జ్ఞానదుడు మహర్షి నారదుడు –15

 జ్ఞానదుడు మహర్షి నారదుడు –15

 

           నారద మహర్షి దర్శించిన శ్రీకృష్ణ లీల ను పోతన గారు ఇలా వర్ణిస్తున్నారు

‘’ఒకచోట నుచిత సంద్యోపాసక్తు,నొకచోట బౌరాణికోక్తిలలితు

నొకచోట బంచ యజ్నోచిత కరముని ,నొకచోట దివ్య భూషోజ్వలును

నొకచోట దేనుదానోత్కలితాత్ముని ,నొకచోట నిజ సుత ప్రకార యుక్తు

నొక్క చోటను సంగీత యుక్తచిత్తు ,నొక్కచోటను జలకేళీయుత విహారు

నొక్క చోటను సంమంచ కోప యుక్తు ,నొక్క చోటను బలభద్ర యుక్త చరితు ‘’

ఇలా ఎందెందు వెదకి జూచిన అందందే అందగత్తెల తో హరి ప్రత్యక్ష మయ్యాడు .ఆ విభవాన్ని ఎంత వర్ణించినా తనివి తీరదు .

‘’చతురానన నందనుడం –చిత మతి జని కాంచే ,నొక్క చెలి గేహమునన్

క్రతు కర్మాచరణుని నా-శ్రిత భయ హర నున్,సురేంద్ర సేవిత చరణున్ ‘’

‘’వ్రుత్రారి వినుతు ని బరమ ప-విత్రుని నారదుండు గాంచె వేరొక ఇంటన్

బుత్రుక పౌత్రక దుహిత్రు కళత్రు సమేతు ననంతు లక్షణ వంతున్ ‘’

 మతి పోయింది మహర్షికి .ఆ మాయా మోహనుని చిత్రాలు విచిత్రం గా గోచరించి అచ్చేరువందించాయి ..

‘’ఒక ఇంట గజవాజి రోహాకుడు నయి ,యొక్కింత భంజనుడై

సకలాత్ముడు ,పరుండు ,షోడశ సహస్ర స్త్రీ నివాసంబులం

దొక బోటింటను దప్పకుండ నిజ మాయోత్సాహుడై యుండ ,న

య్యకలంకున్ ,వరదున్ ,మహా పురుషు ,బ్రహ్మణ్యున్ నతాబ్జాసనున్ ‘’

ఆ పరబ్రహ్మకే అర్ధం కాని వాడు అంటే ఆయన కొడుకైన నారదుడికేం అర్ధమవుతాడు? ఆ మహా లీలా విలాసం అత్యంత సుందరం ,పరమ రమణీయం, మనోహరం ,అత్యంత పవిత్రం .ఎంత వర్ణించినా తనివి తీరటం లేనే లేదు .అటు బ్రహ్మ మానస పుత్రుడైన నారద మునికి, ఇటు భక్త కవి బ్రహ్మ పోతనకు ఇద్దరూ ఆ భక్త పరాదీనులే . ఆ నారాయణ చణ చారణ చక్ర వర్తులే ఇద్దరూ.’’హరినామం ‘’విన్నా ,పలికినా భవహరమవుతుందనే భావించి ,స్మరించి, స్మరించి తన్మయత్వంతో పరవశించిన వారే .అందుకే ‘’మావాంగనాలీలా విలాసం అనంతం అని పించింది ‘’

‘’అస్తోక చరితు నమిత శ-మస్త సుధా హారు వేద మస్తక తల వి

 న్యస్త పదాంబుజ యుగ ళు న-పాస్తాశ్రిత నిఖిల పాపు బరము ననంతున్ ‘’

‘’పరమ భాగవతుండు పరమేస్టి తనయుండు ,మనుజ లీల జెంది మహిత సౌఖ్య

చిత్తుడైన హృషీకేశు యోగ మాయా ప్రభావమునకు నాత్మ నలరి ‘’

 

‘’మాయురే ,హరిహరి వరద ,య –మేయ గుణా యనుచు నాత్మ మెచ్చి మునీన్ద్రుం

దా యదునాయకు,సుజన వి-దేయుని నిట్లనయే ,దేవా!త్రిజగము లందున్ ‘’

తన వల్ల కాలేదు ఇక ఎవరి వల్లా కాదు అనే నిశ్చయానికి వచ్చాడు ముని .ఆ మయావినోదుని తోనే గాన వినోది నారద మౌని

‘’నీ మాయ దెలియ వారలే –తామరస సురేంద్ర తాపసులైనన్

ధీ మంతులు నీ భక్తీ సు-ధా మాధుర్యమున బొదలు ధన్యులు దక్కన్ ‘’

అని చేతులెత్తేశాడు హర్షించి,పులకించి పరమంద భరితుడయ్యాడు .తానిక వెళ్లి వస్తానని ‘’ఏది తెలుసు కొందామని వచ్చాడో దాన్ని కనుల పండువు గా దర్శించి జన్మ చరితార్ధత ను సాధించుకొన్నాడు మనవడు నారదసంయమి . .

సశేషం –మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ –20-3-13-ఉయ్యూరు 

 
 
Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ విహారి గారి అభినందన స్పందన

vihari spandana

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

నా దారి తీరు -16 గుంటూరులో సైన్సు ప్రదర్శన

 నా దారి తీరు -16

 గుంటూరులో సైన్సు ప్రదర్శన

  గుంటూర్ మెడికల్ కాలేజి లో సైన్సుఎక్సి బిషన్ భారీగా జరుగుతోంది .అందరికి వెళ్లి చూడాలనే ఉంది. మా హెడ్ మాస్టారి పెద్ద్దమ్మాయి అక్కడ డాక్టర్ కోర్సు చదువుతోంది .ఆయన ఒక రోజు నాతో ‘మాస్టారూ !మన విద్యార్ధులను తీసుకొని గుంటూర్ వెళ్లి ఎక్షిబిషన్ చూస్తె బాగుంటుంది ‘’అన్నారు .సరే నన్నాను .విద్యార్ధికి పది రూపాయలో ఎంతో వసూలు చేశాం .సుమారు యాభై మంది ఆడ ,మగ పిల్లలు సిద్ధ పడ్డారు రావటానికి .మాని కొండ నుంచి మానేడు మాక నడిచి వెళ్లి అక్కడ పాసెంజర్ రైల్ ఎక్కి బెజవాడ లో దిగి అక్కడి నుంచి మళ్ళీ ట్రైన్ లో గుటూరు వెళ్ళాలి .ఇదీ ప్లాన్ .ఉదయం పది గంటలకే అందరం భోజనాలు చేసి స్కూల్ దగ్గరకు చేరుకొన్నాము .హెడ్ గారు డ్రిల్ మాస్టారు నేను ,సైన్సు సుబ్బారావు పిల్లల వెంట ఉన్నాం .నడిచి మానెడు మాక చేరి అక్కడ పాసెంజర్ ఎక్కి విజయవాడ చేరాం .అక్కడ మళ్ళీ పాసెంజర్ ఎక్కి గుంటూరు చేరుకొన్నాము .మేము చేరే సరికి మధ్యాహ్నం రెండు అయింది .హెడ్ మాస్టారు అక్కడ తన శిష్యులతో ముందే చెప్పి ఉన్చారను కొంటాను .మాకు వెంటనే లోపలి ప్రవేశం కలిగింది .

        మెడికల్ విద్యార్ధులు నిర్వహించిన ప్రదర్శన అది .అనేక రకాల ప్రయోగాలు వర్కింగ్ నాన్ వర్కింగ్ మోడల్స్ ఉన్నాయి అందరం బాగా తిరిగి చూశాం .ద్రవాల్లో నిలవ ఉంచిన జంతువులు  ఉంచారు .అక్కడ స్టూడెంట్స్ కూడా చక్కగా వివరించి చెప్పారు నేను నాకు నచ్చినవన్నీ నోట్ బుక్ లో రాసుకోన్నాను వివరం గా .ఇంకెక్కడైనా వీటిని పెట్టచ్చననేది నా ఆలోచన .అలాగే నేను కొన్ని స్కూళ్ళ లో వీటిని ప్రదర్శన లో పెట్టించాను డబ్బు ఖర్చు ఆయె వాటికి జోలికి పోలేదు బాగా ఆట్రాక్షన్ తో ఉన్నవాటినే సేకరించి తర్వాతా అమలు చేశాను .ఎవరి టిఫిన్లు వాళ్ళే కొని తిన్న జ్ఞాపకం .పిల్లలూ అంతే .అంతా చూసే సరికి రాత్ర్తి తొమ్మిదయింది నడుచు కొంటు రైల్వే స్టేషన్ కు చేరుకొన్నాం .అక్కడినుంచి బెజవాడకు అక్కడి నుంచి అర్ధ రాత్రి పన్నెండు కు మానెడు మక మీదుగా మాని కొండ చేరుకొని ఎవరింటికి వాళ్ళం వెళ్లాం .గొప్ప అను భూతి కింద గుర్తుండి పోయింది .అందరు తప్పక చూడదగిందని చెబుతూ ఉండేవాడిని .శ్రమ అయినా విద్యార్ధులు బాగా ఎంజాయ్ చేశారు బుర్రల్లోకి విషయాలు ఎక్కిన్చుకొన్నారు ఆడ ,మగా పిల్లలున్నా ఎక్కడా ఏ హడావిడి లేదు హెడ్ గారి డిసిప్లిన్ అలాంటిది కంటి చూపు తో శాసించే నేర్పు ఆయనది .

                           తెన్నేరు నాంచారమ్మ సంబరాలు

    మా మిత్రులు అల్లూరి సీతారామ రాజు గారికి మాని కొండ దగ్గర తెన్నేరు లో కొంత పొలం ఉంది .ఏప్రిల్ నెలలో తెన్నేరు లో నాంచారమ్మ తిరుణాల జరుగుతుంది ఆయన ఎప్పటి నుంచో మమ్మల్ని ఆ తిరునాలకు తీసుకొని వెళ్లి చూపించాలని ఉబలాట పడుతున్నారు నేను గరుడాచలం మాస్టారు రాఘవ రావు సిద్ధ పడ్డాము రాత్రి పూట హరికధలు బుర్రకధలు డప్పులూ కోలాటాలు సందడే సందడి గా ఉంది నడిచే వెళ్ళాము నడిచే వచ్చాం అని గుర్తు .ఆయన సరదాగా అన్నీ వివరించి చెప్పారు .అక్కడేదో కొని తిన్నామనుకొంటాను రాజు గారికి దైవ భక్తీ చాలా ఎక్కువ .పామర్రు దగ్గర కురుమద్దాలి లో  అవధూత పిచ్చమ్మ ఆశ్రమానికి తరచు వెళ్లి వస్తూండే వారు .తిరిగి వచ్చేటప్పుడు మా ఇంటికో గరుడా చలం గారింతికో ఉయ్యూరు వచ్చే వారు అ ముగ్గురం మా ఇంట్లో కలిసి భోజనం చేసేవాళ్ళం .టిఫిన్లు తినే వాళ్ళం .రాఘవ రావు కూడా వచ్చేవాడు .రాత్రి రెండో ఆటకు సినిమాకు వెళ్ళే వారం .ఇలా చాలా ఏళ్ళు జరిగాయి .రాజు గారి అబ్బాయి ఉపనయనం మానికొండ లో చేస్తే నేను గరుడాచలం మేష్టారు వెళ్లాం .మాకు రాజ మర్యాదలే జరిపించారు రాజు గారు. రాజు గారంటే మా ఆవిడకు గొప్ప గౌరవం .ఆయన వస్తే పండగ లానే ఉండేది .మెం నలుగురం చాలా అన్యోన్యం గా ఉండేవాళ్ళం నేను అక్కడి నుంచి వచ్చేసినా రెండు నెలలకోసారి మానికొండ గరుడాచలం గారితో కలిసి వెళ్ళటమో లేక ఆరాజు గారు ఇక్కడికి రావటమో జరిగేది .వచ్చినప్పుడల్లా కబుర్లే కబుర్లు రాజు గారు ఆర్.ఎస్.ఎస్.అభిమానులు వాజపేయియి ,ఆద్వానీ లంటే అమిత ఆరాధనా భావం ఆయనకు .మీటింగు లకు తప్పక వెళ్ళే వారు .రామ కృష్ణ పరమహంస అన్నా వివేకానందులన్నా వీరాధనా భావం .ఒక సారి నేను హైదరాబాద్ దోమల గూడా లోరామకృష్ణాశ్రమం లో జరుగుతున్నా సమావేశానికి వెళ్లాను అక్కడ రాజు గారు మూడు రోజుల ట్రెయినింగ్ కాంప్ లో కనీ పించారు

                                   బి.యె. లిట్ 

              ఆయనా నేను బి.ఏ.ఇంగ్లిష్ పరీక్ష ప్రైవేట్ గా రాశాం ..అప్పుడు హైస్కూల్ లో ఆంగ్ల బోధనా చేయాలంటే ఇంగ్లిష్ డిగ్రీ తప్పకుండా ఉండాలనే వారు .నేను చదివిన బి.ఎస్.సి.లో ఒక టెక్స్ట్ ఒక నాన్డిటైల్డ్ మాత్రమె ఉన్నాయి కనుక మా గురువు ప్రసాద శర్మ గారు నన్ను ఇంగ్లీష్ లో బి ఏ.డిగ్రీ చేయమని సలహా ఇచ్చారు అందుకని కట్టాను .నేను రాస్తున్నానని తెలిసి రాజు గారు కూడా సరదాగా కట్టారు రెండేళ్ళు చదవి ప్రతి ఏడాది పరీక్ష రాయాలి ఇంగ్లిష్ తెలుగు  ప్రోజు ,పోయిట్రీ ,నాన్దిటైలేడ్ డ్రామాలు అన్నీ ఉండేవి. ఇద్దరం పరీక్షల రోజుల్లో బెజవాడ ఆర్ ఎస్ ఎస్ కార్యాలయం లో ఉండే వాళ్ళం పైన మెడ మీద చదువుకొని హోటల్ లో భోజనం చేసే వాళ్ళం మాకు ఒక రూమ్ ఇచ్చారు ఇది రాజు గారి చొరవే ..నేను సబ్జేక్తులన్ని పాస్ అయాను రాజు గారు తప్పారు .ఆయనకు చదివితే గుర్తుండేది కాదు .నేనూ అంతే కాని నాకు విజువల్ మెమరి ఉండేది .దాన్ని బాగా ఉపయోగించుకోన్నాను .మెక్బెత్ నాటకం అభిమన్యు వధ అంటే విపరీత మైన అభిమానం కలిగింది అందులో ప్రతి వాక్యం మీద ఎంతైనా రాయచ్చునని పిస్తుంది అంత గా నచ్చింది .ఒకటి రెండు సార్లు రాజు గారు పరీక్షకు కట్టి పాస్ కాలేక విసుగొచ్చి మానేశారు .ఎలాగో బి.ఎస్.సి డిగ్రీ ఉంది కనుక బి .ఏ.త్రెలుగు ఇంగ్లిష్ పాసైతే బి.ఏ.డిగ్రీ ఇస్తారు అలానే నాకు ఇఇచ్చారు .అంటే ఒకరకం గా బి.ఏ.లిట్ అన్నమాట .

                   చెదరిన స్నేహ బంధం 

  రాఘవ రావు కూడా చాలా సరదా మనిషే ఉయ్యూరు లో కలిస్తే అన్నీ మర్చి పోఏ వాళ్ళం . అతను ఒక ప్యూన్ అనే భావంమాకేన్నడూ రాలేదు .ఒక స్నేహితుడి గానే భావించాం  .అతను దాదాపు అందర్నీ ‘’నువ్వు ‘’అనే చొరవ ఉన్న వాడు .గరుడాచలం గారిని, రాజు గారిని అలానే పిలిచేవాడు కాని నన్ను మాత్రం ఎందుకో ‘మీరు ‘అనే అనేవాడు .ఎప్పుడైనా డబ్బులు కావాల్సి వస్తే వచ్చి అడిగి తీసుకొని వెళ్లి అనుకున్న సమయానికి తిరిగి ఇచ్చే వాడు చే బదుల్లెఇవి .ఒక సారి నేను పామర్రు లో పని చేస్తుంటే వాళ్ళ ఆమ్మాయి పెళ్లి నిశ్చయమైందని డబ్బు కావాల్సి వస్తుందని వచ్చి చెప్పాడు అప్పుడు నా పరిస్తితి అంతంత మాత్రమె రెండు వేలు కావాలి .ప్రావిడెంట్ ఫండ్ లో లోన్ తీసుకొని ఇస్తానానని ఆశ పెట్టాను పాపం నేనిస్తాననే నమ్మకం తో ఉన్నాడు .నాలో కొద్ది స్వార్ధం పెరిగింది అతనికిస్తే డబ్బులు రావేమో నని చెడ్డ ఆలోచన వచ్చింది .అంతే లోన్ తీసుకోలేదు నేను అతను వచ్చాడు .కాని నేను లోన్ తీసుకోలేదని ,ఇప్పుడు తీసుకోవటం కుదరదని చెప్పి పంపాను పాపం హతాశుడయ్యాడు. అలా ఎందుకు ప్రవర్తిన్చానో నాకు ఇప్పటికి అర్ధం కాలేదు నన్ను నేను క్షమించుకోలేక పోయాను ఒక రకం గా ఇది మిత్ర ద్రోహమే నని నా అంత రాత్మ ఘోషిస్తూనే ఉంది కాని ఆ అవకాశం మళ్ళీ రాదు కదా అన్న ఇంగితం లేకుండా ప్రవర్తించాను ఇప్పటికి గుండెల్లో కెలుకుతూనే ఉంది ఆ విషయం అతను మరిచే పోయాడు ఎక్కడో తంటాలు పడి పిల్ల పెళ్లి చేసి మమ్మల్ని పిలిచాడు నేను గరుడా చలం మాస్టారు వెళ్లి వచ్చాం .సిగ్గు లేకుండా వెళ్లి అక్షింతలేసి వచ్చాను .ఆ తర్వాతా కొన్నేలళ్ళకే రాఘవ రావు చని పోయాడు గన్నవరం చేరాడు రిటైర్ అయిన తర్వాతా. వాళ్ళమ్మాయి సీతమ్మ నా దగ్గరట్యూషన్ చదివింది. చిన్నమ్మాయి కూడా .

            రాజు గారు కూడా సుమారు అయిదేళ్ళ క్రితం మరణించారు వాళ్ళబ్బాయిలు ఫోన్ చేసి చెప్పారు పన్నెండో రోజు కార్యక్రమానికిమాని కొండ వెళ్లి కుటుంబాన్ని పలకరించి వచ్చాను .అప్పుడు గరుడా చలం మాస్టారు విశాఖ పట్నం లో అబ్బాయి దగ్గర ఉన్నారు .ఇలా మామానికొండ  స్నేహ బృందం లో ముఖ్యులు రాఘవ రావు ,రాజు గారు వెళ్లి పోయారు .గరుడా చలం గారు తరుచు కలుస్తూనే ఉన్నారు. లేక పోతే నేనే వాళ్ళింటికి వెళ్లి వస్తూంటాను వాలళ్ళబ్బాయిలు అమ్మాయిలూ నా శిష్యులే .చాలా జాగ్రత్త ఉన్న మనిషి. స్నేహశీలి మేష్టారు .భార్య గారు కూడా నేనంటే గౌరవం మా ఇంటికి రావటం గరుడాచలం గారికి మహా ఇష్టం .వాళ్ళింట్లో పెళ్ళికి మేము మా ఇంట్లో పెళ్ళికి ఆయన రావటం మానలేదు ఆయన మనుమలు నాగార్జున అతని అన్నయ్యా కూడా ఫ్లోరా స్కూల్ లో నా శిష్యులే ..

               సశేషం –మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ 19-3-13-ఉయ్యూరు 

 

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

శ్యాం నారాయణ్ ది ఎప్పుడూ ‘’రైటాంగిలే’’

శ్యాం నారాయణ్ ది ఎప్పుడూ ‘’రైటాంగిలే’’

డిజిటల్ లైబ్రరీ – శ్యాం నారాయణ కృషి

   అతని షాప్ పేరు” రైటాంగిల్”

   అతని వృత్తీ ‘’రైటాం గిల్ ‘’తోనే

   అతనిప్రవృత్తీ రైటాంగిలే

   అతని ఆలోచన లెప్పుడూ రైటాం గిలే

   అంటే సమకోణం లోనే ఉంటాయి .

   గురుకోణం ,లఘుకోణం ,పరావృతకోణం

   అంటే ఏమిటో తెలియని వాడు

   సమ మార్గం సమధర్మం అతని చూపు

   అతనే రైటాంగిల్ శ్యాం నారాయణ్ .

   ఆకృతికి నిజంగా శ్యాం నారాయణుడే

   నవ్వుకూ చింతనకూ మాత్రం  శ్యాం మనోహరుడే

   అతని వద్ద సంగీత సప్త పాదోధులున్నాయి

  అతని చెంత సాహిత్య నవనిధులూ

  జేగీయమానం గా వెలుగుతున్నాయి

  అతను మీట నొక్కితే చాలు

  ప్రపంచమంతా దర్శన మిస్తుంది

  అదేదో తనకే చెందాలనే ఆరాటం లేని వాడు

 తన విజ్ఞాన సర్వస్వాన్ని అడిగిన వాడికి

 దానం చేసే మహా దాన కర్ణుడు

 కాని అలా ఎప్పుడూ  భావించని ఉత్తమ పురుషుడు అతను 

 ఒక రకం గా మన ముందున్న మరో వి.ఏ.కే.రంగా రావు

 ఆయన మాత్రం అందరికి అందేవాడు కాదు

 కాని శ్యాం మాత్రం స్నేహ సులభుడు

తాను సంపాదించిన విజ్ఞాన సంపదను

మన స్వంతం చేసే సర్వ సమభావుడు, సరసుడు

అతనితో మాట్లాడటమే ఒక ‘’ఎడ్యుకేషన్ ‘’

అతని చెంత ఉంటె అదో మరో సరస్వతీ మహల్

మరో భువన విజయం ,మరో స్వర్లోక సభ ..

”ప్రపంచ సాహిత్య పాదోధి పయస్కుడైన ముని ”అతడు

మాటలు తక్కువ, చేత, చేతన ఎక్కువైన వాడు .

ఇది శ్యాం నారాయణ్ కు ప్రశంశ కాదు

వాస్తవ చిత్రలేఖనం యదార్ధ దర్శనం

          మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -18-3-13-ఉయ్యూరు

Posted in కవితలు | Tagged | Leave a comment

జ్ఞానదుడు మహర్షి నారదుడు -14

జ్ఞానదుడు మహర్షి నారదుడు -14

  దశమ స్కంధం లో నారద లీలలు

అనిరుద్ధుడు అంటే శ్రీకృష్ణుని మనుమడు బాణాసురు ని ఇంట్లో గృహ నిర్బంధం లో ఉన్నాడు ఈ సంగతి తాత శ్రీకృష్ణ పరమాత్మకే తెలియదు .ఆ ఎరుక చెప్పటానికి ‘’మనవడు ‘’నారదుడే స్వయం గా వచ్చాడు .’’శారద కోమల నీరద–పారాడ రుచి దేహుదతుల భాగ్యోదయుడా

నారద ముని ఏతెంచే –నపార దయా మతి మురారి భజన ప్రీతిన్ ‘’

అలాంటి మహర్షికి శ్రీ కృష్ణుడే స్వయం గా స్వాగతం పలికి అర్ఘ్య పాద్యాదులిచ్చి ఉచితాసనం పై ఉపవిస్టుడిని చేసి మహర్షి  యెడ భక్తీ ని చాటుకొన్నాడు .అప్పుడు నారదుడు అనివ్రుద్ధ వృత్తాంతమంతా తెలియ జేసి రక్షించు కోవటానికి తగిన మార్గం యుద్ధమే అని నిశ్చయ పరచాడు .మనుమడిని సంరక్షిన్చుకోమని సలహా నిచ్చాడు .

                 శ్రీ కృష్ణ మహిమ సందర్శనం

  శ్రీకృష్ణ సత్యలు నరకాసుర వధ చేశారు కన్న తల్లి కొడుకు ను చంపింది .లోక కంటకుడైనా వాడేవ్వడైనా ఒక్కటే అని నిరూపించింది ఆ మాత్రు మూర్తి .అతని అధీనం లో ఉన్న 16,000 మంది స్త్రీలకూ ఒకే సారి అందరికి అన్ని రూపాలుగా కన్పించి ,వివాహం చేసుకొన్నాడు దక్షిణ నాయకుడు శ్రీ కృష్ణుడు .ఆ విషయం తెలిసి దానిలోని విశేషమేమిటో స్వయం గా చూసి తెలుసుకోవాలని ఉబలాట పడ్డాడు మనుమడు నారదుడు . వెంటనే ద్వారక కు బయల్దేరి వెళ్ళాడు .ఒక స్త్రీ ఇంటికి చేరాడు ..

‘’నరవర యొక్క నాడువిను నారద సంయమి ,మాధవుండు ,దా

  నరకుని ద్రుంచి ,వాని భవనంబున నున్న పదారు వేల సుం

దరులనోక్క మాటు ప్రమదంబున నందర కన్ని రూపులై

పరమయ్యే నావిని ,శుభస్తితి దద్విభవంబు జూడగన్ ‘

విచ్చేసిన నారదుడిని ప్రత్యుత్థానం తో స్వాగతించి ‘’మునివరు పాద జలంబులు తన చారు కిరీట మణి వితానము సోకన్ వినమితుడై ,నిజ సింహాసనమున గూర్చుండ బెట్టి సద్వినయమునన్ ‘వంగి నమస్కరించి తన సింహాసనం పై కూర్చో బెదటాడ .భగవంతుడు భక్త పరదీనుదని పించాడు వాసుదేవుడు .భక్తునికి భగవంతునికి అభేదం అని నిరూపించాడు ఆయనే ఆచరించి ఆదర్శం గా నిలిచాడు .భక్తీ లో ఇదొక అద్భుత దర్శనం .

‘’తమ పాద కమల తీర్ధం-బున లోకములం బవిత్రముగా జేయు పురా

  తన మౌని లోక గురుడమ్ముని పాద తీర్థంబు మస్తకమున ధరి యించెన్ ‘’

   ఈ విధం గా ‘’బ్రహ్మణ్య దేవుడు నరసఖుడు అయిన నారాయణుడు అశేష తీర్దోప మానంబున మునీంద్ర పాద తీర్ధాన్ని ధరించాడు ‘’సుదాసారాలైన మిత భాషణలు పలికాడు .ఉచితానుచితజ్నుడు కధా యదు వల్లభుడు ?’’ఏ పని చెబితే అది చేస్తాను ‘ఆనతివ్వమని అడిగాడు పరమాత్మ .ఆయనకు నారదుని ఆంతర్యం తెలీదా ?ఆయనతోనే చెప్పించాలని కాకపోతే ?

‘’ఏపని పంచిన చేయుదు –దాపస వర యనుడు నతడు దామోదర చి –ద్రూపక భవదవతార వ్యాపారము దుస్టనిగ్రహార్ధము గాదె ?’’అని విన్న వించాడు విశ్వ శాసన కర్త .నారద ముని గడుసుగా ఆంతర్యం తెలీకుండా

‘’అఖిల లోకైక పతివి ,దయార్ద్ర మతివి ,విశ్వ సంరక్షకుడవు ,శాశ్వతుడవు

 వెలయ నేపని యైన గావింతు వనుట –యార్త బంధుడ విది నీకు నద్భుతంబే ?’’అన్నాడు .ఏదైనా చేయగల సమర్దుడివి .అంటూనే నర్మ గర్భం గా

‘’అబ్జ సంభవ హరదేవ ,దేవతార్చనీయ భూరి సంసార సాగారోత్తరణంబు

  నవ్యయా నంద మోక్ష దాయక ము నైన –నీ పదధ్యాన మాత్మ లో నిలువనీవే ‘’

అని తప్పుకొన్నాడు .ఆంతర్యం బయట పెట్ట లేదు .ఆ దేవుని వల్ల ప్రసన్నత పొంది వేరొక స్త్రీ ఇంటికి వెళ్ళాడు .అక్కడా స్వామి ఉన్నాడు .

‘’ముని వరుండు కాంచే నొండొక –వనజాయత నేత్ర నిజ నివాశంబున

  దానయుతు జిష్ణు సహిష్ణున్ –వినుత గుణాలంక రిష్ణు విష్ణుం గ్రుష్ణున్ ‘’

  ‘’నారడుదట చని కనే నొక –వారిజముఖి ఇంట నున్న వాని మురారిన్

   హారిన్ ,దానవ కుల సంహారిన్ –హరిన్ గమలా మనో విహారిన్ శౌరిన్ ‘’

ఇలా అనంతం గా సాగి పోతూనే ఉంది .ఒక చోట మాత్రం మాధవుడు మునీన్ద్రునితో ‘’సంపూర్ణ కాములైన మిమ్ము అపూర్ణ కాముల మైన మేము ఎలా తృప్తి చెందిన్చగలం ?మీ దర్శనమే నిఖిల శోభనం ‘’అని తమాషా గా పలికాడు ఆనంద నందనుడైన ఆ నంద నందనుని మాటలు కు ఆనంద కందళిత హృదయార విందుడై మందస్మిత సుందర వదనార వవిందుడై నారదుడు ఇంకో స్త్రీ గృహం చేరుకొన్నాడు .ఎక్కడ చూసినా శ్రీ హరి వేర్వేల రూపాలతో ప్రత్యక్ష మావుతూనే ఉన్నాడు .ఒక్కో చోట ఒక్కో పని చేస్తూ కూడా కన్పించాడు .ఆ మహా విభవాన్ని పోతన గారు నారదుని మాటలతో కమనీయం గా రమణీయం గా సుందరతరం గా ,విలాసంగా ,విభ్రమం కలిగేట్లు వర్ణించాడు .బహుశా కవి, ముని తాదాత్మ్యం చెంది న మహా పరమ సమాధి స్తితి లో ఆ పబ్రహ్మ అనంత లీలా వైశిష్ట్యాన్నిదర్శించి తరించి మనకూ ఆ భాగ్యం కలిగించారు .తాను మనో నేత్రం తో దర్శించిన దాన్ని నారదుని ప్రత్యక్ష దర్శనం తో మన ముందు నిలిపాడు‘ఆ వైభవాన్ని తర్వాత అనుభ విద్దాం

సశేషం –మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ –18-3-13-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

నా గాడ్ ఫాదర్ ‘నాన్న-నేను’.సిరివెన్నెల సీతారామశాస్త్రి -యోగీశ్వరశర్మ.

నా గాడ్ ఫాదర్


మెడిసిన్ చదివి డాక్టర్ కావలసిన ఒక కవి జీవితం టెలిఫోన్ డిపార్ట్‌మెంట్‌తో మొదలై సినీప్రయాణం చేసి ‘జగమంత కుటుంబాన్ని’ సంపాదించుకుంది. పాటల రచయితగా మొదటి చిత్రం ‘సిరివెన్నెల’నే తన ఇంటిపేరుగా మార్చుకుని మూడు వేలకు పైగా పాటలతో దిగ్విజయ యాత్ర కొనసాగిస్తున్నారు చెంబోలు సీతారామశాస్త్రి. తండ్రి స్థిరపడిన రంగంలోనే సంగీత దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ఆయన కుమారుడు యోగీశ్వరశర్మ. తన తండ్రి గురించి ఆయన చెబుతున్న విశేషాలే ఈ వారం ‘నాన్న-నేను’.
పాటల రచయితగా నాన్న మొదటి సినిమా ‘సిరివెన్నెల’ 1986లో విడుదలైంది. అంతకు రెండేళ్ల ముందే కె.విశ్వనాథ్‌గారు ఒక చిత్రంలో నాన్న రాసిన గంగావతరణం గీతాన్ని తీసుకున్నారు. అది ఆయనకు నచ్చడంతో నాన్నను చెన్నైకి పిలిపించుకుని ‘సిరివెన్నెల’ చిత్రంలో అన్ని పాటలను రాసే అవకాశాన్ని కల్పించారు. ఆ చిత్రం నాన్నకు ఎంత పేరు తెచ్చిందంటే అదే ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. చిత్ర రంగంలోకి రావడానికి నాన్న కష్టపడనప్పటికీ నిలదొక్కుకోవడానికి మాత్రం శ్రమించాల్సి వచ్చింది. మొదటి చిత్రంలో పాటలు సూపర్‌హిట్టయినప్పటికీ నాన్నకు వెంట వెంటనే అవకాశాలు రాలేదు.

ఆ రోజుల్లో నాన్నకు చాలా కుటుంబ బాధ్యతలు ఉండేవి. తన తమ్ముళ్లు, చెల్లెళ్లతోసహా దాదాపు 15 మందిని పోషించాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. అలాంటి పరిస్థితిలో ఒక పక్క చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగాన్ని వదలలేక, చిత్ర రంగంలో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధపడలేక సతమతమయ్యారు. అదీగాక నాన్నకు వరుసగా సంగీతపరమైన చిత్రాలకు పాటలు రాసే అవకాశాలే వస్తుండడంతో ఆయన మీద క్లాసికల్ రైటర్‌గా ముద్రపడిపోయింది.

నాన్నకు చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. అశ్లీల సాహిత్యానికి, ద్వందార్థాలకు ఆయన పూర్తిగా దూరం. దీనివల్ల కూడా కమర్షియల్ చిత్రాలలో పెద్దగా అవకాశాలు వచ్చేవి కావు. సినీ జీవితానికి గుడ్‌బై చెప్పేసి కాకినాడకు వెళ్లిపోదామని కూడా ఒక దశలో సిద్ధపడ్డారు. శ్రుతిలయలు, స్వర్ణకమలం లాంటి చిత్రాలు అవార్డులు తెచ్చిపెడుతున్నా కమర్షియల్ సక్సెస్ మాత్రం రాలేదు. 1992 వరకు కూడా అదే పరిస్థితి.

1986, 87, 88 సంవత్సరాలకు ఉత్తమ గీత రచయితగా నంది అవార్డులలో హ్యాట్రిక్ సాధించినప్పటికీ కుటుంబాన్ని పోషించడం చాలా కష్టంగా ఉండేది నాన్నకు. అలాంటి పరిస్థితిలో వచ్చిన ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారాయన. సాహితీ విలువలను కాపాడుకుంటూనే కమర్షియల్ పాటలు కూడా రాయవచ్చని నిరూపించారు. ‘బొబ్బిలిరాజా’ చిత్రంలో ఆయన రాసిన ‘బలపం పట్టి భామ…’ పాటే ఇందుకు ఉదాహరణ. పెద్ద హిట్ ఆ పాట. అలా నాన్న విజయయాత్ర మొదలైంది.

డాక్టర్ కాబోయి…
నేను పుట్టింది అనకాపల్లిలో. అయితే నాన్న వృత్తిరీత్యా చెన్నైలో ఉండడంతో పదవ తరగతి దాకా నా చదువు అక్కడే సాగింది. మేము ముగ్గురం సంతానం. మా అక్కయ్య లలితాదేవికి వివాహమైంది. తమ్ముడు రాజాభవానీ శంకర్ ఇంజనీరింగ్ చదివి సినిమాలలో నటిస్తున్నాడు. ‘కేక’ చిత్రంలో హీరోగా పరిచయమయ్యాడు. ప్రస్తుతం రెండు తమిళ చిత్రాల్లోను, తెలుగులో నాకు నచ్చని పదం ప్రేమ’లోను, రాంచరణ్ తేజ హీరోగా నటిస్తున్న ‘ఎవడు’ లోనూ నటిస్తున్నాడు. నాన్న సొంతూరు అనకాపల్లి. మా తాతయ్య సి.వి.యోగిగారు అనకాపల్లి కాలేజీలో లెక్చరర్‌గా పనిచేసేవారు. 13 భాషలను ఔపోసన పట్టిన మహా పండితుడు ఆయన.

మెడిసిన్ చదువుకుని డాక్టర్ కావలసిన నాన్న జీవితం ఊహించని మలుపులు తిరగడానికి తాతగారి మరణమే కారణం. నాన్న మెడిసిన్ మొదటి సంవత్సరం పూర్తిచేసిన సమయంలోనే తాతయ్య మరణించడంతో పెద్దకుమారుడిగా నాన్న కుటుంబ బాధ్యతలను స్వీకరించాల్సి వచ్చింది. దాంతో మెడిసిన్ మానేసి కాకినాడలో టెలిఫోన్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగంలో చేరారు. నాన్న మొదటి రచన ఆయన 11వ ఏట అచ్చయ్యింది.

‘భరణి’ అనే కలం పేరుతో చాలా కవితలు, కథలు రాశారు. పాతికేళ్లు దాటిన సినీ ప్రయాణంలో నాన్న ఏనాడూ రచయితగా రాజీపడలేదు. “పాట నాకు ఇష్టమై రాసుకుంటాను. నిర్మాత, దర్శకులకు నచ్చింది కాబట్టి తీసుకుంటున్నారు. వాళ్లకు నచ్చినట్లు రాయడమంటే నేను రాజీపడ్డానని కాదు. నాకు పూర్తిగా సంతృప్తి చెందినప్పుడే పాట బయటకు వస్తుంది” అని నాన్న అంటారు.

“సినిమా పాటలు అన్ని రకాల శ్రోతలు వినేవి. వాటిని విన్నవారు ప్రభావితం కావచ్చు, కాకపోవచ్చు. కాని..నా పాట సమాజంలో చెడు ప్రభావాన్ని మాత్రం చూపకూడదు. ఏ రకంగానూ ఎవరి ఆత్మస్థయిర్యాన్ని, మనో నిబ్బరాన్ని దెబ్బతియ్యకూడదు. నా పాట సమాజంలో ఆశావహ దృక్పథాన్ని పెంపొందించాలే తప్ప నిరాశావాదాన్ని తీసుకురాకూడదు” అన్నది నాన్న సిద్ధాంతం.

తపస్సులోంచి పుట్టే పాట!
నాన్న రాసుకునేటప్పుడు ఈ లోకంలో ఉండరు. అదొక తపస్సులా ఉంటుంది. రోజుల తరబడి అదే ధ్యాసలో ఉన్న సందర్భాలూ ఉన్నాయి. ఒక్కోసారి మమ్మల్ని కూడా గుర్తుపట్టేవారు కాదు. మేము అక్కడ భోజనం పెట్టి వచ్చేశాక ఏదో ధ్యాసలో తినేసి రాత పని పూర్తయ్యాక “నేను భోంచేశానా?” అని కూడా అడుగుతుంటారు. నాన్న కొత్త పాటకు మొదటి శ్రోతలం అమ్మా, నేనే. శివభక్తుడైన నాన్న శివునిపైన వెయ్యి పాటలు రాయాలని సంకల్పం పెట్టుకున్నారు. ఇప్పటికి 500 పాటలు రాశారు. అందులో కొన్ని ‘శివదర్పణం’ పేరిట పుస్తకంగా వచ్చాయి.

ఆడియో కూడా విడుదలైంది.అందులో కొన్ని పాటలు నాన్న కూడా పాడారు. ఈ ఏడాదిలోనే మరో రెండు ఆల్బమ్‌లు విడుదల చేయాలన్నది నాన్న ఆలోచన. మిగిలిన పాటలను కూడా సాధ్యమైనంత త్వరలో పూర్తిచేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటి దాకా నాన్న సినిమాల కోసం రాసిన పాటలు మూడు వేలకు పైగా ఉన్నాయి. తనకు సినీజన్మనిచ్చిన కళాతపస్వి కె.విశ్వనాథ్‌గారంటే నాన్నకు ఎనలేని అభిమానం. ఆయనను ‘నాన్న’ అనే పిలుస్తారు. ప్రస్తుత తరంలో కృష్ణవంశీగారంటే నాన్నకు పుత్రవాత్సల్యం. ఒకవిధంగా ఆయన నాన్నకు దత్తపుత్రుడు.

నా సినీ జీవితానికి ‘శ్రీకారం’
నేను డిగ్రీ కంప్యూటర్స్ చేశాను. విశాఖపట్నంలో రెండేళ్లు చదువుకున్నప్పుడు అక్కడ వంకాయల నరసింహంగారి దగ్గర మృదంగం నేర్చుకున్నాను. 1998 వరకు నాకు మృదంగం తప్ప మరో వాయిద్యం గురించి తెలియదు. చదువుతోపాటు మృదంగం నేర్చుకుంటూ ప్రదర్శనలు కూడా ఇచ్చేవాడిని. ఆ తర్వాత జోసఫ్ థామస్‌గారి మ్యూజిక్ ఇన్‌స్టిట్యూట్‌లో పియానో నేర్చుకున్నాను. లండన్ యూనివర్సిటీ నిర్వహించే పరీక్షలో నేను 7 గ్రేడ్స్ పాసయ్యాను. లండన్‌కు వెళ్లి ఆడియో ఇంజనీరింగ్ కూడా పూర్తిచేశాను.

లండన్ నుంచి రాగానే ‘కుదిరితే కప్పు కాఫీ’ చిత్రానికి సంగీత దర్శకత్వం చేసే అవకాశం రావడంతో నా సినీ సంగీత ప్రయాణం మొదలైంది. ఆ చిత్రంలోని అన్ని పాటలు నాన్నే రాశారు. ‘శ్రీకారం చుడుతున్నట్టు’ పాటతో నాన్న నా సినీ జీవితానికి శ్రీకారం చుడితే అమెరికా వెళ్లే హడావుడిలో ఉన్నప్పటికీ నాన్న మీద అభిమానంతో ఆ పాటను పాడి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు “నీ సంగీత ప్రయాణానికి ఇది శ్రీకారం కావాలి” అని ఆశీర్వదించడం నా అదృష్టం. ప్రస్తుతం రెండు చిత్రాలకు సంగీత దర్శకత్వం చేస్తున్నాను.

నా తొలి దర్శకుడు రమణ సాల్వ గారి దర్శకత్వంలోనే ‘యామినీ చంద్రశేఖర్’ అనే చిత్రం చేశాను. ఈ చిత్రానికి తారకరత్న హీరో. త్వరలోనే ఆడియో రిలీజ్ అవుతోంది. ఇందులో పాటలను నాన్నే రాశారు. ‘నువ్విలా’ చిత్రం ఫేమ్ అజయ్ హీరోగా నటిస్తున్న ‘ఎంతందంగా ఉన్నావే’ చిత్రం ఆడియో వచ్చే నెలలో రిలీజ్ అవుతుంది. ఇందులో ఐదు పాటల్లో మూడు నాన్న రాశారు.

నాన్న దగ్గరే సమాధానం
జగమంత కుటుంబం నాన్నది. కేవలం తన కుటుంబానికే కాదు అందరికీ ప్రేమను పంచివ్వగల విశాల హృదయం నాన్నది. ఆయనకు స్వపర భేదాలు లేవు. ఇంటికి ఎవరు వచ్చినా వారిని బంధు వరుసలతో పిలవడం మాకు నాన్న నేర్పించిన అలవాటు. నాన్న కోసం వచ్చే విజిటర్స్ కూడా ఎక్కువ. తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్న ఆశతో వచ్చేవారూ ఉంటారు.

“నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని సమాజాన్ని”(గాయం) లాంటి ధిక్కార కవిత్వానికి ప్రభావితులై నాన్నతో మాట్లాడేందుకు చాలామంది వస్తారు. ఆత్మహత్య తప్ప తమకు వేరే గత్యంతరం లేదనుకున్న వాళ్లు సైతం నాన్నతో మాట్లాడి మనసు మార్చుకున్న సంఘటనలు ఉన్నాయి. నాన్న దగ్గరకు వచ్చే వారిలో యువతే ఎక్కువ. ప్రశ్నించే వయసు కాబట్టి వాటికి సమాధానాలు లభిస్తాయన్న ఆశ వాళ్లది. నాన్న పాటలే కాదు మాటలు కూడా గుండె లోతుల్లోంచి దూసుకువస్తాయి.

ఇలా ఎందరికో ఆప్తుడైన నాన్నే నాకు ఫాదర్. గాడ్‌ఫాదర్. నా ఫ్రెండ్, గైడ్, ఫిలాసఫర్ అంతా మా నాన్నే. “ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి…ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి”(పట్టుదల చిత్రం) అన్న నాన్న పాట ఎందరికో స్ఫూర్తి. ఆ పాట చరణంలో వినిపించే “ఆశ నీకు అస్త్రమౌను, శ్వాస నీకు శాస్త్రమౌను ఆశయమ్ము సారథౌనురా” అనే పదాలు నాకు నిరంతరం స్ఫూర్తినిస్తుంటాయి.

సుధాకర్ తొయ్యేటి

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కోరిదే రాజన్న కవి -సంగణ భట్ల నరసయ్య మరియు కాన్వాస్ పై కొత్త డిక్షన్ చిత్రాలు

konide rajannakotta dikshan

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

తోలి తెలుగు జాతీయ కవితా మహోత్సవం – ఆహ్వానం

00010002

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

అ౦దరూ పలికే భాషకే అ౦దల౦ -శ్రీ పూర్ణ చంద్

శ్రీ పూర్ణ చంద్ చెప్పిన అక్షర సత్యాలను ప్రభుత్వం, దాన్ని నడిపే అధికార యంత్రాంగం, మంత్రాంగం చేసే మంత్రి వర్గం, భాషా ప్రియులు ఆలోచించాల్సినవి . ఆలోచిస్తూ కూచోకుండా అమలు చెయ్యాల్సినవి అప్పుడే భాష సు సంపన్నం అవుతుంది  అందలం  ఎక్కు తుంది అందరు పల్లకి లో కూచోవాలన్న ద్రుష్టి మారి మనమూ బోయీలమవ్వాలన్న బాధ్యత రావాలి ..యదార్ధాలు చేదుగా నే ఉంటాయి  కాని ముదిరిన జబ్బుకు గట్టి చికిత్సే కావాలి గొప్ప విచికిత్సే రావాలి .శుభమ్ భూయాత్ అని ఎదురు చూద్దాం -దుర్గా ప్రసాద్

అ౦దరూ పలికే భాషకే అ౦దల౦

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

నా దారి తీరు –14 ఉండమ్మా బొట్టు పెడతా

నా దారి తీరు –14

  ఉండమ్మా బొట్టు పెడతా

     నేను మానికొండ లో పని చేస్తుండగానే బాబూ మూవీస్ వారి ఉండమ్మా బొట్టు పెడతా సినిమా షూటింగ్ మానికొండలో జరిగింది  యాక్టర్లు అందరికి దాదాపు ఆ ఊళ్ళో నే వసతి భోజన సౌకర్యాలు కల్పించారు .షావుకార్ల ఊరు కనుక భవంతులు సకల సౌకర్యాలతో ఉండేవి .వంటలు భోజనాలు అన్నీ అక్కడే ఆ సినిమా షూటింగ్ ను కే.విశ్వనాద్ చేశారు .కాఖీ పాంట్ కాఖి షార్ట్ ఇంషర్ట్ తో ఉండేవారు .జమునా, కృష్ణ మెయిన్ రోల్స్ .ధూళి పాళవగైరా ఉన్నారు .మహదేవన్ మూజిక్ .ఆత్రేయ స్క్రిప్ట్ .’’రావమ్మా మా లక్ష్మీ రావమ్మా ‘’అనే పట ను హరిదాసు వేషం లో ఉన్న ధూళి పళ చేస్తూ సంక్రాంతి సందర్భం గా ఇంటింటికి తిరిగేసాని వేషాన్ని షూట్ చేస్తుంటే చూశాం .ప్రతి ఇల్లు వాకిలి శుభ్రం గా పేడతో అలికి గోమ్మేమ్మలుముగ్గులేసి   బంతి పూలు పెట్టి వైభవం గా తీశారు .ఒక ఇంటి షూటింగ్ మాత్రం చూశాను .ఆ తర్వాత పొలాలలో షూటింగ్.భూగర్భజలాలను పైకి తెప్పించే సన్నివేశం .’’పాతాల గంగమ్మా రారా ఉరికురికి ఉరికురికిఉబికుబికి రారా  ‘’విష్ణూ రావు గారి పొలం లో చిత్రీకరణ .ఎన్నో ఎకరాల లో పంట అంతా ఈ తోక్కిడికి దెబ్బతింది ఆయనకు ఇదేమీ లెక్క లోకి రాదు బాగా ఉన్న షావుకారు ఎప్పుడు గ్లాస్కో లుంగీ తెల్ల చొక్కా .సిగేరేట్ పాకెట్ తో చాల సింపుల్ గా ఉండేవారు . మంచీ మర్యాదా ఉన్న వారు .కృష్ణ కు షూటింగ్ లో ఎన్ని టేకులు తిన్నా మూడ్ రాలేదు యాక్షన్ పండలేదు ‘’విసుగొచ్చిన జమున లాగి చెంప మీద ఒకటి వేసింది’’ వెంటనే బాగా చేసి ఒకే అని పించుకోవటం నాకింకా బాగా గుర్తు .దాదాపు రెండు నెలలు అక్కడే చిత్రేకరణ కధలు గాధలుగా చెప్పుకొనేవారు కంకిపాడు తదితర ప్రాంతాలనుండి రాత్రి కి ఆడవాళ్ళను తెప్పించుకొనే వారు అక్కడ బస చేసిన నటులు అని చెవులు కోరుక్కొనే వారు .ఆదుర్తి సుబ్బారావు దర్శకుడు కాని నేను చూసిన సందర్భాలలో అయన ఎప్పుడూ కనీ పించలేదు .గరుడా చలం గారు రాజు గారు రాఘవరావు నేను మా శాస్త్రి సాయంత్రం వళ బడి ఒదిలి పెట్టగానే ఇంత టిఫిన్ తిని కాఫీ తాగి పొలాల వెంబడి పడే వాళ్ళం షూటింగ్ చూడటానికి .అదో పెద్ద వేడుక గా జరిగి పోయింది .

                             భర్త మార్కండేయ

    సరిగ్గానే రాశాను భక్త మార్కండేయ కాదు అచ్చం గా’’ భర్త మార్కండేయయే’’ .ఇది బి.వి.రాణా రావు గారి నాటిక .లైబ్రరి లో దొరికితే చదివి పొట్ట చేక్కలయ్యేట్లు నవ్వుకొన్నాను ప్రభావతీ చదివి ఆనందించింది స్కూల్ వార్షికోత్సవానికి దాన్ని పిల్లలతో ప్రాక్టీస్ చేయించాను .ఆడ పత్రాలు లేని నాటిక ఇంటి దగ్గరే రిహార్సిల్లు చేయిన్చేవాడిని స్టేజి ఎక్కే దాకా ఆడైలాగులు ఎవరికీ తెలియ కూడదని లేక పోతే గొప్పగా పేలవని .నా పేరే ఉన్న  గబ్బట దుర్గా ప్రసాద్ బాగా నటించాడు .అతని అన్న గారు సుబ్బయ్య శాస్త్రి గారు నేను చిలుకూరు వారి గూడెం స్కూల్ లో పని చేస్తున్నప్పుడు కొండ పర్వ లో పని చేసే వారు అ తర్వాత హెడ్ మాస్టర్ అయ్యారు .ఏం.పురుషోత్తమా చారి అనే లెక్కల మేస్టారి ద్వారా అక్కడ పరిచయమయ్యారు .దేశభక్తి గీతాలు ప్రాక్టీస్ చేయించి పాడించాను బాగా విజయ వంతమైంది కార్య క్రమం .హెడ్ మేష్టారు ఏం.వి.ఆర్ నా చొరవ కు సంతోష పడ్డారు నా మీద అభిమానం బాగా పెరిగింది .

                   ఏం.ఎల్.సి.ఎన్నికలు

         అప్పుడే ఉపాధ్యాయుల నుండి శాసన సభకు ఎన్నికలు జరిగాయని కొంత జ్ఞాపకం .బందరు హిందూ హైస్కూల్ లో లేక్కలమేస్టారు ,కదా రచయితా ,జాగృతి పత్రిక లో సినిమా సమీక్ష చేసేవారు వెంకయ్య నాయుడుకు గురువు అయిన ఆర్ .ఎస్.కే మూర్తి అంటే రాజనాల శివ రామ కృష్ణ మూర్తి గారు ,ఏం కృష్ణా రావు అనే అవనిగడ్డ హెడ్ మాస్టారు ,మొదలైన వారు మా ఇంటికి వచ్చి కొల్లూరికి సపోర్ట్ చేయటానికి ఒక కారులో ప్రచారం చేస్తూ నన్నూ రమ్మన్నారు వాళ్ళతో తిరిగాను చూడని స్కూళ్ళు అన్నీ చూశాను వేసవిసేలవల్లో . .కొల్లూరి గెలిచారు అప్పటి నుంచి నేను అంటే కొల్లూరికి వీరాభిమానం .మా హెడ్ మాస్టారి గ్రూప్ కు వ్యతిరేకం గా నేను పని చేసినా ఆయన దీన్నేమీ మనసులో ఉంచు కోలేదు అయితే నేను ముందే చెప్పాను నేను కృష్ణా జిల్లా టీచర్స్ గిల్డ్ మనిషి నని .అయన సంతోషించారు ఎప్పుడూ నాతో ఆవిషయం ముచ్చటించలేదు అదీ సంస్కారం ఏం.వి.ఆర్ గారిది .

                      నాకోసం తూమాటి

       దాదాపు సంవత్సరం అక్కడ పని చేశాను .రెండో ఏడాది మొదట్లో ఒక సారి కుటుంబం తో రిక్షా మీద ఉయ్యూరు బయల్దేరాను .ఇంటికి రాగానే మా అమ్మ చెప్పింది కాటూరు హెడ్ మాస్టారు తూమాటి కోటేశ్వర రావు గారు కారు వేసుకొని మన ఇంటికి వచ్చారని  మానికొండలో ఉన్నట్లు చెప్పానని వెంటనే వారు మానికొండ వచ్చారని ,మేము అక్కడ లేక పోతే మళ్ళీ ఉయ్యూరు వచ్చారు .మా కంటే ముందు ఉయ్య్యురు వచ్చారు మేము వచ్చేసరికి మా అమ్మ కాఫీలు అవీ ఇచ్చి మర్యాద చేసింది నేను .కనపడగానే ఆయన ఆనందానికి అవధులు లేవు ‘’ప్రసాద్ గారు ౧ మీ కోసమే వచ్చాం .కాటూరు హైస్కూల్ లో సైన్సు పోస్ట్ ఒకటి వస్తోంది దానిలో మిమ్మల్ని వేయించుకోవాలని నా కోరిక .కమిటీ వారు నాకే చాయిస్ వదిలేశారు మీరు ఎవరిని తెచ్చుకొన్న మాకు సమ్మతమే అన్నారు .మరి నా మాట నిలబడతారా‘/?అని అడిగారు .నాకోసం ఒక మంచి హెడ్ మాస్టారు నామీద అభిమానంతో ఇన్ని సార్లు వచ్చారంటే నాకు ఇంతకన్నా కావలసింది ఏముంది ?ఏమీ ఆలోచించ కుండా సరేనన్నాను .ఆయన చాలా ఆనందపడి ‘’మీ మీద నమ్మకంతో ఇలా వచ్చాను నా మాట నిలబెట్టి నందుకు సంతోషం మీరేమీ శ్రమ పడక్కర లేదు .అన్నీ మేమే చూసుకొంటాం ఆర్డర్లు త్వరలోనే వస్తాయి ‘’అన్నారు సరే అని అన్నాను ఇలా అనుకోకుండా అదృష్టం తలుపు తట్టింది అని పించింది కొటేశ్వర రావు గారి సౌజన్యం జీవితం లో మరిచి పోలేను .సమర్ధత ను ఆయన ఎప్పుడు గౌరవిస్తారు అని మళ్ళీ రుజు వైంది. ఈవిషయాలన్ని మా హెడ్ మాస్టారు వెంకటేశ్వర రాగారికి చెప్పాను ఆయనకు నేను మానికొండ వదిలి వెళ్ళటం ఇష్టం గా లేదు .అయిష్టం గానే ఒప్పుకొన్నారు .మన చేతుల్లో లేని విషయం అని పించింది .ఏడాదిలో మళ్ళీ బదిలీకి సిద్ధమయ్యాను .ఇది రిక్వెస్ట్ అయినా  రిక్వెస్ట్ లేని ట్రాన్స్ ఫర్ చేయిస్తామని కోటేశ్వర రావు గారు చెప్పారు దానివల్ల ప్రయాణ ఖర్చులు వస్తాయి

           సశేషం – మీ గబ్బిటదుర్గా ప్రసాద్ -ఉయ్యూరు –16-3-13 .

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

జ్ఞానదుడు మహర్షి నారదుడు -13 ధర్మ రాజు కు వర్ణాశ్రమ ధర్మ బోధ

   జ్ఞానదుడు మహర్షి నారదుడు -13

   ధర్మ రాజు కు వర్ణాశ్రమ ధర్మ బోధ

భాగవత సప్తమ స్కంధం లోనే ధర్మ రాజు నారద మహర్షి ని సకల వర్నాశ్రమ ధర్మాలను తెలియ జేయమని ప్రార్ధిస్తాడు .పరమ ధర్మ మేమిటో కూడా తెలియ జేయమంటాడు .అప్పుడు మహర్షి తాను పూర్వం బదరికాశ్రమం లో సాక్షాత్తు శ్రీ మన్నారయణుని వలన విన్న ధర్మాలను తెలియ జేస్తానని చెప్పటం ప్రారంభించాడు .

‘’అన్ని వర్ణాల వారికి  దయ ముఖ్యం .’’తరుణి తన ప్రాణ వల్లభు –హరి భావము గా భజించి యతడును దానున్ –సిరి కైవడి వర్తించును –హరి లోకము నందు సంత తానందమునన్ ‘’భర్త యేదైవం గా భావిస్తే ఉపవాస, వ్రత, తపస్సు లక్కరలేదు .అన్ని వర్ణాల వారికీ ఉచిత మైన విధులున్నాయి .అవి తప్పక చేయాలి .అంటూ అన్ని ఆశ్రమ ధర్మాలను వివరించి చెప్పాడు .చివరగా సన్య సించి సర్వ భూత నిర పెక్షుడై ,భిక్ష తో నిరాశ్రయం తో ఆత్మా రాముడి సర్వ భూత సముడై ,శాంత సమ చిత్తం తో నారాయణ పరాయణుడు కావాలి .శాస్త్ర జ్ఞానం ఉండ రాదు .గ్రహ నక్షత్రాది విద్యలన్నీ వదిలేయాలి .ఒక చోట ఉండ రాదు .పరమాత్మలో విశ్వాన్ని దర్శించాలి విశ్వం లో పరమాత్మను చూడాలి .మృత్యువు ను ద్రువమైనది గా భావించాలి .పరమ హంస యై అంతరంగ ఆత్మాను సంధానంతో మనీషియై ఇతరులకు తానొక ‘’పిచ్చి వాడు ‘’అని నిరూపించాలి .ఈ సందర్భం గా ‘’అజాగరకద‘’వివరించాడు .

    ‘’రధము మేనెల్ల, సారధి బుద్ధి ,ఇంద్రియ –గణము గుర్రములు ,పగ్గములు మనము

      ప్రాణాది దశ విధ పదీనంబు లిరుసు ,ధ –రమా ధర్మ గతులు రధాంగ కములు

      బహు ళ తరంబైన బంధంబు చిత్తంబు –శబ్దాదికములు సంచార భూము

      లభిమాన సంయుతుం డయినయిన జీవుడు రది –ఘన తర ప్రణవంబు కార్ముకంబు

      శుద్ధ జీవుండు బాణంబు,పరులు ,రాగ –భయ మద ద్వేష శోక లోభ ప్రమోహ

      మానమత్సర్స ముఖములు మాన వేంద్ర‘’

     అని పరమోత్క్రుస్టమైన జీవాత్మ పరమాత్మ విధానం తెలిపాడు

‘’వాదములు వేయు నేటికి ?-వేదోక్త విధిం జరించు బుధుడు గృహమం

దాదరమున ,నారాయణ –పాదంబులు గొలిచి ముక్తి పదమున కేగున్ ‘’

      ఈ విధం గా సకల ధర్మ సారం శ్రీహరి భజనమే శరణమే ,ప్రపత్తి యేనని వివరించాడు .ఆ తర్వాతా తాను ‘’ఉప బర్హణుడు ‘’గా పూర్వం జన్మించి ఆ తర్వాత జన్మ పరంపర దాల్చి చివరకు ఈ కల్పం లో బ్రహ్మ పుత్రునిగా జన్మించానని నారదుడు చెప్పాడు .గృహస్తుడు ఏ ధర్మం చేస్తే మోక్షానికి వెళ్తారో ఆ ధర్మా లన్ని పాండవావాగ్గ్రేసరుడికి వివరించి చెప్పాడు .చివరిగా ఏమి చేస్తే అభీప్సితం నేర ఉతుందో స్పష్ట పరచాడు .నరుడుగా ఉన్న శ్రీ కృష్ణుడే ఆది నారాయణడని ,ఆయన సేవయే సకలార్ధ సిద్ధి అని ప్రకటించాడు .

 ‘’అఖిలాడజాది దుర్లభుడు బ్రహ్మం బైన విష్ణుండు ,నీ

  మఖమందర్చితుడై ,నివాస గతుడై ,మర్త్యాక్రుతిన్ సేవ్యుడై

సఖియై ,చారకుడై ,మనో దయితుడై ,సంబందియై ,మంత్రి యై

సుఖుడుం డయ్యె ,భవన్మహిమ దా జోద్యంబు ధాత్రీశ్వరా ‘’

 ఇలా పూస గ్రుచ్చి నట్లు సకల ధర్మ సారాన్ని ,మందార మకరందం గా పోతన కవీశ్వరుడు నారద మహాముని చేత అందం గా చెప్పించాడు .గహన మైన విషయా లన్నీ అతి సులభం గా అర్ధమయ్యే మాటల తో వీనుల కింపైన పద ప్రయోగం తో అద్వైతానికి ఆయువు పట్టుగా  మనసుకు సుస్పష్టం గా అందించి న వారు పోతనకవీ ,మహామునీ

             సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –16-3-13-ఉయ్యూరు 

Posted in రచనలు | Tagged | Leave a comment

నా దారి తీరు -14 ఇన్స్పెక్షన్ –నాకు అప్పుడే హెచ్ .ఏం.గా ప్రొమోషన్ ?

నా దారి తీరు -14

     ఇన్స్పెక్షన్ –నాకు అప్పుడే హెచ్ .ఏం.గా ప్రొమోషన్ ?

మానికొండ స్కూల్ ఇన్స్పెక్షన్ ప్రారంభమైంది .పేరు జ్ఞాపకం లేదు కాని ఒక ఆచార్యులు గారు ఇన్స్పెక్షన్ చేయటానికి వచ్చారు .ఆయన బ్రాహ్మల ఇంట్లోనే భోజనం చేస్తారట .హెడ్ మాస్టారు వెంకటేశ్వర రావు గారు నన్ను పిలిచి ‘’ఆయనకు మీ ఇంట్లో భోజనం ఏర్పాటు చేయగలరా ?బహుశా రెండు రోజులుంటారు ఏమీ మొహమాటం పడద్దు .ఇదంతా స్కూల్ ఖర్చు లోనే చేస్తాం ./కావలసిన సరుకులన్నీలిస్టు రాసిస్తే ప్యూన్ రాఘవరావు తీసుకొని వచ్చి మీ ఇంట్లో ఇస్తాడు .వీలు కాక పోతే చెప్పేయండి వేరే ప్రయత్నం చేస్తా’’అన్నారు .నేను వెంటనే ‘’భోజనం పెట్ట టానికి నాకేమీ ఇబ్బంది లేదు .అయితే ఈ సరుకులు అవీ మీరు తెప్పించి పంపటం నాకు ఇష్టం లేదు మాతో పాటే వారికి భోజనం పెడతాం అతిధి కనుక ఇంకాస్త గౌరవ పూర్వక ఆతిధ్యం ఇస్తాం .నాకు డబ్బు రూపం లో కాని మరే రూపం లో కాని మీరేమీ ఇవ్వద్దు నా ధర్మం గా అతిధి కి ఆతిధ్యమిస్తాను ‘’అన్నాను .ఆయన సంతోషించి అలానే చేద్దాం .అన్నారు. నేను ఇంటికి వెళ్లి మా శ్రీమతికి ఈ విషయం చెప్పాను నేను తీసుకొన్న నిర్ణయం ఆవిడకూ నచ్చింది .

              ఇన్స్పెక్షన్ కు అధికారి గారు వచ్చారు .నా టెన్త్ క్లాస్ సైన్సు క్లాస్ చూశారు .పుష్పం లోని భాగాలు పాఠంచెప్పాను బాగా వచ్చింది .మందార పువ్వు తెప్పించి వివరించాను బాగా ప్లీజ్ అయ్యారు .అప్పుడు ఎనిమిది తొమ్మిది క్లాసులకు రసాయన శాస్త్రం లో balancing of equations  ఉండేవి .ఇది తెలియాలంటే వాలేన్సి ,సింబల్స్ అన్నీ తెలిసి ఉండాలి చాలా మంది సైన్సు మేస్టార్లు దీని జోలికి పోయే వారు కాదు .నేను మాత్రం సింబల్స్ అన్నీ బట్టీ పట్టించి బాలన్స్ చేయటం ఎలాగో తర్ఫీదు బాగా ఇచ్చాను .మంచి తెలివిగల విద్యార్దులుండేవారు .నేను బోర్డు జోలికి వెల్ల కుండా వాళ్ళతోనే ఎక్వేషన్లు రాయించి బాలన్స్ చేయటం నేర్పాను .అది బాగా క్లిక్ అయింది అందరికి మంచిహుషారు కలిగేది ఏదో సాధించామనే ఆనందం వాళ్ళ లో కనిపించేది నాకు అంతకంటే కావాల్సిందేముంది ?ఏ మేస్టారికైనా ఇంతకంటే ఆనందం ఏముంటుంది .ఇన్స్పెక్టర్ గారు నన్ను తొమ్మిదో తరగతి సైన్సు క్లాస్ లో బాలన్సింగ్ చూపించమని కోరారు .నేను వారితో వినయం గా ‘’సార్ ! వాళ్లకు ఎనిమిదో క్లాస్ లో దీన్ని గురించి చెప్పిన దాఖలాలు నాకు కనీ పించలేదు నేను ఈ ఏడాదే ఇక్కడికి వచ్చాను ..నేనే ఇప్పుడు అన్నీ మొదటి నుంచి చెప్పి నేర్పించాను. కనుక యా క్లాస్ లో అది అంతగా రాణిందని పిస్తోంది .మీరు ఎనిమిదో క్లాస్ కు రండి వారికి మొదటి నుంచి నేనే బోధించాను కనుక బాలన్సింగ్ అవలీలగా చేస్తారు చూడండి ‘’అన్నాను వారు ‘’వెరీ గుడ్ మాస్టారు .నేను కోరిన క్లాస్ కంటే కింది క్లాస్ లో విద్యార్ధులే బాలన్సింగ్ చేస్తారంటున్నారంటే నాకు మహదానందం గా ఉంది అలాగే కానివ్వండి ‘’అన్నారు .ఎనిమిదో క్లాస్ కు ఇన్స్పెక్షన్ కు వచ్చారు .ఒక్క మాట కూడా నేను మాట్లాడకుండా విద్యార్ధులతో సమీకరణాలు బోర్డు మీద రాయించి వాళ్ళతోనే బాలన్స్  చేయించాను .ఏదో ఒకరిద్దరు విద్యార్దులైతే నేను ఏదో మేనేజ్ చేశాననే అనుమానం రావచ్చు .కనుక క్లాస్ లో అందరి తోను చేయించాను .ఒక్కరు కూడా తప్పు చేయ లేదు.ఆచార్యుల వారు మహాదానంద  పడ్డారు .అదీ సరైన ,అవగాహన ఉన్న అధికారి వ్యవహరించే తీరు .నా క్లాస్ ఇన్స్పెక్షన్ అంటే నేను సర్వీస్ లో చేరిన దగ్గర్నుంచి రిటైర్ అయ్యేదాకా ఇన్స్పెక్షన్ రోజున ఏ పాఠంచెబుతానో నా విద్యార్ధులకు ముందు తెలియ జెప్పే వాడిని కాదు ఆ రోజు ఏదిబోధిస్తే బాగా క్లిక్ అవుతుందో, ఏది కష్టమైన విషయమో, ఏది దురవగాహనమో దాన్నే చెప్పే వాడిని ‘’లీకేజీ ఉండేది కాదు ‘’చాలా మంది మేస్టార్లు ఇన్స్పెక్షన్ రోజు చెప్పే పాఠాన్ని అనేక సార్లు క్లాస్ లో ట్రయల్ వేసి అప్పుడు దాన్నే బోధించే వారు .నేను దీనికి భిన్నం

       ఇన్స్పెక్టర్ గారిని మధ్యాహ్నంనాతో పాటు ఇంటికి తీసుకొని వెళ్ళేవాడిని .నా పంచె ఇచ్చి కట్టు కోమనే వాడిని. భోజనం ఇద్దరం కలిసి చేసే వాళ్ళం .మా ఆవిడ అన్ని రకాల పదార్ధాలు స్వీటు హాటు ,పాయసం గారెలు వగైరా లన్నీ చక్కగా చేసేది ఆయన కూడా చాలా ఆప్యాయం గా ఒక బంధువు ఇంట్లో ఉన్నంత చనువు గా ఉండి తృప్తి గా భోజనం చేశారు .రాత్రిళ్ళు కూడా వచ్చి భోజనం చేసే వారు .రెండో రోజు సాయంత్రం తో తనిఖీ పూర్తీ అయింది ఆ రోజు మధ్యాహ్న భోజనానికి వచ్చి భోజనం అయిన తర్వాతా ‘’దుర్గా ప్రసాద్ గారూ !.మీ క్లాసుల నిర్వహణా, మీరు బోధించే విధానం, పిల్లలకు ఏది ఎంత చెప్పాలో అలా చేసే పద్ధతి ,పిల్లల అవగాహన కై మీరు పడుతున్న శ్రమా ,మీ డిసిప్లిన్ మైంటైన్ చేసే తీరు నాకు చాలా బాగా నచ్చాయి ఒక హెడ్ మాస్టరుకు ఉండాల్సిన అన్ని మంచి లక్షణాలు మీలో నాకు కనీ పించాయి .మీకు వెంటనే ప్రమోషన్ వచ్చేట్లు పై అధికార్లకు నేను రికమెండ్ చేస్తున్నాను ‘’అన్నారు నేను అవాక్కయ్యాను .’’సార్! నా సర్వీస్ ఇంకా నాలుగేళ్ళు కూడా కాలేదండి .నాకు ఇప్పుడప్పుడే ప్రమోషన్ రాదు .మీ కు నా మీద ఉన్న సహృదయత కు కృతజ్ఞతలు మీ ప్రోత్సాహాన్ని నా జీవితాంతం గుర్తుంచుకొంటాను ఆ స్థాయి ఎప్పుడూ తగ్గకుండా చూసుకొంటాను .మీ ఆశీర్వాదాలుంటే చాలు ‘’అని వినయం గా చెప్పాను ఆయన మరీ ఆనంద పడ్డారు ‘’ఇంత తక్కువ సర్వీస్ లో ఇంత అద్భుత బోధనా పటిమ ఉండటం అరుదైనది .నేనెన్నో స్కూళ్ళు చూశాను ఎందరో సైన్సు మేస్టార్లు చెప్పిన పాఠాలు అబ్సర్వ్ చేశాను .మీ లాంటి వారు నాకెవ్వరు కన్పించలేదు .కీప్ ఇట్ అప్ ‘’అన్నారు అంతే నేను దాన్ని ఆ పూటకు మర్చి పోయాను .ఇన్స్పెక్షన్ అవగానే స్టాఫ్ మెంబర్లసమావెశం లో హెడ్ మాస్టర్ గారి ఆధ్వర్యం లో మీటింగు ఉంటుంది .ఆ మీటింగ్ లో ఇన్స్పెక్టర్ గారు మధ్యాహ్నం జరిగిన విషయాలన్నీ పూసగుచ్చినట్లు చెప్పారు .నా టీచింగ్ గురించి మరీ ముచ్చటించారు హెడ్ మాస్టారు కూడా ఎంతో ఆనందించారు .ఇలా అతి తక్కువ వయసులో అతి తక్కువ సర్వీస్ లో నాకు హెడ్ మాస్టర్ ఆయె అన్ని అర్హతలు ఉన్నాయని నేను ఎంత త్వరగా హెడ్ మాస్టర్ అయితే అంత బాగా విద్యార్ధులకు స్కూల్ కు లాభం అన్న వారి ఆంతర్యానికిర్యానికి నేను సదా కృతజ్ఞతలు చెప్పుకొంటాను .సమర్ధతను గుర్తించే అధికారి దొరకటం దుర్లభం .అదంతా వారి సౌజన్యం, నా మీద ఉన్న అభిమానం .అంతే కాని నేను పోడిచేసిన్దేమీ లేదని అప్పుడూ ఇప్పుడు ఎప్పుడూ నా నమ్మకం ..నేను పెట్టిన భోజనం,చూపిన ఆతిధ్యమూ కారణాలు కావు ..

                బాడ్  మింటన్ వాలీ బాల్ ఆటల్లో నైపుణ్యం

     హెడ్ మాస్టర్ వెంకటేశ్వర రావు గారు మంచి బాడ్మింటన్ ప్లేయర్ ..ఫ్రంట్ లో బాగా ఆడేవారు లాబ్ అసిస్టంట్ వెంకటేశ్వర రావు బాక్ బాగా ఆడేవాడు సెంటర్ కు డ్రిల్ మాస్టర్ సుబ్బారావు నేను లెఫ్ట్ ఫ్రంట్ ఆడే వాళ్ళం .రోజు స్కూల్ అవగానే పిల్లలోక వైపు మేమొక వైపు ఆడేవాళ్ళం పోటా పోటీగా ఆడే వాళ్ళం హెడ్ గారు బాగా ఎంకరేజ్ చేసే వారు .చుట్టుప్రక్కల స్కూళ్ళ వాళ్ళు అంటే కోలవెన్ను ,పునాది పాడు లలో కూడా టీచర్లు బాగా ఆడే వారు ఫ్రెండ్లీ మాచ్ లకు వచ్చేవారు మేమూ వెళ్లి ఆడేవాళ్ళం .వాలీ బాల్ లో పాండురంగారావు తో బాటు మేము ఆడేవాళ్ళం వెంకటేశ్వర రావు మంచి సర్వీస్ హాండ్ .అఫెన్స్ అండ్ డిఫెన్స్ బాగా ఆడేవాడు అలాగే గుమాస్తా వీరయ్య గారు బానే ఆడేవారు క్రాఫ్ట్ మేష్టారు కూడా ఆడేవాడు .యెమ్.విఽఅర్ .లాబ్ వెంకటేశ్వర రావు ,వీరయ్య గారు పంచె కట్టుతోనే ఆడే వారు హెచ్ ఏం గారు ఎడమకాలు కొంచెం ముందుకు వేసి సర్వీస్ భలేగా చేసేవారు ఎప్పుడూ నల్లద్దాలు పెట్టుకొనే ఆడేవారు ఇలా ఈరెండు ఆటలలో నాకు మంచి అభిరుచి కలిగింది బానే ఆడతాననే పేరూ వచ్చింది .ఆదివారాలలో సాయంత్రం స్కూల్ కు వచ్చి ఆడేవాళ్ళం హెడ్ గారి పుషింగ్ మర్చి పోలేను .ఆ రోజుల్లో రుద్రపాక లో ఉన్న టీచర్లు బాగా ఆడతారనే పేరు ఉండేది .రత్తయ్య గారు డ్రిల్ మేస్టారు .ఈడుపుగంటి వెంకటేశ్వర రావు హెడ్ మాస్టారు మంచి ప్లేయర్ . వీరిద్దరూ అన్నదమ్ములే .మా హెడ్ మాస్టారు ఈయన మంచి దోస్తులు శ్రీరామ మూర్తి గారి వర్గం .అక్కడ ‘’సన్యాసి రావు ‘’గారనే సైన్సు మేస్టారు సీనియార్ ఉపాధ్యాయులు గా నే కాకుండా సెంటర్ ప్లేయర్ గా మంచి పేరుండేది .రెండు చేతులతో రెండు బాట్లు పట్టుకొని ఏ షాట్ అయినా దిమ్మ తిరిగేట్లు కొట్టగలవారు అఫెన్సు డిఫెన్సు లో అందే వేసిన చెయ్యి .చాలా నిదానస్తులు హడా విడి, ఆర్భాటం ఉండదు ఆటలో బరిలోకి దిగిన దగ్గర్నుంచి ఆట అయ్యే దాకా చిరు నవ్వు చిందిస్తూ అందర్నీ ప్రోత్సాహ పరుస్తూ ఆడే వారు ఈ.వి.ఆర్ కొంచెం ఉద్రేకి .రత్తయ్య గారు బానే ఆడేవాడు విష్ణు దాస్ గారు కూడా బానే ఆడేవారు .ఇదంతా నీ కెట్లా తెలుసు అంటారా ఆ కధా వినండి

           మా హెడ్ మాస్టారు రెండు రోజులు సెలవులోస్తే మనం అందరం రుద్ర పాక వెళ్లి ఆడుదాం అని మాతో అన్నారు అందరం ఓ.కే.అన్నాం .అందరం కలిసి రుద్ర పాక చేరుకొన్నాం అదెక్కడుందో అప్పటిదాకా నాకు తెలియదు .చైర్మన్ శ్రీ పిన్నమ నేని కోటేశ్వర రావు గారి అన్నగారు కుటుంబ రావు గారింట్లో మాకు భోజనం టిఫిన్ పడక ఏర్పాట్లు ఆ రెండు రోజులు చైర్మన్ గారు వచ్చి మేము ఆడుతున్నంత సేపు చూసి వెళ్ళేవారు .మాకు ఆరగా ఆరగా  కాఫీలు, ఫలహారాలు అన్నీ పర్య వేక్షించే వారు .ఏ లోపం రానివ్వలేదు తమ స్వంత బంధువుల్లా ఆదరించారు చైర్మన్ గారువారి కుటుంబం, హెడ్ మాస్టారు ,వారి బోధనా ,బోధనేతర సిబ్బంది. నా జీవితం లో మరుపు రానిసంఘటన ఇది ఆ రెండు రోజులు ఎలా గడిచి పోయాయో తెలీదు అంత హుషారు గా గడిచాయి ఈ.విఽఅర్ సోదరులు పంచె కట్టుతో ఆడేవారు రత్తయ్య గారు డ్రిల్ మేష్టారు కనుక ఒక్కోసారి నిక్కర్ వేసుకొని ఆడేవారు సన్యాసి రావు గారి ఆట కూడా కల కాలం గుర్తుండే ఆట ఆటలో ఆయనే అందరికి ఆదర్శం .నేను హెడ్ మేష్టారు గా ప్రమోషన్ పొందన తర్వాతా  చాల సార్లు ప్రధానోపాధ్యాయుల సమావేశాలలో కలుసుకొన్నాం .నేనంటే ఆపేక్ష బాగా ఉండేది .రుద్ర పాక స్కూల్ లో బాడ్మింటన్ వాలీ బాల్ఆడటం నా కు మధురాను భూతి చైర్మన్ గారితో సన్నిహితం కావటం మాటలు కాదు .నిజం చెప్పా లంటే ఈడుపు గంటి ,మిక్కిలినేని చైర్మన్ గారు బల పరచిన కొల్లూరికి ఏం.ఎల్.సి ఎన్నికలో వ్యతిరేకం గా పని చేసిన వారే .కాని వీటిని ఆయన దృష్టిలో పెట్టుకోలేదు సమర్ధతకు సమర్ధన తెలిపారు అదీ పిన్నమనేని అంటే అందుకే జిల్లా అంతా పిన్నమనేని అంటే జిల్లా పరిషత్ చైర్మన్ చైర్మన్ అంటే పిన్నమ నేని అని గౌరవం గా చూశారు ఈ.వి.ఆర్ .పిన్నమనేని అంతరంగికులు ట్రాన్స్ ఫర్ల విషయం లో చైర్మన్ గారికి సల్హలిచే వారని ప్రతీతి .ఈవిఆర్ కు తెలీకుండా ఏ బదిలీ జరిగేది కాదు .ఈయనకు నేనంటే మహా ప్రేం నన్ను ముప్పాళ్ళ నుంచి పామర్రు బదిలీ చేయించటానికి తేరా వెనుక గొప్ప కృషి చేశారు సమర్ధత ఉన్న తీచార్లంటే బాగా ఇష్టపడే వారు .

         సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –15-3-13- ఉయ్యూరు

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

అరకొరగా ఉన్నా ఆగనిదే జీవితం -కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు లభించిన-. ఎన్. గోపి జీవనయానం

అరకొరగా ఉన్నా ఆగనిదే జీవితం


ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ ఎన్ని పాఠాలైనా చెప్పి ఉండవచ్చు. విద్యార్థుల జీవితాల్ని అవి ఎంతగానైనా ప్రభావితం చేసి ఉండవచ్చు. కానీ, ఆ చెప్పేవారిని కూడా నడిపించే పాఠాలు కొన్ని ఉంటాయి కదా! ఆ పాఠాల స్ఫూర్తితోనే ఇక్కడిదాకా రాగ లిగానని చెబుతారు డాక్టర్ ఎన్ గోపి. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా, తెలుగు యూనివ ర్సిటీ వైస్ చాన్సలర్‌గా కన్నా ఆయన ‘వేమన- గోపి’గా, 18 కవితా సంకలనాలు ప్రచురించిన ఒక ‘కవి- గోపి’ గానే ఎక్కువ మందికి తెలుసు. ఆయన రాసిన ‘కాలాన్ని నిద్రపోనివ్వను’ అన్న కవితా సంకలనానికి కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు కూడా లభించింది. ఎన్. గోపి జీవనయానంలోని కొన్ని అరుదైన సంఘటనలే ఈ వారం ‘అనుభవం’
మా స్వస్థలం నల్లగొండ జిల్లాలోని భువనగిరి. మా నాన్నగారు నెత్తిన చీరల మూట పెట్టుకుని ఊరూరూ తిరుగుతూ అమ్మేవారు. ఆయన ఇంట్లో లేనప్పుడు ఎవరైనా వస్తే మా అమ్మ, మా అక్క, నేను అమ్మేవాళ్లం. మా నాన్నకు ఆయుర్వేద వైద్యం మీద కొంత అవగాహన ఉండేది. జబ్బుతో తన వద్దకు వచ్చిన వారికి ఆయుర్వేద మాత్రలు, పసరు మందులు ఇచ్చేవారు. అవసరం అనిపిస్తే కొందరికి భస్మాలు కూడా తయారు చేసి ఇచ్చేవారు. ఈ మందులన్నీ ఆయన అందరికీ ఉచిత ంగానే ఇచ్చేవారు.

ఆయన వైద్యంతో ఒక మహిళకు ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్న ఒక మొండి వ్యాధి నయమైపోయింది. ఆ సంతోషంలో ఆమె భర్త, కొడుకులు, బిడ్డలు, మనమలు మా నాన్నకు కృతజ్ఞతలు చెప్పడానికి పెద్ద గుంపుగా మా ఇంటికి వచ్చారు. ఆమె భర్త మా నాన్నను ఉద్దేశించి “చెన్నయ్య మహరాజ్! మీరిచ్చిన మందుతో నా భార్య వ్యాధి నయమైపోయింది. మీ చేతి చలవ వల్ల ఆమె పూర్తిగా కోలుకుంది. మాకు చాలా సంతోషంగా ఉంది” అంటూ తన జేబులోంచి 100 రూపాయల నోటు తీసి, నాన్నకు ఇవ్వబోయాడు. నాన్న ఆ నోటును ఒక పామును చూసినట్లు చూశాడు. “ఏందయ్యో నేను మందులు ఇచ్చిన ందుకు ఎప్పుడూ పైసలు తీసుకోను” అని ఎంతో చీదరింపుగా అన్నాడు. అప్పుడు నాకు పదేళ్లు ఉంటాయేమో.

ఆ రోజుల్లో 100 రూపాయల నోటంటే చాలా పెద్ద మొత్తం. నాన్న నిరాకరించ డాన్ని చూసి నివ్వెరపోయాను. ఆ రోజుల్లో ఒక మంచి జరీ చీర ఖరీదు మూడు రూపాయలు. ఒక వంద రూపాయలు చేతికి రావాలంటే 33 చీరలు అమ్మాలి. అంత డబ్బును మా నాన్న తృణప్రాయంగా తోసిపుచ్చడం ఎంతో అసాధారణ విషయంగా అనిపించింది నాకు. ఆయనెవరు? నెత్తిన మూట పెట్టుకుని బట్టలమ్ముకునే ఒక చిన్న బట్టల వ్యాపారి. ఎంత చేసినా ఇల్లు గడవడమే కష్టంగా ఉండే ఒక బడుగు జీవి.

అలాంటి వాడు తనకు తెలిసిన వైద్యాన్ని సొమ్ము చేసుకునేందుకు కాకుండా ప్రజల మేలు కోసం ఉపయోగపెట్టాలని ఆలోచించటమే ఒక అద్భుతం. ఆయన బట్టలమ్మే సమయంలో పైసాపైసాకూ గీసిగీసి వ్యాపారం చేయడం నాకు గుర్తుంది. వాళ్లు అడిగిన ధర తనకు గిట్టుబాటు కాదనిపిస్తే పడదని విసురుగా మూట బిగదీసిన సందర్భాలూ ఉన్నాయి. అదేమో తన వ్యాపారం. కానీ, వైద్యం అతని సేవాకార్యం. జీవితం చివరి దశలో ఆరోగ్యం బాగా క్షీణించి తను వ్యాపారం చేయలేని స్థితికి చేరుకున్న నాడు కూడా తాను ఏనాడూ వైద్యంతో సొమ్ము చేసుకోవాలనుకోలేదు. జీవితం చివరి క్షణం దాకా అలాగే ఉండిపోయాడు. ఎవరికి వారు ఎన్ని జీవన సూత్రాలయినా పెట్టుకోవచ్చు కానీ, జీవితమంతా ఆ సూత్రానికి కట్టుబడి జీవించడంలోనే అసలైన జీవితం ఉందనే ఒక లోతైన సత్యాన్ని ఆ సంఘటన నాకు నేర్పింది.

ముద్ర వేసిన ఆరుద్ర వ్యక్తితం
1974లో నాకు ఉస్మానియా యూనివ ర్సిటీలో పిహెచ్‌డిలో సీటు వచ్చింది. ‘ప్రజాకవి వేమన’ అన్నది నా పరిశోధనాంశం. వేమనకు సంబంధించిన ఎంతో విషయసామగ్రి మద్రాసు యూనివర్సిటీ కేంపస్‌లోని ప్రాచ్య లిఖిత గ్రంధాలయంలో ఉన్నట్లు ఎవరో నాకు చెప్పారు. వాటి కోసం నేను మొట్టమొదటిసారిగా మద్రాసుకు వెళ్లాను. ఆరుద్ర గారికి అప్పుడో ఇప్పుడో ఉత్తరాలు రాస్తూ ఉండే వాడ్ని. ఆయన అప్పటికే వేమన మీద ఒక టి రెండు వ్యాసాలు రాశారు. నా పరిశోధన విషయంలో ఏమైనా సలహా ఇస్తారేమోనని ఆయన దగ్గరకు వెళ్లాను. అప్పటిదాకా ఉత్తరాలు రాయడమే తప్ప ముఖ పరిచయమేమీ లేదు. అయినా అంత పెద్దకవి ఏమీ తెలియని ఈ కుర్రాడి కోసం బయలుదేరారు.

పరిశోధన పట్ల ఆయనకున్న అవ్యాజమైన ప్రేమ కూడా అందుకు కారణం కావచ్చు. నన్ను తన కార్లో ఎక్కించుకుని వాళ్ల ఇంటికి దాదాపు 20 కిలో మీటర్ల దూరంలో ఉన్న మద్రాసు యూనివర్సిటీ క్యాంపస్‌కు తీసుకువెళ్లారు. ఆ లైబ్రరీలోని కొంతమంది సిబ్బందికి పరిచయం చేశారు. వేమనకు సంబంధించిన తాళపత్ర గ్రంధాలు, సి.పి. బ్రౌన్ రాయించిన కాగితపు గ్రంధాలు మొత్తం 100 దాకా ఆ లైబ్రరీలో ఉన్నాయి. వాటి ప్రతులు తీసుకోవడానికి ఆ రోజుల్లో జిరాక్స్‌లు లేవు. వేలాది పేజీలను రెండు వేసవి సెలవుల్లో కూర్చుని రాసుకున్నాను. రాసుకోవడం పూర్తయిన తరువాత ఆరుద్ర గారికి అవన్నీ చూపించాలనిపించింది. ఆటో కాదు కదా, బస్సులో వెళ్లడానికి కూడా నా వద్ద డబ్బుల్లేవు.

అందుకే దాదాపు 40 కిలోల బరువు ఉన్న ఆ మొత్తం ప్రతుల్ని తల మీద పెట్టుకుని ఆరుద్ర గారి ఇంటికి నడిచి వెళ్లాను. నేను రాసిన ప్రతుల్ని ఒకటి రెండు పేజీలు తిప్పి చూసి “అబ్బో చాలా విలువైన సమాచారం ఉందే!. ఇవి నేను చూడకూడదు. నేను చూశానంటే వ్యాసాలు రాస్తాను. నువ్వు ఎంతో కష్టపడి ఇవన్నీ సేకరించావు. ఏంరాసినా నువ్వే రాయాలి’ అన్నారు. నేను ఏమైనా రాసినా అది నువ్వు రాసిన తరువాతే అంటూ ఆ ప్రతుల్ని ఇంక తాకలేదు. నేను పిహెచ్.డి వర్క్ చేస్తున్న సమయంలోనే పారిస్‌లో వేమన పద్యాల ప్రతి ఒకటి ఉందని తెలిసింది. ఎంతో కష్టపడి ఒక స్నేహితుడి ద్వారా ఆ ప్రతిని తెప్పించుకున్నాను. దాన్ని ఫోటో కాపీ తీసి ఆరుద్రగారికి ఒక కాపీ పంపాను. ఆయన దాన్ని చదివి “నిజంగానే వీటిలో ఎన్నో విలువైన విషయాలు ఉన్నాయి. ఎప్పుడో ఒకప్పుడు అందులోని విషయాల్ని బయటికి తెచ్చే ప్రయత్నం తప్పకుండా చేస్తాను.

కానీ, నువ్వు ఎంతో కష్టపడి పారిస్ నుంచి సేకరించిన ప్రతులవి. నువ్వు వాటిని పుస్తకంగా వెయ్యక ముందే నేను వాటి గురించి రాయడం భావ్యం కాదు” అంటూ ఉత్తరం రాశారు. కొన్నాళ్లకు శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ వారు ఏదో ఉపన్యాసం ఇవ్వడానికి ఆరుద్ర గారిని ఆహ్వానించారు. అప్పుడిక అనివార్యమై ” గోపీ! నేను వాటిలోంచి కొన్నింటిని వాడుకోవాలనుకుంటున్నాను” అన్నారు. నేను మహా ఆనందంగా ఒప్పుకున్నాను. తాను వాడుకున్న ప్రతి పద్యం కింద ” ఈ పద్యాన్ని గోపి సేకరించాడు. మామూలుగా అయితే అవి పుస్తకరూపంలో రాకముందే నేను వాడుకోవడం భావ్యం కాదు. కానీ అనివార్య పరిస్థితుల్లో వాడుకోవలసి వచ్చింది” అంటూ రాశారు. రెండు సందర్భాల్లోనూ ఆయనలో చూసిన నిజాయితీ నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. ఒక పరిశోధకుడిలో లేదా ఒక సత్యాన్వేషిలో ఎంత నిజాయితీ ఉండాలో నేను ఆరుద్ర గారి నుంచే నేర్చుకున్నాను. ఇన్నేళ్ల ఉపాద్యాయ వృత్తిలో విద్యార్థులు ఏదైనా కొత్త విషయం చెబితే ఆ క్రెడిట్ పూర్తిగా వాళ్లకే దక్కాలని అనుకుంటాను. నా పరిధిలో వాళ్లకు దక్కేలా చేస్తాను కూడా.

అన్నీ కావాలంటే…
పరిశోధనలో భాగంగానే ఒకసారి రాజమండ్రి లైబ్రరీకి వెళ్లాను. కొన్ని పుస్తకాలు తీసుకుని రోజురోజంతా రాసుకుంటూ ఉండిపోయేవాడ్ని. అది నాకు రెండు రోజుల పని. భోజనం అయితే హోటల్లో చేశాను. కాని అక్కడ నాకు తెలిసిన వాళ్లెవరూ లేరు. రాత్రంతా ఎక్కడ ఉండాలి?లాడ్జ్‌లలో ఉండడానికి నా దగ్గర డబ్బులు లేవు. అందుకే రెండు రాత్రులూ ఆర్టీసి బస్‌స్టాండ్‌లోనే పడుకున్నాను. కాకపోతే ఎవరినీ క్రిమినల్స్‌గా అనుమానించే పరిస్థితులు ఆనాడు లేవు. సరిగ్గా 25 ఏళ్ల తరువాత నేను అదే ఊరికి తెలుగు యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా వెళ్లాను.

ఏ ప్రదేశంలో ఒకప్పడు నన్ను పలకరించే మనిషే లేడో అదే రాజమండ్రి స్టేషన్‌లో నేను అడుగు మోపగానే నన్ను వందల మంది రిసీవ్ చేసుకున్నారు. అందులో నా గొప్పతనం ఏమీ లేదు. అదంతా సర స్వతీ మహిమ. నన్ను చదివించలేని పరిస్థితులు మా ఇంట్లోనూ ఉన్నాయి. అయినా నన్ను చదివించారు. ఆ చదువే నన్ను ఇక్కడి దాకా తీసుకువ చ్చింది. వాస్తవానికి నా కన్నా చురుకైన వాళ్లు, నా కన్నా గొప్ప గ్రహణ శక్తి, విశ్లేషణా శక్తి గల వాళ్లు చదివించేవాళ్లు లేక అక్కడే ఉండిపోయారు. అన్నింటికీ సరిపడా డబ్బులు ఉంటేనే అడుగులు వేస్తానని, ఏ కాస్త తక్కువ బడినా అక్కడే ఆగిపోతామనుకునే ధోరణి కొందరిలో ఉంటుంది.

ఎన్నోసార్లు బస్సుల్లో వెళ్లాల్సిన దూరాల్ని కాలి నడకన వెళ్లాల్సి ఉంటుంది. నేను చేసిన పనీ అదే. అదే పనిగా సౌకర్యాలు కోరేవాడు తన ప్రయాణంలో అడుగడుగునా ఆగిపోతాడు. అరకొర సౌకర్యాలతో కూడా అడుగు ముందుకేసే వాడే అంచుదాకా వెళతాడనే సత్యం నా జీవితం నాకు నేర్పిన మరో ముఖ్యమైన పాఠం. – బమ్మెర
ఫోటోలు : సాల్మన్ రాజు

 

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

జ్ఞానదుడు మహర్షి నారదుడు -12

  జ్ఞానదుడు మహర్షి నారదుడు -12

  భక్త ప్రహ్లాద రక్షకుడు నారదుడు

భాగవతం సప్తమ స్కంధం లో ప్రహ్లాద బాలకుని చెలి కాళ్ళందరికి విష్ణు భక్తి అతనికి ఎలా అబ్బిందో అర్ధం కాక బుర్రలు బద్దలు కొట్టుకొని చివరికి అతనినే అడిగేశారు .ఆశ్చర్యం గా ‘’మంటిమి గూడి ,భార్గవ కుమారులొద్ద ననేక శాస్త్రముల్

వింటిమి ,లేడుసద్గురుడు వేరొక డేన్నడు ,రాజ శాల ,ము

 క్కంటికి నైన రాదు చోరగా ,వెలికిం జన రాదు ,నీకు ,ని

ష్కంటక వృత్తి ,నెవ్వడు ప్రగల్భుడు సెప్పె గుణాధ్య చెప్పుమా ?’’అడిగారు

    అప్పుడు ఆ పరమ భాగవోతోత్తముడు ‘’నేను పూర్వం దివ్య ద్రుష్టి గల నారద మహా ముని వల్ల సవిశేష మైన ఈ జ్ఞానాన్ని ,పరమ భాగవతోత్తమ ధర్మాన్ని తెలుసుకొన్నాను .’’అని సవినయం గా చెప్పాడు .తన తండ్రి తపస్సు కోసం అరణ్యాలకు వెళ్ళగా గర్భవతి అయిన తన తల్లి లీలావతీ దేవిని ఇంద్రుడు చేర బట్టి తీసుకొని వెళ్తుంటే దైవ యోగం గా నారద మహర్షి వచ్చి ,ఆమె గర్భం లోని శిశువు మహా భక్తు డౌతాడని రాక్షసామ్ష ఉండదని నచ్చ చెప్పటానికి ప్రయత్నించాడట

‘’స్వర్భువనాది నాద !సురసత్తమ ,వేల్పులలోన మిక్కిలిన్

  నిర్భర పుణ్య మూర్తివి ,సునీతివి ,మానిని బట్టనేల ?ఈ

  గర్భిణినాతురాన్ విడువు ,కల్మష మానసురాలు గాదు ,నీ

  దుర్భర రోషమున్ నిలుపు ,,దుర్జయుడైన నిలింప వైరిపై ‘’అని నచ్చ జెప్పే ప్రయత్నం చేశాడు

 కాని ‘’వేయి కన్నుల ఠవర’’ఒప్పుకోకుండా ‘’వేల్పు దపసి ‘’తో

  ‘’అంత నిధాన మైన దివిజాదిపు వీర్యము ,దీని కుక్షి న

   త్యంత సమృద్ధి నోందెడి మహాత్మా ,కావున ,తత్ప్రసూతి ప

   ర్యన్తము బద్ధ జేసి ,జనితార్భకు ,వజ్ర ధార ద్రుంచి ,ని

   శ్చింతడ నై ,తుదిన్ విడంతు,సిద్ధము దానవ రాజ వల్లభన్ ‘’అని ఇంద్రుడు తన మనసు లోని మాటను భయాన్ని వెలువరించాడు .మహర్షి అంత మాత్రం గా వదిలే రకమా ?తన ప్రయత్నాన్ని అర్ధంతరం గా ముగిస్తాడా ?వేల్పు రేని తో మళ్ళీ అంటున్నాడు

‘’నిర్భీకుడు ప్రశస్త భాగవతుడున్ ,జన్మాంతరా

 విర్భతాచ్యుత పాదభక్తి మహిమా విస్టుండు,దైత్యాంగనా

 గర్భస్తుం డగు బాలకుండు,బహు సంగ్రామాద్యుపాయంబులన్

 దుర్భావంబున నొంది చావడు ,భవ దోర్దర్ప విభ్రాన్తుడై’’ అనినువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా చావడు .అతను కారణ జన్ముడు  అని దేవముని చెప్పగా ,మన్నిన్చాడని ,తన ఆశ్రమానికి తీసుకొని వెళ్లి తన తల్లిని పుత్రికా భావం తో సంరక్షిన్చాడని తెలియ జేశాడు .ఆమె గర్భం లో పరమ భాగవతుడైన ప్రాణి ఉన్నాడని ,ఆమె భర్త వచ్చే వరకు తన ఆశ్రమం లోనే ఉండవలసినదని కోరాడు మహర్షి .ఆమె భక్తీ తో నారద మునిని సేవిస్తూ భర్త రాక కై ఎదురు చూసేది .’’ఆశ్రిత శిక్షా విశారడుడైన నారదుడు ‘’గర్భం లో ఉన్న తనకు ధర్మ తత్వాన్ని ,నిర్మల జ్ఞానాన్ని ఉపదేశించాడు .దాని ఫలితమే తనకు లభించిందని ప్రహ్లాదుడు స్నేహితులకు చెప్పాడు .ఇదంతా చెప్పి తాను నమ్మి చరిస్తున్న బాట లో వారినీ సాగి పొమ్మని హితవు చెప్పాడు .

‘’దానవ దైత్య భుజంగమ ,మానవ గంధర్వ సుర సమాజాము లో –

 లక్ష్మీ నాధుని చరణకమల –ధ్యానంబున ,నేవ్వ డైన ధన్యత నొందున్ ‘’అని చెప్పి విష్ణువు ఏ విధం గా తమకు దక్కుతాడో వివరించి చెప్పాడు ‘’

‘’చిక్కడు వ్రతముల ,గ్రతువుల ,జిక్కడు దానముల ,శౌచ శీల,తపములం

 జిక్కడు యుక్తిని భక్తిని ,జిక్కిన క్రియ నత్యుతుం డుసిద్ధము సుండీ ‘’అంటూ చండా మార్క గురువులు ‘’బాధ గురువులే ‘’కాని ‘’నిజ బోధ గురువులు కారని ‘’స్పష్టం చేశాడు .

 ‘’గురువులు దమకును లోబడు –తెరువులు సేప్పెదరు ,విష్ణు దివ్య

   పదవికిం ,దెరువులు సెప్పరు ,చీకటి బరువులు పెట్టంగ నేల బాలకులారా ?’అని తనతో బాటు మోక్ష ధ గాములై ,కైవల్య పదాన్ని పొందమని వేడుకొంటాడు బాల ప్రహ్లాదుడు చెలి కాళ్ళతో .ఇంకేముంది ?తా చెడ్డ కోతి వనమెల్లా చేర్చి నట్లయింది .రాక్షస వనాన్నే హరి నామ బీజం తో చెడగోట్టాడు .శిష్యులంతా చదువు మానేసి ‘’నారాయణ భక్తి చిత్తముల గీలించారు ‘’’ఇంత గాఢ మైన భక్తీ భావాన్ని తల్లి గర్భం లో ఉండగానే ముద్ర వేసిన నారద మహర్షి మహత్తు మాటలకుఅంద రానిది

              సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –15-3-13-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

తెలుగు లో చదివితే ఉద్యోగాలు రావా ?-శ్రీ పులికొండ సుబ్బా చారి వ్యాసం

telugulon udyogalu -1telugulon udyogalu -2

Posted in సేకరణలు | Tagged | 1 Comment

పక్షి ప్రపంచం:1 కాకి

ప్రియ మిత్రమా !

                       నమస్కారం.
                       పక్షి ప్రపంచంలోని వివిధ  పక్షులకు చెందిన ఆశ్చర్యకరమైన, ఆసక్తికరమైన విశేషాలతో
ఒక వ్యాస పరంపర రాయ తలపెట్టి, ముందుగా మన చిరకాల మిత్రుడు,అతి  సర్వ సాధారణమైన పక్షి అయినట్టి
కాకి పై ఒక సమగ్ర శాస్త్రీయ వ్యాసం రాశాను. ఆ వ్యాసాన్ని ఈ విద్యుల్లేఖతో జతపరిచాను.ఈ వ్యాసం పూర్తిగా శాస్త్రీయ కోణం నుంచి, లోతైన అధ్యయనానికి స్వీయానుభవాలను మేళవించి రాసినది.ఇది మిమ్మల్నందరినీ తప్పక ఆకట్టుకుంటుందని భావిస్తాను.
                               ఈ వ్యాసాన్ని మీరంతా చదివి మీ మీ అభిప్రాయాలు తెలపడమే కాక, మీ మిత్రులందరికీ ఈ వ్యాసాన్ని పంపి వారి స్పందనలను కూడా నాకు తెలుపవలసినదిగా కోరగలరు.బ్లాగర్లు ఈ వ్యాసాన్ని తమ తమ బ్లాగులలో పెట్టి ఈ వ్యాసం యొక్క  లక్ష్య పరిపూర్తికి తోడ్పడవలసిందిగా మనవి.
                                                                             ధన్యవాదాలతో,
                                                                                     ఉంటాను.
                                                                                         మీ,
                                                                                     రవీంద్రనాథ్.
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నా దారి తీరు –13 మానికొండ కాపురం

 నా దారి తీరు –13

 మానికొండ కాపురం

  నేను ,మా ఆవిడ ఇద్దరు పిల్లలతో మాని కొండ లో కాపురం పెట్టాను .కమ్మ వారి ఇంట్లో .స్కూల్ కు దగ్గర ఆ కుటుంబం లో ముసలి ఆయనా ,మామ్మ గారు ,ఇద్దరు మనవళ్ళు ఉండేవారు వాళ్ళ ఇల్లు పెద్దది .మాది వారింటి పక్క చిన్న డాబా ,ముందు పెంకు సావడి .పెద్ద గేటు లో నుంచి లోపలి రావాలి ఆవరణ అంతా వాళ్ళ గేదెలు ఎడ్ల బందీ పాలేళ్ళు .మామ్మ గారు మంచిదే తాతగారు ఎక్కువ గా మాట్లాడే వాడు కాదు .పెద్ద మనవడుఅంటే కొడుకు కొడుకు అంజి బాబు ఎప్పుడూ లున్గీచోక్కా తో ఉండి పై పెత్తనం చేసే వాడు రెండో మనవడు,అమ్మాయి కొడుకు  తొమ్మిది చదువుతున్నాడు .వంటకు ఒక గది.హాలు స్నాల గది ఉండేవి బోర్ లెట్రిన్ .ఆ ఇంట్లో అంతకు ముందు నా బి.యి.డి ట్రెయింగ్ మట్ తాతినేని చెన్నా రావు అనే లెక్కల మేష్టారు .అతన్ని బదిలీ చేస్తే, వెళ్లి పోతే నేను చేరాను .అద్దె యాభై రూపాయలని గుర్తు .పాలు మామ్మ గారే పోసే వారు వెన్న కావాలన్నా అమ్మేది .ఖచ్చిత మైన మనిషి ఊళ్ళో మంచి పేరున్న ఆసాములు ..అఆవిడ పొడుగ్గా నడుం కొంచెం ఒంగి ఉండేది ఆయన ఎర్రగా లావుగా పంచె బనీను తో ఉండేవాడు .మా సామాను ను మా మామయ్యాగారి రెండెడ్ల బండీ మీద మానికొండ కు చేర్చారు .

             మానికొండలో నాకు ముందు సైన్సు మేస్టర్ గా పని చేసిన సురేంద్ర నాద్ చౌ దరి నాకు ట్రెయినింగ్ మేట్(g.s.n.choudari ) .అతన్ని కలవ పాముల వేశారు .చెన్నా రావు, చౌదరి లంటే హెడ్ మాస్టారు వెంకటేశ్వర రావు గారికి పడేది కాదట..చెన్నా- రెక్లెస్ ఫెలో. ట్రెయినింగ్ లోనే ఎవరి మాటా వినే వాడు కాదు చొక్కా కి గుండీలు పెట్టె వాడు కాదు .చాతీ మీద బొచ్చు అంత కనీ పిస్తూ ఉండేది చదువు చెప్పాలనే శ్రద్ధ ఏ మాత్రం లేని వాడు కబుర్ల పోచికోలు ..పెనమకూరు స్వగ్రామం .బేఫరవా రకం అందుకే భరించలేక పంపించేశారు .చౌదరి మాటకారి .లౌక్యం తెలిసిన వాడు ఊళ్ళో అందర్నీ మంచి చేసుకొనే రకం .అంతకు ముందు వరకు ఏం.వి.ఆర్ .గారితో( హెచ్ .ఏం.)బానే ఉండే వాడట .ఏదో తేడా వచ్చి తోసేశారు .ఇతను ట్యూషన్ బాగా మెయింటైన్ చేసే వాడట .చెన్నా కి ఆ గొడవే లేదు అప్పుడు ఇంకా మార్కులకు విలువ ఉంది .అందుకని తప్పకుండా ప్రైవేట్ చదివే వాళ్ళు.నన్ను కూడా ట్యూషన్ చెప్పమని అడిగే వారు .సరే నని ఒప్పుకొన్నాను వి.పాండు రంగా రావు అనే లెక్కల మేష్టారు పెద్ద’’దుకాణమే ‘’నడిపే వాడు .ఎస్ ఎస్.ఎల్సి పిల్ల లంతా ఆయన దగ్గరే చదివే వారు నన్ను తొమ్మది ఎనిమిది క్లాసులకు చెప్పా మన్నారు ఆ రోజుల్లోనే ట్యూషన్ ఫీజు ఏడాదికి రెండు వందల యాభై .చాలా ఎక్కువ డబ్బే నాలెక్కలో .మాని కొండ ను ‘’మనీ కొండ ‘’అనే వారు .పున్నయ్య గారు అనే ఆయన సీనియర్ టీచర్ ఆయనే ఇంచార్జి హెడ్ .సోషల్ మేష్టారు చాలా సౌమ్యుడు .హెచ్ .ఏం.గారి కిచెన్ కేబినేట్ లో ఒకరు .అట్లాగే నరసింహా రావు అనే సెకండరి మేష్టారు కింది క్లాసులన్నీ కుదరేసుకొనే వాడు .హెడ్ గారికి‘’చెంచా ‘’అనేవారు .ఉదయం సాయంత్రం పిల్లలకు ట్యూషన్ లతో బిజీ బిజీ .నాదగ్గర లాయర్ గారి అమ్మాయి సూర్య కుమారి ,అమ్మాజీ అనే అమ్మాయి ,డ్రిల్ మేస్టర్ పిచ్చయ్య గారి అమ్మాయి ,రాఘవరావు కూతురు ,ఊళ్ళో పురోహితులు గారి అమ్మాయి సూర్య కుమారి చదివారు .మగ పిల్లలలో గోగినేని విష్ణూ రావు గారనే పెద్ద లాండ్ లార్డ్ నవయుగా డిస్ట్రిబ్యూటరు గారి అబ్బాయి శ్రీనివాస్ ,గాంధి అనే మానెడు మాక కుర్రాడు అక్కడి వాడే గబ్బిట దుర్గా ప్రసాద్ అని నా పేరే ఉన్న ఇంకో కుర్రాడు మామ్మ గారి రెండో మనవడు మొదలైన వాళ్ళు చదివారు .స్కూల్ లోను ఇంట్లో ను బానే కస్టపడి చెప్పే వాడిని .మామ్మ గారి పెద్ద మనవడికి మాట సరిగా వచ్చేది కాదు .రెండో మనవడు చదువూ అంతే ..అవధాని గారు అనే తెలుగు పండితులుండే వారు మంచి నియమ నిస్టా పరులు .మడి ఆచారం .కానీ డ్యూటీ విషయం లో ఎక్కడా రాజీ లేదు .స్పాట్ వాల్యుయేషన్ కు వెళ్ళినా ఒక గది తీసుకొని వంట చేసుకొనే వారు రెండు పూటలా అనుస్టానముండేది పిలకా పంచె చొక్కా చాలా శ్రోత్రీయం గా ఉండేవారు నేనంటే మంచి గౌరవం వారింటికి తీసుకొని వెళ్ళే వారు మా ఇంటికీ వచ్చేవారు .వారబ్బాయి నా దగ్గరే ప్రైవేట్ చదివాడు ఆబ్బాయి ఒడుగు చేసి మమ్మల్నందర్నీ భోజనానికి పిలిచారు ..

            ఆ మధ్యదాకా తెలుగు దేశం పార్టీ లో ఉన్న ఉప్పులేటి కల్పన మాని కొండ స్కూల్ లోనే మా దగ్గర చదివింది .ఆమె తండ్రి సెకండరి మేస్టారు బసవేశ్వర రావు అనిజ్ఞాపకం తల్లి కూడా టీచరే .అప్పల స్వామి గారు అనే డ్రాయింగ్ మేస్టారుండే వారు చంకలో ఎప్పుడూ ఇంగ్లిష్ పేపరో ,విశాలాంధ్ర పత్రికో ఉండేది మిత భాషి .గొప్ప చిత్రకారులు గా ప్రసిద్ధి. స్కూల్ గదుల లోపల చరిత్ర ,సైన్సు లకు సంబంధించిన మాపులు అత్యద్భుతం గా చిత్రించారు. భారత దేశ పటంలో హమాలయాల ఉన్నతం లోయలు, నదులు కళ్ళకు కట్టి నట్లు చిత్రించారు వీటిని చూడ టానికి చాలా మంది వచ్చేవారు .గ్లాస్కో పంచె ,లాల్చీ తో ఉండేవారు .బాగా రాజకీయ అవగాహన ఉన్న వారు .అప్పటికే తీవ్ర వామ భావాలు వ్యాపించి ఉన్నాయి ఆయనకు అవన్నీ కొట్టిన పిండే .ఏ విషయమైనా ధారాళం గా సవివరం గా చెప్పే వారు .నాకు ఆయన అంటే గౌరవం ఉండేది. ఆయనా నన్ను ఇష్టపడే వారు .ఇంకో పెద్ద తెలుగు మేష్టారు ఆచార్లు గారుండే వారు ఒకే నిలువు బొట్టు పెద్ద మనిషి తరహా .మంచి పండితులు చిన్న తెలుగు మేష్టారు కూడా ఆచార్యుల వారే .పంగనామాలతో ఉండేవారు కోపం జాస్తి బి.పి.కూడా ఉండేదేమో /చిర్రు బుర్రులాడే వారు .ఈ ఆచార్యులలో ఒకరి కొకరికి పడేది కాదు కాని నాతో ఇద్దరు ఆప్యాయం గానేఉండే వారు .చిన్నాయన అందరి మీదా చాడీలు చెప్పేవారు ఉక్రోషం ఎక్కువే .సైన్సు మేస్టర్ గా కొత్తగా ట్రెయింగ్ పాసైన అతనొకడు చేరాడు నేచురల్ సైన్సు చెప్పే వాడు ఇంటి పేరు కొడాలి పేరుసుబ్బారావు . .నాతో మంచి స్నేహం చేసే వాడు అతని భార్య లెక్కల టీచర్ గా పటమట లో చేసేది .ఆమె భారీ మనిషి అతను పొట్టి .వీరిద్దరి పెళ్లి నేను అక్కడ ఉండగానే అయింది పెళ్ళికి వెళ్లి వచ్చాం ఇద్దరు హెడ్ మాస్టర్లు అయి రిటైర్ అయ్యారు .ఇంకొక క్రిస్టియన్ పెద్దాయనసామ్యూలు అనే ఆయన  సెకండరి మేష్టారు గా ఉండేవారు చాలా పెద్ద మనిషి సౌమ్యులు నవ్వు ముఖం తో పలకరించేవారు .ఆయన అంటే ఊళ్లోనూ అభిమానం ఎక్కువ ..ఆయన భార్య కూడా టీచరే .డ్రిల్ మేస్టార్లు గోగినేని పిచ్చయ్య ,గోగినేని సుబ్బారావు  .ఇద్దరిది ఆ ఊరే అందులో పిచ్చయ్య ఆటలేమీ రాని రకం రెండో అతను మంచి యాక్టివ్ .పిల్లలకు ఇతనంటే మహా ప్రేమ గౌరవం ఆడతాడు ఆడిస్తాడు .అక్కడ నేను పని చేసింది ఒక్క ఏడాదే అయినా ఎప్పుడు ఎక్కడ కానీ పించినా భలే మర్యాదగా నవ్వుతు ఆప్యాయం గా పలకరించేవాడు .భలే సరదా మనిషి .ఊరి లోని పెద్ద షావుకార్లు గోగినేని వారే మైకా గనుల యజమానులు .పిచ్చగా సంపాదించారు స్కూల్ కూడా గోగినేని పిచ్చయ్య అనే పెద్ద మనిషి పేర కట్టించారు .

                   ఉయ్యూరు నుంచే పాలు పెరుగు

      రోజూ సైకిల్ మీద మాకు ఉయ్యూరు నుంచి పాలు ,పెరుగు లను కారియర్లలో మా అమ్మపాలేరు నల్ల కిస్టిగాడి  తో పంపించేది .ఖచ్చితం గా వాళ్ళు వచ్చి ఇచ్చి వెళ్తూ ఉండేవారు .కూరలు కూడా ఇంటి నుంచే వచ్చేవి .మానికొండ దొడ్లో అవిసె చెట్టు ఉండేది ఆ కాయలు కూర చేసుకొనే వాళ్ళం .ములగ చెట్టు బాగా కాసేది .మామ్మ గారే కోసి ఇచ్చేది .మా అబ్బాయి శాస్త్రి సాయంకాలం మాతో షికారు వచ్చేవాడు .అప్పటికి ఇంకా జుట్టు తీయించలేదు అందుకని ఆడపిల్లలు జడ వేసి వాడికి పూలు కూడా పెట్టె వారు .అప్పటికే వాడు మన దేశ రాష్ట్రపతులు ,ప్రధానులు ,రాజధానులు అన్నీ గడ గడ చెప్పే వాడు వాడి చిన్నతనం లో నీల్ ఆర్మస్త్రాండ్ చంద్రుని పై కాలు పెట్టాడు అదంతా రేడియో పెట్టి విని పించేవాడిని అ పేర్లు బాగా జ్ఞాపకం వాడికి .మాతో నడిచి వచ్చేవాడు .శర్మ ఇంకా నెలల పిల్లాడు .కట్టెల ,బొగ్గు పొయ్యి మీద వంట కొద్ది సామనే తెచ్చుకోన్నాం .ఒకే మంచం ఉయ్యాల ..చాప లేసుకొని కింద పాడుకొనే వాళ్ళం బయట వసారా లో ట్యూషన్ .విష్ణూరావు గారబ్బాయి నైంత్ చదివే వాడు మంచి బాడ్ మింటన్ ప్లేయర్ కూడా .తెలివి తేటలున్న వాడు అతని అక్క మా ఉయ్యూరు లో బొబ్బా సత్యనారాయణ డాక్టర్ గారి అబ్బాయి ప్రేమ చంద్ భార్య .ఉయ్యూరు లో వాళ్ళ ఇల్లు మా సువర్చలాన్జనేయ స్వామి ఆలయం ప్రక్కనే .డాక్టర్ గారు కమ్యూనిస్టు ,కోడలు ఆధ్యాత్మిక భావాలున్న అమ్మాయి ఆయన కూతురు ఉయ్యూరు స్కూల్ లో చదివి డాక్టరీ పాసైంది ..

                మానికొండ బెజవాడ గుడివాడ రోడ్డులో ఉంది కాలవ గట్టు ప్రక్క ఊరు .ముందుకు వెడితే విశ్వనాధ సత్యనారాయణ గారి స్వంత ఊరు ‘’నంద మూరు ‘’వస్తుంది ఇది తేలప్రోలు వెళ్ళే దారిలో ఉంది .వెనక్కి వస్తే కోమటి గుంట లాకు .అది దాటితే కంకి పాడు .ఆ రోజుల్లో బెజవాడ గుడివాడ బస్సుల ఫ్రీక్వెంసి తక్కువ .అందుకని కంకి పాడు వచ్చి అక్కడి నుంచి రిక్షా లో చేరుకొనే వాళ్ళం .లేక పోతే తేలప్రోలు బస్ లో నందమూరు మలుపు దగ్గర దిగి నడిచో, రిక్షా లోనో వచ్చేవాళ్ళం లేకపోతే కాటూరు మీదుగా వచ్చేవాళ్ళం  ఇప్పుడు బస్సులు సిటీ బస్సులు వచ్చాయి .ఆటోలు సరే సరి .రోడ్డు కూడా బాగా ఉండేవి కావు .హీను రోజులకోసారి ఉయ్యూరు వెళ్లి వచ్చేవాళ్ళం .అప్పుడు టెలిఫోన్ సౌకర్యాలు లేవు ఉత్తరాలే గతి .కమ్యూనికేషన్ ఇబ్బంది గా ఉండేది .సాయంత్రం నడిచి నందమూరు మలుపు దాకానో లేక పోతే ఊళ్ళో నుంచి మానెడు మక రోడ్డులోనో ,లేకపోతే కోమటి గుంత లాకు దాకానో నడిచి వెళ్ళే వాళ్ళం .ఎక్కువ భాగం కాలువ మీద ఉన్న వంతెన మీద కూర్చొనే వాళ్ళం .ఒక టెంట్ దియేటర్ ఉండేది .రాత్రి రెండో ఆటకు ఆక్కడ సినిమా చూసే వాళ్ళం .లేకపోతే గుడివాడ వెళ్లి సినిమా చూసే వాళ్ళం .అలా చూసిన సినిమా చిక్కడు దొరకదు అని గుర్తు .నేను ఉయ్యూరు హైస్కూల్ లో ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు హిందీ మేష్టారు గా ఉన్నమాకినేని .గోపాల క్రిష్నయ్య గారు మానికొండ వారే .మేమున్న ఇంటి బజారు లో ఆయన స్వంత ఇల్లు ఉండేది నేను తరచూ కలిసే వాడిని మేస్తారివి తేనె కళ్ళు .సంస్కారం మూర్తీభవించిన మనిషి పంచె రంగు చొక్కా నవ్వుతు పలకరించేవారు .ఊళ్ళో ఒక చిన్న హోటల్ ఉండేది అయ్యర్ హోటల్ అని పేరు .ఇడ్లీ ,కాఫీ బానే ఉండేవి .ఫామిలీ ఉయ్యూరు వెళితే అయ్యర్ హోటల్ లోనే టిఫిన్ కాఫీలు లాగించేవాళ్ళం .రాజు గారు నాతో డబ్బు ఖర్చు చేయించే వారు కాదు ఆయనే మూడుగా పద్దు రాయించేవారు .మాకూ ఖాతా ఉంది .జీతాలు రాగానే జమ చేసే వాళ్ళం .రాజు గారింటికి ఆహ్వానించే వారు .ఆవిడ చాలా మంచి మనిషి రాజు గారు నేను ,గరుడా చలం గారు ,రాఘవరావు   తరచు  గా రాజు గారి అతిధులం మాకు రాజ మర్యాదలు చేసే వారు రాజు గారు గా మరి ఆయన అప్యాయతనేన్నడు మరువలేము .అలాగే స్కూల్ లో చదువుకొనే ఒక అమ్మాయి బాపు బొమ్మ లాగే ఉండేది .ఆమె తండ్రికి ఒక హోటల్ ఉండేది .సరదాగా గడిచి పోయింది .మానికొండ లో నా సర్విస్ లో కొన్ని ముఖ్య సంఘటనలు చోటు చేసుకొన్నాయి .నాకు మంచి పేరూ సాధించి పెట్టాయి ఆ వివరాలు తరువాత తెలియ జేస్తాను .

              సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –14-3-13-ఉయ్యూరు

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

జ్ఞానదుడు మహర్షి నారదుడు -11 శబళాశ్వు లకు నివృత్తి మార్గ బోధన

 జ్ఞానదుడు మహర్షి నారదుడు -11

   శబళాశ్వు లకు నివృత్తి మార్గ బోధన

  భాగవతం లోని ఆరవ స్కంధం లో నారద మహర్షి ఒక మహా గడుసైన పని చేస్తాడు .దక్ష ప్రజాపతికి ఆసిక్ని అనే భార్య వల్ల శబళాశ్వులు అనే కుమారులు జన్మిస్తారు .తండ్రి వారిని సృష్టి చేయమని కోరగా వారు నారాయణ సరస్సు దగ్గర తీవ్ర తపస్సు చేస్తున్నారు .ఆ సమయం లో తనను ఎవరో బొట్టు పెట్టి పిలిచి నట్లుగా పరిగెత్తుకొచ్చాడు మహతీ వీణా వాదనా నిపుణుడు నారదుడు ..ఆ పిల్లలను చూసి ‘’మీరు మూఢ మతుల్లా ఉన్నారు .పసి బిడ్డలు .సృష్టించటం లో ఏమి గొప్ప వుంది ?మీ అన్నలు హర్యశ్వులు సృష్టి చేయకుండానే నా మాటవిని ‘’తిరిగి ఎన్నడూ రానిలోకాలకు చేరారు .మీరు మీ అన్నలు నడిచిన మార్గం లో నడవరా ?బంధాన్ని వదిలి మోక్షం పొందండి .’’అని నివృత్తి మార్గం తెలియ జేశాడు .వీరూ అన్నల దారిలో పడి ‘’పూర్వజు లేగి నట్టియా చొప్పున ,నేన్నడుం దిరిగి చూడని త్రోవ విశేష పద్ధతిం దప్పక‘’పోయి నాట .ఇలా దక్షుని పుత్రు లందర్నీ ‘’అద్దరికి ‘’చేర్చి సృష్టి కార్యం కొంత కాలం నిలువరించాడు నారదుడు .అయితే దక్షుని కోపానికి గురై పోయాడు పాపం .’’భగావతోత్తములలో లజ్జా హీనుండవై ,యశో హానిం బొందు‘’తావని సకల భూతానుగ్రహం లేకుండా పోతుందని ,నిరంతరం లోక సంచారమే గతి అని శాపం పొందాడు దక్షుని చేత మహర్షి చంద్రుడు నారదుడు .

             దక్షుని చేతిలో ‘’పీటీ దెబ్బ ‘’తిన్న నారదుడు జితేంద్రియుడు ,సర్వ లోకైక హితైషీ కనుక ‘’ఆ క్రోధ వాక్యాలకు  అలుక చెందక ,’’అలాగే కానీ ‘’అని సమ్మతించాడు .దొడ్డ మనసే చూపాడు మహర్షి .లేక పోతే దక్షునికి ఏ తీవ్ర శాపమో ఇచ్చి ఉండేవాడు .అందుకనేనేమో మన నాటక కర్త లంతా నారదుడిని విదూషకుడిగా ,తార్పుడు గాడుగా అగ్గిపుల్ల గా ,తంపుల మారిగా మార్చేసి ఆ శాపాన్ని తమ కలాలకు వరం గా మార్చుకొన్నారు .నారదుడు అంటే ‘’అగ్గి పెట్టె –ఫెయిర్ బ్రాండ్ ‘’అని పించేశారు .పాపం మంచికి పోతే చెడు ఎదు రైంది అంటే ఇదేనేమో ?ఇక మగపిల్లల వాళ్ళ సృష్టి ఎలాగూ జరగదని తెలిసి ఆసక్ని వాళ్ళ ఆడపిల్లల్ని కనీ ధర్మ ,కశ్యప ,చంద్ర భూత ,ఆంగీరస ,క్రుశాశ్వులకు (10+13+27+2+2+2==56)’ఇచ్చి పెళ్లి చేశాడు .తార్కష్యుడు అనే పేరుగల కష్యపునికే ఇంకో ఆరుగురు ఆడపిల్లలను ఇచ్చి వివాహం జరిపించాడు దక్షుడు .పుట్టించటం లోను దక్షుడే ,శపించటం లోను దక్షుడే ,అల్లుడు శివుని అవమానించటంలోను దక్షుడే అని పించుకొన్నాడు .అల్లుళ్ళకే పెత్తనం ఇచ్చి సృష్టి చేయించాడు .ఇలా దక్షుని సృష్టి దక్షత్వం కుమారుల నుండి కుమార్తెలకు అంటే అల్లుళ్ళకు సంక్రమిమ జేసిన ఘనత మన ఘనత వహించిన నారద మునీన్ద్రులదే .తాను శాపం పొందినా కొడుకుల తో పాటు కూతుళ్ళకూ సమాన వాటా దక్కింప జేశాడు మన ‘’అన్న యెన్ టి .రామా రావు’’ కు మార్గ దర్శీ అయాడు .ఘనా ఘన సుందరుని ఘనం గా కీర్తించే ఈ ఘనుడు నారదుడు సర్వ విశారదుడు .ముందు చూపు ఉన్న .వాడు అందర్నీ సమానం గా చూసే తత్త్వం ఉన్న వాడు గా మనకు అని పిస్తాడు .ఒక చోట నిలిచి ఉంటె ‘’జ్ఞాన ప్రవాహం ‘’ఆగి పోతుంది కనుక ఆయనకు వచ్చిన శాపమూ మనకు వరమే అయింది అన్ని లోకాలు తిరుగుతూ క్షేమ సమాచారాలు తెలుసు కొంటు ఆపన్నులను దరికి చేరుస్తూ నిత్య హరి నామ స్మరణ తో తరించాడు .

               సశేషం –మీ గబ్బిట.దుర్గా ప్రసాద్ –14-3-13-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

నా దారి తీరు -12 స్నేహ బృందం ఉయ్యూరు రాక

 నా దారి తీరు -12

 

     స్నేహ బృందం ఉయ్యూరు రాక

నా బదిలీ మీద ఊహా గానాలు చాలా జరిగాయని చెప్పాను .ఈ లోపల కొన్ని విషయాలు రాయాలి .మోపిదేవి లో నాతో పని చేసిన శ్రీ జమ్మల మడక  రామణా రావు(లెక్కల మేష్టారు ),కూచి భొట్ల సత్యనారాయణ (తెలుగు మేష్టారు –అదే వాసన మేష్టారు )కృత్తి వెంటి నరసింహా రావు (సెకండరీ గ్రేడ్ మేష్టారు ) ఒక సారి మా ఇంటికి సరదాగా గడప టానికి ఉయ్యూరు వచ్చారు .మా అమ్మా ,మేము ఎంతో సంతోషించాం .ఒక రోజంతా ఉన్నారు అందరం కలిసి సినిమా కు వెళ్లాం .ఆప్యాయంగా మా వాళ్ళంతా మంచి భోజనం పెట్టారు వాళ్ళూ ఎంతో ఆనడం పొందారు కబుర్లతో కాలక్షేపం బాగానే జరిగింది .చాల రోజుల తర్వాతా కలిశామేమో విడచి వెళ్లాలని వాళ్ళకూ అని పించలేదు .అయ్యో వెళ్లి పోతున్నారు నని నాకూ ఎంతో బాధ గా ఉండేది ఫోటోలు తీసుకొన్నాం మా డబ్బా కెమేరాతో ..సాహిత్య కాలక్షేపం చేశాము సత్యం మేమూ .అనుకో కుండా భలేగా గడిచి పోయింది కాలం .మళ్ళీ ఇలా మేమేక్కడా ఎప్పుడూ కలవలేదు .ఆ తర్వాతా కొంత కాలానికి నరసింహా రావు గారు చని పోయి నట్లు తెలిసింది మంచి ఆరోగ్య వంతుడే కాని సిగరెట్లు బాగా తాగే వాడు .లెక్కల మేష్టారు స్పాట్ వాల్యుయేషన్ లో కలిసే వారు సత్యనారాయణ కూడా .ఆ తర్వాతా లెక్కల మేష్టారు మోపిదేవి లో చాలా ఏళ్ళు పని చేసి బందరు దగ్గరకు బదిలీ చేయించు కొన్నారు కొంతకాలం అవని గడ్డలో పని చేశారు భార్య కమలమ్మ గారు టీచర్ గా చేరింది .లేడీ ఆమ్తిల్ స్కూల్ లో బందరు లో పని చేసింది .ఆమె అన్న నరసింహ మూర్తి గారు మా రెండవ తోడల్లుడు చతుర్వేదుల శ్రీ రామ మూర్తి గారికి స్టేట్ బాంక్ లో సహా ఉద్యోగి .ఆ పరిచయం మా ఆవిడకు కూడా వాళ్ళ ఫ్యామిలీ తో ఉండేది రెండు మూడు సార్లు వాళ్ళను కలుసుకొన్నాం  .రామనా రావు గారు కూడా పదిహీళ్ళ క్రితం చని పోయారు .సత్యనారాయణ కూడా ఆ తర్వాతా చని పోయినట్లు తెలిసింది .ఇలా ఒక స్నేహ బృందం గా మేమందరం  ఉండేవాళ్ళం .ఇప్పుడు ఇవన్నీ తలచుకొంటే భలేగా ఉంటుంది జననాంతర సౌహృదం అంటే ఇదేనేమో ?

                          వార్డు ఎన్నికలు

        ఉయ్యూరు లో మాది రెండవ వార్డు బ్రాహ్మణులు తూర్పు కాపులు ఎక్కువ ..ఒక సారి వార్డు ఎన్నిక జరిగింది దానికి నా స్నేహితుడు సూరి నరసింహం అన్న కృష్ణుడు (రామ కృష్ణ శాస్త్రి )నిల బడ్డాడు అతనికి పోటీ గా మా వాడే కోలాచల చలపతి నిల బడ్డాడు .మేమందరం చలపతికి సపోర్టు .కాని శాస్త్రి ఓడిపోయాడని జ్ఞాపకం .అప్పటి నుంచి నా మీద కసి వాళ్లకు .నన్ను బదిలీ చేయించటానికి ప్రయత్నాలు అతనూ నరసింహమూ చేశారు ..కనుక ఈ వైపు నుంచీ కూడా ట్రాన్స్ఫర్ ఒత్తిడి .సరే కాకాని గ్రూప్ కు కూడా లోన నా మీద మండుతోంది .

                                                                       కుటుంబ విషయాలు

          అప్పటికే మా పెద్దబ్బాయి పుట్టాడు .మా నాన్నగారి పేరు మృత్యుంజయ శాస్త్రి అని పేరు పెట్టాం బారసాల నాడు లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణం .అనుకొన్న ముహూర్తం కనుక చేసేశాము మా ఇంట్లో ముహూర్తాలు పెట్టటం ,దగ్గర ఉందడి జరిపించటం అన్నీ మా మేన మామ గంగయ్య గారే చేసే వాడు .ఆయన ఏది, ఎలా చెబితే అంతే .తిరుగు లేదు ఆయన హృదయం చాలా మంచిది ..మా రెండవ అబ్బాయి పుట్టాడు .మా అన్నయ్య పేరు లక్ష్మీ నరసింహ శర్మ అని పెట్టాం .

                                                 నా మూడవ స్కూలు మాని కొండ  

    బల మైన ఊహా గానాలలో నన్ను ఎక్కడో తిరువూరికో ,ఈదరకో, నెమలి కో ట్రాన్స ఫర్ అని అందరు అనుకొంటూ ఉండే వారు .నేనేమీ ప్రయత్నాలు చెయ్య లేదు .దేనికైనా రెడీ .అనేదే అప్పుడు నా తత్త్వం సిద్ధం గా నే ఉన్నాను .అనుకో కుండా నన్ను మాని కొండ కు ట్రాన్స్ ఫర్ చేస్తూ ఆర్డర్లు వచ్చాయి అందరికి ఆశ్చర్యం !ఎక్కడికి విసిరేస్తారోఅనుకొంటే దగ్గరలోనే మానికొండకు బదిలీ చేయటం వాళ్లకు మింగుడు డ లేదు .ఏ దేవుడు అడ్డు పడ్డాడో నాకు తెలియదు కాని ఊపిరి పీల్చుకున్నాను .పెద్ద దూరమేమీ కాదు రోజూ సైకిల్ మీద వెళ్ళినా వెళ్ళ రావచ్చు .లేక పోతే కాపురం పెట్టచ్చు మా అమ్మ కూడా చాల సంతోషించిందిదూరం వెయ్య నందుకు .కొంపకు వచ్చి వెళ్ళచ్చు నని సంతోషించింది .ఇంట్లో గోడలూ ,పాలేళ్ళు పాడి ,వ్యవసాయం కామాటం బానే ఉంది మాకు .ఎడ్లు బండీపెట్టలేదు కాని అన్నీ ఉన్నాయి ఇవి మైంటైన్ చేయటానికి అమ్మ ఉంది .ఆవిడే గేదెలకుపాలు తీసేది లేకపోతే మా ఆవిడే తీసేది .పాలేళ్ళ మీద వదిలేది కాదు .నేను ఉయ్యూరు లో పని చేస్తున్నా రోజు రెండు పూట్ల పొలం వెళ్ళేవాడిని సైకిల్ మీదే ఉదయం ట్యూషన్ అవగానే స్నానం చేయటానికి ముందు ఉయ్యూరు పొలం వెళ్ళే వాడిని ఒక రౌండ్ తిరిగి వచ్చి స్నానం ,భోజనం చేసి స్కూల్ కు వెళ్ళే వాడిని .సాయంత్రం స్కూల్ నున్చిరగానే కాటూరు పొలం వెళ్ళే వాడిని .ఇంటికి వచ్చి స్నానం చేసి ట్యూషన్ లో కూర్చునే వాడిని .రాత్రి తొమ్మిదిన్నర దాకా సాగేది .ఇదీ నిత్య కృత్యం .ఇందులో రొటీన్ కు భిన్నం లేదు ..8-8-67 న నన్ను రిలీవ్ చేశారు .నా కోరిక మీద జరిగిన బదిలీ కాదు కనుక ట్రాన్సిట్ అవైల్ చేసుకొనే వీలుంది .అందుకని ఆరు రోజులు ట్రాన్సిట్ వాడుకొని 14-8-67 న మాని కొండ హైస్కూల్ లో చేరాను .హెడ్ మాస్టారు శ్రీ మిక్కిలి నేని వెంకటేశ్వర రావు గారు వామ పక్ష భావాలున్న వారు .జిల్లాలో మంచి పేరున్న వాడు .మంచి సైన్సు మస్టర్ గా పేరు పొందారు .ఆయన చక్కగా పంచ గోచీ పోసి కట్టి లాల్చీ వేసే వారు ఆయన్ను చూస్తె ఎస్.వి.రంగా రావు లాగా కని  పిస్తారు .అందుకే ఆయన్ను ‘’మినీ ఎస్.వి.ఆర్ ‘’అనే వారు .

   మానికొండ స్కూల్ పెద్దదే .ఒక్కో క్లాస్ కు కనీసం రెండు సేక్షన్లు ఉండేవి. .మంచి బిల్డింగ్ ఉంది .నాకు తొమ్మిది ,పది ,ఎస్ ఎస్.ఎల్ సి క్లాసుల సైన్సు బోధనా ఉండేది .మంచి లాబ్ ఉన్న స్కూల్ .లాబ్ అసిస్టంట్ గా వెంకటేశ్వర రావు అనే మానేడు మాక ఊరి వాడు ఉండేవాడు పంచ కట్టి చొక్కా వేసే వాడు .సైకిల్ మీద వాళ్ళ ఊరి నుంచి వచ్చేవాడు లాబ్ లో ప్రయోగాలకు బాగా ఏర్పాటు చేసే వాడు .సైన్సుక్లాస్ ల్యాబ్ లోనే చెప్పే వాడిని .హెడ్ మాస్టారుపి..శ్రీ రామ మూర్తి గారి వర్గం వారు ,మేము కొల్లూరి కోటేశ్వర రావు వర్గం .అయినా చాలా సహృదయం తో ఉండేవారాయన .నేను అంటే మహా ఇష్టం .నా సబ్జెక్ట్ బోధన ను బయటి నుంచే గమనించేవారు .లోపలి వచ్చేవారు కాదు వాళ్ళమ్మాయి పద్మావతి అప్పుడు ఎస్.ఎస్.ఎల్.సి లో ఉండేది చిన్నమ్మాయి తొమ్మిదిలో ఉండేది పెద్దమ్మాయి బాగా చదివేది.టీచర్ అయిందని గుర్తు .

                                                అన్నీ తానే అయిన రాఘవ రావు

        స్కూల్ లో ఆనాడు ప్యూన్ అని పిలువ బడే వాడు రాఘవ రావు .’’ఇహి ఇహి ‘’అని నవ్వుతు పలకరించేవాడు .వెలమ అతను కాఖి  నిక్కర్, తెల్ల చొక్కా తో ఉండేవాడు .అందరి కంటే ముందే వచ్చే వాడు .హెడ్ మాస్టారికి తలలో నాలుక గా ఉండేవాడు అన్నీ పకడ్బందీ గా చేసే వాడు .పరీక్షా నిర్వహణ దగ్గర నుండి ఎక్స్ట్రా క్లాస్ టీం టేబిల్ వేయటం వరకు అన్నీ అతనే చూసే వాడు ..డబ్బు విషయం లోకూడా అతనికే బాధ్యత అప్ప గించే వారు హెడ్ మాస్టారు .ఎవరికైనా డబ్బు సాయం చేయాలంటే రాఘవ రావు ద్వారానే ఇప్పించే వారు. అతనే వసూలు చేసే వాడు .అన్నీ ఖచ్చితం గా లెక్కలు రాసే వాడు అంటే స్కూల్ సేక్రేసి అంతా అతనే చూసే వాడు అంత నమ్మకం మంచి కుటుంబం అతని అత్తారిల్లు గన్నవరం . మాతో మంచి స్నేహం గా ఉండేవాడు .కొంచెం వెలమ దర్జా అని పిస్తుంది కొత్త వారికి .మా గురువు గారు గరుడా చలం గారు కూడా ఆక్కడే పని చేస్తున్నారు .ఆయన ఆత్త వారిల్లు మాని కొండే .ఆల్లూరి సీతా రామ రాజు గారు అనే రాజ వంశీకులు సెకండరి ఉపాధ్యాయులు .పంచె కట్టి తెల్ల చొక్కా వేసే వారు చాలా నెమ్మదైన  చాలా పెద్ద మనిషి ఊళ్ళో మంచి గౌరవం ఉన్న వారు .నా కంటే చాలా పెద్ద వారే .కాని మంచి స్నేహం తో ఉన్నారు మాతో .ఇది అయన జీవితాంతం కొనసాగింది .కనుక మళ్ళీ ఇక్కడ మాకో బృందం ఏర్పడింది .రాఘవరావు ,నేను గరుడా చలం గారు రాజు గారు .రోజు సాయంత్రం స్కూల్ అవగానే కాటూరు రోడ్డు లో  వంతెన దగ్గర గట్ల మీద కూర్చుని కబుర్లు చెప్పుకొనే వాళ్ళం .మిగిలిన విషయాలు మళ్ళీ రాస్తాను -.

              సశేషం

              మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –13-3-13 ఉయ్యూ

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

సంగీత పరమాచార్య

సంగీత పరమాచార్య

 

అటు సంగీతంలోనూ, ఇటు వైద్య రంగంలోనూ ఆయనొక అద్భుతం. ఏక కాలంలో రెండు వృత్తుల్లో కీర్తి ప్రతిష్ఠలను ఆర్జించిన మహామహులు చాలామందే ఉండవచ్చు కానీ, డాక్టర్ శ్రీపాద పినాకపాణి ‘బాణి’ మాత్రం న భూతో న భవిష్యతి. తెలుగు సంగీతాభిమానుల కోసం కర్నాటక సంగీతాన్ని తిరగ రాశారు. ఈ సంగీతానికి మకుటాయమానమైన తంజావూర్ బాణీలో వేలాది మంది విద్యార్థులకు శిక్షణనిచ్చారు. సంగీతంపై తెలుగులోనే కాక, ఇంగ్లీషులో కూడా ప్రామాణికమైన గ్రంథాలు రాశారు. ఒకపక్క సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేస్తూనే మరో పక్క వైద్యంలో ప్రొఫెసర్‌గా విద్యాసంస్థల్లో అసంఖ్యాకంగా శిష్యులను తయారు చేశారు.

1913 ఆగస్టు 3న శ్రీకాకుళం జిల్లా ప్రియా అగ్రహారంలో జన్మించిన పినాకపాణి 2013 మార్చి 11న తన 100వ ఏట పరమపదించే వరకూ సంగీత, వైద్య రంగాలకు దిక్సూచిగా వ్యవహరిస్తూనే ఉన్నారు. రాజమండ్రిలో ఎంబీబీఎస్ చేసిన తరువాత విశాఖపట్నంలోని ఆంధ్ర వైద్య కళాశాలలో ఎండీ పూర్తి చేశారు. ఒకపక్క వైద్యం చదువుతూనే ఆయన బీఎస్ లక్ష్మణ రావు దగ్గర, ఆ తరువాత వయొలిన్ విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడు, సంగీతజ్ఞుడు శ్రీరంగ రామానుజ అయ్యంగార్‌ల వద్ద శిష్యరికం చేశారు. 1938ల మొదటిసారిగా ఆకాశవాణి ద్వారా సంగీతంలో ఆయన ప్రతిభ వెలుగులోకి వచ్చింది. వివిధ నగరాల్లో పాట కచ్చేరీలు నిర్వహించడంతో ఆయన కీర్తి ప్రతిష్ఠలు దేశవ్యాప్తమైపోయాయి. సంగీతం పట్ల అభిమానంతో ఆయన సంగీత విద్వాంసురాలు బాలాంబను వివాహం చేసుకున్నారు.

ఒకపక్క వైద్యుడుగా, అసిస్టెంట్ సివిల్ సర్జన్‌గా, వైద్య అధ్యాపకుడుగా, వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా, ఆ తరువాత ఆస్పత్రి పర్యవేక్షకుడుగా ఎదుగుతూనే పినాకపాణి మరోపక్క సంగీత విద్వాంసుడుగా, సంగీత అధ్యాపకుడుగా, సంగీత గ్రంథకర్తగా గుర్తింపు పొందడం ప్రారంభించారు. మూడు దశాబ్దాల పాటు వైద్య సేవలందించి 1968లో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా పదవీ విరమణ చేశారు. సోనియా గాంధీకి చికిత్స చేసిన డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, అమితాబ్ బచ్చన్‌కు చికిత్స చేసిన డాక్టర్ జగన్నాథ్‌లు ఆయన శిష్యులే. సంగీతంలో నూకల చిన సత్యనారాయణ, నేదునూరి కృష్ణమూర్తి, పెమ్మరాజు సూర్యారావు, శ్రీరంగం గోపాలరత్నం, ఓలేటి వెంకటేశ్వర్లు, మల్లాది సూరిబాబు, మల్లాది సోదరులు వంటి హేమాహేమీలు ఆయన శిష్యులే. 1978లో కేంద్ర సంగీత నాటక అకాడమీ ఆయన సంగీతాన్ని రికార్డు చేసి భద్రపరచింది.

మనోధర్మ సంగీతం, పల్లవి గాన సుధ, గానకళా సర్వస్వము, మేళ రాగమాలిక వంటి గ్రంథాలు ఆయన సంగీతానికి అందించిన విలువైన కానుకలు. ఆయన రచనలను టీటీడీ ‘సంగీత సౌరభం’ పేరుతో నాలుగు సంపుటాలుగా ముద్రించింది. అం దులో పినాకపాణి స్వరపరచిన అన్నమాచార్య, త్యాగరాజ స్వామి, ముత్తుస్వామి దీక్షితార్ వంటి వాగ్గేయకారుల కృతులున్నాయి. ఆయన రాసిన 18 సంపుటాల ‘గానకళా సర్వస్వము’లో సంగీతానికి సంబంధించిన ప్రతి వివరణా లభ్యమవుతుంది. 1973లో ఆయన టీటీడీ ఆస్థాన విద్వాంసుడిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ అవార్డు, సంగీత శిఖామణి, గాన కళా సాగర, సప్తగిరి సం గీత విద్వన్మణి, సంగీత కళానిధి, గాన కళా వారధి, కళాప్రపూర్ణ పురస్కారాలు ఆయనకు లభించాయి. కాగా, 1984లో ఆయనను ‘పద్మభూషణ’ బిరుదు వరించింది.

పక్షవాతం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో బాధపడిన పినాకపాణి తన చివరి క్షణం వరకూ లోలోపల ఏదో ఒక కీర్తనను ఆలపిస్తూ కనిపించేవారు. ఆయన 98వ ఏట ఒకసారి వందలాది మంది శిష్యులు ఆయనను చూడడానికి వచ్చారు. వారిని చూసి కుటుంబ సభ్యులు కలవరపడ్డారు. కానీ, ఆయన ఒక్కసారిగా ‘నాదా తనుమనిశం’ అంటూ కీర్తనను ఆలపించడం, దాన్ని శిష్యులు అందుకోవడం అక్కడున్నవారందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. ‘సంగీతమే నా ప్రాణం, నా జీవం’ అని ఆయన అనేవారు. చివరి రోజుల్లో కూడా ఆయనలో సంగీత సాధన కనిపిస్తుండేది.

ఆయన గురు శిష్య సంప్రదాయాన్ని అభిమానించేవారు. శిష్యులు ఆయన ఇంట ఉండి, శుశ్రూష చేస్తూ ఉచితంగా సంగీతాన్ని అభ్యసించేవారు. ఆయన ఇంట్లో సంగీత సాధనకు ప్రత్యేక సమయమంటూ ఉండేది కాదు. ఎప్పుడు తోస్తే అప్పుడే సంగీత సాధన. ఆయన తన కుమార్తె, ముగ్గురు కుమారుల పట్ల ఎంత ఆప్యాయంగా వ్యవహరించారో శిష్యుల పట్ల కూడా అంతే ఆప్యాయంగా ఉండేవారు. ఆయన సంగీత, వైద్య రంగాల్లోనే కాక సంస్కృతంలో కూడా ప్రజ్ఞాశాలి. ఆయనకు సంగీతం తప్ప సంపాదన గురించి ఏనాడూ పట్టలేదు. ఆయన తనకు వచ్చిన స్వర్ణ పతకాలతో భద్రాచలంలో సీతాదేవికి కిరీటం చేయించారు. ‘సంగీతమే జీవితం, జీవితమే సంగీతం’ అన్నంతగా ఆయన సంగీతానికి అంకితమైపోయారు. కర్నూలులో ‘గాయక వైద్యుడు’గా ఆయన స్థిరపడ్డారు. ఓ ఉత్తమ సంగీత విద్వాంసుడు కావాలంటే, ఉత్తమ సాంప్రదాయిక గురువుల నుంచి సంగీతాన్ని నేర్చుకోవడంతో పాటు, విద్యార్థులకు సంగీతం నేర్పగలిగే స్థాయిని కూడా సంపాదించగలగాలని, కచ్చేరీల ద్వారా సంగీతానికి ప్రాచుర్యం కల్పించాలని, చివరికి తన సంగీత పరిజ్ఞానాన్ని గ్రంథస్తం చేసి భావి తరాలకు అందించాలని ఆయన తన శిష్యులకు చెబుతుండేవారు. శిష్యులు ఆయన వారసత్వాన్ని పదిలంగా భావి తరాలకు అందించగలిగితే అదే ఆయనకు నివాళి కూడా.

 

Posted in వార్తా పత్రికలో | Tagged | 2 Comments

మూగబోయిన రాగం

మూగబోయిన రాగం
డాక్టర్ శ్రీపాద పినాకపాణి అస్తమయం
శోకసంద్రంలో సంగీతప్రియులు
ప్రముఖుల సంతాపం..
నేడు కర్నూలులో అంత్యక్రియలు

 

కర్నూలు, హైదరాబాద్, మార్చి 11: కర్ణాటక సంగీతాన్ని తెలుగునాట తంజావూరు బాణీలో కొత్తపుంతలు తొక్కించి సంగీతప్రియుల ప్రశంసలు అందుకున్న సంగీత కళానిధి పద్మభూషణ్ శ్రీపాద పినాకపాణి సోమవారం సాయంత్రం కన్నుమూశారు. ఆయనకు భార్య, నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పినాకపాణి అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు కర్నూలులో నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు.

స్వరరాగ గంగా ప్రవాహమే..
శ్రీపాద పినాకపాణి 1913 ఆగస్టు 3న శ్రీకాకుళం జిల్లా ప్రియాగ్రహారంలో శ్రీపాద రామేశ్వరరావు, జోగమ్మ దంపతులకు జన్మించారు. సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో, ఆయనకు చిన్నప్పటి నుంచే సంగీతంపై మక్కువ ఏర్పడింది. దీన్ని గమనించిన తల్లితండ్రులు.. రాజమండ్రికి చెందిన బీఎస్ లక్ష్మణ్‌రావు దగ్గర 11 ఏళ్ల వయసులో ఆయన్ను చేర్పించారు. పినాకపాణికి ఆయనే మొదటి గురువు. 18 ఏళ్ల వయసులో ప్రముఖ వాయులీన విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడి వద్ద ఆయన రెండున్నర నెలల పాటు శిష్యరికం చేశారు.

ఉత్సవాలు, కచేరీలకు వెళ్తూ ప్రముఖ విద్వాంసులతో పరిచయాలు పెంచుకున్నారు. రంగ రామానుజ అయ్యంగార్ లాంటి తమిళ సంగీత విద్వాంసుల సాహచర్యంతో కొత్తకృతులను సేకరించి తన ప్రతిభకు పదును పెట్టుకున్నారు. సంగీత సాధనకు సమాంతరంగా విద్యాభ్యాసాన్నీ కొనసాగించారు. రాజమండ్రిలో హైస్కూల్, కళాశాల విద్య.. 1938లో ఎంబీబీఎస్ పూర్తిచేశారు. 1945లో జనరల్ మెడిసిన్‌లో ఎండీ పూర్తి చేసి అసిస్టెంట్ సివిల్ సర్జన్‌గా రాజమండ్రిలో చేరారు. అక్కణ్నుంచి వైజాగ్‌కు బదిలీ అయ్యారు. 1957లో కర్నూలు మెడికల్ కళాశాలకు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. అక్కడే ప్రిన్సిపాల్‌గా, ఆసుపత్రి పర్యవేక్షకుడిగా పనిచేశారు. 30 ఏళ్లపాటు వైద్యుడిగా సేవలందించి.. 1968లో పదవీ విరమణ చేశారు.

కర్నూలు కార్యక్షేత్రంగా తన శేషజీవితాన్ని సంగీతానికే అంకితం చేశారు. ఆయన భార్య.. బాలాంబ. 1940లో వీరి వివాహం అయింది. ఆయన రచనలు.. మనోధర్మ సంగీతం, పల్లవి గానసుధ, మేళ రాగమాలిక కర్ణాటక సంగీతానికి విలువైన కానుకలు. టీటీడీ ఆయన రచనలను ‘సంగీత సౌరభం’ పేరుతో నాలుగు సంపుటాలుగా ముద్రించింది. అందులో పినాకపాణి స్వరపరిచిన అన్నమాచార్య కృతులు 108, త్యాగరాజు తదితర వాగ్గేయకారుల కృతులు 607, ముత్తుస్వామి దీక్షితుల కృతులు 173, 44 పదాలు.. వెరసి 1,088 రసగుళికలు ఉన్నాయి. ఇంతేకాక.. ‘నా సంగీత యాత్ర ‘ అనే పుస్తకాన్ని కూడా ఆయన రచించారు. 1973లో టీటీడీ ఆస్థాన విద్వాంసుడిగా పనిచేశారు. అయితే.. శాస్త్రీయ సంగీతానికి మన రాష్ట్రంలో ఆదరణ లేకపోవడం పట్ల చివరి వరకూ పినాకపాణి అసంతృప్తితో, ఆవేదనతో ఉండేవారు.

ఎన్నో పురస్కారాలు..
1966లో ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ అవార్డు, 1970లో సంగీత కళా శిఖామణి, 1973లో విశాఖలో గాన కళాసాగర, 1974లో టీటీడీ సప్తగిరి సంగీత విద్వన్మణి, 1977లో సంగీత నాటక అకాడమీ పురస్కారాలు పొందారు. 1978లో కేంద్ర సంగీత నాటక అకాడమీ ఆయన సంగీతాన్ని రికార్డు చేసి భద్రపరిచింది. అదే ఏడాది.. ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదుతో, 1983లో మద్రాసు మ్యూజిక్ అకాడమీ సంగీత కళానిధి పురస్కారంతో ఆయనను సత్కరించాయి. 1984లో అప్పటి రాష్ట్రపతి జైల్‌సింగ్ చేతులమీదుగా పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. 2012లో తెలుగువెలుగు పురస్కారం వరించింది. ఆయనకు భార్య, నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మొదటి కుమారుడు రిటైరయ్యారు. రెండో కుమారుడు వైద్యు డిగా పనిచేసి, 15 ఏళ్ల కిందట మృతిచెందారు. మూడో కుమారుడు రిటైరయ్యారు. నాలుగో కుమారుడు కర్నూలు వైద్యకళాశాలలో ప్రొఫెసర్.

ప్రముఖుల సంతాపం..
పినాకపాణి మృతితో సంగీత ప్రియులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన మృతి పట్ల సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా.. పినాకపాణి మృతి దేశానికే తీరనిలోటు అని రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేశ్ ఆవేదన వ్యక్తంచేశారు. “తుదిశ్వాస వరకూ సంగీతం కోసం ఆయన పడిన తపన ఆదర్శప్రాయం. నా చిన్నతనంనుంచీ ఆయన్ను చూశాను. ఆ మహానుభావుడి అంత్యక్రియలకు ప్రభుత్వం దోహదపడేలా సీఎంతో మాట్లాడతా” అన్నారు. పినాకపాణి మృతి సంగీత ప్రపంచానికి తీరనిలోటని ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు కేవీ రమణాచారి కూడా పేర్కొన్నారు.

శిష్య ప్రముఖులు
ఇటు సంగీతరంగంలో.. అటు వైద్య రంగంలో.. పినాకపాణి వద్ద శిక్షణ పొందినవారెందరో నేడు దేశవిదేశాల్లో ప్రముఖులుగా పేరొందారు. సుప్రసిద్ధ సినీనటుడు అమితాబ్ బచ్చన్‌కు శస్త్ర చికిత్స చేసిన డాక్టర్ జగన్నాథ్, సోనియాగాంధీకి అమెరికాలో శస్త్ర చికిత్స చేసిన డాక్టర్ నోరి దత్తాత్రే యుడు వంటివారు ‘డాక్టర్’ పినాకపాణి శిష్యులైతే.. నూకల చిన సత్యనారాయణ, నేదునూరి కృష్ణమూర్తి, మల్లాది సోదరులు వంటివారు ‘సంగీత కళానిధి’ పినాకపాణి శిష్యులు!

శ్రీగాన విద్యా వారధి
పినాకపాణి వందో పుట్టినరోజు వేడుకలు 2012 ఆగస్టు 3న టీటీడీ, తెలుగు యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఆ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి చేతుల మీదుగా ఆయనకు స్వర్ణ కంకణధారణ చేయించారు. టీటీడీ ఈవో ఎల్వీ సుబ్రమణ్యం ఆయనకు పట్టు వస్త్రాలు, రూ.10,01,116 చెక్ అందించారు. శ్రీగాన విద్యావారధి బిరుదుతో సత్కరించారు.

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

జ్ఞానదుడు మహర్షి నారదుడు -10

జ్ఞానదుడు మహర్షి నారదుడు -10

ప్రాచీన బర్హికి ఇంకా వివరాలు చెబుతూ నారద మహర్షి ‘’హరి పాద యుగాళాలే అన్నిటికి శరణ్యం

‘’ఘన పురుషార్ధ భూతమనగా దగు నాత్మకు ,నే నిమిత్తమై

   యొనర ,ననర్ధ హేతువన నూల్కును సంస్కృతి సంభవించు,న

   నట్లే నయము ,దన్నిమిత్తము పరిహారకు మర్ది జగద్గురుండు ,

    నా దనరిన వాసుదేవ పరితామర స్ఫుట భక్తీ యారయన్’’

  కనుక ‘’చిర వైరాగ్య జ్ఞాన జనక మైన భక్తి నిదానం గోవింద వర కధాశ్రయమే ‘’అవుతుంది .విష్ణు గుణ గానం చేసి తరించమని ‘’బోధిస్తాడు .

‘’సరసోదార మహాత్మము –ఖరితము లగు మధు విరోధి కమనీయ గుణో

  త్కర ,సురుచిర చరితామృత –పరి పూరిత వాహినులను బరమ ప్రీతిన్

  మన మలరగ శ్రోత్రాన్జలు –లను బాణము సేయు పుణ్యులకు క్షుత్రుష్నా

  ఘనభయ శోక విమోహము –లనయంబును సోకకుండు నవనీ నాధా ‘’

అని వివరిస్తూ ‘’సర్వేశ్వర కదా మృత వాహిని యందు రతి ‘’ని కలిగి ముక్తి పొందమని ఉపదేశిస్తాడు .

            మహా వేదాంతులు తపోదనులైన మహర్షులు కూడా ‘’ఈశ్వరుని వెదకియు గానరు ‘’అని తెలియ జేస్తూ

‘’ఘన విస్తార ,మపార,మద్వయ ,మనంగా ,నొప్పు వేదంబు ,దా

  మను వర్తించుచు ,మంత్ర యుక్త వివిధం బై నట్టి దేవాఖ్య ,శో

  భన ,సామర్ధ్యము చేత ,నింద్ర ముఖ రూపం ,బిస్టదైవంబుగా

  గని వేడ్కన్ ,భజియించువారలు ,గనంగా ,నేర్తురే ఈశ్వరున్’’అంతేకాదు

  ‘’విను మాత్మ భావితుండన –నెనసిన భగవంతు దెప్పు దేవ్వని గరుణం

     దనరుచు ,ననుగ్రహించును –మనుజేశ్వర యపుడ వాడు మహితాత్మకుడై

ధీరత నీ లోక వ్యవహారంబును –వైదికంబు నన దగు కర్మా

 చారము లందు వినిష్టిత –మై రూఢి దనర్చు బుద్ధి నర్దిన్ వీడుచున్ ‘’

సర్వేశ్వర పరి తోషకమేదో అదే కర్మ .ఆ సర్వేశ్వరుని యందు బుద్ధిని ఉంచటమే విద్య .అతడే అన్నిటికి పరమాత్మ .ఆ పద పద్మాలే క్షేమకరం .,మోక్షకరం .అని స్పష్టం చేస్తాడు .జ్ఞానం ఒంట బట్టిన బర్హి  నారద మహర్షికి మనసారా కృతజ్ఞతలు చెప్పుకొంటాడు

‘’ముని వర భగవంతుండవు –ననుపమ విజ్ఞాన నిదివి ,ననదగు నీచేత ను

వివరింపంగా దగి –యెనసిన ఈ యాత్మ తత్వమిత నా చేతన్ ‘’అని అంటూ

 ‘’లోకాంతర ,దేహాంతర భావి యయిన ఫలం ఎలా లభిస్తుందో తెలియ జేయమని వేడుకొంటాడు

లింగమయ శరీరానికి కర్తృత్వ భోక్తృత్వ ములు స్తూల దేహం ద్వారా సంక్రమిస్తాయని అయితే జీవుని లో ‘’బుద్ధి ,మనో మోక్షార్ధ గుణ వ్యూహ రూపాదులు లింగ శరీరం నశించే దాకా అంటే ఉంటాయి ‘’‘’’’చెప్పాడు మహర్షి కనుక ఇవన్నీ పోవాలంటే మనస్సును జయించాలని అదే వీటన్నిటికి ముఖ్య కారణమి చెప్పాడు .అవిద్య వల్లే అనేక జన్మలు జీవి పొందుతాడు .కనుక అవిద్య నశిస్తే మోక్షమే .దానికోసం ‘’ఘన జనన స్తితి ,ప్రళయ కారణ భూతుని ,పద్మ లోచనుని ,పరమేశుడైన ఈశుని ,రమా పతి ని ,సర్వ జగము ఆయన ఆత్మ గా భావించి ,ఆయన పద పంకజాలను ఆర్తి తో భజించాలి అని .విశదీకరించాడు

‘’అని యీగతి భగవంతుం డనఘు,భాగవత ముఖ్యుడు ‘’అయిన నారదుడు జీవేశ్వర గతిని గృపతో చక్కగా ఎరిగించాడు ‘’

            ఈ విధం గా నారదుడు ఎవరికి మనసులో దుఖం ఉన్నా ,సందేహం ఉన్నా మార్గం తోచక విచారిస్తున్నా  అశాంతితో రగిలి పోతున్నా ,ఆ హృదయం తో చక్కగా’’ ట్యూన్ ‘’చేసుకొని పిలువకుండానే అక్కడికి చేరి సందేహ నివృత్తి చేసి ,శాంతి మార్గం చూపి ,ఉపశాంతి కల్గించి మనసులోని చీకట్లను పోగొట్టి జ్ఞాన కాంతులతో నింపి ప్రవ్రుత్తి మార్గం నుంచి నివృత్తి మార్గం వైపు కు మల్లిస్తాడు ఎవరికి ఏ రక మైన బోధ కావాలో బాగా తెలిసిన వాడు మహర్షి .చిత్త వృత్తిని బట్టి ఆధ్యాత్మిక చికిత్స చేయగల భవరోగ వైద్యుడు .పూర్వాపరాలను సమన్వయిస్తాడు భగవత్ చరణమే సర్వ శ్రేయోదాయకమని మోక్ష దాయకమని వివరంగా చెప్పి వారిని ఆ మార్గం లోకి ఉన్ముఖీ కారణం చెందిస్తాడు ఒక జీవిని తరింప జేశాననన్న పరమా నందాన్ని పొందుతాడు .తన పని అయిపోగానే ‘’నారాయణ నారాయణ ‘’అంటూ అక్కడి నుంచి నిష్క్ర మిస్తాడు .రంగ ప్రవేశమూ అదే ‘’నారాయణ ‘’‘’స్మరణతోనే చేయటం నారదుని ప్రత్యేకత .అందుకే పరమ భాగవతోతముడైనాడు మహర్షి నారదుడు

          సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –12-3-13- ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

సరస భారతి -43వ సమావేశం -శ్రీ విజయ నామ సంవత్సర ఉగాది సాహితీ కదంబం

saahithee kadambam-1a saahithee kadambam-2 saahithee kadambam-3saahithee kadambam-4

సరస భారతి -43వ సమావేశం -శ్రీ విజయ నామ సంవత్సర ఉగాది సాహితీ కదంబ ,ఉగాది పురస్కార,పుస్తకావిష్కరణ సభ -7-4-2013 ఆదివారం సా. 4గం-A /Cలైబ్రరి -ఉయ్యూరు

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

నల్లగొండ.. తెలుగు కొండ

నల్లగొండ.. తెలుగు కొండ
జనం భాషలోనే పరిపాలన
ఫలిస్తున్న కలెక్టర్ చొరవ
తెలుగులోనే ఉత్తర ప్రత్యుత్తరాలు
ఆంగ్లంలో వస్తే.. తిరుగు టపా!
95 శాతం లేఖలు మాతృ భాషలోనే
సహకరిస్తున్న అధికారులు, సిబ్బంది
అధికార భాషా అమలులో జిల్లాలకు ప్రథమ స్థానం

 

‘తెలుగా! అదెందుకు?’ అని ప్రశ్నిస్తే… ఈ రాష్ట్రం తెలుగు. ఈ ప్రజలు తెలుగు. వీరి ఆలోచన తెలుగు. మన జీవన విధానం తెలుగు! మరి… తెలుగుకాక మరో భాష మనకెందుకు?… ఇది నల్లగొండ జిల్లా కలెక్టర్ ముక్తేశ్వర రావు అచ్చ తెలుగులో ఇచ్చే స్వచ్ఛమైన సమాధానం! ‘తప్పనిసరి అవసరమైతేనే ఆంగ్లం!’ అనేదే ఆయన విధానం. కలెక్టర్ చొరవతో జిల్లాలో తెలుగు దివ్యంగా వెలుగుతోంది. జనం భాషలోనే పరిపాలన సాగుతోంది. పల్లె నుంచి జిల్లా స్థాయిదాకా అధికార వ్యవహారాలన్నీ తెలుగులోనే! జిల్లా నుంచి హైదరాబాద్‌లోని వివిధ శాఖలకు వెళ్లే ఉత్తరాలూ తెలుగులోనే! ఇప్పుడు 95 శాతం పరిపాలనా వ్యవహారాలన్నీ తెలుగులోనే సాగుతున్నాయి. ఇది… కేవలం మూడునెలల కాలంలో తెలుగు సాధించిన విజయం!

నల్లగొండ, మార్చి 10 : ‘అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తెలుగు భాషలోనే సాగాలి. ఫైళ్లు ఇంగ్లీషులో వస్తే తిప్పి పంపాలని చట్టం చెబుతోంది. దీన్ని అమలు చేద్దాం. మీరేమంటారు?’ గత ఏడాది డిసెంబర్‌లో జిల్లా ఉన్నతాధికారులందరినీ సమావేశపరచి, కలెక్టర్ ముక్తేశ్వరరావు అడిగిన ప్రశ్న ఇది! “ఇంగ్లిష్‌కు సమానమైన తెలుగు పదాలు రాయడం చాలా కష్టం. కంప్యూటర్‌లో ఇంగ్లిష్‌లోనే సౌలభ్యంగా ఉంటుంది! ఎప్పట్లాగా ఇంగ్లిషులోనే పనికానిస్తే బాగుంటుంది” అని చాలామంది అధికారులు బదులిచ్చారు.

“అన్ని ఇంగ్లిషు పదాలకు తెలుగులో సమానార్థాలు రాయాల్సిన అవసరంలేదు. ఫైల్, ఆఫీస్, రోడ్ అని తెలుగులోనే రాసుకోవచ్చు. మార్కెట్‌లో తెలుగు సాఫ్ట్‌వేర్ అందుబాటులో ఉంది. అసలు అది సమస్యే కాదు! ఇక మనది తెలుగు మాట, తెలుగు బాట!” అని కలెక్టర్ తేల్చి చెప్పారు. కలెక్టరేట్, జిల్లా ప్రధాన కార్యాలయాల నుంచి వెళ్లే ప్రతి కాగితం తెలుగులోనే వెళ్లాలని, కిందిస్థాయిలో అదే విధానం అమ లయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఆ తర్వాత… ‘ఇంగ్లిష్‌లో వచ్చే ఉత్తర ప్రత్యుత్తరాలు స్వీకరించబడవు’ అంటూ డీపీఆర్‌వో ప్రధాన కార్యాలయం ఎదుట బోర్డు పెట్టారు. జనవరి నెల వచ్చింది! ‘తెలుగులో పంపండి’ అనే ముద్రకు బాగా పనిపడింది. ఆంగ్లంలో వచ్చిన 300 ఫైళ్లను ‘తెలుగులో పంపండి’ అంటూ తిప్పి పంపారు. అధికారుల వైఖరి మారింది. ధ్యాస తెలుగుపైకి మళ్లింది. గడచిన నెలరోజుల్లో తిప్పి పంపిన ఫైళ్ల సంఖ్య పదికి పడిపోయింది. ఇదీ… తెలుగు మహిమ! ప్రస్తుతం శాంతిభద్రతలు, ఎన్నికల కమిషన్‌కు సంబంధించిన విభాగాల్లో అధికభాగం… కొన్ని మునిసిపాలిటీల్లో 40 శాతం వరకు ఆంగ్ల భాషను వాడుతున్నారు.

ఇది మినహాయిస్తే… మిగిలిన అన్ని విభాగాల్లో 95 శాతానికిపైగా తెలుగు భాషకే పట్టం కడుతున్నారు. అధికారులతో చర్చించాల్సిన అవసరం వస్తే… కలెక్టర్లు గతంలో ‘స్పీక్’ అని రాసేవారు. ఇప్పుడు ‘చర్చించాలి’ అని రాస్తున్నారు. కలెక్టర్ ముక్తేశ్వర రావు సంతకం కూడా తెలుగులోనే చేస్తున్నారు. రెవెన్యూ సదస్సుల నిర్వహణకు సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే నడుస్తున్నాయి. ప్రతి సోమవారం బాధితుల నుంచి స్వీకరించే విజ్ఞప్తులకు తెలుగులోనే సమాధానాలు పంపుతున్నారు. క్షేత్ర స్థాయిలో కుల, ఆదాయ, నివాస «ద్రువీకరణ పత్రాలు తెలుగులోనే జారీ చేస్తున్నారు. మునిసిపాలిటీల్లో పేరు మార్పిడి, పన్నులకు సంబంధించిన రశీదులు, డ్వాక్రా సంఘ సభ్యులకు అందే రుణాల వివరాలు తెలుగులోనే జారీ చేస్తున్నారు.

రైతులకు ఏమాత్రం అర్థంకాని రీతిలో ప్యాడీ, సిరియల్స్, రెడ్‌గ్రామ్ అంటూ ఆంగ్ల పద ప్రయోగం చేసే వ్యవసాయ అధికారులు ఇప్పుడు ఎంచక్కా వరి, పప్పుధాన్యాలు, కందులు, ఉలవలు, ఆముదం, నువ్వులు, బొబ్బర్లు అని తెలుగులో రాస్తున్నారు. రైతుకు నేస్తం, వ్యవసాయ పథకాల కరదీపిక పేరిట వివిధ పథకాలపై తెలుగులో ప్రచార సామగ్రి ముద్రించి పంచిపెడుతున్నారు. రైతు బీమా, భారత ప్రభుత్వ గ్రామీణ గిడ్డంగుల పథకం, రైతు బజార్లు అంటూ వాటికి సంబంధించిన వివరాలు తెలుగులోనే ప్రచారం చేస్తున్నారు. పవర్ టిల్లర్, రోటవేటర్, డ్రమ్ సీడర్, మల్టీక్రాప్ డ్రెసర్ వంటి ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాల పేర్లు తర్జుమా చేయకున్నా… వాటి పేర్లను తెలుగు లిపిలో రాస్తున్నారు. వ్యవసాయ శాఖలో ఉద్యోగులకు సంబంధించిన సెలవులు, వివిధ పథకాల వివరాలు, సమాచార హక్కు చట్టం కింద సమాధానాలు, వివరణ పత్రాలు అన్నీ తెలుగులోనే సాగుతున్నాయి.

విద్యా, రెవెన్యూ శాఖలలో…
విద్యా శాఖలో బడిపిల్లల హాజరుపట్టీ నుంచి డీఈవో, రాజీవ్ విద్యా మిషన్ మధ్య జరిగే ఉత్తర ప్రత్యుత్తరాల వరకూ అన్నీ తెలుగులోనే! మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన వివరాలు పంపేందుకు కంప్యూటర్‌లో ఉండే ఫార్మాట్ నమూనా మినహా… అంతా తెలుగే. పాఠశాల నుంచి ఎంఈవోకు, ఎంఈవో నుంచి పాఠశాలలకు మధ్య జరిగే ప్రత్యుత్తరాలు పూర్తిగా తెలుగులోనే సాగుతున్నాయి. ఉపాధ్యాయులు తెలుగులోనే సెలవు చీటీలు రాస్తున్నారు. పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే పర్యవేక్షకుల (ఇన్విలేజటర్) ఆదేశాలను సైతం తెలుగులోనే సిద్ధం చేసినట్లు మిర్యాలగూడ ఎంఈవో మంగ్యానాయక్ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.

ఇక… జిల్లా విద్యాధికారి జగదీశ్ భాషతోపాటు ఆహార్యంలోనూ తెలుగును పాటిస్తున్నారు. ఆయన అనేక సందర్భాల్లో పంచె, పైజామా, భుజాన కండువాతో కనిపిస్తున్నారు. ఇక జిల్లా కలెక్టర్ చేపట్టిన తెలుగు ఉద్యమానికి పలువురు రాజకీయ నేతలు కూడా సహకరిస్తున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి నుంచి కలెక్టరేట్‌కు, అధికారులకు వచ్చే లేఖలు నూటికి నూరు శాతం తెలుగులోనే వస్తున్నాయి. మిగిలిన ఎంపీలు, ఎమ్మెల్యేలు సగం వరకు తెలుగులో రాస్తున్నారు. గ్రామీణ స్థాయిలో ప్రజలకు సేవలు అందించే రెవెన్యూ శాఖలోనూ పూర్తిస్థాయిలో తెలుగు అమలవుతోంది.

గ్రామం నుంచి కలెక్టరేట్ వరకు ఆ మాటకొస్తే హైదరాబాద్‌కు వెళ్లే లేఖలు కూడా తెలుగులోనే ఉండాలనే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం కృషి చేస్తోంది. మూడు నెలల్లోనే గొప్ప మార్పును సాధించింది. అధికార భాషా సంఘం సభ్యులు ఆకస్మిక తనిఖీ చేసి… వివిధ శాఖల కార్యాలయాల్లో తెలుగు అమలు జరుగుతున్న తీరును చూసి ఆశ్చర్యపోయారు. అధికార భాష అమలులో నల్లగొండ జిల్లాకు ప్రథమ స్థానం ఇచ్చారు.

తెలుగు మహా సభలే స్ఫూర్తి
డిసెంబర్‌లో పల్లెపల్లెలో తెలుగు సభలు జరిగాయి. అధికార కార్యకలాపాల్లో మాత్రం తెలుగు భాష అమలు సంతృప్తికరంగా లేదని అనిపించింది. కార్యాలయంలో, బడిలో, కళాశాలలో ఎక్కడ చూసినా ఇంగ్లిషే వినిపిస్తోంది. ఇంటికి వెళ్లి లుంగీ కట్టుకుంటేనే తెలుగు గుర్తుకు వస్తుంది. ఈ సమయంలో తెలుగు మహాసభలు నన్ను ఉత్తేజితుడిని చేశాయి. నేను అధికార భాషను అమలు చేసినప్పుడే తెలుగు సభలకు న్యాయం చేసినట్టవుతుందని భావించాను. అధికారులకు అర్థమయ్యేలా చెప్పడంతో వారూ స్పందించారు.
– కలెక్టర్ ముక్తేశ్వరరావు

అర్థం చేసుకోగలుగుతున్నాం
ఇంగ్లిషులో ఉండే విషయాలు అర్థమయ్యేవి కావు. ఇప్పుడు తెలుగులో ఇవ్వటంతో మాకు వచ్చిన కొంచెం చదువుతోనే వాటిని చదివి విషయం అర్థం చేసుకుంటున్నాం. ఈ పద్ధతి బాగుంది.
– శ్రీనివాస్ రెడ్డి, రైతు, వేములపల్లి

సౌలభ్యంగా ఉంది..
ప్రజల భాషలో పరిపాలన జరగడం ఇటు అధికారులకు, అటు ప్రజలకు సౌలభ్యంగా ఉంది. హైదరాబాద్ నుంచి వచ్చే ఫైళ్లు సైతం తెలుగులో ఉంటే ఇంకా బాగుంటుంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి వచ్చే ఫైళ్లను తెలుగులోకి మార్చుకుని కింది స్థాయికి పంపటం అదనపు భారంగా మారింది. కంప్యూటర్ ఆపరేటర్లకు తెలుగు భాష లిపిపై శిక్షణ ఇస్తే మరింత ఉపయోగముంటుంది. ఇతర జిల్లాల అధికారులు సైతం మా జిల్లాలో తెలుగు భాషను అమలు చేస్తున్న తీరు తెన్నులను అడిగి తెలుసుకుంటున్నారు.
– రాజేశ్వర్ రెడ్డి,
డీఆర్‌డీఏ, ప్రాజెక్టు డైరెక్టర్

తెలుగులోనే బోర్డులు
జిల్లాస్థాయిలో కార్యాలయాల బోర్డులన్నీ తెలుగులోనే రాశారు. అదే సమయంలో… ఇంగ్లిష్, ఉర్దూ భాషలనూ వాడారు. మండల స్థాయిలో తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల బోర్డులు పూర్తిగా తెలుగులోకి మార్చారు. కలెక్టరేట్‌సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నోటీసు బోర్డుల లో తెలుగే కనిపిస్తోంది. యాదగిరిగుట్ట దేవాలయ టెండర్లు, పులిచింతల, ఏఎంఆర్‌పీ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ నోటీసులు తెలుగులోనే ఉన్నాయి.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నాటి మహామహులందరినీ కలిపిన అభినవాంధ్ర కవి పండిత సభ

నాటి మహామహులందరినీ కలిపిన అభినవాంధ్ర కవి పండిత సభ
జీవద్భాషలోనే విద్య సాగాలని తీర్మానం
– డా. తుర్లపాటి రాజేశ్వరి

ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో అంతర్భాగంగా ఉన్న బరంపురం 19వ శతాబ్ది పూర్వార్థానికి గంజాం జిల్లాలో ప్రధాన సాంస్కృతిక కేంద్రంగా వాసికెక్కింది. జాతీయ ఉద్యమం దేశంలో వ్యాపిస్తున్న క్రమంలో మతం, కులం, స్త్రీల స్థితిగతులు, శాస్త్రీయత, హేతువాదం, ప్రధానాంశంగా ఆధునిక సమాజం రూపుదిద్దుకుంటున్న తరుణంలో బరంపురం ఆధునికతకు, అభ్యుదయ భావాలకు చిరునామాగా ఆంధ్రదేశ చరిత్రలో స్థానం సంపాదించుకున్నది. ఎందరో పండిత ప్రకాండులకూ, కవి గాయక వైతాళికులకు, దేశభక్తులకు జన్మస్థానం బరంపురం.
దేవరాజు వేంకటకృష్ణారావు 1910-11 సంవత్సరాల నుంచి వేగుచుక్క ముద్రణాలయం- గ్రంథమాల ద్వారా అనేక గ్రంథాలను ప్రచురించి- తెలుగుదేశంలో ఖ్యాతి నార్జించారు. 1912లో ‘వాడే వీడు’ నవలా రచన ద్వారా ఆంధ్రభాషలో తొలి అపరాధ పరిశోధక నవలాకర్తగా గుర్తింపు పొందారు. అటు పర్లాకిమిడి కార్యస్థానంగా గిడుగు రామమూర్తి పంతులు, గిడుగు సీతాపతి వ్యావహారికాంధ్ర భాషా ఉద్యమంలో, సాహితీ వ్యవసాయంలో తెలుగుతల్లి ముద్దుబిడ్డలుగా కీర్తి పతాకను ఎగురవేశారు.

పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి బరంపురం, కళ్ళికోట కళాశాలలో అధ్యాపక స్థానాన్ని అలంకరించి, రచయితగా సంస్కృతాంధ్ర, ప్రాకృత భాషాపండితుడిగా, అభ్యుదయవాదిగా యశస్సు నార్జించారు. ఈ నేపథ్యంలో నవీన రీతులలో రచనలు చేస్తున్నవారందరూ బరంపురంలో ఒక ఐక్యవేదికగా ఏర్పడి సభలు నిర్వహింపదలచినట్లుగా మనకు ‘నవ్యాంధ్ర సాహిత్య వీధుల’లోని ఈ పంక్తుల ద్వారా తెలుస్తోంది.

‘1933 నాటికి ఆంధ్రదేశంలో నవ్యసాహిత్యాన్ని ఆరాధిస్తున్న సంస్థలలో సాహితీ సమితి, యువకవి మండలి, కవితా సమితి ముఖ్యమైనవి. ఇవన్నీ కలిసి 1933 మార్చి 10, 11, 12 లలో బరంపురంలో అభినవాంధ్ర (అఖిలాంధ్ర) కవి పండిత సభను పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి అధ్యక్షతన నిర్వహించాయి.’ (పుట-515) 1933 మార్చి 10, 11, 12 తేదీలలో బరంపురంలో జరిగిన ఈ సభలకు నాడు లబ్ధప్రతిష్ఠులైన కవి పండితులందరూ బరంపురం తరలివచ్చారు.

సభల నిర్వహణకు పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రికి అప్పటి కళాశాల ప్రిన్సిపాల్ శ్రీగురు భాగవతుల ధర్మారావు, దేవరాజు వేంకటకృష్ణారావు తదితరులు సహకరించారు. మూడు రోజుల మహాసభలను గిడుగు రామమూర్తి పంతులు ప్రారంభించారు.

మొట్టమొదటిసారిగా జరిగిన ఈ ఆధునిక సాహిత్య సదస్సుకి చిలుకూరి నారాయణరావు అధ్యక్షత వహించారు. సభలలో దేవులపల్లి కృష్ణశాస్త్రి, తల్లావఝ్జల శివశంకరశాస్త్రి, వేదుల సత్యనారాయణ, ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి, గిడుగు సీతపతి, చింతా దీక్షితులు, కొంపెల్ల జనార్దనరావు, శ్రీశ్రీ, తాపీ ధర్మారావు, గుండిమెడ వెంకట సుబ్బారావు, మండపాక పార్వతీశ్వరశాస్త్రి, జయంతి జగన్నాధరావు ప్రభృతులు పాల్గొన్నారు.

శ్రీశ్రీ లాంటి యువకవులకి ఈ సభలు కొత్త ఉత్సాహాన్ని కల్గించాయి. సభలో తల్లావఝ్జల శివశంకరశాస్త్రి నవ్య కవుల కవిత్వాన్ని వినిపించారు. ముఖ్యంగా శ్లిష్ట్లా ఉమామహేశ్వరరావు కవిత- ‘మారో.. మారో.. మారో మారో/ఒకటి రెండూ — మూడు నాలుగు మారో మారో — మారో మారో” సభికుల్ని ఉత్తేజపరిచింది. బరంపురంలో జరిగిన సభలను శ్రీశ్రీ అనంతం: ఆత్మచరిత్రాత్మ చరిత్రాత్మక నవలలో నమోదు చేశారు. “…దీనిని నేనూ జనర్దనరావూ వెళ్లాము. అప్పుడే నేను కొత్త బాణీలో రాస్తున్న నా గీతాలను చింతా దీక్షితులుగారికి చదివి వినిపించాను. అది విని ఆయన అమితానందభరితుడు కావడమూ, వచ్చేసిందిదిగో కొత్త కవిత్వపు వరద” అని నన్ను మెచ్చుకోవడమూ ఎన్నటికీ నేను మరిచిపోలేను” (పుట-125)

గ్రాంధిక భాష వ్రాయటంలోని నిరర్థకత, వ్యావహారికాన్ని ఆశ్రయించాల్సిన ఆవశ్యకత ఈ మహాసభలలో చర్చకు వచ్చాయి. ఈ సభలో తీసుకున్న నిర్ణయాలు: – గ్రాంథికాంధ్రము ఒకానొకప్పుడు పరిమిత ప్రయోజనము కలదైనా నేడు అది సర్వజనోపయోగకారి కాదు. వ్యావహారికాంధ్రము అపరిమిత ప్రయోజనము కలది. ప్రజలలో జ్ఞానాభివృద్ధి కలగడానికి ఇదే పరమ సాధనము.

– ప్రారంభ విద్య ఉన్నత విద్యలను తెలుగు పిల్లలకు చెప్పేటందుకు సాధ్యముగా గవర్నమెంట్ వారు ఏర్పాటు చేసిన గ్రాంథిక భాష అందులకు తగినది కాదు. భాషకున్నూ, బాలురకున్నూ అందువల్ల తీరని నష్టం కలుగుతున్నది. కావున జీవద్భాషలోనే విద్యా కార్యక్రమమంతా జరుపవలెనని గవర్నమెంట్‌ను ఈ సభ వారు కోరుతున్నారు. వీటితో పాటు నవ్య సాహిత్య పరిషత్తు పక్షాన ఒక సాహిత్య పత్రిక వెలువరించటానికీ, కొంపెల్ల జనార్దనరావును ఆ పత్రికా సంపాదకుడిగా నియమించడానికీ కూడా తీర్మానాలు జరిగాయి. కవి పండిత గోష్ఠులతో బరంపురం ప్రతిధ్వనించింది.

నాటి బరంపురం రోజులని జ్ఞాపకం చేసుకుంటూ శ్రీశ్రీ “నాలో పాతరాతి యుగం పోయి కొత్తయుగం ప్రవేశిస్తున్న రోజులు. జనార్దనరావూ నేను కలిసి సాయంకాలం కాగానే ట్రంకురోడ్డు షికారు తిరిగి వచ్చేవాళ్ళం” అంటూ తాము మాట్లాడుకున్న విశేషాలు రాశారు. శ్రీశ్రీ ఈ మూడు రోజులలో ఒకనాడు పంచాగ్నుల వారింటికి వెళ్లారు. నండూరి వారి ఎంకి పాటలపై గాలిదుమారం చెలరేగుతున్నప్పుడు నండూరిని సమర్ధిస్తూ పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి ఒక వ్యాసం రాశారు. అందుచేత శ్రీశ్రీకి పంచాగ్నుల వారంటే ఎనలేని గౌరవం. ఆ రోజు శ్రీశ్రీ ఆయనతో చాలాసేపు గడిపారు.

మాటలలో “నా పుస్తకం ఒకటి మీకు అంకితం చెయ్యాలని ఉందని” వారితో చెప్పటమూ దానికి వారు అంగీకరించటమూ జరిగింది. అయితే ఈ సంభాషణ జరిగిన ఏభై ఏళ్ల తర్వాత శ్రీశ్రీ ఆకాంక్ష కార్యరూపం దాల్చింది. శ్రీశ్రీ సిప్రాలిని 9.6.1981న పంచాగ్నుల వారికి అంకితమిచ్చారు. ఆ విధంగా శ్రీశ్రీ తన కవిత్వాన్ని పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రికి అంకితమివ్వటానికి అంకురార్పణ ఈ మహాసభలలో జరిగింది. అభినవాంధ్ర కవి పండిత సభ తర్వాత కాలంలో నవ్య సాహిత్య పరిషత్తుగా పేరు మార్చుకొని అనేక చిరస్మరణీయమైన కార్యక్రమాలను నిర్వహించింది.

– డా. తుర్లపాటి రాజేశ్వరి
080935 20819
(అభినవాంధ్ర కవి పండిత సభకి 80 ఏళ్ళు)

 

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

శివరాత్రి చిత్రాలు

sivaratri visheshalu -1 sivaratri-2 sivaratri-3 sivaratri-4 sivaratri-5 sivaratri-7 sivaratri-8 sivaratri -6

Posted in సమయం - సందర్భం | Leave a comment

ఆ రోజుల్లోనూ ఉన్నయ్… నిషేధాలు – సితార 17 3 2013

Banned Films F copy

Posted in సేకరణలు | Tagged | Leave a comment

జ్ఞానదుడు మహర్షి నారదుడు -9

జ్ఞానదుడు మహర్షి నారదుడు -9

    ఇంత చేసి నారదుడు ఊర్కొంటాడా ?వెంటనే ఉత్తాన పాద మహా రాజుదగ్గరకు  వెళ్ళాడు ఆయన పూర్వం జరిగిన దంతా మహర్షికి విన్న విన్చుకొన్నాడు అప్పుడు నారద మహర్షి రాజా ! నీకుమారుడు

‘’దేవకిరీట రత్న రుచి దీపిత పాద సరోజుడైన ,రా

 జీవ దళాక్షరక్షితు ,డశేష జగత్పరికీర్తనీయ ,కీ

 ర్తి విభవ ప్రశస్త సుచరిత్రుడు ,వానికి దుఖమేటికిన్ ‘’ అని ఊరడించి అతడు సుకర్మ చేత

‘’సమస్త లోక పాలావలి కందరాని సముదంచిత ,నిత్య పదంబు

నం బ్రభుశ్రీ విలసిల్ల జెందు ,దులసీ ళదాము ,భజించి

యా జగత్పావనుడైన ,నీ సుతు ప్రభావ మేరున్గవు నీవు భూవరా “’అని ధ్రువ కుమారుడు పొంద బోయే మహోత్క్రుస్ట స్థితిని వివరించి తండ్రి మనసుకు శాంతి చేకూరుస్తాడు నారదమహర్షి

‘’నీ కీర్తియు జగముల యంద-దా కల్పము నొంద జేయు ,నంచిత గుణ ర

   త్నాకరుడట కేతేన్చును –శోకిమ్పకు మాతని గూర్చి సుభగా చరిత్రా ‘’అని కూడా తెలిపి ఊరట కల్గిస్తాడు .ఇలా ధ్రువో పాఖ్యానం లో భక్తీ మార్గాన్ని ,తండ్రికి మనశ్శాంతి ని ఉపదేశించి తన ధర్మాన్ని నేర వేరుస్తాడు .ధ్రువుడు ఆదర్శ భక్తీ ధ్రువ తార గా వేలుగొండటానికి తగిన మార్గం చూపించాడు .భక్తికి పరా కాస్టగా నిలిచి ,తగిన శిష్యుడని పించుకొన్నాడు .

           ప్రాచీన బర్హి కి జ్ఞాన బోధ

హవిర్దాననుడి కుమారుడు బర్హిష్మంతుడు .ఎప్పుడు యాగం చేస్తూ ,ప్రాచీనాగ్రం కల దర్భల చేత భూమి అంతటిని కప్పివేసే శాడు .అందుకని ప్రాచీన బర్హి అని పేరొచ్చింది యజ్న యాగాలపై అమితా శక్తి ఉన్న ఇతనిని కర్మ మార్గం నుంచి జ్ఞానమార్గం వైపు మరలించాలని నారదుడే రంగ ప్రవేశం చేశాడు .ఈ కర్మల వల్ల శ్రేయస్సు లభించదని చెప్పాడు .బర్హి మహర్షిని తనకుమోక్ష మార్గం చూపించమని,జ్ఞానోపదేశం చేయమని కోరాడు .ఇది భాగవతం లో చతుర్దా స్కంధం లో ఉంది

   నారదుడు ‘’పురంజనుడు ‘’అనే వాని కదా ను వివరించి చెప్పాడు .పురంజనుడు హిమవత్పర్వత ప్రాంతం లో తొమ్మిది ద్వారాలు కల పురం తనకు అనుకూలం గా ఉందని భావించి ప్రవేశించాడు .అక్కడ అందమైన ‘’ప్రమదోత్తమ ‘’అనే కోరిక పై ఆ పురాదీశ్వరుడైనాడు .ఆమెతో కొంతకాలం ఉండి ,చెప్పకుండా ఒక రోజు వేటకు వెళ్ళితిరిగి వచ్చాడు ..ఆమె దుఖాన్ని చూసి ఉపశమింప జేశాడు .ఇక ఎప్పుడూ వెళ్ళనని ఆమెతోనే కలిసి ఉంటానని మాట ఇచ్చాడు .సంతానం కలిగినా భార్యే పరమావధి గా జీవించాడు

         ఇంతలో ‘’చండవేగుడు ‘’ .అనే గంధర్వుడు డాడి చేశాడు .పరాధ్యక్షుడు ‘’ప్రజా గరుడు ‘’గంధర్వుని ఓడించాడు .ఆ తర్వాత ‘’భయుడు ‘’,కాల పుత్రిక పురంజన నగరం చేరాడు .కాల పుత్రికి పురంజనుడు లొంగి పోయాడు .చివరికి ఆ పురాన్ని వదల లేక వదిలి వెళ్ళాడు .ప్రజాగరుడుడనే మయుని సోదరుడు నగరాన్ని తగుల బెట్టాడు .పురంజనుడు భార్యనే స్మరిస్తూ ప్రాణాలు విడిచాడు .పూర్వం ఇతని చే హిమ్సింప బడ్డ యజ్న పశువులు నరక లోకానికి వచ్చిన పురంజనుడిని గొడ్డళ్ళతో నరికి పారేశాయి .ప్రాణాలు పోతున్నా ,భార్యనే తలచు కోవటం వాళ్ళ తర్వాత జన్మ లో విదర్భ రాజ గృహం లో స్త్రీ గా పుట్టాడు .అప్పుడు మలయకేతువు అనే వాడు ఈమెను వివాహం చేసుకొన్నాడు

        ఈ కధలో దేహం పై మొహం పోవాలని శాశ్వత సత్యాన్ని తెలుసుకొని చేరాలని ,మధ్యలో వచ్చేవన్నీ ,మిధ్యే నని చక్కని కదా సంవిధానం తో వివరించాడు నారదుడు .కధలోని గూడార్దాలనూ వివరించాడు .ప్రాచీన బర్హికి .పంచారామాలు అంటే పంచెంద్రియాలని ,నవద్వారాలు అంటే శరీరం లోని నవ రంద్రాలని ,ఏక పాలన అంటే ప్రాణ పాలనం అని ,త్రికోస్టాలు అంటే తేజో విశేషాలని ,విపనాలు అంటే కర్మేన్ద్రియాలే నని ,పంచ ప్రకృతి అంటే పంచ భూతాలని చెబుతూ ,ప్రకృతి యే‘’కామిని ‘’అని ఇలాంటి దేహ పురం లో నివశించే వాడే పురుషుడని ,అజ్ఞానం వల్ల దీని పై మొహం పెంచుకొని మానవులు ఉత్తమ గతిని చేర లేక పోతున్నారని చక్కగా వివరం గా చెప్పి దేహ భ్రాంతి తొలగింప జేశాడు ‘’వైదర్భీ జనిత సంభావిత సుఖా భావం ,దుఖం చేత‘’పాపిష్టి దశ లో ఉన్నావని హెచ్చరించాడు .చివరగా సత్య జ్ఞాన దర్శనం చేస్తూ హంసి –హంస తో చెప్పి నట్లుగా ‘’నీవు వై దర్భివి కావు –వీరు డితడు వివరింప గా గాడువిభుడు నీకు నొగి మున్ను పురమున నుప రద్ధు జేసినా యా పుర జనపతి వరయు గావు మరియు నీ వన్య సీమంతిని యని యును జర్చింప గా బూర్వ జన్మ మందు బురుషుండ వనియు బుద్ధి దలంచుట యరయంగ నీ యు భయము ,నీ సత్య మింక యు ,మామ కీన మై ఎసగు మాయ జేసి ,కల్పిత మయ్యే జర్చింప మనము –పూర్వమున హంసలమ యని పూరి ఎరుమ్గ –బలికితి దెలియ మనల రూపంబు జూడు ‘’అని భగవంతుడే జీవుడే జీవుడే పరమేశ్వరడనీ రెండూ ఒకటేనని ఆ సంగతి తెలియక అజ్ఞానం తో అలమటిస్తున్నామని అద్భుతం గా కధనం నారదుడు చెప్పి బర్హి మనసును జ్ఞానం వైపుకు మళ్ళిస్తాడు  .

       సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ -10-3-13- ఉయ్యూరు

 

 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

మా ఊరి నాటకంలో హీరో నేనే

మా ఊరి నాటకంలో హీరో నేనే



“జోరుగా వచ్చే ముసీ ప్రవాహం, ఆ నీరు ఎక్కడి కక్కడ సుడులు తిరగడం నిజం ‘టైటానిక్’ నీటిని తలపించేది. ఇంతవరకు నేను అలాంటి సీన్‌ను నా సినిమాల్లో చూపించలేదు. కానీ దర్శకుడు గుణశేఖర్ ‘సైనికుడు’ సినిమాలో కొంతవరకు ఈ ప్రయత్నం చేశారు.”
‘టైటానిక్’ నీటిలో…
“మా ఊరు చాలా అందమైనది. మాకు ఒక వైపు ముసీ నది, (హైదరాబాద్ మూసీ నది కాదు, ప్రకాశం జిల్లాలోది) ఇంకో వైపు జామ, మామడి, సరుగుడు చెట్లు కాపలా ఉంటాయి. అప్పట్లో మా ఊరుకు రోడ్డు లేదు. మా పక్కూరు తిమ్మాడలో దిగి దాదాపు రెండు కిలో మీటర్లు నడిచి ఊళ్లోకి రావాలి. ఇప్పుడైతే ముసీ నదిపై బ్రిడ్జ్ నిర్మించారు. ఊరికి రోడ్లు కూడా పడ్డాయి. బస్సుల రాకపోకలు సాగుతున్నాయి. నా చిన్ననాటి రోజుల్లో ఇవేవీ ఉండేవి కాదు. దాంతో తిమ్మాడ నుంచి మా ఊరుకు రావడం ఒక్కోసారి గొప్ప సాహసంగా ఉండేది. మామూలు రోజుల్లో చెట్లు, డొంకలు, పుట్టలు దాటి వచ్చే మా పల్లె జనం వర్షాకాలంలో మాత్రం నీటితో పోరాటమే చేసేవారు.

తిమ్మాడకు ఆనుకుని ‘ఇనగలేరు’అనే ఏరు ఉంది. వర్షం వస్తే ముసీనది, ఇనగలేరు రెండూ దోస్తీ చేసేవి. దాంతో నిడమానూరు చుట్టూ ఎటు చూసినా నీరే. మా ఊరికి ఎం. నిడమానూరు అనే పేరు రావడానికి ముసీయే కారణం. దాని ఒడ్డునున్న ఊరని మా ఊరిని ముసీ ఒడ్డు నిడమానూరు అంటారు. ఏరు వచ్చినపుడు పొలాలకు, మా ఊరి పెద్ద చెరువుకు తేడా ఉండేది కాదు. ఆ నీటి మధ్యలో మా పల్లె జనం బతికేవారు. అయినా సాధారణ రోజుల్లాగే మా ఊరి నుంచి తిమ్మాడకు ఆ నీటిలోనే రాకపోకలు జరిగేవి. సుడులు తిరిగే ఆ నీటిని దాటడానికి పడవలు, నావలు, తెప్పలు వాడిన సందర్భాలు ఎప్పుడూ లేవు.

మరెలా? దాటే వారంటే…రెండు వెదురు కర్రలే ఆ సాధనం. వాటి సాయంతోనే దాటే వాళ్లం. వాటికి మరో ఇద్దరు సాయం. వాళ్లేం చేసేవారంటే బలిష్టమైన, పొడవాటి వెదురు కర్రలను తీసుకుని వాటిని రైలు పట్టాల్లా పెట్టి వాటి చివరలు మరో రెండు కర్రలతో కలిపి కట్టేవారు. ఆ వెదురు కర్రలకు ముందు వెనుక ఇద్దరు ఉండేవారు. మధ్యలో ప్రయాణీకులు. మన రెండు చంకల కింద వెదురు కర్రలు ఉంటాయి. మిగతా శరీరమంతా నీటిలోనే ఉండేది. ఆ ప్రవాహానికి తగ్గట్టుగా ముందుకెళుతూ ఆ ఇద్దరూ జాగ్రత్తగా ప్రయాణీకులను నిడమానూరుకు చేర్చేవారు.

ఒక ట్రిప్పులో ఏడుగుర్ని ఇలా ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు చేర్చేవారు. ఈ పనిని చాకళ్లు చేసేవారు. నేను రెండు మూడు సార్లు ఇలాంటి ప్రయాణం చేశాను. ఏ మాత్రం పట్టు జారినా నీటిలో మునిగిపోవాల్సిందే. అలాంటిది నా ఎరుకలో ఒక్కసారి కూడా ఎలాంటి అపశ్రుతీ జరగలేదు. జోరుగా వచ్చే ముసీ ప్రవాహం, ఆ నీరు ఎక్కడి కక్కడ సుడులు తిరగడం నిజం ‘టైటానిక్’ నీటిని తలపించేది. ఇంతవరకు నేను అలాంటి సీన్‌ను నా సినిమాల్లో చూపించలేదు. కానీ దర్శకుడు గుణశేఖర్ ‘సైనికుడు’ సినిమాలో కొంతవరకు ఈ ప్రయత్నం చేశారు.


‘పొట్టి’గోపాల్..’ ది ఆర్టిస్టు’
నా సినిమా నేపథ్యానికి మా ఊరిలోనే పునాదులు ఉన్నాయి. మోహనరావని ఒకాయన ఉండేవాడు. పొడవుగా, తెల్లగా చూడగానే ఆకట్టుకునే రూపం ఆయనది. అలాంటి మోహనరావు ఏ మద్రాసులోనో ఉంటే సినిమాల్లో ‘హీరో’ అయ్యేవాడు. ఆయన ఉన్నది ఊర్లో కాబట్టి డ్రామాల్లో హీరో అయ్యాడు. అతని ఆధ్వర్యంలో నాటకాలు వేసేవారు. ఈయనకొక టీమ్ ఉండేది…సుబ్బయ్య, ఎర్రకోటేశ్వరరావు, కె.ఎస్.ఆర్ మూర్తి. వీళ్లు మోహనరావు డ్రామా సంఘంలో శాశ్వత సభ్యులు. వీరందరికీ చేదోడు వాదోడుగా మా బావ కోటేశ్వరరావు వ్యవహరించేవారు.

వాళ్లు ఏదో ఒక నాటకం రిహార్సల్ చేయడం… సందర్భం చూసుకుని వేసేయడం. ఇలా ఉండేది వాళ్ల సరదా. స్టేజ్ మీద వాళ్లని చూశాక రిహార్సల్ ఎలా చేస్తారో చూడాలనే ఆసక్తి కలిగింది. రిహార్సల్స్ స్కూల్‌లోనే, పంచాయితీ భవనంలోనే జరిగేది. లోపలికి ఎవరినీ రానిచ్చేవారు కాదు. రెండు మూడు సార్లు సొంతంగా ప్రయత్నించి విఫలమయ్యాక మా బావ కోటేశ్వరరావుతో లాబీయింగ్ చేసి ఎలాగైతేనేం చూశాను. అప్పటి నుంచి కొత్త ఉబలాటం మొదలైంది.

ఎలాగైనా స్టేజ్‌మీద నటించాలనే కోరిక రాత్రి, పగలు వెంటాడింది. దాంతో మళ్లీ బావతో లాబీయింగ్ చేస్తే పెడితే నా గోల భరించలేక ‘పోలీసు ఇన్‌స్పెక్టరు’ పాత్ర ఇచ్చారు. నేను పొట్టి కావడంతో ఆ బట్టలు బాగా లూజ్ అయిపోయాయి. నన్ను నేనే చూసి తెగ నవ్వుకున్నా. ఎలాగోలా స్టేజ్ మీద నటించాను. ఆ పాత్రలో నా నటన జనాలు గుర్తించారో లేదో కానీ మా డ్రామా కంపెనీ వాళ్లు తరువాత నాటకంలో నన్ను ఏకంగా హీరోని చేశారు.

నా పక్కన ఇందిర అనే స్టేజ్ ఆర్టిస్టు నటించారు. నాటకాన్ని రక్తి కట్టించాలనుకుని ‘పండంటి కాపురం’ సినిమాలోని ‘ఈ కోకకట్టుకున్న బొమ్మరిల్లు’ పాటను మేమే కంపోజ్ చేసి పెట్టుకున్నాం. ఆ ప్రయోగం బాగా విజయవంతమై నన్ను అందరూ మంచి ఆర్టిస్టు అన్నారు. తరువాత రోజు ఊర్లో తిరుగుతుంటే కొంతమంది స్త్రీలు నన్ను గుర్తుపట్టి ‘హీరో’ ‘హీరో’ అంటూ వాళ్లలో వాళ్లు కొంచెం గట్టిగానే అనుకోవడంతో నాకు చెప్పలేనంత సిగ్గేసింది.

అమ్మవార్ల ‘ డావెన్సీకోడ్’…
దేవుడు లేదా దేవతల అనుభవాలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. ఒక్కోసారి నమ్మలేనంతగా ఆశ్చర్యపరుస్తాయి. మా నిడమానూరులో ‘గోగులమ్మ’, ‘గంగమ్మ’, ‘పోలేరమ్మ’ బాగా ఫేమస్. మొక్కులు చెల్లించాలనుకునేవారు ఈ అమ్మవార్లను ఊరంతా ఊరేగించేవారు. ఈ ముగ్గురమ్మల మీద మా ఊరి వాళ్లకు విపరీతమైన నమ్మకం. ఏం కోరినా కాదనరని అంటుంటారు. నాకూ ఈ అమ్మవార్ల మహిమతో ఒక అనుభవం ఉంది.


మా చెల్లాయి సుశీలకు ఒకసారి బ్రెయిన్ ఫీవర్ వచ్చింది. దాన్ని నలభై ఒక్క రోజులు మద్రాసులోని విజయా ఆసుపత్రిలోనే ఉంచేశాము. రోజు రోజుకూ పరిస్థితి చేజారిపోతోంది. ఆఖరికి నలభై ఒకటో రోజు డాక్టర్లు సుశీల ఇంక బతకదని, తీసుకువెళ్లిపోవచ్చని చెప్పారు. మన చేతిలో ఏమీ లేదు కదా సరే అనుకున్నాం. అమ్మానాన్నలిద్దరూ నిస్పృహలోకి వెళ్లిపోయారు. డిశ్చార్జికి అన్ని ఏర్పాట్లు చేస్తుండగా నా దగ్గరకు తమ్ముడు సుబ్బారావు వచ్చి ” మన చెల్లమ్మకు తగ్గితే ‘గోగులమ్మ’, ‘గంగమ్మ’, ‘పోలేరమ్మ’లకు కొలుపులు పెడతానని మొక్కుకోనా?” అని అడిగాడు.

నిరాశగానే నేను “సరే” అన్నాను. గంట తర్వాత డిశ్చార్జి చేయాల్సిన డాక్టర్లు ‘కాసేపు ఆగండ’ని చెప్పారు. మాకేమీ అర్థం కాలేదు. మొత్తానికి మళ్లీ ట్రీట్‌మెంట్ మొదలుపెట్టారు. కొన్ని రోజుల్లో తేరుకున్న సుశీల ఇప్పటికీ ఆరోగ్యంగానే ఉంది. ఆ తరువాత చేసిన ‘గోగులమ్మ’, ‘గంగమ్మ’, ‘పోలేరమ్మ’ కొలుపులకు నేనూ వెళ్లాను. ఇప్పటికీ మా ఊరు ముగ్గురమ్మలను నేను బాగా నమ్ముతాను.

‘డార్క్‌నైట్’ రైడింగ్…
ఊరిలో నాకొక చిన్న గ్యాంగ్ ఉండేది. రమణారెడ్డి, కోటి రెడ్డి, బెజవాడ శ్రీక్రిష్ణయ్య, శ్రీరాములు, మూర్తి కె.ఎస్.ఆర్, కోటేశ్వరరావు, సుబ్బయ్య…వీళ్లంతా గ్యాంగ్ సభ్యులు. సినిమాలు చూడటానికి వీళ్లతోపాటు మరికొంత మందిమి కలిసి సైకిళ్లపై ఒంగోలు వెళ్లేవాళ్లం. ఒంగోలుకు మా ఊరి నుంచి 15 కిలో మీటర్ల దూరం. కొండల మధ్య నుంచి వెళ్లాలి. పాటలు, పందేలు, జోకులతో హాయిగా వెళ్లేవాళ్లం. ఒంగోలులో ‘కొచ్చిన్ కేఫ్’ అని ఉండేది. దానిని కేరళ వాళ్లు నిర్వహిస్తుండేవాళ్లు. అక్కడ టిఫిన్ చేసి మార్నింగ్ షో మొదలు సెకెండ్ షో వరకు ఏకధాటిగా సినిమాలు చూసేవాళ్లం. అప్పట్లో నేల టికెట్ 30 పైసలు. దాంతో సినిమా కోసం కొంత మొత్తం, భోజనాలకు కొంత ఏర్పాటు చేసుకునే వాళ్లం. సెకెండ్ షో అయ్యాక బీచ్‌కు వెళ్లడం ఆనవాయితీ. ఒంగోలు నుంచి 20 కిలో మీటర్ల దూరంలో ‘ఈతముక్కాల -మన్నూరు’ బీచ్‌లుండేవి. రెండో ఆట పూర్తవగానే మేమంతా ఈ బీచ్‌లకు బయలు దేరేవాళ్లం. కొంత దూరం వరకు తారురోడ్డు ఉండేది. ఆ తరువాతే అసలు సినిమా మొదలయ్యేది. కటిక చీకటి…పెద్ద డొంకలు…వాటి మధ్య సైకిళ్ల ప్రయాణం. మా మాటలు మాకే భయపట్టేవి. అయినా అక్కడకు వెళ్లడం అదొక ఆనందం. వెళ్లాక ఓపిక ఉన్నంత వరకు సముద్ర స్నానాలు చేసేవాళ్లం. బాగా అలసిపోయి ఎక్కడి వాడు అక్కడ సముద్రం నుంచి కొట్టుకొచ్చిన చేపల్లా బీచ్ ఒడ్డున పడుకునే వాళ్లం. ఉదయం లేచి ఇంటికి తిరుగుముఖం పట్టేటప్పుడు మాత్రం రాత్రి ఈ దారిలోనే కదా! వెళ్లింది అని ఆశ్చర్యపోయేవాళ్లం. లోపల ఎంత భయమున్నా వదులుకోలేని సరదాలే అవన్నీ.

బల్లెడ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

UPSC : తెలుగు లో మెయిన్స్ రాసే అవకాసమివ్వాలి

upsc eenadu article chukka on upsc eenadu on upsc

Posted in సేకరణలు | Tagged | Leave a comment

జ్ఞానదుడు మహర్షి నారదుడు –8 ద్రువునికి ఉపదేశం

     జ్ఞానదుడు మహర్షి నారదుడు –8

   ద్రువునికి ఉపదేశం

 తల్లి మాట మీద ‘’నిజ ధర్మ పరిశోధన ‘’కోసం రాజధాని ని వదిలి వస్తున్న ధ్రువ బాలకునిసంగతి నారదుడు తెలుసుకొన్నాడు .ఆయన్ను ఎవరూ పిలువనక్కరలేదు .స్వయం గా వచ్చి కర్తవ్య బోధ చేస్తాడు .అగణితమైన కీర్తిని సంపాదించ బోయే ద్రువునికి తగిన మార్గం సూచింప గలవాడు నారదుడు కాక వేరొకరు సమర్ధులు కారు .ధ్రువుడిని చూసి ఇలా అనుకొన్నాడు మహర్షి .’’మాన భంగం సహించని క్షత్రియ ప్రభావం అద్భుతం కదా !బాలకుడైనా పిన తల్లి దురోక్తులకు మనసు వికలమై సత్యాన్వేషణ కోసం బయల్దేరాడు .’’అని ఆనందించి ,ఆ బాలకుని శిరాన్ని తాకి ‘’హస్త మస్తక ‘’జ్ఞానం అందించాడు .అతనికి కర్తవ్యమ్ తెలుపుతూ ఇలా అంటాడు నారదుడు ‘’నాయనా !వివేకం గలవాడు సుఖ దుఖాలను దైవ వశం గా భావిస్తాడు .దైవ వశం చేత లభించిన దానితో సంతుష్టి చెందాలి .వాడే విమల జ్ఞాని ‘’అన్నాడు .

    ధ్రువుడు ‘’మహానుభావా ! నాకు మనశ్శాంతి లేకుండా పోయింది..త్రిభువనోత్క్రుస్టమైనదీ ,అనన్యాధీష్టిత మైనదీ అయిన పదవి పొందటానికి నాకు మంచి మార్గం సూచించండి .’’అని విన్న విన్చుకొన్నాడు .ధ్రువుడిని ప్రేరేపించింది ‘’ధీర జనోత్తముడు వాసుదేవుడే ‘’కనుక ఆయన్నే ‘’అజగ్ర ధ్యాన ప్రణవ చిత్తం తో ‘’భజించమని ఉపదేశిస్తాడు నారద మహర్షి ..బాలడు కనుక వేదాధ్యయనానికి అనర్హుడని ,స్వస్తిక ఆసనం పై కూర్చుని ప్రాణా యామం  చేత స్తిర సంకల్పం తో శ్రీ హరి ని ప్రార్ధించమని చెప్పాడు .అతని లేత మనసులో అద్భుత సుందర శ్రీ మహా విష్ణువు రూపం అచ్చు పడేట్లు వర్ణించి చెబుతాడు .దాని ప్రభావం అత్యధికం .ఆ రూపాన్నే ధ్యానించి వాసుదేవ మంత్రాన్ని ఉపదేశించి ఆర్చించమని బోధ చేశాడు .

‘’ఆశ్రిత సత్ప్రసాదాభి ముఖున్డును ,విద్ధ ప్రసన్నాననేక్ష ణుండు

 సురుచిర వాసుండు ,సుభ్రూయుగుండును సుకపోల తలుడును సుందరుండు

హరి నీల సంశోభితాంగుండు ,దరుణుండు,నరుణావలోక నోష్టా ధరుడు

గరుణా సముద్రుండు,బురుషార్ధనిధీయు ,బ్రణతాశ్రయుండు ,శోభన కరుడు

లలిత శ్రీవత్స లక్షణ లక్షితుండు ,సర్వ లోక శరణ్యుండు ,గర్మ సాక్షి

పురుష లక్షణ యుక్తుండు ,బుణ్య శాలి యసిత మేఘ నిభ శ్యాము డవ్య యుండు ‘’

    ‘’హార కిరీట ,కేయూర కంకణ ఘన భూషనుండాశ్రిత పోషకుండు

     లలిత కాంచీ కలాప శోభిత కటి మండలుండంచిత కుండలుండు

     మహనీయ కౌస్తుభ మణి  ఘ్రుణి,చారు గ్రైవేయ కుందానంద దాయకుండు

   సలలిత ఘన శంఖ చక్రగదాపద్మ హస్తుండు భువన ప్రశసస్తు ,డజుడు

   గమ్ర సౌరభ వనమాలికా ధరుండు ,హత విమోహుండు ,నవ్య పీతాంబరుండు

   లలిత కాంచన నూపురాలన్క్రుతుండు ,నిరతిశయ సద్గుణుడు దర్శనీయ తముడు ‘’

    సరస లోచన ముత్కరడును –హ్రుత్పద్మ కర్ణికా నివాసిత వి

    స్ఫుర దురు ,నఖ మణిశోభిత చరణ –సరోజాతు దతుల శాంతుడనఘున్ ‘’

             అని నఖ  శిఖ పర్యంతం ఆ శ్రీహరిని ,పరంధాముడిని నోరారా వర్ణించి ,అతని చిత్తాన్ని సుముఖం చేశాడు .అది అమోఘం గా పని చేసింది .దూర్వారాన్కారాలతో ,నీటితో తులసీ దళాలతో మాలల తో ,పత్రాలతో వన మాలలతో వస్త్రాలతో భక్తిగా పూజించమని ,దృఢ మైన శాంత చిత్తం తో ,మంచి ఆచారం తో మంగళ గుణాలతో ,మిత భోజనం తో మెలగాలని హెచ్చరించాడు .అంతే కాక విష్ణువు మాయావతారాలలో అచింత్యం గా ఏం చేస్తాడో అది అంతా హృదయ గతం చేసుకొని తన పనిని అంతా మనో వాక్కాయ కర్మ లతో భక్తితో ,ఆ సర్వేశ్వరునికి సమర్పించమని వివరం గా చెప్పాడు .భక్తితోనే మోక్షం సాధించాలని బోధించాడు .ఆ విధి విధానాన్ని అంతటిని ధ్రువుడు పాటించి ,హరి సాక్షాత్కారం పొంది ,ద్రవ తార గా మిగిలి, తన మనో భీష్టమైన శాశ్వత పదం పొంది కృత మనోధుడయ్యాడు . .

అందరకు రేపు మహా శివ రాత్రి శుభా కాంక్షలు 

           సశేషం

           మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –9-3-13-ఉయ్యూరు 

 

Posted in కవితలు | Tagged | Leave a comment

శ్రీమతి పి.కరుణా నిధి కవితలు

 శ్రీమతి   పి.కరుణా నిధి కవితలు 

              

                      మనిషి మనసు 
      మనిషి మనసు ఒక కడలి -అందులోని ఆలోచనలు పడి లేచే కెరటాలు 
      ఒడ్డుకు చేరే కెరటాలే మన ఆశలు  ఆలోచనలు 
      లేచి పడే కేరటాలన్నీ తీరం చేరవు -కొన్ని ఒడ్డుకు చేరి ఇసుకలో ఇంకి పోతాయి 
      మరి కొన్ని కడలి లో కలిసి పోతాయి 
      మన కోర్కెలు కూడా ఇసుక లో ఇంకి పోయే కెరటాల లాగా ఫలితం లేకుండా పోతాయి 
      కొన్ని తీరని కోరికలు తిరిగి వచ్చిన కెరటాల లాగా కడలి లో కలిసి పోతాయి 
      వాటికి హద్దు లేదు అంతం లేదు 
      మన ఆలోచనలు గమ్యం లేనివి -కడలిలో కలిసినవి లా వృధా కాకూడదు 
      ఆశలకు మాత్రం హద్దు ఉండాలి–ఇది తెలిసి జీవితం సాగిస్తే 
      నీకుండవు ఆటు పోట్లు-లేకుంటే తప్పవు పాట్లు 
                         పేగు బంధం
     అమ్మ అన్నది కమ్మని మాట -రెండు పెదిమలు కలిసి నప్పుడోచ్చే తీయని మాట 
    నవమాసాలు నిన్ను మోస్తుంది అమ్మ -తన ప్రాణాలనోడ్డి ఇస్తుంది నీకు జన్మ 
    రక్తాన్ని చిలికి నీకు ఇస్తుంది పాలునీ కడుపు నిండగా 
    బిడ్డ మురిపాలతో తన కస్టాలు మరుస్తుంది 
    చీదర అసహ్యాలనుండి నిన్ను శుభ్రం చేస్తుంది 
    నిన్ను అలంకరించి తాను పొంగి పోతుంది 
    నీ ఎదుగుదల చూసి మురిసి పోతుంది తాను 
    నీ ఉన్నతిని చూసి తానెంతో ఒదిగి పోతుంది 
    పెరిగిన వృక్షం  తన నీడలో మరో మొక్క ను ఎదగ నీయదు 
    సంఘం లో గుర్తింపు పొందిన నీవు –నీ ఎదుగుదలకు కారణ మైన వేరునే మరిచావు 
    ఆశ్రమాలే వారికి గూడును చేసి చేయి దులుపుకోన్నావు 
    గతం తీపి గుర్తులతో ,భవిష్యథ్ పై భవ్య  ఆశలతో 
    నీరాక కోసం చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్నారు
    కొందరు అమ్మలు నాన్నలు  గుండె బరువుతో బతుకు ఈడుస్తున్నారు 
    ఈ నిజం తెలుసుకొని జీవించండి ఓ నవ యుకుల్లారా 
    పేగు బంధం తెంచు కోకండి- రక్త సంబంధం మరచి పోకండి బాబుల్లారా 
    నీ వాళ్ళను నువ్వు మర్చి పోతే నిన్ను నువ్వు మర్చి పోయినట్లే నని గుర్తుంచుకోండి 
 
              శ్రీమతి కరుణా నిధి  సుమారు యాభై ఏళ్ళ క్రితం ఉయ్యూరు హైస్కూల్ లో తొమ్మిదో తరగతి చదువుతూ నా దగ్గర ట్యూషన్ చదివిన పిల్ల . అణకువ ,సౌమ్యత ఉన్న అమ్మాయి .ప్రస్తుతం రామ గుండం లో భర్త ,పిల్లలతో ఉంటోంది ఆమె స్వగ్రామం  ఉయ్యూరు .ఆయనదీ ఇదే ఊరు .. ఉయ్యూరు వచ్చి నప్పుడల్లా మా ఇంటికి వచ్చి” ఈ మేస్టా ర్ని ”చూసి వెడతారా దంపతులు ఇప్పటికీ అదే అణకువ ,అదే సౌజన్యం . ఈ మధ్య రాసిన రెండు కవితలు ”వెన్నెల ”పత్రిక లో ప్రచురితాలైనాయట . ఈ రోజు వచ్చి ఆమె స్వహస్తాలతో రాసిన ఆ కవితల ను నాకు చూపించింది అందులో కవితాత్మ ఉందని పించి కొంత మార్చి ,సాహితీ బంధువు లకు పరిచయం చేస్తున్నాను . 
              మహా శివ రాత్రి శుభా కాంక్షలతో 
                   మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –9-3-13-ఉయ్యూరు 
 
Posted in కవితలు | Tagged | Leave a comment

మా ఇంట్లో శ్రీరంగ వైభవం

DSCF2832 DSCF2829 DSCF2830 DSCF2831

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

కార్మిక మాత జోన్స్ (మదర్ జోన్స్ ) మనిషి పేర మేగజైన్

 కార్మిక మాత జోన్స్ (మదర్ జోన్స్ )

    మనిషి పేర మేగజైన్

     ఆమె  అసమాన సాహస మహిళ .మడమ తిప్పని కార్మికోద్యమ నాయకురాలు .ఎక్కడ కార్మిక ,శ్రామిక సమస్య వచ్చినా అక్కడ వాలి ,పరిష్కారానికి మార్గం సులభం చేసిన దీరోదాత్తురాలు వివేచనా సంపన్నురాలు .బాలకార్మిక విమోచానానికి కంకణం కట్టుకొని ఆహరహం శ్రమించిన నాయకురాలు .మహిళాభ్యున్నతికి ,సరైన విలువలతో కూడిన రాజకీయ ,పరిస్తితుల కల్పనకు పార్టీని స్థాపించిన రాజకీయ దురంధురాలు  కార్మికులందరికీ ఆమె సేవలు ఒక తల్లి తన పిల్లలకు చేసే సేవలుగా అని పించాయి ఆమె లో తమ మాతృమూర్తిని దర్శించుకొన్నారు .అందుకే ఆప్యాయం గా ,దరంగా , ప్రేమగా,,గౌరవం గా ఆమెను ‘’మదర్ జోన్స్ ‘’అని పిలుచుకొని సంతృప్తి చెందారు అందుకే ఆమె ‘’కార్మిక మాత ‘’అయింది .అలాంటి విశిష్ట వ్యక్తిత్వం ఉన్న ఆ విదుషీమణి   పేరనే ఒక ద్వై మాసిక  పత్రిక ను పెట్టి ఆమె పేరును చిరస్మరణీయం చేసి ఆ  మహిళామణికి నీరాజనలా లందించారు అమెరికన్ పత్రికాధి పతులు ఆమె లాగా నే ఈ పత్రిక కూడా నిర్భాయత్వానికి నిజాయితీకి పెద్ద పట వేసింది .ఆమెయే‘’’’ మదర్ జోన్స్’’అనబడే మేరి హారిస్ జోన్స్ . .ఆపత్రిక పేరే ‘’మదర్ జోన్స్ ‘’లేక ‘’మో జో’’.ఆమె జీవితం అందరికి   ఆదర్శప్రాయం

             మదర్ జోన్స్ పత్రిక ఆమె యే ఆదర్శాలకు ,విలువలకు ప్రాతినిధ్యం వహించిందో వాటిని కాపాడటానికి తీవ్రం గా కృషి చేస్తోంది .వామ పక్ష భావ వ్యాప్తికి అంకితమైన పత్రిక ..పరిశోధనాత్మక మైన బ్రేకింగ్ న్యూస్ కు అశేష గౌరవాన్ని పొందింది ఆ పత్రిక .రాజకీయ ,పర్యావరణ ,మానవ హక్కుల ,,సంస్కృతీ పరి రక్షణ కోసం అంకిత భావం తో పని చేస్తున్న పత్రిక .23 సార్లు ‘’నేషనల్ మేగజైన్ అవార్డ్ ‘’కు నామినేట్ అయిన పత్రిక .ఆరు సార్లు ఆ అవార్డు ను దక్కించుకొన్న పత్రిక .2011 లో జనరల్ ఎక్సేలేన్సి అవార్డ్ తో బాటు 2010 లో ఆన్ లైన్ టాపికల్ రిపోర్టింగ్ కు ‘’ఆన్ లైన్ న్యూస్ అసోసియేషన్ ‘’అవార్డు ను పొండిది .’’ఉట్నే రీడర్ ఇండిపెండెంట్ ప్రెస్ అవార్డ్’’ ను జెనెరల్ ఎక్సేలేన్సి లో సాధించిన అగ్రగామి పత్రిక . ఇలాంటి పత్రిక కు ప్రేరణ గా నిలచిన మదర్ జోన్స్ గురించి తెలుసుకొందాం .

MOJO-July-August-Cover200x262

Mother Jones (abbreviated MoJo) is a politically left-wing[2] American magazine, featuring investigative and breaking news reporting on politics, the environment, human rights, and culture. Mother Jones has been nominated for 23 National Magazine Awards and has won six times, including for General Excellence in 2001,[3] 2008,[4] and 2010.[5] In addition, Mother Jones also won the Online News Association Award for Online Topical Reporting in 2010[6] and the Utne Reader Independent Press Award for General Excellence in 2011.[7]

 

 

                  జోన్స్ జీవితం

 

majones1a Mother-Jones_medium

 

    మేరీ హారిస్ జోన్స్ ఐర్లాండ్  దేశం లో ‘’కౌంటి కార్క్’’అనే చోట 1830 (1837 ?)లో  జన్మించింది .ఆమె చిన్నతనం లోనే ఐర్లాండ్  లో తీవ్ర మైన కరువేర్పడింది కరువు బారి నుండి తప్పించుకోవటానికి ఆమె తలిదండ్రులు కుటుంబాన్ని ఉత్తర అమెరికా కు తరలించారు దురదృష్టం ఆమె ను వెంటాడింది అప్పుడే తీవ్రం గా విజ్రుమ్భించిన ‘’పచ్చజ్వరం ‘’తో తల్లిని ,తండ్రిని కోల్పోయిన అభాగ్యురాలైంది ఉపాధ్యాయురాలు గా జీవితాన్ని ప్రారంభించింది ..మెంఫిస్  చేరి రాబర్ట్ జోన్స్ ను 1861 లో వివాహ మాడింది .ఆయన ఐరన్ వర్కర్ .కార్మిక యూనియన్ కు మంచి సపోర్టర్ కూడా .నలుగురు పిల్లలు కలిగారు .అయినా విధి ఆమె పై పగ బట్టింది .మళ్ళీ ఎల్లో ఫీవర్ విజ్రుమ్భించి1867 లో  భర్తను ,పిల్లలను కోల్పోయింది .’’skilled iron worker ‘అయింది .’చికాగో చేరి డ్రెస్ మేకర్ అయింది .గోరు చుట్టుపై రోకటి పోటు అన్నట్లుచికాగోలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం లో ఆమె ఇల్లు పరశురామ ప్రీతీ అయింది . .అంటే నిలువ నీడ కూడా లేని నిర్భాగ్యురాలైంది .ఇలినాయిస్ ,మిచిగాన్ రాష్ట్రాలలో కొంత కాలం ఉంది

                    కార్మిక సంక్షేమం కోసం కృషి

    లేబర్ ఆక్టివిస్ట్ గా KNIGHTS OF LABOUR ‘’తో కలిసి పని చేసింది .కార్మికులు సమ్మె చేస్తుంటే వెన్నంటి ఉండేది .ఉత్తేజకర మైన ప్రసంగాలు చేసి వారిని కార్యోన్ముఖులను చేసేది .పెన్సిల్వేనియా గని కార్మికులు1873 లో  చే బట్టిన అనేక సమ్మెలకు హాజరై వారిని ఉత్సాహపరచింది అలాగే రైల్ రోడ్డు కార్మికులు 1877 లో చే బట్టిన సమ్మెకు వెన్నెముక గ నిలబడింది శ్రామికులను కార్మికులను ఒక తల్లి లాగా ఆదరించటం వల్ల ఆమె లో వారందరూ తమ మాత్రుదేవతనే చూశారు అందుకే ప్రేమ గా ఆమె ను ‘’మదర్ జోన్స్ ‘(జోన్స్ మాత ) అని ఆప్యాయం గా పిలుచుకొన్నారు అదే చివరికి ఆమె పేరు అయింది .’’గనుల దేవత ‘’అనే పేరు నూ పొందింది జోన్స్ .అమెరికా లో ‘’ఐక్య గని కార్మికుల సంఘం‘’ఏర్పడటానికి కృషి చేసింది ఆమె అవగాహన ,వ్యూహరచన ,చొరవ  అందరికి ఆశ్చర్యం కలిగించేవి .విలువలతో కూడిన రాజకీయాలు మాత్రమె దేశ ప్రగతికి తోడ్పడుతాయని భావించి 1898 లో ‘’సోషల్ డెమోక్రాటిక్ పార్టి ‘’అనే రాజకీయ పార్టీని నిర్మించింది 1905 .లో ‘’ప్రపంచ కర్మాగార కార్మికుల యూనియన్ ‘’ఏర్పడటానికి కృషి చేసి విజయంసాధించింది ..’’సోషలిస్ట్ పార్టీ ‘’స్థాపకురాలు గా కూడా పేరుపొందింది . జోన్స్ చేస్తున్న సాంఘిక సంస్కరణలు ,కార్మికుల సేవా కార్యాలను చూసి అమెరిక ప్రభుత్వపు డిస్ట్రిక్ట్ అటార్నీ ఆమెను ‘’dangerous woman ‘’అన్నాడు .ప్రభుత్వంగుండెల్లో రైళ్ళు పరిగెత్తించింది .ఆమె అంటే ఎంతో జాగ్రత్త పడింది అమెరికా ప్రభుత్వం

                      జోన్స్ మూర్తిమత్వం

       ఇన్ని విషయాలు తెలుసుకొన్న తర్వాత జోన్స్ రూప,స్వభావాలేమిటోతెలుసుకోవాలని పిస్తుంది కదా .ఇంత పెద్ద భారీ కార్యక్రమాలు నిర్వహించిన ఆమె ఎంతో ఎత్తుగా ఉంటుంది అనుకొంటే పొరబాటే .ఆమె అయిదడుగుల ఎత్తు మాత్రమె ఉన్న మహిళ .నల్లని డ్రెస్ ,దానికి లేసున్న  కాలర్  ,నల్లటోపీ తో ఎప్పుడూ కనిపించేది .పిరికి తనం లేని మహా చలాకీ స్త్రీ .ఆమె ప్రసంగాలు ఉద్వేగ పూరితం గా ఉండి ‘’స్వరం భాస్వరాన్ని’’ కుమ్మరించేది .ఆమె ధీశక్తి ,శక్తి, ఉత్సాహం, ధైర్య సాహసాలు అందరికి ఆదర్శాలైనాయి .ఇరవై వ శతాబ్దపు తొలి కాలం లో ఆమె ను మించిన నాయకురాలు లేదని పించుకోన్నది ..పిరికి తనం అంటే ఆమెకు ఏవగింపు .ఆమె మగాళ్ళకు సవాలు గా నిలిచింది .వారిలో ధైర్యం పురిగోల్పేది‘’I have been in jail more than once and I expect to go again .If you are too cowardly to fight –I will fight ‘’అని ఒకసారి కాదు అనేక సార్లు మగవారి పై చాలెంజి చేసిన మహిళా నాయకురాలు .

                               ఉద్యమజ్వాల

      ఆఫ్రికన్ అమెరికన్ వర్కర్ల ను ఆహ్వానించి యూనియన్ లలో చేరేట్లు చేసింది జోన్స్ .అంతే కాదు మైనర్ ల భార్యల తో చీపురు ,తుడుపు గుడ్డ పట్టించి గనులలో చర్మ వ్యాధుల వల్ల  కలిగే ప్రమాదాలనుంచి రక్షణ కల్పించింది . చిన్న పిల్లలతో  ‘’we want to go to school and not to the Mines ‘’అనే ప్లేకార్డుల నుచేత బట్టించి ప్రదర్శనలు నిర్వహించింది .పారిశ్రామిక విప్లవం తో ఆమెరికా ముందుకు వెళ్తుంటే ,అమెరికా స్వరూపమే పూర్తిగా మారి అభివృద్ధి పధం లో దూసుకు పోతుంటే ,జోన్స్ కార్మికుల స్తితి గతులను మెరుగు పరచాలని భావించి అంకిత భావం తో కృషి చేసింది .                 నిరుద్యోగులతో ఉద్యోగాల కల్పన కోసం  కాన్సాస్ సిటి నుంచి  వాషింగ్ టన్  డి.సి.నగరం వరకు భారీ ప్రదర్శనకు నాయకత్వం వహించింది .

              కార్మిక ప్రయోజనాలే కాదు గనుల యజమానుల రక్షణ కూ ఆమె తీవ్రం గానే కృషి సల్పింది .అలబామా రాష్ట్రం లోని బర్మింగ్ హాం పట్నం లోని తెల్లజాతి నల్లజాతి మైనర్లకు ‘’దేశవ్యాప్త బొగ్గు గని కార్మికుల సమ్మె ‘’కాలం లో సహాయ పడిన వివేక వంతురాలు జోన్స్ ‘’.యూజీన్ డేబ్స్’’ అనే అమెరికన్ రైల్వే యూనియన్ నాయకుని కి మద్దతు కోసం భారీ ర్యాలీ ని నిర్వహించింది .అతనికి కోర్టు దిక్కారానికి ఆరు నెలలు శిక్ష పడింది 1897 వేసవి లో 9000 మంది కార్మికులు దేశవ్యాప్తం గా ‘’బిటూమినస్ కోల్ సమ్మె ‘’లో పాల్గొన్నారు .యజమానులు చేతులెత్తేశారు జోన్స్ అక్కడ హుటాహుటిన వాలి సాయం చేసి పరిష్కారం సాధించింది .నూలు కార్మికులు ,స్టీల్ వర్కర్లు చేసిన సమ్మె లన్నిటికీ ఆమె మద్దతు ఉంది .ఆమె అంటే భయ పడిన ఆమెరికా లోని  చాలా టౌన్లు.ఆమె రాక ను నిషేధించాయి .ఎన్నో సార్లు జైలుకకెళ్ళింది అయినా ఆమెది చెక్కు చెదరని ఉక్కు గుండె .మొక్క వోని ధైర్యం .అన్ని సార్లు కారాగార శిక్ష అనుభవించిన లేబర్ నాయకులెవ్వరూ లేరు అదీ ఆమె ప్రత్యేకత .

             1912 లో వెస్ట్ వర్జీనియా లో హౌస్ అరెస్ట్ కు గురైంది .కొలరాడో లో ‘లాడ్లో’’’machine gun massacre ‘’ను విని ఆమె చలించి పోయింది .అక్కడ ఒక టెంట్ కాలని లో ఉన్న గనుల యజమానుల కుటుంబాలపై nationals guards men ‘’విరుచుకు పడి భీభత్సం సృష్టించారు .ఈ దాడిలో 20 మంది దారుణం గా చని పోయారు అందులో ఎక్కువ భాగం పిల్లలు మహిళలు ఈ సంఘటన ఆమె ను తీవ్రం గా కలచి వేసింది ఇలాంటివి పునరావృత్తం కారాదనే  ఆశయం తో ఆమె దేశమంతా పర్య టించి ఈ విషయాన్ని ప్రచారం చేసి అందరికి కనువిప్పు కలిగించింది అంతటి మానవతా వాది మదర్ జోన్స్ .ఆమె మాత్రు హృదయం సంక్షోభించింది .ఈ విషయాన్ని అమెరికా కాంగ్రెస్ సభలో వినిపించింది .

                     బాల కార్మిక విమోచన కృషి

      బాల కార్మికులతో పని చేయించి వారి ఆరోగ్యాన్ని చడగోడుతున్నారని, విద్యతో బంగారు బాటలో నడవాల్సిన వాళ్ళ జీవితాలు ఛిద్రమవుతున్నాయని జోన్స్ గ్రహించి వారి విముక్తికి కంకణం కట్టుకొంది ఫిలడెల్ఫియా లో ఒక లక్ష మంది సిల్క్ కార్మికులు పని గంటలు వారానికి 60 గంటల నుంచి 55గంటలకు తగ్గించమని  సమ్మె చేశారు అందులో 16 వేల మంది బాల కార్మికులే ఉండటం ఆశ్చర్య కరం .బాల కార్మికుల చేత పని చేయించ వద్దని పిల్లల చేత ఫిలడెల్ఫియా టెక్స్ టైల్ మిల్స్ నుంచి న్యూయార్క్ సిటి కి ప్రదర్శన నిర్వహించి నాయకత్వం వహించింది .ఆమె ఉద్దేశ్యం ‘’to show New York millionaires our grievances ‘’.ప్రెసిడెంట్ రూజ్ వెల్ట్ఉన్న లాంగ్ ఐలాండ్ ఇంటి వరకు ప్రదర్శన గా వారిని తీసుకొని వెళ్లి పరిస్తితి తీవ్రతను తెలియ జేసింది .

                                   జీవిత చరమాంకం

         80 ఏళ్ళ ముదివయసు లో వాషింగ్ టన్-డి.సి.లో స్తిర పడింది .అయినా అవసరమైనప్పుడు దేశ మంతా తిరిగి, కార్మికుల ఐక్యత కోసం, వారి సంక్షేమం కోసం ప్రచారం చేస్తూనే ఉంది 82 వ ఏట వెస్ట్ వర్జీనియా సమ్మె లో పాల్గొని కార్మికులను రెచ్చగొట్టింది అనే అభియోగం తో 20 ఏళ్ళు జైలు శిక్ష విధించారు .ఆమె అభిమానులు, మద్దతు దారులు భారీ ప్రదర్శనలు నిర్వహించి ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి ఆమెకుప్రభుత్వం  క్షమా భిక్ష పెట్టేట్టు ఒప్పించారు .అదీ జోన్స్ అంటే వారికున్న వీరాభిమానం తమ తల్లి జైలు పాలైతే ఆ కార్మిక సంతానం తట్టుకో లేక పోయింది .తమ కోసం ఆమె చేసిన త్యాగమే వారిని కార్యోన్ముఖులను చేసింది .అలుపెరుగని పోరాట యోద్దురాలని పించు కొంది.అధైర్య పడకుండా మళ్ళీ ఉద్యమాల లోకి ఉరికింది .1924 లో చేతి వ్రేళ్ళ మధ్య పెన్ను నిలుపు కొనే సత్తా లేకపోయినా చికాగో డ్రెస్ మేకర్స్ సమ్మెలో  ప్రత్యక్షం గా కనీ పించి వారిని చైతన్య వంతుల్ని చేసింది .వారిలో వందలాది మంది అరెస్ట్అయి  జైలు శిక్ష అనుభవించారు పాపం . సమ్మె నాలుగు నెలలు సాగింది ..అంతేకాక ‘’బ్లాక్ లిస్టు ‘’లో చేరి పోయారు .

         ఆమె 100 వ జన్మ దినాన్ని దేశ మంతా అత్యుత్సాహం గా,వేడుకగా, ఘనం గా  జరుపుకొన్నారు .ఆమె మాడిసన్ లోని సిల్వర్ స్ప్రింగ్స్ అనే చోట 1930 నవంబర్ 30 న తన 100 వ ఏట ‘’శతమానం భవతి’’ అని పించుకొని ధన్య జీవి గా  మరణించింది .ఆమె కోరిక ప్రకారం ఆమె శరీరాన్ని ఇలినాయిస్ లో ఆలివ్ లో ఉన్న ‘’కార్మికుల సేమిటరి‘’లో ఖననం చేశారు .’’folk hero ‘’అని పించుకొన్న మేరి హారిస్ జోన్స్ అంటే మదర్ జోన్స్ అమెరికా కార్మికులకే మాత కాదు ‘’విశ్వ కార్మిక మాత ‘’.

 

కృతజ్ఞతలు —మదర్ జోన్స్ గురించి రాయమని నన్ను ప్రోత్సహించి,నాతో  రాయించిన ఆప్తులు శ్రీ మైనేని గోపాల కృష్ణ (అమెరికా )గారికి సర్వదా కృతజ్ఞుడను .వారు చెప్పి ఉండక పోతే మదర్ జోన్స్ గురించి నేను చదివి ఉండే వాడిని కాదేమో ?

            మీ–  గబ్బిటదుర్గా ప్రసాద్ -9-3-13- ఉయ్యూరు

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

మన స్మరణీయ మహిళా మణులు

 మన స్మరణీయ మహిళా మణులు

మనదేశం లో మహిళా మణులేందరో ప్రత్యెక స్థానం పొంది ఉన్నారు రాజ్యాలేలిన ఝాన్సీ లక్ష్మీ బాయి ,చాంద్ బీబీ ,అందానికి కొత్తర్ధం చెప్పిన రాణి సంయుక్త ,ఒక సామ్రాజ్యానికే నాయకత్వాసం వహించిన కాకతీయ రాణి రుద్రమ దేవి ,చతుర రాజకీయం లో నిధి అని పించుకొన్న నాగమ్మ త్యాగానికి మరోపేరైన మగువ మాంచాల ,మహా భక్తీ సామ్రాజ్యమేలిన వెంగమాంబ ,కావ్యమే రాసి ఆ రామునికే అంకితమిచిన మొల్ల ,దేశ భాక్తి లో తన స్థానమేమిటో మహిళా సేవలో తన గమ్య మేమిటో తెలియ జెప్పిన దుర్గా బాయి ,మొదటి ఆధునిక కధానిక రాసి గురజాడ తో పోటీ పడిన అచ్చమాంబ అందరు అందరే .ఎవరికీ తీసిపోని వారే .సంగీతం లో ప్రపంచాది పత్యమే సాదించిన భారత రత్న సుబ్బు లక్ష్మి ,సేవే దైవం అని నిరూపించుకొన్న మదర్ తెరీసా భారత దేశ మహిళా ప్రధానిగా సమర్ధత ను చాటిన ఇందిరా గాంధి ,మొదటిమహిళా  గవర్నర్ ,స్త్రీ జాతి శిరోమణి కవితా కోయిల సరోజినీ నాయుడు ,ఇలా ఎందరెందరో ఆకాలం నుంచి ఈ కాలం వరకు ఖ్యాతి పొందారు దేశానికి కీర్తి  తెచ్చారు

              మనకు మహిళా శాస్త్ర వేత్తలు కూడా తక్కువ సంఖ్యలో ఏమీ లేరు తండ్రి రాసినా గణిత శాస్త్రమే తన పేర ఉన్న లీలావతి ,వేశ్యగా జీవించి బుద్ధుని శరణు వేడి ఆమ్రపాలి గా మారి జీవితాన్ని సేవ లో ధన్యం చేసుకొన్న ప్రజాపతి గౌతమి ,సంఘమిత్ర ,భక్తికే పరాకాష్టగా నిలచిన అవ్వయ్యార్ ,గోదాదేవి లను మనం నిత్యం స్మరిస్తాం .శాంతలాదేవి ,అక్కమహా దేవి మొదలైన రాజపుత్ర యుగపు స్త్రీ రాత్నాలున్నారు .మొఘల్ కాలం లో దుర్గా దేవి చాంద్ బీబీ ,నూర్జహాన్ ,ముంతాజ్ మహల్ ,శివాజీ తల్లి జిజియా బాయ్ ,జహానార ,లను స్మరిస్తే ధన్యులమవుతాం .

       షాజహాన్ భార్య ముంతాజ్ బంధువు నూర్ మహల్ అనే మహిళ మేధావి గా గుర్తింపు పొందింది .ఆమె సుగంధ పుష్పాల పరిశోధనలో ఆరి తేరిన నిపుణు రాలని పించు కొన్నది .ఆమెయే డిస్టిలేషన్ పద్ధతి లో పూల నుంచి సుగంధ తైలాలను తయారు చేసిందని మనం మర్చి పోయాం .జహంగీర్ భార్య మెహరున్నీసా అనే వితంతువు ను వివాహం చేసుకొన్నాడు ఈమె నే ‘’నూర్జహాన్ ‘’అంటారు ఈ మాటకు అర్ధం ‘’విశ్వ కాంతి ‘’.జహంగీర్ చని పోయిన తర్వాత షాజహాన్ పాలన లో ఈమె నిరాదరణకు గురైంది .గులాబీ అత్తరు ను తయారు చేయటం లో నూర్జహాన్ అనేక ప్రయోగాలు చేసింది .ఈమె 1645 లో మరణించింది .ఆమె పేర ‘’నూర్జహాన్ సెం ట్స్ ‘’వాడుక లో కి తెచ్చిన వారు దేవరపల్లి సత్యనారాయణ రావు .వారికి మనం కృతజ్ఞతలు చూపాలి

          మన రాష్ట్రానికి చెందినశ్రీమతి  చింతల సీతాదేవి వైద్య విద్యన అభ్యసించారు ఆ తర్వాత ఏం.డి.సాధించిF.I.M.S.Aపొందారు ఆంద్ర విశ్వ విద్యాలయం లో బయో కేమిస్ట్రి లో ఉద్యోగం లో చేరి క్రమం గా అనేక హోదాలకు ఎదిగి ఆంధ్రా మెడికల్ కాలేజి లో ప్రిన్సిపాల్ గా పదవీ విరమణ చేశారు .

 సీతాదేవి గొప్ప పరిశోధకు రాలు .రోగ నిర్ధారణా,జీవ రసాయన శాస్త్రాలలో విశేషం గా పరిశోధన చేసి అంతర్జాతీయం గా గుర్తింపు సాధించారు .యాభై కి పైగా పరిశోధనా పత్రాలను రాసి ప్రచురించారు .’’జర్నల్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ క్లినికల్ బయో కెమిస్త్స్ ఆఫ్ ఇండియా ‘’అనే పత్రిక సంపాదక వర్గం లో పరిశోధనా వ్యాసాలను ప్రచురించటం లో కృషి చేశారు

        1975 LO F.A.M.S లో ఫెలో షిప్ పొందారు ఇంటర్నేషనల్ మెడికల్ సైన్సు ఎకాడేమి లో ‘’ఫౌండర్ ఫెలో‘’గౌరవాన్ని దక్కించుకొన్నారు .అసోసియేషన్ ఆఫ్ క్లినికల్ బయో కేమిస్త్స్ ఆఫ్ ఇండియా వారి గౌరవ సభ్యత్వంఅందుకొన్నారు .ఇండియన్ అ సోసిఎషన్ ఆఫ్ ఫిజియాలజిస్త్స్ అండ్ ఫార్మకో లాజిస్త్స్ కు అధ్యక్షులైన అరుదైన గౌరవాన్ని పొందిన విదుషీ మణి సీతా దేవి .అసోసియేషన్ ఆఫ్ క్లినికల్ బయో కేమిస్త్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన నాల్గవ సదస్సు కు అధ్యక్ష త వహించి మార్గ దర్స్ధకత్వం చేశారు .

           పూర్వ విద్యార్ధిగా ఆంధ్రా మెడికల్ కాలేజి కి ఎన్నో సేవలందించారు పూర్వ విద్యార్ధుల చేత అపూర్వ సత్కారాన్ని పొందారు .త్రివేండ్రం మెడికల్ కాలేజి వారి సిల్వర్ జూబ్లీ ‘’ఆరేషన్ అవార్డ్ ‘’గ్రహీత గా ప్రతిభకు తగిన గౌరవం సాధించారు. రోగ నిర్ధారణ లోను జీవ రసాయన శాస్త్ర విషయాలలో విశేష పరి శోధనలు చేసిన న మహిళా శాస్త్ర వేత్త శ్రీ మతి చింతల సీతా దేవి మహిళా మాణిక్యం .

             మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ –8-3-13-ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మరుగుపడ్డ మాణిక్యం – కలల అలల ఫై – గబ్బిట కృష్ణ మోహన్

kalala alala pai -Pdf

కలల అలల ఫై…….. <== చూడండి

 

0001

0002
0003

Posted in రచనలు | Tagged | Leave a comment

మైసూరు వెళితే… మేల్కోటే వెళ్ళిరండి

మైసూరు వెళితే… మేల్కోటే వెళ్ళిరండి
– డా. నాగసూరి వేణుగోపాల్

 

ఒక కోటి అంటే ఒకటి అంకె పక్కన ఏడు సున్నాలు పెట్టాలి. అదే వేయి కోట్లు అన్నప్పుడు పది సున్నాలు పెట్టాలి. సంఖ్య పెరిగే కొద్దీ సున్నాల సంఖ్య పెరుగుతుంది. ఈ స్థాయిలో ఉన్న సంఖ్యలను సులువుగా పేర్కొనే పద్ధతి ఉంది. వెయ్యి కోట్లను ‘టెన్ టుది పవర్ ఆఫ్ టెన్’ అని గణితాత్మకంగా వ్యక్తీకరించవచ్చు. రామాయణంలో వాల్మీకి టెన్ టుది పవర్ ఆఫ్ సిక్స్‌టిటూ అని ఒకచోట పేర్కొంటారని ఈ మధ్య కవన శర్మ వివరించి చెప్పారు. ఒకటి పక్కన 62 సున్నాలు పెడితే వచ్చే సంఖ్య అన్నమాట.

ఇంత పెద్ద సంఖ్య ఎక్కడ ప్రస్తావనకు వచ్చింది? రావణుని గూఢచారి రాముని సైన్యంలోని సైనికులసంఖ్య చెబుతూ పేర్కొన్నారట. నిజానికి మొత్తం జనాభా అప్పటికి అంత లేకపోవచ్చు. అప్పటికే కాదు ఇప్పటికీ లేకపోవచ్చు. అది కూడా వనవాసంలో ఉన్న కథానాయకుడు శత్రు రాజ్యం మీద దండయాత్ర చేసినపుడు ఈ స్థాయిలో ఎక్కువ చేసి చెప్పడం కవి భావుకతకు పరాకాష్ఠ! వాస్తవానికి పూర్తిగా విరుద్ధం.

ఇం దులో ఎవరికీ అభ్యంతరం లేదు. కానీఇక్కడ గమనించాల్సింది ఏమంటే ‘టుది పవర్ ఆఫ్’ అన్న భావన వాల్మీకి(లేదా రామాయణం రాసిన రచయిత)కి తెలిసి ఉందని మనం భావించక తప్పదు. రామాయణం కాలంతో సంబంధం లేకుండా ఆ రచయిత పరిజ్ఞానాన్ని మనం గుర్తించక తప్పదు! ఆర్యభటుడు, వరాహమిహిరుడు, భాస్కరుడు, చరకుడు, సుశృతుడు వంటివారి మేధస్సునూ, నైపుణ్యాన్నీ మనం గౌరవించక తప్పదు.

మేల్కోటే చిన్న గుట్టమీద ఉండే రెండు భవనాల ముందు ఆగి, దిగి లోపలకు పోగానే ‘ఏవియేషన్ సైన్స్ ఇన్ ఏన్సియంట్ ఇండియా’ – అనే పోస్టర్ కనబడింది. ఈ ధీమ్ మీద జరిగిన సైన్స్ వర్క్‌షాప్ వివరాలు తెలియజేస్తూ గోడ మీద పలకరిస్తోంది ఆ పోస్టర్. లోపలికి పోగానే ‘సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ఇండియా త్రూది ఏజస్’ అనే పుస్తకం తాలూకు వివరాలు ఆకర్షిస్తున్నాయి. ఇంతకూ నేను వెళ్ళింది ఎక్కడో మీకు చెప్పలేదు కదా! అకాడమీ ఆఫ్ సాన్స్‌క్రిట్ రీసెర్చి భవనం లోపల ఉన్నాను.

మైసూరుకు యాభై కిలోమీటర్ల దూరంలో ఈ చిన్న గ్రామముంది. ఇంకా చెప్పాలంటే టిప్పు సుల్తాన్ శ్రీరంగపట్నం, బృందావన్ గార్డెన్స్ దాటుకుని వెళితే జక్కనహళ్ళి వస్తుంది. అవును అమర శిల్పి జక్కన ఊరే! ఈ ఊరికి ఐదారు కిలోమీటర్ల దూరంలో మేల్కోటే ఉంది. చాలా మందికి మేల్కోటే అంటే 12వ శతాబద్దపు చెలువ రాయుని దేవాలయం. యువ తరానికయితే ‘నరసింహ’ సినిమాలో రెండు పెద్ద స్తంభాల మధ్య రజనీకాంత్ కూర్చొన్న దృశ్యం చిత్రీకరించిన స్థలం. తెలుగు టీవీ, సినిమా ప్రేక్షకులకు అయితే మేల్కోటే ఒక నటుడు. కానీ తెలిసిన వారికి ఇది దక్షిణాది బద్రినాథ్.

ఒక వెయ్యి సంవత్సరాలుగా అక్కడ సంస్కృతం గొప్పగా వెల్లివిరిసిన ఊరు. ఆ ఊరిలో ప్రతి కుటుంబం సంస్కృతం మాట్లాడగలిగిన ఊరుగా గౌరవం ఉంది. ఇటీవలి కాలం పరిస్థితి కొంత మారింది. అంతకు మించి జ్ఞాన మండపంగా పిలువబడే ఆ ఊరిలో ప్రతి కుటుంబం చేసే పని చెలువ రాయుని దేవాలయానికి తోడ్పడే రీతిలో రూపొందించి ఉండటం మరింత ఆసక్తికరం. విశిష్టాద్వైతాన్ని ప్రతిపాదించిన రామానుజుల వారు తన జీవిత చరమాంకంలో ఒక పదునాలుగేళ్ళు ఇక్కడ నివాసం ఏర్పరచుకోవడం ఈ ప్రత్యేకతలకు కారణం.

ఆ ఊరిలోకి వెళ్ళి అకాడమీ ఎక్కడ అని అడిగితే మాకు తెలియదని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. మూడు రోజుల క్రితం వారి వెబ్‌సైట్ సంప్రదిస్తే విజిటర్ నెంబరు 44 అని కనబడింది. ప్రపంచంలో అంత తక్కువ మందికి తెలిసిన సంస్థ గురించి మనకెలా తెలిసింది! మైసూరు ప్యాలెస్, మైసూరు సిల్క్, చండిహిల్స్ చూడకుండా మేల్కోటే వెళ్ళమని ఎవరు చెప్పారు? మాకెలా తెల్సింది? – అని మీకనిపిస్తూ ఉంటుంది. నిజమే! గీక్ నేషన్… సరిగానే ఉంది గ్రీక్ నేషన్ కాదు గీక్ నేషన్ … అది ఓ పుస్తకం పేరు. అంజల సైని రచయిత్రి.

భారతదేశపు భవిష్యత్తు – ముఖ్యంగా శాస్త్ర సాంకేతిక రంగాల సామర్థ్యం పట్ల గొప్పగా వివరించే పుస్తకమిది. బ్రిటన్‌కు చెందిన మహిళా జర్నలిస్టు భారతదేశంలో కొన్ని ప్రాంతాలు తిరిగి, అధ్యయనం చేసి ఈ పుస్తకం వెలువరించారు. శాస్త్ర సాంకేతిక రంగాలకు రెండు శాతం జీడీపీ కేటాయింపులున్నాయని ప్రధాని కొన్ని సంవత్సరాల క్రితం ప్రకటించగానే మిగతా ప్రపంచానికి ఆసక్తి కలిగింది. మనకా విషయం తెలిసే లోపు ఆయా దేశాల్లో మన దేశం గురించి ఆసక్తి పెరిగింది.

అంజల సైని రాసిన గీక్ నేషన్ విడుదలవగానే చైనా భాషలోకి అనువాదమైంది. ఎందుకంటే భారతదేశం మీద చైనాకు ఆసక్తి ఆ స్థాయిలో ఉంది కనుక. సరే ఈ పుస్తకం చదవడం, ఈ రచయిత్రి భవదీయ సైన్స్ కాలమిస్ట్ ఒక దినపత్రిక ఇంటర్వ్యూ కోసం హైదరాబాదులో కలవడం కూడా జరిగింది. ఆ పుస్తకంలో రాకెట్ పరిశోధనా స్థానాలు, ఐఐటి, ఐఐఎస్‌సి వంటి సంస్థలను సందర్శించినట్లు రచయిత్రి ట్రావెలోగ్ లాగా వివరించారు. అందులో భాగంగా సైని మైసూర్ దగ్గరుండే అకాడమీ ఆఫ్ సాన్స్‌క్రిట్ రీసెర్చికి వెళ్ళి భారతదేశం గతంలో సాధించిన సైన్స్ విజయాలను గొప్పగా ప్రస్తుతిస్తారు. ఫలితంగా నాకూ మేల్కోటే సంస్కృత పరిశోధనా అకాడమీ చూడలనే కోరిక కలిగింది.

1976 నుంచి నడుస్తున్న ఈ సంస్థ ప్రాచీన తాళపత్ర గ్రంథాలు సేకరించి, పరిష్కరించి, పుస్తకాలు కన్నడ, ఆంగ్ల, సంస్కృత భాషల్లో వెలువరిస్తోంది. అగ్రికల్చరల్ సైన్స్ అంటే టెక్నాలజీ ఇన్ ఏన్సియంట్ ఇండియా అనే పెద్ద ప్రాజెక్టు నడుస్తోంది. హైదరాబాదు యూనివర్సిటీ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీ (సిమ్లా) వంటి సంస్థలతో కలిసి పరిశోధన చేస్తోంది. గతం గురించి మనం కొంత ఉదారతతో, కించిత్ ఆత్మగౌరవంతో శోధించాలనిపించింది. వర్తమానం ద్వారా గతానికీ, భవిష్యత్తుకూ లంకె వేయాలనే ఈ సంస్థ ఉద్దేశ్యం విభేదించేదిగా కనబడటం లేదు. మీరు మైసూరు వెళితే మేల్కోటే వెళ్ళిరండి.. చాలు!

– డా. నాగసూరి వేణుగోపాల్

 

Posted in సేకరణలు | Tagged | 1 Comment

జ్ఞానదుడు మహర్షి నారదుడు -7

జ్ఞానదుడు మహర్షి నారదుడు -7

 వ్యాసుని సందేహం తీర్చి ఇంకా ఇలా అంటున్నాడు మహర్షి నారదుడు ‘’తీర్ధ పాదుడైన దేవుండు విష్ణుండు –దన చరిత్ర మేన దవిలి పాడ-జీరబడ్డ వాని చెలువున నే తెంచి –ఘనుడు నా మనమున గాన వచ్చు ‘’

   అంతే కాదు –‘’వినుమీ సంసారంబను –వననిధి లో మునిగి కర్మ వాంఛల చే వేదన బొందెడు వానికి –విష్ణు గుణ వర్ణనము తెప్ప సుమ్ము మునీంద్రా ‘’అని భక్తి తోనే అన్నీ సాధించగలం అన్న విశ్వాసాన్ని కలిగించి వెళ్ళాడు .

                 బ్రహ్మ దేవుని ద్వారా ప్రపంచ ప్రకారం తెలుపుట

        భాగవత ద్వితీయ స్కంధం లో జనమేజయ మహా రాజు శుక యోగీన్ద్రుని –అసలు సృష్టి ఎలా జరిగిందో వివరించమని అడుగుతాడు .అప్పుడు నారదుడు ఇదే ప్రశ్న ను బ్రహ్మ దేవుని అడుగుతాడు .అయన చెప్పిన సమాధానమే తాను జనమేజయునికి చెబుతానని వినమని చెప్పాడు .

‘’ప్రారంభాది వివేక మెవ్వ డోసగుం –బ్రారంభ సంపత్తి కాధారం బెయ్యది ?-ఏమి హేతువు యదార్ధంబే స్వరూపంబు–సంసారానుక్రమ మూర్ణ నాభి పగిదిన్ సాగించే దోక్కప్పుడుం –భారం బెన్నడునీమనువు దుష్ప్రాపంబు వాణీశ్వారా ‘’అని తండ్రి అయిన బ్రహ్మ దేవుని కొడుకు నారదుడు ప్రశ్నించాడు .’’

   ‘’నువ్వే రాజువి అని నేను అనుకొంటున్నాను నీకంటే ఘనుడు ఉన్నాడా ?ఏ లాభం తో ఈ సృష్టి చేశావు ?ఎక్కడ ఈ చేతన అంతా జన్మిస్తుంది ,నిలిచి ఉంటుంది ,అంతమవుతుంది ?వివరించు అంతే కాదు నీపైన కూడా ఈశుడు అనే వాడుంటే ,ఆతని వివరణ కూడా చెప్పు .నాకు ఈ వివరాలన్నీ తెలిస్తే మిగిలిన వారందరికీ యదార్ధం వివరించి చెప్పగలను‘’అని సవినయం గా అడిగాడు .బ్రహ్మ చాలా సంతోషించి ‘’పూర్వం నుండి ఎవరూ ఇలా నన్ను అడిగిన వారు లేరు .’’నా విభుని మర్మ మడిగితి వి –వత్సా ‘’అని పొంగిపోయాడు సృష్టికర్త .,అయిన వాణీ నాధుడు .సవివరం గా తెలుపుతానని హామీ ఇచ్చి వివరించాడు నారద మహర్షికి

      ‘’నేను ఇంత సృష్టి ని చేయగలనా ?ఇదంతా శ్రీహరి మాయ .అతడే మనందరికీ ఈశ్వరుడు .

‘’ఆ ఈశుడు అనంతుడు హరి –నాయకుడే భువనములకు నాకున్ ,నీకున్

 మాయకు ,బ్రాణివ్రాతము –కీయెడలన్ లేద ఈశ్వరేతరము సుతా ‘’

 ‘’భువనాత్మకు డాఈశుడు –భవనాక్రుతి తోడ నుండు బ్రహ్మాన్డంబున్

   వివరముతో ,బదునాలుగు –వివరంబులు గా నోనర్చే విశాడంబుగన్ ‘’

‘’పరమాత్ముండజు డే జగంబు బ్రతి కల్పంబందు గల్పించు ,దా

బరి రక్షించును ,ద్రుంచు ,నట్టి యనఘున్ ,బ్రహ్మాత్ము ,నిత్యున్ ,జగ

ద్భరితుం ,గేవలు నద్వితీయుని ,విశుద్ధ జ్ఞాను ,సర్వాత్ము ,నీ

శ్వరు ,నాద్యంత విహీను ,నిర్గుణుని ,శశ్వ న్మూర్తి జింతించెదన్ ‘’

అని ఈశ్వర తత్వాన్ని స్పష్టం గా కమ్మగా వర్ణించాడు భక్తి ప్రపత్తులతో .అంతేకాదు –ఎంత వారి కైనా అజ్ఞానం లో ఉంటె ఈశ్వర దర్శనం కాదు .అన్న పరమ సత్యాన్ని ఎరుక పరచాడు  

 .నారదుని జీవితం లో ఇది అనేక సార్లు అనుభవమయిన పరమ సత్యమే

 ‘’సరసగతిన్ ,మునీంద్రులు ప్రసన్న శరీర హృషీక మానస

 స్ఫురణ గలప్పు డవ్విభుని ,భూరి కళా కలిత స్వరూపముం

 దర మిడిచూతురేప్పుడు ,గుతర్క తమోహతి చేత ,నజ్ఞతం

  బొరసిన యప్పుడవ్విభుని మూర్తి గనుంగొన లేరు నారదా “”

   అని మొదలు పెట్టి నారాయణ ,దశావతారాలన్నీ వివరించి చెప్పాడు ఈ విధం గా గడుసుగా నారదుడు అసలు సృష్టి కర్త చేతనే ఆ సృష్టికి ఆద్యుడు అయిన పరమాత్మ విశేషాలను  ,జగదుత్పత్తిని , ,అవతారాల పరంపరా అన్నీ అడిగి చెప్పించుకొని మనకు తెలియ జేసిన మొదటి శ్రోత నారద సంయమీన్ద్రుడు .

            సశేషం

          మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –8-3-13-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

మధురవాణి ‘ఝాన్సీ’

మధురవాణి ‘ఝాన్సీ’


‘సెంచరీ’ తరువాత?…
‘డబుల్’కు రెడీ కావడమే అనుకుంటాం!
కానీ ఝాన్సీ మాత్రం ‘నూరో’ ఎపిసోడ్‌కే చేరుకోలేదు..
ఆ తరువాత ఏమైంది?…
‘నూటొక్క’ ఏళ్ల మధురవాణిగా రంగస్థలంపై మెరిసింది..
మహిళా నిర్ణయాధికారం మీద ‘ఆల్ ఐ వాంట్ ఈజ్ ఎవ్విరి థింగ్ ‘ అనే సినిమాను నిర్మించే స్థాయికి ఎదిగింది.
‘నూటొక్క’ మహిళా దినోత్సవం నాడు ఆ అనుభవాలను మనతో పంచుకుంటున్నారు…

మలచిన ఆ మాట!: ఒకప్పుడు ఏడు రోజులు, మూడు రోజులు వేసే కన్యాశుల్కం నాటకాన్ని ఇప్పుడు మూడుగంటలకు కుదించారు. ఆ తరువాత మేము వే యాలనుకున్నప్పుడు దీక్షిత్ మాస్టారు మరికొంత సౌకర్యం కోసం రెండు గంటలకు కుదించారు. ఈ నాటకాన్ని మా సంతృప్తి కోసమే వేసినా, సినిమా వాళ్లు వేయడం ద్వారా నాటకానికి కొత్త తరం ప్రేక్షకుల్ని తీసుకురావచ్చు అన్న ఒక చిన్న ఆలోచన కూడా దాని వెనుక ఉంది. ఒక దశలో నేనూ, గిరీశం పాత్ర పోషించిన ఉత్తేజ్ ఇద్దరమే నాటకానికి సంబంధించి మొత్తం బాధ్యతల్ని భుజాన వేసుకుని మోయాల్సి వచ్చింది. వాస్తవానికి రంగస్థలం మీద నటించడం నాకు ఇదే తొలిసారి.

మేము కన్యాశుల్కం వేద్దామనుకున్నప్పుడు పరోక్షంగా కొందరు వీళ్లకు నాటకం గురించి ఏం తెలుసు? అన్న వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల్ని నేనొక చాలెంజ్‌గానే తీసుకున్నాను. రిహార్సల్స్ అన్నీ అయిపోయాయి. ప్రదర్శన రోజు రానే వచ్చింది. ప్రదర్శన ఇంకో నాలుగు గంటలు ఉందనగా ఇందులో వెంకమ్మ పాత్ర వేస్తున్న సీనియర్ రంగస్థల నటి హైమావతి గారు నావద్దకు వచ్చి నా చేతుల్ని ఊపుతూ ” అమ్మడూ…! నువ్వు చాలా బాగా చే స్తున్నావ్. కానీ, మధురవాణిలో ఝాన్సీ కనబడుతోంది నాకు . నీ హుందాతనం, నీ ఇంటలెక్చువల్ ఇమేజ్ ఏవైతే ఉన్నాయో అవి దీనికి అక్కర్లా.

మధురవాణి ఇంటెలెక్చువలే కానీ, రామప్పపంతులో, లుబ్దావధానులో, గిరీశమో మధురవాణి వెంట పడింది అందుక్కాదు కదా! దానికో శృంగార కోణం ఉంది కదా. నీ అభినయంలో అది కాస్త కలుపుకో” అన్నారు. ఆ మాటలు వినగానే ఎంత సత్యమిదీ అనిపించింది. నిజానికి అన్ని రోజులు రిహార్సల్స్ ఫలితం ఒక ఎత్తయితే, ప్రదర్శనకు కేవలం నాలుగు గంటల ముందు హైమావతి గారి సూచనతో వచ్చిన ఫలితం ఒక ఎత్తు. ఆమె సలహాతో ఆ పాత్ర పోషణలో ఒక అద్భుతమైన తేడా వచ్చింది. మన వ్యక్తిత్వానికి సంబంధించిన అంశాలు ఒక్కోసారి పాత్రల మీద పడి వాటి సహజాతాలను ఎలా దెబ్బ తీస్తాయో ఆమె మాటల్లో నాకు చాలా స్పష్టంగా తెలిసి వచ్చింది.

ఒక్క అడుగుతో ఇక శిఖరాన్ని అందుకుంటామనుకుంటున్న సమయంలో ఏదో అవాంతరం వచ్చి, హఠాత్తుగా ఆగిపోవడం నా అనుభవంలో ఎన్నో సార్లు చూశాను. ‘డాన్స్ బేబీ డాన్స్’ షో 99 ఎపిసోడ్స్ నేను నిర్వహించాక 100 వ ఎపిసోడ్‌లో నేను లేను. నన్ను ఎప్పుడు మార్చారో, ఎందుకు మార్చారో నాకు తెలియదు. నేను లేకుండానే ఆ సెలబ్రేషన్ జరిగిపోయింది. పోస్ట్‌బాక్స్…..అనే మరో ప్రోగ్రాం విషయంలోనూ అదే జరిగింది. 25 ఎపిసోడ్లు చేయడమే ఎంతో గొప్ప అనుకునే ఆ రోజుల్లో 24 ఎపిసోడ్స్‌లు నేను నిర్వహిస్తే ఆ 25వ ఎపిసోడ్‌కు నేను లేను. నన్ను తొలగించారు. దంపతుల నుంచి సహజీవన అనుభవాల్ని, వారి బంధాన్ని నిలబెడుతున్న అంశాలను వస్తున్న సత్యాల్ని ఆవిష్కరించే ‘పెళ్లి పుస్తకం’ కార్యక్రమం విషయంలోనూ అలాగే జరిగింది. కొన్ని ఎపిసోడ్ల తరువాత ఆ కార్యక్రమం ఎంతో ఆదరణ పొందుతున్న సమయంలో నేను వైదొలగాల్సి వచ్చింది.

అవరోధం మరో ఆరంభానికే
కెరీర్ ప్రారంభంలో ఈ పరిణామాలేమిటో అర్థం కాక చాలా ఆవేదనకు గురయ్యే దాన్ని. కానీ, ఆ తరువాత ప్రోగ్రాం అగిపోయిన ప్రతిసారీ అంతకన్నా మెరుగైన అవకాశమేదో నాకు వచ్చి పడటం నేను గమనించాను. అందుకే ఏదైనా చేజారిపోయినప్పుడు ఎంత మాత్రం బాధపడని స్థితికి చేరుకున్నాను. పైగా ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు నాలోకి నేను ముడుచుకుపోవడం కాకుండా సమస్యను ఆవలివైపు నుంచి పరిశీలించడం నేర్చుకున్నాను. దానివల్ల భావోద్వేగాలకు లోనుకాకుండా, వాస్తవాల్ని గమనించే శక్తి అబ్బి, నిబ్బరంగా ఉండ అలవాటయ్యింది.


బ్యాలెన్స్ చెయ్యకపోతే…
కొంత కాలం పాటు నేను ‘నవీన’, ‘ చేతన ‘ వంటి ఇంటలెక్చువల్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండిపోయాను. ఇవి నాకు ఒక కొత్త ఇమేజ్ ఇచ్చాయి. వాటికి పిఆర్‌పి ఉన్నా లేకపోయినా ఆత్మ సంతృప్తిని ఇచ్చాయి. కాకపోతే, అవి మెల్లమెల్లగా నన్ను వినోదాత్మక కార్యక్రమాల నుంచి దూరం చేశాయి. ఈ పరిణామాలు ఒక దశలో ఝాన్సీ వినోదాత్మకంగా ఏమీ చేయలేదు అన్న అభిప్రాయాన్ని చాలామందిలో కలిగిస్తూ వచ్చాయి. అంతకు ముందు నేను వినోదాత్మక షోలు ఎన్ని చేసినా, ఎన్నో సూపర్ సక్సెస్‌లు ఇచ్చినా అవేవీ పరిగణనలోకి రాకుండా పోయాయి. ఆ స్థితిని ఛేదించడం నిజంగా నాకో పెద్ద సమస్య అయిపోయింది. నేనుగా ప్రయత్నించినా ఏ ఒక్క అవకాశమూ రాలేదు.

ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవటం వల్ల ఏం జరుగుతుందో ఆ మూడే ళ్ల పరిణామాలతో నాకు బాగా తెలిసొచ్చింది. అయితే 2011 డిసెంబర్ మాసంలో ఒక భార్యాభర్తల జంట మా ఇంటికి వచ్చి. “మీతో ఒక ఎంటర్‌టైన్‌మెంట్ షో చేయాలనుకుంటున్నాం” అన్నారు. నేను వెంటనే అంగీకారం తెలిపాను. కాకపోతే, వాళ్లు చెప్పిన లక్కు-కిక్కు అనే ఆ కాన్సెప్ట్ అతి మామూలుగా ఉంది. అయినా ఆ ప్రాజెక్టుకు ఒప్పేసుకుని వర్క్ చేయడం మొదలెట్టాను. అది ఆ తర్వాత చేసిన ‘కో అంటే కోటి’ రెండూ సక్సెక్ అయ్యాయి. మనసుకు నచ్చిన వాటి ప్రవాహంలో పడిపోతే ఒక్కోసారి మన ఉనికికే ప్రమాదం వాటిల్లుతుందని ఆ అనుభవం నాకు నేర్పింది.

అవి మానవ హక్కులే
నా ఉద్దేశంలో పురుషాధిక్యతా ధోరణి ఇప్పటికీ ఏమీ బలహీనపడలేదు కాకపోతే వేరే కోణాల్లో కనిపిస్తోంది. ఇప్పుడు ఆడపిల్ల బయటికి వచ్చి పనిచేస్తుంటే, ఏయ్ ఆడపిల్లవు బయటికి ఎందుకు వచ్చావు? అన్నమాటయితే అనరు. అలాగే నీకు చదువులెందుకమ్మా! అని నేరుగా ఎవరూ అనరు. కానీ అది లోపల ఎక్కడో ఉండిపోతుంది. అవకాశాలు ఇచ్చే దగ్గరో, ప్రమోషన్లు ఇచ్చేద గ్గరో, వేతనాలు మాట్లాడే దగ్గరో అది పనిచేస్తూ ఉంటుంది. పైగా అవన్నీ సంస్థాగతం అయిపోయాయి ఒకప్పుడు వ్యక్తిగతంగా ఉన్న భావజాలం ఇప్పుడు సంస్థాగతం అయిపోయింది.

ఆడపిల్ల అయితే తక్కువ వేతనం ఇచ్చుకోవచ్చు. ఎక్కువ గంటలు పనిచేస్తారు. ప్రమోషన్లు ఇవ్వకపోయినా గట్టిగా అడగరు. ఈ నాటికైనా ఎంత మంది మహిళలు ఉన్నతాధికారులుగా ఉన్నారు. ఎన్ని బోర్డులలో మహిళలు ఎంత శాతం డైరెక్టర్లు ఉన్నారు? ఎంత మంది సిఇఓలుగా ఉన్నారు? మహిళలు ఆ స్థాయికి రావడానికి ఇప్పటికీ సమాజంలో అనుకూలించే పరిస్థితులు లేవు. ఇప్పటిదాకా మనం బయటికి కనిపిస్తున్న వాటి మీద పోరాటం చేశాం. ఇకనుంచి అంతరంగాన్ని టార్గెట్‌చేసి పోరాటం చేయాల్సి ఉంది.

లోపలున్న ఆలోచనను మార్చాల్సి ఉంది. ఈ అంశాన్నే మేము తీసిన ‘ఆల్ ఐ వాంట్ ఈజ్ ఎవ్విరీ థింగ్ ‘అనే మా ఫీచర్ ఫిల్మ్‌లో కూడా చూపే ప్రయత్నం చేశాం. ఈ నూరేళ్ల మహోద్యమాలు పోరాడి తెచ్చుకున్న చట్టాలెన్నో ఉన్నాయి. కాకపోతే తెచ్చుకున్న ఆ చట్టాలు ఉపయోగపడకుండా చేస్తున్న భావజాలం ఒకటుంది. దానిమీద కూడా పోరాటం చేయాల్సి ఉంది, నేను ఫెమినిస్టును ఏమీ కాదు. హ్యూమనిస్టునంతే.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్ళు చివరి రోజు

DSCF2828 DSCF2824 DSCF2825 DSCF2826 DSCF2827

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

విమర్శకులు కావాలి – విమర్శకులు

kara mastaaru -1kara mastaaru -2kara mastaaru -3kara mastaaru -4a

Posted in పుస్తకాలు | Leave a comment

మంజూష నవలా సమాహారం – ఆవిష్కరణ – మచిలీపట్టణం

manjoosha

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

జ్ఞానదుడు మహర్షి నారదుడు -6 వ్యాసునికి కర్తవ్య బోధ

    జ్ఞానదుడు మహర్షి నారదుడు -6

          వ్యాసునికి కర్తవ్య బోధ

వ్యాస భట్టారకుడు వేద విభజన చేశాడు .వేదాంత రచనా పూర్తీ చేశాడు .అష్టాదశ పురాణాలు ,బ్రహ్మ సూత్రాలు రచించాడు .పంచమ వేదమైన మహా భారతాన్నీ రాసి ,ఐతిహాసికత ను సాధించాడు .అయినా మహర్షి మనసు వ్యాకులం గానే ఉంది .’’హరికి యోగి వరుల కభిలషితంబైన భాగవతంబు బలుక నైతి ,మోసమయ్యే దెలివి ,మొనయాడు మరచితి‘’అని చింతిస్తున్న సమయం లో నారద మహర్షియే కదా జ్ఞాన ప్రదాతా మార్గదర్శి వెంటనే ప్రత్యక్షమయ్యాడు .ఆయన మూర్తి మత్వాన్ని పోతన గారు అద్భుతం గా వర్ణించి కళ్ళకు కట్టి నట్లు చూపించాడు .

‘’తన చేతి వల్లకీ తంత్రీ చయంబున ,సతత నారాయణ శబ్దమొప్ప

  నానన సంభూత హరి గీత ,రవ సుధా ధారల యోగీంద్ర తతులు సోక్క

  కపిల జటా భార కాంతిపుంజంబుల దిశలు ప్రభాత దీధితి వహింప

  దనులగ్న తులసికా దామ గంధంబులు గగనాంత రాళంబు గప్పి కొనగ

  వచ్చే మింత నుండి వాసవీ నందను –కడకుమాటలాడ గడక తోడ

  భద్ర విమల కీర్తి పారగుడారూఢ-నాయన విశారదుండు నారదుండు ‘’

         వచ్చిన నారదుడి ని ‘’వినయైక విలాస ,నిగమ విభజన విద్యా జనితోల్లాసున్ భవ దుఃఖ నిరాసున్ గురు మనో వికాసుడు ‘’అయిన వ్యాసుడు సాదరం గా ఆహ్వానించాడు .విషయం తెలుసుకోవాలని ‘’విపంచి ‘’మీటుతూ నవ్వు ముఖం తో అడిగాడు .

’’దాతవు ,భారత శృతి విధాతవు ,వేద పదార్ధ జాల ,వి

 జ్ఞాతవు ,కామ ముఖ్య రిపు షట్కవిజేతవు ,బ్రహ్మ తత్వ ని

 ర్నేతవు ,యోగి నేతవు ,వినీతుడవీవు ,చలించి ,చెల్లరే ‘

కాతురు కైవడిన్ ,వగవ ,గారణ మేమి బరాశారాత్మజా ?’’అని ప్రశ్నిస్తే

 ‘’అజు తనూజుడివి ,పురాణ పురుష భవనము పదములు మెట్టిన వాడివి మహా ప్రబధాలన్నీ తుద ముట్టావు .త్రిలోక సంచారివి సర్వజ్నుడివి ,నీకు తెలియని ధర్మం ఉండదు .నాయీ కొరతకు ధర్మోపదేశం చేయి మహాత్మా ‘’అని బావురు మన్నాడు వ్యాసర్షి .అప్పుడు నారద సంయమీన్ద్రుడు

‘’అంచిత మైన ధర్మ చయమంతయు జెప్పితి ,వందులోన నిం

 చించుక గాని విష్ణు కధ లేర్పడ జెప్పవు ,ధర్మముల్ ,ప్రపం

 చించిన మెచ్చునే మగున విశేష లేన్నిన గాక ,నీకునీ

కొంచెము వచ్చు టేల్ల ,హరిగోరి ,నుతింపమి నార్య పూజితా ?’’అంటూనే శ్రీ హరి నామ స్మరణ లేని కావ్యం యోగ్య మైనడి కాదు అని  తెలియ జేస్తాడు .

‘’హరి నామ స్తుతి సేయు కావ్యము ,సువర్నామ్భోజ హంసావళీ

  సురుచి భ్రాజిత మైన మానస సరస్పూర్తిన్ వెలుగొందు ,శ్రీ

 హరి నామ స్తుతి లేని కావ్యము ,విచిత్రార్దాన్వితమయ్యు ,శ్రీ

 కరమై యుండద యోగ్య దుర్మలిన వత్కాకోల గర్తాక్రుతిన్ ‘’

  నిరుపాధిక మైన జ్ఞాన మైనా హరి భక్తి లేక పోతే విశేషం గా శోభించదు .ఫలం కోరకుండా ఈశ్వరునికి సమర్పణ చేయక పోతేప్రాస్త్యం కాదు .భక్తీ హీన జ్ఞాన ,వాచా కర్మ కౌశాలాలన్నీ నిరర్ధకం .కనుక యదార్ధ దర్శనుడవు ,సత్య రాతుడవు ,ద్రుత వ్రతుడవు కనుక వాసు దేవు లీలా విశేషాలు భక్తితో వర్ణించు ‘’అని విష్ణు మహిమ వర్ణించి కర్తవ్య బోధ చేస్తాడు మహర్షి నారదుడు వ్యాస మహర్షికి

  ‘’వినుతి సేయుమీవు ,వినికి యు,జదువును –దాన మతుల  నయము ,దాపము ద్రుతియు

    గలిమి లెల్ల ఫలము గాదె పుణ్య శ్లోకు –గమల నాదు బొగడ గలిగే నేని ‘’అని చెప్పి తన పూర్వ వృత్తాంతాన్ని అంతటిని వివరిస్తాడు .తాను దాసికొడుకు గా పుట్టి విష్ణుసాయుజ్యాన్ని పొందటం కోసం ఎలా ప్రయత్నించాడో వివరించాడు .

  సశేషం

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –7-3-13- ఉయ్యూరు

  

 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

నీలంరాజు జీవితంలో..

నీలంరాజు జీవితంలో..


పదిహేనేళ్ల వయసులోనే గాంధీ పిలుపుకు స్పందించి విద్యాలయాల బహిష్కరణ చేసిన దేశభక్తుడు నీలంరాజు వేంకట శేషయ్య. తరువాతి కాలంలో ఆయన ప్రకాశం పంతులుగారికి ప్రైవేట్ సెక్రటరీగా పని చేశారు. అతి పిన్న వయసులోనే పాత్రికేయ వృత్తిలోకి ప్రవేశించి ‘స్వరాజ్య’, ‘ఆంధ్రపత్రిక’లలో పని చేసి తర్వాత సొంత వార పత్రిక ‘నవోదయ’ను స్థాపించారు. చాలాకాలం పాటు ‘ఆంధ్రప్రభ’ డైలీకి సంపాదకునిగా కూడా నీలంరాజు వేంకట శేషయ్య వ్యవహరించారు. ఆయన గురించిన విశేషాలను, అనుభవాలను కుమారుడు నీలంరాజు లక్ష్మీ ప్రసాద్ ‘నీలంరాజు వేంకట శేషయ్య జీవితం’ అనే పుస్తకంగా వెలువరించారు. అందులోని కొన్ని ఆసక్తికర భాగాలు ఇక్కడ ఇస్తున్నాం…

” శ్రీశ్రీ రాతలో ఎంతటి ‘ఇమేజరీ’ ప్రవేశపెట్టి రాసేవాడో, మాట్లాడేటప్పుడు అంత నెమ్మదిగా, ఆవేశం లేకుండా సింపుల్‌గా మాట్లాడేవాడు. చమత్కారాలు వాడుతూ సంతోషిస్తూండే వాడు. ఎడం చేత్తో కారమ్స్ ఆడేవాడు. మీరు ఈ చేత్తోనే ఆడుతుంటారా? అని నేను అడిగినప్పుడు “ఔను, నేను లెఫ్టిస్టుని” అన్నాడు.” 

‘నవోదయ’ పత్రిక ప్రముఖ రచయితలనందరినీ ఆకర్షించేది. అందులో శ్రీశ్రీ ‘వారం వారం’ అనే శీర్షిక రాస్తుండేవారు. నెలకు ముప్ఫైరూపాయలు ఇచ్చేవాళ్లం. మా తాహతు అంతే. శేషయ్యగారికున్న వనరుల దృష్ట్యా శ్రీశ్రీ అంతకన్నా ఆశించేవాడు కూడా కాదు (ఆయనకు ‘అవసరమైతే’ ఎంతైనా ఉంటుంది) ‘ఢంకా’ అనే నెలసరి పత్రిక నడిపే ఢంకాచార్యులు గారు -(ఆయనకు ఒక చేయి ఉండేది కాదు -ఎప్పుడూ ఖద్దరు శాలువా కప్పుకొని ఉండేవాడు) శ్రీశ్రీ కనిపిస్తే “శ్రీశ్రీ గారూ మా మీద దయలేదు” అని సరదాగా అనేవాడు. ‘గివ్ ఫైవ్‌రూపీస్ అండ్ టేక్ ది ఆర్టికల్’ అనేవాడు శ్రీశ్రీ బదులుగా. రాసినది జేబులో ఉంటే అప్పటికప్పుడే ఇవ్వగలిగి వుండేవాడు.

లేదంటే, ఆఫీసులో కూచొని నాలుగు తెల్ల కాగితాలడిగి తీసుకొని, ఓ అరగంటలో రాసి (కొట్టివేతలుండేవి కాదు) ఎడిటర్ చేతుల్లో పెట్టి వెళ్లేవాడు. ఆయన డబ్బు అవసరం కూడా అలాంటిదే. ఒక రూపాయైనా అడిగి తీసుకొని సిజర్సు సిగరెట్ పెట్టెలు కొనుక్కునేవాడు. నవోదయ నెలవారీ పారితోషికం నేను ఇవ్వబూనుకున్నప్పుడు, ‘ఆ ముప్ఫైలో మీ రూపాయి మినహాయించుకొని ఇవ్వండి’ అనేవాడు. ఆ రోజుల్లో ఆయన ఒక్కడి పరిస్థితే కాదు, అనేకమంది రచయితల పరిస్థితి అలానే ఉండేది. ఎక్కడా డబ్బు పుట్టేది కాదు. పేరు పేరునా చెప్పడం అనవసరం కానీ, రచయితలు చాలా కష్టం మీద తమ రచనా వ్యాసంగానికి అంకితమై ఉండేవారు. శ్రీశ్రీ ప్రభృతుల మీద నాకు అమిత అభిమానం ఉండేది.


ఆరుద్ర కూడా నవోదయకు వారం వారం రాసేవాడు. తన ‘సినీ వాలీ’ పుస్తకాన్ని శేషయ్యగారికి తర్వాతి కాలంలో అంకితమిస్తూ, ‘వైమానిక దళం నుండి సాహితీ తలానికి తెచ్చిన శేషయ్యగారికి’ అని వ్రాసాడంటే, బహుశా మద్రాసుకు రాగానే ఈయనని కలిసి, నెలకు ముప్ఫై రూపాయల పారితోషికంతో రాస్తానని ఒప్పందం కుదుర్చుకోనుంటాడు. నేను నవోదయలో ‘చైనా బజార్’ అని సంకర తెనుగు భాష (అరవ తెలుగు)లో ‘ఫీచర్’ రాయడం మొదలెడితే ఆయన అభిమానం దాని మీద ఎంతగా ఉండేదంటే సాయంత్రం పానగల్ పార్కు, టి. నగర్‌కు తీసుకువెళ్లి అక్కడ సమావేశమయ్యే మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు, శ్రీశ్రీ, గోరాశాస్త్రి, దేవులపల్లి కృష్ణశాస్త్రి గార్లు మరికొందరు సాహితీ వేత్తల (చెంతన ఉండి రాకపోతే, రాని వారిదే నష్టం) మధ్య చదివి వినిపించేవాడు. వారంతా పగలబడి నవ్వడం ఒకటే ఆరుద్ర అభిలషించింది. ఈ మధ్యనే ద్రవిడ విశ్వవిద్యాలయం వారు ఆ ఫీచర్‌లోని కథల్ని ‘చైనా బజార్ కథలు’ అనే శీర్షికతో చిన్న పుస్తకంగా ప్రచురించారు.

ఒకసారి శ్రీ గోరాశాస్త్రి తన బంధువు ఒకాయన రాసిన ఒక చిన్న నవలిక -లేక అతిపెద్ద కథ ఒకటి తీసుకుని రచయితను కూడా వెంటబెట్టుకొని శేషయ్యగారి వద్దకొచ్చాడు. “ఇది మన నవోదయలో ధారావాహికంగా ప్రచురించడానికి ” అని ఆయన చేతికిచ్చాడు. “అలాగే, చూసి చెప్తాను” అన్నారు శేషయ్యగారు. రెండు రోజులయిన తర్వాత సాయంత్రం తాపీగా వారు ఇద్దరూ కలిసి శేషయ్యగారి వద్దకొచ్చారు. శ్రీ గోరాకూ ఎడిటర్‌కూ సుమారు గంటన్నర, రెండు గంటల వాదం నడిచింది. మొత్తం నేను వినలేదు కానీ, “కథ నడిపిన తీరు బాగానే ఉంది – కాని ఇతివృత్తం నాకు సమ్మతం కాదు” అంటారు ఎడిటర్. “ఇతివృత్తంతో మీకేమి పని? రచన బాగుంది కదా? వేయండి” అంటారు శ్రీ గోరా శాస్త్రి. “అలా కుదరదు. సమాజంలో అక్రమ సంబంధాలను ప్రోత్సహించే వీలుపడదు” అంటారు ఎడిటర్. ” క్రమ అక్రమ సంబంధాల సంగతి ఎడిటర్లకక్కరలేదు, బాగా రాసివుంటే వేయడమే”అని గోరా. “ఎడిటర్, పోస్ట్‌మాన్ కాదు.

పాఠకుల యెడల అతడికో బాధ్యత ఉంది”అని ఎడిటర్ శేషయ్యగారు. “ఎడిటర్ కర్తవ్యమంతే అయివుండాలి” అని గోరా. “ఈ ఎడిటర్ అట్లా అనుకోవడం లేదు” శేషయ్యగారు. చాలా పెనుగులాడాడు శ్రీ గోరా -కొంత దబాయింపు- ‘మారల్ బ్రిగేడ్, నైతిక పోలీసు దళం’ అనేవి ఆయనకి కిట్టేవి కాదు. ‘నవోదయ’ శేషయ్యగారి సొంత పేపరైనప్పుడే శ్రీ గోరా అంతసేపు వాదించాడు. శేషయ్యగారు ఆంధ్రపత్రికలో కూచున్నప్పుడు అయితే ఎంత వాదించేవాడో అనుకున్నాను. చివరకు ఆ పెద్ద కథను మా తండ్రి తిరిగి ఇచ్చారు. గోరా అన్నట్లు, రచనా నైపుణ్యం, శిల్పాన్ని చూచి వేసే వారుండవచ్చు. ‘సంఘం మీద దీని ప్రభావం ఎట్లా ఉంటుంది?’ అనే బాధ్యత గుర్తుంచుకొని ఆగే వారుండవచ్చు.

నవోదయలో శ్రీ జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి రాసిన ఏదో గేయ కవిత్వాన్ని చూసి అమంచర్ల గోపాలరావుగారు ఎంతగా మెచ్చుకున్నారంటే (అప్పుడు ఆయన బొంబైలో ఉన్నాడు) ఆ సంచిక చేత నిడుకొని, బొంబైలో తన ఆంధ్ర స్నేహితులందరి వద్దకూ వెళ్లి, అది వారందరికీ చదివి వినిపించి, నాలుగైదు గంటల తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ రోజుల్లో మనుషులకు కవితావేశం అలా ఉండేది. దానికై శ్రమనీ, ఖర్చునీ లెక్కచేసే వారు కాదు. ఇప్పుడు ధనమొక్కటే ఆవేశాన్ని జనింపజేస్తున్నట్లున్నది.

రష్యన్ రచయిత చెహోవ్ రాసిన చెర్రీ ఆర్చర్డ్ తెనుగులో అనువాదం చేస్తూ ‘సంపెంగతోట’ అని పేరు పెట్టారు శ్రీశ్రీ. పూర్వమెప్పుడో ‘ఇది అనువదిస్తే బాగుంటుంద’ని అబ్బూరి రామకృష్ణరావుగారు, శ్రీశ్రీ, శ్రీరంగం నారాయణబాబు ఇద్దరూ ఉన్నప్పుడు అన్నట్లున్నారు. శ్రీరంగం నారాయణబాబుగారు తాను అనువదించాలి అనుకున్నట్లున్నాడు. ఎవరు ముందు మొదలెట్టారు, ఎవరు పోటీ పడ్డారు అనేదాని మీద ఏదో చర్చచేస్తూ తన ‘వారం వారం’లో శ్రీశ్రీ ఏదో రాశాడు. శ్రీరంగం నారాయణబాబుకు కోపం వచ్చింది. ఆయన మధ్య పాపిడి, గిరజాల జుట్టు, కవి వర్యుడి కట్టు బొట్టు విశిష్టంగా కనిపించేవాడు.

ఆహార్యం కూడా నాటకీయంగా ఉండేది. గంభీర వదనంతో నవోదయ ఆఫీసుకు వచ్చి “శేషయ్యగారూ, ఏమి చెప్పను? భాషా దేవిని బలిమి చెరగొన్నాడు శ్రీశ్రీ” అని నాటకీయంగా అన్నాడు. దాని మీద ఏదో కొంత చర్చ జరిగింది. తర్వాత ఎప్పుడో శ్రీశ్రీ ‘వారం వారం’ రాయడానికి నవోదయలో వచ్చి కూచున్నప్పుడు ఆయనతో నారాయణబాబు ఇలా అన్నాడని చెప్తే “అలా అన్నాడా? వాడి మొహం” అని తన పాటికి తాను రాసుకుంటూపోయాడు. శ్రీశ్రీ రాతలో ఎంతటి ‘ఇమేజరీ’ ప్రవేశపెట్టి రాసేవాడో, మాట్లాడేటప్పుడు అంత నెమ్మదిగా, ఆవేశం లేకుండా సింపుల్‌గా మాట్లాడేవాడు. చమత్కారాలు వాడుతూ సంతోషిస్తూండే వాడు. ఎడం చేత్తో కారమ్స్ ఆడేవాడు. మీరు ఈ చేత్తోనే ఆడుతుంటారా? అని నేను అడిగినప్పుడు “ఔను, నేను లెఫ్టిస్టుని” అన్నాడు.

నీలంరాజు వేంకటశేషయ్య జీవితం
నీలంరాజు లక్ష్మీ ప్రసాద్
పేజీలు: 244, ధర: 100
పుస్తకాలకు: నవోదయ బుక్‌హౌస్, హైదరాబాద్
040 – 24652337

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గోదారి కుర్రాడు మేజిక్‌లో మొనగాడు

గోదారి కుర్రాడు మేజిక్‌లో మొనగాడు


పేదరికం అతని కళాతృష్ణను అణగారనివ్వలేదు. కళ్ల జోడు షాపులో పనిచేస్తూనే కనికట్టు విద్యలో నిష్ణాతునిగా మారాడాయన. ఆయనే ప్రముఖ మెజిషియన్ అలీ. తూర్పు గోదావరి జిల్లాలోని ఒక కుగ్రామంలో జన్మించిన ఆయన అంతర్జాతీయ స్థాయి మెజిషియన్‌గా ఎదిగారు. పేకముక్కలు, పావురాలు వంటివి ఖాళీ చేతులలో సృష్టించడం ఆయన ప్రత్యేకత. తన మేజిక్ ప్రదర్శనలతో ప్రేక్షకులలో మానసికోల్లాసాన్ని నింపుతున్న అలీ అంతరంగం ఆయన మాటల్లోనే…

“మాది తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలు తాలూకాకు చెందిన మామిడికుదురు. పక్కనే నగరంలో పదవ తరగతి దాకా చదువుకున్నాను. మా తాత(అమ్మగారి తండ్రి) హుస్సేన్‌గారు అప్పట్లో చాలా పెద్ద మెజిషియన్. పెద్ద పెద్ద ఐటమ్స్ చేసేవారాయన. వాటిని చూసి ఏమిటీ మాయలు మంత్రాలు అని చిన్నప్పుడు అనుకునేవాణ్ణి. ఆయన దగ్గర చిన్న చిన్న ఐటమ్స్ నేర్చుకున్నాను. మాది మధ్యతరగతి కుటుంబం. నాన్న చిన్న వ్యాపారం చేసేవారు. మేము మొత్తం ఐదుగురం. నేను రెండవవాణ్ణి. నాకో అన్నయ్య, ఒక తమ్ముడు, ఒక చెల్లి, ఆఖరున మరో తమ్ముడు.

చదువును కొనసాగించే ఆర్థిక పరిస్థితి లేకపోవడంతో 25 ఏళ్ల కిత్రం హైదరాబాద్ వచ్చి ఆబిడ్స్‌లో ఒక కళ్ల జోళ్ల షాపులో పనిచేశాను. వచ్చే రెండువేల జీతంలోనే కొంత మొత్తం ఇంటికి పంపాల్సిన పరిస్థితి. 13 గంటలు నిలబడి ఉద్యోగం చేసేవాణ్ణి. కూర్చోడానికి కూడా సమయం ఉండేది కాదు. ఆ సమయంలోనే అమెరికన్ మెజిషియన్ చానిగ్ పొలాక్ మేజిక్ వీడియో క్యాసెట్ చూశాను. పేక ముక్కలతో మేజిక్ చేయడంలో ఆయన నిష్ణాతుడు. అది చూసి నాక్కూడా ఆ విద్యను నేర్చుకోవాలనిపించింది. షాపు యజమాని పేక ముక్కలను చూస్తే తిడతాడని పనిచేస్తూనే అట్టముక్కలతో ప్రాక్టీస్ చేసేవాడిని. రూముకు వచ్చిన తర్వాత గంటల తరబడి ప్రాక్టీస్ కొనసాగేది.

చూసేందుకు వెళితే అవార్డు!
1988లో హైదరాబాద్‌లో ఒక మేజిక్ ఫెస్టివల్ జరిగితే చూసేందుకు వెళ్లాను. మేజిక్ పోటీలు జరుగుతుంటే నాపేరు కూడా పోటీకి ఇచ్చాను. ఆ పోటీల్లో పాల్గొనేందుకు దేశం నలుమూలలకు చెందిన పెద్ద పెద్ద మేజిషియన్లు వచ్చారు. వాళ్లంతా మేకప్‌లు వేసుకుని, భారీ కోట్లు వేసుకుని ఉన్నారు. నా దగ్గర కోటు కాదు కదా వేసుకున్న చొక్కా కూడా దమ్ముకొట్టుకుపోయి, దయనీయంగా ఉంది. అలాగే భయపడుతూ నా ప్రదర్శన పూర్తి చేశాను. పోటీ విజేతల పేర్లు ప్రకటిస్తున్నారు. మొదటి బహుమతి విజేత ‘అలీ’ అని ప్రకటించగానే నేను కాదు వేరే ఎవరో ఉన్నారులే అనుకున్నాను. కాని, విచిత్రంగా మొదటిసారి నేను ఇచ్చిన ప్రదర్శనలోనే నాకు మొదటి బహుమతి లభించింది. బహుమతి తీసుకుంటుంటే నా కళ్లలోంచి నీరు… ఎంత ఆపుకుందామన్నా ఆగలేదు.

కేరళలో అపురూప సత్కారం
కేరళలో గోపీనాథ్ ముత్తుక్కడ్ అనే ప్రఖ్యాత మెజిషియన్ ఒక మేజిక్ అకాడమి నిర్వహిస్తున్నారు. పిసి సర్కార్, కె.లాల్ లాంటి ప్రముఖుల స్థాయిలో ఆయన నిలుస్తారు. ప్లేయింగ్ కార్డ్స్ మేనిప్యులేషన్ (పేకముక్కలతో ఇంద్రజాలం)లో ఈ అకాడమి శిక్షణ ఇస్తుంటుంది. ఒకరోజు గోపీనాథ్‌గారు మా షాపునకు ఫోన్ చేసి “అలీగారూ! మీకు కేరళ ప్రభుత్వం తరఫున ఆలిండియా బెస్ట్ కార్డునేషన్ అవార్డు ఇద్దామనుకుంటున్నాము” అని చెప్పారు.

1989లో త్రివేండ్రం వెళ్లాను. 35 గంటలు రైలు ప్రయాణం చేయడంతో నా బట్టలన్నీ మాసిపోయి ఉన్నాయి. స్టేషన్‌లో నేను కాలు పెట్టగానే నన్ను రెండవ నంబర్ గేట్ దగ్గర వచ్చి గోపీనాథ్‌గారిని కలవాలని అనౌన్స్‌మెంట్ వస్తోంది. చొక్కా మార్చుకోవడానికి కూడా టైము లేకపోవడంతో నేను అలాగే అక్కడకు వెళ్లాను. పూలమాలలు పట్టుకుని మెజిషియన్లు, విద్యార్థినీ విద్యార్థులు అక్కడ గుమికూడి నా రాక కోసం ఎదురుచూస్తున్నారు. ఆ అవార్డు ప్రదానోత్సవం నా జీవితంలో మరచిపోలేని మధురానుభూతిగా మిగిలిపోయింది. షాపులో పనిచేస్తూనే సొంతంగా నేర్చుకోవడం కొనసాగించాను.

ఎన్నెన్నో అద్భుతాలు…
మేజిక్‌లు మూడు రకాలు. ఒకటి ఇల్యూజన్(భ్రమ). అమ్మాయిని గాలిలో లేపడం, మధ్యలో సగానికి కోయడం, పెట్టెలో ఉంచి తాళం వేసి బయటకు రప్పించడంలాంటివి ఈ కోవలోకి వస్తాయి. ఖాళీ చేతులలో నుంచి వస్తువులను సృష్టించడాన్ని కంజ్యూరింగ్ అంటారు. ఉదాహరణకు ఖాళీ చేతులలో పావురాలు, పేకముక్కలను సృష్టించడం. మూడవది క్లోజప్. అంటే చిన్న చిన్న నాణేలను సృష్టించడం, ఒక కాగితం ముక్కను ఇచ్చి దాన్ని వెయ్యిరూపాయల నోటుగా మార్చడం లాంటివి. నేను ప్రధానంగా కంజ్యూరింగ్, క్లోజప్ మేజిక్‌ను చేయడానికే ప్రాధాన్యమిస్తాను.

52 పేకముక్కలు రెండు ఖాళీ చేతులలో రావడం, వాటితో విన్యాసాలు చేయడం, పేకముక్కలు రంగులు మారిపోవడం, గాలిలోనుంచి పావురాలు ఎగురుకుంటూ రావడం, చేతిలో పట్టుకోగానే పావురం చిలుకగా మారిపోవడం, ఒక గుడ్డు పగలగొట్టగానే అందులోనుంచి పావురం రావడం ఇలా దాదాపు 150కి పైగా ఐటమ్స్ చేస్తాను. గంటన్నరపాటు ఒక్కో ప్రదర్శన ఉంటుంది. నాకు ఇద్దరు అసిస్టెంట్లు ఉన్నారు. ఇప్పటిదాకా 6 వేలకు పైగా ప్రదర్శనలు దేశవ్యాప్తంగా ఇచ్చాను. 13 సార్లు జాతీయస్థాయి పోటీలలో ప్రథమ బహుమతి సంపాదించాను. ముంబాయిలో జరిగిన సార్క్ దేశాల మేజిక్ పోటీలలో కూడా ప్రథమ బహుమతి లభించింది.

జాదూరత్న
2000 సంవత్సరంలో దేశంలోని మెజిషియన్లంతా కలసి నాకు జాదూ రత్న అవార్డు ఇచ్చారు. 2002లో జాదూ శిరోమణి అవార్డు లభించింది. త్యాగరాయగానసభలో కళ్లకు గంతలు కట్టుకుని గంటలో వంద ఐటమ్స్ చేసినందుకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సులో స్థానం దక్కింది. అలాగే కళ్లకు గంతలు కట్టుకుని ట్యాంక్‌బండ్ నెక్లెస్‌రోడ్‌లో బండి నడిపాను. ఇప్పటిదాకా సింగపూర్, మలేషియా, దుబాయ్, కువైట్, బహెరిన్ దేశాలలో ప్రదర్శనలు ఇచ్చాను.

ఎక్కువగా కార్పొరేట్ ఆఫీసులు, ఐటి కంపెనీలు, హోటల్స్‌లో జరిగే పుట్టిన రోజు వేడుకలు, ఇతర కార్యక్రమాల్లో నా ప్రదర్శనలు ఉంటాయి. ఒరిస్సాలోని పూరీలో ఏప్రిల్ 13, 14, 15 తేదీలలో మూడు రోజులపాటు జాతీయ స్థాయి మేజిక్ కన్వెన్షన్ జరుగుతోంది. అందులో నా ప్రత్యేక ప్రదర్శన(గాలా షో) ఉంటుంది. అలాగే జూన్‌లో బెంగళూరులో జరిగే అంతర్జాతీయ మేజిక్ ఫెస్టివల్‌లో కూడా పాల్గొంటున్నాను.

జనచైతన్యం కోసం…
రాష్ట్రంలోని చాలా గ్రామాలలో ఇంకా మూఢనమ్మకాలు పోలేదు. వీటి మీద ప్రజలను చైతన్యపరుస్తూ నేను, మరికొందరం మెజిషియన్లు కలసి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాము. కొంతమంది బాబాలు గాలిలో సృష్టించి ఇచ్చే వస్తువులు ఎలా వస్తాయో నా ప్రదర్శనల్లో రెండు మూడు ఐటమ్స్‌ని తప్పనిసరిగా చూపిస్తాను. ఇలా చేయడం వల్ల ప్రజలలో మూఢ విశ్వాసాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది.

మాయలు మంత్రాలు ఏవీ లేవని చెప్పడమే మా ఉద్దేశం. అనాథాశ్రమాలలోని పిల్లల కోసం కూడా ఉచితంగా మేజిక్ ప్రదర్శనలు ఇస్తుంటాను. మేజిక్‌లో నాకంటూ గురువు ఎవరూ లేరు. సొంతంగా నేర్చుకున్నదే ఈ విద్యంతా. సినిమాలలో హీరోలకు కూడా అప్పుడప్పుడు మేజిక్ ట్రెయినింగ్ ఇస్తుంటాను. మా తమ్ముడికి హైదరాబాద్‌లో కళ్లజోడు షాపు ఉంది. ఇప్పటికీ ఖాళీ దొరికితే ఆ షాపులో కూర్చుని కళ్లజోళ్లు రిపేర్ చేస్తుంటాను. కళ అనేది కేవలం మానసిక ఉల్లాసానికే కాదు సామాజిక ప్రయోజనం కూడా సాధించే విధంగా ఉండాలన్నదే నా ఆశయం” అని ముగించారు అలీ. ఆయన ఫోన్ నంబర్: 9849191212.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment