మరుగున పడిన మతాలు –మతాచార్యులు -43

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -43

మిత్ర మతం

మిత్ర మతం క్రీస్తు పూర్వం లోనే ఉండి క్రీ.శ.లో కొన్ని శతాబ్దాలు బాగా వాప్తి చెంది క్షీణించి పోయింది .ఆర్య ,పర్షియన్ పురాణ కధల్లో ఉన్న శాంతి ,సత్యం ఆధారంగా ఈ మతం ఏర్పడింది .ఈ మతానికి దేవత ‘’మిత్రుడు ‘గా ఉండేవాడు తరువాత సూర్యుడు దేవతగా మారాడు మిత్రుడు అన్నా సూర్యుడు అన్నా ఒకటే .ఈ మతం లో దేవతలంతా ఆర్యులు ,పర్శియన్లె .వీరిని రోమన్లు కూడా పూజించే సంప్రదాయం వచ్చింది .భారత్ వచ్చిన ఆర్యులు ఇరానీ సంబంధాన్ని వదలక ముందే ఈమతం వ్యాప్తి లో ఉందని చరిత్రకారుల ఉవాచ .

280px-Mi

 

మిత్రుడు వ్రుషభ  వధ

మిత్ర దేవత మనుష్యులకు చాలా ఇష్టమైన వాడు .ఆర్యుల కాలం లో మిత్రుడు వరుణుడి తో కలిసి ఉన్నట్లు తెలుస్తోంది .ఈ దేవతలిద్దరు ఒకే స్వర్ణ రధ సారదులై ఒకే రకమైన చింతన చేసి నట్లు ఉంది .ఈ ఇద్దరు విశ్వ క్రమాన్ని ,ధర్మాన్ని సంరక్షిస్తూ ,మానవ హృదయాలకు ,కార్యాలకు సాక్షులుగా ఉంటారు .మిత్రా వరుణులనేత్రం గా.సూర్యుడు ఉన్నాడని ఈ మతం అంటుంది .ఆకాశం లో వీరు నియమిత మార్గం లో ప్రయాణం చేసే  వీళ్ళ రధమే ‘’కాంతి ‘’గా భావిస్తారు .వీరిద్దరూ పాపుల ను  శిక్షిస్తారని, అవసరమైతే క్షమిస్తారని విశ్వ సిస్తారు .

మిత్రా వరుణు లిద్దరూ ప్రతి రోజు మానవులను మేల్కొల్పి ,నిత్య క్రుత్యాలకోసం ప్రోత్సహిస్తారు .అనంతా శం అనబడే’’ అదితి ‘’కుమారులైన వీరు ఆదిత్యులయ్యారు అని నమ్ముతారు .వేదం లో ఉన్న మిత్రుడు ,ఇరానియన్ పురాణాల్లో ఉన్న మిత్రుడు వేరు వేరు కాదు .జోరాస్ట్రియన్ మతం లో ‘’ఆర్మజ్ద్ ‘’అంటే ఆహూర ,మజ్ద ఈయనే .ఈయనే విశ్వానికి అధిదేవత .ప్రపంచానికి మధ్య వర్తిగా వ్యవహరిస్తాడు .దుష్టశక్తి అయిన ‘’ఆహ్రిమన్ ‘’వ్యతిరేకం గా మిత్రుడు అజ్మార్డ్ టో కలిసి రోజూ పోరాడుతూనే ఉంటాడు .

చరిత్రకారుడు  ప్లూటార్క్ చెప్పిన దాన్నిబట్టి క్రీ.పూ. 68లో పాంపే చక్ర వర్తి సైలీశియా నుంచి సముద్ర చోరులైన ఖైదీ లచేత ఈ మిత్ర మతం రోమ్ దేశం లో ప్రవేశించింది .రోమన్ సైనికుల ద్వారా ,వర్తకుల ద్వారా ,ప్రచారకుల ద్వారా రోమ్ లో చాలా వేగం గా విస్తరించింది .రోమన్ చక్ర వర్తులు కూడా మిత్ర పూజ చేశారు .బ్రిటన్ లో రోమన్ కేధలిక్కులు ప్రవేశించిన చోట్ల మిత్రమతం నాశనం చెందింది .ఈ మిత్ర మతం క్రీ.శ  .275 నుండి క్షీణత ప్రారంభమైంది .నాల్గవ శతాబ్దం లో మిత్ర మతాన్ని నిషేధించే శారు .దానితో పూర్తిగా అణగారి పోయింది .దీనిస్థానం లో క్రైస్తవం వేరూనింది .

 

300px-An

రోమన్ సామ్రాజ్యం లో మిత్ర నాణాలు

 

ఆ నాడున్న అన్ని రహస్య మతాల లాగానే ‘’ఒక దివ్య వివేకం’’ తమకు ఉందని ,మిత్రాయిజం చెబుతోంది .ఈశ్వరుని తో ఐక్యం అవటం ద్వారా మోక్షం లేక అమృతత్వం సాధించాలని మిత్రుల అభి భాషణం .మిత్ర మతం లో నైతిక ప్రమాణాలు చాలా ముఖ్యమైనవి .ఈ మతం లో ఉన్న అనేక అంశాలు దీని తర్వాతా వచ్చిన ‘’మాని ‘’అనే మతం లో ప్రవేశించాయి

 

220px-MithraReliefvert (1) Mithra_sacrifiant_le_Taureau-005 220px-MithraReliefvert MithrasIMG_5339

 

 

 

మ్యూజిం లో మిత్ర విగ్రహం

 

మిత్ర మతం లోని సూత్రాలు చాలా రహస్యాలు కొద్ది మంది ఆన్తరంగికులకే అవి తెలుసు కనుక పునర్నిర్మాణం అసాధ్యమైంది ..మొదటి ఆంగ్లానువాద పుస్తకం ఫ్ఫ్రాంజ్ కామన్స్ రాసిన’’ texts and illustrationt  illustrations monunuments of  mystic mitra’’అనేది1884 -1900 మధ్య ప్రచురింప బడింది .ప్రతి మిత్ర దేవాలయం లో ముఖ్య దేవుడు మిత్ర ‘’తారోక్తని ‘’అనే పవిత్ర వ్రుషభాన్ని చంపుతున్న  మూర్తి ఉంటుంది .ఈ వృషభం ఖగోళ రహస్యం గా భావిస్తారు .దీనితో బాటు ఒక సర్పం ఒక శునకం ఒక మాల కాకి కూడా విగ్రహ రూపం లో దర్శన మిస్తాయి .ఇవన్నీ నక్షత్ర గణాలకు చెందినవని అనుకొంటారు .ఒక్కొక్క దేవాలయం లో నలభై మందికే ప్రవేశం .మిత్ర శ్రేణిలో నాలుగు సోపానాలున్నాయి అందులో మూడు అందరు చేరుకో వచ్చు ఆధ్యాత్మిక ఉన్నతికివి సోపానాలు .చివరిది.కష్ట సాధ్యం .ఇందులో ఉన్న ఏడు రాంకుల క్రమం –మాల కాకి ,కన్య ,సైనికుడు ,సింహం ,పెర్సేస్ ,సూర్య వార్తాహరుడు ,తండ్రి .

 

Leontocephaline-Ostia

280px-Ostia_Antica_Mithraeumఇటలి లో శిధిల మిత్రాలయం

 

సశేషం

 

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-10-13- ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -42

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -42

జాన్ స్టువార్ట్ మిల్

జాన్ స్టువార్ట్ మిల్ 1806 లో మే ఇరవై న ఇంగ్లాండ్ లో జన్మించిన బ్రిటిష్ దార్శనికుడు .అర్ధ శాస్త్ర నిపుణుడు .తండ్రి కిష్టమైన ఉపయోగ వాదాన్ని వ్యాప్తి చేయటమే ధ్యేయం గా కార్య క్రమం లోకి దిగాడు దీనికి ‘’బెంథెం ‘’సిద్ధాంతాలను కూడా అర్ధం చేసుకొన్నాడు .అనుభవ వాదాన్ని శిఖరా రోహణం చేయించిన ఘనత మిల్ కే దక్కు తుంది .రాజనీతి ,నీతి శాస్త్రాలలో లిబరలిజం అంటే ఉదార వాదాన్ని పూర్తిగా సమర్ధించాడు .220px-John_Stuart_Mill,_Vanity_Fair,_1873-03-29 220px-PSM_V03_D380_John_Stuart_Mill

మిల్ చెప్పిన విధానాలను ‘’మెదడ్స్ ఆఫ్ మిల్ ‘’అంటారు .తన ఆదర్శాన్ని  శాస్త్రం మీద కేంద్రీకరించాడు మిల్ .ప్రక్రుతి శాస్త్రం లో ఉన్న నిశ్చిత పద్ధతుల్ని సాంఘిక శాస్త్రం లో ప్రవేశ పెట్టటం కోసం చాలా కృషి చేసి సఫలీ క్రుతుడైనాడు .’’ఇండక్తివ్ ‘’అంటే వ్యాప్తి సంబంధమైన అన్వేషణ అంతా కారణాలను వెతకటం తోనే సరి పోతుందని భావించాడు .కనుక శాస్త్రీయం గా సంఘటనల  మధ్య సంబంధాలను కనుగొనే పద్ధతుల్ని నిర్ణ యించట  నన్నాడు .ఇందులో  అయిదు పద్ధతులున్నాయని చెప్పాడు .1-cause complex (కారణ సంకీర్ణం )2-factors(అంశాలు )3-antecedents (పూర్వ రాశులు )4-consequences (ఉత్తర రాసులు )

తన భావ వ్యాప్తికి రెండు నియమాలు రూపొందిన్చుకొన్నాడు .1-సంఘటన దేనిలో కనీ పిస్తుందో అలాంటి విభిన్న ద్రుస్టాంతాలను ఒక దానితో ఒకటి పోల్చి చెప్పటం 2-అలాంటి దృష్టాంతాలను అన్ని విధాల  సమానం కాని వాటితో పోల్చి చెప్పటం .ఈ రెండు ‘’ఒక సంఘటన కనీ పించి నప్పుడు ఆ సంఘటనకు కారణం మాత్రం కాదు ‘’అనేది మిల్ యొక్క ప్రాధమిక సూత్రం దీని మీదే అంతా  ఆధారపడి రాశాడు .

మిల్ పద్ధతులలో 1-అంగీకార పధ్ధతి (method of agreement ). ఇందు సంఘటన  యొక్క రెండు లేక ఎక్కువ దృష్టాంతాలు ఒకే పధ్ధతి ని సామాన్యం గా కలిగి ఉంటె అన్ని దృష్టాంతాలు సామాన్య పద్ధతిలో ఆ సంఘటనకు కారణం అవుతుంది .-2-భేద పధ్ధతి –సంఘటన ఏ దృష్టాంతం లో కనీ పించిందో ,దానికి ఆ సంఘటన కనబడని దానికి ఈ ఒక్కటి తప్ప మిగిలిన వన్నీ సమానం గా ఉంటె అప్పుడది ఆ సంఘటన యొక్క కార్యం ,లేక కారణం అవుతుంది

3-అంగీకార భేద సంయుక్త పధ్ధతి (joint method of agreement and difference ).ఒక సంఘటన కనీ పించే రెండు లేక ఎక్కువ ద్రుస్టాంతా లలో ఒక పరిస్తితి మాత్రమె సమానం గా ఉంటె ఆ సంఘటన కనీ పించని రెండు లేక ఎక్కువ ద్రుస్టాం తాలలో ఆ పరిస్తితి లేక పోవటం తప్ప మరేదీ సామాన్యం గా లేక పొతే ఏ పరిస్తితుల్లో ఈ రెండు ద్రుస్టాంతాల ‘’వర్గాలు’’ భేదిస్తాయో అది ఆ సంఘటన యొక్క కార్యం కాని,కారణం కాని కారణం  లో ముఖ్య భాగం కాని అవుతుంది .

4-సాహచర్య పరిణామ పధ్ధతి ( method of concomitant variation ))మార్పు చెందినప్పుడ ల్లా ఒక సంఘటన ఏదో విధం గా మారుతుంటే ఆ సంఘటన రెండవ సంఘట నకు కారణం కాని కార్యం అవుతుంది .

5-అవశేషాల పధ్ధతి (method of residue )-ఏ సంఘటన అయినా యేవో కొన్ని పూర్వ రాస్షుల కార్యం అని ఇదివరకు చెప్పిన దాన్ని వ్యవకలన చేస్తుంది అప్పుడు ఆ సంఘటనలో అవశేషం మిగిలిన పూర్వ రాశుల కార్యం అవుతుంది .ఈ పద్ధతులు కొత్త విషయాలను కనీ పెట్ట టానికి పనికి వచ్చేవి కావు .ఇవి పద్ధతులు కావు నియమాలు మాత్రమె అని తేల్చారు

66 ఏళ్ళ వయసులో 1873 మే ఎనిమిది లో స్టువార్ట్ మిల్ మరణించాడు బ్రిటిష్ పార్ల మెంట్ సభ్యుడైనాడు .లిబరల్ పొలిటికల్ ఫిలాసఫీ వ్యాప్తి చేసిన వారిలో ప్రముఖుడు .మూడేళ్లకే గ్రీక్ భాష నేర్చి ఎనిమిదో ఏట ఈసప్ నీతి కధలు చదివేశాడు ఆ వయసులోనే లాటిన్ నేర్చి యూక్లిడ్ జామెట్రీ ,అల్జీ బ్రాలలో సాధికారత సాధించాడు ఆంగ్ల కవిత్వం చదవటమే కాక రాశాడు కూడా హోమర్ రాసిన ఇలియడ్ కు కొనసాగింపు కావ్యం రాసి మంచి పేరు పొందాడు .ఆగస్తీ కాంటే తో కలం స్నేహం చేశాడు అమెరికన్ అకాడెమి ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ లో గౌరవ సభ్యుడ దయ్యాడు రిప్రేసేన్తతివ్ ప్రభుత్వానికి ప్రోపోర్శనల్  రిప్రేసేన్తెషణ్ కు అనుకూలుడు  బెర్ట్రాండ్ రసెల్ కు ఫిలాసఫీలో ‘’గాడ్ ఫాదర్ ‘’మహిళా హక్కుల కోసం బానిసత్వ విమోచన కోసం కృషి చేశాడు .’’ఫెమినిస్ట్ ఫిలాసఫీ ‘’ రాశాడు  ‘’దాదాపు నలభై పుస్తకాలాను వైవిధ్య భరితం గా రాసిన ఘనా పాఠి జాన్ స్టువార్ట్ మిల్

సశేషం

మీ గబ్బిట దుర్గా ప్రసాద్ -19-10-13- ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

జ్ఞానపీఠ భరద్వాజ ఇకలేరు

జ్ఞానపీఠ భరద్వాజ ఇకలేరు

 
 
 
 

ఆకలి అమ్మ అయింది. ఆమె నేర్పిన పాఠం అక్షర యాత్రకు సిద్ధం చేసింది. కలలు చెదిరిన కాలాన్ని కాలం దన్నుగా రావూరి భరద్వాజ చిత్రీకరించారు. ప్రపంచం బాధను తన బాధ చేసుకొని, తన వేదనను సమాజ సంక్షోభంలో వెతుక్కొని దుర్భర దారిద్య్రాన్ని.. ఓ జీవిత సత్యంగా దృశ్యమానం చేశారు. వెలుగునీడల రాపిడిలో ‘పాకుడురాళ్ల’పై పడిలేచే బతుకులను సాహిత్యంలోకి తెచ్చి, సంచలనం రేపారు. విశ్వనాథ, సినారెల తరువాత..దాదాపు మూడు దశాబ్దాలకు రాష్ట్రానికి జ్ఞాన పీఠ అందించారు. తీరా ఆ ఆనందాన్ని తెలుగు సాహిత్య లోకం ఆస్వాదించకముందే దుఃఖంలో ముంచి పోయారు.

హైదరాబాద్, అక్టోబర్ 18 (ఆంధ్రజ్యోతి) : ప్రముఖ సాహితీవేత్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ (87) శుక్రవారం రాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన మధుమేహం, హైపర్‌టెన్షన్, కిడ్నీ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు. తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో గత సోమవారం ఆయనను హైదరాబాద్ కేర్ ఆస్పత్రిలో చేర్చారు. అప్పటి నుంచి ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి గుండె, కిడ్నీ, కాలేయం పనితీరు మందగించాయి. ఆయనను కాపాడేందుకు వైద్యులు శతథా ప్రయత్నించినా..శుక్రవారం రాత్రి 8.35 గంటలకు రావూరి భరద్వాజ తుదిశ్వాస విడిచారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో మృతి చెందినట్లు ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. మరణించడానికి వారం రోజుల ముందే ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆయన జ్ఞానపీఠ అవార్డును అందుకున్నారు. వీల్ ఛేర్‌లో ఒక చేతిలో సెలైన్ బాటిల్ పట్టుకొని భరద్వాజ ఈ కార్యక్రమంలో పాల్గొన్న దృశ్యం పూర్తిగా చెరిగిపోకముందే.. ఆయన సాహితీ లోకాన్ని వదిలిపెట్టారు. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, ప్రముఖ కవి సి. నారాయణరెడ్డిల కోవలో రాష్ట్రానికి మూడోసారి జ్ఞానపీఠ అందించిన ఖ్యాతిని చిరస్థాయిగా నిలుపుకున్నారు. ఆయన భౌతికకాయానికి శనివారం అంత్యక్రియలు జరగనున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి.

‘ఆకలి’ అక్షరశిల్పి
” ఆకలి నా రచనలకు ప్రేరణ” అని ప్రకటించుకున్న రావూరి భరద్వాజ 1925లో కృష్ణాజిల్లా పరిటాల జగీర్ మోగులూరు గ్రామంలో జన్మించారు. తల్లి మల్లికాంబ, తండ్రి కోటయ్యలపై ఆయన తన తొలి పద్యం చెప్పారు. చురుకైన విద్యార్థిగా పేరు పొందినా, ఆర్థిక పరిస్థితు ల వల్ల ఏడో తరగతితోనే చదువు ఆగిపోయింది. ఆకలి బాధను మరిచిపోవడానికి అక్షరానికి దగ్గరయ్యారు. ఒకవైపు పండో, నీళ్లో తాగి ఆకలి తీర్చుకుంటూ, మరోవైపు దొరికిన పుస్తకమల్లా చదువుతూ సాహిత్య దాహం తీర్చుకునేవారు. గ్రంథాలయం సంవత్సర చందా మూడు రూపాయలు కాగా, దాన్నీ కట్టలేకపోయేవారు. పగలంతా దొరికిన పని చేస్తూ, రాత్రయితే దేవాలయంలోని దీపం వెలుతురులో లైబ్రరీ పుస్తకాలను మధించేవారు. ప్రపంచ సాహిత్యాన్నంతా పఠనం చేస్తూ ఎన్నో నిద్ర లేని రాత్రులను గడిపారు. ఆలపాటి రవీంద్రనాథ్ పని కల్పించడంతో 1946లో మకాం తెనాలికి మార్చారు. తెనాలి జీవితం ఆయన సారస్వత వ్యక్తిత్యాన్నే మార్చి వేసింది.

చలం ప్రభావంతో తొలి రచనలు చేసిన ఆయన.. 1950లో ‘రాగిణి’ వెలువరించారు. ‘కొత్త చిగుళ్లు’లోని విభిన్న శైలి తెలుగు సాహిత్యం దృష్టిని ఆకర్షించింది. 1948లో కాంతం గారితో ఆయన వివాహం జరిగింది. “సంపన్నురాలైనా నా లేమిని, విద్యాహీనతను, నిరుద్యోగాన్ని చాలా దయగా భరించింది. అమాయకుడైన బిడ్డను తెలివైన తల్లి ఎలా చూ స్తుందో ఆ బంగారు తల్లి నన్నలా చూసుకుంది. అందుకే ‘కాంతమ్మ’ అనేవాణ్ని” అని చెబుతున్నప్పుడు భావోద్వేగానికి గురయ్యేవారు. ఈ కాలంలో ఆయన జమీన్ రైతు పత్రికలో జర్నలిస్టుగా పనిచేశారు. వృత్తిగానూ, ప్రవృత్తిగానూ కలం చేతబట్టారు. తెనాలిలోనూ, ఆ తరువాత చెన్నైలోనూ అనేక పత్రికల్లో పనిచేశారు. ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికతో ఆయనకు చెరగని బంధం ఉంది. 1959లో ఆలిండియా రేడియోలో జూనియర్ స్క్రిప్టు రైటర్‌గా విధులు నిర్వహించారు. ” అప్పట్లో త్రిపురనేని గోపిచంద్ ఆలిండియా రేడియోలో ఉన్నారు. ఆయన ఉద్యోగం అడిగాను, ఏడో తరగతి కూడా పూర్తి చేయని వాడికి ఏమి పని ఇవ్వాలని ప్రశ్నించారు. అప్పటికే అచ్చయిన నా పుస్తకాలను చూపించాను. వెంటనే ఉద్యోగం ఇచ్చారు” అని భరద్వాజ గుర్తు చేసుకునే వారు.

కత్తుల వంతెన
తెనాలి జీవితం ఆకలి లోతుపాతులను పరిచయం చేయగా, చెన్నైలో బతుకు కటువైన వాస్తవాల కత్తుల వంతెనపై నడిపింది. తాను పని చేస్తున్న పత్రిక కోసం సినీ పరిశ్రమతో ఆÄ ున పరిచయం పెట్టుకున్నారు. తెర వెనక, మేకప్పు తొలగిన జీవితాల్లోని చీకటిని, చేదును నేరుగా చూసి అక్షర రూపమిచ్చారు. అదే పాకుడురాళ్లు నవల. 1950-60 మధ్య, ఒక దశాబ్దం పాటు అంతర్ బహిర్ సంఘర్షణలకు లోనై ఎట్టకేలకు నవలను పూర్తిచేశారు. 1967లో ఈ నవల హిందీలోకి అనువాదమైంది. “మద్రాసులో సుప్రసిద్ధ కథారచయిత ధనికొండ హన్మంతరావు జ్యోతి, అభిసారిక, చిత్రసీమ అనే పత్రికలు పెట్టారు. వాటిలో ‘చిత్రసీమ’ పని నాకు అప్పజెప్పారు. తారలను కలిసి, మాట్లాడి, రాయడం నా పని. ఒకనటి తనకు రావాల్సిన డబ్బు ఎలా తెలివిగా తెచ్చుకున్నది నాకు చెప్పింది. నన్ను ‘బావా’ అని, మా ఆవిడని ‘పిన్నీ’ అనీ పిలిచేది. అదేం వరస అంటే.. ‘సినిమావాళ్లకు వరసలేంటి?’ అనేది. అలాంటి అనుభవాలన్నీ డైరీలో రాసుకునేవాణ్ని. వాటి ఆధారంగా ‘మాయ జలతారు’ కథ రాశాను. మల్లంపల్లి సోమశేఖరశర్మ చదివి.. నవలగా మార్చాలని కోరారు.

తర్వాత.. కృష్ణా పత్రిక ముదిగొండ సుబ్రహ్మణ్యం సీరియల్ రాయమన్నప్పుడు ఈ కథ చెబితే రాయమన్నారు. దీనికి ‘పాకుడురాళ్లు’ శీర్షిక పెట్టింది శీలా వీర్రాజు. సీరియల్‌ని నిషే ధించాలని పత్రి కను రాకుండా చేయా లని చాలామంది సినీప్రముఖులు యత్నించారు” అని ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌కు ఇచ్చిన ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు. ఈ నవల కథానాయిక మంజరి పాత్ర.. వాస్తవ జీవితంలో ఎవరనేది ఇంతవరకూ బయటపెట్టని భరద్వాజ.. ” నా డైరీలో ఆమె పేరు ఉంది. నేను చనిపోయిన తరువాతే అదెవరైందీ లోకానికి తెలుస్తుంది” అని ఇదే ఇంటర్య్యూలో చెప్పుకున్నారు. ఈ నవలకే 2012 సంవత్సరానికి గాను జ్ఞానపీఠ అవార్డు లభించింది. మనిషి తన గతాన్ని ఎన్నడూ మరిచిపోరాదని చెప్పే భరద్వాజ.. ఉచిత పథకాలతో ప్రజలను ఉద్దరించాలనుకోవడం సరికాదని ‘ఓపెన్ హార్ట్..’లో స్పష్టంగా చెప్పారు.

ప్రముఖుల నివాళి
సాహితీ రంగంలో ఎవరెస్టు శిఖరాలను అధిరోహించిన గొప్ప వ్యక్తిగా..భరద్వాజకు గవర్నర్ నరసింహన్ నివాళులర్పించారు. సాహి త్య లోకానికి ఆయన మరణం పెద్ద లోటు అని సీఎం కిరణ్ అన్నారు. జీవితంలో ఎన్నో కష్టాలకు వోర్చి, అత్యున్నత జ్ఞానపీఠ అందుకోవడం తెలుగు జాతి గర్వించదగ్గ విషయమని టీడీపీ అధినేత చంద్రబాబుకొనియాడారు. బాలల సాహిత్యానికి ఎనలేని సేవలందించారని వైసీపీ నేత జగన్ నివాళి అర్పించారు. సాహితీలోకం ఒక ధృవతారని కోల్పోయిందని బీజేపీ నేత వెంకయ్యనాయుడు సంతాపం ప్రకటించారు. మంత్రి డీకే అరుణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు, కెనడాలో భారతీయ సాంస్కృతిక రాయబారి యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్, సాంస్కృతిక మండలి మాజీ సలహాదారు రమణాచారి, టీజేఏసీ చైర్మన్ కోదండరాం, విద్యావేత్త చుక్కారామయ్య, తెరవే నేత గౌరిశంకర్, తెలంగాణవాది అద్దంకి దయాకర్‌లు..కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Posted in సేకరణలు | Tagged | Leave a comment

తల ఎవడిదో మెదడూ వాడిదే -దేవరాజు మహారాజు కవిత -ఆంధ్ర జ్యోతి -19-10-13

tala yevadido medaa vaadide -devaraju kavita

Posted in కవితలు | Tagged | Leave a comment

‘అశోక్’ ది గ్రేట్

        అశోక్ ది గ్రేట్

    ఆరడగుల బులెట్ అశోకబాబు దాదాపు పది హీను యూనియన్లను ఏక తాటి మీ ద నిలబెట్టి ఏక ధాటీగా అరవై ఆరు రోజుల సమ్మె ను దిగ్విజయం గా ,దిగ్విజయ్ అనే డిక్కీ రాజాకు దడ పుట్టించేట్లు డిక్కీలో పడేసి మహోద్రుతం గా మహోన్నతం గా ఉద్యమం సాగించాడు .అతనికి అన్ని రంగాల నాయకులు బేషరతుగా మద్దతు తో నిలబడి అనుకోన్నదాన్ని సాధించటానికి తోడ్పడ్డారు వీరందరూ అభినంద నీయులే ఆర్ .టి.సి.ఎప్పుడూతమ వారి హక్కులకే సమ్మె చేసేది అలాంటిది మిగిలిన వారితో కలిసి అన్నిటికి అతీతం గా నిలిచి విభజనను వ్యతిరేకించి సమైక్యం కోసం శక్తి యుక్తులన్నీ  ధారపోసి ఆశోక్ వెనుక నిలబడ్డారు అందుకే కాంగ్రెస్ నాయకులకు మంత్రులకు ఏం .పి.లకు ఏం ఎల్ ఎల్;ఏ లకు కూ పట్టని సమస్యలను భుజాన కెత్తుకొని దూసుకు పోయారు

      14 ఇంతకీ సమ్మె వల్ల,  విరమణ వల్ల ఏం సాధించారు ?/అని కొద్ది మంది నిత్య శంకితులు అల్ప బుద్ధులు ప్రశ్నిస్తున్నారు .దీనికి సమాధానం ఒక్కటే .నాయకులేవ్వరికి విభజన వల్ల ఉత్పన్నమయ్యే సమస్య లేమిటో విద్యార్ధులు, ఉద్యోగులు, రైతులు ,సామాన్య గృహిణులు ,హైదరా బాద్ లో ఇన్నేల్లుగా  గా ఉంటున్న వారి సమస్య లేమిటో ,సాగునీటి సమస్య లేమిటో పట్టలేదు అటు తెలంగాణా కాంగ్రెస్ నాయకులు ఇటు  సీమాంధ్ర నాయకులూ తెలుసుకోలేక పోయారు ఒకరిద్దరికి తెలిసినా ధిల్లీ పెద్దలకు తెలప లేక పోయారు .అప్పుడప్పుడు కేతి గాడు బంగారక్క ల్లా  లగడపాటి,ఉండవల్లి  వారానికో సారి ధిల్లీ నుంచి వచ్చి మీడియా ముందు ఏదో మాట్లాడి పోతున్నారు .అసలు సంస్యలేవ్వరికీ అర్ధం కాలేదు లోతైన విశ్లేషణా చేయలేదు .అందువల్లనే ఏక వాక్యం తీర్మానం వల్ల భగ్గు మంది సీమాంధ్ర .అదుగో అప్పుడే అశోక్ బాబు రంగ ప్రవేశం చేశాడు

       రైతుల్ని ,విద్యార్ధుల్ని కార్మిక నాయకు ఆర్ టి.సి ఉద్యోగులు డ్రైవర్లు కండక్టర్లు గేజేటేడ్ ఆఫీసర్లు నాల్గవ తరగతి ఉద్యోగులు ,ముఖ్యం గా అశేష మహిళా జనం రోడ్ల మీదకు అశోక్ ఆధ్వర్యం లో ముందుకొచ్చారు . ఊరు వాడా మీటింగులు పెట్టి వీధి వీధినా సమా వేశాషా ఏర్పాటు చేసి హైదరాబాద్ ,విజయ వాడ మొదలైన ఎన్నో కేంద్రాలలో విస్త్రుత  బహి రంగ సభలు పెట్టి ఏ రంగానికి ఆరంగం నిపుణులతో ప్రజలకు విభజన వల్లవచ్చే ప్రమాదాన్ని జనానికి వివరం గా చెప్పారు అంతా  సూటిగా విస్పష్టం గా తెలియ జేశారు .ధిల్లీ వెళ్లి అన్ని పార్టీల పెద్దలను కలిసి తమ స్టాండ్ ను ముంచు కోచ్చే ప్రమాదాన్ని  వివరించారు ఆ పార్టీ పెద్దలు ‘’విభ జిస్తే ఇన్ని సమస్యలున్నాయా ?మీ రాజకీయ నాయకు లెవరూ మాకు ఈ విషయాలేవీ చెప్పనే లేదు ఊరికే ధిల్లీ వచ్చి సోనియా ను కలిసి ఆమె కను సన్నలలో మెలగి పోతున్నారు .అంతే తప్ప ఏమీ చేయలేక పోయారు .ఇప్పుడు మీ సమస్యలు స్పష్టం గా మీ వల్ల  తెలిసింది .కనుక మేము కూడా చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకొంటాం ’’అని ధైర్యం చెప్పారు .కనుక అశోక్ బృందం జాతీయ నాయకులకు ఇంత విస్పష్టం గా సమస్య పూర్వా పరాలను తెలియ జెప్పారు .అదీ అశోక్ చేసిన గొప్ప పని, సాధించిన ఘన విజయం  ఇందులో సందేహం లేదు .

        ఉద్యమం లో ఇంకో గొ ప్ప విషయం ఉంది తెలంగాణా ఉద్యమం లో రెచ్చ గొట్టి ఆత్మ హత్యలకు ప్రోత్సహించారు కే.సి.ఆర్ .బృందం .కాని దానికి వ్యతి రేకం గా ఇక్కడ సీమాన్ధ్రలో  ఒక్క బులెట్ వాడలేదు ,ఒక ప్రాణం పోలేదు ఎక్కడో శ్రీకాకుళం విజయ నగరాల్లో విధ్వంసం చివర్లో వచ్చింది బొత్స ఇల్లు,వ్యాపారాలు తగల బెట్టటం ఉద్యమ కారుల పనేమీ కాదు బొత్స కుటుంబానికి వ్యతి రేకుల పనే అది .అని అందరికి తెలిసింది .అంతే కాదు బొత్స రెండు గుర్రాల మీద స్వారీ కూడా కారణం అంతకు తప్ప ఇంకేమీ లేదు ..

         ఉద్యమం ఆత్యంత శాంతి యుతం గా ,అహింసా విధానం గా ,గాంధీ అడుగు జాడల్లో నడిపిన ఘనత అశోక్ అండ్ కోది .దీనికి వీరికి   మనసారా అభినందనలుమాట తూలీ మాట్లాడటం బూతులు లేక పోవటం హుందాగా సభలు నిర్వహించటం అతని ప్రతిభకు ,ప్రజ్ఞకు నాయకత్వానికి ఆలోచనకు అడ్డం పట్టింది సంస్కర వంట మైన భాష ,ప్రవర్తన నడవడి వల్లే అశోక్ అంట ధాటీగా నిర్వహించగలిగాడు ఉద్యమాన్ని .ధిల్లీ వెళ్లి అమ్మ ముందు మోకాలి దండా వెయ్యటం తప్ప అది కార పక్షం ఏమీ చెయ్యలేక పోవటం చరిత్ర క్షమించదు .పార్టీ అనేకు కుంభ కోణాల్లో ఇరుక్కు పోయి బయట పడలేని ప్రభుత్వం .పరువు ,ప్రతిస్టా బూడిద పాలు దిక్కు తోచని పార్టీ .దున్దుకు నిర్ణయాలు మళ్ళీ వెనక్కి తీసుకోవటం ఒకరు చెప్పేదానికి ఇంకొరు అన్న దానికి పొంతాన లేక పోవటం ధిల్లీ పెద్దల ఘోర తాప్పిడం అగ్నికి ఆజ్యం పోసే షిండే డిగ్గీ ,మరీ ద్వేషాలను ప్రజ్వలింప జేశారు ఏంతో సామరస్యం గా సమర్ధ వంతం గా హుందాగా బాధ్యతగా ఉండాల్సిన అధినాయక గణం బజారు మనుష్యుల్లా ప్రవర్తించి అసహ్యం పుట్టేట్లు చేసుకొన్నారు .

     మన రాష్ట్రం లో మంత్రివర్గం ,శాసన సభ్యులు రెండు శిబిరాలుగా చీలి ప్రభుత్వం లేదని పిస్తూ ,ప్రజాధనాన్ని జీత భాత్యాల కింద హాయిగా అనుభవిస్తూ మంత్రి అనేవాడు మొత్తం రాష్ట్రానికే అన్న మాటను తుడి  చేసి పబ్బం గడుపుకొంటూ ప్రజాస్వామ్యానికి ద్రోహులుగా ప్రవర్తించటం హేయం గా ఉంది ఇందులోంచి బయట పడ లేని విపత్కర వింత స్తితి దీని పై ద్రుష్టి సారించని అధిష్టానం ఇంత  దారిద్ర నికృష్ట నిర్వీర్య పరిస్తితి మన  రాష్ట్రం లో ఉంది .రెండు శిబిరాలు ధిల్లీ వెళ్ళటం ‘’అమ్మ ఇచ్చేస్తుంది ‘’ఒక శిబిరం వాళ్ళు అంటే ‘’అంతా సోనియమ్మ ‘ఇష్టం ‘’అని హిస్ మాస్టర్ వాయిస్ రికార్డ్ మీద జంతువూ లా తోకాడిం చు కొంటు రావటం తప్ప ఆవిడకు ఈ సమస్యలు తెలియవని అక్కడ కొటరి లో ఉన్న వాళ్ళు తమ రాష్ట్రాలలో చెల్లని నాణాలని తెలుసు కకోలేని అసమర్దులని అర్ధం చేసుకో లేక పోయారు ఇదీ మన దౌర్భాగ్యం . అందుకే అంతా  అయిన్తర్వాత్  ఆకులు పట్టు కోవాల్సి వచ్చింది ఇప్పుడే అశో బాబు రంగ ప్రవేశం చేసి ఇదివరకెన్నడూ లేనంత సమైక్యం గా ఉద్యమాన్ని నిర్వహించి సమస్యల మూలాలను శోధింప జేసి అందరి కి ఎరుక కలిగించాడు అదే ఆతను సాధించిన ఘన విజయం అందుకే ‘’అశోక్ దిగ్రేట్’’ అన్నాను  .

      నేను సర్వీసు లో ఉండగా ఏ’శ్రీరాములు అనే యెన్ జి.వో నాయకుడి ఆధ్వర్యంవాళ్ళు తీచార్లమైన మేము  లో జీత భాత్యాలకోసం ఒక సారి 56రోజులు ,ఇంకో సారి 62రోజులు సమ్మె చేశాం మొదటి దానిలో ఏదీ పొందకుండా నే  విరమించాం రెండో దానిలో బ్రహ్మా నంద రెడ్డి ముష్టి ఆరు రూపాయలు డి.ఏ.,పెంచి అదీ రెండు సార్లు మూడేసి రూపాయలు మా మొహాన కొట్టాడు

      .కాని ఇప్పుడు ఈ సమ్మె జీత భత్యాల కోసం కాదు పవిత్ర ఆశయం కోసం జరిగింది రెండు నెలలు జీతాలు లేక పోయినా ఏ గ్రుహిణీ  బాధ పడి మాట్లాడలేదు రెట్టించిన ఉత్సాహం టో పని చేస్తానని ముందుకు వచ్చింది .అలానే విద్యార్ధులు లాయర్లు ఒకరేమిటి సమస్త వృత్తుల వారు అన్ని తరగతుల వారు ఈ యజ్ఞం లో భాగ స్వామ్యులయ్యారు అయ్యేట్లు చేశాడు అశోక్ బాబు .అందుకే ముఖ్య మంత్రి తాన కున్న ధికార పరిమితికి లోబడి సమైక్యం గా రాష్ట్రాన్ని ఉంచుతాను అని విస్పష్టం గా నాయకులకు చెప్పటం వల్లనే సమ్మె విరమించారు ఇది తాత్కాలిక విరమణయే  నని తేడా వస్తే మెరుపు సమ్మె ఖాయమని అన్ని సంఘాలు పునరుద్ఘాటించాయి .ఆంద్ర దేశ చరిత్రలో చారిత్రాత్మక మైన ఘట్టం ఈ సమైక్య సమ్మె హాట్స్ ఆఫ్ టుఆల్

       మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ – 18-10-13  -ఉయ్యూరు 

 
Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

నిరతాన్నదాత బందా పరదేశి గారు ( 1700 – 1785 )

                                           నిరతాన్నదాత బందా పరదేశి గారు  ( 1700 – 1785 ) 
      శ్రీ బందా పరదేశి గారు  17వ శతాబ్దం వారు , శ్రీ  వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడుగారి సమకాలికులు , వీరి స్వస్థలం వేటపాలెం, వృత్తి కరిణీకం, భక్తి ప్రపత్తులతో భగవదర్పితముగా  పనులు చేయటం వీరి ప్రవృత్తి , ఏకాదశీ వ్రత నిష్టాపరుడు  , అతిధి సత్కారము చేయని దినము ఆయన జీవితములో లేదనిన అతిశయోక్తి కాదు . పన్నెండు సంఖ్యకు తక్కువ కాకుండా – నూటయెనిమిది సంఖ్యకు మించకుండా ద్వాదశి పారణ చేయటం , ( ఏకాశి నాడు ఉపవాస ముండి మరునాడు  భోజన సంతర్పణ చేయటం ) వీరి నియమం .దీనికి తోడు నిత్యాన్నదాన వ్రతం నిరాటంకంగా కొనసాగుతూ వుండేది .వీరికి తోడు వీరి అర్ధాంగి కమలాంబ భర్తకు అనుగుణంగా నడచుకునేది , విసుగు విరామం లేకుండా వండి వార్చేది ,ఇంటికి వచ్చిన అతిధులు  ఆనందంగా వెళ్ళుతుంటే –  వారిని వదలలేక కన్నీళ్ళతో సాగనంపెడివారు ఆ దంపతులు .
        రాబడి తక్కువ ఖర్చు ఎక్కువ అయినపుడు  కొండలైనా తరిగిపోక తప్పదు కదా , చేతికి ఎముక లేకుండా చేసిన అన్నదానాల వలన దినం గడపటమే కష్టమైన పరిస్థితి వచ్చినది , భార్య మెడలోనికి పసుపు కొమ్ము తాడు వచ్చింది , మరునాటి అతిధి సత్కారమెట్లో అంతుబట్టని స్థితి ,అచట నిలువ బుధ్ది కాలేదు ,చీకటి పడిన తరువాత యెవరి కంటా పడకుండా బాపట్ల చేరుకున్నారు , అచట గల తూర్పు సత్రంలో ఒక మూల వొదిగి కూర్చున్నారు .
       ఆ సమయంలో, గుడ్డి దీపం వెలుగులో  అచటనే బసచేసి వున్న ఒక  స్త్రీ తన పిల్లలతో  బస చేసి వుండటం – ఆమె తన పిల్లలతో అన్న మాటలు ఆ దంపతులిద్దరి చెవుల్లోనూ  పడ్డాయి .ఈ శనగ పప్పు తిని మంచినీళ్ళు తాగి పడుకోండి ,రేపు వేటపాలెంలో పరదేశిగారింట కడుపు నిండా అన్నం తిందురుగాని  అని ఓదారుస్తున్నది ., నిశ్శబ్దంగా అచట నుండి లేచి స్వగ్రామం దిక్కుగా  నడిచారు ఆ దంపతులు .తమపై నమ్మకంతో ఆ బిడ్డలను ఓదారుస్తున్న  ఆ మాతృమూర్తి ఆశలను నిజం చేయాలనుకున్నారు , ఇక కర్తవ్యం నుండి పారిపో బుధ్దికాలేదు , తెల్లవారేసరికి ఇల్లు చేరుకున్నారు .దొడ్లో వున్న పెద్ద రుబ్బు రోలును  ఓ రెండు రూపాయలకు  శ్రీ బొమ్మిశెట్టి సుందరరాజయ్య శ్రేష్టికి అమ్మి కావలసిన వస్తు సామగ్రి తెచ్చి వంట చేసి అతిధుల రాక కోసం ఎదురు చూడ సాగారు .ఆ తరువాత వచ్చిన అతిధులను తృప్తి పరచి సాగనంపారు .
             నాటి సాయంత్రం శ్రేష్టిని పిలచి రోలు తీసుకొని పొమ్మని కోరారు పరదేశి దంపతులు , శ్రేష్టి వచ్చి రోలును తీసుకునే ప్రయత్నంలో రోలును కదిపి దొర్లించగానే  – ఆశ్చర్యకరంగా ఆ రోటి క్రింద  బంగారు మొహరీలు నిండి వున్న  బిందె కలబడినది , తాను కొన్నది రోలు మాత్రమేనని , మొహరీల బిందెను పరదేశి గారికి  అప్పజెప్పాడు ధర్మాత్ముడైన శ్రేష్టి ..ఇక చేసేది ఏమీ లేదని , తమ అన్నదాన వ్రతానికి ఎటువంటి అవరోధం కలుగకుండా  భగవంతుడీవిధంగా అనుగ్రహించాడని సర్ది చెప్పుకున్నారు ,
              అసూయాపరులు కొందరు రాజుగారికి ఫిర్యాదు చేసారు , వీరి విషయము సంపూర్ణముగా తెలిసి వుండుట చేత రాజా వేంకటాద్రినాయుడుగారు  పట్టించుకోలేదు . పరదేశిగారి కీర్తి దేశమంతా వ్యాపించింది , శ్రీ వేంకటాద్రినాయుడుగారు తమ గురువైన పాపయారాధ్యులవారితో  క్రీ.శ. 1770లో గంగా పుష్కరాలకు వెళ్ళారు , అచట యధావిధిగా దానాలు , సంతర్పణలూ చేసారు ,  “ఆహా నిరతాన్నదాతయగు బందా పరదేశిగారి దేశాన్ని పాలించే ప్రభువు ” అని అచట నున్న ప్రజానీకం  పొగడటం విన్నారు నాయుడుగారు .సంతోషమేకదా  ! తిరిగి వచ్చిన తరువాత గురువుగారితో చర్చించి – వారి అనుమతితో  బందా పరదేశిగారి కీర్తి ఎల్లకాలం  నిలచి వుండేటట్లు చేయాలని అనుకున్నారు , పరదేశిగారికి అధికారికంగా  కబురు పెట్టారు .తమ అంగీకారం  లేకుండా స్వగ్రామం వెళ్ళరాదని ఆంక్ష విధించారు …….  ( మొదటి భాగం)
                                                                                              పరిశోధన , రచన : బందా వేంకట రామారావు
                                                                                                                              సెల్ .9393483147,
Posted in సేకరణలు | Tagged | 2 Comments

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -41

   మరుగున పడిన మతాలు –మతాచార్యులు -41

కార్ల్ యాస్పర్స్ (Jaspers Carl )

కార్ల్ యాస్పర్స్ జర్మన్ దార్శనికుడు ఓల్డెన్ బర్గ్ లోఒక బ్యాంకి   అధికారి కుమారుడు .1883 లో ఫిబ్రవరి23 న జన్మించాడు మనసిక రోగ చికిత్సా నిపుణుడు .దీనిపై‘’Allegemeine sycho patology ‘’అనే గ్రంధాన్ని రాశాడు ద్రుష్టి ని దర్శన శాస్త్రం మీద కేంద్రీకరించాడు .హిడెన్ బర్గ్ యూని వర్సిటి లో ఆచార్య పదవి లో చేరాడు .అప్పుడున్న జాతీయ సమైక్య వాదాన్ని ఒప్పుకోలేదు కార్ల్ .దీని ఫలితం గా జర్మనీ ని వదిలి పెట్టాల్సిన స్తితి వచ్చింది .1943 లో స్విట్జర్లాండ్ లో బాసిల్ విశ్వ విద్యాలయ ఆచార్య పదవి లో ప్రవేశించాడు .చాలా గ్రంధాలు రాశాడు అందులో ముఖ్యమైనవి దర్శన శాస్త్రం ,దార్శనిక సమాలోచనా రీతి ,దార్శనిక శాస్త్ర ప్రవేశం ,నేటి తర్కం –ప్రతి తర్కం మొదలైనవి .1969ఫిబ్రవరి  26న ఎనభై ఆరు ఏళ్ళ వయసులో మరణించాడు

“While I was still at school Spinoza was the first. Kant then became the philosopher for me and has remained so…Nietzsche gained importance for me only late as the magnificent revelation of nihilism and the task of overcoming it.”

 

 

కియోర్క్ గార్డ్ అనే ఆయన స్తాపించిన అస్తిత్వ వాద సంప్రదాయానికే యాస్పర్ర్స్  చెందుతాడు .అతని దృష్టిలో దర్శన శాస్త్రం అంటే విశ్వాన్ని గూర్చిన అమూర్త సిద్ధాంతం కాదు .అస్తిత్వ గుణం ఉన్న దార్శనికుడు తాను  ఉన్న ప్రత్యక్ష జీవిత సన్నీ వేశాలలో చూపే ప్రవ్రుత్తి .యే దర్శన శాస్త్రం అన్నాడు .యాస్పర్స్  ఆలోచన పరిణతి పొందిన కొద్దీ అస్తిత్వ వాదం లో ఉన్న విరోదా భాసాలపై ఆసక్తి తగ్గింది .అంత కంటే సువ్యవస్తిత దార్శనిక సమా లోచన వైపు ద్రుష్టి పెట్టాడు .ఈ అంశాలను దర్శన శాస్త్రం ఉపేక్షించ కూడదు అని చెప్పాడు .దాని లక్ష్యం హేతు బద్ధ బౌద్ధిక విచారమే .తర్కం యొక్క ప్రాదాన్యతను గు ర్తించాడు .కనుక దర్శన శాష్ట్రం ‘’బుద్ధి దర్శనం’’ అని కొత్త అర్ధం చెప్పాడు .

ఇతని ఆలోచనలలో విషయత్వం (ఆబ్జెక్టి విటి),అస్తిత్వం (ఎక్సిస్టెన్స్ ),అతీత్వం (ట్రాన్సేన్ డేన్స్ ) ఉన్నాయి .వాస్తవికత అంటే సజీవ నిర్జీవ వస్తువులే కాక ,ఆలోచనలు మనః ప్రవృత్తులు .ఇవన్నీ ప్రక్రుతి శాస్త్రం చర్చించేవి .ప్రక్రుతి విజ్ఞానం వల్ల  విశ్వం యొక్క సమగ్ర స్వరూపం తెలియదు ప్రక్రుతి జ్ఞానం దానికది సాటి లేనిదే .దానిపై విపరీతం గా ఆధార పడ రాదు .ప్రక్రుతి విజ్ఞానం టో దర్శన శాస్త్రానికేమీ వైరుధ్యం లేదన్నాడు .దర్శనం ప్రక్రుతి యొక్క పరిమితి ని చూపించి దాని పై వ్యామోహం కలగ కుండా కాపాడుతుంది .వ్యక్తీ అస్తిత్వం లో ఉన్న వైవిధ్యం సందిగ్ధతల పై ద్రుష్టి పెట్టాలి .తన నిర్ణయాలలో మానవుడు తన అస్తిత్వాన్ని బయట పెడతాడు .అతడు కేవలం ‘’విషయి ‘’మాత్రం కాదు .ప్రపంచం టో సంబంధం ఉన్న వాడు .అతని అస్తిత్వానికి ఎప్పుడూ ప్రామాదం  పొంచి ఉంటుంది .ఈ సందర్భం లో అతనికి  వ్యక్తిత్వం, స్వేచ్చ ఉండక పోవచ్చు .

దైవ ద్రుష్టి  లేక పొతే అమానుషం గా మానవుడు ప్రవర్తించే అవకాశం ఉంది .స్వతంత్ర మానవ సంఘం లో  తానొక స్వతంత్ర వ్యక్తీ గా మసులుకోవాలి .అస్తిత్వాన్ని వివరించటం అసాధ్యం అన్నాడు యాస్పర్స్ .కనుక విషయ వాస్తవికత కంటే భిన్నమైన వాటిని కల్పించుకోవాల్సిన అవసరం ఉందన్నాడు .అతీత్వం అనేది లేక పొతే అస్తిత్వం అర్ధం కాదన్నాడు .’’లిమిట్ సిచుయేషన్స్అనే భావాన్ని దీనికోసం వ్యాప్తి లోకి తెచ్చాడు చావు మొదలైనవి అనుభావాలైనప్పుడు మనల్ని మన అస్తిత్వ విషయం లో శ్రద్ధ పెంచి అస్తిత్వం యొక్క నిగూడార్ధాన్ని ఈ అవధి సన్నివేశం(లిమిట్సిచు యేషన్స్ )   కాపాడుతాయని చెప్పాడు .

అస్తిత్వానికి ఈ దృశ్య ప్రపంచం టో సంబంధం ఉన్నట్లే దాని అతీత్వం టో కూడా సంబంధం ఉంది అన్నాడు .దీనిని వివరించటానికి ‘’కూటలిపి భాష ) ‘’ను తయారు చేసి అందులో చెప్పాడు .అతీత్వ సందేశాలను గ్రాహించటా నికి మనిషి ఎప్పుడూ సిద్ధం గా ఉండాలి .కూట లిపి లో మునిగి తేలిన  వాడి జన్మ సార్ధకం .అలాంటి కూట లిపి భాష లలో చరిత్ర ఒకటి ‘’అన్నాడు ఈ భాష పురాణాలలో కళలలో కన్పిస్తుంది అని చెప్పాడు .కూట లిపి కానిదేదీ లేదు అని తేల్చాడు .అతీత్వం వాస్తవికత యొక్క ఉత్కృష్ట దశను, నికృష్ట దశనూ రెండిటిని చెబుతుంది .

1934 లో యాస్పర్స్  రాసిన ‘చరిత్ర పుట్టుక- లక్ష్యం ‘’గ్రంధం  ఈ ద్రుష్టితో   రాసిందే .క్రీ .పూ. 500 కా లాన్ని’’యాక్సిస్ టైం ‘’అంటారు .ఆ కాలానికి చాలా ప్రాధాన్యత కల్పించాడు గ్రంధం లో .ఈ కాలం లోనే ప్రపంచం లో చాలా దేశాలలో మతాచార్యులు జన్మించారని అన్నాడు .వారి సందేశాలను అవగాహన చేసి కొని  ,మానవుడు తన స్తిత్వాన్ని గురించి దాని పరిమితుల గురించి జ్ఞానాన్ని సంపాదించాడు అని స్పష్టం గా చెప్పాడు కార్ల్ .

ఒక రకం గా అస్తిత్వ వాదులలో యాస్పర్స్ అతి వాదుల కంటే సమత్వ ద్రుష్టి ఉన్న వాడుగా గుర్తింపు పొందాడు .పాశ్చాత్య దేశాలలో కనిపించే పురుషార్దాలానే యాస్పర్స్ తన దర్శన శాస్త్రం లో నిక్షిప్తం చేశాడని తెలుస్తుంది .జీన్ పాల్ సాత్రే వంటి నిరీశ్వర వాదుల కంటే యాస్పర్స్ క్రైస్తవానికి దగ్గర గా ఉన్నాడు అ నే భావన కలుగుతుంది

నాజీలు అధికారం లోకి వచ్చిన తర్వాతా జ్యూయిష్ వాడు అని ఉద్యోగం ఊడ  గొట్టారు  జర్మనీ యూరప్ దేశాలలో పేరు పొందిన ఫిలాసఫర్ అని పించుకొన్నాడు

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -18-10-13 ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -40 సర్వేపల్లి రాధా కృష్ణ పండితుడు

    మరుగున పడిన మతాలు –మతాచార్యులు -40

              సర్వేపల్లి రాధా కృష్ణ పండితుడు

1888 లోసెప్టెంబర్ అయిదున రాధాకృష్ణన్  తిరుత్తని లో జన్మించాడు తండ్రి వీరాస్వామి తల్లి సీతమ్మ . సర్వే పల్లి రాదా కృష్ణన్ మద్రాస్ క్రైస్తవ కాలేజి లో విద్య పూర్తీ చేసి ,అక్కడే ప్రెసి దేన్సి కాలేజ్ లో దర్శన శాస్త్ర ఉపన్యాసకుడు గా ,ప్రదానోపన్యాసకుడుగా పని చేశారు .భార్య శివకామి .కల కత్తా విశ్వ విద్యాలయం లో తత్వ శాస్త్రావుపన్యాసకుడు గా పని చేశారు .మాంచెస్టర్ కాలేజ్ ఆ ఫ ఆక్స్ ఫర్డ్ లో ఆస్తాన్ ఉపన్యాసకుడైనాడు .1926 లో చికాగో లో హాస్కేల్ తులనాత్మక మత దర్శనోపాధ్యుడైనాడు .1931-36 లో ఆంద్ర విశ్వ విద్యాలయ ఉపాధ్యక్షుడుగా1936-52  లో ప్రాచ్య మత ,నీటి శాస్త్రాలలో స్పాల్టింగ్ ఆచార్యుడుగా ఉన్నాడు .1939-48 ,కాలం లో బెనారస్ విశ్వ విద్యాలయ ఉపాధ్యక్ష పదవి నిర్వహించాడు .అంతర్జేఅతీయం గా ఎన్నో విశిష్ట పదవులను రించాడు పండితుడు .1951 లో భారత తోలి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ తో బాటు తోలి ఉప రాష్ట్ర పాటి పదివిలో అలరాడాడు ఆతర్వాత రెండవ రాష్ట్రపతి గా  పరిపాలనను ఆదర్శ వంతం గా పని చేసి ప్లేటో చెప్పినట్లు దేశానికి రుషి పాలనా కావాలన్నదాన్ని రుజువు చేసి సర్వా సమర్దుడని పించుకొన్నాడు .అంతకు ముందు రష్యాలో రాయ బారిగా ఉండి  స్టాలిన్ మనసునే మార్చిన ఘనుడు రాధాకృష్ణ దేశికుడు .అనేక వేదాంత గ్రంధాలను తత్వ శాస్త్రా గ్రంధాలను రచించి ప్రపంచ ప్రసిద్ధి చెందాడు ఆచార్యుడు తన పుట్టిన రోజు సెప్టెంబర్ అయిదు ను వేడుక గా జరపటం కంటే ‘’ఉపాధ్యాయ దినోత్సవం ‘’గా నిర్వహించాలని సూచించాడు .అప్పటినుంచి అదే జరుగుతోంది .ప్రస్తాన త్రయం అనబడే బ్రాహ్మ సూత్రాలు ఉపనిషత్తులు భగవద్ గీత కు రాధాకృష్ణన్ చేసిన వ్యాఖ్యానం చరిత్రలో నిలిచి పోతుంది .’’క్రిష్ణార్పణ చారిటి ట్రస్ట్ ను ఏర్పరచి సేవ లందించాడు .’’ఫిలాసఫర్ ప్రెసిడెంట్ ‘’గా సుప్రసిద్ధుడు .ప్లేటో ‘’తత్వ వేత్త రాజ్యాదికారి కావాలి ‘’అన్నదాన్ని రుజువు చేశాడు .అన్తాకు ముందు జనక చక్ర వర్తి తో ఈయనను పోలుస్తారు .

 

 

 

 

 

 

 

                                                              బుజ్జాయి వేసిన చిత్రం పై రాధా కృష్ణ సంతకం                                                  

                                                         రాదా కృష్ణన్ భావనలో సమన్వయము చాలా ముఖ్యమైనది .ఈ విశ్వం యొక్క విచిత్ర రూపాన్ని ,దానిలో కనీ పించే ఏకత్వాన్ని జాగ్రత్త గా గమనించాలని కోరాడు .మానవ స్వభావం సద్భావమనుభావం తో  కూడిన విజ్ఞానం లో కూడా ఏకత్వాన్ని దర్శించ వచ్చు అంటాడు పండితుడు .ఆయన దర్శనం లో మూడు అంశాలు ప్రధానమైనవి .

      మొదటిది –‘’కేవలం ‘’గూర్చి సిద్ధాంతాలున్నాయి .పాశ్చాత్య వేదాంతాన్ని హెగెల్ ,బ్రాడ్లీ వంటి వారి ని ఆదర్శం గా తీసుకొన్నాడు ఈయన భావానాలు మిగిలిన వారి దాని కంటే విలక్షణ మైనది .’’కేవలం అని చెప్పిన రాదా కృష్ణ భావం శాంకారాద్వైతంలోనిదే

      రెండవది –ఈయన రచనలన్నీ ఆధునిక ప్రపంచ సమస్యల పరిష్కారానికే ఉప యోగించాడు .ఇదే భారతీయ వేదాంతానికి కొత్త రూపు నిచ్చాడు .ఇతర దేశాలలో ఉదార భావం వ్యాపించిన చోట్లలో రాదా కృష్ణ భావ వ్యాప్తి చొచ్చుకు పోయింది .

  మూడవది –ఆధునిక దర్శన శాస్త్ర చరిత్రలో మన పండితుని స్తానం అద్వితీయం గా నిలిచి పోయింది .మానవ నాగరకతకు సంస్కృతికి కొత్త సమన్వయం తీసుకొచ్చాడు .ప్రపంచ వైవిధ్యానికి ఏకత్వం సాధించిన ప్రజ్ఞాని .ప్రపంచ దేశాల మధ్య సంస్కృతుల మధ్య ఉన్న భిన్నాలను వదిలి ఏకత్వాన్ని సమకూర్చి న ఘనుడు ఈ మధ్యే మార్గం అంటే‘’తార్కిక వివేచనా జ్ఞానం యొక్క ఫాలితమే ‘’.

       ‘’ library of living philosophers ‘’అనే గ్రంధ శ్రేణి లో ఒకటి అయిన ఫ్రాగ్ మెంట్స్ఆఫ్  కన్ఫెషన్ ‘’లో గురువు యెంత గొప్ప వాడైనా తానూ దాన్ని అంగీకరించాను అన్నాడు స్వానుభవం నుండి వచ్చిన జ్ఞానమే మూల మైనది అని ఖచ్చితం గా చెప్పాడు .గతంఅనాగారక తకు ఆరంభం అని భావించి రెండిటిని పునర్జీవింప జేయాలి  ఇది ప్రాచీనులు చెప్పిన శుకుడు చెప్పిన బోధ కాదు .అప్రాచీన విజ్ఞానం లోని ఆత్మ వివేక సారాన్నిగ్రహించి మహా జ్ఞానాన్ని అంతా కొత్త పద్ధతిలో వివరించి సమస్యా పరిష్కారానికి  విని యోగ యోగ్యత నిరూపించాడు .

 

 

      

 

 

 

    జ్ఞాన ,మీమాంసా శాస్త్రాలలో అంతర జ్ఞానం యొక్క మూలం అయిన ‘’కేవల ‘’సిద్ధాంతాన్ని ముఖ్యం గా బోధించాడు .జ్ఞానం అనేది స్వతః ప్రమాణం .అది నిత్యుడు అయిన జ్ఞాతను తెలియ జేస్తుంది .ప్రపంచం మిధ్య కాని భ్రాంతి కాని కాదు .విజ్ఞానానికి ఉపయోగ పడే సంవేదనలన్ని ,వాటి మధ్య సంసర్గాలుగా మారాలి .ద్రవ్యం జీవం ,చైతాన్యం అనేవి కాల్పనిక నిర్మాణాలు .మానవ అనుభవానికి వరుస దశలు .ఇది కేవల జ్ఞాన వాడి చెప్పే మతం మాత్రం కాదు .

     ‘’ప్రపంచానికి వ్యావహారిక సత్తా ఉంది .వ్యావహారిక సత్తాకు భిన్నమైనవి .మానవ అనుభవం పరమ సత్యం కాదు .భ్రాంతి విలసితం కూడా కాదు . .ప్రపంచం సత్యం కాక పోయినా మనస్సు సృష్టించింది కాదు .సత్తా సర్వాస్వం ఆత్మయే .మన ఆలోచనా పరంపరా లో అనుభవం అయిన ఒక ఆవశ్యకత నిర పేక్ష సత్యం ప్రక్రుతి చైతన్య తో కూడినది .అను రూప మైన వశ్యం సద్బావం యొక్క అనుభూతి లేనిదే నిరుపాధిక సత్యం గా భావిన్చాక్ లేం .దీన్నే ‘’జీవితాన్ని గురించి హావ వాడ దృక్పధం ‘’అనే దానిలో వివరించాడు రాధాకృష్ణన్ .’’అయిడలిస్ట్ వ్యూ ఆఫ్ లైఫ్  లో వీటి విషయమై చర్చించాడు .మనతో సమాన మైన అనుభవం కల ఇతర మనస్సులు కలవు అన్నది అందరికి తెలిసిందే .ఈ సామాన్య ప్రతీకయే పరామాత్మ యొక్క అస్తిత్వైకి ప్రమాణం అన్నాడు .

   తన వాదాలను ఉపనిషత్తుల నాదారాం గా సమర్ధించాడు .అంతర్ జ్ఞానం అనగా ప్రత్యక్ష అనుభూతియే .ఇది అఖండాభనువమే .అంతర జ్ఞానానికి రుజువు దాన్ని మన మనసు నుండి బహిష్కరించ లేక పోవటమే అన్నాడు .

     నీతిశాస్త్ర విషయం లో కూడా రాదా కృష్ణన్ కు కొన్ని నిశ్చిత అభిప్రాయాలున్నాయి .కర్మ స్వేచ్చకు ప్రతి ద్వందికాదు .తన్ను తానూ ఉద్ధరించుకోవాలి అన్న కోరిక మానవుడికి సహజం .సన్యాసం కూడా సాధుత్వాన్ని సాధనం కాదు .స్మృతుల ననుసరించి ప్రవర్తించటం మంచిదే నన్నాడు .అవి శాంతికి ఉపయోగిస్తే మంచిదే అంటాడు .సంపూర్ణ జ్ఞానం ,నిరుపాధిక ప్రేమ ,పరి పూర్ణ స్వేచ్చ మధ్య సామరస్యాన్ని సాధించటమే మనవ జీవిత లక్ష్యం .ఇందులో ఏది లోపించినా సంపూర్ణం కాదు .’H indu   view of life ‘’లో వర్ణ వ్యవస్థ ను సమర్ధించాడు .మానవుడి గుణాలే అతని ఉత్క్రుస్టతకు కారణం .మానవ హక్కులు తగ్గించుకొని కర్తవ్యానికి ప్రాముఖ్యమివ్వాలని కోరాడు .ఇతరుల దృక్పధాన్ని కూడా అర్ధం చేసుకోవాలి .శీలం పీడనం లేక పోవటమే ప్రజాస్వామ్యానికి రక్ష అన్నాడు .ప్రజాస్వామ్యం సఫలం కావాలంటే ఆర్ధిక తార తమ్యాలుండా రాదు .ధర్మం తో ఉందని అభ్యుదయం ఇసుక ఇల్లు లాంటిదే .

     అంతర్జాతీయ రాజకీయ రంగం లో రాదా కృష్ణన్ బోధలు అత్యన్తావస్యకాలు అన్నారెందరో. ప్రతి నాగరికత అక్కడి మతం యొక్క అభి వ్యక్తియే .అంధ విశ్వాసాలు వదిలెయ్యాలి .ఆత్మ సంపత్తి లో మానవు లంతా సమానమే .మానవులు ఉన్నత గుణాలు పొంది ప్రవర్తనలో ఈశ్వర భావాన్ని నింపుకొని ప్రవర్తిస్తేనే శాంతి ఏర్పడుతుంది అని చెప్పాడు .ఏ సంప్రదాయాన్ని రాదా కృష్ణన్ అంగీకరించ లేదు .మనుష్యుల హృదయాలలో వెలుగు నింపి ,శ్రద్ధను ప్రోత్సహించి కృతకృత్యులు కావాలనిపండి తుని ఉపదేశ సారం1975ఏప్రిల్ 17 న 86 ఏళ్ళ నిండు వయసులో పరమ పాడించాడు మహా పండితుడు .

 

t is not God that is worshipped but the authority that claims to speak in His name. Sin becomes disobedience to authority not violation of integrity.

 

“Reading a book gives us the habit of solitary reflection and true enjoyment.”

 

“When we think we know we cease to learn.”

 

“A literary genius, it is said, resembles all, though no one resembles him.”

 

“There is nothing wonderful in my saying that Jainism was in existence long before the Vedas were composed.”

 

        అని ప్రవచించిన ఉత్తమ వేదాంత తత్వ దేశికుడు రాదా కృష్ణన్

 

 

 

         సశేషం

         మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-10-13- ఉయ్యూరు 

 
 
 
 
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

తెల్ల కాకి ,గోప్పూజ ,వేద సభలు -ఆంద్ర జ్యోతి 1710-13

tella kaki,gopuja ,veda sabhalu

Posted in సేకరణలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -39

 

L.N.Tolstoy Prokudin-Gorsky.jpg
                                                              ఇరవై  ఏళ్ళ వయసులో
 మరుగున  పడిన మతాలు –మతాచార్యులు -39

 

లియో టాల్ స్టాయ్

రష్యాలో బాగా సంపన్నమైన కుటుంబం లో లియో టాల్ స్టాయ్ 1828 లోసెప్టెంబర్ తొమ్మిది న  జన్మించాడు .పూర్తీ పేరు లెవ నికోలోవిచ్ కౌంట్  టాల్ స్టాయ్ .యస్నాయ పోల్యాన జన్మ స్తలం  యవ్వనం లో ఖుషీ పురుషుడిగా అన్నీ భోగాలు అనుభ వించాడు ఆ తర్వాతా ఇలాంటి జీవితం పై విరక్తి కలిగింది .ప్రేమ ,కరుణ ప్రధానం గా ఉన్న తత్వ శాస్త్రాన్ని రూపొందించాడు

.యుద్ధం మీద ప్రతి ఒక్కరికి ద్వేషం కలిగే టట్ట్లు ‘’యుద్ధము –శాంతి ‘’అనే గొప్ప నవల1865-69 మధ్య  రాశాడు రష్యా పై నెపోలియన్ దండ యాత్రకు వ్యతిరేకం గా అయిదు కుటుంబాల కదా ను ఇందులో రాశాడు స్వతంత్ర బుద్ధి అన్దరికిఉన్దాలని చెప్పాడు నెపోలియన్ లాంటి గర్విస్తులు తమను తాము తెలుసుకోలేక విర్ర వీగారాని రాశాడు అది ఆయన ‘’మాగ్నం ఓపస్ ‘’అని ఇంచుకోంది.రష్యా సాహిత్య చరిత్రలో అదొక మెయిలు రాయిగా ఆధునిక రష్యా ఇతిహాసం (ఎపిక్) గా సుస్తిర స్తానం పొందింది ఆయనకు విశేష మైన కీర్తి ప్రతిష్టలు తెచ్చింది ప్రపంచ దేశాలలో టాల్ స్టాయ్ పేరు మారు మోగింది .ప్రపంచ ప్రసిద్ధ నవలా రచయిత అయ్యాడు

                                                                                               గాంధి తో టాల్ స్టాయ్

.ఆయన రాసిన అన్నా కేరీనా నవల ఫ్లాబర్ట్ రాసిన ‘’మేడం బోవరి ‘’కి ,ఫాన్తెన్ రాసిన ‘’ఇఫీ బ్రీస్ట్ ‘’నవలకు సరి సమానం .ఇందులో వివాహిత అయిన ఒక స్త్రీ విషాద ఆద చిత్రించాడు ఈ నవల చాలా సార్లు హాలీ వుడ్ సినిమా గా తీశారు .అన్నా కేరీన లో తానూ చెప్పాల్సింది అంటా చెప్పెశానని ఇంకా రాయటానికి ఏమీ మిగలలేదని టాల్ స్టాయ్ చెప్పుకొన్నాడు ఈ నవలలో అసాంఘిక అవి నీతి ని బోధించాడని ఆయనపై ఆరోపణ వచ్చింది ఆయన రాసిన ‘’కన్ఫెషన్ అండ్ వాత ఐ బెలీవ్ ‘’రచనను ప్రభుత్వం నిషేస్ధించింది జీవితం లో సత్యానికి యెంత అవసరం ఉందొ రచనలో లేక కళలలో కూడా సత్యానికి అంతే ప్రాధాన్యత ఉండాన్నాడు టాల్స్టాయ్ గాంధీ గారికి టాల్ స్టాయ్ గురువు ..షేక్స్ పియర్ ,డాంటే ,బీతొవెన్ లు అంటే ఎవగించుకొన్నాడు లియో .కదా నవలాలలో క్లైమాక్స్ అంటే ఇష్టం లేని వాడాయన .ప్రతిదీ సంపూర్ణం గా రాయటమే ధ్యేయం ఆయన క్రిస్టియన్ భావం లో ‘’సేర్మాన్ ఆన్ ది.మౌంట్ ‘’కు ప్రాధాన్యత ఎక్కువ .తనకు నచ్చిన వాటిని విడిగా రాసుకొన్నాడు దీనికి ‘’టాల్ స్టాయ్ బైబిల్’’ అని పేరుఇది బాగా ప్రాచుర్యం పొందింది . పీటర్ ది గ్రేట్ ఈయనకు ‘’కౌంట్ ‘’బిరుదునిచ్చాడుబాక్సర్ విప్ల వాణ్ని సమర్ధించాడు కరువు బాధితులకు సహాయం చేశాడు

 

కరువు సహాయ కార్యక్రమం                                            టాల్ స్టాయ్ సమాధి 

1908 లో ‘’ a letter to a HIindu ‘’అని భారత స్వాతంత్ర్యాన్ని బ్రిటిష్ పాలకుల నుండి తెచ్చుకోవటానికి అహింసా మార్గమే శరణ్యం అని రాశాడు దక్షిణాఫ్రికా లో గాంధీ పని చేస్తున్నప్పుడు ఆయనకు ఇది దొరికి చదివి స్పూర్తి పొందాడు వారిద్దరి మధ్య ఉత్తర ప్రత్యుత్త రాలు జరిగాయి గాన్స్దీ గారి అనుమానాలన్నీ టాల్ స్టాయ్ తీర్చి కార్యోన్ముఖుడిని చేశాడు .గురు దక్షిణ గా దక్షిణాఫ్రికాలో రెండవ ఆశ్రమం గా ‘’టాల్ స్టాయ్ ఫారం ‘’ను గాంధీ ఏర్పాటు చేశాడు .టాల్ స్టాయ్ ‘’ఎస్పరాన్టో ఉద్యమం ‘’ను పూర్తిగా సమర్ధించాడు .

కజాన్ యూని వర్సిటి లో న్యాయ ,భాషా శాస్త్రాలు చదివాడు .ఆ నాటి విద్యా స్తాయి నచ్చక డిగ్రీ పొందలేదు .ఎక్కువ కాలం మాస్కో ,పీటర్స్ బర్గ్ లో గడిపాడు .సుఖ వ్యాధులు అంటించుకొని ,జూదం అది అంతా పోగొట్టుకొన్నాడు .1850 నుంచి రచనా వ్యాసంగం మొదలు పెట్టాడు .సైన్యం లో చేరి పని చేశాడు ’’చైల్డ్ హుడ్ ,బాయ్ హుడ్, యూత్ అనే ట్రయాలజి  గా తన జీవిత చరిత్ర రాసుకొన్నాడు మొదట్లో రాసిన ‘’రైడ్ ‘’అనే కధలో మిలిటరీ చేచన్ పర్వతాలలో ఉన్న త్రైబల్స్ పై చేసిన దాడిని ప్రతిఘటిస్తాడు .క్రీమియన్ వార్ లో సైనిక భాగానికి సారధ్యం వహించి ‘’సేబస్తో పోల్ ‘’స్వాధీనం చేసుకొన్నాడు .రోజు డైరీ రాస్తూ తనలోని భావాలను పొందు పరచే వాడు .గోతే స్తేన్దాల్ థాకరే రచనలను కరతలా మలకం చేసుకొన్నాడు .డికెన్స్ రూసో రచనలను ఆకళింపు చేసుకొన్నాడు .

సిద్ధర్దుడికి జ్ఞానోదయం అయి నట్లు టాల్ స్టాయ్ కి కూడా జ్ఞాన నేత్రం విచ్చు కొంది.జీవిత లక్ష్యం పై జిజ్ఞాస పెరిగింది మరణమా ?అంతమా /అనే ప్రశ్న వేధించింది .మరణ భయాన్ని పోగొట్టుకోవటానికి మార్గాలేమిటి అనే దాని పై చింతన చేశాడు .దీని పై నిరంతరం ఆలోచిస్తూ దేశ ,విదేశాలు తిరిగి మనస్సుకు సమాధానం చెప్పుకొన్నాడు .ఏఎ అనంత పయనం లో ఆటను నాలుగు సూత్రాలను రూపొందించాడు .1-కోపాన్ని చంపుకోవాలి .2-కాముకత్వం రూపు మాపు కోవాలి .3-ఏ విషయాన్ని గురించి ఎవరికి మాట ఇవ్వ కూడదు .4-అపకారికి కూడా ఉపకారం చేయాలి .ఈ నాలుగు సూత్రాలను సమన్వయము చేస్తూ ‘’చతుర్దర్శన సమన్వయ దీపిక ‘’అనే ఉద్గ్రంధం రాశాడు

1917 లో రష్యాలో లెనిన్ నాయకత్వం లో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడింది .ప్రతి కాలేజి విద్యార్ధి  తత్వశాస్త్రాన్ని ఒక ఏడాది తప్పకుండా చదవాలనే నియమం వచ్చింది . హైస్కూల్ లెవెల్ లో తర్కం ,సామాజిక శాస్త్ర బోధన అమల్లోకి వచ్చింది .

ఈ విశ్వం అనంతం అని ,దీనికి ఆది కాని అంతం కాని లేవని టాల్ స్టాయ్ చెప్పాడు .విశ్వం సర్వ సమగ్రం అన్నాడు .కనుక దీన్ని మించినదేడీ ఎక్కడా లేదు అని స్పష్టం చేశాడు .కనుక ‘’అజ్నేయం ‘’అనేది విశ్వం లో లేనే లేదుఅజ్ఞాతం మాత్రం ఉంది అన్నాడు .’’విశ్వ రహస్యాన్ని ఆవిష్కా రించే సూత్రాలు గతి తార్కిక భౌతిక వాదసూత్రాలు మాత్రమె ‘’ అని ఖచ్చితం గా చెప్పాడు .ఇవే అందరికి మార్గ దర్శకాలు అని తేల్చి చెప్పాడు .ఇదంతా ఆ నాటి రష్యా లో ఉన్న తాత్విక ధోరణికి మూల లక్శనాలాఐన విషయాలే .1910 లో నవంబర్ఇరవై న  82 ఏళ్ళ వయసులో టాల్ స్టాయ్ ఇహ లోక యాత్ర చాలించాడు

సశేషం –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-10-13- ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నెత్తురోడిన గాంధీ

నెత్తురోడిన గాంధీ

మహాత్మాగాంధీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన సంఘటనలేమిటి? ఆయనను ప్రభావితం చేసిన వ్యక్తులెవ్వరు?- ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ రాసిన ‘గాంధీ బిఫోర్ ఇండియా’ పుస్తకంలో మనకు లభ్యమవుతాయి. గాంధీ జీవితంలోని కొత్త కోణాలను ఆవిష్కరించిన ఈ పుస్తకంలోని కొన్ని ఆసక్తికరమైన భాగాలు..

“డర్బన్ సహజసిద్ధమైన నౌకాశ్రయం. అయితే అన్ని నౌకలను డర్బన్ నౌకాశ్రయంలోనికి రానిచ్చేవారు కారు. అంతే కాకుండా తెల్లవారికి మాత్రమే ఈ నౌకాశ్రయంలోకి ప్రవేశముండేది. భారతీయులను, నల్లవారిని ఈ నౌకాశ్రయంలో దిగనిచ్చేవారు కాదు. దీనిపై దక్షిణాఫ్రికాలో ఉన్న భారతీయులు తమ అభ్యంతరాలను వ్యక్తం చేయటం మొదలుపెట్టారు. దాంతో 1897, జనవరి 12వ తేదీన దక్షిణాఫ్రికా అధికారులు భారత్ నుంచి వచ్చే నౌకలను కూడా డర్బన్ నౌకాశ్రయంలోకి అనుమతిస్తామని.. భారతీయులు నౌకాశ్రయంలో దిగవచ్చని ప్రకటించారు. ఈ ప్రకటన పట్ల దక్షిణాఫ్రికాలో ఉన్న తెల్లజాతివారు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. 13వ తేదీన దాదాపు ఐదు వేల మంది తెల్లజాతీయులు, 500 మంది నల్లజాతీయులు- భారతీయులకు అనుమతి ఇవ్వటానికి వ్యతిరేకంగా డర్బన్‌లో ఒక పెద్ద ప్రదర్శన జరిపారు. భారతీయులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, కర్రలు తిప్పుతూ డర్బన్‌లో ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించారు.

ఈ ప్రదర్శనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే నేటల్ (దక్షిణాఫ్రికాలో ఒక రాష్ట్రం) అటార్నీ జనరల్ హారీ ఎస్కోంబ్ ప్రదర్శనకారుల దగ్గరకు వచ్చాడు. “భారత్ నుంచి వచ్చిన రెండు నౌకలలో అమాయకులైన ప్రజలు ఉన్నారు. నేటల్‌లో ఉన్న పరిస్థితివారికి తెలియదు. అలాంటి వారిపై ఆగ్రహం ప్రదర్శించటం సరికాదు. నేటల్ ఎప్పటికీ తెల్లవారిదే. వీలైనంత త్వరగా పార్లమెంట్‌ను సమావేశపరిచి ఈ మేరకు తగిన చట్టాలను చేస్తాం..” అంటూ ప్రదర్శనకారుల ఆగ్రహాన్ని చల్లార్చటానికి ప్రయత్నించాడు. ఎస్కోంబ్ ప్రయత్నం చాలా వరకూ ఫలించింది. ఆందోళనకారుల ఆవేశం తగ్గింది. వారు వెనక్కి తిరిగి వెళ్లిపోవటం మొదలుపెట్టారు..

13వ తేదీన భారత్ నుంచి ‘నదేరి’, ‘కోర్‌ల్యాండ్’ అనే రెండు నౌకలు డర్బన్‌కు వచ్చాయి. నదేరిలో గాంధీ, ఆయన కుటుంబం కూడా ఉంది. గాంధీ వస్తున్నారని తెలిసి ఆయన స్నేహితుడు, సహ న్యాయవాది లాఫ్‌టన్ నౌక దగ్గరకు వచ్చాడు. బయట ఉన్న ఉద్రిక్త పరిస్థితులను వివరించాడు. దీనితో గాంధీ తన కుటుంబ సభ్యులను ముందుగా తీరానికి పంపేశాడు. తాను నౌకలోనే ఉండిపోయాడు. ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని..చీకటి పడేదాకా డర్బన్‌కు రావద్దని, గాంధీకి అటార్నీ జనరల్ ఎస్కోంబ్ కబురు పంపాడు. అయితే లాఫ్‌టన్‌కు ఈ సలహా నచ్చలేదు. దొంగతనంగా గాంధీ డర్బన్‌కు రావటం లాఫ్‌టన్‌కు ఇష్టం లేదు. పైగా ప్రదర్శనకారులు చెల్లాచెదురయిపోయారని.. అటువంటప్పుడు గాంధీ బయటకు వచ్చినా ప్రమాదం ఉండదని ఆయన అభిప్రాయపడ్డాడు. దీనితో వారిద్దరూ డర్బన్‌కు బయలుదేరారు.

 

గాంధీ, లాఫ్‌టన్‌ల బోటు మధ్యాహ్నం డర్బన్ పోర్టుకు చేరుకుంది. బోటు తీరానికి చేరుకోగానే అక్కడే తిరుగుతున్న కొందరు తెల్లజాతీయులు గాంధీని చూశారు. గాంధీ వచ్చాడని గట్టిగా కేకలు వేయటం మొదలుపెట్టారు. దీనితో ప్రదర్శనకారులు మళ్లీ డర్బన్ పోర్టు దగ్గరకు చేరుకున్నారు. గాంధీ, లాఫ్‌టన్‌లు ఒక రిక్షాను పిలిచి దానిలోకి ఎక్కబోయే సమయానికి, ప్రదర్శనకారులు వారిని అడ్డుకున్నారు. ఆ రిక్షాను వదిలేసి మరొక రిక్షా ఎక్కబోయారు. దానిని కూడా అడ్డుకోవటంతో- తప్పనిసరి పరిస్థితుల్లో గాంధీ, లాఫ్‌టన్‌లు తమ వద్ద ఉన్న లగేజీని పట్టుకొని నడవటం మొదలుపెట్టారు. వారిని ప్రదర్శనకారులు వెంబడించటం మొదలుపెట్టారు. వారు షిప్ హోటల్ దగ్గరకు చేరుకొనేసరికి- వందల మంది ప్రదర్శనకారులు వారిని చుట్టుముట్టారు. కొందరు గాంధీ మీద కుళ్లిపోయిన చేపలు విసిరితే, మరికొందరు పిడిగుద్దులు కురిపించారు. ఒక వ్యక్తి తన చేతిలో ఉన్న కొరడాతో గాంధీని గట్టిగా కొట్టాడు. అయినా గాంధీ పారిపోలేదు. పత్రికల్లో ప్రచురితమైన ప్రత్యక్ష సాక్షుల కథనాల ప్రకారం- గాంధీ రక్తం ఓడుతూ అక్కడే నిలబడ్డాడు. గాంధీ మీద దాడి జరుగుతోందనే విషయాన్ని కొందరు భారతీయులు పోలీసు సూపరింటెండెంట్ ఆర్. సి. అలెగ్జాండర్ సతీమణి జేన్‌కు తెలియజేశారు. వెంటనే జేన్ కొందరు పోలీసులతో ఆ ప్రాంతానికి చేరుకుంది. పోలీసులు ప్రదర్శనకారులను చెదరగొట్టి గాంధీని ఫీల్డ్‌స్ట్రీట్‌లో ఉన్న పార్శీ రుస్తుంజీ స్టోర్‌కు తీసుకువెళ్లారు.

ఈ విషయం తెలిసి అలెగ్జాండర్ పోలీసు బలగాలతో రుస్తుంజీ స్టోర్‌కు చేరుకున్నాడు. ఇంతలో నౌకాశ్రయం దగ్గర జరిగిన సంఘటన తెలుసుకున్న మరికొందరు- ఈ స్టోర్ దగ్గరకు కూడా వచ్చి గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేయటం మొదలుపెట్టారు. “గాంధీని యాపిల్ చెట్టుకు ఉరితీస్తాం” అని పాటలు పాడటం మొదలుపెట్టారు. పరిస్థితి చేయి దాటిపోతోందని అలెగ్జాండర్ గమనించారు. స్టోర్ లోపలికి వెళ్లి గాంధీని ప్యూన్ బట్టలు వేసుకొమ్మన్నాడు. మొహాన్ని మఫ్లర్‌తో కప్పేసాడు. కళ్ల చుట్టూ నల్లరంగు పూసి- స్టోర్ పక్కనే ఉన్న గోడౌన్ నుంచి బయటికి పంపేశాడు. గాంధీని పంపేసిన తర్వాత అలెగ్జాండర్ బయటకు వచ్చి గాంధీ స్టోర్‌లో లేడని ప్రకటించాడు. కావాలంటే ఒక బృందం వచ్చి గాంధీ ఉన్నాడా లేడా అనే విషయాన్ని నిర్ధారించుకోవచ్చన్నాడు. దీనితో ప్రదర్శనకారుల నుంచి ముగ్గురు ముందుకు వచ్చి స్టోర్‌లోపలికి వెళ్లి గాంధీ లేడని నిర్ధారించుకున్నారు. ఈ లోపులో వాన పడటం మొదలయింది. ఒక వైపు చీకటిలో ఏమీ కనబడకపోవటం, మరో వైపు వాన పడటంతో ప్రదర్శనకారులు చెల్లాచెదురయిపోయారు..

ఈ సంఘటన జరిగిన వారం రోజుల తర్వాత తన ప్రాణాలను కాపాడిన అలెగ్జాండర్ దంపతులకు కృతజ్ఞతలు చెబుతూ గాంధీ ఒక లేఖ రాశాడు. ఒక బహుమతి కూడా పంపాడు. దానికి అలెగ్జాండర్ దంపతులు- “మా దేశవాసులు మీపై చేసిన దాడికి సిగ్గుపడుతున్నాం. మీరు పంపిన బహుమతిని తిప్పి పంపాలనుకున్నాం. కాని బహుమతిని తిప్పిపంపటం మిమ్మల్ని మరింతగా అవమానించినట్లు అవుతుందని భావించాం..నా వద్ద ఎక్కువ మంది సిబ్బంది లేరు. అందువల్ల మిమ్మల్ని మారువేషంలో బయటకు పంపాల్సి వచ్చింది. ఇది మీ హోదాకు తగిన విషయం కాదని మాకు తెలుసు..” అని సమాధానమిచ్చారు….

ఈ సంఘటన జరగటానికి మూడేళ్ల క్రితం పీటర్‌మార్టిజ్‌బర్గ్ రైల్వే స్టేషన్‌లో గాంధీని ఫస్ట్‌క్లాస్ కంపార్ట్‌మెంట్ నుంచి గార్డు బయటకు తోసేశాడు. గాంధీ దక్షిణాఫ్రికా అనుభవం అనగానే చాలా మందికి ఈ సంఘటనే గుర్తుకు వస్తుంది. ఈ సంఘటనను 1951లో లూయిస్ ఫిషర్ రాసిన “ది లైఫ్ ఆఫ్ మహాత్మా గాంధీ” అనే పుస్తకంలో అద్భుతంగా వర్ణించాడు. ఆ తర్వాత రిచర్డ్ అటెన్‌బరో- గాంధీ సినిమాలో దీనిని అత్యంత ప్రధానమైన సంఘటనగా చూపించాడు. ఈ చిత్రం 1948లో గాంధీ హత్యతో ప్రారంభమవుతుంది. వెంటనే 1893లో గాంధీని రైలు నుంచి బయటకు నెట్టేసే సంఘటనకు వెళ్తుంది. దక్షిణాఫ్రికాలో ఆయనకు జరిగిన చేదుఅనుభవాలలో అది మొదటిదైనప్పటికీ ఆయన జీవితంలో డర్బన్ సంఘటన అంతకంటే ముఖ్యమైనదని చెప్పాలి. రైలు నుంచి గాంధీని నెట్టివేసినప్పుడు- ఆయనకు దెబ్బలు తగలలేదు. తన ప్రయాణాన్ని కొనసాగించాడు. కానీ డర్బన్ సంఘటనలో మాత్రం గాంధీ తెల్లవారి జాత్యహంకారం ఎలా ఉంటుందో రుచి చూశాడు. దక్షిణాఫ్రికాలో జాత్యంహంకార రాజకీయాలు ఎలా ఉంటాయో గాంధీకి ప్రత్యక్షంగా తెలిసింది అప్పుడే.

– See more at: http://ec2-54-200-67-22.us-west-2.compute.amazonaws.com/node/11265#sthas…

మహాత్మాగాంధీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన సంఘటనలేమిటి? ఆయనను ప్రభావితం చేసిన వ్యక్తులెవ్వరు?- ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ రాసిన ‘గాంధీ బిఫోర్ ఇండియా’ పుస్తకంలో మనకు లభ్యమవుతాయి. గాంధీ జీవితంలోని కొత్త కోణాలను ఆవిష్కరించిన ఈ పుస్తకంలోని కొన్ని ఆసక్తికరమైన భాగాలు..

“డర్బన్ సహజసిద్ధమైన నౌకాశ్రయం. అయితే అన్ని నౌకలను డర్బన్ నౌకాశ్రయంలోనికి రానిచ్చేవారు కారు. అంతే కాకుండా తెల్లవారికి మాత్రమే ఈ నౌకాశ్రయంలోకి ప్రవేశముండేది. భారతీయులను, నల్లవారిని ఈ నౌకాశ్రయంలో దిగనిచ్చేవారు కాదు. దీనిపై దక్షిణాఫ్రికాలో ఉన్న భారతీయులు తమ అభ్యంతరాలను వ్యక్తం చేయటం మొదలుపెట్టారు. దాంతో 1897, జనవరి 12వ తేదీన దక్షిణాఫ్రికా అధికారులు భారత్ నుంచి వచ్చే నౌకలను కూడా డర్బన్ నౌకాశ్రయంలోకి అనుమతిస్తామని.. భారతీయులు నౌకాశ్రయంలో దిగవచ్చని ప్రకటించారు. ఈ ప్రకటన పట్ల దక్షిణాఫ్రికాలో ఉన్న తెల్లజాతివారు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. 13వ తేదీన దాదాపు ఐదు వేల మంది తెల్లజాతీయులు, 500 మంది నల్లజాతీయులు- భారతీయులకు అనుమతి ఇవ్వటానికి వ్యతిరేకంగా డర్బన్‌లో ఒక పెద్ద ప్రదర్శన జరిపారు. భారతీయులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, కర్రలు తిప్పుతూ డర్బన్‌లో ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించారు. ఈ ప్రదర్శనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే నేటల్ (దక్షిణాఫ్రికాలో ఒక రాష్ట్రం) అటార్నీ జనరల్ హారీ ఎస్కోంబ్ ప్రదర్శనకారుల దగ్గరకు వచ్చాడు. “భారత్ నుంచి వచ్చిన రెండు నౌకలలో అమాయకులైన ప్రజలు ఉన్నారు. నేటల్‌లో ఉన్న పరిస్థితివారికి తెలియదు. అలాంటి వారిపై ఆగ్రహం ప్రదర్శించటం సరికాదు. నేటల్ ఎప్పటికీ తెల్లవారిదే. వీలైనంత త్వరగా పార్లమెంట్‌ను సమావేశపరిచి ఈ మేరకు తగిన చట్టాలను చేస్తాం..” అంటూ ప్రదర్శనకారుల ఆగ్రహాన్ని చల్లార్చటానికి ప్రయత్నించాడు. ఎస్కోంబ్ ప్రయత్నం చాలా వరకూ ఫలించింది. ఆందోళనకారుల ఆవేశం తగ్గింది. వారు వెనక్కి తిరిగి వెళ్లిపోవటం మొదలుపెట్టారు..

13వ తేదీన భారత్ నుంచి ‘నదేరి’, ‘కోర్‌ల్యాండ్’ అనే రెండు నౌకలు డర్బన్‌కు వచ్చాయి. నదేరిలో గాంధీ, ఆయన కుటుంబం కూడా ఉంది. గాంధీ వస్తున్నారని తెలిసి ఆయన స్నేహితుడు, సహ న్యాయవాది లాఫ్‌టన్ నౌక దగ్గరకు వచ్చాడు. బయట ఉన్న ఉద్రిక్త పరిస్థితులను వివరించాడు. దీనితో గాంధీ తన కుటుంబ సభ్యులను ముందుగా తీరానికి పంపేశాడు. తాను నౌకలోనే ఉండిపోయాడు. ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని..చీకటి పడేదాకా డర్బన్‌కు రావద్దని, గాంధీకి అటార్నీ జనరల్ ఎస్కోంబ్ కబురు పంపాడు. అయితే లాఫ్‌టన్‌కు ఈ సలహా నచ్చలేదు. దొంగతనంగా గాంధీ డర్బన్‌కు రావటం లాఫ్‌టన్‌కు ఇష్టం లేదు. పైగా ప్రదర్శనకారులు చెల్లాచెదురయిపోయారని.. అటువంటప్పుడు గాంధీ బయటకు వచ్చినా ప్రమాదం ఉండదని ఆయన అభిప్రాయపడ్డాడు. దీనితో వారిద్దరూ డర్బన్‌కు బయలుదేరారు.

గాంధీ, లాఫ్‌టన్‌ల బోటు మధ్యాహ్నం డర్బన్ పోర్టుకు చేరుకుంది. బోటు తీరానికి చేరుకోగానే అక్కడే తిరుగుతున్న కొందరు తెల్లజాతీయులు గాంధీని చూశారు. గాంధీ వచ్చాడని గట్టిగా కేకలు వేయటం మొదలుపెట్టారు. దీనితో ప్రదర్శనకారులు మళ్లీ డర్బన్ పోర్టు దగ్గరకు చేరుకున్నారు. గాంధీ, లాఫ్‌టన్‌లు ఒక రిక్షాను పిలిచి దానిలోకి ఎక్కబోయే సమయానికి, ప్రదర్శనకారులు వారిని అడ్డుకున్నారు. ఆ రిక్షాను వదిలేసి మరొక రిక్షా ఎక్కబోయారు. దానిని కూడా అడ్డుకోవటంతో- తప్పనిసరి పరిస్థితుల్లో గాంధీ, లాఫ్‌టన్‌లు తమ వద్ద ఉన్న లగేజీని పట్టుకొని నడవటం మొదలుపెట్టారు. వారిని ప్రదర్శనకారులు వెంబడించటం మొదలుపెట్టారు. వారు షిప్ హోటల్ దగ్గరకు చేరుకొనేసరికి- వందల మంది ప్రదర్శనకారులు వారిని చుట్టుముట్టారు. కొందరు గాంధీ మీద కుళ్లిపోయిన చేపలు విసిరితే, మరికొందరు పిడిగుద్దులు కురిపించారు. ఒక వ్యక్తి తన చేతిలో ఉన్న కొరడాతో గాంధీని గట్టిగా కొట్టాడు. అయినా గాంధీ పారిపోలేదు. పత్రికల్లో ప్రచురితమైన ప్రత్యక్ష సాక్షుల కథనాల ప్రకారం- గాంధీ రక్తం ఓడుతూ అక్కడే నిలబడ్డాడు.

గాంధీ మీద దాడి జరుగుతోందనే విషయాన్ని కొందరు భారతీయులు పోలీసు సూపరింటెండెంట్ ఆర్. సి. అలెగ్జాండర్ సతీమణి జేన్‌కు తెలియజేశారు. వెంటనే జేన్ కొందరు పోలీసులతో ఆ ప్రాంతానికి చేరుకుంది. పోలీసులు ప్రదర్శనకారులను చెదరగొట్టి గాంధీని ఫీల్డ్‌స్ట్రీట్‌లో ఉన్న పార్శీ రుస్తుంజీ స్టోర్‌కు తీసుకువెళ్లారు. ఈ విషయం తెలిసి అలెగ్జాండర్ పోలీసు బలగాలతో రుస్తుంజీ స్టోర్‌కు చేరుకున్నాడు. ఇంతలో నౌకాశ్రయం దగ్గర జరిగిన సంఘటన తెలుసుకున్న మరికొందరు- ఈ స్టోర్ దగ్గరకు కూడా వచ్చి గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేయటం మొదలుపెట్టారు. “గాంధీని యాపిల్ చెట్టుకు ఉరితీస్తాం” అని పాటలు పాడటం మొదలుపెట్టారు. పరిస్థితి చేయి దాటిపోతోందని అలెగ్జాండర్ గమనించారు. స్టోర్ లోపలికి వెళ్లి గాంధీని ప్యూన్ బట్టలు వేసుకొమ్మన్నాడు. మొహాన్ని మఫ్లర్‌తో కప్పేసాడు. కళ్ల చుట్టూ నల్లరంగు పూసి- స్టోర్ పక్కనే ఉన్న గోడౌన్ నుంచి బయటికి పంపేశాడు. గాంధీని పంపేసిన తర్వాత అలెగ్జాండర్ బయటకు వచ్చి గాంధీ స్టోర్‌లో లేడని ప్రకటించాడు. కావాలంటే ఒక బృందం వచ్చి గాంధీ ఉన్నాడా లేడా అనే విషయాన్ని నిర్ధారించుకోవచ్చన్నాడు. దీనితో ప్రదర్శనకారుల నుంచి ముగ్గురు ముందుకు వచ్చి స్టోర్‌లోపలికి వెళ్లి గాంధీ లేడని నిర్ధారించుకున్నారు. ఈ లోపులో వాన పడటం మొదలయింది. ఒక వైపు చీకటిలో ఏమీ కనబడకపోవటం, మరో వైపు వాన పడటంతో ప్రదర్శనకారులు చెల్లాచెదురయిపోయారు..

ఈ సంఘటన జరిగిన వారం రోజుల తర్వాత తన ప్రాణాలను కాపాడిన అలెగ్జాండర్ దంపతులకు కృతజ్ఞతలు చెబుతూ గాంధీ ఒక లేఖ రాశాడు. ఒక బహుమతి కూడా పంపాడు. దానికి అలెగ్జాండర్ దంపతులు- “మా దేశవాసులు మీపై చేసిన దాడికి సిగ్గుపడుతున్నాం. మీరు పంపిన బహుమతిని తిప్పి పంపాలనుకున్నాం. కాని బహుమతిని తిప్పిపంపటం మిమ్మల్ని మరింతగా అవమానించినట్లు అవుతుందని భావించాం..నా వద్ద ఎక్కువ మంది సిబ్బంది లేరు. అందువల్ల మిమ్మల్ని మారువేషంలో బయటకు పంపాల్సి వచ్చింది. ఇది మీ హోదాకు తగిన విషయం కాదని మాకు తెలుసు..” అని సమాధానమిచ్చారు….

ఈ సంఘటన జరగటానికి మూడేళ్ల క్రితం పీటర్‌మార్టిజ్‌బర్గ్ రైల్వే స్టేషన్‌లో గాంధీని ఫస్ట్‌క్లాస్ కంపార్ట్‌మెంట్ నుంచి గార్డు బయటకు తోసేశాడు. గాంధీ దక్షిణాఫ్రికా అనుభవం అనగానే చాలా మందికి ఈ సంఘటనే గుర్తుకు వస్తుంది. ఈ సంఘటనను 1951లో లూయిస్ ఫిషర్ రాసిన “ది లైఫ్ ఆఫ్ మహాత్మా గాంధీ” అనే పుస్తకంలో అద్భుతంగా వర్ణించాడు. ఆ తర్వాత రిచర్డ్ అటెన్‌బరో- గాంధీ సినిమాలో దీనిని అత్యంత ప్రధానమైన సంఘటనగా చూపించాడు. ఈ చిత్రం 1948లో గాంధీ హత్యతో ప్రారంభమవుతుంది. వెంటనే 1893లో గాంధీని రైలు నుంచి బయటకు నెట్టేసే సంఘటనకు వెళ్తుంది. దక్షిణాఫ్రికాలో ఆయనకు జరిగిన చేదుఅనుభవాలలో అది మొదటిదైనప్పటికీ ఆయన జీవితంలో డర్బన్ సంఘటన అంతకంటే ముఖ్యమైనదని చెప్పాలి. రైలు నుంచి గాంధీని నెట్టివేసినప్పుడు- ఆయనకు దెబ్బలు తగలలేదు. తన ప్రయాణాన్ని కొనసాగించాడు. కానీ డర్బన్ సంఘటనలో మాత్రం గాంధీ తెల్లవారి జాత్యహంకారం ఎలా ఉంటుందో రుచి చూశాడు. దక్షిణాఫ్రికాలో జాత్యంహంకార రాజకీయాలు ఎలా ఉంటాయో గాంధీకి ప్రత్యక్షంగా తెలిసింది అప్పుడే.

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -38

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -38

డేకార్టేస్

‘’ఆధునిక దార్శనిక పిత ‘’అని పించుకొన్న రీనె డేకార్టేస్  1596 మార్చ్ 31న ఫ్రాన్స్ దేశం లో  జన్మించాడు ప్లేటో తర్వాత మళ్ళీ కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపా పదించి ప్రసిద్ధి కెక్కిన వాడు డేకార్డ్ .శ్రీ మంతుల ఇంటిలో పుట్టి ఉత్తమ విద్యా వ్యాసంగాన్ని సాధించాడు దర్శన శాస్త్రం మీదనే మొదటి నుంచి మోజు ఏర్పడింది .లాఫ్లేచ్ జేజూయిట్ కళా శాలలో విద్య నేర్చి గణితం లో ప్రావీణ్యాన్ని పొందాడు ..నిరంతర చింతనా పరుడు .సైన్యం లో చేరి పని చేశాడు. దీనితో ప్రపంచాను భవం కలిగింది .చాలా దేశాలు తిరిగాడు .అనేక కలలు వచ్చేవి .మనసు వ్యాకులం గా ఉండేది .అప్పుడు స్వాధీన మనస్కత తో తన కలలన్ని తన దర్శన శాస్త్రానుభవమే నని ,కలల్లో పొందిన ఉపదేశాలన్ని అమోఘాలని నిశ్చయించుకొన్నాడు .

 

Frans Hals - Portret van René Descartes.jpg

Firma Descartes.svg

సహజం గా డేకార్డ్ పిరికి వాడు .పుణ్య స్వభావం ఉన్న వాడు .గెలీలియో భూ చలన సిద్ధాంతాన్ని సమర్ధించాడు .తాను  రాసిన గ్రంధాలను ప్రచురించాడు .స్వీడెన్ రాణి క్రిస్టీన్ ఆహ్వానం పై హాలండ్ వెళ్ళాడు .తెల్ల వారు ఝామున అయిదు గంటలకు తనకు రోజు దర్శన శాస్త్రాన్ని బోధించమని కోరింది అలానే చేశాడు .చలి బాధకు తట్టుకోలేక పోయాడు .ఊపిరి తిత్తులు చెడి పోయాయి .1650 లోఫిబ్రవరి న  యాభై నాలుగేళ్ళకే డేకార్డ్ అకాల మరణం  పొందాడు  వాడు  రోమన్ కేధలిక్ మతం వాడు ఆయన రాసిన ఫస్ట్ ఫి లాసఫీ పుస్తకం ఎన్నో యూని వర్సిటీలలో బోధనా  గ్రంధం గా ఉంది

 

క్రిస్తినీ  రాణి తో ఫోటో                                               సమాధి

డేకార్డ్ దర్శన శాస్త్ర్సం లో జ్ఞానానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది .సమ్యక్ నిర్ణయ సామర్ధ్యం ,భ్రమ ,వివేకం మనుష్యులకు సహజం ,సమానం అన్నాడు డేకార్డ్ ..వైయక్తిక బౌద్ధిక వాదం డేకార్డ్ తోనే ప్రారంబ మైంది అంతటి వరకు చర్చి ఆది పత్యం లోనే సాగి పోయింది .’’నేను తలుస్తున్నాను కనుక నేనున్నాను ‘’అనేవాక్యం తో  డేకార్డ్ తన దర్శన శాస్త్రాన్ని ప్రారంభించాడు .దీనికి ముందే ఆతను కొన్ని విధి విధానాలను, నియమాలను రూపొందించు కొన్నట్లు డేకార్డ్ మరణా నంతరం వెలువడిన ‘’రెగ్యులే ‘’అనే పుస్తకం లో ఉంది .మనస్సును యదార్దాలను అప వాదం లేని నిర్ణయాలను చేసే టట్లు మనసును ప్రవర్తింప చేయాలన్నాడు .మానసిక శక్తులకు అనుగుణం గా చిత్త శుద్ధి తో స్పందించాలి .మన మనో నిశ్చయాన్ని ఇతరుల భావాలకు తలొగ్గి వదిలి పెట్ట రాదు సరళ, సంకీర్ణ జీవులన్నిటి విషయమై పరీక్షించి దేని నుండి జ్ఞానం పొంద వచ్చో దానిని గ్రాహించాలి .

కొన్ని భావాలు ఆన్తరికాలు కాక పొతే జ్ఞానం  అనేది రాదు అని అభిప్రాయ పడ్డాడు .దీనికి కావాల్సిన హేతువులను గణిత శాస్త్రం నుంచి గ్రహించాడు .గణితం పై డేకార్డ్ కు అమిత గౌరవం అందుకే ‘’గణితం యొక్క మూలం దృఢ  ప్రతిష్టితం .ఆ మూలం పై గణిత శాస్త్రాని కన్న ఎక్కువ గొప్ప సౌధాన్ని కట్టటం అసాధ్యం అని తెలుసు కొని నేను ఆశ్చర్య పోయాను ‘’అని రాశాడు .

తనకు ముందున్న దార్శనికుల భావాలేవీ నచ్చలేదు డేకార్డ్ కు .నిశ్చిత జ్ఞానం ఎక్కడ లభిస్తుందో అని తీవ్ర అన్వేషణలో పడి  గణితాన్ని ఆధారం గా చేసుకొన్నాడు .సందేహాలకు చోటు లేని నిస్చయత్వం గణితం వల్లనే సాధ్యం కనుకు దీన్ని తన దర్శనానికి అనుసంధానం చేసుకొన్నాడు .దీనికోసం ఒక ప్రస్థా ఘట్టం అవసరం అని పించింది .సెయింట్ అగస్టీన్ చెప్పిన ‘’సందేహ పధ్ధతి ‘’ని గ్రహించాడు .’’నేను ఆలోచిస్తున్నాను కనుక నేను ఉన్నాను ‘’అనే స్వయం విదితం చేసే వ్యక్తీ నిష్టమైన ఆలోచనల ఆధారం గ మిగిలిన సత్యాలను దీని నుంచి రా బట్ట టానికి ప్రయత్నం చేశాడు .సందేహించే వాడి ఉనికి సందేహం లేనిది కనుక సందేహ పదం కాదు అన్నాడు. తాను  ముందు చెప్పిన వాక్యాన్ని ప్రస్థానం గా తీసుకొన్నాడు డేకార్డ్

 

‘’దేన్నీ నేను స్పష్టం గా సమగ్రం గా నేను గ్రాహిస్తానో అది సత్యం అని స్వీకరిస్తాను ‘’అని చెప్పాడు .స్వంత చైతన్యం లాగా ఏది ఏది స్పష్టం గా పరి పూర్ణం గా .కనీ పిస్తుందో అదంతా సత్యమే నంటాడు .నిశ్చల మనస్సు నుండి ఉద్భ వించే భావాలు సప్రమాణ జ్ఞానం అన్నాడు ఇంద్రియ సంవేదనాల కంటే భౌతిక ద్రవ్యం భిన్నమైనది .ఈ గుణాలు అస్పస్టాలు .ఇవి వస్తు నిస్టం కావు .అంటే కొత్త అతి భౌతిక వాదం ఇందులో చేరిందని తెలుస్తోంది .శరీరానికి మనసుకు మధ్య ఉన్న వైరుధ్యం మరీ బల పడింది డేకార్డ్ వాదం లో .మానవుడు కూడా యంత్రమే అయినా అతనిలో దేవుడు, ఆలోచించే మనసును  ఉంచాడు మనిషికి ఉన్న సంవేదనలు గ్రాహక శక్తి ,చలనం మొదలైన స్వరూపం చేత శరీరం లో విజాతికి చెందినా మనసు ఉంది ఎక్కడో శరీరం తో సంసర్గం కలగ జేసు కొంటోంది అని భావించాడు .ఈ సంసర్గం అనేది మాన వ మస్తిష్కం లో ఉన్న ‘’పైనీయాల్ గ్రంధి (అమృత గ్రంధి)లో జరుగుతోంది అని చెప్పాడు డేకార్డ్ .ఇక్కడే మనసు- నాడుల నుంచి వేదనలను గ్రహించి ,నాడీ కణాల గుండా ‘’ఆనిమల్ స్పిరిట్స్’’ద్వారా చలానాలను కలిగిస్తోంది అన్నాడు .కాని డేకార్డ్ చెప్పిన ఈ  విషయాన్నీ భావ వాదులు, భాషా శాస్త్ర వేత్తలూ అంగీకరించలేదు .అయితే ఇది భావ వాదానికి నాంది అని నిస్సందేహం  గా చెప్ప వచ్చు ఇదే డేకార్డ్ సాధించిన ఘన విజయం

ద్రవ్యం కంటే మనస్సు నిశ్చిత బుద్ధికి శ్రేష్టం అని తెలిసింది .దీని పై ఇంకా స్పష్టమైన సిద్ధాంతాలను ఆ తర్వాత ఎప్పుడో కాని కాంట్, హెగెల్ లు చెప్ప గలిగారు .దేవుడు ,బయటి ప్రపంచం లను నిరూపించటానికి డేకార్డ్ ప్రయత్నించాడు .మనసు నుండి బాహ్య ప్రపంచాన్ని ఉత్పాదిన్చాటా నికి సిద్ధాంతాలు చేశాడు .మనసు నుండి భౌతిక ద్రవ్యాన్ని వేరు చేసి వాటి మధ్య సంబంధాన్ని ఏర్పరచాడు .దీనినే ఈశ్వరుడు అన్నాడు .’’ఏది నాకు భిన్నం అయిన దంతటిని సృష్టించిందో ,అలాంటి అనంతం నిత్యం స్వతంత్రం సర్వజ్ఞత్వం అయిన ద్రవ్యమే దేవుడు లేక ఈశ్వరుడు అన్నాడు డేకార్డ్ .దేవుడుతప్పక వివేకవంతుడు .ఈశ్వర అస్తిత్వాన్ని ఆయన స్వరూపం నుండి వేరు చేయలేము అంటూ’’ఒక త్రిభుజం లో మూడు కోణాలు కలిస్తే రెండు సమకోణాలకు సమానం’’ అనే గుణం త్రిభుజం స్వరూ పాన్నుంచి ఎలా వేరు చేయ లేమో ఇదీ అంతే అని ముడి పెట్టాడు .కాంట్ అస్తిత్వం విశేష కోటిలో చేరదు అని తేల్చాడు .

ఈశ్వరుని పరి పూర్నతలో శీల పరి పూర్ణత ఉంది కనుక ఆయన వంచకుడు కాదన్నాడు డేకార్డ్ .సహజ ప్రకాశం కలది అంతా సత్యమే నన్నాడు .మన ఇంద్రియాలు మనల్ని ఎప్పుడూ వంచిస్తాయి అనే భావం నుంచి డేకార్డ్ బాహ్య ప్రపంచ స్వభావాన్ని స్పస్టపరచ టానికి యత్నించాడు .డేకార్డ్ మతం లో విస్తృత మైనదీ ,పరిణామ శీలం కలది తప్ప ఈ విశ్వం లో ఇంకేదీ లేదు .’’ఆర్కి మిడీ స్ లాగా డేకర్డ్ ‘’భౌతిక ద్రవ్యాన్ని,చలనాన్ని నాకు ఇస్తే ఈ విశ్వాన్ని అంతటిని నేను మళ్ళీ నిర్మిస్తాను ‘’అని ప్రతిజ్ఞా చేశాడు

విస్తృతి ని విస్తృత మైన దాని కంటే వేరుగా చూడలేము అన్నాడు .దేశం లేక వస్తువు లోపల ఉండే ప్రదేశం ,దాన్ని ఆక్రమించి ఉన్న ద్రవ్యం పరస్పర భిన్నాలు కావు .మనంచూసే  చూపు ను బట్టి తేడా గా కనీ పిస్తాయంటాడు .వస్తువులో విస్త్రుతి  దాని విశేషణం .అని తన భౌతిక శాస్త్రానికి జామెట్రీ ని జోడించి చెప్పాడు మరి నానాత్వానికి కారణం ఏమిటి ?చలనం ఉష్ణం కాంతి అంటాడు  మనస్సు –శరీరం ల గురించి చెబుతూ భౌతిక సూత్రాలకు లొంగని దాన్ని మనసుకు ఆపాదించాడు ఈశ్వరుడే చలానికి ప్రధాన కారణం మొదటి చలనం ఆయన కల్పించిందే .అప్పటి నుండి విశ్వ చలనం నిరాటంకం గా జరిగి పోతోంది అన్నాడు .

డేకార్డ్ ద్వైత వాదిఅయినా వ్యక్తి లో కనీ పించే మనస్సు శరీరాల ఐక్యతను ,ప్రత్యక్ష ,అంతర్ జ్ఞానాన్ని కాదన లేదు .బాహ్య ప్రపంచం విషయం లో డేకార్డ్ చెప్పింది అతి భౌతిక శాస్త్ర మూల సారమే .అతని దృష్టిలో దర్శనం వృక్షం లాంటిది .దాని మూలం అతి భౌతిక శాస్త్రం .కొమ్మలు భౌతిక శాస్త్రం .మిగిలిన విజ్ఞాన శాస్త్రాలన్నీ దాని శాఖలే .ఈశ్వరుడే ప్రాధమిక ద్రవ్యం .మనసు ,భౌతిక ద్రవ్యం సెకండరి .విశేషణాలు భౌతిక ద్రవ్యం యొక్క సారాలు (ఎస్సెన్స్ )మనస్సు స్వరూపం ఆలోచనా భౌతిక ద్రవ్యాల విస్తృతి .ప్రాకారాలు అంటే ఫంక్షన్స్ ద్రవ్యం యొక్క విశేష రూపాలు (మాడి ఫిషన్స్  )  .డేకార్డ్ దర్శన శాస్త్రం వల్ల  నూతన వైజ్ఞానిక ఆవిష్కారానికి ,దర్శనం తో సమన్వయానికి దారి తీశాయి  అతన్ని విమర్శించిన వారి వల్ల డేకార్డ్  ప్రతిభ పెరి గిందే కాని తగ్గలేదు .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -16-10-13 –ఉయ్యూరు

.

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -37

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -37

జాన్ లాక్

జాన్ లాక్ ఇంగ్లాండు దేశం లో బ్రిస్టల్ నగరం దగ్గర రింగ్ టన్ లో  1632ఆగస్ట్29 న జన్మించాడు .వెస్ట్ మినిస్టర్ స్కూల్ లో చదివి ఇరవై వ ఏట ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటి లో చేరాడు కాని పూర్తీ చేయలేదు వైద్య ,మోడరన్ సైన్స్ల మీద ద్రుష్టి సారించాడు .ఆష్లీ రాజు గృహ వైద్యుయ్యాడు .రాజు తో పరిచయం రాజకీయాలు దారి తీసింది .ఒక వర్తక సంస్తకు కార్య దర్శి గా పని చేశాడు .మూడేళ్ళు ఫ్రాన్స్ దేశం లో ఆరోగ్యం బాగు పర్చుకోవటానికి ఉండి పోయాడు .1679 లో ఇంగ్లాండ్ కు మళ్ళీ వచ్చాడు .శాఫ్త్స్ బరీ రాజు సహచరుడు గా ఉండటం వాళ్ళ తీవ్ర వాదిగా అనుమానింప బడ్డాడు .రాజు1682లో  హాలండ్ కు పారి పొతే లాక్ కూడా అక్కడికే చేరాడు .1689 లో విలియం రాజు మేరీ రాణి సింహాసనం అధిష్టించే దాకా అక్కడే ఉండి పోయాడు .సర్ ఫ్రాన్సిస్  సుశాం తో ఓ.ట్స్ వద్ద నివాసం ఉన్నాడు .1704 లోఅక్టోబర్28 న  72ఏళ్ళ వయసులో అక్కడే చని పోయాడు .”ఫాదర్ ఆఫ్ క్లాసికాల్ లిబరలిజం ”అని లాక్ ను గౌరవం గా పిలుచు కొంటారు . బ్రిటిష్ మేధా పరంపరలో లాక్ ఒకడు .రాజకీయ వేదాంతాన్ని ,ఎపిస్ట మాలజి  ని వ్యాప్తి చేసిన చింతనా పరుడు.  ”continuation of consciousness తో వ్యక్తిత్వాన్ని రుజువు చేసి మొదట వ్యాప్తి చేసినవాడు లాక్ అతని ప్రభావం కాంట్ ,రూసో హ్యూమ్ ల పై అధికం . వోల్టైర్ ,రూసో భావాలకు స్కాటిష్ ఎన్ లైటేన్మెంట్ థింకర్స్ కు అమెరికన్ రివల్యూష నరీలకు లాక్ భావాలే ప్రేరకాలైనాయి అమెరికా లో డిక్లరేషన్ ఆఫ్ ఇండి పెండెంన్స్ పై లాక్ ప్రభావం ఉంది

Inline image 2  An Essay Concerning Human Understanding (1689)  A Letter Concerning Toleration (1689)   Some Thoughts Concerning Education

John Locke Signature.svg

జ్ఞానం ఉత్పత్తి ,నిశ్చయత్వం పరి మితి అనే విషయాల మీద చింతన చేశాడు జాన్ లాక్ .An essay concerning human understanding ‘’అనే ఉద్గ్రంధం రాశాడు మొదట్లో ఏమీ లేకుండా ఉండే మనస్సు తను గ్రహించిన భావాలను దాని పై రాసుకొంటుంది .భావం అంటే ఆలోచించేటప్పుడు అతని బోధకు ఏది విషయం అవుతుందో అది అన్నాడు .భావాలు అంతర్భావాలు ,అంతర్భూత తత్వాలను సత్యాలను నిరాకరించాడు .మనస్సు మూడు రకాలుగా భావాలను గ్రహిస్తుంది .ఇంద్రియాల ద్వారా ,గ్రహిస్తుంది .రెండు సంశయించటం , తో ఆలోచించటం అనే ‘’అను చింతన ‘’ద్వారా గ్రాహిస్తుంది.మూడు –ఒక వస్తువు ఇంకో దాని పై మార్పు తెచ్చినప్పుడు అంటే ‘’ప్రత్యక్ష అనుచిన్తన’’ద్వారా గ్రహిస్తుంది అంటాడు లాక్ .

 

ఘనత్వం ,విస్తృతి ,ఆకారం ,చలనం అనేవి ద్రవ్యం లోని ప్రతి కణానికి చెందిన గుణాలు అన్నాడు .వీటిని’’ ప్రైమరీ క్వాలిటీస్’’అని పిలిచాడు ద్రవ్యం లో ఇంద్రియ గోచరాలు కాని సూక్ష్మ ద్రవ్య భాగాల నిర్మాణం ఉంది వాటికి చలనమూ ఉంది .వీటి వల్లే రంగు రుచి ధ్వని మొదలైన శక్తులు ద్రవ్యానికి వచ్చాయి అని చెప్పాడు .వీటిని ‘’సెకండరి క్వాలిటీస్’’ అన్నాడు .భౌతిక ద్రవ్యం మానసిక ద్రవ్యాల స్వరూపం మనం తెలుసుకోలేమన్నాడు లాక్. ద్రవ్యం అవిజ్ఞాతం అన్నాడు అది మనలో భావాలను కలగా జేసే శక్తి ఉన్న గుణాలకు అధిష్టానం అని మాత్రమె చెప్ప గలిగాడు .

ఈశ్వర అస్తిత్వాన్ని ఆవిష్కరించటానికి అవసరమైన సత్తా అనే వాదాన్ని లాక్ నిరాకరించాడు మానవ అస్తిత్వమే దేవుని అస్తిత్వం అన్నాడు జాన్ లాక్ .మన భావాల్లోని పరస్పర సంవాదమే వస్తు తత్త్వం యొక్క జ్ఞానాన్ని మనకు అంద జేస్తుంది అన్నాడు .అంటే గుణాలు ప్రకృతిలో స్వంత అ స్తిత్వాన్ని కలిగి ఉంటాయి .గుణాలు ఏ ద్రవ్యం లో ఉన్నాయో అలాంటి ద్రవ్య విషయమై ఇంద్రియాలు మనకు అంద జేసే వాస్తవిక అనుభవాల వలన మనకు వస్తువుల యదార్ధ జ్ఞానం లభిస్తుందని లాక్ అభి ప్రాయం

లాక్ చెప్పిన జ్ఞాన సిద్ధాంతం వల్ల  కీర్తి బాగా పెరిగింది .నైతిక సూత్రాలను రాజ నీతికి ,మతానికి తన సిద్ధాంతాలను అన్వయించటం కోసమే లాక్ జ్ఞానం యొక్క పరిమితి ,ప్రామాణ్యాలను పరిశీలించాడు .నైతిక సూత్రాలకు తార్కిక ఆధారాన్ని కల్పించే ప్రయత్నం చేశాడు .అయితే ఇందులో పెద్దగా ముందుకు వెళ్ళ లేక పోయాడు .ప్రతి మనిషి ఇతరులతో సమ్యక్ బుద్ధి ,అంతరాత్మను కనుగొన గలిగిన ప్రకృతి నియమాల ననుసరించి మెలగితే అందరు మనుషులు సమానం గా భావించి తన ,ఇతరుల ప్రాణాలకు స్వాతంత్ర్యాలకు ఆస్తులను కాపాడటానికి నేర శిక్షను తనకున్న శక్తి యుక్తులను సద్వినియోగం చేసుకొంటే దేశం సుభిక్షం గా ఉంటుంది అన్నాడు లాక్ పండితుడు .రాజుకున్న నిరంకుశ అధికారాన్ని లాక్ ఖండించాడు .సామాన్యుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రాజు చట్టాలు చేసి అమలు చేయాలని కోరాడు .ప్రజాభిప్రాయానికి వ్యతిరేకం గా ఉన్న చట్టాలను ,,ప్రభువును తిరస్కరించే అధికారం ప్రజలదే అని నిర్ద్వందం గా చాటి చెప్పాడు జాన్ లాక్ మహాశయుడుదీనినే ఉదార వాదం అన్నాడు

మత  విషయం లో కూడా ఈ ఉదార వాదాన్ని వ్యాప్తి చేశాడు లాక్ .దేవుడు వంచకుడు కాదన్నాడు .ఈశ్వర ఆవిష్కారం అంతా సత్యమే అన్నాడు దేవుని అస్తిత్వ ప్రచారం కోసం ఏర్పడ్డ మతసంస్తల ప్రయోజనాలు ప్రభుత్వ ప్రయోజనాలకు భిన్నమైనవి .ప్రభుత్వం అంటే ప్రాణం స్వతంత్రం ఆస్తి హక్కు వంటి పౌర హక్కులను కాపాడే సమాజమే అని నిర్వచించాడు .రాజ కీయ ధర్మాలకు ప్రత్యెక మత విశ్వాసం అవసరం కాక పోయినా ,స్వధర్మాన్ని నిర్వహించటానికి దేవుని పై నమ్మకం చాలా అవసరం అని తేల్చి చెప్పాడు జాన్ లాక్  .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -16-10-13- ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

హృదయ స్పందన గాంభీర్యం ఉదాత్తత లేని ‘’వాది’’(ఆది )శంకరాచార్య- సినిమా

  హృదయ స్పందన గాంభీర్యం ఉదాత్తత లేని ‘’వాది’’(ఆది )శంకరాచార్య

ఎందుకో భారవి ఈ సినిమా తీస్తున్నాడని తెలిసినా ,విడుదల ముందు ట్రెయిలర్స్ చూసినా ,ఆ యాడ్స్ చూసినా ఈ సినిమా చూడాలనే అభిప్రాయం కలగలేదు .ఊళ్ళో సుమారు వారం ఆడినా దాని మీద ద్రుస్టే పోలేదు ..కాని నిన్న సాయంత్రం ఆరింటికి మా మనవడు చరణ్ ఫోన్ చేసి ‘’తాతా జెమినీ లో ఆది శంకరాచార్య సినిమా వస్తోంది చూడు ‘’అని చెబితే అప్పుడు టి.వి.ఆన్ చేసి చూశా ..నా పూర్వపు నిర్ణయం లో మార్పు అది తేలేక పోయింది .దీనికి కారణం నా వయసు కూడా నేమో .పూర్వం అయ్యర్ తీసిన సంస్కృత సినిమా అరవ కుర్రాడిని పెట్టి తీసి డబ్బింగ్ తో  విడుదలైన సినిమాలు చూసి బాగా అనుభూతి పొంది ఉన్నాను అవి ఇంకా మనసు పై వేసిన గాఢ ముద్ర చెరిగి పోలేదు .కనుక కూడా నచ్చి ఉండక పోవచ్చు అని సర్ది చెప్పుకొన్నాను .పొనీ యూత్ కోసం తీశానని భారవి డబ్బా వా యించి చెప్పినా అందరు ప్రముఖులతో వాయించి చెప్పించినా  యువత కు కిక్కు యెక్క లేదు ‘’.కక్కు ‘’వచ్చిందేమో .లేక పోతే యువత ఇన్ని గ్రాఫిక్కులు ,చొప్పించినా బ్రహ్మా రధం పట్టి ఊరేగించలేక పోయారు .’’సం థింగ్ ఈజ్ మిస్సింగ్ ఫర్ అల్.’’.

నాగార్జున ,మోహన్ బాబు శ్రీ హరి ,విజయ చందర్ ,నాగ బాబు ,సుమన్,భరణి ,సాయి చంద్ వంటి వారు నటులు గానే అని పించారు కాని పాత్రల్లో ఇమడలేదు .పానకం లో పుడక ల్లా వాళ్ళు కధకు  కంటకాలై పోయారు .వారిని కవర్ చేయటానికే భారవికి తాతలు దిగొచ్చారు .ఇక కధ,సందర్భం  గాలికి, అసంతృప్తి ప్రజలకూ మిగిల్చాడు . భైరవి సంభాషణలు అర్ధ వంతం గా ఉన్నాయి .పాటలూ బాగున్నాయి వర్ద మాన గాయకులంతా తమ ప్రతిభను సద్వినియోగం చేసుకొన్నారు .గాయకుడు హేమ చంద్ర అమరుక మహా రాజు గాబా నే చేశాడు. పల్నాటి బాల చంద్రుడేమో నని పించాడు .యుద్ధం చేయలేదు కాని ఇందులో కామ యుద్ద్ధం బానే చేశాడు .ఉభయ భారతి గా కమలిని ముఖర్జీ మంచి నటన ప్రదర్శించింది .ఆద్యంతం సినిమా వేగం గా నడిచింది ఉభయ భారతి భర్తతో వాదం లో లోతు లేదు కాని వెకిలి కని  పించింది .

భారవి గ్రాఫిక్కు కిక్కు లమీదే ఆధారపడ్డాడు అవీ సందర్భోచితం గా లేనే లేవు .శంకరుని ఆత్మస్తైర్యం కంటే పై నుండి ఆడించే నాటకం అంతగా రక్తి కట్టలేదు ఇది పాత్ర శీలాన్ని స్వభావాన్ని ఖూనీ చేసింది .నగరాల పేర్లన్నీ రాసి చూపిస్తూ అంగుళం కదల కుండా శంకరాచార్య ను పన్నెండు సార్లు ఆసేతు హిమాచల పర్యటన చేయించిన భారవి‘’పని తనానికి జోహార్లు ‘’.

కౌశిక్ చాల అందం గా,ఉండాల్సి నంత గంభీరం గా పక్వమైన నటనాను భావం కలవాడు అతన్ని సద్వినియోగం చేసుకోలేక పోయాడు దర్శకుడు .కాశ్మీర సింహాసనాదిపత్యం  ఏంతో  హుందాగా జరగాల్సి ఉంది అది అంతా భరణి,సుమన్ వాచ్యం చేయటం తో పాత్ర ఉదాత్తత దెబ్బతింది’’ఆహా’’ అని పించాల్సిన సీను ‘’ఊహూ ‘’అని అని పించింది అక్కడ ఓంకార మహాత్మ్యాన్ని తెలియ జేసే పాట బాగాఅర్ధ వంతం గా పాడాడు శంకర్ మహదేవన్ ఇది రామ దాసు సినిమా కాపీ బాణీ అని పించింది .ఫ్లూట్ రఘు తన సంగీత దర్శకత్వ సామర్ధ్యాన్ని బాగా విని యోగించాడు .ఆచార్యు ల వారి ఇహలోక యాత్ర చాలింపు చూసి కళ్ళు చెమర్చాల్సింది పోయి ,అక్కడా నాగ్ కనిపించి ఇబ్బంది పెట్టాడు .

రాఘవేంద్ర రావు బాణీ  పుణికి పుచ్చుకొన్న భారవి ఉన్నదంతా ఊడ్చి ఈ సినిమా తీసి దర్శకత్వం వాహించి ఒక చాలేన్జీ గా నిలిచాడు ఇది గర్వకారణమే .ఆతను  మంచి సినిమాలు తీయ గల సత్తా ఉన్న వాడు అని మాత్రం రుజువైంది .కొంచెం పైత్యం తగ్గించుకొంటే భవిష్యత్  భారవి ఇంకా అర్ధ వంతమైన చిత్రాల దర్శకుడ వుతాడని, అవాలని  మనస్పూర్తిగా కోరుకొంటున్నాను . .

మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –15-10-13- ఉయ్యూరు

 

Posted in సినిమా | Tagged | 1 Comment

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -35

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -35

లీబ్నిట్జ్

లీ బ్నిత్జ్త్జ్ పూర్తీ పేరు గాట్ ఫ్రీడ్ విల్ హెల్మ్ లీబ్నిట్జ్ .లైస్శిగ్  నగరం లో 1648 లో జన్మించాడు .అక్కడి యూని వర్సిటి లో నీతి శాస్త్రాన్ని బోధించాడు తండ్రి చిన్నతనం లోనే మరణించాడు  కష్టపడి స్వయం కృషి తో తర్క గణిత శాస్త్రాలలో అపార పాండిత్యాన్ని సాధించాడు .పదార్ధ విజ్ఞానం పై మోజు ఎక్కువ .విద్యార్ధి దశ లోనే అమోఘ పాండిత్యాన్ని పొందటం వల్ల  ఆచార్య పదవి లభించింది .తన కున్న విజ్ఞానం ఒక్క విద్యకే పరి మితం కాకూడదని భావించాడు .రాజు దగ్గర ఉద్యోగం లో చేరి ఈజిప్ట్ పై జైత్ర యాత్ర చేయటానికి పద్నాలుగవ లూయీ ని ప్రేరేపించాడు .కాని అతడు స్తబ్దుగా ఉండి  పోవటం వాళ్ళ నెపోలియన్ దీన్ని గమనించి లాభం పొందాడు .

దేశమంతా పర్య టించిన లీబ్నిట్జ్ ఆర్నాల్డ్ ,హైగేన్స్ మొదలైన ప్రముఖులను సందర్శించాడు .స్పినోజా ఇతని స్నేహాన్ని కాదను కొన్నాడు దీనితో కొంత కుంగి పోయాడు .మైన్త్స్ రాజు చని పోయిన తర్వాతా బ్రన్స్ విక్ రాజు గ్రంధాలయ పర్య వేక్షక ఉద్యోగాన్ని ఇచ్చాడు .ఇక్కడ బ్రన్స్ విక్ వంశ చరిత్ర రాశాడు .చివరి రోజుల్లో రాజు దయ లేక పోవటం వల్ల కాలం గడవటం కష్టమైంది .హారోవార్ రాజు జార్జి రాజ్య నిర్వాహక సభను జర్మనీ నుంచి ఇంగ్లాండ్ కు మార్చేశాడు .రాజు లీబ్నిట్జ్ ను తనతో తీసుకు వెళ్ళ లేదు .అల్ప బుద్ధి అని ,నాస్తికుడని అపకీర్తి పొందాడు .లీబ్నిజ్ 1716 లో మరణించాడు  మరణించిన తర్వాత అతని అంత్య క్రియలు కూడా ఒక నీచుడికి చేసి నట్లు చేశారు .మరణానంతరం ప్రజలు బుద్ధి తెచ్చుకొని అర్ధం చేసుకొన్నారు .

వివిధ దర్శనాలను ఏకం చేయటానికి కృషి చేశాడు .ప్రోటే స్తంట్లు కేధలిక్కుల మధ్య సామరస్యం సాధించటానికి ప్రయత్నించాడు .చైనా సంస్కృతిని మెచ్చు కొన్నాడు .ఉనేస్కో లో ఆదర్శ దార్శనికుడు గా లీబ్నిజ్ ఉండ తగిన వాడు అని ఫిలిప్ వైనర్ భావిన్చాడంటే ఇతని గొప్ప తనం ఎలాంటిదో తెలుస్తోంది .వాదాలతో అనవసర కాల క్షేపం చెయ్యకుండా విజ్ఞాన సమర్పణకుసర్వ సామాన్య భాష ను ఒక దాన్ని సృస్టించ టానికి లీబ్నిట్జ్ కలల కన్నాడు .

గణితం లోన్యూటన్ కనుక్కొన్న ‘’కాల్క్యులస్ ‘’గణితాన్ని ఆవిష్కరించటం లో లీబ్నిట్జ్ కూ గణ నీయ పాత్ర ఉంది .ఎవరు ముందు అని వాదం పెరిగింది .లీబ్నిట్జ్  కనీ పెట్టిన సాం కేతిక పరి భాష న్యూటన్ పరి భాష కంటే గొప్పది .

లీబ్నిట్జ్ దార్శనిక పధ్ధతి లో ద్రవ్య భావం అనేది ఉంది .అధికారం .పధ్ధతి .గూఢ పధ్ధతి లో తార్కిక సత్యాన్ని భూతార్ధ  సత్యం ఉన్నాయి డేకార్డ్ లాగా ఆధునిక విజ్ఞానాన్ని జోడించాడు .ఒక భౌతిక ద్రవ్యం ఆధారం గా ఏకత్వసూత్రం కనుక్కోవటానికి లీబ్నిట్జ్ ప్రయత్నించాడు .’’అరిస్టాటిల్ కౌగిలి నుంచి నేను విడి పోయి డేమక్రటిస్  చెప్పిన పరమాణువాదాన్ని ,శూన్య వాదాన్నిపరమాణువులను అంగీకరించాను .ఇది నా ఊహకు దగ్గర గా ఉంది .గణిత శాస్త్రముకు   కు భిన్నంగా ఉన్నాయి .అతి భౌతిక శాస్త్రీయ బిందువుకే సత్యత్వ ,వాస్తవికత్వాలు ఉన్నాయి .ఈ జీవ అణువు (మొనాడ్)ఒక శక్తి ఎకాన్కమే .ఇది ఆత్మ వంటిది ‘’అంటాడు లీబ్నిట్జ్ .డేకార్డ్. గతి శాస్త్రాన్ని ఇతను ఒప్పుకోలేదు ‘’క్వాం టిటి ఆఫ్ మోషన్ ‘’ నిత్యం అంటాడు డేకార్డ్ దీనికి వ్యతి రేకం గా నియత దశలో జరిగే గతి యొక్క  క్వాం టిటి నిత్యం అన్నాడు లీబ్నిట్జ్. దీనికే శక్తి నిత్యత్వ సూత్రం అని  పేరు . ద్రవ్య కణాన్ని ఒకే స్తానం లో ఉంచటాని కైనా బలం కావాలి .స్తితి శక్తి ఉన్న వస్తువు కైనా చైతన్యం గా ఉంటుంది అన్నాడు .ప్రతి జీవ అణువుకు అంత రంగిక స్వభావం ఉంది. జీవ అణువుల నానాత్వం అంగీ కారమే

జీవ అణువులు కేవల జీవ అణువులు ,ఆత్మా స్పిరిట్స్ అని మూడు రకాలు జీవాణువులు పరస్పర ప్రతిక్రియా రహితలుగా ఉంటాయి శ్రేణుల యొక్క అనా వస్యకత (కంటిన్ జెంట్)పర్యాప్త కారణం అయిన ఈశ్వరుడే .ఇదే లీబ్నిట్జ్ ప ర్యాప్త హేతు సూత్రం . లీబ్నిట్జ్ పద్ధతిలో అవి భక్త తాదాత్మ్య సూత్రం(identity of indiscernibles) ,సంపూర్ణతా(plentitude  ) సూత్రంఉన్నాయి .  ఉండవలసి నంత అస్తిత్వం ఉంది అని సంపూర్ణతా సిద్ధాంతం చెబుతుంది కనీ పించే ప్రపంచం సుస్తాపిత దృశ్యం (bene funda te ))సర్వ జీవాణువుల సహా అస్తిత్వమే (కో ఎక్సి స్తేన్స్ )ఆకాశం అన్నాడు .ఇది సర్వ సామాన్య ఆవ కాశం .దీనికి భిన్నం గా వ్యక్తీ అవకాశం ప్రతి బిమ్బించే జీవాణువు యొక్క పరి పూర్ణత అని ప్రతి పాదించాడు .ఈ రెండు భౌతిక శాస్త్రానికి బాగా ఉప యోగ పడ్డాయి .

సద్రుస్యం లేని ధర్ముల క్రమ వ్యవస్థ నే కాలం అన్నాడు లీబ్నిట్జ్ .ఇవి ఒక దాని తర్వాత ఒకటి ఉంటాయి ఇతని కాల నిర్వచనం అర్ధం అవటం కష్టం .జీవాణువు పరిణామ ధర్మాన్ని అంగీకరించిన కాలం యొక్క  యదార్ధాన్ని లీబ్నిట్జ్ నిరాకరించాడు జీవాణువుల ‘’గవాక్ష రాహిత్యం ‘’ఒక పెద్ద అడ్డంకి.ఇది జ్ఞాన మీమాంసలో చాలా చిక్కులు తెచ్చింది తనకు ముందున్న పూర్వ సిద్ధాంతాలను సమన్వయ పరచటానికే కృషి చేశాయే ఈశ్వరీయ జ్ఞానం అంటాడు .ఇదేవ్యక్తీ   సహాయ జ్ఞానం .కేవలం జీవాణువులను నిరూపించే జ్ఞానం నిక్రుస్టమైనది .ఈ రెంటికి మధ్య ప్రకృష్ట ప్రభావం ఉన్న జీవాణువు లను ప్రదర్శించే మహనీయ మానవులున్నారు అన్నాడు .

లీబ్నిట్జ్ సిద్ధాంతాలన్నీ సంసర్గాలు అసత్యాలు ,ప్రతి పాదనా ఉద్దేశ విదేయం రూపం లో ఉంటాయి .’’జీవాణునవులు అనేకం ‘’అనే వాక్యం మాత్రం సంప్రస్నా త్మకమూ కాదు ఉద్దేస్య విదేయమూ కాదు .ఈ  ప్రపంచ విసహాయం  లో లీబ్నిట్జ్ వైవిధ్యం .సాంప్రదాయ దార్శనిక వర్గానికి ఆధునిక తార్కిక భాషా శాస్త్ర వాదానికి మధ్య గొప్ప సమన్వయము సాధించిన వాడు లీబ్నిట్జ్ .సత్యం కేవలం నామాలు మూలాధారం కలది కాదు అనే లీబ్నిట్జ్ ఉక్తిని తార్కిక భాషా వాదం లో గొప్ప స్తానం పొందింది .

సశేషం

మీ –గబ్బిట దుర్గా  ప్రసాద్ –  15-10-13 ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

-సరస భారతి శుభ వార్తలు

సాహితీ బంధువులకు శుభ కామనలు -మూడు ముఖ్యమైన శుభ వార్తలను మీకు అంద  జేస్తున్నాను

మొదటి శుభవార్త -సరస భారతి ఈ క్షణానికి  లక్షా డబ్భై అయిదువేల మంది వీక్షకులను అక్షరాలా 1,75 049 (సరస భారతి 1,42,657 +శ్రీ ఆంజనేయ స్వామీ  బ్లాగ్-32,392 ) ఆకర్షించిందని తెలియ జేయటానికి మహానందం గా ఉంది .
        రెండవ శుభవార్త -సరస భారతి  ఈ నెల ఇరవై రెండవ తేదీకి నాలుగేళ్ళు దాటి అయిదవ ఏడు లో ప్రవేశిస్తోందనితెలియ జేయటానికి ఆనందం గా ఉంది
      మూడవ శుభ వార్త -ఈ ఏడు పదవ సంవత్సరం చదువుతున్న పేద ప్రతిభా వంతు లైన ఆరుగురు విద్యార్ధులకు  ”నిరతాన్న దాత ,అపర అన్న పూర్ణ శ్రీ మతి డొక్కా సీతమ్మ గారి జ్ఞాపకార్ధం వారి ముని మనవడి కుమారుడు అంటే ఇని మనవడు శ్రీ డొక్కా రామ భద్ర (అమెరికా  ) గారు ఏర్పాటు చేసిన స్కాలర్ షిప్ లను అందించటానికి సరసభారతికి rs10 000 అక్షరాల పది వేల రూపాయలను పంపించారు . ఈ మొత్తాన్ని ఆ ఆరుగురు విద్యార్ధులకు సమానం గా పంచి ఈ నెల ఇరవై   రెండవ తేది మంగళ వారం సాయంత్రం6-30 గం లకు  శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో సరస భారతి 52 వ సమావేశంలో అందజేస్తున్నామని తెలియ జేయటానికి సంతోషం గా ఉంది
    అంతే  కాదు,ఈ కార్య క్రమంలో పాల్గొన టానికిహైదరా బాద్ లో ఉన్న  తమ తలి దండ్రులైన శ్రీ డొక్కా సూర్య నారాయణ గారు(సీతమ్మ గారి ముని మనవలు ) వారి సతీమణి శ్రీ మతి బాలా త్రిపుర సుందరి గార్లను ఉయ్యూరు వచ్చే ఏర్పాటును శ్రీ రామ భద్ర  గారు చేశారని తెలుపటానికి మహా దానందం గా ఉంది . అలాగే నాకు అత్యంత ఆప్తులు ,శ్రీ రామ భద్ర గారి కుటుంబానికి చిర పరిచితులు అయిన విశ్రాంత ప్రదానోపాధ్యాలు శ్రీ కోసూరు ఆది నారాయణ(కోసూరు ) గారి ని ఆహ్వానించాము వారి అమృత హస్తాల మీదుగా విద్యార్ధులకు ఈ ఉపకార వెత నాలను అంద జేస్తున్నామని తెలియ జేయటానికిఇంకా సంతోషం గా ఉంది శ్రీ రామ భద్ర గారి కుటుంబానికి సరస భారతి తరఫున ,నగదు స్కాలర్ షిప్  లను అందుకొంటున్న విద్యార్ధుల తరఫున  కృతజ్ఞతలను తెలియ జేస్తున్నాను –మీ -దుర్గా ప్రసాద్ -14-10-13 -9-45 p.m.
Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -36

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -36

 

వల్లభా చార్యులు

పరబ్రహ్మ సర్వ ధర్మా శ్రయ మని వల్లభా చార్యుల మతం .పరబ్రహ్మ తనను తాను ఈ జగత్తు గా చేసుకొంటాడు .ఎవడి నుండి సర్వ భూతాలూ పుట్టు తున్నాయో అలాంటి బ్రహ్మానికే కర్తృత్వం ఉంది .ఇది ఆయన కు స్వభావమే కాని శంకరుడు చెప్పినట్లు మాయ తో కూడినది కాదు .బ్రహ్మ కర్త అయితే జీవులలో తార తమ్యాలేందుకు ఏర్పడ్డాయి అన్న దానికి వల్లభా చార్యులు ఆయనలో పక్షపాతం .లయ విషయం లో నిర్దయా ఉన్నాయని చెప్పాడు ఇది పరబ్రహ్మ దోషం కాదు అనటానికి మూడు సమాధానాలు చెప్పాడు .జీవుల కర్మల ఫలాన్ని బ్రహ్మం  సఫలం చేశాడు కనుక వైషమ్యదోషం ఆయనకు అంటదు .తన సర్వ సమ ఈ విషమ సృష్టి అవసరం కనుక సామర్ధ్యాన్ని  ప్రదర్శించాటానికే సర్వ సృష్టి ని బయటికి తెచ్చాడు కనుక విషమ దోషం అంటదు  .లీలకు అవకాశం లేదు కనుక విషమ ద్రుష్టి లోపం అంటుకోదు అంటాడు వల్లభుడు  ఈయన1474 .లోచంపా రణ్యం లో  జన్మించి 1531లో మరణించాడు  విష్ణు స్వామి మతం లో ”ఆచార్య ”పదవి పొందాడు . ఆ సంప్రదాయానికి చివరి వాడైన బిల్వ మంగళ ఆచార్యుడుఈయన గురువు

విజయ నగర సామ్రాజ్య చక్ర వర్తి శ్రీ కృష్ణ దేవా రాయల ఆస్థానం లో వల్లభా చార్యులు వాదం లో శంకారా ద్వైతాన్ని ఓడించాడు పుష్టి వాడ భక్తీ కి ప్రధమ ఆచార్యుడు వల్లభుడు విష్ణు స్వామి మతం లో రుద్రసంప్రదాయానికి చెందినా వాడు వల్లభుడు  బ్రహ్మ సూత్రాలకు అనుభాశ్యం రాశాడు పదహారు స్తోత్రాలను రాశాడు మహా జ్ఞాని మహా బహాక్త శేఖరుడు మహా వేదాంతి అని పించుకొన్నాడు తన పుష్టి వాడ మత ప్రచారానికి అనేక పాఠ శాలలను ఏర్పాటు చేశాడు. రామానుజ మాధవ నిమ్బార్కారుల వేదాంతాన్ని తన వేదాంతం లో చొప్పించాడు వల్లభా చార్యులు

Shri mahaprabhuji.jpg

నేను అనేకం గా అవుతాను అనే శ్రుతి వాక్యం పరబ్రహ్మ తన ఇచ్చ ప్రకారం పూర్ణ మైన ఆనందాన్ని మరుగు పరచి జీవ స్వరూపాన్ని గ్రహిస్తాడు . ఈవిషయం లో  అవిద్య లేక మాయ సంబంధం లేదు .అగ్ని నుండి విస్ఫులింగాలు వచ్చి నట్లు జీవులు పరమాత్మ నుండే ఉద్భ విస్తాయి .కనుక జీవ నానాత్వాన్ని అంగీకరించాడు వల్లభా చార్యులు .ఉత్పత్తి, వినాశం లేక పోవటం వల్ల  జీవుడు నిత్యుడే .ఇతడు జ్ఞాత .మాత్రమె .జ్ఞానం అతని ధర్మం .జ్ఞాన రూప మైన ధర్మానికి ,జ్ఞాత్రు రూప మాయిన ధర్మికి కాంతికి సూర్యుడికి ఉన్న సంబంధం లాంటిదే .జీవుడికి పైకి వెళ్ళటం మోక్ష కారక మైన గతి .జీవుడు అణుస్వరూపుడు .తన సహజ జ్ఞానం చే చైతన్య రూపం గా వ్యాపిస్తాడు .

స్మ్రుతి ప్రమాణం చేత జీవుడు పరబ్రహ్మ అంశమే.బ్రహ్మ అంశి.బ్రహ్మకు పామ్శుత్వం  ,నిరంకుశత్వం ఉందని స్మ్రుతి ఒప్పుకొంది .కనీ పించే సృష్టి అంతా సృష్టికి పూర్వమే ఉంది కనీ పించేదంతా సత్యమే అని శ్రుతి వాక్యం కనుక జగత్తు సత్యమే .మట్టి, కుండలో భాగమై నట్లు జగత్తు కూడా బ్రాహ్మ లో భాగమే .వల్లభ మతం లో జగత్తు ,సంసారం ఒకటి కాదు .ఇది ఇంకే మతం లోను కనీ పించని విషయం .అజ్ఞానం టో పుట్టిన సంసారం జ్ఞానం వల్ల  నశిస్తుంది జగత్తు సద్రూపం. దానికి నాశనం లేదు .ఈ మతం లో మోక్షానికి జ్ఞానం కంటే భక్తికే ఎక్కువ ప్రాధాన్యం ఉంది. జ్ఞాన సహజ భక్తీ మహా సాధనం .భక్తిలో మర్యాదా ,పుష్టి అని రెండు రకాలు .మొదటిది పరమేశ్వరుని చరణార విన్దాలపై భక్తీ, రెండోది భగ  వంతుని ముఖార విందము పై  భక్తీ .మర్యాదా భక్తీ వేద సిద్ధం .పుష్టి భక్తీ  వేద నిరపేక్షం .స్వతంత్రం .మర్యాద భక్తికి కి సాయుజ్యమే ఫలం .పుష్టి భక్తికి ఫలం అభేద బావన .మర్యాదా భక్తిలో ఫలా పేక్ష ఉంటె ,పుష్టి భక్తిలో ఫలా పేక్ష లేదు .మర్యాదా భక్తికి  అంబరీషుడు పుష్టి భక్తీ కి  వ్రేపల్లె గోపికా స్త్రీలు ఉదాహరణ .ఇందులో శ్రీ కృష్ణ లీలా రసానుభావాన్ని వ్రజ భామలు పుష్కలం గా అనుభ వించారు .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -14-10-13- ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శమీ పూజ

shamee pooja -1 shamee pooja -2

Posted in సేకరణలు | Tagged | Leave a comment

దసరాకి సరదాకి జీన్సూ నాన్సేన్సూ

    దసరాకి సరదాకి

జీన్సూ నాన్సేన్సూ

‘’అవతలి వాడంటే ఎలర్జీ ,కుళ్ళు .లోకం ప్రతిభను బతక నివ్వదు,ఏం ?నా అంత బాగా ఎవడైన కష్టపడి రాస్తాడా ,నాకు దీనికి నోబుల్ ప్రైజ్ వస్తుందంటే వేళాకోళం చేస్తారు వెర్రి నాయాళ్ళు ,అదేం పెద్ద గొప్పదా ,ఇచ్చిన వాళ్ళందరూ మహా గొప్ప రచయితలా కస్టపడి ఆరు నెలలు చెమటోడ్చి రాస్తే పట్టించుకొనే నాధుడే లేదు ‘’అంటూ ‘’అవును వాళ్ళిద్దరు ఇస్ట పడ్డారు సినిమా ‘’లో ఏం ఎస్.నారాయణ లాగా మా బామ్మర్ది బ్రహ్మ ‘’ఫైలాన్ పెను తుఫాను గాలిలా’’ వచ్చి కూర్చున్నాడు .ఆహా వీడేదో కలలో ఉన్నాడు కాసేపు గాలి తగ్గ నిద్దాం అని కామ్ గా మాట్లాడకుండా కూర్చుండి  పోయాను పేపర్ చదూ కొంటూ .పది నిమిషాలు మా ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలింది అదేదో నవలలో రచయిత్రి చెప్పినట్లు .అప్పటికి వాడు కుదుట పడ్డాడు ఇక లాభం లేడను కొన్నాడో ఏమో వాడే మాట్లాట్టం మొదలెట్టాడు .

‘’అది కాదు బావా !ఈ మధ్య నేను ఫ్రాయిడ్ మనస్తత్వ స్శాశాస్త్రాన్ని  ఔపోసన పట్టాను .తిరగేసి బోర్లేశాను .మనిషి ప్రవర్తనకు అనువంశ జీన్స్ కు ఉన్న సంబంధాన్ని స్టడీ చేసి పారేశా .నాకు తెలిసినదాన్ని ఈ నాటి సమాజం లో వ్యక్తుల ప్రవర్తనలకు అప్ప్లై చేసి వీళ్ళుఎందుకిలా  తలా తోకా లేకుండా ప్రవర్తిస్తున్నారా అని ఆర్నెల్లు కస్టపడి చిక్కి శల్యమై నా పరిశోధనా వ్యాసాన్ని తయారు చేశాను .ఇది చూస్తె నువ్వే ఒప్పుకొంటావ్ దీనికి సాహిత్యం లో నోబుల్ బహుమతి రావచ్చని .ఈ మాట ఎవరికి చెప్పినా నన్నో పురుగు కింద లేక్కేశారు నువ్వు చదివి ‘’ఓ.కే.’’చెబితే నోబుల్ వాళ్లకి పంపిస్తా .నా ప్రతిభ ఏమిటో నిరూపిస్తా .’’అన్నాడు ఆయాస పడుతూ .’’ఒరే !చది వేంత  తీరిక నా కెక్కడిది రా .నా రాత కోతలేవో నాకే సరి పోతున్నాయి .అయినా ఫర్లేదు అందులో ఉన్న సాలిఎంట్ పాయింట్లను కక్కు’’అన్నాను .వాడి ముఖం లో ఆనంద రేఖ తాండవించింది అదేదో నవలలో ఎవరో చెప్పినట్లు .’’ఇంతకూ ఏం రాశావ్ ?దేని మీద ?’’అడిగాను నేనే .’’ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఇలా ఎందుకు ప్రవర్తించి ప్రజా సమస్యలను అర్ధం చేసుకోలేక పోతున్నారు ?/’’అని ఒక మౌలిక ప్రశ్న నా అంతట నేనే వేసుకొని దానికి నాకు దొరికిన సమాధానాలు రిసెర్చ్ లాగా రాశాను .’’సరేరా ఒక్కొక్క ముడీ విప్పు ‘’అని ఎంకరేజ్ చేశా .ఇక రెచ్చి పోయాడు బ్రాహ్మీ బామ్మర్ది

‘’ముందుగా కే.సి.ఆర్ .అందర్నీ ఎందుకు ‘’ముక్కు నేల కేసి రాస్తా ‘’అంటాడో దాని మీద రాశా ‘’అన్నాడు ‘’ఏం రాశావో చెప్పు ‘’అన్నా .’’చిన్నప్పుడు కే.సి.ఆర్ ఒక  వీధి బడిలో చదివే వాడని ,అక్కడ అతనికి స్నేహితులేవ్వరూ లేరని అందరు ఇతన్ని చీద రించుకొని ముక్కు నేలకేసి రాసే వారని అందుకే ముక్కు అంతగా వాచీ పోయిందని ,దాని వల్లే  చిన్నప్పటి ఆ బాధ మనసు లో ఉండి  పోయి సెలలేసి బాధిస్తోందని అందర్నీ ఇప్పుడు ముక్కు నేల కేసి రాయిస్తా అని అంటున్నాడని పాయింట్ లాగా ..నోబుల్ వస్తుందా బా /’’అన్నాడు .’’మరి ఆయన ఆంధ్రోల్లను చీదరిం చే దానికి కారణం ఏం రాశావు ‘’అడిగా .’’దానికీ లాగా .ఆయన బాబాయి  ఒకాయనవీళ్ళ నాన్నను మోసం చేసి ఆస్తి అంతా నా కేశాడట . అప్పటి నుంచి అందరూ అంతేననే భ్రమలో ఉండి పోయి చీద రించు కొంటున్నాడని రాశా ‘’అన్నాడు ‘’సరే .దీనికి ఎవిడెన్స్ ఉందా ?’’అడిగా .’’అదేం లేదు .సందర్భానికి తగిన ప్లాన్ చేసి రాశా .నోబుల్ గ్యారంటీనా బావా ?“’అని మళ్ళీ  కేక .నవ్వాలో ఏడవాలో తెలీక నవ్వి ఊరుకొన్నా మళ్ళీ ‘’చిదంబరం గురించీ రాశా‘’అన్నాడు ‘’వదులు అన్నా ‘’చిదంబరం క్లాస్ మేట్ ఒక తెలుగోడున్నాడు మద్రాస్ లో. వాడేప్పుడు ఈయన కంటే అన్నిట్లో ముందుండే వాడు .డి.ఏం.కే ప్రభుత్వం లో జయ లలిత పార్టీ ప్రభుత్వం లో కూడా హోమ్ మాంత్రి అ య్యాడు .ఇవన్నీ చిదంబరం కు ఈర్ష్య కల్గించాయి .అప్పటి నుండే ఆంధ్రా వాళ్ళు అంటే మండి పడతాడు .తన కంటే అతను తన రాష్ట్రం కంటే ఆంద్ర రాష్ట్రంఅన్నిటా ముందుందని పరాభవం దహించి ‘’ఇంటిలో ‘’చేరి చిచ్చు పెట్టాడు .’’ఫ్రాయిడ్ సిద్ధాంతాన్ని ఇంత బాగా వాడుకొన్న వారెవరూ లేరు బావా వస్తుందా బావా నోబు ల్ ‘’అన్నాడు మళ్ళీ. ‘’ఫ్రాయిడ్ ఏమో కాని ‘’నీది ఫ్రాడ్ సిద్ధాంతం’’ అన్నాను కోపం తో

‘’అప్పుడే ఏమయింది బా  కోదండరాం ఎందుకు ప్రొఫెసర్ పదవి గాలికొదిలి ఉద్యమాల వెంట తిరుగు తున్నాడో కనీ పెట్టా’’అన్నాడు రోట్లో తల పెట్టి రోకలి పోటుకు వెరవడం దేనికని ‘’కానీ ‘’అన్నా ‘’’కోదండరాం యూని వర్సిటి లో చదివే రోజుల్లో ఒక ప్రొఫెసర్ ఏ రోజు క్లాస్ కు  రాకుండావిప్లవ ఉద్యమాల వెంట తిరిగే వాడట .పాపం ఈయనకు చదువు మీద శ్రద్ధ ఎక్కువ అన్నీ స్వంతంగా చదివి తెలుసుకొని అత్తెసరు మార్కులతో గట్టేక్కాడ ట .అప్పటి నుంచి యూని వర్సిటి లోప్రొఫెసర్ ఉద్యోగం వస్తే చస్తే క్లాసుకెళ్ళి పాఠంచెప్పనని తనాకు ఆదర్శమైన ఆయన ప్రొఫెసర్ మీద పరోక్షం గా ఒట్టేసి హాయిగా జీతాలు తీసుకొంటూ ఉద్యమాలు నడుపు కొంటు తల తిక్కగా మాట్లాడుతూ ప్రొఫెసర్ అయినా గులాబీ పెద్దాయనకు ‘’నీ బాంచెన్ ‘’అంటూ కాల్మోక్కుతున్నాడు ‘’మరి ఇందులో ప్రూఫ్ ఉందా ‘’అడిగా ‘’ప్రూఫ్ ఎవరికి కావాలి బా . ఈ మధ్య పరిశోధనలన్నీ ఎత్తి పోతల పధకాలేగా వీటికి తీసి పోతుందా నా పరిశోధనా ?నోబుల్ గ్యారంటీ యేనా ?’’అని క్వేస్చిన్  రైజ్ చేసి నన్ను నిరుత్తరుడిని చేశాడు ..

‘’ సోనియా మనల్ని చీల్చటం వెనక ఏ కధ అల్లావ్ ?’’అడిగా నేనే ‘’అల్లటం, కధా  అంటూ’’లైట్ తీసుకొని పారేయ్యకు’’ బా .సోనియా ఇటలీ లో వాళ్ళ తాతగారింట్లో ఉన్నప్పుడు అక్కడ తెలుగు తెలిసిన మహా పండితుడోకాయన ఉండేవాడు ఆయన తెలుగు ను ఇటాలియన్ ఆఫ్ దిఈస్ట్ అనేవాడట తాత తో అది మండేది ఈమెకు అప్పటి నుండీ తెలుగు రాష్ట్రాన్ని ఎదక్కుండా చెయ్యాలనిశపథం తీసుకొందిట .అందుకే చంద్ర బాబు ముఖ్య మంత్రి అయి అన్ని రంగాల్లో అభి వృద్ధి చూపిస్తే ఏదో కుంటి  సాకు తో ఇక్కడి కొచ్చి మీటింగుల్లో విరుచుకు పడేది అదే రాజ శేఖరుడు సి.ఏ,అయినప్పుడు ఎన్ని అవినీతి ఆరోపణలోచ్చినా ,యెన్ని  ఉపద్రవాలు జరిగినా కన్నెత్తి చూడలేదు .ఇది పక్ష పాతం కాక మరేంటి బావా .ఈ ఏడు నోబుల్ ఖాయమేనా ‘’అన్నాడు ఆశ చావక  .’’దీనికి సాక్ష్యాధారాలు ‘’అడిగా మళ్ళీ ‘’ఊహించా .ఊహకు విలువ ఉందని ఎప్పుడూ నువ్వే అంటావుగా .ఇది అందమైన ఊహేగా తగినట్లే ఉందికదా నోబుల్ మాటేమిటి ?భేతాళ ప్రశ్న లా వదల్లేదు బ్రాహ్మీ .

‘’రాహుల్ నీ బయటికి లాగా .ఆయనవి వాళ్ల బాబాయి సంజయ్ బుద్ధులు వంశ పారం పర్యం గా సంక్రమించాయి .ఆయన యెంత మొండి వాడో’’ఎక్స్ట్రా గవర్నమెంట్ ఆక్టివిటీస్’’ యెట్లా చేశాడో  వాళ్ళ అమ్మ ఇందిరా కాలం లో అట్లానే’’ నాకుపదవి  వద్దు వద్దు’’ అంటూ ‘’అమీబా టెంటకిల్స్’’ లాగా అన్నిటిలో దూసుకెళ్ళుతున్నాడు .’’ప్రధానినే చెత్త బుట్ట లో కుక్కేసిన’’ గడుసు సంజయ స్వరూపం రాహుల్ ది  .’’అన్నాడు ‘’దీనికి వాలిడిటీ  ?’’అన్నాను ‘’.విషయం రాయటానికి వాలిడిటి అవసరం లేదు బావా మన రాజ కీయ నాయకులు మాట్లాడే చెత్తకంతటికి వాలిడిటి  ఉందా ?నోబుల్ పక్కా యేనా ?సూర్ ?లాక్ పెట్టనా ?’’అమితాబ్ రేంజ్ లో దబాయించాడు నన్ను .

ఇక లాభం లేదని ఇంతకీ నీకు నోబుల్ కావాలంటావ్ ?అన్నా ‘’కావా లి ఏంటి బా .రావాల్సిందే .నువ్వు ఊ అంటే రాక చస్తుందా .?’’వాడి ఆశకు అంతు లేదని పించింది .’ఇంకోటి విసురుతా ఇదే చివరిది .కేశవరావు ఎవరికీ  అర్ధం కాకుండా ఎందుకు అలా మాట్లాడుతున్నాడ న్న దాని మీద కూపీ లాగా .ఆయన కు చిన్నప్పుడు పాఠంచెప్పిన .గురువు మాట్లాడుతుంటే ఒక్క ముక్క అర్ధం అయ్యేది కాదట .విద్యార్ధులంతా తననే ఆదర్శం గా తీసుకో వాలని ఆ గురు ఉవాచట అందుకే ఎవరికి అర్ధం కాకుండా చివరికి తను చెప్పేదేమిటో తనకే అర్ధం కాకుండా మాట్లాడి గురు ఋణం తీర్చుకొంటు న్నాడట .ఎలా ఉంది ఆర్గ్యుమెంటు .నోబుల్ నాదేనా ?/ఆశగా బామ్మర్ది బ్రహ్మం ఎన్నో సారో లెక్క లేకుండా అడిగాడు .ఇక ఉండలేక ‘’బామ్మర్దీ !బ్రహ్మం !ఈ ఏడు నోబుల్ బహుమతులివ్వటం పూర్తయి పోయింది వచ్చే ఏడాదికి ట్రైచెయ్యి ‘’అన్నాను తాపీగా ‘’భాలే ఓడివి బా! చావు కబురు చల్లగా చెప్పావు నాతో ఇంత వాగించి  నన్నో వెంగళ ప్ప ను చేశావ్ .అయినా వచ్చే ఏడాది మనదేగా నోబుల్? /అన్నాడు మళ్ళీ .ఇక లాభం లేదనుకొని నిర్వేదం గా ఇంట్లో కొచ్చి వాల్లక్కయ్యకు కనీ పించకుండా టిఫిన్ మెక్కి కాఫీ తాగకుండా నాకు ఆదా చేసి నెమ్మదిగా బాటసారి లో నాగేశ్వర లావు లా ద్రుష్టిఎక్కడో పెట్టి  నడుచు కొంటు నిష్క్రమించాడు బ్రాహ్మీ బామ్మర్ది

శ్రీ విజయ దశమి దసరా శుభా కాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -13-10-13 –ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

దేవుళ్లకు చిత్రాభిషేకం

దేవుళ్లకు చిత్రాభిషేకం

ఒకవైపు దుర్గా నవరాత్రులు, మరోవైపు తిరుమల దేవుడి బ్రహ్మోత్సవాలు… వెరసి దేవుళ్లందరూ భూమ్మీదికి దిగొచ్చేశారేమో అన్నంత కళగా ఉంది ఎటువైపు చూసినా. ఈ సమయంలో ఇష్టదైవాలను రకరకాలుగా పూజించి, శక్తి మేరకు కానుకలు సమర్పించుకుంటారు భక్తులు. విజయవాడకు చెందిన నందమూరి లతారాణి తాను స్వయంగా చిత్రించిన తంజావూరు కళాఖండాలతో దేవుళ్లకుఅర్చన చేస్తున్నారు.

దక్షిణ భారత దేశాన్ని పరిపాలించిన నాయక రాజుల కాలం నుంచి, అంటే కనీసం నాలుగు శతాబ్దాల కాలం నుంచి ప్రచారంలో ఉంది తంజావూరు చిత్రకళ. అందమైన లేత రంగులు, వాటిమీద అద్దే పల్చని బంగారు రేకులు, రవ్వలు, మంచి రత్నాలతో గొప్పగా తయారయ్యే ఈ చిత్రాలను ఒకసారి చూస్తే చూపు తిప్పుకోవడం కష్టం. ‘ఇరవయ్యేళ్ల క్రితం విజయవాడలోని ఒక ఎగ్జిబిషన్‌లో తంజావూరు చిత్రాలను చూసినప్పుడు నేను అలాగే నిలబడిపోయాను. వాటిలోని అందం, హుందాతనం నన్నెంత ఆకట్టుకున్నాయంటే, ఒకటి కొనుక్కు వచ్చి ఇంట్లో పెట్టుకుంటే సరిపోదనిపించింది. వాటిని గియ్యడం, బంగారు రేకుల తాపడం – వాటన్నిటినీ నేర్చుకుని నేను సొంతంగా చేస్తే తప్ప మనసుకు సంతృప్తి లభించదని అర్థమైపోయింది…’ అని చెప్పారు లతారాణి. ఆ ప్రదర్శనలో పాల్గొన్న తంజావూరు కళాకారులను అభ్యర్థించి పదిహేను రోజుల పాటు ప్రాథమిక విషయాలను నేర్చుకున్నారు. పట్టు వదలకుండా ప్రయత్నిస్తూ ఆ కళలో నిష్ణాతురాలయ్యారు.

కొండంత కానుక
‘ఈ చిత్రాలు చెయ్యడానికి కావలసిన పల్చటి బంగారు రేకులు, విలువైన రవ్వలు – అన్నిటినీ చెన్నై నుంచి తెచ్చుకుంటాను. ఏడాది రెండేళ్లు తిరిగేసరికి నేను తయారుచేసిన తంజావూరు చిత్రాలతో ఇల్లంతా నిండిపోయింది. వాటినేం చెయ్యాలో తోచలేదు. అమ్మడం అనేది నా దృష్టిలోనే లేదు. దాంతో ఇంటికొచ్చిన బంధువులు, స్నేహితురాళ్లకు, కుటుంబ మిత్రులకు కానుకలుగా ఇవ్వడం మొదలెట్టాను. కొన్నిటిని మా అబ్బాయి పెళ్లికి ఆహ్వానపత్రికలతో పాటు బహుమతులుగా ఇచ్చాం. బాగున్నాయని అందరూ మెచ్చుకున్నారు. నేను పూజలు కూడా ఎక్కువగానే చేస్తుంటా. అలాంటప్పుడే – ఈ చిత్రాలను దేవుడికి కానుకగా ఎందుకివ్వకూడదు? అనే ఆలోచన నాలో మెదిలింది…’ అంటున్న లతారాణి, వెంటనే దాన్ని అమల్లోకి పెట్టేశారు. తెలుగువాళ్లకు దేవుడంటే తిరుమల వేంకటేశ్వరుడే. “వేంకటేశ్వరుణ్ని మామూలు క్యాలెండర్లో చూసినా తనివి తీరదు.

అలాంటిది ఆయనను తంజావూరు శైలిలో చిత్రిస్తే, ఇక ఆ వైభవాన్ని చూడటానికి రెండు కళ్లూ చాలవు’ అనుకున్నారామె. భక్తిభావంతో మనసంతా నిండిపోయినప్పుడు కొండంత దేవుడికి కొండంత పూజ చెయ్యాలని ఎవరికైనా అనిపిస్తుంది. లతారాణి కూడా దీనికి మినహాయింపేమీ కాదు. దాంతో ఆమె పెద్దపెద్ద చిత్రాలను రూపొందించడం ప్రారంభించారు. 10 ్ఠ15, అంతకుమించిన సైజుల్లో ఆమె రూపొందించిన బొమ్మలను స్వామికి సమర్పించడం ప్రారంభించారు. అలా ఆమె వేసిన వేంకటేశ్వర కల్యాణ దృశ్యాలు క్యూలైన్‌లో భక్తులకు కనిపించేట్టు రంగనాథ మంటపం చుట్టూరా పెట్టారు. బ్రహ్మోత్సవ దృశ్యాలు వైభవస్వామి మంటపంలో కొలువుతీరాయి. ఇంకొన్ని చిత్రాలను తిరుపతి మ్యూజియమ్‌లో ప్రదర్శనకు ఉన్నాయి.

ఇదొక పూజ
దేవాలయానికి వెళ్లేప్పుడు అందరూ పువ్వులు తీసుకెళతారు. లతారాణి మాత్రం ఏ దేవాలయానికి వెళ్లినా, ఆ దేవుడి చిత్రాన్ని తీసుకెళ్లి సమర్పించడం అలవాటుగా పెట్టుకున్నారు. విజయవాడ కనకదుర్గమ్మను దేవీ నవరాత్రుల్లో పది రకాల రూపాల్లో అర్చిస్తారు. వాటన్నిటినీ భారీ చిత్రాలుగా రూపొందించి ఇచ్చారు లతారాణి. మన రాష్ట్రంలోని శ్రీశైలం, భద్రాచలం, సింహాచలం, అన్నవరం, మంగళగిరి వంటి క్షేత్రాలకే కాకుండా, తమిళనాడులోని చిందబరం, కంచిలతో పాటు వైష్ణోదేవి మందిరానికీ తంజావూరు చిత్రాలను బహుమతిగా ఇచ్చారామె. అంత భారీ చిత్రాలను రూపొందించడానికి కనీసం రెండు నెలలైనా పడుతుంది. చిత్రీకరణకు “వాటిని చిత్రిస్తున్నప్పుడు మాటల్లో చెప్పలేని ఆధ్యాత్మిక అనుభవాలు కలుగుతుంటాయి.

ఆ దేవీదేవతలు స్వయంగా వచ్చి కూర్చుని నాతో చిత్రిస్తున్నట్టు తాదాత్మ్యం చెందుతుంటాను..” అని చెబుతున్నారు లతారాణి. చిత్రాలను దేవాలయాలకు ఇచ్చేముందు ఇంట్లో పూజచేసి పట్టువస్త్రాలు, నైవేద్యం సమర్పిస్తారామె. ‘ దైవం ఆనందంగా స్వీకరించిన అనుభూతి కలుగుతుంటుంది ఆ సమయంలో… ఏ తల్లికైనా పిల్లలు పట్టుచీర పెడితే ఆమె ఆనందంగా ఆశీర్వదించదూ, దేవుడు నా బహుమతి స్వీకరించిన అనుభూతిని ఎప్పటికీ మరిచిపోలేను” అని కూడా చెప్పారామె. చిత్రించడం ఒకెత్తు అయితే వాటిని అక్కడవరకూ చేర్చడం మరొక ఎత్తు. దానికి చిత్రాలకైనంత ఖర్చు, శ్రమ అవుతుంటాయి. అయితే దేనికీ వెరవరు ఆమె. ఈ తరహాలో మొత్తం వెయ్యి చిత్రాలను వివిధ దేవాలయాలకు సమర్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు లతారాణి.
– అరుణ పప్పు
ఫోటోలు : ఎన్. సాంబశివరావు, విజయవాడ

దాచుకో, నేచేసిన పూజలివి
“భగవంతుడి పట్ల భక్తిని ప్రదర్శించడంలో ఒక్కొక్కరిదీ ఒక్కొక్క పద్ధతి. అన్నమయ్య 32వేల సంకీర్తనలను రాసి కృతార్థుడయ్యాడని మనకు తెలుసు. ‘దాచుకో నీ పాదాలకు తగ నే చేసిన పూజలివి…’ అన్నాడు కదా ఆయన. నేను మరీ వేలకొద్దీ చెయ్యలేనుగాని, కనీసం 32 తంజావూరు చిత్రాలను వేంకటేశ్వరస్వామికి సమర్పించగలిగితే, నా జన్మ ధన్యమైనట్టే భావిస్తాను. దానిలో భాగంగానే కల్యాణ క్రమాన్ని, బ్రహ్మోత్సవాల్లో స్వామి అధిరోహించే పది రకాల రథాలు, పది అవతారాలను చిత్రించి సమర్పించాను. చివరి శ్వాస వరకూ చిత్రిస్తూనే ఉంటాను.”

వీటికి కాస్త చోటిస్తే….
నందమూరి లతారాణి రత్నశాస్త్రాన్ని బాగా చదువుకున్నారు. భారతీయ హస్తకళలంటే ఆమెకు చాలా గౌరవం. తెలుగులోగిళ్లలో వాటికి తగినంత చోటు కల్పించాలన్న ఉద్దేశంతో విజయవాడలో కొన్నాళ్లు ‘కళావర్షిణి’ అన్న షోరూమ్‌ను నడిపారు. ‘రోజ్‌వుడ్ ఇన్‌లే, తంజావూరు పెయింటింగ్స్, రాజస్థానీ మార్బుల్ ఆర్ట్, శాండల్‌వుడ్ కార్వింగ్… ఇవి ఐదూ మన దేశంలో శతాబ్దాలుగా విలసిల్లుతున్న సంపదలు. మైసూర్ మహారాజ భవనం కానివ్వండి, రాజస్థాన్ కోటలు కానివ్వండి – ఎక్కడైనా ఈ ఐదు హస్తకళలూ తప్పక కొలువుదీరి కనిపిస్తాయి. కాని ఇప్పుడందరూ వాటిని నిర్లక్షం చేస్తున్నారు. ఎప్పుడో ఒకసారి ధరించే నగలకు ఖర్చుపెడతారు తప్ప, ఫర్నిచర్‌కు పెట్టరు. నగ ల్లాగా ఈ కళాకృతులు కూడా హోదాకు చిహ్నాలే అని గుర్తించాలి. ఆర్థిక స్థాయిని బట్టి కుదిరితే పెద్దపెద్దవి, లేకపోతే కనీసం చిన్నచిన్న కళాకృతులనైనా ప్రతి ఇంట్లోనూ పెట్టుకుంటే – ఆ కళలను, వాటిని రూపొందించే కళాకారులను మనం కాపాడుకున్నట్టే కదా…’ అంటున్నారు లతారాణి.

 

Posted in సేకరణలు | Tagged | Leave a comment

మా తాత రోజుకో కథ రాయించేవారు :కృష్ణశాస్త్రి

మా తాత రోజుకో కథ రాయించేవారు :కృష్ణశాస్త్రి

దేవులపల్లి కృష్ణశాస్త్రి అనగానే భావకవిగా సుపరిచితులైన ఒకనాటి కృష్ణశాస్త్రి గుర్తొస్తారు. ఆయన మనవడి పేరు కూడా అదే. తన రెండో నవల ‘జంప్ కట్’ ఆవిష్కరణ సందర్భంగా హైదరాబాద్ వచ్చిన కృష్ణశాస్త్రితో ‘నవ్య’ సంభాషించింది.

-మీది బంగారు బాల్యం అనుకుంటాను….
అక్షరాలా అంతే. మా తాతగారి కోసం ఎంతోమంది రచయితలు, కవులు, సినిమారంగంలోని వ్యక్తులు వచ్చిపోతూ ఉండేవారు. మా నాన్న బుజ్జాయి బొమ్మలేసేవారు. ఆయన కోసం వచ్చే స్నేహితులు, పరిచయస్తులు… అదంతా ఇంకో లోకం. వాళ్లందరి గురించి తెలుసుకోవడం, వారి సంభాషణలను వినడం, అలవాట్లను పరిశీలించడం – ఇవే పెద్ద చదువులాగా ఉండేది. అసలు స్కూలుకెళ్లి నేర్చుకునేదేముంది అనిపించేది. మా తాతగారు కూడా అలానే అనేవారు. అలాంటి ఉద్దేశంతోనే మా నాన్నను ఆయన బడికే పంపలేదు. నన్ను కూడా బడికి పంపొద్దనుకుంటే మా అమ్మ ఊరుకోలేదు. మా అమ్మ పేరు లక్ష్మి. ఆమె భోగరాజు పట్టాభిసీతారామయ్య గారి మునిమనవరాలు. మొత్తానికి మా ఇంట్లో వాతావరణం చాలా స్వేచ్ఛగా, ప్రజాస్వామికంగా ఉండేది. పెద్దాచిన్నా అంతరాలేమీ లేకుండా పిల్లలు ఏదైనా ప్రశ్నించగలిగేలా ఉండేది.

-తాతగారితో మీ అనుబంధం ఎలా ఉండేది?
భలే గొప్పగా ఉండేది.. ఉదాహరణకు ఆయన ఏదైనా మ్యూజిక్ డిస్కషన్‌కు వెళుతున్నారనుకోండి, ఇంట్లో చెప్పాపెట్టకుండా ఆయన కారెక్కేసి నేను కూడా వెళ్లిపోయేవాణ్ని. అది మా అమ్మకు తెలియకుండా ఆయనే మేనేజ్ చేసేవారు. అలాగే స్కూలుకెళ్లే సమయానికి ఎక్కడ దాక్కోవాలో తెలియక కంగారు పడుతుంటే మా తాతగారే ఏ మంచం కిందకో దూరిపొమ్మని చెప్పేవారు. మా అమ్మ వెతుక్కుంటూ వస్తే, ఆయన దానిమీదే కూర్చుని ‘వాడిక్కడ లేడు. ఎక్కడున్నాడో వెతకాలి…’ అని ఆమెను పంపించేసేవారు. ఎంత వయసు వచ్చినా ఆయన ఇరవయ్యేళ్ల యువకుడిలాగా ఉత్సాహంతో తుళ్లిపడుతూ ఉండేవారు.

-మీ అల్లరికి ఆయన సాయం వచ్చేవారన్నమాట..
అసలు మా తాతగారే చాలా అల్లరి మనిషి. నాకు ఊహ తెలిసేనాటికే మా తాతగారికి గొంతు పోయింది. దాంతో అన్నీ రాసి చూపెట్టేవారు. ఆయన అల్లరికి ఉదాహరణ చెబుతా చూడండి. ఒకసారి ‘మా సినిమాకు పాట రాయండి’ అంటూ ఎవరో వచ్చారు. మా తాత ‘వాడి మొహం నాకు నచ్చలేదు. నేను పాట రాయనని చెప్పు’ అని కాగిత ం మీద రాసి మాకు చూపెట్టారు. మేం ఆ మాట అవతలివాళ్లకు చెప్పలేం కదా? అందుకని, ‘తాతగారికి ఇవాళ వేరే పనులున్నాయట. మిమ్మల్ని రేపు రమ్మంటున్నారు’ అని అవస్థ పడుతూ చెప్పేవాళ్లం. అంతలోనే తాతగారు కాగితం తీసుకుని ‘అదేమిటి అలా చెబుతున్నావు? నాకు వాడి వె ధవ మొహం నచ్చలేదని చెప్పానుగా. అదే చెప్పు. వాడు ఎన్నిసార్లొచ్చినా నేను పాట రాయను…’ అని రాసేవారు. అది చదవగానే మాకు నవ్వొచ్చేసేది. దాన్ని దాచుకుని ‘అబ్బే ఏం లేదండి, రేపు కాదట, వచ్చే వారం రమ్మంటున్నారు…’ అని ఏదో సర్దిచెప్పి పంపించేవాళ్లం. మా తాతగారి అల్లరే నాకూ వచ్చింది. నాకిప్పుడు యాభై ఏళ్లు వస్తున్నా నాలోపల ఆరేళ్ల పసిపిల్లాడు అలాగే ఉన్నాడు. దాంతోనే అనుకుంటా, నేను పిల్లల బొమ్మల చిత్రకారుడిగా బాగా రాణించాను.

– మీ రచనా వ్యాసంగం ఎలా మొదలయింది?
వేసవి సెలవుల్లో మేం ఎండలో తిరక్కూడదని మా తాత మమ్మల్ని రోజుకో కథ రాయమనేవారు. అప్పటికే విన్నవైనా, లేదా కొత్తగా ఆలోచించినవైనా, మా మాటల్లో, మాకు నచ్చినట్టు రాయాలి. అలా ముప్ఫై రోజుల్లో ముఫ్పై రాసేవాళ్లం, నేను, నా ఇద్దరక్కచెల్లెళ్లు కూడా. బహుశా నా రచనకు బీజం అక్కడ పడిందనుకుంటాను.

– కానీ నవలారచయితగా చాలా ఆలస్యంగా వచ్చారు. ఎందుకలా?
నవలలు రాసి బతకడం కష్టం. రచన జీవనాధారం కాలేదు. జీవితంలో బాగా స్థిరపడ్డాక ఇంగ్లీష్‌లో నవలలు రాయడం మొదలెట్టాను. మరొకటి కూడా ఉంది. మా తాతగారి పేరే నాకు పెట్టారు. నాకు అది అదృష్టమేగాని ఆయన పాలిట అది దురదృష్టం కాకూడదు కదా. అందుకని నా మీద నాకు నమ్మకం వచ్చాక రాయడం మొదలెట్టాను.

– ఇంతకీ మీరు తెలుగు మాట్లాడటమేనా, లేక….
నాకు తెలుగు రాయడం చదవడం బాగా వచ్చా రాదా అన్నదే కదా మీ ప్రశ్న. నేను పుట్టిపెరిగింది మద్రాసులోనే అయినా, మా నాన్న నన్ను వెంకటసుబ్బారావు స్కూల్లో వేశారు. అప్పట్లో ఆ ఊళ్లో చాలా స్కూళ్లు తెలుగును రెండో భాషగా బోధించేవి. వాటిలో మా స్కూలుకు మంచి పేరుంది. దాంతో నాకు తెలుగు రాయడం, చదవడం చక్కగా వచ్చు. తెలుగంత బాగా తమిళం, ఇంగ్లిష్, హిందీ కూడా వచ్చు. నా నవలలను నేనే తెలుగులోకి తీసుకురావాలని అనుకుంటున్నాను.

-మీ కొత్త నవల ‘జంప్ కట్’ గురించి కొంచెం చెప్పండి…
ఈ నవల్లో కథానాయకుడు సత్యజిత్‌రే. అతని తండ్రి రామన్ సినిమా రచయిత. పెద్దాయన ఆరోగ్యం బాగాలేదంటే చూడటానికి అమెరికా నుంచి ఇండియా వస్తాడు. తర్వాత ఏం జరిగింది, తండ్రి జీవితం గురించి అతనికెన్ని కొత్త విషయాలు తెలిశాయి… అన్నదే కథాంశం. ఈ మాట అంటే చాలామందికి కోపం రావచ్చుగాని కథ మొదలుకొని ప్రచారానికి వేసే పోస్టర్ల వరకూ అన్నీ వేరే చోటి నుంచి ఎత్తేసినవే ఉంటాయి ఎక్కువసార్లు. నా నవలలో అలాంటి సంఘటనల గురించి, అన్నిచోట్లా జరుగుతున్న మేథోచౌర్యం గురించి రాశాను. మన సినిమాల్లో ఒరిజినల్ పనిచేసేవి రెండే విభాగాలనిపిస్తుంది. ఒకటి ట్రాన్స్‌పోర్ట్, రెండోది కేటరింగ్.

– చిన్నప్పట్నుంచీ సినిమా రంగం తెలుసు మీకు, దానిపట్ల మీకు ఆసక్తి లేదా?
నాకు సినిమా రంగం పట్ల చాలా ఆసక్తి ఉంది, అవగాహన ఉంది. అందువల్లే నేను ‘జంప్ కట్’ రాయగలిగాను. ఏదైనా సినిమాకు నేను స్వయంగా రాసి దర్శకత్వం వహించాలని ఆలోచన. త్వరలోనే ఈ ఆలోచన కార్యరూపం దాలుస్తుందని అనుకుంటున్నాను.

-మీరనుకున్నవన్నీ నెరవేరాలని ఆంధ్రజ్యోతి ఆకాంక్షిస్తోంది….
థేంక్యూ. ఈ పత్రికతో మా అనుబంధం ఏనాటిదో. మా నాన్న ఆంధ్రజ్యోతిలో తొమ్మిదేళ్ల పాటు ప్రతిరోజూ కార్టూన్ వేసేవారట. దాని పేరు ‘పెత్తందారు’. తెలుగు నేలతో ఈ బంధం కొనసాగాలని ఆకాంక్షిస్తాను.

కృష్ణశాస్త్రి తొలి నవల ‘ఐస్ బోయిస్ ఇన్ బెల్ బాటమ్స్’ దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుంది. అది కొంత ఆత్మకథాత్మకంగా ఉంటుంది. ఆ పుస్తకం రెండో భాగం ‘రాలీ డేస్ అండ్ డిస్కో నైట్స్’ వచ్చే ఏడాది రాబోతోంది. మూడో భాగం కూడా రాయాలన్నది కృష్ణశాస్త్రి ఆలోచన.

అదితి

– See more at: http://www.andhrajyothy.com/node/9206#sthash.xuJWMyWn.dpuf

దేవులపల్లి కృష్ణశాస్త్రి అనగానే భావకవిగా సుపరిచితులైన ఒకనాటి కృష్ణశాస్త్రి గుర్తొస్తారు. ఆయన మనవడి పేరు కూడా అదే. తన రెండో నవల ‘జంప్ కట్’ ఆవిష్కరణ సందర్భంగా హైదరాబాద్ వచ్చిన కృష్ణశాస్త్రితో ‘నవ్య’ సంభాషించింది.

మీది బంగారు బాల్యం అనుకుంటాను….
అక్షరాలా అంతే. మా తాతగారి కోసం ఎంతోమంది రచయితలు, కవులు, సినిమారంగంలోని వ్యక్తులు వచ్చిపోతూ ఉండేవారు. మా నాన్న బుజ్జాయి బొమ్మలేసేవారు. ఆయన కోసం వచ్చే స్నేహితులు, పరిచయస్తులు… అదంతా ఇంకో లోకం. వాళ్లందరి గురించి తెలుసుకోవడం, వారి సంభాషణలను వినడం, అలవాట్లను పరిశీలించడం ఇవే పెద్ద చదువులాగా ఉండేది. అసలు స్కూలుకెళ్లి నేర్చుకునేదేముంది అనిపించేది. మా తాతగారు కూడా అలానే అనేవారు. అలాంటి ఉద్దేశంతోనే మా నాన్నను ఆయన బడికే పంపలేదు. నన్ను కూడా బడికి పంపొద్దనుకుంటే మా అమ్మ ఊరుకోలేదు. మా అమ్మ పేరు లక్ష్మి. ఆమె భోగరాజు పట్టాభిసీతారామయ్య గారి మునిమనవరాలు. మొత్తానికి మా ఇంట్లో వాతావరణం చాలా స్వేచ్ఛగా, ప్రజాస్వామికంగా ఉండేది. పెద్దాచిన్నా అంతరాలేమీ లేకుండా పిల్లలు ఏదైనా ప్రశ్నించగలిగేలా ఉండేది.

తాతగారితో మీ అనుబంధం ఎలా ఉండేది?
భలే గొప్పగా ఉండేది.. ఉదాహరణకు ఆయన ఏదైనా మ్యూజిక్ డిస్కషన్‌కు వెళుతున్నారనుకోండి, ఇంట్లో చెప్పాపెట్టకుండా ఆయన కారెక్కేసి నేను కూడా వెళ్లిపోయేవాణ్ని. అది మా అమ్మకు తెలియకుండా ఆయనే మేనేజ్ చేసేవారు. అలాగే స్కూలుకెళ్లే సమయానికి ఎక్కడ దాక్కోవాలో తెలియక కంగారు పడుతుంటే మా తాతగారే ఏ మంచం కిందకో దూరిపొమ్మని చెప్పేవారు. మా అమ్మ వెతుక్కుంటూ వస్తే, ఆయన దానిమీదే కూర్చుని ‘వాడిక్కడ లేడు. ఎక్కడున్నాడో వెతకాలి…’ అని ఆమెను పంపించేసేవారు. ఎంత వయసు వచ్చినా ఆయన ఇరవయ్యేళ్ల యువకుడిలాగా ఉత్సాహంతో తుళ్లిపడుతూ ఉండేవారు.

మీ అల్లరికి ఆయన సాయం వచ్చేవారన్నమాట..
అసలు మా తాతగారే చాలా అల్లరి మనిషి. నాకు ఊహ తెలిసేనాటికే మా తాతగారికి గొంతు పోయింది. దాంతో అన్నీ రాసి చూపెట్టేవారు. ఆయన అల్లరికి ఉదాహరణ చెబుతా చూడండి. ఒకసారి ‘మా సినిమాకు పాట రాయండి’ అంటూ ఎవరో వచ్చారు. మా తాత ‘వాడి మొహం నాకు నచ్చలేదు. నేను పాట రాయనని చెప్పు’ అని కాగిత ం మీద రాసి మాకు చూపెట్టారు. మేం ఆ మాట అవతలివాళ్లకు చెప్పలేం కదా? అందుకని, ‘తాతగారికి ఇవాళ వేరే పనులున్నాయట. మిమ్మల్ని రేపు రమ్మంటున్నారు’ అని అవస్థ పడుతూ చెప్పేవాళ్లం. అంతలోనే తాతగారు కాగితం తీసుకుని ‘అదేమిటి అలా చెబుతున్నావు? నాకు వాడి వె ధవ మొహం నచ్చలేదని చెప్పానుగా. అదే చెప్పు. వాడు ఎన్నిసార్లొచ్చినా నేను పాట రాయను…’ అని రాసేవారు. అది చదవగానే మాకు నవ్వొచ్చేసేది. దాన్ని దాచుకుని ‘అబ్బే ఏం లేదండి, రేపు కాదట, వచ్చే వారం రమ్మంటున్నారు…’ అని ఏదో సర్దిచెప్పి పంపించేవాళ్లం. మా తాతగారి అల్లరే నాకూ వచ్చింది. నాకిప్పుడు యాభై ఏళ్లు వస్తున్నా నాలోపల ఆరేళ్ల పసిపిల్లాడు అలాగే ఉన్నాడు. దాంతోనే అనుకుంటా, నేను పిల్లల బొమ్మల చిత్రకారుడిగా బాగా రాణించాను.

మీ రచనా వ్యాసంగం ఎలా మొదలయింది?
వేసవి సెలవుల్లో మేం ఎండలో తిరక్కూడదని మా తాత మమ్మల్ని రోజుకో కథ రాయమనేవారు. అప్పటికే విన్నవైనా, లేదా కొత్తగా ఆలోచించినవైనా, మా మాటల్లో, మాకు నచ్చినట్టు రాయాలి. అలా ముప్ఫై రోజుల్లో ముఫ్పై రాసేవాళ్లం, నేను, నా ఇద్దరక్కచెల్లెళ్లు కూడా. బహుశా నా రచనకు బీజం అక్కడ పడిందనుకుంటాను.

కానీ నవలారచయితగా చాలా ఆలస్యంగా వచ్చారు. ఎందుకలా?
నవలలు రాసి బతకడం కష్టం. రచన జీవనాధారం కాలేదు. జీవితంలో బాగా స్థిరపడ్డాక ఇంగ్లీష్‌లో నవలలు రాయడం మొదలెట్టాను. మరొకటి కూడా ఉంది. మా తాతగారి పేరే నాకు పెట్టారు. నాకు అది అదృష్టమేగాని ఆయన పాలిట అది దురదృష్టం కాకూడదు కదా. అందుకని నా మీద నాకు నమ్మకం వచ్చాక రాయడం మొదలెట్టాను.

ఇంతకీ మీరు తెలుగు మాట్లాడటమేనా, లేక….
నాకు తెలుగు రాయడం చదవడం బాగా వచ్చా రాదా అన్నదే కదా మీ ప్రశ్న. నేను పుట్టిపెరిగింది మద్రాసులోనే అయినా, మా నాన్న నన్ను వెంకటసుబ్బారావు స్కూల్లో వేశారు. అప్పట్లో ఆ ఊళ్లో చాలా స్కూళ్లు తెలుగును రెండో భాషగా బోధించేవి. వాటిలో మా స్కూలుకు మంచి పేరుంది. దాంతో నాకు తెలుగు రాయడం, చదవడం చక్కగా వచ్చు. తెలుగంత బాగా తమిళం, ఇంగ్లిష్, హిందీ కూడా వచ్చు. నా నవలలను నేనే తెలుగులోకి తీసుకురావాలని అనుకుంటున్నాను.

మీ కొత్త నవల ‘జంప్ కట్’ గురించి కొంచెం చెప్పండి…
ఈ నవల్లో కథానాయకుడు సత్యజిత్‌రే. అతని తండ్రి రామన్ సినిమా రచయిత. పెద్దాయన ఆరోగ్యం బాగాలేదంటే చూడటానికి అమెరికా నుంచి ఇండియా వస్తాడు. తర్వాత ఏం జరిగింది, తండ్రి జీవితం గురించి అతనికెన్ని కొత్త విషయాలు తెలిశాయి… అన్నదే కథాంశం. ఈ మాట అంటే చాలామందికి కోపం రావచ్చుగాని కథ మొదలుకొని ప్రచారానికి వేసే పోస్టర్ల వరకూ అన్నీ వేరే చోటి నుంచి ఎత్తేసినవే ఉంటాయి ఎక్కువసార్లు. నా నవలలో అలాంటి సంఘటనల గురించి, అన్నిచోట్లా జరుగుతున్న మేథోచౌర్యం గురించి రాశాను. మన సినిమాల్లో ఒరిజినల్ పనిచేసేవి రెండే విభాగాలనిపిస్తుంది. ఒకటి ట్రాన్స్‌పోర్ట్, రెండోది కేటరింగ్.

చిన్నప్పట్నుంచీ సినిమా రంగం తెలుసు మీకు, దానిపట్ల మీకు ఆసక్తి లేదా?
నాకు సినిమా రంగం పట్ల చాలా ఆసక్తి ఉంది, అవగాహన ఉంది. అందువల్లే నేను ‘జంప్ కట్’ రాయగలిగాను. ఏదైనా సినిమాకు నేను స్వయంగా రాసి దర్శకత్వం వహించాలని ఆలోచన. త్వరలోనే ఈ ఆలోచన కార్యరూపం దాలుస్తుందని అనుకుంటున్నాను.

మీరనుకున్నవన్నీ నెరవేరాలని ఆంధ్రజ్యోతి ఆకాంక్షిస్తోంది….
థేంక్యూ. ఈ పత్రికతో మా అనుబంధం ఏనాటిదో. మా నాన్న ఆంధ్రజ్యోతిలో తొమ్మిదేళ్ల పాటు ప్రతిరోజూ కార్టూన్ వేసేవారట. దాని పేరు ‘పెత్తందారు’. తెలుగు నేలతో ఈ బంధం కొనసాగాలని ఆకాంక్షిస్తాను.

కృష్ణశాస్త్రి తొలి నవల ‘ఐస్ బోయిస్ ఇన్ బెల్ బాటమ్స్’ దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుంది. అది కొంత ఆత్మకథాత్మకంగా ఉంటుంది. ఆ పుస్తకం రెండో భాగం ‘రాలీ డేస్ అండ్ డిస్కో నైట్స్’ వచ్చే ఏడాది రాబోతోంది. మూడో భాగం కూడా రాయాలన్నది కృష్ణశాస్త్రి ఆలోచన.

అదితి

 

Posted in సేకరణలు | Tagged | Leave a comment

ఆ ఎనర్జీ షాద్‌నగరే ఇచ్చింది

ఆ ఎనర్జీ షాద్‌నగరే ఇచ్చింది

‘ఎంత సంపాదించినా, ఎంత ఎదిగినా, ఎన్ని దేశాలు చుట్టొచ్చినా.. ఆహా! సొంతూరిలో దొరికే ఎనర్జీయే వేరు’ అంటాడు నిర్మాత, నటుడు బండ్ల గణేష్. తారాజువ్వలా దూసుకొచ్చిన ఈ స్టార్ ప్రొడ్యూసర్ ‘ఆంజనేయులు’,’తీన్మార్’, ‘గబ్బర్‌సింగ్’, ‘బాద్‌షా’, ‘ఇద్దరమ్మాయిలతో’ వంటి పెద్ద సినిమాలు తీసి.. సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నా.. సొంతూర్లో దొరికే గుర్తింపు, గౌరవం మరెక్కడా దొరకదు అంటున్న ఆయన.. తన ఊరైన షాద్‌నగర్ గురించి చెప్పుకొచ్చాడు ఇలా..
“అప్పుడెప్పుడో 37 ఏళ్ల క్రితం…నాకు ఊహ తెలియని వయసులో వ్యాపారరీత్యా మా నాన్న షాద్‌నగర్‌లో అడుగుపెట్టాడు. రెండు వేల కోళ్లతో పౌల్ట్రీఫామ్ తెరిచాడు. ఇప్పుడది పది లక్షలకు చేరింది. వ్యాపారం బాగా జరుగుతోంది. షాద్‌నగర్‌లో మాకో భరోసా దొరికింది. వచ్చిన కొత్తలో వ్యాపారం నడుస్తుందా? అసలు బతగ్గలమా ఇక్కడ? అని నాన్న చాలాసార్లు భయపడిన సందర్భాలు లేకపోలేదు. కాని ఒక్క ఏడాది తిరిగేలోపు మా జీవితం అద్భుతమైన మలుపు తిరిగింది. వ్యాపారంలో మేము పెట్టిన ఒక్క రూపాయి కూడా నష్టపోలేదు. నేను పుట్టింది గుంటూరు జిల్లా పొన్నూరుకు దగ్గర్లో ఉండే తెలగాయపాలెం అనే చిన్న గ్రామంలో. కాని నాకు సొంతూరు అనే బంధం షాద్‌నగర్‌తోనే ఉంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తరువాత ఆ ఊరికి రాకపోకలు పూర్తిగా తగ్గిపోయాయి. ఎప్పుడో ఒకసారి వెళ్తాం. అది కూడా తప్పనిసరి అయితేనే. నా మూలాలు ఎక్కడివైనా జీవితం ఇక్కడిది. నేను హైదరాబాద్ వచ్చి 25 ఏళ్లు అవుతోంది. వరుసగా మూడు రోజులు షాద్‌నగర్‌ను మిస్సయిన సందర్భమేదీ లేదు. అయితే, ఇప్పుడు అందరికీ తెలిసిన షాద్‌నగర్‌కు నేను చిన్నప్పుడు చూసిన షాద్‌నగర్‌కు ఎంతో తేడా ఉంది. అప్పట్లో అది కూడా సింగిల్ రోడ్ విలేజే. మహా అయితే ఊరు మొత్తం మీద ఒక కారు ఉండేదేమో.

సెలవు కోసం తపిస్తూ…
నాదంతా అల్లరి క్యారెక్టర్. అప్పుడప్పుడూ ఓ యాభై రూపాయలు కావాలంటే నాన్న జేబును వాడుకునేవాణ్ణి. నా చిన్నప్పటి నుంచే మా ఇంట్లో స్కూటర్ ఉండేది. ఇప్పటికీ గుర్తు… ఏబీకే 9543 దాని నెంబర్. అప్పుడప్పుడు నాన్నకు తెలియకుండా దానిపై తిరగడం సరదా. నాన్న పేరు నాగేశ్వరరావు. చాలా జాగర్త కలిగిన మనిషి. అమ్మ బహు నెమ్మది. ఏదైనా తప్పుచేస్తే కొట్టేవాడు నాన్న. ఫలానా విషయంలో కొడతాడు అని నాకనిపిస్తే ఆ రోజు ఆయన కంటికి చిక్కకుండా తిరిగేవాణ్ణి. పాపం.. అన్నయ్య మాత్రం దొరికిపోయేవాడు. నాన్నంటే భయమున్నా కొన్ని పనులు చేయక తప్పేదికాదు. నాకు స్కూల్ అంటే పడకపోయేది. ఎంతసేపు స్కూలుకు ఎలా డుమ్మాకొట్టాలా అనే కాన్సెప్టుతోనే బతికాను. నా తెలివినంతా దానికే ఉపయోగించేవాణ్ణి. వ్రతాలకు, పూజలకు కూడా సెలవు కావాలని తోటి విద్యార్థులను రెచ్చగొట్టి మరీ హెడ్మాస్టర్‌కు ఓ లెటర్ రాసి సెలవు సంపాదించేవాణ్ణి. కొన్నిసార్లయితే మ«ధ్యాహ్నమే ఇంటికి చెక్కేయడం అలవాటు. దారిలోనే లంచ్‌బాక్స్ తిని, నడుచుకుంటూ రావడం వల్ల సరిగ్గా స్కూల్ వదిలేసే టైమ్‌కు ఇంటికి చేరేవాణ్ణి. దాంతో ఇంట్లో వాళ్లకు నా మీద సందేహం వచ్చేది కాదు. ఇలాంటి కథలు బోలెడు!

నేను చదువుకున్నది మొగలిగిద్దలోని జిల్లాపరిషత్ స్కూల్‌లో. అది షాద్‌నగర్‌కు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ స్కూల్‌కు మంచి చరిత్ర ఉంది. ప్రొఫెసర్ హరగోపాల్, మర్రి చెన్నారెడ్డి వంటి ప్రముఖులు చదువుకున్నారందులో. అదేంటో కానీ నాకు మాత్రం అనుకున్న రేంజిలో చదువు అబ్బలేదు.

అది బీభత్సమైన ప్లాన్…
అప్పటిదాకా మొగలిగిద్ద స్కూల్లో చదువుకున్న నేను పదో తరగతికి మాత్రం షాబాద్‌కు మారాను. అక్కడ సీటు లేదంటే పైరవీలు చేసి మరీ సంపాదించుకున్నా. ఇక్కడ సార్లు చదువు మంచిగ చెప్పట్లేదని చెప్పి ఇంట్లో వాళ్లను ఒప్పించాను. కానీ, నా ఫ్రెండ్స్‌కు విషయం తెలియలేదు. అసలు సీక్రెట్ ఏంటంటే.. మొగలిగిద్దలో టెన్త్‌లో చాలామంది డీబార్ అవుతున్నారు. షాబాద్‌లో కాపీయింగ్ బాగా నడుస్తోంది. మనకు కావాల్సింది అదే కదా. అందుకే ఎవరికీ అనుమానం రాకుండా అక్కడ చేరాను. పదోతరగతి పాసయ్యాను. ఇంటర్మీడియట్ షాద్‌నగర్‌లోనే. ఆ మాత్రం చదువుకే ‘ఈ చదువు ఎప్పుడైపోద్దిరా బాబూ’ అని చాలాసార్లు అనుకున్నానంటే నమ్మండి. ఆదివారం వస్తే నాకు పండగ. స్కూల్ సెలవు కదా. మధ్యాహ్నం వరకు పౌల్ట్రీలో పనిచేసి ఆ తరువాత బయటపడేవాళ్లం. కాసేపు ఆటలు, షాద్‌నగర్‌లోనే ఓ సినిమా చూసి ఇంటికి వచ్చేవాళ్లం. మిగతా రోజుల్లో కూడా నేను ఇంట్లో ఉన్న సమయం చాలా తక్కువ. ఎప్పుడూ బయట తిరగడం అలవాటు. ఊళ్లో వినాయకుడి పండగ గ్రాండ్‌గా జరిగేది. నేను డ్యాన్సులు ఇరగదీసేవాణ్ణి. ఆ తొమ్మిది రోజులు పండగే పండగ. ఎవరూ ఇళ్లల్లో పడుకునేవాళ్లం కాదు.. మంటపాల్లోనే మకాం.

ట్రెయిన్ సరదా…
రైల్వేస్టేషన్‌లో గడపడమంటే ఇష్టం. ఎందుకంటే ట్రెయిన్‌ను చూడటం నాకో సరదా. అప్పట్లో షాద్‌నగర్ స్టేషన్‌కు ఎప్పుడో ఓ సారి ట్రైయిన్ వచ్చేది. ఎంతసేపైనా వెయిట్ చేసి దాన్ని చూసి సంబరపడేవాళ్లం. చిన్నప్పుడు చీకటి పడుతోందంటే నాకు చాలా భయం. ఆ టైమ్‌లో అమ్మ స్నానం చేయిస్తూ.. ఆ రోజంతా ఏమేం తప్పులు చేశానో గుర్తు చేసేది. గుర్తు చేస్తే ఫరవాలేదు కానీ, తప్పులన్నీ లెక్కచెబుతూ ఒక్క మగ్గు నీళ్లతో పాటు ఒక దెబ్బ వేసేది. నాన్నతో కూడా చాలాసార్లు దెబ్బలు తిన్నాను. ఒకసారి ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు 60 కిలోల మెక్కజొన్నల బస్తా ఎత్తుకున్నాను. అప్పటికీ నాన్న వద్దని మొత్తుకుంటున్నాడు. రెండడుగులు వేశానో లేదో కింద పడ్డా. నాన్న పరుగున వచ్చాడు. హమ్మయ్య కాస్త ఓదార్పు దొరుకుతుందనుకున్నా కానీ నన్ను పైకి లేపి విపరీతంగా కొట్టాడు. వద్దన్న పనిచేస్తావా అని!

అందుకే ఎన్‌సీసీ..
ఒక చదువు తప్ప ఇంకేపనైనా చేయడానికి భలే ఉత్సాహం చూపేవాణ్ణి. క్రికెట్, ఖోఖో అంటే చాలా ఆసక్తి. ఒకసారి వనపర్తిలో ‘ఖోఖో’ పోటీలు జరిగినప్పుడు బహుమతిని కూడా గెలుచుకున్నాను. నేను ఎన్‌సీసీ స్టూడెంట్‌ను కూడా. నిజానికి ఆ పోలీస్ డ్రెస్ వేసుకోవాలనే కోరికతోనే అందులో చేరాను. చదువు రాకపోవడంతో ఎంతసేపు ఏదైనా పని చేయాలని, డబ్బులు సంపాదించాలనిపించేది. తొమ్మిదేళ్లప్పుడే నాన్నతో పౌల్ట్రీ గురించి, రేట్ల గురించి మాట్లాడేవాణ్ణి. ఆయన కూడా ఓపిగ్గా అన్ని విషయాలు చెప్పేవాడు. బతుకుమార్గం మా ఊరే నేర్పించింది.

ఆ క్షణం భయమేసింది…
ఒకసారి వేసవి సెలవుల్లో స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి తోటలోకి వెళ్లాం. అందరూ బావిలో ఈత కొడుతున్నారు. నన్ను రమ్మన్నారు. నేను వద్దని చెప్పాను. అంతలోకే ఎవరో నన్ను బావిలోకి తోసేశారు. అసలు విషయం ఏంటంటే.. నాకు ఈత రాదు. నా అరుపులు, భయం చూసి మళ్లీ బయటకు తీశారు. అప్పుడు ఎంత భయమేసిందంటే చెప్పలేను. చచ్చిపోతాననుకున్నాను. ఆ సంఘటన జరిగినప్పటి నుంచి నేను వాటర్‌కు దూరంగా ఉండేవాణ్ణి. ఇప్పుడు కూడా తప్పదంటేనే బోట్ ఎక్కుతా. అయితే ఇప్పటికీ నాకు స్విమ్మింగ్ మాత్రం రాదు.

రాఖీతో…
మా ఇంట్లో ఆడపిల్లలు లేరని అమ్మ చాలాసార్లు ఏడవడం నాకు తెలుసు. అమ్మను ఓదార్చడానికి ‘నన్నే ఆడపిల్ల అనుకో అమ్మా’ అని చెబుతుండేవాణ్ణి. ఇక, రాఖీ పండగ వస్తే.. మా చిన్నాన్న కూతురు నాకు రాఖీ కట్టేది. మొదటిసారి కట్టినప్పుడే వెయ్యి రూపాయలు ఇచ్చాను. ఇప్పుడైతే లక్ష! రాఖీ పండగ నెల ముందు నుంచే ‘అన్నా బాగున్నావా? అంటూ టచ్‌లోకి వస్తుంది. మళ్లీ పండగ తరువాత ఫోన్ కట్.. ఒకట్రెండు సార్లు చెల్లిని ఏడిపిద్దామని రాఖీ పండక్కి ఇంటి దగ్గర దొరికేవాణ్ణికాదు. తను మాత్రం నేను ఎక్కడున్నా వెతికి పట్టుకునేది.

ఆ రెండు విషయాల్లో స్పెషల్
మాది ఉమ్మడి కుటుంబం. అమ్మా, నాన్న, మేం ఇద్దరం అన్నదమ్ములం. అందరం కలిసే ఉంటాం. నాకు ముగ్గురు పిల్లలు. ఒక పాప, ఇద్దరు బాబులు (కవలలు). అన్నకు ఇద్దరు పిల్లలు. దీపావళి, అయ్యప్పస్వామి పూజ…ఈ రెండు విషయాల్లో మా ఫ్యామిలీ స్పెషల్. మా చుట్టాలందరివీ పక్కపక్క ఇళ్లే. దీపావళి పండగకు మా బంధువులంతా మా ఇంటికే వస్తారు. షాద్‌నగర్‌లో ఎవరూ చేయని విధంగా దీపావళి జరుపుకుంటాం. ఆ రోజు ఖర్చుకు హద్దు ఉండదు. నేను శివభక్తున్ని. అయ్యప్పమాల వేసేటప్పుడు గురుస్వామితో పెద్ద పూజ నిర్వహిస్తాం. షాద్‌నగర్ మొత్తం మీద ఫస్ట్ పూజ మా ఇంట్లోనే జరుగుతుంది. ఊరివాళ్లంతా స్వచ్ఛందంగా వచ్చి పాల్గొంటారు. 2004లో మా గృహప్రవేశానికి చిరంజీవి రావడం వల్ల కూడా షాద్‌నగర్‌లో మా కుటుంబానికి ఒక గ్లామర్ వచ్చింది.

ఈ స్థాయికి కారణం…
నేను యాక్టర్ కావాలనే లక్ష్యంతో హైదరాబాద్ రావడం… కాస్త గుర్తింపు తెచ్చుకోవడం.. తరువాత నిర్మాతగా మారిన నా ఈ స్థాయికి కారణం కూడా మా షాద్‌నగరే అని నమ్ముతాను. షాద్‌నగర్ నాకు ఎంతో చేసింది. సినిమా పరిశ్రమలో ఇప్పటికీ బండ్ల గణేష్ అంటే షాద్‌గనర్… షాద్‌నగర్ అంటే బండ్ల గణేష్! నాకు జన్మనిచ్చింది తల్లి అయితే బతుకునిచ్చిన తల్లి షాద్‌నగర్. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నాకు ఊరటనిచ్చేది మా ఊరే. నేను ఎన్నో దేశాలు తిరిగినప్పటికీ షాద్‌నగర్‌లో దొరికిన ఎనర్జీ నాకు ఇంకెక్కడా దొరకదు”
– మయన్న
ఫోటోలు: రాజ్‌కుమార్, ఎల్. మోహన్‌రెడ్డి

వృద్ధాశ్రమం నిర్మిస్తాను..
నా సినిమాల పిచ్చి వల్ల మా ఊళ్లో సినిమా థియేటర్ కట్టుకోవాలనే కోరిక ఉండేది. అందుకే పరమేశ్వర థియేటర్ కొనుక్కున్నాను. అదొక్కటే కాదు… నేనేం చేసినా మా ఊళ్లోనే చేయాలనిపిస్తుంది. ప్రతి శనివారం మా పిల్లలు షాద్‌నగర్‌లోనే ఉంటారు. ఆ జనం, ఆ కల్చర్ మిస్ కానివ్వం. మీరు నమ్ముతారో లేదో మా అమ్మ.. మా షాద్‌నగర్ అనే ఫీలింగ్ నాది. ఇప్పుడు అమ్మనాన్నల కోరిక మేరకు ఊర్లో ఒక వృద్ధాశ్రమం కట్టించబోతున్నాను. అది కూడా అత్యాధునికంగా ఉండాలనేది నా సంకల్పం. దానికి కాస్త టైమ్ పట్టవచ్చు. ఎప్పటికైనా కచ్చితంగా కట్టి తీరతాను. దానికి ‘అమ్మానాన్న’ అన్న పేరు కూడా నిర్ణయమైపోయింది.

మా ఊరు ఇచ్చిన గిఫ్ట్ ‘పవన్’
‘సుస్వాగతం’ సినిమా నుంచే పవన్‌కల్యాణ్‌తో పరిచయం. ఆ సినిమాలో నేనూ నటించా. ఆయన ఒకసారి షాద్‌నగర్‌లో భూమి కొనడానికి నా సహాయం తీసుకున్నారు. ఆ టైమ్‌లో మా బిజినెస్‌లు అవీ చూసి ‘నిన్ను నిర్మాతను చేస్తా’నని మాటిచ్చాడు. ఆ..చెప్తార్లెండి అనుకున్నాను.. కానీ ఆయన నన్ను ఈ రేంజ్‌కు తీసుకొచ్చాడు. ‘గబ్బర్‌సింగ్’ సినిమాతో నాకో స్థాయి ఇచ్చి మార్కెట్లో నిలబెట్టాడు. నాకనిపిస్తుంది…మా ఊరే లేకపోతే పవన్‌కల్యాణ్‌తో నాకు ఇంత అనుబంధం ఏర్పడేదా? అని. షాద్‌నగరే పవన్‌ను మా వైపు నడిపించింది. అందుకే పవర్‌స్టార్‌ను నాకు షాద్‌నగర్ ఇచ్చిన గిఫ్ట్‌గా భావిస్తాను.

Posted in సేకరణలు | Tagged | Leave a comment

వందేళ్ళ ఆంధ్ర, వెయ్యేళ్ళ తెలుగు -చలసాని ప్రసాద్

వందేళ్ళ ఆంధ్ర, వెయ్యేళ్ళ తెలుగు -చలసాని ప్రసాద్

ఆంధ్ర అనే పదం కన్నా తెలుగు అనే పదమే ప్రాచీనమైనది. ఆంధ్ర అనే మాటని వాడుకలో నించి తొలగించి తెలుగు అనే మాటనే వాడాలి. అలాగే హైదరాబాద్ అనే మాటకి బదులు భాగ్యనగరం అని వాడాలి. ఈ మార్పులు వెంటనే అమలులోకి రావాలి… ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల భాగ్యనగరం పెరగలేదు. అభాగ్యుల, అనాధల, అనేకుల శ్రమ ఫలితమే మన భాగ్యనగరం.

‘ఆంధ్ర రాష్ట్రం
రాలడానికి పండుకాదు
పండడానికి కాయ కాదు
కాయడానికి పువ్వు కాదు
పూయడానికి మొగ్గ కాదు
మొగ్గడానికి తేలుకాదు
తేలడానికి పాముకాదు
పామడానికి కాలుకాదు
కాలడానికి ఖర్మ కాదు’

అని పంద్రాగస్టుకు ముందే పాడాడు శ్రీశ్రీ. ఇది ఇవాళ అక్షరాలా తెలంగాణకి వర్తిస్తుంది.
భాషాప్రయుక్త రాష్ట్రల ఏర్పాటునేమో ఆంధ్రుల దగ్గరే నేర్చు కున్నానన్నారు గాంధీగారు. మొదటి ప్రపంచయుద్ధానికి ముందే, అంటే 1913 మే 26న తొలి ఆంధ్ర మహాసభ గుంటూరు జిల్లా బాపట్లలో జరిగింది. ఈ సభకు అధ్యక్షత వహించింది సర్ బయ్యా నరసింహ శర్మ గారు. ఈయన అప్పటి వైస్రాయి కౌన్సిల్ మెంబరు. అంతేకాదు మన రావి శాస్త్రిగారి నాన్నకు సాక్షాత్తు మేనమామ. ఆనాటి నుంచీ ఆంధ్ర లోని అన్ని స్కూళ్ళలో ఆంధ్ర వారోత్సవాలు జరిగేవి. అటు తరువాత నలభైఏళ్ళకి గాని ఆంధ్రరాష్ట్రం (1953 అక్టోబర్ 1) ఏర్పడలేదు. పొట్టి శ్రీరాములు ఆత్మాహుతి వల్లనే ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. ఇది జగమెరిగిన సత్యం. పొట్టి శ్రీరాములుని పొట్టన పెట్టుకుంది నెహ్రూయేనని శ్రీ శ్రీ అన్నాడు.
ఇప్పుడు హైదరాబాద్ సమస్యలాగానే అప్పుడు మద్రాసు సమస్య తలెత్తింది. తమిళనాడు కమ్యూనిస్టు పార్టీ ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీ ఏకగ్రీవంగా మద్రాసు తమిళనాడుదే నన్నాయి. తక్కిన రాజకీయ పార్టీలు గూడ గోడమీది పిల్లి వాటంగా కప్పదాట్లు వేశాయి. మద్రాసుకీ, తిరుపతికీ పోటీ వచ్చింది. నిజానికి తిరుపతి మనది కాదు. అక్షరాలా తమిళనాడుదే. అది వైష్ణవ సంప్రదాయం. తిరు అంటే శ్రీ అని అర్థం. తిరు శబ్దం తమిళ భాష లోదే. కాళహస్తి మనది. అది వీర శైవ సంప్రదాయం.
పొట్టి శ్రీరాములు ఆత్మాహుతి తరువాత ఒక పాట ప్రచారం లోకి వచ్చింది….

‘తిరపతి కొండలు
అరవలవేనట
వెంకటేశుడు అయ్యంగారట
తెలుగన్నయ్యలూ
విన్నారా? తెలివి తెచ్చుకుని ఉన్నారా?’
ఇక్కడే ఒక ఉదంతం చెప్పాలి.

తెల్లవాడి ఏలుబడికి వ్యతిరేకంగా మన దేశంలో తీవ్రంగా పోరాడిన వారు పంజాబీలు, బెంగాలీలు, ఆంధ్రులు. వీరు ముగ్గురూ తెల్ల సింహాన్ని జూలు పుచ్చుకుని ఆడిస్తే తక్కిన వాళ్ళు దాని తోక పుచ్చుకుని వేలాడారు. అందుకే తెలుగువారు అడిగిన ఆంధ్ర రాష్ట్రం ఇవ్వకుండా అడగని ఒడిశా రాష్ట్రం (1936 ఏప్రిల్1) ఏర్పాటు జేశారు.
మన విశాఖపట్నం జిల్లాని కబళించి అందులో ఒక ముక్క, చెక్క ఒడిశాలో కలిపేశారు. గంజాం ప్రాంతాన్నీ, బరంపురం, పర్లాకిమిడినీ స్వాహా చేశారు. దీనిని నిరసిస్తూ ఆంధ్రులు కోర్టు కెళ్ళి లండన్ ప్రీవీ కౌన్సిల్ దాకా పోరాడారు. ప్రీవీ కౌన్సిల్ సభ్యులకు ఒడిశా గజపతిరాజులు లంచాలు మేపి కార్లు కొనిపెట్టి ఒడిశాకి అనుకూలంగా తీర్పు చెప్పించారు. ఇది జగమెరిగిన సత్యం. పర్లాకిమిడి ని కబళించినందుకు నిరసనగా మన ‘గిడుగు పిడుగు’ మహేంద్రతనయ నదిని దాటి పాతపట్నం వచ్చేసి పట్టుదలగా మళ్ళా అక్కడ అడుగు పెట్టలేదు. గిడుగు మరెవరో కాదు మన కాళీపట్నం రామారావుగారి నాన్నకి మేనమామ.

మళ్ళీ వెనక్కి వెళదాం. ఆంధ్రరాష్ట్రం ఏర్పడ్డాక రాజధాని విజయవాడ అని అందరూ అనుకున్నారు. కానీ అప్పుడది కమ్యూనిస్టు పార్టీకి కంచుకోట. అక్కడి నుంచి హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ అంటే మన సరోజినీ నాయుడు తమ్ముడు కమ్యూనిస్టుల తోడ్పాటుతో లోక్ సభకి ఎన్నికయ్యాడు. తొలి జనరల్ ఎన్నికల్లో కృష్ణాజిల్లాలో కాంగ్రెస్‌కి చావుతప్పి కన్ను లొట్ట పోయింది. అసెంబ్లీ సీట్లన్నీ కమ్యూనిస్టు పార్టీ గెల్చుకుంది. కాంగ్రెసు ఒంటికాయ శొంఠికొమ్ము లాగా ఒకే ఒక్క సీటు గెలుచుకుంది.
సంజీవరెడ్డికి కమ్యూనిస్టులంటేనే కడుపు మంట. అంతేకాదు. ఒకసారి ‘కమ్యూనిస్టులని పాతి పెట్టాలని’ ఒక పత్రికా ప్రకటననిచ్చాడు. ‘వర్షం పడితే మంచి పంటలు పండుతాయని’ శ్రీశ్రీ అప్పుడే చమత్కరించాడు. ఈ కారణాల వలన రాష్ట్ర రాజధానిని కర్నూలుకు తీసికెళ్ళాడు. అంతేకాదు అప్పుడు బళ్ళారి జిల్లాలో హాలహర్వి సీతారామిరెడ్డి అని ఒక కాంగ్రెస్ నాయకుడు ఉండే వాడు. ఆయన నెహ్రూగారికి అత్యంత సన్నిహితుడు. రాష్ట్ర రాజకీయాలలో ఏనాటికయినా తనకి గట్టి పోటీ అవుతాడేమోననే అనుమానంతో బళ్ళారి జిల్లాని బెంగళూరుకి ధారాదత్తం చేశాడు. ఈ పాపం సంజీవరెడ్డిదే. గజపతిరాజులు పర్లాకిమిడిని మింగితే సంజీవరెడ్డి రాయలసీమను చీల్చాడు.

ఇప్పుడు మన రాష్ట్ర రాజకీయ చరిత్ర అంతా చిందరవందరగా ఉంది. తమిళనాడులాగా మన రాష్ట్రాన్ని కూడా 1956లో తెలుగునాడు అంటే బాగుండేది. ‘విశాలాంధ్రలో ప్రజారాజ్యం’ అని సుందరయ్య గారు రాసిన పుస్తకం 1946లో వేల కాపీలు అమ్ముడు పోయింది. విశాలాంధ్ర అనే మాటను కమ్యూనిస్టులు కామన్ చేశారు గనక సంజీవరెడ్డి ఆ మాట వాడకుండా ఆంధ్రప్రదేశ్ అన్నాడు.
ఆంధ్ర అనే పదం కన్నా తెలుగు అనే పదమే ప్రాచీనమైనది. కనక ఆంధ్ర అనే మాటని వాడుకలో నించి తొలగించి తెలుగు అనే మాటనే వాడాలి. అలాగే హైదరాబాద్ అనే మాటకి బదులు భాగ్యనగరం అని వాడాలి. ఈ మార్పులు వెంటనే అమలులోకి రావాలి. పరిసర ప్రాంతాలు చాలా పురాతనమైనవి. అక్కడి రాళ్ళు హిమాలయాల కన్న ప్రాచీనమైనవని విదేశీ పరిశీలకులు కొందరు తేల్చారు. ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల భాగ్యనగర ంపెరగలేదు. అభాగ్యుల, అనాధల, అనేకుల శ్రమ ఫలితమే మన భాగ్యనగరం.
పేర్ల మార్పులు వెంటనే జరగాలి. ఆంధ్ర, హైదరాబాద్ అనే మాటల బదులు తెలుగు, భాగ్యనగరం అమలులోకిరావాలి. తెలంగాణ రాష్ట్రం సూర్యబింబం లాగా వెలగాలి. రాయలసీమ పేరు అలాగే ఉండాలి. పదహారు జిల్లాలు కోస్తా సీమగా వెలుగొందాలి. ఆంధ్ర అనే పదం పనికి రాదు కనుక విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలని ఉమ్మడిగా కళింగ సీమ అనాలి. మధు రాంతకం రాజారాం ఒకసారి ఒక మాటన్నారు: ‘తిరుపతిలో ఉన్న తెలుగు వాడికి తెనాలి నుంచి అటువైపుదంతా ఉత్తరాంధ్ర లాగానే అనిపిస్తుంది’. కనక కళింగ సీమ అనడం సరయినది.

తెలంగాణ వేరు పడ్డాక తక్కిన ప్రాంతాలకి బెజవాడే రాజధాని. దాన్ని విజయవాడ అనడం కూడా తప్పే. అటు ఇంగ్లీషు వ్యామోహం, ఇటు సంస్కృత వ్యామోహం ఇన్నాళ్లుగా మనని పట్టి పల్లారుస్తున్నాయి. వీటి పీడని వీలైనంత త్వరలో వదిలించుకోవాలి.
బెజవాడ రాజధానిగా కోస్తా సీమ రాష్ట్రం నెలకొనాలి. రాజధానికి బెజవాడలో చాలా వనరులున్నాయి. కనక దుర్గమ్మ వారధి దాటాక ఎపిఎస్‌పి బెటాలియన్ కు చెందిన 200 ఎకరాల ఫైరింగ్ రేంజ్; ఉడా పరిధిలో 200 ఎకరాలు; నాగార్జున యూనివర్శిటీలో 200 ఎకరాలు. యూనివర్సిటీ ఎదురుగా వేల అపార్టుమెంట్లు తయారగా ఉన్నాయి గవర్నమెంటు అధికారుల క్వార్టర్సు కోసం; కొండపల్లిలో వందలాది ఎకరాలు ఉన్నాయి (గవర్నమెంటువి); నూజివీడులో 3000 ఎకరాలున్నాయి-గవర్నమెంటువి. అవసరమయితే నాగార్జున విశ్వవిద్యాలయాన్ని ఒంగోలుకి తరలించవచ్చు .

‘ఇంటెలిజెంటిల్ మెన్ అంతా
గుంటూరుపురంలోనే వుంటారని
కొందరంటారు
కాదని వాదుకొస్తే తంతారు
ఎందుకు బ్రదర్ మనకీ తంటాలు? ‘
కనక బెజవాడ రాజధానిగా గుంటూరులో హైకోర్టు పెట్టి వెంటనే తెలుగు సీమ రాష్ట్రాన్ని తక్షణం ఏర్పాటు చేయాలి.

-చలసాని ప్రసాద్

Posted in సేకరణలు | Tagged | Leave a comment

శ్రీ దేవి భండాసుర వధ లో అంత రార్ధం -8(చివరి భాగం )

శ్రీ దేవి భండాసుర వధ లో అంత రార్ధం -8(చివరి భాగం )

‘’కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ భండాసుర శూన్యకా –బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్తుభ వైభవా ‘’

ఈ సంసారం నిస్సారం అని అర్ధం అవటానికి కామేశ్వరుని కృప కావాలి .శూన్యం సంపూర్ణం గా కనీ పిస్తుంది అప్పుడే .కామ దేవుడు మన్మధుడిని క్షణం లో భస్మం చేసిన అస్త్రం కామేశ్వరుడి దగ్గరే ఉంది  ఆ అస్త్రమే భండాసురుడిని ,వాడి శూన్యక నగరాన్నీ భస్మీ పటలం చేసింది  మనసులో ఏ కోరికా లేనప్పుడు ప్రా పంచిక సుఖాల శూన్యత్వం దానంతటికి అది బయట పడుతుంది .మాయ ,మొహం మమత ,అనే అందమైన వల క్షణం లో ముక్కలై పోతుంది .

కామేశ్వరుడైన  మాహా శివుడి ఈ విజయం తో ఏంతో  సంతోషించిన బ్రహ్మ ,విష్ణు మహేన్ద్రులు ఆయననను ప్రస్తుతించారు .ఆత్మ వైభవ మహత్తు ను తెలుసుకొని దేవతలంతా పరమేశ్వరీ పరమేశ్వరులను పరమ పురుష ,పరా ప్రక్రుతులను ముక్త కంఠం తో ప్రస్తుతి చేశారు .త్రుటిలో భస్మమైన కామ దేవుడిని కరుణామయి అయిన అమ్మ సహించలేక కరుణ తో అతని భార్య రతీ దేవి విలాపాన్ని విని సహించలేక పోయింది .స్త్రీ ,పురుషులను మానవతను మమత ,అనురాగాల తో బంధించే మంగళ కరమైన కామాన్ని లోకానికి అవసరం అని భావించింది అంతే క్షణం లో దయతో అమ్మ మన్మధుడిని పునర్జీవితుడిని చేసింది ఆమె ధర్మ సంవర్ధిని .కనుక కఠిన హృదయం తో కామేశు డు చేసిన కామ దహనాన్ని ,పొరబాటును సరి దిద్దింది .ధార్మిక భూమి మీద విశుద్ధమైన మమత ,ప్రేమ అనురాగాలు వర్ధిల్లాలని కామేశ్వరి సంకల్పం అందుకే మన్మధుడికి బతుకు నిచ్చింది

నిజానికి కాముడు కూడా అమ్మ సృష్టి లోని వాడే కదా .అందుకే స్రష్ట కు సృష్టి మీద సహజం గా అనురాగం ఉంటుంది ఆ అనురాగమే ఇక్కడ కాముని జీవితానికి సహాయ పడింది తండ్రి -కొడుకు పై కోపం ప్రకటిస్తే తల్లి సర్ది చెప్పటం లోకం లో మనం చూస్తూనే ఉన్నాం .’’అశరీర రూపం ‘’లోకాముడిని  కామేశ్వరి సృష్టించి అతని చాయను అందరి హృదయాలలో ప్రతిష్టించింది ఇది కామునికే కాదు సకల చరాచర ప్రాణి కోటి కీ అవసరమైన ధార్మిక భావం సహజం గా ‘’తీయని ఆకలితో’’ కామ వాసన అందరిలో మేల్కొనే ఉంటుంది .దాన్ని పరమేశ్వరి ప్రసాదం గా భావించి ధర్మ సమ్మితం గా సేవిస్తే అది దేవి ఆరాధనే అవుతుంది .ఈ విషయాన్నే తరువాతి శ్లోక పాదం తెలియ జేస్తోంది

‘’హర నేత్రాగ్ని సందగ్ధ కామసంజీవ నౌషధిహ్ ‘’

పరమేశ్వరి నామాలలో ప్రతిదీ ప్రాణ శక్తితో  ఉంటుంది కామ దేవుడిని బూడిద రాసి చేసిన కామేశ్వరుడిని ‘’హర ‘’శబ్దం చక్కగా వ్యక్తం చేసింది .అంతటినీ హరించే వాడు హరుడు ప్రజాపతి చేసిన సృష్టిలో ఆహితమైంది ,అనవసర మైంది ,అశోభన మైంది అంతా నశింప జేయటమే శంకరుని పని .అందుకే హర శబ్దం వాడారు .హరుని మూడవ కన్ను మంట కాముడిని కాల్చింది .ఈ మూడో కన్ను మనందరి లోను ఉంటుందని గ్రహించాలి .లలాటం లో ఉన్న ఈ మూడో కన్ను లోపలి చూపును కలిగి ఆనందాన్ని పొందుతుంది .ఈ కన్ను తెరుచుకొంటే అంధకారం అంతా పటా పంచలై వెలుగు పరచుకొంటుంది .అజ్ఞానం స్తానాన్ని జ్ఞానం ఆక్రమిస్తుంది .ఆత్మ తత్త్వం బోధ పడుతుంది .అప్పుడు జ్ఞాని జీన్ముముక్తుడౌతాడు .ఈ జీవన్ముక్త దశ వైపు ఈ నామం సూచిస్తుందని భావం .పరమేశ్వరుడు ముక్తి దాత .పరమేశ్వరి ఈ ముక్తి ప్రయోజనాన్ని సమస్త ప్రపంచానికి అందిస్తుంది .’’వినాశం లోనే వికాస బీజం ఉంది ‘’అని గ్రహించాలి .కామ వాసన కామిని వినాశనం వైపు లాక్కేడుతుంది .అమ్మ వాడిని కామేశుని వికాసం వైపుకు తీసుకొని వెడుతుంది ఇదే పరమేశ్వరి నామం లో ఉన్న రహస్యార్ధం అని  మహా వ్యాఖ్యాన కర్త స్వర్గీయ ఇల పావులూరి పాండురంగా రావు గారు వ్యాఖ్యానించి చెప్పిన దానినే మీకు అంద జేశాను .అందరికి ఆ పరమేశ్వరీ కటాక్షం లభించాలని ఈ దసరా సందర్భం గా కోరుతున్నాను

సంపూర్ణం

వీలు వెంట శ్రీ లలితా సహస్ర నామాలలో ‘’శ్రీదేవి  దివ్య శరీర త్రికూట రహస్యం ‘’అంద జేస్తాను

శ్రీ దుర్గాష్టమి శుభాకాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -12-10-13-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ బాపు గారి నుంచి దసరా కానుక

శ్రీ బాపు గారి నుంచి దసరా కానుక
 
కొద్దిరోజుల క్రితం బాపు గారు ఫోన్ చేసి మీ హాలు గోడ పెద్దదేనా?
అని అడిగితే విషయం అర్ధం కాలేదు.
కలంకారీ వారికి దశావతారాలు చిత్రించాను, మీకు కూడా పంపిస్తాను అన్నారు.
దసరా పండుగకి మా హాల్లో వేలాడుతున్న కళాఖండం యిదే.
 
గబ్బిట కృష్ణమోహన్         

 

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసుడు డి .వి ంఒహన కృష్ణ అంత రంగం

d.v.mohana krishna -1a d.v.mohana krishna -2

ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసుడు డి .వి ంఒహన కృష్ణ అంత రంగం

 

Posted in సేకరణలు | Tagged | Leave a comment

శ్రీ దేవి భండా సుర వధ లో అంత రార్ధం -7

శ్రీ దేవి  భండా సుర వధ లో అంత రార్ధం -7

‘’కరాంగులి నఖోత్పన్న నారాయణ దశాక్రుతిహ్-మహా  పాశుపతాస్త్రాగ్ని నిర్ధగ్ధాసుర సైనికా ‘’

పరమేశ్వరి సృష్టి అతి విచిత్రం గా ఉంటుంది ఆమె చేతుల పది వేళ్ళలో నారాయణుని పది రూపాలుఅయిన మత్స ,కూర్మ వరాహాదులుదేవి చేతి గోళ్ళ నుండే ఉత్పన్నమవుతాయి  మానవ శరీరం దేవి గృహమే .అందువల్ల ఆ శరీరం లో ప్రతి అణువు దేవి కాంతి తో నిండి ఉంటుంది .ఆధ్యాత్మిక దృష్టిలో చూసినా మనిషిచేయి  అన్నిటి  కంటే ఉత్క్రుస్టమైనది. చేతులతోనే పరమాత్మ ను పూజిస్తాం తినటం త్రాగటం పని చేయటం అన్నీ వాటితోనే అంతేకాక ఇవ్వటం తీసుకోవటం భయపెట్టటం బెదిరించటం ఆశీర్వదించటం అభయమివ్వటం మొదలైన వాటికి చేతులే ముఖ్యాంగాలు .మన చేతి అగ్రభాగం లో లక్ష్మీ దేవి ,మధ్య భాగం లో సరస్వతీ దేవి ,మూల భాగం లో మాహేశ్వరి కాపురముంటారని చెబుతారు ‘’కరాగ్రే వసతే లక్ష్మీ- కరమధ్యే సరస్వతి- కర మూలేతు శర్వాణీ(గోవిందః )ప్రభాతే కర దర్శనం ‘’అని నిద్ర లేవ గానే మన చేయిని చూసుకొంటాం

జంతువులన్నిటికి చేతులున్నా మనిషి చేతులకే ప్రత్యేకతలున్నాయి కర్మలు చేయటం తో పాటు ఇవి మనస్వితకు కూడా ఉప యోగ పడతాయి .చేతిని,అరచేతిని  తిప్పటం లోనే మనిషి వ్యక్తిత్వం బయట పడుతుంది .ఏ వ్యక్తీ చేతిలో ఎంత పవిత్రత, మనస్విత  ,మధురిమ ఉంటాయో అతని వ్యక్తిత్వం అంత దివ్యమైనదిగా భావిస్తారు .మహేశ్వరి దివ్య హస్తం వరద హస్తమై లోకోత్తర భవ్యత ,దివ్యత ల తో నిండి ఉంటుంది .అందుకే ఆమె చేతి వేళ్ళగోళ్ళనుండే సమస్త చరాచర సృష్టి పుడుతుంది .ఆమె శక్తి ముందు మిగిలిన వేవీ సమానం కావు .

భౌతిక ద్రుష్టి లో  ప్రపంచం లోని ప్రతి ప్రాణీ పశువే .కాని ఆధ్యాత్మిక దృష్టిలో అతడే పశుపతి నాధుడు కూడా .పశుపతి దయ వల్లనే మనిషి ఆలోచించటం ప్రారంబించి తనను తాను  తెలుసుకొంటాడు .. –తనలో పశుపతి భావనను సాక్షాత్కారింప జేసుకొంటాడు .ఈ హిరణ్మయ చేతన అ నుభవం లోకి రాగానే అప్పుడు అజ్ఞానం అంతా తొలగి పోతుంది .నిజమైన జ్ఞానోదయమవుతుంది

భండాసుర సైన్యం అంతా పాశుపతాస్త్ర ప్రయోగం తో సర్వ నాశనమవుతుంది వాడి సారహీన నగరాన్ని ఆ జ్వాలలతో భస్మీపటలం చేస్తుంది శర్వాణి .వాడి మహా నగరం పేరే‘’శూన్య క నగరం ‘’అంటే నగర వైభవం అంతా శూన్యం అన్న మాట .అందులో తత్త్వం అనేది లేదని సారాంశం .భవనాలు సింహాసనాలు అధికారం భోగం వంటివి మనిషిని అమరుడిని చేయలేవు .దీన్ని ఇచ్చేది వాడి ఆత్మ జ్ఞానమే .దీనికి తోడూ బ్రహ్మ భావనా .దానిలోనే ఆనందం ఉంది .ప్రపంచం లోని సర్వ వస్తు సముదాయమూ శూన్యమే .సర్వాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడన్న ఎరుకయే అసలైన ప్రపంచసారం .ఇది సర్వ సంపూర్ణం .దీనికి బయటి సాధనాలు ఉపకరణాలు పని చెయ్యవు .’’అంటే శూన్యం నుంచి పూర్ణం ‘’వైపుకు ఆధ్యాత్మిక ప్రయాణం సాగాలి అని పరమార్ధం .

సశేషం

మూలా నక్షత్ర యుక్త సరస్వతీ పూజ శుభా కాంక్షలు

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -11-10-13- ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

సర్వ వర్నోప శోభితే -పద్యాలు మరియు బంధ పద్య చిత్రాలు —మూసీ -అక్టోబర్

pbandha padya chitraalu -1 pbandha padya chitraalu -2 pbandha padya chitraalu -3 sarva varnopa shobhitha

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సరస భారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు 52 వ సమావెశం –

                   అక్షరం లోక రక్షకం

                   సరస భారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు

                 52 వ సమావెశం – 

   శ్రీ పానుగంటి వారి సాక్షి వ్యాసాలపై ప్రసంగం 

                 మరియు  శ్రీ మతి డొక్కా సీతమ్మ గారి స్మారక స్కాలర్ షిప్ ల ప్రదానం

దసరా శుభాకాంక్షలతో ….. ఆహ్వానం

        తేది: సమయం –22-10-13 – మంగళ వారం సాయంత్రం – 6-30 గం లకు

        వేదిక ———-శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం –మహిత మందిరం

        ముఖ్య అతిధి ,వక్త ————శ్రీ గుంటక వేణు గోపాల రెడ్డి  ఏం .ఏ.,ఏం .ఫిల్.   

                                          సరసభారతి ఉపాధ్యక్షులు ,స్థానిక  ఏ.జి.అండ్ ఎస్.జి.సిద్దార్ధ కళాశాల -తెలుగుఅధ్యాపకులు ,పానుగంటి వారి సాక్షి వ్యాసాల పరిశోధకులు

        విషయం —–శ్రీ పానుగంటి లక్ష్మీ నరసింహా రావు గారి ‘’సాక్షి వ్యాసాల విశిష్టతపై  ప్రసంగం

          ఆత్మీయ అతిధి –శ్రీ కోసూరు ఆదినారాయణ రావు –విశ్రాంత ప్రధానోపాధ్యాయులు –కోసూరు

              

                ప్రసంగానంతరం   ఈ సంవత్సరం పదవ తరగతి చదువుతున్న పేద ప్రతిభా వంతు లైన ఆరుగురు విద్యార్ధులకు  ‘’నిరతాన్న దాత ,అపర అన్నపూర్ణ శ్రీ మతి డొక్కా సీతమ్మ గారి              

                  జ్ఞాపకార్ధం వారి మనుమడు శ్రీ డొక్కా రామ తీర్ధ గారు(యు.ఎస్.ఏ.) ఏర్పరచిన ఉప          కార వేతనాల(స్కాలర్షిప్ ల) ప్రదానం.

                     ఉపకార వేతనాలను అందుకొనే విద్యార్ధులు –

                 ఫ్లోరా హైస్కూల్ –1- వి గాయత్రీ గ్రీష్మ -2-ఏం విజయ కుమార్

                 వి.ఆర్.కే.ఏం .హైస్కూల్ —1-డి.వీరమ్మ -2-సి హెచ్. భారత్ కుమార్

                 అమర వాణి  హైస్కూల్ —–1-ఆర్ .కుముద -2-ఎస్.కే.జుబేర్

                 ఈ కార్యక్రమానికి సాహితీ ప్రియులందరూ విచ్చేసి జయ ప్రదం చేయ ప్రార్ధన

 

జోశ్యుల శ్యామలా దేవి– మాది రాజు శివ లక్ష్మి–గబ్బిట వెంకట రమణ –గబ్బిటదుర్గా ప్రసాద్

గౌరవాధ్యక్షులు              కార్య దర్శి                కోశాధికారి          అధ్యక్షులు –సరసభారతి

                                                          9989066375 ,                                                                                                     08676-232797                                                                                                                                                                                                                                                                                      – తెలుగులో మాట్లాడటం మనజన్మ హక్కు –

అందరికి దసరా శుభా కాంక్షలులు

ఉయ్యూరు -11-10-13

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

శ్రీ దేవి భండాసుర వధ లో అంత రార్ధం -6

  శ్రీ దేవి భండాసుర వధ లో అంత రార్ధం -6

విషంగుడి సోదరుడే విశుక్రుడు .శుక్రుడు మనిషి తేజస్సుకు ,ఓజస్సుకు ,ప్రకాశానికి ప్రతీక .’’శుక్రమసి తేజోసి ‘’అని అనే దానిలో పరమేశ్వరి ఈ సంకేత నామం తోనే లభిస్తుంది .కొందరు దీన్ని సద్వినియోగం చేసుకొంటే కొందరు దుర్వినియోగం చేసుకొని చేటు తెచ్చుకొంటారు .కేవలం సుఖ భోగాలకే శుక్రత్వాన్ని ఉపయోగించే వాళ్ళు పార లౌకిక జ్ఞానం పొందలేరు .విశుక్రుడు ఇలాంటి విషయా సక్తుడు .అతని శక్తి పరాక్రమాలను హరించే శక్తి పేరే వారాహి .వరాహ శబ్దం శ్రేష్ట వాచకమే వరాహ లాంచనులు వరాహ ధ్వజాన్ని ధరించే వారూ ఉన్నారు .’’దేన్నీ నాశనం చేయ వీలు లేదో అదే అహం ‘’.ఇలాంటి అక్షయ తత్వాలలోవిశిష్టమైన యుక్తి పేరే వారాహి .విశుక్రుడు నశ్వర సుఖ లాలసుడైతే ,వారాహి అవిననిశ్వర  ,అక్షయ ,అలౌకిక ఆనంద సంధాయిని  .వారాహి చేసిన ఈ కార్యానికి ఆమె వీర్య ,పరాక్రమాలకు  దేవి ప్రసన్ను రాలైంది ఇలా వారాహి విశుక్రుని విషయ లాలసను నాశనం చేసిన్దన్నమాట .ఈ రకం గా మంత్రిణి వారాహిచేసిన విషంగ ,విశుక్ర వధ చెడు తత్వాల నాశనానికి ,సత్ప్రేరణ కు దారి తీసింది

అన్ని అడ్డంకులు తొలగి పోయిన తర్వాత పరమేశ్వరి పరమ శివుని చూసి శ్రీ గణేశుని సృష్టిస్తుంది .ఈ ఆనంద  సమయం లో పరమాందం పొందిన శివుడు కూడా ప్రసన్నుడవుతాడు .వారిద్దరి చూపులు కలిశాయి .అంతే అప్పుడు వెంటనే గణేశుడు వారి ముందు ప్రత్యక్ష మైనాడు వినాయకుడు కుమారస్వామి ఇద్దరు పార్వతీ పరమేశ్వరుల పుత్రులే .సుబ్రహ్మణ్యుడు శివ కుమారుడు .గణపతి పార్వతీ నందనుడు .దీన్నే తులసీ దాస భక్త కవి ‘’శంకర సువన్ భవానీ నందన్ ‘’అని వర్ణించాడు .అంటే ఇందులోని పరమార్ధాన్ని గోస్వామి గ్రహించి మనకు తెలిపాడన్న మాట .కుమార స్వామి జననం కోసం శివుడి వీర్యం అవసర మైంది కాని గణేశ జననం కోసం మహేశ్వరి మహా సంకల్పమే సరి పోయింది మహేశ్వర రూప కల్పన ఈ మహా సంకల్పాన్ని సాకారం చేశాడని అర్ధం చేసుకోవాలి

మహేశ్వరి మహా సంకల్పం వల్ల జనించిన విఘ్నేశుడుఅన్ని విఘ్నాలను దూరం చేసే సర్వ సమర్ధుడు .అతని విఘ్న కారిణీ మహత్వాన్ని చూసి  పార్వతి మహా ఆనంద పడింది ఈ వర్ణనే తరువాతి శ్లోకం లో కానీ పిస్తుంది

‘’మహా గణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షితా –భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణీ’’

పరమేశ్వరి ప్రశస్తమైన మార్గం లో భండాసురుడు అనేక రకాల విఘ్నాలు కల్పించే ప్రయత్నం చేశాడు .కాని వీటన్నిటికి నివారణోపాయాలుఆమె వద్ద ఉన్నాయి  .పుత్రుడు ఆమెకు ఈ కార్యం లో అన్ని రకాల తోడ్పడతాడు గణేశుడు యాంత్రికం గా విఘ్నాలను నియంత్రించ గలడు.కాని మాత భండాసురుని ప్రతి శస్త్రాన్ని ,అమోఘాస్త్రాలతో ఎదుర్కొంది .శస్త్రం భౌతికం .అస్త్రం మానసికం .శరీర బాధా నివారణకు మనో బలం తోనే సాధ్యం .శారీరక యాతనల నుండి ముక్తం అయిన మానస మరాళంఅంటే మనో హంస ఆత్మ వైపుకు ప్రయాణం ప్రారంభిస్తుంది .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -10-10-13 –ఉయ్యూరు

 

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ దేవి భండాసుర వధ లో అంత రార్ధం -5

శ్రీ దేవి భండాసుర లో అంత రార్ధం -5

‘’భండ సైన్య వదోద్యుక్త శక్తి విక్రమ హర్షితా –నిత్యా పరాక్రమోపేతా నిరీక్షణ సముత్సుకా ‘’

భండాసుర వదకోసం శ్రీ దేవి ఏమీ చెయ్యాల్సిన పని లేదు ఆమె శక్తి సేనయే ఈ పని చేస్తుంది .వాడి వధకు బ్రహ్మాండ మంతటి సైన్యం పరమేశ్వరికి తోడ్పడుతుంది .

దేశ కాలాల అనంత విస్మృతి నుండే దేశ కాలాతీత శక్తిని సముపార్జిస్తుంది .అగ్ని కుండ మధ్యలో ఉండి  సూర్య చంద్రుల ప్రకాశం నుండి పరాక్రమాన్ని పొందుతుంది పరమేశ్వరి .సూర్య ,చంద్ర గతి వల్లనే అనేక కళలు ఆవిర్భావ మవుతాయి .సూర్యుడు చంద్రుడి తో సమ రేఖ మీద ఉన్నప్పుడు చంద్రుడు సూర్య కాంతి లో దాక్కుని పోతాడు .ఇదే అమా వాస్య .తర్వాత చంద్రుడు నెమ్మదిగా సూర్యుడి నుండి వేరవుతూ తన కళలను చూపిస్తాడు .క్రమంగా వికసించి చంద్రుడు సూర్యుని ముందు చేరి తన కున్న పదహారు కళలను వ్యక్తం చేస్తాడు .దీనికే పూర్ణిమ అని పేరు .మానవ మెదడు మీద ,సముద్ర తరంగాల మీద చంద్ర కళల; ప్రభావాన్ని మనం అందరం గ్రహిస్తూనే ఉన్నాం .ప్రతి నెలలో పూర్ణిమ అమావాస్య వస్తాయి .ఈ రెండిటి మధ్య నిత్య దేవతలు మంజుల మంగళ రూపం తో మానవ మనస్సు ను అమృత మయం చేసి ఆనందాన్నిస్తూఉంటాయి  .

యుద్ధ రంగం లో శ్రీ దేవి గొప్ప ఉత్సాహం తో యుద్ధ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది పరమేశ్వరి ముద్దుల కూతురు ‘’బాల ‘’కూడా యుద్ధ రంగానికి చేరుకొంటుంది .ఆమె భండాసురునికి ఉన్న 32 మంది కొడుకుల్ని వధించే సింది .వాడి సర్వ సైన్యం క్షణం లో రూపు మాసి పోతుంది .శ్రీ బాల చేసిన ఈ అద్భుత కార్యాన్ని మాత శ్రీ దేవి ప్రశంసించే లోపలే మంత్రిణీ , వారాహీలు భండాసుర మిత్రులైన విషంగ ,విశుక్రులను హత మారుస్తారు .ఈ భీషణ యుద్ధం లో తనకు అండగా నిలవ మని పరమేశ్వరి భర్త కామేశ్వరుని ముఖం నుండే ప్రేరణ పొందుతుంది .వెంటనే విఘ్నేశుడిని సృష్టిస్తుంది .పరమేశ్వరి పవిత్ర గాధకు శ్రీ గణేశుని తో  శ్రీకారం జరుగుతుంది

‘’భండ పుత్రా వధోద్యుక్త బాలా విక్రమ నందితా –మంత్రిణ్యంబా విరచిత విషంగా వధ తోషితా ‘’

విశుక్ర ప్రాణ హరణ వారాహీ వీర్య నందితా –కామేశ్వర ముఖా లోక కల్పిత శ్రీ గణేశ్వరా’’

శ్రీ మాత విజయం ఆత్మ వైభవ గాధయే  .భండాసుర వధ అంటే అజ్ఞాన ,అత్యాచార అహంకార నిర్మూలనమే .నశ్వరం అయింది నశించే దాకా అవినశ్వరం ఆవిర్భావం కాదు .శ్రీ మాత శక్తి ఆత్మ శక్తియే అనిశ్వరమైంది భండాసురుని శక్తి ,పరాక్రమాలు పార్దివమైనవి నశించేవి .శ్రీ మాత కుమార్తె శ్రీ బాల వాడి ముప్ఫై మంది పుత్రులని క్షణం లో భస్మం చేసే సింది .దీని తో ఆత్మ సేన కు ధైర్యం ప్రేరణా కలిగాయి . వాడి సంతానం నశిన్చాగానే మిత్రులైన విషంగ ,విశుక్రులు విజ్రుమ్భించారు .వీరిని మంత్రిణి ,వారాహి దేవతలు వధించేశారు దీనితో వాడి  పరాజయం పరమేశ్వరి విజయం ప్రారంభ మైంది .

పరమాత్మ  స్వరూపిణి అయిన పరమేశ్వరి ఆత్మ వైభవం తెలియని విషంగ  ,విశుక్రులు నిష్ప్రయత్నానికి ,నిర్వీర్యతకు ప్రతీకలు .విషంగుడు అంటే తనంతటి వాడు లేడని మదం  తో అహంకరించే ప్రాణి .వాడికి ఆత్మ స్వరూపం తెలియదు .వాడికి సత్సంఘం అంటే తెలియదు అందుకే విషంగుడైనాడు .సాధారణం గా సంసార జీఎవితం పట్ల అనాసక్తి రెండు రకాల కారణాల వాళ్ళ కలుగుతుంది స్వార్ధం వల్ల  ,పరమార్ధం వల్లా కూడా అనాస క్తి వస్తుంది ఇంద్రియా సక్తుడై విషయ లంపటం లో ఉన్న మనిషి ఈ శరీరాన్ని గురించే ఆలోచిస్తాడు .లౌకిక సుఖం కోసం డబ్బు కావాలని అర్రులు చాస్తాడు .ఇది వ్యక్తీ గత స్వార్ధం దీని వల్ల  మనిషి విషంగుడ వుతాడు .సర్వ సంగ పరిత్యాగి అయినా యోగి ఆత్మానందం కోసమే అన్వేషిస్తాడు మిగిలిన వన్నీ అతనికి తుచ్చాలు నీచాలు ,.మొదటి వాడిది స్వీయ ఆనందం ఇతనిది విరాట్ భావం అంటే సర్వ ప్రపంచం ఈ యోగికి ఆనంద మయం గా కన్పిస్తుంది .మొదటి వాడిది అసంపూర్ణమే కాక ప్రమాదం కూడా .ఇదే విషంగుడి ఆనందం .ఇదే పరామేశ్వరికి ఇష్టం లేని విషయం .క్షుద్ర ఆనంద నిరాకరణమే విషంగ వధ లో అంత రార్ధం .

సశేషం

మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ -9-10-13 ఉయ్యూరు

 

Posted in రచనలు | Tagged | Leave a comment

విభజన తోనే అభి వృద్ధి సాధ్యం అంటున్న రామ్ ప్రసాద్

abhivruddhike vibhajana-1 abhivruddhike vibhajana-2

Posted in సేకరణలు | Tagged | Leave a comment

శ్రీదేవి భండాసుర వధలో అంత రార్ధం -4

శ్రీదేవి భండాసుర వధలో అంత రార్ధం -4

‘’చక్ర రాజ రాదారూఢ సర్వాయుధ పరిస్మ్రుతా –గేయ చక్ర రధా రూఢా మంత్రిణీ పరి సేవితా ‘’

శ్రీ దేవి రధ చక్రాలు అన్నిటి కంటే పెద్దవి ఆ చక్రాల గొప్ప తనాన్ని వర్ణిస్తూ మంత్రిణుల రధ  గేయ చక్రాలు కదులుతున్నాయి .ఈ గేయ గానం అమ్మ వారి రాగిణీస్వరాన్ని ముఖరితం చేసే సంగీత చక్రాలుగా  ఉన్నాయి .ఈ గేయ చక్రాలు వాక్య రామణీ యకం  గా ,మదురిమ లతో కూడి ఉన్నాయి ఇది దేవి తీజో రూప వర్ణనం .జ్ఞాన ,జ్ఞేయ ,జ్ఞాతలవివేకం అంతా ఈ భూమిక లో కనిపిస్తుంది .సత్ ,అసత్ ల  మధ్య ఉండే తేడాను మంత్రిణీ మాత స్పస్టపరుస్తోంది అని భావం .అంటే మంత్రిణులగేయ చక్రాల సహకారం తో శ్రీ మాత శ్రీ చక్ర సాక్షాత్కారం సాధ్యమవుతుంది ..కాని గేయ చక్రం కూడా అందరికి అందేది కాదు .నిర్మల ,నిశ్చల మైన వాక్కున్న  వారికే అది సుసంపన్నమవుతుంది .దీని తర్వాత కిరి చక్ర వర్ణన ఉంటుంది

‘’కిరి చక్ర రధా రూఢదండ నాధ పురస్క్రుతా –జ్వాలా మాలిని కాక్లిస్ట వహ్ని ప్రాకార మధ్యగా ‘’

చావు ,పుట్ట్టుక ల చక్ర భ్రమణం లో ఇరుక్కు పోయిన జీవితాలకు జరా మరణాలు లేని శాశ్వత లోకాన్ని అందించేఆచరణ రూపం లో ఉన్నది శ్రీ చక్రంమాత్రమె . ఆమె దండ నాదు రాలై కూర్చునేది  కిరి చక్రం లోనే .’’కుర్వాన్నే వేహ కర్మాణి జిజీవిషేత్ –శతం సమః ‘’అని ఈశోపనిషత్తు అంటుంది .అంటే మనిషి జీవిత కాలం లో విధ్యుక్త నిర్వహణ చేస్తూ నూరేళ్ళు ఆచరణ లో హాయిగా ఆనందం గా జీవిస్తాడని అర్ధం .ఇదే మానవుడి అమరత్వ రహస్యం అంది ఉపనిషత్ .దీని ఆధారం గా దండనాయకి కిరి చక్రం ధర్మ రాగం లో కర్మ గీతం విని పిస్తోందని భావం .కిరి చక్రం కర్మ చక్రమైతే ,గేయ చక్రం జ్ఞాన చక్రం గా అర్ధం చేసుకోవాలి .శ్రీ చక్రం అమ్మ వారి పరమ పావన భక్తీ భావనకు ప్రతినిధి అయిన కైవల్య చక్రం అని అర్ధమవుతుంది .మంత్రిణులు అమ్మ వారికి నాల్గు దిక్కులా కాపలా కాస్తూ ఉంటె ఆమె భక్తులను రక్షిస్తూ మార్గాన్ని శుభ్రం చేస్తూ ముందుకు సాగి పోతోంది .

శ్రీ మాత అగ్ని గుండం మధ్య ప్రతిష్టిత మై ఉంటుంది .ఆమెను అగ్ని ఏమీ చేయలేదు .అగ్ని సమాన పవిత్రురాలు, ఉజ్వల తేజస్కు రాలు .మనం బొట్టు పెట్టుకొనే చోట మూడో కన్ను ఉంటుందని అందరికి తెలిసిన విషయమే .అది జ్ఞాన, తేజస్సు ,జ్వాల లప్రతీక గా ఉంది లోపలే జ్వలిస్తూ ఉంటుంది .ఈ జ్వాల ఎవరిలో బాగా ఉజ్వలం గా ఉంటుందో వారు ఆ పరమేశ్వరి కి దగ్గర వారవుతారు .అంటే అమ్మ కృప వారి పై చాలా ఎక్కువన్న మాట .దేవీ కృప, మనలోని అంతర్జ్వాల ఒక దాని పై ఒకటి ఆధార పడి ఉంటాయి . దేవి కృప వల్ల  మన జ్ఞాన జ్వాలజ్వలిస్తుంది .ఈ జ్ఞాన కాంతి వల్లే శ్రీ దేవి సాక్షాత్కారం లభిస్తుందని గ్రహించాలి .దీన్ని విశ్లేషణ చేసి చెప్పలేం .దైవ సంయోగం, ఇచ్చ మీద ఆధార పడి  ఉంటుంది .ఆమె జ్వాలా వలయాల మధ్య  ఉంటుంది కనుక ఆమె వద్దకు ఎవరు వెళ్ళ లేరు .ఆ పరం జ్యోతి సాక్షాత్కారం ఉంటె జ్వాలా వలయం లోకి ప్రవేశించే అధికార యోగ్యత లభిస్తుంది ఇది సాధన వల్లనే సాధ్యం .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ – 8-10-13 ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

వేద సభల ఆహ్వానము

0001 0002 0003 0004

 

ఆస్తిక  మహాశయులకు నమస్కారం.  
 
ప్రతి సంవత్సరము తెలంగాణా ప్రాంతములో జరిగే మన శ్రీ జనార్దనానంద సరస్వతి వేద విద్వన్ మహా సభలు ఈ సంవత్సరము కరీంనగర్ జిల్లాలో గల మహా మహిమాన్వితమైన వేములవాడ క్షేత్రములో 24-10-2013 నుండి 27-10-2013 వరకు జరుగుచున్నాయి. 
 
కావున ఆస్తిక మహాశయులందరూ ఈ 4 రోజుల సభలలో పాల్గొని ఆ వేదవేద్యుడైన రాజరాజేశ్వర స్వామి అనుగ్రహాన్ని, అలాగే వేదమాత అనుగ్రహాన్నికూడా పొందవలసినదిగా ప్రార్ధన. 
 
దీనితో పాటు ఆహ్వాన పత్రికను జత చెయడమైనది. 
 
తూములురు శాయినాథ  శర్మ, శ్రీ జనార్దనానంద సరస్వతి స్వామి స్మృతి ట్రస్ట్ 
పసుమర్తి బ్రహ్మానంద శర్మ, శ్రీ జనార్దనానంద సరస్వతి స్వామి స్మృతి ట్రస్ట్ 
కుప్పా శ్రీ ఆంజనేయ శాస్త్రి, శ్రీ వేద వ్యాస పాఠశాల, బ్రాహ్మణ బస్తీ 

 

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

ఉయ్యూరు యోగ మిత్ర మండలి ఆధ్వర్యం లో లో శ్రీ ఎక్కిరాల వేద వ్యాస స్మరణ

uyyooru lo sree yekki rala veda vyaasa smarana-1 uyyooru lo sree yekki rala veda vyaasa smarana-2 uyyooru lo sree yekki rala veda vyaasa smarana-3

ఉయ్యూరు యోగ మిత్ర మండలి ఆధ్వర్యం లో లో శ్రీ ఎక్కిరాల వేద వ్యాస స్మరణ

 

 

 

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీదేవి భండాసుర వధలో అంత రార్ధం -3

శ్రీదేవి భండాసుర వధలో అంత రార్ధం -3

శక్తి స్వరూపిణి అయిన శ్రీ దేవి భండాసుర వదకోసమే జన్మించింది .భండాసురుడు మహా శక్తి సంపన్నుడు మన్మధుని కుమారుడు బల గర్వాలతో మదించి ఉన్నాడు ఎవరిని లెక్క చేసే వాడు కాదు అక్షౌహిణుల దానవ సైన్యం అతని అధీనం లో ఉంది తమ్ముళ్ళు మహా  బల పరాక్రమాలు కలవారు కొడుకులు వీరికంటే శక్తి ఉన్న వారు .వాడి ఆజ్ఞా కు అందరూ దాసోహం అనాల్సిందే .ఎదిరించే ద్జైర్యం ఎవరికి లేదు దేవతలను మునులను రుషి పత్నులను బాధిస్తూ వారి యజ్న యాగాదు లకు భంగం కలిగిస్తున్నాడు .అలాంటి వాడిని వదించాలంటే శక్తి మాత్రమె చాలదు యుక్తి ఉండాలి .దానికి మించి శస్త్రాస్త్ర సంపన్నత ఉండాలి వాడి బలాన్ని నిర్వీర్యం చేసే ఆయుదాలుఉంటేనే  వాడిని నిర్జిన్చటం తేలిక లేక పోతే శ్రమ అంతా వృధా .ఇవన్నీ దేవతలు గ్రహించారు అమ్మకు బాసట గా నిలిచారు తమ శక్తులన్నిటి ని ఆమె పరం చేశారు తాము నిమిత్త మాత్రులుగా ఉండిపోయారు .సర్వ వస్తు సామగ్రి సమకూర్చారు .ఇక శ్రీ దేవి ఆజ్ఞ ఇస్తే చాలు రణం మొదలెట్టటమే అన్నట్లు గా యుద్ధ రంగం సర్వ సంసిద్ధం గా ఉంది

ముందే చెప్పినట్లు భండాసురుడు రాయి లాంటి వాడు .నిష్క్రియా పరుడు ,నిస్చేస్టూడు ,నిస్చేతనుడు .ఎక్కడ పడి  ఉంటె అక్కడే ఉండే తత్త్వం వాడిది .ఒక వేళ  ఏదైనా మార్గం లో నడిస్తే అది తప్పుడు త్రోవే అవుతుంది .తప్పు పనులే చేస్తాడు విచక్షణా జ్ఞాన శూన్యుడు వాడి జీవిత పరమావధి తినటం సౌఖ్యాలనుభావించటం .మనస్సు ,ప్రాణం విజ్ఞానం అనేవి ఏమిటో వాడికి తెలీనే తెలియవు .భౌతిక సుఖాలలో పశువు లాగా ప్రవర్తిస్తాడు .బ్రాహ్మాన్దాన్ని కేవల పిందాండం గా భావించి దేవి ఆగ్రహ  జ్వాలకు మాడి  మసి అయ్యాడు .అమ్మ ఆత్మ వైభవమే వాడిని లోబరు చుకుంది .ఈ విజయాన్నే అమ్మ వారి నామం ‘’భండాసుర వదోద్యుక్త శక్తి సేనా సమన్వితా ‘’అనే నామం లో ఆవిష్కార మైంది ఇక ఆమె సైన్య సమున్నతిని గూర్చి తెలుసు కొందాం .

‘’సంపత్కరీ సమారాధ్యా ,సింధూర వ్రజ సేవితా –అశ్వా రూఢాదిష్టి తాశ్వ కోటి కోటి భిరావ్రుతా ‘’

‘’ సంపత్కరి’’ అనే శక్తి శ్రీ దేవికి ఈ యుద్ధం లో సహాయ పడింది .ఈ శక్తి ఏనుగు మీద స్వారీ  చేస్తుంది .ఇదీ దేవి గజ సైన్యం .సంపద నిచ్చే ఈ శక్తి ఏనుగు లాగా ఘీన్కరిస్తుంది .ఘోర నిద్రలో ఉన్న జీవులకు మేల్కొల్పు పలుకుతుందన్న మాట .కనుక జనాలను జాగృతం చేసే ఈ నినాదాన్ని ‘’హస్తి నాద ప్రాబోదినీ ‘’అని శ్రీ సూక్తం లో చెప్పారు .గజ గర్జనలో గంభీరత ,పరి పూర్ణత జాగృతి మూడు కలిసి సమ్మేళిత మవుతాయి .ఈ అద్భుత సమ్మేళనమే సంపత్కరీ శక్తి  అయిన శ్రీ దేవి గజ సేన లో కనీ పిస్తుంది .సంపత్ అనే శబ్దానికి సమ్యక్ రూపం లో పొందటం అనే అర్ధం ఉంది .ఏ వస్తువు సమ్యక్ అంటే సరైన రూపం లో లభిస్తుందో అదే సంపత్తు అని భావార్ధం .సంపత్తు రూపం లో లభించనిదే విపత్తు .ఏ వస్తువూ సంపత్తు ,కాని విపత్తు కాని కాదు మనం చూసే దృష్టిలో భేదమే ఏ దృష్టిలో చూస్తె ,ఎలా సంపాదిస్తే అది సంపత్త్తా లేక విపత్తా అన్నది ఆధార పడి ఉంటుందని అంతరార్ధం .సంపత్కరీ శక్తి దైవిక మైనది .అదే ప్రపంచం లోని ప్రతి వస్తువును సరైన దృష్టిలో చూపిస్తుంది.జీవితాన్ని ఏనుగు నడకలా గాంభీర్యం గా దర్జాగా గతి శీలం గా సుందరం గా చేస్తుంది శ్రీ దేవి గజ సేన ఇలా యుద్ధ రంగం లో సాగుతుంటే భండాసురిడికి, వాడి సేనకు వణుకు పుట్టిందన్న మాట .

రెండో పాదం లో అశ్వ సేన వర్ణిత మైంది .అశ్వా రూఢఅన్న దైవీ శక్తి కోట్లాది గుర్రాలతో కదులు తోంది.సంపత్కరి గజ గమనం లో గాంభీర్యం సౌందర్యం ఉంటె ఆశ్వారూ కోటి కోటి అశ్వాల పరుగులో గతి శీలతా ,వేగం దమ్యత లేని స్వభావం జ్యోతక మవుతాయి .వేదాలలో ‘’అశ్వ పూర్వా ,రధమద్యా ‘’’’అనే శ్రీదేవి వర్ణన ఉంది ఇప్పుడీ నామం దాన్ని సార్ధకత చేస్తోంది గజ సేనలో దేవి సంపన్నత ఉంటె అశ్వ సేన లో సశ్రీకత కూడా మర్మ గర్భం గా ఉంది .గజ సేనలో జ్ఞానం ,అశ్వ సేన లో కర్మ భావం వ్యక్త మవుతాయి ముందు జ్ఞానం కలగాలి తర్వాత జ్ఞానాన్ని అనుసరించి కర్మా చరణ చేయాలి .అప్పుడే అభీష్ట లక్ష్యం నేర వేరుతుంది అని అంత రార్దము

శ్రీ దేవి ఆమె అనుచర గణం తమ తేజస్సు ,ఓజస్సు లకు అనుగుణమైన వేర్వేరు రధాల పై ముందుకు నడుస్తున్నారు .శ్రీ దేవి కూర్చున్న రధం ‘’శ్రీ చక్ర   రాజం ‘’అంటే శ్రీ చక్రం తో అలంకరింప బడింది ఈ రధం లో విజయం సాధించి పెట్టె సకల శ స్త్రాస్ట్రాలు ఉన్నాయి .ఆమె అనుచర మంత్రులు ‘’గేయ చక్ర’’అనే పేరున్న చక్రాలతో తాయారు చేయ బడిన రధాల మీద అనుసరిస్తున్నారు ఈ  వర్ణన అంతా తరువాతి శ్లోకం లో దర్శన మిస్తుంది .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-10-13- ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | 1 Comment

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -34

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -34

విజ్ఞాన భిక్షువు

సాంఖ్య శాస్త్ర భాష్యం రాసిన వారిలో విజ్ఞాన భిక్షువు సాటి లేని వాడని పించుకొన్నాడు పదహారవ శతాబ్దికి కి చెందిన ఈయన వారణాసి లో జన్మించాడు జీవించాడు . 1560-1600 కాలం వాడని భావిస్తారు .భిక్షు అనేది ఆయన బిరుదు అయితే  ఇతను భిక్షువు కాదు సన్యాసి కాదు బౌద్ధమతావాలంబి కాదు సాంఖ్య సూత్రాలకు ‘’సాం ఖ్య ప్రవచనం‘’ను యోగ సూత్రాలకు అంటే వ్యాస మహర్షి రాసిన దానికి ‘’యోగ వావర్తికం ‘’,బ్రహ్మ సూత్రాలకు ‘’విజ్ఞానామ్రుతం ‘’అనే మూడు మహా భాష్యాలను రాసిన ఘనుడు విజ్ఞాన భిక్షువు .

ఈశ్వర గీతా భాష్యం ,సాంఖ్యసారం , యోగ సార సంగ్రహం సాంఖ్య సారం , మొదలైన ఇతర గ్రంధాలు కూడా రాశాడు దురదృష్ట వశాత్తు ఆయన రచనలను సంపుతీకరించటం కాని ఆంగ్లం లోకి అనువదించటం కాని జరగ లేదు  ఈయనను పరోక్ష బౌద్ధుడు అనీ అంటారు

వేదాంతాన్ని సాంఖ్యం తో సమన్వయ పరచాడు .సాంఖ్యం లో చెప్పిన పరిణామ వాదం వేదాంతుల పాలిటి చింతామణి .అద్వైతాన్ని వ్యావహారికం గా ,మిగిలిన ద్వైత విశిస్తాస్టాద్వైత   భేదా, భేద దర్శనాలను పార మార్ధికం గా పరిణామ వాదం స్వీకరించింది .భిక్షువు పరిణామ వాదాన్ని ఒప్పుకోవటమే కాక సాంఖ్యం లో ఉన్న ప్రకృతి పురుష ద్వైతాన్ని పురుష బహుత్వాన్ని వేదాంత సూత్రాలలో చేర్చాడు .

 

బ్రహ్మ మీమాంస లో జీవాత్మ యొక్క బహుత్వం  కనీ పిస్తుంది కొన్ని శ్లోకాలలో .సాంఖ్యం లోని పురుష ఆత్మత్వం బ్రహ్మ మీమాంస లో ఇబ్బంది కలిగిస్తుంది .’’ఆత్మేతి తూప యంతి ‘’అనే సూత్రం లో పరమాత్మ కే పరమార్ధం లో ఆత్మత్వాన్ని చెప్పింది .అయినా సాంఖ్యం- వేదాంతం తో భేదించలేదు .కారణం వ్యాహరాకికాత్మ అయిన జీవుడికి ఇతర వివేక జ్ఞానాలు మోక్షానికి సాధనాలుగా చెప్పటమే ఇది రెండు దర్శనాలకు సమ్మత మైన విషయమే .కనుక శ్రుతి, స్మృతి లలో ప్రసిద్ధం గా చెప్ప బడిన నానాత్వ ఎకత్వాదులకు సాంఖ్యం లో వ్యావహారిక పరమార్ధ భేద దృష్టిలో సాంఖ్యానికి వేదాంతానికి మధ్య భేదం తొలగి పోయింది అందుకే సాంఖ్య సిద్దాంతాలవివరణ మే వేదాంతం లో కనీ పిస్తోంది

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -6-10-13 ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ దేవి భండాసుర వధలో అంత రార్ధం -2

  శ్రీ దేవి భండాసుర వధలో అంత రార్ధం -2

శ్రీ తత్త్వం విశ్వ మంతా వ్యాపించి ఉంది .ప్రతి మనిషి లలాటం లో శ్రీ తత్వాన్ని చూడ వచ్చు ‘’లోకానతేత్య లాలతే ,లలితా తేన సోచ్యతే ‘’అంటే అమ్మ వారికి లలిత అన్న పేరు ఆమె లోకానికి అతీత యై లోక లీలను లాలిస్తుంది .కనుక ప్రతి వ్యక్తీ లలాటం అ లీల దామమే .కావలసింది దాని పై ధ్యాస  మననం అవగాహనా మాత్రమె .దీనికే ఈ లలితా  సహస్ర నామాలు సాధనాలు అవుతాయి .అది పఠిస్తుంటే శ్రీ తత్త్వం బోధ పడుతుంది .ఉపాసకులు శ్రీ చక్ర పూజ చేస్తారు .ఇదొక విశిష్టమైన యంత్రం .ఇందులో బిందు ,త్రికోణ ,వలయ రేఖ ,దళాల వంటి చిహ్నాలుంటాయి ఇవి ఈ బ్రహ్మాండం యొక్క సృష్టి స్టితి లయాలకు ప్రతీకలు .ఈ లక్షణాలన్ని మానవ శరీరం లోనే ఉన్నాయని మనం మర్చి పోతూంటాము .శరీరమే శ్రీ చక్రానికి ప్రతి రూపం అని తెలియాలి .ఇందులోని తొమ్మిది ఆవరణలే మన నవ రంధ్రాలు .అందులోని ఆనంద మయ బిందువే లలాటం మీద ఉన్న సహస్రార చక్రం .ఇదే అమ్మ వారి పవిత్ర నివాసం .శ్రీ చక్రం మన పుట్టుక తోనే వచ్చే పరమాత్మ సాధనం .

శ్రీ విద్య శ్రీ మాతను ప్రసన్నం చేయటానికి దోహద పడుతుంది .లలితా సహస్రనామ పఠనం ఈ మంత్రం ఫలాన్నిస్తుంది .దేవి కృప అంతర్ముఖమైన వారికే లభిస్తుందని మరువ రాదు .అంటే భావన చాలా ముఖ్యం అందుకే ‘’అంతర్ముఖ సమారాధ్యా –బహిర్ముఖ సుదుర్లభా ‘’అన్నారు భవానీ భావనా గమ్యా అనటం భావనే ముఖ్యమని .భావన అంతర్ముఖం అయితే పిండాండం లో బ్రహ్మాండ దర్శనం లభిస్తుంది .ఇదే శ్రీ దేవి ఆరాధనా పరమ లక్ష్యం .దీని శ్రీ సహస్రిక అమోఘమైన సాధనం .

శాస్త్ర దృష్టిలో చూసినా పదార్ధం శక్తి వీటి ప్రతి క్రియ వల్లనే ప్రపంచ సృష్టి జరుగుతుంది .ఈ రెంటికీ భేదం లేదు .ఆదార్ధం శక్తిగా శక్తి పదార్ధం గా మారుతుంది .శక్తి స్తూల రూపం పదార్ధం .ఈ పరార్ధమే పరమ శివుడు .శక్తియే పరమేశ్వరి .శివుడికి, శివానికి భేదం లేదు .ఒకే తత్వానికి వారిద్దరూ రెండు రూపాలని గ్రాహించాలి .శక్తి దేశాకాల ను బట్టి వివిధ రూపాలు ధరిస్తుంది ‘’యస్య యస్య పదార్ధస్య యాయా శక్తి రుదాహృతా –సాసా సర్వేశ్వరీ దేవీ శక్తిమంతో మహేశ్వరః ‘’

భండాసురుడిని సంహరించింది శ్రీ దేవి .భండాసురుడు అంటే జడత్వం అంటే బద్ధకానికి ప్రతీక .మనిషి హి స్వభావ సిద్ధం గా విశ్రాంతి కోరుకొంటాడు అవసరం వచ్చే దాకా రాయిలా ఉండి పోతాడు .లేక పోతే  యేపనీ లేకుండా దేశ ద్రిమ్మరి లా తిరుగు తాడు .న్యూటన్ జడత్వ సిద్ధాంతం కూడా దీన్ని సమర్ధించింది జడత్వం నశించే వరకు మనిషి తన లో ఉన్న శక్తిని గుర్తించలేదుఈ శక్తినే మనం శ్రీ దేవి అంటున్నాం .అందుకే ఆమె భండాసుర సంహారం చేసి తృప్తి చెందింది ..లోపల చైతన్యాన్ని   ఒక సారి మేలు కొలిపితే సాధనా మార్గం తేలికవుతుంది .అమ్మ మన చెయ్యి పట్టుకొని ఆనంద పరమా వదికి చేరుస్తుంది .

లలితా సహస్ర నామాలలో మొదటి పంక్తి ‘’శ్రీ మాతా శ్రీ మహా రాజ్ఞీ శ్రీ మాట్చిమ్హాసనే శ్వరి ‘’,చిట్ట చివరిది ‘’శ్రీ శివా శివ శాక్త్యైక్య రూపిణీ లలితాంబికా ‘మొదటి మాటలలో శ్రీ మాత గా ,మహా రాణి గా ,ఈశ్వరి గా కనీ పించే   పరమేశ్వరి చివరికి పరమ శివుని తో తాదాత్మ్యం చెంది జగదంబిక ,లలిత రూపం గా దర్శన మిస్తుంది ఇదీ వరుస క్రమం .ఒక్కొక్క సారి మహా లావణ్య నిధి రూపం లో ,ఆరో చోట పరమేశ్వరి ప్రతాప ,పరాక్రమాలు ప్రాణులకు ప్రేరణ నిస్తాయి .ఒక చోట ఆత్మానందాన సంధాయి .మరో చోట మూలాధారం నుండి సహస్రారం దాకా చక్రాలను దాటి అమృతత్వ సంధాయినీ గా దర్శన మిస్తుంది .ఒక చోట బ్రహ్మ విష్ణు రుద్రాగ్రంధి విచ్చేదనం చేసి శివ శక్తుల అభేదాన్ని చూపించి మహా శక్తి రూపం గా ఉంటుంది .విశ్వం సమస్తానికి కర్త్రి ,ధాత్రి ,సంహాద్రి గా ఉంటుంది మన కన్నులలోనే ఉంది మనల్ని కాపాడుతుంది .ఆమెయే శివుడు ఆమె శక్తి ,ఆమెయే పురుషుడు ఆమె ఏ శక్తి  .ప్రక్రుతి ఆమె జీవుడూ ఆమె.ఆమెయే బ్రాహ్మ ఆమె పదార్ధ సహక్తుల సమ్మెలన రూపం

ఇది లలితా సహస్రమే అయినా ఆమె దివ్య విభూతి సందర్శనమే .మొదటి నామం శ్రీ మాత చివరిది లలితాంబిక మధ్యలో కామాక్షి ,బాలా ,భవానీ ,శాంకరీ ,శివకరీ,దుర్గా ,మహా దేవి ,ఆహా లక్ష్మి ,మహా త్రిపుర సుందరి ,పార్వతి ,నారాయణి ,కల్యాణి ,కాత్యాయని ,రామా ,ఉమా ,గౌరీ బ్రాహ్మి ,రాజరాజేశ్వరి ఆయత్రి ,సరస్వతి ,మహా కాలి ,చండికా ,అపర్ణా ,త్ర్యంబిక ,బ్రాహ్మణి ,వైష్ణవి ,శివా మొదలైన నామాలు వస్తాయి ఈ సహస్రం లో లలిత  పేరు ఒక్క సారే వస్తుందని గ్రహించాలి .ఏ రూపం ఎవరికి ఇష్టమో అది ఇందులో ఉంటుంది ‘’సహస్ర పరమా దేవి శతమూలా శాతాంకురా ‘’అన్ని సూక్తం ఇందు లో ఉంది .ఇందులో ఏ నామమూ రెండో సారి రాక పోవటం ప్రత్యేకత .నిర్మల మనసు ,నిశ్చల హృదయం ,స్తిర భావనా లతో ఈ నామాలు ఉచ్చరిస్తే అన్ని రహస్యాలు క్షణం లో అర్ధమవుతాయి .శ్రీ చక్రం లో అధిష్టాన దేవత శ్రీ మాత అక్షర ఆకృతి  లో దర్శన మిస్తుంది .ఒక చోట డకారం లో మరో చోట రకారం లో ,మరో చోట లకారం లో ,వేరే చోట కకారం లో మరో సారి సకారం లో దర్శన భాగ్యం కలిగిస్తుంది .మనలో ఉన్న ఆత్మ మన దేవత .అది ప్రపంచమంతా వ్యాపించి ఉండనే భావన ముఖ్యం ఇక్కడ లలిత అన్నారు అంటే ఆత్మకే మరో పేరు లలిత అని గుర్తించాలి

రేపటి నుంచి భండాసుర వధ లోని అంతరార్ధాన్ని తెలుసు కొందాం

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -6-10-13 ఉయ్యూరు

 

Posted in రచనలు | Tagged | 1 Comment

కష్టపడే తత్వం అక్కడే నేర్చుకున్నాను : పరుచూరి హనుమంతరావు

కష్టపడే తత్వం అక్కడే నేర్చుకున్నాను : పరుచూరి హనుమంతరావు

P

ప్రింటింగ్‌లో అత్యున్నత ప్రమాణాలకు పెట్టింది పేరయిన ‘ప్రగతి ఆర్ట్ ప్రింటర్స్’నే తన ఇంటి పేరుగా మార్చుకున్న తొంభయ్యేళ్ల పెద్దమనిషి పరుచూరి హనుమంతరావు. ఆయనను ‘మీ ఊరేది’ అని కొద్దిగా కదిలిస్తే చాలు.. తొమ్మిదేళ్ల చిన్నపిల్లాడైపోయి, ‘పొలం పనులు చేసుకోవడం, బర్రెల్ని మేపుకోవడం, చెరువు ఒడ్డున చెక్కభజనలు చెయ్యడం, ఊరంతా బలాదూరు తిరగడం…’ అంటూ తాను పుట్టిపెరిగిన ‘చిట్టూర్పు’ గురించిన మైమరుపులోకి వెళ్లిపోతారు. ఆయన చెబుతున్న సొంతూరి విశేషాలే ఈ వారం ‘మా ఊరు’.

“1936లో కాలువలు వచ్చాక మా ప్రాంతమంతా మాగాణిగా మారిపోయిందిగాని, అంతకుముందు మా దివిసీమను అబిసీనియా అనేవారు. మా ప్రాంతానివీ, మనుషులవీ రూపురేఖలు అలా ఉండేవన్నమాట. కృష్ణా జిల్లా దివి తాలూకాలోని చిట్టూర్పు అనే గ్రామం మాది. తాలూకాలు రద్దయ్యి మండలాలు వచ్చాయి గనక మా ఊరు ఘంటశాల మండలంలో ఉందని చెప్పాలి ఇప్పుడు. నాకు ఊహ తెలిసేసరికి మా ఊళ్లో 200 – 300 ఇళ్లుండేవనుకుంటాను. దాదాపు అందరూ వ్యవసాయదారులు, కమ్మ కులస్తులే. ఇతరులు చాలా తక్కువ. ఊరెప్పుడూ ప్రశాంతంగా ఉండేది. ఎవరి పని వాళ్లు చేసుకోవడం తప్ప పొరపొచ్చాలు, గొడవలు ఏవీ ఉండేవి కావు.

మా నాన్నకు కట్నం
మా నాన్న నరసయ్య, అమ్మ శ్రీరామమ్మలిద్దరికీ చదువు రాదు. ఉన్న రెండున్నర ఎకరాల్లో పగలనక రాత్రనక కష్టపడేవాళ్లు. మెట్ట పొలాల్ని దున్నడం, విత్తనాలు జల్లడం, వేరుశెనగ పంట పీకడం, కాయ ఒలవడం – ఎప్పుడూ ఇవే పనులు చేస్తూ ఉండేవారు. ఇంట్లో నేను, మా అక్క ఇద్దరమే సంతానం. మా అమ్మ మరీ కష్టజీవి. పైన చెప్పిన పనులన్నీ చేస్తూనే రాత్రిళ్లు రాట్నం వడికేది. వచ్చిన నూలుతో నాకు బట్టలు కుట్టించేది. మా అమ్మానాన్నల పెళ్లయిన చాలాకాలానికి, అంటే నాకు ఊహ తెలిసిన తర్వాతే మా మేనమామలొచ్చి మా నాన్నకు కట్నంగా నాలుగు వందల రూపాయలు ఇవ్వబోయారు. మా నాన్న ‘నాకొద్దు, తీసుకోను’ అని మొండికేశాడు. అప్పుడు ఆ సొమ్మును మా అమ్మ తీసుకుంది. ఆ సమయంలోనే చల్లపల్లి సమీపంలోని అడవిని పొలాలుగా అమ్ముతారనే వార్త వచ్చింది. ఈ సొమ్ము పెట్టి, అక్కడ అడవిలో ఎకరం ఏభై రూపాయల చొప్పున భూమి కొంది మా అమ్మ. ఆ అడవిని చదును చెయ్యడం, దున్నడం – ఆ కష్టమంతా మళ్లీ వాళ్లిద్దరే పడ్డారు. అసలు మా చిన్నప్పుడు వరి అన్నం తింటారని కూడా మాకు తెలియదు. మొక్కజొన్న అన్నం, దానిలో వెన్నపూస, కారం వేసుకుని తినేవాళ్లం. మూడుపూటలా అదే.

అంగలూరు మాస్టారొచ్చారు
నేనెప్పుడు పుట్టానో నాకు సరిగ్గా తెలియదు. కాని 1924 జనవరి 16 అని బడి రికార్డుల్లో నమోదయింది. అంతే అనుకుంటాను. ఆనాటికి మా ఊళ్లో బడి లేదు. అందువల్ల నేనూ అమ్మానాన్నలతో పాటు వ్యవసాయప్పనులు చేసేవాణ్ని. ఎక్కువగా వేరుశెనగ పీకడం, కాయ ఒలవడం వంటివి చేసేవాణ్ని. ఈ పనుల్లేనప్పుడు మా బర్రెల్ని మేపేవాణ్ని. మాకు మంచి ఎడ్లు కూడా ఉండేవి. ఒకసారి వాటిని బండికి పూన్చి, బండి నిండా బస్తాలేసుకుని ఊరి వైపు వస్తున్నా. ఆ రోజు అట్లతదియ అనుకుంటా. మా ఇంటి నిండా ఆడవాళ్లున్నారు. తెలియక ఎవరో ఎడ్లను అదిలిస్తే అవి పరుగందుకున్నాయి. దాంతో నేను బండి మీద నుంచి కిందపడి స్పృహ తప్పిపోయాను. ఊళ్లో పిల్లలెవరికీ చదువు అబ్బడం లేదని అంగలూరు నుంచి ఒక ఉపాధ్యాయుణ్ని తీసుకొచ్చారు. ఆయన ఇంటింటికీ వచ్చి పాఠాలు చెప్పేవారు. తర్వాత నేను చల్లపల్లి బడిలో నాలుగో తరగతిలో చేరాను. మా తాతగారింట్లో ఉండేవాణ్ని. దగ్గర్లోని వక్కలగడ్డలో బోడి నారాయణరావు అనే ఆయన ఇంగ్లీషు బాగా చెప్పేవారు. ఘంటశాలపాలెం అక్కడికి దగ్గరే. ఆ ఊళ్లో అందరూ బాగా ధనవంతులనుకుంటాను, దాదాపు అందరూ డబ్బు వడ్డీలకిచ్చేవారు. మా ఆవిడ సీతాలక్ష్మిది ఆ ఊరే. చిన్నప్పుడు నేను ఆమెకు లెక్కలు చెప్పేవాణ్ని.

మునసబు చెప్పిన కిటుకు
దసరా వస్తోందంటే చాలు, మాకు పండగే పండగ. ‘పిల్లవాళ్లకు చాలు పప్పుబెల్లాలు, అయ్యవార్లకు చాలు ఐదు వరహాలు….’ అని బోలెడన్ని దసరా పాటలు, పద్యాలు పాడుకుంటూ ఇల్లిల్లూ తిరిగేవాళ్లం. ఎవరింటికెళ్లినా ఏదో ఒకటి చేతిలో పెట్టకుండా పంపేవారు కాదు. తినుబండారాలన్నీ తింటూ, చిల్లరకాసులు దొరికితే సంబరపడుతూ ఆ పదిపదిహేను రోజులూ ఆటవిడుపుగా గడిపేసేవాళ్లం. మా ఊళ్లో మునసబుగారని ఒకాయన ఉండేవాడు. ఆయన నాకు బాగా డబ్బు సంపాదించే మార్గం ఏమిటో ఒకసారి చెప్పాడు. ‘అబ్బాయ్, మనూళ్లో బాగా డబ్బున్నవాణ్ని చూసి ఒక పది రూపాయలు అడిగి తీసుకో. ఖర్చు చెయ్యకు. ఇస్తానని చెప్పిన రోజుకు తీసుకెళ్లి ఇచ్చేయ్. తర్వాత వంద రూపాయలు తీసుకో. మళ్లీ ఇచ్చెయ్యి. తర్వాత వెయ్యి, ఆ తర్వాత పదివేలూ తీసుకో. ఎప్పటిదప్పుడు చెప్పిన గడువుకు రెండు రోజుల ముందే ఇచ్చెయ్…’ అన్నాడు. ‘వాడుకోని దానికి డబ్బు అడిగి తీసుకోవడం ఎందుకు? అయినా ఇలా చేస్తే మనకు డబ్బెట్టా వస్తుంది’ అని అడిగాను. ‘అదే చెబుతాను వినరా. చివర్లో లక్ష రూపాయలు అడుగు. నువ్వు ముందు తీసుకున్నవన్నీ తిరిగిచ్చావుగనక అడగ్గానే లక్ష ఇస్తారు. అది పట్టుకుని ఊరు విడిచి మరో చోటికి పారిపో’ అన్నాడాయన నవ్వుతూ. అప్పటిదాకా నిజంగా ఏదో వ్యాపారం చెప్పేస్తున్నాడని జాగ్రత్తగా వింటున్నవాణ్నల్లా ‘చాల్చాల్లే పొండి. గొప్ప కబుర్లు చెబుతారు…’ అని నవ్వుకుంటూ వచ్చేశాను. కాని ఇప్పుడు ఎంతోమంది ఈ పద్ధతినే పాటించి మోసాలు చెయ్యడం చూస్తుంటే మా ఊరి మునసబు ఎంత తెలివైనవాడో అనిపిస్తుంటుంది.

చెరువు కతలు ఎన్నో…
మా ఊరి చెరువులో మేమంతా ప్రతిరోజూ చేసే స్నానాల దృశ్యాన్ని నేనెప్పటికీ మర్చిపోలేను. స్నానం తర్వాత పిల్లలంతా కలిసి చెరువు ఒడ్డునే చెక్కభజన చేసేవాళ్లం. తల్చుకుంటే ఇప్పటికీ భలే సంతోషమనిపిస్తుంది. నా చిన్నప్పుడు ఒకసారి ఏమైందంటే – మా ఊళ్లో ఒకేరోజున ముప్ఫైమందికి పూనకం వచ్చింది. ముందు మా ఊరి కోమటి భార్య గంగానమ్మ గుడికి వెళితే ఆమెకు వచ్చింది. గంటలోపే మిగిలిన వాళ్లందరికీ వ చ్చేసి తెగ ఊగిపోయారు. అది ఎలా జరిగిందో ఎంతాలోచించినా అప్పుడు అర్థం కాలేదు, ఇప్పటికీ ఆ వింతేమిటో అంతుబట్టదు. ఈ తొంభయ్యేళ్ల వయసులో కూడా ఆ దృశ్యాన్ని గుర్తుచేసుకుంటే భయం వేస్తుంది. ఒకసారి చల్లపల్లి దివాన్‌గారు మా ఊరొచ్చారు. ఊళ్లో చెరువును వేలం వేసి, ఆ డబ్బును దివాణానికి తరలించాలన్నది ఆయన ఆలోచన. ‘చెరువు ఊరిది. అందువల్ల ఆ డబ్బు మా ఊరికే ఉపయోగపడాలి. అలా కాదంటే వేలం పాడ్డానికే వీల్లేదు’ అని అడ్డుకున్నాన్నేను. ఊళ్లో అందరూ ‘నీకెందుకురా ఇలాంటి విషయాలన్నీ? చిన్నవాడివి, గమ్మునుండు’ అన్నారు. నేను వింటేనా? మొత్తానికి నా పంతమే నెగ్గింది. చెరువు వేలంపాటలో వచ్చిన సొమ్ముతో మా ఊళ్లో రవీంద్రుడి పేరు మీద గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశాం. దానికి ఏభయ్యేళ్లు పూర్తయినప్పుడు నన్నూ మా ఆవిడనూ ఆహ్వానించి అక్కడో పూజ చేయించారు. మామూలుగానైతే నేను పూజలు చెయ్యను. కానీ మా ఊరివాళ్లు పట్టుపడితే కాదనలేక ఆ ఒక్కసారీ పూజలో కూర్చున్నాను. ఆ గ్రంథాలయం ఇప్పుడు శిథిలావస్థకు చేరింది. దాన్ని పునరుద్ధరించే ఆలోచనలో ఉన్నాను.

ఎంత పెద్ద దేశమో…
1939లో అనుకుంటాను, మద్రాసులో ఆలిండియా స్కౌట్స్ సమావేశం జరిగింది. అదే మొట్టమొదటి సారి నేను రైలెక్కి మరో ఊరికి వెళ్లడం. ఆ సంబరాన్ని మాటల్లో వర్ణించలేను. రైలు ఏయే ఊళ్ల గుండా వెళుతోందో, ఏయే స్టేషన్లలో ఆగుతోందో – అవన్నీ పెద్ద యాత్రావిశేషాల్లాగా ఒక పుస్తకంలో ఎప్పటికప్పుడు రాసిపెట్టుకున్నా. ఆ సమావేశానికి దేశంలో అన్ని మూలల నుంచి విద్యార్థులు రావడంతో ‘మన దేశం ఇంత పెద్దదన్న మాట, ఇన్ని భాషలు, ఇన్నేసి సంస్కృతులు ఉన్నాయన్నమాట…’ అని తొలిసారి నాకు అర్థమైనది అప్పుడే. నా ఆశ్చర్యానికి అంతు లేదు.

బీజం అక్కడే పడింది
ఊళ్లో చిన్నప్పుడు నాకో కోమట్లబ్బాయి స్నేహితుడిగా ఉండేవాడు. వాడి పేరు సుబ్బారావు. మా ఇద్దరికీ ఒప్పందం ఏమంటే – వాడు నాకు రోజూ బెల్లమ్ముక్క పెట్టాలి. లేకపోతే కొడతానని భయపెట్టేవాణ్ని. అందుకని వాడు నాకు రోజూ బెల్లం పెట్టేవాడు, అది లేనప్పుడు ఇంకేమైనా అప్పచ్చులు పెట్టేవాడు. అలా చెయ్యడం తప్పని కూడా తెలియదప్పుడు. చిన్నప్పుడు ఊరంతా తెగ బలాదూర్ తిరిగేవాణ్ని. మా ఊళ్లో నన్ను కొందరు ముద్దుగా, కొందరు చిరాగ్గా ‘చిట్టూర్పు ఆంబోతు’ అనేవాళ్లు. వేములపల్లి రాఘవయ్య అనే మా ఊరాయన ఒకరు సాహిత్యం బాగా చదువుకున్నారు. ఆయన పద్యనాటకాలు రాసి, పదిమందిని పోగుచేసి వాటిని ఆడించేవారు. అలా ఆయన రాసిన హరిశ్చంద్ర నాటకంలో నాకు లోహితుడిగా వేషం ఇచ్చారు. చాలా రోజుల పాటు రిహార్సల్స్ వేసినా, చివరికి ఏవో పరిస్థితుల వల్ల మేమా నాటకాన్ని వెయ్యనేలేదు. ఆయన నాలో నాటిన విత్తనం తర్వాత చాలా పెరిగి పెద్దయింది. నాటకాలంటే ఇష్టం ఏర్పడింది. పాఠశాల రోజుల నుంచీ బుర్రకథలు, నాటకాలు వేసేవాణ్ని. పెద్దవుతున్నకొద్దీ నేను ఎస్ఎఫ్ఐలోను, ఇప్టా (ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్)లోనూ క్రియాశీలకంగా ఉండేవాణ్నంటే అది మా ఊరి చలవే. తర్వాత ప్రజానాట్యమండలిలో చురుగ్గా పాల్గొనడానికీ బీజం అక్కడే పడింది.

సాంఘిక చిత్రం మారింది
నా చిన్నప్పుడు సమాజం ఎలా ఉండేదో చెప్పడానికి ఒక్క ఉదాహరణ చాలు – మా ఊళ్లో ఒకమ్మాయికి చిన్నప్పుడే పెళ్లవడం, భర్త పోతే వితంతువు కావడం జరిగాయి. అప్పట్లో ఆమె కుటుంబ సభ్యులు పూనుకుని ఆమెకు మళ్లీ పెళ్లి చేశారు. దాంతో ఊరంతా ఆ కుటుంబాన్ని వెలి వేసింది. ఒక ఏడాదిపాటు వాళ్లింటికి చాకలి, మంగలి, కుమ్మరితో సహా ఎవరూ వెళ్లలేదు. తర్వాత నెమ్మదిగా మళ్లీ కలుపుకున్నారు. పరిస్థితి క్రమంగా మారుతూ వచ్చింది. మరొకసారి ఏమైందంటే – మా ఊళ్లో మల్లిపెద్దివారని, వాళ్లింట్లోని ఆడపిల్లకు పెళ్లి పెట్టుకున్నారు. మగపెళ్లివారు బండ్లు కట్టుకుని తరలివచ్చాక ఏదో గొడవ రేగింది. ‘పెళ్లయ్యాక చెబుదాం వీళ్ల సంగతి, ఆ పిల్లను రాచిరంపాన పెడదాం, వీళ్లేం చేస్తారో చూద్దాం’ అని మగపెళ్లివారు అనుకోవడం ఆడపిల్లవారికి తెలిసింది. ‘పెళ్లీ లేదు గిళ్లీ లేదు, చేసిన భోజనాలు చాలు. మా పిల్లనివ్వం మీకు. వచ్చిన దారినే తిరిగిపొండి..’ అని బెదిరించి పంపేశారు వీళ్లు. వాళ్లు తోకముడిచి వెళ్లిపోయారు. అంతా వెళ్లిపోయాక, ‘మన హనుమంతరావు ఏడున్నాడో చూడండ్రా…’ అని నాకోసం వెతికారు. ఎందుకంటే ఆ పిల్లనిచ్చి పెళ్లి చేద్దామని! ఆ విషయం పొక్కగానే నేను ఊళ్లో ఉండకుండా పారిపోయాను!!

మొదట్నుంచీ కమ్యూనిజమే
నేను చల్లపల్లి స్కూల్లో స్కౌట్ లీడర్‌గా ఉండేవాణ్ని, బాస్కెట్‌బాల్ బాగా ఆడేవాణ్ని. ఒకసారి మా తరగతి గోడ మీద ‘స్వతంత్ర భారత్‌కీ జై’ అని ఎవరో రాశారు. అలా రాసిందెవరో చెప్పాలని మా ప్రిన్సిపాల్ నన్ను నిలదీశారు. చెబితే ఆ విద్యార్థిని స్కూలు నుంచి తీసేస్తారని నాకు తెలుసు. అందుకని ‘నాకు తెలుసు. అయినా నేను చెప్పను…’ అన్నాను. దాంతో నన్ను స్కూలు నుంచి బైటికి పంపేశారు. నాయుడుగారని ఒకాయన చదువు ఏమీ లేకపోయినా మంచి మెకానిక్. ఆయన మా ఇంటికొచ్చేవాడు. ఆయన తీసుకెళ్లి నన్ను మచిలీపట్నం స్కూల్లో చేర్చారు. తర్వాత నా చదువంతా అక్కడే సాగింది. మా నాన్న నాకిచ్చిన పొలాన్ని అమ్మి హైదరాబాద్ సమీపంలో పొలం కొన్నాను. అక్కడికి వెళ్లినప్పుడు అచ్చం మా పల్లెలో ఉన్నట్టే ఉంటుంది. ఇప్పటికీ మా ఊరితో నాకు సత్సంబంధాలున్నాయి. అక్కడ జరిగే శుభకార్యాలన్నిటికీ వెళ్లొస్తూనే ఉంటాను.

పెరుమాళ్లు అలానే నటించాడు…
మా ఇంట్లో మేం నలుగురమే. కాని మా పెదనాన్నది మాత్రం పెద్ద కుటుంబం. మా ఇళ్లు పక్కపక్కనే ఉండే వి. పక్కపక్క ఇళ్లే అయినా మా నాన్న, పెదనాన్న పెద్దగా మాట్లాడుకునేవారు కాదు. ఏదైనా చెప్పవలసి వస్తే మా నాన్న పళ్లు తోముకుంటున్నప్పుడో, ఊరికే అరుగు మీద కూర్చున్నప్పుడో పెదనాన్న అటుగా నడిచి వచ్చి ‘ఫలానావాళ్లు ఫలానా ఊళ్లో పెళ్లని పిలిచారు. రేప్పొద్దున బయల్దేరితే బాగుంటుంది’ అని ఎవరితో చెబుతున్నాడో తెలియకుండా చెప్పేసి వెళ్లిపోయేవాడు. మా నాన్న మర్నాడుదయానికల్లా తయారుగా ఉంటే, ఇద్దరూ కలిసి ఒక్కముక్క మాట్లాడుకోకుండా వెళ్లొచ్చేసేవారు. ఆప్యాయతలున్నా అన్నదమ్ములు ఇలా కూడా ఉంటారని చెబితే ‘కలిసి ఉంటే కలదు సుఖం’ సినిమాలో పెరుమాళ్లు అచ్చం అలానే నటించాడు.

నా జీవితం…
తెలంగాణ సాయుధ పోరాటానికి మద్దతుగా ఆంధ్ర ప్రాంతంలో జరిగిన ప్రదర్శనల్లో నేను పాల్గొన్నాను. కమ్యూనిస్టునైనందున అప్పటి ప్రభుత్వం రాజమండ్రి జైల్లో బంధించింది. ఆర్నెల్ల తర్వాత కడలూరు జైలుకు మార్చారు. ఏకే గోపాలన్, కడియాల గోపాలరావు, మోటూరి హనుమంతరావు, విశాలాంధ్ర ఎడిటర్ రాజగోపాలరావు వంటివాళ్లంతా అదే జైల్లో ఉండటంతో పరిచయాలు పెరిగాయి. జైలు నుంచి బయటికొచ్చి మద్రాసులో బియ్యే పూర్తిచేశాను. తర్వాత ఆంధ్ర రాష్ట్ర ఉద్యమ సందర్భంగా తరిమెల నాగిరెడ్డి, నార్ల వెంకటేశ్వర్రావు, టంగుటూరి ప్రకాశం పంతులు వంటివారితో కలిసి పనిచేశాను. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత విశాలాంధ్ర పత్రికలో పనిచేశాను. తాపీ ధర్మారావుగారబ్బాయి చాణక్యతో కలిసి ‘నాగార్జున ఫిలిమ్స్’ ప్రారంభించి 1957లో హైదరాబాద్ వచ్చేశాను. సినిమాలకు నెగెటివ్ ఫిలిమ్ కొరత ఏర్పడటంతో క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయి. ఆ సమయంలో వాసిరెడ్డి సీతాదేవితో కలిసి 1962 సెప్టెంబర్ 1న ప్రగతి ఆర్ట్ ప్రింటర్స్ ప్రారంభించాను.

-అరుణ పప్పు
ఫోటోలు : లవకుమార్, సురేశ్ (ఘంటశాల)

 

 

Category:

– See more at: http://www.andhrajyothy.com/node/7610#sthash.hEhUplvm.dpuf

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బాధితుల బాధలను స్వీకరించి అనుభవించిన -యోగిని తెరేసి న్యూమన్

బాధితుల బాధలను స్వీకరించి అనుభవించిన -యోగిని తెరేసి న్యూమన్

                  మనకు ఏ కష్టమో బాధో రోగమో వస్తే మహాను భావులనో యోగుల నో  దర్శించి  ఇంత విభూతి లేక పవిత్ర జలం,మంత్రం  వంటివి పొంది ఉపశమనం పొందటం లోకం లో చూస్తున్న విషయమే  .కాని రోగగ్రస్తుల రోగాలను తాను పొంది ఆ బాధలను స్వయం గా అనుభవించి, వారికి ఉపశమనం కల్గించటం మహా యోగులైన కొందరికే సాధ్యం .అలాంటి అరుదైన యోగిని జర్మని కి చెందిన తెరేసి న్యూమన్

              జర్మని లోని .బవేరియాలో కొనిస్గేర్ స్యూద్అనే  గ్రామంలో  తెరేసి న్యూమన్  1898 ఏప్రిల్ ఎనిమిది న జన్మించింది ఆమె కేధలిక్ మతావ లంబి .జీవితాంతం పుట్టిన ఊరిలోనే గడిపింది ‘’థర్డ్ ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిస్ ‘’లో సభ్యురాలు .. పేద కుటుంబం .తండ్రికి అధిక సంతానం 1918 లో మార్చ్ పదవ తేదీన ఆమె మేన మామ ఇంట  వంట పొయ్యి వెలిగిస్తూ ఒక బల్ల మీద  నుంచి కిందపడి పాక్షిక పక్షవాతానికి గురైంది .ఇంకోసారి ఇలాంటి ప్రమాదమే జరిగి కంటి చూపు కూడా మందగించింది .చాలా కాలం మంచం  మీదే ఉండటం వల్ల  ఆమె శరీరానికి పుళ్లు ఏర్పడి ఎముకలు బయటికి వచ్చి ఎంతో నరకం అనుభ వించింది ఇదంతా ఆమె ఇరవై ఏళ్ళ వయసులోనే జరిగింది . 1919 కి పూర్తిగా గుడ్డిది అయిపొయింది పాపం .కానీ 1923 ఏప్రిల్ 29 ననాలుగేళ్ళకురోమ్ నగరం లో తెరేసి లూసేక్స్ కు బ్యీటిఫికేషన్   మత దీక్ష ఇస్తున్నప్పుడు  న్యూమన్ కు   అకస్మాత్తుగా చూపు వచ్చేసి అందరికి ఆశ్చర్యం కలిగించింది 1925 లో లూసేక్స్ ను రోమన్ కేధలిక్ చర్చ కి  ‘’సెయింట్ ‘’గా ప్రకటించారు .ఆయన దయ వల్లనే తన కంటి చూపు రావటం ‘’బెడ్ సోర్స్’’ నయమవటం జరిగిందని తెరెసి  చెప్పుకోంది..ఆమెకు హీబ్రు ,గ్రీక్ లాటిన్ భాషలు తెలుసు

    1925 నవంబర్ ఏడు న న్యూమాన్ కు ‘’అపెండి సైటిస్  ‘’వచ్చి మళ్ళీ మంచం ఎక్కాల్సిన పరిస్తితి కలిగింది .  ఆమె కు ఆపరేషన్ చేయించాలని కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తుండగా వద్దని గట్టిగా అరచి తనను వెంటనే చర్చి కి తీసుకు వెళ్ళ మని కోరింది . అక్కడ ప్రార్ధన చేయ గానే అపెండి సైటిస్ మాయమయిందని  ప్రకటించింది .1926 మార్చ్ అయిదు  శుక్రవారం ఆమె కు గుండె పైన ఒక చిన్న పుండు ఏర్పడినట్లు అందులో యేసు క్రీస్తు, ఆయన శిష్యులు కన్పించి నట్లు తెలియ జేసింది . మార్చ్ పన్నెండు న మళ్ళీ క్రీస్తు మౌంట్  ఆలివేట్ పై దర్శనమిచ్చి నట్లు చెప్పింది ‘’క్రూసి ఫిక్సేషన్ ‘’కూడా ఆమె కు కన పడింది  ఇలా చాలా సార్లు ఆమె క్రీస్తు ను దర్శించిన అను భూతి పొందింది .ఈస్టర్ఆదివారం నాడు క్రీస్తు పునరుద్ధానాన్ని చూసింది .దీని వల్ల  ఆమె లో దైవీ శక్తులు చేరాయని అనుభూతి పొందింది .ఆమె లో వింత కాంతి వ్యక్తమైంది .కొందరు ఇవన్నీ ‘’హిస్టీరియా ‘’లక్షణాలని ,,’’మల్టిపుల్ పెర్సనాలిటి డిసార్దర్ (M.P.D.)అనీ అనుకొన్నారు  .ఆమె ఎన్నో మహిమలను ప్రదర్శించి అందర్నీ ఆశ్చర్య పరచింది

      1922 నుండి 1942 లో చని పోయేంత వరకు తెరేసి ‘’పవిత్ర యూకారిస్ట్ ‘’తప్ప  ఏ విధమైన ఆహారం తిన నే లేదు .అంటే నలభై ఏళ్ళు నిరాహారం గా ఉందన్న మాట .1926 నుండి  మరణించే దాకా అసలు మంచి నీళ్ళు కూడా తాగ కుండా  గడిపింది ఆ మాహాత్మురాలు ..ఏమీ తిన నప్పుడు  శరీరం శుష్కించి, బొమికల పోగు గా ఉండాలి కదా .కాని ఆమె కు వయసు మీద పడుతున్న కొద్దీ బరువు పెరుగుతోంది ఇది మరీ విడ్డూరం గా అని పించింది డాక్టర్లకు …1927లలో 121 పౌండ్ల బరువుంటే 1935 లో140 ,1950 లో 200 పౌండ్లు ఉంది 1953లో 215 పౌండ్ల బరువుంది .  జీవన క్రియలన్నీ సక్రమం గా ఉన్నాయి ఆమె కు ఈ బలాన్ని , ప్రాణ  శక్తిని యేసు క్రీస్తు ఇస్తున్నట్లుగా బావించేది

            1922 లో ఆమె ను చూడ టానికి  గొంతు నెప్పి తో బాధ పడుతున్న యువకుడొకడు వచ్చాడు .అతని బాధ గమనించి తొమ్మిది రోజులు ప్రత్యెక ప్రార్ధన చేసి అతని వ్యాధిని తాను పొంది అతని నేప్పిని పోగొట్టింది .అప్పుడే ఆ కుర్రాడు అక్కడే ఆమె సమక్షం లో మొదటి ప్రార్ధన చేశాడు  .ఇలా ‘’ఆమె ఎవరికీ తెలియ కుండా అనేక బాధలు పడేది. అవి ఇన్నీ అన్నీ అని,ఇన్ని రకాలని  చెప్పలేము’’ అని ఆమె జీవిత చరిత్ర రాసిన వారు అన్నారు . పేదల ,రోగ గ్రస్తుల ,ప్రమాదాలలో మరణించే వారల ఆత్మ హత్యకు పాల్పడే వారల బాధలను తొలగించి వాటిని తనకు సంక్రమింప జేయ మని ఆమె అను నిత్యం యేసు క్రీస్తు ను ప్రార్ధించేది .అందుకే సాటి మానవుల కోసం అంత యమ యాతన అనుభవించేది .ఇది ఆమె నిత్య కృత్యం అయి పోయింది .ఆ జబ్బులను తానే స్వీకరించేది వారిని విముక్తులను చేసేది .ఇదంతా తానూ ఐచ్చికం గా నే చేస్తున్నాని ఏ ప్రతి ఫలా పేక్ష తనకు లేదని తన ప్రభువుకు విన్న వించు కొనేది .ఇతరులకు చెందిన ఇన్ని బాధలు అనుభ విస్తున్నా తెరేసి కాంతి వంత మైన కన్నులతో, ఏంతో సంతోషం గా చిరు నవ్వు తో చిన్న పిల్ల లాగ అమాయకత్వం గా హాస్య ప్రియం గా ఉండటం ప్రత్యేకత .

         తెర్సి మహిమలను చూచే భక్తుల సంఖ్య మిలియన్లను దాటి పోతోంది .ఇందులో వందలాది డాక్టర్లు ఆమె కేస్ ను అధ్యయనం చేయటానికి వచ్చే వారు 1945 లో నాజీ ప్రభుత్వ పతనం తర్వాత అమెరికా నుండి  అనేక స్థాయిలలో  ఉన్న  వేలాది మంది వచ్చి చూసి వెళ్ళే వారు .ప్రపంచం నలు మూలల నుండి ఎంతో మంది ఉన్నతాధికారులు సైనికులు ‘’జర్మనికి వ్యతిరేకం గా పోరాడిన దేశాల ప్రతినిధులు తీర్ధ యాత్ర లాగా వచ్చి ఆమెను  సందర్శించి వెళ్ళే వారు .నాజీ దురాగతాలకు గురి అయిన వారందరికీ ఆమె ఆహారం,మందులు అంద జేసేది ..బాధితులు వస్తే ఓదార్చి ఉపశమనం కల్గించి పంపేది .

     1945 ఏప్రిల్ 20 న తెరేసి లేని సమయం లో నాజీ సైనిక సార్జంట్ ఆమె కుటుంబ బంధువులను చంపటానికి ఆమెను తమకు స్వాధీనం చేయమని అడగటానికి వచ్చాడు .కానీ అప్పటికే అమెరికా బాంబుల దాడిలో ఆమె ఆశ్రమం దెబ్బతింది .ఆమెకు ప్రాణాపాయం తప్పింది .కానీ ఆమె దయకు అంతు  లేదు కమ్యూనిస్ట్ పాలన లో వున్న వారికి కూడా ఆహార పొట్లాలను, మందులను ఉదారం గా సరఫరా చేయించి మాన వత్వాన్ని చాటుకొన్నది ..

  1926 లో ఆమె తలపై కని  పించిన తొమ్మిది పుండ్లు ఆమె చని పోయే వరకు అలానే ఉండి పోయాయి పెరగనూ లేదు ఇన్ ఫెక్షనూ రాలేదు .వాసనకూడా రాలేదు .అదీ విడ్డూరం .ఇవి యేసు క్రీస్తు తలపై  ముళ్ళ వలన కలిగిన గాయాలుగా ఉన్నట్లు అందరూ భావించే వారు అందుకే ఆమె ను ‘’స్టిగ్మటా ‘’అంటే  ‘’పుండ్ల (మచ్చల ) మనిషి’’ అన్నారు . ప్రతి క్షణం దైవీ శక్తి ,ప్రాణ శక్తి ఆమె లో నిండి నిబిడీ క్రుతమ య్యేవి .ఆమె నాలుక పై శక్తి పాతం ఉన్నది అని అందరు భావించే వారు  ఆమె మాటలు దైవీ శక్తి పూరితాలుగా ఉండి ఉపశమనం కల్గించేవి

               తెరేసి దైవ ప్రార్ధన తో ఎక్కువ కాలం గడిపినా మిగిలిన సమయాలలో ఇంటి పని ,పొలం పని,తోట పని చేసేది .బాధితుల ఉత్తరాలకు జవాబులు రాసేది రాత్రి పూట స్తానిక చర్చ లో నేలను ఊడిచి శుభ్రం చేయటం, పూలను అలంకరించటం చేసేది .విరామం ఎరుగని కర్మ యోగి గా జీవితం గడిపింది .వారం లో రెండు లేక మూడు గంటలు మాత్రమె నిద్రించేది మిగతా కాలం  లో క్రీసు ధ్యానం లో రోగుల బాధలను తాను పొంది వారికి ఊరట కల్గించేది

               ఇంతటి సార్ధక జీవితాన్ని గడిపి పరోపకారం గా జీవించి బాధితుల పాలిటి అపర దేవ దూత గా నిలిచి,ఎందరికో మార్గ దర్శనం చేసిన తెరేసి న్యూమన్ యోగిని 1962 సెప్టెంబర్18 న 64 ఏళ్ళ వయసులో దైవ దర్శనం పొంది సునాయాసం గా మరణించింది .

                  –  గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

0

Posted in రచనలు | Tagged | Leave a comment

వాల్మీకి రామాయణం యధామూలానువాదం -ఆచార్య పుల్లెల శ్రీ రామచంద్రుడు

0001 0002

Posted in పుస్తకాలు | Tagged | 2 Comments

మరుగున పడిన మతాలు-మతాచార్యులు -33

మరుగున పడిన మతాలు-మతాచార్యులు -33

వైట్ హెడ్

ఆల్ఫ్రెడ్ నార్త్ వైట్ హెడ్ బ్రిటన్ కు చెందిన దార్శనికుడు 1861 లో ఫిబ్రవరి పది హీను జన్మించాడు ట్రినిటి కాలేజ్ లోయాభై ఏళ్ళకు  ఫెలోషిప్ సాధించాడు లండన్ యూని వర్సిటి లో గణిత, యాంత్రిక శాస్త్రాలను బోధించాడు ఇంపీరియల్ కాలేజి ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ లో గణిత శాస్త్ర ఆచార్యుడు అయ్యాడు .1924 లో ఉద్యోగం  విరమించే దాకా హార్వర్డ్ యూని వర్సిటి లో దర్శన శాస్త్ర ఆచార్యుడు గా ఉన్నాడు .గణితానికి ,దర్శన శాస్త్రానికి వైట్ హెడ్ చేసిన సేవ నిరుప  మానం క్షేత్ర గణితం భౌతిక శాస్త్రం ,అతి భౌతిక శాస్త్రాలలో ఉన్న అడ్డంకులను  తొలగించాడు .ఈయన ప్రభావం అనేక మంది ఆ చార్యులపై పడింది మహా ప్రతిభా సంపన్నుడ ని  పించుకొన్నాడు .

 

Alfred North Whitehead.jpg

ఒక శాస్త్రం లో విశేషజ్నత ఉన్న వాడు మరొక దాంట్లో నిష్ణాతుడు కావటం అసాధ్యం కాని వైట్ హెడ్ గణిత శాస్త్రాధ్యాపకుడై ఉండి కూడా దార్శనికుడు గా మారి అంత రింద్రియ జ్ఞానానికి తర్కానికి ,భౌతిక శాస్త్రానికి సమాన మైన ప్రాద్దాన్యం ఇచ్చి ఒక కొత్త దర్శన సిద్ధాంతాన్ని ప్రతి పాడించిన మహా మేధావి .అతని దర్శనం లో దృక్పద ఐక్యతా ,సమీక్షా వైశిద్యం అందరి ప్రశంసలు పొందాయి ..

వైట్ హెడ్ ప్రత్యేకత ఏమిటి అంటే పదార్ధాలను గ్రాహించి ప్రపంచాన్ని అవయవ సమూహం గా  నిరూపించటం .ప్రకృతి దృశ్యాలన్నీ ఒక సర్వ సామాన్య ప్ర క్రియ చేత శాసింప బడుతాయని సిద్ధాంతీకరించాడు .ఇది సృజనాత్మక ప్రక్రియ .ఈయన దర్శనం లో మూడు భాగాలున్నాయి మొదటిది వాస్తవిక సంభవాలు (ఆక్త్యువాల్ అకేష న్స్ )రెండు నిత్య వస్తుజ్ఞానం (ఎటర్నల్ ఆబ్జేక్త్స్ )మూడవది దేవుడు .,ప్రపంచం

అతని దృక్పధం లో ప్రపంచం ప్రత్యెక వాస్తవ సత్యాల సమాహారం .ఇవి ఒక దానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి .ప్రాతి వాస్తవికత మిగిలిన శక్తి కేంద్రాలతో సృజనాత్మకం గా ప్రక్రియ లో పాల్గొంటాయి వాస్తవ ప్రక్రియలను విక సింప జేసే ఈ ప్రక్రియనే ‘’కాన్శంస్ ‘’అన్నాడు ఈ ప్రత్యెక సంభవాలు అమూర్త వస్తువులు కావు .ఇందులో ప్రతిదీ నిజమైంది ,ప్రాత్యేక మైంది కూడా .వాస్తవిక సంభవాల ప్రత్యేకత దాని అంతర ఏకత చేత నియమింప బడుతుంది .

వైట్ హెడ్ భావాలలో నిత్య వస్తు భావం చాలా ప్రాధాన్యం పొందింది .వాస్తవిక సంభవాలు ఇంద్రియాలనే కాక బుద్ధిని కూడా తాకుతాయి ఇలాంటి అమూర్తాలనే నిత్య వస్తువు అన్నాడు అమూర్త వస్తువులు ఇంద్రియాలకు అతీతం గా ఉంటాయి నిత్య వస్తువులు అంతర్యామిత్వాన్ని కోరతాయి .నిత్య వస్తు ప్రపంచం కనీ పించే ప్రపంచం కంటే అతీతం గా ఉంటుంది .నిత్య వస్తువులు విశ్వం యొక్క మౌలిక అంశాలు అన్నాడు వైట్ హెడ్ .

అతని ‘’అవయవి ‘’దర్శనం లో ‘’నిరాపేక్ష అతీతత్వాం ,’’నిరపేక్ష అంతర్యామిత్వం ‘’మొదలైన భావాలు లేవు .ఆయన వాస్తవిక సంభావాలకు సాపేక్షతా సూత్రం ఎలా అన్వాయిస్తుందో ఈశ్వరునికి సంబంధించిన దానికీ అలానే వర్తిస్తుంది ఈశ్వరుడు ప్రపంచానికి వాస్తవిక సంభావాలకు అతీతుడు కాదు అన్నాడు దేవుడిని వదిలేసి నిత్య వస్తువులు ఇతర వాస్తవిక సంభావ వికాసానికిమార్గ దర్శనం చేస్తాయి .ఈశ్వరుడు నిత్య వస్తువుల సృష్టి కర్తకాదన్నాడు వైట్ హెడ్ .అయితే వాటి వ్యవస్థ యేర్పడ టానికి దేవుడే కారకుడు తన మౌలిక స్వభావ ప్రభావం చేత ఈశ్వరుడు నిత్య వస్తువులను దర్శిస్తాడు ఆయన గ్రహించి నట్లు ఏ వస్తువు గ్రహించ లేదు ఒక వాస్తవిక సంభవం ఇంకొక దాని చేత విషయీకరింప బడుతుంది .ఇతర వాస్తవ సంబంధాల లాగా ఈశ్వరుడు మూర్తార్ధలను కల్పించడు దృష్టిలో కాని ,ప్రతీకార గుణం లో కాని తీక్ష్ణత లో కాని ఈశ్వరుడి అనుభవం సర్వ సమగ్రం అన్నాడు వైట్ హెడ్1947 డిసెంబర్ ముప్ఫై న మరణించాడు ప్రాసెస్ ఆఫ్ ఫిలాసఫీ ,ప్రాసెస్ ఆఫ్ దియాలజిల సిద్ధాంత కర్త గా గొప్ప గుర్తింపు పొందాడు

సశేషం

మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ -5-10-13 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ దేవి భండాసుర వధలో అంత రార్ధం -1

శ్రీ దేవి భండాసుర వధలో  అంత రార్ధం  -1

శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం లో శ్రీ దేవి అయిన శ్రీ లలితా పరమేశ్వరి సహస్ర నామ స్తోత్రాలలో భండాసుర రాక్షసుని సంహారం ఉన్నది .ఇది మామూలుగా దుస్ట రాక్షస సంహారం గా అని పిస్తుంది .కాని లోతులు తరచి చూస్తె అద్భుతమైన అంతరార్ధం గోచరిస్తుంది ఇవిదసరా నవరాత్రి ఉత్సవాలు  కనుక ఇందులోని ఆంతర్యాన్ని తెలియ జేయటమే నా ఉద్దేశ్యం .దీనికి  మహా ఆధ్యాత్మిక పరులు ,బహు గ్రంధ కర్త ,మహా వాజ్మి అనేక భాషలలో నిష్ణాతులు కేంద్ర ప్రభుత్వ ఉన్నతోద్యోగులు అయిన స్వర్గీయ శ్రీ  ఇల పావులూరి పాండు రంగా రావు గారు రచించిన ‘’శ్రీ సహస్రిక ‘’అనే శ్రీ లలితా పరమేశ్వరి సహస్ర నామ స్తోత్రానికి వారు రాసిన అత్యద్భుత మైన మహా విశ్లేషణ ఆధారం .నేను చదివి ఎంతో అనుభూతి పొందాను .ఇప్పుడు మీ కోసం సంక్షిప్తం గా ఈ వధలోని  ఆంతర్యాన్ని  వారు ఆవిష్కరించిన సత్యాలను మీకు తెలియ జేయటానికి సాహసిస్తున్నాను .ఈ అంత రార్ధం తెలుసు కొని మనం లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేస్తే అలౌకిక ఆనందం లభిస్తుంది .అదొక దివ్య అనుభూతి గా మిగులుతుంది .ఊరికే పారాయణ కోసం పారాయణ కాకుండా ఈ సూక్ష్మాన్ని గ్రహించి చదివితే చెప్పరాని సంతోషం కలుగుతుంది .పాండు రంగా రావు గారు అమ్మ నామాలలోని ప్రతి దాన్ని గొప్పగా అర్ధం చెప్పి ,ప్రతి నామానికి తరువాతి నామం తో ఉన్న అను బంధాన్ని వివరిచటం నాకు తెలిసి నంత వరకు ఎవరూ చేయలేదు .అలాగే వారు శ్రీ విష్ణు సహస్ర నామాలకూ ఇదే పధ్ధతి అవలమించి వివరణ ఇవ్వటం ఆంద్ర దేశం చేసుకొన్న అదృష్టం .ద్రష్టలు మాత్రమె సందర్శించ గలిగే మహా వైభవం ఇది .వారు జితేన్ద్రియులు కనుక బహు ఆధ్యాత్మిక గ్రంధాలను  అవలోడనం చేసిన మహా మనీషి కనుక వారికే సాధ్యమైంది అదొక లోకం .అందులో ప్రవేశిస్తే పరమాను  భవమే .మాన, ఆధ్యాత్మిక మహా శాంతి లభించటానికి ఇలాంటివి చదివి తరించాలి .

ఉపాసన లో శారీరక అంగం అయిన అర్చన ,మానసిక అంగం జపం ,బౌద్ధిక అంగం ధ్యానం అని మూడు ఉంటాయి వీటిలో మాటల ద్వారా చేసే స్తోత్రం లేక స్తుతి అందరికి చాలా తేలికైనది సాధ్యమైనది  ఈ స్తోత్ర సాహిత్యం లో భాగాలే సహస్ర నామ స్తోత్రం .ఆచార్య శంకరులు ‘’గేయం గీతా నామ సహస్రం ‘’అని దీని గొప్ప తనాన్ని చెప్పారు .శంకరుల దృష్టిలో గీతాధ్యయనం ,సహస్ర నామ పఠనం సాధకులందరికి పరమ కర్తవ్యమ్ .గీత అంటే ఆచార్యుల భావనలో భగవద్గీత .సహస్ర నామం అంటే విష్ణు సహస్ర నామం .ఈ రెండిటికి భాష్యం రచించి చదువరులకు సుసాధ్యం చేశారుఆది శంకరులు   ఈ రెండు మనం పంచమ వేదం అని చెప్పుకొనే మహా భారతం లోనే ఉన్నాయి కర్త వేద వ్యాస మహర్షి  . మహా భారత యుద్ధం ముందు భగవద్గీత ను సాక్షాత్తు శ్రీ కృష్ణ పరబ్రహ్మ జిజ్ఞాసువైన అ ర్జునునికి బోధించాడు  .యుద్ధం తర్వాత విష్ణు సహస్ర నామం వస్తుంది గీత ప్రేరణ నిస్తే సహస్రనామం శాంతి నిస్తుంది .భారతం లో విష్ణు సహస్రం తో బాటు శివ సహస్ర నామమూ  ఉంది .ఈ సహస్రనామ పారాయణ హిందువులకే కాదు జైనులకు కూడా ఉంది .జైన మునులు సాధకుల కోసం అనేక సహస్ర నామాలు రాశారు

ఈ పరంపరలో మనకు బ్రహ్మాండ పురాణం లో శ్రీ లలితా మాత లాలిత్యాన్ని ,లావణ్యాన్ని ,లీలా విభూతిని వర్ణించే శ్రీ లలితా సహస్రనామం లిఖించ బడి ఉంది దక్షిణాది సాధకులకు ఇది పరమ పావనమైనది .వ్యక్తీ గతం గా సామూహికం గా ఉత్సవాలలో దీన్ని పారాయణ చేసి గొప్ప అను భూతిని పొందుతారు, కలిగిస్తారు .శుక్ర వారం నాడు పఠనం మహా పవిత్రమైనదిగా భావిస్తారు ప్రతి నామానికి మొదట ప్రణవ నామమైన ‘’ఓం కారాన్ని’’ ,చివర ప్రణామ నామమైన ‘’నమః ‘’శబ్దాలను చేర్చి లలితా మాతను వాగ్రూపం గా అర్చిస్తారు

శ్రీ శంకర భగవత్పాదులు విష్ణు ,లలితా సహస్ర నామాలకు ఎంతో ప్రాధాన్యత నిచ్చారు .విష్ణు సహస్రనామాలకు ఎంతో సార వంత మైన భాష్యం రాశారు .లలితా సహస్రనామాల ఆధారం గా ‘’సౌందర్య లహరి ‘’అనే మహిమాన్విత మైన శతకం రాశారు .ఇది సాధకులకు తవ్విన కొద్దీ లభించే అపూర్వ నిధి .శంకరులు స్తాపించిన ద్వాదశ పీఠాలలో  లలో శ్రీ చక్రాన్ని ప్రతిష్టించి దానికొక విశిష్టతను సంత రించారు ..లలితా సహస్ర నామం స్తోత్రం మాత్రమె కాదు శ్రీ దేవీ రహస్యాన్ని ప్రతి పాదించే శాస్త్రం కూడా .స్మరణ మాత్రం చేత పవిత్రం చేసేవి ఈ రెండు సహస్రాలు .లలిత లో శ్రీ దేవి అనంత సౌందర్యం ,ప్రభావం ప్రసాద గుణం గొప్పగా వర్ణించ బడ్డాయి .ఆత్మ విద్య యొక్క అంత రంగిక రహస్త్యం కూడా ప్రతి పాదించారు .అందుకే దీన్ని ‘’రహస్య నామ స్తోత్రం ‘’అనీ అంటారు .

 

శ్రీ తత్త్వం,శ్రీ విద్యా, ,శ్రీ చక్ర రహస్యం శ్రీ దేవి సహస్రనామాలలో దర్శన మిస్తాయి .అమ్మ తన చిన్మయ మంద హాసం తో ఆత్మ కధను మధుర వాక్కులతో వినిపిస్తున్నట్లున్తుంది .ఇందులో ఒక చక్కని క్రమ పద్ధతి  ఉంది .విష్ణు సహస్ర నామాలలో నామాల పూర్వా పరం, ఆత్మాను శాసనం అందరికి అర్ధం కావు .చాలా సూక్ష్మ పరిశీలన చేసిన వారికే అవి గోచరాలు .కాని లలిత లో పూర్వాపర సంబంధం, ఆధ్యాత్మికత, దార్శనికత ,ఆలోచనా ధార, ప్రతి వారికి అర్ధమయ్యే రీతి లో కూర్చబడిన నామాలు‘’.బహుజన హితాయ బాలానం సుఖ బోధనం’’ అన్నట్లు సులభ శైలిలో నామాలు నడుస్తాయి .

సరస్వతీ మాతను శ్రీ దేవి తన నమ సహస్రిక ను రచించమని కోరితే వాగ్దేవి రాసింది .అమ్మ ఆజ్ఞ తో వాగ్దేవతలు ఈ స్తోత్రం చేశారు .రచనలో సుందరత,సౌష్టవం ఉన్నాయి సాహిత్యం పరమ ఉత్కృష్ట స్తాయి లో ఉంది .మొదటి ఇరవై నాలుగు శ్లోకాలలో శ్రీ దేవి దివ్య సౌందర్య వర్ణన ఉంది ఇంత అద్భుత వర్ణన ప్రపంచం లో ఏ సాహిత్యం లోను లేదని దీనికి సరి సాటి లేదు అని శ్రీ ఇల పావులూరి వారన్నారు .లలితా సహస్రనామాలను చెప్పిన వాడు హయ గ్రీవుడు .శ్రోత అగస్త్య మహర్షి .రహ్మాండ పురాణం లో హయగ్రీవుడు లలితామాత మహిమ లన్నీ అద్భుతం గా వర్ణించి చెప్పినప్పుడు మహర్షి పులకించి ‘’లలితా దేవి రహస్య నామాలను ‘’కూడా తెలియ జేయ వలసిందని కోరగా ‘’రహస్య నామ సహస్రం ‘’ను హయగ్రీవుడు ఉపదేశించాడు .ప్రతి నామం లో దేవి నివాసం ఉంటుందన్నాడు కనుక నామాల ద్వారా చెప్పిన సత్యం దీని కూర్పు లో ఉందని తెలుస్తుంది .

శ్రీ దేవి మహిమాన్విత గాధల వెనుక కూడా తాత్విక రహస్యం ఉంది .బ్రహ్మాండ పురాణం లో శంభువు శ్రీ యాగం లో చిత్ కుండం లో శ్రీ మాతను ప్రత్యక్షం చేసుకోన్నాడని ఉంది కనుక శ్రీ యాగం ,శ్రీ మాత ను పొందటానికి ఒక సాధనం అని తెలుస్తోంది .ప్రతి ప్రాణి లలాట లో ఈ చిత్ కుండం జ్వాజ్వల్య మానం గా ప్రకాశిస్తుంటుంది .శ్రీ యాగం చేసినా దర్శన మిస్తుంది శివుడీకే  యాగం చేస్తే కాని ఆమె దర్శనం కాలేదు .శ్రీ తత్వాన్ని గూర్చి ఆలోచించటం,శ్రీ విద్య మననం ,శ్రీ చక్రారాదనే శ్రీ యాగం అంటే .వేరే ఏదీ కాదని గ్రహించాలి .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -5-10-13- ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -32

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -32

షోపెన్ హార్

జర్మని కి చెందిన షోఫెన్  హార్ డాన్జింగ్ నగరం లో 1788 లో ఫిబ్రవరి 22న జన్మించాడు .ధనిక కుటుంబానికి చెందిన ఈయన తల్లి సాహిత్య కళా రంగాలలో మంచి ఖ్యాతి పొందింది .తండ్రి చేసే వ్యాపారం లో కొంత కాలం పని చేశాడు నచ్చలేదు .1809 లో గోటేన్ నగరం చేరాడు ..అక్కడి విశ్వ విద్యాలయం లో వైద్య శాస్త్రం లో చేరాడు .

 

 

Schopenhauer.jpg

Arthur Schopenhauer Signature.svg

‘’పర్యాప్తతత్త్వం యొక్క నాలుగు మూలాలు ‘’అనే బృహత్ గ్రంధాన్ని రాసి జేనా విశ్వ విద్యాలయం నుంచి 1813 లో డాక్టరేట్ బిరుదు పొందాడు  డ్రెస్ డెన్ లో ప్రధాన గ్రంధమైన’’ భావ ,సంకల్ప రూపాలలో ప్రపంచం ‘’1878 లో రచించాడు .బెర్లిన్ విశ్వ విద్యాలయం లో  లెక్చరర్  అయ్యాడు .అప్పటికే ప్రఖ్యాతులైన హెగెల్ మొదలైన వారి‘’భావ వాదం ‘’పై తీవ్ర విమర్శలు చేశాడు హార్ .తన మనసులోని భావ ధారను ఉపన్యాసాలుగా వెలువరించాడు .అయితే మంచి ఉపన్యాసకుడి గా గుర్తింపు పొందలేక పోయాడు ..వినే వాళ్ళే కరువై పోయారు .కోపం వచ్చి ఈ ఉపన్యాస పరం పరకు స్వస్తి చెప్పాడు .1831 లో బెర్లిన్ లో కలరా తీవ్రం గా విజ్రుమ్భించిన కాలం లో అందరు నగరాన్ని వదిలి పెట్టి వెళ్లి పోతే ,షో పెన్  హార్ మాత్రం ఒక్కడే ఏకాకి గా బెర్లిన్ లో ఉండి  పోయాడు .1860 సెప్టెంబర్ 21న డెబ్భై రెండేళ్లకు మరణించాడు రిచార్డ్ వాగ్నర్ ,ఎడ్విన్ స్కోరింజేర్ ,ఆల్బర్ట్ ఐన్స్టీన్ ,టాల్ స్టాయ్ ,ఫ్రాయిడ్ ,ముస్తఫా మొహమ్మద్ మొదలైన వారి పై హార ప్రభావం అధికం .వేదాల,ఉపనిషత్తుల  సారాన్ని బాగా గ్రహించాడు హార్.వేద ,ఉపనిషత్తుల పై  ఆయన శ్రేష్ట  అభిప్రాయాన్ని కింద చూడండి

If the reader has also received the benefit of the Vedas, the access to which by means of the Upanishads is in my eyes the greatest privilege which this still young century (1818) may claim before all previous centuries, if then the reader, I say, has received his initiation in primeval Indian wisdom, and received it with an open heart, he will be prepared in the very best way for hearing what I have to tell him. It will not sound to him strange, as to many others, much less disagreeable; for I might, if it did not sound conceited, contend that every one of the detached statements which constitute the Upanishads, may be deduced as a necessary result from the fundamental thoughts which I have to enunciate, though those deductions themselves are by no means to be found there.[90]

He summarised the influence of the Upanishads thus: “It has been the solace of my life, it will be the solace of my death!”

హార్ దర్శికుడే కాక కళా మర్మజ్ఞుడు కూడా .ఈయన దర్శన సిద్ధాంతాల మీద ప్లేటో కాంట్ లప్రభావం ఎక్కువ .ప్లేటో చెప్పిన ‘’రియాలిటి అండ్ అపియరెన్స్ ‘’సిద్ధాంతాన్ని కాంట్ ఒప్పుకొని వృద్ధి చేస్తే హాపర్ కూడా సమర్ధించాడు .హార్ దృష్టిలో దర్శన శాస్త్రానికి ,విజ్ఞాన శాస్త్రానికి ,శాస్త్రానికి ,కళ  కు బుద్ధికి ,సంకల్పానికి మధ్య భేదం ఉంది .బుద్ధి కంటే సంకల్పం గొప్పది మూలమైనది,ప్రధానమైంది . ..అన్నాడు షో షేన్.బుద్ధి హేతు  ద్వారాకనిపించే  ప్రపంచాన్ని నిర్మించుకొంటున్నది  కాని దాని వెనుక ఉన్న సత్యం యొక్క జ్ఞానాన్ని కలిగించదు .ఆంతరంగిక జ్ఞానం ద్వారానే సత్య జ్ఞానం లభిస్తుంది .అలాంటి లోపలి జ్ఞానం తోనే బుద్ధికి, కాలానికి, ప్రయోజనం  లేని సంకల్పం గోచరిస్తుంది .

విషయ జ్ఞానం మీదే ప్రపంచం ఆధార పడి ఉందని, జ్ఞాన భావమే ప్రపంచ భావం అన్న భావ వాదాన్ని హార్ అంగీక రించాడు ..అయితే విషయి లోని భావాలన్నిటికీ సంకల్పమే ఆధారం అన్నాడు .ఈ సంకల్పమే వ్యక్తిలో ,విశ్వం లో, జడం లో, చైతన్యం లో వివిధ దశలలలో తనను తాను ఆవిష్కరించు కొంతుటుంది అన్నాడు .ఈ సంకల్పం సంగీతం లాంటి కళల లో కూడా ఆవిష్క్రార మవుతుంది  అన్నాడు .సంకల్పం వివేక రహిత మైనది .బుద్ధి దీనికి బానిస అన్నాడు హాపర్ .

శాస్త్రం వస్తువు యొక్క ఉపాధి ని మాత్రమె తెలియ జేస్తుంది .కాని దాని యదార్ధ స్వరూపాన్ని చెప్ప లేదు అలాంటి వస్తు యదార్ధ స్వరూపం శాస్త్రానికి అందదు  కళలు మాత్రమె వ్యక్తం చేస్తాయి .విజ్ఞానం  అంటే తార్కిక ప్రక్రియ ..సాధన వల్ల  దీన్ని గ్రహించ వచ్చు .దార్శనిక సత్యాన్ని తన లాంటి మేధావులు మాత్రమె గ్రహించ గలరు అన్నాడు .అలాంటి సత్య గ్రహణానికి మూలం వ్యక్తీ లో ఉండే దార్శనిక శక్తి అని హార్ అభిప్రాయ పడ్డాడు .

సంకల్పం అనే భావనలో అన్ని కోరికలు ,ప్రయత్నాలు ,ప్రేరణలు ,పరిణామ ప్రవృత్తులు ఉన్నాయి .వీటి వైరుధ్యం వల్లనే అసంతృప్తి, బాధ కలుగుతాయి .మానవ జీవితం బాధా మయం అంటాడు షో షెన్..అందుకని హార్ ను ‘’నిరాశా వాది ‘’అన్నారు సుఖం అనేది వ్యతి రేక భావమే .మన బాధలకు, కోరికలకు అది తాత్కాలిక ఉపశమనమే .సంకల్పం హేతు రహిత మైంది. దాని వల్ల  వచ్చే సంఘర్షణ కూడా నిత్య మైనది ఇలాంటి సంకల్పానికి పర్య వసానం నిరాశే అంటాడు .మనం చూసేదంతా నిరుపయోగం అనే భావన వస్తే అదేవిముక్తి మార్గం చూపిస్తుంది .కోరికలను అణచుకొంటే కాని శాంతి రాదు. .కాలాను భూతి లో సంకల్పం నిషేధించ బడుతుంది .దీని వల్ల  కోరికలూ ఉండవు .కాని లభించే ఉపశాంతి మాత్రం తాత్కాలికం గానే ఉంటుంది అన్నాడు షో ఫెన్ హార్ .

సంకల్ప విమోచనం నీతి ద్వారానే సాధ్యం .ఒకే ఒక్క పరమార్ధమైన సంకల్పం యొక్క రూపాలైన వ్యక్తులు పరస్పరం భిన్నాలు కారు .దీని కంటే గొప్పది సంకల్పాన్ని నిషేధించట మే .సంకల్పాన్ని నిషేధిస్తే బాధ ఉండదు .ఏ మతం ప్రతి పాదించినా ఇదే నంటాడు .

దేశం, కాలం, కారణాలు భ్రాంతి మాత్రమె .అందుకని మానవ ప్రయత్నం వృధా .పురోగతి ఉండదు అన్నాడు హార్ .అహంకారమే రాజ వ్యవస్థకు కారణం .పేదరికం ,బానిసత్వం నిరుద్యోగం ,యుద్ధాలు కొద్ది మంది భో గాన్ని అనుభ వించటం వల్లనే వస్తున్నాయన్న రాజ కీయ మర్మజ్ఞుడు హాపర్. .కాని ఈ భోగమే లేక పోతే సంస్కృతీ ,మానవ వికాసం ఉండవు అనీ చెప్పాడు .ఎక్కువ మంది ప్రజలు బుద్ధి హీనులు ..వీరిని  బుద్ధి మంతులైన వారు నాయకులై ముందుకు నడిపించాలి .స్త్రీలు బుద్ధిలోను  ,నైతికం గాను మగ వారి కంటే తక్కువ వారు అన్నాడు షో ఫెన్ హార్

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-10-13 ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -31

     మరుగున పడిన మతాలు –మతాచార్యులు -31

స్టాయిక్ మతం

గ్రీకు దర్శన శాస్త్రేం లోచివరి యుగానికి చెందినమతమే స్టాయిక్ మతం .క్రీ పూ300 లో ‘’జీనో ‘’స్టాయిక్. మతాన్ని ఎదేన్స్ నగరం లో స్తాపించాడు ఇందులో నైతికం, దార్ర్శనికం  అనే రెండు భాగాలున్నాయి …ఎదేన్స్ లో జీనో ఒక సంత దగ్గర బొమ్మలు వేసే ‘’స్టోవా‘’అనే వసారాలో దీన్ని మొదట బోధించటం వల్ల స్స్టాయిక్ మతం అనే పేరొచ్చింది .దీన్ని అనుసరించే వారే స్టాయిక్కులు .

 

Zeno of Elea Tibaldi or Carducci Escorial.jpg

సత్య ద్వారం తెరవటం                                                                    జీనో

సినిక్ దార్శనికుడైన స్టాయిక్ దగ్గర జీనో విద్య నేర్చుకొన్నాడు .ఆ మతం లోని నైతిక సిద్ధాంతాలను తీసుకొని స్టాయిక్ మతం గా వృద్ధి చేశాడు జీనో .ఇతని వారసుడు క్లియాన్తిస్ .ఇతను ఇందులోని హేరా క్లైటాస్ మత భావాలను వ్యాప్తి చేశాడు .హేరా క్లైటాస్ చెప్పిన విశ్వాగ్ని (యూని వరసల్ ఫైర్ ),లాగాన్ చెప్పిన కాలం అనే సిద్దాన్తాలున్తాయి .తరువాత క్రిసప్పాస్ దీన్ని ఇంకా వ్యాపింప జేశాడు .క్రీ.పూ.రెండో శతాబ్దిలో దీన్ని రోమన్ సామ్రాజ్యం లో సేనే టియన్ ప్రవేశ పెట్టాడు .ఇతను చెప్పిన దాన్ని‘’మధ్య స్టోవాఅన్నారు .రోమన్  కుటుంబాలలో ఇది రెండు వందల ఏళ్ళు బాగా వ్యాపించింది .క్రీ.పూ.ఒకటవ శతాబ్దం లో ‘’సేనేకా ‘’,ఎపిక్తాస్  ,మార్కస్ ,ఒరీలియన్ చక్ర వర్తి బాగాఉధృతం గా  గా ప్రచారం చేశారు .క్రీ;శ .మూడవ శతాబ్దం వచ్చేసరికి స్టాయిక్ భావాలన్నీ క్రైస్తవ మతం లో చేరిపోయాయి .రోమన్ ధర్మ శాస్త్రం పై సేనేకా, స్టాయిక్ మత ప్రభావం బాగా ఉండేది .

స్టాయిక్ మతం లో మూడు భాగాలున్నాయి తర్కం ,భౌతికం ,నీతి శాస్త్రాలు .తర్క శాస్త్రం లో మనసు బయటి వాటి నుంచి ఇంద్రియాల ద్వారా సంవేదనలు గ్రాహించి హేతు బుద్ధి తో ఒక క్రమంగా మార్చి సామాన్య భావాన్ని సృష్టించు కొంటుంది .మనసుకు దృఢ మైన నమ్మకం కలిగితే కాని సంవేదనలు సత్యం అని అంగీకరించదు .సామాన్య భావాలు –ఏ సంబంధం గుణాల యొక్క సామాన్యలయ్యయో వాటికి ఈ విశ్వం  లోని హేతు క్రమం కు అనుగున్ణ్యం  గా ఉన్నప్పుడే అవి సత్యాలవుతాయి .గుణాలు ,సంబంధాలు మనం సంకల్పించేవి కావు  అంటుంది  స్టాయిజం  ..నిజం గా ప్రకృతి లో ఉంటె,సామాన్య భావాలు మన మనసులో మాత్రమె ఉంటాయి అంటారు స్టాయిక్కులు సత్యాన్ని చేరాలంటే అనుమానం కూడా ఒక ప్రమాణమే .కనుక తర్కం అనేది వీరిసాధనం  .అరిస్టాటిల్ చెప్పిన న్యాయ ప్రయోగ సిద్ధాంతాలకు కొన్ని మార్పులు చేసి ,కొత్తవి చేర్చి దీన్ని రూపొందించారు

భౌతిక శాస్త్రం లో అరిస్టాటిల్ చెప్పిన అతి భౌతిక రూపమే స్టాయిక్కులభౌతిక శాస్త్రం .దీనిలో ఖగోళం ,మతం మనస్తత్వ శాస్త్రాలున్నాయి .ఈ విశ్వానికి మూల కారణం అంతటా వ్యాపించి ఉండే అగ్ని అంటారు స్టాయిక్కులు .అదే ఈశ్వరుడు అన్నారు .సత్తా అనేది రెండు తత్త్వాలలో  ఉంటుంది మొదటిది .సచేతన మైనది .ఇది స్వయం చాలక మైనది .ఇదే కార్య కారకం కూడా .ఇతర వస్తువులకు రూప కల్పనా చేస్తుంది .రెండవది జడం ఇది మార్పు చెందుతుంది ,కదలిక ఉంటుంది ఇతరాలు దీన్ని రూప కల్పనా చేస్తాయి ఆలోచన లో మాత్రమె ఈ రెండు తత్వాలను వేరు చేయగలం .నిజం గా చెప్పాలంటే ఈరెండు కలిసే ఉంటాయి అన్నది స్టాయిక్కుల జడ తత్త్వం .

స్టాయిక్కులు నియతి వాదాన్ని సమర్ధించారు .ప్రపంచం లో అన్ని పూ ర్వమే ఈ విశ్వం ఏర్పాటు చేసిందని ,విధిని అంగీకరించటం లోనే మనిషికి స్వేచ్చ ఉందని అంటారు .

స్టాయిక్కులనీతి శాస్త్రం లో సృష్టి నియమాన్ని (లాగోస్ )క్రమాన్ని ,హేతువు ను తెలుసు కొని దాన్ని అనుసరించటమే మానవ కర్తవ్యమ్ అన్నారు స్టాయిక్కులు .అత్యుత్తమ తత్వమైన హేతు బుద్ధిని అనుసరించి జీవించాలి .సుఖం ధర్మాని కంటే భిన్నమైనది ..అదొక రాగం మాత్రమె .రాగాలను లోబర్చుకొన్న వాడే రుషి .ఆరోగ్యం, జీవితం, మర్యాదా, డబ్బు హోదా ,అధికారం స్నేహం విజయం స్వతస్సిద్ధమైనవి .ఇవి శ్రేయస్కరాలు కావు .మృత్యువు వ్యాధి అవమానం దరిద్రం నీచ జన్మ ఇవి స్వయం గా దోషాలు కావు .వీటి ఆచరణ మనకు ఫలితం ఇస్తుంది .ఇవి మన ఆచరణకు లక్ష్యాలు కాదు .ఆనందం సౌఖ్యం సాధించటం మన శక్తి లోనిది కాదు .మన సంకల్పాన్నను సరిం చి దృష్టిని మార్చుకోవాలి .వాటి విలువ మన శీలం గల ప్రభావం మీదనే ఆధార పడి  ఉంటాయి .ధర్మమే అన్నిటికన్నా స్వతస్సిద్ధం గా ఉత్తమోత్తమ మైనది .అదే అసలైన అందాన్ని చేకూర్చేది .ధర్మా ధర్మ విచక్షణత తో చేసే పని మాత్రామే ధర్మా చరణ అవుతుంది .వైరాగ్యం స్టాయిక్కులనైతిక  లక్ష్యం .కొన్ని సందర్భాలలో స్టాయిక్కులు ఆత్మ హత్యను సమర్ధించారు .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -3-10-13 ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment