రవీంద్రనాథ్ గారి వంకాయలు -బంగాళా దుంపలు- వ్యాసాలు

ప్రియ మిత్రమా !

                      నమస్కారం.
                       కాయగూరల్లో మన తెలుగువారికి అత్యంత ప్రీతిపాత్రమైన వంకాయను గూర్చి ఇటీవల నేను రాసిన వ్యాసం ఈ విద్యుల్లేఖకు జతపరిచాను.  ఎప్పటిలాగే చదివి మీ మీ అభిప్రాయాలు తెలుపుతారని ఆశిస్తాను.
                                                                                                            మీ,
                                                                                                       రవీంద్రనాథ్.

వంకాయ

 
ప్రియమైన దుర్గా ప్రసాద్ గారూ !

                                             నమస్తే . వంకాయ పై వ్యాసం నచ్చినందుకు ధన్యవాదాలు.
                                               ‘బంగాళా దుంపల’ వ్యాసం పి. డి.యఫ్. పంపుతున్నాను.
                                                చదివి, అభిప్రాయం తెలియజేయగోరతాను.
                                                                                                  రవీంద్రనాథ్.

Posted in సేకరణలు | Tagged | Leave a comment

భలే సుందరం

భలే సుందరం


కొందరే జీవితాన్ని ఇంత సుందరంగా, ఈ సుందరంలా తీర్చిదిద్దుకోగలరు. ఈ కథనం చదివితే మా మాటతో మీరూ ఏకీభవిస్తారు. జికె సుందరం. ఒట్టి రంగు పిచ్చోడు. పాతికేళ్ళ కిందట పట్టుకున్న పిచ్చి ఇది. ఫ్యాను కింద చొక్కా నలగకుండా చేసుకునే బ్యాంకు ఉద్యోగం. గుట్టుగా ఉండొచ్చుకదా! పాటలంటాడు, పద్యాలంటాడు, ఏకపాత్రలంటాడు, పౌరాణికాలంటాడు, నాటికలంటాడు. పెళ్ళీపెటాకుల్లేవు, క్షణం తీరిక ఉండదు. పగలు బ్యాంకు, రాత్రి రిహార్సల్స్. అలసటే ఉండదా ఈ మనిషికి అనిపిస్తుంది చూస్తుంటే. ఉత్సాహం ఉరకలెత్తుతూ ఉంటుంది.

బళ్ళారి, గుంటూరు, శ్రీకాకుళం, హైదరాబాద్, కర్నూలు..ఎక్కడికైనా సరే సవాల్, ఎంత దూరమైనా ఎర్ర బస్సెక్కి వెళ్ళిపోతాడు, రంగు పూసుకుని నాటకం ఆడడానికి. అన్నా తమ్ముళ్ల మందలింపులు, అమ్మ ఆందోళన.. నాటకం ముందు బలాదూర్!

రంగు మాయ కమ్మిన మనిషి, మన్ను తిన్నవాడిలా మెత్తగా కనిపిస్తాడా..గొంతు విప్పితే కాటిసీనుతో టాపు లేచిపోద్ది. స్టేజి లైట్ల జిలుగు వెలుగుల వేడిలో ముఖానికి పూసుకున్న రంగు ధారలై కారుతున్నా, పలుకు పెళ్ళు మంటూనే ఉంటుంది,ఎండకి పేలే పెంకులాగ. జికె సుందరం పూర్తి పేరు గోపాల కృష్ణ సుందరం. పుట్టిందీ, చదువుతూ పెరిగిందీ నెల్లూరులో. డిగ్రీ అవగానే, పరీక్ష రాస్తే పిలిచినట్టుగా వచ్చేసింది భారతీయ స్టేట్ బ్యాంకులో ఉద్యోగం. తెల్ల కాలరు నౌకరీ. మంచి కట్నంతో, నగా నట్రాతో కోడలు గ్యారంటీ. తిరుపతి బస్సెక్కాడు ఉద్యోగంలో చే రడానికి. చేరింది ఉద్యోగంలోనే కానీ చేరువైంది మాత్రం రంగుల ప్రపంచానికి.

నోట్లు లెక్క పెట్టడం, నోటు పుస్తకాల్లో రాసుకోవడం- బ్యాంకంటే ఇంతే కాదని, ఏటా జరిగే కల్చరల్ పండగ చూశాక అర్ధమైంది. ఇంట్లో అమ్మ సహా అందరూ పాటలు పాడే వాళ్లే. ‘ఓహో..కిన్నెరసాని..’ అంటూ విశ్వనాధ గీతాన్ని అందుకున్నపుడు ఓహోహో అన్నారు అందరూ. ‘అలికిడైతే చాలు..’ అంటూ నెల్లుట్ల గీత లాలిత్యాన్ని ఒలకబోస్తే బ్యాంకు మైమరచింది. పాడుతా తీయగా, సరిగమలు..ఇంక దున్నుకున్నాడు. ఎర్రగా బుర్రగా నునులేతగా ఉన్న నెల్లూరు పిలగాడు భలే పాడుతున్నాడబ్బా అన్నారు.

బ్యాంకు ఉద్యోగులతో నాటకాలు వేయించే పని పడింది. నేర్పించేది శివప్రసాద్, ప్రస్తుతం చిత్తూరు ఎంపీ. ఒక సారి ఒక పాత్ర వేసే ఉద్యోగి రాలేదు. ‘అబయా..నువ్వే కట్టగూడదా ఆ వేషం’ అన్నాడాయన. ‘పుటుక్కు జర జర డుబుక్కు మే’ తొలి నాటకం. అట్లా పడ్డాడు రంగులో. నాటిక పూర్తయినా చప్పట్లు నిలవనివ్వలా. ఒకటా రెండా వందలాది నాటకాలు. బ్యాంకుని దాటేశాడు. తిరుపతి థియేటర్ ఆర్ట్స్, మహతి లలితకళాసమితి, విజయసారధి ఆర్ట్స్ అసోసియేషన్, సుబ్బరాజు నాట్య కళాపరిషత్..ఇట్లాంటి సంస్థలతో కలిసిపోయి ఊరూరూ తిరిగాడు, వేషాలేసుకుంటూ. శ్రీనివాస కల్యాణంతో బంగారు నంది కొట్టేశాడు. విరాటపాండవీయానికి రెండు నందులు. హరిశ్చంద్ర, ధృతరాష్ట్ర, అన్నమయ్య, రామదాసుల ఏకపాత్రలను ప్రదర్శించి ఎన్నో గరుడ అవార్డ్స్ అందుకున్నాడు.

శ్రీనివాసుడు, శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, అర్జునుడు, ధర్మరాజు, బృహన్నల, నక్షత్రకుడు, నారదుడు, లక్ష్మణుడు..వేషాలు మారుతూనే ఉన్నాయి. పరిషత్‌లకు పరుగులు. ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ గుణ నటుడు, ఉత్తమ సంగీతం, ఉత్తమ దర్శకత్వం- బహుమతుల సునామీ. బావా బావా పన్నీరు, తపస్సు, కొయ్యగుర్రం, మిస్డ్‌కాల్, శ్రీచక్రం, భేతాళప్రశ్న, విపులాచ పృధ్వి, భూమి గుండ్రంగా ఉంది, శ్రీకారం, స్వర్గారోహణం, నువ్వు ప్లస్ నేను మైనస్ ప్రేమ ఈజ్ ఈక్వల్ టూ పెళ్ళి, మొక్కు, సత్యాగ్రాహి..ఇంకా ఎన్నో సాంఘికాలు, సందేశాలు. పరుగు..పరుగు..పరుగు..అర క్షణం అన్నా ఆగితే కదా! ఒక అమ్మాయికన్నా లైనేయలేదు. వేసిన వాళ్ళకి పడలేదు. అబ్బే, తీరిక ఎక్కడిదీ? నాటకాల్లో బిజీ. ‘ఏం సుందరం.. మంచి సమ్మందం..’ అంటే, విరిసీ విరియని చిరునవ్వుతో సరి. భుక్తికి ఉద్యోగం, బతుకు నాటకం. ‘ఏం బా.. ఇంకింతేనా?’ అంటే, పెరుగులో దోస ముక్కలు వేసి ఆవ పొడి చల్లి కమ్మని పచ్చడి వడ్డిస్తాడు. తింటే, సుందరం వంటే తినాలనిపిస్తుంది. సుందరం లంచ్‌బాక్స్ విప్పేక గానీ, పెళ్ళాం ప్రేమతో వండి పంపిన కేరియర్లు తెరవరు బ్యాంకులో కొలీగ్స్.

అరవై నాలుగులో ఇరవై నాలుగు కళలయినా పండిస్తాడు జికె. సాంగ్స్, నాటకమ్స్, ఫ్రెండ్స్, పార్టీస్..వాట్ నాట్? వెనక్కి తిరిగి చూసుకోక ముందే అరవై నిండిపోయాయి. నిగ నిగలాడే ఆ మనిషిని చూస్తే నమ్మడం కష్టమే, ఈ నెలాఖరున రిటైరవతాడంటే. ‘సుందరయ్యా, తర్వాత మరేంటయ్యా?’ అంటే, రెండు చేతులూ ముఖం ముందు పెడతాడు, అప్పల్రాజు సినిమాలో సునీల్‌లా. అంటే, స్టేజీ మీద నుంచి తెర మీదకు దూకేద్దామనేనా? సరే, కానీ. ఆల్‌ది బెస్ట్ అబ్బాయీ!

సందేశం: ‘రంగస్థలం మీద నువ్వు పొందినదేమిటీ, పోగొట్టుకున్న దేమిటీ?’ అని సంధిస్తే, ‘పోగొట్టుకున్నది ఒంటరితనం. పొందినది ఆనందం’ అంటాడు గోపాలకృష్ణ సుందరం. ఇట్టాంటి పిచ్చి సుందరాలుండ బట్టే కదా, తెలుగు నేల మీద నాటకం ఈ మాత్రం అయినా బతికున్నది. సుందరం వర్ధిల్లు గాక! సుందరం పిచ్చి మరింత వర్ధిల్లు గాక!!

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

లాటిట్యూడ్ జీరో

లాటిట్యూడ్ జీరో

     అని పేరున్న ఈ పుస్తకాన్ని gianni Guada lupi and Antony shugaar అనే ఇద్దరు రాశారు .ఇందులో వారు చూసిన ,సేకరించిన అనేక వింతలు మనకు అమితాశ్చర్యాన్ని కలిగిస్తాయి .అందులో కొన్ని రుచికి చూపిస్తున్నాను .

1–                ఈజిప్ట్ కు దగ్గరలో ఒక దీవిలో ఉన్న మనుషులకు నాలుక రెండుగా చీలి ఉంటుందట .ఆ రెండిటి తో ఒకే సారి ఇద్దరి తో వారు మాట్లాడగలరట .

2  lo –cu అనే దీవిలో మనుషులందరూ నల్లగానే ఉంటారు .ముక్కుకు మూడు రంద్రాలున్డటం వీరి ప్రత్యేకత . బాగా మూయటానికి వీలుగా వీరికి కంటి రెప్పలు sun shades గా ఉపయోగడతాయట.

3  pi-pa-.lo అనే చోట కొంగలు ఒంటె అంత ఉంటాయట .రెండు గజాల పొడవున్తాయట .చాలా తక్కువ ఎత్తులో మాత్రమె ఇవి ఎగర గలవు .

4—champa అనే చోట ఆడ ,మగా అసలు బట్టలే వేసుకోరు .దీనికి ఒక కారణం ఉందట .బుద్ధుడు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు వీళ్ళ పూర్వీకులు ఆయన బట్టలు లాగేశారట .అందుకని బుద్ధుడు శపపించాడట.అప్పటి నుంచి బట్టలు వేసుకోవట్లేదట .

 5-pizzaro అనే యాత్రీకుడు ఓడలో బయల్దేరి దారి తప్పి సర్వస్వం కోల్పోయి చివరికితినటానికి కూడా ఏమీ దొరక్క  తను వెంట తెచ్చుకొన్న గుర్రాలను ,కుక్కల్నితినేశాడట .చివరికి  పాంటుకు పెట్టుకొనే బెల్టు కూడా తినాల్సిన దుస్తితి వచ్చిందట పాపం . .

 6-ginzalo pizzaro అనే పైన చెప్ప బడిన యాత్రికుడు ‘’quito ‘’ కు వెళ్ళినప్పుడు అక్కడ ఒక డేగ వాలిందట .అక్కడివారు అది అశుభ శూచకమని ,అతని ఆత్మీయులేవరో చని పోయి ఉంటారని చెప్పారట .నిజం గానే అతని సోదరుడు చని పోయినట్లు కొద్ది రోజుల్లో వార్త అతనికి చేరిందట .

7 –అమెజాన్ ప్రాంతం లో ఒక దీవి లో ఆడ వాళ్ళదే రాజ్యం .మగ పొందు కావాలంటే పక్క దేశాల మీద డాడి చేసి మగాళ్ళను తెచ్చుకొంటారు .గర్భం ధరించగానే వాళ్ళని చంపేస్తారు .మగ పిల్ల్లాడు పుడితే సఫా చేస్తారు ఆడపిల్ల పుడితే పెంచుకొంటారట .

8-పేరు దేశం లో బంగారు దీవి ఉందని అంతా బంగారు మయమే నని అనుకొనే వారట .

 9-గ్రీకు భాషలో అమెజాన్ అంటే వక్షోజాలు లేని స్త్రీ అని అర్ధం ట .rio de las amajaans అంటే అమెజాన్ నది అని అర్ధం .

10-రాలీ అనే ఇంగ్లాండ్ యాత్రికుడు నార్త్ అమెరికా లోని వర్జీనియా ను మొదటి సారి చూశాడు .అప్పుడు ఇంగ్లాండ్ ను ఎలిజ బెత్ రాణి పరిపాలిస్తోంది ఆమె అప్పటికి కన్య అంటే వర్జిన్. అందుకని దీనికి వర్జీనియా అనే పేరొచ్చిందట .

11 –అమెజాన్ ప్రాంతం లో ఆడవాళ్ళకు కుడి చన్ను మామూలుగాను ,రెండోది మగ వాడికి ఉన్నట్లు చిన్నది గాను ఉంటుందట .

12 –గాలా పెగాస్ అనే దీవిలో చార్లెస్ డార్విన్ కు ఎక్కడా లేనన్ని వింత జంతువులు కని పించాయట .

 13 ధర్మ సంరక్షణార్ధం నేను పుడుతూ ఉంటాను అని కృష్ణుడు గీతలో చెప్పిన దానికి ఇంగ్లీష్ లో ఒక సూక్తి సరి సమానం గా ఉంది ‘’times of calamity tend to create prophets ‘’.

14 –నైల్ నదికి  గొప్ప అర్ధం ఉంది. నైల్ అంటే ఈజిప్ట్ భాష లో ‘’చంద్రుని లాగా వెలుగులీను తుంది ‘’అని అర్ధం .

15-లేక్ విక్టోరియా దగ్గర karague అనే ప్రాంతం లో rumanooka అనే రాజు ఉండేవాడు (రమణకుడు ?)అక్కడ రాజు భార్య ఎంత లావుగా ఉంటె అంత గొప్ప ట .ఆమె ఎప్పుడూ పాలు తాగుతూ ఒళ్ళు పెంచు కోనేదిట .ఆవిడ కుర్చీలోంచి లేవాలి అంటే అటు ముగ్గురు ,ఇటు ముగ్గురు ఆడ సేవికలు పట్టుకొని లేపాలట

16 –అంజో లా ప్రాంతం లో ఆడ వాళ్ళను పైకి లేపాలి అంటే కనీసం 8 మంది మగాళ్ళు కావాలట .అంత భారీ కాయులన్నమాట .

17-ఫసిఫిక్ సముద్రానికి ఆ పేరు పెట్టిన వాడు మాజిలాన్ అనే యాత్రికుడు అని మనమందరం మరిచి పోయి ఉంటాము .

18-bruner అనే చోట రాజు గారి దర్బారు లో రాజుగారితో యూరోపియన్లు ఎవరు డైరెక్ట్ గా మాట్లాడకూడదట.ఐరోపా వాడు అక్కడ ఆస్థానం లో ఉన్న సేవకుడికి చెబితే ,వాడు పై వాడికి చెబితే ,వాడు ఆ సిటి గవర్నర్ తమ్ముడికి చెబితే ,వాడు మంత్రి చెవిలో ఊదితే ,వాడు నెమ్మదిగా రాజు గారికి విషయం తెలియ జేస్తాడట .రాజు చెప్పేదికూడా ఇలాగే రివర్స్ డైరెక్షన్ లో యూరోపియన్ కు చేరుతుందిట .

19 –వేసూవియాస్ లో అగ్ని పర్వతం ప్రేలి నప్పుడు ఎన్నో దీవులు మునిగి పోయాయి .ఎన్నో వేల మంది చని పోయారు .పాంపీ అనే మహా నగరం ఆ బూడిద కింద కొన్ని మీటర్ల లోతున సమాధి అయింది .

20—partua అనే మాటకు అర్ధం కొబ్బరి తోట అని ట .

           ఇలా ఈ పుస్తకం లో  అనేక విషయాలుంది ఆశ్చర్యం కలిగిస్తాయి

                2—8-2002 లో నా డైరీ లోని విషయాలను మీకు అందించాను

               మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –30-4-13- .ఉయ్యూరు  .

Posted in రచనలు | Tagged | 1 Comment

మై స్ట్రోక్ ఆఫ్ లక్

మై స్ట్రోక్ ఆఫ్ లక్

          కర్క్ డగ్లాస్  ప్రెసిడెంట్ రీగన్ కు  సమకాలికుడైన హాలీ వుడ్ హీరో ..83 సినిమాలలో నటించాడు ఆస్కార్ పురస్కార గ్రహీత .కొన్ని మంచి సినిమాలకు దర్శకత్వం చేశాడు .’’ .presidential award of freedom ‘’పొందాడు .ఆ అవార్డే అమెరికా ప్రెసిడెంట్ ఇచ్చే అత్యన్నత పురస్కారం .ఆస్కార్ నుండి జీవన సాఫల్య (life achievement )పురస్కారసమూ పొందిన వాడు .ఎన్నో సంస్థలు డగ్లాస్ కు పురస్కారాల నిచ్చి గౌరవించాయి . .అతను నటించిన వాటిలో champion ,bad and the beautiful ,lust of life,20,000 leagues under the sea   సినిమాలు గొప్ప పేరు తెచ్చాయి .’’bryon ‘’అనే ఫిలిం సంస్తనేర్పాటు చేసి ‘’spartacus ‘’లాంటి క్లాసిక్ సినిమాలు తీశాడు ..డైరెక్ట్ చేశాడు .మూడు నవలలు ,పిల్లల కోసం పుస్తకాలు కూడా రాసిన రచయిత .కింది ఫోటోలలో చివరిది ఆయన కొడుకు మైకేల్ డగ్లాస్ ది  . 

Kirk-Douglas-9278036-1-402

 

 

 

 

         ఒకసారి షూటింగ్ లో ఉండగా హెలికాప్టర్ ప్రమాదం లో వెన్నెముక విరిగింది .శస్త్ర చికిత్స జరిగింది .ఛాతీలో ‘pace maker ‘’ఏర్పాటు చేశారు .80  ఏళ్ళ వయసులో ఆకస్మికంగా  ‘’బ్రెయిన్ షాక్ ‘’వచ్చింది .మాట పడిపోయింది నడక సాగలేదు .వీల్ చైర్ లో కూర్చుని కంప్యూటర్ సాయంతో డిక్టేషన్ చెప్పి తన కద రాసుకొన్నాడు .అందుకే ఆ కధకు ‘’my stroke of luck ‘’అని అర్ధవంత మైన పేరు పెట్టాడు .అతని కొడుకుల్లో చివరి వాడు మైకేల్  కూడా హాలీఉడ్ నటుడై రెండు సార్లు ఆస్కార్ అవార్డు లను గెలిచి తండ్రికి తగ్గ వారసుడని పించాడు

               డగ్లాస్ భార్య అన్నే .ఇద్దరు అమితమైన అన్యోన్యం గా ఉండేవారు ఆమెకు బ్రెస్ట్ కేన్సర్ వచ్చి దాన్ని తీయాల్సి వచ్చింది నతనికి ఆరుగురు అక్క చెల్లెళ్ళు .చాలా మంచి కుటుంబ సంబంధాలుండేవి .ఒకసారి అతనికలలో దేవత కన్పించి స్వర్గానికి తీసుకు వెళ్ళింది .’’ఇదేనా స్వర్గం /?అని ఇతను అడిగితే దేవత ‘’కాదు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అదే స్వర్గం ‘’అన్న దట .దానికి కారణం అక్కడ భూమి మీద సూర్యోదయ సూర్యాస్తమయాలు ,నక్షత్ర కాంతులు మనోహరం ..చెట్లూ పూలు ఫలాలు కంటే స్వర్గం ఏముంది ?’’అక్కడ గోల్ఫ్ లాంటి ఆటలాడ వచ్చు ఇక్కడ అవేమీ ఉండవు ‘’అని చెప్పిందట .అంతటి స్వర్గమైన భూమి ని వదిలి స్వర్గం కోసం మీ మనుషులకు దేవులాట ఎందుకు ?’’అని.మదలిన్చిందట .’’dist thou art and to dust thou shall return ‘’అంటాడు డగ్లస్ .

            డగ్లస్ తన లాగీ ఏదో ఒక అంగ వైకల్యం పొందిన గొప్ప వాళ్ళనీ ,తన సహచరులను జ్ఞాపకం చేసుకొంటాడు .రూజ్ వెళ్త వీల్ చైర్ లో కూర్చుని మూడు సార్లు అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడని గుర్తు చేస్తాడు .రీగన్ కు తన వాళ్ళను కూడా గుర్తు పట్టలేని జబ్బు .స్టీఫెన్ హాకింగ్ గొప్ప ఫిజిసిస్ట్. .అంగ వైకల్యం తోనే అయన్ స్టీన్ అంతటి గొప్ప మేధావి అయ్యాడు  .వీళ్ళంతా ఇతరుల కోసం చేసిన సేవలు నేమరేసుకొన్నాడు .స్పీచ్ తెరపి వల్ల నెమ్మదిగా మాట్లాడటం వచ్చింది డగ్లాస్ కు ..నడక వచ్చింది .మళ్ళీ సినిమా తీశాడు సినిమాలలో నటించాడు .అందరి అభిమానం సంపాదించాడు .       jean Dominique Bauby  అనే ఫ్రెంచ్ అతనికి ఆక్సిడెంట్ జరిగి ,స్ట్రోక్ వచ్చి పూర్తిగా పక్షవాతం వచ్చింది .మాట అనేదే లేదు .ఒక్క ఎడమ కన్ను మాత్రమెకొద్దిగా  రెప్ప వేయ గలుగు తోంది జీవించాలనే తపన పెరిగింది .శ్రమ పడ్డాడు .ఇంగ్లీష్ లో తరచు గా వచ్చే ‘’e ‘’తో మొదలు పెట్టి w తో అంతమయ్యే పదాలను తీసుకొని ఒక ‘’కోడ్‘’తయారు చేసుకొన్నాడు .చివరికి దానితోనే the diving  bell and the butter fly ‘’అనే పుస్తకం రాసి తన మనో భావాలను అందులో పొందు పరచాడు .చాలా మందికి ఉపయోగ పాడాలన్న ఆదుర్దా .,దీక్షా ,సాధన అతనికి తోడ్పడ్డాయి .. తన శరీరం డైవింగ్ బెల్ లో ఇరుక్కు పోయినా తన ఆలోచనలు సీతా కోక చిలుకల్లా నిరంతరం భ్రమిస్తాయి దీనినే ‘’locked in syndrome ‘’అన్నాడు .

              Doody Moore గొప్ప పియానో వాయిద్య కారుడు .చివర్లో వణుకు వ్యాధి వచ్చింది .మాట తగ్గింది .progressive super nuclear pally అనే వ్యాధి వచ్చింది అయినా విధిని జయించాడు అనేక ఇంటర్వ్యు లు ఇచ్చాడు .Barbana santra అనే  ఫిలిం పెర్సానాలిటి అతన్ని ఇంటర్వ్యు చేసి ‘’ఏమి కోల్పోయారు ?’’అని అడిగితే ‘’playing the piano ‘’అన్నాడట .అలాగే అమెరికా వైస్ ప్రెసిడెంట్ అల్గోరే భార్య టిప్పర్ గోరె డిప్రెషన్ కు లోనైనదట .ఆ విషయం చర్చల్లో బహిర్గతం చేసి మిగిలిన వారికి ఎంతో ఊరట నిచ్చిన్దట .’’sex is like air .it is not important unless you are not getting any ‘’అని నిర్మొహమాటం గా చెప్పాడు డగ్లాస్ .అతని ముఖ్య నీతి సూత్రాలలో అతి ముఖ్యమైనది ‘’never try to change your spouse ‘’

             కంఫూజియాస్ చెప్పిన వెయ్యి మైళ్ళ దూరం కూడా ఒక అడుగు తోనే మొదలవుతుంది అన్న వాక్యం చాలా ఇష్టం ..ప్రపంచాన్ని దర్శించటానికి రెండు విధానాలున్నాయి .ఒకటి ఏదీ  వింతకాదు .రెండోది ప్రతిదీ వింత అని పించటం .బాధ గురించి చెబుతూ  ‘’pain is god’s megaphone to wake up a deaft world అన్న c.s.Lewis మాటను ఉటంకిస్తాడు .

        మళ్ళీ ప్రజా జీవితం లో  చొర బడ్డాడు డగ్లాస్ భార్య తో కలిసి వందలాది స్కూల్ ఆట స్థలాలను బాగు చేయించి ఉపయోగం లోకి తెచ్చాడు .తండ్రి పేర Alzheimer’s trust ‘’పెట్టి ఇల్లు లేని స్త్రీలకూ ఇల్లు కట్టించి ఇచ్చాడు .’’డేడ్ సి.’’దగ్గరున్న జోర్డాన్ లో ‘’’below the sea level ఉన్న ప్రాంతం ఉంది .విమానం దాని మీంచి ప్రయాణిస్తుంది .డగ్లాస్ కుమారుడు మైకేల్ డగ్లాస్ కు కూడా ఆస్కార్ లో ‘’లైఫ్ అచీవ్ మెంట్ అవార్డ్ ‘’వచ్చింది తండ్రి లాగా .ఏదైనా వైకల్యం వచ్చిన వారు ‘’ఆపరేటర్ మాన్యుయల్ ‘’ను తప్పక ఉపయోగించుకోవాలని స్వంతం గా ఏర్పాటు చేసుకోవాలని సలహా ఇస్తాడు అదొక గైడ్ లా పని చేసి మంచి ఫలితాన్నిస్తుందని ధైర్యం చెబుతాడు .

             హెలెన్ కెల్లర్ కు చెవుడు మూగా .ఆమె  we do the best we can ,.we never know what miracle is wrought in our life or the life of another ‘’అన్న మాటలు అందరికి ఆదర్శం కావాలన్నాడు .

         196 పేజీలున్న ఈపుస్తకాన్ని ఒక్క పూట లో చదివేశాను .చాలా బాగా రాశాడు స్ప్పూర్తి వంతం గా ఉంది అధైర్య పడే వారికి కొండంత ధైర్యాన్నిస్తుంది.ఎంతో మంది డగ్లాస్ కు ఉత్తరాలు రాసి తమ సాను భూతిని పంచుకొన్నారు ఆస్కార్ ఫంక్షన్ లో డగ్లాస్ మాట్లాడినప్పుడు చూసిన జోర్డాన్ రాజు తన దేశానికి ఆహ్వానించాడు .కొద్ది కాలానికే రాజు మరణించాడు .కొడుకు తండ్రి మాటను నిల బెట్టి డగ్లాస్ ను ఆహ్వానించి సత్కరించి గౌరవవించి పంపాడు .డగ్లాస్ అమెరికా దేశానికి ‘’సుహృద్భావ రాయబారి‘’(goodwill ambassador )గా పని చేశాడు .ఇందులో ‘’we see the real person behind the fabulous talent and at life lived to its very fullest ‘’అని పించటం ఖాయం 

               కర్క్ డగ్లాస్ న్యు యార్క్ లోని ఆమ్ స్టార్ డాం లో 1906 డిసెంబర్ 9 న జన్మించాడు .రష్యాకు చెందినా జ్యూయిష్ ఇమ్మిగ్రెంట్ కుటంబం ఆయనది అసలు రష్యా పేరు Issur Danielovitch .

.        మొదటి సారి అమెరికా వెళ్లి నప్పుడు హూస్టన్ లైబ్రరి నుండి తెచ్చి చదివిన ఈ పుస్తకం లోని విశేషాలను 31 -7-2002 న నా డైరీలో రాసుకొన్న వాటిని మీకోసం అందించాను .

             మీ –గబ్బిట దుర్గా  ప్రసాద్—29-4-13-ఉయ్యూరు  

Posted in రచనలు | Tagged | Leave a comment

పెరటి లో అరిటి – ఈలలు వేసిన గెలలు

This gallery contains 17 photos.

More Galleries | Tagged | Leave a comment

ఇంకొంచెం చేడితేనే మళ్ళీ వెనక్కి వస్తారు -అక్కినేని

inkonchem chedaali nag -1-2 inkonchem chedaali nag -1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

లెర్నింగ్ టు ఫాల్ (The blessings of an imperfect life )

   లెర్నింగ్ టు ఫాల్ (The blessings of an imperfect life )

                         ఈ పుస్తకాన్ని ఫిలిప్ సిమ్మన్స్ అనే న్యు హాంప్  షైర్ర్ రచయిత రాశాడు .ఆయన ఇలినాయిస్ లో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా పని చేశాడు .తొమ్మిదేళ్ళు పని చేసిన తర్వాత ఒక వింత వ్యాధి‘’AL.S’’(lougehrig ‘s disease ) వచ్చింది .కదలలేడు మాటలు సరిగ్గా పలక లేడు స్వంత ఊరు వచ్చేశాడు .ఆ రాష్ట్రం న్యు హాప్ షైర్ర్  ను గ్రానైట్ స్టేట్ అంటారు .కాలిఫోర్నియాను బె స్టేట్ అని టెక్సాస్ ను లోన్  స్టార్ర్ స్టేట్ అనీ అంటారు అంటే కొండలు లేని రాష్ట్రం .నెమ్మదిగా తన వైకల్యాన్ని జయించాడు .కాలేజీ స్కూలు చర్చి లలో ఉపన్యాసాలిచ్చి ఆకర్షించాడు .’’united universal association ‘’స్తాపించి ఎడిటర్ అయాడు .ఆయన సృజనాత్మకరచనలకు  మిచిగాన్ యూని వర్సిటి పి.హెచ్ డి.నిచ్చి గౌరవించింది .’’post modern American fiction ‘’ మీద ‘’deep surface ‘’అనే పుస్తకం రాస్తే దాన్ని జార్జియా యూని వెర్సిటి ప్రచురించి ప్రాచుర్యం కల్పించింది .అతని భార్య కేథరీన్ కళా కారిణి .కొడుకు ఆరన్ కూతురు అమీలా .

 Bantamcolor jacket150 asset_upload_file326_2332 philhat 150pixweb

               చాలా దుర్భర జీవితం గడపాల్సి వచ్చింది ఆ వ్యాధి మూలం గా .దానితో ‘’the art of dying ‘’ను నేర్వటం ప్రారంభించాడు .ఆ తర్వాత నెమ్మదిగా కూడా దీసుకొని పాజిటివ్ దృక్పధం పెరిగి ‘’the art of living ‘’నేర్చాడు .అతను రాసిన ఈ పుస్తకం లో శాంతి కోసం అన్వేషణ కని పిస్తుంది జీవిత సమస్యలను ఎదుర్కోవటానికి పొందిన ధైర్యం కని పిస్తుంది .ప్రతి చిన్న విషయం తనకు గొప్ప అనుభవాన్నిచ్చింది అంటాడు .తన రాష్ట్రం గ్రామం ప్రజలు అంటే విపరీతమైన మోజు ఆయనకు .సంవత్సరం లో ఉన్న 12నెలలకు ప్రతీక గా ఈ పుస్తకం లో 12 చాప్టర్లు రాశాడు .’’the work of learning to live richly in the face of loss ‘’ను మనం నేర్చుకొంటాం .దేనికీ చింతించక పోవటం ,ప్రతి దాని నుంచి మంచిన గ్రహించటం ఫిలిప్ కు తెలిసిన విద్య .హిందూ బౌద్ధ ,జైన ఇస్లాం మతాలన నన్నిటిని చదివి ఆకళింపు చేసుకొన్నాడు .జంగ్ క్రీస్తు ,దలైలామా లను ఒంట బట్టిన్చుకొన్నాడు .కస్టాల కడలి లో కూడా చాలా ప్రశాంత జీవితాన్ని గడిపాడు అదే అతని ప్రత్యేకత .ఇతని జీవితం చదువుతుంటే ప్రఖ్యాత ఖగోళ శాస్త్ర వేత్త స్టీఫెన్ హాక్ గుర్తొస్తాడు .తన జీవితాన్ని అతా ఒక తెరచిన పుస్తకం లా మన ముందు పరిచాడు .ఎన్నో ఉదాహరణలు ఎన్నో కొటేషన్లు ,ఎంతో అనుభవం అన్నీ కలగలిపి రాసిన మార్గ దర్శిఈ పుస్తకం అని పిస్తుంది

         తాను ఒక మనిషిగా తండ్రిగా కొడుకు గా స్నేహితునిగా తనకొచ్చిన అపూర్వ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చావు కళ ను, జీవ కళను రాశానంటాడు .అన్ని గ్రందాల సారం తాను గ్రహించానని వాటిని ఉదహరించే నేర్పు అలవాటు చేసుకోన్నానని చెప్పాడు .తనకు నవ్వు అంటే మహా ఇష్టం అన్నాడు .అది ఎంతో రిలీఫ్ నిస్తుందని చెప్పాడు ‘’laugh releases good chemicals into the brain.if we can not laugh we can not properly serious .the very seriousness with which we pursue truth can be funny ‘’అంటాడు .

              బౌద్ధ గురువు దలైలామా ప్రత్యేకత ఆయన చిరు నవ్వే నంటాడు ఫిలిప్ .’’he is plainly in love with the world at peace with himself even though with the forced occupation of his country with the Chinese ,his own life in exile ‘’అని దలైలామా ను మెచ్చుకొంటాడు .

ఇంకో సత్యం చెప్పాడు ‘’comedy ends in happiness ,while tragedy yields wisdom .we want to be I suppose to be happay ,wise ,and wisely happy ‘’అని గొప్ప గా చెప్పాడు రచయిత .గ్రీకు రాజు అరిలియాస్ ప్రతిదీ ఒక పనే అని మరణం కూడా దీనికి భిన్నం కాదని చెప్పాడని గుర్తు చేస్తాడు .అన్నిటిని ఆహ్వానించి నట్లే మనం మరణాన్నీ ఆహ్వానిన్చాల్సిందే నన్న ఎరుక కల్గిస్తాడు .’’to accept death is to live with profound sense of freedom .this freedom first from attachements to the things of this life ,that donot really matter fame ,material possessions and even finally our own bodies .Acceptance brings the freedom to live fully in the present .the freedom finally to act according to our heighest nature ‘’అని మన వాళ్ళు చెప్పిన జీవన వేదంతాన్నంతా ఒలికిస్తాడు ఫిలిప్ సిమ్మన్స్ .తను రాసిన పుస్తకం లోని సత్యం ‘’the imperfect is our paradise ‘’అంటాడు

              ఇందులో కొన్ని విశేషాలు కూడా తెలిపాడు స్నేక్ రేంజ్,మౌన్టేన్స్ పైన ఉన్న పైన్న్ చెట్ల   వయస్సు 5000 సంవత్సరాలుట .’’ a town is is saved not more by the righteousmen in it ,than  by the woods and swamps that surround it ‘’అన్న ఎమెర్సన్ సూక్తిని సందర్భోచితం గా చెప్పాడు లాటిన్ భాష లో animal అంటే soul అని అర్ధం .( anima ).to acknowledge one’s own soul then there is to knowledge the animal withn us ‘’అంటే మనలో జంతు లక్షణాన్ని వదిలిన్చుకొంటే అదే జ్ఞానం .ఎందుకు ఈ శిధిల హృదయం కుక్క తోక లాగా ఊగుతూ వెంట వస్తుంది అని విసుక్కున్నడట మహా కవి ఈట్స్..నిర్ణయాన్ని చెప్పకుండా ఆత్మ పరిశీలన చేయటమే అత్యున్నత ఆధ్యాత్మికత అని హిందూ వేదాంతులు చెప్పిన దాన్ని ఉటంకిస్తాడు దేవుని అదృశ్యమే ఆయన రాకకు సూచన అన్నాడట meister eckheart .

          మనం పెట్టె ‘’నమస్తే’’ కి మంచి భావాన్ని తెలియ జేశాడు ‘’నీ లోను నాలోనూ  ఉన్న జీవ ఆత్మకు వందనం  అని తెలిపాడు. ఎమెర్సన్ ‘’a fact is the end or last issue of spirit ‘’ అన్న మాటను గుర్తు చేస్తాడు ఇక్కడే స్పిరిట్ అంటే అర్ధం శ్వాస (spiritus )అనే భలే అర్ధం బోధిస్తాడు .తాను దేవుడిని దేవుడి నుండి విముక్తి కోసం  ప్రార్ధిస్తాను అన్నాడట ఎఖార్ట్ (I pray god to rid me of god )ఏదీ చేయక పోతే దేన్నీ చేయాకుండావదిలి పెట్ట నట్లే .ప్రపంచపాలన దానికది చేసుకొంటూ పోతుంది అని సుజుకి సామెత .చివరగా రాబర్ట్ ఫ్రాస్ట్ అనే కవి వాక్యం తో ముగిస్తాడు ‘’ they can not scare me ,with their empty spaces –between stars on stars where no human race is –I have it to me so much nearer home –to scare my self with my own desert places ‘’.

           ఇలా చాలా పరి పక్వ భావ జాలం తో నిండిన జ్ఞానోదయం కలిగించే పుస్తకం జీవిత సారం రచయిత తాను అన్నీ తెలుసుకొని మణేచ్చను జయించి జీవితేచ్చను సాధించి జీవితాన్ని పరిపక్వం చేసుకొన్నాడు ఏ బందానికి లోను కాకుండా ఈశ్వరార్పణ బుద్ధి తో జీవితం కోన సాగిస్తున్నాడు .ధన్య జీవి అని పించుకొన్నాడు సంతృప్తిని సాధించుకొన్నాడు ఒక మహర్షిలా తత్వ వేత్తలా అపోజిల్ లా మనకు కర్తవ్య బోధ చేశాడు .జీవితం లో ఉంటూ ధన్యమైన జీవితాన్ని గడుపుతూ మనకూ ఆదర్శ ప్రాయమైనాడు

                ఈ పుస్తకం ప్రచురింప అడ్డ ఆరు నెలలకే దీన్ని నేను చదివిన అదృష్ట వంతుడిని .ఉన్నత ,ఉత్తమ మానవులు ఎక్కడ ఉన్నా ,వారి ఆలోచనలన్నీ పరమోత్తమం గా నే ఉంటాయి అని రుజువు చేసిన పుస్తకం .ప్రతి పతనం ఉత్తానానికి నాన్దికావాలి అప్పడే మన జీవితపు వెలుగు ఇతర జీవితాలనూ ప్రకాశ వంతం చేస్తుంది తాను చెప్పిన విషయాలన్నిటిని ఆచరణాత్మకం గా జీవితం సాగిస్తున్న ఫిలిప్ సిమ్మాన్స్ ముమ్మాటికి మార్గ దర్శియే .1957 లో జన్మించి 55 ఏళ్ళు మాత్రమె జీవించి2012 లో మరణించాడు .   

                మొదటి సారి అమెరికా వెళ్ళినప్పుడు టెక్సాస్ రాష్ట్రం లోని  హూస్టన్ నగర లైబ్రరి నుండి తెచ్చుకొని చదివి , ‘’26 -7-2002 న నా డైరీ లోరాసుకొన్న విశేషాలను మీ కోసం అందించాను

               మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –28-4-13-ఉయ్యూరు 

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

మా పెరటి వసంతం

This gallery contains 6 photos.

More Galleries | Tagged | Leave a comment

అందరివీ సినిమా పెళ్లిళ్లే

అందరివీ సినిమా పెళ్లిళ్లే


‘ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం’ ‘అందమైన భామలు లేత మెరుపు తీగలు…’ ‘గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట’ వంటి హిట్ పాటలు విన్నప్పుడు ఆ పదాల అర్థాల్లో పడి వాటిని రాసిన భువనచంద్ర గురించి కాసేపు మర్చిపోతాం. ‘మంచిమంచి పాటలెన్నో రాయడానికి పునాది వేసింది మా ఊరు చింతలపూడి’ అంటున్నారు భువనచంద్ర. ఏలియ మాస్టారు బడి, పేడ చెప్పులు, చిన్నప్పటి సంపాదన, మొదట చేసుకున్న పెళ్ళిళ్లు, ఊళ్లో కురిసిన వాన మొదలుకొని ఊరివారి నుంచి నేర్చుకున్న విలువైన జీవిత పాఠాలను కూడా వివరిస్తున్నారాయన. భువనచంద్ర చెబుతున్న తన సొంతూరు చింతలపూడి విశేషాలు…. 

“ఊరి గురించి చెప్పేముందు తమ్మిలేరు గురించి చెప్పాలి. తమ్మిలేటికి ఇవతలవైపు కృష్ణా జిల్లా, అవతలవైపు పశ్చిమగోదావరి జిల్లా. మా పూర్వీకులది, నేను పుట్టిందీ కృష్ణా జిల్లాలోని గుళ్లపూడి గ్రామమే. ఆ ఊళ్లో ఉన్న రెండొందల కుటుంబాలూ మా చుట్టాలూపక్కాలే, అందరూ కరణాలే. మా ఇంటిపేరే ‘ఊరకరణం’. మా తాతగారి సమయంలో పన్నెండొందల ఎకరాలు, మా నాన్నకు వచ్చేసరికి మూడొందల ఎకరాలు ఉండేవని విన్నాను. స్వాతంత్య్రానికి పూర్వం మా నాన్న సుబ్రమణ్యేశ్వర శర్మ ఊరికి సర్పంచ్‌గా పనిచేశారట. దానిలో విశేషమేమీ లేదుగానీ, మా అమ్మ చంద్రమౌళీశ్వరీదేవి కూడా గ్రామపెద్దగా పనిచేయడమే చెప్పుకోవలసిన సంగతి.

అప్పట్లో ఆమె ఐదారు తరగతులు చదువుకున్నదేమో. అయినా మంచి గొంతుతో చక్కగా పాడేది, స్వాతంత్య్ర ఉద్యమ పాటలెన్నో వచ్చావిడకు. మా అమ్మానాన్నా ఒకసారి గాంధీగారిని దర్శించుకున్నారని, మా అమ్మ తన ఒంటి మీదున్న ఏడు వారాల నగలూ తీసి ఆయన జోలెలో వేసిందని గుళ్లపూడిలో చెప్పుకునేవారు. తమ్మిలేటి మీద వంతెన, ఊళ్లో రామాలయం… అన్నీ మా నాన్నే కట్టించారని అంటారు. చెప్పొచ్చేదేమంటే నా తల్లిదండ్రులు వైభవంగా బతికిన రోజులు నేను చూడలేదు. నేను పుట్టేసరికే ఆస్తులన్నీ హరించుకుపోయాయి. నాకు ముగ్గురన్నయ్యలు, నలుగురు అక్కలు. నేను ఎనిమిదోవాణ్ని. ఊళ్లోని సీమచింతచెట్ల కింద నన్నెవరో ఎత్తుకుని తిప్పుతున్నట్లు… గుళ్లపూడి కి సంబంధించి లీలగా నాకు గుర్తున్న జ్ఞాపకం అదే.

పేడ చెప్పులు తెలుసా
నాకు రెండేళ్లు దాటక ముందే మా నాన్న కుటుంబాన్నంతా తీసుకుని తమ్మిలేటి కి అటువైపునున్న చింతలపూడి వెళ్లిపోయారు. ఆ ఊళ్లోని మేడుకొండూరు వేంకటేశ్వరరావుగారు చనిపోతూ దగ్గర్లోని ‘తీగలవంచ నరసాపురం’ గ్రామ కరణీకాన్ని మా నాన్నకు అప్పజెప్పారు. మొత్తానికి నాకు ఊహ తెలియకముందే చింతలపూడి మా ఊరయిపోయింది. ఇంట్లోనే శతక పద్యాలూ, స్తోత్రాలూ వంటివి నేర్పించిన తర్వాత ఐదేళ్లు నిండాక ఏ బడిలో వెయ్యాలి అన్నది ప్రశ్న. మేడ బడి, సుబ్బరాజు బడి అని ఉండేవి. వాటికైతే రెండు వీధులు దాటాలి. కాని మా వీధిలోనే ‘ఏలియ’ అనే క్రైస్తవుడొకాయన బడి నడిపేవారు. అందులో వేశారు నన్ను.

ఆయన నెలకు పావలానో అర్థో – ఎంతిస్తే అంతే తీసుకునేవాడు. బడి అంటే భవనమూ బెంచీలూ ఉన్నాయనుకుంటారేమో. అదొక పశువుల పాక. దాన్లోనే ఒక వారగా మాకు పాఠాలు. మా పలకలు అక్కడ పెట్టి అన్నానికి వెళ్లొచ్చేసరికి పశువులు వాటి పనులవి కానిచ్చేసేవి. అయితే మాకేం అసహ్యం ఉండేది కాదు. పైగా ‘అరేయ్ ఇవాళ సుబ్బరాజు మేస్టారిగారమ్మాయి అమ్ములు పలక మీద గేదెలు పేడ వేశాయిరోయ్’ అని సంబరపడేవాళ్లం. జయలక్ష్మి, విజయలక్ష్మి, పుష్పవతి, అమ్మాజీ, హైమవతి, కాకుండా ఇద్దరు ముగ్గురు భారతులు నాకు సహాధ్యాయులుగా ఉండేవాళ్లు.

అబ్బాయిల్లో నల్లమూరి పాండురంగమూర్తి – ఎన్పీఆర్ అనేవాళ్లం, జిజ్జు అని మేం పిల్చుకునే బర్మా వెంకటేశ్వర్రావు, హరి, ఉపాధ్యాయుల సుబ్బయ్య, కేడీవీఎల్ కాంతారావు, ఘంటా గంగాధర్… ఇదీ మా పిల్ల సైన్యం. వీళ్లలో కొందరు ఇప్పటికీ అక్కడే ఉన్నారు. చిన్నప్పుడు మాకెవరికీ కాళ్లకు చెప్పులుండేవి కావు. హైస్కూలుకెళ్లేప్పుడు కాళ్లు కాలుతుంటే దార్లో ఎక్కడైనా పేడ కనబడితే పరుగెత్తుకుంటూ పోయి దాన్ని తొక్కేవాళ్లం. కాస్త ఆరాక నడుచుకుని వెళుతుంటే కాళ్లకున్న పేడ చెప్పుల్లాగా మమ్మల్ని రక్షించేది. అదే శీతాకాలంలోనో వానాకాలంలోనో నడుస్తున్నప్పుడు పచ్చగడ్డి, దాని చివరన నిలిచిన మంచుబిందువులు, ఏవేవో గడ్డిపూలు కాళ్లకు తగిలి గిలిగింతలు పెట్టి ఒళ్లు పులకరించింది నాకిప్పటికీ జ్ఞాపకమే.

మేమూ కాటన్ దొరలమే
ఆ రోజుల్లో మా నాన్నకు నెలకు ఎనిమిది రూపాయల జీతం అనుకుంటా. విలువైన వస్తువులతో కాకుండా వచ్చిపోయే రైతులు, గ్రామస్తులతో మా ఇల్లు కళకళలాడేది. తాను అనుభవించిన ఐశ్వర్యాన్ని పిల్లలకి ఇవ్వలేకపోయాననే బాధతోనో ఏమో, మా నాన్న ఎక్కువ సమయం మౌనంగా ఉండేవారు. ‘నేను మీకు కష్టపడటం నేర్పుతున్నాను. జీవితంలో అసలైన టీచర్లు కష్టాలే. సుఖపడటం ఎవరూ నేర్పకుండానే వచ్చేస్తుంది’ అన్నారొకసారి. హైస్కూలుకు వెళ్లేప్పటికి నాకున్నవి రెండే నిక్కర్లు. అవీ చిరుగులు పడి కుట్టుకున్నవే. ఒక మేస్టారు ‘సిండరెల్లా’ అని నన్ను గేలిచేశారు. అప్పుడు నాన్న మాటలనే గుర్తు చేసుకున్నాను. ఆ మాటల ప్రభావంతోనే నేనిప్పుడు కోటీశ్వరుడితోనైనా, కూటికి లేనివాడితోనైనా – ఎవరితోనైనా హాయిగా మాట్లాడగలను, భోజనం చెయ్యగలను.

పేద – గొప్ప ఇవి ఈ సమాజానికి రెండు ముఖాలు. ఎన్నాళ్లయినా అవి ఒకదాన్నొకటి చూసుకోవు. ఇదంతా చెబుతున్నానని నా బాల్యమేదో బీదబీదగా గడిచిందని అనుకోకండి. మా ఊరు నాకే కాదు, మా గ్యాంగ్ అంతటికీ అద్భుతమైన బాల్యాన్ని బహుకరించింది. వాటిలో ముందు చెప్పుకోవలసింది చెరువు, దాన్ని ఆనుకుని ఉండే మామిడి తోట, ఆపైన ఉండే బూడిద గుంట (శ్మశానం), తర్వాత మైదానం. వర్షాకాలం వచ్చిందంటే చాలు, మాకు తోచిన దగ్గర ఆనకట్టలు కట్టేసి నీరు నిలవచేసి కాటన్ దొరలా పోజులు కొట్టేవాళ్లం. మా చెరువు ఒడ్డున మేడిచె ట్లు, తుమ్మచెట్లు ఉండేవి. మాకు ఖాళీ దొరికినప్పుడల్లా తుమ్మ చెట్లకు గాటు పెట్టి జిగురు తీసేవాళ్లం. ఆ జిగురును కోమటి కొట్లో ఇస్తే అణాలు, కానీలు ఇచ్చేవారు. అణాకు నాలుగు కానులు. కానీకి రెండు పప్పుండలు, లేదా గిద్దెడు మరమరాలు, వేయించిన శెనగపప్పు వచ్చేవి. ఇక అర్థణాకు రెండు బజ్జీలు వచ్చేవి. అంత గొప్ప ఆదాయ మార్గాన్ని పిల్లలెవరైనా వదులుకుంటారా చెప్పండి?

చింతలపూడే మాకు మద్రాసు
మా ఊరి చెరువు ఒడ్డున నేను పసిరిక పామును చూశాను. గట్టు మీద రాళ్ల కింద చుట్టలు చుట్టుకుని పడుకున్న బురద పాములను చూశాను. వానాకాలంలోనైతే అక్కడ కప్పల సంగీతం మారుమోగిపోయేది. ఊళ్లో చాకలివాళ్లకు గాడిదలుండేవి. వాళ్లు చూడకుండా వాటిని ఎక్కి స్వారీ చెయ్యడం మాకు భలే సరదాగా ఉండేది. అవి ఎక్కనివ్వకుండా తన్నేవి. అయినా సరే, కూర్చున్న ఆ ఒక్క నిమిషమే మేం ప్రపంచానికి రాజుల్లా ఫీలయ్యేవాళ్లం. ఇక గేదె స్వారీలయితే చెప్పక్కర్లేదు. అసలు చింతలపూడి మావరకూ మాకు మరో మద్రాసు కిందే లెక్క. విపరీతంగా వచ్చే జానపద సినిమాల ప్రభావంతో మమ్మల్ని మేం సినిమా తారల్లాగా ఊహించుకునేవాళ్లం.

వెదురు కత్తులు తయారుచేసుకుని యుద్ధాలు చేసేవాళ్లం. ఆ సమయంలో మేం ఎన్టీయార్, ఏయన్నార్, రాజనాల, కాంతారావుల్లా మారిపోయేవాళ్లం. అలాగే మాకు జోడీలు కూడా ఉండేవారు! ఉదాహరణకు ‘అరేయ్ నీ పెళ్లాం ఎవర్రా’ అని ఏడెనిమిదేళ్లవాణ్ని ఎవణ్ననడిగినా బి.సరోజ, కృష్ణకుమారి, సావిత్రి, జమున… వీటిలో ఏదొక పేరు చెప్పేవాళ్లు. అలాగే అమ్మాయిలు కూడా తమకు నచ్చిన హీరోలను పెళ్లి చేసుకున్నట్టే మాట్లాడేవాళ్లు. వీటివల్ల మాలో మాకు చాలా తగువులొచ్చేవి. ఉదాహరణకు అప్పటికే హరనాథ్ అనే హీరోని ఒకమ్మాయి ఎంచుకుందనుకోండి, మరో అమ్మాయిని ‘నీ మొగుడెవరే’ అనడిగితే హరనాథ్ అందనుకోండి, వెంటనే మేం పరిగెత్తుకుంటూ వెళ్లిపోయి ‘సేయ్, నీ మొగుణ్నే అదీ ఎంచుకుంది’ అని చెప్పేసేవాళ్లం. ఇంక భీకరమైన యుద్ధం మొదలయ్యేది. అలానే కొత్త కుర్రాడెవరైనా వచ్చి ఏ సావిత్రో ‘నా పెళ్లాం’ అన్నాడా, అంతకు ముందే సావిత్రిని కలల్లో ప్రతిష్టించుకున్నవాడి చేతిలో తన్నులు తినాల్సిందే.

అప్పుల అప్పారావులం అవొద్దు
మా ఊరి వైశ్యుల నుంచి నేనొక అద్భుతమైన విషయాన్ని నేర్చుకున్నాను. దాన్ని అమల్లో పెడితే ప్రపంచమే మారిపోతుంది. అదేంటంటే – మా కుటుంబాల్లో ఒకాయన ఇంట్లో పిల్ల పెళ్లికి సరుకులు కావాల్సొచ్చాయి. చిట్టా ఇచ్చి దుకాణానికి నావంటి కుర్రాడొకణ్ని పంపారు. ఆ శెట్టిగారు ఈ పెద్దాయన ఇంటికొచ్చి ‘ఎందుకండే అన్ని సరుకులూ ఇంత ఖర్చూనూ? రేప్పొద్దున ఊళ్లో మరో గొప్ప పెళ్లి జరుగుతుంది, అప్పుడు మీరు పెట్టిన భోజనాన్ని మర్చిపోతారు జనాలు. ఆపైనాడు పక్కూళ్లో అంత కన్నా మంచి భోజనం పెడితే ఈళ్లదీ మర్చిపోతారు. ఆమాత్రం దానికి మీరెందుకండే అప్పులైపోవడం?’ అంటూ అందులో మూడో వంతు సరుకులు పంపించాడు. వాటితోటే పెళ్లి బ్రహ్మాండంగా అయింది. మా శెట్టిగారి మాటల్లో ఎంత గొప్ప ఆర్థిక సూత్రం ఇమిడి ఉందో తెలుసుకున్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను.

అప్పు అంటే అవతలివాడు తీర్చగలిగినంత ఇవ్వాలిగానీ, వాడు ఆస్తులమ్మేసే పరిస్థితికి తీసుకురాకూడదు. అలాగే తాహతును మించి అనవసరమైన ఖర్చులెందుకు అన్నదే అందులోని పరమార్థం. ఇప్పుడు చూడండి, అందరి జేబుల్లోనూ క్రెడిట్ కార్డులే. అందరూ అప్పుల అప్పారావులే. ప్రభుత్వాలు సైతం తిరిగి తీర్చలేనంత అప్పులు చేస్తున్నాయి. నాకు చింతలపూడి మరో విషయం కూడా నేర్పింది. నిత్య జీవితంలో అవసరం లేని వస్తువును చచ్చినా కొనేవారు కాదు మా ఊరివాళ్లు. ఎవరైనా కొంటే ‘ఏంరోయ్ బలే ఎచ్చులకు పోతున్నావ’ని వేళాకోళం చేసేవారు. ఇప్పుడు అవసరం ఉన్నవీ లేనివీ కొనడం, పోగు చెయ్యడం ఫ్యాషనయిపోయింది. నేనిప్పటికీ పూర్వపు పద్ధతిలోనే ఉన్నాను. అత్యవసరమైనవే కొంటాను. పాటకు లక్ష రూపాయలు పారితోషికం అందుకున్నా సరే నా పద్ధతి మారదు.

నోరు మూసుకుని కళ్లు తెరిచాను
మా చింతలపూడి నాకు ప్రకృతిలోని అందాలను చూపెట్టింది. నక్షత్రాల జల్లెడలోంచి కురిసే చీకటి, పండు వెన్నెల సోనలు, జామచెట్ల మీదకు వచ్చివాలే రామచిలుకలు, ఊరవతల తోటల్లోని పిచ్చుకగూళ్లు, వానకురిసే ముందు ఆకాశం, రాతిలోంచి వచ్చిన కప్ప…. చెప్పుకుంటూ పోతే ఎన్నో. అవే నా పాటలోలనూ ప్రతిఫలిస్తాయి. మా అన్నయ్య డిటెక్టివ్ నవలలు చదువుతూ మధ్యలో ఆపేసి నిద్రపోయేవాడు. తర్వాత కథేమైందో చెప్పరా అంటే ‘నోర్మూసుకోవాయ్’ అనేవాడు. వాడు నోర్మూసుకోమనడం వల్లనే నేను కళ్లు తెరుచుకున్నాను. విపరీతంగా చదవడం మొదలెట్టాను.

మా ఊరి గ్రంథాలయంలో దాశరథిగారని ఉండేవారు, ఆయన నాకు ప్రపంచ సాహిత్యాన్ని పరిచయం చేశారు. ఆ సమయంలోనే మా ఊరివాళ్లంతా కలిసి బోధానందపురి మహరాజ్ అనే సాధువొకరిని తీసుకొచ్చి విశ్వనాథ మఠం నిర్మించారు. ఆయన కూడా శంకరాచార్యలాగానే కేరళలోని కాలడి గ్రామస్తులు, చిన్నవయసులోనే సన్యాసం తీసుకుని హిమాలయాల్లో సంచరించినవారు. బడి, గ్రంథాలయం పోను మిగిలిన సమయమంతా నేను ఆశ్రమంలోనే గడిపేవాణ్ని. ఆయన శిష్యరికం వల్ల, అక్కడికి వచ్చిపోయే పండితుల వల్ల నేను మన సంప్రదాయ సాహిత్యం, తాత్వికతల గురించి బాగా తెలుసుకున్నాను. అప్పుడే గుడిలో రాజేశ్వరీదేవిని ప్రతిష్ఠించారు.

ఉదయం పువ్వులు కోసి పెట్టడం, భక్తులకు ప్రసాదాలు పంచడం ఇలాంటివన్నీ నా పనులన్నమాట. అవి చేస్తున్నప్పుడు నాకు ప్రకృతి అంతా శక్తిమయమని అర్థమయింది. అయినా జీవితమంటే ఏమిటి, మనమంతా ఎవరు, ఎక్కణ్నించి వచ్చాం, ఎక్కడికి వెళుతున్నాం… ఇవన్నీ తెలుసుకోవాలని తపనగా ఉండేది. వీటి గురించి ఆలోచిస్తూ నేను సన్యాసి అవాలని తీర్మానించుకున్నాను. ముందుగా భారతీయ వైమానిక దళంలో చేరి పద్దెనిమిదేళ్లు పనిచేశాను. తర్వాత పాదచారినై చాలా కాలం హిమాలయాల్లో ఒంటరిగా సంచరించాను. మనస్సు చేసే అద్భుతాలను చూశాక ఎక్కడున్నా ఒకటే అనిపించి చెన్నైకి చేరుకుని ఇదిగో మీముందిలా పాటల రచయితగా నిలబడ్డాను. మా ఊళ్లో మా అన్నయ్య, అక్క కుటుంబాలు ఇప్పటికీ ఉన్నాయి. వాళ్లకోసం, మా గుళ్లోని అమ్మవారిని చూడటం కోసం నేను ఏడాదికోసారైనా చింతలపూడి వెళుతుంటాను. అక్కడ చెరువు పూడ్చేసి మరీ ఇళ్లు కట్టేసుకున్నారు. మామిడి తోటల ఆనవాలే లేదు. మైదానం తగ్గిపోయింది. నేను ఊరికేమీ చెయ్యలేకపోవచ్చు, కానీ దాన్ని మరింత చెడగొట్టలేదు.

పేరు మారిందిలా!
ఇంతకూ నా అసలు పేరు శేష పూర్ణానంద ప్రభాకర గురురాజు. మా అమ్మ పేరులోని చంద్ర, చెన్నైలో నన్ను తల్లిలాగా చూసుకున్న భువనేశ్వరమ్మ పేరులోని సగం తీసుకుని నేను ‘భువనచంద్ర’నయ్యాను.

మా తిండి పురాణం
ఊళ్లోని చెరువులో దొరికే తామరాకులను ఎండబెట్టి దాచుకునేవాళ్లు అందరూ. హోటల్లో ఇడ్లీలు, బజ్జీలు వంటివన్నీ వాటిలోనే పెట్టిచ్చేవారు. మిరపకాయ బజ్జీలను తినడానికో పద్ధతి ఉంది. మిరపకాయ బజ్జీలను చిన్న ముక్కలుగా కోసి, అందులో ఉల్లిచెక్కు, నిమ్మకాయ పిండి కాస్త ఉప్పూకారం వేసి బాగా కలిపి తింటే నా సామిరంగా… అసలు రుచి బజ్జీల్లో ఉందో ఎండిన తామరాకులో ఉందో ఇప్పటికీ అర్థం కాదు. అలాగే వేసవి కాలం వచ్చిందంటే చాలు, పిల్లల జేబుల్లో బ్లేడు, ఉప్పూకారం ఉండాల్సిందే. అది చాలా పెద్ద రహస్యం. నైపుణ్యాల ఆధారంగా ప్రతి బ్యాచ్‌లోనూ ఆరేడుగురు ఉండేవారు.

ఇద్దరు కాపలా ఉండటానికి, ఒకరు చెట్టెక్కడానికి, ఒకరు కోసిన కాయలను క్యాచ్ పట్టడానికి. కాయలు చేతుల్లోకి రావడమే ఆలస్యం, వాటిని బ్లేడుతో చెక్కి, చిన్నచిన్న ముక్కలుగా కోసి ఎండిపోయిన కొబ్బరి చిప్పల్లో పోసి ఉప్పూకారం కలిపి లొట్టలేసుకుంటూ తినేవాళ్లం. ఇక ఊళ్లో ఎవరింట్లో అరటి గెల కాసినా పిల్ల సైన్యానికి ఉప్పందేది. గెల మొత్తం ఎత్తుకెళితే తన్నులు పడతాయని తెలుసుగనక చాలా నేర్పుగా పళ్లు దొంగిలించేవాళ్లం. ఇక పంపరపనస కాయలు ఒలిచి వాటి డిప్పలను నెత్తిమీద పెట్టుకొని ఊరేగేవాళ్లం. వామన చింతకాయలను బచ్చలితో కలిపి పచ్చడి చేసుకుని తింటే అబ్బో ఇది చింతలపూడి కాదు, స్వర్గం అన్నట్టుండేది.

ఊళ్లో మరీ విసుగు పుడితే నాలుగు కిలోమీటర్ల దూరంలోని తమ్మిలేరు దగ్గరకు నడిచి వెళుతూ అడవి కరివేపాకు, జామకాయలు ఏరుకునేవాళ్లం. అన్ని కాలాల్లోనూ అన్ని రకాల ఆహారపదార్థాలు దొరికేవి కాదు. అందుకని ఇళ్లలో కొన్ని నిలవ చేసేవారు. ఆ పనిలో పిల్లల భాగస్వామ్యం చాలానే ఉండేది. ఉదాహరణకు కొబ్బరి, నువ్వులు వంటివి మిల్లుకిచ్చి నూనె తీసి తేవడం, అవసరమైనప్పుడల్లా ధాన్యాన్ని ఆడించడం, కూరగాయల ఒరుగులు పెడుతుంటే సాయం చెయ్యడం, ఆవకాయలు పెడుతున్నప్పుడు కారం, పసుపు, ఆవపిండి వంటి వాటిని వస్త్రకాయితం చెయ్యడం (జల్లెడ పట్టడం) ఇవన్నీ మా పనులే.

Posted in సేకరణలు | Tagged | Leave a comment

టెర్రా ఫర్మా (solid as a rock )

   టెర్రా ఫర్మా (solid as a rock )

          టెర్రా ఫర్మా అనేశాస్త్రీయపరిశోధన పుస్తకాన్ని James Lawrence Powell అనే జియాలజీ అధ్యాపకుడు రాశాడు. లాస్ అన్జేల్స్ లో నేషనల్ హిస్టరికి డైరెక్టర్ .శీర్షిక అర్ధం రాయి వంటి ఘన పదార్ధం అని .కెప్లర్ దగ్గర్నుంచి నేటి వరకు జరిగిన పరిశోధనలను స్థాలీపులాకం గా ఇందులో చర్చించాడు .

 8ac2810ae7a0cc747562d110.L

           మనం నడయాడే భూమి ఎలా ఏర్పడిందనే విషయం రాశాడు .స్పేస్  అండ్ టయిం  లో జరిగిన మార్పులన్నిటిని చర్చించాడు . టైం ,డ్రిఫ్ట్ స్పేస్ ,చాన్స్   పేర్లకు అర్ధాలు తెలిపాడు ..ఇరవయ్యవ శతాబ్దపు రివల్యూషన్ ను ఆవిష్కరించి ,భూమి గూర్చిన అసలైన విజ్ఞానాన్ని అందించాడు .ఇంతకీ భూమి వయస్సు ఎంత ?లార్డ్ కెల్విన్ కు ఎర్నెస్ట్ రూధర్ ఫోర్డ్ కు మధ్య జరిగిన విషయాలన్నిటిని విశదీకరించాడు .దీనితో అసలు భూగర్భ శాస్త్ర విజ్ఞానం బయటికొచ్చింది .దానితో ఈ శాస్త్ర వేత్తలు 4.5 బిలియన్ సంవత్సరాల‘’జియలాజికల్ టైం’’ను ఇరవై నాలుగు గంటలకు కుదిస్తే హోమో స్పైన్స్ చివరి సెకండ్ లో ఆవిర్భ విన్చాయని తెలిపాడు .దీనినే జియాలజికల్ రివల్యూషన్ అఫ్ టైంఅంటారు .దీని వల్ల మన భూమి ఎంత పురాతన మైనదో తెలుస్తోంది .

                 20 వ శతాబ్దపు తొలి రోజుల్లో జెర్మనికి చెందిన మేటీరియాలజిస్ట్ ,పోలార్ ఎక్స్ప్లోరర్ ఆల్ఫ్రెడ్ వేగ్నర్ భావనాత్మక వారసత్వ సిద్ధాంతాన్ని (intuitive heritical theory)చెప్పాడు టెర్రా ఫర్మా అనేది ఇప్పుడున్నంత గట్టిగా లేదు ఖండాలు దూరమైనాయని ,చెప్పాడు .1926 లో పెట్రోలియం జియాలజిస్ట్ లు న్యూ యార్క్ లో వేగ్నర్ సిద్ధాంతాన్ని చర్చించటానికి సమా వేశామయారు ..వేగ్నర్ సిద్ధాంతాలను నమ్మాలి అంటే ఇప్పటి దాకా అంటే 70 ఏళ్ళనుంచిన నేర్చిన  చరిత్ర నంతా మర్చి పోవాలి .మళ్ళీ కొత్త విధానాన్ని మొదలు పెట్టాలి .అని తేల్చుకొన్నారు .నలభై ఏళ్ళ తర్వాతదీన్ని కొత్త తరం అదే పని చేసింది .పావెల్ గారి రెండో భాగం లో మన భూమి ఎలా కదిలిందో తెలిపాడు .

            జియలజికల్ కాలం లో ఎన్నో ఉల్కలు సోలార్ సిస్టం లో అడ్డమైన ప్రతిదాన్ని ఢీ కొట్టాయి .గ్రహాలూ ఊహా తీయమైన  వేగం ,గమనాలతో సంచరించాయి .ఒక సారి పర్వతం అంత పెద్ద ఉల్క స్పేస్స్ లో ప్రయాణం చేసింది .భూమిని ఆ వేగం తో బలం గా తాకింది  .అప్పుడు డైనోసార్లు తో బాటు రెండు వంతుల జీవ జాతులన్నీ అంత రించాయి .దీనితో అనేక క్రటర్స్ అంటే గుంటలేర్పడ్డాయి ..అదే మన పూర్వీకమైన భూమి .మళ్ళీ అలా జరుగుతుందని చెప్పలేం ఊహించాలెం .ఇదే పావెల్ గారి రివల్యూషన్ ఆఫ్ చాన్స్ ‘’అదే మన అదృష్టం .మన కాళ్ళ కింద ఉన్న రాళ్ళు రప్పలు గురించే ఈకధ అంతా అని పుస్తకాన్ని ముద్రించిన వారంటారు .ఇందులోని చివరి అధ్యాయం ‘’tapestry ‘’లో మొత్తం విషయాన్ని అంతా సమీక్షించాడు రచయిత .ఇదంతా ఒక నేత అంటాడు ఇందులో ఏ దారం లేక పోయినా నేత కలవదు అనుకొన్న నేత పూర్తికాదు  అంటాడు ‘’inspite of the evident human failings of scientists ,the tapestry of science grows ever stranger .egotism ,prejudices ,poor guesses ,and out right mistakes all the end make no difference .their effect is only to delay truth not to deny it .the invisible moving finger of science weaves a tapestry far stronger than scientists themselves .scientists and their theories come and go ,the tapestry of science is eternal ‘’అని గొప్ప సత్యాన్ని చెప్పాడు రచయిత .

           భారీ గ్రహాలూ భూమి ఉపరితలానికి పైన ఏడాదికి కొన్ని శతాబ్దాల కాలం కదిలాయి .ఇది మన గోళ్ల పెరుగుదల కాలం తో పోల్చవచ్చు .పాలియో మాగ్నెటిక్ టైం స్కేల్అగ్ని పర్వత రాళ్లు ,భూమి నుండి ఏర్పడింది .లోతు సముద్ర కోర్స్ మొదలైన వి ,అట్లాంటిక్ వ్యాప్తి రేట్ ను తెలిపింది .దీనితో ఖండాలు విడిపోయే దూరం 6000 k.m.అయింది రాళ్ళు ఏర్పడే కాలానికి .ఇది ఏర్పడటానికి మిలియన్ల సంవత్సరాలై ఉంటుంది .విడిపోయే రేటు ఏడాదికి 3.3 సెంటి మీటర్లు .గ్లోబల్ పొజిషన్ సిస్టం ,లేజర్ రెంజింగ్ మొదలైన వాటి వల్ల అంతా స్పష్టమైంది .జియాలజీ, జియో ఫిజిక్స్ కూడా దీన్ని సమర్ధించాయి .కాని కాలం ఇంకా కావాలి రుజువు చేయటానికి .

            వేలాది ఏళ్ళ చరిత్ర పుటల్లో ఎవరూ ఉల్కా పాతాన్ని స్వయం గా చూడలేదు .క్రేటర్ ఏర్పటమూఎవరికీ తెలీదు .గెలీలియో కనీ పెట్టిన టెలిస్కోప్ ను ఎన్నో ఏళ్ళ నుండి ఉపయోగించి చంద్రుడిని చూస్తున్నా ఎవరూ క్రేటర్ ను చూడలేదు కొద్ది మంది చూసినట్లు భావించారు అంతే .మానవ జీవన ప్రమాణ కాలంకు సంబంధం లేకుండా ఈ క్రేటర్లు ఏర్పడి ఉంటాయి .కుజ ,గురు ,శుక్ర గ్రహాల పైన ఏర్పడి కప్పి వేసి ఉండ వచ్చు .మనకు చూసే అదృష్టం లేదు జీఎవిత కాలం లో .’’imagine removing every forth note from Eine kepler ,Nauchtmusik ,evry fourth line from hamlet ,every fourth brush stroke from Van Gogh’s irises .to do so would be to deny and discreate that finest that our species has achieved ‘’అని పూర్తీ చేస్తాడు రచయిత ప్రతి అధ్యాయం ప్రారంభం లో ఒక గొప్ప సూక్తి ని రాశాడు .అవన్నీ మాణిక్యాలే గొప్ప సత్యాలే .ఆ చాప్టర్ సారాం శాలే .

 1—all truths passes through three stages .first it is ridiculed ,second it is violently oppressed and third it is accepted as self evident (aurthor Schopenhauer )

 2—if an elderly distinguished scientist says that same thing is possible ,he is not almost certainly right ,but if he says that it is impossible  he is very probably wrong .(Arthur c.clerk )

3-an important scientific innovation rarely makes its way by gradually winning over and converting its opponents .what does happen is that its opponents gradually die art and that growing generation is familiar with the idea from the beginning .(max plank )

4 –the time has gone when the physicist prescribed dictatorially what theories the geologists might be permitted to consider (a.s..eddington )

 5-when  you cannot measure ,your knowledge is meager and un satisfactory (Kelvin )

 6- a science that hesitates to forget founders is lost (a.n.white head )

 7-if at first the idea is not obsurd then there is no ope for it (Einstein )

 8-to be uncertain is to be un comfortable but to be certain is to be ridiculous (Goethe )

 9—any thing that has happened .can.(marshal kay )

 10—the sea washing the equator and poles offers its perilious aid ,and the power and empire that follows iti .beware me it says ‘’but if you can hold me I am the key to all the lands –(r.w.emerson )

11 –how extremely stupid not to have that thought (Thomas hardy )

12- one of the greatest obstacles to progress is not ignorance ,but the illusion of knowledge (denial borstin )

13—in search of self satisfaction is death .doubt motivates progress but it is painful to endure (jaques monod )

14-i can state flatly that heaven that heavier than air flying machines are impossible (lord Kelvin )

15—my mother groaned my father wept ,into the dangerous world I lept helpless naked piping loud ,.like a frequent hid in a cloud (blake )

16—what is this talked –if mystery of birth—but being mounted bareback on the earth

  (Robert frost )

17—the moving finger writes and having writ –moves on ,nor all your pity nor wit –shall lure it back to cancel half a line –nor all your tears wash out a word of it .(omar khayyaam )

                   మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –27-4-13- ఉయ్యూరు

 

Posted in రచనలు | Tagged | Leave a comment

చినుకు నవ వసంత సంచిక -4 (చివరి భాగం )

చినుకు నవ వసంత సంచిక -4 (చివరి భాగం )

             ఈ సంచికలో  ముఖ్యమైన ముఖా ముఖం ఉంది అది డాక్టర్ శ్రీపాద పినాక పాణి గారితో పన్నాల సుబ్రహ్మణ్య భట్టు చేసిన ఇంటర్వ్యు అది .అందులో ముఖ్య విషయాలు ‘’కృతి అంటే వర్ణమే .రాగ భావం,ఫ్లో రెండు ఉంటె స్వరకల్పన బాగుంటుంది .సంగీత త్రిమూర్తులైన త్యాగ రాజు ,శ్యామ శాస్త్రి దీక్షితార్ ఎక్కువ కృతులు నోటికి వస్తే రాగాలాపన బాగుంటుంది లు సంగీతం అంటే ఇలా ఉండాలి అని చెప్పిన వారు దేవుడే వారి రూపాలలో వచ్చాడు అంతకు ముందు పురందరదాసు అన్నమయ్య ఉన్నా వాళ్ళు సంగీతజ్ఞులు కారు .భజన పరులు మాత్రమె .వాళ్ళు పాడే వారు కాక పోవటం వాళ్ళ వాళ్లకు శిష్యా బృందం యేర్పడ లేదు .అన్నమయ్య 32 వేల కృతులు రాసాడు అంటే రోజుకు ఎన్ని రాసి ఉండాలి ?ఆయన సంగీతం పాడాడో ఇతరులకు చెప్పాడో రికార్డు లేదు అసలు అన్నమయ్య సంగీతం అనేదే లేదు మనకి .గురువు అనే వాడు అచ్చం త్యాగ రాజు గారి లానే ఉండాలి .అయన దగ్గర సంగీతం నేర్చుకొన్న మొదటి12 మంది చివరిదాకా ఆయన తోనే ఉన్నారు .అంటే త్యాగయ్య ఫాస్ట్ క్లాస్ గా పాదేవాడని తెలుస్తోంది .బాగా సంగీతం బోధించేవాడని అర్ధమవుతుంది .ధనమ్మాల్ కు వెయ్యి కృతులు వచ్చు .అన్నీ మెదడులోనే భద్ర పరచుకొందామే .మంచి గురువు వెల్ ఎక్విప్పేడ్ గా ఉండాలి .చెప్పడం రావాలి .శిష్యుడికి ఏది పలుకుతుందో ఎలా పలక వచ్చో అలా సాధన చేయించి పాడించాలి శిష్యుడి గొంతు ధర్మాన్ని అర్ధం చేసుకోవాలి మహారాజులు త్యాగయ్యను అడిగి మరీ పాదిన్చుకోన్నారంటే ఆయన ఒకటో నంబర్ పాతగాదన్న మాట .గోవింద రాజు పిల్లే నోటి పాత వీణ వాయించి నట్లుండేది .ఆయన ఒక ఐడియల్ నాకు .ధనమ్మాల్ గమకానికి ,అరియకుడి పాటకు దీటుగా నిలుస్తారు .సుభాష్ లా ఉంటేనే సంగీతం .మనసును ఆకర్షించే సంగీతమే మంచి సంగీతం .తంజావూర్ బాణీ పాడే వాళ్ళంతా నాకు గురువులే .

     ‘’ద్వారం వెంకట స్వామి నాయుడు గారు నాద యోగి .ఆయనకు కృతి పాతం లేదు .వీణ సంగమేశ్వర శాస్త్రి గారి వద్ద పక్క వాద్యాం గా వీణ వాయించి నాయుడు గారు ఆ అందాన్ని గ్రహించారు .నేను నాదం లో అందాన్ని వెతుక్కుంటూ పోతున్నాను గాయకుడు అన్నవాటిని నాయుడు గారు మహా తేలిగ్గా వాయించే వారు .ఆయన జీనియస్ .నా శిష్యులు ఓలేటి వెంకటేశ్వర్లు నేదునూరి కృష్ణ మూర్తి లు అంటే నాకు అభిమానం నా మనో ధర్మం తెలిసిన వారు వారిద్దరూ .నా బాణీ అంటూ వేరే లేదు దక్షినాది బానీయే నా బాణీ నేను నా సంగీత యాత్రలో ఎంతో తృప్తి చెందాను 1119 కృతులను నాల్గు సంపుటాలుగా తెచ్చాను అది పల్లవుల పుస్తకం .’’మనో ధర్మ సంగీతం ‘’అనే అయిదు పుస్తకాలు రాశాను .మల్లాది సూరి బాబు నేను చెప్పిన దల్లా ఆకళించుకొన్న గొప్ప శిష్యుడు వేరి రిసేప్తివ్ అతను .’’ఇలా సంగీత పినాక పాణి వానిని బానినితెలుగు వారికి మళ్ళీ ఇంకోసారి రుచి చూపించాడు భట్టు దీన్ని ఇంత విపులం గా ప్రచురించిన నండూరి అభినందనీయుడు .

            2012 లోవిరిసిన తెలుగు కవితా వసంతాన్ని డాక్టర్ కడియాల రామ మోహన రాయ్ విపులం గా వివా రించారు పూర్వం శ్రీ వాత్స వ ఇలా ఏ ఏడాది కా ఏడాది రచనల నన్ని సమీక్షించటం గుర్తు కొస్తుంది .’’అదృష్ట దీపక్ కు మద్రాస్ జ్ఞాపకాలు ‘’మండుతున్నట్లు ‘అని పించాయి .’ అవేవీ ఇప్పుడు లేకపోవటమే వెలితి ..ఇస్మాయిల్ కవిత్వ లాలిత్యాన్ని యై కామేశ్వరి పరామర్శించారు .’’యూని వర్సితీలలో తెలుగు డిపార్ట్మెంట్ ఎత్తేస్తే కాని తెలుగు విమర్శ బాగు పడదు ‘అన్నాడట ఇస్మాయిల్ .ఆయన అనుభవాల ఆధారం గా ఊహా లోకం లో రూపు దాల్చిన కవితలను చదివి ఆనందించమని రచయిత్రి కోరింది .

         ‘’నవ్విపోదురు గాక ‘’అంటూ సినీ నిర్మాత మురారి రాసిన పుస్తకం సంచలనమే రేపింది దాన్ని సమీక్షించాడు పాటి బండ్ల దక్షిణా మూర్తి .’సినీ రంగం లో హిపోక్రసి లేని వారు భానుమతి డి.వి.నరస రాజు ఇద్దరు మాత్రమె నన్నాదట శ్రీ శ్రీ .అలాగే చక్రపాణి మురారి కూడా అదే కోవకి చెందుతారని మూర్తి గారి కితాబు .’’వెలుతురూ జల పాతం గా డెబ్భై ఏళ్ళ గిడ్డి సుబ్బారావు ను కొనియాడాడు సింగం పల్లి .మాకినేని సూర్య భాస్కర్ ‘’ప్రపంచ భాష గా తెలుగు ‘’వర్ద్ధిల్లాలంటే పది సూచనలు చేశాడు అందులో తెలుగు కంప్యూటింగ్ విషయ నిర్మాణానికి కృషి చెయ్యాలని అంతర్జాల వెబ్ ,డిజిటల్ గ్రంధాలయాలు మున్నగు వాటిలో తెలుగు విశ్యాభి వృద్ధి జరగాలి అన్నది ముఖ్యమైంది

              ‘’రుబాయీల తెలుగు కవి సమ్రాట్టు ‘’అంటూ శ్రీ తిరుమల శ్రీని వాసా చార్య ను ‘’సుధామ‘’వివిధ కోణాల్లో ఆవిష్కరించాడు .’’ఈ దేశం వృక్షానికి ప్రతి మనిషి ఒక ఆకు –ఈ దేశం పుష్పానికి ప్రతి మనిషి ఒక రేకు –ఈ తరు పుష్పాల పైన ఎవరైనా చేయి వేస్తె—తత్ క్షణమే అవుతాడు ప్రతి మనిషి ఒక బాకు ‘’అన్న పంక్తుల్ని ఉదాహరించటం బాగుంది .’’జననీ జనకులను మర్చి పోతే యెట్లా –బోధించిన గురువుని మర్చిఒతే యెట్లా –ణీ కోసం నిచ్చెన నిలిపిన దేశాన్నే –ఋణం తీర్చకుండా మరచి పోతే యెట్లా ?/’’అని ప్రశ్నిస్తారు ఆచార్య .

         ‘’తెలుగు కదా సౌందర్యాన్వేషణ ‘’అనే ప్రత్యెక వ్యాసం లో గుడిపాటి తిలక్ బైరాగి ,బుచ్చిబాబు చలం వేగుంట ,స్మైల్ మొదలైన వారి కధల్లో ఉన్న సౌందర్యాన్ని వెలికి తెచ్చే ప్రయత్నం బాగుంది అందులో తెలుగు రచయిత్రుల్లో తాత్విక బలం ఉన్న రచయిత్రి గా జలంధర ను ప్రస్తుతించాడు .

            డాక్టర్ పూర్ణ చంద్ ‘’రాయల నాటి పాలనా భాష ‘’ను సమీక్షించి అది నేటి అవసరాలకు ఎలా వినియోగించుకోవాలో సూచించాడు .శాసనాల్లోంచి ,ప్రాచీన కావ్యాల్లోంచి ఆధారాలు వెదికి అధ్యయనం చేయించాలని ,కొత్త పరి భాషా పదాలను సూచించటానికి ప్రజల్ని భాగ స్వామ్యులను చేయాలని ,ఆ పదాలను అంతర్జాలం లో ఉంచితే విస్తృత చర్చ జరిగి నిగ్గు తెల్తుందని దానికి ఇంగ్లీష్ సమానార్ధాన్ని ఇస్తూ పెంపు చేస్తూ మహా నిఘంటువు తయారు చేయాలని మంచి సూచనలే చేశారు

             అరసవిల్లి కృష్ణ ‘’సావిత్రి ‘’ని అగ్ని శ్వాస గా అభి వర్ణించాడు .’’ నా వంట్లో రక్త మామ్సాలన్ని నూరి ముద్దచేసి –ఔషధం చేసి –నా అనువనువుకీ పూశాను –ఇప్పుడు –నువ్వు వస్తాడువు అయ్యావు–శాసకుదవయ్యావు ‘’అని పితృస్వామ్య సమాజం లో కొడుకు పాత్రను మన ముందు నిల బడుతుంది సినీ నటి సావిత్రి మరణిస్తే ‘’తరలి పోయిన తార తరుణి సావిత్రి –ఇక నైనా పొండుమా విను వీధి విశ్రాంతి ‘’అని ఈ సావిత్రి అన్నాడట .

        ఆదూరి సత్య వతి రచన ‘’ఒక వేణువు పలికింది ‘’ని సమీక్ష చేసింది వి.సీతా మహాలక్ష్మి ‘’ఉత్తమ మైన  ఆత్మా పరమైన కవిత్వం లో ఉన్న లావణ్యం మరెక్కడా ఉండదు ‘’అన్న కృష్ణ శాస్త్రి పంక్తుల్ని ఉదాహరిస్తూ రచన సాగింది .’’ఒక వేణువు పలికినది –ఒక మనసును ఊపినది –ఒక ఆమని ఓడిగినది–ఒక పున్నమి విరిసినది ‘’సత్యవతికి ఆత్మా భక్తీ పరమాత్మ ప్రకృతి ఆమె కవిత్వం మనోహర స్వరపరిమలాలను వెదజల్లే ఒక వేణువు అని తీర్మానించింది సమీక్షకురాలు లక్ష్మి .

              చివరగా తెలుగు భాషోద్యమానికి ఎత్తిన బావుటా అయిన ఇటీవలే పరమ పాడించిన చలమాల ధర్మా రావు గారి పై మండవ శ్రీరామ మూర్తి మనసుల్ని తాకే రచన చేసి ఆయన్ను ఆయన భాషా సేవలను ప్రస్తుతించారు .

          16 బాపూ కొంటె బొమ్మలు ముసి ముసి నవ్వులు ,నోరు వెల్ల బెట్టినవ్వేనవ్వులు కిసుక్కు నవ్వులు ,పగలబడి నవ్వటాలు అవతలి వాడు హడలి చచ్చేట్లు బిగ్గరగానవ్వటం ,కేవ్వుకేకలు ,పెట్టిస్తాయి .. హాస్యం ,వ్యంగ్యం ,రిపార్టీ ,ఎద్దేవా, అమాయకత్వం , తో పులకరిస్తాం ..  వీటి విలువ అసలు కట్టనే కట్టలే మండీ బాబు . .

             ఇన్ని విభిన్న రుచుల్ని ,విభిన్న ధోరణుల్ని, విభిన్న భాషా సంప్రదాయాల్ని ఒక్క చోట చేర్చి చినుకు చినుకుగా , హర్షపు  చినుకులుగా తీర్చి దిద్ది ప్రత్యెక సంచికను నవ వసంత సంచిక గా వెలువరించటానికి సంపాదకుడు రాజ గోపాల్ చూపిన శ్రద్ధ ,రాయించిన తీరు, రాసిన వారి నేర్పూ, ,చదివించిన వైనం చూస్తె ఆశ్చర్యం వేస్తుంది మరో సారి చినుకు ను , రాజ గోపాల్ కను మనసారా అభి నందిస్తున్నాను ఈ సంచిక వెల 60 రూపాయలు మాత్రమె .ప్రతి పేజీని మనం ఆనందం గా అనుభవిస్తాం ఈ ఆనందాన్నీ  వెల కట్టలేము కదా. త.ప్పక అందరు కొని చదివి అమూల్య సమయాన్ని సార్ధకం చేసుకోండి.నవ వసంత సంచిక గా చినుకు వసంతాన్ని చినుకు గా తెచ్చింది . అనుభవించటం మన కర్తవ్యం . 

           చినుకు ప్రత్యెక సంచిక పై చిలికించిన మాటల చినుకులు సమాప్తం

                    మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –27-4-13- ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

చినుకు నవ వసంత సంచిక -3

 

   చినుకు నవ వసంత సంచిక -3

                                 కవితా లహరి

         ఈ సంచిక లో 17 కవితలున్నాయి .మొదటి కవిత జ్ఞాన పీఠ అవార్డు గ్రహీత నారాయణ రెడ్డి గారిది .’’సెలయేటి చరమ గమ్యం సాగరం తో చేసే కరచాలనమా ?లేక ఆత్మార్పణమా ?పుష్కలం గా జల రాసులున్న సముద్రం సెలయేటి నీటిని తనలోకి లాక్కోవటం అత్యాశ కాదా?’’అని ప్రశ్నిస్తారు ‘’ఆశ  వాంఛనీయమే కాని అత్యాశ వర్జనీయం ’’అని హిత బోధ చేస్తారు .

         డాక్టర్ గోపి రాసిన ‘’అపూర్వం ‘’లో అనవసర జ్ఞానాన్ని వదిలి కవి ఆది వాసిగా మారిపోతాడని ఆకుల్లాంటి అమాయకత్వం తో అందరి మేలును శ్వాశిస్తాడని ‘’ప్రగాఢ వాంచను తెలియ జేశారు .నిఖిలేశ్వర్‘’కోరిక ‘’లో మనిషి కోరికల సారాన్ని కోల్పోతున్నాడని ‘’నిర్వేదన చెందాడు .డా.మల్లెమాల వేణు గోపాల రెడ్డి ‘’మెదడుకి పదును పట్టి గతం లోకి వెళ్లి ,స్వాగతం రాస్తే మాత్రం అది చెరగని సంతకా మౌతుంది‘’అంటాడు ‘’మాకోలోకం ‘’లో ‘’అగ్ని ద్వీపం ‘’లో సూర్యారావు ‘’కవిత్వం అగ్ని సరస్సు అనుకొంటాడు .నవ నాడుల గర్జన అంటాడు .విజ్రుమ్భణ గా భావిస్తాడు .వాస్తవాల గాయం రగిలి పొంగిన లావా అని భావిస్తాడు .భ్హావాన్ని స్పిరిట్ దీపం మీద –వేడి చేసె పరీక్ష  నాళికఅనుకొంటాడు ‘’చాలా భావ గర్భితమైన కవిత ఇది .కోపూరి పుష్పా దేవి కి రోడ్డు ఊడ్చి బాగు చేసే వారి చీపుళ్ళు కాళీ మాత చేతి త్రిశూలం గా దుర్మార్గులను దునుమాడె వీరి చీపుళ్ళు మన ఖరాబును మత్తు పెట్టేవి గా అని పించాయి .’’మర్నాటి పొద్దునకు మల్లెల్లా మెరిసే వీధులు –మళ్ళీ మట్టికోట్టుకోవడానికి సిద్ధమవుతాయి ‘’అంటారు ఈ’ఆర్ద రాత్రి సూర్యుల ‘’గురించి రాస్తూ .’’అర్ధ రాత్రి సూర్యులు గొప్ప ‘’కాయినేజ్ వర్డ్ ‘’.

              ‘’ఆమె ఒక హైకూ ‘’అంటూ ‘’ఆమె వెళుతూ నాలోపలి సగాన్ని అర్ధమిచ్చింది ‘’అని పొంగిపోతాడు మోహన రాం ప్రసాద్ .ఆర్ ఎస్.భల్లం ‘’’’ఆవేశపు ఆకాశం మీంచి —ఆక్రందనల మెరుపు పెళ్ళలు విరిగి పడ్తుంటే –కాలిన వెన్నెముకల మీద –ఎన్ని మాటల వెన్న ముద్దలు చిలికితే ఏముంది ?’’అంటూ ‘’భద్రతే బాధ్యత గా –బతుకు ప్రయాణం సాగనప్పుడు –నేల ఒళ్లంతా శవాల కమురు వాసన‘’అని భళ్ళున డోక్కుంటారు ‘’కన్నీటి సందర్భం ‘’లో .బడి పిల్లల బస్సు ప్రమాదానికి స్పందిస్తూ .బృందావన రావు అనేక బహుమతులు పొందిన గొప్ప కవి కధకుడు .ఆయనకు ‘’స్వతంత్రేచ్చ  ఒక జీవ సహజాతం ‘’’’బాధ్యతలను స్వీక రించడానికి ముందుకు దూకే గుండె దిటవు స్వేచ్చ ‘’అంటాడు .వల్లభాపురం జనార్దన్ ‘’చావెజ్ మరణం ప్రజా చైతన్యానికి వాక్యాంత  బిందువు కాదు ,కామా మాత్రమె‘’నని పించింది ‘’ప్రజా హృదయాల్లో శాశ్వతం గా ఉండిపోయే ఉదయ సూర్యుడి గా  భవిష్యత్తుకు బాట చూపే కాగడా ‘’గా కనీ పించి పులకించాడు ‘’చరిత్ర సంతకం ‘’లో .మందరపు హైమవతి ‘’ఆత్మ విశ్వాసాల పతాకాల నేగరేసే ఆధునిక మగువ స్మృతులే రాయాలి –భయమేరుగని ప్రపంచం లో –బాలికలు కళ్ళు తెరవాలి ‘’అని’’కలల రెక్కలు ‘’లో కోరుకొంటారు .

                   సాహిత్య విహారం

            లో మధురాంతకం నరేంద్ర ఇరవయ్యవ శతాబ్దపు కన్నడ మహాకవీ ,రాష్ట్ర కవి జ్ఞాన పీఠ పురస్కార కవి అయిన కుప్పిలి వెంకటప్ప పుట్టప్ప (కు వెం పు )పుట్టిన కుప్పెల్లి పల్లెటూరి సందర్శనం లో ఆయన ఇంటిని దాని అద చందాలను వర్ణించి మనకు మహదానందం కల్గిస్తారు రోజు దాన్ని కనీసం వెయ్యి మంది అయినా సందర్శిస్తారట .తర్వాత నరేంద్ర కేరళ లోని తిరూర్ లో జరిగే ‘’తుచ్చన్ న్ ‘’ఉత్సవం జరిగే ఆడిటోరియం అక్కడ జరిగే ఉత్సవ విశేషాలు తెలిపారు తిరూర్ లో జన్మించిన తున్చాట్టు ఏడు తున్చన్ మళయాళ భాషకూ ,సాహిత్యానికి పితామహుడు తున్చన్ సాహిత్య ఉత్సవాలు మలయాలీలకు పెద్ద పండుగే నాలుగు రోజులు  ఉదయం సాయంత్రం ఆయన కవిత్వాన్ని సామూహికం గా పారాయణం చేస్తారు .మొదటి రోజు ఆయన స్మారకోపన్యాసం ఏర్పాటు చేస్తారు .ఏదైనా సమకాలీన అంశం గురించి భారతీయ భాషా వేత్తలు ప్రసంగిస్తారు .చివరి రోజున  తుచ్చన్ రాసిన తాళపత్ర గ్రంధాలను ,ఘంటాన్ని భక్తిగా ఊరేగిస్తారు .తర్వాత బహుభాషా కవి సమ్మేళనం ఉంటుంది .ఇక్కడి గ్రంధాలయం గొప్ప పరిశోధన కేంద్రం గా సేవ చేస్తుంది తున్చన్ ఉత్సవాలు గొప్ప సాహిత్య సాంస్కృతిక ఉత్సవాలని అందరికి ఆదర్శమని నరేంద్ర తెలియ జెప్పారు

                             ప్రత్యేక వ్యాసం గా రంగనాయకమ్మ ‘’దెయ్యాల ,ప్రేతాత్మల ,సోదుల ,పూన కాల ,పరలోకాల తత్వ శాస్త్ర సమర్ధకులు ‘’లో కో.కు.గారిని ,దాన్ని సమర్ధించిన లెఫ్ట్ భావ వ్యక్తులను  చీల్చి చెండాడింది .’సాహిత్యం ఎందుకు ?‘’అంటూ ద్వా నా..శాస్త్రి ఏదో రాసిపారేశాడు .ఆకెళ్ళ ‘’రేపటి శత్రువు ‘’ను గుమ్మా పరిచయం చేస్తే ,వెన్నా ‘’సమకాలీన హిందీ కవిత్వం లో భిన్న ధోరణులు ‘’విని పించారు .

       అంపశయ్య నవీన్ ‘’చివరికి మిగిలేది ‘’నవల పై శ్రీమతి వై కామేశ్వరి రాసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు ఆయన భావనలో ‘’ఇది చైతన్య స్రవంతి తో బుచ్చి బాబు రాయలేదని ఆయన నవల దేనికీ అనుకరణ కాదని తన నవల కు జీవిత రహస్యం ,దాన్ని తెలుసుకోవటానికి మానవుడు చేసే యత్నమే ఏ గొప్ప గ్రందానికైనా పునాది అని బుచ్చి బాబే చెప్పాడని అది మనో వైజ్ఞానిక నవల అన్న ఆర్ ఎస్ సుదర్శనం చెప్పిన మాట వాస్తవ మని ‘’చెప్పారు .

               వంశీ కృష్ణ ‘’నాలుగు కాలాల నల్లమిరియం చెట్టు ‘’అనే నవల ,దాన్ని రాసిన వి.చంద్ర శేఖర రావు లగొప్పతనాన్ని ఆవిష్కరించారు .రావు గారి వస్తువులు కావలసిన రూపాల్ని అవే వెతుక్కుం టాయని  ,ప్రభుత్వం తో పోరాడే చెంచుల అస్తిత్వం ఆవేదనే అయన వస్తువులని వారి అస్తిత్వానికి సూర్యాస్తమయం సంకేతం అని నల్ల ఇరియాలు చీకటి ని తొలగించటానికి దారిదీపాలని ఇవి భయ నివారిణి అని వెయ్యి కాళ్ళ రాక్షసి ప్రపంచీ కరణ అని ,అది అన్ని ఉద్యమాలను మింగేసింది అని చెప్పారు .

            విశ్వనాధ అధిక్షేప రచనల పై రెంటాల శ్రీ వెంకటేశ్వర రావు గొప్ప విశ్లేషణే చేశారు .ఆహా హుహూ ,పులుల సత్యాగ్రహం ,విష్ణు శర్మ ఇంగ్లీష్ చదువు ,దమయంతీ స్వయం వరం ,నందిగ్రామ రాజ్యం నవలలే అధిక్షేపణ నవలలు .ఆహా హుహూ లో గంధర్వుడిని లండన్  ట్రె ఫాల్గర్ స్క్వేర్ లో కూల్చటం అక్కడి జాతి పండితుల ,శాస్త్ర వేత్తల సైనికుల అల్పజ్ఞానం అవివేకం తెలియ జేయటమే .ఇందులో విప్రతీకాన్ని ,అల్పోక్తి ని విశ్వనాధ బలం గా వాడుకొన్నారు .పులుల సత్యాగ్రహం తెలంగాణా ఉద్యమపు తోలి నవల .ఇందులో మంది సత్యాగ్రహాన్ని ఎగతాళి చేశాడు విశ్వనాధ .భాషాదిక్షేపం కోసం విష్ణు శర్మ ఇంగ్లీష్ చదువు రాశాడు ఖండన  కంటే సమర్ధనా ,గడుసుదనం కంటే అమాయికత్వమూ సాధించే అధిక్షేపానికి విచిత్రమైన రుచి ఉంటుంది అంటాడు రెంటాల .ఇందులో ఆరోపిత వికృతి ఉందని చెప్పాడు .నందిగ్రామ రాజ్యం లో సన్మాన పత్రాల పేరడీ చేసి అపహాస్యాన్ని సృష్టించాడు విశ్వనాధ .ఆధునిక కవులు ‘’అరిగిన గ్రామఫోనుపిన్నులు  ‘’అన్నాడు ఎగతాళిగా .చివరగా రెంటాల ‘’పాశ్చాత్య నాగరకతా సామ్రాజ్య వాదాన్ని ఎదుర్కొన్న మొదటి మహా రచయిత గా ,అధిక్షేప కారుడిగా విశ్వనాధ ‘’ను‘’మెచ్చుకొన్నాడు .

             మిగిలిన విషయాలు రేపు

            మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –26-4-13-ఉయ్యూరు 

Posted in రచనలు | Tagged | Leave a comment

మన’’ అగాధమీ’’లు

మన’’ అగాధమీ’’లు

           నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు ప్రవీణ్ అన బడే స్వర్గీయ తురగా కృష్ణ మోహన్ మన అకాడేమీల రభస చూసి అందులో జరిగే రాజకీయాలకు అసహ్యం వేసి వాటిని ‘’అగాధమీలు ‘’అన్నాడు .నిజం గానే మన వాళ్ళు ఆ మాటను రుజువు చేశారు .అగాధం లోకి పడి ,వాటినీ నెట్టెశారు . ఎంతో సేవ చేయాల్సినవి -రాజకీయ కాలుష్యాలకు గురై .అస్తిత్వాన్నీ కోల్పోయాయి .రామా రావు వచ్చిన తర్వాత తెలుగుకు మొదట్లో ఏదో ఒరిగింది అని పించింది .కాని అన్నీ తెలిసిన నార్ల చేతికి తీర్పునిస్తే ఆయన వాటిని చీపురు తో ఊడ్చి పారేసి భాషకు ,సంస్కృతికి తీరని అన్యాయమే చేశాడు ‘’.ఆయన వైఖరి మొదటి నుంచి అతి ‘’అన్నది దీనితో బాగా రుజువైంది,చేసుకొన్నాడు కూడా .దీనికి ఆయన్ను చరిత్ర క్షమించదని ఆ నాడేఅంతా అన్నారు అనుకొన్నారు .అలా కాల గర్భం లో  అకాడెమీలు అగాధం లో ,చీకటి కూపం లో ఇప్పటి దాకా మగ్గి పోయాయి .మరి మోక్షం లేదా ?అనుకున్న తరుణం లో అందరి ఒత్తిడి వల్లా ఇప్పటి ప్రభుత్వం మళ్ళీ వాటిని పునరుద్ధరించాలని సంకల్పించటం ఒక గొప్ప ముందడుగే .దీన్ని మనం స్వాగతిన్చాల్సిందే .

             అయితే ఆచార్య ముదిగొండ వారి వ్యాసం చదివిన తర్వాత అకాడమీలు  రాబోయే కాలం లో ఎలా పరణమిస్తాయనే భయం కలగటం సహజం .సాధారణం గా అధికార పార్టీ కి ఇవి శరణాలయాలే .సందేహం లేదు .కాని సమర్ధత ను ప్రమాణం గా తీసుకొని వాటిని అప్పగిస్తే ఎంతో మేలు కలగటం ఖాయం ..ప్రతిదీ రాజకీయం చేయకుండా ప్రభుత్వం విస్తృతం గా దేనిపై ఆలోచించాలి అభిప్రాయ సేకరణ చేయాలి ప్రతిభను గుర్తించాలి సమర్ధులను ఒప్పించి కూర్చో బెట్టాలి .అప్పుడు ప్రభుత్వానికి ఆ సంస్థలకు నిర్వహించే ప్రతిభా మూర్తులకు  కేర్తి ప్రతిష్టలు కలుగుతాయి .ఇందుకోసం రచయితల సంఘాలు, కళా సంస్థలు తమ అమూల్య అభిప్రాయాలను అందించాలి .ఏదో చెడు జరుగుతుందన్న నిరాశ వీడాలి .మంచి జరగాలన్న కాంక్ష పెరగాలి .జరుగుతుందని ఆశించటం తప్పేమీ కాదు ..మరాలా  ,ఇన్నేళ్ళకు ఇన్నాళ్ళకు ఆకడేమీలు పునర్దర్శనం ఇస్తున్నాయంటే సంతోషం గా నే ఉంది .సాహిత్య ,సాంస్కృతిక వికసన కేంద్రాలుగా అవి తీర్చ బడాలని ఆశిద్దాం .నిరాశను దూరం చేద్దాం .నిండు మనసుతో స్వాగాతిద్దాం .జరిగిన పొరబాటే మళ్ళీ జరిగి ‘’అగాధమీలు ‘’కారాదని,డమ్మీలు, మమ్మీలు గా మారరాదని భావిద్దాం .శుభం భూయాత్ .

              మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ –26-4-13- ఉయ్యూరు

                 

 
Posted in రచనలు | Tagged | Leave a comment

చినుకు నవ వసంత సంచిక– 2 కధా విషయం

    చినుకు నవ వసంత సంచిక— 2

                            కధా విషయం

         చినుకు పత్రిక అనగానే కధలకు అగ్ర తాంబూలం అని అందరికి తెలుసు .ఇందులో కేంద్ర సాహిత్య బహుమతిని ఇటీవలే పొందిన శ్రీ పెద్ది భొట్ల సుబ్బరామయ్య గారి కదతో ప్రారంభించారు .ఆంగ్లో ఇండియన్ల దయనీయ స్తితిని ఇంగ్లీష్ సరిగ్గా రాక వారు పడే ఇబ్బందుల్ని ,ఏదో ఒక కళా శాలలో ఆంగ్లో పాద్యాయిని గా చేరితే అక్కడి .పి.డి.పిడికిట్లో నలిగిన ఆమె జీవితాన్ని ‘’చీకటి లో కరగిన బొమ్మ ‘’కద లో అద్భుతం గా ఆవిష్కరించారు .ఆ వ్యాయామం వాడు ‘’శిష్నోదర పరాయణుడు ‘’అని తేల్చారు .ఆమె ఈ దీన గాధను రచయితకు చెప్పుకొనిఆయన ఉండమన్నా ఉండకుండా ‘’కాశీకి వెళ్లాలని అక్కడి దేవుణ్ణి కొన్ని ప్రశ్నలు అడగాలని ‘’చెప్పి వెళ్లి పోతుంది .సుబ్బరామయ్య గారు   సాంఘిక అంశాలను  ఆధ్యాత్మికామ్శాలను  భలే గా ముడేస్తారని మరో సారి రుజువు చేశారు .వీరి కధతో బోణీ చేయటం చాలా సముచితం గా ఉంది .

          జి.లక్ష్మి కద ‘’ఓ అనామక డైరీ ‘’లో భార్య మన వంక చూపుకు ఒక అర్ధం ఉంటుందని అది అప్పుడు తెలియదని చెబుతుంది .భార్య స్వంత ఆస్తి అనుకోటం పొరబాటని అంటుంది ‘’బయట మిమ్మల్ని అందరు దేవుడని జెంటిల్మన్ అని అంటారు .మీ భార్య మాత్రం అనలేదు . ఒకళ్ళకు మంచి అయింది వేరొకరికి మంచి ఎందుకు కాక పోయిందో మీకు తెలియదు ‘’అని రచయిత్రి మెత్తని చీపురు తో మగాళ్ళని వాయిస్తుంది .న్యూటన్ మూడో చలన సూత్రం అన్నిటికి అన్వయిస్తుందని ప్రతి చర్యకు ప్రతి చర్య ఉంటుందని దాన్ని జీవితానికి ఎలా అన్వ యించుకోవాలావు తెలియాలని తెలియని నిర్లక్షం భార్య ఎక్కడికీ పోదు అనే మొండితన జీవితాలను, దాంపత్యాన్ని అఘాధం లోకి నెడుతాయని మంచి సూచన ఉందీ కద లో ..చిలీ దేశపు కధకు పి సత్య వతి ‘’చెట్టు ‘’పేర అనువదించిన కధ లో భార్య కు అనురాగం ప్రేమ ,విహారాలు కావాలని లేట్ గా తెలుసుకోంది.అట్టాడ అప్పలనాయుడు కద ‘’అండ గత్తేలు ‘’ఉత్తరాంధ్ర లో సెజ్ల భాగోతం పల్లె వదిలి పట్నాలు చేరటం .’’అపుడు బతుకు మమ్మల్ని తగిలీసింది . .ఇప్పుడు అందంమమ్మల్ని పట్నం నుండి తగిలేస్తది మా మేనత్త మాత్రం ఊరొదిలి రానంది .అక్కడే సావో రేవో అనీసింది ‘’ఇలాంటి ఎన్నో కధలు ఎన్నో నాయుడు రాసి మెప్పించారని మనకు తెలుసు .పసుమర్తి పద్మజా రాణి కద ‘’ఒక ఆకు పచ్చదనం కోసం ‘’లో పల్లె టూరి సౌభాగ్య గరిమ కనీ పిస్తుంది ‘’ఇంత మంచి పల్లెల్ని కోల్పోతే మన మొహాల్ని మనం కోల్పోయిన వాళ్ళమే అవుతాం ‘’అని చెప్పిస్తుంది .రేపటి తరానికి మనం ఇవ్వాల్సింది కాలుష్యం ,కేన్సరు  కాదు పల్లెల్లాంటి ఒక ఆకూ పచ్చ ని బహుమతి ని అని ప్రబోధం కద లో ఉంది .పాపినేని కధలో ‘’జీవితం ఒక సుదీర్ఘ అన్వేషణ ,ప్రపంచం తో ఏ విధం గ సంబంధం పెట్టుకొవాలో ,అనంత విశ్వాత్మ తో ఎలా సంభాషించాలో దానికోసం ఏ దారి లో ప్రయానిన్చాలో తెలుసుకో గోరె యువకుని గమనం .

          ప్రముఖ కధకుడు కాటూరి రవీంద్ర త్రివిక్రమ్’’అరణ్యం ‘’కద లో మానవత్వ పరిమళం కనీ పిస్తుంది .’’మంచితనం మల్లె చెట్టు కొమ్మలు విరిచినా మళ్ళీ ఆశగా కొమ్మలు వేస్తుంది మల్లెలు పూయించి పరిమళాలు వేదజల్లుతుండి అనే సామాజిక స్పృహ ఉంది .’’సంధ్య ‘’అనే కధలోగంటేల గౌరు నాయుడు ఉద్యోగం చేసే మహిళ సర్టి ఫికెట్లు లాగేసి ఆమెను లోబరచుకోవాలనే మ్రుగాడు వాడి ఆటవిక చేష్టలు వాడి నుండి తప్పించుకు పోదామని ప్రయత్నిస్తే ఎదురు చూసిన మనిషే తిరిగి వచ్చి నట్టయింది ‘’ఆమె తొలి సంధ్యయే .ఇక ముందు అంతా వెలుగే ‘’అంటాడు సాయం సంధ్య ప్రయాణం చీకట్లో అయినా తోలి సంధ్య అయిన్దామెకు చివరికి .ప్రముఖ కధకుడు, విశ్లేషకుడు విహారి రాసిన ‘’అటు చూస్తె వెలుగు ‘’లో కర్తవ్య బోధ ఉంది ‘’వారం లో మిగిలిన రోజులన్నీ వారాంతానికి సహకార హస్తాలవుతాయి ‘’అన్న నిజం కని పిస్తుంది .

          మొగులు కమలా కాంత్ ‘’చైతన్యం ‘’లో సత్సంప్రదాయాలను .విశ్వాసాలనుగౌరవించాలని చెప్పిన‘’చైతన్య ‘’ను సంప్రాదాయ పద్ధతిలో పెళ్లి చేసుకొని అందరి కి తమ తో బాటు ఆనందాన్ని పంచిన జంట కద బాగుంది ‘’జంతు నీతి ‘’కధలో చిలుకూరి దేవపుత్ర మనుషులకంటే ఆటవిక జంతువులకే సంస్కారం, మర్యాదా, మన్ననలు ఎక్కువ ఉన్నట్లు చెప్పాడు స్కై బాబా రాసిన ‘’జమీలా ‘’’’అడుగు ముందుకు వెయ్యి .దారి అదే విచ్చుకొంటుంది ‘’అన్నీ కోల్పోయినప్పుడు కూడా జీరో బెసేడ్ స్థాయి నుంచి మళ్ళీ  జిందగీని శురూ చేయచ్చు ‘’అనే ఆత్మ స్స్థైర్యం ఉంది .ఈ సంచికలో చివరి కద సుంకోజి దేవేంద్రా చారి రాసిన ‘’చిట్ట చివరి కద ‘’ఇందులో ‘’ఆకలి విశ్వవ్యాప్తం గురించి అన్ని రంగాల్లో దాని విషకోరల గురించి ప్రస్తావన ఉంది .’’ఆకలి కోరల్లో చిక్కుకొని విప్పదీసుకొనే ప్రయత్నం లో మరిన్ని చిక్కు ముడులు వేసుకొంటూ తమకు తామే బందీలుగా మనుష్యులు మారుతున్నారు .అందుకే ఇంకోర్ని గురించి పట్టించుకోలేక పోతున్నారు ఉచ్వాస నిస్శ్వాసాలు కూడా పక్కవాడికి తెలియని స్తితి .ఎవడి బాధ వాడిదే ఎవడి గధ వాడిదే ..ప్రతి గొప్ప పనికి ఒక ప్రారంభం ఉంటుంది .దానికే చరిత్రలో స్తానం .ముగింపు ఎప్పుడూ విషాదమే నా కధే చివరిది .నేనే ముగింపు కాకూడదు ‘’అనే తాత్విక భావ వ్యాప్తి .

              21 కధలకు స్థానం కల్పించి  ,కొత్త వారికి ,పాత వారికి అవకాశం కల్పించింది చినుకు ..

                    చిత్ర విచిత్రాలు

          కే.ఏం.వి.చూపించిన సినీ చిత్ర విచిత్రాలు అయిదు .ఇందులో కొన్ని ఇదివరకు ఏదో ఒక పత్రికలో వచ్చినవే లేక రావి కొండల రావు వ్యాఖ్యనిన్చినవే అందులో ముఖ్యం గా ‘’మల్లీశ్వరి ‘’సినిమా కదగురించి అది బుచ్చి బాబు రాసిన నాటకం ‘’రాయల వారి కరుణా కృత్యం ‘’బి.యెన్.రెడ్డి గారికి ఇది నచ్చి కధను అందం గా రాసుకొని కృష్ణ శాస్త్రీయం చేయించి న భూతో గా తీర్చి దిద్దితే రసాలూరు సాలూరు బాణీలు ఘంట సాల మేస్టారి గాన లహరి భానుమతి కల కూజితాలు విరహ పరాకాష్ట  గా నిలిచి క్లాసిక్ ని చేసి నిత్య నూతనం చేశారు .

              విజయా వారి మాటల మాంత్రికుడు పాటల సృష్టికర్త పింగళి నాగేంద్ర రావు గారు ఆఖరి దశలో కేన్సర్ బారి పడి మందులకు డబ్బులు లేక ఆరుద్రను తన దగ్గరున్న అమూల్యమైన పుస్తకాలను అమ్మి పెట్టమని కోరటం మనకు తెలిసి నప్పుడు మనసు గిల గిల లాడిపోతుంది నవ్వులు పూయించిన మహా రచయితకు ఇన్ని కష్టాలా అని పిస్తుంది విధి అంతే .

      ‘’మనిషి రోడ్డున పడ్డాడు ‘’సినిమా తీసిన పుణ్య మూర్తుల రాజ బాబు చేయని దానం లేదు ధర్మ లేదు తన పుట్టిన రోజు నాడు తను ఇంత ఎదగ టానికి కారణమైన వారికి సన్మానం చేసి తృప్తి చెందేవాడు విపరీతమైన తాగుడుతో జీవితాన్ని నరక ప్రాయం చేసుకొన్నాడు అయితేనేం అతని ఇంటి పేరు పుణ్య మూర్తులు కావటం చేసిన వన్నీ పుణ్య కార్యాలు కావటం వాళ్ళ భార్య ఇద్దరు కొడుకులు మంచి పొజిషన్ లో అమెరికా లో ఉన్నారన్న సంగతి తెలిసి మహదానందం కలుగుతుంది మనకు .

              సకల కళా సరస్వతి భానుమతి తన మొదటి కద కు ఆంద్ర పత్రిక ఇరవై , రూపాయలు పారితోషికం గా పంపితే మహద్భాగ్యం గా స్వీకరించి అత్తగారికి సైను పంచ ,తాను జాకెట్టు కొనుక్కొని భర్తకు కర్చీఫ్ ,కొడుకు భరణికి పిప్పరమెంట్లు కొని సంతృప్తి చెందానని ఆంద్ర పత్రిక ఆఫీసుకు ఫోన్ చేసి మరీ చెప్పిందట ఆమె తీసుకొంటుందో తిడుతుందో అని భయ పడ్డ వాళ్ళు హాయిగా ఊపిరి పీల్చుకోన్నారట .దటీజ్ పద్మశ్రీ అంటారు కే.ఏం.వి.

      తెలుగులో వచ్చిన ‘’చంటి ‘’సినిమా ‘’చిన్న తంబి ‘’అనే తమిళ చిత్ర కదా .అందులో ప్రభు కుష్బు జంట .తెలుగులో వెంకటేష్ మీనా .రెండు చోట్లా కనక వర్షమే కురిసింది .దాని దర్శకుడు పి.వాసు దీనికి రవి రాజా పిని శెట్టి సంగీతం లయ రాజా ఇలయ రాజా .కన్నడం లో దీన్ని’’ రామా చారి ‘’పేరుతో తీస్తే అక్కడా సూపర్ హిట్టే హంసలేఖ సంగీతం. ఇలయ రాజా బాణీల ఓణీలు వేసుకోకండా స్వీయ బాణీలతో జన రంజకం చేయటం ఇప్పటికి ఆమె స్వరపరచిన పాటలకు మంచి పేరున్డటం ఆనందించ దగ్గ విషయం .రామానాయుడు చంటి ని ‘’అనాడి ‘’గా హిందీ లో వెంకటేష్ కరిష్మా లతో తీసి హిట్ కొట్టాడు వెంకీ కి మొదటి హిందీ పిక్చరిది .ఇదంతా మనకు కాలక్షేపం బటానీలు మిర్చీ మసాలా .

              మిగిలిన కవిత్వం సమీక్షలు ఇంటర్వ్యులగురించిన  విషయాలు మళ్ళీ రాస్తాను

                మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ –26-4-13- ఉయ్యూరు

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మూకీల నుంచే మహిళా దర్శకులు

మూకీల నుంచే మహిళా దర్శకులు
భారతీయ సినీ చరిత్రలో మొదటి దర్శకురాలు ఫాతిమా బేగమ్

 


అన్ని రంగాల్లో మాదిరిగానే సినీ రంగంలోనూ ఆది నుంచీ పురుషాధిక్యమే. నటనా శాఖని మినహాయిస్తే సినిమాకి సంబంధించిన కొన్ని శాఖల్లో మహిళా ప్రాతినిథ్యం నామ మాత్రం కాగా, కొన్ని శాఖల్లో అసలు ప్రాతినిథ్యమే లేదు. అన్ని శాఖల వారినీ సమన్వయపరిచి, తన మేధోప్రతిభతో సన్నివేశాల్ని కల్పించి సినిమాకి ఓ రూపాన్ని తీసుకువచ్చే దర్శకత్వంలోనూ మహిళల సంఖ్య చాలా తక్కువ. ఇటీవలి కాలంలోనే వారి సంఖ్య ముఖ్యంగా హిందీలో కొంచెం కొంచెంగా పెరుగుతూ వస్తుండటం శుభ పరిణామం. అయితే భారతీయ సినిమాకి మూకీ యుగం నుంచే లేడీ డైరెక్టర్స్ ఉన్నారనే నిజం ఈ కాలం వారికి ఆశ్చర్యం కలిగించే విషయమైనా అది నిజం. భారతీయ సినీ చరిత్రలో మొదటి దర్శకురాలు ఓ ఉర్దూ మహిళ కావడం విశేషం. ఆమె ఫాతిమా బేగమ్. స్వతహాగా నటి అయిన ఆమె అర్దేషీర్ ఇరానీ, నానుభాయ్ దేశాయ్ వంటి దర్శకుల వద్ద సహాయకురాలిగా పనిచేశారు. ఆమె దర్శకత్వం వహించిన మొదటి మూకీ సినిమా ‘బుల్‌బులే పరిస్తాన్’ (1926). మూకీల కాలంలో బాగా పేరుపొందిన తారలు జుబేదా, సుల్తానా, షెహజాది ఆమె కుమార్తెలే.

భానుమతి ‘చండీరాణి’
తెలుగులో ఐదో దశకంలోనే సృజనాత్మకమైన దర్శకత్వ శాఖలో మహిళల ప్రాతినిథ్యం మొదలైంది. ఈ రోజుల్లో అంటే దర్శకత్వ శాఖలో పనిచేసిన వాళ్లు దర్శకురాళ్లవడం కనిపిస్తోంది కానీ ఆ కాలంలో నటనారంగంలో రాణుకెక్కిన తారలే దర్శకురాళ్లవడం గమనించదగ్గ అంశం. తెలుగులో మొదటి దర్శకురాలిగా భానుమతీ రామకృష్ణ చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన భానుమతి నటనకి వ్యాకరణం నేర్పిన తారగా అన్నాదురై చేత ప్రశంసలు పొందారు. గాయనిగానూ గొప్ప కీర్తి ప్రతిష్ఠలు పొందిన భానుమతి దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ‘చండీరాణి’ (1953). దీన్ని కేవలం తెలుగులోనే కాక తమిళ, హిందీ భాషల్లోనూ ఆమె రూపొందించడం విశేషంగా చెప్పాలి. ఆ తర్వాత ఆమె ‘విచిత్ర వివాహం’, ‘అమ్మాయి పెళ్లి’, ‘మనవడి కోసం’ వంటి చిత్రాలు రూపొందించారు.

చివరిసారి ఆమె దర్శకత్వం వహించిన చిత్రం ‘అసాధ్యురాలు’ (1993). నటిగా, గాయనిగా, దర్శకురాలిగా, రచయిత్రిగా తెలుగు సినిమాపై ఆమె వేసిన ముద్ర అనితరసాధ్యం. భానుమతి తర్వాత దర్శకురాలైన మరో తార సావిత్రి. తెలుగు సినీ సీమలోని రెండో తరంలో తిరుగులేని స్టార్ హీరోయిన్‌గా వెలిగిపోయిన సావిత్రిది స్వతహాగా అతి సున్నితమైన హృదయం. అందుకే ఆత్మ సంతృప్తి కోసం దర్శకురాలిగా మారిన ఆమె తొలిగా ఓ సున్నిత కథాంశంతో ‘చిన్నారి పాపలు’ (1968) చిత్రాన్ని రూపొందించారు. దీనితో గాయని పి. లీలను సంగీత దర్శకురాలిగా పరిచయం చేశారు. ఈ సినిమా మధ్యలో నిర్మాతలు చేతెలెత్తేస్తే, తనే డబ్బులు ఖర్చుపెట్టి చేతులు కాల్చుకున్నారు. ఆ తర్వాత సావిత్రి ‘చిరంజీవి’, ‘మాతృదేవత’, ‘వింత సంసారం’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.

మనదే ప్రపంచ రికార్డు
ఇక తెలుగు సినిమాని ప్రపంచ పటంపై నిలిపిన ఘటికురాలిగా విజయనిర్మల చరిత్ర సృష్టించారు. ప్రపంచంలో ఏ భాషలోనైనా అత్యధిక చిత్రాలను (47) రూపొందించిన లేడీ డైరెక్టర్‌గా ఆమె గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు పొందారు. ఇప్పటికీ ఆమె రికార్డు పదిలం. బాల నటిగా చిత్ర రంగంలో ప్రవేశించి, హీరోయిన్‌గా ఎదిగి, తారాపథంలో ఉండగానే దర్శకురాలి అవతారమెత్తి యద్దనపూడి సులోచనారాణి నవల ఆధారంగా తొలి చిత్రం ‘మీనా’ (1973)ను రూపొందించి విజయాన్ని అందుకున్నారు విజయ నిర్మల. ఆ తర్వాత కాలంలో పలు నవలల్ని తెరకెక్కించి, నవలా చిత్రాల దర్శకురాలిగా పేరుపొందారు. ఆమె దర్శకత్వం వహించిన వాటిలో దేవదాసు, హేమాహేమీలు, శంఖుతీర్థం, రామ్ రాబర్ట్ రహీమ్, భోగిమంటలు, అంతం కాదిది ఆరంభం, ముఖ్యమంత్రి, సూర్యచంద్ర, కలెక్టర్ విజయ, సాహసమే నా ఊపిరి, పుట్టింటి గౌరవం వంటి చిత్రాలున్నాయి. విజయనిర్మల తర్వాత అంత వేగంగా చిత్రాలు రూపొందించే దర్శకురాళ్లు ఆ తర్వాత ఏ భారతీయ భాషలోనూ రాలేదు. సరాసరిన ఏడాదికి ఆమె రెండు చిత్రాలు రూపొందిస్తూ వచ్చారు. ఆమె తర్వాత జీవిత, జయ బి., సుచిత్రా చంద్రబోస్ వంటి దర్శకురాళ్లు తెలుగులో కొన్ని చిత్రాలు రూపొందించారు.

తెలుగు కంటే ముందు తమిళంలోనే
తమిళంలో మొదటి దర్శకురాలిగా టి.పి. రాజలక్ష్మి చరిత్రకెక్కారు. తెలుగులో కంటే చాలా ముందుగానే ఆమె తన స్వీయ నవల ఆధారంగా ‘మిస్ కమల’ (1936) చిత్రాన్ని రూపొందించారు. ఆ తర్వాత ఆమె ‘మదురై వీరన్’ (1938) అనే మరో చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. రేవతి, సుహాసిని వంటి తారలు కూడా తమిళంలో కొన్ని సినిమాలు రూపొందించారు. బెంగాలీలో మొదటి దర్శకురాలు అరుంధతీ దేవి. ‘యాత్రిక్’ (1952)తో నటిగా కెరీర్‌ను ఆరంభించిన ఆమె నలభై రెండేళ్ల వయసులో ‘ఛూటి’ (1967)తో దర్శకురాలిగా మారారు. తర్వాత ‘మేఘో రౌద్ర’, ‘పడి పషీర్ బర్మి బక్ష’, ‘దీపార్ ప్రేమ’, ‘గోకుల్’ చిత్రాల్ని రూపొందించారు. తన చిత్రాలతో ఆమె సమాజంలోని కొన్ని ఆచార వ్యవహారాల్ని తూర్పారబట్టడం గమనార్హం. న్యూవేవ్ డైరెక్టర్‌గా ప్రఖ్యాతుడైన బి.వి. కారంత్ జీవన సహచరి ప్రేమా కారంత్ పేరుపొందిన రంగస్థల కళాకారిణి. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో శిక్షణ పొందిన ఆమె సినీ రంగంలో ప్రవేశించి మొదట్లో కాస్ట్యూమ్ డిజైనర్‌గా, ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశాక, ‘ఫణియమ్మ’ (1983) అనే చిత్రాన్ని రూపొందించారు. కన్నడంలో ఓ మహిళ దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం అదే. ‘బంధ్ జరోకే’ (1997) అనేది డైరెక్టర్‌గా ఆమె చివరి చిత్రం. తన చిత్రాల్లో మహిళల్ని ఆమె శక్తివంతంగా మలచిన తీరు విమర్శకుల ప్రశంసలు పొందింది.

ఆంగ్ల చిత్రాలకు ఊపు
భారతీయ సినిమాకి వన్నె తెచ్చిన దర్శకురాళ్లలో సాయి పరంజపే, అపర్ణా సేన్, మీరా నాయర్, దీపా మెహతా ముఖ్యులు. ‘జాదు కా సంఖ్’ (1974)తో డైరెక్టర్‌గా కెరీర్ మొదలుపెట్టిన సాయి పరంజపే స్పర్శ్, కథ, చష్మే బద్దూర్, సాజ్ వంటి సినిమాలతో భారతీయ సినిమాపై తనదైన ముద్రని బలంగా వేశారు. సత్యజిత్ రే ‘తీన్ కన్యా’లో నటిగా పరిచయమైన అపర్ణా సేన్ ’36 చౌరంఘీ లేన్’ (1981)తో డైరెక్టర్‌గా మారి, తొలి చిత్రంతోటే ఉత్తమ దర్శకురాలిగా జాతీయ అవార్డు పొంది సంచలనం సృష్టించారు. భారత దేశంలో ఇంగ్లీష్ సినిమాల నిర్మాణానికి ఆ సినిమా ఊతమిచ్చింది. ఆ తర్వాత ఆమె తీసిన పరోమా, సతి, యుగాంత్, మిస్టర్ అండ్ మిసెస్ అయ్యర్, 15 పార్క్ అవెన్యూ, ద జపనీస్ వైఫ్ వంటి చిత్రాలు ఆమెకి మంచి పేరు తీసుకొచ్చాయి.

సలామ్ బాంబే, మిసిస్సిపి మసాలా, కామసూత్ర, మాన్‌సూన్ వెడ్డింగ్, ద నేమ్‌సేక్ వంటి చిత్రాలతో మీరా నాయర్, ఫైర్, ఎర్త్, వాటర్, మిడ్‌నైట్స్ చిల్డ్రన్ వంటి చిత్రాలతో దీపా మెహతా భారతీయ సినిమాకి అంతర్జాతీయంగా వన్నె తెచ్చారు. కల్పనా లజ్మి, తనూజా చంద్ర వంటి వాళ్లు కూడా దర్శకత్వంలో తమ ముద్రను వేశారు. ప్రస్తుతం మేఘనా గుల్జార్, లీనా యాదవ్, జోయా అఖ్తర్, రీమా కగ్తి, కిరణ్ రావ్, ఫరా ఖాన్ వంటి లేడీ డైరెక్టర్లు ప్రధాన స్రవంతి చిత్రాలతో పురుషులకు ఏ మాత్రం తీసిపోమని నిరూపిస్తూ ముందుకు సాగుతున్నారు. రానున్న కాలంలో ఈ తరహా దర్శకురాళ్లతో భారతీయ సినిమా మరింత సంపన్నవంతం అవుతుందని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాబోదు.

 

Posted in వార్తా పత్రికలో | Leave a comment

ఆ అమ్మాయే నాకు పునర్జన్మనిచ్చింది!–కోన వెంకట్

ఆ అమ్మాయే నాకు పునర్జన్మనిచ్చింది!


ఎవరో రాసిన కథకు తాము మాటలు రాయడం కన్నా కథ, మాటలు ఒకరే రాయడంలో ఎంతో సౌఖ్యం ఉంది. అది మన జీవిత నిర్ణయం మన చేతుల్లోనే ఉన్నట్లుగా ఉంటుంది. గమనిస్తే కథ-మాటల రచయిత కోన వెంకట్ విజయ రహస్యం వెనుక ఈ విషయం కూడా ఉందనే అనిపిస్తుంది. ఈ మధ్య విడుదల అయిన ‘బాద్ షా’,త్వరలో విడుదల కానున్న ‘షాడో’, ‘బలుపు’ సినిమాలతో కలిపి దాదాపు 30 సినిమాలకు ఆయన కథ-మాటలు సమకూర్చారు. తొలినాటి ఓటమితోనే తన జీవితం ముగిసిపోతుందనుకున్న ఆయన ఇప్పుడు సినీ ఆకాశంలో తన జైత్రయాత్రను కొనసాగిస్తున్నాడు. కోన వెంకట్ వ్యక్తిగత, సినీజీవిత ప్రస్థానంలోని కొన్ని అరుదైన సంఘటనలే ఈ వారం ‘అనుభవం’ 
అసంతృప్తి ఎవరినీ ఉన్నచోట ఉండనివ్వదు. ఉన్న ప్రపంచాన్ని వదిలేసి, కొత్త ప్రపంచంలోకి వెళ్లేలా ప్రేరేపిస్తుంది. కాకపోతే ఆ కొత్త ప్రపంచం గురించి ఎంతో కొంత తెలియకుండా అమాంతంగా దూకే స్తే ఒక్కోసారి అది మన ఉనికినే కూల్చివేయవచ్చు. ప్రభుత్వ ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగాలు ఎన్నో చేశాను. కానీ, ఎక్కడా సంతృప్తి లేక ఒకదాని తరువాత ఒకటిగా వదిలేస్తూ వచ్చాను. అయితే అప్పటికే సినిమాల పట్ల ఒక పాషన్ ఉండేది. అది నన్ను నిరంతం అటు వైపే లాగేది. దాంతోనే నేనీ రంగంలోకి వచ్చాను. సినిమా అనుకోవడమే గానీ, ఆ రంగంలోని ఏ విభాగానికి నేను సరిపోతాను? అన్న విషయంలో మాత్రం నాకు స్పష్టత లేదు. ఏ విభాగంలోనూ ప్రవేశం గానీ, ప్రావీణ్యం గానీ లేకపోవడం వల్లేనేమో సినిమా నిర్మాణానికి సిద్ధమైపోయా!

పాతాళంలో పడిపోయి…
అది 1996. ధర్మవరపు సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో ‘తోకలేని పిట్ట’ సినిమా తీశా. ఫ్లాప్ అయ్యింది. పెట్టిన 72 లక్షల్లో ఒక్క పైసా కూడా తిరిగి రాలేదు. చేతిలో చిల్లిగ వ్వ లేదు. భార్య, ఇద్దరు పిల్లలతో నా బతుకు రోడ్డున పడింది. రాము (రామ్‌గోపాల్ వర్మ) తమ్ముడు కోటి నా క్లాస్‌మేట్. అలా రాముతో కూడా నాకు సాన్నిహిత్యం ఉంది. ఆ సమయంలో రాము మద్రాసులో ఒక ఆఫీసు తీసుకుని ‘సత్య’ సినిమా తీయడానికి సిద్ధమవుతున్నాడు. నా విషయం తెలిసి నాకు ఫోన్ చేసి “నేను ఎంత చె ప్పినా నువ్వు వినలేదు. నేను ముంబయ్ నుంచి మద్రాసు వస్తున్నాను. నువ్వు అక్కడికి వచ్చేయ్” అన్నాడు. వెంటనే మద్రాసుకు వెళ్లాను. నాలుగు రోజులయినా అతను రాలేదు.నా దగ్గరున్న డబ్బులేమో అయిపోతున్నాయి. నాకిక ఏ ఆశా కనిపించలేదు. జీవితం తిరిగి పుంజుకునే అవకాశమే లేదనిపించింది. అందుకే జీవితాన్ని ముగించడమే మేలనిపించింది.

నిద్రమాత్రలు, వాటర్ బాటిల్ తీసుకుని రాత్రి ఎనిమిది గంటల సమయంలో మెరీనా బీచ్‌కు వెళ్లా. ఇంతలో కాళ్లూ చేతులు సగం సగమే ఉన్న ఓ 12 ఏళ్ల అమ్మాయి బీచ్‌లో బెలూన్‌లు అమ్ముతూ కనిపించింది. నా దృష్టి అంతా ఆ అమ్మాయి మీదే నిమగ్నమైపోయింది. అంతటి శారీరక వైకల్యం ఉండి కూడా ఆమె కళ్లల్లో ఏ కాస్త విషాదమూ లేదు. పైగా ఎంతో ఉత్సాహంగా నవ్వుతూ బీచ్ అంతా తిరుగుతూ అందరి దగ్గరికీ వెళుతూ బెలూన్లు అమ్ముకుంటోంది. ఆ దృశ్యం చూడగానే నా ఆలోచనల్లో మార్పు మొదలయ్యింది. అన్ని లోపాలు ఉండి కూడా ఆ అమ్మాయి అంత ఉత్సాహంగా జీవితాన్ని ఆస్వాదిస్తూ ఉంటే అన్నీ సవ్యంగా ఉండి ఏదో ఓటమి పేరుతో నేను ఆత్మహత్యకు సిద్ధం కావడమేమిటి? అనిపించింది.

నాలోని దిగులూ, ఆవేదన మెల్లమెల్లగా అదృశ్యమైపోయాయి. ఏదో ఆవేశం మనసంతా నిండిపోయింది. సమస్యే లేదు. ఇక, ఏదైతే అది అవ్వనీ, జీవితంతో పోరాడదాం అనుకున్నాను. నిద్రమాత్రల్ని నీళ్లలోకి విసిరికొట్టి బీచ్‌లోంచి బయటపడ్డాను. ఆ మరుసటి రోజు ఉదయమే రాము ముంబై నుంచి మద్రాసు వచ్చేశాడు. నా మాటల తీరును గమనిస్తూ ఉన్నాడేమో మరి! తాను తీయబోయే’ సత్య’ సినిమాకు డైలాగులు రాసే అవకాశం నాకిచ్చాడు. అక్కడితో నా జీవితం ఒక పెద్ద మలుపు తిరిగింది. నేను బీచ్‌లో కూర్చున్న సమయాన ఆ అమ్మాయే కనిపించకపోయి ఉంటే ఆ రోజుతో నా జీవితం ముగిసిపోయేదేమో! కాకపోతే, పడిపోయిన అన్నిసార్లూ, అందరికీ అలా తిరిగి లేచే అవకాశం రాకపోవచ్చు. ఎక్కడ పడిపోతామోనన్న భయంతో అసలు అడుగే ముందుకు వేయొద్దని కాదు గానీ, ఆ అడుగు వేయడానికి ముందే ఆ రంగం గురించిన లోతైన అధ్యయనం ఉండాలన్నది ఆ చేదు అనుభవం ద్వారా నేర్చుకున్నాను.

రెండు సున్నిత అంశాల మధ్య

మా నాన్నకు 1981లో ఒకసారి అమెరికాలో బైపాస్ సర్జరీ అయ్యింది. ఆ తరువాత నెల్లూరులో డిఎస్‌పిగా ఉన్న రోజుల్లో అంటే 1986లో రెండవసారి మళ్లీ అదే అమెరికాలో ఆయనకు సర్జరీ అయింది. వాస్తవానికి అదొక విషమ స్థితే. ఏ రకమైన మానసిక ఒత్తిళ్లకూ తావులేని వాతావరణం అప్పుడాయనకు ఉండాలి. నాన్నగారు నాలుగు రోజుల్లో వచ్చేస్తారన్న సమయంలో నా సమస్య ఒకటి మొదలయ్యింది. కాలేజ్ ఫైనలియర్లో ఉన్న నేను ఓ అమ్మాయిని ప్రేమించాను. ఆ విషయం తెలిసిన అమ్మాయి తల్లిదండ్రులు ఆమెకు వేరే సంబంధం ఖాయం చేశారు. మరో ఇంట్లో ఎక్కడో నిర్బంధించి చిత్రహింసలకు గురిచేయడం మొదలెట్టారు. నేను వెళ్లి ఎలాగోలా ఆ అమ్మాయిని తీసుకువచ్చేసి ఎవరికీ తెలియకుండా గుళ్లో పెళ్లి చేసుకున్నాను.

రెండుసార్లు సర్జరీ కావడం వల్ల విషయం ఆయనకు చెప్పే పరిస్థితి లేదు. మా తాతయ్యతో నాకున్న సాన్నిహిత్యం వల్ల ఆ విషయాన్ని ఆయనకే చెప్పేశాను. అప్పుడాయన మహారాష్ట్ర.గవర్నర్. విషయం విని తాతయ్య ఏమీ ఆశ్చర్యపోలేదు. వెంటనే అమ్మాయిని తీసుకుని రాజ్‌భవన్‌కు వచ్చేయమన్నారు. నేను అమ్మాయిని తీసుకుని బాంబే వెళ్లాను. ఆ తరువాత నాలుగు రోజులకే నాన్నగారు అమెరికా నుంచి అక్కడికి వ చ్చేస్తున్నారు.

ఈ విషయమై మా నాన్నను ఒప్పించడం కష్టమేమో అన్న ఆలోచనలో పడిపోయాడు తాతయ్య. పైగా రెండవసారి గుండె ఆపరేషన్ చేయించుకుని వస్తున్న సమయంలో ఇలాంటి విషయాలు చెప్పడం ప్రమాదమేమో అన్న భయాందోళన ఆయనను పీడించసాగింది. అమెరికా నుంచి వచ్చిన మరుసటిరోజు తాతయ్య నాన్నగారి ముందు నా విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. “ఒరే నువ్వు పోలీస్ ఆఫీసర్‌వు కదా! ఒక ఇష్యూలో నీ అభిప్రాయం కావాలి” అన్నాడు. “విషయం ఏమిటో చెప్పండి నాన్నా!” అన్నాడు నాన్న కూల్‌గానే. తాతయ్య తన ఫ్రెండ్ వాళ్ల అబ్బాయి విషయంగా నా సమస్య అంతా చెప్పాడు. “ఆ అబ్బాయి అమ్మాయిని తీసుకు వచ్చేసి అలా పెళ్లి చేసుకోవడం కరెక్టేనంటావా?” అన్నాడు.

నాన్న ఎలా రియాక్ట్ అవుతాడోనని విపరీతమైన ఆందోళనకు గురయ్యాను. దానికి నాన్న “ఆ పెద్దలు అమ్మాయినో, అబ్బాయినో కన్విన్స్ చేయాలి. లేదా వాళ్లయినా కన్విన్స్ కావాలి. అమ్మాయిని కొట్టి హింసించి బలవంతంగా మనసు మార్చాలనుకోవడం తప్పు. అందువల్ల ఆ కుర్రాడు చేసింది నూరు శాతం కరెక్ట్. ఒక పోలీస్ ఆఫీసర్‌గానే కాదు. ఒక సిటి జన్‌గా కూడా చెబుతున్నాను” అన్నాడు. ఆ వెంటనే తాతయ్య ‘ఆ కుర్రాడు ఎవరో కాదు నీ కొడుకే’ అన్నాడు. ఆ సమయంలో నేను వాళ్లకు దగ్గరలోనే ఉన్నాను. నాన్న నా వైపు అదోలా చూశాడు. ఏమంటాడో అనుకున్నాను. నాకేసి చూస్తూ “వీడు ఇలాంటిదేదో చేస్తాడని నేను ఎప్పుడో అనుకున్నాలే. సరే! వెళ్లి అమ్మాయిని తీసుకు రా!” అన్నాడు. అప్పటిదాకా ఆయనలోని గంభీరమైన పార్శ్వాన్ని మాత్రమే చూసిన నేను దాని వెనకున్న ఒక సున్నితమైన మనసును చూసి చాలా ఆనందపడ్డాను.

తాతయ్య విషయాన్ని బయటపెట్టిన తీరు ఆయన పట్ల నాకున్న గౌరవభావాన్ని మరింత పెంచింది. రెండవసారి గుండె ఆపరేషన్ చేయించుకుని అప్పుడే వ చ్చిన కొడుకు ఒక పక్క, తాను ప్రేమించిన అమ్మాయి తనకు శాశ్వతంగా దూరమైపోతుందేమోనని ఆందోళన పడే మనవడి జీవితం మరో పక్క ఎంత సంఘర్షణకు గురిచేశాయో నేను ఊహించగలను. రెండు అత్యంత సున్నితమైన విషయాల మధ్య నిలుచుని తాతయ్య ఆ సమస్యను పరిష్కరించిన తీరును నేను ఎప్పటికీ మరిచిపోలేను. అధికారాలు, హోదాలు కాదు… సమస్యల్ని పరిష్కరించే సామర్థ్యమే మనిషిని సమున్నత స్థాయిలో నిలబెడతాయని నేను ఆరోజు గ్రహించాను. దూరాలే మిగిలాయి

రెండవసారి గుండె ఆపరేషన్ అయిన నాటి నుంచి నాన్నలో ఏదో మార్పు కనిపించడం మొదలయ్యింది. దానికి కుటుంబ సభ్యులతో ఏనాడూ ఆత్మీయంగా ఉండలేకపోయానన్న ఆవేదనే కారణమని ఆ తరువాత తెలిసింది.

పోలీసు ఆఫీసర్ (డిఎస్‌పి)గా నాన్నగారు ఎప్పుడూ చాలా బిజీగా ఉండేవారు. నేను, అక్కయ్య స్కూలుకు వెళ్లే సమయంలో ఆయన నిద్రపోతుండేవారు. స్కూలు నుంచి వచ్చేసరికి డ్యూటీకి వెళ్లిపోయేవారు. ఆయనంటే మాకు చాలా భయం. ఆదివారాల్లో ఎప్పుడైనా చూడగలిగినా నేనూ మా అక్కయ్య ఇద్దరమూ ఆయన్ని దూరదూరంగా ఉండే చూసేవాళ్లం. ఏడాది మొత్తంలో మహా అయితే, ఒకటి రెండు సార్లు మాట్లాడే సందర్భం వచ్చేదేమో. అదీ పొడిపొడిగానే. డిగ్రీ పూర్తయ్యే దాకా ఆయనతో నేను మాట్లాడిన సందర్భాల్ని వేళ్ల మీద లెక్కపెట్టవచ్చేమో. నేను మా ఇంట్లో టెంత్ క్లాస్ వరకే ఉన్నాను. ఆ తర్వాత కాలమంతా మా తాతయ్య వద్దే ఉన్నాను. అది నాన్నకూ నాకూ మధ్య మరింత దూరాన్ని పెంచింది.

అయితే కుటుంబ అనుబంధాల విషయాల్లో తాను పెద్ద తప్పే చేశానన్న పశ్చాత్తాపం నాన్నగారిలో రోజురోజుకూ పెరుగుతూ వచ్చింది. ఆ క్రమంలోనే మెల్లమెల్లగా నామీద ఆయనకు ప్రేమ కలగడం మొదలయ్యింది. ఒకసారి డ్యూటీలో భాగంగా వైజాగ్ వెళ్లినప్పుడు ఆయనకు జాండీస్ వచ్చింది. అది బాగా ఎక్కువై ఒక దశలో మంచాన పడ్డారు. నేను రోజూ హాస్పిటల్‌కు వెళ్లి, ఆయన మంచం పక్కన కూర్చునే వాడ్ని. ఆ సమయంలో ఒకరోజు ఆయన జీవితంలో తొలిసారి ఆత్మీయంగా నా చేయి పట్టుకున్నారు. నేను ఇద్దరు పిల్లల తండ్రినయ్యాక జరిగిన ఘటన అది. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశానన్న వ్యధ ఆయన ప్రతిమాటలో ధ్వనించేది. ఆ స్థితినుంచి బయటపడటానికి నాతో ఎక్కువగా మాట్లాడటం మొదలెట్టాడు. అందులో భాగంగానే అప్పుడప్పుడు నన్ను తన వెంట పోలీస్ ఆఫీసర్స్ క్లబ్‌లకు తీసుకువెళ్లేవాడు. అయితే నాతో మనసు విప్పి మాట్లాడటం మొద లలైన నెలరోజుల్లోనే ఆయన కన్నుమూశారు. నేను సినీ రచయితనయ్యింది 1996లో.

ఈ రంగంలో నా ప్రయాణాన్ని గానీ, నా విజయాన్ని గానీ, కాస్తో కూస్తో వచ్చిన నా పేరును గానీ ఆయన ఎలాగూ చూడలేకపోయారు కానీ, కనీసం ఆ ఆత్మీయతనైనా మనసారా పొందలేకపోయాను. విధి నిర్వహణలో ఎంత బాధ్యతాయుతంగానైనా ఉండవచ్చు. కానీ, అదే సమయంలో అయినవాళ్ల విషయంలో పట్టనట్లు ఉండకూడదన్న పాఠాన్ని నేను మా నాన్నగారిని చూసి తెలుసుకున్నాను

Posted in వార్తా పత్రికలో | Leave a comment

చినుకు నవమ సంతానం –1

 చినుకు నవమ సంతానం –1

              శ్రీ నండూరి రాజ గోపాల్ గారి మానస పు( ప)త్రిక ‘’చినుకు’’ ఎనిమిది ఏళ్ళు పూర్తీ చేసుకొని తొమ్మిదవ ఏట ప్రవేశించిన సందర్భం గా తొమ్మిదవ జన్మ దిన ప్రత్యెక సంచికను ఎంతో అందం గా , ఆకర్షణీయం గా ,సర్వాంగ సుందరం గా తీర్చిదిద్ది ,చందాదారులకు ప్రత్యేకం గా కొరియర్ లో పంపే జాగ్రత్త తీసుకొని అందజేశారు. అభినంద నీయం .’’అష్ట వర్షా భవేత్ కన్యా’’అన్న దానికి తగినట్లు పత్రిక కన్య రూపం దాల్చింది .అదే ముఖ చిత్రం గా శ్రీ ఉదయ్ వేసినట్లుంది .వసంతం లో శృంగార భావాల జల్లుగా కురిసినట్లనని పించింది .200 పేజీల బృహత్ ఉగాది వసంత కానుక అందర్నీ అలరిస్తుంది సంపాదకీయం కాక 21  కధలు ,ఎనిమిది వ్యాసాలూ ,ఆరు సమీక్షలు ,17  ,కవితలు ,తో బాటు సాహిత్య విహారం ,ఆలోచన ,ఆవేదనా ,వేషం ,సమాచారం ,పరిచయం పొరుగు సాహిత్యం ,వినబడని రాగం ,సందర్భం ,ప్రశ్న ,ఆట విడుపు ,నివాళి శీర్షికలు ,మధ్యలో 16  కొంటె బొమ్మల బాపు కళాత్మకాలు అయిదు చిత్త్రాల విచిత్రాలు , శ్రీ పినాక పాణి గారితో ‘’పన్నాల భట్టీయం ‘’అనే ముఖాముఖం దేనికదే ఒక విందు భోజనం .కమ్మగా రుచి కరం గా ,ఆరోగ్య వంతం గా భాషా సాంస్కృతిక నేపధ్యం గా ,రూపు కట్టిన ప్రత్యెక సంచిక ఇది .నేను అమెరికా నుంచి కిందటేడాది అక్టోబర్ లో వచ్చాను .అప్పటి నుండి చినుకు ను తిరగేయతమే కాని పూర్తిగా చదవలేదు చదవాలనీ అని పించలేదు .కారణం పీఠాదిపతుల చేతుల్లో గిల గిల లాది నట్లు అని పించటమే .ఈ విషయం ఆ మధ్య ఎప్పుడో అసోసియేట్ ఎడిటర్ శ్రీ లంకె జనార్దన్ కు చెప్పినట్లు జ్ఞాపకం ..ఈ సారి నిన్నల్లా కూర్చుని పట్టు బట్టి చదివాను .మహదానందం గా ఉంది అందుకే ఈ అభినందన .

             సంపాదకీయం లో నండూరి ‘’మంచి పత్రికలు మనదైన ప్రత్యేకతలను పదిల పరుస్తాయని ,మనదైన చిరునామాని కాలం పై నమోదు చేస్తాయని ,మన ఆశలని ,ఆకాంక్షలని ఆనందాలని ఆవేదనలని ఎప్పటి కప్పుడు స్వీకరించి విశద పరిచి ఒదారుస్తాయని మరీ కదల లేని నిస్సహాయత లో ఉన్నప్పుడు మన గతం లోని అమృత క్షణాలను మోసుకొచ్చి మనపై పన్నీరు లా చిలకరిస్తాయని ,వర్తమానం లోను ఏదో ఒక మెలకువ తో మన భుజం తడతాయని మనం జీవంతో ఉండటానికి ,జీవించి ఉండటానికి కాణమౌతాయని మన ఆలోచనలు వికశించటానికి ,అడుగులు విస్తరిం చ టానికి దోహదపడి మనకో మంచి ‘’రేపు ‘’ని అందించటానికి ప్రయత్నిస్తాయని’’ కవితా ధోరణి లో తన మనో భావాలను ఆవిష్కరించి ,ఈ పత్రికను ఆ గాడిలో నడిపిస్తున్నారు .నడిపిస్తూనే ఉండాలని మనమందరం కోరుకొందాం .

                  ఈ సంచిక లో నాకు అత్యంత ఆకర్షణీయం గా,మానసును కుదిపేసి నట్లున్న రచన శ్రీమతి జగద్దాత్రి రాసిన ‘’మౌనించిన వసంతం ‘’.ఆమె రచన ఒక కవితా సెలయేరులా ప్రవహించింది పండిట్ రవి శంకర్ మొదటి భార్య శ్రీ మతి అన్నపూర్ణ  గారి ‘’వినబడని రాగం ‘’ను అద్భుతం గా ఆవిష్కరించటం .అన్నీ ఉన్నా సంగీత సరస్వతి అని పించుకొన్నా ఎంతో మంది ఉత్త్తమ కళాకారులను తయారు చేసి అందించినా ఆమె మౌనించిన  సంగీత సరస్వతి గానే ఉండి పోవటం ఆమెకు ఆమె వేసుకొన్న శిక్ష .ఈ లోకాన్ని త్యజించిన తాపసి అంటుంది జగద్ధాత్రి .

          అన్నపూర్ణ భారత దేశం గర్వించే ‘’సుర్ బహార్ ‘’విద్వాం శురాలు బాబాఆలుద్దీన్ ఖాన్ గారాల పట్టి .రోషనార అని లాంచనం గా ముస్లిం పేరు పెట్టినా కాశీ అన్నపూర్ణఅనే పేరుతోనే ప్రసిద్ధి చెందింది . పెట్టాడు తండ్రి ఆమెకు ఆమె పద్నాలుగో ఏట ఒక దుర్ముహుర్తన రవి శంకర్ ఆమె జీవితం లో ప్రవేశించాడు .తండ్రికి శిష్యుడై తన మనసు దోచాడు వివాహం అయింది కొడుకు పుట్టాడు .ఆమెకు ప్రాచీన వాయిద్యం ‘’సుర్ బహార్ ‘’అంటే ‘’స్వర వసంతం ‘’.కస్టమైనదీ ఆమెకిస్టమైనదీ .. రవి లాంటి ‘’భ్రమర ప్రేమికుడి’’ దెబ్బకు తట్టుకోలేక పోయింది .ఆమె ను అవమాన పరచాడు దొరికిన ప్రతి వారితోను కులికాడు .సితార్ పండిట్ .ఏమీ చేయలేక ‘’మౌన ప్రతిఘట’’నే ఆమె చేసింది .అది ఆమె బలహీనత గా భావించాడు .కొడుకును సంగీతం లో తీర్చి దిద్దదామనుకొంటే అతడు తండ్రి చాటు చేరి చిత్రకళనేర్చి తండ్రికి దూరమై ఒంటరి జీవితం తో విఫల వివాహం తో డిప్రెషన్ పాలై రాలిపోయాడు .భర్త తో ఎడబాటు, కొడుకు తప్పటడుగులు ఆమెను  కుంగదీసినా ఆమె సంగీతాన్ని సుర్ బహార్ ను మాత్రం శ్వాస గా చేసుకొని జీవించింది

           ప్రముఖ ఫ్లూట్ విద్వాంశుడు   పండిట్ హరిప్రసాద్ చౌరాశియా అన్నపూర్ణ విద్వత్ ను విని ఆమె సాధనకు అబ్బుర పడ్డాడు .తానామే వద్ద ఎంతో నేర్చుకోన్నానని ,ఆమె ‘’మౌన సాధిక ‘’అని చెప్పాడు శిష్యుడై పోయాడు రుషి అనే మరో శిష్యుడిని తీర్చి దిద్ది  అతన్ని వివాహం చేసు కొంది అన్నపూర్ణ .అయినా ఆమె లో ‘’వసంతం హసించలేదు ‘’.ఎవరితోనూ మాట్లాడదు .తానూ తన సంగీత సాధనకే పరిమిత మై పోయిన యోగిని అయింది .’’మనుషులతో కలవడం కన్నా ఒంటరితనం శాంతి గా ఉంటుంది ‘’అని చెప్పుతుంది .మనుషులు ద్వంద్వ స్వభావం తో ఉంటారని తనముందు మాట్లాడేది ఒకటి బయట కొచ్చి చెప్పేదొకటి అని తెలుసుకోన్నానని  అంటుంది

             గురు పౌర్ణమి రోజున ఆమె శిక్షణ పొందిన శిష్యులంతా వచ్చి చేరుతారు అందరిని ఆప్యాయం గా పలకరిస్తుంది కాని బయటికి రాదు అన్నపూర్ణ .ఆమె మనసులో బడబాగ్నిని అర్ధం చేసుకొన్న వారు లేరు ఆమె ఒక దుఃఖ సాగరం .సంగీతానికి ఎంతో శక్తి ఉందని తాను వివశమై రాత్రిళ్ళు పాడుతు సాధన చేస్తుంటే కమ్మని వాసనలు వేస్తాయని ,ఎవరో తన చుట్టూ ఉండి విన్నట్లుఅనుభూతికి లోనౌతానని  చెబుతుంది అది ఆమెకే అనుభవైక వేద్యం అన్న పూర్ణ ఒక స్త్రీ మూర్తికాదు .ఒక కళా సాగరం .అందులో రవిశంకర్, కొడుకు సుఖేంద్ర ,అతని కొడుకు, రవి శంకర్ పెళ్ళాడిన కమల ,తండ్రిబాబా ,అన్న ఆలీ ,రుషీ అందరు నదులై ప్రవహించి కాలం లో కలిసి పోయిన వారే ‘’అంటుంది రచయిత్రి జగద్ధాత్రి ..అన్నపూర్ణ జీవితం లోని అవతలి కోణాన్ని ఆవిష్కరించిన వాడు ‘’స్వపన్ కుమార్ బంద్యో పాధ్యాయ ‘’ఆమె పై కస్టపడి ఇంటర్వ్యు చేసి ‘’’’An un heard melody Annapurna ‘’పుస్తకాన్ని 2005 లో ప్రచురించాడు .అతనికి మనం రుణ పడి ఉన్నాం అంటుంది రచయిత్రి .70 ఏళ్ళు దాటినా అన్నపూర్ణ  దిన చర్యలో మార్పు లేదు .ఆమె చిన్న ఇల్లు ,సుర్ బహార్ ,ఆమె వేసే గింజలకోసం వచ్చే వందలాది పావురాలు అదే ఆమె జీవిత సర్వస్వం అదే ఆమె కు శాంతినిచ్చే జీవనం .

               జగద్దాత్రికి అన్నపూర్ణ పేరెత్తితే పరవశం .ఆమె లో కవితా ఝారి ఒడ్లు తెంచుక ప్రవహిస్తుంది .అందుకే అన్నపూర్ణను ‘’అనంత రాగ మేఘం ,వసంత గర్జన ,నిశ్శబ్ద ఘీంకారం ,మౌన ఓంకారం .జీవనపు పలు రాగాలను అత్యంత రమణీయం గా ,కర్ణ పేయం గా పలికించగల అపర సరస్వతి .ఆమె అనంత రాగాల మాలిక .సాగరుడే శృతి వేయగా ,ప్రకృతియే విశ్వ శ్రోతగా ,ఆమె దివ్య గానం ఒక తపస్సుగా ,ఒక యోగం లా ,ఒక యజ్ఞం లా అలా  అనంతం గా  సాగిపోతూనే ఉంటుంది ‘’అని తానూ రాగ ఝరి గా ,ఆరాధనా లహరిగా పొంగిపోతుంది .అన్నపూర్ణ ను పరిచయం చేసిన స్వపన్ ,ను, దాని ఆధారం గా ‘’చినుకు ‘’లో చిలికించిన జగద్ధాత్రి ని ,దాన్ని ఆనందం తో ముద్రించిన నండూరి రాజ గోపాల్ అందరు ప్రత్యేకం గా అభినందనీయులు .

                ఈ సంచిక లోని మరిన్ని వివరాలు మళ్ళీ అందిస్తాను

                 మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ –25-4-13- ఉయ్యూరు

    

Posted in రచనలు | Tagged | 1 Comment

మన తెలుగు –పద్య కవిత–శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజి కవిత -చినుకు -ఏప్రిల్

puvvada vaari kavitha

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జమీలా -స్కై బాబా కద -చినుకు -ఏప్రిల్

sky baba kadha -1 sky baba kadha -2sky baba kadha -3

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రిడెంప్షన్ సాంగ్(విముక్తి గీతం )

    రిడెంప్షన్ సాంగ్(విముక్తి గీతం )

      Bertice Berry అనే ఆఫ్రికన్ అమెరికన్ అమ్మాయి రాసిన నవలే రిడెంప్షన్  సాంగ్ .నల్ల జాతి  వారు ,వారి పిల్లలు పడే బాధలు ,తెల్ల వాళ్ళు వీళ్ళ కన్నేత్వాన్ని ఎలా పాడు చేసేదీ ,మొదలైన వాటి నన్నిటిని ఇందులో మనసు ద్రవిన్చేట్లు రాసింది .అయితే ఎవరి పైనా ద్వేషం వద్దని ,ప్రేమ తోనే అంతా జయించాలని యేసు క్రీస్తు మాటలనే ఆమె చెప్పింది .

              ఇందులో Fina అనే అమ్మాయి ,Ross అనే అబ్బాయి ఒక పుస్తకాల షాప్ ‘’బ్లాక్ ఇమేజెస్ ‘’కు వెళ్తారు .ఆ షాపు యజమాని miss Cojy అనే నల్ల జాతి స్త్రీ .నల్ల జాతి వాళ్ళ అరుదైన పుస్తకాలన్నీ ఈమె వద్ద ఉన్నాయి .అందులో తన తల్లి వాళ్ళు ఇచ్చిన children of grace ‘’అనే‘’మెమరి బుక్ ‘’ఆమె వద్ద ఉంది .ఆ పుస్తకం ఆమెను ఎంతో మార్చింది .జరుగ బోయేదాన్ని వివరిస్తుంది ఆ గ్రంధం .సమస్య లతో వచ్చిన వాళ్లకు ఏ పుస్తకం కావాలో సూచిస్తుంది ఆమె. అది చదివి వాళ్ళు తమ మార్గాన్ని తెలుసుకొంటారు సమస్యకు పరిష్కారం పొందుతారు .రాస్ ఒక anthro pologist ‘’(మానవ శాస్త్ర వేత్త ) .ఆమె ఒక విద్యార్ధిని .ఇద్దరు చిల్ద్రెన్ ఆఫ్ గ్రేస్ చదవాలని అక్కడికి వస్తారు .ఇద్దరినీ సమాధాన పరచి తానే ఆ పుస్తకం చదివి వినిపిస్తుంది కోజీ .కోజీ తో బాటు ,వీళ్ళిద్దరూ కూడా జీవితం లో పెళ్ళిళ్ళ దెబ్బలు తిన్న వాళ్ళే .అందరి పూర్వ జీవితాలు తెలుసుకోవాలనే తాపత్రయం ఈ ఇద్దరినీ కలుపుతుంది .వాళ్ళ జీవితాలకొక సార్ధకత కల్పిస్తుంది కోజి ఆఫ్రికన్ అమెరికన్లు ఎలా సంభాషించుకొంటారో అచ్చం గా అలానే సంభాషణలు రాసింది రచయిత .

              ఈ నవలలో రచయిత్రి ఎన్నో జీవిత సత్యాలను చెబుతుంది అన్నిటిని పాత్రలతోనే చెప్పించింది .ఒక చోట ఒక స్లేవ్ ఓనర్ తన దగ్గర పని చేసే ‘’బెన్ ‘’అనే వాడు తన నల్ల జాతి వారి తిరుగు బాటు ను ముందే తెలుసుకొని యజమానికి తెలియ జేస్తాడు .వాడు దాన్ని అణచి వేసి ,వీడినీ వీడి పెళ్ళాలను ,పిల్లల్ని కూడా నిర్దాక్షిణ్యం గా చంపేస్తాడు అప్పుడు వాడు ‘’any body who will turn on their own is lower than a dog .some day that dog is gonna turn on you too ‘’అని జీవిత సత్యాన్ని చెప్పిస్తుంది రచయిత .రాస్ అంటాడు తమ స్వాతంత్రం భౌతికతకు మారి పోయింది దైవానికి ఆయన భావానికి దూరమై పోయింది అని .కోసినా ఈ ప్రేమికులతో ‘’you have been charged to set these families right .you have to teach the recipe of life .the key ingredient is love ‘’.’’అయోనా ,అనే అమ్మాయి’’ ,joe ‘’అనే అబ్బాయిల ప్రేమ కధే ఇది .ఈ కధయే వాళ్ళ తరతరాల గాధ.గా భావించి ఆదర్శవంతం గా భావిస్తారు .

             ఈ నవలలో రాస్ ఫీనా ల విడి విడి ప్రేమలు వాటి వైఫల్యాలు ,కోజీ ప్రేమ కద, అయోనా జోల ప్రేమ కద నాలుగు పేటలతో అల్లిన నవల .ఎక్కడా విసుగు అని పించదు .ప్రతి పాత్ర తన జీవితాన్ని తెరచిన పుస్తకం లా ఆవిష్కరించటం ఇందులో విశేషం .రచయిత్రి చిన్న అమ్మాయే . .కాని చాలా అనుభవం ఉన్న ప్రౌఢ లా రాసింది .తన జాతి ఋణం తీర్చుకోంది’’ a sparkling heart felt debut and a compelling read ‘’అన్న కొన్నీ బ్రిస్కో మాట నిజం .’’the story is about love ,the importance of understanding one’s history and the power of books ,and how they can influence your life ‘’అని పుస్తకం కవర్ పేజి మీద ఉన్న మాట సత్యమే .

             ఈ నవలలో కోజీ పాత్ర చాలా విశిష్టమైంది .అబ్బూరి రామ కృష్ణా రావు గారు ఆంద్ర విశ్వ విద్యాలయం లో లైబ్రేరియన్ గా ఉన్నప్పుడు శ్రీ శ్రీ,బూదరాజు ,ఆరుద్రా వగైరా రచయితలకు ఏ పుస్తకాలు చదవాలో ఏవి కొత్తగా విడుదల యాయో తెలియ జేసి చదివించే వారని వారి  మాటల వల్ల తెలుస్తుంది అలాగే కోజీ కూడా చేయటం మెచ్చ దగిన విషయం .ఇందులో సంభాణలే చాలా తమాషా గా ఉంటాయి .మనకు అంతా ‘’గ్రమాటికల్ మిస్టేక్స్ ‘’లా అని పిస్తాయి కాని అదే వాళ్ళ వాడుక భాష అని తెలిస్తే ఆశ్చర్య పడం .ఉదాహరణకు ‘’he say I his freedom .cause when he think of me he free in his head ‘’

                         కోజీ అనే షాప్ యజమానురాలు ఆ జంటకు అయోనా కదచెబుతూ ‘’her love and her love of her people needed were connected to a revolution that was already happening .it crossed generations and found its way to her.but this was not about her .it was about generations of people who needed to be set free ‘’She and Ross were simply a part of a large picture ‘’అన్న గొప్ప సందేశాన్నిచ్చి స్పూర్తి కలిగించటం విశేషం .

           అయోనా తన కద లో చివరికి తన సందేశాన్ని చాలా గొప్ప గా అంద జేస్తుంది తన జాతి వారంతా తరతరాలుగా బానిసలు గా బతుకు తున్నారని వాల్లన్దరికితీరని అన్యాయం జరిగి పోతూనే ఉందని అది అర్ధం చేసుకోవాలని ,పిల్లలను తీర్చి దిద్దుకొమ్మని ,సత్యాన్ని దర్శించమని యజమానులను అసహ్యించుకొని వారి లాగా అధికారాన్ని సంపాదించుకొని తల ఎత్తుకు తిరగాలని ,తమ కోసమే కాక ఇతరుల గురించి ఆలోచించి ముందుకు వెళ్లాలని తమ చరిత్రను ,మూలాలను అధ్యయనం చేయాలని ప్రేమతో ,క్షమా తో ఉండమని కాని దేన్నీ మర్చి పోవద్దని (forgive never forget )సందేశం ఇస్తుంది ‘’this is the Recipe of life ,,the road to freedom .Freedom just is not as strong as the ones on our mind.The only thing that can win over evil is love ..learn to love because we donot get time for nothing else .’’అదీఆమే ప్రేమ సందేశం త్యాగ సందేశం ఆదర్శ గీతం విముక్తి గీతం .

       అయోనా ను హాన్ బాయ్ అనే యజమాని కొడుకు మళ్ళీ మళ్ళీ ‘’రేప్’’ చేస్తాడు .ఈమెను జో ప్రేమిస్తాడు .డబ్బు కట్టి ఈమెను బానిసత్వం నుండి విముక్తి చేస్తాడు .హన్ ,వాడి మనుషులు గేలి చేస్తూ నవ్వుతో నుంటారు .అప్పుడు జో బిగ్గరగా ‘’iona I own her ‘’అంటూ పదే పదే సంతృప్తిగా సంతోషం గా అంటాడు .అంతటి ప్రేమ అతనిది .ఆ అమర ప్రేమ నే కద గా తీసుకొని ఆద్యంతం ప్రేరణ నిచ్చే నవల గా మార్చింది రచయిత బెర్సి’’రిడెంప్షన్ సాంగ్’’ నిజం గా నే కమ్మని పాటలా సాగింది .కర్తవ్య బోధ చేసింది జాతి విముక్తికి మార్గం చూపింది .నల్ల జాతి వారికి ‘’విముక్తి గీతం‘’అయి తర తరాలను ప్రభావితం చేసింది .

    రచయిత గురించి పరిచయం -బెర్తిస్ బెర్రీ 1906 లో అమెరికాలో జన్మించింది .దిల్వారే లోని విల్లింగ్ తన లో పెరిగింది ..ఫ్లారిడా లోని జాక్సన్ యూని వర్సిటి లో గ్రాడ్యుయేషన్ చేసింది .ఒహాయో లోని కెంట్ వర్సిటి నుండి సోషియాలజీ లో పి.హెచ్.డి ని 26 ఏళ్ళకే సాధించింది  ”i am on my way .But yout foot is on my head ” వంటి నవలలు రాసింది .ప్రస్తుతం జార్జియా లోని సవన్నా లో భర్త తో ఉంటోంది” .రిడెంప్షన్  సాంగ్” తో గొప్ప పేరొచ్చింది .

              మొదటి సారి అమెరికా వెళ్ళినప్పుడు చదివిన ఈ నవల గురించి 28-7-2002 సోమ వారం నా డైరీ లో రాసుకొన్న విషయాలు మీ కోసం అందించాను .

                 మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –24-4-13- ఉయ్యూరు 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సంధ్య -కదా గంటేడ గౌరు నాయుడు -చినుకు మాసపత్రిక -ఏప్రిల్

ganteda gouri nayudi kadha -6 ganteda gouri nayudi kadha -1 ganteda gouri nayudi kadha -2 ganteda gouri nayudi kadha -3 ganteda gouri nayudi kadha -4 ganteda gouri nayudi kadha -5

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విశ్వనాధ అధిక్షేప రచనలు -రెంటాల శ్రీ వెంకటేశ్వర రావు –చినుకు మాస పత్రిక -ఏప్రిల్

vishvanadhan adhikshepa rachanalu -1 vishvanadhan adhikshepa rachanalu -2 vishvanadhan adhikshepa rachanalu -3 vishvanadhan adhikshepa rachanalu -4vishvanadhan adhikshepa rachanalu -5

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

తి.తి.దే వారి అన్నమయ్య ఉత్సవాలు – వి.ఎ.కె.రంగారావు

తి.తి.దే వారి అన్నమయ్య ఉత్సవాలు
– వి.ఎ.కె.రంగారావు

 

పెద్ద పెట్టున ఏ రకం ఉత్సవాలు జరిపినా, జరిపింది ఎంతటి వారయినా దోషాలుండవచ్చు. అవి గమనించి యికపై జరగకుండా చర్య తీసుకోవటమే విజ్ఞత. కిందటి వర్ధంతి కార్యక్రమాలు ముఖ్యంగా రెండు చోట్ల జరిగాయి. ప్రసంగాలు అన్నమాచార్య కళా మందిరంలో ఉదయం 10.30 నుంచి 1.30 వరకు. సాయంత్రాలు యిక్కడ 6.00 నుంచి 9.00 వరకు రెండేసి సంగీత సభలు. మహతిలో 5.00 నుంచి 7.30 వరకు రెండేసి సంగీత సభలు, 7.45 నుంచి 9.00 వరకు నాట్యం, నాటకం.

నేనున్న మూడు రోజులలో (ఏప్రిల్ 10, 11, 12) రెండు రోజులు ప్రసంగాలు ఆలస్యంగా మొదలైనవి, ఎవరో ఒకరు రాలేదని. రాని వాడధ్యక్షుడైనా సరే, సకాలానికి రావడం అతని (రప్పించడం తి.తి.దే) బాధ్యత. రాని ఒక్కడి కోసం వచ్చిన వారి సమయం వృథా చేయడం దౌర్జన్యం. ఒకనాడధ్యక్షత వహించిన డా. టి. కోటేశ్వరరావు ముందే వచ్చి, 10.30 కంతా పిలవకపోయినా రంగమెక్కి కూచున్నారు. బ్రతికినట్లు తక్కిన వారూ చేరగా, సమయానికి కార్యక్రమం ప్రారంభమైనది. వేసవి కాలం కాబట్టి 10.00కే ప్రారంభించి 1.00 కంతా ముగిస్తే అందరికీ వీలుగా వుంటుంది. పిలిచిన వారినే పిలవడం, చెప్పినవే వేర్వేరు వక్తలతో చెప్పించడం అభియోగాలు కావు. వాస్తవాలు. ఒకే వ్యక్తి వేర్వేరు విషయాల గురించి మాట్లాడకూడదా, వేర్వేరు వ్యక్తులు ఒకే విషయం గురించి చెప్పని విషయాలు చెప్పగూడదా అన్న చొప్పదంటు ప్రశ్ననటుపెట్టి వేరు వేరు విషయాలూ, వ్యక్తులూ అన్న నియమం పెట్టుకొంటే మేలు.

అవినీతి కొడిగట్టిన వారిని పిలవటం తి.తి.దేకి ధర్మం కాదనే వారూ వున్నారు. ఎక్కడో జరిగిన దాని గురించి అధినేతలు పట్టించుకోలేదనుకోవడమెందుకు తి.తి.దేకే నామం పెట్టిన అవినేతలనే పిలవగా! ఈ అక్రమం జరిగిందన్న విషయం బయల్పడి ఋజువైన నెలలోనే యీ వ్యక్తినే పిలిచారు. ఇది ఆనాటి ఇ.ఓ. దృష్టికి తీసుకురాబడింది. ఈ సారీ అలాగే ఇ.ఓ. దృష్టికి తీసుకువస్తే, ఆ అధినేతకు పదవి పొడిగించారు. సమాధానం? “ఆ అవినీతిలో మేము పాలపంచుకోలేదు” అన్న మాటఏనా? అవినీతిపరులను యిలా వెనకేసుకురావటం అవినీతి కాదా? ఈ ప్రసంగాలను క్రితం కేసర్ల వాణి (అన్నమాచార్య పీఠం పెద్ద ఉద్యోగిని) నడిపేవారు.

ఇప్పుడాపని చిట్రాజు గోవింద రాజుది. ప్రసంగం చేసే వారిని పిలవడం ఎలా? ఒకసారి ఫోన్‌లో చెప్పి (డా. ఎల్.బి.శంకరరావుతో వాణి) తరువాత అతీగతీ పట్టించుకోకపోతే, గోవిందరాజు ద్వారా విషయాలు రాబట్టుకొని వెళ్లవలసి వచ్చింది. ప్రసంగాలకు పిలిచినవారికి యింత సమయం కేటాయిస్తున్నామని ముందుచెబుతున్నారా? లేదు. ఒకరోజు అధ్యక్షుల దీర్ఘ ప్రసంగం అయిన తరువాత, తక్కిన వారిని తొందరగా పదిహేను నిమిషాలతో ముగించమనడం ఏమి ధర్మం? ప్రసంగాలు జరుగుతుండగా పుచ్చుకొనే మొత్తాలకు రసీదులు సంతకాలు పెట్టించుకోవడం ఒక వికారం. ప్రారంభానికిముందో, ముగింపు తరువాతనో యీ పని చేయించుకొనడానికి ఎంత సేపవుతుంది! కార్యక్రమాలు నడిపే వాళ్లు వీరు. రంగస్థల నిర్వాహకుడంటూ (స్టేజి మేనేజర్) ఒకడుండ వద్దా? రంగస్థలానికి ముందు నుంచి ఎక్కివెళ్లే మెట్లు నిండా, కూర్చునే కుర్చీల చేతుల మీద, మందిరంప్రతిమూలలోను నివురు గప్పినట్లు దుమ్ము. శుభ్రం చేసే స్త్రీలు అక్కడే తచ్చాడుతుంటారు– బహుశః ప్రసాదాలకు కాబోలు– వారితో చెప్పి చేయించేవాడెవడు! ఇక బయట నుం చి వచ్చే ప్రేక్షకులకు సరియైన శౌచగృహాలుండాలా? లఘుశంక దీర్చుకొని చేతులు కడుగుకొందామంటే బేసినులో నీళ్లు రావు. మరుగుదొడ్ల గదుల్లోకి వెళ్లి కడుక్కోవాలి. ఆ క్షణానికి అది ఉపయోగంలో ఉంటే?

అన్నమయ్య కళామందిరంలో అన్నిటికంటే భయావహమైన లొసుగు; అగ్నిప్రమాదానికి అస్కారమిచ్చేది. ఈ మందిరానికి రెండు ప్రక్కల వసారాలున్నవి. ఒకటి ఉపయోగంలో వుంది. మరొకటి దిగ్బంధం చేసి, అందులో పనికిరాని వస్తువులు పడవేశారు. ప్రవేశ రుసుము వసూలు చేసే ప్రదర్శనశాలయితే యీ పని చట్ట విరుద్ధము. అనుమతి యివ్వరు. అయితే రుసుము వసూలు చేయడం లేదని అగ్నిప్రమాదాలు ఆగవు కదా! వెంటనే యీ చెత్తను తొలగించి తలుపులు తెరచే వీలు కల్గించాలి.

అగ్నిప్రమాదమంటే గుర్తుకు వచ్చింది. తి.తి.దే ముద్రణాలయం వెనుకనున్న పుస్తకాల గిడ్డంగి భవనంలో మొదటి అంతస్తుకి వెళ్లే మెట్లున్నవి. ఈ మెట్ల వెనుకప్రక్క ఖాళీ స్థలంలో ముద్రణాలయంలో తయారయే చెత్త, తొలగింపబడిన కాగితపు ముక్కలు యిత్యాది, అప్పుడప్పుడక్కడ కుప్పలుగా ఉంటాయి. ఇది కూడా పరశురామ ప్రీతి అయే అవకాశాలెక్కువ. ఇటువంటి చెత్త అక్కడ నిలవ ఉండకుండా చూసుకోవడం ముఖ్యం. అలా జరగకూడనిదే జరిగితే తి.తి.దే నిర్వాహక వర్గం తల తీసి ఎక్కడ పెట్టుకోవాలి? ఇక ఆ సభలకు వచ్చేదెవ్వరు? బయట ఎండ నుంచి ఉపశమనం పొందాలని వాయువనుకూలిత ప్రాంగణానికి (ఎ.సి. హాలు) వచ్చే దానయ్యలే ఎక్కువ. తక్కిన వారెందుకు రారు? పిలుపులందకపోవడం చేత. అక్కడి సిబ్బందిలో ఒకరన్న మాట “వేయడానికి వెయ్యి, రంగు రంగుల ఆహ్వాన పత్రికలు వేస్తారు. ఈసారి పంపడం మాత్రం ముప్ఫయ్యో, ముప్ఫై అయిదో పంపారు.

” ఇది నిజమా, దీనికెవరు బాధ్యులు? ఊరంతా వున్న విద్యాసంస్థలన్నిటికీ కాకపోయినా తి.తి.దే అనుబంధ సంస్థలకైనా పంపాలా? పంపితే వారెందుకు రారు? ఆహ్వానపత్రిక చూద్దామని అడిగితే రవ్వా శ్రీహరి వద్ద లేదు (వీరు తి.తి.దే ఎడిటర్-యిన్-చీఫ్)! ఇక మహతి గురించి. ఇక్కడ స్టేజి మేనేజర్ అవసరం మరింత. ఒక నృత్య కార్యక్రమం ముగిసిన పావుగంటకు అదే రంగంపై రెండవది ప్రారంభం కావాలంటే ముందుగానే దానికి తయారవ్వాలి. మొన్న జి.రేవతి గానం సకాలానికి (6.30) ముగియగా 6.45కి ప్రారంభం కావాలసిన ‘అన్నమయ్య సంకీర్తన విజయం’ గంట, ఒక్క గంట ఆలస్యంగా మొదలయ్యింది. అందులో త్యాగరాజు చూడడానికి పురందరదాసులా, పెద తిరుమలయ్య, సిక్స్‌పాక్ శివాజీలా వుండడం వేషరచనలో వింతలు. కొంతకాలం క్రిందట మహతిలో ఏర్పాటుచేసిన అన్నమయ్య కార్యక్రమం రద్దు చేసి (ఒక అంశాన్ని హఠాత్తుగా కళామందిరానికి తరలించి) తి.తి.దే ఉద్యోగస్థుల సమావేశం నిర్వహించారు. తరలించబడిన కార్యక్రమం వారు లబో, అది చూడాలని వచ్చినవారు దిబో మంటే వినేవారెవ్వరు?

మహతిలోనే నా కార్యక్రమాలు నడపమని అన్నమయ్య అడగడు, సరే. ఇలా కార్యక్రమం వుందని ముందు తెలియదా? ఆ ఉద్యోగస్థుల కార్యక్రమానికి తి.తి.దే పెద్దలే వచ్చారు. ఎందుకిలా జరిగిందని ఒక్కరు, ఒఖ్ఖరు అడిగారా? తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతీ అనుకొన్నారా?
ఇటువంటి ప్రవర్తన ఎవరికి గౌరవం? తి.తి.దే వారికా, అన్నమాచార్య పీఠానికా?

– వి.ఎ.కె.రంగారావు
(తి.తి.దే ప్రతి యేటా అన్నమాచార్య వర్ధంతులూ జయంతులూ తిరుపతిలో జరుపుతుంది. ఈ యేడు అన్నమయ్య జయంతి వచ్చే నెల 24 వ తేదీ)

 
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కొండలో కోట -ఆంధ్ర జ్యోతి

kondalo kota

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

లాఫింగ్ బాయ్

  లాఫింగ్ బాయ్

          Oliver La Farge రాసిన laughing boy నవల పులిట్జర్ ప్రైజ్ తెచ్చుకోంది .ఇదంతా’’ పోయేటిక్ ప్రోజ్’’గా ఉంటుంది .ప్రతి వాక్యం భావ గర్భితమే .నిండుగా అందం గా ఉంటుంది .సంభాషణలు చాలా క్లుప్త గా లోతుగా ఆలోచనాత్మకం గా ఉంటాయి .వర్ణన అద్భుతం అని పిస్తుంది .మరో లోకం లో విహరించిన అనుభూతి పొందుతాం .అడవి బాపి రాజు గారి నవలల్లా గా మెత్తగా  కత్తిలా ఉంది .

 images (9)

 

 

            కథ అంతా Nava Jo అనే  ఇండియన్ అమెరికన్ల జీవితమే .వారు ఆటవిక తెగ వారు అమెరికా అసలు వాళ్ళదే .ఆ తర్వాత్ ఆంగ్లేయులు ఫ్రెంచ్ వారు మొదలైన వారొచ్చి ఆక్రమించుకొన్నారు .ఒక ప్రేమ జంట కథ ను ఇతి వృత్తం గా తీసుకొని వాళ్ళ ఫ్లాష్ బాక్ లు ,ఒడిదుడుకులు ,అనుకొన్నది సాధించటాలు ,పాశ్చాశ్చ  వ్యామోహం నుండి కాపాడుకోవటం ,తమఅస్తిత్వాన్ని   తెల్సుకొని మార్చుకోవటం బ్రహ్మాండం గా వర్ణించాడు రచయిత .An American classic ,the greatest novel yet written about the original Americans ‘’అని కితాబు పొందిన నవల .ఇదొక సాహస ప్రయత్నం అని విజయవంతమైన ప్రయోగమని అందరు భావించారు .మంచి ఊహా ఆచరణ ఉన్న రచయిత అని అతన్ని కొనియాడారు .’’I do not recall a single other long story of primitive life in which the story is so completely kept within its native colour and tone ‘’అని ‘’సాటర్ డే రివ్యు ‘’మెచ్చింది .ఇందులో వచనం కవిత్వ స్థాయిని చేరింది అంది న్యు యార్క్ టెలిగ్రాం పత్రిక .’’it is a prose poem of rare beauty ,depth of feeling and emotional power .it is the finest American novel this reviewer has read in 10 years ‘’అన్నాడు ఫిలడెల్ఫియా కు చెందిన విమర్శక ప్రముఖుడు .

                  ఈ నవలలో పేర్లు తమాషా గా ఉంటాయి .అబ్బాయి పేరు’’లాఫింగ్ బాయ్’’ .అమ్మాయి పేరు‘’స్లిమ్ గరల్ ‘’ఇవన్నీ వీళ్ళ నేటివ్ భాష లోని పేర్లే .పిలిగ్రిం ప్రోగ్రెస్ లో పేర్లు లా ,మన పంచతంత్రం లో పేర్లు లా ఉంటాయి .రెడ మాన్  ,టాకింగ్ గాడ్ మొదలైన పేర్లు పాత్రల స్వభావాన్నీ తెలియ జేస్తాయి .వీరంతా మెక్సికన్ ఆక్సేంట్ తో మాట్లాడతారు .ఇందులో అమ్మాయి స్లిమ్ గర్ల్ అమెరికన్ లాగా పెరిగింది .చాలా ప్రేమ కధలు నడిచాయి .చివరికి లాఫింగ్ బాయ్ తో ఉంది .ఇంకా పెళ్లి పూర్తీ కాలేదు .ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు .ఆ అమ్మాయికి అల్లిక ,కుట్టుపని నేర్పడతను .గొర్రెల పెంపకం ,గుర్రాలను కొని అమ్మటం అతను చేస్తుంటాడు ఆమెను చదివించి అమెరికన్ లా చేయాలని అతని ఆరాటం .నవ జో గా మారాలని ఆమె తపన .ఇద్దరు ప్రేమను వెల్లడించుకో లేదు .సిస్టర్ గా చూడాలని వీడి తపన .చెప్పలేడు .ఆమెను ఒక సుపీరియర్ అమెరికన్ చేయాలని వాడి మనో నిశ్చయం .ఆమె ఉన్నత పదవిలో ఉంటె తనకీ గౌరవం అని అనుకొంటాడు .గాఢ ప్రేమికుడు స్నేహితుడు సహాయకుడు ఆమెకు .

             ఆమె నిత్యం నవ జో జీవిత విధానాలను అనుసరిస్తూ మెచ్చుకొంటూ ఉంటుంది .to acquire nava jo gesture completely ‘’అని ఆమె గాఢ వాంచ అతనికి తమ గూడెం లోకి చేరాలని కోరిక .అలా వచ్చేస్తే అతన్ని ‘’went away ‘’,’’blind eyes ‘’అంటారని అర్ధ వంతం గా చెబుతుంది .అతను చాలా బాధ పడుతుంటాడు .తనేదో కోల్పోయి నట్లు బాధ .ఆమెతో ఉంటె తన అస్తిత్వం దెబ్బ తింటుందేమో నని భయం తాను మగాడినని యోదుడినని భావిస్తాడు .ఆమెను మర్చి పోక పోతే తాను ఏమై పోతానో నని లోపల జంకు .ఇలా వీళ్ళిద్దరూ గుంజాటన పడుతూ ఉంటారు .

    ఒక రోజు ఎవరి మీదో వేస్తున్న బాణం ఆ అమ్మాయికి తగులు తుంది .అలా రక్తం కారుకుంటూ ఇల్లు చేరుతుంది .అప్పుడు అతనిలో ప్రేమ వెల్లువ గా బయట పడుతుంది .బాణం తీసి సపర్యలు చేస్తాడు .కొంత నయం అవగానే నిజ మైన భార్యా భార్తల్లా జీవిస్తారు .అప్పుడామే తన పాత జీవిత కథఅంతా ఆవిష్కరిస్తుంది .వీడు పశ్చాత్తాప పడతాడు .ఇద్దరు కలిసి నవ జో వెళ్లాలని నిర్నయిన్చుకొని బయల్దేరారు  .దారిలో ఆమె చని పోతు  .’’చెడిన ఆడ వాళ్ళను ‘’squa ‘’అంటారు .’’squa is a word Americans use to mean Indian women .’’అని తన కద చెబుతూ ‘’నేను ణనీ వల్ల నా ఆత్మను కాపాడుకోన్నాను .నీతో ఉండటం పరమ సంతోషం .నీతో సత్యం చెప్పాలనే నా కోరిక ‘’అని తన గుండె లోతుల్లోని ప్రేమను వెల్లడి చేస్తుంది .కొత్త జీవితం ప్రారంభించాలన్న తపన ఆమెది ..చని పోతుంది అతని చేతుల్లో .ఒక గొయ్యి తీసి ,ఆమె నగలన్నీ ఆమెకే అలంకరించి ,తనకు ఆమె ఇచ్చినవీ అందులోనే ఉంచేసి ఖననం చేస్తాడు .ఒంటరి వాడుగా మిగిలి పోతాడు .అమర ప్రేమికుడని పించుకొంటాడు లాఫింగ్ బాయ్ .

        చివరగా రచయిత ‘’Now he was not a nav Jo terrified of the dead ,not an Indian ,not an individual of any race ,but a man who had buried his own heart ‘’అంటాడు అద్భుత మైన కవితా ధారతో కృష్ణ శాస్త్రి గారి కవితా పంక్తులు  జ్ఞాపకం వస్తాయి .తను కావాలనుకొన్నది కావాలని తీర్మానించుకొన్నాడు .దీనినే కవితాత్మకం గా రచయిత ఇలా చెబుతాడు ‘’the reminder of his life would be a monument to her .all this could not be changed or taken from him ,he would never lose its mark .that was a comfort ‘’దేవ దాసులా తాగుడుకు బానిస కాకుండా ఆమె కోసం కొత్త జీవితం ఆరంభిస్తాడు .అది ఆమెకు అంకితం చేయాలని భావిస్తాడు .నిజమైన ప్రేమకు ఆ ఆటవిక జాతుల వాళ్ళు ఆదర్శం గా నిలిచారు జంటగా .కళ్ళు చేమరిస్తాయి .చివరి అధ్యాయాలు కుదిపేస్తాయి .శ్వాస అడ కుండా చేస్తాయి .వాళ్ళ హృదయపు లోతుల్లోకి మనల్ని తీసుకొని వెళ్లి ఆనందాన్ని పొందింప జేస్తాడు రచయిత .అంతటా పాత్రలే దర్శన మిస్తాయి .అన్నీ జీవం ఉన్న పాత్రలే .వ్యక్తిత్వం తోణికిస లాడేవే .సహజం గా స్వభావ సిద్ధం గా ప్రవర్తిస్తాయి .ఒక గొప్ప నవలా రాజాన్ని చదివిన అను భూతి పొందాను .బరువైన హృదయం తో ఆ అమర ప్రేమైక జంట లాఫింగ్ బాయ్ ,స్లిమ్ గర్ల్ కు అక్షరామ్జలే ఈ జ్ఞాపకాలు .చివరికి అతడు ఇలా అనుకొంటాడు ‘’we shall never be fear from each other always alone ,but never lonely –in beauty it is finished ‘’అని వాళ్ళ భాష లో ఒక పాట పాడుకొంటాడు .ఆ పాట ‘’ for ever alone ,for ever in sorrow I wander –for ever empty for ever hungry I wander –with the sorrow of great beauty I wander –with the emptiness of great beauty I wander –never alone ,never weeping ,never empty –now on the old age trail ,now on the path of beauty I wander –Ahlam beautiful ‘’

           నిరాశ కంటే ఆశ కు పెద్దపీట వేస్తాడు రచయిత .ఏడుస్తూ కూర్చోవటం కంటే మళ్ళీ ఆ జ్ఞాప కాలతో కొత్త జీవితం సాగించాలి అని హితవు చెబుతాడు .లాఫింగ్ బాయ్ కి గొప్ప ప్రశాంతి కలిగింది ఎదురు దెబ్బల నుండి పెద్ద గుణ పాఠం నేర్చుకొన్నాడు .తమ ఇద్దరి ప్రేమ అజరామరం అని తెలుసుకొన్నాడు అందుకే అంత శాంతి ఏర్పడింది .’’త్వమేవాహం ‘’లోకి సుదీర్ఘ ప్రయాణం సాగిస్తాడు .  1920 వరకు25,000 మంది నవ జో లు మాత్రమె ఉన్నారట .’’their generala condition and mode of life ,with all its hardships ,simplicity and riches could continue indefinitely if only they were not interrupted ‘’అని రచయిత తేలుస్తాడు .అనవసరం గా వాళ్ళ ఆచార వ్యవహారాల జోలికి,కట్టుబాట్ల వైపుకి  వెల్ల వద్దని వారి మానాన వారిని ప్రశాంతం గా జీవిన్చేట్లు చేయమని ప్రభుత్వానికి ,నాగరకులకు హెచ్చరిక చేస్తాడు .అందువల్లనే మరో ముప్ఫై ఏళ్ళకు అంటే 1950 నాటికి నవ జో లసంఖ్య  85,000అయింది .ఆధునిక ప్రభుత్వాలతో ,ఆధునిక సదుపాయాలతో పాత వి అన్నీ కోల్పోయారు .ఇప్పుడు వారంతా ఆనందం హసించని జీవులు గా బతుకులు ఈడుస్తున్నారు .వారిని ఆదరించే వారితో స్నేహం చేసే వారే కరువైపోయారు .తాగుడుకు బానిసలై పోయారు .అయినా కొంత మంది ఇంకా వారి మతాన్ని ,వారి పరిసరాల అందాలను ,హాస్యాన్ని కాపాడుకొంటూ మందు కు బానిసలు కాకుండా నే వారి వినోదాలు ఉత్సవాలను ఘనం గా నిర్వహించుకొంటున్నారు .ఈ రచయిత కూడా అదే తెగ కు చెందినా వాడే .అందుకే అంత గొప్ప గా వారి జీవితాన్ని చిత్రీకరించాడు .ఆఫ్రికన్ అమెరికన్లు అంటే నీగ్రోల పుట్టు పూర్వోత్తరాలను తెలియ జేసే ‘’the roots ‘’నవల జ్ఞాపకం వస్తుంది

 మొదటి సారి అమెరికా వెళ్ళినప్పుడు చదివిన ఈ నవల ను గురించి 19-7-2002 శుక్రవారం నా డైరీలో రాసుకొన్న విషయాలు మీ కోసం అందించాను .

            మీ  –గబ్బిటదుర్గా ప్రసాద్ –22-4-13- ఉయ్యూరు 

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

ఇంగ్లాండ్ సాహస కన్య గ్రేస్ డార్లింగ్ -విహంగ

ఇంగ్లాండ్ సాహస కన్య గ్రేస్ డార్లింగ్

 

ఇంగ్లాండ్ సాహస కన్య గ్రేస్ డార్లింగ్

 అపాయం లో ఉన్న వారిని రక్షించటం కనీస మానవ ధర్మం .దానికి ఆడా  మగా తేడా లేదు .సాయమ అందుకొనే వారు  తన వారా ,పరాయి వారా అన్న భేదం ఉండదు .ఆర్తులను కాపాడటమే ధ్యేయం .దీనికి సాహసం, ధైర్యం కావాలి .ఆ రెండూ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాయి .సంకల్పం గట్టిదైతే కృషి తప్పక ఫలిస్తుంది .అలాంటి అద్భుత సాహసం చేసి తీవ్ర ప్రమాదం లో చిక్కుకొన్న నావికా ప్రయాణీకులను అరుదైన ధైర్య సాహసాలతో రక్షించిన మానవీయ మూర్తి ఇంగ్లాండ్ దేశానికి చెందిన గ్రేస్ డార్లింగ్ అనే కన్య ..ఆ సాహసి విశేషాలను తెలుసుకొని ఉత్తెజితులమవుదాం .

     ఇంగ్లాండ్ దేశం లో నార్త్ ఆంబ్రియా  దగ్గర ఉన్న తూర్పు సముద్రం లోని ఫారన్ ద్వీపాలలో ఒకటైన లాంగ్ స్టన్ ద్వీపం లో  లైట్ హౌస్ రక్షకుడు గా ఉన్న విలియండార్లింగ్ కు ఏడవవసంతానం గా   గ్రేస్ డార్లింగ్ 1815 లో జన్మించింది .ఈ ఫారన్ ద్వీపాలు ఆ కాలం లో నిర్మానుష్యం గా ఉండేవి .జంతు వృక్ష సంతతి ఎక్కడా ఉండేది కాదు .అంతా కొండలు, రాళ్ళ మాయం .సముద్రం ఎప్పుడూ అల్లకల్లోలం గా ఉండి అలలు ఉవ్వెత్తున ఎగసి పడటం ఇక్కడ సహజ లక్షణం .ప్రవాహవేగం ఎక్కువ .ప్రమాద భరిత ప్రాంతం గా పేరు పొందింది .అప్పటికే అనేక నౌకలిక్కడ మునిగి పోయి వేలాది మంది ని పొట్టన బెట్టుకొన్న ప్రాంతమిది .1782లో అమెరికా నుండి తిరిగి వస్తున్న ఓడ ఇక్కడి అలల తాకిడికి ముక్కలై సముద్ర గర్భం లో కలిసి పోయింది .1823 లో అయిదు ఓడలిక్కడే జల సమాధి చెందాయి .అందుకని ఇక్కడ లైట్ హౌస్ నిర్మించి దానికి గార్డ్ గా విలియం ను నియమించింది ఇంగ్లాండ్ ప్రభుత్వం .ఆయన చాలా ఓర్పుగా నేర్పుగా కావలి కాస్తున్నాడు అతని సమర్ధతను  ప్రభుత్వం గుర్తించింది కూడా .

         తన పని చాలా కష్టం తో కూడుకోన్నదైనందున తన పిల్లలకు మంచి విద్యా బుద్ధులను నేర్పించాలని విలియం తపన చెందే వాడు ..గ్రేస్ డార్లింగ్ చాలా శాంత స్వభావం కలది .ఆమె సూక్ష్మ బుద్ధి కలదై నందున  చురుకుగా చదవటం రాయటం నేర్చుకొన్నది .తండ్రికి పడవ నడపటం లో ఎప్పుడూ సాయం చేసింది కాదు .ఇంటి పనులన్నీ తల్లే చూసుకొనేది ..గ్రేస్ కు ఇరవై రెండేళ్ళ వయసులో1838 లో సెప్టెంబర్ ఏడవతేది ఆమె జీవితం లో ఒక అత్యద్భుత మైన సంఘటన జరిగి ,ఆమె చరిత్ర ప్రపంచ ప్రసిద్ధ మైంది .

            1838 సెప్టెంబర్ అయిదవ తేదీన ‘’ఫోర్ ఫార్ ఫైర్’’అనే పొగ ఓడ హాల్ నగరం నుంచి బయల్దేరింది. దాని కెప్టెన్ జాన్ హంబుల్ .అందులో విలువైన వస్తువుల ను వర్తకం కోసం తీసుకొని పోయే వారున్నారు .ఓడ సిబ్బందితో కలిపి అరవై రెండు మంది ప్రయాణీకులున్నారు .ఓడ కొత్తదే కాని దాని స్టీం బాయిలర్లు అడుగున చిల్లి పడి నీరు కారటం ప్రారంభ మైంది .ఎంతో తంటాలు పడి అందులో నీళ్ళు నిలవచేసే ప్రయత్నాలు చేసినా ఫలితం శూన్యం .ఆరోజు అర్ధ రాత్రి పన్నెండు గంటలకు గాలి తీవ్రమైనది సముద్రపు అలలు ఎంతో ఎత్తుకు లేచి యెగిరి పడుతున్నాయి .వెంటనే పెద్ద గాలివాన ప్రారంభ మైంది .గాడాంధకారం .ప్రకృతి ప్రకోపం మానవ నిస్సహాయత .అందరు కళవళ పడిపోతున్నారు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని క్షణమొక యుగం గా గడుపుతున్నారందరూ ..స్టీం బాయిలర్ల లో నీరు నిలవటం లేదు .చక్రాలు పని చేయటం ఆగిపోయింది .గాలి వేగానికి ఓడ అటూ ఇటూ ఒక దిశా నిర్దేశం లేకుండా తీవ్రం గా ఊగిపోతోంది .ప్రయాణీకులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని గడుపుతున్నారు ఆందోళన తో దిక్కు తోచటం లేదు ఆక్రందనలు చేస్తున్నారు .ప్రకృతి ముందు మానవుని నిస్సహాయత ప్రస్పుటం గా కని  పించింది .

            ఓడ ఏదో ఒక గట్టు వైపుకు కొట్టుకు పోతున్నట్లు అని పించి ధైర్యం కూడా దీసుకొని కెప్టెన్ తెరచాపలు ఎత్తించాడు ..కాని అతని కృషి ఫలించలేదు .ప్రవాహం బలంగా దక్షిణ దిశకు పరిగేట్టుతోంది దానితో బాటు  నౌక అలానే సాగి పోతోంది గమ్యం లేకుండా .దూరం గా ఫారన్ ద్వీపపు లైట్ హౌస్ కాంతి కనీ పిస్తోంది .అందరికి తమ ఓడ ఎంత అపాయకర స్థలం లో ఉందొ అర్ధమై పోయింది .కెప్టెన్ హంబుల్ ఓడను ఆద్వీపం మధ్యలోకి నడిపి రక్షిద్దామని తీవ్రం గా ప్రయత్నించాడు కాని ఫలితం లేకుండా పోయింది .తెల్ల వారు ఝామున నాలుగింటికి ఓడ ‘’హార్కార్ రాక్’’అనే  కొండకు ఢీ కొని ముందుభాగం ముక్కలైంది వెనుక భాగం అలల తాకిడికి అల్ల కల్లోలమైంది .ఎవరికి వారు తమ ప్రాణాలను దక్కించుకోవాలనే ప్రయత్నం లో ఉన్నారు ఆత్మ రక్షణార్ధం ఎవరి ప్రయత్నాలు వాళ్ళు ప్రారంభించారు స్వార్ధ పరులైన కొందరు నావికులు నౌక లో ఉన్న ఒక చిన్న ‘’లైఫ్ బోట్’’ ను  సముద్రం లో కి దింపి దానిలో ఎక్కి పారిపోవటానికి ప్రయత్నించారు .ప్రయాణీకుల ప్రాణాలను కాపాడాల్సిన నావికులే స్వార్ధ బుద్ధితో ఆత్మ రక్షణకు అందర్నీ నట్టేట ముంచి పలాయనం చిత్త గించి వృత్తికీ దేశానికీ  అవమానం తెచ్చారు .స్వార్ధం ఎంతటి నీచానికైనా దిగ జారుస్తుందనితెలియ జేసే సంఘటన ఇది . .

          నావికులు పడవలో పారి పోతున్నారని అలికిడి ద్వారా తెలుసుకొన్న ఒకరిద్దరు తామూ ఆ పడవలోకి దూకారు కొందరు దూకే ప్రయత్నం లో సముద్రం లో పడి మునిగి అక్కడికక్కడే చని పోయారు .కళ్ళ ముందే వాళ్ళు చని పోతుంటే ఓడలో ఉన్న వారి ఆర్తనాదాలతో ,హాహా రావాలతో ఆ ప్రదేశం అంతా శోక సముద్రమే అయింది .భగవంతుని ప్రార్ధించటం తప్ప వారింకేమీ చెయ్య లేని నిస్సహాయ స్తితి .ఓడ విరుగుతున్న ధ్వనులు, రోదనలు మిన్ను ముట్టాయి .ఈ దెబ్బతో ,నౌకమధ్య కు  రెండు ముక్కలైంది .మొదటి భాగం అగాధ సముద్ర జలాల్లో మునిగి కంటికి కని  పించకుండామునిగి  అదృశ్యమైంది .నౌక లోని గదులన్నీ మునిగిన ఈభాగం లోనే ఉన్నాయి .ఓడనాయకుడు,భార్య కూడా ఇందులోనే ఉన్నారు పాపం . .

               తెరచాపకోయ్యలు, చక్రాలు ఉన్న ముందుభాగం మాత్రం కొండలో చిక్కుకొని ఉండి పోయింది .ఇందులో తొమ్మిది మంది మాత్రం ప్రాణాలు ఉగ్గ బట్టుకొని బతికి ఉన్నారు .వీరిలో అయిదుగురు ప్రయాణీకులు ,నలుగురు మాత్రం నావికులు .ప్రయాణీకులలో ‘’సారా డాసన్ ‘’అనే ఆమె తన ఇద్దరు పిల్లల్ని రోమ్మునకు హత్తుకొని భీతావహి యై ఉంది .సాయం కోసం అందరు అరుస్తున్నారు ఆమె పిల్లలిద్దరూ ఆ చలికి, గాలికి, నీటికి బిర్ర బిగుసుకొని ఆమెచేతుల్లోనేమరణించారు ఆమె కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది .  .ఆమె మాత్రం కోన ఊపిరితో ఉంది ..గాలి వాన క్రమం గా తగ్గు ముఖం పట్టింది .కాని సముద్రం మాత్రం భయంకరం గా గర్జిస్తూనే ఉంది .తెల్ల వారుతోంది .చీకట్లు ఇంకా విచ్చుకోలేదు  . .ఎవరైనా వచ్చి రక్షిస్తారని ఆ తొమ్మిది మందిఎదురు చూస్తున్నారు .

                మన కధా నాయకి గ్రేస్ డార్లింగ్ కు నావ లోని వారి ఆర్త నాదాలు విని పించాయి ఆమె నిరుపేద బాలిక .వెంటనే తండ్రిని నిద్ర లేపింది . ఎలా వారికి వారికి సాయమందించ గలమని తల్లీ కూతురు ఆలోచించారు.ఇంతలో తెల్ల వారింది పగిలిన ఓడ భాగం కని పించింది .కాని సముద్రం ఇంకా అల్లకల్లోలం గా ఉంది వెళ్ళ టానికి ఎవరికి ధైర్యం చాలటం లేదు అవకాశమూ కనిపించటం లేదు .‘’స్మేదిల్‘’అనే ధన వంతుడు సముద్రం లో చేపలు పట్టే వారికి అయిదు పౌన్లు డబ్బు  ఇస్తానని ఆశ పెట్టి పిలిచినా వాళ్ళు కూడా సముద్రం లోకి పడవలతో వెళ్ళ టానికి సాహసం చెయ్య లేక పోయారు .సముద్రం లోకి వెళ్ళటం ప్రాణాంతకం అని పించింది అందరికి .ఎవరి ప్రాణం వారికి తీపి కదా .నీటిలో నిత్యం చేపల్లా ఈదేవాళ్లేభయపడితే సామాన్యులకు వెళ్ళే ధైర్యం ఎక్కడుంటుంది ?

       లైట్ హౌస్ గార్డు అయిన డార్లింగ్ మొదట సంశయించినా కూతురు గ్రేస్ చొరవ తీసుకొనటం తో ధైర్యం గా ముందడుగు వేసి ఓడ లోని వారిని రక్షించాలని బయలు దేరాడు .ఒక ‘’లైఫ్ బోట్’’ ను సముద్రం లోకి దింపి చెరొక తెడ్డు పట్టుకొని నడపటం ప్రారంభించారు .అయితే ఆమె కు పడవ నడపటం ఇంతకు ముందెప్పుడూ చేయలేదని ముందే చెప్పుకొన్నాం .కాని అవతలి వారిని రక్షించాలన్న తాపత్రయం ఆమె కు ఆ విద్య ను అప్పటి కప్పుడు నేర్చుకోనేట్లు చేసింది .అత్యంత వేగం గా ,సామర్ధ్యం గా పడవను నడిపి తండ్రికే ఆశ్చర్యాన్ని కలిగించింది ..రక్షించాల్సిన వారంతా కొండ మీద చిక్కు కొన్నారు వారి దగ్గరకు చేరా లంటే ఆ కొండ ఎక్కాలి .పడవ పగలకుండా చూసుకోవాలి కెరటాల తాకిడికి ,..వేగానికి పడవ కొండకు ఢీకొంటే మొదటికే మోసం .నెమ్మదిగా పడవను కొండ దగ్గిరికి చేర్చారు తండ్రీ తనయలు గబుక్కున తండ్రి ఒక్క సారి కొండపైకి దూకాడు .కూతురు  గ్రేస్  లాఘవం గా పడవను లోతు నీటి లోకి నడిపి నీటి పై తేలేట్లు చేసింది .ఒక్కోకర్ని అతి  జాగ్రత్తగా పడవ లోకి చేర్చాడు .తొమ్మిది మందిని ఎక్కించుకొని సురక్షితం గా తమ లైట్ హౌ లోకి చేర్చారు .వీరి ప్రాణాలను కాపాడటానికి గ్రేస్  ఎంత ఆత్రుత పడిందో అంతే ఆత్రుత ను మరో మూడు రోజులు చూపించి వారికి అన్ని సౌకర్యాలు కల్పించి తల్లి కి చేదోడు గా ఉంది .వారి మనోవేదనను శాంత పరచటానికి గ్రేస్ కుటుంబం శక్తి వంచన లేకుండా చేసి మానవత్వాన్ని ప్రదర్శించారు .తను పడుకొనే పరుపును ఇద్దరు పిల్లలను కోల్పోయిన అభాగ్యురాలు డాసన్ దొరసాని కి  ఇచ్చి గ్రేస్ బల్లమీదే నిద్రపోయింది .ఆ తర్వాత ఓడలలో వచ్చి ఇక్కడ చిక్కుపడ్డ వారిని కూడా ఇంటికి తెచ్చిమొత్తం ఇరవై మందికి  తండ్రీ కూతురు వారి ఆలనా పాలనా చూశారు .మానవత్వం వికశించిన మహాద్భుత సన్నీ వేశం ఇది .చరిత్రలో నిలిచి పోయింది .

                  గ్రేస్ తండ్రి జీతం మీద ఆధార పడి బతికే పేద ఉద్యోగి .అయినా ఆయన కూతురు గ్రేస్ ఒక సాహస కార్యం తో అందరి దృష్టిని ఆకర్షించింది. పేరు పుట్టుక తో రాదు. చేసేపనులవల్ల,వస్తుందని రుజువు చేసింది ప్రపంచానికి..గ్రేస్ చేసిన సాహస చర్య  ఆనోటా ఆనోటా పడి  అందరి దృష్టికీ చేరింది ఎక్కడెక్కడి నుంచో జనం ఆమెను చూడ టానికి తీర్ధ ప్రజ గా వచ్చేవారు ధనికులు, అధికారులు,సామాన్యులు  అందరు వచ్చి ఆమె ను అభినందించారు .రాణి రాజు ఈ తండ్రీ కూతుర్లను పిలిపించి సత్కరించారు బంగారు గడియారాన్ని గ్రేస్ కు కానుక గా ఇచ్చారు .దాన్ని ఆమె తనను చూడ టానికి వచ్చిన వారందరికీ చూపిస్తూ మురిసి పోయేది .అనేక మంది ఎన్నో విలువైన కానుకలను గ్రేస్ కు పంపారు .ఆమె కు ఆర్ధిక సాయం చేయాలనే సంకల్పం తో చందాలు వసూలు చేసి700 పౌన్ల ధనాన్ని ఆమె కు అందించారు ..గ్రేస్ సాహసం పై నాటకాలు రాసి ప్రదర్శించారు .ఆమె కొద్దిసేపు పడవలో కూర్చుని నాటకం చూస్తె బోలెడు ధనమిస్తామని ఆశ పెట్టారు .కాని ఆమె దేనికీ ప్రలోభ పడలేదు వీటిని  తృణప్రాయం గా భావించి తిరస్కరించింది .త్యాగానికి ప్రతి ఫలం కోరుకొని మనీషి అని పించి,నిజం గా నే గ్రేస్ అని పించుకోంది .తానేదో గొప్ప ఘనకార్యం చేశానని ఆమె ఎప్పుడూ ప్రగల్భాలు పలకలేదు .ఈ సంఘటన తర్వాత మూడేళ్ళు తలిదంద్రులతోనే ఉంది వారు బతికి ఉండగా వేరుగా ఉండనని చెప్పింది .వాళ్ళు వివాహ ప్రయత్నాలు చేసినా వివాహం కూడా  చేసుకోకుండా జీవించి కన్య గానే మిగిలి పోయింది . .

           1841 లో గ్రేస్ కన్య కు క్షయ రోగం సోకింది ..వీలైన మంచి వైద్యం చేయించినా గుణం కనపడ లేదు ,క్రమంగా క్షీణించి పోయింది .మరణ సమయం లో ఆమె బంధువు లందర్నీ  పిలిపించుకొని తన వద్ద ఉన్న అమూల్య వస్తువలను తన స్మృత్యర్ధం కానుకలు గా అందజేసిన త్యాగ శీలి గ్రేస్ .జీవితాన్ని ‘’గ్రేస్ ‘’తో జీవించి ,అందరికి ‘’డార్లింగ్ కన్య’’అయిన గ్రేస్ డార్లింగ్  ‘’1842 అక్టోబర్20 న  బాంబరోనగరం లో కీర్తి శేషురాలైంది .ఆమె శవ యాత్రలో అశేష జనం పాల్గొని ఆమెకు శ్రద్ధాంజలి ఘటించి చరిత్ర సృష్టించారు .ఆమెను ‘’సెయింట్ ఐడాన్స్ చర్చి యార్డ్ ‘’లో ఆమె తలిదండ్రుల సమాధుల ప్రక్కనే  సమాధి చేశారు .

       ఆమె సాహసజీవితం పై ఎన్నో కధలు నాటికలు పాటలు వచ్చాయి .’’Grece Darling or Maid of the isles ‘’పేరైత జేరోల్ద్ వేర్మాన్ 1839  లో ఒక నాటకం రాసి  ప్రదర్శించాడు .ప్రఖ్యాత ప్రకృతి కవి విలియం వర్డ్స్ వర్త్ 1843 లో ‘’గ్రేస్ డార్లింగ్ ‘’అనే అద్భుత కవిత రాసి ఆమె త్యాగాన్ని ప్రస్తుతించాడు .ప్రభుత్వం గ్రేస్ పేరుమీద ఒక లైఫ్ బోట్ ను హోలీ ఐలాండ్ లో ఏర్పాటు చేసింది .విలియం బెల్ స్కాట్ అనే ప్రముఖ చిత్రకారుడు డార్లింగ్ జీవితం పై చిత్రించిన అనేక చిత్రాలను నార్త్ అంబర్ లాండ్ లోని ‘’వాషింగ్ టన్’’హాలులో ప్రదర్శించాడు .బామ్బర్గ్ లో ఒక మ్యూజియం లో ఆమె సాహసాలను భద్ర పరచారు .దేవ్ కజిన్స్ ఆమె పై ఒక గొప్ప భావాత్మక ప్రేమ గీతాన్ని రాశారు .వెస్ట్ గెట్ గ్రేస్ జీవితం లోని అపూర్వ ఘట్టాలపై ఒక సంగీత రూపకాన్ని సమకూర్చి ప్రదర్శించాడు .ఆమె పరోప కార పారీణత అందరికి ఆదర్శమే .చిరస్మరణీయురాలు గ్రేస్ డార్లింగ్ ..

– గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆకలిగొన్న అక్షరానికి నమస్కారం – స్కైబాబ

ఆకలిగొన్న అక్షరానికి నమస్కారం
– స్కైబాబ

ఆకలి బాధలకూ పురస్కారం వచ్చింది. అత్యున్నత గౌరవం దక్కింది. ఎనిమిదవ తరగతి కూడా చదవలేని ఒక నిరుపేద మనిషిని అక్షరాలే ఆదుకున్నాయి. కలలో కూడా ఊహించలేని జ్ఞానపీఠమనే అందలమెక్కించాయి. ఆ మనీషి పేరు రావూరి భరద్వాజ. ఆయన రాసిన ‘పాకుడురాళ్ల’పై ఆయన మాటలివిగో..

– మొదట కథగా వచ్చిన రచన ‘పాకుడు రాళు’్ల నవలగా ఎలా మారింది?
– మొదట ఏదో పత్రికలో మాయజలతారు పేరుతో కథ గా వచ్చింది. దానిని మల్లంపల్లి సోమశేఖరశర్మ చదివి చాలా మెచ్చుకున్నారు.. కానీ పదిమంది కూర్చొనే చోటులో వందమందిని కూర్చుండపెట్టినట్లు ఉందన్నారు. అది ఐదొందల, ఆరొందల పేజీల్లో రావలసిన విస్తృతి ఉన్న రచన అన్నారు. ఆయన సూచనను పాటిస్తూ, అప్పట్లో హైదరాబాద్ నుంచి వచ్చే కృష్ణాపత్రికలో సీరియల్‌గా రాసాను. మూడున్నర సంవత్సరాలపాటు ప్రచురించారు. ఆ పత్రికలో పనిచేసే శీలావీర్రాజు గారు ఆ సీరియల్‌కు పాకుడురాళ్లు అని పేరు పెట్టారు.

-పాకుడురాళ్లు నవలా నాయిక మంజరికి ప్రేరణ ఎవరు?
-పేర్లు చెప్పను. అప్పట్లో పరిశ్రమలో ప్రధాన స్రవంతిలో ఉన్న నటులు, నటీమణులు ఆ పాత్రకు ప్రేరణ. అలా ఎంతోమంది గుణగణాలను ఆ పాత్రలో చొప్పించడవల్ల అది చక్కగా, చిక్కగా రూపొందింది. – ఏ పాత్రతో ఐడెంటిఫై అయ్యారు మీరు? మంజరితోనా, మాధవరావుతోనా?
– నేను ఎవరి ద్వారా ఐడింటిఫై కాను కాను కాను. నాకు బాగా తెలిసిన వ్యక్తుల గురించిన లక్షణాలు మంజరి పాత్రలో నిబిడీకృతం చేసాను. అనేకమందిలో కలిసిన వైవిధ్యభరితమైన లక్షణాలను ఆమెలో పొందుపరిచాను.
– ఆ రచనపై అప్పట్లో వచ్చిన ప్రశంసలు, విమర్శల గురించి…
-ప్రశంసలకన్నా విమర్శలే ఎక్కువగా వచ్చాయి. సినిమావాళ్ల తప్పులు, అక్రమాలు ఎత్తిచూపానని విమర్శించారు. వారిపట్ల తక్కువ చూపుతో, హేళన చేస్తూ రాసానని విమర్శలు సంధించారు.ఆ రచనపై కోర్టులో దావా వేస్తామని కొందరు బెదిరించారు. ‘వేయండి. చెక్కులో 5వేలరూపాయలని రాసి 50 వేలు తీసుకోవడం అక్రమం కాదా?’ అని ప్రశ్నిస్తూ నేనూ వారికి సవాల్ విసిరాను.
– ఆ అంశం మీదనే ఎందుకు రాయాలనుకున్నారు?
– పరిశ్రమకు సంబంధించిన వారితో రోజువారీ అనుభవాలను రాయకుండా ఉండలే కపోయాను. రాసాను.
– ఈ రచనలో ప్రయోగాలు చేసారా?
– ఈ రచనలో ప్రత్యేకంగా ప్రయోగాలు చేయలేదు. ఆయా సందర్భాలను బట్టి, సన్నివేశాలను బట్టి భాషను, శైలిని ఉపయోగించాను.
-మంజరిని ఎందుకు ‘ఆత్మహత్య చేయించారు’?
– ఆ వాతావరణంలో పెరిగి, బతికి సాధించేదేమీలేదని అనుకుని ఆత్మహత్య చేసుకుంది. మార్లిన్ మన్రో ఎందుకు చేసుకుందో అందుకే ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది. మంజరి చనిపోతుందని ముందుగానే తెలుసు నాకు.

– చిత్రసీమ అనే పత్రికకే పరిమితమయ్యారు. సినిమా పరిశ్రమలో పనిచేయాలనిపించలేదా?
-చెప్పాను కదా. దగ్గరగా అక్కడి చెడుగులన్నీ చూసాకా అందులో పనిచేయడం వద్దనుకున్నాను.
– చలంతో మీ మరపురాని అనుభవాలు?
– చలంగారంటే నాకు పిచ్చి. ఆయన రచనల్లో పేరాలకు పేరాలు కంఠతా వచ్చు. పరిచయం చేసుకున్నాను. నా ‘రాగిణి’కి ముందుమాట అడిగాను రాసారు. అది నా అదృష్టం.
-చేయాలనుకున్న రచనలు ఇంకా ఏమైనా మిగిలిపోయాయా ?
– కొన్ని ఉన్నాయి. అవి ఒక రూపానికి వచ్చాక అప్పుడు రాస్తాను. అంతవరకు వాటి గురించి చెప్పను.
– మీరు చేసిన ప్రయోగాల గురించి చెప్పండి.
– ముందుగా ముగింపు చెప్పి తర్వాత కథ నడపే ప్రయోగం ఎక్కువగా చేశాను. అలా రాస్తే పాఠకులు ఎలా స్వీకరిస్తారో చూడాలని అలా చేశాను. ఇంకా ప్రయోగాలు చేయాలని కూడా ఉంది. – ఇతర భాషల, ఇతర దేశాల సాహిత్య అధ్యయనం గురించి..
– నాకు తెలుగు మాత్రమే వచ్చు. ఇంగ్లీషులో సరళంగా వున్నవాటిని చదివాను. అవి నాకు అర్థమైన రీతిలో వాటి ఆధారంగా కూడా రచనలు చేసాను. అలా స్ఫూర్తి కలిగించిన ఇంగ్లీషు రచనల వివరాలు కూడా నా పుస్తకాల్లో రికార్డు చేసాను.

– ఆకలి తీర్చుకోవడం కోసం, బతుకుదెరువుకోసం మీరు రచనారంగంలోకి వచ్చారని అన్నారు. మరి మీ ఆలోచనలను, అనుభూతులను వ్యక్తం చేసిన రచనలున్నాయా?
– ఔను.. చాలా రచనలు ఆకలి తీర్చుకోవడం కోసమే చేసాను. సొంత ఫీలింగ్స్, సొంత ఆలోచనలు వ్యక్తం చేసిన రచనలు కూడా ఉన్నాయి. అవి ‘కాదంబరి’ ‘సశేషం’ ‘నేను ఎందుకు రాస్తున్నాను’.
ం హైదరాబాద్ స్టేట్‌లో పుట్టానన్నారు.. తెలంగాణ ఉద్యమం గురించి మీ అభిప్రాయం?
– రాజకీయాలతో బొత్తిగా నాకు సంబంధం లేదండి. మా ఊరు మాకివ్వండి, మా దేశం మాకు ఇవ్వండి అని అడిగాము. ఇచ్చాక ఏం చే సాము. ఒకప్పుడు బ్రిటిష్‌వారిపై పోరాడాము. ఆ తరువాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అంతకంటే ఎక్కువ అన్యాయాలు జరిగాయి. ఏం చేద్దాం? చెరువులో నీళ్లు తాగామా? బావిలో నీళ్లు తాగామా అన్నది ముఖ్యం కాదు, నీళ్లు తాగామా? లేదా? అన్నది ముఖ్యం. -విశ్వబ్రాహ్మణ చైతన్యంతో ఏవైనా రచనలు చేసారా?
– ఇంతవరకూ ఏమీ రాయలేదు. రాయాలనుకోలేదు. రాయాలనిపించనపుడు వద్దనుకునే అవకాశం ఎక్కడుంది? అయినా కులం ముఖ్యం కాదు వర్గమే ముఖ్యం.
– మీమీద విమర్శ ఉంది- నిలకడగా ఉండేవారు కారని.. అనార్కిస్టు భావుకుడు మీలో ఉన్నారని..
– నాకు ఫలానా సిద్ధాంతం నచ్చితే నచ్చిందని చెబుతా. నచ్చినట్టు నటించడం ఉద్యోగంలో భాగమైతే నటించా. న టించే బతికా.
– ఒకప్పుడు కమ్యూనిస్టులకు దగ్గరగా ఉండి, తరువాత ఎందుకు దూరమయ్యారు?
– ‘నువ్వు ఏ సిద్ధాంతం చెపుతున్నావో, అది నువ్వు పాటించడం లేదు. అపుడు నేను నీకు దగ్గరగా ఉండాలనుకోను’. అదే జరిగింది కమ్యూనిస్టు భావాల విషయంలో.
– చలంగారు గాక మీకు నచ్చిన ఇతర రచయితలు..
– లోకోద్ధరణకోసం రాస్తున్నాము అనేవాళ్లను నేను పట్టించుకోను. మాకు ఇష్టంలేనివైనా పొట్టకూటికోసమే రాస్తున్నామని తెగువతో చెప్పగల, నిజాయతీగల రచయితల పాదాలకు నమస్కరిస్తాను. – ‘జీవన సమరం’ రచన గురించి..

– దిక్కుమొక్కూ లేకుండా బతుకుతున్నవారి వద్దకు వెళ్లి వారిగురించిన విషయాలను కథనాలుగా రాసాను. అది ఈనాడులో సంవత్సరంపాటు వచ్చింది.
– అవమానాలు, ఛీత్కారాలు ఎన్నో అనుభవించి ఈ స్థాయిలో కొచ్చారు మీరు. అవి ఎదుర్కొన్న క్షణాల్లో మీకెలా అనిపించింది.
– అలాంటివి నేను పట్టించుకోలేదు. ఉద్యోగంలో కూడా పైవారు చెప్పిన పనిని,చెప్పని పనిని కూడా చేసుకుంటూపోయాను…
– మిమ్మల్ని ప్రోత్సహించిన వారు..
నా మొదటి పారితోషికం ఐదు రూపాయలు, ఆంధ్రజ్యోతి మాస పత్రిక నుంచి వచ్చింది. ధనికొండ హనుమంతరావు నా మొదటి కథను ఆ పత్రికలో 1947 ప్రాంతంలో ప్రచురించారు. ఉద్యోగం ఇచ్చింది త్రిపురనేని గోపీచంద్. ఆకాశవాణిలో చేరాక ఉద్యోగ విషయాల్లో మెలకువలు నేర్పి, తోడ్పడినవారు ప్రొడక్షన్ అసిస్టెంట్ వాడ్రేవు పురుషోత్తంగారు.
– యువరచయితలకు మీరిచ్చే సందేశం..
-నేను ఇంకా నేర్చుకునేస్థితిలోనే ఉన్నాను. అలాంటపుడు మరొకరికి ఇలా రాయండి అని ఎలా చెప్పగలను?

– ఇంటర్వ్యూ: యింద్రవెల్లి రమేష్
99854 40002
– స్కైబాబ

 

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

గణిత మేధావి.. హ్యూమన్ కంప్యూటర్..శకుంతలాదేవి ఇక లేరు!

గణిత మేధావి.. హ్యూమన్ కంప్యూటర్..
శకుంతలాదేవి ఇక లేరు!

 

బెంగళూరు, ఏప్రిల్ 21: గణిత మేధావి.. హ్యూమన్ కంప్యూటర్‌గా పేరొందిన శకుంతలా దేవి (84) కన్నుమూశారు! శ్వాసకోశ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను పదిహేను రోజుల క్రితం.. బెంగళూరులోని ఆసుపత్రిలో చేర్చ గా చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 8:15 గంటలకు తుదిశ్వాస విడిచారని శకుంతలాదేవి ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ పబ్లిక్ ట్రస్ట్ ట్రస్టీ డీసీ శివదేవ్ తెలిపారు. శకుంతలాదేవికి ఒక కుమార్తె ఉన్నారు. ఆమె 1929 నవంబర్ 4న సంప్రదాయ కన్నడ బ్రాహ్మణ కుటుంబంలో బెంగళూరులో జన్మించారు. ఆమె తండ్రి సర్కస్‌లో పనిచేసేవారు.

మూడేళ్ల వయసులోనే పేకలతో ట్రిక్కులు చేయడం లో శకుంతల ప్రతిభను ఆయన గుర్తించారు. ఎంత ప్రతిభ ఉన్నా.. పేదరికం కారణంగా ఆమె చదువుకోలేకపోయారు. తల్లిదండ్రులు ఆమెను ఒకటో తరగతిలో చేర్చినప్పటికీ.. నెలకు రూ.2 ఫీజు కట్టలేక మధ్యలోనే బడి మాన్పించేశారు. అయితే, ఆమె ప్రతిభ గురించి అన్ని దిక్కులా వ్యాపించింది. ఆరేళ్లప్పుడు యూనివర్సిటీ ఆఫ్ మై సూర్‌లో, ఎనిమిదేళ్ల వయసులో అన్నామలై వర్సిటీలో.. గణితంలో తనకున్న ప్రావీణ్యాన్ని ఆమె బహిరంగంగా ప్రదర్శించారు.

1977లో.. 201 అంకెలున్న సంఖ్యకు 23వ వర్గాన్ని ఆమె తన మనసులోనే గుణించి 50 సెకన్లలో సమాధానం చెప్పి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. ఆమె చెప్పిన సమాధానాన్ని ద్రువీకరించుకోవడానికి శాస్త్రజ్ఞులు ఆ అంకెను వేగవంతమైన యూనివాక్ 1108 కంప్యూటర్‌కు ఫీడ్ చేయగా.. ఇదే సమస్యను పరిష్కరించడానికి దానికి ఒక నిమిషంపైగానే సమయం పట్టింది. అలాగే, 1980 జూన్ 18న.. ఇంపీరియల్ కాలేజ్, లండన్ కంప్యూటర్ విభాగం వారు ఆమెకు ఒక పరీక్ష పెట్టారు.

కంప్యూటర్ అప్పటికప్పుడు ఇచ్చిన రెండు పదమూడు అంకెల సంఖ్యలను గుణించి ఫలితం చెప్పమన్నారు. ఆ ప్రశ్నకు ఆమె సరిగ్గా 28 సెకన్లలో సమాధానం చెప్పి వారిని ఆశ్చర్యానికి గురిచేశారు. గత శతాబ్దిలో ఏ ఏడాదిలో ఏ నెలలో ఏ తేదీన ఏ వారం వచ్చిందో.. నిద్రలో లేపి అడిగినా ఠక్కున చెప్పే మేధస్సు ఆమె సొంతం. అంతేకాదు, ఆమె రచయిత్రి కూడా. గణితం, జ్యోతిషాలను అంశాలుగా తీసుకుని.. ఫన్ విత్ నంబర్స్, ఆస్ట్రాలజీ ఫర్ యు, పజిల్స్ టు పజిల్ యు, మాథబ్లిట్, ఎవేకెన్ ద జీనియస్ ఇన్ యువర్ చైల్డ్, ఇన్ ద వండర్‌లాండ్ ఆఫ్ నంబర్స్ వంటి పుస్తకాలు రాశారు.

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

‘’ టు సీ యు ఎగైన్’’ –కదా సంపుటి

   ‘’ టు సీ యు  ఎగైన్’’ –కదా సంపుటి

           Alice Adams అనే ఆవిడ రాసిన’’ to see you again’’ అనే కదల పుస్తకం చాలా బాగుంది ఆమె అమెరికా లోని సాన్ ఫ్రాన్సిస్కో నగరానికి చెందిన రచయిత్రి .మనుషుల అంత రంగాల్ని క్షున్నం గా పరిశీలించే నేర్పున్న ఆవిడ .దానిని అంత సూటిగా స్వచ్చం గా సినిమా రీల్ లాగా చూపించే ఒడుపూ  నేర్పూ ఉన్నావిడ .చాలా గొప్ప స్టైల్ లో రాసింది .

ట్రూ కలర్స్ అనే కధలో పెళ్లి చేసుకొంటానన్న లాయర్ లాస్ వేగాస్ జూదం లో ఒడి పోయి నందువల్ల రిలక్తంట్ గా ఉండటం ఈమెకూ అతని పై మోజు పోవటం గొప్పగా చిత్రీకరించింది .ఓ సినిమా చూస్తున్నంత అనుభవం పొందుతాం ఆ శైలి శైలూషియే..అలాగే’’ Teressa ‘’  కదా బాగా పండింది .కోకోనట్ తోటల్లో పని చేసే వాళ్ళ జేవితాల ప్రతి బింబం ఇది .జీతాలు పెరగవు .అడిగితే యజ మాని దౌర్జన్యాలు, చావులు .తండ్రిని చంపిన యజమానిని చంపి జైలుకు వెళ్తాడు ఒకమ్మాయి కొడుకు .జైలు జీవితం లో పోరాడలేక అక్కడే చని పోతాడు అది తెలిసిన తల్లి ‘’I have no fears now every thing befallen me ,for the rest of the days I am safe .i can go to sleep without fear .i could even wlak among north Americans fearing nothing .Now it will be possible for me to work in the great hotel .we live together by the sea and grow old and safe forever ‘’.అనుకొంటుంది ఆ తల్లి.తెరెసా  .తన ముగ్గురు పిల్లల్ని తీసుకొని పల్లెకు వెళ్లి పోతుంది .చాలా హృదయాలను కదిలించేదిగా ఉంటుంది ప్రతి సన్నీవేశమూ .గొప్ప నిర్వహణ అని పిస్తుంది .

            True colours కదా లో రచయిత్రి falling in love with people you hardly know of course is in some ways a problem ,it then occurred to me ,you know the shape and taste of each tiny vein in their flesh and all the secrets smell but may be not how they feel about money ,for example or how really they like to spend their time when they are not making love ‘’అని గొప్ప సత్యాలను చెబుతుంది .జీవితాలను కాచి వడబోసిన అనుభం మనకు ఆమె లో కనీ పిస్తుంది .

               Legends కదా లో ప్రేమికులు సరదాగా ఇలా తిట్టుకొంటారు ‘’if you are going to be such a silly bitch about it ‘’అని వాడు అంటే ‘’yes ,I am dumb bastard ‘’అంటుంది ఆవిడ .మొత్తం 19 కధలు అన్నీ బానే రాసింది .ఇవన్నీ శాన్ఫ్రాన్సిస్కో నగరం,దాని చుట్టూ జరిగిన కధలే .ఆ నగర వాతావరణం బార్లు ,రెస్టా రెంట్లు  మటల్స్ ,వగైరా లన్నీ చూపిస్తుంది .picturesque గా ఉంటుంది చదువుతుంటే .ఈ కదా సంపుటి చదవక పోతే ఒక మంచిపుస్తకం చదవ లేదన్న వెలితి ఉండేది అది తీరిందిప్పుడు .స్త్రీ మనస్తత్వాన్ని అద్దం లో చూపించింది .ఎక్కడా భేషజం కని పించదు .ఏదీ దాచుకోలేదు .కధల్లో ప్రేమ విషయాలు ,వాటి వైఫల్యాలు ,ఒంటరి జీవితాలు ,boy meet girl కధలు ,నలుగురైదుగురు పిల్లల్ని కని   ఆ  పిల్లల్ని వదిలేసి వేరే వాళ్ళను చేసుకొనే ఆడా ,మగా, తాడూ బొంగరం లేని జీవితాలు ఇందులో చూపించింది ఇదంతా ఆధునిక అమెరికా ప్రజా జీవితం ..ఎవరూ తృప్తిగా బతుకు తున్నట్లు అని పించదు .ఎక్కడో ఏదో వెలితి ,అసంతృప్తి ,ఆత్మను వదిలి భ్రమింటమే కని పిస్తుంది

               Tuth and consecenes కదలో ఉన్నత శ్రేణి కి చెందిన అమ్మాయి నిమ్న జాతి యువకుడూ ఎలిమెంటరి స్కూల్ క్లాస్ మెట్లు .ఆటపాటల్లో ఆడపిల్లలు ‘’ట్రూత్ ఆర్ కానస్సెంసేస్ ‘’అనే ఆట ఆడతారు .ఈ అమ్మాయి వంతు వస్తుంది .’సహారా  ఎడారిలో ఎండలో ఇసకలో పడుకుంటే ఒంటికి తేనే రాసి ఉంటె ,చెదలు నిన్ను తినటం ఇష్టమా ?కార్ జోన్స్ అనే వాడిని ముద్దు పెట్టుకోవటం ఇష్టమా / అని అడుగుతారు .ఆ అమ్మాయి అమాయకం గా అతన్ని ముద్దు పెట్టుకోవటమే ఇష్టం అంటుంది .పిల్లలు ఏడిపిస్తారామేను .అతను ఇవన్నీ పట్టించుకో వద్దన్నాడు .నల్ల గా ఉండే అతను ఒక సారి ఈ అమ్మాయిని స్కూల్లో ఒక మూల ముద్దాడి వెళ్లి పోతాడు .ఇక తనకేమీ సంబంధం లేనట్లు ప్రవర్తిస్తాడు .కాని ఆ అమ్మాయి జీవిత మంతా ఈ ఆలోచన లతోనే గడుపుతుంది .అతను త్వరగా ప్రమోషన్లు పొంది వేరే స్కూల్ లో చేరతాడు .బాగా చదివి మంచి పొజిషన్ పొంది సినీ స్టార్ ను పెళ్ళాడి తే, పై తరగతికి చెందిన ఈ పిల్ల అలాగే సాదా జీవితం సాగిస్తుంది

                 ఈ కధలన్నిటిలో పాత్రలన్నీ ‘’trying to free from constraining family bonds people be witched by capricious love ,people temporarily conquering old panics or changing in profound ways ‘’లా ఉంటాయని విశ్లేషకులు భావించారు .’’Alice demonstrates a new her special mastery of the short story ‘’అని ఆమె రచనలను మెచ్చారు విమర్శకులు .ఇది ప్రత్యక్షర సత్యం అని చదివి అనుభవించిన నాకు అని పించింది .ఒక్క మాటలో’’ simply superb ‘’‘’.ఈవిడ కధలన్నీ ప్రఖ్యాత అమెరికన్ కదా రచయిత’’ O Henry  award collection  ‘’కు ఎన్నికైన కధలే .అందుకే అంత స్తాయి లో ఉంటాయి .హెన్రీ ఎంత బాగా కధలు రాసి ఆ కట్టుకోన్నాడో ఆలిస్ కూడా అంతే .మనకు వాసిరెడ్డి సీతా దేవి కధలు గుర్తుకు వస్తాయి .

             మొదటి సారి అమెరికా వెళ్లి నప్పుడు నేను చదివిన ఈ కదా సంపుటి పై నేను 19 -7-2002 న నా డైరీ లో రాసుకొన్న విషయాలు ఇప్పుడు మీ కోసం అందించాను .

          మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ –21-4-13-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

తిక్కన లలిత కళా పీఠం-నెల్లూరు -ఉగాది సభల ఆహ్వాన పత్రిక -24-4-13 ,25-4-13

tikkana peetham -ugadi sabhalu tikkana peetham -ugadi sabhalu-4 tikkana peetham -ugadi sabhalu-2 tikkana peetham -ugadi sabhalu-3

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

దిఫిషర్ మాన్స్ సన్

   దిఫిషర్ మాన్స్ సన్

      మైకేల్ కోప్ఆంగ్లం లో రాసిన నవల ‘’దిఫిషర్ మాన్స్ సన్ ‘’.ఆద్యంతం కట్టి పడేసే నవల చేపలు పట్టే వాడి కొడుకు పరిస్తితుల ప్రభావం వాళ్ళ మళ్ళీ చేపలు పట్టేవాడే అవుతాడు అని నిరూపించిన నవల .సముద్రం మీద జీవితం ,ఎంత కస్టపడి చేపలు పట్టినా బ్రోకర్ల పైరవీల వల్ల  ,స్థానిక కట్టు బాట్ల వల్ల  ఈ కుటుంబానికి డబ్బు చాలా తక్కువ గానే వస్తోంది .కష్టం ఎక్కువ ఫలితం తక్కువ గా వారి జీవితాలు గడిచి పోతుంటాయి .తల్లికి తన కొడుకు ‘’నీల్ ‘’మళ్ళీతండ్రి లాగాచేపలు పట్టే వాడిగా జీవించటం ఇష్టం లేదు .కాలేజి లో చదువు కొమ్మంటుంది .  కాని కొడుకు నీల్ కు తండ్రీ ,కావాలి, తల్లీ కావాలి .తల్లి ఊహా సంచార జీవి .తండ్రి ప్రాక్టికల్ మాన్ ..ఈ రెండిటిని అర్ధం చేసుకొన్నవాడు కొడుకు .తండ్రి క్రమం గా ముసలి వాడై పోతాడు కనీసం బోట్ ను నడిపే ఓపిక లేని వాడవుతాడు .అప్పటికే రెండు ఆపరేషన్లు జరిగాయి ..కోలుకో లేక చని పోతాడు తండ్రి .అంతకు ముందే ఈ దరిద్రపు జీవితం వెగటుగా తోచి తల్లి తన దారి తాను చూసుకొంటుంది .’’కానెరీ ‘’నడుపుతూ వేరోకడిని పెళ్లి చేసుకొని వెళ్లి పోతుంది .తల్లీ తండ్రీ ఇద్దరు లేని అనాధ అవుతాడు నీల్ ..కాని తరతరాలుగా వారిది చేపలు పట్టే వృత్తి .కనుక తమ్ములు ముగ్గురి తో కలిసి నీల్ ఒక కొత్త బోట్ ను కొంటాడు .మళ్ళీ ఆ కుటుంబం సముద్రం పై జీవనం ప్రారంభిస్తారు .

            నవల మంచి నడకాలో,  శైలి లో సాగుతుంది .చక్కని సంభాషణలు మనసును కట్టిపడేస్తాయి .చాలా వేగం గా చదివించే లక్షణం ఉన్న పుస్తకం ఇది .రచయిత Michael Koepe ‘’కూడా చేపల వ్యాపారం చేసే వాడే అవటం వారి సాధక బాధకాలన్ని కళ్ళకు కట్టి నట్లు వర్ణించ గలిగాడు . అతనికి టీచర్ గా ఉన్న అనుభవమూ రచనకు తోడ్పడింది.మంచి ప్ప్రీ సేన్తెషన్ ఇవ్వ గలిగాడు . రచయిత .దీన్ని గురించిన ప్రశంసలు చాలా ఉన్నాయి అందులో ఒకటి రెండు చూద్దాం

‘’it is an intimate story of a troubled family and an evacuative memorial to the  fast disappearing world of commercial fishermen .In mascular ,poetic prose and with a powerful sense of authentic ‘on every page ,the author has created a triumphant novel about our life to childhood and the pull of the sea ‘’

         ‘’the fisherman’s life was empty of pity was his father’s body was out of balance because his mind was ?could it be that all men were fishermen ,sailors on a pitiless sea carried the way and that by tide and current ,lost in fog ,lashed by endless waves if un certainty ?was life itself without balance?Did his father mirror it in the unseen depths of his heart ?’’  ఇవన్నీ జీవిత సత్యాలే నని పిస్తాయి అవే ఈ నవలలో అడుగడుగునా ప్రతి ఫలించి గొప్పదనాన్ని చేకూర్చాయి .

            నీల్ తన తండ్రి అస్తికలను సముద్రం లో కలుపుతాడు ఈ  సెంటి మెంట్ మన వాళ్ళదే వాళ్ళకూ చేరింది .మంచి కుటుంబ బాంధవ్యం ,ఆప్యాయతా ,ప్రేమా ,బాధ్యత లతో బాటు ఆధునికత ,దాని పై మోజు ఉన్న తల్లీ అంతా మనకు కళ్ళ ముందు కనీ పిస్తారు గురజాడ వారి మనుమడు ‘’గణేష్ పాత్రో ‘’రాసిన‘’పావలా ‘’నాటకం మనకు గుర్తుకొస్తుంది .అందులో రేడియో కోసం మిశ్రో ,పావలా శ్యామల నటించన తీరు ముందు నిలుస్తుంది ..

            అంతే కాదు ఎర్నెస్ట్ హెమింగ్ వే రాసిన నవల ‘’the old man on the sea ‘’కు నోబెల్ ప్రైజ్ వచ్చిన విషయమూ గుర్తుకొస్తుంది నిజ జీవితాలను అద్భుత శిల్పం తో మలిచాడు హెమింగ్వే .హాట్స్ ఆఫ్ అని పిస్తుంది .హెమింగ్వే కు నోబెల్ పురస్కారం లభించింది అని ఒక సారి తన తో విజయ వాడ రోడ్డు మీద నడుస్తున్న విశ్వనాధ తో ప్రోలా ప్రగడ సత్య నారాయణ మూర్తి గారు అన్నారట .విన్న విశ్వ నాద ‘’ఒరే  నువ్వు ఆ నవల చదివావా ?’’అని అడిగారట .అయన ‘’లేదు ‘’అని అన్నారట .’’మీరు చదివారా గురువు గారూ ‘’అని మళ్ళీ మూర్తి గారి ప్రశ్న ..దానికి విశ్వనాధ ‘’ఒరే ఆ నవల మార్కెట్ లో రిలీజ్ అయిన వెంటనే నాకు అమెరికా నుంచి మిత్రుడొకడు కాపీ పంపాడు .వెంటనే చదివేశా ..దీనికి ఏదో గొప్ప ప్రైజ్ వస్తుందని అనుకొన్నా ‘’అన్నారట .’’దీనికి నోబెల్ రావటం పై మీ అభిప్రాయం ?’’మళ్ళీ ప్రోలా ప్రగడ వారి  సంధించిన ప్రశ్న .కల్ప వృక్ష స్వామి ‘’ఒరే వాడు మన’’ గీత ‘’ను అర్ధం చేసుకోన్నాడురా .మన వేదాంతానికి అంత ప్రాచుర్యం ఉంది .దాన్ని చిన్న కధలో ఇమిడ్చి ప్రతి వాక్యాన్ని రసాత్మకం గా రాశాడురా ..’’కర్మన్యేవాదికారస్య ‘’అన్నదే దీనిలోని ముఖ్యమైన ముడి .దాన్ని అందుకున్నాడ్రా హెమింగ్ వే .అందుకే నోబెల్ వచ్చింది .మనం అన్నీ ఇవే చెబుతాము కాని నవలా, కదా, నాటకాలలో వీటిని నిక్షిప్తం చేస్తే హిందూ భూతం పట్టిందేమో నని మన వాళ్ళు అనుకొంటారన్న భయం మనకు .కాని వాడు భారతీయ ఆత్మ ను పట్టుకోన్నాడ్రా .అందుకే అంత అత్యుత్తమ పురస్కారం కొట్టేశాడు  మనం కూడా గర్వ పడాలి భావం మనదే అయి నందుకు .హెమింగ్ వే ను చూసి ‘’అని మన సారా అభినందిన్చారట వేయి పడగల స్వామి .ఈ విషయాలన్నీ 2002  మార్చి లో బెజవాడ లో భారతీయ సాహిత్య పరిషద్ ‘’కదా రచన ‘’పై ఒక సెమినార్ జరిగితే ప్రోలా ప్రగడ వారే స్వయం గా చెప్పారు నేనూ, మా బావ మరది ఆనంద్ కూడా ఆ సెమినార్ లో పాల్గొన్న వాళ్ళమే .

        ఇప్పుడు నేను రాసిన the fisherman’s son ‘’గురించిన విషయం మాత్రం మొదటి సారి2002 లో అమెరికా వెళ్లి నప్పుడు చదివి,16-7-2002 మంగళ వారం నా డైరీ లో రాసుకొన్న విషయాలు.ఇప్పుడు మీ కోసం అందించాను .ఇలాగే కొన్ని పుస్తకాలు కొందరు  రచయితలపై అప్పుడు నేను చదివి రాసుకొన్న విషయాలు వీలు వెంట మీకుఅంద జేస్తాను .

                   మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –20-4-13-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

విశ్వనాధ కల్ప వృక్ష వైశిష్ట్యం

           విశ్వనాధ కల్ప వృక్ష వైశిష్ట్యం

         ‘’  సహృదయ చక్రం ‘’పేర ఆచార్య కోవెల సుప్రసన్న గారు వెలువ రించిన విషయాలే క్రోడీకరించి మీ ముందుఉంచుతున్నాను .తన రామాయణానికి జాతీయ చైతన్య స్రవంతి వాహిక గా తీర్చి దిద్దాలనే తపన ఉన్న వాడు విశ్వనాధ .వాల్మీకి అంటే అమిత భక్తీ విశ్వనాధకు .అందుకే కై మోడుస్తూ

‘’ఈ సంసార మిదేన్ని జన్మముల కేని మౌని వాల్మీకి భా

   షా సంక్రాంత ఋణంబు తీర్చగాలదా ?తత్కావ్య నిర్మాణ రే 

   ఖా సామగ్రి ఋణంబు తీర్చగలదా ?కాకుత్సుడౌస్వామి ,గా

   ధా సంపన్నత భక్తీ దీర్చినను ద్వైతా ద్వైత మార్గంబులన్ ‘’

       అందుకే విశ్వనాధ తన రామాయణాన్ని వాల్మీకి కి భాష్యప్రాయం అని చాలా సార్లు చెప్పుకొన్నాడు .తన కృతి వాల్మీకికి ప్రతికృతి మాత్రం కాదు .తనను సర్వకాల సర్వా వస్తలలో ‘’రామ చంద్ర పద పద్మాదీన చేతస్కుడను ‘’అని వినయం గానే అయినా నిగ్రహం గా చెప్పుకొన్నాడు .కల్ప వృక్షం కూడా ఇతిహాస లక్షణం కలిగినదే .మానవ జీవితం లోని ప్రతి దశనూ ఆవరించే ఇది నడిచింది ఉన్న 32 ఖండాలు దేనికదే ప్రత్యెక కావ్యమే .

                 బహు విధ శిల్ప విన్యాసాన్ని కదా కధనం  లో ప్రయోగించిన విశిష్ట ప్రయోగ కవి విశ్వనాధ .ఒక్కో సారి నాటకాలుగా ,చలన చిత్రాలుగా ,చిత్రకళా ప్రదర్శనల్లా ఉంటె వేరొక చోట చర్చోప చర్చలుంటాయి మరికొన్ని చోట్ల విపుల వ్యాఖ్యాన గర్భితం గా వర్ననాత్మకం గా ఉండటం విశ్వనాధైక మార్గం .తన మార్గం నన్నయ తిక్కనల మార్గాల మేలు కలయిక అన్నాడు వేయి పడగల స్వామి .కల్ప వృక్షం అంతా కదా కదన కౌశాలమే నంటారు సుప్రసన్న .పాత్రల మనో లక్షణాన్ని తీర్చి దిద్దటం లో విశ్వనాధ తర్వాతే వ ఎవరైనా .అయన మనస్తత్వ శాస్త్రపాండిత్యానికి మనం శిరసు వంచాల్సిందే .హేతు కల్పనల వెంట ఆయన బుద్ధిని పరిగెట్టిస్తాడు .

             జీవులందరూ అంతస్సులో పరమేశ్వరాన్వేషణ చేసే వారే .కనుక అందరిలో దైవ చింతన మనసు పొరల్లో ఉంటూనే ఉంటుంది .దైత్య ప్రకృతి వాచ్యం గా ఉంటె దైవీ ప్రకృతి వ్యంగ్యీ భూతం గా ఉంటుంది.రావణుని సంభాషణల్లో ఈ ప్రకృతిని బాగా చూపిస్తాడు విశ్వనాధ .సీతను జగన్మాత గా అరాదిస్తున్నట్లు తానామే భక్తుడైనట్లు ధ్వనిన్చేవే అతని పలుకులన్నీ .పోతన లో బీజ ప్రాయం గా ఉన్న ఈ భావం విశ్వనాధ లో విజ్రుమ్భించింది అంటారు కోవెల వారు .

             రామాయణ కదా దైవీ ఆసుర శక్తుల సంఘర్ణమే నని విశ్వనాధ భావించాడు .దైవీ శక్తుల విజయమే కల్ప వృక్ష ఇతి వృత్తం .అందుకని ఇది వర్త మాన పరిధి ని దాటి సార్వ కాలిక మైనదైనది అంటాడు సుప్రసన్న .మరి దీన్ని నిబందిన్చాతానికి విశ్వనాధ విశిష్ట శైలీ ని ఎంచుకొన్నాడు ‘’నా చేత శబ్దమేరటకు చిన్నము నిలవదు ‘’అని తన మనో ధర్మాన్ని ఒప్పుకొన్నాడు .అంటే భావ తీవ్రుడాయన .ఆయన భావమే శబ్దాన్ని ఎన్నుకొంటుంది అయన ఎంచుకోడు .ఇదీ విశ్వనాదీయం .భావ వేగం తో శబ్దం దానంతట అదే రూపొందుతుంది అది సంస్కృతమా తెలుగా రెంటి మేళ విమ్పా అని ఉండదు అంతే అక్కడ ఆ శబ్దం వచ్చి కూర్చుంటుంది .విరుపులు ,ఒడుపులు అన్నీ అవే చోటు చేసుకొని వచ్చి కూర్చుంటాయి .అందుకే తన కవిత ‘’తేనెల్ వారును ,మేఘ గర్జనలు వీతేన్చున్ పికీ కన్యకా నూనా వ్యాహృతి మాదు పంచమము చిందున్ దయో నదాంభః కాన శ్రీ నృత్యంబులు చూపు మత్కవిత ‘’అన్నాడు .అంతటి వైవిధ్యం ఆయన కవితది .’’ఔచితి లేదు ,భాషలేదాక్రుతి లేదు యూరక రసాత్మనే స్రవించి పోదు ‘’అని నిసర్గ రమణీయం తన కవిత అంటాడు

    కల్ప వృక్షం లో విశిష్టాద్వైతం లోని శరణా గతి ధర్మాన్ని బాగా వ్యాఖ్యా నించాడు విశ్వనాధ .అరణ్య కాండలో మహర్షుల విభిన్న తపో లక్షణాలు కన్పిస్తాయి .భక్తిలో ఉన్న వై లక్షణం అంతా గోచరిస్తుంది .రావణాసురుని లో శ్రీ విద్య ఉంది .సీతా దేవి పరాశక్తి మంత్రం శాస్త్ర రహస్య మంతా ఇందులో నిండి ఉంది .వాల్మీకి మహర్షి సుందర కాండ లో ‘’సుందర  హనుమ మంత్రాన్ని’’ నిక్షేపిస్తే విశ్వనాధ ‘’ఆపదుద్ధారక హనుమంమంత్రాన్ని’’ నిక్షేపించాడని వ్యాఖ్యానించారు సుప్రసన్నా చార్యులు .అందుకే ఆ మంత్రం ద్రష్ట శచీ పురందర రుషి తరచుగా హనుమత్ స్తోత్రం చేయటం కనీ పిస్తుంది .అడవిలో రామ లక్ష్మణుల తో వెళ్ళే సీతను వర్ణించే సీస పద్యాలలో ‘’సౌభాగ్య లక్ష్మీ స్తోత్రం ‘’ఉందంటారు ద్రష్ట సుప్రసన్న .అసలు రావణుడే దక్షిణ ఆమ్నాయం లోని ‘’ఖగ రావణ మహా మంత్రానికి ‘’అది దైవతం అని తేల్చారు ఆచార్యుల వారు .నన్నయ గారి భారత లక్షణాలన్నీ కల్ప వృక్షం లో సంపూర్ణం గాఅన్వ యిస్తూ ఉంది అని గొప్ప కితాబునిచ్చారు డాక్టర్ సుప్రసన్న ..’’నా సకలోహ   వైభవ సనాధము ‘’అని విశ్వనాధ చెప్పుకోవటం ఇందుకే నంటారు సుప్రసన్న .

             శ్రీ రామ నవమి శుభా కాంక్షలతో

             మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ -19-4-13-

Posted in రచనలు | Tagged | Leave a comment

వంశీ – జ్ఞానపీఠ ఆలస్యానికి నమస్కారం

20130418a_01010100420130418a_011101002

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

అంతా రామ మయం

అంతా రామ మయం


శ్రీరామ నవమినాడు దేశ విదేశాల భక్తులంతా భద్రాచలం చేరుకుంటారు. సీతారాముల కల్యాణోత్సవం కనులారా వీక్షించాలని తపిస్తారు. అలాంటి రాముని సేవలో తరిస్తున్న భద్రాద్రి దేవస్థానాచార్యులు కొమాండూర్ ఇళైయవిల్లి స్థలశాయి, ఆలయ ప్రధాన అర్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు తమ అనుభవాలను ఇలా పంచుకుంటున్నారు..
12 సంవత్సరాల పుణ్యకాలం
– కొమాండూర్ ఇళైయవిల్లి స్థలశాయి, భద్రాద్రి దేవస్థానం స్థానాచార్యులు
“అటు గోదారి తల్లినీ, ఇటు జగదభి రామున్నీ చూసి తరించడం మొదలై దశాబ్దంపైగానే గడచింది. నిర్వ్యాజమైన స్వామి కటాక్షంతో 2001 అక్టోబరు 25వ తేదీ నుంచి స్థానాచార్యులుగా స్వామి సేవకై నియమితమయ్యాను. 2002 నుంచి శ్రీరామ నవమి ఉత్సవంలో జరిగే సీతారాముల కల్యాణంలో పాల్గొంటున్నాను. కల్యాణోత్సవంలో భాగస్వామ్యం వహించడం నిజంగా ఎంతో అదృష్టం. శ్రీరామ నవమినాడు ఆ శ్రీరామచంద్ర ప్రభువే ఈ క్షేత్రాన్ని ఆవహించాడేమో అనే అనుభూతి కలుగుతుంటుంది నాకు.

ఆధ్యాత్మిక ధామం…
అనేక వేల సంవత్సరాలు భద్ర మహర్షి చేసిన తపస్సుకు ఫలంగా వైకుంఠ నా«థుడైన శ్రీమన్నారాయణుడు రామచంద్ర మహాప్రభువుగా, స్వయంభువుగా వెలసిన పుణ్యక్షేత్రం భద్రాచలం. ఈ రాముని సన్నిధి ఒక ఆధ్యాత్మిక ధామం. ఇంద్రాది దేవతలతో, దేవర్షి నారదునిచే పూజలందుకున్నాడు భద్రాద్రి రాముడు. పోకల దమ్మక్క అనే ఒక ఆదివాసీ భక్తురాలికి పుట్టలో దర్శనమిచ్చాడు. గొప్ప వాగ్గేయకారుడు, మహా భక్తుడైన భక్త రామదాసు నిర్మించిన ఈ ఆలయంలో కొలువై అందరికీ దర్శనమిచ్చే మహా భాగ్యాన్ని ప్రసాదించిన భక్త వరదుడీ రామచంద్రుడు. అందుకే ఇక్కడ ఏటా జరిగే కల్యాణోత్సవం నిత్యనూతనంగా అనిపిస్తుంటుంది. సీతారాములిద్దరూ తమ కల్యాణాన్ని ప్రత్యక్షంగా తామే జరిపించుకుంటున్నట్లుగా అనిపిస్తుంది.


ఇక్కడి నుంచే ఆరంభం…
దేశ వ్యాప్తంగా ఎన్నో శ్రీరామక్షేత్రాలున్నా.. ఇతర రాష్ట్రాల్లోని కొన్ని రామాలయాల్లో నవమి నాడు సీతారాముల కల్యాణం జరిపించే ఆచారం లేదు. భద్రాచలంలో జరిగే కల్యాణోత్సవం ఎప్పుడయితే మీడియా ద్వారా ప్రచారం పొందిందో అప్పటి నుంచే ఇతర రామాలయాల్లో సీతారాముల కళ్యాణం ఆరంభమయింది. ఆ కళ్యాణోత్సవం భద్రాద్రిని పోలి ఉండేలా చూసుకుంటున్నారు. అంతేకాదు ఇక్కడి మాదిరిగానే శ్రీరామ నవమినాడే ఆ ఉత్సవాన్ని జరిపించుకునే పద్ధతీ అలవాటు చేసుకున్నారు.

అజరామం..ప్రామాణికం
ఇప్పటి వరకు నేను దక్షిణాదిన ఉన్న అన్ని రామాలయాలను దర్శించుకున్నాను. అలాగే అక్కడక్కడ జరిగే కల్యాణోత్సవాలను కూడా చూశాను. పాల్గొన్నాను. కాని ఈ క్షేత్రంలో జరిగే కల్యాణోత్సవమే గొప్ప ఆధ్యాత్మికానుభూతిని కలిగించింది. ఈ క్షేత్రంలోని కల్యాణోత్సవ ప్రక్రియే చాలా ప్రామాణికమైనదిగా నాకు అనిపిస్తుంటుంది. కొన్ని వందల ఏళ్లుగా నిరాటంకంగా, పాంచరాత్రగమశాస్త్ర బద్ధంగా సీతారామ కళ్యాణం ఇక్కడ జరుగుతోంది. 2011లో జరిగిన పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకోత్సవం, అప్పుడు దేవస్థానం నిర్వహించిన శ్రీరామ క్రతువు భద్రాచల క్షేత్ర చరిత్రలోనే గొప్పవి. సామ్రాజ్య పట్టాభిషేకోత్సవం జరిగిన తర్వాత పట్టాభిషేకోత్సవ ప్రాశస్త్ర్యం కూడా పెరిగింది. మన రాష్ట్రం, ఇతర రాష్ట్రాల్లోని కొన్ని రామాలయాల్లో ఇక్కడి నుంచి అర్చక స్వాములను పిలిపించుకొని పట్టాభిషేకోత్సవాలు, కల్యాణోత్సవాలను జరిపించుకుంటున్నారంటేనే భద్రాద్రి గొప్పతనం అర్థం చేసుకోవచ్చు.

ఆనందసమయం…
సామ్రాజ్య పట్టాభిషేకోత్సవంలో పాల్గొనడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. ముఖ్యంగా పట్టాభిషేకోత్సవం శ్రీరామునికి మాత్రమే చేసుకునే ఒక గొప్ప సేవ. ఈ సేవను ఇంకా బాగా విస్తరింపజేయవలసిన అవసరం ఉంది. దీనిని ఎంత వైభవంగా జరిపితే మన రాష్ట్రం అంత సుభిక్షంగా ఉంటుందని నా విశ్వాసం. అయితే ఈ మధ్య మాత్రం కల్యాణోత్సవాల విషయంలో సంప్రదాయేతరుల జోక్యం పెరడంపై బాధ కలుగుతోంది. పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకోత్సవాలకు సంబంధించిన ఒక సావనీర్‌ను విడుదల చేయాలనుకున్నాం. సావనీర్ కమిటీలోని ఐదుగురు సభ్యుల్లో నేనొకడిని. అయితే కొన్ని కారణాల వల్ల సావనీర్ విడుదల చేయలేకపోయాం. దీన్ని ఒక లోపంగా భావిస్తున్నాను. గోదావరి నదీ స్నానం, భద్రాచల దర్శనం, శ్రీరామసేవ… ఇంతకంటే ఈ జీవితానికి కావలసింది ఇంకేముంది?”


పూర్వజన్మ సుకృతం
– పొడిచేటి జగన్నాథాచార్యులు,
భద్రాద్రి దేవస్థానం ఆలయ ప్రధాన అర్చకులు
కంచర్ల గోపన్న రామాలయాన్ని నిర్మించాక పూజా కార్యక్రమాలు చేసేందుకు తమిళనాడు రాష్ట్రంలోని శ్రీరంగం నుంచి ఐదు కుటుంబాల వారిని తీసుకువచ్చారట. తూరుగోటి, కోటి, అమరవాది, గొట్టుపుళ్ల, పొడిచేటి కుటుంబాల వారు అందులో ఉన్నారు. అలా భద్రాద్రి చేరుకున్న వారిలో మాది పొడిచేటి వంశం. మా తాతల కాలం నుంచి మిరాశిల వ్యవస్థ అమల్లో ఉంది. మా నాన్న గారు పొడిచేటి శేషాచార్యులు 82 ఏళ్ల వరకు అర్చకత్వ బాధ్యతలు నిర్వహించారు. 1968 నుంచి 1972 వరకు నేను ఆలయంలో అర్చకునిగా పని చేశాను. అనంతరం నన్ను దేవాదాయ శాఖలోకి రెగ్యులర్ ఉద్యోగిగా తీసుకున్నారు.

వారధికి బీజం…
ఏటా చైత్రశుద్ద నవమి నాడు శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణం మిథిలా స్టేడియంలోని శిల్పకళాశోభితమైన కల్యాణ మండపంలో నిర్వహిస్తున్నారు. ఇందులో నాకు అర్చకునిగా బాధ్యతలు నిర్వహించే అవకాశం లభించడం పూర్వ జన్మసుకృతంగా భావిస్తా. ఇప్పటి వరకు సుమారు 30కి పైగా కల్యాణాల్లో పాల్గొన్నాను. తొలి నాళ్లలో భద్రాద్రిలో రామయ్య కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పడవలు, లాంచీల పై వచ్చేవారు. నాకు పదేళ్ల వయసు ఉన్నపుడు శ్రీరామ కల్యాణం చూడటానికి పడవలపై వచ్చిన జనం గోదావరిలో మునిగిపోయి చచ్చిపోయారు. ఆ ప్రమాదంలో వందలాది మంది మృతి చెందడంతో గోదావరిపై భద్రాచలం వద్ద వారధికి పునాది రాయి పడింది.

మరపురాని జ్ఞాపకాలు…
60 ఏళ్లకోసారి నిర్వహించే మహాసామ్రాజ్య పట్టాభిషేకం 1987లో జరిగింది. దానిని నేను ఎన్నటికీ మరిచిపోలేను. అలాగే 2011లో జరిగిన శ్రీరామ పట్టాభిషేకం చూసినపుడు కూడా ఆ రాముడే దిగివచ్చాడేమో అన్న అనుభూతి కలిగింది. ఆ రోజు ఇసుక వేస్తే రాలనంతమంది భక్తులు భద్రాద్రి పురవీధుల్లో దర్శనమిచ్చారు. అయితే తొలినాళ్లలో కల్యాణం నిర్వహించిన పరిస్థితులకు నేటికీ ఎన్నో మార్పులు వచ్చాయి. తొలుత రామదాసు నిర్మించిన యాగశాల పై భాగంలో కల్యాణ మండపం ఉండేది. అక్కడ కల్యాణం నిర్వహించేవారు. అప్పట్లో స్వామి వారి కల్యాణాన్ని తిలకించేందుకు వెయ్యి మందే వచ్చేవారు.

కాలక్రమేణా భక్తుల రాక పెరగడంతో చిత్రకూట మండపం ఎదురుగా డబుల్ మండపంలో కల్యాణం నిర్వహించారు. ఆ తరువాత 1964లో ఏప్రిల్ 6న నీలం సంజీవరెడ్డి ఆరంభించిన కళ్యాణ మండపంలో కళ్యాణోత్సవం మొదలు పెట్టారు. అప్పటి నుంచీ అక్కడే ఈ వేడుక కొనసాగుతోంది. నేను ప్రధాన అర్చకునిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఇది రెండో కల్యాణం. భారతం, రామాయణం, భాగవతం, పాంచరాత్రగమం, ఇతిహాసాలు, పురాణాలు, దివ్య ప్రబంధాలు పఠించేందుకు పండితులు భద్రాద్రికి చేరుకోవాలనీ, అది ఒక సంప్రదాయంగా కొనసాగితే చూడాలనేది నా కల.

Posted in సేకరణలు | Tagged | Leave a comment

శ్రీ కృష్ణుడు ఇంద్రుని అవతారం

  శ్రీ కృష్ణుడు ఇంద్రుని అవతారం

           భగవాన్ శ్రీ కృష్ణుడు ఇంద్రుని అవతారం అని వేదాల ననుసరించి శ్రీ రమణ మహర్షి కి గురువు ఆయనతో ‘నాయనా ‘’అని గౌరవం గా పిలిపించుకొన్న కావ్య కంఠబిరుదాంకితులు వాసిష్ట గణపతి  మునిఅభిప్రాయ పడ్డారు వేదాలలో కుత్సుని సారధి గా చెప్పబడిన వాడే కృష్ణుడు. కుత్సుడు అంటే అర్జునుడు .ఋగ్వేదం 4-17-14  మంత్రం లో ఇంద్రుడు సూర్యుని రధ చక్రాన్ని తొలగించి యుద్ధం లో అర్జునుని పరాభవాన్నుండి కాపాడి నట్లు ఉందట .కృష్ణుడే  సూర్యుని కూడా మాయోపాయం చేత కూల గొట్టాడని ఆ రుక్కు తాత్పర్యం .అతని శరీరానికి మూల భూతం భూమి .సాధారణం గా అందరి శరీరాలకు భూమియే ప్రకృతి మరి కర్ణుడికి అవటానికి ప్రత్యేకత ఏమిటి ?/అని వితర్కించి గణపతి ముని భూదేవి  అంశావతారం పొందిన స్త్రీకి అతడు జన్మించి నట్లు తేల్చి అదీ విశేషం గా తెలియ జేశారు .కనుక కుత్సితుని రక్షించిన ఇంద్రుడే కృష్ణుడు అని తేల్చారు . అంశావతారానికి  అసలు అవతారానికి భేదం లేదని కృష్ణుని ఇంద్రావతారం గా నిగమాలు పేర్కొన్నాయి అని తెలిపారు .

             భారత ఇతి హాసం లో కృష్ణుని ‘’శౌరి ‘అన్నారు .వేదాలలో ‘’శూర దేవుని పౌత్రునిగ వర్ణించి ‘’శౌర దేవుడు ‘’అన్నారు .ఇతిహాసం లో దేవా అనే పదాన్ని వదిలేశారు .ఇంద్రునికి శౌర దేవత్వం కూడా అవతార సంబంధమే అని మంత్రం చెబుతోంది ఈ మంత్రం కర్త ‘’పురుహన్మా రుషి ‘’.ఆ మంత్రార్ధం –‘’శౌరదేవుడైన ఇంద్రా !లేగ దూడలను తీసుకొని వచ్చితల్లి ఆవు దగ్గర పాలను కుడిపించే వాడి లాగా పరలోకం చేరిన కుమారులను మూడు లోకాలలోనూ గాలించి వాళ్ళను తెచ్చి బతికించి ప్రాణ ప్రేరణ చేయి .’’.భాగవతం దశమ స్కంధం లో చనిపోయిన బ్రాహ్మణ బాలకులను శ్రీకృష్ణుడు బ్రాహ్మణుని కోరిక మేరకు పిలిచి పునర్జీవితులను చేసిన కధ మనకు తెలిసిందే .ఈ రెండు మంత్రాలకు కర్త అయిన పురుహన్మా రుషియే భాగవతం లో శ్రీ కృష్ణుని విద్యా చెలికాడు అయిన కుచేలుడనే సుదాముడు .అతడు ప్రేమతో తెచ్చిసమర్పించిన గుప్పెడు అటుకులు గ్రహించి అతనికి సాటి లేని సంపద నిచ్చి ఆదరించాడు బాల్య సఖుడైన కృష్ణుడు .

               ఋగ్వేదం 4-32-22-  రుక్కు లో కృష్ణుడు నందుడు అనే గోపాలకునికి పుట్టిన పుత్రుడని ఉంది .అదే భాగవతపురాణం  భారతేతి హాసాలలో కృత్రిమ పుత్రుడని పేర్కొన్నాయి .కనుక కృష్ణుడు ఇంద్రుని అవతారమే నంటారు వాసిష్ట ముని .ఇంద్రుని కి ఉన్న ‘’వసు ‘’శబ్దానికి ‘’దేవా ‘’కలిపితే వచ్చేది వసుదేవ నామమే .దానికి పుత్రార్ధ కం గా వచ్చే పేరే ‘’వాసుదేవ ‘’.ఈ రెండు మంత్రాలకు రుషి వసిస్టుడు .రెండో మంత్రం లో వసిస్టుడు‘’మన్య మానుడు ‘’ను తన శత్రువు గా పేర్కొన్నాడు .మరి వసిస్టుడు అంతటి గొప్ప వాడికి శత్రువు సామాన్యుడేవడు అవుతాడు అని ప్రశ్నించుకోవాలి .ఇక్కడ కొంత దూరా లోచన చేయాలంటారు ‘’నాయన ‘’.వసిష్ట శత్రువు అంటే వసిస్స్టుడికి శత్రువు కాదు ఆయన పురోహితుడు గా ఉన్న రాజుకు శత్రువు అని తీసుకోవాలని వివరణ ఇస్తారు .వేదాలలో సుదాసుడు అనే వాడు ఈయన శత్రువు అని ఉంది .సుదాసుని తండ్రి పిజ వసుడనే వాడు రాజు .తండ్రి కొడుకు లలో ఒకరితో మన్య మాన వంశీకులు యుద్ధం చేశారు .ఆ యుద్ధం లో ఇంద్రాదుల అనుగ్రహం పొంది రాజు దేవకుని చంపాడు .కనుక దీనిని బట్టి యుద్ధం చేసింది సుదాసుడే అని నిర్ధారించారు కావ్య కంఠులు .పది మంది రాజులు ఇతని శత్రువులని చెప్ప బడింది .అందులో ‘’భేదాకుడు ‘’అనే రాక్షసుడు కూడా ఉన్నాడు .ఈ యుద్ధం యమునా నదీ తీరం లో జరిగింది అని స్పష్టం చేశారు గణపతి ముని .దేవకుని రాజధాని మధుర అక్కడే ఉంది .దేవజుడితో బాటు అతని కుమారులూ చచ్చారు . .అప్పుడు దేవకుని తమ్ముడు’’ ఉగ్రసేనుడు ‘’రాజయ్యాడు .ఈ రాజరికం అకస్మాత్తు గా లభించింది దీనికి కినిసిన కంసుడు అతన్ని బంధించి తానే రాజై ఆర్యులన్దర్నీ ఓడించాడు .వాళ్ళు దిక్కు లేక పారిపోయారు అని భాగవత పురాణ కధనం .

                           ఇంతకీ మనకు దీని వల్ల తెలిసిన్దేమిటి ?దేవకుని   కూతురు’’ వికుంఠ .’’దేవకుని కూతురు కనుక దేవకీ అయింది .దైవకి అనే పదం ప్రాకృత భాష లో దేవకీ అయింది .వైకుంఠ నామం కృష్ణునికి చెందేది .ఈ పేరు తో కృష్ణుడు మంత్రం ద్రష్ట అయాడు .కృష్ణుడు అనే పేరఇంకొకరు కూడా మంత్రం ద్రస్టగా ఉన్నారంటారు గణపతి ముని .ఈయనే పాండవుల పితామహుడైన ద్వైపాయన మహర్షి అనబడే వేద వ్యాసుడు .ఇంత దూరం ఆలోచించి కావ్య  కం ఠులు నిర్ణయాలు చేస్తారు వారి సూక్ష్మ దృష్టికి అందనిది లేదు .ఇలాంటివి ఎన్నో వారు ‘’భారత చరిత్ర పరీక్ష ‘’లో త్రవ్వి పోశారు సంస్కృతం లో రాశారు .మన కు తెలియాలని శ్రీ రాణీ శేషాద్రి శాస్త్రి గారు  తెలుగు లోకి అందునా సులభ మైన తెలుగు లోకి అను వాదం చేయగా శ్రీ గుంటూరు లక్ష్మీ కాంతం గారు దీనిని 1961 లో ముద్రించి తెలుగు వారికి చేరువ చేశారు ఈ ముగ్గురు మహాను భావులకు ఆంద్ర జాతి ఎంతో రుణ పడి ఉంది  .

          వీలు వెంట మరిన్ని గణపతి ముని గారి భారత కధలను అందించ టానికి ప్రయత్నిస్తాను

                  శ్రీరామ నవమి శుభా కాంక్షలతో

       మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ – 18-4-13- ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మహర్షి స్థానానికి జ్ఞాన పీఠానికి ఎదిగిన రావూరి భరద్వాజ

మహర్షి  స్థానానికి  జ్ఞాన పీఠానికి ఎదిగిన రావూరి భరద్వాజ

‘’అవును నేను ఆకలి చంపుకోవటానికి ,టీ నీళ్ళు తాగటానికి డబ్బులకోసం అడిగిన వాడికల్లా వాడేది అడిగితే అది రాసి పారేశాను .ఆకలి నన్ను ఆ పని చేయించింది .’’అని చిత్ర గుప్త లాంటి పత్రికలకు సెక్స్ కధలు రాసినప్పుడు బాధపడ్డాడు ..తెనాలిలో  తమళుడు ప్రముఖ తెలగు  నవలా రచయిత అయిన’’శారద ‘’గా పిలువబడిన నటరాజన్ తో ,ప్రసిద్ధ హిందీ రచయితా రాహుల్ సాన్క్రుత్యాయన్ ను తెలుగు వారికి పరిచయం చేసిన ఆలూరి భుజంగ రావు ,పత్రికా సంపాదకుడు ధని కొండ హనుమంత రావు లతో నిద్ర లేని రాత్రులను, తిండి లేని  పగళ్ళను ఎన్నో గడిపి వారందరి ప్రేమను, ఆప్యాయతల్ని,కుటుంబ బాంధవ్యాలను పంచుకొన్నాడు .దేవుడే లడని వారి తో బాటు చాలా కాలం భావించి ఆ దిశ లోనే ఎన్నో మైళ్ళు ప్రయాణం చేసి ,చివరికి తనకు అత్యంత ఆప్తురాలు తన కష్టాలలో  కన్నీళ్ళలో కలేమిలో, కలిమిలో భాగస్వామి అయిన అర్ధాంగి కాంతమ్మ గారు మరణించటం తో జీవిత గమ్యాన్ని మార్చుకొని ఆమె లో దైవాన్ని దర్శించి అప్పటి  నుంచి ‘’ఈశ్వరుడే అన్నిటా ఉన్నాడు .ఆయన వల్లే సర్వం నడుస్తోంది ‘’అన్న ఎరుక కలిగి మహర్షిలా గడ్డం పెంచుకొని ఆయన్ను చూస్తేనే ఒక ఆధునిక భరద్వాజ మహర్షి లా దర్శనమిస్తు మహర్షి స్థానానికి ఎదిగి ఇప్పుడు అత్యున్నత జ్ఞాన పీఠం పై ఆసీను డవుతున్న వాడు ,ఎదిగిన మనిషి ఎరుక కలిగిన మనీషి ,మానవత్వానికి నిలువెత్తు ఉదాహరణ రావూరి భరద్వాజ ..మళ్ళీ పాతికేళ్ళ తర్వాతా జ్ఞాన పీఠం తెలుగు వారి తలుపు తట్టి ప్రవేశించింది .అందునా వచన రచనకు రావటం మరీ ఆనందం .ప్రతిభను ఇంతకాలనికైనా గుర్తించిన ప్రభుతకు అభినందనలు .ఎందరో తమిళ, కన్నడ రచయితలు యిట్టె కొట్టేసే జ్ఞాన పీఠం ఎందరికో ఆదర్శం గా నిలిచే తెలుగు వారికి ఆలస్యం గా రావటం బాధాకరమే .ఇంకా రావాల్సిన ప్రతిభా సంపన్ను లెందరో మనకున్నారు వీరికి త్వరలో దక్కాలని ఆశిద్దాం 

 

 

.

               భరద్వాజ అంటే మానవత్వం .దాన్ని అన్ని కోణాల్లోనూ దర్శించిన మహనీయుడు ఆయన .ఈ నాడు పత్రిక కు ఆయన ‘’జీవన సమరం ‘’శీర్షిక తో50 మంది వృత్తుల వారిని ప్రత్యేకం గా ఇంటర్వ్యు చేసి వారి జీవితాలలోని చీకటి వెలుగులకు అక్షర రూపం కల్పించి ,పాఠకులకు పరిచయం చేసిన తీరు’’నభూతో’’ అని పించింది. చెప్పే విషయం లో నవ్యత ఆయన ప్రత్యేకత .తాళాలు బాగు చేసే వాడు, గొడుగులు రిపేర్ చేసే వాడు ,చెప్పులు కుట్టేవాడు ఒకరేమిటి శ్రీ శ్రీ అన్నట్లు ‘’సమస్తవ్రుత్తులు ‘’వారిని మన ముందు నిల బెట్టి’’ఇదీ వారి జీవితం .ఏం సాయం చేయాలో చేసి ఆదుకోండి ‘’అని ప్రభుత్వాలకు ప్రజలకు చెప్పాడు అవి చదువుతుంటే కడుపు తరుక్కు పోతుంది ఒక వీడియో కెమెరా తీసుకొని మనల్ని తన వెంట తీసుకొని వెడుతూ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ గుండె చప్పుళ్ళను విని పిస్తూ కన్నీరు కార్పిస్తూ వారి దౌర్భాగ్యానికి ఏమీ చేయ లేని నిస్సహాయతను కళ్ళ ముందు కనపరచారు భరద్వాజ .ఇదొక సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది .నా ఉద్దేశ్యం లో అదొక్కటి చాలు భరద్వాజకు ఏ అవార్డు అయినా రావటానికి .

                               భరద్వాజ చేయని వృత్తి లేదు దేన్నీ చీదరించుకో లేదు .అవి తనకు అన్నం పెట్టాయనే కృతజ్ఞతా భావం ఆయన మాటల్లో, మనసులో ,రాతలో ప్రతి అంగుళం లోను కన్పిస్తుంది .అందరితో కలిసి పోయి పని చేశాడు .ఎవర్నీ దూరం చేసుకో లేదు అదీ భరద్వాజ వ్యక్తిత్వం .అవతలి వాడిలో స్నేహాన్ని, ఆప్యాయతను, ప్రేమను మాత్రమె దర్శించాడు ఇది చాలు ఆయన అంత ఎత్తుకు ఎదగ టానికి .మంచిని దర్శించాడు చెడుకు దూరమయ్యాడు .అందర్నీ అక్కున చేర్చుకొన్నాడు .గొర్రెలు కాశాడు ,ఇంటింటికీ పేపర్ వేశాడు ,ప్రెస్ లో అక్షరాలూ కూర్చాడు .అనేక వృత్తుల లో పని చేసి పొట్ట పోషించుకొన్నాడు భార్యకింత తిండి పెట్టాడు .జర్నలిస్ట్ గా ఆకాశ వాణి లో పని చేయటం తో అతని అక్షర అర్చన సార్ధక మైంది .సమాజం లోని అన్ని వర్గాల వ్రుత్తుల వారి జీవితాలను లోతుగా అధ్యయనం చేశాడు కనుకే అతను రాసింది అంతా వాసి గా మారింది గుర్తింపు ను తెచ్చింది మహా రచయిత గా మన్ననా వచ్చింది .అన్ని తనకు జీవిత పాఠాలు నేర్పాయి అని నిజాయితీగా చెప్పాడు .

                  భరద్వాజ ఎప్పుడో 35 ఏళ్ళ క్రితం రాసిన ‘’పాకుడు రాళ్ళు ‘’నవలకు ఇప్పుడు గుర్తింపు నిచ్చి పురస్కారం అందించటం ఎంత లేటుగా ప్రతిభను గుర్తిస్తారో తెలిపే ఉదాహరణ.మాత్రమె .ఆయన సాహితీవ్యాసంగం తక్కువేమీ కాదు .సుమారు  500 ఆణిముత్యాల్లాంటి కధలు రాశాడు .19 నవలలూ వెలువరించాడు .చిన్న పిల్లలకోసం నవలికలు రాశాడు తాను రాసిన వ్యాసాలను మూడు సంపుటాలుగా తెచ్చాడు .ఆ నాడే డిటెక్టివ్ నవలలూ ,శృంగార నవలలూ రాసిన చదివించే గుణాన్ని పెంచాడు .విజ్ఞాన శాస్త్రం లో తన ప్రతిభకు పాండిత్యాన్ని జోడించి 33వ్యాసాలను జనరంజకం గా రాశాడు .నాటకాలలోను తన ప్రావీణ్యాన్ని చూపి ఎనిమిది నాటకాలు రాశాడు భరద్వాజ .భరద్వాజ ఒక విశ్వ విద్యాలయం అని పించాడు విశ్వాన్ని ,అందులో ఉన్న ప్రతి రేణువును చదివాడు, అవగతం చేసుకొన్నాడు ఆ విజ్ఞాన సంపదను చదువరుల పరం చేసిన జ్ఞాన దాత అని పించుకొన్నాడు .అయన వచనం ప్రవాహ శీలత కలిగి ఉంటుంది ఎక్కడా క్లిష్టత ,అయోమయం కనీ పించవు అందుకే చలం తర్వాతా అంత ‘’రీడబిలిటీ ‘’ఉన్న రచయిత అని పించుకొన్నాడు భరద్వాజ . ఆయన రచనలు అనేక భారతీయ భాషల్లోకి ,ఆంగ్లం లోకి అనువదింప బడి గౌరవం పొందాయి . .

                         భార్య కాంతమ్మ గారి పై ఆయన ‘’ఎలిజీ లు ‘’రాశారు .అవీ మహా ప్రాచుర్యం పొందాయి .విశ్వనాధ వరలక్ష్మీ త్రిశతి తర్వాతా అంతటి ప్రాచుర్యం పొందిన ‘’స్మృతి కావ్యాలు అవి వీటిపై మా ఉయ్యూరు అమ్మాయి యనమండ్ర పేరయ్య గారి కుమార్తె అన్నపూర్ణా విశాలాక్షి (హైదరా బాద్ ) రిసెర్చ్ చేసి పుస్తకం రాసింది టి.వి.లో మాట్లాడింది. అయితే ఆమె, భర్త ఇద్దరు 1987 లో కేదార్నాద్ బదరీనాద్ యాత్రలో బస్ లోయలో పడి దుర్మరణం చెందటం విషాద సంఘటన . భరద్వాజ సాహిత్యం పై పుంఖాను పుంఖం గా పరిశోధనలు జరిగాయి .‘’భరద్వాజ భార్య కాంతమ్మ గారిని  అసలు మరచి పోనే లేదు ఆయన శ్వాస ఆమె గా భావించి జీవిస్తున్నాడు ఇదీ భారతీయ ఆధ్యాత్మిక భావానికి తురీయం ,పరాకాష్ట .దాన్ని సాధించాడు రుషి లాంటి జీవితం సాగిస్తున్నాడు .ఆయన మూర్తి దర్శనం ఒక దివ్యాను భూతి నిస్తుంది .సౌమ్యం గా మాట్లాడటం రాయటం భరద్వాజకు సహజాతాలు .’’శ్రీ మతి కాంతమ్మా భరద్వాజ ట్రస్ట్‘’నేర్పరచి తనకు వచ్చిన పారితోషి కాలన్నిటిని దానికి జమ చేస్తూ ప్రతి ఏడాది పేద విద్యార్ధులకు 5000రూపాయలు నగదు పురస్కారం అందిస్తూ సార్ధకం చేస్తున్న వాడు భరద్వాజ .

                 చదివింది ఏడవతరగతే .నేర్చింది అనంతం రాసింది బంగారం .మన పశ్చిమ కృష్ణా జిల్లాలో‘’మొగులూరు ‘’గ్రామంలో1927 లో జూలై 1 న  భరద్వాజ మల్లికాంబ ,కోటయ్య దంపతులకు జన్మించాడు ప్రాధమిక విద్య గుంటూరు జిల్లా తాడికొండలో .చిన్నతనం లోనే తలి దండ్రుల మీద మొదటి పద్యాన్ని ఛందస్సు నేర్చి చెప్పాడు .బడికి వెళ్ళాలంటే మంచి బట్టలు వేసుకు రావాలని ఆంక్ష పెడితే బడి మానేసి ప్రపంచాన్ని చదవటం మొదలెట్టాడు .ఏడు పాసై ఎనిమిది లో చేరేటప్పుడు జరిగిన సంఘటన ఇది. రాత్రిళ్ళు గుడిలో పడుకొని గ్రంధాలయం నుండి తెచ్చుకొన్న పుస్తకాలు చదివాడు .తర్వాతా తెనాలి నెల్లూరు ,మద్రాస్ లలో అనేక చిన్న చిన్న పనులు చేశాడు .

           భరద్వాజ పాత్రికేయ జీఎవితం ‘’జమీన్ రైతు ‘’తో ప్రారంభమైంది దానికి 1946 లో పని చేశాడు రెండేళ్ళ తర్వాత ‘’దీన బంధు ‘’పత్రిక కు ఇంచార్జి గా వ్యవహరించాడు  జ్యోతి, సమీక్ష ,యువ చిత్రసీమ ,సినిమా పత్రికలలో పని చేసి మంచి పేరు తనకు పత్రికలకు సంపాదించాడు ..1957 లో ఆలిండియా రేడియో కు జూనియర్ స్క్రిప్ట్ రైటర్ గా ఉద్యోగించాడు ఇప్పటి నుంచి జీవితం లో కొంత స్తిర పడ్డాడు అంతకు ముందు దాకా ఒక్కపూటే తిని అర్ధాకలి తో ఎన్నో ఏళ్ళు గడిపాడు .

                1983 లో భరద్వాజ కు కేంద్ర సాహిత్య అకాడెమి ,పురస్కారం ., రెండు సార్లు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ పురస్కారాలు లభించాయి .ఆంద్ర విశ్వవిద్యాలయం ‘’కళాప్ర పూర్ణ ‘’బిరుదు నిచ్చి సత్కరిస్తే బోయి భీమన్న అవార్డు ,భారతీయ భాషా పరిషద్ అవార్డులు వరించాయి .వ్యక్తీ గత ,సాహిత్య జీవితాలను ఎంతో నిబద్ధత తో సాగించిన గొప్ప రచయిత భరద్వాజ .జ్ఞానపీఠ పురస్కారం తో మళ్ళీ’’తెలుగు వచన సాహిత్యం’’ నిజం గానే జ్ఞాన పీఠం పై జ్ఞాన జ్యోతిస్సులను వెలువరిస్తోంది మానవీయతకు పట్టం కట్టిన మహోన్నత  సంస్కారి, మానవీయ విలువలకు నిలువుటద్దం రావూరి భరద్వాజ  ఇప్పుడు మన ముందున్న ఆధునిక భరద్వాజ  మహర్షియే . 86 ఏళ్ళవయసులో   వసంత వేళ వరించిన అభి నందన చందనమే ఇది ..

                మీ –గబ్బట దుర్గా ప్రసాద్ –18-4-13 ఉయ్యూరు 

 

Posted in సమయం - సందర్భం | Tagged | 4 Comments

నేటితో రామప్ప గుడికి 800 ఏళ్లు

శిల్పకళా శోభితం
– డా. సంగనభట్ల నరసయ్య

 

రామప్ప దేవాలయం శిల్పకళా శోభితం. దీని అందానికి మొదటి కారణం నల్లని గ్రానైట్ (చలువరాయి) శిలను వాడటం, రెండోది అద్దం లాంటి నునుపుదనం, మూడోది సునిశితమైన అతి సూక్ష్మమైన స్వర్ణాభరణ సదృశమైన జిలుగు పనితనం, నాలుగు పైకప్పులను మోసే నాగిని శిల్పాల విశిష్టత, శిల్పాకృతుల ముఖాల్లో హావభావాలు పలికించడం… కర్ణాటక రాష్ట్రంలో రామప్ప గుడికి సమ ఉజ్జీలైన హోయసల శిల్పారామాలు, హళేబీడు, బేళూరు దేవాలయాలు చుట్టూ అందమైన పూల తోటలతో, మంచినీటి సౌకర్యాలతో, పర్యాటక శాఖ వారి ప్రజా సౌకర్యాలతో, రాజమార్గాలతో అలరారుతున్నాయి. రామప్ప గుడి మాత్రం ఏ సౌకర్యమూ లేక ఉంది. దీన్ని అందమైన పర్యాటక స్థలంగా మార్చవచ్చు. 

నేడు చైత్యశుద్ధ అష్టమి, విజయనామ సంవత్సరం. సరిగ్గా నేటికి 800 సంవత్సరాల క్రితం శ్రీముఖ నామ సంవత్సరంలో శ్రీరామనవమికి ముందు రోజు క్రీ.శ. 1213లో రామప్ప దేవాలయాన్ని పాలంపేటలో రేచర్ల రుద్రారెడ్డి విగ్రహ స్థాపనాది క్రతువులతో ప్రారంభం చేసి శాసనం వేయించాడు. కాకతీయ సామ్రాజ్య వైభవాల్లో – తెలుగు నేల ఏకచ్ఛత్రాధిపత్యం క్రిందకు రావడం, తెలుగు భాషలో, అమరభాషలో కావ్యాల్లాంటి అందమైన కవితా పరిమళాలతో గుబాళించే శాసనాలు రావడం, ప్రజాహిత విధానాల ద్వారా ప్రభువులు ధర్మాత్ములని పేరుగాంచడం, విస్తృతంగా తెలుగు నేలతో విదేశీ వ్యాపారాలు జరగడం, అందమైన అపురూపమైన దేవాలయాల నిర్మాణం జరగడం పేర్కొనదగ్గవి. కాకతీయ ఆలయ శిల్పసంపద అనగానే రాశీభూతమైన సౌందర్యం, మానవ మేధకు పరాకాష్ఠ అయిన స్థాపత్యం, నిర్మాణ దృఢత్వానికి మారుపేరైన రుద్రదేవుని వేయిస్తంభాల గుడి, రుద్ర సేనాని రామప్ప దేవాలయం జ్ఞాపకం వస్తాయి.

రుద్ర సేనాని పాలంపేట సమీపంలో, ఆతుకూరు గ్రామంలో ఆలయం నిర్మించి, ఆలయంలో శాసనం వేయించారు. ఈ శాసనం బట్టి చాలా విశేషాలు తెలుస్తున్నాయి. 31వ పంక్తిలో ‘వీరస్య శ్రీరుద్ర చమూపతే:’ అని తనను రుద్ర సేనానిగా పేర్కొన్నాడు. ఇతని పూర్తి పేరు రేచర్ల రుద్రారెడ్డి. ఇతని జీవితం, కుటుంబ విశేషాలు అనేకం ఇందులో తెలుపబడ్డాయి. రుద్రుడొక్కడే కాక ఇతని పూర్వీకులు సైతం కాకతీయ ప్రభువులకు తండ్రి తాతల నుంచి చాలా విధేయతలతో సేవలందించారు. ఇతని వంశంలోని మూల పురుషుడు రేచర్ల బ్రహ్మన లేదా బమ్మారెడ్డి కాకతీయ ప్రభువు మొదటి ప్రోలరాజు వద్ద సైన్యాధిపతిగా పనిచేసి క్రీ.శ. 1052లో కాంచీని గెలిచి యుద్ధమందు ప్రభువు విజయానికి కారణమయ్యాడు. ప్రోలడు పశ్చిమ చాళుక్య సామంతుడై ప్రభువుల పక్షాన యుద్ధం చేశాడు. ఇతని మునిమనుమడు రేచర్ల కామయ లేదా కామారెడ్డి కాకతీయ రెండవ ప్రోలరాజు (గణపతి దేవుని తాత) వద్ద సైన్యాధిపతిగా పనిచేసి మాతెన గుండ రాజుతో యుద్ధం చేసి తన భుజబలంతో ప్రభువు విజయానికి కారణమయ్యాడు. కామయ కుమారుడు కాటయ కూడా రెండవ ప్రోలరాజు కొలువులోనే ఉన్నాడు. ఈ ఇమ్మడి కాటయ (భార్య బెజ్జమ్మ) కుమారుడైన రేచర్ల రుద్ర చమూపతి (శాసన పంక్తులు 59, 60) తొలుత కాకతి రుద్రుని వద్ద, పిదప ఆయన తమ్ముడు మహాదేవుని వద్ద, ఆపై మహాదేవుని కుమారుడు గణపతి దేవుని వద్ద సర్వ సైన్యాధ్యక్షుడుగా పనిచేశాడు.

రేచర్ల రుద్రుడు ‘మహాశూరుడు. స్వామిహిరుడు. సునిశ్చితమతి’ అని పాలంపేట శాసనంలో పేర్కొనబడినాడు. నిజంగా రుద్రుడే లేకుంటే కాకతీయ సామ్రాజ్యం గణపతి దేవుని కంటే ముందే సమాప్తమయ్యేది. కారణం, మహా దేవుడు దేవగిరి, ప్రభువుల తోటి యుద్ధంలో పరాజయం చవిచూసి యుద్ధనిహతుడైనాడు. రాజు చనిపోవడమే గాక యువరాజు గణపతి దేవుడు బందీ అయి చెరసాల చేరినాడు. ఆ విపత్కర పరిస్థితుల్లో రుద్రుడే ఒంటిచేత రాజ్యభారాన్ని వహించి, సైన్య సమీకరణ గావించి, శత్రువులను సంహరించి, యువరాజు గణపతి దేవుని విడిపించి, తిరిగి కాకతీయ సామ్రాజ్యానికి (ఓరుగల్లు నగరంలో) పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. మధ్యకాలం స్వల్పమే అయినా కాకతి సామ్రాజ్యానికి గడ్డు కాలం. ప్రభువు మరణం, యువరాజు చెరసాలలో బందీ, సామంతుల తిరుగుబాట్లు, వీటన్నిటినీ చక్కదిద్ది కొంతకాలం కాకతీయ సామ్రాజ్యాన్ని తానే నడిపాడు. కానీ ఆతడా విషయాన్ని స్పష్టంగా పేర్కొంటే రాజును ధిక్కరించినట్టవుతుందని గూఢంగా రామప్ప దేవాలయ శాసనంలో సూచించాడు.

‘కాకతీయ శ్రియాపాదే భూరిషు కంటకేషు నిహితే తీక్ష్ణేషు మోహాత్‌క్షణం’ అన్న రామప్పగుడి శాసనంలో కాకతీయుల అదృష్టదేవత ముళ్లపై నడుస్తున్న సమయంలో ఆ రాజ్యరమను కాపాడినాడని పేర్కొనడం ఈ సూచన. ఆ సమయంలో తానే రాజ్యాన్ని నిర్వహించానని సూటిగా చెప్పడం అవిధేయత కిందకు వస్తుంది. ‘కాకతీయ రాజ్య సమర్థం’, ‘కాకతీయ రాజ్య భార ధేరేయః’ ఇత్యాది బిరుదులు ఉప్పరపల్లె, దాక్షా రామ శాసనాల్లో పేర్కొనబడ్డాయి. (ఇంతకంటే స్పష్టంగా తానే ఏలినట్టు చెప్పడం భావ్యం కాదు గదా!)

ఆతుకూరు రుద్రేశ్వరాలయం అంటే ఎవరికీ తెలియదేమో కానీ పాలంపేట రామప్ప దేవాలయం అంటే అందరికీ తెలుసు. ఆలయంలో రుద్ర సేనాని వేయించిన శాసనం చాలా విశేషాలు చెబుతోంది. శాసనాన్ని అందంగా రాయించి, అందంగా చెక్కించి, మరింత అందంగా మంటపం కట్టించి, దేవుణ్ణి ప్రతిష్ఠించినట్టు నిలబెట్టిన వైనం చరిత్రలో భారతదేశంలో ఏ ఆలయంలో బహుశా కనబడదు. ఈ ఆలయం ఆధ్యాత్మిక శోభనిస్తే, దీని పక్కన రుద్రుడు తవ్వించిన రామప్ప చెరువు ప్రాకృతిక శోభకు, సస్యశ్యామలత్వానికి చిరునామాగా, రుద్రుని ధర్మాభి నిరతిని తెలుపుతోంది.

సంస్కృత భాషలో రచించబడ్డ దేవాలయ శాసనం ప్రాఢమైన రచన. 204 పంక్తులతో అనేకంగా వృత్తాలతో రచితమైంది. వేయి స్తంభాల గుడిలో గణపతి దేవుని పెద్ద తండ్రి కాకతి రుద్రుడు వేయించిన శాసన శైలిని పోలి ఉంది. ఈ శాసనాన్ని బట్టి ఆలయ ప్రధాన దైవం పేరు శ్రీ రుద్రేశ్వరుడు. ఆలయ నిర్మాత పేరు ఆలయ దైవం పేరులోకల్సి రుద్ర+ఈశ్వర అయినది. ఈ ఆచారం కాకతీయుల కాలంలోని విశేష లక్షణం. మిగిలిన చిన్న దేవాలయాలు తన తండ్రి తాతల పేర కాటేశ్వర, కామేశ్వర అనే పేర్లతో నిర్మించి, వాటికి అంగరంగ వైభోగాలకు ఉప్పరపల్లి, బొర్లపల్లి గ్రామాలు రుద్రసేనా ని దానం చేశాడు. ఈ ఆలయం గ్రామ మధ్యలో ఉన్నట్టు, ఆ గ్రామం పేరు ఆతుకూరు అని పేర్కొనబడింది. ప్రస్తుతం ఈ ఆలయం చుట్టూ పొలాలే తప్ప గ్రామం లేదు. కాలగర్భంలో కలిసిపోయింది. ఆ గ్రామం పక్కన చెరువు నిర్మించబడిందని, ఆ చెరువు ‘తత్పురీ దర్పణ నిభ:’ అని ఊరికి ము ఖం చూసుకోవడానికి అద్దంలా ఉందని వర్ణన ఉంది. చెరువు పేరు లేదు.

నేడు రామప్ప దేవాలయం, రామప్ప చెరువు పేరుతో పిలువబడుతున్నా ఈ రామప్ప ఎవరో తెలియదు. శాసనాల్లో లేదు. శిల్పి అని కొందరు చెప్పినా అది ఊహే. శిల్పి పేరుతో ఆలయాలు ఎక్కడా లేవు. నారప్ప అని పశ్చిమ చాళుక్య సేనాని ఒకడు నాటి శాసనాలలో ఉన్న పేరు (నగునూరు (కరీంనగర్ జిల్లా) వీరగల్లు లఘుశాసనం). అలాంటి వాడే ఓ సేనాని రుద్రునికి సన్నిహితుడై ఆలయ, తటాక నిర్మాణ పర్యవేక్షణ చేసి ఉండి ఉండును. లేదా రుద్రునికి ముందే ఈ ఆలయం ఒక చిన్న ఆలయంగా రామప్ప చేత నిర్మితం అయి అన్నా ఉండాలి. ఇవన్నీ ఊహలే. చెరువు మాత్రం రుద్రుని నిర్మాణమే. రుద్రుడు మరిన్ని చెరువులు తవ్వించినట్టు ఇతర ఆధారాలున్నాయి. తండ్రి కాటయ వలెనే రుద్రుడు కూడా చెరువులు తవ్వించాడని గొడిశాల శాసనం (శ.సం.1157 = క్రీ.శ. 1236) చెబుతోంది. రామప్ప దేవాలయ శాసనానికి 23 ఏళ్ల తరువాతి శాసనమిది.

(రామప్ప చెరువు ఒడ్డున మరొక ఆలయం నీళ్లలో ప్రతిఫలించేంత దగ్గరగా గట్టునే ఉంది. ప్రస్తుతం శిథిల స్థితిలో ఉంది. దీన్ని పునరుద్ధరిస్తే – దీంట్లో ఏదైనా శిథిలాల కింద శాసనం లభించవచ్చు. అప్పటికి ఏదైనా పరిష్కారం లభిస్తుందేమో!) రుద్రేశ్వరునికి ‘నడికుడి’ అనే గ్రామం దానంచేసినట్టు రామప్ప దేవాలయ శాసనం చివరి వాక్యంలో ఉంది.
కాకతి రాజన్యులే ధర్మాత్ములు. రెండవ ప్రోలడు ‘దారిద్య్ర విద్రావణ’ బిరుదాంకితుడు. అనగా ప్రజల దారిద్య్రం పోగొట్టినవాడు. అనేకములగు సముద్రముల వంటి చెరువులు నిర్మించిన ప్రభువు ప్రజల దరిద్రము పోగొట్టడా? వారి కర్షక సంక్షేమ విధానములట్టివి. ప్రోలునికి, రుద్రునికి పరనారీ సోదరులన్న బిరుదములున్నవి. శత్రురాజ కాంతలను ఆ విధంగా గౌరవించారు. తురక ప్రభువుల విధానం దీనికి భిన్నం. ఇంకొక్క విశేషం. ప్రపంచంలో ఏ రాజ వంశానికి దక్కని అపురూప గౌరవం కాకతి ప్రభువులకు దక్కింది. ఈ రాజ్యం అంతరించాక రెండు శతాబ్దాల తరువాతి కాలంలో ప్రజలింకా ఆ ప్రభువులను ధర్మాత్ములైన ప్రభువులని స్మరించుకొన్న వైనం చూస్తే ఒళ్లు పులకరిస్తుంది. క్రీ.శ. 1504 నాటి ఓరుగల్లు షితాబుఖాన్ శాసనంలో ‘పూర్వం కాకతి వంశ్య రాజ నివహై: ఆపాలితా ధర్మాత్మభి:’ (పూర్వం కాకతీయ వంశీకులు అయిన ధర్మాత్ములైన రాజులచే పాలించబడిన ఈ భూమి) అని పేర్కొనబడింది. ఆ ధర్మాత్ముల ఆలయ శిల్ప కళను, తటాక జలాలను కన్నుల కద్దు కుంటారు తెలంగాణ ప్రజలు నేటికి కూడా. వారి సేనాని రుద్రుడు ధర్మమూర్తి, వారి బాటలోనే నడిచాడు.

రామప్ప దేవాలయం శిల్పకళా శోభితం. దీని అందానికి మొదటి కారణం నల్లని గ్రానైట్ (చలువరాయి) శిలను వాడటం, రెండోది అద్దం లాంటి నునుపుదనం, మూడోది సునిశితమైన అతి సూక్ష్మమైన స్వర్ణాభరణ సదృశమైన జిలుగు పనితనం, నాలుగు పైకప్పులను మోసే నాగిని శిల్పాల విశిష్టత, శిల్పాకృతుల ముఖాల్లో హావభావాలు పలికించడం.
సుందర సువిశాల ప్రాంగణంలో వితర్దిక మీద ప్రదక్షిణా పథానికి వేసిన రాతి ఫలకాల విశాలత్వం వెనుక ప్రధాన ఆలయం చుట్టూ పిట్టగోడలా పేర్చిన రాతిఫలకాలు, వాటిపై తోరణాల్లా వరుసలు తీర్చిన గజసైన్యపు కవాతు, సింహాల వరుసలు, నాట్య భంగిమలు, దేశీయమైన జానపద నృత్య, వాద్యకారులు మనోహరంగా దర్శనమిస్తారు. త్రికూటాలయం, ఆలయానికి తూర్పుముఖ ద్వారం, ద్వారం ఎదురుగా హుందాగా కూర్చు న్న నందీశ్వరుని విగ్రహం దర్శనమిస్తాయి. మెడపట్టెలు, చిరుగంటలు మొదలు అందమైన ఆహార్యం, బలిష్ఠ శరీర సౌష్ఠవంతో ఈ నందీశ్వరుని చూడటానికి రెండు కళ్లు చాలవు. ఆలయం ప్రవేశించే ముందే కప్పు ను మోస్తున్న నాగిని లేదా మదనిక శిల్పాలు, ద్వాదశ మూర్తులు ఈ ఆలయ వైశిష్ట్యానికి మూలస్తంభాలు. అసామాన్య నాట్యకోవిదలు ఆభరణాలే ఆచ్ఛాదనగా, మరికొన్ని నగ్నంగా కనబడే ఈ శిల్పాల సౌందర్యం వర్ణించడం ఎవరి తరంగాదు. తైలస్నానం చేసి, అనాచ్ఛాదితంగా స్నానశాల నుంచి బయటికి వచ్చినట్టు కొందరికి కనిపిస్తే శాస్త్రీయమైన నృత్య భంగిమలతో, మృదంగ వాద్యకారిణులుగా, ఆభరణ ధారిణులుగా వివిధ మూర్తులుగా మరికొందరికి కనిపిస్తాయి.

గజకేసరి శిల్పాలు, రుద్రుని (భార్యాసహిత) శిల్పం, వివిధ భంగిమల నాట్యకారిణులు, పురాణ గాథలు గోడలకు స్తంభాలకు దర్శనమిస్తాయి. జాయసేనాని నృత్త విధానాలు, పేరిణి శివనాట్యం, కుండలాకార నృత్యాలు ఇలా ఆలయం నృత్య కళాకారులకు పాఠాలు నేర్పే ఒక నృత్య కళాశాలగా అలరారుతుంది. ప్రధాన ద్వారం దాటి మధ్య మంటపంలోకి వెళితే తల పైభాగాన గల శిల్పాలు, బహుభుజ రుద్రమూర్తి లాస్యం, అష్టదిక్పాలకుల శిల్పాలు, వృత్తాకార శిల్పాలు, మధ్యమంటప స్తంభాలపై నాలుగువైపుల ఫలకాలపై వేసిన ఒకే ఫ్రేములో బిగించిన సమగ్ర చిత్రాల వంటి శిల్పాలు, గర్భాలయ ద్వార బంధ శిల్పాలు, ఆలయంలో నిలిచిన మహాశివలింగ రూపం ఒక్కటేమిటి ఆలయంలో దశ దిశలు మెడతిప్పక, మడమతిప్పక, కన్నార్పక ఆ్రర్ద హృదయంతో నయనానందకర శిల్పాలే చూడగలం. రోజులుగా ఆరాధించవలసిన, అధ్యయనం చేయవలసిన, హృదయ మర్పించవలసిన శిల్పనిధి రామప్ప దేవాలయం. జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయ దర్శనం చేయని వారి జీవితం వ్యర్థమే.

ఒకప్పుడు దీని గోపురం చాలా అందమైన ఎనిమిది తంతెలతో ఇటుక నిర్మాణం. ఈ ఇటుక ఎంతగట్టిదో అంత తేలికైనది. నీటిలో వేస్తే తేలేదని ప్రసిద్ధి. ఇపుడా నిర్మాణం శిథిలమై, పునర్నిర్మాణం జరిగింది. గోపుర శోభ పాతది అందంగా ఉండేది. ఈ ఆలయంలోని మదని శిల్పాలు రాణీ రుద్రమదేవివని, రామప్ప రుద్రమదేవిని ఇష్టపడి ఆమె విగ్రహాలు చెక్కినాడని, అమరశిల్ప జక్కననే ఈ ఆలయ శిల్పి అని, ఈ ఆలయం కట్టినవారు 15, 20 అడుగుల ఎత్తువారని, దేవాలయ నంది దినదినము పెరుగుతున్నదని, గుడి వంగిపోతే సెనగలు పోసి నాన్చి, అవి ఉబ్బగా గుడిగా సరిగా నిల్చినదని ఇలాంటి అనేక కట్టుకథలు దీనికి సంబంధించినవి వినబడుతున్నాయి. ఆలయ విశిష్టత గొప్పదే కనుక కట్టుకథలు బాగానే పుడతాయి.
కర్ణాటక రాష్ట్రంలో రామప్ప గుడికి సమ ఉజ్జీలైన హోయసల శిల్పారామాలు, హళేబీడు, బేళూరు దేవాలయాలు చుట్టూ అందమైన పూలతోటలతో, మంచినీటి సౌకర్యాలతో, రాష్ట్ర పర్యాటక శాఖ వారి ప్రజా సౌకర్యాలతో, చక్కటి రాజమార్గాలతో అలరారుతున్నాయి. రామప్ప గుడి మాత్రం ఏ సౌకర్యమూ లేక ఉంది. దీన్ని అందమైన పర్యాటక స్థలంగా మార్చవచ్చు. సాంస్కృతిక వ్యవహారాల శాఖ, పర్యాటక శాఖ, పురావస్తు శాఖలు సంయుక్తంగా దీన్ని అభివృద్ధి చేయాలి. 800 సంవత్సరాల ఉత్సవాలు సంవత్సరం పొడుగునా జరపాలి. దేవాలయ చరిత్రపై గ్రంథాలు, సమాచారం అచ్చువేయాలి. నంది మంటపం పూర్తి నిర్మాణం జరగాలి. అప్పుడే ఈ ఉత్సవాలకు సార్థకత. లేకుంటే మన అసమర్థత, అజాగ్రత్త, అనాదృతి వల్ల రేచర్ల రుద్రుని హృదయం క్షోభిస్తుంది.

– డా. సంగనభట్ల నరసయ్య
(నేటితో రామప్ప గుడికి 800 ఏళ్లు)
(నేడు ప్రపంచ వారసత్వ దినోత్సవం)

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

జ్ఞానపీఠ రావూరి

జ్ఞానపీఠ రావూరి

 

తెలుగు సాహితీవేత్తకు మరోసారి జ్ఞానపీఠం గుర్తింపు లభించింది. ప్రముఖ తెలుగు రచయిత డాక్టర్ రావూరి భరద్వాజను కేంద్ర ప్రభుత్వం సాహిత్యంలో అత్యున్నత స్థాయి జ్ఞానపీఠ పురస్కారానికి ఎంపిక చేయడం తెలుగువారు నిజంగా గర్వించదగిన విషయం. ఆయన రాసిన ‘పాకుడు రాళ్లు’ గ్రంథానికి మూడున్నర దశాబ్దాల తరువాత 2012 సంవత్సరానికి గాను ఈ అవార్డును ప్రకటించింది. ‘జీవితంలో సంపన్నుడు కాకపోవడం పెద్ద విషాదమేమీ కాదు. ప్రేమించబడకపోవడం, తనను ప్రేమించేవారు ఎవరూ లేకపోవడం మాత్రం విషాదమే’ అని ‘పాకుడు రాళ్లు’ గ్రంథంలో ఆయన కథానాయికతో అనిపించడం ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. చలన చిత్ర ప్రపంచంలో చిన్న తారలు ఎదుర్కునే కష్టనష్టాలను కళ్లకు కట్టినట్టు చూపిస్తూ ఆయన నవల రాసిన తీరు నిజానికి జ్ఞానపీఠ పురస్కారానికి మించింది. 1971లో కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణకు, 1988లో డాక్టర్ సి. నారాయణ రెడ్డికి ఈ అత్యున్నత సాహితీ పురస్కారం లభించింది.

తన సాహితీ జీవితంలో 500కు పైగా కథానికలు, 19 నవలలు, అనేక శృంగార కథలు, బాలల కోసం ఏడు నవలికలు, 3 వ్యాస సంపుటాలు, జీవిత కథలు, డిటెక్టివ్ నవలలు, 33 వైజ్ఞానిక వ్యాసాలు, 8 నాటకాలు, మొత్తం మీద 150కి పైగా పుస్తకాలు రాసిన 86 ఏళ్ల రావూరి భరద్వాజను జ్ఞానపీఠ్ అవార్డు కమిటీ ఈ అవార్డుకు ఎంపిక చే సింది. ఏడవ తరగతి వరకే సాంప్రదాయిక చదువులు చదివిన భరద్వాజ ఆ తరువాత ప్రపంచాన్ని విస్తృతంగా చదివారు. ఆయన రాసిన పుస్తకాలు అనేక విశ్వవిద్యాలయాల్లో పాఠ్య పుస్తకాలయ్యాయి. ఆయన సాహిత్యంపై పరిశోధనలు చేసి పిహెచ్.డిలు సంపాదించిన వారెందరో ఉన్నారు. జీవితంలో ఆయన అనేక ఒడిదుడుకుల్ని చూశారు. అయినప్పటికీ ఎంతో పట్టుదలతో తన సాహితీ వ్యాసంగాన్ని కొనసాగించారు. ఆయన రాసిన కాదంబరి, కౌముది, పాకుడు రాళ్లు, జీవన సమరం, ఇనుప తెర వెనుక వంటి గ్రంథాలు ఇంగ్లీషు భాషలోకే కాక, అనేక భారతీయ భాషల్లోకి కూడా అనువాదమయ్యాయి.

కథలు చెప్పడంలో, కథలు అల్లడంలో ఆయనకున్న ప్రావీణ్యం అసమానమైంది. ఆయనలో సామాజిక స్పృహ ఎక్కువ. ఆయన గ్రంథాలలో మానవీయ విలువలు ప్రాధాన్యం పొందుతుంటాయి. ఆయనకు ఇంతకు ముందు సాహిత్య అకాడమీ అవార్డు, సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డు, తెలుగు అకాడమీ అవార్డు, త్రిపురనేని గోపీ చంద్ అవార్డు, బాల సాహిత్య పరిషత్ అవార్డు వంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలెన్నో లభించాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం, నాగార్జున విశ్వవిద్యాలయం ఆయనను డాక్టరేట్‌తో సత్కరించాయి. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు జ్ఞానపీఠ్ అవార్డుకు సరిసమానమైన లోక్‌నాయక్ ఫౌండేషన్ అవార్డు కూడా ఆయనకు లభించింది.

‘జీవన సమరం’ పేరుతో ఆయన 52 వృత్తుల గురించి 52 వారాల పాటు ఓ దినపత్రికలో ధారావాహికంగా రాసిన కథలు పాఠకులను బాగా ఆకట్టుకున్నాయి. భార్య మరణించిన తరువాత ఆయన ఆమె జ్ఞాపకాలతో రాసిన స్మృతి కావ్యం ఎటువంటివారికైనా మనసుకు హత్తుకుపోతుంది. గొర్రెల కాపరిగా, పేపర్ బాయ్‌గా, కంపోజర్‌గా, ఆ తరువాత జర్నలిస్టుగా(ఆకాశవాణిలో) వివిధ వృత్తులతో జీవితాన్ని ముందుకు నడిపించిన భరద్వాజ చివరికి రచయితగా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. తెలుగు సాహిత్యంలో చలం, తరువాత ఆ కోవలోని గొప్ప రచయితగా పేరుపొందిన భరద్వాజ తన రచనల ద్వారా జీవిత కాలమంతా పేదరికంపై పోరాటం సాగిస్తూనే ఉన్నారు. ‘పేదరికం, అవమానాలు, చదువు, అవసరాలు నాకు పుట్టినప్పటి నుంచీ ఇప్పటి వరకూ ఉపాధ్యాయులే’ అంటారాయన. ‘నన్నూ, నా ఆకలినీ తృప్తి పరచడానికే నేను రచనా వ్యాసంగాన్ని చేపట్టాను’ అని కూడా చెబుతారాయన. తనకు అవార్డుల ద్వారా వచ్చిన సొమ్మును ఆయన ఎప్పటికప్పుడు తన శ్రీమతి కాంతమ్మ, భరద్వాజ ట్రస్టుకు మళ్లిస్తూ పేద విద్యార్థులకు ఏటా రూ. 5,000 చొప్పున అవార్డుగా అందజేస్తున్నారు.

విశ్వనాథ సత్యనారాయణ తరువాత 17 ఏళ్లకు సి. నారాయణ రెడ్డికి ఈ జ్ఞానపీఠ అవార్డు రాగా, ఆ తరువాత 25 ఏళ్లకు భరద్వాజకు ఈ అవార్డు రావడం నిజంగా ఆలోచించాల్సిన విషయం. ఇంతవరకూ దేశంలో 48 మందికి జ్ఞానపీఠ పురస్కారాలు లభించగా అందులో ముగ్గురు తెలుగువారికి మాత్రమే ఈ పురస్కారం దక్కడం తెలుగువారి పట్ల అవార్డు కమిటీకి ఉన్న చులకన భావానికి అద్దం పడుతోంది. గతంలో ఈ అవార్డు లభించిన యు.ఆర్. అనంతమూర్తి, ఓ.ఎన్.వి. కురూప్, జయకంఠన్, నిర్మల్ వర్మ, మహాశ్వేతా దేవి, కురతుల్లాయిన్ హైదర్, అమృతా ప్రీతమ్ వంటి హేమా హేమీలను తప్ప ఇతర భాషా రచయితలలో చాలామంది పేర్లను సాహితీవేత్తలు సైతం విని ఉండరు.

జాతీయ స్థాయిలో సాహితీ రంగాన్ని ప్రభావితం చేసిన శ్రీ శ్రీ, చలం వంటి మహా రచయితలను, దాశరథి వంటి ప్రతిభాశాలిని, జాషువా వంటి అద్భుత పద్య కవిని, పుట్టపర్తి వంటి పండితుడిని సైతం జ్ఞానపీఠ పురస్కార కమిటీ విస్మరించింది. నిజానికి బెంగాలీ, కన్నడ, హిందీ సాహితీవేత్తలకు దీటుగా, అంతకు మించీ తెలుగు సాహితీవేత్తలు అద్భుతమైన గ్రంథాలను తీసుకు వస్తున్నప్పటికీ, రెండు దశాబ్దాలకు ఒకసారి తప్ప తెలుగువారు ఈ కమిటీ దృష్టికి రాకపోవడం యాదృచ్ఛికం కాకపోవచ్చు. ఈ ధోరణి వల్ల తెలుగువారికి నష్టం జరగకపోవచ్చు కానీ, జ్ఞానపీఠ పురస్కారం స్థాయిని తగ్గించినట్టే అవుతుంది.

Posted in సేకరణలు | Tagged | Leave a comment

శ్రీ విజయ ఉగాది కవికోకిల కలస్వనాలు -10 (చివరి భాగం )

  శ్రీ విజయ ఉగాది కవికోకిల కలస్వనాలు -10 (చివరి భాగం )

         31-తెలుగును మరువను –విడువను –చి బి.గాయత్రి –ఎనిమిదవ తరగతి –వి.ఆర్.కే.యం

                .హైస్కూల్ –ఉయ్యూరు   

          అ ఆకాశం చూడలేనంత పెద్దదే అయితే –నా తెలుగు సాహిత్యం చెప్పలేనంత గొప్పది

          అమ్మ ప్రేమ ఆకాశమంత గొప్పది –అమ్మే ప్రేమకు సమానం

          నా తెలుగు భాష విన్నప్పుడు నా మనసుకు తియ్యగా ,కమ్మగా ఉండి ఉల్లాసం ఇస్తుంది

          నా మనసు పులకరిస్తుంది –ఎంత సేపు మాటాడినా విన్నా నాకు తనివి తీరని తృప్తి

           నా తెలుగు మాట గొప్పదనం తియ్యదనం తెలుసుకొన్న వారిదే  మూలధనం

          చెప్పటానికి నాకు మాటలు రావటం లేదు –నేను తెలుగు మాట్లాడకుండా ఉండలేను

          గాలిని కట్టి బంధించలేను రేయిని ఆపలేను పగటిని ఆపలేను ,మరణాన్ని ఆపలేను

         అలాగే నేను తెలుగును మర్చి పోలేను –దాన్ని గురించి తెలిస్తే అందరికీ మహా నందం

         జన్మ నిచ్చిన తల్లిని ,దేశాన్ని ,మాతృభాష ను మరచి పోలేను -పోను  కూడా

         ‘’దేశ భాష లందు తెలుగు లెస్స ‘’అన్న సత్యాన్ని నేను  మర్చి పోలేను .

32-కాళ రాత్రి –  శ్రీ చక్రవర్తి  ఎ..ఎస్.ర్. –కూచిపూడి

                ఒక దేహం కాలి పోయింది –ఒక బతుకు నీరైంది

                 ఒక కుటుంబం కూలి పోయింది –ఆశల సౌదాలన్నీ పేక మేడల్లానేల రాలాయి  

                విని పించింది బాంబు పేలుడే –దాని వెనుక తెగిన పేగు బందాలేన్నెన్నో

               ఒక్క క్షణం లో  దిల్ షుక్ నగర్ దిల్ దుఃఖ నగర్ గా మారిపోయింది .

              

                శ్రీ విజయ ఉగాది కవికోకిల సవనాలు ఇంతటి తో సమాప్తం

                      మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –17-4-13- ఉయ్యూరు

Posted in కవి కోకిల స్వరాలు | Tagged | Leave a comment

శ్రీ విజయ ఉగాది కవికోకిల కలస్వనాలు -9

   శ్రీ విజయ ఉగాది కవికోకిల కలస్వనాలు -9

26-విజయ కు స్వాగతం –శ్రీ తుమ్మోజు రామ లక్ష్మణా చార్యులు –విజయవాడ –9703776659

          స్వాగత మాంధ్రసత్కవుల వాక్జనితా రసగీతికా ,సుధా

          రాగ మాశ్రయీ ! విజయ రంజిత నూతన వత్సరంబహా  

           రాగిలి ఏమి ఇచ్చదేవు రాగల రోజుల తెల్గు వారికిన్

          రాగ విరాగ శూన్యమయి రక్తిని గోల్పడి నట్టి జాతికిన్ .

                   తెలుగు నేడు రేపు

     తెలుగు తెలుంగు గా  వెలుగు తీయని కాలము ముందు గల్గునా

      పలుకుల పంచదార పోలుపై నమ్రుతంబది జాలువారగా

      కులుకుచు రాగామోల్కు పద గుంఫిత గేయ కవిత్వ సంపదల్

      తెలుగుల సోత్తనంగ భువి తేజరిలెం గద నేటి దంకయున్ .

            తెలుగది కాదు పూర్తిగను తెరగు నాంగ్లము గాదు ఏదియో

            తెలుపగరానిభాషగను తెన్నులు తీరును లేని వాక్యముల్

             పలుకుచు మాత్రుభాషనిల భ్రస్టము చేయుచునున్న వారాయో

             తలచుచు నూహ సేయగను తల్లదడిలున్ హృది తెల్గు భారతీ !

      ఎలమావి చిగురేమో తలపగా చేదాయే –కోకిల రాగాలు మూగవోయె

      మలయ మారుత వీచి –ధూళి దూసరితమ్ము –సంధ్యా విహారాల సౌఖ్యమేది ?

       శీతల వాహినీ శీకర స్నానాలు –వట్టి పోయిన నది నెట్లు సాగు

       ఉద్యాన వనముల నుయ్యాలలే గాని –లలితమౌ పరిమళ లహరులేవి?

        పూర్ణ చంద్రుని చల్లని కిరణ హాయి –అనుభావిమ్పగలేరైరి అవని జనులు

         ప్రాక్రుతంబగు సౌందర్య సుకృతి జూడ –వైక్రుతంబయ్యే మానవ దుష్క్రుతాన .

                  విజయకు విన్నపము

          కాలమేదైన మనుజుల కర్మ లఖిల –మొక్కరీతిగానే నేడు నెగడ సాగే

          స్వార్ధ చింతన బాపియు సకల జనుల –కాచి రక్షించి విజయమ్ము కలుగ జేయు

                తెలుగు విద్యార్ధి విద్దెల దివ్వె యగుచు –గగన సీమల విజ్ఞాన కాంతి పరచి

                 దిక్తటంబుల తాకుచు దీప్తి తోడ –విజయ కేతన మెత్తుచు వెలుగు గాక

                 సార్ధకంబైన నీ పేరు సత్యమగును

  27-అదృశ్య దృశ్యాలు –శ్రీమతి మందరపు హైమవతి –విజయ వాడ –

           నడివీధిలో నడుస్తున్నప్పుడు ,నలుగురితో మాట్లాడుతున్నప్పుడు

బడిలో పాఠాలు చెబుతున్నప్పుడు –అన్నం తింటున్నప్పుడు నిద్రపోతున్నప్పుడు

చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి –కామం ,విషం మాటల కంటకాలు గుండెల్లో గుచ్చుకొంతూనే ఉంటాయి

     మనిషి వాసన తగలగానే –తనువు మరిచే దానవుల్లా –ఆడపేరు కానీ పించినా

       ఫోను నెంబరు కనిపించినా –పొగరు బోతూ పొట్ల గిట్టల్లా పెట్రేగి పోతారు

   చలువ చేసిన రాయంచ రెక్కల్లాంటి ఖద్దరు బట్టల ముసుగులో –

పెద్దలేప్పుడు మల్లె నవ్వులు రువ్వుతూ –మాటల సమ్మోహనాస్త్రాలు సంధిస్తారు

       ఇప్పుడు ఆరు రుతువుల విభిన్న వర్గాల విచిత్ర విన్యా లు లేవు

  సకల జనులను సంమోహ పరచే ఏకైక రుతువు’’ కామ రుతువే ‘’

వెండి తెరపై బుల్లి తెరపై అనవరతం ప్రదర్శించే అంగనల నగంగ అర్ధ నగ్న దృశ్యాలే చాలు

  కవయిత్రి నైనా నేను –పదునైన కట్టి గాట్లను –తలిరాకు లాంటి ఎదపై

 మలినపు మాటల మరకలను ప్రదర్శించలేము కదా

 అంత రంగ హంతకులను –నిరూపించలేము కదా

 28—తెలుగు భాష –శ్రీమతి వారణాసి సూర్య కుమారి –మచిలీ పట్నం –

  ఉత్పలమాల –‘’భావ మేరున్గా జేయుటకు భాషయే ముఖ్యము మాన వాలికిన్

                    దేవుని వేడు చుందగాను దీనుల బాధలు తీర్చు పల్కులన్

                    భావిని బాధ్యతల్ తెలిపి బాలల నేర్పుగా తీర్చి దిద్దుతలన్

                    దీవెన లిచ్చు వేళలను తీయగా తోచు తెలుంగు భాషయే

   ‘’                      భారత దేశ మండుగల భాషల లోన తెలుంగు లెస్సగా

                           ధీరుడు రాయ లప్పటికే తెచెను పేరు ప్రతిష్ట లంతతాన్

                           మీరును మెమతాఆఅన్చునిక మీనము మేషము లెక్క జూడకన్

                           కూరిమి నేడు నూ మనము కోరిన కట్టగవచ్చు పట్టమున్

         ‘’       పూలనుతావియున్ మధువు పుష్టిగా ణుండు విధమ్ము భాషయే

                   కాలము శాశ్వతంముగాను కానగ వచ్చును సుధా మయంబుగాన్

                   మెలగు భాషగా తెలుగు మేదిని మెప్పును పొంద మోదమున్

                    తేలును మానసమ్ములును తేలిక నూయల లూగు ఛందమున్ .

         ‘’              కేకి పికంముల సుస్వరము కీరము పాలకుల కంటే వారిధిన్

                         ఆ కెరటంముల ధ్వనిని ,హాయగు తుమ్మెద పాత కంటే నూ

                         ప్రాకిన మాధవీ లతల బంగారు ప్రకృతి శోభ కంటే నూ

                         లోకము నుత్తమంబాగు తెలుంగు కవిత్వము ప్రీతీ గోల్పునే

           ‘’                   ఏ రకమైన భాషయును ఎంతగా నేర్చిన ,మాత్రుభాశానే

                                మారక ప్రేమతో తెలుగు మాధురి గ్రోలుచు మాటలాడు టే

                                పౌరుల లక్ష్యమై నపుడే భూరి భవిష్య వికాస మొండుచున్

                                నీరద తుల్యమై కురియు నిత్యమూ తేట తెలుంగు వర్షమై

     ‘’              ఆశయ సిద్ధికి మనము ఆకలి దప్పులు విస్మరించియున్

                     లేశము బద్దకించ కను లేదు విరామ మటంచు చెప్పకే

                     పాశు పతాస్త్రస్మౌ ననేడు పట్టుదలన్ కృషి చేసి నప్పుడే

                      ఆశలు తీరి కష్టమున కండును సత్ఫలితంబు తృప్తియున్ .

      తేట గీతి – భాష పాటలను గౌరవ భావ మానక –కొందరు తెలుగు వెలుగును కోరుకోనారు

                   అట్టి వారికి నాభి రుచి యబ్బు నటుల –పాటు పడవలే నెల్లరు పట్టు విడక

          29–.మార్పు కోసం –శ్రీ విష్ణు భొట్ల ప్రసూన రామ కృష్ణ –విజయ వాడ -9440618122

                 వక్చ్చింది ఉగాది –ప్రతి ఏడూ చూసిన ఉగాదే పేరు మార్చింది అంతే

                 అదే వేపపూత అదే చెరకు గడ ,అదే బెల్లం అదే రుచి –ఎక్కడా మార్పు కన్పించనే లేదు

            మా ఊరిలో అదే శిధిల శివాలయం –అదే ఎండిన పార్కు

            బీటలు వారిన బడి –మందుల్లేని దవాఖానా –పక్కనే గోడల్లేని స్మశానం

            ఊరి చివర పూరి పాకలు ఊళ్ళో పెంకుటిల్లు –వీటిని ఏ కొత్త ఉగాది మార్పు తేనే లేదు

             మార్పేదో వస్తుందని ప్రతి ఏడాది ఎదురు చూపులు చూసి నా జీవితమంతా మా ఇంటి ఎదురు మానులా ఎండిపోయింది

            ఆ మాను చిగురించదు  –ఈ మేను పులకించదు -బతుకులు మారుతాయని ఆశ మాత్రం ఎప్పుడో చచ్చి శవమైంది

            విజయ నామం కదా ఏదో చిరు ఆశ ఉంది స్వాగ్సతిస్తున్నాను తప్పక .

 30—తస్మాత్ జాగ్రత జాగ్రత –శ్రీమతి కోగంటి విజయ లక్ష్మి –గుడివాడ

        కొప్పు నిండా పూలు పెట్టి –చిగురు వన్నెల చీర కట్టి –వేప  పూవు రైక  తొడిగి

        పుడమి తల్లి సిన్గారించగా ,కవిత కోకిల  కంఠ–మెత్తికొత్త గీతం ఆలాపించింది

         మధుమాసం మంచి గంధం –మనములన్ని  చిలకరించాగా

         ఆరు రుచుల సమ్మేళనం –ఉగాది పచ్చడి భుజించి

          కవిత కోకిల కంఠమెత్తి చైత్ర గీతి ఆల పించింది

        ఓట్ల కోసం పాటుబడి –శుష్క వాగ్దనాలేవో విని పించి

        పదవులతో లబ్ది పొందిన బడా బాబుల బడాయి బద్దలై న వేళ

        కవిత కోకిల కీచు గొంతుతోశోక గీతం  ఆ ల పించింది

        విజయా! విచిత్ర శక్తులతో వచ్చావా ?లేకుంటే చెదరిన గుండెల స్వాంతన పరచలేవని తెలుసుకో .—

        అందుకే తస్మాత్ జాగ్రత జాగ్రత్త అన్నాను ముందుగానే .

    సశేషం –మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ -17-4-13 

Posted in కవి కోకిల స్వరాలు | Tagged | Leave a comment

చిగురాకుల ఊయలలో ‘ఇల’ మరిచిన ఓ చిలుకా..

చిగురాకుల ఊయలలో ‘ఇల’ మరిచిన ఓ చిలుకా..


‘ప్రతివాద భయంకర’ ఇంటి పేరు గల శ్రీనివాస్ నిజానికి అతిసున్నిత మనస్కుడు. ‘పఠనం, గానం’ ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. ‘నిత్యయవ్వనుడి’గా చెప్పుకుని మురిసిపోయే నిత్య దరహాసి. ఒక పరిశోధనాంశం గురించి సలహా కోసం చెన్నయ్‌లోని ఆయన ఇంటికి వెళ్లినప్పుడు అనేక ఆసక్తికర అంశాలు వెల్లడించారు. ఆయన మహాప్రస్థానానికి సరిగ్గా ఆరు రోజుల ముందు ఆయనతో ముచ్చటించే అదృష్టం కలిగింది. అప్పటికే కాస్తంత నలతగా ఉన్నా ఓపికగా సంభాషించారు. ఆ వివరాలను ‘ప్రశ్నలు-జవాబులు’గా క్రోడీకరిస్తే ఆవిష్కృతమైన ఈ ముఖాముఖి ‘సుస్వర’ శ్రీనివాసుడికి అక్షర నివాళిగా… 

మీ చలన చిత్ర ప్రయాణం…? సినిమా అవకాశాల గురించి….
చిత్రసీమలో ఏదో కావాలని వచ్చి ఏదో విభాగంలో స్థిరపడిన వారు ఉన్నారు. నాకు సంబంధించినంత వరకు భగవత్ కృపవల్ల అనుకున్నది పొందగలిగాను. గాయకుడు కావాలనే వచ్చాను. ఆ కలను సాకారం చేసుకోగలిగాను.అయితే అందరంటున్నట్లు తెలుగులో వేల పాటలు పాడలేదు.వందలే. కాని పాడినవన్నీ విజయవంతమైనవే, గుర్తింపు తెచ్చినవే. ఇక..అవకాశాలు అంటే…గాత్ర ధర్మాన్ని బట్టి అవకాశాలు వస్తాయి తప్ప ఇందులో ఇతరత్రా కారణాలు వెదకవలసిన అవసరం లేదేమో? అవకాశాలు రాకపోవడానికి ఇతరులను తప్పుపట్టలేం.

తప్పు పట్టీ ఏం చేయలేం. ‘గుమ్మడికాయంత కృషికి ఆవగింజంత అదృష్టం తోడు కావాలి’అంటారు. ఆ అదృష్టానికి ఏ పేరైనా పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇతరుల పరపతి (సిఫార్సు)తో రంగ ప్రవేశం చేసినా ఆ తర్వాతైనా మనమేమిటో రుజువు చేసుకోవాలి కదా! కన్నడంలో ‘కనకదాస్’ చిత్రంలో నా పాటలు విని మహానటుడు రాజ్‌కుమార్ కదిలిపోయారు. అప్పటివరకు తన పాత్రలకు తానే పాడుకునే ఆయన నాకు అవకాశం ఇచ్చి రెండు దశాబ్దాలు తన నటనతో నా గాత్రానికి గౌరవం పెంచారు. అది దైవ నిర్ణయం.


సంగీతంలో గురువు ఎవరు?
సంగీతంలోనే కాదు…జీవితంలోనూ ఆది గురువు మా అమ్మ శేషమ్మే. అలా అని ఆమె పండితురాలో, సంగీత విద్వాంసురాలో కాదు. సాధారణ ఇల్లాలు. ఆమె నుంచే స్వరజ్ఞానం అబ్బింది. ఆమె పాడిన ‘చందమామ రావే…జాబిల్లి రావే…’లాంటి లాలి పాటలే నాలో సంగీతం పట్ల ఆసక్తిని రేపాయి. వృత్తి పరంగా కూడా నేను ప్రత్యేకించి సంగీతం నేర్చుకోలేదు. ‘అభ్యాసం కూసు విద్య’ అన్నట్లు పాడగా పాడగా, పరిశీలన వల్ల స్వరజ్ఞానం అలా వచ్చి ఉంటుంది. దానిని రసజ్ఞులు ఆమోదించి ఆశీర్వదించారు.

మీ సాహితీ వ్యాసంగం గురించి వివరిస్తారా…?
నేను పుస్తక ప్రియుడిని. నా దినచర్య పఠనంతో మొదలై పఠనంతో ముగుస్తుంది. ‘పుస్తకం మంచి నేస్తం’ అని నమ్ముతాను. పుస్తక పఠనం కేవలం కాలక్షేపానికే కాదు….అది మానసికానందంతో పాటు విజ్ఞానాన్నిస్తుంది. చదువుకు, రచనకు వయస్సు, కాలమానాలతో నిమిత్తం లేదు. కలలో మంచి ఆలోచన తట్టినా వెంటనే లేచి అక్షర రూపం ఇవ్వడం నాకు అలవాటు. రచన, పఠనం నాకు నిద్రాహారాలను కూడా దరిచేరనీయవు. సరిగా లెక్కేయలేదు కానీ అంచనా లేదు కానీ.. అన్ని రకాల రచనలు అంటే పాటలు, కవితలు, గేయాలు, గజళ్లు, వ్యాసాలు వంటివన్నీ రెండున్నర లక్షల పైమాటే రాసి ఉంటాను. జీవించినంత కాలం సాహితీ వ్యాసంగం కొనసాగాలని, ఆ వ్యాసంగం సాగినంత కాలం జీవించాలన్నది నా ఆశ. భగవంతుడు నెరవేరుస్తాడనే అనుకుంటున్నాను.

గజళ్లు అంటే మీకు ప్రత్యేకాభిమానం అంటారు..?
ప్రత్యేక అభిమానమే కాదు…అవంటే ప్రాణం. సంస్కృతం సహా ఎనిమిది భాషల్లో గజల్స్ రాసి పాడాను. తమిళంలో గజల్ ప్రక్రియను ప్రవేశపెట్టింది నేనే. తెలుగులో దాశరథి – సి. నారాయణ రెడ్డి గజల్ ప్రక్రియలో విశేష కృషి చేశారు.నేను గజల్ ప్రియుడిని కావడం వల్ల అది నన్ను ఆ జంట కవులకు మరింత చేరువ చేసింది. దాశరథి కృష్ణమాచార్యులు అత్యంత సన్నిహితులు. ఆయన రూపంలో ‘వామనమూర్తి’ కాని ప్రతిభా పాటవాల్లో ‘త్రివిక్రముడు’. మెత్తని మనసులో దిట్టమైన భావాలు గల వ్యక్తి.

ఆయనతో సాగించిన కవితా గానం ఓ మధుర జ్ఞాపకం. ఆయన రాసిన అనేక గజళ్లకు వరుసలు కట్టి రేడియో కార్యక్రమాల్లో, కచేరీల్లో పాడేవాడిని. ఆయన గజళ్లలో ‘రమ్మంటే చాలు లేవే రాజ్యాలు విడిచిరానా’ అంటే నాకు అత్యంత ఇష్టం. గజళ్ల ఆలాపనకు నిర్దిష్ట సంగీత రీతి అంటూ లేదు. శాస్త్రీయ, పాశ్చాత్య, లలిత సంగీతం..ఇలా ఏ బాణీలోనైనా పాడవచ్చు. సినిమా పరంగా నాకు అమితమైన గుర్తింపు, పేరు తెచ్చినది దాశరథి రాసిన ‘ఓహో గులాబీ బాల…అందాల ప్రేమ మాల’ పాటే.

మంచి పాట అంటే….?
ఒక పాట వినిపించినపుడు నడిచే వ్యక్తి లిప్త కాలం ఆగి చెవి ఒగ్గడం. ఏ స్థితిలోనైనా అలవోకగా పెదవులపై ఆ పాట నర్తించడం. ఇలాంటి పాట పుట్టాలంటే ‘పాళీ, బాణీ, వాణి’ (రచన, వరుస, గాత్రం) సమపాళ్లలో సంగమించాలి. అందరూ మనసు పెట్టాలి. పాట శాశ్వతంగా నిలిచిపోయేది కనుక గానం విషయంలో రాజీకూడదు. అప్పట్లో ఒక్కొక్క పాటను కనీసం నెల రోజలు సాధన చేసేవారం. సంగీత దర్శకులు ‘చాలు’ అన్నా మరో(టేక్) సారి పాడిన సందర్భాలూ ఉన్నాయి. ఇప్పుడు అంత వ్యవధి ఎక్కడ? మీకు తగినంత గుర్తింపు వచ్చిందనుకుంటున్నారా?.. పురస్కారాలూ అవీ…?

వాటి గురించి అంతగా ఆలోచించను నేను. మన వ్యాసంగం, మనుగడ కోసం, మనస్సు తృప్తి కోసమే కానీ అవార్డులు, రివార్డుల కోసం కాదు. అవి ప్రోత్సాహకాలే కానీ ప్రతిభకు కొలమానాలు కావు. పురస్కారాలు వచ్చినంత మాత్రాన మంచి కళాకారుడని, లేకపోతే కాదని ఎక్కడుంది? కన్నడంలో నటగాయక సార్వభౌముడు రాజ్‌కుమార్ ఏరికోరి నాతో పాటలు పాడించుకున్నారు. తెలుగులో ఘంటసాల తిరుగులేని గాయకుడు. ఆయన సంగీత దర్శకత్వంలోనూ పాడాను. ఇలాంటి వాటి కంటే గుర్తింపు, గౌరవం ఏముంటాయి? అయినా ఆదరించిన వారు గౌరవిస్తూనే ఉంటారు, ఉన్నారు.

ఈ ప్రస్థానంలో మరువలేని సంఘటనలు..?
ఒకటా రెండా?…ఎన్నో. అమ్మ ఒడిలో విన్న జోలపాట స్ఫూర్తితో మహానటులు, గాయకులకు పాడే స్థాయికి చేరుకునే అదృష్టం కలిగింది. గాయకుడిగా మిగిలిపోక సినీగీత రచయితైన అదృష్టమూ దక్కింది. అదీ ఒక భాష సినిమాలో మరో భాషా గీతంతో. అంటే…హిందీ సినిమాలో తెలుగు పాట, తెలుగు సినిమాలో మరోభాష పాట. ‘ఆకలి రాజ్యం’లో ‘తూ హై రాజా’ హిందీ గీతం, కన్నడ చిత్రం ‘మక్కళ భాగ్య’లో తెలుగు, తమిళ, మలయాళ హిందీ భాషా చరణాలు అందుకు ఉదాహరణలు. చిత్తూరు నాగయ్య గారు మా అందరికి పితృ సమానులు. అంతటి మహానటుడు, గాయకుడు, సంగీత దర్శకుడికి ‘శాంతినివాసం’ చిత్రంలో పాడడం (శ్రీ రఘురాం జయరఘురాం…) పూర్వజన్మసుకృతం. ఈ విషయంలో ఘంటసాల గారి తర్వాత నాకు దక్కిన అరుదైన అవకాశం అది.

ఆయన నాగయ్య గారికి ‘లవకుశ’లో పాడిన సంగతి తెలిసిందే కదా! చిత్రరంగ ప్రవేశానికి ముందు ఘంటసాల, లతామంగేష్కర్, రఫీ ..తదితరుల పాటలు వింటూ సాధన చేసిన వాడిని. ఆ తర్వాత వారితో గొంతు కలపడం మహద్భాగ్యం కదా?
ఆస్తికవాదులై ఉండీ జ్యోతిష్యులను, జాతకాలను నమ్మరట…?

ఇక్కడ ఆస్తికవాదానికి, జాతకాలు నమ్మకపోవడానికి సంబంధం లేదు. ఏదైనా నిర్మాణాత్మకంగా ఉండాలి. జాతకాలను విమర్శించను. మానవ ప్రయత్నాన్ని మానవద్దంటాను. మన ప్రయత్నం లేకుండా జాతకాలే అన్నీ సమకూర్చి పెడతాయనుకుంటే ఎలా? సుడిగాలిలో దీపం పెట్టి ‘దేవుడా నీదే భారం’ అనడం సమంజసమా? నా సంగతే చూస్తే… నా చిన్నతనంలో ఒక జ్యోతిష్యుడి మాటలు వినివుంటే ఇప్పుడు ఈ స్థాయికి చేరేవాడిని కాదేమో…!నేను సినిమాల్లో రాణించలేనని ఆయన చెప్పారు. ‘మీరు చెప్పింది యధాతథంగా జరుగుతుందా?’ అని ప్రశ్నిస్తే, ఒకటి రెండు సార్లు జరక్కపోవచ్చని సమాధానమిచ్చారు. ఆ ‘ఒకటి రెండు సార్లలో ఇదెందుకు ఉండకూడదు’ అనిపించి ప్రయత్నించాను.

సినిమా మాధ్యమంపై రకరకాల వ్యాఖ్యలు ఉన్నాయి…
అవును ఉన్నాయి. అప్పుడప్పుడో, అక్కడక్కడో వచ్చే సాహిత్యాన్ని బట్టి ఈ మాధ్యమాన్ని తక్కువగా అంచనా వేయడం సబబు కాదనుకుంటాను. ఒక విషయాన్ని సులువుగా జనానికి చేర్చగల శక్తిమంతమైన మాధ్యమం ఇది. సాహిత్యంలో మార్పు వచ్చిన మాట నిజిమే. అయితే సినిమా నిర్మాణం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. వ్యాపారం అందులో ఒకటి. ఒకవేళ సినిమా సాహిత్యంలోనే విలువలు లేవనుకుంటే దశాబ్దాల క్రితం నాటి పాటలు ఆ’పాత’మధురాలుగా ఎలా మనగలుగుతాయి? మారుతున్న కాలంతో పాటే సినీ సంగీత సాహిత్యాలునూ.

అదీకాక, తరానికి తరానికి అంతరం ఉన్నట్లే అభిరుచులు మారుతుంటాయి. కాలానుగుణంగా అన్నీ మారుతున్నప్పుడు సంగీత సాహిత్యాలకు మాత్రం మినహాయింపు ఎందుకుంటుంది? నేనెప్పుడూ చెబుతుంటాను- వైవిధ్యం కోసం భగవంతుడే కాలాన్ని ఆరు రుతువులుగా విభజించాడు. అయితే ఎన్ని మార్పులు వచ్చినా సంగీతానికి సంబంధించినంత వరకు మాధుర్యానికే(మెలోడీ) పెద్ద పీట వేయాలి. మాధుర్య రహిత సంగీతం రసహీనంగా ఉంటుందని నా ప్రగాఢ నమ్మకం.

కోపంగా పాడే పాటల్లోనూ మాధుర్యమే ప్రధానాంశంగా ఉండాలి. ఇప్పుడూ మంచి పాటలు వస్తూనే ఉన్నాయి. కాకపోతే అరుదుగా..! సత్తా ఉన్న కవులున్నారు. తీయగల నిర్మాత దర్శకులున్నారు. మంచి గాయకులున్నారు. ఆదరించే రసజ్ఞ ప్రేక్షక శ్రోతలున్నారు. మరి మాధుర్య గీతాలు వెనకబడి పోవడంలో లోపం ఎక్కడో అంతుపట్టదు. సినిమా పాట ఎన్ని పోకడలు పోయినా మాధుర్యానికి పట్టం కట్టాలన్నది నా ఆకాంక్ష. ఆ సమయం వస్తుందని నా ఆశ.

ఆరవల్లి జగన్నాథస్వామి

 

Posted in సేకరణలు | Tagged | 2 Comments

కరెంటు కోతా జిందాబాద్ !!

కరెంటు కోతా జిందాబాద్ !!  

            కరెంటుండదట యేడు దాటితే ననుకంటూ ఎగిరి లేస్తారు బ్రాహ్మీ ముహూర్తంలో !

                  మోటర్, హీటర్, గ్రైండర్, వాషర్ పనులన్నీ చేసేస్తారు – ఉషోదయానికి ముందస్తుగా!

                   సంప్రదాయాన్ని గౌరవిస్తారు – సూర్యుడు పలకరించినా ఏనాడూ లేవని సూర్యకాంతలు !

                   దృశ్య శ్రవణ  ఛానల్స్  అన్నీ నిశీధిలో కలవగా నిక్షేపంగా ఆడుకుంటారు పిల్లలు పోట్లాటలు లేకుండా-!

                అత్తాకోడళ్ళ సీరియల్సు సమీక్షణంలో భార్యామణి , అంతులేని అంతర్జాల వీక్షణంలో భర్తా మయుడు !

                 కోత సమయంలో కష్టాలు తెలుపుకుంటారు ! సుఖాలు తెలుసుకుంటారు ! నిజంగా భార్యాభర్తలవుతారు !

    ప్రభుత్వం ఏదయినా – కరెంటుకోతా జిందాబాద్ ! ఈ ధరాతలానికి క్రమ శిక్షణను నేర్పించావు !

                    కరెంటు ప్యాను లేకుంటే – దేశీ ఫ్యానుతో వ్యాయామం – సిక్స్ ప్యాకులో ఆరోగ్యం !

      డాక్టరు బిల్లుల తగ్గుబడి కాల్చని కరెంటుకు సర్ ఛార్జీ కట్టుబడి ! విద్యుత్  బిల్లుల సర్దుబడి !

                      కోత లేకుండా చూస్తామని ప్రభుత్వ పెద్దల ఊసుల రాశుల మ్రొక్కుబడి !

 ప్రజలు తిరస్కరించిన పక్షాల తిరుగుబడి – స్కూళ్ళన్నీ మూతబడి- జనం రోడ్ల పై కెగబడి !

                      పని చేసే వాడు లేడు,చేయమనే వాడూ లేడు –ప్ర.తి పక్షములారా   మా అభినందనలందు కొనుడు !

            కరెంటుకోత మనం మనకు వ్రాసుకున్న మన తల వ్రాత – ధర్మల్ ప్లాంట్లు వద్దంటూ ధర్నా మనదే !

              అణు విద్యుత్ ప్లాంటు వద్దంటూ ఆందోళనా మనదే – జల విద్యుత్ ఉత్పత్తి ఊసేలేని ఉత్తుత్తి కబుర్లూ మనవే, !

                 ఉచితాలంటూ దోచి పెట్టేది మనమే! మన దళారులు నీళ్లు దోచుకుంటే చూస్తూ ఊరుకునేది మనమే !

     జండా ఏదైనై మన ఎజండా ఓటు బ్యాంకు నిక్షేపం,ఎప్పటి కెయ్యది ప్రస్తుతమో అప్పటికా మాటలాట మన  కాలక్షేపం !

కర్త , కర్మ , క్రియ మనవే ఈ ప్రజా ప్రభుతలో !   కాదా ఇది త్రికాల వేదం – ఈ బందా నాదం!!

 పరిశోధన,రచన బందా వేంకట రామారావు, సెల్ . 9393483147.బందాభవన్,

ఇం.57-2-30, యాదవుల బజారు, పటమట సెంటరు, విజయవాడ-1

Posted in కవితలు | Tagged | Leave a comment

శ్రీ విజయ ఉగాది కవి కోకిల కూజితాలు -8

 శ్రీ విజయ ఉగాది కవి కోకిల కూజితాలు -8

  21- మాట విజయ బాట –శ్రీచిత్తజల్లు భవానీ శంకరం –ఉయ్యూరు –9292153791

         మాటకు ప్రాణము సత్యము తెలిసి తెలిసి –మాటకు మాట బదులిచ్చి ,ఇచ్చిన మాట మరచినారు

      బోటికి ప్రాణము మానము అని ఎరిగి ఎరిగి –తల్లి బిడ్డ తేడా లేక మాన భంగమొనర్చి హతమార్చినారు

చీటికి ప్రాణము వ్రాలు అని చదివి చదివి –చదవ కుండగానే సంతకు చేసినారు

కోటకు ప్రాణము సుభట కోటి అని ఎంచి పెంచిన –భటులు పొంచి ఉన్న పేలుళ్ళను తప్పించలేని భటులు

 అక్కటా లెక్కకు మించి పెరుగుచున్న అట్టి జనులు –ఆనందముగా నందనం జరుగుచున్నాడని

 అరని చిచ్చువోలె అసంతృప్తి జ్వాలలు ఎగసి పడగ–అభయమిచ్చి రక్షించవమ్మ విజయ .

 

 

22-కామాంధుల చేతుల్లో భవిత ?—శ్రీ శృంగారపు వెంకటప్పయ్య –విజయ వాడ -8985313811

        సిగ్గుపడుతున్నది సిగ్గు పడుతున్నది –చెడ్డ సమాజాన్ని చూసి మానవతయే లేదని

       మానవత ఇంకేక్కడిదని ?

       కామాం ధులు రాబందులు గా మారుతుంటే –వనిత భవిత రక్త చరిత గా మారుతుందని

       ఎన్నాళ్ళని ,ఎన్నేళ్ళనికన్నీళ్లు శోకాలు ?

       క్షణమొక రణం గా బతుకు బరువై పోతోంది –ఆవేదన చెందుతూ ,మానని గాయాలతో కన్నీళ్ళ     కాలాన్ని ఈదుతున్నది

     మ్రుగాల్లాంటి మగాలళ్లున్న మనసులేని లోకం లో –కలలే కల్లలై ఆశయాలు అందకాకన్నోల్లకు కన్నీళ్ళే పంచి

     ఒంటరిగా సాగలేని అంగడిలో ఆడతనం –చీకటి పాలౌతుంటే

తిరిగి రాని కాలం లో చితి మంటగా మారుతుంటే

గుప్పెడంత గుండెకు వేదన వెంటాడుతున్నది

 

 

23- కరువైన కన్నీటి బాట –శ్రీమతి కోనేరు కల్పన–విజయవాడ -9246493712

       తేట గీతి –బొట్టు పెట్టి పిలిచినారు బుడతలిద్దరిని వదలి వేళ్ళలేనిక మీరేటును పోక

                   కాస్త చూసుకోండి ఇదిగో గంట లీవు –బువ్వ పెట్టగ వచ్చేద పోయిరానో ?

           ‘’      ఆలి ఆశ మొదమనగా అతని పోవ  –అనుమతిచ్చేను అతడు

                   నీటి బోట్టైనఇంట లే నిన్న నల్ల –రాలేనే బిందె లోన తుర్రు మనియె బొట్టు

           ‘’     కోపమొచ్చి అవ్వు వచ్చి కొంత తడవు –నివ్వెర వాడి బిందెలు తీసే నీళ్ళకోసం

                   ఉస్సురనుచు భామా పతి తుస్సుమనేను –పంపు కాస్త చుక్క పడక పంతమనగా

           ‘’     పిల్లలోచ్చి నీల్లడిగిరి పేచి పెట్టి –గోలచేసిరి పోరుగునా గోడు ఇంతే

                  జాయమీద కోపమయిన జాలివేసే –దిక్కు తోచక దిగులాయే తిక్కరేగే .

          ‘’      చుక్క లేకనే చిక్కులు చుక్క వేసి –చూపుతా నా తెలివి చూసుకోండి

                  నీరు లేక పోతే మానె బీరు ఉంది –చుక్క ఏదయినా నేమిలె చిక్కు వీడ

          ‘’       ఆకలితో పిల్ల లేమాయె అనుచు అచట –వేగిరముగా తాంబూలమున్ పిలిచి పొంది

                    కొలము వీడ్కొని కుచ్చెళ్లు కొంచే మెత్తి-పడతి చేరెను ఇంటికి పడుతూ లేస్తూ

           ‘’   కంపు కొట్టు ఇంటిని నిషా కాటు పడ్డ –పతిని గాఢ మత్తున జోగు సుతుల గాంచి

                మెదడు మొద్దు బారే ,మనసు మేట వేసే –నీరాజక్షికి కరువే కన్నీటి  బొట్టు

 

 

      24—విజయ నామం –శ్రీ కాట్రగడ్డ వెంకట రావు –పామర్రు

             వందనమమ్మా విజయనామ ఉగాది –సరసభారతి సహృదయ వాహిని

            కవులతో సరస సంగీత సరిగమలు –మందు టెండలో సరసభారతి ముత్యాలు మెరిసి

            లేలేత పచ్చదనం ,వసంత వైరాగ్యం –షడ్రుచులు కల్గించు ఉగాది శాకంబరి

             కృష్ణమ్మ ఒడిలోన కవులందరూ జత గూడిరి –విజయమ్ము కల్గించు విజయ నామం

              జైత్ర యాత్ర కోన సాగు వారము లిమ్ము –విజయ నామమా ణీ కిదే స్వాగతమ్ము

 

 

       25-దివ్య ఔషధం –శ్రీ వసుధ బసవేశ్వర రావు –గుడివాడ

              అమ్మలారా –అమ్మపాలకు నోచుకోని బిడ్డలకు అమ్మభాష నేర్పండి

              అయ్యలారా –దేశభక్తి వంట బట్టించుకొని విద్యార్ధులకు –అమ్మభాషయినా నేర్పండి

              ఆచార్యులారా –మాతృభాష ,మాతృప్రేమను దేశ సేవను

               పెంచేదివ్య ఔషధం అని చాటండి

                                కాల మహిమ

                  శిశిరం హరించిన పాత్ర సంతతిని—వసంతం లో చెట్టు యధావిధిగా ప్రసరిస్తుంది

                  అదే పత్ర హరితం అదే త్యాగ భరితం

                  మనిషి ఒక తరాన్ని –చరిత్ర పుటల్లోకిదూర్చి

                   మరో కొత్త తరానికి దారిస్తే –వారసులది ఒక్కో రీతి ,ఒక్కోనీతి

                  ఒకరిది స్వార్ధ ప్రవ్రుత్తి –ఇంకోరిది పశు ప్రవ్రుత్తి

                  కాలమా !ఏమిటీ వైపరీత్యం ?

                 సశేషం

                          మీ—గబ్బిటదుర్గా ప్రసాద్ -15-4-13- ఉయ్యూరు

                  

 

                   

 

           

Posted in కవి కోకిల స్వరాలు | Tagged | Leave a comment

నిజం గానే ప్రతి వాది భయంకర శ్రీనివా(యి)స్

  నిజం గానే ప్రతి వాది భయంకర శ్రీనివా(యి)స్

           ఆయన గాత్రం విలక్షణ మైంది .ఆయన ఆహార్యం అచ్చ తెలుగుదనం నిండి ఉండేది .ఆయన అష్టభాషా పండితుడు .రెండు లక్షకు పైగా గజల్స్ రాసి ‘’గజల్ మొగల్ ‘’అని పించాడు .నిండైన విగ్రహం నిలువు బొట్టు తలపాగా చూడగానే ఆయనే ప్రతివాది భయంకర శ్రీనివాస్ అని గుర్తిస్తాం .ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా ఆయన తీరు మారదు .మనల్ని చూసి అంతా నేర్చుకోవాలన్న అయన ఆరాటం సఫలీ కృతం .83 ఏళ్ళ వయసులోనిన్న  అమరుడై అమర గాయక శ్రేణిలో చేరిపోయాడు ఆయన వాయిస్ ను’’ శ్రీనివాయిస్ ‘’అని బాపు రమణలు కీర్తిన్చినట్లు గుర్తు .అదో సప్తస్వర స్వర పేటిక .అందులో ఎన్నెన్ని రాగాలు ఇమిడాయో ,ఓదిగాయో లెక్క చెప్పలేము /పక్క రాష్ట్రాలు గుర్తించి కీర్తి కిరీటాలు పెట్టినా కళ్ళు లేని కబోది ప్రభుత్వాలైన మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రమూ ఏ బిరుదూ నివ్వకుండా  నిశ్చేతనంగా ఉండిపోవటం సిగ్గు పడాల్సిన విషయం దీనికి ప్రయత్నించని శాసన సభ్యులు పార్లమెంట్ సభ్యుల అచేతనత్వానికి నిదర్శనం .ఆయన వీటికేమీ ఆరాట పడలేదు .ఆయనకు వస్తే మనం సంతోషించేవాళ్ళం .కాలర్ ఎగరేసుకొనే వాళ్ళం .

 14-4maintop 15BGPBS1_1428036g

 

                 సందర్భానికి ,సంఘటనకు స్పందించి కవితలు చెప్పిన కవి గాయకుడు శ్రీనివాస్ ..నీల్ ఆర్మస్త్రాంగ్ చంద్రుని పై కాలు మోపి నప్పుడు మానవ అభ్యుదయం ముండగు వేసినందుకు పులకించి ఆంగ్లం లో కవిత రాసి ,పాడి ‘’మామ’’ పైనే కాలు మోపిన’’ అల్లుడుఆర్మ స్ట్రాంగ్’’ ను ,ఆనాటి ప్రెసిడెంట్ నిక్సన్ ను  మెప్పించిన ఘనుడు .చిన్నతనం లో మాటలు ఆలస్యం గా వచ్చినా  ‘’శ్రీనివాయిసీయం ‘’ఆ తర్వాత ఉధృత సెలయేటి ప్రవాహం లా ముందుకు దూసుకొని ఒడ్డులొరసి ప్రవహించి ధన్య మైంది భక్తీ, రక్తి ,జ్ఞాన వైరాగ్య గీతాలకేన్నిటికో ప్రాణ ప్రతిష్ట చేశాడు .సినీ సంగీత దర్శకత్వమూ వహించి తన సత్తా చాటుకొన్నాడు .ప్రముఖ వీణ విద్వాంశులు ఈమని శంకర శాస్త్రి గారి ప్రోత్సాహం తో సినీ రంగ ప్రవేశం చేసి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా చేసుకొన్నాడు .మొట్టమొదటి సారి జెమినీ స్టూడియో లో భక్త కబీర్ దాస్ దోహాలు పాడి ‘’ఆహా ‘’అని పించుకొన్నాడు అదే ఆయన రంగ ప్రవేశం ..

          ఘంట సాల వెంకటేశ్వర రావు  గారంటే వీర అభిమానం శ్రీనివాస్ కు .ఘంట సాల విగ్రహావిష్కరణకు వచ్చి మహా సంబర పడ్డాడు .నిర్మాత నాగేంద్ర రావు ఆయనకు తోలి అవకాశమిచ్చారు .ప్రముఖ గాయని సుశీల గారితో కలిసి తొలి సినీ పాట  పాడారు ..అదే ‘’ప్రేమపాశెం ‘’ఆ పాశం ఇప్పటి వరకు వదలలేదు ‘’అదో అనుకోని యాదృచ్చిక సంఘటన .తెలుగు లో ‘’కత్తి వీరుడు కాంతా రావు ‘’సినిమాలకు ,కన్నడం లో ‘’కన్నడ కంఠీరవుడు’’రాజ కుమార్ కు ,తమిళం లో శివాజీ గణేషన్ కు ఎక్కువ పాటలు పాడిన ఘనత శ్రీనివాస్ దే .హిందీ లోను పాడి అక్కడి ,ఇక్కడి వారిని మెప్పించాడు .దక్షిణాది భాషలన్నిట్లోనూ పాటలు పాడి సెహబాస్ శ్రీనివాస్ అని పించుకొన్నాడు .అయన గీత రచయిత గా కూడా లబ్ధ  ప్రతిస్టుడు.

                    ఆకలి రాజ్యం హిందీ సినిమాలో ‘’తూ హై రాజా ‘’అనే జనాదరణ పొందిన పాట రాసిన గీత రచయిత శ్రీనివాస్ .చాలా కాలం సినీ సంగీత వినీ లాకాశం లో చుక్కల్లో పున్నమి చంద్రుడు గా వెలిగాడు .భక్తీ గీతాలను ఆర్తిగా పాడి మెప్పు పొందాడు ముకుందమాల వెంకటేశ్వర సుప్రభాతం ,మల్లికార్జున స్తోత్రం పాడి భక్తీ భావలహరి ని పారించిన మేటి గాయకుడు .శ్రీనివాయిస్ లో మాధుర్యం పరవశం కల్గిస్తుంది .ఆయన శైలి చాలా విలక్షణ మైనది ఎన్నో పద్యాలకు ప్రాణం పోశాడు .మద్రాస్ లో వుడ్ లాండ్ హోటల్ లో ఆయన సాయంకాలాలు  తనకై కేటాయించిన ప్రత్యెక టేబుల్ దగ్గర కోర్చుని గీత రచన చేయటం,పాడి వినిపించి అభిమానులను సంతృప్తి పరచటం  అందరికి తెలిసిన విషయమే .ఘంట సాల సినీ రంగం లో ఏకచ్చత్రాదిపత్యం గా ఏలుతున్న కాలం లో ఆ కంఠానికి  ఏమాత్రం దరి దాపుల్లో తన స్వరం లేక పోయినా ,విలక్షణ స్వరం తో అంతటి స్తానాన్ని ఆక్రమించటం శ్రీనివాయిస్ ప్రతిభకు నిదర్శనం ..

         హిందీలో రఫీ కి మించిన గోతు ఘంటసాలది తలత్ మహమూద్ ను తలపించే స్వరం శ్రీనివాస్ ది అని అందరు మెచ్చిన సంగతి మనకు తెలుసు .’’పక్కింటి అమ్మాయి ‘’సినిమాలో శ్రీనివాస్ జపానీ పాటను పాడిఅలరించి  తన ‘’స్వర వైవిధ్యాన్ని’’ నిరూపించుకొన్నాడు .’’నీలి మేఘాలలో నీలాల తారవో ‘’అని పాడినపాట రఫీ పాడిన‘’చౌదవీకా చాంద్ హో ‘’కు ఏమాత్రం తీసిపోదని సినీ విశ్లేషకుల భావన .అలానే భలే రాముడు సినిమాలో‘’భయమేలా ఓ మనసా ‘’పాటలో ఆర్ద్రత గుండెను తాకి వివశుల్ని చేసింది .’’కాలంగల్ ఆదు వసంతం ‘’అన్న‘’పాపమన్నిప్పు ‘’సినిమాలోని పాటతో ఉజ్వల గాయకుడి గా శ్రీనివాస్ ఎదిగి పోయాడు .ప్రేమించి చూడు సినిమా లో పాడిన పాటలు కొంటె తనానికి ,మాధుర్యానికి పెద్ద పీటే వేశాయి .అప్పటి దాకా తన పాటలు తానే పాడుకొనేకన్నడ రాజ్ కుమార్ శ్రీనివాస్ గొంతులోని మాధుర్యానికి, లాలిత్యానికి మురిసి పోయి తన చిత్రాలన్నింటిలో ఆయన తోనే పాడించి తనకూ శ్రీనివాస్ కు యేన లేని కీర్తి తెచ్చారు .హిందీ సౌరాష్ట్ర ,సింహళీ ,బెంగాలి ,పంజాబీ మొదలైన 12భాషల్లో పాటలు పాడిన మహా గాయకుడు శ్రీనివాస్ .ఆయన దగ్గరకు వచ్చే స్తాయి చాలా మందికి లేదని నిరూపించుకొన్నాడు ఇమిటేషన్ పాటలతో మురిపించి ఏలే గాయకుల మధ్య సవత వాణీ బాణీలతోస స్థిర స్థానం  సంపాదించుకొన్నాడు వారికి బిరుదులోచ్చాయి ఈయన్ని గుర్తించనే లేదు అదీ వింత . . దీనికీ కుంగిపోలేదు అయన .తన దారి లో తాను అవిశ్రాంతం గా నడచి గమ్యం చేరుకొన్నాడు .హిందీ లో రఫీ ,మన్నాడే గీతారాయ్ వంటి ప్రముఖ గాయకులతో స్వరం కలిపి పాటలు పాడిన మేటి గాయకుడు శ్రీనివాస్ .

       ‘’ అయిదు స్వరాల రాగాలకు బదులు నాలుగే స్వరాలతో ప్రముఖ కర్నాటక సంగీత వాగ్గేయ కారుడు శ్రీ మంగళం పల్లి బాల మురళీ కృష్ణ ఆలపిస్తే ,స్వర ప్రధానం గా’’ ఏక స్వరం’’ తో రాగాలను ఆలపించి ‘’ఎకేశ్వరి ‘’అని పేరు పెట్టిన స్వర మాంత్రికుడు పి.బి.శ్రీనివాస్ ‘’ అని సంగీతజ్నులచేత ప్రస్తుతింప బడ్డాడు .పట్టుమని పది రోజుల్లో ఉర్దూ భాష నేర్చుకొని అందులో రెండున్నర లక్షల గజల్స్ రాసిన ‘’గజల్ ఘనా పాఠీ’’పి.బి..

            పి.బి.అంటే చాలు ‘’ఓహో గులాబి బాలా అందాల ప్రేమ మాలా ‘’’’వెన్నెల కేలా నాపై కోపం’’ ,’’అందాల ఓ చిలకా అందుకో నా లేఖా ‘’’’నీలి కన్నుల నీడలల లోనా ‘’,వెన్నెల రేయీ ఎంతో చలీ ‘’భక్త పోతనలో పోతన్న గారి రస గుళికలైన పద్యాలు గుర్తుకొస్తాయి .ఆయన భౌతికం గా లేక పోయినా ‘’నువ్వు లేవు –నీ పాట ఉంది ‘’అన్న కవి వాక్కు జ్ఞాపకం వస్తుంది .స్వర్లోకం లో ఈ స్వర మాంత్రికుడు సురలోకాదిపతినీ తన అనేక భాషా పాండిత్యం తో ఉక్కిరి బిక్కిరి చేస్తాడేమో ?

              ‘’ లాంగ్ లివ్ శ్రీనివాయిస్ ‘’

               మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –15-4-13 ఉయ్యూరు 

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

అమరుడైన పి.బి.

20130415a_01010101014-4maintop

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment