తోలి నిఘంటు కర్త – మామిడి వెంకటాచార్యులు

toli nighantu kartha mamidi venkataryulu

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కాశీ ఖండం -34 పుణ్య కీర్తి అవతారం

  కాశీ ఖండం -34

                                 పుణ్య కీర్తి అవతారం

‘’వామాన్గా ధ్రువ తొ విష్ణుహ్’’అనే ప్రమాణం వల్ల అర్ధ నారీశ్వర స్వరూప మానుడైన పరమాత్మ సగుణా నికి సాకారం లో ఉండి ఎడమ భాగం నుండి ప్రకృతి స్వరూప మైన శక్తి తత్వాన్ని మూర్తీభావించుకొని ఇంకొక అద్భుత రూపాన్ని వెలయ జేశాడు .ఆ శక్తి పరమేశ్వరానుగ్రహం తొ దుష్ట శిక్షణ చేసే విష్ణు రూపం అయింది అమృత మధనం లో ఆవిర్భవించిన సౌందర్య రాశి లక్ష్మిని వివాహం చేసుకొన్నాడు .ఆమె హిమాలయాల్లో పార్ధివ లింగ పూజా నియమాన్ని స్వీకరించి రోజు వెయ్యి మామిడి పళ్ళ తొ‘’వేద సార శివ సహస్ర నామా వల ‘’ని పఠిస్తూ శివార్పణం చేస్తోంది ఆమె తీవ్ర తపస్సులో తన రెండు స్తనాలను కత్తితో కోసుకొని శివ లింగం పై ఉంచి అర్చించింది ,దానితో ఆమె శరీరాకృతి ఇది వర కంటే ద్విగుణీకృత సౌందర్యం తొ విరాజిల్లింది .తన తపస్సు ఫలితాన్ని శివునికే అర్పించింది ఆ సంకల్ప జలం నాలుగు దిక్కులకు వెద జల్లింది .ఆ బిందువులు పడిన చోట్ల వృక్షాలు మొలిచాయి .  

         శివుడు సంతోషించి ‘’విష్ణు పత్నీ !నువ్వు ఇప్పటి నుండి ఐశ్వర్య శక్తికి దేవతవవుతావు .పూర్వం నీ భర్త విష్ణువు నన్ను కమలాల తొ అర్చించి చివరకు నీ లాగానే తన కళ్ళను పెకలించి పూజించి నాకు ప్రీతీ పాత్రుడయాడు అప్పుడు నేను అతనికి‘’చక్రం ‘’అనే అతి గొప్ప ఆయుధాన్ని ప్రదానం చేశాను .నీ సహస్ర ఫల పూజా ఫలితం గా వృక్ష సంతతి అభి వృద్ధి చెందింది .అంతే కాక నీ పూజా ఫలితం బిల్వ వృక్షం గా ప్రసిద్ధి పొందుతుంది .అది నాకు చాలా ప్రీతికరం . అభిషేకం, భస్మం తొ పాటు బిల్వ దళం కూడా ఇక నుంచి మాకు ప్రీతికరమవుతుంది .జగన్మాత యొక్క హిరణ్మయీ శక్తి ని నీలో నిక్షిప్తం చేస్తున్నాను .శ్రీ సూక్తం నీ పూజలో ముఖ్య భాగం అవుతుంది .దీని పఠనం విశేష ఫలప్రదం .బిల్వార్చన ,శివ పూ జల్లో శ్రీ సూక్త పఠనం అత్యంత కైవల్య దాయకం .యజ్ఞాలలో శ్రీ సూక్తం చెబుతూ బిల్వ దళాలను పంచాక్షరి మంత్ర యుతం గా సమర్పించే వారు ఆఖండడ ఐశ్వర్యం పొందుతారు .’’వ్రుక్షోజ బిల్వః తస్య ఫలాని తపసాను దంతి మయాతరసయాస్చ బాహ్యా అ లక్ష్మీహ్’’తన భార్య లక్ష్మీ దేవి శివుడిని మెప్పించి నందుకు విష్ణు మూర్తి పొంగి పోతాడు .

           లక్ష్మీ నారాయనులిద్దరు ఆ తర్వాత కైలాసం చేరి శివుని ముందునిలబడి నమస్కరిస్తారు ‘’హరీ ! నా మాట ప్రకారం గణేశుడు కాశీ చేరి డుమ్ది రూపం పొంది అనుకున్న కార్యాన్ని దివ్యం గా నేర వేర్చాడు దివోదాసు మోక్ష ప్రాప్తికి సమయం దగ్గర పడింది .సకల దేవతా గణం తొ మీరందరూ వారణాసికి తరలి వెళ్ళండి .’’అని ఆదేశించాడు .శ్రీ దేవి జ్ఞాన బోధకు రాలిన తపశ్విని వేషం లో ‘’విజ్ఞాన కౌముది ‘’అనే పేరుతో అక్కడ అవతరించింది .గరుత్మంతుడు సాదు వేషం లో వినయ కీర్తి అనే శిష్యుడు అయాడు వీరి గురువు ధర్మా చార్యులు పుణ్య కీ ర్తి పేరుతో శ్రీ మహా విష్ణువు కాశీ చేరాడు . ఈ బృందం అనేక మహిమలను ప్రదర్శిస్తూ అందరిని ఆకర్షించింది .పద్దేనిమీదో రోజున పుణ్య కీ ర్తి దివోదాస చక్ర వర్తి దగ్గరకు చేర తాడు ఆయన అర్ఘ్య పాద్యాదుల తొ సత్కరించాడు స్వామితో చక్ర వర్తి తనకు ఆరోజు మహా పవిత్ర మైనదని అదే తగిన ముహూర్తం అని పూర్వం డుంధీ చెప్పిన విషయం  జ్ఞాపకం చేసుకొన్నాడు .స్వామితో తన మనసులోని మాటలు చెప్పుకొన్నాడు ‘’దైవీ శక్తిని కాదని నేను ఇంత వరకు స్వతంత్రించి పాలించాను స్వార్ధ రహిత ధర్మ శక్తి గొప్పది అని రుజువు చేయటానికే ఇంత పని చేశాను ఇక ఈ జీవితం పై విరక్తి కల్గింది వేరే మార్గామేమితో సెలవివ్వండి ‘’అని విన్న వించాడు .

        అప్పుడు పుణ్య కీ ర్తి రూపం లో ఉన్న విష్ణువు ‘మా ఉపదేశాలకు తాగి నట్లే మీరు నడుచుకొన్నారు .మా దృష్టిలో నాలుగు దానాలు  ముఖ్య మైనవి  .అవి భయం తొ ఉన్న వారి భయం పో గొట్టి అభయ హస్తాన్ని చ్చి ఆదువటం మొదటిది .రెండోది –రోగం తొ బాధ పడే వారికి తగిన సమయం లో మందులు అందించి ఆదు కోవటం మూడవది విద్యార్ధులకు విద్య కు ఆటంకం కలుగ కుండా శక్తికొలది విద్య నేర్పించి సాయపడటం నాల్గవది ఆకలి తొ ఉన్న వారికి కడుపు నిండా అన్నాన్ని పెట్టించటం అన్ని ధర్మాలలో ‘’అహింసా పరమో ధర్మః ‘’అనేది ఉత్రుష్టమైనది .నా మాటలను జాగ్రత్త గా అర్ధం చేసుకొని వెంటనే ఆచరణ లో పెట్టండి .సృష్టిలో ఎవరి హద్దు వారికి ఉంటుంది .మీ ఆలోచన మీ అంత రాత్మ వరకు పరమ సత్యమే .కాని పరమాత్మ దృష్టిలో మీరు దోషులు .సృష్టి నియమాలకు అతీతం గా మీరు వ్యవహరించారు .అందుకే ‘’నేను ఎందుకిక్కడ ?నా కేమి పని ఉంది ?’’అని విశ్వేశ్వరుడు కాశీ వదిలి మందరాచలం వెళ్లి పోయాడు ఆయన లేని కాశి నిర్వీర్యమైంది .పరమాత్మ దృష్టిలో మీరు చేసింది మహా పరాధం .ఆ పాప శాంతికి ఒక ఉపాయం ఉంది అదే ‘’లింగ ప్రతిష్ట ‘ఒక లింగ ప్రతిష్ట తొ ప్రపంచ ప్రతిష్ట కలుగుతుంది .ఈ రోజు నుంచి మొదలు పెట్టి ఏడు రోజుల్లో ప్రతిష్ట పూర్తీ అవ్వాలి .ఇది శివాజ్న ‘’అని చెప్పి పుణ్య కీ ర్తి రూపం లోనీ విష్ణు మూర్తి అంతర్ధానమయ్యాడు .

            సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –21-12-12-ఉయ్యూరు 

 
Posted in రచనలు | Tagged | Leave a comment

సిని సంగీతం లో మేరుపర్వతం

ghantasala -1ghantasala -2ghantasala -3ghantasala -4

Posted in సేకరణలు | Tagged | 1 Comment

కాలక్షేపానికి కమ్మని కబుర్లు -3 నిత్య శంకితులు

 కాలక్షేపానికి కమ్మని కబుర్లు -3

                       నిత్య శంకితులు

   అన్నీ అను మానాలే నిత్య శంకితుడికి .అణు మానం పెను భూతం అని అన్నారు మన వాళ్ళు .ఏపని మొదలూ పెట్టడు ,పెట్టినా మధ్యలోనే ఆపేస్తాడు .అంగుళం ముందుకు కదలలేడు..వాడికి సందేహ నివృత్తి చేయటం కుక్క తోకను సవ రించటమే .ఎప్పటి కప్పుడు మళ్ళీ మొదటికే వస్తుంది కధ .కనుక వాణ్ణి దూరం చేసుకో వాలి  .సందేహం రావటం దేహానికి సహజం .కాని ఆ సందేహం తన అస్తిత్వాన్నే దెబ్బ తీసేది అయితే ప్రగతి లేదు .గురువులో, తెలిసిన పెద్దలో అనుమానాలను తీరుస్తారు .అవి మటు మాయ మయ్యే ట్లుచేస్తారు . వాడు కూడా కొంత ముందడుగు వేయాలి .చరిత్రలో ఎంతో మంది ఇలా సందేహ నివృత్తి చేసుకొని గురు అనుగ్రహం తొ ముందుకు వెళ్ళిన వారే .ఒక మెట్టు అన్నా  ఎక్కాలి .చతికిల పడితే ఎప్పుడు అదే స్తితి లోనే ఉంటాడు .

          ఈ సందేహాలు పరమాత్మ ను తెలుసు కోవటం లో మరీ జటిలం గా ఉంటాయి పరమాత్మే సందేహం అయితే ఇంకా సందేహించేది ఎవరిని /అని ప్రశ్నిస్తారు వేదాంతులు .సందేహించే వాడే మన లోపల ఉన్నప్పుడు వాడిని సందేహించటం అసాధ్యం .కనుక సందేహించ గల శక్తి గా నిలిచినా వాడిని సందేహించటం కుదరదు అని గురు బోధ .ఇక్కడో తమాషా కధ చెబుతారు .ముల్లా నజీరుద్దీన్ చుట్టూ ఎప్పుడు భజన పరులు చేరి ఆయన్ను ఉబ్బెస్తూ వాళ్ళింట్లో చేరి భోజనాలు లాగిస్తుఉండే వారు .ఇలా ఒక సారి నలభై మంది చేరారు .వీళ్ళందర్నీ ఆ ‘’ఉబ్బు మైకం ‘’లో భోజనానికి రమ్మని ఇంటికి వెంట బెట్టు కెళ్ళాడు ..తీరా ఇంటికి వెళ్లి చూస్తె ఇల్లు ‘’అయ్య వారి నట్టిల్లు ‘’గా ఉంది .ఒక్క సరుకూ లేదు .ఉపాయం ఆలో చించి భార్య తొ తాను ఇంట్లో లేనని చెప్ప మన్నాడు .ఆమె అలానే చెప్పింది .తమ తొ పాటే లోపలి వచ్చాడని ఎక్కడికి పోతాడని వాళ్ళు ప్రశ్నిం చారు .అప్పుడు తెలివిగా నజీరుద్దీన్ లోపలి గుమ్మం తేర చాటు నుంచి తల బయటికి పెట్టి నజీరుద్దీన్ దొడ్డి దారి నుండి వెళ్లి పోయాడు .ఇక కనపడడు అని వాళ్ళతో చెప్పాడు .పాపం మోస గించటం కూడా తెలీని అమాయకుడు వాళ్ళ చేతికి దొరికి పోయాడు .

        సందేహం ఒక విషం .లాగా మనం చేసే పనిని కబళించి ముందుకు అడుగు వెయ్య నివ్వదు .మరి అత్యంత శిఖర సమాన మై,ఉత్కృష్ట మై ధ్యానం విషయం లో సందేహం తొ ఏ పనీ చేయక పోతే అసలు ప్రగతి సాధ్యం కాదని స్వామి మధు సూదన సరస్వతి అంటారు .భౌతిక వాది పదార్ధాల అస్తిత్వాన్నే నమ్మ నప్పుడు పరమాత్మను అసలు నమ్మ లేడు .పదార్ధాన్ని తెలుసు కోవటం కష్టం పరమాత్మను తెలుసు కోవటం సులభం అంటారు స్వామి .పదార్ధం బయట ఉంటె ,పరమాత్మ లోపలే ఉంటాడు .పదార్ధం దూరం గా ఉంటుంది .పరమాత్మ దగ్గర గా ఉంటాడు .మనమే పరమాత్మ అయినప్పుడు పదార్ధం అనాత్మ లేక సంసారం అవుతుంది అంటారు సరస్వతీ స్వాములు .పరమాత్మ ఒక వస్తువు కాదు తెలుసు కోవా టానికి .ఆయన తెలుసు కో బడే పదార్ధంకూడా  కాదు సందేహించే మనమే చైతన్య స్వరూపలం అయిన పరమాత్మ స్వరూపాలం అంటారు మధు సూదనులు .

           నిత్య శంకితుడు ఒకడు ఇల్లు గడవక సైన్యం లో చేరాడట .కమాండర్ కుడి వైపుకు తిరగామాన్నా ,ఎడమ వైపుకు తిరగ మన్నా తిరక్క పోతే ఏం అని అలానే నిలబడి పోయే వాడట .ఇది గమనించిన ఇతడు డ్రిల్ కు పనికి రాడని భావించి, కమాండర్ అతడిని వంటింట్లో బటానీలు ఏరే కార్య క్రమం అప్పగించి చిన్నవి,పెద్దవి గింజల్ని వేరు చెయ్య మన్నాడు .కాసేపాగి వచ్చి చూస్తె వాడేమీ పని మొదలే పెట్టనే లేదట .ఎందుకు యేర లేక పోయావని అడిగితే చిన్న గింజలు ,పెద్ద గింజలు మాట చెప్పారు కాని మధ్య రకం గా ఉన్న గింజల సంగతి మీరు చెప్పలేదు కదా అందుకని నేను చూస్తూ కూర్చున్నానని చెప్పాడట . కనుక నిత్య శంకితుడు ఏమీ ముందడుగు వెయ్య లేడని చెప్పారు స్వామి .

                 మరో విషయం తొ మళ్ళీ కబుర్లు చెప్పు కొందాం .

             మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –20-12-12-ఉయ్యూరు 

Posted in రచనలు | Tagged | Leave a comment

తెలుగు సభల చిహ్నం -దాని వివరణ మరియు బాపు గారి పుట్టిన రోజు కు ”గీతా”గారి గీతం

telugu sabhala logotelugu sabhala logo-2bapu puttina roju ''geethaa''m

Posted in రచనలు | Tagged | Leave a comment

తెలుగుకు ‘వెబ్’ వెలుగు -సరసభారతి ఈఅనాడు – విజయవాడ –

20121220b_008105001

Posted in రచనలు | Tagged , | Leave a comment

కాశీ ఖండం –33 ద్వితీయ భాగం –డుండివినాయక లీల

కాశీ ఖండం –33

ద్వితీయ భాగం –డుండివినాయక లీల

‘’ప్రణవాత్మ రూప సాక్షాత్కారిణీం,పాప హారిణీం—మోక్ష ప్రదాయినీం ,కర్మ నాశనీం ,విశ్వ మోహినీం

వారాణసీం ,కర్మ భూమిం,మనో వాచామ గోచరాం-ప్రణమామి సదా భక్త్యా  –కాశీ వాస ఫలాప్తయే’’

‘’ఆది పూజ్య డుంఢిరాజం –అన్న పూర్ణాం చ మాతరం –విశ్వనాధం విశాలాక్షీ –సమేతం ప్రణమామ్యహం

నమామి భైరవం దేవం –దండ పాణిం తు మాధవం –గంగాం మలాప గంగా దివ్యాం,భవానీం మణి కర్ణికాం

త్రయ త్రింశత్కోటి దేవ పూజితం లింగ రూపిణం-విశ్వేశ్వరం శివం వందే ,గ్రంధ లేఖన సిద్ధయే

పద్దెనిమిదిపురాణాలలో పెద్దది స్కాంద  పురాణం  .యాభై ఖండాల తొ ఒక లక్ష శ్లోకాల తొ ఉన్న గ్రంధం . స్కందుడు చెప్పిన పురాణం కనుక స్కాంద పురాణం అయింది .కాశీ క్షేత్రాన్ని గురించి చెప్పిన భాగ మంతా ‘’కాశీ ఖండం ‘’అనే పేరు తొ ఉంది .కాశి అంటే ప్రకాశ సంబంధ మైన స్వయం ప్రకాశ మాన మైంది .నమ్మి తనను సేవించే వారికి ప్రకాశింప జేసేది అని భావం .దీనికే వారణాసి అని కూడా పేరుంది .గంగా నదికి ఉన్న అనేక ఘాట్  లలో వరుణా ఘాట్  నుండి అసీ ఘాట్  వరకు ఉనన్న అందులో  అయిదు క్రోసులు వైశాల్యం ఉన్న ప్రాంతం మాత్రమె చాలా పూర్తీ మహిమ కలిగింది .అందుకే వారణాసి అనే పేరు సార్ధక మయింది .

దివోదాస చక్ర వర్తి ధర్మ పత్ని లీలా వతి తొ అత్యంత ధర్మ శక్తి తొ ,సమస్త దేవతలను పాదా క్రాన్తులను చేసుకొని ప్రపంచమంతా ఏక చ్చత్రాది పత్యం గా పాలిస్తున్నాడు .తనకు అత్యంత భక్తులైన ఆ దంపతులకు సాయుజ్యాన్ని, దేవతా గణానికి స్వేచ్చను ప్రసాదించే ఆలోచన తొ విశ్వనాధుడు డుమ్ది వినాయకుని సృష్టించి కాశి లో ప్రవేశ పెట్టాడు

‘’ఆదాయ శాసనం మూర్ది –గణాధీశోధ ధూర్జటీ –ప్రతస్థే త్వరితః కాశీం –స్తితిజ్ఞ్సః స్తితి హేతవే

మందరాచల శిఖరం పై ధ్యాన మగ్నుడైన సదాశివుణి సమస్త దేవతలు సేవిస్తున్నారు .వారితో పరమ శివుడు ‘’భూలోకం లో కైలాసం లాంటి నా నివాసం ఒకటి ఉంది .ఎవరి చేతా ప్రతిష్టింప బడ కుండా నా అంతట నేనే పరబ్రహ్మ స్వరూపమైన లింగరూపం గా అక్కడ వేలిశాను .ఆ లింగం లో శివ శక్తి జ్యొథిహ్ ప్రకాశరూపం లో ప్రక్షిప్త మై ఉంది .అత్యంత శక్తి వంత మైనజ్యోతిర్లింగం ఇది .దీనికి అయిదు క్రోసుల పరిసర ప్రాంతం అంతా పరమ పవిత్ర మైనది గా నేను వరం ఇస్తున్నాను .పాపపు చీకటిని పోగొట్టి జ్ఞానజ్యోతిని ఇచ్చి మోక్షమిచ్చే లింగం ఇది .సగుణ రూప సాకార పూజ కంటే నిర్గుణ రూప నిరాకార లింగ పూజే శ్రేష్టం .,నాకు ఇష్టం కూడా .సర్వం లింగమయం .అని అర్ధం చేసు కోవాలి .

‘’దివోదాస చక్ర వర్తి భక్తీ పాశం తొ భాగ వంతుడిని కట్టి పడేసి నవగ్రహ ,దిక్పాలశక్తిని ,తపశ్శక్తిని లొంగ దీసుకొని సర్వం తానే అయి వెలిగి పోతున్నాడు .కాశీ లో అందరు విశ్వనాదుడే స్వయం గా కాశీలో ఉండి అన్నీ చక్క బరచ కూడదా అని ఆలోచిస్తున్నారు ‘’అని చెప్పి తన దివ్య శక్తి తొ వినాయక సృష్టి చేసి ఆయన తొ ‘’నా బహిప్రాణం అయిన కాశీ చేరు అక్కడి పరిస్తితులను చక్క బెట్టు .’’అనగానే ఆయన శివాజ్న అంటూ కాశీకి వెళ్లి పోయాడు .

అద్భుత మైన కాంతి పుంజం తొ ఒంటి నిండా విభూతి రేఖలు ,సిందూరం రంగు పట్టు బట్ట ,ఎర్రటి శాలువా ,లావు శరీరం తొ పొట్టి వాడైనా గట్టి వాడే నని పించాడు వినాయకుడు తన వాక్కు నిజం అవుతుందని చెప్పుతూ జనాన్ని ఆకర్షించాడు .రాజ మర్యాదలు చేస్తున్నారు .కోరికలు తీర్చుకొంటున్నారు .జరిగిందీ జరుగుతున్నది జరుగ బోఏదీ అన్నీ ఖచ్చిథం  గా చెప్పి అందరి మనసుల్ని ఆకర్షిస్తున్నాడు .మనుషులకు ఎలాంటి కలలోస్తాయో చెప్పటం, వారికొచ్చిన కల విశేషాలనను తెలియ జేయటం తొ అందరి ద్రుష్టి లోను పడ్డాడు రాజాస్తానికి కూడా ఈయమ్న మహిమలు చేరాయి .రాణి కోరిక పై రాజు దివోదాసు ఆయన్ను ఊరేగింపు గా ఆస్థానానికి గౌరవం గా రప్పిస్తాడు .వారి ఆతిధ్యాన్ని పొంది నాలుగు వేదాల, సకల శాస్త్రా పురాణాల విషయాలన్నీ వారికి బోధించి మెప్పు పొందాడు

ఒక ఏకాంత ప్రదేశం లో డుమ్దితొ  చక్ర వర్తి ‘’మాకు ఈ ప్రజా పాలన తప్ప ఇంకా ఏమీ పని లేదా .ఏదైనా ఉంటె ఆజ్ఞా పిస్తే చేస్తాను ‘’అన్నాడు డుమ్ది ‘’మీరు సమయానికి తగ్గ మాటే అన్నారు .మీ లాగా ఇంతకు ముందేవరు ధర్మ బద్ధం గా న్యాయ బద్ధం గా ,ప్రజాహితం గా పరిపాలన చేయలేదు .భవిష్యత్తు లో కూడా చేయ బోరు అన్ని శక్తులను లోబరచుకొని అన్నీ మీరే అయి పాలించారు .వచ్చే రోజులు మంచివి కావు .మీరు కొత్త దృష్టి తొ జీవించాలి .నేటికి పద్దెనిమిదో రోజు నమీ జీవితానికి ఒక సుముహూర్తం వస్తోంది .ఒక తేజో రాశి బ్రాహ్మణోత్తముడు మీ దర్శనం కోరుతాడు .ఆయన చెప్పి నట్లు నడుచు కొండి .మీ జన్మ చరితార్ధ మయ్యే రోజు ఆ రోజే .అని చెప్పి డుమ్ది తన ఆశ్రమానికి వెళ్లి పోయాడు

సశేషం –మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ –20-12-12-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

గొల్ల పూడి కధా మారుతం –22 పదవ కధ –ఆమె –

      గొల్ల పూడి కధా మారుతం –22

                       పదవ కధ –ఆమె –

 ఎక్కడో ఇతర రాష్ట్రాల్లో ఇరవై  ఏళ్ళు పని చేసి బదిలీ పై స్వగ్రామం చేరాడు రచయిత .పాత ఇల్లు బూజు దులిపి స్వంత ఇంట్లో చేరాడు .స్వచ్చమైన పల్లె టూరి గాలి వెలుతురు లభించి నందుకు భార్యాభర్త లిద్దరూ ఆనందించారు .కిటికీ దగ్గర కూర్చుని తనివి తీరా గాలి పీలుస్తున్నారు .కిటికీ కి అవతల పొగడ చెట్టు ఉండి .మంచి వాసన తొ గాలి వస్తోంది .’’మంచి వారి మీద ,చెడ్డ వారి మీద వర్షించే భగ వంతుని కరుణ లాగా మురుగు కాల్వ మీద ,దుమ్ము రోడ్డు పైనా దాని పూలు పరుచుకోన్నాయి .లేక పోతే మంచికి విలువేమిటి “’?అని ప్రశ్నిస్తాడు రచయిత .హఠాత్తుగా తలెత్తి చూశాడు తనకు పట్టిన అదృష్టానికి పొంగి పోయాడు .ఆమె దర్శనం తొ పులకించి పరవశించి పోయాడు .ఎంతో మంది కాలేజి అమ్మాయిలూ ప్రౌఢలు అటుగా వెళ్తున్నా అందరి లోను ఆమె అతన్ని బాగా ఆకర్షించింది .’’ఆ సౌందర్యపు పలకరింత కు దిగ్భ్రాంతు డయ్యాడు ఆ గుప్త సౌందర్యానికి అచేతనం గా చూస్తూ ఉండి పోయాడు .అలా ఎంతకాలం తదేకం గా ఉన్నాడో గుర్తు లేదు .క్రమం గా కను మరుగై కలలోంచి జారి పోయి నట్టుంది ‘’

               ఆ రాత్రి అంతా ఆమె ముగ్ధ సౌందర్యపు ఆలోచనలతో అతనికి నిద్రే లేదు ఆ సౌందర్యం అతడిని వివ శుడిని చేసింది .బుజ్జగించి ,లాలించి జోల పాడి నట్టుంది .తన్మయత్వం తొ అచేతనుడిని  చేసింది .మర్నాడు అదే తీరున కూర్చుని సౌందర్యారాధన చేశాడు .’’తారున్యపు తొలి చాయలు ఆమె చెక్కిళ్ళు యెర్రని కెంపు లాంటి చీర .ఆకాశానికి ఎగసిన అగ్ని శిఖా ‘’లాకన్పించింది.మరీ పరి శీలించి చూస్తె ఆ ఎర్రదనం పలుచ బడి సుప్త సౌందర్యం పరవశున్ని చేసింది .భార్య పసి గట్టింది .తనను కాదని అతని మనసు ఎవర్నో ఆకర్షించిందని ఈర్ష్య పడింది .చలి గాలిలో అలా ఎందుకు కూర్చుంటారు అంటూ చెప్పలేని బాధ తొ ప్రేమతో చెప్పింది .అయితే ఆమె ను చూడటం తనకి వ్యసనమే అయింది .ఒక్కో రోజు అసలు కన్పించేది కాదు ఆ తర్వాత ‘’యెర్రని తాంబూలచర్వణం తొ తామసం కల్గించే పెద్ద ముత్తైదువ లాయెర్రని కోపం తొ ఒక్కోసారి దిగులుతో కుంచించుకు పోయి కన్పించేది .చేత నైతే ఆమె దుఖం తీర్చాలని ఉబలాట పడే వాడు .అశక్తత వల్ల ఏమీ చేయ లేక పోయే వాడు కిటికీ దగ్గర అలాగే తపస్సు చేసే వాడు ఆమె కోసం .కళ్ళు అశ్రు శిక్తాలయ్యేవి .భార్య ఎప్పుడో తట్టి లేపి అతని కన్నీరు చూసి దిగ్భ్రాంతి చెందేది .అప్పటికే చీకటి పడి ఆమె అదృశ్య మయేది .భార్యకు ఇతన్ని చూస్తుంటే దిగులేసింది .

             ఓ నాటి సాయంత్రం ప్రత్యేకాలన్కరణం తొ ఆమె కని పించింది .ఆ సౌందర్య సందర్శ నంతొ లీన మయ్యాడు .భార్య ఏడుపు తొ ఈలోకం లోకి వచ్చాడు .ఆమె ఈతని బాధకు కారణం అడిగింది కన్నీరే జవాబు .’’మీరేవరినో చూస్తున్నారు మీ ఇద్దరి  రాయ బారాన్ని నేను గమనిస్తున్నా .నేను చచ్చినా ఆమె ముఖం చూడను గాక చూడను‘’అంది ఆమెను భర్త కిటికీ దగ్గరికి లాక్కేల్లినప్పుడు .చివరికి ఆమె ను చూపించాడు .ఆమె నిర్ఘాంత పోయింది ఆశ్చర్యం, విస్మయం ఆమె ను అవాక్కు చేశాయి .అయితే భర్తను నమ్మలేక పోయింది .మోసం చేస్తున్నడను కొన్నది .’’నేను రోజు చూసేది ఈ సంధ్యనే .ప్రతి రోజు పడమటి ఆకాశాన్ని వెలిగించే పెద్ద ముత్తైదువ .పెదవుల పై కేందామర ,చెక్కిళ్ళ పై రంగులు ఆమె నిత్య యవ్వని ఆ సౌందర్యానికి మూర్చ పోనీ దెవ్వరు ?’’అన్నాడు .

                భార్యకు ఒకటే నవ్వు .దీపాలు వెలిగాయి .సంధ్య జేగురైంది .భార్య మంగళ సూత్రం కళ్ళ కద్దు కొని అఆతని కళ్ళల్లోకి చూసి లోపలికెళ్ళి పోయింది ‘’సంధ్యనూ అతడినీ ఏకాంతం గా వదిలేసి ‘’అని ‘’సంధ్యా వందనం‘’చేస్తాడు కవి గా రచయిత గొల్లపూడి .సస్పెన్స్ లో అద్భత మైన కధా గమనం కొసమెరుపు భార్యకు ఊరట .-భర్త ఈ వయసులో ఎవరి పైనా మరులు గోన నందుకు .,తన మాంగల్యం పచ్చ గా నిల్చి నందుకు .చిన్న విషయాన్ని మహాద్భుత రీతి లో గొప్ప కేన్వాస్ పై చిత్రించిన నేర్పు ఇది .ఆ సౌన్దర్యారాధనకు ,వర్ణనకు మనసు పరవ శిం చదామనకు కూడా? .అదే మారుతీయం .గొల్లపూడి తనం , గొప్పదనం ,నూతనత్వం. ఆ సంధ్యా సుందరికి ఆనంద నీరాజనాలు ‘

మరో కధలో మళ్ళీ కలుద్దాం

సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –20-12-12-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

గొల్ల పూడి కధా మారుతం –21 కీర్తి శేషుడు -2

  గొల్ల పూడి కధా మారుతం –21

                                      కీర్తి శేషుడు -2

 చివరికి భార్య రాజమ్మను కనుక్కొని వివరం గా నాగులు చావు సంగతి చెప్పాడు .ఆమె లో సతీత్వపు గుర్తు ఆమె ను అంద గత్తే ను చేసింది ..చావు కబురు విని ‘’చెడి పోయిన కుర్రాడు తప్పి  పోతే వాడిలో మంచి తనాన్ని గుర్తు చేసుకొని ఏడ్చే తల్లిలా ఏడ్చి గోల పెట్టింది’’ట .నాగులు పై కోపం లేదా అని అడిగితే ‘’ఆడు మంచోడే బాబూ !మా అమ్మకీ అన్నకీ ఆడు నన్ను సరిగ్గా ఎలుకోలేదని గుర్రు .మా బాధ ఆళ్ళకి తెలీదు నాకు పిల్లల్లేక పోతే నేనేడ  వాలి ఆడేందు కేడవాల ? ముత్తమ్మను చేరాడు మగాడు ఆల్లకు ఎదురు సెప్పి బతగ్గలమా ‘’అంది .ఆ ‘’లంపెన్ ‘’సొసైటీ లో మగాళ్ళంతా అంతే కదా .వాళ్ళతో సర్దుకు పోతేనే జీవితం ,నిండుతనం .చీటికి మాటికి తగాదాలాడుతూ కాపురం చేయలేరు వాళ్ళు .ముత్తమ్మ దగ్గర కెళ్ళటం ఇష్టం లేక పోయినా ఆగుతాడా? సోసీ సూడ నట్టు సర్దుకు పోవాల ‘’అనే జీవిత సత్యం తెలిసి బతుకు తోంది రాజాలు

                 వాడి చేతి రవ్వల ఉంగరం గుర్తు చేస్తే తానే అది చేయించి ఇచ్చానని ,పెట్టుకొని వారం కూడా కాలేదని బాధ పడింది .తానేం సంపాదిన్చక్కర్లేదని అన్న ఇంటిని సూత్తాడు తన డబ్బంతా నాగులుకు ఇస్తున్నందుకు తిడతాడు అని చెప్పింది ఇది సతీత్వం పై ఆమె ఏర్పరచుకొన్న నమ్మకం .,విశ్వాసం .అవి ఆమె మాటల్లో కన్పించాయట రచయితకు .’’నాగులు పట్ల దూషణ ను కనీసం ఆమె మనస్సు లో నైనా కాపాడుకొంది‘’అని తృప్తి పడతాడు .నాగులు చని పోతు ఉంగరాన్నే కాదు మరో అందమైన గుర్తు ను కూడా వదిలి పోయాడు అది ఆమె మనసుకే ప్రత్యేకం తీపి ముద్ర అది చేరిపినా చేరగానిది ,తరగని గని . 

      ‘’నాగులు ఏ రాజకీయ నాయకుడో సాహితీ వేత్త ,సంగీత విద్వాంసుడోధన వంతుడో కాదు యజమాని దృష్టిలో .,పిల్ల నిచ్చిన వాళ్ళ దృష్టిలో సుఖాన్నిచ్చిన వాళ్ళ దృష్టిలో వాడొక అసమర్ధుడు చేతకాని వాడు .కాని కట్టుకొన్న పెళ్ళాం దృష్టిలో మాత్రం వాడొక కమ్మని కల ‘’అంత మాత్రం చేత లోకం వాడిని గుర్తుంచుకో వాల్సిన అవసరం లేదని సమాప్తం చేస్తాడు .నాగులు కీర్తి శేషుడే అందరి దృష్టిలో అయితే ఆ కీర్తి భార్యకే దక్కింది .అది ఆమె స్వంతం .మిగిలిన వారందరి దృష్టిలో వాడొక మృత జీవుడే .ఆమె దృష్టిలో జీవన్మృతుడు .కట్టుకొన్న వాడు కొట్టినా తిట్టినా సహించడమే కాక ‘’,పైమేత ‘’అలవాటు పడ్డా అర్ధం చేసుకోగల సగటు ఆడ మనిషి ఆమె .అందుకే లోపల ఎంత బాధ ఉన్నా ,తట్టు కొని నిల ఆడింది .

              ఆ ఊళ్లోనే తన కంటి ఎదుటే భర్త అలా ప్రవర్తిస్తున్నా ,అతనిలో మంచినే చూసింది పిల్లలు పుట్టాక పోవటం తన తప్పు గానే అనుకోంది .ముత్తమ్మ వ్యవహారం లో వాడి తప్పేం లేదని ఊరడించుకోంది .పురుషాధిక్య లోకం లో ప్రతి ఆడదీ ప్రవర్తించి నట్లే రాజమ్మా ప్రవర్తించింది .తన మనో రాజ్యం లో ‘’నాగ ప్రతిష్ట ‘’చేసుకోంది .వాడేక్కడున్నా ,సుఖం గా ఉండాలని కోరుకోంది .వాడు పోతే కట్టలు తెగిన దుఖం తొ రోదించింది ఆమె ఒక్కతే .సతీత్వపు గుర్తు ఆమెనిలా చేయించింది .మూడు ముళ్ళ బంధం ఎంత గట్టిదో అతి సామాన్యులలోను ఆ పవిత్రత ను  కాపాడు కొనే పద్ధతిని ఎలా అవలంబిస్తారో రాజమ్మ లో చూపించాడు మారుతీ రావు .’’నీ సుఖమే నే కోరుతున్నా –అందుకే నేనుంటున్నా ‘’అని పాడి నట్లు గా జీవించింది రాజమ్మ .అతన్ని కీర్తి శేషుని చేసిన రాజమ్మ ఆంతర్యం దొడ్డది .ఆ కీర్తి ఆమెది .,ఆమెకే స్వంతం .ఆమె వల్లనే అతడు చరిత్ర కెక్కాడు .కధా నాయకుడయ్యాడు .లేకుంటే మామూలు ‘’నాగులు గాడే ‘’ఆయె వాడు .తన మనో శిఖరం పై అతనికో గొప్ప ఉన్నత సింహాసనంవేసి కీర్తి కిరీటం పెట్టింది .సతీత్వపు బావుటా ఎగుర వేసి, కధా నాయిక అయింది రాజమ్మ .

             మరో కధలో కలుద్దాం

       సశేషం –మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ – 19-12-12- ఉయ్యూరు 

Posted in రచనలు | Tagged | Leave a comment

కాశీ ఖండం -32 జ్ఞాన వాపీ ప్రశంస

        కాశీ ఖండం -32

 

                                జ్ఞాన వాపీ ప్రశంస

  స్కందుడు అగస్త్యర్షికి జ్ఞాన వాపి ప్రశస్తిని తెలియ జేశాడు ..కాశి లో మణి కర్ణిక ఉత్తమ మైన తీర్ధం .అది స్నానం సకల పుణ్య ప్రదం .యతీశ్వరులు కూడా మణి కర్ణిక కు వస్తారు ముక్తి కోసం .ఇక్కడి స్నానం ముక్తి దాయకం .గంగా నది మధ్య నుండి హరిశ్చంద్ర ఘాట్ వరకు గంగ నుంచి బిందు మాధవం వరకు స్వర్గ ధామంమణి కర్ణిక .కళా వతి చిత్రాన్ని మాటి మాటికీ చూస్తోంది .జ్ఞాన వాపిని కాల భైరవుడు నిరంతరం రక్షిస్తూ ఉంటాడు .అష్ట మూర్తి అయిన మహాదేవుడు జ్ఞాన వాపి లో ఉన్నాడు ఆయన్ను చూసి సంభ్రమాశ్చర్యాన్ని పొందింది .కళా వతి శరీరం కంపించి చిత్ర పటం జారి కింద పడింది .చెలి కత్తేలు గమనించి ,ఆమె విరహ వేదన గ్రహించి శైత్యోప చారాలు చేశారు .ఆమెకు పూర్వజన్మ జ్ఞానం జ్ఞాన వాపి వల్ల కలిగింది .ఆ విషయాన్ని చెల్లి కత్తేలకు చెప్పింది

             పూర్వజన్మ లో తాను హరిస్వామి కుమార్తె సుశీలనని తనను విద్యాధరుడు ఎత్తుకొని పోతుంటే రాక్షసుడొకడు అడ్డు తగిలి అతని చేత చచ్చాడని ,తాను మరణించి కర్నాటక లో మలయ కేతునికి కలా వతి అనే కుమార్తె గా జన్మించానని వివరం గా చెప్పింది .అందరు జ్ఞాన వాపి గొప్ప దనాన్ని పొగిడారు .భర్త మలయ కేతుని చూసి ఇలా అన్నది ‘’మీరు నా మీద చూపుతున్న ప్రేమ ,ఆదరణ మిగిలిన వారి మీద చూపటం లేదు కాశీ వెళ్లి విశ్వేశ్వర దర్శనం చేస్తే మీకు అన్నీ తెలుస్తాయి‘’అన్నది .అప్పుడాతడు ఆమె ను వదిలి ఉండలేనని చెప్పి పుత్రులకు అన్నీ అప్పగించి భార్య తొ కాశీ చేరుకున్నాడు . .అక్కడ గంగా స్నానం చేసి విశ్వేశ్వరుడిని సందర్శించి పులకించి పోయాడు .రాణి తొ కలిసి జ్ఞాన వాపి లో స్నానం చేశాడు .

             ఇంతలో ఒక యోగి వచ్చి వారి చేతిలో కొంత విభూతి పెట్టి ,ఆశీర్వదిస్తూ ‘’ఈ రోజు మహా నేపధ్యం .ఒక్క క్షణం లో నక్షత్రాలు ఉదయిస్తాయి ‘’అన్నాడు .ఇంతలో ఘంటా నాదాలు చేస్తూ ఒక విమానం అక్కడికి చేరింది .దాని నుండి చంద్ర మౌళి దిగాడు వెంటనే చెవిలో ఏదో బోధించాడు .అప్పుడొక మహా జ్యోతి అక్కడ ప్రజ్వ రిల్లింది .తర్వాతా చంద్ర మౌళీశ్వరుడు తన ఆలయానికి వెళ్లి పోయాడు .జ్ఞాన వాపి ప్రత్యక్షం గా జ్ఞానాన్నిస్తుంది .అది సర్వ జ్ఞాన మయం సర్వ లింగ మయం .అప్పటికప్పుడు పవిత్రం చేస్తుంది .మరణ కాలం లో కూడా మహా జ్ఞానం నశించదు .ఈ కధ విన్నా ,చదివినా అందరికి పుణ్యం లభిస్తుంది అని కుమారస్వామి అగస్త్య మహర్షికి తెలియ జేశాడు .

            కాశీ ఖండం మొదటి అధ్యాయం సమాప్తం

            సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –19-12-12-.ఉయ్యూరు 

 
Posted in రచనలు | Tagged | Leave a comment

గొల్ల పూడి కధామారుతం –20 తొమ్మిదవ కధ –కీర్తి శేషుడు -1

 గొల్ల పూడి కధామారుతం –20

 

                  తొమ్మిదవ కధ –కీర్తి శేషుడు -1

 దిగువతరగతి మనస్తత్వానికి అడ్డం పట్టే కధ ‘’కీర్తి శేషుడు ‘’చని పోయిన ఒక వ్యక్తీ గురించి వాళ్ళ దగ్గరి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో ,అందులోను వాళ్ళసామాజిక స్తితిని బట్టి ఎలా స్పందిస్తారో చూపుతాడు రచయిత .వాళ్ళ మీద మనకు సహ్రుదయతే కలుగు తుంది .ద్వేషం, ఏవ గింపూ రావు .అంత బాగా పరిశీలన తొ రాసిన కధ ఇది .ఇందులోనూ రచయితే కధ చెబుతాడు .అలా చెప్పటం మారుతీ రావు కు మహా ఇష్టం .కారులో ప్రయాణిస్తున్న రచయితకి ఓ కట్టెల లారీ పల్లం లోకి దొర్లి పల్టీలు కొట్టి ,దాని పై ప్రయాణించే వ్యక్తీ కింద పడిపోయి కట్టేల్లో కూరుకు పోయి అతని పై లారీ ఉండగా ‘’తెగిన తోక ‘’లా చేయి మాత్రమె బయటకు వచ్చి గలగలా కొట్టుకొని చని పోయి నట్లు దూరం నుండే చూశాడు .లారీ డ్రైవరు క్లీనరూ పరారీ .జనం పోగయ్యారు .ఇంతలో ఓ జీపు వచ్చి ,అందు లోంచి ఓ బుర్ర మీసాలయన దిగి చూసి ,జీపుని ముందుకు నడి పించేశాడు .పోలీసులూ చేరారు ఆక్సి డెంట్ ప్రదేశానికి .ఇన్స్పెక్టర్ దిగి ‘’పూర్ మాన్ –లారీ లెక్కి కూర్చుం టారీ  రాస్కెల్స్ .యే చెట్టుకో గుద్దు కున్నా ముందు వీళ్ళే చస్తారు ‘’అన్నాడు తనకేం పట్టనట్లు.మృత్యువు ఒక జీవితానికి అతి ముఖ్య సంఘటన అయితే –అతినికి దైనందిన కార్య క్రమం .మృత్యువు కు దగ్గరగా వస్తు పలకరిస్తూ ,దాని పైశాచిక దృశ్యాన్ని తరచు చూస్తూ సాగి పోతుంటారు పోలీస్ వాళ్ళు ‘’అని ,వాళ్ళ నైజం పై సహజ సిద్ధ మైన వ్యాఖ్యానం చేస్తాడు గొల్లపూడి .

  చని పోయిన వ్యక్తీ చేతి పై ‘’నాగులు ‘’అన్న పచ్చ బొట్టుంది .కొత్త బంగారపు ఉంగరం ఉండి .’’ఎక్కడో కొట్టేసి ఉంటాడు .దొంగ రాస్కెల్ .కూలీ వెధవకు బంగారున్గారమేమిటి ?అన్నాడు సబ్ .’’కలప కళాసీ కి ఉంగరం అర్హత లేని విలాసం స్తోమతు లేని సరదా .నలుగురి అపహాస్యానికి అవకాశం .కూలీ చచ్చినా ,అతని కళ్ళు ‘’చారెడు ‘’ఉండ టానికి వీల్లేదు‘’అని సామాన్యునికి ,మాన్యునికి భేదం కూడా చెప్పాడు .అదే మొట్ట లావోడు అయితే ‘’చచ్చిన బిడ్డ బారెడు ‘’సామెత వర్తిస్తుంది .పోలీసు జీబు లోంచి ‘’ఓ నల్ల శానం లాంటి శాల్తీ దిగింది .గ్లాస్కో లుంగి ,సిల్కు లాల్చీ ,బంగారున్గరాలు ,గార పళ్ళు ,యెర్ర బొట్టు .దిగుతూనే లబో దిబో మంటూ ‘’లారీని ‘’పరా మర్శించాడు .వేలకు వేలు నష్టం తెచ్చిన డ్రైవర్నిబండ బూతులు తిట్టి వాడిని  ఎలా గైనా వెతికి పట్టుకొని ,నష్ట అరిహారం ఇప్పించాలని త్వరగా లారీని తీసుకు వెళ్ళే పర్మిషన్ ఇప్పించాలని గోల చేశాడు .అతడే ‘’ఓనరుడు ‘’లారీకి .లారీ కింద శవం ఉందన్నాడు సబ్ .’’ఉండకేం చేస్తుంది ?ఆ వెధవేప్పుడూ పైనే కూర్చుంటాడు .తప్ప తాగి బయల్దేరి ఉంటారు .ణా కొంప మీదకు తెచ్చారు .’’అని అందర్ని తిట్లతో లంకిన్చుకొన్నాడు .ఎన్నెల్ల బట్టి నాగులు పని చేస్తున్నాడని సబ్ అడిగిన దానికి తన కింద ఎంతో మంది ఉంటారని ఎవరేప్పుడు చేరారో చెప్పలేనని తప్పించుకొన్నాడు .ఎక్కడుంటాడో ఆ తాగు బోతూ వెధవ అని అడ్రెస్ కూడా చెప్పా లేదు .చావు లో కూడా సాను భూతి సహాయం ఆలోచించని శాల్తీ అది .ఎవరు అతనితో నిజం చెప్పలేరు .డబ్బుకు లోకం దాసోహం .

     రచయితే నాగులు అడ్రెస్ కోసం వాకబు చేసి గూడెం లో నాగుల ఇల్లు పట్టుకొన్నాడు .ఓ ముసల్డీ ,ఓ యువకుడూ ఉన్నారింట్లో .నాగులు చచ్చిన వార్త వాళ్లకు చెప్పాడు .’’ఆడిగురించి మాకేటీ సేప్పోద్దు .ఆఎదవ గురించి మేం ఇన దలచుకో లేదు ‘’అంది ముసల్ది .’’సత్తే సచ్చాడు లంజ నాకొడుకు ‘’అన్నాడు పక్క నున్న వాడు .వాళ్ళిద్దరూ నాగులు అత్తా బామ్మర్ది అని అర్ధ మైంది .తన కూతురు మనువు పాడు చేశాడని ముసల్ది ఏడిస్తే బావ మీద కోపం ఎందుకో అర్ధం కాలేదు ‘’’’ఆడు సావక పోతే నేను సంపెద్దును ‘’అన్నాడు వాడు మళ్ళీ .అంటే వాడు ఎలా ఎందుకు చని పోయాడో ఎవరికి అక్కర్లేదు .చేతికి ఉంగరం ఉందని చెప్పాడు రచయిత .పోలీసోడు దొబ్బెస్తాడేమో నని తొందర్లో తానే కొట్టేయ టానికి బామ్మర్ది ‘’పారందు ‘’కొన్నాడు .వాడక్కర్లేదు వాడి వస్తువు పై అంత మోజు .వాడు ఎట్టాగో తిరిగి రాడు .దాన్నైనా దక్కించుకొందామని ఆరాటం .ముత్తమ్మ నాగులు ‘’లంజ ‘’అని తెలుసు కొన్నాడు .పెళ్ళాం రాజమ్మ పుల్లలు యేరు కోటానికి వెళ్ళిందని తెలిసింది .మొత్తం మీద ముత్తమ్మ ,ఓ బడ్డీ కొట్టు ఆసామి తొ మాట్లాడుతుండటం చూశాడు .ఆమె చూపుల్లో ఆహ్వానం, వాడి చూపుల్లో ‘’ఆకలి ‘’ఉన్నట్లు గుర్తించాడు .అందం గా తెల్లగా ఉండది రాణీలా చిలకలా ఉంది .ఆకర్షణ ఉండి మత్తు ఉంది..బిగువైన ఒళ్ళు ఉంది ..నాగులు చచ్చి పోయాడని చెప్పాడు .నిర్లక్ష్యం గా ‘’యే నాగులూ‘’అంది .రచయితకీమీ తెలియ దనుకొని ‘’ఆడో పొగరు బోతూ ‘’అంది .నాగులు మంచి వాడు కాడా అని అడిగితే‘’కట్టుకొన్న పెళ్ళాన్ని కాదన్న ఓడు ఆడూ మనిషేనా ?ఇంటిని కట్టుకో లేని వాడు ఊరి నేలు కుంతాదంటే ఎవర్నమ్ముతారు తారు బాబూ ‘’అంది .కట్టుకొన్న పెళ్ళాన్నె  కాకుండా చేసిన ముత్తమ్మే ఈ మాట అన్నందుకు నవ్వోచింది .’’సానిది కూడా తన బతుకు లో ఒక విచిత్ర మైన నీతి ని సృష్టించు కొంటుంది .అవి నీతి లోను నీతిని చూప లేని నాగులు సుఖం గా బతకటం ముత్తమ్మ ఉద్దేశం కాదు ‘’అంటాడు అవి నీతి లో నీతిని ఆమె కన్నీటి చుక్క కు నోచుకో లేదంటాడు .అద్భుత విశ్లేషణ .అందరి గుండెల లోతులు తరచ గల మహా రచయిత చేసే విధానం ఇదే .గిరజాల జుట్టు బడ్డీ వాడి పెదవుల పై మంద హాసాన్ని రచయిత చూశాడు .

             సశేషం –మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –18-12-12- ఉయ్యూరు 

Posted in రచనలు | Tagged | Leave a comment

కాశీ ఖండం –31 జ్ఞాన వాపి (బావి )మహాత్మ్యం

 కాశీ ఖండం –31

                   జ్ఞాన వాపి (బావి )మహాత్మ్యం

అగస్త్యునికి కుమారస్వామి కాశీ లోని జ్ఞాన వాపి మహాత్మ్యాన్ని వివరించాడు .పూర్వం దేవ యుగం లో ఈశానుడు స్వేచ్చగా తాండవ నృత్యం చేస్తున్నప్పుడు దాహం బాగా వేసి నీటి కోసం వెతి కాడు .అప్పటి స్తితిలో మేఘాలు వర్షిమ్చటం లేదు .నదుల్లో ,బావుల్లో నీరే లేదు .దొరికిన నీరైనా ఉప్పు కషాయం .నరసంచారం తగ్గింది .ఆనంద కాననం అని పిలువా బడే కాశీ క్షేత్రం ఊసర క్షేత్రమయింది .మరణాల సంఖ్య పెరిగి పోతోంది ..ఈశానుడు కాశీ నగరం చేరాడు .అక్కడ జ్యోతిర్లిన్గాన్ని చూసి ఆశ్చర్యపోయాడు .ఆ లింగానికి  అభిషేకం చేసి ,ఆ తీర్ధాన్ని త్రాగాలను కొన్నాడు .తన చేతిలోని త్రిశూలాన్ని శివాలయం దగ్గర భూమి పై గుచ్చాడు .అక్కడ ఒక కుండం ఏర్పడింది .అది పూర్తిగా నీటి తొ నిండి పోయి,చుట్ట ప్రక్కల ప్రదేశం కూడా నీటి తొ నిండింది .ఆ మహోదకం తోఈశానుడు జ్యోతిర్లిన్గాన్ని అభి షెకించాడు .

          ఆ  కుండం లోనీ నీరు ఉత్తమ హృదయం లా స్వచ్చం గా ,వెన్నెలలా తేటగా ,శంఖం లా శివుని నామం లా పవిత్రం గా ఉంది .అమ్రుతోపమానం గా ఉంది పంచామృతాలతో ఈశానుడు ఆ జలం తొ జ్యోతిర్లిన్గాన్ని తనివి తీర వెయ్యి ఘటాల జలం తొ .అభి షెకించాడు.సంప్రీతి చెందిన రుద్రుడు ప్రత్యక్ష మైనాడు .’’నీ సహస్ర ఘటాభి షెకానికి సంతోషించాను .నువ్వు కోరిన యే వరమైనా ఇస్తాను కోరుకో ‘’అన్నాడు .అప్పుడు ఈశానుడు ఆ తీర్ధం ఆయన పేరు తొ పిలువ బడాలని కోరాడు విశ్వేశుడు ‘’అన్ని లోకాలలోనూ ఉన్న తీర్దా లన్నిటిలో ఇది ప్రసిద్ధమవుతుంది .దీన్ని శివ తీర్ధం అని పిలుస్తారు .శివం అంటే జ్ఞానం కనుక జ్ఞాన తీర్ధం ఇది .ఈ జ్ఞాన వాపి మహా ప్రసిద్ధి చెందుతుంది .తాకితేనే పాపాలను నశింప జేస్తుంది .అశ్వమేధ యాగ ఫలం లభిస్తుంది .ఈ జలం తొ పిండ ప్రదానం చేస్తే కల్పాంతం వర కు శివలోకం లోనే ఉంటారు . .జ్వరం మొదలైన అపస్మారకాలు శివ తీర్ధం చేత పొగొట్ట బడుతాయి .ఇక్కడ శివుడు ద్రవ రూప మైన జ్ఞాన స్వరూపుడు గా ఉండి అలసత్వం మొదలైన వాటిని తొలగిస్తాడు .జ్ఞానాన్ని బోధిస్తాడు .

               స్కందుడు అగస్త్యునికి ఒక కధ చెప్పాడు .పూర్వం కాశి లో హరి స్వామి అనే బ్రాహ్మణుడు ఉండే వాడు .ఆయన కు అతి లోక సౌందర్య వతి అయిన సుశీల అనే కూతురుంది .ఆమె సూర్యుడికి భయ పడి చీకటి లో దాగుకోనేది .రోజు జ్ఞాన వాపి దగ్గర స్నానం చేసి శివుడిని ఆరాధించేది .ఒక రోజు ఆమె ఇంటి బయట నిద్రిస్తుంటే ఆమె అందానికి ముగ్దు డైన ఒక విద్యా ధరుడు ఆమెను ఎత్తుకొని పోయాడు అప్పుడు విద్యున్మాలి అనే రాక్షసుడు అతడిని అడ్డ గించాడు త్రిశూలం తొ విద్యాధరుడిని పొడిచాడు .అతను ఒక్క పిడికిలి పోటుతో రాక్షసుడిని చంపేశాడు .సుశీల ఆ విద్యాధరుడే తన పతి అని అతని శవం మీద పడి ఏడిచింది .సుశీలను తాకటం చేత ఆమె పుణ్య వశం తొ విద్యున్మాలి రాక్షసుడు స్వర్గం చేరాడు .విద్యాధరుడు చని పోయే ముందు సుశీలను స్మరించటం చేత మలయ కేతువు అనే పర్వత రాజుకు కుమారుడు గా పుట్టాడు .సుశీల కర్నాటక దేశం లో పుట్టింది .ఆమె పేరు కళా వతి .ఆమెకు పూర్వజన్మ వాసన వల్ల చిన్న తనం నుండే రుద్రార్చన చేసింది ఒక ఉత్తరాది వాడు ఒక రోజు రాజు గారికి ఒక చిత్రాన్ని చూపాడు దాన్ని ఆయన కళా వతికి చూపించాడు .అంతే ఆమె లో చాలా మార్పు వచ్చింది

         కాశీ క్షేత్రాన్ని జ్యోతిర్లిన్గాన్ని ,జ్ఞాన కూపిని గంగా నదిని స్మరించింది .ఆ ప్రదేశాలలో తిరిగిన అనుభూతి పొందింది‘’ఇది కాల భైరవుడు క్షేత్ర పాలకుడు గా ఉన్న చోటు .ఇది కాల భైరవుని చేతి నుండి నేల బడిన బ్రహ్మ కపాల క్షేత్రం ,ఇది రుణ విమోచన క్షేత్రం ,ఇదుగో ఓంకారేశ్వరుడు ,ఇది ప్రణవాక్ష్య క్షేత్రం ,ఇది మత్సోదరి తీర్ధం ఈయన కామేశ్వరుడు ఇక్కడ ఈశ్వరుడు స్వలని (స్వలీన )పేరు తొ ఉన్నాడు స్కందేశ్వరుడు సర్వ సిద్ధి దాయకుడు .ఈయన వినాయకుడు విఘ్నాలను హరిస్తాడు ,ఈ జ్యోతిర్లిన్గాన్ని దర్శిస్తే భ్రున్గీశ్వరుడు జీవన్ముక్తు డయాడు .యజ్ఞేశ్వర ,సర్వ తీర్దేశ్వర లింగాలను సేవిస్తే అన్నీ లభిస్తాయి సారస్వత సర్వ తీర్దేశ్వర లింగాలకు అభిషేకం చేస్తే తీరని కోరిక ఉండదు .మంత్రేశ్వరుడు అన్ని మంత్రాలకు అది పతి .బాణాసురుడు పూజించిన బాణేశ్వర లింగం ఇది .ఇది ప్రహ్లాదుడు స్తాపించిన వైరోచన లింగం దీన్ని బలి కేశవుడని ,నారద కేశవుడని అంటారు .

           దత్తాత్రేయుని దత్తాత్రేయ లింగం ఇదిగో ఆదికేశావుడు మొదట దీన్ని స్తాపించాడు ఇది గదాధర లింగం దీనికి భ్రుగు కేశవుడని ,వామన కేశవుడని పేరు .ఇవి నారాయణ లింగాలు వీటికి యజ్న వరాహ కేశవులని పేరు .వీటినే నరసింహ లింగమని ,గోపీ గోవింద లింగాలని పేర్లు .ఈ నరసింహుని అనుగ్రహం తోనే ప్రహ్లాదుడు ఇంద్ర పదవి పొందాడు .ఈ ఖర్ప వినాయకుడిని శేష మాధవుడు అంటారు .ఇదే శంఖ మాధవ లింగం .ఇక్కడే శంకుడు అనే రాక్షసుడు చంప బడ్డాడు .ఇది సరస్వతి నదీ ప్రవాహం.ఇది పర బ్రహ్మ రసాయనం ఇక్కడ సరస్వతి గంగా నది సంగమిస్తాయి .ఈయన బిందు మాధవుడు .సాక్షాత్తు లక్ష్మీ పతి .ఇక్కడ స్నానం చేస్తే పునర్జన్మ ఉండదు .బిందు నాధుడు ప్రణవ స్వరూపుడు ఈమె మంగళ గౌరీ ఇది గభస్తేశ్వర లింగం .దీనికి మయూఖాదిత్యుడని పేరు .మ్రుకండుని కుమారుడు మార్కండేయుడు స్తాపించిన మార్కండేయ లింగమిది .ఇది కిరణేశ్వర లింగం ,ఇది దౌత పాపెశ్వర లింగం ,ఈయన మణి ప్రదీప నాగుడు ఇది కపీశ్వరలింగం కోతులకు కూడా మొక్షాన్నిస్తుంది .ఇది ప్రియ వ్రాతెశ్వర లింగం .ఈయన కాల రాజు .కలికాలపు పాపాలన్నీ పోగొట్టు తాడు ఇది దివ్య మందాకినీ నది .ఇది రత్నేశ్వర లింగం .ఇదే కృత్తి వాస లింగం ,ఇదే ఓంకారేశ్వర లింగం శివుని కన్ను వంటిది .ఇది గోకర్నేశ్వర లింగం శివుని చెవుల వంటిది ,ఈ రెండు లింగాలు విశ్వేసుని చేతులు .ధర్మేశ ,మణి కర్నేశులు విశ్వేషుని హస్తాలు .కాళేశ్వర కపర్దేశ్వర లింగాలు ఆయన పదాలు .జ్యేష్టేశ్వరుడు అయన పిరుదు .మధ్యేశ్వరుడు ఆయన నాభి .శ్రుతీశ్వర లింగం శివ జటా జూతం చంద్రేశుడు ఆయన హృదయం .వీరేశ్వరుడు ఆత్మ ,ఆయన లింగమే కేదారేశ్వరుడు .ఇక్కడున్న కోటాను కోట్ల లింగాలు ఆయన గోళ్ళు ,రోమాలు ఆభరణాలు విశ్వేషుని దక్షిణ హస్తం మోక్ష దాయిని .భగవతి దుర్గా దేవి పితృ లింగం .ఈమె చిత్ర ఘంటేశ్వారి .ఇది ఘంటా కర్ణుని మడుగు .ఈ విశాలాక్షి లలితా గౌరీ స్వరూపు రాలు ఇతడు అవినాశుడు .ఇది ధర్మ కూపం ఈమె విశ్వ భుజా దేవి .లోకాలనేలే చల్లని తల్లి .ఈమె బందీ మహాదేవి త్రైలోక్య వందిత .ఇది దశాశ్వ మేధ తీర్ధం ఇది ప్రయాగ తీర్ధం. తీర్ధరాజం అంటారు ఇదే గంగా కేశవా తీర్ధం మోక్ష ద్వారం స్వర్గ ధామం అంటూ ఆమె ఆ చిత్రం లో కాశీ లో ఉన్న సకల దేవతా గణాన్ని తీర్ధాలను చూస్తూ పులకించి పోయింది

        సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –18-12-12-ఉయ్యూరు 

Posted in రచనలు | Tagged | Leave a comment

కాలక్షేపానికి కమ్మని కబుర్లు –3 మనప్రయాణం

   కాలక్షేపానికి కమ్మని కబుర్లు –3

                           మనప్రయాణం

 మగవాడు తిరిగి ,ఆడది తిరక్కా చెడి పోతారని సామెత .తిరగటం అంటే చెడు తిరుగుళ్ళు అని కాదు అర్ధం .అంటే యాత్రలు ,మంచి వారి సందర్శనం అనే అర్ధం లో ఈ మాట చెప్పారు .మరి ఆడ వారి విషయం లో తిరుగుడు కు చెడ్డ అర్ధ మే ఉంది . కనుక అందరు జాగ్రత్త గా ఉండాలని అభిప్రాయం .మంచి తిరుగుళ్ళకు అర్ధం ,పర మార్ధం ఉంటుంది .లేకుంటే ఆ తిరుగుళ్ళు కొంప ముంచుతాయి .తస్మాత్ జాగ్రత్త .ప్రయాణం అంటే యానం అని పేరు ఉంది .శ్రీ రాముని ప్రయాణమే రామాయణం .సీతా దేవి యానం సీతాయణం అవుతుంది .రామాయణం లో రామ యానం ,సీత యానం రెండు ఉన్నాయి .యానం అంటే పడవ అని అర్ధం ఉందట బౌద్ధం లో .

           గౌతమ బుద్ధుడు మహాత్ములను రెండు గా విభజించాడు .మొదటి వారిని ‘’అర్హతులు ‘’అని రెండవ వారిని‘’బోధి సత్వులు ‘’అని విభజన చేశాడు .అర్హతులకు జ్ఞాన విభూతి చైతన్యం ఉన్నా వారికి ఇతరులకు బోధించే అర్హత లేదు కనుక గురువులు కాలేరు .బోధి సత్వులు మాత్రమె గురువులని పించుకొంటారు .దీనిని బట్టే బౌద్ధ మతం లో రెండు శాఖలేర్పడ్డాయి అవే హీన యానం అని మహా యానం అని పేర్లతో పిలువబడ్డాయి .హీన యానం అంటే చిన్న పడవ .మహా యానం అంటే పెద్ద పడవ  . అర్హతులు చిన్న పడవలు గా మారారు .దాని ద్వారానే ప్రయాణం చేసి సంసార సాగరాన్ని దాటుతారు . ఇంకెవరికి ఆ పడవలో చోటు లేదు .బోధి సత్వులు పెద్ద పడవలు గా మారారు .ఎందరి కైనా అందులో చోటు కల్పించ గలరు .వీరు బోధన వల్ల ఎంత మంది నైనా భవసాగరాన్ని దాటించే సమర్ధత గల వారు .అని చెబుతారు .

             మానవ జీవన యానం లోపుట్టుక , బాల్యం యవ్వనం వృద్ధాప్యం ,మరణంవరుస క్రమం .అంత్య దశ లో భగవంతుని స్మరణమే ముక్తికి మార్గం అని మహాత్ములైన గురువులు బోధించారు .ముసలి తనం తప్ప మిగిలిన దశలంటే అందరికి ఇష్టం .వృద్ధాప్యం అంటే భయమే .దీన్ని జరఅంటారు . తర్వాత వచ్చేదే మరణం .ఇవేవీ తప్పించుకోలేనివి .జర అంటే ముసలి తనం ‘’జ్రువయో హానిహ్ ‘’ అంటే క్షీణా వస్త ను తెలియ జేసేదని అర్ధం .శరీరం లోనీ సర్వ అంగాలు క్రమం గా క్షీణిస్తాయి శిధిలం అవుతాయి . హిందీ భాష లో జర ..అంటే కొంచెం అని అర్ధం ఒక్క తృష్ణ తప్ప అన్నీ కొద్దిగా నే మిగిలి ఉంటాయని భావం .గుజరాతీ భాష లో దీనినే ‘’ఘట్ పన్ ‘’అంటారు .అన్నీ తగ్గటమే. పెరగటం అనేది ఉండదని భావం .యువకులు వ్రుద్దులులను చూసి నవ్వుతారు .కానీ వారికీ ఆ దశ తప్పదు అని మర్చి పోతారు ..రాలి పోయే పువ్వులను చూసి మొగ్గలు నవ్వుతాయి కానీ తమకీ ఆ పరిస్తితి వస్తుందనే జ్ఞానం ఉండక పోవటమే నవ్వటానికి కారణం..ఇదంతా తెలిసిన వారికి మోక్షమే అంటారు మహర్షులు ‘      

 మరో కొత్త కబురు తొ ఈ సారి కలుద్దాం .

             మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –17-12-12-ఉయ్యూరు 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

గొల్ల పూడి కధా మారుతం –19 ఊర్వశీ –పురూరవ –2(చివరి భాగం )

 

            గొల్ల పూడి కధా మారుతం –19

                      ఊర్వశీ –పురూరవ –2(చివరి భాగం )

   ఇంటి కొచ్చిన మాలతి ‘’అవేం పన్లండీ ?’’అంది నవ్వుతు .తేలు కుట్టిన దొంగే తను .’’వయసు పై బడ్డ కొద్దీ చిన్న వారై పోతున్నారు మరీ “’అంది .’’కేసు వాదించలేని ప్లీడరు పరిస్తితి ‘’అతనిది .ఏదో సంజాయిషీ చెప్పాలని ‘’కిటికీ తీసి చూడంగానే నువ్వు కని పించావు ‘’అన్నాడు .’’చాల్లెండి .ప్రతి రోజు అక్కడే నిలబడి చూస్తుఉంటారటగా ఆవిడ అంతా చెప్పింది ‘’అన్నది .నోట మాట రాలలేదు .ఇలాంటి వి ఆడ వాళ్ళు మాట్లాడు కుంటారని ,తన భార్యకే ఆమె చెప్పిందని విని దిమ్మ తిరిగింది .ఇక అతనికి ఆ ఇంట్లో ఉండటం ఇష్టం లేదు .వేరే ఇంట్లోకి మారాడు .భార్య మాత్రం ఏమీ మాట్లాడదు .నవ్వుతుంది అంతే .ఇది మరీ బాధించింది . .ఇతని సైకో అనలిస్ట్ మిత్రుడికి ఆ వూరు బదిలీ అయింది ఇల్లు కావాలంటే తాను ఇదివరకున్న ఇల్లే చూపించాడు .ఒక నెల రోజులు బ్రహ్మ చర్యం వెలిగించమని సలహా చెప్పాడు .ఓ పది హేను రోజుల తర్వాత మిత్రుడిని చూడ టానికి వెళ్లాడు .తన అనుభవమే అతనికీ అయిందని తెలిసి ఆశ్చర్య పోయి ,’’ఆమె కధ‘’లోనీ ఆంతర్యం అడిగాడు ఎనలైజ్ చేసి చెప్తాడనే ఆదుర్దాతో .అతని మాటల్లో ‘’ఆ అమ్మాయి ఎవర్నీ ప్రేమించదు .తనను తానే ప్రేమించు కొంటుంది .ఆమె లో విచిత్ర మైన ‘’వానిటీ ‘’ఉంది.మన మీద ఆసక్తి కంటే తనమీద తనకు ఆసక్తి ఎక్కువ .

            తను ఇతరుల్ని ఆకర్షిస్తోందా లేదా అన్నదే ఆమె ఆలోచన .ఆమె అందానికి ముగ్దులమవుతున్నాం అనే ఆలోచన ఆమెకి కావాలి .ప్రతి స్త్రీ లోను ఈ కోరిక ఉంటుంది .కొందర్లో అంతర్గతం గా ఉంటె మరి కొందర్లో కళ్ళల్లో, చేతల్లో బయట పడుతుంది .కానీ ఈ అమ్మాయి మరీ విచిత్ర మైంది .మనం చూస్తున్నట్లు తృప్తి పడటమే కాదు నలుగురు తనకు లభించిన ఈ అవకాశానికి ఈర్ష్య పడాలని ఆమె ఆరాటం .నలుగురికి మనల్ని చూపి తన గర్వాన్ని చాటు కోవాలి ..తన కోసం ఎదుటి వాడు పడి చస్తాడని తనకు మాత్రం అది విసుగు అనీ ,ఇందులో ఆశ్చర్యమేదీ లేదని ,అందుకే మనల్ని అక్కడ కట్టి పడేసి ,నలుగుర్నీ తీసుకొచ్చి తానే చూపిస్తుంది ‘’అని ఆమె సైకాలజీ ని వివ రించి చెప్పాడు .ఆశ్చర్య పోతున్న రచయిత తొ ‘’చివరికి మీ ఆవిడనీ  ఆవిడే పిలిపించి చూపించింది ‘’ చిత్రం అని పించింది .అతనే మళ్ళీ ‘’కొందరి అందం బుజ్జ గించి జో కొడితే ,మరి కొందరి అందం రెచ్చ గొట్టి భయ పెడుతుంది ‘’.అణు శక్తి ‘’అంతటిది అందం .కొందరు శాంతికి వాడితే ,మరి కొందరు  వినాశనానికి వాడుతారు .’’అని అందం అనేది రెండంచుల కత్తిఅన్నట్లు చెప్పాడు .విచిత్ర మైన మనస్తత్వం .ఈ విషయం తెలిశాక రచయితకు ‘’ఊర్వశీ పురూరవ ‘’కాలెండర్ గాలికి కదుల్తూ వెక్కి రించి నట్లుంది ‘’ అని ముక్తా ఇంపు ఇస్తాడు .అదీ గొల్ల పూడి కధానాయికల వైవిధ్యం

    మరో కధ తొ ఈ సారి

              మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ –17-12-12- ఉయ్యూరు .

 

Posted in రచనలు | Tagged | Leave a comment

కాశీ ఖండం –30 దండ పాణి ఆవిర్భావం

         కాశీ ఖండం –30

                           దండ పాణి ఆవిర్భావం

  పూర్వం రత్న భద్రుడు యక్షుడుందే వాడు .పుణ్యాత్ముడు ,ధార్మికుడు .అతనికి పూర్ణ భద్రుడనే కుమారుడున్నాడు .కుమారునికి యుక్త వయస్సు వచ్చిన తర్వాత తండ్రి అన్నిటి విషయాలు కొడుక్కి అప్ప గించి శాంభవ యోగం చేత మరణించాడు .కుమారుడు సర్వ భోగాలు అనుభ విస్తు పుత్రులు లేక పోవటం వల్ల కలత చెందాడు .భార్య తొ తాను ఉంటున్న ఈ ప్రాసాదాలు ఏమీ నచ్చటం లేదని మనస్శాంతి  లేకుండా పోయిందని ,పుత్రుని పొందితేనే జీవితం ధన్యమని చెప్పాడు .

             పూర్ణ భద్రుడు తన సంగీత విద్య చేత మహా శివుని మెప్పించాడు .శివానుగ్రహం వల్ల భార్య కనక కుండల గర్భం దాల్చింది .కుమారుడు జన్మించాడు .వాడికి హరి కేషుడు అని పేరు పెట్టారు .కొడుకు పుత్తి న సంతోషం తొ అనేక దాన ధర్మాలు చేశాడు ..ఎనిమి దో ఏటేహరి కేశునికి శివ భక్తీ అలవడింది .శివుడిని తప్ప వేరొకరి ధ్యాస లేదు .నాలుక మీద హర నామం మాత్రమె ఉండేది .దుమ్ముతో లింగాన్ని చేసి గరిక తొ పూజించే వాడు .తండ్రి పూర్ణ భద్రుడికి కొడుకు వింత ప్రకృతి అర్ధం కాలేదు .ఈ పూజలు ముసలి తనం లో చేసుకో వచ్చు ,ముందు వివాహం చేసుకొని సంతానాన్ని కని తమకు సంతోషం కలుగ జేయమని నచ్చే చెప్పే వాడు .ఒక్కోసారి తండ్రి గట్టిగా మందలించే వాడు .భయ పడి ఒక రోజున ఇల్లు వదిలి పెట్టి వెళ్లి పోయాడు .

                హరి కేషుడు అందరికి దారి చూపేది కాశీ నగరమే అని భావించి ఒక అరణ్యంలో  ప్రవేశించి .అక్కడ శివుడి కోసం ఉత్తమ తపస్సాచ రించాడు .శివుడు మెచ్చి పార్వతీ సమేతం గా ప్రత్యక్ష మై నాడు .అతని జుట్టు అంత జడలు కట్టింది .శరీరం అంతా పుట్టలు పట్టాయి .మాంసం లేని ఎముకల గూడు గా ఉన్నాడు .తెల్లని శరీరం తొ శంఖం లా మెరుస్తున్నాడు .మాంసాన్ని కీటకాలు పొడుచుకు తింటున్నాయి .అతని పింగళా దృష్టి దిగంతాల వరకు వ్యాపించి ,అతని తపోగ్ని అంతటా ప్రసరిస్తోంది .భక్తీ తప్ప ఇంకేమీ అతనికి తెలియదు సింహానికి భయ పడ్డ లేడి పిల్లలు అతన్ని రక్షిస్తున్నాయి .

            పరమేశ్వరుడు వృషభ వాహనం దిగి పుట్టలో  ఉన్న హరి కేషుని చేయి పట్టి బయటికి తెచ్చాడు .అతడు పరమేశ్వర సాక్షాత్కాసరం తొ పరవ షించి స్తుతించాడు .అప్పుడు శివుడు మెచ్చి ‘’నువ్వు దక్షిణ దిశలో నివ శిస్తు నా కను సన్న లలో మెలుగు తు ఉండు దుష్టులను దండిస్తు దండ పాణి అనే పేరప్రసిద్ధి చెండుతావు ‘’అని చెప్పి అదృశ్యమైనాడు .స్కందుడు అగస్త్య మహర్షితొ హరి కేషుడు అనే యక్షుడే కాశీ లో దండ నాయకుడనే పేరుతో ఉంటున్నాడు అని,దండ పాణి అనుగ్రహం లేనిదే కాశీ లో ఎవరు సుఖం అనుభ విన్చలేరని  చెప్పాడు .

              సశేషం మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –.17-12-12-ఉయ్యూరు 

 
 
 
 
 
 
 
 
 
Posted in రచనలు | Tagged | Leave a comment

కాలక్షేపానికి కమ్మని కబుర్లు –2 ములగ చేట్టేక్కిస్తే –

కాలక్షేపానికి కమ్మని కబుర్లు –2

ములగ చేట్టేక్కిస్తే –

–ఏముంది ఢామ్మని కింద పడి నడుం విరుగ గోట్టుకొంటాడు .ఎక్కించే వాడు తన పని గడుపు కోవటానికి అవతలి వాడిని ఉబ్బెస్తాడు .దీనితో వీడు ఉబ్బి పోయి కావాల్సింది చేసి పెట్టటమో ,డబ్బు చేపటమొ  చేసి చేతి చమురు వది లించుకొంటాడు ..ములగ చెట్టు గొంగళి పురుగుల మయం అవటం తొ ఇప్పుడు దాని స్థానం లో ‘’సుబాబుల్ ‘’వచ్చింది .రెండూ పెళుసు కొమ్మలున్నవే .ఎక్కితే విరిగి కాలో చెయ్యో పోగొట్టుకోవాల్సిందే .అందుకే ‘’వాణ్ణి సుబాబుల్ ఎక్కించాను ‘’అనే సామెత వాడుక లోకి వచ్చింది .పూర్వం రాజాస్థానం లో ,జమీందారుల వద్ద కవులు పండితులు వంది మాగధులు పొగడ్త లతో ఉబ్బేసి కట్నం కానుకా సన్మానం ,వార్శికాలు అందుకొనే వారు .వారివి యదోక్తులై తే ప్రభువులకు ఆనేది కాదు ..కనుక అతిశయోక్తులు ,ఉత్ప్రేక్షలు వాడి వారిని రంజింప జేయాల్సి వచ్చేది .ఈ ఉబ్బెయటాన్నే ‘’గాల్లో తేలించటం ‘’,’’ఆకాశానికి ఎత్తేయటం ‘’ధూపం వేయటం అంటారు .ఇంకొంచెం ముతగ్గా -పంపు కొట్టటం ,లేదా గాలి కొట్టటం ,అంటారు .గాస్ కొట్టటం ,సోడా గాస్ అనీ పేరు వీరిలో కొందరు మహా ముదుర్లు ఉంటారు . వీరినిg.m.g.-gas master general అంటారు . .కొందరు తమ గురించి తాము గొప్పలు చెప్పుకొంటారు కొందరు ఇతర్లను పొగిడి సాధించుకొంటారు .మరి కొంతమంది పరస్పరం ‘’ఇం ద్రుడివి చంద్రుడివి అను కొంటారు వీరినే ‘స్వ డబ్బా ,పర డబ్బా ,పరస్పర డబ్బా ‘’గాళ్ళు అనటం లోక రివాజు .తనను పొగిడి తన అజ్ఞానాన్ని కాష్ చేసుకొంటున్నారు అని తెలుసుకో లేని వాళ్ళు అజ్ఞానులు . ఇది తెలిసి ఉబ్బులకు ఉబ్బి తబ్బిబ్బులు కా కుండా జాగ్రత్త పడే వాళ్ళు జ్ఞానులు .దీనికి పడిపోని వారు యేకొద్ది మందో ఉంటారు .

మహా విజ్ఞాని గ్రీకు వేదాంతి సోక్ర టెస్ఒక మాట చెప్పాడు తాను చిన్నప్పుడు అన్నీ తెలిసిన వాణ్ణి అనుకొనే వాడినని ,యవ్వనం వచ్చాక తనకు కొన్ని విషయాలే తెలుసు నని అనుకోన్నాని ముసలి తనం లో తనకేమీ తెలియదని నిర్దా రించుకోన్నానని అన్నాడు .ఈ మాటలు అన్న రోజునే దేల్ఫీదేవత  దేవాలయం లో ‘’సోక్రటీస్ మహా జ్ఞాని ‘’అనే మాటలు దేవత నోటి నుంచి విని పించాయట.ఆ విషయం ఎవరో ఆయనకు తెలియ జేస్తే ఆయన ‘’నేను మహాజ్ఞానిని అని అనుకొన్న రోజుల్లో దేల్ఫీ దేవత నోరు విప్పి మాట్లాడుతుందేమో నను కొన్నాను .ఇపుడు నేను పరమ అజ్ఞానిని అని తెలుసు కొన్న తర్వాత ఆవిడ సర్టి ఫికేట్ నాకెందుకు ?’’అన్నాడట .ఈ విషయాన్ని అక్కడి వారు దేల్ఫీ దేవత ఆలయానికి వెళ్లి ఆమె తొ చెప్పారట .అప్పుడా దేవత ‘’నేను పరమ అజ్ఞానిని అని తెలుసుకొన్న వాడే అసలైన జ్ఞాని .అందుకే నేను సోక్రటీస్ మహాజ్ఞాని అన్నాను ‘’అని బదులిచ్చిందిట .

అందుకే ఉపనిషద్ వాక్యం ‘’భవతే నాతి వాది ‘’ను ఉదాహరిస్తారు .సత్యాన్ని తెలుసు కొన్న వాడు మౌనం గా నే ఉంటాడు .ఘర్షణ లేనిది మౌనం .మౌనమే పరమ అంగీకారం .’’చిత్ర కారుడిచిత్రం లాంటి ఈ ప్రపంచాన్ని అంగీకరించని నువ్వు ఆ చిత్ర కారుడి లాంటి పరమాత్మను ఎలా స్వీకరిస్తావు ?/ అందుకే మౌనం అవసరం ‘’అంటారు స్వామి మధు సూదన సరస్వతి .’’నన్ను అర్ధం చేసుకొన్న వారి తోనే నేను మాట్లాడుతాను ‘’అన్నాడట ఒక మహాను భావుడు .అలాంటి వారు దొరకా లంటే వెతుక్కో వాలి .వెతకే శ్రమ లేకుండా మౌనం గా ఉంటె అన్నీ తెలుస్తాయి అని భావం .

హృదయ సంగీతమే ప్రార్ధన .ప్రార్ధనలో కన్నీళ్లు కారక్కర్లేదు .కళ్ళు చమరిస్తే చాలు .హృదయం ఆర్ద్రమవాలి .హృదయ ఆర్ద్రతే   నిజ మైన ప్రార్ధన అంటారు స్వామి .మొత్తం మీద అజ్ఞానం లోంచి జ్ఞానం లోకి అక్కడి నుంచి మౌనం లోకి ప్రయాణం చేశాం .

మరో విషయం తొ మళ్ళీ ముందుకు –

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –16-12-12-ఉయ్యూరు

 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

ప్రసార భారతి – సంగీత విభావరి – మచిలీ పట్నం లో

radio sangeetha kadambam -2radio sangeetha kadambam -3

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

గొల్లపూడి కదా మారుతం –18 ఎనిమిదవ కధ – ఊర్వశీ –పురూరవ – 1

  గొల్లపూడి కదా మారుతం –18

                           ఎనిమిదవ కధ – ఊర్వశీ –పురూరవ – 1

ఒక్కో మనిషికి ఒక్కో రక మైన ప్రవర్తన ఉంటుంది .తమలోని గొప్పను ప్రదర్శించుకోవాలనే తపన ఉంటుంది అవతల వాడిని గేలి చేస్తూ హాయిఅనుభావిస్తారు ఆ మనస్తత్వ పరి శీలన ,విశ్లేషణమే ‘’ఊర్వశీ –పురూరవ ‘’కధ .రచయిత కిటికీ దగ్గర నుంచో గానే ,అవతలి ఇంట్లో అంటే ఎదు రింట్లో ఎదురుగా ఊర్వశీ –పురూరవా కాలెండర్ ,అద్దమూ కని పించేవి .ఓ రోజు యధా లాపం గా చూస్తె ,ఆ కిటికీ దగ్గర రెండు కళ్ళు కని పించాయి .’’హృదయాన్ని కాల్చే వెన్నెల –అనుభవాలకు ఆతృత పడెట్టు చూసే వెన్నెలా ,తియ్యటి సుఖాలకీ మధుర క్షణాలకీ తపన పరచే వెన్నెల ,ఊరించి మండించే వెన్నె లంతటి ‘’వాడి ‘’కళ్ళు .’’అవి .ఎవరి కైనా కుతూహలం ఉత్సాహం ఎవరివా అని ఊహకు రాకుఉండా ఉండదు అలంటి కళ్ళ ను చూస్తె .ఏ కవీ వర్ణించ నంత గొప్పగా వర్ణించాడు మారుతీ రావు ఆ కళ్ళ ఛందాన్ని అందాన్ని .ఆహ్వానిస్తున్నట్లున్నాయి .అద్దం  లో ముఖం చూసుకొని తల దువ్వు కొంటున్నది ఆ కళ్ళ ‘’లేడి ‘’తన అందాన్ని ఊర్వశి తొ పోల్చు కొంటోందేమో నని పించింది .ఆమె అటూ ఇటూ ఎవరి కోసమో వెతుకు తోంది .తనని చూసి పారిపోలేదు .ఎందుకు పారి పోలేదో నని అనుమానించాడు .స్త్రీ మనస్తత్వాన్ని ‘’psycho analyst ‘’లా గా ఇలా అంటాడు ‘’స్త్రీ లో తిరస్కారానికి అర్ధ సంశయం ,సంశయానికి అర్ధాంగీకారం ,అంగీకారానికి అర్ధ హేళన ‘’ఉంటాయట .అద్భుత మైన ఎస్టి మేషన్ .ఆ కాలెండర్లో ఊర్వశి కోసం కోరికతో తపన తొ బాధ తొ నిరీక్షనతొ నీర సిస్తున్న పురూరవుడు ఉన్నాడు .ఇలా రచయిత రోజంతా ఆ కళ్ళ మీద ‘’మూజింగ్స్ ‘’తొ ఖర్చయి పోతుండేది .మగాడు ఓ పది రాత్రులు ఆడదాన్ని గురించి ఆలో చిస్తే మతి పోతుంది .ఆడది పదిగంటలు ఆలోచిస్తే మతి పోగొట్టు కొంటుంది అందుకని ఆ ఆలోచనలలోను స్త్రీ పై చెయ్యి గా ఉంటుంది .ఆమె కళ్ళను తాను అర్ధం చేసు కొనే లోపు ,ఆమె ఇతని మనసు అర్ధం చేసుకోన్నదిట .

         ఇప్పుడు తను కిటికీ దగ్గర నుంచుంటే ఆమె నవ్వు తోంది .యేవో రహస్యాలు తెలిసి నట్లు కళ్ళు ఆడిస్తోంది .ఇతను తెల్ల బోతే నవ్వు ఆపు కోలేక కొంగు అడ్డం పెట్టుకొంటోంది .ఆమె ప్రవర్తన ఈయనకు అర్ధం కావటం లేదు .ఒక రోజు రోజూ లానే ఇదే సీన్ జరుగు తుండగా ,ఆమె కొంచెం పక్కకు తప్పుకొంటే ,ఎవరో ఓ వృద్దు రాలు అక్కడ నుంచొని ఇతన్ని చూసింది .సిగ్గు పడి తలుపేశాడు .గుండెల్లో వణుకు ఏం జరుగుతుందో నని .ఆ తర్వాత చాలా రోజులు ఆమె కిటికీ దగ్గరకు రావటం ,ఇతను చూడటం ,ఆమె తప్పుకో గానే ఎవరో ఒకరు తనని చూడటం జరిగాయి .భయం తోఅక్కడ నిల బడటం తగ్గించేశాడు .ఆమెకి ఇదేమీ  పట్టి నట్లు లేదు .రోజూ అలాగే నిల బడు తోంది .ఎవరో ఆమె ప్రక్కగా కని పించ గానే తాను తప్పుకొనే వాడు .ఆ తర్వాతరచయిత పెళ్లి అయి ,భార్య మాలతి కాపురానికి వచ్చింది .భార్య ఒక నాడు ఎదురింటి ఆవిడ పేరు కమల అని ,భర్త మిలిటరి వాడని ,తల్లీ చెల్లీ తాను మాత్రమె ఇంట్లో ఉంటున్నామని సమాచారం సేకరించి ఇతనికి చెప్పింది .ఆ ఇంట్లో చాలా మంది కని పిస్తున్నారే అని సందేహం వెలి బుచ్చాడు .’’ముగ్గురే ఉన్నారు .మిగతా వాళ్ళు పక్క వాళ్లేమో ?’’అంది .ఒక రోజు భార్య ఎవరింటికో వెళ్తే కిటికీ తెరిచి చూశాడు .’’జీవితం లో హఠాత్తు గా ప్రవేశించిన సుఖాన్ని శాశ్వతం చేసుకో వాలన్న పిచ్చి మారాజు ,ఆతని ఆరాటం లో ఆనందాన్ని వెతుక్కొంటూ కలలో అనుభవం లాగ చేజిక్కి,జారి పోయే ఊర్వశి ‘’గా అని పించింది .తన పరిస్తితి తొ చక్కని సమన్వయము చేసు కొన్నాడు .ఇంతలో కిటికీ సుందరి కమల కన్పించింది .తాను చూస్తున్నాడా లేదా అని తీవ్రం గా పరి కిస్తోంది .ఎంతో ఉత్సాహం గా ఏదో చెప్పాలను కొన్నాడు .ఇంతలో పక్కకు తప్పు కుంది .తన భార్య అక్కడ ప్రత్యక్షం .తెల్ల బోయాడు .ఆమె పకాలున నవ్వటం ప్రారంభించింది .సిగ్గు తొ కుంచించుకు పోయాడు .తల పట్టుక్కూర్చున్నాడు .ఆ ఘాతం ఎలా తట్టు కోవాలో తెలీడం లేదు .పిచ్చెక్కి నంత పని .ఏం సంజాయిషీ ఇస్తాడు భార్యకు ?సంజాయిషీ లతో కాపురాలు నిలుస్తాయా ?అన్నీ  సందేహాలే .

               ‘’ఆమె కన్ను లలో అనంతాంబరంపు నీలి నీడలు కలవు ‘’అన్నాడు కృష్ణ శాస్త్రి –ఆ కళ్ళ వైభోగం ఏమిటో తర్వాత చూద్దాం .

            సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –15-12-12-ఉయ్యూరు 

Posted in రచనలు | Tagged | Leave a comment

కాశీ ఖండం –29 కాల భైరవుడు

        కాశీ ఖండం –29

                                                కాల భైరవుడు

 కాల భైరవ ప్రాదుర్భవాన్ని గురించి అగస్త్యునికి కార్తికేయుడు వివ రించాడు .పూర్వం మేరు శృంగం లో బ్రహ్మ దేవుడు ఏకాంతం గా తపస్సు చేస్తున్నాడు ..మహర్షులు ఆయన దగ్గరకు వెళ్లి ఏకాంతం గా ఏమి చేస్తున్నావని ప్రశ్నించారు .దానికి బ్రహ్మ ‘’నేను దాతను .జగత్తును సృష్టించి ,పెంచి లయం చేస్తుంటాను .స్వయంభు ని .సర్వేశ్వరుడిని .జగాలన్ని నా అధీనం .నా కంటే గొప్ప దేవుడు లేదు ‘’అని ప్రగల్భాలు పలికాడు .అప్పుడు నారాయణఅంశ తొ వచ్చిన క్రతువు బ్రహ్మ తొ ‘’పర తత్వాన్ని తెలుసుకోకుండా అజ్ఞానం తొ మాట్లాడుతున్నావు ..నేనే కర్తను ,నారాయణుడిని ,యజ్న స్వరూపుడను .’’అన్నాడు ఇద్దరికీ వాగ్వాదం జరిగింది .చతుర్వేదాలలో ప్రవీణులైన విప్రులను సాక్షు లు గా ఉంచుకొని వాదు లాడుకొన్నారు .వేదాలలో ఏమి చెప్ప బడిందో తెలియ బర్చమని వారిద్దరూ కోరారు .వేదాలే తమకు ప్రమాణం అని తెలియ జేశారు .ఋగ్వేదం ‘’ఈ సకల భూత గణం ఎక్కడి నుంచి వచ్చి ,మళ్ళీ ఎక్కడికి చేరుతుందో అదే పర తత్త్వంఅయిన రుద్రుడు  ‘’అన్నది  యజుర్వేదం ‘’ఎవరు యజ్ఞాధి పతి యో ,యోగం చేత అర్చింప బడే వాడేవ్వడో, ఎవరు అందరికి ప్రమాణమో ఆయనే సర్వజ్ను డైన శివుడు ‘’అని చెప్పింది .సామ వేదం’’ఎవరి చేత విశ్వ భ్రమణం జరుగు తోందో ,యోగులెవరిని గూర్చి చిన్తిస్తారో ,ఎవని కాంతి చే ఈ విశ్వం ప్రకాశిస్తుందో ఆయనే పరమ శివుడైన న త్రయంబకుడు ‘’అన్నది .అధర్వ వేదం ‘’దేవేశ్వరుడేవడో ,కైవల్య స్వరూపుడేవ్వడో అతడే దుఃఖ హారి అయిన శంకరుడు‘’అని చెప్పింది .

                అప్పుడు బ్రహ్మా క్రతువు లిద్దరూ శ్మశానం లో విభూతి పూసుకొని దిగంబరం గా తిరిగే వాడూ ,ఎద్దునేక్కి తిరిగే వాడు సర్ప భూషణుడు ఎలా బ్రహ్మత్వం పొందుతాడు అన్నారు . .అప్పుడు సనాతన ప్రమాణం అమూర్తి అయినా మూర్తి మత్వాన్ని పొంది నవ్వుతు ‘’పరమేశ్వరుని తెలుసు కోవటం కష్టమైన పని .లీలా రూపం తొ నాట్యమాడుతాడు .ఆయన స్వయం జ్యోతి ,సనాతనుడు ,ఆనంద స్వరూపుడు ‘’అని చెప్పింది .అయినా బ్రహ్మ అజ్ఞానం నాశనం కాలేదు .అప్పుడు ఒక జ్యోతి వారి ముందు ప్రత్యక్ష మైంది .అది భూమ్యాకాశాలను ఆక్రమించింది ..జ్యోతిర్మండల మైన పురుషా కారం తొ అది బ్రహ్మ కున్న ఐదో శిరస్సు ను తగుల బెట్టింది .తరువాత ఆజ్యోతి శివ రూపం చెంది ప్రత్యక్ష మై నాడు. .బ్రహ్మ అహంకారం చావలేదు ‘’పూర్వం నువ్వు నా ఫాలభాగం నుండి పుట్టావు .నన్ను శరణు వేడు నేను నిన్ను రక్షిస్తా‘’అని గర్వం గా అన్నాడు .అప్పుడు కోపం తొ ఒక భైరవా కారాన్ని శివుడు తన నుంచి సృష్టించాడు .

            శివుడు కాల భైరవుని తొ ‘’నువ్వు ఈ ప్రపంచాన్ని భరించే శక్తి కల వాడివి .నిన్ను ‘’పాప భక్షకుడు ‘’అని పిలుస్తారు కాశీలోనే నీ ఉనికి కాలమే నిన్ను చూసి భయ పడే కాల భైరవుడివి .’’అన్నాడు అప్పుడు భైరవుడు తన ఎడమ చేతి బొటన వ్రేలి తొ బ్రహ్మ ఐదో తలను గిల్లి వేశాడు .భయ పడిన బ్రహ్మ శత రుద్రీయాన్ని పఠించాడు ..శివుడు బ్రహ్మను ఓదార్చి కాల భైరవుని తొ ‘’నువ్వు యజ్ఞాలలో మాన్యత్వాన్ని పొందుతావు .బ్రహ్మ కపాలాన్ని చేతి లో ధరించి ,బ్రహ్మ హత్యా దోషం పోవటానికి తపస్సు చెయ్యి .’’అని చెప్పాడు  .

             ఆ శివుడు బ్రహ్మ హత్య అనే పేరుకల కన్య ను సృష్టించాడు .ఆమె ఎర్రనిది. యెర్రని వస్త్రాలు యెర్ర చందనం ధరించి కోరలతో కూడిన విశాల మైన నోటి తొ వ్రేలాడే నాలుక తొ ,ఒక కాలు పైకెత్తి రక్త పానం చేస్తూ ఖడ్గం రక్త పాత్ర ,తల పుర్రె చేతుల్లో ధరించి అందర్ని భయ భ్రాంతులను చేసింది .శివుడు కాల భైరవు ని తొ ‘’నువ్వు అన్ని ప్రదేశాలలో తిరిగే అధికారం కల వాడివి .ఈమె తొ నీకు కావాల్సిన పని చేయించుకో ‘’అని చెప్పి అంతర్ధానమయ్యాడు .

           కపాల పాణియై ,కాపాలికా వ్రతము ధరించి భైరవుడు త్రిలోక సంచారి అయాడు .కాశీ లో కాల భైరవుడు నిరంతరం సంచరిస్తూ ఏ దోషాలు రాకుండా కాపాడుతాడు .అన్ని కోరికలను తీరుస్తున్నాడు .భైరవుడు కాశీ లో ప్రవేశించగానే ‘’బ్ర హ్మ హత్య ‘’భయ పడి పాతాళ లోకానికి పారి పోయింది .

                 సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –15-12-12-ఉయ్యూరు 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

ప్రపంచ తెలుగు మహా సభలు-కొన్ని ఆలోచనలు

ప్రపంచ తెలుగు మహా సభలు-కొన్ని ఆలోచనలు 
తిరుపతి లో ఈ నెల ఇర్వి ఏడు నుండి మూడు రోజుల పాటు జరిగే ప్రపంచ తెలుగు మహా సభల్లో పాల్గొనే వారి 
  వారికి ప్రతి నిది రుసుము ను అయిదు వందల రూపాయలు గా నిర్ణ యించి వసూలు చేశారు .నాలుగు వేల మంది ప్రతినిధులకు గాను ప్రభుత్వానికి  వచ్చే ఆదాయం ఇరవై లక్షలు మాత్రమె .ఒక రకం గా సముద్రం లో కాకి రెట్ట .ప్రభుత్వం ఖర్చు చేసే కోట్లాది రూపాయల్లో  ఇది ఏమూలకూ ఖాతరు చేయాల్సినది కాదు .అదే విదేశాల నుండి వచ్చే ప్రతి నిధులకు, అతిధులకు ప్రభుత్వం విమాన చార్జీలు ,ఫైవ్ స్టార్ బస సౌకర్యం ,కారు ఖర్చులు కలిపి ఒక్కో ప్రతి నిది పై లక్ష రూపాయల పైనే ఖర్చు చేస్తుంది .ఈ ఖర్చుతో లెక్కిస్తే దేశం లోనీ ప్రతి నిధుల పై వసూలు చేసేది ఏమాత్రం లెక్క లోకి రాదు .అంతే కాదు దేశం లోనీ ప్రతి నిధులు ఒక్కొక్కరు అయిదు వందలు రుసుము చెల్లించి, దూ రాభారం నుండి రైలు లేక బస్  చార్జీలు సుమారు వెయ్యి రూపాయలు ఖర్చు చేసుకొంటే గాని సభల ను చూడలేరు .వీరికి కనీస బస సౌకర్యం ఉన్నట్లు ఎక్కడా ప్రభుత్వం చెప్పటం లేదు .ఏ హోటల్ లో నో ఉండాల్సి వస్తే ఇంకో వెయ్యి రూపాయలు అదనపు ఖర్చు .ఇవన్నీ ప్రభుత్వం పరి గణించాలి .ఇంకో విషయం ప్రతి నిధులకు ఒక పూట మాత్రమె భోజనం టిఫిన్ కాఫీ సదు పాయం ఉంటుందని చెబుతున్నారని అంటున్నారు .ఇందులో నిజమెంతో తెలియదు .రెండో పూట వీరి భోజనం టిఫిన్ ఖర్చు కూడా భరించి హాజరవ్వాల్సి ఉంటుంది .
                       తిరుపతి దేవస్థానం రోజు ఉచితం గా పది  వేల మందికి పైగా  భోజనం పేడు తోంది .కనుక ఈ నాలుగైదు వేల మందికి రెండు పూటలా భోజనం టిఫిన్ ఖర్చు ఎంత ఎక్కువ గా లెక్క వేసినా రోజుకు ఒక కోటి రూపాయల కంటే కాదు .మూడు రోజులకు కలిపి గరిష్టం గా మూడు కోట్లు .దేవస్థానం ఆదాయం లో ఇది అసలు లెక్కింప దగిన సొమ్మే కాదు .అదీ స్వామి పాదాల చెంత ,తెలుగు భాషా సంస్కృతీ పరి రక్షణకు జరుగు తున్న సభలు కనుక దేవస్థానం వారి సౌజన్యం తొ ఉచిత భోజన ,వసతి సౌకర్యాలు కలి పిస్తే ఎంతో హుందా గా ఉంటుంది .పూర్వం భూమన కరుణా కర రెడ్డి తిరుపతిలో ఎంతో వైభవం గా తెలుగు సభలు నిర్వహించి వచ్చిన వారికందరికీ ఉచిత ప్రయాణ ,భోజన వసతి సౌకర్యాలు కల్పించారని అందరు ఘనం గా చెప్పుకొన్నారు .నగదు పారితోషికమూ అందజేసి పంపారని విన్నాం .అటు వంటిది ప్రభుత్వం ఈ పని చేయలేదా పూనుకొంటే ?చేయాలని కోరుతున్నారు తెలుగు పై అభి మానం ఉన్న తెలుగు బిడ్డలు .ఈ విషయమై ప్రభుత్వం పునరాలో చించి మంచి నిర్ణయం తీసుకోవాలని కోరటం సమంజస మైన విషయమే నని భావిస్తున్నాను
                గ్రామ స్తాయి నుండి జిల్లా స్తాయి వరకు దాదాపు ఇరవై రోజులు గా కార్య క్రమాలు నిర్వహించి సభల పై అవగాహన కల్గింప జేయ మని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది . ఎన్ని జిల్లాలు దీన్ని స్పూర్తి గా తీసుకొని నిర్వ హించాయో తెలియటం లేదు .అధికార భాషా సంఘ అధ్యక్షులు గా కృష్ణా జిల్లా నుండి శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారిని నియమించటం ప్రభుత్వం చేసినమంచి  గొప్ప నిర్ణయం .దానికి ప్రభుత్వాన్ని అందరు  అభి నందిస్తున్నారు .కృష్ణా జిల్లా కలెక్టర్ గారు శ్రీ బుద్ధ ప్రకాష్ గారు గొప్ప కార్య శీలురుఅవటం, బుద్ధ ప్రసాద్ గారి స్వంత జిల్లా అవటం, ఆయన ఎన్నో ఏళ్లుగా భాషా సంస్కృతి ల విషయమై అవిశ్రాంతం గా కృషి చేయటం ,ఆయన ఆధ్వర్యం లో కృష్ణా జిల్లా రచయితల సంఘం రెండు సార్లు ప్రపంచ తెలుగు రచయితల సభలను విజయ వాడ లో దిగ్విజయం గా జరపటం దానికి అధ్యక్ష కార్య దర్శు లైన శ్రీ గుత్తికొండ సుబ్బారావు శ్రీ పూర్ణచంద్ గార్ల నిర్దుష్ట ప్రణాళిక ,దాన్ని అమలు జేసే విధానం వల్ల ప్రభుత్వం చే బట్టిన ఇప్పటి కార్య క్రమం కూడా మంచి అవగాహన కల్పించింది .ప్రక్క జిల్లాల లో కాని ఇతర జిలా ల లో కాని ఇంత చైతన్యం కని పించక పోవటం ఆశ్చర్యమే .అయితే ఇక్కడ కూడా మొక్కు బడి గా నే చాలా చోట్ల జరిగాయని పించింది .ప్రజల్లో, భాషాభి మానుల్లో స్పందన కలిగించటం లో ఎక్కడో లోపం ఉందని పించింది .మండల స్తాయి రేవిన్యు  స్తాయి ,జిల్లాలో విజయ వాడ ,మచిలీ పట్నం లలో భాషా సంస్కృతి లకు సేవ లందించిన వారికి తగిన సన్మానం జరగటం జిల్లా మొత్తాన్ని ఒకే యూనిట్ గా తీసుకొని విజయ వాడ లో ప్రతిభా పురస్కారాలన్దించటం లో కృష్ణా జిల్లా అందరి కంటే ముందుంది అని నిర్ద్వంద్వం గా నిరూపించింది .దీనికి అందరు అభి నందనీయులే .
                    ముప్ఫై ఏడేళ్ళ క్రితం నాటి ముఖ్యమంత్రిశ్రీ  జలగం వెంగళ రావు గారి సమర్ధ నాయకత్వం లో ,నిస్వార్ధ ప్రజాసేవకులు ఆ నాటి విద్యా మంత్రి స్వర్గీయ శ్రీ మండలి వెంకట కృష్ణా రావు గారి ఆధ్వర్యం లో మొదటి ప్రపంచ సభలు హైదరా బాద్ లో అద్వితీయం గా జరిగి అందరి ప్రశంసలు అందుకొన్నాయి .ఆనాడు సమర్ధ మైన నాయకత్వం ఉంది నిజాయితీ ఉంది .తెలుగు జాతి సమైక్యత ఉంది .అందుకే విజయ వంతం అయ్యాయి ఇవాళ భౌగోళికం గా తెలుగు వారుప్రస్తుతానికి  కలిసి  ఉన్నా మనస్సులో విశాల దృక్పధంలేక పోవటం  ,నిర్వహించే ప్రభుత్వ మంత్రి వర్గం లో గ్రూపు భేదాలు ”గుడ్ విల్ ”కన్నా ”ఇల్  విల్ ”ఎక్కువవటం ,ప్రాంతీయ భేదం, భాషా సంస్కృతులపై సందేహాల నేపధ్యం లో మళ్ళీ నాలుగవ  సభలు తిరు పతి లో జరుగు తున్నాయి ప్రాంతీయ భేదాలను అదిగా మించి సర్వ సమర్ధులను గుర్తించి సంమానించాలి .ఇక్కడ ఏ మాత్రం ఏమరు పాటు జరిగినా ప్రమాదం అని గుర్తించాలి . ఆ తండ్రి కుమారుడు శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారి ఆధ్వర్యం లో జరగటం ఒక చారిత్రాత్మక సంఘటన .ఎన్ని భేదాలు ఉన్నా మనం అందరం తెలుగు తల్లి బిడ్డలం .ఇది మన తెలుగు పండుగ .మన సంస్కృతీ వైభవానికి ఎత్తు  తున్న విజయ పతాక అని అందరు గుర్తించి ,పాల్గొని దిగ్విజం చేయాలి .ఇది ఎవరి విజయం అని లెక్కలు కాదు కావలసింది .ఇది తెలుగు వాడి విజయం అని ఆలో చిద్దాం .
                నేను మొదట సూచించిన సూచనలను ప్రభత్వం పరిశీలించి తగు నిర్ణయం తీసు కొంటుందని ఆశిస్తూ .సభలు జయప్రదం కావాలని కోరుతున్నాను
                     మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –15-11-12- ఉయ్యూరు

 

Posted in సభలు సమావేశాలు | Tagged | 1 Comment

ప్రపంచ తెలుగు మహాసభ – తిరుపతి – ఆహ్వాన పత్రం

prapancha telugu mahaa sabhala kaaryakramaalu aashayaalu-7 prapancha telugu mahaa sabhala kaaryakramaalu aashayaalu-2 prapancha telugu mahaa sabhala kaaryakramaalu aashayaalu-3 prapancha telugu mahaa sabhala kaaryakramaalu aashayaalu-4 prapancha telugu mahaa sabhala kaaryakramaalu aashayaalu-5 prapancha telugu mahaa sabhala kaaryakramaalu aashayaalu-6

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

వుయ్యూరు -వి ఆర్ కే మ్ స్కూల్ లో జరిగిన ప్రపంచ తెలుగు మహా సభలు

DSCF1517 DSCF1440 DSCF1441 DSCF1442 DSCF1443 DSCF1444 DSCF1445 DSCF1446 DSCF1447 DSCF1448 DSCF1449 DSCF1450 DSCF1451 DSCF1452 DSCF1453 DSCF1454 DSCF1455 DSCF1456 DSCF1457 DSCF1458 DSCF1459 DSCF1460 DSCF1461 DSCF1462 DSCF1463 DSCF1464 DSCF1465 DSCF1466 DSCF1467 DSCF1468 DSCF1469 DSCF1470 DSCF1471 DSCF1472 DSCF1473 DSCF1474 DSCF1475 DSCF1476 DSCF1477 DSCF1478 DSCF1479 DSCF1480 DSCF1481 DSCF1482 DSCF1483 DSCF1484 DSCF1485 DSCF1486 DSCF1487 DSCF1488 DSCF1490 DSCF1491 DSCF1492 DSCF1493 DSCF1494 DSCF1495 DSCF1496 DSCF1497 DSCF1498 DSCF1499 DSCF1500 DSCF1501 DSCF1502 DSCF1503 DSCF1504 DSCF1505 DSCF1506 DSCF1507 DSCF1508 DSCF1509 DSCF1510 DSCF1511 DSCF1512 DSCF1513 DSCF1514 DSCF1515 DSCF1516

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

కృష్ణా జిల్లా సాంస్కృతిక సదస్సు –విజయ వాడ -13-12-12

 కృష్ణా జిల్లా సాంస్కృతిక సదస్సు –విజయ వాడ -13-12-12- గురువారం

   నిన్న అంటే పదమూడవ తేది మధ్యాహ్నం రెండు గంటలకు జిల్లా పౌర సంబంధాల అది కారి గారు నాకు ఫోన్ చేసి‘’ఈరోజు సాయంత్రం అయిదు గంటలకు విజయవాడ ఇందిరా గాంధి స్టేడియం లో మీకు సన్మానం ఉంది తప్పక రండి ‘’అని చెప్పారు .నేను వెళ్లాను .అప్పటికే వివిధ పాఠశాల విద్యార్ధులు బెంజ్ సర్కిల్ నుండి ఊరేగింపుగా తెలుగు భాషా సంస్కృతి లను కాపాడుకోవాలి అంటూ నినాదాలు చేస్తూ స్టేడియం చేరారు .విద్యార్ధినుల మా తెలుగు తల్లికి నృత్యాభి నయం తొ  సభ ప్రారంభ మైంది ..విద్యార్ధినులు ‘’తెలుగు భాష తీయదనం తెలుగు నేల గొప్పదనం ‘’పాటను నృత్యాభి నయం చేశారు .ఇద్దరు మహిళలు‘’నేత్రావధానం ‘’నిర్వహించారు .పృచ్చకులు రాసిచ్చిన ప్రశ్నలకు కళ్ళ కదలిక లతో సమాధానం చెప్పటం .బాగానే సరిగ్గానే చెప్పారు .పది నిముషాలలో ముగింప జేశారు నిర్వాహకులు స్పందనా కరువే అయింది ..ఇక్కడ ఒక విశేషం –బందరు లో ఉంటున్న అధ్యాపకులు స్రేఎ స్వర్ణ రాజ హను మంత రావు గారు నేత్రా వధానం ప్రదర్శన లను వెయ్యికి పైగా చేశారు .ఈ వేదిక ప్రక్క మరో వేదిక పై ‘’భువన విజయం ‘’కోసం కృష్ణ దేవ రాయలుగా శ్రీ కోట సుందర రామ శర్మ ,తిమ్మరుసు గా అవధాని శ్రీ పాల పర్తి  శ్యామలా నంద ప్రసాద్ ల తొ బాటు అష్ట దిగ్గజ కవుల వేషాలలో సర్వశ్రీ గుమ్మా సాంబశివరావు.పింగళి కృష్ణా రావు పువ్వాడ తిక్కన సోమయాజి ,జంధ్యాల మహతీ శంకర్ వంటి హేమా హేమీలు రెండు గంటలు గా కూర్చున్నారు చివరికి వారి కిచ్చిన సమయం పావు గంట మాత్రమె .నిరీక్షణే వారికి సరి పోయింది పాపం ..వారి ముందు కొన్ని నృత్య ప్రదర్శనలు జరిగాయి .స్వర్గీయ వేమల పల్లి శ్రీ కృష్ణ రాసిన ‘’చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా గత మెంతో ఘన కీర్తి కలవోడా ‘’గీతాన్ని ఒక గాయకుడు అద్బ్భుతం గా పాడి ఉత్తేజం కల్గించాడు .

                ఆంద్ర ప్రదేశ్ అధికార భాషా సంఘాధ్యక్షులు శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ మొదటి ప్రపంచ తెలుగు మహా సభలు ముప్ఫై ఏడేళ్ళ క్రితం హైదరా బాద్ లో జరిగాయని ,రెండవ సభ మలేషియా లో మూడవది మారిషస్ లో జరిగిందని ఇప్పుడు జరుగ బోయే నాల్గవ సభ తిరు పతి లో ఈ నెల ఇరవై ఏడు నుండి ఇరవై తొమ్మిది వరకు జరుతాయని చెప్పారు .ఇప్పటికే రుసుము చెల్లించి మూడు వేలకు పైగా ప్రతి నిధులు నమోదు చేసుకొన్నారని ,ఇంకో ఏడేని మిది మంది స్వంత క్షర్చులతో వస్తున్నారని అన్నారు .మొత్తం మూడు వేల మంది వివిధ కళా కారులు పాల్గొంటున్నారని అందులో పదిహేను వందల మంది జానపద కళాకారు లుండటం విశేషమని మూడొందల మంది రచయితలు పత్ర సమర్పణ చేస్తున్నారనికొన్ని వందల మంది విదేశాల నుండి వస్తున్నారని చెప్పారు . చాలా పెద్ద స్థాయి లో నిర్వహించే సభలు అని ,రాష్ట్ర పతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ సభలను ప్రారంభిస్తారని శ్రీ నారాయణ రెడ్డి గారు రచించిన గీతం తొ సభ ప్రారంభ మవుతుందని తెలిపారు .తెలుగు ను కాపాడు కోవలసిన బాధ్యత మన అందరిది అని ఇంట్లో తెలుగు తప్పక మాట్లాడాలని ప్రాధమిక స్తాయి నుండి విశ్వ విద్యాలయ స్తాయి వరకు తెలుగు బోధించ టానికి అన్ని విధాలా కృషి చేస్తామని ఈ  సభలు దిశా నిర్దేశం చేస్తూ ,ఆధునిక సాంకేతికతను భాషకు సమ కూర్చు కొంటూ అంతర్జాలం లో కూడా తెలుగు వాడకాన్ని పెంచే ఏర్పాటులో ఉన్నామని ,అందరు పాల్గొని సభలను దిగ్విజయం చేయాలని కోరారు .పూర్వం జరిగిన సభలు ఒక్క హైదరా బాద్ కే పరి మితమైనాయని ఈ సభలు గ్రామ గ్రామాన ప్రదర్శనలతో ఉత్తెజితులం చేశామని మండల,రేవిన్యు స్టయిల్లో పోటీలు నిర్వహించి ప్రతిభా పురస్కారాలను అందించామని చెప్పారు జిల్లా స్తాయిలో ఈ నెల తొమ్మిది నుండి పన్నెండు వరకు బెజవాడ ,మచిలీ పట్నాలలో అనేక సభలు, సెమినార్లు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించి సభల పై అవగాహన కల్పించామని అన్నారు ఈ రోజు విజయ వాడ లో జిల్లా మొత్తం సభల ముగింపు సభ జరుపు తున్నామని జిల్లా స్తాయిలో అనేక రంగాలలో విశిష్ట సేవ లందించిన వారిని గుర్తించి ఉచిత రీతిని సత్కరిస్తున్నామని తెలియ జేశారు .

           DSCF1439 DSCF1376 DSCF1377 DSCF1378 DSCF1379 DSCF1380 DSCF1381 DSCF1382 DSCF1383 DSCF1384 DSCF1385 DSCF1386 DSCF1387 DSCF1388 DSCF1389 DSCF1390 DSCF1391 DSCF1392 DSCF1393 DSCF1394 DSCF1395 DSCF1396 DSCF1397 DSCF1398 DSCF1399 DSCF1400 DSCF1401 DSCF1402 DSCF1403 DSCF1404 DSCF1405 DSCF1406 DSCF1407 DSCF1408 DSCF1409 DSCF1410 DSCF1411 DSCF1412 DSCF1413 DSCF1414 DSCF1415 DSCF1416 DSCF1417 DSCF1418 DSCF1419 DSCF1420 DSCF1421 DSCF1422 DSCF1423 DSCF1424 DSCF1425 DSCF1426 DSCF1427 DSCF1428 DSCF1429 DSCF1430 DSCF1431 DSCF1432 DSCF1433 DSCF1434 DSCF1435 DSCF1436 DSCF1437 DSCF1438ఆ తర్వాత మారిషస్ దేశం లో మూడవ ప్రపంచ సభలనిర్వహణ లో భాగస్వామి, అక్కడి తెలుగు రేడియో ‘’టోరి‘’లోతెలుగు కు ఇన్చార్జి అయిన శ్రీ సంజీవప్పడు  మాట్లాడుతూ రెండు వందల ఏళ్ళ క్రితం తమ వారంతా ఉత్త రాంధ్ర నుండి మారిషస్ చేరుకోన్నారని ‘’మరీచి మహర్షి దేశం ‘’కనుక మారిషస్ అయిందని ,తాను మారిషస్ లోనే జన్మించానని అయినా తెలుగు నర నరానా జీర్నిచి పోయిందని అన్నారు మారిషస్ లో ఒకటో తరగతి నుండి విశ్వ విద్యాలయ స్తాయి వరకు తెలుగులో బోధన ఉంటుందన్నారు ఉగాది ,సంక్రాంతి వంటి తెలుగు పండగలకు జాతీయ సెలవులిస్తారని తామంతా  తెలుగు పండుగలను అత్యంత ఉత్సాహం గా జరుపు కొంటామని అన్నారు రెండు వందల ఏళ్ళ నుంచి శ్రీ రామ భజన ను విడువ కుండా మారిషస్ లో జరుపుకొంటున్నామని చెప్పారు భారత దేశానికి యాభై, అరవై మందితో ప్రతి ఏడాది వస్తామని ఇక్కడికి విమానం దిగ గానే ఈ నేల తల్లికి సాష్టాంగ నమస్కారం చేస్తామని ,ఆ మట్టిని శిరసున ధరిస్తామని తెలుగు నేల అంటే తాము ఎన్నడు మర్చి పోమని ఇక్కడి పుణ్య క్షేత్రాలన్నీ దర్శించి అక్కడి మట్టి ని తమతో తీసుకొని వెళ్లి అతి పవిత్రం గా చూసుకొంటామనిహర్ష ధ్వానాల మధ్య  వివరించారు .

          గుడి వాడ వాసి ,అమెరికా లో స్తిర నివాసి ‘’మరో పికాసో ‘’అని పించుకొన్న ప్రఖ్యాత చిత్ర కారులు డాక్టర్  శ్రీ ఎస్ .వి. రామా రావు మాట్లాడుతూ అమెరికా లో ఉన్నా ప్రతి ఏడు భరత్ కు వస్తామని ఇక్కడి మూలాలను మరిచి పోమని అక్కడ తమ ఇళ్లలో తెలుగు తప్పని సరి  మాట్లాడుతున్నామని.మనం  అందరం కలిసి తెలుగు సభలను విజయ వంతం చేద్దామని అన్నారు .తానా అధ్యక్షులు, గన్నవరం వాసి శ్రీ తోటకూర ప్రసాద్ తాము అమెరికా లో తెలుగు నేర్పటానికి లక్షలాది డాలర్లు ఖర్చు చేస్తున్నామని అందరు ఇళ్ళల్లో తెలుగే మాట్లాడుతామని ,తెలుగు సంస్కృతీ వైభవాన్ని తెలియ జేసే తానా సభలు నిర్వహిస్తున్నామని భారత అభి వృద్ధికి తెలుగు భాషా సంస్కృతి ల అభి వృద్ధికి తమ వంతు సాయం అందిస్తూనే ఉన్నామన్నారు .ఇక్కడ తెలుగు మాధ్యమం లో బోధనా లేక పోవటం విచారకరమన్నారు

          ఆ తర్వాత జిల్లాలో కవిత్వం ,రచన ,నాటకం ,సంగీతం నృత్యం ,చిత్ర లేఖనం ,క్రీడలు ఆటలలో మొదలైన వివిధ రంగాలలో విశేష కృషి, సేవలు చేసినవారిని సుమారు వందమందిని ఎంపిక చేసి వారందరికి తెలుగు పురస్కారాలంద జేశారు వీరందరికీ శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ ,కలెక్టర్ శ్రీ బుద్ధ ప్రకాష్ గారు స్వయం గా ఒక్కొక్కరికి శాలువా కప్పి జ్ఞాపికను ,ప్రశంశా పత్రాన్ని దానితో పాటు వెయ్యి రూపాయల నగదు బహుమతిని అందజేసి సత్కరించి తమ విశేషతను చాటు కొన్నారు ..బుద్ధ ప్రసాద్ గారు నాకు శాలువా కప్పి సన్మానం చేస్తూ కలెక్టర్ గారితో ‘’వీరు గబ్బిట దుర్గా ప్రసాద్ గారు .ఉయ్యురు నుండి వచ్చారు . .అక్కడ ఆయన గొప్ప సాహిత్య సంచలనం .ఎన్నో చాలా గొప్ప సాహిత్య సభలను నిర్వహిస్తూ మమ్మల్ని కూడా భాగా స్వామ్యులను చేస్తారు ‘’అన్నారు.కలెక్టర్ గారు కర చాలనం చేశారు . .ఆనందం  ఆశ్చర్యం వేసింది నాకు రంగ రంగ వైభవం గా సాగిన ఈ కార్య క్రమం చాలా ఆలస్యం అయి నందు వల్ల చివరికి ప్రేక్షకులు లేక వేలా తేలా బోయి ఖాళీ కుర్చీల తొ దర్శన మిచ్చింది ..ఏం సి.దాస్ గారు సభా సంచాలనాన్ని తప్పుల తడిక గా నిర్వ హించటం ,పేర్లను తప్పుగా పలకటం ,అనవసరపు ప్రసంగం విసుగేత్తిం చింది ..ఏమైనా కలెక్టర్ గారు జిల్లా అధికారులు గ్రామ స్తాయి నుంచి జిల్లా స్తాయి వరకు దాదాపు పది హేను రోజుల పాటు ఈ తెలుగు భాషా పండుగను చేయటం న భూతో న భవిష్యతి అని పించింది . ఇంటికి చేరే సరికి రాత్రి పదిన్నర అయింది .

 సభలో ప్రముఖులనుఫోటో లలో  గుర్తు పట్టటానికి కొన్ని ఆన వాళ్ళు –నల్ల పాంటు నల్లకోటు వేసుకొన్న వారు శ్రీ తోటకూర ప్రసాద్ –తానా అధ్యక్షులు .వారి ప్రక్కన రంగు పాంటు రంగు షార్ట్ ఇంశార్ట్ తొ ఉన్న వారు చిత్రకారులు శ్రీ ఎస్.వి.రామా రావు గారు .మాట్లాడిన వారిలో తెల్ల పైజమా ,పసుపు లాల్చీ తొ నుదుట నిలువు గా వెడల్పు యెర్ర బొట్టు తొ ఉన్న వారుమారిషస్ కు చెందిన  శ్రీ సంజీవప్పడు గారు .తెల పాంటు తెల్ల ఫుల్ హాండ్ బుష్ షార్ట్ లో ఉన్న వారు శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారు .తెల్ల పాంటు తెల్ల షార్ట్ ఇంశార్ట్ లో ఉండి సన్మానం చేసిన వారు కలెక్టర్ శ్రీ బుద్ధ ప్రకాష్ గారు .

           సన్మా నితులలో తెల్ల మీసాలు గడ్డం తొ పంచె లాల్చీ తొ కుర్చీలో కూర్చున్న వారు’’మాయల ఫకీర్ ‘’నాటక’’ ఫేం’’ శ్రీ ఆచంట వెంకట్రామయ్య నాయుడు గారు  వేదిక పైరాష్ట్ర గ్రందాలయాధ్యక్షులు  శ్రీ తుర్ల పాటి కుటుంబ రావు గారిని గుర్తు పట్టే ఉంటారు బుద్ధ ప్రసాద్ గారి పక్కనే వేదిక పై కూర్చున్నారు

            మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –14-12-12- ఉయ్యూరు ,

 
 
 
 
 
Posted in సభలు సమావేశాలు | Tagged | 1 Comment

గొల్లపూడి కధామారుతం –17 పరకీయ -3 (చివరి భాగం )

గొల్లపూడి కధామారుతం –17

          పరకీయ -3 (చివరి భాగం )

   విజయ వాడ వచ్చి జనన మరణ ఆఫీసుకు వెళ్లి అయిదేళ్ళ క్రితం పుట్టిన శిశు వివ రాలు తెలుసుకొన్నాడు రచయిత ..వసంతకు ఆడ పిల్ల పుట్టి చని పోయిందని రికార్డులు చెప్పాయి .ఎంతో రిలీఫ్ పొందాడు .తన పాత అనుభవానికి యే నిదర్శనమూ  లేదన్న తృప్తి అతన్ని సంతృప్తి పరచిందట .’’భోరున ఏడవ లేక పోయానే ‘’అను కొన్నాట్ట .’’ఆ ఇద్దరు కుర్రాళ్ళలో ఎవరు ?’’అన్నది వెతుక్కోవటం లో ప్రేమ తొ కూడిన ఆత్రుత కంటే ,పాత అనుభవానికి ఇంత గట్టి నిదర్శనం మిగి లిందన్న భీతి ఎక్కువ గా ఉందేమో /’’అంటాడు రచయిత చివరగా .

        ఇలా పర కీయ లో పర కాయ ప్రవేశం చేసి ,ఆమె అంత రంగాన్ని ఫోటో స్టాట్ తీసి చూపిస్తాడు .తన పాపానికి ప్రాయశ్చిత్తం గా వసంత ను పెళ్లి చేసుకోవాల్సింది పోయి ,పిరికి మందును నూరి పోస్తే ,ఆవిడ మాత్రం ప్రపంచాన్ని ఏది రించే ధీమా తొ ,అతని పై విద్వేషం లేకుండా ఒక రక మైన సాను భూతి తొ ప్రవర్తించింది వసంత .పరిస్తితులను తనకను కూలం గ మార్చుకోంది .అతను మాత్రం తన పాపాలకు ఆన వాలు మాత్రం వెతుక్కోన్నాడు .అక్కడా ఆమె ముందు ఓడిపోయాడు .బహుశా పుట్టిన పాప చని పోవటానికి ఇతని un balanced and un preparedness కారణం కావచ్చు . ఆ పాపాన్ని అంతటి తొ కడిగేసుకొని ఆమె ముందడుగు వేసింది .మద్రాస్ లో మోసపోయినా ,ఇతని కి మోసానికీ బలి అయినా ,ఆమె లో జీవించాలనే భావం చెక్కు చెదర లేదు .మొండితనం ,పరిస్తితులను అనుకూలం గా మార్చుకొనే తెలివి, స్తైర్యం ఆమెకు అబ్బాయి .అందుకే బలరాం తొ హాయిగా బతుకు తోంది .పండంటి ఇద్దరు పిల్లలు కూడా .ఇతను చేసిన పాపానికి భార్యకు పిల్లలు కూడా కలగ లేదన్న సత్యమూ మనకు గోచరిస్తుంది .చేసుకొన్నా వారికి చేసుకోన్నంత .ఆమె విషయం లో నమ్మకం ఆమె ను బలి గోన్నా ,దాన్ని మొక్క వోని ధైర్యం తొ ఎదుర్కొని నిలిచింది .అదే ఆమె ప్రత్యేకత a bold fighting natural spirit , ఓటమిని ఎదుర్కొంటున్నా ,అంతిమ విజయం కోసం నిరంతరం పోరాడే పటిమ కలది వసంత .నిత్య వసంతం గా కని పిస్తుంది .

       ‘’ఊహల్ని సాహిత్యానికి అను వదించటం మాత్రం అలవరచు కొన్న గొంగళీ పురుగు దశ ‘’లో తాను ఈ కధ రాశాను అంటాడు మారుతీ రావు .నిజమే .ఏదైనా రూప విక్రియ చెందా లంటే గొంగళిపురుగు దశ అవసరమే .ఆ దశ లోనే దొరికిన్దల్లా తింటుంది .అంటే ‘’మేస్తుంది ‘’.నేమరేసు కొటుంది .చక్కని గూడు అల్లుకొని హాయిగా నిదరోతుంది .భవిష్యత్తుకు కావాల్సిన రంగుల రెక్కలూ ,ఎదగ వలసిన చివరి దశా అందుకోనేందుకు ముందు దశే ఇది.భవిష్యత్తు కు కావాల్సిన సమస్తం ఈ దశ లోనే నిలువ చేసుకొంటుంది .సమయం రాగానే హాయిగా గూడు చీల్చుకొని అనంతా కాశం లోకి రివ్వున యెగిరి పోతుంది .ఆ రెక్కల ఆకర్షణ లో అంతా దిగ్భ్రమ చెందుతారు .ముందు జీవితం అంటే గూడు దశ లేనిది సీతా కొక చిలుక లేదు .అలాగే గొల్ల పూడి కూడా తాను భవిష్యత్తు లో ఓ గొప్ప కధకుని గా మార్పు చెందటానికి కావలసిన దంతా నమిలి .మింగి జీర్నించు కొన్నాడు సరిగ్గా నలభై మూడేళ్ళ  క్రితం .అతనిలో ఊహలూ భావాలు కధా కధన విధానం అంతా పరి పక్వమవ టానికి కావాల్సిన సమస్త హంగులు కలిగి ఉన్న దశ అది .ఆ తర్వాత ఇంకా మంచి కధలు రాసి రచయిత గా ,విమర్శకుడిగా ,సినీ రచయితగా విశాల విశ్వం లో వినూత్నం గా ఎగిరే స్తితికి చేరుకొన్నాడు .తన పూర్వ కోశస్త స్తితిని మర్చి పోని కృతజ్ఞత ఉంది అతని మాటల్లో నని పిస్తుంది .

               భవిష్యత్ ప్రణాళిక లన్ని ఆ సుప్త స్తితి లో మననం చేసుకొంటూ ,ప్రణాళిక సిద్ధం చేసుకొంటూ ఊహల్ని అల్లు కుంటూ ,కాబోయే రంగుల దశను కలల్లో చూస్తూ గడిపి ఉంటాడు .ఆ నిరంతర మననం ,నిరీక్ష ,ఓపిక ,ఒక గిరి గీసుకొన్న జీవితం ,అన్ని shades of opinions ను సేకరించి ,తనది అయిన విశేష వ్యక్తిత్వం ఏర్పరచుకొన్న వైనం మారుతీ రావు ను ఈనాడు ఇంతటి మహోన్నత స్తితికి తెచ్చింది most perfect dialogue రచయితగా ,most success ful writer గా జీవిత సత్యాలను కాచి వడ పోసిన వాడిగా ,కొత్త మాటల్ని కొత్త ప్రయోగాల్ని ,కొత్త రుచుల్ని ,తన రచనలోచూపించి monotony నుంచి వేరు చేయ గలిగిన రచయిత గా ఎదిగాడు .అదీ అతని back ground.అందుకే ఈకదను గొంగళి పురుగు దశ లో రాశానని సత్యాన్ని చెప్పాడు .అదీ రచయితకు ఉండాల్సిన నిజాయితీ .నిబద్ధత కూడా ఇంకా యేర్పడ లేదన్న చింత కూడా ధ్వనిస్తుంది .ఏమైనా గొల్ల పూడి ఒక’’ వినూత్న కదా చిత్ర కారుడు‘’.భాషకు ఏదో తెలీని అందాలను కూర్చ గల సమర్ధుడు .ఊహల్ని ఉన్నత స్తాయికి తీసుకొని వెళ్ళ గలిగే నేర్పరి ఆహా ! అని పించే రచయిత .అతనిలో విస్తృత పరిశీలనా శక్తి ,నిశిత మైన చూపు నాకు కని పిస్తుంది .ఆ కధలనుఅతనే అంత బాగా చెప్పగలడుఅని పిస్తుంది .ఓ తిలక్ ,ఓ మధు రాన్తకం ,ఓ అమరేంద్ర ,ఓ బుచ్చిబాబు ,ఓ విశ్వ నాద ,ఓ మల్లాది ,ఓ గోపీ చంద్ అతనిలో తొంగి చూస్తూంటారు ..వీరిలో ఎవరూ అతను కాదు .ఎవరూ అతని లోంచి దాటి పోరు .ఓ విలక్షణ మైన ప్రత్యేకత కలిగిన నూత్న ప్రయోగ కర్త ,ప్రయోక్త గొల్ల పూడి అందుకే అతని కధలు అంత బాగా వస్తాయి అలరించి మురిపిస్తాయ్ .పదే పదే చది విస్తాయి .చెక్కిన శిల్పమే ప్రతి మాటా .ఇంతకీ పరకీయ అంటే ?ఇతరులకు చెందినది అని అర్ధం .తనదికానిది అని ధ్వని .

               మరో కధ తొ మళ్ళీ కలుద్దాం

                మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –13-12-12-ఉయ్యూరు 

Posted in రచనలు | Tagged | Leave a comment

కాశీ ఖండం –28 వారణాసి మహిమ

          కాశీ ఖండం –28

                    వారణాసి  మహిమ

అగసత్యు నికి కుమారస్వామి వారణాసి మహిమ ను వివరిస్తున్నాడు .ఇక్కడ ప్రయత్న,అప్రయత్న మరణం సంభ వీస్తే ముక్తియే . .ఈ మణి కర్ణిక లోకి గంగ చేరింది .ఇది శ్రీ విష్ణువుకు చక్ర పుష్కరిణి .పరబ్రహ్మ నివాస క్షేత్రం భగీరధుడు రాజర్షి బాగీరధిని భూమి పైకి తెచ్చి తన పితా మహు లందరికి ఉత్తమ లోకాలను కల్గించాడు .ఇక్కడ బంగారం ఉద్భ వించింది .చక్ర పుష్కరిణి మణి శ్రవణం అనే పేరు తొ పిలువా బడుతుంది .మణి కర్ణిక లో గంగ చేరిన దగ్గర్నుంచి ఇది దేవతలకు నిత్య ఆవాసం అయింది .ఇక్కడ జ్ఞానం తొ పని లేదు .గంగా స్నానం విశ్వనాధ దర్శనమే ముక్తి నిస్తుంది .యముడు మొదలైన వారు కూడా ఇక్కడి వారినేమీ చేయలేరు .అన్ని విఘ్నాలను పోగొట్టే వరుణా నది ఉంది..కాశీ కి దక్షిణం గా అసి నదికి ఉత్తరం గా వరుణా నదిని దేవతలు నిల్పి మోక్ష నిక్షేపం గా కాపాడు తున్నారు .

        ఈ క్షేత్రం లో పడమరన వినాయకుడున్నాడు .ఈయన విశ్వనాదునికి రక్షకుడు .వినాయకుని అను మతి లేని వారికి ప్రవేశం లేదు .పూర్వం దక్షిణ సముద్ర తీరాన సేతు బంధనం దగ్గర మాత్రు భక్తీ కల ధనుంజయుడు అనే వాడుండే వాడు .సన్మార్గం లో ధనం సంపాదించే వాడు .అర్ధులను సంతోష పెట్టె వాడు .వినయ సంపన్నుడు .విష్ణు పూజా దురంధరుడు గుణ సంపన్నుడు .సదాచార సంపన్నుడు .తల్లి ని విశేషం గా పూజించి సేవించే వాడు .శివ యోగి బోధ వల్ల అతనికి జ్ఞానం కలిగింది .తల్లి చని పోయింది ఆమె అస్తికలను భద్రం గా ఒక పెట్టె లోరాగి  పెట్టి పూజలు చేసి కావడిలో దాన్ని కాశీ కి తీసుకు వెళ్ళే ప్రయత్నం చేశాడు .ఇతరు లెవ్వరు పెట్టె ను ముట్టుకో కుండా జాగ్రత్త పడ్డాడు .దారిలోఒక అరణ్యం లో  జ్వరం వచ్చి బాధ పడ్డాడు .కూలి వాడిని ఏర్పాటు చేసుకొని అతని తొ పెట్టె మోయించాడు .

               కాశీ కి చేరాడు .మోసే వాడినే  కాపలా ఉంచి కావలసినవి కొనుక్కో వటానికి బజారు వెళ్లాడు .ఆ రాగి పెట్టె లో డబ్బు ఉంటుందని వాడు ఆశ పడ్డాడు .దాన్ని ఎత్తుకు పోయాడు .ధనుంజయుడు తిరిగి వచ్చి తెలుసుకొని బాధ పడ్డాడు .గంగా స్నానం విశ్వ నాద దర్శనం లేకుండా ఆ మోత గాడి ఇంటికి వెళ్లాడు .వాడు ఆ పెట్టె ను దారిలోనే బద్దలు కొట్టి అందులో అస్తికలే ఉన్నందున అక్కడ పారేసి పారి పోయాడు ఇంటికి వెళ్లి అతని భార్యను నిజం చెప్పమని ధనుంజయుడు కోరాడు ఆమె ఇంట్లో దాగి ఉన్న భర్తకు ఈ సంగతి చెప్పింది .ధనుంజయుడు అతడిని తీసుకొని ఆ ప్రదేశానికి చేరాడు .ఆ చోటును అంత పెద్ద అరణ్యం లో కని పెట్ట లేక హతాశుడై ఇంటికి తిరిగి వెళ్లి పోయాడు .

          అందరికి చెప్పి ,వారు చెప్పిన ప్రకారం గయ కు వెళ్లి తల్లి శ్రాద్ధం  పెట్టాడు .ప్రయాగ లో త్రివేణీ సంగమ స్నానం చేశాడు .తరువాత కాశీ కి వచ్చి తల్లి అస్తికలను గంగలో కలిపితే విశ్వేశ్వరా నుగ్రహం లేక పోవటం వల్ల నెట్టి వేయ  బడ్డాయి .శ్మ అంటే శవం .శాన అంటే శయ నించేది .అంటే శవం శయనించేది కనుక కాశి కి మహా శ్మశానం అని పేరొచ్చింది .అంటే ప్రళయ కాలం లో సమస్త భూత జాలం శవం పై ఈ మహా క్షేత్రం లో శయనిస్తుంది అని అర్ధం .కనుకనే మహా శ్మశానం అయింది .ప్రళయ కాలం లో ఈశ్వరుడు ప్రతి నిత్యం కాశీ పట్నం లో త్రిశూలం పై ఉంచి రక్షిస్తూ ఉంటాడు .అందుకే కాశీ కి ప్రళయ భయం లేదు .కాశి కలి కాల వర్జిత మైనది .దీనిని కాశి ,అని ,వార ణాసి అని ,రుద్రా వాసమని ,మహాశ్మశానమని ,ఆనంద కాననం ,దేవీ పురమని అంటారు .

            సశేషం –మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ –13-12-12-ఉయ్యూరు 

 

Posted in రచనలు | Tagged | 2 Comments

తెలుగు సాహితీ వైభవం – మచిలీపట్టణం

DSCF1375 DSCF1300 DSCF1301 DSCF1302 DSCF1303 DSCF1304 DSCF1305 DSCF1306 DSCF1307 DSCF1308 DSCF1309 DSCF1310 DSCF1311 DSCF1312 DSCF1313 DSCF1314 DSCF1315 DSCF1316 DSCF1317 DSCF1318 DSCF1319 DSCF1320 DSCF1321 DSCF1322 DSCF1323 DSCF1324 DSCF1325 DSCF1326 DSCF1327 DSCF1328 DSCF1329 DSCF1330 DSCF1331 DSCF1332 DSCF1333 DSCF1334 DSCF1335 DSCF1336 DSCF1337 DSCF1338 DSCF1339 DSCF1340 DSCF1341 DSCF1342 DSCF1343 DSCF1344 DSCF1345 DSCF1346 DSCF1347 DSCF1348 DSCF1349 DSCF1350 DSCF1351 DSCF1352 DSCF1353 DSCF1354 DSCF1355 DSCF1356 DSCF1357 DSCF1358 DSCF1359 DSCF1360 DSCF1361 DSCF1362 DSCF1363 DSCF1364 DSCF1365 DSCF1366 DSCF1367 DSCF1368 DSCF1369 DSCF1370 DSCF1371 DSCF1372 DSCF1373 DSCF1374

Posted in సభలు సమావేశాలు | Tagged | 1 Comment

గొల్ల పూడి కధా మారుతం -16 పరకీయ -2

  గొల్ల పూడి కధా మారుతం -16

                                      పరకీయ -2

   ట్రైనింగ్ తర్వాత వచ్చి ఆమె కోసం వెదికితే కని పించలేదు .కొద్ది రోజులకు ఆమెకూ బలరాం కు పెళ్లి శుభలేఖ అందింది .ఆమెను తను సరిగ్గా అర్ధం చేసుకో లేక పోయానని బాధ పడ్డాడు .ఆమె తననెందుకు మోసం చేసిందో తెలియలేదు .నిజం గా ఆమె గర్భ వతేనా ?కాలం అన్నీ మరి చెట్లు చేస్తుంది .తానూ ఓ ఇంటి వాడయ్యాడు .అప్పటికి ఇప్పుడు మళ్ళీ ఆమె హార్సిలీ హిల్స్ మీద ప్రత్యక్షం .సినిమా రీలు మళ్ళీ మొదటి కొచ్చింది .ఆరోజు ఆమె ఇంటికి వెళ్లాడు‘’ఎందుకు వెళ్లి పోయావు ఆ నాడు ఆకు చెప్పకుండా ?’’అడిగాడు .’’చెబితే ఏం చేసే వారు ?’’అంది తడుము కోకుండా .వసంత దృష్టిని అంతగా భవిష్యత్తు వైపుకు ఎలా మళ్ళించ గలిగిందా అన్న ఆలోచన ఇంకా నిర్వీర్యుడిని చేసింది .’’ఇలా జరుగుతుందని ఆనాడు తెలిస్తే మీరు దూరం గా ఉండే వారు కదూ ?’అంది .తిక మక పడ్డాడు .ఇంతలో అతని భార్య వచ్చింది .తాను వచ్చి చాలా సేపయిందని ,ఆమె భర్తతో మాట్లాడుతున్నానని ,అతనితో ఇది వరకే పరిచయం ఉందని ,ఫోటో వల్ల గుర్తు పట్టానని వసంత ఆమె తొ అంది .

          ‘’ ఆ క్షణం లో జీవిత మంతా వసంత పాదాల దగ్గర ఉన్నట్ట ని పించింది  ‘’అంత ఫామేదా గా ఆమె ప్రవర్తించింది .తన వల్ల అవతలి వ్యక్తికీ ఇబ్బంది కలుగ రాదనీ ఆమె ఆంతర్యం అంత మహోన్నత మైనది .ఇతని భార్య ఆశ్చర్యం ప్రకటిస్తే ‘’ఏం అంతేనా ?’’అంది లేని చిరు నవ్వు మొగాన పులుముకొని తనకెందుకు చెప్పలేదని భార్య అడిగితే సమాధానం వసంతే చెప్పింది ‘’ఆయనకు మాత్రం ఏం తెలుసు ?నేను రోజు ఆయన ఎదురుగా నిల బడుతున్నానా ?’’అంది .మాటల్లో అతని పై ఎంతో అధికారం ఉందని తోస్తే ఇతని భార్య విస్తు బోయింది .అలాగే ఇంకొంచెం సేపుంటే ఏం జరిగేదో తెలీదు ‘’నీ మాటలు వింటే బెదిరి పోతుంది .పిచ్చేక్కినా ఆశ్చర్యం లేదు ‘’అన్నాడు .

         రచయిత ,భార్య ల తొ కలిసి నడుస్తూ ‘’మీ ఆయన నన్ను పెళ్లి చేసుకొని ఉంటె బాగుండే దండి ఆయనకు మీరింకా చాలా నేర్పాలి ముఖ్యం గా ఆడ వాళ్ళు మట్టి బొమ్మలు కాదు ,వాళ్ళకీ మనసు ఉంది ‘’అని ‘’తన మాటలు నొప్పిస్తే క్షమించమనిసాదా సీదా గా అని వెళ్లి పోయింది వసంత. .ఇతని భార్య మాత్రం ‘’మీకూ యేవో రహస్యాలున్నాయి .ముందే చెబితే బాగుండేది గా .ఆవిడ దగ్గర అవమానం పొందక ముందే ‘’అంది .ఎలా చెప్పాలోఎమ్చేప్పాలో తెలీలేదితనికి .డీలా పడి పోయా డు .ఓ రోజు ఉన్నట్టుండి అతని భార్య తనకా ప్రదేశం లో ఉండ బుద్ధి కావటం లేదని ఇంటికి పోతానని అంటే పంపించేశాడు .అయిదేళ్ళ నాటి సంఘటన ,రక్తం పరుగు ,ఆమె త్యాగం లో ఔన్నత్యం ,తన పిరికి  తనం ,స్త్రీత్వపు విలువలు పూర్తీ స్వరూపం గుర్తొచ్చి శ్మ్రుతి ,విస్మృతి ల మధ్య కొట్టు కొంటున్నాడు ‘’అనడం అద్భుతం గా ఉందికదూ .

                ఒక రోజు బలరాం తొ ‘’నాకూ వెళ్ళాలని పిస్తోంది ఆరోగ్యం బాగా లేదు .రిలీవ్ చేస్తే వెళ్తాను ‘’అన్నాడు .అతను ఆశ్చర్యం తొ ‘’ఈ ప్రదేశం చూసి మూర్చ పోయిన అతనే ఇలా అంటున్నాడా ?’’అని పించింది .’’అందానికి ,ఆరోగ్యానికి సంబంధం లేదు ‘’అన్నాడు .ఆ రోజు సాయంత్రం వసంత కన్పించింది .ఆమెకీ తెలిసింది ఇతను వెళ్లి పోతున్నాడని .’’దాచ కుండా చెప్పు ‘’అన్నాడు .యే విషయ మో ఆమెకీ తెల్సన్నాడు .’’చెబితే మీరు తట్టు కొ గలరా ?’’అంది సస్పెన్స్ క్రియేట్ చేస్తూ .’’పోనీ చెప్పన్లెండి .నన్ను మళ్ళీ అడగొద్దు .అని మిమ్మల్ని త్వరలోనే రిలీవ్ చేసే ఏర్పాట్లు చేస్తా లెండి ‘’అని భరోసా ఇచ్చింది .కన్నీరు కారుస్తుందేమో నను కొన్నాడు .ఆమె ముఖం చూప కుండా వెళ్లి పోయింది

                సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –12-12-12

Posted in రచనలు | Tagged | Leave a comment

కాశీ ఖండం –27 గంగా మహాత్మ్యం

  కాశీ ఖండం –27

                        గంగా మహాత్మ్యం

 పార్వతీ దేవి శివుడిని భాగీరధ వృత్తాంతాన్ని,గంగకు భాగీరధి అనే పేరు ఎలా వచ్చింది ఆ విషయాన్ని ఆమె కు చెప్పిన వైనాన్ని అగస్తునికి స్కందుడు చెబుతున్నాడు . గంగ లో పితృ దేవతలు ఎల్లప్పుడు ఉంటారు కనుక వారికి ఆవాహన ,విసర్జన అక్కర లేదు .పితృ ,మాత్రు వంశాలలో మరణించిన వారు ,అగ్ని ప్రమాదం లో చని పోయిన వారు ,విద్యుత్తు ,పులి వల్లా ,పక్షి మృగ క్రిమి కీటకాలను హింసించి చంపినవారు  ,ఉరి వేసుకొని చని పోయిన వారు ,విషం చేత ,చచ్చిన వారు ,కుంభీపాక ,రౌరవాది నరకాలలో ఉన్న వారు ,యమ లోకం లో ఉన్న వారు పుత్రులు లేకుండా మరణించే వారు,క్రుతఘ్నులు మిత్రద్రోహులు ,డబ్బు దోచే వారు ,అనాధలు దీనులు మొదలైన వారికి గంగా జలం తొ తర్పణం విడిస్తే వారంతా స్వర్గాన్ని పొంది ,భోగాలను భ విస్తారు .

          మూడు లోకాల్లో ఉన్న తీర్ధాలన్నీ కాశి లో ని గంగా జలం లో ఉన్నాయి .ఇక్కడి ఉత్తర వాహిని అయిన గంగా నది ని ‘’స్వర్గ సముద్రం ‘’అంటారు .బ్రహ్మ హత్యా పాతక దోషాన్ని కూడా పరి హరించే సమర్ధత ఉన్నది .ముక్తి క్షేత్రం . .విశ్వ నాధుని అనుగ్రహం తొ అమృతత్వాన్ని పొందుతారు .మహా పాపి కూడా అంత్య కాలం లో గంగా స్నానం చేస్తే పాపం నుండి విముక్తు డవుతాడు .

         పూర్వం కళింగ దేశం లో ఒక బ్రాహ్మనుడుందే వాడు ఉప్పు అమ్ముకొని జీవించే వాడు .స్నానం ,సంధ్యా అంటే ఏమిటో అతడికి తెలియదు .అతని పేరు ‘’వాహికుడు ‘’యజ్ఞోప వీతం మాత్రం ఉండేది .ఒక శూద్ర విధవా స్త్రీ ని పెళ్లి చేసుకొన్నాడు .ఆ దేశం లో విప రీతమైన కరువు వచ్చింది .అంతా దేశం వదిలి పోతున్నారు .వీరిద్దరూ కూడా వెళ్లారు దారిలో ఒక పెద్ద పులి అతడిని చంపి తినేసింది . అతడి ఎడమకాలి ని  మాత్రం ఒక గ్రద్ద తన్నుకొని పోయింది .ఇంకో గ్రద్ద ఈ మాంసం కోసం దానితో యుద్ధం చేసింది .ఆ గ్రద్ద నోటి నుండి జారిన వాహికుని ఎడమకాలు అదృష్ట వశాత్తు గంగా నదిలో పడింది .యమదూతలు అతన్ని చేరి చరణా కోలు తొ కొట్టి బాధించటం ప్రారంభించారు .అతడి నోరు ,ముక్కుల నుండి రక్తం కారుతోంది .అలాగే వాడిని యమ ధర్మ రాజు వద్దకు తీసుకొని పోయి నిల బెట్టారు .చిత్ర గుప్తుని పిలిచి అతడి పుణ్య ,పాప విశేషాలు చెప్పా మన్నాడు యమధర్మ రాజు .

           చిత్ర గుప్తుడు చిట్టా విప్పి చెప్పాడు .అతడు జన్మించిన దగ్గర్నుంచి జాత కర్మ జరగ లేదని ,ఆయుర్బలం వల్ల గర్భ దోశాలేమీ అంతలేదని ,పదకొండో రోజు న నామ కరణం జరగ లేదని ,నాల్గవ నెలలో బయటికి తీసుకొని వెళ్ళ లేదని ,శుభ తిధులలో తండ్రిఅతడిని తన వెంట తీసుకొని వెళ్ళే వాడని ,అన్నప్రాసనా చేయ బడ లేదని తండ్రి  మి ఠాయి కొని సూర్యుడికి చూపించి కొడుక్కి పెట్టె వాడని ,చూడా కర్మ ,కర్ణ వేద విధి విధానం లో జరుగ లేదని,స్వర్ణ కారుడేవరో చెవులు కుట్టాడని ,ఎనిమిదో ఏట మౌన్జీ ధారణా జరిగిందని ,దాని విసర్జన శాస్త్ర ప్రకారం చేయ లేదని ,శూద్ర స్త్రీని పెళ్లి చేసుకొన్నాడని ,చిన్నప్పటి నుండి దొంగ గా బతికాడని ,జూదం అదే వాడని ఉప్పు అమ్ముకొనే వాడని ఒక ఆవుదూడ వచ్చి ఉప్పు నాకు తుంటే దాన్ని కొడితే అది మరణించిందని ,తల్లిని చాలా సార్లు కాలితో తన్నాడని ,తండ్రి మాట వినే వాడుకాడని ,చాలా సార్లు ఇతరులతో పోట్లాదాడని, విషం తాగుతానని బెది రించే వాడని ,ఒకప్పుడు అగ్ని చేత దగ్ధ మయాడని ,జంతువులనేక సార్లు కొమ్ములతో ఇతన్ని కుమ్మేశాయని ,కర్రలు పెట్టి అఘాయిత్యం గా తల పగలకొట్టుకొనే వాడని ,చర్మం ,మాంసం ,గోళ్ళు అమ్మే వాడని పగలే స్త్రీ లతో వ్యభిచరించే వాడని కాసే ,పూసే చట్లను నిష్కారణం గా నరికేసె వాడని ఇంతెందుకు వీడు మూర్తీభవించిన పాపమే అని ఏకరువు పెట్టాడు చిత్ర గుప్తుడు .

        అతడిని చిత్ర హింసల పాలు చేయమని యముడు ఆజ్న జారీ చేశాడు .ఇంతలో అతని ఎడమ కాలు గంగా నదిలో పడటం వల్ల స్వర్గం నుండి విమానం వచ్చి అప్సరసలు సేవిస్తుండ గా వాహికుడిని స్వర్గానికి తీసుకొని పోయారు .కనుక గంగా నది  పుణ్య ప్రదమైంది అని స్కందుడు చెప్పాడు .సదా శివ సంబంధ మైన ఒకానొక శివ సంబంధ శక్తి ఎప్పుడూ గంగ లో ప్రవహిస్తూ ఉంటుంది .దేవదేవుడే జగద్రక్షణ కోసం గంగ రూపాన్ని పొందాడు .శంభుని చే వేదాక్షరాలు వడ కట్ట బడి ఆ గంగా ధరుని చే గంగా జలం గా చేయ బడింది .యోగా ,సాంఖ్య ఉపనిషత్ సారం గంగా జలం ..గరుత్మంతుని చూస్తె పాములు పారి పోయి నట్లు భాగీరధిని చూస్తేనే పాపాలన్నీ పారి పోతాయి .గంగ మట్టిని శిరస్సు న ధరిస్తే సూర్య సమాన తేజం కలుగుతుంది .గంగా స్తుతి ,దర్శనం, స్పర్శనం, పానం, స్నానం సర్వ కామాలను తీరుస్తాయి .నదులలో ఉత్తమ మైనది .చంద్రుని కూడా శోభా వంతుని చేసే లక్షణం ఉంది .గంగయే సర్వ తీర్ధం .అదే తపోవనం .;గంగను మించిన దేదీ లేదు ఇది సత్యం ,పునస్సత్యం  .

          సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –12-12-12-ఉయ్యూరు 

Posted in రచనలు | Tagged | Leave a comment

గొల్ల పూడి కధా మారుతం –15 ఏడవకధ –పరకీయ -1

       గొల్ల పూడి కధా మారుతం –15

                                            ఏడవకధ –పరకీయ -1

 ఇదోవిచిత్ర మైన కధ .హార్సిలీ హిల్స్ లో గవర్నర్ ప్రోగ్రాం లో పాల్గొన టానికి వెళ్లాడు రచయిత .అతని తొ బాటు అదే ఆఫీసు లో పని చేస్తున్న బలరాం కూడా ఉన్నాడు .అందమైన ప్రదేశం కనుక వారి భార్యలకూ ఆ అందాన్ని చూపించ వచ్చు నని భావించి ఓ వారం తర్వాత వారిని రప్పించు కొన్నారు ..ఎదురెదురు ఇళ్ళల్లో ఉంటున్నారు .బలరాం కొడుకు రోజూ వీల్లింటికి వచ్చి ఆడుకొంటాడు .ఒక రోజు రచయిత భార్య తన భర్త ఫోటో ఫ్రేం తొ ఆడుకొంటున్న ఆ కుర్రాణ్ణి చూసింది .వాడు ఆమెకి తెలీకుండా దాన్ని ఇంటికి తీసుకు పోయాడు .తర్వాతా ఫ్రేం మాత్రమె తిరిగి వచ్చింది .ఫోటో లేదు .వాళ్ళబ్బాయి చిమ్పెశాడట .అందుకని ఆవిడ ఇది మాత్రమె ఇచ్చి పంపిందని రచయిత భార్య చెప్పింది .ఇతనికి అనుమానం వచ్చిఅడిగితే ఫ్రేము ఆవిడే తెచ్చి ఇచ్చిందని అర్ధమైంది .కావాలనే తీసి కెళ్ళిందేమో అన్నాడు .’’మీ ఫోటో ఆవిడెం చేసుకొంటుంది ?’’అని ప్రశ్నించింది భర్తను .అక్కడి తొ ఆ ఆలోచన లకు బ్రేక్ పడింది .

           మర్నాడు రాత్రి ఆఫీసు నుండి తిరిగి వస్తుంటే ,ఎదు రింటామే చీకటి లో ఓ కుర్రాణ్ణి ఎత్తు కొని ఓ చెట్టు నీడన ఉండి .తనను చూసి నవ్వింది .’’పోల్చు కొ లేదా ?’’అంది .నాలుగేళ్ల కితం విన్న గొంతు .గుర్తు పట్టాడు .’’అప్పట్లో తన జీవితాన్ని రెప రెప లాడించిన వ్యక్తీ –వసంత ‘’అని తెల్సుకున్నాడు .’’మొన్న నీ ఫోటో చూసే వరకు నువ్వని తెలీదు .నేనే కొట్టేశా నను కొన్నావా ఫోటోని ?’’అనినవ్వింది .’’ఆ నవ్వు వల్లే మోస పోయాను ‘’మళ్ళీ అదే ఆయుధం ప్రయోగిస్తుంది అను  కొన్నాడు ‘’నిన్ను బాధ పెట్టన్లె ‘’అంది .ఏదో అడగాలని అతనికి ఉండి .అడగ లేక పోతున్నాడు .’’ఈ ఇద్దరు కుర్రాళ్ళ లో ఎవ రైనా “’అని అడగ బోయిన ప్రశ్న ను ఆమె అడిగేస్తే మింగ లేక పోయాడు .ఆమె ఊహకు జోహార్లర్పించాడు .’’అవును ‘’అన్నాడు .’’చెప్పుకో చూద్దాం ‘’అని సవాల్ విసిరింది .తన పోలిక ఆపిల్లల్లో కని పించలేదు విసుగేసింది .’’నాకు పిల్లల్లేరు సుఖం గా ఉన్నా .మళ్ళీ నన్ను కదపకు ‘’అని వచ్చే శాడు .మనసు లో ఏదో మూల అందులో ఒకడు తన కొడుకే నని గాఢ మైన భావం ఉంది .

          పాత కధ గుర్తొచ్చింది .నాలుగేళ్ల క్రితం తాను హాయిగా బ్రహ్మ చారి జీవితం గడుపు తున్నాడు .ఓ రోజు రూము లో ఉంటె ,చిన్న సంచీతో ,ఓ ఉత్తరం తొ వసంత గది లోకి వచ్చింది .ఆ ఉత్తరం వేణు రాసిచ్చాడు .వసంత తన చెల్లెలని,నమ్మి ఎవరితోనో మద్రాస్ వెళ్లి పోయి ,వాడు మాయ మైతే ,జబ్బు తొ ఉన్న తండ్రికి తెలిస్తే గుండె ఆగి పోతుందని ,అందుకే ఇంటికి రావద్దన్నానని ,చదూ కుంది కనుక తానే ఏదో దారి చూపిస్తాడనే ఆశతో పంపానని రాశాడు .ఆమె వయస్సు అతన్ని ఇబ్బంది పెట్టింది .ఏంచేయాలో ఆమె కే తెలీదు .వేరే చోట గది కుదిర్చి ప్రైవేట్లు ఏర్పాటు చేశాడు .ఓ నెలకు ఆమె కూడా కుదుట బడింది .ఆమె లో గతం ఉన్నట్లు కన్పించలేదు .’’గతం తొ రాజీ పడటం మనసు విధించే పెద్ద శిక్ష .ఉద్రేకాలకు అనుభ వాలను మనసు లో దాచుకొ లేని వ్యక్తీ ప్రపంచం పై వాటిని రుద్దేస్తాడు .మనసు లోనే దాచు కుంటే ప్రపంచాన్ని తన అవసరాలకు లేకుండా చేసుకొంటాడు .అందుకే సమన్వయము అవసరం .పాత అనుభవాలు మత్తు మందుల్లాంటివి. వాటిని పూర్తిగా వదులు కొ కూడదు .’’అంటాడు ఆమె రాజీ పరిస్తితి ని అర్ధం చేసుకొని .

             వీలైనప్పుడు వెళ్లి యోగ క్షేమాలను తెల్సు కుంటున్నాడు .కళ్ళ నిండా కృతజ్ఞత తొ పలక రించేది .తెలివైన్దికదాఎలా మోసపోయిందో నని అడిగాడు .’’ఏ తెలివీ కోరికను జయించ లేదండి .నేను ఆడ దాన్ని ‘’అంది ‘’మీకు కృతజ్ఞత ఎలా చెప్పుకోవాలి ?’’అన్నట్లుఉండేవివి ఆమె చూపులు .’’మీ కళ్ళల్లో అంత బలం లేక పోతే మీకింకా సహాయం చేసే వాడిని ‘’అన్నాడు .’’ఏం ?పెళ్లి చేసుకొనే వారా ?’’అంది .నవ్వేసి వచ్చేశాడు .ఆ తర్వాత ఎక్కడికో వెళ్లి ,వర్షం వస్తే అటు వైపు వెళ్లి ఆమె రూం చేరాడు .’’ఆర్నెల్ల క్రితం మీ దగ్గరకు వచ్చే ముందు నాకే సమస్యా లేదు .ఒక్క చావు తప్పించి .ఇప్పుడు చాలా పెద్ద సమస్య వచ్చి పడింది ‘’అంది .ఏమిటని అడిగితే బతకటం అంది సింపుల్ గా .చలికి శాలువా ఇచ్చింది .’’మద్రాస్ వెళ్లి ఏ తప్పు చేశానో –మీ సహాయం పొంది అంత నేరమూ చేశానని పిస్తోంది .నా అంతట నేను బతకటం ఎంత సుఖం ?’’అంది .దిగ్భ్రమ చెందాడు .’’ఏం అనుకో కండి .మీ సహాయానికి ఏదో రూపం లో కృతజ్ఞత చెప్పుకొంటాను ‘’అన్నది .వర్షం వెలిస్తే ఇంటికి చేరాడు .

                ‘’చేత కాని తనాన్ని కప్పి పుచ్చి ,కోరికను ముందుకు తోసే సాధనమే కృతజ్ఞత ‘’అంటాడు మారుతీ రావు .అతని కి మలేరియా వస్తే ఆమె ఎంతో సేవ చేసింది .ఆమె లోనీ మాతృత్వం ,సహనం ,ఔదార్యం తెలిశాయి .ఆమె ను వదిలి పోయిన వ్యక్తీ ఎంత దౌర్భాగ్యుడో అనుకొన్నాడు .పదిరోజు లయింది .కోలుకొన్నాడు .ఆమె నలిగి పోయింది చాకిరీతో .’’మిమ్మల్ని కష్ట పెట్టటం చూస్తె ,నా జ్వరం ఎప్పటికీ తగ్గదు ‘’అనే వాడు .ఆమె నవ్వేది .’’మీకేం కావాలో మీకు తెలీదు .మీ శరీరానికేం కష్టం లేనప్పుడు మీ మనసులో ఏదో భాగం పాడైంది పెళ్లి చేసుకోండి త్వరగా ‘’అంది .నిర్ఘాంత పోయాడు ఆమె పరిశీలనకు ,’’రెమిడీ’’ కి ..ఆ సాయంత్రం చలి గాలికి వళ్ళంతా జ్వరం వచ్చి నట్లని పించింది .శరీరపు అలసట కంటే ,మనస్సు అలసట వణి కిస్తోంది .ఆ రోజే చివరి రోజు అని పించింది .అర్ధ రాత్రి కళ్ళు విప్పితే ఆమె అక్కడే కూర్చుని వుంది .’’నువ్వు చెప్పిన మందు పుచ్చు కొ కుండానే చచ్చి పోయేట్టున్నాను ‘’అన్నాడు .’’ఏమిటది ?’’అన్నది .’’నా మనస్సుకు దగ్గర పడ్డ వ్యక్తిని ‘’అని ఆమె పూర్వం అన్న మాట జ్ఞాపకం చేశాడు .

                ఆమె కళ్ళల్లో జాలి ,కన్నీటి మెరుపు ఆశ్చర్యం కల్గించాయి .ఏడ్చేసి అతన్ని కావలించు కొంది .అలాంటి ఆలోచనలు వద్దన్నది .ఇద్దరు ఒకటై పోయారు .ఆ రోజు అనుభ వానికి తన జీవితం అంతా ‘’అరణం ‘’ఇచ్చినా చాలదనుకొన్నాడు .ఆర్నెల్ల తర్వాతా తను మద్రాస్ ట్రైనింగ్ కు వెళ్తున్నాని చెబితే భయం లేదు వెళ్లి రమ్మని భరోసా ఇచ్చింది .ఆ తర్వాత ఎనిమిది నెలలకి తాను తల్లి కాబోతున్నట్లు జాబు రాసింది .దిమ్మెర పోయాడు .’’అనుభవం కంటే జ్ఞాపకం విధించే శిక్ష క ఠిన మైంది ;;అంటాడు గొల్ల పూడి .’’ఏం చేయ దల్చుకోన్నావు ?’’అని ఇతను రాస్తే ‘’మీ ఉత్తరానికి నవ్వొచ్చింది ,భయ పడ్డట్టున్నారు .నాకేం భయం లేదు .మర్చి పొండి‘’అని రాసింది .అంత తెగింపూ ,ధైర్యం ఎలా సాధ్యమొ ఆశ్చర్యం కలిగింది .తనని వేళా కోళంచేస్తోందను కొన్నాడు .స్త్రీ నిఅర్ధం చేసుకోవటం చాలా కష్టం అని తెలిసింది .

               సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ – 11-12-12- ఉయ్యూరు 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

“మాత్రు భాషా పరిరక్షణ ధ్యేయంగా” పద్య, గేయ మరియు నాటక రచనల పోటీ

సి పి బ్రౌన్ సేవాసమితి తరఫున మేము“మాత్రు భాషా పరిరక్షణ ధ్యేయంగా” పద్య, గేయ మరియు నాటక రచనల పోటీలనునిర్వహిస్తున్నాం. దీనికి సంబంధించిన వివరాలను ఈ-ఉత్తరంతో జతపరుస్తున్నాము.
 
ఆసక్తి గల వారందరూ పోటీలలో పాల్గొని మా ఈ చిన్ని ప్రయత్నాన్ని సఫలీకృతం చేయవలసినదిగా ప్రార్ధన.
ఇట్లు
భవదీయుడు
ఇడమకంటి లక్ష్మీరెడ్డి                                      నిమ్మగడ్డ చన్ద్రశేఖర్
అధ్యక్షులు                                                     ప్రధాన కార్యదర్శి
సి పి బ్రౌన్ సేవాసమితి                                     సి పి బ్రౌన్ సేవాసమితి
బెంగళూరు                                                     బెంగళూరు
                                                      చరవాణి : 08951179083
                                                 అంతర్జాలం : www.cpbrown.org
                                       ఈ మెయిల్ : cpbrownsevasamithi@yahoo.com
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కాశీ ఖండం –26 గంగా మహిమ –దశహార స్తోత్రం

కాశీ ఖండం –26

 

                                                                    గంగా మహిమ –దశహార స్తోత్రం  

  కాశీ కి ఆనంద కాననం అనే పేరెలా వచ్చిందో కుమార స్వామి అగస్తునికి ఇలా వివ రించాడు .సాగర పుత్రులు అశ్వ మేదాశ్వం వెంట వెళ్లి కపిల మహర్షిని అవమానించి ఆయన క్రోధాగ్నికి దగ్దులైనారు .భగీరధుడు ఈ వృత్తాంతాన్ని విని ,వారికి ముక్తి కల్గించే ఉద్దేశ్యం తొ తపస్సు చేసి గంగను తీసుకు రావాలని నిశ్చయించుకొన్నాడు .హిమాలయాలకు వెళ్లి తపస్సు ప్రారంభించాడు .త్రిపద గామిని అయిన గంగ నుభూమికి తెచ్చి తన తన పితామహు లందర్నీ ఉత్తమ లోకాలకు పంపాలని ఆయన సంకల్పం గంగ సమస్త బ్రహ్మాం డాలకు ఆధారమైనది .శుద్ధ విద్యా స్వరూపిణి ,త్రిశక్తి .కరుణాంతరంగ .పరబ్రహ్మ స్వరూపిణి .చతుర్విధ పురుషార్ధాలు గంగా నదిలో ఉన్నాయి .గంగా దర్శనం చేతనే సకల పాపాలు నశిస్తాయి .గంగను స్మరిస్తే సంసార బంధ విముక్తి కలుగు తుంది .భక్తీ తొ తేనె ,నువ్వులు ,తొ కూడిన పిండాలను గంగోదకాల లో సమర్పించిన వాడి పితరులునూరేళ్ళు పరి తృప్తి పొందుతారు .

          గంగా నది లో స్నానం సర్వ తీర్ధ ఫలదం .వ్రతాలలో సత్య వ్రతం ,దానాల్లో అభయ దానం ,పర్వతాలలో హిమవత్పర్వతం ఎంత గొప్పవో గంగ అంత గొప్పది .గంగా పానం ఎన్నో జన్మల పాపాన్ని హరిస్తుంది .గంగ లో అమా వాస్య నాడు స్నానం చేస్తే నూరు రెట్లు అధిక పుణ్యాన్నిస్తుంది .జ్యేష్ట శుద్ధ నవమి హస్తా నక్షత్రం లో స్నానం ,రాత్రి జాగరణ చేస్తే ,దీపాలను వెలిగించి హారతిస్తే ,దానం చేస్తే ఉత్తమ లోక ప్రాప్తి కలుగు తుంది .

       గంగను పూజిస్తూ ‘’శుభకరీ అగు గంగ కు నమస్కారం .రుద్ర రూపిణి సకల దేవత స్వరూపిణి ,నమస్కారం .ప్రాణి కోటి విశాహారిణీ నమోస్తుతే ,ముక్తి భుక్తి ఇచ్చే నీకు నమో నమః .స్వర్గ లోక ప్రాప్తి కల్గించు నీ కిదే నమస్కారం .మంగళ స్వరూపిణివి .పరాపరాలకు ఆధారం నీవే .నిర్వాణ సుఖాన్నిచ్చే నీకు వందనం .మూల ప్రకృతివి ,పరబ్రహ్మ స్వరూపిణివి నీకు ప్రణామం ‘’అని గంగా స్తవం ఎవరు జ్యేష్ట శుక్ల దశమీ హస్తా నక్షత్రం లో ప ఠిస్తారో వారి జోలికి దరిద్రం రానే రాదు .శ్రీ మహా విష్ణువు ఎంతో శివుడు  అంతే .ఉమకు గంగకు భేదం లేదు .శివ కేశవులకు లక్ష్మీ పార్వతులకు గంగా గౌరీ లకు భేదం ఉందని భావించే వాడు మూర్ఖుడు .

                 సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –11-12-12-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

తెలుగు లోని మాదుర్యాన్ని చాటుదాం

bhuvana vijayam

ghaneebhavana soundaryam

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విజయ వాడ రవీంద్ర నాద టాగూర్ గ్రందా లయం లో విశ్వ నాద కళాపీ ఠంలో సాహితీ సదస్సు

సాహితీ బంధువులకు -ఈ నెల తొమ్మిది నుంచి పన్నెండు వరకుసాయంత్రం అయిదు గంటల నుండి ఏదు వరకు  ఇటు విజయ వాడ అటు మచిలీ పట్నాలలో జిల్లా స్తాయి తెలుగు సభలు జరుగుతున్నాయి నిన్న పదవ తేది విజయ వాడ రవీంద్ర నాద టాగూర్ గ్రందా లయం లో విశ్వ నాద కళాపీ ఠంలో సాహితీ సదస్సు జరిగింది .సభా వేదిక పేరు ”తెన్నేటి హేమ లతా వేదిక ”అందులో నలుగురు పత్ర సమర్పకులు తమ పత్రాలను చదివారు .ఆ సభకు అధ్యక్షత వహించాలని కృష్ణా జిల్లా రచయితల సంఘం కార్య దర్శి డాక్టర్ జి .వి.పూర్ణ చంద్ద్ నిన్న ఉదయం నాకు ఫోన్ చేశారు .సాయంత్రం వెళ్లి అధ్యక్ష స్తానం వహించి సభ నిర్వహించే అరుదైన అవకాశం పొందాను .ఆ సభలో ముఖ్య అతిధి ఆకాశ వాణి విజయ వాడ ఇన్చార్జి స్టేషన్ డైరెక్టర్ శ్రీ మతి మంజులూరి కృష్ణ కుమారి గారు .ఆత్మీయ అతిధి కురు పితామహులు కృష్ణా జిల్లా రచయితల సంఘానికి మూల పురుషులు శ్రీ కాల నాద భట్ట వీర భద్ర శాస్త్రి గారు .శ్రీ మతి కొమాండూరి కృష్ణ గారు తమ తండ్రి సి.రాఘ వాచారి గారి ”విశా లాంధ్ర ”సంపాదకీయాల పై ప్రసంగించి పత్ర సమర్పణ చేశారు .సన్ ఫ్లవర్ పత్రిక సంపాదకులు రామ కృష్ణ గారు ”నేటి పత్రికా భాష ”పై ప్రసంగించారు .శ్రీ మన్మధ రావు గారు ”పోలవరపు కోటేశ్వర రావు ”గారి కదల పై ప్రసంగిస్తే శ్రీ బ్రహ్మయ్య గారు దువ్వూరి రామి రెడ్డి గారి ”కృషీ వలుడు ”పై మాట్లాడారు .అతిధు లందరికి శాలువాలు కప్పి జ్ఞాపిక లిచ్చి నగదు బహుమతి నందించి సత్కరించారు .ప్రభుత్వం తరఫున భూగర్భ జల వనరుల చీఫ్ ఇంజినీర్ శ్రీ ప్రసాద రావు గారు దగ్గరుండి కార్య క్రమాన్ని నిర్వ హించారు వారే అందరికి సన్మానం చేశారు .ఈ  జిల్లా కార్య క్రమాలు ”కృష్ణా జిల్లా సాహితీ వైభ వం ”పేర కృష్ణాజిల్లా  సాహిత్య మండలి ఆధ్వర్యం లో జరిగి అందరిని అల రించింది .

                 ఆ తర్వాత” జాలాది ”వేదిక పై కవి సమ్మేళనం శ్రీ చల పాక ప్రకాష్ అధ్యక్షత న జరి గింది .ఉయ్యూరు నుండి డాక్టర్ చిన్మయ గారి తొ బాటువిజయ వాడ కు చెందిన  పదిహేను మంది కవులు పాల్గొని తమ కవిత లను విని పించారు .మహిళా కవులూ ఎక్కువ మందే పాల్గొన్నారు .మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ 

DSCF1299 DSCF1187 DSCF1188 DSCF1189 DSCF1190 DSCF1191 DSCF1192 DSCF1193 DSCF1194 DSCF1195 DSCF1196 DSCF1197 DSCF1198 DSCF1199 DSCF1200 DSCF1201 DSCF1202 DSCF1203 DSCF1204 DSCF1205 DSCF1206 DSCF1208 DSCF1209 DSCF1210 DSCF1211 DSCF1212 DSCF1213 DSCF1214 DSCF1215 DSCF1216 DSCF1217 DSCF1218 DSCF1219 DSCF1220 DSCF1221 DSCF1222 DSCF1223 DSCF1224 DSCF1225 DSCF1226 DSCF1227 DSCF1228 DSCF1229 DSCF1230 DSCF1231 DSCF1232 DSCF1233 DSCF1234 DSCF1235 DSCF1236 DSCF1237 DSCF1238 DSCF1239 DSCF1240 DSCF1241 DSCF1242 DSCF1243 DSCF1244 DSCF1245 DSCF1246 DSCF1247 DSCF1248 DSCF1249 DSCF1250 DSCF1251 DSCF1252 DSCF1253 DSCF1254 DSCF1255 DSCF1256 DSCF1257 DSCF1258 DSCF1259 DSCF1260 DSCF1261 DSCF1262 DSCF1263 DSCF1264 DSCF1265 DSCF1266 DSCF1267 DSCF1268 DSCF1269 DSCF1270 DSCF1271 DSCF1272 DSCF1273 DSCF1274 DSCF1275 DSCF1276 DSCF1277 DSCF1278 DSCF1279 DSCF1280 DSCF1281 DSCF1282 DSCF1283 DSCF1284 DSCF1285 DSCF1286 DSCF1287 DSCF1288 DSCF1289 DSCF1290 DSCF1291 DSCF1292 DSCF1293 DSCF1294 DSCF1295 DSCF1296 DSCF1297 DSCF1298

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

సంపూర్ణ సమగ్ర కన్యాశుల్కానికి ప్రేక్ష్యకాభిషేకం

sudeergha kanyaa shulkam

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలుగు సభలు -మచిలీ పట్నం – నూజివీడు లో జరిగిన ప్రపంచ తెలుగు మహా సభల – సన్మానం – వార్తా పత్రికలలో

nuzvid sanmanamjillaa staayi telugu sabhalu

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కాశీ ఖండం –25 మణి కర్ణికాఖ్యానం

        కాశీ ఖండం –25

                                       మణి కర్ణికాఖ్యానం

 అగస్త్యుడు కుమార స్వామిని అవి ముక్త క్షేత్ర మైన కాశి ఎప్పటి నుంచి ఉన్నది ,మోక్ష కారణం ఎలా అయింది ,అంతకు ముందు అక్కదేముంది గంగా నది లేనప్పుడు కూడా కాశి ఉన్నదా ,రుద్ర నివాసం అనే పెరేట్లా వచ్చిందో వివ రించమని వేడాడు .అప్పుడు స్కందుడు ఇలా చెప్పాడు .ప్రళయ కాలం లో స్తావర ,జంగమా లన్ని నశించి సూర్యుడు ,గ్రహ నక్షత్రాలు లేక సమస్త బ్రహ్మాండం చీకటి గా ఉండేది .శూన్య మైన ఆకాశం ఇతర తేజస్సు చేత వృద్ధి పొందేది .ద్రష్ట లెవరూ లేని సమయం లో శబ్ద స్పర్శ రస గందాదులు లేని కాలం లో దిక్కులు కూడా తెలియని స్తితి ఉండేది .అప్పుడు‘’తత్వత్ బ్రహ్మ ‘’అని వేదం ఎవరి గురించి చెప్పిందో ,నామ రూపాలు ఎవరికి లేవో, స్తూల సూక్ష్మ రూపాలు ఎవరికి లేవో, ఆనంద స్వరూపుడేవ్వడో ,నిర్వికల్పం ,మాయా రహితం ,అది అసం విత్తు అని పిలువ బడుతుంది .ఈ అద్వితీయుడు సృష్టి చేయాలని సంకల్పించాడు .దీని నిర్వహణకు ఇంకోరు తోడు కావాలని అనుకొన్నాడు .

            అప్పుడు ‘’మాయా శక్తి ‘’ని సృష్టించాడు .అది సర్వైజ్ఞాత్వం ,సర్వ జ్ఞానం కలది .అంతట  నిండి ఉండేది ,అన్నిటిని చూసేది అన్నిటిని సృష్టించేది అది .దానినే ‘’పర ‘’అన్నారు .ఆ తర్వాతా బ్రహ్మ ను సృష్టించాడు . సృష్టికి ఆద్యుడను .మాయ ఆయననేప్పుడు  విడిచి ఉండదు .ఆ  మాయనే ప్రకృతి అంటారు .మాయ కాల స్వరూపిణి .ఈశ్వర శక్తి యేప్రకృతి .ఆ పరాశక్తిని ఈశ్వరుడు రమించాడు .వారి ఆనంద ఫలితమే ఈ కాశి పట్టణం .ప్రళయ కాల మందు కూడా శివా శివులు దీన్ని వదలి పెట్టరు .మహా ప్రళయం లో సముద్రాలు ,భూమి వికలం అయి నప్పుడు తాను విహరించటానికి ఈశ్వరుడు కాశి ని నిర్మించాడు .ఆనందాన్నిస్తుంది కనుక ఇది ఆనంద వనం అనే పేరు తెచ్చు కొన్నది .

              పార్వతీ పరమేశ్వరులకు ఇంకా ఏమి సృష్టించాలి అన్న ఆలోచన వచ్చింది .పార్వతి దేవి వైపు సాభి ప్రాయం గా చూశాడు .వెంటనే ఆమె శరీరం నుండి సత్వ గుణో పెతుడైన అచ్యుతుడుద్భ వించాడు .అప్పుడు శివుడు అతని తొ‘’నువ్వు విష్ణువు అనే పేరు తొ పిలువబడుతావు .నా ఉచ్చ్వాస నిస్శ్వాసాల వల్ల వేదాలు ఉద్భవిస్తాయి అని చెప్పి విష్ణువుకు బుద్ధిత్వానికి అది పతిని చేశాడు .శివుడు ఆనంద కాననానికి పార్వతి తొ సహా వెళ్లి పోయాడు .

     విష్ణువు శివుని గురించి తపస్సు చేయ సంకల్పించాడు .సుదర్శన చక్రం తొ భూమిని త్రవ్వి ఒక పుష్కరిణి ఏర్పాటు చేశాడు .అందులో ఆయన చెమట బిందువులు పడి నీటి తొ నిండిపోయింది .దాని ఒడ్డున తీవ్ర తపస్సును కదలకుండా చేసి స్తాణువే అయ్యాడు .ఈశ్వరుడు సతీ సమేతం గా వచ్చి మెచ్చాడు ఎల్లప్పుడు శివ పార్వతులను దర్శించే భాగ్యం ప్రసాదించమని విష్ణువు వరం అడిగాడు .సరేనన్నాడు .విష్ణువు కఠోర తపస్సుకు ఇంకో వరం ఇచ్చాడు .విష్ణువు తపస్సు చూసి ఆనందం తొ శిరస్సు ఊపుతుంటే ఆయన మణి కర్ణిక అనే కర్ణ భూషణం ఒకటి జారి పుష్కరిణి లో పడింది .అది ఇక నుంచిఆ ప్రదేశం అంటే విష్ణువు తవ్విన పుష్కరిణి  మణి కర్ణికఅని పిలువబడుతుందని చెప్పాడు .

                 అప్పుడు విష్ణువు ‘’శివా !నీ వల్ల ఈ పుష్కరిణి మణి కర్ణిక అవటం ఆనందం గా ఉంది.ఇది ఉత్తమొత్తమమైనది అవాలి ఇక్కడ ఎప్పుడు మహోదయం కావాలి ‘అని కోరాడు సరే నన్నాడు భవుడు.శివుని పరి పరి విధాల స్తోత్రం చేశాడు .ఎక్కడ యముని భయం ఉండదో ,ఎక్కడ గర్భ నరకం ఉండదో అదే కాశి ..అని స్కందుడు అగస్త్య ర్శి కి చెప్పాడు .’’నేను యువకుడిని .నాకు మరణం చాలా దూరం ఉంది .మృత్యువు గురించి నాకు ఇప్పుడే విచారం ఎందుకు ?/అను కొనే వాడికి యముడి దున్న పోతు ఘంటా రావం విని పిస్తుంది .శరీరం మీద ఆసక్తి దూరం చేసుకొన్న వాడికి, శివుని పై దృఢ చిత్తం తొ ఉన్న వాడికి శివ పురి నివాసం కల్గుతుంది ..

                    సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –10-12-12- ఉయ్యూరు

 
Posted in రచనలు | Tagged | Leave a comment

కాలక్షేపానికి కమ్మని కబుర్లు -1 ఆయ్య వారేంచేస్తునారు అంటే ?

   కాలక్షేపానికి కమ్మని కబుర్లు -1

                                                                                ఆయ్య  వారేంచేస్తునారు అంటే ?

   — చేసిన తప్పులు దిద్దు కొంటున్నారు అని సామెత ఉందని తెలుసుగా .మామూలు అయ్య వారలకు ,గురువులకు ఇది మామూలే .గుగ్గురువులకూ ఒక్కో సారి తప్పదు .కాని గురు దేవులు ,విశ్వ కవి అని పించుకొన్న వాడు ,తాను రాసిన గీతాంజలికి, తనకూ ,భారతీయ సాహిత్యానికి నోబెల్ ప్రైజ్ సంపాదించిన వాడు రవీంద్ర నాద టాగూర్ కు కూడా ఈ స్థితి తప్పలేదట .ఆయన బెంగాలీ భాష లో మొదటగా గీతాంజలి పద్యాలను రాశాడు కదా .అయితే అది అంతర్జాతీయం గా పేరు తెచ్చు కోవాలంటే విశ్వ వ్యాప్త మైన భాష అని పించుకొంటున్న ఇంగ్లీష్ లోకి అనువదిస్తే నే కాని గుర్తింపు రాదు .ఆ విషయం ఆ మహాశయునికి తెలుసు .ఎవరో అను వాదం చేస్తే ఎలా ఉంటుందో ? తన భావాలను సరిగ్గా అందులో పొందు పరుస్తారో లేదో నని ఆయనే తనకున్న అపార ఆంగ్ల జ్ఞానం తొ ఆంగ్లం లోకి అనువాదం చేశేశాడు .సరే బానే ఉంది .అంతా అయిం తర్వాత ఒక అను మానం పీడించింది .ఆంగ్లం తనకు పరాయి భాష .తానేమో బెంగాలీ లో బాగా చెప్పగలిగాడు .తన భావాలను తాను అదే స్పూర్తిగా ఆంగ్లం లోకి తీసుకు రాగాలిగానో లేదో, పడాల్సిన చోట అర్ధ వంత మైన, భావ స్పోరక మైనఆంగ్ల పదాలు వేశానో లేదో తన మాటలు మంత్ర శబ్దాలు గా ఉన్నాయో లేదో నని సందేహం కలి గింది .ఎవరి కైనా ఆంగ్లం లో నిష్ణాతుడికి చూపించి తప్పు లుంటే దిద్దించాలని నిర్ణ యించు కొన్నాడు

               ఆ కాలం లో సి.ఎఫ్ .ఆండ్రూస్ ఇంగ్లీష్ లో దిట్ట ,గాంధీ గారికి దగ్గరి వాడు ,కాంగ్రెస్ పార్టీ లో ముఖ్యుడు కనుక ఆయనకు పంపి క్షుణ్ణం గా చదివి మార్పు లుంటే సూచించమని కోరాడు .ఆయన ఆసాంతం చదివి చాలా బాగా ఉందని నాలుగు చోట్ల మాత్రమె దోషాలున్నాయని అవి సరి చేస్తే చాలు నని కితాబిచ్చాడు .ఆండ్రూస్ చెప్పిన చోట్లతప్పులు దిద్ది  ఆయన సూచించిన పదాలను చేర్చాడు .హమ్మయ్యా అనుకొన్నాడు గురుదేవ్

                   ఒక సారి యూరప్ పర్యటనలో విశ్వ కవి ఒక కవి సమ్మేళనం లో పాల్గొని తన గీతాంజలి ని మొట్ట మొదటి సారిగా శ్రోతలకు చదివి విని పిస్తున్నాడు .అందరు మరోలోకం లో విహరించిన అను భూతి పొందారు అద్భుతం అని మెచ్చుకొన్నారు .ఆ సభలో ఉన్న ‘’మీట్స్ ‘’అనే యువ కవి ఒక్క సారిగా లేచి ‘’అద్భుతం పరమాద్భుతం ఇంత గొప్ప కవిత నేనింత వరకు వినలేదు .ఈ కవిత్వానికి ఏదో ఒక రోజు నోబెల్ బహు మతి రావటం ఖాయం ‘’.అన్నాడట .ఆ తర్వాత రవీంద్రుడు ఆ కావ్యాన్ని మీట్స్ కవికి చూపించాడట .ఆయన అంతా పరిశీలనగా చదివి ఒక్క నాలుగు చోట్ల తప్పులు దొర్లాయి అని పిస్తోంది .వాటిని మార్చమని సలహా ఇచ్చాడట .తీరా చూస్తే ఆ నాలుగు మాటలు తను రాసినవి కావట .ఆండ్రూస్ సూచించిన మాటలని మీట్స్ కు వివరించి చెప్పాడు .అప్పుడా యువ కవి ‘’భాషా దృష్టిలో అవి తప్పులు గా కని పించినా కావ్య దృష్టిలో అవే మేలైన, అర్ధ వంత మైన పదాలు .కనుక మొదట మీరు రాసిన పదాలనే ఉంచండి‘’అని హితవు చెప్పాడట .గురు దేవులు కధ మళ్ళీ మొదటికే వచ్చిందని తాను రాసిన పదాలనే ఉంచి ముద్రించాడట .ఆయువ కవి చెప్పిన భవిష్య వాణినిజమై ,గీతాంజలి నోబెల్ సాధించింది .

              అందుకే స్వామి మధు సూదన సరస్వతి తాను రాసిన గ్రంధం లో తప్పు లుంటే సూచించమని కోరను అని ఒక వేళ సూచించినా రేపటికి తాను ఉంటానో లేనో నని గడుసుగా సెల విచ్చారు .తనది ఎందరో నడిచిన ”ఎంగిలి మార్గమే ”ననితనభాషలో తప్పులనేవిఉండవనీ చెప్పారు .ఒక వేళఉండినా దిద్దాలంటే మళ్ళీ తిరిగిరాయాల్సిందే కనుక ఆ ప్రయత్నం చేయ వద్దని చదు వరులను కోరాడు స్వామి . 

                  స్వ ఆత్మా ప్రాప్తి కోసం చెప్పే వేదాంత మార్గాలన్నీ అబద్ధాలు అంటారు చైనా తత్వ వేత్తలు .అనేక వేల గ్రంధాలు ఆత్మమార్గాన్ని బోధించటానికి ఉన్నాయి అవి .సత్యాన్ని మాటల ద్వారా తెలియ జేయ వచ్చు కాని గమ్యాన్ని చేర్చలేవు .శబ్దాలకు ,మాటలకు అందేది సత్యం కాదని చైనా వారు అంటారు వారిది ‘’మార్గం కాని మార్గం ‘’అంటారు . అదే ‘’Tao ‘’.అంటే నడిచే దారి గమ్యానికి చేర్చ దు .అయితే గమ్యం చేరటం యెట్లా ?వ్యక్తి స్వయం గా తన ఆత్మ స్వరూపాన్ని తెలుసు కోవటానికి నడ వాల్సిన పనేమీ లేదుగా .తన లోనే ఆత్మ ఉందిగా దాన్ని తెలుసుకోవటానికి మార్గాలక్కరలేదు నడవక్కర్లేదని వారి భావన .

                    మంచి కబుర్ల తొ మళ్ళీ కలుద్దాం

                          మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –9-12-12-ఉయ్యూరు

 

Posted in రచనలు | Tagged | 1 Comment

గొల్ల పూడి కధా మారుతం –14

    గొల్ల పూడి కధా మారుతం –14

                                                                         అందమైన జీవితం-3-(చివరి భాగం )

    ‘’జీవిత భారాన్ని మోసిన అలసట తొ కళ్ళల్లో నీడల్ని చూశాడు ‘’కమల లో రచయిత .తెచ్చి పెట్టుకొన్న ఉత్సాహం తప్పిస్తే ,మనిషి నీరసించింది .ఇంట్లో పిల్లల అలికిడి నిపించ లేదు .కమల జీవితం లోను ,మనస్సు లోను ఒంటరిదేమో ‘’అని పించింది .మర్నాడు తాజ్ మహల్ చూడాలను కొన్నాడు రచయిత .భార్యా , కమలా ఆమె భర్త తొ సహా .’’ఆయనకు తీరిక ఉండదు .’’అన్నా ఉత్సాహం గా అన్ని ఏర్పాట్లు చేస్తోంది .అయినా అతడిని అడిగాడు ‘’నేనూ అంటే కమల వస్తుందా? ’’అని అడిగాడాయన .తనకు తెలీని రహస్య మేదో తెలిసి పోతోందన్న వ్యధ అతనిలో కన్పించి బిత్తర పోయాడు మన వాడు .’’తాజ్ మహాచరిత్ర కు గుర్తు –మనకేమీ కాదు నేను కళా కారుణ్ణి కాను .Iam not interested ‘’అన్నాడు .ఖచ్చిత మైన అభిప్రాయం ఆయనకున్నాయని ,వాటిని ప్రశ్నించే హక్కు ఎవరికి లేదని అని పించింది .తెల్ల వారి లేస్తూనే కమల తానూ రావటం లేదని చెప్పింది .’’ఇంతలోనే నీ మనసు మారి పోయిన్డెం ?’’అన్నాడు‘’నీకేం తెలుస్తుంది బాబూ !నువ్వు మగాడివి .ఆ ప్రశ్న మీ ఆవిడ అడిగిందేమో చూడు నేను చూడ క పోతే ఏం ముని గింది ?’’అంది నిర్లిప్తం గా .ఉత్సాహం నీరుకారి పోయింది వీరిద్దరికి .అయినా వెళ్లి చూసోచ్చారు .ఆ రాత్రి చాలా పొద్దు పోయిన తర్వాతా తిరిగి వచ్చారు .కామలలో  మార్పేదో కన్పించింది మొదటి సారి ఆమె లో కోపం చూశాడు .పొద్దున్న కమలకూ ఈపూట కమలకూ తేడా ఉంది .అర్ధ రాత్రి బాత్ రూం లో ఏదో ఏడుపు విని పిస్తే అక్కడికి వెళ్లాడు .ఆమె నుదిటి పై రక్తం ఉంది ‘’కమలా ‘’అని ఆశ్చర్య పడ్డాడు ‘’మెల్లగా మాట్లాడు .ఆయన ‘’ఒళ్ళు మరిచి ‘’నిద్ర పోతున్నారు ..’’అంది .రక్తానికి కారణం అడిగాడు ‘’ఎంత బ్రాందీ సీసా అయితే మాత్రం అంత గట్టివి ఎందుకు బాబూ ?’’అంది తల తిరిగి పోయిన్దితనికి తాగి సీసా తొ కొట్టాడా అని అడిగితే ‘’ఏం కొట్టదానికి అధికారం లేదా భర్తకి ?’’అని ఆమె అడిగితే తెల్ల బోయాడు .సహనానికి భూదేవి హద్దు .,ఆశయం కదా మనకి అందులో భారత నారీ మణి కి .అందులో అర్దాన్గికి‘’ఎందుకూ ?’’అని అడిగాడు కారణమన్నా తెలుసు కొందామని ‘’కారణం ఏ ఆడదీ చెప్పదు బాబీ .నువ్వడుగా కూడదు .నువ్వు మెలకువ గా ఉన్నావు కనుక నీకు దొరికి పోయాను .ఎవరి తోను అనద్దు ‘’అని ఆంక్ష పెట్టింది .రాఘ వెండ్ర రావు మీద కసీ ,కమల పై జాలీ కలుగు తున్నట్లనైపించంది .’’నువ్వూ మీ ఆవిణ్ణి కొడతావా ?’’అని అడిగింది ఉదాసీనం గా అన్నాడు ‘’నాకు అందం లేదుగా ?పెళ్ళాన్ని కొట్టే అర్హత లేదు ‘’ఆ మాట చెళ్ళున తగి లి నట్లు గా నిర్ఘాంత పోయి చూసిందామె .వెళ్ళే ముందు సీతను చీరా సారే తొ సత్కరించింది .’’త్వరగా అబ్బాయిని ఎత్తుకో ‘’అని సలహా ఇచ్చింది .’’మంచి పిల్ల జాగ్రత్త గా చూసుకో .’’అని అతనికీ చెప్పింది హెచ్చరింపు గా ఆమె మాటలున్నాయని పించింది ‘’మంచి దయితేనేం అందగత్తే కాదుగా ‘’అన్నాడు ఉడికిమ్పుగా .కోపం గా .’ఆమె ‘’అందానికేం చిలక లాంటి పిల్ల ‘’అన్నది .అందం లో రాజీకి ఓ మెట్టు కిందికి దిగింది అని పించింది రచయితకు 

                ఆ తర్వాత నాలుగేళ్ళకు కమల హైదరాబాద్ లో కని పించింది .ఇంటికి రమ్మంది .చాలా చిత్రాలు చూపిస్తా నంది తన చేయి పట్టుకొని బీచ్ లో ఆడుతూ పాడుతూ చూసిన కమలకీ ,నిండిన పరి పూర్ణత సాధించిన ఈమాత్రు మూర్తి  కమలకీ పోలికలు వెదికే లోపే వెళ్లి పోయింది .భార్యా భర్తలు ఒక ఆదివారం కమలా వాళ్ళింటికి వెళ్లారు .వసారా లో కూర్చున్న వ్యక్తిని కాని ,అతని ముందు కూర్చున్న మూడేళ్ళ కుర్రాడిని కాని పోల్చుకో లేక పోయాడు .రాఘ వెంద్ర రావే  అతను .అతనే గుర్తు పట్టి పలక రించాడు .కుడి కన్ను దగ్గర్నుంచి చెవి దాకా చీరుకు పోయి నట్లు పెద్ద మచ్చ .కంటి దృష్టీ తప్పింది ఎడమ చెయ్యి వంకరయింది .సరిగా పని చేయటం లేదు శరీరం బాగా లావై నెత్తి మీద ఒకవెంట్రుక ముక్క కూడా లేదు గాంభీర్యం తగ్గి, ఇప్పుడు నవ్వుతున్నాడు .కష్టసుఖాలు,ఓటమి వల్ల మనిషి మెత్త బడ్డాడు .ఊహించని పెను మార్పే ఇది .తెల్ల బోయి చూస్తున్న తనను ‘’మాట్లాడ వద్దు ‘’అని సంజ్ఞచేసింది కమల .భర్తనే వివరం అడిగితే ‘’మూడేళ్ళ క్రితం ఆక్సి డెంట్ లో ఇలా జరిగింది .తల పగిలేదే .కొద్ది లో తప్పింది ,నాల్గు నెలలు హాస్పిటల్ లో ఉన్నారు .ఇప్పుడే ఇక్కడికి ట్రాన్స్ ఫర్ అయారు ‘’అని కమలే చెప్పింది .ఎక్కడా అశం తృప్తీ , దుఖం ఆమె కంఠంలో కానీ పించలేదు .ఉండ బట్టలేక ‘’ఎలా బతుకు తున్నావు ఈ కురూపి తొ ?’’అన్నాడు .తెలివి తక్కువ వాడిని క్షమించి నట్లు చూసి ‘ఫకాల్న నవ్వి ‘’నోర్ముయ్ !మీ ఆవిడ వింటుంది వింటే  ఆయన తొ బ్రతకటం నిజం గా నే నాకిష్టం లేదేమో నను కొంటుంది కూడా ‘’అన్నది .ఎంత నిబ్బరం వచ్చిన్దామెకు ?తరతరాల సంస్కృతీ వార సత్వమా ?రాజీ పడిన ఊరటా ?పిల్లాడిని చూపించింది .సన్నగా ,పీల గా ప్రాణం లేనట్లున్నాడు వాడికింకా మాటలు రాలేదు ‘’వాడికి మీ ఇద్దరి పోలికా రాలేదు ‘’అన్నాడు ‘’ఏమైనా ఆయన పోలిక రాలేదు అదే అదృష్టం ‘’అంది .అనుభవానికి తగిన మాట అది .వేదన లోంచి ధ్వనించిన మాట .’’చిన్నప్పటి గర్వం ,తిరుగు బాటు కన్నా ఈ దయా ,ప్రేమతో ఇంకా అందం గా కని పించింది కమల లేక అందం మారలేదేమో /అందాన్ని చూసే దృష్టి లో ఆర్పేమో ‘’అని వితర్కిన్చుకొన్నాడు

                   ‘’’ భర్త అందం చెరిగి పోయినా కమల ఆలోచనల్లో మొదటిఅందం ముద్ర చెడి పోలేదు .నా అందం లో మార్పు లేక పోయినా నా అందాన్ని గురించి ఆమె అభి ప్రాయం లో మార్పు తెచ్చుకోంది .సీత లో అందం లేక పోయినా ఆమె స్వభావం లో ,బ్రదకడం లో ఉన్న అందం తొ సరి పెట్టుకుంది .మరి పసి వాడిలో ?తండ్రి పోలిక లేని కారణం గ ఆ గుణాల్ని పుణికి పుచ్చుకొ లేదన్న ఆశ ,అంతకు మించి తన కొడుకు అన్న ఆప్యాయత లోనిఅందమేమో అది ‘’అని చాలా అందం గాకధను  ముగిస్తాడు మారుతీ రావు..అందం అంత రంగానికి సంబంధించిందే .అది బాహ్యం గా ఉన్న దాని కంటే లోపల ఉంటె నిండుదనం గౌరవం ,అనురాగం ,ప్రేమ కన్పిస్తాయి భయం ఉండి తప్పటడుగులు వేస్తె జీవితం అధః పతనమే .అప్పుడు అంతు లేని విచారమే .అంతస్సౌన్దర్యం అంత విలు వైనది .అది ఉన్న ప్రతి వ్యక్తీ ఆరాధనీయుడే .ఏ మహర్షిచేప్పినా ,ప్రవక్త చెప్పినా ,అవతార పురుషుడు ప్రవచించిన దానిని సాధించేందుకే .ఆ ఆనందం ఉంటె జగత్తంతా మనో హారం గా ,ముగ్ధంగా ,పర వశం గా కన్పిస్తుంది .  ఆ చూపు లేక పోతే ప్రకృతి అంతా వికృతి గా ,ఉంటుంది .ఆకృతి నిరాక్రుతి అవుతుంది .ఆ చూపు నిన్డుదనాన్నిస్తుంది తృప్తినీ ఆత్మ సంతృప్తినీ అందించి ,జీవితానికి పరి పూర్ణత్వాన్ని ప్రసాదిస్తుంది ‘’అందం తన విశ్వ రూపాన్ని కమలలో ప్రదర్శించింది ‘’అని మహా వాక్యం తొ ‘’అందమైన జీవితం ‘’కధ ను అంత అందం గా నూ ముగిస్తాడు రచయిత గొల్ల పూడి .అందమే ఆనందం గా ,ఆనందమే జీవిత మకరందం గా .,ఆనంద రస నిష్యందం గా .కమల ఓ సగటు భారతీయ మహిళా మూర్తి స్వరూపం .తర తరాల ఆదర్శ స్వరూపానికి దర్పణం .అందానికే అందం కమల జీవితం అని పిస్తుంది .అందమైన కధానిక తొ మరింత మైన సుందర కధనం ;;అందమైన జీవితం ‘’.జీవితం లోనీ పలు మార్పుల అందమైన అనుభవ పూర్వక మైన  నిశిత పరిశీలనం ,పరి పక్వం, పరి పూర్ణం ..

                మరో కధ తొ మళ్ళీ మీ ముందుకు

              సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –9-12-12-ఉయ్యూరు 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

కాశీ ఖండం –24 స్కంధ అగస్త్య సమాగమం

       కాశీ ఖండం –24

                                                       స్కంధ అగస్త్య సమాగమం

వ్యాస మహర్షి సూత మహామునికి అగస్త్య వృత్తాంతాన్ని వివరిస్తున్నాడు .కలశోద్భవు డైన అగస్త్యుడు శ్రీ గిరి ప్రదక్షిణం చేసి స్కంద వనాన్ని సందర్శించాడు .అక్కడ తపోధనులు చాలా మంది ఉన్నారు . మనోహర మైన పర్వతం ఒకటి తపస్సు చేసుకోవటానికి అనువైన ప్రదేశం ఇదే అన్నట్లు గా కన్పించింది .అక్కడ షడానను డైన కుమారస్వామిని దర్శించాడు .ఆయనకు భార్య లోపాముద్ర తొ  సాష్టాంగ నమస్కారం చేశాడు ఆయనను స్తోత్రాల తొ తృప్తి పరచాడు .’’స్వామీ !తారకాసురుని సంహరించి లోకాలను రక్షించావు .మూర్తి సహితుడివి ,మూర్తి రహితుడివి కూడా .సహస్ర మూర్తివి ,సహస్ర గుణాధికుడవు .బ్రహ్మ వేత్తలలో శ్రేష్ఠుడవు .తపో ధనుడవు .మన్మధ సంహారకుడివి .ఐశ్వర్య విరాగివి .శరవణ జన్ముడవు నీకు నమస్కారం ‘’అని స్తుతించాడు .ప్రీతి చెందినకుమారస్వామి ‘’మహర్షీ !కుంభ సంభవుడవు .వింధ్య  గర్వాపహారివి .కుశలమే కదా .మోక్షమిచ్చే విరూపాక్షుని అనుగ్రహం కోసం నేనిక్కడ తపస్సు చేస్తున్నాను .తీర్ధ స్నానాల చేత ,తపస్సు వల్లా .,,పరోపకారం వలన ధర్మం లభిస్తుంది .ధర్మం వల్ల అర్ధం దొరుకు తుంది .ధనా పేక్ష లేకుండా ధర్మా చరణం చేస్తే ధనం అదే వస్తుంది .దానికోసం వేమ్పర్లాడక్కర లేదు .ధర్మం వల్ల స్వర్గ ప్రాప్తి కల్గుతుంది .కానీ కాశీ పట్నం మాత్రం లభించదు .కాశీ ప్రాప్తికి శివుడు పార్వతీ దేవి తొ మూడు ఉపాయాలు చెప్పాడు .అందులో పాశు పత యోగం ఒకటి .రెండోది గంగా యమునా సంగమ లో స్నానం .మూడోది కాశీ పట్నం లో మృతి చెందటం .శ్రీ శైల ,హిమవత్పర్వతాల సందర్శనం ,దేవాలయ దర్శనం ,త్రిదండ ధారణం ,సర్వ కర్మ సన్యాసం ,అనేక రకాల తపస్సులు ,యమ నియమాది వ్రతాలు ,సముద్ర స్నానం ,అరణ్య వాసం ,మానస సరోవరతీర్ధ  సందర్శనం ,గురుపీఠములను చూడటం ,అగ్నిలో హవనం చేయటం,సంకల్ప పూర్వకం గా చేసే యోగాలు శ్రీ మహా విష్ణు పూజన ,కీర్తన అనేవి ముక్తికి మార్గాలు అందుకే నేను నిన్ను కాశీ కుశలమా అని ప్రశ్నించాను .నా దగ్గరకు వచ్చి నన్ను స్పృశించు .నీ పుణ్యం కొంత నాకు దక్క నివ్వు .

         ‘’కాశీ లో మూడు రాత్రులున్న వారి పాద రేణువు లను తాకినా చాలు పవిత్రు లవుతారు .అక్కడ ఉత్తర వాహిని అయిన గంగా నదిలో స్నానం చేసి నీ జుట్టు అంతా పింగళ వర్ణం గా మారింది .నీపేర ఉన్న అగస్త్యేశ్వర లింగాన్ని అర్చించిన వారి పితృదేవతలు సంతృప్తి చెందుతారు ‘’అని కార్తికేయుడు పరమానందం తొ అగస్త్య మహర్షి శరీరాన్నంతా స్పృశించి ,అమృత సరో వరం లో స్నానం చేసిన వాడి ,సుఖాన్ని పొందాడు .కళ్ళు మూసికొని ‘’సర్వేశా !జయం ‘’అని మూడు సార్లు అన్నాడు .

                 అగస్త్యుడు కుమారస్వామితో ‘’స్వామీ !నీ తల్లి పార్వతీ దేవికి నీ తండ్రి పరమేశ్వరుడు వారణాసి మహిమను వర్ణించి చెప్పినప్పుడు నీవు ఆమె ఒడిలో కూర్చుని సమస్తము విన్నావు .అదంతా నాకు సవిస్త రం గా చెప్పమని అర్ధిస్తున్నాను ‘’అని అడిగాడు .దానికి స్కందుడు ‘’అదంతా చెబుతాను .విను .కాశీ క్షేత్రం లో ఉన్నా, గంగ నీరు త్రాగినా ,విశ్వేశ దర్శనం చేసినా ,అక్కడి గాలి పీల్చినా పుణ్యం వస్తుంది .ఇక్కడ తపస్సు చేసిన వారికి వేరొక చోట వెయ్యి తపస్సులు చేసినప్పుడు వచ్చే ఫలితం లభిస్తుంది .ఇక్కడ యావజ్జీవితం నివశించే వాడు మృత్యు ,భయ రహితుడవుతాడు ..పునర్జనం లేకుండా ఉండా లంటే ,కాశీ నివాసం తప్పని సరి .అవి ముక్త క్షేత్ర మైన కాశి ని వదల రాదు .ప్రాణము మర్మ స్థానాన్ని చేదించుకొని వెళ్ళే వరకు కాశీ లో స్మృతి ఉంటుంది .ప్రాణం ఉత్క్రమణం చెందే టప్పుడు సాక్షాత్తు విశ్వేశ్వరుడే వచ్చి చెవిలో రామ తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు దాని తొ ప్రాణి బ్రహ్మ స్వరూపుడవుతాడు .’’అని ఆరుమొగాల కుమారస్వామి చెప్పాడని లోపాముద్రకు ముని చెప్పాడు .

              సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ – 9-12-12-ఉయ్యూరు 

Posted in రచనలు | Tagged | Leave a comment

నూజివీడు లో జరిగిన ప్రపంచ తెలుగు మహా సభల – సన్మానం

This gallery contains 38 photos.

  సాహితీ బంధువులకు శుభ కామ నలు .నూజి వీడు రెవిన్యు డివిజన్ నిర్వ హించే” ప్రపంచ తెలుగు మహా సభల” సందర్భం గా  ఎనిమిదవ తేది అంటే శని వారం సాయంత్రం నూజి వీడు లోఆర్ .డి వో.గారి ఆధ్వర్యం లో  జరిగిన కార్య క్రమం లో ఉయ్యూరు జోన్ లో నన్ను ఎంపిక చేసి సన్మానమ్ .ఇది … Continue reading

More Galleries | Tagged | Leave a comment

నుడి – అధికారాన్ని చెలాయించే భాషను ఆపగలమా ?

0001

0001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గొల్ల పూడి కదా మారుతం –13 అందమైన జీవితం –2

గొల్ల పూడి కదా మారుతం –13

                                                                         అందమైన జీవితం –2

 కమల భర్త తొ డార్జి లింగ్ వెళ్లి పోయింది .వెళ్ళే రోజు ఆమె కార్చిన కన్నీటిలో ఒక్క బొట్టైనా తన మీద జాలి తొ అయి ఉంటుందని ఊహించాడు .పదేళ్ళ తర్వాత తిరు పతి లో కలిశాడు ‘’ఈ ప్రపంచం లో అప్పుడే కళ్ళు తెరచిన గుడ్డి పువ్వు లా ఉండి‘’అన్నాడు ఆమెను చూసి .’’బాబీ ! అని ఆమె గుర్తు పట్టి పలక రించింది .అతని చుట్టూ కేరింతలు కొట్టే మిత్రులున్నారు .’’ఆడ పిల్లల్ని ఏడి పించేటప్పుడు ఎప్పు డైనా నేను జ్ఞాపకం వస్తానా బాబీ ?’’అని అడిగింది చీరలో ఉన్న అందం ఈ డ్రెస్ లో లేదని పించింది అతనికి .’’ఒళ్ళు చేశాను కదూ !అవును ఇంకేం చేయాలో తెలీక’’అంది .రచయిత ఆలోచనలను గ్రహించి నట్లుంది .పంజాబీ డ్రెస్ ఆయన కిష్టమని ఆయనతో తానూ టూర్ కు వెళ్లటం నేర్చుకోన్నానని చెప్పింది .’’ఎప్పుడూ కొంగు పట్టుకొని తిరిగే వాడివి కదా !అలా పిరికి గా ఉన్నా వేమిటి ? అని ప్రశ్నించింది .’’కొంగే లేదుగా ఇప్పుడు ‘’అని అంటే తను మరి పోయానని ఆ అలంకారాలు తనకి  కిష్టం లేనట్లుగా ఉందని  అనుకొన్నది .సెలవల్లో ఇంటికి రమ్మంది .చాలా మాట్లాడాలని ఉందని కూడా చెప్పింది .తిరుపతి లో ఎక్కడ బస చేశారో చెప్పమని తానే వస్తానని అన్నాడు .’’నువ్వా ! అమ్మో ! వద్దు .నేనే ఆయన్ను తీసుకు వస్తాలే నీ దగ్గరికి ‘’అని అడ్రెస్ మాత్రం తీసుకొని వెళ్ళింది .’’ఆమె ముఖం లో కనీ పించేదంతా నవ్వు ,తృప్తి, ఆనందం కాదు అని ‘’అని తెలిసి పోయింది .అంత తేలిగ్గా ఆమె భావాలను గ్రహించే శాడు face is the index of the mind ‘’అన్నారుగా .ఆమె తిరుపతి లో మళ్ళీ కనిపించలేదు .

             ఆరేళ్ళ తర్వాత రచయితకు పెళ్లి అయింది .సీత అందమైన పిల్ల కాదు కాని మంచి పిల్ల .అది కూడా అదృష్ట వశాత్తు నేమో ?అనుకుంటాడు .కమలా వాళ్ళు ధిల్లీ లో ఉన్నారు ఇతడు ట్రైనింగ్ కు అక్కడికే వెళ్లాడు .ఉత్తరం రాస్తే భార్య తొ సహా రమ్మనమని రాసింది .సీతను చూడ గానే ఆప్యాయం గా చేతుల్లోకి తీసుకొని ‘’ఆయన స్నానం చేస్తున్నారు .ఈ లోగా కాఫీలు త్రాగండి ‘’అని ,మంచి పిల్లనే చేసుకోన్నావె దొంగా !’’అన్నది .తనకేమో ఉక్కిరి బిక్కిరి గా ఉంది .ఏం చెప్ప లేక ప్పోతున్నాడు .రాఘ వెంద్ర రావు వచ్చాడు .బట్టతల అయింది .బుగ్గ లుబ్బి పెదిమలు లావుగా ఎర్రటి కళ్ళ తొ కొంచెం భయంకరం గా ఉన్నాడని పించింది .’’బాబీ అండీ .మన పెళ్ళికి పదేళ్ళ వాడు ‘’అనిపరిచయం చేసింది .’’మీ ఆయన గడుసు వాడమ్మా  !ఆ రోజుల్లోనే నన్ను పెళ్లి చేసుకోమని వెంట పడే వాడు ‘’అని ,గుక్క తిప్పుకో కుండా నవ్వింది .ఈ సంభాషణ భర్తకు నచ్చి నట్లు లేదు .ఆఫీసుకు వెళ్తున్నట్లు చెప్పి వెళ్లి పోయాడు .నవ్వే కమల పిల్లి అయి పోయింది .’’మేష్టారి పెం బెత్తం రుచి తెలిసిన విద్యార్ధి లాగా అతని తొ గదిలోకి వెళ్లి పోయింది ‘’అతను వెళ్ళే వరకు బయటికి రాలేదు

                    సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –8-12-12-ఉయ్యూరు

 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

కాశీ ఖండం -23 విశ్వ కర్మ నిర్వాణ ప్రయాణం

 కాశీ ఖండం -23

                                                                                 విశ్వ కర్మ నిర్వాణ ప్రయాణం

    విష్ణు దూతలైన సుశీల ,బహు శీలలు శివ శర్మ తొ ‘’నువ్వు ఈ విష్ణు లోకం లో భోగాలను అనుభ వించు .నువ్వు పుణ్య తీర్ధ మైన హరిద్వారం లో మరణించటం వల్ల నంది వర్ధన నగరం లో మహా రాజు వై జన్మిస్తావు .నీ రాజ్యం లో విద్యా విహీనులు ఉండ రాదు .స్త్రీలు తమ ధర్మాలను నిర్వర్తించాలి .ఎవరికీ దుఖం ఉండ కూడదు .వేద అనేది రత్నాలకు మాత్రమె .శూలం దేవతా మూర్తుల చేతి లోనే .కంపం అనేది సాత్విక భావోద్వేగం లోనే ,జ్వరం భయం వల్లనే దరిద్రం వల్ల కాదు ,ప్రమత్తఅనేది ఏనుగు ల యందు మాత్రమె .కంటకత్వం చెట్ల లోనే ,విహారాలు జనం లోనే ,దండం సన్యాసం లోనే ,గుణ వంత మైన పాలన నీ రాజ్యం లో ఉంటుంది. రాజ్య ధర్మజ్నుడవు అని పేరు పొందుతావు . .శ్రీ హరి సేవలో జీవితాన్ని ధన్యం చేసుకో .అజ్ఞానం లేని దివ్య జ్ఞానాన్ని కాశీ విశ్వేశ్వరుడు నీకు ప్రసాదిస్తాడు ‘’

 

 

           మోక్ష కారక మైన శివ లింగాన్నికాశీ లో  స్తాపించి దేవాలయం కట్టి నిత్య ము అభిషేక పూజాదులతో శివుడిని ప్రసన్నం చేసుకో .ఒక రోజు నీ దగ్గరకు వ్రతోప వాసాల తొ క్షీణించిన ఒక తపోధనుడు వస్తాడు .అతడు బాగా బక్క చిక్కి ఉంటాడు .నీ దగ్గర కూర్చుంది నీయోగా క్షేమాలను అడుగుతాడు .అతడు నిన్ను ‘’నువ్వెవరివి /ఎక్కడి నుండి వచ్చావు ?రెండవ ఆమె లాగా ఉన్న ఆమె ఎవరు ?ఈ గుడిని ఎవరు ఎప్పుడు నిర్మించారు ?అదంతా నేకు తెలుసా /దాని వల్ల ఏ ప్రయోజనం నీకు కలుగు తుంది ?’’అని ప్రశ్నిస్తాడు .దానికి నువ్వు నేను చెప్పి నట్లు సమాధానాలు చెప్పు ‘’నేను వృద్ధ కాలుడను .అనే మహా రాజును .దక్షిణ దేశం వాడిని .నా భార్య తొ ఇక్కడికి వచ్చాను .ఈ లింగాన్ని ప్రార్ధించటం తప్ప నాకేం తెలీదు .శివుడే ఈ ఆలయాన్ని నిర్మించుకొన్నాడు .దీని పేరు ,దాని విశేషం నాకేమీ తెలీదు .’’అని చెప్పమని చెప్పాడు .

               అప్పుడు ఆ వృద్ధుడు నీతో ‘’ఈ లింగము పేరు నీకు తెలియదు .లింగం వంక తదేక దృష్టి తొ చూడు .ఈ గుడి ఎవరు కట్టిందీ విన బడుతుంది .అది విన్న తరువాత నాకు చెప్పు ‘’అన్నాడు అప్పుడు ‘’నీవు కర్తవు ,కారయితావు .సాక్షాత్తు స్వయం భువుడవు .నేను అబద్ధం ఎందుకు చెబుతాను ?’’అను. వృద్ధ తపస్వి ‘’నాకు దాహం గా ఉంది నీళ్ళు తీసుకొని రా’’అని చెప్తాడు ..అప్పుడు వెంటనే బావి నుండి నీరు తోడి అతనికివ్వు .అతడు త్రాగుతాడు .అప్పుడు వెంటనే అతడు దేవతా స్వరూపం పొందుతాడు .యవ్వన ,రూప వంతుడు అవుతాడు .కుబుసం విడిచిన త్రాచు పాములా మెరుస్తాడు .అప్పుడు నువ్వు ‘’స్వామీ !ఏ ప్రభావం వల్ల మీరు ఈ వృద్ధ రూపం పొందారు ?మళ్ళీ ఈసుందర రూపం ఎలా వచ్చింది ?అని అడుగు .అప్పుడా తాపసి ఇలా చెప్తాడు ‘’వృద్ధ కాల మహా రాజా !నువ్వు బుద్ధి మంతుడివి .నీ భార్య అనుకూల వతి .ఈమె తుర్వసుడు అనే బ్రాహ్మణుని కూతురు .తండ్రి ఈమె ను నైద్రుతుడు అనే మహాత్ముని కిచ్చి వివాహం చేశాడు .భర్త చని పోయాడు .ఆమె పుణ్య వ్రతాల వల్ల పాండ్య రాజు కుమార్తె గా జన్మించింది .నిన్ను వివాహం చేసుకొని సుఖాలను భావిస్తోంది .

               ‘’పూర్వ జన్మ లో నువ్వు శివ శర్మ వు .వైకుంఠాన్ని పొంది పుణ్య వశం చేత నంది వర్ధన పురం లో వృద్ధ కాలుడు అనే రాజుగా పుట్టావు .ఈ మోక్ష క్షేత్రం లో నీ వు శివ పూజా దురంధరుడివై మోక్షాన్ని పొందుతున్నావు .నువ్వు చెప్పిన కర్తా ,కారయితా శంభుడే వేరేవరుకాదు.ఈ ఆలయాన్ని ఆయనే నిర్మించుకొన్నాడు .నీ పుణ్యాన్ని జాగ్రత్త గా కాపాడుకో .ఈ లింగం వృద్ధ కాల లింగం అని పిలువబడుతుంది .దీన్ని అర్చిస్తే కోరికలు తీరుతాయి ఈ వృద్ధ కాళేశ్వర లింగాన్ని పూజిస్తే సంవత్సరం లోపే సిద్ధి పొందుతారు .ఈ బావి నీరు త్రాగితే అంటువ్యాధులు రావు ..’’అని పలికి తన తొ ఉన్న అనంగ లేఖ చేయి పట్టుకొని వృద్ధ కాళేశ్వర లింగం లో అంతర్హితుడయాడు తాపసి .’’మహా కాలళా !మహా కాళా!  అని ఎవరు స్మరిస్తారో వారు విష్ణు దర్శనం పొంది మోక్షానికి పోతారు .

     ఈ విషయాలన్నీ భార్య లోపా ముద్రా దేవికి ముని అగస్త్యుడు వివరించాడు .శివ శర్మ వైకుంఠ వాసం చేసి తిరిగి భూమి పై నంది వర్ధన పట్టణం లో జన్మించి ఇహ లోక భోగాలు అనుభ వించాడు వారసులకు రాజ్యం అప్పగించి కాశీ చేరి విశ్వేశ్వరుని పూజించి మోక్షాన్ని పొందాడు .ఈ శివ శర్మ కధ విన్న వారికి ఉత్తమ జ్ఞానం కలుగు తుంది అని మహర్షి ఫల శ్రుతి చెప్పారు

          సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –8-12-12-ఉయ్యూరు .

                        

Posted in రచనలు | Tagged | Leave a comment

అశోకుని పై ‘’లఘు సర్వస్వమే ‘’ప్రత్యెక సంచిక

 అశోకుని పై ‘’లఘు సర్వస్వమే  ‘’ప్రత్యెక సంచిక

 సాహితీ బంధువులకు –మీకొక అమూల్య కానుక ను అందిస్తున్నాను ..

           గుంటూరు జిల్లా మంగళ గిరి నుండి వెలువడే ‘’ బుద్ధ భూమి పత్రికవారు  ‘’అక్టోబర్ –నవంబర్ సంచికను అశోకుని ప్రత్యెక సంచిక గా వెలువరించారు .దేవానాం ప్రియ ,ప్రియ దర్శి బిరుదు పొంది ,కళింగ యుద్ధ విజయం తర్వాత బౌద్ధ ధర్మావలంబి యై ,ఆఅహింసకే ప్రాధాన్యత నిచ్చి ,ఆ మత వ్యాప్తికి అవిరళ కృషి, చేసి తన కూతురు ,కుమారులను సింహళం మొదలైన దేశాలలో వ్యాప్తికోసం పంపి త్రికరణ శుద్ధి గా ధర్మాన్ని పాలిస్తూ ,పాలింప జేస్తూ ఆదర్శ చక్ర వర్తి అని పించుకొని బౌద్ధారామాలకు భూరి విరాళాలిచ్చి బౌద్ధ స్తూప నిర్మాణం చేసి ,మహా సభలు నిర్వ హించిన మహనీయుని పై ఈ సంచిక తేవటం హర్ష ణీయం .దీనికిశ్రీ రేకా కృష్ణార్జున రావు గారిని ,వారికి సహక రించిన వారికి అభి నందనలు .ఒక రకం గా ఇది అశోకుని పై ‘’లఘు సర్వస్వం ‘’అని పిస్తుంది .చాలా విషయాలను సేకరించి రాయించి, మంచి అరుదైన చిత్రాలను,వర్ణ చిత్రాలను  పొందు పరచి నిర్వ హించిన కార్యం ఇది .ashokuni pai pratyeka sanchika -1

         ‘’ఒక రాజు లేక చక్ర వర్తి యుద్ధం లో వీర విజయం సాధిస్తే పొంగిపోయి ఇంకా యుద్ధాలు చేసి రాజ్య విస్తరణ చేయటం చూశాం .కాని అశోక చక్ర వర్తి కళింగ యుద్ధం తర్వాత  రక్త పాతానికి నికి విచలితుడై పూర్తిగా మారిపోయి అహింసా వ్రతాన్ని అవలంబించి యుద్ధాలు ఇక చేయను అని ప్రకటించాడు .ఇలాప్రపంచం మొత్తం మీద ఏ రాజు ,ఏ చక్ర వర్తి  నిర్ణయం తీసుకోలేదు .అదీ అశోకుని ఘనత ‘’అని చరిత్ర కారులు మెచ్చారు ..మూడవ సంగీతి ని నిర్వహించాడు .దమ్మ మహా మాత్రులనే ప్రత్యేకాధి కారుల్ని నియమించాడు .సత్వర న్యాయం ఆయన లక్ష్యం .ఆయన ఉదార మానవతా దృష్టికి జేజేలు .పన్నులను ఆపన్నులకు, ప్రజా సంక్షే మానికి విని యోగించాడు .మనిషిగా జీవించటం మరణాన్ని జయించటం నేర్పాడు .మూగ జీవుల ఆరాటాన్ని గుర్తించి సేవ చేశాడు .

        ashokuni pai pratyeka sanchika -2  సామ్రాట్ అశోక అంటేనే ఒళ్ళు జలద రిస్తుంది .ఉప గుప్తుడు లేక మొగ్గలి పుత్ర తిష్యుని వల్ల బౌద్ధ ధర్మాన్ని పొందాడు .కుమార్తె సంఘ మిత్ర ను,కుమారుడు మహేంద్రుని బోధి వృక్ష శాఖ నిచ్చి శ్రీ లంకకు పంపాడు .అక్కడ వారు‘’అనూ రాధ పురం ‘’క్రీ.పూ.247లో దానిని వారు నాటి నట్లు చరిత్ర చెబుతోంది .సుస్తిర పరి పాలన కోసం సామ్రాట్ భవన ,కాంభోజ ,ఆంద్ర ,భోజ ,పారింద దేశాలకు స్వయం ప్రతి పత్తి తొ శాసనాధికారాలిచ్చాడు .మహా పాత్ర ,రాజుక్ ,ప్రాదేశిక్ ,మొదలైన అధికారులను ఏర్పాటు చేసి ఎవరి విధి వారు నిర్వ హించేట్లు చేశాడు .

            బౌద్ధ సాహిత్యం లో ‘’అశోకా వదానం ‘’అనేది ‘’దివ్యావ దానం ‘’అనే బృహత్ గ్రంధం లో ఒక భాగం .ఇందులో ఆయన గురించి సమగ్ర చరిత్ర కన్పిస్తుంది అశోకుని కుమారుడు ధర్మ వివర్ధనుడు అతని కళ్ళకు అసాధారణ శోభ వుండేది అతడినే కుణాలుడు అంటారు .ఉపగుప్తుని శిష్యుడై ధర్మ శిక్షణ పొందాడు .కాంచన మాల తొ వివాహ మైంది అతడిని తక్ష శిలకు రాజ ప్రతినిధిని చేశాడు తండ్రి .సెలవు తెసుకొంటు పిన తల్లి అశోకుని రెండవ భార్య అయిన తిష్య రక్షిత దగ్గరకు వెళ్లాడు .ఆమెకు మనస్సు చలించింది .చలించలేదు కొడుకు ..కోపం తొ అతడినిసర్వ నాశనం చేయాలని సంకల్పించింది .అశోకునికి జబ్బు చేసి కొంత కాలం అపస్మారకం లో ఉన్నాడు .రాజ ముద్రిక సంపాదించి అతడికి శిక్ష వేసి కళ్ళు పీకించి ,పదవి లాగేసింది .అతను ఒంటరిగా పాటలీ పుత్రం చేరి భిక్ష చేస్తూ జీవించాడు .ఒక రోజు వీధిలో వీణ వాయిస్తుంటే ఆ కమ్ర నాదాన్నిఆస్థాన విద్వాంశుడు   పోల్చుకొని అతడే కుణాలుడు అని గ్రహించాడు .అశోకునికి భార్య కుణాలుని పై అనేక అభి యోగాలు మోపింది .విచారణ జరుపుతుంటే  ఆయనకు నిజం తెలిసింది భార్య కు శిక్ష విధించే సభ ఏర్పాటు చేశాడు . అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాడు సభాస్తలిలో సామ్రాట్ అశోక .ఆమెను చిత్ర హింసలు చేసి చంపమని ఆజ్న జారీ చేశాడు ధర్మ అశోకుడు .అప్పుడు ‘’నాన్నా ‘’ అంటూ ఒక స్వరం విన బడింది .అతడే కుణాలుడు .’’ఉప గుప్తుల వారి అనుగ్రహం  వల్ల నేను ధర్మ రాజ పుత్రుడినయ్యాను .మీరు గడించి నంత పుణ్యం ఏ చక్ర వర్తీ గడించలేదు .ఒక్క సారి ఉప గుప్తుడిని బుద్ధ భగ వానుడిని తలచు కోండి .నా తల్లి తిష్య రక్షిత కు క్షమా భిక్ష పెట్టండి‘’అని అర్ధించాడు .చండా శోకుడు శాంతాశోకుడై ధర్మా శోకుడైనాడు .ఇలాంటి మనకు తెలీని విష యాలను లో చేర్చారు ..

       ashokuni pai pratyeka sanchika -3     అశోకుడు గుహాలయాలు ,ఏక శిలా స్తంభాలు ,ఎన్నో నిర్మించాడు అవి గొప్ప వాస్తు శాస్త్ర విధానం లో ఉన్నాయి .చైనా దేశం లో జీజియాంగ్ రాష్ట్రం లో జింగ్ బో అనే పట్టణం లో ఉన్న అయిదు పర్వతాలలో ఒకటైన ‘’అశోక పర్వతం ‘’మీద ‘’అశోకా రామం ‘’క్రీ.పూ282లో నిర్మించ బడింది .అశోకుని శిల శాశనాలు మహా రాష్ట్ర లోనీ గిర్నార్ ,ఉత్తరాంచల్ లో కాటస ,భువనేశ్వర్ లో దోలి ,జోగడ ,పాకిస్తాన్ లో షాబాజ్ గర్హి ,మాన్ షెరా ,మహా రాష్ట్రలో సోపార ,ఆంధ్రాలో ఎర్రగుడి .,ఉత్తర ప్రదేశ్ లో అలహా బాద్ ,బీహార్ లో రాధియా లో ,ఉన్నాయి .అశోకుని సారనాద్ స్తూపం ,అక్కడి అశోక చక్రం ,భారత దేశానికి అధికార చిహ్నమైన మూడు తలల సింహం మన జాతి చరిత్రలో ఒక టై నాయి .

          ప్రపంచానికే ఆదర్శ పాలకుడని పించుకొన్నాడు అశోక చక్ర వర్తి తను భోజనం చేస్తున్నా స్నానం చేస్తున్నా నిద్రిస్తున్నా  ఏ సమయం లో నైనా అధికారులు వచ్చి తనను కలుసుకో వచ్చునని ప్రజా విషయం కంటే తనకేదీ ముఖ్యం కాదని చెప్పాడు .ధనం కంటే ధర్మం  తోనే అభి వృద్ధి జరగాలని కోరాడు . అహింసా, ఆదరణ ,శాంతి ,సహజీవనం ,సాను భూతి తోనే మాన వాళికి మంచి జరుగు తుందని నమ్మాడు .అన్య మతాలను కూడా ఆదరించి మత సహనం చూపిన మాన్యుడైనాడు .విశాల దృక్పధం, సర్వ జీవ సౌభాగ్యమే ఆయన ఆశయం .అది సాధించి అందరికి మార్గ దర్శి అయాడు .ఉన్నత సంస్కృతి ,నాగరకత లకు మూల పురుషుడని పించుకొన్నాడు .వార్తా పత్రికల రూప శిల్పి అశోకుడు .ఆయా ప్రాంతాల సమా చారాన్ని రాజ దాని లో అందరికి అందించాలని దర్బారు బయట సమాచారాన్ని రాయించి సమాచార విప్లవం తెచ్చాడు .

           నేపాల్ దేశం లో అశోకుడు బౌద్ధ దీక్ష తీసుకొన్న దీపావళి రోజును ఘనం గా దీప తోరణాలను అలంకరించి‘’అశోక దీపావళి‘’గా జరుపు కొంటారు .గిరిజనుల అమాయ కత్వాన్ని కాష్ చేసుకొనే వారికి తీవ్రం గా దండించాడు గిరిజనులను గురించి పట్టించుకొన్న మొదటి రాజు గా గుర్తింప బడ్డాడు .పర్యావరణ పరి రక్షణ కోసం మొక్కలు నాటించి దారులను ఏర్పాటు చేసి యాత్రికులకు సత్రాలు కట్టించాడు .ఇంత గొప్ప పరి పాలకుని పేర దేశం లో ‘’ఒక విశ్వ విద్యాలయంకూడా  లేక పోవటం శోచనీయం ‘’అన్నారొక రచయిత ఇందులో . ఇది అందరి దృష్టినీ ఆకర్షించాలి .ప్రభుత్వం పై ఒత్తిడి చేయాలి .

              ఒక సారి ఒక బౌద్ధ భిక్షువు పాదాలకు తల వంచి నమస్కరించాడు సామ్రాట్ .ఆయన మంత్రి ‘’;యశుడు‘’ఒక మహా రాజు అలా చేయ రాదనీ అన్నాడు .చిరు నవ్వుతో ముందుకు కదిలాడు .కొన్ని రోజుల తర్వాత ఒక మాంసం కొట్టు నుంచి గొర్రె, మేక, తొ బాటు ఒక అనామక మనిషి తల తెప్పించి బంట్రోతుల  కిచ్చి అమ్ముకొని రమ్మన్నాడు .వారు నగరం అంతా తిరిగినా మనిషి తలను ఎవరు కోన లేదు .మిగిలిన రెండు జంతువుల తలలు అమ్ము డయాయని చెప్పారు అప్పుడు మంత్రిని పిలిచి అది అనామకు డైన మనిషి శిరస్సు అయినా ఎవరు కొన లేదని, తన శిరస్సు విక్ర యిస్తే కొంటారా ?అని అడిగాడు ..అప్పుడు చక్ర వర్తి ‘’ప్రకృతి లో పక్షుల,జంతువుల శిరస్సు కంటే నిరుప యోగ మైన మానవుని శిరస్సు ను వంచి ఒక జ్ఞాని పాదాలకు నమస్కరిస్తే గౌరవం తగ్గు తుందా?’’అని అడిగాడు అదీ చక్ర వర్తి ఔన్నత్యం ,గురు గౌరవం ..

              అశోకుని చివరి రోజులు చాలా భారం గా గడవటం విచార కరం .పట్ట మహిషి అసంది మిత్ర వివాహమైన ఇరవై తోమ్మిదిఏళ్ళ కే మరణించింది .చాలా కాలం పునర్వివాహం చేసుకో కుండానే గడిపాడు .తప్పని పసరి పరిస్తితులలో‘’తిష్య రక్షిత ‘’ను ద్వితీయం చేసుకొన్నాడు .ఆమె అతని పట్ల చాలా క్రూరం గా వ్యవహరించింది .ఆయన ఎంతో ప్రేమ గా పెంచు కొంటున్న బొధి వృక్షానికి విషం పెట్టించి క్షీణింప జేస్తుంది తట్టుకోలేక కృశించి పోతాడు భయ పడి ఆ చెట్టుకు వెయ్యి కుండల పాలు పోసి నెమ్మదిగా బ్రతి కించింది .అశోకుడు ఆనందం తొ గొప్ప ఉత్సవం చేశాడు ఒక సారి ఆజీవకులు అనే బౌద్ధ వ్యతి రేకులు బుద్ధ విగ్రహాలను ధ్వంసం చేశారు .వాళ్ళను గుర్తించి తలలు నరకమని,నరికిన ప్రతి తలకు ఒక బంగారు నాణెం బహుమతి గా ఇస్తానని అశోకుడు ప్రకటించాడు .అలాంటి సమయం లో అశోకుని తమ్ముడు‘’విగత అశోకుడు ‘’రోగంతొ బాధ పడుతూ ,ఒక ఇంట్లో విశ్రాంతి తీసుకొన్నాడు ..అతని ఆకారం చూసి ఆజీవుకుడని అను మానించి, అర్ధ రాత్రి ఆ ఇంటి యజమాని భార్య సాయంతో విగత శోకుడిని విగత జీవుణ్ణి చేశాడు .ఆ తలను అశోకుడికి చూపి బంగారు నాణెం ఇవ్వ మని  కోరాడు .తమ్ముడి తలను గుర్తించి ,అశోకుడు నిశ్చే ష్టు డయాడు. . .తన తప్పు తెలుసు కొని ‘’శిర చ్చేదం‘’శిక్ష ను రద్దు చేశాడు  

                చివరి రోజుల్లో తీవ్ర అనారోగ్యం పాలైనాడు .బౌద్ధ సంఘాలకు వంద కోట్ల బంగారు నాణాలు ఇవ్వాలని అనుకొని తొంభై ఆరు కోట్లు ఇచ్చేశాడు .మిగిలిన ఆరుకోట్లు ఇవ్వ టానికి మనుమడు ,కుణా లుని  కొడుకు‘’సంప్రది’’ఒప్పుకోకుండా గట్టి నిఘా పెట్టాడు అయినా తనకు భోజనం పెట్టె బంగారు పళ్ళాలను ఇచ్చేశాడు వెండి పళ్ళాలతో భోజనం పెడితే వాటినీ ఇచ్చేశాడు రాగి వాటిని కూడా చివరికి కి పింగాణీ పళ్ళాలు కూడా ఇచ్చేశాడు .ఇది తెలిసి మనవడు భోజనానికి ‘’ఓక అరకాయ ఉసిరి కాయముక్కను ‘’పంపాడు .నిర్వేదం చెందిన సామ్రాట్ ఈ రాజ్యానికి రాజేవ్వరు అని రాజ భటులను అడిగితే ‘’మీరే ‘’అని వారు అంటే ‘’నా తృప్తికోసం అంటున్నారు మీరు .నా పరిస్తితి ఇది‘’అని ఆ ముక్కను చూపి దాన్ని కూడా ‘’కుక్కుటా రామం ‘’లోనిభిక్షుకులకు అందజేయమని సేవకుడికిచ్చి పంపాడు .వారంతా దాన్నే మహా ప్రసాదం గా చూర్ణం చేసి తిన్నారట ..ఇదీ చాలామందికి  తెలీని విషయమే . . ఇది చదివి గుండె చెరువు కాని పాఠకుడు ఉండడు.

                   చివరి ఘడియల్లో అశోకుని విశ్వాస పాత్రుడు రాధ గుప్తుడు వచ్చి ‘’ఈ భూ మండలానికి మీరే చక్ర వర్తులు ‘’అన్నాడు .అంతె -ప్రభుత్వ ఖజానా తప్ప మిగిలిన భూ మండలాన్ని  బౌద్ధా రామాలకు దానం గా ఇచ్చేశాడు .ఇలా చేయటం ఏదో గొప్ప పదవికోసం కాదని ,మనస్సు మీదసార్వ భౌమాదికారాన్ని పొందటానికే నని చెప్పాడు .ఇదే తాను చేసిన దాన ఫలం అని చెప్పి రాజాజ్న గా రాయించి దాని మీద తన పంటి ముద్ర తొ రాజ ముద్ర వేశాడు .ఇక్కడ మనకు శిబి ,దధీచి మొదలైన త్యాగ ధనులు గుర్తుకొస్తారు .తన 71 వ ఏట తుది శ్వాస విడి చాడు అశోక సామ్రాట్ .ఇది ఆ మహా మహుని చివరి దయనీయ గాధ. .విచలితుల మవుతాం ..

   ఇలాంటి ఎన్నో అద్భుత మైన విశేషాల తొ ఈ ప్రత్యెక సంచిక అల రారింది . అమూల్య మైన విషయాలున్న ఈ సంచికను కొని  చదివి, దాచుకో దగిన ఆభరణం . .మరొక్క సారి ‘’రేకా వారి బృందాన్ని’’మనసారా అభి నందిస్తున్నాను . చివరగా అశోక ధర్మ చక్రం మీద శ్రీ తియ్య గూర సీతా రామి రెడ్డి గారి హృదయ మైనపద్యాన్ని  ఉదహరిస్తాను .

     ‘’దివ్యమై ,మోక్ష గంతవ్యమై ,భవ్యమై ,బబోధి సంభావ్య మగుచు

      భాగ్యమై ,సంబోధి భాగమై ,ఆస్రవ మృగ్యమై ,ముని జన యోగ్య మగుచు

      నిత్యమై ,బొది సంస్తుత్యమై ,నిర్వాణ సత్యమై ,సాధన కృత్య మగుచు

       బోధియై సద్ధర్మ వేదియై ,హేతు ప్రమోదియై యమృత స్వాది యగుచు

               సంప్రజన్య సంక్రాంతుల సంచ రించు –సర్వ మంగళ చక్రంబు సర్వ త్రాణ

               జయద యమల చక్రము బుద్ధ జ్ఞాత ధర్మ –చక్ర మిది మారుని దునుము ఆయుధమ్ము ‘’.

   మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –7-12-12-ఉయ్యూరు

          

సాహితీ బంధువులకు శుభ కామ నలు .నూజి వీడు రెవిన్యు డివిజన్ నిర్వ హించే” ప్రపంచ తెలుగు మహా సభల” సందర్భం గా రేపు ఎనిమిదవ తేది అంటే శని వారం సాయంత్రం నూజి వీడు లోఆర్ .డి వో.గారి ఆధ్వర్యం లో  జరిగే కార్య క్రమం లో ఉయ్యూరు జోన్ లో నన్ను ఎంపిక చేసి సన్మానిం చాలని సంకల్పించినట్లు ,నాకు ఆవిషయాన్ని  ఆర్.డి .వో.గారు తెలియ జేయమని చెప్పి నట్లు ఇప్పుడే నూజి వీడు నుండి ఆ సభల కన్వీనర్ శ్రీ శిఖా ఆకాష్ గారు ఫోన్ చేసి తెలిపారు .ఇది సరస భారతికి జరిగే సన్మానం గా భావిస్తూ అంగీకారం తెలియ జేశాను . మీ –గబ్బిట  దుర్గా ప్రసాద్

Posted in రచనలు | Tagged | Leave a comment

గొల్లపూడి కధామారుతం –12 ఆరవ కధ –అందమైన జీవితం –1

 గొల్లపూడి కధామారుతం –12

                                                                                ఆరవ కధ –అందమైన జీవితం –1

  సత్య భామ కు పూర్తి వ్యతి రేక మైన ‘’కమల ‘’పాత్రను సృష్టించాడు ‘’అందమైన జీవితం’’కధలో గొల్ల పూడి .జీవితం నేర్పే పాఠా లను చక్కగా నేర్చుకొని ,ఒదిగి పోతు ,కష్టాలనీ బాధల్నీ ఎదుర్కొంటూ ,’’రాజీ ‘’గా బ్రతికే అమ్మాయి కధ ఇది .’’నీ ముక్కు అంత పొడుగ్గా లేక పోతే తప్ప కుండా నిన్నే పెళ్లి చేసుకొనే దాన్ని ‘’అంది రచయిత తొ ఇరవై ఏళ్ళ కితం కమల .ఆ మాటకు ఆమె మీద కంటే తన ముక్కు మీద కోపం తెచ్చుకొన్నాడు .అంత అంద మైన అమ్మాయి తన జీవితం లో ‘’మిస్ ‘’అయి ‘’మిసెస్ ‘’కాలేక పోయి నందుకు .’’చాలా వాటికి రాజీ పడ్డాను కాని –నా ముక్కుని మాత్రం క్షమించ లేదు ‘’అంటాడు కధను ప్రారంభిస్తూ .మరి ఆమె అందం సామాన్య మైనదా .?’’మత్తు గా నిద్రిస్తున్నప్రపంచం మీద ఉదయించిన సూర్యోదయం లాంటి ముఖం ,కొండ లోయల్లో మంచు తెరల్ని తట్టి లేపే వెలుగు తెరల్లాగా గుండె లోతుల్లో కోరికల్ని తట్టి లేపి ,పలకరించే చిరు నవ్వు ,ప్రపంచాన్ని జయించిన సామ్రాజ్ఞి చివరి తిరస్కారంలాగా ఠీవిగా కదలాడే కళ్ళు ‘’గల కమలకు తనను తిరస్కరించే అదుకారం ఇచ్చి ఉంటుందనుకొంటాడు .ఇంటర్ చదివే రోజుల్లో కాలేజీ కుర్రాళ్ళకు ఆమె కొంటె తనం ఆట వస్తువు .వాళ్ళ అల్లరిని హర్షిస్తు ప్రోత్స హించేది కూడా .అయితే చివరికి వాళ్ళ అల్లరికి తన ఆరంగుళాల జడే బలయిందనీ ,ఓ చీకటి సాయంత్రం ఎవరో అబ్బాయిలు ఆమె కొంగు లాగి ఓ గజం కత్తి రించి మర్నాడు దాని రుమాళ్ళ తొ కనీ పించారని వాళ్ళ నాన్న కు తెలిసి చదువు మాని పించేశాడు .ఆమె విచారించలేదు .విచారిస్తే ‘’కమల ఎందు కవుతుండీ ‘’?అని ప్రశ్నిస్తాడు మారుతీ రావు

             ఇంటి దగ్గరే ఉండటం వల్ల ,ఆమె తొ పరిచయం బాగా పెరిగి కబుర్లూ సరదా షికార్లూ చేశారిద్దరూ .ఆమె అందాన్ని చూసి చుట్టూ చేరే కుర్రకారుని చూసి భయ పాడేది కాదు .’’చిరు నవ్వుతో తిరస్కారాన్ని, కంటి చూపుతో నిర్లక్ష్యాన్ని చూపి ,తన చెయ్యి పట్టుకొని వాళ్ళ మధ్య నుంచి సామ్రాజ్ఞి లాగా నడిచి పోయేది కమల .ఆమె అందం ‘’మల్లె పూవు లోనీ అమాయక అందం కాదు .త్రాచు పాము లో కని పించే ఠీవైన అందం .’’ ఆ ఆనందం లో గడుసుదనం గర్వం ఠీవి ,తిరుగు బాటు దనం ఉంది .ఓ సాయంత్రం బీచ్ లో ‘’నువ్వు చాలా అందం గా ఉంటావు కమలా “’అన్నాడు .అతని గొంతు ఒణుకుకని పెట్టి ,అతని ముఖాన్ని చేతులతో దగ్గరకు లాక్కొని మరీ ముద్దు పెట్టు కుంది .’’అలంటి విషయం ఆమె కెవరు చెప్పలేదేమో ?అది చెప్పటం ఆమె కిష్టమేమో ?’’అనుకున్నాడు .ఆమె జుట్టు అన్నా ,నవ్వి నప్పుడు కుడి చివర బయటికి తొంగి చూసే సన్నటి పంటి నొక్కు అన్నా అతని కి చాలా ఇష్టం .ఆ కళ్ళలో అప్పుడు చూపే దయా ,సాను భూతి కలకాలం గుర్తుంచు కొన్నాడు .అప్పటికి అతని వయసు పదేళ్ళే   రాజ బాబూ ,రమా ప్రభా ల‘’ఇల్లూ –ఇల్లాలు‘సినిమా సీన్ లో పాట లాగా ఉంది కదూ.

           ఓ రోజు ఆమె ను చూడ టానికి పెళ్లి వారోచ్చారు .పెళ్లి కొడుకు రాఘ వెంద్రరావు ‘’పాల రాయి లాగా నును పైన వాడు .విశాల మైన నుదురు .పెదాలు నవ్వినప్పుడు కని పించే వంపు ,,గొంతులో లాలిత్యం ,నెమ్మది ‘’కల వాడు .అందగాడే కాక జియాలజిస్ట్ .పెళ్లి నిశ్చయ మైంది .రెండ్రోజుల తర్వాత ‘’ మొన్న వచ్చిన ఆ పోడ వాటి ఆయనతో పెళ్లి అయిన తర్వాతవెళ్లి పోతావా ?’’అని అడిగాడు .’’అవును ‘’అంది .’’అమ్మ కళ్ళల్లో కనీ పించే దయ ఆమె కళ్ళల్లో కని పించింది అతనికి . .చిలిపి దనం ,అల్లరి రెండు రోజుల్లో మాయ మయి కమల పెద్దది అయి పోయిందని పించింది .’’ఈ పెద్దరికం నాకు నచ్చలేదు .చుట్టూ ఉన్న ప్రపంచం మారి పోయి నట్టుంది నాకు ‘’అంటాడు ఆ షాక్ భరించలేక .వాళ్ళమ్మని అడిగాడు ‘’కమల ను నే పెళ్లి చేసుకొంటే మనింటికి వచ్చేస్తుందా ?’’అని  .ఆవిడ నవ్వి అలా అనకూడదు తప్పుఅని బుగ్గ గిల్లి  అంది .కాని ఇతనికి లోపల కోరిక చావలేదు .పెళ్లి ఇంకో వారం ఉందనగా ‘’నన్నూ పెళ్లి చేసుకోవూ ?’’అన్నాడు .అప్పుడు అంది ‘’నీ ముక్కు అంత పొడుగ్గా లేక పోతే చేసుకొనే దాన్నే బాబీ ‘’అని .అలా మొదలు పెట్టి ఇంత దాకా చెప్పే శాడు గడుసు గొల్ల పూడి .పెళ్లి లో భార్యా భర్తల అన్యోన్యం  చూసి ఆశ్చర్య పడ్డాడు గొప్ప అందగాడిని చేసుకొన్నందుకు తృప్తి ,గర్వం .ఆ క్షణం లో ఆ అగ్ని హోత్రం వెనక గమనించాడు

           సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –7-12-12-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment