శ్రీ దేవి భండాసుర వధ లో అంత రార్ధం -6
విషంగుడి సోదరుడే విశుక్రుడు .శుక్రుడు మనిషి తేజస్సుకు ,ఓజస్సుకు ,ప్రకాశానికి ప్రతీక .’’శుక్రమసి తేజోసి ‘’అని అనే దానిలో పరమేశ్వరి ఈ సంకేత నామం తోనే లభిస్తుంది .కొందరు దీన్ని సద్వినియోగం చేసుకొంటే కొందరు దుర్వినియోగం చేసుకొని చేటు తెచ్చుకొంటారు .కేవలం సుఖ భోగాలకే శుక్రత్వాన్ని ఉపయోగించే వాళ్ళు పార లౌకిక జ్ఞానం పొందలేరు .విశుక్రుడు ఇలాంటి విషయా సక్తుడు .అతని శక్తి పరాక్రమాలను హరించే శక్తి పేరే వారాహి .వరాహ శబ్దం శ్రేష్ట వాచకమే వరాహ లాంచనులు వరాహ ధ్వజాన్ని ధరించే వారూ ఉన్నారు .’’దేన్నీ నాశనం చేయ వీలు లేదో అదే అహం ‘’.ఇలాంటి అక్షయ తత్వాలలోవిశిష్టమైన యుక్తి పేరే వారాహి .విశుక్రుడు నశ్వర సుఖ లాలసుడైతే ,వారాహి అవిననిశ్వర ,అక్షయ ,అలౌకిక ఆనంద సంధాయిని .వారాహి చేసిన ఈ కార్యానికి ఆమె వీర్య ,పరాక్రమాలకు దేవి ప్రసన్ను రాలైంది ఇలా వారాహి విశుక్రుని విషయ లాలసను నాశనం చేసిన్దన్నమాట .ఈ రకం గా మంత్రిణి వారాహిచేసిన విషంగ ,విశుక్ర వధ చెడు తత్వాల నాశనానికి ,సత్ప్రేరణ కు దారి తీసింది
అన్ని అడ్డంకులు తొలగి పోయిన తర్వాత పరమేశ్వరి పరమ శివుని చూసి శ్రీ గణేశుని సృష్టిస్తుంది .ఈ ఆనంద సమయం లో పరమాందం పొందిన శివుడు కూడా ప్రసన్నుడవుతాడు .వారిద్దరి చూపులు కలిశాయి .అంతే అప్పుడు వెంటనే గణేశుడు వారి ముందు ప్రత్యక్ష మైనాడు వినాయకుడు కుమారస్వామి ఇద్దరు పార్వతీ పరమేశ్వరుల పుత్రులే .సుబ్రహ్మణ్యుడు శివ కుమారుడు .గణపతి పార్వతీ నందనుడు .దీన్నే తులసీ దాస భక్త కవి ‘’శంకర సువన్ భవానీ నందన్ ‘’అని వర్ణించాడు .అంటే ఇందులోని పరమార్ధాన్ని గోస్వామి గ్రహించి మనకు తెలిపాడన్న మాట .కుమార స్వామి జననం కోసం శివుడి వీర్యం అవసర మైంది కాని గణేశ జననం కోసం మహేశ్వరి మహా సంకల్పమే సరి పోయింది మహేశ్వర రూప కల్పన ఈ మహా సంకల్పాన్ని సాకారం చేశాడని అర్ధం చేసుకోవాలి
మహేశ్వరి మహా సంకల్పం వల్ల జనించిన విఘ్నేశుడుఅన్ని విఘ్నాలను దూరం చేసే సర్వ సమర్ధుడు .అతని విఘ్న కారిణీ మహత్వాన్ని చూసి పార్వతి మహా ఆనంద పడింది ఈ వర్ణనే తరువాతి శ్లోకం లో కానీ పిస్తుంది
‘’మహా గణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షితా –భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణీ’’
పరమేశ్వరి ప్రశస్తమైన మార్గం లో భండాసురుడు అనేక రకాల విఘ్నాలు కల్పించే ప్రయత్నం చేశాడు .కాని వీటన్నిటికి నివారణోపాయాలుఆమె వద్ద ఉన్నాయి .పుత్రుడు ఆమెకు ఈ కార్యం లో అన్ని రకాల తోడ్పడతాడు గణేశుడు యాంత్రికం గా విఘ్నాలను నియంత్రించ గలడు.కాని మాత భండాసురుని ప్రతి శస్త్రాన్ని ,అమోఘాస్త్రాలతో ఎదుర్కొంది .శస్త్రం భౌతికం .అస్త్రం మానసికం .శరీర బాధా నివారణకు మనో బలం తోనే సాధ్యం .శారీరక యాతనల నుండి ముక్తం అయిన మానస మరాళంఅంటే మనో హంస ఆత్మ వైపుకు ప్రయాణం ప్రారంభిస్తుంది .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -10-10-13 –ఉయ్యూరు
