కనబడుట లేదు! తొలి తెలుగు శాసనం ఎక్కడ?!

కనబడుట లేదు! తొలి తెలుగు శాసనం ఎక్కడ?!
– డాక్టర్ వేంపల్లి గంగాధర్

కడప జిల్లాలోని కలమళ్ళ గ్రామంలో గల శ్రీ చెన్నకేశవస్వామి ఆలయ ప్రాంగణంలో క్రీ.శ. 575లో రేనాటి చోళరాజు ధనుంజయ వర్మ వేయించిన శాసనాన్ని 1904లో మద్రాసు శాసన పరిశోధన విభాగం వారు గుర్తించారు. నేటికి లభించిన తొలి తెలుగు శాసనాల్లో కలమళ్ళ శాసనమే ప్రప్రథమ మనడానికి అందులో వాడిన ప్రాచీన లిపి-భాషలే ప్రమాణం.

పోగొట్టుకున్నాం!

ఈసారి పోయింది అట్లాటి ఇట్లాటి వస్తువు కాదు. తెలుగు భాషకు వెలుగు పూలు పూయించిన తొలి తెలుగు శాసనం…
తెలుగు భాషకు రాజ భాష హోదాను, శాసన భాషగా ఒక అధికార ప్రతిపత్తి కల్గించి, తెలుగు భాషకు అక్షర రూపం యిచ్చి చారిత్రకంగా, సాహిత్యపరంగా ఘన వారసత్వ కీర్తిని అందించిన ‘కలమళ్ళ శాసనం’ -తొలి తెలుగు శాసనం ఎక్కడుందో యిప్పుడెవరికీ తెలియడం లేదు. అందరూ నిస్సహాయంగా చేతులెత్తేస్తున్నారు. దీంతో దాదాపుగా మనం తొలి తెలుగు శాసనాన్ని కోల్పోయినట్లేనని భావించాల్సి వస్తోంది. కడప జిల్లాలోని కలమళ్ళ గ్రామంలో గల శ్రీ చెన్నకేశవస్వామి ఆలయ ప్రాంగణంలో క్రీ.శ. 575లో రేనాటి చోళరాజు ధనుంజయ వర్మ వేయించిన శాసనాన్ని 1904లో మద్రాసు శాసన పరిశోధన విభాగం వారు గుర్తించారు. ఆ తర్వాత వారితో పాటూ ఆ శాసనాన్ని మద్రాసు మ్యూజియానికి తరలించారని అందరూ భావిస్తూ వచ్చారు. ఇదే నేపథ్యంలో నేను సమాచార హక్కు చట్టం ద్వారా 07 జనవరి 2013 నాడు శాసనం నమూనా ప్రతిని, స్క్రిప్ట్‌ను జతపర్చుతూ సమగ్ర వివరాలతో చెన్నై ‘ఎగ్మోర్’ ప్రభుత్వ మ్యూజియం వారిని ప్రశ్నించడం జరిగింది.

తొలి తెలుగు శాసనం, రేనాటి చోళరాజు ధనుంజయ వర్మ వేయించిన శాసనంకు సంబంధించిన వివరాలు, మ్యూజియంలో ప్రదర్శిస్తున్నారా? దానిని తగిన విధంగా సంరక్షిస్తున్నారా? వంటి ప్రశ్నలను వారి ముందుంచినప్పుడు- అలాంటి శాసనమేదీ తమ వద్ద లేదని- చెన్నై ప్రభుత్వ మ్యూజియం అసిస్టెంట్ డైరక్టర్ తిరు ఎస్. సెల్వ అరసు, అధికారికంగా లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.
దీంతో యింతకాలంగా ఎగ్మో ర్ మ్యూజియంలో వుందని భ్రమపడుతూ వచ్చిన శాసనం అక్కడ లేదని తేలిపోయింది. అంతకు మునుపే శాసన నిర్దేశకుల కార్యాలయం, భారతీయ పురాతత్వశాఖ, మైసూరు వారి వద్ద కూడా ఈ శాసనం లేదని వెల్లడైంది. ఈ మైసూర్ శాఖ ఎపిగ్రాఫియా ఇండియా, ఏన్యువల్ రిపోర్ట్ ఆన్ ఇండియన్ ఎపిగ్రఫీ అనే శాసన పత్రికలను కూడా ప్రచురిస్తోంది. ఈ మైసూర్ కార్యాలయానికి 125 సంవత్సరాల చరిత్ర కూడా వుంది. వీరి వద్ద రేనాటి చోళుల శాసనాలకు సంబంధించిన ప్రాథమిక సమాచారం వుంది. కానీ ‘తొలి తెలుగు శాసనాన్ని’ సేకరించకపోయినందుకు, సంరక్షించక పోయినందుకు మనం విచారించాల్సిందే!

ఇదే విధంగా భారతీయ పురాతత్వ సర్వేక్షణ, ఉప పురాతత్వ అధీక్షకులు- హైదరాబాదు వారిని కూడా 30 అక్టోబర్ 2012 నాడు రెండు లేఖల ద్వారా ప్రశ్నించడం జరిగింది. వారి నుంచి కూడా అసంతృప్తిని మిగిల్చే సమాధానాలే లభించాయి. తొలి తెలుగు శాసనం ఆచూకీ తమకు కూడా తెలియదని చేతులెత్తేయడం దిగ్భ్రాంతిని కల్గిస్తోంది.
సమాచార హక్కు చట్టం ద్వారా భారతీయ పురాతత్వ శాఖ, హైద్రా బాదు మండలం వారిని ఈ అంశంపై అడిగిన కొన్ని ప్రశ్నలు- వాటికి వారిచ్చిన సమాధానాలు ఇవి:
? కడప జిల్లాలో బయల్పడిన ‘కలమళ్ళ శాసనం’ ప్రస్తుతం ఎక్కడ వుంది?
ం కలమళ్ళ గ్రామంలో గల శ్రీ చెన్నకేశవస్వామి ఆలయ ప్రాంగణంలో 1904లో మద్రాసు నందలి శాసన పరిశోధన విభాగం వారు ఈ శాసనాన్ని గుర్తించారు. ప్రస్తుతం ఎక్కడ వుందో తెలియదు. ? కలమళ్ళ శాసనం పొడవు, వెడల్పు, ఆకారం, బరువు వంటి సాంకేతిక వివరాలు తెలపగలరు?
ం కలమళ్ళ శాసనం పొడవు, వెడల్పు, ఆకారం, బరువు వంటి సాంకేతిక వివరాలు లభించుట లేదు.
? కలమళ్ళ శాసనాన్ని మొదటిసారిగా ఎవరు, ఎప్పు డు, ఎక్కడ గుర్తించారు? తర్వాత ఎక్కడికి తరలించారు? ప్రస్తుతం ఎక్క డుంది?
ం కలమళ్ళ శాసనాన్ని తొలిసారిగా 1904లో మద్రాసు ప్రభుత్వ శాఖ వారు కలమళ్ళ గ్రామంలోని ఆలయ ప్రాంగణంలో వున్న ట్లు గుర్తించారు. తర్వాత 1947-48 లో ఆచార్య కె.నీలకంఠ శాస్త్రి, యమ్. వెంకట రామయ్య ఈ శాసనాన్ని పరిష్కరించి ప్రచురించారు.
ఇంతకు మించి ఏ సమాచారం అందుబాటులో లేదు.

? తొలి తెలుగు శాసనంగా చెప్పబడుతున్న కడప జిల్లా లోని కలమళ్ళ శాసనంను భారతీయ పురాతత్వ శాఖ తొలి తెలుగు శాసనంగా అంగీకరిస్తోందా? అంగీకరిస్తే ఆధారాలు తెలుపగలరు? ం రేనాటి చోళరాజు ధనుంజయుడు వేయించిన కలమళ్ళ శిలాశాసనాన్ని తొలి తెలుగు శాసనంగా ప్రసిద్ధ శాసన పరిశోధకులు సహేతుకంగా నిర్ణయించారు. కావున మేము కూడా వారి అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాము. నేటికి లభించిన తొలి తెలుగు శాసనాల్లో కలమళ్ళ శాసనమే ప్రప్రథమ మనడానికి అందులో వాడిన ప్రాచీన లిపి-భాషలే ప్రమాణం. ఎరికల్ ముత్తురాజు వేయించిన ఎర్రగుడిపాడు శాసనం, పుణ్యకుమారుడి తిప్పలూరు శాసనాలు తర్వాత క్రమంలో వచ్చి చేరుతాయి.

‘తెలుగు లిపి’ నిర్మాణం…

తొలి తెలుగు శాసనం వల్ల నాటి నుంచి నేటి వరకు తెలుగు లిపి పరిణామ క్రమాన్ని అధ్యయనం చేయడానికి వీలు కల్గుతుంది. ప్రాకృత, ద్రావిడ భాషల నుండి విడిపోయి వేరుగా తెలుగు లిపి నిర్మితం కావడం గుర్తించవచ్చు. తెలుగు వాక్య రచనా విధానం, ఉచ్ఛారణ సౌలభ్యం కోసం చేసుకున్న ఇతర మార్పులు విశదమవుతాయి. ప్రాకృత వాక్యాల స్థానంలో తెలుగు వాక్యాలు చేరడం గమనించవచ్చు. వీటి ద్వారా తెలుగు భాషా సంప్రదాయ, స్వరూపాన్ని విశ్లేషించవచ్చు.

చరిత్ర ఆధారాల్లో…

రేనాటి చోళుల కారణంగా మనకు ఇవాళ ప్రాచీన తెలుగు వాక్య రచనా విధానం తెలుస్తోంది. రేగడినేల ఉన్న ప్రాంతం కాబట్టి ‘రేగడినాడు’ ప్రాంతం ‘రేనాడు’గా మారి ఉండవచ్చునని చరిత్ర పరిశోధకుడు పుట్టపర్తి శ్రీనివాసాచారి అభిప్రాయపడ్డారు. రేనాటి చోళులు తాము కరికాల చోళుని సంతతికి చెందినవారమని చెప్పుకున్నారు. క్రీ.శ. 484 ప్రాంతంలో రేనాడు కరికాల చోళుని పాలనలో వుండేదని చరిత్రకారుడు నేలటూరి వెంకట రమణయ్య నిరూపించారు.
తెలుగులో మొట్టమొదటి శాసనాల్లో కన్పించే రేనాటి చోళుని పేరు ఎరికల్ ముత్తురాజు ధనుంజయుడు. ఇతడు నందివర్మ కుమారుడు. ధనుంజయ వర్మ పేరుకు ముందున్న ‘ఎరికల్’ అనేది రేనాటి సీమలోని గ్రామమై వుంటుందని కూడా చరిత్రకారుల భావన.
రేనాటి చోళులు ‘చెప్పలియా’ గ్రామం రాజధానిగా రేనాటి ప్రాంతాన్ని పాలించారు. రేనాడు ప్రాంతం కడప జిల్లాలోని ప్రొద్దుటూరు, కమలాపురం, జమ్మల మడుగు, తాలూకాలు; కర్నూలు జిల్లా కోయిలకుంట్ల తాలూకాలోని కొన్ని ప్రాంతాలతో వున్న ఏడు వేల గ్రామాలున్న ప్రాంతంగా ‘పూర్వోద్ధృతము’ రచన నందు ఎస్.వి.రమణయ్య ఆధారాలు చూపారు. రేనాటి చోళులు తమ రాజధానిగా చేసుకున్న ‘చెప్పలియా’ ప్రాంతం నేడు కమలాపురం మండలంలోని ‘పెద్ద చెప్పలి’గా తగిన ఆధారాలతో గుర్తించడం కూడా జరిగింది.

రేనాటి చోళుల వంశ వృక్షంలో 13 తరాల రాజుల పేర్లు శాసనాధారాల ద్వారా రూపొందించడమైంది. కశ్యప గోత్రానికి చెందిన నందివర్మ పరిపాలనా కాలం క్రీ.శ. 550 అని చెప్పుకోవచ్చు. తర్వాతి తరంలో వచ్చిన సింహ విష్ణు, సుందరనంద, ధనుంజయ వర్మలు క్రీ.శ. 575 ప్రాంతంలో వచ్చారు. పుణ్యకుమారుడు, వసంతపోరి చోళ మహరాణి భర్తగా, పోర్ముఖరామ, పురుష శార్దూల, మదన విలాస వంటి బిరుదులు ధరించి క్రీ.శ. 625లో నాల్గవ తరంలో కీర్తి పొందాడు. 11వ తరంలో నృపకామ (క్రీ.శ. 800), 12వ తరంలో దిహికర (క్రీ.శ. 825), 13వ తరంలో శ్రీకంఠ అధిరాజు (క్రీ.శ. 850) క్రమ పట్టికలో కన్పిస్తారు.

ఆనాటి కాలంలో యువరాజు కాకుండా మిగిలిన రాజకుమారులలో పెద్దవాడిని ముత్తురాజు అని పిలిచేవారు. అంటే యువరాజు తర్వాత రాజ్యానికి రాజుగా రావడానికి అవకాశాలున్న వారికే ఈ పట్టం యిచ్చేవారు. మహేంద్రవర్మ కొడుకైన పుణ్యకుమారుడి రెండు తామ్ర శాసనాలు, మూడు శిలాశాసనాలు లభిస్తున్నాయి. ప్రొద్దుటూరు రామేశ్వర శిలాశాసనంలో ‘పృథివీ వల్లభ’ అనే బిరుదు పేర్కొనడం జరిగింది. పుణ్య కుమారుడు హిరణ్య రాష్ట్రాన్ని పాలిస్తూ కొంత భూమిని దానం చేసినట్లు ఒక తామ్ర శాసనం చెప్తోంది. తర్వాత కాలంలో వైదుంబ రాజులు రేనాడును ఆక్రమించుకోగా వీరు పొత్తపి ప్రాంతానికి మరలిపోయినట్లు చరిత్ర కథనం.
చివరగా…

గత ఏడాది డిసెంబర్ మాసంలో 27 నుంచి 29 వరకు మూడు రోజుల పాటూ నిర్వహించిన ‘ప్రపంచ తెలుగు మహాసభల్లో’ తొలి తెలుగు శాసనాన్ని ప్రదర్శిస్తారని ఎందరో భాషాభిమానులు, చరిత్ర పరిశోధకులు ఎదురుచూశారు. కానీ వారికి నిరాశే మిగిలింది. అధికార భాషా సంఘం, రాష్ట్ర సాంస్కృతిక శాఖ గానీ దీని పట్ల శ్రద్ధ పెట్టినట్లు కూడా కన్పించదు. భారతీయ పురాతత్వ శాఖ-హైదరాబాదు శాఖ గురించి యిక చెప్పనవసరం లేదు. కనీసం యికనైనా ఈ శాసనం ఆనవాళ్ళ గురించి, ఆచూకీ గురించి విస్తృతంగా అన్వేషణ జరగాల్సిన అవసరం తప్పనిసరిగా వుంది. లేదంటే- చరిత్ర ఎప్పటికీ మనల్ని క్షమించదు

– డాక్టర్ వేంపల్లి గంగాధర్
94400 74893

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సరభారతి ప్రచురణ – సిద్ద యోగి పుంగవులు – pdf

 

సిద్ద యోగి పుంగవులు

siddhayogi pungavulu -cover-1 siddhayogi pungavulu -cover-2

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | 1 Comment

శ్రీ విజయ ఉగాది కవికోకిల కల స్వనాలు -7

    శ్రీ విజయ ఉగాది కవికోకిల కల స్వనాలు -7

                  16-  ఉగాది హేల–కవిత –శ్రీ అగ్ని హోత్రం శ్రీ రామ చక్ర వర్తి –కూచిపూడి –

   అనురాగ కుసుమాలు వికశించగా –ఆనంద జేగంట మది మ్రోగగా

  అందరి హృదయాలు పులకించగా –ఈ విజయ నామ సంవత్సరం –సరసభారతి ప్రోత్సాహం

  శ్రీ రస్తు శుభ మస్తు –ప్రపంచ శాంతి రస్తూ –విచ్చేసిన కవి పున్గవులకు విజయోస్తు .

       శ్రీకర నూత్న వత్సరమ శీఘ్రము రమ్మిక స్వాగతమ్మునున్

       ప్రాకట లీల బల్కదము పావన భక్తి విజయనామ సు

       శ్లోక శుభాబ్దమా ప్ర,ణప్రతులన్ గొనుమ బహుధా సుదీ సుధా

        మా ,కరుణించి బ్రోవుము సుమా మము నీవు శుభ  క్షమా రమా .

             అరయ సుందర ప్రకృతి నంత జ గాన ఉగాది హేల సొం

             పార వహించే ,మించే ఫలభాషిత పుష్ప సుగంధ బంధురో

             దార విలాస కోకిల వితాన కుహూధ్వని కేకి నాట్య వి

             స్తార శుకారవలి కుల ఝాంక్రుతి దక్షిణ మారుతమ్ములన్ .

     రెండేండ్ల పసి పాప ,రెక్కలాడిన వగ్గు –మగవాని కామాన మ్రగ్గిపోవ

     గద్డైన దుడ్డైన ‘’గర్భాత్ర పరులరౌ ‘’—స్వార్ధ సురాలికి స్వాహ కాగ

     రోజుకో పార్టి సరోజుల గుమగుమల్ –రాజకీయ వనాల బ్రబలు చుండ

     బాబాలు స్వాములున్ వాడ వాడల –జనము లో పిచ్చగా ఘనులు కాగ

     నేటి స్వాతంత్ర భారతి నేమ్మనంపు –స్వర్ణ కాంతులతో గామ్క్షింప వచ్చు చున్న

     యో విజయా ,యొకింత నీ వొదిగి యుండి –మంచి శకునమ్ము జూచి యేతెంచి రమ్ము .        

                  అవినీతి కనురీతి నభ్యుదయంముతో –శుక్ల పక్షపు చంద్రు సోబగులీనే

                  మమకార మనురాగ మనువనువు నశింప –మానవత్వము తాను మచ్చ నూనె

                  హింసలు ,ద్వేషాలు హెచ్చులై మెచ్చులై –రాహుకేతుల పాత్ర రచన చేసే

                  కులములు ,మతముల గుమ్మలాటలబడి –సర్వాత్మ భావమ్ము చంపి వేసే

                  నిట్టి దుర్ముహూర్తమ్ములో నేట్టులీవు –రాగలవు ,మా మదుల కనురాగ మీయ

                  గలవు ?ఐన నీ గ్రహ గతుల్ కఠిన మౌచు –నిన్బడగా జూచే కర్మముం దీర్చి కొనుము

     

 

        17—అప్పుడే అసలు ఉగాది –కవిత –శ్రీమతి పెళ్ళూరి శేషుకుమారి –విజయ వాడ .

                 నిరంతర స్రవంతి –నిత్య నూతన తేజస్వి –అవిశ్రాంత సమ వర్తి –అపరిష్కృత అభినేత్రి–కాలం

         ఈ భ్రమణం లో మనిషి జీవన విధాన పరిణామ క్రమం విపరీతమై –వైపరీత్యాలకు తావిస్తోంది

          కుటుంబ వ్యవస్థ కుంటుపడి పోయి –వృద్ధాశ్రమాల ఎదుగుదలకు కాపు కాస్తోంది

          మాత్రుత్వపు కు తీరికే లేదు –పేగు తెంచుకొన్న మరుక్షణమే అమ్మ తనానికి కరువొచ్చి

           పసి కందు పరాయితనపు ఆలనా పాలన లో ఒదిగి పోతోంది

            బుడి బుడి నడకలు –చిటిచిటి పలుకులు –శైశవాన్ని మురిపెంగా ఆహ్వానిచే అమ్మతానాలు లేవు

       స్తన్య మిచ్చి ధన్యమైన అమ్మ –ఏనాటికైనా ఆదర్శమే

         ఏం దౌర్భాగ్య మోచ్చిందో మమతానురాగాల కోవెల మూసుకు పోతోంది

         ఏమయితేనేం కళ్ళున్నా చూడలేని అంధకారం లో ఉన్నాడు మనిషి

         అడుగు తడబడుతున్నా –మనసులో ఒంటరితనం ఎగబడుతున్నా

        కర్ణభేరి ని కరాబు చేసే సెల్లుతో –శాటి లైట్ల కింద ఆహ్లాదాన్ని ఆవిష్కరిస్తున్నాడు .

        సహజత్వం తలవంపుతనమై –మనిషి మానవ మూల్యాలను సమూలంగా పెకలించుకొంటు

        మరమనిషి లా మారిపోతున్న ఈ నైజం –దిగ జారుడు తనానికి పరాకాష్ట

        పచ్చదనాన్ని ఓర్వలేనితనం పురుడు పోసుకొని –సహజీవనానికి స్వస్తి వాక్యం ఇచ్చింది

       పెరుగుతున్న విజ్ఞానం లో విచక్షణ కోల్పోతున్న మనిషి

       క్షనాలన్నింటిణీ కరెన్సీ కి డాలర్లకు మూట గట్టి

      జీవితం తాలూకు ఆనందాలకు ఇరుకు బతుకుల్లో ఈడ్చుకుంటూ

      ఏమీ మిగలని జీవితం పొడవును వెనక్కి తిరిగి చూసు కొంటె

       ‘’నందన ‘’విలాసం గా నవ్వుతు వీడ్కోలు అందుకోంది

       ఇదే సృష్టి రహస్యం అంటూ –నూతనోత్తేజం పొంగులు వారుతుంటే

       ‘’విజయ ‘’నామ వత్సరం ఆహ్వనానికి వచ్చింది

      షడ్రుచుల ఉగాది పచ్చడి చప్పరిమ్పులతో సరికాదు

       స్వచ్చమైన చైతన్యపు చిరు నవ్వులతో

        రేపటి లోగిలిలో –మనిషి అసలు మనిషి గా మారినపుడేఅసలు  ఉగాది

 

  

      18-మానవత్వం –శ్రీమతి వడ్డాది లక్ష్మి సుభద్ర –విజయ వాడ -0866-2541543

            మొగ్గగానే చిదిమేసిరి –అడిగే నాధుడే లేడాయే

          గర్భశోకం గుర్తించే వారే లేరై నారిప్పుడు

          కల్తీ ఎరువులు కల్తీ విత్తనాలు –రైతులకు శత్రువులాయే

          ఇదిగో డాము ,అదిగో బారేజి –ఊహల చిత్రాలు ఆశలు నింపే

           అన్నెం పున్నెం ఎరుగని యువకులు –బాంబులకు అన్కితమాయే

         కన్న వాళ్లకు శోకం మిగిలే –ఉన్నవాదోక్కడు వీధుల పాలాయె

         పాశ్చాత్య సంస్కృతి –వేర్రితలలేసే

         కుర్రకారు మతి తప్పి –కర్తవ్యమ్ తెలియక

        అడ్డదారులు వెతుకు తుంటే –తపన లేని చదువు

         శ్రమ లేని ధనము –కోరు చుండే నేటి యువత

       కాలేజీలలో చదువే పూజ్యం –వెంటాడే వేధింపులు

        ఆడపిల్లలు అదిరి బెదిరి వంచనకు గురై మోసపోయి

        బతుకు భారమై దిక్కు తోచక గగ్గోలు

        చదువు సున్నా –జీవితం శూన్యం

         కడుపు కొట్టి బాటలు వేసిన –మూన్నాల్లకు బోర్డులు తిప్పేసి

         కక్కలేక మింగలేక సతమత మయ్యే వేతన జీవులు  అందరాని మానవత్వం

         ఆలోచన లేని జీవితాలు ఇలానే ఉంటాయి

          ఈ విజయ వత్సరమైనా అందరికి శుభాల నివ్వాలని ఆశ .

    

19—ఓ శాంతి కపోతమా –కవిత –శ్రీ పాణిగ్రాహి రాజశేఖర్ –విజయవాడ –9292 006075

         ఓ శాంతి కపోతమా ఇటురాకు సుమా

       అస్సాం ఘటనలకు –నీ గుండె బెదురుతుందేమో

       ముంబై పేలుళ్లకు –నీ రెక్కలు ఊడిపోతాఎమో

       తమిళనాడు ,కేరళల జలయుద్ధమేఘాలు

        నిన్ను కప్పెస్తాయేమో

     ఆంద్ర కర్నాటక హద్దు గొడవలలో దెబ్బలు తింటావేమో

      తెలంగాణా ఉద్యమ సెగలో మాడి మసి అయి  పోతావేమో

     కుటిల రాజకీయ నేతల కబంధ హస్తాలలో చిక్కడిపోతావేమో

    ధన వంతుల పంజరాల్లో బొమ్మవై పోతావేమో

    శాంతివనం కాదిది –అవినీతి సామ్రాజ్యమే

   ఇక్కడ నీకు చోటే లేదు చోటా నాయకుల మధ్య

  నిన్ను స్వాగతించే నైతిక హక్కే కోల్పోయిన అభాగ్యులం

   అక్కున చేర్చుకొనే శాంతి దూతలే కరువైనారు

   మిత్రమా ణీ దారి  మార్చుకో –అశాంతి గూటి నుంచి పారిపో –శాంతి సీమ లో తల దాచుకో

 

 20-మల్లెపూవు మనువాడింది –కవిత శ్రీ మైనే పల్లి సుబ్రహ్మణ్యం –ఆకునూరు 9490420476 –

      చిన్నారి పువ్వా –చిరుమల్లె పువ్వా

      చిన్నారి మాలా మరుమల్లె మాలా

      మరువాన్ని నీవు మను వాడినా –మట్టుగుండే మరువ మంటే

     గుండు మల్లె నవ్విందట

      వాలు చూపుల వయ్యారంతో ,వరుసలేమో కలిపావా

      చెట్టాపట్టా లేసుకొని కొప్పులోకి చేరావా

      మండు టెండలో మరువాన్నే మరిచావా

      శృంగార శరాలతో వేధించావే

      మత్తుగుండే మరదలు పిల్లకి లోకువ నీవే నంటా

       తోటలోని ఆకుల మధ్య శ్వేత బిందువు నీవంటా

     కోటలోని తోబుట్టువులు తుల్ళ్ళీ తుల్ళ్ళీ గిల్లా రంటా

     గంపలోని గుంపు తోటి గుబాళించినావే –

     పెళ్లి లోని జంట మధ్య కులుకుతావే జంటగాను

      జడలోనే చేరి నీవు నాగకన్యలా ఉంటావు

     కొప్పులోకి చేరి నీవు కోటి కాంతులిస్తావు

     మజా గుండె మరదలు పిల్లకి నీతోడుంటే

     చిరుచేమటే  పన్నీరంటా

              సశేషం

           మీ—గబ్బిటదుర్గా ప్రసాద్ –14-4-13-ఉయ్యూరు

Posted in కవి కోకిల స్వరాలు | Tagged | 1 Comment

బొమ్మ కట్టిన తెలుగు మాట

14-4sun42

Posted in సేకరణలు | Leave a comment

శ్రీ విజయ ఉగాది కవికోకిల స్వనాలు -6

 శ్రీ విజయ ఉగాది కవికోకిల స్వనాలు -6

   13-పరామర్శ –మినీ కధ –శ్రీ పొన్నాడ సత్య ప్రకాశ రావు –  విజయ వాడ 9494649967

           అర్ధరాత్రి రెండింటికి ఫోన్ మోగి మెలకువ వచ్చింది .గతం లో’’ టెలిగ్రాం ‘’అని కేక వినపడగానే హడలి చచ్చే వాళ్ళం ఏం కొంప మునిగిందో నని .ఇప్పుడు వేళకాని వళ సెల్ మోగితే అదే కంగారు ఏ వార్తైనా పాట తో మొదలెట్టి చెబుతుంది .మంచేదో చెడేదో దానికేం తెలుసు ? .వైజాగ్ నుంచి అన్నయ్య ఫోన్ .వదినకు సేఎరియస్ అని i.c.u.లో ఉందని నీరసం గా చెప్పాడు .రెండు ఉపశమనం మాటలు ఊది, తయారై స్టేషన్ కు బయల్దేరా .అసలు మా అన్నయ్యకు ఆరోగ్య సమస్యలున్నాయి .ఆ మధ్యనే రెండు సార్లుi.c.uలో చేరి గండం గడిచి బయట పడ్డాడు .మా వదినకు మొదట్లో ‘’శంఖం ‘’మాత్రమె ఉండేది .ఈ మధ్యనే‘’చక్రం ‘’కూడా వచ్చి చేరింది .(అదే నండి బి.పీ.,సుగరూ )అయినా ఆరోగ్యం గానే ఉంటుంది .ఇప్పుడేమయిందో మరి ?

               నేను వైజాగ్ చేరకుండానే వదిన పై లోకాలకు చేరుకొన్న సంగతీ తెలిసింది .ఇల్లు చేరుకొన్నాను .పిల్లలు బంధువులు చేరుకొంటున్నారు .’’జరగ వలసిన కార్యక్రమం చూడండి ‘’అన్నాడు పక్క ఫ్లాట్ ఆయన నన్ను చూసి .శవాన్ని ఎక్కువ సేపు కారిడార్ లో ఉంచటానికి ఇష్టపడటం లేదుఇరుగుఊరుగు .మా వదిన నిన్నటి వరకు ఎంతో కలివిడి గా మసలిన మనిషి .ప్రాణం ఎంతో విలువైనదీ అంటే ఇదే నన్న మాట .

                అన్నయ్యతో మాట్లాడుతుంటే వచ్చింది మా మేనత్త ‘’అయ్యో !ఎంత పని జరిగి పోయిందిరా ! తను బాగానే ఉండేది కదా అసలు పోయింది తను అంటే నమ్మలేక పోయానురా ‘’అంది .దాదాపు అందరిది అదే మాట .అంటే అన్నయ్య పోయాడు అంటే తేలిగ్గా నమ్మే వారన్నమాట .’’నేనూ ముందు నమ్మలేదే .తను శుభ్రం గా నే ఉండేది కదా ?’’అన్నాడు మామయ్య.ఫార్మాలిటీ గా కాఫీ తాగుతూ .నేను వచ్చిన గంటలో మామయ్యకాఫీ తాగటం ఇది మూడో సారి ..

       ‘’అవును నేను పోయి ఉంటె బాగుండేది .’’అని అప్పటికి చాలా సార్లు అన్న అన్నయ్య కూడా మౌనం గా ఉండి పోయాడు .అందరు అదే మాట పలు సార్లు అంటుంటే చేష్టలుడిగి .

  ‘’బాడీ ని ఈ రోజే తీసేస్తారా /ఇంకా ఎవరైనా రావాలా ?’’ఎవరో చెవులు కొరుక్కుంటున్నారు .మా అన్నయ్య రెండో కొడుకు బొంబాయి నించి ఫ్లైట్ లో వస్తున్నాడు .వాడికోసమే చూస్తున్నాం .

          ఆటో ఆగిన శబ్దం విని బయటకు వచ్చాను .మా అన్నయ్య తోడల్లుడు(తోడేలల్లుడు ?) దిగాడు .నన్ను చూసి ‘’వార్త వినగానే షాక్ తో అవాక్కయ్యా నండీ .పోయింది ఆవిడా ,ఆయనా అని అనుమానం కూడా వచ్చింది . ఆవిడ బాగానే ఉండేది కదా ?ఏమయ్యింది ఇంతలో ?’’అని యక్ష ప్రశ్నలు సంధించాడు .నేను సమాధానం చెప్పకుండా మౌనం గా నిష్క్రమించాను .ఇదీ మన పరామర్శ తంతు .

 

14—తాజ్ మహల్ –కవిత –శ్రీమతి ఎస్.ఉషారాణి –  పెదఓగిరాల — 9346705908

        ఓ అపురూప చారిత్రిక విన్యాసమా !

        షాజహాను ప్రేమ పారవశ్యం లో స్నానించి

         పర్షియన్ అగరు ధూప లతికల్లో

        గులాబీ అత్తరు పరిమళాలలో

        విహరించిన మొఘల్ సోయగమా !

                 నీపాల రాతి చెక్కుటద్దాలలో

                 ఒదిగిపోయిన శరచ్చంద్రికలు

                 నీ రత్న ఖచిత కాంతి రేఖల్లో మెరిసి

                 ఎగిసి పడుతున్న యమునా జల తరంగిణులు

  ఒకానొక అవ్యక్త దుఃఖ భారంతో

  అనుక్షణం నీ తలపుల్ని స్పృశించే

  హాజహాను హృదయ విపంచిక నుండి

  జారిపడిన రస రాగ మాలిక వై

  ప్రపంచాన్ని వివశుల్ని చేస్తున్నావు .

             నీ నిశ్చల నిద్రా సౌందర్య భారాన్ని

             యమున మాత్రం ఎంతకాలమని మోయ గలదు ?

             శోకమా /విరహమా ?సౌందర్యమా ?

             ఎటూ తెలియక మనసు మాటి మాటికీ తడ బడుతోంది

    వెన్నెల లేని దీర్ఘ హేమంత యామినిలో

    యమునా జలాలాలలో నీ నీడ కనీ పించని వేళ

     షాజహాన్ శోక గీత మొకటి నిన్ను వెదుక్కుంటూ

      స్వర్గ ద్వారాల చెంత పదే పదే పడిగాపులు పడుతోంది

               చక్రవర్తీ !

              బ్రద్దలైన జీవన మధు కలశం నుండి ఒలికి పోతున్న

             సౌందర్య ప్రవాహాలను నీ కం దించే దెవ్వరు ?

              భరత ఖండ మంతా నీకు దాసోహమంటున్న వేళ

              నీప్రేమను పరీక్షించటానికి

              విరహోద్యాన వనాల్లోకి పారిపోయిన నీముంతాజ్

                         యమునా నదీ సైకత శ్రేణుల్లో

                         మలి సంజలో నిశ్చేస్టుడవై

                         ఒంటరిగా నిలబడిన నువ్వు,

                         కాలం చెక్కిలి మీద

                         గడ్డ కట్టిన కన్నీటి చుక్కలా

                          ఈ తాజ్ మహల్ !

 

      15–  అమ్మ భాష (కవిత )శ్రీ దండి భొట్ల దత్తాత్రేయ శర్మ –(మచిలీ పట్నం )-9247558854

             భాషే కదా –మనం పుట్టినప్పుడే మన పో(తొ )లి కేకతో మన బతుకు ను బయట పెట్టింది

          భాషేకదా –ఉయ్యాలలో ఉలిక్కి పడ్డప్పుడు –‘’వస్తున్నా కన్నా’’ అన్న అమ్మ పిలుపై                   ధైర్యాన్నిచ్చింది ?

          భాషేకదా –అల్లరి చేష్టలతో అలసిన వేళ –అమ్మ లాలి పాడి మనల్ని నిదుర పుచ్చింది ?

          భాషేకదా –ఉప్పు కప్పురంబు అంటూ భిన్న మైన మనుషులకు

                     రూపాలోకటే నంటూ ఒకటో తరగతి లోనే –బతుకు పాఠంనేర్పింది ?

        ఈ భాషే కదా –కులమత ప్రాంతీయ భేదాలకతీతంగా

                           విశాల భావం తో ‘’భాషా ప్రయుక్త ఆది రాష్ట్రం గా ‘’

                           ఆంద్ర రాష్ట్రాన్ని అవతరింప జేసింది ?

       మన తల్లి  భాషే కదా –మన ఆనందాన్ని బాధల్ని కోపాల్ని

                                     అభిమానాల్ని ,అవమానాలని పది మందితో

                                     మనసు విప్పి పంచుకొనేందుకు మాధ్యమమై

                                     నిలిచి మన భావ జాలానికి బలాన్నిచ్చింది /?

           అలాంటి అమ్మ భాష ను మరిచి –ఆర్ధికాభివృద్ధి సాకుతో నో ,ఉన్నత జీవనమన్న మైకం తోనో

             ఎంతగా అమ్ముడై పోయాం మనం

          మన తల్లిని వదిలి మన తల్లి చేతే ఊడిగం చేయించు కొంటు –కర్ర పెత్తనం చేస్తున్న ఆంగ్ల దొరసాని ని నెత్తి  కెక్కించు కొని

       ఊరేగిస్తున్నాం మన సౌభాగ్యాన్ని సర్వం కోల్పోయాం .

                 అవధానం వాడిని ,ఆవకాయ వేడినీ –గోముగా వడ్డించే గొంగూరనీ

                 సంక్రాంతికి ఎదురొచ్చే బసవన్నల్ని

                  పడమటి గోపురం మీదవాలి పోయే పొద్దుల్ని –

                  ఇలా ఎన్నిటినో ఎంతో కోల్పోయాం .

                               పంట పొలాల్ని చితి పెట్టి పరిగ లేరుకొంటున్నాం

                              చివరికి తల్లి భాషలో మాట్లాడి తే శిక్షలు పొందే స్తాయికి దిగజారాం  

                              ఆంగ్లాంధకారం నుండి ఇకనైనా మేల్కొందాం

                              అమ్మని ప్రేమిద్దాం –అతిధి ని గౌరవిద్దాం

                              అవసర మున్నంత వరకే  అవతలి భాషల గురించి ఆలోచిద్దాం

                              తెలుగు పునర్జీవానికి పూనుకొన్న ‘’విద్వన్ మండలి ‘’కి అండగా నిలుద్దాం

                      ఈ మెయిల్ లలో నో ఏ మెయిల్ లలోనో విహరిం చినా నా –తల్లి  మేలు మరచి పోకుండా ఉందాం

                      అంత రిక్షం లో ప్రసరించే అంతర్జాల ,శాస్త్ర ,సంకేత తరంగాలలో

                      తెలుగు అంత రంగాన్ని ఆవిష్కరిద్దాం

                     అంతరించి పోతోంది అంటున్న తెలుగు తేజాన్ని

                     ఖండ ఖండాంత రాలలో అఖండం గా ప్రకాశింప  జేద్దాం

                     విజయం చేస్తున్న విజయ నామ సంవత్సర సాక్షి గా బాస చేసి చెబుదాం

                     

       ‘’నా తల్లి బాస మరే భాష కు బానిస కానివ్వమని

      అమ్మకాలకు కాక ,అమ్మ కాళ్ళకే మనం అనవరత అవనత శిరస్కులమని ‘’

      మంచి మార్పు కోరే మనసే భాషా వికాసానికి పునాది

      దానిని ఆరంభించిన తొలి నాడే మనకు అచ్చమైన ఉగాది ..

                 సశేషం –మీ—గబ్బిటదుర్గా ప్రసాద్ –13-4-13 ఉయ్యూరు

Posted in కవి కోకిల స్వరాలు | Tagged | Leave a comment

ఉగాదికి ఆహ్వానం కవిత ,జలపాతాలు కిప్పింగ్ ,మాంగల్య శాస్త్రం -మూసీ మాస పత్రిక నుండి

ugadiki ahvanam jalapaathaalu mangalya shaastram -1 mangalya shaastram -1_1

Posted in సేకరణలు | Leave a comment

కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు–13 (చివరి భాగం )

  కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు–13 (చివరి భాగం )

               శాస్త్ర కవి ఉండేల మాల కొండా రెడ్డి

   విజ్ఞాన శాస్త్రం లో విశేష కృషి చేసి ,కమ్మగా కవిత లల్లిన వారు అరుదు గా ఉంటారు .ఆ అరుదైన కవుల్లో ఉండేల మాల కొండా రెడ్డి గారొకరు .ఇంజినీరింగ్ విద్య చదివి ఆశాఖ లో అధ్యాపకుడై ,స్వయం గా ఇంజినీరింగ్ కాలేజి స్తాపించి  ,సాంకేతిక విద్య ను సార్వత్రికం చేసిన వదాన్యుడు ,విద్యా వినయ సంపన్నుడు ,కవి ఉండేల.’’ఒండేల –ఉండేల అన్నిటా సర్వ సమర్ధుడు ‘’ .నేతాజీ ,వి వేకానందుడు ,కాంతి చక్రాలు అన్న కావ్యాలు రాశారు .నిత్యం రాయటం అయన దిన చర్య .తొమ్మిదో తరగతి లోనే కవిత చెప్పిన బాల కవి ..జాతిని తీర్చి దిద్దిన మహాను భావులను ,నాయకులను గా చేసి కావ్యాలు రాసి దేశ భక్తిని చాటుకొన్నారు .’’ఆరు వేల మైళ్ళ కావల బెత్తెడు –దీవులేలుకోనేదడివారు తెల్లవారు–నాల్గు కోట్ల ప్రజలు నలువది కోట్ల పై –ప్రభువులైరి ఎంత పరువు చేటు /’’అని చిన్నప్పుడే పరపీడనం పై విరుచుకు పడ్డారు .ప్రాచీన ఛందస్సునే ఎన్నుకొని కవిత లల్లారు .నవీన భావాలను అందులో అందం గా పొదిగారు .కర్షక పక్ష పాతి అవటం తో ఆ భావాలను ,అనుభ వాలను కర్షక భాష లో వెల్లడించారు .ఆయనకు ‘’జాబిలి రేక వెండి కొడవలి గా తోచింది .’’అది మొలక చీకటి పైరులను తరుగు తోందట .’’మంచి భావం, తగిన పదజాలం .వీరి కవిత్వాన్ని వేటూరి ప్రభాకర శాస్త్రి ,మల్లంపల్లి సోమ శేఖర శర్మ ,దుర్భా సుబ్రహ్మణ్య శాస్త్రి గార్లు మెచ్చారు .’’ప్రాచీనులలో నవీనులు ‘’అని కితాబు నిచ్చారు .

 malak_0 mg_logo_full Undela Malakonda Reddy

 

 

             ‘’వివేకానందుడు అనే గ్రంధం చక్కని తాత్విక చింతన కల్గిస్తుంది .’’కానందు ‘’ని పై రెడ్డి గారికి భక్తీ ఎక్కువ .పులకించి పోయి వర్నిస్తారా వైతాలికుడిని .వివేకానంద మరణాన్ని జీర్ణించుకోలేక ‘ఆత్మ సామ్రాజ్య పాలనా దక్ష మణికి–నీకు నేటికి నూరేండ్లు నిన్డునేల ?-దైవ సృష్టి రహస్య మర్ధంబు గాదు –త్యాగ గుణశాలి –భారత సన్యాస మౌళి ‘’అని తన బాధ నంతా కవిత్వం లో కుమ్మరించేశారు .

        ‘’కోడి’’ ని శ్రామిక జీవి అని ,సహృదయత తో మెచ్చారు .’’ఉదాత్త గుణాధ్యము ణనీచరిత్ర బెన్ కబ్బము వ్రాయ వచ్చును ‘’అని కొనియాడారు .శ్రమించే వారు అంటే రెడ్డి గారికి ఎంతో   ఆదరం .కోడికి ‘’రుతు బద్ధ రాగ భోగోన్నతి ఉంది‘’అని శ్లాఘించారు .కోడి ని ఆదర్శం గా తీసుకొంటే సోమరితనం పోతుందని ,ఉర్వి సుభిక్షం గా ఉంటుందని హితవు చెప్పారు .

                     భారతీయ కలలపై రెడ్డి గారికి అభిమానం ,మక్కువా ఎక్కువ .చేనేత పై ‘’వస్త్ర శిల్పి ‘’ఖండిక రాశారు .’’ప్రాణము లేని యంత్రాల పనిని మెచ్చి –జీవ యంత్రము నిను ,పేద జేతురట –‘’అని నేతన్న దైన్య స్తితికి సానుభూతి తో స్పందించారు .ఆడవారు గాజులు వేసుకొంటే అందం గా ఉంటారు .గాజుల్లేని స్త్రీ ‘’శిశిర గీత వ్రాత శిధిల వల్లకి వోలె‘’చిన్న బోతుందని బాధ పడ్డారు .భారతీయ సంస్కృతి సంప్రదాయాలపై రెడ్డి గారికి విపరీత ఆరాధనా భావం ఉంది

                 మాల కొండా రెడ్డి గారు ప్రకాశం జిల్లా కనిగిరి తాలూకా ‘’ఇని మేర్ల ‘’లో 13-8-1932 లో జన్మించారు .సివిల్ ఇంజినీరింగ్ చదివి రాష్ట్ర ప్రభుత్వం లో ఇంజినీర్ గా రెండేళ్ళు పని చేశారు తర్వాత ఉస్మానియా ఇంజినీరింగ్ కాలేజి లోను వరంగల్ కాలేజి లోను పని చేసి ప్రొఫెసర్ అయారు .1979 లో ‘’చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ‘’స్తాపించి సాంకేతిక విద్య కు గణనీయ మైన స్తాయి కల్పించారు .ఎన్నో అవార్డులు రివార్డులు పొందిన యోగ్యుడు రెడ్డి గారు 

         49 వ ఏట ‘’మొగలి రేకులు ‘’రాశారు 1946 లో ‘’సత్యం శివం సుందరం ‘’రాశారు .అవసాన దశ లో అంటే2003 లో భగవద్గీత ఆధారం గా ‘’మానవ  గీత ‘’రాసి జన్మ చరితార్ధం చేసుకొన్నారు .ఎంతో మంది ప్రతిభా వంతులకు పురస్కారాల నందించిన వదాన్యులు,త్యాగశీలి ఉండేలా మాల కొండా రెడ్డి గారు .

                     14-గోళ్ళమూడి వెంకట రామ రెడ్డి

ప్రకాశం జిల్లా పాకాల ప్రాంత నివాసి .ప్రాధమిక విద్య మాత్రమె నేర్చారు .స్వయం కృషి తో విజ్ఞానం పొందిన సాధకుడు .’’చిత్రాంగి ‘’నాటకం మాత్రమె వీరి నిర్యాణం తర్వాత భార్య ప్రచురించారు ఇది పూర్తీ గ్రాంధిక రచన

                   15-దిరిశాల వెంకట రామణా రెడ్డి

              ప్రకాశం జిల్లా పరిషత్ అధ్యక్షులు గా పని చేశారు .మంచి కవితా లక్షణాలున్న వారు ‘’పల్లె టూరు ‘’అనే ఖండిక వీరికి సాహిత్యం లో స్థానం కల్పించింది వడ్లు దంపె స్త్రీలను సహజ సుందరం గా వర్ణించి న కవి .యేకులు వడికే స్త్రీని ,సాతాను జియ్యరు ,పంచాంగ శాస్త్రులను తన కవిత్వం లో అందం గా బంధించారు .’’భాగ్య మేదైన ప్రుదివిని బడయ వచ్చు –తొడరి శారదాంశ బడయ దుర్లభంబు –‘’అంటూ ఒంగోలు జిల్లా రచయితల సంఘం వారు ‘’ప్రొద్దు పొడుపు ‘’కావ్యాన్ని అన్కితమిచ్చటప్పుడు చెప్పి ‘’మీరు నేను ఈ రీతి గా బంధువుల మయ్యాం ‘’అని చమత్కరించారు

          ‘’కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు’’ఇంతటితో పరి సమాప్తం –స్వస్తి

           మీ –గబ్బట దుర్గా ప్రసాద్ –13-4-13- ఉయ్యూరు 

Posted in రచనలు | Tagged | Leave a comment

దుర్గాప్రసాద్ ,గుత్తికొండ ,కె.బి.లక్ష్మి ,శైలజా మిత్ర రచనలు కవితలు

vacchaavaa ugaadee manjoosha papam pedda jantuvulu shailajamitra kavitha2

Posted in కవి కోకిల స్వరాలు | Tagged | Leave a comment

శ్రీ విజయ ఉగాది కవి కోకిల కలకూజితాలు -6

  శ్రీ విజయ ఉగాది కవి కోకిల కలకూజితాలు -6

                     11-   ఒకే ఒక్కడు –చి.మాదిరాజు బిందు వెంకట దత్తశ్రీ (భగవద్గీత ఫేం )

     ఆనంద మా నంద మాయనే

     ఉయ్యూరు పురములో కవికోకిలల సందడి

      ఊహలకు రెక్క లొచ్చి –కలాలకు పదును పెట్టగ

     నిజాల పట్టిక విజయ దుందుభి మొగించేనే

     సరసభారతికి మరో మకుటం

     ఈ సాహితీ కదంబం

     హేమ కాంతిలో వెలుగుకే వెలుగు వచ్చే

     జ్ఞాన కాంతులు వెదజల్లెనే

     సువర్చాలాదీశుని ఆశీస్సులు మెండుగ నుండగా

     మండుటెండలలోకవిత వికశించే వసంత రాగాలతో

    ‘’ ఊసుల్లో ఉయ్యూరు ‘’తో ,’’మా అక్కయ్య ‘’కవితలతో

       ఒకటా రెండా, విభిన్న కార్యక్రమాలతో  

      సరసభారాతికి వన్నె తెచ్చింది

      సాహితీ వనం లో మహా కల్ప వృక్షం

     ఉయ్యూరు నే ప్రపంచానికి చేరువ చేసిన

     అంతర్జాల విన్యాసకులు

     నిజ సాహితీ వేత్త

    మనందరికీ హితులు, సన్నిహితులు

    ఆయనే మన దుర్గా ప్రసాద్ గారు

    ఆయనే ఒకే ఒక్కడు  .

 

 

   12-ముప్పదం—గబ్బిట దుర్గా ప్రసాద్

          వివరణ –ముప్పదం అంటే నా భావనలో మూడు పాదాలు ఉన్నది అని అంతేకాని ముప్ఫై పాదాలున్నదికాదు .దీనికి కోడి గుడ్డు మీద ఈకలు లాగే వాళ్ళు ‘’ముప్పు ఉన్నది ‘’అని అర్ధం చెప్పినా నాకేమీ అభ్యంతరం లేదు పైగా స్వాగతిస్తాను .

                  

      ‘’అప్పటి దాకా అది ‘’దిల్ షుక్ నగర్ ‘’

         ఆ రోజు ‘’ మాత్రం వాళ్లకు’’ దిల్ ఖుష్ నగర్ ‘’

        ఆ నాటి నుంచి మనకు  అయింది ‘’దిల్ దుఃఖ్ నగర్ ‘’.

              సశేషం

                   మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –12-4-13- ఉయ్యూరు

Posted in కవి కోకిల స్వరాలు | Tagged | Leave a comment

అరటి నార చీరలు

అరటి నార చీరలు


సీతారాములు వనవాసానికి వెళ్లినప్పుడు నార దుస్తులను ధరించారని విన్నాం. అడవుల్లో తపస్సు చేసుకునే ఋషులూ నార వస్త్రాలనే కట్టుకునేవారనే కథలూ తెలుసు. కాని నార వస్త్రాలేమిటో తెలుసా? ‘అరటి చెట్టు పీచుతో బ్రహ్మాండమైన వస్త్రాలు తయారుచేస్తున్నాం’ అని చెప్పారు ‘అనానాఫిట్’ అనే సంస్థవారు. ప్రకాశం జిల్లాకు చెందిన యువకుడు మామిళ్లపల్లి రాజశేఖర్, చెన్నైకు చెందిన చేనేతకారుడు సి.శేఖర్‌తో కలిసి చేస్తున్న అద్భుతమిది.
అర టి చెట్టుకు పూర్వులు కల్పతరువన్న పేరెందుకు పెట్టారోగానీ నూటికి నూరుపాళ్లూ అది నిజమే అంటున్నారీ యువకులు. కాయ, పండు, పువ్వులే కాదు అరటి చెట్టు కాండమూ మనకెంతో ఉపయోగకరమైదని నిరూపిస్తున్నారు వీళ్లు. మామూలుగానైతే అరటి చెట్టు కాండం వృధాగా పోయేదే. కాని అదే ‘అనానాఫిట్’కు ముడిసరుకుగా మారింది.

ఆరంభానికి బీజం
ప్రకాశం జిల్లా పొదిలి మండలం కాటూరివారిపాలెం గ్రామంలో పుట్టిపెరిగిన మామిళ్లపల్లి రాజశేఖర్ రూర్కెలా ఐఐటీలో నుంచి టెక్స్‌టైల్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్ చదివారు. ఒక సమావేశంలో శేఖర్‌ను కలిశారు. శేఖర్‌ది చెన్నైకి 20కి.మీ. దూరంలోని అనకపుత్తూరు అనే గ్రామం. అది ఒకప్పుడు చేనేతకు ప్రసిద్ధి చెందిన ఊరు. పూర్వం ప్రఖ్యాతమైన ‘మద్రాస్ రుమాళ్లు’ ఇక్కడే తయారయ్యేవి. కాలక్రమేణా నేతపనివారు ఉపాధికోల్పోయారు.

తాము బాగుపడుతూ అక్కడివాళ్లకేదైనా మంచి అవకాశం కల్పించాలనుకున్నారు ఈ యువకులు. కాస్త సృజనాత్మకంగా ఆలోచించి అరటి నార నుంచి వస్త్రాలు తయారుచెయ్యాలన్న ప్రతిపాదన గురించి చర్చించుకున్నారు. అలా 2009లో ‘అనానాఫిట్’ అంకపుత్తూరులో ఏర్పాటయింది. ‘అనకపుత్తూరు నేచురల్ ఫైబర్ టెక్స్‌టైల్స్’లోంచి మొదటి అక్షరాలను తీసుకుని తమ సంస్థకు ఆ పేరు పెట్టారు.

ప్రయోజనాల స్నేహం
అరటినార సహజమైన పీచు పదార్థం కావడం వల్ల దీనితో రూపొందించిన దుస్తులు వేడిని తక్కువగా గ్రహిస్తాయి. శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. అత్యుత్తమ నాణ్యత ఉన్న నారతో చొక్కాలు, చీరలు త యారుచేస్తే రెండోరకం నాణ్యత ఉన్న పీచుతో బ్యాగులు, చెవిరింగులు, చేతులకు గాజులు, చెప్పులు వంటి ఎన్నో రకాల వస్తువులను తయారుచేస్తోంది అనానాఫిట్ సంస్థ.

కేవలం అరటి పీచు మాత్రమే కాకుండా పైనాపిల్, వెదురు, జనుము, కలబంద వంటి ఇంకొన్ని సహజ పీచు పదార్థాల నుంచి కూడా దుస్తుల తయారు చేయాలని గురించి పరిశోధనలు చేస్తోందీ సంస్థ. ప్రయోగాత్మకంగా 25 రకాల సహజ పీచు పదార్థాలతో చీరల్ని తయారుచేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు ఎక్కింది అనానాఫిట్. 2011లో ‘పరివర్తన్ లీడర్‌షిప్ అవార్డు’నూ అందుకుంది. ప్రస్తుతానికి నెలకు రెండొందల చీరల చొప్పున రూపొందించి చెన్నై, బెంగుళూరుల్లో అమ్ముతున్నారు. చీరలు రెండున్నర వేల రూపాయల నుంచి వివిధ ధరల్లో లభిస్తాయి.


నాణేనికి మరో వైపు
“నిజానికి మాకు చైనా ఎనిమిది లక్షల టీ షర్టులకు ఆర్డరిచ్చింది. ఒక స్వచ్ఛంద సంస్థ ఏకంగా లక్ష చొక్కాలకు ఆర్డరిచ్చింది. ఫ్రాన్స్, యూకే, ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి దేశాలన్నిటా మాకు వినియోగదారులున్నారు. అయితే అంత పెద్దఎత్తున తయారుచెయ్యడానికి తగిన నిధుల్లేవు. అదే మా సమస్య’ అంటున్నారు రాజశేఖర్. కేవలం నిధులే కాదు, అంత ఎక్కువ సంఖ్యలో తయారుచెయ్యడానికి తగిన సాంకేతికత కూడా వాళ్లకు లేదు.

ప్రస్తుతానికి తిరుచిలోని నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ బనానా దీనికి సాంకేతిక సాయం చేస్తోంది. కానీ అది సరిపోదు. నిధులు, సాంకేతికత సమస్యలను అధిగమించడానికి ప్రఖ్యాత డిజైనర్లను సంప్రదించి ఏకంగా లక్ష రూపాయల చొక్కాను తయారుచేసి ప్రదర్శనకు పెట్టబోతోంది అనానాఫిట్. ఈ రెండు సమస్యలనూ అధిగమిస్తే అంకపుత్తూరులోని నేత కార్మికులకూ పని దొరుకుతుంది, వినియోగదారులకు చవకలో మేలైన నారవస్త్రాలూ లభిస్తాయి.

అరుణ పప్పు
రాజశేఖర్ : 07845041192

Posted in సేకరణలు | Tagged | Leave a comment

కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -12

కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -12

                             బ్రౌన్  పధగామి బం.గొ.రే.

        బంగోరె అంటే బండి గోపాల రెడ్డి అని చాలా మందికి తెలియదు .బండి శంకరయ్యరెడ్డి ,శంకరమ్మ లకు 1938 అక్టోబర్ 10 న నెల్లూరు జిల్లా కోపూరు తాలూకా ‘’మిన గల్లు ‘’లో జన్మించారు .అక్కడే ప్రాధమిక విద్య చదివి నెల్లూర్ లో ఇంటర్ ,వాల్తేరు లో బి.కాం.ఆనర్స్ పూర్తీ చేశారు .పరిశోధన అంటే అమిత మైన ఆసక్తి చూపించేవాడు .1957 లో ‘’స్రవంతి ‘’అనే పత్రికకు సంపాదకత్వం వహించాడు .తర్వాతా సెంట్రల్ కోఆపరేటివ్ బాంక్ లో అకౌంటెంట్ గా ఉద్యోగం కొంతకాలం చేసి వదిలేశాడు ,.

       1963 లో ‘’శ్రీ విక్రమ పూరి సర్వస్వ గ్రంధ మండలి ‘’లో చాలా వ్యాసాలూ రాశాడు బంగోరె .’’జమీన్ రైతు ‘’పత్రికకు సబ్ ఎడిటర్ అయాడు .నూరేళ్ళ నాటి నెల్లూరు సంగతులన్నీ అనువదించి ప్రచురించాడు .బంగోరె ‘’నెల్లూరు జిల్లాకు మొదటి  జర్నలిస్ట్’’.గురజాడ కన్యా శుల్కం నాటకానికి విస్తృత అను బంధం రాసి 1969 లో ప్రచురించాడు .తమిళ నవలను ‘’చంద్రిక కద ‘’పేర తెలుగు లోకి అనువదించాడు .కట్టమంచి రామ లింగా రెడ్డి గారి పై వచ్చిన విస్తృత గ్రంధానికి బంగోరె సంపాదకత్వం వహించాడు .పఠాభి‘’ఫిడేలు రాగాల డజన్ ‘’ను పునర్ముద్రించాడు బంగోరె .ఎమెస్కో వారి ‘’తాతా చార్యుల కధలు ‘’కు సంకలన బాధ్యత చేబట్టాడు .డాక్టర్ జే.మంగమ్మ గారి పరిశోధనా గ్రంధాన్ని ప్రచురించాడు .

              1977 లో సర్ ఫిలిప్ బ్రౌన్ లేఖలను ‘’బ్రౌన్ లేఖలు –ఆధునికాంధ్ర సాహిత్య శకలం‘’పేరముద్రించాడు .బ్రౌన్ జీవిత చరిత్ర ను ఆంగ్లం లో ప్రచురించి ఘనకీర్తి పొందాడు బంగోరె .’’మాల పల్లి నవల పై నిషేదాలు ‘’పై పరిశోధన చేసి ప్రచురించాడు .వేమన పద్యాలను లండన్ నుంచి సేకరించి తెచ్చి‘’వేమన –C .P.బ్రౌన్ ‘’పేరిట ప్రచురించాడు .

 

 

 

                     సి.పి. బ్రౌన్ 

           జమీన్ రైతు పత్రిక లో పని చేసినప్పుడే ‘’లోకలిస్ట్ కూని రాగాలాపన ‘’పేర ఒక ‘’కాలం‘’నిర్వహించాడు .’’అంతులేని రిసెర్చ్ చేసిన పరిశోధనా వ్యగ్రుడు బంగోరె ‘’అని పేరు పొందాడు .అందుకే ప్రఖ్యాత విమర్శకుడు కే.వి.రమణారెడ్డి బంగోరె ను ‘’రిసెర్చ్ గెరిల్లా ‘’అని ముద్దుగా ,మురిపెం గా పిలిచాడు .ఎన్నో అకాడెమీలు ,సాహితీ సభలు ,విశ్వ విద్యాలయాలు చేయాల్సిన పరి శోధనలను ఒంటి చేత్తో చేసి‘’అయ్యారే –బంగోరే‘’ అని పించాడు .  ..తెలుగు పత్రికల పుట్టు  పూర్వోత్తరాలను శాస్త్రీయ దృక్పధం తో విశ్లేషించిన మేటి విమర్శకుడు బంగోరె .

              హిమాలయాలను సందర్శించాలనే గాఢ మైన కోరిక బంగోరె కు ఉండేది .దీనికోసం  నెల్లూరు నుండి బయల్దేరి మళ్ళీ తిరిగి రాలేదు తిరిగి రాని లోకాలకు చేరుకోన్నాడని అందరు భావించారు .1982నవంబర్ 5 న బంగోరె మరణ వార్తను పత్రికలు  ప్రచురించాయి .బంగోరె పరిశోధక వ్యాసంగానికి అవధుల్లేకుండా పోయిందని  అందరు  కీర్తించారు .ఒక రకం గా ‘’ఆధునిక పరిశోధనా పరమేశ్వరుడు బంగోరె ‘’.

              సశేషం

                   మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ -12-4-13 –ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

”ఫోర్త్ ట్రిక్” పంచాంగ శ్రవణం

    సాహితీ  బంధువులకు ఉగాది శుభా కాంక్షలు -ఈ రోజు  ఉదయం పద కొండు  గంటలకు మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారి దేవాలయం లో ఉదయం పూట ఉగాది స్పెషల్ పూజ, వేపపువ్వు పచ్చడి రవ్వకేసరి  ప్రసాదం తర్వాతపంచాంగ శ్రవణం చేశాను స్వామి సమక్షం లో .పూజారి  గారు ఆలయ మర్యాద తో సత్కరించారు ..

               మధ్యాహ్నం  విష్ణాలయం  గత ముప్ఫై ఏళ్ళుగా అవిచ్చిన్నం గా కోన సాగుతున్న పంచాంగ శ్రవణా నికి నన్నూ ఆహ్వానించి చేయమని కోరారు నేను అక్కడ ఇప్పటికి డజను సార్లకు పైగా నే చేశాను ఎందూరి సుబ్బారావు గారి కుటుంబం నిర్వహించే సభ ఇది ఆయన మరణం తర్వాతా కుమారులూ కోన సాగిస్తున్నారు వారు నాశిష్యులు .కనుక చెయ్యమని కోరుతారుఅందుకే  మధ్యాహ్నం  3గంటలకు అక్కడ పంచాంగ శ్రవణం చేశాను .ఉచిత  రీతి సత్కరించారుఅయి  పోయి ఇంటికి వచ్చాను మళ్ళీ నా శిష్యులు ఇంటికి వచ్చి వాసవీ క్లబ్ అనే దాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని దాని జిల్లా ప్రెసిడెంట్ ఇప్పుడే వచ్చారని దయతో మరో సారి పంచాంగ శ్రవణం చేయమని బ్రతిమిలాడారు న్యాయం గా మళ్ళీ వెళ్ళ  కూడదు కాని శిష్య వాత్సల్యం తో అయిదింటికి వెళ్లాను .వారన్దరి ఎదుట మళ్ళీ చేస్తూ ఇలా మొదలు పెట్టాను ”పూర్వం రెడ్డొచ్చె మొదలాడు ”అనే సామెత లా ఉంది ఈపని . అంతేకాక వివాహ ముహూర్తానికి తాళి కట్టించేసి వీడి యో తీసే వాడు రాలేదని మళ్ళీ మూడు ముళ్ళు వేయించి నట్లుంది ”అని చెప్పి అందరి నవ్వుల మధ్యా మళ్ళీ పంచాంగ శ్రవణం చేసి వారందరికీ సంతోషం కలిగించాను . మళ్ళీ గౌరవ సత్కారం అందుకొన్నాను .

               అయిదు రోజుల క్రితం దత్త గుడి ఆచార్యుల గారు రాత్రి పదింటికి ఫోన్ చేసి ఉగాది రోజు సాయంత్రం ఆరు గంటలకు దత్త గుడి లో పంచాంగ శ్రవణం చేయమని కోరారు కాదన లేదు సరే నన్నాను స్నానామ్  సంధ్యా పూర్తీ చేసి ఆరింటికి అక్కడికి వెళ్లాను ఆరున్నరకు ప్రారంభించి ఎడుమ్బావు వరకు చెప్పి అందరికి తృప్తి కల్గించాను .వారు ఘనం గా సత్కరించారు .”మీరే చెయ్యాలి మాస్టారూ వార్షికం గా మా  వాళ్ళందరూ కోరుకొంటున్నారు ”అన్నారు ఆచార్యుల గారు ”సరే దైవ నిర్ణయం”అన్నాను పదేళ్ళ క్రితం దత్త గుడిలో కళ్యాణ మండపం ప్రారంభోత్సవం నాడు సీతా రామ కల్యాణం వేదాంతం  రామాచార్యుల వారి ఆధ్వర్యంలో డా క్తర్ విశ్వేశ్వర రావు దంపతులు చేస్తూ నన్ను ”కామెంటరి ”చెప్పమని పిలిస్తే వెళ్లి చెప్పాను. నాటికి నేడు మళ్ళీ అని వారికి జ్ఞాపకం చేశాను ఇలా ఉగాది నాడు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి పంచాంగ శ్రవణం నాలుగు సార్లు చేసి” ఫొర్  ట్రిక్” కొట్టాను అని పించింది దైవ లీల ఆయన దయ లేక పోతే ఇది సాధ్యమా ?”

                     మరోసారి ఉగాది శుభా కాంక్షలతో మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -11-4-13 -ఉయ్యూరు  
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శ్రీ విజయ ఉగాది కవి కోకిల కల కూజితాలు -4

      శ్రీ విజయ ఉగాది కవి కోకిల కల కూజితాలు -4

                        (10) కోకిల మానసం –శ్రీ మతి ముదిగొండ సీతా రావమ్మ –మచిలీ పట్నం-  8520891585

 

        మత్తకోకిల –కొమ్మ చాటున దాగి యుంటివి కోపమేలనే తెల్పవే

                    కమ్మగా నొక పాట పాడవే కానివారము కాములే

                    సమ్మదంబున తెల్గు సీమకు సాగిరమ్మని పిల్చినన్

                    గుమ్ము గుమ్మున జూతువేలనే కొంటె తన మేమాయేనే ?

ఉత్పల మాల –ఊరక భీతి చెందేదవు ఊసుల బల్కవదేమి కోకిలా

                   మారెన నీదు బుద్ధి మరు మల్లెల వాసన చూడ వేమిటే

                   కారణమేమి పల్కుమన ,కాన్చితి కాంతల మాన భంగముల్

                  మారణ కాండ సల్పటలు ,మత్సర భావము రేగిపోవుటల్ 

మత్త కోకిల –భీతి పెర్గెను ఆంద్ర చేరగ ప్రేమ దూరమే ఆయేగా

               ‘’నాతి ‘’నేనని నన్ను పట్టేడి నవ్యతల్ కని పించగా

                 చేత లన్నియు క్రూరమాయెను చిత్తమే వికటించగా 

                 రీతి మారిన తెల్గు వారల లీలలన్ని ఎరింగితిన్ .

ఆట వెలది –తెలుగు దేశ మందు తెగువ పెర్గెను చూడ

              దోచువారే కాదు దాచు వారు

             నిజము పల్క నట్టి నిక్రుస్టులును పెర్గే

             బయట తిరుగ నాకు భయము కలిగే .

ఆట వెలది- ఏమి చేయ లేను ,చింత మిగిలే నాకు

              భ్రాంతి తోడ వస్థి,బాధ మిగిలే

             పలుక కుంట మేలు ,పలు పాట్లు పడకుండ

             ఏగ దలచినాను ,వేగలేక .

 

Posted in కవి కోకిల స్వరాలు | Tagged | Leave a comment

ఊచల ఉగాది

             ఊచల ఉగాది

        మా’బామ్మర్ది ’ టోలీ  బౌలీ  బ్రాహ్మి ‘’మధ్యాహ్నమైనా రాక పోయేటప్పటికి నాకు ఆశ్చర్యమేసింది ఉదయమే వేప పువ్వు పచ్చడితో ప్రారంభించి ఉపహారాలమీద దండు నడిపే మా వాడు అడ్రస్ లేకపోవటం వింతగా ఉంది .వాళ్ళ అక్కయ్య కంగారు మరీ ఎక్కువ అయింది .ఫోన్ చేయ్య్యమని నాకు ఇప్పటికే పది సార్లు చెవిలో జోరీగ గా పోరుతోంది .సరే కాదనలేక ఫోన్ చేశా.మనిషి మాట నీరసం గా ఉంది .ఇది మరీ ఆశ్చర్యమేసింది .సరే అర్జంట్ గా రమ్మని వాళ్ళక్క చెప్పినట్లు ఓ ఝలక్ ఇచ్చాను .వస్తానన్నాడు .

             మొహం అదో రకం గా పెట్టుకొని వచ్చాడు .కారణం ఏమిటో మాకేమీ అర్ధం కాలేదు సరే వచ్చిన వాడిని సాదరం గా ఆహ్వానించింది వాళ్ళ అక్కయ్య .నెమ్మదిగా వంటింట్లో చేరి టిఫిన్ లాగించి నా దగ్గర కు వచ్చాడు .’’ఏమిట్రా ఉలుకు పలుకు లేకుండా ఉన్నావు .హుషారు లేదేం ?’’అన్నాను .వాడు ‘’ఏముంది బావా .ఈ సారి ఉగాది ‘’ఊచల ఉగాది ‘’గా ఉందని బాధ వేస్తోంది ‘’అన్నాడు .’’ఊచల ఉగాది ఏమిట్రా /కొత్తగా కాయినేజ్ చేశావా ?’’అన్నాను .’’నా బొంద కాయినేజ్ లేదు ఏం లేదు మన రాష్ట్ర ప్రభుత్వం లో మంత్రులు  కొందరు చువ్వలు  లెక్క పెడుతూ ,కొందరు ఏ క్షణం లో చువ్వాల్లో ఇరుక్కుంటామో అని కంగారుతో మిగిలిన వారు ఉన్నారు కదా అందుకే దీన్ని ‘’చువ్వల ఉగాది ‘’అన్నాను .దానికీ నీ నీరసానికి సంబంధం ఏమిటి /అన్నాను .’’ప్రభుత్వం అంతా చువ్వల చట్ర్తం లో ఉంది కదా అని బాధ బావా నన్నేమీ చేయనివ్వటం లేదు మనసంతా అదో ఇది గా ఉంది ‘’అన్నాడు’’ సరే ఇంటి దగ్గర పండగ చేశావా ?’’అడిగా .’’వేప పువ్వు తిన బోయి కాయ పొరబాటున నోట్లో పెట్టుకొన్నాను బెల్లం వేయమని మీ చెల్లెలు చెబితే అల్లం కలిపా .మిరియం వేయమంటే గొడ్డు కారం పోశా .ఇంకా రుచి ఏముంటుంది >””అని వాపోయాడు .

              ‘’సరేరా –దేశ రాజకీయం సంగతేమిటి ?’’అని అడిగా .’’ఏం చెప్పను బావోయ్ .ఒక పక్క మోడీ సవాలు విసురుతూ మీసాలు దువ్వుతున్నాడు మరి రాహుల్ ఆశాజ్యోతి అని బుజాలేగారేసి ముందుకు తోస్తే బెదిరి పారిపోఎట్లున్నాడు .పూర్వం బండ లాగుడు పోటీలలో గిత్తలను కాడికి కట్టి చేన్నాకోల్ తో కొడుతూ ‘’అరె అరె ‘’అని అరుస్తూ అర్రుమీద చరుస్తూ ,తోక మెలేసి అంగాన్ని గిలి పడితే అవి పరిగెత్తుతూ బండ ను లాగేవి. .అందులోదమ్ము లేని గిత్త కాడిపారేసి పడుకొంటుంది అలా ఉంది ప్రధాన మంత్రి పదవి పోటీలో మోడీ కి రాహుల్ కి .రాహుల్ కాడి కిందకు రాక ముందే అర్జున విషాద యోగం అభినయిస్తున్నాడు ఇంకేం పోటీ బావా చప్పగా ఉంది .’’ఆన్నాడు బోల్డు బాధ పడుతూ మోడీ ని చూస్తె  ఢీఢీ అంటుంటే కుర్రాడు తీవ్ర పోటీ ఇవ్వటానికి జంకుతూ పారి పోయే పోజులో ఉన్నాడని విశ్లేషకులు భావిస్తున్నారు .యువజన ఆశాకిరణం నిరాశా కిరణం లా తయారయ్యాడు .అదీ బాధ .’’అన్నాడు ప్రపంచం బాధ తన బాధ అని వాపోయిన శ్రీ శ్రీ లాగా .

                ‘’చిరు దూసుకు పోతుంటే బొత్స అడ్డు తగుల్తున్నడుంటున్నారేమిటి ?’’అడిగా .’’అదే నాకు అర్ధం కావటం లేదు బా..ఏదో మంచి ఆలోచన లతో టూరిజం ను అభి వృద్ధి చేస్తుంటే ఇప్పుడు బొత్స అతన్ని అడ్డుకొంటున్నాడు .ఓర్వలేని తనం బావా ‘’అన్నాడు .’’కిరణ్ పరిస్తితి ఏమిటి ?’’అడిగాను .’’దున్నేస్తున్నాడు తన ముద్ర వేసేస్తున్నాడు .’’అన్నాడు

               ‘’అధికార పార్టీ పెరాలిసిస్ తో ఉంది అని అందరు అంటున్నారు ‘’నువ్వేమంటావ్ ‘’మళ్ళీ నా ప్రశ్న .’’అమ్మగారు పాపం జబ్బు తో ఉంది అమెరికా వెళ్లి రావటం సరి పోతోంది అబ్బాయి గారు దేన్నీ పట్టించుకోటం లేదు .ఆవిడ కనిపిస్తే సందడి లేకుంటే నీరసం లా ఉంది పరిస్తితి ‘’అన్నాడు .

           ఇంతకీ ఉగాది పచ్చడి లో ఉన్న షడ్రుచులు నీకు తెలిశాయా /’’అడిగితె ‘’ఆరేమో కాని ఒక్క చేదే నాకు కనీ పిస్తోంది .ఖర్మ ఖర్మ ‘’అని లబో దిబో మన్నాడు మా టోలీ బౌలీ బ్రాహ్మి బామ్మర్ది

               శ్రీ విజయ  ఉగాది (వూ చల ఉగాది కాదండోయ్ బాబూ )శుభా కాంక్షలతో

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -11-4-13-ఉయ్యూరు

 

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -11

  కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -11

                    రాయల సీమ గేయ కవి పులి కంటి కృష్ణా రెడ్డి

             రాయల సీమ అంటే ఆనాడు రాజ భోగం రత్నాలు ,ముత్యాలు వీధుల్లో అమ్మే కృష్ణ దేవరాయల రాజ్యం జ్ఞాపకం వస్తుంది కాని నేడు రాయల సీమ అంటే కరువు ,కాటకం దర్శన మిచ్చి కన్నీరు తెప్పిస్తుంది హృదయం ద్రవిస్తుంది .రత్నాల సీమ రాళ్ళ సీమ గా మారి పోయిందని వ్యధ ధ్వనిస్తుంది .అయితే సాహిత్యం అను నిత్యం పండే సీమ గా మనకు కని పించి మానసిక ఆనందం కలుగుతుంది పాట ,పద్యం కదా ,గేయం వెళ్లివిరిసిన రత్నాల సీమ నేడు రాయల సీమ .రాయలసీమ మాండలికాన్ని ఆస్తిగా గేయాల నిండా నింపిన పులి కంటి కృష్ణ రెడ్డి చిత్తూరు జిల్లాలో జన్మించారు తండ్రి గోవింద రెడ్డి తల్లి పాపమ్మ .

 

 

 

 

 

 

    తన అనుభావాలనన్నిటిని అక్షరాలుగా మలచిన అక్షర శిల్పి కృష్ణా రెడ్డి .రాయలసీమ పలుకుబడి జానపదుల ఒరవడి ఆపోసన పట్టిన వారాయన .ఆయన కద రాసినా గేయం విని పించినా’’ ఇది పులి కంటిది’’ అని స్పష్టమైన ముద్ర కని పిస్తుంది .ఆయన శైలి అనితర సాధ్యం .చిత్తూరు జిల్లా వెదురు కుప్పం మండలం లోని ‘’జక్క దోన ‘’లో 1931 లో కృష్ణా రెడ్డి జన్మించారు చక్కని దోవ ను జానపదానికి వేశారు .నటుడు ,గాయకుడు ,దర్శకుడు గా తన ప్రతిభను చాటుకొన్నారు .ఆయన రచనలన్నీ రేడియో ,టీ.వీ.లలో ప్రసారమైనాయి .పత్రికలలో చోటు చేసుకొన్నాయి .ఎన్నో నాటకాలు రాసి ,స్వయం గా ప్రదర్శించిన వారు రెడ్డి గారు .తన చుట్టూ ఉన్న సమాజాన్ని అధ్యయనం చేసి ఆ విషయాలనే రచనల్లో చొప్పించి జీవం పోసిన జీవదాత .సామాజిక స్పృహ ,తాత్వికత ఆయనకు సహజాతాలు .

           అన్నిటా కాలుష్యం పెరిగి పోయిందని బాధ పడే వారు రెడ్డి గారు .అందరు పూను కొంటె కాలుష్యాన్ని రూపు మాప లేమా అని ప్రశ్నిస్తారు .ఆయన భావాలన్నీ ప్రగతి శీలాలు .ఆయన సాహితీ సంపత్తిని విలువ కట్టటం చాలా కష్టం .అన్ని సాహితీ ప్రక్రియలను చేబట్టి అన్నిటిని ఉధృతం గా తీర్చి దిద్దిన మేటి రచయిత కృష్ణా రెడ్డి .అందరికి దూరమై పోయిన దళితులు అంటే ఆయనకు అమిత ఆదరం .వారిని అక్కున చేర్చుకొన్నారు .వారి మనోభావాలను వారి నోటి తోనే చెప్పి నంత సహజం గా రెడ్డి గారు కవిత్వం లో ,కధల్లో చెప్పి అనితర సాధ్యం అని పించారు.మహా మానవతా వాదిగా ప్రఖ్యాతు లయ్యారు .ఆయన కధలను చదివితే ‘’రాయల సీమ రా.వి.శాస్త్రి ‘’అనిపిస్తుంది అని కితాబు నిచ్చిన సీనియర్ పాత్రికేయులు ,సంపాదకులు శ్రీ పొత్తూరి వెంకటేశ్వర రావు గారి మాటలు అక్షర సత్యాలే .మాల మాదిగల జీవితాలను సజీవ దృశ్యాలుగా చూపిన మహా రచయిత కృష్ణా రెడ్డి .ఆయన మాండలీకం ‘’కలకండ పలుకే’’.

              ఆంద్ర ప్రభ లో సంవత్సరం పాటు ‘’నాలుక్కాళ్ళ మండపం ‘’అనే ‘’కాలం ‘’నిర్వహించి రాయల సీమ జీవన చిత్రాన్ని సజీవం గా ఆవిష్కరించారు .కృష్ణా రెడ్డి గారు గొంతెత్తి పాడితే ఆ మాధుర్యం ,శబ్ద సౌందర్యం భావలహరికి జోహార్లు అంటాం .ఆయన తో పాటు కవి సమ్మేళనాలలో పాల్గొనే కవులు ఆయన ముందు చిత్తు అయి నట్లు కనిపించి పులికంటి అందరి కంటే మేటి అని పించారు ఎన్నో సార్లు .ఇది నాకు ప్రత్యక్ష అనుభవం .రైతు సమస్యలు ,రాజకీయాలు ,,ఓట్లు ,నీటి ఎద్దడి అన్నిటిని స్పృశించి రాసిన మేటి రచనలెన్నో ఉన్నాయి .56 కదల ‘’సీమ భారతం ‘’వెలువరించారు .రాయల సీమ యాస మీద మాంచి పట్టున్న రచయిత రెడ్డి గారు .ఎన్నో రేడియో ,టి.వి.కవి  సమ్మేళనాలలో పాల్గొని అందరి లోను తన పాటద్వారా’’ నాయక మణి ‘’గా నిలిచే వారు ..ఆయన రైతు పక్ష పాతి .ఆయన సృష్టించిన ‘’బాశాలి ‘’పాత్ర విశిష్ట మైంది .’’భాగ్య శాలి- బాశాలి’’ అయింది వారి యాస లో .కుటుంబాన్ని తీర్చి  దిద్దటం లో భార్య పాత్ర ఎలా ఉంటుందో ఇందులో చూపించారు

          కృష్ణా రెడ్డి రైల్వే శాఖ లో బుకింగ్ క్లార్క్ గా జీవితం ప్రారంభించారు .’’కామధేను ‘’పక్ష పత్రిక ను ఆరేళ్ళు సమర్ధం గా నడిపిన సంపాదకులాయన .ఆంధ్రభూమి పత్రికలో ఉద్యోగించారు .కృష్ణారెడ్డి కధలు ,గూడుకోసం గువ్వలు ,కోటిగాడు స్వతంత్రుడు ,పులికంటి దళిత కధలు సంపుటాలను రెడ్డి గారు వెలువరించారు .ఆయనవి 14 కధలు ఉత్తమ కధలు గా ఎన్నికైనాయి .’’పులికంటి సాహితీ సత్కృతి‘’స్తాపించిఎందరో  సాహితీ మూర్తులను సత్కరించారు .’’ఆటవెలదుల తోట ‘’కావ్యం రచించారు .ఆకాశ వాణి ,దూరదర్శన్ లకు సలహా దారు గా సలహాలన్దించారు .చిత్తూరు జిల్లా రచయితల సంఘానికి ఉపాధ్యక్షులు గా దీర్ఘ కాలం పని చేశారు .’’సీమ చిన్నోడు ‘’అని అందరి చేత ఆప్యాయం గా పిలువబడ్డ పులికంటి  క్రిష్ణారెడ్డి గారు 2007 నవంబర్ 18 న 76 వ ఏట అనంత లోకాలకు చేరుకొన్నారు .’’తెలుగు జానపద దీపం ఆరిపోయింది .జానపదం చిన్న బోయింది ‘’.

            మరో కవి గురించి ఈసారి

             సశేషం

                 శ్రీ విజయ నామ సంవత్సర ఉగాది శుభా కాంక్షలతో

                         మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –111-4-13 ఉయ్యూరు 

Posted in రచనలు | Tagged | 1 Comment

”శ్రీ విజయ నామ ఉగాది కవి కోకిల స్వరాలు ‘ -3

sree vijaya ugaadi kavikokila svaraalu -9 sree vijaya ugaadi kavikokila svaraalu -7 001 sree vijaya ugaadi kavikokila svaraalu -8

Posted in కవి కోకిల స్వరాలు | Tagged | Leave a comment

”శ్రీ విజయ నామ ఉగాది కవి కోకిల స్వరాలు ‘ -2

sree vijaya ugaadi kavikokila svaraalu -5sree vijaya ugaadi kavikokila svaraalu -7

Posted in కవి కోకిల స్వరాలు | Tagged | Leave a comment

”శ్రీ విజయ నామ ఉగాది కవి కోకిల స్వరాలు ‘ -1

sree vijaya ugaadi kavikokila svaraalu -1sree vijaya ugaadi kavikokila svaraalu -2sree vijaya ugaadi kavikokila svaraalu -3sree vijaya ugaadi kavikokila svaraalu -4

Posted in కవి కోకిల స్వరాలు | Tagged | Leave a comment

శ్రీ విజయ నామ సంవత్సర ఉగాది శుభా కాంక్షలు

సాహితీ బంధువు లకు– 11-4-13 గురువారం  శ్రీ విజయ నామ సంవత్సర ఉగాది శుభా కాంక్షలు అన్ని దిక్కులా దిగ్విజయం అన్నిటా విజయం అందరి జీవితాలలో ఆనందం ఈ ”విజయ ”తెస్తుందని  ఆశిద్దాం మీ -దుర్గా ప్రసాద్ 

 

ugadi_2013_greetings

 

    సాహితీ బంధువులకు శ్రీ విజయ నామ సంవత్సర ఉగాది శుభా కాంక్షలు -ఉగాది సందర్భం గా 7-4-13-ఆదివారం సరసభారతి ఉయ్యూరు లో 43వ  సమావేశం గా నిర్వహించిన ”సాహితీ కదంబం ”లో కవి మిత్రులు రాసి చదివిన కవితలను ”శ్రీ ఉగాది కవి కోకిల స్వరాలు ”పేర ఈ రోజు ఉగాది నుండి మీకు వరుసగా అందిస్తున్నాం .చదివి ఆస్వాదించి అభినందించండి .-దుర్గా ప్రసాద్ 

 

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -10

    కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -10

                         సరసుడు బెజవాడ గోపాల రెడ్డి

            బెజవాడ గోపాల రెడ్డి గారు 1907 లో నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెం లో ఆగస్ట్ అయిదున జన్మించారు .తండ్రి పట్టాభి రామి రెడ్డి తల్లి సీతమ్మ .స్కూల్ చదువు అక్కడే పూర్తీ చేసి బందరు జాతీయ కళా శాలలో చేరారు .రవీంద్రుని శాంతినికేతన్ లో విద్య పూర్తీ చేశారు గాంధీ గారి పిలుపు తో స్వాతంత్ర ఉద్యమం లో పాల్గొని చాలా సార్లు జైలు కు వెళ్ళారు .ముప్ఫై ఏళ్ళు రాక ముందే మంత్రి అయి ఆశ్చర్య పరచారు .రాష్ట్ర ,కేంద్ర ప్రభుత్వాలలో వివిధ శాఖల మంత్రిగా సుమారు 15 ఏళ్ళు పని చేశారు .రాజకీయాలలో తీరిక లేకుండా ఉన్నా సాహిత్యం పై మక్కువ వీడలేదు .

 

 

 

రెడ్డి ఆంద్ర విశ్వ విద్యా లాయానికి ప్రో చాన్సలర్ గా ఎన్నికయి ఆరేళ్ళు పదవిలో కోన సాగారు తెలుగు భాషా సమితి ,ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమి లకు అధ్యక్షులుగా సుదీర్ఘ కాలం పని చేసిన ఘనత ఆయనది ఆనేక గ్రంధాలు వెలువరించారు .కేంద్ర సాహిత్య అకాడెమీ అధ్యక్షతా ఆయన్ను వరించింది .దీనికి తోడు జ్ఞాన పీఠ పురస్కార సంఘానికి అధ్యక్షులు గాను వ్యవహరించారు .విశ్వ కవి రవీంద్రుడు అంటే రెడ్డి గారికి మహా అభిమానం .రవీంద్రుని రచనలను తెలుగు లోకి అనువ దించారు .రవి కవి న్హృదయాన్ని తెలుగు వారికి పరిచయం చేశారు .ఉర్దూ భాషలోను పట్టు సాధించి ,ఆరచనలనూ తెలుగు చేశారు .70ఏళ్ళు పై బడిన తర్వాతే స్వంత రచనలు ప్రారంభించారు .తన  అనుభవాలను జ్ఞాపకాలను అక్షర బద్ధం చేశారు .ఇరవై కి పైగా కవితా సంపుటాలను వెలువ రించారు .

         గోపాల రెడ్డి గారు ఉత్తర ప్రదేశ్ గవర్నర్ గా పని చేశారు పదవీ విరమణ తర్వాతా రాజకీయాలకు దూరమయ్యారు .ఆయన సరసుడు సహృదయుడు కూడా .కళా పిపాసి నిత్య సాహితీ చైతన్య జీవి .’’గోపాల రెడ్డి ది భారతీయ హృదయం .చూపు విశ్వభారతీయం ,నాలుక తెలుగు జాతీయం ,శ్వాస కోశాలు సంగీత సాహిత్య జాతీయం ,నడక సౌజన్యం ,నవ్వు రసికత్వం ,పిలుపు సహజీవనం తలపు మధుర భావనం, బాట గాంధీయం ,పాటజాతీయం ‘’అన్న ఆచార్య జి.వి.. సుబ్రహ్మణ్యం  గారి ఎస్టిమేషన్ సత్య దర్శనమే .రెడ్డి గారు ఆజాను బాహువు .ఆయన వ్యక్తిత్వమూ అంత దొడ్డదే .విస్తృతం గా పర్యటించిన యాత్రికుడాయన .’’నేను విశ్వ నరున్ని .వసుధైక కుటుంబం నా లక్ష్యం .’’అని చెప్పిన సంస్కారి .తనది సార్ధక మైన జీవితం అని సంతృప్తి తోనే తాను జీవిస్తున్నానని  ,అన్ని రంగాలలోను తాను గణనీయ పాత్రను పోషించానని మనో వాక్కాయ కర్మలా తానొక వీరుడిగా గడిపానని ఢంకా బజాయించి చెప్పిన సరస సాహిత్య సున్నిత హృదయులు బెజవాడ గోపాల రెడ్డి వరేన్యులు .9-3-1997 న తొంభై ఏళ్ళ ముది ప్రాయాన రెడ్డి గారు తుది శ్వాస వదిలారు .

           సశేషం

            మీ –గబ్బట  దుర్గా ప్రసాద్ 10-4-13- –ఉయ్యూరు

      

 

Posted in రచనలు | Tagged | Leave a comment

సరస భారతి 43 వ సమావేశం లో సరిగమలు

 సరస భారతి 43 వ సమావేశం లో సరిగమలు

 

సరస భారతి 43 వ సమా వేశం –విశేషాలు

సాహితీ కదంబం కార్య క్రమం-వార్తాపత్రికల్లో

వినండి , వీక్షించండి

     సుమారు ముప్ఫై మంది మహిళా కవులు రచయితలు ,,అరవై కి పైగా పురుష కవి రచయితలు ,సన్మానితులు  ,అతిధులు ,పోటీలలో పాల్గొని విజేతలైన బాల బాలికలు ,ముప్ఫై మంది పురప్రముఖులు మీడియా మిత్రులు తో సరస భారతి నిర్వహించిన 43 వ సభ కళ కళ  లాడింది .ఇంత భారీ గా ఒక సాహితీ కార్యక్రమం జరగటం అందులో వేసవిలో సమయ పాలనతో నిర్వహించటం అందరిని మెప్పించింది .దాదాపు సాయంత్రం నాలుగింటి లోపే ఎక్కువ మంది చేరుకొన్నారు .అందరికి కుర్చీలలో బెంచీల పైనా కూర్చునే ఏర్పాటు జరిగింది .వచ్చిన వారందరికీ స్పెషల్ స్వీటు ,మిక్చర్ తో కూడిన పొట్లం తో బాటు పొడవైన పెద్ద చక్ర కేళీ పండు ను ఉపాహారం గా అందజేయటం జరిగింది .వేడి చిక్కని రుచికర మైన తేనీరు అందించారు .దూర ప్రాంతాల నుండి వచ్చిన వారు అలసట తీర్చుకోవటానికి ఇవి ఉపయోగ పడ్డాయి .అందరికి మినరల్ వాటర్ అందించారు .

                రాత్రి కవి సమ్మేళనం సమయం లో అందరికి తలా ఒక స్వీట్ బిస్కెట్ పాకెట్ అందించటం ప్రత్యెక ప్రశంసలకు కారణ మైంది .కార్యక్రమం దాదాపు నాలుగు గంటల పైనే నడిచింది .మొత్తం పూర్తీ అవటానికి రాత్రి తొమ్మిది దాటింది .అదే రోజున ఉయ్యూరు సెంటర్ లో మంత్రి గారు వారి పార్టీ అధ్యక్షులు ఒక భారీ సభ ను సాయంత్రం ఆరు గంటలకు నిర్వహించటం వల్ల ట్రాఫిక్ జాం లో చిక్కుకొని ఇబ్బందులు పడి సాహిత్యాభిమానులు సభకు చేరుకోవటం వారికి ఉన్న ఆసక్తికి నిదర్శనం .ఉయ్యూరు బస్ స్టాండ్ నుండి బస్ లన్నిటిని దారి మళ్ళించి బై పాస్ రోడ్డు లో నడిపించటం వల్లతిరిగి వెళ్ళటానికి వీరందరూ చాలా ఇబ్బందులు పడ్డారు .అయినా మర్నాడు వారు ఫోన్ చేసి చక్కని కార్యక్రమం లో పాల్గొన్న ఆనందం పొందామని తెలియ జేశారు వారి మాటల్లో ఎంతో సంతృప్తి గోచరించింది ..

            అనుకోని అతిధిగాజర్నలిజం కాలేజి ప్రిన్సిపాల్ ఉయ్యూరు వాసి  శ్రీ గోవింద రాజు చక్రధర్ గారు రావటం తమ స్పందన తెలియ జేయటం స్థానిక విలేకరులకు గొప్ప ఆనందాన్నిచ్చింది ఇందులో ఎక్కువ మంది ఆయనకు శిష్యులవటం మర్చి పోనీ విషయం .వారందరూ కలిసి చక్రధర్ గారిని ఘనం గా సన్మా నించి తమ అభిమానాన్ని చాటుకొన్నారు .ఆయన మొదట్లో ఇదంతా ఎందుకు అని అన్నా వీరి అభిమానానికి కరిగి పోయారు .అనుకోని అతిధికి అనుకోని సన్మానం గా దీన్ని అందరు భావించారు .

             స్థానిక సంస్థల నుండి రాష్ట్ర శాసన మండలికి ఎన్నిక కాబడి ఆరేళ్ళ పదవీ కాలాన్నిసమర్ధ వంతం గా నిర్వ హించి ఎన్నో ప్రజోప కర కార్యాలతో ప్రజల మధ్యగడిపి   ఫ్లోర్ లీడర్ గా తన సమర్ధత ను నిరూపించుకొని,వాగ్దాటితో  అవతలి వారిని చిత్తు  చేసే శ్రీ యలమంచిలి బాబు రాజేంద్ర ప్రసాద్ పదవీ కాలం మార్చి 29 తో ముగిసింది .అందుకే ఆయన్ను ‘’తాజా మాజీ ‘’అని అన్నారు సరసభారతి అధ్యక్షులు  అతనికి సరస భారతి తో చక్కని సంబందాలున్డటం ఎప్పుడు పిలిచినా హాజరవటం వల్ల ఈ సంస్థకు అతను అంటే మహా ఇష్టం అందుకే రాజేంద్ర కు సరస భారతి    ఆత్మీయం గా శ్రీ గుత్తికొండ సుబ్బారావు శ్రీ చక్రధర్ సమక్షం లో ,సభలో ఉన్న వందమంది కవి పండిత ప్రముఖుల మధ్యపదవీ  విరమణ సన్మానం చేసింది .అతను వద్దు అని అన్నా ఈ అభిమానానికి కాదన లేక పోయారు మళ్ళీ ఇంకో ఉన్నత పదవి అతన్ని త్వరలో వరించి అతని సమర్ధత కు నిర్వచనం కావాలని సుబ్బారావు గారు  కోరారు .రాజేంద్రవేలమందిలో  ఒక్కడు అని కొనియాడారు .

        ఈకార్యక్రమ రూప కల్పనా ఫిబ్రవరి చివరి వారం లో జరిగింది .దీనిలో పురస్కారం అందుకో వలసిందిగా మచిలీ పతనానికి చెందినా కవి ,సాహిత్యోప జీవి శ్రీమతి ముదిగొండ సీతా రావమ్మ గారి కి తెలియ జేయటానికి ఎన్ని సార్లు ఫోన్ లో ప్రయత్నించినా దొరకలేదు కాని కవి సమ్మేళనం లో ఆమె పేరు వేసి ఆహ్వానం పంపం.ఆమె వచ్చి నందుకు చాలా అందం వేసింది ఆమె ఒక నెల రోజులు కాశీ లో ఉండటం వాళ్ళ ఫోన్ అందుకో లేక పోయానని తెలియ జేశారు వచ్చిన అవకాశాన్ని వదలకుండా ఆమెకు శాలువా పూల హారం జ్ఞాపికా నగదు బహుమతి తో సత్కరించి అనుకొన్నది నేరవేర్చుకోన్నాం ఆమె కూడా ఎంతో ఆనందించారు .

                    సభలో పురస్కారాలు పొందిన వారందరూ అతి తక్కువ సమయం లో తమ స్పందనను తెలియ జేయటం సమయ పాలన కు బాగా తోడ్పడింది .ఎవరూ సమయాతిక్రమణ చేయక పోవటం విశేషం .సాహితీ కదంబంకార్యక్రమమో రాసిన దాన్ని బట్టి  రాత్రి ఏడున్నరకు పూర్తీ అవ్వాల్సి ఉంది కాని ప్రారంభం అయిందే ఏడింటికి .అందుకని తొమ్మిదిన్నర కు పూర్తీ అవటం ఇబ్బంది కలిగించింది .కారణం కార్యక్రమం సాయంత్రం నాలుగింటికి మొదలవ్వాల్సింది ముద్దు ముద్దుగా సుమారు అయిదింటికి ప్రారంభ మవటం .అంటే గంట లేటన్న మాట .ఏ సాహిత్య సభలో అయినా ఇది మామూలే అనుకొన్నా సరసభారాతికి ఇది నచ్చని విషయం .మహిళలకు ముందు కవిత చెప్పే అవకాశం కల్గించినా పాపం ఆలస్యం తప్పలేదు .ఇది నిర్వహణ లోపం మాత్రమె కాదు అతిధుల రాక ఆలస్యం కూడా .

          ఎక్కడా సుత్తి లేదు సుదీర్ఘ ప్రసంగం కూడా లేదు .సుబ్బారావు గారు పెడన లో వేరే కార్యక్రమం ఉన్నందున సాయంత్రం ఆరు గంటలకు అధ్యక్షులకు బాధ్యత అప్పగించి వెళ్ళారు ఇంతలో పూర్ణ చంద్ ఆ స్థానాన్ని పూరించారు .మొదట్లో ప్రసంగించాల్సిన పూర్ణ చంద్ విజయ వాడ లో అత్యవసర కార్యక్రమం లో పాల్గొని రావటం వాళ్ళ ఆలస్యం గా వచ్చారు .’’సాహితీ లతా తెన్నేటి  హేమలత సాహితీ ప్రస్తానం ‘’పై ప్రసంగించి అలరించి లతా కు నీరాజనాలన్దించటం మరో మలుపు .లతను ఉయ్యూరు లాంటి పల్లె తూల్లలో స్మరించటం ఒక గొప్ప విశేషం కూడా అయింది అందుకే పూర్ణ చంద్ గారిని ఆత్మీయం గా సరసభారతి సన్మా నించి గౌర వించింది .ఆయన తన ప్రసంగం లో నా గురించిన ప్రసంగం వచ్చినప్పుడల్లా ‘’నాన్న గారు‘’అనటం నాకు ఎంతో ఆత్మీయత ,కుటుంబ బాంధవ్యం గోచరించాయి ఎప్పుడు బందరు వెళ్ళినా మా ఇంటికి వచ్చి వెళ్ళటం ఆయన సహృదయత .,సంస్కారం .అవే ఈ మాటలను అని పించింది ..కృష్ణా జిల్లా రచయిత ళ సంఘానికే కాక సుబ్బారో ప్రేమ చంద్ లు సరసభారతికి  వారిద్దరూ రెండు కళ్ళు .దిశా నిర్దేశికులు .పదేళ్ళ మా అందరి పరిచయం మరువ లేనిది నాతో ఎంతో రచన చేయించిన వారుయా ఇద్దరు .సమావేశాల్లో నాకు భాగ స్వామ్యం కల్పించటం వారి సౌజన్యం .

                సరస భారతి ప్రచురించినవి ఆవిష్కరణ చేయటం మామూలే కానిరిటైరేడ్ ఇంజినీర్ ,ఆధ్యాత్మిక విషయాలను శాస్త్రీయ దృక్పధం తో ఆలోచించి అనేక” మహర్షి భరద్వాజ” వంటి అనేక  పుస్తకాలు రచించిన  శ్రీ బందా వెంకట రామా రావు గారి అమూల్య గ్రంధం ‘దైవం శాస్త్రీయ  పరిశోధన ”ను ,శ్రీ శృంగారపు వెంకటప్పయ్య గారి” ఆధ్యాత్మిక గీతాలు ” సి.డి . లను ఈ సమావేశం లో ఆవిష్కరించాలని వారిద్దరూ కోరటం అలా జరగటం మరో కొత్త మలుపు నవంబర్ లో శ్రీ టి.వి.సత్యనారాయణ గారి ”శ్రీ కృష్ణ లీలామృతం ”కథా సంపుటిని వారి కోరికపై సరసభారతి సభలో శ్రీమతి డాక్టర్ కే.బి.లక్ష్మి గారి చేతుల మీదుగా గా ఆవిష్కరించటం సరస భారతి పై వారందరికీ ఉన్న అపారమైన గౌరవం ,నమ్మకం లకు నిదర్శనం దాని వ్యాప్తికిఅద్దం పట్టి నట్లు అయింది 

               శాఖా గ్రంధాలయం లో ఈ కార్య క్రమం నిర్వహించటానికి అనుమతి నిచ్చిన లైబ్రరి స్టాఫ్ కు సరస భారతి కృతజ్ఞతలు తెలుపు కొంది.వారికీ ,సభలో పాల్గొన్న ,చివరి వరకు ఉన్న వారందరికీ వివేకా నంద స్వామి ఫోటో జ్ఞాపికను సరస భారతి అందజేసింది .ఆ జ్ఞాపిక సభకు హాజరైన వారందరికీ ఎంతో బాగా నచ్చింది .ఫోన్లు చేసి మరీ అభినందించారు జ్ఞాపికను .

         ఈ సభలో పురస్కారం పొందాల్సిన శ్రీ టి.శోభ నాద్రిగారు తమ అనారోగ్యం వాళ్ళ రాలేక పోతున్నానని ఆ ఉదయమే ఫోన్ చేసి చెప్పి నేను చేస్తున్న ఈ కార్యక్రమాన్నిమన సారా అభి నందించారు ..మా సన్మానం అందుకోవాల్సిన డాక్టర్  పింగళి వెంకట కృష్ణా రావు గారు వస్తాను,వస్తాను  అని నేను ఫోన్ చేసినప్పుడల్లా చెప్పివిజయ వాడ నుంచి రాక పోవటం నాకు గొప్ప నిరాశనే కల్గించింది .కాని ఎక్కడో నెల్లూరు నుండి నేను ఆహ్వానిన్చగానే వస్తానని చెప్పి వచ్చి మహదానందాన్ని పొంది మా అందరకు కల్గించిన ప్రముఖ కవి తిక్కన లలిత కళా పీఠ వ్యవస్తాపక అధ్యక్షులు శ్రీ ఆలూరు శిరోమణి శర్మ గారు‘’వినయానికి విద్వాత్తుకు ,మంచితనానికి మాట నిలబెట్టుకోనడానికి శిరో మణి’’ అని పించుకొన్నారు .

                ఈ కార్యక్రమం ‘’జన గణ మన’’గీతం తో పరి సమాప్తి చెందింది .అందరికి మధుర భావనలు మిగిల్చింది .

       ‘’సాహితీ కదంబం ‘’లో పాల్గొని కవితలు చెప్పిన వారి కవితలన్నిటిని శ్రీ విజయ ఉగాది నుండి‘’విజయ ఉగాది కవి కోకిల స్వరాలు ‘’పేర ధారావాహికం గా ‘’సరస భారతి ‘’అందిస్తోందని తెలియ జేయటానికి ఆనందం గా ఉంది

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -9-4-13- ఉయ్యూరు 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | 1 Comment

అన్నమయ్య స్మృతిలో…2

అన్నమయ్య స్మృతిలో…2
అన్నమయ్య సాహిత్య మథనం

 

అన్నమయ్య విలక్షణ లక్షణా సమన్వితంగా
వాడిన పదాలు :
‘ఇచ్చకాలు’ అంటే ఇంపైన మాటలా, మెర మెచ్చులా!
‘పన్నీరు’ అంటే ?
‘అలకల కులుకుల’ అంటే ఉంగరాల వెంట్రుకలా!
‘తిరుపట్ల’ అంటే ఒక ఊరా?
ఇలాంటివెన్నో! ఇంకా తేలనివి!!
అన్నమయ్య సాహిత్యం కొన్నివందల సంవత్సరాలు మరుగున పడి వుంది. క్రీ.శ.1816లో ఎ.డి.కాంబెల్ అనే ఒక పాశ్చాత్య వైయాకరణుల వినికిడికి వచ్చింది. కొం డపై వుండే ఒక బ్రాహ్మణుని ద్వారా ఆ రాగిరేకుల మీదవేమిటో తెలుసుకొని ‘ఉన్నదంతా ఆ స్వామిపై పాటలే; ఒకటి మాత్రం వ్యాకరణానికి సంబంధించినది. దీని నకలు తీయించా’నని వ్రాసుకొన్నాడు. బహుశః ఆ వ్యాకరణం సంకీర్తన లక్షణమై ఉంటుందని పెద్దలన్నారు కాని నేననుకోవడం పెదతిరుమలయ్య రేఫ ఱకార నిర్ణయమని. ఇవి చూసింది, ఆ అభిప్రాయం వెలిబుచ్చినది ఆ బ్రాహ్మణుడు. ‘సంకీర్తన లక్షణం’ చూసి అతనది ఛందో విషయమనుకోవడానికే ఎక్కువ అవకాశం ఉంది. పెద తిరుమలయ్యది వ్యా కరణం అనుకొని ఆ దొరకలాచెప్పడం, తెలుగు వ్యాకరణం వ్రాయబూనిన ఆయన దాని నకలు వ్రాయించుకొనడం జరిగి ఉంటుంది.

ఇది కొన్ని కొత్త ప్రశ్నలకు తావిస్తున్నది. ఆ రాగిరేకులు ఆ నాటికి ఎక్కడున్నవి, యిప్పుడు మనం సంకీర్తన భండారం అని వ్యవహరిస్తున్నదానిలోనేనా? అప్పటికి వేలకొలది యీ రాగిరేకులు అక్కడే నిక్షిప్తమై వున్నవా? ఉంటే కొండపైనుండే ‘ఓ’ బ్రాహ్మడి (అర్చకులలో ఒకరనుకొన్నా సరే!) అందుబాటులోనే వున్నా యా? దొరగారడిగిన వెంటనే చూసి చెప్పగలిగాడా? అయి తే 1922లో తి.తి.దే వారు వీటిని ఎక్కడ కనుగొన్నారు? శ్రీ వేటూరి ఆదేశానుసారం అర్చకం ఉదయగిరి శ్రీనివాసాచార్యులు ఆ భండారంలోనివి దిగినప్పుడవన్ని అందులో లేవే? మరెక్కడున్నవి! 1947-48 ప్రాంతాల్లో వీటిని వెలికి తీసి పరిష్కరించి ప్రచురించేకార్యక్రమం తి.తి.దే పలువురు పెద్దల ప్రమేయంతో చేయించింది. వారిలో ప్రథములు సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి, చివరి నాల్గింటికి ఒక రూపం కల్పించింది కామిశెట్టి శ్రీనివాసులు, మేడసాని మోహన్.

ఈ రాగిరేకులలో లేనివి కొన్ని తాళ్లపాక వంశస్థుల వద్ద చేతివ్రాత పుస్తకాలలో లభించాయి. ‘పొడగంటిమయ్యా, పురుషోత్తమా’, ‘అలుగక కూటమి చవిగాదనుచు’ మొదలైనవి. చిరంజీవి జి.బి.శంకరరావు తాళ్లపాక శేషాచార్యుల వ్రాతప్రతి నుంచి 288, తంజావూరు సరస్వతి మహల్ లైబ్రరీ నుంచి 30 చిల్లరా సేకరించి వేటూరి ఆనందమూర్తి పరిష్కరించగా తయారు చేసినది కొన్నేళ్లుగా తి.తి.దే వారి ప్రచురణకు స్వీకరించబడి, పడివున్నది. ఆనందమూర్తి ప్రతిపాదనలో ముఖ్యాంశం (తన తండ్రిగారు సూచించినదే) యీ తాళ్లపాక వంశంలో అన్నమయ్య, పెదతిరుమల య్య, చిన్నన్నలే కాక పదకర్తలు మరికొందరున్నారు అన్నది యీ పుస్తకం బయటికి వస్తే చర్చనీయాంశం అవుతుంది. ఇంతకు ముందు తెలియనిది, ఎవరికీ తట్టనిదీ ఒకరంటేనే దానిని కాదనేవారు కాదనగలరు, బలపరచేవారౌననగలరు. ఇవి సహేతుకంగా సాగితే జరిగే వడపోత మంచిదే.

అన్నమయ్య సాహిత్యం 6 శతాబ్దాల క్రిందటిది. సాధారణులు దానిని పూర్తిగా అర్థం చేసికొనడం కష్టం. ఆనాటి మాటలు కొన్ని నేడు చలామణిలో లేవు. మరికొన్నిటికి అర్థం మారింది. సూర్యరాయాంధ్ర నిఘంటువు, శబ్దరత్నాకరం పదసాహిత్యంలో వున్న మాటలను పట్టించుకోలేదు. ఆ కొరత ‘శ్రీహరి నిఘంటువు’ (రవ్వా శ్రీహరి, 2004) కొంత వరకు తీర్చింది. అన్ని వేల పదాలు కాకపోయినా ఆరోపాలన్నీ అన్నమయ్య రచనల నుంచే స్వీకరించిన ‘అన్నమయ్య పదకోశం’ (రవ్వా శ్రీహరి, 2013) మరింత ముందుకు సాగించింది. అన్నమయ్య వాడిన ప్రతి పదానికీ నిర్దిష్టమైన అర్థం సాధించడం గగన పారిజాతం. ఇది చేసిన వారి కృషిని తేలిక చేయ డం కాదు. ఆ తాళ్లపాక సముద్ర మథనం క్షీరసాగర మథనం లాంటిదని గ్రహించడమే. తాళ్లపాక సాహిత్యాన్ని ఆరాధించే వారికి మరికొన్ని వెసులుబాట్లివీ: ‘అన్నమయ్య సంకీర్తనామృతం (సముద్రాల లక్ష్మణయ్య). ఇందులో 150 ఆధ్యాత్మిక సంకీర్తనలకు ఒలిచిన అరటిపండులాంటి అర్థ వివరణ లభిస్తుంది. చివరి రెండూ తి.తి.దే ప్రచురణలు. ‘తాళ్లపాక వారి పలుకుబళ్లు’ (రామలక్ష్మీ ఆరుద్ర, 1971, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ) వలన తెలిసేవి ప్రయోగ విశేషాలే అయినా, యీ సంకీర్తనల పూర్తి పాఠాలు పరిశీలిస్తే మరికొన్ని క్లిష్ట పదాలకర్థాలు తేలికవవచ్చు. ఈ సేకరణ 18 సంపుటాల వరకే పరిమితం.

ఇటువంటి బృహత్కార్యం, ‘తాళ్లపాక పదప్రయోగ కోశం’ అన్ని సంపుటాల నుంచీ తీసికొన్నది పి.నరసింహారెడ్డి అజమాయిషీలో తయారయి గత రెండేళ్లు గా తి.తి.దే ప్రచురణకు ఎదురు చూస్తున్నది.

కేవలం పాటల ఛందస్సు, నిర్మాణం తెలుసుకోవాలంటే ఆంగ్లాంధ్రాలలో ఒక కల్పద్రుమం ‘ది ట్యూన్స్ ఆఫ్ డివినిటీ’! ఒక ప్రక్క తాళ్లపాక చిన తిరుమలయ్య వ్రాసిన సంకీర్తన లక్షణం, మరొక ప్రక్క సాళ్వ కృష్ణమూర్తిగారి సరళానువాదం (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏషియన్ స్టడీస్, సెమ్మంజేరి, మద్రాసు 600 041 వారి ప్రచురణ 1990). ఇప్పుడిది అచ్చులో దొరకదు. ఆ సం స్థకు దీనిని పునఃప్రచురణ చేసే ఉద్దేశమూ ఉన్నట్లు లేదు. సమర్థులూ, దీని అసామాన్యతను గ్రహించగలవారూ ఆ పని చేపట్టితే తెలుగుభాషకొక ఆమూల్యాభరణం తిరిగి అందగలదు. ఇవన్నీ ఒక ఎత్తు.

అన్నమయ్య సాహిత్యంలోని వేర్వేరు కోణాలను వెలిగించటానికి పనికి వచ్చేవి. తాళ్లపాక సాహిత్యమంతటినీ దృష్టిలో వుంచుకొని, తండ్రి చూపిన దారిలో నడచి మకుటాయమానమైన వివరణలు చేసినది వేటూరి ఆనందమూర్తి. ‘తాళ్లపాక కవుల కృతులు’ మొదటిది. ‘తాళ్లపాక కవుల పద కవితలు’ రెండవది. వీటి సొంత ప్రచురణ 1976లో. అచ్చులో లేవు. వీటిని తి.తి.దే పునర్ముద్రణకు 2007లో స్వీకరించింది. తరువాత వీటి సంగతేమిటో తెలియదు. ఈ పుస్తకాలన్నీ అందుబాటులో వుంటే అన్నమయ్య సాహిత్యమంతా అరచేతి ఉసిరిక అవుతుందా! దశమస్కంధం పారాయణ చేసినంత మాత్రాన ఆ ధూర్తుడు మన వశంవర్తి అవుతాడా? అవదు; అవడు. కానీ యీ ప్రయత్నాల కా పుస్తకాలు తోడ్పడగలవు. కొంత పొగమంచు విడగలదు. కొన్ని తెరలు తొలగగలవు. ఆ రోజు కోసం ఎదురు చూపులు!
– వి.ఎ.కె.రంగారావు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -9

  కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -9

                   హిందీ చందమామ సంపాదకుడు బాల శౌరి రెడ్డి

 ‘’ ఒక అయిడియా  జీవితాన్నే మార్చేసి నట్లు ‘’  ప్రముఖులతో పరిచయం కూడా జీవితాన్ని మార్చేస్తుంది .బాల శౌరి రెడ్డి మద్రాస్ లో 1946 లో గాంధీ గారిని చూశారు .ఆటోగ్రాఫ్ కావాలని అడిగితే హిందీ లో రాసిచ్చారు మహాత్ముడు .దానితో హిందీపై అభిమానం పెరిగి ఇరవై వ ఏట ఇల్లు వదిలి కాశీ చేరారు .హిందీ చదవటం ప్రారంభించారు .ఆ సమయం లో భారత కోకిల సరోజినీ నాయుడు చని పోయింది.ఆమె పై మొట్టమొదటి సారిగా కవిత్వం రాశారు .అది అందర్నీ ఆకర్షించింది .అప్పటికి ఉత్తరాది వారు మనల్ని మద్రాసీలు అనే పిల్చేవారు .సంస్కారం లేని వారిగా ,ఆంధ్రులని భావించి తేలిగ్గా చూసే వారు .రెడ్డి గారు దీన్ని సహించే వారు కాదు .ఒక ఉగాది పర్వదినాన రెడ్డి గారు ఆంద్ర భాషా వాజ్మయం పై అద్భుత ప్రసంగం చేసి అందరి నోళ్ళూ మూయించారు .మద్రాస్ నుండి వెలువడే ‘’త్రిలింగ ‘’పత్రిక లో ఆయన రచనలు ప్రచురితమయ్యెవి .హిందీ లో ప్రచురింప బడే ‘’గ్రామ సంసార ‘’పత్రికకు హిందీ రచనలు రాసేవారు .హిందీలో 75 ,తెలుగు లో 13 గ్రంధాలు రాసిన మేటి రచయిత బాల శౌరి రెడ్డి. దేశ ,విదేశాలలో లెక్కలేనన్ని  సన్మానాలందుకొన్నారు .

                       హిందీ ప్రచారం

        1950 లో దక్షిణ భారత హిందీ ప్రచార సభ రెడ్డి గారిని హిందీ ఉపన్యాసకుని గా మద్రాస్ కు ఆహ్వానించింది .రెడ్డి గారి ప్రతిభకు పట్టం కట్టింది నార్ల ,జలసూత్రం కృష్ణ శాస్త్రి మున్నగు సాహితీ మూర్తుల తో మంచి సాన్నిహిత్యమేర్పడింది .ఆబ్ (ఈనాడు ),ఆజ్కల్ పత్రికలలో హిందీ రచనలు వస్తూన్దేవి .పారితోషికమూ లభించేది .1954 లో ‘’పంచామ్రుత్ ‘’అనే గ్రంధాన్ని రాశారు .అందులో తెలుగు కవులను పరిచయం చేస్తూ వారి పద్యాలను హిందీ లో అనువాదం చేసి ప్రచురించారు .తెలుగు వాజ్మయ వికాసం పై విపుల మైన పీఠిక రాశారు .పట్టాభి గారు దీన్ని ఎంతో మెచ్చుకొన్నారు .నార్ల వారి అభినందనా లభించింది .ఈ గ్రంధానికి భారత ప్రభుత్వ పారితోషికమూ లభించింది .1956 లో పులి వెందుల లో ఆ నాటి విద్యా మంత్రి సమక్షం లో గడియారం వెంకట శాస్త్రి గారు ,జమ్మల మడక మాధవ రామ శర్మ గార్ల ఆధ్వర్యం లో రెడ్డి గారికి ఘన సన్మానం జరిగింది .’’జిందగీ రాఃహ్ (జీవన పధం )అనే హిందీ సాంఘిక నవలకు బహుమతి నందుకొన్నారు .రాష్ట్ర మంతటా సన్మాన మహోత్సవాలు జరిగాయి .రాష్ట్ర పతి రాధాకృష్ణన్ ముఖ్య మంత్రి కాసు సమక్షం లో హైదరాబాద్ లో ఆంద్ర రాష్ట్ర హిందీ ప్రచార సభ రజత జయంతి నాడు వైభవోపేతమైన సన్మానం అందుకొన్నారు .ఆంద్ర జ్యోతి లో37 వారాలు ధారా వాహికం గా ‘’రామాయణ కాలం లో భారతీయ సంస్కృతి ‘’ప్రచురింప బడి విశేషం గా ప్రజలను ఆకట్టుకొన్నారు

               హిందీ లో నవలలు వ్యాసాలూ నాటకాలు ,వాజ్మయ చరిత్ర రాసి బహుమతులు పొందారు .30 పుస్తకాల ద్వారా తెలుగు భాషా ,సంస్కృతి , హిందీ లో రాసి హిందీ భాషాభిమానులకు తెలుగు వైభవాన్ని రుచి చూపించారు .రెడ్డి గారి హిందీ రచనలు తెలుగు లోకి అనువదింప బడి బహుళ ప్రచారం పొందాయి .వీరి ‘’లకుమ‘’నవల ఏడు సార్లు ముద్రణ పొందింది అంటే వీరి వైదుష్యం ఏమిటో తెలుస్తుంది .హిందీ కన్నడ గుజరాత్ భాషల్లోకీ అనువాదం పొందింది .లకుమ కు బెంగళూర్ యూని వర్సిటి అవార్డు ,దావాగ్ని నవలకు రాష్ట్ర పతి పురస్కారం లభించాయి .ఉత్తమ అనువాదకుని గా ‘’ద్వివాగ్రీశ్ ‘’అవార్డు ను రాష్ట్ర పతి శంకర దయాళ్ శర్మ చేతుల మీదుగా అందుకొన్నారు .దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సాహిత్య అకాడెమీలు రెడ్డిగారికి ,సన్మానాలు చేసి తమ సాహిత్యాభిలాషను చాటుకోన్నాయి  అనేక విద్వద్ సభల్లో కీలక ఉపన్యాసాలిచ్చారు .చాలా  పత్రికలూ ప్రత్యెక సంచికలు ప్రచురించాయి 2000 లో ‘’అపనే అపనే బాల శౌరి రెడ్డి ‘’అనే 400 పేజీల అభి నందన సంచికను ఢిల్లీ సాహిత్య అకాడెమి ఆవిష్కరించి ఘనం గా సత్కరించింది .

                 మామా –చందమామా –సన్మాన సీమా

            1966 నుండి 1985 వరసకు అంటే 23 ఏళ్ళు రెడ్డి గారు హిందీ’’ చందమామ ‘’సంపాదకులు గా పని చేశారు .ఆ చందమామ ఈ మామ ను ఇలా ఆదరించి గౌరవించింది .దాని సర్క్యులేషన్ ను1,67,000లకు పెంచిన ఘనత బాల శౌరి రెడ్డి గారిదే .కలకత్తా లోని భారతీయ భాషా పరిషత్ కు నాలుగేళ్ళు డైరెక్టర్ గా పని చేసి  30 సెమినార్లు నిర్వహించి రికార్డు సృష్టించారు .విశ్వంభర రాసిన నారాయణ రెడ్డి గారికి బాల శౌరి రెడ్డి గారి సారధ్యం లోనే మొదటి పురస్కారం లభించింది .మాలతీ చందూర్ ,రావూరి భరద్వాజ ,కేతు విశ్వనాధ రెడ్డి లకు కూడా పరిషత్తు తరఫున సన్మానాలను రెడ్డి గారు చేశారు .1998  నుండి తమిళ నాడు హిందీ అకాడెమి అధ్యక్షులు గా పని చేశారు .హిందీ దిన పత్రిక ‘’చమకతా సితారా ‘’కు సంపాదకులు గా మూడేళ్ళు పని చేశారు .ఆంద్ర విశ్వ విద్యాలయం ‘’కళా ప్రపూర్ణ ‘’నూ శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం డి.లిట్ బిరుదు  నిచ్చి సత్కరించాయి .’’సాహిత్య మార్తాండ ‘’.’’హిందీ రత్న ‘’,’’వాజ్మయ రత్నాకర‘’బిరుదులూ రెడ్డి గారిని వరించాయి .డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ,మహాత్మా గాంధి వంటి వారు అధ్యక్షులు గా పని చేసిన ‘’ప్రయాగ హిందీ సమ్మేళనం ‘’కు శ్రీ రెడ్డి ఎన్నిక అయారంటే వారి సామర్ధ్యత ఎంతో తెలుస్తోంది .1974 మొదటి హిందీ సమ్మేళనం లో ను మూడవ ఏడవ  సమ్మేళనాలలో  రెడ్డి గారిని ఘనం గా సన్మా నించారు .

                        జీవిత విశేషాలు

  1928 లో కడప జిల్లా పులి వెందుల తాలూకా గొల్లల గూడూరు లో బాల శౌరి రెడ్డి గారు జన్మించారు .తన మాతృభాషకు ,రాష్ట్రానికి ,సంస్కృతికి గొప్ప పేరు తెచ్చి హిందీ భాష లో అసదృశ పాండిత్యాన్ని సంపాదించి ఉత్తర దక్షిణ భారతాలకు సారస్వత సేతువు గా అజేయం గా నిలిచి సాహితీ మూర్ధన్యులు బాల శౌరి రెడ్డి గారు .బాల్యం లోనే కాక యవ్వనం లో మధ్య వయసులో ముసలితనం లో కూడా నిత్యోత్సాహి గా ఉన్నారు .’’సమాజానికి ,దేశానికి ,ప్రపంచానికి రచయిత బాధ్యతా యుతం గా కృషి చేస్తూ ఒక పౌరుడు గా ఉండాలి ‘’అని సాహిత్య సిరి అయిన బాల శౌరి గారి అభిప్రాయం .ఓర్పు ,కృషి విశ్వాసమే హన విజయ రహస్యం అంటారు రెడ్డి గారు .హిందీ సాహిత్యాకాశం లో ప్రకాశ వంతం గ వేలుగులీనే ‘’చమక్ చమక్ తార‘’శ్రీ బాల శౌరి రెడ్డి ..

           మరో ప్రముఖుని గూర్చి తర్వాతా

       సశేషం –మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ –9-4-13- ఉయ్యూరు 

Posted in కవితలు | Tagged | Leave a comment

సరస భారతి 43 వ సమా వేశం –విశేషాలు

 సరస భారతి 43 వ సమా వేశం –విశేషాలు

సాహితీ కదంబం కార్య క్రమం-వార్తాపత్రికల్లో

వినండి , వీక్షించండి

     నిన్న అంటే ఏప్రిల్  ఏడవ తేదీ ఆదివారంసాయంత్రంనాలుగు గంటలకు  సరస భారతి 43 వ సమావేశాన్ని ‘’శ్రీ విజయ నామ సంవత్సర ఉగాది సాహితీ కదంబం ‘’గా  ఉయ్యూరు శాఖా గ్రంధాలయం (ఏ.సి.లైబ్రరి )లో’’శ్రీమతి తెన్నేటి హేమలత సాహితీ వేదిక ‘’పై నిర్వహించింది .ఆహూతులైన అతిధులకు కవులు రచయితలకు పురస్కార గ్రహీతలకు ,మీడియా మిత్రులకు సాహితీ అభిమానులకు అధ్యక్ష స్తాయి లో గబ్బట దుర్గా ప్రసాద్ ఉగాది శుభా కాంక్షల తో స్వాగతం పలికారు .అతిధులను ,పురస్కార గ్రహీతలను వేదిక పైకి ఒక్కొక్కరిని ఆహ్వానించగా వారన్దరికి కమలా ఫలం తో సరస భారతి సభ్యులు సాహితీ ప్రియులు వేదిక పైకి ఆహ్వానించారు . సరసభారతి గౌరవాధ్యక్షురాలుశ్రీమతిజోశ్యుల శ్యామల దేవి ప్రార్ధనతో సభను ప్రారంభించారు .సభకు అధ్యక్షులు గా వ్యవహరించిన కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు మాట్లాడుతూ ఉయ్యూరు రావటం అంటే తమ కెంతో ఇస్టమని ఇక్కడ సరసభారతి వారు నిర్వహించే కార్యక్రమాలు చాలా విస్తృత స్తాయిలో ఉంటాయని తనలాగా దుర్గా ప్రసాద్ గారికి కూడా సాహిత్య ఆశ ఎక్కువ అని ఏదైనా సవాలుగా తీసుకొని సమర్ధ వంతం గా నిర్వహించటంలో  అయన సమర్ధులని మంచి కార్యకర్త అని ఇలాంటి సభలు ఉయ్యూరు లో జరపటం ఎంతో  సంతోషమని మని ఇలాంటివి విజయ వాడ మచిలీ పట్నం వంటి పెద్ద పట్నాలలో నిర్వహించే రోజు సరసభారతికి తప్పక వస్తుందని ఆశను వెలి బుచ్చారు .దుర్గాప్రసాద్ గారు ఇంటర్నెట్ ను సమర్ధ వంతం గా ఉపయోగిస్తున్నారని సరసభారతి బ్లాగ్ లో రోజుకు కనీసం ఆరేడు ఆర్టికల్స్ ఉంటాయన్  అన్ని విషయాలను సమగ్రం  గా ఉండే బ్లాగ్ అని ఇంత తక్కువ కాలం లో లక్ష మంది పైగా వీక్షకులను ఆకర్షించటం సామాన్య విషయం కాదని ,ఎక్కడ ఏ సమావేశ విషయమైనా సరసభారతి అందిస్తోందని ఇది గర్వించాల్సిన విషయమని అన్నారు .

                అనుకోని అతిధి గా విచ్చేసిన ఉయ్యూరు నివాసి హైదరాబాద్ లో జర్నలిజం కాలేజి ని స్థాపించి ఎందరో యువకలకు జర్నలిజం కోర్సులో ప్రవేశం కల్పించి తీర్చి దిద్దినప్రిన్సిపాల్  శ్రీ గోవింద రాజు చక్రధర్ మాట్లాడుతూ దుర్గా ప్రసాద్ గారి సాహిత్య కార్య క్రమాలను తెలుసుకోన్నానన్నారు ప్రతి ఇంటిలో వంట గది ఉన్నట్లే పుస్తకాల గది ఉండాలని ,పుస్తక రచన ప్రచురణ వెలువరించటం చాలా వ్యయ ప్రయాసలతో కూడినదని దీన్ని సరస భారతి సమర్ధం గా ఉయ్యూరు లో చేయటం స్వాగతిమ్పదగిన విషయమని  మన యోగ, ఆయుర్వేద విద్య ,శాస్త్రాలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయని మన కట్టు బొట్టు అందరికి ఆదర్శం గా ఉంటాయని అందరు వీటిని అనుకరించి మనకు కను విప్పు కల్గిస్తున్నారని అన్నారు .

            ముఖ్య అతిధి తాజా మాజీ శాసన మండలి సభ్యులు శ్రీ యలమంచిలి వెంకట బాబు రాజేంద్ర ప్రసాద్ తమప్రసంగం లో ఏదేశం లో నైనా సాహిత్యమే ఆజాతి జీవితాన్ని, జీవనాన్ని ప్రభావితం చేస్తుందని ,తెలుగు సాహిత్యం సర్వతో ముఖం గా వృద్ధి చెందిందని దీనికి కారకులైన కవి పండిత రచయితలకు మనం రుణ పడి ఉన్నామని అన్నారు .మన చరిత్రను భావి తరాలకు అందజేస్తున్న సరసభారతి ఆదర్శం గా పని చేస్తోందనిఈ  సంస్థ ప్రచురించిన పది పుస్తకాలలో తాను ఎనిమిది పుస్తకాలను ఆవిష్కరించటం తన అదృష్టమని తెలిపారు సమావేశాలు నిర్వహించటం పెద్దల్ని పిలిపించి ఉపన్యాసాలు ఇప్పించటం పుస్తకాలు రాయటం ముద్రించి ఆవిష్కరణ లు చేయటం కవి సమ్మేలణాలునిర్వహించటం అన్నీ ఒంటి చేత్తో నిర్వహిస్తున్న దుర్గా ప్రసాద్ మాస్టారు అందరికి ఆదర్శం అని డెబ్భై మూడేళ్ళ వయసులో యాభై ఏళ్ళ వారుగా చలాకీ గా ఉండటం లో రహస్యం అయన నిరంతర చైతన్య మే నని చెప్పారు .ఈ లైబ్రరి పై అంతస్తు నిర్మాణం లో ఉందని అక్కడ సాహితీ సమావేశాలు జరుపుఒనే అన్ని వసతులు కల్పిస్తామని వై వి.బి.తెలియ జేశారు .

                       పుస్తకావిష్కరణ

        సిద్ధ యోగి పుంగవులు దైవం –సశాస్త్రీయ పరిశోధన పుస్తకాలను ,ఆధ్యాత్మిక గీతాలు సి.డి.లను రాజేంద్రప్రసాద్ చక్రధర్ సుబ్బారావు గార్లు ఆవిష్కరించారు .సిద్ధయోగి పుంగవులు రాసిన దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ సరసభారతి ప్రచురించిన దవ పుస్తకం అని తన అయిదవ రచన అని దీనిని నెట్ లో రాశానని దీన్ని అమెరికా లో ఉంటున్న శ్రీ మైనేని గోపాల కృష్ణ గారికి అంకితం ఇవ్వలనుకొని వారికి తెలియబర్చానని ఆయన తమను ఇంతవారిని గా తీర్చి దిద్దిన తమ మాతృమూర్తి స్వర్గీయ మైనేని సౌభాగ్యమ్మ గారికి అంకిత మివ్వమని కోరారని తెలియ జేశారు .ముప్ఫై అయిదు ఎపిసోడ్లపుస్తకాన్ని రమ్య భారతి సంపాదకులు శ్రీ చల పాక ప్రకాష్ చ క్కగా ముద్రించి అందించారని వారిద్దరి ఋణం తీర్చుకోలేనిదని అన్నారు ఇటీవల అమెరికా కు వెళ్లి నప్పుడు గోపాల కృష్ణ గారు అలబామా లో ని తమ గ్రామం హాంట్స్ విల్ కు ఆహ్వానించి అక్కడ అలబామా తెలుగు అసోసియేషన్ తో తనకు సన్మానం జరిపారని తనకు అయిదు వందల డాలర్ల చెక్కు అందజేశారని చెప్పారు అందువల్లనే ఈ డబ్బుతో ఈ పుస్తకం తెచ్చి వారి తల్లి గారికి అంకితం చేశానని అన్నారు .ఆమె మలయాళస్వామి వారి వద్ద మంత్రం దీక్ష తీసుకొని అనుసరించిన ధన్యాత్మురాలని వివరించారు గోపాల కృష్ణ గారి ఆత్మీయత మరువలేదని ఈ లైబ్రరి ఇంత ఉన్నత స్తితి లోకి రావటానికి వారే కారణం అని చెప్పారు .

          దైవం శాస్త్రీయ పరిశోధన గ్రంధ కర్త ఈ పుస్తకాన్ని రాయటం డిటిపి కవర్ డిజైన్ ,కవర్  అంతా తానే చేశానని god అంటే జనరేషన్ ,ఆర్గనైజేషన్ ,డిస్త్రక్షన్ అని అదే సృష్టి స్తితి లయ కారకుడైన భగవంతుడు అని మనం అంటామని చక్కని వివరణ నిచ్చారు .శ్రీ శృంగారపు వెంకటప్పయ్య గారు తాము రాసి స్వర పరచి తెచ్చిన సిడి గురించి ప్రసంగించి విశేషాలు వివరించారు .

                         పురస్కార ప్రదానం

          ప్రతి ఉగాదికి సరసభారతి స్వర్గీయ గబ్బిట భవనమ్మ మృత్యుంజయ శాస్త్రిగారల స్మారక ఉగాది పురస్కారాలను అంద జేస్తుంది దీన్ని వారి కుమారులు కోడలు దుర్గాప్రసాద్,ప్రభావతి దంపతులు అందజేస్తారు ఈ రోజు వివిధ రంగాలలో విశేష కృషి చేసిన పన్నెండు మందికి నగదు పురస్కారం తో పాటు శాలువా, పూల హారం చందన తాంబూలం పన్నీటి జల్లు లతో వివేకానంద స్వామి ఫోటో ఉన్న జ్ఞాపిక లను అందజేశారు దీనిని రాజేంద్రప్రసాద్ సుబ్బారావు గార్ల సమక్షం లో వారి చేతుల మీదుగా నిర్వహించారు .పురస్కారాలను అందుకొన్న వారు  ఉచిత రీతి స్పందన తెలియ జేశారు  

      మొదట గా అఖిల భారత కూచి పూడి నృత్య కేంద్ర కార్య దర్శి శ్రీ పసుమర్తి కేశవ ప్రసాద్ తమ స్పందన తెలియ జేస్తూ తమ తలిదండ్రులు చేసిన సత్కారం లాగా ఉందని తాను ఇటువంటి వాటికి సాధారణం గా రానని కాని దుర్గాప్రసాద్ గారి పిలుపు లో ఆత్మీయత ఉండటం వల్ల వచ్చానని ఇది మరపు రాని సంఘటన అని అన్నారు .ప్రముఖ కవయిత్రి ,కదా రచయిత్రి శ్రీమతి జి.మేరి కృపా బాయి ప్రసంగిస్తూ తనను గుర్తించి సన్మానం చేసి నందుకు క్రుతజ్ఞాతలని ఉయ్యూరు లో జరిగిన కదా సదస్సుకు కవి సమ్మేళనాలకులకు హాజరయ్యానని  ఇక్కడి వారి ఆదరణ మరువలేమని చెప్పారు బందరు చరిత్ర పరిశోధకులు శ్రీ మహమ్మద్ సిలార్ గారు తమ స్పందన లో తనను బందరు వారే గుర్తించలేదని దుర్గా ప్రసాద్ గారే మొదట ఆహ్వానించి సమ్మానిన్చారని  ఇది తెలిసి రేపు ఉగాదికి బందరు వారు న్మానింప బోతున్నారని తన సన్మానాలకు ఇక్కడే నాంది జరిగిందని సంతోషం వెలి బుచ్చారు కధకుడు విమర్శకుడు .శ్రీ వేలూరి కౌండిన్య సరసభారతి తో తన బాంధవ్యాన్ని నేమరేసుకొన్నారు .నెల్లూరు రు లో శ్రీ తిక్కన మహా కవి లలిత కళా పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఆలూరు  శిరోమణి శర్మ గారు బ్రాహ్మీ మూర్తిగా అపర తిక్కనావతరం గా అందరికి కనీ పించారు చక్కని పద్యాలతో శుభాశంసనంచేశారు ఇక్కడికి రావటం మరపు రానిసంఘటన గా పేర్కొన్నారు .ప్రముఖ వక్త ,తెలుగు పండితురాలు శ్రీమతి కే.కనక దుర్గా మహాలక్ష్మి ఇదంతా సరస్వతీ దేవి  కటాక్షం అని తనను ఆహ్వానించి సత్కరించటం మరచి పోలేనని చిన్న వారిలో కూడా ప్రతిభను గుర్తించి ఇలా సన్మానం చేయటం సరసభారతి అధ్యక్షులకే చెల్లిందని చెప్పారు .ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విజయ వాడ తెలుగు పండితులు ,రచయిత శ్రీ దిట్టకవి శేషాచార్యులు తమ పద్యాలతో కృతజ్ఞతలను ఉగాది శుభా కాంక్షలను తెలియ జేశారు .ఘంటసాల గారి మేనల్లుడు సుమధుర గాయకులూ ,పెద కల్లేపల్లి ఒరి-ఎంటల్ హైస్కూల్ ఉపాధ్యాయులు శ్రీ ఆమంచి చంద్ర శేఖర్ తమ స్పందన లో దుర్గా ప్రసాద్ గారితో చాలా కాలం గా పరిచయం ఉన్నా ఉయ్యురుకు రావటం ఇదే ప్రధమం అని అన్నారు మహా కవి కాళిదాసు సినిమా లోని ‘’మాతంగ కన్యాం మనసా స్మరామి ‘’అనే కాళిదాసు రచనను ఉచ్చైస్వరం గా పాడి సభ్యలను మరో లోకం లోకి తీసుకొని వెళ్ళారు ఏ స్తాయిలో పడినా ఎక్కడా గాత్రానికి తేడా రాలేదు అందరి హర్షధ్వానాలు అందుకొన్నారు .హైదరాబాద్ స్టేట్ బాంక్ లో ఉద్యోగిస్తూ చిత్రకళా లో అనితర సాధ్య ప్రతిభ ను కన పరుస్తున్న టి.వి.ఎస్.బి.శాస్త్రి (ఆనంద్ )తనకు ఉయ్యూరు తో ఉన్న పరిచయాన్ని జ్ఞాపకం చేసుకొన్నారు దుర్గాప్రసాద్ గారు తన బావగారని తమ అ క్కయ్యే అయన భార్య ప్రభావతి అని చెప్పారు .గీతా జ్ఞాన యజ్ఞాన్ని చేస్తూ దేశ విదేశాలలు పర్య టించిన భగవద్గీత ‘’ ఫేం‘’చిరంజీవి మాదిరాజు బిందు దత్తశ్రీ తన స్పందనలో ‘’ఒకే ఒక్కడు ‘’అన్న గీతం లో దుర్గా ప్రసాద్ సర్వతో ముఖ ప్రతిభను వర్ణించి చెప్పింది ,ఇలా అందరు తమ అనుభవాలను అందరికి అందజేసి జేజే లందు .కొన్నారు .బందరు కవయిత్రి సాహితీ విదుషీమణి శ్రీమతి ముదిగొండ సీతా రావమ్మ గారు తనకు జరిగిన సన్మానానికి ఆనందం తో పులకించి స్పందన తెలిపారు .

               వివేకానంద స్వామి పై వ్యాస రచన –బహుమతులు

       సరసభారతి ఎప్పుడూ విద్యార్ధులను మహిళలను దృష్టిలో ఉంచుకొనే కార్యక్రమాలను నిర్వహిస్తుంది ఇది స్వామి వివేకానంద 150 వ జయంతి సందర్భం గా సరసభారతి స్కూల్ విద్యార్ధులకు వ్యాస రచన పోటీలను అమరవాణి హైస్కూల్ లో ప్రిన్సిపాల్ పి.వి.నాగరాజు చేత నిర్వహిమ్పజేసి బహుమతులను అందించారు ఈ బహుమతులను ప్రఖ్యాత కదా రచయిత్రి శ్రీమతి కోపూరి పుష్పాదేవి గారు స్వంత ఖర్చులతో అందజేశారు వీరికి సరసభారతి కృతజ్ఞత త్రేలియ జేసింది

                     లత సాహితీ ప్రస్తానం  .

      కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్య దర్శి డాక్టర్ శ్రీ జి.వి.పూర్ణ చంద్ లత తో తనకున్న పరిచయాన్ని గుర్తుకు చేసుకోనిప్రసంగించారు లతా పై ఒక కార్య క్రమం దుర్గా ప్రసా ద్ గారు నిర్వహించటం విశేషం అని అన్నారు .’’లతరాయ లేదు చెప్పింది ఆవిడ చెబితే  సన్నిహితుడు ఆంజనేయులు గారు స్వయం గా రాశారని తెలియ జేశారు .తన నవల ‘’సప్త సింధు ‘’ను చెయ్యి పట్టుకొని రాయించిన అక్క లత అన్నారు .చలం కోరే శ్రీ స్వేచ్చ లత కోరలేదని ఆమె కోరిన స్వేచ్చ విచ్చల విడి తనానికి కాదని ,సంసార సుఖం లో సమాన స్తాయి అని స్త్రేకి ఆత్మ రక్షణ కోరింది మొదట లతా మాత్రమె నని ఇప్పుడు స్త్రీ ఉద్యమాలు నిర్వహించే వారందరి కంటే ముందే లత వారి తరఫున నిల బడిందని పురుషాహంకారాన్ని సాహిన్చాలేదని తెలియ జేశారు .తెలుగు సాహిత్య అకాడెమి కి పోటీ చేసిఅధ్యక్షురాలి గా  గెలిచినా స్త్రీ లతఅన్నారు .అలానే గుత్తికొండ సుబ్బా రావు గారు అకాడెమి సభ్యులవటానికి కారణం లత గారే నని ఆయన్ను ఆమె తన తరఫున పోటీకి నిలబెట్టి గోపాల రెడ్డి గారి అభ్యర్ధిని ఓడించి గెలిపించిన సత్తా ఉన్న స్త్రీ లతఅన్నారు .  ఆమె రామాయణ కల్ప వృక్షానికి రంగనాయకమ్మ రాసిన విష వృక్షానికి దీటుగా విశ్వనాధను సమర్ధిస్తూ’’ సీతాయణం ‘’రాసిన తీరు అద్వితీయం అని వివరించారు ఆమె ‘’ఊహాగానం,’’మోహన వంశీ’’ ఆ రోజుల్లో పాసనగా అందరు  చదివి ఉత్తెజితులయ్యారని చెప్పారు .శ్రీ చలపాక ప్రకష్ చేసిన సూచన  ‘’కృష్ణా జిల్లా పై కవిత’’పై స్పందిస్తూ దీన్ని ప్రకాష్, దుర్గా ప్రసాద్ గార్ల సంపాదకత్వం లో తెద్దామని సమగ్రం  గా ఉండేట్లు చేద్దామని అన్నారు .శ్రీమతి మందరపు హైమవతి ,శ్రీ వసుధ బసవేశ్వర రావు ఆత్మీయ అతిధులు గా తమ ప్రసంగాలలో సరసభారతి  చేస్తున్న సేవలను ప్రస్తుతించారు .పూర్ణ చంద్ తమ ప్రసంగం లో ఎప్పుడు దుర్గా ప్రసాద్ ను ప్రస్తావించినా ‘’నాన్న గారు ‘’అని సంబోధించటం ఆయనకూ అందరికి  ఎంతో ఆప్యాయతను గౌరవాన్ని కల్గించింది ఇది పూర్ణ చంద్ సంస్కారం అది అందరికి అబ్బేది కాదు .

 

              దుర్గా ప్రసాద్ స్పందిస్తూ ఈ వేదిక ను లతా వేదిక భావించి కార్య క్రమం నిర్వహించటం దానిలో శ్రీ పూర్ణ చంద్ ఆమె సాహితీ ప్రస్తానాన్ని ఆవిష్కరించటం ఎంతో విలువ నిచ్చిందని కృతజ్ఞతలను తెలిపి శాలువా హారాలతో సత్కరించారు

                       నెలవారీ సమావేశాలకు స్వస్తి

ఇది తమ వివాహం అయి 49 స్వతరాలు పూర్తీ అయి 50 వ ఏడు లో ప్రవేశించిన సందర్భం గా ఏర్పాటు చేసిన సభ అనిదుర్గా ప్రసాద్ చెప్పారు  అంతేకాక ఇక ముందు సరస భారతి నెల వారీ కార్యక్రమాలకు స్వస్తి పలికి అంతర్జాలం కే పరి మితం అవుతుందని తెలియ జేయటానికి కూడాఈ సమావెశం లో తెలియ జేయటానికే నని  నని అన్నారు . .తాను చదవాల్సింది ఎంతో ఉందని రాయాల్సిందీ చాలా ఉందని ,ప్రముఖ తత్వవేత్త ,జిజ్ఞాసి ఇమ్మాన్యుయల్ కాంట్ పై ప్రారంభించిన రచన పూర్తీ చేయాలనాను కొంటున్నానని దీనికి చాలా సమయం వెచ్చించాల్సి ఉందని తెలియ జేశారు .జూన్ మూడవ తేదీ సోమవారం శ్రీ హనుమజ్జయంతి సందర్భం గా సరసభారతి ప్రచురిస్తున్న పదకొండవ పుస్తకం ,దుర్గా ప్రసాద్ ఆరవ రచన, అయిన శ్రీ ఆంజనేయస్వామి మాహాత్మ్యం ‘’పుస్తకం శ్రీ సువర్చలన్జనేయస్వామి వారల దేవాలయం లో ఆవిష్కరణ జరుగుతుందని దీనినీ ప్రకాష్ గారే ముద్రించి అందిస్తున్నందుకు క్రుతజ్ఞాతలని ఈ పుస్తకం తో సరసభారతి పుస్తక ప్రచురణ ను కూడా ఆపివేస్తోందని తెలిపారు .

                 సాహితీ కదంబం

     ఉగాది సాహితీ కదంబాన్ని తెలుగు లెక్చరర్ డాక్టర్ వై శ్రీలత, ప్రముఖ కవి, విశ్లేషకులు .శ్రీ అరసవిల్లి కృష్ణ,ప్రఖ్యాత హాస్య రచయిత  శ్రీ దండి భొట్ల దత్తాత్రేయ శర్మ గార్లు సమర్ధత తో నిర్వహించారు .సుమారు ముప్పయి  మంది పాల్గొన్న ఈ కార్యక్రమం ఆసాంతం రక్తి కట్టింది .అందరికి స్వామి వివేకా నంద ఫోటో జ్ఞాపికలను అందజేశారు దాదాపు నాలుగు గంటల కాలం సాగిన ఈ కార్యక్రమం మొత్తం ఎంతో అనుభూతి నిచ్చింది అందరు ఎంతో ఆనందించారు .

              సరసభారతి కార్యదర్శి శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి సభా నిర్వహణలో సహకరించి వందన సమర్పణ చేశారు .

సుమారు వంద మంది పాల్గొన్న సభ నిండుగా కను విందుగా కానీ పించింది . సరస్వతీ మూర్తుల మధ్య కొన్ని గంటల పాటు తమ దంపతులు ఆనందం గా గడపటం మహా అను భూతి నిచ్చిందని వీరందరి ప్రేమకు, ఆత్మీయతకు ,సాహిత్యభిలాషకు ఏమిచ్చి కృతజ్ఞతలు చెప్పుకోగలమని సంతోషం నిండిన కన్నులతో దుర్గా ప్రసాద్ దంపతులు తమ మనోభావాన్ని వ్యక్తం చేశారు . 

           సాహితీ కదంబం లో చదివిన వాటిని సరసభారతి బ్లాగ్ లో కొద్ది రోజుల్లో సీరియల్ గా ప్రచురిస్తాము .చదివి స్పందన తెలియ జేస్తే సంతోషిస్తాము

     మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –8-4-13-ఉయ్యూరు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | 2 Comments

ఉయ్యూరు లో జరిగిన సరసభారతి విజయ నామ ఉగాది సాహితీ కదంబం కార్య క్రమం-వార్తాపత్రికల్లో

media coverage - 1-sarasabharathi program on 7-4-13విజయ నామ ఉగాది సాహితీ కదంబం కార్య క్రమం- ఉయ్యూరు లో జరిగిన సరసభారతి ఉగాది విశేషాలు –

media coverage - 2 sarasabharathi program on 7-4-13

Posted in సభలు సమావేశాలు, సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

విజయ నామ ఉగాది సాహితీ కదంబం కార్య క్రమం- ఉయ్యూరు లో జరిగిన సరసభారతి ఉగాది విశేషాలు –

Sarasabharathi 43 130407 32 3

Sarasabharathi 43 130407 32 2 Sarasabharathi 43 130407 32 1Sarasabharathi 43 130407 8 3 Sarasabharathi 43 130407 8 1 Sarasabharathi 43 130407 8 2

This slideshow requires JavaScript.

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ముళ్ళపూడి’ వరం నేను

‘ముళ్ళపూడి’ వరం నేను


సున్నితంగా, నాజూకుగా చురకలేసే హాస్యానికి కేరాఫ్ అడ్రస్ స్వర్గీయ ముళ్ళపూడి వెంకటరమణ. కథా రచయితగా, స్క్రిప్ట్ రైటర్‌గా, సినీ నిర్మాతగా ‘కోతి కొమ్మచ్చి’ ఆడి, ఆడించి… నవ్వించి, ఏడ్పించి.. బోలెడన్ని కళాఖండాలను మనకు అప్పగించి ఈ లోకం నుంచి తప్పుకున్నారాయన. తండ్రి బాటలోనే సినీ ప్రయాణం సాగిస్తూ ‘విశాఖ ఎక్స్‌ప్రెస్’, ‘నా అల్లుడు’ తదితర చిత్రాల దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు ఆయన కుమారుడు వర ముళ్ళపూడి. బాపు-రమణల బంధం, తండ్రితో తన అనుబంధం గురించి వర ముళ్ళపూడి చెబుతున్న విశేషాలే ఈ వారం ‘నాన్న-నేను’.
మా అమ్మానాన్నలకు నేను, చెల్లెలు అనురాధ ఇద్దరమే. తను పెళ్లిచేసుకుని భర్త కార్తీక్, కుమార్తె తేజస్వినితో కాలిఫోర్నియాలో ఉంటోంది. నేను పుట్టింది విజయవాడలో అయినా నాన్న మద్రాసులో స్థిరపడడంతో నా చదువంతా అక్కడే సాగింది. నాన్నకి మామూలుగా కోపం రాదు. వస్తే మాత్రం ఇంటిపైకప్పు దడదడలాడాల్సిందే! గట్టిగా అరిచేసేవారు. ఇంతా చేస్తే ఆ కోపం రెండు నిమిషాలే ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ మామూలే. నా జీవితంలో నాన్న చేత తిట్లు తిన్నది ఒక్కసారే.

అది కూడా ఒక అబద్ధం చెప్పినందుకు. మార్కులు తక్కువ వచ్చాయని నాన్నకు నా ముఖం చూపెట్టలేక స్కూల్లో ప్రోగ్రెస్ కార్డు ఇవ్వలేదని అబద్ధం చెప్పాను. ఆ విషయం నాన్నకు తెలిసింది. చడామడా తిట్టేశారు. ఆ రోజంతా నాతో మాట్లాడలేదు. తెల్లారాక కోపం తగ్గింది కాని ఆ రాత్రంతా ఆయన ఎంత బాధపడి ఉంటారోనని నాకు మాత్రం నిద్రపట్టలేదు. మార్కులు సరిగ్గా రాలేదన్న బాధ కన్నా అబద్ధం చెప్పి నాన్న మనసును నొప్పించానన్న దిగులే ఆ రాత్రంతా నన్ను వేధించింది.

ఆ తర్వాత ఎప్పుడూ నాన్నకు అబద్ధం చెప్పలేదు. నాన్న మనసును కష్టపెట్టలేదు. నాన్న తిట్టినందుకు ఏడుపు రాలేదు కాని ఆ తర్వాత పొగిడినపుడు మాత్రం ఏడుపు తన్నుకుంటూ వచ్చేసింది. అవి నేను కాలిఫోర్నియాలో కమర్షియల్ పైలట్‌గా ట్రెయినింగ్ తీసుకుంటున్న రోజులు. ట్రెయినింగ్‌లో నాకు అందరికన్నా ఎక్కువ గ్రేడ్లు వచ్చాయి. నన్ను మెచ్చుకుంటూ ఉత్తరం రాశారు నాన్న.

ఆ ఉత్తరం చదువుకుని చాలా రోజులు సంతోషం పట్టలేక ఏడ్చాను. అదే నాన్న నాకు రాసిన మొదటి ఉత్తరం…చివరి ఉత్తరం కూడా. ఎప్పుడూ సరదాగా నవ్వుతూ నవ్విస్తూ ఉండే నాన్న కన్నీళ్లు పెట్టుకోవడం రెండు సార్లు చూశాను. నాన్నకు ఎంతో ఇష్టమైన సంగీత దర్శకులు కె.వి. మహదేవన్‌గారికి కుడిభుజంగా ఉండే పుహలేందిగారు పోయినప్పుడు నాన్నను నేనే అక్కడకు తీసుకెళ్లాను.

నాన్న ఏడవడం చూసి ఏమైపోతారోనని నాకే భయం వేసింది. రెండోది నాన్న కళ్లలో ఆనందబాష్పాలు. ‘కోతి కొమ్మచ్చి’ పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగింది. బాపు-రమణలకి సన్మానం జరిగినప్పుడు ఆడిటోరియం మొత్తం లేచి నిలుచుని చప్పట్లు కొట్టినప్పుడు నాన్న కళ్లలో నీళ్లు కనిపించాయి.


భోజనాల సందడి
నాన్నకు, బాపుగారికి మధ్య ఉన్న స్నేహబంధం గురించి కొత్తగా చెప్పడానికి ఏముంటుంది? అయినా అది చెప్పకపోతే నాన్న గురించి సమగ్రంగా చెప్పనట్లే అవుతుంది. బాపుగారిని నేను ‘మామ’ అని పిలుస్తాను. నాన్నకీ, మామకీ సినిమా ఇండస్ట్రీలో గాడ్‌ఫాదర్‌లు ఎవరూ లేరు. ఇద్దరికీ ఏ బ్యాక్‌గ్రౌండ్ లేదు. ఒకళ్లకి ఒకళ్లు బ్యాక్‌గ్రౌండ్ అయ్యారు. మా ఇంట్లో పదిమంది ఉండేవాళ్లం. పైన మామ ఇంట్లో ఐదుగురు. మొత్తం 15 మంది. ఇల్లంతా గోలగోలగా ఉండేది. నాన్న భోజనప్రియులు.

తినటమే కాదు…తినిపించడంలో కూడా బోలెడంత ఆనందం పొందేవారు. చిన్న వంక దొరికితే చాలు మా ఆస్థాన వంటవాళ్లని పిలిపించి భోజనాలు పెట్టించేసేవారు. పక్కనే నిలుచుని అన్నీ చూసుకునేవారు. షూటింగుల్లో కూడా అంతే. ఒకసారి ఒక తమాషా సంఘటన జరిగింది.

1986-89 మధ్య రాష్ట్రప్రభుత్వం కోసం స్కూలు పాఠాలు ఆడియో-విజువల్ చేస్తున్నప్పుడు రాజమండ్రిలో షూటింగ్ పెట్టారు. యూనిట్ అందరినీ రైల్లో ఫస్ట్ క్లాస్‌లో రాజమండ్రి తీసుకెళ్లారు. భోజనాల వేళ వడ్డనలు జరుగుతున్నాయి.

ఒక లైట్‌మ్యాన్ కడుపు నిండా భోంచేసి చేతులు కడుక్కుంటూ అక్కడే ఉన్న శ్రీరమణగారితో, “సార్ వడ్డించడానికి కొంచెం కుర్రాళ్లని పెట్టుకోవచ్చుగా… ఆ పెద్దాయనను చూడండి. ఎలా అవస్థపడుతున్నారో” అన్నాడు. శ్రీరమణగారు అశ్చర్యంగా వెనక్కు తిరిగి చూసి ఉలిక్కిపడ్డారు. ఎవరా ఆ పెద్దాయన అని చూస్తే తలకు తువ్వాలు చుట్టుకుని లుంగీ పైకి ఎగ్గట్టుకుని అన్నం వడ్డిస్తున్న నాన్న కనిపించారు. “భలేవాడివయ్యా బాబు! ఆయన ఎవరనుకున్నావు?ఆయనే నిర్మాత” అనేసరికి ఆ లైట్‌మ్యాన్ వెయ్యివోల్టుల కరెంట్ షాక్ కొట్టినట్లు కొయ్యబారిపోయాడు!

ఎవరా నాలుగో మనిషి?
నాన్నకు గోదావరి అంటే ప్రాణం. ఆ పేరు చెప్తే పూనకం వచ్చేసేది. నాన్న-మామ తీసిన సినిమాల్లో ఎక్కువ అక్కడే షూటింగ్ జరుపుకున్నాయి. షూటింగ్ లొకేషన్లు చూడడానికి తరచు నాన్న, శ్రీరమణగారు, చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ కెవి రావుగారు రైల్లో రాజమండ్రికి వెళ్లేవారు. మామ అప్పుడప్పుడు వీళ్లతో వెళ్లేవారు. వీళ్ల ప్రయాణమంటే మాకే హడావుడి ఎక్కువ. భోజనాలను కేరేజ్‌లో సర్దడానికి నానాహైరానా పడేవాళ్లం. ఇంట్లో ఒక పెద్ద రేకు డబ్బా ఉండేది. రైల్లో తీసికెళ్లడం కోసమే దీన్ని ప్రత్యేకంగా చేయించారనుకుంటా.

దాంట్లో నాలుగు భోజనం ప్లేట్లు, నాలుగు టిఫిన్ ప్లేట్లు, గరిటెలు, చెంచాలు, నాలుగు గిన్నెల క్యారేజ్…వీటితో పాటు కాయితాలలో చుట్టిన నాలుగు గాజు గ్లాసులు వగైరాలు ఉండేవి. నాన్న మాటల్లో అది ‘మందోబస్తు’! ఆ రోజుల్లో ఎసి కంపార్ట్‌మెంట్లు లేవు. ఫస్ట్ క్లాస్ క్యాబిన్ మాత్రమే ఉండేది. ఒక్కో క్యాబిన్‌లో నాలుగు బెర్త్‌లు. ముగ్గురే వెళ్లవలసి వచ్చినా నాలుగు టికెట్లు బుక్ చేసేవారు. ఒకసారి వీళ్లు ముగ్గురే ప్రయాణం చేస్తున్నారు.

రేకు డబ్బాలో నలుగురికి సరిపడా భోజనం ఉంది. “ముగ్గురికి అంత భోజనం ఎందుకు?” అని మేమడిగితే, “క్యాబిన్‌లో నాలుగో మనిషి ఉన్నాడనుకో…ఆయన తిండి తెచ్చుకోలేదనుకో… రాత్రి వేళ ఇబ్బంది పడతాడు కదా పాపం” అన్నారు నాన్న. చాలా రోజుల తర్వాత నేను ఒక్కడినే రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవరో తెలియని ఒకాయన వచ్చి తనను తాను పరిచయం చేసుకుని ఓ తిండి లేని రాత్రి నాన్నతో భోజనం చేసిన అనుభవాన్ని గురించి చాలా గొప్పగా చెప్పాడు. అప్పుడు అర్థమైంది నాకు..నాలుగో మనిషికి నిర్వచనం.

ప్రేమ’యుద్ధాలు’!
నాన్న, మామకి ఒకళ్లంటే ఒకళ్లకు పిచ్చిప్రేమ. అలాగని వాళ్లిద్దరూ ఎప్పుడూ కలహించుకోరని కాదు. వాళ్లిద్దరూ వాదించుకోవడం, కాస్సేపు మాట్లాడుకోకపోవడం…ఆ తర్వాత మామూలైపోవడం మాకు చిన్నప్పటి నుంచి అలవాటే. అయితే ఒకసారి మాత్రం వీళ్లిద్దరూ జీవితంలో మళ్లీ కలుసుకుంటారా అన్న భయం వేసింది. హైదరాబాద్‌లో ఒక సినిమా షూటింగ్ కోసం మద్రాసు నుంచి మేమంతా వచ్చాము. స్టూడియోలో షూటింగ్. మామ డైరెక్టర్. నేను ఆయన అసిస్టెంట్. ఇంకో అసిస్టెంట్‌గా ఇప్పుడు దర్శకుడైన గాంధీ ఉన్నారు. మేమిద్దరం స్టూడియో నుంచి ఆలస్యంగా రాత్రి పదింటికి గెస్ట్ హౌస్ చేరుకున్నాము.

దూరం నుంచే పెద్దగా అరుపులు వినిపిస్తున్నాయి. గేటులో నుంచి తొంగి చూస్తే వసారాలో కుర్చీలో కూర్చుని నాన్న, మామ గట్టిగా అరుచుకుంటున్నారు. మేమిద్దరం హడలిపోయాము. ఎప్పట్లా లేవా అరుపులు. “ఇక అంతా అయిపోయింది. వీళ్లిద్దరూ విడిపోవడం ఖాయం’ అనుకుని లోపలకు వెళ్లడానికి కూడా భయమేసి అట్నుంచి అటే రోడ్డు మీదకు వెళ్లిపోయాము. అలా రాత్రి 11.30 దాకా బయటే తచ్చాడాము. ఇక ఆకలికి తట్టుకోలేక, ఏం చూడాల్సి వస్తుందో అనుకుని బిక్కుబిక్కుమంటూ గెస్ట్‌హౌస్ లోపలకు వెళ్లాము.

అక్కడంతా నిశ్శబ్దం. ఎక్కడా చడీచప్పుడూ లేదు. ఇద్దరూ నిద్రపోతున్నారు. మేమూ పడుకున్నాము. మర్నాడు పొద్దునే ఏం చూడాలో, ఏం వినాలో అని భయపడుతూ బయటకు వచ్చాము. అక్కడ కనిపించిన దృశ్యం చూసి మా ఇద్దరికీ నోట మాట రాలేదు. వాళ్లిద్దరూ కూర్చుని కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ చేస్తున్నారు. మామ నాన్నకి వడ్డిస్తుంటే..’ఈ చట్నీ తిను.. బావుంది” అంటూ మామకి నాన్న తిరిగి వడ్డిస్తున్నారు. వాళ్లిద్దరూ తామిద్దరం వేర్వేరని ఎన్నడూ అనుకోలేదు. మేము కూడా నాన్న, మామని వేర్వేరుగా చూడము.

నాన్న ఎక్కడకు వెళ్లారని?
కష్టాలను చూసి బెంబేలెత్తకూడదని, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని నాన్న చిన్నప్పటి నుంచి నాకు చెప్పేవారు. నేను కాలిఫోర్నియాలో గొప్ప గ్రేడ్లతో కమర్షియల్ పైలట్ లైసెన్సు తెచ్చుకుని కూడా కొన్ని కారణాల వల్ల పైలట్ కాలేని పరిస్థితి ఎదురైనప్పుడు ధైర్యం చెప్పింది నాన్నే. “ఏం పర్వాలేదు వచ్చెయ్! నీకో కొత్త జీవితం వెతుకుదాము” అంటూ ఓడిపోతున్న నన్ను మళ్లీ సరైన దారిలో పెట్టారు నాన్న. షూటింగ్‌లో ఒకసారి మామ నన్ను తిట్టినందుకు ఎవరితో మాట్లాడకుండా బాధపడుతూ కాస్సేపు దూరంగా వెళ్లి నిలబడ్డా. నాన్నే పిలిచి “నువ్వు తప్పు చేశావు. పర్యవసానాలను నువ్వు ఎదుర్కోవలసిందే..మళ్లీ ఆ తప్పు చేయకుండా చూసుకో…అంతేగాని పారిపోకు” అన్నారు.

నాన్న నూరిపోసిన ఆ ధైర్యమే అపజయాలను కూడా తట్టుకుని ముందుకు నడిపిస్తోంది. నాన్న లేరు అంటే నేను నమ్మను. ఆయన ఎప్పుడూ ఇక్కడే…మాతోనే ఉంటారని నేను భావిస్తున్నాను. అందుకే ఇంట్లో ఏదీ మార్చనివ్వలేదు. నాన్న కూర్చునే కుర్చీలు, ఆయన వాడే టేబుల్, ఆయన పూజ చేసుకునే చోటు, ఏవి ఎక్కడ ఉండేవో అవన్నీ అలాగే ఉన్నాయి..ఉంటాయి. నాన్న ఇంకా రైలు ప్రయాణంలోనే ఉన్నారనీ, ఆయనకు ఇష్టమైన గోదావరి దగ్గరకు వెళ్లారనే భావనతోనే ఉన్నాను..అలాగే ఉంటాను..నా జీవితాంతం.

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | 2 Comments

కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -8’

  కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -8’

                        మహా వాగ్మి –మరుపూరి కోదండ రామి రెడ్డి

     మరుపూరి కోదండ రామి రెడ్డిగారు నెల్లూరు జిల్లా పొట్ల పూడి గ్రామం లో 3-10-1902 లో జన్మించారు .వీధి బడిలోనే విద్యాభ్యాసం .మచిలీ పట్నం జాతీయ కళా శాల లో తెలుగు ఆంగ్లాలతో నిష్ణాతులయ్యారు .జాతీయోద్యమం లో పాల్గొన్నారు .అనువాద సాహిత్యం లో ప్రఖ్యాతి చెందారు .ఆశువుగా ,మనోహరం గా ఉపన్య  శించె మహా నేర్పున్న వక్త .ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ సభ్యులు గా పని చేశారు .

              రెడ్డి గారి తల్లి గొప్ప సంస్కార వతి .అతిధి సత్కారాలకు పేరు పొందింది .భగవాన్ రమణ మహర్షి శిష్యురాలు .కోదండ రామి రెడ్డి గారు పదవ తరగతి చదువుతూనే గాంధీ గారి బోధనలకు ప్రభావితులై జాతీయోద్యమం లో చేరారు చదువుకు గంట కొట్టేశారు .బందరులో చదువుతుండగానే విశ్వనాధ, బెజవాడ గోపాల రెడ్డి గార్ల తో గాఢ పరిచయమేర్పడింది .ప్రఖ్యాత నటుడు దొరస్వామయ్య గారిపై కాలేజి విద్యార్ధిగా ఉన్నప్పుడే గొప్ప వ్యాసాన్ని ‘’శారద ‘’పత్రికకు రాశాడు .ఫ్రెంచ్ కదా రచయిత బాల్జక్  కధలను అనువాదం చేసి ప్రచురించాడు .మద్రాస్ లో ‘’సమదర్శి ‘’పత్రికా సంపాదకుని గా పని చేశారు తర్వాత ‘’ప్రభాత ముద్రాలయం ‘’స్తాపించి ‘’రంద్రాన్వేషి ‘’అనే పత్రికను నిర్వహించారు తర్వాతా ‘’మందాకినీ ‘’పత్రికను నడిపి ఆంద్ర దేశం లోనే పేరెన్నిక గన్న సంపాదకులని  పించుకోన్నారు.

           రెడ్డి గారు భారత జాతీయ నాయకుల ఆంగ్ల ప్రసంగాలను అవలీలగా ,ఆశువుగా ధారా శుద్ధితో అనువదించే వారు .ఈ వ్యాసంగం నలభై ఏళ్ళు అవిచ్చిన్నం గా కోన సాగింది .రెడ్డి గారి రచనలలో భావ గాంభీర్యం ,చమత్కారం ,హాస్యం తోణికిస లాడేవి .ప్రపంచ రాజ్యాల పుట్టుపూర్వోత్తరాలు ,బీదల పాట్లు ,హిందూ పర పదశాహి ,షిర్డీ సాయి భగవాన్ ,ఈసప్ నీతి కధలు ,మంజీర గాధ ,వేమన –పాశ్చాత్యులు ,అస్సామీ సాహిత్య చరిత్ర అనేవి రెడ్డి గారి అనువాదిత గ్రంధాలు .కర్ణుడు అనే పేరిట రాసిన విమర్శన గ్రంధం విశ్వ విద్యాలయాలలో పాఠ్య గ్రంధ మైంది .తెలుగు అకాడెమి వారి ‘’మాండలిక పద కోశం ‘’,రెడ్డి గారి ఆధ్వర్యం లోనే వెలువడింది మహా భారతం లో కర్ణ పర్నానికి ,కళా పూర్ణోదయ ప్రబంధానికి విస్తృత పీఠికలు రచించారు .’’క్రియా స్వరూపం ‘’,’’మని మాయ భూషణం ‘’,’’తెలుగు సామెతలు ‘’,గ్రందాల ప్రచురణ కమిటీ సభ్యులుగా రెడ్డి గారు పని చేశారు .రెడ్డి గారి మహా భారత విమర్శ నిసర్గ రమణీయం గా ఉంటుంది ఎన్నో విషయాలు తవ్వి తీశారు .త్యాగయ్య గారి పై అద్భుత విశ్లేషణాత్మక గ్రంధాన్ని రాసి అన్నికోణాల్లోను త్యాగరాజ స్వామి బహుముఖీన ప్రతిభను ఆవిష్కరించి కర్నాటక సంగీతానికి యెనలేని కీర్తి తెచ్చారు .

 కోదండ రామి రెడ్డి గారు మంచి బోధనా పరులు .గొప్ప నటులు కూడా .వేదం వారి ప్రతాప రుద్రీయ నాటకం లోని తురక తెలుగు ను అద్భుతం గా పలికి ,నాటకీయం గా బోధించే వారని చెప్పుకొంటారు వారి శిష్యులు .అందరిని సమానం గా ఆదరించేవారు అనేక సార్లు భారత దేశమంతా తిరిగి విషయ సంగ్రహణ చేసిన మహోత్తమ పరిశోధకులు .మరుపుకు రాని వారు మరుపూరి కోదండ రామి రెడ్డి గారు

                సశేషం—మీ—గబ్బిటదుర్గా ప్రసాద్ 7-3-13-ఉయ్యూరు 

Posted in రచనలు | Tagged | Leave a comment

తమిళ నాడు లో తెలుగు పో

telugu kavitha1thamila nadulo telugu poru

Posted in కవితలు | Tagged | Leave a comment

కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -7

                      కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -7

                                     సాంప్రదాయ సాహిత్య విమర్శకు రాలు ,అందరికి అక్క గారు శ్రీమతి పి.యశో (ధరా )దా రెడ్డి

   ఆంద్ర ప్రదేశ్ అధికార భాషా సంఘానికి మొదటి మహిళా అధ్యక్షురాలు గా తన దక్షతను చాటిన మేటి విద్యా వేత్త ఆచార్య పాకాల యశోదా రెడ్డి .ఆమె పి.యశోదా రెడ్డి గానే అందరికి సుపరిచితురాలు .గొప్పసాహిత్య   విమర్శకురాలుగా పేరొందారు . 78 సంవత్సరాలు నిండు జీవితం గడిపి సార్ధక జీవి గా గుర్తిమ్పబడి కీర్తి శేషులయ్యారు .

          సుప్రసిద్ధ చిత్రకారులు పి.టి.రెడ్డి గారిని పరిణయమాడి యశోదా రెడ్డి అయారు .ఆయన అంతర్జాతీయ చిత్రకారుని గా గుర్తింపు పొందారు .యశోదా రెడ్డి ఉస్మానియా విశ్వ విద్యాలయం లో 33 ఏళ్ళు అధ్యాపకులు గా పని చేసి ,ఆచార్యులు గా పదవీ విరమణ చేశారు .ఆమె సాంప్రదాయ సాహిత్య విమర్శకురాలిగా ప్రఖ్యాతి పొందారు .తెలంగాణా మాండలికానికి తన రచనలలో గొప్ప పీట వేసిన విదుషీ మణి. 1929 లో మహబూబ్ నగర్ జిల్లా బిజినె పల్లి లో జన్మించారు .నిజాం ప్రభుత్వం లో నగర కమీషనర్ అయిన రాజబహదూర్ బిరుదాంకితులు వెంకట రామా రెడ్డి హైదరాబాద్ కు ఆమెను తీసుకొని వచ్చి రెడ్డి హాస్టల్ లో చేర్పించారు .1969 లో పి.హెచ్.డి. చేశారు . .1955 లో కొంతకాలం ఉపాధ్యాయిని గా పని చేశారు .  . హైదరాబాద్ ఆకాశ వాణి లో కొంతకాలం ఉద్గించారు .1976 లో లో ఆగ్రా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ నిచ్చి సత్కరించారు .1990-93-కాలం లో ఆంద్ర ప్రదేశ్ అధికార భాషా సంగాధ్య్క్షులు గా బాధ్యతలు నిర్వహించారు .

                      సాహితీ సేవ

       తెలుగుదేశం లో తెలుగుదనం వెల్లివిరియాలని యశోదా రెడ్డి సంకల్పం తో అధికార భాష సంఘాధ్యక్షురాలిగా గొప్ప కృషే చేశారు .తెలుగును అధికార భాష  చేయాలన్న ఆమె సంకల్పం మాత్రం కార్య రూపం దాల్చలేదు అది ఆమెకే కాదు అందరికి బాధగానే ఉంది .ఆమెను సంగీత నాటక అకాడెమి జనరల్ కౌన్సిల్ సభ్యత్వం ,ప్రపంచ సంస్కృత అధ్యయన కేంద్ర సభ్యత్వం వరించాయి .అనేక భాషా సాహిత్య సంఘాలలో సభ్యురాలుగా పని చేశారు .1991 లో కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు అందుకొన్నారు .డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు తమ భార్య పేర నెలకొల్పిన అవార్డును స్వీకరించారు .తెలుగులో సుమారు 30 అమూల్య గ్రంధాలను రచించారు .అందులో పారిజాతాపహరణం ,హరివంశం ,ఆంద్ర సాహిత్య చరిత్ర వికాసం ,అమరజీవులు ,తెలుగు సామెతలు పుస్తకాలు ఆమెకు యెనలేని కీర్తి ని తెచ్చి పెట్టాయి .తెలంగాణా మాండలికం లో రాసిన కధలు ,మా ఊరి ముచ్చట్లు ,ఎచ్చమ్మ కధలు ,ప్రజల్లో బాగా చొచ్చుకు పోయాయి .మంచి ప్రభావమూచూపాయి .ఆమె లో తెలంగాణా భాషాభిమానం నిండుగా ఉండేది .ఎంతో గొప్ప పండితురాలైనా సంప్రదాయ సాహిత్యాన్ని కాచి వడబోసినా  వాడుక మాటలతో అందరికి అర్ధమయ్యే పదాలతో ,జాతీయాలతో ,నానుడులతో ఆకర్షణీయం గా ప్రసంగించే నేర్పు యశోదా రెడ్డిది .అందరు ఆమెను ఆప్యాయం గా ‘’అక్క ‘’అని ఆత్మీయం గా పిలిచే వారు .కీ.శే.సురవరం ప్రతాప రెడ్డి గారి సంపాదకత్వం లో వెలువడిన గ్రంధానికి ముందు మాట రాసిన యోగ్యురాలు .ఎన్నో సాహిత్య సాంస్కృతిక సభలలో ప్రసంగించి ప్రేరణ కల్గించిన విజ్నురాలు యశోద .నిజం గా ఆమె యశో’’ధరా ‘’రెడ్దియే .

 

 

 

 

 

    చిన్నతనం లోనే యశోదా రెడ్డి తల్లిని కోల్పోయింది తండ్రికి విరోధిగా మారింది .అందువల్ల అనాధ గానే బతికింది .భర్త పి.టి.రెడ్డి తో అనేక దేశాలు సందర్శించింది .జీవితం ఆమెకు ఎన్నో పాఠాలు నేర్పింది .భర్త ఆంద్ర ప్రదేశ్ ఆస్థాన చిత్రకారునిగా ,లలిత కళా అకాడెమి అధ్యక్షులుగా పని చేసిన యోగ్యులు .కళ ఏ పరమావధిగా భర్త తో సహజీవనం సాగించిన అర్దాంగియశోద .1966 భర్త మరణించారు .’’సుధర్మ ఆర్ట్ గేలరి ‘’అనే సంస్థను యశోదా రెడ్డి ప్రారంభించి భర్తను చిరస్మరణీయుని చేసిన భార్య యశోదా రెడ్డి .

         100 కు పైగా కధలు నాటికలు ,ప్రసంగాలు కవితలు రాసి న రచయిత్రి యశోద .ధర్మ శాల అనే కదా సంకలనం వెలువరించింది .ఉగాదికి ఊయల ,భావిక అనే కవితా సంకలనాలు తెచ్చింది .బడి పెద్ద ,నక్క బావ ,బుచ్చి గాడు అనే పిల్లల కధలు రాసి పేరు తెచ్చుకోంది .కదా స్రవంతి ,పోతన భాగవత సుధ ,భారతం లో స్త్రీ ,ఎర్రాప్రగడ వంటి పరిశోధనా గ్రంధాలు ఆమె కీర్తి కిరీటం లో కలికితురాళ్ళు .విశ్వనాధసత్యనారాయణ గారితో కలిసి రెండు భాగాలుగా‘’తెలుగు సామెతలు ‘’అనే గ్రంధాన్ని వెలువరించింది .రచ్చబండ , ,నందిని , పరివ్రాజక దీక్ష నాటకాలను రాసి ప్రదర్శించింది .కంచి కామకోటి పీఠం లో ధార్మిక ఉపన్యాసాల నిచ్చి స్వామి వారల మన్ననలు పొందిన ఆస్తిక విద్వద్ వరేన్యురాలు  .యశోదా రెడ్డి మరణం తెలంగాణా కే కాదు యావదాంధ్ర దేశానికి తీరని లోటే

        మరో రెడ్డి కవిని రేపు తెలుసుకొందాం ..

         సశేషం

మీ—గబ్బిటదుర్గా ప్రసాద్ -6-4-13- ఉయ్యూరు

 

 


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Tagged | Leave a comment

సరస భారతి -43వ సమావేశం -శ్రీ విజయ నామ సంవత్సర ఉగాది సాహితీ కదంబం

43 va sarasa bharati samavesham -paper coverageసరస భారతి -43వ సమావేశం -శ్రీ విజయ నామ సంవత్సర ఉగాది సాహితీ కదంబం

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

సినిమా కష్టాలు దాటాల్సిందే…

సినిమా కష్టాలు దాటాల్సిందే…


విలన్ పాత్రల్ని కూడా హీరోపాత్రలంత రసాత్మకంగా పోషించిన వారు కైకాల సత్యనారాయణ. ‘నవరస నటసార్వభౌముడు’గా కీర్తించబడే ఆయన ఇప్పటికి 780 సినిమాలకు పైగా నటించారు. గతంలో అనేకానేక అవార్డులూ, రివార్డులూ అందుకున్న ఆయనను ఇటీవల అత్యంత ప్రతిష్ఠాత్మకమైన రఘుపతి వెంకయ్యనాయడు అవార్డు కూడా వరించింది. ఐదు దశాబ్దాల ఆయన సినీ జీవిత ప్రస్థానంలోని కొన్ని అరుదైన సంఘటనలే ఈ వారం ‘అనుభవం’
ఎంచుకున్న రంగం మీద ఎంత ప్రేమైనా ఉండవచ్చు. ఆ రంగంలో ఎంత ప్రావీణ్యమైనా ఉండవచ్చు. అంతమాత్రాన వెళ్లీ వెళ్లగానే ఏ రంగమూ అక్కున చేర్చుకోదు. సినిమా అవకాశాల కోసం నేను 1957లో మద్రాసు వెళ్లాను. ఎప్పుడూ ఏవో ఆఫర్స్ వచ్చినట్లే వచ్చి మళ్లీ వెనక్కి వెళ్లేవి. నెలలు, ఏళ్లు గడిచినా ఏ ఒక్క అవకాశమూ లేదు. ఏరోజుకారోజు డబ్బులకు కటకటగా ఉండేది. అప్పుడప్పుడు పస్తులు పడుకోవాల్సి వచ్చేది కూడా. ఒక ప్రతికూల వాతావరణంలో ఉన్నప్పుడు దాదాపు ప్రతిదీ మనల్ని పరీక్షిస్తుంది. ఆ అగ్ని పరీక్షకు జడిసి ఏ కాస్త వెనుకడుగు వేసినా ఇంక ఎప్పటికీ ఆ పొలిమేరల్లోకి వెళ్లలేకపోవచ్చు. ఎదురీదే తత్వమే లేకపోతే, కాళ్లకు అడుగడుగునా సంకెళ్లే పడతాయన్న పాఠాన్ని ఆ పరిణామాలు నాకు నేర్పాయి.

వైఫల్యాలు వెంటాడి తే…..
మద్రాసులో నానా అవస్థలూ పడుతున్న సమయంలో డి ఎల్ రావుగారు తాను తీయబోయే ‘సిపాయి కూతురు’ అనే సినిమాకోసం నన్ను హీరోగా ఎంపిక చేశారు. సినిమా షూటింగ్ పూర్తయి విడుదల కూడా అయ్యింది కానీ, ఆ సినిమా ఫెయిల్ అయింది. ఆ తర్వాత ఒక్క సినిమా అవకాశం కూడా రాలేదు. మనసులో తీవ్రమైన అలజడి మొదలయ్యింది. జీవితాన్ని ఒక అయోమయం కమ్మేసింది. తాత్కాలికంగానా, శాశ్వతంగానా అలా ఏమీ అనుకోలేదు కానీ, ఊరికి వెళ్లిపోదాం అనిపించింది. సరిగ్గా అదే సమయంలో విఠలాచార్య గారు నాకోసం కబురు పెట్టారు. తనకు తెలిసిన ఒకరు తాము నిర్మిస్తున్న ‘సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి’ సినిమాలోని ముగ్గురు కథానాయకుల్లో ఒకరికోసం గాలిస్తున్నారు.

‘సిపాయి కూతురు’ సినిమాలోని నా నటన చూసి విఠలాచార్య గారికి నా పేరు సిఫార్సు చేశారు. ఆ సినిమా దర్శకుడు వేరే అయినా ఆ సంస్థ తీయబోయే రెండవ సినిమాకు తానే దర్శకత్వం వహించబోతున్న చనువుతో విఠలాచార్య గారే ఆ పాత్రకు నన్ను ఎంపిక చేశారు. చిక్కేమిటంటే, ఆ సినిమా డి స్ట్రిబ్యూషన్ హక్కుల్ని అంతకు ముందు ‘సిపాయి కూతురు’ సినిమా డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేసిన వ్యక్తే తీసుకున్నారు. ఆయన ‘సిపాయి కూతురు’ సినిమా ఫెయిల్ అయిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాలో నన్ను తీసుకోవడానికి వీల్లేదన్నారు. నా గుండె బరువెక్కిపోయింది.

విజయాలు కొన్నాళ్లుపోతే కనుమరుగైపోవచ్చు కానీ, కొన్ని వైఫల్యాలు జీవితాంతం వెంటాడతాయేమో అనిపించింది. ఆ విషయం తెలిసిన విఠలాచార్యగారు ఆ డిస్ట్రిబ్యూటర్‌ను ఉద్దేశించి “చూడండి మంచికో చెడుకో నేను అతడ్ని ఎంపిక చేశాను. రేపు అతని భవిష్యత్తు ఎలా ఉండబోతోందో ఎవరికి తెలుసు? అలా అని మిమ్మల్ని నే ను బలవంతపెట్టను. తొలి రెండు రోజుల షూటింగ్‌కు నేనే దర్శకత్వం వహిస్తాను. ఆ రషెస్ చూడండి. అవి మీకు నచ్చితే అతన్ని కొనసాగించండి. నచ్చకపోతే తీసివేద్దురు గానీ.

ఒకవేళ తీసివేస్తే అప్పటిదాకా అయ్యే ఖర్చంతా నే నే భ రిస్తాను” అన్నారట. వాళ్లు సరేనన్నారు. రెండు రోజుల షూటింగ్ తరువాత విఠలాచార్య నన్ను తన వద్దకు పిలిపించుకుని, తె రవెనుక జరిగిన విషయమంతా చెప్పారు. నేను తీవ్రమైన ఉద్వేగానికి లోనయ్యాను. తొలి వైఫల్యాలు మనిషిని ఒక్కోసారి ఎంత దారుణంగా వెంటాడ తాయో అప్పుడు నేను ప్రత్యక్షంగా చూశాను. ఒకవేళ నా పర్‌ఫార్మెన్స్ నచ్చక నిజంగానే నన్ను తొలగించేస్త్తే నేను చేయగలిగింది ఏమీ లేదు. దీనవదనంతో తిరిగి మా ఊరికి ఎలాగూ వెళ్లలేను. అందుకే ఇక బతకడమే దండగ అనిపించింది.


రేపటి మాటేమిటి?
అయితే అందరికీ నా పర్‌ఫార్మెన్స్ బాగా నచ్చింది. నన్ను ఆ పాత్రకు కొనసాగించారు. ఆ సినిమా విడుదలై శతదినోత్సవం కూడా జరుపుకుంది. అయితే, సరిగ్గా అదే సమయంలో విఠలాచార్య మనసులో నా భవిష్యత్తు గురించిన ఒక ఆలోచన మొదలయ్యింది. ఆ విషయం చె ప్పడానికే నన్ను ఆయన తన వద్దకు పిలిపించుకుని “సత్యనారాయణ గారూ! హీరో పాత్రధారులకు ఇక్కడ బాగా పోటీ ఉంది. అయినా ఒకటీ అరా అవకాశాలు రావచ్చు కూడా. కొన్నిసార్లు రాకపోనూ వచ్చు. సమస్య ఏమిటంటే, పరిశ్రమలో మీకు సపోర్టుగా నిలిచే వారు ఎవరూ లే రు. అందుకే పెద్దవాడిగా చెబుతున్నాను.

మీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మీరు విలన్ పాత్రలకు సిద్ధమైపోతే అది మీకు అన్నివిధాలా మంచిది”అన్నారు. నాకు ఆయన చెప్పిన మాటల్లో ఎంతో నిజం ఉందనిపించింది. విలన్ పాత్రలకు నేను సిద్ధమైపోయాను. ఇచ్చిన మాట ప్రకారం విఠలాచార్య గారు తన సొంత దర్శకత్వంలోనే తొలిసారిగా విలన్ పాత్ర వేసే అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఇంక ఒక్కొక్కటిగా విలన్ అవకాశాలు రావడం మొదలయ్యింది. ‘అగ్గిపిడుగు’ సినిమాలోని నా విలన్ పాత్రకు బాగా ప్రశంసలు వచ్చాయి.

ఆ ప్రస్థానంలో విలన్‌గా, క్యారెక్టర్ యాక్టర్‌గా 780 సినిమాలకు పైగానే నటించాను. హీరో పాత్రలే వేస్తానంటూ భీష్మించుకుని కూర్చుంటే నేను ఇక్కడిదాకా వచ్చే వాడ్ని కాదేమో! అంతకు ముందు తీసుకున్న నిర్ణయానికి భిన్నంగా వెళ్లాల్సివస్తే ఎవరికైనా ముండు బాధగానే ఉంటుంది. కాకపోతే ఆ బాధ తాత్కాలికమే.మళ్లీ ఒక నిర్ణయం తీసుకుని, నాలుగు అడుగులు వేశాక ఆ భాధ మటుమాయమవుతుంది. విజయాలకు అన్నివేళలా ఆయావ్యక్తుల శక్తిసామర్థ్యాలే కారణం కాదు, అప్పటి ఆయా పరిస్థితుల్ని ఆకళింపు చేసుకుని తీసుకునే నిర్ణయాల మీద కూడా ఎంతో ఆధారపడి ఉంటుందన్న సత్యాన్ని నాకు ఆ సంఘటన నేర్పింది.

ఏదీ అన్నింటికీ వర్తించ దు
నటుడిగా కొంత నిలదొక్కుకున్న తర్వాత నే నొక సెకండ్‌హ్యాండ్ కారు కొనుక్కున్నాను. సంక్రాంతి పండగ రావడంతో నా భార్య, ముగ్గురు పిల్లలు, డ్రైవర్ అందరమూ కలిసి మద్రాసు నుంచి మా ఊరు గుడివాడకు కార్లోనే బయల్దేరాం. నాయుడుపేటకు వచ్చేసరికి బాగా రాత్రి అయ్యింది. రోడ్డు పక్కన లారీ ఆపి నిలుచున్న కొందరు, మా కారు ఆపి, మీరొచ్చే దారిలో ఎక్కడైనా ఒక కుర్రాడు కనిపించాడా? అన్నారు. లేదన్నాం. “ఇంతకూ విషయం ఏమిటీ?” అంటే, వెళుతున్న తమ లారీని ఆపి, వాళ్ల క్లీనర్‌ను లాక్కుని వెళ్లిపోయారట. “ఫ్యామిలీతో వెళుతున్నారు. ఎవరైనా మిమ్మల్ని కారు ఆపమని సైగ చేస్తే ఎట్టిపరిస్థితిలోనూ ఆపకండి.

ఆపితే ప్రమాదంలో పడతారు” అన్నారు. వాళ్లకు థాంక్స్ చెప్పి మళ్లీ ముందుకు కదిలాం. కొంతదూరం వెళ్లాక వాళ్లు చెప్పినట్లే రోడ్డు మీద బాగా బలంగా ఉన్న ఓ వ్యక్తి కారు ఆపమని సైగ చేశాడు. మాకు వెంటనే లారీ వ్యక్తులు చెప్పిన విషయం గుర్తొచ్చింది. కారు ఆపకుండా ముందుకు పోనీయమన్నాను. ఆ వ్యక్తిని దాటేసి కారు ముందుకు వెళుతోంది. అంతే కొద్ది క్షణాల్లో మా కారు నీళ్లల్లో మునగబోయింది. ఇంతలో ఆ పక్కనే ఉన్న లారీ వాళ్లు మా కారును పట్టుకుని బయటికి లాగేశారు. మేమంతా ప్రాణాలతో బయటపడ్డాం. చాలాసేపటిదాకా అసలేం జరిగిందో కూడా అర్థం కాలేదు. తీరా చూస్తే అక్కడో పెద్ద వాగు ఎంతో ఉధృతంగా పారుతోంది.

ఆ విషయాన్ని చెప్పడానికే అతడు మమ్మల్ని కారు ఆపమన్నాడు. ఆ లారీ వ్యక్తులు కలిగించిన అనుమానంతో అతను దొంగల ముఠాలో భాగం అనుకున్నాం. అది ఎంత పొరపాటో మా కారు వాగులో పడిపోయేదాకా తెలియలేదు. జీవితం అన్నప్పుడు ఎన్నెన్నో సత్యాలు తెలుస్తుంటాయి. తెలిసిన ప్రతిసత్యాన్నీ అన్నింటికీ అన్వయించాలని చూస్తే అది ఎంత ప్రమాదమో ఆ సంఘటన ద్వారా తెలిసొచ్చింది. అందుకే ప్రతి సంఘటననూ ప్రత్యేకంగా అర్థం చేసుకోవాలే గానీ, అన్నిటినీ అప్పటికే ఏర్పరుచుకున్న దృక్పథంతో చూడటం తగదన్న విషయం నాకు ఆ సంఘటన ద్వారా బోధపడింది.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలుగుకు సైన్స్ పార్శ్వం డా. నాగసూరి వేణుగోపాల్

తెలుగుకు సైన్స్ పార్శ్వం
– డా. నాగసూరి వేణుగోపాల్

 

మీకు తెలుసా… కొన్ని దేశాలలో సైన్స్ దినపత్రికలు ఉన్నాయి… అంటూ రవి కళాశాల ప్రకటన మూడు దశాబ్దాల క్రితం నన్నెంతో ఆకర్షించింది. దినపత్రికలే అందరికీ అందని కాలంలో సైన్స్ దినపత్రికల గురించి ఆసక్తి కల్గించటం ఒక్క సి.వి.యన్.ధన్ గారికి చెల్లు! ఈ విషయాలు గమనించే కాలంలో నేను ఇంకా హైస్కూలు, జూనియర్ కళాశాల విద్యార్థినే! గత శతాబ్దం ముగిసే సమయంలో నేను ఉద్యోగరీత్యా విజయవాడలో ఉన్నాను. ఆకాశవాణిలో ప్రసారమయ్యే సైన్స్ కార్యక్రమాలు విని, తరచూ చర్చించే వారు సి.వి.యన్. ధన్. ఒకసారి నాకో ప్రశ్న సంధించారు – చాలా మంది సైన్స్ ప్రసంగాలు రాసుకుని వస్తారు కదా, వాటిలోని సమాచారం ఎంత వాస్తవమో ఎలా తెలుసుకుంటావు? – అని. ఇది చిన్న ప్రశ్న కాదు. అది రేడియోకే కాదు ఏ మాధ్యమానికైనా వర్తిస్తుంది, ఏ విభాగానికైనా వర్తిస్తుంది.

సరే, ధన్ గారి ప్రశ్న నిజంగా ఏ మీడియా సంస్థ నిర్వహాకుడికైనా అవసరం, దాని గురించి ఆలోచించాలి కూడా!సైన్స్‌కు సంబంధించి స్థూలంగా ఏ విభాగమైనా ప్రాథమికమైన సమాచారం ఇవ్వగలిగిన పుస్తకం ‘సైన్స్ మేటర్స్’ అని, దానిని సంప్రదించమని ధన్‌గారు సూచించారు. రాబర్ట్ ఎమ్. హాజన్, జేమ్స్ ట్రిఫిల్ రచయితలుగా వెలువడిన ఈ పుస్తకం లండన్‌లో 1991లో మొదట వెలువడింది, మనదేశపు ఎడిషన్‌ను 1996లో యూనివర్సిటీ ప్రెస్ ప్రచురించింది. ఉపోద్ఘాతం, తెలుసుకోవడం, శక్తి, విద్యుత్తు, అయస్కాంతత్వం, పరమాణువు, క్వాంటమ్, రసాయన బంధం, పరమాణు నిర్మాణం, అణు కేంద్రక కణాలు, ఖగోళం, విశ్వాంతరాళం, సాపేక్షత, భూగమనం, జీవం, జన్యుశాస్త్రం, పరిణామం, జీవావరణ వ్యవస్థలు – ఇలా 18 అధ్యాయాల్లో 300 పేజీలలోపు దాదాపు అన్ని సైన్స్‌రంగాల విషయాలను ఈ పుస్తకం పరిచయం చేస్తుంది.

ఇప్పటికీ నాకు ఇది ఎంతో దోహదకారిగా ఉంది. ‘ఫాస్ట్ సైన్స్ ఫాక్ట్స్’ అనే సురేంద్ర వర్మ పుస్తకమూ ఎంతో తోడ్పడుతోంది.తెలుగులో రావాల్సిన మహా నిఘంటువు గురించి తెలుగు అధికార భాషాసంఘం అధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్ గారు చాలా కాలంగా అవసరమైన వారితో చర్చిస్తున్నారు. ఇటువంటి మహా నిఘంటువులు చేర్చవలసిన విజ్ఞాన శాస్త్ర సంబంధమైన విషయాల గురించి, వాటితో ముడిపడిన పార్శ్వం గురించి ఇటీవల ఆచార్య రవ్వా శ్రీహరి గారు కొంత విపులంగా చర్చించారు. ఆ సంభాషణ తర్వాత ఆలోచిస్తే సైన్స్‌కు సంబంధించి తెలుగులో రావాల్సిన పుస్తకాలు ఏమిటో కూడా మనం దృష్టి పెట్టాలనిపించింది.

ఇదివరకు సి.వి.యన్.ధన్ సూచించిన రీతిలో అందరూ చదవాలంటే తెలుగులో అలాంటి పుస్తకాలు లభ్యం కావాలి. ఈ రకం పుస్తకాలు నిపుణుల అవసరాల కొరకు తయారైనవి. వీటికి మించి సగటు వ్యక్తి తరచూ వాడే లేదా చాలా తరచు అవసరమయ్యే సమాచారం తెలుగులో దొరకాలి. ఉదాహరణకు సెల్‌ఫోన్‌లో వాడే ‘సిమ్’కార్డ్ పదంలోని అక్షర క్రమం నుంచి, అదెలా పనిచేస్తుంది, ఎలా తయరావుతుందనే విషయాలు సరళంగా, సూక్ష్మంగా తెలిపే పుస్తకాలు రావాలి. నేషనల్ బుక్ ట్రస్ట్ వారి సహకారంతో రూపా సంస్థ భారతీయ శాస్త్రవేత్తల జీవిత విశేషాలు సంక్షిప్తంగా వివరించే నిఘంటువు 2002లో సుమారు 1500 పేజీలతో నాలుగు వందల రూపాయల వెలతో విడుదల చేసింది.

ఈ పుస్తకం తెలుగులో ఎందుకు రాకూడదు? సి.యస్.ఐ.ఆర్. సంస్థ పాతికేళ్ళ క్రితం ‘గోల్డెన్ ట్రెజరీ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ’ అనే ప్రచురణను ప్రచురించింది. ఈ పుస్తకం కూడా తెలుగులో వస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. విగ్సాన్ ప్రసార సంస్థ కూడా మంచి సైన్స్ పుస్తకాలు వేస్తోంది. ఇవన్నీ ప్రభుత్వ సంస్థలే. వీటిని ఇతర భారతీయ భాషల్లో తేవాలి – తెలుగుతో సహా. తెలుగు అకాడమీ నాలుగు దశాబ్దాల క్రితం చక్కటి కృషిచేసి ఎన్నో రంగాలకు సంబంధించిన పారిభాషిక పదకోశాలు విడుదల చేసింది. వీటిల్లో లోటుపాట్లను గమనించి, మెరుగు చేయాల్సిన బాధ్యత ప్రజలదీ, పండితులదీ. అలాగే కొన్నింటికి నిఘంటువులను వెలువరించింది తెలుగు అకాడమి.

వృక్ష శాస్త్రానికి సంబంధించిన పదాలకు తెలుగు అక్షర క్రమంలో నాలుగు వందల పుటల నిఘంటువు 1994లో వచ్చింది. ఇలాంటివి మరిన్ని రంగాలకు విస్తరించే సమయంలో మనకు తెలుగు మీద గౌరవం తగ్గిపోయింది. మరోవైపు జమ్మి కోనేటి రావు వంటి వారు చేసిన కృషి గురించి చెప్పుకోవాలి. జంతు శాస్త్రం, వైద్యం, ఖగోళ శాస్త్రాలకు సంబంధించి ఇంగ్లీషు – ఇంగ్లీషు – తెలుగు పద్ధతిలో ఒక్క పుస్తకం నాలుగు వందలకు పైగా పుటలున్నదిగా రూపొందించారు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ఆయుర్వేద నిఘంటువును ఎపుడో రాశారు. ఇలా చాలామంది కృషి చేశారు, చేస్తున్నారు. ఎటొచ్చి అన్నీ ఒక చోట లభ్యం కావాలి.

తక్షణమే సైన్స్ టెక్నాలజీ రంగాలకు సంబంధించి నిఘంటువు రావాలి. తర్వాతి దశలో విభిన్న రంగాలకు సంబంధించి ప్రత్యేక నిఘంటువులు రావాలి. తెలుగు అకాడమీ ఇదివరకు ప్రచురించిన పారిభాషిక పదకోశాలు ఇటువంటి ప్రయత్నాలకు ఆధారంగా తోడ్పడుతాయి.ఇటువంటి పనికి ఎవరు దిగాలి? ఎవరిని ఆహ్వానించాలి? వస్తు ప్రధానమైన కృషి కనుక, ఆయా రంగాలలో నైపుణ్యం కల్గి ఉండటమే ప్రధాన అర్హత. భాష మీద పట్టు, ఆసక్తి, గౌరవం, సాధన అనేవి అదనపు అర్హతలు. ఇదే క్రమంలో ప్రాధాన్యాలను నిర్ణయించాలి. ఇంగ్లీషులో, ఇతర భాషలలో జరుగుతున్న కృషి, నడుస్తున్న ధోరణి గమనించి ప్రజల ప్రయోజనమే కీలకంగా ప్రయత్నాలు జరగాలి. ఆధునిక అవసరాలకు తగినట్లుగా శాస్త్ర సాంకేతిక రంగాలలో తెలుగు భాష పరిపుష్టమైతేనే నిజమైన తెలుగు భాషా ప్రగతి, భాషా ప్రయోజనం సాధ్యం!

– డా. నాగసూరి వేణుగోపాల్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక విమర్శకు యుగపురుషుడు సి.ఆర్.రెడ్డి

ఆధునిక విమర్శకు యుగపురుషుడు సి.ఆర్.రెడ్డి

           భారత దేశం లో సి.ఆర్.అంటే చక్రవర్తుల రాజ గోపాలాచారి అనే రాజాజీ అని అందరికి తెలుసు .ఆంధ్రులందరికీ సి.ఆర్ .అంటే కట్టమంచి రామ లింగారెడ్డి అని పూర్తిగా తెలుసు .ఆ రెండక్షరాలతోనే చిర యశస్సు నార్జిన్చారాయన .చిత్తతూరు జిల్లాలో కట్టమంచి గ్రామం లో 1880 లో జన్మించారు 

 

 

.చిత్తూరు మద్రాస్ లలో చదివి రాజకీయార్ధిక శాస్త్రం లో ,తత్వ శాస్రం లో పట్టా పొందారు .చిన్నప్పటి నుంచి కుశాగ్ర బుద్ధి .స్కాలర్షిప్ తో కేంబ్రిడ్జి విశ్వ విద్యాలయం లో చరిత్రాధ్యయనం చేశారు .మొదటి తరగతి లో ఉత్తీర్ణుడై అక్కడి ‘’రైట్స్ ‘’బహుమతిని తన ప్రతిభకు తార్కణ గా పొందాడు .విద్యార్ధి సంఘాన్ని స్తాపించి ,దాని నాయకుడై సేవలందించాడు .1907  లో అమెరికా లో ఉన్నత విద్యు నభ్యసించాడు .ఆ నాటి గైక్వాడ్ సంస్తాదీశుడు రెడ్డి కి ఆర్ధిక సాయమందించాడు .అమెరికా నుండి తిరిగి రాగానే బరోడా కాలేజి వైస్ ప్రిన్సిపాల్ గా ఉద్యోగం లో చేరాడు .ఈయన ప్రతిభ ను గుర్తించిన మైసూరు ప్రభుత్వం ప్రభుత్వ విద్యా శాఖ లో అసిస్టంట్ ఇన్స్పెక్టర్ జెనరల్ గా నియమించి గౌరవించింది .తర్వాత మైసూర్ మహారాజా కాలేజి లో ప్రొఫెసర్ అయాడు .అంచెలంచెల మీద ఆయన తన సామార్ధ్యానికి తగిన ఉన్నత పదవుల నందు కొన్నాడు .యూరప్ ,కెనడా జపాన్ వగైరా దేశాలను పర్య టించి విద్యా విషయక పరిశీలన చేశాడు .1913 లో మహారాజా కళాశాల ప్రిన్సిపాల్ అయి 1916 లో విద్యా శాఖ ఇన్స్పెక్టర్ జెనరల్ అయారు .

300px-Crreddy

 

        ప్రతివిషయం పై నిశిత పరిశీలన చేయటం రెడ్డి గారికి అలవాటు .దేశ రాజ కీయాలను అధ్యయనం చేశారు .జస్టిస్ పార్టి లో చేరి రెండు సార్లు మద్రాస్ యూని వెర్సిటి తరఫున శాసన సభ కు ఎన్నికైనాడు .1926 ఆంద్ర విశ్వ కళా పరిషత్ ఏర్పడింది .దీనికి రెడ్డి గారు మొట్టమొదటి  ఉపాధ్యక్షుడు అంటే వైస్ చాన్సలర్ .అయారు ప్రతిభకు తగ్గ పదవి .తన శక్తి సామర్ధ్యాలను చూపి విశ్వ విద్యాలయ అభి వృద్ధికి ఇతోధికం గా కృషి చేశాడు .1928 లో రెండవ సారి ఉపాధ్యక్ష పదవి వరించింది .తే ప్రభుత్వ  నిరంకుశ చర్యలకు విసి గి పోయి రాజీ నామా చేశాడు అయితేనేం 1935లో చిత్తూరు జిల్లా నుంచి మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కు సభ్యుడిగా నిలబడి ఘన విజయం సాధించాడు .పాదరసం లాంటి బుర్ర ఉన్న రెడ్డి గారు ఎక్కడా నిలకడ గా ఉండలేక ,ఇమడలేక పోయాడు .1936లో కాంగ్రెస్ పార్టి లో చేరాడు మళ్ళీ ఆంద్ర విశ్వ విద్యాలయ ఉపాధ్యక్షులు గా ఎన్నుకో బడ్డాడు చని పోయే దాకా దాని వైస్ చాన్సలర్ గా ఉండి  సేవ జేసిన బుద్ధి జీవి రెడ్డి గారు .1937  లో మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్ అయాడు .

images (1)

ఆ నాడున్న విశ్వ విద్యాలయాలలో కలకత్తా ,మద్రాస్ విద్యాలయాలకు గొప్ప పేరు ఉంది .ఆ స్తాయి ఆంధ్రా యూని వెర్సిటి కి రావాలని  కల లు గన్నాడు తపన పడ్డాడు అందుకోసం ప్రతిభా సంపన్నులైన సమర్ధులైన అధ్యాపకులను ఎంపిక చేసి నియమించాడు .అందులో రాధాకృష్ణన్ గారొకరు .ఆధునిక వసతులతో విశ్వవిద్యాలయాన్ని తీర్చి దిద్దాడు .ఆయన సేవలను గుర్తించి విశ్వ విద్యాలయం ఆయనకు ‘’కళా ప్రపూర్ణ ‘’బిరుదు నిచ్చి గౌరవించింది .ఆంద్ర ఆంగ్లాలలో అసమాన ప్రతిభా దురీను డు రెడ్డి గారు .మంచి వాగ్ధాటి హాస్యం చతురత ఆయన మాటల్లో ధ్వనిస్తాయి .రాజకీయ శాస్త్రాన్ని అవపోసిన పట్టిన అపర అగస్త్యుడు .నిర్భీతి ,స్వతంత్రత ఆయన ముఖ్య లక్షణాలు  అనుకొన్నది సాధించే ఓర్పు నేర్పు ఉన్నవాడు

                                సారస్వత సేవ

 రామ లింగా రెడ్డి రాసిన ‘’కవిత్వ తత్వ విచారం ‘’గొప్ప విమర్శన గ్రంధం గా ప్రఖ్యాతి పొందింది .ప్రబంధ కవుల రచనా పద్ధతులను లోతుగా పరిశీలించి విశ్లేషించారు .అయితే అంత తీవ్ర విమర్శకు తట్టు కోలేని వారు ఆ గ్రంధం పై ప్రతి విమర్శ చేశారు విమర్శనా పద్ధతికి కొత్త ఒరవడిని సృష్టించి కొత్త గవాక్షాలను తెరిచాడు విమర్శ మూస విధానం లో నుంచి కొత్త పోకడలు పోయింది .చాలా మంది కవులకు మార్గ దర్శకుడు సి.ఆర్..అందుకనే ఆయన్ను ‘’ఆధునిక ఆంద్ర సాహిత్య విమర్శకు ‘’యుగ పురుషుడు ‘’అన్నారు .తేలికైన భాష ,తెలుగు నుడికారం తో ఆయన రచనలుంటాయి .ఆయనది చాలా విశిష్టమైన శైలి తీక్ష్ణ విమర్శకుడు అని పించుకొన్నాడు

                   నవ్య కావ్యం ‘’ముసలమ్మ మరణం ‘’

   మద్రాస్ క్రిస్టియన్ కాలేజి లోని ఆంద్ర భాశా   రంజని సమాజ కావ్య రచనలలో 1889లో పోటీలు నిర్వహించింది అందులో కట్టమంచి వారి వీరి ముసలమ్మ మరణం కావ్యం ఎన్నికయింది .కధను అనంత పురం చరిత్ర నుంచి గ్రహించి మార్పులు చేర్పులు చేసి కావ్యం గా మలిచారు రెడ్డి గారు అనంత పురం దగ్గర బుక్క రాయ సముద్రం అనే ఊరు లోని చెరువు కట్ట నీటి ఉధృతికి తెగిపోయింది .గ్రామ దేవత ఆ ఊరి లోని‘’ముసలమ్మ‘’ అనే సాధ్వీ లలామ ను బలి ఇస్తేనే ప్రమాదం తప్పుతుంది అని చెప్పింది .ఆ విషయం తెలిసిన ఆఊరి కోడలు ముసలమ్మ గ్రామ సంరక్షణ కోసం ఆ చెరువు నీటిలో పడి  ప్రాణ త్యాగం చేసి గ్రామాన్ని కాపాడింది అని కధనం .ఇప్పుడా చెరువు కట్టకు ‘’ముసలమ్మ కట్ట ‘’అని పేరు .ఆమె త్యాగాన్ని కావ్యం గా మలిచారు రామలింగా రెడ్డి గారు .సమస్ష్టి కోసం వ్యష్టి బలిదానం అన్నదే ఇక్కడి విషయం .కరుణ రస స్పోరక కావ్యం .కదా కొత్తదే కాని రెడ్డి గారి రచన సంప్రదాయ అద్దం గానే సాగింది .కనుక నవ్య కవిత్వం గా నారాయణ రెడ్డి గారు దీనిని గుర్తించలేదు .వస్తువు కొత్తదే విషాదాంతం గా ముగింట మూ కొత్తదనమే .నాయిక సామాన్య గృహస్తురాలు .ఇదీ కొత్త విషయమే .అందుకని దీన్ని నవ్య కవిత్వానికి ‘’సంధి కావ్యం‘’అని ,నవ్య కవితా ప్రభాతానికి వేగు చుక్క అని పింగళి లక్ష్మీ కాంతం గారు పేర్కొన్నారు .ఏమైనా రడ్డి  గారు కొత్త ప్రయోగానికి నాందీ వాచకం పలికారు .బహుముఖ ప్రజ్ఞా శాలి ,కళా ప్రపూర్ణ ,ఆధునిక విమర్శకు మార్గ దర్శి శ్రీ కట్టమంచి రామ లింగా రెడ్డి 71 ఏళ్ళు నిండుగా జీవించి 1951లో తనువు చాలించి చరితార్దులైనారు .  

         మరో ప్రముఖుని గురించి ఈ సారి

           సశేషం –మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ –5-3-13-ఉయ్యూరు

 

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

మా గరుడా చలం మాస్టారు

                        మా గరుడా చలం మాస్టారు

            పొట్టిగా అటు లావూ కాకుండా ఇటు సన్నమూ కాకుండా ఉండే చామన ఛాయా శరీరం ,ఎప్పుడూ నున్నటి గుండు ,ధోవతి పైన తెల్ల లేక సాధారణ రంగు పొడవైన అరచేతుల చొక్కా బడికి వెళ్తే పైన ఖండువా వెడల్పైన నుదురు గలగలా మాట్లాడే వ్యక్తియే గరుడాచలం మాస్టారు .బోళా గా మాట్లాడినా ఆత్మవిశ్వాసం ఆత్మా గౌరవం ఉన్న వారు .మాట తూలి అనరు .ఎవరైనా పొరబాటున అంటే చురక లాంటిమ్చకుండా ఉండరు .మొండి ధైర్యం ఆయనకున్న ఆస్తి .సెకండరి గ్రేడ్ ట్రైనింగ్ పాసై జిల్లా బోర్డు లో సెకండరి ఉపాధ్యాయులు గా చేరారు ఉయ్యూరు తాడంకి,మానికొండ పామర్రు మొదలైన చోట్ల పని చేశారు .ఎక్కడపని చేసినా వృత్తికి తగిన పూర్తీ న్యాయం చేసిన ఉపాధ్యాయుల్ని పించుకొన్నారు .కాకా పట్టటం గడప పూజ తెలియని వారు .ముక్కు సూటి మనిషి .ఎస్.ఎస్.ఎల్.సి.తాడంకి హైస్కూల్ లో చదివారు . మాస్టారు నాయీ బ్రాహ్మలు వారి తండ్రి గారు కుల వృత్తి చేస్తూ వైద్యమూ చేసి ఉయ్యూరు లో మంచి పేరుపొందారు ఆ రోజుల్లో ‘’సంచి కట్టు వైద్యం ‘’కు మంచి పేరుండేది .ఆ కులం వారిలో డాక్టరీ చేసిన వారు ఆ కాలం లో ఎక్కువ మందే ఉన్నారు .మైనేని గోపాల క్రిష్నయ్య గారి కుటుంబానికి గరుడా చలం గారి తండ్రి గారే వైద్యులు అని నాకు చాలా సార్లు చెప్పారు .మాస్టారు చిన్నతనం లో ఎంత దూరమైనా కాలి నడకనే వెళ్ళే వాడి నని నాకు చాలా సార్లు చెప్పారు ఆయనకు సైకిల్ తొక్కటం రాదు నేర్చుకో లేదు .

 

           నాకు మాస్టారి తో మొదటి పరిచయం నేను ఉయ్యూరు హైస్కూల్ లో ఎనిమిదవ తరగతిలో1953 లో చేరినప్పుడు .అయన మాక్లాసుకు ఏ సబ్జక్టు కు రాలేదు అప్పుడు మా స్కూల్ లోనే పని చేసేవారు .ఆయనతో బాటు కే.ఆర్ కాంతయ్య గారు ,మహంకాళి సుబ్బరామయ్య గారు ,లింగం బసవా చారి గారు ,సూరి రామ శేషయ్య గారు ఆదిరాజు పున్నయ్యగారు సూరి కృష్ణ మూర్తిగారు ,కూనపులి సుబ్రహ్మణ్యం గారు మొదలైన వాళ్ళంతా సెకండరి టీచర్లే .ఆయన తోటి వారే కాంతయ్య గారు మాకు లెక్కలకు బసవాచారి గారు ఇంగ్లిష్ సోషల్ కు సుబ్బరామయ్య గారు తెలుగుకు వచ్చేవారు గరుడా చలం గారు ఏడవ తరగతి కి చెప్పే వారని జ్ఞాపకం .మా తమ్ముడు కృష్ణ మోహన్ కు టీచర్ గరుడా చలం గారు .ఆయన అభిమాన సబ్జెక్టులు లెక్కలు సోషల్ .రెండు బాగా చెప్పేవారని అనేవారు .అంటే గరుడాచలం గారు నాకు ప్రత్యక్ష గురువు కాదు .పరోక్ష గురువు .కాంతయ్య మాస్టారు గరుడాచలం గారు కలిస్తే బసవాచారి మాస్టార్ని ఆట పట్టించే వారు బసవా చారి గారికి ఉడుకు బోతు తనం ఎక్కువ దాన్ని అలుసుగా తీసుకొని ఆడించే వాళ్ళు .

          గరుడాచలం గారి మాటల గురించి ఆయన విద్యార్ధులు వింతగా చెప్పుకొనే వారు మా తమ్ముడి వల్లనాకా విషయం తెలిసింది .ఆయనకు ‘’ర’’అనే అక్షరం పలికేదికాదు .అటేన్దేన్సులో పేర్లు పిలిచేటప్పుడు ,పాఠం చెప్పే తప్పుడు ఈ ఇబ్బంది పడే వారట .పిల్లాడిని నీ నెంబరు ఎంత /అని అడగటానికి ‘’నీ నెంబగు ఎంత ?’’అనేవారట రు బదులు గు పలికే వారన్న మాట .నీపేరు ఏమిటి అనటానికి ‘’నీ పేగు ఏమిటి ?’’అనే వారట ఇవన్నీ కధలు గాధలుగా ఆ రోజుల్లో చెప్పుకొనే వారు కనుక ఆయనకు నిక్ నెం ‘’పేగు ,నెంబగు ‘’అయి పోయింది ఆయన పేరుతో కాకుండా ఈపెరుతోనే పిలిచేవారు పిల్లలు .

             ఆ తర్వాత నేను బి.యి.డి చేసి ఉయ్యూరు హైస్కూల్ లో సైన్సు మేస్టారు గా పనిచేసినప్పుడు మాస్టారు మాకు సోదర ఉపాధ్యాయులు .మళ్ళీ మా కాంతయ్య మేష్టారు భార్య చంద్ర లీలమ్మ గారు ,బసవాచారిగారు సుబ్బరామయ్య గారు ,ప్రేమలత అనే అమ్మాయి నాదగ్గర స్కూల్ లో చదివి సెకండరి పాసై టీచర్ గా వచ్చింది ఆ తర్వాతా .వీరందరూ సహచర ఉపాధ్యాయులు శిష్యడనైన నేను మా గురువు లతో కలిసి పని చేయటం అదృష్టం అలాగే జంధ్యాల ప్రసాద శర్మ గారు మాకు స్కూల్ ఫైనలో సైన్సు మేష్టారు .అయన ఇప్పుడూ అదేపోస్ట్ లో పని చేస్తున్నారు నేనూ వారితో సహా ఉపాధ్యాయుడిగా పని చేసిన ఆనందం .గరుడా చలం గారి అమ్మాయి రెండో అబ్బాయి నా దగ్గర ట్యూషన్ కూడా చదివారు అలా మళ్ళీ మాస్టారు తో నా పరిచయం పెరిగింది .

                    నేను ఉయ్యూరు నుండి మానికొండ స్కూల్ కు బదిలీ అయాను అప్పుడు గరుడాచలం మాస్టారు అక్కడ పని చేస్తున్నారు .ఆయన ఆత్త వారి ఊరు మానికొండ .నేను మాస్టారు రాజు గారు అనే అల్లూరి సీతా రామ రాజు గారు ,అటెండర్ రాఘవ రావు కలిసి ఉండేవాళ్ళం సాయంత్రాలు ఎవరి ఇంట్లోనో ఒకరి ఇంట్లో టిఫిన్ కాఫీలు వాహ్యాళి మా ఇంట్లో తరచుగా భోజనాలు బలేగా ఉన్న రోజులవి మేము ముగ్గురం రాజు గారింట్లో ఆతిధ్యం ఆయన మిగిలిన వారితో మ ఇంటికి రావటం .ఇవన్నీ మరిచి పోలేని రోజులు గరుడా చలం గారు ఫామిలీ పెట్టలేదు .అత్తగారింటి లోనే ఉండేవారు .

                నేనుకాటూరు  ఉయ్యూరులలో పని చేసినప్పుడు రాజుగారు రాఘవరావు ఉయ్యూరు వచ్చి గరుడాచలం గారితో కలిసి మా ఇంటికి వచ్చే వారు ఇక్కడే భోజనం టిఫిన్ సినిమా నిద్ర మా ఇంట్లోనే . గరుడాచలం మాస్టారు నేను కలిసి మానికొండ వెళ్లి అక్కడ రాజుగారింట్లోనో రాఘవ రావు ఇంట్లోనో భోజనమ చేసి సాయంకాలానికి ఉయ్యూరురు వచ్చే వాళ్ళం ఇలా ఎన్నో ఏళ్ళు గడిచాయి సుమారు 48 సంవత్సరాల బంధం .ముందు గా రాఘవ రావు ఆ త్ర్హర్వాత త అయిదేల్లక్రితం రాజు గారు మమ్మల్ని విడిచి పైకి వెళ్లి పోయారు మొన్న గరుడా చలం మాస్టారు వెళ్లి పోయారు మనుషులు దూరమైనా మనసులు కలిసిన బాంధవ్యం మాది .అందులో గరుడా చలం గారు  రాజుగారి తో ఎప్పుడు మా ఇంటికి వచ్చినా మా శ్రీమతి ఎన్నో రకాల అయిటంస్ నిమిషాల్లో చేసి అందరికి వడ్డించేది మేము మా సావిట్లో కూర్చుని హాయిగా భోజనం చేసే వాళ్ళం .మాస్టారికి ‘’దంత సిరి ‘’బాగా ఉండేది మొహమాటం లేకుండా అడిగి వడ్డించుకొని కడుపు నిండా తినే వారు .మా ఆవిడతో ‘’అమ్మాయీ ! మేము ఎప్పుడు వచ్చినా క్షాణాల మీద ఇన్ని చేసి మాతో కొసరి కొసరి తినిపిస్తావు అందుకే మీ ఇంటికి రావటం మాకు చాల ఇష్టం ‘’అనేవారు అలానే అయన ఒక్కరే వచ్చినా అలానే ఆతిధ్యమిచ్చే వాళ్ళం రాజు గారు మహా మొహమాటం మనిషి .కాని వీర్సంతా ఉదాత్తులు గొప్ప స్నేహ శీలురు .

             మేము నలుగు సార్లు అమెరికా వెళ్లాం .మూడు సార్లూ రాజు గారు గరుడా చలం గారు మా ఇంటికి వచ్చి భోజనం చేసి కూర్చుని మాట్లాడి మాకు వీడ్కోలు చెప్పే వారు అంత గా కలిసి పోయిన స్నేహం మాది నేను మానికొండ లో పని చేసింది ఒక్క ఏడాదే కాని అది ఇన్నేళ్ళ అస్నేహ బంధాన్ని సృష్టించింది ఇది మా గొప్ప కాదు వారందరి హృదయ విశాలయం,ఆత్మీయతాను .లేక పోతే ఎందుకు గుర్తుంచుకొంటారు ?ఎందుకు ప్రేమగా వచ్చి పలకరిస్తారు ?అదొక గొప్ప సౌజన్యం .మాటలకు అందనిది .

             రాజు గారు కురుమద్దాలి పిచ్చమ్మ గారి ఆశ్రమానికి వచ్చినప్పుడల్లా మా ఇంటికి గరుడా చలం గారితో తప్పక వచ్చి వెళ్ళే వారు యోగ క్షేమాలు తెలియ బరచే వారు తెలుసుకొనే వారు అలా జీవికా జీవులం గా ఉన్నాం .ఉయ్యూరు సాహితీ మండలి సమావేశాలకు మాస్టారిని ఇంటికి వెళ్లి ఆహ్వానం అందించేవాడిని తప్పక వచ్చి వెళ్ళేవారు ,సరసభారతి సభలకు కూడా స్వయం గా వెళ్లి ఆహ్వానిన్చేవాడిని కొంచెం నడక ఇబ్బంది గా ఉన్నా వచ్చే వారు .ఉయ్యూరు ఏ’సి.లైబ్రరి ప్రారంభోత్సస్వానికి ప్రేమ చంద్ గారి సన్మానానికి వచ్చి వారిని పలకరించి మాట్లాడారు వారు వీరిని గుర్తుంచుకొని గౌరవం చూపారు .ఎప్పుడైనా బజారు లో కనపడితే ‘’మాస్టారు బజారు తిరిగే తీరిక ఉంది కాని మా ఇంటికి వచ్చే ఒపిక . లేదా ?’’అనే వాడిని అంతే మర్నాడు మా ఇంటిలో ప్రత్యక్షం .ఫోన్ లో తరచు మాట్లాడుకొనే వారం అక్టోబర్ లో అమెరికా నుంచి వచ్చిన తర్వాతా రెండు సార్లు ఆయన ఇంటికి వెళ్లి పలకరించాను అప్పటికే భార్య గారి ఆరోగ్యమూ దెబ్బతింది ఇద్దరు వ్యాధి గ్రస్తులే అయారు చిన్నబ్బాయి వీరిని కంటికి రెప్పలా చూసుకొన్నాడు .మాస్టారు గారి భార్య గారు నాతో అరమరిక లు లేకుండా కుటుంబ విషయాలన్నీ చెప్పేవారు బాగా ఆదరించే వారు .నేను రాకపోతే ఆయనతో ఫోన్ చేసి మాట్లాడించే వారు .

               నేను 200-2002 మధ్య ఫ్లోరా స్కూల్ వారి ఆహ్వానం పై అడ్మిని స్త్రేటర్ గా పని చేసినప్పుడు మాస్టరు గారి మనవలిద్దరు అక్కడ చదివే వారు .వారికోసం స్కూల్ కు వచ్చి కనపడే వారు .అందులో చిన్నకుర్రాడు నాగార్జున కొంచెం అల్లరి చేస్తూ చదువు మీద ద్రుష్టి పెట్టె వాడు కాదు మాస్టారు వాడి బాధ్యత నాకు అప్పగించారు తమ మాట వినటం లేదని నేనే శ్రద్ధ తీసుకోవాలని కోరారు వాడిని విపరీతం గా కొట్టేవాడిని అల్లరి చేస్తే .వాడు పైకి ఏమీ అల్లరి పిల్లడు గా ఉండే వాడు కాదు నవ్వుతు ఉండే’’సైలెంట్ కిల్లర్‘’పదవ తరగతికి వచ్చాడు అక్కడా అదే తీరు ఒక సారి వాడిని ఇంటికి పిలిచి ‘’ఒరరే !మీ తాతగారు నాకు గురువు గారు .కనుక నువ్వు నాకు మనవాడి వరుస .అల్లరి మంచిదే కాని అది చదువుకు అడ్డు అవుతుంది ఇప్పటికైనా మించింది లేదు ఇప్పటి నుంచి చదివితే ముప్ఫై అయిదు మార్కులు లు తెచ్చుకోవటం పెద్ద కష్టమేమీ కాదు . జాగ్రత్త భవిస్యత్తు పై ద్రుష్టి పెట్టు ‘’అని లాలన గా చెప్పాను అంతే మర్నాడు నుంచి వాడి ప్రవర్తన లో గొప్ప మార్పు వచ్చింది మాస్టారు కూడా గమనించి నాకు థాంక్స్ చెప్పారు వాడు టెన్త్ పాసై పాలిటెక్నిక్ చదివి బి.టెక్ పాస్ అయి ఉద్యోగం చేస్తున్నాడు .నాకు గర్వం గా ఉంటుంది వాడిని చూస్తె .

                    గరుడాచలం గారి ఆరోగ్యం బాగాలేదని హైదరాబాద్ తీసుకొని వెళ్ళారని తెలిసింది రోజు వాకబు చేస్తూనే ఉన్నాను .నిన్న ఉదయం వారి మనవడు ఇందాక దాకా చెప్పుకొన్న నాగార్జున వచ్చి‘’తాత గారు రాత్రి చని పోయారండి ‘’అని దీనం గా చెప్పాడు .నేనువారింటికి వెళ్లి  శివమైనవారి పార్ధివ దేహానికి నమస్సులు అర్పించి వారి భార్య పిల్లలను పలకరించి వచ్చాను 86 ఏళ్ళు నిండుగా జీవించి పెద్దగా ఇబ్బంది పడకుండా, ఇబ్బంది పెట్టకుండా తనువు చాలించిన ధన్య మూర్తి గరుడా చలం మాస్టారు వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను .

              మీ—గబ్బిట  దుర్గా ప్రసాద్ -5-4-13-ఉయ్యూరు 

 

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

వృత్తిరీత్యా అంటరానివాడిని’– డాక్టర్ యల వర్తి నాయుడమ్మ

వృత్తిరీత్యా అంటరానివాడిని’


మన దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తల్లో వై. నాయుడమ్మ ఒకరు. తోళ్ల పరిశ్రమ ఆధునీకరణకు సెంట్రల్ లెథర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డైరక్టర్‌గా ఆయన చేసిన సేవలు ఎనలేనివి. 1985లో కనిష్క విమాన ప్రమాదంలో మరణించిన నాయుడమ్మ జీవిత చరిత్ర ఇప్పటి దాకా రాకపోవటం ఒక లోటే. ఇప్పుడు ఆ లోటును ఇన్‌కంటాక్స్ చీఫ్ కమిషనర్‌గా పదవీ విరమణ చేసిన కె. చంద్రహాస్ పూరించారు. ‘ది పీపుల్స్ సైంటిస్ట్ ‘ అనే పేరిట నాయుడమ్మ జీవిత చరిత్రను రాశారు. ఆ పుస్తకంలోని కొన్ని ఆసక్తికరమైన భాగాలు..

సమాజంలో వెనకబడిన వర్గాల వారి అభివృద్ధి కోసం సైన్స్ అండ్ టెక్నాలజీని ఉపయోగించటంలో ఆయన చేసిన సేవ అజరామరం. ఆయన స్ఫూర్తితోనే నేను కాలేజ్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ డైరక్టర్‌గా ఉన్న సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు ఆచరణాత్మకమైన నైపుణ్యాన్ని పెంపొందించటానికి శిక్షణ ఇచ్చాం.. ” – (డాక్టర్ కె. లక్ష్మీనారాయణ, నాయుడమ్మ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సమయంలో సన్నిహితంగా పనిచేసిన ఐఎఎస్ అధికారి..)

నాయుడమ్మ విదేశాలలో చదివినా, అనేక ప్రాంతాలు చూసినా, గ్రామీణ భారతాన్నే ఇష్టపడేవారు. తోళ్లకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానంలో నిష్ణాతుడు కావటం వల్ల ఆయనకు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే చర్మకారులతో పరిచయాలు ఏర్పడ్డాయి. నాయుడమ్మ సీఎల్ఆర్ఐ డైరక్టర్‌గా పదవి చేపట్టే సమయానికి దేశంలో తోళ్ల పరిశ్రమ చాలా ప్రాథమిక దశలో ఉంది. కొన్ని శతాబ్దాల నుంచి ఆ పరిశ్రమలో ఎటువంటి మార్పులు రాలేదు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం,రసాయనాల ఉపయోగం గ్రామీణ ప్రాంతాల్లోని చర్మకారుల దాకా చేరలేదు. సంప్రదాయపద్ధతులలోని మంచిని వాడుకుంటూనే, చర్మకారులకు ఆధునిక పద్ధతులలో శిక్షణ ఇస్తే ప్రయోజనం ఉంటుందని ఆయన భావించారు. తోళ్ల పరిశ్రమ వల్ల దేశం ఆర్థికంగాను, పారిశ్రామికంగాను మాత్రమే కాకుండా సామాజికంగా కూడా అభివృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. 

ఆధునిక సమాజంలో అంటరానితనానికి స్థానం లేదని నాయుడమ్మ భావించేవారు. తోళ్ల పరిశ్రమ అభివృద్ధికి ఎలాంటి ప్రణాళికలు అవసరం? ఆ ప్రణాళికలను ఎలా అమలు చేయాలి? వాటిలో ఎదురయ్యే ఆటంకాలేమిటనే విషయాలపై ఆయనకు మంచి అవగాహన ఉండేది. సమాజంలో కొందరిని అంటరానివారిగా పరిగణించటం నాయుడమ్మకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. వర్ణవ్యవస్థను సమర్థించే వారిని ఆయన ఇష్టపడేవారు కాదు. వారు ఎంత పెద్ద పదవిలో ఉన్నా సహించేవారు కారు. 1950లలో నాయుడమ్మ సీఎల్ఆర్ఐ డిప్యూటీ డైరక్టర్‌గా ఉన్న సమయంలో శ్రీ ప్రకాశ తమిళనాడు గవర్నర్‌గా వ్యవహరించేవారు. శ్రీ ప్రకాశ వారణాసికి చెందిన వారు. ఆయనకు నాయుడమ్మ కులమేమిటో తెలుసుకోవాలనే ఆసక్తి ఉండేది. తోలు పరిశ్రమతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని బట్టి నాయుడమ్మ నిమ్న (మాదిగ) కులానికి చెందిన వాడని శ్రీప్రకాశ భావించారు.

అయితే ఎవరూ ఆ విషయాన్ని నిర్ధారించలేకపోయారు. దీనితో ఆసక్తి ఆపుకోలేక ఒక రోజు నాయుడమ్మకు గవర్నర్ ఫోన్ చేశారు. మీ కులమేమిటని నేరుగానే అడిగారు. నాయుడమ్మ కావాలంటే తన కులాన్ని చెప్పి ఉండచ్చు. కాని చెప్పలేదు. గవర్నర్ అడిగిన ప్రశ్న ఆయనకు ఆవేదన కలిగించింది. దానిని దాచుకొని- “నేను వృత్తిరీత్యా అంటరానిసమాజానికి చెందినవాడిని” అని సమాధానమిచ్చారు. గవర్నర్ వెంటనే ఫోన్ పెట్టేశారు. ఐదు నిమిషాల తర్వాత మళ్లీ ఫోన్ చేసి తప్పుజరిగిందని విచారం వ్యక్తం చేసారు. ఆ సమయంలో మన దేశంలో తొమ్మది పరిశోధనాశాలలు ఉండేవి. ఇవన్నీ సెంటర్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉండేవి. ఈ పరిశోధనాశాలల డైరక్టర్లకు, సీఎస్ఐఆర్ కార్యాలయానికి మధ్య విభేదాలు బాగా ముదిరిపోయాయి. దీనితో ఈ విభేదాలను పరిష్కరించటానికి అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఎనిమిది పరిశోధనాశాలల డైరక్టర్లతో సమావేశమయ్యారు. సీఎస్ఐఆర్‌తో ఉన్న సమస్యల గురించి ఇందిర అందరి డైరక్టర్లతోను ఎటువంటి అరమరికలు లేకుండా చర్చిస్తున్నారు. ఆ సమయంలో నాయుడమ్మ సీఎల్ఆర్ఐ డైరక్టర్‌గా ఉండేవారు. నాయుడమ్మ వంతు వచ్చింది.

“మేడం, ద్రౌపదికి ఐదుగురు భర్తలు మాత్రమే ఉండేవారు. కాని ఒక పరిశోధనాశాల డైరక్టర్‌కు ఎంత మంది భర్తలు ఉంటారో నేను మీకు చెప్పలేను” అన్నారు. ఇందిర దగ్గర ఆ తరహా వ్యాఖ్యలు చేయటానికి చాలా సాహసం ఉండాలి. వేరే ఎవరైనా అలాంటి వ్యాఖ్యలు చేస్తే ఇందిర వారిని తీవ్రంగా మందలించి ఉండేవారు. కాని నాయుడమ్మ చెప్పిన తీరును చూసి ఇందిర కూడా నవ్వి ఊరుకున్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన కొన్ని రోజులకు అమెరికా వెళ్లారు. ఆ సమయంలో నాయుడమ్మ కూడా ఆయనతో అమెరికా వెళ్లారు. అమెరికాలో జర్నలిస్టులు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు? వాటికి ఎలాంటి సమాధానాలు చెప్పాలనే విషయాన్ని ఎన్టీఆర్‌కు నాయుడమ్మ ముందే చెప్పారు.

ఆ సమయంలో ఎన్టీఆర్‌కు, ప్రధాని ఇందిరకు మధ్య రాజకీయ వైరం తీవ్రంగా ఉండేది. జర్నలిస్టులు ఇందిర గురించి ప్రశ్నిస్తే- రామారావు తన సహజ ఆవేశంతో సమాధానాలిచ్చే అవకాశం ఉందని నాయుడమ్మ ఆందోళన చెందారు. అనుకున్నట్లే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో- “మీరు, మేడమ్ గాంధీ వేర్వేరు పార్టీలకు చెందిన వారు. మీ ఇద్దరి మధ్య మౌలికమైన విభేదాలు కూడా ఉన్నాయి. మీరు ఆమెను ఎలా మేనేజ్ చేస్తున్నారు?” అని ఒక జర్నలిస్టు అడిగారు. నాయుడమ్మ ముందు చెప్పి ఉండకపోతే- ఎన్టీఆర్ తాను విదేశాల్లో ఉన్నాననే విషయాన్ని కూడా మర్చిపోయి ఇందిర మీద విరుచుకుపడేవారు. కాని ఎన్టీఆర్ సంయమనం పాటించారు. “నేను దేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిని. ఆమె మొత్తం దేశానికి ప్రధానమంత్రి. మా మధ్య విధానపరమైన విభేదాలు ఉండి ఉండచ్చు. కానీ జాతీయ ప్రయోజనాలే మా ఇద్దరికి ముఖ్యం..” అని సమాధానమిచ్చారు. ఎన్టీఆర్ సమాధానాన్ని జర్నలిస్టులు కూడా మెచ్చుకున్నారు.

ద పీపుల్స్ సైంటిస్ట్
రచయిత: కె. చంద్రహాస్
ప్రచురణ: పీగాసెస్ ఇండియా పబ్లిషర్స్
ధర: రూ. 200
పేజీలు: 172
ప్రతులకు: 8008449678, 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

1948 హైదరాబాద్ పతనం

1948 హైదరాబాద్ పతనం


భారత దేశ చరిత్రలో హైదరాబాద్ సంస్థాన విలీనం ఒక వివాదాస్పద అధ్యాయం. దీనికి సంబంధించిన వివరాలు అనేకం అందుబాటులో ఉన్నా- ఇంకా వెలుగులోకి రాని కొన్ని ముఖ్యమైన కోణాలున్నాయనేది విశ్లేషకుల అభిప్రాయం. ముఖ్యంగా ఆ నాటి సంఘటనల గురించి రాసిన ముస్లింలు తక్కువ. ఆ సమయంలో ఉస్మానాబాద్ కలెక్టర్‌గా పనిచేసిన మొహమ్మద్ హైదర్ రాసిన “October coup’ అనే ఆంగ్లపుస్తకాన్ని ఇటీవల ‘1948-హైదరాబాద్ పతనం’ పేరిట తెలుగులోకి అనువదించారు. ఈ నెల 7వ తేదీన విడుదల కానున్న ఈ పుస్తకంలోని కొన్ని ఆసక్తికరమైన భాగాలు మీ కోసం..

సెప్టెంబరు 17…శుక్రవారం ఉదయం ఖాసిం రజ్వీ నుంచి నాకు ఫోను వచ్చింది. అతనితో ఫోనులో మాట్లాడ్డం అదే మొదటిసారి. “లోపలే ఉండండి” అతను సలహా ఇచ్చాడు. ఇంటి నుంచి బయటకు రాకండి. శుక్రవారం ప్రార్థనల సమయంలో నివారించలేని కొన్ని పరిణామాలు జరగవచ్చు” అన్నాడు.
“అప్పటికి భారత సైన్యం నగరంలోకి ప్రవేశిస్తుందని అనుకుంటున్నారా?” అని నేను అడిగాను.
“అబ్బే అదేం కాదు అన్నాడు.
“అది కాకపోతే ఇంకేమిటి?” నేను ఆరా తీశాను.
“అనివార్యమైనది” అని మళ్లీ నొక్కి చెప్పాడు. “మన వాళ్లు ఆయుధాలు చేపడతారు” అన్నాడు.
జరిగిందేంటంటే అతను అప్పటికే తన అనుచరులకు వేలాది తుపాకులు పంచి పెట్టాడు. ఆరోజు మధ్యాహ్నం తర్వాత హిందువులను ఊచకోత కోయాలని వాళ్లకి ఆదేశాలు కూడా ఇచ్చాడు.


నేను చాలా భయపడ్డాను. ఇది చాలా తప్పు అని నేనతనికి చెప్పాను. భారత బలగాలు నగరానికి చేరుకుంటే మొత్తం హైదరాబాదే సర్వనాశనం అయిపోతుందని చెప్పాను. అయితే అతను వినే పరిస్థితిలో లేడు. రాజకీయాల నుంచి రిటైరయ్యే ముందు దయాదాక్షిణ్యాలతో వ్యవహరించాలని నేను అభ్యర్థించాను. అతను వినిపించుకోకుండానే ఫోన్ కట్ చేశాను. నేను నవాబ్ దీన్‌యార్ జంగ్ దగ్గరకు పరుగు తీశాను. ఖాసిం రజ్వీ అంటువంటి ఆలోచనతో ఉన్నట్లు ఆయనకు అప్పటికే సమాచారం అందింది. వెంటనే రిజ్వీకి ఫోన్ చేశారు. వాళ్లిద్దరూ అరగంటకు పైగానే మాట్లాడారు. దీన్‌యార్‌జంగ్ పాతికేళ్లకు పైగా ప్రజా జీవితంలో ఉన్నాడు. ఆయన ఎవ్వరినైనా దేని గురించి అయినా ఒప్పించగల నేర్పరి. అలాంటి దీన్‌యార్‌జంగ్‌కు అతని మొత్తం జీవితంలోనే ఎన్నడూ ఎదురుకాని విధంగా- 1948 సెప్టెంబరు 17 న ఆ అరగంట అతని నైపుణ్యానికి ఓ అగ్ని పరీక్షే అయ్యిందని చెప్పాలి. ఆ రోజు అతను సాధించింది హైదరాబాద్ ప్రజలకు అతను చేసిన అతి గొప్ప సహాయంగా మిగిలిపోయింది.

అరగంట మాటలూ పూర్తికాగానే ఖాసిం రజ్వీ తన అనుచరులను ఆయుధాలు అప్పగించాల్సిందిగా ఆదేశించాడు. అదే రోజు మరికొంతసేపటి తర్వాత లాయక్ అలీ, ఆయన మంత్రి వర్గం (సెప్టెంబరు 17 ఉదయాన) రాజీనామాలు సమర్పించి ప్రభుత్వ పాలనా పగ్గాలు నిజాంకు అప్పగించినట్లు వార్తలు వచ్చాయి. లాయక్ అలీ యే ఈ విషయాన్ని ప్రసార మాధ్యమాల్లో మాట్లాడుతూ నిర్ధారించాడు.

ఆరోజు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ సంస్థానమంతటా కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. జనరల్ ఎల్ ఇద్రూస్ అంతకు ముందురోజే నిజాం రాజును కలిసి మరింతగా ప్రతిఘటించడం వల్ల ప్రయోజనం ఉండకపోగా ప్రాణనష్టం భారీగా ఉండే ప్రమాదముందని సలహా ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి.

ఆ సాయంత్రమే ఖాసిం రజ్వీ తన వాణి వినిపించాడు. అతని గొంతు డెక్కన్ రేడియోలో చివరి సారి వినిపించింది. ఇచ్చిన హామీల మేరకు పనిచేయలేకపోయానని ఒప్పుకున్న రజ్వీ -పరిస్థితులే తనకు వ్యతిరేకంగా కుట్రపన్నాయని అన్నాడు. ఎవరెంతగా రెచ్చగొట్టినా ముస్లింలంతా ప్రశాంతంగా ఉండాల్సిందిగా రజ్వీ ఉద్బోధించాడు. హిందూ ముస్లింల మధ్యనున్న సంప్రదాయ ఐక్యత ఎట్టి పరిస్థితిల్లోనూ అలాగే కొనసాగాలని రజ్వీ ఆకాంక్షించాడు. గతంలో జరిగిన ఘటనలన్నీ మర్చిపోవాలని విజ్ఞప్తి చేశాడు. ఆ ప్రసంగం విన్న వారంతా కూడా అతని మొత్తం జీవితంలో అంత రాజనీతిజ్ఞతతో చేసిన ప్రసంగం మరోటి లేదని ఏకగ్రీవంగా అభిప్రాయపడ్డారు.
* * *


మరొక పెద్ద విషయాన్ని మీకు చెప్పి ముగిస్తాను. హైదరాబాద్‌కు, భారత దేశానికి మధ్య జరిగిన సంఘటనలను మనం ఎంత వరకు అర్థం చేసుకోగలం? 1947 -48 మధ్య జరిగిన సంఘటనలను సామాన్యంగా మనం భారతదేశం దృష్టి నుంచి, జాతీయోద్యమం దృష్టి నుంచి చూస్తాం. అది అంత ప్రయోజనకరమైన పద్ధతని నేను అనుకోను. ఎందుకంటే, ఆ దృష్టితో చూడడం ప్రారంభిస్తే హైదరాబాద్ తీసుకున్న నిర్ణయం చాలా తప్పుడు నిర్ణయమని, అంచనాలకు అందని నిర్ణయమని, ఐక్య భారతదేశ ఆవిర్భావమనే ఒక మహా కెరటానికి వ్యతిరేకంగా ఒక చిన్న రాష్ట్రం తన శక్తికి మించి పోరాడి, ఓడిపోయిందని భావించవచ్చు. ఇప్పటికే ఆ భావన స్థిరపడిపోయింది. హైదరాబాద్ అప్పట్లో తీసుకున్న చర్య చాలా అసంబద్ధ నిర్ణయమని, చివరికది తాను చేసిన తప్పుడు అంచనాలకు తానే ఫలితాన్ని అనుభవించిందని సాధారణ ప్రజానీకం చాలామంది భావించవచ్చు.

నిజానికి హైదరాబాద్ పిచ్చిదా? చెడ్డదా? దిద్దుకోలేని తప్పులు చేసిందా? ఒక శత్రువుకు సంబంధించి సాధారణంగా మనం ఎప్పుడూ తప్పుగానే ఆలోచిస్తుంటాం. కానీ తనను కలుపుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్న ఒక వర్గం చర్యలను అర్థరహితంగా, దాన్ని కలుపుకోవడానికి రెండో వర్గం చేస్తున్న ప్రయత్నాలకు ఎప్పటి నుంచో ఆమోదం ఉన్నట్లు మనం భావించడం సరైనదేనా? ఈ విధంగా మనం చరిత్రను విజేతల వైపు నుంచే చూస్తూ, దానికి వక్రభాష్యం చెప్పడం లేదా? దానికి బదులుగా ఒక చిన్న రాష్ట్రమైన హైదరాబాద్, తన కన్నా శక్తివంతమైన ప్రభుత్వంతో పోరాడిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచించినపుడు మనం పరిస్థితిని కొంచెం బాగా అర్థం చేసుకోవచ్చు. ఆ పోరాటానికి సంబంధించిన వివరాల్లోకి ఇప్పుడు వెళ్లడం అప్రస్తుతం. కానీ అప్పటి సంఘటనల్లో రెండు అసమాన ప్రభుత్వాల మధ్య జరిగిన పోరులో మనం అవి వ్యవహరించిన సాధారణ తీరుని పరిశీలించడం బాగుంటుంది.

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పారా మేడిక్స్ వారి ముందడుగు మాస పత్రిక –ఎడిటర్ పోస్ట్ర్-బాబు తో డాక్టర్ మూర్తి బాబు

babu tho munadugu murti baabu murti mundadugu_1oxidisation-1oxidisation-2anti oxidents-1anti oxidents-2

ఆక్సీ కరణ -డాక్టర్ జి.యెన్ జి. కృష్ణ మూర్తి

జీవ క్రియ రక్షకాలు (యాంటి ఆక్సిడే న్త్స్ )డాక్టర్ జి.యెన్ జి. కృష్ణ మూర్తి

 

Posted in ఆరోగ్యం | Leave a comment

కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -5

 కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -5

                        సాహిత్య సాంస్కృతిక వైతాళికుడు సురవరం ప్రతాప రెడ్డి -2

               సురవరం వారు గోల్కొండ పత్రిక లో రాసిన సంపాదకీయాలను చదివి ఎందరో ప్రభావితులయ్యారు .విషయ అవగాహనకు అవి బాగా తోడ్పడేవి .తెలంగాణా లో కవులే లేరని ఎవరో ఎద్దేవా చేస్తే తెలంగాణా కవుల రచనల నన్నిటిని సేకరించి గోల్కొండ పత్రిక లో ప్రచురించి దీటైన సమాధానమిచ్చారు .ఆ కవులను ఆంద్ర దేశానికి పరిచయం చేసి తన భాషాభిమానాన్ని చాటుకొన్నారు .ఆధునిక కదా రచయిత గా ప్రతాప రెడ్డి గారు ప్రసిద్ధి చెందారు .’’ప్రతాప రెడ్డి కధలు ‘’పేరిట ప్రచురితమయాయి .తెలంగాణా జీవితాన్ని ,భాషను కధల్లో ప్రతి ఫలింప జేశారు .ఆయనరాసిన ‘’నిరీక్షణ ‘’కద ఉత్తమమైనదని విమర్శకాభి ప్రాయం .అధిక్షేపం అంటే ‘’సటైర్ ‘’తో కొన్ని కధలు రాశారు .దేశభక్తుల ,ధర్మవీరుల ,వీర శిఖామణుల జీవిత చరిత్రలు రాసి చరిత్ర లో వారికి గొప్ప స్తానం కల్పించారు .రాజ బహదూర్ వెంకట రామి రెడ్డి గారి జీవిత చరిత్రను శ్లాఘనీయం గా రచించారు

 

 

 

                చారిత్రిక పరిశోధక పరబ్రహ్మ

   ఇవన్నీ ఒక ఎత్తు అయితే వారి పరిశోధన మరో ఎత్తు .ఇవీ బహుళ ప్రచారం పొందాయి .’’హిందువుల పండుగలు‘’ను మంచి శైలిలో ,ప్రామాణికం గా రాశారు .పండుగల ప్రాధాన్యాన్ని ,అందులో చారిత్రిక ,శాస్త్ర రహస్యాలను తెలియ జేసి మహోపకారం చేశారు .దీనికి మహాతత్వ వేత్త ,భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ పండితుడు పీఠిక రాయటం బంగారానికి తావి అబ్బి నట్లయింది .రామాయణం లోని అనేక విషయాలను విశ్లేషించి వెలుగు లోకి తెచ్చారు .’’ఆంధ్రుల సాంఘిక చరిత్ర ‘’సురవరం వారి అపూర్వ సృష్టి .అప్పటికీ ఇప్పటికీ ఉత్తమ గ్రంధం గా అగ్రభాగాన నిలిచింది .ఒక రకం గా ఇది తెలుగు వారి జీవన సర్వస్వం అన వచ్చు .క్రీ.ష.1050 – నుంచి 1950 వరకు అంటే 900సంవత్సరాల మధ్య ఉన్న కాలానికి సంబంధించిన ఆంధ్రుల సాంఘిక చరిత్ర ఇది .కళలు మతం ,రాజకీయాలు ,వ్యాపారం ప్రజా జీవన సరళి వినోదం విజ్ఞానం ,ఆచారాలు ,అలంకరణలు ఆటలు ,పాటలు ఒకటేమిటి సర్వస్వాన్ని మన ముందుంచిన అపూర్వ పరిశోధన గ్రంధం .కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు పొందిన మొట్ట మొదటి తెలుగు పుస్తకం .మన చరిత్రను ఆవిష్కరించిన మహనీయ గ్రంధం .ఉత్రేక్షలు ,ఉపమానాలు లేకుండా నిసర్గ రమణీయం గా ,సూటిగా ,హృదయాలకు హత్తుకొనేలా కదా కదన పద్ధతిలో సాగిన అద్భుత రచన .ఆంధ్రుల బహుముఖీన వికసనానికి నిలు వెత్తు దర్పణం .ఇదొక్క పుస్తకం చాలు రెడ్డి గారిని చిరస్మరనీయుడిని చేయటానికి అందుకే పరిశోధక పరమేష్టి అని పించుకొన్నారు .సువారవరం పేరు చెబితే ముందు గుర్తొచ్చేది ఆంధ్రుల సాంఘిక చరిత్ర .ఆ పుస్తకం పేరు చెబితే గుర్తొచ్చేది ప్రతాప రెడ్డి గారు .

               ఇది కాక ,’’సంఘోద్ధరణ ‘’’’,గ్రామ జన దర్పణం ‘’,’’నిజాం రాష్ట్ర పాలన ‘’,మొదలైన పరిశోధనా గ్రంధాలూ రెడ్డి గారు రాశారు .’’యువజన విజ్ఞానం ‘’వీరి మరో రచన .ప్రజల ప్రాధమిక హక్కుల గురించి ‘’ప్రజాదికారాలు ‘’అనే ఉప యుక్త గ్రంధం రాశారు .ఎన్నో గ్రంధాలకు పీఠికలు రాసి ‘’పీఠికాదిపతి ‘’అని పించుకొన్నారు .’’తెలుగు లిపి–సంస్కరణ ‘’పై పుస్తకం రాశారు .సురవరం స్పృశించని ప్రక్రియ లేదు .స్పృశించి స్వర్ణం గా మార్చని ది లేదు .ఆయన రాసింది అంతా పరమ ప్రామాణిక మైనదని నిర్ధారించారు .ఇంతటి తో ఆగిపోలేదు ‘’వ్యక్తి చిత్త్రణ ‘’లో సిద్ధ హస్తులైనారు .మాడపాటి హనుమంత రావు గారిని గురించి సురవరం ఉ రాసిన వ్యక్తి చిత్రణ అంటే ‘’ప్రొఫైల్ ‘’ఒక కళా ఖండం అంటారు దేవుల పల్లి రామానుజం గారు .

        అనేక మంది యువకులను ప్రోత్సహించి రాయించి పత్రికలో ప్రచురించేవారు .వెర్రి వెంగళప్ప ,గద్వాల సిద్ధాంతి ,చిత్రగుప్త ,భావకవి రామ మూర్తి ,శ్రీశకుమార్ ,యుగపతి అనే మారు పేర్ల తో చాలా రాశారని రామానుజ రావు గుర్తు చేసుకొన్నారు .’’ప్రజా వానణి ‘’అనే దిన పత్రికనూ కొంతకాలం రెడ్డి గారు నడిపారు .పత్రికా ముఖం గా వాదోప వాదాలను ఆహ్వానించే వారు ‘’శ్రీ కృష్ణునికి మీసము లుండేడివా ?”’’’జంగాలు బ్రాహ్మనులా ?’’,’’స్త్రీకి స్వాతంత్రం అవసరమా ?’’మొదలైన విషయాల పై పత్రికలో చర్చలు జరిపించేవారు .

       సురవరం వారు వెయ్యికి పైగా వ్యాసాలూ రాశారని అంటారు .వారిది విలక్షణ మైన వ్యక్తిత్వం .తెలంగాణా నుడికారానికి వారి రచనలు ఆయువు పట్టు .ఆయన ఉదార చరితుని గా లబ్ధ ప్రతిష్టితుడు .కాలా తీత వ్యక్తీ అని పించుకొన్నారు .ఆయనది ప్రతిఫలం ఆశించని త్యాగం .’’త్యాగం ,దేశభక్తి ,భాషాభిమానం ,స్వతంత్ర కాంక్ష ,ప్రజా శ్రేయస్సు ,దేశాభ్యుదయం కోసం సర్వస్వం సమర్పించిన నిత్య సంగ్రామ శీలి ప్రతాప రెడ్డి గారు .నాయకుడు ,వక్త ,దేశ భక్తుడు గ్రంధాలయోద్యమ సారధి ,సంస్కారి ,పత్రికాధి పతి వైతాళికుడు ప్రతాప రెడ్డి ‘’అని కీర్తించిన రామానుజ రావు గారి మాటలు ప్రత్యక్షర సత్యాలు ఇదీ ప్రతాప రెడ్డీయం ,ప్రతాప రెడ్డి యశో భూషణం 1953 లో యాభై ఏడేళ్ళ వయసు లో ప్రతాప రెడ్డి గారు పరలోకం చేరారు .

                రెడ్డిత్రయం లో రామ లింగా రెడ్డి మేధో జీవి.రామిరెడ్డి హృదయ వాది .ప్రతాప రెడ్డి కార్య శీలి ,ప్రజాభ్యుదయ పదగామి నిత్య చైతన్య శీలి .ముగ్గురూ ముగ్గురే .మార్గాలు  భిన్నాలు .లక్ష్యం ఒక్కటే .సత్య శివ సుందరాలే ఈ ముగ్గురు అని విశ్లేషకాభి ప్రాయం .ఇదే తెలుగు సాహితీ త్రివేణీ సంగమం .అయితే అంతర్వాహిని గా సరస్వతి ముగ్గురిలోనూ ఉంది .శిఖర ప్రాయమైన వారు .ఆధునిక వాజ్మయ శిఖరాలు అవి .కట్టమంచి కొన్ని రచనలే చేసి మంచి కట్ట వేస్తె ,దున్నేవాడిని రైతును కదా నాయకుడిని చేసి కోమల ,లలిత రచనలు చేసి అనువాదానికి మార్గ దర్శి  అయారు రామి రెడ్డి .ఇక సురలోక వరం భూలోక పరమైంది ప్రతాప రెడ్డి తో .విస్తృత రచనలు సర్వ ప్రక్రియలతో సరస్వతికి విశేష ఆభరణాల నలంకరించారు .భాషాభిమానం ,దేశాభిమానం ,ఒడ్డుల నొరసి రెడ్డి గారిలో ప్రవహించింది .ఆంధ్రుల చరిత్రకు ఒక అర్ధాన్ని ,పరమార్ధాన్ని సంతరించింది కళా ప్రపూర్నులే ప్రాతస్మరనీయులే వైతాళికులే .వేమన్న తర్వాతా  రెడ్లరచనలు ఈ ముగ్గురి ద్వారానే ప్రజల్లోకి ప్రవహించాయి .నిత్య నూతనం గా భాసించాయి .చరితార్ధతను పొందాయి .’’హాట్స్ ఆఫ్ టు ట్ర యంవీరో ‘’

          మరో కవి గురించి మళ్ళీ మాట్లాడుకొందాం

             సశేషం –మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ -4-4-13-ఉయ్యూరు 

 
 
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నా దారి తీరు -21- కొన్ని కుటుంబ విషయాలు

నా దారి తీరు -21-

            కొన్ని కుటుంబ విషయాలు

     అప్పటికే మాకు నాలుగో అబ్బాయి వెంకట రమణ పుట్టాడు .ఇల్లంతా పిల్లల లతో సందడి గా ఉండేది .ఒక పక్క ట్యూషన్ ఇంకోపక్క పొలం పనులు ,పాలేళ్ళ మీద అజమాయిషీ ,’’పార్ధి గారి పార్లమెంట్’’ పార్ధి గారి పార్లమెంట్కు రాత్రిళ్ళు వెళ్లి కూచోవటం ,సాయంకాలం లో ఆర్ .ఎస్.ఎస్.శాఖా కార్యాలకు హాజరవటం .క్షణం తీరిక లేకుండానే కాలం గడిచి పోయేది .హైస్కూల్ లో సైన్సు రూమ్ నే సాహితీ క్షేత్రం గా సాహిత్య కార్యక్రమాలు నిర్వహించటం .వీటికి తోటి ఉపాధ్యాయుల సహకారం అందించటం అన్నీ జరిగాయి .సంక్ర్తాంతి, ఉగాది లకు స్కూల్ లోనే సాయం వేళ కవి సమ్మేళనాలు నిర్వహించాను వీటికి స్వర్గీయ టి.ఎల్.కాంతా రావు ,వి.రామ కృష్ణా రావు ,అన్నే పిచ్చి బాబు ,తెలుగు మేస్టారు జ్ఞానసుందరం ,లెక్కల మేస్టారు ఆంజనేయ శాస్త్రి ,హిందీ మేస్టర్ర్ కొడాలి రామా రావు నాకు బాసట గా నిలిచే వారు .బెజవాడ ఆకాశ వాణి నిర్వహించే కవి సమ్మేళనాలకు మమ్మల్ని ప్రోత్సహించి కాంతా రావు తీసుకొని వెళ్ళేవాడు .అక్కడ బాగా ఆనందించే వాళ్ళం .అప్పటికే కాంతా రావు రేడియో ప్రసంగాలు చాలా చేశాడు .భారతి పత్రిక అతడిని అడిగి వ్యాసాలూ రాయించు కొనేది .అతను మా ఇంటి ప్రక్కనే కాపురం ఉండేవాడు భార్య కమలమ్మ మంచి ఇల్లాలు .అప్పటికే ‘’మందు బాబు ‘’అయ్యాడు .సిగరెట్లూ బానే తాగే వాడు .ఒక ఆడపిల్ల, మొగపిల్లాడు .ఇదంతా ఒక బృందం గా గడిపాం.సూపర్వైజర్ పూర్ణ చంద్ర రావు గారు కూడా ఇందులో ముఖ్యులు. చాలా సరదా అయిన వారు .సాహిత్యం మీద మక్కువేమీ లేకపోయినా మాకోసం సరదా గా వచ్చేవారు .ఆయన ఇంటి దగ్గర మాకు టిఫిన్ పార్టీలు ఇచ్చేవారు బలే మాటకారి .అలాగే చెరుకు డెవలప్ మెంట్ ఆఫీసు అధికారి మీసాల వెంకట రెడ్డి గారు మాతో కలిసే వారు కాంతా రావు పక్క ఇంట్లోనే ఆయన కాపురం కూడా .పూర్ణ చంద్ర రావు గారమ్మాయి  నా దగ్గర ట్యూషన్ చదివింది .చిన్నబ్బాయి కూడా .కొందరు అబ్బాయిలు ,అమ్మాయిలూ మెట్రి పరీక్షల్లో లెక్కల్లో తప్పి నా దగ్గర ట్యూషన్ చదివే వారు .వాళ్లకు నా ట్యూషన్ పిల్లలు వెళ్ళిన తర్వాతో ఆది వారాల్లోనో ప్రైవేట్ చెప్పే వాడిని .వారంతా బాగా చదివి పాసయ్యేట్లు చేశాను .హైస్కూల్ లో ‘’వేమన త్రిశతి ‘’జయంతి ని చాల ఘనం గా నిర్వహించాం .ప్రఖ్యాత విమర్శకుడు ఆచార్య జి.వి.కృష్ణా రావు గారిని ముఖ్య అతిధి గా ఆహ్వానించి సత్కారం చేశాం.ఆ నాటి సభకు ఇంద్ర గంటి శ్రీ కాంత శర్మ గారిని ఆహ్వా నిన్చాం .ఆయన వచ్చి సభను సు సంపన్నం చేశారు అలాగే అద్దేపల్లి రామ మోహన రావు తరచుగా మా సభలకు వచ్చేవారు .శ్రీ కాంత శర్మ ఒక రోజంతా రాత్రి ఇక్కడే మాతో గడపటం చిరస్మరణీయం .అలాగే మా వంగల కృష్ణదత్త శర్మ గారింట్లో ఏ.బి.ఆనంద్ ,నండూరి సుబ్బారావు సుమన్ మొదలైన రేడియో ఆర్టిస్టులు మా కోరిక పై వచ్చి మధుర సాయంత్రం గడపటం మరిచి పోలేను .వెన్నెల రాత్రిలో మా ఇంట్లో సాహితీ సమ్మేళనం నిర్వహించాను .అందరికి వేడి వేడిగా టిఫిన్లు టీలు తో చర్చలతో కాలమే తెలియ కుండా గడిపాం .ఇవన్నీ మధురమైన అనుభవాలే .మా గురువు గారు పెద్ది భొట్ల సుబ్బ రామయ్య గారితో మను చరిత్ర పై ఉపన్యాసం ఇప్పించాం .మా మోపిదేవి మిత్రులు లెక్కల మేష్టారు రమణ రావు ,నరసింహా రావు ,’’వాసన మేష్టారు’’ సత్యనారాయణ లతో ఒక సాయంత్రం హుషారుగా గడపటం గురించి ఇదివరకే చెప్పాను .ఆర్.ఎస్.ఎస్.వారుపౌర్ణమి నాడు  నిర్వహించే ‘’కోజాగిరి‘’కి హాజరయ్యే వాడిని .ఇలా కాలక్షేపం బానే జరిగి పోతోంది .మాకు సాహితీ మిత్రులుగా ప్రముఖ అనువాదకులు‘’రావూరి భరద్వాజ ,ప్రముఖ నవలా కారుడు తమిళుడు అయిన ‘’శారద ‘’అనే శ్రీనివాసన్   లకు మిత్రుడు తెనాలి వాడు హిందీ మేష్టారు అయిన శ్రీ ఆలూరి భుజంగ రావు ,కే.సి.పి.లో కెమిస్ట్ టి.వి.సత్యనారాయణ ,మునసబు కోటేశ్వర రావు ఉన్నారు .

                                మామ్మ మరణం

          మా రెండో అబ్బాయి శర్మ పుట్టిన తర్వాత మా మామ్మ నాగమ్మ గారు పెద్ద అనారోగ్యం పాలు అవకుండా చని పోయింది సుమారు 85 ఏళ్ళుఆప్యాయత కు మరో పేరు మామ్మ నాగమ్మ గారు మంచి ఆరోగ్యం తో జీవించింది మామ్మ .చిన్నతనం లోనే అంటే మా నాన్న గారు మృత్యుంజయ శాస్త్రి గారు జన్మించిన కొద్ది నెలలకే భర్తను కోల్పోయిన అభాగ్యురాలు మామ్మ .అప్పటి నుంచి ఉయ్యూరు లో పుట్టింట్లోనే ఉందికొడుకు ను పెంచుకొంటూ .ఇప్పుడు మేముంటున్న ప్రక్క ఇల్లే మామ్మ పుట్టిల్లు .మా మామ్మ కు ఒక అక్కయ్య ,ఇద్దరు చెల్లెళ్ళు .వీళ్ళలో ఎవరికి ముందు మగ పిల్లాడు జన్మిస్తే వారికి తన ఆస్తి నంతా రాసిస్తానని మా మామ్మ తండ్రి గుండు లక్ష్మీ నరసింహవధనులు గారు అన్నారట .మా నాన్న గారు ముందు పుట్టటం వల్ల ఆయన పేరా ఉన్న ఉయ్యూరు లోని కాటూరు లోని ఇల్లు ,పొలాలు మా మామ్మ గారి కొడుకు మా తండ్రి గారు అయిన మృత్యుంజయ శాస్త్రి గారికి ‘’దౌహిత్రుని ‘’హోదాలో సంక్రమించేట్లు విల్లు రాశారు .ఇది మా మిగిలిన నాయనమ్మలకు గుర్రు గా ఉన్నా తప్పక ఒప్పుకోన్నారట .మళ్ళీ అందరూ కలిసి పోయారు .నరసిమ్హావదాను లు గారే ఉయ్యూరు లో రావి చెట్టు బజారు లో స్వంత స్థలం లో శ్రీ సువర్చ లాంజనేయ స్వామి వారిని ప్రతిష్టించి దేవాలయం నిర్మించారు సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు.అప్పటి నుండే అది ‘’గబ్బిట ‘’వారి దేవాలయం అని పిలువ బడేది .మా తాత గారి తర్వాత మా నాన్న గారు వంశ పారంపర్య ధర్మ కర్తలయారు .ఆ తర్వాతా నేను ధర్మ కర్త గా వ్యవహరిస్తూస్వామి సేవ లో  జీవితాన్ని పండించుకొంటున్నాను ..

              మా నాయనమ్మ ను మామ్మ అని పిలవటం మాకు అలవాటు .ఆవిడ జ్ఞాపకం తో ఇవన్నీ రీళ్ళు గా తిరిగాయి ,చివరి వరకు ఆమె పూర్తీ ఆరోగ్యం గా ఉండేది .పళ్ళు కూడా ఊడలేదు .కళ్ళు బాగా కని పించేవి కళ్ళ జోడు అవసరం లేకుండా సూదిలో దారం గుచ్చెది .నాకు మా తాతగారి పేరు దుర్గా పతి శాస్త్రి గారి పేరు పెట్టారు .నాకు గ్రాహకం తెలిసిన తర్వాతా నేనే ‘’దుర్గా ప్రసాద్ ‘’అని మార్చుకొన్నాను .అందుకని మామ్మ నన్ను పేరు పెట్టి పిలిచేది కాదు ‘’పెసాదూ’’అని మాత్రమె పిలిచేది .నేనంటే మామ్మకు విపరీత మైన అభిమానం .కానీ మేము ఆమె ను తక్కువ చూపు చూసే వాళ్ళమేమో నని పించేది వేళా  కోళ మాడే వాళ్ళం .ఆమె వంటను విమర్శించే వాళ్ళం .మేమే కాదు మా నాన్న కూడా ఆమె ను ఆట పట్టించేవాడు .కాని అన్నిటికి నవ్వే ఆమె సమాధానం .ఏమీ అనేది కాదు అత్తగారు అంటే మా అమ్మకు గౌరవమే కాని ఎందుకో అంతగా పట్టించుకోనేది కాదు .1961 లో మా నాన్న గారి మరణం మామ్మ  ను కుంగదీసింది .తను జీవించి ఉండగానే కొడుకు ను పోగొట్టుకొని గర్భ శోకాన్ని అనుభవించింది .అంతకు ముందు మా అన్నయ్య మరణం కుటుంబం లో విషాదాన్ని తెస్తే ,కొడుకు మరణం మళ్ళీ ఆమెను ఇబ్బంది పాలు చేసింది .అయితే మా నాన్న కాని మా అమ్మ కాని నేను కాని ఆమె కు ఏ లోటు రాకుండా చూసుకొన్నాం .అందుకే మేమంటే మహా ప్రాణం ఆమెకు .మా ఆవిడ ప్రభావతి ని బుగ్గలు గిల్లి ముద్దు పెట్టుకొనేది .మా పెద్దబ్బాయి శాస్త్రి ని ఉయ్యాల్లో  ఊపేది .ముని మనవడిని చూసుకొన్నది . అంతకు ముందే మా అన్న పిల్లలూ ,మా అక్కయ్య పిల్లలూ ఉన్నారనుకోండి …మా రెండో అబ్బాయి శర్మ పుట్టిన కొద్ది నెలలకే మామ్మ మరణించింది అని ముందే చెప్పాను .   కొద్ది రోజులు కొంచెం ఆరోగ్య భంగం కలిగింది మామ్మకు.తన పనులు తాను చేసుకొనేది .మాకేమీ ఇబ్బంది కలిగించలేదు .నేను ఒకసారి  ‘’ మామ్మా ! నాకు సెలవులన్నే అయి పోయాయి .కాస్త నా మీద దయుంచి సెలవల్లో చని పోతే మంచిది ‘’అన్నాను అమాయకం గానో, అతి తెలివితోనే ,ఒళ్ళు బలిసో .’’ఆవిడ దాన్ని లైట్ గా తీసుకొని‘’అలాగేరా పెసాదు .నీకు ఇబ్బంది కలిగించకుండా నే పోతాను .’’అంది .అలానే ఆవిడ దసరా సెలవుల్లో ‘’దుర్గాష్టమి‘’నాడు మామ్మ చని పోయింది .అదీ మనవడి మీద అభిమానం .కార్య క్రమాలన్ని మా మామయ్య ఆధ్వర్యం లో ఘనం గా నే నిర్వహించాం ఉడక శాంతి నిర్వహించాం .అప్పటి నుంచి అంటే1969 నుంచి  ఇప్పటి దాకా మామ్మ ఆబ్దికాలు పెడుతునె ఉన్నాను .అమెరికా వెళ్ళినప్పుడు తప్ప .లేక పోతే ఎవరైనా బ్రాహ్మడిని పిలిచి కాళ్ళు కడిగి దక్షిణా తాంబూలం ఇవ్వటం చేసే వాడిని .రెండేళ్ళ క్రితం శ్రీ శైలం దేవాలయం లో మామ్మ పేర ఆమె చనిపోయిన దుర్గా స్టమి  నాడు ఉచిత భోజనం పెట్టటానికి ‘’కరివేన వారి నిత్యాన్న దాన బ్రాహ్మణ సత్రం ‘’లో రెండు వేల రూపాయలు శాశ్వత నిధికి జమ చేశాను .ఒక వేళనాకు ఆమె తిది పెట్టె వీలున్నా లేకున్నా ఆ నాడు ఆమె పేర భోజనం పెట్టె ఏర్పాటు ఇది .అదొక తృప్తి మాత్రమె .

                         పదవతరగతి తో హైస్కూల్ చదువు పూర్తీ

       మేమంతా ఏ.ఎస్.ఎల్.సి.అంటే సెకండరి స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ చదివిన వాళ్ళం . .ఇప్పటిదాకా హైస్కూల్ స్థాయి అదే ఉంది కాని ప్రభుత్వం మార్పులు చేసింది .సెకండరి స్థాయి పదవతరగతి తో ఆఖరు చేసింది .కొంతకాలం ఎస్.ఎస్.ఎల్.సి ,పదవతరగతి అనే ఎస్.ఎస్.సి రెండు ఉండేవి తర్వాత మొదటిది రద్దు అయి రెండోదే. అంటే సెకండరి స్తాయి విద్య పదవ తరగతి తో ఆఖరు అన్నమాట ఈ సంధి కాలం లో ఉన్న వారందరూ పాస అవటానికి కొంతకాలం అవకాశమిచ్చారు .ఇప్పుడిదే ఎస్.ఎస్.ఎస్.సి.నడుస్తోంది .ఇంటర్ రెండేళ్ళు వచ్చింది .డిగ్రీ రెండేళ్ళు .అంతకు ముందు పి.యు.సి.ఉంది ఇంటర్ మూడేళ్ళ కోర్సు గా ఉండేది .జూనియర్ కళా శాలలేర్పడదతటానికి ముందు హయ్యర్ సెకండరి స్తాయి స్కూళ్ళు కొన్ని చోట్ల పెట్టారు .ఆకునూరు అడ్డాడడ నూజివీడు మొదలైన చోట్ల ఉండేవి .దీని లో బోధనకు ఏం.ఏ.లేక ఏం.ఎస్.సి అర్హత కావాల్సి వచ్చేది .అవీ క్రమం గా మూసేసి  మేస్టర్లకు లెక్చరర్లు గా ప్రిన్సిపాల్స్ గా అవకాశాలు వచ్చాయి .తర్వాత జూనియర్ కళా శాలలేర్పడ్డాయి ..ఇవన్నీ పదేళ్లలోపుజరిగిన  మార్పులే .,

                     సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –3-4-13- ఉయ్యూరు –

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -4

 కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -4

             ఆంద్ర సాహిత్య సంస్కృతీ వైతాళికుడు సురవరం ప్రతాప రెడ్డి –1

       రెడ్డి త్రయం లో మూడవ వారే సురవరం ప్రతాప రెడ్డి .తెలుగు వైతాళికుడు అన్న మాట ను సార్ధకం చేసుకొన్నారు .గద్వాల సంస్థానానికి రాజధాని అయిన ‘’బోరవెల్లి ‘’గ్రామం లో 1896 మే నెల 28 న జన్మించారు .స్వగ్రామం అలంపురం తాలూకా ఇటికాల పాడు  ..ఆ తాలూకా ‘’మాల్గొవా మామిడి పండ్ల‘’కు ప్రసిద్ధి .మద్రాస్ లో’’ లా ‘’పట్టా పొందారు .వేదం వెంకట రాయ శాస్త్రి గారి వద్ద సంస్క్రుతాన్ద్రాలను క్షుణ్ణం గా అభ్యసించారు .చిన్నతనం నుంచే తెలుగులో కవిత్వం చెప్పటం అలవడింది .నెమ్మదిగా సాహిత్యం వైపు ద్రుష్టి సారించి జీవితాంతం సాహితీ సేవ చేస్తూ గడిపారు .సాహితీ  విరాన్మూర్తి  అని పించుకొన్నారు .మానవల్లి రామ క్రిష్నయ్య పంతులు గారితో ఏర్పడిన సాన్నిహిత్యం సాహిత్యోప జీవిని చేసింది .

           ఆ సమయం లో హైదరాబాద్ నిజాం నవాబు వశం లో ఉండేది .సురవరం వారు అన్నట్లు‘’తౌరక్యాంధ్ర సంస్కృతికి ఆలవాలం ‘’గా ఉండేది .రెడ్డి గారు తమ మకాం హైదరా బాద్ కు మార్చారు స్వాతంత్ర ఉద్యమం ఉద్ధృతం గా ఉన్న రోజు లవి .తెలంగాణా బాగా వెనక బడి ఉంది .ప్రజలు నిరక్ష రాస్యులు .బీదరికం పెనుభూతమై పట్టి పీడిస్తోంది . ఉర్దూ తప్ప తెలుగు విని పించని పరిస్తితి .ప్రజలకు ప్రాధమిక హక్కులే లేవు .ఇవన్నీ స్వయం గా చూసి చలించి దేశ సేవా ,ప్రజాసేవ తన కర్తవ్యమ్ గా భావించారు .సంఘ సంస్కరణ ,మాత్రు భాషా భి వృద్ధి తక్షణ కర్తవ్యం అనుకొన్నారు .ప్రజల్ని చైతన్య వంతుల్ని చేయాలి .దానికి సాధనం పత్రికా నిర్వహణే అని నిర్ణయించుకొన్నారు .అప్పటికే మాడపాటి హనుమంత రావు గారు ఆంధ్రోద్యమం లో పూర్తిగా అంకిత మై పని చేస్తున్నారు.ఆయనతో పాటు‘’గోలకొండ పత్రిక ‘’ను 10-5-1926 న స్తాపించారు .నాంపల్లి అబిడ్స్ నుంచి మకరం జహి మార్కెట్ కు వెళ్ళే దారిలో పత్రిక ఆఫీసు ఉండేది .ఆ దారి గుండానే నిజాం నవాబు కింగ్ కోఠీకి వెళ్ళేవాడు సాధారణ మైన ధోవతి ,షర్టు ధరించే వారు రెడ్డిగారు .గాంభీర్యం తో కూడిన నిండైన విగ్రహం .మాట పెళుసు .మనసు నవనీతం అని అంతా చెప్పేవారు .’’ఆంద్ర భాషా సేవ, కులమత జాతి విచాక్ష ణతలేని విధం గా ఆంధ్రుల అభివృద్దే తమ పత్రిక ధ్యేయం గా ప్రకటించి అనుసరించారు .ఎన్నో ఒడిదుడుకు లకు లోనైనారు .ధనార్జన ధ్యేయం కాదు .త్యాగాన్ని తన మార్గం గా భావించి అభ్యుదయం కోసం అహరహం కృషి చేసిన ధన్య జీవి .చేతలతో ఆదర్శాన్ని నిరూపించిన మార్గ దర్శి మహనీయుడు సురవంరం ప్రతాప రెడ్డి గారు తెలంగాణా కే కాదు సర్వ ఆంద్ర దేశానికి ఆయన ఒక వరం .

                        బహుముఖ ప్రజ్ఞ

సంఘం లో మార్పు రాలేక పోతే వికాసం ఉండదుకనుక గొప్ప పాండిత్యాన్ని సాదించుకొన్నారు .ఆ మార్పు కై ధన, మన, ప్రాణాలను అర్పణ చేసి పని చేసిన నిస్వార్ధ మూర్తి .ఇంగ్లీష్ ,ఉర్దూ లలో గొప్ప పాండిత్యాన్ని సంపాదించారు .విజ్ఞానాన్ని అందిపుచ్చుకొన్నారు .మేధావి గా సంఘం లో గుర్తింపు పొందారు .గొప్ప వక్త గా మంచి విమర్శకుడు గా ఖ్యాతి పొందారు .వీటికి మించి మహా పరిశోధకుడు అని పించుకొన్నాడు .నిరంతర గ్రంధ పఠనం లో మునిగి తేలేవారు .వాటి పై తోటి వారితో చర్చించే వారు .కాని నవాబు శాసనాలు చాలా కఠినం గా ఉండేవి ఆ నాడు .వాక్కు ,పత్రికా స్వాతంత్రాలు మ్రుగ్యమే .సభలు ,సమావేశాలకు అనుమతి లేదు .ఈ స్తితినే రెడ్డి గారు వ్యంగ్యం గా ‘’వాగ్బంధన శాసన శృంగార తాండవ విశేషం ‘’అన్నారు .1924- 29 కాలం లో ‘’రెడ్డి విద్యార్ధి వసతి గృహ సంస్థ ‘’కు నిర్వాహకులు గా పని చేశారు.అమ గ్ర్సందాలయాన్ని ,అముద్రిత తాల పత్రాలను దానికి అందజేశారు .1927 లో ఏర్పడిన ‘’ఆంద్ర మహాసభ ‘’కు మొదటి అధ్యక్షులయారు .అందరు తెలుగే మాట్లాడాలని తీర్మానించారు .వనపర్తి నియోజక వర్గం నుంచి హైదరాబాద్ కు శాసన సభ్యులు గా ఎన్నికై రాజకీయ ప్రక్షాలనానికి పూను కున్నారు .పెదపాలెం గ్రంధాలయానికి అధ్యక్షులు గా ,ఆంద్ర ప్రదేశ్ గ్రంధాలయ సంఘానికి ఉపాధ్యక్షులుగా ,ఎన్నికయారు .గ్రంధాలయోద్యమాన్ని భుజ స్కందాల పైధరించి అభి వృద్ధికి తీవ్ర కృషి చేశారు .1940 లో‘’గ్రంధాలయోద్యమం ‘’అనే పుస్తకం రాసి ప్రచురించారు .’’ఆంద్ర సారస్వత పరిషత్తు ‘’ను స్తాపించి 1944-45కు అధ్యక్షులైనారు ‘’విజ్ఞాన వర్దినీ పరిషత్ ‘’కు వ్యవస్థాపక అధ్యక్షులయారు .ఆయుర్వేదాన్ని క్షున్నం గా అధ్యయనం చేసి ఆరోగ్య రహస్యాలను జన సామాన్యానికి అంద జేశారు .హైదరాబాద్ ఆయుర్వేద సంస్థ ను స్తాపించి అధ్యక్షులై పెంచి పోషించారు రెడ్డి గారు .

               సాహితీ సేవ

     ప్రతాప రెడ్డి గారు కవి ,నాటక రచయిత ,నవలా కారుడు ,పరిశోధకుడు గా తమ రచనా ప్రతాపాన్ని చూపించారు .ప్రజలను ప్రభావితులను చేశారు .వివిధ ప్రక్రియలలో సుమారు 40 గ్రంధాలు రచించారు .ఇవన్నీ గ్రాంధికం లో రాసిన రచనలే .’’ఆరె వీరులు ‘’అనే నవల రాశారు .ఇంకో నవల రాసి నట్లుంది కాని అముద్రితం.’’భక్త తుకారాం ‘’’’ఉచ్చల విషాదం ‘’అనే రెండు నాటకాలు రాశారు మొదటి నాటకం లో దేశాభి మానం ,కులరహిత సమాజనిర్మానం కోసం అయితే ,రెండోది అచ్చం గా దేశ భక్తీ ని బోధించేది .పాటలు ,పద్యాలు గంభీర సంభాషణ లతో నాటకాలు రక్తి కట్టాయి .చాలా మంది నటులు వీటిని చక్కగా ప్రదర్శించే వారు .ఆయన మొదటి కావ్యం ‘’చంపకీ భ్రమర విలాపం ‘’తర్వాత ‘’ప్రేమార్పణం ‘’’’హంవీర సంభవం‘’,’’ధర్మాసనం ‘’,’’మద్య పానం  ‘’కావ్యాలు రాశారు .ప్రజలలో దేశ భక్తిని రాగుల్కొల్పటానికి మంచి పాటలు రాశారు .అవన్నీ విపరీతం గా ప్రచారం లోకి వచ్చాయి .క్రమంగా పద్య రచన తగ్గించుకొని వచనం లోకి మళ్ళారు .భావ వ్యాప్తికి ,ప్రచారానికి ,ఉత్తేజానికి వచనం బాగా తోడ్పడింది .

               సశేషం

              మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ –3-4-13-ఉయ్యూరు 

Posted in రచనలు | Leave a comment

శ్రీ కృష్ణునివయసు-125 ఏళ్ళే

sri krishnuni vayasu 125 yelle

Posted in సేకరణలు | Leave a comment

ద్వారం వెంకట స్వామి నాయుడు గారి పై స్వర్గీయ సశ్రీ రంగం నారాయణ బాబు కవిత

dvaram pai narayana babu

Posted in కవితలు | Tagged | Leave a comment

సాంకేతికతకు అందని మానవత్వం

sankethikathaku andani maanavatvama.c library opening

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నా పేరడీ మరియు నల్లోరి బసవ లింగం గారి ప్రశంశ

vishvanadha vachananiki peradinalluri basavalingam kavitha

Posted in రచనలు | Tagged | Leave a comment