అపర భగీరధీయం-1

అపర భగీరధీయం-1

తన పూర్వీకులైన సగరుల భస్మ రాశులపై దివిజ గంగను భూమి మీదకు తెప్పించి వారి ప్రేతాత్మలకు విముక్తి కలిగించి  అమరత్వాన్ని కల్పించాడు భగీరధుడు .దీనికి ఆయనకు ఎన్నో అడ్డన్కులేర్పడ్డాయి గంగను భూమి మీదకు దిమ్పాలంటే సరాసరి అది పడితే భూమి బ్రద్దలై పోతుంది అందుకని ముందుశివుని జటాజూటం లోకి అక్కడినుండి  హిమాలయ పర్వతాలపై కి చేర్చాడు,దాని మీద నుండి భూమిపైకి తెప్పించాడు మధ్యలో జాహ్న మహర్షి చెవిలో దూరితే బతిమాలి తప్పించి భూమార్గం పట్టించి సాగరుల భస్మ రాశులపై  పారించి వారికి విముక్తి కల్గించి పితృ ఋణం తీర్చుకొన్నాడు ఆయన చేసినా ఈ కఠోర శ్రమనే భగీరధ ప్రయత్నం అన్నారు .కరువు కాటకాలతో వరదలతో అల్లాడే గోదావరి ప్రాంత జనులకు దాహార్తి తీర్చి, తాగు నీటితో బాటు సాగి నీటి వసతి కల్పించి లక్షలాది ఎకరాలలో నీరు పారించి గోదావరి డెల్టాను సస్య శ్యామలం చేయటానికి ధవళేశ్వరం వద్ద ఆనకట్ట కట్టి అంతటి శ్రమనూ పడ్డాడు సర్ ఆర్ధర్ కాటన్ దొర .అందుకే ఆయన్ను ఆ ప్రాంత జనం ‘’అపర భగీరధుడు ‘’ అని ప్రశంశించి కృతజ్ఞతలు చెప్పి నిత్య గోదావరీ స్నానం లో ఆ మహానుహావుడికి సూర్యునితో పాటు అర్ఘ్య ప్రాదానం చేస్తున్నారు వాళ్ళు అలా ఆయన సేవల్ని నిత్యం స్మరిస్తూ ప్రాతస్మరణీయుడు గా భావించారు ఈ అపర భగీరధుడు చేబట్టిన ఆనకట్ట నిర్మాణాన్నే నేను ‘’అపర భగీరదం ‘’అన్నాను .ఈ వ్యాసం లో ఆ నిర్మాణ వైనాన్ని తేలియ జేయట మే నా కర్తవ్యమ్

             ఆ నాటి గోదావరితీర జన ఈతి బాధలు

దక్షిణ గంగ అయిన గోదావరి నది దక్షిణ భారతం లో అతి పెద్ద నది .పస్చిమకనుమల్లో నాసికా త్రయంబకం వద్ద జన్మించి మహా రాష్ట్ర ,మధ్యప్రదేశ్ ,గుండా ప్రవహించి తెలుగు నేలను చేరుతుంది .ప్రాణహిత ,మంజీరా ,ఇంద్రావతి ,శబరీ ,కిన్నెర సాని మొదలైన ఉపనదులను తనలో కలుపుకొని పాపి కొండల్ని చీల్చుకొని పరవళ్ళు తొక్కుతూ అరణ్యాలు అధిగమించి పోలవరం వద్ద మైదానం లోకి ప్రవహిస్తుంది .1440కిలో మీటర్ల సుదీర్ఘ ప్రయాణం లో కాళేశ్వరం ధర్మపురి.భద్రాచలం  మొదలైన పుణ్య క్షేత్రాలను చుట్టి ధవళేశ్వరం దగ్గర ‘’గౌతమి .’’వశిష్ట ‘’అనే రెండు పాయలుగా చీలి, మరి కొంత తూర్పుకు ప్రవహించి ఏడు శాఖలుగా చీలి అలసి సొలసి సాగర సంగమం చేస్తుంది  అయినా నదికి రెండు వైపులా ఉన్న ప్రాంతాలు మాత్రం దుర్భర దారిద్ర్యం లో మగ్గి పోయేవి .

19వ శతాబ్దం పూర్వ భాగం లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ ప్రాంతాలలో ఎన్నో ప్రత్తి మిల్లులు స్తాపించి నేత పని వారికి పుష్కలం గా చేతి నిండా పని కల్పించింది .ఇక్కడ తయారైన నాణ్యమైన వస్త్రాలు ఇతర దేశాలకు ఎగు మతి చేసి ఎంతో లాభాలను కలిగించేవి .కాని ఇంగ్లాండ్ లో పారిశ్రామిక విప్లవం రావటం తో వస్త్ర పరిశ్రమలో ఆధునికత చోటు చేసుకోంది .ఆర్క్ రైట్ మొదలైన బ్రిటిష్ సంస్థలు ఏర్పడి ఇంగ్లాండ్ నుంచి మనదేశానికి వస్త్రాలను అధికం గా దిగు మతి చేయటం తో మన నేతన్నల కడుపు కొట్టారు నూలు బట్ట గిరాకీ బయటి దేశాల్లోనే కాక మనదేశం లోను తగ్గింది . 1829నాటికి బట్టల మిల్లులు పూర్తిగా మూత పడ్డాయి .తిండికి దిక్కే లేని నేతన్నలు వేరే వృత్తులు చూసుకోవాల్సి వచ్చింది .1826లో పద్నాలుగు లక్షల రూపాయల విలువ గల బట్టలు ఎగుమతి అయితే 1841కి కేవలం ఒక లక్ష రూపాయల ఎగుమతులే జరిగాయి .

1791లో వచ్చిన కరువు కాటకాలు ,అప్పటికి వందేళ్ళు సాగిన యుద్ధాలు ,సంస్థానాధీసుల అలసత్వం భోగ లాలసత్వం ప్రజా సమస్యలపై ద్రుష్టి లేమి ,వల్ల అరాచకం ,నిరక్ష రాస్యత పెరిగాయి 1831నాటి అతి వృష్టి ,ఆ తర్వాతి ఏడు వచ్చిన గాలివాన ,1833లో ఏర్పడిన క్షామం వరుసగా ఉత్తరాంధ్ర జన జీవితాన్ని అస్త వ్యస్తం చేశాయి .దీనికే ‘’నందన క్షామం ‘’అని పేరు .ప్రతి నలుగురిలో ఒకరు మరణించారు .పిల్లా పాపలతో జనం ఆవాసాలు వదిలి మద్రాస్ ప్రాంతాలకు వెళ్తూ ఆకలి దప్పులతో వేలాది మంది చని పోయారు ఎక్కడ చూసిన మృత కళేబరాలే .దుర్గంధ భూయిష్టమై పోయింది .తిండికి లేక ఆడపిల్లల్ని నిజాం బేర గాళ్ళకు అమ్ముకొన్నారు పాపం .వేలాది పశువులు మేత ,నీరు లేక చనిపోయాయి .దోపిడీలు, దొంగతనాలు విచ్చల విడి అయ్యాయి .వర్తకులు తెచ్చేధాన్యాన్ని   గ్రామస్తులు గుంపులుగా చేరి లాక్కొని  పోయేవారు .కస్టపడకుండా సహాయం చెయ్యరాదని ఆనాటి పాలకుల సిద్ధాంతం .బాగా బతికిన వారు కూలి పనులు చేయలేక పరువుతక్కువ గా భావించి చావటానికి సిద్ధపడ్డారు బావుల వద్ద మంచి నీటికోసం జలయుద్ధాలు జరిగేవి .పెద్దాపురం, పిఠాపురం, గూటాల ,కిర్లం పూడి కపిలేశ్వరపురం ,పోలవరం కొత్తపల్లి మొగల్తుర్రు మొదలైన సంస్థాన రాజులు నీటి పారుదలపై శ్రద్ధ చూపలేదు ప్రజా సంక్షేమం వారి ద్రుష్టికే రాలేదు .వదలకుండా పన్నులు మాత్రం పీడించి వసూలు చేసుకొని జల్సా చేశారు

1834-35 లలో వాతా వరణం అనుకూలించి కాస్త ఊరట కల్గించింది .కాని 1836నుండి వరుసగా మూడేళ్ళు ప్రక్రుతి వైపరేత్యాలేర్పడి పంటలు దెబ్బతిన్నాయి .1839లో కాకినాడ ప్రాంతం లో వచ్చిన బ్రహ్మాండమైన ఉప్పెన తో సముద్రం పొంగి ,కాకినాడ ,కోరంగి ప్రాంతాలుదాదాపు  జల సమాధి అయ్యాయి సముద్రం నాలుగు మైళ్ళ దూరం వరకు పడవల్ని విసిరి కొట్టింది .కాకినాడ ,రాజమండ్రి మధ్య ఉన్న ఇళ్ళు ఏ ఒకటో రెండో తప్ప అన్నీ నేల మట్టమైనాయి .జలాశయాలు ఉప్పు నీటితో నిండిపోయాయి .తాగటానికి గుక్కెడు మంచి నీళ్ళు దొరక లేదు .బావుల్లోఉప్పునీరు చేరి భరించ రానికంపు వచ్చేది .1840 లో కూడా ఇలాంటి పరిస్తితులే ఏర్పడ్డాయి జన జీవనం దుర్భరమై పోయింది గోదావరికి వరద వచ్చినప్పుడల్లా నీరు సముద్రం లోకే పోయేది .ఇలాంటి విపత్కర పరిస్తితులలో నుంచి ఒడ్డున పడ వేసే అపర భగీరధుడు కావాల్సి వచ్చాడు అప్పుడే కాటన్ దొర అక్కడ ప్రత్యక్ష మయ్యాడు .

గోదావరి పై సర్వే-ఆనకట్ట ప్రతి పాదన

గోదావరి పై ఆనకట్ట కట్టక పూర్వం గోదావరి జిల్లా ఉత్తరాంధ్ర లను కలిపి ‘’రాజమండ్రి జిల్లా ‘’అని పిలిచే వారు .1831-40మధ్యకాలం లో అతి వృష్టి అనా వృష్టి తుఫాన్లు ఉప్పెనలు జిల్లాను పూర్తిగా కుంగ దీశాయి .1821-లో జనాభా7,38,308  ఉంటె పదేళ్ళ తర్వాతా  1842-43 లో అంతే జనాభా  పెరగలేదుకాని5,61,041కి తగ్గి పోయింది .1815-24 మధ్య ప్రభుత్వానికి శిస్తు ఆదాయం 18 ,72172 రూపాయలు అయితే ,1830–43.మధ్య ఆదాయం పదహారు లక్షలే అయింది అంతకు ముందు గోదావరి డెల్టాకు సాగు నీటి సౌకర్యాలు కల్గించాలని యాభై ఏళ్ళుగా ఎన్నో ప్రతి పాదనలను పంపినా ప్రభుత్వం శ్రద్ధ చూపించలేదు .ఆదాయం తగ్గి పోయే సరికి వాళ్లకు చురుక్కు మని పించింది .ఇప్పుడు ద్రుష్టి పెట్టారు .తగ్గటానికి కారణాలను పరిశీలించమని నివేదికలు పంపమని పరిపాలనా విభాగం లో పని చేస్తున్న ‘’హెన్రి మౌంట్ గోమరీ ‘’ని ప్రభుత్వం ఆదేశించింది .కాని  తన జిల్లాకు వేరే అధికారిని నియమింటం రాజ మండ్రి కలెక్టర్ అవమానం గా భావించి సహాయ నిరాకరణ చేశాడు ప్రభుత్వం వెంటనే స్పందించికలెక్టర్ ను తొలగించి  మాంట్ గోమరీ నే జిల్లా ఎడ్మినిస్త్రేటర్ గాహోదా కల్పించి ,కార్య రంగం లో దిగమని సూచించింది

గోమరీ వెంటనే అధ్యయనం చేసి ఒక నివేదిక తయారు చేసి అందులో జిల్లాలో ఇరిగేషన్ పనులను అశ్రద్ధ చేయటం ,రెవిన్యు అధికారుల లంచ గొండి తనం ,అసమర్ధత ,లోప భూయిష్ట ఎస్టేట్ ల నిర్వహణ వల్లక్షామం ఏర్పడి ఆకలి చావులతో జనాభా క్షీణించి ప్రభుత్వాదాయం తగ్గి పోయిందని తెలియ జేశాడు .దీనికి పరిష్కారం గోదావరి డెల్టాలో సాగు నీటి సౌకర్యం కల్గించటం ఒక్కటే శరణ్యం అని చెబుతూ ,దీనికి ఇప్పటికే ఈ రంగం లో తన సమర్ధతను శక్తి యుక్తులను ,వివేకాన్ని కష్ట సహిష్ణుతను రుజువు చేసుకొన్నఆర్ధర్  కాటన్ దొర ఒక్కడే సర్వ సమర్ధుడు అని ప్రభుత్వానికి నిర్ద్వంద్వం గా తెలియ జేశాడు.

 

 

 

అప్పటికే మేజర్ ఆర్ధర్ కాటన్ రెండో శతాబ్దం లో కరికాల చోళుడు కావేరి నది పై నిర్మించిన’’ గ్రాండ్ ఆనకట్ట’’ ‘’కు అడుగున తూములు ఏర్పరచి,కావేరిలో ఒండును తొలగించి లోతు చేసి నీటి నిల్వ సామర్ధ్యాన్ని30 మిలియన్ల ఘన గజాలకు బదులు నలభై మిలియన్లఘనగజాల వరకు పెంచాడు కాలరూన్ నదిపై ఆనకట్టలు కట్టి ,కొంత నీటిని కావేరికి మళ్ళించి వరదలను ఆపి ,తంజావవూర్ జిల్లాను’’ దక్షిణ దేశ దాన్యా గారం’’ చేశాడు  స్తానికం గా దొరికే వాటినే ఉపయోగించి తన ఆలోచన ను రుజువుచేసి సాటి లేని ‘’ఇరిగేషన్ ఇంజినీర్’’ గా   సుస్తిర కీర్తి పొందాడు .  .రెడ్ హిల్స్ కు రైల్ మార్గం ఏర్పరిచాడు .తర్వాతా మద్రాస్ లోపని చేసి నౌకాశ్రయ నిర్మాణం కార్య క్రమం చేబట్టి ,మిలిటరీ బారక్స్ ను తక్కువ వ్యయం తో నిర్మించి ప్రభుత్వ మన్ననలు పొందాడు ఆ తర్వాత విశాఖ లో చర్చి నిర్మించి విశాఖను సముద్ర కెరటాల నుండి రక్షించే రాతి గోడ లు కట్టాడు   ఆ రాళ్ళ మధ్య మట్టి ఇసుక పేరుకొని కట్టలు మరింత ద్రుఢతరం అయ్యాయి సహజ నౌకాశ్రయానికి విశాఖ చాలా అనువైన స్తలం అనీ ,విశాఖను జల మార్గాల ద్వారా ముఖ్య పట్నాలతోలతో కలిపి వృద్ధి చేయాలని విశాఖ పరిసరాల్లో చెరకు ,కాఫీ పండ్ల తోటలపెంపకం చాలా శ్రేష్టం అనీ ప్రభుత్వానికి ముందు చూపుతో సూచనలు చేసిన ‘’ఆధునిక విశాఖ శిల్పి’’ సర్ ఆర్ధర్ కాటన్.అప్పటికే ప్రభుత్వం కోరకుండానే గోదావరి డెల్టా భి వృద్ధికి కొన్ని సూచనలు ప్రభుత్వానికి పంపి ఉన్నాడు .ప్రత్తికి బదులు చెరుకు పండించటానికి ఏర్పాట్లు చేయాలని సూచించాడు ప్రాభుత్వం దీన్ని అంగీకరించింది కూడా . మాంట్ గోమరీ సూచన కు వెంటనే స్పందించిన ప్రభుత్వం కాటన్ ను గోదావరి డెల్టా కు నీటి పారుదల సౌకర్యాలు కల్పించటానికి నివేదిక తయారు చెయ్యమని కాటన్ ను 1844 ఆగస్ట్ అయిదున  ఆదేశించింది .

కాటన్ కార్యక్రమం

ప్రభుత్వ ఆజ్ఞతో విశాఖ నుండి రాజ మండ్ర చేరుకొన్నాడు కాటన్ .పాపి కొండల నుంచి అసముద్రంవరకు గోదావరి నదిని సర్వ్ చేసి వేర్వేరు ప్రదేశాలలో నదీ నీటి మట్టాలను ,వాలును ,ప్రవాహ వేగాన్ని లెక్కలు  కట్టటానికి ఉద్యమించాడు 20లక్షల ఎకరాల్లో సర్వే  చేయాలి. కాలువల మార్గాలని, భూ మట్టాలని నిర్ణయించాలి .ఇదిఎంతో కష్టమైన పని .సర్వే కు ఎనిమిది మంది పని చేసే సోల్జర్లను ఆరుగురు సర్వేయర్లను ఏర్పాటు చేయమని ప్రభుత్వానికి రాశాడు .పొదుపు మంత్రం పాటించే ప్రభుత్వం అనుభవం లేని ఒక కుర్ర అధికారిని ,శిక్షణ లో ఉన్న ఐదుగురుసర్వేయర్లను మాత్రమె సాంక్షన్ చేసింది .జీపుల్లేని కాలం. ఎడ్ల బండీ లేక గుర్రాల మీదే ప్రయాణ సాధ్యం .సర్వే పరికరాలు ఆధునికమైనవికవు మొరటుగా ఉండేవి .కాని ఏమాత్రం నిస్పృహ కు లోను కాని కాటన్ ఓపిక లేక పోయినా రోజుకు కనీసం పది మైళ్ళు గుర్రం మీద తిరుగుతూ మిక్కిలి శ్రమ కోర్చి అపర భగీరదుడై కేవలం ఎనిమిది నెలల్లో నివేదిక రూపొందించి ప్రభుత్వానికి 1845ఏప్రిల్ పది హేడు న సమర్పించాడు .

కాటన్ నివేదికలో ముఖ్య విశేషాలు

గోదావరి డెల్టాలో నేల స్వభావం వాతా వరణం ,జల వనరులు ప్రపంచం లో ఎక్కడా లేవు వరదలను తట్టుకోనేట్లు లోతట్టు ప్రాంతం లో గోదావరికి రెండు వైపులా మట్టి కట్టలు ఎత్తుగా కట్టాలి .నదికి అడ్డం గా ఆనకట్ట కట్టి ,కాలువలు త్రవ్వి నదీ జలాలను ఎత్తు గా ఉండే పంట భూములకు అందించాలి .చదును భూముల నుండి మిగులు నీటిని బయటికి పంపి పంట దిగుబడికోసం మురికి కాలవలు త్రవ్వాలి .వ్యవసాయ ఉత్పత్తుల రవాణా కు రోడ్లు, వంతెనలు ఎక్కువగా నిర్మించాలి .వీటన్నిటికి పన్నెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది .

ఇలా చేస్తే ఒన గూడే సదుపాయాలేమిటో కూడా కాటన్ వివ రించాడు .గోదావరి కృష్ణా లోయలలో సుమారు ఇరవై లక్షల ఎకరాలకు సాగునీరు లభిస్తుంది .ముప్ఫై లక్షలున్న సంవత్సర ఆదాయం  రెండు కోట్ల రూపాయలకు పెరుగుతుంది .డెల్టాకు అంతటికి నౌకాయాన సదుపాయం ఏర్పడుతుంది .వేసవి లో 30 వేల ఎకరాలకు చెరుకు సాగుకు సరి పడ నీరు అందుతుంది.మారు మూల గ్రామాలకు కూడా తాగునీరు అందుతుంది .వార్షిక రెవిన్యు ఇరవై  లక్షల నుండి అరవై లక్షలకు పెరుగుతుంది  .

    ప్రత్యెక సూచనలు

ఆనకట్ట నిర్మాణం మిలిటరీ కట్టడాల నిర్మాణం అంత పటిష్టం గ ఇంజినీర్ల నిర్వహణలోనే జరగాలి. అనుభవం లేని స్తానిక రెవిన్యు అధికారులకు ఈ పని అప్పగిస్తే పైసా కూడా ఆదాయం రాదు .తన సూచనల్లో ఏదైనా సందేహాలుంటే తనకు రాత పూర్వకం గీ తెలియ జేసి సమాధానం రాయటానికి తనకు తగి నంత వ్యవదినివ్వాలి .

ఇలాంటి సూచనలు, సలహాలు ఇంత్సకు ముందు ఏ అధికారి సాదికారికం గా ప్రభుత్వానికి ఇవ్వలేదు .దీనికి ధైర్యం ఆత్మ విశ్వాసం ఉండాలి. అవి పుష్కలం గా ఉండబట్టే కాటన్ నిర్భయం గా ఈ విషయాలు తెలిపాడు వీటిని రాజ మండ్రిజిల్లా కలెక్టర్ ఫ్రేండర్ గాస్ట్  -మద్రాస్ చీఫ్ ఇంజినీర్ లెఫ్టి నేనెంట్ కల్నల్ ఏ లాయ్ కి పంపిస్తే ,  ఆయన బల పరచి రెవెన్యు బోర్డ్ కు  26-2-1846 న పంపాడు .ఇది సమర్ధించి మద్రాస్ ప్రభుత్వానికి పంపిస్తే ప్రభుత్వం అంగీకరించి లండన్ లో డైరెక్టర్లకు పంపించింది .డైరేక్తర్ల్ కోర్టు ఆనకట్ట నిర్మాణానికి 4,75 572రూపాయలు ,అప్పటికే ఉన్న పంటకాలవల మరమ్మత్తులకు 14,000  రూపాయలు శాంక్షన్క్ చేసింది  1847లో ఆనకట్ట నిర్మాణానికి మద్రాస్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది గోదావరి డెల్టా ప్రజల కోరిక, కాటన్ ఆశ, ఒకే సారి నేర వేరాయి .ఇక కాటన్ కార్య రంగం లో దూకటమే మిగిలింది .ఇదీ గోదావరి డెల్టా సస్యశ్యామలమవటానికి’’ డెల్టా రూప శిల్పి కాటన్ ‘’ఆరంభించిన పనికి ఉన్న నేపధ్యం . నిర్మాణ విషయాలు తరువాత తెలుసు కొందాం .

సశేషం –మీ గబ్బిటదుర్గా ప్రసాద్ -29-10-13-ఉయ్యూరు

 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

రాచకీయ ”ద్విప్లేట్స్” -3

                     రాచకీయ ”ద్విప్లేట్స్”
  21–విభజన కే సైఅని ఒంటికాలితో వస్తున్న హోమ్ ”షిండే ”
        కలగాపులగం గా తొందర పడి ఇష్టం వచ్చినట్లు వండుతున్నాడు ”ఆండే”(గుడ్లు )
 
22-ఎవరి మీదైనా  దాడికి రెడీ ,కయ్యానికి సై గా ఉండే ‘వీరభద్రం దాడి”
    గౌరవం మర్యాదా ఇచ్చిన  సైకిల్ దిగి, గన్ల్ చెంతచేరి ”బేవకూఫ్ ‘అనిపించుకొన్నా ‘ఒట్టి బద్రయ్యై మరిచాడు  ” ఎదురు దాడి”  
23-తను మాట్లాడేది జనానికే కాదు తనకూ తెలీని” బొత్స ”
     డిల్లీలో కోవర్ట్ ,గల్లీలో ,జనాగ్రహం లో అయ్యాడు” కుత్స ”
24– సంయమనం అంటే తెలీని ”డిగ్గీ”
      కారుకూతల్తోకారం రాసి, సమైక్యం లోఅయ్యాడు ”బుగ్గి ”
25-కారు వాడు,గులాబీదాసుడు  కే.సి.ఆర్ 
    బేకార్ మాటలతో,వివేకం పోయి తానే అయ్యాడు ”బేకార్ ” 
                        మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -29-10-13-ఉయ్యూరు 
 
Posted in రచనలు | Tagged | Leave a comment

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -3

      విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -3
                       బ్రహ్మ గుప్తుడు
  ”గణక చక్ర వర్తిచూడామణి  ”అని బిరుదు పొందిన బ్రహ్మ గుప్తుడు గుజరాత్ లో భిల్లమాల గ్రామం లో 598 లో జన్మించాడు .ఆర్యభట్టు రాసినఖగోళ శాస్త్రం లోని  గణిత విషయాలన్నీ క్షున్నం గా పరిశోధించాడు . శూన్యం అంటే సున్నా ను,అనంతం అంటే ఇంఫినిటి మొదట కనీ పెట్టాడు .భౌతికం గా ఇవి లేక పోయినా మానసికం గా వీటిని సృష్టించాడు .సున్నాను ఏ సంఖ్యతో హెచ్చిన్చినా సున్నా ఏ వస్తుందని ,ఏదైనా ఒక సంఖ్యను సున్నా తో భాగిస్తే అనంతం వస్తుందని తెలిపాడు .దీనికే” ఖహారం ”అన్నాడు .దీన్ని ఈయన తరువాతి వాడైన భాస్కరా చార్య ఒక శ్లోకం లో నిబద్దం చేశాడు .”వాదా దౌవియత్ ఖం ఖేన దాతే -ఖహారో భవేత్ ఖేన భక్తస్చ రాశిహ్ ”
               బ్రహ్మ గుప్తుని ప్రతిభ ను గుర్తించిన వ్యాఘ్రముఖ మహారాజు తన ఆస్థానానికి ఆహ్వానించి ,సన్మానించి ఆస్స్తాన పండిత గౌరవాన్ని కల్పించాడు .అప్పటిదాకా జీవనానికి చాలా ఇబ్బంది పడ్డ బ్రహ్మ గుప్తునికి పరిశోధనకు మహదవకాశం లభించింది .అంక గణితాన్ని బీజ గణితాన్ని మొదటి సారిగా రెండు ప్రత్యక విభాగాలుగా గుర్తించిన ఘనత కూడా ఈయనదే .ఈయన శిష్యుడు భాస్కరాచార్య గురువును సత్కరించి ”గణక చక్ర వర్తి చూడామణి ”బిరుదు ను ఇచ్చాడు .
Inline image 1    Inline image 2

Brahmagupta’s theorem

Main article: 

Brahmagupta’s theorem states that AF =FD.

Brahmagupta continues,

12.23. The square-root of the sum of the two products of the sides and opposite sides of a non-unequal quadrilateral is the diagonal. The square of the diagonal is diminished by the square of half the sum of the base and the top; the square-root is the perpendicular [altitudes].[11]

So, in a “non-unequal” cyclic quadrilateral (that is, an isosceles trapezoid), the length of each diagonal is \sqrt{pr + qs}.

He continues to give formulas for the lengths and areas of geometric figures, such as the circumradius of an isosceles trapezoid and a scalene quadrilateral, and the lengths of diagonals in a scalene cyclic quadrilateral. This leads up to Brahmagupta’s famous theorem

                 గణితం లో ప్రత్యెక విభాగం అయిన ”న్యూమరికల్ ఎనాలిసిస్ ”అని పిలవా బడే ”అంక గణిత విశ్లేషణ ”చేసిన మొదటి వాడు కూడా బ్రహ్మ దత్తుడే .సున్నా వినియోగం లో ఉపయోగించే సూత్రాలను నిబద్దం చేసిన ఘనత ఈయనదే .అప్పటివరకు అందరుకష్ట  సాధ్యం అని భావించిన ax2_+1==y2అనే సమీకరణాన్ని సాధించింది బ్రహ్మ గుప్తుడే అంటే గణితానికి బ్రహ్మ లా అన్నీ సృస్తిన్చాడన్నమాట .
             బ్రహ్మ దత్తుడు తన 30వ ఏట ”బ్రహ్మ స్పుట సిద్ధాంతం ”అనే గ్రంధాన్ని రాశాడు .మొదటి సారి ఈయన కనీ పెట్టిన ”దశాంశ పద్ధతి ”క్రమం గా అన్ని దేశాలకు వ్యాపించింది .ఈ పుస్తకం ప్రపంచ గణిత శాస్త్రానికే కొత్త ద్వారాలు తెరిచింది .పాశ్చాత్య దేశాల అంకెల కంటే బ్రహ్మ గుప్తుని అంకెల విధానం శాస్త్రీయం గా ఉందని ప్రపంచం,ప్రపంచ గణిత మేధావులు  మెచ్చుకొన్నారు .తన రెండవ పుస్తకం ”కరణ ఖండ ఖడ్యక”
లోను గణిత శాస్త్రానికే ప్రాధాన్యత నిచ్చాడు అంకగణిత ,బీజ గణిత మొదలైన విభాగాలపై ప్రాధమిక సిద్ధాంతాలు ఇందులో చేశాడు .
”ax +b==0,ax2+bx+c==0”మొదలైన సమీకరణాలను పరిష్కరించాడు
              ఖగోళ శాస్త్ర అధ్యయనం లో ,పరిశోధనలో ఆల్జీబ్రా ను మొదట ఉపయోగించిన వాడుకూడా బ్రహ్మ గుప్తుడే రెండవ గ్రంధం లో ఖగోళ గణితం విపరీతం గా ఉంది .అనేక కొత్త విషయాలు జోడించాడు .బ్రహ్మ స్పుట సిద్ధాంత గ్రంధం దేశ విదేశాలలో మంచి పేరుతెచ్చుకోంది.ఇందులో ”శ్రేడులు(సర్డ్స్)జ్యామితి అనేక నిరర్దారిత సమీకరణ సాధనా ,వర్గ సమీకరణ సాధన మొదలైన విఅతి సులభ విధానం లో  ఉన్నాయి .బ్రహ్మ గుప్తుడు కనీ పెట్టిన సున్నాను ఆరబిక్ భాషలో సిఫర్ అంటే ,గ్రీకులోజిఫర్ అన్నారు అదే ఇంగ్లీష్ లో” జీరో’అయింది .’భాస్కరుడికి ముందే బ్రహ్మ స్పుట సిద్ధాంతం చాలా దేశాల్లో ప్రచారమైంది
             క్రీ.శ770లో ఉజ్జయిని లోని ప్రముఖ గణిత పండితుడు ”కంక’భట్టు ”ను బాగ్దాద్ రాజ దర్బారుకు పిలిపించి ఆరబ్ పండితులకు భారతీయ అంకెల గణన పద్ధతిని నేర్పాడు .అప్పుడే బ్రహ్మ స్పుట సిద్ధాంత గ్రంధం అరబిక్ భాషలోకి తర్జుమా అయింది ఇలాఏడవ శతాబ్ది పూర్వార్ధం లోనే భారతీయ అంకెలు ,సంఖ్యామానం సిరియా అరేబియా ,ఈజిప్ట్ ,క్రమంగా పాశ్చాత్య దేశాలకు వ్యాపించింది .అరేబియా నుంచి వచ్చిన అంకెలు కనుక పాశ్చాత్యులు ”ఆరబిక్ అంకెలు ”అన్నారు కాని ఆరబ్బులు మాత్రం ”హిందూ అంకెల విధానం ”(ఆల్  ఆర్కాన్ ఆల్ హింద్”గా పిలుస్తారు .
                 సున్నా కు ఏ సంఖ్యను కలిపినా ఏసంఖ్య నుండి సున్నాను తీసివేసినా ఏ మార్పు ఉండదు అని సూత్రీకరించాడు బ్రహ్మ దత్తుడు. మొదట్లో బ్రహ్మ దత్తుడు ఏ సంఖ్యనైనా సున్నా తో భాగిస్తే సున్నా ఏ వస్తుందని పొరబడి చెప్పాడు .కాని అనంతం వస్తుందని తర్క శాస్త్ర నిబద్ధత తో పేర్కొనటం జరిగింది” పై ”.విలువ10 యొక్క వర్గ మూలం గా నిర్ణయించాడు .ఫస్ట్అండ్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్స్ సాధించాడు .”ఫ్రస్టం ఆఫ్ పిరమిడ్ ”కు ఖచ్చిత విలువ కనీ పెట్టాడు .బీజ గణితం లో సంఖ్యలకు సంబంధించిన విషయాన్ని తెలుపుతూ వర్గ సమీకరణణాలను అందించాడు .
           కరణ ఖండ ఖడ్యక ”గ్రంధం లో బ్రహ్మ గుప్తుడు ఆర్య భట సిద్ధాంతాలను గాఢంగా అధ్యయనం చేసి చాలా విషయాలు చెప్పాడు .భూమి గుండ్రం గా ఉందని భూమి స్తిరం గా ఉండక గమనం కలిగి ఉందని ఆర్య భట్టు కూడా చెప్పాడు .గురుత్వాకర్షణ గురించి విపుల చర్చ చేశాడు .భూమికి ఆకర్షణ ఉందన్నాడు .నీటికి ప్రవహించటం ఎలా సహజమో అలాగే భూమికి ప్రక్రుతి లోని అన్నిటిని ఆకర్షిస్తుందని వివరించాడు .ఇది ప్రకృతి సిద్ధం గా భూమికి ఉన్న విశిష్ట గుణం అన్నాడు .ఈయన వాడిన” స్పుట” అన్న మాటకు పూర్వం ఉన్న అంశాలను సరి చేయటం అని అర్ధం చెప్పుకొన్నాడు .జీవితం లో చివరి భాగం లో 645లో కరణ ఖండ ఖాడ్యరాశాడు 648 లో బ్రహ్మ గుప్తుడు బ్రహ్మైక్యం పొందాడు .
         ప్రొఫెసర్ ”వాలెస్ ”అనే చారిత్రిక పరిశోధకుడు భారతీయుల గణిత ,ఖగోళ విషయాలు చాలా నిర్డుస్ట మైనవిఅనీ ,జ్యామెట్రీ , సూత్రాల నాదరం గా ఖగోళ రహస్యాలు సాధించారని ఇదంతా క్రీ .పూ 3,000. సంవత్సరాలకు ముందే సాధించిన భారతీయ విజ్ఞానం అని మెచ్చుకొన్నాడుజ్యామెట్రీ  అనేది  ఇండియా లోనే పుట్టిందని  ఇది పాశ్చాత్య దేశాల వారి ద్రుష్టి సోకని ఎంతో ముందు కాలం లోనే జన్మించిందని ఎన్నో ”ఎలిమెంటరి ప్రపోజిషన్లు” భారత దేశం నుండే గ్రీసుకు వ్యాపించాయని భారతీయ విజ్ఞులైనప్రాచీన  శాస్త్రజ్ఞులను ఆరాధనా భావం తో మెచ్చుకొన్నాడు వాలెస్ .  .
                       సశేషం
                        మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -29-10-13-ఉయ్యూరు
Posted in సైన్స్ | Tagged | Leave a comment

NON STOP జోకర్

 

గంటల తరబడి ఆపకుండా నవ్వించడం జోక్ కాదు. కాని విశాఖపట్టణంలోని కోరుకొండ రంగారావుకు మాత్రం జోక్‌తో పెట్టిన విద్య. అయన కదిలొస్తే జోక్, నడిచొస్తే జోక్, షర్టు మడతెడితే జోక్. వైవిధ్యమైన కామెడీ స్క్రిప్ట్స్, కామెడీ ప్లేలెట్స్‌లతో అదరగొట్టేస్తున్న ఈయన.. జోకులరాజ్యంలో పాతుకుపోయిన పాత రికార్డులన్నీ తుడిపేస్తున్నారు. ఈ మధ్యనే ఆపకుండా 654 జోకులు చెప్పి గిన్నిస్‌ను ఆకర్షించాడు. ఇంతకు మునుపు 35 గంటలపాటు నాన్‌స్టాప్ జోకులు వినిపించి.. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డును, ఇండియా బుక్ ఆఫ్ రికార్డులను సైతం సాధించాడు. విశాఖ తీరాన ‘లాఫింగ్ ఫన్ క్లబ్’ ద్వారా అందర్నీ నవ్విస్తున్న ఆ నవ్వులడాన్ గురించే ఈ కథనం..

“హలో సార్, కోరుకొండ రంగారావు గారేనా?”
“అవునండీ. నమస్కారం. చెప్పండి మీకు నేను ఏ విధమైన సంతోషం కలిగించాలో.”
“సార్.. నాకెందుకో ఈ రోజు మనసు మనసులో లేదండీ. భార్యా పిల్లలు గుర్తుకొస్తున్నారు. దయచేసి మీరొక జోక్ చెబితే కాస్త నవ్వుకుని.. మనసును తేలిక చేసుకుంటానండీ.”
“తప్పకుండా చెబుతా! నీకు సెల్‌ఫోన్ ఉందా?”
“ఉందండి. ఇవాళ ఫోన్లు లేనోళ్లు ఎవరున్నారు చెప్పండి.”
“నీలాంటోడే ఒకాయన ఫోన్‌లో మాట్లాడుతూ.. మాట్లాడుతూ.. వెళ్లిపోయాడు. ఇక మళ్లీ రాలేదు..”
“అదెలాగండీ బాబూ”

“ఇదొక ఫోన్ జోక్. చెబుతాను విను- ‘గుండ్రాయిలా ఉండే అన్నయ్యగారు ఇంత హఠాత్తుగా ఎలా పోయారు వదినా’ అంటూ ఒకావిడ ఏడుస్తూ అడిగింది. భర్త పోయిన దుఃఖంలో ఉన్న ఆవిడ- ‘ఏమీ లేదు వదినా, మీ అన్నయ్యకు ఫోన్ రాగానే బాల్కనీలోకి వెళ్లి మాట్లాడే అలవాటుంది. మొన్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో వెళుతున్నప్పుడు ఇలానే ఫోన్ వచ్చింది. ఫోన్ పట్టుకుని.. బెర్తు దిగి మాట్లాడుతూ మాట్లాడుతూ బయటికి నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఇక మళ్లీ రాలేదు.. అని ఏడుస్తూ చెప్పిందామె.’
“అహ్హహ్హ. థ్యాంక్యు రంగారావు గారు. మా కోసం ఇలాంటి జోకులు పేలుస్తూ ఉండండి” అని చెప్పి పెట్టేశాడు.

రంగారావుకు జోక్ చెప్పమని ఫోన్ చేసిన ఆ వ్యక్తి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుడు. ఒక ఆశ్రమంలో రోజులు లెక్కపెడుతూ.. మరణశయ్య మీద పోరాటం చేస్తున్న అభాగ్యుడు. అతనే కాదు. మానసిక ఒత్తిళ్లతో నలిగిపోయే వాళ్లకు.. ఒక చిన్న చిరునవ్వుకే మొహంవాచిపోయిన ఉరుకుల పరుగుల జనులకు.. మనసు బాగోలేనపుడు ఏ బంధువులో, స్నేహితులో గుర్తుకురారు. విశాఖపట్టణంలోని కోరుకొండ రంగారావు గుర్తుకొస్తాడు. ‘సార్, మూడ్ బాగోలేదు. ఒక జోకు చెప్పండి ప్లీజ్!’ అంటే ఎంత బిజీలో ఉన్నా.. ఫోన్‌లోనే ఒక హాస్యోక్తి విసిరి.. కాసేపు నవ్వించి.. వాళ్ల గుండె మీదున్న బరువును దించే వరకు ఊరుకోడాయన. జోకులు వేసి వేసి.. ఆయనేమీ నవ్వుల పాలవ్వలేదు. కేవలం బూజుపట్టిన పాతరికార్డులను తన వాడివేడి జోకులతో ఫెళ్లున బద్దలు కొడుతూ వెళుతున్నాడంతే!

టెన్షన్‌కు మందు..
“నవ్వేవాడు హ్యాపీఫెలో. నవ్వించేవాడు జాలీఫెలో. నవ్వలేనివాడు బఫెలో. జంధ్యాలగారి ‘నవ్వు ఒక భోగం’ ఇలా మార్చేశానండీ. ఆయనగారి సూక్తిని ఎంతకాలం చెబుతామండీ. కాస్త మోడ్రన్‌గా ఉంటుందని ఇలా అనేస్తుంటాను. ఈతరం వాళ్లకు ఇది బాగా నచ్చింది” అంటూ ఉత్తరాంధ్రయాసలో గబగబా మాట్లాడే రంగారావు.. దేని గురించి ఎంత సీరియస్‌గా చెబుతున్నా సరదా చేస్తున్నట్లే అనిపిస్తుంది. “ఇవాళ ప్రజలకు అన్నీ ఉన్నాయండీ. పాపం నవ్వుకోవడానికి సమయమూ సందర్భమే చిక్కడం లేదు. అందరూ రామజపంలా జపిస్తున్న ఏకైకపదం ‘టెన్షన్ టెన్షన్’. చిన్నదానికీ పెద్దదానికీ కోపతాపాలైతే ఎలాగండి? ఈ ఉద్వేగాలకు ఎన్నో కారణాలు ఉండవచ్చు కానీ వాటన్నిటినీ చల్లబరిచే గుణం హాస్యానికి మాత్రమే ఉంది. రోడ్డు మీద వెళుతున్నప్పుడు అవతలివాడికి చిన్న డాష్ ఇచ్చామనుకోండి. తప్పు మీదే అయినా ఒక చిరునవ్వు నవ్వి, సారీ చెప్పండి. అవతలి వ్యక్తి ఎంత కోపిష్టివాడైనా అర్థం చేసుకుంటాడు. అలా కాకుండా మీరే ముందుగా మీదికి వెళితే మాత్రం.. అటువైపు కోపం రెట్టింపు అవుతుంది. గొడవలకు దారి తీస్తుంది. హాస్యస్ఫోరకంగా ఉంటే పోయేదేమీలేదు’ అన్నారు రంగారావు.

