నా పేరడీ మరియు నల్లోరి బసవ లింగం గారి ప్రశంశ

vishvanadha vachananiki peradinalluri basavalingam kavitha

Posted in రచనలు | Tagged | Leave a comment

ఇంగ్లాండ్ సాహస కన్య గ్రేస్ డార్లింగ్–విహంగ వెబ్ మేగజైన్ లో ప్రచురితం

ఇంగ్లాండ్ సాహస కన్య గ్రేస్ డార్లింగ్

 అపాయం లో ఉన్న వారిని రక్షించటం కనీస మానవ ధర్మం .దానికి ఆడా  మగా తేడా లేదు .సాయమ అందుకొనే వారు  తన వారా ,పరాయి వారా అన్న భేదం ఉండదు .ఆర్తులను కాపాడటమే ధ్యేయం .దీనికి సాహసం, ధైర్యం కావాలి .ఆ రెండూ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాయి .సంకల్పం గట్టిదైతే కృషి తప్పక ఫలిస్తుంది .అలాంటి అద్భుత సాహసం చేసి తీవ్ర ప్రమాదం లో చిక్కుకొన్న నావికా ప్రయాణీకులను అరుదైన ధైర్య సాహసాలతో రక్షించిన మానవీయ మూర్తి ఇంగ్లాండ్ దేశానికి చెందిన గ్రేస్ డార్లింగ్ అనే కన్య ..ఆ సాహసి విశేషాలను తెలుసుకొని ఉత్తెజితులమవుదాం .

     ఇంగ్లాండ్ దేశం లో నార్త్ ఆంబ్రియా  దగ్గర ఉన్న తూర్పు సముద్రం లోని ఫారన్ ద్వీపాలలో ఒకటైన లాంగ్ స్టన్ ద్వీపం లో  లైట్ హౌస్ రక్షకుడు గా ఉన్న విలియండార్లింగ్ కు ఏడవవసంతానం గా   గ్రేస్ డార్లింగ్ 1815 లో జన్మించింది .ఈ ఫారన్ ద్వీపాలు ఆ కాలం లో నిర్మానుష్యం గా ఉండేవి .జంతు వృక్ష సంతతి ఎక్కడా ఉండేది కాదు .అంతా కొండలు, రాళ్ళ మాయం .సముద్రం ఎప్పుడూ అల్లకల్లోలం గా ఉండి అలలు ఉవ్వెత్తున ఎగసి పడటం ఇక్కడ సహజ లక్షణం .ప్రవాహవేగం ఎక్కువ .ప్రమాద భరిత ప్రాంతం గా పేరు పొందింది .అప్పటికే అనేక నౌకలిక్కడ మునిగి పోయి వేలాది మంది ని పొట్టన బెట్టుకొన్న ప్రాంతమిది .1782లో అమెరికా నుండి తిరిగి వస్తున్న ఓడ ఇక్కడి అలల తాకిడికి ముక్కలై సముద్ర గర్భం లో కలిసి పోయింది .1823 లో అయిదు ఓడలిక్కడే జల సమాధి చెందాయి .అందుకని ఇక్కడ లైట్ హౌస్ నిర్మించి దానికి గార్డ్ గా విలియం ను నియమించింది ఇంగ్లాండ్ ప్రభుత్వం .ఆయన చాలా ఓర్పుగా నేర్పుగా కావలి కాస్తున్నాడు అతని సమర్ధతను  ప్రభుత్వం గుర్తించింది కూడా .

         తన పని చాలా కష్టం తో కూడుకోన్నదైనందున తన పిల్లలకు మంచి విద్యా బుద్ధులను నేర్పించాలని విలియం తపన చెందే వాడు ..గ్రేస్ డార్లింగ్ చాలా శాంత స్వభావం కలది .ఆమె సూక్ష్మ బుద్ధి కలదై నందున  చురుకుగా చదవటం రాయటం నేర్చుకొన్నది .తండ్రికి పడవ నడపటం లో ఎప్పుడూ సాయం చేసింది కాదు .ఇంటి పనులన్నీ తల్లే చూసుకొనేది ..గ్రేస్ కు ఇరవై రెండేళ్ళ వయసులో1838 లో సెప్టెంబర్ ఏడవతేది ఆమె జీవితం లో ఒక అత్యద్భుత మైన సంఘటన జరిగి ,ఆమె చరిత్ర ప్రపంచ ప్రసిద్ధ మైంది .

            1838 సెప్టెంబర్ అయిదవ తేదీన ‘’ఫోర్ ఫార్ ఫైర్’’అనే పొగ ఓడ హాల్ నగరం నుంచి బయల్దేరింది. దాని కెప్టెన్ జాన్ హంబుల్ .అందులో విలువైన వస్తువుల ను వర్తకం కోసం తీసుకొని పోయే వారున్నారు .ఓడ సిబ్బందితో కలిపి అరవై రెండు మంది ప్రయాణీకులున్నారు .ఓడ కొత్తదే కాని దాని స్టీం బాయిలర్లు అడుగున చిల్లి పడి నీరు కారటం ప్రారంభ మైంది .ఎంతో తంటాలు పడి అందులో నీళ్ళు నిలవచేసే ప్రయత్నాలు చేసినా ఫలితం శూన్యం .ఆరోజు అర్ధ రాత్రి పన్నెండు గంటలకు గాలి తీవ్రమైనది సముద్రపు అలలు ఎంతో ఎత్తుకు లేచి యెగిరి పడుతున్నాయి .వెంటనే పెద్ద గాలివాన ప్రారంభ మైంది .గాడాంధకారం .ప్రకృతి ప్రకోపం మానవ నిస్సహాయత .అందరు కళవళ పడిపోతున్నారు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని క్షణమొక యుగం గా గడుపుతున్నారందరూ ..స్టీం బాయిలర్ల లో నీరు నిలవటం లేదు .చక్రాలు పని చేయటం ఆగిపోయింది .గాలి వేగానికి ఓడ అటూ ఇటూ ఒక దిశా నిర్దేశం లేకుండా తీవ్రం గా ఊగిపోతోంది .ప్రయాణీకులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని గడుపుతున్నారు ఆందోళన తో దిక్కు తోచటం లేదు ఆక్రందనలు చేస్తున్నారు .ప్రకృతి ముందు మానవుని నిస్సహాయత ప్రస్పుటం గా కని  పించింది .

            ఓడ ఏదో ఒక గట్టు వైపుకు కొట్టుకు పోతున్నట్లు అని పించి ధైర్యం కూడా దీసుకొని కెప్టెన్ తెరచాపలు ఎత్తించాడు ..కాని అతని కృషి ఫలించలేదు .ప్రవాహం బలంగా దక్షిణ దిశకు పరిగేట్టుతోంది దానితో బాటు  నౌక అలానే సాగి పోతోంది గమ్యం లేకుండా .దూరం గా ఫారన్ ద్వీపపు లైట్ హౌస్ కాంతి కనీ పిస్తోంది .అందరికి తమ ఓడ ఎంత అపాయకర స్థలం లో ఉందొ అర్ధమై పోయింది .కెప్టెన్ హంబుల్ ఓడను ఆద్వీపం మధ్యలోకి నడిపి రక్షిద్దామని తీవ్రం గా ప్రయత్నించాడు కాని ఫలితం లేకుండా పోయింది .తెల్ల వారు ఝామున నాలుగింటికి ఓడ ‘’హార్కార్ రాక్’’అనే  కొండకు ఢీ కొని ముందుభాగం ముక్కలైంది వెనుక భాగం అలల తాకిడికి అల్ల కల్లోలమైంది .ఎవరికి వారు తమ ప్రాణాలను దక్కించుకోవాలనే ప్రయత్నం లో ఉన్నారు ఆత్మ రక్షణార్ధం ఎవరి ప్రయత్నాలు వాళ్ళు ప్రారంభించారు స్వార్ధ పరులైన కొందరు నావికులు నౌక లో ఉన్న ఒక చిన్న ‘’లైఫ్ బోట్’’ ను  సముద్రం లో కి దింపి దానిలో ఎక్కి పారిపోవటానికి ప్రయత్నించారు .ప్రయాణీకుల ప్రాణాలను కాపాడాల్సిన నావికులే స్వార్ధ బుద్ధితో ఆత్మ రక్షణకు అందర్నీ నట్టేట ముంచి పలాయనం చిత్త గించి వృత్తికీ దేశానికీ  అవమానం తెచ్చారు .స్వార్ధం ఎంతటి నీచానికైనా దిగ జారుస్తుందనితెలియ జేసే సంఘటన ఇది . .

          నావికులు పడవలో పారి పోతున్నారని అలికిడి ద్వారా తెలుసుకొన్న ఒకరిద్దరు తామూ ఆ పడవలోకి దూకారు కొందరు దూకే ప్రయత్నం లో సముద్రం లో పడి మునిగి అక్కడికక్కడే చని పోయారు .కళ్ళ ముందే వాళ్ళు చని పోతుంటే ఓడలో ఉన్న వారి ఆర్తనాదాలతో ,హాహా రావాలతో ఆ ప్రదేశం అంతా శోక సముద్రమే అయింది .భగవంతుని ప్రార్ధించటం తప్ప వారింకేమీ చెయ్య లేని నిస్సహాయ స్తితి .ఓడ విరుగుతున్న ధ్వనులు, రోదనలు మిన్ను ముట్టాయి .ఈ దెబ్బతో ,నౌకమధ్య కు  రెండు ముక్కలైంది .మొదటి భాగం అగాధ సముద్ర జలాల్లో మునిగి కంటికి కని  పించకుండామునిగి  అదృశ్యమైంది .నౌక లోని గదులన్నీ మునిగిన ఈభాగం లోనే ఉన్నాయి .ఓడనాయకుడు,భార్య కూడా ఇందులోనే ఉన్నారు పాపం . .

               తెరచాపకోయ్యలు, చక్రాలు ఉన్న ముందుభాగం మాత్రం కొండలో చిక్కుకొని ఉండి పోయింది .ఇందులో తొమ్మిది మంది మాత్రం ప్రాణాలు ఉగ్గ బట్టుకొని బతికి ఉన్నారు .వీరిలో అయిదుగురు ప్రయాణీకులు ,నలుగురు మాత్రం నావికులు .ప్రయాణీకులలో ‘’సారా డాసన్ ‘’అనే ఆమె తన ఇద్దరు పిల్లల్ని రోమ్మునకు హత్తుకొని భీతావహి యై ఉంది .సాయం కోసం అందరు అరుస్తున్నారు ఆమె పిల్లలిద్దరూ ఆ చలికి, గాలికి, నీటికి బిర్ర బిగుసుకొని ఆమెచేతుల్లోనేమరణించారు ఆమె కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది .  .ఆమె మాత్రం కోన ఊపిరితో ఉంది ..గాలి వాన క్రమం గా తగ్గు ముఖం పట్టింది .కాని సముద్రం మాత్రం భయంకరం గా గర్జిస్తూనే ఉంది .తెల్ల వారుతోంది .చీకట్లు ఇంకా విచ్చుకోలేదు  . .ఎవరైనా వచ్చి రక్షిస్తారని ఆ తొమ్మిది మందిఎదురు చూస్తున్నారు .

                మన కధా నాయకి గ్రేస్ డార్లింగ్ కు నావ లోని వారి ఆర్త నాదాలు విని పించాయి ఆమె నిరుపేద బాలిక .వెంటనే తండ్రిని నిద్ర లేపింది . ఎలా వారికి వారికి సాయమందించ గలమని తల్లీ కూతురు ఆలోచించారు.ఇంతలో తెల్ల వారింది పగిలిన ఓడ భాగం కని పించింది .కాని సముద్రం ఇంకా అల్లకల్లోలం గా ఉంది వెళ్ళ టానికి ఎవరికి ధైర్యం చాలటం లేదు అవకాశమూ కనిపించటం లేదు .‘’స్మేదిల్‘’అనే ధన వంతుడు సముద్రం లో చేపలు పట్టే వారికి అయిదు పౌన్లు డబ్బు  ఇస్తానని ఆశ పెట్టి పిలిచినా వాళ్ళు కూడా సముద్రం లోకి పడవలతో వెళ్ళ టానికి సాహసం చెయ్య లేక పోయారు .సముద్రం లోకి వెళ్ళటం ప్రాణాంతకం అని పించింది అందరికి .ఎవరి ప్రాణం వారికి తీపి కదా .నీటిలో నిత్యం చేపల్లా ఈదేవాళ్లేభయపడితే సామాన్యులకు వెళ్ళే ధైర్యం ఎక్కడుంటుంది ?

       లైట్ హౌస్ గార్డు అయిన డార్లింగ్ మొదట సంశయించినా కూతురు గ్రేస్ చొరవ తీసుకొనటం తో ధైర్యం గా ముందడుగు వేసి ఓడ లోని వారిని రక్షించాలని బయలు దేరాడు .ఒక ‘’లైఫ్ బోట్’’ ను సముద్రం లోకి దింపి చెరొక తెడ్డు పట్టుకొని నడపటం ప్రారంభించారు .అయితే ఆమె కు పడవ నడపటం ఇంతకు ముందెప్పుడూ చేయలేదని ముందే చెప్పుకొన్నాం .కాని అవతలి వారిని రక్షించాలన్న తాపత్రయం ఆమె కు ఆ విద్య ను అప్పటి కప్పుడు నేర్చుకోనేట్లు చేసింది .అత్యంత వేగం గా ,సామర్ధ్యం గా పడవను నడిపి తండ్రికే ఆశ్చర్యాన్ని కలిగించింది ..రక్షించాల్సిన వారంతా కొండ మీద చిక్కు కొన్నారు వారి దగ్గరకు చేరా లంటే ఆ కొండ ఎక్కాలి .పడవ పగలకుండా చూసుకోవాలి కెరటాల తాకిడికి ,..వేగానికి పడవ కొండకు ఢీకొంటే మొదటికే మోసం .నెమ్మదిగా పడవను కొండ దగ్గిరికి చేర్చారు తండ్రీ తనయలు గబుక్కున తండ్రి ఒక్క సారి కొండపైకి దూకాడు .కూతురు  గ్రేస్  లాఘవం గా పడవను లోతు నీటి లోకి నడిపి నీటి పై తేలేట్లు చేసింది .ఒక్కోకర్ని అతి  జాగ్రత్తగా పడవ లోకి చేర్చాడు .తొమ్మిది మందిని ఎక్కించుకొని సురక్షితం గా తమ లైట్ హౌ లోకి చేర్చారు .వీరి ప్రాణాలను కాపాడటానికి గ్రేస్  ఎంత ఆత్రుత పడిందో అంతే ఆత్రుత ను మరో మూడు రోజులు చూపించి వారికి అన్ని సౌకర్యాలు కల్పించి తల్లి కి చేదోడు గా ఉంది .వారి మనోవేదనను శాంత పరచటానికి గ్రేస్ కుటుంబం శక్తి వంచన లేకుండా చేసి మానవత్వాన్ని ప్రదర్శించారు .తను పడుకొనే పరుపును ఇద్దరు పిల్లలను కోల్పోయిన అభాగ్యురాలు డాసన్ దొరసాని కి  ఇచ్చి గ్రేస్ బల్లమీదే నిద్రపోయింది .ఆ తర్వాత ఓడలలో వచ్చి ఇక్కడ చిక్కుపడ్డ వారిని కూడా ఇంటికి తెచ్చిమొత్తం ఇరవై మందికి  తండ్రీ కూతురు వారి ఆలనా పాలనా చూశారు .మానవత్వం వికశించిన మహాద్భుత సన్నీ వేశం ఇది .చరిత్రలో నిలిచి పోయింది .

                  గ్రేస్ తండ్రి జీతం మీద ఆధార పడి బతికే పేద ఉద్యోగి .అయినా ఆయన కూతురు గ్రేస్ ఒక సాహస కార్యం తో అందరి దృష్టిని ఆకర్షించింది. పేరు పుట్టుక తో రాదు. చేసేపనులవల్ల,వస్తుందని రుజువు చేసింది ప్రపంచానికి..గ్రేస్ చేసిన సాహస చర్య  ఆనోటా ఆనోటా పడి  అందరి దృష్టికీ చేరింది ఎక్కడెక్కడి నుంచో జనం ఆమెను చూడ టానికి తీర్ధ ప్రజ గా వచ్చేవారు ధనికులు, అధికారులు,సామాన్యులు  అందరు వచ్చి ఆమె ను అభినందించారు .రాణి రాజు ఈ తండ్రీ కూతుర్లను పిలిపించి సత్కరించారు బంగారు గడియారాన్ని గ్రేస్ కు కానుక గా ఇచ్చారు .దాన్ని ఆమె తనను చూడ టానికి వచ్చిన వారందరికీ చూపిస్తూ మురిసి పోయేది .అనేక మంది ఎన్నో విలువైన కానుకలను గ్రేస్ కు పంపారు .ఆమె కు ఆర్ధిక సాయం చేయాలనే సంకల్పం తో చందాలు వసూలు చేసి700 పౌన్ల ధనాన్ని ఆమె కు అందించారు ..గ్రేస్ సాహసం పై నాటకాలు రాసి ప్రదర్శించారు .ఆమె కొద్దిసేపు పడవలో కూర్చుని నాటకం చూస్తె బోలెడు ధనమిస్తామని ఆశ పెట్టారు .కాని ఆమె దేనికీ ప్రలోభ పడలేదు వీటిని  తృణప్రాయం గా భావించి తిరస్కరించింది .త్యాగానికి ప్రతి ఫలం కోరుకొని మనీషి అని పించి,నిజం గా నే గ్రేస్ అని పించుకోంది .తానేదో గొప్ప ఘనకార్యం చేశానని ఆమె ఎప్పుడూ ప్రగల్భాలు పలకలేదు .ఈ సంఘటన తర్వాత మూడేళ్ళు తలిదంద్రులతోనే ఉంది వారు బతికి ఉండగా వేరుగా ఉండనని చెప్పింది .వాళ్ళు వివాహ ప్రయత్నాలు చేసినా వివాహం కూడా  చేసుకోకుండా జీవించి కన్య గానే మిగిలి పోయింది . .

           1841 లో గ్రేస్ కన్య కు క్షయ రోగం సోకింది ..వీలైన మంచి వైద్యం చేయించినా గుణం కనపడ లేదు ,క్రమంగా క్షీణించి పోయింది .మరణ సమయం లో ఆమె బంధువు లందర్నీ  పిలిపించుకొని తన వద్ద ఉన్న అమూల్య వస్తువలను తన స్మృత్యర్ధం కానుకలు గా అందజేసిన త్యాగ శీలి గ్రేస్ .జీవితాన్ని ‘’గ్రేస్ ‘’తో జీవించి ,అందరికి ‘’డార్లింగ్ కన్య’’అయిన గ్రేస్ డార్లింగ్  ‘’1842 అక్టోబర్20 న  బాంబరోనగరం లో కీర్తి శేషురాలైంది .ఆమె శవ యాత్రలో అశేష జనం పాల్గొని ఆమెకు శ్రద్ధాంజలి ఘటించి చరిత్ర సృష్టించారు .ఆమెను ‘’సెయింట్ ఐడాన్స్ చర్చి యార్డ్ ‘’లో ఆమె తలిదండ్రుల సమాధుల ప్రక్కనే  సమాధి చేశారు .

       ఆమె సాహసజీవితం పై ఎన్నో కధలు నాటికలు పాటలు వచ్చాయి .’’Grece Darling or Maid of the isles ‘’పేరైత జేరోల్ద్ వేర్మాన్ 1839  లో ఒక నాటకం రాసి  ప్రదర్శించాడు .ప్రఖ్యాత ప్రకృతి కవి విలియం వర్డ్స్ వర్త్ 1843 లో ‘’గ్రేస్ డార్లింగ్ ‘’అనే అద్భుత కవిత రాసి ఆమె త్యాగాన్ని ప్రస్తుతించాడు .ప్రభుత్వం గ్రేస్ పేరుమీద ఒక లైఫ్ బోట్ ను హోలీ ఐలాండ్ లో ఏర్పాటు చేసింది .విలియం బెల్ స్కాట్ అనే ప్రముఖ చిత్రకారుడు డార్లింగ్ జీవితం పై చిత్రించిన అనేక చిత్రాలను నార్త్ అంబర్ లాండ్ లోని ‘’వాషింగ్ టన్’’హాలులో ప్రదర్శించాడు .బామ్బర్గ్ లో ఒక మ్యూజియం లో ఆమె సాహసాలను భద్ర పరచారు .దేవ్ కజిన్స్ ఆమె పై ఒక గొప్ప భావాత్మక ప్రేమ గీతాన్ని రాశారు .వెస్ట్ గెట్ గ్రేస్ జీవితం లోని అపూర్వ ఘట్టాలపై ఒక సంగీత రూపకాన్ని సమకూర్చి ప్రదర్శించాడు .ఆమె పరోప కార పారీణత అందరికి ఆదర్శమే .చిరస్మరణీయురాలు గ్రేస్ డార్లింగ్ ..

– గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Posted in రచనలు | Tagged | Leave a comment

కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -3

కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -3

కృషీవల కవి కోకిల దువ్వూరి  రామి రెడ్డి

రెడ్డిత్రయం లో రెండవ వారు దువ్వూరి రామి రెడ్డి .కవికోకిల బిరుదాంకితులు .1895 లో నెల్లూరు లో జన్మించారు .ఇరవై ఏళ్ళకే ‘’నలజారమ్మ అగ్ని ప్రవేశం కావ్యం1917 లో  రాశారు అర్వాత ఏడాది ‘వనకుమారి ‘’రచించారు .విజయ నగర కావ్య పరీక్ష లో ఉత్తీర్నుడైనారు వనకుమారి కావ్యం లోని ప్రకృతి వర్ణనలు అందర్నీ ఆకర్షించాయి .రామి రెడ్డి గారికి గొప్ప పేరు తెచ్చిన కావ్యం ‘,’కృషీవలుడు ‘’గ్రామీణ జీవితాన్ని కవిత్వీకరించిన వాడు రైతు పక్షాన నిలిచి అతని కృషికి మొదటి సారిగా కావ్య గౌరవం కల్పించినవాడు రామి రెడ్డి గారే .స్వీయప్రతిభ తో దేశీయ కావ్యం గా రాశారు ఆంగ్లం లోని పాస్టరల్ పోయిట్రీ ప్రభావం ఉన్నది .’’నా కవిత వనలత ‘’అని పత్రాలతో పుష్పాలతో దినదిన ప్రవర్ధమానమవుతోందని చెప్పుకొన్నాడు .’’జలదాంగన ‘’యువక స్వప్నం ,కడపటి వీడ్కోలు అనే ఖండకావ్యాలూ రాశాడు .మంచి భావుకత ,మనస్తత్వ పరిశీలన ఉన్నకవి గా ప్రసిద్ధి .పార్శీ భాషలో పండితుడైనాడు .

       ఉమరఖయాం రాసిన రుబాయీలను ‘’పాన శాల ‘’పేర అనువదించాడు .దీనితో రెడ్డి గారి ప్రతిభ పూర్తిగా వికశించింది .స్వతంత్రకావ్యమేమో నన్నంత గా తెలుగుదనాన్ని ఆ కావ్యం లో సొగసుగా అందించాడు .పాన శాల లో రెడ్డి గారు రాసిన ఉపోద్ఘాతం పండిత ప్రశంశలను పొందింది .ప్రేమకు ,ప్రకృతికి అడ్డం పట్టింది .1917 లో నెల్లూరు లో కట్టమంచి రామ లింగా రెడ్డి గారి చేతుల మీదుగా స్వర్ణ పతకం పొందారు .విజయవాడ లో ఆంద్ర మహాసభ వారు‘’కవికోకిల ‘’బిరుదు ప్రదానం చేశారు .మీరాబాయి ,మాధవ విజయం అనే రెండు నాటకాలు కూడా రాశారు .చివరి రోజుల్లో ‘’పలిత కేశం ‘’గులాబి తోట కావ్యాలు రాశారు .వివిధ విషయాలపై చాలా వ్యాసాలూ రాశారు .ఇవన్నీ కలిపి‘’సారస్వత వ్యాసాలూ ‘గా పచురించారు .’’కాంగ్రెస్ వాలా ‘’అనే వ్యావహారిక నాటకమూ రెడ్డి గారు రాశారు .

      విజ్ఞాన శాస్త్రం పై రెడ్డి గారికి మక్కువ ఎక్కువ .అందులో విశేష కృషి చేసి తన ప్రజ్ఞ నిరూపించుకొన్నాడు .’’అణువునందున్న తేజస్సు యధిక మగును –ఒక్కభువనంబు జూర్నించి యూదివైవ ‘’అని అణుశక్తి సామర్ధ్యాన్ని ఆ నాడే తెలిపిన వైజ్ఞానిక కవి .,దార్శనికుడు .అయన కవిత్వం పద లాలిత్యం తో అర్ధ గాంభీర్యం తో అలరారుతుంది .విశ్రుత బుద్ధి వివేక పూర్ణ విద్యా నిలయాలు సంస్థలు ఉదార గుణమూ కలవారు ,పూజ్యులు మానవులే నాగరకత కు మూలం అన్నారు .

‘’మునుపటి నుండి మానవ సమూహము గాంచిన యున్నతస్తితిన్

పోనరిచి నట్టికార్యము లపూర్వ మనో బలసిద్ధులుం జిరం

తన మగు దేశానాగరకత ల్ ,బహు శాస్త్ర సముపార్జనంబు ,జే

ప్పిన బది ఏండ్లు పట్టు ప్రుధివిం గల దంతయు జెప్ప సాధ్యమే ‘’

                  కర్షక కవి

శ్రీ రామి రెడ్డి కి స్వంత ఆశయలున్నాయి .స్వేచ్చ కోరాడు .జాతీయ భావం తనువంతా నిండింది .పాశ్చాత్య పారశీక అధ్యయనం వల్ల,ఆ భావ ధారా ను తెలుగు జాతీయం గా తీర్చి దిద్దాడు .జీవితాన్ని అన్నికోణాల్లోనుంచి పరిశీలించారు .పొలం గట్టుకు పరిమిత మైన కర్షక కవి .గ్రామీణ జీవితానికి ‘’కృషీవలుడు ‘’కావ్యం లో అద్దంపట్టారు .రైతుకు ఇంతవరకు ఎవరూ కీర్తికిరీటం పెట్ట లేదు .ఆ పని మొదట చేసిన వాడు రామి రెడ్దియే .

‘’అన్నా హాలిక నీదు జీవితము నెయ్యంబార  వర్ణింప ,మే

 కొన్నాన్ ,నిర్ఝర సారవేగమున వాక్పూరంబు మాధుర్య సం

 పన్నంబై ప్రవహిన్చుగాని ,యితరుల్ భగ్నాశులై ,ఈర్ష్యతో

నన్నుం గర్షక పక్షపాతి యని నిందా వాక్యముల్ బల్కరే ‘’

అని తన కర్షక పక్ష పాతాన్ని నిరూపించుకొన్నారు ‘’పైరి కుడు ‘’రైతు )భారత క్షమ తలాత్మ గౌరవ పవిత్ర మూర్తి ‘’అని కీర్తించాడు .చేతుల్లో ‘’హలం కులిశ ‘’రేఖ లుంటేనే రాజులవుతారని జోస్యం చెప్పారు .రైతు బుజాల పై నాగలి చాల్లున్నంత వరకే రాజు కాళ్ళ లో ఆ చిహ్నాలు ఉంటాయి అంటారు .  .కవులు కూడా అజ్ఞానాన్ని పారద్రోలి యుద్ధం లో పాల్గొనాలి అని అభిప్రాయ పడ్డారు .రెడ్డిగారు భవ్య భవిష్యత్తు ను దర్శించారు .’’సకల మానవ జాతి సంతతులు కుల వర్ణ భేదాలు పాటించకుండా ఒక్క కడుపునా బుట్టి ఒక్క చనుబాలు త్రాగిన రీతి ‘’గా చూడాలని లలు కన్నాడు అప్పుడు ధర్మ దేవత శుద్ధ స్పటిక పాత్రలో ‘’శాంతి అనే ఆసవం తెచ్చి అందర్నీ తని యింప జేస్తుంది అని కమ్మ ని కల కన్నాడు .ఆకాల నేటికీ నిజం కానందుకు బాధగానే ఉంది .సామ్య వాదం రావాలని రెడ్డి గారు ప్రగాఢం గా వాన్చించారు .

    రామిరెడ్డి చలన చిత్ర పరిశ్రమ లో ప్రవేశించి దర్శకుదయారు .తన కవితలను తానే ఆంగ్లం లోకి అనువదిన్చుకొని‘’voice of the read ‘’గా ప్రచురించారు .చిత్రలేఖనం లోను ప్రావీణ్యం సంపాదించారు .ఆరుద్ర అన్నట్లు ‘’కట్టమంచి కవిత్వ తత్వ విచారం మాత్రమె చేస్తే ,రామిరెడ్డి కవిత్వ నిరూపణ చేశాడు ‘’చదివింది థర్డ్ ఫారమే అయినా స్వయం కృషి ఓ ఎనిమిది భాషల్లో పాండిత్యం సాధించాడు .’’నీతి స్పర్శ లేని సౌందర్యం పరిపూర్ణం కాదు ‘’అని త్రికరణ శుద్ధి గా నమ్మాడు .ఆ నీతినే ప్రజల గీతిగా పాడాడు .సర్వ మానవ సమానత కై కవితా గళం విప్పాడు .1947 లో దువ్వూరి వారు దూర తీరాలకు చేరి కీర్తి శేషులయ్యారు .

    దేశ భక్తీ తనువంతా జీర్ణించుకొన్న కవి రామి రెడ్డి .’’తిప్పవే రాట్నమా దేశ చరితంబు –విప్పవే రాట్నమా విజయ కేతనము ‘’అని పులకించి పాడిన దేశ భక్త  కవి .ద్రౌపదీ సందేశం అనే నాటకం లో జాతీయ భావ ప్రబోధం చేశాడు .’’లేవమ్మ స్వాప్నికా శయ్యవీడి –కనుమా యందందు సూర్యంశులన్ ‘’అని భారత మాత్రు ప్రబోధం లో జాతిని మేల్కొల్పాడు .స్వాతంత్ర రధానికి ‘’లేవు దివ్య తురంగముల్ లేవు రధాలు  –ప్రజలే యా తేరు మోకులు పట్టు వారు‘’అని జాగృతి గీతం పాడారు .కర్తవ్య బోధ చేశారు .స్వాతంత్ర ఉద్యమం ఎలా ఉండాలో తెలిపే విధానమంతా ‘’కాంగ్రెస్ వాలా ‘’నాటకం లో తెలియ జెప్పారు .కట్టమంచి బుద్ధి జీవి అయితే ,రామి రెడ్డి హృదయ జీవి .,కవితా స్వాప్నికుడు మాత్రమే కాదు కర్తవ్యమ్ బోధించిన కార్య శూరుడు .స్వాతంత్ర్య భానూదయం కోసం తపించి చూడకుండానే దివికేగిన దేశ భక్తుడు . లోక బాంధవుడు ..తెలుగు కవితా వనం లో కావ్య గానం చేసిన కవికోకిల దువ్వూరి రామి రెడ్డి .

          మరో కవి గురించి మరో మారు

     మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-4-13-ఉయ్యూరు 

Posted in కవితలు | Tagged | Leave a comment

పూస పాటి వారి విజయ నగరం కోట వైభవం

vijayanagram kota vaibhavam

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆశుకవి ఒగిరాల వారి ‘’అర్ధ శతకం ‘’

  ఆశుకవి ఒగిరాల వారి ‘’అర్ధ శతకం ‘’

    నాకు అత్యంత ఆప్తులు సాహితీ స్వరూపులు మిత్రులు శ్రీ ఒగిరాల సుబ్రహ్మణ్యం గారిది  ఉయ్యురు దగ్గర పెదఒగిరాల . పంచాయత్ రాజ్ లో గుమాస్తాగా గన్నవరం దగ్గర పెదవటపల్లి లో పని చేసి రిటైర్ అయారు .దాదాపు పదేళ్లుగా పరిచయం ఉంది .మా సాహిత్య సభలకు తప్పక వస్తారు .ఒక సారి వారికి మా తలిదండ్రుల పేరిట ఆత్మీయపురస్కారం అందజేశాం .మా ఇళ్ళల్లో శుభకార్యాలకు ఆయన భార్య తో సహా వచ్చే వారు .మేమూ  వారింట శుభకార్యాలకు హాజరయ్యేవారం .మంచి ఆశుకవి. సహజ కవి. భక్తితో శతకం రాసి నా అభిప్రాయం కోరి రాయించుకొన్నారు .దాని ఆవిష్కరణ పెదవటపల్లిలో ఆ నాటి గన్నవరం శాసన సభ్యులు గద్దె రామ మోహన రావు గారు చేస్తే నేనూవ వెళ్లాను .మళ్ళీ ‘’అర్ధ శతకం ‘’రాసి నా అభిప్రాయం కోరితే16-1-2009  న రాసి పంపాను .అందులోని విషయాలే ఇప్పుడు మీకు తెలియ జేస్తున్నాను ‘

       ఓగిరాల వారు కవిత వాగ్ధారగా ప్రవహింప జేసే నేర్పుస్వయం సిద్ధం గా అబ్బిన కవి .భావం కోసం ,పదం కోసం వెదుకులాట ఉండదు .ఎన్నో శతకాలు భావ బంధురం గా రాశారు అన్నీ నాకు చూపించే ప్రచురించారు .ఎంతటి భక్తీ కవో అంతటి సామాజిక స్పూర్తి ఉన్న ప్రజాకవి కూడా .కవి క్రాంత దర్శి అన్నది జగమెరిగిన విషయమే .కవి సమాజం లని లోపాలు గుర్తించి రంద్రాన్వేషకుడూ కావాలి .అంటే ‘’కంత దర్శి ‘’అవాలి .అప్పుడే చెడును చెరిగి మంచిని ప్రోదు చేయటం సాధ్యం .కవులంతాయేదేవుని పై శతకం రాసినా ఈ సూక్ష్మాన్ని వదిలి పెట్టలేదు .ఆ మార్గం లోనే సుబ్రహ్మణ్య కవీ ప్రయాణం చేశారు .’’వారిజాక్ష మాల ‘’గా 54 పద్యాలు అల్లారు .అందుకే దాన్ని ‘’అర్ధ శతకం అన్నాన్నేను .అర్ధ వంత మైన భావాలున్న శతకం అని కూడా అర్ధం .

        కవి సహజం గా సమాజ హితైషి .ఉద్యమాలు చేసి చైతన్యం కల్గిస్తారు .అయితే అందరు కవులు ఉద్యమ కారులు కాలేరు .,కారు కూడా .వెనక ఉండి చైతన్యం కల్గిస్తారు .అలాంటి తెర వెనుక కవే వీరు .సమాజం లోని రుగ్మతలను నిత్యం చూస్తూ బాధ పడుతూ ఏమీ చేయలేక నిట్టూరుస్తూ కనీసం ఆ వారిజాక్షుడైనా తన విత్ఫుల్ల సరోజ నేత్రాలను తెరచి లోకం లో జరిగే అన్యాయాన్ని చూసి జనానికి బుద్ది చెప్పి సమాజ ప్రగతికి తోడ్పడి బహుజన హితాయ బహుజన సుఖాయ గా కర్తవ్య బోధ చేస్తాడనే వీరి నమ్మకం .అందుకే గజేంద్రుని లా ‘’నీవే తప్ప ఇతః పరం బెరుగ  ‘’అన్నట్లు దీనం గా ప్రార్ధించి తన గోడు విన్న వించారు ‘’మన్య కవి ‘’,సుబ్రహ్మణ్య కవి గణ్యకవి .ఆశయం మహోత్రుస్టమైంది .అంతా భగవంతునిదే భారం .అన్నంత గా శరణా గతులయ్యారు .ఇదీ ఓ మార్గమే .ప్రత్యక్ష కార్యా చరణకు బదులు పరోక్ష తోడ్పాటు .ఆ వేదన బాధా చింతన ,మనోవేదన ,నిట్టూర్పు నీరవ స్తితి నుంచి ఉద్బుద్ధమైంది ఈ శతకార్ధం .

     విందులు వినోదాల పేరిట జనాన్ని పిలిచిఆహారాన్ని ఇష్టం వచ్చి నట్లు తిన్నంత తిని మిగిలింది పారేసే మూర్ఖులను చూసియేవగించుకొన్నారు కవి .ఆ మిగిలింది అవసర మైన నిర్భాగ్యులకు పెడితే వారి పొట్టలు నిండవా వారిజాక్షా అని నిలదీశారు పోనీ ఆ మిగిలిన ఎంగలాకుల్లోని పదార్ధాలను కాకులాకు పెడితే వాటికీ పితరులకూ తృప్తి కాని వాటిపై బడి తిండికోసం వెంపర్లాడే నిర్భాగ్యుల్నిచూసి జాలి .పాప భీతి తగ్గి దైవం సోమ్మ కాజేయటం లోక సహజమైనదని ఆకాశ హర్మ్యాల లు , అందులో జరిగే పాపాల వల్ల నేల కుంగి పోతోందని మనసు లో కున్గిపోయాడుకవి .అకాల వర్షాలు అన్నం పెట్టె రైతు నడ్డి విరుస్తున్నాయి పంట చేతికొచ్చే సమయానికి వరుణుడు కడుపు కొడుతున్నాడు .

       ఏ మతం వారైనా స్వార్ద పరులే .పరహితం తక్కువ .ఆడంబరం జాస్తి .ఏదో చిన్న పొరబాటు జరిగిందని వైద్యుని పై చెయ్యి చేసుకోవటం ధర్నాలు చేయటం సిగ్గుచేటు అంటారు .కానీ పెంచి పెద్ద చేసే తలిదండ్రుల కాస్త సుఖాలు చూడని పుత్రులు పుట్టనేమి గిట్టనేమి అని వేమన్న లా బాధ పడ్డారు .పెంచలేక పిల్లల్ని అమ్ముకోవటం ఆత్మ హత్యకు పాల్పడటం తప్పు అన్నారు .విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి అయిన కాలం లో విచక్షణ లోపించి ప్రాణికోటికి ముప్పు ఏర్పడుతోందని వ్యధ చెందారు .

        నిస్వార్ధ జీవితం అత్యున్నతమైనదని నడిరోడ్డు మీద గప్పాలు కొడుతూ అమూల్య కాలాన్ని వృధా చేస్తున్నారని వాపోయారు .రాగింగ్ ,ప్రేమ పేరుతో యువత హద్దు మీరి ప్రవర్తించి నాగరక లక్షణాలు కోల్పోతోందని అది హర్షణీయం కాదని భావించారు .ఇది సగటు మనిషి ఆవేదనే .రక్షక భటులు భక్షకులౌతున్నారు .ఉదాసీనత పెరిగింది .కర్తవ్య పాలన లేదని మౌన రోదన చెందారు .అన్నిటా అవినీతి కోర్టులు కూడా దీనికి భిన్నం కాదు .కోర్టు తీర్పుల్లో అస్తవ్యస్తత ,న్యాయాదీశుల్లో లంచ గొండితనం జాతిని సిగ్గుపడేట్లు చేస్తున్నాయి .ధర్మాన్ని రక్షించే సంస్థలే దిగజారి పోతే జాతికి రక్షణ ఏది అన్నారు

    ప్రజా సంక్షేమం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న ట్లు ప్రకటనలు గుప్పించి వారికి అందకుండా మధ్యలోనే గుట్కా యస్వాహా చేసే దేశముదుర్లని ఈసడించారు .మనదేశం మొదటి నుంచి వ్యావసాయక దేశమే నని రైతే దేశానికి వెన్నెముక అని అన్నదాత అని గుర్తు చేశారు .అలాంటి పంట భూములను సెజ ల పేరిట నంజుకు తింటూ రైతు కడుపు కొడుతున్నారని బాధ పడ్డారు .ఫాషన్ల మోజులో వెర్రి చేస్టలతో  జాతి పరువు మంట గలుపుతున్నారని ఆవేదన చెందారు .అనుకరణ కొంతవరకే మేలు .అదే దారి పడితే అధోగతే .తస్మాత్ జాగ్రత్త గా హెచ్చరించారు .

      గ్లోబల్ వార్మింగ్ పెరిగి వాతావరణం లో అనూహ్య మార్పులు వచ్చి మంచు భూములు కరిగి వర్షాభావం ఏర్పడి ప్రజా జీవనం అస్తవ్యస్తమైందనిదని ఆవేదన చెందారు .వసుధైక కుటుంబం భావన బల పడాలని కోరుకొన్నారు .జాతికి పట్టని చీడ లేదు మళ్ళీ గాంధీ పుట్టి ఉద్ధరించాల్సిందే నంటారు గాంధీగిరి యేశరణ్యం అంటారు దొంగనోట్ల ముద్రణ కుటుంబ పరిశ్రమ అయింది .నేర పరిశోధన కంటి తుడుపే .తిలా పాపం తలా పిడికెడు .అంతా నకిలీ అసలేదో కానిదేదో ఆ దేవుడే కనీ పెట్ట లేదన్నారు .ఓ వారిజాక్షా ఏమిటీ పరీక్ష అని  మొత్తుకొన్నారు కవిగారు. కని పించిన ప్రతి అన్యాయాన్ని హింసా దౌర్జన్యాలనుఉతికి ఆరేశారు .కవిత్వం లో మంచి ధారా శుద్ధి ఉంది .తగిన పదాలతో భావ గాంభీర్యం గా ఉన్నాయి పద్యాలు .మనసులో నాని నాని, చింతనలో పండి పండి ,ఆవేశం తో రగిలి రగిలి ,ఆక్రోశం తో ఒదిగి ఒదిగి ,ఆవేదన లో కనలికనలి  నిండు మనసుతో వెలువడిన పద్యాల మాల ఇది .ఇది ఆ వారిజాక్షునికి సమర్పించిన ‘’అర్ధాక్షర శతక మాల .అందర్నీ ఆలోచింపజేసే పద్యాలు .కవి గారి పరిణత అధ్యయ నానికి కవితాదారకు అద్దం పట్టే పద్యాల మాల .మనో రంజకం గా భావ సుగంధ బంధురం గా ఉన్న్నాయి మా ఉయ్యూరు కు ఆయన ఆస్థాన కవి .మాన్య కవి .చదివి ఆనందించండి .అభినందించండి ఇలాంటివి మరిన్ని సుబ్రహ్మణ్య కవి గారి నుండి రావాలనిమనసారా ఆశిస్తున్నాను .

    మీ—గబ్బిటదుర్గాప్రసాద్ -1-4-13-ఉయ్యూరు

 

 
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -2

కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -2

             ఆధునిక విమర్శక రా.రా.(జు?)

ఆయన విమర్శ పదునైన ఆయుధం .మొహమాటం లేదు .అయిన వాడు అన్న బంధం లేదు .సరుకు ఉంటె ఎవర్నైనా బుజం తట్టి ప్రోత్సహించాడు .ఆధునిక సాహిత్య విమర్శ కు ఒక దిశా నిర్దేశం చేశాడు .సూటిగా నిర్మొహమాటం గా విమర్శిస్తాడు .అతనిది ‘’లో చూపు ‘’..విమర్శ అతని శ్వాస .అందుకోసం ఒక సాహితీ పత్రికనే నడిపిన సాహసి .రచయిత తో సహవేదన పొందాలన్న ఆశయం తో ఆ పత్రికను ‘’సంవేదన ‘’గా తీర్చి దిద్దాడు .ఆ తర్వాతే ఎందరో ఆయన మార్గాన్ని అనుసరించారు .అలాంటి నిర్మోహ మాట విమర్శకుడే రాచమల్లు రామ చంద్రా రెడ్డి .అందరికి రా.రా. గా సుపరిచితుడు .కడప జిల్లా పులివెందల తాలూకా పైడి పాళెంగ్రామం లో 1922 లో జన్మించాడు .మద్రాస్ లో ఇంజినీరింగ్ చదివాడు .అప్పుడే మార్క్సిస్ట్ భావనలు ఆకర్షించాయి .ఏ ఉద్యోగమూ చేయలేదు .మార్క్స్ ,ఎంగెల్స్ రచనలు వంట బట్టిన్చుకొన్నాడు .విశాలాంధ్ర దిన పత్రిక లో ఆరు నెలలు ఈనాడు పత్రిక లో రెండేళ్ళు మాత్త్రమే పని చేశాడు .1969 -75వరకు రష్యాలో ఉండి మూడు డజన్ల పుస్తకాలను అనువదించాడు .అందులో పిల్లల పుస్తకాలూ ఉన్నాయి .1988 లో66ఏళ్ళ వయసు లో  తనువు చాలించి కీర్తి శేషడయ్యాడు .

                    సాహితీ ప్రస్తానం

  రా.రా.అలసిన గుండెలు కద రాశాడు .’’శ్రీ శ్రీ తాత్విక చిత్త వృత్తి ‘’పై వ్యాసాన్ని ‘’వేకువ ‘’పత్రిక కు రాశాడు .ఇది చాలా ప్రాచుర్యం పొందిన వ్యాసం .ఇది రారా కు చాలా ఇష్టమైనది కూడా .’’శ్రీమాన్ వేయి పడగల సత్యనారాయణ ‘’,’’విరసం భవిష్యత్తు ‘’’’సాహిత్యం లో ఆధునికత ‘’,’’బైరాగి అవగాహన ‘’,’’పాఠకులు మెచ్చుకుంటున్నారు జాగ్రత్త ‘’’’అనువాద సమస్యలు ‘’,అభ్యుదయ సాహిత్యోద్యమం లో అతివాద ,మితవాద ధోరణులు ‘’,’’సాహిత్యం లో నిబద్ధత ‘’’’,చాసో రచనా తత్త్వం ‘’,మొదలైన వ్యాసాలూ సవ్య సాచి ,వీచిక ,సంవేదన ,విశాలాంధ్ర పత్రికలకు రాశాడు .కొడవటి గంటి ,మల్లారెడ్డి మొదలైన రచయితల పుస్తకాలకు పరిచయ వ్యాసాలూ రాశాడు .ఎన్నో పుస్తకాలను సమీక్ష చేశాడు .వచన కవితా సమీక్షా చేశాడు .విమర్శ వ్యాప్తి కోసం సంవేదన పత్రిక నిర్వహించి తన భావాలను ప్రకటించాడు .తన అభిమాన పత్రికలకు తన భావ ధారకు ప్రతిస్పందించే పత్రికలకు మాత్రమె రాసే వాడు .నిబద్ధత గల విమర్శకుని గా ప్రసిద్ధి చెందాడు .తనకంటూ నిర్డుస్ట సిద్ధాంత భావజాలం గల వాడుగా నిలబడ్డాడు .అనువాద సమస్యలు గ్రంధానికి కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కారం అందుకొన్నాడు .

                  రారా భావ ధార

     నవలలో వస్తువు ఇతివృత్తాన్ని కాక విశాల జీవితాన్ని వర్ణించాలి .పాఠకుని సంస్కార వికాసానికి నవల దారి చూపాలి .సాంఘిక సాన్ఘికేతర శక్తుల మధ్య జరిగే సంఘర్షణ ను ,పాత్రల హృదయాలలోని అంతర్మధనం గా చిత్రించాలి .భిన్న పాత్రల హృదయాల్లోని ఘర్షణ ను ఒకే వ్యక్తీ అంతరంగం లో జరిగి నట్లు మహీధర రామ మోహన రావు ‘’కొల్లాయి గట్టితేనేమి ‘నవలలో చిత్రించటం వల్ల అది శిల్పం రీత్యా కొత్త సృష్టి అని మంచి ప్రయోగమనీ మెచ్చాడు .ఆయనే రాసిన‘’ఎవరికోసం ‘’నవల భిన్న శక్తుల మధ్య ఘర్షణ ను ,అంతర్మధనం గా చిత్రించిన మొదట నవల గా పేర్కొన్నాడు .రావిశాస్త్రి నవలలో పాండిత్య ప్రదర్శన ,ఉపదేశం ,వినోద చాపల్యం ఉన్నాయని ఘాటుగానే చెప్పాడు .’’పాఠకుని హృదయానికి నచ్చేది కళ .చర్మాన్ని తాకి గిలిగింతలు పెట్టేది వినోదం .’’అని హెచ్చరిస్తూ పాఠకుని మెప్పించాలని రాస్తే కళా విలువలుండవు అని స్పష్టం గా చెప్పాడు .

       కధల గురించి రారా కు కొన్ని అభిప్రాయాలున్నాయి .’’జీవిత సత్యాలను క్లోజప్ లో చూపించి పాఠకునికి అవగాహన కల్గించి ,చైతన్య పరిధిని విస్తృతం చేయాలి .సామాజిక స్పృహ ,స్పర్శా ఉండాలి .సంస్కారాన్ని కలిగించాలి‘’అన్నాడు .అనుభూతి ఉండాలి .అది లేని సాహిత్యం లేదు .చాసో కధలు ‘’ప్లాటుల్లేనివి ‘’అన్నాడు .తన అభిప్రాయాలు చాసో కధల్లో ప్రతి ఫలించాయి కనుక ఆయననను ఉత్తమ కధకుడు అన్నాడు .వాస్తవిక జీవితం లో నుంచి కధలు రావాలని కోరాడు .చలం గురించి రాస్తూ ఆయన ప్రచారకుడేనని భావకవులకు అభ్యుదయ కవులకు చలం వారధి అని నిర్ధారించాడు .ఆయన నవలలు మైదానం ,కరుణ లను రారా నవలలు గా అంగీకరించలేదు .’’చలం గొప్ప తనం ఆయన విప్లవాత్మక భావాల్లో ఉంది .ఏ కళా నియమాలను పాటించకుండా ,సాహిత్య గుణం సంపాదించుకొన్న రచనలు చేసినందుకు చలాన్ని అభి నందించాలి ‘’అని అభిప్రాయ పడ్డాడు .చలం రాసిన ‘’యశోద గీతాలు ‘’కంటే విశ్వనాధ రాసిన పద్యాలు చాలా నయం అంటాడు .’’సుధా ‘’అనే గీతాలు రాయటం చరిత్రలో ఒక పెద్ద ‘’ట్రాజేడి ‘’గా భావించాడు రారా . రొమాంటిక్కు లలో విప్లవకారుడు చలం ఉన్నాడు .’’హేడోనిస్ట్ ‘’గా రారా చలాన్ని చూశాడు .అంటే ‘’స్వసుఖ వాది‘’రమణాశ్రమం చేరి నందువల్ల ఆ పేరు తో పిల్చాడు చలాన్ని .

             రారా గుర జాడనూ ఉతికేశాడు .జాతీయోద్యమం పట్ల గురజాడ కు సదభిప్రాయం లేదన్నాడు .గురజాడ 21 శతాబ్ది వాడన్నాడు .కన్యా శుల్కాన్ని మహా భారతం తో పోల్చాడు .ఆ నాటకాన్ని జీవిత వాస్తవికత లోంచి చూడాలని హితవు చెప్పాడు .గురజాడ లో కవి అంశ కంటే  మేధావి అంశ ఎక్కువన్నాడు .ఆయన ఖండికలలో విప్లవాత్మక భావ సంపన్నత ఉన్నంతగా కవితా సౌరభం లేదు ‘’అని తేల్చాడు .గిరీశం హాస్య గాడు కావటానికి కారణం గురజాడ లోని హాస్య దృష్టే నంటాడు రారా .

‘’భావుకుల రచయిత కో.కు ‘’అని కిరీటం పెట్టాడు రారా .ఆయన లో శాస్త్రీయ ఆలోచన ,మార్క్సిస్టుభావజాలం ,మానవతా వాదం ఉన్నాయని ఎస్టిమేట్ చేశాడు .ఆయన భాషకు ప్రవాహ గుణం ,ధారా శుద్ధి ఉన్నాయి .అదే కుటుంబ రావు శైలి అయింది అని మెచ్చాడు .

                      ‘’ కవిత్వం అంటే శబ్ద ,భావ సౌందర్యం కాదు .అనుభూతియే కవిత్వం .హృదయాన్ని కదిలించేది కవిత్వం .’’అని అభిప్రాయ పడ్డాడురారా..బోయి భీమన్న కవిత్వం లో కవిత్వాంశ లేదని కొట్టిపారేశాడు .’’విశ్వం ‘’లో  గాఢత్వం లేదు .ఆవంత్స వస్తువుకు న్యాయం చెయ్యలేదన్నాడు .రూపం విశ్వరూపం ఎత్తింది .కవిత్వం మేధో వ్యాపారం కాదు .హృదయ నివేదన అని చక్కని విశ్లేషణ చేశాడు .మనసును ఆకర్షించే కవిత్వం ‘’ఖలీల్ జీబ్రా ‘’ది అంటాడు .మాయ మర్మం లేని వాడుగా కాళోజి ని భావించాడు .దిగంబరులది కవిత్వమే కాదు పొమ్మన్న ధైర్య శాలి రారా .తెలుగు జాతి జీవితం యొక్క ‘’పేరడీ ‘’ఏ మల్లారెడ్డి కవిత్వం అంటాడు .నినాదానికి ,నిర్వేదానికి మధ్య సాహిత్య లక్ష్యం ఉండాలి .శ్రీశ్రీ కవిత్వం లో ‘’లయ ‘’మాత్రమే ఉంది .బాల గంగాధర తిలక్ ను ఉత్తమ కవి గా కొని యాడాడు రారా .బైరాగి రాసిన‘’నూతిలో గొంతుకలు ఏకైక తాత్విక కావ్యం’’ అని ప్రస్తుతించాడు .అభ్యుదయ నిరాశావాది ,సందేహం ,సందిగ్ధత ,బైరాగిలో ఉన్నాయి .శ్రీ శ్రీ ది స్పందన అన్నాడు .కోకు ది ఆలోచన ..సిద్ధాంత స్తాయి లో ఆలోచించే వాడే మేధావి అంటాడు రారా .విమర్శకు శాస్త్రీయ ప్రతి పత్తి కల్గించిన వాడు రారా .రాగద్వేషాలు చూపలేదు .వ్యక్తీ స్తాయి నుంచి ,సామాజిక స్తాయికి విమర్శను ఎదగ జేసినా గొప్ప విమర్శకుడు రారా .మొక్కుబడి గా చేసే పుస్తక సమీక్ష కు విమర్శ స్తాయికి తెచ్చిన వాడు రారాయే అనటం లో సందేహం లేదు .రారా లో ‘’ఇంటలెక్త్యువల్ ఆనేస్టీ ఉంది ‘’అని అందుకే  అందరు  ఆయన్ను మెచ్చుకొన్నారు .అభిరుచి కంటే సామాజిక  ద్రుష్టి కే ప్రామాన్యత నిచ్చాడు .ఆయన ప్రయత్నం గొప్పది, మార్గ దర్శక మైనదీ కూడా .ఆయన పదాలకు కొత్త వాసన వచ్చింది అంటాడు యాకూబ్ .క్రూర కర్కోటక విమర్శకుడు గా బిరుదు పొందాడు శ్రీ శ్రీ చేత .క్షీణ విలువల్ని సహించని సాహితీ ప్రియుడు రారా .అందుకే  ‘’ఆధునిక విమర్శక రారాజు ‘’అని పించుకొన్నాడు రా.రా.

        మరోకవి కోసం ఎదురు చూడండి

సశేషం –మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –1-4-13-ఉయ్యూరు 

Posted in కవితలు | Tagged | Leave a comment

నాలో నవరసాలకు చిరునామా!

నాలో నవరసాలకు చిరునామా!


సోగ్గాడు, సాహసవంతుడు, సావాసగాళ్లు వంటి నిన్నటి సినిమాల్లో విలన్, ఇప్పుడు ఫ్యామిలీమ్యాన్ ఎవరంటే గుర్తుకొచ్చేది గిరిబాబే. వెండితెర మీద నవరసాలనూ అలవోకగా ఆవిష్కరించే ఈ నటుడు తన సొంతూరు రావినూతల గురించి చెబుతున్నప్పుడు కూడా వాటిని అంతే సునాయాసంగా కురిపిస్తారు. తోపుల్లోకెళ్లి ఏం చేసేవాళ్లో, సినిమా వేషాలు ఎప్పట్నుంచి మొదలో… ఎన్ని ప్రశ్నలైనా అడగండి, ఆయన్నుంచి వచ్చే సమాధానం ఒకే ఒక్కటి. ‘రావినూతల’. ఆయన సొంతూరు విశేషాలు…

నా అసలు పేరు యర్రా శేషారావు. ఇంటాబయటా అందరూ అదే పేరుతో పిలిచేవారుగానీ, మా తాత మాత్రం ఎందుకో ‘గిరి’ అని పిలిచేవారు. అందుకే నేను సినిమాల్లోకి వచ్చినప్పుడు నా పేరును గిరిబాబు అని మార్చుకున్నా. ప్రకాశం జిల్లా రావినూతల నా సొంతూరు. మరీ శుద్ధ పల్లెటూరేం కాదు. నేను పుట్టేనాటికే అంటే 1943 నాటికే అది మేజర్ గ్రామ పంచాయితీ. మాది వ్యవసాయ కుటుంబం. మా ఊరికి ఎలాంటి కాలవలూ లేవు. పూర్తిగా వ ర్షాధార వ్యవసాయం. అందువల్ల వరి పంటే వేసేవారు కాదు. జొన్న, కంది, సజ్జ, వరిగ వంటి చిరుధాన్యాలే పండేవి.


మా ఆహారపుటలవాట్లూ దానికి తగ్గట్టే ఉండేవి. ఉదయంపూట జొన్న, సజ్జ సంగటి తిని రాత్రి పూట మాత్రం వరిగ ధాన్యంతో వండిన అన్నం తినేవాళ్లం. మా తాతగారికి మా నాన్న ఒక్కడే కొడుకు. మా మేనత్తలు పెళ్లయి వాళ్ల కుటుంబాలతో మా ఊళ్లోనే విడిగా కాపురాలుండేవారు. నాకు ఏడెనిమిదేళ్ల వయసులో మా తాత, నాన్నమ్మ పోయారు. అప్పటికి మాకు పన్నెండెకరాల పొలం ఉండేది. ఇప్పటి లెక్కల్లో అది ఎక్కువే అనిపిస్తుందేమోగానీ, అప్పట్లో మాది మామూలు కుటుంబం కిందే లెక్క. మా నాన్న దాని కోసం ఆరు కాలాలూ పనిచేసేవాడు. పొలానికి పొద్దున వెళితే తిరిగొచ్చేది రాత్రికే. చేని తోడిదే లోకం ఆయనకు.

వినాయకుడి కంటే మాకే ఎక్కువ సరదా…
పండగల్లో మొదట వచ్చే వినాయకచవితి అంటే మాకు గొప్ప సరదా. దేవుడి మీద భక్తి అనుకుంటారేమో, భక్తీపాడూ ఏం లేదు. వేకువ జామునే లేచి పత్రి కోసం పొలాలు తోటలు తిరగడమే మాకు సరదానిచ్చే పని. ముందురోజే ‘అరేయ్, రేప్పొద్దునే వచ్చి లేపుతాం’ అని చెప్పేవాళ్లు స్నేహితులు. దాంతో అసలు ఆ రాత్రి నిద్ర పట్టేదే కాదు. ఎప్పుడు కోడి కూస్తుందా, ఎప్పుడు వాళ్లొచ్చి తలుపు తడతారా అన్నదే ఆలోచన. ఆ సమయం వచ్చి తలుపు చప్పుడవగానే సంచి తీసుకుని పరుగోపరుగు. ముందుగా శివాలయానికి వెళ్లి మారేడు దళాలు కోసేవాళ్లం. తర్వాత ఆ పూజ జాబితాలో చెప్పినవన్నీ సంపాదించాలి. అదీ మా లక్ష్యం.

అదొక పెద్ద అడ్వెంచర్ మా దృష్టిలో. పొలాలన్నీ ఉత్తి కాళ్లతో తిరిగేవాళ్లం కాబట్టి, కాళ్లు తెగ నొప్పెట్టేవి. దానికితోడు నిద్రలేమి. మొత్తానికి నానా చావులూ చచ్చి అన్ని రకాలూ సంపాదించి ఇంటికొచ్చేసరికి తెగ నీరసపడిపోయేవాళ్లం. అప్పట్నించి పూజ ఎప్పుడవుతుందా, ప్రసాదాలు ఎప్పుడు పెడతారా అని ఎదురుచూడటమే. ఇంతలో పెద్దవాళ్లు వచ్చి కూర్చుని ‘అబ్బాయ్ కాస్త ఆ పుస్తకం తీసి మంత్రాలు చదివి పూజ చెయ్యరా, నీకు చదువొచ్చు కదా’ అన్నారంటే మా పనయిపోయినట్టే. అప్పటికే కళ్లు గిర్రున తిరుగుతూ ఉండేవి. అసలు సంగతి ఏంటంటే ఆ మంత్రాలు చదివేంత చదువు మాకూ రాదు! పైగా కథ చదవడానికి సిగ్గు. ఇవన్నీ చెప్పలేక, చెబితే తంతారని భయపడి ఏదో అయిందనిపించేవాళ్లం. వినాయకచవితి కేవలం ఒక రోజు సరదానే. అదే దీపావళి అయితే నెల రోజుల ముందు నుంచే సందడి మొదలయ్యేది.

అది మామూలు ఎంజాయ్‌మెంటు కాదు! పదిపదిహేను మంది కుర్రాళ్లం కలిసి పండక్కి చాలారోజులు ముందుగానే తాటి కండెలు, చింతపేళ్లు, కందిదుంపలు – ఇలాంటివన్నీ సేకరించేవాళ్లం. ఎవరింటిముందు వాళ్లు చిన్న గొయ్యి తీసి అవన్నీ వేసి మంటపెట్టి ఆరిన తర్వాత మట్టి అలికి ఉంచేవాళ్లం. మర్నాడుదయానికి అవి బొగ్గులుగా తయార య్యేవి. వాటిని తీసుకెళ్లి బజారు రోట్లో వేసి దంచుకునేవాళ్లం. ఆ మసికి సూరేకారం, సజ్జపొట్టు అవన్నీ కలిపి గుడ్డలో కట్టి వాటిని మూడు పుల్లల మధ్య కట్టి చివరనో తాడు కడితే ‘పొట్లాలు’ తయారవుతాయి. వాటికి నిప్పు పెట్టి గాలిలో చుట్టూ తిప్పితే నా సామిరంగా… వెలుగు రవ్వలు పువ్వుల్లా రాలుతూ ఉంటాయి. ఇవిగాక కంసాలాయన ‘రోలూరోకలీ’ అని మరోరకం చేసిచ్చేవాడు. దానిలో పొటాషియం, గంధకం దట్టించేవారు కనుక వెలిగించినప్పుడు పేలి పెద్ద శబ్దం వచ్చేది.

పిట్టల్ని కొట్టి… తేనె తాగి…
వ్యవసాయ కుటుంబం కావడం వల్ల మా ఇంట్లో జత ఎడ్లు, ఒక గేదె ఉండేవి. మా ఊళ్లో యానాదులు, వడ్డిరాజులు నిర్వహించే కోడిపందేలంటే నాకు చాలా ఇష్టంగా ఉండేది. వాటికోసం నాకు పదిహేను పదహారేళ్లు వచ్చినప్పటి నుంచీ నేను మా ఇంట్లో కోళ్లను ప్రత్యేకంగా పెంచేవాణ్ని. అప్పట్లో ఇలా డబ్బులు పందెం కాసే పద్ధతి లేదు. గెలిస్తే మనకో కోడి వస్తుందంతే. అదే ఎంతో గొప్పగా అనిపించేది. సంక్రాంతి వస్తోందంటే చాలు ఈ హడావుడి మొదలయ్యేది. పండగ తర్వాత ఒక పదిహేను రోజుల పాటు ఇలాంటి సరదాలు ఉండేవి. అయితే చిన్నప్పుడు మేం నలుగురైదుగురు స్నేహితులం కలిసి ఉదయాన్నే ఒక్క రోజు తోపులకు వెళ్లి పిట్టల్ని కొట్టేవాళ్లం. అక్కడే చితుకులు పోగుచేసి కాల్చుకుని తినేవాళ్లం. ఇదిగాక తేనెపట్టు ఎక్కడున్నా వెతికి కనిపెట్టడం మాకో ఘనకార్యం. ఎక్కడైనా, ఎంత రహస్యంగా అయినా ఉండనీ, మేం దాన్ని కనిపెట్టేసేవాళ్లం. కింద మంటపెట్టి తేనెటీగలు పారిపోయాక హాయిగా తేనె తాగేసేవాళ్లం. తప్పూఒప్పూ పాపంపుణ్యం ఏమీ తెలియని వయసది.


చిన్నప్పట్నుంచీ హీరోనే
మా ఊళ్లో పూర్వం నుంచే హైస్కూలుండేది. అందువల్ల మేం చదువుకోవడం కోసం పెద్ద దూరాలు వెళ్లనవసరం లేకపోయేది. కానీ మా స్కూలుకు చుట్టుపక్కల పది గ్రామాల నుంచి నడుచుకుంటూ వచ్చేవారు విద్యార్థులు. వాళ్లను చూసి చాలా కష్టమనిపించేది. నేనయితే స్కూల్లో అన్నిట్లో ఫస్టే. ఆటలు, పాటలు, పోటీలు… అన్నిట్లో నాదే మొదటి బహుమతి. దానికితోడు ఎర్రగాబుర్రగా ఉండేవాణ్నేమో, సినిమాల్లో హీరోల గురించి చూపిస్తారు చూడండి, అలా ఉండే దన్నమాట నా హవా. నాకు తొమ్మిదిపదేళ్ల వయసున్నప్పుడు ఊళ్లో సినిమాలు వేసేందుకు ఒక టూరింగ్ టెంట్ ఉండేది.

ఏడాదికో రెండుమూడు నెలలు వాళ్లు వేరే ఊళ్లకు వెళ్లేవారుగానీ, మిగిలిన కాలమంతా ఇక్కడే. టెంట్ ఉందంటే నేను ఫస్ట్ షో చూడవలిసిందే. ఒక సినిమా ఎన్ని రోజులు వేసినా నాకు బోర్ కొట్టదు. ప్రతిరోజూ సాయంత్రం ఆట తప్పకుండా చూసేవాణ్ని. టికెట్టు పావలా అనుకుంటాను. దీనికిమాత్రం మా అమ్మానాన్నా ఏమీ అభ్యంతరం చెప్పేవాళ్లు కాదు. అప్పటినుంచే నాకు సినిమా వ్యామోహం పట్టుకుంది. నేను కూడా నటుణ్నవాలి. అదే నా లక్ష్యం. టెంట్ తీసేసి సినిమాల్లేనప్పుడు చుట్టుపక్కల ఏ ఊళ్లో నాటకాలు వేసినా మా ఊరి నుంచి కుర్రాళ్లందరం సైకిళ్లేసుకుని పొలోమని వెళ్లిపోయేవాళ్లం.

చింతామణి, హరిశ్చంద్ర, రామాంజనేయయుద్ధం… ఒకటేమిటి? ఎన్ని చూసేవాళ్లమో లెక్కేలేదు. చివరికి మేమే ఒక నాటకసమాజం స్థాపించి సామాజిక, చారిత్రక నాటకాలు వేసేవాళ్లం. ఒక నవలనో, కథనో నాటకంగా మలుచుకునేవాళ్లం. ఒకసారి పల్నాటియుద్ధం వెయ్యాలనుకున్నాం. కాని నాయకురాలు నాగమ్మగా వెయ్యడానికి తగిన నటి దొరకలేదు. దాంతో నేను ఆడవేషం వెయ్యకతప్పింది కాదు. అదొక్కటే నేను ఆడవేషం వేసిన సందర్భం. ఇప్పటికీ మా ఊరి కుర్రాళ్లు మంచి నాటకాలు వేస్తుంటారు.

మా ఊరి తీరే వేరు
ఇప్పటికీ మా ఊరికి సాగు నీటి సౌకర్యమేదీ లేనందున రెక్కలుముక్కలు చేసుకుని పిల్లల్ని బాగా చదివించుకున్నారు తల్లిదండ్రులు. వారి కృషి ఫలితంగా బాగా చదువుకుని విదేశాల్లో స్థిరపడిన మా ఊరి వాళ్లు 70-80 మంది ఉన్నారు. హైదరాబాద్‌లోనే ఓ వంద కుటుంబాలు రావినూతల వాళ్లున్నారు. ఇక వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నవాళ్లు బోల్డుమంది. అందరం కలిసి ఓ పదిహే నిరవై ఏళ్ల క్రితమే ‘రావినూతల డెవలప్‌మెంట్ సొసైటీ’ని ఏర్పాటుచేసుకున్నా. నిధులు సమకూర్చుకున్నాం. పూర్వం నుంచీ ఉన్న విష్ణు, శివాలయాలను బాగుచేసుకున్నాం. కొత్తగా సాయి మందిరాన్ని, నిలువెత్తు అభయాంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించాం.

అన్ని హంగులతో కల్యాణమంటపం, కళా వేదికలను నిర్మించుకున్నాం. సిమెంటు రోడ్లు, మంచి హైస్కూలు, మంచినీళ్ల ట్యాంకు… అన్నీ ఉన్నాయి మాకు. ఈ సొసైటీ కాకుండా ‘రావినూతల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్’ అని ఇంకోటుంది. దానిలో కూడా మేమంతా భాగస్తులమే. అయితే అది పూర్తిగా ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసమే పనిచేస్తుంది. ఆ సంఘం కృషి ఫలితంగా మా ఊళ్లో ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి క్రికెట్ ఆడగలిగిన అద్భుతమైన స్టేడియమ్ ఉంది. క్రికెట్ ఆడే మంచి ఆటగాళ్లున్నారు. 

ప్రతిఏటా రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలూ జరుగుతాయి. ఢిల్లీ, ముంబై, బెంగుళూరు జట్లొచ్చి మరీ ఆడతాయి. కొన్నిసార్లు సినిమా నటులను తీసుకెళ్లి ఆడిస్తుంటాను. మా ఊళ్లోని సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా సినిమా రంగంలోని నా స్నేహితులను తీసుకెళుతుంటాను. మా ఊరికి సంబంధించి ముఖ్యమైన విషయం ఇంకోటుంది. అదేంటంటే అన్ని ఊళ్లలోనూ ఉన్నట్టే మా ఊళ్లోనూ రాజకీయ పార్టీలున్నాయి కానీ ఎన్నికల వేడి మొదలయినప్పుడే అవి మాకు గుర్తొస్తాయి. ఊరి బాగు కోసం ఏ పని మొదలెట్టినా అందరూ ఒక్కటైపోయి దాన్ని సాధించుకుంటాం తప్ప, పార్టీల పేరిట రాజకీయాలు చేసి ఊరికి వచ్చే సౌకర్యాలను కాలదన్నుకోం.

తీరని వెలితి
మా నాన్నకిప్పుడు 103 ఏళ్లు. నాతోనే ఉన్నారు. ఆయన ఇచ్చిన పొలాన్ని నేను కొంత పెంచాను. నాకు షూటింగులు లేనప్పుడల్లా హుటాహుటిన మా ఊరికెళ్లిపోతాను. వ్యవసాయ పనులను దగ్గరుండి చూసుకుంటాను. పాతదికాక అన్ని వసతులతో మరో కొత్త ఇల్లు కట్టించుకున్నాను. విచిత్రమైన విషయం ఒకటి చెప్పనా, నాకు పదకొండేళ్లో పన్నెండేళ్లో ఉన్నప్పుడు మా అమ్మ ఇల్లు బాగుచేయిస్తుంటే ‘ఎందుకమ్మా ఈ శ్రమంతా, ఇక్కడ ఎల్లకాలం ఉండబోతామా?’ అన్నవాణ్ని నేను. ‘అదేంట్రా అలా అంటావు? ఈ ఊరొదిలి ఎక్కడికి వెళ్తావు’ అని అమ్మ ఆశ్చర్యపోయింది.

సినిమాల్లో చేరతానంటే దెబ్బలు పడతాయని తెలుసు గనక ‘అదేనమ్మా నేను చదువుకుని ఉద్యోగస్తుణ్నవుతాను కదా…’ అని సర్దేశాను. నేను సినిమారంగంలో పేరుతెచ్చుకుని స్థిరపడ టాన్ని మా అమ్మ చూడలేదు. అది నాకు ఎప్పటికీ తీరని వెలితి. తన యాభయ్యేళ్ల వయసులోనే అమ్మ పోయిందంటే నాకు అదొక పెద్ద షాకు. ప్రపంచమంతా శూన్యమే అనిపించింది. పూర్తి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. ‘అమ్మ లేదు’ అన్న వాస్తవాన్ని అంగీకరించి, మామూలు జీవితం గడపటానికి నాకు పూర్తిగా పదేళ్లు పట్టింది. ఇప్పటికీ మా అమ్మ గురించిన ఏ ప్రస్తావ న వచ్చినా నాకు కన్నీళ్లొచ్చేస్తాయి.

కష్టజీవుల ఊరది
మా నాన్న పేరు నాగయ్య, అమ్మపేరు నాగరత్నమ్మ. వాళ్ల పేర్లు కలిసినట్టే, శ్రమ కూడా కలిసే చేసేవారు. నాన్న వెంటే నీడలా మా అమ్మ ఎంత పని చేసేదో చెప్పలేను. ఆమాటకొస్తే ఆడామగా అని తేడా లేకుండా మా ఊరివాళ్లంతా కష్టజీవులే. వంచిన నడుం ఎత్తకుండా పనిచేసేవాళ్లే. రెక్కాడితేగాని డొక్కాడదు అంటారు చూడండి, అందరూ అలాంటివారే. జన్మభూమినే కాదు, రెక్కలుముక్కలు చేసుకుని తమని బాగా చదివించిన తల్లిదండ్రులనూ బాగా చూసుకుంటున్నారు మా ఊరి పిల్లలు. వాళ్లు అభివృద్ధి సాధించి అమ్మానాన్నలను సుఖపెట్టాలని సమస్త సౌకర్యాలనూ క ల్పిస్తున్నారు. ఇక్కడొక విషయం చెప్పాలి. పిల్లలు అన్ని సదుపాయాలనూ కలగజేస్తున్నారుకదాని పెద్దవాళ్లు సోమరిగా కూర్చోవడం లేదు. జీవితమంతా చేసిన శ్రమను వాళ్లు మర్చిపోలేకపోతున్నారు. ఎంత పెద్దవాళ్లయినా, ఇప్పుడు సంపదకేం కొదవలేకపోయినా ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటారు వాళ్లు. ఇది నాకు ఎంత స్ఫూర్తినిస్తుందో చెప్పలేను.


అమ్మ పెద్ద స్పై
నేను మా అమ్మానాన్నలకు ఏకైక సంతానాన్ని. నాకు అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములు ఎవరూ లేరు. అయినా సరదాలకు కొదవ లేని బాల్యం నాది. చెడుగుడును బలిగుడ్డు అనేవాళ్లం. ఎక్కువ సమయం ఆ ఆటలోనే గడిచిపోయేది మాకు. ఇక కోతికొమ్మచ్చి, బచ్చాలాట, బొంగరాలు, గోళీలు… ఒకటారెండా, ఎంత ఆడుకున్నా తనివి తీరేదే కాదు. నేను ఆటల్లో యమా బిజీగా ఉండగా పెద్ద స్పై(గూఢచారి)లాగా నేనెక్కడున్నానో తెలుసుకుని వచ్చేసేది మా అమ్మ. నాలుగు తన్ని నన్ను ఇంటికి తీసుకుపోతూ ఉండేది. ఆ నిమిషానికి ఏడ్చినా, మర్నాటినుంచీ మళ్లీ నా దారి నాదే. ఒక్కణ్నే పిల్లవాణ్ని గనక నాపట్ల చాలా శ్రద్ధగా ఉండేది మా అమ్మ.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నా గెలుపు బాణి నాన్నదే

నా గెలుపు బాణి నాన్నదే


ఆయనకు తెలియని రంగమంటూ లేదు. చిత్రలేఖనం, సంగీతం, కవిత్వం, కథారచన, దర్శకత్వం… ఇలా అన్ని కళారూపాలను ఆయన ఔపోసన పట్టారు. ఆరేడు భాషలలో కవిత్వాలు రాయగల పాండిత్యం ఆయన సొంతం. అయితే రావలసిన గుర్తింపు ఆయనకు రాలేదు. ఎనిమిది పదుల వయసులో సైతం విజయం కోసం ప్రయత్నాన్ని మానలేదు ఆయన. ఆయనే ప్రముఖ సినీ సంగీత దర్శకులు ఎం.ఎం.కీరవాణి తండ్రి శివదత్త. తన విజయానికి బాటలు వేసిన తన తండ్రి గురించి కీరవాణి చెబుతున్న విశేషాలే ఈ వారం ‘నాన్న-నేను’.
పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి నదీ తీరాన ఉండే కొవ్వూరు మా స్వగ్రామం. మా తాతగారు మంచి స్థితిమంతులు. అప్పట్లో స్థానికంగా తిరిగే పది, పన్నెండు ప్రైవేట్ బస్సులుండేవి మా తాతగారికి. ఆయనకు ఏడుగురు సంతానం. నాన్నగారు మూడవ కుమారుడు. ఒక అక్క, ఒక అన్న, నలుగురు తమ్ముళ్లు నాన్నగారికి. నాన్నగారి చివరి తమ్ముడే దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌గారు. నాన్నగారికి చిన్నప్పటి నుంచి చదువు మీద కన్నా కళల మీదే మక్కువ ఎక్కువ.

చదువు సంధ్య లేకుండా కళలంటూ కలలు కంటున్నాడని బస్సులను తనిఖీ చేసే బాధ్యతను నాన్నగారికి అప్పగించారు తాతగారు. అది ఆయనకు ఇష్టంలేని పని. దీంతో కొంత డబ్బు తీసుకుని ఇంట్లో చెప్పాపెట్టకుండా బొంబాయికి వెళ్లి అక్కడ జెజె ఫైనార్ట్స్ కాలేజ్‌లో చిత్రలేఖనంలో డిప్లొమా సంపాదించి ఊరుకి తిరిగి వచ్చారు. నాన్నగారు అద్భుతంగా చిత్రాలు వేస్తారు. అప్పట్లో ఆయన వేసిన వేంకటేశ్వరస్వామి, పద్మావతి అమ్మవార్ల చిత్రాలు ఇప్పటికీ చాలా ఇళ్లలో దర్శనమిస్తాయి.

రచయితలకు కలం పేరు ఉన్నట్లే నాన్నగారి బ్రష్ నేమ్ ‘కమలేష్’. నాన్నగారు వేసిన చిత్రాలతో ఈ మధ్యనే ఒక ఎగ్జిబిషన్ కూడా పెట్టాము. కేవలం చిత్రకారుడిగానే నాన్నగారి ప్రయాణం సాగి ఉంటే గొప్ప పేరు ప్రతిష్టలు వచ్చి ఉండేవేమో! కాని, నాన్నగారికి ఇదొక్కటే కాదు ఇంకా చాలా అభిరుచులు, ఆసక్తులు ఉన్నాయి.

కథలు, కవితలు, నాటకాలు రాయడం నాన్నకు ఇష్టమైన వ్యాసంగాలు. గిటార్, సితార్, హార్మనీ వంటి వాయిద్యాలను నాన్నగారు సొంతంగా నేర్చుకున్నారు. ఏ ఒక్క కళారూపాన్నో అంటిపెట్టుకోకుండా ఎప్పుడు ఏది ఇష్టమో దాన్ని చేసుకుంటూ పోవడం ఒక్కటే ఆయనకు తెలుసు. నాన్నగారికి వాళ్ల పెద్దలు పెట్టిన పేరు సుబ్బారావు. అది నాజూకుగా లేదని బాబురావుగా మార్చుకున్నారు. మిత్రులు నాన్నగారిని ‘బాబ్జీ’ అని పిలిచేవారు. కొన్నాళ్ల తర్వాత ఆ పేరులో కూడా కొత్తదనం లేదని ‘శివదత్త’ అని ఖాయం చేసుకున్నారు. నాకు ఊహ తెలిసినప్పటినుంచి నాన్నగారి పేరు అదే.

భానుమతి-భాగ్యవతి
నాన్నగారికి అలనాటి గాయక నటీమణి భానుమతి గారన్నా, సంగీత దర్శకులు ఎస్. రాజేశ్వరరావు గారన్నా వల్లమాలిన అభిమానం. ‘మల్లీశ్వరి’ సినిమాను ఆయన కొన్ని వందల సార్లు చూసి ఉంటారు. పెళ్లి చూపులకు వెళ్లినపుడు అమ్మ వీణ వాయించడాన్ని చూసి ఆనందించారట. పేరు ‘భానుమతి’ అని తెలుసుకుని మారుమాట్లాడకుండా పెళ్లి చేసుకున్నారట. అయితే ఆ తర్వాత తెలిసింది నాన్నగారికి తనలాగే అమ్మ పేరు కూడా ‘ఒరిజినల్’ కాదని! సూర్యభగవానుడి నక్షత్రంలో పుట్టిందని అమ్మకు సూర్యనారాయణ అని నామకరణం చేశారట.

అయితే మగ పిల్లాడిని పిలిచినట్లుగా ఉందని ఆ తర్వాత భానుమతి అని మార్చారట. అదీ భానుమతిగారి పేరు మహత్యం! మా అమ్మానాన్నలకు మేము ఆరుగురం సంతానం. నేనే మొదటివాడిని. చాలామంది నా పేరులో ముందు ఉండే మరకతమణే ఇంటి పేరుగా భావిస్తుంటారు. నిజానికి మా ఇంటిపేరు కోడూరి. నాకు మా అమ్మానాన్నలు పెట్టిన పేరు మరకతమణి కీరవాణి. మరకతమణి అంటే ఎమరాల్డ్ స్టోన్(పచ్చ రాయి).

ఇక కీరవాణి అన్న పేరు రావడానికి కారణం ‘విప్రనారాయణ’ సినిమాలోని తనకు ఇష్టమైన ‘ఎందుకోయి తోటమాలి’ పాట ఏ రాగంలోనిదని ఎస్. రాజేశ్వరరావుగారిని కలిసినపుడు నాన్నగారు అడిగారట. అది ‘కీరవాణి’ రాగం అని ఆయన చెప్పడంతో ఎంతో ఇష్టంగా ఆ రాగాన్ని నా పేరులో చేర్చారు నాన్నగారు. నా తర్వాత చెల్లెలు కర్ణప్రియ, తమ్ముడు శ్వేతనాగ, చెల్లెలు శ్రీసప్తమి, తమ్ముళ్లు శివశ్రీకాంచి, కల్యాణి మాలిక్. నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో నాన్నగారి పాత్ర ఎంతో ఉంది. ఏడెనిమిదేళ్ల వయసులో ఉన్నప్పుడు ఒకసారి వీధిలో కనిపించిన పిల్లిని రాయితో కొట్టాను.

అది చూసిన నాన్నగారు నా చెంప చెళ్లుమనిపించారు. “అది నిన్నేం చేసిందని దాన్ని రాయితో కొట్టావు. దాని వల్ల నీకేం అపకారం జరిగింది. మూగజీవాలపైనా నీ ప్రతాపం?” అంటూ తీవ్రంగా మందలించారు. ఆనాటి నుంచి జీవహింసకు నేను దూరమయ్యాను. అలాగే మా ఇంట్లో నరసమ్మగారని ఒక మామ్మగారు ఉండేవారు. ఒకరోజు నేను సరదాగా ‘ఏయ్! నరసమ్మా’ అంటూ ఏకవచనంతో ఆటపట్టించాను. అది నాన్నగారి కంటపడింది. “ఆవిడ వయసెక్కడ, నీ వయసెక్కడ? పెద్దలను అలా పేర్లతో పిలుస్తారా? మామ్మగారు లేదా నరసమ్మగారు అని పిలు” అంటూ కొట్టకపోయినా నాన్నగారు బాగా చివాట్లు పెట్టారు.

మనకన్నా వయసులో పెద్దవారిని గౌరవవచనంతో పిలవాలని నాన్నగారు ఆనాడు చెప్పిన మాటలను ఈనాటికీ పాటిస్తున్నాను. ‘చివరకు మిగిలేది’ అనే సినిమాలో శివరంజని రాగంలో స్వరపరిచి శ్రీరంగం గోపాలరత్నంగారు పాడిన ‘చిన్నారీ నీ సొగసే’ అనే పాట నాన్నగారు నాకు నేర్పించిన మొదటి పాట. నాన్నగారికి ఇంగ్లీషు భాషపైన మంచి పట్టుంది. మేము పెద్ద చదువులు చదువుకోకపోయినప్పటికీ ఇంగ్లీషులో మేము అనర్ఘళంగా మాట్లాడడానికి నాన్నగారు నేర్పించిన ఆనాటి ఇంగ్లీషు పాఠాలే కారణం.

ఏ రంగాన్నీ వదిలిపెట్టలేదు
నాన్నగారు కేవలం చిత్రకారులే కాదు…మంచి కవి, రచయిత కూడా. గంగావతరణం, వైణతేయం లాంటి పద్యకావ్యాలు రాశారు. హంసమంజీరాలు అనే నవల రాశారు. ఎన్నో క«థలు, నాటకాలు రాశారు. కాళీమాత మీద దాదాపు 150 శ్లోకాలు రాశారు. ఆయన తెలుగు, సంస్కృతం, కన్నడ, తమిళం, హిందీ, ఇంగ్లీషు భాషల్లో అనర్ఘళంగా మాట్లాడడమే కాదు పాటలు కూడా రాస్తారు. ఇవిగాక హార్మోనియం, సితార్, గిటార్ వాయిస్తారు. పాటలు కూడా పాడతారు. చక్కని హావభావాలతో నటించి చూపిస్తారు.

ఒక్కమాటలో చెప్పాలంటే నాన్నగారు ప్రవేశించని రంగం లేదు. నాన్నగారికి బాడీ బిల్డింగ్ అంటే కూడా చాలా ఇష్టం. నాన్నగారు తాను రాసిన కథలతో సినిమాలు తీద్దామని దర్శకత్వం చేసి చేతులు కాల్చుకున్నారు. నిర్మాణ రంగంలో అనుభవం లేక కొంతమంది భాగస్వాములతో కలిసి రెండు, మూడు సినిమాలు తీయడం, అవి మధ్యలోనే ఆగిపోవడం జరిగింది. ఆ తర్వాత ‘అర్ధాంగి’ అనే సినిమాకు దర్శకత్వం చేసే అవకాశం నాన్నగారికి వచ్చింది. నాన్నగారు ఈ మధ్యనే ‘చంద్రహాస్’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ చిత్రానికి నంది అవార్డు వచ్చినా పెద్దగా ఆడలేదు.

నాన్నగారు తన పెళ్లి కాకముందు ఒక్కరే మద్రాసు వెళ్లి ఎల్.వి. ప్రసాద్‌గారి దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశారు. ఆ రోజుల్లో ప్రసాద్‌గారికే పెద్దగా పనిలేదు. అప్పుడప్పుడే ఆయన నిలదొక్కుకుంటున్నారు. చేతి నిండా పనిలేకపోవడంతో నాన్నగారికి బోర్ కొట్టి వాపసు వచ్చేశారు. ఆ తర్వాతి కాలంలో ఎల్.వి. ప్రసాద్‌గారు అగ్రదర్శకులుగా ఎదిగారు. అక్కడే కొనసాగి ఉంటే ఈ రోజు కె. విశ్వనాథ్‌గారి సరసనో, బాపుగారి సరసనో నాన్నగారి పేరు కూడా నిలబడి ఉండేదేమో!

సంగీతంలో సరిగంగస్నానాలు
రాయచూరులో భూములు చవకగా దొరుకుతున్నాయని తెలిసి కొవ్వూరులో పొలాలు అమ్మేసి నాన్నగారు మకాం అక్కడికి మార్చారు. పొలాలు కొని వ్యవసాయం చేయించడం మొదలుపెట్టారు. అయితే స్వీయ అజమాయిషీ కొరవడడంతో లాభాలు గుమాస్తాల పరమైపోయాయి. అక్కడే ఇంటర్మీడియట్‌తో నా చదువుకు ఫుల్‌స్టాప్ పెట్టేశాను.

ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ రాశాను కాని సీటు రాలేదు. నేను చదువు మానేసినందుకు అందరూ బాధపడుతుంటే సంతోషించింది ఎవరైనా ఉంటే అది నాన్నగారే. “చదువు నీకు కూడు పెట్టదు. తీసి అవతల పారెయ్. ఇప్పుడు నీకు కావలసినంత సమయం దొరికింది. సంగీతం మీదే పూర్తిగా ఏకాగ్రత పెట్టు. దేవుడిచ్చిన సంగీత జ్ఞానం నీకుంది. దాన్ని మెరుగుపరుచుకో” అంటూ నాన్నగారు నాకు మార్గదర్శనం చేశారు.

ఇప్పుడైతే సినిమా పాటలకు బాణీలు కడుతున్నాను కాని ఆ రోజుల్లో నాన్నగారు రోజుకో పాట రాయడం నేను బాణీలు కట్టడం. అలా కొన్ని వేల పాటలు మేమిద్దరం సృష్టించాము. అన్నపానీయాల మీద ధ్యాస లేకుండా ఏళ్ల తరబడి జరిగింది ఆ కఠోర సాధన. నాన్నగారు ఇచ్చిన ఆ తర్ఫీదే కళాతపస్వి కె. విశ్వనాథ్‌గారి చిత్రాలకు సంగీత దర్శకత్వం చేసే అవకాశాన్ని నాకు కల్పించింది.

నాన్న వేసిన మెట్ల మీదుగా…
జీవితంలో అందరికీ ఆశలు, ఆశయాలు ఉంటాయి. వాటిని సాధించుకోవడానికి అందరమూ కష్టపడతాము. కాని…విజయం అందరినీ వరిస్తుందన్న భరోసా లేదు. మనలో ఎంత ప్రతిభ ఉన్నా సక్సెస్‌తోనే అది వెలుగులోకి వస్తుంది. నాన్నగారు బహుముఖ ప్రజ్ఞాశాలి. అన్ని రంగాలను ఆయన స్పృశించారు. ఆయన ఏ ఒక్క రంగానికో పరిమితం కాలేకపోయారు. ఒక్క రంగానికే పరిమితమై ఉంటే ఆయనకు రావలసిన గుర్తింపు వచ్చి ఉండేదేమో! కాని నాన్నగారిది అందుకు పూర్తి విరుద్ధమైన మనస్తత్వం. తన ఇష్టాయిష్టాలకు వస్తే ఆయన రాజీపడే ప్రసక్తి ఉండదు.

నాన్నగారికి ఇప్పుడు 80 ఏళ్లు. ఇప్పటికీ అలుపెరుగని అవిశ్రాంత యోధులాయన. దేవుడి దర్శనం కోసం కొండ ఎక్కాలంటే మెట్ల దారిలో వెళ్లకతప్పదు. మనల్ని భగవంతుడి దర్శనానికి పంపే మెట్లు మాత్రం ఆ దేవుడిని చూడలేవు. నాన్నగారు కూడా ఆ మెట్లలాంటివారు. మా ప్రగతికి ఆయనే మెట్టుగా మారారు. తన జీవితంలో తాను ఆశించిన విజయం దరికి చేరకపోయినా మా విజయానికి తానే ఆలంబన అయ్యారు. జీవితంలో నేనేమైనా సాధించి ఉంటే అది నాన్నగారు వేసిన పునాదే.

Posted in సేకరణలు | Tagged | Leave a comment

కొత్త అందాలతో చల్లపల్లి రాజా గారి కోట

kotta challapalli kota

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

అవీ ఇవీ అన్నీ -4

అవీ ఇవీ అన్నీ -4

1–సెప్టెంబర్ అయిదు గురు పూజోత్సవం నాడు చేసే ప్రతిజ్ఞ-

To commit our selves once more to our  chosen profession

 Endeavour selflessly to brighten the lives of those in our charge

 Allow ourselves to accept that self improvement is an endless process

 Cherish ourselves the values that we preach

Help that special child with love in our heart as he needs us more

Evaluate ourselves honestly and mend what needs mending

Reach out to the vast expanding field of knowledge and be better informed

Serve with willingness ,not apathy

Do what is right ,rather than what is easy’

Acknowledge we are shaping tomorrow’s world

Yes !let us promise to live up to their expectation .

 

2—28-6-1985 న మంగళా పురం జిల్లా పరిషద్ ఉన్నత పాఠ శాలలో డ్రాయింగ్ మేష్టారు శ్రీ శ్రీరాం పాండు రంగా చార్యులు గారు పదవీ విరమణ చేసినప్పుడు హెడ్ మాస్టారు గా నేను  రాసి చదివిన కవిత

                శ్రీ రాం రాం

మితంగా మాట్లాడితేనేం హితం గా ఉంటుంది

నెమ్మదిగా ఉంటేనేం నెమ్మది పవిత్రం

పొట్టిగా ఉన్నా గట్టివాడే

నల్లని రూపం లో చల్లని ఆత్మీయత

విధి నిర్వహణ లో విశిష్టమైన పంధా

బాధ్యతా నిర్వహణ అనన్య సామాన్యం

క్రమ శిక్షణ కు మారుపేరు

వినయ ,శీలాలకు వెలుగు రేక

గౌరవం ఇచ్చి పుచ్చుకొనే సంస్కారి

కళకు కాణాచి ,బోధనకు ‘’గురువే’’

నిత్య నిరంతర పరిశీలనా శీలి

మమత సమతా మానవతా సమాహారం

దూరదర్శి, మార్గ దర్శి ,సన్మార్గ గామి

జీవితం లోతు పాతులు తరచిన సౌజన్య మూర్తి

గాడి తప్పిన వాడి తో దేనికైనా సిద్ధమే

ఆతిధ్యం అతి మధురం ఆదర్శం మధురాతి మధురం

ముప్ఫై అయిదేళ్ళ క్రితం పదవికి శ్రీరామ చుట్టి

నేడు విరమణ సందర్భం గా రాం రాం పెట్టె

ఇన్ని సద్గుణాల కాల వాల మైన కళాచార్యులు

శ్రీయుత శ్రీరాం పాండు రంగా చార్యులు .

          సశేషం

మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ -31-3-13-ఉయ్యూరు

 

 

Posted in సేకరణలు | Tagged | Leave a comment

కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -1

  కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -1

                       బహునూతన కవి పఠాభి

‘’వచన పద్యమనే దుడ్డు కర్రల్తో-పద్యాల నడుముల్ విరగ దంతాను ‘’అని ఎవరనన్నారని ప్రశ్నిస్తే ఠకీ మని జవాబు వస్తుంది ‘’పఠాభి ‘అని .అంత ప్రాచుర్యం పొందిన కవి ఆయన .రొటీన్ కవిత్వం వెగటు పుట్టింది .ఆ కన్నీళ్లు ,విరహాలు వేదనలు అలంకారాలు విసుగు పుట్టాయి .అందరి కంటే భిన్నం గా ఆలోచించాలన్న భావం బలమైనది .తెలుగు కవిత్వానికి కొత్త రక్తం ఎక్కించాలని ఆరాటం పెరిగింది .చెప్పే ప్రతి మాటా కొత్తదనం తో ఆకర్షణీయం గా ఉండాలని పించింది .అందుకే ఛందస్సు బంధాల నుంచి కవిత్వాన్ని విముక్తి చేశాడు .కొత్త రూపు సంత రించాడు .ప్రయోగాలు చేశాడు .ప్రశసల తో బాటు అభిశంసలూ పొందాడు .అతనే తిక్కవరపు పట్టాభి రామ రెడ్డి .తన పేరునే ముందుగా కొత్తగా‘’పఠాభి ‘’గా మార్చుకొని నవ్య కవిత్వానికి నాంది పలికాడు .

      ‘’ఫిడేలు రాగాల డజన్ ‘’అన్న పేరు విన గానే పఠాభి జ్ఞాపకం వస్తాడు .అంతటి గాఢ ముద్ర ను తెలుగు కవిత్వం పై వేశాడు .ఆయన నెల్లూరు లో 1919 లో జన్మించాడు .మద్రాస్ ప్రెసిడెన్సి కాలేజి లో ఇంటర్ చదివాడు .ఇంటరె కాదు చలాన్నీ శ్రీ శ్రీ ని చదివేశాడు .రవీంద్రుని శాంతి  నికేతన్ లో  బి.ఏ.చేశాడు .చిత్రలేఖనం పట్టుబడింది .విశ్వకవి రవి కవి సాహిత్యం కరతలామలకం అయింది .కలకత్తా లో ఏం.ఏ.చదివాడు .అప్పటికే కలకత్తా ‘’dying city ‘’గా పేరు పొందింది .వేగవంతమైన జీవితం ,మురికి ఆవాసాలు, కటిక దరిద్రం ,వేదన ,రోదన లతో పిచ్చెక్కి పోయినట్లుండేది .ఇరుకు గదిలో కాపురం ఉన్నాడు .శాంతి నికేతన్ లో చదివినా అశాంతి మనసంతా ఆవరించుకొని ఉంది .చంద్రుడు చల్లగా కన్పించనే లేదు .వింతగా తోచాడు కవి పఠాభి కి .అ భావాలనే తర్వాత కవిత్వం లో పొందు పరచాడు .కుటుంబం మైకా వ్యాపారం చేసేది .తానూ పాలుపంచుకొన్నాడు .మద్రాస్ కు తరచు వెళ్తూఉండే వాడు .ఆ నగరం లో కొత్త నాగరకత ఆకర్షించింది .కవిత్వం మొగ్గ తొడిగింది .

                       ఫిడేలు రాగాల డజన్ 

‘’డజను ఫిడేలు రాగాలు ‘’అని సాధారణం గా అంటాం .అలా అంటే పఠాభి ఎందుకవుతాడు ?తిరగేసి కొత్తదనం తెచ్చాడు .ఛందస్సు పరిష్వంగం లోంచి బయట పడ్డాడు .తన ఊహా శక్తికి తగిన వాహిక ను ఎన్నుకొన్నాడు .మద్రాసు నగర జీవితాన్ని ఫిడేలు రాగాలలో బంధించాడు . తానే మేని ఫెస్టోతయారు చేసుకొన్నాడు .’’పద్యానికి ,గద్యానికి అంట కట్టి ,,గ్రాంధికానికి వ్యావహారికానికి పెళ్లి చేసి ,తెలుగు ,ఇంగ్లీష్ కు పొత్తు కలిపి కవిత్వం రాస్తాను .వచన కవిత్వం అనే పేరుతో పిలుస్తా .వాటిని దుడ్డు కర్రల్ని చేసి పద్యాల నడుము విరగ గోడ్తా ‘’అన్నాడు .తన కవిత్వం పూర్వ కవిత్వం కాదు ,నవ్య కవిత్వం కాదు ,భావ కవిత్వం కాదు ‘’నూతనములో బహు నూతన కవిత్వం ‘’తనది అని ప్రవర చెప్పుకొన్నాడు .అందుకే ఫిడేలు రాగాల డజన్ అసలు సిసలు మొదటి వచన కవితా గ్రంధం అయింది అన్నాడు ఆరుద్ర .పాశ్కాస్చవాయిద్యమైన ఫిడేలుతో కర్నాటక సంగీతం పలికించి నట్లు ఇంగ్లీష్ కవిత్వ రీతుల్ని తెలుగులో ప్రవేశపెట్టాడని విమర్శకాభిప్రాయం .ఈ పుస్తకానికి శ్రీ శ్రీ ‘’ఇంట్రో ‘’రాశాడు .అందులో ‘’విచిత్రమే సౌందర్యం ,సౌందర్యమే విచిత్రం ‘’అని తీర్మానించాడు .ఇదే ప్రసిద్ధ ఆంగ్ల కవి రచయితా విమర్శకుడు ఆస్కార్ వైల్డ్ అభిప్రాయం కూడా .తనను ‘’అహంభావ కవి ‘’గా పఠాభి పిలుచుకొన్నాడు .

    ‘’కాంగ్రెస్ పట్టాభి ని కాదు ,మరో పఠాభి ని ‘’అని నిర్వచిన్చుకొన్నాడు .తన కళ్ళలో టెలిస్కోపులు మైక్రోస్కోపులున్నాయన్నాడు .అన్నీ చూడగలనని చాలెంజి చేశాడు .’’చిన్నయ సూరి బాల వ్యాకరణాన్ని దండిస్తాను .’’అని తొడ గొట్టాడు .అతని ప్రవ్రుత్తి అహంకారం , విశ్రుమ్ఖలత .వైచిత్రీ .సెక్సు ప్రధానం గా సాగిన వచన పద్యాలవి .ఇంతటి తిరుగు బాటును అంత వరకు ఏ కవీ చేయలేదు .నగర జీవితాన్ని వస్తువు గా తీసుకొని రాసిన నవ్య కవుల్లోపఠాభియే మొదటి వాడు .అతనిది ‘’వస్తుభావ పద వైచిత్రి ‘’అంటారు నారాయణ రెడ్డి .సంఘం లోని కుళ్ళు ను బయట పెట్టాడు .అతని పద ప్రయోగ నూతనత్వం ఆశ్చర్యమేస్తుంది .’’బోగం పిల్ల చనులు బూందీ పొట్లాల లాగా ‘’ఉన్నాయి ‘’అంటాడు పచ్చి శృంగారాన్ని ఒలక బోశాడు .బోగం దాన్ని ‘’సంఘానికి వేస్ట్ పేపర్ బాస్కెట్  ‘’గా వర్ణించాడు .

        సూర్య బింబం పఠాభికి ‘’ప్రభాత రేజరు నిసి నల్లని చీకట్ల గడ్డాన్ని షేవ్ జేయన్ పడిన కత్తి గాటు ‘’లా కనీ పించింది .ఇంగ్లీష్ పదాల్ని విచ్చల విడిగా వాడేశాడు .’’హైహీలు యాన ‘’,’’మద్రాస్సిటి ‘’,’’క్యాజ్జేయ ‘’వంటి పద చిత్రాలు కూర్చాడు .శాకా హారుల్ని ‘’శాఖాహారులు ‘’అన్నాడు .అక్షరాల్ని విడదీసి వినోదించాడు .అచ్చులో  .అడ్డం గా ,నిలువు గా రాసిచమత్కారాలు చేశాడు .ట్రాఫిక్ పోలీస్ అతనికి ‘’నట రాట్టు లాగా నతండుకూడా మృత్యుంజయ నృత్యంబును సల్పుచుంటాడు సతతము ‘’గా కన్పిస్తాడు .విపరీతం గా ఆలోచించే మనస్తత్వం పఠాభిది.అందుకే రామాయణం లో సీత‘’రామయ్య సతి గా నుంట కన్న ,రావణుని ప్రియు రాలుగా ఉండి ,అమరుడిని చేస్తే బాగుంటుంది ‘’అనివిపరీతపు ఆలోచనా చేసిన వాడు వెర్రి పఠాభి .అందుకే పఠాభి ది ‘’ప్రైవేటు రోడ్డు దాని పై నేను తప్ప వేరెవరు నడవ లేదు‘’అంటాడు తాను కూడా విచిత్ర ప్రయోగ శీలి ప్రయోగ శీలి అయిన ఆరుద్ర .పఠాభి టెక్నిక్కు ,చమత్కారం ,తిరుగుబాటుతనం తెగింపు ఉన్న కవి గా ముద్ర పడ్డాడు .

                      పఠాభి పన్ చాంగం 

      అంత్య ప్రాసలతో దేశీ ఛందస్సులో కవిత్వం కూడా రాశాడు పఠాభి .’’కయిత నా దయిత ‘’అనగల ధైర్యం పఠాభి ది .పఠాభికి పేరు తెచ్చింది ‘’పఠాభి పన్ చాంగం ‘’.దీన్ని1946 లో రాశాడు .ఇందులో వాటిని ఉదాహరించని సాహితీ ప్రియుడుండడు .అవన్నీ ‘’శ్లేషక్రడలే’’ .శ్లేష హాయి తెలిసిన వాడు పఠాభి .’’పన్ లలో సంపన్నుడు పఠాభి‘’.అనిపించుకొన్నాడు ..’’నీలగిరి నీలిమలు ‘’కూడా రాశాడు .ఉదాత్తుడైన మనిషి పఠాభి .సోషలిస్టు భావాలున్న వాడు .రామ మనోహర లోహియాకు అతి సన్నిహితుడు పఠాభి .పఠాభి భార్య ‘’స్నేహలత ‘’ఎమెర్జెన్సి కాలం లో ఇందిరా గాంధి దౌష్ట్యానికి బలి అయింది .పఠాభి ‘’సంస్కార ‘’అనే ఆర్ట్ ఫిలిం తీసి దర్శకత్వం వహించాడు .దీనికి అంతర్జాతీయ ఖ్యాతి వచ్చింది .ఈ సినిమా ను అందరు ‘’నూతన దృశ్య కావ్యం ‘’అన్నారు .ఇంకొన్ని సినిమాలు నిర్మించి పేరుపొందాడు .ఆయన కుమారుడూ సినీ నిర్మాతే ..2006 లో పఠాభి మరణించాడు .పైలోకాల్లోను తన అహంభావం ప్రదర్శించి దేవ వేశ్యలను ‘’బహు బహు నూతనం గా ‘’వర్ణిస్తూ ఉంటాడేమో ?ఏమైనా శబ్దం లోంచి ‘’అగ్గి ‘’పుట్టించాడు పఠాభి .ఆయన‘’పన్ చాంగ పఠనం’’ తో శుభం కార్డు పలుకుదాం

     1-‘’ఉద్యోగుల్లో రెండు రకాలు –ఒకరు చేసే వారు –మరొకరు కాజేసే వారు

     2-కాంగ్రెస్ వాళ్లకు వడకటం తగ్గి –యేకటం హెచ్చింది

     3-కవితా పట్టాభి షిక్తుడు పఠాభి

     4-జిహ్వ పని వాదించుటే కాదు –ఆస్వాదించుట కూడా

.

        మరో కవిని గురించి ఇంకోసారి

      మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ -31-3-13- ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged , | Leave a comment

అవీ ఇవీ అన్నీ -3

  అవీ ఇవీ అన్నీ -3

1-ఆదిత్య మండలం లో ప్రకాశించే మహిమాన్విత మైన కాంతులే ‘’వేద రుక్కులు .‘’సంధ్యా సమయం లో విరాజిల్లే ప్రభలు ‘’సామ వేద సంహితలు’’ .చండ మార్తాండ మండలం లో మనోహరం గా ప్రవహించేసత్యమైన ఆత్మయే యజుర్వేదం .ఆత్మ కారకుడు ఆదిత్యుడు .ఆరోగ్య ప్రదాత .,అన్నదాత .అని ‘’అరుణం ‘’చెబుతోంది .

2-బ్రహ్మ లోకం లో నాలుగు నక్షత్రాలు చతురస్రం ఆకాశం లో ఉన్నాయి .వాటి కింద ‘’నిబుళ ‘’అనే మేఘం వర్తులాకారం గా తిరుగుతుంది .ఇది వీణా కారం గా ఉంటుంది .ఇదే ‘’శారద ‘’కు ప్రతీక .బ్రహ్మాండం లోని నక్షత్ర మండలం నుంచి ధ్వనులు ఉత్పత్తి అవుతాయి .అవే వేదాలకు ఆధారం .అందుకే వేదాలు అపౌరుషేయాలు .

3-యూరప్ లోని ‘’లార్దేస్ తటాకం ‘’ఒక పవిత్రమైన రోజున స్నానం చేస్తే అన్ని వ్యాధులు  నయం చేస్తుంది .’’man the unknown ‘’అనే పుస్తకం రాసిన dr.Elixis carcell అనే నోబెల్ ప్రైజ్ విన్నర్ దీని పై పరిశోధన చేసి డాక్టర్ల బృందం తో వెళ్లి స్నానం చేసిన తర్వాతా ,చెయ్యక ముందు పరీక్షలు చేయించాడు .శారీరక ,మానసిక రోగాలన్నీ తగ్గి పోయి నట్లు వారందరూ నిర్ధారించారు .శరీరం లో ఆర్గానిక్ మార్పులు కూడా గమనించాడు .’’నా కళ్ళ ముందు ప్రత్యక్షం గా కన్పిస్తున్న రుజువు ను నేను ఎలా కాదన గలను ‘’?అన్నాడు ఆయన .

4-19 వ శతాబ్దం చివర భారత దేశం సందర్శించిన ‘’మార్క్ ట్వేన్ ‘’అనే ప్రఖ్యాత అమెరికన్ నవలా కారుడు ,అమెరికా అస్తిత్వాన్ని నిరూపించిన దార్శనికుడు భారత దేశాన్ని సందర్శించాడు .ఇక్కడి మన పవిత్ర గంగా జలం గురించి అద్భుతం గా వర్ణించాడు అతని ‘’more tramps abroad ‘’అనే పుస్తకం లో ఇలా రాశాడు ‘’కలరా బెనారస్ లో సంభవించినా ,చుట్టుపక్కల ప్రదేశాలలో వ్యాపించలేదు .ఆగ్రా లోని గవర్న మెంట్ డాక్టర్ ‘’హానికన్ ‘’గంగ నీటిని పరీక్షించాడు .నదిలోకి మురికి గొట్టాల ద్వారా వచ్చే నీరు కలిసిన చోట పరీక్ష చేశాడు .అందులో లక్షలాది క్రిములున్నాయి .ఆరు గంటల తర్వాత పరీక్షిస్తే అవన్నీ చచ్చి పోయి ఉన్నాయి .నదిలో శవం ఉన్న చోట కూడా నీటిని పరీక్షించాడు .అక్కడా అదే ఫలితం .బావులలోని నీటిని ,పరీక్షించాడు కలరా క్రిములు విపరీతం గా వృద్ధి చెందాయి .కనుక గంగ లో ఎంత కలుషితం వచ్చి కలిసినా కొద్ది కాలం లో యదా స్తితికి వచ్చే గుణం గంగ నీటికి ఉంది .ఈ విషయాన్ని తరతరాలుగా హిందువులు నమ్ముతున్నారు .క్రిమి శాస్త్రం అంత ప్రాచీన కాలం లో కూడా వారికి ఎలా తెలిసిందో ఆశ్చర్యం గా ఉంది .మన పశ్చిమ దేశస్తులు ఆటవిక పధ్ధతి నుంచి బయట పడటానికి చాలా ముందే హిందువులకు మహోన్నత నాగరకత ఉందని స్పస్టం అవుతోంది . ‘’అని రాశాడు మహానుభావుడు మార్క్ ట్వైన్. .గంగా జలాలకు క్రిమి సంహారక స్వభావం ,తనను తాను శుభ్ర పరచుకొనే గుణం ఉన్నట్లు ప్రపంచం లో ఏ నదికీ లేదు

నీలం రాజు లక్ష్మీ   ప్రసాద్ –ఆంద్ర ప్రభ -22-3-95

5-బ్రహ్మర్షి రఘుపతి వెంకట రత్నం నాయుడు గారి గురించి శిష్యులు కృష్ణ శాస్త్రి

‘’ఈ జడ జీవితమ్ము పలికించితి నే యమ పంక మందు నం

   భోజము మొల్వ జేసితివి అపూర్వము నీదయ ఈ నిశీధి ,నీ

   రాజన మెత్తినావు ,విపులమ్మగు నీఎద నిండెనే ,శర

   ద్రాజిత చంద్ర కాన్తులంచు తమ్ములు స్వర్గ లతాంత వాసనల్ ‘’

6-పానుగంటి లక్ష్మీ నరసింహా రావు గారు పిఠాపురం రాజా వారి పై చెప్పినతమాషా  పద్యం

‘’స్వజనుల నేరీతి బరిపాలన మొనర్తు –నాశ్రితుల నెవ్వాని నాచరింతు

 వాదాయమున నెంత యర్దుల కిచ్చెద –వేదేటు చేసిన భ్రుత్యు నెద గణింతు

  నవని పాలన నేది యార్జించి నాడవు –కవిత గానంబు నే పగిది విందు

  వేట్లుగా  బృధుసౌఖ్య మీక్షిం పగా  నుంటి –వాత్మ సంస్తుతుల కే మందువయ్య

  సరిగ ,ధని ,సగమ ,పనిని ,సరిగ ,గరిమ –మరి మరిగ ,పాపనిగని ,సరి సరి యని

  వీణ కాని ‘’మా ‘’వెన్క ‘’నీ’’వీణ వరుస—మీద !’’నీ’’ వెన్క’’మా ‘’సూర్య మేదినీశ .’’

           సేకరణ –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -30-3-13- ఉయ్యూరు

Posted in సేకరణలు | Tagged | Leave a comment

అవీ ఇవీ అన్నీ -2

 అవీ ఇవీ అన్నీ -2

మండేకాలం –ఎండాకాలం –కవితలు

1-నారాయణ బాబు

‘’ఎండాకాలం ఎండా కాలం –పగళ్ళు నెగళ్లు

  మండే రోడ్డు –పన్నెండు గంటలు

2-‘’ప్రకృతి పెట్టిన వేసవి గాన పాఠశాల –

    తుమ్మెద తుంబుర శ్రుతి –కోయిల ఒజ్జ’’

3-దాశరధి

‘’నాల్క కింత తడిలేకున్నా –నయనాలకు తడి తగిలించిన

   క్షణ క్షణ విజ్రుం భిత  తృష్ణ –ఈ మృగ తృష్ణ

4 –నామాడి శ్రీధర్

‘’ఇరుకు గదిలో పసి పిల్ల ఎడతెగని ఏడుపుకి –

  ఆరుబయట చెమర్చిన తార్రోడ్డు ‘’

5-తిలక్

  ‘’కాలం కదలదు –గుహలో పులి పంజా విప్పదు

    గాలం తగలదు –చెట్ల నీడ ఆవులు మోరలు  దింపవు

    నల్లపిల్లి బల్లిని చంపదు ‘’

6-తిలక్

 ‘’గది అవతల స్టెయిన్ లెస్ స్టీల్ రేకులా ఎండ

  చెట్టు మొదలు దాహం తో నోరు తెరచిన తొండ

  విరహం లా వేడి గాడ్పు వీస్తోంది

  విచిత్రం గా మనసు భ్రమిస్తోంది

7- రంది సోమరాజు

   ‘’సేప్పుల్లెకుండా రోడ్డేసే ఒల్ని సూసి

     తారుతో కరిగి డబ్బా లోంచి సుక్కలు సుక్కలుగా ఏడ్చింది ఎండ ‘’

8—కొలిమి కాడ తిత్తూదే కుర్రోడుసొమ్మసిలి పోనాడు

   ‘’ అమ్మ ‘’అని కూడా అనలేదు  ‘’

9-ఇసుక తిప్పలతో బయట పడ్డ గోదారి

ఎత్తాంటోళ్ళ కైనా తిప్పలు తప్పవన్నట్లుంది ‘’

 

 

9-హస్తరేఖాల ను బట్టి జాతకం చెప్పటాన్ని ‘’సముద్రుడు ‘’అనే అయన రాశాడు .అప్పటి నుంచి దానికి ‘’హస్త సాముద్రికం ‘’అనే పేరోచ్చిందిట .

10 -రామ లక్ష్మణుల లక్షణాలు

‘’రామో విళ దంతత్వం –లక్ష్మణే సాద కింకిణీ

 సీతాయాం భిన్న రోమాని –తస్మాత్ దుఖ సాహిష్ణుతా ‘’

శ్రీరాముని దంతాలు ఎడం గా ఉండటం వల్ల వనవాసం చేయాల్సి వచ్చింది .లక్ష్మణుని మెటికలు ‘’టకీ ‘’మని శబ్దం రావటం వల్ల  అరణ్య వాసం చేయాల్సి వచ్చింది .సీత కు భిన్న రోమాలు ఉండటం వల్ల దుఖాలు ఎక్కువగా అనుభవించాల్సి వచ్చిందని ఒక జ్యోతిష్యుడు చెప్పాడట

11—చదవటానికి ఒక గొప్ప టెక్నిక్ ఉందట అదే -‘’murder technique ‘’.కంగారు పడకండి

    M—MOOD (చదవాలి అనే స్తితికి రావటం)

    U –understanding (చదివి అర్ధం చేసుకోవటం )

    R-RE-READING (మళ్ళీ చదవటం )

     D –DETECT –(తెలియనిది తెలుసుకోవటం )

     E—EFFECTIVE (చివరి సారి చదవటం )

     R—review (మననం చేసుకోవటం )

      

     

 సేకరణ –మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ –30-3-13-ఉయ్యూరు

 

Posted in సేకరణలు | Tagged | Leave a comment

బుడ్డి కధల్లో దొడ్డ భావాలు

బుడ్డి కధల్లో దొడ్డ భావాలు

     ఒక చిన్న ఆంగ్ల కదల పుస్తకాన్ని చదివి ప్రభావితులై ఇవి తెలుగు వారికి చేరాలనే తపనతో శ్రీ చిలకలపాటి రవీంద్రకుమార్ సరళం గా తెలుగులోకి అనువదిస్తే, దేవి నేని సీతారావమ్మ ఫౌండేషన్ తరఫున శ్రీ దేవి నేని మధుసూదన రావు గారు ‘’కదా చిత్రాలు –బతుకు పాఠా లు ‘’పుస్తకం గా ప్రచురించి బాల బాలికలకు అందించే మహత్కార్యాన్ని చేబట్టారు ఇవి చిన్న కధలే కాని ‘’చిన్నమంత విలువగల బంగారు కధలు’’ ..అన్ని వయసుల వారికి అవసరమైన కధలు .అన్నీ ఆణి ముత్యాలే అన్ని జీవిత సత్యాలే .జీవితానికి అవసరమైన పాఠాలే ఆవిష్కరింప బడ్డాయి మానవీయ కోణాలను తట్టిలేపిన కధలే . వయోభేదం లేకుండా అందరు చదివి తీరాల్సినవే రచయిత ,ప్రచురణ కర్తా ఇద్దరూ అభినందనీయులే .ఇందులో 25 కధలున్నాయి .ఈ మార్చ్ లోనే వెలువడిన తాజా సంపుటి ఇది ..ముచ్చటైన ముద్రణా అందమైన ప్రకృతి దృశ్యం ఉన్న ముఖ చిత్రం పుస్తకానికి మరింత శోభను ,విలువను పెంచాయి . నిజం గా ఇవి ఉత్తమ కదా చిత్రాలే .చిత్ర కదా భావాలే జీవిత పాఠాలే .

    పల్లెటూరి ముసలాయనకు ఉన్న కొద్దిపాటి పొలం లో బంగాళా దుంపలు పండించుకోవాలను కొన్నా వయోభారం తో చేయలేక, జైలు లో ఉన్న కొడుక్కు తన నిస్సహాయతను ఉత్తరం లో తెలిపాడు .అతను తండ్రిని దుక్కి దున్నద్దని పొలం లో తుపాకీలు పాతిపెట్టానని జవాబు రాశాడు .అది జైలు అధికార్లు చదివి అ పొలం లోకి వెళ్లి ప్రతి అంగుళం తవ్వి చూశారు .ఏమీ కనీ పించలేదు .కొడుకు మళ్ళీ ఉత్తరం రాస్తూ చేను తవ్వటం అయి పోయింది కనుక దుంపలు నాటమని రాశాడు .మనం ఎక్కడున్నా మంచి చేయాలనుకొంటే చేయగలం అని తెలియ జెప్పే ఈకధ పేరు ‘’ఉత్తరం దున్నిన పొలం ‘’

     ఇద్దరన్నదమ్ములు కడుపేదవారు ఇద్దర్నీ చదివించే స్తోమత 18 మంది సంతానాన్ని కన్న తండ్రికి లేదు .ఈ అన్నదమ్ములు ఒక నాణెం ఎగరేసి అది ఎవరి కి అనుకూలం గా పడితే వారు ముందు కళల ఎకాడమీ లో చేరి కోరిక సాధించుకోవాలని అతనికి ఓడిపోయిన వాడు గనులలో పని చేసి డబ్బు పంపించాలని ఒప్పందం చేసుకొన్నారు .తర్వాత మొదటి వాడు రెండో వాడికి సాయం చేయాలని ఒప్పందం చేసుకొన్నారు .ఒకడు గెలిచి న్యు రేమ్బర్గ్ వెళ్లి కళల్లో నిష్ణాతుడై తిరిగి వచ్చాడు ఇతనికి గనుల్లో పని చేసి రెండో వాడు తోడ్పడ్డాడు. తనకు సాయం చేసిన సోదరుడి కోసం కళా నిష్ణాతుడు విందు ఏర్పరచి పానీయం గ్లాస్ అందుకోమన్నాడు .కళాశాలలో చేరమని అర్ధించాడు .కాని రెండవ వాడు తాను ఆ పని చేయలేనన్నాడు .కారణం తన చేతులు గనిపని లో పనికి రాకుండా పోయాయన్నాడు ఇది జరిగి 450ఏళ్ళయింది తన సోదరుడు చేసిన త్యాగానికి గుర్తుగా అతని అరచేతులు చేతులు కలిసి ఉండేలా సన్నని వేళ్ళు ఆకాశం వైపు సాచి ఉండేలా చిత్రించాడు దీనికి ‘’చేతులు ‘’అని పేరు పెట్టాడు .ఈ కళా ఖండానికి ప్రపంచ ప్రఖ్యాతి లభించింది .అభిమానులంతా దీనికి ‘’ప్రార్ధిస్తున్న చేతులు ‘’అని అతని త్యాగానికి చిహ్నం గా పిల్చుకొన్నారు ఆ చిత్రకారుడే ఆల్బ్రేర్ట్ ద్డ్యూరార్ అతని సోదరుడే గానికార్మికుడైన ఆల్బ్రేక్ట్ .త్యాగానికి అద్భుత మైన కానుక ఈ చిత్రం దీన్ని అందరు గీసిన భావన ఉంది .

       మనం మారితే ప్రపంచమూ మారుతుందన్న సూక్ష్మాన్ని చెప్పే కధలో ఒక కోటీశ్వరుడికి కంటి జబ్బు వచ్చి ఎన్ని మందులు వాడినా నయం కాకపోతే ఒక సన్యాసి ఆకుపచ్చరంగు మాత్రమె చూడమని సలహా ఇస్తే కనుచూపు మేర ఉన్న ప్రతి వస్తువుకు ఆ రంగు పులిమించాడు’’కోటి’’ .మళ్ళీ సన్యాసి యెర్ర బట్టలతో వస్తే సేవకులు ఆయన పై ఆకు పచ్చ రంగు కుమ్మరించారు .ఆయన నవ్వి ‘’మీ యజమాని ఆకు పచ్చ రంగు కళ్ళ జోడు పెట్టుకొంటే కొద్ది ఖర్చుతో పోయేది .అనవసరం గా డబ్బంతా ఆకుపచ్చ మీద తగలేశాడు ‘’అని వెళ్ళిపోయాడట .

   కుటుంబం తో గడిపే క్షణాలు మధురమైనవి అని తెలిపే ‘’గృహమే కదా స్వర్గ సీమ ‘’కద ,.మాతృప్రేమ విలువను కళ్ళకు కట్టించింద కధలో తల్లికి ఒకే కన్ను ఉండటం తో ఆమెను చూడటానికి,ఆమె దగ్గర ఉండటానికి ఇష్టం లేని ఒకడు తన కూతురు పుట్టిన రోజు పండక్కి నాయనమ్మ వస్తే వెళ్లి పొమ్మని కఠినం గా చెప్పి ఆమెఎవరో తెలీనట్లు ప్రవర్తిస్తాడు .పాఠశాల పూర్వ విద్యార్ధుల సభకు కొడుకు వస్తాడని ఆశించి భంగపడింది తల్లి .తన పాత ఇంటి వైపు వెళ్తున్న కొడుక్కి తల్లి నేల మీద పడి ఉండటం చూశాడు ఆమె పై ఉన్న ద్వేషం తో ఒక్క కన్నీటి బొట్టుకూడా విదల్ల్చని కర్కటకడయ్యాడు .ఆమె చేతిలో ఉత్తరం తీసి చదివాడు ..అందులో అతని పసితనం లో అతను కన్ను ప్రమాదవశాత్తు పోతే తనకన్ను దానం చేసి చూపునిచ్చానని అందుకే తనకు ఒక్క కన్నే మిగిలిందని రాసి ఉంది .ఇదంతా అతనిపై ప్రేమే అని ఉంది .అతనితోనే తన ప్రపంచం అని తెలియ జేసింది ఆ మాతృమూర్తి .కళ్ళు చెమర్చే కధ..ఒక త్యాగమయి జీవిత విషాద గాధ ఇది .

   తాను ప్రేమించే వారికోసం తన పద్ధతిని మార్చుకొనే వాడే అత్యంత సంతోషం గా ఉంటాడని ‘’నిజమైన స్నేహితుడు‘కదచెబుతుంది .లుకేమియా తో బాధ పడే తోటి విద్యార్ధి జుట్టు అంతా రాలి గుండు అయిపోతే అతన్ని అందరు దూరం గా ఉంచితే తోటి విద్యార్ధిని తండ్రి అనుమతి తో గుండు గీయించుకొని స్వార్ధం లేని ప్రేమ అంటే ఏమిటో చేసి చూపించింది .

    ఆహింస కు ఉన్న  శక్తి గొప్పదని గాంధీ మనుమడు తెలుసుకొన్న కద చదివి తీరాల్సిందే .అమూల్య మైన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి కారు నడిపే టప్పుడు జాగ్రత్త గా ఉండాలని బోధించేకద ,ద్రుష్టి కోణాన్ని మార్చి చూస్తె ఇంద్రధనుస్సే బతుకు లో దర్శించ వచ్చు .పిల్లలతో గడపాల్సిన అవసరం గురించి ,ఆదర బాదరా ఏదో దాన్ని నమ్మి మిగతావేవీ లేవనే మూర్ఖత్వం పనికి రాదనీ ,చెప్పిన కధలు మనసుకు హత్తుకొంటాయి .

      ఒక వడ్రంగి జీవితకాలమంతా ఆ పనిలోనే గడిపి చివరికి విసుగొచ్చి మానేయాలనుకొంటున్నానని యజమానికి, చెబితే తనకు చివరి సారిగా ఒక ఇల్లు కట్టమని కోరితే అన్య మనస్కం గా అయిష్టం గా కట్టి పెట్టాడు .ఇల్లు పూర్తికాగానే యజమాని ఆ ఇంటి తాళం చెవి అతని చేతిలో పెట్టి ఆ ఇల్లు వద్ర్న్గిదే అని చెబితే అవాక్కయ్యాడు .తాను అంకిత భావం తో ఆ ఇల్లు కట్టితే ఎంత అందం గా గొప్ప గా ఉండేదో అనివాపోయాడు .వివేకం ,అంకిత భావం ప్రతి పనిలోనూ అవసరం అని చెప్పేకద .

     ప్రేమ ఉన్న చోటే ఐశ్వర్యం ,విజయం కూడా ఉంటాయని తెలిపే కధ ముచ్చట గా ఉంది .విజయం అనేది ఒంటరిగా లభించదు సామూహిక ప్రయత్నం వల్ల సిద్ధిస్తుంది అన్న సామాజిక విషయం ,సుహృద్భావం తో మెలిగే వారు తన పొరుగు వారు ,సహచరులు ప్రశాంతం గా ఉండేందుకు సాయ పడాలి సామాజిక బాధ్యతా ఉన్న కధా ఆలోచనలను గిల కొడతాయి .ఓటి కుండ కూ ఒక పరమ ప్రయోజనం ఉంది ఏదీ వ్యర్ధం కాదు .అనే భావం ఒక కధలోనూ ,విజయ సాధకులకు తరచు అపజయాలు ఎదురవుతాయి కాని ప్రయత్నం మానరు .మనం కనే లలను మనమే సాకారం చేసుకోవాలని చాటే కధా ,భవిష్యత్తుకోసం అర్రులు చాస్తూ వర్తమానాన్ని వదిలేస్తే అధోగతే .అన్న కధా ,మేలు చేయటానికి తొందరపడాలి కీడు చేయటానికి కాసేపు ఆలోచించాలన్న విషయమూ ,సరైన ఆలోచన చేస్తే క్లిష్టమైన సమస్యకూ పరిష్కారం దొరుకుతుందనే నీతి ,నిజం తెలుసుకోకుండా తొందరపడి మాట్లాడి మన అవివేకాన్ని బయట పెట్టుకొంటే అపహాస్యం పాలౌతామన్న సూత్రం ,మన జన్మ సార్ర్ధకత కు ఉపయోగించేవే .

        ‘’మనం భగవ దంశ ఉన్న వాళ్ళం .జనం వ్యధలను మానపటానికి మన వంతు బాధ్యత చేబట్టాలి .దానితో మన వ్యధలూ తీరుతాయి ‘’అనే గొప్ప సత్యాన్ని ఆవిష్కరించిన కధే ‘’ఓ చిరు నవ్వు ‘’.

      ఒకరు చేసిన తప్పుకు మరొకరు బలి అవటం మనం నిత్యం చూస్తున్న విషయమే తలిదండ్రుల మాట అనుసరిస్తూ తాగకుండా కారును నెమ్మదిగానే నడుపుతున్నా, స్నేహితుడి కారు వేగం గా వచ్చి గుద్దటం తో బలమైన గాయాలు తగిలి మృత్యు ద్వారం దగ్గర ఉండికూడా తన కోసం ఏడవ వద్దని తనను గుద్దిన వాడు తాను పడిఉన్నా పట్టించుకోకుండా నడిచి వెళ్తుంటే అది వాడికి ధర్మం కాదేమో నని ,వాడు తాగి నడిపాడని ,వాడి తాగుడికి తాను మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని వాడికి ఎవరైనా తాగి కారు నడపోద్దని చెప్పి ఉంటె తాను తానింకా బతికే ఉండేవాడి నని ఆ ప్రాణి విల విల్లాడటం ప్రేవుల్ని దేవేస్తుంది .హృదయ విదారక మైన సంఘటనను  మరణించే వాడి ఒక్కడి డైలాగ్ లతో గుండెలు పిండేట్లు చెప్పిన చివరి కద‘’అమ్మా నాకెందుకిలా ?’’కన్నీరే తెప్పిస్తుంది ఆలోచింప జేస్తుంది .’’డ్రంకెన్ డ్రైవ్’’ ఎంత ప్రమాదమో తెలియ జేస్తుంది .ఒకరి తప్పుకు ఇంకొకరి బలి . ఇది విధ్హి విలాసం అని ఊరుకో రాదు ఇదొక సాంఘిక సమస్య .అందరం నిలబడి మార్పు తేవాలి అని వాచ్యం చేయకుండానే సూచించిన కద.

ఇన్ని మంచి కధలను ఆంద్ర పాఠక లోకానికి అందించిన రవీంద్ర కుమార్ మధుసూదన రావు గార్లకు మరో సారి అభినందనలు .

ఈ అమూల్య మైన కదా గుచ్చాన్ని ‘’అమూల్యం ‘’గానే అందించారు దేవినేని వారు కావాల్సిన వారు ఈ కింది చిరునామా ను సంపరదించండి

దేవినేని మధుసూదన రావు –చైర్మన్ –దేవినేని సీతా రావమ్మ ఫౌండేషన్

తెన్నేరు –పోస్ట్ 521260 –కృష్ణా జిల్లా –ఫోన్ -9989051200 – email  -mdevineni@gmail.com   .

          మీ –దుర్గా ప్రసాద్ –30-3-13 ఉఉయ్యురు 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అవీ ఇవీ అన్నీ -1

   అవీ ఇవీ  అన్నీ -1

1-ఓటు –నాడు మనసారా ఇచ్చేది –నేడు మనసారా తో ఇస్తున్నారు

2-మరణం –జీవించి నందుకు లభించే బహుమతి

3-జనం –ఓట్ల చెట్లు

4-కుండ –మనసు ను చల్ల బరచు కొనేందుకు నిప్పుల కొలిమి లో ఒళ్లంతా కాల్చుకునేది

5-సారీ-తప్పిదాల మన్నించగల ఇంగ్లీష్ వారి పంచాక్షరీ మంత్రం

6-సానుభూతి –ఎదుటి వారి హృదయాలను తెరిచే బంగారు తాళం చెవి  

7-నవ్వు లేకుండా నువ్వు లేవు (ఆర్.కే.లక్ష్మణ్ )

8 –లేడీస్ ఫింగర్స్ –కొండేపూడి నిర్మల

    ‘’ ఎలాగైతేనేం –ఎన్ని గోళాలు తలక్రిందు లయితేనేం

     సగం సగం తెగిన మనమంతా –ఒక అర్ధ వంత మైన వాక్యం గా అల్లుకు పోయాం కదా /

     గడ్డ కట్ట టానికే పుట్టిన అలల్ని –చురక లేసి పరిగెత్తించాం  కదా

     నాటకం ఆడక ముందు డైలాగ్సే ఉంటాయి –ఒట్టి డై –లాగ్స్

     డైలాగ్ ని ముక్కున కరచుకొనే దాక –రెక్కలవసరం తెలీని మానం

     పగలు చాలు –రాత్రిచాలు –వంట వేల దాటిందనే స్పృహ చాలు

     తుప్పు పట్టిన కత్తిమీద –కసకసా తెగుతున్న

     ఉత్సాహపు వేళ్ళతో మగ్గుతున్న –లే—డీ—స్—ఫింగర్స్ ‘’

10-యువ రుక్కులు

    సూర్యుడు –పగలు రేయి సృష్టికర్త

    ప్రేయసి –ప్రేమిస్తే గులాబి ,ద్వేషిస్తే గులాబి ముళ్ళు

   నవ్వు –హృదయం మాట్లాడే లిపి లేని భాష

   గుండె –దేహాలయం లో నిరంతరం మోగే గంటలు

   సూర్యుడు –లోడ్ షెడ్డింగుగు లేని పెద్ద విద్యుత్ కేంద్రం

   సారా –తాగితే బతుకు కరువు –మానితే బతుకు తెరువు

   చీర –నేడు శరీరానికి కట్టుబడి –రేపు స్టీలు  సామాను కు పెట్టుబడి

   డబ్బు –సృష్టించిన వాడినే –ఆడించే తుంటరి .

11-ఉపాధ్యాయినీ –అంటే ‘’ఉపాధ్యాయులు ఉన్నది’’ అనే అర్ధం అట .తిరుమల రామ చంద్ర చెప్పారు –‘’ఉపాధ్యాయా‘’అనాలట లేడీ టీచర్ ని

12 –కవుల దీపావళి

    జే.బాపు రెడ్డి

‘’దీపము నార్పు చీకట్ల రూపు గాంచి –బెదిరి పోయిన కాంతులె చెదరి పోయి

 గుట్టుగా వచ్చి తమ గుండె గూటి లోన ఊహలుగా –ఒదిగి నాయి ‘’

దాశరధి

‘’గాదంద కార స్తంభాగ్రం లోని కాంతి కళీక –కర్కోతకులపై విరుచుకు పడే క్రాంతి కాళిక

సుధామ

‘’మానవ అజ్ఞాన తమస్సు పై మహోన్నత విద్యోరేఖగా –భాషా భేషజాల రంగ స్థలిపై

 జాన పద శైలూషిలా –అంధకార మదాన్ద్హత పై నిజాయిథేఎ కొరడా మెరుపు

 చీకటి కాళింది పై చిన్ని కృష్ణుని లీలగా ‘’

ఆచార్య తిరుమల

‘’అసెంబ్లీ లో ప్రశ్నల తారాజువ్వలూ ,చప్పట్ల టపాసులూ

 ప్రతిపాదనల చిచ్చు బుడ్లూ ,ప్రజల వినతి పత్రాల విష్ణు చక్రాలూ

వాగ్దానాల కాకర పువ్వోత్తులు ,చివరికి కొత్త పన్నుల లక్ష్మీ బాంబులు

ప్రభుతకు దీపావళి –ప్రజలకు అమావాస్య

రస రాజు

‘’ఇప్పుడా స్త్రేఎ శక్తియే కన్నులేర్రజేసి పాడునురా

  సురుని ద్రుంచ బయలు దేరే –అబల అనుకోకు స్త్రీ మూర్తి

 తిమిరమును చీల్చ గల్గిన దీప మహిళ

కే.వి.శేషా చార్యులు

‘’ఒక దీప కలికతో వెలుగు పది దీపాలు –ఒక మంచి మనసు తో  సుఖ పడు లోకాలు

14 –నాలుక –రుచుల డిటెక్టర్ –మాటల డిక్టేటర్

15 –పువ్వు –పుట్టి ,నవ్వుల సువాసనలతో మరణించేది

16 -వీరేశ లింగం గారి పై విశ్వనాధ

‘’చీకటి పడి పోతుంటే –ఆకటితో చని పోతుంటే

 దూరపు వెలుగులు తెచ్చినదేవరో –తీరని ఆకలి తీర్చిన దదేవరో

రామ మోహనుడు రాచిన దారులు –కొమలాత్ములు కొలిచిన దారులు

ప్రేమ మ్రుదాత్ములు విల్చిన దారులు –తెరచిన దేవరో, తీసినదే వరో (కేదార గౌళ –ఆంద్ర ప్రభ -10-4-95 )

17- నండూరి కృష్ణ మాచార్య (పద్య శిల్పం )

‘’యతి ప్రాస లేని సూక్తులు గొంగళి పురుగులు –యతి ప్రాసలున్న సామెతలు సీతాకోక చిలుకలు ‘’

 

.     సేకరణ –మీ గబ్బిత దుర్గా ప్రసాద్ –29-3-13-ఉయ్యూరు

Posted in సేకరణలు | Tagged | Leave a comment

శ్రీ పొన్నాడ సత్య ప్రకాష్ కదా ”వెనకడుగు ”

ponnaada kadha -1 ponnaada kadha -2ponnaada kadha -3

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

శ్రీ కంఠ కర్ణామృతం ,ఆత్మ నివేదనం పాషాణి నేతాజీ ,రామాయణ పావని ల పై సాభిప్రాయం

శ్రీ కంఠ కర్ణామృతం ,ఆత్మ నివేదనం పాషాణి నేతాజీ ,రామాయణ పావని ల పై సాభిప్రాయం

  శ్రీ జానకీ జాని గారికి నేను 21-11-2008 న రాసిన లేఖాంశాలు

బ్ర..వే .శ్రీ జానకీ జాని గారికి నమస్సుమాంజలి –ఉభయ కుశలోపరి –

ఈ నెల 19 వ తేదీన కాకినాడలో మిమ్మల్ని మా దంపతులం దర్శించటం చాలా ఆనందం గా ఉంది .మళ్ళీ గొప్ప అను భూతి ని పొందాను .మీ చిరునవ్వు ,మాటల పోహలింపు మరపు రావు .మీ శ్రీమతి గారు మా శ్రీమతికి ఆరాధ్యులయారు .ఆప్యాయత తో కూడిన మీ ఆదరణ ఆహ్లాదాన్నిచ్చింది .కొంచెం సేపు మీతో గడిపిన ఆ క్షణాలు మధుర క్షణాలే .నాపై ఆత్మీయత తో మీరిచ్చిన పుస్తకాలు నిన్న ,ఇవాళ చదివాను

             మీ తండ్రి గారు సామవేదం జానకి రామ శర్మ గారు జీవించి ఉంటె మరో ‘’సౌందర్య లహరి ‘’వ్రాసి ‘’లలితా సౌందర్య లహరి ‘’అనో ,’’శ్రీ సౌందర్య లహరి ‘’అనో పేరు పెట్టి ప్రచురించి ఉండేవారు .ఆంద్ర దేశానికి ఆ అదృష్టం వారి మరణం వల్ల  పట్టకుండా పోయింది .ఈ మాట ఎందుకు అన్నానంటే ,మీ తండ్రి గారి ‘’శ్రీ కంఠకర్ణామృతం ‘’చదివిన తర్వాత అంతటి గౌరవం కలిగింది .కర్ణామృతం పేరుకు తగ్గట్టే అమ్రుతోపమానం .భగవత్పాదుల వారి ‘’శివానంద లహరి‘’స్థాయికి తగ్గంతగా ఉంది .’’శివ కేశవ నామ సారూప్య సామ్యాలను వివరిస్తూ చెప్పిన శ్లోకం రమణీయం గా ఉంది .ఒక్క ఈ శ్లోకమే ఏమిటి ,ప్రతి శ్లోకం హృదయపు లోతుల్లోంచి భక్తీ జ్ఞానాలను రంగరించి వెలువరించిందే .వైరాగ్య మార్గ దర్శనం చేసేవే .మంచి శతకం చదివానన్న ఆనందం ,పరవశం కల్గింది .ధన్య జీవులు శర్మ గారు .శ్రీ కైవల్య పదాన్ని శ్రీ కంఠపదలహరి తో పొందారు .దీనికి బ్రహ్మ విద్యా సరస్వతీ స్వరూపులు శ్రీ నూకాల రావు గారి వ్యాఖ్యానం అమృతానికి తావి అబ్బినట్లయింది .సూక్ష్మం లో మోక్షం గా ఉంది .’’పులవర్తి ‘’వారు ఆనంద పులకాన్కితం చేశారు .సరళ వ్యాఖ్యానం తో బంగారానికి తావి అబ్బింది .అట్టమీదిబొమ్మ ,శివరంజని లా ఉంది .అందుకే మరో సౌందర్య లహరి పొందే అదృష్టం ఆంద్ర దేశం జార విడుచు కొంది అని ముందే చెప్పాను ,

            అయితేనేం మరో ధూర్జటిని మీ తండ్రి గారి ‘’ఆత్మ నివేదనం ‘’లో దర్శించాను .ప్రతి పద్యం ఆత్మా నివేదనమే .ఆ భవునికి హారతి గీతమే .చదివితే మృత్యువును జయించా గలమనే నమ్మకం కలుగుతుంది .పరిణతి చెందినా కవిత్వం .భావం నాట్యమే చేసింది .ప్రతి పదం సాభిప్రాయం గా ప్రయోగించారు .ఆయన నట ధూర్జటి అయితే ,శ్రీ శర్మ గారు దభావ ధూర్జటి గా మారి కంఠేకాలుడిని తనివి తీరా వర్ణించారు .భక్తీ భావానికి చక్కని సోపానం నిర్మించారు .ముగ్ధ మనోహరం గా ప్రతి పద్యం అలరారింది .కఠిన పద విన్యాసాలు లేవు .క్లిస్టాన్వయాలు లేవు .అంతా తేట తెల్లం గా మనసుకు హత్తుకోనేట్లుంది .సూటిగా గుండెకు తాకంది .ఈ రెండు శతకాలు అను క్షణ పారాయణీయాలు .ఈ కార్తీకం లో ఈ రెండు పుస్తకాలు చదివి శివ దర్శన వైభవాన్ని అనుభవించాను .ఇవి ముక్తి సోపానాలే .వారి రామాయణ కావ్యమూ ఇంతటి సారళ్యం తో నడిచిందే కదా .ఇలాంటి శివ స్వరూపులైన మీ తండ్రి గారు మీకు లభించటం మీ అదృష్టం తండ్రికి తగ్గ కొడుకు మీరు .అలాంటికవి ఆంద్ర దేశం లో జన్మించటం ఆంధ్రుల అదృష్టమే .

నాకు ఒకటి అని పించింది .శ్రీ కంఠకర్ణామృతం ‘’ను ఆడియో కేసెట్ గా ఎవరైనా ప్రయత్నించి తెస్తే అద్భుతం గా ఉంటుంది .

           మీ ‘’పాషాణి’’ఇతి వృత్తం బాగుంది .లోకేశ్వరి మహా రాణి లో మార్పు అనివార్యం .ఆమె లోని పాషానత్వాన్ని నిర్మూలించి కరుణాంత రంగిత గా మారటానికి తధాగతుని శాంతి సందేశం పొందటానికి వీలుగా ఉంది .శాంతి మాత్రమే ప్రపంచాన్ని జయించాలి పగ, ద్వేషం కాదు అన్న గొప్ప సందేశాన్ని అద్భుతం గా చెప్పారు ఈ ఏకాంకిక లో .మీరు .’’రవి కవి ‘’శత జయంతి కి ఇది ప్రచురిమ్పబడటం విశ్వ శాంతికి సంకేతం .అయితే సంభాషణలు దీర్ఘం గా ఉన్నాయేమో నని పించింది నాకు .ఇంకొంచెం క్లుప్తం గా ఉంటె మనసుకు పట్టేవి .ఏమైనా మంచి ప్రయత్నం .సఫలయత్నం..ఎన్నో ప్రదర్శనలు పొందిన నాటిక గా తెలిసి ఆనందించాను .

        మీ రెండో పుస్తకం ‘’నేతాజీ ‘’.కల్నల్ డి.ఎస్.రాజు గారి శత వార్షికం సందర్భం గా ద్వితీయ ముద్రణ పొందటం ఆంధ్రుల అదృష్టం .నేతాజీకి డాక్టర్ గా రాజు గారిసేవ ,,వైద్య రంగం లో అసమాన ప్రతిభా చూపి ,వైద్య రంగ విస్తరణ కోసం కాకినాడ లో రంగరాయ వైద్య కళా శాల నేర్పరచిన  వారి దూర దృష్టికి నిదర్శనం .వారికి అంకితమిచ్చి అమరజీవిని చేశారు మీరు .నేతాజీ తో బాటు రాజు గారి గురించి తెలియని ఆంధ్రుడు లేదు .నేతాజీని అభిమానించని దేశీయుడూ లేదడు .సర్వులకు ఆరాధనీయుడు బోసుబాబు .ఆ హుందా ,ఆ ఠీవీ ,ఆ రాజసం ,ఆ విగ్రహం అందరి మనసుల్లోను ముద్ర పడి పోయింది .నేతాజీ తర్వాతే ఏ నాయకుడైనా .అన్నభావం అందరిదీ .దీనికి తగ్గట్టు తగిన సమయం లో బాలల కోసమే అయినా అందరికి ఉపయోగపడే పుస్తకం గా తెచ్చారు .మీ రచన కూడా అంత ఉదాత్త స్తాయి లో సాగింది .రాజుగారితో సంభాషించి చాలా విశేషాలు చేర్చారు .అందరు తప్పక చదవాల్సిన పుస్తకం .అయితే మలి ముద్రణ లో గ్రాంధికాన్ని మార్చి రాస్తేప్రస్తుతకాలానికి తగినట్లు గా ఉండేది అని పించింది .అలా చేయ వచ్చో లేదో తెలీదు కాని చేస్తే చదివించే పుస్తకం గా నిల బడుతుంది .చక్కని ముద్రణా ఫోటోలు పుస్తకానికి నిండుదనం తెచ్చాయి .

                సుభాష్ బాబు ఎప్పుడూ ‘’శెభాష్ బాబే ‘’రెండో అభిప్రాయమే లేదు .నేతాజీ శత జయంతిని1997 జనవరి23 న శ్రీ మండలి బుద్ధప్రసాద్ అవని గడ్డ గాంధి క్షేత్రం లో నిర్వహించారు .అప్పుడు నేనూ వెళ్లాను .ప్రఖ్యాత చిత్రకారుడు మరో పికాసో, క ళా తపస్వి ఎస్వి.రామా రావు అమెరికా నుంచి వచ్చారు .ప్రసిద్ధ కధకులు నా ఆత్మీయ మిత్రులు శ్రీ ఆర్.ఎస్.కే మూర్తి (బందరు )గారూ,లబ్ధ ప్రతిష్ట కధకులు విశ్లేషకులు జర్నలిస్టూ  శ్రీ వాకాటి పాండురంగా రావు గారుచిరస్మరణీయ ప్రసంగాలు చేశారు .మన కేంద్ర ప్రభుత్వం ,నెహ్రూ వంశంనేతాజీ ని మర్చి పోయినా ప్రభుత్వ పరం గా శతజయంతిని జరపక పోయినా ఒక వేళఎక్కడైనా మొక్కుబడిగా జరిపినా సంస్కారి ,సౌజన్య మూర్తి దేశం పై అపారమైన భక్తీ విశ్వాసాలున్న వారు ,జాతి సంస్కృతీ పరి రక్షణకు ఎప్పుడూ ముందుండే వారు, విలువలతో కూడిన జీవితాన్ని ఆదర్శ వంతం గా గడుపుతున్న శ్రీ బుద్ధ ప్రసాద్ చాలా ఘనం గా నేతాజీ శత జయంతిని నిర్వహించి అందరి ప్రశంశలు అందుకొన్నారు .మీ ‘’నేతాజీ ‘’ని చదవటం తో ఇవన్నీ ఒక్క సారి సినిమా రీల్ లా తిరిగాయి .ఆ ఊసులు మీతో కలబోసుకోన్నాను .

              మీ మూడో పుస్తకం ‘’రామాయణ పావని ‘’ద్వితీయా వృత్తి .ప్రధమావృత్తీ పుస్తకం నాకు ఎప్పుడో మీరు పంపారు .చదివాను .మీ రచన గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు .వాల్మీకి మహర్షిపై, వాల్మీకం పై ,కల్పవృక్ష రామాయణం పై రామదాసు అయిన పావని పై మీ భక్తీ ప్రపత్తులు పద పదాన జ్యోతకంయ్యాయి ..ఆర్తిగా రాసిన పుస్తకం .అందులో ఆచార్య ఎస్.వి.జోగా రావు గారి ముందుమాట లో చెప్పిన పద్యం ‘’ఒక భూతంబున కుద్భవించి ‘’నాకు కంఠతా వచ్చేసి ఎప్పుడు ఏ సభలో నైనా ఉదాహరిస్తున్నాను .అలాగే వాల్మీకి పై ఆచార్యుల వారు ‘’ఆ కవితా తపస్వి ‘’పద్యం రామాయణ కావ్య పరమార్ధాన్ని సంగ్రహం గా మనోహరం గా చెప్పారు .మంచి పుస్తకం .మళ్ళీ నా చేతికి వచ్చి నందుకు మహదానందం గా ఉంది .మీ దంపతులకు మా దంపతులం ముకుళిత హస్తాలతో నమస్కరిస్తూ –సెలవ్ –దుర్గా ప్రసాద్-21-11-2008  .

                మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –29-3-13-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

నాదారి తీరు -20 మళ్ళీ ఉయ్యూరు –నాలుగవ బదిలీ

  నాదారి తీరు -20

                మళ్ళీ ఉయ్యూరు –నాలుగవ బదిలీ

    మొత్తం మీద నా కాటూరు ఉద్యోగం ఏమంత ఆనందం గా లేక పోయింది. వెళ్లి నప్పుడున్న ఉత్సాహం మధ్యలోను చివర్లోను లేదు .ముళ్ళ మీద ఉన్నట్లే గడిపాను .ఒక ఊరట ఏమిటంటే ఉయ్యూరు నుండి ఉదయం వెళ్ళేటప్పుడు సాయంత్రం కాటూరు నుండి ఇంటికి వచ్చేటప్పుడు రెండు పూటలా మా పొలం చూసే వీలు కలిగింది ..అదో‘’తుత్తి’’.ఉద్దండయ్యఅనే ప్యూన్ కాటూరు స్కూల్ లో పనిచేసేవాడు మంచివాడు .కాఖీ నిక్కర్ తో ఉండేవాడు నెమ్మది మనిషి అలానే ఆ ఊర్లో ఆర్.ఏం .పి.డాక్టర్ ఫణి భూషణ రావు ,ఆయన అన్న డ్రాయింగ్ మేష్టారు (కడవకొల్లు )లతో పరిచయం జరిగింది .కాటూరు పి.హెచ్.సి డాక్టర్ కూడా ఆచార్యులు గారు.మంచి పేరు తెచ్చుకొన్న కుర్రాడు అందరికి తలలో నాలుక గా ఉండేవారు ఒక సారి ఫామిలీ ప్లానింగ్ కాంప్ ను గొప్పగా నిర్వహించారు .అప్పుడు మేమందరం వెళ్లి చూశాం ..వేసవి కాలం లో మా పొలాలకుపంటకాలువల ద్వారా నీరు రావటానికి తవ్విన్చేవాళ్ళు .దానికి అయిన ఖర్చు అంతటిని ఎకరానికి ఇంత అని వేసి వసూలు చేసే వారు కాటూరు ఆయనే వెల్లంకి ఇంటిపేరున్న ఆయనే ఉయ్యూరు వచ్చి వసూలు చేసుకొని వెళ్ళే వారు నీరుకావి పంచె మీసాలతో ఉండేవారు .ఇప్పుడు ఉయ్యూరు లో డాక్టర్ విశ్వేశ్వర రావు గారిది కాటూరు .ఆయన తండ్రి గారు పెద్దమనిషి .విశ్వేశ్వర రావు గారూ పేరున్న డాక్టర్ .ఈ అనుభవాలే మిగిలాయి

                  రెండో సారి ఉయ్యూరు –హెచ్.ఏం ఎస్.కే.

    కాటూరు హైస్కూల్ లో 12-12-69 ఉదయం రిలీవ్ అయి ఆ సాయంత్రమే ఉయ్యూరు హైస్కూల్ లో చేరాను .అప్పుడు హెడ్ మాస్టారు నూజివీడు నుంచి వచ్చి పనిచేస్తున్న ఎస్.కే.వెంకటేశ్వర్లు గారు .ఆస్కార్ వైల్డ్ రాసిన ‘’సెల్ఫిష్ జైంట్ ‘’కధలో లాంటి భారీ పర్సనాలిటి నల్లగా బాగా ఎత్తుగా ఉండేవారు .మంచి మాటకారి .పెద్ద స్కూల్  నుంచి వచ్చారు స్కూల్ డబ్బు అంతా’’ నాకేస్తారనే’’ పేరున్న వారు .ఆయన కంటే ముందే ఆయన ‘’కీర్తి’’ ఇక్కడికి చేరింది .అప్పుడు ఉయ్యూరు లో మాతోబాటు ఆంజనేయ శాస్త్రి కాంతా రావు రామకృష్ణా రావు జ్ఞానసుందరం పిచ్చి బాబు వగైరాలు పని చేశారు .ఆటలు బాగా ఆడే వాళ్ళం .కారంస్ ఖాళీ పీరియడ్స్ లో పోటీలు పెట్టుకొని ఆడేవాళ్ళం శాస్త్రిగారు  కాంతా రావు , పిచ్చిబాబు మంచి ప్లేయర్స్ నేనూ బానే ఆదేవాడిని ఫ్లాస్కులకు ఫ్లాస్కులు కాఫీ లు తెప్పించుకొని తాగే వాళ్ళం .భలే సరదా గా గడిచింది డ్రిల్ మేష్టారు వై రామా రావు గారు నాకు గురువు .ఎస్.వి.సుబ్బారావు గారు కూడా .వై పూర్ణ చంద్ర రావు కనుమూరు నుండి వచ్చేవాడు ఆయన డ్రిల్ మేస్టారే .యెన్.డి.ఎస్.రహమాన్ ఉండేవాడు .సుబ్బారావు అనే ఇంకో డ్రిల్లు మేస్టారూ ఉన్న జ్ఞాపకం మేమందరం వాలీబాల్ బాద్మింటన్ ప్లేయర్సుమే ,స్కూల్ వదల గానే చాలా సేపు ఆడి ఇంటికి వెళ్ళే వాళ్ళం నేప్పల్లె గాంధి అనే కుర్రాడు ఈ రెండిటిలో ఎక్స్పర్ట్ .ఇంటి దగ్గర ట్యూషన్ మామూ లే ..

      హెడ్ వెంకటేశ్వర్లు గారు వింత మనిషి .కాపురం స్కూల్ లోనే .హెడ్ మాస్టర్ రూమ్ లోనే ఉండేవారు .ఉదయం లేక సాయంత్రం ప్యూన్ ఆంజనేయులు లేక నర్రా కృష్ణ మూర్తి ద్వారా ఒక చీటీ ఇచ్చి ఇంటికి పంపేవారు /‘’ప్లీజ్ ఈ రోజు భోజనం పంపండి ‘’అని .అంతే మా ఆవిడ వెంటనే ఏర్పాటు చేసి కారియర్ ప్యూన్ కిచ్చేది ఒక్కో సారి ఆయనే మా ఇంటికి వచ్చే వారు భోజనం చేసి వెళ్ళే వారు అలాగే సూరి రామ శేషయ్య గారినీ ‘’బాదారు ‘’చాల కాలం .దాదాపు ఆయన ఉన్న కాలం లో నెలకి ఏ నాలుగు రోజులో హోటల్ భోజనం చేశారేమో మిగిలిన రోజులన్నీ ‘’ఊరి మీదే’’.వారానికో సారి నూజివీడు వెళ్లి వచ్చేవారు .వెళ్ళేటప్పుడు ఎవర్నో ఒకర్ని బాదుకొని స్వీట్లు హాట్లు పొట్లాలు కట్టించుకొని తీసుకొని వెళ్ళేవారు .ఆయన పాదాలు ఏనుగు పాదాలలా నల్లగా గజ్జి గా ఉన్నట్లున్దేవి .మా సైన్సు రూమ్ కు కావలసిన వసతులు కల్పించారు .రేడియో కొన్నారు ఇనుప బీరువాలు మాకు ఆఫీస్ కు డ్రిల్ మేస్టార్ల కు కొన్నారు దీనితో స్కూల్ లో ఉన్న నిలవ సొమ్ము అంతా స్వాహా అయిందని గోల పెట్టేశారు .డ్రిల్ మేస్తర్లతో ‘’సున్నం పెట్టుకో కుండా’’ వాళ్ళనూ‘’సంతృప్తి ‘’పరచే వారు .

                         బ్రహ్మా నంద రెడ్డి పాస్ –అనే నాన్ డిటెన్షన్ స్కీం

   అప్పుడు ఇంకా డిటేన్షన్ విధానం ఉంది .అందుకని వార్షిక పరీక్షలు అవగానే స్కూల్ లో పరీక్ష పేపర్లు దిద్దే కార్య క్రమం ఎర్పాటు చేశారు .ఇంతవరకు ఎవరు ఇలా చేయలేదు ఈయనే అలా చేసింది .కస్టపడి అందరం చెమటలు కక్కుతూ అక్కడే ఉండిపేపర్లు దిద్దాం. ఫ్లాస్కులతో టీ లు తెప్పించి అందరికి ఇప్పించేవారు .మా మేనమామ గారి అమ్మాయి లక్ష్మి ఇంగ్లిష్ లో తప్పి నట్లు తెలిసింది .క్లాస్తొమ్మిది అని గుర్తు .  .ఈ విషయం ఆయనకు చెప్పాను .ఆ పేపరు దిద్దిన మేస్తార్ని పిలిపించి ‘’యిదేం దిద్దటం ఇంత బాగా రాస్తే ఇన్ని తక్కువ మార్కు లేమిటి /’’అని కోప పడినట్లు గా నటించి పాసు మార్కులు తానే వేసి పాస్ చేయించారు .అంత డేరింగ్ అండ్ డాషింగ్ హెడ్ మాస్టారు ఆయన .చేయ్యాలనుకొంటే అడ్డగోలుగా ఏ పనైనా చేస్తారు దేనికీ వెరవని మనిషి ..వాల్యుయేషన్ అంతా అయి పోయిన తర్వాత ప్రమోషన్ లిస్టు లన్ని తయారయాయి .ఇంతలో ముఖ్య మంత్రి కాసు బ్రహ్మా నంద రెడ్డి డిటేన్షన్ విధానాన్ని రద్దు చేసి అందరు పాస్ అయినట్లు డిక్లేర్ చేయమని ప్రభుత్వ ఆర్డర్ పాస్ చేశాడు దీన్నే ‘’బ్రహ్మానంద రెడ్డి పాస్ ‘’అన్నాం .’’మార్కుల కోసం కక్కూర్తి పడాల్సిన అవసరం తప్పింది .అవినీతికి ఒక రకం గా చెక్ పెట్టి నట్లే ఏడవతరగాతికి మాత్రం కామన్ పరీక్షలున్తాయని ప్రకటించారు .మేము ఇంత కస్టపడి చెమటలు కార్చుకొంటు చేసిన శ్రమ అంతా వ్యర్ధం ని బాధ పడ్డాం .

          అప్పుడు స్కూల్ లో ఒక చిన్న కుర్రాడు పని చేసే వాడు .వాడిని మాతో బాటు క్లాస్ రూములకు తీసుకొని వెళ్లి, పిల్లల దగ్గరున్న కాపీలు తీయించియేరించి బుట్టల్లో మోయించి బయట పారేయించే వాళ్ళం .వాడిని హెడ్ మాస్టారు‘’టేస్టికిల్ ‘’అని సరదా గా పిలిచే వారు సంజీవ రావు అనే అయోమయాన్ని నైట్ వాచర్ గా ఏర్పాటు చేశారు .మేము పరీక్షలు చాలా స్ట్రిక్ట్ గా జరిపే వాళ్ళం .ఎవర్నీ కాపీలు కొట్ట నిచ్చే వాళ్ళం కాదు .ఇదంతా మాకే వదిలేశారు హెడ్ గారు రామ కృష్ణా రావు గారు నేను ఆంజనేయ శాస్త్రి చాలా స్ట్రిక్ట్ మేస్తర్లని పేరు పొందాం .మేము పిల్లల్ని కొట్టినా ఎవరూ ఎదురు మాట్లాడే వాళ్ళు కాదు .వెంకటేశ్వర్ల గారి సంతకం ‘’జిలేబి చుట్ట ‘’లాగా తమాషా గా ఉండేది .ఆయన మీద  స్కూల్లోనే కాపురం ఉంటున్నాడని పిటీషన్ పెట్టారు ఆయనకు ఎవర్ని ఎలా మేనేజ్ చేయాలో తెలుసు ..సాయంత్రం వేల స్కూల్ అవగానే ఎవరో ఒక మేష్టారు లేక ఇద్దరు ముగ్గురు మేస్తర్లతో కలిసి హోటల్ కు వెళ్ళే వారు .అక్కడ కడుపు నిండుగా లగించే వారు బిల్లు కట్టి మేస్టార్లు జేబు చిల్లు పదేయించుకొనే వారు ఇలా ‘’కాటా దెబ్బ’’ తిన్న వాళ్ళలో నేనూ ఉన్నాను ఏమైనా మాటల్లో బురిడీ కొట్టించేవారు .అదో ఆర్ట్ ..స్కూల్ వార్షి కొత్సవం జరపకుండా అన్నితరగతుల విద్యార్ధులకు మార్కులను బట్టి ఫస్ట్ సెకండ్ థర్డ్ లను నిర్ణయించి పుస్తకాలు  కొని బహూకరించారు ఇదో ముందడుగే ..మంచి పుస్తకాలేకొన్నారు కొనటానికి నన్ను ,పంపేవారు .నవోదయ ,విశాలాంధ్ర షాపుల్లో ఉపయోగ పడే పుస్తకాలను కోన్నాం .స్కూల్ తెరిచే సమయానికి వెంకటేశ్వర్లు గారు మళ్ళీ నూజివీడు కు ట్రాన్స్ ఫర్ అయారు .ఆయన స్తానం లో మంటాడ నివాసి శ్రీ కోడె బోయిన సూర్య నారాయణ గారు హెడ్ మాస్టర్ గా వచ్చారు .

                       ఉపాయం మేస్టారు

    కోడె బోయిన వారు ‘’చిక్కడు దొరకడు ‘’లాంటి మనిషి చేతికి మట్టి కానివ్వరు .’’ఉపాయం ‘’మేస్స్టారనే’’ పేరు పొందారు .ఘర్షణ ఇష్టపడే వారు కాదు సాదుస్వభావం మల్లెపువ్వు లాంటి పంచా ,తెల్ల చొక్కా ఉత్తరీయం గొడుగు తో వచ్చేవారు .నెత్తిమీద నాలుగే పోచలు ఈచివారి నుంచి ఆ చివరికి ఉండేవి .ఏదో కస్టపడి అలసి పోయి నట్లు బస్సులు విడుస్తున్దేవారు. సీనియర్ హెడ్ మాస్టారే .లెక్కల మేష్టారు గా పేరుండేది .

                       హిందూ ముస్లిం కొట్లాట 

అప్పుడు ఆయన మెతక తనానికి స్కూల్ లో హిందూ ముస్లిం విద్యార్ధుల కొట్లాటలు జరిగాయి .అప్పుడు నేను పిచ్చి బాబు రామకృష్ణా రావు ఆంజనేయ శాస్త్రి ఒక బృందం గా ఏర్పడి ,స్కూల్ డిసిప్లిన్ దెబ్బతిన కుండా చూడాల్సిన బాధ్యత ను మీద వేసుకోన్నాం .హెడ్ మాస్టార్ని ఒక రకం గా పక్కకు పెట్టి ఏ సమస్య వచ్చినా మేమే డీల్ చేసి పరిష్కరించాం .ఒక నెల లోనే మేమంటే ఏమిటో అందరికి తెలిసి. అందరు చక్కని సహకారం అందించారు .అంతే మళ్ళీ వర్గ ,మత పోరాటాలు రాలేదు .ఒక రకం గా ఇది మా కృషే అనుమానం లేదు .తలిదండ్రులు కూడా మమ్మల్ని మెచ్చుకొని స్కూల్ కు వచ్చి అభి నందిన్చేవారు ముస్లిం పెద్దలు కూడా జరిగిన దానికి చింతిస్తున్నామని ఉయ్యూరు ఎప్పుడూ మత సామరస్యానికి నిలయమని మళ్ళీ అటువంటి అవాంచనీయ సంఘటనలు రాకుండా తమ పిల్లల విషయం లో శ్రద్ధ తీసుకొంటామని చెప్పారు అందరం హేపీ ..’’

                  తాగుబోతు సుబ్బారావు

      స్కూల్ పక్కనే సుబ్బారావు అనే తాగు బోతూ ఉండేవాడు అతనికి అమ్మా తమ్ముడు ఉన్నారు తాగి వచ్చి స్కూలు జ రిగే సమయం లోనే మేస్తర్ల్ని బూతులు తిట్టే వాడు .ఏ మేష్టారు కల్పించుకొనే వాడుకాదు మనకెందుకులే అని ఊరుకొనే వారు .ఇది సహించలేక మా బృందం ఒక సారి సుబ్బారావు మీద తిరగబడి ఎదిరించాం. మళ్ళీ స్కూల్ లోకి అడుగు పెడితే కాళ్ళు విరగ్గొట్టి పోలీస్ కంప్లైంట్ ఇస్తామని చెప్పాం .మేము స్తానికులం అవటం తో కిక్కురు మనకుండా వెళ్లి పోయి అప్పటినుంచి తాగి రావటం మానేశాడు అంతకు ముందు అనేక ఏళ్ళు గా స్కూల్ కు అతను ఈ రకమైన గొడవ తో ఇబ్బంది కలిగించాడు దీనితో ఫుల్స్టాప్ .ఇప్పుడతను వేదాంతి అయాడు వీరమ్మ తల్లి గుడి దగ్గర రూమ్ లో ఉంటూ తత్వాలు పాడుకొంటు సాధువుల వేషం వేసుకొని ఉంటున్నాడు గొంతు మంచిది బ్రహ్మం గారి తత్వాలు బాగా పాడుతాడు ..

         సశేషం –మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –29-3-13- ఉయ్యూరు

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నేటి లెక్కల ప్రకారం.. వెయ్యి కోట్ల సినిమా ‘లవకుశ’

నేటి లెక్కల ప్రకారం.. వెయ్యి కోట్ల సినిమా ‘లవకుశ’

 


వాణిజ్యపరంగా ‘లవకుశ’ సాధించిన విజయం భారత సినీ చరిత్రలోనే ప్రత్యేక ఘట్టం. పావలా నుంచి రూపాయి వరకూ టిక్కెట్ ధరలు, రాష్ట్ర జనాభా మూడు కోట్లున్న రోజుల్లో కోటి రూపాయలు వసూలు చేసిన సినిమా ఇది. అలాగే 50-60 లక్షల జనాభా ఉన్న వంద కేంద్రాల్లో 1.98 కోట్ల టిక్కెట్లు అమ్ముడయ్యాయి (అప్పటి పత్రికా ప్రకటన ఆధారంగా). అంటే దాదాపు ఉన్న జనాభాకు మించి నాలుగు రెట్ల టిక్కెట్లు అమ్ముడయ్యాయంటే ఈ సినిమా సాధించిన అసాధారణ రికార్డు ఏమిటన్నది అర్థమవుతుంది. ఈ రోజున ఇలాంటి ఆదరణను ఏ సినిమా అయినా పొందిందంటే అది రూ. వెయ్యి కోట్లు వసూలు చేసిన సినిమా అవడం ఖాయం! ‘లవకుశ’ చిత్రం విడుదలై యాభై ఏళ్లయిన సందర్భంగా ఆ చిత్ర విశేషాలు…


రామాయణం అంటే ఓ నీతి కథ. సమాజానికి మంచిని బోధించడానికి ఆదర్శప్రాయుడైన ఒక భర్త, ఒక తండ్రి, ఒక కొడుకు, ఒక అన్న, ఒక రాజు… వంటి పలు రకాల పాత్రల్ని చూపించిన గొప్ప కావ్యం. ప్రధానమైన ఉత్తర రామాయణ కథను నడిపిస్తూ పూర్వ రామాయణాన్ని చెబుతూ మొత్తం రామాయణాన్ని ఒక సినిమాగా అందించడం ‘లవకుశ’ ప్రత్యేకత. ఎలాంటి శృంగార భావనలకు చోటు కల్పించకుండా, అరిషడ్వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలకు ప్రాతినిథ్యం లేకుండా ఒక సినిమా తీయడం, అది అఖండ విజయాన్ని సాధించడం ఏ రకంగా చూసినా అపూర్వమైన చరిత్ర.

మూడు గంటల యాభై నిమిషాల నిడివి కలిగిన చిత్రంలో దాదాపు గంటా నలభై ఐదు నిమిషాల కాలం 36 పాటలు, పద్యాలతో ప్రేక్షకుల్ని రంజింపచేసిన ఘనత నిస్సందేహంగా సంగీత దర్శకుడు ఘంటసాలదే. ‘తెలుగునాట రామాలయం లేని ఊరు లేదు, ‘లవకుశ’ పాటలు మోగని గుడిలేదు, వాటిని వినని తెలుగువాడు లేడ’నేది ఒక నానుడిగా మారింది. ఇప్పటి వాణిజ్య పరిభాషలో ఇది రూ. వంద కోట్ల ఆడియో అని చెప్పాలి.

అనితర సాధ్యమైన ప్రజాదరణ
మొదట 1963 మార్చి 29న విడుదలైన 26 కేంద్రాల్లోనూ శత దినోత్సవం జరుపుకుని, లేట్ రన్‌లో 46 కేంద్రాల్లో వంద రోజులు నడిచిన ఏకైక చిత్రంగా నేటికీ నిలిచింది ‘లవకుశ’. తెలుగునాట మొట్ట మొదటిసారి 500 రోజులు ఆడిన సినిమా ఇదే. అదివరకు రికార్డు రామారావే నటించిన ‘పాతాళభైరవి’ది. అది 245 రోజులు ఆడింది. అంటే దానికంటే రెట్టింపు పైగా రోజులు నడవడం ‘లవకుశ’ ప్రత్యేకత. రిపీట్ రన్‌లలోనూ ఈ సినిమా మాదిరిగా ఆడిన సినిమా మరొకటి లేదు. 

రిపీట్ రన్‌లలోని ప్రదర్శనలన్నీ కలిపితే వందకు పైగా కేంద్రాల్లో ఏడాది పైగా రన్‌ను నమోదు చేసిన సినిమా దేశంలో ఇదొక్కటే అవుతుంది. తమిళ వెర్షన్ సైతం ఘన విజయం సాధించి మధురైలో 40 వారాలు ఆడటం, హిందీ డబ్బింగ్ వెర్షన్ కూడా రజతోత్సవం జరుపుకోవడం ద్వారా దేశమంతటా నీరాజనాలు అందుకుంది. భారత సినీ చరిత్రలో ఒకే చిత్రం ద్వారా ఒకే హీరో మూడు భాషల్లో రెండు సార్లు విజయాలను సాధించడం (మొదట ‘పాతాళభైరవి’, తర్వాత ‘లవకుశ’) నాటికీ, నేటికీ ఒక్క ఎన్టీఆర్‌కే చెల్లింది. ఆ ఏడాది జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా రాష్ట్రపతి నుండి బహుమతి అందుకుంది. ఒకే సంవత్సరం ‘లవకుశ’, ‘నర్తనశాల’, ‘కర్ణన్’ (తమిళం) వంటి మూడు అవార్డు చిత్రాల్లో నటించినందుకు గాను రామారావు సైతం రాష్ట్రపతి నుంచి ప్రత్యేక బహుమతిని అందుకోవడం విశేషం.

ఇలా మూడు చిత్రాలకు కలిపి ఒకేసారి జాతీయ బహుమతిని ఇప్పటిదాకా మరే నటుడూ అందుకోలేదు. తెలుగులో మొదటి వర్ణ చిత్రమైన ‘లవకుశ’ విడుదలై యాభై ఏళ్లయినా ఇప్పటికీ థియేటర్ల ద్వారా, డీవీడీల ద్వారా, టీవీల ద్వారా, ఆడియో ద్వారా ప్రేక్షకాదరణ పొందుతూనే ఉంది. ఈ విషయంలో ‘పాతాళభైరవి’, ‘మాయాబజార్’, ‘జగదేకవీరుని కథ’ చిత్రాలు మాత్రమే ‘లవకుశ’తో సరితూగుతాయి.

మహామహుల కలయిక

అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇందులోని పాత్రధారుల గురించి. మహామహులు నటించినా వారు కనిపించరు, వారి పాత్రలే తెరమీద కనిపిస్తాయి. శ్రీరామునిగా నటించిన రామారావు, సీత పాత్రతో అంజలీదేవి అప్పట్లో ప్రేక్షకులకు దైవ సమానులైపోయారు. ఎక్కడికి వెళ్లినా వారికి పాదాభివందనాలు చేసి, హారతులు పట్టి తమ భక్తిని చాటుకునేవారు జనం. వాల్మీకిగా నాగయ్య, లక్ష్మణునిగా కాంతారావు, లవకుశులుగా మాస్టర్ నాగరాజు, మాస్టర్ సుబ్రహ్మణ్యం, భూదేవిగా ఎస్. వరలక్ష్మి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.

దర్శకులైన తండ్రీ తనయులు చిత్తజల్లు పుల్లయ్య, సి.యస్. రావు, రచయిత సదాశివబ్రహ్మం, ఛాయాగ్రాహకుడు పి.ఎల్. రాయ్, ట్రిక్స్ నిపుణుడు రవికాంత్ నగాయిచ్ తదితర సాంకేతిక నిపుణులంతా ఈ చిత్రానికి ప్రాణ ప్రతిష్ట చేశారు. నలభై తొమ్మిదేళ్ల తర్వాత ఇదే సినిమాని ‘శ్రీరామరాజ్యం’ పేరుతో తీయగా ఎన్టీ రామారావు కుమారుడైన బాలకృష్ణ హీరోగా నటించి మెప్పించడం, దానికి ఉత్తమ చిత్రంగా నంది అవార్డు రావడం గమనార్హం. అలా నేటికీ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో శ్రీరామునిగా ఎన్టీఆర్ ముద్ర కొనసాగుతూనే ఉండటం విశేషం!

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

ఎన్‌టీఆర్ మళ్లీ ఎక్కడో పుట్టే వుంటారు

లవ కుశకు 50


ఎన్‌టీఆర్ మళ్లీ ఎక్కడో పుట్టే వుంటారు

సీతాదేవి.. పవిత్రతకు మారుపేరు. ఆదర్శగృహిణిగా, జగజ్జననిగా భక్తజనసందోహం చేత నీరాజనాలందుకుంటున్న ఆ మహాసాధ్విని చూసిన వారు ఈ విశ్వంలో ఎవ్వరూ లేరు. కానీ దక్షిణభారత ప్రజలు మాత్రం సీతాదేవి ఎలా వుంటుందనగానే ఠపీమని ‘లవకుశ’ సినిమాలో అంజలీదేవినే గుర్తు చేసుకుంటారు. అంతగా ఆ పాత్రలో లీనమై నటించారామె. మొత్తం ఆంధ్రావనిచేత అపరసీతాదేవిగా జేజేలందుకుంటున్న ఆమె.. ఆ పాత్రపోషణ తనకు మాత్రమే దక్కిన అదృష్టమని చెబుతున్నారు. లవకుశ సినిమా విడుదలై నేటికి యాభయ్యేళ్లు పూర్తయిన సందర్భంగా.. ఆ సినిమా షూటింగ్‌లో అంజలీదేవి అనుభవాలు ఆంధ్రజ్యోతి పాఠకుల కోసం…
‘లవకుశ’ సినిమాకు తల్లీ,తండ్రీ అంతా దర్శకుడు సి.పుల్లయ్యగారే. ఈ సినిమా క్రెడిట్ ముందుగా ఆయనకే దక్కాలి. సినిమా విడుదలై యాభయ్యేళ్లయినా, ఇప్పటికీ తెలుగు ప్రజల నోళ్లలో నానుతున్నదంటే ఆయనే కారణం. నన్ను ‘గొల్లభామ’ సినిమా ద్వారా గ్లామర్ పాత్రలో పరిచయం చేసిన ఆయన.. ఆ తరువాత రేలంగి వెంకట్రామయ్య సరసన నన్ను పెట్టి ‘పక్కింటి అమ్మాయి’ పేరుతో కామెడీ చిత్రం రూపొందించారు.

సి.పుల్లయ్యగారితో నా మూడో సినిమా ‘లవకుశ’. అప్పటి వరకూ గ్లామర్ పాత్రలు పోషించిన నన్ను పవిత్రమైన సీత పాత్రకు తీసుకోవడం పట్ల ఇండస్ట్రీలో విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. ఎంతోమంది ఆయన్ని వద్దంటూ వారించారు. రాజ్యం ఫిలింస్ నిర్వాహకురాలు లక్ష్మీరాజ్యం అయితే “డ్యాన్సులు చేసుకునే అమ్మాయిని ఇంత మంచి పాత్రకు ఎలా ఎంపిక చేశారు” అంటూ దర్శకుణ్ణి నిలదీశారట. అయినా ఆయన వెనక్కి తగ్గలేదు.


సీత పాత్ర చేసేటప్పుడు నేను ప్రత్యేకంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. అన్ని పాత్రల్లాగే ఆ పాత్రలో లీనమై నటించాను. ఎప్పటిలాగే ఉదయాన్నే భగవంతుడికి పూజలు చేసుకుని షూటింగ్‌కి వెళ్లేదాన్ని. వృత్తిని నేను పవిత్రంగా భావిస్తాను. ఆ పవిత్రతతో పని చేస్తే చాలు. ‘కీలుగుర్రం’ సినిమాలో రాక్షసి పాత్ర వేశాను. అందుకని రాక్షసంగా వుండలేంగా. నిజానికి ఆ పాత్ర నేను చేయనని చెప్పాను. కానీ నా భర్త పెనుపాత్రుని ఆదినారాయణరావు గారు నచ్చచెప్పి నన్ను ఒప్పించారు.

ఏ పాత్ర వేసినా, మనం మనసుపెట్టి నటించాలి, అంతే అన్నారు. సీత పాత్రను నేను ఎంతో ప్రేమతో, భక్తిభావంతో చేశాను. లవకుశ సినిమా షూటింగ్ ఏడేళ్లు జరిగింది. ఆశ్రమం సీన్లన్నీ పూర్తయ్యేసరికి నిర్మాత ఎ.శంకరరెడ్డి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాంతో నాలుగేళ్ల గ్యాప్ తరువాత ఆ సినిమా మళ్లీ మొదలైంది. ఆ నాలుగేళ్ల గ్యాప్‌లో పుల్లయ్యగారికి ఫోన్ చేసి సినిమా గురించి వాకబు చేస్తుండేదాన్ని.

పాపం వారు మాత్రం ఏం చేస్తారు? నష్టాల్లో వున్నారాయె! యాక్షన్‌కి రియాక్షన్ కూడా వుంటేనే మంచి ఔట్‌పుట్ వస్తుంది. ఆ సినిమాలో ఎవరి పాత్రకు వారు న్యాయం చేశారు. సీతా-రాముడు అనగానే నేను, ఎన్‌టీఆర్ గుర్తుకొస్తున్నామంటే ఆ పాత్రల విశిష్టత, పాత్రలు మలచిన తీరు, వాటికి మేం చేసిన న్యాయం..అన్నీ కలవడమే కారణం. అది తెలుగులో తొలి కలర్ సినిమా కాబట్టి యూనిట్ అంతా ఎంతో కష్టపడ్డాం.

ఇప్పటికీ ఆ సినిమా చూస్తే మా కష్టమంతా గుర్తుకొస్తుంటుంది. ఉదయం వెళ్తే.. సాయంత్రం షూటింగ్ పూర్తయ్యే వరకూ ఆ పాత్రల్లోనే ఇమిడిపోయి వుండేవాళ్లం. సి.పుల్లయ్యగారి అబ్బాయి సీఎస్ రావ్ కూడా ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. లవకుశలకు ఆయనే ప్రత్యేకంగా తర్ఫీదు ఇచ్చేవారు. ప్రతిరోజూ వారికి సీన్ల గురించి శిక్షణ వుండేది. లవుడు నాగరాజు, కుశుడు సుబ్రమణ్యం చిన్నవారైనా బాగా కష్టపడి పని చేసేవారు. చిత్తూరు వి.నాగయ్య అవార్డు కార్యక్రమానికి వారిని కూడా పిలవాలని అనుకుంటున్నాను. అప్పట్లో ఇప్పటిలా హడావుడిగా ఏదో షూటింగ్ ముగించేశాం అన్నట్లుగా వుండేది కాదు. ఎంతో క్రమశిక్షణతో, ఒక అంకితభావంతో పని చేసేవాళ్లం.

రాముడంటే నా దృష్టిలో ఎన్‌టీ రామారావుగారే. ఇక ఆ పాత్రలో మనం ఇంకెవ్వర్నీ చూడలేం. రాముడు, కృష్ణుడి పాత్రలకు న్యాయం చేసేవారు ఇప్పటికీ ఇంకెవ్వరూ రాలేదు. లవకుశ సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర చిత్తూరు వి.నాగయ్యగారిది. ఆ పాత్రని ఆయన తప్ప మరెవ్వరూ చేయలేరేమో! ఆశ్రమంలో ఆయన చెప్పిన పద్యాలు, హావభావాలు ఇంకెవ్వరి చేతా పలికించలేరేమో! ఆ సినిమాలో అన్ని పాత్రలకి అందరూ తగినట్లు సరిపోయారు.

సినిమా విడుదలైన తరువాత థియేటర్లలో తెరకు పూజలు చేయడం, సీతారాములకు కల్యాణాలు జరిపించడం వంటివెన్నో జరిగేవి. నేను ఇటీవల పుట్టపర్తి వెళ్తే ప్రశాంతి నిలయంలో ఓ వ్యక్తి మంగళసూత్రం పట్టుకుని నా కోసం ఎదురు చూస్తున్నాడు. “ఏంటయ్యా” అనడిగితే.. లవకుశ చిత్రం విడుదలైనప్పుడు సీతాదేవి కోసం (నా కోసం) మంగళసూత్రం తయారుచేయించి పెట్టాడట. అప్పటి నుంచి నన్ను కలవడానికి కుదరకపోవడంతో పుట్టపర్తిలో కనిపించగానే ఇచ్చాడు.

ఆ పాత్రపై ఆయనకున్న పవిత్ర భావనను, ఆయన అభిమానాన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి? అతనికి ఏం సమాధానం చెప్పాలో నాకు నోట మాట రాలేదు. ఆ మంగళసూత్రాన్ని సీతమ్మవారి మెడలో వేయమని చెప్పాను. లవకుశ సినిమా విడుదలైన కొత్తలో సీత పాత్రకు వచ్చిన స్పందనను చూసి ఓ రోజు లక్ష్మీరాజ్యం నా వద్దకు వచ్చి, నన్ను కౌగిలించుకుని కన్నీరు పెట్టుకుంది. ఆ పాత్రకు నన్ను వద్దని చెప్పడం తప్పేనని చెప్పింది.

ఆ మాట సి.పుల్లయ్యగారితోనూ చెప్పింది. ఆ సినిమాకు సంగీతం ఘంటసాల గారు చక్కగా అందించారు. ఇప్పటికీ ఎక్కడ పూజలు జరిగినా, ఆ సినిమాలోని పాటల్ని వాడుతున్నారంటేనే ఆయన గొప్పతనం తెలుస్తుంది. శ్రీరాముడి పాత్రలో ఎన్‌టీఆర్ సెట్‌లోకి వస్తే అంతే! అంతా గప్‌చుప్. అందరూ ఎవరి పని వారు చూసుకునేవారు. అంతేనా, ఆ దివ్యమంగళమూర్తిని కళ్లారా చూసుకుంటూ ఉత్సాహంగా ఉరుకులు పెట్టేవారు. ఆయన రూపం గురించి ఎంత చెప్పినా తక్కువేనేమో! ఆయన మళ్లీ ఎక్కడో పుట్టే వుంటారు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మధురం మధురం ఈ గానం -శ్రీ పొన్నాడ సత్య ప్రకాశ రావు

madhura gaanam -1madhura gaanam -2

Posted in వార్తా పత్రికలో | Leave a comment

శ్రీ సింహాద్రి వెంకటేశ్వర రావు (అవనిగడ్డ ) కవిత ”తెలుగు వెలుగు ”

simhadri kavithasimhadri kavith2

Posted in కవితలు | Tagged | Leave a comment

శ్రీ లక్ష్మీ యాగం -విజయవాడ ,కూచిపూడి నాట్యోత్సవం , ,శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి (ప్రసాద రాయ కులపతి )అభిభాషణం

lakshmi yagam kulapathi kulapathi-a

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జానకీ జాని గారి ‘’అరుంధతి’’ -3 (చివరి భాగం )

  జానకీ జాని గారి ‘’అరుంధతి’’ -3 (చివరి భాగం )

     ‘’అర్ధ రూపాయి ‘’కధ లో మానవత్వం ఎప్పటి కైనా జయిస్తుందన్న ఆశకల్పిస్తుంది .ఆసురీ శక్తులపై మానవత్వం విజయం సాధించాలి అన్న ఆశకు ,సత్యానికి దివిటీ ఈ కద .సత్యమూర్తి పేరు అతన్ని ఎప్పుడూ ‘’రాంగ్ ట్రాక్ ‘’నుంచి  మళ్ళిస్తూ ,మంచి మార్గం లో పడేస్తుంది .అందుకే తాత్కాలికం గా తప్పు చేసినా ,దరిద్రుడి దగ్గర ఓ అర్ధ రూపాయి దొంగిలించి భార్యకు బ్రెడ్ కొందామని వెళ్ళినా ,అంతరాత్మ అతన్ని ప్రశ్నిస్తూనే ఉంది .’’ఇది పద్ధతి కాదు ‘’అని హెచ్చరిస్తూనే ఉంది .మనస్సును బుద్ధి జయించి ,తన తప్పు తెలుసుకొన్నాడు .చక్కని సంఘర్షణ ను అద్భుతం గా శిల్పీకరించారండీ మీరు ..’’అర్ధ రూపాయి ‘’అనటం లో దానికి విలువ లేకపోయినా ,విలువను కల్పించి ,చిరంజీవి ని చేశారు .దరిద్రం ఎవరి నైనా నీచం గా ప్రవర్తిమ్పజేస్తుంది .కాని దాన్ని,దాని పరీక్షల్ని తట్టుకోవాలి .అప్పుడే అంతిమ విజయం .మానవత్వం మాయ మైతే ప్రపంచం లో మనిషి మనుగడ ప్రశ్నార్ధకమే అవుతుంది .

   ‘’ రూపాంతరం ‘’ కధలో ‘’సుహాసిని’’ అన్న పేరు బాగుందండీ .ఆమె ప్రపంచాన్ని చూసి నవ్వుకుంటుంది .ఆమె ను చూసి మనం నవ్వుకొంటాం .అవతలి వాడు వంచన చేస్తే ,నేనూ చేయలేనా అని భావించి ఆమె ప్రవర్తించింది .దెబ్బతిన్నా దెబ్బ తీయాలి అనేప్రతీకారేచ్చమనస్తత్వంఆమెది .అయితే అది ఎవరి ఆనందం కోసం ?ఎవరి తృప్తి కోసం ?ఆమె పొందే తృప్తి ఏ పాటిది ?ఎవర్ని మోసం చేస్తోని తన అంత రాత్మనే .పైగా దానికో సపోర్టింగ్ స్టేట్ మెంట్ ఇస్తుంది ‘’స్వార్ధ పరులైన పురుషులేన్దర్నో చడ గోడుతున్నానన్న సంతృప్తి నాకెంతో ఆనందాన్నిస్తోంది .’’.ఇప్పటిదాకా ఆమె ఓ గొంగళి పురుగు .ఆశల వలయం లో ,గూటిలో చిక్కు కొని ఉంది .అంతా వాడుకోన్నవారే .చీదరించుకొని వదిలేశారు .ఇప్పుడామె వన్నెల సీతా కోక చిలుక లా రూపాంతరం చెందింది .రెక్కలొచ్చి యెగిరి పోయింది .వన్నె చిన్నెలతో ఆకర్షిస్తోంది . .ఇది అశాశ్వతం అని తెలిసినా తానేదో గొప్ప పని చేస్తున్నానన్న భావం .స్త్రీ చెడిపోవటానికి పురుషుడు కారణం .ఈ చేడిపోటం  ఇరు వైపులా ఉంది .ఏ ఒక్కరికో మాత్రమె కాదు .అన్నది ఆమె భావన .ఈ భావంతో మనం ఏకీభవించలేక పోవచ్చు .అందుకే ఆ సీతాకోక చిలుక మాటలకు రచయిత మనస్సు మీద గొంగళి పురుగులు పాకి నట్లు అయిందట ..మంచి కధనం తో నడిచిన కద

          వైవిధ్య వంత మైన కధాంశాలను ఎన్నుకొని ఉదాత్తతను ఆదర్శం గా భావించి సమాజం కోసం దేశాన్ని ‘’స్లోగన్‘’పరంగా ,ఇవ్వకుండా ,విశ్లేషన పరం గా ఇచ్చి ,లోతైన భావాలను వ్యాపింపజేసిన మీ కధలు ఆణి ముత్యాలు .ఓ కవి ఓ పండితుడు ,బహుభాష వేత్త ,ముఖ్యం గా రామాయణ రహస్యాలను ఆకళించుకొన్న వివేక మూర్తి ,అయిన మీరు తాత్విక దృక్పధం తో రాసిన కధలు భారతీయతకు అద్దం పట్టాయి .ఇవన్నీ ఆంధ్ర దేశం లో ఎక్కడో అక్కడ జరిగే ఉంటాయి .అక్షర రూపం దాల్చి ‘’అక్షరం, అక్షయం ‘’అయాయి . .ఆంగ్లం లో సాటి లేని మీరు ఒక్క ఆంగ్ల పదం కూడా కధనం లోకి చొచ్చుకు రాకుండా తీసుకొన్న జాగ్రత్తకు తెలుగు జాతి యావత్తు గర్వ పడుతుంది .తీయని తెలుగు కధ చదివా మన్న ఆనందాన్ని ,సంతృప్తిని మీరు పా ఠకులకు మిగిల్చారు .మీ కృషి ప్రశంశ నీయం .

   ‘’ఇప్పుడే మేలుకొన్నాను ‘’అని మీరు ముందుమాటలో అన్నారు .’’మేలు కొన్న వాడి కలలు ‘’లో ఎప్పుడోనే మీరు మేలు కొన్నారు .అందులో ‘’రస గంగాధరం ‘’అయిన తిలక్ కు అన్కితమూ చేశారు .మా అందరికోసం ‘’వెన్నెల మెట్లు‘’కట్టారు .’’నేతాజీ’’ ని పరిచయం చేసి ,’’రామాయణ పావని ‘’ద్వారా రామాయణ పావనత్వాన్ని చాటారు .ఈ కదల ద్వారా ‘’అరుంధతి ‘’ని భూమి పైకీ దింపారు .మరిన్ని రచనలు మీ నుండి రావాలని కోరుకొంటాను .నన్ను మీ అత్మీయుని గా భావించి సహృదయత ను కనబరుస్తున్నందుకు సదా కృతజ్ఞుడిని .ఇదంతా ఏక బిగిని రాసిన లేఖ .దోషాలుంటే మన్నించే సహ్రుదత ఉన్న వారు కదా .అందర్నీ అడిగి నట్లు చెప్పండి –మీ దుర్గా ప్రసాద్ –28-11-2000 .

            సమాప్తం

   మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –28-3-13  ఉయ్యూరు 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆఫ్రికా విషాదమూ – అచెబే సాహిత్యమూ

ఆఫ్రికా విషాదమూ – అచెబే సాహిత్యమూ

– డాక్టర్ కె. ఇంద్రసేనా రెడ్డి

 


చినువా అచెబే అస్తమయంతో సాహిత్య ప్రియులు ఒక స్నేహితుడిని కోల్పోయారు; నైజీరియన్లు ఒక తాత్వికుడిని కోల్పోయారు; ఆఫ్రికన్లు ఒక మార్గదర్శకుడిని కోల్పోయారు; సామాజిక ఆందోళనకారులు క్రియాశీలి అయిన ఒక రచయితను కోల్పోయారు… ‘ఒక నిబద్ధత లేకుండా, నిరసన వ్యక్తం చేయకుండా ఆఫ్రికా గురించి రాయడం అసాధ్యమని నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే ఆఫ్రికాకు గతం అనేది లేదని భావించే వారు ఉన్నారు. మేము చేస్తున్నదల్లా ఆఫ్రికాకు గతం ఉన్నదని చెప్పడమే..’ అని చినువా అన్నారు. 

చినువా అచెబే మరణంతో సాహిత్య ప్రియులు ఒక స్నేహితుడిని కోల్పోయారు; నైజీరియన్లు ఒక తాత్వికుడిని కోల్పోయారు; ఆఫ్రికన్లు ఒక మార్గదర్శకుడిని కోల్పోయారు; సామాజిక ఆందోళనకారులు క్రియాశీలి అయిన ఒక రచయితను కోల్పోయారు. ఆఫ్రికాలో నయా వలసవాద పరిస్థితులు పలువురు క్రియాశీల రచయితలు, రచయిత్రులను ప్రభవింపచేశాయి. వీరిలో ప్రముఖులు వోల్ సోయింకా (నైజీరియన్ రచయిత, నోబెల్ సాహిత్య పురస్కార గ్రహీత), గూగీ వా థియోంగో (కెన్యా సాహిత్యకుడు, ఇప్పుడు అమెరికాలో ప్రవాసి), నవాల్ ఎల్ సదావీ (ఈజిప్టియన్ సాహితీవేత్త), ఫ్రాంట్జ్ ఫానన్ (మార్టినిక్), అబేబ టెస్ ఫాగియోర్గిస్ (ఎరిట్రియా). సామాన్యుని పక్షాన నిలిచిన ఈ సాహితీ సృజకులందరూ తమ తమ దేశాల్లోని ఆర్థిక-సామాజిక దోపిడీ వ్యవస్థలను తీవ్రంగా దుయ్యబట్టడమే గాకుండా, కొత్త వలస వాదానికి వ్యతిరేకంగా ప్రజ్వరిల్లిన ప్రజల విమోచనోద్యమాలలో చురుగ్గా పాల్గొన్నారు. నైజీరియా నుంచి వేరుపడి స్వతంత్ర దేశంగా ఆవిర్భవించడానికి సహచర బయాఫ్రాన్ (బయాఫ్రా దక్షిణ నైజీరియాలోని ఒక ప్రాంతం) ప్రజలతో కలిసి చినువా పోరాడారు. బయాఫ్రా ప్రాంతంలో 1967-70 సంవత్సరాల మధ్య చోటుచేసుకున్న అంతర్యుద్ధం నైజీరియా చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. ఆ అంతర్యుద్ధ రక్తసిక్త స్మృతులే చినువా తాజా నవల ‘దేర్ వజ్ ఎ కంట్రీ’ (2012) ఇతివృత్తం.

‘థింగ్స్ ఫాల్ ఎపార్ట్’ (1958) చినువా తొలి నవల. ఈ నవల ప్రచురితమై యాభై సంవత్సరాలు అయిన సందర్భంగా 2008లో ఆఫ్రికా, ఐరోపా, భారత్‌లలో పలు విశ్వవిద్యాలయాలు ఆ సాహిత్య కృతిపై సదస్సులు నిర్వహించాయి. నల్లగొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో చినువా సాహిత్య సదస్సు నిర్వహణలో భాగస్వామినయినందుకు నేను గర్విస్తున్నాను (అప్పుడు నేను ఆ వర్సిటీ ఆంగ్ల విభాగానికి ప్రధానాచార్యుడుగా నున్నాను). ‘థింగ్స్ ఫాల్ ఎపార్ట్’ ప్రపంచవ్యాప్తంగా యాభైకి పైగా భాషలలోకి అనువదింపబడింది. కోటికి పైగా ప్రతులు వ్యాప్తిలో ఉన్నాయి. మతం (క్రైస్తవం), దాని మిత్రుడు వలసదారు సంయుక్త అధికార ప్రాబల్యానికి వ్యతిరేకంగా మరెవరి సహాయం లేకపోయినా ఒంటరిగా సాహసోపేత పోరాటం చేసిన ఒక ఆఫ్రికన్ కథా నాయకుని విషాదగాథను ఆ నవల చెప్పింది. ఆఫ్రికన్ ప్రజల సంప్రదాయాలు, విలువలు, విశ్వాసాలలో అంతర్భాగంగాఉన్న ఆఫ్రికన్ కల్పనా గాథలు, ఆచారాలు, జానపద సాహిత్యాన్ని చినువా నవలలు ‘థింగ్స్ ఫాల్ ఎపార్ట్’, ‘ఆంథిల్స్ ఆఫ్ సవన్నా’ (1987) రెండూ పునః సృజించాయి. చినువా తన రచనలలో ఆఫ్రికన్ స్ఫూర్తిని నింపుతారు. ఆంగ్ల భాషను ఆఫ్రికీకరణ చేయడానికి ఆయన తన శాయశక్తులా ప్రయత్నించారు. వలస పాలకుల వారసత్వ అవశేషంగా మిగిలిన ఆంగ్ల భాషను ఉపయోగించుకోవడం అనివార్యమయినందుకు ఆయన చాలా విచారపడతారు. అయితే ‘తన ఆఫ్రికన్ అనుభవంలోని బరువును వ్యక్తీకరించేందుకు ఆంగ్ల భాష ఉపకరిస్తుందని’ చినువా అన్నారు.

చినువా నవలలు ‘థింగ్స్ ఫాల్ ఎపార్ట్’ (1958), ‘నో లాంగర్ ఎట్ ఈజ్’ (1960), ‘యారో ఆఫ్ గాడ్’ (1964), ‘ఎ మ్యాన్ ఆఫ్ ది పీపుల్ ‘ (1966), ‘ఆంథిల్స్ ఆఫ్ ది సవన్నా’ (1987) మొదలైనవి వలసపాలనాయుగంలోను, వలస పాలన నుంచి విముక్తి పొందిన అనంతరమూ నైజీరియాలో నెలకొనివున్న పరిస్థితులను అభివర్ణిస్తాయి. నిజానికి అవి ఒక్క నైజీరియాలోనే కాక ఆఫ్రికా దేశాలన్నిటా ఉన్న అటువంటి పరిస్థితులకు దర్పణం పట్టాయని చెప్పవచ్చు. ప్రస్తావిత ఐదు నవలలనూ 1890ల నుంచి 1980ల దాకా నైజీరియా చరిత్రగా కూడా చదవవచ్చు. నవలా రచయిత, కవి, విమర్శకుడు, వ్యాసకర్తే కాకుండా చినువా ఒక చరిత్రకారుడు కూడా. వీటన్నిటికీ మించి ఆయన ఒక క్రియాశీలి అయిన రచయిత కూడా. జాత్యహంకారాన్ని, జాత్యదురహంకారులను చినువా ఎటువంటి మినహాయింపులు లేకుండా తీవ్రంగా విమర్శించారు. జాత్యోన్మాదం పాశ్చాత్య ప్రపంచ సృష్టి అని, ఆ దురాచారాన్ని ఆఫ్రికా, ఇతర ప్రాంతాలపై రుద్దారని ఆయన దుయ్యబడతారు. జర్మన్ దార్శనికుడు హేగెల్ ‘చరిత్ర తత్వాలు’ (ఫిలాసఫీస్ ఆఫ్ హిస్టరీ)లో ఆఫ్రికా కనీసం ఒక అంధకార ప్రాంతంగా కూడా కానరాదని ఆయన అంటారు.

నోబెల్ పురస్కార గ్రహీత జోసెఫ్ కాన్రాడ్‌కు ఆఫ్రికా అంటే ‘చీకటి హృదయం’కు ప్రతిబింబమే! ఆఫ్రికా గురించి ఆయన ఉత్కృష్ట నవల ‘హార్ట్ ఆఫ్ డార్క్‌నెస్’ మనకు కల్గించే భావన అదే కదా. మరి కాన్రాడ్‌ను ‘సంకుచిత యూరోపియన్ మనస్తత్వం గల జాత్య దురహంకారి’ అని విమర్శించగల ధైర్యం చినువాకు కాక మరెవరికి ఉంటుంది? ఆఫ్రికాను ‘చీకటి ఖండం’గా వక్రీకరించిన కథనాలను సరిదిద్దడానికి, ఆ ఖండంపై ఉన్న తప్పుడు అభిప్రాయాన్ని రూపుమాపడానికి చినువా ఒక నిబద్ధతతో రచనా వ్యాసంగాన్ని చేశారు. ఆయన ఇలా అం టారు: ‘ఒక నిబద్ధత లేకుండా, నిరసన వ్యక్తం చేయకుండా ఆఫ్రికా గురించి రాయడం అసాధ్యమని నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే ఆఫ్రికాకు గతం అనేది లేదని భావించే వారు ఉన్నారు. మేము చేస్తున్నదల్లా ఆఫ్రికాకు గతం ఉన్నదని చెప్పడమే..’

వలస పాలనలో మగ్గిపోతున్న ఆఫ్రికా ప్రజల జీవన స్థితిగతులను చినువా మొదటి మూడు నవలలు అభివర్ణిస్తాయి. శ్వేతజాతీయులు తొలుత తమ మతం, బైబిల్‌తో ఆఫ్రికాలో అడుగుపెట్టారు; వారిని అనుసరించి వలసవాదులు తుపాకులతో వచ్చారు. బైబిల్, తుపాకీ అనే రెండు మాటలు ఆఫ్రికాలో వలసవాదం చరిత్రను సంక్షేపిస్తాయి. స్వాతంత్య్రానంతరం కొత్త వలసవాదంలో అధికార స్థానాలలో సుప్రతిష్ఠులైన నల్ల జాతి నాయకుల పాలనలో మారిన పరిస్థితులను ‘ఏ మ్యాన్ ఆఫ్ ది పీపుల్’, ‘అంథిల్స్ ఆఫ్ ది సవన్నా’ అభివర్ణిస్తాయి. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆఫ్రికన్ల శత్రువు లోపలి మనిషే. అంటే వారి నుంచి వచ్చిన వ్యక్తే. అయితే అమెరికా, యూరోప్‌లలోని తన నయా వలసవాద యజమానుల ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తుంటాడు. ఇదే ఆఫ్రికా విషాదం. భారత్, ఇతర వర్ధమానదేశాల చరిత్ర గతి కూడా ఇదే రీతిలో ఉంది. ఈ చారిత్రక సామ్యమే చినువాను మనకు అంటే భారతీయులకు సన్నిహితుడిని చేసింది. ఆయన సాహిత్యం మన సమాజానికీ ఉపయుక్తత కలిగి ఉంది. ఇది చినువా సాహిత్యంలోని విశ్వ జనీన గుణం.

చినువా ఇక లేరు. అయితే ఆయన అర్థవంతంగా జీవించారు. భవిష్యత్తుకు సమున్నత వారసత్వాన్ని వదిలివెళ్ళారు. బలహీనులలో కెల్లా బలహీనులు అత్యంత శక్తిమంతులను ఎలా ఎదుర్కోగలరో ప్రపంచానికి ఆయన చూపారు. ఈ నివాళి వ్యాసాన్ని ఒక నీతికథతో ముగిస్తాను. చినువా నవలలో ఒక నిరక్షరాస్య గ్రామీణుడు ఈ దృష్టాంత కథను చెబుతాడు. అమాయక ప్రజలకు ప్రతీకగా తాబేలును, రాజ్య వ్యవస్థ దుర్మార్గ అధికారాలకు ప్రతీకగా చిరుతపులిని సూచించడానికి చినువా ఆ కథను ఉపయోగించుకుంటారు. ఒక ఆఫ్రికన్ కల్పనాకథ ప్రకారం తాబేలు, చిరుతపులి రెండూ బద్ధ శత్రువులు. తాబేలు కంటపడినప్పుడల్లా చిరుత తక్షణమే దానిని చంపివేసి తింటుంది. ఒకసారి తాబేలును చిరుత చూస్తుంది. ‘నేను నిన్ను చంపబోతున్నానని’ చిరుత అంటుంది. తను మృతికి సిద్ధం కావడానికి ఒకటి రెండు నిమిషాలు వ్యవధినివ్వమని తాబేలు వేడుకొంటుంది. సరేనంటుంది చిరుత. వెన్వెంటనే తాబేలు మట్టిని కాళ్ళతో తన్నుతూ దుమ్మును రేపుతుంది. చిరుత అయోమయంలో పడుతుంది. ‘ఏం చేస్తున్నావని’ అడుగుతుంది. తాబేలు వెంటనే ఇలా సమాధానమిస్తుంది: ‘నేను ఎలాగూ చనిపోబోతున్నాను కదా. అయితే చనిపోయే ముందు ఇక్కడకు వచ్చిన వారు నీకు నాకు మధ్య మహాయుద్ధం జరిగిందన్న విషయాన్ని గ్రహించాలని నేను కోరుకొంటున్నాను’. ఎంత అద్భుతమైన దృష్టాంత గాథ!

– డాక్టర్ కె. ఇంద్రసేనా రెడ్డి
ఆంగ్ల ఆచార్యులు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జానకీ జాని గారి అరుంధతి -2

   జానకీ జాని గారి అరుంధతి -2

          ‘’యదా కాష్టం చ ‘’కదా సంగతి మన రాజ మండ్రిబారతీయ సాహిత్య పరిషత్ సభలో మీ నుంచే విన్నాను .ఇందులోనూ అరుంధతి యే..ఈ అరుంధతిని అందుకోవాలన్న ఆరాటమే కాని ప్రయత్నం చేయని అసమర్ధుడు ఆనంద రావు .ఆనందం మనసులోనే క్రియలో లేనివాడు . అతను కలల్ని తిని బతికే గొంగళి పురుగు .అందులోంచి బయట పడలేడు .స్పందించలేడు .చేతకాని వాడు .కళ్ళ ముందు అంతా జరిగి పోతున్నా ,కలల వల లోంచి తప్పుకో లేదు .మనసులో అనుకొన్నా క్రియలో సాధించలేని వాడు .కదల లేడు కదిలించలేడు .ఆలోచనల సుడి లో చిక్కు కొంటాడు .బయట పడటం రాదు .అందుకే చివరగా మీరు ‘’రైలు ఎక్కే వాళ్ళు ,దిగే వాళ్ళు కూడా అటు ఎక్కటానికి ,ఇటు దిగటానికి అంతరాయం కల్గిస్తూనే ఉన్నారు ‘’అని ముగించటం బాగుంది .

           ‘’కాలోహి ‘’లో పాత్రలపేర్లు బాగున్నాయి .చిదానందం ,నిజం గా చిదానందమే .కామేశం లో కామం అంతర్గతం .పైకిఎన్ని చెప్పినా దాన్ని జయించలేక పోయాడు .ఆధ్యాత్మిక విషయాలు ఎన్ని చదివినా అతని లో దాని ప్రభావం పుస్తకం మూసే దాకానే .ఆ తర్వాత అంతర్గతం గా ఉన్న కోర్కె బలీయమై ,దాన్ని బహిర్గతం చేసి ,ఆధ్యాత్మిక భావాల్ని అణగించేస్తోంది .చివరికి కోరికే జయించింది .చిదానందం చైతన్య స్వామి ప్రబోధం విని పూర్తిగా ప్రభావితుడై భవ బంధ విమోచనకు పరుగు దీస్తే కామేశం లో స్వామి ప్రభావం తాత్కాలికమే అయింది .కామ వాంఛ పెరిగి మళ్ళీ గృహస్తాశ్రమం తీసుకోవటానికి నిర్ణయించాడు .ఒకే చోట మెదిలే ఇద్దరు వ్యక్తుల భిన్న ప్రవృత్తుల కు అద్దం పట్టిన కద ఇది .వర్ధనమ్మ పేరు బాగా సరిపోయింది .ఆమె లో కామ దాహం వర్ధిల్ల జేయటానికి ప్రోద్బలం చేసింది కనుక పేరు బాగా నప్పింది .’’బాబు గారూ ‘’సంబోధించే ఆమె, ముగింపు లో ‘’ఏమండీ “’అనటం ఆమె లో వచ్చిన పెద్ద మార్పును ఒకే ఒక్క మాటతో అద్భుతం గా చెప్పారండీ మీరు .అతను తల దిన్చుకోటమూ ,నాటకీయమే .’’బలవానిన్ద్రియానపి ‘’అన్న సత్యం వ్యక్త మైన కద .

           ‘’ వ్యత్యాసం ‘’కదా లో సుశీల ,సత్య మూర్తి దాంపత్యం కూడా ఒడిదుడుకులకు తట్టుకొని నిలబడి సవ్యం గా ముగిసింది .పట్టుదలలు ,పంతాలు భార్యా భర్తల మధ్య ఉండటం సహజం .అంత మాత్రాన కాపురం లో నీళ్ళు పోసుకో రాదు .అధిగమించి ,అర్ధం చేసుకొని దాంపత్య రధాన్ని లాక్కు రావాలి .అందుకనే ‘’ఈ బుద్ధి పెద్ద వాళ్ళక్కూడా ఉంటె ఎంత బాగుండును ?’’అని అతని మనసు లో మీరు అని పించి మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చారు .ఆమె సుశీల కనుక దారి తప్పలేదు .అతను సత్య మూర్తి కనుక రుజు మార్గం వదలలేదు .’’సెకండ్ థాట్స్ ‘’ఇద్దర్నీ కలిపాయి .జీవితం లో ఈ రకమైన సంయమనం అవసరమని ఈ కాలం వారికి మెత్తగా చెప్పిన కద .చాల నచ్చింది .’’

   ‘’దరిద్రం ‘’పేరూ తమాషాగానే సరిపోయింది కధకు ..శేషగిరి పేరు రామ మూర్తికి రామ మూర్తి పేరు శేషగిరికి మారిస్తే బాగుండేది అని పించింది .వాడికి శేషం గా మిగిలింది ‘’గిరి అంతటి దరిద్రం ‘’అని పించేది .అని నా అభిప్రాయం సుమండీ .’’we can eradicate poverty but we cannot eradicate the feeing of poverty ‘’అన్నదాన్ని రుజువు చేసిన కద ఇది .

   ‘’ఆల్కెమీ ‘’ఒక ఊహ .ఆచార్య నాగార్జునుడు ప్రయత్నించాడని ప్రతీతి .అది అందరికి సాధ్యమయ్యేది కాదు .ఆ ప్రయోగాలలో కొట్టు మిట్టాడుకు పోవటమే కాని బయట పడేది శూన్యం .ఈ కద లో పాత్రలు అన్ని అలాంటి స్వభావం కలవే .ఊహల అంచులలో ప్రయాణం చేస్తూ వాస్తవికత ను మార్చే వాళ్ళే .అందుకే ఎవరూ ఆ ప్రయత్నం లో కృత క్రుత్యులు కాలేదు శ్రమే తప్ప ఫలితం దక్కని నిర్భాగ్య జీవులే తండ్రి కూతురూ కూతురు చుట్టూ తిరిగే షోకిల్లా .

            సశేషం

                 మీ –గబ్బట దుర్గా ప్రసాద్ -.27-3-13-ఉయ్యూరు 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

దశాదిత్య ప్రతిభా పురస్కార సభ

దశాదిత్య ప్రతిభా పురస్కార సభ

  కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యం లో 26-3-13-మంగళ వారం సాయంత్రం ఆరు గంటలకు విజయవాడ లో హోటల్ ఐలాపురం లో దిగ్దంతులైన పది మందికి వారి ప్రతిభా విశేషాల కు పురస్కార సన్మాన సభ జరిగింది .కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు అధ్యక్షత  వహించగా గౌరవాధ్యక్షులు ,అధికార భాషా సంఘం అధ్యక్షులు శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ ,లోక్ నాయక ఫౌండేషన్ వ్యవస్తాపకులు శ్రీ యార్ల గడ్డ లక్ష్మీ ప్రసాద్ ల పర్యవేక్షణ లో ప్రధాన కార్య దర్శి డాక్టర్ జి.వి.పూర్ణ చంద్ సభా నిర్వహణ లో వైభవోపేతం గా జరిగింది .

    శ్రీ కే.వి.ఎల్.యెన్.నరసింహం గారి శ్రావ్య మైన కం ఠం తో ఆలపించిన ‘’మా తెలుగు తల్లికి మల్లె పూ   దండ ‘’గీతం తో సభ ప్రారంభ మైంది .శ్రీ సుబ్బారావు గారు తమఅధ్యక్ష ప్రసంగం లో ఆరు నెలలుగా వాయిదా పడుతున్న ఈ సభ ఈరోజు ఇంతవైభవం గా జరగటం అదృష్టమని ,ఇందరు ప్రతిభా మూర్తులను ఒకే వేదిక పై చూడటం మనం చేసుకొన్నా పుణ్యమని ఇది అరుదైన సంఘటనమని ,దేశం లో ఏ అనధికార ,అధికార సంస్థ కృష్ణా జిల్లా రచయితల సంఘం చేబట్టినన్ని సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు చేబట్టి నిర్వహించలేదని ప్రపంచ వ్యాప్తం గా మన సంఘం అందరి అభిమానాలను సాధించిందని భాషకు ఎన లేని సేవలన్దిన్చిందని అన్నారు .ఈ సభ కు దిశా నిర్దేశం చేస్తూ శ్రీ పూర్ణ చంద్ గత ముప్ఫై ఏళ్ళుగా మన సంఘం నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాలు విజయవంతమైనాయన్నారు తెలుగు భాషా సంస్కృతుల పరి రక్షణ లో మనం ముందున్నామని తెలుగు భాషా సదస్సులు జాతీయ తెలుగు రచయితల సభలు ,రెండు సార్లు ప్రపంచ తెలుగు రచయితల సభలను న భూతో గా నిర్వహించిందని ,తెలుగు భాష ప్రాచీనత పై జాతీయ సదస్సు ,సిందు –కృష్ణా లోయల నాగరకతల అధ్యయన సదస్సు ,అంతర్జాలం లో రచనల శిక్షణా సదస్సు ,తెలుగులో న్యాయ పాలనా సదస్సు ,కృష్ణా జిల్లా చారిత్రిక వైభవం పై జాతీయ సదస్సు అద్భుతం గా జరిపిన చరిత్ర మనది అన్నారు మన సంఘానికి అంతర్జాతీయ గుర్తింపు అంటే ఐ.ఎస్.ఐ.ముద్ర  రావాలని అన్నారు .

డాక్టర్ గుమ్మా సాంబశివరావుఆహ్వానం పలుకుతూ వివిధ రంగాలలో అద్వితీయ కృషి చేసిన ప్రముఖులకు‘’కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రతిభా పురస్కారాలను అందిస్తోందని ప్రతి పురస్కారానికి పది వేల రూపాయల నగదు ,ప్రశంశా పత్రం తో సత్కారం చేసి గౌరవిస్తున్నామని చెప్పారు ఇది మూడవ పురస్కార సభ అని అన్నారు ఇప్పటి వరకు కీ.శే.మండలి కృష్ణా రావు భాషా పురస్కారాన్ని శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ నెలకొల్పి ఆచార్య కోరాడ మహాదేవ శాస్త్రి డాక్టర్ బాలాంత్రపు రజనీకాంత రావు ,కీ.శే.డాక్టర్ వి.వి.కృష్ణ శాస్త్రి గార్లకు అందజేశామని తెలిపారు .కీ.శే.ఆలూరి బైరాగి సాహితీ పురస్కారాన్ని ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ నెలకొల్పగా ఆచార్య జి.ఆదేశ్వర రావు ,శ్రీ వంగపండు ప్రసాద రావు ,డాక్టర్ మైనేని కృష్ణ కుమారి అందుకోన్నారని ,శ్రీ గుత్తికొండ సుబ్బారావు తన పేర నెల కొల్పిన సాహితీ సేవా పురస్కారాన్ని .పోతుకూచి సాంబశివరావు ,డా.బోయిన పల్లి రామా రావు ,ఆచార్య వంగపల్లి విశ్వనాధం గారలు అందుకోన్నారని ,కీ’శే.పోలవరపు కోటేశ్వర రావు కదా పురస్కారాన్ని శ్రీ గోళ్ళ నారాయణ రావు నెలకొల్పగా శ్రీ మునిపల్లె రాజు ,శ్రీ విహారి అందుకోన్నారని స్వర్గీయ ముక్కామల నాగభూషణం పాత్రికేయ పురస్కారాన్ని ఆచార్య ప్రతిభ నెల కొల్పగా ,కీ.శే.పరకాల పట్టాభి రామా రావు ,శ్రీ జి.వి.రామా రావు గార్లు అందుకోన్నారని హర్ష ధ్వానాల మధ్య తెలియ జేశారు ..

         శ్రీ యార్లగడ్డ తెలుగు హిందీలలో కవితలను పుంఖాను పుంఖం గా గుప్పించి ఆలూరి బైరాగి విశిష్టతను ప్రసంశించారు ..శ్రీ బుద్ధ ప్రసాద్ తమ కీలకోపన్యాసం లో ఇది ‘’సాంస్కృతిక వికాస సంవత్సరం ‘’గా ప్రభుత్వం భావించి చేస్తోందని ఇంకా భాషా సంస్కృతులకు చేయాల్సింది చాలా ఉందని ఇందరు పెద్దల్ని సత్కరించుకోవటం మననల్ని మనం సమ్మా నిన్చుకోన్నట్లే నని వారందరి తో తనకున్న పరిచయాన్ని వివరించారు పది మంది సూర్యులు ఈ వేదిక ను సుసంపన్నం చేశారని వీరంతా రాత్రికోడా ప్రకాశించే దశాదిత్యులని పిస్తున్నారని ఆన్నారు .పరబ్రహ్మ శాస్త్రి గారి శాసన పరిశోధకులు మనకు ఇప్పుడు లేరని వారి సేవలు అమోఘమని చెప్పారు యువత వారి దారిలో నడిచి ఎంతో చరిత్ర ను త్రవ్వి తీయాలని కోరారు ..

    ఇప్పుడుజరుగుతున్నది  2011,2012 సంవత్సరాలకు సంబంధించిన పురస్కార సభ అని గుర్తు చేశారు .  ఆ తర్వాత దా.పి.వి పరబ్రహ్మ శాస్త్రి గారికి ఆచార్య పేరి భాస్కర రావు గారికి, మండలి కృష్ణా రావు ‘’భాషా పురస్కారాన్ని’’అండ జేశారు .ఆలూరి బైరాగి ‘’సాహితీ ప్రతిభా పురస్కారాలను ‘’డా.వెలగా వెంకటప్పయ్య ,శ్రీ ఏ.కృష్ణా రావు లకు ,శ్రీ గుత్తికొండ సుబ్బారావు ‘’సాహితీ సేవా పురస్కారాన్ని’’ శ్రీ గూడ ఆంజనేయులు ,శ్రీ యాదగిరి శ్రీ రామ నరసింహా రావు లకు సాహితీ తపస్వి పోలవరపు కోటేశ్వర రావు’’ కదా పురస్కారాన్ని’’ ఆచార్య కొలక లూరి ఇనాక్ ,శ్రీ శ్రీ రమణ గార్లకు ముక్కామల నాగ భూషణం ‘’పాత్రికేయ పురస్కారాన్ని’’డా.జి.వి.వరదా చారి శ్రీ గోటేటి రామ రావు గార్లకు ప్రసాద్ ద్వయం అధ్యక్షా కార్య దర్శులల సమక్షం లో అభిమానుల కరతాళ ధ్వనుల మధ్య అందజేశారు .కన్నుల పండువు గా సాగిన ఈ కార్య క్రమం మధురాను భూతినిచ్చింది .

      తమకు జరిగిన ఈ పురస్కార ప్రదానం పై అందుకొన్న ప్రముఖులు తమ మనో భావాలను పంచుకొని కృతజ్ఞతలు తెలియ జేశారు .ముందుగా కృష్ణా రావు గారు పత్రికలూ ప్రజల కన్ను నోరు అని వాటి విలువ ను ఎందరో మహాను భావులు పూర్వమే తెలియ జేశారని వారి అడుగు జాడలలో తానూ నడుస్తున్నానని ప్రధానం గా తానుకవి ని అని చెప్పారు .శ్రీ పరబ్రహ్మ శాస్త్రి గారు తమ ప్రసంగం లో అశోకుడి కంటే ముందే మన భట్టిప్రోలు శాశనం ఉందని అందులో తెలుగు ప్రామాణిక మైనదని అన్నారు ఈ శాసనం ఫోటోలు తీయించి ప్రతి ప్రభుత్వ కార్యాలయం లోను ఉంచాలి అని గట్టిగా చెప్పారు శ్రీ కాకుళాంధ్ర మహా విష్ణువు విగ్రహ స్థాపకులు  శాతవాహన చక్రవర్తి గౌతమీ పుత్ర శాతకర్ణి అన్నారు ఆంద్ర దేశాన్ని జయించి నందుకు గుర్తుగా దీన్ని ఏర్పాటు చేసి ఉండవచ్చునని లేక అతని సేనాని విష్ణు అనే పేరున్న వాడు రాజు ఆజ్ఞ తో నెలకొల్పి ఉండ వచ్చునన్నారు .ఖారవేలుడు ఒరిస్సా ప్రాంతం వాడని ఆంద్ర దేశం వచ్చాడని మంచి పాలనా దక్షుడని అన్నారు మన చరిత్ర గొప్పదని తెలుగే అన్నిటి కన్నా ప్రాచీనమని వివరించారు .

      ఆచార్య పేరి భాస్కరరావు తెలుగు లిపి సంస్కరణ కు ఇంటర్నెట్ బాగా దోహద పడుతోందని పూర్వం అచ్చులో లేని అక్షరాలను మళ్ళీ వాడే విధానం చేస్తున్నామని ఒక పదాన్ని వేర్వేరు చోట్ల ఎలా పలుకుతారో చిత్రాలద్వారా చూపించే సౌకర్యం ఉందని అంతర్జాలం తో భాషను అను సంధానం చేయాల్సిన అవసరం చాలా ఉందని అన్నారు .బ్రాహ్మీ లిపి లో‘’అ’అనే మన తెలుగు అక్షరం ‘’శిలువ ‘’ఆకారం లో ఉండేదని క్రమం గా పరివర్తన చెంది ఇప్పుడు మనం రాసే రూపం లోకి వచ్చిందని ,ఆ క్రమ పరిణామాన్ని మనం కంప్యూటర్ ద్వారా తెలుద్సుకో వచ్చునని .బ్రిటన్లో  ఇంగ్లిష్ ను జాగ్రత్త గా కాపాడు కొంటారని వారసత్వాన్ని భద్ర పరచుకొంటారని బెర్నార్డ్ షా సూచించిన భాషా సంస్కరణలు మార్పులన్నిటినిబ్రిటిషర్లు  అక్కడి భాషా వేత్తలు తిరస్కరించారని గుర్తు చేశారు .

       శ్రీ వెలగా వెంకటప్పయ్య బైరాగి తామూ ఒకే చోట తెనాలి లో అయితారం లో జన్మించామని చెప్పారు పదకొండేళ్ళు బైరాగి బీహార్ లో ఉండి వచ్చాడని హిందీ లో గొప్ప పాండిత్యం సంపాదించాడని నిరాడంబరమే ఆయన ఆహార్యమని కండగల కవిత్వం రాసి తన ‘’నూతిలో గొంతుకలు’’ కు అద్వితీయ సాహితీ గౌరవాన్ని సాధించాడని చెప్పారు

          .శ్రీ రమణ మాట్లాడుతూ భమిడి పాటి కామేశ్వర రావు గారు కొడుకు రాధాకృష్ణ కు వచ్చిన మొదటి బహుమతి తెలిసి ‘’ఈ స్తితి లో ఉందన్న మాట తెలుగు సాహిత్యం ‘’అని మేళ మాడారని గుర్తు చేశారు తాను ఇందరు పెద్దల మధ్య కూచునే అర్హత లేని వాడినని వారంత గా తాను స్దాధించింది లేదని అన్నారు పత్రిక లో పని చేసి పేరడీ రచన ద్వారా ప్రాచుర్యం పొందానని  తన’’ మిధునం ‘’కదా ద్వారా ప్రపంచవ్యాప్త గౌరవం కలిగిందనిబాపు రమణలస్నేహం తో తాను ఇంతవాడిని అయ్యానని వినమ్రం గా చెబుతూ నవ్వుల్నీ పూయించారు ..

      ఆచార్య ఇనాక్ గారు తను రాసి మెప్పించి నంత సాహిత్యం సమకాలీనం గా లేదని కదా, నవలా, నాటిక ,విమర్శ లలో తన రచనలు గొప్ప గుర్తింపు పొందాయని మన జాతీయ పతాకానికి మూడు రంగులు కాకుండా మూడు ద్రవాలు ఉంటె బాగుంటుంది అని పిస్తుందని అవి ‘’చెమట ,’’’రక్తం’’లని అన్నారు తానేప్పుడో ‘’వ్యాస పరిణామం ‘’ పై పరిశోధనా వ్యాసం రాస్తే మళ్ళీ దాని జోలికి ఎవ్వరూ వెళ్లలేదని చెప్పారు .తనకు జ్ఞాన పీఠ పురస్కారం రావాలని బుద్ధ ప్రసాద్ గారు కోరటం తన పై ఉన్న అపార నమ్మకమని చెప్పారు కృష్ణా జిల్లా రచయితల సంఘం తనను ఎప్పుడూ ఆత్మీయం గా ఆహ్వానిస్తుందని అందుకే ప్రతి సభకు వచ్చి వారి ఋణం తీర్చుకొంటానని తెలియ జేశారు .

 

    శ్రీ  గూడ శ్రీ రాములు భిలాయ్ లో యాభై ఏళ్ళుగా తెలుగు ను బ్రతికిన్చుకొంటున్నామని ‘’భిలాయ్ వాణి ‘అనే పత్రికను పదకొండేళ్ళుగా నిర్వహిస్తూ అందరికి ప్రతిఫలాపేక్ష లేకుండా పంపిస్తున్నామని తామంతా మొదటి తరానికి చెందినవారమని ఇప్పుడు రెండో తరం యువ నాయకులూ కూడా బాధ్యతలు చేబట్టి పని చేస్తున్నారని తమల్ని మర్చి పోవద్దని కోరుకొన్నారు

     .శ్రీ యాదగిరి శ్రీ రామ నరసింహా రావు పి.వి.నరసింహా రావు అనుక్షణ పుస్తక పఠనాభి లాషి విజిటర్లు ఒకరు విడిచి ఒకరు వచ్చే రెండు నిమిషాల వ్యవధిలోనే ఆయన చేతిలో ఉన్న పుస్తకం లో ఎక్కడా ఆపేశారో అక్కడి నుంచి చదివే వారని ఆయనకు 21భాషలలో అ పారవైదుష్యం ఉందని తన అనుభవాలను గుది గుచ్చి వివరించారు

.    డా.వరదా చారి ఇవాళ బ్రిటన్ దేశ పత్రికలలోనూ పతనం ప్రారంభమైందని ,పత్రికల వాళ్ళను చిన్న చూపు చూసే అలవాటు ఉందని కాని ఒక పాత్రికేయుని గా ఇక్కడ మీరు చేస్తున్న సన్మానానికి పులకరిస్తున్నానని కృతజ్ఞత తెలిపారు తాను హేచ్.ఏం.టి.వి.కి ‘’ అంబుల్డ్స్ మన్’’ గా ఉండి  వీక్షకుల మనో భావాలకు విలువనిచ్చే పని చేస్తున్నాని .ఇలాంటి ఒక పదవి ఏర్పాటు చేయటం మన తెలుగు చానళ్ళ చరిత్ర లో ప్రధమం అని దీనికి కారకులైనడైరెక్టర్ ,పూర్వపు ఆంద్ర జ్యోతి సంపాదకులు శ్రీ కే.రామ చంద్ర మూర్తి ని అభినందించాలని అన్నారు .

         శ్రీ గోటేటి రామా రావు తన ప్రపంచ పర్యటనానుభావాన్ని వివరించారు తమ పత్రిక ప్రుబుద్దానద్ర్హ్ర ద్వారా తనకు ప్రపంచ వ్యాప్త గొరవం కలిగిందని తమిళమద్రాస్ లో ‘’తెలుగు కు పాదు ‘’తాను అని మండలి వారనే వారని గుర్తు చేసుకొన్నారు కెనడా లోని టోరాంటో లో అమెరికా లో న్యు జెర్సీ లో తెలుగు సంఘాలు ఏర్పడటానికి తన కృషి ఉందని  మలేషియా లో మదిని సోమి నాయుడు గారు తెలుగు కు చేసిన కృషి చిరస్మరణీయం అన్నారు .తెలుగు భాష .మరణించదని అది అమృత భాష అని మన లిపి చాలా గొప్పదని వివరించారు .

  దాదాపు మూడున్నర గంటలు జరిగిన ఈ పురస్కార సభ వేసవిలో వసంతం లా అలరించింది .రచయితల సంఘం చాలా నెలల తర్వాత జరిపిన సభ శోభాయమానం గా ప్రేక్షకాదరణ తో విశేష వీక్షక సందోహం తో రమణీయం గా జరిగింది అనంతరం అందరి కమ్మని విందు ఏర్పాటు చేశారు .

                  మిధున పతయేనమః

         శ్రీ రమణ పేరడీ లంటే నాకు మహా ఇష్టం .జల సూత్రం రుక్మిణీ నాద శాస్త్రి (జరుక్ శాస్త్రి )ఎప్పుడో పేరడీ కవిత్వాన్ని రాసి ఒక రకం గా ఆద్యుడని పించుకొన్నాడు ఆ వ్యంగ్యాస్త్రాలతో ఆ నాటి మహా కవులను మహా ఇబ్బంది పెట్టి’’ తేలు కొండి గాడు  ‘’ అని పించుకొన్నాడు మళ్ళీ ఇన్నేళ్ళకు శ్రీ రమణ అందరు కవుల కవితలకు అద్భుత పేరడీలు రాసి‘’పేరడీ గారడీ వాడు ‘’అని పించుకొన్నాడు .జరుక్ శాస్త్రి వదిలిన లింకు ను మళ్ళీ పట్టుకొని చెలరేగి పోయాడు .అంతేకాదు వచన కవుల రచనలకూ పరమ పేరడీలు రాసి శెభాష్ అని పించుకొన్న’’ కోణంగి ‘’.అలాంటి రమణ‘’మిధునం ‘’కద తో ఒక్కసారిపాతికేళ్ళ కిందట  ‘’స్టార్ కదా రచయిత ‘’అయ్యాడు దాన్ని భరణి సినిమా తీసి ఒక అద్భుతం చేశాడు దీనితో రమణ కీర్తి శిఖరాయమానం అయింది ఆ మిధునం అన్నా ,ఆ కదా రచయిత శ్రీ రమణ అన్నా నాకు మా శ్రీమతికి వీరాభి మానం .ఆయన్ను చూడాలనే ఓపిక లేకపోయినా విజయ వాడ కు నాతో వచ్చింది .అంత సేపు కూర్చుని చూసింది ,విన్నది శ్రీ రమణ తో ఫోటోలు తీసుకొన్నాం .ఆయన్ను నేను పలకరిస్తూ ‘’మిధున పతయే నమః ‘’అన్నాను చిరు నవ్వు చిందిస్తూ ‘’అబ్బో ‘’అన్నారు .ఆనంద పడ్డారు ఇది శివుని అభిషేకం లో చెప్పే మాట ఓం మిధున పతయే నమః ఓం మిదున పతాన్తికాయనమః  ‘’అని అంటారు దీన్ని జోడించాను రెండో అర్ధం లో ‘’మిధునం‘’కద కు పతి అనే అర్ధం ఈ మాట కే/బి/లక్ష్మి గారికి చెబితే పరమ సంతోష పడిపోయారు గుమ్మా సాంబశివరావు గారికి చెబితే ఆనంద పడ్డారు .అప్పుడే అమెరికా నుంచి మా అమ్మాయి విజయ లక్ష్మి ఫోన్ చేస్తే మాట్లాడుతూ ఈ మాట చెబితే‘’అద్భుతః ‘’అంది .శ్రీ రమణ తో ఫోన్ లో మాట్లాడి తన ఆనందాన్ని వ్యక్తం చేసింది ఆయనా సంతోషించారు త్వరలో అమెరికా లో డెట్రాయిట్ వస్తున్నట్లు మా అమ్మాయికి శ్రీ రమణ తెలిపారు శ్రీ రమణ తో నేను ‘’మీ మిధునం కదా ను ఏం.పి.3 లో నా వాయిస్ తో రికార్డుచేసి ఇంటర్నెట్ లో అందరికి పంపాను చదివేటప్పుడు చివర్లో నాకు కన్నీళ్లు ఆగక ధారా పాతం గా కారిపోయాయి అవి ఆనదశ్రువులో దుఖాశ్రువులో తెలీదు .విన్న వారందరూ కూడా కన్నీరు కార్చామని మెయిల్స్ రాశారు ‘’అని చెబితే చిరునవ్వే సమాధానం .మన పల్లె తూల్లలో పశువుల కాపరుల వద్ద అద్భుత మైన భాషా జ్ఞానం ఉందని దాన్ని మనం భద్ర పరచుకోవాలని అన్నారు .అంతే కాదు పొలాల పని చేసేటప్పుడు నారు పీకే తప్పుడు నాటే తప్పుడు కోతల సమయం లో రైతులు కూలీలు ‘’మునుం పట్టటం ‘’అనే మాట ఉపయోగిస్తారని .మునుం అంటే కొంత వైశాల్యం గల ప్రదేశం అని అంటూ ఈ పదాన్ని తిక్కన గారు భారతం లో ప్రయోగించారని అన్నారు నాతోను బుద్ధ ప్రసాద్ గారితోనూ . ..ఎంతో కాలం గా శ్రీ రమణ గారిని చూసే అదృష్టం కలిగింది మా అందరికి .ఆయన అ సలు పేరు’’ రామ చంద్ర రావు’’ అని తనకూ ఇప్పుడే తెలిసిందని కే.బి.లక్ష్మి గారు ఆయన్ను సభకు పరిచయం చేస్తూ అన్నారు వెలగా వెంకటప్పయ్య గారిని పరిచయం చేసే బాధ్యత నాకు అప్పగించారు ..

         ఒక రాసావేశం లో మునిగి తేలి గుత్తికొండ సుబ్బారావు గారి కారులో ఉయ్యూరు కు రాత్రి పదకొండున్నరకు ఆయన తోపాటువచ్చాం మా ఇంటి దగ్గర దింపి బందరు వెళ్ళారు .వెళ్ళేటప్పుడు వేణు గోపాల రెడ్డి కూడా మాతో బెజవాడ వచ్చాడు అప్పుడూ కారు లోనే వెళ్లాం .

      గొప్ప అనుభూతిని మిగిల్చి ప్రతిభకు పట్టం కట్టి ,కర్తవ్యాన్ని బోధించిన సభ .రంగ రంగ విభవం గా జరిగింది .

  మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ –27-3-13- ఉయ్యూరు 

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

జానకీ జాని గారి ‘’అరుంధతి’’ -1

        జానకీ జాని గారి ‘’అరుంధతి’’ -1

       1994 లో రాజమండ్రి లో భారతీయ సాహిత్య పరిషత్ ఆధ్వర్యం లో మూడు రోజుల పాటు సాహితీ సదస్సు జరిగింది .ఆ నాటి పరిషత్ అధ్యక్షులు నాకు పరమ ఆప్తులు ,ప్రఖ్యాత కదా రచయితశ్రీ ఆర్.ఎస్.కే.మూర్తి గారు .కప్పగంతుల మల్లికార్జున రావు గారు రాజమండ్రి సభలను న భూతో గా జరిపించారు .రెండు పూట్ల కాఫీలు టిఫినీలు భోజనాలుపెళ్లి వారి వేడుక గా జరిగాయి . సాహిత్య సదస్సులు ,కవి సంమేలనాలతో ప్రాంగణం అంతా మరు మోగింది .ప్రఖ్యాత రచయిత శ్రీ వాకాటి పాండురంగా రావు గారిని మొదటి సారి చూసింది అక్కడే స్వర్గీయ .బండారు సదాశివరావు గారు డాక్టర్ జి.వి.సుబ్రహ్మణ్యం గారు వగైరా దిగ్దంతులు దిశా నిర్దేశం చేసిన సభల వి ఽఅ సమయం లోనే ప్రఖ్యాత నాటక ,సినీ నటుడు తనికెళ్ళ భరణి నీ చూశాం .  అప్పుడే  వాల్మీకి విశ్వనాదల రామాయణం పై సమగ్ర అధ్యయనం చేసి పుంఖాను పుంఖాలుగా ఉపన్యాస లహరి ని ఆంద్ర దేశ మంతాప్రవహింపజేసిన వారు, లబ్ధ ప్రతిస్తులైన కధకులు ,ఆంగ్లోపన్యాసకులు ,విశ్రాంత ప్రిన్సిపాల్ కాకినాడ నివాసి ,విశ్వనాధకు ముఖ్య అంతేవాసి అయిన శ్రీ సామవేదం జానకి రామ శాస్త్రి గారు అంటే జానకీ జాని గారు నాకు మా బావమరిది ఆనంద్ కు పరిచయ మయ్యారు మొదటి రోజునే .అంతే మిగిలిన రోజుల్లో ఆయన్ను మేము వదిలి పెట్టనే లేదు అప్పటి నుంచి జానకి జాని గారికి నాకు విపరీత మైన పరిచయం కలిగింది .ఉత్తరాలు రాయటం ,ఫోన్లు చేసుకోవటం జరుగుతూ ఉండేది ..ఒక సారి ఏలూరు లో వారి తల్లి గారిని చూడ టానికి వచ్చి నాకు ఫోన్ చేసి ‘’మిమ్మల్ని చూడాలని ఉంది .వస్తున్నాను ‘’అన్నారు .రెండు రోజులే వ్యవధి. నాకు తెలిసిన సాహితీ మిత్రులన్దర్నీ వారు వచ్చేరోజుకు మా ఇంట్లో సమావేశ పరచాను యాభై మందికి పైగా వచ్చారు .అందరికి‘’టిఫినాదులు’’ ఏర్పాటు చేయించి వారిని ‘’రామాయణం ‘’పై ప్రసంగించ వలసిందని కోరాను .రెండు గంటలు నాన్ స్టాప్ గా వాల్మీకం ,కల్ప వృక్షం లపై అనర్ళ ప్రసంగం చేశారు ఇదంతా టేప్ పై భద్రపరచాను .వారికి నా చేతనయినంత సన్మానం చేశాను ఎంతో ఆనందించారు .అది మొదలు నేను ఎప్పుడు కాకినాడ వెళ్ళినా (మా అమ్మాయి అత్తగారి ఊరు )జానకీ జాని గారి ని దర్శించి రావటం అలవాటు .ఆయనా ఎంతో సంతృప్తి చెందేవారు .వారి శ్రీ మతి కూడా గొప్పగా ఆదరించేవారు .శ్రీ జానకీ జాని గారు ఒక రోజు నాకు తమ కదా సంకలనం ‘’అరుంధతి ‘’పంపారు .నేను వెంటనే చదివి ,నా మనో భావాలను వారికి లేఖ మూలం గా 28-11-2000న తెలియ బర్చాను . ఆలేఖలోని అంశాలే ఇప్పుడు మీ ముందుంచుతున్నాను

    ‘’. పూజ్యులు ,గౌరవనీయులు శ్రీ జానకీ జాని గారికి –హృదయ పూర్వక నమస్కారాలు .ఉభయ కుశలోపరి .ఆత్మీయం గా మీరు పంపిన మీ ‘’అరుంధతి ‘’నిన్ననేభద్రం గా  నా వద్దకు దిగి వచ్చింది  చాలా సంతోషం .నిన్న రాత్రే పూర్తిగా చదివాను .ఆనందం పొందాను .ఆ అనుభూతి తో ఈ ఉత్తరం రాస్తున్నాను .

   ‘’మీలో మీరు భావిస్తున్న బద్దకాన్ని వదిలించి ,కర్తవ్యం లోకి దింపి,ఈ కదా స్రవంతిని నిస్పృహ ఎడారి దారిలో ఇంకి పోకుండా వెలువరించటానికి ప్రోత్సాహ పరచిన ‘’విజయ భావన ‘’వారు అభి నందనీయులు .’’మీ భావన విజయం‘’చేయాలనే వారి సత్ సంకల్పం .మిమ్మల్ని విజయం వైపు నడిపించి ,మీలోని సుప్త భావనలను ప్రదీప్తం చేసింది .ఆంద్ర సాహితీ లోకానికి ఒక అమూల్య రచనను అందించింది .ప్రేరణ మానవులను ఏ ఉన్నత స్తితి కైనా తీసుకొని వెళ్తుంది అన్నదానికి ఇది ఉదాహరణ .సహృదయులైన మీరు అందరికి స్నేహ పాత్రులు .మీ సన్నిధానం ఒక సుమధుర లోకమే .కాలం ఎలా గడిచి పోతుందో చెప్పలేము .అదొక అనిర్వచనీయ అనుభూతి .ఆ ఆనందాన్ని మీ ద్వారా పొందిన నాకు వేరే సాక్ష్యం అక్కర్లేదు .

       మీ కధా ద్వాదశాదిత్యుల్ని లోకం పైకి తరలించారు .భావుకత ,సృజనాత్మకత తగ్గి పోతున్న కధలు వస్తున్న సమయం లో మీ ఆదిత్యుల కాంతి చ్చటలు దివ్యం గా ప్రభావితం చేసి కొత్త వెలుగుల నిస్తాయి .సందేహం లేదు .ఇవన్నీ పూర్వమే ప్రచురితాలైనా గుది గుచ్చి ,ఏర్చి కూర్చిన ఈ సరం ముత్యాల సరం ఓ వరం .మీ కధను మీ శ్రీమతి గారికి అంకితం చేయటమూ ఓ ప్రత్యేకతే .మీ అర్ధాంగి ప్రోత్సాహం మీకు కొండంత శక్తి .ఆమె వల్లనే మీ సాహిత్య వ్యాసంగం నిరాటంకం గా సాగిపోతోంది .దానికి కృతజ్ఞతా భావమే ఈ సమర్పణ .పుస్తకం కూడా మీమనసులా స్వచ్చంగా ,లోప రహితం గా ఉంది .

               కధ అంటే సంభాషణల మయం .అందులోను ఈకాలం లో వాక్యానికి రెండో మూడో తెలుగుపదాలు ,మిగతావి ఆంగ్ల మయాలు .మీ కధల్లో చక్కని తెలుగు గుబాళించింది .ఆంగ్ల వాసన సోకలేదు .నా పరిశీలన లో 91పేజీల ఈ కదా గుచ్చం లో సుమారు 185 మాత్ర్రమే సంభాషణలు .అంటే సరాసరి పేజికి రెండు మాత్రమె సంభాషణలు కన్పించాయి .చెప్పేదంతా రచయితే చెప్పితే ,సూటిగా స్పష్టం గా ఉంటుంది అన్న భావన మిమ్మల్ని ఇలా రాయించింది అని పించింది .ఉన్న సంభాషణలు కూడా చాలా క్లుప్తం గా ,సూటిగా ఉన్నాయి .’’between the lines ‘’భావం వెదకాల్సిన అవసరమూ లేదు .అంత నిసర్గం గా ఉంది .మీ పై శ్రీ విశ్వనాధ ప్రభావం అధికం కదా .ఆయన కదా సంవిధానం మీ రచనలలో నాకు కని పించింది ..లోకాన్ని అన్నికోణాల నుంచి గమనించారు మీరు .సమస్యల సుడిగుండాలు చాలానే ఉన్నాయి .వీటన్నిటికి మించి ఒక అద్భుత మైన సూత్రం జీవితాలను కట్టి పడేస్తుంది .దానిని పట్టుకొన్నారు మీరు .

         ఈ కధల్లో దాంపత్య ధర్మానికి విలువ నిచ్చి దాన్ని కాపాడుకోమని అంతస్సూత్రం గా చెప్పారు .బహుశా మీకు ,మాకు మనందరికీ ఆ దిశలో ఆదర్శం కనీ పించేది ‘’అరుంధతీ దేవి ‘’.అందుకే ఆ పేరు ను మీ కధల్లో స్త్రీలకూ ఎక్కువ సార్లు ఉపయోగించారని పించింది .వివాహం అయిన వెంటనే ‘’అరుంధతీ నక్షత్రాన్ని ‘’నూతన వదూవరులకు చూపించి ,ఆదర్శ వంతుల్ని చేయటం మన సంప్రదాయం .కులాలకు అతీతం గా దీన్ని అవిచ్చిన్నం గా పాటిస్తూనే ఉన్నాం ఈనాటి వరకు .

          ‘’దిగి వచ్చిన ‘’కధ లో కృష్ణ మూర్తి కమ్మర్షియల్ టాక్స్ ఉద్యోగి .జీవితం లో కస్టపడి పైకి వచ్చినా నిండుకుండలా ఉన్నా ,కమ్మర్షియల్ గా జీవితాన్ని కాష్ చేసుకోలేక పోయిన అభాగ్యుడు .దాంపత్య  సుఖమూ అవసరమే కదా .భార్య అభీష్టాలు తీర్చాలన్న విషయం ఆలోచించలేక పోయాడు .ఆమెకు అదొక అసంతృప్తి .అది బీజం గా ఉండి మొలకెత్తి ఆమె పాలిటి ఓ వృక్షమే అయింది .ఆ నీడలో నిలువ లేక పోయింది .మొహం ఆమెను మోహన రావు రూపం లో ఆవహించింది .ఆ మాయ లో పడి గాడి తప్పింది .తప్పు తెలిసింది కాని అప్పటికే ఆలస్య మై పోయింది .వంటలక్క గా జీవితం గడపాలని నిర్ణయించుకొని ,భర్త పంచ నే చేరింది .అనుకో కుండా కాలమూ ,అవకాశమూ ,అవసరం ఆ భార్యా భర్తల్ని కలిపింది .కష్టపడకుండా ,కనకుండా కొడుకూ లభించాడు .ఆ ఆనందం శాశ్వత మైంది .క్షణికా నందం జీవితాన్ని అస్థ వ్యస్తం చేసింది అతనికీ ఆమెకు కాలం కలిసి వచ్చింది .మళ్ళీ ఆనందం అరుంధతి రూపం లో దిగి వచ్చింది .ఆశల ఆకాశం లో చిక్కుకున్న ఆమె స్వంత స్తితి తెలియ టానికి చాలా సమయం పట్టింది .తప్పని సరి గా నేలకు దిగి వచ్చింది .ఈ కధలో పేర్లు చాలా బాగా నప్పాయి .మోహన రావు మాటల్లో మొహం ,ఆడదాన్ని మాటలతో మోసం చేసే నేర్పు ఉన్న వాడు .కృష్ణ మూర్తి నిండు కుండ .కస్టాల కడలి ఈదిన వాడు .అయితే ఆ మహానుభావుడికున్న‘’దక్షిణ నాయకత్వం ‘’లేనిఅమాయకుడు .ఉద్ధరించే ఓపికా ,జ్ఞానం ఉన్న వాడు .ఇక అరుంధతి గురించి ఇప్పటిదాకా చెప్పిందే .మంచి ముగింపు దిశగా  కద చక్కగా నడిపారు విశ్వనాధ వారి చెలియలి కట్ట లా సాగి చివరికి సుఖాంతమయింది ..ఆదర్శాన్ని ఆచరణ లో చూపారు .సంతోషం ..

              సశేషం –మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ -26-3-13- ఉయ్యూరు 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

నాదారి తీరు -19 రాష్ట్ర పతి ఎన్నికల కోలాహలం

నాదారి తీరు -19

                 రాష్ట్ర పతి ఎన్నికల కోలాహలం

     కాంగ్రెస్ తరఫున నీలం సంజీవ రెడ్డి ని రాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రకటించింది ప్రధాని ఇందిరా నాయకత్వం లో .ఇది ఆనాటి సిండికేట్ గా పేరొందిన కామరాజ నాడార్ ,అతుల్య ఘోష్ ,ఎస్.కే.పాటిల్ ,నిజలింగప్పల నిర్ణయమే కాని తన నిర్ణయం కాదని కొద్ది రోజులకే ఇందిరప్లేట్ ఫిరాయించింది .’’అంతరాత్మప్రబోధం ‘’అనే మాటను తెచ్చి పార్టీ అభ్యర్ధిని ఓడించాలని నిర్ణయించుకోందీ.ఆమె తన అభ్యర్ధిగా వరాహగిరి వెంకట గిరి ని బరిలోకి దింపింది అప్పటికి ఆయన ఉప రాష్ట్రపతి .దేశం లో కాంగ్రెస్ పార్టి రెండు గ్రూపులుగా పై నుంచి కిందికి చీలింది .ప్రతి పక్షాలు సంజీవ రెడ్డినే బుజానికి ఎత్తుకోన్నాయి .అప్పటికి ఆయన లోక్ సభ స్పీకర్ చేశాడు .ఇద్దరు తెలుగు వారే .ఆంధ్రప్రదేశ్ కు చెందినా వారే .మహా రంజుగా నడిచింది రాజకీయం .లెక్కలు ,పైలేక్కలు ఎవరికి వారు వేసుకొని పందెం కోళ్ళను దువ్వారు .కాంగ్రెస్ లో యువ రక్తం ‘’యాంగ్ టర్క్ ‘’లనే పేర ఇందిరకు అండగా ‘’.ముసలి ముఠా’’ అంతా రెండో వైపు మొహరించారు .యాంగ్టర్క్కు లంటే చంద్రశేఖర్ ,మోహన్ దారియా ,కృష్ణ కాంత్ మొదలైన వారు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకొన్నారు బహుశా ఈ అంతరాత్మ ప్రబోధం తో దేశ రాజకీయాలు పతనం అవటానికి నాంది అయింది దీనికి బాధ్యురాలు ఇందిరే .ప్రజాస్వామ్యం మట్టి కరిచింది అప్పటి నుంచే ,విలువలకు తిలోదకాలిచ్చిండీ అప్పటి నుంచే .సమర్ధత కంటే ‘’చెప్పుకింద తేలులు ‘’కు అధికారం సంక్రమింటమూ దీనితోనే ప్రారంభం .

      మా కాటూరు స్కూల్ లోను ఈ వివాదం ప్రతిధ్వనించింది .నేను, హెడ్ మాస్టారు కోటేశ్వర రావు మొదలైన వారంతా ఒక గ్రూప్ గా ,దయాకర రావు ప్రసాద్ ,మొదలైన వారంతా రెండో గ్రూప్ అయ్యాం .ఖాళీ పీరియడ్లలో వీటి పైనే చర్చోప చర్చలు చేసుకొనే వాళ్ళం హెడ్ మాస్టారి తో కూడా ఈ విషయాలు ముచ్చటించే వాళ్ళం అప్పుడు ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రికా సంపాదకుడు’’ ఫ్రాంక్ మొరెస్’’ రాసిన సంపాదకీయాలంటే పడి చచ్చే వాళ్ళం చదివి అవతలి వారిని ఉడికించే వాళ్ళం ప్రభ కూడా ఆతాను లో గుడ్డ కనుక మాకు సపోర్ట్ అని అనుకొన్నాం .అభ్యర్ధులు  ఇద్దరు దేశమంతా తిరిగి ఓట్లు అడుక్కొన్నారు .గిరి ఓటమి నా ఓటమి అంది ఇందిరా కంయూనిస్ట్లు ఆమె వైపే .అప్పుడు మన ముఖ్య మంత్రి కాసు వారు .సంజీవరెడ్డినే బుజాన వేసుకొన్నాడని గుర్తు .ఎన్నిక జరిగింది ఫలితాలను ప్రకటిమ్చేరోజు న స్కూల్ ఉంది మధ్యాహ్నం విరామ సమయం లో ,సాయంత్రం బడి అయిన తర్వాతా హెడ్ మాస్టారి రూమ్ లో ఉన్న రేడియో పెట్టుకొని వార్తలు వినే వాళ్ళం ..పోటా పోటీగా జరిగిన ఎన్నిక .నాకు దయాకర రావు కు మాటా మాటా పెరిగింది .ఒక సారి నన్ను రెచ్చగొట్టే మాట ఏదో అన్నాడు నేను రెచ్చి పోయి చెప్పు తీశాను .దానితో ఒక్క సారిర చల్ల బడ్డాడు ‘’బ్రదర్ ఇంత సీరియస్ గా తీసుకొంటా వనుకోలేదు సారీ సారీ ‘’అన్నాడు ‘’మర్యాద దాటితే నేనిలానే ప్రవర్తిస్తాను జాగ్రత్త‘’అన్నాను అంతే అప్పటి నుంచి మా సంభాషణ సరసం గా నే సాగింది .ఇద్దరం ఉద్రేక స్వభావులమే .ఒళ్ళు దగ్గర ఉంచుకోన్నాం .ఈ సంఘటన నాకే ఆ తర్వాతా చిరాకని పించింది .ఎవరికోసమో మనం ఇంతగా కాట్లాడుకోవాలా అని పించింది ..మొత్తం మీద గిరిగారు గెలిచారు సంజీవ రెడ్డి ఓడిపోయాడు .గిరి గారు మా ఉయ్యూరు కే.సి.పి.కి చాల సార్లు కేంద్ర కార్మిక మంత్రిగా వచ్చారు .ఒకటి రెండు సార్లు చూసిన జ్ఞాపకం పైజమా కుర్తా తో భారీ విగ్రహం .చిన్న సైజు కొండ .ఇంటిపేరు సార్ధకం మంచి కార్మిక నాయకులు .ఉయ్యూరు లక్ష్మణ నగర్ ను ఆయనే ప్రారంభించారు .సంజీవ రెడ్డి అంటే ఎందుకో నాకు చిన్నప్పటి నుంచి విపరీత మైన అభిమానం మాలో మేము ఆయన్ను ‘గురువు గారు ‘’అనుకొనే వాళ్ళం .డేరింగ్ అండ్ డాషిన్ మనిషి .వ్యక్తిత్వం ఉన్న వాడని నా ఆరాధన .అప్పటికి ఆర్.ఎస్.ఎస్.పేపర్లు అయిన ‘’ఆర్గ నైజర్‘’జాగృతి ఆంగ్ల తెలుగు పత్రికలను చందా కట్టి తెప్పించి చదివే వాడిని. ఆర్గ నైజర్ లో పడింది అంటే నూటికి నూరు శాతం యదార్ధం అని పించేది .జాగృతి తెలుగు సంస్కృతికి కొమ్ము కాసింది .మంచి కధలు వచ్చేవి .ఆర్ ఎస్.కే.గారి సినీ రివ్యు అద్భుతం గా ఉండేవి .

         గిరిగారు ఆ తర్వాతా అమ్మ చెప్పినట్లు డి అప్పటివరకు ఉన్న గౌరవాన్ని పోగొట్టుకోన్నారని,రబ్బరు స్టాంప్ అని పించుకోన్నారని  పేపర్లు కోడై కూశాయి .భార్య అనధికార వ్యక్తిగా పెత్తనం చేలాయిన్చేదని చెవులు కోరుక్కొనే వారు. కదలలేని మనిషి గా గిరి గారు ముద్ర పడ్డారు .ఏమైనా తెలుగు వ్యక్తీ రాష్ట్ర పతి పీఠంఅది రోహించి నందుకు మనం గర్విన్చాల్సిందే .ఈ పుణ్యం ఇందిరాదే రెడ్డి గెలిచినా అంతే కదా .

               అప్పటికి మాకు ముగ్గురబ్బాయిలు .శాస్త్రి శర్మ గురించి రాశా.మూడో వాడు నాగ గోపాల కృష్ణ మూర్తి .మా మామ్మ పేరు’’నాగమ్మ ‘’ను కలిపాం .

                    గెజిటెడ్ ఇన్స్పెక్టర్ గా హెడ్ మాస్టారికి పదోన్నతి

     మా హెడ్ మాస్టారు తూమాటి కోటేశ్వర రావు గారు అప్పటికే సీనియర్ హెడ్ మాస్టారు గా గుర్తింపు పొందారు రాజకీయ బలమూ ఉంది కాకాని వారి అండదండలు దివి తాలూకా వారు అవటం తో గొట్టిపాటి బ్రహ్మయ్య గారి ఆశెస్సులు మండలి కృష్ణా రావు గారి సాయమూ ,బందరు ఏం.పికాశీనాధుని పూర్ణ మల్లికార్జునుడు గారి ఆశీస్సు ఏం.పి .అంకినీడు గారి ప్రోత్సాహం చైర్మన్ పిన్నమ నేని చొరవ ఆయనకు పుష్కలం గా ఉన్నాయి. హైస్కూల్ హెడ్ మాస్టర్ నుంచి గేజేటేడ్ ఇన్స్పెక్టర్ అనే ప్రభుత్వ హోదాకు అప్పుడు మార్గాలు ఏర్పడ్డాయి మనజిల్లా మొత్తం మీద వీరికి ఒక్కరికే ఆ చాన్సు లభించింది పదోన్నతి పొందారు అందరం చాలా సంతోషించాం .సమర్దునికి తగిన పదవి .మన జిల్లా లోనే పోస్టింగ్ అని జ్ఞాపకం .మంచి వీడ్కోలు విందు నేర్పాటు చేశాం .ఊళ్ళో వాళ్ళు కూడా హార్దికం గా ఘన మైన వీడ్కోలు ఇచ్చారు .ఆయన స్థానం లో ఉయ్యూరు లో మాతో పాటు పనిచేసిన లెక్కల మేష్టారు అన్నే ఉమా మహేశ్వర రావు గారిని వేశారు .

                అన్నే వారి హయాం

 చాలా రిసేర్వేడ్ గా ఉన్నట్లు కనిపించేమనిషి అన్నే .కాని లోపల తనకు తెలిసి నట్లు ఎవరికి తెలియదనే ఒక రకమైన గర్వం .అవతలి వాడిని చులకన చేసి మాట్లాడే నైజమూ ఉంది .’’స్వకుచం ‘’ఎక్కువ అని పిస్తుంది పది నిమిషాలు మాట్లాడగానే .కాని గొప్ప కబుర్ల పోచికోలు .రాజకీయాలను అవపోసన పట్టిన వాడు .మంచి మాటకారి.మంచి ఇంగ్లిష్ మాట్లాడేవాడు .లెక్కల్లో దిట్ట .రూల్ ప్రకారం నడుస్తాడని పేరు కాని స్వంతానికి వస్తే అది హుష్ కాకి .అని పిస్తాడు ..కడియాల వెంకట్రామయ్య గారు స్కూల్ కమిటీ ప్రెసిడెంట్ .తరచుగా కాటూరు లో మా ఇంటికి ఎదురుగా ఉన్న ధాన్యం కొట్టు దగ్గరకు వచ్చి కూర్చునే వారు లుంగీ చొక్కా ఉండేది కాదు చేతుల బనీను లేదా తువ్వాల .ఆన్నే ఆయన మేనమామ గారే ఏం.వి.కృష్ణా రావు అనే ఆయన .ఆదర్శ జీవి సంస్కారం మూర్తీభవించిన వారు నాకు గొప్ప ఆదర్శం నాకు ఎన్నో ఉత్తరాలు రాశారు కాటూరు స్కూల్ లో  కోటేశ్వర రావు గారి ముందు పని చేసి ఒక గాడిలో పెట్టిన వ్యక్తీ .డిసిప్లిన్ ను చాలా సహజం గామఅలు బరచారని విన్నాను ఇక్కడి నుండి అవని గడ్డ కు ప్రమోషన్ మీద జూనియర్ కాలేజికి వెళ్ళిన గుర్తు ..నేను ఉయ్యూరు నుంచే వచ్చే వాడిని సైకిల్ మీద .ఆ సైకిల్ మా అన్నయ్యది అనుకొంటా హాస్పేట్ నుంచి ఒకటి వచ్చింది .కటి . మా బావ గారు వివేక నంద గారిదో కటి .దానికి చిన్న సీటు ఉండేది దాన్ని తర్వాత మార్చాం .గడ్డిమోపులకు వీలుగా పెద్ద కారీయరు  వేయించాను .తర్వాత పాలేలళ్ళకు ఒకటి ఇచ్చాం .ఆ న్రోజుల్లోకమితీ ప్రెసిడెంట్ ను ప్రసన్నం చేసుకోవటానికి హెడ్డూ ఉపాధ్యాయులు తరచుగా ఇంటికి వెళ్లి యేవో కబుర్లు చెప్పి రావటం ఉండేది ద్నేనెప్పుడూ అలా చేయలేదు కానీ పిస్తే ఒక నమస్కారం పెట్టటమే అంతే .ఇలా ఇంటి ప్రదక్షిణం చేయటాన్ని ఆ కాలం లో ‘’గడప పూజ ‘అనే వారు నాకది నచ్చాడు .ఎక్కడైనా అంతే .

                    చిన్న కారు లో కూచుని రిక్వెస్ట్ రాయటం

ఒక రోజు స్కూల్ జరుగుతుండగా మా మేనమామ గంగయ్య గారి పెద్దబ్బాయి పద్మనాభం ఒక చిన్న కారులో వచ్చి నన్ను హెడ్ మాస్టారి దగ్గర పర్మిషన్ పదినిమిషాలు తీసుకొని రమ్మని కబురు చేశాడు .అలాగే చేసి కారులో ఉన్న వాడిని కలిశాను .వాడు నా ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నిస్తున్నామని ,రిక్వెస్ట్ రాసి ఇస్తే వెంటనే పని అవుతుందని ,చైర్మన్ గారితో మాట్లాడామని చెప్పాడు .తెల్ల కాగితాలు కూడా తెచ్చాడు .అంతే నేను మారు మాట్లాడ కుండా వెంటనే ఉయ్యూరు కు రిక్వెస్ట్ లెటర్ రాసి సంతకం పెట్టి ఇచ్చాను .వాడు దాన్ని తీసుకొని ఉయ్యూరు లో మా వార్డు మెంబర్ కోలాచల చలపతి తోకలిసి బందరు వెళ్లి చైర్మన్ గారిని కలిసి ‘’ మా వాడిని ఉయ్యూరు హైస్కూల్ కువెంటనే బదిలీ చేయాలి ‘’అని కోరారట .ఆయన నవ్వుతు ‘’మీ వాడు ఉయ్యూరు తప్ప ఇంకెక్కడా చెయ్యడా ?’’అని  అంటూ కాగితాన్ని తీసుకొన్నారని చేస్తానని హామీ ఇచ్చారని ఆ సాయంత్రం నేను ఇంటికి ఉయ్యూరు చేరిన తర్వాతా చెప్పాడు పద్మనాభం .ఒక రకం గా ఇది పద్మనాభం ప్రతిజ్ఞయే .నా ప్రమేయం ఏమీ లేదు. వాడికి నేనంటే మహా ఇది .కాని వాడిని మా చిన్నప్పుడు పురుగు లాగా చీదరించే వాళ్ళం ఇది మా ‘’కుసంస్కారం ‘’అది వాడి’’ సుసంస్కారం’’ అని ఇప్పుడు అర్ధమయింది .

      సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -25-3-13-ఉయ్యూరు 

 

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

శ్రీ పరమాచార్య పరమ పద పీయూషం -3

 శ్రీ పరమాచార్య పరమ పద పీయూషం -3

    శ్రీ పరమా చార్య ద్రావిడ దేశం లో నే మహాద్భుతశైవ భక్తురాలైన అవ్వయ్యార్ ను మహా గణపతి ని ఉద్దేశించి పరమానంద భరిత కధను ‘’విపరీత మైన అవ్వ –విచిత్ర శిశువు ‘’పేరచెప్పారు .వారిద్దరి మధ్య ఉన్న భక్తీ, ఆరాధనను కళ్ళకుకట్టించారు ..ఆమెను ఊరూరా తిరిగే మనిషిగా ఆయన్ను ఒక చోటి నుండి కదలని బొద్దు ఏనుగు గున్న గా వర్ణించారు .

   ద్రావిడ భాషలో ‘’పిళ్ళై ‘’అంటే బిడ్డ .దీనికి శ్రేష్ట వాచకం ‘’యార్ ‘’చేరిస్తే ‘’పిల్లైయార్ అవుతుంది .అంటే ‘’శిశువు గారు‘’అని అర్ధం .‘ .ద్రావిడ దేశం లో వినాయకుడిని అదేపేరుతో ముద్దుగా పిలుచుకొంటారు ..ఎప్పుడూ కదలకు కూర్చుని తినే వాణ్ని తమిళులు ‘’నువ్వేమైనా పిల్లైయార్ వా ?’’అని ఎద్దేవా చేస్తారట .అంటే రాతి విగ్రహం లా కదలవెం ?’’అని భావం .పార్వతీ పరమేశ్వరుల జ్యేష్ట పుత్రుడు కనుక ఆపేరు వచ్చింది అను ను కోవటం తప్పు .’’జ్యేష్ట రాజం బ్రహ్మనంబ్రహ్ణస్పథిహ్ ‘’అన్న గణపతిని గూర్చి చెప్పిన వైదిక మంత్రమే దీనికి ఆధారంఅన్నారు స్వామి .భూతాది పతి గణపతి ఆయనకు మించిన నాయకుడు లేడు .అందుకే వి అనే విశేషం చేర్చి వినాయకుడు అన్నారు .’’మొక్కు వారి పనుల చక్కజేసేది సామి –గరిక పూల మెచ్చు గబ్బి వేల్పు ‘’.పనులు చేసినా ,చెడగొట్టినా ఆయనే .ఈయనే ‘’యం నత్వా కృత క్రుత్యాస్యుహ్ తం నమామి గజాననం ‘’అని మంచి పనులు ప్రారంభించేటప్పుడు మొక్కు కుంటాం .

 

 

 

 

  ఇంతకీ వినాయకుడి దేహ విభవం చూస్తె నవ్వు పుట్టిస్తుంది కాని అందులో పరమార్ధం ఉంది .ఆయనది ఎనుగుముఖం .ఏనుగుకు దేహ బలం ఎక్కువ .ఎంత బలం ఉన్నా జంతు హింస చేయని సాధు జంతువు .అలానే మన‘’పిళ్ళారి ‘’అధిక శక్తి వంతుడైనా కావాలని ఎవరికీ అపకారం చేయడు .ఉపకారం అయన నైజం.గణపతి జ్ఞాన స్వరూపుడు .నిర్మల నిర్వికల్ప గునాతీత సాన్ద్రానంద పరబ్రాహ్మ స్వరూపమే గణపతి ..ఏనుగు నడకలో రాజసం ఠీవీ ఉన్నాయి .ఆ హొయలు ఇతర జంతువులకు దేనికీ లేదు అందుకే ఏనుగు నడక తో ఆడవారి నడకను పోలుస్తూ గజ గమన అంటారు .తొండం విసరటం చెవుల్ని హఠాత్తుగా రెపరెప లాడించటం ,తినటానికేడైనా అందిస్తే అమాంతం లాక్కొని గుటకాయస్వాహా చేయటం దానికే తగింది .ఏనుగును ఎంత సేపు చూసినా తనివి తీరదు .ఏనుగు ముఖం శాంతికి చిహ్నం .దర్శనీయ మృగం ఏనుగు కంటే వేరేదీ లేదని పరమాచార్య నిశ్చితాభిప్రాయం .

     మన’’ పిళ్ళారి’’ ఏనుగుకు ఏనుగు ,బిడ్డకు బిడ్డా అంటారు తమాషాగా స్వామి .శిశువు లాగా సారళ్యంఏనుగుకున్న బలం ,చురుకుదనం పరమ సుందర మంగళ స్వరూపం జ్ఞానం, ఆనందం ,అందం, శాంతి ఒక్క చోట మూర్తీభవించి నట్లు ఉన్న రూపమే వినాయక స్వామి .ఎన్నో విరుద్ధమైన విషయాలు ఒక చోట ఉన్న విచిత్ర మైన స్వామి గణపతి .ఆయన ముఖం మృగ వర్గానికి చెందింది .దేహం మానవ వర్గానికి చెందింది .రూపమేమో శిశువు .నిజానికి ఆయన మ్రుగమూ కాదు మనిషీ కాదు దేవ వర్గానికి చెందినా వాడు .ఒక చేతిలో విరిగిన దంతం ,మరో చేతిలో మధుర మైన మోదకం అంటే ఉండ్రాయి .పూర్ణ మైన వస్తువూ అసంపూర్ణ దంతం .’’పూర్ణమదః పూర్నమిదం –పూర్ణాత్ పూర్ణం ‘’అని ప్రకటించిన పరబ్రహ్మమే వినాయకుడు .ఈ మాట వింటే మనకు ఎంతో ‘’మొదకరం ‘’గా లేదా అంటారు పరమాచార్య ..పిళ్ళారి బ్రహ్మ చారి అయినా అందరికి పెళ్ళిళ్ళు చేస్తాడు ఏనుగు రూపము  లో వచ్చి వల్లి అనే ఆటవిక కన్యను తమ్ముడు సుబ్రహ్మణ్య స్వామికి జతచేసి పెళ్లి చేయించిన వాడు అన్న గణపతియే .పెళ్ళికాని పిల్లలు మంచి వరుడిని చూసి పెట్తమై గణపతినే ప్రార్ధిస్తారు .వీరి ఆశలను తీర్చి మోక్షకాముల్ని చేద్దామనే సంకల్పమేమో నంటారు స్వామి .

 

 

                                                                                adhiyaman and avvaiyyaar 

 

 

 

        దక్షిణ దేశం లో పరమ భక్తురాలు ‘’అవ్వైయ్యార్ ‘’ఈమెను కైలాసం చేర్చిన వాడూ గణపతియే నని తమిళ దేశం లో ఒక కద బాగా ప్రచారం లో ఉంది .తమిళ దేశం లో ఎక్కడ చూసినా గణపతి విగ్రహాలే కనీ పిస్తాయి .ఆయన అనుగ్రహించిన అవ్వ అవ్వయ్యార్ దేశమంతా క్షణం తీరిక లేకుండా తిరిగి తత్వ బోధ చేసి జనాలను చైతన్యం చేసింది .ఆయన ఉన్న చోటు నుండి ఒక్క అడుగైనా కదలడు .ఈమె ఒక్క చోట కూడా నిలవకుండా ఊరూరా తిరిగేది .ఆ అవ్వ ఆవైయ్యార్ ఈ బిడ్డ పిల్లైయ్యార్ అంటూ ముగిస్తారు కంచి పెద్ద స్వామి .

సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -25-3-13-ఉయ్యూరు 

Posted in రచనలు | Tagged | Leave a comment

జ్ఞానడుడు మహర్షి నారదుడు -20(చివరి భాగం )

 జ్ఞానడుడు మహర్షి నారదుడు -20(చివరి భాగం )

    ఈ విధం గా నారదుడు దేవకీ వసుదేవులకు శ్రీహరి దివ్య కదామృత పానం చేయించి ,స్వస్వరూప జ్ఞానం కల్గించాడు .అవతార పురుషుని అవతారం సమాప్తమయ్యే స్తితి దగ్గరకు వచ్చింది కనుక ,వారి కోసం మనసు లో ఉండే బాధను అణచుకోవటానికి ఉన్ముఖీ కరణం చేశాడు మహర్షి .యాదవ వంశ వినాశామూ శ్రీ హరి సంకల్పమే కనుక ,యాదవ కులం లో మిగిలి ఉండేవారేవ్వరు ఉండరని అర్ధం చేసుకొనే మానషిక ధైర్యం తట్టుకొనే శక్తి ఆ తలిదండ్రులకు కల్పించగాలిగాడు .ఈ జీవిత మంతా ఒక పద్ధతి ప్రకారం ,విధి విధానం గా నడుస్తుంది అన్న సత్యాన్ని ఆవిష్కరించాడు .కర్మల వల్ల  ఉత్తమ లోకాలు కలిగినా ,శాశ్వతానందం ముక్తి మాత్రమె నని ,అదీ శ్రీ హరి చింతనం వల్ల మాత్రమె సాధ్యమని ఎరుక పరచాడు .బంధం మోక్షానికి అడ్డం కనుక సర్వ బంధనాలను విచ్చిన్నం చేసుకొని ‘’నీవే తప్ప ఇతః పరంబెరుగా‘’ననే ప్రపత్తి మార్గాన్ని చేబట్టాలని అప్పుడే ఆయన సామీప్య, సారూప్య ,,సాయుజ్య, ప్రదమైన మోక్షం కలుగుతుందని మహర్షి నారదుడు ఆయా సందర్భాలలో ససవివరం గా తెలియ బర్చాడు .నవవిధ భక్తులనూ బోధించిన నారదుడు చెప్పని విషయమే లేదు .

 

ఇంతటి మహోన్నత భక్తీ సామ్రాజ్యాన్ని దర్శింప జేసిన  శ్రీ మద్భాగవతం చరితార్ధ మైంది .పుణ్య ఫల ప్రదమైంది .

‘’లలిత స్కంధము కృష్ణ మూలము ,శుకా లాపాభి రామంబు ,మం

 జులతాభి శోభితమున్ ,సువర్ణ సుమనస్సుజ్నేయ మున్ ,సుందరో

జ్జ్వల వృత్తంబు ,మహా ఫలంబు ,విమల వ్యాసాల వాలంబు నై

వెలయున్ ,భాగవతాఖ్య కల్పతరువుర్విన్ సద్విజ శ్రేయమై .’’

narad_910 images (1) images (2) images (3) images (4) images (5) images (6) images (7) images (8) images (9) images (10) images Mahabharat05ramauoft_0884‘’సత్యం పరం ధీమహి ‘’అని గాయత్రీ ప్రారంభం లో ,గాయత్రీ నామ బ్రహ్మ స్వరూపమై ,మత్స పురాణం లో గాయత్రిని అధికరించి ,ధర్మ విస్తారాన్ని వృత్రాసుర వధను చెప్పబడేది మాత్రమె భాగవతం అనడం వల్ల ఇది మహా భాగవతం అయింది, అనిపించు కొన్నది

   ‘’శ్రీ మంతమై ముని శ్రేష్ట కృతంబైన భాగవతంబు సద్భక్తి తోడ

     వినగోరు వారల విమల చిత్తంబుల ,జెచ్చెర నీశుడు చిక్కుగాక  

     ఇతర శాస్త్రంబుల ,నీశుండు చిక్కునే ,మంచి వారలకు నిర్మత్సరులకు

     గపట నిర్ముక్తులై ,కాంక్ష సేయకయును దగిలి యుండుట మహా తత్వ బుద్ధి

     బరగానా ధ్యాత్మికాడి తాపత్రయంబు నడచి ,పరమార్ధ భూతమై యధిక సుఖదా

     మై సమస్తంబుబు గాకయు ,నయ్యు నుండ –వస్తు వేరుగంగ దగు భాగవతము నందు ‘’

‘’వేద కల్ప వృక్ష విగలితమై ,శుఖ ముఖ సుదాద్రవమున మొనసి యున్న

భాగవత పురాణ ఫల రసాస్వాదన –పదవి గనుడు రసిక భావ విదులు ‘’

    శ్రీ హరి నామామృతం తప్ప ఏదీ దరి చేర్చదు.

‘’వర గోవింద కదా సుధారస మహా వర్షోరు ధారా పరం

పర లంగాక ,బుదేంద్ర చంద్ర ఇతరోపాయాను రక్తిం ,బ్రవి

స్తర దుర్దాంత ,దురంత ,దుస్సహాజ ,సుస్సంభావితానేక దు

స్తర గంభీర ,కఠోర ,కల్మష ,కనద్దావానలంబారునే ‘’ అని మహర్షి మహా రాజుతో అంటాడు .భాగవత కదా ప్రారంభం లో

‘’హరినామ కదన దావానల జ్వాలచే గాలవే ఘోరాఘకాననములు

వైకుంఠదర్శన వాయు సంఘంబుచే దోలగవే ,భవ దుఃఖ తోయదములు కమల నాభ ధ్యాన కంఠీరవము చే గూలవే సంతాప కుంజరములు

నారాయణ స్మరణ ప్రభాకర దీప్తి చే దీరవే షడ్వర్గ తిమిరములు

నలిన నయన సద్భక్తి నావ చే గాకసం –సార జలధి దాటి చనగ రాదు

వేయు నేల ,మాకు విష్ణు ప్రభావంబు –దేలుపవయ్య సుత ధీసమేత ‘’

‘’చారుతర ధర్మ రాశికి –భారకుడగు కృష్ణు డాత్మ పదమున కేగన్

భారకుడు లేని ఎవ్వని –జేరును ధర్మంబు బలుపు సెడి మునీంద్రా ‘’అన్నది భాగవత పరమార్ధం విన్నా చదివినా చెప్పినా ఇహ  పరదాయకం .మోక్ష ప్రదం .నారద భక్తీ సూత్ర పరి పుష్టం .అమలం ,దివ్యం ,

 

భక్త కవి పోతన                                                        వేద వ్యాస మహర్షి             వ్యాసుడు చెబుతుంటే వినాయకుడు రాయటం 

 

 

వ్యాస పూర్ణిమ -గురు పూర్ణిమ                                                                 వ్యాస భాఘ్ 

 

 

 

 

 

సర్వ లఘు సీసం (దశమ స్కంధం )

‘’నవ వికచ ,సరసిరుహ నయన ,యుగ నిజ చణ ,గగన చర నది జనిత ,నిగమ వినుత

 జలధి సుత కుచకలష ,లలిత మృగ మద రుచి పరిమళ నిజ హృదయ ధరణి భరణ

ద్రుహిణ ముఖ సురనికర ,విహితను తి కలిత ,గుణ కటి ఘటిత ,రుచిర తర కనక వసన

భుజగ రిపు వరగమన ,రజతగిరి పతి వినుత ,నతత జపరత ,నియమ సరణి చరిత

తిమి ,కమఠ కిటి నృహరి ,ముదిత బలినిహి –త దపరశుధర ,దశ వదన విళన

మురదమన ,కలికలుష సుముదపహరణ –కరివరద ,ముని ,నర సుర ,గరుడ వినుత ‘’

                          ఓం స్వస్తి –సంపూర్ణం .

    మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ –25-3-13-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

‘శివతాండవ’ మాడిన నిత్య విద్యార్థి–సరస్వతీ పుత్ర శ్రీ పుట్టపర్తి నారాయణా చార్యులు -శత జయంతి సందర్భం గా

‘శివతాండవ’ మాడిన నిత్య విద్యార్థి
– శశిశ్రీ

తాను రచించిన కావ్యాన్నే తానే పాఠ్యపుస్తకంగా చదివి పరీక్ష రాసిన అరుదైన కవి సరస్వతీపుత్ర పద్మశ్రీ డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యులు. పదునాలుగు భాషలలో పాండిత్య శోభతో ఒక్క గొంతుకై అబ్బురపరచిన బహుభాషా చక్రవర్తి ఆయన. తెలుగు ప్రబంధాలలోని ప్రబంధ నాయికలకు సాహిత్య చరిత్రలో సముచిత సమయోచిత స్థానం పదిలపరచిన సాహిత్య విమర్శకుడాయన. ప్రాచీన సాహిత్యంతోపాటు ఆధునిక సాహిత్యం సమదృష్టితో అధ్యయనం చేసిన సాహిత్యజీవి ఆచార్యులు. పద్యం గద్యం ఇరుకారుల సేద్యంగా శతాధిక గ్రంథాలు రచించిన శక్తత గల రచయిత ఆయన. గొప్ప వక్త. సమర్థుడైన విమర్శకుడు. శక్తత గల అనువాదకుడు. ఛాందసభావాలు గిట్టనివాడు. సంప్రదాయం మరువనివాడు. ఆధునికాన్ని అభిమానించేవాడు. 

వందేళ్ల క్రితం 1914 మార్చి 28న అనంతపురం జిల్లా పెనుగొండ తాలుకా చియ్యేడు గ్రామంలోని విద్వత్ కుటుంబంలో నారాయణాచార్యులు జన్మించారు. పుట్టపర్తి శ్రీనివాసులు, లక్ష్మీదేవమ్మ ఆయన తల్లిదండ్రులు. ఎనిమిదో తరగతి వరకు చదివి బడి మానేశారు. వీధి పిల్లలతో కలసి పెనుగొండ కోటలో తిరుగుతూ ఆటపాటల్లో కాలం వెల్లబుచ్చేవారు పుట్టపర్తి. విద్వత్ కుటుంబంలో జన్మించిన నారాయణాచార్యులు చదువుసంధ్యలు లేక ‘పండితపుత్ర శుంఠః’ అని ఎక్కడ మారిపోతాడోనని శ్రీనివాసాచార్యులు భయపడ్డారు. ఇక తానే గురువయ్యారు. తెలుగు, సంస్కృతం నేర్పారు. ఆ సందర్భంలోనే ఆ కుటుంబానికి శ్రేయోభిలాషి అయిన టి.శివశంకరం, నారాయణాచార్యులను వెంటతీసుకుపోయి పెనుగొండలోని సబ్‌కలెక్టర్ భార్య అయిన పిట్ దొరసానికి పరిచయం చేశారు. ఆమె ఆంగ్లంలో గొప్ప విద్వాంసురాలు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో షేక్స్‌పియర్, బ్రౌనింగ్ మీద గొప్ప పరిశోధన చేశారామె. ఆమె, ఆచార్యులకు ఆంగ్లభాషను నేర్పడమే కాకుండా గెట్టిగా ఆంగ్లసాహిత్యాన్ని పరిచయం కూడా చేశారు.

అప్పట్లో పెనుగొండలోని నాగనాయని చెరువు గ్రామంలో రంజకం మహాలక్షుమమ్మ అనే ప్రసిద్ధ నర్తకి ఉండేది. ఒకరోజు ఆమె ఇంటి ముందు నుండి ఆచార్యులు వెళుతున్నారు. అప్పుడు శ్రావ్యమైన మువ్వల సవ్వడి వినిపించింది. ఆచార్యులు ఆ ఇంటి కిటికీ నుండి చూశారు. లోపల నర్తకి అద్భుతంగా నృత్యం చేస్తూ కనిపించింది. నృత్యం అయిపోయాక తనను గమనిస్తున్న బాలుడైన ఆచార్యులను ఆమె దగ్గరికి పిలిచింది. ‘నృత్యం చేర్చుకుంటావా?’ అని అడిగింది. వెంటనే ఆచార్యులు ఔనన్నట్లు తలాడించారు. ఫలితమే ఆచార్యులు ఆమె ద్వారా సంగీతం, నృత్యం రెండు కళల్లో ప్రావీణ్యం సంపాదించారు.

కేవలం ఇంటి చదువుతో నారాయణాచార్యుల జీవితానికి భవిష్యత్ ఉండబోదని ఆయన తండ్రి శ్రీనివాసాచార్యులు అనుకున్నారు. అప్పట్లో కట్ట మంచి రామలింగారెడ్డి, మైసూర్ యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్‌గా ఉండేవారు. ఆయన ప్రత్యేక ఆహ్వానంతో రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, అదే యూనివర్సిటీలో తగు హోదాలో పనిచేస్తుండేవారు. ఆ రాళ్లపల్లివారు, పుట్టపరి వారికి దగ్గరి బంధువు. దీంతో ఆచార్యులను ఆయన వద్దకు పంపారు. అక్కడ ఆచార్యులు ప్రాకృతభాష అధ్యయనం చేశారు.

అక్కడ ఉన్నప్పుడే పెనుగొండకోట గతవైభవం, ప్రస్తుత దయనీయ స్థితిని దృశ్యమానం చేస్తూ 150 పద్యాలతో ‘పెనుగొండ లక్ష్మి’ అనే లఘుకావ్యం రచించారు ఆచార్యులు. ఆ కావ్యాన్ని రాళ్ళపల్లి చదివి భవిష్యత్తులో గొప్పకవి కాగలవని దీవించారు. ఆ తరువాత నారాయణాచార్యులు తిరుపతిలోని వేంకటేశ్వర సంస్కృత కళాశాలలో చేరడానికి వెళ్ళారు. అప్పుడు ఆచార్యుల వయస్సు 16 ఏళ్ళు. ఆ కాలేజీ ప్రిన్సిపల్‌గా, ప్రసిద్ధులైన కపిస్థలం కృష్ణమాచార్యులు ఉండేవారు. కాలేజీ అడ్మిషన్ ఇమ్మని ఆచార్యులు ఆయన్ను కోరారు. తగు ధృవీకరణపత్రం చూపమని ప్రిన్సిపల్ అడిగారు. ఉంటేకదా, చూపడానికి. దీంతో అడ్మిషన్ సాధ్యం కాదు పొమ్మన్నారు. ఆచార్యులకు కోపం వచ్చింది. ఆవేశంగా, ఆశువుగా పద్యాలు చెబుతూ బయటికి నడిచారు. ఈ చర్యతో ఆ ప్రిన్సిపల్ దిగ్భ్రమ చెందారు. నారాయణాచార్యులలోని అంతర్గత యోగ్యతను గుర్తించి అడ్మిషన్ ఇచ్చారు. అయితే అక్కడ కూడా పుట్టపర్తివారు కోర్సు పూర్తి చేయకుండానే పెనుగొండకు తిరిగి వెళ్ళిపోయారు.

ఆ తర్వాత కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన కనకవల్లీదేవి (కనకమ్మ)తో పెళ్ళి జరిగింది. అప్పటికి ఆచార్యుల వయసు 20 ఏళ్ళు. ఆ విధంగా అనంతరపురం జిల్లా నుండి కడప జిల్లా ప్రొద్దుటూరుకు మకాం మారాల్సి వచ్చింది. ప్రొద్దుటూరులోనే శ్రీకన్యకాపరమేశ్వరి ఆలయంలో సంస్కృతం నేర్పించే ఉపాధ్యాయునిగా పనిచేయసాగారు. అప్పటికి ఆచార్యులు ఇంకా విద్వాన్ పూర్తి చేయనే లేదు. ప్రభుత్వ ఉద్యోగం కోసం విద్వాన్ అవసరమని స్థానికులైన పెద్దలు సలహా ఇచ్చారు. దీనితో విద్వాన్ పూర్తి చేయడానికి తిరుపతిలోని ప్రాచ్యకళాశాలలో చేరారు. విద్వాన్ పూర్తిచేశాక ప్రొద్దుటూరులోని మునిసిపల్ హైస్కూల్‌లో తెలుగు పండితునిగా చేరారు.

అయితే తిరుపతిలో ఆచార్యులు చదువుకునేటప్పుడు తాను రాసిన కావ్యం ‘పెనుకొండ లక్ష్మి’ పాఠ్యపుస్తకంగా చదివి పరీక్ష రాశారు. విచిత్రమేమిటంటే ఆ పరీక్షలో ఆచార్యులు తప్పారు. తాను పరీక్ష బాగా రాసినా ఎందుకు ఉత్తీర్ణున్ని చేయలేదో చెప్పమని ప్రిన్సిపల్‌ను ఆచార్యులు అడిగారు. ఆ ప్రిన్సిపల్‌కు కూడా ఆశ్చర్యమే అనిపించి జవాబు పత్రం తెప్పించి పరిశీలించారు. అప్పుడు తేలిందేమిటంటే 2 మార్కుల ప్రశ్నకు ఒక సుదీర్ఘ వ్యాసం మాత్రమే జవాబు రాసి వ్యవధి ముగియడంతో పేపరు ఇచ్చేసి రావడంతో పరీక్ష తప్పారన్న విషయం గ్రహించారు. దీనితో ఆచార్యులు అవాక్కయ్యారు. తర్వాత మళ్ళీ రాసి ఉత్తీర్ణులయ్యారు.

ఆచార్యులు శతాధికంగా గ్రంథాలు రాసినా, ఆయనకు కీర్తి ప్రతిష్ఠలు సమకూర్చి పెట్టినది ఒక లఘుకావ్యమైన ‘శివతాండవ’మే. రంజకం లక్షుమమ్మ వద్ద నేర్చిన నృత్యం, రాళ్ళపల్లి దగ్గర నేర్చుకున్న సంగీతం, కన్నడ భాషా సాహిత్యంలో అధ్యయనం చేసిన రగడ ఛందస్సులోని సాహిత్యం ఆ లఘుకావ్య రచనకు జవజీవాలు పోశాయి. పుట్టపర్తి నారాయణాచార్యులంటూనే ఇప్పటికీ అందరికీ గుర్తుకొచ్చేది ఆయన శివతాండవ కావ్యమే.

శివతాండవ కావ్యం వెలువడ్డానికి పూర్వ నేపథ్యం ఆసక్తికరమైనది ఒకటుంది. అది 1949వ సంవత్సరం. ఆచార్యులు అప్పటికి చాలా గ్రంథాలే రచించారు. ఆధ్యాత్మికంగా చాలా కృషి చేశారు. అష్టాక్షరి మంత్రం 13 కోట్లు మార్లు నియమ నిబంధనలతో జపించారు. అయి నా దైవసాక్షాత్కారం కలగలేదు. దీనితో జీవితంపైనే ఆచార్యులకు విరక్తి కలిగింది. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఒక సన్యాసిగా మారి ఉత్తర భారతదేశం వెళ్లిపోయారు. హిమాలయాల్లో కొంతకాలం తపస్సు చేశారు. అప్పటికీ దైవ సాక్షాత్కారం సాధ్యపడలేదు. ఇక జీవితం పరిసమాప్తం చేయాలనుకున్నారు. ఆత్మపరిత్యాగం కోసం ఆ హిమాలయాల్లోని ఒక పర్వతాన్నెక్కి కిందికి దూకి చనిపోవాలనుకున్నారు. ఆ ఆలోచనతో వడివడిగా నడిచి వెళ్లసాగారు ఆచార్యులు.

సరిగ్గా అప్పుడు ఆచార్యులకు ఒక ఆకర్షకమైన స్వరం వినిపించింది. పేరుపెట్టి పిలుస్తున్న ఆ వ్యక్తిని చూశారు. ఆయన ఒక సన్యాసి దగ్గరకు వచ్చి ఆచార్యులతో మాట్లాడి తనతోపాటు ఆశ్రమానికి తీసుకెళ్లారు. చావురాత ఇప్పుడే లేదని సముదాయించి తన వద్ద ఆరు నెలలపాటు పెట్టుకున్నారు. చివరికి ఒకరోజు ఆ ఆశ్రమ పెద్ద తన దేశవ్యాపిత శిష్యులను హిమాలయాలకు పిలిపించుకున్నారు. వచ్చినవారిలో ఎందరో విద్వాంసులున్నారు. వారందరిచేత ఆచార్యుల విద్వత్ శక్తతను పరీక్షింపజేసినారు. పరీక్షించిన వారంతా ఆచార్యుల బహుభాషా పాండిత్య ప్రతిభను శ్లాఘించారు. అప్పుడు, ఆశ్రమపెద్ద నారాయణాచార్యులకు ‘సరస్వతీపుత్ర’ బిరుదు ప్రదానించి సత్కరించారు. మళ్లీ గృహస్థ జీవితం గడపమని ప్రొద్దుటూరుకు పంపారు. ఆచార్యులను ఆత్మహత్య పాలుకాకుండా కాపాడి, బిరుదుతో సత్కరించి పంపిన ఆ ఆశ్రమపెద్ద ఎవరో కాదు -స్వామి శివానంద సరస్వతి. మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలాం, ఆంధ్రజ్యోతి పూర్వ సంపాదకులు నండూరి రామమోహనరావులకు కూడా ఆ స్వామి శివానంద సరస్వతి గురువు.

అలా ఆచార్యులు ప్రొద్దుటూరు చేరాక అక్కడి అగస్తేశ్వర ఆలయానికి ప్రతిరోజు వెళ్లి ప్రదక్షిణలు చేసి రావడం దినచర్యగా చేసుకున్నారు. 40 రోజులు ప్రదక్షిణలు చేశాక ఒకరోజు ఒక అలౌకిక కవితావేశం ఆచార్యులలో పెల్లుబుకింది. అప్పుడు రచించిందే ‘శివతాండవం’ గేయకావ్యం. ఆ కావ్యం రగడ ఛందస్సులో రచించారు. ఆ కావ్యంలో సంగీతం, సాహిత్యం పోటీపడి అక్షరబద్దమయ్యాయి. ఆ కావ్యం ఆచార్యులకు మారుపేరుగా స్థిరస్థాయిగా నిలిచిపోయింది. కాలపరీక్షలో నిలిచింది. ఇంతచేసి ఆ గేయకావ్యం 70 పేజీలకు మించింది కాదు. అయితేనేం ఆచార్యులకు స్పెస్‌మెన్‌గా నిలిచిపోయింది.

ఆచార్యులు స్వయంగా తానే శివతాండవాన్ని పాడు తూ నృత్యం చేస్తుంటే, ఆ అద్భుత దృశ్యం, ఒళ్లు గగుర్పొడుస్తుంది. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెంలోని శివాలయం ప్రారంభోత్సవం జరిగినప్పుడు తిక్కవరపు రామిరెడ్డి ఆచార్యులను ఆహ్వానించారు. ఆరోజు ఆచార్యులు శివతాండవం గానం చేస్తూ, చేసిన తాండవాన్ని చూసినవారంతా, మహాశివుడే శివతాండవం చేస్తున్నట్లు అనుభూతించారని ఆనాటి పెద్దలు చెబుతారు. ఆచార్యులు ఎక్కడికి, ఏ సాహిత్య సభలకు వెళ్లినా శ్రోతలు, తొలుత శివతాండవమే వినిపించమని కోరేవారు. విశేషమేమిటంటే పరమవైష్ణవుని చేతిలో పరమశివుని కావ్యం శివతాండవం రూపుదాల్చడం, ఆచార్యులలోని శివకేశవ అభేద్య భావానికి ప్రతీక.

ఆచార్యులు రచించిన శతాధిక గ్రంథాలలో పెనుగొండ లక్ష్మి, మేఘదూతము, పురోగమనము, శివతాండవము, అగ్నివీణ చాలా కీర్తిప్రతిష్ఠలు ఆయనకు సమకూర్చాయి. ఈ గ్రంథాలన్నీ లఘుకావ్యాలే కావడం విశేషం. ఒక్క పెనుగొండ లక్ష్మి తప్ప మిగిలినవన్ని గేయ కావ్యాలు కావడం, అవన్నీ ఆచార్యులు తన యవ్వనదశలోనే రాసినవి కావడం గమనార్హం. అలాగే ఆచార్యులు ‘జనప్రియ రామాయణం’ కూడా గేయఛందస్సులోనే రచించారు. అయితే ఈ కావ్యం రెండు సంపుటాలు మాత్రమే వెలువడింది. 1972లో ‘పద్మశ్రీ’ అందుకున్న ఆచార్యులకు 1975లో శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ, 1987లో శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశాయి.

భారతీయ సుప్రసిద్ధ సాహిత్య నిర్మాతల్లో పుట్టపర్తి నారాయణాచార్యులకు అరుదైన స్థానం ఉంది. గొప్ప వక్త. సమర్థుడైన విమర్శకుడు. శక్తత గల అనువాదకుడు. ఛాందసభావాలు గిట్టనివాడు. సంప్రదాయం మరువనివాడు. ఆధునికాన్ని అభిమానించేవాడు. అటువంటి మహాకవి, బహుభాషా చక్కవర్తి ‘నేను నిత్య విద్యార్థిని’ అని జీవితం కడవరకు చెప్పుకున్న నిగర్వసాహిత్యవేత్త. ఆయన ఏ యూనివర్సిటీ గడప ఎక్కకుండానే 14 భాషల్లో పాండిత్యం హస్తగతం చేసుకున్నారు. అది ఆయనకు భాషలపట్ల ఉన్న తడిఆరని దాహం. ఆయన 1990 సెప్టెంబర్ 1న కడపలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. గ్లాస్‌నోస్త్, పెరిస్త్రోయికా పుస్తకాల్ని చదువుతూ కన్నుమూశారు.

ఆచార్యులు జన్మించి వంద వసంతాలు. ఈ సందర్భంగా కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయం, సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సంయుక్తంగా కడపలో 2013 మార్చి 28న ఆచార్యుల శత జయంతికి గుర్తుగా సాహిత్య సదస్సు ఏర్పాటు చేశాయి. ఆ సదస్సులో కేంద్ర సాహిత్య అకాడమి ప్రచురించిన ఈ వ్యాసకర్త రచన ‘భారతీయ సాహిత్య నిర్మాతలు – పుట్టపర్తి నారాయణాచార్య’ గ్రంథాన్ని ఆవిష్కరించనున్నారు. ఆరోజు ఆ గ్రంథం 800 ప్రతుల్ని ఆచార్యుల అభిమానులు కొనుగోలు చేయడానికి ముందస్తు ఏర్పాటు చేసుకోవడం విశేషం.

– శశిశ్రీ
93479 14465
(ఈ నెల 28న పుట్టపర్తి నారాయణాచార్యులు శత జయంతి)

 

Posted in సేకరణలు | Tagged | Leave a comment

జ్ఞానదుడు మహర్షి నారదుడు -19

 జ్ఞానదుడు మహర్షి నారదుడు -19

  విదేహ రాజు కు హరి అనే ముని ఇలా వివరించాడు ‘’సర్వ భూత మయుడైన సరసిజాక్షు –డాతడే ,తన యాత్మ యందుండు ననేడు వాడు –శంఖ చక్ర ధరుమ్డంచు జానెడు వాడు –భక్తీ భావాభి రతుండు  వో భాగవతుండు ‘’

‘’వర్ణాశ్రమ ధర్మంబుల –నిర్ణయ కర్మల జెడక నిఖిల జగత్సం

  పూర్ణుడు హరి యను నాతడే –వర్ణింపగ భాగవతుడు వసుధాధీశా !’’

విదేహుని సందేహం తీరింది ..కాని హరి నామ స్మరణం ,ఆ కదామృతత సేవనం కావాలని పించి మళ్ళీ అడిగాడు

‘’గజరాజ వరదు గుణములు –త్రిజత్పావనములగుట దేట డంగా

సుజన మనో రంజనముగా –విజితేన్ద్రియ వినగనాకు వేడుక పుట్టెన్ ‘’.

అప్పుడు ‘’అంత రిక్షుడు’’ అనే మౌని వర్యుడు

‘’పరమ బ్రహ్మ మనంగా –బర తత్వమనంగా బరమ దమనగను నీ

శ్వరుడన ,గ్రుష్ణు దన జగ –ద్భరితుడు నారాయణుండు దా వెలుగొందున్ ‘’

అవ్యక్త నిర్గుణ పర బ్రహ్మం లో తనకు విపర్యయం గా జన్మించిన జ్ఞానమే ‘’మాయ’’.ఆ మాయ చేతనే ఆయన ఈ జగత్తును నిర్మిస్తాడు .ఆయన మాత్రం నిశ్చిమ్తుడే .మాయ కూడా ఆత్మ లో లీన మవుతుంది .పంచ భూతాదిక జీవులను సృష్టించేది ఆ మాయయే .లయిన్చేదీ  అదే ‘’అన్నాడు మహర్షి .మరి ఆ మాయను దాటే ఉపాయం చెప్పమన్నాడు రాజు

‘’ప్రబుధుడు ‘’అనే మహర్షి ‘’శరీరమే నిత్యం అనుకోని జీవులు దుఖం లో మునిగి పోతారు .తాని తాము తెలుసుకోరు.విరక్తి మార్గం అవలంబించరు .సద్గురువును పొంది భూతదయ ,హరికదామృత పానం ,బ్రహ్మ చర్య ,సాదు సంగమమం ,సజ్జన మైత్రి ,వినయ ,శుచిత్వ ,క్షమా ,మౌనం ,వేదార్ధ వివేచనం ,అహింస ,ద్వంద్వ విసర్జనం చేసి ఈశ్వరుని సర్వ గతుని గా భావించాలీ .గ్రుహారామ క్షేత్ర కళత్ర పుత్రా విత్తాదులను శ్రీ హరికి అర్పణ చేయాలి .పరమాత్మను తప్ప దేనినీ చూడ రాదు .’’అని వివరించాడు .

‘’హరిదాసుల మిత్రత్వము –మురరిపు కద లేన్నికోనుచు మోదము తోడన్

భారితాశ్రు పులకితుండై –పురుషుడు హరి మాయ గెల్చు భూప వరేన్యా ‘’

ఇందరు ఇన్ని రకాలుఆ చెప్పినా రాజు గారి కి మనశ్శాంతి లభించలేదు .’’పరమాత్మ ప్రభావం ‘’గురించి చెప్పమని అడిగాడు .అప్పుడు ‘’పిప్పలాయనుడు ‘’అనే మహర్షి ఇలా చెప్పాడు

‘’పరమాత్మకు వృద్ధి క్షయాలు ఉండవు .హరి భక్తీ చేత సుజ్ఞాని భాగవత్సదనం చేరుకొంటాడు .’’అని చెప్పాడు

‘’ఏ కర్మలు చేస్తే హరిని చేర గలమో ‘’వివరించమని మళ్ళీ రాజుగారి అభ్యర్ధనం .’’విర్హోత్రుడు’’ అనే ముని ‘’కర్మలన్నీ బంధనాలే .మోక్షానికి నారాయణ భజనమే పరమ పావనమైనది .ఫలితం ఆశించకుండా హరినిస్మరించాలి .షోడశోప చారాలతో ,ధూప దీప నైవేద్యాలతో సాష్టాంగ నమస్కారం చేస్తుంటే హరిని చేరగలరు ‘’అన్నాడు

‘’అసలు ఈశ్వరుడు ఏయే కర్మల్ని చేశాడు ?’’వాటి వివరం చెప్పమని రాజు ప్రశ్నించాడు

‘’ద్రమీలుడు ‘’అనే ముని పుంగవుడు –‘

‘’తారల నెన్నగ వచ్చును –భూరేణువుల లెక్క వెట్టబోలును ,ధాత్రిన్

 నారాయణ గుణ కదనము –లారయ వర్ణింప లేరు పరబ్రహ్మాదుల్ ‘’అని తేల్చి చెప్పి ధర్ముడు అనే వాడు దక్షుని పుత్రిక ను పెళ్ళాడి బదరికా వనం లో నారాయణ ఋషిని కన్నాడు .ఆయన తపస్సు చేస్తూ ఉండగా మన్మధుడిని పంపాడు బలభేది .చలించలేదీయన .వారందరూ స్తుతిస్తే మూడు కోట్ల మంది స్త్రీలను తన శరీరం నుండి పుట్టించాడు .ఊరువుల నుండి ఊర్వశి జన్మించి దేవలోకం చేరింది .ఈ కద విన్న వారంతా ముక్తులే .ఆ తర్వాతమత్స ,కూర్మ వరాహ ,నారసింహ ,వామన ,రామ రఘురామ కృష్ణ బుద్ధ కల్క్యాది అవతారాలు ధరించాడు అని ఆ కధలన్నీ సవివరం గా తెలియ జేశాడు .

      రాజు ‘’హరిపూజ చేయక పోతే ఏమవుతుంది ?’’అని ప్రశ్నించాడు .’’చమసుడు ‘’అనే మహర్షి ‘’హరి నుతింపక స్త్రీలోలుడైన వాడు నరకం చేరుతాడు .ముక్తి మార్గం అప్రత్యక్షం అని భావించేవాడు దుర్గతి చెందుతాడు .’’అన్నాడు .రాజు‘’ఏ యుగంబున నే రీతి వర్తించు –నెట్టి రూపాదు నేవ్విధమున—మును నుతింప బడెను –ముని దేవ గణంబుచే విష్ణు డవ్యయుండు విశ్వ విభుడు ‘’అని ప్రశ్నించాడు .దీనికి ‘’కరభాజన ముని ‘’‘’చాలా అవతారాలలో జన్మించి రాక్షస సంహారం చేశాడు హరి కృత యుగం లో శుక్ల వర్ణుడై ,చతుర్బాహుడై జటా వల్కల క్రిష్ణాజినోత్తరీయ జప మాలికా దండ కమండల దరుడై నిర్మల ధ్యాన గరిస్టులైన పురుష శ్రేష్టం చేత హంసుడు ,సుపర్ణుడు ,వైకుమ్తుడు ,ధర్ముడు ,అమలుడు ,యోగీశ్వరుడు ,ఈశ్వరుడు ,పురుషుడు ,అవ్యక్తుడు పరమాత్ముడు అనే దివ్య నామాలతో ప్రసిద్ధి చెందాడు .

       త్రేతా యుగం లోపృశ్ని గర్భ ,సర్వతో దేవ ,ఉరుక్రమ ,వృషాకపి ,జయంత పేర్లతో స్తుతింప బడ్డాడు . రక్త వర్ణం తో నాలుగు చేతులతో హిరణ్య కేశుడు ,వేద త్రయ స్వరూపుడు సృక్ ,సృవాది ఉప లక్షణ శోభితుడు అయి విష్ణు ,యజ్న , లోపృశ్ని గర్భ ,సర్వతో దేవా ,ఉరుక్రమ ,వృషాకపి ,జయంత పేర్లతో స్తుతింప బడ్డాడు.

           ద్వాపరయుగం లో రెండు చేతులతో శ్రీ వత్స కౌస్తుభ వనమాలికా విరాజ మానుడై జనార్దన ,వాసుదేవ ,సంకర్షణ ,ప్రద్యుమ్న ,అనిరుద్ధ ,నారాయణ ,విశ్వ రూప ,సర్వ భూతాత్మక నామాలతో పిలువా బడ్డాడు .

    కలియుగం లో కృష్ణ వర్ణం తో కృష్ణ నామం తో భక్త సంరక్షణార్ధం యజ్న సంకీర్తనల చేత ప్రస్తుతింప బాడుతాడు .హరి రామ ,నారాయణ ,నృసింహ ,కంసారి శాలినోదర ‘’పేర్లతో మునుల చే స్తుతింప బాదుతాడు అంతే కాదు –

‘’ద్రావిడ దేశంబు నందుల దామ్ర పర్ని–సహ్యజక్రుత మాలాది సకల నదుల

కేవ్వడేనిని ,భక్తీ తో నేగి యచట –బొదిలి తర్పణ మొగి జేయ ,పుణ్య మొదవు ‘’అని’’ రుభ కుమారులైన ‘’మునులు‘’విష్ణు ధ్యాన కదా సుదారసాను భావం ‘’అంతటిని విదేహ మహా రాజు కు విశదీకరించారు అని నారద మహర్షి వసుదేవునికి వివరం గా చెప్పాడు .

‘’కమలాక్షు పద భక్తి కధనముల్ ,వాసుదేవ విని యఘంబుల బాసి వెలసితీవు

 భువన ప్రసిద్దిగా బొలుపొందు సత్కీర్తి కైవల్య లక్ష్మి యు గలుగు మీద

నారాయనుమ్డు నీ నందనుమ్డను మోహ మెదలించి ,విష్ణు గా నెరిగి కొలువు

మతడు ,నీ తనయుడై యవతరించుట జేసి సిధించే దేహ సంశుద్ధి నీకు

సరస సల్లాప సౌహార్ద సౌస్తావమున –బావనంబైతి ,శిశుపాల ,పౌండ్ర ,నరక

ముర ,జరా సంద ,యవనులు ముదము తోడ –వాసుదేవుని జేరిరి వైరిలయ్యు ‘’

‘’దుస్ట జన నిగ్రహంబును –శిస్ట ప్రతి పాదనంబు సేయన ,హరి దా

సృష్టి నవతారమొందేను –స్రష్ట ముఖానిక దివిజ సంఘము వొగడన్ ‘’

లోక రక్షా ణార్ధమే శ్రీ కృష్ణుడు అవతరించాడు ‘’అని నారద మహర్షి చెప్పగానే ,విస్మిత చిత్తుడై దేవకీ వసుదేవులు శ్రీ కృష్ణుని పరమాత్మ గా భావించారు .ఇదే దేవారహస్యం ఈ రహస్యాన్ని ఆ దేవ దేవునే గర్భాన మోసి కన్న తలిదంద్రులైన దేవకీ వసుదేవులకు ఎరుక కల్గించి వ్యామోహ దూరుల్ని చేసిన వాడు మహర్షి నారదుడు .

               సశేషం

    మీ—గబ్బిటదుర్గా ప్రసాద్ –24-3-13- ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

అపూ’ లాంటి జ్ఞాపకాలే నావన్నీ

అపూ’ లాంటి జ్ఞాపకాలే నావన్నీ


ఆరికెపూడి ప్రేమ్‌చంద్ అంటే పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో పరిశోధకుడిగా పనిచేసిన అధ్యయనశీలి అంటే కాస్త తెలుస్తుంది. ఫోర్డ్ ఫౌండేషన్ తరఫున అంతర్జాతీయ ద్రవ్యనిధి సంఘంలో ఉద్యోగం చేశారంటే ఇంకొంచెం తెలుస్తుంది. రిజర్వ్‌బ్యాంక్ పూర్వపు గవర్నర్ వై.వేణుగోపాలరెడ్డి వంటివారికి ఆప్తులైన ఆలోచనాపరుడని చెబితే మరికొంచెం తెలుస్తుంది.

ప్రభుత్వాలు ప్రజాధనాన్ని ఖర్చుపెట్టాల్సిన తీరు మీద ప్రేమ్‌చంద్ రాసిన పుస్తకాలను ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ముద్రించిందంటే ఆయన గొప్పదనం ఇంకా ఎక్కువ అర్థమవుతుంది. ‘వాటన్నిటికీ మూలాలు మా పల్లెటూళ్లో ఉన్నాయి’ అంటూ తన సొంతూరు గురించి ఆరికెపూడి ప్రేమ్‌చంద్ చెబుతున్న కబుర్లు ఆయన మాటల్లోనే…
కృష్ణా జిల్లా కడవకొల్లు అంటే ఎక్కువమందికి తెలియకపోవచ్చు. కడవకొల్లు, వీరవల్లి, పొట్లపాడు… మూడూళ్లనూ కలిపి చెప్పాలి. ఆంధ్రా మాస్కో అని పిలిచే కాటూరు మాకు రెండు మైళ్ల దూరం. నేను 1933 ఆగస్ట్ 22న కడవకొల్లులో పుట్టాను. అప్పటికి అంతా కలిపి పాతిక ముప్ఫయ్యిళ్లు ఉండేవేమో మా ఊళ్లో. అందరూ అతి సాధారణ రైతులు. రెండెకరాలూ, మూడెకరాల వాళ్లు. తిండికీ బట్టకూ లోపం లేకుండా గడిచిపోయే కుటుంబాలు. విలాసమంటే ఏమిటో తెలియని మనుషులు.

అయితే నేను పుట్టడానికి ఆరేడేళ్ల ముందు ఉయ్యూరులో కేసీపీ వాళ్లు చక్కెర కర్మాగారాన్ని ప్రారంభించడంతో డెల్టా రైతుల దశ తిరిగింది. తిండిగింజల బదులు చెరుకు వేసి పంట చేతికి రాగానే ఫ్యాక్టరీకి తరలించడంతో డబ్బు రూపేణా ఆదాయాన్ని కళ్ల చూస్తున్న రోజులవి. మా నాన్న ఆరికెపూడి వెంకటరామయ్య జాతీయోద్యమంతో ప్రభావితులై తన వాటా రెండెకరాల పొలాన్ని అమ్మేసి మా ఊళ్లో పాఠశాల నిర్మించారు.

దీనికి ఉయ్యూరు రాజాగారు మరికొంత సొమ్ము సాయం చేశారు. తనకంటూ ఏ పదవీ లేకపోయినా మా నాన్న రోజంతా ఆ స్కూలు నిర్వహణలోనే గడిపేవారు. అందువల్ల మా నాన్నను అందరూ ‘పంతులుగారు’ అని, మా అమ్మను ‘పంతులుగారి భార్య’ అనీ అనేవాళ్లు. ఊరి బడి కోసం తన భూమిని అమ్మేసిన మా నాన్నను ఆయన అన్నదమ్ములు చాలా గౌరవంగా చూసేవారు.

ఉమ్మడి కుటుంబంలో అందరూ కష్టసుఖాలు పంచుకునేవారు. ప్రస్తుతం మూడొందల మంది విద్యార్థులున్నారా స్కూల్లో. మా నాన్న పుస్తకాలు కొనుక్కొచ్చి స్కూల్లో చిన్నపాటి గ్రంథాలయమూ నడిపేవారు. అప్పటికే ఆర్యసమాజంతో ప్రభావితులైన ఆయనకు కవిరాజు త్రిపురనేని రామస్వామి తోడయ్యారు. మా తాతగారిదీ అంగలూరే కావడంతో ఆ బంధం ఉండేది. నేను పుట్టకముందే మా పెద్దక్కకు పెళ్లయింది. మంత్రాలు, పురోహితుడి అవసరం లేకుండా జరిగిన తొలి పెళ్లి మా అక్కాబావలదే. కవిరాజు తాను రాసిన ‘వివాహవిధి’ పుస్తకం సాయంతో స్వయంగా చేసిన పెళ్లి అది.

కాలవ కబుర్లు కొన్ని
కడవకొల్లుకు ఆనుకుని కృష్ణా నది కాలువ రైవస్ కెనాల్ ఉండేది. మా ఈత సరదాలు అన్నీ అక్కడే. పిల్లలకు చిన్న తువ్వాలొకటి ఇచ్చేవాళ్లు. దాన్ని కట్టుకుని స్నానం చెయ్యాలి. చేసిన తర్వాత పిండేసి ఒళ్లు తుడుచుకోవాలి. బైటకు ఒళ్లు కనిపించకుండా ఈ పని లాఘవంగా చెయ్యాలి. అందులో నేను సిద్ధహస్తుణ్ని. నిజానికి మా ఊరి కాలవలో దిగి స్నానం చెయ్యడం అసాధ్యం. ప్రవాహవేగం అంత తీవ్రంగా ఉండేది. కాలుపెడితే కొట్టుకుపోవడమే. అందుకని మా నాన్న ఊరికి దగ్గరగా మెట్లతో ఒక చిన్న రేవులాగా కట్టించి పెద్ద ఇనపగొలుసు పెట్టించారు.

దాన్ని పట్టుకుని నడుముల్లోతు దిగి స్నానం చేసేవాళ్లు పిల్లలూ, ఆడవాళ్లూను. కొద్దిగా తుప్పు పట్టిందిగానీ ఇప్పటికీ ఉందది. కాలవ దగ్గరగా ఉన్నందువల్ల మా ఊరి నూతుల్లో నీరు పుష్కలంగా ఉండేది. వానకాలంలోనయితే చేద అవసరమే ఉండేది కాదు. బకెట్లతో నేరుగా తోడుకోవడమే. వేసవికాలంలో కొబ్బరికాయలు కోసి తాడు కట్టి నూతిలో పడేసేవాళ్లం. చల్లగా అయ్యాక తాగేవాళ్లం. అదొక రిఫ్రిజిరేషన్ టెక్నిక్ అన్నమాట. చిన్నప్పుడు నా లాగు జేబులో ఉప్పు కారప్పొడి ఎప్పుడూ సిద్ధంగా ఉండేవి.

మామిడికాయల సీజన్‌లో తోటలకెళ్లినపుడు వెంటనే తినడానికి వీలుగా. ఊళ్లో అందరికీ అందరూ తెలిసినవాళ్లే కనుక ఏమీ అనేవారుకాదు. ఏడాది పొడుగునా రాచఉసిరి కాయలు, జామకాయలు, చెరుకుగడలు ఏదోటి తింటూనే ఉండేవాళ్లం. ఉయ్యూరు ఫ్యాక్టరీకి చెరుకు బళ్లు వెళుతుంటే రైతులే మేం కనబడినప్పుడు ఓ గడ తీసిచ్చేవాళ్లు. కాలవ ఒడ్డున ఊరికి చివరగా ఉండే కల్లుపాక సాయంత్రం శ్రమజీవులతో నిండిపోయేది. ఎందుకో ఆ దృశ్యం నాపై చెరగని ముద్రవేసింది. కనుచీకటి పడుతుండగా అక్కడికి చేరే మనుషులు, వాళ్ల మాటలు, సందడి వాతావరణం – చూసి తీరవలసిందేగాని మాటల్లో చెప్పలేనిది.

చెరువున్నా లాభం సున్నా
మా ఊరి చెరువుకు ఎదురుగానే మా ఇల్లు. ఆ చెరువులో చేపలు పుష్కలంగా దొరికేవి. అయితే మా నాన్న గాంధీగారిని కలిసి ఇచ్చిన మాట ప్రకారం శుద్ధ శాకాహారిగా మారిపోయారు. ఇంట్లోనూ మాంసాహారం వండకూడదని గట్టి నియమం పెట్టారు. తాలింపులో సైతం మసాలా వాసన వస్తే ఒప్పుకునేవారు కాదు. అందుకని మా అమ్మ వండేది కాదుగానీ ఆమె తోబుట్టువులు చెరువు చేపలో, చికెనో వంటివి వండి తెచ్చిస్తే ఇంట్లో పిల్లలకు పెట్టేది. నేను ముందునుంచీ శాకాహారినే.

ఇక కరెంటూ టీవీలూ ఏమీ లేని కాలంకదా అది. ఎండాకాలమైతే ఆడవాళ్లంతా పచ్చళ్లు పెట్టడంలో మునిగిపోయేవారు. ఒక ఇంట్లో ఉలవచారు చేస్తే, అన్ని ఇళ్లకూ పంచాల్సిందే. అందువల్ల ఉలవచారొక పెద్ద పని. వేసవిలో కూరగాయలకు మొహం వాచే కాలం.

అప్పుడు ఎక్కువగా పచ్చిపులుసు లాంటివి తినేవాళ్లు. నా చిన్నప్పుడు టమాటా పంటే తెలీదు ఊళ్లో. వానకాలం వస్తోందంటే ముందుగానే కంద, పెండలం వంటివి ఆరపెట్టుకునేవాళ్లు. వానల్లో బురదబురద అయిపోయే మా ఊరి మట్టి రోడ్డు ఆ తర్వాత ఎండాక నడవలేనంత గట్టిగా అయిపోయేది. దాంతో అందరి కాళ్లూ చీలిపోయి రక్తాలొచ్చేవి. ఆంధ్రా యూనివర్సిటీలో ఆనర్స్ కోర్సు పూర్తిచేసేవరకూ నాకూ చెప్పుల్లేవు.

బట్టలకూ రేషనే
మా పిన్నమ్మ తె ల్లవారుజాము నుంచే రాట్నం వడికేది. దాన్నుంచి వచ్చే ‘మ్‌మ్‌మ్…..’ అనే శబ్దానికి నిద్రలేచి, ఆపై రోజంతా ఊళ్లోని పాతిక గడపలూ తిరగడమే చిన్నప్పుడు మా వ్యాపకం. ఆకలి సమయానికి ఏ ఇంట్లో ఉంటే అక్కడ అన్నం పెట్టేసేవాళ్లు, మేం తినేసేవాళ్లం. కేవలం రాత్రి పడుకోబోయే ముందు పిల్లలందరూ ఉన్నారో లేదో చూసుకునేవాళ్లు పెద్దవాళ్లు. ‘ఉదయం ఎక్కడరా తిన్నావు?’ అనే ప్రశ్న అడిగితే అడిగేవారు, లేదంటే లేదు.

తెల్లవారుజాము ప్రమిదల వెలుగులో మా అమ్మ మజ్జిగ చిలకడం నాకింకా గుర్తుంది. అప్పట్లో కరెంటు లేక ఊళ్లో అందరూ నూనె దీపాలే వాడేవాళ్లు. వంటక్కూడా మట్టి పాత్రలే తప్ప కనీసం జర్మన్ సిల్వర్ కూడా తెలియదు. ’40ల్లో యుద్ధం వలన అన్నిటికీ కరువుగానే ఉండేది. గుడ్డి వెలుతురునిచ్చే కిరోసిన్ అయినా దొరికేది కాదు. చివరకు కట్టుకునే బట్టకూ కరువే. తయారైన బట్ట అంతా మిలిటరీకి తరలిపోయేది.

ఆ సమయంలో అందరికీ పీసీ కోటింగ్ గుడ్డలే గతి. రంగును బట్టి చొక్కాలు, ప్యాంట్లు కుట్టించుకోవడమే. ఆడవాళ్లకు చిన్న అంచున్న తెల్లటి చీరలు వచ్చేవి. ఇప్పట్లాగా డబ్బు పెట్టి బజార్లో కొనితెచ్చుకోవడం కాదు. మా ఊళ్లల్లో గుడ్డ కావాలంటే క్యూలో నిల్చోవాల్సిందే. మా అక్కయ్యలకు చీరల కోసం నేనూ అలా వరసలో నిలబడ్డవాణ్నే. పాప్లిన్ గుడ్డ కావాలంటే మన పేరివ్వాలి. లాటరీ తీసి అందులో మన పేరుంటే అప్పుడు ఇస్తారు.

గుట్టు తెలియని ఊరు
మా కడవకొల్లు వాళ్లే కాదు, డెల్టాల్లోని పల్లెటూళ్లలో ఎక్కువమంది ఏదో ఒక లిటిగేషన్‌లో ఉండేవాళ్లు. ఉదయం పూట బెజవాడ కోర్టుల చుట్టూ తిరగడంతో అలసిపోయేవారు. సాయంత్రం చీకటి పడ్డాక ఊరికెళ్లలేరు కనుక గన్నవరం, బెజవాడల్లో తమ ఊరివాళ్లెవరైనా కాపురమున్నారేమోనని ఆరా తీసి వాళ్లింటికి వెళ్లిపోయేవాళ్లు. ఆ ఇంటి ఇల్లాలు వచ్చినవాళ్లకు వేన్నీళ్లివ్వడం, వేడివేడిగా భోజనం పెట్టడం, మంచాలివ్వడం ఇవన్నీ చెయ్యాలి. ఉదయాన్నే లేచి ఎవరి తోవన వాళ్లు వెళ్లేవారు.

ఏ కాస్త లోపం జరిగినా ఊరికొచ్చాక ‘వెళ్లకవెళ్లక ఫలానా సుబ్బయ్య కూతురింటికి ఒక్కపూట వెళితే కూరయినా చేసి పెట్టలేదు, పడుకోను మంచమైనా ఇవ్వలేదు’ అని ఊరంతా చెప్పేసేవారు. అది పెద్ద అవమానం. చెప్పొచ్చేదేమంటే ఏ విషయమైనా ఉన్నదున్నట్టు మాట్లాడేసుకోవడమేగానీ దాచుకోవడం తెలియదు అప్పట్లో. కోపం వస్తే కేకలేసుకోవడం, మళ్లీ మామూలుగా పలకరించుకోవడం, ఏదైనా ఉంటే ఉందని లేకపోతే లేదని – ఇంతే అక్కడి తీరు.

అయితే మా నాన్న దీనికి మినహాయింపు. ఆయన చదువుకుని దేశమంతా తిరిగొచ్చారు కనుక మేం కొంత సంస్కారయుతంగా ప్రవర్తించాలని ఆయన ఆశించేవారు. అంటే జాగ్రత్తగా మాట్లాడడం, ఇంటికెవరైనా వస్తే లేచి నిలబడి సరిగా సమాధానం చెప్పడం, కోపం వచ్చినా అరవకపోవడం… ఇలాంటివి.

ఉయ్యూరులో ఒకరోజు బడికి వెళుతున్నప్పుడు మా బంధువు మైనేని కనకం అనే ఆవిడ దారిలో కనపడి ‘అబ్బాయ్, ఇవాళేం కూర?’ అనడిగింది. ‘కూరేం లేదు, మా అమ్మ ఆవకాయ కలిపి పెట్టింది’ అని చెప్పేశా. వెంటనే నన్ను పక్కకు లాగి ‘అదేం మాటరా అబ్బాయ్? కాస్తయినా గుట్టు తెలియదా నీకు? కూర లేకపోయినా ఏదోటి ఉందని చెప్పాలిగానీ అలా చెప్పుకుంటారా? గుట్టు నేర్చుకో’ అంది. మా ఊరు కడవకొల్లులో అలాంటివేమీ ఎరుగనివాణ్ని కనక నాకు ఆవిడ మాటలు చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి.

నన్ను నడిపింది ఆ బొమ్మే
అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్ఎఫ్) సంస్థలో విదేశీ పట్టాలేవీ లేకుండా, పేరు వెనుక కనీసం పీహెచ్‌డీ అన్న మూడక్షరాలైనా లేకుండా పనిచేసిన మనిషిని నేనొక్కణ్నేనేమో. కానీ దానికి అవసరమైన పునాదిని వేసింది, ప్రాథమిక విద్యనందించిందీ మా కడవకొల్లును, ఉయ్యూరులే. విదేశాల్లో నివసిస్తున్నా మా ఊరితో బంధమనే తల్లి వేరును తెంచుకోలేదు నేను. ప్రఖ్యాత బెంగాలీ రచయిత బిభూతిభూషణ్ రాసి, సత్యజిత్‌రే సినిమాగా తీసిన ‘పథేర్ పాంచాలి’, ‘అపరాజితుడు’ వంటి నవలల కథానాయకుడు ‘అపూ’ లాగానే నా లోపల కూడా మా ఊరికి సంబంధించి నా బాల్య జ్ఞాపకాలతో ఒక అందమైన చిత్రం ముద్రపడిపోయింది.

నేను పదేళ్లు ఢి ల్లీలో, మరో నలభయ్యేళ్లు అమెరికాలో నివసించిన సమయమంతా ఆ చిత్రమే నాకు ఊపిరినిచ్చేది. ఐఎమ్ఎఫ్‌లో పనిచేస్తున్నప్పుడు, వివిధ దేశాల్లో పర్యటిస్తున్నప్పుడు, ప్రభుత్వాలు ప్రజాధనాన్ని వినియోగించే తీరు మీద పెద్ద పెద్ద పుస్తకాలు రాస్తున్నప్పుడు సైతం మా ఊరి చిత్రమే నాకు అవసరమైన బలాన్నిచ్చేది.

ఇప్పుడు మావాళ్లెవ్వరూ అక్కడలేరు. అయినా మా గ్రామానికి అవసరమైనది ఏదైనా చెయ్యడానికి నేను సిద్ధమే. ఒక బడో, గుడో, రోడ్డో… ఏ నిర్మాణమైనా చేస్తాం, ఏ సౌకర్యమైనా కల్పిస్తాం. కానీ దాన్ని పది కాలాల పాటు సరిగా నిర్వహించడానికి ముందుకొచ్చేదెవరు? కేవలం డబ్బు పెట్టి ఏదైనా చేసెయ్యగానే సరిపోతుందా చెప్పండి? బాధ్యత తీసుకునేవాళ్లుంటే గ్రామాల బాగు కోసం ముందుకొచ్చేవాళ్లు నేనే కాదు, చాలామందే ఉన్నారు.

అరుణ పప్పు
ఫోటోలు : రాజ్‌కుమార్, డి.కోటేశ్వరరావు

Posted in సేకరణలు | Tagged | Leave a comment

జ్ఞానదుడు మహర్షి నారదుడు -18

  జ్ఞానదుడు మహర్షి నారదుడు -18

                 ఏకాదశ స్కంధం

‘’నిరుపమ సుందర శరీరం ధరించి సమస్త కర్మ తత్పరుడైన పరమేశ్వరుడు యాదవులను అడగింప దలచు కొన్నాడు‘’.ఆ సమయం లో విశ్వామిత్ర అసిత దుర్వాస భ్రుంగి అంగీరస కశ్యప వామదేవ వాలఖిల్య అత్రి వసిష్ట నారదాది మునివరులు ద్వారకా నగరానికి విచ్చేశారు .ఆయనను స్తుతించారు .ఆయనా చక్కగా మర్యాదలు జరిపాడు .

‘’తరణంబులు భవ జలధికి హరణంబులు దురిత లతల కాగమ మూల కా

  భారణంబులార్త జనులకు శరణం బులు నీదు దివ్య చరణంబులిలన్ ‘’

మత్తకోకిల –‘’ఒక్క వేళను సూక్ష్మ రూపము నొందుదీవణు మాత్రమై

               యొక్క వేళను స్తూల రూపము నొందు దంతయు నీవయై

               పెక్కు రూపులు దాల్తు నీదగు పెంపు మాకు నుతిమ్పగా

               నక్కజంబగుచున్న దే మానసంబుజాక్ష రమాపతీ ‘’

‘’శ్రీ నాయక నీ నామము –నానా భవ రోగ కర్మ నాశము నకు ,వి

న్నాణంబగు ,నౌషధమిది –కానరు దుస్టాత్ములకట కంజ దళాక్షా ‘’

అని ముక్త కం ఠం గా ప్రస్తుతించారు .యదునాయకుడు సంతోషించి ‘’మదీయ ధ్యాన నామ స్మరణంబులు భవ రోగ హరణాలు .బ్రహ్మ రుద్రాది శరణాలు .మంగళ కరాలు అయినా నా రూపం గల వారైన బ్రాహ్మణుల పరితాపాలను పరిహరించు .పురుషు నైశ్వర్య సమేతులు గా చేస్తాను ‘’అని యోగీశ్వరేశ్వరుడు ఆనతిచ్చాడు .’’ఇక్కడికి మీరంతా వచ్చిన కారణ మేమిటి ?’’అని ప్రశ్నించాడు .వాళ్ళు ‘’భవదీయ పదార విందదర్శనం కంటే మిక్కిలి విశేషమేమున్తుంది‘’అని వాసుదేవ వదన చంద్రామ్రుతాన్ని నిజ నేత్ర చకోరాలతో గ్రోలారు ‘’యధేచ్చగావాసుదేవుని అనుమతితో

 బయల్దేరి ద్వారకకు దగ్గరలో ఉన్న ‘’పిడారకం ‘’అనే పుణ్య తీర్దానికి వెళ్ళారు .

            అక్కడ యాదవులు సామ్బునికి గర్భిణీ స్త్రీ వేషం వేయించి ఈ మునులను దర్పం తో కన్నూ మిన్నూ కానకుండా ‘’ఆడ పిల్ల పుడుతుందా మగపిల్లాడా ?’’అని అడిగారు .రోషం తో కనుగోనల్లో నిప్పులు రాలగా

‘’వాలాయము యదుకుల ని –ర్మూలనకరంబైనట్టి ముసలంబొకటి

 బాలిక కుదయిన్చును బొం—డాలస్యము లేదటంచు నట బల్కటయున్ ‘’

ముసలం అంటే రోకలి పుట్టటం దాన్ని అరగదీసి సముద్రం లో కలపటం ,యాదవులంతా ఒకరి నొకరు కొట్టుకొని చావటం అందరికీ తెలిసిన కధే .ఇదే ‘’యాదవ కులం లో ముసలం పుట్టటం ‘’అనే సామెత కు దారి తీసింది .పరస్పర హననం తో యాదవ వంశం నిర్వంశ మయింది .’

               వసుదేవుడికి నారద మహర్షి చెప్పిన ‘’విదేహర్షభ సంవాదం ‘’

శ్రీ కృష్ణుని దర్శించి మునులంతా వెళ్ళారు .కాని నారద మహర్షి చేయవలసిన పని ఇంకా మిగిలి ఉంది కనుక దేవకీ వసుదేవులను దర్శించాడు .వారు సమాదరించారు .’’ఏ నరుడు నారాయణ చరణ సరసీరుహ భజన పరాయణత్వం నిరంతరం పొందడో అలాంటి వాడికి మృత్యువు ఎప్పుడూ అతి సమీపం లోనే ఉంటుంది .మీ దర్శనం సుభప్రదం . భాగవత కధల్లో ధర్మ సందేహాలున్నాయి .అవి తీర్చండి మహాత్మా .గోవిందుని పుత్రునిగా పొందాలనుకొని నెరవేరక దేవతా మాయలో చిక్కి చిత్త వ్యసనాన్ధకారం లో ఉన్నాను .హరి కదామృతంఅందివ్వండి .అలాగైతే సుఖం కలుగుతుంది ‘’అని కృష్ణుని తండ్రి వాసుదేవుడు మహర్షిని వేడుకొన్నాడు ..

‘’పరమేశ్వర భక్తీ జనకమై ,కైవల్య పద ప్రాప్తికర మైన విదేహర్షభ సంవాదం అనే పురాతనపుణ్య కద‘’చెప్తానని నారదుడు కదా విధానం వివరించాడు .పూర్వం విదేహుడు అనే రాజు యజ్ఞం చేశాడు .యజ్ఞం చివర ‘’కవి ,హర్యంత రిక్షా ప్రబుద్ధ పిప్పలాయనవిర్హోత్ర ద్రమీల చమస కరభాజను ‘’లు అనే తొమ్మిది మంది ఊర్ధ్వ రేతస్కులైన బ్రహ్మ విద్యా విశారదులు అక్కడికియేతేన్చారు .రాజు యధావిధి వారిని పూజించాడు .వారితో ‘’మీరు విష్ణువును దర్శించిన మహా భూరితపోధన వర్యులు ‘’కనుక ‘’క్రూరులు ,బహుడుఖ రోగ కుత్సిత బుద్ధులు నీరసులు నరులు కనుక సుజ్ఞాన బుద్ధిని నాకు అందించండి ‘’అని వేడుకొన్నాడు .’’పరమేశ్వరుడు ప్రపత్తి నిసస్టలకు సారూప్యాన్ని ఎలా ఇస్తాడు ?’’అని వివరించమని కోరాడు .

   అప్పుడు కవి అనే ముని ‘’కరణ త్రయాలతో చేసే ప్రతి పని హరి సమర్పణం అని పలికి చేయాలి .శ్రీహరిని ఉత్తమోత్తముని గా మనసులో నిలపాలి .నిరంతర హరి నామ స్మరణ చేయాలి .అలాంటి వానికి కైవల్యం సులభం గా లభిస్తుంది .

‘’సంతసంబు గృష్ణ సంకీర్తనంబులు వీనుల విందుగా వినగా వలయు

   హర్షంబు తోడుత హరినామ కధనంబు పాటల నాటల బరగ వలయు

   నారాయణుని దివ్య నామాక్షరంబులు హృద్వీది సతతంబు నిలుప వలయు

   గంజాక్షు లీలలు కాన్తారముల నైన భక్తీ యుక్తంబుగా బాడవలయు

   వెర్రి మాడ్కిని లీలతో విశ్వ మయుని –నోడువుచు లోక బాహ్యత నొంద వలయు

నింతయు విష్ణు మయమని ఎరున్గ వలయు –భేద మొనరింప వలదు మేదినీశ ‘’

అని చెప్పాడు విదేహ రాజుకూ సందేహం తీరలేదు ‘’భాగవత ధర్మం అంటే ఏమిటి ??’’వివరించమన్నాడు భాగవతుడేవాడు ?ఆతని లక్షణాలులే-యేమిటి ?తెలుపమని అర్ధించాడు దీనికి హరి అనే ముని సమాధానం ఏమి చెప్పాడో తర్వాత తెలుసు కొందాం .

            సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –23-3-13- ఉయ్యూరు

  

Posted in రచనలు | Tagged | Leave a comment

నమ్మకమే గెలిపిస్తుంది

నమ్మకమే గెలిపిస్తుంది


ఏ హోదాలోనయినా ఉండవచ్చు. ఎన్ని అధికారాలైనా ఉండవచ్చు. కానీ, ఏవైపు ఉండాలనుకుంటున్నాం అన్న విషయంలో ముందే ఒక స్పష్టత ఉండాలి. అదేమీ లేకుండా మధ్యేమార్గంలో వెళ్లాలనుకుంటే అడుగడుగునా రాజీపడాల్సి వస్తుంది. ఆ రాజీలతో జీవితం ఏ తీరమూ చేరద ంటారు నిజాయితీకి, నిర్భీతికీ మారుపేరైన ఐఎఎస్ అధికారిణి పూనం మాలకొండయ్య. ఎన్నో శాఖల్లో సమర్థంగా పనిచేసిన ఆమె ప్రస్తుతం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు కమీషనర్‌గా ఉన్నారు. పాతికేళ్ల ఐఎఎస్ జీవితంలో ఆమె ఎదుర్కొన్న అరుదైన సంఘటనలే ఈ వారం అనుభవం.

జీవితంలో అనుకోని సంఘటనలు ఎన్నో జరుగుతాయి. అలాంటివి జరిగినప్పుడు, నాకే ఇలా ఎందుకు జరిగింది? అని విపరీతంగా అంతర్మధనానికి గురవుతాం. కానీ, పైకి అది బాధించే విషయంగానే ఉన్నా దాని లోలోపల కొన్ని అద్భుత విషయాలే ఉండవచ్చు. ఒక్కోసారి చేజారిపోయిన దానికి మించిన గొప్పతనమేదో చేతికందిన దాంట్లో ఉండవచ్చు. గాయపడి విలవిల్లాడుతున్న మనసులోకి ఎవరైనా ఒక పాజిటివ్ దృక్పథాన్ని ప్రవేశపెట్టాలే గానీ, తిరిగి నిలబడే క్రమంలో వారు రెట్టింపు శక్తితో పనిచేస్తారు, అద్భుత విజయాల్ని సాధిస్తారన్నది నా అనుభవంతో నేను నేర్చుకున్న సత్యం.

1990లో ఐఎఎస్ ఆఫీసర్‌గా ఆంధ్రప్రదేశ్ వచ్చాను. తొలి పోస్టింగ్ నాకు భద్రాచలం వేశారు. నేను జాయింట్ కలెక్టర్‌గా గుంటూరుకు వెళ్లినప్పుడు నర్సరావుపేట ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ పార్లమెంట్ నియోజక వర్గం దేశంలోకెల్లా అత్యంత హింసాత్మక నియోజక వర్గాల్లో ఒకటి. పాట్నా త ర్వాత రెండవ స్థాన ం నరసరావుపేటదే. ఎన్నికలు వచ్చాయంటే చాలు, ఈ సారి ఎంత మంది ప్రాణాలు పోతాయోనని ప్రజలంతా వణికిపోయే పరిస్థితులు. జాయింట్ కలెక్టర్‌గా నేను అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్‌ని కూడా.

ఒక మహిళ ఆపని చేయడం కష్టం కదా అనుకున్నారందరూ.ఇక్కడ కష్టం కదా అనుకున్నారు. అక్కడి పరిస్థితుల్ని అవగాహన చేసుకున్న నేను ఎన్నికలకు నాలుగు మాసాల ముందు నుంచే కొన్ని రకాల ఎక్సర్‌సైజులు మొదలుపెట్టాను. ఏ ప్రాంతాల్లో ఈ బాంబుల సంస్కృతి ఉందో ఆ ప్రాంతానికి వెళ్లి ఆ సంస్కృతిని విడనాడండని చెబుతూ ఉండేదాన్ని. రోజూ ప్రజల మధ్యకు వెళ్లడం, హింసాత్మక చర్యల వల్ల ఎదురయ్యే పరిణామాల గురించి, శాంతియుత మార్గాల్లో వెళ్లడం వల్ల కలిగే ఫలితాల గురించి నిరంతరం చెబుతూ ఉండేదాన్ని. మొత్తానికి ఎన్నికలు శాంతియుతంగా జరిగిపోయాయి.

ఎన్నికలు పూర్తయిన రోజు సాయంత్రం 6 గంటల వేళ నేను ఆఫీసులో ఉన్నప్పుడు కొన్ని వందల మంది ప్రజలు, మా ఆఫీసుకు వస్తున్న విషయాన్ని గమనించి మా ఆఫీసు సిబ్బంది ఎంతో ఆందోళనతో నా వద్దకు వచ్చారు. మేడమ్! 1991లో ఎన్నికలు జరిగినప్పుడు కూడా జనం ఇలానే వచ్చారు. దౌర్జన్యానికి దిగితే విషయం కాల్పుల దాకా వెళ్లింది. ఇప్పుడేం జరగనుందో అన్నారు. మీరు ఎవరి సీట్లలో వాళ్లు కూర్చోండి. విషయాన్ని నేను చూస్తాను అని చెప్పి, వరండాలోకి వచ్చి నిలుచున్నాను. వందలాది మంది చాలా వేగంగా వచ్చేస్తున్నారు. నా వద్దకు వచ్చేశారు. వచ్చీరావడమే “దండం అమ్మా, ఇంత ప్రశాంతమైన ఎన్నికలు ఇన్నేళ్ల జీవిత కాలంలో మేము ఎన్నడూ చూడలేదు. మా నరసరావుపేట ఎల్లకాలం మీకు రుణపడి ఉంటుంది” అన్నారు. మేము అనుకున్నది ఒకటి జరిగింది వేరొకటి. ఊహించని ఈ పరిణామంతో నా మనసు ఉద్వేగంతో ఊగిపోయింది.

ఆ్రర్దతతో నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఎన్నో దశాబ్దాలుగా వున్న సమస్యను ఎవరైనా హృదయంతో అర్థం చేసుకుని, అంకిత భావనతో, సంకల్పించిన దానిలో పూర్తిగా విలీనమై పనిచేస్తే పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని ఆశించిన దానికన్నా అద్భుత ఫలితాలే వస్తాయని నా అనుభవం నేర్పింది. మౌలికంగా ఏ మనిషైనా ఇంటా బయటా శాంతినే కోరుకుంటాడన్నది నా ప్రగాఢ విశ్వాసం. కాకపోతే, ఆ వర్గం హింసాత్మకంగా వ్యవహరించిందని ఈ వర్గం, ఈ వర్గం హింసాత్మకంగా వ్యవహరించిందని ఆ వర్గం ఆవేశంతో ఆక్రోశంతో చేయకూడని పనులు చేస్తుంటారు. ఒక్కసారి శాంతియుత పరిస్థితులు నెలకొనబోతున్నాయన్న భావన కలిగితే మాత్రం దాని వైపే మొగ్గుతారు. అదే నరసరావుపేట నియోజక వర ్గం చరిత్రలో ఒక మైలురాయిలా నిలిచింది. ఈ అనుభవం నా జీవితంలో కూడా గొప్ప మలుపుగా నిలిచింది.

పారదర్శకంగా…
పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పుడు ఒక సమస్య వచ్చింది. అత్యధిక భూభాగంలో వ్యవసాయం చేసే జిల్లా అది. గోదావరి డెల్టా కావడం వల్ల ఏటా దాదాపు మూడు లక్షల ఎకరాల్లో వరిపంట వేస్తారు. దానికి సంబంధించి నవంబర్‌లో ఇరిగేషన్ బోర్డు మీటింగ్ జరిగింది. మామూలుగానే ఆ ఏడు కూడా నీటి పంపిణీ చేస్తామంటూ హామీ ఇచ్చారు. రైతులు డిసెంబర్‌లో వరినారు పోశారు. నెలరోజుల్లో అవి నాట్లకు వచ్చాయి. కానీ నీళ్లు ఇస్తామన్న అధికారులు, నీరు సరిపడా లేదు కాబట్టి మేము నీళ్లు ఇవ్వలేం.అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. విత్తనాలకు, నారు పెంచడానికి అవసరమైన ఎరువులకు ఎంతో ఖర్చుపెట్టారు. ఇప్పుడు మీరు నీరు ఇవ్వలేమని చెబితే వారంతా ఏమైపోవాలి? అన్నాను. అదేమోగానీ, మేమైతే నీరు ఇవ్వలేం అన్నారు. “తక్కువ నీళ్లతో ఎక్కువ భూమికి నీరందించే విధానం ఉంది కదా! ఆ ప్రయోగం చేస్తే ఎలా ఉంటుంది?” అన్నాను.

“అవన్నీ పుస్తకాల్లో చదువుకోవడానికి బావుంటాయి మేడం” అన్నారు. “అదేం కాదు. మనం ఆ విధానాన్ని అనుసరించాల్సిందే” అన్నాను. కాలువకు గేట్లు ఉంటాయి. ఒకవైపు నీరు వెళ్లే గేటును తెరిచిన ప్పుడు మరోవైపు నీరు వెళ్లే గేటును మూసివేయడం ఈ విధానం. ఇరిగేషన్‌న్అధికారులు “రొటేషన్ విధానంలో మీరు నీరు అందిస్తానంటే మాకేమీ అభ్యంతరం లేదు. కానీ, మీరు అనుకునే దానికి విరుద్ధంగా ఏమైనా జరిగితే మాత్రం నీటిపారుదల శాఖ దానికి బాధ్యత వహించదు. మీరే పూర్తి భాధ్యత వహించాల్సి ఉంటుంది” అన్నారు. నేను క్షణమైనా ఆలస్యం చేయకుండా, దానికి నేనే బా«ధ్యత వహిస్తానన్నాను. రొటేషన్ విధానం మొదలయ్యింది.

ఒక రోజున నర్సాపురం – పాలకొల్లు రైతుల మధ్య నీరు విడుదల విషయంలో అధికారులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారంటూ గొడవ మొదలైంది. అర్థరాత్రి పూట అక్కడకు చేరుకున్నాను. “ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా నేను చూస్తాను. రెండు వర్గాల వారూ మీ ఇళ్లకు వెళ్లిపోండి. నా మీద నమ్మకం ఉంచండి” అన్నాను. విచారణ జరపగా అధికారుల తప్పేం లేదని తేలింది. అయినా ఒకసారి ప్రజలకు అనుమానం కలిగిన తరువాత వారింక ఎన్ని చె ప్పినా నమ్మరు. అందుకే ఆ మరుసటి రోజున డిప్యూటీకి విషయం వివరించి మరో సర్కిల్‌కు అతడ్ని మార్చాను. మొత్తానికి వాటర్ రొటేషన్ విధానం పూర్తిగా విజయవంతం అయ్యింది. ఎంత సేపూ అప్పటిదాకా మనముందున్న విధానాలతోనే ప్రతి సమస్యనూ పరిష్కరించాలనుకుంటాం. వాటితో కాదనిపిస్తే అసాధ్యమని తేల్చేస్తాం. అంతే త ప్ప కొత్త మార్గాల కోసం ఆలోచించం.

సమాజం విస్తృతం అవుతున్న కొద్దీ ప్రతి సమస్యా సంక్లిష్టమవుతూ ఉంటుంది. ఈ స్థితిలో వినూత్నంగా ఆలోచించడం తప్పనిసరి. పారదర్శకత, ప్రజల భాగస్వామ్యం, ఇవి రెండే సామాజిక సమస్యలను పరిష్కరించే అద్భుతమైన ఆయుధాలు. పారదర్శకత ఉన్నప్పుడే ప్రజలు భాగస్వాములవుతారు. అప్పుడే ప్రజాప్రతినిధులైనా, అధికార ప్రతినిధులైనా అనుకున్నది సా«ధిస్తారు. ప్రజల విశ్వాసాన్ని పొందడం అంటే, మనకున్న శక్తి వేయింతలు కావడమే. ఆ సమష్టి శక్తే సమాజంలోని అన్ని సమస్యలకూ ఏకైక పరిష్కారమన్నది ఇన్నేళ్ల నా జీవితం నాకు నేర్పిన అతి గొప్ప పాఠం.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నాదారి తీరు -18 కాటూరు కాపురం

         నాదారి తీరు -18

              కాటూరు కాపురం

నన్ను ఆహ్వానించిన స్కూల్ కనుక మన జాగ్రత్తలో మనం ఉండాలని కుటుంబాన్ని  కాటూరు కు మార్చాను .బండిలో సామాను వచ్చింది .కడియాల వారి వడ్ల కొట్టు ఎదురుగా పంచాయితీ ఆఫీస్ దగ్గర ఒక చిన్న డాబా ,దాని ముందు పెంకుటిల్లు అద్దెకు తీసుకొన్నాను .

                     పెండ్యాల వారిల్లు

   ఎడమ వైపున ప్రముఖ సినీ సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వర రావు గారిల్లు ఉంది .కుడి వైపు ఒక ఆర్.ఐ.గారిల్లు ..పెండ్యాల వారి అమ్మగారు ఇక్కడే ఉండేవారు .పెండ్యాల గారికి ఈవిడ సవతి తల్లి పెండ్యాల నాగాన్జనేయులు గారి అబ్బాయిలు, సోదరి పిల్లలను ఈ మామ్మ గారు పెంచుతున్నారు అన్నీ తానే అయి చూసుకొనే వారు. ఆమె చాలా మంచిది.అని మా ఆవిడ చెప్పేది .కలుపుగోలుగా మాట్లాడేదట .తెల్లవారు ఝామునే లేచి ఇంటి పని అంతా ఒంటి చేత్తో చేసుకొని ,పిల్లల్ని స్కూల్ వళకు తయారు చేసి పంపేది .ఆవిడ .ఆ తర్వాతమడికట్టుకోని వంట చేసుకొనేది ..మంచి ఆచార పరాయణురాలు .పాతకాలపు పద్ధతిలో తెల్ల బట్టలు తో ఉండేది మడీ ఆచారం బాగా పాటించేది సాయం వేళల్లో ప్రభావతి తో కబుర్లు బాగా చెప్పేదట .ఆవిడ తన మనుమరాల్లను మనవాళ్ళను మురిపెం గా పెంచేది .వారికి ఏ లోటు రానిచ్చేది కాదు .పెండ్యాల వారింటి ప్రక్కన ఉంటున్నామనే గర్వం నాకు ఉండేది ఆవిడ అత్తగారి ఆరళ్ళకు బాగా ఇబ్బంది పడ్డారట అమిత కష్టజీవి ఆమె చిన్నతనం లోనే కాదు పెద్ద తనం లోను ఆమెకు కస్టాలు తప్పలేదు .ఒక పిల్లల కోడి లా కన్పించేది ఎప్పుడూ వాళ్ళ సంగతే ,ధ్యాసే ఆవిడకు .మా ఆవిడకు ఆవిడ గొప్ప ప్రేరణ అని ఎప్పుడూ అంటూ ఉంటుంది . ఆమె లో ఎన్నో మంచి గుణాలను చూసి ప్రభావతి ప్రభావితం అయిందని అంటుంది అప్పుడే పెండ్యాల సంగీతం అంటే వెర్రి వ్యామోహం నాకు .ఇప్పటికీ అంతే .అలాంటి సంగీత సార్వ భౌముడిని కన్న గ్రామం కాటూరు .ఆయన కు అక్కడ ఇంత వరకు ఒక శిలా విగ్రహం కాని గుర్తింపు కాని లేక పోవటం నాకు ఆశ్చర్యమేస్తుంది నేను ఆ ఊరి వాళ్ళ కందరి  ద్రుష్టి లోకి  ఈ విషయం తెచ్చాను .కాని ఒక్కచిత్రపటం కూడా నాకు తెలిసి నంత వరకు ఏ ప్రభుత్వ కార్యాలయం లోను పెట్టించలేదు …

              ఆర్ ఐ గారు నియోగులు .భార్య యోగ్యురాలు .టీచర్ గా పని చేసేది .మా ఆవిడకు తాను ఎంతో సహాయం చేస్తానని అనేది అట .ఆయన అప్పుడప్పుడు మాట్లాడే వారు. పిల్లలు స్కూల్ లో చదివే వారు ఆయన చాలా పొట్టి ,ఆవిడ బాగా పొడుగు వింత గా ఉండేది

 

                   కాటూరు వారి లోగిలి

కాటూరు మెయిన్ రోడ్డు లో అప్పుడున్న గ్రంధాలయం ఎదురుగా ప్రముఖ కవి స్వతంత్ర సమారయోధులు కాటూరు వెంకటేశ్వర రావు గారి పెద్ద మండువా లోగిలి, విశాల మైన దొడ్డీ ఉండేవి వాకిట్లో అరుగు మీద వారు కూర్చునే వారని చెప్పుకొనే వారు. నేను వారిని కాటూరు లో చూసిన జ్ఞాపకం లేదు .పెద్ద వ్యవసాయ దారులు .వ్యవసాయం అంతా అన్నగారు చూసేవారని విన్నాను పాలేళ్ళు ,నౌకర్లు ,చాకర్లు ఇల్లు భలే సందడిగా ఉండేదని ఎందరో లబ్ధ ప్రతిస్టులైన కవులు రచయితలు కాటూరి వారింటికి వచ్చిఅతిధ్యం స్వీకరించేవారని చెప్పుకొనే వారు కాని నా చిన్నతనం లో కాటూరి వారు ,ప్రఖ్యాత కవి దేవుల పల్లి కృష్ణ శాస్త్రి గారు మా ఇంటికి రావటం మా పెంకుటింటి సావడిలో తూర్పు గోడ దగ్గర కుర్చీలలో కూచుని మా నాన్న గారితో మాట్లాడటం నాకు యిప్పటికి గుర్తు .దేవుల పల్లి వారు మద్రాస్ లో ఉంటున్న మా పెద్దక్కయ్య కు పెదమామ గారి అంటే గాడేపల్లి పేద సూర్య నారాయణ అంటే రేడియో లో’’బావగారి కబుర్లు’’ చెప్పే ఇద్దరిలో ఒక బావగారన్న మాట ఏఎయన అల్లుడే కృష్ణ శాస్త్రి గారు …పేద సూర్య నారాయణ గారి  తమ్ముడే గాడేపల్లి సూర్యనారాయణ అంటే మా అక్కయ్య మామ గారు ..ఈయన గొప్ప స్టేజి నటులు చాణక్య చంద్ర గుప్త మొదలైన హిందీ నాటకాలు చాలా వేశాడు దర్శకత్వమూ వహించాడు .పాత వెంకటేశ్వర స్వామి మహాత్మ్యం అంటే సి.ఎస్.ఆర్ ఆంజనేయులు గారు కృష్ణుడిగా వేసిన సినిమాలో ఈయన భ్రుగు మహర్షి వేశారు .వింధ్యరాణి మొదలైన సినిమా లో నటించారు .ఆయన కుమారుడే కృపానిధి మా బావగారు ..ఈయనా తండ్రి తో కలిసి నాటకాలు ఆడారు .ఇద్దరిది మంచి పర్సనాలిటీయే . కృష్ణ శాస్త్రిగారితో మాకు బంధుత్వం ఉందన్న మాట . .ఆయన భార్య రాజ హంస గారు చాలా మంచి మనిషి నేను మద్రాస్ వెళ్ళినప్పుడల్లా టి.నగర్ లో ఉన్న వారింటికి నన్ను మా అక్కయ్య తీసుకొని వెళ్ళేది .కృష్ణ శాస్త్రి గారు చనువు గా మాట్లాడే వారు .ఆయన  మరణించ టానికినికి ఇరవై రోజుల ముందు మద్రాస్ లో వారిని దర్శించి ఎన్నో విషయాలను ‘’స్క్రిబ్లింగ్ పాడ్’’ మీద ముచ్చటించు కోన్నాం .ఉయ్యూరు లో మా ఇంటికి వచ్చినప్పుడు ఆయనకు మంచి గిరజాల నల్ల జుట్టుండేది పంచా శాలువా తో చూసిన జ్ఞాపకం ఆయన పెట్టుకొన్న కళ్ళ జోడు ఇంకా నా స్మృతి పధం నుంచి వీడి పోలేదు .నెహ్రు కోటు వేసుకొన్నారు కాటూరు వారు దర్జాగా పంచా లాల్చీ తో ఉత్త్తరీయం తో ఉన్నారు చేతిలో విలాసవంత మైన చేతి కర్ర .చుట్ట కూడామా ఇంట్లో కాల్చిన గుర్తు .దాదాపు రెండు గంటలు పైనే మా ఇంట్లో ఈ కవి జంట గడిపారు.కాటూరి వారికి కూడా కాటూరు లో స్మృతి చిహ్నం లేక పోవటం విడ్డూరమే 

                           కాటూరు లో సాయంత్రాలు

    ఉదయం ట్యూషన్ ,తర్వాతా బడీ రాత్రికి మళ్ళీ ట్యూషన్ సాయంత్రం నేను, గౌతమేశ్వర రావు గారు ఇంకొకరిద్దరూ కలిసి ప్రభుత్వ ఆసుపత్రి దాకా నడిచి వెళ్లి అక్కడ తూముల మీదో వంతెన మీదో కూర్చునే వాళ్ళం పిచ్చా పాటీ మాట్లాడుకొనే వాళ్ళం .సరదాగా గడిచి పోయేవి .గౌతమేశ్వర రావు గారు గొప్ప సంస్కారి, మిత భాషి గా ఉన్నా  లోకాన్ని ఎంతో చదివిన వారు .రాజకీయాలపై మంచి అవగాహన ఉంది .ఆ తర్వాత ఆయనకు రెడ్డి గూడెం హెడ్ మాస్టర్ గా ప్రొమోషన్ వస్తే వెళ్లి పోయారు మొలలతో  తో ఎక్కువ బాధ పడే వారు .రెడ్డి గూడెం బాగా వేడి ప్రాంతం .ఎలా తట్టుకొంటారో అను కొనే వాడిని  

                               పాలిటిక్స్

   ఆయన స్థానం లో కోనేరు దయాకర రావు అనే ఆయన వచ్చాడు .మంచి మాటకారి ఏ ఎండ కా గొడుకు రకం .గొప్ప కబాడీ ప్లేయర్ మమ్మల్ని అందర్నీ బరిలో దింపి ఆడించేవాడు సబ్ జోన్ లో కప్పు సాధించిన జ్ఞాపకం .ఈయన అన్న లోకేశ్వరరావు అనే సీనియర్ హెడ్ మాస్టర్ ఆ తర్వాతా ఎప్పుడో నేను పామర్రు లో వారి దగ్గర పని చేశాను .దయాకర రావు వచ్చిన దగ్గర్నుంచి పాలిటిక్స్ ఎక్కువైనాయి .నెమ్మదిగా సూర్య నారాయణరెడ్డి  గారితో చేరి ట్యూషన్ చెప్పేవాడు. నా దగ్గర  పదోతరగతి విద్యార్ధులు ప్రైవేట్ చదివే వారు అందులో పొట్లపాడు అమ్మాయి శేషుమాంబ చదివేది .ఆ ఊరి సర్పంచ్ మాదల అంజయ్య గారి అమ్మాయి .తమ్ముడు కూడా కాటూరు లోనే చదివే వాడని  గుర్తు .ఈ అమ్మాయి  చాలా ఫేషనబుల్ గా ఉండేది .సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ..ఈ అమ్మాయి నా దగ్గర చదవటం దయాకర రావు కు ఇష్టం ఉండేదికాదు .చాలా వ్యూహాలు పన్ని ఆమె ను మాన్పించాడు నా దగ్గర .ఆమె తర్వాతా రెడ్డి గారి దగ్గర చేరింది బోళ్ళపాడు వాడు శేషురేడ్డి ,ఇంకొకరిద్దరూ కుర్రాళ్ళు చదివే వారు ఊర్లో నాయీ బ్రాహ్మిన్ సుబ్బారావు గారి అబ్బాయి వెంకటేశ్వర రావు నా శిష్యుడే అలాగే అప్పుడు రమేష్ అనే కడవకొల్లు కుర్రాడు కాటూరు స్కూల్ లో చదివే వాడు .అతనే అ తర్వాతా గొప్ప కబాడీ ఆటగాడు అయాడు రాష్ట్ర వ్యాప్తం గా పేరున్న వాడు .కడవకొల్లు లో ,బాడీ పోటీలను చాలా కాలం నిర్వహించాడు .ఇప్పటికి అతనికి నేనంటే చాలా గౌరవం .ఎంతో మర్యాద గా నమస్కారం పెట్టి మాట్లాడుతాడు .ఉయ్యూరు హైస్కూల్ లో డ్రిల్ల్ మేష్టారు గా పని చేసి ఈమధ్యనే రిటైర్ అయ్యాడు .అతని కబాడీ అట చూసి ఆ నాటి కలెక్టర్ ఏ.వి.ఎస్.రెడ్డి గారు అతన్ని సెలెక్ట్ చేసి వ్యాయామ ఉపాధ్యాయుని గా నియమించి గొప్ప పని చేశారు సమర్ధతకు గొప్ప పట్టం కట్టారు కలెక్టర్ రెడ్డి గారు .క్రమంగా నా దగ్గర నుండి పిల్లలు జారిపోయారు .నాకు ఇదంతా బాధ గా ఉంది .కనుక వెంటనే ఒక నిర్ణయం తీసుకొని మూడు నెలల తర్వాతకుటుంబాన్ని ఉయ్యూరు పంపించేశాను .నేను రోజు ఉయ్యూరు నుండే సైకిల్ మీద వచ్చేవాడిని స్కూల్ కు .

                        కాకాని వారికి ఘన సన్మానం

   ఉయ్యూరు లో ఓడిపోయినరాజకీయ కురు వృద్ధులు కాకాని వెంకట రత్నం గారిని గన్నవరం నియోజక వర్గం లో నిల బెట్టి ఆ నాటి ముఖ్య మంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి గెలిపించి వ్యవసాయ శాఖా మాత్యులుగా మంత్రి వర్గం లో కి తీసుకొన్నారు .ఆ సందర్భం గా కాటూరు ప్రజలు ,పెద్దలు కాకాని వారికి ఘన సన్మానం చేయాలని సంకల్పించారు .వేదిక హైస్కూలె .కాకానికి ఆహ్వాన పత్రం ప్రశంశా పత్రాలను నేను తెలుగు మేష్టారు ములగలేటి శర్మ గారు తయారు చేశాం .బాగా వచ్చింది అన్నారు అందరు .శర్మ గారు పద్యాలు కూడా రాశారు .నాకు సన్మాన పత్రం రాయటం ఇదే మొదలు .అంత ఇష్టం లేకపోయినా రాసేశాను .సన్మాన కార్యక్రమం భారీగా జరిగింది .ఆ ఊరి కాంగ్రేస్   పెద్దలు వెల్లంకి శ్రీ వేణు గోపాల రావు గారు ,వీరినే అందరు ‘’శ్రీ వేణు ‘’అనేవారు .కడియాల వారు,వెల్లంకి ఇతర పెద్దలు ,ముదునూరు రాజకీయ దురంధరులు కలపాల సూర్య ప్రకాశ రావు గారు అందరు కలిసి అద్భుతం గా నిర్వహించారు .నేను సన్మాన పత్రాన్ని,’’శర్మ గారు పద్యాలను చదివిన జ్ఞాపకం ..హెడ్ మాస్టారు కోటేశ్వర రావు గారు ఎంతో సంతోషించారు .కాటూరు ప్రెసిడెంట్ గా చాల ఏళ్ళు పనిచేసిన కమ్యూనిస్టు నాయకులు ‘’నాదెళ్ళవారు’’. తక్కువ గా మాట్లాడేవారు ఎక్కువ పని చేసే వారు పార్టీకి అతి ముఖ్యమైన సేవకులు ఆయన కూతురు అప్పుడు స్కూల్ లో చదివేది .

   స్కూల్ లో డ్రాయింగ్ మేష్టారు చిన్నగా ,పొట్టిగా బక్క పల్చగా ,ఎర్రగా ఉండేవారు .కోరా పంచె కోరా చొక్కా తో ఉండేవారు అక్కడే ఉద్యోగం లో చేరి అక్కడే రిటైర్ అయారు ..అయన కొడుకు మా స్టూడెంట్ .కాటూరు లో రెండు దేవాలయాలున్నాయి శివాలయం చాలా పురాతన మైనది విష్ణ్వాలయం కొత్తది శివాలయ అర్చకులకు మంచి పేరుండేది .ఆయన కొడుకు త్రయంబక రావు అప్పటికే ట్రెయినింగ్ పాసై ఉద్యోగం చేస్తున్నాడు అతని తమ్ముడు స్కూల్ లో చదువుతున్నాడు ..కడవకొల్లు వంతెన దిగ గానే కుడి వైపు మా పొలాలున్నాయి. బోరు వేసి పంట పండిస్తున్నాం .వర్రే వాళ్ళు చేస్తున్నారు .అప్పుడు .కడియాల నాగభూషణంఅనే రైతు పొలం మా పొలం ప్రక్కనే ఉంది .ఆయనది కాటూరు .ఆయన అన్న గారే సంజీవరావు గారితో కాటూరు లో దుకాణం నిర్వహిస్తున్నారు అలానే బాలయ్య గారు అనే పెద్ద మనిషిదీ ఇదే ఊరు వారిదీ మా ప్రక్క పోలమే నిత్యం పొలం దగ్గర కనీ పించి నవ్వుతు పలకరించేవాడు బాలయ్య గారు భలే పెద్ద మనిషి .మన్నే కోటేశ్వర రావు గారి పొలం మా పొలం దగ్గరే ఉంది ..

                    రైవస్ కాలువ ఈదటం

   ఒక సారి కార్తీక మాసం లో హెడ్ మాస్టారు తో సహా మేమంతా కడవ కోల్లుదగ్గర ఉన్న ‘’రైవస్ కాలువ’’కు స్నానానికి వచ్చాం .అందరం పందెం వేసుకొని రైవస్ కాలువను ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు ఈది మళ్ళీఈ ఒడ్డుకు చేరాలి అని పందెం వేసుకోన్నాం  హెడ్  మాస్టారు కూడా దిగారు అందరి కంటే నేనే ముందు ఈది గెలిచాను .తర్వాతా సుంకర వెంకటేశ్వర రావు అనే డ్రిల్ మేష్టారు ,ఆ తర్వాతా హెడ్ మాస్టారు చేరుకొన్నాం .అంత వెడల్పైన కాలువ ను నేనెప్పుడూ అంతకు ముందు ఈ ద లేదు ఏదో చిన్నప్పటి నుండి మా ఉయ్యూరు లోని ‘’పుల్లేరుకాలువ ‘’లో ఈదేవాడిని. కనుక ఈత అలవాటు ఉంది మునిగి ఈదటం కూడా నాకు వచ్చు ..అది ఇక్కడ నాకు ఉపయోగ పడిందన్న మాట ..అందరు నన్ను మెచ్చుకొన్నారు .హెడ్ గారితో సహా ..అంత సాహసం నేను చేయగలనని అనుకో లేదు .కాని జరిగింది ..

    రాష్ట్రపతి ఎన్నికా ,హెడ్ మాస్టారి ప్రమోషను నూ మిగిలిన విశేషాలు తర్వాత చెబుతాను

   సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -22-3-13-ఉయ్యూరు

 

 

Posted in నా దారి తీరు | Tagged | 1 Comment

శ్రీ పరమాచార్య పరమపద పీయూషం -2

  శ్రీ పరమాచార్య పరమపద పీయూషం -2

‘’పాశ్చాత్యులకు మీరిచ్చే సందేశం ఏమిటి””? /అని ఒక సారి శ్రీ పరమాచార్యను అడిగితే వారు ‘’మీరు చేసే ఏ పని అయినా సరే దానికి ప్రేమ ముఖ్య కారణం గా ఉండాలి .కార్యం అంటే కర్త, కర్తకు భిన్నమైన ఇతరులూ ఉంటారు .కనుక కార్యం ప్రేమతో నిండి ఉండాలి ఒక్కోసారి ఇతరులను  హిమ్సించాల్సి వస్తుంది .యుద్ధాలు చేయాల్సి వస్తుంది .అప్పుడు కూడా మన హృదయం లో ద్వేషం ఉండ రాదు ‘’ఈ కర్మ సంస్కార కారణం గా చేయ బడుతోంది .దీనిలో ద్వేషానికి తావులేదు ‘’అన్నభావం ఉండాలి ప్రేమఓతప్రోతమైతే ఎలాంటి గడ్డు సమస్య అయనా మనం పరిష్కరించగలం .’’అని చెప్పారు .

స్వామికి ఉపవాసం ఉండటం చాలా ఇష్టం .చాలా రోజులు నిరాహారం గానే ఉండేవారు లేకపోతే గుప్పెడు పేలాలు పాలు లేక పెరుగు లో నాన బెట్టి స్వీకరించేవారట .ఉపవాసం శరీరానికి మనస్సుకు మంచిదని వారి భావం .పౌర్ణమి అమావాస్య ,శుక్ల అష్టమి చతుర్దశి పంచమి షష్టి తిదులు  ఉపవాసంకు  శ్రేష్టం అని భారతం లో ఉన్నట్లు తరచుగా స్వామి చెప్పేవారు మనం చేసే ప్రతి పనీ ఈశ్వరార్పణ బుద్ధి తో చేయాలని వారి అభిమతం .

         స్వామి ‘’కామ కోటి రామ కోటి ‘’అయిందని చమత్కరించేవారట .రామ కోటి రాసిన వారు వచ్చి ఇక్కడ స్వామికి సమర్పించేవారు .అయోధ్యలో పుట్టిన రాముడికి కంచిలోని కామాక్షి అమ్మవారికి ఏమిటి సంబంధం ?అని విచారించి వారు లలితా పరా భట్టారిక శ్రీ త్రిపుర సుందరి అయిన కామాక్షి అని ,శ్రీ రామ చంద్ర మూర్తి ,కామాక్షీ అమ్మవారూ ఒక్కరేనని అన్నారు .అందుకే రామాయణం లో సీతాదేవి భర్తను ‘’నువ్వు పురుషుడివి కావు స్త్రీవి ‘’అనటం లో ఇంత అంతరార్ధం ఉందని చెప్పారు .అది దెప్పి పొడుపు మాటే అయినా యదార్ధమే ఆమె నోటి లో నుంచి బయటకు వచ్చిందని సెలవిచ్చారు .

       ఒకసారి ‘’ఆర్ధర్ ఐషన్ బర్గ్ ‘’అనే విదేశీయుడు స్వామి వారిని దర్శించాడు .అతను ‘’నేను జ్ఞానిని అయితే మిమ్మల్ని అడగాల్సిన సరైన ప్రశ్న ఏది ?’’అని గడుసుగా అడిగాడు .పరమాచార్య ఎవరైనా ప్రశ్నిస్తే రెండు నిమిషాలు మౌనం లో ఉండి సమాధానం చెప్పటం అలవాటు .స్వామి ‘’మీరు జ్ఞాని అయితే ఏ  ప్రశ్నలూ  వేయరు ‘’అని బదులు చెప్పారు .అతనితో సుదీర్ఘ సంభాషణ జరిపి చివరికి ‘’మనం చేసే అన్వేషణే ఆనందం ,సుఖం .ఒక సుఖం పొందాము అంటే అది సుఖం కాదు .సుఖ స్వరూపం గా ఉండే సుఖం అని అర్ధం చేసుకోవాలి ‘’అన్నారు

   అద్వైతాన్ని వివరిస్తూ స్వామి ‘’అద్వైతం అంటే రెండవది లేనిది ..ఈ ప్రపంచం లో ఎన్నో చూస్తుంటాము ఇవన్నీ లేవు అంటే అసంగతం అవుతుంది అప్పుడు మన ప్రయత్నాకి ఫలం ఏమిటి మరి ?ఆకలి దరిద్రం దప్పిక రోగం పోగొట్టుకోవటానికి ఎంతో శ్రమ పడుతున్నాం ఇవి లేని చోటు ఉందా ?ఇవన్నీ దేహ ధర్మాలు .మనం చేసుకొన్నా కర్మ ఫలాన్ని అనుభవించటానికి దేహదారణ చేస్తున్నాం ఆత్మకు ఇవేవీ అంటవుకదా .ఈదేహమే మనం అనే భావన కల్గించి దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడు ఈ ద్వంద్వాల పరిధి లో నుంచి బయట పడాలి ‘’దేహనా నాస్తి కించన ‘’అనే భావం ఏర్పడితే కోరికా భయం మొదలైన వేవీ ఉండవు ‘’ఆత్మావా ఇదమేక ఎవాగ్ర ఆసీ నాన్యత్కిమ్చన ‘’’’ఎకో దాదారభువనాని విశ్వా’’ఎకమేవాద్వితీయం ‘’అని అద్వైతంబోధిస్తోంది మనసును ఆత్మలో ఉంచాలి అద్వైత జ్ఞానం చేతనే వాసనలు నశిస్తాయి ప్రశాంతత ఏర్పడుతుంది పంచ భూతాలు సముత్తితాలైనప్పుడు యోగి శరీరం యోగాగ్ని మయమే అవుతుంది అప్పుడు ముసలితనం,భయం ,రోగం ,చావు ఉండవు అని శృతి చెప్పింది ‘’అని స్పష్టం చేశారు

     ఒక సరి దుర్గా దేవి ప్రతిష్ట సమయం లో స్వామి ‘’దుర్గా పంచరత్న స్తోత్రం ‘’అనే మంత్రాలను రాశారు

పరబ్రహ్మ అని మనం తెలిసో తెలీకో చాలా సార్లు అంటాం ఇంతకూ ఆయన ఎవరు ?అంబతో కూడిన పరమేశ్వరుడే ఆ పరబ్రహ్మ వేరే ఏదీ కాదు అన్నారు స్వామి .ఈశ్వర తత్త్వం సామ్బుడే నంటారు వారు అందుకే శంకర భగవత్పాదులు‘’దశ శ్లోకి ‘’లో ‘’తస్మిన్ మే హృదయం సుఖేన రమతాం సాంబేపర బ్రహ్మణే ‘’అన్నారు ఈ సాంబ మూర్తి మీద హృదయాన్ని లగ్నం చేస్తే సుఖం గా వర్దిల్లుతామంటారు స్వామి

‘’ఆకాశ స్చికురాయతే దశ దిశాభోగో దుకూలాయతే

 శీతాం శుహ్  ప్రసవాయతే స్తిర తరానందః స్వరూపయతే

 వేదాంతో నిలయాయతే సువినయో యస్య స్వభావాయతే

తస్మిన్ మే హృదయం సుఖేన రమతం  సాంబేపరబ్రహ్మణే ‘’

    ఒక సారి పరమాచార్యుల వారికి కనకాభి షేకం చేయాలనే తలంపు భక్తులకు కలిగింది ఆ సందర్భం గా వారు ‘’మీరు నాకు పళ్ళూ పుష్పాలు సమర్పిస్తూఉంటారు  పద్యాలు రాసి పఠిస్తారు ఇవన్నీ నాకు కనకాభిషేకమే .ఇవన్నీ స్వీకరించటానికి నాకేమి అర్హత ఉంది అని నేను ఎప్పుడూ ఆలోచిస్తాను. ఒకే ఒక కారణం కని పిస్తోంది శ్రీ శంకర భగవత్పాదుల వారి దివ్య నామం ఏదో భాగ్య వశం చేత నాకు లభించి నందు వల్ల  అని అనుకొంటాను వారిపేర ఈ సేవలన్ని నాకు చేస్తున్నారని నా భావన ఇన్ని గౌరవ మర్యాదలు మీ నుండి పొందటానికి ఆ స్వాముల వారి గుణ గణాలను స్మరిస్తాను ‘’

శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం –నమామి భాగ త్పాదం శంకరం లోక శంకరం ‘’

సర్వ దేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి అన్నారు కదా మీరు చేసేవన్నీ ఆది శంకరులకే చెందుతాయని నేను బావిస్తున్నాను .వారికే వీటిని నేను మీ తరఫున సమర్పిస్తున్నాను. వీటిని పొందే అర్హత వారికి మాత్రమె ఉంది క.ర్మలన్నీ చేసి ‘’జనార్దనః ప్రీయతాం ‘’అంటాం కదా ఈ కర్మలన్నీ నా సంత్రుప్తికి కాదు ఆ జనార్దనుని సంత్రుప్తికి అని అందులో ఉన్న పరమార్ధం .మాకు కర్మానుస్టానమే విధి .ఈ కర్మలు ‘’పర బ్రహ్మాత్మనా స్తీయతాం ‘’అనే చివరి మెట్టుకు తీసుకొని పోతాయి అందుకే నిత్యం పరమేశ్వరుడినిప్రార్ధించాలి .ఆయన అనుగ్రహం కోరుకోవాలి ఆ శ్రద్ధ మనకు కలిగింది అంటే‘’బ్రహ్మైవాహం ‘’అనే అనుభవ సిద్ధి కలుగుతుంది .అలాంటి బ్రాహ్మీ స్తితియే కనకాభిషేకం .అంతే కాదు రాత్నాభిషేకమే అవుతుంది ‘’అని గొప్ప సమన్వయము తో ఎరుక పరచారు శ్రీ పరమాచార్యుల వారు అదీ వారి మహోత్రుస్టస్తితి .అదీ వారి పరమ పద పీయూష లహరి .

    సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –22-3-13

Posted in రచనలు | Tagged | Leave a comment

జ్ఞానదుడు మహర్షి నారదుడు -17 శ్రీ కృష్ణావతార సమాప్తి

జ్ఞానదుడు మహర్షి నారదుడు -17

 

             శ్రీ కృష్ణావతార సమాప్తి

ద్వాపర యుగాంతం వచ్చేసి యాదవ కులం లో ముసలం పుట్టింది .అక్కడ హస్తిన లో కురు సంగ్రామం లో రాజాది రాజులు ,ప్రజలులక్షలాదిగా పరి సమాప్తి చెందారు .ఇంకో 48 ఏళ్ళలో కలి  ప్రవేశింప బోతున్నాడు .అంతా లయం ,విలయమే కావాలి .ఇదంతా ఆయన ఇచ్చ .,సంకల్పం .ఆ మార్గం గా లోకం కదిలి పోతోంది .తమ అవతార సమాప్తి దగ్గరకు వచ్చిందని పరమాత్మకు తెలుసు .అందుకే అందరు కలిసి గ్రహణ స్నానం కోసం సముద్ర తీరానికి చేరారు .మహర్షు లందరికి శ్రీ రామ కృష్ణుల ను దర్శించాలనే ఇచ్చ కలిగింది .

‘బలవదరాతి మర్దనుల బాన్డునల నిభ ప్రభాగులం

గలిత నిజాననాంబుజ వికాస జితాంచిత పూర్ణ చంద్ర మం

డలుల ,బరేశులన్ ,నర విడంబినులన్ ,గరుణా పయోదులన్

విశాదలంకరిష్ణుల ,నవీన సహిష్ణుల రామ కృష్ణులన్ ‘’

నారద ,సాత్యవతేయ ,గౌతమ ,వ్యాసాదులంతా తరలి వచ్చారు .అర్ఘ్య పాద్యాలు నమస్కృతులు అందుకొన్నారు అప్పుడు శ్రీ కృష్ణుడు వారిని అడిగాడు

‘’సమ్మునీశ్వరు లారా జన్మ భాక్కుల మైన మాకు నిచ్చోట సమ్మతిని దేవ

నికర దుష్ప్రాపులు ,నిరుపమ యోగీన్ద్రులైన మీ దర్శనం బబ్బే గాదె

ధృతి మంద భాగ్యు లింద్రియ పరతంత్రులు నైన మూఢాత్ముల ,కనఘులార

భవదీయ దర్శన ,స్పర్శన ,చింతన ,పాదార్చనలు దుర్లభంబు లయ్యు

నేడు మాకిట సులభమై నెగడే గాదె –జాగృతి పై దీర్ఘ భూతులు ,సాధుమతులు

మిమ్ము దర్శించు టయ చాలు నెమ్మి తోడ –వేర తీర్థంబు లవని పై వెదక నేల ?’’

అని చాలా సద్భక్తి పురస్సరం గా గౌరవం నేరుపుతాడు పరమాత్మ .ఇదీ మర్యాదా పురుష లక్షణం .వారిని దర్శిస్తేనే సర్వ పాపహరం వారు సర్వ తీర్ధ రాజుల కంటే పరమ పవిత్రులు .ఉదకాలతో కూడిన తీర్దాలు ,మ్రుచ్చికతో కూడిన దేవా గణాలు తీర్ధ దేవతా రూపకాలు కావు .అయితే అవన్నీ చిరకాల సేవనార్చనల వల్లనే పవిత్రం అవుతాయి .కాని సత్పురషులున్నారే వీరు మాత్రం దర్శన మాత్రం చేతనే పవిత్రత కల్గిస్తారు .సకలార్ధ గోచర జ్ఞానం గల నారదాది మహర్షులు ముహూర్త మాత్రం చేత పావనం చేయగలరు .ఆత్మబుద్ధి లేనివారికి తీర్ధ స్నానం పుణ్యాన్ని ,పవిత్రతను ఇవ్వలేదు .అని శ్రీ హరి వివరిస్తాడు .దేవముని గణంశ్రీ కృష్ణ ముఖరిత పవిత్ర వాగ్మకరందం చేత ఆనంద పరవశం చెందింది .

‘’నీకంటే పవిత్రులేవరు ?కర్త భోక్త భర్త హర్త నీవు .ఎందరి కోసమో ఎన్నో చేశావు .ఇందులో హింస ఉంది ,వధ ఉంది .బాధ ఉంది .నిఖిల యజ్నశుడవైనా యాగం తో దుష్కర్మఅంతా  నశిస్తుంది ఇదే ధర్మం

‘’దేవర్షి పితృ ఋణంబులు –భూవర మఖ వేద పాత పుత్రుల చేతన్

వావిరి నీగని పురుషుడు –పోవునదోలోకమునకు బుణ్య చ్యుతుడై ‘’అంతే కాదు

‘’వర తనయధ్యయనంబుల –ధరియించితి రుణ యుగంబు దడయక ధరణీ

వరదేవ ఋణము సవనా –చరణడవై ఈగుటోప్పు సమ్మతి తోడన్ ‘’

‘’బ్రాహ్మణ ,దేవ ఋణం తీర్చుకోవటానికి యాగం యజ్న కర్తకూ తప్పదు’’ అన్నారు ఇంకేముంది .మహర్షులనే యాజకులు గా చేసి ఆ తీర్ధ ప్రాంతం లోనే అష్టాదశ భార్యా యుతుడై యాగం పూర్తీ చేసి దక్షినాదులతో సంతృప్తి చెందించాడు. సంతుస్తులైన ముని గణం స్వస్థానం చేరింది .

                బలభద్రుని ప్రేరేపించటం

శ్రీ కృష్ణుని కుమారుడు సాంబుడు దుర్యోధనుని కూతురు లక్ష్మణ ను ఎత్తుకొచ్చాడు కౌరవులు సామ్బుని చెర బట్టారు .ఈ విషయం నారదుడు హలాయుధ ధారి అయిన బలరాముని చెవిన పడేశాడు .ఆ కోపం తో ఊగిపోయిన కృష్ణుని అన్న నాగ నగరానికి వెళ్ళాడు .అక్కడ కౌరవులు అతన్ని నీచం గా మాట్లాడారు .ఆ కోపం తో నాగలితో హస్తినా పురాన్ని ఎత్తి యమునా నదిలో కలుపబోయాడు భయపడిన కౌరవులు లక్ష్మణ సహిత సామ్బుల్ని అప్పగించారు .ఇలా కరువంశం తో వియ్యమూ జరిపించాడు మహర్షి నారదుడు సుభద్రకూ లక్ష్మణ కుమారునికి జరగాల్సిన వివాహం‘’మాయా బజార్ ‘’తో విచ్చిన్న మైంది .ఇప్పుడు ఒక రకం గా మంచే జరిగింది కొత్త బంధం సంబంధం చేకూరింది నారద మహర్షి ఏది చేసినా ఇలా మంచికే దారి తీస్తుంది..మళ్ళీ  వీరి అబ్బాయి వారి అల్లుడైనాడు .ఇదంతా బలరాముని అవక్ర పరాక్రమానికి భయపడే జరిగింది

       సశేషం –మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ –22-3-13-ఉయ్యూరు 

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ పరమాచార్య పరమ పద పీయూషం

             శ్రీ పరమాచార్య పరమ పద పీయూషం

ఆధునిక జగద్గురువులు ,నడయాడే పర బ్రహ్మ స్వరూపం ,పరమాచార్యులు,  కంచి కామ కోటి పీఠాదిపతులు శ్రీ శ్రీ శ్రీ చంద్ర శేఖర  యతీంద్ర స్వామి .కాలి నడకన ఆ సేతు హిమాచల పర్యంతం పర్యటించి దర్శించిన ప్రతి చోటా అనుగ్రహ భాషణం చేసి భక్తులకు సన్మార్గ దర్శనం చేశారు .వారు తమిళ నాడు లో పర్యటించినప్పుడు తమిళం లో చేసిన ప్రసంగాల సారాన్ని ‘’శ్రీ విశాఖ ‘’గారు సరళం గా తెలుగు లోకి అనువదించారు వీటిని సంపుటాలుగా తెనాలి లోని సాధన గ్రంధ మండలి సంస్థాపకులు శ్రీ బులుసు సూర్య ప్రకాశ శాస్త్రి గారుముద్రించి ఆస్తిక జన మనోభిరామం చేశారు .వీటికి శతావధాని వేలూరి శివరామ శాస్త్రి గారు పర్యవేక్షించి నిగ్గు తేల్చారు .ఇందులో పరమాచార్యుల వారి వచో వైభవం ,పరమ ప్రామాణికత ,వేద వేదాంగాల పై వారికున్న అపార వైదుష్యం, సంగీత సాహిత్య శాస్త్రాది విషయాలపై వారికున్న అనంత పాండిత్యం మనకు దృగ్గోచర మవుతుంది ఇదంతా ఒక అద్భుత జ్ఞాన భాండాగారం .మనం తెలుసుకోదగ్గవీ ఆచరించి తరించేవి .అందులోని కొన్ని ముఖ్య విషయాలను ‘’శ్రీ పరమాచార్య పరమ పద పీయూషం ‘’గా అందజేస్తున్నాను ..

          పరమాచార్యుల వారి జన్మనక్షత్రం ‘’అనూరాధ ‘’.దాని ఆది దైవతం మిత్రుడు .వృశ్చిక రాశి .అనువాదం చేసిన విశాఖ గారి జన్మ నక్షత్రం విశాఖ .అదీ వృశ్చిక రాశియే వీరికి స్వామి సంపత్తార .స్వామికి వీరు పరమ మిత్ర తార. కనుక వారి అనుగ్రహం పుష్కలం గా వీరికి లభించింది .స్వామి వారికి జ్ఞాపక శక్తి ని కంప్యూటర్ తో పోల్చారు సుమారు ఇరవై ఏడేళ్ళ క్రితం తాము’’ చిన్న తిప్ప సముద్రం అనే గ్రామం ‘’లో  విడిది చేసిన విషయాన్ని రచయిత కు గుర్తు చేశారట .స్వామి తమిళ నాడులోని ‘’తిండీ వనం ‘’గ్రామం లో జన్మించి పదమూడవ ఏటనే సన్యాసం స్వీకరించి కామ కోటి పీఠాన్ని అధిష్టించారు .

       శివరామ శాస్త్రి గారికి స్వామి వారి పాండిత్య ప్రకర్ష పై గొప్ప గౌరవముండేది. స్వామి వారి ఉపన్యాసాలపై ‘’పెద్ద కారికలు ‘’రాయవచ్చు అని అనేవారట కాటూరి వెంకటేశ్వర రావు గారు పరమాచార్యుల కు శిష్యులు .స్వామి పై‘’నమోవాక షస్త్యన్తాలు ‘’రాసి నివేదించారట .అందులో ఒక పద్యం లో యతి భంగమైనట్లు వేలూరి వారు గమనించి‘’యతుల పై రాసిన పద్యం లోనే యతి పోతే యెట్లా ?’’అని బాధ పడ్డారట .ఒకసారి విశాఖ గారు స్వామి దర్శనానికి తల్లిగారు  భార్యతో వెళ్లారు స్వామికి వీరు నమస్కరిస్తుంటే వద్దని వారిన్చారట .’’మీ రిద్దరు ముందు మీ తల్లి గారికి నమస్కరించి తర్వాత నాకు నమస్కారం చేయండి ‘’అని హితవు చెప్పారట మాతృదేవో భవ కు ఇది నిరూపణ .స్వామి పరమ శాక్తులు అంబికా తత్వాన్నే ఎక్కువ గా బోధించేవారట ..శ్రీ ఆదిశంకర మార్గం లో నడిచే స్వామి అద్వైతానికి పెద్దపీట వేస్తారు .వారికి సర్వమతాలు సమ్మతాలే .అద్వైతానికి దేనిలోనూ విరోధం కనీ పిందని వారి భావన .

  ఒక సారి భక్త మీరా బాయి బృందావనం వెళ్ళింది అక్కడ వల్లభాచార్యులున్నారు వారిని దర్శిద్దామని కబురు చేస్తే ‘’నాకు స్త్రీ ని చూసే అలవాటు లేదు ‘’అని బదులు పంపారట . అప్పుడు మీరా ‘’ఈ బృందావనం లో శ్రీ క్రిష్ణుడోక్కడే పురుషుడు .మిగతా వారంతా స్త్రీలే అని అనుకొన్నాను మీకు ‘’నేను పురుషుడిని ‘’అనే భావం ఉంటె బృందావనం నుంచి నిరభ్యంతరం గా వెళ్లి పొండి‘’అని ఖరా ఖండి గా చెప్పి పంపింది .అప్పుడు వల్లభులకు జ్ఞానోదయం అయిందట ఈ విషయాన్ని స్వామి ‘’ఆనంద తాండవం ‘’వ్యాసం లో చెప్పారట .

         స్వామి వారికి భక్తుడొకడు స్పటికమాలను ఇచ్చారు .అందులో ఒక పగడం ‘’మేరుగు’’ గా కట్టి ఉంది  .అది అక్షమాల అని స్వామి గ్రహించారు .వెంటనే వారి ద్రుష్టి మాఘ కవి రాసిన ‘’మేఘ సందేశ కావ్యం ‘మీదకు పోయింది .నారదుడు ఆకాశ మార్గం లో వీణ ను వాయిస్తూ వస్తున్నాడు అయాన్ను మాఘుడు ఇలా వర్నిన్చడట ‘’మాలను తిప్పుతూ ఎప్పుడూ వీణ ను వాయించటం వల్ల యెర్ర బారిన నారదుని బొటన వ్రేలి ఎర్రదనం స్పటిక మాలలోని స్పటికాలను ఎర్రగా ప్రవాళములు గా మార్చేసింది ‘’అన్నాడు అందుకే స్పటిక మాలలో నిజంగా ప్రవాళాన్ని మేరువుగా ఎన్నుకొన్నాడు భక్తుడు అని తెలియ జేశారట అదీ వారి పాండిత్య గరిమ

            స్వామి ‘’మనకు కావలసింది అల్లా హృదయం ద్రవించే భక్తి. ఏదో మూట కట్టుకొని ఈలోకానికి వచ్చాం .పాపమూ వద్దు ,పుణ్యమూ వద్దు ఈ మూటను ఇక్కడే దులుపుకొని వెళ్లి పోవాలి అందుకే ఆ పరమేశ్వరి లోక మాత దారి చూపే త్రిపుర సుందరి ‘’అని తరచు చెప్పేవారట .

సుమారు తొంభై ఏళ్ళ క్రితం చెట్టినాడు లో వీరప్ప స్వామి అనే ఆయన ఉండేవాడు .మహా భక్తుడే చిత్తశుద్ధి ఉంది కాని కోపిస్టి .ఎప్పుడూ ముక్కు మీదే కోపం .ఆయనకు సుబ్బరామయ్యర్ అనే బ్రాహ్మణ స్నేహితుడు ఉండేవాడు .ఆయన్ను తన కోపం పోవటానికి మార్గం సూచించమని వేడుకొన్నాడు అయ్యర్ ‘’తిరుక్కోయిలూర్ వెళ్ళు .దారి కనపడుతుంది‘’అని సలహా చెప్పాడు వెంటనే అక్కడికి చేరాడు .అక్కడ మూల విగ్రహానికి ఎదురుగా పరమ కోపిస్టి అయిన దుర్వాస మహర్షి విగ్రహం ఉంది .మహర్షి సేవ చేసి కోపం పోగొట్టుకోన్నారట.వీరప్పస్వామి .ఆలయాన్ని బాగుచేయించాడు దేవాలయం చుట్టూ గ్రుహారామలు ఏర్పరచి తానొక కుటీరం ఏర్పాటు చేసుకొని ఉన్నాడట .రధం నిర్మించి ఇచ్చాడు .రాధ యాత్రలో బలి ఇవ్వటం సంప్రదాయం వద్దు అని వారించి రధం కదలక పోతే తానే రధచక్రాల క్రింద పడుకొంటాను అన్నాడట ఆంతే నిరాటంకం గా రధ యాత్ర ఏ జంతు బలీ లేకుండా అప్పటి నుంచి సాగిందట .

          సమస్త వస్తువులు తమ కాంతిని ,శక్తిని,  ఆకారాన్ని ఆ సర్వేశ్వరుని మూలం గానే పొందుతున్నామని ఈ జగత్తును చిన్మయం గాభావించి భగవన్మయం గా చూడ గలిగితే దుఖం అనేది ఉండదు దుఃఖ తీరాన భగవత్ప్రేమ వృద్ధి చెందాలి అని పరమాచార్య భాషణం అందరికి శిరో దార్యం .

               అప్పయ్య దీక్షితుల వారు గొప్ప శివ భక్తులు ఒక సారి వారికే అనుమానం వచ్చి తనకున్నది భాక్తియా లేక భక్తి అభాసమా ఆని వితర్కిన్చుకోన్నారట .పరీక్షించుకోవటానికి ఉన్మత్త అవస్థను పొందారు .కావాలనే .ఆ స్తితిలో మన ఆలోచనలు ఎలా ఉంటాయో అదే మన నైసర్గిక గుణం అవుతుంది అని తీర్మానించుకొని మందు తిని పిచ్చి వాడై పోయాడు .తాను పిచ్చితనం లో చెప్పినదంతా రాసి ఉంచమని శిష్యులకు చెప్పారు అప్పుడు దీక్షితుల వారు ఏక ధాటిగా యాభై శ్లోకాలు చెప్పారట .అవి గ్రంధాసస్థమైనాయి వీటికి ‘’ఉన్మత్త పంచశతి ‘’అని పేరు .అందులో ఒక శ్లోక భావం తెలుసు కొందాం ‘’శివా !నీ అనుగ్రహం అంతం లేనిది .సులభం గా లభించే జిల్లేడు పూలు తమ్మిపూలు భక్తులనుంచి గ్రహించి వారికి మోక్ష సామ్రాజ్య లక్ష్మి నే అనుగ్రహిస్తున్నావు ఇది తెలియక మేము మా కాలాన్ని వృధా చేసుకొంటున్నాం ‘’అని ఈకదను పరమాచార్య ఒక చోట వర్ణించి చెప్పారు .

         కామ కోటి పీఠం ఉంది కంచిలో .’’కద కంచికి వెళ్ళింది ‘’అనే సామెత మనకు తెలిసిందే అంటే అర్ధం మాత్రం మనకు చాలా మందికి తెలీదు .కంచికి వెళ్లి కామాక్షి అమ్మవారిని కనులారా దర్శించి తే మళ్ళీ ఆ జీవికి జన్మ ఉండదు అంటే మనకద కంచికి చేరింది అన్నమాట .అ మ్మ వారి ప్రభావం అంత గొప్పది అని అర్ధం ఇక్కడి స్వామిఏకామ్రనాధుడు .ఆయనే ఆదిమ పురుషుడు .అమ్మవారు ‘’నయన పీయూషం’’ గా కన్పించి జన్మ రాహిత్యాన్నిస్తుంది. శ్రీ శంకర భగవత్పాదులు దక్షిణా మూర్తి స్తోత్రం లో ‘’భూమి నీరు నిప్పు ,గాలి ,ఆకాశం సూర్యుడు ,చంద్రుడు ,పురుషుడు అనే రూపం లో భవుడు ఉన్నాడని చెప్పారు .ఆ భవుని పత్ని భూమి ,సూర్యుడు , వాయువు ,ఆకాశము, అగ్ని సోమయాజి ,ఉదకం చంద్రుడు అనే అష్టమూర్తుల రూపం ఉన్న ఆదిమ జనని అనితాను ఆ జగజ్జననిని కంపా తీరం లో చూస్తున్నాననిమూక కవి వర్ణించారు  వీరిద్దరిని చూస్తె ‘’సౌందర్యం ఆనందాన్ని వివాహం చేసుకొన్నది ‘’అనిపిస్తుంది అంటారు పరమాచార్యుల వారు  (.beauty has married bliss )

స్వామివారొక సారి ‘’ఆర్యా వృత్త ములో ఉన్న కావ్యాలను గురించి అడిగారు  తమకు తెలిసిన ఆర్యా శతకం ఒక్కదానినే శిష్యులు పేర్కొన్నారు అప్పుడు స్వామి సదాశివ బ్రహ్మేన్డ్రుల వారు రాసిన ‘’ఆత్మవిద్యా విలాసం ‘’అనే వేదాంత గ్రంధం ఆర్యా వృత్తం లోనే రాయబడిందని చెప్పారు ఇంకా ఏమి ఉన్నాయని అడిగితే అందరు నోళ్ళు వెళ్ళ బెట్టారట అప్పుడుపరమా చార్యుల వారు  భక్త్యావేశం లో చేతులు పైకెత్తి ‘’అమల కమలధి వాసిని –మనసో వైమల్య దాయిని మనోజ్ఞే –సుందర గాత్రి సుశీలే –తవ చరణంణాంభోరుహం నమామి సదా ‘’అనే శ్లోకం తో ప్రారంభించి 14 శ్లోకాలను ఆర్యా వృత్తం లో ఉన్నవాటిని వినిపించి శ్రోతలను రసోన్ముఖులను  చేశారట ఇవి శ్రీ శంకర  భగవత్పాదుల ‘’ప్రపంచసారం ‘’లో ఉన్నాయని చెప్పి అందర్నీ సంభ్రమాశ్చర్యం లో ముంచెత్తేశారట. .అదీ వారి దిషాణా ,ధారణా జ్ఞాపకశక్తీ .ఇదే వారి పరమ పద పీయూష లహరి   .

          సమాప్తం  మీగబ్బిట దుర్గా ప్రసాద్ –21-3-13- ఉయ్యూరు 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

జ్ఞానదుడు మహర్షి నారదుడు -16

        జ్ఞానదుడు మహర్షి నారదుడు -16

   ధర్మ రాజు రాజ సూయం లో నారదుని మార్గ దర్శ కత్వం

ధరిత్రి లో ధర్మ హాని జరుగుతోందని మాట విన బడ్డా ,మనసులో కదిలినా ధర్మ రక్షణార్ధం తగిన వారిని పురమాయించి ఆ పని నేర వేర్చటం నారదుని అలవాటు .ఒక రోజు శ్రీ కృష్ణ స్వామి ద్వారకలో కొలువై ఉన్న సమయం లో ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి తన మొర విని పించాడు .జరాసంధుడు బల మద గర్వం తో ‘’తనకు మొక్కని రాజులను ‘’20,000మందిని గిరివ్రజ పట్టణం లో బందీలుగా చేశాడని ,వారందరి పంపున తాను వచ్చానని ఆ ఘోర రాక్షసుని బారి నుండి భూమిని ,భూదేవుల్ని ,భూ పాలకులను సంరక్షించ మని విన్న విస్తూంటాడు ఇంతలో అకస్మాత్తుగా నారద మహర్షి అక్కడ ప్రత్యక్షం .

‘’శారద చంద్రికా సారంగు రుచి తోడ ,జడముడి కెంపు చే జరచి ,నవ్య

  శరదంబు దావ్రుత సౌదామనీ లతా శోభ ,గాంచన కటి సూత్ర మలర

  లలిత పూర్ణేందు మండలకము గతి ,మృదు మ్రుగాజిన రుచి మించు చూప

  గల్ప శాఖాగ్ర సంగత పుష్ప గుచ్చంబు లీల ,గేలను నక్షమాల యమర

  భూరి పుణ్య నదీ తోయ పూణమున –దాగు కమడలునోక్క హస్తమున తనర

  వెల్ల జన్నిదమ రుత శోభిల్ల వచ్చే –నారదుండు వివేక విశారడుండు ‘’

                  యదా ప్రకారం శ్రీ కృష్ణుడు మహర్షికి గౌరవం గా అతిధి మర్యాదలు చేశాడు వినయం తో నారదుని తో‘’ఇప్పు దేన్డుండి వచ్చితి విన్డులకును –నఖిల లోకైక సంచారి వగుచు

నీ యెరుంగని యర్ధంబునిఖిల మందు –నరయ లేదండ్రు మిమ్మొకడడుగా వలయు ‘’

ద్రుష్టి పాండవుల మీదికి పోయింది యదు వంశ మౌలికి .వారి యోగ క్షేమాలు తెలుసుకోవాలని పించింది

‘’పాండు నందను లిప్పుడేపగిది నెచట –నున్న వారలో ఎరిగింపు మన్న

మౌని కర సరోజాతములు మోడ్చి –కడక తోడ బలికె –గమలాక్షు జూచి సద్భక్తి మెరసి ‘’

పరమాత్ముడైన వాసుదేవునికి తెలియని విశేషాలేముంటాయి అయినా అడిగాడు కనుక చెప్పుతున్నాడు ..ధర్మ రాజు  రాజ సూయ యాగం చేస్తున్నాడని తన ఆత్మ బందుడైన భక్త వత్సలుడైన పరమ పూరుషుడైన ,యజ్న రక్షకుడైన, యజ్న భోక్త అయిన శ్రీ కృష్ణుని ఆహ్వానించి తీసుకొని రమ్మన్నాడని ఆ యాగాన్ని రక్షించే భారం స్వీకరిచమని కోరాడని తెలియ జేశాడు .అంటే బావ శిశు పాలుని వధకు సిద్ధం కావలసింది అని భావం .ఆయన పేరు విన్నా తలచినా పాపాలు హరిస్తాయి అలాంటి  యజ్న నారాయణ మూర్తి ని అవమానించినా , అపహసిన్చినా వాడి చావు మూడిందేదే .నన్న ఆంతర్యం నారద వచనాలలో స్పష్టమవుతుంది .

‘’నీపేరు వినిన ,నొడివిన బాపంబులు దూలి పోవు పద్మాక్ష ,జగ

ద్దీపక ,నీ దర్శనమున –నేపారవె భక్త జనుల కిహ పర సుఖముల్ ‘’

‘’భావదీయోజ్వల కీర్తి దిగ్వితతుల్ భాసిల్లు యుష్మత్పదో

ద్భవ నైర్మల్య జలంబు లుత్కలిక బతాళంబులంబునన్  బారు భో

గవతీ నామ మునం దనర్చి ధరణి గంగా నదీ రూపమై

దివి మందాకినీ యై ,జగత్రయమునం దీపించు గా దే హరీ ‘’

‘’ ఆ మఖ వళ సమస్త ధ –రా మండలిల్గు మేటి రాజులు   మౌని

  స్తోమంబును భవదీయ మ –హా మహిమము జూచి సత్క్రుతార్ధత బొందన్ కలరు ‘’

అని చెప్పాడు .ఎల నవ్వు మొగం తో ఉద్దవుని ఆలోచించి ,ధర్మ రాజు రాజ సూయ యాగానికి తరలి వెళ్ళాడు యదు వంశ విభుడు .ఇలా లోక రక్షకునికి కూడా ప్రేరేపణ కల్గించాల్సిన సమయం లో తన వంతు ధర్మాన్ని నెర వేర్చి ,అధర్మ పద గాముల పీచాన్ని అడంచ టానికి ముందుకు వచ్చే ధర్మ పద దర్శనుడు మార్గ దర్శీ మహర్షి నారదుడు .అంతటి మాయావీ మహర్షి చెప్పిన మాటలు విని శిశు పాలుని ద్రుంచి ,జరా సంధుని చీల్పించి లోక రక్షణ చేశాడు   

              సశేషం –మీ –గబ్బట దుర్గా ప్రసాద్ -21-3-13-ఉయ్యూరు

 

Posted in రచనలు | Tagged | Leave a comment

సెక్స్ సెన్స్ ముళ్లపూడి వెంకట రమణ ‘శృంగార శాఖా చంక్రమణం’

సెక్స్ సెన్స్


‘శృంగారం’ అంటే ఏమిటి?
‘శృంగారం’ ఎలా పుట్టింది?
‘శృంగారం’ సారాంశం ఏమిటి?’
వీటన్నిటి గురించి తనదైన శైలిలో ముళ్లపూడి వెంకట రమణ ‘శృంగార శాఖా చంక్రమణం’ అంటూ రాసుకొచ్చారు. బాపు చేతిరాతతో వచ్చిన ఈ పుస్తకంలోని కొన్ని భాగాలతో కాసేపు మన రొమాన్స్…

గ్రూచో మార్క్సు రాసిన హిస్టరీ ఆఫ్ మేన్‌కైండ్ గుర్తొచ్చింది -వినండి.
ఆదిమానవుడూ మానవీ ఒకరోజు గుహలోంచి బయటకొచ్చారు. దుంపలూ పళ్లూ చేపలు తెచ్చుకోడానికి బయలు దేరారు.
ఆహార నిద్ర భయ మైధునాలలో వాళ్లకి మొదటి మూడే తెలుసు. ఆడా మొగా తేడాలు కూడా అంతగా తెలీవు. కళ్లూ చెవులూ కాళ్లూ చేతులూ వగైరా ఎక్విప్‌మెంట్ ఇద్దరికీ సమానంగానే ఉంది -బొడ్డు కింద ఒక చోట తప్ప -కొంచెం అటూ ఇటూగా సమానంగానే ఉన్నారు.
ఆ ఒక్క తేడా గురించి చెప్పబోతూ ఒక సభలో వక్త -” దేరీజ్ ఎ ఫండమెంటల్ డిఫరెన్స్ బిట్వీన్ మేన్ అండ్ ఉమన్” అని ఆరంభించాడు. ‘వైవా లా ద డిఫరెన్స్'(ఆ తేడాకి జిందాబాద్) అని అరిచాట్ట సభలోని ఒక ఫ్రెంచి శ్రోత-
సరే -ఆదిమానవులిద్దరూ గుహబైట నిలచి అటూ ఇటూ చూస్తుండగా కారు మబ్బులు మీద కురికాయి. చీకటి. చీకటిలో మెరుపులూ ఉరుములూ -దగ్గర్లోనే పెద్ద శబ్దంతో గుండెలదిరేలా అరడజను పిడుగులు పడ్డాయి. కుంభవృష్టిగా వర్షం.
ఇద్దరూ గుహలోకి పరుగెత్తి భయం కొద్దీ ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకున్నారు..కున్నారు..కున్నారు.. అలాగే ఉన్నారు… కొన్ని విఘడియల తరవాత చలి తగ్గింది.
అంతేకాదు. అంత చలిలోనూ చిరు చెమటలు పట్టాయి. కళ్లు తేలిపోతున్నాయి. ఒళ్లు తూలిపోతోంది. ఈ భయం -తిండి కన్న నిద్ర కన్న బాగుందే అనుకున్నారు. వాన వెలిసింది.

మళ్లీ పిడుగులూ వర్షం ఎప్పుడొస్తాయీ అని ఎదురుచూడసాగారు. అవి వస్తే గుహలోకి వెళ్లి భయంతో వాటేసుకోవచ్చు.
చివరికి విసుగేసి బయట నిలబడి -‘వానా..రా! పిడుగూ..రా!’ అంటూ చప్పట్లు కొట్టారు. అదే ఆది తాళం.
చిందులు తొక్కారు. అదే ఆది నాట్యం.
అరిచారు. హోహో అన్నారు. ఢాం ఢాం తప తప అన్నారు.
ఆది శబ్దం ఆది సాహిత్యం.
కొన్నాళ్లకి వర్షం పడింది. వాళ్లు భయం నటించి గుహలో దూరి వాటేసుకున్నారు.
ఈ సారి వర్షం ఎడతెరిపి లేకుండా నాలుగు మాసాలు కురిసింది. భయపడి పడి వాళ్లకి విసుగేసింది.
ఇంక చాలు అని చప్పట్లు కొట్టారు.
ఇద్దరు పిల్లలు పుట్టారు.
సంభోగం మీద విరక్తిలోంచి సరికొత్త రక్తిలోకి సంతోషంలోకి మేలు కొన్నారు. అర్థవంతంగా సృష్టి సాగింది.
*** ఒక కవి రుషి స్వర్గానికి వెళ్లాడు. చాలా ఆత్రంగా ఉన్నాడు – “ఏం కావాలయ్యా” అని అడిగాడు ఇంద్రుడు. “రంభోగం” అన్నాడు రుషి.
“అంటే?”
“అదే స్వామీ -రంభతో” ….అంటూ సిగ్గుపడిపోయాడు.
“రంభా సంభోగం కుదించి రంభోగం అన్నావా! సెబాష్ కవీ.
ఆ తోటలోకి వెళ్లు రంభ వస్తుంది” -అన్నాడు ఇంద్రుడు.
తోటలోకి రంభ వచ్చి నిలుచుంది -మెకానికల్‌గా బట్టలు వూడదీస్తూ. కవి కవితావేశంతో పేట్రేగిపోయాడు.
ధన్యుడిని రంభాదేవి అన్నాడు దండం పెట్టి.

“అప్పుడే? ఇంకా”…
“అంటే నిన్ను చూసి ధన్యుడినయాను. నీ కళ్లు కలువ రేకులు. పెదిమలు దొండపళ్లు. కుచములు కుంభ స్థలములు. తొడలు అరటి బోదెలు. ఘనజఘనాలు ఇసుక తిన్నెలు” అంటుండగా రంభ బెదిరి చూసి దుప్పటి కప్పేసుకుంది. వాటితో పోలుస్తున్నావు కవీ -నా అంగాల కన్నా అవే అంత బాగుంటే వెళ్లి వాటినే వాటేసుకుని పండుకో అంటూ రంభ జంభారి యింటికి వెళ్లిపోయింది. స్వర్గానికి వచ్చిన అతిథుల కోసం పెట్టిన భేటీ కుదరకపోతే ఆనాటి రంభా సంభోగం ఇంద్రుడి కోటాలో పడుతుందిట.(దాన్ని మాత్రం శచీ దేవి అభ్యంతర పెట్టకూడదు -అది డ్యూటీ – బహ్వృ -చూడు)

“అయ్యో! శృంగారం కోసం నాలుగు పంక్తులంటే పొమ్మంటివా! ఈ ఉపమాన భంగం భరించలేను” అంటూ కాలుజారి పడ్డాడు కవి. సంభోగం అనేది కేవలం విధి నిర్వహణ అయినందువల్ల -రంభకి శృంగారం బొత్తిగా తెలీదు. అందుకని కవిగారు లొట్టలు వేస్తే అలా అపార్థం చేసుకుంది. కానీ స్వర్గంలో సంసారాలు చేసుకుంటున్న ఇతర దేవగణాలకూ – వారే యేమిటి -సాక్షాన్మహావిష్ణువుకూ శృంగారం అంటే ఎంతో సరదా కాని స్వర్గానికి అది అందుబాటులో లేదు.

అందుకే –
ఎల్లవేళలా భయభక్తులతో కాళ్లుపట్టే లక్ష్మీ దేవితో శృంగారం కొరవడి తనను కాళ్లతో తన్నే సత్యభామ శృంగారం కోరి, శ్రీ వైకుంఠ విరక్తుడై భూలోకానికి దిగివచ్చాడు. ఆయనే కాదు -ఎందరో దేవతలు, స్వర్గం చేరిన రుషులూ, ఊర్వశిలాటి అప్సరసలూ శాపాలు ఇప్పించుకుని మరీ భూ లోకానికి దిగి వచ్చారు ఉబలాటంతో.

*** శృంగారం అనగానే కామక్రీడల గొడవ అని రూఢర్థం ఏర్పడిపోయింది కాని చూడగలిగే వారికి అనేక విషయాల్లో శృంగారం భాసిస్తుంది.
వంటకోసం కూరలు తరగడం, తాళింపు సామాను అమర్చుకోడం…
వేయబోయే బొమ్మకోసం వచ్చే ఊహలు, వాటి ప్రకారం పెన్సిలుతో స్కెచెస్ వేసుకోడం…
పాటకు రాగాలు వెతుక్కోవడం… స్వరాలు అమర్చుకోవడం… మార్చుకోవడం కథకు వస్తువు, దానికోసం పాత్రలూ, వాటి వేష భాషలూ ఊహించుకోవడం…
ఇలా నిత్య జీవన వ్యాపారాలన్నిటా శృంగార దృష్టితో ఆలోచిస్తే జీవితం చాలా సరదాగా ఉత్సాహభరితంగా శోభిస్తుంది.
దేవుడిని ఆరాధించిన భక్తులు కూడా స్తోత్రాల్లాగా -నీకు నాలుగు చేతులున్నాయి మంచి మంచి నగలున్నాయి అని పొగడకుండా ఆయనకు భక్తి సంగతుల ద్వారా అనురాగంతో అర్చించి శోభించారు.

శృంగారం పరమార్థం సంతోషం; మోక్షం కాదు పుట్టినప్పటి నుంచి వేళయేదాకా సరదాగా బతకడం.

శృంగార శాఖా చంక్రమణం
ముళ్లపూడి వెంకటరమణ
పేజీలు: 30, ధర: రూ.60
ప్రచురణ: వాహిని బుక్ ట్రస్టు
ఫోన్: 040 -24652387

Posted in పుస్తకాలు | Tagged | 2 Comments

నాదారి తీరు –17 నాలుగో స్కూలు –కాటూరు

   నాదారి తీరు –17

         నాలుగో స్కూలు –కాటూరు

మొత్తం మీద శ్రీ తూమాటి కోటేశ్వర రావు గారి మాట నెగ్గింది. నాకు కాటూరు హైస్కూల్ కు ట్రాన్స్ ఫర్ జరిగింది .మానికొండ లో 17-8-1968 సాయంత్రం రిలీవ్ అయి మూడు రోజులు మాత్రమె  ట్రాన్సిట్ వాడుకొని 21-8-68 న కాటూరు హైస్కూల్ లో చేరాను .చాలా చరిత్ర ఉన్న స్కూలు .కడియాల వెంకట్రామయ్య వారి యాజమాన్యం లో ఉన్న స్కూలు .మంచి వాతావరణం .చుట్టూ కొబ్బరి చెట్లు .వ్యవసాయం చేసే పొలమూ ఉంది .కూరగాయలు బాగా పండిస్తారు .వాటిని నాలుగు రోజుల కోసారి వేలం నిర్వహించి ఆ డబ్బు ను స్కూల్ జెనరల్ ఫండ్ లో జమ చేస్తారు .ఆ ధనాన్ని విద్యార్ధుల సంక్షేమం కోసం ఖర్చు చేస్తారు .

           నాకు ఎస్ ఎస్.ఎల్.సి.క్లాసుల సైన్సు సబ్జెక్ట్ పదో తరగతి జెనరల్ లెక్కలు మిగిలిన క్లాస్ లకు సైన్సు ఇచ్చారు .మంచి స్టాఫ్ రూమ్ ఉంది .పీరియడ్లు అనుకూలం గా నేఉన్నాయి .ఖచ్చితం గా రెండో బెల్ కొట్టేసరికి టీచర్లు క్లాసు లకు వెళ్ళాలి .కోటేశ్వర రావుగారి  డిసిప్లిన్ గొప్పది .అందరు రూల్స్ పాటించాల్సిందే .నత్తా నాగేష్  గారు స్టాఫ్ సెక్రెటరి .పంచె కట్టే వారు .సీనియర్ ఉపాధ్యాయులు హరి గౌతమేశ్వర రావు గారు అనే సోషల్ మేష్టారు ఆర్ .ఎస్.ఎస్..సీనియర్ కార్య కర్త .ఆ సంస్థ పై వీరాభిమానం ఉండేది జనసంఘ పార్టీ అంటే ప్రాణం .చాలా నిదానస్తులు .పంచ కట్టుకొని చొక్కా వేసే వారు ఎర్రగా పొడుగ్గా సూటి పెద్ద ముక్కుతో ఉండేవారు .పువ్వుల రామ మోహన రావు గారు సీనియర్ హిందీ పండిట్ .ముదునూరు వారు .రోజు అక్కడి నుండే వచ్చేవారు .పంచకట్టుకొనే వారు .తెలుగు కు ములగలేటి శర్మ గారు సీనియర్  .పొట్టిగా పంచ కట్టుతో నిలువు బొట్టు తో ఉండేవారు స్నేహశీలి గలగలా మాట్లాడే వారు కవి కూడా .మా పెద్ద కోడలు సమతకు దగ్గర బంధువులు ..జూనియర్ తెలుగు పండితులు ఘంట సాల కు చెందిన శివారాధకులు శర్మ గారు నల్ల గా ఉండేవారు ఆయనా పంచాకట్టే .

                  నేనంటే పడని ఒకే ఒక్కడు

 

   లెక్కలకు నర్రా వెంకట రత్నం గారు .అందరు నన్ను పలకరించారు ఆప్యాయం గా .ఈయన మాత్రం ముఖం ముడుచుకొని ఉండేవాడు .ఆయన కళ్ళు చింత నిప్పుల్లా ఉండేవి ఈయన పలకరించక పోవటానికి కారణం గౌతమేశ్వర రావు గారుఆ తర్వాత  చెప్పారు ‘’మీరు ఇక్కడికి రావటం వెంకట రత్నానికి ఇష్టం లేదు .మీరు వస్తే తాను వెళ్లి పోతానని హెడ్ మాస్టర్ ను కమిటీ ని బెదిరించాడట .వాళ్ళు ‘’నువ్వు ఉంటె ఉండు .పోతే పో.దుర్గా ప్రసాద్ గారు ఇక్కడికి రావటం ఖాయం .నీఇష్టం ఏం చేసుకొంటావో చేసుకో ‘’అన్నారట .అందుకని ముఖం చెల్లక పలకరించాలేదట .అదీ ఇక్కడి విషయం .చూసింది అంతా బంగారం  కాదన్న సామెత అర్ధమయింది.‘’ఆల్ ఈజ్ నాట్ వెల్’’అని పించింది . క్రమం గా వెంకట రత్నం స్నేహితుడయ్యాడు బాగా మాట్లాడే వాడు మంచి లెక్కల మేస్టారు అతను .సుబోధకం గా ఉండేది అతని బోధనాపటిమ . .పాంటు ముడ్డి మీదకు జారి పోతు ఉండేది .రంగుల చొక్కా రంగుల పాంటు తో ఉండేవాడు రెండు బాగా నలిగి ఉండేవి గుడివాడ క్లబ్ లో తెల్లార్లు పేకాడి సరాసరి స్కూల్ కు వచ్చేవాడని అనుకొనే వారు .అందుకే కళ్ళు యెర్ర బొగ్గు కణికల్లా  ఉండేవి .నేను చేరిన కొన్ని నెలలకు ఆయన యెవరీ చెప్పకుండా ,సెలవు పెట్ట కుండా ‘’జంప్ జిలాని‘’అయ్యాడు .మద్రాస్ లో పేకాడుతున్నట్లు తర్వాత ఎప్పుడో తెలిసింది .అతని భార్య కాటూరు పి.హెచ్.సి.లో గవర్న మెంట్ నర్సు .చాలా యోగ్యురాలు అని చెప్పుకొనే వారు. పిల్లలున్నారు కాని వెంకటరత్నం ఇవేవీ పట్టించుకోకుండా రికామీ గా తిరుగుతూనే ఉండే వాడు .ఇది ఇక్కడ మొదలు కాదు ప్రతి స్కూల్ లోను ఇదే పరిస్తితి ఆ తర్వాతా నాతో ఉయ్యూరు స్కూల్ లో పని చేశాడు .56 రోజుల స్ట్రైక్ లో ఇద్దరం కలిసి పనిచేశాం ఉయ్యురు  మండలం స్ట్రైక్ కు నేను కన్వీనర్ని అతను నాకు అసిస్టంట్ .చివరికి కాటూరు లో అతన్ని వెదికి తీసుకొని రమ్మనిన హెడ్ మాస్టారు తెలిసిన వారిని పంపించి వేదికించి పట్టుకొని తెప్పించారు .కాని అయన మళ్ళీ అదే ధోరణి .మళ్ళీ జంప్.చివరికి కాటూరు నుంచి పంపించేశారు . ఇదీ వెంకట రత్నం కదా .ఇంకా ఉంది ఇంకో సారి రాస్తా .

   ఇద్దరు డ్రిల్లు మేస్టార్లు ఒక ఎన్డి.ఎస్..ఉదేవారు మంచి గ్రౌండ్ ఉంది .పిల్లలు బాగా ఆడేవారు సుంకర వెంకటేశ్వర రావు అనే ఆ ఊరి వాడే పెద్ద డ్రిల్ మేష్టారు పలుకు బడి ఉన్నవాడు .మునసబు గారికి బంధువు వెంకట రత్నం అనే బెజవాడ అయన యెన్.డి.ఎస్.చాలా మంచి వాడు .చిన్న డ్రిల్లు మేష్టారు శర్మ గారు కుందేరు నివాసి .తర్వాతా లా పాసై రిటైర్ అయిన తర్వాతా లాయర్ గా ప్రాక్టీస్ చేశాడు నాకు మంచి మిత్రుడు శర్మ గారు .పలుకు బడి ఉన్నవాడు ..మునసబు అంటే అందరికి హడలే ఆఊళ్ళో .ఆయన కే మా కాటూరు పొలం శిస్తులు చెల్లించేవాళ్ళం. కాని శిస్తులకు వెడితే చాలా మర్యాదగా నే ఉండేవాడు .పంచ కట్టుడు మనిషి .లావుగా ఉండి గంభీర కంఠంతో మాట్లాడే వాడు .సైన్సు కు నాతోబాటు  ఏ.సూర్య నారాయణ రెడ్డి అనే దావులూరు నేటివ్ ఉండేవాడు సన్నగా రివట గా ఉండేవాడు .నేచురల్ సైన్సు అద్భుతం గా బోధించే వాడు అతను చెబుతుంటే పిల్లలకు అక్కడికక్కడే అర్ధమయ్యేది మా ఇద్దరికీ బోధనా లో పోటీ .లెక్కలకు గుంటూరు వాడు నాగేశ్వర రావు అనే అతనున్నాడు చీటికీ మాటికీ పార్టీలు ఇచ్చేవాడు ఇనుప బీరువా కొన్నందుకు ఉదయం పార్టీ ఇచ్చాడు ఇంటి దగ్గర .బాగా డబ్బు మదించిన వాడు భార్య విజయ లక్ష్మి ఇక్కడే సెకండరి గ్రేడ్ టీచర్ పిల్లలు అమెరికా లో ఉన్నారు మరదలు కస్తూరి గారు కూడా టీచరే ..ఇతను కాటూరు లో వ్యవసాయం చేసేవాడు .వారానికో సారి గుంటూర్ వెళ్లి అక్కడి పొలాలు చూసుకొనే వాడు .సూయా యా పరుడు గా కనీ పిస్తాడు .హెడ్ మాస్తారయ్యాడు .మేమిద్దరం పోట్లాడుకోన్నట్లు గా మాట్లాడుకొనే వాళ్ళం .ఇప్పటికీ అదే విధం గా ఉంటాం .కాటూరు పొలం వెళ్లి నప్పుడల్లా కానీ పించేవాడు .మండవ కోటేశ్వర రావు గారు అనే కాటూరు పెద్ద మనిషి తో అతనికి సాగు స్నేహం నాకూ ఆయన మంచి ఇరుగు పొరుగు చేల సన్నిహిత్వం మంచి సలహా దారు పెద్ద మనిషి కొడుకు కోడలు బెజవాడలో పెద్ద డాక్టర్లు భార్య అనారోగ్యం కాటూరు వదిలి వెల్ల లేదు వ్యవసాయం బాగా చేసే వాడు కోటేశ్వర రావు గారు .గుమాస్తా సుంకర వెంకటేశ్వర రావు అనుకొంటా మంచి పని తెలిసిన వాడు ఆ తర్వాతా జిల్లా పరిషద్ లో ఆఫీస్ సూపరిం టేన్దేంట్ అయాడు భార్య ఇక్కడే సెకండరి టీచర్ ..కడియాల ప్రసాద్ అనే సెకండరి ఉపాధ్యాయుడుందే వాడు మాటకారి లెఫ్ట్ భావాలున్న వాడు సంజీవ రావు గారి అబ్బాయి గా చలా మణి అయేవాడు పంచకట్టు మనిషి .సంజీవరావు గారికి ఊళ్ళో పచారి దుకాణం ఉండేది ఇంకొకరితో భాగస్వామ్యం .మంచి సరుకు దొరికేది .ఉయ్యూరు లో మా గేదెలకు చిట్టూ,తవుడు ఇక్కడే కొని రిక్షా లో తీసుకొని వెళ్ళేవాడిని అప్పు పెట్టి జీతం రాగానే తీర్చటం మామూలు .బియ్యం కూడా  దొరికేవి .ఒక క్రిస్టియన్ టీచర్ కృపా రావు  ఉండేవారు చాలా మంచి టీచర్ .పెద్ద మనిషి .నాకు ఆదర్శం .పంచ కట్టు మనిషే .భార్య ఇక్కడే టీచర్ కొడుకు ,కూతురు ఇక్కడే స్కూల్ లో చదివే వారు .కొడుకు డిగ్రీ పాసై బి.యి.డి.కోసం ప్రయత్నిస్తూ రాకపోతే నా దగ్గరకు ఉయ్యూరు వచ్చి చెప్పారు అప్పుడు నేను కాంతా రావు ,ఆంజనేయశాస్త్రి పిచ్చి బాబు మొదలైన వారందరం కలిసి బందరు వెళ్లి కొల్లూరి కోటేశ్వర రావు గారికి చెప్పాం ఆయన మమ్మల్ని తనతో తీసుకొని వెళ్లి బియి.డి కాలేజి కరస్పాండెంట్ తో మాట్లాడి సీటు వచ్చేట్లు చేశారు .ఇదంతా ఎప్పుడో ఆ తర్వాత చాలా కాలానికి జరిగిన కదా ఇప్పుడే చెప్పేశాను .అంతే ..సరదా గా కాలం గడిచి పోతోంది ..

                 కాటూరు కాపురం విశేషాలు ఆనక రాస్తాను .

   సశేషం –మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ –20-3-13-ఉయ్యూరు

 

Posted in నా దారి తీరు | Tagged | 1 Comment

‘చెట్లు చెప్పిన కత ”

సాహితీ బంధువులారా -”నడుస్తున్న చరిత్ర ”మార్చి నెల పత్రిక లో సా.వెం  రమేష్  రాసిన ”చెట్లు చెప్పిన కత ”చదవండి మనం మరిచి పోయిన ఎన్నో పలుకు బడులను ఆయన కధలలో మళ్ళీ పురుడు పోసుకోన్నాయి .ఈ కదా అంతే-మళ్లీ  మనకో ”ఆధునిక పంచతత్రం ”కనీ పించి అద్భుత పరుస్తుంది 

ఓపిగ్గా చదవండి ఎన్ని ఎన్ని అచ్చతెలుగు పలుకు బడులో దర్శన మిస్తాయి ఆనందింప జేస్తాయి ఆతనికి హాట్స్ ఆఫ్ అన బుద్దేస్తుంది మనం గర్వించదగిన గొప్ప తెలుగు కదా రచయిత  రమేష్ హాసూర్  ప్రాంతపు తెలుగుకు పట్టం కట్టిన రచయిత లకు రమేష్ ష్స్ఫూర్తి ప్రదాత ,చోదకశక్తీ కూడా అతని” ప్రళయ కావేరి కధలు” తెలుగు జాతి గర్వం గా చెప్ప్పుకోదగిన ఆణి   ముత్యాలు కనుక ఈ చెట్లు చెప్పిన కతలను చదివి మనస్పూర్తిగా స్పందించండి 

— మీ–గబ్బిట  దుర్గా ప్రసాద్ –20-3-13-ఉయ్యూరు 

saa.vem.ramesha cheppina chettu kadha-1saa.vem.ramesha cheppina chettu kadha-2 saa.vem.ramesha cheppina chettu kadha3 saa.vem.ramesha cheppina chettu kadha-2 saa.vem.ramesha cheppina chettu kadha-4 saa.vem.ramesha cheppina chettu kadha-5 saa.vem.ramesha cheppina chettu kadha-6saa.vem.ramesha cheppina chettu kadha-7

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అరుదైన సార్థక నామధేయుడు – సామల రమేష్‌బాబు

 

అరుదైన సార్థక నామధేయుడు
– సామల రమేష్‌బాబు

 


నిబద్ధతకు, నిజాయితీకి ప్రతిరూపంగా జీవించిన వ్యక్తుల్ని అరుదుగా చూస్తాం. సోమవారం అర్థరాత్రి మరణించిన సి.ధర్మారావు అటువంటి మనిషి. పసిపిల్లల నుంచి వయోవృద్ధుల దాకా అందరూ ఆయనకు స్నేహితులే. ఆయన ప్రభుత్వోద్యోగిగా పనిచేసిన కాలంలో తనకెదురుగా కనిపించేట్లు పెట్టుకున్న చిన్న చెక్కపలకపై రాసి ఉండేది – “ఎదురుగా ఉన్న వ్యక్తిని చిరునవ్వుతో పకలరించలేనంత తీరుబడి లేకుండా ఉన్నామా?”- అని. ఉద్యోగ విరమణ చేస్తూ ఆ పలకను తన ఇంటికి తెచ్చుకొని వాకిలికి తగిలించుకొన్నారు. తన పేరుకు తగ్గట్లే ఆయన ధర్మారావే. తల్లిదండ్రులు పెట్టిన పేరుకు సరిగ్గా వ్యతిరేకంగా ప్రవర్తించేవారిని మనం ఎక్కువగా చూస్తాం. కానీ, ధర్మారావు సంగతి ప్రత్యేకం. అవినీతికి, అధర్మానికి ప్రతీ కలుగా ఉన్నత ప్రభుత్వోద్యోగులను పరిగణిస్తున్న వర్తమాన కాలంలో ధర్మారావు పూర్తిగా ధర్మప్రవర్తనతోనే జీవించారు. తన వద్దకు ఏ పనిమీద వచ్చిన వారినైనా, తన ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సందర్భంలోగానీ, ఇతర పనుల మీద గానీ, వారు చెప్పేది శ్రద్ధగా విని, చేతనైన సహాయం చేసి అన్నివిధాలుగా అండగా నిలవడం ఆయన సహజ లక్షణం. ఈ ధర్మప్రవర్తనే ఆయనకు ఎందరో మిత్రుల్ని, సన్నిహితుల్ని సమకూర్చింది.

సి. ధర్మారావు కృష్ణా జిల్లా పెద అవుటపల్లిలో 1934 మార్చి 30న జన్మించారు. గన్నవరం హైస్కూల్లో, ఏలూ రు కాలేజీలో, ఆంధ్ర, ఉస్మానియా యూనివర్సిటీల్లో చదువు సాగించిన ధర్మారావు తన పేరు చివర బి.ఏ, ఎల్.ఎల్.బి అని పెట్టుకోవడానికి ఇష్టపడరు. పలు రంగాల్లో స్వతంత్రంగా నిరంతర కృషితో ఎదిగిన ఆయన జ్ఞానాన్ని కొలిచే విద్యార్హత కాదది. గోరా శాస్త్రి శిష్యుడుగా తెలుగు స్వతంత్రలో రచన చేసిన నాటి నుంచి ఆయన వ్యాస రచనా రంగంలో చాలా ఎత్తుకే ఎదిగారు. తర్వాతి కాల ంలో దాదాపొక పుష్కరకాలం ‘నడుస్తున్న చరిత్ర’ మాస పత్రికలో నిర్వహించిన ‘రవ్వలూ పువ్వులూ’ కాలం గానీ, అనేక పత్రికల్లో అప్పుడప్పుడు రాసిన వ్యాసాలు ఆయన సునిశిత విషయ పరిజ్ఞానానికీ, రచనాశక్తికీ దీటుగా నిలబడేవే. వాటిలో కొన్నిటిని ‘రవ్వలూ పువ్వులూ’ అనే పేరుతోనూ ‘ప్రేమించుకొందాం రండి’ అనే పేరుతోనూ రెండు సంపుటులుగా ప్రకటించారు. నిజానికి ఆ రెండు సంపుటుల పేర్లూ అందులోని రచనలూ ఆయన పోకడనూ, ఆదర్శాలను, వ్యక్తిత్వాన్నీ కళ్లకు కట్టినట్లు చూపిస్తాయి.

ఏదైనా మాట్లాడేముందు, రాసేముందు, చేసేముందు దాని గురించి లోతుగా ఆలోచించి ఒక స్పష్టతకు రానిదే ఆయన పెదవి కదిలేది కాదు, కలం ముందుకుసాగేది కాదు, అడుగుపడేదీ కాదు. ఎదుటి మనిషితో ఒక్కసారి స్నేహం కుదిరితే, కలిసి పనిచేయగల అదనుకుదిరితే అది చిరకాల బంధమే అయ్యేది. అదే తత్వం ఆయనను ఇస్మాయిల్‌కూ, ఎ.ఆర్.కృష్ణకూ సన్నిహితం చేసింది. గోరా శాస్త్రి, ఇస్మాయిల్, ఎ.ఆర్.కృష్ణల షష్టిపూర్తి సంచికల్నీ, చిరస్మరణీయంగా ఆయన రూపుదిద్దారు. చలం శత జయంతి ఉత్సవాల్ని ఏడాదిపాటు నిర్వహించి, ప్రత్యేక సంచికను అపురూపంగా తీర్చిదిద్ది, విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో చలం విగ్రహాన్ని ప్రతిష్టింప చేసింది ధర్మారావే. 1956లో కర్నూలులో ఆంధ్ర రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగిగా చేరినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 1992లో ఉద్యోగ విరమణ చేసినంతవరకు తెలుగు వారి సామాజిక రాజకీయ గతిని సన్నిహితంగా అధ్యయనం చేసిన ధర్మారావుకు ఆ రంగాల్లో హేమాహేమీలందరూ సన్నిహితమే అయినా ఎటువంటి ప్రయోజనాలను ఆశించకుండా జీవించారు.

తెలుగు భాషకు పట్టిన దుర్గతిని, పరిపాలనలో తెలుగు దిగజారుడును సహించలేక అందుకోసం 1984నుంచీ జీవితాంతం వరకూ నిరంతరం పాటుపడ్డారు. 1984-85లో కొత్తపల్లి వీరభద్రరావు, తర్వాత 86-88లలో నండూరి రామకృష్ణమాచార్యులు అధికార భాషా సంఘం అధ్యక్షులుగా ఉన్నప్పుడు వారికి కార్యదర్శిగా – స్పెషల్ ఆఫీసర్‌గా పనిచేశారు. ఆయన హయాంలోనే పాలనా భాషగా తెలుగు ఉన్నత శిఖరాలకు చేరింది – నాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు సంకల్ప బలంతో. ధర్మారావు ఎన్నడూ నిరాశ నిస్పృహలకు లోనుకాలేదు. కొన్నాళ్లుగా ఆరోగ్యం దెబ్బతిన్నా, ఆ పెదాలపై చిరునవ్వు చెదరలేదు. స్నేహితులకూ, సన్నిహితులకూ ఆయన మరణం భరించలేనిది, తెలుగు సమాజానికి తీరని లోటు. సి. ధర్మారావు భౌతిక కాయానికి నేడు (20.3.2013) ఉద యం 11 గంటలకు హైదరాబాద్‌లో అంత్యక్రియలు జరుగుతాయి.

– సామల రమేష్‌బాబు
తెలుగు భాషోద్యమ సమాఖ్య అధ్యక్షులు

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment