస్తాలకెత్తడం చూడడం మాత్రం భలే సంతోషంగా ఉండేది.
-అరుణ పప్పు
ఫోటోలు : ప్రశాంత్ ఇంటూరి, ఉమా(గుంటూరు)

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వేయి పడగలు –రేడియో నాటకం -15వ భాగం

   వేయి పడగలు –రేడియో నాటకం -15వ భాగం

ఈ రోజు శని వారం  ఉదయం ఏడుం బావుకు   హైదరాబాద్ ఆకాశ వాణి కేంద్రం నుండి శ్రీ విశ్వ నాద వారి వేయి పడగలు నవలకు  మలచిన రేడియో నాటకం పది హేనవ భాగం ప్రసార మైంది .ఆచార్య యెన్ .గోపి గారి ప్రస్తావన ఏంతో ఉన్నతం గా ఉంది . విశ్వనాధ ను దర్శించ గలిగానని అది తన అదృష్టమని గోపి అన్నారు .’’ఆంద్ర దేశం పట్టని విరాట్ సాహితీ మూర్తి విశ్వనాధ’’ అని మెచ్చారు .ఈనవల జమీందారి వ్యవస్థ అంతమవుతున్న కాలానికి ,ఆధునికం గా వస్తున్న తీరేమిటో తెన్నేమితో తెలియని కాలానికి సంధి కాలం లో వచ్చిన నవల అన్నారు ఇది సంధి నవల అన వచ్చు .ప్రతి పాత్ర ఔచిత్యంతో జీవం తొణినికిస లాడేట్లు కవి సామ్రాట్ తీర్చిదిద్దారని ,పర్యావరణ స్పృహ ను అద్భుతం గా ఆవిష్కరించిన నవలగా ఇది వన్నె కేక్కిందని ,విశ్వనాధ బహుముఖీన ప్రతిభకు దర్పణం అని కీర్తించారు .అలాంటి ఉన్నత నవలకు అంతేసమున్నత స్తాయిలో నాటకీ కరించి ప్రసారం చేస్తున్న హైదరాబాద్ రేడియో కేంద్రం వారి కృషి ప్రశంస నీయం అని  శ్లాఘించారు గోపి . .

 

ఈ రోజు ఎపిసోడ్ లో జోశ్యులు అనే బడి పంతులు ,ఆయన భార్య మంగ ల కాపురం, ఆయన చాలీ చాలని జీతం ,దాన్ని అవకాశం చేసుకొని రామేశం ఆడే కపటనాటకం ,అతని భార్య ను ప్రలోభ పెట్టి వశ పరచుకొన్న తీరు ,డబ్బు నగల పిచ్చికి ఆమె’’ సేద్యూస్ ‘’అయి, దాంపత్య జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకొన్నా వైనం ,ఇది మొదట్లో తెలుసుకో లేక పోయినా నిదానం గా గ్రహించి వాడిని అదుపు చేయలేని అసమర్ధత ,ఆమె ను కట్టడి చేయ లేని అశక్తతను  ,వంటరిగా పిచ్చి వాడైకుమిలి పోయే విధము  అద్భుతం గా ఉంది  వాడు పంపిన సంజాయిషీ ఉత్తరానికి జవాబుగా జోశ్యులు రాసిన ‘’ఆత్మ క్షోభను’’ స్టాఫ్ మేమ్బర్లందరు చదివేట్లు ప్యూన్ తో పంపి, వాడిని కపటపు నైజాన్ని ఎండ గట్టిన తీరు కన్నీరు తెప్పించింది .భార్యకు మందలింపు గా హెచ్చరిక గా వాడు వాడుకొని వదిలేసే  రకమని, తానిక  జీవించి ఉండలేనని కనీసం బతకతానికైనా వాడి దగ్గర డబ్బు గుంజే మార్గం ఎర్పరచుకోమని పిచ్చి ప్రేలాపనగా చెప్పి వీధిలోకి పారి పోయిన జోశ్యులను చూసి ఆమె ‘’మళ్ళీ తిరిగి రారా ?అనటం ఈ నాడే కాదు ,ఆ నాడూ ఇలాంటివి జరిగేవి అనటానికి నిదర్శనం గా ఉంది జోశ్యుల వృత్తాంతం కను విప్పు కలిగిస్తుంది .

కిరీటీ వాళ్ళు ధర్మా రావు ఇంటికి రావటం, వారి స్నేహానికి ఆనవాలుగా ఉంది .వారి మధ్య సంభాషణలు సరసంగా ,ఆత్మీయం గా ఉన్నాయి స్నేహ ధర్మానికి ప్రతీక గా అని పిస్తాయి .అవసరమైన వారికి అవసర మైనప్పుడు పెద్దన్నలా ధర్మా రావు ఇచ్చే సలహాలు వారి జీవిత గమనానికి తోడ్పడేవి లా ఉన్నాయి .విశ్వనాధ సకలోహ వైభావమైన వేయి పడగలు రేడియో అంతా విస్తరించి ,ఆంద్ర దేశానికి ధర్మ ఘంటా రావాన్ని కమనీయం గా విని పిస్తోంది .అందరికి అభినందన శతం.

గబ్బిట దుర్గా ప్రసాద్ -23-11-13-ఉయ్యూరు

Posted in రేడియో లో | Tagged | Leave a comment