విశాఖ స్టీల్ ప్లాంటులో ఫోర్‌మ్యాన్‌గా చేస్తున్న ఇతనికి మొదట్నించి పదిమందిని పోగేసుకుని నవ్వించడం అలవాటు. ఉత్తరాంధ్ర జీవనశైలిలో సహజంగా ఉట్టిపడే హాస్యాన్ని పట్టుకోవడం వల్ల.. రంగారావు పాత జోకులు చెప్పినా.. కొత్తగా వింటున్నట్లే ఉంటుంది. “జోకులు అందరూ చెబుతారు. కానీ దాన్ని చెప్పే విధానం, చాతుర్యం, శరీరభాష.. ప్రాముఖ్యం వహిస్తాయి” అంటున్న ఆయనకు అవేవీ ఊరికే అబ్బలేదు. వైజాగ్‌లోని ‘విశాఖ హ్యూమర్ క్లబ్’, ‘క్రియేటివ్ కామెడీ క్లబ్’, ‘బాబాయ్ లాఫింగ్ క్లబ్’లలో కొన్నేళ్లపాటు చురుకైన పాత్ర పోషించాడు. అక్కడికొచ్చి జోకులు చెప్పే రకరకాల వ్యక్తులను గమనించడం, సినిమాలు, నాటకాలు, నేతల ప్రసంగాలు, టీవీ కార్యక్రమాలు, పుస్తకాల్లోని హాస్య సన్నివేశాలను కాలానుగుణంగా మార్చుకుని.. క్లబ్‌లలో ప్రదర్శించడం.. మిత్ర బృందాలను నవ్వించడం చేసేవారు.

‘మాకు మేమే సొంతంగా కామెడీ స్క్రిప్ట్‌లు, కామెడీ- ప్లేలెట్స్ రాసుకునేవాళ్లం. అవన్నీ లాఫింగ్ క్లబ్స్‌లోనే కాదు. టీవీలు, రేడియోలలో ప్రదర్శితమయ్యాయి. నాకొక గుర్తింపు వచ్చాక.. వేముల భాస్కరాచారి, జీవీ త్రినాథ్, పీకే దుర్గాప్రసాద్, డాక్టర్ ఎన్ఎస్ఆర్ కృష్ణారావు అనే మిత్రులు తోడయ్యారు. వీరిలో రచయితలు, నటులు ఉన్నారు. మేమంతా కలిసి.. ‘లాఫర్స్ ఫన్ క్లబ్’ పెట్టాము” అని చెప్పుకొచ్చారు. ఈ క్లబ్ విశాఖలోనే కాదు రాష్ట్రమంతా నవ్విస్తోందిప్పుడు. నటులకు దినభత్యం, రవాణా ఖర్చుల నిమిత్తం ఒక్కోసారి స్వల్ప మొత్తంలో టికెట్లు వసూలు చేస్తున్నారు. చాలామటుకు ఉచిత ప్రదర్శనలే! ఇప్పటి వరకు రంగారావు బృందం 2,800 కార్యక్రమాలు నిర్వహించింది. పొట్టి హాస్య కథలు, సన్నివేశాలు, మిమిక్రీ, మేజిక్‌షోలతో ఒక ప్రత్యేక ప్రేక్షకవర్గాన్ని సంపాదించుకుంది. ప్రతి నెలా నాలుగో ఆదివారం నాడు స్టీల్‌ప్లాంట్‌లోని ఆడిటోరియంలో ఒక హాస్య ప్రదర్శన తప్పక ఉంటుంది.

ఎప్పటికప్పుడు కొత్త కొత్త జోకుల్ని తయారు చేసుకోవడమంటే మాటలు కాదు. దీనికి ఎలాంటి కసరత్తు చేస్తారని రంగారావును అడిగితే – “ఎవరైనా ఒక పది ఫ్రెష్‌జోక్స్ చెబుతామంటే.. అన్నంనీళ్లు ముట్టకుండా బండేసుకుని బుర్రున వెళ్లిపోతాను. ఆ జోక్స్‌ను తెచ్చుకుని ముందు మా బృందానికి వినిపిస్తాను. వాళ్లు నవ్వితే సరి. లేకపోతే మూలనపడేస్తాను. ఒక్కోసారి వాటినే ముందుకు వెనక్కు మార్చి, డబుల్ మసాల దట్టించి, పోపు పెట్టి ప్రేక్షకులకు అందిస్తుంటాను. మరొక మార్గం.. జోకుల పుస్తకాలను సేకరించడం. ఇంకొందరు ఈ మెయిల్స్ ద్వారా నాకు పంపిస్తుంటారు. ఇక మిత్రుడు కాశీవిశ్వనాథ్‌గారు ఉండనే ఉన్నారు. ఆయన అలవోకగా స్క్రిప్టులు రాసేయగలరు. కొన్ని కార్యక్రమాలకు సినీనటుడు కళ్లు చిదంబరం కూడా సహాయపడుతుంటారు. మా దగ్గర వేలాది జోకుల బ్యాంకు ఉందిప్పుడు..” అన్నారాయన.

అన్నీ మనమీదే..
లాఫింగ్‌ఫన్‌క్లబ్ పెట్టిన తర్వాత.. చాలా రికార్డులు నెలకొల్పాడాయన. ఒక గంటలో ప్రపంచంలోనే అత్యధిక జోకులు చెప్పిన ఆస్ట్రేలియాకు చెందిన ఆంథోనీ లెహ్‌మన్ రికార్డును ఈ మధ్యనే తుడిపేశాడు. విశాఖవాసుల్ని హాస్యజల్లులతో ముంచెత్తి గిన్నిస్‌రికార్డును నెలకొల్పడం పెద్ద సంచలనం. “పన్నెండు మంది న్యాయనిర్ణేతల ముందు గంటసేపు ఆపకుండా.. 654 జోకుల్ని చెప్పాను. ఒక నిమిషానికి పది జోకుల చొప్పున నవ్వించగలిగాను. ఇదొక వరల్డ్ రికార్డు” అన్నారు. ఆయన చెప్పే జోకుల్లో ఆధునిక జీవితాలను ప్రతిబింబించేవే అధికం. భార్యభర్తలు, ఇరుగుపొరుగు, పోలీసులు, రాజకీయ నాయకులు, డాక్టర్లు, యాక్టర్లు, యాచకులు, ప్రేమికులు, డ్రైవర్లు, జడ్జిలు.. ఒక్కరేమిటి..? సమస్తవర్గాలు హాస్యాయుధాలే! స్టీల్‌ప్లాంట్‌లో ఉత్తమ హాస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత.. ఒక ఎఫ్ఎం రేడియో నిర్వహించిన పోటీలో ‘నవ్వులడాన్’ కిరీటాన్ని సొంతం చేసుకున్నాడీయన. నవ్వుల దినోత్సవం రోజున ఏకబిగిన 35 గంటలపాటు జోకులు పేల్చి లిమ్కాబుక్ ఆఫ్ రికార్డుల్లోకీ ఎక్కాడు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లలో కూడా ఇతని పేరు నమోదైంది. “స్టీలు ప్లాంట్ ప్రోత్సాహం మరువలేనిది. లిమ్కాబుక్ ఆఫ్ రికార్డు’ ప్రదర్శన కోసం మా కంపెనీ రెండు లక్షలు స్పాన్సర్ చేసింది” అన్నారు.

హాస్యమూ ఒక ఔషధం..
“మనోవ్యాధికి మందు లేదు అంటారు. కానీ అందరికీ తెలిసిన మందొకటి ఉంది. అదే హాస్య ఔషధం. దీన్ని వైద్యులే «ద్రువీకరించారు. మనస్ఫూర్తిగా నవ్వితే మెదడులో గామా ఇంటల్‌పెరా అనే హర్మోన్ విడుదల అవుతుంది. దీనివల్ల శరీరంలో వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది” అంటున్న రంగారావు సామాన్యప్రేక్షకులను నవ్వించడం వరకే పరిమితం కాలేదు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులు, ఖైదీలు, అనా«థలు, వృద్ధుల సమూహాలు ఉన్న చోటికి వెళ్లి నవ్వులు పంచి.. కాస్త ఉపశమనాన్ని కలిగిస్తున్నారు. “కలెక్టర్ ఆఫీసు దగ్గర ప్రతి మంగళవారం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. అక్కడికి రెండొందల మంది ఎయిడ్స్ పేషెంట్లు వస్తారు. నేనొకసారి వెళ్లి వాళ్లను కలిశాను. చాలా బాధ కలిగింది.

ఒక్కరి ముఖంలో కూడా చిరునవ్వు లేదు. నన్ను వేదిక మీదికి పిలిచి నవ్వించమన్నారు వైద్యులు. నేను ఆపకుండా జోకుల మీదు జోకులు వేస్తుంటే.. ఒక్కసారిగా బాధితుల ముఖాలన్నీ వెలిగిపోయాయి. ఆ గంటసేపు వాళ్లకున్న జబ్బును మరిచిపోయి నవ్వుల్లో మునిగిపోయారు. ‘మా వైద్యం పనిచేయని చోట మీలాంటి వాళ్ల వైద్యం పనిచేస్తుంది..’ అంటూ డాక్టర్లు నన్ను అభినందించడం మరిచిపోలేను. మీకెప్పుడు బాధ కలిగితే అప్పుడు ఫోన్ చేయండి. జోక్ చెబుతాను అంటూ.. ఎయిడ్స్ బాధితులందరికీ నా విజిటింగు కార్డులు ఇచ్చొచ్చాను. ఇప్పటికీ వాళ్లు నాకు ఫోన్ చేసి జోకులు చెప్పించుకుంటుంటారు” అన్నారు ఈ విశాఖ హాస్యరాజు.

సీతమ్మధార, మహారాణిపేటలలోని వృద్ధాశ్రమాలకు సైతం వెళ్లి.. హాస్య కార్యక్రమాలు చేస్తుంటారీయన. త్వరలోనే అడవివరం సెంట్రల్ జైలుకు వెళ్లి.. ఖైదీలను నవ్వించేందుకు.. అనుమతి కోసం ఎదురుచూస్తున్నారట. ఆఖర్న ఒక మాటన్నాడు రంగారావు.. “నాకు నవ్వించే గుణమే కనక లేకపోతే ఏనాడో ఆత్మహత్య చేసుకుని చనిపోయుండేవాణ్ణి – అన్నాడు గాంధీ మహాత్ముడు. హాస్యం ఆయన జీవితాన్ని ఎంత ఉన్నతంగా నడిపించిందో ఆ మాటను బట్టే తెలుస్తుంది” అంటూ ముగించారు.

కోరుకొండ రంగారావు ఫోన్ : 98854 98444

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సమగ్ర కళా వేదికగా శతరూపం

 

రాష్ట్రంలో తెలుగు భాష, సాంస్కృతిక వికాసానికి ఒక కొత్త విధానాన్ని రూపొందించాలని, యువతకు కళా రంగంలో అవకాశాలు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది.

స్పష్టమైన సాంస్కృతిక విధానం లేని మన రాష్ట్రంలో తప్పటడుగుల శతరూప కార్యక్రమం కొత్తపుంతల్లో సాగుతోంది. ప్రతిభావంతులైన కళాకారుల సృజన, ప్రదర్శనా పాటవాలకు ప్రోత్సాహక వేదికగా ఆ కార్యక్రమాన్ని రూపుదిద్దారు. వరుసగా వంద రోజులపాటు సకల కళారూపాలకు ఆహ్వానం పలుకుతూ మెరికల్లాంటి వారికి తొలి సోపానంగా ఈ కార్యక్రమం దోహదం చేస్తోంది. రెండువేల వందమంది కళాకారుల ప్రదర్శనలు, అందుకుగాను యాభై ఐదు లక్షలకు తాకిన ప్రత్యేక వ్యయంతో శతరూప- 2013 తుది దశకు చేరుకుంది. ఈ ఏడాది ఆగస్టు రెండవ తేదీ నుంచి వరుసపెట్టుగా జరుగుతున్న సప్తాహ సంరంభాల్లో తెలంగాణ జిల్లాల నుంచి వచ్చిన కళా ప్రదర్శనలు అపార ఆదరణ పొందాయి. పెద్దపెద్ద సంస్థలు, అగ్రశ్రేణి కళాకారుల ప్రత్యేక కార్యక్రమాలకు దీటుగా ప్రేక్షకుల ఆదరణ పెంచుకున్న శతరూపలో బహుముఖ రూపాల గుణపాఠాలు సాంస్కృతిక రంగంలో అనుభవంలోకి వచ్చాయి.

జాతీయ స్థాయిలో పేతోపాటు నిర్వహణలో, ఆదరణలో ఆదర్శమైన రవీంద్రభారతి ప్రాంగణంలో సువిశాలమైన ఆరుబయలు వేదికపై వేసవి సాయంత్రాల ఆటవిడుపుగా తొలి దశ కార్యక్రమాలకు నాంది పలికారు. 2006లో మొదలైన మొదటి దశ శతరూపకు పర్యాటక శాఖ నిధులను సమకూర్చడంలోనూ, శిల్పారామం వంటి వేదికపై నిత్యం ప్రదర్శించే తీరును కొత్త దారిలోకి మళ్ళించడంలోనూ అప్పటి కార్యదర్శి అర్జా శ్రీకాంత్ కీలక పాత్ర పోషించారు. సాంస్కృతిక శాఖతోపాటు పర్యాటక రంగం, యువజన వ్యవహారాల శాఖల బాధ్యతల్ని జమిలిగా నిర్వహించడంలో ఆయన శతరూపకు తెరతీశారు. రాష్ట్రవ్యాప్తంగా గల కళారూపాల్ని గుర్తించి వాటికి సంబంధించిన వివరాలు, విశేషాల్ని ప్రచురించడంతోపాటు ఆయా కళారూపాల్లో నిష్ణాతులైన వారి జాబితాల్ని రూపొందించి గుర్తింపు కార్డులు జారీ చేయడంతో సాంస్కృతిక రంగం కొత్త ఒరవడిలోకొచ్చింది.

ఇక సుమారు 16 వేల పైచిలుకు కళాకారుల వివరాలను కంప్యూటర్ పరిజ్ఞానంతో వర్గీకరించి, క్రోడీకరించిన తర్వాత సాంస్కృతిక శాఖ ప్రదర్శనలను నిర్వహించడంలో కొత్త కొత్త పద్ధతులను అనుసరించారు. వారి వారి ప్రతిభను మదింపు వేయడంతోపాటు తదనంతర అవకాశాల కల్పనకు రాష్ట్ర రాజధాని నడిబొడ్డున సాంస్కృతిక శాఖ కార్యాలయం ప్రాంగణంలో రవీంద్రభారతి ముంగిలిలోని పచ్చికలో చల్లగాలుల మధ్య ఆ ఆహ్లాద వేదిక ఏర్పాటయింది. ఒక పూటకు రెండు మూడు కార్యక్రమాల ఒత్తిడిని తట్టుకోవడానికి సరికొత్త వేదికను రూపొందించారు. రవీంద్రభారతి నిర్మాణం, సాంస్కృతిక శాఖ ఉనికి రూపుదిద్దుకోవడానికి ముందు ప్రతిష్టాత్మక ప్రదర్శనలతో రాజధానిలో వేదికగా ఉపయోగపడిన గాంధీభవన్‌లోని ప్రకాశం హాలును కూడా వినియోగించడం సంప్రదాయంగా ఉండేది. ఆ ఆనవాయితీని పునరుద్ధరిస్తూ శతరూప గాంధీభవన్ వేదికలను జమిలిగా 2006లో తీర్చిదిద్దారు.

సరికొత్త కళారూపాలు
కాగా, శతరూప వేదికపై పలు కార్యక్రమాలు కళకళలాడటం సాంస్కృతిక శాఖ వన్నె పెంచింది. గుర్తింపు కార్డులు తీసుకుని మంత్రులు, శాసనసభ్యుల సిఫారసులతో సాంస్కృతిక శాఖ సంచాలకుడిని సంప్రదించి, అభ్యర్థించి, ఒత్తిడి తెచ్చి వేదికలపై ఎక్కటం ప్రతిష్టాత్మకంగా మారింది. ఒక్కపెట్టున 30 నుంచి 40 లక్షల రూపాయల వరకూ నిధులు మంజూరు అవుతుండడంతో, వాటిలో ఎంతోకొంత పొందటానికి కొందరు తాపత్రయపడేవారు. కళాకారులు, అధికారుల మధ్య సంబంధాలు పంపకాలతోనే అవకాశాలు ఉండే పద్ధతికి శతరూప వేదిక కేంద్రంగా మారింది. అయితే, ఇదంతా నిన్నటి మాట. ఇప్పుడు ఈ రంగంలో సరికొత్త సంస్కరణలు మొదలయ్యాయి. సాంస్కృతిక శాఖ తీరుతెన్నులు మారాయి. పురావస్తు ప్రదర్శన శాఖ అధికారిగా పనిచేసిన కేదారేశ్వరి అటు పర్యాటక రంగమే కాక, ఇటు సాంస్కృతిక శాఖ కూడా ప్రకాశించేలాగా చేశారు. సాంస్కృతిక రంగంలోని స్వయం ప్రకటిత పెత్తందారుల పోకడల్ని సమూలంగా మార్చిన ఐఎఎస్ అధికారి బి. వెంకటేశం మరొక దిశలో సంస్కరణలు తెచ్చారు. సాంస్కృతిక శాఖ సంచాలకుడిగా తెలుగు సాహితీ ప్రపంచంలో ప్రాచుర్యం పొందిన అవధాని డాక్టర్ రాళ్ళబండి ప్రసాదరాజు (కవితా ప్రసాద్) నియమితులవటంతో శతరూప వన్నె పెరిగింది. రవీంద్రభారతి ప్రధాన మందిరం, ఘంటసాల వేదికలపై కళా సంబంధ ప్రదర్శనలకు ఉచిత కేటాయింపులు, ప్రోత్సాహకాలు, సరికొత్త కసరత్తులు కలగలిసి గతకాలం పద్ధతులు, విధానాల్ని సమూలంగా మార్చాయి.

అవి రూపుదిద్దుకుని సరైన దారికి మళ్ళుతున్న సందర్భంలో మళ్ళీ బదిలీలు, తాత్కాలిక పద్ధతులు పెరిగాయి. ప్రస్తుతం వరంగల్ ప్రాంత డీఐజీగా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ ఎం. కాంతారావు, వాణిజ్య పన్నుల శాఖలో అత్యున్నత అధికారి వి. హర్షవర్ధన్, పర్యాటక శాఖలోని సహాయ కార్యదర్శి సునీతా భగవత్‌ల సారథ్యంలో శతరూప నిర్వహణలో పెను మార్పులు వచ్చాయి. సాంస్కృతిక శాఖకు సమాంతరంగాే ముఖ్యమంత్రి నేరుగా నియమించే సాంస్కృతిక మండలి అధ్యక్షుడి అనధికార జోక్యంతో సాంస్కృతిక శాఖ ఒదిదుడుకుల పాలైంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి శాశ్వతంగా మూతపడిందనిపించే భావనకు బలం పెంచుతూ సాంస్కృతిక మండలి మొత్తంగా తెరమరుగైంది. పునర్నియామకంతో, భాష, సాంస్కృతిక శాఖల అనుసంధానంతో, ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంతో, విజయనామ సంవత్సర శతరూప సరికొత్త విజయాలను నమోదు చేసుకుంది.

మారుతున్న కళా రంగం
గత ఏడాది తిరుపతిలో 45 కోట్ల భారీ వ్యయంతో తెలుగుతనానికి వైభవం, విమర్శలు తెచ్చిపెట్టిన నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభల తీర్మానంలో భాగంగా ఈ ఏడాది అంతా తెలుగు భాషా సాంస్కృతిక వికాస సంవత్సరం అయింది. అందుకు అనుగుణమైన కార్యక్రమాలలో భాగంగా శతరూప- 2013 ప్రత్యేక వేదిక అయింది. కేంద్ర ప్రభుత్వం నుంచి 25 లక్షల రూపాయల ప్రత్యేక మంజూరు, పలు రాష్ట్రాల నుంచి తెలుగువారి శతరూప సాధిస్తున్న ఫలితాలపై ఆరా తీస్తున్నవారి శ్రద్ధ కొత్త వెలుగుల్ని తెచ్చిపెట్టాయి. గతంలోని అధికారులు పత్రికా ప్రకటనల ద్వారా దరఖాస్తుల్ని ఆహ్వానించడం, అందుకుగాను కొంత రుసుము కూడా వసూలు చేయడంతోపాటు 2006లో మొదలైన శతరూప 2010 నాటికి రద్దు అయింది. ఆ తరువాత రెండు సంవత్సరాలు వద్దు అనుకున్నారు. అంతకు ముందు కేవలం హైదరాబాద్‌లో జరిపి ఊర్కోవడం కన్నా ఆయా జిల్లాలు, ప్రాంతాలకు తరలించాలన్న ప్రభుత్వ పెద్దల నిర్ణయం మన కళారంగంలో సంచలనం తెచ్చింది. అవకాశాల కోసం అగ్రశ్రేణి కళాకారుల నుంచి వర్ధిష్టుల దాకా వెంపర్లాడటం, తమకు తోచిన పద్ధతుల్లో ప్రయత్నాలు ముమ్మరంగా చేయటం ఆరంభమైంది.

ఇక గతంలో ఎన్నడూ వేదికలు ఎక్కని అద్భుత సృజనా ప్రతిభ శతరూప 2013 వేదిక పైకి వచ్చాయి. కొందరు కళాకారులు తమకు తాము ప్రకటించుకున్న అగ్రాసనాలు, పెత్తందారీ పోకడల మధ్య తాజా మొగ్గల్లాంటి కళాకారులు కళాసౌరభాల్ని పరవశించేలా పంచారు. తుదిదశకు చేరుకున్న ఈ ఏడాది శతరూపతో అందరిలో సరికొత్త ఉత్తేజం వెల్లివిరుస్తోందని సంచాలకుడు కవితాప్రసాద్ తమ మదింపు ఫలితాల్ని వివరిస్తున్నారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా వివిధ వర్గాల ప్రజలతో సంబంధాలు పెరగడంతో తెలుగు భాషా వికాసానికి ఈ ఏడాది శతరూపను కొత్తరూపంలోకి తెచ్చామని వివరించారు. “కొంతమందికి కోపం, మరి కొంత మందికి సరదా వేదికగా మారిపోయిన శతరూప తీరుతెన్నుల్ని సమూలంగా మార్చాం. ఇటీవలి కాలంలో మన ముందు తరాల తెలుగు వెలుగుల్ని స్మరించుకోవడం దాదాపుగా లేకుండా పోయింది. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన వారు, ప్రపంచానికి ఆదర్శంగా మేధలో, సంస్కృతిలో పేరెన్నికగన్నవారు ఈ తరం యువతకి తెలియకుండా పోతున్నారు. ఆ లోటుని గమనించి సాంస్కృతిక శాఖ తన వంతు బాధ్యతగా ఆదర్శవంతమైన వేదికను రూపొందించింది. అదే ఈ ఏటి శతరూప అయింది” అని కవితా ప్రసాద్ అన్నారు.

యువతలో శ్రద్ధాసక్తులు
“ప్రతిభావంతుల అవసరాలకు, సాధారణ విద్యకు కళారంగంలో ప్రోత్సాహకర అవకాశాలు కల్పించడం కోసం సరికొత్త సాంస్కృతిక విధానాన్ని రూపుదిద్దుకుంటోంది. మహనీయుల విశేషాలతో సాంస్కృతిక శాఖ పుస్తకాలు ప్రచురిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగుదనాన్ని సగర్వంగా చాటుకునేలా యూట్యూబ్‌లో కూడా శతరూప కార్యక్రమాల్ని పెట్టిస్తున్నాం. అందరికీ అందుబాటులోకి తెచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ వేదిక స్ఫూర్తిని అందుకున్న రంగస్థల కళాకారుడు గుమ్మడి గోపాలకృష్ణ పౌరాణిక నాటక ప్రదర్శనను ఏర్పాటు చేయబోతున్నారు. ఆ తరువాత సురభి సంస్థ వారు ప్రత్యేక ప్రదర్శనలతో ఇదే వేదిక పైకి రాబోతున్నారు. మరికొన్ని కళా సంస్థలు, సాంస్కృతిక సంస్థల నిర్వాహకులు తమకు కూడా అవకాశాలు కల్పించమని అభ్యర్థనలు పంపిస్తున్నారు. వీలైనంత త్వరలో రమారమి 600 మందికి అనువుగా వెసులుబాటుతో కళా ప్రదర్శనలు తిలకించేలా అన్ని హంగుల ఆడిటోరియం సంసిద్ధం చేయాలన్న యోచన కూడా ఉంది.

ఈ ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉంది” అని కవితా ప్రసాద్ వివరించారు. ఇంకా అనేక ప్రోత్సాహకాలు యువతలో కళాభిరుచిని పెంపొందించి, అందుకు తగిన రీతిలో ప్రదర్శన అవకాశాలు, తెలుగుదనంపై ప్రీతీ పెంచేలా సాంస్కృతిక శాఖకి శతరూప-2013 చాలా అంశాల విషయంలో కొత్త ఆలోచనలు రేకెత్తించింది. నూరు రోజులుగా రకరకాల కళారూపాల్ని తిలకించిన ప్రేక్షకులు మెచ్చుకోళ్ళతోపాటు నచ్చనివాటిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే, ప్రేక్షకులను రంజింపజేసే అంశాలపై ఇన్నేళ్ళకు స్పష్టత ఏర్పడింది. ఈ వేదికపై నమోదు చేసుకున్నవారికి తరచుగా ప్రభుత్వపరమైన కార్యక్రమాలకు ఆహ్వానాలు, సమాచారం పంపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా జిల్లాలలో మండల స్థాయిలో ఉల్లాసకరమైన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్న స్ఫూర్తికి ఈ శతరూప బలమైన బీజం వేసింది.

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అక్షరంలో.. ఆచరణలో..ఆజానుబాహువు -బొగ్గుల శ్రీనివాస్

అక్షరంలో.. ఆచరణలో..ఆజానుబాహువు

1948వ సంవత్సరం.. ‘రేరాణి’ పత్రికలో ‘అలవాటయిన ప్రాణం’ అనే కథలో పరిధికి మించిన శృంగారం రాశాడని ఒక 21 ఏళ్ల యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 500 రూపాయల జరిమాన కట్టకపోతే ఆరు నెలల జైలుశిక్ష అనుభవించవలసి ఉంటుందని జడ్జి తీర్పునిచ్చాడు. ‘రేరాణి’ పత్రికాధిపతి ఆలపాటి రవీంద్రనాథ్ జరిమానా కట్టి ఆ యువకుడిని రక్షించారు. కొసమెరుపు ఏమిటంటే ‘ఆ రేరాణి పత్రికను నాకోసారి ఇస్తారా? ఇంకోమాటు ఆ కథను చదువుకుంటాను’ అని ఆ జడ్జిగారే ఆ యువకుడి వద్దకు వచ్చి అడిగితీసుకున్నాడు. మరో 65 ఏళ్ల తర్వాత ఆ యువకుడే తన 86 ఏళ్ల వయస్సులో తన సమగ్ర సాహిత్యానికిగాను ఇండియన్ నోబెల్‌గా అభివర్ణించే జ్ఞానపీఠం ఎక్కాడు. అవును, అతడే రావూరి భరద్వాజ.

కేవలం 7వ తరగతి వరకే చదివిన భరద్వాజ 1943లో తన 17వ యేటనే ‘వీరగాధ’ అనే గ్రాంధిక నవల ద్వారా తెలుగు సాహిత్యంలోకి ప్రవేశించారు. స్వతహాగా కథకుడైన తన తండ్రి కోటయ్య, అమ్మమ్మ మొగులూరి సుబ్బమ్మల ప్రభావంతో జన్మతః కథలపై మక్కువ ఏర్పరచుకున్నారు. సుప్రసిద్ధ కథకుడు జీవన్ ప్రభాత్ (ప్రపంచ స్థాయి రచన ‘అస్థిపంజరాల తిరుగుబాటు’ రచయిత) పొగాకు కంపెనీలో ఉద్యోగ నిమిత్తం భరద్వాజ స్వస్థలం తాడికొండకు రావటం భరద్వాజకు వరమైంది. జీవన్ ప్రభాత్ ప్రోత్సాహంతో చలం సాహిత్యం మొత్తం చదివేశారు. 1946 ఆగస్టు 4న ‘ప్రజామిత్ర’ వారపత్రికలో భరద్వాజ తొలి రచన ‘విమల’ అచ్చయింది.

భరద్వాజ రాసిన ‘రాగిణి’ కథాసంపుటికి చలం పీఠిక రాస్తూ- ‘చలం పుస్తకాలు వారసత్వం కావనేదే కాకుండా, ఏ భాషకన్నా తలవంపులు అం టారు ప్రాజ్ఞులు. అలాంటి దుష్టసంప్రదాయం చలంతోనే ఆఖరు కాక భరద్వాజ వంటి రచయిత ద్వారా పెర్‌పెట్యుయేట్ కాబోతుందంటే చాలా నిరాశ పడుతుంది ఈ దేశపు భావి నిర్ణయ సారస్వత ప్రభువులకు’అని వక్కాణించారు. ‘హెరాల్డ్ ట్రిబ్యూన్’- న్యూయార్క్ పత్రిక 1952లో ప్రపం చ కథల పోటీని నిర్వహించినపుడు భరద్వాజ వ్రాసిన ‘పరిస్థితుల వారసులు’ అనే కథను కూడా ఎంట్రీకి స్వీకరించారు. అయితే పాలగుమ్మి పద్మరాజు రాసిన ‘గాలివాన’కు బహుమతి వచ్చింది. అయితే ఆ కథకు ఏమాత్రం తీసిపోని కథలుగా విశ్వసించి అప్పటి ‘భారతి’ పత్రిక వారు ప్రచురించిన నాలుగు కథలలో ‘పరిస్థితుల వారసులు’ కూడా ఉంది. ఆ రోజుల్లో కథకు ఎక్కువ ప్రతిఫలం తీసుకున్న నలుగురైదుగురు రచయితలలో భరద్వాజ ఒకరు.

1952లోనే భరద్వాజ ‘చిత్రగ్రహ’ నవలికను రాశారు. (అప్పటికింకా చంద్రునిపై మానవుడు కాలుమోపనేలేదు.) ఒక అమెరికా దేశీయుడు, ఒక వంగ దేశీయుడు, ఒక తెలుగువాడు చంద్రమండలం బయలుదేరి మార్గమధ్యంలో ‘శశూన్’ అనే ఇంకో గ్రహంలో అడుగుపెట్టడాన్ని రాశారు. అందులో ‘కామినీ కాంచనాల కోసం ఒకరి నొకరు దారుణంగా నరుక్కు చచ్చే ఈ భూమండలాన్ని చూసి సిగ్గుపడుతున్నాను’ అంటారు రచయిత ఒకచోట.

‘నా ఊహలకే అందని కవి భరద్వాజ ఒక్కరే’ అంటారు విశ్వనాథ సత్యనారాయణ. ‘తెలుగు జాతి గర్వించదగ్గ కొద్దిమంది రచయితల్లో భరద్వాజ ఒకరు’ అని త్రిపురనేని గోపీచంద్ అంటారు. ‘ఒక విషయం ఆధారంగా కథ చెప్పడం సులువు. కానీ కెమెరాతో చిత్రీకరించినట్లు డాక్యుమెంటరీలా రాయడం చాలాకష్టం. చార్లెస్ డికెన్స్ ఆ పనీ చేశారు. నాకు తెలిసినంతవరకూ తెలుగులో 1830లో ‘కాశీయాత్రా చరిత్ర’ అనే రచనలో యేనుగుల వీరస్వామయ్య తను చూసినవి చూసినట్టు డాక్యుమెంటరీలా అక్షరబద్ధం చేశారు. అలాంటి క్రియేటివ్ రైటింగ్ స్థాయి భరద్వాజలోనే ఉంది. చెకోవ్‌లా కేవలం జీవిత శకలాలే ఫోటోగ్రఫీ చేసినట్టు, వీడియోలో బంధించినట్టు చూపే సామర్థ్యం భరద్వాజ సొంతం’ అని శ్రీశ్రీ కొనియాడారు. ‘సామాన్యులను అర్థం చేసుకున్న అసామాన్యుడు, మనుష్యులను తెలుసుకున్న మహామనీషి’ అని కితాబునిచ్చారు దాశరథి. కేంద్ర సమాచార శాఖ ఆధ్వర్యంలోని ఆలిండియా రేడియోలో 1987లో ప్రసంగ కార్యక్రమాల ప్రయోక్తగా చిన్న ఉద్యోగిగా ఉద్యోగ విరమణ చేసిన భరద్వాజను అదే కేంద్ర సమాచార శాఖ ఆధ్వర్యంలో వెలువడే ‘యోజన’ పత్రికలో, (కేవలం రాష్ట్రపతి, ప్రధాని లాంటి వారి ముఖచిత్రాలకు మాత్రమే అనుమతి ఉన్నా) ‘ఈ శతాబ్దపు గొప్ప రచయిత డాక్టర్ రావూరి భరద్వాజ’ అంటూ పట్నాల సుధాకర్ సంపాదకత్వంలో సుదీర్ఘ వ్యాసం రావటం అప్పట్లో సంచలనం. ‘ఉత్తమ సాహిత్యానికి జ్ఞానపీఠ్, నోబెల్ బహుమతి లాంటి అవార్డులే కొలబద్దలయితే ఆ అవార్డులను అందుకునేందుకు అర్హతలను మించిన ఉత్తమ సాహిత్యాన్ని భరద్వాజ మనకందించారు’ అంటూ ఆ వ్యాసం ముగించారు.

చాలామంది కవులు తమ రచనలలో విశ్వరూపాన్ని ప్రదర్శిస్తారు. కానీ వ్యక్తిగత జీవితంలో మరుగుజ్జుగా కనిపిస్తారు. కానీ అందుకు అపవాదుగా నిలుస్తారు భరద్వాజ. ‘రాత కూతల కన్నా, చేత ముఖ్యం’ అంటారు. ఇంకొకరికి సుభాషితాలు చెప్పటం కన్నా మనం ఏదైనా సత్కార్యం చెయ్యటం మంచిది. మనం మంచి చేసినా అందులో ఏదో స్వార్థం ఉంటుందని వెతికేవారు, విమర్శించేవారు ఎపుడూ ఉంటారు. వంద నీతి వాక్యాల కన్నా, ఒక చిన్న సత్కార్యం ఎంతో గొప్పది అంటారు.

1977లో దివిసీమ మీద తుఫాను విరుచుకుపడినపుడు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం తరఫున భరద్వాజ పర్యటించి వందలాది బాధామయ గాధలలో కొన్నింటిని మాత్రమే ధ్వనిబద్ధం చేసి రేడియోలో ప్రసారం చేసినప్పటికీ.. ఇంకా మిగిలిపోయిన ఎన్నో కుటుంబాల విధ్వంస కథలను అక్షరబద్ధం చేసి ‘ఈనాడు’ పత్రికలో ప్రకటించగా రాష్ట్రం నలుమూలల నుండి అందిన విరాళాల ద్వారా రామకృష్ణమఠం నిర్వాహకుల ద్వారా అక్కడ సహాయ చర్యలు చేపట్టారు. తుఫానులో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన ‘పాలకాయతిప్ప’ అనే మొత్తం గ్రామం తిరిగి పునర్నిర్మించబడిందంటే దానికి ముఖ్యకారణం ‘అనుభవాలకే తప్ప అక్షరాలకు అందని’ గాధలను అక్షరబద్ధం చేసిన రావూరి భరద్వాజయే! 1978లో ఈనాడులో ‘జీవన సమరం’ శీర్షికన హైదరాబాద్ నగరంలో రోడ్డు పక్కన పిడకలు చేసి బతుకు సాగించే పోశమ్మ అనే ముసలమ్మ దీనగాధను అక్షరబద్ధం చేశారు. ‘దేవుడు సచ్చినోడు ఆకలి ఎందుకు పెట్టాడో తెలియదు- పాడు ముండాకొడుకు.. సంద్రాలు నిండుతున్నాయి గానీ ఈ జానెడు పొట్ట నిండడం లేదు బిడ్డా!’ అంటుంది పోశమ్మ.

ఈమె గాథకు చలించిన ఓ కాలేజీ విద్యార్థి ఆ పత్రికా కార్యాలయానికి ఉత్తరం ద్వారా 10 రూపాయలు పంపించి పోశమ్మకు అందజేయమని తెలియజేశాడు. ఆ పది రూపాయలు పోశమ్మకు ఇవ్వాలని ఆమె ఉండే రోడ్డుకు వెళ్లి భరద్వాజ వాకబు చేయగా పోశమ్మ చచ్చిపోయిందని అక్కడివాళ్లు చెప్పగా నోటును, ఉత్తరాన్ని గుండెను కదిలించే జ్ఞాపికలుగా చివరి వరకూ భరద్వాజ దాచుకున్నారు.
కేవలం ‘పాకుడురాళ్లు’ నవలకే జ్ఞానపీఠ పురస్కారం లభించిందని సర్వత్రా వినిపిస్తుంది. ఇది నిజం కాదు. 1970లో విశ్వనాథ ‘రామాయణ కల్పవృక్షా’నికీ, 1988లో డా.సి.నారాయణరెడ్డికి ‘విశ్వంభర’కూ పురస్కారం లభించినపుడు జ్ఞానపీఠ్ కమిటీ నిబంధనల ప్రకారం ఒక్క పుస్తకానికే పురస్కారం ఇచ్చేవారు. కానీ నేడు ఏదేని ఒక గుర్తింపు పొందిన భాషలో ఒక రచయిత చేసిన మొత్తం రచనలకు పురస్కారం ఇస్తున్నారు. కేవలం పాకుడురాళ్లు నవలకే పురస్కారం వచ్చింది అనే ప్రచారం వల్ల భరద్వాజ రాసిన అద్భుత సాహిత్యం వెలుగులోకి వచ్చే అవకాశమే లేదు. జ్ఞానపీఠ కమిటీ వెలువరించిన పత్రికా ప్రకటనలో భరద్వాజ రచించిన ఉత్కృష్ట రచనలుగా ఉదహరించిన కొన్ని రచనలలో ‘పాకుడురాళ్ళు’ పేరు ఉంది. ‘పాకుడురాళ్లు’ ప్రచురించిన ప్రచురణ సంస్థ కూడా తమ నవలకే జ్ఞానపీఠం వచ్చింది అని ముఖచిత్రంపై పేర్కొన్నది.

ప్రస్తుతం భరద్వాజ రచనలు ‘స్మృతి సాహిత్యం, జీవన సమరం, పాకుడురాళ్లే’ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. చలం తన ‘మైదానం’కు సరితూగ గల రచన ‘శిథిల సంధ్య’ (1951)యే అన్నారు. మరి ఆ శిథిల సంధ్య ఎంతమందికి తెలుసూ? కాబట్టి భరద్వాజ రచనలన్నింటినీ పునర్ముద్రింపజేసి భావితరాలకు అందజేయాలి.
-బొగ్గుల శ్రీనివాస్
92465 51144

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వెండి తెర బంగారం

venditera bangaram

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నా దారి తీరు -46 స్పాట్ లో సరిగమలు

    నా దారి తీరు -46

స్పాట్ లో సరిగమలు

రోజూ తిరగలేక పోతే బందర్లో బాలమ్మ గారింట్లో ఉండి పోయే వాడిని .వాళ్ళ హాలులో ఒక చోట నా బాగ్  పెట్టుకొని స్నానం అవీ అక్కడే చేసే వాడిని బాలమ్మ గారు నాకు ఉదయం రోజూ కాఫీ ఇచ్చేవారు .సాయంత్రం స్పాట్ నుంచి రాగానే టీ ఇచ్చ్చే వారు .ఆవిడ భర్త ‘’పీచు గారు ‘అనబడే రెంత చింతల సోమయాజులు గారు ,వారి పిల్లలు అందరు ఎంతో ఆప్యాయం గా ఉండేవారు ఎంతో మర్యాద చూపేవారు .ఉదయం రాత్రి హోటల్ లో భోజనం టిఫిన్ చేసే వాడిని .ఇంట్లో భోజనం చేయమని బల వంత పెట్టె వారు కాని సాధ్యమైనంత వరకు వారికి ఇబ్బంది కలిగించే వాడిని కాదు ‘’అన్నయ్య గారూ ‘’అని బాలమ్మ గారు పిలిచే పిలుపు లో ఎంతో ఆత్మీయత కని పించేది .పిల్లలంతా మామయ్యగారూ అని పిలుస్తూఉండే వారు  ఒక రకం గా వారింట్లో సభ్యుడనై పోయాను .స్పాట్ అయి పోయినతర్వాత బందరు లడ్డు లాంటివి కొని ఇచ్చి వచ్చేవాడిని .ఎప్పుడు బందరు వెళ్ళినా నా పనులయిన్తర్వాత ఒక సారి వారింటికి వెళ్లి పలకరించి రావటం ఒక అలవాటై పోయింది .ఏంతో  సంతోషించే వారు .బాలమ్మ గారు మా అబ్బాయిల పెళ్లిళ్లకు వచ్చేవారు .అలాగే నా గాడ్ ఫాదర్ అయిన ఆర్ ఎస్.కే గారిని కూడా కలిసి వచ్చేవాడిని .ఆయన ‘’జాగృతి ‘’వార పత్రికలో సినీ సమీక్ష చేశే వారు. ఆ ఒరవడి అద్భుతం గా ఉండేది .ఈ విషయం లో నేను ఆయన ఫాన్ ను .ఆయన ఆర్.ఎస్.ఎస్ ,జనససంఘ ,బి జెపి లకు చాలా సన్నిహితులు .వార్తలకోసం ధిల్లీ మొదలైన చోట్లకు వెళ్లి వార్తలు సేకరించేవారు .ఒక లోక సభ ఎన్నికలో బి జెపి కూటమి అత్యదిక  సీట్లు గెలుస్తుందని రాశారు నాకున్న అవగాహనా బట్టి రావని ఆయనకు ఉత్తరం రాశా .నిజం గానే నేను చెప్పిందే నిజమైంది .అప్పుడు ఆయన ఫోన్ చేసి ‘’ప్రసాద్ గారూ !మీరే కరెక్ట్ నా అంచనాలు తప్పాయి ఐ యాం సారీ ‘’అన్నారు .‘’అదీ నిజాయితీ . అందుకే ఆయన నా ఆరాధ్యులై పోయారు

స్పాట్ లో కొన్ని చారిత్రాత్మక సంఘటనలు జరిగాయి .హెడ్ మాస్టర్స్ అసోసి ఏషన్  మీటింగ్ అరుగుతూ ఉండేది మేము హెడ్ మాస్తార్లం కాక ముందు కూడా దాని ప్రెసిడెంట్ సోమంచి రామం గారు మమ్మల్నీ రమ్మని పిలిస్తే వెళ్ళే వాళ్ళం .జరిగే తీరు తెన్నులు చూసే వాడిని .కాని అయన అందరు హెడ్ మాస్టర్లకు మీటింగ్ ఉంది అని చెప్పినా పట్టు మని పది మంది కూడా హాజరయ్యే వారు కాదు .పాపం ఆయనకు విసుగు కోపం వచ్చేది .కాని తమాయించుకొని సంఘం పరిస్తితిని మాకు వివరించి బాధ పడేవారు . మేము హెడ్ మాస్టర్లం  కాదు కనుక ఏమి చెయ్యగలం ?మేము హెడ్ మాస్టర్లం అయిన తర్వాత అసోసి ఏషన్  ను బలోపేతం చెయ్యాలని చాలా ఆలోచించాం మేము హెడ్ లం అయిన కొత్తలో రామం గారు రిటైర్ అయి నాలుగైదు మంది సంఘానికి ప్రేసిడెంట్లు వచ్చారు కాని ఎవరూ నిలబడలేదు .ఆరు నెలలో మూడు నెలలో ఉండి  తప్పుకొనే వారు సంఘం మరీ కుదేలయి పోయింది .అప్పుడు ఒక సారి నా దగ్గర అసిస్టంట్ గా స్పాట్ లో ఇంగ్లీష్ పేపర్లు దిద్దిన ఆదినారాయణ ,పెదముత్తేవి హెడ్ మాస్టర్ నేను అలోచించి ఏమైనా సంఘానికి గొప్ప స్తానం కల్పించాలని అనుకొన్నాము అతను చురుకైన వాడు .అప్పుడు పటమట హైస్కూల్ హెడ్ మిస్త్రేస్ ప్రామీలా రాణి గారితో కూడా చర్చించాం ఆవిడా సరే అంది .రామం గారితో మాట్లాడాం దీనికి మొత్తం బాధ్యత తీసుకొన్నది నేనూ ఆదినారాయాణనే.మిగిలిన వారందరికీ చెప్పాం అందరు మంచి అసోసియేషన్ ఏర్పడాలనే భావించారు . నా ఆలోచన ప్రకారం ప్రమీలా రాణి ప్రెసిడెంట్ గా ,ఆదినారాయణ కార్య దర్శి గా సంఘం ఏర్పడాలని అందర్నీ ఒప్పించాం .

అందరం ఒక రోజు సాయంత్రం స్పాట్ అయిన తర్వాత అందరిని హాజరయ్యేట్లు చేసి ఉండిపోయేట్లు చేశాం అందరు ఉన్న్నారు ఇదే మొదటి సక్సెస్ అను కొన్నాం.నా ప్రపోసల్ ను అందరికి చెప్పాను అందరు ఏక గ్రీవం గా దాన్ని ఎండార్స్ చేశారు అంతే రామం గారు సభాధ్యక్షుడి గా  వీరిని ఎంనుకోన్నాం  నన్ను ఉపాధ్యక్షుడిని చేశారు కార్య వర్గాన్ని ఉత్సాహ వం తులతో వారి అనుమతి పై తీసుకొన్నాం .అప్పుడు డి.యి ఓ .గారు నూకల శ్రీరామమూర్తి గారు .ఏంతో  సాదు స్వభావులు .మంచి చేయాలనుకొనే వారు సమర్ధుడైన పరిపాలకుడు గా పేరు పొందారు అంతకు ముందు ఒక సారి ఈ జిల్లాలో గజెటెడ్ ఇన్స్పెక్టర్ గా పరిషత్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గా అద్భుతమైన రికార్డ్ తో పని చేశారు ఆయన వెంటనే దీన్ని సమర్ధించారు .

అప్పుడు కామన్ ఎక్సామినేషన్  బోర్డ్ సేక్రేటరి గా బేజ వాడ హిందూ హైస్కూల్ హెడ్ మాస్టర్ నరసింహా రావు గారున్దేవాడు అది ప్రైవేట్ హైస్కూల్ .ఆయన టెస్ట్ పేపర్లు ,క్వార్టర్లీ ,హాఫ్ యియర్లీ, యాన్యువల్ పేపర్లను ముందే లీకయెట్లు  అమ్మి సొమ్ము చేసుకొనే వాడు .మా అందరికి చాలా అసహ్యం గా ఉంది  .అంతే కాదు జిల్లా పరిషత్ స్కూళ్ళు ఎక్కువ జిల్లాలో .అందుకని వీరి వల్ల  ఆదాయం కూడా కూడా ఎక్కువ .అందుకని జిల్లా పరిషత్ హెడ్ మాస్టర్  సెక్రటరి షిప్ రావాలని మేమందరం అనుకొనే వాళ్ళం నూకల వారు రావటం వాళ్ళ ఇది  సులు వైంది వారికీ ఈ విషయం చెప్పాం .ఆయన నవ్వి సరే చూద్దాం అన్నారు ఇది తెలిసిన నరసింహా రావు గారు ఒకసారి నా దగ్గరకొచ్చి తనకే ఆ పదవి కావాలని చాలా బల వంత పెట్టాడు ఎవరికి చెప్పినా ఒప్పుకోలేదు అందరూ దుర్గా ప్రసాద్ ను ఒప్పిస్తే మాకేం అభ్యంతరం లేదు అని తప్పించుకొన్నారు .నేను ససేమిరా అ న్నాను .నాకు ఆది నారాయణ సపోర్ట్ .నూకల వారు స్పాట్ అయి పోగానే వేసవి సెలలవలలో తన కున్న పవర్ ఆధారం గా ప్రమీలా రాణి గారిని సి.యి.బోర్డ్ సెక్రెటరి గా నియమించి కార్య వర్గాన్ని ఆమెనే వేయమన్నారు ఆమె తనకు తెలిసిన మా తో సంప్రదించి మంచి వారిని ఏర్పరచుకోంది హెడ్ మాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ,దీనికి సెక్రటరి కూడా అవటం వాళ్ళ ఏంతో  సౌలభ్యం ఏర్పడింది మేము అనుకొన్న వన్నీ సాధించుకో గలిగాం .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-10-13- ఉయ్యూరు

 

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

ఉయ్యూరు కాలేజి వర్షం నీరు నిలిచి ‘జల సముద్రం ‘ గా

DSCF4551 DSCF4552 DSCF4553 DSCF4554 DSCF4555 DSCF4556 DSCF4557

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

వేయి పడగలు –రేడియో నాటకం -12వ భాగం

వేయి పడగలు –రేడియో నాటకం -12వ భాగం

ఈ రోజు శని వారం ఉదయం ఎడుమ్బావుకు హైదరాబాద్ ఆకాశ వాణి కేంద్రం  తొలి తెలుగు జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత విశ్వనాధ సత్యనారాయణ గారు రచించిన వేయి పడగలు నవలకు నాటకీ కరణం చేసిన పన్నేండవ భాగం విన్నాను .ముందు మాట చెప్పినవారు మన రాష్ట్రం లోని జానపద కళా రీతులను తెలుగు చదువుల స్థానం లో ఆంగ్ల భాష ప్రాచుర్యం పొందుతున్న రీతికి అంతరించి పోతున్న సంస్కృతికి ధర్మానికి ప్రతీక వేయి పడగలు అని చెప్పి దీనినొక అద్భుత రసమయ కావ్యం లా నవలా సొగసులతో తీర్చి దిద్దిన విశ్వనాధ సహస్ర ముఖ మేధో వికసనం గా అభి వర్ణించారు జన జాగృతి చేశారని చెప్పారు .

ఈ నాటి ఈ భాగం లో హరప్ప  సుబ్బన్న పేట లో లో జరుగుతున్నజానపద కళా రీతుల ప్రదర్శన చూస్తాడు ,ప్రక్కనే ధర్మా రావు కూర్చుంటాడు  చిన్న రాజా వారిని తండ్రిగారి అనుమతి తీసుకొని వచ్చారా అని అడుగుతాడు దానికి ఆ కుర్రాడు ఇలాంటి వాటికి అనుమతి ఎందుకని ,అయినా అనుమతి పొందే వచ్చానని ,ముందు  తండ్రి వద్దని వారిన్చాడని కాదు వెళ్తాను అంటే అప్పుడు ‘’ఆమె ‘’వైపు అదోలా చాశాడని ఆమె ఇంగ్లీష్ సంగీతం లో లీనమై అదోలా చూసిందని అప్పుడు అయిష్టం గానే సరే వవెళ్ళ మన్నాడని సవివరం గా తెలియ జేస్తాడు ఇక్కడ తన తండ్రి రెండో పెళ్లి చేసుకొన్నా ఆవిడను పిన్ని అనకుండా అదేదో అసహ్యం భావం తో ‘’ఆమె ‘’అని తనకున్న అభిప్రాయాన్ని బయట పెట్టాడు .’’మీ ప్రక్కన కూర్చో వచ్చా? /’’అని ధర్మను అడిగితే ‘’అదేమిటి బాబు నా ఒళ్లో కూర్చోవలసిన వాడివి .నాకు తామ్ముడు లాంటి వాడివి ‘’అని ఆప్యాయతను వర్షిస్తే హరప్ప దానిలో తడిసి ముద్దా అయ్యాడు ఇదీ ఆరాధనా భావం అతను కళల కు చూపిస్తున్నఆసక్తికి నిదర్శనం .తండ్రి .

వారి సంభాషణ లో పాముల వాళ్ళ ప్రదర్శన ప్రసక్తి వస్తుంది పాములాడించే వాడు వివిధ రకాల పాముల్ని వాటి విషాలను గురించి కాటు వేస్తె నివారణ గురించి చాలా వివరం గా చెప్పటం చూసి వాటిని ఆడించిన తీరును చూసి సంభ్రమాశ్చర్యాలతో మునిగి పోయాడు .అప్పుడు ధర్మా రావు ‘’వాడు చెప్పిన విషయాలు ఒక రిసెర్చ్ ప్రొఫెసర్ చేసిన పరిశోధనను తల దన్నేలా ఉందని అలాంటి వాడి ప్రతిభాకు  ఏ యూని వర్సిటి గుర్తించని ,తగిన ప్రోత్సాహమివ్వదనిఅతను బాధ పడ్డాడు  నిజమే నంటాడు హరప్పా . ఎట్సన్ డోరా దొర మన కళల ప్రామాణ్యాన్ని ఎంతో మెచ్చాడని కూడా తెలియ జేస్తాడు

మర్నాడు ప్రహ్లాద నాటకం చూడాలని ఉందని అన్నబుల్లి రాజా వారిని తండ్రి అనుమతి తీసుకొని రమ్మని హెచ్చరించాడు .అలాగే మర్నాడు వచ్చాడు తండ్రి అంత తేలిగ్గా ఒప్పుకోలేదని ,మన సంస్థానం లోనే దాన్ని ప్రదర్శింప జేద్దామని అప్పుడు చూడచ్చు అని అన్నాడని కాని అంత దాకా ఆగలేక వచ్చానని అన్నాడు .ప్రహ్లాదుడు మహా భక్తుడని ధర్మం కోసం అసలైన చదువు కోసం అలమటించిన బాలుడని ఎన్నో బాధలు తండ్రి చేతుల్లో అనుభవించాడని అన్నిటికీ శ్రీ హరే ఉన్నాడని త్రికరణ శుద్ధిగా నమ్మాడని అలానే విష్ణువు అతన్ని కాపాడాడని చివరికి స్తంభం లో ఉన్న హరి నరసింహ రూపం లో ప్రత్యక్ష మైనట్లు నాటకం లో చూపారు .నరసింహ పాత్ర దారి హిరన్య కశిపుడిని చంపిన సన్నివేశం లో వెంటనే కొందరు వచ్చి హారతి ఇచ్చి శాంతింప జేశారు ఇలా ఎందుకు చేశారని కుతూహలం గా హరప్పా అడిగాడు దానికి ‘’ఒకప్పుడు నరసింహ పాత్రను తండ్రి హిరణ్య కశిపుడు పాత్రను కొడుకు వేశారని తండ్రిపాత్రదారి పాత్రలో లీనమై పోయి ఇనుప గోళ్ళతో నిజం గానే కొడుకు హిరణ్య క్షిపుడిని చీల్చేశాడని అప్పటి నుంచి ఈ జాగ్రత్త తీసుకొంటున్నారని చక్కని సమాధానం చెప్పి అతని లో ఉన్న కుతూహలాన్ని మెచ్చాడు

అలాగే దమయంతి రెండవ స్వయం వరం లో ఆమె వయస్సు ఎంత అని ధర్మ ను అడిగితే అతని తెలుసుకొనే కోరికను ఆహ్వానించి 34 అని చెప్పాడు . తనకు బందరు జాతీయ కళా శాలలో తెలుగు లెక్చరర్  పోస్టింగ్ వచ్చిందని చెబితే ‘’జీతం ఎంత ?/’’అని అడిగితే ‘’ముప్ఫై రూపాయలు అని చెప్పాడు .మరి తనకు ఇంగ్లీష్ ను రోజుకో గంట మాత్రమె బోధించే ఈట్సన్ దొరకు నెలకు పన్నెండు వందలు ఇస్తున్నారని బాధగా అంటాడు హరప్పా .అంటే మన చదువులు చెప్పే వారిని చాలా తేలిగ్గా చూస్తున్నారని ,పరాయి భాష చెప్పే వారిని నెత్తిన కెత్తుకొని చాల ఎక్కువ జీతం  ఇస్తునారని ఆ చిన్న బుర్ర ఆలోచించ గలిగింది ఇతనే భవిష్యత్తులో దివాణాన్ని సంస్కరించ గల ఆశా దీపం అని తెలియ జేస్తాడు విశ్వనాధ

ఇట్లా ఈ భాగం లో మన జానపదకళకు కూచి పూడి నాట్యానికి నాటకానికి పెద్ద పీటవేసి వీటిని అందరు సమాదరించాల్సిన అవసరాన్ని గుర్తు చేశాడు కవి సామ్రాట్ .నాటకం లో అందరు సమర్ధ వంతం గా తమ పాత్రలను పోషించి న్యాయం చేకూర్చారు .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-10-13 –ఉయ్యూరు

Posted in రేడియో లో | Tagged | Leave a comment

నిజాం ఆంధ్రులకు శ్రీ సురవరం ప్రతాప రెడ్డి గారి ఉద్బోధ 8 1 1938 ఆంధ్ర పత్రిక

From: Ramineni Bhaskaredra Rao <bhaskarrsd@gmail.com>
Date: 2013/10/26
Subject: నిజాం ఆంధ్రులకు శ్రీ సురవరం ప్రతాప రెడ్డి గారి ఉద్బోధ 8 1 1938 ఆంధ్ర పత్రిక
To:

నిజాం  ఆంధ్రులలో ప్రముఖుడు శ్రీ సురవరం ప్రతాప రెడ్డి గారు ఆంధ్ర భాష, ఆంధ్ర సంస్కృతి,
ఆంధ్ర వ్యక్తిత్వం సంరక్షించడం  గూర్చి, ఆంధ్రులలో ఐకమత్యం గురించి, నిజాం రాజ్యంలో 
తెలుగు చదువుకోవడానికి, పాటశాలలు నడపడానికి గల నిర్భందాలను ఈ ఉపన్యాసంలో
తెలియచేశారు.  ఈ మద్య నిజాం గొప్పతనాన్ని గూర్చి కొందరు పత్రికలలో పొగడుతున్న 
విధానానికి పూర్తి వ్యతిరేక దిశలో శ్రీ రెడ్డి గారి  అభిప్రాయం ఉన్నది. గమనించగలరు. ఆ 
నాటి నిజాం చట్టాల ప్రకారం ప్రజలకు వాక్స్వాతంత్రం కూడా లేదని గమనించాలి.  
Inline images 1

 

Posted in సేకరణలు | Leave a comment

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -2

     విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -2

                          అలనాటి మన గణిత శాస్ట్ర జ్నులు

                                    మేధా తిధి

              ప్రాచీన భారతం లో గణిత శాస్త్రం కోసం కృషి చేసిన మొదటి శాస్త్ర వేత్త మేధా తిధి .ఈయన్ శ్రుత పాండిత్యం వల్లనే గణితాన్ని విస్తరించాడని వరాహ మిహిరుడు ,ఆర్య బహ్ట్టు భాస్కరా చార్యులు ,బ్రహ్మ గుప్తాదులు తమ గ్రంధాలలో పేర్కొన్నారు .ఈయన కాలం ఎవరి తెలియదు .అన్కగానితాన్ని ఒక క్రమ పద్ధతిలో సమకూర్చాడని తెలుస్తోంది .గణితానికి ఆయువు పట్టు అయిన ‘’సూచకాలు ‘’(ఆనవాళ్ళు )ను గురించి ఆలోచించిన మొదటి గణిత మేధావి మేధా తిధి.ఆయనది సృజనా శీలత్వం .

                          ఆర్య భట్టు

  క్రీ.శ. .475-550 కాలపు కేరళ దేశస్తుడు ఆర్య  భట్టు .495 లో ‘’ఆర్య భటీయం ‘’ రాశాడు .తిరు వంచి పురం లో పుట్టాడు ఇందులో అంక గణిత బీజ గణిత ,త్రికోణ మితి ,ఖగోళ శాస్త్ర అధ్యనాలను గురించి రాశాడు .’’పై ‘’విలువ ను త్రిభుజ వృత్త వైశాల్యాలను కనుగొనే సూత్రాలను కనుక్కొన్నాడు .గోళం పిరమిడ్ ,ఘనం ల  పరిమాణాలను కనుక్కోనటానికి ప్రయత్నించాడు మహా మేధావి గా గుర్తింపు పొందాడు .సమ చతుర్భుజం ,రూట్ లను కానీ పెట్టె సూత్రం కనుక్కొన్నాడు .ఈ నాటి sine కు సంస్కృతం లో‘’జ్యాఅని పేరు పెట్టాడు .దీని టేబుల్స్ తాయారు చేశాడు దీన్నే అరేబియా వాళ్ళు ‘’జిబా’’అన్నారు ఇది సరైన అర్దాన్నివ్వటం లేదన్నారు చాలా మంది .తర్వాతలాటిన్ లో దీన్ని సైనస్ అన్నారు .చైనా లో జ్యా ను ‘’మింగ్’’గా అనువదించారు . ‘ఆర్యభట్ నలంద విశ్వ విద్యాలయాచార్యుడుగా ఉన్నాడు బీహార్ లో ”తరం గణ ”లో ఆస్త్రోనామికల్ అబ్సర్వేటరి  ఏర్పరచాడు పదమూడు శ్లోకాల గీతికా పాద ,33శ్లోకాల గణిత పాద ,25పాదాల కాలక్రియ పాద ,50 శ్లోకాల గోల పాద రాశాడు గుప్తులకాలం వాడు  550లో మరణించాడు  

 

 220px-2064_aryabhata-crp

 

 

        పూనా లో ఆర్య భట విగ్రహం 

 

                             వరాహ మిహిరుడు

     క్రీ.శ 550-587 –కాలం నాటి ఉజ్జయినీ వాసుడు వరాహ మిహిరుడు .గణితం ఆధారం గా ఖగోళ పరిశోధనలు నిర్వహించాడు .గణిత శాస్త్రం అన్ని శాస్త్రాలకు ప్రాతి పదికగా ఉందని ప్రచారం చేశాడు .ఈయన రాసిన పుస్తకాలలో గణిత ,ఖగోళ శాస్త్ర అంశాలు కలిసే ఉంటాయి .కేవలం ఖగోలానికి సంబంధించిన ‘’పంచ సిద్ధాంతం ‘’,రాస్తే గణితానికి బృహజ్జాతకం ,బృహత్ సంహిత లలో పెద్ద స్తానాన్ని కల్పించాడు .మాల్వ రాజు విక్రమాదిత్యుని ఆస్తానం లో ఉన్నాడు ”బృహత్ సంహిత ”అనే విజ్ఞాన సర్వస్వాన్ని నిర్మించాడు ఖగోళం పై పదకొండు పుస్తకాలు రాశాడు ఆయన రాసిన బృహత్ జాతకం, బృహత్ వివాహ పటలి లగ్న వారాహిఇప్పటికీ జాతక చరిత్రలో ప్రముఖ స్తానం లో నే ఉన్నాయి  ఈయన కొడుకు ప్రతూషుడు ”హోర సార ”గ్రంధం రాశాడు మిహిరుడు587లో మరణించాడు 

     

 

 

                               భాస్కరా చార్యుడు

          క్రీ.శ.550-630 కాలం వాడిన భాస్కరా చార్యుడు కేరళలోనే జన్మించాడు కాని మరాఠీ గణి తుడుగా ప్రసిద్ధి .’’sine ‘’కు సంబంధించిన టేబుల్స్ మొదటి సారిగా వివరించిన మేధా సంపన్నుడు .’’మహా భాస్కరీయ ‘’గ్రంధం లో గణిత ,ఖగోళ శాస్త్రాలను మేలవించాడు .’’ఆర్య భాతీయ భాష్యం’’లో  ఆర్య భట్టు సూత్రాలను అభి వృద్ధి చేసి వివరించాడు  ‘’దశాంశ పద్ధతిని కనుక్కొన్నాడు సున్నాకు ”0”గుర్తును ఉపయోగించిన మొదటి వాడు .మహా భాస్కరీయ ,లఘు భాస్కరీయ అనే ఖగోళ గ్రంధాలు రాశాడు  

 

 th (3)

 

 

 

                         మహా వీరాచార్యుడు

 బ్రహ్మ గుప్తుని తరువాతి కాలం వాడు క్రీ.శ 595 లోపంజాబ్ లో జన్మించాడని తెలుస్తోంది కొందరు ఈయన కాలాన్ని850గా భావించారు జైన గణిత శాస్త్ర వేత్త .మైసూర్ లో ఉండేవాడు .రాష్ట్ర కూటరాజు అమోఘ వర్షుని ఆస్తానం లో ఉన్నాడు .  జ్యోతిషాన్ని గణితం నుంచి వేరు చేశాడు .   .ప్రాచీన సంస్కృత భాషలో ‘’గణిత సార సంగ్రహం ‘’ను పాఠ్య గ్రంధం గా రాశాడు .వివిధ గణిత సమీకరణాల గురించి చర్చించాడు .వృత్తం అర్ధ వృత్తం రాంబస్ లపై చర్చించాడు  a3=a(a+b)(a-b) +b2(a-b) + b2.[3] అనే సూత్రాన్ని కనుక్కొన్నాడు  rCn as [n(n-1)(n-2)…(n-r+1)]/r(r-1)(r-2)…2*1.[10]  ఫార్ములా తయారు చేశాడు దీర్ఘ వృత్తం అనే ఎలిప్స్ వైశాల్యం కనుగొన్నాడు సంఖ్యా వర్గం ఘనం కను గొనె విధానం చెప్పాడు రుణ సమాఖ్య కు స్క్వేర్ రూట్ ఉండదని చెప్పాడు .భిన్నాల మొత్తాన్ని కంగోనే సులభ సూత్రం చెప్పాడు .  .  జీవితం లో గణితం ఏ విధం గా ఉప యోగ పడుతుందో సామాన్యులకు వివరిస్తూ గణిత శాస్త్రాన్ని అభి వృద్ధి చేస్దాడు .

 

                                    పావులూరి మల్లన్న

       క్రీ.శ .-1019-1061ప్రాంతం వాడిన మల్లన్న తోలి తెలుగు గణిత శాస్త్రజ్ఞుడు రాజమహేంద్ర పురం రాజు రాజ రాజ నరేంద్రుడి ప్రోత్సాహం తో మహా వారాచార్య రాసిన ‘’గణిత సార సంగ్రహం ‘’ ను కవిత్వం గా ‘’సార సంగ్రహ గణితం ‘’స్వతంత్ర అనువాద గ్రంధం గా రాశాడు .దీన్ని ‘’పావులూరి మల్లన్నగణితం ‘’ అని ఆప్యాయం గా పిలుస్తారు .

                              భాస్కరాచార్య -2

      క్రీ.శ.1114-1185 వాడైన రెండవ భాస్కరుడు కర్నాటక మహారాష్ట్ర సరిహద్దు లోని ‘’బీజా పూర్’’లో జన్మించాడు .ప్రపంచ ప్రసిద్ధ ‘’సిద్ధాంత శిరోమణి ‘’అనే మహా అనిత గ్రంధాన్ని రాశాడు .’’జ్యామితి ‘’ని అధ్యయనం చేసి విస్తరించాడు .ఆర్య భట ,బ్రహ్మ గుప్తుల విదానాలనాధారం గా సున్నా విలువను మరింతగా ఆవిష్కరించాడు .న్యూటన్ లీబ్నిజ్ ల కంటేముందే ”కాల్క్యులస్ ”గణితాన్ని స్తాపించాడు .  దిఫెరెంశియాల్ కాల్క్యులస్ ను ఖగోళ గణితానికి వాడాడు ”కారణ కౌతూహల ”గ్రంధం రాశాడు . కాల్క్యులస్ కు న్యూటన్ ,లీబ్నిజ్ లకు పెరోచ్చిన్దికాని భాస్కరాచార్య వారి కంటే ముందే”దిఫెరెంశియాల్ కాల్క్యులస్ ”గణ న సూత్రాలను కనుగొన్నట్లు చాలా ఆధారాలు లభించాయి .”diferential coeficient ,diferential calcus   ”లకు ఆద్యుడు భాస్కరుడే  బీజగణితం రాశాడు అందులో ధన సంఖ్యకు ధన రుణ స్క్వేర్ రూట్ లు ఉంటాయని చెప్పాడు unknown and unknown quantities,surds ,sovetion of indeterminate  equations ,quadratic equations ,products of several unknown లను స్పష్టం గా లెక్కించే విధానం చెప్పాడు Bhaskara derived a cyclic, chakravala method for solving indeterminate quadratic equations of the form ax2 + bx + c = y.[13] Bhaskara’s method for finding the solutions of the problem Nx2 + 1 = y2 (the so-called “Pell’s equation“) is of considerable importance.[9]computations of sines of angles18 and 36  కానీ పెట్టాడు .ఇదె ఇప్పుడు   and గా పిలువా బడుతోంది 

 

 

 

 

          భారతీయ ‘’సూర్య సిద్ధాంతం ‘’లో గ్రీకుల భావనలను ఎంతో దూరం దాటి పోయిన సిద్దాన్తాలున్నాయని ,ఆ తర్వాతా రెండు శతాబ్దాలకు కాని యూరోపియన్లకు అంతు పట్టని విషయాలు భారతీయలు కానీ పెట్టి ఉంచారని ‘’ఎపిస్తోన్ ‘’అనే శాస్త్ర వేత్త పేర్కొన్నాడు .ఆయన రాసిన సిద్ధాంత కౌముది లో infinitesimal calculus nd mathematical analysis,ఉన్నాయి  

  • He gave the result that if  then 
  • the length of thesidereal year, the time that is required for the Earth to orbit the Sun, as 365.2588 days which is same as in Suryasiddhanta.[citation needed] The modern accepted measurement is 365.2563 days, a difference of just 3.5 minutes.[citation needed]ను ఖగోళ సూత్రాలతో కనుగొన్నాడు లీలావతి గణితం భాస్కరాచార్య కృతం 
      నిరంతరం తిరిగే ”యష్టి యంత్రం ”కనీ పెట్టాడు  ఇలా అంకగణిత బీజ గణిత ఖగోళ శాస్త్రాలలోను కాల్క్యుస గణితం లోను అద్భుత మద్భుత కృషి చేసిన రెండవ భాస్కరా చార్య చిరస్మరణీయుడు 
      అద్భుత ఆవిష్కరణలు చేసిన రెండవ భాస్కరా చార్య చిరస్మరణీయుడు 

 

        సశేషం

           మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -26-10-13- ఉయ్యూరు

                     .

                       

Posted in రచనలు | Tagged | Leave a comment

నా దారి తీరు -45 స్పాట్ లో పదనిసలు

                      నా దారి తీరు -45

                         స్పాట్ లో పదనిసలు

      బందరు స్పాట్ లో తమాషా విషయాలెన్నో ఉన్నాయి .తెలుగు పండితులు రోజు సాయంత్రం పూట అయిపోగానే అందరు ఒక రూమ్ లో సమావేశమై ఏదోఒక సాహిత్య కార్యక్రమాన్ని నిర్వహించేవారు .స్వంత కవిత్వాలు విని పించేవారు .మంచి గ్రంధాలను సమీక్షించే వారు వీలైనప్పుడల్లా నేను కూడా వెళ్ళే వాడిని .అందులో పామర్రు తెలుగు సీనియర్ పండిట్ శ్రీ నల్లూరి బసవ లింగం అందర్నీ తన వాక్చాతుర్యం తో అలరించే వారు .ఆయన కంఠ స్వరం అతి మధురం గా ఉండేది అన్ని స్తాయిలలోను పాటలూ ,పద్యాలు ఆలాపించే వారు మేమందరం ఆయన్ను’’అపర ఘంట సాల’’ అనే వాళ్ళం .ముఖ్యం గా తిక్కన రాసిన పద్యాలు భీష్మ సినిమాలోవి అద్భుతం గా పాడేవాడు .హరికధలూ బాగా చెప్పేవాడు.రేడియో ఆర్టిస్ట్ కూడా .ఆనేక కవి సమ్మేళ నాలలో  పాల్గొనే వాడు చిక్కని కండగల పద్యం చెప్పే వాడు మైసూర్ విశ్వ విద్యాలయం లో కన్నడం నేర్చి ఆ భాషనూ ఇక్కడి విద్యార్ధులకు బోధించే వాడు దానికి ఆయనకు స్పెషల్ అలవెన్స్ ఇచ్చేవారు నాకు మంచి దోస్తు .మా సాహిత్య సభలకు కవి సమ్మళనాలకు ఆహ్వానించే వాళ్ళం వచ్చి సుసంపన్నం చేసే వాడు .

          శంకరాభరణం లో ఆండాళ్ళకు సఆధునిక కర్ణాటక సంగీతాన్ని పాఠాలు చెప్పే దాసు, అప్పుడు వచ్చిన శంకారాభరణం శంకర శాస్త్రి అన్న మాటలు సంగీతం గురించి చెప్పిన విషయాలు యదా తదం గా ఒక్క అక్షరం పొల్లు పోకుండా చెప్పేవాడు అందులోని పాటలన్నీ మహా సుందరం గా పాడేవాడు .వీటికోసమే ఆయన్ను ప్రతి స్కూల్ కు పిలిచి పాడించి సన్మానించేవారు నేను అడ్డాడ హైస్కూల్ హెడ్ మాస్టార్ని అయిన తర్వాతా రెండు మూడు సార్లు పిలిచి ఒక సారి ఆయన్ను పిలిచి ఘన సన్మానం చేశాను చాలా పొంగిపోయాడు .నూట పదహార్లు తాంబూలం లో పెట్టి అందించాను . చాలా విశాల హృదయుడు బసవలింగం .ఆయన స్పెషల్ ఒకటి ఉంది .అది ‘’కళా పూర్ణోదయం’’ప్రబంధం లోని కధలను పుస్తకం చూడకుండా అవసరమైన పింగళి సూరన పద్యాలను ఉ దహరిస్తూ అలవోకగా ధారా వాహికం గా కమ్మని స్వరం తో హృదయ రంజకం గా విని పించేవాడు దీనిని ఆకాశ వాణి విజయ వాడ కేంద్రం వారు రేడియోలో ధారా వాహిక గా చెప్పించారు చాలా సభల్లో రోజుల కొద్దీ దీన్ని విని పించారు .అదీ బసవ లింగం ప్రత్యేకం అది ఆయన శైలి కూడా.కళ్ళు మనసు అప్పగించి అలా అనిమేషం గా వింటూ కూర్చునే వాళ్ళం ఎక్కడా తడబాటు ,పొరబాటు ఉండేది కాదు .మామూలుగా కళా పూర్ణోదయం కదా విధానం గందర గోళం గా ఉంటుందికదా .ఒక కద లోంచి ఇంకో కధలోకి గెంతు తుంది పూర్వాపరాలను గుర్తుంచుకొని మళ్ళీ ట్రాక్ లోకి రావటం ఎంతో ఏకాగ్రత ఉన్న వారికే సాధ్యం .దాన్ని సాధించాడు బసవ లింగం .అది ఆయన పూర్వ జన్మ సుకృతం సంస్కారం .దీనికి ప్రతి ఫలా పేక్ష కూడా కోరడు .విని అర్ధం చేసుకొనే రసజ్నులుంటే చాలు అదీ ఆయన వైఖరి .అంత  మాత్రం చేత ఎవరూ ఆయన్ను నిరాశ పరచలేదు నాకు తెలిసినంత వరకు..వీలైనప్పుడల్లా ఉయ్యూరుకు మా ఇంటికి వచ్చే వాడు వచ్చినప్పుడల్లా భోజనం చేయమని బల వంతం చేసి భోజనం చేయించి ఏదో తోచిన తాంబూలం ఇచ్చి పంపేవాడిని .ఉన్న సమయం లో ఘంటసాల పాటలు ,పద్యాలు పాడి రంజనం చేసేవాడు .నవ్వుతూ మాట్లాడటం బసవ లింగం మరో ప్రత్యేకత .

              బందరు బెజవాడ ,పామర్రు గుడివాడ మొదలైన చోట్ల నడి  రోడ్డు మీద ఆహ్వానం మేరకు హరి కధలు చెప్పి  మెప్పించే వాడు .రిటైర్ అయిన తర్వాత ఏలూరు మొదలైన చోట్ల కాలేజీ లో తెలుగు లెక్చరర్ గా పని చేశాడు కాని ఎక్కడా నిలవలేక పోయాడు .అప్పుడూ నాతో ఫోన్ లో మాట్లాడేవాడు ఉయ్యూరు వచ్చి కష్టసుఖాలు చెప్పుకోనేవాడు రిటైర్ అయిన డబ్బుతో బళ్ళారి ప్రాంతం లో పొలాలు కొని స్వంత వ్యవసాయం చేసి చేతులు కాల్చుకొని నస్టపోయాడు అచ్చి రాని తెలియని ఆపని చేశాడు తెలివి తక్కువగా .కొడుకు కూడా అందిరాలేదు .దాదాపు ఏడెనిమిది ఏళ్ళ క్రితం మరణించాడు మిత్రుడు బసవలింగం .

           బందరు స్పాట్ లో కవిత్వం విని పించిన వారిలో చింతల పాటి పూర్ణ చంద్ర రావు ఆయన తమ్ముడు మురళీ కృష్ణ లు కూడా ఉన్నారు .కమ్మని కవిత్వం వ్రాసే నేర్పు వారిద్దరిది .పూర్ణ గారు పద్య శతకాలు రాశారు మురళి నా ఆత్మీయులు, కుటుంబ స్నేహితులు కధకులు ,భారతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షులు ,బందర్లో లెక్కల మేష్టారు అయిన ఆర్ ఎస్.కే.మూర్తి గారి అల్లుడు .భార్యా భర్త లిద్దరూ ఉపాధ్యాయులే ఇద్దరూ హెడ్ మాస్టర్లు అయ్యారు .ఈ సోదరులిద్దరు కూచి పూడి, మొవ్వ ,కోసూరు, చల్ల పల్లి ప్రాంతాలలో సాహిత్య సభలు అయిదారేళ్ళు నిర్వహించారు నన్ను ఎప్పుడూ పిలిచే వారు వెళ్ళే వాడిని .ఈ ఐద్దరు  కలిసి పద్మాకర్  శతావధాని చేత చల్ల పల్లి లో అష్టావధానం ఆ తర్వాత శతావధానం చేయించారు .ఈ రెండిటిలో  నేను ప్రుచ్చకుడిని .శాతావదానానికి మాడుగుల నాగ ఫణి శర్మ గారు కూడా వచ్చి ఆశేర్వ దించారు ప్రముఖ సాహితీ వేత్తలేందరో పాల్గొన్నారు .రాళ్ళ బండి కవితా ప్రసాద్ కూడా వచ్చారు రావి రంగారావు వగైరాలన్దర్నీ తప్పక పిలిచే వాడు .మురళి రిసెర్చ్ చేసి పి.హెచ్.డి సాధించాడు .ఈ నెల ఇరవై ఏడున బందరులో అతని ‘’సిరి మల్లెలు ‘’పద్య కావ్య ఆవిష్కరణ ఉంది .ఉయ్యూరు సాహిత్య సభలకు సోదరు లిద్దరూ వచ్చేవారు .కవి సమ్మేళనం లో పాల్గొనే వారు .పూర్ణ రేడియో లో ‘’సమస్యా పూరణం ‘చాలా సార్లు నిర్వహించాడు ,రిటైర్ అయింతర్వాత కూడా నిర్వహిస్తూనే ఉన్నాడు .మంచి మిత్రులు ఇద్దరూ నాకు .ఇప్పటికీ ఫోన్ లో మాట్లాడుకొంటాం .

         స్పాట్ లో సాధారణం గా పేపర్లు దిద్దేటప్పుడు నేను చాలా ఉదారం గ వ్యవహరిస్తాను మార్కులు తగినన్ని వేస్తాను .నేను దిద్దిన దాన్ని చీఫ్ చూసినా మార్పు చేయలేనట్లు ఉంటుంది ఇది చాలా సార్లు జరిగింది దిద్దేటప్పుడు నేను ముందుగా పద్దేమిది పేపర్ల బండిల్ లో ‘’రాండం’’ గా కొన్ని పేపర్లు సాంపిల్ గా తీసి ,దిద్ది చీఫ్ కు చూపి ఆ తర్వాతా నా ధోరణిలో నేను రూల్స్ ప్రకారమే దిద్దేసే వాడిని అది ఫిజికల్ సైన్స్ పేపర్లు అయినా నేచురల్ సైన్స్ వి అయినా ఇంగ్లీష్ మొదటి పేపరైనా రెండవ పేపర్ అయినా నా స్పీడ్ నాదే .అయితే మిగతా వాటి కంటే ఇంగ్లీష్ పేపర్ వన్ కు కొంచెం ఎక్కువ సమయం పట్టేది అంతే .ప్రతి పేపర్కు క్వేస్చిన్ వార్ ,పేజ్ వార్ టోటల్స్ వేయాలి .బిట్ పేపర్ మార్కులు మెయిన్ మార్కుల పక్కన వేసి కూడి అసలు టోటల్ మార్కులు వేయాలి కింద సంతకం పెట్టాలి .అక్షర రూపం లో తోటల్స్ రాయాలి మా అసిస్టంట్ ఎక్సామినర్ నంబర్ కూడా వేయాలి స్పెశాల్ అసిస్టంట్ చెక్ చేసిన తర్వాతా ,మార్కు లిస్టు లను ప్రిపేర్ చేయాలి మొదట్లో ఒక కాగితం మీద నంబర్ వేసి ప్రక్కన మార్కులు వేసి టోటల్స్ వేయాల్సి వచ్చేది తర్వాత జిరాక్స్ పేపర్ల లలో వేయాల్సి వచ్చేది .పద్దెనిమిది బండిల్ వచ్చియా తర్వాత కంప్యూటర్ మార్క్స్ లిస్టు నంబర్ తో సహా వచ్చింది దానిలో మార్కులు తప్పులు కేకుండా పోస్ట్ చెయ్యాలి ఒక వేళ తప్పులు పడితే ఎన్ని ఉన్నాయో రాసి సంతకం పెట్టాలి దీనికి అడ్డ వరుసా ,నిలువ వరుస టోటల్స్ వేయాలి అవి సరి పోవాలి అప్పుడు ఆలిస్టు  మొత్తం మార్కులువేయాలి ఇదీ పధ్ధతి ఒక వేళ లిస్టు పాడైతే జిరాక్స్ లిస్టు తీసుకొని అందులో నంబర్లు వేసి మార్కులు ఇది వరకు లానే చెయ్యాలి . ఇదంతా అయిన తర్వాతా చెకర్ ఓకే చేస్తే చీఫ్ కు చూపించి హాండ్ ఓవర్ చేయాలి

            సాధారణం గా స్పాట్ లో ఎవరి పట్లా పక్షపాతం నాకు ఉండేది కాదు నిష్పక్ష పాతం గా ఉండే వాడిని కాని నా వ్రతానికి ఒక సారి భంగం కలిగింది..అప్పుడు నేను హిందూ హైస్కూల్ లో ఇంగ్లీష్ రెండవ పేపర్ దిద్దు తున్నాను .నా చీఫ్ నా గురుతుల్యులు ,మా హెడ్ మాస్టర్స్ర్ అసోసియేషన్ కు పెద్ద దిక్కు ,రూల్స్ అన్నీ బాగా తెలిసి రూల్స్ పుస్తకాన్ని మాకోసం హాండ్ బుక్ గా రాసిన వారు అయిన హెడ్ మాస్టర్ సోమంచి రామం గారు అని పిలువబడే సోమంచి రామ చంద్ర మూర్తి గారు మంచి కధకు లు .బాల సాహిత్యాన్ని రాసిన వారు .మా లాంటి వారెందరికో ‘’గాడ్ ఫాదర్ ‘’

    అలాంటి రామం గారు ఒక రోజు పేపర్లు దిద్దే సమయం లో నెమ్మదిగా నన్ను బయటికి పిలిచి చాలా లో వాయిస్ లో ‘’ప్రసాదూ !నా ఫ్రెండ్ ఒకాయన కొవ్వూరులో హెడ్ మాస్టర్ అతని కొడుకు ఇప్పటికి నాలుగు సార్లు ఎస్ ఎస్ సి లో ఇంగ్లీష్ లో తప్పాడు ఇప్పుడు వాడు పాస్ కాక పోతే వాడికి దిక్కుండదు .కనుక ఆ పేపర్ మన దగ్గరికే వచ్చిందినీకే ఆ బండిల్ ఇచ్చాను  నువ్వే వాడినిఎలగో అలా గట్టేక్కించాలి ఇది ఆజ్ఞా కాదు ,ఆదేశం కాదు నా పెర్సనల్ రిక్వెస్ట్ .సాటి హెడ్ మాస్టర్ మనో వేదన ‘’అన్నారు .నేను  ‘’మాస్టారూ !సాధ్యమైనంత వరకు స్పెషల్ కేర్ తో దాన్ని దిద్దుతాను.నేను చూసింతర్వాత మీరు చెక్ చేసి ఓకే చేస్తానంటే నాకేమి అభ్యంతరం లేదు ‘’అన్నాను ఆయన ‘’సరే అలానే చేద్దాం ‘’అని చెప్పారు .

              నిజం గానే ఆ పేపర్ నా దగ్గరకే వచ్చింది .తీసి దిద్దటం మొదలు పెట్టాను .కుర్రాడిపేపర్ లో సరుకేమీ లేదు మొదట్లో దిద్దితే పది మార్కులే వచ్చాయి .పాస్ కావాలంటే కనీసం పద్దెనిమిది మార్కులు రావాలి .ఇంకో పేపర్ కూడా ఉంది అది ఏ కేంద్రానికి వెళ్లిందో తెలీదు కనుక దాన్లో వాడు పొడి చేస్తాడనే గ్యారంటీ లేదు కనుక దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వీడికి కనీసం ఇరవై దాటి మార్కులు వెయ్యాలి . తప్పుల్ని సరి చేశా .లెటర్ ఉంటుంది పది మార్కులకు .అదీ ఈ వెధవ యెమేఎ గిలక లేదు . కనీసం అయిదారు లైన్లు రాసినా ఏదో ఒకటి చేసి మార్కు లెయ్య వచ్చు .మరి ఏం చేయాలో బుర్రగీక్కున్నా .కాని నాకే తట్టింది మాక్సిమమం మార్కులు వేశాను మాచింగ్ ఏదో ఉంది .దాన్ని కూడా నేనే సరి చేశా.మొత్తం మీద తిమ్మిని బ్రాహ్మి బ్రహ్మిని తిమ్మి చేసి ఇరవై  రెండు మార్కులు వేశాను చీఫ్ రామం గారికి చూపించా .ఆయన సంతృప్తి పడి  ఏమీ మాట్లాడకుండా స్క్రూటినీ చేసి నట్లు పచ్చ ఇంకు తోరైట్లు కొట్టి నేను చేసిన దాన్ని ఎండార్స్ చేసి మిత్ర సుపుత్రుడిని గట్టున పడేశారు .ఇదే నా మొదటి చివరీ వ్రత భంగం కధ .ఆ తర్వాతెప్పుడో రామం గారు కలిసి ఆ కుర్రాడు పాసైనట్లు  తండ్రి తనకు ఫోన్ చేసి చెప్పాడని చెప్పారు. హాపీ గా సుఖాంతం అయింది

      స్పాట్  లో  లో నాతో పాటు ఇంగ్లీష్ పేపర్లు దిద్దే గోపాల రావు అనే హిందూ హైస్కూల్ లెక్కల మేష్టారు నాతో ఎప్పుడూ పోటీ .ఒక అయిదు నిముషాలు తేడాతో ఎన్ని పేపర్లయినా దిద్ది పారేసి బయట పడే వాళ్ళం నవ్వుకుంటూ .ఆ తర్వాత కాసేపు గాసిప్ కొట్టేవాళ్ళం అతను రిటైర్ అయి ఈ మధ్యనే చని పోయాడని తెలిసింది .ఇంకో పోటీ దారుడు పమిడి ముక్కలసూర్య నారాయణ అనే సైన్స్ మేష్టారు .అతనూ స్పీడ్ గానే దిద్దేవాడు పమిడి ముక్కాలా వాడు సినీ నటుడు చంద్రమోహన్ డి ఆ ఊరే అతను చంద్రమోహన్ కు బంధువు కూడా .మాతో పాటు హెడ్ మాస్టర్ కూడా అయ్యాడు .

       కొందరు విద్యార్ధులు ఆన్సర్ పేపర్ల లో ఏమీ రాయకుండా ‘’సార నన్ను పాస్ మార్కులేసి పాస్ చేయండి .అని రాస్తే కొందరు ప్రశ్న పత్రాన్నే మక్కీకి మక్కీ ఎక్కించేవారు మరీ ముడుర్లు అయితే బూతులు రాసి మార్కులు వెయ్యక పోతే చచ్చి పోతామని చంపేస్తామని రాసెవారు. ఇవన్నీ నవ్వుకొంటూ చీఫ్ కు, తదితర అసిస్తంట్లకు చెప్పుకొంటూ దిద్దే వాళ్ళం వాళ్ళ మీద కోపం ఉండేది కాదు .కొన్ని సెంటర్ల వాళ్ళు ఫాక్టు కాపీలు కొట్టేవారు .ఒకడికి ఎన్ని మార్కులొస్తే మిగిలిన వారికీ దాదాపు అన్నే వచ్చేవి దీన్ని చీఫ్ కు కాంప్ అసిస్టంట్ కు చెప్పి రికార్డ్ చేయించ వచ్చు కాని దేశం అంతా అదే తీరు కనుక నోరు మూసుకొనే వాళ్ళం .రికార్డ్ చేయిస్తే కేస్ పెడితే స్వంత ఖర్చులతో హైదరాబాద్ వెళ్ళాలి వాయిదాలు తిరగాలి ఈ బాధ ఎవరూ పడరు ఉపాయం గా అపాయం నుంచి తప్పించుకోవటమే .రోజూ కాంప్ లోని మార్క్స్ లిస్టు లు హైదరాబాద్ కు స్పెషల్ మేసేన్జేర్ తో పంపించేవారు .తెలుగు మేస్టార్లు చాలా చాదస్తం గా దిద్దే వారు పావు ఇకటి బై  ఎనిమిది మార్కులు వేసి,కూడా లేక చచ్చేవారు .వారిది ఎప్పుడూ ఆలస్యమే .అదిపోయి అర మార్కు కంటే తక్కువ వెయ్య రాదనే నియమం వచ్చింది ..

           మరిన్ని స్పాట్ విశేషాలు ఈ సారి

             సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -25-10-13 –ఉయ్యూరు

 

 

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

రాచకీయ ‘’ద్విప్లెట్స్’’-2

 రాచకీయ ‘’ద్విప్లెట్స్’’ -1

        రాచకీయ ‘’ద్విప్లెట్స్’’-2

11-బుద్ధ జీవి ,సంస్కారి,సమస్యా పరిష్కారి ‘’ప్రెసిడెంట్ ప్రణబ్ ‘’

     ఈ రోజు విభజన సమస్యకు అందరికి అయ్యాడు ‘’మంత్రం ప్రణవం’’

12-సమస్య సృష్టించి భగ్గున మండుతుంటే వినోదం చూస్తోంది ‘’కోర్ కమిటీ ‘’’

     సానుకూల స్పందన,ముందుచూపులేని చెవిటి మూగా అయిన  ’’ దగా కోర్ కమిటీ ‘’

13- బెయిలిప్పించి బయటికి తెస్తే బెదిరించి పేలుస్తున్న’’ గన్  అయ్యాడు జగన్ ‘’

      కుక్కుకున్న కోట్లే మయ్యాయోమరిచేట్లు  చోద్యం చూపిస్తున్ననాటకం ‘’మాయా జగన్’’

14- తెల్ల లుంగీ లాల్చీ వెనక నల్ల ఆలోచనల ‘’చిదంబరం ‘’

     ఆంతర్యం అంతు బట్టనిరహస్యం అయింది ‘’చిదంబర ‘’

15-పదవి ఉన్నా దానికో విలువుందని మర్చిన ‘’మన్ మోహన్ ‘ ‘

     స్కాములు కుంభకోణాలు ,అవినీతి తో అయ్యాడు ‘’మసిమోహన్ ‘’

16-దేశం కాని దేశం వనిత ఇక్కడ చక్రం తిప్పే ‘’సోనియా ‘’

    ఈ దేశ చరిత్రే తెలుసుకోలేని కబోది ని చేసింది ఆమె ‘’మానియా ‘’

17-అమ్మకొడుకు బంగారప్పలుకుల ,బంగారు బాతు ‘’రాహుల్ ‘’

     చరిత్ర మార్చుతాడంటేనమ్మలేం పొంచి ఉందన్నాడు‘’రాహుకాల్ ‘’

18-సత్తా చూపిస్తాడట ఇప్పటిదాకా కునికిన ‘’నరసింహన్ ‘’

     విభజన ప్రక్రియలో ఇప్పుడు అవుతాడేమో ‘’వీర నరసింహన్ ‘’

19-ఉండాలో వేంచేయాలో తేల్చుకోలేని ‘’రాయపాటి ‘’

    ఉండి తలా  తోకా లేని వాగుడు కాక   ఏం’’పొడిచేశాడేమిటి ‘’?

20-కావు కావు మని పదవికోసం గావుకేకలు పెట్టి’’ కావూరి ‘’

    అదిరాగానే తూ నా బొడ్డు అని వేసుకొన్నాడు’’ స్వయం ఉరి’’

    మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -25-10-13- ఉయ్యూరు

 

Posted in కవితలు | Tagged | Leave a comment

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -1

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -1

భారత దేశం అనాది నుంచీ శాస్త్రాలకు కళలకు పెట్టింది పేరు ఎందరో వీటిపైపై కృషి చేసి ప్రతిభ చాటి దేశ విదేశాల లో కీర్తి పొందారు .కాని చాలా మంది ఈ నాటి వారికి మన వాళ్ళు శాస్త్ర సాంకేతికాలలో కూడా గణ నీయ మైన అభి వృద్ధి సాధించారని తెలియదు ఇది నిజమా అనుకొనే స్తితి ఖగోళ,విజ్ఞాన శాస్త్ర ,గణిత ఆయుర్వేద,శస్త్ర ,భూ విజ్ఞానశాస్త్రాలలో అపార మైన విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించి అన్నిటా తామే ప్రధములని పించుకొన్నారు ..ఆలాంటి పూర్వ శాస్త్రజ్ఞులను పరిచయం చేయటానికే ‘’విజ్ఞులైన అలనాటి మన శాస్ట్రజ్నులు’’శీర్షిక లో ధారా వాహిక గా అంద జేస్తున్నాను . ముందుగా గణిత శాస్త్రం దాని పై కృషి చేసి న వారిని గురించి వివరిస్తున్నాను

గణిత శాస్త్రం

ప్రాచీనుల దృష్టిలో గణిత శాస్త్రం అంటే అంక ,బీజ ,రేఖా ,ఖగోళ ,భూగోళ శాస్త్రాలన్నీ కలిసి ఉన్నదే .లెక్కలను ఇసుక మీద ,లేక బూడిద మీద చేసే అలవాటు అనాదిగా మనకు ఉంది .దీనికే  పట్టిక  లేక బల్ల మీద చేసే వారు అందుకని వీటికి ధూళి కర్మ అని పట్టిక గణితం అని పేర్లు ఉండేవి .ప్రాచీన గణిత శాస్త్రం లో రెండు దశలున్నాయి .క్రీ శ400-1200 వరకు వేద గణితమే మొదటి దశ ఏడవ శతాబ్దం లో వచ్చిన రేఖా గణితం రెండవ దశ .వేద గణిత కాలం లో అంక ,బీజ గణితాలు చాలా ప్రాధమిక దశ లోనే ఉండేవి .వేద కల్ప సూత్రాలలో సుల్బ సూత్రాలున్నాయి .ఇందులో యజ్న వేదికల్ని ఏ రూపం లో నిర్మించాలో ఉంది .త్రిభుజాలు ,వృత్తాలు దీర్ఘ చతురస్రాల వైశాల్యానికి సమానమైన వైశాల్యం తో చతురశ్రాలను నిర్మించే విధానం వివరించారు .చతురస్ర వైశాల్యాన్ని తేలిగ్గా లెక్క గట్టె వారు .క్రీ .పూ.కి చెందిన తైత్తిరీయ ,సత్పద బ్రాహ్మణాలలో ఈ లెక్కలన్నీ కనీ పిస్తాయి .గ్రీకు  గణిత  శాస్తజ్నుల కంటే ముందే మన వాళ్లకు ఈ గణితం కరతలామలకం అంటే ఆశ్చర్య మేస్తుంది .

క్రీ.శ.ఏడవ శతాబ్దానికి చెందిన బ్రహ్మ గుప్తుడు అనే భారతీయ రేఖా శాస్త్ర వేత్త రేఖా గణితం లో అద్వితీయ అభి వృద్ధిని సాధించాడు .చక్రీయ చతుర్భుజ వైశాల్యాన్ని వికర్నాన్ని కనుగొన్నాడు .ఇప్పుడే అంక ,బీజ గణితాలలో  కూడా మన వాళ్ళు ముందున్నారు .మన వాళ్ళు హిందూ –అరెబిక్ సంఖ్యా పధ్ధతి అని అందరు చెప్పే రేఖా గణితం తో సహా అన్ని గణిత శాస్త్ర విభాగాలలో అద్వితీయ ప్రతిభ చూపి మార్గ దర్శకులయ్యారు .ఒక్కొక్క అంకెకూ ఒక్కొక్క స్థానవిలువ నిచ్చి దాని అధ్యయ నానికి శిక్షణకు వీలు కల్పించారు సామాన్యులకూ గణితాన్ని చేరువ అయ్యేట్లు చేశారు .ప్రసిద్ధ రోమన్ సంఖ్యా పధ్ధతి కంటే ఇది చాల తేలిక పధ్ధతి అయింది .రోమన్ పద్ధతిలో హెచ్చవేత భాగహారాలు చేయాలంటే తాతలు దిగి వస్తారు .

‘’ సున్నా ‘’ను కనుక్కొని ప్రపంచానికే మన వాళ్ళు మహోపకారం చేశారు .వర్గ ,ఘన మూలాలను(స్క్వేర్ రూట్ క్యూబ్ రూట్ ) మన వాళ్ళే అందరి కంటే ముందే కనుక్కున్నారు .దాదాపు అందరు ఇప్పుడు ఇదే పద్ధతిని ఉపయోగించటం మనకు తెలుసు .ప్రాచీన గణిత శాస్త్రాలలో కనిష్ట ,సామాన్య భిన్నాంకాలు ,సరళ వడ్డీ ,చక్ర వడ్డీ త్రివిధ నియమం .మిశ్రమాలు మొదలైన అనేక సమస్యలను చర్చించారు .త్రివిధ నియమం మన దేశం లోనే పుట్టింది .మొదటి ఆర్య భట్ గ్రందాలలో దీన్ని గురించి ఉంది .తొమ్మిది సంఖ్యలని తీసేసి లెక్కలు సరిగ్గా ఉన్నాయో లేదో సరి చూసుకొనే పద్ధతి మన దేశం లోనే ప్రారంభ మైంది .

వ్యాపార ,వాణిజ్య రంగాలలో లెక్కల అవసరం పెరిగింది .కనుక గణితాన్ని అభి వృద్ధి చేయాల్సిన అవసరం ఎక్కు వైంది .చిక్కు లెక్కలు ,నోటి లెక్కలు పది మందీ కూర్చుని సరదాగా చేసే వారు .అలాగే పజిల్స్ ను కూడా చేదించే వారు .మన వారిలో గణితాన్ని బాగా అభి వృద్ధి చేసిన వారిలో మొదటి ఆర్య భట్టు ప్రధముడు .క్రీ.శ.499 లో ఆయన రాసిన ‘’ఆర్య భటీయం ‘’లో బీజ గణితానికి చెందిన అనేక సమస్యలను ఎలా పరిష్కరించాలో రాశాడు .సంసమ్మేషన్  ఆఫ్ సిరీస్ ,అరిత్ మెటికల్ ప్రోగ్రేషన్స్  ,చతురస్రాలు ఘనాలు ,పెర్ముటేషన్ ,కాంబి నేషన్స్ గురించి భట్టు విస్తృతం గా చర్చించాడు .ఇవే భావితర శాస్త్రజ్ఞులకు మార్గ దర్శకాలైనాయి .క్లిష్టమైన అనేక బీజ గణిత సమస్యలను ఆర్య భట్ పరిష్కరించాడు .ఏడవ శతాబ్దం వాడైన బ్రహ్మ గుప్త గణిత వేత్త మైనస్ లతో సున్నా లతో లెక్కలు ఏ విధం గా చేయ వచ్చో తెలియ జేసి సూత్రాలు రాశాడు .పన్నెండవ శతాబ్దికి చెందిన భాస్కరాచార్య ఒక ‘’రూట్ సెట్’’ తెలిస్తే ,మిగిలిన అంకెలని యెట్లా కనుక్కో వచ్చో కనీ పెట్టాడు

స్పెయిన్ దేశ రాజధాని మాడ్రిడ్ లో ప్రాచీన మ్యూజియం ఉంది అందులో ‘’కోడెక్స్ విజి లెన్స్ ‘’అనే పురాతన గణిత గ్రంధం ఉంది .ఇది యూరప్ దేశస్తులకు పరమ ప్రామాణికం .అందులో మొదటి అధ్యాయం లోనే గణిత శాస్త్రం లో భారతీయ మేధా సంపత్తిని అనేక విధాలుగా ప్రస్తుతించారు .దీని వల్లనే ఆ తర్వా అందురూ మన గణిత విజ్ఞానాని ప్రశంశించటం ప్రారంభించారు .తొమ్మిది అంకెల గణనం ,సున్నా యొక్క సాంకేతిక అవసరం ,దశాంశ పద్ధతి ,వృత్త పరిధికి ,వ్యాసానికి నిష్పత్తిని తెలిపే ‘’పై ‘’(22/7 )విలువ ,మొదలైన విశేషాలను శతాబ్దాలకు పూర్వమే మన భారతీయ గణిత శాస్త్రజ్ఞులు కనుక్కొన్నారు .ఆర్య భట్ ‘’పై విలువ ‘’ను3.1416గా నిర్ణయించి చెప్పాడు .భాస్కరుడు గణితం లో ఉన్న ఎనిమిది మౌలిక భావాలను విస్తరించి చెప్పటం ,ఆపస్తంభుడు బోదాయనుడు ,బ్రహ్మ గుప్తుడు రెండవ భాస్కరాచార్య ‘’అవ్యక్త గణితం’’పేరుతోబీజ గణితాన్ని ఆవిష్కరించి విస్తరించటం మన వాళ్ళే చేశారని చెబితే నమ్మ లేని నిజాలను కొనే వారుండే వారు ఇప్పుడా పరిస్తితి లేదు అందరు గట్టిగా మనమే  దీని పురోగతికి మార్గ దర్శనం చేసింది అని ఊరూ వాడా ఎలుగెత్తి చాటు తున్నారు .

దీని తర్వాతరేపటి నుంచి  అలనాటి గణిత శాస్త్రజ్ఞుల గురించి వరుసగా తెలుసు కొందాం

ఈ ధారా వాహిక కు ఆధారం’’ శ్రీ వాసవ్య ‘’రాసిన ప్రాచీన భారతీయ శాస్త్ర వేత్తలు ‘’మరియు వీకీ పీడియా

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -25-10-13-ఉయ్యూరు

.

Posted in రచనలు | Tagged | 1 Comment

సరసభారతి 52వ సమావేశం – ఈనాడులో

Enadu 23-10-13

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఇప్పటికీ అవే గాయాలు

ఇప్పటికీ అవే గాయాలు : కొలకలూరి ఇనాక్

పశువుల కాసే ఓ కుర్రాడు యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ కావడాన్ని ఊహించ గలమా? అలాంటి అసాధ్యాన్ని నిజం చేసిన వారు కొలకలూరి ఇనాక్. అంటరానితనం కారణంగా ఎదురయ్యే అన్ని అవమానాలూ భరిస్తూనే అనుకున్న లక్ష్యం దిశగా అడుగు ముందుకేశారాయన. పిహెచ్.డి లో సీటు రావడానికి ఎన్ని అవాంతరాలు ఎదురయ్యాయో, వైస్ చాన్స్‌లర్ కావడానికి కూడా అన్ని అవాంతరాలు ఎదుర య్యాయి ఆయనకు. ఇప్పటికి 72 పుస్తకాలు రచించారు. 75 ఏళ్ల వయసులోనూ ఆయన కలం నుంచి ఏటా ఒక పుస్తకమైనా విడుదలవుతూనే ఉంటుంది. ఆచార్య కొలకలూరి ఇనాక్ జీవన ప్రస్థానంలోని కొన్ని సంఘటనలే ఈ వారం ‘అనుభవం’

అడుగడుగునా అణచివేత కు గురైన ఒక మనిషి అన్నిటినీ అధిగమించి ముందుకు సాగడం అంటే ఎంత కష్టమైన పని? ఆడుతూ పాడుతూ తిరిగే బాల్యంలో అంటరానివాడివి అంటూ తన వయసు వారంతా ఆరడుగుల దూరం నిలబడితే ఎలా ఉంటుంది? నన్నయితే ఎప్పుడూ ఏదో ఒంటరితనం వెంటాడుతున్నట్లే ఉండేది. అందుకే అస్తమానం చెట్లూ చేలు పట్టుకుని తిరుగుతుండే వాణ్ని. చేలల్లో దొరికే సద్దకంకులు, జొన్న కంకులు, పెసరకాయలు, కందికాయలు, దోసకాయలు ఇలా ఏవి దొరికితే అవి తింటూ రోజంతా గడిపేవాణ్ని. మాది గుంటూరు జిల్లాలోని వేజెండ్ల. గ్రామంలోని పాఠశాలకు మమ్మల్ని రానివ్వరు. అందువల్ల మా మాదిగపల్లిలోనే బాప్టిస్టు మిషన్ వాళ్లు ఒక స్కూలు ప్రారంభించారు. నేను ఆ స్కూల్లో మూడవ తరగతి సగం దాకా చదువుకున్నా. ఈ లోగా మా కుటుంబ ఆర్థిక పరిస్థితులు మారిపోయాయి.

మా నాన్నగారు పెద్ద జీతగాడిగా పనిచేసే దొరగారి వద్దే నన్ను చిన్న జీతగాడిగా పెట్టారు. అప్పటికి నాకు 8 ఏళ్లు ఉంటాయేమో! ఓరోజు పశువుల్ని మేపుతున్న సమయంలో తెనాలి నుంచి గుంటూరు వెళుతున్న రైలు మీదికి నేను, నా తోటి పశుల కాపర్లము పక్కనున్న గుంటలోంచి బురద తీసి కొట్టాం. ఒక ఆటలా ఏదో తమాషాగా చేశాం. అయితే ఆ తర్వాత రైల్లో పోలీసులు వచ్చారట. వాళ్లు వచ్చేసరికే మేము పశువుల్ని తోలుకుని ఊళ్లోకి వ చ్చేశాం. పోలీసులు మమ్మల్ని పట్టుకోవడానికి వచ్చారని తెలిసి నేను పొలాల్లోకి పారిపోయా. పోలీసులు నాతోటి పశువుల కాపర్లు ఇద్దర్ని పట్టుకున్నారు. మా ఇంటికి కూడా వచ్చారట. మా అమ్మ వాళ్ల మీద తిరగబడినా, మా నాన్న ఏదో సర్దిచెప్పి పంపేశారట. ఆ తరువాత నేను పని మానేశా. నేను పెద్ద దుండగీడుగా మారిపోతున్నానన్నది అమ్మ ఆవేదన.

అదే సమయంలో తగరపు దేవదాసు అనే ఓ యువకుడు ఏసీ కాలేజ్‌లో బిఏ చేస్తూనే అటు స్కూలుకు పోకుండా ఎక్కడా పని చేయకుండా ఖాళీగా తిరుగుతున్న పిల్లలందనీ పోగు చేసుకుని మా మాదిగపల్లిలో ట్యూషన్లు చెప్పడం మొదలెట్టాడు. ఆయన వద్దకు వెళి ్ల’నేనూ ట్యూషన్‌కు వస్తాను మాస్టారూ!’ అన్నా. నేను జీతానికి ఉన్నానని అక్కడున్న పిల్లలంతా అరిచారు. నేను మానేశానని చెప్పా. ఆయన మా ఇంటికి వెళ్లి మా అమ్మను ఒప్పించి ట్యూషన్‌లో చేర్చుకున్నారు. నాకు లెక్కలు అవీ బాగా రావడం చూసి, నన్ను ఒక ఎంట్రన్స్ పరీక్ష రాయించి నే రుగా ఆరవ తరగతిలో చేరేలా చేశారాయన. ఆ రోజు ఆయన నాలో వేసిన బీజాలే నేను ఈ స్థితికి రావడానికి దారి తీశాయి. తెలిసీ తెలియని వయసులో చేసే ఒకటి రెండు ఆకతాయి పనుల ఆధారంగా పిల్లల భవిష్యత్తు వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం సరికాదని నా జీవితమే నాకు నేర్పింది. అందుకే పసి పిల్లల పెడధోరణుల ఆధారంగా వారి భవిష్యత్ జీవితాన్ని అంచనా వేసే ప్రయత్నం నేనెప్పుడూ చేయను.

నిలబెట్టేవీ ఉంటాయి
బి.ఏ ఆనర్స్ ఉండేది. అది ఎం.ఏ కు సమానం. తెలుగు మాతృభాష కావడం వల్లనో, తెలుగు అయితే సులువుగా చదువుకోవచ్చన్న భావనో తెలియదు గానీ, నేను తెలుగు బి.ఏ లో చేరా. ఆ రోజుల్లో బి.ఏ ఆనర్స్‌లో చేరిన వారిలో మాదిగ విద్యార్థులెవరూ లేరు. మా టీచర్లంతా అగ్రవర్ణాలకు చెందిన వారే. వాళ్లకు నేను క్లాసులో ఉండడం కొంచెం ఇబ్బందికరంగా ఉండేది. బాపిరెడ్డి అనే వ్యక్తి రోజూ చాక్‌పీస్, డస్టర్ తెచ్చిపెట్టేవాడు. ఒకరోజు నేను వెళ్లి ఆఫీసు రూము నుంచి ఆ రెండూ తీసుకొచ్చి పెడితే “నువ్వెందుకు తెచ్చావురా” అన్నాడు మాస్టారు. “బాపిరెడ్డి రాలేదు సార్” అన్నాను. “బాపిరెడ్డి రాకపోయినా నువ్వు తేవద్దు”అన్నాడు ఎంతో కటువుగా. నేను తెచ్చిన డస్టర్ గానీ, చాక్‌పీసు గానీ ఆయన ముట్టుకోలేదు. ఇది బి.ఏ ఆనర్స్‌లో చేరాక ఎదురైన అనుభవం. రోజులు గడిచే కొద్దీ నేను చదువుకోవడం మా మాస్టర్లకు ఇష్టం లే దని బోధపడింది. దీనికి తోడు నాతో మాట్లాడితే తక్కువ మార్కులు వేస్తారని, వేధిస్తారని నా క్లాస్‌మేట్స్ ఎవరూ నాతో మాట్లాడేవారు కాదు. దాంతో గొంతు పట్టేసినట్లు ఉండేది. నాకు అంటరానితనం సంపూర్ణ స్వరూపం అప్పుడే బాగా తెలిసింది. తెలిసో, తెలియకో నేను అందులో చేరడమనే ఒక మహా నేరం చేశానని అర్థమైంది. కాకపోతే ఆ రోజుల్లో పరీక్షల్లో ప్రతి పేపర్‌కీ రెండు వాల్యుయేషన్‌లు ఉండేవి. ఒక వాల్యుయేషన్ మా సొంత మాస్టర్లు చేస్తారు. మరో వాల్యుయేషన్ వేరే మాస్టర్లు చేస్తారు. అందువల్ల ఫస్ట్ క్లాసు నాకు ఎలాగూ రాదు కానీ, సెకండ్ క్లాసు మాత్రం రాకుండా పోదు అనే నిర్ధారణకు వచ్చా. ఆ నమ్మకమే చదువు కొనసాగేలా చేసింది. మనల్ని కూలదోసే అంశాలను గుర్తించడంతో పాటు, మనం నిలదొక్కుకోవడానికి ఉన్న మార్గాల్ని కూడా తెలుసుకుంటూ ఉండాలి. లేకపోతే మనల్ని మనం కూలదోసుకునే దిశగా మన అడుగులు పడవ చ్చునని నాకు అనిపిస్తుంది.

ఆటంకాలకు లెక్కేముంది?
ఆ రోజుల్లో ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్రా యూనివర్సిటీ ఈ రెండే పీహెచ్‌డి ఇవ్వగలిగేవి. నేను ఎన్‌సిసి ఆఫీసర్‌గా చేస్తూనే ఆంధ్రా యూనివర్సిటీలో పీహెచ్‌డి కోసం దరఖాస్తు పెట్టుకున్నా. నాకు రాలేదు. పీహెచ్‌డీ సీట్ అనేది అడ్మినిస్ట్రేషన్ రూల్స్ ప్రకారం ఇచ్చేది కాదు. ఈ వ్యక్తి పీహెచ్‌డీ చేయగలడు అనుకుంటే ఆ మాస్టారు ఇవ్వవచ్చు. కానీ, ఏ మాస్టారు నాకు ఇవ్వడానికి ఆమోదం తెలుపలేదు. అందుకే నేను ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి, తెలుగు డిపార్ట్‌మెంట్ హెడ్ దివాకర్ల వెంకటావధానిని అడిగా. దరఖాస్తు ఇవ్వండి అన్నాడాయన. దరఖాస్తు ఇచ్చాను. గైడ్‌గా ఏ ప్రొఫెసరూ మిమ్మల్ని తీసుకోలేదు అన్నాడు. మరుసటి సంవత్సరం మళ్లీ దరఖాస్తు ఇచ్చా. గైడ్‌గా ఉండడానికి సమ్మతించిన వ్యక్తి సంతకం తీసుకురండి అన్నారు. కానీ, ప్రొఫెసర్లలో ఏ ఒక్కరూ సంతకం చేయలేదు.

ఒక దశలో బోయి భీమన్న గారి వద్దకు వెళ్లి విషయం చెప్పా. నేను అవధాని గారికి ఫోన్ చేసి చెబుతా నువ్వు వెళ్లు అన్నారు. చెప్పారు. కానీ, దానికీ ఏదో తిరకాసు సమాధానం చెప్పి తప్పించుకున్నారు. చివరికి బోయి భీమన్న గారే అప్పటి ముఖ్యమంత్రి సంజీవయ్యగారి వద్దకు వెళ్లమని చెప్పారు. నేను వెళ్లి కలిశా. ఆయన వెంటనే స్పందించి అవధాని గారికి ఫోన్ చేశారు. “మీరు చెబితే కాదనేదేముంది? వెంటనే పంపించండి” అన్నారు. ఆ తర్వాత కూడా అదుగో ఇదుగో అంటూ వాయిదా వేసి నాకు సీటు ఇవ్వనే లేదు. ఆ విషయం సంజీవయ్యగారికి చెబితే ఆయన నిస్సహాయంగా ఉండిపోయారు. నేనింక సెలవు తీసుకుని వెళ్లిపోయా.
ఎస్‌వీ యూనివర్సిటీలో జి ఎన్ రెడ్డి తెలుగు విభాగపు అధిపతి అయ్యాక గానీ, నాకు పిహెచ్‌డీలో సీటు రాలేదు. కోరాడ మహదేవ శాస్త్రి గారు గైడ్‌గా ఉండడానికి సమ్మతించారు. మొత్తంగా చూస్తే పిహెచ్‌డీలో సీటు రావడానికి నాకు తొమ్మిదేళ్లు పట్టింది. నిర్ణీత వ్యవధి కన్నా ముందే నా థీసిస్‌ను సబ్‌మిట్ చేశాను. ఆ తరువాత రీడర్‌నయ్యా, ప్రొఫెసర్‌నయ్యా. ప్రొఫెసర్‌గా చేసిన 16 ఏళ్ల కాలంలో ప్రతి ఏడాదీ అందరూ నేను వీసీని అవుతాన నుకున్న వాళ్లే. కానీ, పలుమార్లు అది వాయిదా పడుతూనే వచ్చింది.

మనిషిగా ఆలోచిస్తేనే….
దళితుల్ని ప్రోత్సహించాలన్న సంకల్పం ఎన్.టి. రామారావు గారిలో చాలా బలంగా ఉండేది. నేను ప్రొఫెసర్ అయిన మూడేళ్లకు అంటే 1987లో నాగార్జున యూనివ ర్సిటీ వీసీ పోస్టు ఖాళీ అయ్యింది. నాకు ఇచ్చిన మాట మేరకు నాగార్జున యూనివర్సిటీకి నన్ను వీసీని చేద్దామనుకున్నారు. ఆనవాయితీగా ఆ పదవి కోసం ముగ్గురి పేర్లను ప్రతిపాదిస్తూ ముఖ్యమంత్రి ముందు నోట్ పెట్టారు. మిగిలిన రెండు పేర్లలో జిజెవిజె రాజు అన్న పేరు కూడా ఉంది. ఆ రాజు గారి కోసం భయంకరమైన రాజకీయం జరిగింది. అతని సామాజిక వర్గానికి చెందిన కొందరు మంత్రులు, కొంతమంది ఎంఎల్ఏలు వీసీ పదవి అతనికే రావాలని పట్టుపట్టారు. రామారావు గారి మీద విపరీతమైన ఒత్తిడి తెచ్చారు. ఎంత కాదనుకున్నా చివరికి అతని పేరునే టిక్ చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. అలా నాకు రావలసిన అవకాశం తప్పిపోయింది.

ఆ సందర్భంగా రామారావు గారు నాతో ‘ తమరికి మేము ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాం’ అన్నారు. అప్పుడు నేను “వచ్చి ఉంటే సంతోషించే వాణ్నే కానీ, రాలేదన్న దిగులు మాత్రం నాకు లేదు. సార్! ఆయనకిప్పుడు 58 ఏళ్లు. నాకింకా 47 ఏళ్లే. ఆయన వయసు అయిపోతోంది కాబట్టి ప్రస్తుతం ఆ పదవి ఆయనకు రావడమే మంచిది. మీరు అనుకుంటే ఎప్పుడైనా సాయం చేయవచ్చు” అన్నాను ఆయనను ఓదార్చడానికి. “మీరు ఏమైనా చెప్పండి. మాట నిలబెట్టుకోలేక పోయినందుకు మాకు కష్టంగానే ఉంది.” అన్నారాయన. ఆ తర్వాత కూడా అలాంటి ఖాళీలు వ చ్చినా కొన్ని కులాలకు, ప్రాంతాలకు, మతాలకు సంబంధించిన ఒత్తిళ్లు ఏవో వచ్చి నాకు ఇవ్వాలని అనుకున్నా ఇవ్వలేకపోయారు. 87లో తప్పిపోయిన ఆ అవకాశం 98 దాకా రానేలేదు. సినీసామ్రాజ్యంలో ఒక రారాజులా ఉన్న ఆయన రాజకీయాల్లోకి వచ్చాక కొన్ని సందర్భాల్లో ఎంతో నిస్సహాయంగా ఉండిపోవలసి వచ్చేది. చంద్రబాబు నాయుడు నా విద్యార్థి. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక గానీ, వీసీ అయ్యే అవకాశం నాకు రాలేదు. ఎస్‌వీ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌ను అయ్యే నాటికి నా రిటైర్‌మెంట్ ఇక సంవత్సరమే మిగిలింది. కాకపోతే రిటైర్ అయ్యాక కూడా రెండేళ్లు ఆ పదవిలో కొనసాగాను. సామాజిక మార్పు కోసం ఎన్ని చట్టాలు వస్తున్నా, వాటిని నిర్వీర్యం చేసే వ్యవస్థలు ఒక పక్కన పనిచేస్తూనే ఉన్నాయి. పాతకుపోయిన జాడ్యాలను చిదిమేయనిదే, ఒక మానవీయకోణాన్ని నిలబెట్టనిదే అట్టడుగున పడి ఉన్న వారికి అవస్థలు తప్పవని నాకనిపిస్తుంది.

ఆ దుఃఖం వయసెంత?
నేను వీసీగా ఉన్నకాలంలో చేపట్టిన ఇతర చర్యల విషయం అలా ఉంచితే, యూనివర్సిటీ ఉద్యోగులు పదవీ విరమణ చేసిన మరుసటి నెల ఒకటో తేదీనాటికల్లా పెన్షన్ అందేలా ఒక విధి విధానాన్ని ఏర్పాటు చేశా. అందుకు సంబంధించిన ఒక పత్రం పదవీవిరమణ రోజునే అందచేసే వాణ్ని. వాటితో పాటు ఎల్ఐసి. జిపిఎఫ్, యూనివర్సిటీ నుంచి ఏమేమి రావాలో ఆ మరుసటి నెల ఫస్ట్‌న వచ్చేలా ఏర్పాటు చేశా. ఆ పత్రాలన్నీ వారికి అందించడానికి ముందు వారిని సత్కరించే సంప్రదాయాన్ని కూడా ఒకటి ఏర్పాటు చేశా. నేనే స్వయంగా ఒక పూలమాల వేయడం, ఒక శాలువా కప్పడం, యూనివ ర్సిటీ ఎంబ్లమ్‌ను ఒక షీల్డ్‌లా చేసి ఇవ్వడం ఇవన్నీ చేశా. ఈ ఏర్పాట్లు జరిగిన సరిగ్గా నెలలోనే రాఘవనాయుడు గారని యూనివర్సిటీ రెక్టార్ రిటైరైతే ఆ సత్కారాలన్నీ చేసి చివరన ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నా. అదే రోజున రిటైరైన క్లాస్ ఫోర్ ఉద్యోగి స్కావెంజర్ (పాకీ )రాజు కూడా అదే వేదిక మీద ఉన్నాడు. రాఘవ నాయుడు గారికి మల్లే పూల మాల వేసి, శాలువా కప్పి అతన్నీ ఆలింగనం చేసుకున్నా. ఆ మనిషి నీడైనా పడకుండా దూరం జరిగిపోవడాన్ని బతుకంతా చూసిన ఆయనకు అది ఊహించలేని విషయమైంది. ఆ సమయంలో రాజు దుఃఖాన్ని చూడాలి.. అతడు ఏడుస్తుంటే కొండలు పగులుతున్నట్లనిపించింది. జీవితకాలమంతా భరించిన అవమానాలన్నీ గుండెలో గడ్డకట్టుకుపోయి ఒక్కసారిగా పగిలి పైకి తన్నుకొస్తే అలాగే ఉంటుందేమో మరి! మన దారిన మనం, మన వైఖరితో మనం అలా ఉండిపోతామే గానీ ఎన్ని గుండెలు గాయమవుతున్నాయో చాలా సార్లు ఏమీ ఆలోచించం. అలా అందరూ ఆలోచించగలిగిన్నాడు, ఇన్ని అంతరాలు, ఇన్ని వైషమ్యాలు ఉండవేమో అనిపిస్తుంది నాకు.
-బమ్మెర

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మధురగాయకుడు మన్నాడే మరి లేరు!

 

మధురగాయకుడు మన్నాడే మరి లేరు!

అనారోగ్యంతో బెంగళూరులో కన్నుమూత
అక్కడే అంత్యక్రియలు పూర్తి.. ప్రముఖుల సంతాపం

బెంగళూరు, అక్టోబర్ 24 : మహమ్మద్ రఫీ.. ముకేష్.. కిషోర్ కుమార్.. మన్నాడే… హిందీ చలనచిత్ర చరిత్రలో సంగీతానికి స్వర్ణయుగంగా చెప్పుకొనే 1950-70ల నడుమ ఒక వెలుగు వెలుగిన ఈ నాలుగు స్తంభాల్లో ఆఖరు స్తంభం ఒరిగిపోయింది! ప్యార్ హువా ఇక్‌రార్ హువా (శ్రీ 420, 1955), యె మెరీ జొహ్ర జబీన్.. తురెnు మాలూమ్ నహీ (వఖ్త్, 1965.. ‘సరిగమలాపవయా.. సరసకు చేరవయా’ పాటను ఒకసారి గుర్తుచేసుకోండి), ఎక్ చతుర నార్ బడి హోషియార్ (పడోసన్, 1968), యే భాయ్ జర దేఖ్ కే చలో (మేరా నామ్ జోకర్, 1970) యారి హై ఈమాన్ మేరా యార్ మేరీ జిందగీ (జంజీర్, 1973).. క్లాసికల్, రొమాంటిక్, కామెడీ ఇలా ఒకదానికొకటి సంబంధం లేకుండా విభిన్నమైన పాటలతో సినీ సంగీతాభిమానులను రసడోలలూగించిన మన్నాడే (94) మధుర స్వరం మూగబోయింది!! నాలుగునెలలుగా ఊపరితిత్తులు, మూత్రపిండాలకు సంబంధించిన తీవ్రఅనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరు నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున 3.50 గంటలకు కన్నుమూశారు.

ఆయన భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం గురువారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల దాకా ఇక్కడి రవీంద్ర కళా క్షేత్రలో ఉంచి.. అభిమానులు అంతిమ నివాళులు అర్పించిన పిమ్మట బెంగాలీ సంప్రదాయం ప్రకారం బెంగళూరు హెబ్బాళ్ హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. మన్నాడేకు ఇద్దరు కుమార్తెలు షురోమా, సుమిత ఉన్నారు. గురువారం తెల్లవారుజామున ఆయన పరిస్థితి విషమిస్తోందని ఆయన చిన్న కుమార్తె సుమితకు తెలియజేయగానే వెంటనే ఆమె ఆస్పత్రికి చేరుకున్నారని, తన తండ్రి అంతిమ ఘడియల్లో ఆయన పక్కనే ఉన్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. పెద్ద కుమార్తె షురోమా అమెరికాలో ఉంటున్నందున చాలాకాలంగా ఆయన బెంగళూరులో చిన్న కుమార్తె వద్దనే ఉంటున్నారు. మన్నాడే భార్య సులోచన కుమరన్ 2012 జనవరిలో కేన్సర్‌తో కన్నుమూశారు. సులోచన అంటే మన్నాడేకి ప్రాణం. ఆమే తన విజయాలకు స్ఫూర్తి అని ఎప్పుడూ చెబుతుండేవారు.

చిన్నవయసు నుంచే…
మన్నాడే అసలు పేరు ప్రబోధ్ చంద్ర డే. 1919 మే 1న పూర్ణచంద్ర డే, మహామాయా డే దంపతులకు కోల్‌కాతాలో జన్మించారు. సంగీతాచార్యుడైన తన బాబాయి కృష్ణచంద్ర డే, ఉస్తాద్ డబీర్ ఖాన్, ఉస్తాద్ అమన్ అలీ ఖాన్, ఉస్తాద్ అబ్దుల్ రహమాన్‌ఖాన్‌ల వద్ద చిన్న వయసునుంచే శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించారు. పదో ఏట నుంచే బాలగాయకుడిగా స్టేజీ ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు. కాలేజీ రోజుల్లో రెజ్లింగ్, బాక్సింగ్ కూడా నేర్చుకుని కుస్తీపట్లు పట్టినా.. పాటను మాత్రం ఏ దశలోనూ వదల్లేదు. వరుసగా మూడేళ్లపాటు అంతర్‌కళాశాలల పాటల పోటీల్లో విజేతగా నిలవడమే ఇందుకు నిదర్శనం. తొలుత బారిస్టర్ కావాలనుకున్న మన్నాడే.. తన బాబాయి సలహాతోనే సంగీతాన్నే జీవికగా మలుచుకున్నాడు. ఆయనకు ‘మన్నా డే’ అనే పేరు పెట్టింది.. 1943లో తమన్నా చిత్రంలో సురయ్యాతో సూపర్‌హిట్ యుగళగీతాన్ని ఆలపించే అవకాశాన్ని ఇచ్చిందీ కృష్ణ చంద్ర డేనే కావడం విశేషం.

ప్రముఖుల సంతాపం: మన్నాడే మరణవార్త ఆయన అభిమానులను శోకసంద్రంలో ముంచింది. బాలీవుడ్ ప్రముఖులు ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ప్రముఖ గాయని లతామంగేష్కర్, బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్, ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ తదితర ప్రముఖులు ఆయన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఇంకా.. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, బంగ్లా దేశ్ ప్రధాని షేక్ హసీనా తదితరులు సంతాపం తెలిపారు. ఆ మహాగాయకుడు పశ్చిమబెంగాల్‌కే గర్వకారణమని, ఆయన భౌతికకాయాన్ని కోల్‌కాతా తీసుకొచ్చేందుకు తాను ప్రయత్నించానని.. కానీ, ఆయన కుటుంబసభ్యులు అంగీకరించకపోవడంతో కుదరలేదని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ అన్నారు. అయితే, తన తండ్రి మరణవార్త తెలిపినా కూడా మమత సరిగా స్పందించలేదని, దేశం గర్వించదగ్గ మహాగాయకుడిని ఆ రాష్ట్రం విస్మరించడం.. కర్ణాటక సర్కారూ పట్టించుకోకపోవడం ఆవేదన కలిగించిందని, మన్నాడే కుమార్తె సుమిత విలపించారు.

ఆ టోపీ.. అభిమాని కానుక
మన్నాడే అనగానే అందరికీ గుర్తుకొచ్చే ట్రేడ్ మార్క్.. ఆయన తలపై ఉండే ఫర్ క్యాప్. ఆ టోపీని కాశ్మీర్‌కి చెందిన ఒక అభిమాని ఆయనకు బహూకరించాడు. ఒకసారి డిసెంబర్ నెలలో కాశ్మీర్‌కి వెళ్లి ప్రదర్శన ఇస్తున్న సమయంలో స్టేజీపైనే చలికి గజగజలాడుతుంటే.. ఆ అభిమాని వేదిక మీదకు వచ్చి తన క్యాప్‌ని తీసి ఇవ్వడంతో ఉపశమనం పొందిఅద్భుతమైన ప్రదర్శన ఇవ్వగలిగారట. అప్పటి నుంచి జీవితాంతం ఆ క్యాప్‌ని అభిమాని గుర్తుగా ధరిస్తూనే ఉన్నారు.

 

Posted in సినిమా | Tagged | Leave a comment

రాచకీయ ‘’ద్విప్లెట్స్’’

         రాచకీయ ‘’ద్విప్లెట్స్’’

1-డిల్లీ లో అమ్మగారి కృపకు రాణి ‘’కిల్లి ‘’

   ఇక్కడ గల్లీ గల్లీ లో అవుతోంది  మ్యావ్ మ్యావ్ ’’ పిల్లి ‘’

2-నిన్నటి దాకా అధికారం చెలాయించిన’’ చిన్నమ్మ’’

   ఇప్పుడు అయిపొయింది కాణీకి కూడా ‘’చెల్లననమ్మ’’

3-పేరులోమాత్రమే ఉండి పోయిన  ‘’శీలం’’

   ప్రజాదర్బారు లో పోగొట్టుకొన్నాడు కావాల్సిన ‘’ శీలం’’

 4-.నటుడుగా ఉండిపోతే అయ్యే వాడుచిరకాలం నట’’ చిరంజీవి ‘’

     పార్టీ పెట్టి కూల్చి, ఖద్దరు గుడారం లో దూరి అయ్యాడు ‘’అభాగ్య జీవి’’ .

5-మాటలలే కాదు శరీరం కూడా  లావుగా ఉన్న మంత్రి’’లక్ష్మి’’

   సమైక్య భావనలో సామాన్యుల చేత అని పించుకోంది ‘’ఛీఛాలచ్చి’’

6- మేధావి,వాక్య విశారదుడు ,అవగాహన ఉన్న ‘’ఉండవల్లి ‘’

    ఇవాళ ఇక్కడ హీరో అక్కడ కోటరీ కళ్ళలో  ‘’కారం కలిపిన ఉల్లి ‘’

7-చిరును నమ్మి కాంగ్రెస్ గంట బజాయించి కొట్టిన ‘’గంటా ‘’

   అందరికంటే ముందు ఎదురు తిరిగి వాయించాడు’’ సమైక్య గంట ‘’ 

8-జగడం,లగడం లో జెట్టీలో ,ఎన్నికల ముందే ఫలితాలుకరెక్ట్ గాచెప్పే ‘’లగడ పాటి ‘’

  అటు ధిల్లీ లో ఇటు గల్లీ లో కాలేక పోయాడు  ‘’ ఏగాణీ  పాటి’’ .

9-కుర్చీ ఎక్కించి చెప్పిందే వివింటాడు అనుకొంటే  ‘’కిరణ్ ‘’

   సమైక్య ఆశా కిరణంమై , పై ఏలికల పాటిమేకై  చేశాడు’’మాన్చలేని  వ్రణం’’ .

10-సమైక్య శంఖా రావం తో పైకెగసిన ‘’రాకెట్ అశోక్ ‘’  

    అందర్నీ కలుపు కొంటూ యుద్ధ భేరి మోగించి అయ్యాడు ’’ది గ్రేట్ అశోక్ ‘’

      మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-10-13- ఉయ్యూరు

 

Posted in కవితలు | Tagged | Leave a comment

పురావస్తు పరిశోధక బ్రహ్మ స్వర్గీయ వేలూరి కృష్ణ శాస్త్రి -ఆంద్ర జ్యోతి -24-10-13

v.krishna sastri

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బౌద్ధ సంస్కృతి పరిరక్షణే లక్ష్యం

బౌద్ధ సంస్కృతి పరిరక్షణే లక్ష్యం

ఒకప్పుడు సివిల్స్ సర్వీసు పరీక్షల కోసం భారతదేశ చరిత్రతోపాటు బౌద్ధమతంపై సమగ్ర అధ్యయనం చేసిన చెన్నూరు ఆంజనేయరెడ్డి బౌద్ధ సంస్కృతి పట్ల ఆకర్షితులయ్యారు. ఆరంభంలో నాస్తికుడైన ఈయన తాను నమ్మిన బౌద్ధ సంస్కృతి, సంప్రదాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పలు స్వచ్ఛంద కార్యక్రమాలు చేపడుతున్నారు. వివిధ భాషల్లో ఉన్న గ్రంథాలను తెలుగులోకి అనువదించి ప్రచురించటంతో పాటు, రాష్ట్రంలో ఉన్న పురాతన బౌద్ధ క్షేత్రాలను పరిరక్షించి, వాటి అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారు. ఇటీవల ఇండొనేషియాలోని పురాతన బౌద్ధ క్షేత్రమైన బోరోబుదూర్‌ను సందర్శించి వచ్చిన మాజీ ఐపీఎస్ అధికారి ఆంజనేయరెడ్డి అక్కడి బౌద్ధ క్షేత్రాల గురించి, రాష్ట్రంలో బౌద్ధ సంస్కృతి పరిరక్షణ గురించి చెబుతున్న విశేషాలు ఆయన మాటల్లోనే….

“నేను మొదటి నుంచీ నాస్తికుడిని. అయితే, ఇరవై మూడేళ్ల వయసులో అనుకోకుండా నేను బౌద్ధ సంస్కృతి అధ్యయనం చేయడం జరిగింది. అప్పటి నుంచీ బౌద్ధ మతం మీద శ్రద్ధాసక్తులు పెరిగాయి. నా స్వభావానికి బౌద్ధమత సంస్కృతి సరిపోతుందని అనిపించి, దాన్ని స్వీకరించాను. సమాజంలోని ప్రజలందరికీ ప్రయోజనాన్నిచ్చే మంచి పనుల్ని చే యాలనేదే బుద్ధుని బోధనల సారం. నేటి సమాజంలో అన్ని సమస్యలకూ పరిష్కారం బౌద్ధంలోనే ఉందని నాకు నమ్మకం. మనిషి నీతి నియమాలు, నైతిక విలువలతో కూడిన జీవనం కొనసాగించేందుకు బుద్ధుడు చెప్పిన బోధనలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇతరులకు తోడ్పడాలనే ఉన్నత ఆశయాన్ని ఆచరణలో అమలు చేయడంతో పాటు, మన దేశ బౌద్ధ సంస్కృతిని సామాన్య ప్రజల్లోకి మరింతగా తీసుకు వెళ్లాలనే ఆకాంక్షతో పలు స్వచ్ఛంద కార్యక్రమాలు చేపడుతున్నాను.

బోరోబుదూర్‌ను సందర్శించిన వేళ…
ఇండొనేషియా దేశంలో ప్రపంచంలోనే అతి పెద్ద బౌద్ధ క్షేత్రమైన బోరోబుదూర్‌ను సందర్శించాలనే నా చిరకాల వాంఛ ఇటీవల ఫలించింది. జావా దీవిలో ఉన్న ఈ క్షేత్రాన్ని చూసినప్పుడు నేనెంతో సంతోషపడ్డాను. మూడు తరాలకు చెందిన శిల్పులు వందేళ్ల పాటు శ్రమించి, లావాతో ఏర్పడిన పెద్ద రాళ్లతో బోరోబుదూర్‌ను నిర్మించారు. అరవై వేలకు పైగా రాళ్లతో ఈ బుద్ధ విహారాన్ని కట్టారని తెలుసుకొని ఆశ్చర్యపోయాను. అగ్నిపర్వతం పేలినప్పుడు వచ్చిన బూడిదతో బోరోబుదూర్ క్షేత్రం కనుమరుగైందని బ్రిటిష్, డచ్ దేశాల నిపుణులు గుర్తించి దాన్ని వెలుగులోకి తీసుకు వచ్చారు. వంద ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న ఈ క్షేత్రంలో బుద్ధుని జీవితం, జాతక కథలు, బుద్ధుని శిల్పాలున్నాయి. బౌద్ధమతం బాగా వ్యాప్తి చెందిన పురాతన కాలంలో మన దేశ శిల్పులు అక్కడకు వెళ్లి ఈ క్షేత్రాన్ని నిర్మించటం వల్ల దీనిలో మన దేశ సంస్కృతి ప్రస్ఫుటంగా కనిపించింది.

అత్యంత పురాతనమైన ఈ అతిపెద్ద బౌద్ధ క్షేత్రాన్ని చూసినప్పుడు నేనెంతో గర్వంగా ఫీలయ్యాను. ఇక బాలీ, జావా దీవులు ఎత్తయిన కొండల మధ్య ఎన్నో కళాఖండాలతో రమణీయంగా కనిపించాయి. బుద్ధుని బోధనలకు జర్మనీతో పాటు, పలు యూరప్ దేశాలు, అమెరికాల్లో కూడా ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో దీనికి కేంద్రమైన మన దేశంలో బుద్ధుని అనుసరించే వాళ్లు తగ్గిపోవటం నాకెంతో విచారం కలిగించింది. ఇండొనేషియా దేశం 20 వేలకు పైగా దీవుల సమాహారం. ప్రకృతి అందాలతో దీవులన్నీ కొత్త అందాలు సంతరించుకున్నాయి. బాలి, జావా దీవుల్లోని పురాతన బౌద్ధ క్షేత్రాలను నా కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించాను. ఎక్కడా చెత్త ఆనవాళ్లు కూడా లేకుండా ఎంతో శుభ్రంగా ఉన్న వీధుల్లో యాచకులు సైతం కనిపించకపోవటం విశేషం. ఇండొనేషియా దేశ పర్యటన నాకెన్నో మరచిపోలేని మధుర జ్ఞాపకాలను మిగిల్చింది.

బౌద్ధ క్షేత్రాల అభివృద్ధి
రాష్ట్రంలో ఉన్న పురాతన బౌద్ధ క్షేత్రాల అభివృద్ధికి పాటుపడుతున్నాను.రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా, మేనేజింగ్ డైరెక్టరుగా పనిచేసినప్పుడు రాష్ట్రంలోని 22 బౌద్ధ క్షేత్రాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్‌ను రూపొందించాను. కృష్ణానదీ తీరాన ఉన్న నాగార్జున కొండ వద్ద 270 ఎకరాల విస్తీర్ణంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో బౌద్ధ వనాన్ని అభివృద్ధి చేస్తున్నాం. గౌరవ కన్సల్‌టెంట్‌గా సేవలందిస్తూ నాటి బౌద్ధమత పురాతన ప్రాభవాన్ని పరిరక్షించేందుకు పాటుపడుతున్నాను. అమరావతిలో బౌద్ధ మ్యూజియాన్ని నిర్మించటంతో పాటు, నాగార్జునసాగర్‌లో 35 ఎకరాల్లో విపాసన ఇంటర్నేషనల్ మెడిటేషన్ కేంద్రాన్ని నిర్మించాం. ఆనంద బుద్ధ విహార ట్రస్టుకు ఉపాధ్యక్షుడిగా ఉండి హైదరాబాద్‌లో ఆనంద బుద్ధ విహార్‌ను నిర్మించాం.

ధర్మదీపం ఫౌండేషన్
నైతిక విలువలతో కూడిన జీవితాన్ని గడపాలనే బోధనలతో కూడిన ధమ్మపద పుస్తకాన్ని నాకు బహుమతిగా ఇవ్వటంతో దాన్ని చదివి ఎంతో ప్రభావితుడినయ్యాను. ఆంధ్ర ప్రదేశ్ పోలీసు అకాడమీలో శిక్షణ పొందిన యువ పోలీసు అధికారులకు ధమ్మపద పుస్తకాన్ని తెలుగులోకి అనువాదం చేయించి పంపిణీ చేశాను. 1992లో హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో బౌద్ధ మతగురువు దలైలామాను కలిసి మాట్లాడాను. దలైలామా నుంచి స్ఫూర్తి పొంది, ధర్మదీపం పేరిట ఓ ఫౌండేషన్‌ను నెలకొల్పి బుద్ధుని బోధనలపై వివిధ భాషల్లో ఉన్న 30 పుస్తకాలను తెలుగులోకి అనువాదం చేయించి, ముద్రించాను. ధర్మపథం, జాతక కథలు, జయమంగళం, బుద్ధవచనం తదితర పుస్తకాలను పంపిణీ చేశాను. బుద్ధుని మూలగ్రంథాలైన ధర్మపీటకం, సూత్రపీటకం, వినయపీటకంలను పాలీ భాష నుంచి తెలుగులోకి అనువదింపజేసి అందించాలనే ఆకాంక్షతో తెలుగు త్రిపీటకం ప్రాజెక్టును చేపట్టాను. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర సాంస్కృతిక మండలి 50 లక్షల రూపాయలను గ్రాంటుగా ఇచ్చింది. దీనికి తోడు మా ఫౌండేషన్ నిధులతో వచ్చే పదేళ్లలో అనేక బౌద్ధ గ్రంథాలను తెలుగులోకి అనువదించే పని చేపట్టాను.

బౌద్ధ విహారాలు నిర్మిస్తాం
బౌద్ధ సంస్కృతిని పరిరక్షించటమే ప్రధాన ఆశయంగా కార్యక్రమాలు చేపడుతున్నాను. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న మహాబోధి సొసైటీ సభ్యుడిగా, అమరావతిలోని ధాన్యకటక బుద్ధవిహార గౌరవ అధ్యక్షుడిగా, ధర్మదీపం ఫౌండేషన్ ఛైర్మన్‌గా బౌద్ధ సంస్కృతి వ్యాప్తికి నా వంతు సేవలందిస్తున్నాను. భవిష్యత్తులో హైదరాబాద్ శివార్లలోని ఇబ్రహీంపట్నంలో ధమ్మగిరి విహారాన్ని నిర్మించేందుకు స్థలాన్ని సేకరించి, సమాయత్తమయ్యాను. విశాఖపట్టణంలో మరో విహారాన్ని నిర్మించాలనుకుంటున్నానంటూ ఆంజనేయరెడ్డి తన భవిష్యత్తు ప్రణాళిక గురించి వివరించారు.

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సారే మా ‘శ్రీహరి’ 24-10-2013 andhrajyothi

సారే మా ‘శ్రీహరి’

రియల్‌స్టార్ శ్రీహరి- భాస్కర్‌ల బంధం గురించి మాట్లాడటం అంటే ఓ మహానది పిల్లకాలువపై పెంచుకున్న ప్రేమను, సముద్రమే నది కోసం ఎదురుచూస్తున్న సందర్భాన్ని వర్ణించినట్టుగా ఉంటుంది. ఈ భాస్కర్ సినిమా పరిశ్రమలో తప్ప ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ శ్రీహరి జీవన ప్రయాణంలో ఇతనిదీ సగం జీవితం. ఆ ‘హీరో’ నవ్వితే ఈ ‘మేకప్‌మేనూ’ నవ్వాడు. ఆయన పనిచేస్తే ఈయనా పనిచేశాడు. ఆయన రెస్ట్ తీసుకుంటే ఈయనా రెస్ట్ తీసుకున్నాడు. శ్రీహరి చివరి క్షణాల్లోనూ పక్కనే ఉన్నాడు. ఆయన బాధతో తల్లడిల్లినప్పుడు, భాస్కర్ కూడా విలవిల్లాడిపోయాడు. షూటింగ్‌లో, ప్రయాణంలో, ఆస్పత్రిలో…అన్ని చోట్లా వెన్నంటే ఉన్న భాస్కర్….శ్రీహరికి పర్సనల్ మేకప్‌మేన్ మాత్రమే. అయితేనేం? వారి జీవన ప్రయాణానికి ‘అనుబంధం’ అని పేరుపెట్టలేమా!

మొదట్లో అంటే… 1993కు ముందు భాస్కర్ అసిస్టెంట్‌గా గీతా ఆర్ట్స్ సినిమాలు చేస్తుండేవాడు. ‘లంకేశ్వరుడు’ సినిమాతో పరిచయమైన శ్రీహరికి పనిలో భాగంగా అప్పటికే కొన్నిసార్లు మేకప్ కూడా చేశాడు. ఇద్దరికీ మంచి పరిచయమే. అయితే భాస్కర్ గీతా ఆర్ట్స్ నుంచి బయటకు బయటకొచ్చాక శ్రీహరే అతన్ని పిలిపించుకుని పర్సనల్ చేయమన్నాడు. అలా 1993 ఫిబ్రవరి 27న శ్రీహరికి పర్సనల్ మేకప్‌మేన్ అయ్యాడు భాస్కర్.

రెండు దశాబ్దాలు..174 సినిమాలు
శ్రీహరి గురించి అప్పటికే భాస్కర్‌కు తెలుసు కాబట్టి వెంటనే ఒప్పుకుని మద్రాస్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాడు. అలా ‘సమరం’ సినిమాతో పర్సనల్ బంధం బలపడింది. అది మొదలు ఇప్పటి వరకు మొత్తం 174 సినిమాలకు పనిచేశాడు భాస్కర్. 21 సంవత్సరాల తన వృత్తి జీవితంలో ఒక్కసారి కూడా శ్రీహరి వల్ల ఇబ్బంది పడలేదు. ఆయన్ని ఇబ్బంది పెట్టలేదు. 80 గెటప్‌లు చేసినా ఒక్క రోజు కూడా శ్రీహరిలో చిరాకు చూడలేదు. గెటప్ కుదరాలంటే ఆర్టిస్టు సహకారం బాగుండాలి. అది శ్రీహరి దగ్గర పుష్కలంగా ఉంటుందంటాడు భాస్కర్. అందుకే ‘దుర్యోధనుడు’, ‘ఘటోత్కచుడు’, ‘యమధర్మరాజు’ వంటి పౌరాణిక ఆహార్యాలు కూడా చేసి శ్రీహరిని మెప్పించాడు.
ఎప్పుడూ జాలీగా, నవ్వుతూ ఉంటూ టెక్నీషియన్స్‌ను, ఆర్టిస్టులను… అందరినీ గౌరవంగా చూసే శ్రీహరి దగ్గర పనిచేయడమంటే అందరికీ ఇష్టమే. ఇంట్లో ఉన్నా, సెట్లో ఉన్నా, అవుట్‌డోర్‌లో ఉన్నా, ఫారిన్‌లో ఉన్నా…ఒకేలా ఉండే శ్రీహరితో భాస్కర్‌ది ప్రత్యేక అనుబంధం.

ఇన్నేళ్లలో భాస్కర్‌కు ఒక్కసారి కూడా ‘నాకిది కావా’లని అడిగే అవకాశమే శ్రీహరి ఇవ్వలేదంటే నమ్మాలి. శ్రీహరి నీకేం చేశాడని భాస్కర్‌ను అడిగితే, ‘అన్నీ ఆయనే చేశాడు కదా’ అంటాడు. ‘నన్నో సొంత తమ్ముడిలా చూసుకున్నాడు. భాస్కర్ అని పిలిచేవాడు. ఇంట్లో కూడా నన్ను ఫ్యామిలీ మెంబర్‌లాగే చూసేవాళ్లు. నిజానికి మేకప్‌మేన్‌కు అంత స్థానం ఇవ్వాల్సిన పనిలేదు. పైసల్ సరిగ్గా ఇస్తే చాలు.. ఎవరి పని వాళ్లు చక్కగా చేస్తారు. కానీ సార్ అలా కాదు. ఆత్మీయతే ఆయనకు పెద్ద ఆభరణం. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మా భాస్కర్ అని చెప్పేవాడు. నాకేం లోటు లేకుండా, రాకుండా చూసుకున్నాడు’ అంటాడు భాస్కర్.

భాస్కర్ చూసుకుంటాడులే…
రెండు దశాబ్దాల జీవన ప్రయాణంలో శ్రీహరిని భాస్కర్ చూసినంత దగ్గరగా మరెవరూ చూసి ఉండరు. ఫ్యామిలీ విషయాలు కూడా చర్చించుకునేవారిద్దరూ. ఇల్లు, పొలం పనులు ఏవైనా ‘భాస్కర్ చూసుకుంటాడులే’ అనేవాడు. ఆయన బర్త్‌డే ఫంక్షన్ కూడా భాస్కర్‌కే అప్పగించేవాడు. పరిశ్రమ నిండా ఆత్మీయుల్ని సంపాదించుకున్న శ్రీహరిలాంటి యాక్టర్ ప్రేమను పొందాలంటే భాస్కర్ ఎంత నిజాయితీగా ఉండాలో అలాగే ఉన్నాడు. వేరే కంపెనీలు, వ్యక్తులు ఎంతోమంది తోచిన విధంగా ప్రలోభ పెట్టినా ఆయన ఎక్కడా లొంగలేదు. అందుకే శ్రీహరికి భాస్కర్ అంటే ఇష్టం. అత్యాశలేని భాస్కర్‌ను, వద్దన్నా.. ప్రతి పైసకూ లెక్క చూపించే భాస్కర్‌ను ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. కారు కొనిస్తానని బలవంతం పెట్టినా భాస్కర్ ఒప్పుకోలేదు. ఉన్న కారుని తీసుకో అని ఇబ్బంది పెట్టినా ‘వద్దు సార్’ అని సున్నితంగా తప్పుకున్నాడు. అయినా భాస్కర్ పిల్లల చదువు నుంచి ఆరోగ్యం వరకు, ఆర్థిక సమస్యల నుంచి హార్దిక విషయాల వరకు అన్నింటిని అడిగి మరీ తెలుసుకునేవాడు శ్రీహరి. ఇద్దరూ అలా బతికేశారు..ఒకరికొకరు నచ్చేటట్టు!

సెకండ్ థాటే లేదు…
చిన్నా చితకా వేషాలేసుకునే శ్రీహరి రియల్‌స్టార్‌గా ఎదిగిన తీరంతా భాస్కర్ కళ్ల ముందే జరిగింది. ఎక్కడైనా శ్రీహరి తొణికాడా? ఎక్కడైనా పొంగిపోయాడా? ఎప్పుడైనా మనుషుల్ని తక్కువగా చూశాడా? లేదు.. తన స్టాఫ్‌ను పెంచుకున్నాడు. ఇంకొంత మందికి జీవితాల్ని ఇచ్చాడు. కాదు.. కొన్ని గ్రామాల్నే దత్తత తీసుకున్న శ్రీహరి విశాల హృదయం, తన పొలాల్లో పండిన పంటను అవసరమున్న ప్రాంతాల్లో (వరదలు రావడం, కరువు ఉండటం వంటివి) పంచిన ఔదార్యం, కష్టాల్లో ఉన్న జూనియర్ ఆర్టిస్టులకూ బియ్యం, బట్టలు పంపిన ఆయన ప్రేమ, తన సినిమా పూర్తయితే స్టాఫ్ అందరికీ కొత్త బట్టలు కొనిచ్చి, కడుపు నిండా భోజనం పెట్టి పంపించే ఆత్మీయత… ఇవన్నీ శ్రీహరిని ఎవరెస్ట్ మీద కూర్చోబెట్టాయి. ఆ స్థాయిని కళ్లారా చూసిన భాస్కర్ మా సార్ అని గర్వంగా చెప్పుకోవడం గొప్ప అయితే, మా భాస్కర్ అని శ్రీహరి అందరికీ పరిచయం చేయడం విశేషమే కదా! అలాంటి రియల్ హీరోను ఎవరైనా మిస్ అవుతారా? అందుకే ఇంకో చోట పనిచేసే అవకాశం వచ్చినా పట్టించుకోలేదు భాస్కర్. శ్రీహరితో పనిచేయడం అంటే ఒక సంతృప్తికరమైన జీవితం! సెకండ్ థాట్‌కు అవకాశమే లేదు!!

తనను ఎంతో ప్రేమించిన, తనకు ఎంతో ఆప్యాయతను పంచిన శ్రీహరికి భాస్కర్ ఏమివ్వగలడు?…తన ఇంటికి ‘శ్రీహరి శాంతి నిలయం’ అని పేరుపెట్టుకోవడం వంటి గౌరవపూర్వకమైన పనులు చేయడం తప్ప! గిఫ్ట్ పోగొట్టినా…
పెళ్లికాక ముందు శాంతి దుబాయ్ నుంచి తీసుకొచ్చి మరీ ఓ రింగ్‌ను శ్రీహరికి గిఫ్ట్‌గా ఇచ్చింది. ‘కుంతీ పుత్రుడు’ సినిమా షూటింగ్‌లో ఓ రోజు భాస్కర్ మూలంగా ఆ రింగ్ దొంగలపాలైంది. అది కావాలని చేసింది కాకపోయినప్పటికీ అందులోని వెలకట్టలేని ‘ప్రేమ కానుక’ గురించి ఎంతో బాధపడ్డాడు భాస్కర్.

అపరాధ భావంతో తిరుగుతున్న అతన్ని ఒక్క మాట అనడం గానీ, చిరాకు గానీ, అసహనం గానీ వ్యక్తం చేయకుండా శ్రీహరే ఓదార్చాడు. రియల్‌స్టార్ వస్తువు కంటే మనుషులకే విలువిస్తాడని చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణ ఏముంటుంది? నిజమే, భాస్కర్ బాధపడితే చూడలేకపోయేవాడు శ్రీహరి. తన ప్రపంచంలో భాస్కర్‌కు అత్యున్నత స్థానం ఇచ్చేవాడు. కొన్ని విషయాల్లో ఎమోషనల్‌గా కూడా ఉండేవాడు. ‘జబర్‌దస్త్’ సినిమా సమయంలో ఉద్యోగం మానేద్దామనుకున్నాడట భాస్కర్. శ్రీహరి పిలిచి ‘నువ్వు లేకపోతే నేను రిటైర్ అవుతా భాస్కర్. కొన్నాళ్లు చెయ్యి.. ఇద్దరమూ ఒకేసారి రిటైర్ అవుదా’మని చెప్పాడు. ఏ ఆర్టిస్టు నుంచి ఏ మేకప్‌మేన్ వినని మాట ఇది. అది భాస్కర్ భాగ్యం! అంతేకాదు, శ్రీహరి గొప్పతనం కూడా!!
కానీ ‘రిటైర్మెంట్ అంటే పరిశ్రమ నుంచి అనుకున్నాగానీ, జీవితం నుంచి అనుకోలేదు సార్’ అని బాధపడే భాస్కర్ బాధకు ఏ పేరు పెడదాం!!
– మయన్న
ఫొటోలు: రామకృష్ణ

సార్ దగ్గర తప్ప మరెక్కడా పనిచేయలేను. అలాంటి మనిషి దగ్గర చేసిన నేను ఇంకోచోట ఇముడుతానో లేదో…అసలు నా మనసులో మేకప్ ఆలోచనలే లేదు. అవసరమైతే వేరే పనిచేసుకుంటాను కానీ, ఇంకొకరికి పర్సనల్ చేయలేను. మా బంధానికి ఏ పేరన్నా పెట్టుకోండి. సార్ మాత్రం అద్భుతమైన వ్యక్తి. ఎవరికి ఏది ఇవ్వాలో, తననే నమ్ముకున్న వాళ్లను ఎలా చూడాలో ఆయనకు బాగా తెలుసు. మా స్టాఫ్‌ను ఎంత ప్రేమగా చూసేవాడో! కొందరికి ఇండ్లు కూడా కట్టించాడు.

కల్లపారి భాస్కర్‌రెడ్డిది మహబూబ్‌నగర్ జిల్లాలోని పెద పోతులపాడు గ్రామం. టెన్త్ ఫెయిల్ అయిన తరువాత బెంగళూర్ పారిపోయిన ఆయన ఓ రెండు మూడు సంవత్సరాలు ఊటీ, మైసూర్ వంటి ప్రాంతాలు తిరిగి చివరికి మద్రాస్‌లో ఆగిపోయారు. అక్కడే ఓ విగ్ సెంటర్‌లో చేరి సినిమావాళ్లతో పరిచయాలు పెంచుకుని, క్రమంగా మేకప్‌మేన్ అయ్యారు. అసిస్టెంట్‌గా చేస్తూనే శ్రీహరి వల్ల పర్సనల్ మేకప్‌మేన్ అయ్యాడు.
చివరి వరకూ ఆయనకు మాత్రమే పనిచేశారు.

అన్నే మా ఆశాదీపం
అన్నతో నాకు పదేళ్లుగా పరిచయం. ఎంతమందిలో ఉన్నా శేఖర్ అని నోరారా పిలిచేవాడు. మా ఫైటర్లంటే అన్నకు చాలా ఇష్టం. అభిమానం. ఎందుకంటే యాక్షన్ కష్టాలేంటో ఆయనకు బాగా తెలుసు. ఆ స్టేజీ దాటి వచ్చినవాడు కదా. అందరు హీరోల్లాగా మమ్మల్ని నాలుగు దెబ్బలు కొట్టి వెళ్లిపోడు. ప్రేమగా మాట్లాడతాడు. నాలుగు మంచి మాటలు చెప్పేటోడు. ఫైటర్లుగా మాకేదైనా రిస్కీ షాట్లు ఉన్నప్పుడు ఆయన చాలా టెన్షన్ పడేవాడు. మా కోసం ఆరాటపడేవాడు. ఆ ప్రేమను చూసే కావచ్చు. అన్నతో పనిచేయడమంటే మేము మరింత ఉత్సాహంగా ఉండేవాళ్లం. ఒకసారి ‘కూలీ’ సినిమా కోసం ట్రెయిన్ ఫైట్ చిత్రీకరణ జరుగుతోంది. హీరో కొడితే ట్రెయిన్ మీద నుంచి పడిపోయే షాట్ తీస్తున్నారు. ఆ పడిపోవడం ఎలాగో టెక్నిక్ చెప్పాడు శ్రీహరన్న. అదే నాకు ప్రాణభిక్ష పెట్టింది ఎందుకంటే అప్పటికే నేను మరోలా పడాలి అని డిసైడ్ అయిపోయి ఉన్నా…అదే జరిగితే ఇప్పుడు నేను ఉండేవాణ్ణే కాదు.

అలాగే ‘ఢీ’ సినిమాలో శ్రీహరి మీద ఎటాక్ చేసి తన చెల్లెలు జెనీలియాను విలన్లు తీసుకెళ్లే ప్రీ క్లయిమాక్స్ ఫైట్ ఒకటి ఉంటుంది. ఆ ఫైట్‌ను నేను ఎప్పటికీ మరిచిపోను. కట్స్ లేకుండా చేసిన ఫైట్ అది. ఎంతో స్టామినా ఉంటే గానీ చేయలేరు. ఆ ఫైట్‌లో నా ఫేస్ మీద పంచ్ పడాలి. అది దవడ మీద తగిలి నా రెండు దవడలు పక్కకు జరిగిపోయాయి. అన్న కంగారు పడిపోయాడు. ఆయన వెహికిల్‌లోకి తీసుకెళ్లి ఏదేదో చేసి మొత్తానికి మళ్లీ సెట్‌రైట్ చేశాడు. అన్న నాకు సాయం చేశాడని చెప్పడం కాదు..ఒక హీరో ఫైటర్స్ గురించి అలాంటి చొరవ తీసుకోవడమే విశేషం. అందుకే సినిమా ఏదైనా కానీ, స్పాట్ ఏదైనా కానీ…సెట్లో అన్న ఉన్నడంటే మాకు కాస్త ఊరటగా అనిపిస్తుంది. మమ్మల్నందరినీ పిలిచి మాతో పాటే భోజనం చేస్తాడు. ఎప్పుడూ నవ్వుతూనో, నవ్విస్తూనో ఉంటాడు. చాలా ఎంజాయ్ చేస్తాడు. ఆయన నిజంగా వస్తాద్ లాంటివాడే. ఎలాంటి షాట్ అయినా చేస్తాడు. మాకు తెలిసి ఫలానా షాట్ చేయలేకపోయాడనేదే లేదు. ఎంతటి రిస్క్ అయినా ఢీ కొడతాడు. అంతెందుకు, ఆయనతో ఫైట్ చేసిన మేము అలిసిపోయినా అన్న మాత్రం అదే స్టామినాతో కనిపిస్తాడు మళ్లీ. నిజంగా శ్రీహరన్న ఒక టిపికిల్ మనిషి. ఏదైనా చేసేయడమే అన్నకు తెలుసు.

నేను సిన్సియర్‌గా పనిచేసేవాణ్ణి. నన్ను బాగా ప్రేమించేవాడు. పైగా నేను మార్షల్ ఆర్ట్స్. నా బాడీలాంగ్వేజ్, అరుపులు అన్నీ తేడాగా ఉంటాయి. అందుకే నాతో చాలా కామెడీ చేసేవాడు. ఏదైనా చెప్తే శ్రద్ధగా వినేవాడు. అలా మా అనుబంధం కాస్త ఎక్కువే. నాకు నంది అవార్డు వచ్చినప్పుడు కూడా అన్న చాలా హ్యాపీగా ఫీలయ్యాడు. శభాష్‌రా అని భుజం తట్టాడు. నాకు అవకాశాల్లేని టైమ్‌లో కూడా ప్రోత్సహించాడు. కష్టాల తరువాతే ఫలితాలుంటాయని మానసిక స్థయిర్యం నింపేవాడు.
మాకే కష్టం వచ్చినా అన్న ఉన్నాడులే అనిపించేంత దగ్గరగా ఉండేవాడు మాతో…అది కేవలం శ్రీహరన్నకే సాధ్యం. ఆయనతో ఎంజాయ్ చేసిన రోజులు, కలిసి తిన్న క్షణాలు, ఆయనతో కలిసి పనిచేసిన సందర్భాలు ఏవీ ఎప్పటికీ మరిచిపోలేను. మాలాంటి వాళ్లకు ఆశాదీపంగా ఉండేవాడు..ఆ వెలుగులో ఎంతోమంది సాయం పొందారు!

 

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మురుగున పడిన మతాలు –మతాచార్యులు -50 (చివరి భాగం )

మురుగున పడిన మతాలు –మతాచార్యులు -50 (చివరి భాగం )

               రవీంద్ర నాధ టాగూర్

విశ్వకవి గా ,గీతాంజలి కర్త గా అనేక కదా, నవలా, నాటక రచయితగా శాంతి నికేతన్ సంస్తాపకుడుగా ,రవీంద్ర సంగీత కర్త గా, గాయకుడుగా,చిత్రకారుని గా  రవీంద్ర  నాధ‘టాగూర్ ప్రముఖ స్తానం పొందాడు .ఆయన దార్శనికుడు కూడా తండ్రి దేవేంద్ర నాద టాగూర్ కుమారుడు .కలకత్తాలో 1861 లో మే ఏడున జన్మించాడు  నిత్యం ఉపనిషత్ మంత్రం ఘోష ఉన్న కుటుంబం వారిది .చిన్న నాడే వంగ దేశ వైష్ణవ  భక్తీ గీతాలకు ఆకర్షితుడయ్యాడు .వివాహం అయిన తర్వాత ఇంట్లోనే పదేళ్ళ పాటు ఉన్నాడు .తోట పని వారితో ,బ్రహ్మ జ్ఞాన చింతనతో ,విశ్వ సౌభ్రాత్వపు భావనలతో ఉండి పోయాడు .ఇవే ఆయన దార్శనిక సూత్రాలకు మూలాలయ్యాయి .గీతాంజలి కవిత్వానికి1931 లో  నోబెల్ పురస్కారాన్ని సాహిత్యం లో పొందిన మొదటిభారత దేశపు కవి టాగూర్ .మొదటి నాన్ యూరోపియన్ కవికూడా .బెంగాలీ చిత్ర కళను బంధాల నుండి విముక్తి చేసి స్వేచ్చా చిత్ర కల గా  ఘనత టాగూర్ దే.మన జాతీయ గీతం జన గణ మన బంగ్లా దేశ గీతం ‘’సోనార్ బంగ్లా ‘’లను రాసి న వాడు రవి కవియే .ఎన్నో సాహిత్య వ్యాసాలనూ సాదికారికం గా రాశాడు అయన రాసిన” కాబూలీ వాలా ”కద, చండాలిక నాటకం ,నౌకా భంగం నవల ప్రసిద్ధి చెందాయి శరత్ టాగూర్ ను తన గురువు అన్నాడు

Late-middle-aged bearded man in white robes looks to the left with serene composure.Tagore manuscript6 c.jpg

Close-up on a Bengali word handwritten with angular, jaunty letters.

1900-1- కాలం లో శాంతి నికేత విద్యా సంస్థను స్తాపించి కళలను ,సాహిత్య చిత్రలేఖన నృత్యాలను బోధించాడు ఆ తర్వాత అది విశ్వ భారతి గా రూపు దాల్చింది .ఇప్పుడువిశ్వ విద్యాలయమై  కేంద్ర ప్రభుత్వ అధీనం లో నడుస్తోంది .సాధన ,,క్రియేటివ్ యూనిటి ,మానవత్వం వ్యక్తిత్వం లను రవీంద్రుడు ఆధారం గా చేసుకొని దర్శన  భావాలను వ్యాప్తి చేశాడు .కవిత్వానికి దార్శనిక సూత్రాలకు సంబంధం కల్పించాడు .

రవీంద్ర మతం వైష్ణవ వేదాంతానికి దగ్గరలో ఉంటుంది .పరమార్ధం పురుష రూపం లో ఉంది అదే మానవ కృత దైవం .అదియే పురుషోత్తముడు ‘’నిరవధికం అవదీక్రుతం అయితే పరమార్ధం పురుషార్ధం అవుతుందని టాగూర్ చెప్పాడు .సృష్టి కార్యోన్ముఖం అయితే పురుషార్ధం పురుషం అవుతుందని అన్నాడు .అమూర్తాన్ని కేవలం అంటే ఆబ్సల్యూట్ ను  కాదన లేదు .పురుష విధానం లో ఆలోచించి నప్పుడే కేవలం మానవ బోధకు అందుతుంది అన్నాడు  టాగూర్ .

 

Three-verse handwritten composition; each verse has original Bengali with English-language translation below: "My fancies are fireflies: specks of living light twinkling in the dark. The same voice murmurs in these desultory lines, which is born in wayside pansies letting hasty glances pass by. The butterfly does not count years but moments, and therefore has enough time."Photo of a formal function, an aged bald man and old woman in simple white robes are seated side-by-side with legs folded on a rug-strewn dais; the man looks at a bearded and garlanded old man seated on another dais at left. In the foreground, various ceremonial objects are arrayed; in the background, dozens of other people observe.

అద్వైతాన్ని అంగీకరించి, దేవుడొక్కడే అన్నాడు .సావధిక సత్తా నిరవదిక సత్తా పేక్షం అవుతుంది .కేవలం తో ఏక మవటమే సావదికాత్మ యొక్క పరమ లక్ష్యం అంటాడు .టాగూర్ చెప్పిన ఐక్యతకు శంకరుడు చెప్పిన అద్వైత ఐక్యతకు భేదం ఉంది .జీవాత్మ తనకు తాను నిరవ శేషంగా  పరమాత్మకు అర్పించుకోవటమే టాగూర్ చెప్పిన ఐక్యత .అహం లేక పోతే ప్రేమ ఎలా ?ఇదొక్కటే ఉంటె ప్రేమ యెట్లా సాధ్యం ?అని సాధన లో వివరించాడు  ఆత్మ అన్నిటి కంటే ఎక్కువ ప్రేమాస్పదమైంది .ఆత్మ స్వరూపాన్నే సర్వ ప్రేమాస్పదం గా ఉపాశించేది .ఈ ప్రేమ బాహ్యమైంది ,మరణ శీల మైంది అన్న బృహదారన్యకానికి ఆనందానికి ,ప్రేమకు వ్యాఖ్యానాన్ని కల్పించి జ్ఞానం కంటే ప్రేమయే  బ్రహ్మ ప్రాప్తికి  సాధకం అవుతుందని రవీంద్రుడు వివరించాడు .’’సాపరాను రిక్త రీశ్వ రే ‘’అనే శాండిల్య మహర్షి సూత్రర్ధాన్ని అనుసరించి ఈశ్వరుని పై ఉన్న పరమ ప్రేమయే భక్తీ అని చెప్పాడు .అలాంటి భక్తీ అహేతుక ,వ్యవహితమూ అయినప్పుడు ప్రేమ అవుతుంది అని గట్టిగా చెప్పాడు .ప్రేమ ,భక్తీ అనర్దాన్తరాలు .జ్ఞానం విషయి విషయ తేడాను పాటిస్తుంది .ఈ తేడా లేక పోతే జ్ఞానం రావటం అసంభవం అన్నాడు విశ్వ కవి .ప్రేమ లక్ష్యం ఐక్యత .ఇందులో విషయి విషయ వ్యత్యాసం అంత రించి పోతుంది .కాని ప్రేమ జ్ఞానం తో పొందేది కాదు అన్నాడు

.A bronze bust of a middle-aged and forward-gazing bearded man supported on a tall rectangular wooden pedestal above a larger plinth set amidst a small ornate octagonal museum room with pink walls and wooden panelling; flanking the bust on the wall behind are two paintings of Tagore: to the left, a costumed youth acting a drama scene; to the right, a portrait showing an aged man with a large white beard clad in black and red robes.

వాల్మీకి నాటక భాగం”నీస్” ఇందిరా దేవి తో టాగూర్

ఈశ్వరుని తెలుసుకోవాలంటే ఆనందమే ,ప్రేమయే మార్గాలు .ఆనందం జ్ఞానం యొక్క స్పూర్తి అంటాడు .బుద్ధి మనల్ని జ్ఞేయ విషయాలనుండి వేరు చేస్తున్దన్నాడు .ప్రేమ విషయాన్ని ఏకీకరణం వల్లనే తెలుసుకో గలం  .అలాంటి జ్ఞానం అపరోక్షం .అనుమానానికి చోటు ఇవ్వదు .అని ప్రేమ రహస్యాన్ని సంపూర్ణం గా ఆవిష్కరించాడు విశ్వకవి రవికవి జ్ఞాని టాగూర్ .

ర్Black-and-white photograph of a stylised sketch depicting a tribal funerary mask.Black-and-white close-up photograph of a piece of wood boldly painted in unmixed solid strokes of black and white in a stylised semblance to "ro" and "tho" from the Bengali syllabary.

టాగూర్ చిత్రాలు

‘’మరుగున పడిన మతాలు –మతా చార్యులు ‘’సమాప్తం ..

 

ఈ ధారా వాహిక కు కావలసిన ముఖ్య విషయాలన్నిటిని ‘’వీకీ పీడియా ‘’నుండి’’ విజ్ఞాన సర్వస్వం’’ నుండి గ్రహించానని సవినయం గా మనవి చేస్తున్నాను .మొదటి ఎపిసోడ్ లో చెప్పినట్లు నేను అందించింది ఆవగింజంత మాత్రమె  .దీన్ని ఆధారం గా ఆ మహనీయులను గుర్తు చేయటానికి మాత్రమె. కావలసిన వారు ఇంకా లోతుగా తెలుసుకొంటారనే నా భావన  .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -23-10-13- ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -49

     మరుగున పడిన మతాలు –మతాచార్యులు -49

కబీర్

భక్త కవి కబీర్ శ్రేష్ట సత్పురుషుడు ..తలిదంద్రులెవరో తెలియదు .కాని పుట్టింది1398  లో జ్యేష్ట శుద్ధ పూర్ణిమ సోమవారం నాడు అని  అంటారు . .మహమ్మదీయ దంపతులు కబీర్ ను పెంచారని అంటారు ఆయన చేనేత వ్రుత్తి కి చెందినా వాడు . .కాశి లో కబీర్ జన్మించాడు .కబీర్ అంటే ఆరబిక్ లో కబీర్అంటే గొప్ప వాడు అని అర్ధం  ఇస్లాం మతం లో 37 వ దేవుడి పేరు కబీర్ .వివాహం చేసుకొని కొడుకును కన్నాడు రామానంద స్వామి తన గురువు అని కబీర్ అన్నాడు .గురువు ‘’రామ’’మంత్రాన్ని కబీర్ కు బోధించాడు .కబీర్ సంప్రదాయం ఆందరికీ అందుబాటులో ఉంటుంది .ఆయన భక్తులు పది లక్షలకు పైగా ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నారు ..కబీర్ బీజక్ కబీర్ గ్రంధావళి,అనురాగ సాగర్ పుస్తకాలు కబీర్ రాశాడు అవధి బోజ్పురి ,వ్రాజ్ మాండలికాలలో తత్వాలు రాశాడు సంత్ మత్ ,రాదాస్వామి గబీర్ దాస్ లపై కబీర్ ప్రభావం ఉంది .ఆయన కవితల్ని బాణీలు లేక బోధలు అంటారు రెండు పంక్తులుందే వీటిని’’ కబీర్ దోహాలు’’అంటారు . దులో కబీర్ గంభీర వేదాంత భావాలు సూటిగా మనసుకు హత్తుకోనేట్లు చెప్పటం అయన ప్రతిభకు నిదర్శనం .ఇవి ముఖతా చెప్పినవే పరంపర గా తర తరాలుగా వ్యాప్తి చెందాయి సూఫీ మతం లో మొదటి ప్రార్ధాన కబీర్  కవిత్వం తో నే ప్రారంభమవుతుంది గృహస్తుగా సంత్ గా కబీర్ సమర్ధ జీవితాన్ని గడిపాడు .కబీర్ భగత్ ను సిక్కుల అయిదవ మతగురువు అర్జున్ సిక్కు మత గ్రంధం గ్రంధ సాహేబ్ లోచేర్పించాడు ..కబీర్ 1518 లో నూట ఇరవై ఏళ్ళు జీవించి మఘార్ లో మరణించాడు

 

 

 

 

వారణాసి లో మగ్గం నేస్తున్న కబీర్ చిత్రపటం      కబీర్ పోస్టల్ స్టాంప్ -1952

 

కబీర్ పరమాత్మను అన్ని నామాలతో భజించిన మహా భక్త శిఖా మణి.అందులో న్రామ నామం అంటే మహా ప్రీతీ ఆయనకు అందువల్ల ముస్లిం మత పెద్దల ఆగ్రహానికి ఈర్ష్యకు గురి కావాల్సి వచ్చింది .సికందర్ లోడి భక్త కబీర్ ను చాలా బాధలు పెట్టాడని చరిత్ర చెబుతోంది .కబీర్ కు అల్లా ,విష్ణు ,కృష్ణ ,గోవింద ,ఖుదా ,రామ నామాలన్నీ నిర్గుణ పరబ్రాహ్మను సూచిన్చేమంత్రాలే  నని నమ్మాడు . కబీర్ కొలిచే రాముడు వేదా తీతుడైన ,త్రిలోకాలకు విలక్షణుడైన కేవల పరమాత్మ తత్వమే .

భక్తిని పారమార్ధిక సాధనం గా కబీర్ ఎంచుకొన్నాడు .మన లని  భగవంతుడి తో కలిపే హృదయం దొరకటం ఒక మహా రహస్యం అన్నాడు కబీర్ .దీనినే ఆయన’’ భావ ‘’,భేద ‘’పేర్లతో పిలిచాడు .అందుకే తన మార్గాన్ని ‘’భావ భగతి ‘’అంటే భావ భక్తి అన్నాడు .దీన్ని వర్ణించటం అసాధ్యం అన్నాడు .అదొక అనుభవైక వేద్య విధానం అని చెప్పాడు సద్గురు కటాక్షం వల్లనే ఇది సాధ్యం అన్నాడు .అప్పుడే జ్ఞాన నేత్రం వికశించి మనలో దాగి ఉన్న రహస్యం మనకు తెలుస్తుంది అంటాడు .భగవంతుని పై జిజ్ఞాస ,ఆయన ముఖ వీక్షణ అభిలాష తీవ్రం గా మనలో రగుల్కొని ఈశ్వరుడోక్కడే ఏకైక ప్రియ తముడై ,ఆయన విరహం తాళ లేనంత అయినప్పుడే భాగవత్సాక్షాత్కారం లభిస్తుందని కబీర్ చెప్పాడు .

కబీర్ చెప్పిన భావా భక్తీ కి మస్శుద్ధి ,మనస్సు యొక్క సంయమనం ,అవసరాలు .అన్ని భొతిక విషయాలు వదిలేసి చివరికి దేనిలో ప్రవేశించాలో ఆ  మనస్సు ను మనం వెతుక్కోవాలి .అదే ‘’ఆకల్  నిరంజన్’’ అంటే నిరంజన బుద్ధి .అని కబీరు వర్ణించాడు .ఈ నిరంజన బుద్ధి ఎక్కడో లేదు మన మనసులోనే ఉందన్నాడు .మనసు నిర్వికారం గా ఉన్నప్పుడు అది స్వచ్చమైన అద్దం లాగా శుద్ధమైనప్పుడు అది నిరంజన బుద్ధి లో ప్రవేశిస్తుంది .అప్పుడే మన మనస్సులో రహస్యమైన శాశ్వత పర వస్తువు ప్రతి బిమ్బిస్తుంది .అదే ‘’అపా ‘’,బ్రహ్మం ‘’,రాముడు ‘’అందుకే ఈ ప్రాప్తి సాధ్యమవుతుంది దీనినే ఆ ప్రాప్తి సాధనాన్ని ‘’ఆత్మ సాధన ‘’,బ్రహ్మ విచారం ‘’రామ నామ సిద్ధి  యోగం‘’అన్నాడు.

భావం అనేది షట్చక్రాల బంగారు భవనం లో ఉంది .దాని తాళం విప్పి లోపలి ప్రవేశించి నప్పుడే షట్చక్ర చేదనం జరిగి అది తెలుస్తుంది .పరం జ్యోతి సహస్రారం లో దర్శనం అయినప్పుడు ‘’హద్దు ‘’హద్దు లేనిది ‘’అవుతుంది అంటాడు కబీర్ .’’ఘట ‘’ ముందే ‘’అఘటం కనీపిస్తుంది . ఇదే అనంత బ్రహ్మ యొక్క అసంఖ్యాక సూర్య సమానం అయి ,శీతల తేజస్సు ,దాని వర్ణన కుదరదు .ఆ స్తితి ప్రాప్తించి నప్పుడు కల్పనలనేవి ఉండవు .మనస్సు పోయి ,అమనస్కత ఏర్పడుతుంది .ఈ కర్మ వల్ల కర్మ నాశనం అయి మమత్వం అభిమానాలు బ్రహ్మాగ్ని చేత భస్మం అవుతాయి .ఈ అవస్తనే కబీర్ ‘’సహజ సమాధి ‘’అన్నాడు .గురువు వల్లే ఇది లభిస్తుందని చెప్పాడు దీనికోసం ఆసనం ముద్రా ,అక్కర్లేదు .వాసనా త్యాగం మనో నిరోధం వల్ల ‘’సురటి ‘’ని అరికట్టాలి .అప్పుడే సహజ సమాధి వీలు అవుతుంది .అనాది నుండి వచ్చిన వాసనాదుల వల్ల కలిగే ప్రపంచ దృశ్యాల స్పురణమే ‘’సురటి  ‘’ లేదా సంసారం .

హిందూ, మహమ్మదీయ మతాలలో ఒకే పరమ సత్యం ఉందని నమ్మి దాన్ని వ్యక్తం చేయటానికి ప్రయత్నించాడు .కబీర్ ది ఒక రకం గా ‘’అద్వైత సాక్షాత్కార వాదం‘’కబీర్ పై హఠ యోగుల ప్రభావం ఉంది.కుల భేదాలను లెక్క చేయలేదు కబీర్ .అందరికి సన్నిహితుడైన ఒకే ఈశ్వరుడి గూర్చి ప్రజలకు దేశ భాషలో బోధించైనా ప్రజా భక్త కవి కబీర్ . ..

సశేషం

మీ  –గబ్బిట దుర్గా ప్రసాద్ -23-10-13-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సరస భారతి 52వ సమావేశ విశేషాలు

  సరస భారతి 52వ సమావేశ విశేషాలు

శ్రీపానుగంటి వారి సాక్షివ్యాసలపై ప్రసంగం ,శ్రీ మతి డొక్కా సీతమ్మ గారి స్మారక స్కాలర్షిప్ ల ‘ప్రదానం గా సరసభారతి 52 వ సమావెశం శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో నిన్న సాయంత్రం సాయంత్రం(22-10-13-మంగళ వారం ) ఆరున్నర గంటలకు జరిగింది .ప్రొద్దుటి నుంచి యెడ తెరిపి లేని అకాల వర్షం తో అసలు కార్యక్రమం జరపగలమా అన్న సందేహం ఉన్నా ధైర్యం తో మా  అంజనేయ స్వామి వారి అనుగ్రహం తో జరుప గలిగాం .మధ్యాహ్నం నుండి అందరికి మళ్ళీ ఫోన్లు చేసి కార్యక్రమం తప్పక జరుగుతుందని జ్ఞాపకం చేశాం .

శ్రీమతి డొక్కా సీతమ్మగారి పై సరసభారతి 52 వ సమావేశం

డొక్కా సీతమ్మ గారి మునిమనవడు శ్రీ డొక్కా సూర్య నారాయణ గారు వారి శ్రీమతి శ్రీమతి బాలా త్రిపుర సుందరి గారుఉదయానికే హైదరాబాద్ నుండి విజయ వాడకు వచ్చి శ్రీ కనక దుర్గమ్మ దర్శనం చేసుకొని సాయంత్రం నాలుగున్నరకు కార్ లో బయల్దేరి సరాసరి మా ఇంటికి వచ్చి కాసేపు కూర్చుని కాఫీ సేవించారు .మా ఇల్లూ,అరటి చెట్లు ,ఉసిరి చెట్టు చూసి మహదానంద పడ్డారు .వారు మా ఇంట్లో కి వచ్చినప్పుడు కూడా తేలిక పాటి జల్లు కురిసింది .కాని మా ఇంటినుంచిమేము నలుగురం  ఆలయానికి వారి కారు లో బయల్దేరినప్పుడు  తమాషా గా వర్షం ఆగి పోయింది .మళ్ళీ కురవలేదు  అందుకని కార్యక్రమం సవ్యం గా, నిండుగా ,ఆత్మీయ భావన తో జరిగింది

కార్య దర్శి శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి అందరిని వేదిక పైకి ఆహ్వానించి ప్రార్ధన చేయటం తో అసలు కార్యక్రమం మొదలైంది .అధ్యక్షత వహించిన నేను సరసభారతి ఏర్పడి ఈ రోజుకు నాలుగేళ్ళు పూర్తీ అయ్యాయని అయిదవ ఏడాదిలో ప్రవేశించి శిశు దశ నుండి బాల్య దశలో కి చేరిందని ఇది అందరి సహకార ఫలితమేనని ,సరసభారతి తరఫున పదకొండు పుస్తకాలు ముద్రించామని ,అందులో  నేను రాసినవి ఆరు ఉన్నాయనిఇవి నెట్ లో రాసిన వే నని  తెలియ జేశాను .ఇవన్నీ అందరికి ఉచితం గా అందించామని వదాన్యులు ముందుకొచ్చి కొన్ని పుస్తకాలకు పూర్తీ ధన సహాయం చేశారని ,ప్రతి ఉగాదికి కవి సమ్మేలనాలను వరుసగ నాలుగు ఏళ్ళు నిర్వాహించామని జిల్లాలో ప్రసిద్ధులైన కవులు సుమారు యాభై మంది వరకు వచ్చి ప్రతి సారీ కవితలు వినిపించే వారని వాటిని పుస్తక రూపం లో తెచ్చి అందించామని గుర్తు చేశాను . .లబ్ధ ప్రతిస్టూలైన ఎందరో కవులను కళా కారులను ఆహ్వానించి ఉపన్యాసాలిప్పించి సత్కరించామని చెప్పాను

ఉయ్యూరు కాలేజి లో, ఫ్లోరా స్కూల్ లో విద్యార్ధులకు అనేక కార్య క్రమాలు జరిపి వారికి సాహిత్యం పట్ల అవగాహన కల్గిన్చామని అన్నాను .రెండేళ్ళ క్రితం కాలేజి ,సరసభారతి ,కాలేజీ ,,కృష్ణా జిల్లా రచయితల సంఘం సంయుక్తం గా గురజాడ ,రవీంద్రుల 150 వ జయంతిని ఘనం గా నిర్వహించమని గుర్తు చేశాను .మళ్ళీ అలాంటి  మంచి కార్యక్రమం కాలేజి లో చే బట్టమని  తెలుగు లేక్చరర్ ,ఈ నాటి వక్త అయిన వేణుగోపాల్ ను కోరాను .జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత ,ఇటీవలే స్వర్గస్తులైన శ్రీ రావూరి భరద్వాజ గురించి కాలేజీ విద్యార్ధులకు తెలియదని ,కనుక వారిపై అవగాహనా సదస్సు నిర్వహించే ఏర్పాట్లు చేయమని వేణుగోపాల్ కు చెప్పాను ను  తప్పకుండా .చేద్దామని అన్నాడు ఆ తర్వాత అందరం రెండు నిమిషాలు భరద్వాజ మృతికి సంతాప సూచకం గా మౌనం పాటించాం.

DSCF4526ముఖ్య అతిధి వక్త అయిన శ్రీ గుంటక వేణు గోపాల రెడ్డి పానుగంటి వారు తెలుగు భాష గొప్పదనాన్ని గురించి చెప్పిన కమనీయ వాక్యాలతో ప్రసంగం ప్రారంభించి అందర్నీ ఆకట్టుకొన్నాడు .పానుగంటి లక్ష్మీ నరసింహా రావు గారు తూర్పు గోదావరి జిల్లా సీతా నగరం లో 11-2-13 న జన్మించారని 75ఏళ్ళు జీవించి 7-10-1940 లో మరణించారని ,పెద్దాపురం హైస్కూలో టీచర్ గా ఉద్యోగం ప్రారంభించారని అనేక సంస్థానాల్లో దివాన్ గా ని ,పిఠా పురం రాజా సూర్యా రావు గారి ఆస్తాన కవి అయ్యారని చెప్పాడు .ఆంధ్రా షేక్స్ పియర్, కవిశేఖర్ ,ఆంధ్రా ఎడిసన్ బిరుదులు పొందారని ,చెళ్ళపిళ్ళ వారు ‘’అభినవ కాళిదాసు ‘’బిరుదు ప్రదానం చేశారని చెప్పాడు చిలకమర్తి ,,కూచి నరసింహం ,పానుగంటి ముగ్గురిని’’నరసింహ లేక సింహ త్రయం’’ అనే వారని అన్నాడు దాదాపు ముప్ఫై నాటకాలు పానుగంటి వారు రాశారని అందులో సారంగధర ,పాదుకా పట్టాభిషేకం ,ప్రచండ చాణక్య ,విజయ రాఘవం మొదలైన నాటకాలను ఆ కాలం లో ప్రతి ఊరిలో ప్రదర్శించే వారని చిక్కని కవిత్వానికి, కమనీయ భావానికి వారు పట్టు గొమ్మ అనీ ,చేవ గల వచన రచనా నిపుణులని హాస్యాన్ని కూడా పండించి హాస్య వల్లరి ,వృద్ధ వివాహం వంటివి రచించారని చెప్పాడు  న్గాలీ  భాషలో ఆశుతోష్ ముఖర్జీ రాసిన ‘’గౌరాంగ ‘’నాటకం ఆధారం గా పానుగంటి ‘’రాదా కృష్ణ ‘’నాటకాన్ని పరమ రమణీయం గా ,వారిద్దరి అద్భుత ప్రేమకు నిదర్శనం గా రాశారని ఇదీ బాగా ప్రచారం అయిందని గుర్తు చేశాడు

పిఠా పురం రాజా ఆస్తానం తర్వాత పానుగంటి వారి ఇల్లే పెద్ద దివాణం గా ఆ రోజుల్లో ఉండేదని అందరు చెప్పుకొనే వారని ,ఆధునిక కవి సార్వ భౌముడు గా (శ్రీనాధుడు లాగా )భోగ జీవి అని ,సంపాదనలో ఖర్చు తప్ప మిగులు లేక, కొడుకులకు ఉద్యోగాలు లేకచివరి రోజుల్లో తన  పుస్తకాలు అమ్మి జీవించారని చెప్పాడు .పిఠాపురం లో 1935లో చిలక మర్తి వారి ఆధ్వర్యం లో ఘన సన్మానం జరిగిందని పానుగంటి వారి ఈవితాన్ని సంక్షిప్తం గా తెలిపాడు .

పానుగంటి వారు సాక్షి వ్యాసాలను అధిక్షేప రచనలుగా 1913-14 ,20-22 ,27-28 ,1933 లో వరుస భాగాలుగా రాశారని ఇవి ఆనాడు పత్రికల్లో వచ్చేవని వీటి కోసం వారం వారం సాహిత్య ప్రియులు ఎదురు చూసే వారని చెప్పాడు గోపాల్ .ఈ రచన కు ప్రేరణ ఎడిసన్ రాసిన స్పేక్టేటర్ వ్యాసాలని తెలియ జేశాడు అయితే ఇది సర్వ స్వతంత్ర రచనమే కాని అనువాదం, చాయా కూడా లేదని స్పష్టం చేశాడు .పానుగంటి వారి ధార అమోఘం అని ఏ విషయాన్ని అయినా కూలంకషం   గా లోతులకు వెళ్లి చర్చించారని సమాజం లో ఉన్న మూఢ నమ్మకాలను బయట పెట్టటమే వారి ధ్యేయమని .అమ్రుతోపమైన తెలుగు భాష రాశారని అందరిని అలరించారని కొందరు ఆ దెబ్బలు తమకే నని తెలుసుకొనే వారని వ్యంగ్యాన్ని అధిక్షేపాన్ని పల్లకీ లో ఊరేగించిన మహా ను భావుడు పానుగంటి అని తన ప్రసంగాన్ని ముగించాడు .

తరువాత శ్రీ డొక్కా సూర్య నారాయణ గారు సీతమ్మగారి గురించి గుర్తు చేసుకొన్నారు ఆమె చేసిన అన్న దానం వల్లనే ఇప్పటికీ తా మంతా తరతరాలుగా హాయిగా ఉన్నామని మంచిని ప్రోత్సహించాలని ఇలాంటి కార్యక్రమం సరసభారతి నిర్వహించటం ఏంతో సంతోషం గా ఉందని ,తమనూ భాగస్వామ్యులను చేసినందుకు క్రుతజ్ఞాతలని చెప్పారుఇంకెవరైనా బీద విద్యార్ధులు డబ్బు లేక చదువు కోన సాగించలేక పోతే తనకు తెలియ జేస్తే తప్పక ఆర్ధిక సహాయం అందిస్తామని తమ కుమారుడురామ భద్ర అమెరికా లో ఇలాంటివి చాలా చేస్తున్నాడని చెప్పారు  వారి శ్రీమతి బాలా త్రిపుర సుందరి విద్యార్ధులను తెలుగు భాష సంస్కృతీ లపై మక్కువ పెంచుకొమ్మని అందమైన సుందరమైన మన భాషను మరచి పోవద్దని తమ పిల్లలను కాన్వెంట్ లలో చదివించకుండా అమలా పురం లో తెలుగు స్కూల్స్ లోనే  చదివిన్చామని ఒక భాష వస్తే మిగిలినవి సునాయాసం గా నేర్వ వచ్చని తమ పిల్లలే కాక చాలా మంది రుజువు చేశారని గుర్తు చేశారు .DSCF4542 DSCF4538 DSCF4535

ఆ తర్వాతముఖ్య అతిధి చి వేణుగోపాల రెడ్డికి  ,ఆలయ మర్యాదతో సత్కరించి,తర్వాతా సరసభారతి తరఫున శాలువా కప్పి చందన తామ్బూలాలిచ్చి  టాగూర్ చిత్రపటాన్ని జ్ఞాపికగా అందించి ,శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం పుస్తకాన్ని ,నగదును కానుకగా ఇచ్చాం .,గురువు గారి చేతుల మీదుగా సత్కారం పొందిన తాను ధన్యుడను అని ఆనందం గా రెడ్డి తెలియ జేశాడు

శ్రీ డొక్కా దంపతులకు ఆ వెంటనే ముందుగా ఆలయ మర్యాదతోపూజారి మురళి  సత్కరించ గా సరసభారతి  తర ఫున శాలువా కప్పి దండ వేసి ,శ్రీసువర్చలాన్జనేయ స్వామి వారల పెద్ద ఫోటోలు రెండు  వారికీ వారి అబ్బాయి రామ భద్ర గారికి  అంద జేశాం .సరసభారతి పుస్తకాలు శ్రీ హనుమత్ కదానిది ,శ్రీ ఆంజనేయ స్వామి మాహాత్మ్యం ,సిద్ధయోగి పుంగవులు ,ఉయ్యూరు ఊసులు రెండు సెట్లు వారికీ రామ భద్ర గారికి అందించాం .జరిగిన సన్మానానికి వారిద్దరూ కృతజ్ఞత తెలిపారు

తరువాత శ్రీ డొక్కా సూర్య నారాయణదంపతుల   చేతి మీదుగా ఆరుగురు విద్యార్ధులకు అమెరికాలో ఉన్న శ్రీ డొక్కా రామ భద్ర ఏర్పాటు చేసిన ‘’నిరతాన్న దాత ,అపర అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మగారి స్మారకస్కాలర్ షిప్ లను ఒక్కొక్కరికి 1,667రూపాయల చొప్పున మొత్తం10,000 రూపాయలను ,సరసభారతి పుస్తకాలు సిద్ధ యోగి పుంగవులు ,శ్రీ ఆంజనేయ స్వామి మాహాత్మ్యం తో బాటు గురజాడ వారి  ఫోటో  జ్ఞాపిక గా అందించాము స్కాలర్షిప్ లు అందుకొన్న విద్యా ర్ధులు  తలి దండ్రుల తో వచ్చి ఏంతో సంతోషం గా అందుకొని డొక్కా వారికి,సరస భారతికి కృతజ్ఞతలు మనః పూర్వకం గా తెలియ జేశారు .అమర వాణి హైస్కూల్ ప్రిన్సిపాల్ నాగరాజు ఎవరూ ఎక్కడా చేబట్టని డొక్కా సీతమ్మగారి కార్యక్రమాన్ని నిర్వహించటం పేద విద్యార్ధులకు ఆమె స్మారకరూపం గా స్కాలర్షిప్ లను అందించటం సరసభారతి నిర్వహించటం చాలా గొప్ప విషయమని దీనికి డో క్కా వారి కుటుంబ సభ్యులు రావటం మరీ హర్ష దాయకమని తెలియ జేశాడు .కార్య దర్శి శివ లక్ష్మి వందన సమర్పణ చేసింది

చివరగా నేను ఈ కార్యక్రమానికి స్పూర్తి టి.వి.లో శ్రీ చాగంటి వారు ఆ మధ్య డొక్కా సీతమ్మ గారిని గురించి మాట్లాడి విద్యార్ధులకు ఆమె జీవిత చరిత్ర తెలియ జెప్పాలని కోరటమే నని ,ఈ సభ కిందటి సభ చాగంటి వారి ప్రేరణయే నని పరోక్షం గా కృతజ్ఞతలు తెలిపాను .అమరావతి ప్రభువు వాసి రెడ్డి వెంకటాద్రి నాయుడు పాలనలో గుంటూరు జిల్లా వేట పాలెం లో నివసించిన శ్రీ బందా పరదేశిదంపతుల   అన్నదానాన్ని గురించి రాజుకు తెలిసిన విషయాన్ని ,చివర్లో అన్నీ అమ్ముకొని ఊరు వదిలి వేరే ఊరు వెళ్తే అక్కడ సత్రం లో ఒక తల్లి పిల్లలకు ఆ రాత్రికి పప్పూ బెల్లం టిని పడుకోమని ఉదయమే పరదేశి గారింటికి వెడితే ఆయన కడుపు నిండా భోజనం పెడతారని చెప్పిన మాటలు పరదేశి దంపతులు విని అప్పటికప్పుడు మళ్ళీ తమ ఊరు వెళ్లి అమ్మకానికి ఏదీ లేక రుబ్బు రో లును ఒక షావుకారుకు రెండు రూపాయలకు అమ్మి దానితో అతిధులు వచ్చె లోపు భోజనం సిద్ధం చేసి వడ్డించారని రుబ్బు రోలును కోమటి తీసుకు వెళ్ళమని కోమని రోజ్జూ చెప్పేవాడని ఒక సారి పరదేశిగారు శ్రేష్టి ఇంటికి వెళ్ళాడని అతను రోలు ఎత్తితే దానికింద బంగారు లంకె బిన్దలున్డటం చూసి అవి తనకు చెందవని పరదేశిగారివేనని చెప్పి బతిమిలాడి ఇచ్చేశాడని దానితో మళ్ళీ అన్నదానం కోన సాగించాడని మనం చేసిన పుణ్యమే మన వెంట వస్తుందని సీతమ్మగారి ,పరదేశి గారి చరిత్రలు చెబుతున్నాయని ఈ వ్యాసాన్ని మిత్రులు విజయ వాడ వాసి  బందావెంకట రామా రావు గారు నాకు పంపించే దాకా నాకు పరదేశి గారిగురించి తెలియదని నెట్ లో అందరికి దాన్ని పంపానని చెప్పాను

శ్రీ ఆంజనేయ స్వామికి హారతీ ,మంత్రం పుష్పం, తీర్ధ ప్రసాద విని యోగం తో కార్య క్రమం పూర్తీ అయింది  .

మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ –   23-10-13 –ఉయ్యూరు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

గోగులు పూచే … గోగులు పూచే …. మా ఇంట గుమ్మడి

DSCF4548 DSCF4549 DSCF4550

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఇసుక తుఫాన్ ‘జజీరా’

ఇసుక తుఫాన్ ‘జజీరా’

ఉత్తరప్రదేశ్‌లో ఇసుకమాఫియా మీద పోరాడి సస్పెన్షన్‌కు గురైన దుర్గ్గాశక్తి నాగ్‌పాల్ గురించి దేశమంతటికీ తెలుసు. ఎందుకంటే ఆమె ఐఏఎస్ అధికారిణి కనుక. ఆమె చూపిన తెగువకు, సాహసానికీ ఏ మాత్రం తక్కువ కాకుండా.. అదే ఇసుక మాఫియాను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తోంది కేరళకు చెందిన సామాన్య ముస్లిం మహిళ ‘జజీరా’. స్థానిక పోలీసుస్టేషన్ ఎదుట మొదలుపెట్టిన నిరసనను జిల్లా కలెక్టర్, ముఖ్యమంత్రి, దేశ రాజధాని వరకు తీసుకెళ్లి సంచలనం రేపుతున్న ఆ ఇసుకతుఫాన్ గురించే ఈ కథనం..

అది ఢిల్లీలోని జంతర్‌మంతర్. పొద్దున్నే వణికించే చలిలో నిరసన తెలిపేందుకు సన్నద్ధం అవుతున్నారు ఉద్యమకారులు. ఒక్కొక్కరిది ఒక్కో సమస్య. దేశవ్యాప్తంగా ఎక్కడ ఏ డిమాండ్ వచ్చినా, దాన్ని దేశరాజధానిలో వినిపిస్తే భారతదేశమంతా వినిపిస్తుందన్నది ఉద్యమకారుల నమ్మకం. అదే కోరికతో ముగ్గురు పిల్లలను వెంటబెట్టుకుని జంతర్‌మంతర్‌కు వచ్చింది ఒక తల్లి. పేరు జజీరా. ముప్పయి ఏళ్లుంటాయేమో! పిల్లల సహాయంతోనే ఒక చిన్న నీలిరంగు టెంటు కట్టుకుంది. హిందీలో పెద్ద పెద్ద అక్షరాలతో రాసున్న ఎర్రటి బ్యానరొకటి వాళ్ల వెనకవైపు కనిపిస్తోంది. అందులో ‘ఇసుక మాఫియాను అరికట్టండి’ అన్న నినాదం ఎర్రెర్రటి అక్షరాలతో నిగనిగలాడుతోంది. అక్కడ వివిధ రకాల నిరసనలు వ్యక్తం చేస్తున్న వాళ్లెవ్వరూ ఆమెను పట్టించుకోవడం లేదు. కాని జాతీయస్థాయి మీడియా పట్టించుకుంది. చేతుల్లో మైకులు, భుజాల మీద కెమెరాలు పట్టుకుని ఆమెను చుట్టుముట్టారు పాత్రికేయులు. కెమెరాలన్నీ ఆమెవైపు తిరిగాయి. ఢిల్లీవాసులు, సామాజికవేత్తలు, ప్రజాసంఘాల ప్రతినిధులు అందరూ ‘ఎవరీమె?’, ‘పిల్లల్ని తీసుకుని ఇంత దూరం ఎందుకొచ్చినట్లు?’ కనుక్కోవడం మొదలుపెట్టారు.

జీవితమే ఒక పోరాటం..
జజీరా సొంతూరు కేరళలోని కన్నూర్‌లోని మడాయి అనే గ్రామం. అదొక తీర ప్రాంతం. ఆమెది కట్టుబాట్లున్న నిరుపేద ముస్లిం కుటుంబం. తండ్రి అర్ధాంతరంగా మరణించడంతో పదోతరగతిలోపే చదువు మానేయక తప్పలేదు. ముగ్గురు సోదరుల భారాన్ని జజీరా మోయాల్సి వచ్చింది. పదహారేళ్ల వయసులో పెళ్లి చేసుకుందామె. భర్త స్త్రీలోలుడు, తాగుబోతు. కాపురాన్ని భరించలేక బంధాన్ని తెగతెంపులు చేసుకోవాల్సి వచ్చింది. అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. కుటుంబాన్ని ఎలా పోషించాలో దిక్కుతెలియని జజీరా.. పిల్లల్ని పట్టుకుని కన్నూర్ నుంచి ఎర్నాకుళం చేరుకుంది. “రెండేళ్లు కూలి పని చేశాను. బతకడం కష్టమైంది. దిక్కుతోచక మళ్లీ కొట్టాయం వెళ్లిపోయి.. అక్కడ పుస్తకాలను విక్రయించి పిల్లల్ని పోషించాను. మళ్లీ సొంతూరైన కన్నూర్‌కు రావాల్సి వచ్చింది. అక్కడే డ్రైవింగ్ నేర్చుకున్నాను. లైసెన్సు తీసుకుని ఆటోరిక్షా నడపడం మొదలుపెట్టా. అప్పటి వరకు నా కుటుంబంతో పోరాడాల్సి వచ్చింది. ఆటో తోలడం మొదలుపెట్టాక సమాజంతో పోరాడాల్సి వచ్చింది..” అంటూ చెప్పుకొచ్చింది జజీరా. ఆటోస్టాండులో అందరూ మగవాళ్లున్నారు. తనొక్కతే మహిళ. తోటి ఆటోవాలాల ఎగసెక్కాలు, కామెంట్లు ఎక్కువయ్యేవి. “ఒక్కోసారి వాళ్ల వేధింపులు భరించలేకపోయేదాన్ని. ఆటోస్టాండులోనే కాదు. ప్యాసింజర్లను తీసుకుని రోడ్ల మీద ప్రయాణిస్తున్నప్పుడు కూడా అవే కామెంట్లు. పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినా ఫలితం లేదు..” అని గుర్తుచేసుకుంది.

మా తీరం మాకు కావాలి..
ఒక మదర్సాలో పాఠాలు బోధించే అబ్దుల్‌సలామ్ పరిచయం కావడంతో.. అతన్ని విశ్వసించి రెండో పెళ్లి చేసుకుంది. ఆయన ఉద్యమానికి సహకరిస్తున్నారు. “అది 2011. మూడో బిడ్డ కడుపులో ఉంది. కాన్పు కోసం మా అమ్మగారి ఊరైన కన్నూర్‌కు వెళ్లాను. మాది సముద్ర తీరప్రాంతం. ఎక్కువగా పేదవాళ్లే నివశించేవాళ్లక్కడ. కాని ఈ మధ్య పెద్ద పెద్ద భవంతులు, కట్టడాలు వచ్చేశాయి. మా సమస్య అది కాదు. తీరంలోని ఇసుకను తవ్వుకుపోతుండటం సమస్య. నదుల్లోని ఇసుకంతా అయిపోయింది. అందుకని అందరూవచ్చి సముద్రతీరం మీద పడ్డారిప్పుడు. ఇలాగే తరలించుకుపోతే తీరం మాయమైపోతుంది. దానివల్ల సముద్రపు నీళ్లు ముందుకు చొచ్చుకొస్తాయి.

ఉప్పెనలు, తపాన్లు, వరదలు వచ్చినప్పుడు ఇళ్లు మునిగిపోవడం ఖాయం. అది అందరికీ నష్టమే” అన్నది జజీరా ఆవేదన. ఆమె చెప్పినట్లు ఒకప్పుడు ఫుట్‌బాల్ మైదానాల్ని తలపించే కన్నూర్ తీరప్రాంతం ఇప్పుడు ఫుట్‌పాత్ సైజుకు చేరడం దారుణం. ఇరుగుపొరుగు, ఊర్లోని ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరి దగ్గరకెళ్లి ఇసుక సమస్య గురించి చెప్పినా చైతన్యం రాలేదు. తనే స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. బిడ్డల్ని ఒక చంకన వేసుకుని, మరో చేత్తో కొంగును నడుముకు చుట్టుకుని ‘ఇసుక మాఫియా’ మీద పోరాటం ప్రకటించిందీమె. “ముందు నా ఇంటి నుంచే ఉద్యమం మొదలవ్వాలి. ఒకప్పుడు నేను ఎంతో అపురూపంగా చూసుకున్న నా సోదరులే ఇసుకమాఫియాకు సహకరిస్తున్నారు. వాళ్లు దినకూలీలు. అయినా సరే ఆ పని మానేసి మరో పని చేసుకొమ్మని చెప్పాను. వినలేదు. అందుకే వాళ్లుంటున్న వీధుల్లో నా తొలినిరసన చేపట్టాను” అని చెప్పిందామె. నెలల పసికందును ఎత్తుకునే ఇసుకతోడుతున్న లారీలు, ట్రక్కుల ఫోటోలు తీసి.. రెవెన్యూ ఆఫీసులకు వెళ్లి.. ఫిర్యాదు చేయడం మొదలుపెట్టింది జజీరా. అధికారులందరూ ఆమెను ఒక పిచ్చిదాన్ని చూసినట్లు చూశారు తప్ప సమస్యను ఆలకించలేదు. తెల్లకాగితంలో రాసిన వినతిపత్రాన్ని పైనుంచి కింది వరకు చూసి.. ‘వెళ్లిరండి’ అని తలూపి పక్కనపడేసేవారు. “ఈ దేశంలో అన్నిటికంటే ఘోరమైన అన్యాయం ఇసుక అక్రమరవాణా. ఇందులో పోలీసులు, బిల్డర్లు, అధికారులు, నేతలు కుమ్మక్కై ప్రకృతి వనరుల్ని దోచుకుంటున్నారు” అనే జజీరాకు శత్రువులు పెరిగిపోయారు. ఇసుకమాఫియా వాళ్లందరూ ఒక్కటై ఆమె మీద దాడి చేశారు. కొట్టారు. బూతులు తిట్టారు. తోటి మహిళా కూలీలతోనే చావబాదించారు. “ఒకసారి నా పిల్లలతో సహా ఇసుకలారీకి అడ్డంగా పడుకున్నాను. నన్ను లారీకింద తొక్కిస్తామని భయపెట్టారు. అయినా సరే జంకలేదు. నా తలను పట్టుకుని ఇసుకలో పూడ్చిపెట్టారు. నా మొండితనాన్ని భరించలేక మా ఇంటిని ధ్వంసం చేశారు. నా చేతిలోని సెల్‌ఫోన్‌ను లాక్కుని పగలగొట్టారు. వీటికే వెన్నుచూపితే నేనీ ఉద్యమం చేసేదాన్నే కాదు” అందీ కేరళ మహిళ.

జిల్లా కలెక్టర్ దృష్టికి..
‘ఇసుకమాఫియాతో పెట్టుకుంటే ప్రాణాలే పోతాయ్. నీకు ముగ్గురు పిల్లలున్నారు. మనకెందుకిదంతా? ఆలోచించు’ అని బంధువులు సముదాయించినా ఊరుకోలేదు. పుతియంగడి అనే పోలీసుస్టేషన్‌కు వెళ్లి మరొక ఫిర్యాదు చేసింది జజీరా. అక్కడున్న పోలీసులు ‘వెళ్లు వెళ్లవమ్మా, నువ్వు ఒక్కతే దేశాన్ని ఉద్దరిస్తావా ఏందీ?” అని కసురుకున్నారు. వాళ్లతో వాదనకు దిగలేదామె. మౌనంగా స్టేషను గేటు వద్దకు వచ్చి, ఒక పాత గుడ్డ పరుచుకుని నిరసనకు కూర్చుంది. “వెళ్లిపోతుందనుకున్న మనిషి ఇలా భీష్మించుకు కూర్చుందేమిటి? పైఅధికారులకు తెలిస్తే ఏం సమాధానం చెప్పాలి?” అని వణికిపోయారు పోలీసులు. ఒకట్రెండు రోజులు కాదు. వారం గడిచింది. స్థానిక మలయాళ పత్రికలు జజీరా పోరాటాన్ని ప్రచురించాయి. ఆమె పట్టుదలను మెచ్చుకుంటూ పలువురు సామాజికవేత్తలు చేతులు కలిపారు. అనుకున్నట్లుగానే పైఅధికారుల నుంచి పోలీసులకు ఫోన్ వచ్చింది. అది కూడా జిల్లా కలెక్టర్ నుంచి! జజీరాను జిల్లా కలెక్టర్ వద్దకు తీసుకెళ్లారు పోలీసులు.

“ఏమిటమ్మా నీ సమస్య. పత్రికల్లో చూస్తున్నాను. ఏమిటి చెప్పు?” అని అడిగారు కలెక్టర్. “సార్, కొన్ని ముఠాల చేతుల్లోకి వెళ్లిపోయింది మా తీరప్రాంతం. ఇదెంత అన్యాయం? ఇంతమంది అధికారులు, ఇంతపెద్ద వ్యవస్థ మనకుంది. ఒక్కరు కూడా అడ్డుకోలేకపోతున్నారు. తీరంలోని ఇసుకను తవ్వుకుపోవడం వల్ల మా బతుకులు మునిగిపోతాయి. మీరైనా న్యాయం చేయండి..” అంటూ కలెక్టర్‌కు విజ్ఞప్తి చేసింది జజీరా. “నీ దగ్గరున్న ఆధారాలన్నీ ఇవ్వు. యాక్షన్ తీసుకుంటాను. ఆ సంగతి నాకు వదిలేసి, నువ్విక ఇంటికి వెళ్లు..” అని సర్దిచెప్పి జజీరాను ఇంటికి పంపించారు కలెక్టర్. కొన్నాళ్లు స్థానిక అధికారులు హడావిడి చేశారు. ఆ తర్వాత చేతులెత్తేశారు. ఫలితం సున్నా. పోనీలే అని ఊరుకోలేదు జజీరా. మళ్లీ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లింది. “అయ్యా, నేను కలెక్టర్‌ను కలవాలి. అనుమతి ఇప్పించండి” అని అడిగితే- “ఏమిటమ్మా నీ ఇసుక సమస్య పరిష్కారం కాలేదా? ప్రతి చిన్న విషయానికీ కలెక్టర్‌ను కలవాలంటే కుదరదు. అనుమతిస్తే మా ఉద్యోగాలు పోతాయ్” అని కలెక్టర్ కార్యాలయ ఉద్యోగులు జజీరాను వెనక్కి పంపించారు. సర్కారు చేతిలో మోసపోయానన్న సంగతి తెలుసుకున్న ఆమె.. ఈసారి ఉద్యమస్థావరాన్ని మార్చాలనుకుంది. ముగ్గురు పిల్లలను తీసుకుని కేరళ రాజధాని అయిన తిరువనంతపురం వెళ్లే రైలు ఎక్కింది. ఈసారి సెక్రటేరియట్ ఎదుట నిరసన తెలపాలన్నది ఆమె ఆలోచన. “నువ్వు ఎందుకిలా తయారవుతున్నావ్. పిల్లల్ని చెడగొడుతున్నావ్. రాజధానిలో నీ అరుపులు ఎవరికి వినిపిస్తాయి? నువ్వొక మహిళవు” అని ఊళ్లో వాళ్లందరూ అడ్డుకున్నా వినలేదు.

సిఎం నుంచి పిలుపు..
తిరువనంతపురంలోని సెక్రటేరియట్. గేటుకు ఎదురుగా చిన్న గుడారం. ఒక పెద్ద బ్యానరు. ఇసుకమాఫియాను అరికట్టండి అన్న నినాదం. ఇటూఇటూ ఇద్దరు ఆడపిల్లలు, ఒళ్లో ఒక చంటిగాడు. చూసేవాళ్లకు ఆ సన్నివేశం వింతగా ఉంది. ప్రతిరోజు సెక్రటేరియట్‌కు ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు వస్తున్నారు, పోతున్నారు. జజీరాది ఒక రోజుండి పోయే నిరసనేలే అనుకున్నారంతా! రోజులు గడిచినా సీను మారలేదు. విషయాన్ని ముఖ్యమంత్రి పట్టించుకోకుండా ఉండలేకపోయాడు. “సెక్రటేరియట్ గేటు ఎదురుగా కూర్చున్న ఆమెను పిలవండి. మాట్లాడాలి” అని అధికారులను ఆదేశించాడు ముఖ్యమంత్రి ఉమెన్‌చాందీ. “అయ్యా, నమస్కారం. ఇప్పటికే నా సమస్య మీ దృష్టికి వచ్చుండాలి..” అని వినయంగా చెప్పింది జజీరా. “ఏమిటమ్మా ఇది. సెక్రటేరియట్‌కు వచ్చి నిరసన తెలపడమేమిటి? మీ ఊళ్లో పోలీసులు, అధికారులు ఉన్నారు కదా! కలవలేకపోయావా?” అన్నారు సీఎం. “అయ్యా, అవన్నీ అయిపోయాకే ఇక్కడికి వచ్చాను. నాకెక్కడా పరిష్కారం దొరకలేదు” అని సమాధానం ఇచ్చింది. “సరే, నేను మీ జిల్లా అధికారులతో మాట్లాడతాను. మీ తీరంలో ఇసుకతవ్వకాలను నిలుపుదల చేయిస్తా. నువ్వు ఇంటికి వెళ్లిపో” అన్నారు సీఎం. “అయ్యా, చాలా సంతోషం. ఆ మాటేదో మీరు నోటితో కాకుండా రాతపూర్వకంగా ఇస్తే మంచిది. అప్పుడే నా నిరసనదీక్ష విరమిస్తాను” అని మెలికపెట్టింది జజీరా. అందుకు ముఖ్యమంత్రి ఒప్పుకోకపోవడంతో.. నిరసనను విరమించడానికి జజీరా కూడా ఒప్పుకోలేదు. సెక్రటేరియట్ ఎదురుగ్గానే 64 రోజులు దీక్ష చేసింది. ప్రభుత్వం మొండిదైతే అంతకంటే మొండిది జజీరా. రాష్ట్రంలో రేపిన ఇసుకతుపానును.. ఢిల్లీ వీధుల వరకు తీసుకెళ్లాలని నిర్ణయించింది.

ఢిల్లీ వీధుల్లో..
అదే ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఏర్పాటు చేసిన నిరసన శిబిరం. “నేను ఢిల్లీకి వచ్చింది సమస్య వెంటనే పరిష్కారం అవుతుందని కాదు. ఇసుక అక్రమ తవ్వకాలను జాతీయస్థాయి సమస్యను చేయాలన్నది నా ఉద్దేశ్యం. నాకిక్కడ ఎంతోమంది అండ దొరుకుతోంది” అంది. జజీరా ఇసుక తుపాను సంచలనం రేపడంతో.. జాతీయ మానవహక్కుల కమీషన్ స్పందించింది. “ఇసుక అక్రమ తవ్వకాల మీద మీరెలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలిపే ఒక నివేదిక ఇవ్వండి” అంటూ కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారు అధికారులు. ఇదే సమస్య మీద కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేష్ జోక్యం చేసుకుంటూ.. కేరళ ముఖ్యమంత్రికి ఒక వ్యక్తిగత లేఖ రాశారు. ప్రస్తుతానికి జజీరా కథ ఇక్కడి వరకు వచ్చింది. జజీరాలాంటి ఒక్క చిన్న ఇసుక రేణువు ఈ వ్యవస్థ కళ్లలో పడినా.. కాసేపైనా బాధతో కళ్లు నులుపుకోక తప్పదు. అదే పోరాటానికున్న శక్తి.. దాన్ని మరొకసారి నిరూపించిందీ సామాన్య ముస్లిం మహిళ.
ం నవ్య డెస్క్

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీమతి డొక్కా సీతమ్మగారి పై సరసభారతి 52 వ సమావేశం

This gallery contains 60 photos.

శ్రీమతి డొక్కా సీతమ్మగారి పై సరసభారతి నిత్వహించిన సాంస్కృతిక కార్యక్రమము సరస భారతి 52వ సమావేశ విశేషాలు

More Galleries | Tagged | Leave a comment

శ్రీమతి డొక్కా సీతమ్మగారి స్మారక స్కాలర్షిప్ అందుకున్న విద్యార్ధుల కృతజ్ఞతలు

dokkaa seethamma gaari avardees responseశ్రీమతి డొక్కా సీతమ్మగారి పై సరసభారతి నిత్వహించిన సాంస్కృతిక కార్యక్రమము

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతాచార్యులు 48- బెర్గ్ సన్

    మరుగున పడిన మతాలు –మతాచార్యులు 48-

బెర్గ్ సన్

హెన్రి    బెర్గ్ సన్ ఫ్రెంచ్ దార్శనికుడు .ఫ్రెంచ్ వారిపై అమిత ప్రభావం కలిగిన వాడు .1859 లో అక్టోబర్ పద్దెనిమిది న జన్మించాడు .ఈయన భావాలు విలియం జేమ్స్ ద్వారా అమెరికా చేరి బహుళ వ్యాప్తి చెందాయి ,చివరి రోజులో చరిత్ర అధ్యాయం తో గడిపాడు . ఆ యన చెప్పిన వాటిపై ఈతరం దార్శనికులు అధికం గా ఆకర్షితులవుతున్డటం బెర్గ్ సన్ ప్ర త్యేకత . .

image

 

బెర్గ్ సన్ ద్రుష్టి లో అంతరజ్ఞానమే నిజమైన దర్శనానికి మూలం .సత్యం అనేది ఏక మైన సృష్టి కార్యం గా అన్నిటా గోచరిస్తుంది .దీనినే ‘’ఎలాన్ వైటల్’’అంటే సర్జనాత్మక శక్తి అన్నాడు .ఇదే ప్రాణశక్తి   .ఈ శక్తి ద్రవ్యం కలిగించే నిరోధాన్ని ,అవకాశం యొక్క కదలని తనాన్ని ప్రతిఘటిస్తూ అనేక అనుభవ రూపాలు దాలుస్తు ,భొతిక ద్రవ్యం నుండి జీవానికి ,అక్కడి నుండి మానవుడి కి అక్కడనుండి ఇంకా పైకి వ్యాపిస్తుంది .ఇది ఆత్మ వైవిధ్య ప్రక్రియ .దీనిలో ఏకత్వం ఎప్పుడూ ఉంటూనే ఉంది .ఈ ఏకత్వం నుంచే భేదాలు ఏర్పడతాయి .పైన చెప్పిన పురోగతి ఈ భేదాలను ధరించటమే కాకుండా ,వాటికి అభిన్నం గా కూడా ఉంటుంది .ఈ విషయాలన్నీ బెర్గ్ సన్ నాలుగు మహా గ్రంధాలలో నిక్షిప్తం చేశాడు .అవే లేడాన్నీల్ ఇమ్మేడిఎట్స్త్స్ డిలా కాన్షస్ (చైతన్యనికి ప్రత్యక్షం గా ఉన్న అంశాలు ),మేటి యర్ యెట్  మేమ్వారి (భౌతిక ద్రవ్యం స్మృతి ),రివల్యూషన్ క్రియార్తిర్స్ (సర్గాత్మక పరిణామం ),లేడోయ్ సోర్సీర్సేస్ డి లా మొరాలిటి యెట్  రేలిజియాన్  (నీతి ,మతాల ప్రాదుర్భావం ) ఇవి కాక పత్రికల్లో రాసిన వాటినీ పుస్తాకాలుగా  ముద్రించాడు అందులో లేనర్జి స్పిరి త్యువల్(ప్రాణ శక్తి )డ్యూరియెట్ సైమల్తేనిటి  (అవధి అనెవి ఉన్నాయి

దానీజ్ అనే గ్రంధం లో శుద్ధమైన కాల ప్రవాహాన్ని కాలం గాను ,భావాన్ని  మనో ద్రవ్యం గాను ,తి భౌతిక సత్యం గాను చెప్పాడు ..కాలప్రవాహం మానసిక మైనది అన్నాడు నిర్విరామం గా వేరు వేరు విధాలుగా ప్రవహిస్తుంది .ఎప్పుడూ మార్పులు చెందుతూ ఉంటుంది .మన ప్రక్రియలు దాన్ని భేదించి ముక్కలుగా మనకు కనపడేట్లు చేస్తుంది .ఇది కాలానికి ఆచలత్వానికి సాపేక్షం .విస్తృతి అనే దానికి చలనం ఉండదు .దిక్ బిందువులు ఒకే విధం గా ఉంటాయి .అందులో ప్రతిదీ మిగిలిన వాటికి వెలుపలగాను ఒక దాన్ని అనుసరించి ఒకటి ఉంటాయి .నిజమైన కాలానికి విస్తృతి లేదు .సంకుచితమైంది .తర్వాతి లక్షణాలు ముందున్న వాటితో కలిసి పోయి ప్రతి క్షణం కొత్తది గా కనీ పిస్తుంది .భూత ,వర్తమాన భవిష్యత్ కాలాల క్రమం అంతా ఒక అవిభక్తమైన ప్రవ్రుత్తి —యాక్టివిటి)

మనం కాలాన్ని శాస్త్రీయ ,పారిశ్రామిక కాలం గా మార్చేశాం అంటారు బెర్గ్ సన్).అపరిచ్చేద్య వస్తువులకు పరిచ్చేద్యాన్ని ఆరోపించటం వల్లనే భాష ,తర్కం భౌతిక శాస్త్రం వగైరా గా మారాయి .సజీవ కాలం స్వతంత్రం ,ఉత్పాదకం ,అనిర్దేశ్యం అన్నాడు మన పండితుడు .దీనికి ఎన్నో ఉదాహరణల్ని ‘’ద్రవ్యం స్మృతి ‘’లో చెప్పాడు శరీరం ఆత్మ చేత కల్పించ బడిన ఒక సాధనం అన్నాడు ఆత్మ అంటే కాలం యొక్క పూర్తీ ప్రవాహమే .మన మస్తిష్కం ప్రోద్బలన కర్త గా ఉంటుంది .ప్రవృత్తిని చేబట్టని వాటిని దాచేస్తుంది దీనినే శుద్ధ స్మృతి అన్నాడు .ఇదే మన ఆత్మల మూలం అంటాడు యాక్షన్ కనపడని భూతాంశాలలో ఒక దాన్ని స్వయం గా ఎన్ను కొంటుంది .నానాత్వాన్ని గ్రహించే ప్రాణ శక్తి తానూ విడి పోకుండా అయస్కాంతం లాగా భిన్న ధ్రువాలను ఏర్పరుస్తుంది .చలనం కళ  భొతిక ద్రవ్యం క్రమం గా క్షీణించి చలన శూన్యత గా మారిపోతుంది .ఈ విషయాన్ని‘’సర్గాత్మక పరిణామం ‘’లో చెప్పాడు .

వృక్షాలు మనష్యులు ఒక దాని నొకటి తిని బతుకుతాయి .’’గతం తం యొక్క రెండు ఉద్భవ స్స్థా నాలు ‘’లో మనిషి  ప్రతీతుల్ని మనుష్య సంవర్గానికి అన్వయించాడు ఈ దివ్య ప్రాణ శక్తి మానవుడిలో భొతిక ద్రవ్యత్వ బంధనాలను చేదించుకొని స్వేచ్చ పొందింది .ఇలాచేయటం వల్ల పరిణామం ఏర్పడి మానవ బుద్ధి ,మనుష్యుడు మిగిలి ఉన్నారంటాడు .ప్రాణ శక్తి కి ఆటంకం కలిగితే సంఘం లో సంక్షోభం వస్తుందన్నాడు .కొందరు మహాను భావులు ఈ దివ్య శక్తిని సాధించుకొని మానవుల్ని రాక్షిస్తారు .త్యాగం ,శీలం లను బోధించి నైతిక మార్గాన్ని అవలంబించేట్లు దారి చూపిస్తారు ప్రస్తుత మన నాగరకత ఇలాంటి సంక్షోభ స్తితిలోనే ఉందని గట్టిగా చెప్పాడు అచల సంవృత స్తితి ,చల విస్తృత స్తితి లలో ఒక దాన్ని ఎన్నుకోవాల్సిన సమయం వచ్చిందని హెచ్చరిస్తాడు బెర్గ్ సన్.1941 lలోజనవరి నాలుగున  ఎనభై రెండేళ్ళ వయసులో బెర్గ్ సన్ దార్శనికుడు మహా ప్రస్తానం చెందాడు

బెర్గ్ సన్ 1927 లో నోబుల్ పురస్కారాన్ని అందుకొన్నాడు ఫ్రాన్స్ దేశపు అత్యున్నత అవార్డు”గ్రాండ్ క్రోకస్ డి లా లీజియన్ డీ ఆనర్ ” అందుకొన్న ఘనుడు . ఆయన రాసిన కాంటి నెంటల్  ఫిలాసఫీ ,ఫ్రెంచ్ స్పిరిట్యులిజం  గ్రంధాలు బహుళ ప్రచారం పొందాయి .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -22-10-13- ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -47 బెర్నార్డ్ బోజం కెట్ (Bosanquet Bernrd )

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -47

      బెర్నార్డ్ బోజం కెట్ (Bosanquet  Bernrd )

1848    లో జూలై పద్నాలుగున జన్మించిన బెర్నార్డ్ బోజం కెట్ హెగెల్ సంప్రదాయానికి చెందిన ‘’కేవల భౌతిక వాది ఇంగ్లాండ్ లో‘’(ఆబ్సల్యూట్ ఐడియ లిస్టు).హారో లో ఆక్స్ ఫర్డ్ కాలేజి లో విద్య నేర్చాడు సెయింట్ ఆండ్రూస్ యూని వర్సిటి లో నైతిక ,దర్శనా చార్యుడు గా పని చేశాడు .ఆక్స్ ఫర్డ్ లో ఫెలో అయ్యాడు .మొదటి పుస్తకం ‘’అతీనియాన్  కాంష్టి ట్యూషన్ హిస్టరీ హిస్టరికి ‘’అనువాద గ్రంధం లండన్ ఎథికల్ సొసైటీ ,చారిటి ఆర్గా నైజేషన్ సొసైటీ ,లండన్ స్కూల్ ఆఫ్ ఎథిక్స్ అండ్ సోషల్ ఫిలాసఫీ లకు అపార సేవలందించాడు .’’దిఫిలసాఫికల్ దీరీ ఆఫ్ స్టేట్ అండ్ సైకాలజీ ఆఫ్ మోరల్ సెల్ఫ్ ‘’గ్రంధాన్ని రచించాడు ‘’అరిస్తాతిలియాన్ సొసైటీ కి ఉపాధ్యక్షుడు గా అధ్యక్షుడు గా పని చేశాడు .ఎడిన్ బర్గ్ యూని వర్సిటి లో ‘’జిఫార్డ్ లెక్చర్లు ‘’ఇచ్చి వాటిని పుస్తకం గా ముద్రించాడు

 200px-BernardBosanquetPhilosopher

1849    ఈయన దృష్టిలో సత్యం ఏకమే .ఈ ఏకమైనది సర్వ  వ్యాపకమే కాక ,సంపూర్ణంగా హేతు బద్ధ అనుభవమే .ఇదే సామాన్యాన్ని ,విశేషాన్ని సంఘటితం చేస్తుంది .దీనికి మాత్రమె అస్తిత్వం ఉంది ,మిగిలిన మనస్సులు ,వ్యక్తులు ,వస్తువులు ఆంశిక వ్యక్తిత్వం కలవి .ఆంశిక విశేషత్వం ,ఆంశిక సత్యాన్ని కలిగి ఉండేవి అంటాడు బెర్నార్డ్

           లోపల ఉన్న చైతన్యం ఎక్కడి నుంచో వచ్చినదీ  ,అసంపూర్ణం ,అస్వతంత్రం ,ఆమ్శికమైన వ్యక్తిత్వం కలిగింది అని అభిప్రాయ పడ్డాడు ఈ చై తన్యం యొక్క ప్రవృత్తులు ఇంద్రియానుభవాలు ,ఆలోచన ,నైతికాచరణ ,సౌందర్య సంధానం మొదలైన వన్నీ ఒక ఉదార ,ఉదాత్త లక్ష్యాన్నివెతుక్కొంటూ అందుకొని ,  దాన్ని పొందే ప్రయత్నం లో మనకు కనీ పిస్తున్నాయని చెప్పాడు .ఆత్మా  తన కన్న ఉదాత్తమైన మరొక వస్తువు కు తనను తాను త్యాగం చేసుకోవటమే ఆత్మ పరి పూర్ణతను సాధిస్తుందని నమ్మాడు .బోజం కేట్ దృష్టిలో ఈ విశ్వం అంతా ఒక నాటకమే ఇది ఆబ్సల్యూట్ అనే ‘’కేవలం ‘’చేత రచించ బడింది . ఈ జగత్తు అనే రంగాస్థలం మీద ప్రదర్శింప బడుతు ఉన్నది ఈ కేవలం అనేది కళాకారుడు  ,హేతువు తోకూడిన బోధ (ఇంటలిజెన్స్)మాత్రమే .ఈ బోధ యొక్క తాత్పర్యం కేవలం నాటక అభినయమే కాకుండా ఆత్మ ప్రకటనం కూడా అవుతుంది అంతేకాదు తెలుసుకో దగిన సత్యం యొక్క ఏకత్వాన్ని గోచరింప జేస్తున్దంటాడు బెర్నార్డ్.  .75 ఏళ్ళు జీవించి1923  లో ఫిబ్రవరి ఎనిమిదిన బెర్నార్డ్ బోజంకెట్ ఇహ లోక యాత్ర చాలించాడు .’’బ్రిటిష్ ఫిలాసఫీకి ఆ తరానికి కేంద్ర బిందు’వు’ గా బెర్నార్డ్ ను భావిస్తారు

ఆయన రాసిన గ్రంధాలు అపూర్వ మైనవి .వాటి వివరాలు చూద్దాం

  • Knowledge and Reality, A Criticism of Mr. F. H. Bradley’s ‘Principles of Logic’. London: Kegan Paul, Trench, 1885.
  • Logic, or the Morphology of Knowledge. Oxford: Clarendon Press, 1888. 2d ed., 1911.
  • Essays and Addresses. London, Swan Sonnenschein, 1889.
  • A History of Aesthetic, London: Swan Sonnenschein, 1892. 2d ed., 1904.
  • The Civilization of Christendom and Other Studies. London: Swan Sonnenschein, 1893.
  • The Essentials of Logic: Being Ten Lectures on Judgement and Inference. London and New York: Macmillan, 1895.
  • Aspects of the Social Problem, London, 1895.
  • A Companion to Plato’s Republic for English Readers: Being a Commentary adapted to Davies and Vaughan’s Translation. New York/London, 1895.
  • The Philosophical Theory of the State, London, 1899; 4th ed., 1923.
  • Psychology of the Moral Self, London and New York: Macmillan, 1897.
  • The Principle of Individuality and Value. The Gifford Lectures for 1911 delivered in Edinburgh University. London: Macmillan, 1912.
  • The Value and Destiny of the Individual. The Gifford Lectures for 1912 delivered in Edinburgh University. London: Macmillan, 1913.
  • The Distinction Between Mind and its Objects. The Adamson Lecture for 1913 with an Appendix. Manchester: University Press, 1913
  • Three Lectures on Aesthetic, London: Macmillan, 1915.
  • Social and International Ideals: Being Studies in Patriotism, London: Macmillan, 1917.
  • Some Suggestions in Ethics, London: Macmillan, 1918; 2nd ed. 1919.
  • Implication and Linear Inference, London: Macmillan, 1920.
  • What Religion Is, London: Macmillan, 1920.
  • The Meeting of Extremes in Contemporary Philosophy. London: Macmillan, 1921.
  • Three Chapters on the Nature of Mind, London: Macmillan, 1923.
  • Science and Philosophy and Other Essays by the Late Bernard Bosanquet, (ed. J.H. Muirhead and R.C. Bosanquet), London, Allen and Unwin, 1927.

  సశేషం –మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -22-10-13-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -46

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -46

భాస్కరా చార్యులు

భాస్కరా చార్యులకే భాస్కర రాయుడు ,భాసురానందుడు అనే పేర్లున్నాయి తండ్రి గంభీర రాయ దీక్షితులు .తల్లి కోనాంబా దేవి .వీరిది మహా రాష్ట్ర దేశం .కాశీ వెళ్లి విద్య నేర్చిన భాస్కరుడు తంజావూర్  చేరి కావేరీ తీరం లో ‘’తిరువేలంగాడు ‘’లో ఉన్నాడు .అక్కడ గంగాధర వాజ పేయి అనే పండితుడి వద్ద శాస్త్రాలు నేర్చాడు .శ్రీ విద్యోపాసకులలో భాస్కరుడు ప్రసిద్ధుడు .

భాస్కరా చార్యులు బ్రహ్మ సూత్రాలకు భాష్యం రాశాడు సేతు బంధం అనే గ్రంధం లో వామకేశ్వర తంత్రం లోని నిత్య షోడశికార్నవానికి వ్యాఖ్యానం చేశాడు పరశురామ కల్ప సూత్రం పై ‘’రత్నాలోకం ‘’అనే వ్యాఖ్యాన గ్రంధం రచించాడు .దుర్గా సప్త శతి పై ‘’గుప్త వతి ‘’అనే వ్యాఖ్యానం రాశాడు భాస్కరుడు క్రీ.శ,.తొమ్మిదో శతాబ్ది వాడని వాచస్పతిమిశ్రుడికి పూర్వం ,శంకరాచార్యుల తరువాతి వాడు అని భావిస్తారు .సూత్ర భాష్యాన్ని తొమ్మిదో శతాబ్దం మొదటి భాగం లో రచించాడని తెలుస్తోంది వాచస్పతి మిశ్రుడు భాస్కరాచార్యులను తన గ్రంధాలలో ఉదాహరించాడు .శంకరులను తీవ్రం గా విమర్శించాడు ఆచార్యుడు .

శ్రుతుల మీదా ,బ్రహ్మ సూత్రాల మీద ఇతరులు చేసిన వ్యాఖ్యానాల నన్నిటిని భాస్కరుడు ఖండించి తన ప్రజ్ఞా పాటవాలను ప్రదర్శించాడు .మహా యానం లోని శూన్య వాదమే మాయా వాదం అంటాడు భాస్కరుడు .భేదాన్ని అభేదాన్ని గుర్తించే భేదా భేద వాదాన్ని యితడు చెప్పాడు .బ్రహ్మమే ఈ విశ్వం లో పరిణమించాడని భావించాడు .ముక్తికి జ్ఞానం ,కర్మా రెండు  సాధనలాలె  అని గట్టిగా చెప్పాడు .. .జీవన్ముక్తిని అంగీకరించలేదు .విదేహ ముక్తినే అంగీక రించాడు .

పరిపూర్ణం ,అఖండం అయిన పరబ్రహ్మం భాస్కర మతం లో అపరిమితం ,పరిమితం ,అఖండం ఖండం కూడా అవుతుందని  చెప్పాడు .ఏక ఉపాధి ఉన్న బ్రాహ్మం అనేక ఉపాధులను గ్రహించి పరిచ్చిన్నం అవుతాడని అన్నాడు .ఈ సిద్ధాంతం శంకర ,రామానుజ మతాలకు మధ్యస్తం గా ఉంది .శంకరుడు చెప్పిన మాయా వాదాన్ని విమర్శించటానికే భాస్కరుడు తన దర్శనాన్ని ఉపయోగించాడు మాయా వాదం మహా యానం లో నుంచి వచ్చింది అంటాడు అందుకని విచ్చిన్న మూలం అన్నాడు .ఈ భేదా భేద వాదమే భాస్కర మతానికి భూమిక .బ్రహ్మం నిరుపాధికం ,సోపాధికం ,.ప్రపంచం చేతనా చేతన విభాగానికి అర్హమైంది అంటాడు .బ్రహ్మకు జీవలోకం లో సంబంధం లో ఈ భేదం అనేది ఔపాదికమే .అభేదం అనేది స్వాభావిక మైంది అన్నాడు

యాదవ మతం లో బ్రహ్మకు భేదం అభేదం స్వాభావికాలే .కానీ భాస్కర మతం లో చిత్తూ ,అచిత్తురెండు బ్రహ్మం యొక్క వాస్తవిక పరిణామాలే .శంకరుడు చెప్పినట్లు మాయ యొక్క లీల కాదు .భేదం లో అభేద లక్షణం కూడా కలిసి ఉందన్నాడు ఆచార్య భాస్కరుడు .దీనికి ఉదాహరణతరంగాలు సముద్రం కంటే భిన్నాలే కాక అభిన్నాలు కూడా అన్నాడు .సముద్ర శక్తి నుంచే తరంగాలు పుట్టాయి .కనుక  ఒకే సముద్రం దాని శక్తి వ్యక్తీకరాలు అయిన తరంగాలకంటే భిన్నం గా కన్పించినా ,శక్తికి శక్తి జనకానికి అభిన్నం .అందువల్ల ఇది భేదం కాదు అభేదం కూడా కాదని సమర్ధించాడు .మాయా వాదం లో జీవాత్మ అవిద్య తో కూడిన పరమాత్మ యొక్క ఆభాసమే .రామానుజుడు జీవాత్మను బ్రహ్మం శరీరం గ ,భావించాడు .ఈ రెండు మతాలను కాదని జీవుడికి బ్రహ్మానికి భాస్కరుడు అంశ ,అమ్శిత్వాలను కల్పించాడు .అనంత శక్తి స్వరూపుడైన బ్రహ్మం ఉపాధిని తీసుకొని ,జీవాత్మగా మారుతాడ న్నాడు . ఉపాధి స్వీకారం వల్ల  బ్రహ్మం కర్మ బద్ధుడు అవుతాడు .ఈ కర్మ అంటే అంతం లేని కార్యాచరణమే .ఇదిలేక పోయినా దీనికి అంతం ఉంది జీవుడు సాదన క్రమం లో సంసారాన్ని అవగాహన చేసుకొన్నప్పుడు ఉపాధి నశిస్తుందని చెప్పాడు భాస్కరా చార్యుడు బ్రహ్మం అంటే ఏమిటో ,ఉపాధి అంటే ఏమిటో తెలుసుకోలేని  జీవుడు సంసార లంపటం లో పడతాడు అని తన వేదాంతం లో భాస్కరాచార్యులు చెప్పాడు

 

భాస్కరా చార్యను .1554-1594 కాలం  వాడైన అప్పయ్య దీక్షితులు ప్రశంషించాడు 1677-1750 వాడైన నాగోజి భట్టఅనే వ్యాకరణ పండితుని  ను భాస్కరుడు తన‘’గుప్తావతి ‘’గ్రంధం లో ప్రస్తుతించాడు వీటన్నిటి వల్ల  భాస్కరుడి కాలం 1670 అని తేల్చారు భాస్కరుడు సోమయజ్ఞాన్ని జ్యోతిస్తోమాన్నిచేశాడు .కాశీనుండి వచ్చి కొంతకాలం కృష్ణా నదీ తీరం లో ఉండి  కావేరీ తీరానికి చేరాడు  తంజావూర్ మహా రాజు కావేరి దక్షిణ తీరం లో ‘’భాస్కర రాజ నగరం ‘’అనే అగ్రహారాన్ని ఆచార్యులకు రాసిచ్చాడు

చంద్ర సేన రాజు కు ఒక నపుంసక కుమారుడు జన్మించాడని అతన్ని ఎలా అయినా పురుషుడి గా మార్చమని రాజు ఆచార్య పాదాలను ఆశ్రయించాడు ఆయన కృష్ణా నదీ తీరం లో రోజు ఆ కుర్రాడితో కలిసి సూర్య దేవుడికి ‘’త్రిచరర్ఘ్య ప్రదానం’’చేశాడు ఆయన నివాసం నదికి దూరం గా ఉంది అందుకని రోజు ఏంతో  దూరం నడిచి వచ్చి అర్ఘ్యప్రదానం చేసే వాడు .కాళ్లు పుండ్లు పడ్డాయి  శిష్యులు భరించలేక ఏడుస్తున్నారు .అప్పుడు ఆచార్యుడు సూర్య దేవుడిని తన శిష్యుల సంతృప్తి కోసం నదీ ప్రవాహాన్ని తన ఇంటి దగ్గరకు త్రిప్పమని ప్రార్ధించాడు భాస్కరుడు ఈ భాస్కరుని ప్రార్ధన మన్నించి కృష్ణా ప్రవాహ దిశను ఇంటికి దగ్గరగా వచ్చేట్లు చేశాడు దానితో ఆ నీటి ప్రవాహం లో తడిసిన రాజు కొడుకు నపుంసకత్వం నశించి పురుష రూపం వచ్చిందట . ఇవీ భాస్కర మహిమలు

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-10-13- ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

చైనా లో ప్రపంచం లోనే ఎత్తైన కంచు బుద్ధ విగ్రహం -బుద్ధభూమి -అక్టోబర్ సంచిక

yettaina kanchu buddhudu -1 yettaina kanchu buddhudu -2 yettaina kanchu buddhudu -3 yettaina kanchu buddhudu -4

Posted in సేకరణలు | Tagged | Leave a comment

పద్యకవిత్వంలో భావచిత్రాలు – పి. రామకృష్ణ

పద్యకవిత్వంలో భావచిత్రాలు – పి. రామకృష్ణ

వర్ణనలు వేరు, భావచిత్రాలు వేరు. వర్ణనలు, కవి తన కల్పనా శక్తికొద్దీ చేసేవైతే, చదువరి కళ్ళముందు ఒక నిర్దిష్ట చిత్రాన్ని నిలిపి వుంచగలిగేది భావచిత్రం. స్థూలంగానూ, తేలికగానూ చెప్పాలంటే… ఒకటి చెప్పేదైతే, మరొకటి చూపించేది… సూర్యోదయాన్ని నాచన సోమనాథుడు తన ‘ఉత్తర హరివంశం’లో… ‘కుంకుమహత్తించి కొనగోట తీర్చిన పురుహూతి నిల్లాలి బొట్టనంగ’ ఉందన్నాడు. ఇప్పటికీ గృహిణులు నుదుట కుంకుమద్దుకొని, కొనగోట దిద్దుకునే దృశ్యాన్ని చూస్తూనే వున్నాం. బాపు చలనచిత్రంలోనూ, చలనం లేని చిత్రంలోనూ ఆ దృశ్యాల్ని చూస్తున్నాం కూడా. అది చాలు, నాచన వర్ణన కూడా చిత్రమే అనడానికి.

పై శీర్షిక పలువురికి ఆశ్చర్యం కలిగించవచ్చు. కారణం? కథ ప్రధానాంశంగా సాగే పద్యకవిత్వంలో భావచిత్రాలుండే అవకాశం లేదనీ, అవి ఆధునిక కవిత్వంలో (వచన కవితలో) కనిపించే కవితాంశమనీ అభిప్రాయం ఏర్పడి వుండటం అందుకు కారణం. ‘భావకవిత్వం’గా గుర్తించిన కవిత్వంలోనే భావచిత్రాలు కనిపించనప్పుడు, పద్యకవిత్వంలో వుండటం సాధ్యమా అన్న సందేహమూ రావచ్చు. బహుశా, పద్యకవిత్వంలో వుండే సూర్యోదయాస్తమయాది వర్ణనల్నీ, ఋతు వర్ణనల్నీ భావచిత్రాలుగా భావిస్తూ వుండవచ్చని, అనుకోనూవచ్చు. అటువంటి వారికి మన విశిష్టమైన, విస్తారమైన పద్యసాహిత్యం గురించి తెలీకపోవడమే కారణమనుకోక తప్పదు.

పద్య సాహిత్యంలో సూర్యోదయ, సూర్యాస్తమయ వర్ణనలూ, ఋతు వర్ణనలూ అద్భుతంగా వున్నాయి. వాటినే భావ చిత్రాలనడం లేదు. వర్ణనలు వేరు, భావచిత్రాలు వేరు. వర్ణనలు, కవి తన కల్పనా శక్తికొద్దీ చేసేవైతే, చదువరి కళ్ళముందు ఒక నిర్దిష్ట చిత్రాన్ని నిలిపి వుంచగలిగేది భావచిత్రం. స్థూలంగానూ, తేలికగానూ చెప్పాలంటే… ఒకటి చెప్పేదైతే, మరొకటి చూపించేది. శ్రవణానికంటే దృశ్యానికి ఎక్కువ ప్రభావం వుంటుందని చెప్పనక్కర్లేదు. ఆ రీత్యా, కవిత్వ సృజనలో భావచిత్రాల కల్పన వర్ణన కన్నా ఉత్తమ స్థాయికి చెందిన ఆధునిక కవితా రూపంగా అభివర్ణించవచ్చు. ఇక్కడ మళ్ళీ ఒక ప్రశ్న ఎదురయ్యే అవకాశముంది.

మరి ప్రాచీన ప్రక్రియ అయిన పద్యకవిత్వంలో ఆధునిక కవితా రూపమంటున్న భావచిత్రాల కల్పన ఎలా సాధ్యం? ‘ఆధునికత’ అన్నది ఏ కాలంలోనైనా వుంటుంది. సమకాలీనతను ఏ స్థాయిలోనైనా సరే అధిగమించి ముందుకుపోయినా, అది ఆధునికతే. ‘ఆధునికత’ అన్న నిర్ధారణలోనే ఆధునికత అంతా ఇమిడి వుండదు. అప్పటికి… ఆధునికత. అంతే! అయితే, అప్పటి ఆధునికత ఇప్పటికీ ఆధునికత కాగలుగుతుందా? సైన్స్ పరంగా ఈ సందేహానికి తేలిగ్గా సమాధానం చెప్పవచ్చు కానీ, మనం సాహిత్యపరంగానే చెప్పుకుందాం. నిజమే, పద్యసాహిత్యమంతా కథ ప్రధానాంశంగా సాగిందే. అయితే, కవిత్వ మనేది అది అనువాదమైనా, ‘కేవల కల్పనా కథ’లైనా, పురాణ కథే అయినా, ఏదైనా అది మానసిక పరిశ్రమే. అందువల్ల, కథాగమనంలో ఎక్కువగా వైవిధ్యం చూపేందుకు అవకాశం లేకపోయినా, కథకు నిమిత్తం లేని, తనకు నిమిత్తమైన అవకాశం కల్పించుకుంటాడు కవి. సూర్యోదయ, సూర్యాస్తమయ, ఋతు వర్ణనలు అలావచ్చినవే. ఊహాశక్తిమంతులైన కవులు ఆ వర్ణనలకు మించిన కల్పనలు చేశారు. అవి ఇప్పటికీ ఆధునిక కవితా రూపాలే. అవి మనం ఇప్పుడంటున్న భావచిత్రాలే. పద్యంలో అటువంటి దృశ్యాలు కనిపించడం అరుదే కావచ్చు. కానీ, ఉన్నాయని చెప్పడమే ఈ వ్యాసం ఉద్దేశం.
కృష్ణదేవయరా ‘ఆముక్తమాల్యద’లో ఋతు వర్ణనలు అద్భుతంగా వున్నాయన్నది తెలిసిందే. అందులో వర్ణన స్థాయిని మించిన భావచిత్రాలూ ఎన్నో వున్నాయి. చూడగల కళ్ళకు కనిపిస్తూనే వున్నాయి. ఈ పద్యం చూడండి.

తడి తల డిగ్గి ముంపజడతం తుదఱెప్పల కన్నువిప్పి పు ల్పొడుచుచు నీరు ముంగరలపోలిక ముక్కునగూడ, నోట గొం తొడియుచు గూటిక సగమొత్తుచు ఱెక్కవిదుర్చుమున్ను గా వడకుటెగాక చేష్టుడిగె, వక్షము పక్షులు జానువుల్ చొరన్
వర్ష ఋతువు వచ్చింది. ‘ఓ హరి సాహరిన్ ప్రథమ మొల్కెడిధారల..’ వర్షం కురుస్తోంది. ఆ వర్షంలో ఓ చెట్టు, ఆ చెట్టు కొమ్మల్లో గూడు, ఆ గూట్లో ఓ పిట్ట. కనిపిస్తోందా? ఇంకా నిశితంగా చూడండి! వర్షాన్ని చెట్టూ ఆపలేదు, గూడూ ఆపలేదు కదా! ఆ వర్షంలో ఆ చిన్నారి పిట్ట ఎలా వుంది? తలమీదుగా జారే చినుకుల్తో తడిసి ముద్దయి, ముక్కుమీదుగా జారే బిందువులు ముత్యాల ముక్కెరలా వుండగా, గూటి పుల్లల్ని సవరించడం, ఱెక్క విదిల్చి తడి ఆరబెట్టుకోవడం వంటి కదలికలు కూడా లేకుండా, అప్పుడప్పుడూ కంటి ఱెప్పలు కొద్దిగా విప్పి చూసి, వర్షపు చుక్కలు పడితే మళ్ళీ కళ్ళు మూసుకొని, శరీరాన్ని కాళ్ళ మధ్యకు కుదించుకొని వుండిపోయింది. ఈ అద్భుతమైన కల్పననేమందాం? వర్షాన్నీ, చెట్టునీ, చెట్టుమీదున్న గూటినీ, గూట్లోని తడిసిన పిట్టనీ చూపించడాన్ని భావచిత్రం అనగూడదా? కూడదనే వాళ్ళు భావచిత్రాలంటే ఏమిటో కూడా చెప్పవలసి వుంటుంది.

రమణి మరికొంత వడిదాక రథము జూచు
తరుణి అటుపైన కేతనము జూచు
కలికి ఆపైన రథపరాగమ్ము జూచు
పడతి అంతట మరి వట్టి బయలు జూచు
కంకంటి పాపరాజు గారి ‘ఉత్తర రామాయణం’లోని ఈ చిన్న పద్యంలో, చరణానికొకటి చొప్పున నాలుగు భావచిత్రాలున్నాయి. అన్న ఆజ్ఞ ప్రకారం సీతను అడవిలో దించి వెళ్తున్నాడు లక్ష్మణుడు. విషయం తెలుసుకున్న సీత విషాదంతో, నిశ్చేష్టతో నిలిచి చూస్తోంది. తనకు గత జీవితంతో సంబంధం తెగిపోయింది. రథం నడుపుకొని వెళ్ళిపోతున్న మరిది కనిపిస్తున్న దృశ్యమే ఆఖరి అనుబంధం. అందువల్ల, కన్నీటితో ఆ దృశ్యం చెరిగిపోకుండా వుండేట్టు నిర్నిమేషంగా చూస్తోంది. నాలుగు చరణాల చివర ‘జూచు’ అన్న శబ్దాన్నే కవి వాడటం గమనించాలి. సీత చూస్తోంది… చూస్తోంది, ఆ దృశ్యం అలాగే వుంది, రథం దృశ్యమే మారుతూ వచ్చింది. ముందుగా తననక్కడ దించి వెళ్తున్న రథం కనిపించింది. ‘కొంతవడి దాక’ అంటే కొంతవేగం దాకా పూర్తిగా రథం కనిపించింది. ఆ తర్వాత కేతనం మాత్రమే కనిపించింది. ఆ తర్వాత రథ వేగానికి లేచిన దుమ్ము మాత్రమే కనిపించింది. ఆ తర్వాత దుమ్ము కూడా లేని వట్టిబయలు (శూన్యం) కనిపించింది. కెమేరాతో చూపించినట్టున్న ఈ దృశ్యాన్ని సీతతో పాటు మనమూ చూస్తాం.

ప్రక్కలు వంచు, వంచి మునిపండ్లను పండ్లనురాచు, రాచి ఱొ మ్మక్కలుజేయు, చేతి తలయల్లన కాళుల సంది సంది, లో చక్కికి నొక్కు, నొక్కియిరుచంబడ గుమ్మడి మూడగట్టి, వీ పెక్కి దువాళి చేసి చలి ఇక్కడ నక్కడ బెట్టువేకువన్
– వల్లభరాయుడు
హేమంతరాత్రి ఏ రైలో, బస్సో తప్పి నిరాశ్రయంగా చిక్కినప్పుడు, లేదా మీరు రైతులైతే ఏ పొలం కాపలాలోనో వున్నప్పుడు, ఈ పద్యం మీకు తెలీకపోవచ్చు కానీ, ఈ అనుభవం తెలిసే వుంటుంది. ముందుగా ‘ప్రక్కలు వంచు’ భుజాలు వంచుకునేట్టు చేస్తుంది, ఉహుహూ అంటూ ముందరి పండ్లను రాచుకునేట్టు చేసి, రెండు చేతుల్తో రొమ్ము అదుముకునేట్టు చేస్తుంది, తలను కిందికి దించి కాళ్ళమధ్య కుదించుకునేలా చేస్తుంది, కాళ్ళూ చేతులూ లేని ముద్దలా (మూటలా) మారిన నీ వీపెక్కి సవారీ చేస్తూ, వేకువ జామున చలి చంపేస్తుంది. చలి చేసిన ఈ ‘చిత్ర’హింసను చూసి, వణుకుతూనే నవ్వుకుంటాం.

– ‘ప్రక్కలు వంచు, వంచి మునిపండ్లను పండ్లను రాచు, రాచి ఱొమ్మక్కలు జేయు, చేసి ….’ ఈ విధంగా ఒక స్థితి నుంచీ మరో స్థితికి మారిన చలిహింసను హాస్యభరితంగా చూపించాడు కవి. – ‘గుమ్మడి మూగట్టి’ ‘వీపెక్కి దువాళి చేసి’ ఇవి అచ్చమైన తెలుగు పదాలు. – ‘చలి ఇక్కడ నక్కడ బెట్టువేకువన్’ వేకువజామున చలి వణికిస్తోంది అని ఒక్కవాక్యంలో చెప్పకుండా, ఈ విధంగా శరీర వ్యక్తీకరణ (బాడీ లాంగ్వేజ్) ద్వారా చెప్పడంతో నవ్వకుండా వుండలేం. చలిని ఒక వాతావరణ విశేషంగా కాకుండా, చలినీ, బాధితుడినీ ఇద్దర్నీ మనుషులేనన్నట్టు చెప్పడం ద్వారా కళ్ళముందు ఒక దృశ్యాన్ని నిలుపుతోంది.
సమయ వినోది మిన్ననెడి చక్కనిరంగమునందు ది గ్రమణులు చూడ గారడము రక్తినిజూప విధుండనెండు న ద్దమునొక కర్ణమందునిచి, దాపలి కర్ణము నందు హేమ చ క్రము వెడలంగ దీసెననగా, రవిదోచె ప్రభాప్రభావుడై
– చిత్ర కవి సింగరార్యుడు
కావడానికి సూర్యోదయ వర్ణనే. అయితే, ప్రత్యేకత వుంది. వెన్నెల రాత్రి గడచి వేకువ రావడంతో చంద్రుడు పాలిపోయి అద్దం బిళ్ళలాగై అస్తమిస్తూంటే, ఇటు సూర్యుడు బంగారపు చక్రంలా ఉదయించాడు. కాలమనే గారడీ మనిషి ఆకాశ రంగం మీద తన విద్యను ప్రదర్శిస్తున్నాడు, అదీ దిక్కులనే స్త్రీలు చూస్తుండగా. ప్రదర్శనలో, అవసరం తీరిన చంద్రుడిని ఒక చెవి సందున దోపుకొని, ఇంకో చెవి సందునుంచీ సూర్యుడిని బయటికి తీసినట్టుందట! గారడీ మనిషి తన ప్రదర్శనకు అవసరమైన సాధనాలను అందుబాటులో వుంచుకునేందుకు చెవి సందున దోపుకున్నాడనుకోవాలి. ఏమైనా, సూర్య చంద్రులిద్దరికీ రెండు చెవులూ సరిపోయాయి. ఈ కల్పనతో కవి ‘చిత్రకవి’ పేరును సార్థకం చేసుకున్నాడు.
సూర్యోదయాన్ని నాచన సోమనాథుడు తన ‘ఉత్తర హరివంశం’లో… ‘కుంకుమహత్తించి కొనగోట తీర్చిన పురుహూతి నిల్లాలి బొట్టనంగ’ ఉందన్నాడు. శచీదేవి బొట్టు సంగతి మనకు తెలీదుగానీ, ఇప్పటికీ గృహిణులు నుదుట కుంకుమద్దుకొని, కొనగోట దిద్దుకునే దృశ్యాన్ని చూస్తూనే వున్నాం. బాపు చలనచిత్రంలోనూ, చలనం లేని చిత్రంలోనూ ఆ దృశ్యాల్ని చూస్తున్నాం కూడా. అది చాలు, నాచన వర్ణన కూడా చిత్రమే అనడానికి.

తమి పూదీగెల తూగుటుయ్యెలల పంతా లాడుచున్ తూగు నా కొమరుం బ్రాయపు గబ్బిగుబ్బెతలయంఘ్రల్చక్కగా సాగి మిం టి మొగంబైచనుదెంచు ఠీవి కనుగొంటే దివ్యమౌనీంద్ర! నా కమృగీనేత్రల మీద కయ్యమునకున్ కాల్దాచు లాగొప్పెడిన్
– పింగళి సూరన
మణికంధరుడనే శిష్యుడితో కలసి దివి నుంచీ భువికి దిగుతున్నాడు నారదుడు. పూలతోటలో కల భాషిణి చెలికత్తెలతో కలసి ఉయ్యెలలూగుతున్న దృశ్యాన్ని చూపుతూ ఆ శిష్యుడంటాడలా. ఉయ్యాల లూగుతున్న ఆ యువతుల పాదాలు ఆకాశం వైపు దూసుకురావడం చూస్తుంటే, స్వర్గంలోని అప్సరసలతో కయ్యానికి కాల్దూచినట్టు లేదూ.. అన్నాడు. మీ అందాలు మా కాలి గోటి కి సరిరావన్నట్టు సవాల్ చేయడంలా వుంది అనడం. శిష్యుడి వర ్ణన విని ‘భళిరా! సత్కలి వౌదు’ అని మెచ్చుకుంటాడు నారదుడు. ఆ ప్రశంస మణికంధరుడికీ కావచ్చు, పింగళి సూరనకూ కావ చ్చు. అదలావుంటే, ఉయ్యెలలూగుతున్న యువతులను పైనుంచీ చూస్తున్నప్పటి అనుభూతిని కలిగించడం ఇందులోని ప్రత్యేకత.
సాయంకాలం. పక్షులు తమ ఆహారాన్వేషణను ముగించుకొని గూళ్ళకు చేరుకుంటున్నాయి. చెరొక దిక్కునా వెళ్ళిన పక్షులు జంటలను కలుసుకుంటున్నాయి, ఇ(గూ)ళ్ళకు చేరుకోవడానికి. ఒక చక్రవాకి తన జతగాడి కోసం వెతుకుతోంది. ఎదురుగా వచ్చే పక్షుల్లో వున్నాడేమో (ఉందేమో) అనుకుని పిలుస్తూ (కూస్తూ) వెళ్ళి చూసి కనిపించకపోతే, ఆకాశంలో ఇటూ ఇటూ తిరుగుతూ చూస్తోంది. ఎక్కడా కనిపించక, ఆందోళనతో అలసటతో ఎక్కడైనా నీరు తాగేందుకు ఏ నది ఒడ్డునో వున్నాడేమోని అక్కడా వెతుకుతోంది. పిలిచి పిలిచి నోరు దాహంతో ఎండిపోతోంది కనుక, నీరు తాగుదామని కొలను నీటిలో ముక్కు ముంచుతుంది. కానీ, తాగాలనిపించదు. మళ్ళీ ఎగురుతుంది, వెతుకుతుంది… ‘సంజప్రియబాసి వగనొక్క చక్రవాకి’.

‘మను చరిత్ర’లో ‘ఏ విహంగముకన్న ఎలిగించుచును సారెసారెకు సైకతమ్ముల కూడదాఱు’ అన్న పద్యంలో కనిపిస్తున్న భావచిత్రం అది. కావ్యార్థంలో వరూధిని స్థితికి సూచనగా వుందనుకున్నప్పటికీ, ఆ విహంగాన్వేషణను చూపించడం ఎంత హృదయంగమంగా, ఆర్ద్రంగా, ప్రత్యక్షంగా వుందో గమనించవచ్చు. ఇంత వ్యాఖ్యానం ఎందుకంటే, పరంపరగా కనిపించే పద్య కావ్యాలలో కూడా కవి ప్రత్యేకంగా కనిపించే సందర్భాలున్నాయనడానికే. వర్షంలో ఓ చెట్టుమీద గూట్లో తడిసిన పిట్టను ‘ఆముక్తమాల్యద’ కవి చూడగలిగితే, సాయంకాలం గూటికి చేరుకోవలసిన పక్షి రాకపోతే, జతపక్షి పడే ఆవేదనను ‘మనుచరిత్ర’ కవి చూడగలిగాడు. భావచిత్రాలనదగిన ఇటువంటి సందర్భాలు మన పద్య కవిత్వంలో, లేదా పద్య సాహిత్యంలో (రెండిటికీ అభేదం పాటించానని మనవి) ఎన్నో వున్నాయి.

ఛందోబద్ధ పద్యం ప్రస్తుత సామాజిక సమస్యల చిత్రణకు అనువైనది కాదని అంగీకరిస్తూనే, పద్య కవిత్వమంతా యతిప్రాసల ప్రయాసని, అది చదవడం అనవసరమనీ అనడాన్ని ‘అజా ్ఞనం’అనీ.. సున్నితంగా చెప్పాలంటే ‘తెలియనితనం’ అనీ అనాల్సి వుంటుంది. పద్య సాహిత్యం మన పునాది. మన జాతి సంపద.
– పి. రామకృష్ణ

Posted in సేకరణలు | Tagged | Leave a comment

పెద్దలు వెళ్లిపోతున్నారు -బొగ్గుల శ్రీనివాస్

పెద్దలు వెళ్లిపోతున్నారు -బొగ్గుల శ్రీనివాస్

“లోకోద్ధరణకోసం రాస్తున్నామనే వాళ్ళను పట్టించుకోను. మాకు ఇష్టం లేనివైనా పొట్టకూటికోసమే రాస్తున్నామని తెగువతో చెప్పగల నిజాయితీ గల రచయితల పాదాలకు నమస్కరిస్తాను….నేను ఇంకా నేర్చుకునే స్థితిలోనే ఉన్నాను. అలాంటపుడు మరొకరికి ‘ఇలా రాయండి’ అని ఎలా చెప్పగలను. …నాకు ఆకలి తెలుసు, అవిద్య తెలుసు,అవమానం తెలుసు! వాటిని పుష్కళంగా అనుభ వించాను కాబట్టి ఇవి లేని సమాజం కోరుకుంటాను.”

” పిల్లలు చిరకాలం వ ర్ధిల్లాలి
తల్లులూ,తండ్రులూ చిరకాలం వర్ధిల్లాలి
మనుషులు చిరకాలం వర్ధిల్లాలి
గాయపడిన ఈ గ్రహం చిరకాలం వర్ధిల్లాలి
గాలిలోని శ్రేష్ఠమైన పాలు చిరకాలం వర్ధిల్లాలి
ప్రవహిస్తున్న నదులూ, తల్లిలాంటి సముద్రాలూ చిరకాలం వర్ధిల్లాలి

గడ్డిపరక మధుర రసం చిరకాలం వర్ధిల్లాలి
గ్లోబులోని పచ్చదనమంతా చిరకాలం వర్ధిల్లాలి
బతికున్న జంతువులన్నీ చిరకాలం వర్ధిల్లాలి
మనందరి ఆలోచనలకన్నా లోతైన ఈ భూమి చిరకాలం వర్ధిల్లాలి
…………………”
‘కవిత్వం కావాలి కవిత ్వం’ అని కవిత్వం కోసం పలవరించి, కలవరించి వెళ్లిపోయినస్వాప్నికుడు త్రిపురనేని శ్రీనివాస్ అనువదించిన కవిత ఇది. బ్రిటన్‌కు చెందిన అడ్రియన్ మిచెల్ రాసిన కవితను ‘ఆఖరి మాట’ అని అలా అనువదించాడు.
రావూరి భరద్వాజ మాటలు చదివినపుడు ఈ కవిత గుర్తుకొచ్చింది. ఆయనకు ‘భీమన్న సాహితీ నిధి’ పురస్కారం ఇచ్చినపుడు ఆ సంస్థ అధ్యక్షురాలు హైమవతి భీమన్న ఆయన మాటలను గుర్తు చేసారు. ఇంతకూ ఆ పెద్దాయన మాటలేమిటంటే…నాకు రాజ్యం వద్దు, స్వర్గం వద్దు. మోక్షంతో పనిలేదు. దుఃఖ బాధితుల కష్టాలన్నీ తొలిగిపోవాలి. సర్వ ప్రాణాలు సుఖపడాలి.
భిన్న నేపథ్యాలున్న ఈ ఇద్దరూ ‘అందరూ బాగుండాల’ని కోరుకున్నారు. ఈ గ్లోబునుద్దేశించి తమ భావాలు ప్రకటించారు.

అక్టోబరు 18 ఉదయం ‘అస్వస్థతతో భరద్వాజ’ అని పత్రికలో ఒక మారుమూల ఉన్న చిన్నవార్తను చదివాను. ఉరుకుల పరుగుల రోజువారీ జీవితంలో ఆఫీసు పనికి వెళ్లి తిరిగి వచ్చి సిస్టం ముందు కూర్చున్నాను. ఈనెల 25న జరపాలనుకుంటున్న ‘కలేకూరి మళ్లీ పుట్టినరోజు’కు సంబంధించిన కరపత్రాన్ని నా బాధ్యతలో భాగంగా మిత్రులకు ‘పోసు’్ట చేస్తున్నాను. 9గంటల రాత్రి. పక్కనే ఉన్న సెల్‌ఫోన్‌కు లెక్కకు మించి ఎస్ఎమ్మెస్‌లు వస్తున్నాయి. ఒక్కొక్కటీ చదువుకుంటూ పోయాను. దిమ్మ తిరుగుతోంది. అన్నిటిలోనూ విషయం ఒకటే-రావూరి భరద్వాజ ఇకలేరు..రావూరి భరద్వాజ అమర్ రహే. మబ్బు పట్టినట్టయింది. తేరుకుని ఒక్కొక్కరికీ ‘అమర్ రహే..అమర్ రహే’ అని తిరుగు ఎస్ఎమ్మెస్‌లు ఇచ్చాను కోరస్‌లాగా.

ఫేస్‌బుక్‌లో కరపత్రాలు పోస్టు చేసే పని వదిలిపెట్టి నా ‘టైమ్‌లైన్’లో ఇలా టైప్ చేసాను-“పెద్దాయన రావూరి మరణం ఆయనకు జ్ఞానపీఠ ఇచ్చినవారి ఔదార్యాన్ని కాదు-నిర్లక్షాన్ని, జాప్యాన్ని తెలిపింది. బడుగు రచయితలకు అన్యాయాన్ని తెలిపింది. సృజన వర్ధిల్లాలి”
మళ్లీ ఈ వాక్యాన్ని చదువుకున్నాను. ఏదో లోపం ఉన్నట్లనిపించింది. దానిని ఇలా తిరగరాస్తున్నాను-“ఇంకా ఎక్కడో భూమ్మీద మనుషులనే వాళ్లు ఉండబట్టి, ధర్మం ఒక్క పాదంమీదనైనా అక్కడక్కడా డేకుతుండ బట్టి, రుతుచక్రం తప్పించి అయినా వానలు పడుతుండడాన్ని బట్టి ఈ వయసులో ఐనా ఆ బడుగు పెద్దాయనకు జ్ఞానపీఠ వచ్చింది”

ఆ అత్యున్నత పురస్కారం ఆయనకు ప్రకటించినపుడు ఇదే ‘వివిధ’కు ఇంటర్వ్యూ చేస్తూ ఇదే మాటే అడిగాను-“సార్! ఈ వయసులో ఇంత ఆలస్యంగా మీకు ఇచ్చిన పురస్కారం గురించి ఏమనుకుంటున్నార ”ని. “ఇదీ ఇవ్వకపోతే నా తరఫున అడిగేవాళ్లెవరున్నారు?”అని ఆయన వేసిన ఎదురుప్రశ్నకు మౌనమే నా సమాధానమైంది. ఒక వెబ్‌సైట్ వార్షికోత్సవంలో దాసరి నారాయణరావు ఆయనను సన్మానించినపుడు కూడా వేదిక నుంచి ఈ ప్రశ్నే ఆయన వేసారు.
ఏది ఏమైనా, ఢిల్లీలో పదిరోజుల ముందు సెలైన్ బాటిల్ పట్టుకుని ఆయన పురస్కారం అందుకున్న దృశ్యాన్ని మరువలేము. ఈ జుగుప్సాకర స్థితిని తలుచుకుని ఈసడించక ఉండలేము.

ఇపుడు పెద్దలే కరువయ్యారు. ‘పుటుక నాది,చావు నాది బ్రతుకంతా దేశానిది’ అని నినదించే కాళోజీలు లేరు. అడ్డదిడ్డంగా దిక్కుదరీ లేకుండా పతనమవుతున్న దేశానికి హితవు చెప్పి మేల్కొలిపే పెద్దలు లేరు. విద్వేషాలు మాని మానవత్వంతో మెలగండని చెప్పేవారు లేరు. కన్నీళ్లు దిగమింగుతూ తన దారిన తాను అక్షరాలను వెలిగించిన 87 ఏళ్ల రావూరి భరద్వాజా లేరు. పెద్దలు వెళ్లిపోతున్నారు.

అవార్డు రాకముందు ఆయనను పట్టించుకున్నవారు లేరు. కనీసం పది సంవత్సరాల వెనక వరకు ఆయన ఉన్నారా లేరా అని కూడా పట్టించుకున్న వారు లేరు. ఎన్నో అవార్డులు, గౌరవ డాక్టరేట్లు, పురస్కారాలు ఆయనకు వచ్చి వుండవచ్చు. ఇది అంతా చాలా కాలం కిందటి మాట. ‘రావూరి భరద్వాజా..ఇంకా బతికున్నారా’ అన్నవాళ్లూ లేకపోలేదు. రుంజ(విశ్వ కర్మ రచయితలు కళాకారుల వేదిక) ఏర్పడిన కొద్దికాలానికి ఆయనను పుస్తకావిష్కరణకు ఆహ్వానించాము. జ్ఞానపీఠకు ముందు, తరువాత రెండుసార్లు పుస్తకావిష్కరణలు చేసారు. మంచి మాటలు నాలుగుచెప్పారు. ఆ నిరాడంబర జీవి ఇంత సాహిత్యం రాసారని మాకెవరికీ అప్పటికి తెలీదు.

వ్యవసాయకూలీగా పనిచేసారు. పశువుల కాపరిగా, హోటల్ వర్కర్‌గా, పేపర్‌బాయ్‌గా చేసారు. దుర్భర దారిద్య్రంలో ఉంటూ 180 పైగా పుస్తకాలు రాసిన రచయిత ఎవరూ తెలుగులో లేరు. అయినా ఆయనకు అవార్డు వచ్చినందుకు అసూయపడిన విశ్వవిద్యాలయాలు, పండితులు ఉన్నారంటే, మనం ఎలాంటి దేశంలో ఉన్నామా అని వేదన కలిగింది.

ఆరునెలలక్రితం ఆయన చెప్పిన మాటలతోనే ముగిస్తాను.
“లోకోద్ధరణకోసం రాస్తున్నామనే వాళ్ళను పట్టించుకోను. మాకు ఇష్టం లేనివైనా పొట్టకూటికోసమే రాస్తున్నామని తెగువతో చెప్పగల నిజాయితీ గల రచయితల పాదాలకు నమస్కరిస్తాను….నేను ఇంకా నేర్చుకునే స్థితిలోనే ఉన్నాను. అలాంటపుడు మరొకరికి ‘ఇలా రాయండి’ అని ఎలా చెప్పగలను. …నాకు ఆకలి తెలుసు, అవిద్య తెలుసు,అవమానం తెలుసు! వాటిని పుష్కళంగా అనుభ వించాను కాబట్టి ఇవి లేని సమాజం కోరుకుంటాను.”
జోహారు రావూరి భరద్వాజకు. జోహారు ఆ పెద్దాయనకు.
-యింద్రవెల్లి రమేష్
facebook.com / indravelliramesh

పి.ఎస్-
“రావూరి భరద్వాజకు జ్ఞానపీఠ ఇచ్చి, తనను తానే గౌరవించుకుంది ఆ జ్ఞానపీఠ”
రావూరి శవపేటిక ముందు అందెశ్రీ అలా అన్నారు.

“ఆయన అన్ని రచనలు చేసినా వేటిలోనూ దారి తప్పలేదు. కన్నీళ్లు, కష్టాల గురించే రాసారు. ఎడిటోరియల్ బోర్డు మెంబరుగా దాదాపు ఆయన రచనలన్నీ చదివిన నాకు ఉన్న అభిప్రాయమిది” అన్నారు ఎస్వీ సత్యనారాయణ.
సినీ ‘మాయా సరస్సు’లో అడుగేస్తే ‘కాలు జారే’ ‘పాకుడురాళ’్లపై మారుమూల మంగమ్మను ‘మహానటి మంజరి’గా మార్చి మార్లిన్ మన్రోతో మాట్లాడించిన ‘మహావ్యక్తిత్వ వికాస నిపుణుడు’
-రావూరి రచనల మీద అమితాసక్తి కలిగిన

Posted in సేకరణలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -45

      మరుగున పడిన మతాలు –మతాచార్యులు -45

మ(మా )ని మతం (Manicheism )

మని లేక మానికేయన్ అనే పర్షియన్ మత  ప్రవక్త క్రేపూ.216 -276 బోధించిన మత వ్యవస్తనే మని లేక మానికా  మతం అంటారు .దీన్ని ‘’జ్ఞాన  మతం ‘’అనీ పిలుస్తారు .ఈ మత సిద్ధాంతాలలో జ్ఞాన ,క్రైస్తవ బౌద్ధ ,జోరాస్ట్రియన్ మత భావనలన్నీ ఉన్నాయి .క్రీ.పూ.మూడో శతాబ్దం లో పుట్టిన ఈ మతం అనేక పశ్చిమ ,తూర్పు దేశాలలో విపరీతం గా వ్యాప్తి చెందింది .చివరికి క్రైస్తవం దీన్ని మింగేసింది .

మని అనేది గ్రీకు పేరు దీనికి లాటిన్ లో సమాన పదం మానికేయన్ .మానికేయన్ సంపన్న ఉన్నత  కుటుంబం లో  జన్మించాడు తండ్రి దగ్గరే విద్య నేర్చాడు .ఆనాటికి ప్రచారం లో ఉన్న మిత్ర మతాన్ని క్రైస్తవాన్ని ,పెర్షియా దేశ మతమయిన మజ్దాను కూలంక షం గా అధ్యయనం చేసి ఆకళింపు చేసుకొన్నాడు అయన ఇరవై ఏళ్ళ వయస్సు లో ఈ కొత్త్తమతాన్ని స్తాపించాడు .క్రీ.శ 241కాలపు పర్షియా రాజు షాపూర్ పట్టాభిషేకానికి ఈ మతాన్ని ప్రత్యేకం గా బోధించాడు భారత దేశం కూడా వచ్చాడని ప్రచారం లో ఉంది ..కాని బహ్రాన్  రాజు ఇతన్ని మాజ్డా మత పూజార్లకు అప్పగించాడు . బ్రతికి ఉండగానే మానికేయన్ చర్మాన్ని ఒలిచి అతి క్రూరం గా చంపేశారు వాళ్ళు

220px-Manicheans

 

 

మని మతస్తులు                      220px-ManichaeanElectaeKocho10thCentury             పదవ శతాబ్ది లో మని మతావలంబకులు 

మానికేయన్ తనకు దివ్య సాక్షాత్కారం కలిగిందని ,ప్రపంచ మత ప్రవక్తలలో తానే చివరి వాడినని చెప్పుకొన్నాడు .బుద్ధుడు జోరాస్తర్ ,యేసు క్రీస్తు  కూడా ప్రవక్త లే అన్నాడు  తను ఈ లోకానికి ‘’శాంతి దూత ‘’గా వచ్చానని తెలియ జేశాడు .

మని మత సిద్ధాంతాలు –ఇది పూర్తిగా ద్వైత మతం .ఆయన దృష్టిలో భౌతిక నైతిక విషయాలలో భేదం లేదు ..కాంతికి ,చీకటికి మధ్య గొప్ప సంఘర్షణ ఉంది .అలాగే సంఘర్షణ పుణ్య ,పాపాల మధ్యా ఉంది .జ్ఞానం అన్నా విమోచనం అన్నా చీకటి లోంచి వెలుగుకు ప్రస్తానం .తమస్సులోనుంది వచ్చిన వాటినన్నిటిని వదిలెయ్యాలి .కాంతి లోకం నుండి వచ్చిన అన్ని విషయాలను ప్రోత్సహించి ,వాటినే అనుసరించాలి .కాంతి లోకం దేవుడి అధీనం లో ఉంది .తమోలోకానికి అధిపతి ‘’సైతాను ‘’.ఈ రెండు లోకాల మధ్యా మొదటి నుంచి సంఘర్షణ ఉంది .ఒక సారి సైతాన్ కాంతి లోకం పైకి దండెత్తినప్పుడు కాంతి దేవత మొదటి మానవుడిని సృష్టించి సైతాను తో పోరాటానికి పంపింది సైతానే శక్తి వంతుడై మనిషిని నిర్బంధించాడు .కొత్త దేవతల సహాయం తో కాంతి దేవతయే సైతానుతో పోరాడి మొదటి మానవుడిని విడి పించిందని వీరి సిద్ధాంతం .

ఒకప్పదు  మని మతం లో ఉన్న సెయింట్ అగస్టీన్

 

1

పదమూడవ శతాబ్దం  లో దొరికిన మని గ్రంధ భాగం

220px-Augustine_Confessiones 220px-Tiffany_Window_of_St_Augustine_-_Lightner_Museum 220px-Museum_für_Indische_Kunst_Dahlem_Berlin_Mai_2006_066

మొదటి మానవుడంటే ‘’ఆదాము ‘’.ఇతన్ని సైతాను లాగానే సృష్టించాడు .కాని బలమైన కాంతి రేఖ ఉన్న వాడు ఆడం కు తోడుగా సైతాన్’’ అవ్వ’’ అంటే ఈవ్ ను ఇచ్చాడట .వీరి కామం వల్లనే మానవ జాతి ఆవిర్భవించింది .రాక్షసులు కామం తో, భ్రాంతితో, ప్రలోభాలతో మానవుల్ని హింసించారు .అప్పుడు కాంతి దేవత ప్రవక్త లను భూమి మీదకు పంపి ,మానవులకు వారి స్వభావాన్ని గురించి ,ప్రకృతి గురించి సరైన జ్జ్ఞానాన్నిచ్చి విముక్తికోసం సహాయ పడతారు .

ఈ మతం లో పురోహితులు మాత్రం చాలా కఠిన మైన నియమాలను పాటించాలి .సాధారణ మానవులు అహింస ,విగ్రహారాధన ,అబద్ధం ,వ్యభిచారాలను దురాశలను వదిలితే చాలు .మని మతం ‘’ప్రోబాస్ ‘’చక్ర వర్తి కాలం లో క్రీ.శ.280 లో రోమన్  సామ్రాజ్యం లో ప్రవేశించింది .దాదాపు మూడు వందల ఏళ్ళు సువ్యవస్తితం గా నిలిచి ఉంది అక్కడ .తర్వాత వచ్చిన రోమన్ చక్ర వర్తులు మని మతానికి వ్యతి రేకం గా శాసనాలు చేశారు .మధ్య యుగం వచ్చేసరికి కొత్త దారులు చూసుకొని క్షీణించి పోయింది

మని సిద్ధాంత గ్రంధాలు చాలా ఉన్నా చివరికి కొన్ని భాగాలు మాత్రమె అదీ అనువాద రూపం లో లభించాయి చైనా దేశం లోను ఈ మతం బానే వ్యాపించింది మని సిరియానిక్ లిపి ని కానీ పెట్టాడని భావిస్తారు మన  వినాయకుడు ఈ మతం లో ప్రవేశించాడు మనికేయన్ కుషాన్ సామ్రాజ్యం లో పర్యతిన్చాడని చెబుతారు పాప్ మితియాదిస్ కాలం లో ఈ మతం రోమ్ లో బాగా ఉండేది .రోమన్ చక్ర వర్తి తియోదాస్ మానికేయులను చంపేయమని క్రీ.ష.382 లో క్రైస్తవ మతాన్ని రాజ మతం గా ప్రకటించే ముందు ఆజ్ఞా జారీ చేశాడు

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-10-13- ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -44

 

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -44

భారతీ తీర్ధులు

ఆది శంకరా చార్యుల వారి తర్వాతా అద్వైత మత వ్యాప్తికి అధిక కృషి చేసిన వాడు భారతీ తీర్ధులు .మాధవ ,విద్యారన్యుల సమకాలికుడు .వీరిద్దరి కంటే వయసులో పెద్ద వాడు .విద్యారన్యులు అనే బిరుదనామం మాధవాచార్యులకు భారతీ తీర్ధులకుఇద్దరికీ  వర్తిస్తుంది .1386 శాసనాన్ని బట్టి భారతీ తీర్దులకు విద్యా తీర్ధులు గురువు అని తెలుస్తోంది .భారతీ తీర్ధులు మాధవ ,విద్యారణ్యు లిద్దరికీ గురువే .మాధవ ,భా రతీ తీర్దులిద్దరు అద్వైత పండితులే .విజయ నగర రాజుల తో సన్నిహిత సంబంధం ఉన్న వారుకూడా .

vidyatirtha_mahaswamigal

 

 

విద్యాతీర్ధ స్వామి వారి శిష్యులు భారతీ తీర్ధులు, విద్యారన్యులు

భారతీ తీర్ధుల కాలం పద్నాలుగో శతాబ్దం .శృంగేరి పీఠాన్ని అది రోహించటం లో మాధవ ,విద్యారన్యులిద్దరికంటే భారతీ తీర్ధులు ముందు వాడు.శాంకరాద్వైతాన్ని వ్యాఖ్యానించటం లో అద్వితీయ ప్రతిభా సంపన్నుడు భారతీ తీర్ధ .విజయ నగర రాజుల చేత సన్మానింప  బడిన వాడు .తీర్ధ రాసిన ‘’పంచదశి ‘’అద్వైత సంప్రదాయం లో శాశ్వత స్తానాన్ని పొందింది .ఈయన రాసిన ‘’వివరణ ప్రమేయ సంగ్రహం ‘’కూడా ఉత్తమమైనదిగా పేర్కొంటారు .’’దృక్ దృశ్య వివేకం ‘’అనే వీరి రచన పరమోత్క్రుస్ట మైంది .

భారతీ తీర్ధ 1333-1380 కాలం వాడు ఆంద్ర దేశం లో ఏకశిలా నగరం అయిన ఓరుగల్ అనే వరంగల్ లో జన్మించాడు పూర్వాశ్రమం లో విద్యారన్యుల తమ్ముడు .గురువైన విద్యా తీర్ధుల తర్వాతా పదకొండవ శృంగేరి పీతాదిపతి అయి నలభై ఏడేళ్ళు పీతాదిపత్యం లో ఉన్నాడు  ఆయన కాలం చారిత్రాత్మక మైనదిగా పేర్కొంటారు .శ్రీ ఆది శంకరా చార్యులు మంచి గాంధపు శారదా విగ్రహాన్ని శృంగేరి లో ఏర్పరిస్తే భారతీ తీర్ధ స్వర్ణ విగ్రహం చేయించి ప్రతిష్టించారు ఆలయాన్ని మతాన్ని అభి వృద్ధి చేశాడు సామాన్యుల కోసం మతాన్ని విస్తృత పరచాడు .విజయ నగర రాజుల కాలం లో విద్యా శంకరాలయం నిర్మాణం జరిపించాడు హరిహర రాయమహారాజు తన తమ్ముడు మారెప్పను అల్లుడుబాలప్పను శృంగేరి పంపించి ఆశ్రమపోషణకు అయిదు గ్రామాలు దానం గా ఇప్పించాడు .అంటే కాదు భారతీ తీర్ధకు సేవకులుగా నలభై మంది బ్రాహ్మణ పరి చారకుల్ని నియమించాడు

భారతీ తీర్ధులు 120 మంది వేద పండితులకు రాజు తన కిచ్చిన దానిలో భూములనిచ్చి వారి పోషణకు సాయ పడ్డాడు .దీంతోనే శృంగేరి గ్రామ నిర్మాణం ప్రారంభ మైంది వేదాలలో ,శాస్త్రాలలో అపార పాండిత్యాన్ని చోపిన వారికి బిరుడులిచ్చి సత్కరించటం భారతీ తీర్ధ కాలం లోనే ప్రారంభ మైంది

अज्ञानां जाह्नवी तीर्थं विद्यातीर्थं विवेकिनाम् ।
सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये ॥

That Ganga which is the sin-removing refuge to the ignorant, That esoteric knowledge that is the refuge sought by the wise, That refuge which is good for all who seek Bliss, Unto that Bharati Tirtha, I bow!

ఇది భారతీ తీర్ధ స్వామిగూర్చిన ప్రస్తుతి . ‘’పవిత్ర గంగా జలం అజ్ఞానులపాప ప్రక్క్షాళ నం చేస్తుంది ఆశ్రయిస్తే మహాజ్ఞానాన్నిజ్ఞానులు ప్రసాదిస్తారు . బ్రహ్మానందాన్ని, ఆశ్రయించిన వారికందరికీ మంచిని ప్రసాదించే  శ్రీ భారతీ తీర్ధులకు ప్రణామం ‘’ అని భావం

ఉపనిషత్తులలో చెప్పినట్లు బ్రహ్మం ,దాని స్వభావాన్ని బాహ్య ,అభ్యంతారాలకు అంటే ఆబ్జెక్టివ్ అండ్ సబ్జెక్టివ మెధడ్ లరెండిటిని  సమన్వయ పరచి బోధించాడు భారతీ తీర్ధ .తన పంచ దశి లో ‘’పంచ మహా భూతం ‘’అనే అధ్యాయం లో బాహ్య ప్రపంచాన్నుంచి బ్రహ్మాన్ని ఎలా వేరు చేయ వచ్చో సవివరం గా తెలిపాడు .’’పంచకోశ వివేకం ‘’అనే మూడవ అధ్యాయం లో పంచకోశాల నుండి ఆత్మను వేరు చేసి చూపించాడు ఇది ధాన్యం నుండి పై పొట్టు ను తీసే విధానం లాంటిది .

జీవుడు ,ఈశ్వరుడు ఇద్దరు ప్రపంచ సృష్టికర్తలు అని భారతీర్ధ అన్నాడు ఇందులో ఈశ్వరుడు ముఖ్య కర్త .జీవుడు ఆయనకు లోబడి పని చేసే వాడు .ప్రపంచ స్తితికి మాత్రం ఆధారం ఈశ్వరుడే .ప్రపంచానుభ వాలకు మాత్రం జీవుడు ఆశ్రయుడు గా ఉంటాడు .జీవుడి సృష్టి బాహ్య ప్రపంచం కాదు .అంతర భావనా ప్రపంచమే నంటాడు తీర్ధ .’’వివరణ ప్రమేయ సంగ్రహం ‘’లో ప్రతి బింబ వాదాన్ని తీసుకొచ్చి వివరణ కోరే వారికి సంతృప్తి కలిగించాడు .కాని పంచ దశిలో ప్రతి బింబ వాదం లో ఒకటైన ‘’ఆభాస వాదం‘’ను అంగీకరించి ,వివరణ కారుని దృష్టిలో బింబం కంటే వేరే కాదని సత్యమైన అభాసం అని తేల్చాడు .అంటేభ్రాంతి అని చెప్పాడు .మాయకు ,అవిద్య కు భేదాన్ని చెప్పకుండా వివరణ కారుని సిద్ధాంతాన్ని అనుసరించి పంచ దశిలో ఈ రెండిటిని వేరు పరచి చూపించాడు .

వేదాంత విచారం చేత లభించే జ్ఞానం ఒక్కటే ముక్తికి సాధనం అని స్పష్టం చేశాడు .శ్రీ  కృష్ణ .భగవానుడు చెప్పిన సాంఖ్యం ,యోగం రెండిటిలో ఏదైనా ఒకటి ముక్తికి సాధనం అవుతుందని పంచదశి లో వివరించాడు .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-10-13- ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నేను మలాలా -ఆత్మకధ -ఆంధ్ర జ్యోతి ఆదివారం -20-10-13

malala-1 malala-2 malala-3 malala-4 malala-5

నేను మలాలా -ఆత్మకధ -ఆంధ్ర జ్యోతి ఆదివారం -20-10-13

 

 

 

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కవి ,కధకుడు చింతా దీక్షితులు -కె.బి.లక్ష్మి -చినుకు అక్టోబర్

kavi,kadhakulu -chintaa deekshitulu --1 kavi,kadhakulu -chintaa deekshitulu --2 kavi,kadhakulu -chintaa deekshitulu --3

కవి ,కధకుడు చింతా దీక్షితులు -కె.బి.లక్ష్మి -చినుకు అక్టోబర్

 

Posted in సేకరణలు | Tagged | 1 Comment

స్వర్గీయ ఛాయా రాజ్ కవిత-మాతృభాష -నడుస్తున్న చరిత్ర – అక్టోబర్

chaya raj maatrubhaasha -kavita

Posted in కవితలు | Tagged | Leave a comment

ఘనపూర్ కళ్యాణ మండపం ఘోష -నడుస్తున్న చరిత్ర -అక్టోబర్

ghanapur kalyana mandapa aavedana

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చిత్రకారుడు యెస్.విఱమా రావు తో అబ్దుల్ కలాం -నడుస్తున్న చరిత్ర -అక్టోబర్

sv.ramarao with kalam

Posted in సేకరణలు | Tagged | Leave a comment

శాతవాహన తోలి రాజ దాని కోటి పల్లి -నడుస్తున్న చరిత్ర -అక్టోబర్

shatavahana toli rajadhani kotilingala-1 shatavahana toli rajadhani kotilingala-2 shatavahana toli rajadhani kotilingala-3

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాయల154వ పట్టాభిషేకోత్సవం ,బాల వాక్కు-నడుస్తున్న చరిత్ర -అక్టోబర్

balavakkulu rayala 154 va pattaabhishekotsavam

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కాళోజి శత జయంతి -నడుస్తున్న చరిత్ర -అక్టోబర్

kaloji shata jayanti

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment