గొల్ల పూడి కధా మారుతం -16
పరకీయ -2
ట్రైనింగ్ తర్వాత వచ్చి ఆమె కోసం వెదికితే కని పించలేదు .కొద్ది రోజులకు ఆమెకూ బలరాం కు పెళ్లి శుభలేఖ అందింది .ఆమెను తను సరిగ్గా అర్ధం చేసుకో లేక పోయానని బాధ పడ్డాడు .ఆమె తననెందుకు మోసం చేసిందో తెలియలేదు .నిజం గా ఆమె గర్భ వతేనా ?కాలం అన్నీ మరి చెట్లు చేస్తుంది .తానూ ఓ ఇంటి వాడయ్యాడు .అప్పటికి ఇప్పుడు మళ్ళీ ఆమె హార్సిలీ హిల్స్ మీద ప్రత్యక్షం .సినిమా రీలు మళ్ళీ మొదటి కొచ్చింది .ఆరోజు ఆమె ఇంటికి వెళ్లాడు‘’ఎందుకు వెళ్లి పోయావు ఆ నాడు ఆకు చెప్పకుండా ?’’అడిగాడు .’’చెబితే ఏం చేసే వారు ?’’అంది తడుము కోకుండా .వసంత దృష్టిని అంతగా భవిష్యత్తు వైపుకు ఎలా మళ్ళించ గలిగిందా అన్న ఆలోచన ఇంకా నిర్వీర్యుడిని చేసింది .’’ఇలా జరుగుతుందని ఆనాడు తెలిస్తే మీరు దూరం గా ఉండే వారు కదూ ?’అంది .తిక మక పడ్డాడు .ఇంతలో అతని భార్య వచ్చింది .తాను వచ్చి చాలా సేపయిందని ,ఆమె భర్తతో మాట్లాడుతున్నానని ,అతనితో ఇది వరకే పరిచయం ఉందని ,ఫోటో వల్ల గుర్తు పట్టానని వసంత ఆమె తొ అంది .
‘’ ఆ క్షణం లో జీవిత మంతా వసంత పాదాల దగ్గర ఉన్నట్ట ని పించింది ‘’అంత ఫామేదా గా ఆమె ప్రవర్తించింది .తన వల్ల అవతలి వ్యక్తికీ ఇబ్బంది కలుగ రాదనీ ఆమె ఆంతర్యం అంత మహోన్నత మైనది .ఇతని భార్య ఆశ్చర్యం ప్రకటిస్తే ‘’ఏం అంతేనా ?’’అంది లేని చిరు నవ్వు మొగాన పులుముకొని తనకెందుకు చెప్పలేదని భార్య అడిగితే సమాధానం వసంతే చెప్పింది ‘’ఆయనకు మాత్రం ఏం తెలుసు ?నేను రోజు ఆయన ఎదురుగా నిల బడుతున్నానా ?’’అంది .మాటల్లో అతని పై ఎంతో అధికారం ఉందని తోస్తే ఇతని భార్య విస్తు బోయింది .అలాగే ఇంకొంచెం సేపుంటే ఏం జరిగేదో తెలీదు ‘’నీ మాటలు వింటే బెదిరి పోతుంది .పిచ్చేక్కినా ఆశ్చర్యం లేదు ‘’అన్నాడు .
రచయిత ,భార్య ల తొ కలిసి నడుస్తూ ‘’మీ ఆయన నన్ను పెళ్లి చేసుకొని ఉంటె బాగుండే దండి ఆయనకు మీరింకా చాలా నేర్పాలి ముఖ్యం గా ఆడ వాళ్ళు మట్టి బొమ్మలు కాదు ,వాళ్ళకీ మనసు ఉంది ‘’అని ‘’తన మాటలు నొప్పిస్తే క్షమించమనిసాదా సీదా గా అని వెళ్లి పోయింది వసంత. .ఇతని భార్య మాత్రం ‘’మీకూ యేవో రహస్యాలున్నాయి .ముందే చెబితే బాగుండేది గా .ఆవిడ దగ్గర అవమానం పొందక ముందే ‘’అంది .ఎలా చెప్పాలోఎమ్చేప్పాలో తెలీలేదితనికి .డీలా పడి పోయా డు .ఓ రోజు ఉన్నట్టుండి అతని భార్య తనకా ప్రదేశం లో ఉండ బుద్ధి కావటం లేదని ఇంటికి పోతానని అంటే పంపించేశాడు .అయిదేళ్ళ నాటి సంఘటన ,రక్తం పరుగు ,ఆమె త్యాగం లో ఔన్నత్యం ,తన పిరికి తనం ,స్త్రీత్వపు విలువలు పూర్తీ స్వరూపం గుర్తొచ్చి శ్మ్రుతి ,విస్మృతి ల మధ్య కొట్టు కొంటున్నాడు ‘’అనడం అద్భుతం గా ఉందికదూ .
ఒక రోజు బలరాం తొ ‘’నాకూ వెళ్ళాలని పిస్తోంది ఆరోగ్యం బాగా లేదు .రిలీవ్ చేస్తే వెళ్తాను ‘’అన్నాడు .అతను ఆశ్చర్యం తొ ‘’ఈ ప్రదేశం చూసి మూర్చ పోయిన అతనే ఇలా అంటున్నాడా ?’’అని పించింది .’’అందానికి ,ఆరోగ్యానికి సంబంధం లేదు ‘’అన్నాడు .ఆ రోజు సాయంత్రం వసంత కన్పించింది .ఆమెకీ తెలిసింది ఇతను వెళ్లి పోతున్నాడని .’’దాచ కుండా చెప్పు ‘’అన్నాడు .యే విషయ మో ఆమెకీ తెల్సన్నాడు .’’చెబితే మీరు తట్టు కొ గలరా ?’’అంది సస్పెన్స్ క్రియేట్ చేస్తూ .’’పోనీ చెప్పన్లెండి .నన్ను మళ్ళీ అడగొద్దు .అని మిమ్మల్ని త్వరలోనే రిలీవ్ చేసే ఏర్పాట్లు చేస్తా లెండి ‘’అని భరోసా ఇచ్చింది .కన్నీరు కారుస్తుందేమో నను కొన్నాడు .ఆమె ముఖం చూప కుండా వెళ్లి పోయింది
సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –12-12-12
