This gallery contains 115 photos.
Sarasa Bharathi 39 121119 1Sarasa Bharathi 39 121119 2
MLA PARDHA SAARADHI పూజ
కాశీ ఖండం –8
ఇంద్ర ,అగ్ని లోక వర్ణనం
శివ శర్మను ఇంద్ర లోకానికి తీసుకొని వెళ్లారు .విశ్వ కర్మ తన తపో బలం తో దీన్ని నిర్మించాడు పగలే వెన్నెల అక్కడ .చంద్రుడు ఎక్కడ తిరిగినా తన ప్రేయసి అయిన వెన్నెల ను ఇక్కడ ఉంచి వెడతాడు .చింతా మణి అన్ని టిని క్షణం లో తయారు చేస్తుంది కనుక నేతగాల్లు బంగారపు పని వారు మొదలైన వారుండరు ..అన్నీ ఇచ్చే కామ ధేనువు ఉందికనుక వంట వాళ్ళు ఉండరు .ఇంద్ర పదవి ఉత్కృష్ట మైనది .నూరు అశ్వ మేదాలు చేస్తే ఇంద్ర పదవి లభిస్తుంది .అర్చిష్మతి ,సమయమని ,పుణ్య వతి ,అమలా వతి ,గంధవతి ,అలక ,ఈశాన్య లోకం స్వర్గం తో సమానం .ఇంద్రుడిని సహస్రాక్షుడు ,దివస్పతి ,శతమన్యుడు అనీ పిలుస్తారు .నారదాది మహర్షులు తరచు వచ్చి ఆశీర్వదిస్తారు .అన్ని లోకాలకు స్తైర్యం ,ధైర్యం ఇంద్ర లోకమే .మహేంద్రుడు ఓడిపోతే మూడు లోకాలు ఒడి పోయినట్లే .రాక్షసులు ,మనుష్యులు ,గంధర్వ,యక్షులు ఇంద్ర పదవికోసం ఘోర తపస్సు చేస్తారు .నూరు యాగాలు భూలోకం లో చేసి జితెన్ద్రియుడైన వారికి ఇంద్ర పదవి దక్కుతుంది యుద్ధం లో వీర మరణం పొందిన వారు ఇక్కడికే చేరుతారు .ధర్మ నిర్ణయం చేసే వారికి కూడా భోగ భూమి
అగ్ని హోత్రుని నగరమే అర్చిష్మతి .అగ్ని దేవుడిని నిష్ఠ తో ఉపాశించిన వారికి ఈలోకం దక్కుతుంది .శీతా కలం లో చలి బాధను తట్టుకొనలేక పోయే వారికి కట్టెలను దానం చేసిన వారు ,ప్రతి పౌర్ణమి నాడు ఇష్టులు ఆచరించే వారు ఇక్కడ నివ సహిస్తారు .అనాధ ప్రేతకు అగ్ని సంస్కారం చేసినా ,దాన్ని ప్రోత్స హించినా అగ్ని లోక ప్రాప్తి ఖాయం .గురువు ,దేవుడు ,వ్రతము ,తీర్ధము ,అన్నీ అగ్ని దేవుడే .అన్ని వస్తువులు అగ్ని స్పర్శ తో పవిత్రమవుతాయి .అందుకే అగ్నికి పావనుడు అని పేరొచ్చింది .శివ శర్మ విష్ణు దూతలను ‘’అగ్ని దేవుడు ఎవరు? /అని ప్రశ్నించాడు దానికి వారు సవివరం గా సమాధానం చెప్పారు .
నర్మదా నదీ తీరం లో విశ్వానరుడనే శివ భక్తుడున్నాడు .శాండిల్య గోత్రజుడు ,జితేంద్రియుడు బ్రహ్మమ తేజశ్వి ఆశ్రమ ధర్మాలను చక్కగా పాటించి ,అనుకూల వతి అయిన భార్యను తెచ్చుకొన్నాడు అతిధి సత్కారాలు చేస్తూ కపటం లేకుండా కాలం గడిపాడు అతని భార్య శుచిష్మతికి చాలా కాలం సంతానం కలుగ లేదు .ఒక రోజు ఆమె భర్తను సమీపించి ,గృహస్తులకు ఉచిత మైన తత్వాన్ని తనకు బోధించ మని కోరింది .దానికి ఆయనతాను ఆమెకు అన్నీ సమకూర్చాను కదా ఇంకా ఏమైనా కావాలంటే కోరుకో మన్నాడు .ఆమె మహేశ్వరుని తో సమాన మైన పుత్రుని ప్రసాదించమని అర్ధించింది .ఆయన అలానే అని చెప్పి కాశీ నగరం చేరాడు .రోజూ గంగా స్నానం నిత్యం విశ్వేశ్వరాది దేవ దర్శనం చేశాడు ..తన భార్య కొరికి వెంటనే తీరాలి అంటే యే లింగాన్ని అర్చించాలి అని ఆలోచించాడు అక్కడ కాలేషుడు ,వృద్ధ కాలేషుడు ,కలశేశ్వరుడు ,కామేషుడు ,చందేషుడు ,జ్యేష్టేషుడు ,త్రిలోచనుడు ,జంబు కేషుడు ,జైగీషుడు ,దశాశ్వ మేధ ఘట్టం లోని ఈశ్వర లింగం ,చండీషుడు ,ద్రుక్కేషుడు ,గరుదేషుడు ,గోకర్నేషుడు ,గనేశ్వరుడు వీటిలో దేన్నీ అర్చిన్చాలనే సందేహ కలిగింది ఆ తర్వాత ఆతని దృష్టిలో గౌరీశ లింగం ,ధర్మేష లింగం ,తారకేశ్వర లింగం ,సర్వేశ్వర లింగం ,ప్రతీశ లింగం ,ప్రీతి కేశ్వర లింగం ,పర్వతేశ్వర ,బ్రహ్మేశ ,అధ్యమేశ్వర ,బృహత్పతీశ్వర ,విభాన్దేశ్వర ,భార భూతేశ్వర ,మహాలక్ష్మీశ్వర ,మరుటేశ ,మొక్షీశ ,గంగేశ ,నర్మదేశ్వర ,మార్కండేయేశ్వర ,మణి కర్నేశ ,రత్నేశ ,సిద్దేశ్వర ,యామునేశ ,లాంగావీశ ,విశ్వేశ ,అవిముక్టేశ ,విశాలక్ష్మీశ ,వ్యాఘ్రేశ్వర ,వరాహేశ్వర ,వ్యాశేష ,వృషభధ్వజేశ ,వరుణేశ ,విదేశ ,వసిష్టేశ ,శానైశ్చరేశ ,ఇంద్రేశ ,సంగమేశ ,హరిశ్చంద్రేశ ,హరికేశ్వర ,త్రిసందీశ ,మహాదేవ ,శివ ,భవానీశ ,కపర్దీశ ,కందుకేశ ,మక్షేశ్వర ,మిత్రా వరుణేశ ,లో ఎవరు తన కోర్కె తీరుస్తారని మీమమాంస పడ్డాడు .
చివరకి సిద్దేశ్వర లింగాన్ని పూజిస్తే సకల సిద్ధ కలుగు తుందని భావించాడు .అక్కడే వీరేశ్వర లింగం ఉందని గ్రహించాడు .ఇదే ఉక్తమైన లింగం అని నిర్ణయించుకొన్నాడు .దీనినే పూర్వం వేద శిరుడు అనే మహర్షి శత రుద్రీయ అభి షేకం చేసి సశరీర లింగైక్యం పొందాడని జ్ఞాపకం చేసుకొన్నాడు అలాగే జయద్రధుడు ,విదూరుడు మున్నగు వారికోర్కేలను తీర్చింది ఈ లింగమే అని భావించాడు అనేక రకాలైన నియమాల తో నిష్టతో వీరేశ్వర లింగాన్ని అభిషేకిస్తూ దీక్ష గా సేవించాడు .అతని తీవ్ర తపస్సుకు మెచ్చి బాల మహేశ్వరుడు ప్రత్యక్ష మై వరం కోరుకోమన్నాడు .ఆయన్ను పరి పరి విధాల స్తుతించి తనకు ఈశ్వరుని తేజస్సు గల కుమారుని ఇవ్వ మని కోరాడు ..శివుడు ‘’నేను నీ భార్య సుచిష్మతి గర్భాన ‘’గృహ పతి’’గా జన్మిస్తున్నాను . అతడు దేవతలకు ప్రీతీ కల్గిస్తాడు ‘’తవ పుత్రస్య మేష్యామి ,శుచిష్మత్యాం మహా మతే –ఖ్యాతో గృహ పతి ర్నామనా ,శుచిహ్ సర్వామర ప్రియః ‘’అనే శ్లోకాన్ని ఎవ్వరు శ్రద్ధ గా ప ఠిస్తారో వారికి శివుని వంటి కుమారుడు కలుగుతాడు ‘’అని ఆశీర్వా దించి అంతర్దానమైనాడు .ఈ కధను లోపాముద్రకు అగస్త్యుడు చెప్పాడు
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –21-11-12-ఉయ్యూరు
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
మిత్రుడు శ్రీ టి.వి.సత్యనారాయణ (తాడి మేటి వెంకట సత్య నారాయణ )శ్రీ కృష్ణుని పరం గా రాసిన కదా సంపుటి ‘’శ్రీ కృష్ణ లీలామృతం ‘’పుస్తకాన్ని నిన్న అంటే 19-11-12సోమవారం నాడు –
సరసభారతి 39 వ సమా వేషం లోమహిళా దినోత్సవ సందర్భం గా స్థానిక ఫ్లోరా స్కూల్ లో ,ప్రముఖ సాహితీ వేత్త ,సీనియర్ జర్నలిస్ట్ ముఖ్య అతిధి శ్రీ మతి డాక్టర్ కే .బి.లక్ష్మి ఆవిష్కరించారు .సరస భారతి గౌరవాధ్యక్షురాలు ,ఫ్లోరా ప్రిన్సిపాల్ శ్రీ మతి జోశ్యుల శ్యామలా దేవి అధ్యక్షత వహించిన సభలో ,కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ గుత్తి కొండ సుబారావు ,శ్రీ టి.వి.,సరసభారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ వేదిక నలంకరించారు .లక్ష్మి గారు మాట్లాడుతూ మహిళా సాధికారత అవసరమని ,మహిళలకు అక్షరాస్యత ,ఆర్ధిక స్వావ లంబనం ,విధాన నిర్ణయాలలో స్వేచ్చ ఉంటేనే సాధికారత సాధించగలరని అన్నారు ,మహిళలు ఆత్మా విశ్వాసం తో ముందుకు సాగాలని ,స్త్రీ శక్తి అమోఘ మైనదని ఆమె ఆది పరాశక్తి అని అంబ అని పురుషునికి పరిపూర్నత నిచ్చే ఆలిగా ,బిడ్డలను తీర్చి దిద్దే అమ్మగా స్త్రీ శక్తి అమోఘమని ఆమె ‘’స్త్రీ శక్తి ‘’ని ఆవిష్కరించి అందరినీ మెప్పించారు .దుర్గా ప్రసాద్ ‘’ఈ రోజు భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధి జన్మ దినమని ఈ రోజును దేశ సమైక్యతా దినోత్సవం గా ,మహిళా సాధికారిక దినో త్సవం గా జరుపుకొంటున్నారని చెబుతూ ,సుమారు ముప్ఫై ఏళ్ళ నాడు ‘’ఇండియన్ ఎక్స్ప్రెస్ ‘’సంపాదకుడు ఫ్రాంక్ మోరేస్ ‘’the only man in the congress party is indiraa gaandhi ‘’అని రాశాడని తెలియ జేశారు .ముప్ఫై అయిదేళ్ళ క్రితం ఈ రోజునే దివి సీమ ఉప్పెన వచ్చిందని గుర్తు చేశారు .గుర్తి కొండ సుబ్బారావు మాట్లాడుతూ ప్రపంచం లో ముగ్గు రు మహిళా ప్రధానులు –ఇందిరా గాంధి ,మార్గరేట్ థాచర్ ,సిరి మావో బండారు నాయకే మహిళా శక్తి ఏమిటో నిరూపించారని తమ దేశాలను తీర్చి దిద్దారని ,ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేశారని గుర్తు చేశారు .అంతకు ముందు ఇటీవలే మరణించిన అపర సత్యభామ ,అభినవ ,అభినయ సత్య భామ,’’కూచి పూడి నాట్య నిఘంటువు ‘’ పద్మశ్రీ వేదాంతం సత్య నారాయణ శర్మ గారి మరణానికి సంతాపం ప్రకటించారు ..దివి తాలూకా మాణిక్యం ,చల్ల పల్లి దగ్గిర ఉన్న పెదప్రోలు నివాసి శ్రీ కృత్తి వెంటి శ్రీనివాస రావు కేంద్ర సాహిత్య అకాడెమి కి కార్య దర్శి గా పదోన్నతి పొందినందుకు హర్ష ధ్వానాల మధ్య అభినందనలు తెలియ జేశారు .,దుర్గా ప్రసాద్ శ్రీని వాస రావు కుటుంబం తో తనకు యాభై ఏళ్ళ క్రితమే ఉన్న పరిచయాన్ని శ్రీను చిన్న తనాన్ని జ్ఞాపకం చేసుకొన్నారు .దాదాపు వంద మంది పది, తొమ్మిది తరగతుల విద్యార్ధినులు,మహిళా ఉపాధ్యాయులు పుర ప్రముఖులు సమావేశం లో పాల్గొని నిండు దనం చేకూర్చారు .సత్య నారాయణ గారు సరస భారతి ఆధ్వర్యం లోనే తన పుస్తకావిష్కరణ జరగాలన్న తన కల అద్భుతం గా రంగ రంగ వైభవం గా నెర వేరిందనిసంతోషం తో తెలిపారు లక్ష్మి గారికి,సత్య నారాయణ గారికి సరస భారతి నిర్వాహకులు శాలువాలు కప్పి సరసభారతి పుస్తకాలను ,గురజాడ ఫోటో ఉన్న జ్ఞాపికలను అంద జేశారు .కార్య దర్శి శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి కార్య క్రమాన్ని ఆసాంతం పర్య వెక్షిస్తూ నిర్వహించారు గ్రంధాలయ వారోత్స వాల సందర్భం గా పుస్తకావిష్కరణ జరగటం మర్చి పోరాని సంఘటన అని అందరు మెచ్చుకొన్నారు .దుర్గా ప్రసాద్ పుస్తకాన్ని సమీక్ష చేస్తూ ,పరిచయం చేశారు .
పుస్తక పరిచయం
ఇందులో పద కొండు కద లున్నాయి ఏకాదశి విష్ణువుకు ప్రీతీ కరమైనది కనుక అన్నే కధలున్డటం బాగున్నది .ఇవన్నీ శ్రీ కృష్ణుని జీవితం తో భక్తుల జీవితం తో ముడి పడి ఉన్న కధలు .భక్తీ ,ఆర్తి రంగరించి రాసినవి .శ్రీకృష్ణుని స్నేహితులు బాల్య సఖులు ,ఆయన్ను ఆరాధించే వారు ,ఇష్ట సఖులు వారి అంత రంగాల ఆవిష్కరణ,నిష్కల్మష మైన ప్రేమ చిప్పిలే కధలు రచయిత మనల్ని ద్వాపరం లోకి తీసుకొని అన్నీ చూపిస్తాడు చక్కని ప్రకృతి వర్ణన ఉంది .చిన్నపిల్లలు హాయిగా చదువు కొనే కధలు .
మొదటి కద శ్రీ కృష్ణుని బాల్య స్నేహితుడు కాలి వైకల్యం ఉన్న ‘’లోట్టాయి ‘’ది ,కాలు లొట్ట పోయిందని, కన్ను లొట్టపోయిందని అంటూంటాం .ఏకం గా వాడి అంగ వైకల్యానికి తగిన లోట్టాయి పేరు పెట్టాడు రచయిత .వాడికి తాడి చెట్లు ఎక్కి, లేత తాటి ముంజలు కోయటం వెన్నతో పెట్టిన విద్య .అవి ఎప్పుడూ కోసి కన్నయ్యకు పెడుతూ ఉంటాడు .అందరితో బాటు చద్ది భోజనాలు తింటూ ,కృష్ణుడు పెట్టిన ఎంగిలి ముద్దలకు పరవశించే వాడు ,ఆ ఎంగిలి చేత్తోనే తాటి ముంజెలు క్కిట్టయ్యక్ నోటికి అందించే వాడు .ఇదే వాడి దిన చర్య .కాళీయ మర్దనం రోజు వీడు కృష్ణుని వెంట వెళ్ళలేదు .ఇంటి వద్దే ఉండి పోయాడు .సంగతి తెలిసి ఆదరా బాదరా తాటి ముజలు కోసి తాటాకు పొట్లం లో కట్టి ,తాబేటి బుర్రలో నీళ్ళు తెసుకొని మడుగు దగ్గరకు పరి గేత్తాడు .కృష్ణుడు అలిసి పోయాడు శక్తి తగ్గి పోయింది ఈ సంగతి యశోద తో సహా ఎవరికీ తోచలేదు .లోట్టాయి కిట్టయ్యకు బుర్ర లోని చల్లని నీళ్ళు తాగించి, లేత ముజలు తిని పించి తేగలు పెట్టాడు .కన్నయ్య పరమానందం అనుభ వించాడు .యశోద లోట్టాయి తెలివికి అబ్బుర పడి వాడిని ఒళ్ళోకి తీసుకొని ముద్దు పెట్టు కొంది .వాడి ఆనందం వర్ననా తీతం .ఎవరూ లోట్టాయిని గేలి చేసే వారు కాదని భగవంతుని దృష్టిలో అంతా సమానమే నని గోపకులు భావించారని చెప్పారు .ఇదే వారి వేదాంతం అన్నారు రచయిత .కన్నయ్య మురళీ నాదానికి ప్రకృతి పరవశించేదని సర్వ జీవులు అందులో తమ ఆత్మలను పరమాత్మలో సన్నిహితం చేసే పరమాద్భుత ద్రుశ్యమని వర్ణించారు ..ఈ కదా లో వాతావరణాన్ని తెలుగు నేల లో కల్పించారు .ఇది సరైనదేనా అంటే పోతన్న గారు కృష్ణుడితో ఊరగాయలు నంజుడు చూపించారు కదా .కధకుని ఊహ కు జేజేలు పలకాలి .ముళ్ళ పూడి వారి ‘’కానుక ‘’కధా గుర్తుకు తెస్తుంది.
రెండో కధ కూడా ఊహా సంచారమే కాని కొన్ని పేర్లకు సార్ధకత కల్పించారు .శ్రీ కృష్ణుడు ‘’శిఖి పించ మౌళి‘’అన్న దానికి ఆ మూడు మాటలను తీసుకొని కధ అల్లారు .శిఖి అంటే నెమలి దానికన్నులు కూడా .నెమలికి తన అందమైన కన్నులను కన్నయ్య పుట్టిన రోజైన అష్టమి నాడు కానుక గా ఇవ్వాలను కొంటుంది .కాని ఒక వర్షం రోజు పరవశించి నాట్యం చేస్తుంటే శిఖి అనే కోయ వాడు దాన్ని బాణం తో చంపేసి,పించాలను కట్టగా కట్టి కృష్ణుడికి కానుక గా ఇవ్వాలనివేల్తుంటే ఒక నాగు బాము కాటుకు చని ఒతాడు .ఇక్కడ రచయిత ప్రకృతి ని ధ్వంసం సహించ రాదని , జీవ హింస నేరమని అలా చేస్తే దానికి శాస్తి జరుగుతుందనే సూచన చేశారు .వాడు చనిపోతు ఒక ముసలి బ్రాహ్మణుడు కిట్టయ్య పుట్టిన రోజున ఏదైనా కానుక ఇచ్చి తన దరిద్రాన్ని పోగొట్టుకొందామని వెళ్తుంటే బోయ ఆయన చేతిలో నెమలి ఈకలు పెట్టి తన కానుక గా కృష్ణునికి ఇవ్వమని ప్రాధేయ పడుతాడు మౌళి అలానే చేస్తాడు .యశోద కొడుకు పుట్టిన రోజున బాగా అలంకరించి సిగలో నెమలి పించం పెట్టింది అది సార్ధకమై అప్పటి నుండి ‘’శిఖి పించ మౌలి ‘’అయ్యాడని సమర్ధించారు .
స్నేహ వాత్సల్యం అనే కధలో శ్రీ కృష్ణ కుచేల కద చెప్పారు .కృష్ణ దర్శనం చేసి ఏమీ అడక్కుండా ఇంటికి చేరిన కుచేలుడికి అష్టిశ్వరాలు కనీ పించి ఆశ్చర్య పోతు ‘’కృష్ణా !అడిగితే అడిగి నంతే ఇస్తావు .అడగక పోతే అంతా ఇస్తావు ‘’అని నవ్వుకున్నాడు అన్న మాటే కదా సారాంశం .నాల్గవకధరుక్మిణిఅలిగింది .పెద్దభార్య రుక్మిణికి తీపి ఇష్టం .అదే కృష్ణుడికీ ఇష్టమని భ్రమ పడుతుంది .అష్టమి నాడు రుక్మిణి స్వీట్లు చేసి తిని పిస్తూ మాగన్ను గా నిద్ర పోయింది సత్య పెరుగన్నం తిని పిస్తుంటే మెలకువ వచ్చి లబలబ లాడింది రుక్మిణి .అందరు నవ్వారు .అందుకని రుక్మిణి అలిగింది రుక్మిణి అలంకార ప్రియ .సత్య కాదు .తన స్వామి ఆరాధనే ఆమె ఊపిరి .ఆమె పెంచిన చిలక కూడా స్వామి పేరు తర్వాత సత్య పేరు పలకాలి .రెండోసారి కృష్ణ శబ్డంవిని పిస్తే సహించదు కృష్ణుడు సత్య తో పెద్ద భార్య ఇంటికి వస్తు సత్య పిరుదు మీద మురళి తో ఒక చిన్న దెబ్బ వేయిస్తాడు సత్యనారాయణ .అది మనకూ ,ఆమెకూ ‘’అమ్మ నీకమ్మనీ దెబ్బ ‘’గుర్తుకు తెస్తుంది .తీపి తింటే లావు ఎక్కరు తీపి జబ్బు వస్తుందనే ఆధునిక యువతి సత్య .
రామ చిలుక కద రామావతారం తో ప్రారంభమై కృష్ణా వతారం లో పూర్తీ అవుతుంది .సీతాదేవి లంకలో అశోక వృక్షం కిందశోకిస్తూ ఏమీ తిన కుండా గడుపు తుంటే ఒక చిలుక పండిన పండును ఏరి రోజు తెచ్చి ఆమెకిస్తే అది మాత్రమె టిని ప్రాణాలు నిల బెట్టుకోన్నడనేఊహ చేశారు .
రావణుడు దీన్ని సేవకుల ద్వారా గ్రహించి చిలకను చంపే స్తాడు అది ‘’రామా రామా !చనిపోయి సీతాదేవి ఒడిలో పడింది .ఈ విషయాన్ని రావణ వధానంతరం అయోధ్యలో పట్టాభి షేకం తర్వాతా రాముడికి సీత చెప్పింది అప్పుడు రాముడు ‘’రా బోయే కాలం లో శుక మహర్షి గా ఆ చిలుక జన్మించి భాగవత కధను విని పిస్తాడని ఆ చిలుక ‘’రామ చిలుక ‘’గా ప్రశిద్ధ మావు తుందని చెప్పాడు .కృష్ణా వతారం లో ఒక చిలుక పండిన పండ్లను గుర్తించటాని పల్లనన్నిటినీ కొరికి కొరికి ముక్కు ఎర్రబడి రక్తం కారుతోంది .చివరికి పండిన పండును యెర్ర ముక్కు తో కరిచి కృష్ణుడి పాదాల దగ్గర కానుక గా జార విడి చింది .కృష్ణుడు దాన్ని ఎత్తుకొని ముద్దు చేశాడు ‘’పక్షి జాతికి గర్వ కారణ మైన నీ విరిగిన వంకరముక్కు నీకు మరింత అందాన్నిచ్చింది నీకు భవిష్యత్తు ను చెప్పే విద్య అలవడుతుంది .రామావతారం లో నేనిచ్చిన వరంగా రామ చిలుక వై యెర్రని ముక్కుతోశోభిస్తూ ,శుక మహర్షి గా అవత రిస్తావు ‘’అని దీవిన్చాడని చక్కని ఊహ చేసి రాశారు .అసంబద్ధం అని పించినా భక్తికి ఏదీ అసాధ్యం కాదని సరిపెట్టుకోవాలి .
అన్నా అన్న కధలో శ్రీ కృష్ణుడు రుక్మిణికి వస్త్రాపహరణం సమయం లో అనంత మైన చీరాల నిచ్చే సందర్భానికి ఒక కధ సృష్టించారు .ఒక సారి ద్రౌపది గంగా స్నానం చేస్తుంటే ఒక ముని గారి కౌపీనం నీటి వేగానికి కొట్టుకు పోతే తనకు ఇంద్రుని భార్య శచీ దేవి ఇచ్చిన దివ్య వస్త్రాన్ని ఆయనకు ప్రదానం చేసిందట .ఆముని ‘’ఆపత్ సమయే అక్షయ మస్తు ‘’అని ఆమె ను దీవించాడు కృష్ణుడు మేఘ మల్హార రాగం ఆలపిస్తే గోపికలు ఒడ్డున పడేసిన వస్త్రాల్ని మళ్ళీ ఒడ్డుకు చేరి వారి మానాలను కాపాడాయని ఊహ చేయటం తమాషా .
భామా కలాపం సత్య భామది అయితే వీరు ‘’రాదా కలాపం ‘’కదా రాశారు .శ్రీకృష్ణ మురళీ గానానికి జగతి వెన్నెల రేయి పరవ శిస్తుంటే రాధ మువ్వల తో ఆనంద నృత్యం చేస్తోంది .ఆమె కాళి గజ్జెలు మూడు జారి శ్రుతి తప్పుతోంది .ఆయన మువ్వాలను ముద్దాడి పై ఖండువా పట్టు దారానికి కట్టి దాన్ని తన మోహన మురళికి కట్టి ఆనంద భైరవిని ఆలాపిస్తుంటే రాధ మువ్వ గోపాలుని ప్రేమ తత్వానికి హృదయం ఆర్డర మై రెండు చేతులు జోడించి ,ఆయన మెడ చుట్టూ చేతులు వేసి పరవశించినదన్నది కధాంశం కొందరు మురళికి మువ్వలు కట్టివాయిన్చాతాన్ని కదకు అతికించారు .. .
నీలి కలువ తాను కూడా తెల్ల కలువల సోయగం పొందాలంటే ఏం చెయ్యాలనే తపన లో గడుపుతోంది తనెవరూ చూ డటం లేదని కోయరని బాధ గూడు కట్టింది ఆదానిలో ఒక అమావాస్య రోజు తెల్లకలువాలకు చంద్ర దర్శనం లేక నిరాశ పడ్డాయి ముడుచుకు పోయాయి నీలి కలువ పెట్టిన ముద్దులకు కళలు నింపుకొని ఆకశం లో చంద్రుడు వెన్న ముద్దా లా వెలిగాడు .కన్నె ముద్దు లాగా ఉన్నదనుకోంది రాధ .నీలి కలువ ముద్దుల తో చందమామ ముఖం లో మచ్చ ఏర్పడి వింత సోయగాన్నిచ్చింది .ఒక రాజుకు లేక లేక కృష్ణుని దయ వల్ల ఆడ సంతానం కలిగింది ఆమె పేరు నీలిమ అందాల రాశి అయితే నలుపు రంగు .పెళ్లి చేసుకోవటానికి ఎవరు ముందుకు రాలేదు . చివరికి ఒక రాకుమారుడు చేసుకోవటానికి అంగీకరించాడు .ఆమె అతన్ని నీలి కలువ తెచ్చి ఇస్తే పెళ్లి చేసుకొంటా నంది.అతడు తిరిగి తిరిగి నీలి కలువ ఉన్న చోటికి ఆమెతో బాటు అందర్నీ తెసుకొని వెళ్లాడు .నీలి కాలువను అడిగిన కారణాన్ని అతడే ఆమెకు చెప్పి ఆశ్చర్యం కలిగించాడు ‘నీకు ప్రకృతి ఇష్టం .నీలాగే నీ ప్రకృతిని ప్రేమించే భర్త కావాలని నీ కోరిక కేవలం ప్రేమిస్త,చాలదు ఆరాధించాలి ప్రకృతి లో మమైక్యం అయిన వారు పూలు కోయారు ఆ సౌందర్యాన్ని ఆరాధిస్తారు అందుకే నేను ఆ పువ్వు కోయలేదు .అందుకే నేను ఆ పువ్వును కోయలేదు ‘’అని చెప్పాడు .అతని ప్రకృతి ఆరాధనా కు ఆమె సంతోష పడి కౌగిలించుకోన్నది చివరగా రచయిత కొన్ని ప్రక్రుతిసూక్తులు చెప్పి కదముగిస్తాడు .స్తాడు ‘’ప్రకృతి ఉన్నంతకాలం ప్రేమ ఉంటుంది .ప్రేమకు నిరీక్షణ ఉంటుంది .అది రాధలా ఉంటుంది .ప్రపంచానికి రాధ చెప్పే గాధలా ఉంటుంది .ప్రేమకు విషాదం లేదు వినోదం తప్ప .ఖేదం లేదు మోదం తప్ప .శోకం లేదు నాకం తప్ప ‘’ప్రేమే రాధ .ప్రేమ ప్రపంచాన్ని రాధకే రాసిచ్చాడు .
యశోదకు ఆడ పిల్ల లేదనే బాధ ఉంది బాల కృష్ణుని ఒక రోజు రాధ ఆడ వేషం వేసి ఒళ్లంతా ముద్దులు కుమ్మరించి అలంకరించింది .అవి ఆయన మెడకు హారం లా ఉన్నది .ముద్దులు మూట కడుతూ ‘’కిట్టమ్మ ‘’అని పించాడు అతడే ‘’కిట్టమ్మా బాల కిట్టామ్మా ‘’అయాడని చక్కని కద అల్లారు ..గోవర్ధన గిరిని గోకులం లోని వృషభ సంతతి కొమ్ముల మీదకు ఎత్తేట్లు చేసి తాటి చెట్టును తులా దండం చేసి కృష్ణుడు ఉపాయతో పైకి లేపాడని దాని కింద గోవులు గోపాలురు హాయిగా సేద తీరి ఇంద్రుని భయం నుండి కాపాడుకోన్నారని ఇది ఆధునిక తులా దండ సూత్రమే నని సమర్ధించారు ‘’గోవర్ధన గిరి ‘’కద లో .చివరి కదా జాంబవతీ పరిణయ శుభ లేఖ .ఇందులో లగ్న పత్రిక రాశారు .జాంబవంతుని గర్వాపహరణం చెప్పారు .జాంబ వంతుడు తన గుహ లో దాచుకొన్న తేనే తుట్టెను కూడా కృష్ణునికి కానుక గా ఇచ్చాడు .జాంబవతి కళ్యాణం జరిపించే వార్తను తుట్టె లోని మధుపాలు వన మంతా తిరిగకళ్యాణ తీపి వార్త ను చాటింన్చాయట .అందుకే వాటికి ‘’మధు పదములు ‘’-మధుపం ‘’అనే పేరు వచ్చినదని చమత్కరించారు .జాంబవతీ కల్యాణాన్ని తెలుగు ఆచారం ప్రకారం కోయ వారి పద్ధతిలోఅయిదు రోజులు చేయించారు . .
ఈ కధల్లో కొన్ని ‘’స్వాతి ‘’మొదలైన పత్రిక లలో ప్రచురింప బడి ప్రాచుర్యం పొందాయి .సత్యనారాయణ గారి అనన్య కృష్ణ భక్తికి, ఆయన లో జీర్నించిన శ్రీ కృష్ణ భావానికి ఈ కధలు గొప్ప ఉదాహరణలు .అందరు చదివి ఆనందించాలని కోరుతున్నాను .’’చినుకు ‘’మాస పత్రిక ఈ పుస్తకాన్ని అత్యంత మనోహరం గా అందం గా ప్రచురించి శ్రీ కృష్ణ మొహనత్వాన్ని కలిగించింది . .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –20-11-12- ఉయ్యూరు
ఆయన వివాదాల పుట్ట ,యే క్షణం లో ఏమి ఆలోచిస్తాడో తెలీని క్షణికావేశ పరుడు ,ఎడ్డెమంటే తెడ్డెం అనే బాపతు ,ఊరిన్దరిది ఒక దారి అయితే ఉలిపి కట్టది ఇంకో దారి అని అనేక సార్లు నిరూపించుకొన్న వాడు ,యాభై ఏళ్ళ తిరుగు ,ఎదురు లేని పోరాటం నడిపిన యోధుడు ,ఎవర్ని ఎప్పుడు మిత్రకూటం లో చేరుస్తాడో ఎవరిని పురుగు లా ఏరి పారేస్తాడో తెలీని విచిత్రవ్యక్తి
,తాను అనుకొన్నది సాధించే నేర్పున్నా ,ఓర్పు లేదని ముద్ర పడ్డ వాడు ,అయిన వాళ్ళు దూరమైనా భేఖాతరు చేసిన వాడు ,గర్జన ,ఘర్షణలె ఆయుధాలుగా సైన్యాన్ని నడిపించిన వాడు ,అపర శివుడి సేన గా శివ సేన ను నిర్మించి తన‘’సుప్రీమసి’’ ని అణుక్షణంనం కాపాడుకొన్న వాడు ,నిలకడా స్తిరత్వం,విశాల దృక్పధం ఉంటె భారత ప్రధాని కాగలిగిన వాడు ,అయినా ఎక్కడున్నా మరాథాలోను హస్తిన లో ను చక్రం తిప్పిన మేధావి ,శివాజీ మహారాజ్ తర్వాత మళ్ళీ హిందూ జాతిని ఏకీకృతం చేశాడనే గొప్ప పేరు సంపాదించుకొన్న వాడు ,కార్టూన్లతో వ్యంగ్యోక్తులతో ప్రజాహృదయాన్ని దోచుకొన్న వాడు మరాఠా ప్రజల హృదయ సింహా సనాన్ని శాశ్వతం గా అధిష్టించి కూర్చున్న వాడు ,’’మరాఠా టైగర్ ‘’అని పించుకోవటమే కాదు, అలా నిజం గా నే గర్జించి,ప్రతాపం చూపి , అందర్ని తన కను సన్నలలో నిలుపు కొన్న వాడు ,రాజకీయాలను బాల్(బంతి )ఆట గా ఆడిన శివ సేనాధి పతి థాకరే .
నియంత’’ హిట్లర్ ‘’అంటే అభిమానించే థాకరే నడక అంతా అదే పోకడ లో నే నడిచింది .సమస్యలను స్వయం గా సృష్టించటం ,అందులోంచి తెలివిగా బయట పడటం మళ్ళీ ఇంకో దాన్ని కాళ్ళకు చుట్టుకోవటమే ఆయన జీవితానికి సరి పోయింది .ఆయన నోటికి ఉప్పూ ,పత్రీ లేదని చాలా సార్లు రుజువు చేసుకొన్నాడు .ఎంతటి వాడి నైనా ఎదిరించే సాహసం .ఎంతటి తక్కువ వాడి నైనా నెత్తిన పెట్టుకొనే నేర్పు ఆయన స్వంతం .ఆయన వ్యతి రేకించిన’’ప్రేమికుల రోజు ‘’ఆగకుండా పోయిందా? /పాప్గాయకుడిని అందలం ఎక్కించిన ఆయన విదానమేమిటి అంటే ప్రశ్నార్ధకమే ..క్రికెట్ ఆటలో కళల విషయాలలో మరీ సంకుచితం గా వ్యవహిరించాడని అందరు అనుకొన్న మాటే .అంతటి తో ఆటలూ మానలేదు, పాటలూ తగ్గలేదు .అయితే ఇవన్నీ ఆయన కు’’ గొప్ప బేస్ ‘’నిచ్చాయి .ఉద్యమాలకు వీలు కల్పించాయి ,నిత్యం ప్రజల మధ్య ఉండే అవకాశాలు కల్పించుకొన్నాడు .శివ సేన సిద్దాన్తమేమిటో ఆ కార్య కర్తలకూ తెలీని పరిస్తితి .మహారాష్ట్ర లో ఏది జరిగినా దాన్ని మహారాష్ట్రుల ఆత్మ గౌరవం తో ముడి పెట్టి ప్రజల్ని చైతన్యం చేశాడు ..అధికారాన్ని పూర్తి మెజారిటీ తోసంపాదించిన రోజులు ,పూర్తిగా తుడిచి పెట్టుకు పోయిన రోజులు ,పొత్తులో లాభ పడిన సందర్భాలు ,ఆ పొత్తుల్ని గుడ్డ పీలికల్లా చీల్చేసిన సందర్భాలు అన్నీ ఆయన చేశాడు .ఏది చేసినా ఆయన ముద్ర ఉండాలి ,పడాలి ,ఆయన ఆజ్న శిరసా వహించాలి .లేకుంటే ఉక్కు పాదం తో అణటమే .అందుకే ఆయన కు ‘’నన్ను టచ్ చేస్తే బొంబాయి మట్టి కరుస్తుంది ‘’అని చెప్పే సాహసం వచ్చింది .ఆయన మాటకాదని ముంబై లో నిల బడ గల సత్తా మేటి సినీ నటులకూ లేదు .’’ముంబై ముంబాయిలాడే అని గర్జిన్చినా అది అమలు కాలేదు కదా .అక్కడా వెనకడుగే .అయితే ఇంత ఉక్కు పాదం తో నిరంకుశుడైన ఆయన ‘’అండర్ వరల్డ్ ‘’వారినేమీ చేయ లేక పోవటం విడ్డూరమే . ‘’సామ్నా ‘’పత్రికా సంపాదకుడి గా ఆయన రాసే ప్రతి మాటలో నిప్పులు కురిపించే విధానం ఉంది ,అందర్ని ఆకట్టుకొనే సామర్ధ్యం ఉంది .తన ప్రసంగాలతో జనాన్ని ఉత్సాహ ,ఉద్రేక పరచి తన మార్గానికి వాళ్ళను తెచ్చుకొనే పోరాట పటిమ ఉన్నత నాయకత్వం అయన స్వంతం చేసుకోన్నాడు .ఆయన ఎంతటి వివాదాస్పడుడైనా ఆయన ఈల వేస్తె లక్షలాది మరాఠీలు కార్య రంగం లోకి దుముకు తారు .ఆయన చెప్పింది తు ఛా తప్పక ఆచరిస్తారు నిప్పుల్లో దూక మంటే దూకు తారు .ఆయనది సుగ్రీవాజ్న .ఆయన మరణం తో శోకించని మరాఠా వ్యక్తి లేడు .ఇంత సుస్తిర స్థానాన్ని జన హృదయం లో నిలుపు కొన్న వ్యక్తీ ఈ అర్ధ శతాబ్ది లో లేనే లేరంటే అతి శయోక్తి కాదు .వారి భావన లో బాల్ థాకరే అమరుడే .,
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
కాశీ ఖండం – 7
అప్సరస ,సూర్య లోక వర్ణన
విష్ణు దూతలు శివ శర్మ ను అప్సరస లోకానికి తీసుకొని వెళ్లారు .అక్కడ ద్యూత విద్య లో నేర్పరులు, రసజ్ఞులు అయిన ఆడ వారుంటారు .సమస్త భాషలలో వారు కోవిదులు .క్షీర సాగర మధనం లో జన్మించిన వారు .మన్మ ధుని త్రిభువన విజయాస్త్రాలు వారే .ఊర్వశి ,మేనక ,రంభ ,చంద్ర లేఖ ,తిలోత్తమ ,వపుష్మతి ,కాంతిమతి ,లీలావతి ,ఉత్పలావతి ,అలంబుష ,గుణవతి ,స్థూల కేశి ,కళావతి ,కళానిధి ,గుణనిధి ,కర్పూర తిలక ,ఉర్వార ,అనంగతిలక ,మదన మోహిని,చకోరాక్షి ,చంద్ర కళ ,ముని మనోహర ,గవద్రావ ,తపోద్వేష్టి ,చారునాన ,సుకర్నిక ,దారు సంజీవని ,సుశ్రీ ,క్రమ శుల్క శుభానన ,తపస్శుల్కల్క ,హిమావతి ,పంచాశ్వ మేదిక ,రాజ సూయార్ధిని ,అష్టాగ్ని హోమిక ,వాజపేయ శతోద్భవ ,మొదలైన వారు అప్సరస గణం .వేరి సంఖ్య 6,000 ..ఇతర స్త్రీలు కూడా కొందరుంటారు .వీరంతా లావణ్యం తో ,నిత్య యవ్వనం తో ,దివ్యామ్బరాలతో ఉంటారు .వీరందరూ స్వైరుణులు ,సు సంపన్నులు ..కోరిక తీర్చే వ్రతాలు చేసి ఉద్యాపనాలు చేసిన వారు అప్సరస లోకం కి చేరుకొంటారు .వీరంతా సంగీత నృత్యాలలో అఖండులు .వీరిని దేవ వేశ్యలని అంటారు .సూర్య సంక్రమణం నాడు దానం చేసిన వారు ,’’మొదాత్ ‘’అనే మంత్రాన్ని అనుష్టించి దానాలిచ్చిన వారు ఇక్కడికి చేరుకొంటారు .
తర్వాత సూర్య లోకానికి చేరుకొన్నాడు శివ శర్మ .సూర్య లోక ము తిమ్మిది యోజనాల విస్తీర్ణం కలది .విచిత్రాలైన ఏడు గుర్రాలు ,ఒకే చక్రం ఉన్న రధం పై అనూరుడు సారధి గా సూర్యుడు నిత్య సంచారం చేస్తూంటాడు .క్షణ కాలం లోనే ఆవిర్భావ ,తిరోభావాలను పొందే సూర్యుడు ప్రత్యక్ష వేద పురుషుడు .ఆదిత్యుడే సాక్స్శాత్తుబ్రహ్మ .సూర్యుని వల్లనే సకల జీవరాశులు ఆహారాన్ని సంపాదిన్చుకొంటున్నాయి .ప్రత్యక్ష సాక్షి ,కర్మ సాక్షి .గాయత్రీ మంత్రం తో సకాలం లో వదల బడిన అర్ఘ్యం నశించదు అది మూడు లోకాల పుణ్యాన్ని అందిస్తుంది .సూర్యోపాసన చేసే వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ,మిత్ర ,పుత్ర ,కలత్రాలు అష్ట విధ భోగాలు స్వర్గ మోక్షాలు కలుగుతాయి .
ఆస్టా దశ విద్యల్లో మీమాంస గొప్పది .దాని కంటే తర్కం ,దాని కంటే పురాణం గొప్పవి .వీటి కంటే ధర్మ శాస్త్రం ,వాటికంటే వేదాలు వేదం కంటే ఉపనిషత్తులు వీటికంటే గాయత్రీ మంత్రం గొప్పవి .అది ప్రణవ సంపుటి .గాయత్రి మంత్రం కంటే అధిక మైన మంత్రం మూడు లోకాలలోనూ లేదు .గాయత్రి వేద జనని .గాయత్రి వల్ల బ్రాహ్మణులు జన్మిస్తున్నారు .తన మంత్రాన్ని ఉపాశించే వారిని రక్షిస్తుంది కనుక గాయత్రి అని పేరు .సూర్యుడు సాక్షాత్త్ వాచ్యుడు .గాయత్రి సూర్యుని గూర్చి చెప్పే వాచకం .
గాయత్రి మంత్రం చేత రాజర్షి విశ్వా మిత్రుడు బ్రహ్మర్షి అయాడు .గాయత్రియే విష్ణువు ,శివుడు ,బ్రహ్మా .అమ్శుమాలి అని పిలువ బడే సూర్యుడు దేవత్రయ స్వరూపుడు .అన్ని తేజస్సులు దివాకరునిలో ఉన్నాయి .ఆయనే కాల స్వరూపుడు, కాలుడు కూడా .తూర్పున ఉదయించి సమస్త విశ్వాన్ని ధరించే విశ్వ సృష్టికర్త .పడమర దిశ లో సర్వతోముఖుడై కనీ పిస్తాడు . ఉత్తరాయణ ,దక్షిణాయణ పుణ్య కాలాలో షడతీతుల్లో ,విష్ణు పంచకం లో ఎవరు మహా దానం చేస్తారో పిత్రుక్రియలు నిర్వ హిస్తారో ,వారు సూర్య సమాన తెజస్కులై ,సూర్య లోకం లో నివ శిస్తారు .ఆదివారం సూర్య గ్రహణం నాడు దానం చేస్తే ఉత్తమ లోక ప్రాప్తి .
హంసుడు ,భానుడు ,సహస్రామ్శువు ,తపనుడు ,తాపనుడు ,రవి ,వికర్తనుడు వివశ్వంతుడు ,,విశ్వ కర్మ ,విభావనుడు ,విశ్వ రూపుడు ,విశ్వ కర్త ,మార్తాండుడు మిహిరుడు ,అంశు మతుడు ,ఆదిత్యుడు ,ఉష్నగుడు ,సూర్యుడు ,ఆర్యముడు ,బ్రద్నుడు ,ద్వాదశాదిత్యుడు ,సప్త హయుడు భాస్కరుడు ,ఆహాస్కరుడు ,ఖగుడు ,శూరుడు ,ప్రభాకరుడు ,శ్రీ మంత్ర్హుడు ,లోక చక్షువు ,గ్రహేశ్వరుడు ,త్రిలోకేశుడు ,లోక సాక్షి ,తమోరి ,శాశ్వతుడు ,శుచి ,గభస్తి ,హస్తాంషుడు ,తరణి ,సుమాహారిణి ,ద్యుమణి ,హరిదాశ్వుడు ,అర్కుడు ,భాను మంతుడు ,భయ నాశనుడు ,చందోశ్వుడు ,వేద వేద్యుడు ,భాస్వంతుడు ,పూషుడు ,వృషాకపి ,ఏక చక్ర ధరుడు ,మిత్రుడు ,మందేహారి ,తమిశ్రఘ్నుడు ,దైత్యఘ్నుడు ,పాప హర్త ,ధర్ముడు ,ధర్మ ప్రకాశకుడు ,హీళి,చిత్రభానుడు ,కలిఘ్నుడు ,తార్ష్య వాహనుడు ,దిక్రుతి ,పద్మినీ నాభుడు ,కుశేషయ కారుడు ,హరి ,ఘర్మ రశ్మి ,దుర్ని రీక్షుడు ,చందాంశువు ,కశ్యపాత్మజుడు ,అనే డెబ్బది రెండు పేర్లు సూర్యునికి ఉన్నాయి .ఇందులో ప్రతి నామం మొదట ఓం అని చేర్చి ,ఉచ్చ రిస్తూ ,సూర్యుని చూస్తూ నమస్కరిస్తే సూర్యలోక ప్రాప్తి కలుగు తుంది .రెండు చేతులతో ఎర్రగా తోమిన రాగి చెంబు నిండా నిర్మల మైన జలాన్ని నింపి మోకాళ్ళ పైన భూమి మీద కూర్చుని, గన్నేరు పూలు ,రక్త చందనం ,గరిక ,అక్షతలు ఆ పాత్రలో ఉంచి ,సూర్యుడిని ధ్యానిస్తూ ,ఫాల భాగం దగ్గర ఆ చెంబు నుంచుకొని స్తిర చిత్తం తో, పైన చెప్పిన72 సూర్య నామాలను ఉచ్చరిస్తూ సూర్యునికి అర్ఘ్యాన్ని చ్చే వాడేప్పుడు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లు తాడు ,వ్యాధులు నశిస్తాయి’’ ,అని శివ శర్మకు విష్ణు దూతలు వివ రించారని భార్య లోపాముద్రకు అగస్త్య ముని చెప్పాడు
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –20-11-12- ఉయ్యూరు .
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
శిల్ప యోగి –యలవర్తి ఆంజనేయ శాస్త్రి
విశ్వ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యాల వర్తి ఆంజనేయ శాస్త్రి గారు 1877 లో బుచ్చయ్య ,లక్ష్మి దేవమ్మ గార్లకు జన్మించారు .వైదికా చార కుటుంబం వీరిది .యజుర్వేదం లో ప్రశిద్ధ మైన శిల్ప శాస్త్ర నిపుణులు .వీరి గోత్రం సువర్ణ రుషి గోత్రం ..శ్రౌతం లోను ,స్మార్తం లోను ,వీరు మంచి అభినివేశం చూపారు .వేదం లో కొన్ని పన్నాలను నేర్చుకొన్నారు .సంస్కృతాన్ని అభ్యశించి కావ్య నాటకాలన్కారాలను అధ్యయనం చేశారు .తర్కం ,వ్యాకరణం శిల్పం ,వాస్తు శాస్తాల లోతులు తరచి చూశారు .ధర్మ శాస్త్రాలను అవలోడనం చేశారు ..వేదాంతాన్ని క్షుణ్ణం గా నేర్చారు .యోగ శాస్త్రం లో వీరి పాండిత్యం గణ నీయం .అది జన్మాంతర సంస్కారం వల్ల లభించినది గా అందరు భావిస్తారు .ఏ శాస్త్రం తీసుకొన్నా దాన్ని ఆసాంతం చదివి, నిష్ణాతులు అని పించుకోవటం వీరి ప్రజ్ఞ
తెలుగు లో కావలసిన జ్ఞానాన్ని స్వయం గా సాధించుకొన్నారు .సంస్కృతం ,తెలుగు లలో అలవోక గా కవిత్వం చెప్పటం అల వాటైనది. యమ,నియమ ,మొదలైన అష్టాంగ యోగం వీరికి అద్భుతం గా అబ్బింది .గాయత్రీ మంత్రానుష్టానం తో కూడిన తపస్సు అంటే వారికిమహా ఇష్టం .నియమం తప్పకుండా దాన్ని శ్రద్ధా భక్తుల తో అనుష్టించారు .శక్తులు అలవడి నాయి గృహస్త జీవితం గడుపుతూనే ఉదయమే ప్రారంభించి పదకొండు గంటల వరకు తదేక దీక్ష తో అనుష్టానం చేసే వారు .ఆ సమయం లో ఎవ్వరికీ దర్శనం ఇచ్చే వారు కాదు .అంతటి కఠోర దీక్ష వారిది .వారి దీక్ష కు అందరు ముక్కున వ్రేలు వేసుకొనే వారు
వాస్తు శాస్త్రం మీద వీరికి ఉన్న అపార అభిని వేశంతో వాస్తు విషయాలన్నీ సేకరించి ఒక ఉద్గ్రంధం గా‘’వాస్తుపాఠ సంగ్రహం ‘’రాశారు కాని ఆంధ్రుల దురదృష్టమేమో అది ముద్రణకు నోచుకో లేదు .’’సంస్కృత సంధ్యా వందన భాష్యం ‘’రాసి సంధ్యా వందనం మీద అందరికి అభిరుచి ,,అభినివేశం కల్పించారు .’’విశ్వ బ్రహ్మోపనిషత్తులు ‘’ను సంపాదించి , తెలుగు అర్ధం తో దాన్ని ప్రచురించారు .యజుర్వేదం లోని’’విశ్వ బ్రహ్మ సూక్తాది ‘’మంత్రాలను కొన్నిటికి విశేష వ్యాఖ్యానం రాసి ప్రకటించారు .వీరి ప్రతిభకు దర్పణం గా వెలసిన మహా గ్రంధం ‘’దైవజ్న స్మృతి అనే ధర్మ శాస్త్ర గ్రంధం .‘’..జాన పాటి పట్టాభి రామ శాస్త్రి గారికి ,పంచార్షేయులైన విశ్వ బ్రాహ్మణులకు బ్రాహ్మణత్వం పై గుంటూరు న్యాయ స్థానంలో జరిగిన పండిత వివాదం సందర్భం లో ఆంజనేయ శాస్త్రి గారు అయిదు రోజులు శాస్త్ర వాదం చేసి ,,పండిత సాక్ష్యాన్నిచ్చి ,విశ్వ బ్రాహ్మణ బ్రాహ్మణత్వాన్ని నిరూపించి గెలిపించిన వాదనా సామర్ధ్యం గల శాస్త్ర నిపుణులు .
వీరి రెండవ భార్య సుందరమ్మ గారికి జీవనో పాదుల కోసం అవసర మైన సమస్తాన్ని ఆమెకు యేర్పాటు చేసి ,తన యావదాస్తిని ,ఇంటిని సర్వస్వ దక్షిణ గా విశ్వ బ్రాహ్మణ సంస్కృత పా ఠ శాలకు దానం చేస్తూ మరణ శాసనం రాసిన వదాన్యులు .1914లో 37ఏళ్ళ అతి తక్కువ వయసులో మరణించారు .విశ్వ బ్రాహ్మణ కులానికి ఏడు గడ గా ,వెన్నెముక గా నిలిచి వారి శాస్త్ర పరిజ్ఞానానికి ఇతోధికం గా కృషి చేసి శిల్ప శాస్త్రయోగి గా పేరు పొందారు యల వర్తి ఆంజనేయ శాస్త్రి గారు .
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –19-11-12- ఉయ్యూరు
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
యమపురి వర్ణనం
సాధ్వి లోపాముద్ర భర్త అగస్త్య ముని ని ‘’శివ శర్మ హరిద్వారం లో మరణింన్చినా మోక్షం పొందకుండా ,విష్ణు లోకానికి ఎందుకు వెళ్లాడు ?/అని ప్రశ్నించింది .దానికి మహర్షి వివరించి చెబుతున్నాడు .అన్ని క్షేత్రాలు ముక్తి క్షేత్రాలు కావనియు ,దాని గురించిన వివరాలను చెప్పాడు .శివ శర్మ ను యమ లోకానికి తీసుకొని వెళ్లారు ముందుగా విష్ణు దూతలు …అక్కడ విక్రుతాకారులు కన్పించారు .అది పిశాచాలోకమని పాప కర్మలు చేసిన వారు ,పరిశుద్ధ మైన మనస్సు లేని వారు ఇక్కడికి వస్తారని చెప్పారు .ఆ తర్వాతా కొంత దూరం లో మనోహరాకారులు ,శ్యామలాకారులు కనిపించారు .అది గుహ్య లోకమని ,న్యాయం గా డబ్బు సంపాదించిన వారు ఇక్కడికి వస్తారని చెప్పారు .సంపాదించిన డబ్బును దాస్తారు కనుక గుఖ్యక లోకం అంటారు వీరిది దాన ధర్మాలు తెలియవు .సుఖం గా మాత్రం ఉంటారు .బ్రాహ్మణులను పూజించి గోదానం ఇస్తారు .దేవతల్లాగా స్వర్గ సౌఖ్యం పొందుతారు .
కొంత దూరం పోయిన తర్వాతా గాంధర్వ లోకం కని పించింది డబ్బున్న వారిని సంగీతం తో సంతోష పెట్టినవారిక్కడికి వస్తారు ఈ గాంధర్వ విద్య తోనే నారదుడు దేవర్షి అయ్యాడు .వీరంతా శివుని సంతోష పెడతారు .హరి హరుల సమక్షం లో పాడిన వారు మోక్షం పొందుతారు .తర్వాత విద్యాధర లోకం చేరారు .అన్ని విద్యలలో నిష్ణాతులు ఈ లోకం లో ఉంటారు ..ఇంతలో యమ ధర్మ రాజు అనుచర గణం తో అక్కడికి చేరాడు .ఆయన సౌమ్య మైన ఆకారం తో ,తెల్లని వస్త్రాల తో కని పించాడు .యముడంటే అందరు భయ పడతారు కాదా ఇంత సాధువు లాగా ఉన్నాడేమిటి /?అని శివ శర్మకు సందేహం కలిగింది .అప్పుడు విష్ణు దూతలు పాపాత్ములకు యముడు భీకరం గా ,సజ్జనులకు సౌ మ్యుడు గా దర్శన మిస్తాడని ,హరిద్వారం లో చని పోవటం ,ధర్మ శాస్త్రధ్యయనం చేయటం వల్ల శివ శర్మకు మంచి గా కని పించాడని చెప్పారు .(ఒకప్పుడు బళ్ళారి రాఘవ గారు సావిత్రి నాటకం లో సావిత్రి వద్దకు ఆమె భర్త సత్య వంతుని ప్రాణాలను తీసుకొని వెళ్ళే సందర్భం లో ధవళ వస్త్రాల తో చాలా సౌమ్యం గా రంగ ప్రవేశం చేసి నటించారట ,.ఆ నాటకం అయిన తర్వాతా విశ్లేషకులు అలా ఎందుకుఅలా చేశారు అనిఅడిగారట .దానికి రాఘవ –నేను యమధర్మ రాజు గా సతీ సావిత్రి అనే పతీవ్రత దగ్గరకు వస్తున్నాను యముడుధర్మాధర్మాలు తెలిసిన వాడు కనుక ధర్మ రాజు అని పిలువబడుతాడు . మంచి వారికీ మంచి గా, దుష్టులకు భయంకరం గా కనీ పిస్తాడని శాస్త్రాలు చెప్పాయి అని వివ రించారట )..నిజం గా ఆయన పసుపు పచ్చని నేత్రాలు కలవాడు .కోపం తో అవి యెర్ర గా ఉంటాయి .అక్కడున్న వారికి వారి పాపాలననుసరించి శిక్షలు ప్రకటిస్తున్నాడు యమ ధర్మ రాజు .
దుఖితుల దుఖాన్ని పోగొట్టే రాజులు యమ ధర్మ రాజు సభా సదులు గా ఉంటారు .ఉసీనరుడు ,సుధాన్వుడు ,వృష పర్వుడు ,జయద్రధుడు ,రాజ సహస్ర జిత్తు ,దృఢ దానవుడు ,రిపున్జయుడు ,యవనాశ్వుడు ,దంత వక్త్రుడు ,నాభాగుడు ,రిపు మంగళుడు ,కరంధముడు ,ధర్మ సేనుడు ,పరమర్ధనుడు ,పరాన్తకుడు మొదలైన నీతి మంతులైన రాజులు ,ధర్మా ధర్మాలు తెలిసిన వారు సుధర్మ సభ లో ఉంటారు .శివ ,విష్ణు నామాలను సదా జపించే వారు యమునికి దూతలు గా పని చేస్తారు ..వీరు విష్ణు శివ కీర్తనలను చేసే వారి దగరకు పోరాదని యమ శాసనం .యమ ధర్మ రాజు రచించిన ‘’లలిత ప్రబంధం ‘’అనే మహా గ్రంధం నామాన్ని స్మరించే వారికికూడా పునర్జన్మ ఉండదు అని విష్ణు దూతలు శివ శర్మ కు చెప్పినట్లు అగస్త్య ముని లోపాముద్ర కు తెలియ జేశాడు .అక్కడి నుండి విష్ణు దూతలు శివ శర్మను అప్సరలోకానికి ,ఆ తర్వాత సూర్య లోకానికి తీసుకొని వెళ్లారు .ఆలోకాల వివరాలు ఈ సారి తెలుసు కొందాం .
సశేషం –మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –19-11-12—ఉయ్యూరు
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
సిద్ధ యోగి పుంగవులు –27
శ్రీ విద్యోపాసకులు –ఆది భట్ట రామ మూర్తి శాస్త్రి
బొబ్బిలి తాలూకా మురగడం అగ్రహారం లో 1861 లో సుబ్రహ్మణ్య ,,మహాలక్ష్మమ్మ దంపతులకు ఆది భట్ట రామ మూర్తి శాస్త్రి గారు జన్మించారు .ద్రావిడ శాఖకు చెందిన వీరు స్వగ్రామం లోనే పంచాకావ్యాలను నేర్చుకొన్నారు .పిమ్మట శ్రీ పాద రామ మూర్తి శాస్త్రి గారి వద్ద తర్క శాస్త్రాన్ని ,పంచ లక్షణ వ్యధి కారణాన్ని ,సిద్ధాంత లక్షణాలను అవచ్చేదకత్వ నిరరుక్తి ని ,పక్షత సామాన్య నిరుక్తి అనే తర్క గ్రంధాలను ఆసాంతం చదువు కొన్నారు ..పండితులకు నిలయ మైన కాశీ చేరి ,కర్నాటక సీతా రామ శాస్త్రి గారి దగ్గర నవ్యభిచారం ,సథ్ ప్రతి పక్షం ,అవయవం ,అనే మహా గ్రంధాలను చదివి తమ తర్క పాండిత్యాన్ని అభి వృద్ధి చేసుకొన్నారు .బెంగాలీ పండితులైన వజ్ర కుమార విద్యా రత్న భట్టా చార్యుల వారి వద్ద వ్యుత్పత్తి వాద ,శక్తి వాదాల తో బాటు ,ప్రామాణ్య వాదం ,విధి వాదం ,ముక్తి వాదం అనే అపూర్వ గ్రంధ రాజాలను తుదముట్టా చదివి తమ వాదనా సామర్ధ్యానికి పదును పెట్టుకొన్నారు .
తర్క శాస్త్రం లో ప్రమాణ గ్రంధ మైన ‘’మూల చూడం’’ ను అధ్యయనం చేసి ఎదురులేని పాండిత్యాన్ని కైవశం చేసుకొన్నారు ..కలకత్తా వెళ్లి అక్కడి ప్రభుత్వ పరీక్ష లో పాల్గొని ‘’తర్క తీర్ధ ‘’బిరుదును అందుకొన్నారు .అక్కడ విశేష సన్మానం తో బాటు అయిదు వందల రూపాయల నవ రత్న రూప బహుమానాన్ని అందుకొన్నారు .ప్రతిభ తగిన ప్రతి ఫలం వారికి లభించింది .దానితో సంతృప్తి చెందలేదు కాశీ పండితుల చేత కూడా భేష్ అని పించుకోవాలనే ఆలో చన కలిగి కాశీ చేరారు .అక్కడ ద్రావిడ సుబ్రహ్మణ్య దీక్షితులవద్ద వేదాంత సూత్ర శంకర భాష్యం లో చతుస్సూత్రి వరకు అధ్యనం చేశారు ..స్వీయ ప్రతిభ తో దశోపనిషత్తుల భాష్యాలను ,గీతా భాష్యాన్ని ,సూత్ర భాష్యాన్ని ,అద్వై త సిద్ధిని ,గౌడ బ్రహ్మా నందాన్ని తాను అభ్యసించి ,శిష్యులకు అధ్యాపనం చేశారు .
వీరి అపూర్వ పాండిత్యం అందరిని ఆకట్టు కొన్నది .కర్నాటక దేశం లోని చిత్రా పూర్ లోని శంకరపీఠస్వామికి వేదాంతాన్ని బోధించే అరుదైన అవాకాశాన్ని పొందారు ..వారి ఆదేశం పై అక్కడి విద్యార్ధులకు తర్క శాస్త్రం బోధిస్తూ మూడేళ్ళు ఉన్నారు ..తమ పర్యటనలలో దర్భాంగా ,మండి సంస్థానాలను దర్శించి విద్వత్తు ను ప్రదర్శించి బహుమానాలను, సత్కారాలను పొందారు .ఉర్లాం జమీన్ దారు వీరిని తర్క శాస్త్ర పరీక్షాధి కారి గా చేశారు .మండ పేట ,విజయనగరం ,రాజ మండ్రిసంస్కృత కలా శాలలో పది హేడు సంవత్స రాలు అధ్యాపకులు గా పని చేసి ఎందరో శిష్యులకు తర్క శాస్త్రాన్ని బోధించి ,తీర్చి దిద్దారు .
వీరి విద్యా గరిమను చూసి తిరుపతి సంస్కృత కలా శాలలో ప్రధాన ఆచార్య పదివి నిచ్చి సత్కరించారు .ఇక్కడ ఎక్కువ కాలం పని చేయ లేదు .దక్షిణ దేశ సంచారం చేస్తూ విద్వత్ సభలలో రాణిస్తూ వాదాలలో జయ భేరి మ్రోగిస్తూ, తర్కం లో అజేయులని పించుకొని .,శాస్త్రార్ధ చర్చలలో అద్వితీయులని నిరూపించుకొని జయ కేతనాన్ని ఎగుర వేశారు .లుకులాం అగ్రహారాన్ని చేరుకొని ,అక్కడ వదాన్యులైన బూర్లె శ్రీ రాములు గారి చేత భూమి, గృహం ,వసతులను పొంది నివాసమున్నారు .సుఖ జీవితాన్ని గడుపుతూ విద్యార్ధులకు తర్క వేదాంత విద్యనూ బోధిస్తూ గడిపారు .శక్తి వాదం పైన ఒక అపూర్వ వ్యాఖ్యానాన్ని రాశారు కాని ముద్రణ కు అది నోచుకో లేదు .
రామ మూర్తి శాస్త్రి గారు విద్యార్ధి దశ నుండి శ్రీవిద్యో పాసకులు .కడ దాకా దాన్ని కొన సాగించిన దీక్షా దక్షులు .అవసాన దశ సమీపించే తరుణం లో శాస్త్రి గారు నదీ తీరం లో ఉండాలని సంకల్పించుకొని ,రాజమహేంద్ర వరం చేరి, గోదావరీ తటాన కొంత కాలం ఉన్నారు .చివరి రోజులలో సన్యాసాశ్రమం తీసుకొని సార్ధక జన్ము లైనారు .తమ యాభై తొమ్మిదవ ఏట1920లో ఆది భట్ట రామ మూర్తి శాస్త్రి స్వామి సిద్ధి పొందారు .వారి విద్యా వైదుష్యానికి శ్రీ విద్యోపాసనే తోడ్పడిందనిని నిశ్చయం గా నమ్మి, ఆ మరనాంతం దాన్ని అనుసరించిన ధన్య జీవులు .
. సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –18-11-12—ఉయ్యూరు
కూచిపూడి నాట్య విషయాలకు సంబంధించిన సిద్ధాంత, ప్రాయోగిక, సంగీత, సాహిత్య, చరిత్ర ఇత్యాది విషయాలకు సత్యనారాయణ శర్మ ఒక నిఘంటువు లాంటి వారు. కలాపాలు, యక్షగానాలు, ఏకపాత్ర కేళికలు, కూచిపూడి నాట్యంలోని మార్పులు, చేర్పులు, ప్రదర్శనా విధానంలో నాటికీ, నేటికీ ఉన్న వ్యత్యాసం, నాటి కూచిపూటి నాట్య గురువుల విశేషాలు, కూచిపూడి నాట్యానికి ఆ మహనీయులు చేసిన సేవ ఇత్యాది విషయాల గూర్చి నేడు కూలంకషంగా చెప్పగలిగిన ఏకైక వ్యక్తి ఆయనే.
నాచిన్న తనంలో నేనుచూసిన పద్మశ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మగారి స్త్రీ వేషం ‘విప్రనారాయణ’ నృత్య రూపకంలో ‘దేవదేవి’ కిక్కిరిసినది. ప్రేక్షకులు, ఇసుక వేస్తే రాలని జనం. ప్రేక్షకులలో ఏ ఒక్కరూ ఈ లోకంలో లేరు. అందరూ ఆ ‘దేవదేవి’ అందానికీ, హొయలకూ, అభినయ కౌశలానికి మంత్రముగ్ధులయిన వారే. అభినయంలో వారికి వారే సాటి. సత్యనారాయణ శర్మ గారి అభినయం మనోధర్మంతో కూడి ఉండటం వల్ల ఎంతో వైవిధ్యంగా ఉండేది. ఎన్నిసార్లు ఒకే అంశాన్ని చూసినా ఇంకా చూడాలనిపించేది ఆ కారణంగా. వారితో నా చివరి సంభాషణలలో ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ, ‘మీ కాలంలో ఒక దర్వునుగానీ, ఒక అంకాన్ని గానీ తెల్లార్లు ప్రదర్శించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అభినయానికి ఎల్లలుగీసి ప్రదర్శిస్తున్న ఈ రోజులలో వైవిధ్యం లేకుండా సాత్వికాభినయాన్ని పంజరంలో బంధించటం ఎంతవరకు సబబు?” అన్నా వారు దానికి నవ్వేసి “ఆ కాలానికి అది కరెక్టు. ఈ కాలానికి ఇది కరెక్టు. అయినా నువ్వన్నట్టు ఒక వాక్యానికి ఐదు సార్లే చేయాలి అని ఎక్కడా లేదు. సందర్భాన్ని బట్టి చేసుకుంటూ పోవాలి’ అన్నారు. సమయోచిత సంభాషణ, లౌక్యంతో విషయాన్ని చెప్పకనే చెప్పటం వారి సొత్తు అనిపించింది నాకు.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు 2003లో లబ్దప్రతిష్ఠులయిన 10 మంది గురువుల నాట్య బాణీలపై, నేను సంధానకర్తగా, ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం చైర్మన్‌గా నిర్వహించిన బాణీ ఫెస్టివల్‌లో వారు, వారి బాణీని ప్రదర్శిస్తూ చేసిన సోదాహరణ ప్రసంగం అపూర్వం, అపురూపం. నాట్య గురువుల బాణీలపై ఏర్పాటు చేసిన ఈ సదస్సు, నృత్య ప్రదర్శన ఆలోచనకు వారు నన్నెంతగానో ఆభినందించారు. నా పూర్వజన్మ సుకృతం. అలాగే మా విశ్వవిద్యాలయ బోధనా సిబ్బంది, విద్యార్థులు అందరం శ్రీ సిద్ధేంద్ర కళాపీఠం, కూచిపూడిలో వారి గురుత్వంలో భామాకలాపాన్ని నేర్చుకోవడం ఒక అదృష్టం.
కూచిపూడి నాట్య విషయాలకు సంబంధించిన సిద్ధాంత, ప్రాయోగిక, సంగీత, సాహిత్య, చరిత్ర ఇత్యాది విషయాలకు సత్యనారాయణ శర్మ ఒక నిఘంటువు లాంటి వారు. కలాపాలు, యక్షగానాలు, ఏకపాత్ర కేళికలు, కూచిపూడి నాట్యంలోని మార్పులు, చేర్పులు, ప్రదర్శనా విధానంలో నాటికీ, నేటికీ ఉన్న వ్యత్యాసం, నాటి కూచిపూటి నాట్య గురువుల విశేషాలు, కూచిపూడి నాట్యానికి ఆ మహనీయులు చేసిన సేవ ఇత్యాది విషయాల గూర్చి నేడు కూలంకషంగా చెప్పగలిగిన ఏకైక వ్యక్తి ఆయనే. అనేక నాట్య సదస్సులలో వారు నాట్యసంబంధిత విషయాలపై సోదాహరణ ప్రసంగాలు చేశారు. వారు మంచి వక్త. కార్యశీలురు.
ఎటువంటి కార్యాన్నయినా వారి మృదుమధుర సంభాషణతో సాధించగలరు. వారు పొందిన సత్కారాలు, సన్మానాలు, బిరుదులు అనేకం. అయినా అవి ఏవీ ఆయన ప్రతిభాపాటవాలకు మించినవి కావు. ఇటీవల ఉద్దండులయిన కూచిపూడి కళాకారులను కోల్పోయి కూచిపూడి నాట్యకళామతల్లి మౌనంగా రోదిస్తోంది. మా తరానికి మార్గదర్శకులు వారు. వారి తదనంతరం దశ, దిశ నిర్దేశించే పెద్దలెవరు? వారి ఆశయాలకు అనుగుణంగా నడుస్తూ, తెలిసింది తక్కువ, తెలుసుకోవాల్సింది ఎంతో అనే వారి ఆలోచనా ధోరణి అలవరచుకుంటూ, ఆ తరం వారు ఏర్పరచిన బాటలో నేటి తరం వారు నడవాలని భావిస్తూ, అశ్రునయనాలతో మామయ్యకి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.
– భాగవతుల సేతురాం
అసోసియేట్ ప్రొఫెసర్
నృత్య శాఖ, తెలుగు విశ్వవిద్యాలయం
జ్యోతిష్టోమ యోగి –మల్లాది రామ కృష్ణ చయనులు
మల్లాది రామ కృష్ణ చయనులు గారు 1865లో గుంటూరు జిల్లా సత్తెన పల్లి తాలూకా గోరంట్ల అగ్రహారం లో జన్మించారు .తండ్రి రాఘవయ్య ,తల్లి అచ్చమ్మ గార్లు .వెలనాటి బ్రాహ్మణులు .చిన్న నాటే వీరు హైదరా బాద్ సంస్థానం లో ఒక గ్రామానికి తీసుకొని పో బడి ఒక్కడ ఒకరికి దత్త తపొందారు .కాని అక్కడి పరిస్థితులు అనుకూలించక తిరిగి స్వస్థలం చేరుకొన్నారు .అయితే తెలంగాణా ప్రాంతం లో ఉండటం వల్ల ఉర్దూ అరబ్బీ ,పార్శీ భాషలలో కొద్ది ప్రవేశం లభించింది .గోరంట్లలో సంస్కృతా భ్యాసం చేశారు ‘.సంస్కృత కావ్యాలను నేర్చారు .
అమలా పురం చేరి అక్కడి ఇందుపల్లి గ్రామం లో ఏలేశ్వరపు తమ్మన్న శాస్త్రి గారి దగ్గర కావ్యాలు నాటకాలు పూర్తీ చేశారు .పేరూరు కు చేరుకొని మంధా చెన్నయ్య శాస్త్రి గారి వద్ద తర్కాన్ని ,పేరి నరసింహ శాస్త్రి గారి దగ్గర వ్యాకరణ శాస్త్రాన్ని క్షున్నంగా అభ్య శిం చారు ..వీరి జ్ఞాన తృష్ణ తీర లేదు .శ్రీ పాద రామ శాస్త్రి గారి వద్దా ,విజయనగరంలోని భీమా చార్యుల వారి వద్దా అంతే వాసులుగా ఉండి తర్క శాస్త్రాన్ని మధించారు .ఈ శాస్త్రా లన్నిటిలో నిశిత పాండిత్యాన్ని సంపాదించి తిరుగు లేదని పించుకొన్నారు .
చయనులు గారు ఇరవై రెండో ఏటనే కొండ వీడు లో ఒక సప్తాహం జరుగుతుంటే వెళ్లారు .అక్కడ ఒక ప్రసిద్ధ పండితుని తో వాదించాల్సి వచ్చి తన వాదనా సామర్ధ్యాన్ని నిరూపించి ,ఆ పండితుని ఓడించారు .దీంతో వీరి కీర్తి సర్వత్రా వ్యాపించింది .వెంటనే వారికి అమరా వతి లోని గుడి మెల్ల వెంకట సుబ్బయ్య గారు తమ కుమార్తెకృష్ణ వేణమ్మ నిచ్చి వివాహం జరిపించారు . రామ కృష్ణ గారు మైసూర్ సందర్శించి అక్కడి పజమాని సుందర రామ శాస్త్రి గారి వద్ద బ్రహ్మ సూత్ర శంకర భాష్యాన్ని ,వేదాంత పరి భాష ను అద్వైత సిద్ధి మొదలైన గ్రంధాలను చదివి ఆధ్యాత్మిక విద్య లో అనితర సాధ్య పాండితీ గరిమను సాధించారు .దీని తో ఆగక, బెంగుళూరు సీతా రామ శాస్త్రి గారి వద్ద తర్క శాస్త్రం లోని అరుదైన గ్రంధ రాజాలను సైతం కరతలా మలకం చేసుకొన్నారు .అక్కడి నుండి తమిళ నాడు చేరుకొన్నారు .అక్కడ వేద ,శ్రౌతాల లోను ,షట్ శాస్త్రాలలోను అసమాన ప్రజ్ఞను సాదించుకొన్నారు .అక్కడ వీరి గురువులు ఈ శాస్త్రాలలో దిట్ట అని పించుకొన్న త్యాగ రాజ శాస్త్రి గారు .వాచస్పత్యాన్ని ,కల్పతరువును వ్యుత్పత్తి వాదం మొదలైన ఉద్గ్రందాలను అవలోడనం చేశారు .త్యాగయ్య శాస్త్రి గారు అప్పయ్య దీక్షితుల వారికి తొమ్మిదవ తరం వారు .అంతటి గురు మూర్తి వీరికి లభించటం చయనుల గారి పూర్వ జన్మ సుకృతం .
ఈ విధం గా విద్యా జైత్ర యాత్రను దిగ్విజయం గా పూర్తీ చేసుకొని గుంటూరు దగ్గరున్న అమరావతి క్షేత్రాన్ని చేరి ,స్వగృహాన్ని నిర్మించుకొని స్తిర నివాసం ఉన్నారు .విజయ వాడ లో కూడా గృహ నిర్మాణం గావిన్చుకొన్నారు .36 వ ఏట మళ్ళీ దక్షిణ దేశం వెళ్లి ,త్యాగరాజ స్వామి నిలయ మైన తిరువయ్యూరు లో,స్థల పురాణం బాల కృష్ణ శాస్త్రి గారి వద్ద శిష్యులై ఉపనిషత్ ,షట్ దర్శనాలు ,మరికొన్ని వేదాంత గ్రంధాలను ప ఠనం చేశారు .
ఈ విధం గా అపార పాండిత్యాన్ని సంపాదించిన రామ కృష్ణ గారు విశేషం గా దేశ సంచారం చేసి ధర్మ ,వేదాంత ప్రబోదాలను చేస్తూ ప్రజలకు ఆధ్యాత్మిక భావన కల్గించారు .చాలా కాలం పుష్ప గిరి పీఠము ,విరూపాక్ష పీఠములకు ఆస్థాన పండితులు గా ఉండి తమ ప్రజ్ఞ ను చాటుకొన్నారు .వీరికి వైదిక కర్మానుష్టానం పై ఆసక్తి ఎక్కువ .1904 లో అమరా వతి లో జ్యోతిష్తోమాన్ని ,1922 లో విజయ వాడ లో చయనాన్ని చేశారు .అప్పటి నుండి వీరు రామ కృష్ణ యాజులని, రామ కృష్ణ చయనులు గారు అని ఆహితాగ్ని నామాల తో పిలువబడ్డారు .
శ్రుతి, స్మృతి లలో చెప్పబడిన సనాతన ధర్మాన్ని ప్రజలలో విశేష ప్రచారం చేసిన వీరి లాగా ఉన్న పండితులు అరుదు గా ఉంటారు .వేదాంత శాస్త్రాన్ని సర్వ జనులకు సమ్మత మైన రీతి లో భాష్య ప్రవచనం రూపం లో నే కాక ,ఉపన్యాస రూపం లో కూడా చెప్పటం లో వీరికి వీరే సాటి అని పించుకొన్నారు .పండితులలో మహా వక్త గా ప్రక్ష్యాతి చెందారు చయనులు గారు .కాశీ పండితులు వీరి వేదాంత ప్రవచనాలను విని ‘’పండిత ప్రవర ‘’బిరుదు నిచ్చి సత్కరించారు .పంజాబు రాష్ట్రం లోను పర్య టించి తన వాగమ్రుతాన్ని పంచి ‘’వ్యాఖ్యాన వాచస్పతి ‘’బిరుదు నందుకున్నారు .అఖిల భారతం లోను చయనుల గారి కీర్తి చంద్రికలు వ్యాపించి నాయి .’’అఖిల భారత వర్ణాశ్రమ ధర్మసంఘం ‘’లో చయనులు గారు కార్య నిర్వాహక సభ్యులు గా ఉన్నారు .’’బాల బోధిని ,’’,భ్రమ భంజని ‘’అనే వేదాంత గ్రంధాలను రాశారు .’’ప్రాయశ్చిత్త పశు విషయక విమర్శ గ్రంధాలను’’ ,’’మహా భారత కదా తత్వ నిర్ణయాన్ని’’రచించిన తాత్విక రచయితలు .76 ఏళ్ళ జేవితాన్ని క్రతువుల్లో యాగాలలో ,ధర్మ ప్రబోధం లో ,ఆధ్యాత్మిక గ్రంధ రచనలో నిండుగా గడిపినజ్యోతిష్టోమ యోగి రామ కృష్ణ చయనులు గారు 1941 లో పరమ పదించారు .
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –18-11-12-ఉయ్యూరు
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
సప్త పురి వర్ణనం
అగస్త్య మహర్షి భార్య లోపా ముద్రా దేవికి శివ శర్మ కధను చెప్పటం ప్రారంభించాడు .మధురా నగరం లో శివ శర్మ అనే బ్రాహ్మనుడుండే వాడు .వేద ,వేదాంగాలు ,సకల శాస్త్రాలు నేర్చి ,సత్పుత్రులను కని వారికి సమానం గా ఆస్తి పంచి ,ముసలి తనం లోకి ప్రవేశించాడు .వయస్సంతా ధన సంపాదన లో ఖర్చు అయి పోయిందని విద్య నేర్వటానికి సరి పోయిందని దైవా రాధనా తీర్ధ యాత్రలు చేయ లేక పోయానని విచారించాడు .దానాలు చేయలేక పోయానని బాధ పడ్డాడు చివరికి తీర్ధ యాత్రలు చేసి జీవితానికి పరమార్ధాన్ని కల్పించుకొంటానని నిశ్చయానికి వచ్చాడు మంచి రోజు చూసుకొని విఘ్నేశ్వర పూజ చేసుకొని ననాందీశ్రార్ధాన్ని నిర్వర్తించి తీర్ధ యాత్రలకు బయల్దేరాడు .
శివ శర్మ మొదట అయోధ్య కు చేరాడు .సరయు నదిలో స్నానం చేసి పితృదేవతలకు పిండ ప్రదానం చేసి అయిదు రాత్రులు ఉండి ,ప్రయాగ చేరాడు .తివేణీసంగమం లో పవిత్ర స్నానం చేసి ,గంగా నది ఇక్కడే కలుస్తుందన్న విషయం తెలిసి కొన్నాడు .ప్రకృష్ట మైన క్షేత్రం కనుక ప్రయాగ అనే పేరొచ్చింది .సప్త పాతాళాలలో వ్రేళ్ళూనుకొని ఉన్న అక్షయ వట వృక్షాన్ని భక్తితో దర్శించాడు .బ్రాహ్మణులకు సమారాధన చేశాడు .ఇది ధర్మార్ధ కామ మొక్షాలనిచ్చే క్షేత్ర రాజం .బ్రహ్మ హత్యా దోషాన్ని కూడా నివారించే శక్తి ఈ క్షే త్రానికి ఉంది .విష్ణు స్థానమైన వేణీ మాధవా న్ని దర్శించాడు .రజో రూపం లో ఉండే సరస్వతి ,తమో రూపం లో ఉండే యమునా ,సత్వ రూపం లో ఉన్నగంగా నది ఇక్కడ కలిసి నిర్గుణ బ్రహ్మ రూపాన్ని పొందినాయి . ఈ త్రివేణీ సంగమం బ్రహ్మ లోకానికి నిచ్చెన .ఇది తీర్ధ రాజం ..బిందు మాధవుడు సేవించు కాశీ పట్నం వరుణ ,అసి నదుల మధ్య ఉంది ప్రయాగ నుండి అక్కడికి చేరాడు .మణి కర్ణిక లో స్నానం చేసి విశ్వేశ్వరుడిని దర్శించాడు కాశి ఎప్పటికప్పుడు కొత్తగా కనీ పిస్తుంది .ఉత్తమ ప్రబంధాలలో స్రవించే రసం లాగా కాశి మనోజ్ఞం గా ఉంటుంది .సంసారులకు చింతా మణి వంటిది .ముక్తి లక్ష్మీపీఠ.మణి.ఇక్కడ సకల జీవ రాసులు దేవతల తో సమానం .సప్త క్షేత్రాలలో కాశి ఒరిపిడి రాయి వంటిది .ఇతర క్క్షేత్రాలను దర్శించిన వారు కూడా మళ్ళీ కాశీ కే చేరుకొంటారు .
అక్కడి నుండి శివ శర్మ ఉజ్జయిని వచ్చాడు .తన లీలచే ,ప్రతి కల్పం లోను ప్రళయం చెందే ఈ విశ్వాన్ని చూసి ,చూసి శివుడు మహా కాళుడయ్యాడిక్కడ .లోకం లోని పాపాలను పోగొట్టు తుంది కనుక అవంతి అనీ అంటారు .ప్రతి యుగం లోనుకళలను నింపి కళకళ లాడుతూ కని పిస్తుంది .మహా కాళుని సమీపం లో కోటి లింగాలున్నాయి .హాటకేశ్వరుడైన మహా కాలుడు తారకేశ్వరుడై ఒకే లింగాన్ని మూడు గా భేదించి ,మూడు లోకాలను ఆక్రమించాడు .ఇక్కడున్న సిద్ధ వటం వద్ద ఉండే జ్యోతిని దర్శించాడు .’’మహా కాళా ,మహా కాళా’’ అంటూ ఆర్తి గా పిలిస్తే యమ దూతలు దగ్గరకు రారు .ఇక్కడి నుంచి కంచి నగరం చేరాడు .కాంతి నిచ్చేది కనుక దీన్ని కాంతి లేక కంచి అంటారు ఇక్కడ మహా విష్ణువు ను లక్ష్మీ దేవిని సందర్శించాడు .తీర్ధ విధులు నిర్వర్తించి, ద్వారా వతి అంటే ద్వారక చేరాడు అన్ని వర్ణాల వారికి ఇది పుణ్య ద్వారం కనుక ద్వారక అనే పేరొచ్చింది ఇక్కడి సముద్రుడు అనేక యుగాలుగా రత్నాలను సేకరించుకొని రత్నా కరుడయ్యాడు .ఇక్కడ మరణిస్తే వైకుంఠమే చేరుతారు .శ్రీ మహా విష్ణువుకు నిలయం .తర్వాత మాయాపురికి వచ్చాడు .దీనినే హరిద్వారం అంటారు .మోక్షద్వారం అని, గంగా ద్వారం అనీ పిలుస్తారు .కొద్ది కాలం ఇక్కడున్నాడు చలి జ్వరంవచ్చి తీవ్రం గా బాధ పడ్డాడు .సప్తపురీ యాత్ర లను సంపూర్ణం గా చేద్దా మనుకొంటే, ఈ విపత్తు వచ్చిందని బాధ పడ్డాడు .ఎక్కడికి కదల లేక నలభై తొమ్మిది రోజు లు అక్కడే ఉండి మరణించాడు .వైకుంఠ ము నుండి విమానం వచ్చి శివ శర్మ ను విష్ణు దూతలు తీసుకొని వెళ్లారు .
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –18—11—12-ఉయ్యూరు
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
సిద్ధ యోగి పుంగవులు -25
కృష్ణ బ్రహ్మ తంత్ర –పరకాల స్వామి .
స్వామి వారి పూర్వాశ్రమ నామం హోస దుర్గం కృష్ణ మా చార్యులు వీరు వికారి నామ సంవత్సర జ్యేష్ట శుక్ల పంచమి నాడు జన్మించారు .తండ్రి గారు శ్రీని వాస తాతా చార్యుల వారు గొప్ప ప్రఖ్యాతి చెందినపండితకవులు .తండ్రి గారి కీర్తి ఆంద్ర దేశమంతటా వ్యాపించింది .ఆచార్యుల వారు కర్నూలు మండలి లో పేపలి లో విద్యాభ్యాసం మొదలు పెట్టారు .వీరి ప్రధమ గురువులు వ్యాకరణ శాస్త్రం లో దిట్ట అని పించుకొన్న అయోధ్య కొండమాచార్యుల వారు .అఖండ పాండితీ గరిమతో ,స్వామి వారు అందరి మన్ననలు అందుకొన్నారు .
కృష్ణ మాచార్యుల కుమారులు శ్రీనివాస రాఘవా చార్య ,దేశికా చారర్యులు ఇద్దరు పండిత కవులు గా సుప్రసిద్ధులు .అంటే వీరి కుటుంబమే పండిత కవి వంశం అని తెలుస్తోంది .అనంత పాండిత్య ప్రకీర్శ తో స్వామి వారు వనపర్తి ,గద్వాల ,ఆత్మ కూరు సంస్థానాలను సందర్శించి ,తమ కవితా ,పాండిత్య ధార తో మెప్పించి సత్కారాలను ,సన్మానాలను అందుకొన్న శేముషీ దురంధరులు .వనపర్తి ఆస్థానం లో ధర్మాధి కారి గా కొంతకాలం పని చేశారు .అప్పుడే ఆ రాజు గారి పై ‘’రామేశ్వర విజయ చంపు ‘’అనే ప్రబంధాన్ని రచించారు .అలాగే ఆత్మకూరు సంస్థానం లో ఉన్న శ్రీని వాస స్వామి వారిపై ‘’శ్రీని వాస విలాస చంపువు ‘’అనే విశిష్ట ప్రబంధాన్ని పండిత జన రంజకం గా నిర్మించారు ..వీరు రాసిన ‘’హంస సందేశ వ్యాఖ్య ‘’పండిత ప్రశంశలను పొందింది . .హయగ్రీవ ఉపాసకు లైన స్వామి వారు శాతా లంకార లక్ష్య లక్షణ సమన్వయము గా హయగ్రీవ స్వామిని లక్ష్యం గా ఉంచుకొని ‘’అలంకార మణి హారం ‘’అనే శాస్త్ర గ్రంధాన్ని రచించి అలంకార శాస్త్రం లో తమ ప్రావీణ్యాన్ని నిరూపించుకొన్నారు .
కార్తీక మాసం లో గద్వాల లో జరిగే ఉత్స వాలను వర్ణిస్తూ’’ కార్తికోత్సవ దీపిక ‘’అనే గ్రంధాన్ని రాశారు .లక్ష్మీ సహస్ర వ్యాఖ్య ,నృసింహ విలాస చంపువు వీరి అముద్రిత గ్రంధాలు .కృష్ణ మాచార్యులు 40వ ఏట ఆశ్రమ స్వీకారం చేశారు .మైసూర్ లోని పరకాల మథాధి పతు లైన శ్రీ రంగనాధ స్వామి వారు ఆచార్యుల వారి పాండిత్యం ,నీతి నియమాలకు ముగ్ధులై తమ తర్వాత పీథాది పతులు గా నియమించారు .అప్పుడే వీరికి కృష్ణ పర తంత్ర స్వామి గా నామకరణం జరిగింది .పరకాల పీథాది పతులు గా స్వామి వారు 30సంవత్స రాలు సేవ లదించి పీథం ఉన్నతికి అన్ని విధాలా కృషి చేసి అందరి దృష్టిని ఆకర్షింప జేశారు .ఆశ్రమాధి పతి గా వీరు విజ్ఞాన బీజాలను దేశ మంతటా వెద జల్లి ,వేద విహిత ధర్మ వ్యాప్తికి ఇతోధికం గా తోడ్పడ్డారు .
స్వామి వారి విద్వత్తు ,పాండిత్యం నిర్డుష్టమైనవి .శ్రీ వారికి ‘’విద్వత్ కవి సార్వ భౌమ ‘’,’’కవి గండ భేరుండ‘’మొదలైన బిరుదులు లభించాయి .వీరి అపూర్వ గ్రంధాలు కొన్ని ముద్రణ కు నోచుకో లేదు అందులో శ్రీ పరకాల గురు విజయం ,రఘు నాద విజయం ,రంగ రాజ విలాసం ,నృశింహ విలాసం ,కేశవోత్సవ మాలిక ,శ్రీ లక్ష్మీ సహస్రం ,రాసాస్వాదిని ,ఆచార్య వేద పాద స్తవ వ్యాఖ్యానం ,నవ రత్న హార స్తవ ,వ్యాఖ్యానం ,కావ్యోత్కార్శరక్షా ,సరస్వతీ మూలధనం ,శ్రీ కృష్ణ జయంతీ పౌర్వా పర్య నిర్ణయం ,శిష్ట సిద్ధాంత పద్ధతి ,శూద్రాశీర్నిర్ణయం ,కర్త్రుక్రమ నిర్ణయం ,స్వయం వ్యక్త ప్రతిష్టా నిర్ణయం ,అధిక మాసోత్సవ నిర్ణయం ,సోదర కన్యా ద్వయ వివాహ నిర్ణయం ,అతి క్రాంత శ్రాద్ద కాల నిర్ణయం, వివాహ కాల నిర్ణయం ,ప్రసన్నాభరణం ,వ్రుత్తి ముక్తాహార స్తుతి వ్యాఖ్యానం ,సుభద్రా పరిణయం ,విశ్రాంత రాఘవం ,ఉన్మత్త పాండవం మొదలైన అనేక ఆధ్యాత్మిక ,ఆగమ ,సిద్ధాంత ,కావ్య ,వ్యాఖ్య అలంకార గ్రంధాలను అలవోక గా రచించిన మహాను భావులు .వీరి స్తోత్రాలకు విశేష ప్రాచుర్యం ఉంది .
ఆహ్నిక రత్నం ,మేఘ మాల ,సమయామ్రుతం ,సూర్యోప రాగ దర్పణం ,రాజ వంశ రత్నావళి ,కళ్యాణ గీత మంజరి ,ఉత్తర రంగ మహాత్మ్యం ,శ్రీ రామాయణ వైభవం ,శంభు రహస్యం ,శ్రీ శరదంబుజ మాల ,శ్రీ రామ చంద్ర మంగళ మాలిక ,శ్రీ సర్వర్తు కుసుమ మాలా ,మొదలైనవి శ్రీ వారి వేద వేదాంగ,శాస్త్ర,విషయ పరిజ్ఞానానికి మహా శేముషీ వైభవానికి నిదర్శన గ్రంధాలు .ఇంత సాహిత్య సంపదను జాతికి అందించిన పూర్ణ ప్రజ్ఞా చాతుర్యం శ్రీ పరకాల స్వామి వారిది .మథాధి పత్యాన్ని సాధికారికం గా,సాంగం గా,సర్వ సమర్ధ వంతం గా , నిర్వహించి బహుజన హితం కోసం జీవితాన్ని పరి పూర్ణం చేసుకొన్నా కృష్ణ పర తంత్ర –పరకాల స్వామి యతీంద్రులు ఆనంద నామ సంవత్సర కార్తీక బహుళ పంచమి నాడు సిద్ధి పొందారు ..
స శేషం –మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –17-11-12-ఉయ్యురు
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
వాస్తు యోగి –వడ్డేపాటి నిరంజన శాస్త్రి
వడ్డే పాటి నిరంజన శాస్త్రి గారు 1877 లో గుంటూరు జిల్లా తెనాలి తాలూకా దుగ్గిరాల గ్రామం లో జన్మించారు తండ్రి కోటయ్య గారు తల్లి గారు భద్రమ్మ .చిన్న నాడే ఉపనయనం జరిగింది .వెంటనే వేదాధ్యయనం ప్రారంభించారు .వేదం ,ఉపనిషత్తులను అభ్య శించారు .సంస్కృతం లోను తెలుగు లోను విశేష పాండిత్యాన్ని సంపాదించుకొన్నారు .
వీరు శిల్పర్షి పంచకం లో సానగ రుషి గోత్రానికి చెందిన వారు .రుగ్వేద అధ్యయనులు ..విశ్వ బ్రాహ్మణులు .వంశ వ్రుత్తి అయిన ఇనుప పని, కమ్మర పని లో తండ్రి గారి కర్మా గారం లో సరదా గా పని చేస్తూ మెలకువలన్నీ నేర్చారు ..వీరి దృష్టి శిల్పం మీదకు ,వస్తు శాస్త్రం మీదకు మళ్ళింది .వాటిని క్షున్నం గా నేర్చి ప్రవీణులయ్యారు ..జ్యోతిషం ఆతరువాత అభిమాన విషయ మైంది .దీని లోతు పాతులను తరచి నిష్ణాతు లని పించుకొన్నారు .ఇవి ఇలా కోన సాగిస్తూనే వేద, ఆగమ దర్శన శాస్త్రాలలో విశేష ప్రతిభను చాటుకొన్నారు ..అందులో ప్రవేశమే కాదు పాండిత్యాన్ని ,గడించి వాదనలో సాటి లేరని నిరూపించుకొన్నారు .ఉన్నత విద్యాలయం లో పండిత పదవి వీరిని వరించి వీరి ప్రతిభకు తగిన వరం అయింది
శాస్త్రి గారు ,18 వ ఏట నే వీర బ్రహ్మేంద్ర చరిత్రను ,’’కల్యంధ కౌముది ‘’అనే పేరు తోశ్రవ్య కావ్యం గా రాశారు .కుమారాస్వామి తారకాసుర వదను ‘’కుమారాభ్యుదయం ‘’నాటకం గా రాశారు .రెండు మహా ప్రౌఢ ప్రబంధాలను కూడా రాసి ,పూర్వకవుల సామర్ధ్యం తనకూ ఉన్నదని నిరూపించారు .అవి భీష్మోదయం ,ధర్మ పాల చరిత్రం .మాఘ మహాత్మ్యాన్ని ఆంధ్రీకరించారు సూర్య శతకం ,సుబ్బరాయ తారావళి ,తో బాటు బ్రహ్మానంద లీలలు అనే నాటకాన్ని కూడా రాశారు .వీరి భాషా పాండిత్య వేద విజ్ఞాన శాస్త్ర ఆగమ దర్శన సిద్ధాంతాల కు నికషోపలం గా నిలిచేది వీరు రచించిన ‘’విశ్వ కర్మ బ్రాహ్మణ వంశాగమ ము ‘’అనే మహా గ్రంధం .
వాస్తు శాస్త్రపు గుట్టు మట్టులన్ని ఆకళింపు చేసుకొని యోగ దృష్టి తో దానిని ఆచరణ లో ఉంచుకొని ఎందరికో మార్గ దర్శులై నిలిచారు .వీరు నిర్మాణాలను చేసి ,పర్య వెక్షిస్తూ దోష రహితం గా ,శాస్త్ర బద్ధం గా వాస్తు బద్ధం గా నిర్మాణపు పనులకు మంచి సహేతుకమైన సూచనలిచ్చే వారు శాస్త్రి గారు గొప్ప సంఘ సేవకులు .,సంఘ సంస్కర్తలు .మచిలీ పట్నం వాస్తవ్యులు కొండి పర్తి వీర భద్రా చార్యులు గారితో కలిసి వీరు 1908 లో కృష్ణా ,గుంటూరు మండల విశ్వ బ్రాహ్మణ మహా సభ లను నిర్వహించారు .’’ప్రబోధిని ‘’అనేపత్రిక ను స్థాపించి నీతి ,మత ,భాషా ,శిల్ప ,సాంఘిక విషయాల ఉద్ధరణ కోసం తీవ్రం గా కృషి చేసి కృత క్రుత్యులయారు .శిల్ప శాస్త్ర్రం లో ఉన్న అభి రుచి వల్ల తమిళ నాడు ,ఆంద్ర ,మహారాష్ట్ర లలో పర్య టించి ,శిల్ప రహస్యాలను గ్రహించారు .అమూల్య విషయాలను సేకరించి శిల్ప శాస్త్ర పురోగతికి ఏంతోసేవ చేశారు .
నిరంజన శాస్త్రి గారు అనేక యజ్ఞాలను తానే యాజకులు గా ఉండి నిర్వహించారు .ఆంద్ర, ఆంధ్రేతర ప్రాంతాలలో వీరు అనేక చోట్ల నిర్వహించిన ‘’అహింసా యజ్ఞం ‘’ఎందరినో ప్రభావితులను చేసి ప్రేరణ నిచ్చింది .దీని వల్ల వేలాది మంది వైదిక ధర్మ పరాయణులు గా మారారు ..ఇంతకంటే సాధించాల్సిన్దేమి ఉంది ?బ్రాహ్మణ ,విశ్వ బ్రాహ్మణ వివాదాలలో వాదాలలో గుంటూరు, మద్రాస్, గోకర్ణ క్షేత్రాలలో బ్రాహ్మణ ,విశ్వ బ్రాహ్మణ ఆధిక్యాన్ని గూర్చి జరిగిన వాదోప వాదాలలో శాస్త్రి గారు సమర్ధ వంత మైన తమ వాదనను విని పించి దిగ్దంతులైన పండితులనే ఆశ్చర్య పరిచారు ఎందరికో స్వయం వెళ్లి పండిత సాక్ష్యాలను ఇచ్చి గెలుపొందేట్లు చేసిన వాదనా నిపుణులు .వారి కి అరవై ఏళ్ళు వచ్చేసరికి1937 లో నూరేళ్ళు నిండి పోయాయి .ఒక గొప్ప సామాజిక సేవకుడిని ఆంద్ర దేశం కోల్పోయింది
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –17-11-12-ఉయ్యూరు
Gabbita Durga Prasad
Rtd. head Master
Sivalayam Street
తీర్దాధ్యాయం
కొల్హా పుర మహా లక్ష్మీ దేవి సందర్శనం తో పులకించిన అగస్త్య లోపాముద్ర దంపతులు తమకు అమ్మ వారి దర్శనం పరోప కారం వల్ల కలిగిన ఫలం అని భావించారు .అక్కడి నుండి త్రిపురాంతకం చూసి శ్రీశైలం చేరారు .శ్రీ శైల శిఖరం చూసి పునర్జన్మ లేని దాని దర్శనానికి ఆనంద పడ్డారు .;శ్రీ శైల పర్వతం ఎనభై నాలుగు యోజనాల విస్తీర్ణం కలదని భార్యకు తెలియ జేశాడు ముని .లోపాముద్ర భర్త తో ‘’స్వామీ ! భర్త అనుజ్న లేకుండా భార్య యే పనీ చేయ రాదు కదా .ఇక్కడి శిఖరాన్ని చూస్తె పునర్జన్మ లేదు కదా మరి మనకింక కాశీ తో పనేమిటి ?’’అని అడిగింది .దానికి మహర్షి ‘’ఈ విషయాన్ని పూర్వం మహర్షులు చర్చించి కొన్ని నిర్ణయాలు చేశారు .ఆ వివరాలను నీకు తెలియ జేస్తాను .ముక్తి క్షేత్రాలు చాలా ఉన్నాయి .అందులో మొదటిది తీర్ధ రాజం అని పేరు పొందిన ప్రయాగ .ధర్మార్ధ మోక్ష కామాలనిచ్చేది నైమిశారణ్యం .కురుక్షేత్రం ,హరిద్వారం ,ఉజ్జయిని ,అయోధ్య ,మధుర,ద్వారక ,అమరావతి ,సరస్వతీ సాగర సంగమం ,గంగా సాగర సంగమం ,కాంతి త్ర్యయంబకం .సప్త గోదావరీ తీరం ,కాలంజరం ,ప్రభాస తీర్ధం ,బదరికాశ్రమం ,కాశి ,ఓంకారక్షేత్రం ,పురుషోత్తమం ,గోకర్ణం భ్రుగు కచ్చం ,భ్లు తుంగం ,పుష్కరం ,శ్రీ శైలం ,ధారారా తీర్ధం ,మానసతీర్ధం లమొదలైనవి మొక్షాన్నిచ్చేవి .గయా తీర్ధం పితృదేవత లకు మోక్షాన్ని స్తుంది .అక్కడే పితృ పితామహ ప్రపితామహులు తరిస్తారు ‘’అని చెప్పాడు .
అప్పుడు భార్య మానస తీర్ధాన్ని గురించి వివరించ మని కోరింది .అగస్త్యుడు ‘’సత్యం ,క్షమా ,ఇంద్రియ నిగ్రహం ,సర్వ భూత దయ ,నిష్కాపట్యం ,దానం దమం ,శమం సంతోషం అనేవి మానస తీర్ధాలు .వీటన్నిటి తో బాటు బ్రహ్మ చర్యం ,ప్రియ భాషణం ,జ్ఞానం, ధృతి ,తపస్సు కూడా మానస తీర్ధాలే .వీట న్నిటి కంటే ముఖ్యం మనసును పరి శుద్ధం గా ఉంచుకోవటం .తీర్ధాలలో స్నానం స్నానమే కాదు .ఇంద్రియ నిగ్రహం ,మాస పరిశుద్ధత లేకుండా ఎక్కడ స్నానం చేసినా మలినాలు ,,పాపాలు పోవు .మనసు లో మాలిణ్యం లేని వాడే సుస్నాతుడని పిలువ బడుతాడు .దానం తపస్సు శౌచం లేకుండా చిత్తం ప్రశాంతిని నిర్మలత్వాన్ని పొందడు .ఇంద్రియాలను నిగ్రహించి ఉన్న చోటే నైమిశం కురుక్షేత్రాదులు .రాగ ద్వేషాలను వదిలి జ్ఞాన జలములో ధ్యానం చేత పవిత్రుడయ్యే వాడు మానస తీర్ధ స్నానం చేసిన వాడే .ఉత్తమ లోకా లను పొందుతాడు .ఋషులు తిరుగాడిన నెల ,స్నానం చేసిన తీర్ధాలు పుణ్యప్రదాలు ,పరమ పవిత్రాలు .కనుక అక్కడ స్నానం చేస్తే ఉత్తమ లోకం వస్తుంది .తీర్ధాలలో ఉపవాసం చేసి దానాలిచ్చి ,అగ్నమాది క్రతువులు చేయాలి .ఎవరి మనసులో విద్యా తపస్సు కేర్తి ఉంటాయో వారికి తీర్ధ యాత్రలు ఫలిస్తాయి .గర్వం లేని వాడు సత్య భాషి ,దృఢ వ్రతుడు ,సర్వ భూత సముడు పొందే ఫలాన్ని తీర్ధ యాత్ర చేసిన వారు పొందుతారు ..తీర్ధాలకు వచ్చి అక్కడి దేవతలను ముందుగా ప్రార్ధించాలి అప్పుడు స్నానం చేస్తేనే ఫలితం ఉంటుంది .శ్రద్ధ తో తీర్ధ యాత్ర చేస్తే పాప ప్రక్షాళనం జరుగు తుంది .ఇతరుల కోసం తీర్ధ యాత్ర చేస్సిన వాడికి పదహారవ వంతు ఫలం దక్కుతుంది .తీర్ధం లో ఉప వాసం శిరో మున్దనం చాలా ముఖ్య మైనవి .క్షౌరం వల్ల శిరోగత పాపాలు పోతాయి .తీర్ధాలలో శ్రాద్ధం పిండ ప్రదానం చేస్తే పితృ దేవతలు తృప్తి చెందుతారు .తీర్ధ యాత్ర సర్వ సాధక మైనది ..మోక్ష ప్రదాయక మైనది .కాశి ,కంచి ,హరిద్వారం ,అయోధ్య ,ద్వారక ,మధుర ,ఉజ్జయిని మోక్ష పురాలు గా ప్రశిద్ధి చెందాయి .శ్రీ శైలం మోక్షదాయకం అంతకంటే కేదారం గొప్పది ఈ రెంటికంటే .గొప్పది ప్రయాగ. దీనికంటే అవిముక్త క్షేత్రం కాశి మహా గొప్పది కాశిలో చని పోతే మోక్షమే .తీర్ధ కోటికి అందని ముక్తి కాశీ లో లభిస్తుంది ..పూర్వం విష్ణు దూతలు శివ శర్మ అనే అతనికి చెప్పిన విషయాన్ని తెలియ జేస్తా విను ‘’అన్నాడు మహర్షి
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –17-11-12-ఉయ్యూరు
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
‘’కూచి పూడి నాట్య వేదాంతం ‘’శ్రీ సత్య నారాయణ శర్మ
ఆయన అభినవ సత్య భామ .ముదిమి వయసు లోను వన్నె తగ్గని అభినయ కౌశలం .కూచి పూడి ని విడిచి పెట్టి ఉందని నాట్యా చార్యులు .జీవితాన్ని కళా రాదన కే అంకితం చేసిన ధన్య జీవి .అక్కడి సిద్ధేంద్ర కలాక్షేత్రానికి పునాదుల నుంచి ,పునర్వికాసం వరకు ఆయన చేసిన కృషి జగద్విదితం .సిద్ధేంద్ర యోగి దేవాలయ నిర్మాణం లోను ,దాని నిర్వహణ లోను ఆయన ఆలోచన,ప్రస్ఫుటం .సంపాదించుకొనే అనేక వెసులు బాట్లు ఇతర ప్రాంతాలలో ఉన్నా వాటిని తృణీకరించి ,జన్మ భూమి పైనా ,కూచి పూడి నాట్యం మీద ఉన్న విశేష గౌరవం ,ప్రేమ ,అభిమానాల నే మాత్రం చె జార్చుకోకుండా కళకే అంకిత మై ఆదర్శ ప్రాయులైన కళా తపస్వి. . 78 ఏళ్ళు నిండు జీవితాన్ని గడిపి నిన్న రాత్రి తుది శ్వాస విడిచిన పద్మ శ్రీ వేదాంతం సత్య నారాయణ శర్మ గారు ముమ్మాటికీ’’ కూచి పూడి నాట్య వేదాంతమే ‘’
మగాడు ఆడ వేషం వేసి రాణించి ఆ కళకే సార్ధకత తెచ్చిన వారు శర్మ గారు .ఈ విధం గా కూచి పూడికి అంతర్జాతీయ పేరు ప్రఖ్యాతులను అందించి ,ఆ కళా సరస్వతికి జన నీరాజనాలన్దిన్ప జేశారు .వీరి తొమ్మిదవ ఏట నాట్య తరగతికి ఆదరా బాదరా నడిచి వెడుతుంటే ,పొలాలలో ఒక యోగి తారస పడ్డారట .ఈ కుర్రాడి హావ భావ విన్యాసాలను గమనించి ఆయోగి ‘’నువ్వు గొప్ప నాట్యా చార్యుడవుతావు .నీ వల్ల నీ గ్రామానికి, కూచి పూడి కళకు విశేష కీర్తి లభిస్తుంది ‘’అని మనసారా ఆశీర్వా దించి ,అదృశ్య మైనాడట .ఎవరీయన అని తర్వాత ఆరా తీస్తే ఊరి పెద్దలు ,తలి దండ్రులు ఆ వచ్చిన యోగి సాక్షాత్తుకూచి పూడి నృత్యానికి ఆద్య గురువు లైన సిద్ధేంద్ర యోగి పుంగవులే అని నిర్దారించారట .అంతటి పుణ్య పురుషుల ఆశీస్సు లభించింది శర్మ గారికి .అంతే ఇక ఆయనకు ఎదురు లేకుండా పోయింది .
కూచి పూడి నాట్యం లో విశిష్ట మైన శ్రీ కృష్ణ సత్యభామ కలాపం అదే ‘’భామా కలాపం ‘’పై పూర్తీ దృష్టిని పెట్టి అభ్యసించి దాని మూలాలను శిఖరాలను తరచి చూశారు .సత్య భామ అంటే సత్య నారాయణ శర్మ గారే వేయాలి అన్న పేరొచ్చింది ..ఎక్కడా మగతనం మనకు కనీ పించదు .ఆ నడక ,ఒయ్యారం ,హొయలు ,సొగసులు,సోయగం మురిపెం ముద్దు ,మాట పాటా అన్నీ కాచి వడపోసి ఆ పాత్ర ను చిరంజీవి ని చేశారు .ఈ వేషం వల్ల వివాహం చేసుకోవ టానికి స్త్రీ ఎవరు ముందుకు రారని చెవి నిల్లు కట్టుకొని పోరినా,వారు పెడ చెవిని బెట్టి తన సత్య భామకే అంకితమై పోయి న భూతో నభవిష్యతి అని పించుకొన్నారు .దానినొక అద్వితీయ పాత్ర గా మలిచి మెరుగులు దిద్దారు .ఆయన దీక్ష ,పట్టుదలా,కఠోర శ్రమ ,అధ్యయనం ,అమలు చేసిన తీరు మహాశ్చర్యాన్ని కలిగిస్తుంది ..ఆ పాత్రకు ఆయనే సరి అది ఆయన కోసమే నని పించారు .ఎక్కడ ప్రదర్శన నిర్వ హించినా,,ఎంత దూరమైనా వెళ్లి తిరిగి స్వగ్రామం చేరుకోవటం వారికి ఇష్టం .నాట్యానికే కాదు ఆ నాట్యం అందించిన గ్రామానికీ ఆయన సేవలు నిరుప మానం .ఎన్ని వేల ప్రదర్శనలిచ్చారో లెక్కలేదు .ప్రదర్శించిన ప్రతి చోటా ,ప్రశంశా వర్షమే కురిసింది .ఆడ వాళ్ళే అబ్బుర పడి స్త్రీయేమో నని భ్రమ పడిన సందర్భాలున్నాయట .భార్యనే ఆశ్చర్య పరచారంటారు .ఆయనను సన్మానించని,బిరుదులన్దించని ,సపురస్కారం అందజేయని సంఘం ,విద్యాలయం ,అకాడెమీ ,సాహిత్య సంగీత నృత్య సంస్థ లేదు ..నలభై వ ఏట భారత ప్రభుత్వం వీరిని ‘’పద్మశ్రీ ‘’పురస్కారం తో సన్మానించి వారి కీర్తికి వన్నె తెచ్చింది .వారికి వయసు పైన పడుతున్నా ,లాస్యం లో ఏ మాత్రం వన్నె చిన్నెలు తగ్గలేదని విశ్లేషకులు నివ్వెర పోతుంటారు .కూచి పూడి విశ్వ విద్యాలయం అభి వృద్ధికి వారిచ్చిన ప్రోత్సాహ ప్రోద్బలాలు మరిచి పోరానివి .అక్కడి గ్రంధాలయం ,రిసోర్సు కార్యాలకు సౌకర్యాలు కల్గించారు .వెంపటి ఛిన సత్యం, వేదాంతం సత్య నారాయణ ,బందా కనక లింగేశ్వర త్రయం కూచి పూడి నాట్యా భి వృద్ధికి అవిశ్రాంత కృషి చేశారు .ఇవాళ ఆ కేంద్రం ఇంత ఉన్నత స్తితికి రావ టానికి వీరే ముఖ్య కారకులు .
ప్రతి ఏడాది సిద్ధేంద్ర ఆరాధనోత్స వాలను నిర్వ హిస్తు కళా కారులను రావించి ,వారి ప్రతిభను ప్రకటింప జేస్తూ ప్రోత్సహిస్తూ సంగీతానికి ప్రాధాన్యత కల్పిస్తూ అన్ని రకాల నృత్యాలకు అన్ని ప్రాంతాల వారికీ అవకాశం కల్గిస్తూ అంతర్జాతీయ ఖ్యాతిని కూచి పూడి గ్రామానికి కల్గించారు .ఉదయం పూట సోదాహరణ ప్రసంగాలను ఏర్పాటు చేసి శర్మ గారు తాను వయసును లెక్క చేయకుండా రెండేళ్ళ కిందట కూడా తన అభినయ కౌశలాన్ని ఆహూతులందరికి తెలియ జేసి ముక్కున వ్రేలు వేసుకోనేట్లు చేశారు .నేను ఎన్నో సార్లు వీటిని స్వయం గా చూసి తరించాను .వారితో పరిచయం ఉంది కాని అంతకు మించి దూరం పోలేదు .కాని మనిషి కనీ పిస్తే మన రెండు చేతులు అనుకో కుండా ముడుచుకు పోయి వారికి నమస్కారం చేస్తాము .అదీ వారి ప్రత్యేకత .ఎప్పుడూ సాంప్రదాయ మైన దుస్తులే వేసుకొంటూ ,మన సంస్కృతికి అద్దం పడుతూ మనల్ని ఆకర్షిస్తారు .నుదుటి మీద యెర్రని నిలువు బొట్టు వారి ప్రత్యేకత .ఆ కళ్ళ లో హావ భావాలు తొణికిస లాడుతూనే ఉంటాయి .అసలు వారిని చూస్తె ఈయన సత్య భామ వేస్తారా /అని పిస్తుంది వేషం కడితే ఇక ఆనంద పర వశమే పదేళ్ళ క్రితం అనుకొంటా ఒక సారి బందరు టౌన్ హాల్ లో ఒక సభలో మేమిద్దరం ప్రక్క ప్రక్కనే కూర్చున్నాం .నేను పరిచయం చేసుకొని వారిని గురించి నా నాట్ బుక్ లో రాసిన నాలుగు మాటలు వారికిచ్చి చదవమని కొరాను .వారు ఎంతో ఆత్మీయం గా చదివి తమ ఆనందాన్ని తెలిపి నమస్కరిస్తూ కన్ను లు ఎగర వేసి నేను రాసిన దాని కింద సంతకం చేసిచ్చి వారి సహృదయత ను చాటుకొన్నారు .అప్పటి నుండి తరచు కలుస్తూనే ఉన్నాం కూచి పూడిలో .
సత్య నారాయణ శర్మ గారికి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ ఇన్ డా
న్స్ బిరుదు నిచ్చి భారత ప్రభుత్వం సత్క రించింది .పెరు దేశం లోని అనేక సంస్థలు వారికి గౌరవ డాక్టరేట్ నిచ్చాయి ఆ నగర తాళం చెవులు అందించి గౌర వించాయి .కొలంబియా లోని పలు సంస్థలు సత్కరించి కీ లను అందించి గౌరవించాయి . డెన్మార్క్ లోని అంతర్జాతీయ సంస్థ ,యు నేస్కో సత్కారాలు పొందారు .ఒరిస్సా లోని మానవ హక్కుల కమిషన్ గౌరవ పురస్కారమంద జేసింది .ఉత్తర ప్రదేశ్ లో రంగ్గ్ మహోత్సవ్ వారు ‘’రంగ్గ్ భూషణ్ ‘’బిరుదు నిచ్చి సన్మానించారు .ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం ‘’మెడల్ ఇన్ పెర్ఫార్మన్స్ ఆర్ట్ ‘’ను ,ఉగాది పురస్కారాన్ని అంద జేసింది .నిజామాబాద్ లోని లలితాశ్రమం ‘’నృత్య శేఖర్ ‘’నుఇచ్చి గౌరవించింది .ఉత్కళ్ యువ సంస్కృతి సంఘం ‘’చారిస్మాన్ అవార్డు ‘’ను అందించింది .నిజామాబాద్ జిల్లా కలెక్టర్‘’ఉత్తమ అవార్డు ‘’ను అందజేసి గౌరవించారు .ఇంతటి విశిష్ట వ్యక్తిని మన కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ తో సరి పుచ్చి నిద్ర పోవటం సిగ్గు పడాల్సిన విషయం .కూచి పూడి నృత్య కళకు కూచి పూడి గ్రామానికి అంకిత మై ప్రపంచ పటం లో ఆ రెంటికి తిరుగు లేని కల్పించి ,భామా కలాపాన్ని అంతర్జాతీయ స్తాయికి తెచ్చి సత్య భామ పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేసి తానూ ఆ పాత్ర ద్వారా ప్రతిష్టా గౌరవాలు పొందిన కళా శేఖరులు వేదాంతం సత్య నారాయణ శర్మ గారి మరణం ఆంద్ర కళా మతల్లికి తీరని లోటు .ఈ మధ్యనే పరమ పదించిన వెంపటి ఛిన సత్యంగారు ఒక అగాధాన్ని కల్పించి వెడితే, శర్మ గారు మరీ శూన్యం చేసి వెళ్లారు .వీరిద్దరూ రెండు అభినయ .మహా శిఖరాలు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –16-11-12-ఉయ్యూరు
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
పార్ధివ లింగ యోగి -పేరి లక్ష్మీ నారాయణ శాస్త్రి గారు
నిత్య పార్ధివ లింగ పూజా పరాయణులు బ్రహ్మశ్రీ పేరిలక్ష్మీ నారాయణ శాస్త్రి గారు .1877లో గోదావరి జిల్లా కోన సీమ లో పేరూరు అగ్రహారం లో జన్మించారు .తండ్రి గారు మహా శ్రీ విద్యోపాసకులైన అనంత రామావధానులు గారు .తల్లి గారు వెంక మాంబ ..తాత గారు శ్రీ పార్ధివ లింగ పూజా పరాయణులు ,శ్రీ విద్యోపాసకులు,సత్కర్మ పరాయణులు అయిన సుబ్బావధానులు గారు .వీరిది ద్రావిడ బ్రాహ్మణకుటుంబం .
శాస్త్రి గారి చిన్నతనం లోనే తండ్రి మరణించారు .అమ్మ గారే వీరిని కంటికి రెప్పలాగా కాపాడారు .ఎనిమిదవ ఏటనే ఉపనయం చేశారు .పదహారవ ఏటనే వైయాకరణ చూడా మణి బిరుదాన్కితులైన మంధా చెన్నయ్య శాస్త్రి గారి కి శిష్యులై సంస్కృత కావ్య నాటకాలను ,న్యాయ వేదాంత గ్రంధాలను అభ్యాసం చేశారు ..తర్క శాస్త్రం మీద మోజు కలిగి అతి దుర్బోధకం గా ఉండే ఆ శాస్త్రాన్ని పంచ దార పానకం లా గుటకాయస్వాహా గా పుచ్చుకొని ,ఆ నాటి మేటి తర్క శాస్త్రజ్నులనే ఆశ్చర్యం లో ముంచారు .ఆయన దిషణాదిక్యత కు అందరు ముచ్చట పడ్డారు.
విజయ నగర మహా రాజ సంస్కృత కళాశాలలో న్యాయ శాస్త్ర ప్రధానా చార్యలు అపర గౌతమ బిరుదాంకితులు అయిన గుమ్మలూరి సంగ మేశ్వర శాస్త్రి గారి వద్ద న్యాయ శాస్త్రాన్ని పది ఏళ్ళు అభ్యశించారు .దీనికి మెరుగులు దిద్దు కోవటానికి నైయాకరణ సార్వ భౌములు అని పిలువబడే పిథాపుర ఆస్థాన విద్వాంసు లైన శ్రీపాద లక్ష్మీ నరసింహ శాస్త్రి గారి సమక్షం లో రెండేండ్లు న్యాయ శాస్త్రాన్ని చదివి అసాధారణ పండితులని పించుకొన్నారు .పిఠాపురం ,ఉర్లాం సంస్థానాలను దర్శించి తమ నిరుప మాన మైన పాండిత్య ప్రకర్ష ను నిరూపించి ,,శాస్త్ర పరీక్ష లో నెగ్గి ,ప్రధమ స్థానాన్ని పొంది అనేక బహుమానాలను గెలుచుకొన్నారు .
తమ స్వగ్రామం లో న్యాయ శాస్త్రాన్ని ,వేదాంతాన్ని అనేక మంది శిష్యులకు బోధించారు .వీరి కీర్తి నెల నాలుగు చెర గులా వ్యాపించింది .1902 లో విజయ నగర సంస్కృత మహా విద్యాలయం లో న్యాయ శాస్త్రాధ్యాపకు లుగా నియుక్తులైనారు ..1913 లో సంగమేశ్వర శాస్త్రి గారి నిర్యాణం తరువాత వీరు ప్రధాన న్యాయ శాస్త్ర పండితులుగా పదోన్నతి పొందారు .మహా రాజావారి అభ్యర్ధన మేర కు రాజస్థాన్ లోని జయపూర్ సమస్తానికి వెళ్లి అక్కడ మహా విద్వత్ సభలో తమ ప్రజ్ఞా,పాండిత్య ప్రతిభ ను ,వాదకౌశలాన్ని ప్రదర్శించి ‘’న్యాయ భూషణ ‘’బిరుదును పొందారు ..విజయ వాడ లోని త్రిలింగవిద్యా పీథం వారు బ్రహ్మశ్రీ ముదిగొండ వెంకట రమణ సిద్ధాంతి గారి ఆధ్వర్యం లో న్యాయ స్థాపక ‘’బిరుదు నిచ్చి సత్కరించారు .1937 లో లక్ష్మీ నారాయణ శాస్త్రి గారు సంస్కృత కళాశాల ప్రధాన పండిత పదవిని అలంకరించారు .అయిదేళ్ళు పని చేసి విశ్రాంతి పొందారు .
ఆ నాటి బ్రిటీష్ ప్రభుత్వంవారు శాస్త్రి గారి విద్వత్తు కు అబ్బుర పడి ‘’మహా మహోపాధ్యాయ ‘’అనే అరుదైన బిరుదు నిచ్చి సత్క రించారు .వీరికి ముందు నలుగురు మాత్రమె ఈ బిరుదు ను పొందారు .న్యాయ, వేదాన్తాలను జీవితాంతం బోధించటమే గాక మంత్ర ,జ్యోతిషాలలో అద్భుత ప్రావీణ్యంసంపాదించారు .అతి గహన మైన ఉదయనా చార్యుల రచన ‘’కుసుమాంజలి ‘’ని అతి సరళ భాష లో అనువాదం చేసి తమ పాండితీ గరిమను నిరూపించారు .అలాగే గదాధర భట్టాచార్యుల ‘’హేత్వాభాస సామాన్య నిరుక్తి ,’’సవ్యభి చార సామాన్య నిరుక్తి ‘’అనే నవ్య న్యాయ శాస్త్ర గ్రంధాలకు ‘’లలిత ‘’అనే పేరు తో వివరణాన్ని రాసి ,తమ న్యాయ శాస్త్ర కౌశలాన్ని ,ప్రతిభా వ్యుత్పత్తిని ప్రదర్శించి కోవిదుల మన్నన లందుకొన్నారు .మాధవా చార్యుల వారి ‘’సర్వదర్శన సంగ్ర హం ‘’లోని అనేక భాగాలకు ఆంధ్రాను వాదం చేశారు .అయితే అది అముద్రితమే ..డెబ్బది మూడు సంవత్స రాలు ధన్య జీవితాన్ని గడిపిన న్యాయ శాస్త్ర కోవిదులైన శాస్త్రి గారు 1949 న పరమ పదించారు .
సశేషం —మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –16-11-12-ఉయ్యూరు
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
అగస్త్య ప్రస్థానం
అగస్త్య మహర్షి కాశీ విశ్వేశ్వరుని ప్రార్ధించి ,భార్య లోపాముద్ర తో ‘’మన పై ఎంత భారాన్ని దేవతలు పెట్టారో చూశావా ?ముని వ్రుత్తి లో ఉండే మనం ఎక్కడ ?ఈ కార్యభారం ఎక్కడ ?పర్వతాల రెక్కలను చేదించిన ఇంద్రునికి ఇది అసాధ్య మైనదా ?ఈ వింధ్యాద్రి అతనినే జయిన్చిందా ?కల్ప వృక్షం ,కామ ధేనువు ,చింతా మణి కలిగి ఉన్న దేవేంద్రుడు ,ముక్కు మూసుకొని తపస్సు చేసుకొనే ఈ బ్రాహ్మణుడిని ప్రార్ధించ టానికి వచ్చాడు .అన్నిటిని దహించ గల శక్తి ఉన్న అగ్ని దేవుడికి ఈ పని అసాధ్య మైందా ?దండం ధరించి ప్రాణుల ను శాసించే యముడీ పని చేయ లేడా ?ఆదిత్యులు ,వసువులు ,రుద్రులు ,విశ్వేదేవులు ఈ స్వల్ప కార్యాన్ని చేయ లేక పోయారా ?ఇంత మందికి సాధ్యం కాని వింధ్యాద్రి గర్వాపహరణం నేను చేయగలనని వారు నమ్మారంటే ఆశ్చర్యం గా ఉంది’’.
‘’ కాశీ క్షేత్రాన్ని గురించి మహాత్ములు చెప్పిన మాటలు మల్ళీ మళ్ళీ జ్ఞాపకానికి వస్తున్నాయి .కాశీ లో నివశించే వారికి అనేక విఘ్నాలు కలుగు తుంటాయి .అలాంటి విఘ్నమే మనకిప్పుడు వచ్చింది .విశ్వేశ్వరుడు విముఖం గా ఉన్నప్పుడే వ్యతి రేకం గా ప్రవర్తించాలి .కాశీని వదలుట చేతి లోని మోక్షాన్ని వలటమే .పుణ్యం నశిస్తేనే కాశీ నుండి వెళ్ళాలని పిస్తుంది .ఉత్తమ పురుషార్ధ మైన మోక్షం కాశి లోనే లభిస్తుంది .ఇది అతి పుణ్య క్షేత్రమని శ్రుతులు చెబుతున్నాయి .జాబాలి ,అరుణి ,వరణ పింగళ నాడీ మధ్య ఉన్న అవిముక్త క్షేత్రం కాశి .వాటి మధ్య ఉన్నసు షుమ్నా నాడియే కాశి .ఇక్కడ ప్ప్రాణం ఉత్క్రమణం జరిగితే విశ్వ నాధుడు మోక్షమిస్తాడు .ఆయనే తారక మంత్రోప దేశం చేస్తాడు దానితో బ్రహ్మత్వం సిద్ధిస్తుంది .కాశితో సమాన మైన క్షేత్రం ,విశ్వేశ్వరునికి సమానమైన దైవం లేవు .ఇలాంటి పుణ్య రాశి కాశి ని ఇప్పుడు మనం విడిచి పెట్టి వెళ్ళాల్సి వస్తోంది .మనసు స్వాధీనం లో ఉండటం లేదు ‘’అని మహర్షి దుఖాశ్రువులను ధారా పాతం గా కార్చాడు ..
దంపతులిద్దరూ విశ్వేశ్వరుని దర్శించారు .స్వామికి విన్న విన్చుకొంటు ముని ‘’నువ్వు కాశీ విభుడవు .కనుక నీకు విన్న విన్చుకోవటానికి వచ్చాను .నేనేమి అపరాధం చేశాను ?అన్నపూర్ణా దేవిని వదిలి పెట్టాల్సి వచ్చింది ?కాల భైరవా నువ్వైనా అభయం ఇవ్వవా ?దండ పాణీ !నువ్వైనా మేము వెళ్ళ కుండా చేయలేవా ?డుమ్ది వినాయకా !విఘ్నాలకు అది రాజువు .నీకు మా మీద ఎందుకు కోపం కలిగింది ?పంచ వినాయకులారా !చింతా మణి గణపతీ !కపర్దీ !ఆశా గజాశ్యా !సిద్ధి వినాయకా !నేనేమి కాశీ వదిలి వెళ్ళేంత తప్పు చేయలేదు .ఇతరుల తప్పు ఎంచ లేదు .పరులకు అపకారం చేయ లేదు .త్రికాలాలో గంగా స్నానం చేసి విశ్వేశ్వరుడిని సందర్శిస్తూ నా జీవితాన్ని చరితార్ధం చేసుకొంటున్నాను .ప్రతి పర్వం లోను పంచ గంగా యాత్ర చేస్తున్నాను .తల్లీ విశాలాక్షీ !భవానీ ! శివ రంజనీ !నువ్వైనా కనిక రించవా ?కాశీ పట్టణ దేవత లారా !నేనేమీ నా స్వార్ధం కోసం కాశీ ని వదిలి పెట్టి వెళ్లటం లేదు .దేవతల అభ్యర్ధన మేరకు ,పరోప కారం కోసమే వెడుతున్నాను .పూర్వం దధీచి తన ఎముకను ఇంద్రుడికి ఇవ్వ లేదా ?బలి తన సర్వస్వాన్ని పోగొట్టు కొ లేదా ?’’అని అందరికి విన్న విన్చుకొంటు మునులను, ఆబాల వ్రుద్ధులను వృక్ష జంతు కోటికి మ్రొక్కి అందరికి వీడ్కోలు చెప్పి ,ధర్మ పత్ని లోపాముద్ర వ్రేలు పట్టుకొని ‘’పుణ్య రాశి అయిన కాశి ని వదిలి పెట్టి వెళ్తున్నాను ‘’అని కన్నీరు కారుస్తూ ,చప్పట్లు చరుస్తూ’’అయ్యో కాశీ కాశీ ఆరుస్తూ శివ ,శివ అని ప్రలాపిస్తూ కింద పడి పోయాడు మహర్షి .మళ్ళీ కొంచెం స్తిమిత పడి భార్య చేయి ఊత గా తీసుకొని ‘’నాకు వినాశం దగ్గర పడింది ‘’అని పలవరిస్తూ ముందుకు కదిలాడు .
కొద్ది కాలానికే ,ఆకాశ మంత ఎత్తు పెరిగి ,సూర్య గమనానికి నిరోధం గా ఉన్న వింధ్యాద్రి వద్దకు చేరుకొన్నారు దంపతులు .వింధ్యాద్రి భయం తో ‘’స్వామీ ! నేను మీ సేవకుడిని .ఏమి ఆజ్న ?’’అని వినయం గా అడిగాడు .దానికి మహర్షి ‘’వింధ్య రాజా !నువ్వు చాలా ప్రాజ్ఞుడవు .నా శక్తి సామర్ధ్యాలు తెలిసిన వాడివి .నేను దక్షిణ దేశానికి వెళ్తున్నాను తిరిగి వచ్చే దాకా ఇలాగే ఉండు ‘’అని చెప్పాడు .మహర్షి కోప పడ నందుకు సుముఖం గా మాట్లాడి నందుకు,శపించ నందుకు వింధ్య సంతోష పడిఅలాగే వినమ్రం గా కిందికి వంగి ఉండి పోయింది .మహర్షి వింధ్య ను దాటి వచ్చాడు .సూర్యుడు మళ్ళీ తన గమనాన్ని నిరాటంకం గా కోన సాగించాడు .’’నేడోరేపో అగస్త్య మహర్షి తిరిగి వస్తాడు ‘’అని ఎదురు చూస్తూ అలానే ఉండి పోయాడు వింధ్య రాజు .అగస్తుడు మళ్ళీ తిరిగి రాడు ,వింధ్య ఇక పైకి లేవడు అనే సంతృప్తి తో సూర్యుడు మరీ ప్రచండం గా తన దిన యాత్ర సాగించాడు .దుష్టుల సంకల్పాలను ఇలానే మహాత్ములు నీరు గార్చుతారని అందరు అనుకొన్నారు .
అగస్త్యుడు గోదా వరి తీరానికి చేరి సంచ రిస్తున్నా ఇంకా మనసులో కాశి భావం తొలగి పోలేదు .పదే పదే తలుచుకొంటునే ఉన్నాడు ..పిచ్చి వారి వలె ఇద్దరు గాలిని చూసి ‘’కాశీ పట్నం కుశల మేనా ?ఎప్పుడు మళ్ళీ కాశీకి వేడతాము /అని ప్రశ్నిస్తున్నారు .అంత అవినా భావ సంబంధం తో వారు కాశీ లో మెలిగారు ..కొల్హాపురం చేరి అక్కడి మహా లక్ష్మి అమ్మ వారిని దర్శించారు .ముల్లోకాలను అడవి పంది గా భయ పెట్టిన కోలాసురుడిని సంహరించిన లక్ష్మీ దేవి ఇక్కడ కొలువై ఉంది .మహా లక్ష్మి ని ఇద్దరు మనసా రా స్తోత్రం చేసి ,ప్రార్ధించారు ‘’అమ్మా లక్ష్మీ దేవీ ! నువ్వు ఎక్కడ ఉంటె అక్కడ సమస్త మంగళాలు ఉంటాయి.నువ్వు అనుగ్రహిస్తే అన్నీ చేకూరుతాయి ‘’అని ప్రార్దిన్చారు .అమ్మవారు ప్రత్యక్షమై ‘’మిత్రా వరుణ సంభవా అగ్స్త్యమునీ ! !పతివ్రతా శిరోమణీ లోపాముద్రా !’’అని సంబోధించి ,లోపాముద్రా దేవి ని తన సమీపం లో కోర్చో బెట్టుకొని ,ఆమె శరీరాన్ని స్పర్శించింది మహా లక్ష్మి అమ్మ వారు ..’’కోలాహల రాక్షసుని అస్త్రం చేత బాధింప బద్ద నా శరీరాన్ని నీ స్పర్శ తో స్వాస్త్యం పొందుతున్నాను ‘’అని పలికి , లోపాముద్రను కౌగిలించుకొని ,సౌభాగ్యాలను కారణాలైన ఆభరణాల తో ఆమె ను అలంకరించింది .మహర్షితో ‘’రుషి సత్తమా !నీ తాప కారణం తెలిసింది కాశీ ని వదిలి నందుకు నీ మనసు అమిత బాధ పడుతోంది ,ఏదైనా వరం ఇవ్వాలని ఉంది ‘’అన్నది .దానికి ముని ‘’అమ్మా మహా లక్ష్మీ !వరం ఇవ్వ దలిస్తే మళ్ళీ మాకు కాశి సందర్శన భాగ్యం అనే వరమే ఇవ్వు .ఇంకేమి వద్దు ‘’అన్నాడు .లక్ష్మీ దేవి ‘’తధాస్తు ‘’అని దీవించి స్వస్తత కలిగించింది .’’మహర్షీ !రాబొయె ద్వాపర యుగం లో పందొమ్మిదవ బ్రహ్మ కాలం లో నువ్వు వ్యాసుడవు అవుతావు .మళ్ళీ వారణాసి కి వెళ్లి వేద శాస్త్రాలను పరిష్కరించి ,ధర్మ బోధ చేస్తావు ..ప్రస్తుతం ఇక్కడి నుండి నువ్వు బయల్దేరి వెళ్లి స్కందుని దర్శనం చేసుకో .అతడు నీకు వారణాసి రహస్యమంతా వివరం గా చెబుతాడు .’’ అని చెప్పి ఇద్దరినీ దీవించి పంపించింది .
సశేషం —మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –16-11-12-ఉయ్యూరు
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
అంతర్ముఖ మహా యోగి – బెల్లం కొండ రామ రాయ కవి
వైష్ణవ సంప్రదాయానికి చెందిన బెల్లం కొండ రామ రాయ కవి నియోగి బ్రాహ్మణులు .గుంటూరు జిల్లా నరస రావు పేట దగ్గరున్న పామిడి పాడులో 1876 లో జన్మించారు .సంపన్న కుటుంబం .రుక్ శాఖ కు చెందినవారు .వీరు ఆశ్వలాయన సూత్ర బద్ధులు .వీరిది భారద్వాజస గోత్రం .చిన్న తనం లోనే తండ్రిని కోల్పోయిన అభాగ్యుడీయన .మొదట ఆంగ్ల విద్యనూ నేర్చుకొన్నారు .పిమ్మట దాని పై విరక్తి ఏర్పడి ,సంస్క్రుతాధ్యనం కోన సాగించారు .వీరు మొదట విశిష్టాద్వైత మతాన్ని అవలంబించారు .హయగ్రీవ ఉపాసన తో సర్వం సాదించుకొన్నారు .చాలా కుశాగ్ర బుద్ధి కల వీరు చిన్న నాటే రోజు సంస్కృతం లో కవితలు అల్లే వారు .వీరి సంస్కృత పాండిత్యం కాళిదాసు రఘు వంశం లో రెండు ,కుమార సంభవం లో రెండు సర్గ లతో నే ఆగి పోయింది ..మేఘ దూతాన్ని విన్నారు .తర్వాతా అన్నిటిని చక్కగా అన్వయించు కొన్నారు ..
పద హారవ ఏటనే ‘’రుక్మిణీ పరిణయం ‘’,’’రమా పరిణయం ‘’,అనే చంపూ కావ్యాలను రాశారు .నెల్లూరు కు చెందిన సింగ రాజు వెంకట రామణ య్య గారి కుమార్తె ఆది లక్ష్మమ్మ ను పరిణయ మాడారు .వీరి మంత్రాను ష్టానం చాలా తీవ్రం గా ఉండేది .గొంతు వరకు నీటిలో ఉండి మంత్రాన్ని అనుష్టించే వారు .చింత తోట లో అరుగు మీద కూర్చుని ఉపాసన చేసే వారు .ఇంటిలో నిత్యం హయగ్రీవ అర్చన చేస్తూ ,విద్యార్ధులకు భోజన భాజనాలను సమకూరుస్తూ ,సాహిత్యం ,అలంకార శాస్త్రాలను విద్య బోధించే వారు ..పురిమళ్ళరామ శాస్త్రి ,సుబ్రహ్మణ్య శాస్త్రుల గార్ల వద్ద తర్క ,వ్యాకరణాలను అధ్యయనం చేశారు .వ్యాఖ్యావ్యాకరణాలను స్వయం గా నేర్చిన మేధావి బెల్లంకొండ కవి .సిద్ధాంత కౌముది పై ‘’శరద్రాత్రి ‘’అనే వ్యాఖ్య రాసిన పండిత ప్రకాండులు .
ప్రతి రోజు వేదాంత గ్రంధ అధ్యన, అధ్యాపనం చేస్తూ ,అద్వైత వేదాంత గ్రంధాల నన్నిటిని స్వంత బుద్ధి తో అన్వ యించుకొని ఆమూలాగ్రం గ్రహించిన అపర అగస్త్యులు .వంశ పారం పర్యం గా వస్తున్న వైష్ణ వానికి దూరమై ,ఆ గురువులను వదిలేసి అద్వైత సిద్ధాంతం లో నిష్టను పెంచుకొన్నారు ..శంకరాద్వైతానికి పాథాలు చెప్పారు .అద్వైతం వీరి నర నరానాజీర్ణించుకొని పోయింది 143 గ్రంధాలను రచించిన మహా రచయిత అయారు .స్వయం గా వారే 30 కి పైగా గ్రంధాలను ముద్రించుకొన్నారు .అతి చిన్న వయసు లో ఇన్ని గ్రంధాలు రచించిన రచయిత లేడు అని పించుకొన్నారు ..
రామ రాయ కవి రచించిన స్తోత్ర గ్రంధాలు చాలా ఉన్నాయి .అలాగే శతక సంఖ్య కూడా ఎక్కువే .అందులో అష్టక స్తోత్రాలు 68 ఉన్నాయి .అన్నిటి లోను అద్వైత సిద్ధాంత ప్రతి పాదనే చేసి అపర శంకరు లని పించారు .భగవత్పాదుల గీతా భాష్యానికి వీరు వ్యాఖ్య రాశారు .వీరి గ్రంధాలలో ముఖ్య మైనవి –గీతా భాష్యార్క ప్రకాశిక ,(శంకర భాష్య టీకా ),వేదాంత ముక్తావళి ,శంకరాశంకర భాష్య విమర్శ (అద్వైతం )సిద్ధాంత సింధువు (మధు సూదన సరస్వతి గ్రంధానికి వ్యాఖ్య )వేదాంత కౌస్తుభం ,అద్వైతాన్య మత ఖండం ,శరద్రాత్రి (కౌముదికి వ్యాఖ్య )చంపూ భాగవత వ్యాఖ్య ,మురారి రచించిన అనర్ఘ రాఘవ నాటక వ్యాఖ్యానం ,సముద్ర మధనం అనే చంపు కావ్యం ,కృష్ణ లీలా తరంగిణి అనే కావ్యం
రామ రాయ కవి గ్రంధ రచన ను ఒక మహా తపస్సు గా భావించి సాధించారు .కవిత్వం దారా శుద్ధి తో ,నిసర్గ రమణీయం గా ఉంటుంది .అంతర్ముఖు లైన ,సమా విష్టులు అయిన మహా యోగి బెల్లం కొండ రామ రాయ కవి .హయగ్రీవో పాసకులకు అసాధ్యమేదీ లేదని నిరూపించిన మహా తపస్సంపన్నులు .
సశేషం -మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ –15-11-12 -ఉయ్యూరు
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
అగస్త్యాశ్రమం
దేవతలందరూ వార ణాసి చేరి అయిదు రోజులు నిత్యమ గంగా స్నానం చేస్తూ విశ్వేశ్వర విశాలాక్షీ అన్నపూర్ణా,దుం థిగణపతి ,కాల భైరవులను దర్శించారు .ఆ తర్వాత అగస్త్య ముని ఆశ్రమాన్ని చేరుకొన్నారు ..అగస్త్యుడు తన పేర అగస్త్యేశ్వర స్వామిని స్తాపించి ,జప హోమాలను చేస్తూ పరమేశ్వర ధ్యానం లో భార్య లోపాముద్ర తో గడుపుతున్నాడు .సముద్రాలను తన పురది శిలి లో ఉంచి పానం చేసి నప్పుడు అందులో ఉండే బడ బాగ్ని ఆయన శరీరం లో ప్రవేశించి ,దివ్య కాంతులను వెలువరుస్తోంది .ఆయన తన తపస్సు చే సూర్యుని ప్రకాశింప జేస్తున్నాడు ,అగ్నిని మండింప జేస్తున్నాడు ,ఆయన తపో బలం వల్ల చపలాలు ఆచపలాలుగా మారాయి ..ఆశ్రమం లో క్రూర మృగాల తో సాదు జంతువులు కలిసి మెలుగు తున్నాయి .మహా ప్రశాంతం గా అగస్త్యా శ్రమం ఉన్నది .దుష్ట మృగాలు మాంస భక్షణ మాని పచ్చ గడ్డి మేస్తున్నాయి .కొంగలు చేపలను ,పెద్ద చేపలు చిన్న వాటిని తినటం లేదు .ఆశ్రమంలో‘మాంసం ఎక్కడ ?శివ భక్తీ ఎక్కడ ?మందిర మెక్కడ ?శివార్చనం ఎక్కడ ?మద్య మాంసాలు తిన్న వారికి శంకరుడు దూరం గా ఉంటాడు .శివానుగ్రహం లేక అజ్ఞానం నశించదు ‘’అన్న వాక్యం రాసి అందరికి అహింసా ధర్మాన్ని బోధిస్తోంది .
ఈ ప్రశాంతత ను చూసి దేవతలు ఆశ్చర్య పడ్డారు .’’ఇక్కడున్న పక్షులు విశ్వేశ్వరుని ధ్యానిస్తున్నాయా ?చిలుకలు విశ్వ నాధుని కీర్తిస్తున్నాయా ?కోకిలలు కలికాల పరి స్తితులకు కలత చెంది విశ్వేశ్వర తలం పు తో చిత్త శాంతి పొందు తున్నాయి .స్వర్గం లో నుండి పతనం చెడటం ఉంది కాని కాశి లో పతనం ఉండదు .యముడి దగ్గర ఉండటం కంటే ,కాశీలో ఉండటం శ్రేయస్కరం .బ్రహ్మాండం లో ఏ ప్రదేశం లో ఉన్న దాని కంటే కాశి లో నివశించటం శ్రేష్టం .ఇక్కడ ఉన్నా ,ఈశ్వర దర్శనం లేక పోతే వ్యర్ధం .ఉత్తర వాహిని అయిన గంగా నదిలో స్నానం చేసి ,విశ్వేశుని దర్శించిన వారి శ్రేయస్సు కు అంతం ఉండదు .’’దేవ దేవ మహా దేవ శంభో !శివా శివా !దూర్జటే !నీల కంథేశ!పినాకీ !శశి శేఖర !నన్ను రక్షించు ‘’అంటూ ముక్తి మండపం పై కూర్చోవటం ,ధర్మ విషయాలు మాట్లాడుకోవటం పురాణ శ్రవణం చేయటం ,నిత్య కర్మలు చేయటం పిండాదులు పెట్టటం ,పరోప కారం చేయటం ,అంటే సమస్త ధర్మాలను ఆచరిన్చటమే .శుక్ల పక్షం లో చంద్ర కల అభి వృద్ధి చెంది నట్లు కాశీ క్షేత్రం లో ఉన్నవారికి పుణ్యం అలా పెరుగుతూ ఉంటుంది ..ఇక్కడ పురుషార్ధాలను ఇచ్చేది భవానీ మాత .కోరికలను తీర్చే వాడు డున్తి విఘ్నేశ్వరుడు .విశ్వేశ్వరుడు మరణ కాలం లో సమస్త ప్రాణులకు రామ తారక మంత్రాన్ని చెవిలో బోధించి మొక్షాన్నిస్తాడు .విశ్వేశ్వరుడు ధర్మార్ధ కామ మోక్ష స్వరూపుడు .పరమాత్మ స్వరూపుడు .అందుకనే కాశీ వంటి పట్టణం మూడు లోకాలలోనూ లేదనే ప్రఖ్యాతి వచ్చింది .’’అని దేవత లందురు అను కొంటూ ,అనేక మంది బ్రహ్మ చారి శిష్యుల తో పరి వేష్టించి ఉన్న అగస్త్య ముని ని దర్శించారు .శ్యామక ధాన్యాన్ని హోమం కోసం చేతులో పట్టుకొన్న రుషి కన్యలను చూశారు .సాధ్వి లోపాముద్ర పాద ముద్ర లను చూసి పులకించారు .ఆ పాద ముద్ర లకు భక్తీ గా నమస్కరించారు .అక్కడ సమాధి నుండి మేల్కొన్న బ్రహ్మ దేవుని లా ప్రకాశి స్తున్న అగస్త్య మహర్షిని దర్శించి నమోవాకాలనర్పించారు .ఆయన వీరిని సాదరం గా ఆహ్వా నించి, అతిధి మర్యాదలు చేసి, శుఖాసీనులను చేశాడు ..వారి రాకకు కారణాన్ని అడిగాడు మహర్షి.
పతివ్రతాఖ్యానం
అప్పుడు దేవతలందరి తరఫున దేవ గురుడు బృహస్పతి మహర్షి తో ‘’లోపాముద్ర వల్లభా !నీవు ఘనులలో ఘనుడవు ..నీవంటి తపోధనులు లేరు .ఈ కల్యాణి లోపాముద్ర నీ సహా ధర్మ చారిని గా నీ ఛాయ లాగా ప్రవర్తిస్తోంది .మహా పతి వ్రత లైన అరుంధతి ,అనసూయ ,సావిత్రి ,శాండిల్య ,సత్య ,లక్ష్మి ,శతరూప లతో ఈమె సమానం .ఈమె ను మించిన పతివ్రత ను ఊహించలేము .’’అని లోపాముద్రాగాస్త్యులను కీర్తించాడు .తర్వాత పతివ్రతా ధర్మాలను వివ రించాడు బృహస్పతి ‘’కన్య వివాహ సందర్భం లో పెండ్లి కుమార్తె తో పురోహితుడు ‘’భర్త తో జీవించినా లేక పోయినా సహా చరిగా ఉండు ‘’అని చెబుతారు .కనుకభార్య భర్తను నీడ లాగా అనుసరించాలటం పతివ్రత లక్షణం .యమ దూతలు పతివ్రతను చూస్తె అగ్నిని చూసి నంత భయం తో పారి పోతారు .ఆమె తేజస్సు ముందు సూర్యాగ్నుల తేజస్సు దిగ దుడుపు .స్త్రీల పతివ్రతాచారణం వల్లనే భూమి భారం తగ్గుతోంది .ఈ లోకానికి ,పర లోకానికి భార్యయే మూలం .భార్య తో కలిసి దేవ ,పితృ కార్యాలు చేయాలి .,భర్త ను కోల్పోయిన స్త్రీ ఏ దానం చేసినా ‘’నా భర్త సంతోషించు గాక ‘’అని చేయాలి శ్రావణ ,భాద్ర పద మాసాలలో ఆమె భోజనాలు అతిధులకు పెట్టాలి .కార్తీకం లో మౌనాన్ని పాటించాలి .ఆకులలో భుజించాలి .దీప దానం చేయాలి ఈ దానం తో ఏదీ సమానం కాదు .సూర్యోదయం అవగానే మాఘ స్నానం చేయాలి దీపాన్ని దానం చేసే టప్పుడు పరమేశ్వర స్వరూపుడైన తన భర్త సంతోషించాలి అని అనుకోవాలి .కొడుకు అనుమతి తో పనులు చేయాలి . పాతివ్రత్యం గల స్త్రీ ని పూజిస్తే గంగా స్నానం చేసి నంత ఫలితం కలుగు తుంది .అమ్మా లోపా ముద్రా దేవీ !మీ దర్శనం మాకు గంగా స్నానం తో సమానం ‘’అని చెప్పాడు .
బృహస్పతి తాము వచ్చిన కారణాన్ని ఇప్పుడు వివ రించి చెబుతున్నాడు ‘’మహర్షీ !వీరు అగ్ని ,యమ ,నిరుతి ,వరుణ ,వాయు ,కుబేర ,రుద్రదేవతలు .లోకం లో జనం వీరి వల్ల అన్ని అర్ధాలను పొందుతున్నారు .మేరు పర్వతం వింధ్య గిరి పై ఈర్ష్య పెంచుకొని విపరీతం గా పెరిగింది .సూర్యుని మార్గానికి అవరోధమేర్పడింది .దానిని మీరే దారి లోకి తేవాలి ,లోక కార్యాలన్నీ మళ్ళీ యదా ప్రకారం జరిగేటట్లు చేయాలి అందుకే మేమంతా మీ దర్శనం చేసి అర్ధించటానికి వచ్చాం .’’అని విన్న వించాడు .అగస్త్య మహర్షి ‘’అలాగే చేస్తాను ,నిశ్చింత గా వెళ్ళండి ‘’అని అభయమిచ్చి దేవతలను పంపించాడు . .
సశేషం —మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –15-11-12—ఉయ్యూరు
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
పీథి కా పుర పీథాది పతి –ఉమర్ ఆలీషా కవి
ఉమర్ ఆలీషా గారు కవి ,రాజకీయ నాయకులు ,ఖిలాఫత్ ఉద్యమ నాయకులు మహర్షి మోహి యుద్దీన్ కుమారులు .వంశ పారంపర్య పీథాది పతులు .తండ్రి గారు భాషా గురు వరేణ్యులు .కనుక కవిత్వం ఉగ్గు బాల తోనే అలవడింది .తల్లి గారు చాంద్ బీబీ .28-2-1885 న తూర్పు గోదావరిజిల్లా పిథాపురం లో జన్మించారు .తండ్రి గారు ఉర్దూ ,అరబ్బీ ,పారశీక సంస్కృతాలలో మహా పండితులు .శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీథ సంస్తాపకులు .ఆత్మ విద్య లో మార్గ దర్శులు .వీరి పూర్వీకు లందరూ ఈ కోవకే చెందినా వారు .
ఉమర్ ఆలీషా గారు చిన్నప్పుడే సంస్కృతాంధ్రాలలో నిష్ణాతు లయారు .తర్వాత పారశీక ,ఆంగ్ల ,అరబ్బీ భాష లో ప్రావీణ్యంసంపాదించారు .ఆంగ్లం లో మంచి ఉపన్యాసకులు .ఆంగ్ల పద్య కావ్యాలలో ఏమా త్రం ప్రవేశం లేదు ..వీరికి పోతన లాగా సహజం గా నె కవిత్వం అబ్బింది .సహజ కవులు గా కీర్తి గడించారు .పద్నాలుగవ ఏట నే ధారాళం గా తెలుగు లో కవిత్వం చెప్పి అందర్ని మెప్పించారు .పద్దెనిమిదవ ఏట ‘’మణి మాల ‘’అనే నాటకం రాసి ప్రచు రించారు ..ఏంతో మంది ఆలీషా గారికి ఉద్యోగం ఇస్తానని ఆహ్వానించినా వీరు ఆశ పడని స్వాభి మానులు .భాషా ,దేశ సేవ లో జీవితాన్ని పండించుకొన్నారు .
ఉమర్ గారు ఇస్లాం మతస్తులు .మాత్రు భాష ఉర్దూ .సుమారు యాభై గ్రంధాలు రచించారు .అందులో నాటకాలు ,ఖండ కావ్యాలు ,పద్య కావ్యాలు ,చరిత్రా ఆధ్యాత్మిక గ్రంధాలు ,నవలలు అనువాదాలు ఉన్నాయి .నాటకాలలో మణి మాల ,విచిత్ర బిల్హణీయం ,చంద్ర గుప్త ,కౌరవ రంగము ,అనసూయా దేవి,కళ ఉన్నాయి .పద్య కావ్యాలలో ఉమర్ఖయ్యాం ,మహమ్మద్ ప్రవక్త జీవితం ,సూఫీ వేదాంత ధర్మంముఖ్య మైనవి . ,సర్గ మాత ,పేర్కొన దగినవి .ఖండ కావ్యాలలో ముఖ్య మైనది బార్హిణీదేవి ..అనేక నవలలు ,పారశీక రచనల అనువాదాలు చాలా ఉన్నాయి .ఎన్నో సాహిత్య వ్యాసాలూ రాశారు .
ఆలీ గారి రాజకీయ జీవితమూ విశేష మైనదే .ముస్లిం లీగ్ కు మద్రాస్ విభాగానికిఉపాధ్యక్షులు గా పని చేశారు . ఉత్తర మద్రాస్ నుంచి పార్ల మెంట్ కు ఎన్నిక అయి దేశ సేవ చేశారు. 1936-45 వరకు అయిదేళ్ళుపార్ల మెంట్ సభ్యులు గా ఉన్నారు . .బెనారస్ హిందూ విశ్వ విద్యాలం లో తెలుగు కవితా విభాగానికి సభ్యుడి గా గౌర వింప బడ్డారు .ఆంద్ర విశ్వ విద్యాలయం ముస్లిం బోర్డ్ ఆఫ్ స్టడీస్ లో తెలుగు శాఖ కు సభ్యులయారు .ఆలీ బ్రదర్స్ లో ఒక రైన షౌకత్ ఆలీ గాంధీజీ ఒకే రైల్ లో ప్రయాణం చేస్తూ ఉంటె వాల్టేరు స్టేషన్ లో ఆలీ ని పోలీసులు అరెస్ట్ చేసి జైలు కు పంపారు ..గాంధి గారు అప్పటికప్పుడు స్టేషన్ లోని జనాన్ని ఉద్దేశించి మాట్లాడి ఆలీ దేశ సేవను మెచ్చారు .ఆ తర్వాత ఉమర్ ఆలీషా మహోదయులు ఉత్తేజ పూర్వక ఉపన్యాసం చేసి అందరిని చైతన్య పరచారు ..
ఉమరాలీషా గారిని ఆలీఘర్ యుని వేర్సిటి’ మౌల్వీ’’ బిరుదు నిచ్చి సత్క రించింది ఆంధ్ర విశ్వ విద్యాలయం పండిత బిరుదు తో సత్కరించింది .ఇంటర్నశానల్ అకాడెమి ఆఫ్ అమెరికా 1936 లో ‘’డాక్టర్ ఆఫ్ లెటర్స్ ‘’తో గౌరవించింది .
వారు రాసిన ‘’తత్వ సందేశం ‘’అనే ఆధ్యాత్మిక గ్రంధం చాలా ప్రాచుర్యం పొందింది .మహమ్మద్ రసూల్ చరిత్ర మంచి పేరు తెచ్చు కొంది ..స్త్రీవిద్య ను ప్రోత్స హిస్తు పుస్తకాలు రాశారు .స్వాతంత్ర్య సమరానికి సంబంధించిన విషయాల పై రచనలు చేశారు .అస్పృశ్యతా నివారణకోసం పాటు బడటమే కాక రచనలూ చేశారు .వర కట్న నిషేధం పై ఉద్యమం నడిపి వ్యాసాలూ రాశారు .ఇక ఫిలాసఫీ లో పుంఖాను పుంఖాలుగా వ్యాసాలూ రాసి మార్గ దర్శనం చేశారు .అటు భాషా సేవ ఇటు మాత్రు దేశ సేవ తో బాటు ఆధ్యాత్మిక గురువు గా,సంఘ దురాచార నిర్మూలన ,మహిళాభ్యున్నతికి కృషి చేసి ఉమర్ ఆలీషా గురు వరేన్యులులు అందరికి దగ్గ రయ్యారు ..ఒక శిష్యుని కోరిక మన్నించి నరసా పురం వెళ్లారు .అక్కడే23-2-1945 న అకస్మాత్తుగా’’ సెరిబ్రల్ హెమరేజి’’ కి లోనై అరవై యవ ఏట తనువు చాలించారు .
మరో మహానేయుని చరిత్ర తో మళ్ళీ కలుద్దాం .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –14-11-12—ఉయ్యూరు
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
‘’ఆది పూజ్యం ,ఆది వన్ద్యం ,సిద్ధి బుద్దీశ్వరం ప్రభుం –శుభ ,లాభ తనూజం తం ,వందేహం ,గణ నాయకం ‘’
‘’విశ్వేశం ,మాధవం దుమ్దిం,దండ పాణించభైరవం –వందే కాశీం ,గుహాం ,గంగాం ,భవానీం ,మణి కర్ణికాం
‘’న గాయత్ర్యా సమో మంత్రం –న కాశీ సదృశీ పురీ –న విశ్వేశ సమం లింగం –సత్యం ,సత్యం ,పునః పునః ,
‘’కలౌ విశ్వేశ్వరోదేవః –కలౌ వారాణశీ పురీ –కలౌ భాగీరధీ గంగా –కలౌ దానం విశిష్యతే ‘’
‘’కాశ్యాం హి కాశ్యతే కాశీ –కాశీ సర్వ ప్రకాశికా –సాకారీ విదితా ఏవ –తేన ప్రాప్తాహి కాశికా ‘’
‘’కాశీ బ్రహ్మేతి వ్యాఖ్యానం –తబ్రహ్మ ప్రాప్యతే –త్రాహి –తస్మాత్ కాశీ గుణాన్ ,సర్వే-తత్ర తత్ర వదన్తిహి’’
‘’కాశీ కాశీ తి కాశీతి –రాసానా రస సం యుతా –యస్య కస్యాపి భూ యాశ్చేత్త్ –స రసజ్నో న చేతరః ‘’
వింధ్యాద్రి వర్ధనం
ఒకప్పుడు నారద మహర్షి నర్మదా నది లో స్నానం చేసి ఓంకార నాధుడిని దర్శించి ,సంచారం చేస్తున్నాడు ..ఆ రేవా నది ఒడ్డున ఉన్న వింధ్య పర్వతాన్ని చూశాడు .దాని నిండా ఫల పుష్ప వృక్షాలు కన్నుల విందు చేస్తున్నాయి .అనేక జంతు సమూహాలు ,పక్షులు తిరుగుతూ దాని శోభను పెంచుతున్నాయి ..నారదుని చూసి వింధ్యాద్రి పర వశించింది .ఆయన కు సపర్యలు చేయాలని కోరిక కలిగింది .నారదుని రాకతో పునీతుడై నట్లు వింధ్యాద్రి చెప్పుకొన్నది .మూడు లోకాలలో సంచరించే మహర్షికి తెలిసిన ఆశ్చర్య కర విశేషాలను అడిగి తెలుసుకొన్నది .మేరు పర్వతం మొదలైన వాటికి భూమిని దర్శించే భాగ్యం ఉందని , హిమాలయం శివ పార్వతుల నివాస స్తానము , పర్వతాలకు రాజు కనుక దానికి గౌరవించాలి అన్నాడు వింధ్యుడు .మేరువు స్వర్ణ మయం అయినా ,రత్నాల తో నిండి ఉన్నా తాను గౌర విన్చాల్సిన పని లేదని బింకం గా పలికాడు .మందేహాదులకు నిలయ మైన ఉదయ పర్వతం కూడా ఉంది కదా, నీలం రంగులో నీలాద్రి ఉన్నది ,సర్వ సర్ప సమూహాలున్నరైవతాద్రి ఉన్నది ,హేమ ,త్రికూట ,క్రౌంచ పర్వతాలు భూ భారాన్ని నిర్వ హింప లేవు మొత్తం మీద భూ భారాన్ని మోసే శక్తి ,సామర్ధ్యాలు తనకు మాత్రమె ఉన్నాయని వింధ్య పర్వతం నారద ముని తో ప్రగల్భాలు పలికింది
నారదునికి వింధ్యాద్రి నిజ రూపం తెలిసింది .గర్వం తో అందర్ని చులకన గా మాట్లాడు తున్నాడని గ్రహించాడు .శిఖర దర్శనం తోనే మోక్షమిచ్చే శ్రీ శైల పర్వతం ఉంది దాని ముందు వింధ్య ఎంత ?అను కొన్నాడు .కాని ఉపాయం గా వింధ్యాద్రి తో ‘’వింధ్య రాజా ! నిజం చెప్పావు .మేరు పర్వతం నీ చేత కించ పరచ బడింది .నేనూ అదే అనుకొన్నాను నీ నోటి నుంచి నిజం బైటికి వచ్చింది .అయినా ఏదో పేరు ,ప్రతిష్టా సంపాదించుకొన్న వారి గురించి మనకెందుకు చింత ?మనం విమర్శించటం ఉచితం కాదు .నీకు స్వస్తి ‘’అని చెప్పి ఆకాశ మార్గం లో వెళ్లి పోయాడు .నారదుని మాటలు విన్ధ్యాద్రికి మాత్సర్యం కలిగించాయి .’’శాస్త్రం తిరస్కరించిన వారి జీవితం ,జ్ఞాతుల చే పరాభ వింప బడిన వారి జీవితం వృధా .వారికి కునుకు పట్టాడు ..దుఖం తో నాకేమీ పాలు పోవటం లేదు .దుఖం జ్వరం లాంటిది.వైద్యుడికి లొంగదు.మేరువును ఎలా జయించాలి ?యెగిరి వెళ్లి మేరువు మీద పడదామను కొంటె, మా రెక్కల్ని టిని వాజ్రాయుధం తో ఇంద్రుడు నరికేశాడాయే .మేరు పర్వతం ఇంత ఔన్నత్యాన్ని ఎలా పొందుతోంది ?దాని గొప్ప తనానికి ఈర్ష్య నాలో పెరిగి, దహిస్తోంది .భూములన్నీ దాన్ని ఎలా చుట్టి వస్తున్నాయి .భూభారం ఎలా మోస్తోంది ?బ్రహ్మ చారి నారడుడి మాటలు నర్మ గర్భం గా ఉన్నాయి .నాకు సరైన మార్గాన్ని చూప గల వాడు విశ్వేశ్వరుడే .సాక్షాత్తు సూర్య భాగ వానుడే మేరువు చుట్టూ నిత్యం ప్రదక్షిణం చేస్తుంటాడు ..కనుక నేను కూడా నిలువు గా పెరిగి నా ఔన్నత్యాన్ని నిరూపించు కోవాలి ‘’అని అనేక రకాలు గా మధన పడింది .చివరకు ఆకాశం లోకి నిలువు గా పెరగటం ప్రారంభించింది ‘
సూర్య గమనానికి అడ్డు కోనేంత ఎత్తుకు వింధ్య పర్వతం పెరిగి పోయింది .సూర్యుడే తనను దాటి వెళ్ళ లేడుఇక యముడెలా దాటి దక్షిణ దిక్కు కు వెళ్తాడు ?అను కొన్నది .మనసు లోని చింత తీరి ధైర్య స్తైర్యాలు కలిగాయి వింధ్యకు .
సత్య లోక వర్ణనం
సకల జగత్తుకు సూర్యుడు ఆత్మ .చీకటికి విరోధి రోజూ ఉదయాద్రిన ఉదయించి చీకటిని సంహరించి వెలుగు నింపుతూ పద్మాలకు ప్రకాశాన్నిస్తూ నిత్య కృత్యాలకు తోడ్పడుతాడు సాయంకాలం పశ్చిమాన అస్తమించి కలువలకు వికసనం కలగ టానికి కారణం అవుతున్నచంద్రుని రప్పిస్తున్నాడు . .సూర్యునికి మలయానిలం ఉచ్చ్వాసం క్షీరోదకం అంబరం ,త్రికూట పర్వతం రత్న రాశుల ఆభరణం ,సువేల పర్వతం నితంబం ,కావేరి గౌతములు జన్ఘాలు ,చోళ రాజ్యం అమ్శుకం ,మహారాష్ట్ర వాగ్విలాసం .అలాంటి దక్షిణ నాయకుడైన రవి అక్కడే నిలిచి పోవాల్సి వచ్చింది .అప్పుడు ఆయన సారధి అనూరుడు మేరువు తో పోటీ పడి వింధ్య పెరిగి మార్గాన్ని అడ్డ గిన్చిందని తెలిపాడు .గగన మార్గానికి నిరోధం కలిగి నందుకు సూర్యుడు ఆశ్చర్య పడ్డాడు .
సూర్య గమనం లేక పోయే సరికి యజ్న యాగాదులు ,బ్రాహ్మల సంధ్యా వందనాదులు ఆగి పోయాయి .సృష్టి స్తితి లయాలకు కారణమైన సూర్యుని గతి ని స్తంభింప జేసి నందుకు మూడు లోకాలు తల్లడిల్లి పోయాయి .దేవత అందరు బ్రహ్మ దేవుని చేరి మొర పెట్టుకోవాలని బయల్దేరారు న్’బ్రహ్మను దర్శించి స్తోత్రాలతో తృప్తి చెందించారు ,దానికి బ్రహ్మ పరమానంద భరితుడైనాడు .ఏమి వరం కావాలో కోరుకో మన్నాడు త్రిమూర్తుల మైన తాము సృష్టి స్తితి లయాలను చేస్తామని కోరిన కోర్కెలను తీరుస్తామని చెప్పాడు .అప్పుడు బ్రహ్మ వారికి సత్య లోకం లోని విశేషాలను వివ రించిచేప్పాడు ‘’ఈమె భారతి నా భార్య .ఇవి శ్రుతి స్మృతులు .ఇక్కడ కామ క్రోధ మద మాత్సర్యాలుండవు .వీరందరూ చాతుర్మాస్యాది వ్రతాలు చేసిన బ్రాహ్మణులు .వీరు పతివ్రతలు .వీరు బ్రహ్మ చారులు .వీరు మాతా పితర పూజ చేసిన పుణ్యాత్ములు .వీరు గోసంరక్షణ చేసిన వారు .వీరు నిష్కామ కర్ములు .వీరు నిత్యాగ్ని హోత్రులు ,కపిల దానం చేసిన వారు వీరు .వీరు సారస్వత తపో సంపన్నులు .వీరు దానం తీసుకోని వారు .వీరంతా నాకు ప్రియులు సూర్య తేజం ఉన్న వారు .ప్రయాగలో మాఘ మాసం లో రవి మకర రాశి లో ప్రవేశించి నపుడు పుణ్య స్నానం చేసిన వారు వీరు .కార్తీకం లో కాశీలో పంచ నదాలలో మూడు రోజులు స్నానం చేసిన వారిరుగో .మణి కర్ణిక లో స్నానం వీరు చేసిన వారు .వీరు వేదాధ్యన పరులు వీరు పురాణ ప్రవచకులు వీరు వైద్య విద్యా భూ దానాలు చేసిన వారు వీరంతా ఇలాంటి పుణ్య కార్యాలు చేసి ఇక్కడి నా సత్య లోకం చేరారు .’’అని అక్కడ ఉన్న వారందరినీ దేవత లందరికి చూపించాడు బ్రహ్మ .
బ్రహ్మ మరల మాట్లాడుతూ బ్రాహ్మణులలో మంత్రాలున్నాయని ,గోవులలో హవిస్సులున్నాయని ,బ్రాహ్మణులు అంటే నడిచే తీర్ధాలని ,ఆవులు పవిత్ర మైనవని ,గోవు గిట్టల నుండి రేగిన దుమ్ము కణాలు గంగా జలం అంత పవిత్ర మైనవని ,ఆవుల కొమ్ముల చివర్లలో అన్ని తీర్ధాలు ఉన్నాయని ,గిట్ట లలో అన్ని పర్వతాలు ఉన్నాయని ,కొమ్ముల మధ్య గౌరీ దేవి ఉంటుందని ,గోదానం చేస్తే పితృదేవతలు మహా సంతోషిస్తారని ,ఋషులు దేవతలు ప్రీతీ చెందుతారని గోవు లక్ష్మీ స్వరూపమని పాపాలను పోగొట్టు తుందని వివరించాడు .గోమయం యమునా నది అని ,గోమూత్రం నర్మదా నదీ జలం ,ఆవు పాలు గంగోదకంఅని , దాని అన్ని అంగాలలో అన్ని లోకాలు ఉన్నాయని బ్రహ్మ చెప్పాడు .ఎవరు గంగా స్నానం చేస్తూ ఆ నది ఒడ్డున నివశిస్తూ పురాణాలు వింటాడో వాడు సత్య లోకానికి అర్హుడు అని తెలిపాడు .ఇంతకూ దేవతలేందుకు వచ్చారో మళ్ళీ అడిగాడు .వింధ్యాద్రి చేసిన పనిని వివరించారు దేవతలు .అప్పుడు బ్రహ్మ వారితో ‘’కాశీ క్షేత్రం అవి ముక్త క్షేతం .అక్కడ మహా తపస్వి అయిన అగస్త్య మహర్షి నిత్య విశ్వేశ్వర దర్శనం గంగా స్నానాల తో పునీతు డవుతున్నాడు .ఆయన దగ్గరకు వెళ్ళండి .ఆయనే తగిన ఉపాయం చెప్ప గలదు .మీ ప్రయత్నం సఫలం అగు గాక ‘’అని చెప్పి అదృశ్య మయాడు .బ్రహ్మ దర్శనం అయి నందుకు ,కాశీ క్షేత్ర దర్శనం,గంగా విశ్వేశ్వరఅగస్త్య దర్శనం చేయమని ఆయన చెప్పిన సలహా కు ఆనంద పడి దేవత లందరూ కాశీ పట్నానికి బయల్దేరి వెళ్లారు
సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –14-11-12-ఉయ్యూరు
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
పేలని ,కాలని టపాసులు—సరదాకి
సావిట్లో వాలు కుర్చీలో కూర్చుని పేపర్ చదువుకుంటున్నాను .ఇంతలో వంటింట్లోంచి బ్రేవ్ మని త్రేపుకుంటూ పోకిరి సినిమాలో ‘’బ్రహ్మి ‘’లాగా అరపాంటు టీ షర్ట్ వేసుకొని బయటికొస్తూ ‘’హేపీ దివాలీ బావా ‘’అంటూ బయటికి వచ్చాడు మా బామ్మర్ది బ్రహ్మి .వాడి వాలకం చూస్తె వాళ్ళ అక్కయ్య పెట్టిన ఒక డజను గారెలు తిని ,ఒక ‘’ఆప్కోరా చెంబెడు ‘’కాఫీ లాగించి వచ్చి నట్టున్నాడు .’’దివాలీ ఏమిట్రా దివాలా హవాలా ‘’లాగా అన్నాను .’’బావా మేష్టరి నుంచి రిటైర్ అయి పది హేను ఏళ్ళు అయినా ఇంకా ‘’కేరేక్షన్ వర్క్ ‘’మానలేదు .. అన్నాడు .’’తప్పు కాయి బాబూ దీపావళి శుభా కాంక్షలు ‘’అన్నాడు బ్రహ్మి .’’ఏ రా మీ ఇంటికి ఎప్పుడు మీ అక్క ఫోన్ చేసినా ఇంట్లో లేరు ,ఎక్కడికో వెళ్లారు ,ఎప్పుడొస్తారో తెలీదు వస్తే నేనే ఫోన్ చేయిస్తా అని మీ ఆవిడ చెబుతోంది .అంత తీరిక లేని వ్యవ హారాలెం చేస్తున్నావు ?ఏదైనా పార్టీ పెట్టి సభలు ,సమావేశాలు చేస్తున్నావా?’’అన్నాను .వాడు ‘’అదేమీ లేదు బావా , ఏదో సభలు సమావేశాలకు వెళ్లి ఖాళీ బుర్రలో ఇంత సరుకు నింపుకొని వస్తున్నాను .నీతో మాట్లాడా లంటే సరుకుఉండాలిగా‘’అన్నాడు .’’ఇంతకి ఏమిట్రా దీపావళి విశేషాలు ?’’అడిగా .’’ఏముంది బావో !అంతా దివాలా గా రాష్ట్రం పరిస్తితి .నీలం తుఫానోచ్చి పంటంతా గాలం వేసి లాక్కె ల్లిపోయింది .దీనాతి దీనం గా ప్రజలు ఆకాశం వైపు చూస్తున్నారు దిక్కేవ్వరో తెలీక ,ఆదుకోనేదేవ్వరో అర్ధం కాక ‘’అన్నాడు .’’అదేమిట్రా !సిఎం .విహంగ వీక్షణం చేశాడని ఎంతైనా సాయం చెయ్య టానికి సిద్ధం అని డబ్బుకేమీ ఇబ్బంది లేదని హామీ ఇచ్చాట్ట గా ‘’అన్నాను .’’పిచ్చోడివి బా !మా ఆయనే ఉంటె —తో పనేంటి ?’’అని విన లేదా ?’’.ఆయన దగ్గర డబ్బులేమీ లేవు .పైవాళ్ళు రాల్చేది తక్కువ .అయినా ఎందుకో బావా కిరణ్ గారి చుట్టూ కిరణాల సోకు పోయింది .దిగులుగా ఉంటున్నాడు .నాదేం పోయింది అన్న వేదాంతం లో పడ్డ ట్టున్నాడు‘’అన్నాడు .ఇవన్నీ మామూ లేగా .ఇక వదిలేయ్యమన్నాను .
కాసేపాగి’’ కొత్త టపాకాయలేమోచ్చాయి మార్కెట్లోకి .?ఎవరెవరు ఏమేమి కాలుస్తున్నార్రా ?’’అని అడిగా .వాడు కాసేపు బుర్ర గోక్కొని’’ బలే ప్రశ్న వేశావు బా “’అన్నాడు వాడు .’’సరే దస్త్రం విప్పుతున్నాను ‘’అన్నాడు .’’కానీ, ఆలస్యం చేయకు ‘’అన్నాను .’’బావా పాపం రాజకీయ నాయకులు కాల్చినవి పే ల్చినవి ఏవీ కాంతిఇవ్వలేదట ,పేలనూ లేదని మీడియా -మీది మీదికొచ్చి మరీ వాయిస్తోంది .మన కే సి యార్ ఒక కొత్త బాంబు తయారు చేయించి అతిగా గఫ్ఫాలు కొట్టి మీడియా నంతా పిలిచి విందు ఇచ్చి ,దాన్ని ఎంతో కస్టపడి వాళ్ళబ్బాయి ,అమ్మాయి లతో నిప్పు పెట్టిన్చాడట .అది ఉండి ఉండి కాలుతూ ,ఆరుతూ తుస్సు బస్సు మంటూ కూల బడిందట అస్సలు పే లనే పేల లేదట ..కారణం ఏమిటని విచారిస్తే అది ఇప్పటికే గుజరాత్ రేవుల్లో ను ,పోలవరం డాం నీళ్ళ లోను నాన్ని నాని అలా అయిందని చెవులు కోరుక్కొంటున్నారు .
‘’ నాకో సంగతి తెలిసిన్దిరా నిజమో అబద్ధమో తెలీదు ‘’’’వదులు బా వదులు నిజమో కాదో నేను చెబుతా‘’అన్నాడు ‘’సరే విను .పాపం రాహుల్ గొప్ప మతాబా చేయించాడని ,దాన్ని యు.పి.లో కాలుద్దామని ప్లాన్ చేసి ఆర్భాటం చేశాడని ,తీరా కాల్చే సమయానికి అది నిప్పులు చేరగటం పోయి కాంతి రావటం మాని ‘’ఆశా నిరాశేనా మిగి లింది చిన్తేనా ?’’అని పాడుకోన్నాడని ,అందుకే ఇప్పటి దాకా తనమీద నిప్పులు చెరిగిన మాయావతి ,ములాయం ల సాయం తీసుకొని నిప్పు ధట్టిస్తున్నాడని ,పాపం బావ గారేమైనా సాయం చేస్తాడేమో ననుకొంటే ఆయన పీకల్లోతు మునిగాడనో ,మున్చాడనో విన్నాను .’’అన్నాను .. ‘’నిజమే బావా ! ఏంతో ఆశ పడి కాళ్ళు అరిగే టట్లు తిరిగి ఎన్నేళ్ళ నుంచో ప్రాక్టిస్ చేస్తే చివరికి తుస్సు మన్నది .కాని కుర్రాడు ములాయం కొడుకు మూన్నేల్లల్లో బాంబు తయారు చేయించి బ్రహ్మాండం బద్దలు కొట్టించి ‘’మాయాజాలం ‘’చేదించి భేరీ భండారాలు మోగించి నట్లు టపాసులు పేల్చాడు, కాల్చాడు .ఆ వెలుగుల్లో శబ్దాల తో ది ల్లీ అదిరింది ,కంపించింది బావోయ్ దానితో యవ్వ రాజ్య పట్టాభిషేకం కూడా తుస్సు మంది ఇక వైరాగ్యమే మిగిలింది ‘’అని పూరించాడు బామ్మర్ది బ్రహ్మి .
‘’బావా ఈసంగతి తెలుసా ?’’అడిగాడు మళ్ళీ ‘’యే సంగతి అన్నాను “’’అదే మన సి.ఏం.పెట్టిన చిచ్చు బుడ్డి సంగతి >’’అన్నాడు ‘’తెలీదు చెప్పు ‘’అన్నాను .’’డిల్లీ వెళ్లొచ్చిన దగ్గర్నుంచి చిర్రు బుర్రులెకాని ముఖం లో మతాబాలు వెలగటం లేదని ,ఎంతో ఆర్భాటం గా తయారు చేయించిన చిచ్చు బుడ్డి అడుగు నుండి నిప్పులు చిమ్మి తుస్సు మందని ,పైకి రవ్వలేరాలేదని అనుకుంటున్నారు ‘’అని చెప్పాడు ‘కారణం ఏమిఅయి ఉంటుందను కొంటున్నారు ?’’అడిగా‘’అందులో మందు కూరమని మంత్రుల కిస్తే ,గాలి నింపారని మందు బదులు ఇసక కూరి ,మాయ చేశారని ఇదంతా కావాలనే చేశారని ట్యాంక్ బండ్ మీద చెప్పుకొంటున్నారు ‘’అన్నాడు .
‘’ సరే రాఘవులు ,నారాయణ ఏం కాల్చార్రా ?’’అడిగా .’’ఈ సారి వె రైటీ చేయాలని ఇద్దరు కూర్చుని తూటా లు తయారు చేశారట బా..అందులో ఒకరికి తెలీకుండా ఒకరు జిల్లీ మందు బదులు జిల్లేడు బొగ్గు మాత్రమె కూరారట .ఇద్దరు జాయింట్ గా సుందరయ్య భవన దగ్గర కాల్చే ప్రయత్నానికి ఇరు పార్టీల కార్య కర్తలు హాజ రయ్యారట .ఇద్దరు భారీగా ఉన్న ఆ తూటా ను అంటిం న్చారట .మసి, పొగా తప్ప చుమ్యి చంయి లేదట .అంతా ముసి ముసి నవ్వులు నవ్వుకోన్నారట .ఏమిటి ఇట్లా జరిగిందని జాయింట్ కమిటీ వేసి నిజం తెల్చమన్నారట .అప్పుడు బండారం బయట పడిందని కంకి కొడవలి ,కత్తి సుత్తి సాక్షిగా తెల్చారట .కలిసి పని చెయ్యటం అంటే వెనక పోట్లు అన్న మాట అని రాజకీయ విశ్లేషకులు విపరీతార్ధం లాగారు బా ‘’అన్నాడు .
‘’సరే మన బాబు గారి బాంబు సంగతి చెప్పవా ?’’అడిగా .’’బావోయ్ .అది ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ అంటుకొని భగ్గు మంటోంది ,నిప్పులు కుమ్మ రిస్తోంది సింహాసనం ఎక్కేసినట్లు వీరంగం వేస్తోంది వీర విహారం చేస్తోంది దివిటీలా వెలుగుతోంది అంటున్నారు ‘’అని సన్నాయి నొక్కులు నొక్కాడు .’’ఇది నీ ఊహా నిజమా ?’’అన్నా .’’ఊహా ,అపోహా కలిసిన నిజం ‘’అని తేల్చాడు వాడు .’’పాపం జగనన్న టపాకాయల సంగతేంటి ?’’అడిగా .‘’.ఏముంది శోకాల తిమిరావాలీ దీపావళీ ‘’అని పాడుకొంటూ ,తల్లి ,అమ్మ పాద యాత్రలకు సంతోషించాలో లేదో తెలీక తల్లడిల్లుతూ నిర్వేదం బాంబు లు కాలుస్తున్నాడట .అవి ఎగర లేకా ,తిరగ లేకా ,పేల లేకా, కాల లేకా ,వెలుగివ్వలేక శోకాశ్రువులు రాలుస్తున్నాయట ఇంకెంత కాలం ఇంకెంత దూరం గద్దే అని అరుస్తున్నాయట.“’అన్నాడు .కేశవ రావు గారు భూ చక్రం తిరిగి నట్లు హస్తిన చుట్టూ ,అమ్మ వారి చుట్టూ తిరిగి తిరిగి కాళ్ళు అరిగి పోయి విష్ణు చక్రం అయినా కాలుద్దామని యత్నిస్తే అది తిరగకా కదలకా చెయ్యి కాలిందట .దానితో ఫిర్యాదు చేస్తూ అంతిమ లేఖాస్త్రం సంధిం చాడట ”అన్నాడు .”ఒరే .ఇవన్నీ పేలక పోవటానికి కాలక పోవ టానికి అసలు కారణం రాష్ట్రాన్ని ముంచెత్తిన నీలం తుఫాను వర్షం, నిండా ముంచిన వరదలేమో .దానికి నువ్వు ఇంత కలర్ ఇచ్చావు ”అన్నాను . ఇంతలో మా ఆవిడ ‘’యే మండీ! వాడి పిల్లలు ఇంటి దగ్గర వాడికోసం ఎదురు చూస్తూ ఉంటారు .మీ సోది ఆపి వాణ్ణి ఇంటికి వెళ్ళ నివ్వండి లేక పోతే మా మరదలు వాడి మీద బాంబులు పెలుస్తుంది ‘’అని మా మీద మాటల తూటాలు పేల్చింది .నవ్వుకొంటూ- ”బ్రహ్మీలాగు ”జేబుల్లో చేతులు పెట్టుకొని చిద్విలాసం గా కదిలాడు బామ్మర్ది బ్రాహ్మీ .
ఇదంతా ఉత్తిత్తినే –సరదాకి –లైట్ తీసుకొంటారుగా
దీపావళి శుభా కాంక్ష లతో
మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –13-11-12-ఉయ్యూరు
ఊసుల్లో ఉయ్యూరు –44
దీపాల ఆవళే కాదు -అవ్వాయి చువ్వాయి లడాయి కూడా
రోలు –రోకలి –టపాసు మందు
దీపావళి అంటే మా ఉయ్యూరు లో మా చిన్నప్పుడు నెల రోజుల ముందు నుంచే సందడి ప్రారంభ మయ్యేది .ముందుగా రోలు ,రోకలి మందు తో హడా విడి మొదలు .ఈ మాట ఇప్పటి వారికేవ్వరికి తెలియదు .ఇనుము తో చేసిన రోలు పైన వెడల్పుగా లావుగా ,ఒక పావు అంగుళం కన్నం తో ఉండేది .దాని అడుగు భాగం కొంచెం పలుచగా ఉండి తాడు కాని, వైరు కాని గుచ్చే వీలున్న రంధ్రం ఉండేది .రోలు లో సరి పడా దూరే చిన్న ఇనుప రోకలి ఉండేది .ఇది పైన కొంచెం లావుగా వెడల్పుగాతీగె దూరే బొక్క తో ను ,,అడుగు భాగం రోలు లో దూరేట్లుండేది .రోలు ,రోకలిని ఒక గట్టి జనప నారలేక ,గోగు నార తాడు తో ఆ రంధ్రాల లో నుంచి పోనిచ్చి కట్టే వాళ్ళం .రోలు లో ‘’టపాసు మందు పెట్టి రోకలి అందులో ఉంచి ,తాడును బిగుతు గా పట్టుకొని గట్టి బండ మీద రోకలి కింద ఉండేట్లు పెట్టి బలం తో కొట్టాలి .అప్పుడు టపాసు ఘర్షణ కు అంటుకొని మండి పేలి, బ్రహ్మాండ మైన శబ్దం వచ్చేది .ఒక్కో సారి పెద్ద శబ్దం వచ్చి నప్పుడు చెవులు బద్ద లై పోతాయేమో నని పించేది .వరుస గా అలా కొడుతూ ఉంటె భలే గా ఉండేది .ఊరంతా చిన్న పిల్లలకు ఇదే ఆట .టపాసు మందు ను’’ రోలు రోకలి మందు’’ అనే వాళ్ళు .ఒక్కో సారి తాడు కాలి పోయేది .చేతికి ప్రమాదం జరిగేది .క్రమం గా తాడు పోయి దాని స్థానం లో పటకారు లాంటి గట్టి ఇనుప తీగ వచ్చింది .పటకారు లా నొక్కే వీలున్డటం వల్ల చేతికి ప్రమాదం ఉండేది కాదు ..రోలు ,రోకలి సుమారు రెండు లేక మూడు అంగుళాల పొడవున్దేవి .పోటా పోటీగా కాల్చే వాళ్ళం .ఇంట్లో ఎంత మంది పిల్ల లుంటే అన్ని రోలు రోకలి ఉండేవి .వీటిని కమ్మర్లు తయారు చేసే వారు .ఇంతకీ టపాసు మందు అంటే ?గంధకం ,సురేకారం అనే పోటాస్సియం నైట్రేట్ ల మిశ్రమమే టపాసు మందు అంటారు .ఇది తగిన పాళ్ళ లో కలిపి చిల్లర కోట్లల్లో అమ్మే వారు .అయితే అది బాగా పెలేది కాదు .అందుకని మేమే ఇంటి దగ్గర తయారు చేసుకొనే వాళ్ళం .పచ్చ గంధకాన్ని కొని ఎండ బెట్టి రోట్లోనో సన్ని కల్లులోనో నూరి ఆర బెట్టాలి .సురేకారాం తెల్లగా స్పటికం లా ఉంటుంది .దీనికి ఘర్షణ తగిలితే పేలి పోతుంది .చాలా జాగ్రత్త గా ఉండాలి .దీన్ని గంధకానికి సంబంధం లేకుండా వేరే రోట్లో నూరి ‘’వస్త్ర కాగితం ‘’పట్టి అంటే మెత్త గా జల్లించి ఎండలో విడిగా పెట్టాలి .బాగా ఎండిన తర్వాతా వీటిని ఒకటి అర పాళ్ళలో కలిపి మళ్ళీ ఆర బెట్టి సీసాలలో నిలవ చేసే వాళ్ళం చిన్న సీసాలలో మళ్ళీ దాన్ని తీసుకొని ,ఒక తాటాకు ముక్క చిన్నది సీసాలో వేసి దానితో మందును రోలు లో వేసుకొనే వాళ్ళం .ఆడ పిల్లలు ఈ పని చేసి పెట్టె వారు . .‘’.ఇదే టపాసు లేక రోలు రోకలి మందు .మేం తాయారు చేసిన మందు బాగా పెలేది .ఇంకా బాగా పేలటానికి తగరం కాగితం తెచ్చి చిన్న చిన్న ఉండలు గా చేసి రోలు రోకలి మందుతోఒక ఉండ వేసి కలిపి కొట్టే వాళ్ళం బ్రహ్మాండం బద్ద లయ్యే శబ్దం వచ్చేది .దీని తో పండగ ప్రారంభ మైనట్లే .దసరా నుండి ఈ హడా విడి మొదలయ్యేది దీపావళి వెళ్ళిన వారం దాకా కొట్టుడే కొట్టుడు .విసుగేసేది కాదు . ,
తుపాకి బిళ్ళలు
తర్వాతా తర్వాతా రోలు రోకలి ‘’ఔట్ఆఫ్ ఫాషన్ ‘’అయింది .దీని స్తానం లో టపాసు బిళ్ళలు వచ్చాయి .చిన్న చిన్న అట్ట డబ్బాలలో గుండ్రని ,ఎర్రని చిన్న చిన్న బిళ్ళలు ఉండేవి . .,బిళ్ళమధ్య లో టపాసు మందు కొద్దిగా పెట్టి రంగు కాగితం తో కప్పేసే వాళ్ళు .ఈ బిళ్ళను ఒక్కొక్కటిగా తీసుకొని బండ మీద పెట్టి చిన్న రాళ్ళ తోకాని , గుండ్రాయి తో నో బిళ్ళ లను కొడితే మండి ధామ్మని శబ్దం వచ్చేది .పన్నెండు చిన్న అట్ట డబ్బాలను ఒక పెద్ద పాకెట్ చేసి హోల్ సెల్ గా అమ్మే వారు .ఇది కొంత కాలం సాగింది .బిళ్ళల స్థానం లో వరుసగా ఒకే కాగితం లో దూరం దూరం గా పెట్టిన బిళ్ళలు వచ్చాయి .వీటినీ వరస పెట్టి రాళ్ళ తో కొట్టి కాల్చే వాళ్ళం .ఇదీ మోజు తీరింది .తర్వాత తుపాకి బిళ్ళలు చైన్ లా గా వచ్చి చిన్న తుపాకులోచ్చాయి .మామూలు తుపాకీ లానే ఆ మందున్న బిళ్ళ ల చైన్ ను పెట్టి ట్రిగ్గర్ తో నొక్కితే వరుస గా జరిగి పేలుతూ ఉండేవి . ఈ తుపాకీ హవా కొంత కాలం సాగింది .కొద్దికాలం’’ నట్లు బోల్టులు ‘’వచ్చాయి నట్ పైకి జరిపి బోల్ట్ మీద తుపాకి బిళ్ళను పెట్టి బోల్ట్ బించి ననేల కేసి కొడితే అది ధామ్మని శబ్దం చేసేది .
మతాబులు –చిచ్చు బుడ్లు
ఈ టపాసుల పని ఇలా నిరంతరం గా కోన సాగేది .తర్వాత మతాబులు చిచ్చు బుడ్లు జిల్లీలు తయారు చేయటం ఉండేది .మతాబ ,చిచ్చు బుడ్లకు గంధకంసురేకారం ఇనుప రజను కలిపి చేయాలి .ముందు మతాబా పొట్లాలను తయారు చేయాలి కాగితం తో స్తూపా కారం గా సుమారు ఆరేడు అంగుళాల పొట్లాలు తయారు చేసి జిగురు తో అంటించి ఎండ బెట్టె వాళ్ళం .ఎండిన తర్వాతఅడుగున కొద్ది గా ఇసుక పోసి మడిచి అంటించి ,అప్పుడు మతాబా మందు కొద్ది కొద్ది గా పోస్తు పెన్సిల్ లాంటి వాటి తో కూరుతూ నింపి పైన మళ్ళీ అంటించే వాళ్ళం ..ఇదే మతాబా .వీటిని ఎండలో పెట్టి ఆర బెట్టె వాళ్ళం ఎంత ఆరితే అంత బాగా కాల్తాయి .రజను సరైన పాళ్ళ పడిటే గంధకం మంచిదైతే ఆ మతాబా నిజం గానే పువ్వుల్లా నిల్చి కాలి మహా ముచ్చట చేస్తు వెలుగుతాయి . .నేను మతాబ కూరటం లో ఎక్స్పెర్ట్ నే .అలాగే చిచ్చు బుడ్లు కూడా ./మా మేన మామ గంగయ్య గారే మాకు ఇవి నేర్పారు ..చిచ్చు బుడ్లు కొట్లో కొన్నవి కొని కలిస్తే సరిగ్గా రవ్వలు రావు .పైకి చిమ్మదు .అందుకని ఇంటి దగ్గర మేమే తయారు చేసే వాళ్ళం .కుమ్మరి వాళ్ళ దగ్గర ఖాళీ చిచ్చు బుడ్లు కొనే వాళ్ళం .వాటికి పైన బొక్క ఉంటుంది .అది మరీ వెడల్పు గా ఉండ రాదు .అలాంటి వాటినీ బాగా కాలిన వాటినీ చూసి తెచ్చు కోవాలి ..దీనికీ మతాబు మందే వాడుతారు ఆముదం పోసి కలుపుతారు …అడుగునఉన్న వెడల్పురంధ్రాన్ని వాడేసిన కాగితాలు ,లేక కార్డుల తో కొద్దిగా కప్పి దాని కింద బంక మట్టి తోపూసే వాళ్ళం .అది బాగా ఆరి పోయే దాకా ఎండ బెట్టె వాళ్ళం .ఎండిన చిచ్చు బుడ్ల లోముందుగా పై బొక్క దగ్గర గా ఉండేట్లు జిల్లీ మందు కూరాలి .. బాగా ఎండ బెట్టిన మతాబా మందు సరి అయిన పాళ్ళలో కూరి నింపాలి .జాగ్రత్త గా బొటన వ్రేలి తో కూరాలి .ఎంత బాగా వాదులు లేకుండా కూరితే అంత బాగా నిలిచి కాల్తాయి .కావాలంటే చిన్న రంధ్రాన్ని సన్నని రంగు కాగితం ముక్క తో మూసెయ్యాలి ..మళ్ళీ వీటిని బాగా ఎండ తగిలేట్లు ఆర బెట్టి ఇంట్లో చెమ్మ తగలని చోట దాకుకో వాలి .చిచ్చు బుడ్డి బాగా కాల టానికి మా వాకిట్లో చిన్న గుంట ను అది మూతి వరకు కూరుకోనేట్లు తవ్వి అందు లో చిచ్చు బుడ్డి పెట్టి ,పైన కాకర పువ్వొత్తి తో పై కాగితం ముక్కను అంటిస్తే అది అంటుకొని దాని కింద ఉన్న జిల్లీ మందు అంటుకొని అసలు మందు అంటుకొని జిమ్మని వెలుగు ,పువ్వులు బాగా చాలా ఎత్తుకు నాన్ స్టాప్ గా ఎగురు తాయి .ఇందులో ను నేను నిష్ణాతుడినే .ఆ తర్వాతామా పిల్లలు కూడా బానే నేర్చుకొన్నారు .మా చిన్నతనంలో ఆడ వాళ్ళందరూ మతాబా గొట్టాలు తయారు చేయటం, మగాళ్ళు మందు కూరటం జరిగేది మా అక్కయ్యలు బాగా చేసే వారు .ఇదో కుటీర పరిశ్రమ లా ఉండేది ఆ రోజుల్లో .
నేల టపాకాయలు –-ఉల్లి పాయలు -తాటాకు టపాకాయలు .
కొందరు నేల టపాకాయలు తయారు చేసే వారు .మా మామయ్య గారి అబ్బాయిలు అందులో మొన గాళ్ళు .అవి ఒక్కో సారి చుడుతూ ఉంటె చేతి లో ప్రేలె ప్రమాదం ఉంది కనుక మేము వాటి జోలికి పోయే వాళ్ళం కాదు ..కొనే కాల్చే వాళ్ళం .తర్వాతా చెప్పుకో దగినవి ‘’తాటాకు టపాకాయలు ‘’ ఇంకా బాగా కా లే తాటాకు టపాకాయలను ‘’కరెంటు టపాకాయలు ‘’అనే వారు .ఈ టపాకాయలు చవక గా ఉండేవి .ఎక్కువ మందికొనే వారు.పేలుడు శబ్దం కూడా బాగా వచ్చేది.తాటాకును మడిచి లోపల పేలుడు మందు కూరి చివర వత్తి పెట్టి ఉండేవి .పట్టుకోవటానికి బారైన తోక ఉండేది .వత్తిని దీపం దగ్గర పెట్టి అంటించి దూరం గా విసిరేసే వాళ్ళం. దదామ్మనిమ్మని శబ్దం వచ్చేది .నాకెందుకో అది అంటేభయం .పెద్ద గా కాల్చే వాడిని కాదు .
జిల్లీలు –పిచ్చికలు -అవ్వాయి చువ్వాయిలు –తూటాలు
వీటికి బొగ్గు పొడి చాలా ముఖ్యం అందుకని ప్రత్యేకంగా జిల్లేడు చెట్ల ముదురు కొమ్మలను కోసి ఎండేసి ,కాల్చి బొగ్గులు చేసి ,వస్త్ర కాగిథం పట్టి మెత్తగా చేసి ఎండ బెడతారు .పేకముక్కలు ,కార్డులు లతో అవ్వాయి గొట్టాలు తయారు చేసి అడుగున ఒక బొక్క చిన్నది చేసి ఆర బెద తారు . ..గంధకం ,సురేకారం బొగ్గు పొడి జాగ్రత్త గా దట్టించి కూరి, కొబ్బరీనే పుల్లను నిలువుగా కట్టి బొక్క ను రంగు కాగితం తో మూసి ఆర బెడ తారు .ఇందులో పాళ్ళు చాలా జాగ్రత్త గా కలపాలి .అదే నేర్పరి తనం .చూపుడు వేలి మీద అడ్డం గా పట్టుకొని ‘’బాలన్సు ‘’చూస్తారు ..ఇది చిన్నా ,పెద్ద గొట్టాల లాగా నొక్కు దగ్గర వెరై నట్లుంటాయి ఆ నొక్కు ను ట్వైన్న్ దారం తో బొక్క మూసుకొని పోకుండా బిగిస్తారు .పైన అంటించి వదిల్తే జున్యి మని ఆకాశం లోకి దూసుకు పోతాయి .పాళ్ళు సరిగా లేక పోతే తుస్సు మంటాయి .దీన్ని ‘’పిత్తటం‘’అంటారు .చేతిలో పిత్తి తె చెయ్యి కాలి పోతుంది .కనుక అవ్వాయిలు అందరు చేయలేరు .సోడా మోహన్ బాగా చేసి కోట్లకు అమ్మే వాడు వెంట్ర ప్రగడ వెంకట రత్నం ఎక్స్పెర్ట్ .మా మామయ్యకొడుకులు పద్మనాభం ,హరి మొహనాయ్,మా రమణ బాగా తయారు చేసే వాళ్ళు .కొలసాని వాళ్ళ అవ్వాయిలకు మంచి గిరాకీ ఉండేది .ఇప్పుడు వెదురు పుల్లతో లావు గా ఉండే పెద్ద అవ్వాయిలు వస్తున్నాయి .ఇవి బాగా పైకి పోయి అక్కడ కాంతి నిస్తూ శబ్ధం చేస్తూ పేలుతున్నాయి ..ఇదివరకు దీపా వలికె అవ్వాయిలు .ఇప్పుడు పండుగలకు ,పబ్బాలకు ,పెళ్ళిళ్ళ కు చావు లకు అవ్వాయి లు లేకుండా జరగటం లేదు .
జిల్లీలంటే చిన్న సైజు లో స్తూపా కారం గా నాలుగంగుళాలున్దేవి వాటికి పల్చని చర్మం చుడ తారు చివర అంటిస్తే అంటుకొని జువ్వుమని పరిగెత్తు తాయి కాల్చి వదిలేయాలి .అంతకంటే లావు గా ఉండేవి తూటాలు ఇవి బందర్లో బాగా చేస్తారని పేరుండేది ..పిచ్చికలు అని వచ్చేవి .సుమారు అరంగుళం ఉండే కాల్చిన మట్టి పిడతలు .పైన చిన్న రంధ్రం ఉండేది .ఎంతో ఉపాయం గా అందులో జిల్లీ మందుకూరి ,పైన చిన్న రంగుకాగితం ముక్కతో రంధ్రాన్ని మూస్తారు .కాగితం అంటిస్తే లోపలి మందు అంటుకొని జియ్యి కుమ్యి ,కుమ్యి అంటూ కీచు శబ్దం తో పిచ్చిక లాగా యెగిరి పోయేది .ఇవి ప్రమాదం అని ఆపేశారు .
బజార్లో దొరికే టపాసులు
లక్ష్మి ఔట్లు లక్ష్మీ బాంబులు ,మంగమ్మ శపథం బాంబులు ,సీమ టపా కాయలు భూచక్రాలు విష్ణు చక్రాలు ,తాళ్ళు, వెన్న ముద్దలు ,పాము బిళ్ళలు ,రంగుల అగ్గి పెట్టెలు ,రంగు రంగుల కాకర పువ్వోత్తులు చిన్నవి ,పెద్దవి రంగుల మతాబాలు ,టేలి ఫోన్లు అంటే రెండు కర్రలు దూరం గా పాతి వాటికి దారం కట్టి టెలిఫోన్ అనేదాన్ని దాని మీద ఉంచి వెలిగిస్తే ఈచివర్నించి ఆ చివరకు ,మళ్ళీ అటు నుంచి ఇటు వస్తు కాలుతూశబ్ధం చేస్తూ సరదా చేసేది .సీసా లో పెట్టి కాల్చే అవ్వాయిలు వత్తిదగ్గర అంటిస్తే జుమ్యి మని పైకి లేస్తుంది .ఇవాళ అనేక రకాలున్నాయి అన్నీ నాకు తెలీను తెలియవు .
కప్పు గంతులు
కప్పు గంతులు అనే ఒక రకం టపాసులున్దేవి .ఆడ పిల్లలు బాగా కాల్చేవారు .గరుకు గచ్చు మీద దాన్ని గీస్తే ,టపటప లాడుతూ నీలి మంట వచ్చి చిట పట లాడుతూ పైకి కిందికి కప్పు లాగా దుముకి నట్లుఉండి సందడి చేసేవి .మగ వాళ్లకు రోలు ,రోకలి ఆడ వాళ్లకు కప్పు గంతులు ఆనాటి టపాసులు . .అవి ప్రమాద కరం అని వాటిని నిషేధించారు .
మా ఇంట్లో దీపావళి టపాకాయలు కొనాలి అంటే మా నాన్న ను ఎన్నో సార్లు బతిమాలాల్సి వచ్చేది .ఊర వారికి ,బూర గడ్డ వారికి ,కొల్లి పర వారికి టపాసులు అమ్మే దుకా నాలు ఉండేవి . .దాదాపు యాభై రూపాయిలు పెడితే ఎన్నో వచ్చేవి ఇంటిల్లి పాదీ హాయి గా కాల్చుకొనే వాళ్ళం .ఒక్కో సారి డబ్బులు లేక అప్పు పెట్టి తెచ్చే వాళ్ళం . తర్వాత త్తీర్చే వాళ్ళం .పాలేళ్ళకు పని మనిషికి ,పాకీ వాళ్లకు కొన్ని టపాకాయలు దీపావళిరోజున ఇచ్చే వాళ్ళం .కొన్న వాటిని చాటల్లోనో సత్తు పళ్ళాలలోనో ఉంచి ఎండలో నాలుగైదు రోజులు ఎండ బెట్టె వాళ్ళం .ఎంత బాగా ఆరితే ,ఎండితే అంత బాగా కాలేవి .దీపావళి మామూళ్ళు ఇచ్చే వాళ్ళం .నా హయాం లో ఎక్కువ డబ్బు పెట్టె కొనే వాడిని .మా పిల్లల హయాం లో విజ్రుమ్భించి కొంటున్నారు .కాలం మార్పు .దీపావళి కి ముసురు పట్టి ఇబ్బంది కల్గించేది .ఎన్ని వానలు పడినా దీపావళి నాడు వర్షం వచ్చి పండగ కు ఇబ్బంది కలగలేదు నాకు తెలిసి నంత వరకు .ఇదో వింతే .
నరక చతుర్దశి
దీపావళి కి ముందు రోజే నరక చతుర్దశి .అంటే తెల్ల వారు ఝామున చతుర్దశి ఉన్న రోజు .రేడియో వాళ్ళు తెల్ల వారు ఝామున అయిదు గంటలకే మంగళ వాద్యం గంట కు పైగా పెట్టె వారు .అది వినే వాళ్ళం .అప్పుడు లేచే వాళ్ళం .మా అమ్మ మమ్మలన్దర్నీ వరుస లో కూర్చో బెట్టి ముఖాల పై బోట్లు పెట్టి ,మంగళ హారతి నిచ్చి కళ్ళకు అద్ది ,నెత్తిననువ్వుల నూనె పెట్టేది దీన్ని ‘’మాడుకు చమురు పెట్టటం ‘’అనే వారు
.అమ్మకడుపు చల్లగా దీవించేది పళ్ళెం లో తాంబూలం పెట్టి ఆడ పిల్లలకు డబ్బు లు ఇచ్చే వాళ్ళం .ఇప్పుడా పని మా ఆవిడ మాకు మా పిల్లలకు,మనవళ్ళు మనవ రాళ్ళకు చేస్తూ ఆచారాన్ని పాటిస్తోంది .
తలంటికి ముందు టపాకాయ లు కొన్ని కాల్చే వాళ్ళం .టపాకాయలకు ముందు దివిటీలు కాల్చే వాళ్ళం దివిటీ అంటే ఎండిన గోగు పుల్లలను కట్టగా కట్టి చివర అంటించి ఆకాశం వైపు తిప్పుతు ‘’ది బ్బు దిబ్బూ దీపావళి–మళ్ళీ వచ్చే నాగుల చవితి ‘’అని పాడే వాళ్ళం ..ఇది గాక ఒక పొడవైన తాడు చివర నూనె తో తడిపిన గుడ్డను గుండ్రం గా కట్టి అంటించి తాడు చివర పట్టుకొని గిర గిరా తిప్పే వాళ్ళం .దీనికేదో పేరుండేది జ్ఞాపకం లేదు . .ఇదే నరకాసుర వధ ,దాని ఆనందంపొందే వాళ్ళం . ..ఆ తర్వాత తలంటి ప్రహసనం .తలంటికి వేడి నీళ్ళే పోసుకోవటం అల వాటు .మా మ్మ రాగి కాగు ను ముందు రోజు సా యంత్రమే అడుగున,చుట్టూ మసి అంతా పోయేట్లు పని మనిషి తో తోమించి పసుపు కుంకుమ పెట్టి రెడీ చేసేది .తెల్ల వారు ఝామునే లేచి పొయ్యి అంటించి ఆ కాగును పొయ్యి మీద పెట్టి నీళ్ళు పోసికట్టే పుల్లల తో నీళ్ళు కాచేది .దాన్ని ఇప్పటికీ మేము పాటిస్తున్నాం .ఆ తర్వాతచిన్న పిల్లలు కొత్త బట్టలు కట్టుకొనే వారు .ఇప్పుడు నరక చతుర్దశి నాడు ‘’లక్ష్మీ పూజ ‘’చేస్తున్నారు .ధన్ తేరా అని బంగారం కొనటం ప్రారంభమయింది .అమావాస్య నాడు కొత్త బట్టలు కట్టుకోరు .
దీపావళి అమావాస్య
అసలు దీదీపావళి పండగ ఈరోజే .ఉదయం అంతా టపాకాయలు తెచ్చుకోవటం ఎండ బెట్టుకోవటం తో సరి పోతుంది .సాయంత్రం పెంద్రాలే చీకటి పడుతుంది కనుక అయిదున్నర నుండి సందడి ప్రారంభం .ఆడ వాళ్ళు మళ్ళీ స్నానం చేసి దేవుడి దగ్గర దీపా రాధన చేసి ,ఆ దీపం తో మట్టి ప్రమిదల లో నువ్వుల నూనె పోసి వత్తులు వేసి వెలిగిస్తారు .నైవేద్యం పెడ తారు .దీపాలకు కుంకుమ పెడ తారు .దీప లక్ష్మి పూజ అన్న మాట . దీపాలను జాగ్రత్తగా పళ్ళా లలో పెట్టుకొని ఇంటి అన్ని గదుల్లో బయటి అరుగుల మీద ,గొడ్ల దొడ్డి గుమ్మం దగ్గర వాకిలి గుమ్మాల దగర పెట్టి ఆరి పోకుండా జాగ్రత్త గా చూస్తు ,నూనె పోస్తు కాపాడుతారు .ఇలా ఇల్లు దొడ్డి వాకిలి దీపాల వెలుగు లో కొత్త అందాన్ని సంత రించుకొంతాయి దీప లక్ష్మీ తాండవం అని పిస్తుంది .అదొక సుందర సుమనోహర దృశ్యమే ..ప్రతి ఏడు కొత్త ప్రమిదలు కొన్ని కొనాలి .పాత వాటిని నిప్పుల్లో కాల్చి శుద్ధి చేసి వాడుకోవాలి .చీకటి పడ గానే మేము ముందు టపాకాయలు కాల్చకుండా ,మా వీధి లోకి వెళ్లి అందరు కాల్చేవి చూసే వాళ్ళం .వాళ్ళ కాల్పుల సద్దు మణి గాక ఇంటికి వచ్చి అప్పుడు మొదలెట్టే వాళ్ళం .చిన్నా ,పెద్దా అందరు సరదాగా కాల్చే వారు .ఎవరికి ఏది వీలైతే దాన్ని వాళ్ళు కాల్చే వాళ్ళు .కాల్చే టప్పుడు పాత బట్టలు కట్టుకోవటం చెప్పులు వేసుకోవ టం మేము చిన్నప్పటి నుంచి అల వాటు చేసుకొన్నాం .మా పిల్లలు కూడా పాటిస్తారు .బాంబులు, ఔట్లు పేల్చే వాళ్ళు వేరుగా ఉంటారు సీమ టపాకాయలు కాల్చే వాళ్ళు ,తాటాకు కాయలు కాల్చే వారు వేరు నాకు మతాబా ఇష్టం అవి కాల్చే వాడిని మా తమ్ముడు అవ్వాయిలు వేసే వాడు .భూ విష్ణు చక్రాలు కాకర పువ్వోత్తులు ఆడ వాళ్ళు ఎక్కువ ఇష్ట పడే వారు .సామాను అంతా కాల్చటం అయిన తర్వాతాకాళ్ళు ,చేతులు కడుక్కొన్న తర్వాత మా అమ్మ చేసిన మైసూరు పాకం అందరికి పెట్టేది .టపాకాయలు కాల్చిన తర్వాత తీపి తినాలనే ఆచారం ఉంది .ఇప్పటికి మేము పాటిస్తూనే ఉన్నాం .మా ఆవిడ నాకు ఇష్ట మైన మైసూర్ పాకం చేసి తిని పిస్తూనే ఉంది .పిల్లలకూ ఇష్టం మాఅమ్మా ,ప్రభావతి ఇద్దరు పాక్ బాగా చేస్తారు .నేయ్యితోనే చేయటం ఇప్పటికి ఉంది.కొన్న నెయ్యి కాదు పాల తో వచ్చిన నెయ్యే .దీపావళి రోజున కజ్జికాయలు ,అరిసెలు ,జంతికలు ,చక్కిలాలు కారప్పూస వండుతారు .
నరకాసుర దహనం –అవ్వాయి చువ్వాయి లడాయి
బెజవాడ ,బందర్లో ద నరకాసురుని బొమ్మను చేసి తగలబెడ తారు .ఇది మాకూ పాకింది మా వంగల దత్తు గారు దీన్ని మాకు ప్రేరణ కలిగించారు .మా ఇళ్ళ దగ్గర టపాకాయలు కాల్చటం అయిన తర్వాత భోజనం చేసి దత్తు గారింటికి వెళ్ళే వాళ్ళం .ఆ రోజు ఉదయమే ఆయన కర్రల కు గడ్డి ని చుట్టించి నరకాసుర ఆకారాన్ని వాళ్ళ పాలేరు తో చేయించి ఉంచే వారు .నెత్తిన ఒక కుండా బోర్లించే వాళ్ళం .పాత చొక్కా దానికి తొడిగి చేతుల మీద, నెత్తిమీద టపాకాయలు పెట్టి అంటించే వాళ్ళం .అది తగల బడుతుంటే అందులోని మందు గుండు సామగ్రి కాలుతూ పేలుతూ ఉంటె సరదా గా ఉండేది ..దత్తు గారికి ఇలా మేమంతా వచ్చి చేయటం చాలా సంతోషం గా ఉండేది .
బందర్లో తూటాలు బాగా కాల్చే వారని అవ్వాయి లతో కోనేరు సెంటర్ లో లడాయి చేసే వారని విన్నాం .మనంఎందుకు ఇక్కడ చేయ కూడదని ఆలో చించి అమలు పరిచాం .మొదట మేము, మా మామయ్యా గారి పిల్లలు సూరి నరసింహం సోదరుల తో అవ్వాయి లడాయికి దిగాం .మేముఇక్కడి నుంచి వాళ్ళ మీదకు వదిల్తే వాళ్ళు మా మీదకు వదిలే వారు .కొన్ని తప్పించుకొని పక్క ఇళ్ళ లో దూరేవి .లేక పోతే గడ్డి వాముల్లో దూరి తగల బడేవి .లుంగీలు చీరలు కాలేవి .వీటిని అంటించ టానికి ఒక కొబ్బరి తాడు కాల్చి అగ్గి పెట్ట జేబులో వేసుకొని రోడ్డు మీదకు వచ్చే వాళ్ళం .వేసే వాడికి తాడుతో అంటించి సహాయం చేసే వారుండే వారు .అవి దూసుకు పోతుంటే మహా తమాషా గా ఉండేది .ఆ తర్వాత చోడవరపు వాళ్ళు మేము పోటీ పడే వాళ్ళం .లడాయి మహా రంజు గా ఉండేది .కొంత కాలం ఇలా అయినట తర్వాత మేమందరం కలిసి ఉయ్యూరు సెంటర్ కి చేరే వాళ్ళం .అక్కడ ముస్లిములు, గౌండ్ల తో పోటా పోటీగా ఆవ్వాయి చువ్వాయి లడాయి చేసే వాళ్ళం .కనీసం రెండు గంటలైనా ఈ లడాయి జరిగేది .భలే తమాషా గా ఉండేది .అంతా ఆనందమే .చిరాకు పరాకు లేమయ్యేవో తెలిసేది కాదు .పెద్ద వాళ్ళు కూడా ఏమీ అనే వారు కాదు డబ్బు వాళ్ళిచ్చే వాళ్ళు కాదు .,మా తంటాలేవో మేం పడే వాళ్ళం .ఒక్కో సారి ఉయ్యూరు పుల్లేరు కాలువ దగ్గరకు వెళ్లి నీటి లో అవ్వాయిలు వదిలే వాళ్ళం .అవి నీటి అంచున వెళ్తూ పాము మెలికలు తిరుగుతూ సందడి చేస్తూ వెడుతుంటే మహా ముచ్చట గా ఉండేది .ఇదీ దీప ఆవళీ-అవ్వాయి చువ్వాయి లడాయీ .
దీపా వలి శుభా కాంక్ష లతో
మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ –12-11-12—ఉయ్యూరు
అవును -వారిద్దరూ
కాపు –రెడ్డి
‘’జన వేమన’’ అన్న నా వ్యాస పరంపరను చదివిన ఒక చదువరి తాను ఎక్కడో కాపులు కూడా రెడ్లె అని చది వానని సందేహం తీర్చమని నెలకు పైగా రోజుల క్రితం నాకు మెయిల్ రా శారు .నాకు తీరిక ,సమయం ఇప్పుడే దొరికి విషయము అందు బాటు లోకి వచ్చింది కనుక సమాధానం రాస్తున్నాను –
మొదట్లో రెడ్డి పదం రాచరికాన్ని సూచించేది గా ఉండేది .వారిని ‘’రడ్డీలు ‘’అని కూడా అనేవారు .1046లో వేసిన శాసనం లో’’ రెడ్డి కంబు దయ సేసిన ‘’అని రెండు సార్లున్నదని ,రాట్అనే శబ్దం నుండి అది వచ్చిందని దానికి రాజు అనిఅర్ధం అని చరిత్ర కారులు చెప్పారు ..
ఏ..వడి యేలు రాసిన పుస్తకం లో రెడ్ల కు మొదట ‘’కాపు ‘’అనే పేరు కమ్మవారికి ఉండేదని ,ఒక కధ ప్రచారం లో ఉంది .ప్రతాప రుద్రచక్ర వర్తి కాలం లో ఒక రహస్య మైన లేఖ (కమ్మ )శత్రువుల చేతికి చిక్కిందని ,దాన్ని కొందరు అత్యంత ధైర్య ,సాహస ,చాకచక్యా ల తో తెచ్చి ఇచ్చారని వారే ‘’కమ్మ వారు ‘’అయారు అని రాశాడు .1312 లో కాకతీయ గణపతి చక్ర వర్తి కడప జిల్లా లోని , చెన్నూరు గ్రామం లో నాగ నాధుని దేవాలయం లో వేయించిన శాసనం లో రెడ్డి పదాన్ని రాజుకు చేర్చాడు .ఇది రాజ చిహ్నమే అన్నారందరూ .కుల వాచకం కాదు .
కాపుల నుండి వెలమ ,కమ్మ లను ఏర్పరచిన వాడు మొదటి ప్రతాప రుద్రుడే .ఆ తర్వాత వచ్చిన గణపతి దేవుడు ఆ శతాబ్దం లో స్తిర పడిన రెడ్డి ,వెలమ ,కమ్మ కులాల తో సంబంధాలు కలుపుకొని రాజ్య సుస్తిరతసాధించాడు .పల్నాటి యుద్ధం కాలం లో ఈ కులాల మధ్య చిచ్చు బాగా రగి లింది .అసలు వీరంతా వ్రుత్తి చేత సైనికులు లేక క్షత్రియులు ఆకారం లో ,ఆచరణ లో ఒకటిగానే ఉన్నారని’’ ఫ్రాన్సిస్ ‘’అనే చరిత్ర కారుడు రాశాడు .
కాపులను’’ కాంపులు’’అని పిలిచే వారు ,రాసే వారు .1091పశ్చిమ గోదావరి జిల్లా లోని పాలకొల్లు లో మార్యార్కుడు వేయించిన శాసనం లో ‘’కాంపులు ‘’అని కాపులను పేర్కొన్నారు .1094 లో అప్పికట్ల లో వేయించిన శాసనం లో విశ్వేశ్వర మహా దేవరకు’’ అఖండ వత్తి దీపాలకు’’‘’అలుకుం బట్ల ప్రోలి రెడ్డి ,ముదివి రెడ్డి ,నారప రెడ్డి ,వీరు మువ్వురు కాంపులు తమ పుత్రాను పౌత్రిక మా చంద్రార్కము ‘’అని ఉంది . .కనుక కాపులు రడ్లు అయి తర్వాత రెడ్లు అయారని తెలుస్తోంది .శాసనం 190లో ‘’అయ్యప రడ్డి,-కొడుకు ‘’రడ్డి ‘’అని ఉన్నది .వీటన్నిటిని బట్టి రెడ్లు కూడా కాపులే అని భావించ వచ్చని అన్నారు శాసన ,చరిత్ర పరిశోధకులు స్వర్గీయ కొడాలి లక్ష్మీ నారాయణ గారు తమ ‘’విస్మృత ఆంద్ర నాయకుల చరిత్ర ‘’అన్న పరిశోధన పుస్తకం లో .వేమన కూడా ‘’కలి యుగమున నున్న కాపు కులానకు –వేమన తన కీర్తి విక్రయించే ‘’అని రాసుకొన్నాడు .
1111 లో ఖర నామ సంవత్సర ఫాల్గుణ బహుళ పాడ్యమి సోమ వారం శ్రవణా నక్షత్ర యుక్త కర్కాటక లగ్నం లో కాకతి రుద్రదేవుడు ఆయా కులాలకు గోత్ర్తము మొద లైన బిరుద నామాలు యెర్పరచి నట్లు తెలుస్తోంది .అప్పటికి ఇంకా పల్నాటి యుద్ధం జరగలేదని ,రెండవ ప్రతాప రుద్రుడు తాత గారు ఏర్పరచిన కుల గోత్రాలను ప్రకటింఛాడని అంతకు పూర్వమే ఉన్న కాపు కులం నుండి ఒకటవ ప్రతాప రుద్రుడు వెలమ ,కమ్మ లను ఎర్పరచాడని ,కాపు ,వెలమ ,కమ్మ ,రెడ్డి ,తెలగ మొదలైన కులాల వారంతా ఆర్యులేనని కొడాలి వారి అభిప్రాయం.కుంభీ జాతి నుండి వెలమ వారోచ్చారని ,కూర్మీల నుండి కమ్మ ,తెలగ కాపు ,రెడ్లు అయారని ఆయనే చెప్పారు .కృష్ణా నదికి దక్షిణం గా ఉన్నది వెలనాడు అని కైఫీయత్తుల్లో ఉంది .కమ్మ వారికి మూల పురుషు లైన దుర్జయులకు ఇది మంచి పట్టు ఉన్న ప్రాంతం
రెడ్లు కొండ వీడు ను పాలించే టప్పుడు ‘’కొండ వీటి దండ కవిలె’’ రాయించారు .అందులో వెలమ ,బలిజ ముస్లిం మొదలైన 39 సామంతులను పేర్కొన్నారు .ఇందులో కమ్మ నాడు, కమ్మ రాష్ట్రాల పేర్లు లేవు .మహా రాష్ట్రుల కాలం లో ‘’చౌత్‘’అనే పన్ను అంటే నాల్గో వంతు పన్నును కమ్మ వారు వసూలు చేయటం వల్ల ‘’చౌదరి ‘’అనే పేరు వచ్చిందని తెలుస్తోంది .మహా రాష్ట్రులకు పూర్వమే ఈ పేరు ఉందట. .అయోధ్య లోని ధన వంతు లైనవారు ‘’చౌదరి శబ్దాన్ని’’ గౌరవ సూచకం గా పెట్టు కొనే వారని ‘’కార్నెజీ అన్న చరిత్ర కారుడు ‘’రాసి నట్లు లక్ష్మీ నారాయణ గారు పేర్కొన్నారు ..జమీందారీ ,దేశ పాండ్యా ,దేశ ముఖ ,చౌదరి అనే శబ్దాలు బిరుద నామాలు గానో ఉద్యోగ నామాలు గానో కుల విచక్షణ లేకుండా ఉన్నాయని తెలుస్తోంది .
ఆంద్ర శాత వాహనులకు పూర్వమే కాపులు లేక కూర్మీలు గుంటూరు మండలానికి వచ్చి ,బౌద్ధ స్తూపాలను నిర్మించారని ,వీరు బౌద్దులైన లిచ్చవులు ,ఇక్ష్వాకులు అయి ఉండచ్చు నని వీరిలోని వారే ,కమ్మ ,కాపు ,తెలగ ,రెడ్డి కులాల వారని, వీరంతా ఏక గర్భ జనితులని కొడాలి వారి భావన .కనుక వీ రందరూ ఆర్య క్షత్రియులే కాని శాతవాహన వంశస్తులు కారని ఆయన నిశ్చితాభిప్రాయం .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –10-11-12—ఉయ్యూరు
—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
శ్రీ శంకరుల లలి (కవి) తాసౌందర్య లహరి –44(చివరి భాగం )
98 –‘’కదా కాలే మాతః కధయ కలితా లక్తక రసం –పిబేయం ,విద్యార్దీ ,తవ చరణ నిర్నేజన జలం
ప్రకృత్యా ,మూకానా ,మపిచ ,కవితా కారణ తయా –కదా ధత్తే వాణీ ముఖ కమల తాంబూల రసతాం ‘’
తాత్పర్యం –మంగళాక్రుతీ మాతా !జన రంజకత్వం కోసం పూతగా పూసుకొన్న యెర్రని లత్తుక రసం తో ఉన్న నీ చరణాలను కడిగిన పాద్యోదకాన్ని ,బ్రహ్మ విద్య ను అభ్య సించె విద్యార్ధి నైన నేను ,మరణించే లోపల ,యే సమయం లోనైనా పుచ్చు కోగాలనా ? ఆ నీ పవిత్ర పాదోదకం చెవిటి వారికి వినికిడి శక్తిని ,మూగ వాడికి మాటను కలిగించి ,కవిత్వం చెప్ప టానికి కారణం అవటం చేత ,వాణీ ముఖ కమల రస సారస్యాన్ని ఎప్పుడు స్వీకరిస్తుందో కదా ?
విశేషం –శంకర భగవత్పాదులు సామీప్య భక్తీ ని కోరు కొన్నారు .తాంబూల కవిత సరస్వతీ వాదన వాగ్విలాసం తో పోల్చా దాగిన సూక్తి ప్రవాహం .కాళి దాసాదులు సరస్వతి ముఖ కమలస్త తాంబూలం వల్ల మహా కావు లైనారు .భగవతి పాదజాలం లాక్షారసావుకితం కనుక భారతీ ముఖ కమస్త వీటీ (తాంబూలం )రూపం పొంది ,సత్కవితా హేతువు అయింది .మూగ వాడిన ఒకనికి కంచి కామాక్షి అమ్మ తాంబూల రసం నాలుక మీద పడ గానే మహా ఆశుదార గా మహా కవిత్వం అలవోక గా నోటి నుండి వెలువడింది ..ఆయననే ‘’మూక కవి ‘’అంటారు ..ఆయన ఆర్యా శతకం మొదలైన అయిదు శతకాలనుఅమ్మ వారి పై చెప్పారు . వీటినే ‘’మూక పంచ శతి ‘’అంటారు . అద్భుత కవితా ప్రవాహం అందులో ఉంటుంది .ఆయనే తర్వాతా కంచి కామ కోటి పీఠానికి అది పతి కూడా అయారు .అమ్మ దయ అంట గొప్పదని ,ఆమె తాంబూల రసం లో అంతటి మహత్తు ఉందని శంకరుల భావం .అంటే కాదు అంత మహా విద్వాంసుడు వేద వేదాంగాలను ఆవ పోసాన పట్టిన వాడు అయిన ఆయన తనను ‘’విద్యార్ధి ‘’గానే చెప్పుకోవటం వారి వినయానికి ప్రతేక .అమ్మ దయ ఉంటె రానిదేమీ లేదని అర్ధం .
99—‘’సరస్వత్యా లక్ష్మ్యా ,విధి ,హరి ,సపత్నో విహరతే –రతెహ్ పాతివ్రత్యం ,శిదిలయతి రమ్యేణ వపుషా
చిరంజీవంనేవ క్షపిత పశు పాషా వ్యతి కరః –పరా నందా భిఖ్యం రసాయతి రసం త్వద్భజన వాన్ ‘’
తాత్పర్యం –సర్వాపద్నివారి ణీ మాతా !నిన్ను భజించే భక్తుడు సరస్వతి ,లక్ష్మి దేవులతో చిరంజీవి గా వర్ధిల్లు తాడు .బ్రహ్మ ,విష్ణు లకు అసూయ పుట్టిస్తాడు .మన్మధుని సౌందర్యం తో సమాన మైన కాంతి సౌందర్యం కల శరీరం తో ,మన్మధుని భార్య రతీ దేవికే మొహం పుట్టించి ,ఆమె పాతి వ్రత్యానికే భంగం కలిగిస్తాడు .చివరికి జీవ సంబంధాన్ని వది లించుకొని ,జీవన్ముక్తుడై ,సదాశివ తత్వాత్మకుడై ,పరమానంద రస సౌభాగ్యాన్ని అనుభవిస్తాడు .అంటే నీ భక్తుడు అతి సౌందర్య వంతుడు ,తేజస్వి ,వర్చస్వి విద్యా పారంగతుడు ఐశ్వర్య వంతుడు అవుతాడు .
విశేషం –సాధకుడు తానే మన్మధుని వంటి శరీరం పొంది ,రతీ దేవినే భ్రమింప జేస్తాడని భావం .బ్రహ్మ ,విష్ణు లకుఅసూయ కల్గిస్తాడు .పశువు అంటే జీవుడు .ఇంద్రియాల చేత ప్రపంచాన్ని చూసే వాడని అర్ధం.’’పశు –బందనే ‘’అవిద్య చేత బద్ద్దు డైన జీవుడే పశువు .పాశం అనేది అవిద్య ‘’.అదిథిహ్ పాశం ప్రముమోక్త్వే తన్నిమః –పశుభ్యః పశు పతయే కరోమి ‘’అని శ్రుతి .ఆదిత్య మండలాన్తర్గత మైన అదితి అనే స్త్రీ శక్తి అవిద్యా కృత బంధాన్ని విముక్తి చేయుగాక అని పై దాని అర్ధం .అదితి–పశు పతి ఐన సదా శివుని తో పాశ విముక్తి చేస్తాడని భావం .
అవిద్యా పాశం వది లించుకొంటే సదా శివ రూపుడు అవుతాడు .పరా నంద ,పరా నందాత్మిక ,పరా నంద జ్యోతి లో రసిస్తున్నాడు .ఆస్వాదిస్తున్నాడు .ఇదంతా భగవతి ని భజించే వాడికే సాధ్యం .భజించటమే సేవించటం అని అర్ధం .
ఆత్మ జ్ఞానం కలిగినా ,ధర్మా నుష్టాదులకు ఫలా పేక్ష లేక పోయినా ,సంస్కార వశం తో చక్ర భ్రమణం వల్ల శరీర సంబంధం ఉంటుంది .భజనలు రెండు రకాలు మొదటిది షట్చక్ర సేవ రెండోది ధారణా .షట్చక్ర సేవ –ఆధార ,స్వాధీ ష్టానాలలో ఉపాసన ఉండదు .కారణం తమస్సు చేత అవి ఆవ రింప బడి ఉన్నాయి .మణి పూరకం నుంచి సహస్రారం వరకు పూజ ఉంటుంది .మణి పూరక పూజాదులకు ఆమె సమీపం లోకి చేరతారు .అనాహత చక్ర పూజా పరులకు సాలోక్య ముక్తి వస్తుంది .అంటే దేవి పట్టణం లోనే ఉంటారు .విశుద్ధ చక్రోపాసకులకు సామీప్య ముక్తి లభిస్తుంది .పాద సేవ చేసే సేవకులవటం వల్ల ఆజ్ఞా చక్రోపసకులకు సారూప్య ముక్తి వస్తుంది .అంటే ఆమె తో సమాన రూపాన్ని పొందుతారు .వీరందరికి బాహ్య బాహ్య దుఖాన్ని వదిలేసె శక్తి ఉండదు .దేహ ధారణా ఉంటుంది కనుక సాయుజ్య ముక్తి రాదు .సాయుజ్యమే శాశ్వత ముక్తి అని భావం .అది భగవతి భజన వల్ల ఆస్వాద్యమవుతుంది .
లోకం లో స్త్రీ సమ్మేళనం వల్ల పరమ సుఖం లేదు .అన్ని దుఖాలు పోతేనే సాయుజ్యం .అది శివ శక్తి సంపుటాన్తర్భాగం .పశువులు జ్ఞాన గర్వితులు .పరలోక సుఖం లేనివారు .విద్య లేదు ఒట్టిఐహిక సుఖ జీవులు ,పాశ బందితులు .
రసో వై సహః ‘’అని శ్రుతి భగవతి సకల సేవా రాధ్య .సర్వ దేవతాధిక .సకల ప్రపంచ ఉత్పత్తి మాతృక .సర్వ మంత్ర జలోత్కట .అలాగే భగవతి భక్తులు కూడా .బ్రహ్మాదుల కంటే ఉత్కృష్ట స్తితి ని పొందుతారని పిండి తార్ధం.
100—‘’ప్రదీప్త జ్వాలా భిర్దివస కర ,నీరాజన విధి –స్సుదా,సూతే స్చంద్రోపల జలల ,వైరర్ఘ్య రచనా
స్వకీయై రంభోభి స్సలిల నిది సౌహిత్య కరణం –త్వదీయా భిర్వాగ్భిస్తవ జనని ,వాచాం స్తుతి రియం ‘’
తాత్పర్యం –మనో వాచామ గోచరీ తల్లీ !వాక్ ప్రపంచానికి తల్లి వైన నీవు ఇచ్చిన నీ స్వరూపాలైన వాక్కుల చేత నిన్ను నేను కొని యాడుతున్నాను .తనవి అయిన కాంతి దివిటీ లతో సూర్యుడికి నీరాజనం పట్టి నట్లు ఉంది నా చేష్ట .తన సంబంధ మైన చంద్ర కాంత శిలనుంచి వచ్చే నీటి తో చంద్రునికి అర్ఘ్యం ఇచ్చి నట్లుంది .తన సంబంధ మైన జలాల చేత తర్పణం చేసి ,సముద్రుని దప్పిక తీర్చటం లాగా ఉంది నా వెర్రి చేష్ట. .నీవు పరా శక్తివి .నిన్ను స్తుతించే శక్తి ఎవ్వరికీ లేదు .అహంకారం వదిలి సర్వం నీ కరుణ యే నని నీ స్తోత్రం చేస్తూ ముగిస్తున్నాను .
విశేషం –సర్వము భగవతియే .చేతనా చేతనం అంతా ఆమెయే .స్తోత్రమే శ్రీ దేవి అయితే ఈ స్తోత్రం చేయటం అపరాధమే .అందుకే ‘’క్షం తవ్యం ‘’అని క్షమించ మని చమని వేడుకొన్నారు వేదాంత శంకరులు .’’త్వదీయాభిర్వాగ్భిస్తవ ‘’అంటే ఆమెయే మాతృకా రూపిణి .మాత్రుకాక్షరాలు ఆమె .ఆమె స్తుతి .’’మాతృకా వర్ణ లిప్తాంగీ –మహా చక్ర మాధ్యగాం’’అని లలిత .
పరా ,పశ్యంతీ ,మాధ్యమా ,వైఖరీ రూప వాక్కు ల వల్ల ‘’త్వయైవ ఉల్లసితా వైఖరీ ,సంరుజ్ఞ్ముభిత తన్మయ ,మాత్రుకాక్ష రైహ్ త్వయి వస్తు రితి ఆకారంత క్షకారాంత మాతృకా వర్ణ రూపిణీ ‘’అని లలితా సహస్రం ..ఇంతటి మేధావి ,పరమ ఉపాసకులు సాక్షాత్తు కైలాస వాసి ఈశ్వరుడు ,ఆత్మ జ్ఞాని ఉపనిషత్తులకు, బ్రహ్మ సూత్రాలకు,భగవద్గీత కు అమోఘ వ్యాఖ్యానాలు రచించి భక్తీ స్తోత్రాలను అనర్గళం గా చెప్పి ,అద్వైత మాతా చార్యులై,షణ్మతస్తాపకులై ,సకల జనోద్దారకులై ,వేద మార్గ పద గామి యైన శ్రీ శ్రీ శ్రీ శంకర భగవత్పాదులు అలౌకికా నందం తో లలితా రా భట్టారిక వైభవాన్ని ‘’సౌందర్య లహరి ‘’లో నిక్షిప్తం చేశారు .ఇందులో వారి కవితా సౌందర్య లహరి నీ దర్శించుకోన్నాం .దీన్ని చదివితే ఇంకా దేన్నీ చదవనక్కర్లేదన్నట్లున్న రచన ఇది .సాధన చేసే వారికి చేసి నంత .ఇప్పటి దాకా ఆ పరమ వైభవాన్ని దర్శించి తరించాం .దీని లోని అంతరార్ధాన్ని పరమ శోభాయ మానం గా వివరించారు ‘’సదా శివా నంద నాద ‘’బిరుదాంకితులు బ్రహ్మశ్రీ తుమ్మల పల్లి రామ లింగేశ్వర శర్మ గారు ..ఆ అమృత పానమే మనకు శ్రీ రామ రక్ష .
ఇతి మంగళం మహాత్ –సంపూర్ణం .
దీపావళి శుభా కాంక్ష లతో
మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ –10 – 11-12-ఉయ్యూరు
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి – 43
96—‘’కళత్రం ,వైధాత్రం ,కతికతి ,భజన్తే ,న,కవయః –శ్రియో దేవ్యాః ,కోవా ,న భవతి పథిహ్ కైరపి ధనైహ్
మహాదేవం హిత్వా తవ సతి సతీ నామ చరమే –కుచాభ్యామాసంగః కురవక తరో ,రప్యసులభః ‘’
తాత్పర్యం –పుణ్య శ్రవణ కీర్తనా తల్లీ !ఎందరెందరో కవులు సరస్వతీ దేవిని పొందాలను కొంటారు .ఏదో కొంత డబ్బు సంపాదించిన వారంతా లక్ష్మీ పతులం అను కొంటున్నారు .పతివ్రతా శిరోమణి వైన నీవు నీ ఉద్యాన వనం లో‘’కురవక ‘’వృక్షానికి దోహదం చేయ వలసి వస్తే, నీవు నీ అర్ధ భాగం అయిన శివుని తో ఆలింగనం చేస్తున్నావు .నీ పాతివ్రత్య మహాత్మ్యం అవాజ్మానస గోచరం .
విశేషం –కురవక పుష్పం పుష్పించ టానికి భర్త తో కలిసిన ఉత్తమ స్త్రీ ఆలింగనం చేయాలి దీనినే దోహద క్రియ అంటారు .కురవాకం అంటే యెర్ర గోరింట .పచ్చ గోరింటాను కురంటంకం అని ,నీలి గోరింటాను ఖుంటి అని అంటారు .
సరస్వతి ,లక్ష్మీ ప్రసాదం వల్ల ఉపాసకులు మధుర కవిత్వం ,దానం సౌఖ్యం పొందుతారు .కాని భగవతి ప్రసాదం వల్ల‘’అక్షయ పరమా నందం ‘’అనుభవిస్తారని ధ్వని పూర్వక భావం .సతీ –‘’సతీ సతి యోగా విసృష్ట దేహతాం ‘’అన్నాడు కాళి దాస మహా కవి .’’సతీ పతివ్రతా గౌర్యః ‘’అని నిఘంటువు చెబుతోంది .సర్వ దేవతా సార్వ భౌముడే మహా దేవుడు ఇతర దేవతలు– దేవః .సదాశివుడు– మహాదేవః
కు +రవ =కురవ –కుత్చిత వాదాలు చేసే వాడని అర్ధం .కాషాయం ధరించి కుతర్క ,వితర్క కుత్చిత వాదాలు చేసే వారికి శ్రీ దేవి అనుగ్రహం రాదు అని అంత రార్ధం.
97—‘’గిరా,మాహుర్దేవీం ,ద్రుహణగృహిణీ ,మాగమా విదో –హరెహ్ పత్నీం పద్మం హర సహచరీ ,మద్రి తనయాం
తురీయాకాపి ,త్వం ,దురధిగమ నిశ్సీమ మహిమా –మహా మయా ,విశ్వం ,భ్రమయసి ,పరబ్రహ్మ మహిషీ ‘’
తాత్పర్యం –మహా ప్రళయ సాక్షిణీ !పరబ్రహ్మ పట్టపు రాణి వైన జననీ !ఆగమ విదులు నిన్నే బ్రహ్మ దేవుని భార్య యైన ,వాక్కులకు అధిష్టాత్రి అయిన సరస్వతి దేవిగా ,నిన్నే విష్ణువుకు భార్య యైన లక్ష్మీ దేవి గా ,హరుని అర్ధాంగి అయిన పార్వతీ దేవి గా భావిస్తున్నారు .నువ్వు ఈ ముగ్గురి కంటే వేరైన నాల్గవదీ ,అనిర్వాచ్య మైనదీ అతి కష్టం మీద పొండ పొండ శక్య మైన అపార మహిమాన్విత మైన ,శుద్ధ విద్యాన్తర్గత మైన మాయా తత్వమై ,ఈ ప్రపంచాన్ని భ్రమింప జేస్తున్నావు . విశేషం –వాశిష్టం లో ‘’విశ్వ నాటక విలాస సాక్షిణీ సంవి దేవ పురతో విజ్రుం భతే ‘’అనీ ,శ్రుతిలో ‘’ఋతం సత్యం ,పరబ్రహ్మ పురుషం ,కృష్ణ ఊర్ధ్వ రిదం ,విరూపాక్షం విశ్వ రూపాయతే నమః ‘’అనీ ఉంది.సర్వ శక్తులు సదా శివుడిన పర బ్రహ్మను ,ఆయన భార్యభావాలను పొంది అంక స్తిత మై ఉన్నాయని భావం .
‘’తస్మాకం మండలా రూధా శక్తిర్మాహేశ్వరీ పరా –మహాలక్ష్మిరితిఖ్యాతా ,శ్యామో ,సర్వ మనోహరీ ‘’అని పురాణాలు శ్లాఘించాయి .
‘’సర్వ స్యాద్యా ,మహాలక్ష్మీ ,స్త్రిగుణాపరమేశ్వరీ –లక్ష్యా లక్ష్య స్వరూపా ,సా వ్యాప్య క్రుత్నం వ్యవ స్తితా ‘’అని మార్కండేయ పురాణం .
పరబ్రహ్మ సకల జగత్కారణ భూతుడు .పరబ్రహ్మ మహిషి –సకల జగత్కారణ భూత .సృష్టి స్తితి లయ హేతు వైన మహా లక్ష్మి సమాఖ్య దేవత .మహా మాయా అంటే అందరికి సంసార వాసన ను ప్రసాదించేది.మహా అంటే అందరి చేత అర్చింప బడేది .రుద్రుని సహచారిణి ‘’జయ ప్రధమ మిధునం బ్రహ్మ ,సరస్వతి .ద్వితీయ మిధునం –విష్ణు ,లక్ష్మి తృతీయ మిధునం –రుద్రా ,జయ .సృష్టి స్తితి లయాది సకల దేవతా కారణ భూత మైన పరబ్రహ్మ భగవతి యే.
సశేషం —మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –9-11-12—ఉయ్యూరు
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
‘’ వైష్ణవ జనతో ‘’భజనకు తెలుగు అనువాదం
నమస్తే గోపాల కృష్ణ గారు -ఉభయ కుశ లోపరి
వైష్ణవ జనతో ‘’అనే గాంధీ గారికిష్ట మైన భక్తీ గీతాన్ని ఎవరైనా తెలుగు లోకి అనువదిన్చారా ?ఆ స్క్రిప్ట్ లభిస్తుందా ,దాన్ని అసలెవరు రాశారు ?’’అని మీరు నాకు మెయిల్ పంపారు. ‘’నా దృష్టికి రాలేదని, తెలిస్తే తెలియ జేస్తానని‘’మీకు వెంటనే మెయిల్రాశాను .అప్పటి నుంచి ఆ అన్వేషణ లోనే ఉన్నాను .నలుగురైదుగురు నిష్ణాతులను సంప్రదించాను .వారి దృష్టికీ రాలేదని చెప్పారు ..ఈ విషయం మా ఆవిడా కు తెలిసి ‘’దాన్ని మీరే ఎందుకు తెలుగు చేయ రాదు ?’’అని ప్రశ్నించింది .వెంటనే అర గంట క్రితం నెట్లో దాని ఇంగ్లీష్ అను వాదం చూసి, నేనే తెలుగు చేసి పంపుతున్నాను ..ఇది ఆ కవి కి పూర్తీ న్యాయం చేశానో లేదో తెలీదు కాని, ప్రయత్నం మాత్రం చేశాను . .
ఈ భజన గీతాన్ని పది హేన వ శతాబ్దపు గుజ రాతీ కవి ‘’నరసింహ మెహతా’’గుజరాతీ భాష లో రచించారు .
తెలుగు సేత
పరుల బాధలను అర్ధం చేసుకొన్నా వాడే పరమేశ్వరు డైన విష్ణువుకు పరమ ఆప్తుడు
ఇతరుల అవసరాలకు సాయ పడే స్త్రీ లేక పురుషుడు ఆ సాయాన్ని గర్వం గా చెప్పుకో రాదు .
ఇలాంటి విష్ణు జనులు విశ్వం లో అందర్నీ గౌరవిస్తారుపర దూషణ చేయరు ,విమర్శించరు .
.అందర్ని సమదృష్టి తో చూస్తారు ..
అతడు కోరికలను విసర్జిస్తాడు .పర స్త్రీలు అతనికి మాత్రు సమానం .వైష్ణవ జనులు అసత్యమాడరు
.పర ధనా పేక్ష లేకుండా జీవిస్తారు ..వారు సంగత్వం ,నిస్సంగత్వాలకు అతీతులు .
నిస్సంగత్వం లోను స్తిర చిత్తం తో వ్యవ హరిస్తారు .అలాంటి వారు నిరంతర భగవధ్యానం లో మునిగి ఉంటారు
.సకల తీర్దాలలో వారు తన్మయులౌతారు . వారికి ఆశా, ,మోసం, వంచన తెలియవు .భోగాన్ని ,కోపాన్ని విసర్జిస్తారు ..
.అలాంటి వ్యక్తియే భగ వంతుని అర్చించ టానికి అర్హుడు .అతడే సకల మానవ జాతి ని ఉద్ద రించగలడు
అని ‘’నరసి’’(నరసింహ మెహతా )అంటాడు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –8-11-12—ఉయ్యూరు
అమెరికా లో జర్మన్ హవా –9
అమెరికా అభ్యున్నతి లో జర్మన్ల భాగస్వామ్యం
అమెరికా లో 18వ శతాబ్దం లో ‘’లాగ్ కేబిన్లు ‘’నిర్మించిన మొదటి వారు జర్మన్లె .ఇవి విస్కాన్సిన్ లోని మంచు లోను ,టెక్సాస్ లోని దుమ్మును తట్టుకొన గలిగేవి .19 వ శతాబ్దం లో జర్మన్లు క్రిస్మస్ సందర్భం గా క్రిస్మస్ ట్రీ లను ,శాంతా క్లాస్ లను ఏర్పరచారు .పిక్నిక్ ఫూడ్స్ ను తయారు చేసిన వాళ్ళూ జర్మన్లె .frankfurters ,hum burgers saurkrant ,potato salad లు జర్మన్లవే .ఇలా జర్మనీ సంప్రదాయం అమెరికాది గా మారి పోయింది
జాన్ పీటర్ జిన్జేర్ .
1730 లో తన పదమూడవ ఏట న్యు యార్క్ చేరిన జాన్ పీటర్ జిన్జేర్ ‘’పాలన్తిన్ ‘’సాంప్రదాయం వాడు .ఫ్రీ స్పీచ్ కు ఆద్యుడు .అనాధ గా అమెరికా చేరి ,విలియం బ్రాడ్ ఫోర్డ్ లో అప్రెంటిస్ గా పని చేసి ,న్యూయార్క్ లోని మొదటి వార్తా పత్రిక న్యు యార్క్ గెజిట్ ను ప్రచురించాడు .జిన్జేర్ క్రమం గా ఎదిగి కాలని మొదటి స్వతంత్ర జర్నల్ ‘’న్యు యార్క్ వీక్లి జర్నల్ ‘’ను తెచ్చాడు .అంతకు ముందు వరకు ఆ పేపర్ బ్రిటీష రాజు మొదటి జార్జి దయా దాక్షిణ్యా ల పై బతికింది .ఇప్పుడు స్వతంత్ర పత్రిక .స్వేచ్చగా ,తీవ్రం గా అందులో రాజకీయాలను రాశాడు జిన్జేర్ .’’cosby నితీవ్రం గా విమర్శించే వాడు .ఆఫీసర్లను గాడిదలు ,కుక్కలు అన్నాడు .కోపం వచ్చిన గవర్నర్ కాస్బిపై కోర్టు లో కేసు వేశాడు .ఇతని తరఫున లాయర్గా ఆండ్రు హామిల్టన్ పని చేశాడు .’’ప్రభుత్వాన్ని విమర్శించటం ,లొసుగులు చెప్పటం అమెరికా రాజ్యాంగం ఇచ్చిన హక్కు ‘’అని వాదించాడు .జడ్జి ఇతని వాదన నమ్మి కేసు కొట్టేశాడు .ఈ విధం గా అమెరికా లో పత్రికా స్వాతంత్ర్యం బల పడింది .అందరు జిన్జేర్ ను మెచ్చారు .జర్మన్ అమెరికన్ రచయిత ‘’హెన్రీ లూయిస్ మెకెన్ ‘’అది నిజం గా పత్రికా శక్తి అన్నాడు .18 36 లో బాల్టిమోర్ వెళ్లి తండ్రి తనకు బహుమానం గా ఇచ్చిన ప్రింటింగ్ ప్రెస్ ను ,టైప్ అక్షరాల బూజును దులిపాడు .ఆ తర్వాట్హ మెకెన్ మార్నింగ్ హెరాల్డ్ లో చేరి నిజాయితీ తెలివి తేటల తో రచనలు చేస్తూ అమెరికన్ జర్న లిస్టు లకు ఆదర్శం అయాడు .1924 లో ‘’అమెరికన్ మెర్కురీ ‘’అనే పేపర్ ను నడిపాడు .ప్రజాస్వామ్యం ,వేదాంతం ,మతం ,కవిత్వం జ్ఞాపకాల మీద పుస్తకాలు రాశాడు .
1918 లో ‘’ది అమెరికన్ లాంగ్వేజ్ ‘’పత్రిక వచ్చింది ఉచ్చారణ లో వచ్చిన మార్పుల దశలను చర్చించాడు .వేలాది మాటలు అమెరికా శబ్ద ప్రపంచం లో ఎలా చేరాయో వివ రించాడు .ఇది ఇప్పుడు పాతదే అని పించినా అమెరికా భాషోద్యమానికి కర దీపిక గా నిలిచింది .
విజ్ఞాన శాస్త్రం
విజ్ఞాన శాస్త్రం లో ను జర్మన్ల పాత్ర గణ నీయం గా ఉంది ఫార్టీ యైటర్ల లో ఒక డైన ‘’అబ్రహాం జాకోబి‘’జర్మన్ల మొదటి వైద్యుడు .అడవుల రక్షణ ,అప్పటి దాకా అమెరికన్ల కు తెలీదు .బేరన్ హార్డ్ ఎడ్వార్డ్ 1876 లో వచ్చాకనే వీటి పై శ్రద్ధ వహించారు .ఆంత్రో పాలజి ణి సరదా గా ప్రారంభించి దానికి ఒక స్తాయి కల్పించింది జర్మన్లె .’’ఫ్రాంజ్ బాస్ ‘’అనే జర్మన్1888లో వచ్చి దీన్ని పూర్తీ స్తాయి శాస్త్రం గా మలిచాడు .అతని శిష్యులే కొలంబియా వర్సిటి లోని ‘’రూత్ బెనెడిక్ట్ ,మార్గ రేట్ మీడ్ ‘’ లు
కార్ల్ షుజ్జ్
1850 లో వచ్చిన ‘’కార్ల్ షుర్జ్ ‘’బానిస వ్యతి రేక తను బోధించాడు .ఫిలడెల్ఫియా లో ‘’ఫిమేల్ అంటి స్లేవరి సొసైటి ణి ఏర్పరచాడు 1856 .లో బానిస వ్యతిరేక ఉద్యమాన్ని తీవ్రం చేశాడు .మూడేళ్ళ తర్వాత ‘’ట్రూ అమెరికనిజం‘’భావం తో జాతీయ ప్రాధాన్యత పొందాడు .బోస్టన్ లోని ఫాన్విల్ హాల్ లో ఇచ్చిన ఉద్వేగ పూరిత ఉపన్యాసం లో ‘’ఈ దేశ చరిత్ర లో నీతి తో కూడిన ప్రభావ వంత మైన నిర్ణయాత్మక విధానం ఇదే ‘’అని ప్రకటించాడు .న్యాయం ,స్వాతంత్రం కోసం పాటు పడ్డాడు .యాభై ఏళ్ళ తర్వాతజర్మని లో ఐక్య ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడి నందుకు సంతోషించాడు .1848లో షుర్జ్ స్విస్ దేశానికి పారి పోవాల్సి వచ్చింది .
1852 లో మళ్ళీ న్యు యార్క్ వచ్చిన షుజ్ ‘’father land is so close to me ‘’అన్నాడు .భార్య మార్గరేట్ మేయర్ తో కలిసి వాటర్ టౌన్ ,విస్కాన్సిన్ లలో పర్య తించాడు .ఆమె ఈ రెండు చోట్లా కిన్దర్ గార్టెన్ స్కూళ్ళ ను ప్రారంభించింది .ఇవే మొదటి కిండర్ స్కూళ్ళు .ఆయన ఇంగ్లీష్ బోధిస్తూ ,ళా ప్రాక్టీస్ చేశాడు .అప్పుడే ఇల్లినాయిస్ రిప్రేజెంటటివ్ అయిన అబ్రహాం లింకన్ కూడా సభ్యుడై ,కొత్తగా పెట్టిన రిపబ్లికన్ పార్టి లో చేరాడు .లింకన్ ప్రెసిడెంట్ గా ఎన్నిక కావటానికి షుజ్జ్ తీవ్రం గా ప్రచారం చేశాడు ‘’ I made Lincon President ‘’అని మిత్రుడికి గర్వం గా జాబు రాశాడు .అంటే తాను లింకన్ కు ప్రజా బలం చేకూర్చ టానికి ,బానిసత్వ వేళ్ళను పెకలించటానికి తోత్పడిణా నని తన జాబు లో సారాంశం గా చెప్పాడు .ప్రెసిడెంట్ లింకన్ షు జ్జ్ ను స్పెయిన్ కు రాయ బారిని చేసి కృతజ్ఞత చూపాడు .1862ఆ పదవిని వదిలి పెట్టి ,సివిల్ వార్ లో విదేశీ జోక్యం లేకుండా చేయటానికి ఏమి చెయ్యాలి అన్న దాని పై ప్రెసిడెంట్ కు సలహా దారు గా ఉన్నాడు .దాన్ని తిరస్కరిస్తే brigadier general of volunteer union troops అయాడు .
1865 లో ప్రెసిడెంట్ లింకన్ హత్య షుజ్ కెరీర్ ను మార్చేసింది .లింకన్ తర్వాతి ప్రెసిడెంట్ ఆండ్రు జాన్సన్ పద్ధతి నచ్చక వాషింగ్ టన్ వదిలి సెయింట్ లూయిస్ చేరి westliche post ‘’కు ఎడిటర్ గా పని చేసి జర్నలిజం లో స్తిర పడి పోయాడు .1869 లో మళ్ళీ రాజకీయ ప్రవేశం చేశాడు .సెనేట కు ఎన్నికైన మొదటి జర్మన్ అని పించుకొన్నాడు .born citizenఅయి మిస్సోరి నుంచి 1875 లో సెనేటర్ గా ఎన్నికయాడు .అమెరికా స్వాతంత్రానికి వెన్నెముక అయాడు .కరేబియన్ సముద్రం లో అమెరికా విస్తరణ కు తోడ్పడ్డాడు .అమెరికన్ ఇండియన్స్ పై వివక్ష ను నిర శించాడు షుజ్జ్ .
ప్రెసిడెంట్ రూథర్ ఫోర్డ్ బి.హేయిస్ –కాలినక్ట్ లో సెక్రెటరి ఆఫ్ ది ఇంటీరియర్ గా పని చేసి సెనేటర్ గా సమర్ధత చూపాడు .బ్యూరో ఆఫ్ ఇండియన్ అఫైర్స్ ,,యంగ్ ఇండియన్స్ కు ,విద్య కు ,అరణ్య ,భూ సంపద పరి రక్షణ కు గొప్ప కృషి చేశాడు .ప్రఖ్యాత అ రచయిత మార్క్ ట్వేన్ ఈయన స్నేహితుడే .అతని మరణాన్నివిని మార్క్ ట్వేన్ ‘గొప్పగా ఆయన్ను విశ్లేషించాడు .మార్క్ ట్వేన్ అనే పేరు తనకు ఎలా వచ్చిందో అందులో తెలిపాడు .షుజ్జ్ ను ‘’పోలిటికల్ చాన్నేల్ ఫౌండర్ ‘’అని కీర్తించాడు .అతని నిజాయితీ దేశభక్తి దీక్ష ,గౌరవం ,దూసుకు పోయే తత్త్వం అంటే తనకు మహా ఇష్టం అని అభి వర్ణించాడు .తాను రాజకీయం గా షుజ్ తో కలిసి ప్రయాణం చేయ లేక పోయానని బాధ పడ్డాడు .అయితే తాను యే మాత్రం సంకోచించ కుండా షుజ్ అను అనుసరించాను అని గర్వం గా చెప్పుకొన్నాడు మార్క్ ట్వేన్ .
సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –8-11-12—ఉయ్యూరు
—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com